యూదా పత్రిక
*యూదా పత్రిక –మొదటి భాగం*
*ఉపోద్ఘాతము*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
దేవునికి మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు-9 సిరీస్ లో భాగంగా మరో గ్రంధ ధ్యానముతో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది! ఈ యూదా పత్రిక చాలా చిన్నది అయినా ఈ ఆకరి దినములలో సంఘమునకు కావలసిన విలువైన వర్తమానాలు మనకు కనబడతాయి! కాబట్టి ప్రార్ధనాపూర్వకముగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం! ఈ అధ్యాయం /గ్రంధమును పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే ఈ గ్రంధాన్ని ఎవరు ఏ ఏ పరిస్తితులలో ఎందుకు రాశారో ఆ నేపధ్యాన్ని చూసుకుంటే దీనిని ఇంకా బాగా అర్ధం చేసుకోవచ్చు! కాబట్టి ఈ గ్రంధ రచయిత కోసం, పరిస్తితుల కోసం మొదటగా చూసుకుందాం!
*రచయిత*: యూదా – యాకోబు సహోదరుడు
*యాకోబు ఎవరు*? *పెద్ద యాకోబా చిన్న యాకోబా?*
పెద్ద యాకోబు అయ్యే అవకాశమే లేదు! కారణం పెద్ద యాకోబు గారి సహోదరుడు మన అపోస్తలుడైన యోహాను గారు! వారికి యూదా అనే సహోదరుడు లేనేలేడు! అంతేకాకుండా ఈ పెద్ద యాకోబు గారు యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయిన సుమారు 4 సంవత్సరములకు హేరోదు చేత కత్తిచేత చంపబడ్డారు!
మరి *చిన్న యాకోబు ఎవరు*? యేసుక్రీస్తుప్రభులవారి తమ్ముడు! గాని యాకోబు గారు గాని యూదా గారు గాని నేను యేసుక్రీస్తుప్రభులవారి తమ్ముడను అని చెప్పుకోలేదు- గొప్పలు చెప్పుకోలేదు! ఎందుకంటే తననుతాము తగ్గించుకున్నారు వీరిద్దరూ!!! మత్తయి సువార్త 13:55; 27:56 ప్రకారం, మార్కు 6:3 ప్రకారం యేసుప్రభుల వారికీ నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు .....
మత్తయి 13: 55,56
ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?
ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.
మార్కు 6: 3
ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతోనున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
కాబట్టి యాకోబు గారు యేసయ్యకి పెద్ద తమ్ముడు, ఈ పత్రిక రచయిత యేసయ్యకి మూడవ లేక నాల్గవ తమ్ముడు అని అర్ధం అవుతుంది!!!
అయితే కొందరు ఈ పత్రిక రచయిత అపోస్తలుడైన యూదా అంటారు అపోస్తలుడైన యూదాకు మరో రెండు పేర్లున్నాయి- తద్డయి లేక లెబ్బయి మత్తయి 10:3, ఈయన తండ్రి పేరు లూకా 6:15 ప్రకారం ఈ యూదా అలియాస్ తద్డయి అలియాస్ లెబ్బయి యొక్క తండ్రి పేరు అల్ఫయి!!!
గాని యేసుక్రీస్తుప్రభులవారి తండ్రిపేరు యోసేపు గారు! యోసేపు గారికి అల్ఫయి అనే మారుపేరు ఉన్నట్లు ఎక్కడా బైబిల్ లో వ్రాయబడలేదు! కేథలిక్స్ నమ్మేది ఏమిటంటే యోసేపు గారికి అల్ఫయి అనే మరో పేరుంది! ఈ లెబ్బయి లేక తద్డయి అనే యూదా యేసుక్రీస్తుప్రభులవారి శిష్యుడే అంటారు! గాని ప్రొటెస్టెంట్లు ముఖ్యంగా పెంతుకోస్తు వారు, బాప్టిస్టు వారు దీనిని ఒప్పుకోరు! బైబిల్ లో ఆయన సహోదరులు ఆయన శిష్యులుగా ఉన్నారు అని ఎక్కడా లేదు! చరిత్రలో కూడా లేదు! అయితే ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు అనగా ఆయనను మెస్సయ్యగా అని బైబిల్ లో రికార్డు చేయబడింది. యోహాను 7:5 ...
ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు.
అయితే యేసుక్రీస్తుప్రభులవారి సహోదరులందరూ నమ్మి విశ్వసించి శిష్యులతో కలసి ప్రార్ధించినట్లు అపోస్తలుల కార్యములో వ్రాయబడింది! 1:13,14....
13. వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే(మతాభిమానియను) అనబడిన సీమోను, *యాకోబు కుమారుడగు(లేక, సహోదరుడగు) యూదా అనువారు*.
14. *వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.*
దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభులవారి మరణం వరకు ఆయన సహోదరులు ఆయన మెస్సయ్యగా నమ్మలేదు గాని ఆయనను హింసించిన విధానానికి ఎంతో బాధపడ్డారు! అయితే ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడయ్యారో ఆయన అనేకమందికి కనబడ్డారు! తప్పకుండా మరియమ్మగారికి ఆయన సహోదరులకు కనబడ్డారు అని అనుకోవచ్చు! అప్పుడు ఆయనను నమ్మి ఉండవచ్చు! అందుకే ఆ మేడగదిలోకి పోయి ప్రార్ధన చేసిన వారిలో ఆయన తల్లితో పాటుగా యాకోబు సహోదరుడైన యూదా అనగా ఈ పత్రిక రచయితా మరియు ఆయన సహోదరులు కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్ధన చేయుచుండిరి అని వ్రాయబడింది! ఇందును బట్టి మరో విషయం కూడా అర్ధమవుతుంది అది ఏమిటంటే పెంతెకోస్తు దినమున ఆత్మాభిషేకము పొందుకున్న వారిలో ఆయన తల్లియైన మరియమ్మగారు ఆయన నలుగురు సహోదరులు కూడా ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది!!!
కాబట్టి పైన వివరించిన విషయాలు ప్రకారం యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఆయన సహోదరులు ఎవరూ ఆయనను నమ్మి విశ్వశించలేదు! కాబట్టి ఈ లెబ్బయి అలియాస్ తద్డయి అలియాస్ యూదా సన్ ఆఫ్ అల్ఫయి యేసుక్రీస్తుప్రభులవారి సహోదరుడు కాదు అని అర్ధమవుతుంది! శిష్యుడు అన్నమాట!
కాబట్టి ఈ పత్రిక రచయిత: యేసుక్రీస్తుప్రభులవారి తమ్ముడు!
*తండ్రి*: యోసేపు గారు
*తల్లి*: మరియమ్మ గారు (యేసయ్య తల్లిగారు)
*అన్న* : చిన్న యాకోబు గారు! యాకోబు పత్రికను వ్రాసింది ఈయనే! ఇంకా ఈయన అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం ప్రకారం ఆదిమ అపోస్తలులు కాలంలో సంఘమునకు అధ్యక్షునిగా ఉన్నారు! ఈయన చెప్పిన మాటయే ఫైనల్ అన్నమాట ఆ రోజులలో! అయితే ఈ సంఘ అధ్యక్ష పదవి తమ్ముడు యూదాకు యాకోబు గారి తదనంతరం రాలేదు!
*రాసిన కాలం*: క్రీ.శ. సుమారు 80—90 మధ్యలో!!!
*వృత్తి*: వడ్రంగి లేక కార్పెంటరీ (యోసేపు గారు యేసయ్య చిన్నతనంలోనే చనిపోయారు కాబట్టి కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభులవారే ఈ వడ్రంగి పని చేసి పోషించారు. చెల్లెళ్ళకు పెళ్లి చేసి తమ్ముళ్ళను ప్రయోజకులను చేసి అప్పుడు పరిచర్య ప్రారంభించారు యేసయ్య! కాబట్టి చిన్న తమ్ముడైన యూదా వడ్రంగి విద్య యేసుక్రీస్తుప్రభులవారి వద్దనే నేర్చుకున్నారు!)
ఈ పత్రిక వ్రాయడానికి కారణం: ౩—4 వచనాలు!
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో- వ్రాయబడినవారు) .
ఈ వచనాలు జాగ్రత్తగా గమనిస్తే అందరికీ కలిగెడు రక్షణను గూర్చి వ్రాయాలని తలిస్తే పరిశుద్ధాత్ముడు పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించిన బోధలో కొందరు రహస్యముగా జొరబడి తప్పుడు బోధలతో సంఘాలను బ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి వారికి వ్యతిరేఖంగా సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ పత్రికను వ్రాసారు!
*యూదా పత్రిక –రెండవ భాగం*
*యేసుక్రీస్తు దాసుడను...1*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
దేవునికి మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా గతభాగంలో భక్తుడైన యూదా గారు ఏ పరిస్తితులలో ఈ పత్రిక రాశారో చూసుకున్నాము! ఇక ఈ పత్రికను ధ్యానం చేద్దాం!
పై వచనంలో యూదా గారు యేసుక్రీస్తుప్రభులవారి సొంత చిన్న తమ్ముడైనప్పటికీ తనను తాను యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడను అంటూ పరిచయం చేసుకుంటున్నారు! ఇక మనం యాకోబు పత్రికను చూసుకుంటే యూదా గారి అన్నయ్య యేసుక్రీస్తు ప్రభులవారి పెద్ద తమ్ముడైన యాకోబు గారు కూడా నేను యేసుక్రీస్తు దాసుడను అంటూ పరిచయం చేసుకుంటున్నారు! ఏమి?
వారు అలా చెప్పుకోడానికి కారణం ఏమిటి? యేసుక్రీస్తు యొక్క తమ్ముడిని అని గర్వంగా చెప్పుకునే అధికారం వాళ్లకుంది! గాని ఎందుకు చెప్పుకోలేదు??!!!
ఎందుకంటే మొదటగా ఆయన ఎవరో- వీరికి బాగా తెలిసింది. శారీరకంగా భూమిమీద మనిషిగా తమకు అన్నయ్యగా పుట్టినా, ఆయన మరణ పునరుత్థానం చూసిన వారికి నిజంగా ఆయన దేవుని కుమారుడని, దేవుడని అర్ధమయ్యింది కాబట్టి ఆయన సహోదరులం అని చెప్పుకోకుండా ఆయన దాసులము అని చెప్పుకున్నారు! తమను తాము తగ్గించు కుంటున్నారు. ఇంకా తమ రక్త సంబంధం కన్నా ఆత్మీయ బంధాన్నే చూపించడానికి ఇష్టపడ్డారు.
ఇక పౌలుగారు కూడా అంటున్నారు “యేసు క్రీస్తు దాసుడును (doulos),
అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును..." రోమా 1:1
పేతురు గారు కూడా అంటున్నారు: “యేసుక్రీస్తు దాసుడును (doulos) అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.” 2 పేతురు 1:1
ఒకసారి వీరు ఉపయోగించిన పదము యొక్క అర్ధము చూసుకుంటే గ్రీకు భాషలో వ్రాయబడింది కాబట్టి గ్రీకు భాషలో వీరు ఉపయోగించిన పదం doulos!! doulos అంటే బానిస- కట్టు బానిస!!
బానిస అంటే: ఒక యజమాని యొక్క ఆస్తిగా ఉన్న మనిషి!! మనిషే గాని ఒక యజమాని యొక్క ఆస్తి! ఈ బానిసకు చట్టపరమైన ఏవిధమైన హక్కులు ఉండవు! జీతముండదు! యజమాని ఏమి చెబితే అది చెయ్యాలి! ఒకవేళ యజమానికి కోపం వచ్చి కొట్టినా తిట్టినా చివరికి చంపినా కేసులేదు! ఎందుకంటే యజమాని ఆస్తి కాబట్టి యజమాని ఏమైనా చేసుకోడానికి యజమానికి హక్కు అధికారం ఉంది! కారణం యజమాని వెల ఇచ్చి కొనుక్కున్నాడు!
ఇదీ ఆకాలంలో వారు వాడిన పదానికి అర్ధం! ఈ భక్తులంతా మేము యేసుక్రీస్తుప్రభులవారికి దాసులము అనగా బానిసలం- కట్టు బానిసలం అని చెప్పుకున్నారు! ఇంతగా వారు తమను తాము తగ్గించు కున్నారు! ఈ రోజుల్లో ఎంతోమంది నాయకులు దైవసేవకులు తమ తాతను బట్టి తమ తండ్రిని బట్టి మేము ఇంతా అంతా అని చెప్పుకుంటున్నారు! మా తాతలు నేతులు త్రాగారు- మా మూతులు వాసన చూడండి అంటున్నారు! నిజానికి వీళ్ళు సున్నా! వీరిలో సరుకు ఏమీలేదు! తమ తండ్రిని బట్టి లేక తాతను బట్టి చలామణి అవుతున్నారు! మరికొంతమంది మూడు పాటలు రెండు ప్రసంగాలు చేసి టీవీల్లో ప్రసారం చేసి మేము ఇంతా అంతా అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు!
గాని ఈ గొప్ప దేవుని సేవకులు మేము యేసుక్రీస్తు దాసులము అంటున్నారు! యేసయ్యకు సొంత తమ్ముళ్ళు అయినా మేము ఆయన దాసులము అని తగ్గించుకుని చెప్పుకుంటున్నారు! ఇక పౌలుగారు పేతురు గారు యేసయ్య ద్వారా అపోస్తలులుగా పిలువబడి గొప్ప అద్భుతకార్యాలు చేస్తూ బలమైన సువార్త పరిచర్య చేస్తున్నా, ఆదిమ సంఘానికి స్తంభాలుగా విధివిధానాలు రాసిన వ్యక్తులైనా, ఎంతో తగ్గించుకుని మేము యేసుక్రీస్తుకి దాసులము అనగా కట్టు బానిసలము అని చెప్పుకున్నారు! ఇంతగా తగ్గించుకున్నారు కాబట్టే అంత ఘనమైన సేవా పరిచర్య చేశారు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును హెచ్చించుకొనువాడు తగ్గించబడును!!! మత్తయి 23:12...
ప్రియ దైవసేవకుడా! ప్రియ విశ్వాసి! సంఘపెద్దా! క్వయిర్ లీడర్! పాటగాడా! వాయిద్యకారుడా! నీకు కలిగిన ఆదిక్యతలను బట్టి తలాంతులను బట్టి అతిశయిస్తున్నావా? లేక తగ్గించుకుంటున్నావా? హెచ్చించుకుంటే తగ్గించబడతావు అని మర్చిపోకు! పైనున్న దైవజనులు తమనుతాము తగ్గించుకున్నారు కాబట్టే హెచ్చించబడ్డారు! నీవు అలాంటి తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి!
సంఘకాపరులారా! సేవకులారా! ప్రసంగీకులారా! పెద్దలారా! మీరు ఒకసారి పేతురు గారు చెప్పింది కూడా వినండి! మీకు కలిగిన ఈ ఆధిక్యతను బట్టి సంఘము మీద లేక సంఘస్తులు మీద అధికారం ప్రభుత్వం చేయకుండా వారికి పరిచారకులై ఉండమని హితవు పలుకుతున్నారు పేతురు గారు! ..
1పేతురు 5:1—4
1. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
2. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
3. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;
4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
కాబట్టి పేతురు గారు చెప్పినట్లు మందకు మాదిరిగా ఉందాము గాని సంఘము మీద పెత్తనము చేయకుండా ఉందాము! సంఘములో పరిచర్య చేయడానికి మాదిరిగా ఉండడానికి దేవుడు పిలిచారు కాని అధికారం చేయడానికి కానేకాదు!
అటువంటి తగ్గింపు జీవితం కలిగి ఉందాము! దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –మూడవ భాగం*
*యేసుక్రీస్తు దాసుడను...2*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
ప్రియులారా మనము యేసుక్రీస్తు దాసుడను అనేమాటను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక మనము దాసులు కోసం చూసుకుంటే క్రీస్తుకు దాసులుగా ఉండటం- లోకానికి పాపానికి దాసులుగా ఉండటానికి చాలా తేడా ఉంది! లోకానికి బానిసలుగా ఉన్నవారికి యజమాని సాతాను గాడు! చివరికి వారికి కలిగే ఫలము- నరకము!!!
అయితే నీతికి- నిజదేవునికి బానిసలుగా చేసుకుంటే – వారికి యజమాని యేసుక్రీస్తుప్రభులవారు! చివరకు వారికి లభించేది నిత్యజీవము- పరలోకము!!
కాబట్టి ప్రియ చదువరులారా! మీరు దేనికి బానిసలుగా ఉంటారో మీరే తేల్చుకోండి!
అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే మనము లోకానికి సాతానుకి బానిసలమైనా సరే దేవుడు మనలను క్రీస్తుద్వారా విమోచించి
ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.” కొలస్సి :1: 3
“మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” 1 కొరింథీ 6:19,20
అందుకే యూదా గారు అదే చెప్తున్నారు - నేను క్రీస్తుకి బానిసని, ఆయన కొరకే పనిచేసేవాడిని, ఆయనను మాత్రమే సంతోషపెట్టేవాడిని. నేను క్రీస్తుకు బానిసని గనుక నేను మీతో చెప్పబోయే విషయాలు సత్యాలు, ఎందుకంటే నేను క్రీస్తుని సంతోషపెట్టడానికి, మీ క్షేమాభివృద్ధి కొరకు ఈ విషయాలు రాస్తున్నాను.
ఇక మనము ఒకసారి దాసుల యొక్క విధులు పాత్ర ఏమిటో ఒకసారి ఆలోచిద్దాం!
*మొదటగా దాసులు యజమానులు చెప్పే ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాడు!*
అదేవిధంగా క్రీస్తు దాసుడిగా పిలువబడిన ఓ సేవకుడా! విశ్వాసి! నీవు కూడా ఆయన చెప్పిన మాటను తప్పకుండా పాటించాలి! బైబిల్ దేవుడు చెప్పిన ప్రతీ విషయాన్ని తప్పిపోకుండా పాటించాలి! లేకపొతే కొరడాతో కొట్టడానికి యజమానికి పూర్తీ అధికారం ఉంది అని మర్చిపోకు!!!
*దాసుడు యజమానికి సంపూర్తిగా లోబడి ఉంటాడు*
అదేవిధంగా క్రైస్తవుడు/సేవకుడు/విశ్వాసి కూడా దేవునికి సంపూర్తిగా లోబడి ఉండాలి! నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకుండా ఆయన అధికారమునకు సంపూర్తిగా లోబడి ఉండాలని బైబిల్ చెబుతుంది. సామెతలు 3:5,6,7,8
5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
6. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
7. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము
8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.
ఒకసారి దేవుని దాసులు ఆయన మాటకు లోబడి ఏమి చేశారో గుర్తుకు తెచ్చుకుందాము!
అబ్రాహాము గారికి దేవుడు చెప్పారు- నీ తండ్రి ఇంటినుండి నేను చూపించబోయే దేశానికి వెళ్ళిపో అంటే మాట తప్పకుండా తనకు కలిగిన సమస్తమును తీసుకుని వెళ్ళిపోయారు అబ్రాహాము గారు! Genesis(ఆదికాండము) 12:1,4
1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
చూశారా ప్రశ్నించలేదు దేవుణ్ణి ఎక్కడకు వెళ్ళాలి- ఎలా వెళ్ళాలి? ఎన్ని రోజులు అక్కడ ఉండాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే నాకు ఏమిస్తావు లాంటి ప్రశ్నలు అడగకుండా సమస్తము తీసుకుని కనాను దేశం వెళ్ళిపోయారు అబ్రాహాము గారు. అందుకే అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది.
రోమా 4:3
గలతీ 3:6
యాకోబె 2:23
అంతేకాకుండా విశ్వాసులందరికీ తండ్రిగా చేసింది ఆ లోబడటం!!! ప్రియమైన విశ్వాసి నీకు ఆ లోబడుట అనేది ఉందా!!!
ఇస్సాకు గారితో దేవుడు కరువు వచ్చింది గాని నీవు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు అని చెబితే కరువులో కూడా దేవుణ్ణి నమ్మారు కాబట్టి నూరంతల ఆశీర్వాదం కలిగింది!
యాకోబుగారు దేవుని మాటను శిరసావహించారు. అందుకే దేవుడు నేను అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అన్నారు! ఎందుకంటే వీరంతా ఆయన చెప్పిన మాటలను సంపూర్తిగా లోబడి పాటించారు!
న్యాయాధిపతులు దేవుని మాటకు లోబడ్డారు- శత్రువుల చేతిలోనుండి ఇశ్రాయేలు దేశాన్ని విడిపించగలిగారు!
సమూయేలు గారు లోబడ్డారు- సౌలు రాజును- దావీదు గారిని అభిషేకించారు!
సౌలు దేవుని మాటను సగం సగం చేశాడు! చివరికి శాపగ్రస్తుడై పోయాడు!
దావీదు గారు దేవుడు చెప్పిన ప్రతీమాటకు లోబడ్డారు- చక్రవర్తిగా అయ్యారు! చివరికి నా ఇష్టానుసారుడైన మనిషిగా దేవుని చేత పిలువబడ్డారు!
యెషయా గారు లోబడ్డారు!
యిర్మియా గారిని పెళ్లి చేసుకోవద్దు అంటే లోబడి పెళ్లి చేసుకోలేదు!
యేహెజ్కేలు గారిని నీ భార్యను తీసివేస్తాను ఏడవకు అన్నారు! అలాగే చేశారు!
ఇంకా ప్రవక్తలు అపోస్తలులు దేవుడు చెప్పిన మాటను సంపూర్తిగా లోబడ్డారు అందుకే ఇంత ఘనమైన సేవను చేశారు!
కాబట్టి ఓ దేవుని దాసుడా విశ్వాసిగా పిలువబడిన ప్రియ చదువరీ! దేవుని మాటకు సంపూర్తిగా లోబడు! అప్పుడు దేవుడు నిన్ను ఉపయోగించుకుని ఘనమైన గొప్ప కార్యాలే కాకుండా అసాధారణ మైన కార్యాలు చేస్తారు! యెహోషువా గారు మోషే గారు ఆయన మాటకు సంపూర్తిగా లోబడ్డారు కాబట్టి అసాధారణమైన అధ్బుతాలు చూడగలిగారు! ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, సూర్యచంద్రులను ఆపేశారు! యోర్దాను నదిని ఆపేశారు!
దేవునికి తననుతాను సంపూర్తిగా అప్పగించుకున్న మనుష్యులు కావాలి! వారిని ఉపయోగించుకుని దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారు!
మరినీవు ఆయనకు సంపూర్తిగా లోబడతావా??!!!!
దైవాశీస్సులు!!!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –నాల్గవ భాగం*
*యేసుక్రీస్తు దాసుడను...3*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
ప్రియులారా మనము యేసుక్రీస్తు దాసుడను అనేమాటను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక మనము దాసులు కోసం చూసుకుంటే దాసులు దేవుని వైపు ఎదురుచూడాలి! వారికన్నులు దేవుని తట్టే చూడాలి కీర్తనలు 123:1—2 వచనాల ప్రకారం...
1. ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
2. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
పై వచనాల ప్రకారం దాసులమైన మనము మన దేవుని వైపే చూడాలి! ఎంతవరకు అంటే ఆయన మనలను కరుణించేవరకు!!! కొంతసేపు చూసి విసిగిపోయి మరొకరి తట్టు చూడటం చెయ్యకూడదు! ఆయన మన యజమాని కనుక ఆయన కరుణించే వరకు ఆయన వైపే చూడాలి!
సరే దాసుడు లేక దాసీ యజమాని వైపు ఎందుకు చూస్తాడు/చూస్తుంది???
మొదటగా చెప్పిన ఆజ్ఞను పాటించడానికి. లేక యాజమాని నుండి ఆదేశాలు పొందుకోడానికి!
అలాగే మనము కూడా దేవుని నుండి ఆదేశాలు పొందుకోడానికి ఆయన తట్టు చూస్తూ ఉండాలి!
ఈ సమయంలో ఒక్కమాట చెప్పనీయండి! నాకు తెలిసిన కొందరు దైవజనులు ఉన్నారు! వారు ఆదివారం ఆరాధనలో ఏ వాక్యం పడితే అది చెప్పకుండా శుక్రవారం రాత్రినుండే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటారు! దేవుడు చెప్పిన మాటలే దేవుడు చెప్పిన విషయమే వారు ఆరాధనలో చెబుతారు గాని తమ సొంత ప్రసంగాలు చెయ్యనే చెయ్యరే! కొన్నిసార్లు దేవుడు ఏమీ చెప్పకపోతే ఆరోజు స్తుతి ఆరాధనతోనే సాక్షాలతోనే ముగించేశారు గాని ప్రసంగం చెయ్యడం మానేశారు! ఏమండి అయ్యగారు ఎందుకు ప్రసంగం చెయ్యలేదు అని అడిగితే దేవుడు నాకు ఏమీ చెప్పలేదు అందుకే నేనూ అమీ చెప్పలేదని సమాధానం చెప్పారు! ఎంత ధన్యతో కదా! ఇలాగే ప్రతీ సేవకుడు కాపరి దేవుని నుండి కనిపెట్టి వాక్యం చెబితే సంఘాలు ఎంత ఆశీర్వాద కరంగా దేవునికి నమ్మకంగా ఉంటాయి కదా! నేను ప్రసంగాలు తయారుచేసుకుని ఆదివారం ప్రసంగం చెయ్యడం తప్పు అనడం లేదు! గాని ఇలా దేవుని సన్నిధిలో కనిపెట్టి అయన తట్టే చూస్తూ ఆయన చెప్పిన మాటలే చెబితే ఆరోజు ఆరాధన మహిమకరంగా ఉండదూ? పరలోకమే క్రిందికి దిగరాదూ?? సంఘమనతా నిజమైన విశ్వాసులుగా మారతారు కదా!! కాబట్టి ఒక దైవజనుడు దేవుని వైపే కనిపెట్టాలి! ఒక విశ్వాసి ప్రతీ విషయం కొరకు, సమస్య పరిష్కారం కొరకు, కావాల్సిన అవసరతల కొరకు దేవుని వైపే చూడాలి ! అంతేకాని లోకము వైపు పెద్దల వైపు అధికారుల వైపు కోర్టుల వైపు పోలీస్ స్టేషన్ వైపు చూస్తే నీవు విశ్వాస జీవితంలో గెలవలేవు ఓడిపోతావు!!
ఇక రెండవదిగా దాసుడు/దాసీ యజమాని వైపు మొదటగా ఆహారం కొరకు ఎదురుచూస్తారు!
రెండవదిగా పనివాడు జీతము కొరకు చూస్తాడు! అవును నీకు కావాల్సిన ఆహారం కొరకు దేవుని వైపే చూడాలి గాని మనుష్యుల సహాయం కోసం ఎదురుచూడకూడదు! మనుష్యులు ఈరోజు పెట్టి రేపు దేప్పుతారు! అయితే దేవుడు నీకు పెట్టింది ఎప్పుడూ మరలా తీసుకోరు! నీకు సమృద్ధిగా ఇచ్చేదేవుడు నీ దేవుడు!
దీనికోసం యేసుక్రీస్తుప్రభులవారు ఏమి చెప్పారో చూద్దాం! లూకా 17:7—10 ....
7. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.
8. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని
9. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా?
10. అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
ఇక్కడ చేనిలో పనివాడు లేక దాసుడు యజమాని పొలంలో పనిచేసి వచ్చిన వెంటనే సాధారణంగా యజమాని వెళ్లి భోజనం చెయ్యు అని చెప్పరు కదా, ముందు నేను భోజనం చేసేవరకు ఉండి ఆ తర్వాత నీవు భోజనం చెయ్యు అని చెబుతారు అంటున్నారు.
దీని ప్రకారం దేవుని సేవకుడు/ విశ్వాసి మొదటగా దేవుని పని చెయ్యాలి. ఆ తర్వాతనే మీకు భోజనం లేక ఆహారం, ఆశీర్వాదాలు కలుగుతాయి అని అర్ధమవుతుంది! యోహాను 4 ప్రకారం దేవుని ఆహారం ఏమిటంటే ఆత్మల పంట లేక సువార్త పరిచర్య! John(యోహాను సువార్త) 4:31,32,34
31. ఆ లోగా శిష్యులు బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.
32. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా
34. యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.
అది ఎంత ఎక్కువగా చేస్తే అంత దేవుని ఆహారము అన్నమాట! మొదటగా సేవకుడు/కాపరి/విశ్వాసి దేవుని సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించాలి. అప్పుడు దేవుడు నీకు కావలసిన ఆహారం దయచేస్తారు అన్నమాట! మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుము అప్పుడు నీకు ఏమి కావాలో అన్నీ దేవుడు నీకు ఇస్తారు అని చెప్పబడింది..మత్తయి 6:33
ఇక రెండవది జీతము కోసం!
అంతేకాదు బైబిల్ చెబుతుంది పనివాడు జీతానికి భోజనానికి అర్హుడు గనుక నీకు కావలసిన వన్నీ దేవుడు నీకు ఇస్తారు ఎప్పుడు అంటే నీవు మొదటగా దేవుని పని చేసినప్పుడు!!! నీవు ఆయన చెప్పినవి చేయకుండా ఆయన నుండి ఆశించడం తప్పు!
లూకా 10: 7
వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.
1తిమోతికి 5: 19
మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషారోపణ అంగీకరింపకుము
ఇంకా దేవుడు చెబుతున్నారు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది.
ప్రకటన గ్రంథం 22: 12
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
కాబట్టి మనము చేసిన సేవను బట్టి పరిచర్యను బట్టి, చేసిన క్రియలకు కూడా దేవుడు జీతమివ్వబోతున్నారు!!!
ఇక ఇదే భాగం తొమ్మిదో వచనం చూసుకుంటే ఆ దాసుడు ఆజ్ఞాపించినవి అన్నీ చేసినందుకు యజమాని దాసుణ్ణి మెచ్చుకుంటాడ? లేదు కదా! అంటున్నారు. కాబట్టి దేవుని పనిచేశాక నీవు సెహబాస్ అనే మాటలు వెరీగుడ్ అనే మాటలు ఆశించవద్దు అంటూ పదో వచనంలో అటువలే మీరు కూడా మీకు ఆజ్ఞాపించినవి అన్ని చేసిన తరువాత అయ్యా మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము చేయవలసినవే అనగా మా యొక్క విధిని మాత్రమే మేము నిర్వర్తించాము అని తగ్గించుకోమని దేవాదిదేవుడే చెబుతున్నారు! అంటే మీరు చేసిన ఘనమైన సువార్త పరిచర్యను చూసి, మీకున్న గొప్ప పరిచర్య పెద్ద పెద్ద సంఘాలు అధిక సంఖ్య కలిగిన విశ్వాసులు , మీకున్న తలాంతులను బట్టి మీరు సాధించిన విజయాలను బట్టి అతిశయించకుండా అయ్యా మేము నిష్ప్రయోజనమైన దాసులము! కేవలం నీవు చెప్పినవి మేము చేయాల్సినవి మాత్రమే మేము చేశాము తప్ప మేము గొప్పగా ఏమీ చెయ్యలేదు అని చెప్పాలి! మనలో ఎంతమంది వారు సాధించిన విజయాలను బట్టి వారు సాధించిన సువార్త విజయాలు ఆధ్యాత్మిక ఫలాలను బట్టి అతిశయించడం లేదు!!!! రెండు ప్రసంగాలు మూడు పాటలు హిట్ అయిపోతే ఏదో సాధించినట్లు ఫోజులు కొడుతున్నాము! అది తప్పు! అతిశయించవద్దు! కేవలం మేము నిష్ప్రయోజమైన దాసులం అని చెప్పమంటున్నారు! మరినీవు ఇలాంటి అతిశయ మాటలను వదిలేస్తావా !!!!!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –ఐదవ భాగం*
*యేసుక్రీస్తు దాసుడను...4*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
ప్రియులారా మనము యేసుక్రీస్తు దాసుడను అనేమాటను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇంకా మనము దాసులు కోసం చూసుకుంటే బైబిల్ లో దాసులు కోసం ఏమని వ్రాయబడిందో చూసుకుందాం!
1సమూయేలు ౩:9—10 ప్రకారం దేవుని మాట కోసం కనిపెట్టి ఆయన మాటలను పొందుకోవాలి...
9. నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల- యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.
10. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా- సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలు- *నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.*
ఇక్కడ సమూయేలు గారు కనిపెట్టి దేవుని మాటలను పొందుకున్నారు. ఇంకా అనేకమంది దైవజనులు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని మాటలను పొందుకున్నారు!
దానియేలు 9:17 ప్రకారం దేవుని సన్నిధిలో ప్రార్ధన చెయ్యాలి.....
ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి *నీ దాసుడు చేయు ప్రార్థనలను* విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.
ప్రియమైన దేవుని దాసుడా/ విశ్వాసి నీవు ప్రార్ధన చేస్తున్నావా? నీళ్ళు కుమ్మరించినట్లు నీ కన్నీరు కుమ్మరిస్తున్నావా? యిర్మియా 9:17—21
17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.
18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.
19. మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడుచున్నది.
20. స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తె లకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
ఇక మలాకీ 1:6 ప్రకారం దాసుడు తమ యజమానిని ఘనపరచాలి!!
మలాకీ 1: 6
కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
ఎలా ఘనపరచాలి అంటే 6--8 వచనాలు..
Malachi(మలాకీ) 1:7,8
7. నా బలి పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా
8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
దీని ప్రకారము ప్రభు బల్లను ఘనముగా పవిత్రముగా ఆచరించాలి. మనలో మలినము పాపము ఉంచుకొని ఆ బల్లను సమీపించకూడదు!
ఇంకా దేవునికి నీరాబడిలో నీ ఆస్తిలో శ్రేష్ఠమైనవి ఇచ్చి ఘనపరచాలి!
దేవునికి ఇవ్వాల్సిన గౌరవము దేవునికి ఇవ్వాల్సిన ధనము దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి ఘనపరచాలి!
ఇక మత్తయి 24:45—50 వచనాలలో దాసుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది వ్రాయబడింది....
45. యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?
46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
47. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
48. అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని
49. తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె
50. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును.
51. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
మొదటగా తన ఇంటివారికి తగిన వేల అన్నము పెట్టువాడై ఉండాలి! అనగా సంఘమునకు ఏ సమయంలో ఎలాంటి వాక్యము కావాలో తెలుసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యము చెప్పేవాడై ఉండాలి గాని నిద్రబోతుగా ఉండకూడదు!
తర్వాత దాసుడు నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు అయి ఉండాలి! దీనికోసం యేసయ్య చెబుతున్నారు కొద్ది దానిలో నమ్మకంగా ఉండేవాడు పెద్దవాటిలోను నమ్మకంగా ఉంటాడు అంటున్నారు!
లూకా 16:10లో....
మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
ఇక మత్తయి 25వ అధ్యాయంలో గల దేనారాలు- దాసులు- యజమాని ఉపమానంలో దేవుడు పదే పదే చెప్పారు: భళా నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక వాటిమీద నియమిస్తున్నాను. అలా నమ్మకంగా లేనివాడ్ని సోమరియైన చెడ్డదాసుడా అని పిలవడమే కాకుండా అగ్ని గుండములో త్రోసినట్లు చూడగలము!
అలాగే యేసయ్య దేవుని కుమారుడై ఉండి దేవుని ఇంటిమీద అంతము వరకు నమ్మకముగా ఉన్నారు అని హెబ్రీ ౩:6లో చెబుతున్నారు...
హెబ్రీయులకు 3: 6
అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
అందుకే బాప్తిస్మము తీసుకునే టప్పుడు సేవకుడు అంటాడు: అంత్యము వరకు నమ్మకముగా ఉండుము అప్పుడు దేవుడు నీకు జీవకిరీటము ఇచ్చును అంటూ! మరి నీవు అంత్యము వరకు నమ్మకముగా ఉంటావా ప్రియ సేవకుడా/విశ్వాసి!!!
ఇక రెండవది బుద్ధిమంతుడుగా ఉండాలి! అనగా అన్ని విషయాలలో బుద్ధి కలిగి నడచుకోవడమే కాకుండా ఏది మంచి ఏది చెడు అనేది వివేచించి ప్రవర్తించాలి అన్నమాట!! దేవునిమాటలకు సాతాను మాటలకు వ్యత్యాసం తెలుసుకోవాలి! నిజమైన బాధలకు అబద్ద భోధాలకు వ్యత్యాసము తెలుసుకోనగలిగి ఉండాలి!
ఇక బుద్దిమంతుడైతే బండమీద ఇల్లు కట్టిన వానివలె ఉండాలి....
Matthew(మత్తయి సువార్త) 7:24,25
24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
లూకా 6: 48
వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలి యుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున (అనేక ప్రాచీన ప్రతులలో- దీనిపునాది బండమీద వేయబడెను గనుక అని పాఠాంతరము) దాని కదలింపలేకపోయెను.
అనగా దేవుని మాటలు వినడమే కాకుండా దానిప్రకారం చేయువాడై ఉండాలి!!
ఇక తోడి దాసులను ప్రేమించాలి గాని వారిని కొట్టకూడదు! అనగా అందరితోను సమాధానం కలిగి ఉండాలి. కలిగినది అందరితోను పంచుకుంటూ ఉండాలి! నేటిరోజులలో అనేకమంది దైవసేవకులకు తన తోటి సేవకుడంటే పడదు! ఈర్ష అసూయతో మిగిలిపోతున్నారు. వీరు బుద్ధిహీనులు అన్నమాట! నిజమైన దేవుని దాసులు కాదు అన్నమాట!
ఇక తర్వాత దాసుడు తినుచూ త్రాగుచూ ఉండకూడదు! తినుచు త్రాగుచూ అంటే త్రాగుబోతులుగా ఉండకూడదు తిండిపోతుగా కూడా ఉండకూడదు! మధ్యమందు అసహ్యము పెంచుకోవాలి తప్ప త్రాగుబోతుగా తిండిబోతుగా తిట్టుబోతుగా తిరుగుబోతుగా వదరబోతుగా ఉండరాదు!
చివరిగా యజమాని రాకకొరకు కనిపెడుతూ ఉండాలి! అనగా దేవుని దాసుడు దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి! దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి అంటే మొదటగా తానూ వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం కలిగి ఆత్మానుసారుడై ఉండాలి! అప్పుడే దేవుని రాకడ కొరకు కనిపెట్ట గలడు అలా కాకుండా నలుగురితో... కులంతో... అనేటట్లు ఉంటే సోమరియైన చెడ్డదాసుడా అని అనిపించుకోవడం కాకుండా యజమాని వానిని నరికించి వేశదారులతో కూడా వానికి పాలు నియమిస్తారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది అని యేసుక్రీస్తుప్రభులవారు తానే స్వయంగా అంటున్నారు!
1కొరింథీ 7:22 ప్రకారం ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందిన వాడు కనుక లోక కార్యాలు చెయ్యకుండా దేవుని ఆత్మకార్యాలు చెయ్యాలి....
2 తిమోతి 2:26 ప్రభువు యొక్క దాసుడు దేవుని మాటలను అనుసరించని విశ్వాసులను సాత్వికముతో శిక్షించాలి. సాధువుగా ఉండాలి భోదించ సమర్ధుడుగా ఉండాలి. కీడును సహించువాడుగా ఉండాలి! దీనికోసం దైవజనుడా అనే శీర్షికలో విస్తారంగా చెప్పడం జరిగింది కాబట్టి ముందుకు పోదాం!
జగడమాడకూడదు! తాను బాధలు శ్రమ పడుతున్నా సాత్వికముతో దేవుని ప్రేమను చూపించే వారిగానే ఉండాలి!
ఇక అదే నాలుగో అధ్యాయం ప్రకారం విశ్వాసులు ఎవరైనా తప్పుచేస్తే ఖండించుము గద్ధించుము బుద్ధిచెప్పుము అనే ఆజ్న ప్రకారం సంఘాన్ని ఖండించాలి గద్ధించాలి బుద్ధిచెప్పాలి! అలా చేసి సంఘాన్ని సరిచెయ్యాలి!
కాబట్టి ప్రియమైన దైవజనుడా! కాపరీ! విశ్వాసి! నీవు దేవునికి దాసునిగా ఉండటానికి పిలువబడ్డావు కాబట్టి పైన చెప్పినవి అన్నీ చేస్తున్నావా?
దేవుని మాటల కోసం కనిపెడుతున్నావా? ఆయన సన్నిధిలో ప్రార్ధన చేస్తున్నావా?
నీ యజమానుడైన దేవుణ్ణి ఘనపరుస్తున్నావా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా!!! నీ క్రియల ద్వారా!!
సంఘానికి కావలసిన ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దేవుని నుండి పొందుకుని సంఘానికి తినిపిస్తున్నావా??
నమ్మకముగా ఉంటున్నావా?
బుద్ధిమంతుడిగా ఉంటున్నావా?
ఆ హార్మెగిద్దోను యుద్ధములో యేసయ్య ఎందుకు గెలువగలిగారు అంటే తనతో ఉన్నవారు .....ప్రకటన గ్రంథం 17: 14
వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
నమ్మకమైన వారు అందుకే గెలువ గలిగారు అంటున్నారు!
మరినీవు అలా ఉంటావా?
త్రాగుబోతుగా గాని తిరుగుబోతుగా గాని తిట్టుబోతుగా గాని ఉండకూడదని తెలుసా?
బోధించ సమర్ధుడుగా ఉంటూ సంఘాన్ని ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ ఉంటున్నావా?
అలా నీవుంటే నీవు ధన్యుడవు! దేవునిచేత ఒకరోజు భళా నమ్మకమైన మంచిదాసుడా అని అనిపించుకుంటావు!
దేవుడు అట్టి విధంగా మనలను చేయును గాక!!
ఆమెన్!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –6వ భాగం*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
ప్రియులారా మనము యేసుక్రీస్తు దాసుడను అనేమాటను ధ్యానం చేసుకున్నాము!
ఇక మనము ఈ అధ్యాయం ధ్యానం చేద్దాం~
యూదాగారు అంటున్నారు యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా అంటున్నారు. గమనించాలి యేసుక్రీస్తు యొక్క దాసుడను అని చెప్పుకున్నారు గాని నేను యాకోబు యొక్క సహోదరుడను అని చెప్పుకుంటున్నారు. ఈ పత్రిక రాసేటప్పటికి యాకోబు గారు ఆదిమ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు ౩౦ సంవత్సరాలనుండి. అనగా ఇప్పుడు సంఘానికి అధ్యకుడైన యాకోబుగారి తమ్ముడ్ని అని గొప్పగా చెప్పుకుంటున్నారా? కానేకాదండి. ఇలా చెప్పుకోడానికి కారణం మరొకటి ఉంది! ఈ పత్రిక రాసేటప్పటికి యూదా అనే పేరు గలవారు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు మొదటగా చనిపోయిన యూదా ఇష్కరియోతు, రెండవది: అపోస్తలుడైన యూదా అలియాస్ లెబ్బయి అలియాస్ తద్డయి . ఇంకా ఆ రోజులలో రక్షించబడిన విశ్వాసులు మరియు సువార్త ప్రకటిస్తున్న దైవజనులు చాలామంది ఉన్నారు కాబట్టి తను ఎవరో పరిచయం చేసుకోడానికి నేను యాకోబు సహోదరుడను అని చెప్పు కుంటున్నారు.
ఇక తర్వాత: *తండ్రియైన దేవునియందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభము* అంటున్నారు.
*తండ్రియైన దేవునియందు ప్రేమించబడి* అంటున్నారు. అయితే ముఖ్యముగా చెప్పుకోవలసినది ఏమిటంటే ఈ వచనం తెలుగులో తప్పుగా తర్జుమా చేయడం జరిగింది. ఇంగ్లీష్ బైబిల్ లోను, ప్రాచీన ప్రతులలోను, ఇంకా స్టడీ బైబిల్ లోను తండ్రియైన దేవునిద్వారా పరిశుద్ధపరచబడిన వారికి అని వ్రాయబడింది.
ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ లో ఏమి వ్రాయబడిందో చూద్దాం....
Jude
1: 1
Jude,
the servant of Jesus Christ, and brother of James, to them that are sanctified
by God the Father, and preserved in Jesus Christ, and called:
స్టడీ బైబిల్ లో..... దేవుని పిలుపు అందినవారికి – తండ్రి అయిన దేవునివల్ల పవిత్రులై యేసు క్రీస్తులో కాపాడబడుతూ ఉన్నవారికి – యేసు క్రీస్తు దాసుడూ, యాకోబుకు సోదరుడూ అయిన యూదా రాస్తున్న విషయాలు
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే తండ్రియైన దేవునివలన పవిత్రపరచబడిన వారు అంటున్నారు...
పౌలుగారు కూడా ఏవిధంగా పవిత్రులయ్యారో మనకు రోమా పత్రికలో చెబుతున్నారు 15:15
అయినను అన్యజనులు అను అర్పణ *పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి* ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింప బడిన కృపను బట్టీ,అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
ఒక మనిషి జన్మతహా పాపి! అయితే అతడు తాను పాపినని గ్రహించి పశ్చాత్తాప పడి యేసుక్రీస్తుప్రభులవారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన శరణు వేడితో ఆయన రక్తము ప్రతీపాపమునుండి కడిగి పవిత్రపరుస్తుంది. 1యోహాను 1: 7
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
1యోహాను 1: 9
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
అయితే దేవునిలో పరిశుద్ధ పరచబడాలంటే ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు అది కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రం పవిత్ర పరచబడతారు! ఇంకా పూర్తిగా అర్ధం కావాలంటే మొదటగా యేసురక్తంలో కడుగబడాలి, భాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధ పరచబడతారు. అయితే పాపలోకంలో ఉన్నాము కాబట్టి ఈ పాపము మనకు అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి మనము ప్రతీరోజు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవిస్తే ఆ పరిశుద్దాత్ముడు నిన్ను ప్రతీ పాపమును ఒప్పుకోమని బలవంతం చేస్తాడు. అప్పుడు నీవు పశ్చాత్తాప పడితే పరిశుద్దాత్మ ద్వారా నీవు పరిశుద్ధుడవు అవుతావు అన్నమాట! ప్రతీరోజూ పవిత్రుడవు అవుతావు!!
ఇంకా వివరంగా చూసుకుంటే 1కొరింథీ 6:11..
మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.
చూశారా ఇక్కడ కూడా దేవుని ఆత్మవలన మీరు కడుగబడ్డారు అంటున్నారు.
ఇంకా హెబ్రీ 10:10,14 లో కూడా అంటున్నారు....
10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.
14. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.
కాబట్టి దేవుని వలన కుమారుని రక్తం వలన పరిశుద్దాత్మ వలన పవిత్ర పరచబడ్డాము!
అందుకే పౌలుగారు తన పత్రికలలో పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడిన వారికి అంటూ ఉత్తరం రాస్తూ ఉండేవారు.
రోమీయులకు 1: 2
దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.
1కొరింథీ 1:21
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా *క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని*, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
ఇక తర్వాత మాట : *యేసుక్రీస్తులో భద్రము చేయబడి*...మనము యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డాము అంటున్నారు. దీనిని చదివితే నాకు ఒక కధ గుర్తుకు వస్తుంది. మాయలఫకీర్ గాడి ప్రాణం అంట "ఏడు సముద్రాల అవతల జీవగడ్డ అనే దీవిలో ఉన్న పెద్ద మర్రిచెట్టు ఉంటుందనీ.. ఆ చెట్టు తొర్రలో ఓ బంగారు పంజరం ఉంటుందనీ, ఆ పంజరంలో ఉండే చిలుకలో తన ప్రాణం" ఉందని చెప్పుకునేవాడు. అదో కట్టుకధ! గాని బైబిల్ చెబుతుంది మనమందరం అనగా క్రీస్తురక్తంలో కడుగబడిన ప్రతీ విశ్వాసి ప్రాణము యేసుక్రీస్తు నందు భద్రము చేయబడింది అని బైబిల్ చెబుతుంది. అందుకే యోబు గ్రంధంలో సైతానుకి దేవుడు వార్నింగ్ ఇస్తున్నారు- అతని దేహానికి అతనికి కలిగిన వాటిని ఏమైనా చేయు గాని అతని ప్రాణాన్ని మాత్రం తాకగూడదు అని చెప్పారు!
యోబు 2: 6
అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.
కాబట్టి మన ప్రాణాత్మలు దేవుని చేతిలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి! సైతాను గాడు మనలను రోగగ్రస్తులుగా చెయ్యగలడు గాని మన ప్రాణాలు తీసే అధికారం వాడికి లేదు అని గ్రహించాలి!
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు నాచేతిలో నుండి ఎవరూ ఎత్తుకుపోలేరు అంటున్నారు యోహాను 10:27—29 లో..
27. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
28. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.
29. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు;
తను చేసిన ప్రార్ధనలో కూడా ఇదే ప్రార్ధన చేశారు
John(యోహాను సువార్త) 17:11,12,15
11. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
12. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
15. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి ( లేక, కీడునుండి) వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.
పేతురు గారు చెబుతున్నారు 1పేతురు 1:5
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
కాబట్టి ప్రియ దైవజనమా! మనము యేసుక్రీస్తునందు భధ్రపరచపడ్డాము కాబట్టి ధైర్యముగా ఉండు! ఏవిధమైన సాతాను క్రియలు మనలను ఏమీ చెయ్యలేవు! నీవు పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు పరిశుద్ధ పరచాబడ్డావు కాబట్టి దైర్యంగా ఉండు!
రోమా 8:29—౩౦ ...
28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.
ఆమెన్!
*యూదా పత్రిక –7వ భాగం*
యూదా 1:1
యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
(గతభాగం తరువాయి)
ప్రియులారా! యూదా గారు అంటున్నారు: పరచబడి తండ్రియైన దేవునిచేత పవిత్రపరచ బడి , యేసుక్రీస్తునందు భద్రపరచబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటున్నారు.
ఈ వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయం: *పిలువబడిన వారికి*
చూశారా మనమందరం దేవునిచేత పిలువబడిన వారము. దేనికోసం పిలువబడిన వారు?
పౌలుగారు అంటున్నారు: పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు ...
రోమీయులకు 1: 2
దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.
1కొరింథీ 1:2
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా *క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని*, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
చూశారా మనము పరిశుద్దులముగా ఉండాలనే దేవుడు , మనలను పిలిచారు గాని ఈ పాపపు లోకంలో పాపపు పనులు చేసి పాపులుగా మారడానికి కానేకాదు! అందుకే పౌలుగారు అంటున్నారు: తన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తము....1థెస్సలొనికయులకు 4: 5
పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
యాకోబు గారు భక్తికి ఇచ్చిన నిర్వచనంలో అంటున్నారు ఇహలోక మాలిన్యము అంటకుండా తన ఘటమును కాపాడుకోవడమే భక్తీ.... 1:27
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్దులుగా ఉండాలి ....లేవీ 11:44,45; 21:8;
ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవరూ తండ్రిని చూడలేరు పరలోకం చేరలేరు అని గ్రహించాలి
హెబ్రీయులకు 12: 14
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
ఇక అదే పౌలుగారు దేనికోసం పిలువబడిన వారు అని చెబుతున్నారు అంటే కొంతమంది అపోస్తలులుగా ఉండటానికి పిలువబడ్డారు!
రోమీయులకు 1: 1
యేసు క్రీస్తు( క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,
1కోరింథీయులకు 1: 1
దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషెక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును
ఇదే వచనాన్ని ఇంకా మిగిలిన వాటికి వర్తింపజేస్తే కొంతమంది కాపరులుగా ఉండటానికి, కొంతమంది ప్రవక్తలగా ఉండటానికి, కొంతమంది భోధకులుగా ఉండటానికి కొంతమంది పరిచర్య చేయడానికి, కొంతమందిని విశ్వాసులుగా ఉండటానికి, కొంతమందిని అద్భుతాలు చేయడానికి పిలిచారు. అయితే వీరందరినీ పరిశుద్దులుగా ఉండటానికే పిలిచారు అంటి గ్రహించాలి.........
1కోరింథీయులకు 12: 28
మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
ఇక స్వాతంత్రము పొందటానికి పిలువబడ్డారు.
1కోరింథీయులకు 7: 22
ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.
ఇంకా మనందరిని నిత్యమైన స్వాస్త్యము పొందటానికి పిలువబడ్డాము... హెబ్రీ 9:15
ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.
నిత్యమైన స్వాస్త్యము అంటే: పరలోకంలో మనము అనుభవించబోయే మేలులు అన్నమాట!!!
అసలు నీ పిలుపు ఎంత మహత్తరమైనదో నీకు తెలుసా?
ఒకసారి రోమా 8:28—౩౦ చదువుదాం....
28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.
మరి ఇంతటి ప్రశస్తమైన పిలుపు, ఏర్పాటు కదా దానికి తగిన జీవితం జీవిస్తున్నావా?
అందుకే పేతురు గారు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటున్నారు
2పేతురు 1: 10
అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.
రోమా 1:7, 9:24
మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.
ఇంకా దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచారు అంటే ఆయన కుమారుని సహవాసానికి పిలిచారు 1కొరింథీ 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
అది చాలా ఉన్నతమైనది ఫిలిప్పీ 3:14
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
ఇంకా మనకు పాప విముక్తి దయచేయాలని మనలను పిలిచారు
2తిమోతికి 1: 10
క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.
ఇంకా చీకటినుండి తనవెలుగు లోనికి పిలిచారు! ఎందుకోసం పిలిచారు అంటే తన గుణాతిశయములను ప్రకటించడానికి
1పేతురు 2:9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
ఇంకా దీవెనకు ఆశీర్వాదాలకు వారసులవ్వడానికి
1పేతురు 3: 9
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
ఇంకా శాశ్వత మహిమకు పిలిచారు
1పేతురు 5: 10
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.
ఇంకా గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డారు.
ప్రకటన గ్రంథం 19: 9
మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.
గమనించాలి- ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు అతిశ్రేష్టులు అన్నమాట! గమనించాలి దేవునికి పక్షపాతం అనేది లేదు! అందరూ దేవునికి సమానులే! కాబట్టి రక్షణ పొందిన వారినందరినీ దేవుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలిచినా కొందరే ఆ విందులో పాల్గొనే అర్హతను పొందుకుంటారు! వారు ఎవరంటే జయించిన వారు! జయజీవితం పొందిన వారు! తమ ఘటమును కాపాడుకున్నవారు! తమ సాక్ష్యమును కాపాడుకున్నవారు! వాక్యానుసారమైన జీవితం, సాక్ష్యార్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించిన వారు అన్నమాట! వీరే జయించిన వారు! పాపము మీద జయం! లోకాశల మీద జయం! ఆలోచనలో జయం! తలంపులలో జయం! చూపులో జయం! అన్నింటిమీద జయం కలిగిన జయవీరులు అన్నమాట! వీరే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు!
ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే గొర్రెపిల్ల పెండ్లివిందు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరుగుతుంది. అనగా ఈ గొర్రెపిల్ల పెండ్లివిందులో ఎవరుంటారు? ఎత్తబడిన వారు! ఎత్తబడిన వారే జయించిన వారు! వీరే అర్హులు!
ప్రియ దైవజనమా! నీవు నేను ఈ గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడ్డాము కదా! మరి అందుకు తగినట్లు జీవిస్తున్నావా? ఎత్తబడే గుంపులో నీవున్నావా? ఒకవేళ ఈరోజే యేసయ్య వస్తే ఈరోజే సంఘము ఎత్తబడితే నీవు ఎత్తబడతావా? అటువంటి జీవితం జీవిస్తున్నావా? విడువబడితే ఆ శ్రమలు నీవు పడలేవు అని నీకు గుర్తుందా?
అందుకే పౌలుగారు అంటున్నారు ఎఫెసీ 4:2లో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకోండి అంటున్నారు....
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: పిలువబడిన వారు అనేకులు అయితే ఏర్పరచబడిన వారు కొందరే!!!
మత్తయి 22: 14
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
మరి నీవు పిలువబడ్డావు కదా, ఏర్పరచబడిన గుంపులో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా?
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –8వ భాగం*
యూదా 1: 2
మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక రెండవ వచనంలో శుభాదివందనాలు తెలియజేస్తున్నారు యూదా గారు! ఏమని అంటే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక!!!
యూదా గారు విశ్వాసులైన అందరికీ దేవుని యొక్క కనికరము కలిగి ఉండాలి పొందుకోవాలి ఇంకా సమాధానము కలిగి ఉండాలి! ఏ సమాధానము? దేవుని సమాధానము కలిగి ఉండాలి చివరగా దేవుని ప్రేమను అందరూ కలిగి ఉండడమే కాకుండా విస్తరించాలి అంటున్నారు.
కనికరమునకు మరో పేరు కరుణ! ఎందుకు ఈ కనికరమును/కరుణను విశ్వాసులందరూ పొందుకోవాలని యూదాగారు ఆశిస్తున్నారు అంటే ఒకానొకప్పుడు విశ్వాసులందరూ తమ పాపాల్లో మునిగిపోయి ఎలా విడుదల పొందాలో తెలియక కొట్టుమిట్టాడుచుండగా, అజ్ఞానంలో దౌర్బల్యం కలిగి నిస్సహాయ స్తితిలో ఉండగా దేవుడు కనికరించి వారిని క్షమించారు, తన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారిద్వారా వారికి విడుదల కలిగేలా ఏర్పాటుచేసి వారిని / మనలను విడిపించారు. ఇక్కడ అర్హతలేని మనలను క్షమించి కనికరించి రక్షించారు కాబట్టి మనం కూడా ఇలాగే మొదటగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండి తోటివారిపట్ల కనికరం కలిగి ఉండాలి అని ఆశిస్తున్నారు యూదాగారు!
దీనికోసం ఇంకా చూసుకుంటే
రోమా 9:15—16లో ...
15. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
16. కాగా పొందగోరువాని వలననైనను, ప్రయాసపడువాని (మూలభాషలో- పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
రోమీయులకు 11: 32
అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
రోమీయులకు 12: 1
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
రోమీయులకు 15: 8
నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి (సున్నతి యొక్క) గలవారికి పరిచారకుడాయెను.
ఎఫెసీయులకు 2: 4,5
అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.
కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
తీతుకు 3: 5,6
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,
కాబట్టి దేవుని యొక్క కనికరము/ కరుణయే మనలను రక్షించింది కాబట్టి మనము కూడా ఈ కనికరమును పొందుకుని అందరికి పంచాలి!
ఇకపోతే దేవుని సమాధానం ప్రతీ విశ్వాసి పొందుకోవాలని కోరుకుంటున్నారు. సమాధానము కోసం అనేకసార్లు మాట్లాడుకున్నాము కనుక ముందుకు పోదాం! యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము ఇచ్చునట్లు కాదు నా శాంతినే మీకిస్తున్నాను అంటున్నారు...
యోహాను 14: 27
శాంతి (లేక, సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే (లేక, సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
రోమీయులకు 1: 3
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక,
దేవునితో సరియైన సంభంధం, విశ్వాసులతో, పొరుగువారితో ఐక్యమత్యము కలిగి ఉన్నందువలన కలిగే మనశ్శాంతి హృదయశాంతి అందరు కలిగిఉండాలని ఆశిస్తున్నారు! అందరితో సమాధానం కలిగి ఉండాలి విశ్వాసి! ఆ సమాధానమును అందరికీ పంచాలి!
ఇక చివరగా ప్రేమ కలిగిఉండాలి విస్తరింపజేయాలి అంటున్నారు! దేవుడు చూపిన ప్రేమ ఆగాపే ప్రేమ! దీనికోసం అనేకసార్లు చూసుకున్నాము!
John(యోహాను సువార్త) 13:34,35
34. మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.
35. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
రోమా 5:5
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
1కొరింథీ 13:1
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
ఎఫెసీయులకు 3: 18
మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి, స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
గమనించాలి మనం దేవుని నుండి కనికరమును ప్రేమను పొందుకున్నాము కనుకనే ఈరోజు ఇలా రక్షించబడిన స్థితిలో ఉన్నాము! ఆయన మనలను రక్షించడానికి దోహదం చేసింది ఆయన ప్రేమ ఆయన కరుణ/కనికరం మాత్రమే. చివరికి ఆయన శాంతిని కూడా మనకు ఇచ్చారు! కాబట్టి అదే ప్రేమను మనము కూడా పొందుకోవాలి! గలతీ పత్రిక 5 అధ్యాయంలో వివరించిన ఆత్మఫలములో ఎంతో విశిష్టమైనది ఈ దేవుని ప్రేమ! దీనిని 1కొరింథీ 13:13లో దృఢపరుస్తున్నారు పౌలుగారు!
1కోరింథీయులకు 13: 13
కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
ఇంకా దీనికి ప్రేమస్వరూపి అయిన దేవుడే మూలాధారం!
1
John(మొదటి యోహాను) 4:7,8,9,10,11,12,16,18,19,20,21
7. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
8. దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
9. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ (ఒక్కడే, కుమారుడుగా) కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.
12. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
16. మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు (దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
18. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
20.ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (ఎట్లు ప్రేమింప గలడు?)
21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.
కాబట్టి ఆప్రేమను పొందుకుందాము పొందుకోవడమే కాకుండా అందరికీ పంచుదాం! విస్తరిద్దాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –9వ భాగం*
యూదా 1:3,4
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో- వ్రాయబడినవారు) .
ప్రియులారా! మనం యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఈ పత్రికకు మూల వచనాలు ఈ రెండు! దీనిలోనే ఈ పత్రికను రాసిన ముఖ్య ఉద్దేశం ఉంది! అది ఏమిటంటే మనకందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు వ్రాయాలి అని విశేష ఆసక్తి కలిగి ఉత్తరం వ్రాయాలని ప్రయత్నం చేస్తుంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని వ్రాయవలసి వచ్చెను అంటున్నారు యూదా గారు! ఎందుకు పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించబడిన బోధనిమిత్తం పోరాడాలి అంటున్నారు అంటే నాలుగో వచనంలో ఎందుకంటే కొదరు తప్పుడు బోధకులు సంఘాలలో రహస్యంగా జొరబడి, వారే భక్తిహీనులై దేవుని కృపను వారు తమ కామాతురతకును వారి స్వార్ధానికి దుర్వినియోగ పరుస్తూ మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుప్రభులవారిని విసర్జిస్తూ, తమ తప్పుడు బోధలు, వారికి అనుకూల బోధలు చేస్తూ, తమ పొట్టను పోషించు కుంటున్నారు కాబట్టి మీరు జాగ్రత్తపడి అటువంటి బోధను విసర్జించి ఈ తప్పుడుబోధకులు- తప్పుడుగాళ్లతో పోరాడండి అంటున్నారు యూదాగారు పరిశుద్ధాత్మ పూర్ణుడై!!!
గమనించారా- ఈ భక్తుడు మనందరికీ కలిగిన రక్షణ మరియు పాపవిముక్తి కోసం వ్రాయాలి అనుకుంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం వ్రాయమని చెప్పి ఈ పత్రికను వ్రాయించారు! అనగా ఈ పత్రిక ఆ కాలంలోనూ ఇక ఈ కాలంలోనూ కూడా ఎంతో విశిష్టమైన ముఖ్యమైన కావాల్సిన సమాచారం కలది కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ పత్రికలో గల ప్రతీ అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి అనుసరించాల్సి ఉంది అని గ్రహించాలి! భక్తుడు అతిశ్రేష్టమైన మహిమతో కూడిన విషయం వ్రాయాలని తలిస్తే పరిశుద్ధాత్ముడు మరో సంగతి గురుంచి రాసేలా చేశాడు!
రోమీయులకు 1: 16
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
దీనినే వ్రాయాలి అనుకున్నారు గాని పరిశుద్దాత్ముని ఉద్దేశం వేరు! కాబట్టి మనము కూడా మన యొక్క స్వంత ఆలోచనలను స్వంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇయ్యకుండా పరిశుద్దాత్మునికే సంపూర్ణ అధికారం ఇస్తే ఎంతో గొప్ప కార్యాలు చూడగలము అన్నమాట! అది సువార్తకు పరిచర్యకు సంభందించిన విషయమైనా గాని అది చాలా మంచిదైనా గాని ఒకసారి దేవుని సన్నిధిలో కనిపెట్టి అది దేవుని చిత్తమా అని మనము గాని ఒక్కసారి దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్ముడు ఆ పనిని ఏవిధంగా చెయ్యాలో మనకు విశిధపరచి దేవుని పనిని దేవుని విధానంలో చేయించుకుంటారు! మన పద్దతిలో చేస్తే చిన్న ఆటంకమునకు కూడా మనం సోలిపోతాము! అయితే దేవుని విధానంలో చేస్తే మనము తప్పకుండా విజయం సాధిస్తాము గాబట్టి దేవునికి పరిశుద్ధాత్మునికి సంపూర్ణ అధికారం ఇద్దాం!
ఇక *పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ ఏమిటి?*
దీనికోసం మనం ఆలోచిద్దాం!
ఇక్కడ "ఒక్కసారే అప్పగింపబడిన బోధ"
అన్న వాక్యాన్ని
"ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము"
అని అక్షరాలా అనువదించవచ్చు. 'ఒక్కసారే అప్పగించబడటం' అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథాలు దాదాపు 1500
BC నుండి 400
BC కాలంలో రాయబడ్డాయి. అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు దేవుడు తన వాక్య సత్యాలని అనేకమందికి బయలుపరుస్తూ వచ్చాడు. అయితే కొత్త నిబంధన గ్రంథాలన్నీ మొదటి శతాబ్దపు కాలంలోనే రాయబడ్డాయి. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో మొదటి శతాబ్దం తరవాత కలపబడిన గ్రంథాలు గాని, వాక్యాలు గాని ఏమి లేవు. అంటే కొత్త నిబంధన గ్రంథములోని బోధ ఒక్కసారే అప్పగించబడింది, అది దేవుని అపొస్తలుల ద్వారా ఆయన సంఘానికి అప్పగించబడింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుల అధికారం కింద మనకు ఇవ్వబడిన కొత్త, పాత నిబంధన గ్రంథాలే 'ఒక్కసారే అప్పగించబడిన బోధగా' పరిగణించబడాలి. దీనినే అపోస్తలుల బోధ అనవచ్చు! ఇలా దేవుడు బైబిల్ గ్రంథంలో తన వాక్యాన్ని పరిపూర్ణంగా బయలుపరిచాడు, దానికి కలపడానికి గాని అందులోనుండి తీసివేయడానికి గాని ఏమి లేదు. అయితే ఈ కాలంలో అనేకులు దర్శనాలు కలిగాయని, దేవుడు కలలో చెప్పాడని ఇంకా మరెన్నో విధాలుగా మాట్లాడాడని చెప్తుంటారు.
కొందరు అయ్యగారికి బయలుపరచిన బోధ అంటారు దానిని పాటిస్తారు! మరికొందరు దేవుడు నాతో మాట్లాడారు నేను ఈ సంఘకాలానికి ప్రవక్తను అన్నారు. అతనిని కొందరు అనుసరిస్తూ ఆయనను అనగా ఈ ప్రవక్తను చివరి ప్రవక్తగా అంగీకరించాలి అంగీకరించి ఆయన బోధను అనుసరించకపోతే నరకానికి పోతారు అంటున్నారు. మరికొందరు ఆ కాలానికి మెస్సీయ యేసయ్య అయితే మన కాలానికి మెస్సీయ ఈ ప్రవక్త అనే తప్పుడుబోదను చేస్తున్నారు! ఇంకా ఇలాంటివి కోకోల్లులుగా వచ్చేశాయి నేటిదినాలలో!
ఇవే నిజమైతే దేవుడు తన వాక్యాన్ని "ఒక్కసారే అప్పగించలేదు" అని మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది; అయితే అందుకు భిన్నంగా యూదాగారు "ఒక్కసారే అప్పగించబడిన బోధ/విశ్వాసము" అని చెప్తున్నారు యూదా గారు. యూదాగారు చెప్పేది నిజమా లేక ఈ కాలంలో దర్శనాల ద్వారా, కలల ద్వారా దేవుడు అనేకమైన విషయాలను ఇంకా బయలుపరుస్తున్నాడు అని చెప్పే బోధకుల మాటలు నిజమా? కొంచెం ఆలోచన చేయండి.
ఈ విశ్వాసం క్రీస్తు మరియు తన అపొస్తలులు ఇచ్చిన సిద్దాంతపరమైన సత్యాల మీద ఆధారపడి ఉంటుంది. బైబిలును నాకు నచ్చిన విధంగా నేను అర్ధం చేసుకుంటాను అంటే వీలుకాదు. వాక్యాన్ని అపొస్తలులు ఏ అర్థంతో బోధించారో అదే అర్ధంతో మనం గ్రహించాలి. అపొస్తలులు బోధించిన సిద్ధాంతాలను (ఉదాహరణకు: 'పాప సిద్దాంతము'. 'రక్షణ సిద్దాంతము', 'దేవుని ఎన్నిక సిద్దాంతము', 'పరిశుద్దాత్మ సిద్దాంతము', 'క్రీస్తు సిద్ధాంతము' మొదలైనవి) మనం సరిగ్గా అర్ధం చేసుకోవాలి.
*అపోస్తలుల బోధ ఏమిటి?*
👉ఈ *"అపోస్తలుల బోధ"* మనిషిని బట్టి మారిపోదు.
👉ఈ *"అపోస్తలుల బోధ"* సంఘాన్ని బట్టి మారిపోదు.
🔺కానీ నేడు సువార్త పరిచర్యలో లక్షలకొద్ది పధతులు,
🔺వేలకొద్ది మార్గాలు.
🔺ప్రతి సంఘానిది ఒక్కొక్క బోధ. . . .
🔺ఒకరు మాదే పరలోకం ఇచ్చి సంఘం అంటారు.
🔺ఒకరు మాదే నిజమైన సంఘం అంటారు.
🔺ఒకరు మందిరంలోనే విగ్రహారాధన చేస్తూ, bible లోని మనుషులను ఆరాధిస్తూ ఉంటారు.
మంచిది. . . .
👉
*వీటిలో అపోస్తలుల బోధ ఏది ?*
👉ముందు నాకు అపోస్తలుల బోధ అంటే ఏంటి అనేది తెలిస్తే మిగిలిన దొంగ బోధలకు నేను దూరంగా ఉండగలను.
👉అపో.కా 2వ అధ్యయము.... పెంతుకోస్తను దినమున మేడ గదిలోని శిష్యులకు ఆత్మ అనుగ్రహింపబడింది ఈ క్రమంలో కొందరు శిష్యులను అపహాస్యము చేసారు. . . . అప్పుడు పేతురు లేచి ఆ జనులతో ఒక ప్రసంగం చేసాడు. 3000 మందిని మార్చిన ప్రసంగం అది, మొదటి సంఘం కట్టబడుటకు ప్రేరేపించిన ప్రసంగం అది.
"Acts
2:14-40" వరకు ఈ ప్రసంగం చాలా వివరంగా వ్రాయబడింది. *ఇక్కడే అపోస్తలుల బోధ దాగివుంది.*
👉
అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)
🔺
*దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:16-35).
🔺
*సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:22-24).
🔺
*యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:31-36).
*యేసే; మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).
🔺
*ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:36).
🔺
*పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:38).
🔺
*మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:38).
🔺
*పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*
(అపో.కా 2:38).
🔺
*ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).
♻ *ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41).
👉నా ప్రియ స్నేహితులారా....
ఇదే అపోస్తలుల బోధనాక్రమము.
👉మీ సంఘములలో బోధనాక్రమము కూడా ఇలానే వుంటుందా ?
*నీ సమాధానం....*
👉అవును. అయితే " నువ్వు దేవుని హస్తలలోనే ఉన్నావు. ఉత్సహించి; ఆనందించండి"
👉నీ సమాధానం....
👉కాదు. అయితే *" తస్మాత్ జాగ్రత్త సుమా"*
👉" ఇప్పుడు మనకి కావలసింది క్రొత్త క్రొత్త బోధలు కాదు;
*మనం మరచిపోయి పక్కన పెట్టిన అపోస్తలుల బోధ*
👉" ఇప్పుడు మనకి కావలసింది క్రొత్త క్రొత్త సిధ్ధాంతాలు కాదు;
*మనం మరచిపోయి పక్కన పెట్టిన అసలు దేవుని వాక్యపుసిధ్దాంతం*
👉 ఇప్పుడు మనకి కావలసింది క్రొత్త క్రొత్త సువార్తలు కాదు;
*మనం మరచిపోయి పక్కన పెట్టిన అసలు సువార్త*
ఇది జ్ఞాపకముంచుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –10వ భాగం*
యూదా 1:3,4
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో- వ్రాయబడినవారు) .
ప్రియులారా! మనం యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
కాబట్టి ఒక్కసారే అప్పగించబడిన బోధ అనగా పాత క్రొత్త నిబంధనలకు అనుగుణంగా యేసుక్రీస్తుప్రభులవారిద్వారా మరియు ఆయన శిష్యులైన అపోస్తలులు ద్వారా మనకు అప్పగించబడిన విశ్వాస స్యత్యము అనగా అపోస్తలుల బోధ! ఇది సంపూర్ణమైనది! దీనితో ఏమీ కలుపకూడదు ఏమీ తీసివేయకూడదు అని గ్రహించాలి!
ద్వితీ 4:2
మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.
చూశారా దేవుడు ఎంత ఖండితముగా చెబుతున్నారో!
సామెతలు 30: 6
ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.
ఇంకా ప్రకటన గ్రంధంలో 22లో కూడా ఇదే ఆజ్ఞాపించాడు దేవుడు 18—19
18. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వేరెవరిద్వారా ఎప్పుడూ కొత్త సత్యాన్ని కొత్త సిద్ధాంతాలను బయలుపరచరు. ఎవరైనా అలా బయలుపరిచారు అని చెబితే అది తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధలు అని గ్రహించాలి!
అంతేకాకుండా విశ్వాసులు/ సేవకులు తమకు అందిన విశ్వాస సత్యాలను అనుసరిస్తూ ఆచరిస్తూ ఉండాలి. ఈ బోధకు వ్యతిరేఖమైన బోధగాని వర్తమానం గాని వస్తే వాటిని దేవుని పక్షంగా వాదించాలి అని గ్రహించాలి! అందుకే గలతీయులకు ఉత్తరం రాస్తూ పౌలుగారు చెబుతున్నారు.. మేము మీకు మొదటచెప్పిన సువార్త కాకుండా మరొక సువార్త మేము గాని దేవదూతలు గాని మరెవరైనా ప్రకటిస్తే వారు శాపగ్రస్తులు అంటున్నారు
Galatians(గలతీయులకు) 1:7,8,9
7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
కాబట్టి ఈ అపోస్తలుల బోధ కాకుండా ఎవరైనా చేస్తున్న తప్పుడు బోధలు వర్తమానాలు సిద్దాంతాలు చెబుతున్న వారందరూ శాపగ్రస్తులు, వాటిని అనుసరించే వారు కూడా శాపగ్రస్తులు అని గ్రహించాలి. వెంటనే ఆ తప్పుడు బోధలనునుండి తొలిగిపొమ్మని ప్రేమతో హెచ్చరిస్తున్నాను!
చూడండి పౌలుగారు ఏమి చెబుతున్నారో...
1థెస్సలొనికయులకు 2: 4
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
చూశారా ఇక్కడ మరో గుంపు ఉంది. దేవుని సువార్త ప్రకారం చెప్పకుండా తమ కడుపు నింపుకోడానికి అనుకూల బోధలు చేసే గుంపు! వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రజలను నొప్పించకుండా ప్రజలను మెప్పించే బోధ చేస్తున్నారు.
ఉదాహరణకు మనం భారతీయులం కాబట్టి మంగళసూత్రం కట్టుకున్నా వేసుకున్నా పర్వాలేదు, పెళ్ళికి రాటలు వెయ్యడం పెళ్లి పందిరి వెయ్యడం పర్వాలేదు. మామిడాకులు పందిరిలో కట్టుకున్నా పర్వాలేదు సైన్సు ప్రకారం అవి కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుంటాయి, ఇంకా ఇలాంటి ఆచారాలు పర్వాలేదు అంటూ, తిధులు నక్షత్రాలు , జ్యోతిష్యం ముహూర్తాలు పర్వాలేదు అంటూ చేస్తున్న తప్పుడు బోధలు, ఇంకా వాస్తు- సైన్సు, దానిని ఆచరించినా పర్వాలేదు అనే పాపాత్ములు అందరూ శాపగ్రస్తులు అని మర్చిపోవద్దు! ఇవి అనుకూల బోధలు! బైబిల్ లో మీరు అన్యజనుల ఆచారాలు చొప్పున చెయ్యొద్దు వారినుండి వేరై రక్షణ పొందండి అంటే వాటినే చేస్తున్నారు. గుడికి వస్తున్నారు సంస్కారం తీసుకుంటున్నారు గాని లోకాచారాలు అన్యాచారాలు మానడం లేదు! బంగారు నగలు ఆభరణాలు ధరించకూడదు అని బైబిల్ చెబితే ఎక్కడ రాయబడింది? రిబ్కాకు మరి ఇవ్వలేదా అంటూ వితండవాదం చేస్తున్న వీరు శాపగ్రస్తులు కాదా??!!! దేవుని వాక్యాన్ని కలిపిచెరుపుతున్న వీరు వాక్యవిరుద్దులు కాదా??!! మరి వీరు శాపగ్రస్తులు కాదా!!!
పౌలుగారు అంటున్నారు నేను దేవుడ్ని మహిమ పరచకుండా మనుషులును సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే నేను దేవుని సేవకున్ని కాకయే పోదును అంటున్నారు.
గలతియులకు 1: 10
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
మరి మనుష్యులను సంతోష పెట్టడానికి అనుకూల బోధలు చేస్తున్న ఓ ప్రియసేవకులారా! మరి మీరు దేవుని సేవకులా లేక మనుష్యుల సేవకులా మీరే ఆలోచించుకోండి!
1తిమోతి 1:3--11
3. నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
4. విశ్వాస సంబంధమైన దేవుని యేర్పాటుతో (మూలభాషలో- గృహనిర్వాహకత్వముతో) కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
5. ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.
6. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,
7. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
8. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము,
9. ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును (భ్రష్టులకును) పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,
10. హితబోధకు (ఆరోగ్యకరమైన బోధకు) విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
11. నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.
1
Timothy(మొదటి తిమోతికి) 6:3,4,5
3. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను (ఆరోగ్యకరమైన వాక్యములను) దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల
4. వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
5. చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
2తిమోతి 1:14
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము.
2
Timothy(రెండవ తిమోతికి) 4:1,2,3,4,5
1. దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
2. వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.
3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
5. అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
మరి దీనిని నీవు అనుసరిస్తున్నావా ప్రియ సేవకుడా!!!!ఈ తప్పుడు భోధకుల కోసం ఏమని వ్రాయబడిందో చూడండి
యోబు 20:23
వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.
Ezekiel(యెహెజ్కేలు) 34:2,4,6,7,8
2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.
4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
6. నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.
7. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
8. కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహారమాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ఫిలిప్పీ 3:18,19
18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.
అందుకే దైవజనులకు పరిశుద్ధాత్మపూర్ణుడై పౌలుగారు ఏమి చెబుతున్నారు అంటే
1తిమోతి 6:11—14
11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి (విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము (వెంటాడుము).
12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,
14. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
ఇక విశ్వాసులకోసం అంటున్నారు
గలతీ 1:6—12
6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.
12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.
కాబట్టి ప్రియ దైవజనమా! ప్రియ సేవకులారా! పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించబడిన భోధలోనే ఉందాము! అపోస్తలుల బోధను అనుసరిద్దాం!
భిన్నమైన బోధలకు వ్యతిరేఖంగా పోరాడుదాం! వాదిద్దాము! ప్రభువుకోసం నిలబడదాం!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –11వ భాగం*
యూదా 1:3,4
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో- వ్రాయబడినవారు) .
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధకోసం ధ్యానం చేసుకున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక నాల్గవ వచనంలో ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు—దేనికోసం? వారు భక్తిహీనులై మన దేవుని కృపను తమ కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు మన అద్వితీయ నాధుడును ప్రభువునైన యేసుక్రీస్తు ను విసర్జించుచున్నారు అంటున్నారు.
ఈ పత్రిక వ్రాయవలసిన అవసరం ఏమిటంటే కొంతమంది తప్పుడుభోధకులు రహస్యముగా సంఘములలో జొరబడి తప్పుడుభోదలు చేస్తున్నారు. ఆ తప్పుడుభోదలు సంఘ విశ్వాసులకు ఎంతో తీపిగా ఇష్టంగా ఉన్నాయి. అవి విని ప్రజలు సత్యమునుండి తొలిగిపోతున్నారు. అందుకే కొరడా తీసి కొట్టినట్లుగా ఈ ఉత్తరం పరిశుద్ధాత్ముడు యూదా గారినుపయోగించుకుని వ్రాయిస్తున్నారు!
అసలు వారు భోధించే ఈ అబద్దభోధ ఏమిటి?
పాపక్షమాపణ, రక్షణ కేవలం దేవుని కృప మూలంగానే వస్తుంది గనుక, అది ఏవిధంగాను మన మంచి పనులపై ఆధారపడదు గనుక క్రైస్తవులు ఎలా జీవించినా, తమకు ఇష్టం వచ్చినట్లు బ్రతికినా పర్వాలేదు. కారణం భాప్తిస్మం తీసుకున్న ప్రతీవ్యక్తి కృప క్రిందను ఉన్నారు కాబట్టి ఎంతగా పాపం చేసినా కృప మనలను క్షమించివేస్తుంది అనేది వారి ఉద్దేశం! దానికి వారు చూపించే రిఫరెన్సు రోమా 5:20... ఇక్కడ పౌలుగారు పాపం ఎక్కడైతే ఎక్కువయ్యిందో అక్కడ దేవుని కృప మరింతగా ఎక్కువయ్యింది అన్నారు! అందుకు వారు ఎంతగా పాపం చేస్తే అంతగా కృప పనిచేస్తుంది కాబట్టి పాపములు చేసినా ఒక్కసారి భాప్తిస్మం తీసుకుంటే కృప వలన మన పాపములు క్షమించబడతాయి అనే తప్పుడు సిద్దాంతం ఈ తప్పుడుగాళ్ళు ప్రజలలో చెబుతున్నారు. ఇంకా ఈ సిద్ధాంతానికి మరో సిద్ధాంతం కూడా కలుపుతున్నారు. ఇది లవొదొకయ ప్రాంతం నుండి ప్రపంచంలోకి ప్రాకింది. ఏమిటంటే మానవులు చేసే పాపం మన శరీరానికే ప్రాకుతుంది గాని మన ఆత్మలకు అంటదు. కారణం శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం! కనుక మనం చేసే పాపాలు కేవలం శరీరానికే అంటుతాయి. ఆత్మలకు అంటవు. కాబట్టి పాపం చేసినా పర్వాలేదు. శరీరం ఇక్కడే ఉండిపోతుంది గాని ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది నీవు ఎన్ని పాపాలు చేసినా అనడం మొదలుపెట్టారు. ఈ రెండు సిద్దాంతాలు సంఘంలో రహస్యంగా భోధిస్తూ సంఘంలో ఉన్న స్త్రీలను లోబరుచుకుని వారితో వ్యభిచారం చేసేవారు! ఇది యూదా గారికి తెలిసి ఎంతో కన్నీరు కార్చి ఈ ఉత్తరం రాస్తున్నారు! పౌలుగారు కూడా ఈ సిద్దాంతానికి వ్యతిరేకమగా మాట్లాడుచున్నారు రోమా 6:1 కృప వృద్ధి చెందింది అని ఇంకా పాపంలో నిలిచి ఉందామా అని అడుగుతున్నారు! నిజం చెప్పాలంటే పౌలుగారి ఉద్దేశం ఏమిటంటే ఎక్కడైతే పాపం వృద్ధి చెందిందో వారిని రక్షించడానికి ఇంకా ఎక్కువగా దేవుని కృప అవసరమయ్యింది అని ఆయన ఉద్దేశం! అయితే వీరు ఏమని తప్పుగా అన్వయించుకున్నారు అంటే మనం ఎంత ఎక్కువగా పాపాలు చేస్తే అంతగా కృప విస్తరిస్తుంది కాబట్టి పాపాలు చేసినా వ్యభిచారం చేసినా పర్వాలేదు అని తప్పుడుభోదలు చేశారు. నిజానికి పౌలుగారి ఉద్దేశం ఏమిటంటే ఎక్కువగా పాపం చేసిన వారిని రక్షించడానికి ఎక్కువగా దేవుని కృప పని చేయాల్సివచ్చింది. కాబట్టి ఇక విశ్వాసులు పవిత్రజీవితం జీవించాలి. కారణం దేవుడు ప్రతీ విశ్వాసి నిర్దోషులుగా బ్రతకాలని కోరుకునే తన రక్తంతో కడిగి పవిత్రులునుగా చేశారు కాబట్టి ఇకను పాపం చెయ్యకుండా పరిశుద్ధ జీవితం జీవించాలి అనేది పౌలుగారి ఉద్దేశ్యం అయితే దానిని వక్రీకరించి ఎంతగా పాపాలు చేస్తామో దానిని క్షమించడానికి అంతగా మనకు దేవుని కృప సహాయపడుతుంది అంటూ ప్రచారాలు చేశారు. యేసుక్రీస్తుపభులవారి ప్రార్ధనలో కూడా మనము పరిశుద్ధంగా జీవించడానికి మనలను ప్రత్యేకపరిచారు అంటూ ప్రార్ధించారు... యోహాను 17:15—19
15. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి ( లేక,కీడునుండి) వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.
16. నేను లోకసంబంధిని కానట్టువారును లోకసంబంధులు కారు.
17. సత్యమందు (మూలభాషలో- సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
19. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
చూడండి ఇలాంటి తప్పుడు బోధలు అన్నీ ఈ తప్పుడుగాళ్ళు బహిరంగంగా చెప్పరు. సంఘకాపరి లేనప్పుడు విశ్వాసుల గృహాల అడ్రస్ లు కనుక్కుని వారి ఇంటికి వెళ్లి ఎక్కువగా ఇలాంటి తప్పుడుభోదలు చేస్తారు! వారి మాటలు ఎంతో రుచికరంగా వారు చెప్పేదే నిజమన్నట్లుగా బల్లగుద్ది మరీ చెబుతారు. ఇంకా ఎంతో ప్రేమను ఒలకబోస్తారు! ఒక్కసారి మీరు సత్యం నుండి తొలిగిపోతే ఇక మిమ్మల్ని విశ్వాస బ్రష్టులుగా చేసి ఇక మిమ్మును పట్టించుకోరు!
అందుకే వారిని హెచ్చరిస్తున్నారు యూదాగారు! వారు దొంగచాటుగా రహస్యముగా వస్తున్నారు మీ దగ్గరకు! వారి మాటలు నమ్మవద్దు అని హెచ్చరిస్తున్నారు! ఇలాంటి తప్పుడుభోధకులు వస్తారని పెరతురుగారు ముందుగానే చెప్పారు 2 పేతురు 2:1లో...
మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుnతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
మా ప్రాంతంలో కూడా ఇలాంటి తప్పుడుభోధకులు బయలుదేరి ఎన్నో తప్పుడుభోదలు చేస్తున్నారు. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటూ కొందరు, అల్లాయే దేవుడు అంటూ కొందరు, బ్రేన్హాం గారిని ఈ కాలపు ప్రవక్తగా అంగీకరించాలి లేకపోతే మీకు నరకం అంటూ కొందరు, ఇంకా విచిత్రం ఏమిటంటే యేసుబాబు సాయిబాబా అన్నదమ్ములు, కాబట్టి సాయిని పూజించినా యేసుబాబుని పూజించినట్లే అని కొందరు, ఏడువారాలు చర్చికి వస్తే చాలు మీ పాపాలు పోతాయి అంటూ మరికొందరు... ఇలా అనేక పనికిమాలిన సిద్దాంతాలు పట్టుకొచ్చి ప్రజలను కలవర పరుస్తున్నారు. సంఘంలో వీటికోసం చెప్పాము. ఇంకా చెప్పాము- ఎవరైతే ఇలాంటి భోదలు చేస్తున్నారో- వారు మీ ఇంటికి వచ్చినప్పుడు- అయ్యా దీనికోసం మాకు అంతగా తెలియదు- మా పాష్టర్ గారిని పిలుస్తాను, ఆయనకు మీరు వివరించండి, అప్పుడు ఆయన మాకు ఇంకా బాగా చెబుతారు అని చెప్పి మాకు ఫోన్ చెయ్యమని చెప్పాము. అలా ఫోన్ చేసిన వెంటనే తప్పుడుగాళ్ళు పారిపోతున్నారు! కాబట్టి ప్రియ సంఘమా! వీరి భోధలను నమ్మవద్దు!
మీ సంఘంలో మీ సంఘకాపరి చెప్పిన అపోస్తలుల బోధయే నిజమైన భోధ! ఇలాంటి తప్పుడుభోధలను నమ్మవద్దు! కాపరులారా! దైవసేవకులారా! ఈ తప్పుడుభోదలు ప్రభలినప్పుడు సంఘంలో వీటికోసం వివరంగా చెప్పండి!
మన సంఘాలను కాపాడుకుందాం!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –12వ భాగం*
యూదా 1:3,4
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో- వ్రాయబడినవారు) .
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! రహస్యముగా జొరబడిన తప్పుడుభోధకులు కోసం మనం చూసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇంకా అబద్దభోధకులు కోసం ఆలోచిస్తే 2 పేతురు 2:1లో...
మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
అబద్దబోధకులు పాతనిబంధన కాలంలో ఉన్నారు. ఇప్పుడు మీలో కూడా ఉన్నారు. వారి భోదలు మిమ్మల్ని నాశనం లోనికి నడిపిస్తాయి జాగ్రత్తగా ఉండండి. వారినుండి దూరంగా ఉండండి అంటున్నారు పేతురు గారు!
పాత నిబంధనలో ఈ కపట భోధకుల కోసం ఎక్కడ వ్రాయబడ్డాయి అంటే ద్వితీ 13:1—5; 18:20—22; 1రాజులు 18:19—40; 22:6—7; యెషయా 9:15; యిర్మియా 2:8; 5:31; 14:14; 28:1—9; యెహే 13:2—7
ఇక క్రొత్త నిబంధనలో కూడా చెబుతున్నారు:
యేసుక్రీస్తుప్రభులవారే చెప్పారు మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7: 16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
మత్తయి 24: 11
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
పౌలుగారు చెబుతున్నారు అపో 20:29—30
29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.
30. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.
రోమా 16:17—18
17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
గలతీ 1:7
అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
ఇలాంటి తప్పుడుభోధకులు క్రీస్తు సిలువకు విరోధులు అని చెబుతున్నారు! ఫిలిప్పీ 3:18
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
1తిమోతి 4:1—3
1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
3. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.
అయితే విశ్వాసులలో అనేకులకు ఇలాంటి భోధలే కావాలట! 2తిమోతి 4:3,4
3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4.సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
యాకోబు గారు అంటున్నారు 4:1
మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
గమనించాలి అనేక శతాబ్దాలుగా ఇదే పద్దతిని ఉపయోగించుకుని సాతానుగాడు విజయం సాధిస్తున్నాడు! డైరెక్టుగా ఎటాక్ చేస్తే వాడిని చావజంపుతున్నాము కాబట్టి విశ్వాసులలో విశ్వాసులకే ఇలాంటి తప్పుడుభోదలతో కలవరపరచి విశ్వాసబ్రష్టులు చేస్తూ వాడు విజయం సాధిస్తున్నాడు! కాబట్టి ప్రియ సంఘమా ఇలాంటి తప్పుడు భోధలకు తప్పుడుగాళ్ళకు దూరంగా ఉండమని మనవిచేస్తున్నాను! గమనించాలి భూమిమీద మొట్టమొదటి అబద్ద ప్రవక్త/ తప్పుడుభోధకుడు ఎవరో తెలుసా?!!! అది సాతాను గాడే! అవునా ఇది నిజమా అంటూ ప్రారరంభించి మొట్టమొదటి అబద్దం చెప్పాడు ఆదికాండం 3:4లో మీరు చావనే చావరు అంటూ! అంతే, అప్పటినుండి పాపం ప్రభలిపోయింది. ఆరోజు హవ్వమ్మ గారు వాడిని ఎదిరించి ఉంటే మనకు ఈ తిప్పలు ఉండేవి కావు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు.
యోహాను 8: 44
మీరు మీ తండ్రియగు అపవాది ( అనగా,సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక,అబద్దకునికి జనకుడునై) యున్నాడు.
గమనించాలి ఈ అబద్దభోధకులు తమ తప్పుడు సిద్ధాంతాలను ఎంతో కుయుక్తిగా విశ్వాసులకు భోధిస్తారు. అక్కడ అవునా ఇది నిజమా అంటూ అనుమాన బీజము వేసి చిన్న అబద్డంతో ఏదేనుతోటలో ఉన్న సంఘాన్ని నాశనం చేశాడు! గమనించాలి వీరు అసత్యానికి కొంత సత్యాన్ని కలిపి దానిని ఆకర్షణీయంగా మార్చి కలిపిచెరుపుతుంటారు వారు బైబిల్లో ఉన్న విషయాలే చెబుతూ ఉంటారు గాని దానికి కొంత అబద్దాన్ని కలిపి మన చెవులకు ఇంపైనట్లుగా చెబుతూ మనలను నమ్మబుచ్చుతారు. కాబట్టి ఇలాంటి అబద్ద భోధకులనుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరికోసం పౌలుగారు చెబుతున్నారు వారు మారువేషం వేసుకుని ఎంతోమంచి వారు అయినట్లు ఎంతో భక్తిపరులు అయినట్లు నటించి గొర్రె చర్మము వేసుకున్న తోడేలు వలె పాడుచేస్తారు అంటున్నారు. 2కొరింథీ 11:13—15
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
గలతీ 2:4
మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది.
చూడండి యూదా గారు అంటున్నారు వీరు భక్తిహీనులు గాని భక్తి గలవారి వలె నటిస్తారు గాని వీరు నిజక్రైస్తవులు కాదు అంటున్నారు. అది వారి ప్రవర్తనే ఋజువుచేస్తుంది.
ఇంకా అంటున్నారు వీరు దేవుని కృపను వారి కామాతురతకు ఉపయోగించుకుంటున్నారు. దేవుని కృపా సిద్ధాంతమును తప్పుగా భోధించి తమ కామం తీర్చుకుంటున్నారు – ఎవరితో? సంఘంలో గల బలహీన విశ్వాసం గల స్త్రీలతో!!!
వీరు పైకి సిస్టర్ సిస్టర్ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని వశపరచుకుంటారు. కాబట్టి ప్రియ యవ్వన స్త్రీలారా! ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి.
చివరకు వీరు యేసుక్రీస్తుప్రభులవారిని విసర్జించి మిమ్మల్ని కూడా విశ్వాసబ్రష్టులు చేస్తారు! చివరకు వీరు శిక్షావిధికి గురి అవుతారు అంటున్నారు. ఆ భోదను నీవు కూడా నమ్మితే నీవు కూడా అదే శిక్షకు పాలవుతావని మరచిపోకు!
అయితే నీవనొచ్చు! ఏది తప్పుడుభోధ? ఏది నిజమైన భోధ అని మాకు ఎలా తెలుస్తుంది?
అయ్యా అమ్మా! బైబిల్ ని పరిశీలంచండి! బైబిల్ లో అలా వ్రాయబడిందా లేదా అని! బెరయ విశ్వాసులు పౌలుగారు సీల గారు భోధించిన భోధలను కూడా నిజంగా లేఖనంలో అలా వ్రాయబడిందా లేదా అని పరిశీలించి అప్పుడు నమ్మేవారు. అపో.కార్యములు 17: 11
వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
అలాగే మీరుకూడా అది అనగా వారిభోధ వాక్యానుసారమా లేదా అనేది చూసుకుని పరిశీలించండి. అది వాక్యానుసారమో కాదో చూసుకుని నమ్మండి. అది వాక్యానుసారం కాదు అని తెలిస్తే వెంటనే ఎదిరించండి. కనీసం వారికి వందనం కూడా చెయ్యవద్దు! టీ కూడా ఇవ్వవద్దు! మీ గృహం లోపలి వారిని ఆహ్వానించవద్దు! స్తీలారా వారు ఎపుడు వస్తారో తెలుసా? మీ భర్త పనిమీద వెళ్ళాక వస్తారు, తప్పుడు భోదలు చేస్తారు!
ఇంకా వారివి తప్పుడుభోధలో కాదో మీ సంఘకాపరికి చెప్పి తెలుసుకోండి! ఇలాంటివారు వస్తే వెంటనే మీ కాపరికి ఫోన్ చెయ్యండి రమ్మని చెప్పండి. మీ కాపరి వస్తే వాడు అబద్ధభోధకుడు అయితే పారిపోతాడు!
ఇంకా మత్తయి 7: 16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
కనుక ఈ తప్పుడుగాళ్ళకు దూరంగా ఉందాం! తప్పుడుభోధలను విసర్జిద్దాం!
పరలోకం చేరుకుందాం!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –13వ భాగం*
*మొదటి ఉదాహరణ*
యూదా 1:5
ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక ఐదవ వచనం చూసుకుంటే ఈ సంగతులన్నియు మీకు ముందే తెలుసు గాని మరోసారి మీకు జ్ఞాపకం చేసి చెప్పాలని అనుకుంటున్నాను అంటున్నారు. "ఈ సంగతులు మీరు ముందే ఎరిగినను" అని యూదాగారు చెప్తున్నారు, అనగా ఆ సంఘంవారికి, అబద్ధ బోధకులకి పడే శిక్ష గురించి ముందే తెలుసు. అయినప్పటికి రచయిత అదే విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం వారు మరిచిపోకూడదని, వారు తమని తాము జాగ్రత్తపర్చుకోవాలని, అంత మాత్రమే కాకుండా అది వారికి క్షేమకరం అని భావించి యూదాగారు అదే విషయాన్ని రాసారు. అపొస్తలుడైన పౌలుగారు , పేతురుగారు మరియు ఇతరులు ఇదే చేసారు. సంఘానికి తెలిసిన విషయాన్నే వారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు. అపొస్తలులు, విశ్వాసులు ఎలావుండాలి, క్రీస్తు వారిని ఎలా ప్రేమిస్తున్నాడు, వారికి ఉన్న నిరీక్షణ ఎలాంటిది అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు.
2
Peter(రెండవ పేతురు) 1:12,13,14,15
12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.
13. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చునని యెరిగి,
14. నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
15. నేను మృతిపొందిన తరువాత (నా నిర్గమమునకు తరువాత) కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
ప్రియులారా ఇక్కడనుండి భక్తుడు కొందరిని ఉదాహరణగా చూపించి ఎవరైతే దేవునిమీద తిరుగబడ్డారో వారు ఎలా నాశనమైపోయారు అనేది ఒకసారి గుర్తుచేసి అలాగే దేవునికి వ్యతిరేఖమైన భోధలుచేసే వారు కూడా ఇలానే నాశనమైపోతారు. వారిమీదికి కూడా ఇలాగే దేవుని తీర్పులు వస్తాయి అంటూ కొందరిని ఉదాహరణగా చూపించారు!
*మొదటి ఉదాహరణ*
మొట్టమొదటగా యూదాగారు ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చెబుతున్నారు:
ప్రభువు ఐగుప్తులోనుండి తన ప్రజలను రక్షించి బయటకు రప్పించినా సరే వారిలో దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మకుండా ఆయన మీద తిరుగబడిన వారిని తర్వాత అనగా ఐగుప్తునుండి బయటకు వచ్చాక నాశనం చేసెను అంటున్నారు.
గమనించాలి: క్రొత్త నిబంధన గ్రంధంలో యేసుక్రీస్తుప్రభులవారికి ఉన్న మరో బిరుదు ప్రభువు! ఇది గ్రీకు పదం కురియోస్ అనే మాటనుండి వచ్చింది.
లూకా 2: 11
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)
జాగ్రత్తగా గమనిస్తే ఐగుప్తునుండి ప్రజలను మోషే గారిద్వారా బయటకు రప్పించినది తండ్రియైన యెహోవా దేవుడు!
నిర్గమ 3:7—12
7. మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను.
9. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని.
10. కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.
11. అందుకు మోషేనేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయు లను ఐగుప్తు లోనుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా
12. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
నిర్గమకాండము 18: 10
మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక.
అయితే ఇక్కడ యూదాగారు ప్రభువే తీసుకుని వచ్చారు అని రాస్తున్నారు. అనగా యూదాగారు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పేదేమిటంటే యేసుక్రీస్తు ప్రభులవారే తండ్రియైన యెహోవా దేవుడు అని!!!
సరే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలలో కొందరు ఆయనను పూర్తిగా విశ్వసించనందువలన తర్వాత అనగా ఎర్రసముద్రం దాటాక పిట్టల్లా రాలిపోయారు అని గుర్తుకు చేస్తున్నారు. దేవుడు చెప్పారు : యెరికో ప్రాంతాన్ని వేగు చూడటానికి 12 మంది వెల్లివచ్చాక వారు ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపరిచారు కనుక ఇశ్రాయేలు ప్రజలలో యెపున్నే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువా తప్ప అందరూ అనగా మోషే ఆహారోనులతో సహా అరణ్యంలో రాలిపోతారు కేవలం వారి కుమారులు మాత్రమే వెళ్తారు అని.
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 1:34,35,36,37,38
34. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని
35. బహుగా కోపపడినేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో
36. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.
37. మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.
38. అతడు ఇశ్రా యేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.
అలాగే వీరంతా రాలిపోయేవరకు వారు అరణ్యంలో 40 సంవత్సరాలు సంచారం చేయాల్సివచ్చింది, ఇంకా మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం నుండి చివరి వరకు చదివితే ఎవరెవరు ఎలా రాలిపోయారో, ఎందుకు రాలిపోయారో మనము చదవగలం! దీనిని మాటిమాటికి ఎత్తి కీర్తనాకారులు రాశారు ముఖ్యంగా కీర్తనలు 78వ అధ్యాయంలో!
ఇంకా పౌలుగారు కూడా దీనిని ఎత్తి రాస్తున్నారు కొరింథీ పత్రికలో!!!
“సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘము క్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి; అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపకయుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. *ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.*” 1 కొరింథీ.10:1-11
హెబ్రీ 3:16—19
16. విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా
17. ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు (లేక, అవయవములు) అరణ్యములో రాలి పోయెను.
18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారిని గూర్చియే గదా
19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
వీరికి భిన్నంగా నిజమైన విశ్వాసులు దేవుణ్ణి సంతోషపెట్టాలనే భావం కలిగినవారై, ఆయన చెప్పిన మార్గాలను అనుసరించాలని పౌలుగారు ఉద్దేశ పడ్డారు!. విశ్వాసం అనేది మన మనసులో మనం ఏర్పరచుకున్న భావం కాదు కానీ, మన జీవితాన్ని మార్చే ఒక సిద్ధాంతం. అనేకులు ఈనాడు, 'యేసుని నమ్మాము' అని చెప్పుకుంటున్నప్పటికీ, నిజమైన రక్షణకు సంబంధించిన గుణాలక్షణాలు, విశ్వాసం వారిలో కనపడటంలేదు. నిజమైన విశ్వాసులు 'నమ్మాను' అని నోటిమాటలతో చెప్పడం మాత్రమే కాదు గాని, క్రీస్తు కొరకు వారు శ్రమపడుతూ, పాపాన్ని ద్వేషిస్తూ, సహోదరులని ప్రేమిస్తూ, అబద్ద బోధకులని వ్యతిరేకిస్తూ, "తమ క్రియలని బట్టి క్రీస్తు సంబంధులుగా తమని తాము రుజువుపరచుకుంటారు".
ఆ సంఘంలో ఉన్న మతభ్రష్టులకు ఈ లక్షణాలు ఏవీ లేకపోయినా, 'మేము రక్షణ పొందుకున్నాము' అని చెప్పుకుంటున్నారు గనుక అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులవలె నశిస్తారు అని యూదాగారు హెచ్చరిస్తున్నారు. ఈ కపట విశ్వాసులు, కపట భోధకులు, అబద్ధబోధకులు 'క్రీస్తుని నమ్మామని' చెప్పి, సంఘములో బోధించే స్థానాన్ని తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ అధికారం దేవుని నుండే పొందుకున్నాము అని చెప్పి, అపొస్తలుల నిజమైన బోధను తృణీకరిస్తూ, వారు చెప్పేదే సత్యమని సంఘాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ తమ మీదకి తామే నిత్యనాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఇశ్రాయేలీయులని విడిచిపెట్టని దేవుడు, “దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఆయనను విసర్జిస్తున్నవారిని కూడా విడిచిపెట్టడు.” అనేదే ఇక్కడ యూదాగారు చేస్తున్న హెచ్చరిక!
ప్రియ సంఘమా! నాయకులారా! కాపరులారా! ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకుని అపోస్తలుల భోధలో మాత్రమే సాగిపోవాలని మీకు ప్రభువు ప్రేమను బట్టి గుర్తుకుచేస్తున్నాను!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –14వ భాగం*
*రెండవ ఉదాహరణ*
యూదా 1: 6
మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక్కడ మరియు తమ ప్రధానత్వమును నిలుపుకోక తమ నివాస స్థలమును అనగా పరలోకమును విడిచిన దేవదూతలను (లూషీఫర్ వాడి అనుచరులు) మహా దినమున జరిగే తీర్పువరకు కటికచీకటిలో (అనగా పాతాళములో ఒక భాగమైన అగాధములో) నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అంటున్నారు.
ఇక్కడ యూదాగారు దేవుడు విడిపించిన ఇశ్రాయేలీయులనే కాదు, ఆయన పరిశుద్ధముగా సృష్టించిన దేవదూతలు సైతం పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు అని చెప్తున్నారు. ఇది దేవుని పరిశుద్ధతకు ఒక చిహ్నం. మేము నిజమైన క్రైస్తవులం అనుకుంటూ, క్రైస్తవులకు ఉండాల్సిన గుణాలక్షణాలు ఏవీ లేకుండా బ్రతికేవాళ్లు ఈ ఉదాహరణలను బట్టి భయపడాలి. ఇశ్రాయేలీయులను, దేవదూతలను, ఆ సంఘంలో మతభ్రష్టులను దేవుడు విడిచిపెట్టలేదు; తన కృపలో నిలువకపోతే నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు.
అయితే దేవదూతలు చేసిన పాపం ఏంటి అని మనం కొంచెం ఆలోచన చేద్దాం. అనేకమంది ఈ వాక్యభాగాన్ని ఆదికాండము 6:2 తో కలిపి, దేవదూతలు స్త్రీలతో తమని తాము అపవిత్రపరచుకొన్నారు అని చెప్తుంటారు.“దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” ఆదికాండము 6:2
దీనికోసం ఎన్నెన్నో స్టోరీలు సిద్ధాంతాలు చెబుతుంటారు.
దేవదూతలు ఈ భూమి మీద స్త్రీలను వివాహం చేసుకున్నారు, అందుకు దేవుడు వారిని శపించాడు అనే వివరణ అనేకమైన ప్రాచీన ప్రతులని బట్టి అంగీకరించటానికి యోగ్యముగా ఉన్నా, ఇది పరిపూర్ణ సత్యం అని చెప్పటానికి వాక్యం నుండి ఎటువంటి సహకారం లేదు. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనంలో "దేవదూతలు" అని తెలుగులోకి అనువదించబడిన పదం, గ్రీకులో "దేవుని కుమారులు" అని ఉంది. అయితే ఈ రకమైన వివరణకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దేవదూతలు ఆత్మలని దేవునివాక్యం సెలవిస్తోంది (కీర్తన 104:4, హెబ్రీ 1:14), ). ఈ రెండు వచనాలను (కీర్తన, హెబ్రీ) తెలుగులో "వాయువులు" అని అనువదించబడినప్పటికీ గ్రీకు పదం యొక్క అసలు అర్థం “ఆత్మలు.” మనుషులను అభివృద్ది చెంది ఈ భూమిని పాలించండి అని దేవుడు ఆశీర్వదించారు. ఆలా ఆశీర్వదించినప్పుడు, సంతానం కలగడానికి అవసరమైన శారీరక ప్రక్రియను కూడా దేవుడు స్త్రీ, పురుషులలో ఉంచారు. అయితే దేవదూతలకు ఈ ప్రక్రియ లేదు, ఎందుకంటే వారు అభివృద్ధి చెందటానికి (పెళ్లి చేసుకొని పిల్లలని కనటానికి) దేవుడు వారిని సృష్టించలేదు.
దేవుని వాక్యంలో మనుషులు కూడా "దేవుని కుమారులు" అనబడ్డారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు "దేవుని కుమారులు" అని పిలువబడ్డారు ( యిర్మీయా 31:20), , (ద్వితీయో 14:1), , కీర్తన 82:6, ).
మరికొందరు దేవదూతలు పాపం చేసారు అనటం కన్నా, దేవుని పిల్లలైనా ఎనోషు సంతానమువారు, దేవునికి విరుద్దంగా అన్యస్త్రీలని వివాహమాడారు అనే వివరణ సమంజసంగా ఉంటుంది అంటారు
అయితే దీనికోసం వివరంగా బైబిల్ లో వ్రాయబడలేదు గాని హనోకు గ్రంధంలో వ్రాయబడి ఉంది. అయితే హనోకు గ్రంధాన్ని, యాశారు గ్రంధాన్ని, చరిత్రల గ్రంధాన్ని పరిశుద్ధ గ్రంధంలో చేర్చడానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలేదు! దీనికోసం ఎంతోమంది ఉపవాసముండి ప్రార్ధన చేశారు గాని పరిశుద్దాత్ముడు ఒప్పుకోలేనందున ఆ గ్రంధాలను, మరికొన్ని శిష్యులు వ్రాసిన సువార్తలను బైబిల్ గ్రంధంలో చేర్చలేదు. కాబట్టి మనం వాటికోసం అంతగా చెప్పాల్సిన అవసరం లేదు!
ఈ గ్రంధాలను సుడిపిగ్రాఫా (pseudepigrapha) గా పిలువబడే గ్రంధాలు! ఇవి దేవుని వాక్యంగా యూదులచేత పరిగణించబడలేదు కూడా!
సరే, మరి తమ నివాసస్థలాన్ని దేవదూతలు విడిచారు అంటే అర్థం ఏంటి? మనకి సాతాను పాపం చేసాడని, వాడితో పాటు సహకరించిన అనేక దేవదూతలు తోసివేయబడ్డారని తెలుసు. దీనికోసం యేహెజ్కేలు గ్రంధంలో ఇంకా యెషయా గ్రంధంలో కొద్దిగా వ్రాయబడి ఉంది! వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది “నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి” (యెహెజ్కేలు 28:15). "నీవు గర్వించినవాడవై, ........... నీ జ్ఞానమును చెరుపుకొంటివి" (యెహెజ్కేలు 28:17). “నేను ఆకాశమునకెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలము మీదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే” (యెషయా 14:12-15). ఇలా గర్వించిన సాతానుతో పాటు, వానికి సహకరించిన దూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. పేతురుగారు తన పత్రికలో అంటున్నారు "దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటీగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను” (2 పేతురు 2:4).
ఇలా దేవుడు తమకి ఇచ్చిన ఆ గొప్ప నివాసస్థలాన్ని, అనగా పరలోకములో, ఆయన (దేవుని) సముఖములో నివసించే భాగ్యాన్ని వారి పాపాన్ని బట్టి కోల్పోయారు. దేవుని చేత త్రోసివేయబడి, "మహాదినమున జరుగు తీర్పువరకు బందించబడ్డారు," అనగా సాతాను వాని దూతల కోసం దేవుడు సిద్దపరచిన "అగ్ని గంధకములుగల గుండము" లోనికి కొంతమంది నెట్టివేయబడ్డారు ఇంకా ఉన్న మరికొంతమంది ఒక రోజున వారు నెట్టివేయబడతారు తీర్పు తరువాత. ఆ రోజున సాతాను వాడి అనుచరులు (దూతలు, మనుషులు) నిత్యనాశనాన్ని పొందుకుంటారు. యూదాగారు ఆ విషయాన్నే చెప్తున్నారు. ఈ అబద్దబోధకులకి , అవిశ్వాసులకి, వాక్యాన్ని వక్రీకరించి తమ సొంత లాభానికి వాడుకునేవారికి కూడా ఇదే గతి పడుతుంది. పాపం చేసిన ఇశ్రాయేలీయులను విడువలేదు, మానవాతీతులైన దేవదూతలను కూడా విడువలేదు,
మరి ప్రియ సంఘమా! విశ్వాసి! తప్పుడుభోదలు చేస్తున్న సహోదరుడా! నువ్వు ఆ పాపమార్గంలోనే ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? జాగ్రత్త!
నేడే ఆ తప్పుడు భోధల మార్గమును వదిలి పరిశుద్ధ గ్రంధముతోను- ఇంకా అపోస్తలుల బోధతోను సరిచేసుకుని దేవునితో సమాధాన పడు!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –15వ భాగం*
*మూడవ ఉదాహరణ*
యూదా 1: 7
ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక ఏడవ వచనంలో ఆ ప్రకారముగానే సోదొమ గోమోర్రా వాటి చుట్టుపక్కల పట్టణాల ప్రజలు వీరివలేనే వ్యభిచారము చేయుచూ పరశరీరానుసారులు అయ్యారు తద్వారా దేవుడు వారిని నిత్యాగ్ని గుండముచేత దహించడం వలన వారు దృష్టాంతాలుగా మిగిలిపోయారు అంటున్నారు.
ఈ వచనంలో ఎన్నో గూఢమైన భావాలున్నాయి.
మొదటగా సోదోమ గోమోర్రా పట్టణాలు వాటిచుట్టుప్రక్కల పట్టణాలు వీరివలనే అంటున్నారు
గమనించాలి మనకు సోదోమాగోమోర్రా పట్టణాల కోసం మనకు ఆదికాండం 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. దాని వివరణకు వెళ్లేముందు ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది దేవుడు సోదోమాగోమోర్రా పట్టణాలను అగ్ని గంధకాలచేత దహించినప్పుడు కేవలం సోదోమాగోమోర్రా పట్టణాలు మాత్రమే దహించబడ్డాయి అని అనుకుంటారు. గాని గమనించాలి ఇక్కడ చెబుతున్నారు కేవలం సోదోమగోమోర్రా కాకుండా వాటి చుట్టుప్రక్కల గల పట్టణాలు కూడా కాలిపోయాయి అని చెబుతున్నారు యూదాగారు! మరిచుట్టుప్రక్కల పట్టణాలు గ్రామాలు ఏమిటి?
దీనికి జవాబు ద్వితీ 29:23లో కనబడుతుంది/ యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సోదోమ గోమోర్ర అద్మా సెబాయిము ల వలె ....... అంటున్నారు కాబట్టి కాలిపోయినవి ఈ నాలుగు పట్టణాలు మరియు చుట్టుప్రకలనున్న చిన్నచిన్న పల్లెలు కాలిపోయాయి అన్నమాట! మీకు తెలుసు కదా ఆ సోదోమాగోమోరా ప్రాంతాలు ధహించబడిన ప్రాంతము లోనే dead sea అనబడే మృత సముద్రము ఉంది. దాని విస్తీర్ణం 605 కి.మీ. కాబట్టి ఇంత విస్తీర్ణం అంటే కేవలం పట్టణాలే కాదు చుట్టుపక్కల పల్లెలు కూడా కాలిపోయాయి అన్నమాట!
ఇక ఇదే వచనంలో వీరివలేనే అంటున్నారు. వీరివలేనే అనగా ఆదికాండం 6:1—4లో చెప్పబడిన దృష్టాంతము అని గ్రహించాలి. అనగా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపం చేసినట్లు కనబడుతుంది కదా దాని విషయం చెబుతున్నారు.
సరే ఇక్కడ వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులు అయ్యారు అంటున్నారు. మరి వారు చేసిన వ్యభిచారము ఏమిటి?
ఇది మనకు ఆదికాండం 19వ అధ్యాయంలో ఉంది. 18వ అధ్యాయంలో అబ్రాహాము గారి దగ్గరకు ముగ్గురు దేవదూతలు వంటి మనుష్యులు వచ్చారు కదా మొత్తం జరిగాక దేవుడు అబ్రాహాము కి చెప్పకుండా నేను చేయబోయే కార్యం ఎలా చేస్తాను అనుకుని తానూ సోదోమోగోమర్రా పట్టణాలను కాల్చబోతున్నట్లు అభ్రాహాము గారికి చెబితే వారికోసం అబ్రాహము గారు దేవునికి విజ్ఞాపన చేసినట్లు చూడగలం కారణం అక్కడ తన అన్న కొడుకైన లోతుగారు ఉన్నారు కనుక! ఇది జరుగుచున్నప్పుడు ఇద్దరు మనుష్యులు అనగా దేవదూతలు ఈ సోదోమా గోమార్రాలకు వచ్చినట్లు సాయంత్రం సమయాన అని కనబడుతుంది. అప్పుడు వారికి అతిధిమర్యాదలకోసం లోతుగారు తమ ఇంటికి ఈ దూతలను బలవంతంగా పిలిచి తీసుకుని వెళ్ళినట్లు చూడగలం. ఈ అతిధి మర్యాదలు ఆయన అబ్రాహాము గారిదగ్గర నేర్చుకున్నారు. ఇక ఈ పట్టణాల వారు చేసే వ్యభిచారం ఏమిటంటే చీకటి పడ్డాక ఈ దేవదూతలతో పాపం చెయ్యడానికి వ్యభిచారం చెయ్యడానికి చిన్నలు పెద్దలు ముసలివారు మొత్తం మగవారంతా వచ్చారు, వారిని బయటకు తీసుకుని వస్తావా లేదా అని గొడవు పెట్టారు. అప్పుడు జరిగిన వృత్తాంతము మీకు తెలుసు! అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే మగవారు దేవదూతలైన మగవారితో పాపం చెయ్యడానికి అడుగుతున్నారు. అనగా మగవారు మగవారితో పాపం చేసే అలవాటు వారికి వేల సంవత్సరాలు నుండే ఉంది అన్నమాట!
“ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్దులును ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా” (ఆది 19:5). ఆ పట్టణం వారు లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు. అనగా "పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి” (రోమా 1:27).
వీరు దేవుడు నియమించిన సహజ స్థితికి (natural order) వ్యతిరేకమైన స్థితిలో జీవించారు.
ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పనీయండి!
మొదటిది: దేవదూతలు స్త్రీలు కాదు! పురుషులు! పుల్లింగము అని గ్రహించాలి! చాలామంది గబ్రియేలు దేవదూత వచ్చింది. మిఖాయెల్ దేవదూత వచ్చింది అంటారు. అది తప్పండీ! బైబిల్ లో ఎక్కడ చూసినా దేవదూతల కోసం వచ్చాడు, ఇలా అన్నాడు అని వ్రాయబడింది గాని స్త్రీలింగము ఎక్కడా వాడబడలేదు! అయితే మన ఇండియాలో దేవతలు దేవదూతలు స్త్రీలు అని చెప్పబడ్డాయి కాబట్టి అది అలవాటు అయిపోయి క్రైస్తవులు కూడా దేవదూతలను స్త్రీలుగానే పిలుస్తున్నారు. దయచేసి మీరు సరిచేసుకుని దేవదూతలను పురుషులుగా సంభోదించడం నేర్చుకోమని మనవిచేస్తున్నాను!
ఇక రెండవ భయంకరమైన విషయం ఏమిటంటే అప్పుడే కాదుగాని ఇప్పుడు కూడా మగవారితో మగవారు పాపం చెయ్యడం- అనగా గే (Gay) వ్యవస్థ, స్త్రీలతో స్త్రీలు పాపం చెయ్యడం (లెస్బియన్)వ్యవస్థ అప్పుడు ఉన్నాయి. అందుకే ఆ పట్టణాలను దేవుడు కాల్చివేశారు! మరి దేవుడు మారనివాడు కాబట్టి ఇప్పుడు కూడా తప్పకుండా దేవుని ఉగ్రత వీరిమీదికి రాదా??!!!! తప్పకుండా వస్తుంది. ఈ రోజులలో అమెరికా యూరోపు వంటి పాశ్చాత్య దేశాలలోనే కాకుండా మన దేశంలో కూడా ఆడవారికి ఆడవారు పెళ్ళిచేసుకోవచ్చు, పురుషులకు పురుషులు చేసుకోవచ్చు లాంటి తీర్పులు వచ్చాయి మన దేశంలో- సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. ఇంకా ఘోరం ఏమిటంటే అక్రమ సంభంధాలు తప్పు కాదంట మన సుప్రీం కోర్టుకి! స్త్రీకి 18 సంవత్సరాలు దాటిని తర్వాత తనకు ఇష్టమైన పురుషున్ని పెళ్లి చేసుకోవచ్చు సహజీవనం చేయవచ్చు అని . ఇంకా పెళ్లి అయిన తర్వాత కూడా తనకు నచ్చిన వ్యక్తితో అనగా భర్తతో కాకుండా మరో పురుషునితో సంభంధం పెట్టుకునా పర్వాలేదు! ఎందుకంటే వారిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి అయిన స్త్రీ మరో పురుషునితో అక్రమ సంభంధం పెట్టుకున్నా ఆ పర పురుషుని పెళ్లి చేసుకున్నా తప్పులేదు అని తీర్పు ఇచ్చింది. ఇంకా ఒక పురుషుడు భార్య ఉండగా మరో స్త్రీని పెళ్ళిచేసుకోవచ్చు అని కూడా తీర్పు ఇచ్చింది. దానికి పెట్టిన కండిషన్ లు ఏమిటంటే భార్య ఒప్పుకోవాలి, పోషించే కెపాసిటీ ఉండాలి, శారీరకంగా ఇద్దరిని సంతృప్తి పరచే బలముండాలి! ఎంత ఘోరమండి! ఎక్కడికి పోతుంది మన దేశం! ఎక్కడికి పోతున్నాయి మన దేశాలు! ఆ సోదోమా గోమోర్రాల కంటే ఘోరంగా ఉన్నాయి కదండీ! ఈ మధ్యన ఒక దైవజనుడు తన సాక్ష్యం చెబుతున్నారు: అమెరికా దేశంలో ఒక రాష్ట్రానికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డారు ఆ దైవజనుడు! అక్కడ ప్రసంగం మొదలుపెట్టక మునుపు ఆ సంఘకాపరి అయ్యా మీరు దేనికోసమైనా చెప్పండి గాని గే వ్యవస్తకోసం గాని లెస్బియన్ వ్యవస్థ కోసం గాని చెప్పొద్దు! కారణం మా సంఘంలో అనేకమంది ఉన్నారు వారు! అంతేకాదు ఈ రాష్ట్రంలో వాటికి వ్యతిరేఖంగా ప్రసంగం చేస్తే వారిని అరెస్ట్ చేసే అధికారం ఉంది అని చెప్పారట! ఎంతఘోరమో కదా! ఇలాంటి వ్యవస్థ వలెనే కదా దేవుడు అగ్ని గంధకాలతో ఈ పట్టణాలను కాల్చివేశారు! మరి వీరు కూడా అదే శిక్షకు పాత్రులు కారా!!!!
ప్రియ దైవజనుడా! ఇలాంటి పాపాలు దేవుడు క్షమించడు అని చెబుతున్నావా లేదా??!! మీ సంఘంలో వ్యభిచారం జరుగుతున్నా, అక్రమ సంభందాలతో ఉన్నారని తెలిసినా నీవు వాటిని ఖండించి బుద్ధిచెబుతున్నావా లేక కానుకలు ఆశించి, జీతం ఆశించి భయపడి చెప్పకుండా ఉన్నావా? ఎవరు చేసినా పాపానికి వారే పోతారు అని వదిలేస్తున్నావా? పౌలుగారు తన కొరింథీ పత్రికలో రాస్తున్నారు ఇలాంటి వారిని వేలివేసేయ్ అంటూ! దేవుడు ఇలాంటి వాటిని క్షమించరు అని గ్రహించు!
మరో విషయం చెప్పనా? దేవుడు సంఘకాపరులను సేవకులను భోధకులను కావలి వారిగా పెట్టారు యేహెజ్కేలు 33వ అధ్యాయం ప్రకారం! అక్కడ చెబుతున్నారు- ఎవడైనా పాపం చేస్తున్నప్పుడు నీవు శిక్షకు అర్హుడవు మరణమౌతావు అని దేవుడు చెప్పమంటే నీవు చెప్పకపోతే వాడు ఎలాగు చస్తాడు గాని వాడి ఆత్మకోసం నిన్ను లెక్క అడుగుతాను అంటున్నారు.
Ezekiel(యెహెజ్కేలు) 33:2,3,4,5,6,7,8,9
2. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన యెడల
3. అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున
4. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది
5. బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడిన యెడల తనప్రాణమును రక్షించుకొనును.
6. అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనంద చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయు దును.
7. నరపుత్రుడా, *నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను* గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.
8. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.
9. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.
కాబట్టి నీవు నేను మన సంఘాలకు కావలి వారిగా దేవుడు పెట్టారు కాబట్టి తప్పును, వ్యభిచారాలను అక్రమ సంభంధాలను ఖండించాలి గద్ధించాలి బుద్ధిచెప్పాలి! భయపడకూడదు! నీవు భయపడినా లేక నీకు జీతం రాదు కాబట్టి మరో సంఘానికి తరిమేస్తారో అని గాని, వారు కొడతారు అని భయపడ్డావా వారి ఆత్మలకు నీవు లెక్కచేప్పాలి కాబట్టి వారికంటే నీవే మొదటగా నరకానికి పోతావు అని గ్రహించాలి!
ప్రియ సంఘమా! నీ భార్యతో తప్ప మరో స్త్రీతో గాని పురుషునితో గాని సంపర్కము చేయకూడదు! ఓ స్త్రీ నీవు నీ భర్తతోనే తప్ప మరో స్త్రీతో గాని మరో పురుషునితో గాని సంపర్కం చెయ్యకూడదు! ఇదే బైబిల్ బోధ! దీనికి వ్యతిరేకంగా నడుస్తున్నావా నరకానికి పోతావు జాగ్రత్త!!!
ఇక చివరగా వారిని దృష్టాంతాలుగా ఉంచారు అంటున్నారు! అనగా వారిని చూపించి మనకు బుద్ధి చెబుతున్నారు అన్నమాట!
పేతురు గారు చెబుతున్నారు: భక్తిహీనులకు దృష్టాంతముగా ఉంచటానికి నాశనం చేసాడు (2 పేతురు 2:6). అయితే వారు చేసిన పాపం ఏంటి అంటే, "వ్యభిచారము" “కామ వికారయుక్తమైన నడవడి (2 పేతురు 2:7)” అని చెప్పబడింది. ఇది ఎలాంటి "వ్యభిచారము" అంటే "పరశరీర సంబంధమైనది" అని యూదా చెప్తున్నాడు. ఈ సొదొమ గొమొఱ్ఱవాళ్ళు స్త్రీలని విడిచి, పురుషులతో వ్యభిచరిస్తున్నారు.
పౌలుగారు అంటున్నారు: ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.” 1 కొరింథీ.10:11
మరి దేవుడు చెప్పిన ఈ ఉదాహరణలను మనసులో ఉంచుకుని ఇలాంటి పాపాలను వదిలేద్దాం! మనకు అలాంటివి కనబడితే వాటిని ఖండిచి సరిచేద్దాం! దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుదాం!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –16వ భాగం*
యూదా 1: 8
అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్ర పరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను (మూలభాషలో- మహిమలను) దూషించుచు ఉన్నారు.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక ఎనిమిదవ వచనంలో అంటున్నారు: అటువలేనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు అంటున్నారు!
వీరును అనగా- ఇలాంటి మతభ్రష్టులు అని అర్ధం!
మతబ్రష్టులు ఏమి చేస్తున్నారంటే కలలు కంటున్నారు అట!
ప్రియులారా ఈ కలలు కనుట అనే మాట కోసం చాలా భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అవన్నీ చూసుకుందాం!
మొదటి అభిప్రాయం ఏమిటంటే తమకు కలలు/ దర్శనాలు వచ్చాయి, దేవుడు మాతో మాట్లాడాడు అంటూ భిన్నమైన భోదలు చేసేవారు అని అర్ధం.
ఒకసారి ద్వితీ 13:1—3 చూసుకుంటే
1. ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి
2. నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల
3. అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ...
ఇక్కడ కలలు కన్నాను దేవుడు నాతో మాట్లాడారు అనే అబద్దపు మాటలు మాట్లాడుచు ప్రజలను మోసగిస్తున్నారు
ఇక యిర్మియా గ్రంధంలో దేవుడు చెబుతున్నారు: కలగంటిని కలగంటిని అంటూ నా పేరిట అబద్దాలు పలుకుతున్నారు.
Jeremiah(యిర్మీయా) 23:25,26,27,28,30,31,3
25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.
26. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?
27. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?
28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరోధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.
వీరు దేవుని దర్శనం/ప్రవచనం కలలో కలిగిందని సంఘాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు (అపో. కార్య. 2:17).
రెండవదిగా దేవుని అధికారానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని దగ్గర నుండి తమ సొంత లాభానికి అవసరమైన వాటిని ఆశిస్తున్నారు (సామెతలు 10:28).
“మీ వృద్దులు కలలు కందురు” (అపో. కార్య. 2:17) అని చెప్పబడిన వాక్యాన్ని చూపించి మాకు కూడా దైవ దర్శనాలు కలుగుతున్నాయి అని బహుశా చెప్పుకొనియుంటారు. ఈ కలలు కంటున్నవారి ప్రవర్తన ఎలా ఉంది అంటే, మొదటిగా వీరు శరీరాన్ని అపవిత్రపరచుకొంటున్నారు. ఎలా అయితే సొదొమ గొమొఱ్ఱ పట్టణపు వారు వారి శరీరాల్ని అపవిత్ర పరచుకున్నారో అలానే వీరు కూడా "సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొన్నారు” (ఎఫెసీ 4:19). ఇదే విషయాన్ని యూదా 4వ వచనంలో, వీరు “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచున్నారు” అని చెప్పారు.
నేటిరోజులలో కూడా అనేకమంది దొంగ కలలు చెబుతూ మనుష్యులను విశ్వాసులను మోసగిస్తూ తమ పొట్ట పోషించుకుంటున్నారు. ముఖ్యంగా వీరు తప్పుడు భోధలతో విశ్వాసులను మోసగించి మతబ్రష్టులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిదగ్గర జాగ్రత్తగా ఉండాలి!
ఇక మరొక అభిప్రాయం ఏమిటంటే కలలు కనుచు శరీరాన్ని అపవిత్ర పరచుకొంటున్నారు ఆనగా వీరికి కామాతురత ఎక్కువై ఎప్పుడూ వాటికోసమే కళలు కనుచు శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారు- ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఇంగీష్ లో ఎలా ఉంది అంటే filthy dreamers
defile the flesh- ఇక్కడ ఫిల్తీ అనగా అపవిత్రమైన ఆశుద్ధమైన, అనగా వీరు అపవిత్రమైన కలలు కంటున్నారు అని ఉంది అనగా వీరు కామాభిలాషకు సంభందించిన కలలు కంటూ శరీరాన్ని అపవిత్ర పరచుకుంటున్నారు- అనగా అయితే వీరు శారీరకంగా మరొకరితో వ్యభిచారం చేస్తున్నారు లేదా కలలు కంటూ / ఎవరినో ఊహించుకుంటూ హస్తప్రయోగం (masturbation) చేసుకుంటూ శరీరాన్ని మనస్సుని అపవిత్రం చేసుకుంటున్నారు అనేది మరో అభిప్రాయం! నిజం కదా! ఈ రోజుల్లో స్త్రీలు పురుషులు ఎంతోమంది ఇటువంటి పాపంలో మునిగిపోతున్నారు కదా! మేము శరీరంతో పాపం చెయ్యడం లేదు కదా మనస్సులో ఊహించుకుంటూ తృప్తి పొందుతున్నాము. కాబట్టి తప్పే కాదు అని మనసులో అనుకుంటూ ఉన్నారు. ప్రభువు ఏమంటున్నారు? ఒక స్త్రీతో పాపం చెయ్యడమే తప్పుకాదు గాని కనీసం మొహపుచూపుతో చూసినా తన మనస్సులో అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లే అన్నారు! మరి ఇప్పుడు నీవు మోహపు చూపు చూడటమే కాకుండా ఆమెతో సంభోగం చేసినట్లు ఊహించుకుని భావప్రాప్తి పొందటం అంతకన్నా పెద్దనేరమే కదా!!!
రోమా 1:24
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
1కొరింథీ 6:18
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ పాపం నుండి కూడా దూరమై మన మనస్సును శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుందాం!
ఇక ఈ మతబ్రష్టులు చేసే మరొక తప్పు / అబద్దబోధ ఏమిటంటే ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు
వీరు "ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు”, అనగా, ఈ లోక ప్రభుత్వాన్ని వీరు నిరాకరిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న యజమానులకు మరియు ప్రభువులకు వీరు విధేయత చూపకుండా, ఇలా ఉండటమే వాక్యానుసారమని వారి అపవిత్ర ప్రవర్తనను సమర్థించుకుంటున్నారు. వీరు ప్రభువును నిరాకరిస్తున్నారు అని 4వ వచనంలో చెప్పిన యూదాగారు, ఇక్కడ వీరు ఈ లోక ప్రభుత్వాన్ని కూడా నిరాకరిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ లోక యజమానులకు విధేయత చూపించే స్వభావం క్రీస్తు మరియు ఆయన అపొస్తలులు, సంఘానికి నేర్పించారు.
(రోమా 13:1--3)
1. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.
2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
3. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు.
ఇంకా ఏసుక్రీస్తు ప్రభులవారు మీరు ఏపని చేసినా అది దేవునికి చేస్తున్నాము అని భావించి చెయ్యమంటున్నారు అపోస్తలులు మీ అధికారులకు మీ యజమానులకు లోబడి ఉండమని చెబుతున్నారు! అంతే తప్ప యజమానులను మీ ప్రభుత్వ అధికారులను, మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి డౌన్ డౌన్ అంటూ అరవమని ధర్నాలు చేయ్యమని దేవుడు ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు! ఇలా డౌన్ డౌన్ అని అరిచేవారు, ధర్నాలు చేసేవారు వాక్యవిరుద్ధమైన పనులు చేస్తున్నారు అని గ్రహించాలి! దీనిని బట్టి ఈ లోక ప్రభుత్వాన్ని నిరాకరించేవారు దేవుని అధికారాన్ని నిరాకరిస్తున్నారు అని తెలుసుకోవాలి. దీని ఉద్దేశం నిజమైన విశ్వాసులు దేవునికి వ్యతిరేకమైన విషయాలలో ప్రభుత్వానికి విధేయత చూపాలి అని కాదు కానీ, దేవునివాక్యానికి విరుద్ధంగా లేనంతవరకు విశ్వాసులు ఈ లోకఅధికారులకు విధేయత చూపాలి.
ఇక చివరగా ఈ మతబ్రష్టులు మహాత్ములను దూషించుచున్నారు అంటున్నారు! దీనికోసం కూడా రెండు అభిప్రాయాలున్నాయి!
వీరు “మహాత్ములను దూషిస్తున్నారు”, ఇక్కడ మహాత్ములు అని "doxa" అనే గ్రీకు పదాన్ని అనువదించడం జరిగింది. ఈ పదం కొత్తనిబంధనలో కనీసం 150 సార్లు వాడబడింది. ఈ పదానికి సందర్భాన్ని బట్టి వివిధ అర్ధాలు ఉన్నాయి, అయితే ఈ పదం యొక్క ప్రాథమిక అర్ధము "శోభ", "ప్రకాశం". ఇది (ఈ పదం) సందర్భాన్ని బట్టి దేవునిని, దేవదూతలను, మరియు మనుషులను గురించి వర్ణించడానికి వాడబడింది. అయితే ఈ వచనంలో యూదా ఈ పదాన్ని వాడిన అర్ధం "ప్రకాశమానమైన దేవదూతలను" వర్ణిస్తుంది అని కొందరు వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడుతుంటారు. మరి కొందరు వ్యాఖ్యానకర్తలు "మహాత్ములు" అంటే దేవుడు సంఘం మీద నియమించిన అధికారులు అని వ్యాఖ్యానిస్తారు. వీరు దేవదూతలను దూషిస్తున్నారు అనే భావం ఎంతవరకు సమంజసమో తెలియదు కానీ, వీరు దేవుడు నియమించిన అధికారానికి (సంఘంలో అధికారులు) వ్యతిరేకంగా ఉన్నారు అనే వివరణ అంగీకరించబద్దంగా ఉంది. యూదా 11వ వచనంలో చెప్పబడినట్టు “కోరహు, మోషే మరియు అహరోను మీద ఎలా తిరగబడ్డాడో", వీరు కూడా అపొస్తలులు మరియు అపొస్తలులు నియమించిన అధికారులను అదే విధంగా ఎదిరిస్తున్నారు (మహాత్ములను దూషిస్తున్నారు) అని చెప్పొచ్చు.
ఇంకా మరో అర్ధం ఉంది మహాత్ములు అనగా మహనీయులు అనగా అదృశ్యలోకంలో ఉన్న గొప్పవారిని అంటారు. అదృష్యలోకంలో ఉన్న గొప్పవారు దేవదూతలు ఇంకా అంతకంటే గొప్పవారు అనే అర్ధం వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం పరదైసులో ఉన్న పాత నిబంధన క్రొత్త నిబంధన ఆత్మలు అని కూడా అంటారు! వీరిని కూడా వీరు దూషిస్తున్నారు అంటున్నారు! 2పేతురు 2:10
ఇక దీనిని తెలుగు బైబిల్ లో చదివితే ఈ పదం క్రింద ఫుట్ నోట్ లో ఇలా ఉంది: మహాత్ములు అనగా మహిమలను దూశిస్తునారు. మహిమలు అనగా దేవుని యొక్క మహిమలే కాకుండా దేవుడు చేసిన అద్భుతాలు అని కూడా వస్తుంది. నేటిరోజులలో అనేకమంది దొంగ భోధకులు అబద్ధభోధకులు ఇప్పుడు ప్రవక్తలు లేరు, అపోస్తలులు లేరు, అంతేకాకుండా అద్భుతాలు కూడా లేవు! ఆకాలంలో సంఘము విస్తరించడానికి బైబిల్ ని సంపూర్తిగా పొందుకోడానికి అద్భుతాలు చెయ్యబడ్డాయి, ప్రవక్తలున్నారు ఇప్పుడు వాటి అవసరం లేదు! బైబిల్ ఉంది! ప్రవక్తల అవసరం లేదు! అద్భుతాలు ఆగిపోయాయి అని చెబుతున్నారు అనేక దొంగబోధకులు! అయ్యా అమ్మా! యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అవును ఆమెన్ అని బైబిల్ చెబితే ఆ రోజులలో అద్భుతాలు అవసరం ఈరోజులలో అద్భుతాలు ఆగిపోయాయి, ప్రవచనాలు ఆగిపోయాయి, ప్రవక్తలు లేరు అంటూ ఎలా చెబుతున్నారు?
హెబ్రీయులకు 13: 8
యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.
అప్పుడున్న అద్భుతాలు అప్పుడున్న ప్రవక్తలు ఇప్పుడు కూడా ఉన్నారు! ఇప్పుడు కూడా అదే ఆత్మ పనిచేస్తున్నాడు ఆరోజులలో అద్భుతాలు చేసిన పరిశుద్ధాత్ముడు ఆ రోజులలో ప్రవక్తలను ఉపయోగించు కున్న పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు! ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి! ఇప్పుడు కూడా ప్రవక్తలున్నారు! ఇది గమనించి మీ అభిప్రాయాన్ని మార్చుకోమని మనవిచేస్తున్నాను!
మతబ్రష్టులు ఆరోజులలో దేవుని తీర్పుకి గురై నాశనమైపోయారు! ఈరోజు కూడా నీవు తప్పుడు భోదలు చేస్తే నీవుకూడా తీర్పుకి లోనై నాశనానికి నరకానికి పాత్రుడవు అవుతావు అని మరచిపోవద్దు!
సంఘమా సత్యాన్ని తెలుసుకుని వీరినుండి దూరంగా ఉండమని మనవిచేస్తున్నాను!
దైవాశీస్శులు!
*యూదా పత్రిక –17వ భాగం*
*నాల్గవ ఉపమానం*
యూదా 1:9
అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో (అనగా-సాతానుతో) వాదించుచు మోషేయొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 9వ వచనంలో అంటున్నారు: “అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.” యూదా 1:9
ప్రియులారా దీనికోసం పాతనిబంధనలో లేదు! గాని యూదాగారు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాస్తున్నారు అని గ్రహించాలి.
ఇక్కడ “మిఖాయేలు", "అపవాది" వాదనలో ఉన్నట్టు మనం చూడగలం. ఈ మిఖాయేలు ఎవరు? అందుకు యూదా ఇలా చెపున్నాడు "ప్రధానదూతయైన మిఖాయేలు". అంటే మిఖాయేలు అధికారంలో ఉన్నవాడు (ఇతర దేవదూతలకి అధికారిగా ఉన్నాడు).
దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు "పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను”
(దానియేలు 10:13).
దానియేలు 10: 21
అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.
దానియేలు 12వ అధ్యాయంలో “ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును.” (దానియేలు 12:1).
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా” (ప్రకటన 12:7).
ఈ వచనాలను బట్టి మిఖాయేలు అధికార స్థానంలో ఉన్న దేవదూత అని మనం నిర్ధారించవచ్చు.
అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారు అంటే మిఖాయేలు దేవదూత దేవదూతలందరిలో ప్రధానమైన వాడు ఇంకా ఇశ్రాయేలు ప్రజల తరుపున యుద్ధాలు చేసేవాడు ! అయితే ఇంకొందరు అభిప్రాయపడేది ఏమిటంటే గాబ్రియేలు దేవదూత దేవుని నుండి భూమిమీదికి వర్తమానాలు ఎలా మోసుకుని వెళ్ళడానికి నియమించబడ్డాడో అలాగే దేవుని తరుపున దేవుని యుద్ధాలు చెయ్యడానికి మిఖాయేలు దేవదూత నియమించబడ్డాడు!
అయితే ఇక్కడ చూస్తే అధికార స్థానంలో ఉన్న మిఖాయేలు, మరియు ఒకప్పుడు అభిషేకమునొందిన కెరూబు అయిన అపవాది, “మోషేయొక్క శరీరమునుగూర్చి" వాదించుకొంటున్నారు. ఈ సంఘటన ఏ పాతనిబంధన గ్రంథములోను రచించబడలేదు. మరి యూదాకి ఈ సంఘటన ఎలా తెలుసు అనే ప్రశ్న మనకు రావచ్చు? పరిశుద్దాత్మ దేవుని చేత ప్రేరేపించబడినవాడు గనుక, దేవుడే ఒక ప్రవచన రూపకంగా ఈ విషయాన్ని యూదాగారికి తెలియపరచి ఉండొచ్చు. అయితే యూదుల చరిత్ర పుస్తకాలలో ఒకటైన “The Testament of Moses” అనే గ్రంథంలో మోషే శరీరాన్ని గురించిన వాగ్వివాదం (మిఖాయేలు, అపవాది) కనబడుతుంది. యూదాగారు ఈ గ్రంథం నుంచే ఆ సమాచారాన్ని తీసుకున్నారు అని అనేకమంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతుంటారు.
అయితే ఇక్కడ యూదాగారు ఈ వచనాన్ని ఒక చారిత్రాత్మక సత్యాన్ని తెలియజేయడానికి (మోషే శరీరం ఎక్కడ పాతిపెట్టబడింది) చెప్పట్లేదు గాని, 'మహాత్ములను దూషిస్తున్న' వారికి మరియు 'మిఖాయేలుకి' మధ్య గల వ్యత్యాసాన్ని నిరూపించడానికి చెప్తున్నారు. మిఖాయేలు దూషించి తీర్పు తీర్చే విషయంలో తెగించలేదు, తీర్పరి దేవుడే గనుక "ప్రభువు నిన్ను గద్దించును గాక" అని చెప్పారు. మనమైతే మనమే జడ్జిమెంటు ఇచ్చేస్తుంటాము. ఇక్కడ ఈ దూతకు ఏమి జరిగిందో అంతా తెలిసినా తీర్పు తీర్చడానికి తెగించక ప్రభువు నిన్ను గద్దించు గాక అన్నాడు!
ఇదే విషయాన్ని అపొస్తలుడైన పేతురు గారు కూడా చెప్తున్నారు. “దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోపవెరతురు” 2 పేతురు 2:11.
ఒక విషయం గమనించాలి: చాలామంది అభిప్రాయపడేది ఏమిటంటే యూదాగారు రాసిన పత్రికలో ఉన్న కొన్నివిషయాలు పేతురుగారు తన పత్రికలో ముందుగానే రాశారు! అనగా వీరిమధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది అంటారు! ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఆదిమ సంఘానికి మొదటి పెద్దలు- పేతురు గారు, యోహాను గారు మరియు యేసుక్రీస్తుప్రభులవారి పెద్ద తమ్ముడు చిన్న యాకోబు అనే యాకోబు గారు! కాబట్టి వచ్చే సమస్యలను వారే తీర్చేవారు! వారితోపాటుగా యూదాగారు కూడా ఈ సమావేశాలకు వెళ్తుండే వారు, ఈ రకంగా పేతురుగారితో యూదా గారికి బాగా పరిచయముంది. బహుశా యేసయ్య నేర్పించిన సత్యాలు యూదాగారు యాకోబుగారు పేతురు గారినుండి యోహాను గారి నుండి నేర్చుకుని ఉంటారు! అందుకే పేతురుగారు చెప్పిన కొన్ని విషయాలు యూదా గారు కూడా రాశారు!
సరే, మోషేగారి దేహము అనగా చనిపోయిన తర్వాత పార్ధివ దేహము కోసం దేవుని దూతలు సాతాను దూతలు తగవాడు కున్నారు అని కొన్ని గ్రంధాలలో వ్రాయబడ్డాయి. అయితే దేవుడే మోషేగారి దేహాన్ని ఎవరికీ తెలియకుండా చేసేశారు. లేకపోతే అయన సమాధిని పూజించేవారేమో ఇశ్రాయేలీయులు. అలా చేద్దామని సాతాను గాడి ఉద్దేశ్యమేమో!
ఇక ఆ గ్రంధాల ప్రకారం ఎందుకు సాతాను దూతలు మోషేగారి దేహం కోసం పోరాడుకున్నారు అంటే మోషే గారికి ఆహారోను గారికి బండతో మాట్లాడు, నేను నీరు ఇస్తాను అని దేవుడు చెబితే మోషేగారు కోపం తట్టుకోలేక బండను కొడతారు! అప్పుడు వారు దేవుణ్ణి మహిమపరచనందువలన మీరిద్దరూ కూడా కనాను దేశం చూడరు అని దేవుడు వారిమీద కోపపడ్డారు! ఇక్కడ సైతాను గాడి ప్రశ్న ఏమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞ బండతో మాట్లాడు అంటే బండను కొట్టారు కాబట్టి పాపం చేసిన వాడు పరదైసుకి కాదు పాతాళానికి వెళ్ళాలి కాబట్టి భూలోకంలో ఉన్న మోషేగారి పార్ధివ దేహాన్ని ఇక్కడ అపవిత్ర పరచి, అతని ఆత్మను పరదైసుకి వెళ్ళకుండా కొంతసేపు అడ్డుకున్నాయి! అయితే మిఖాయేలు అతని సైనికులయిన దూతలు సైతాను గాడి సైనికులను ఎదిరించి పరదైసుకి తీసుకుని వెళ్ళారు అంటారు! ఇదీ వారుచెప్పే కధ! అయితే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ స్టోరీని నిజమని నమ్మడం కాదు గాని దేవదూతలు కూడా ఇలాంటి దైవభక్తులకు వ్యతిరేకంగా సాతాను గాడు మాట్లాడినప్పుడు తీర్పు తీర్చలేదు శపించలేదు గాని ప్రభువు నిన్ను గద్ధించును గాక అని చెప్పి ఊరుకున్నారు! మనము కూడా ఇలాగ తీర్పు తీర్చకుండా దేవుని చిత్తానికి వదిలెయ్యాలి! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్చబడదు!
మత్తయి 7: 1
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
లూకా 6: 37
తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;
1కోరింథీయులకు 4: 5
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
ఈ విషయాన్ని యూదాగారు ఎందుకు రాస్తున్నారు అంటే ఈ మతబ్రష్టులు దేవుని భయము లేకుండా వారికి వారే తీర్పరులు జడ్జీలు అన్నట్లుగా తీర్పు తీరుస్తున్నారు! వీరు కూడా శిక్షకు పాత్రులు అని చెబుతున్నారు!
కాబట్టి ఇప్పుడు మనము కూడా తీర్పు తీర్చవద్దు! దేవునికే వదిలేద్దాం!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –18వ భాగం*
*నాల్గవ ఉపమానం*
యూదా 1:9,10
9. అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో (అనగా-సాతానుతో) వాదించుచు మోషేయొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను.
10. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనము చేసికొనుచున్నారు.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 10వ వచనంలో అంటున్నారు: “వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనము చేసికొనుచున్నారు.”
“వీరైతే" అనగా అబద్ద భోధకులు- మతబ్రష్టులు (అబద్ధ బోధకులకి, మిఖాయేలుకి మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ), గ్రహించలేని, అర్ధం కాని విషయాలను గురించి దూషిస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు మిఖాయేలుకి, వీరికి వ్యత్యాసాన్ని చూపుతున్నారు అంటే, మిఖాయేలుకి అపవాది గురించి అన్ని విషయాలు తెలిసినప్పటికీ, దేవుని స్థానాన్ని తీసుకొని తీర్పు తీర్చకుండా, ప్రభువు గద్దింపునకు ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. అయితే వీరికి తెలియని విషయాలను బట్టికూడా వీరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ, దుర్భాషలాడుతున్నారు. గ్రహించలేని విషయాలు అంటే అవి దేవదూతల గురించిన విషయాలు అయియుండొచ్పు, దేవుని అపొస్తలుల గురించిన విషయాలు లేదా వాక్యానికి సంబంధించిన విషయాలు అయియుండొచ్చు. వీరు ఎందుకు ఈ విషయాలని గ్రహించలేకపోతున్నారు అంటే వీరు "ప్రకృతి సంబంధమైన మనుషులు" అని విశ్లేషించవచ్చు. "ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు" (1 కొరింథీ 2:14). వీరు అపొస్తలులని దుర్భాషలాడుతూ, వారి బోధను తృణీకరిస్తూ, వాక్యానికి విధేయత చూపించే విషయంలో దూషకులుగా ఉన్నారు. వీరు చేసే పనులను "దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా?" (కీర్తన 73:11) అని అనుకొనే స్థితిలో బ్రతుకుతున్నారు.
వీరిని గురించి పేతురుగారు ఇలా చెప్తున్నారు "వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు” (2 పేతురు 2:12).
వీరు ఆధ్యాత్మిక విషయాల గ్రహింపు లేనివారై, "వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి, తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.” (2 పేతురు 2:14)
వీరు "నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోయి,.........కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టు"(2 పేతురు 2:21,22) వీరి ప్రవర్తన ఉంది.
పౌలుగారు చెబుతున్నారు: వీరు ఏ విషయాన్నీ వివేచించకుండా, తమ స్వాభావికమైన మనసుకు ఏదీ తోస్తే దానిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు "సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగరహితులును, నిర్దయులునై"యున్నారు (రోమా 1:29-31).
వీరిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు గనుక, వీరు స్వభావసిద్దంగా ప్రవర్తిస్తూ ఆత్మ వివేచన లేకుండా సమస్తమైన దుర్నీతితో నిండుకొని శరీరక్రియలయందు ఆనందిస్తూ ఉంటారు.
ఇలాంటి కపట విశ్వాసులు/బోధకులు "తమ్మునుతాము నాశనము చేసుకుంటున్నారు" అని యూదాగారు చెప్తున్నారు.
పౌగారు అంటున్నారు: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్చలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును” (గలతి 6:7).
వీరు దేవుని అపొస్తలులును దూషిస్తూ, శరీరాన్ని బట్టి శరీరేచ్ఛేలను మృగాలవలె విత్తుతున్నారు గనుక, నాశనమనే పంటని కోస్తారు.
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ అబద్దభోధకుల వలె మనం తెలియని వాటికోసం మాట్లాడవద్దు! నాకు అంతగా తెలియదు అని ఊరుకుందాం! ఇంకా ఎవరైనా వాక్యవిరుద్ధమైన విషయాలు బోధిస్తే మీకు దానికోసం తెలిస్తే ధైర్యంగా ఎదిరించండి. తెలియక పోతే మా దైవసేవకులకి బాగా తెలిసి ఉండవచ్చు వారిని పిలుస్తాను వారు వచ్చేవరకు ఉండండి అని చెప్పండి! ఇంకా వదరుతూ ఉంటే దేవుడే నిన్ను గద్దించును గాక అని పలికి ఊరుకోవాలి!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –19వ భాగం*
*5వ ఉపమానం*
యూదా 1: 11
అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 11వ వచనంలో ఏకంగా ముగ్గురిని చూపించి మూడు ఉదాహరణలు చెబుతున్నారు :అయ్యో వారికి శ్రమ అంటూ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పుత్రోవలో పరుగెట్టిరి కోరహు చేసినట్లు తిరస్కారం చేసిరి అంటున్నారు!
ఈ కపట బోధకులకి "శ్రమ" అని యూదాగారు చెప్తున్నారు. ఎందుకు వీరికి శ్రమ అంటే వీరు దేవుడు నియమించిన మార్గాలను చెరిపేసి, ఆయనకు విరుద్ధమైన మార్గాలలో నడుస్తున్నారు. ఇక్కడ వీరి మార్గాల గురించి ఈ విధంగా చెప్పబడింది.
• కయీను నడిచిన మార్గంలో వీళ్ళు నడుస్తున్నారు
• బిలాము నడిచిన తప్పు త్రోవలో వీళ్ళు పరుగెడుతున్నారు
• కోరహు వలే తిరస్కారము చేసి నశిస్తున్నారు
*కయీను తప్పు మార్గం*: దేవునికి సరియైన అర్పణ – సరియైన రీతిలో ఇవ్వలేదు; తన తమ్ముడు అర్పణం దేవుడు అంగీకరించినందుకు తమ్ముడిపై ద్వేషం పెంచుకున్నాడు; కపటముగా మాట్లాడి తోటలోనికి పోయి తమ్ముడ్ని హత్య చేశాడు; దేవుడు అడిగితే దేవునికే గీర సమాధానం చెప్పాడు; అందుకే దేవునిచేత శపించబడ్డాడు!
*బిలాము తప్పు త్రోవ*: ధనాశచేత ఇశ్రాయేలు వారిని శపించాలని అనుకున్నాడు; దేవుడు వద్దు అని చెప్పినా బయలుదేరి వెళ్ళాడు; గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు! బాలాకుకి దేవుని ప్రజలను దేవునిచేతనే ఏవిధంగా నాశనం చెయ్యాలో తప్పుడు సలహాలు ఇచ్చాడు! నీతిమంతుల మరణం వంటి మరణం నాకు రావాలని కోరుకున్న ఇశ్రాయేలు వారిచేత హత్య గావించబడ్డాడు!
*కోరహు చేసిన తిరస్కారం*: దైవజనుడైన మోషేగారిమీద, ఆహారోను మీద వ్యతిరేఖంగా లేచాడు! వారికి అనగా ఈ దైవజనులకు దేవుడిచ్చిన ఆధిక్యతను ప్రశ్నించాడు, తిరస్కరించాడు; తనతో పాటుగా మరో 250 మందిని లేపాడు; అందరూ తనతోపాటుగా నాశానమయ్యేలా చేసి భూమిలోకి దిగిపోయాడు!
సరే ఇప్పుడు ఈ ముగ్గురు చేసిన తప్పుడు పనులు తప్పుడు మార్గాలు కోసం వివరంగా చూసుకుందాం!
*కయీను నడిచిన మార్గం ఏంటి?*
వాక్యం ఇలా సెలవిస్తోంది “మనము కయీనువంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను గనుకనే గదా?” (1 యోహాను 3:12). కయీను అసూయ, నరహత్య, అహంకారము, అన్యాయము అనే పాపములతో నిండియున్నవాడు. అలానే ఈ అబద్ధబోధకులు ఇతరుల ఆత్మీయవరాలను చూసి తట్టుకోలేక, అసూయపడుతూ, తమ తప్పుడుబోధల ద్వారా అనేక ఆత్మలను నిత్యనాశనానికి నడిపిస్తున్నారు. ఇలా కయీను నడిచిన మార్గంలో నడుస్తున్న వీరికి శ్రమ.
ఇంకా వివరంగా చూసుకోవాలంటే ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ సంఘటన కోసం వ్రాయబడింది. 4:2—12
2. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.
3. కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
4. హేబెలు కూడ తన మందలో తొలుచూలు తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;
5. కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా
6. యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి?
7. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.
8. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.
9. యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.
10. అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.
11. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు;
12. నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.
చూడండి మొదటగా దేవునికి బలి అర్పించాలి అనే బోధను తండ్రి దగ్గర నేర్చుకుని మొదటగా అర్పించినది కయీనే! గాని అతడు సరియైన అర్పణ సరియైన రీతిలో సరియైన మనస్సుతో లేక పూర్నమనస్సుతో పూర్ణ ఆత్మతో అర్పించలేదు! అందుకే దేవుడు ఈ కయీను అర్పనను అంగీకరించలేదు! అయితే తన తమ్ముడైన హేబెలు విశ్వాసమును బట్టి సరియైన అర్పణ అర్పించాడు అని మనకు హెబ్రీపత్రికలో ఉంది!
హెబ్రీ 11:4
విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.
చూశారా దేవుడు ఏమి చెబుతున్నారో!
దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే కయీనుకి లేనిది హేబెలుకి ఉన్నది మొదటిది దేవుడంటే భక్తి గౌరవం; రెండు దేవునిమీద పరిపూర్ణ విశ్వాసం!
ఈ విశ్వాసం తల్లిదండ్రులు దగ్గర నేర్చుకున్నారు హేబెలు గారు! ఆదాము హవ్వమ్మలు బహుశా తన పిల్లలిద్దరికీ చెప్పి ఉంటారు! అసలు మేము దేవుని ఏదేను తోటలో ఉండేవారం! సాతాను గాడి మాటలకు మేము మోసపోయి దేవుడు తినవద్దు అన్న పండుని తిని శాపగ్రస్తులము, పాపులము అయిపోయాము! అయితే దేవుడు కరుణామయుడు కాబట్టి బలి అర్పించడం ద్వారా దేవుణ్ణి మంచి చేసుకుని ఆయన దగ్గరకు చేరగలము! అందుకే వెంటనే కయీను అర్పణ అర్పించాడు! అయితే పూర్ణమనస్సుతో కాదన్నమాట! అందుకే దేవుడు ఏమంటున్నారు? నీవు సత్క్రియ చేస్తే నీ తలను ఎత్తుకోవా?? ఈమాటను బట్టి కొంతమంది సేవకులు బైబిల్ పండితులు అంటుంటారు: కయీను ముందుగా ప్రధమ ఫలం అర్పించాడు అట; తర్వాత అనుకున్నాడట- పండించింది నేను కష్టపడింది నేను – ఇప్పుడు అనుభవించేది దేవుడా- దేవుడు చూస్తున్నాడా ఏమిటి- కొంత అర్పించి కొంత తీసేద్దాం అని బలిపీటం మీద నున్న అర్పణలో కొంత తీసేసాడు అట! దీనిని దేవుడు చూసి ప్రపంచంలో అర్పించిన మొట్టమొదటి బలిని దేవుడు అంగీకరించలేదు! అయితే హేబెలుగారు మొదటగా దేవునికి ఏమి బలి అర్పించాలి? ఏ బలి దేవుడు అంగీకరిస్తారు అని ఆలోచించి విశ్వాసముతో ప్రార్ధించి పొందుకుని, తనకున్న దానిలో శ్రేష్టమైన క్రోవ్విన తొలిచూలు వాటిని కొన్ని తీసుకుని వచ్చి అన్నింటినీ అర్పించేశారు! దేవుడు ఈ విశ్వాస హృదయాన్ని, యదార్ధమైన మనస్సుని చూసి ఆకాశమునుండి దేవుని అగ్ని దిగివచ్చి అర్పణము అంగీకరించినట్లుగా దానిని దహించెను! వెంటనే హేబెలు గారు సాగిలపడ్డారు! అయితే కయీను అర్పణమును దేవుడు బలమైన గాలి పంపించగా ఆ గాలితో కయీను అర్పించిన అర్పణ అనగా ప్రధమ ఫలమైన పనలు ఎగిరిపోయాయి! దీనిని చూసి కయీను పగపట్టి మాయమాటలు చెప్పి తమ్ముడ్ని తోటలోనికి తీసుకుని పోయి చంపేశాడు! తర్వాత దేవునికి ఎదురు సమాధానం చెప్పాడు! వెంటనే శపించబడ్డాడు!
కాబట్టి ఇప్పుడు కూడా అనేకమంది దేవునికి సరియైన అర్పణ అర్పించకుండా విశ్వాసం లేని హృదయము కలిగి దేవుణ్ణి పెదాలతో మాత్రము స్తుతిస్తున్నారు గాని వారి హృదయము దేవునికి దూరంగా ఉంది! చర్చిలో పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అని పాడుతున్నారు గాని వారు చేసే ప్రతీ పని అపరిశుద్ధతయే! వారి పనులు అపవిత్రాలు- వారి మాటలు అపవిత్రాలు- వారి నడక అపవిత్రాలు! వారి చూపు అపవిత్రము- , మొత్తమంతా అపవిత్రమైన ప్రవర్తన కలిగి చర్చికి వచ్చి స్తోత్రము నాయనా పరిశుద్ధుడా అంటూ ఈ అపవిత్రులు పాపులు ప్రార్ధన చేస్తూ సంఘస్తులను మోసగిస్తున్నారు గాని దేవుడ్ని మోసం చెయ్యలేరు! ఈ మధ్యన కొత్త పనికిమాలిన బోధకులు తయారయ్యారు- దశమభాగము అనేది పాత నిబంధన వారికి గాని ఇప్పుడు మనం ధర్మశాస్త్రం క్రింద ఉన్నాము గనుక దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు- ప్రధమ ఫలాలు దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ పనికిమాలిన వారు చేస్తున్న ఈ అబద్ద పనికిమాలిన బోధకులు కూడా ఇలా తీర్పుకి శిక్షకు పాత్రులు కారా?!! ఆమధ్య కాకినాడ నగరంలో ఒక క్రొత్త చర్చి ప్రారంభం అయ్యింది! మీరు మా సంఘానికి రండి, దశమభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు! కేవలం ఆరాధనా సమయంలో వచ్చి, కూర్చుని దేవుణ్ణి ఆరాధించి వెళ్ళేటప్పుడు చికిన్ బిర్యాని కడుపునిండా తినేసి వెళ్ళిపొండి అంటూ ప్రకటనలు చేసి అనేకులను వారు ఆకర్షించుకొని మతబ్రష్టులుగా చేశారు! ఈ తప్పుడు బోధ వాక్యవిరుద్ధం కాదా! మరి వీరిని దేవుడు తీర్పులోనికి తీసుకుని రారా??!!!
కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలనుండి దూరంగా ఉండటమే కాకుండా కయీను చేసినట్లు తప్పుడు అర్పణలు అర్పించవద్దు! సహోదరుల మీద సహోదరీల మీద ద్వేషం పెంచుకోవద్దు! ఏదేమైనా గాని హత్య చేయవద్దు- ఆ ఆలోచన కూడా చేయవద్దు, కుట్రలు చేయవద్దు! ముఖ్యంగా దేవుని స్వరానికి లోబడండి!
దైవాశీస్సులు!!!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –20వ భాగం*
*6వ ఉపమానం*
యూదా 1:11
అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 11వ వచనంలో ఏకంగా ముగ్గురిని చూపించి మూడు ఉదాహరణలు చెబుతున్నారు :అయ్యో వారికి శ్రమ అంటూ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పుత్రోవలో పరుగెట్టిరి కోరహు చేసినట్లు తిరస్కారం చేసిరి అంటున్నారు!
ఈ కపట బోధకులకి "శ్రమ" అని యూదాగారు చెప్తున్నారు. ఎందుకు వీరికి శ్రమ అంటే వీరు దేవుడు నియమించిన మార్గాలను చెరిపేసి, ఆయనకు విరుద్ధమైన మార్గాలలో నడుస్తున్నారు. ఇక్కడ వీరి మార్గాల గురించి ఈ విధంగా చెప్పబడింది.
• కయీను నడిచిన మార్గంలో వీళ్ళు నడుస్తున్నారు
• బిలాము నడిచిన తప్పు త్రోవలో వీళ్ళు పరుగెడుతున్నారు
• కోరహు వలే తిరస్కారము చేసి నశిస్తున్నారు
*బిలాము తప్పు త్రోవ*: ధనాశచేత ఇశ్రాయేలు వారిని శపించాలని అనుకున్నాడు; దేవుడు వద్దు అని చెప్పినా బయలుదేరి వెళ్ళాడు; గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు! బాలాకుకి దేవుని ప్రజలను దేవునిచేతనే ఏవిధంగా నాశనం చెయ్యాలో తప్పుడు సలహాలు ఇచ్చాడు! నీతిమంతుల మరణం వంటి మరణం నాకు రావాలని కోరుకున్నా గాని ఇశ్రాయేలు వారిచేత హత్య గావించబడ్డాడు!
దీనికోసం మనకు సంఖ్యాకాండం 22—24 అధ్యాయాలలో వివరంగా వ్రాయబడి ఉంది.
బిలాము, దేవుడు ఆశీర్వదించిన ఇశ్రాయేలు జనాన్ని శపించడానికి బాలాకు అనే మోయాబు రాజు చేత పిలిపించబడినప్పుడు, దేవుడు వెళ్లొద్దు అని చెప్పారు. మొదటిసారి బిలాము వెళ్ళలేదు. రెండవసారి రాజైన బాలాకు దగ్గర నుండి మనుషులు వచ్చినప్పుడు, దేవుడు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ తన ధనాపేక్షను బట్టి మీరు ఈ రాత్రి ఇక్కడ బస చేయండి (బాలాకు రాజు దగ్గర నుండి వచ్చిన మనుషులని) నేను దేవునిని అడుగుతాను అని అన్నాడు.
చూడండి- దేవుని ప్రవక్త అనేవాడు లేని రోజులలో ఒక పరాయి దేశంలో రోషము గల ప్రవక్త- బిలాము ఎవరిని దీవిస్తే వారు దీవించబడేవారు, ఎవరిని శపిస్తే వారు శపించబడేవారు. బిలాము ఏమి పలికినా దేవుడు చేసేవారు! ప్రతీరోజూ దేవునితో సంభాషించే అనుభవం గల గొప్ప ప్రవక్త ధనపిచ్చిలో పడిపోయాడు!
దేవుడు బిలాము యొక్క తప్పుడు ఉద్దేశాన్ని బట్టి బాలాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి అనుమతించాడు. అయితే బిలాము యొక్క తప్పు ఏమిటో తనకు తెలిసేలా చేయడానికే దేవుడు వెళ్ళడానికి అనుమతించాడుగాని ఇశ్రాయేలీయులను శపించటానికి కాదు. దేవుడు ఏ మాటలైతే ఇశ్రాయేలీయులను గురించి బిలాముకు చెప్పాడో, అవే మాటలు బిలాము రాజైన బాలాకు రాజుకు చెప్తాడు. అప్పుడు బాలాకు, నేను ఇశ్రాయేలీయులను శపించటానికి నిన్ను పిలిస్తే నువ్వు వారిని ఆశీర్వదిస్తున్నావు, ఇదేంటి అని అడుగుతాడు. అందుకు బిలాము, దేవుడు చెప్పమన్న మాటలు తప్ప నా సొంతంగా ఏమి చెప్పలేను అని అంటాడు. దేవుడు ఆశీర్వదించిన ప్రజలను నేను శపించలేను అని కూడా రాజుకు బదులిస్తాడు. ఈ కథ అంతా విన్న తరువాత, బిలాము దేవుడు చెప్పమన్నదే చెప్పాడు కదా? దేవుని మాట విన్నాడు కదా? మరి ఎందుకు యూదా "బిలాము నడిచిన తప్పుమార్గం" అని అంటున్నాడు అని మనం అనుకోవచ్చు (సంఖ్యాకాండము 22-24).
అయితే బిలాము, ఇశ్రాయేలీయులను దేవుడు శపించడు అని ఎరిగినవాడై, రాజైన బాలాకుకు ఒక సలహా ఇస్తాడు అదేమిటంటే, 'మోయాబీయుల స్త్రీలను ఇశ్రాయేలీయులతో వ్యభిచారం చేయమను, అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షిస్తాడు' అని. మోయాబు రాజు అలానే చేసి ఇశ్రాయేలీయులలో అనేకులు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసేట్లు చేస్తాడు. అందును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులలో 24,000 మందిని తెగులు ద్వారా సంహరించాడు.“అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించినవారు నీలో ఉన్నారు.” ప్రకటన 2:14
ధనాపేక్ష, లేక బహుమానం పొందుకోవాలని దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుని ప్రజలను విగ్రహారాధనలోకి, జారత్వములోకి నెట్టినవాడు బిలాము. అలానే ఈ కపట బోధకులు దేవుని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వ్యభిచారంలోకి, విగ్రహారాధనలోకి నడిపిస్తున్నారు. బిలామును ఎలా అయితే దేవుడు, యెహోషువ చేతిలో మరణం పొందేలా చేసారో, అలానే వీరు క్రీస్తు చేత శిక్షకు నియమించబడ్డారు.
2పేతురు 2:15,16
15. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.
16. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! ఇలాంటి తప్పుడు బోధలకు లోనై వ్యభిచారం, విగ్రహారాధన లాంటి పాపములకు తిరుగవద్దు అని మనవిచేస్తున్నాను! ఇక మా పల్లెటూర్లలో రక్షించబడిన విశ్వాసుల యొద్దకు అన్యులు వచ్చి అమ్మా, నీవు పూజచేయవద్దు! మాకు ఎలా చెయ్యాలో తెలియదు, దయచేసి వచ్చి ఎలా చెయ్యాలో దూరం నుండి చూసి చెప్పు! మేము చేస్తాము అంటూ వారి బంధువులు పిలుస్తుంటే నేను చెయ్యను కదా అని అలాంటి పూజలు ఎలా చెయ్యాలో చెబుతున్నారు! అమ్మా అయ్యా మీరు కూడా శిక్షకు పాత్రులు అని మరచిపోవద్దు! అలాంటివారికి దేవుని గూర్చి చెప్పి వాటిలో మోక్షం లేదు నేను కూడా అలాంటివి చేసి మోసపోయాను! ఎవరూ ఏ దేవత నన్ను ఆదుకోలేదు! అప్పుడు దేవుడు యేసుక్రీస్తుప్రభులవారు నన్ను కరుణించి ఈ రోగం నుండి నన్ను విడుదల చేశారు అనే సాక్ష్యాన్ని నీవు చెప్పాలి గాని వారిని ఎంకరేజ్ చెయ్యకూడదు అని గ్రహించాలి! అంతేకాకుండా అలాంటి పూజలకు నీవు హాజరు కాకూడదు వారు నీకు ఎంత బంధువులైన వెళ్ళకూడదు! ఇదే బైబిల్ చెబుతుంది!
వాటికి- వారికీ దూరంగా ఉందాము! పరలోకం చేరుకుందాం!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –21వ భాగం*
*7వ ఉపమానం*
యూదా 1:11
అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 11వ వచనంలో ఏకంగా ముగ్గురిని చూపించి మూడు ఉదాహరణలు చెబుతున్నారు :అయ్యో వారికి శ్రమ అంటూ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పుత్రోవలో పరుగెట్టిరి కోరహు చేసినట్లు తిరస్కారం చేసిరి అంటున్నారు!
ఈ కపట బోధకులకి "శ్రమ" అని యూదాగారు చెప్తున్నారు. ఎందుకు వీరికి శ్రమ అంటే వీరు దేవుడు నియమించిన మార్గాలను చెరిపేసి, ఆయనకు విరుద్ధమైన మార్గాలలో నడుస్తున్నారు. ఇక్కడ వీరి మార్గాల గురించి ఈ విధంగా చెప్పబడింది.
• కయీను నడిచిన మార్గంలో వీళ్ళు నడుస్తున్నారు
• బిలాము నడిచిన తప్పు త్రోవలో వీళ్ళు పరుగెడుతున్నారు
• కోరహు వలే తిరస్కారము చేసి నశిస్తున్నారు
*కోరహు చేసిన తిరస్కారం*: దైవజనుడైన మోషేగారిమీద, ఆహారోను మీద వ్యతిరేఖంగా లేచాడు! వారికి అనగా ఈ దైవజనులకు దేవుడిచ్చిన ఆధిక్యతను ప్రశ్నించాడు, తిరస్కరించాడు; తనతో పాటుగా మరో 250 మందిని లేపాడు; అందరూ తనతోపాటుగా నాశనమయ్యేలా చేసి భూమిలోకి దిగిపోయాడు!
దీనికోసం మనకు సంఖ్యా 16వ అధ్యాయంలో వివరంగా వ్రాయబడింది........
Numbers(సంఖ్యాకాండము) 16:1,2,3,5,6,7,9,10,11,16,17,18,19,22,23,24,26,29,30,31,32
1. లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
2. ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందల యేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
5. తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
6. ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.
7. అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.
9. తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?
10. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును *యెహోవాకు విరోధముగా పోగైయున్నారు*. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
16. మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.
17. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.
18. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్ని యుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.
19. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.
22. వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.
23. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
24. కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
26. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
29. మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.
30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
31. అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.
32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
చూశారా దేవుడంటే భయభక్తులు లేవు గాని వీరికి యాజకత్వం కావాలి! వారు మోషే ఆహారోనుల పైనే తిరుగుబాటు చేస్తున్నాము అనుకున్నారు గాని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాము అని యోచించలేదు! అందుకే దేవునిపై తిరుగుబాటు చేసి తమపైకి తామే నాశనం కొని తెచ్చుకున్నారు!
వీరి హృదయాలలో నాలుగు విషయాలు తాండవమాడుతున్నాయి: సత్యము పట్ల దానిని అనుసరించేవారి పట్ల హృదయపూర్వక ద్వేషం! తమకు కావాలనుకున్న దానిమీద అత్యాశ, దేవునికి విరోధంగా తిరుగుబాటు! చివరగా అధికార కాంక్ష!
కోరహు, దేవుడు అధికారంలో ఉంచిన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి తనతో పాటు 250 మంది సభికులును సమాజప్రధానులు తీసుకొని వెళ్ళాడు.“మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్దుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, మోషే..................తనవాడు ఎవడో పరిశుద్దుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచు కొనినవానిని తన యొద్దకు చేర్చుకొనును.” సంఖ్యా 16:3-5
ఆ విధంగా దేవుడు నియమించిన అధికారాన్ని త్రోసిపుచ్చి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందున, దేవుడు వారిని (కోరహు, అతనితో ఉన్నవారు) నాశనం చేసారు.“భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.” సంఖ్యా 16:32,33
అలానే ఈ అబద్ద ప్రవక్తలు, అపొస్తలుల బోధకు విరుద్ధమైన బోధ చేస్తూ తమని తాము దేవుడు నియమించిన అధికారం కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ పాపం చేస్తున్నారు గనుక వారికి శ్రమ, దేవుడు వారిని నాశనం చేస్తారు అని యూదాగారు చెప్తున్నారు. కయీను నడిచిన మార్గం, బిలాము మరియు కోరహు నడిచిన మార్గం దేవుడు నియమించిన మార్గానికి వ్యతిరేకమైనది అని తెలిసి కూడా ఈ అబద్ద ప్రవక్తలు అదే మార్గంలో నడుస్తున్నారు. మరి నీ సంగతేంటి, నువ్వు కూడా క్రైస్తవుడవని చెప్పుకుంటూ అదే మార్గంలో (దేవునికి వ్యతిరేకమైన) నడుస్తున్నావా, లేక నిజమైన క్రైస్తవుడిగా ప్రభువుని సంతోషపెట్టేలా జీవిస్తున్నావా?
ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకుని నిన్ను నీవు సరిచేసుకో!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –22వ భాగం*
యూదా 1:12,13
12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు (మూలభాషలో- మేపుకొనుచు), మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,
13. తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను,మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 12, 13 వచనాలలో యూదా గారు ఈ మతబ్రష్టులను తూర్పారబోస్తున్నారు. “వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు గాడాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది." యూదా 1:12,13
వీరు "మీ ప్రేమవిందులలో దొంగమెట్టలుగా ఉన్నారు" అని యూదాగారు చెప్తున్నారు. ఎందుకు వీరిని ఆలా వర్ణిస్తున్నారు అంటే, "తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు" అని సమాధానము ఇస్తున్నారు. వీళ్ళు ఇతరుల అవసరాలకన్నా తమ సొంత లాభానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వీళ్ళకి సంఘం పట్ల ఎటువంటి ప్రేమ లేదు. సంఘాన్ని అభివృద్ధి చేయడం, సంఘానికి సహకారంగా ఉండడం వీరి ఉద్దేశం కాదు. వీరు ఎంత సంపాదించామా అని మాత్రమే ఆలోచిస్తారు, సంఘాన్ని అడ్డుపెట్టుకొని ధనార్జన చేస్తారు. వీళ్ళు "మీతో సుభోజనము" చేస్తూ, అనగా మీలో ఒకరిలా కనబడుతూ, తమని తామే మోసం చేసుకుంటున్నారు. వీరు అతి భయంకరులు. వీరికి ఇంత పెద్ద శిక్ష ఉంది అని తెలిసినప్పటికీ వీరు నిర్భయముగా తమని తాము పోషించుకుంటున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటివారు అనేకులు ఉన్నారు. క్రీస్తుసేవ లక్ష్యంగా కాకుండా, ధనాపేక్షే లక్ష్యంగా దేవుని సేవలోకి వస్తున్నారు. వీరు గొర్రెలకాపరులు కాదు కానీ, గొర్రెల వేషంలో ఉన్న తోడేళ్ళు. వీళ్ళు వాక్యాన్ని తమకు అనుకూలమైనట్టుగా మలుచుకొని, మీరు దేవుడికి డబ్బిస్తే దేవుడు మీకు తిరిగిస్తాడని, మీరు పాపంలో బ్రతికినా దేవుని కృప మీకు తోడుగా ఉంది గనుక భయపడాల్సిన అవసరమే లేదని, అనగా దేవుడు కృపామయుడు గనుక మిమ్మల్ని క్షమిస్తాడని చెప్తుంటారు. వీరు అనేకులకు అడ్డుబండల్లా ఉంటూ, అనేకులు పాపంలో మునిగిపోవడానికి కారణం అవుతున్నారు.
వాక్యం వీరికోసం ఏమిచెబుతుంది అంటే:
వీరు వారి అంతరాత్మ ప్రభోధాన్ని వినరు! వాక్యాన్ని కూడా లెక్కచెయ్యరు! దేవుని హెచ్చరికలను కూడా వినరు! 1తిమోతి 4:1,2
1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
ఇక వీరి ధనాశ, తిండిబోతు తనం కోసం చూసుకుంటే యెహే 34:1—10
ఈభాగంలో కాపరులు మందను మేపకుండా మందలో క్రొవ్విన వాటిని తినడం మొదలుపెట్టారు! సంఘసంక్షేమాన్ని పట్టించుకోకుండా తమ సంపదను తీర్చుకోడానికి తమ గొంతెమ్మ కోరికలను తీర్చుకోడానికి చూస్తూ అందుకుగాను వాక్యాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కలిపిచెరుపుతున్నారు!
Ezekiel(యెహెజ్కేలు) 34:2,3,4,10
2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.
3.మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,
4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
10. ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ఈ కాలంలో అనేకులు నిజమైన సువార్తను విడిచిపెట్టి “సంక్షేమ సువార్త
Prosperity Gospel పేరుతొ తమ
Property పెంచుకుంటూ మరియు “ఆరోగ్య మరియు సంపద సువార్త
(Health and wealth Gospel)” అనే వాటిని ప్రకటిస్తున్నారు. అనేకులు దురదచెవులుగలవారై తమకు నచ్చిన ఇలాంటి బోధకు మొగ్గుచూపుతున్నారు. వీళ్ళు చెప్పేదేంటంటే, దేవుని చిత్తం నీకు సిరిసంపదలు ఇవ్వడమే అని, దేవుడు నిన్ను ఇబ్బందిపరచడు, నీకు అనారోగ్యం రావడం దేవుని చిత్తం కాదు అని చెప్తుంటారు. నేటి సంఘంలో అనేకులు ఎంతోకాలం నుండి సంఘానికి వెళుతున్నా వారికి వాక్యం గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ఒక పత్రిక (పౌలు గాని పేతురు మరెవరైనా రచించినది) యొక్క సారాంశం ఏంటి అంటే చెప్పలేకపోతున్నారు, ఆ పత్రిక ద్వారా దేవుడు ఆనాటి సంఘముతో ఏమి మాట్లాడాడు, ఇప్పుడు మనతో ఏమి మాట్లాడాలను కుంటున్నారు అని అడిగితే ఏమి సమాధానం చెప్పే స్థితిలో లేరు. నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయములో దాచుకున్నాను అని చెప్పిన దావీదు మాటలకి నేటి సంఘంలో అనేకుల పద్దతి వ్యతిరేకంగా ఉంది.
యిర్మియా 10: 21
కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.
యిర్మియా 12: 10
కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.
యిర్మియా 23: 1
యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
యిర్మియా 23: 2
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
ఇంకా పేతురు గారు ఏమంటున్నారు అంటే 2పేతురు 2:2-15
1. మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
2. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.
3. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
10. శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను(మహిమలను) దూషింప వెరువకయున్నారు.
12. వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,
13. ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంక ములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.
14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునైయుండి,
15. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.
వీళ్ళ హృదయాలలోకి ఎంత తొంగిచూసినా అక్కడ వాక్యం ఉండదు. ఇలా ఆ అబద్ధబోధకుల బోధకి చెవియొగ్గి దేవుని నుండి దూరమైపోయిన వీరికి (తిరిగి పశ్చాత్తాపపడి మనసు మార్చుకోకపోతే), వారితో పాటు "గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది”.
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –23వ భాగం*
యూదా 1:12,13
12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు (మూలభాషలో- మేపుకొనుచు). మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,
13. తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను,మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.
ప్రియులారా! మనము యూదా పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు చూసుకుంటున్నాము!
ఇక 12, 13 వచనాలలో యూదా గారు ఈ మతబ్రష్టులను తూర్పారబోస్తున్నారు. “వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు గాడాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది." యూదా 1:12,13
(గతభాగం తరువాయి)
అంతమాత్రమే కాకుండా యూదాగారు , వీరిని అనేక రకాలుగా పోలుస్తూ వీరు ఎంత నిష్ప్రయోజకులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు "నిర్జల మేఘములు" అనగా, నీళ్లు లేని మేఘాలు. వర్షం పడాలంటే మేఘంలో నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది, అలానే సంఘానికి ఆత్మీయ మేలు జరగాలంటే మేఘాలలాగ, ఉన్నతస్థానంలో కూర్చున్నవారిలో జీవిస్తున్న దేవుని వాక్యం ఉండాలి. అలా లేనప్పుడు వారి బోధ నీరులేని మేఘం లాంటిది, దాని వలన ఎటువంటి చిగురు చిగురించదు.
పేతురు గారు అంటున్నారు వీరు నీరులేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘాలు, వీరికోసం గాడాంధకారం సిద్ధము చేసి కాచి ఉంచబడింది అంటున్నారు 2పేతురు 17
వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.
ఇంకా యూదా గారు పోలుస్తున్నారు: వీళ్ళు "రెండు మార్లు చచ్చిన చెట్లగాను" ఉన్నారు. కొత్త ఫలాలు రాకపోగా ఉన్న ఫలాలు కూడా ఊడిపోయి, వేర్లతో సహా ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, అనగా దేవునికి ఇష్టమైన క్రియలు తమ జీవితంలో చూపించలేని స్థితిలో ఉన్నారు.
ఇక్కడ యూదాగారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమంటున్నారు అంటే: రెండుసార్లు చచ్చి, వేళ్ళతో పెళ్ళగించబడిన చెట్లు అంటున్నారు!
దీనిలో ఎంతో గూఢార్ధము గోచరిస్తుంది. రెండుసార్లు చచ్చిన చెట్టుతో విశ్వాసిని/అబద్దబోధకుడని ఎందుకు పోల్చారు అంటే మనకు ఎఫెసీ 2:1 లో అంటున్నారు మీ అపరాదాల్లో పాపాలలో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును బ్రతికించారు... అనగా ఒకసారి విశ్వాసి తన అతిక్రమాల్లో పాపాలలో అపరాదాలతో చచ్చిన స్థితి అనగా లోకంలో బ్రతికి ఉన్నా గాని ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తు మిమ్మును ప్రేమించి బ్రతికించారు అంటున్నారు! ఇక్కడ ఒకసారి చచ్చారు బ్రతికారు!
ఇక ఇలా రక్షణ పొందిన తర్వాత ఎవరైతే సుఖబోగాల వెనుక తిరిగేవారు బ్రతికినా చచ్చిన స్థితిలోనే ఉంటున్నారు అంటున్నారు. అనగా లోకంలో మరలా బ్రతుకుతున్నారు అంటే క్రీస్తులో/ ఆధ్యాత్మికంగా మరలా చస్తున్నారు అని అర్ధం అంటున్నారు! 1తిమోతి 5:6 అనగా ఇక్కడ రెండోసారి చస్తున్నారు! రెండుసార్లు చచ్చినట్లే కదా!
అయ్యా అమ్మా! ప్రియ విశ్వాసి/ భోధకుడా! కాపరి! సేవకుడా! నీవేవరివైనా సరే! ఇప్పుడు నీవు సుఖబోగాల వెనుక తిరిగావో వెంటనే నీవు రెండుసార్లు చచ్చినోడివి/ రెండుసార్లు చచ్చినదానికి! ఇది నేను కాదు తిమోతి గారు ఆత్మావేశుడై పలుకుతున్న మాట! సంఘ వ్యాప్తి కోసం కాకుండా, ఆత్మల పంట కోసం కాకుండా,
prosperity గోస్పెల్ పేరుతొ నీ property పెంచుకుని, సుఖబోగాల వెనుక తిరుగుతూ, AC కార్లు కొనుక్కొంటూ, లగ్జరీ ఇల్లు కట్టించుకుంటూ తిరుగుతున్నా ఓ బోధకుడా/కాపరీ/సేవకుడా/ విశ్వాసి!!! నీవు ఆధ్యాత్మికంగా రెండోసారి చనిపోయావు అని మరచిపోకు! మీ నాశనం కునికి నిద్రపోదు అని బైబిల్ చెబుతుంది ! ఇది రెండవ మరణం అని కూడా చెబుతుంది బైబిల్! ప్రకటన 20:14
వీరిలో ఆధ్యాత్మిక జీవం లేదు గాని లోకంలో పేరు ప్రఖ్యాతులు మాత్రం ఉన్నాయి చివరికి యూదా గారు అంటున్నారు వీరు వేళ్ళతో దేవునిలో పెళ్ళగించబడ్డారు! గాని వీరికి ఈ విషయం తెలియదు!
మత్తయి సువార్తలో ఇలాంటి వారికోసం యేసుక్రీస్తుప్రభులవారు చెబుతున్నారు:
మత్తయి 21:18—19
18. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.
19. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపు చెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.
లూకా 13:6—7
6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు
7. గనుక అతడు ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.
ఇక దేవుడు ఇలాంటివారిని వేళ్ళతో పెల్లగించేస్తాను అంటున్నారు: ..
మత్తయి 15: 13
ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.
ఇక్కడ దేవుడు నాటలేదు వీరిని సాతాను గాడి ద్వారా నాటబడ్డారు, మంచిఫలాలు కాసేందుకు అవసరమైన దానితో వీరికి ఏ సంభందము లేదు. విశ్వాసులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారో దానికి వీరు వ్యతిరేఖంగా జీవిస్తారు. అనగా ఎఫెసీ 3:18, కొలస్సీ 2:7లో చెప్పినదానికి వ్యతిరేఖంగా ఉంటారు..
ఎఫెసీయులకు 3: 18
మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
కొలస్సీయులకు 2: 7
మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.
ఇంకా అంటున్నారు: సముద్రపు అలలు గాలి పెరిగే కొద్దీ ఇంకా పైపైకి ఎగబడతాయి! అలాగే వారి ఆస్తి పెరిగో కొద్దీ దేవుడు ఇంకా దీవిస్తున్నారు అని భ్రమపడతారు! గాలి ఇంకా పెరిగితే సముద్రం నురుగు కడుతుంది, ఇంకా పెరిగితే స్ప్రే వస్తుంది. ఈ పరిస్తితి సముద్రంలో ప్రయాణించే పడవలకు ఓడలకు చాలా అపాయకరమైనది! ఓడలకు ప్రయాణంలో ఎందుకు పనికిరాదు, సముద్రంలో చేపలు పట్టడానికి పడవలకు ఎందుకు పనికిరాదు ఈ స్తితి! అలాగే వీరు సువార్త ప్రకటించకుండా కేవలం గొప్పలు చెప్పుకోడానికే తప్ప, ప్రజలను నవ్వించడానికే ప్రయత్నిస్తారు గాని ఆత్మలను సంపాదించరు! ఆత్మీయ జీవితాలను సరిచెయ్యరు! ఇంకా ఎలా అయితే సముద్రములో అలలు ఆగ్రహముగా లేచి ఒడ్డున్న తుస్సుమని ఆగిపోతాయో వీరు కూడా గర్విష్టులై సముద్రపు అలలులాగ ప్రవర్తించినా, ఒక రోజు దేవుని చేతిలో తగిన శిక్ష అనుభవిస్తారు.
ఇంకా వీరు దారి తప్పిన చుక్కలు! అనగా గమ్యం వైపు కాకుండా ఎటో పయనిస్తున్న నక్షత్రాలు, చివరకు మరో నక్షత్రాన్ని గుద్దుకుని ముక్కలు ముక్కలు అయిపోతాయి వీరుకూడా గురివైపు పయనించకుండా వారి ఆస్తుల వైపు పయనించి పతనమైపోతారు!
ఫిలిప్పీయులకు 3: 14
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
చివరగా వీరికోసం గాడాంధకారం కాచి ఉంది! ఈనాటి అనేక బోధకులు కూడా దేవునిని వేడుకోవడం మానేసి, దేవునికే ఆజ్ఞ ఇవ్వడం మొదలుపెట్టారు. వీరు 'దేవా నువ్వు ఇప్పుడు దిగిరావాల్సిందే', 'నీ ఆత్మ వీరి మీద కుమ్మరించు', 'దేవా ఇప్పుడే, నేను అడుగుతున్నాను ఈ క్షణములోనే వీరిని ఆశీర్వదించు' అని చెప్తుంటారు. వీరందరూ చివరిలో "ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొండని వారితో చెప్పుదును" (మత్తయి 7:21-23).
ప్రియ సంఘమా! వారు అనగా అబద్ధ భోదకులు మరియు మతభ్రష్టులు నీరులేని మేఘాలులా ఉన్నారట మనమైతే నీరుగల మేఘముల వలె ఉందాము. అనగా పరిశుద్ధాత్మ శక్తికలిగి, మన హృదయం నిండా వాక్యము నింపుకుని ఉందాము!
ఇంకా వారు కాయలు లేని చెట్లులా ఉన్నారు. మనమైతే ఫలములు గల చెట్లు అనగా ఆత్మఫలము గలవారముగా ఉందాము. గలతీ 5 లో చెప్పిన ప్రతీ ఫలము ఫలిద్ధాము. ఇంకా ఆత్మల పంటలో ముందుందాము!!!
ప్రియ బోధకుడా! నీ పరిస్థితి ఎలా ఉందో పరిశీలించుకో! నిన్ను నీవు సరిచేసుకో!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –24వ భాగం*
*8వ ఉపమానం*
యూదా 1:14—15
14. ఆదాము
మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని
తీర్పు తీర్చుటకును, వారిలో
భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
15. భక్తిహీనులైన
పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని
ఒప్పించుటకును, ప్రభువు
తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
ప్రియులారా! మనము యూదా పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు
చూసుకుంటున్నాము!
ప్రియులారా ఇక ఈ రెండు వచనాలలో మరో ఉపమానం
చెబుతున్నారు యూదా గారు! ఆదాము మొదలుకొని ఏడవ వాడిన హనోకు కూడా వీరిని గూర్చి అనగా
ఈ అబద్దబోధకులు మరియు మతబ్రష్టులు కోసం ప్రవచించి అన్నారట: ఏమని అంటే ఇదిగో
అందరికిని అనగా లోకంలో ఉన్నవారికి, లోకంలో
ఇంతవరకు పుట్టిన వారికి, ఇంకా పుట్టబోయే
వారికినీ తీర్పు తీర్చుటకు; వారిలో అనగా
లోకంలో పుట్టినవారు , పుట్టి- చనిపోయిన వారు , పుట్టబోయేవారు ,ఇప్పుడు
ఉన్నవారు వీరిలో ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో అలాంటి వారు భక్తిహీనముగా చేసిన
భక్తిహీన క్రియలన్నిటి గూర్చియు, ఇంకా
భక్తిహీనులైన పాపులు దేవునికి విరోధముగా పలికిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు
వారిని ఒప్పించడానికి ప్రభువు వేవేల దూతలతో వచ్చెను అంటున్నారు!
ప్రియదైవజనమా! ఈ రెండు
వచనాలలో చాలా విషయాలు చెప్పబడ్డాయి! మొదటగా ఆదాము మొదలుకొని ఏడవవాడిన హనోకు
ప్రవచించారు అంటున్నారు. ఆదాము నుండి ఏడవవాడు అని ప్రత్యేకంగా చెప్పాలా??!! హనోకు, ఆదాము
నుండి యేడవ వాడు,
"ఆదాము షేతు
ఎనోషు కేయినాను మహలలేలు యెరెదు హనోకు" (1 దినవృత్తాంతములు 1:1-3). హనోకుగారి గురించి ఈ విధంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆదాము నుండి
ఏడోవాడైన హనోకును,
కయీను కుమారుడైన హనోకుకు
(కయీను కుమారుడి పేరు కూడా హనోకే) మధ్య వ్యత్యాసం చూపడానికి, దేవుని
చిత్తానుసారముగా నడిచిందీ ఏ హనోకో తెలియజెప్పడానికి ఈ
విధంగా రాసారు యూదాగారు!.
అయితే దీనికోసం పాత నిబంధనలో
ఎక్కడా వ్రాయబడిలేదు! అయితే ఇది హనోకు గ్రంధంలో వ్రాయబడి ఉంది! గాని హనోకు గ్రంధము
దైవగ్రంధముగా చేర్చబడలేదు బైబిల్ లో! హనోకు గారు
దేవునితో నడిచెను అని ఉంది! ఇంకా దేవుడు ఉండలేక తనతో ఉండటానికి తీసుకుని
వెళ్లిపోయినట్లు ఆదికాండంలో చెప్పబడింది!...
Genesis(ఆదికాండము)
5:22,23,24
22. హనోకు
మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను
కనెను.
23. హనోకు
దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
24. హనోకు
దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
మరి ఈ విషయం యూదా గారికి
ఎలా తెలిసింది?
హనోకు గ్రంధము చదివి
ఉంటారా? ఏమో తెలియదు గాని దీనిని వ్రాయించినది పరిశుద్ధాత్ముడు కాబట్టి తప్పకుండా
హనోకు గారు ప్రవచించారు అని మనం నమ్మాలి! ఒక విషయం గమనించాలి! గ్రంధాన్ని చదవడం
వలన మాత్రమే కాదు గాని ప్రపంచంలో అన్ని దేశాలలోను Oral Tradition అనేది ఒకటుంది! అనగా ముఖ్యమైన విషయాలు మా తాత గారు- మా నాన్నగారికి
చెబుతారు,
మానాన్నగారు నాకు చెప్పారు, నేను
నా కొడుకుకి చెబుతాను,
వాడు తన కుమారునికి అనగా
నా మనవడుకి చెబుతాడు! ఇది ఎప్పటినుండో ఉంది! కాబట్టి ఈ విషయాలు ఈ ఓరల్ ట్రెడిషన్
నుండే పేతురు గారికి యూదాగారికి తెలిసి ఉంటుంది.
అయితే హనోకు గారు దేవునితో నడిచిన అనుభవం కలిగిన
వ్యక్తీ కాబట్టి దేవునినుండి ఎన్నో నేర్చుకుని ఉంటారు. ఈ దేవునితో నడిచే అనుభవం
ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉంది కాబట్టి పరిశుద్దాత్మ పూర్ణుడై
ప్రవచిస్తున్నారు అన్నమాట: అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి
భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన
పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చెను.
దేవుడు ఈ భక్తిహీనులకు రెండు విషయాలను బట్టి తీర్పుతీరుస్తాడు అని హనోకు
చెప్తున్నాడు. అవేంటంటే "వారి భక్తిహీనమైన క్రియలు", "వారు ప్రభువుకు వ్యతిరేకంగా పలికిన కఠినమైన
మాటలు" అని వివరిస్తున్నాడు. వారి భక్తిహీనమైన క్రియలు ఏంటి అంటే, దేవుని మార్గంలో కాకుండా వాళ్ళ దురాశలు చొప్పున
నడుస్తూ, దేవునిని కాకుండా మనుష్యులను
సంతోషపెడుతున్నారు. అలానే ప్రభువు పట్ల కఠినమైన మాటలు అనగా అన్ని విషయాలలో సణుగుతూ, తమని తాము హెచ్చించుకొనునట్లు డంబపు మాటలు
పలుకుతున్నారు. వీరికి ప్రభువు తప్పక తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చటానికి
"ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చెను" అని యూదాగారు
చెపుతున్నారు. అయితే వచ్చెను అనగా, జరిగిపోయిన
విషయము అని అర్ధం కదా, మరి హనోకు
ఎందుకు ఈ ప్రవచనం జరిగిపోయినట్టు భూతకాలంలో చెప్పారు. దీనినే “aorist active indicative” అని అంటారు. దీని అర్థం ఏంటంటే, ఇది ఖచ్ఛితంగా భవిష్యత్ కాలంలో జరుగుతుంది గనుక, దీనిని జరిగినట్టే భావించి భూతకాలంలో చెప్పడం.
ప్రభువు వీళ్ళకి తీర్పు తీర్చడానికి ఖచ్ఛితంగా వస్తాడు గనుక, "ప్రభువు......వచ్చెను" అని ప్రవచించబడింది.
మొదటిమాట అందరికిని తీర్పు తీర్చుటకు ... దీనికోసం బైబిల్ లో అనేక
రిఫరెన్సులు ఉన్నాయి.
సంఖ్యా 33:4
యోబు 21:22
కీర్తనలు 7:11; 9:3;, 8,16, 19, 17:2; 67:3 .... ఇంకా ఎన్నో
ఉన్నాయి!
ఇక తర్వాత భక్తీ హీనులు భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలకు ,
ఇంకా
పలికిన కటినమైన మాటలకు దేవుడు తీర్పు తీర్చే కాలం ఉంది అంటున్నారు.
అందుకే మనుష్యులు పలికే వ్యర్ధమైన
ప్రతీమాటకు విమర్శ దినమందు లెక్క అప్పగించాలి
అని వ్రాయబడింది!
మత్తయి 12:36
ఇకా మనుష్యులు చేసే ప్రతీ కార్యమునకు విమర్శ దినమందు లెక్క అప్పగించాలి!
అవి మంచివైనా చెడ్డవైనా ప్రతీ మాటకు, ప్రతీ పనికి దేవునికి
లెక్క అప్పగించాలి....
2కోరింథీయులకు
5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును
పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
ఇంకా దేవుడు తన వేవేల దూతలతో వచ్చును అనేమాట చూసుకుంటే: ఈ విషయం మోషేగారికి
మరియు దావీదుగారికి కూడా తెలిసుండాలి, దీనిని బట్టే వారు ఇలా
రాయగలిగారు: “దైవజనుడైన మోషే మృతినొందకమునుపు
అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది.......... ఆయన (దేవుడు) పారాను కొండనుండి
ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను” (ద్వితీయో 33:2).
“దేవుని
రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు” (కీర్తన 68:17)
“తన
మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల
సింహాసనముమీద ఆసీనుడై యుండును.” మత్తయి
25:31
“వ్యభిచారమును
పాపమును చేయు ఈ తరమువారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై
పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను” మార్కు 8:38.
“నన్ను
గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును
కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.” లూకా 9:26
ప్రియ దైవజనమా! నీవుకూడా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావా?!!
అయితే
నీకు కూడా తీర్పు తప్పదని మరచిపోకు! ఈ మతబ్రష్టులు అబద్ద బోధకులు దేవుని
వ్యతిరేఖంగా అనేకమాటలు కఠినమాటలు పలికారు. అందుకే వారికి తీర్పుతీర్చడానికి దేవుడు
తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తున్నారు. ఇంకా లోకానికి తీర్పు తీర్చడానికి
వస్తున్నారు! తన బిడ్డలను తనతో తీసుకుని పోడానికి కూడా వస్తున్నారు! ఎవరి క్రియల
చొప్పున వారికి జీతం ఇవ్వడానికి వస్తున్నారు! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?
దేవునికి
వ్యతిరేఖమైన కార్యాలు చేస్తున్నావా?
సరిచేసుకో! సరిచూసుకో!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –25వ భాగం*
యూదా 1: 16
వారు తమ దురాశల చొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, (లేక, ముఖస్తుతి
చేయుచు) సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునైయున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.
ప్రియులారా! మనము యూదా పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము! దేవునిమీద తిరుగబడి నాశనమైపోయిన వారి ఉదాహరణలు ఇంతవరకు
చూసుకున్నాము! ఇక ఈ భక్తిలేని మనుష్యులు, విశ్వాసహీనులు,
మతబ్రష్టుల
యొక్క మరిన్ని లక్షణాలు కోసం ధ్యానం చేద్దాం!
ఈ 16వ వచనంలో అంటున్నారు వారు అనగా ఏ భక్తిలేని
మనుష్యులు/ విశ్వాసులు/ అబద్ద భోధకులు తమ దురాశల చొప్పున
నడచుచు లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడుచు అనగా ముఖస్తుతి చేస్తూ పొగడుతూ
ఉంటారు, ఇంకా వారు సణుగువారును ,
తమ గతిని గూర్చి దేవుణ్ణి నిందించువారునై ఉన్నారు,
వారి నోరు డంభమైన మాటలు పలుకుతూ ఉంటుంది అంటున్నారు!!
వారు తమ దురాశల చొప్పున నడుచుకొంటున్నారు అంటున్నారు!
బైబిల్ చెబుతుంది దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము
పరిపక్వమై మరణమును కనును అని చెబుతుంది! .యాకోబు 1:15..
ఈ విషయం వీరికి తెలిసి కూడా ఇంకా దురాశల చొప్పున
ప్రవర్తిస్తూ ఉంటారు! ఇంకా ఇదే యాకోబు పత్రికలో అదే అధ్యాయం మీద వచనం చూసుకుంటే
దేవుడు కీడు విషయమై శోధింపనేరడు కాని ఆయన ఎవనిని శోధించడు, అయితే ప్రతీవాడును తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి
మరులు కొల్పబడిన వాడై శోధించబడును అంటున్నారు! 13,14 వచనాలు!
అందుకే వీరికి ఇన్ని శోధనలు శ్రమలు కలుగుతుంటాయి
చాలామందికి!
ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: ఈ అబద్దబోధకుల తండ్రి దేవుడు
కాదు- వారి బాబు – అపవాది గాడు
అంటున్నారు, అందుకే వీరు వారి తండ్రియైన అపవాది యొక్క దురాశలను
నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు! వాడు నరహంతకుడు కాబట్టి వీరు అలాంటి వారే!
వారి నోటిలో సత్యము ఎంతమాత్రము ఉండదు! వారు చెప్పేవన్నీ అబద్దాలే! అబద్దపు స్వభావం
కలిగి ఉంటారు అంటున్నారు ! యోహాను 8:44
యోహాను 8: 44
మీరు మీ తండ్రియగు అపవాది (అనగా, సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి
వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే
మాటలాడును; వాడు
అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక, అబద్దకునికి
జనకుడునై) యున్నాడు.
ఇక పేతురు గారు అంటున్నారు విశ్వాసి అయిన ప్రతీవాడును
ఇలాంటి దురాశల వెనుక పరుగెత్తకూడదు! వాటికి గతించిన కాలమే
చాలును అంటున్నారు.
1పేతురు
4: 3
మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య
పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే
చాలును,
ఇంకా వీరు అపహాసకులు అంటున్నారు, ఇంకా దేవుని రాకడ అనేది లేనేలేదు అని కూడా అంటున్నారు
: 2పేతురు 3:3
3. అంత్య
దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ
స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,
4.ఆయన
రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు
నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని
చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.
పౌలుగారు చెబుతున్నారు: ఈ దురాశలతోనే వీరు
సత్యము విషయమై అనుభవ జ్ఞానం లేని స్త్రీల ఇంట్లో ప్రవేశించి వారితో పాపం
చేస్తున్నారు అని కూడా చెబుతున్నారు 2తిమోతి
3:5,6,7
5. పైకి
భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి
విముఖుడవై యుండుము.
6. పాపభరితులై
నానావిధములైన దురాశల వలన నడిపింపబడి, యెల్లప్పుడును
నేర్చుకొనుచున్నను,
7. సత్యవిషయమైన
అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.
ఇదే విషయం యూదా గారు కూడా ఈ తర్వాత వచనం అనగా 17వ వచనంలో చెబుతున్నారు...
అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు
పరిహాసకులుందురని
ఇక తర్వాత అంశం: లాభము కొరకు మనుష్యులను కొనియాడేవారు అనగా పొగిడే వారు:
వీరు ఏ విషయం లోను నిజాయితీగా ముక్కుసూటిగా ఉండరు! ప్రజలను మెప్పించడానికి
ప్రయత్నించి లాభం కోరుకుంటారు! అది వాక్యానుసారం కాకపోయినా ప్రజలను మెప్పించాలి
అని వారికి అనుకూలమైన బోధలు చేసే అనుకూల భోధకులు అన్నమాట! దానికోసం ప్రజలను
పొగుడుతారు! ముఖస్తుతి చేస్తారు! వీరి కోసం పౌలుగారు తిమోతికి రాస్తూ అంటున్నారు
2 Timothy(రెండవ తిమోతికి) 3:2,3,4,5
2. ఏలాగనగా
మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు
తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
3. అనురాగరహితులు
అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
4. ద్రోహులు
మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
5. పైకి
భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి
విముఖుడవై యుండుము.
2తిమోతి
4:3—5
3. ఎందుకనగా
జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద
చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4. సత్యమునకు
చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
5. అయితే
నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
రోమా 16:18
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే
దాసులు; వారు ఇంపైన మాటలవలనను
ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
ఇక పౌలుగారు తెగించి అంటున్నారు: ఒకవేళ మనుష్యులను నేను మెప్పించడానికి
ప్రయత్నం చేస్తే నేను దేవుని సేవకుడను కాకపోదును, అప్పుడు నేను
మనుష్యుల సేవకుడను అంటున్నారు గలతీ పత్రికలో!..
గలతియులకు 1: 10
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు
కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను
మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని
మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
యోబుగ్రంధంలో ఇలా ముఖస్తుతి చేసేవారిని దేవుడు సజీవుల
లిస్టు లోనుండి తొందరగా తీసేస్తారు అట: 32:21—22
21. మీరు
దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై
బిరుదులు పెట్టను
22. ముఖస్తుతి
చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము
చేయును.
కీర్తనాకారుడు కూడా వీరికోసం చెబుతున్నారు: 122:1—4
1. యెహోవా
నన్ను రక్షింపుము, భక్తిగలవారు
లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.
2. అందరు
ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో
పలుకుదురు.
3. యెహోవా
ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
4. మా
నాలుకలచేత మేము సాధించెదము మా పెదవులుమావి, మాకు
ప్రభువు ఎవడని వారను కొందురు.
సామెతలు 26:28;
అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును
ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
సామెతలు 29: 5
తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు
వలవేయువాడు.
ఇక తమ గతిని గూర్చి నిందించు వారు: వీరు తమకు కలిగిన దారిద్ర్యము కొరకు
తమను సృజించిన దేవుణ్ణి నిందిస్తారు, ఇంకా తమకు కలిగిన శోధనల
వలన అవి దేవుడు కావాలనే చేశారు అనుకుంటారు గాని తమ స్వకీయ దురాశలు వలెనే ఇలా
జరిగింది అని గ్రహించకుండా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు!
ఇక తర్వాత లక్షణము: సణుగువారు
పౌలుగారు అంటున్నారు: మీలో ఎవరునూ సణుగువారుగా
ఉండవద్దు- అలా సణిగి నాశనం తెచ్చుకున్నారు అంటున్నారు...
1కోరింథీయులకు
10: 10
మీరు సణుగకుడి; వారిలో
కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.
ఇంకా అంటున్నారు: ఫిలిప్పీయులకు 2: 15
సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
ఇంకా మోషేగారి సొంత అన్నయ్య అక్క మోషేగారిమీద అసూయ పడి సణిగారు వెంటనే అక్క
మిర్యాము గారికి తెల్లని కుష్టువ్యాది వచ్చేసింది! ఆహారోను కి కూడా రావాల్సింది
గాని ఆయన తలమీద అభిషేక తైలము ఉంది కాబట్టి బ్రతికిపోయారు! కాబట్టి మనలో ఎవరూ
దేవునిమీద సణుగకూడదు ఇంకా మనుష్యులమీద కూడా సణుగ కూడదు!
ఇక తర్వాత వారినోరు డంభమైన మాటలు పలుకుతుంది: పౌలుగారు అంటున్నారు: ప్రేమ
డంబముగా ప్రవర్తించదు! 1కొరింథీ 13:4;
కాబట్టి ఎవరైనా డంబాలు పలుకుతున్నారు అంటే వారిలో దేవుని ప్రేమ ఎంతమాత్రము
లేదు అని అర్ధము!!!
కాబట్టి ప్రియ దైవజనమా! ఈ లక్షణాలను గమనించి అబద్దభోధకులనుండి దూరంగా
ఉందాం! వారి లక్షణాలు మనలో ఒకవేళ ఏమైనా ఉంటె తొలగించుకుని దేవునితో సమాధాన పడి ఆయన
రాకడకు సిద్ధపడదాము!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –26వ భాగం*
యూదా
1:17—19
17. అయితే
ప్రియులారా, అంత్యకాలమునందు
తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని
18. మన
ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పినమాటలను జ్ఞాపకము
చేసికొనుడి.
19. అట్టివారు
ప్రకృతి సంబంధులును ఆత్మలేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.
ప్రియులారా! మనము యూదా పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక ఈ వచనాలలో మరలా ఈ అబద్దబోధకులు/ మతబ్రష్టుల లక్షణాలనే ఎత్తిరాస్తున్నారు!
ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు మీకు పూర్వకాలమందు మీకు
చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు! ఆ అపోస్తలులు చాలా మాటలు చెప్పారు
గాని ఇక్కడ భక్తుడు దేనికోసం చెబుతున్నారు? అంటే ఈ మతబ్రష్టులు/
విశ్వాస హీనులు/అబద్దబోధకులు వస్తారు వారితో
జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు కదా వారి మాటలు జ్ఞాపకం చేసుకోండి
అంటున్నారు! ఈ అధ్యాయం 5వ వచనంలో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నారు!
అలాగే 2పేతురు
1:12—15 లో పేతురుగారు కూడా మరలా
మీకు జ్ఞాపకం చెయ్యాలని అనుకుంటున్నాను అన్నారు!.....
12. కాబట్టి
మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు
సిద్ధముగా ఉన్నాను.
13. మరియు
మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి
పెట్టవలసివచ్చునని యెరిగి,
14. నేను
ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని
యెంచుకొనుచున్నాను.
15. నేను
మృతిపొందిన తరువాత (నా నిర్గమమునకు తరువాత) కూడ మీరు నిత్యము వీటిని
జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
కాబట్టి అపోస్తలులైన పౌలుగారు పేతురు గారు ముందుగా
మీతో చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు!
ఇక ఏ విషయం కోసం యూదాగారు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు: అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొనే పరిహాసకులు
వస్తారు అని ఆ భక్తులు ముందుగానే చెప్పారు!
“అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి
ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.” 2 పేతురు 3:3,4.
“అంత్యదినములలో
అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు
ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత
లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు
సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా
ప్రేమించువారు, పైకి
భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి
విముఖుడవై యుండుము.” 2 తిమోతి
3:1-7
ఈ అపహాసకులు భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుస్తారు కనుక,
వారిని
వెంబడించేవారు కూడా అలానే తయారవుతారు. ఈ పరిహాసకులు, "మేము దేవుని
ప్రజలము" అని సంఘాన్ని నమ్మిస్తున్నారు, అయితే వీరు పరిశుద్దతను
బట్టి కాక తమ దురాశల చొప్పున నడుచుకుంటారు. ఇది ఈ అబద్ధ బోధకులను గ్రహించటానికి/
కనిపెట్టడానికి ఒక చిహ్నం. అపహాసకులు ఉండకూడదు అని కాదు కానీ,
తన
ప్రజలను అపహాసకుల/అబద్ద బోధకుల బోధనుండి కాపాడమని దేవుని వేడుకోవాలి. ఇంకా వీరినుండి మనం దూరంగా
ఉండాలి! ఆయన తప్పకుండా వస్తారు- మనలను తీసుకుని పోతారు!
ఇక తర్వాత అట్టివారు దేవుని ఆత్మలేని వారు ప్రకృతి సంబంధులు అంటున్నారు “అట్టివారు
ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.” యూదా 1:19
"అట్టివారు" అనగా
"భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే పరిహాసకులు" అని యూదా
చెప్తున్నారు. వీరు ప్రకృతి సంబంధులు, అనగా
పరిశుద్ధాత్మ లేనివారు అని కూడా వివరిస్తున్నాడు. ఈ అబద్ధ బోధకులకు రక్షణ లేదు.
ప్రకృతి సంబంధులు అని అనువదించబడిన గ్రీకు పదం “psuchikoi
(సుచికోయ్)”. దీని అర్థం “స్వాభావికమైన”, “ఇంద్రియ నిగ్రహం లేని”, “పశువులు".
ఇలాంటివారి యొక్క ముఖ్య ఉద్దేశం, సంఘంలో
సాధ్యమైనంతమందిని విడదీయాలని లేదా బేధాలు కలగజేయాలని. ఇలాంటివారు, సంఘంలో ఉన్నవారి మీద నిందలు మోపడం, సహోదరులని
అవమానపరిచే మాటలు మాట్లాడడం, కించపరచడం, సత్యానికి వ్యతిరేకంగా ఇతరులని తయారుచేయడం చేస్తుంటారు. గుర్తుంచుకోండి
మీరు సంఘములో బేధాలు పుట్టించేవారిగా ఉంటే మీరు సత్యసంబంధులు కారు.
ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి- ప్రతీ విశ్వాసి / ప్రతీ సేవకుడు తప్పకుండా
దేవుని పరిశుద్ధాత్మను పొందుకుని కలిగియుండాలి! కారణం దేవుడు చెబుతున్నారు ఆయనాత్మ
లేనివాడు ఆయన వాడు కానేకాదు! రోమా 8:9
దేవుని ఆత్మ లేకుండా ఈ రోజులలో అనేకులు మేము
క్రైస్తవులమే దేవుని బిడ్డలమే అంటూ తిరిగేస్తున్నారు! మరికొంతమంది తెల్లబట్టలు
వేసుకుని మందిరంలో ప్రవేశించి భక్తిపరులుగా వేషం వేసి మోసం చేస్తున్నారు! కేవలం
తెల్లబట్టలు వేసుకున్నంతమాత్రాన నీవు క్రైస్తవుడవు కావు పరిశుద్ధాత్ముడు నీలో
లేడు! ప్రతీరోజు ఆయనాత్మ నీలో పనిచెయ్యాలి! ఆయనాత్మ నీలో పనిచేస్తే నీవు అబద్దాలు
ఆడలేవు, బూతులు మాట్లాడలేవు, వ్యభిచారం అక్రమ సంబంధాలు కలిగి ఉండలేవు! పాపానికి సంబంధించిన
ఆలోచనలు ఏమి వచ్చినా ముందుగానే పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దించి సరిచేస్తుంటాడు! నీవు విచ్చలవిడిగా ఈ
పాపాలు చేస్తున్నావు అంటే నీలో ఆయనాత్మ లేదు అని అర్ధం! ఇవి చేసేస్తూ నీవు
మందిరంలో దీర్ఘ ప్రార్ధనలు చేస్తూ, ఇంకా
ఆత్మను పొందుకున్నట్లుగా బాషలు మాట్లాడుతూ ఉన్నావంటే నీలో పరిశుద్ధాత్మ లేదు-
భ్రమపరిచే దురాత్మ ఉంది అని అర్ధం! కాబట్టి ఆ ఆత్మ వాని క్రియల ఆధారంగా ఆ వ్యక్తీ
పొందుకున్నది పరిశుద్దాత్మ లేక దురాత్మ అనేది మనకు తెలుస్తుంది! యోహాను 14:17
లోకము ఆయనను చూడదు, ఆయనను
ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను
ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో
ఉండును.
Romans(రోమీయులకు)
8:5,6,9,11,14,15,16,17,23
5. శరీరానుసారులు
శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు
ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన
మనస్సు మరణము;
6. ఆత్మానుసారమైన
మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
9. దేవుని
ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు
కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
11. మృతులలో
నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన
మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
14. దేవుని
ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
15. ఏలయనగా
మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ
ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.
16. మనము
దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.
17. మనము
పిల్లలమైతే వారసులము, అనగా
దేవుని వారసులము; క్రీస్తుతో
కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి
వారసులము.
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా
మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
ఎఫెసీయులకు 4: 18
వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని
వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ
మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
ఇంకా ఇలాంటివారు బేధాలు కలిగించే వారు అంటున్నారు
యూదా గారు!
రోమా 16:17
సహోదరులారా, మీరు
నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని
కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
రోమీయులకు 16: 18
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే
దాసులు; వారు ఇంపైన మాటలవలనను
ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
వీరిమీదికి ఉగ్రత వస్తుంది అని పౌలుగారు అంటున్నారు!
రోమీయులకు 2: 8
అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని
ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
బేధాలు పుట్టించు వారు పరలోకం వెళ్ళరు: గలతీ 5:21
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను
మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
ఇలాంటి వారిని వెలివేసేయ్:
తీతుకు 3: 10
మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు
బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
కాబట్టి మనం బేధాలు కల్పించకూడదు! అలా బేధాలు పుట్టించే వారికి దూరంగా
ఉండాలి అని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –27వ భాగం*
యూదా
1:20—23
20. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దాని మీద మిమ్మును
మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో
ప్రార్థనచేయుచు,
21. నిత్య
జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొనియుండుడి.
22. సందేహపడువారి
మీద కనికరము చూపుడి.
23. అగ్నిలోనుండి
లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర
సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని (మూలభాషలో-
శరీరమువలన డాగుపడిన అంగీని) అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.
ప్రియులారా! మనము యూదా పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మతబ్రష్టుల/అబద్దబోధకుల యొక్క మోసాలు,
లక్షణాల
కోసం హెచ్చరించి ఇప్పుడు మనము లేక విశ్వాసులు ఏమి చెయ్యాలో చెబుతున్నారు యూదాగారు!
ఇరవై వచనంలో మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు
కట్టుకోవాలి అంటున్నారు రెండవదిగా పరిశుద్దాత్మలో ప్రార్ధన చెయ్యండి అంటున్నారు!
"ప్రియులారా" అనగా ఆ సంఘంలో ఉన్న నిజమైన
విశ్వాసులను ఉద్దేశిస్తూ, యూదాగారు నాలుగు ప్రోత్సాహకరమైన విషయాలు రాసారు.
మొదటిది "మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైన దానిమీద మిమ్మును
మీరు కట్టుకొనుచు" అని చెపుతున్నారు. దీనిని అక్షరాలా అనువదిస్తే "అతిపరిశుద్ధమైన
మీ విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకొనుచు” అని చెప్పొచ్చు. ఇందును గురించి అపొస్తలులు ఇలా
చెప్తున్నారు: “దేవుడు
నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా
చూచుకొనవలెను. వేయబడినది తప్పు మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల
రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు
మొదలైనవాటితో కట్టినయెడల, వాని
వాని పని కనబడును, ఆ
దినము దానిని తేటపరచును, అది
అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే
పరీక్షించును.” 1 కొరింథీ
3:10-13
“క్రీస్తుయేసే
ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు
కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు
వృద్ధిపొందుచున్నది." ఎఫెసీ 2:20,21
“సమస్తమైన
దుష్టత్వమును, సమస్తమైన
కపటమును, వేషధారణను, అసూయను, సమస్త
దూషణ మాటలను మాని, క్రొత్తగా
జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన
వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” 1 పేతురు 2:2,3
పై వాక్యభాగాలలో చెప్పబడిన విధంగా యేసుక్రీస్తు మరణ పునరుత్తానాలయందు
విశ్వాసం ఉంచటం వలన రక్షణ పొందిన మనం, ఆ విశ్వసాన్ని
కొనసాగించడానికి అపొస్తలులు చేసిన బోధలో నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉండాలి
అంటే ఆ బోధ ఏంటో మనం తెలుసుకొని ఉండాలి, లేని యెడల "గాలికి చెదరగొట్టు పొట్టు వలె” (కీర్తన 1:4) ఉంటాము.
రెండవదిగా “పరిశుద్దాత్మలో ప్రార్థనచేయుచు", అని చెప్తున్నారు. వాక్యాన్ని మాత్రమే చదివి
ప్రార్ధనను నిర్లక్షపెట్టేవారిని నిరుత్సాహపరుస్తూ, క్రైస్తవ
విశ్వాసంలో సత్య వాక్యాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో,
ప్రార్ధన
చేయడం కూడా అంతే ముఖ్యం అని వివరిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయడం
అంటే ఏంటి?
కొంతమంది "భాషలలో దేవుని స్తుతించడం" అనే
అర్థాన్ని చెప్తున్నారు. మరి నిజంగా ఇక్కడ యూదాగారు దేని గురించి మాట్లాడుతున్నారు?
ఇంతకు ముందు వచనంలో ఆ అబద్ధ బోధకులను "ఆత్మ
లేనివారు" అని అంటున్నారు. ఇక్కడ "ప్రియులు" అయిన క్రైస్తవ
సోదరులని "పరిశుద్ధాత్మలో ప్రార్ధన" చేయండి అంటున్నారు, అనగా ఈ "ప్రియులు" పరిశుద్ధాత్మను
కలిగినవారు.
అయితే కొందరు ఎందుకు ఈ ప్రార్ధనకు 'భాషలలో దేవుని స్తుతించడం' అనే అర్థం చెప్తున్నారు?
ఎందుకంటే 1 కొరింథీ
14:12-13, వచనాలలో భాషలు ఆత్మసంబంధమైన ఒక
వరమని, దానిని మీరు అపేక్షించండి అని పౌలుగారు కొరింథీ
సంఘానికి చెప్తున్నారు. అలానే 15వ వచనంలో
"నేను ఆత్మతో ప్రార్ధన చేతును” అని
పౌలుగారు చెపుతున్నారు. యూదాగారు చెప్పిన ఈ "పరిశుదాత్మలో ప్రార్థన చేయుడి"
అనే మాటలను, పౌలుగారు చెప్పిన
"నేను ఆత్మతో ప్రార్ధన చేతును " అనే మాటతో కలిపి, పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయటం అంటే, భాషలలో మాట్లాడటం అనే విశ్లేషణను ఇస్తున్నారు. అయితే
పౌలుగారు ఈ విధంగా చెప్పారు “నేను భాషతో
ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను
ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును (1 కొరింథీ
14:14-15)”
పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయటం అనగా, దేవుని సన్నిధికి, క్రీస్తు
రక్తం ద్వారా పరిశుద్ధాత్ముని సహాయంతో రాగలం అని గ్రహించి, ఆ దేవుడు మన తండ్రని, ఆ
తండ్రికి ప్రార్ధన చేయటానికి మన సహాయకుడు పరిశుద్ధాత్ముడే అని తెలుసుకొని, తనని దుఃఖపరచకుండా, విధేయత
చూపుతూ ప్రతి సమయంలో ఆత్మసహాయం ప్రార్ధన నిమిత్తం పొందుకోవాలి అనేదే.
అయితే ప్రార్థన అనేది మన సొంత శక్తితో చేసేది కాదు, మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్ధన చేస్తాము.
మరి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే ప్రార్ధనలో నావంతు ఏంటి అని మీరు అడగొచ్చు? పరిశుద్ధాత్మ దేవుడు ఏవి సరైనవో, ఏది వాక్యానుసారమైన ప్రార్ధనో అది మనకు నేర్పించి, ఆ ప్రేరేపణ ద్వారా మనం తండ్రి దగ్గర ప్రాధేయపడేలా, కృతజ్ఞత చెల్లించేలా సహాయం చేస్తాడు. అంతే కానీ మన
ప్రమేయం ఏమి లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన తరుపున ప్రార్థన చేయడు. అయితే మన సహజ
స్వభావం ప్రార్థనని వ్యతిరేకిస్తూ, మనల్ని
ప్రార్థన చేయకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది.
ప్రార్ధన చేయటానికి బలమైన ప్రయత్నం ఎంతో అవసరం.
మూడవదిగా,
నిత్యజీవార్థమైన
యేసుప్రభువు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు, అనగా మన అనుదిన బలహీనతలను,
మన
పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొంటూ, ఆయన కనికరం మన జీవితంలో అనుదినం పెరుగుతూ ఉండటాన్ని
గ్రహిస్తూ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
నాలుగవదిగా,
మనం
దేవుని ప్రేమలో నిలకడగా ఉండేలాగా మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే మనం దేవుని
ఆజ్ఞలకు (క్రీస్తు ఆజ్ఞలకు) విధేయత చూపుతూ ఉండాలి.
“తండ్రి
నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు
గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా
ప్రేమయందు నిలిచియుందురు.” యోహాను
15:9,10
“సందేహపడువారిమీద
కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమునొప్పుకొనక
దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి." యూదా 1:22,23
ఇక్కడ యూదాగారు రెండు వర్గాలకు సంబంధించిన జనుల
గురించి మాట్లాడుతున్నాడు. వీరు “సందేహపడువారు", మరియు "అగ్నిలో ఉన్నవారు". వీరు ఎవరు అంటే, ఈ మతభ్రష్టుల (అబద్ధ బోధకుల) బోధ విని వారిని వెంబడిస్తున్వారు.
అయితే వారిని వెంబడించేవారిలో కూడా రెండు వర్గాలు ఉన్నాయా అనే అనుమానం మనకు
రావచ్చు? అయితే ఇక్కడ ఒకే వర్గం గురించి
చెప్పబడింది (తప్పు బోధను విని దానిని అనుసరిస్తున్నవారు) అని మనం అర్ధం
చేసుకోవాలి. మరి యూదాగారు ఎందుకు కొందరిని కరుణించండి, మరి కొందరిని అగ్నిలోనుండి లాగండి అంటున్నారు?
దీనిని ఇలా అర్ధం చేసుకోవచ్చు. అబద్ధబోధను
ప్రేమిస్తున్నవారిలో కొందరు సాత్వికము కలిగి, చెప్పింది
వినే మనసు కలిగినవారు, మరికొందరు
సత్యం చెప్పినా వినకుండా అహంకారంతో తమదే సత్యమని డంబముగా ఉండేవారు.ఆ సాత్వికమైన
మనసుకలిగినవారి పట్ల కనికరము చూపుతూ సువార్త ప్రకటించాలి. వారిని కనికరముతో
సత్యములోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
అయితే ఆ రెండో కోవకు చెందినవారు, అనగా అహంకారంతో, డంబముతో
ప్రవర్తిస్తున్నవారి పట్ల కఠినంగా వారికి రాబోయే తీర్పుని గురించి చెప్పి, సాధ్యమైతే కొందరినైనా ఆ అగ్నిలో నుండి లాగినట్టు, బలంగా, తొందరగా
సత్యంలోకి లాగాలి. ఈ పనిని సంఘం మొత్తం కలిసి చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు
యూదాగారు.
నేటి క్రైస్తవులు అనేకులు, సువార్త ప్రకటించాల్సిన పని నాది కాదు, సంఘంలో పాస్టరుగారిది, లేకపోతే
పెద్దలది అని అనుకుంటున్నారు. నిజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత రక్షింపబడిన
ప్రతి క్రైస్తవుడిది. ఈ సువార్త పరిచర్య అనేది సంఘం లోపల నుండి మొదలై, బయటకు వ్యాపించాలి. అదే విషయాన్ని యూదాగారు
చెప్తున్నారు, సంఘంలో అసత్య బోధలను నమ్ముతూ, అవిశ్వాసంగా, రక్షణ
లేకుండా ఉన్నవారికి సత్యం బోధించడం ఒక్కరి బాధ్యత కాదు, సంఘం మొత్తానిది. ఎందుకు ప్రత్యేకించి అబద్ధ బోధలలో
ఉన్నవారికి సత్యం బోధించాలి అంటే, 'ఈ
మతభ్రష్టుల వేదాంతాన్ని మరియు ఆచరణని అనుకరిస్తున్నవారికి భ్రష్టులైపోయే అవకాశం
ఎంత సత్యమో, మనసు మార్చుకొని సత్యంలోకి వస్తే
రక్షించబడతారు అనే నిరీక్షణ కూడా అంతే సత్యం.'
ఈ సువార్త ప్రకటించేటప్పుడు, ప్రత్యేకంగా అసత్య బోధలలో ఉన్నవారికి బోధిస్తున్నపుడు
పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఇక్కడ భక్తుడు వివరించారు. మొదటిగా "శరీర
సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక..." అని
చెప్తున్నారు. శరీరసంబంధమైన క్రియలు అనగా "కామాతురత్వము" అని 4వ వచనంలో "వ్యభిచారం" అని 7వ వచనంలో చెప్పబడింది. వాళ్ళు చేసే ఈ శరీరసంబంధమైన
క్రియలను బట్టి మీరు అస్సలు ప్రేరేపించబడకూడదు. మీరు, వారు చేసే క్రియలకు ఆకర్షితులు అయ్యే ప్రమాదం ఉంది
గనుక, వారి ప్రవర్తనను ఏ మాత్రము
ఆమోదించకుండా "అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి".
కాబట్టి మనవంతుగా మనం సువార్త ప్రకటిస్తూ
తోటివిశ్వాసుల సందేహాలు ఇంకా దేవుని కోసం అన్యుల సందేహాలు తీరుస్తూ వారి
విశ్వాసాన్ని కడుతూ మనం ఆత్మలో అనగా పరిశుద్దాత్మలో ప్రార్ధన చేస్తూ అగ్నిలో నుండి
లాగినట్లు అన్యులను మన బంధువులను తోటి విశ్వాసులు విశ్వాస బ్రష్టులు కాకుండా
కాపాడుతూ ముందుకు పోదాము!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు మెండుగా దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*యూదా పత్రిక –28వ భాగం*
యూదా
1:24—25
24. తొట్రిల్లకుండ
మిమ్మును కాపాడుటకును, తన
మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
25. మన
ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు
మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును
కలుగును గాక. ఆమేన్.
ప్రియులారా! మనము యూదా పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం చివరికి వచ్చేశాము!
ఈ వచనాలలో ఒక ఆశీర్వాదం ఉంది! అనేక సంఘాలలో అనేకమంది దైవజనులు ఆరాధన అనంతరం
ఇచ్చే ఆశీర్వాదం (Benediction) గా ఈ రెండు వచనాలనే
చెబుతుంటారు! ఈ వచనాలలో ఎంతో గూఢమైన సంగతులు నిక్షిప్తమై ఉన్నాయి!
తొట్ట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు.. గమనించాలి- మనము తొట్ట్రిల్లకుండా
మనలను కాపాడుటకు దేవుడు సమర్దుడే గాని దేవుడు అందరినీ అలా కాపాడరు! ఎవరైతే
దేవునియందు భయభక్తులు కలిగి ఆయన జాడలయందు ఆయన త్రోవయందు నడుచుటకు ఇష్టపడి, నమ్మకముగా ఆ త్రోవలో నడుస్తుంటారో దేవుడు అలాంటివారిని
తొట్ట్రిల్లకుండా కాపాడుతూ ఉంటారు! ఒకవేళ సాతాను తప్పుడు త్రోవలకు బ్రమపడి ఆ
త్రోవలయందు వెళ్ళడానికి బయలుదేరితే ఒక్క లెంపకాయ కొట్టి ఒరేయ్ దారి అదికాదురా, ఇదీ అని చెబుతూ సరిచేస్తూ తొట్ట్రిల్లకుండా కాపాడుతూ
ఉంటారు దేవుడు! అయితే నిజం చెప్పాలంటే నీవు దారి తప్పకుండా తొట్ట్రిల్లకుండా చూడాల్సిన భాద్యత దేవునిది కానేకాదు! కాని నీయందు
ఆయనకున్న ఘనమైన దృఢమైన శాశ్వతప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఆయన నిన్ను కాపాడుతూ
ఉంటారు! స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటిబిడ్డను కరుణింప కుండా మరచునా వారైనా
మరతురు గాని చూడుము నా అరచేతులమీద నిన్ను చెక్కుకుంటిని అన్నారు కదా...
Isaiah(యెషయా
గ్రంథము) 49:15,16
15. స్త్రీ
తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
16. చూడుము
నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనే వాడను నేనే
నిన్ను ఎత్తుకుని రక్షించు వాడను నేనే అన్నారు!
యెషయా 46: 4
ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల
వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే
నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను
ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
జారిపడకుండా నా పాదములను కన్నీరు విడువకుండా నా
కన్నులను ఆయన కాపాడుతున్నారు అంటున్నారు కీర్తనాకారుడు!
కీర్తనలు 56: 12
దేవా, నీవు
మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని
సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.
కీర్తనలు 116: 8
మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా
కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
కీర్తనలు 40: 2
నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు.
ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.
అయితే ఈ
సందర్భంగా దేవుడు కాపాడుతూ ఉంటారు కాని నీవు జారిపడకుండా ఉండాలి అంటే ఇంకా
తొట్ట్రిల్లకుండా ఉండాలి అంటే నీవు చేయాల్సినవి రెండు! కారణం నీవు తప్పు
చెయ్యకుండా నిన్ను గార్డ్ చేసే వారు ముగ్గురు! ఒకటి వాక్యం! రెండు
పరిశుద్ధాత్ముడు! మూడు నీ అంతరాత్మ!
కీర్తనాకారుడు 119 వ కీర్తన లో అంటారు: నీ ఎదుట పాపము
చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అంటున్నారు!
కీర్తనలు 119:
11
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము
ఉంచుకొని యున్నాను.
అనగా
పాపము చెయ్యకుండా వాక్యము నిన్ను అడ్డగిస్తుంది.
అదే విధముగా నీవు పాపం చేద్దామని అనుకున్నా దారి
తప్పుతున్నా నీలో నిజంగా పరిశుద్ధాత్ముడు నివశిస్తూ ఉంటే వెంటనే వాక్యము, పరిశుద్ధాత్ముడు ఇంకా నీ అంతరాత్మ ఈ ముగ్గురు కలిసి
ఒరేయ్ పనికిమాలిన వాడా నీవు ఎవడవో నీకు తెలుసా? నీవు
పవిత్ర రక్తంతో కడుగబడిన వాడవు తెలుసా! ఫలాని అధ్యాయం ఫలాని వచనంలో వాక్యం ఏమి
సెలవిస్తుంది? నరకంలో కి పోతావు జాగ్రత్త! అంటూ
నిన్ను గద్దిస్తూ ఉంటారు! వెంటనే నీవు తప్పు ఒప్పుకుని ప్రభువా నాకు వచ్చిన ఈ
తప్పుడు ఆలోచనలకు నేను చింతిస్తున్నాను! నన్ను క్షమించు అని నీవు వేడుకుంటే
పరిశుద్ధాత్ముడు నిన్ను కడుగుతాడు. నీవు పరిశుద్ధుడవు అవుతావు! అయ్యా! ఇది నా
స్వానుభవం! ఎన్నోసార్లు నన్ను గద్దించి సరిచేశారు ఈ ముగ్గురు! అందుకే ఈ రోజు నేను
ధైర్యంగా చెప్పగలను- ఈ రోజు సంఘము ఎత్తబడితే ఎత్తబడే గుంపులో నేనుంటాను! ప్రియ
చదువరీ ! స్నేహితుడా! ఇది నీకు కూడా సాధ్యమే! మరినీవు వాక్యాన్ని నీ గుండెల్లో
దాచుకున్నావా? పరిశుద్దాత్ముని శక్తిని నీవు
పొందుకున్నావా? ప్రతీ విషయంలో దేవునికి అధికారం
ఇస్తున్నావా? నీ అంతరాత్మ ప్రభోధాన్ని వింటున్నావా
లేక వాని పీక నులిమి నీవు నోర్మూసుకో! నాకు అన్నీ తెలుసు అంటున్నావా?
"తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకు" శక్తి గల దేవుడు యేసు క్రీస్తు. ఒక
వేళ ప్రభువు మనలను కాపాడకపోతే,
మనము తొట్రిల్లిపోతాము అని
ఈ వచనం సెలవిస్తోంది. దేవుడు ఎలా మనలను కాపాడతారు అంటే "సహింపగలుగుటకు ఆయన శోధనతో
కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును (1 కొరింథీ 10:13)", "సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక". అంటే
దేవుడు మనకు శోధనని తప్పించుకునే మార్గాన్ని చూపించి దానిని జయించే శక్తి ఇస్తారు.
పాపాన్ని జయించడం మాత్రమే కాకుండా, పరిశుద్దతలో అనగా
ఆత్మపూర్ణులై ప్రభువుని సేవించి సంతోషపెట్టేలా ఉంచుతూ మనలను భద్రం చేస్తారు. ఈ
అబద్ధబోధకుల నుంచి మనలను రక్షించేది దేవుడే. ఒకవేళ ప్రభువు మనలను ఈ విధంగా భద్రం
చేయకపోతే మనం నశించిపోతాం.
కీర్తన 37:23—24
23. ఒకని
నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
24. యెహోవా
అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
రోమా 8:37
రోమీయులకు 8: 37
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము.
కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయనలో సాగిపోదాం!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*యూదా పత్రిక –29వ భాగం*
యూదా 1:24—25
24. తొట్రిల్లకుండ
మిమ్మును కాపాడుటకును, తన
మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
25. మన
ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు
మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును
కలుగును గాక. ఆమేన్.
ప్రియులారా! మనము యూదా పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం చివరికి వచ్చేశాము!
(గతభాగం తరువాయి)
ఇక తన మహిమ ఎదుట
ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన దేవుడు అంటున్నారు: దీనిలో ఎంతో ఎంతో
గూఢార్ధము ఉంది! దీని అర్ధము: యేసుక్రీస్తుప్రభులవారు తొందరలో తన మహిమతో రాబోతున్నారు!
అప్పుడు తీర్పు తీర్చే గడియ అనేది ఒకటుంటుంది. ఆరోజు నిన్ను నీవు త్రాసులో తూయగా
నీవు నిర్దోషి అని పరిశుద్ధుడు అని దేవునిచేత అనిపించుకోవాలి! అలా నిన్ను
నిలబెట్టడానికి యేసుక్రీస్తు సమర్ధుడు అని అర్ధం! ఇంతకీ నీవు నిర్దోషమైన జీవితం
జీవిస్తున్నావా? పరిశుద్ధమైన జీవితం- వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం
జీవిస్తున్నావా?
యేసయ్య అంటున్నారు: ఎవడైతే
జనుల ఎదుట నన్ను ఒప్పుకుంటాడో అనగా జనుల ఎదుట నేను యేసుక్రీస్తుప్రభులవారిని నా
స్వంత రక్షకునిగా అంగీకరించాను ఇక నా దేవుడు ఆయనే అని ఒప్పుకుంటారో వారిని దేవుడు
తన మహిమతో వచ్చినప్పుడు తన దూతల ఎదుట యేసయ్య కూడా ఈ వ్యక్తి నా రక్తంలో కడుగబడిన
నా వాడు అని ధైర్యగా చెబుతారట! ఎవడైతే సిగ్గుపడి నేను యేసు రక్తంలో కడుగబడ్డాను
ఆయన బిడ్డని అని ఎవడు చెప్పడో వాడ్ని వీడెవడో నాకు తెలియదు అంటారట! కాబట్టి నిన్ను
నీవు సరిచేసుకోమని మనివి చేస్తున్నాను!
మత్తయి 25:31
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును
వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
లూకా 9:26
నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో
వాని గూర్చి మనుష్యకుమారుడు, తనకును
తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.
మనలను నిర్దోషముగా నిలబెట్టడమే దేవుని లక్ష్యం! ఎఫెసీ
5:26—27..
ఇక తర్వాత మాటలో శక్తిగల మరక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన
యేసుక్రీస్తుద్వారా ....
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శక్తిగల మన రక్షకుడైన దేవునికి అంటున్నారు-
ఇక్కడ మరోసారి యూదా గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నారు: తండ్రియైన
యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు ఒక్కటే! ఈ లోకంలో రక్షకుడు అనే
బిరుదు కేవలం యేసుక్రీస్తు ప్రభులవారికే ఉంది అందుకే గబ్రియేల దేవదూత యోసేపుతో
అంటున్నాడు: తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని
పేరుపెట్టుదువు!.....
మత్తయి 1: 21
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక
ఆయనకు యేసు (యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
కాబట్టి యేసుక్రీస్తు= యెహోవా దేవుడు అని గ్రహించాలి!
ఇంకా అయన దేనిలో శక్తివంతుడు అని చూసుకుంటే:
ఎఫెసీయులకు 3: 20
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము
అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను
అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
యాకోబు 1:21
అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల
వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
ఒకడు నా చేతిలోనుండి మిమ్మును విడిపించే శక్తి ఎవడికి ఉంది అంటూ వాగాడు,
కొద్దిసేపటిలోనే
మహోన్నతుడైన దేవుని సేవకులారా అంటూ చెప్పాల్సివచ్చింది! దానియేలు 3!
అంతటి శక్తిమంతుడు మన దేవుడు! ఆయన మనము పాపం చేయకుండా కూడా ఆపుతూ మనలను
నిర్దోషులుగా ఉంచడానికి కూడా ఆయన శక్తిగలవాడు!
"మహిమయు
మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును
కలుగును గాక" ఎందుకు యూదాగారు ఇక్కడ దేవునికి ఇలా మహిమ
చెల్లిస్తున్నారు అంటే "తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువ
బెట్టుటకును, శక్తిగలవాడు " అని సమాధానం ఇస్తున్నారు. మన
రక్షణ మరియు దాని కొనసాగింపు సర్వయుగములు నివసించే ఆ మహిమగల దేవుని కృప అని అర్ధం
చేసుకోవాలి. మనల్ని రక్షించాల్సిన అవసరం దేవునికి లేకపోయినప్పటికీ,
తన
నిత్యమైన ప్రేమని బట్టి మనల్ని సర్వసత్యములోనికి నడిపించి,
పాపం
నుండి బయటకి తీసుకొచ్చి, తన కుమారులు/కుమార్తెలుగా మనల్ని చేసుకొని
నిత్యజీవాన్ని ప్రసాదించిన దేవుణ్ణి యుదాగారితో పాటు మనం కూడా స్తుతిద్దాం.
జాగ్రత్తగా పరిశీలిస్తే యూదా గారికి పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పాడు అంటే ఆయన
మహిమ గలవాడు ఇంకా మహాత్యము గలవాడు అంటున్నారు. ఆయన ఎంత మహిమ గలవాడో మనకు ప్రకటన 1
మరియు
4, 5 అధ్యాయాలలో ఉంది. ఇంకా ఆయన ప్రభావ స్వరూప దర్శనం చూసిన యేహెజ్కేలు గారు తన
గ్రంధంలో వివరిస్తున్నారు!
ఇక మహాత్యము అనగా అద్భుతాలు సూచక క్రియలు చేసేవాడు- ఆయన చేసిన అద్భుతాలు బైబిల్
మొత్తం ఉన్నాయి ఇంకా నాలుగు సువార్తలలో ఎన్నెన్నో ఉన్నాయి!
ఇక
ఆధిపత్యము అధికారం ఎలా వచ్చాయి??
యేసుక్రీస్తుప్రభులవారు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నారు?
ఇదిగో
భూమియందును ఆకాశమందును నాకు సర్వాదికరం ఇవ్వబడింది కాబట్టి ఈ సువార్త అందరికి
చెప్పండి నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షణ పొందుతాడు నమ్మని వారికి శిక్ష!
మత్తయి 28: 18
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను
నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.
ఇంకా ఈ భూలోకంలో పాపములు క్షమించడానికి మనుష్యకుమారునికి అధికారం ఉంది
అంటున్నారు!
మార్కు 2: 10
అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి
అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి
ఇంకా సాతానుని పడుద్రోయుట ద్వారా అధికారం క్రీస్తుది అయ్యింది
ప్రకటన 12:10
మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట
వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది
పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
1పేతురు
3: 22
ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను
శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
ఎఫెసీ 1:20
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను
శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ
యుగమునందు మాత్రమే
యోహాను 5:26,27
26. తండ్రి
యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై
యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.
27. మరియు
ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.
ప్రకటన 5:13
అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను
సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా
వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును
ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.
చివరగా ఫిలిప్పీ 2:5—11
6. ఆయన
దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో
సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల
పోలికగా పుట్టి, దాసుని
స్వరూపమును ధరించుకొని, తన్ను
తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
9. అందుచేతను
పరలోకమందున్న వారిలో గాని, భూమి
మీద ఉన్నవారిలో గాని,
10. భూమి
క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని
మోకాలును యేసునామమున వంగునట్లును,
11 .ప్రతివాని
నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
ఇట్టి ఘనుడైన దేవాదిదేవుడ్డ్ని పూజిద్దాం! ఆయన సన్నిధిని వణుకుదాం!
యూదా 1:24—25
24. తొట్రిల్లకుండ
మిమ్మును కాపాడుటకును, తన
మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
25. మన
ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు
మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును
కలుగును గాక. ఆమేన్.
ఆమెన్!
(సమాప్తం)
*********""""""********"""""""""""""""""""""""""""""""*********************************************
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ఈ యూదా పత్రికద్వారా పరిశుద్ధాత్మ
దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను! ఆయన ఎదుట మిమ్మును నిర్దోశముగా
నిలువబెట్టాలనేదే మా ఉద్దేశం! దయచేసి నాకోసం ప్రార్ధన చెయ్యండి! మా వెబ్సైట్ కోసం
మా పేజీ ద్వారా జరిగే పరిచర్య కోసం వాట్సప్ ద్వారా పరిచర్య కోసం ప్రార్ధన
చెయ్యండి! ప్రభువు చిత్తమైతే
*యాకోబు
పత్రిక* ధ్యానాలతో మరలా కలుసుకుందాం!
దైవాశీస్సులు!
ఇట్లు
వందనములతో
మీ ఆత్మీయ సహోదరుడు
రాజ కుమార్ దోనే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి