యూదా పత్రిక
* యూదా పత్రిక – మొదటి భాగం * * ఉపోద్ఘాతము * యూదా 1:1 యేసుక్రీస్తు దాసుడును , యాకోబు సహోదరుడునైన యూదా , తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి , యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది . దేవునికి మహిమ కలుగును గాక ! ప్రియ దైవజనమా ! ఆధ్యాత్మిక సందేశాలు -9 సిరీస్ లో భాగంగా మరో గ్రంధ ధ్యానముతో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ! ఈ యూదా పత్రిక చాలా చిన్నది అయినా ఈ ఆకరి దినములలో సంఘమునకు కావలసిన విలువైన వర్తమానాలు మనకు కనబడతాయి ! కాబట్టి ప్రార్ధనాపూర్వకముగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం ! ఈ అధ్యాయం / గ్రంధమును పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే ఈ గ్రంధాన్ని ఎవరు ఏ ఏ పరిస్తితులలో ఎందుకు రాశారో ఆ నేపధ్యాన్ని చూసుకుంటే దీనిని ఇంకా బాగా అర్ధం చేసుకోవచ్చు ! కాబట్టి ఈ గ్రంధ రచయిత కోసం , పరిస్తితుల కోసం మొదటగా చూసుకుందాం ! * రచయిత *: యూదా – యాకోబు సహోదరుడు * యాకోబు ఎవరు *? * పెద్ద యాకోబా చిన్న యాకోబా ?* పెద్ద యాకోబు అయ్యే అవకాశమే లేదు ! కారణం పెద్ద య