పోస్ట్‌లు

2026లోని పోస్ట్‌లను చూపుతోంది

గీతములకు గీతము-2 (5--8 అధ్యాయాలు)

చిత్రం
  * గీతాలకు గీతము - పరమగీతము * *88 వ భాగము * * నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని *   పరమగీతము 5: 1. నా సహోదరీ , ప్రాణేశ్వరీ , నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను . నా సఖులారా , భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా , పానము చేయుడి .         ప్రియులారా ! పరమగీతములను ధ్యానము   చేస్తున్నాము .   ఇంతవరకు 4 అధ్యాయాలలోనుండి అనేకమైన విషయాలు ధ్యానం చేశాము ! ఇక 5 వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధిస్తారో నేర్చుకుందాం !   ఇక మొదటి వచనంలో ప్రియుడైన సోలోమోను అంటున్నాడు నా సహోదరీ , ప్రాణేశ్వరీ , నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను . నా సఖులారా , భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా , పానము చేయుడి .   ప్రియులారా ! ఈ వచనం యేసుక్రీస్తుప్రభులవారి యొక్క రెండవరాక...

గీతములకు గీతము- పరమ గీతము

చిత్రం
  * గీతాలకు గీతము - పరమగీతము * * మొదటి భాగము - ఉపోద్ఘాతము -1*                   ప్రియ దైవజనమా ! యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభాది వందనములు ! ఈ ఆధ్యాత్మిక సందేశాలు - 13 లో భాగంగా మరోసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ! ఈసారి పరమగీతములు అనే అత్యంత శ్రేష్టమైన పుస్తకము మరియు అనేకులకు వివాదాస్పదమైన పుస్తకమునుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ధ్యానం చేసుకుందాం !      నిజానికి అనేకులు ఈ పుస్తకాన్ని చదవడానికి ఆలోచిస్తారు , మరికొంతమంది సిగ్గుపడతారు . మరికొంతమంది క్రీస్తు విరోధులు ఇది ఒక బూతు పుస్తకము అంటారు ! మరికొంతమంది బైబిల్ ను పరిశుద్ధ గ్రంధము అంటారు కదా మరి ఇలాంటి పుస్తకము బైబిల్ లో ఎలా ఉంది అంటారు ! మరి కొంతమంది బైబిల్ లో ఉన్న ప్రతీ వచనం ప్రతీ అధ్యాయం ప్రతీ పుస్తకము పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు కదా ! మరి ఇలాంటి పుస్తకము ఎందుకు బైబిల్ లో జతచేయబడింది అంటారు ! కాబట్టి మొదట ఈ పుస్తకము యొక్క విశేషము తెలుసుకుని ఆ తర్వాత నేపధ్యం తెలుసుకుని అప్పుడు ఈ గ్రంధము ...