పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

యోవేలు గ్రంధము

చిత్రం
    * ఉపోద్ఘాతము *   యోవేలు 1: 15 ఆహా , యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము ! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును . యోవేలు 2: 12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి . ఇదే యెహోవా వాక్కు      దేవుని ఘనమైన , అద్భుతమైన , యోగ్యమైన , పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ! బాగున్నారా ? ఆధ్యాత్మిక సందేశాలు -8 సిరీస్ లో భాగంగా మొదటగా ఒక గొప్ప దైవజనుడు వ్రాసిన ప్రవచన గ్రంధం నుండి దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నారో ధ్యానం చేసుకుందాం ! ఈ రకంగా మరోసారి మిమ్మును ఇలా కలవడం చాలా ఆనందం గా ఉంది . అట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనములు !      ప్రియులారా ! కొన్నిరోజులు యోవేలు ప్రవక్త గారి గ్రంధము నుండి దేవుడుచెప్పిన మాటలను ధ్యానం చేసుకుందాం !   * ప్రవక్త పరిచయం *! * పేరు *: యోవేలు * పే రుకు అర్ధం *: యెహోవాయే దేవుడు * తండ్రి *: పెతూయేలు (1:1) * తల్లి *: తెలియదు * ఊరు *: తెలియదు గాని వాడిన భాష ప్రకారం యూదయ దక్షిణ ప్రాంతం కావచ్చు ! * రాజుల క...