పక్షిరాజు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితి 32:11 గూడు: పర్వత శిఖరంమీద నిర్మిస్తుంది. మొదటగా బలమైన కర్రలు వాటిపైన చిన్న చిన్న కొమ్మలను పేర్చుతుంది. దానిపైన పీచువంటి పదార్ధాన్ని ఉంచుతుంది. దానిపైన మేకులు , గాజు ముక్కలు , ముళ్ళు మొదలగునవి పేర్చుతుంది. దానిపైన మెత్తని బట్టలు , దూది వంటి పదార్ధాలతో గూడును నిర్మించి , దానిలో గుడ్లనుపెట్టి పొదుగుతుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది. సమయానికి పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతుంది. మావంటి తల్లి ఇంకెవ్వరికి ఉండదని , పిల్లల ఆనందానికి అవధులుండవు. ఎంతో ప్రేమగా తనబిడ్డలను సాకుతున్న తల్లి , ఒక్కసారిగా దాని హృదయం బండబారిపోతుంది. గూడు రేపేస్తుంది. మెత్తటి బట్టలు , దూదిని గాలిలోకి విసిరేస్తుంది. ఇకదానిక్రింద వుండేవేమిటి ? మేకులు , గాజుముక్కలు , బ్లేడు ముక్కలు , ముళ్ళు , ఆ చిన్ని పిల్లల పసి దేహాలకు ఈ ముళ్ళు గాయాలు చేస్తుంటే , వాటి బాధ వర్ణనాతీతం. అంతవరకు సమయానికి ఆహారం తెచ్చిపెట్టే తల్లి అడ్రస్ లేకుండా పోతుంది. ఒకప్రక్క ముళ్ళు బాధ , మరొకప్...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి