గీతములకు గీతము-2 (5--8 అధ్యాయాలు)
* గీతాలకు గీతము - పరమగీతము * *88 వ భాగము * * నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని * పరమగీతము 5: 1. నా సహోదరీ , ప్రాణేశ్వరీ , నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను . నా సఖులారా , భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా , పానము చేయుడి . ప్రియులారా ! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము . ఇంతవరకు 4 అధ్యాయాలలోనుండి అనేకమైన విషయాలు ధ్యానం చేశాము ! ఇక 5 వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధిస్తారో నేర్చుకుందాం ! ఇక మొదటి వచనంలో ప్రియుడైన సోలోమోను అంటున్నాడు నా సహోదరీ , ప్రాణేశ్వరీ , నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను . నా సఖులారా , భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా , పానము చేయుడి . ప్రియులారా ! ఈ వచనం యేసుక్రీస్తుప్రభులవారి యొక్క రెండవరాక...