యాకోబు పత్రిక

* యాకోబు పత్రిక – మొదటి భాగం * * ఉపోద్ఘాతము * అది క్రీ . శ . 62 వ సంవత్సరం , సన్హేద్రీన్ సభ జరుగుతుంది ! మధ్యలో ఒక పెద్దాయనను నిలబెట్టారు ! ఆయన నీతిమంతుడుగా అంగీకరించబడ్డవాడు అందుకే మర్యాదగా విచారణ చేస్తున్నారు ! ( నీతిమంతుడుగా అంగీకరించబడటం అంటే కేవలం నీతిగా బ్రతకడమే కాదు - ప్రధానమైన రెండు కార్యాలు తప్పకుండా చెయ్యాలి - దశమ భాగాన్ని తప్పకుండా ఇవ్వాలి ; తనకున్న ఆస్తిని మూడు భాగాలు చేసి , ఒక భాగాన్ని దేవునికి , మరో భాగాన్ని పేదలకు , పరదేశులకు విధవరాళ్ళు కోసం , చివరి భాగాన్ని తనకోసం – తన పిల్లలకోసం వెచ్చించాలి అప్పుడే నీతిమంతుడు అని సభద్వారా నిర్దారించబడతాడు )! అడిగారు సభ : * పెద్దాయనా ! నీవు నీతిమంతుడవు అని మా అందరికి తెలుసు ! నీవు ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాము అయితే అసలు సిలువ వేయబడి చనిపోయిన యేసు అనే వ్యక్తికోసం నీ యొక్క అభిప్రాయం ఏమిటి *? వెంటనే ఆ నీతిమంతుడు అంటున్నారు : * మీరెందుకు యేసుక్రీస్తు కోసం నన్ను అడుగుతా...