యాకోబు పత్రిక

 

*యాకోబు పత్రికమొదటి భాగం*

*ఉపోద్ఘాతము*

 

        అది క్రీ.. 62 సంవత్సరం, సన్హేద్రీన్ సభ జరుగుతుంది! మధ్యలో ఒక పెద్దాయనను నిలబెట్టారు! ఆయన నీతిమంతుడుగా అంగీకరించబడ్డవాడు అందుకే మర్యాదగా విచారణ చేస్తున్నారు! (నీతిమంతుడుగా అంగీకరించబడటం అంటే కేవలం నీతిగా బ్రతకడమే కాదు- ప్రధానమైన రెండు కార్యాలు తప్పకుండా చెయ్యాలి- దశమ భాగాన్ని తప్పకుండా ఇవ్వాలితనకున్న ఆస్తిని మూడు భాగాలు చేసి, ఒక భాగాన్ని దేవునికి, మరో భాగాన్ని పేదలకు, పరదేశులకు విధవరాళ్ళు కోసం , చివరి భాగాన్ని తనకోసం తన పిల్లలకోసం వెచ్చించాలి అప్పుడే నీతిమంతుడు అని సభద్వారా నిర్దారించబడతాడు)!

అడిగారు సభ: *పెద్దాయనా! నీవు నీతిమంతుడవు అని మా అందరికి తెలుసు! నీవు ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాము అయితే అసలు సిలువ వేయబడి చనిపోయిన యేసు అనే వ్యక్తికోసం నీ యొక్క అభిప్రాయం ఏమిటి*? 

వెంటనే నీతిమంతుడు అంటున్నారు:  *మీరెందుకు యేసుక్రీస్తు కోసం నన్ను అడుగుతారు?!! ఆయన చనిపోవడమే కాకుండా పునరుత్థానుడై పరలోకమందు తండ్రియైన దేవుని కుడిపార్వ్శమందు ఆసీనుడై ఉన్నాడు! మరలా మేఘముల ద్వారా తిరిగి రాబోతున్నాడు!!!*

  వెంటనే అనేకులు సభలో ఉన్నవారు దీనిని నమ్మి యేసుక్రీస్తుప్రభుల వారిని స్తుతించడం మొదలుపెట్టారు!

 

వెంటనే సభలోని పెద్దలు అంటున్నారుఅయ్యో నా ప్రియమైన ప్రజలారా! నీతిమంతుడు ఎంతో గందరగోళంలో ఉన్నాడు, తను తికమక పడి మిమ్మల్ని కూడా తికమక పెడుతున్నాడు! అని చెప్పి , ఆయనను ఎత్తైన ప్రాంతానికి లాగుకుని వెళ్లి లూకా 4:29లో  యేసుక్రీస్తుప్రభులవారిని కొండపేటుమీదనుండి పడద్రోయాలని అనుకున్నారో అదే కొండపేటునుండి త్రోసివేశారు! రక్తం కారుతుంది గాని ఆయన చనిపోలేదు! వెంటనే పెద్దలు రాళ్ళతో కొట్టడం మొదలుపెట్టారువెంటనే పెద్దాయన మోకాల్లూని యేసుప్రభులవారు, స్తెఫనుగారు ప్రార్ధించినట్లు “*తండ్రి దయచేసి నేరాన్ని వారిమీద మోపవద్దు, దయచేసి వారిని క్షమించండి*” అని ప్రార్ధించారు! వెంటనే అక్కడున్న ప్రజలు పెద్దలారా- దయచేసి ఆపండి! నీతిమంతుడు మనకోసం ప్రార్ధన చేస్తున్నాడు- ఆయనను రాళ్ళతో కొట్టడం ఆపండి అంటున్నారు! కాని అక్కడున్న ఒక చాకలివాడు- తాను బట్టలు ఉతికే కర్రతో పెద్దాయన తలమీద బలంగా కొట్టడం ప్రారంభించాడు! వెంటనే పెద్దాయన తల పగిలిపోయింది. రక్తము కారిపోయి పెద్దాయన చనిపోయాడు!!!

 

ఇదీ ఒక నీతిమంతుడి మరణం! నీతిమంతుడు పేరు: యాకోబు! యేసుక్రీస్తుప్రభులవారి స్వయాన పెద్ద తమ్ముడు! ఆదిమ సంఘానికి ప్రధమ అధ్యక్షుడు లేక ఇశ్రాయేలు దేశంలో గల సంఘాలు అన్నింటికీ మొదటి భిషప్!

సభకు నాయకుడు: ప్రధాన యాజకుడైన అన్న! లేక ఆననీయ!!!

 

నీతిమంతుని మరణం కోసం బైబిల్ లో వ్రాయబడలేదు గాని చరిత్రకారులైన జోసెఫెస్, హేగేస్సిపుస్ మరియు యూసిబయాస్ ఇలా రాశారు:

 

The historian Josephus places James’ death during a time of transition between two Roman governors, signifying a probable date of 62 AD.

Hegessipus records the following about James’ death, as quoted by Eusebius, a 4th century Church historian:

 

James the Just is so well respected by even the non-Christian Jews, that when James tells them  Jesus is the Savior, some of the ruling class become believers. This worries the Jewish leaders, who beg James to speak to the crowds

The Jewish leaders take James to the summit of the temple, where the crowd can see and hear him, and cry out in a loud voice, “We are all bound to obey you, as you are just. The people are confused and following the dead man named Jesus. Tell us about this crucified Jesus.”

James calls out just as loudly, “Why do you ask me about Jesus? He sits in heaven, at the right hand of God, and will return on the clouds of heaven.” Many of the people are convinced then and there that Jesus is the Resurrected Lord and start praising Him on the spot.

The leaders are beside themselves. They shout to the people, “Oh dear! The just man is confused himself!” and throw James down from that height. But he is not killed, so the leaders start stoning him.

James does what he has always done. He kneels down and asks God to forgive the Jews. The stones continue to batter his body as a priest yells, “Stop! What are doing? The just one is praying for us!”

A launderer takes the club used to beat clothes and hurls it at James’ head, and the just one finally dies.

ప్రియ దైవజనమా! యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు! మరోసారి ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్- 9 లో భాగంగా మరోసారి గొప్ప దైవజనుని పత్రిక ద్వారా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది! అట్టి కృప నిచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు!

 

  గ్రంధాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం కోసం మొదటిగా భక్తునికోసం తెలుసుకుని తర్వాత యాకోబు పత్రికను విపులంగా ధ్యానం చేసుకుందాం!

 

దైవాశీస్సులు!

 

*యాకోబు పత్రిక రెండవ భాగము*

*ఉపోద్ఘాతము 2*

 

యాకోబు 1:1

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

 

  ప్రియులారా! గ్రంధాన్ని ధ్యానించకముందు యాకోబు గారి కోసం చూసుకుందాం!

 

పేరు: యాకోబు (యేసుప్రభులవారి పెద్ద తమ్ముడు)

 

తండ్రి: యోసేపు (యేసుప్రభులవారి తండ్రి- భూలోకంలో)

 

తల్లి: మరియ (యేసుప్రభులవారి తల్లి- భూలోకంలో)

 

ఎప్పుడు పుట్టారు?  క్రీ.. 2లో సుమారుగా

 

ఎక్కడ పుట్టారు?  నజరేతు, గలలియ, ఇశ్రాయేలు (గమనించాలి- యేసుప్రభులవారు పుట్టిన తర్వాత హేరోదు రాజు రెండేళ్ళు నిండని పసివారిని చంపమని ఆజ్ఞాపించాడు (మత్తయి 2:13--17) వెంటనే దేవుడు దూత గబ్రియేలును పంపించి ఐగుప్తుకి వెళ్ళమని చెబితే మరియమ్మ గారు, యోసేపు గారు పసివాడైన యేసయ్యను తీసుకుని రహదారిగుండా కాకుండా ఇశ్రాయేలు ప్రజలు నడచిన అరణ్యమార్గము గుండా ఐగుప్తుకి పారిపోయారు. కారణం రహదారి ద్వారా ప్రయాణం చేస్తే దారినిండా రోమా సైనికులు ఉన్నారుకాబట్టి అరణ్యమార్గము ద్వారా ఎన్నో రోజులు నడిచి ఐగుప్టు చేరుకున్నారు. ఇక ఐగుప్తు దేశం కూడా రోమా పాలనలో ఉన్నందున అక్కడ కూడా రోమా సైనికులు తిరుగుతున్నందువలన అక్కడ కూడా ఒకే ప్రాంతంలో ఉండక, కొన్ని రోజులు ఒక దగ్గర ఉండి, తర్వాత మరో ప్రాంతం తిరిగే వారు. ఇలా ఐగుప్తులో కూడా స్థిరంగా ఒక దగ్గర ఉండలేదు! కారణం వలన ఐగుప్తులో వీరికి ఎవరూ పుట్టలేదు! దేవుడు మరలా గబ్రియేలు దూతను పంపించి హేరోదు చనిపోయాడు నీ స్వదేశానికి వెళ్ళు అని చెప్పిన తర్వాత రహదారి మార్గంలోనే బెత్లెహేము వచ్చారు. (మత్తయి 2:19--23)  గాని అక్కడ హేరోదు కొడుకు అక్కడ పరిపాలిస్తున్నాడు అని విని- యూదయలో ఉండకుండా గలిలియ కు వచ్చి నజరేతులో నివాసం చెయ్యడం జరిగింది. అక్కడ పుట్టారు వీరికి నలుగురు కుమారులు- ఇద్దరి కూతుర్లు)

 

అన్నదమ్ములు- చెల్లుల్లు: యేసుప్రభులవారు- అన్నయ్య, ఇంకా సీమోను, యోసేపు, యూదా పత్రిక రాసిన యూదా తమ్ముడు, వీరు తమ్ముళ్ళు, ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు మార్కు 6:3

 

వృత్తి: వండ్రంగి కార్పెంటర్- యేసుప్రభులవారు నేర్పించారు. కారణం చెల్లెళ్ళు పుట్టిన వెంటనే యోసేపు గారు చనిపోయారు. అందువల్ల కుటుంభభారం పెద్ద కొడుకుగా యేసుక్రీస్తుప్రభులవారి మీద పడింది. అందుకే తమ్ముళ్ళు ఇద్దరికీ వడ్రంగి వృత్తి నేర్పించి వారు ప్రయోజకులైన తర్వాతనే యేసయ్య పరిచర్య ప్రారంభించారు!

యేసుప్రభులవారు పరిచర్య చేసేటప్పుడు యాకోబు గారు ఆయన వెంట తిరిగారా? లేదు!

 

 బైబిల్ లో ఆయన సహోదరులు ఆయన శిష్యులుగా ఉన్నారు అని ఎక్కడా లేదు! చరిత్రలో కూడా లేదు! అయితే ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు అనగా ఆయనను మెస్సయ్యగా  అని బైబిల్ లో రికార్డు చేయబడింది. యోహాను 7:5 ...

ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు.

 

అయితే యేసుక్రీస్తుప్రభులవారి సహోదరులందరూ నమ్మి విశ్వసించి శిష్యులతో కలసి ప్రార్ధించినట్లు అపోస్తలుల కార్యములో వ్రాయబడింది! 1:13,14....

13. వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే(మతాభిమానియను) అనబడిన సీమోను, *యాకోబు కుమారుడగు(లేక, సహోదరుడగు) యూదా అనువారు*.

14. *వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.*

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభులవారి మరణం వరకు ఆయన సహోదరులు ఆయన మెస్సయ్యగా నమ్మలేదు గాని ఆయనను హింసించిన విధానానికి ఎంతో బాధపడ్డారు! అయితే ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడయ్యారో ఆయన అనేకమందికి కనబడ్డారు! తప్పకుండా మరియమ్మగారికి ఆయన సహోదరులకు కనబడ్డారు అని అనుకోవచ్చు! అప్పుడు ఆయనను నమ్మి ఉండవచ్చు! అందుకే మేడగదిలోకి పోయి ప్రార్ధన చేసిన వారిలో ఆయన తల్లితో పాటుగా యాకోబు, ఆయన  సహోదరుడైన యూదా మరియు ఆయన సహోదరులు కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్ధన చేయుచుండిరి అని వ్రాయబడింది! ఇందును బట్టి మరో విషయం కూడా అర్ధమవుతుంది అది ఏమిటంటే పెంతెకోస్తు దినమున ఆత్మాభిషేకము పొందుకున్న వారిలో ఆయన తల్లియైన మరియమ్మగారు ఆయన నలుగురు సహోదరులు కూడా ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది!!!

 

కాబట్టి పైన వివరించిన విషయాలు ప్రకారం యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఆయన సహోదరులు ఎవరూ ఆయనను నమ్మి విశ్వశించలేదు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక మూడవ భాగము*

*ఉపోద్ఘాతము 3- ఆదిమ సంఘంలో యాకోబు గారి పాత్ర*

 

యాకోబు 1:1

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

 

  ప్రియులారా! గ్రంధాన్ని ధ్యానించకముందు యాకోబు గారి కోసం చూసుకుందాం!

 

                 (గతభాగం తరువాత)

 

ప్రియులారా గతభాగంలో యాకోబు గారు ఎప్పుడు రక్షించబడ్డారో ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చూసుకున్నాము! ఇక ఈరోజు సంఘములో యాకోబు గారి పాత్ర ను చూసుకుందాం!

 

పెంతుకోస్తు దినాన కట్టబడిన సంఘము విస్తరించడం మొదలుపెట్టింది. ఎలా విస్తరించబడుతుందో అంతే ఎక్కువగా సంఘము మీదికి శ్రమలు కూడా పెరిగాయి. సంఘముతో పాటుగా యేసుక్రీస్తుప్రభులవారి తల్లి, ఆయన సహోదరులు కూడా ఉన్నారు. సంఘము మరియు అపోస్తలులు కూడా వీరికి యేసుక్రీస్తుప్రభులవారి కుటుంభంగా వీరిని ఎంతోప్రేమగా చూసేవారు! అలాగని వీరు సంఘము మీద అధికారం చెలాయించలేదు! అయితే శ్రమలు విస్తరించే కొలదీ శిష్యులు, శిష్యుల శిష్యులు అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు అని మనకు అపోస్తలుల కార్యములో రికార్డ్ చేయడం జరిగింది! .పొ. 8:1

  కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

4. కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.

 

ఇంకా పౌలుగారు రక్షించబడక ముందు సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా సంఘాన్ని హింసించినట్లు మనకు అపో 8,9 అధ్యాయాలలో కనిపిస్తుంది. కాబట్టి రక్షించబడిన ఇంకా ఘోరంగా అనేకప్రాంతాలకు చెదిరిపోయారు! అయితే ఇలా చెదిరిపోయిన వారు కాళీగా కూర్చోకుండా అక్కడ సువార్త ప్రకటించడం చేస్తుండగా అనేకులు రక్షించబడటం జరిగింది. అలా రక్షించబడిన విశ్వాసులను బలపరచడానికి పేతురు గారు ఇంకా శిష్యులు వెళ్లి అన్యజనులను రక్షించబడిన యూదులను బలపరచడం జరిగేది అపో 11:1 ప్రకారం! ఇదే సమయంలో  పెద్ద యాకోబు అనబడే యోహాను గారి అన్నయ్య, లేక యేసు ప్రభులవారి పెద్దమ్మ కొడుకు అయిన యాకోబు గారిని హేరోదు ఖడ్గముతో హత్యచేశాడు! కాబట్టి అపోస్తలులు కూడా ఇలా చెదిరిపోయారుఇలా చూసుకుంటూ వెళ్తే అపో పదిహేనో అధ్యాయం రాబోయేసరికి యేరూషలేములో మిగిలింది  పేతురు గారు, యోహాను గారు ఇంకా యాకోబు గారు మాత్రమే! మిగిలిన వారు అనేక దేశాలకు చెదిరిపోయారు! అప్పటికీ అపో 15 అధ్యాయం ప్రకారం సంఘానికి మొట్టమొదటి అధ్యక్షులుగా యాకోబు గారు ఉన్నారు! అయితే చరిత్ర చెబుతుంది- మొత్తం అందరూ చెదిరిపోయినా పేతురు గారిని యోహాను గారిని ఇంకా సంఘానికి అధ్యక్షులుగా ఉండమని యాకోబు గారిని యేరూషలేములోనే ఉండమన్నారు. మిగిలిన వారు అనేకదేశాలకు చెదిరిపోయి సువార్తను ప్రకటించాలి అని నిర్ణయం జరిగింది. ఏదైనా సమస్య వచ్చినప్పడు లేదా ఎవరినైనా బలపరచాలి అంటే యోహాను గారు గాని పేతురు గారు గాని వెళ్లి వారిని బలపరచడం జరిగేదిసమస్య వస్తే యాకోబు గారు, పేతురు గారు, యోహాను గారు ఉండి సమస్య తీర్చేవారు! ఇలాగే 15 అధ్యాయంలో చాలాపెద్ద సమస్య వస్తే సమస్యను ముగ్గురు తీర్చారు!

*యాకోబు- తగ్గించుకున్న విశ్వాసి*

 

మనము యాకోబు పత్రిక మొదటి వచనం చూసుకుంటే దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది అంటూ తననుతాను తగ్గించు కున్నారు! యూదా పత్రికలో వివరించడం జరిగింది యూదా గారు యేసుక్రీస్తుప్రభులవారి సొంత చిన్న తమ్ముడైనప్పటికీ తనను తాను యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడను అంటూ పరిచయం చేసుకుంటున్నారు! ఇక మనం యాకోబు పత్రికను చూసుకుంటే యూదా గారి అన్నయ్య యేసుక్రీస్తు ప్రభులవారి పెద్ద తమ్ముడైన యాకోబు గారు కూడా నేను యేసుక్రీస్తు దాసుడను అంటూ పరిచయం చేసుకుంటున్నారు! ఏమి?

 

వారు అలా చెప్పుకోడానికి కారణం ఏమిటి? యేసుక్రీస్తు యొక్క తమ్ముడిని అని గర్వంగా చెప్పుకునే అధికారం వాళ్లకుంది! గాని ఎందుకు చెప్పుకోలేదు??!!!

 

ఎందుకంటే మొదటగా ఆయన ఎవరో- వీరికి బాగా తెలిసింది. శారీరకంగా భూమిమీద మనిషిగా తమకు అన్నయ్యగా పుట్టినా, ఆయన మరణ పునరుత్థానం చూసిన వారికి నిజంగా ఆయన దేవుని కుమారుడని, దేవుడని అర్ధమయ్యింది కాబట్టి ఆయన సహోదరులం అని చెప్పుకోకుండా ఆయన దాసులము అని చెప్పుకున్నారు! తమను తాము తగ్గించు కుంటున్నారు. ఇంకా తమ రక్త సంబంధం కన్నా ఆత్మీయ బంధాన్నే చూపించడానికి ఇష్టపడ్డారు.

 

ఇక పౌలుగారు కూడా అంటున్నారుయేసు క్రీస్తు దాసుడును (doulos), అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును..." రోమా 1:1

 

పేతురు గారు కూడా అంటున్నారు: “యేసుక్రీస్తు దాసుడును (doulos) అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.” 2 పేతురు 1:1

 

ఒకసారి వీరు ఉపయోగించిన పదము యొక్క అర్ధము చూసుకుంటే గ్రీకు భాషలో వ్రాయబడింది కాబట్టి గ్రీకు భాషలో వీరు ఉపయోగించిన పదం doulos!! doulos అంటే బానిస- కట్టు బానిస!! ఇక్కడ యాకోబు గారు తమ్ముడైనప్పటికీ నేను యేసుప్రభువుకు కట్టు బానిసను అని చెప్పుకున్నారు తగ్గించుకున్నారు!

 

మరినీకు తగ్గింపు జీవితం ఉందా ప్రియ సహోదరి సహోదరుడా!!!!!

 

(ఇంకా ఉంది)

*యాకోబు పత్రిక నాల్గవ భాగము*

*ఉపోద్ఘాతము 4- ఆదిమ సంఘంలో యాకోబు గారి పాత్ర*

 

యాకోబు 1:1

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

 

  ప్రియులారా! గ్రంధాన్ని ధ్యానించకముందు యాకోబు గారి కోసం చూసుకుందాం!

 

                 (గతభాగం తరువాత)

 

*యాకోబు- పెద్దగా/ అధ్యక్షునిగా/ తెలివిగల నాయకునిగా*

 

ఒకసారి మనము మరలా అపో కా. 15 అధ్యాయం చూసుకుంటే ఒక పెద్ద సమస్య వస్తుంది దానిని ఏవిధంగా డీల్ చేశారో యాకోబు గారు మనకు అర్ధమవుతుంది.

 

1. కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.

  (లేవీయకాండము 12:3)

2. పౌలున కును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.

3. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.

4. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి.

5. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.

6. అప్పుడు అపొస్తలులును పెద్దలును సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను

7. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.

8. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను.

9. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని భేదమైనను కనుపరచలేదు

10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

11. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

12. అంతట సమూహమంతయు ఊరకుండి, బర్న బాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను.

13.*వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహో దరులారా, నా మాట ఆలకించుడి.*

14. అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.

15. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా

16. తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు

(యిర్మియా 12:15, ఆమోసు 9:9-12)

17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి సంగతులను తెలియ

18. పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది.

(యెషయా 45:21)

19. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక

20. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

(ఆదికాండము 9:4, లేవీయకాండము 3:17, లేవీయకాండము 10:14)

21. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

22. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును

23. వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము.

24. కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు

25. గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను

26. మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను.

27. కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో సంగతులు మీకు తెలియజేతురు.

28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

29. అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.

(ఆదికాండము 9:4, లేవీయకాండము 3:17, లేవీయకాండము 10:14)

30. అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి పత్రిక ఇచ్చిరి.

31. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.

 

ప్రియులారా! ఇక్కడ భాగంలో మనకు అంతియొకయ లో ఒక సమస్య వచ్చింది మరి ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు- అంతియొకయలో సమస్య వస్తే పౌలుగారు బర్నబా గారు అంత బాధపడటం ఏమిటి? అయ్యా! కాలంలో యేరూషలేము సంఘానికి ముఖ్య కేంద్రమైనా అక్కడ అందరు ఉండేవారు కాదు. కేవలం పేతురు గారు, యోహాను గారు మరియు యాకోబు గారు మాత్రమే ఉండేవారు. కాబట్టి చెదిరిపోయిన విశ్వాసులు కేంద్రంగా అంతియొకయనే చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా లేదా సమాచారం అందించాలన్నా మొదటిగా అంతియొకయకు చేరేది, అక్కడనుండి యేరూషలేముకి ఇంకా మిగిలిన ప్రాంతాలకు వెళ్ళేది. కాబట్టి ఇది క్రైస్తవులకు అనగా అన్యజనులలో రక్షించబడిన విశ్వాసులకు జీవన్మరణ సమస్యగా మారింది కనుకనే పౌలుగారు బర్నబా గారు వెంటనే బయలుదేరి యేరూషలేము వెళ్లారు! అక్కడ పేతురు గారు యాకోబు గారు ఉన్నట్లు అధ్యాయం చెబుతుంది అయితే గలతీ పత్రికలో 1:18,19 లో వీరిద్దరినీ కలుసుకున్నాను అని చెప్పడమే కాకుండా , ఇంకా 2:8,9లో పేతురు గారు, యాకోబు గారు మాత్రమే కాకుండా యోహాను గారు కూడా ఉన్నారు, వారు సంఘానికి స్థంభములుగా ఎంచబడ్డారు అని రాస్తున్నారు!

 

8. అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

10. మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.

 

సరే ఇప్పుడు అపోస్తలుల కార్యములు 15 అధ్యాయంలో సమస్యను అనగా అన్యజనులు కూడా సున్నతి పొందాలి అనే సమస్యను పౌలుగారు బర్నబా గారు సభ ముందు పెట్టారు, వెంటనే సున్నతిపొందాలి అనే బ్యాచ్ కూడా మాట్లాడారు! అక్కడ బహు తర్కము జరిగింది. అందుకు ప్రతిగా పేతురు గారు అన్యజనుల రక్షణ విషయంలో తనకు కలిగిన అనుభవం ఎంతగానో వివరించారు. ఇక్కడ పేతురు గారి ఉద్దేశం కూడా అన్యజనులు రక్షణ పొందిన తర్వాత సున్నతి పొందవలసిన అవసరం లేదు! కారణం దేవుడు వారిమీద కాడి మోపలేదు, పితరులు కూడా వారిమీద కాడి మోపలేదు మనమెందుకు వారిమీద సున్నతి అనే కాడి మోపడం అన్నారు! అన్నీ విన్నాక ఇప్పుడు యాకోబు గారు లేచి జడ్జిమెంట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ పెద్దగా అధ్యక్షుడిగా యాకోబు గారు మొదటగా ఇరుపక్షాల వాదన విన్నారు! ఎవరో ఒకరి పక్ష్యంగా మాట్లాడటం లేదు! ఇద్దరి వాదనలు చాలా ఓపికగా ఉన్నారు. కోపపడలేదు! సమస్యను సానుకూలంగా విని- బహుశా పరిశుద్దాత్ముని సహాయం కోరి ఉంటారు. వెంటనే ఇక తర్జనబర్జన లేకుండా తిన్నగా జడ్జిమెంటు ఇస్తున్నారు - కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక

20. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

అంతేకాదు మనం 1620వరకు చూసుకుంటే జడ్జిమెంటు కి తగిన రిఫరెన్సులు చెబుతూ తీర్పు ఇచ్చినవెంటనే ఇక సున్నతిపొందిన వారి బ్యాచ్ కూడా ఏమీ అనలేదు! కారణం మొదటగా ఈయన నీతిమంతుడు,

రెండవది: ఆయన అధ్యక్షుడు! అంతేకాదు అనేక దేశాలలో చెదిరియున్న యూదులు గాని అన్యజనులలో నుండి రక్షించబడిన విశ్వాసులు గాని తీర్పుకు ఎంతో సంతోషించారు!

 

కాబట్టి ఈయనలో మొదటగా సమస్యను తీరికగా ఓపికగా వినే లక్షణం ఉంది అనగా ఒక పెద్దకు ఉండాల్సిన లక్షణం ఉంది! తర్వాత సంఘానికి కావలసిన తీర్పును పరిశుద్ధాత్మ సహాయం, లేఖనాల సహాయం తీసుకుని వాక్యానుసారమైన తీర్పు ఇస్తున్నారు! తన సొంత తీర్పు గాని, తన సొంత జనుల పక్షాన గాని మాట్లాడకుండా వాక్య భాగం లోనుండే తీర్పు ఇచ్చి అందరినీ మెప్పించారు! అంతేకాకుండా ఆదిమ సంఘంలో వచ్చిన సమస్యలన్నిటికంటే గొప్ప సమస్యకు యిట్టే పరిష్కారం చెప్పారు! ఒకవేళ ఆరోజు తీర్పు వచ్చి ఉండక పోతే మనమందరం సున్నతి పొందాల్సిన అవసరం వచ్చి ఉండేది! అందుకు దేవునికి స్తోత్రం!

 

ఇదీ ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా , తెలివితేటలుగల నాయకునిగా యాకోబుగారు స్పందించిన విధానం!

*యాకోబు పత్రిక 5 భాగము*

*ఉపోద్ఘాతము 5- ఆదిమ సంఘంలో యాకోబు గారి పాత్ర*

యాకోబు 1:1

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

 

  ప్రియులారా! గ్రంధాన్ని ధ్యానించకముందు యాకోబు గారి కోసం చూసుకుంటున్నాం!

                 (గతభాగం తరువాత)

*యాకోబు- ఒక కాపరిగా*

 

   యాకోబు గారు ఒక కాపరి స్థానం లో ఉండి చేసినవి చూద్దాం!

 

దీనిని ధ్యానం చెయ్యాలంటే ముందు అసలు పత్రిక రాయడానికి గల నేపధ్యం చూసుకుందాం!

గతభాగంలో సున్నతి బ్యాచ్ వారు అన్యజనులలో నుండి రక్షించ బడిన విశ్వాసులను మీరు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు అని ప్రపంచమంతా కలవరపరుస్తున్నప్పుడు పౌలుగారు బర్నబా గారు యేరూషలేము వచ్చినప్పుడు అక్కడ మహా సభ జరిగినట్లు చూసుకున్నాము! అది జరిగాక సంఘాన్ని బలపరచడానికి ఇంకా శ్రమల వలన చెదిరిపోయిన యూదులను హెచ్చరించడానికి పత్రిక రాస్తూ బలపరుస్తున్నారు! అందుకే మొదటి వచనంలో అన్యదేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి అంటూ మొదలుపెట్టారు!

 

ఇక్కడ చెదిరిపోయిన యూదులు ఎంతో భయంకరమైన హింసలు శ్రమలు పొందుతున్నారు! ఎవరితో లేక ఎవరి ద్వారా పొందుతున్నారు అనేది చూసుకుంటే పౌలుగారు చెబుతున్నారు ఇంకా అపోస్తలుల కార్యములు కూడా చెబుతుంది- అన్యజనుల ద్వారా పొందిన శ్రమలు చాలా స్వల్పము గాని సొంత జనులైన రక్షణ పొందని యూదుల ద్వారా అనేకశ్రమలను హింసలను పొందుకున్నారు! దీనిని యేసుప్రభులవారు కూడా ప్రకటన 2 మరియు మూడవ అధ్యాయాలలో చెబుతున్నారు! వారు నిజమైన యూదులు కాదు గాని సాతాను సమాజం అని దేవుడు ప్రకటన గ్రంధంలో చెప్పినది వీరికోసమే!

 

కాబట్టి వీరు అనగా చెదిరిపోయిన రక్షించబడిన యూదులు శ్రమల యందు కృంగిపోకుండా దృఢంగా ఉండాలంటూ వారిని 1:24 వచనాల ద్వారా ఓదారుస్తూ వారిని విశ్వాసంలో బలపరుస్తున్నారు!

 ఇంకా 5:8 లో మీరు ఓపిక కలిగి ఉండండి. మీ హృదయాలను ధైర్య పరచుకోండి అన్నారు! అవును కాపరి కూడా ఇలానే సంఘాన్ని ధైర్యపరుస్తూ విశ్వాసం లో వారిని బలపరుస్తూ ఉండాలి సంఘానికి శ్రమలు కలిగినా లేక ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికి శ్రమలు విస్తరించినప్పుడు!!! ఇక్కడ కాపరి పాత్రను సమర్ధంగా పోషిస్తునారు యాకోబు గారు!

 

ఇంకా మిగిలిన వచనాలలో ఎన్నో రకాలైన ఓదార్పు మాటలు ఇంకా గద్దింపు మాటలు కూడా చెబుతున్నారు పత్రికలో! ఇక 1:12 నుండి 26 వరకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు! ఇంకా దేవుడే నన్ను శ్రమలు పాలు చేశారు అంటూ దేవుని మీద నిందమోపవద్దు! మీ స్వకీయ దురాశల వలననే మీరు శోధించబడతారు అంటూ చెబుతున్నారు! ఇంకా దురాశ ఎవరికీ ఉండకూడదు అంటూ హెచ్చరిస్తున్నారు!

 

ఇంకా 5 అధ్యాయంలో ఎవరిమీద తీర్పు తీర్చకండి అంటూ ఎవరిమీద సణుగుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు! యాకోబు 2:12-13, 4:11-12,

 

ఇంకా నోటిని స్వాధీనంలో ఉంచుకోండి అంటున్నారు యాకోబు 1:19-20, 3:2-12

 

ఎవరిమీద ద్వేషం ఉంచుకోవద్దు- ఇతరులతో తగవులాడవద్దు  అంటున్నారు యాకోబు 3:14-4:2

 

ఇక మొదటి అధ్యాయం చివరి వచనంలో నిజమైన భక్తీ ఏమిటో భక్తికి నిర్వచనం చెబుతున్నారు! ...యాకోబు 1: 27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

*యాకోబు- ఒక అసమానతలను ఖండించేవాడుగా*

 

బైబిల్ గ్రంధంలో- ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంధంలో పేదలను ప్రేమించేవారుగా ఇంకా ధనవంతులు చేసే ఘోరమైన కార్యాలను ఖండించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మొదటిగా యేసుక్రీస్తుప్రభులవారు తర్వాత ఆయన తమ్ముడైన యాకోబు గారు మాత్రమే! ఇంకా భీదలను ప్రేమించిన వారు కూడా వీరే! సమాజంలో పేదలను హీనంగా చూడటం వీరిద్దరూ సహించలేకపోయారు! కారణం ఇద్దరిలో పనిచేసేది పరిశుద్ధాత్ముడే కాబట్టి! సామాజిక అసమానతలు గాని ఆర్ధిక అసమానతలను దిక్కరించారు, హెచ్చరించారు! యేసయ్య అంటున్నారో అయ్యో ధనవంతులారా, అయ్యో పరిసయ్యులారా, .....

 

ఇక్కడ యాకోబు గారు కూడా 5:15 లో అంటున్నారు: ఇదిగో ధనవంతులారా మీమేడికి వచ్చే ఉపద్రవాల గూర్చి ప్రలాపించి ఏడవండి!....

James(యాకోబు) 5:1,2,3,4,5,6

1. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.

2. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

3. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.

4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

5. మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

6. మీరు నీతి మంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.

ఇలా ఆర్ధిక అసమానతలను ఖండించారు!

 

యేసుప్రభులవారు కూడా అన్నారు:

Luke(లూకా సువార్త) 6:24,25,26

24. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు.

25. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.

26. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

 

మత్తయి 23:

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో- నరకకుమారునిగా) చేయుదురు.

16. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

17. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?

18. మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టు కొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

19. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?

20. బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దానిపైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.

21. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.

22. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.

24. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.

28. ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు

30.మనము మన(లేక, మేము, మా) పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో(మూలభాషలో-రక్తవిషయములో) వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.

31.అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.

33.సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? య్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.

24. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.

28. ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు

30. మనము మన(లేక, మేము, మా) పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో (మూలభాషలో- రక్తవిషయములో) వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.

31. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.

33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

అంతేకాకుండా పెద్దలను కాపరులను కూడా ఖండించారు- గొప్ప ఖరీదైన బట్టలు వేసుకుని ఒకడు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఒకడు మీ కూతాలకు ఆహాజరైతే గొప్ప ఖరీదైన బట్టలు వేసుకుని వచ్చిన వాడిని పెద్ద ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి, దీన స్థితిలో ఉన్న సహోదరున్ని అనగా పేదవాన్ని అదిగో దూరంగా అక్కడ కూర్చో అంటున్నారు కదా! జాగ్రత్త మీ మీదికి తీర్పు వస్తుంది అని హెచ్చరిస్తున్నారు! ఆలంటివి చెయ్యవద్దు అని హితవు పలుకుతున్నారు!

 

James(యాకోబు) 2:1,2,3,4,5,6,7,8

1. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై యుండకుడి.

2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?

5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

6. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా?

7. మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?

8. మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.

*యాకోబు- సంఘక్షేమం కోరేవాడుగా*

యాకోబు గారు సంఘ క్షేమమును ఆశించి అంటున్నారు- మీలో ఎవరైనా రోగిగా ఉంటే మా దగ్గరికి రండి మేము ప్రార్ధన చేస్తే ఇది అయిపొయింది అది అయిపొయింది అంటూ గొప్పలు చెయ్యక- మీలో ఎవరైనా రోగిగా ఉంటే మీ సంఘంలో ఉన్న పెద్దలను పిలవండి. వారు వచ్చి నూనె రాచి ప్రార్ధించినప్పుడు- విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్థత కలిగిస్తుంది అంటూ పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను చెప్పారు! రోజులలో అనేకమంది టీవీ బోధకుల మోజులో పది స్వస్తతల వెనుక పరుగెత్తుతున్నారు! దేవుడు అది చెప్పలేదు బైబిల్ లో! మీకోసం మీరే ప్రార్ధన చేసుకోండి ఇంకా మీ సంఘపెద్దలను పిలవండి అంటున్నారు గాని బోధకుని దగ్గరకు పరుగెత్తు ఆయన దగ్గర స్వస్తత వరం ఉంది అని చెప్పలేదు! కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పిన దేవుని మాటలను విందాం! వాక్యానికి లోబడుదాం! పాదిర్ల వెనుక సంఘం సంఘం వెనుక పరుగెత్తడం మానేద్దాం!

 

ఇదీ సంఘ క్షేమాన్ని ఆశించే వ్యక్తిగా ఆయన సంఘంలో పోషించిన పాత్ర!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 6 భాగము*

*గ్రంధ వివరణ*

యాకోబు 1:1

దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

  ప్రియులారా! ఇక గ్రంధ వివరణ చూసుకుందాం!

 

*ఎప్పుడు రాశారు?* బహుశా క్రీ.. 4550 మధ్యలో! అపో 15 అధ్యాయంలో సున్నతి గూర్చిన మహా సభ జరిగిన తర్వాత

*ఎవరికి రాశారు?* చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలకు!

*ముఖ్య ఉద్దేశం:* చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు మరియు అన్యజనుల నుండి రక్షించబడిన విశ్వాసులు శ్రమల ద్వారా కృంగిపోకుండా దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలని! ఇంకా యధార్ధమునకు విరుద్ధమైన అలవాట్లను బహిరంగపరచి చూపించుటయు నిజమైన నియమములను నేర్పించుటయు.

 

*మూలపాఠం*: క్రియలులేని విశ్వాసమును విశ్వాసమనుట తగదు. ఎందుకనగా క్రియలులేని విశ్వాసము మృతము. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. విశ్వాసమనునది క్రియా పూర్వకముగానే బయలుపరచబడవలెను. ఇశ్రాయేలు ప్రజలలో చెదిరిపోయిన  విశ్వాసులకు యాకోబు గారు  వ్రాసిన పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితముతో సంప్రదింపజేసి చూపించుచున్నారు.

 

     విశ్వాసమనునది శోధనలలో ఔన్నత్యతను అధిష్ఠించుచున్నది. విశ్వాసము శోధనలకు లోబడక చెడు దురాశలకు స్థానమివ్వక  దీర్ఘశాంతము, దృఢత్వము మొదలగు వాటిని బయలుపరుస్తుంది. యాకోబు గారి యొక్క అభిప్రాయానుసారముగా విశ్వాసము, పక్షపాతము ఒకటిగా ఏకీభవించవు. విశ్వాసము నాలుకను స్వాధీనపరచుకొను శక్తిని యిచ్చుచున్నది. చిన్నదైనను గొప్ప శక్తి గల ఒకే కళ్లెముతో స్వాధీనపరచుకొనుట అవశ్యకము. విశ్వాసమునకు అట్టి సామర్థ్యమున్నది. పరలోక జ్ఞానమును సంపాదించుకొని ఇహలోక జ్ఞానమును విడిచి పెట్టుటకును విశ్వాసము సహాయపడుచున్నది. విశ్వాసము ద్వారా మనము లోకమును విడిచి ప్రత్యేకింపబడి దేవునికి లోబడుచున్నాము. సాతానును ఎదిరించి నిలిచి దేవునికి సమీపించుచున్నాము. చివరిగా విశ్వాసము ప్రభువు యొక్క రాకడ నిమిత్తమై దీర్ఘశాంతముతో ఎదురు చూచుచున్నది. ఇబ్బందులందును, శ్రమలలోను సణుగుగొణుగు అలవాటును అనిశ్చయముగా వదలి పెట్టుచున్నది.

 

*ముఖ్య పదజాలము*: - క్రియా పూర్వకమైన విశ్వాసము.

 

*ముఖ్య వచనములు*: - యాకోబు 1:19-22; యాకోబు 2:14-17.

 

*గ్రంథ విభజన క్లుప్తంగా*:-

 

1.  విశ్వాసము యొక్క శోధన. యాకోబు 1:1-18.

2. విశ్వాసము యొక్క ప్రత్యేక లక్షణములు. - యాకోబు 1:19--5:6

3.       విశ్వాసము యొక్క విజయము. -యాకోబు 5:7-20.

 

గ్రంధ వివరణ వివరంగా:

లేఖ ఎవరికి రాశారో వారు 1:1

బాధలను, పరీక్షలను ఎదుర్కోవడం 1:2-15

పరీక్షలను ఆనందంతో ఎదుర్కోండి 1:2

పరీక్షలు మంచి ఫలితాలనిస్తాయని తెలుసుకోండి 1:3-4

పరీక్షల విషయంలో జ్ఞానాన్ని ఇమ్మని అడగండి 1:5-8

జీవిత సంగ్రహాన్ని గ్రహించండి 1:9-11

ఓర్పుతో పరీక్షలను ఎదుర్కొనేవాడికి కలిగే బహుమానం 1:12

దేవుడు దుష్ట ప్రేరేపణ చేయడని తెలుసుకోండి 1:13-14

దుష్ట ప్రేరేపణకు లొంగిపోవడం వల్ల వచ్చే ఫలితం 1:15

దేవుడిచ్చే మంచి బహుమానాలు 1:16-18

వినడం, ఆచరించడం 1:19-25

నిజమైన భక్తి 1:19-25

అందరిపట్ల పక్షపాతం లేకుండా వ్యవహరించండి 2:1-13

మంచి పనులను కలిగించని విశ్వాసం ప్రయోజనం లేనిది, నిర్జీవమైనది 2:14-26

నాలుక 3:1-12

రెండు రకాల జ్ఞానం 3:13-18

జగడాలకు పోట్లాటలకు కారణం 4:1-2

ప్రార్థనల్లో దురుద్దేశం 4:3

లోకం దేవునికి వ్యతిరేకం 4:4

దేవునికి లోబడండి 4:5-7

సైతాను పారిపోయేలా చేసే విధానం 4:7

దేవుణ్ణి దగ్గరకు ఎలా తేవాలి 4:8-10

తీర్పు తీర్చడానికి ప్రయత్నించకండి 4:11-12

రేపటి గురించి ఆలోచించకండి 4:13-17

ధనికులకు హెచ్చరిక 5:1-6

కష్టాలలో ఓర్పు కలిగి ఉండడం 5:7-11

ఒట్టుపెట్టుకోవద్దు 5:12

సంతోషంగా, లేక కష్టాలలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి 5:13-16

ప్రార్థనలోని శక్తి 5:17-18

పాపులను దేవునివైపుకు మళ్ళించడం 5:19-20

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 7 భాగము*

*విశ్వాసికి కలిగే శ్రమలు శోధనలు- కలిగే ఆత్మీయ ఫలాలు*

యాకోబు 1:1,2,3

1. దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

 

  ప్రియులారా! ఇక గ్రంధ వివరణ చూసుకుందాం! గత భాగాలలో చూసుకున్నాము! పత్రిక యాకోబు గారు చెదిరిపోయిన 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు వారి విశ్వాస అభివృద్ధికై పత్రికను రాస్తున్నారు అని మొదటి వచనం చెబుతుంది!

 

 ఇక రెండు మూడు వచనాలలో నా సహోదరులారా! మీ విశ్వాసమునకు ఏదైనా పరీక్ష ఎదురైతే అది మీకు ఓర్పును పుట్టిస్తుంది అని తెలిసికొని, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మీకు మహానందముగా ఎంచుకోండి అంటున్నారు! అయ్యా నిజంగా ఆలోచిస్తే శ్రమలు శోధనలు మనిషికి నిజంగా ఆనందం తీసుకుని వస్తాయా?? లేనేలేదు! లోకానుసారంగా అయితే ఎట్టి పరిస్తితులలో కూడా అది ఆనందం తీసుకుని రాదు గాని మీరు క్రీస్తులో ఉంటే తప్పకుండా అది మీకు ఆనందం, సంతోషం తీసుకుని వస్తుంది అంటున్నారు! దానికన్నా ముందు మీకు శ్రమలు అనేవి మీకు ఓర్పుని ఇస్తుంది! దీనినే దీర్ఘశాంతము అని కూడా అనవచ్చు! కాబట్టి విశ్వాస జీవితంలో నీకు పరీక్షలు ఎదురైతే వోలిపోక సోలిపోక జారిపోవద్దు గాని ధైర్యంగా ఎదుర్కోమంటున్నారు! ఎందుకంటే దేవుడు తానూ తన ఇష్ట పూర్వకంగా మనిషికి శోధనలు తీసుకుని రారు గాని మనిషి తన స్వకీయ దురాశల వలననే మీకు శ్రమలు పరీక్షలు కలుగుతున్నాయి అని రాశారు! 1:14;  అందుకే శ్రమ దినమందు నీవు కృంగిపోతే నీవు చేతకాని వాడవు అవుతావు అని గ్రంధం సెలవిస్తుంది! సామెతలు 24:10;

 

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే పరీక్షలు శోధనలు శ్రమలు మనిషికి ఆనందం కలిగించవు గాని అవి తీసుకుని వచ్చే ఆధ్యాత్మిక మేలులు ఎంతో గొప్పవిదీనికోసం ప్రభువు చెబుతున్నారు యోహాను 16:33లో ... చూడండి మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి అయినా మేరు బెదరవద్దు నేను లోకాన్ని జయించాను!యోహాను 16: 33

నాయందు మీకు సమాధానము కలుగునట్లు మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

 ఇది యేసుప్రభులవారే డైరెక్టుగా చెబుతున్నారు! మీరు నన్ను నమ్ముకుంటే మీకు అన్నీ సుఖాలే మీకు దుఖమే లేనేలేదు అని చెప్పలేదు! మీరు నన్ను వెంబడించాలంటే ప్రతీవాడు తానూ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని సెలవిచ్చారు! లూకా 9: 23

మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

లూకా 14: 27

మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు నా శిష్యుడు కానేరడు.

 

యేసుప్రభులవారు గాని ఆయన శిష్యులు గాని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపరచలేదు! లోకంలో మీకు శ్రమ కలుగును అని యేసయ్య చెబితే ,అనేక శ్రమలను అనుభవించి మనము పరలోకం చేరాలి అని శిష్యులు ముందుగానే చెప్పారు....

అపో.కార్యములు 14: 22

శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

 

పౌలుగారు థెస్సలోనికయులకు పత్రిక రాస్తూ మనము శ్రమలను అనుభవించడానికే పిలువబడ్డాము అంటున్నారు....

1థెస్సలొనికయులకు 3: 4

అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

 

ఇంకా అంటున్నారు: రోమా 5:35

3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను (శీలము) కలుగజేయునని యెరిగి

4. శ్రమలయందును అతిశయపడుదము.

5.ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

2కొరింథీ 8:2

ఏలాగనగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.

 

1పేతురులో పేతురుగారు అంటున్నారు: 1:57

5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

విశ్వాస పరీక్షలు మరియు శోధనలు శ్రమలు మనకు ఎంతో దుఃఖం కలిగిస్తాయి గాని మనలని మరింత మంచివారుగా మరియు అధ్యాతికంగా బలవంతులుగా విశ్వాసంలో దృఢమైన వారుగా చేసేందుకే దేవుడు ఇలాంటి శ్రమలను శోధనలను పరీక్షలను మన జీవితంలో అనుమతి ఇస్తారు! ఇది దేవుని విధానం! మనలను ఆధ్యాత్మికంగా శక్తివంతులుగా చేసే దేవుని టెక్నిక్ ఇది! ఉదాహరణకు విద్యార్ధులు సంవత్సరమంతా చదివిన తర్వాత సంవత్సరం అంతమందు కొన్ని పరీక్షలు పెడతారు! దానిలో ఉత్తీర్ణత సాధిస్తేనే దానికన్నా ఉన్నతమైన విధ్యాభాషం చెయ్యగలము! పరీక్షలేకుండా ఉత్తీర్ణత మరియు మరో మెట్టు ఎక్కడం అనేది ఉండదు! అలాగే దేవుడు నీకు ఆధ్యాత్మికంగా ఒక్కోమెట్టు ఎక్కించడానికి శ్రమలను శోధనలను నీ జీవితంలో అనుమతి ఇస్తున్నారు అన్నమాట! అందుకే కీర్తనాకారుడు అంటున్నారు

66:1012

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

ఇంకా పరీక్షలు ద్వారా విశ్వాసి పరిపూర్ణత సాధించాలి అనేది దేవుడు చిత్తము!

ఎఫెసీ 4:1315

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక,

15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

 

ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు: మరి ఇలాంటి శ్రమలు శోధనలు చాలామంది విశ్వాసులకు వారికున్న దేవునిమీద గల విశ్వాసానికి నిరీక్షణను భంగం చేస్తాయి కదా, వారిని విశ్వాస బ్రష్టులను చెయ్యవా? ఇంకా పరలోకం మీద నున్న వారికున్న నిరీక్షణను వదిలేస్తారు కదా!

పౌలుగారు అంటున్నారు కానేకాదు! ఇలాంటి శ్రమల వలన వారికున్న దేవునిపై గల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిరీక్షణను ఇంకా వృద్ధి చెందిస్తాయి శ్రమలు శోధనలు! కారణం శోధన శ్రమ జయిస్తే వెంటనే నీకు మరో క్రొత్త కృపావరం ఆధ్యాత్మిక ఫలము ఇస్తారు! ఇప్పుడు నీకు ఇచ్చిన నీకు ఉన్న కృపావరం కంటే ఇంకా ఉన్నతమైనది బలమైనది దృఢమైనది గల ఆత్మీయ వరములు ఫలములు దేవుడు ఇస్తారు! వాటిని ఉపయోగించి క్రొత్త సవాలును ధైర్యంగా ఆనందంగా స్వీకరించి నిన్ను ఆధ్యాత్మికంగా బలవంతునిగా చేస్తాయి అంటున్నారు పౌలుగారు! అందువలన నిజమైన విశ్వాసి   శోధనలు నీకు ఆధ్యాత్మిక మేలులు తీసుకుని వస్తాయి అని గ్రహించి ఆనందంగా ఉండగలడు! ఆధ్యాత్మిక భావం క్రమక్రమంగా నీకు అలవాటు అవుతుంది. అందుకే హెబ్రీ 10:3539 లో పౌలుగారు చెబుతున్నారు....

35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.

38. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

39. అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు (లేక, సంపాదించుకొనుటకు) విశ్వాసము కలిగినవారమై యున్నాము.

 

వారికి సంభవించే శ్రమలలో శోధనలలో దేవుడు వారిని విడిచి పెట్టలేదు వారితోనే ఉన్నారు అని విశ్వాసులు క్రమక్రమంగా తెలుసుకుంటారు! శ్రమలలో దేవుడు వారినే జయించే వారుగా చేస్తారని దేవునిమీద పరిపూర్ణ విశ్వాసం ఉంచుతారు!

 

విశ్వాసుల విషయంలో ఓర్పు మరియు సహనం ధీర్గశాంతం మంచి వ్యక్తిత్వాన్ని పదును పెడుతుంది! బాధలు కష్టాలు విషమ పరీక్షలు ఓర్చుకోవడం విశ్వాసులను మెరుగు పెట్టి వారిని విశ్వాస విషయంలో బలవంతులుగాను భవిష్యత్తులో అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్దులుగా తీర్చి దిద్దుతుంది! పద్దతి ద్వారా వారు మొదట నమ్మినప్పుడున్న విశ్వాసం నిరీక్షణలు అభివృద్ధి చెందుతాయి!

 

ఇక చివరిగా శ్రమలు మనకు సంపూర్ణ సిద్ధ్ధిని కలిగిస్తాయి అని హెబ్రీ గ్రంధకర్త అంటున్నారు....

Hebrews(హెబ్రీయులకు) 2:10,11,18

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా *వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును*.

11. *పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే(లేక, ఒక్కడే) మూలము*. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

18. *తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.*

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నీకు కలుగుతున్న శ్రమలను శోధనలను చూసి బెదిరిపోవద్దు”! అధైర్య పడవద్దు! ఆరోజు 12గోత్రాలకు యాకోబు గారు ఆత్మావేశుడై చెప్పిన మాట పరిశుద్ధాత్మ దేవుడు  నీతో ఈరోజు చెబుతున్నాడు: శ్రమలలో శోధనలలో పరీక్షలలో క్రుంగిపోకు! దేవుడు నీతో ఉన్నారు! శ్రమలు శోధనలు నిన్ను ఇంకా విశ్వాసం దృడంగా ఉంచుతాయే గాని నిన్ను విశ్వాస బ్రష్టులుగా చేయదు! శ్రమలద్వారా పరీక్షల ద్వారా రోజురోజుకి నీవు క్రీస్తు రూపంలోనికి మారతావు అని గ్రహించు!

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

*యాకోబు పత్రిక 8 భాగము*

యాకోబు 1: 4

మీరు సంపూర్ణులును, అనూనాంగులును, విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

 

ఇక నాల్గవ వచనంలో అంటున్నారు: మీరు సంపూర్ణులును అనునాంగులును విషయములోను కొదువ లేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి అంటున్నారు .

 

   దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా అర్ధాలు గోచరిస్తాయి మనకు! వాడుక భాషలో చెప్పాలి అంటే నీవు ఓర్పు కలిగియుంటే లేక ఓర్చుకుంటే సంపూర్ణుడవు అవుతారు, అనునాంగుడవు అవుతావు ఇంకా విషయంలోనూ కొదువలేకుండా ఉంటావు! ఇవన్నీ సాధించాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి!

 ఓర్పు కోసం ధ్యానం చేసేముందు సంపూర్ణులు అనగా పరిపూర్ణత సాధించిన వారు అనగా మాటయందు గాని, చూపునందు గాని ప్రవర్తన యందు గాని, ఆలోచనలలో ఇంకా తలంపులలో గాని తప్పు చెయ్యకుండా పాపానికి ఆస్కారమియ్యకుండా ఉంటే దానిని సంపూర్ణత అంటారు! అయితే వచనం చూసుకుంటే సంపూర్ణత సాధించాలి అంటే ఓర్పు అనేది ఉండాలి అంటున్నారు యాకోబు గారు! అయితే హెబ్రీ పత్రికలో అంటున్నారు: సంపూర్ణత సాధించాలి అంటే శ్రమలద్వారానే అది సాధ్యం అంటున్నారు రెండో అధ్యాయంలో! యేసుక్రీస్తుప్రభులవారు శ్రమలద్వారా ఎలా సంపూర్ణత సాధించారో అలాగే మనం కూడా అదే శ్రమల మార్గం ద్వారా పయనించి సంపూర్ణత సాధించాలి! మరి శ్రమలలో ఓర్పు మరియు సహనము ఇంకా దీర్ఘశాంతము లేకుండా వాటిని ఓర్చుకోలేము! అందుకే ఓర్పుని తన క్రియను కొనసాగించనీయండి అంటున్నారు యాకోబు గారు!

 

  ఇంకా అనునాంగులు కావాలన్నా ఓర్పు కావాలి! అనునాంగులు అనగా మొదటిదిఅన్ని విషయాలలో పరిపక్వత సాధించిన వారు! రెండవది: బైబిల్ ప్రకారం- ఆధ్యాత్మికంగా పరిపక్వత సాధించడం! అనగా  ఈలోకంలో తొనకకుండా నోరు జారకుండా బేలన్స్డ్ గా ఉండాలి అంటే ఓర్పు కావాలి! ఇంకా ఆత్మీయ వరాలు ఫలాలు సాధించాలన్నా ఆధ్యాత్మికంగా రాణించాలి అన్నా నీకు ఓర్పు అనేది కావాలి!

 

 ఇక విషయంలోనూ కొదువలేకుండా ఉండాలన్నా నీకు ఓర్పు కావాలి! అది లోక సంబంధమైన భౌతిక మైన విషయాల్లో కొదువలేకుండా ఉండాలన్నా, ఇంకా దేవుని సంబంధమైన ఆధ్యాత్మిక విషయాలను సాధించాలన్నా నీకు ఓర్పు కావాలి! ఓర్పుని తన పనిని కొనసాగించనీయాలి!

 

*ఓర్పు!*

ఓర్పుకు మరోపేరు దీర్ఘశాంతము!

 

      పౌలుగారు చెబుతున్నారు- దైవసేవకునికి/ దైవజనుడికి ఓర్పు ఎంతో అవసరం! పెద్దల సామెత : ఓర్చుకుంటే కోడిగుడ్డు దాకడు మాంసం అవుతుంది. కోడిగుడ్డు దాకడు అనగా పాత్రనిండా మాంసం అవుతుంది మరి ఎలా అవుతుంది? కోడిగుడ్డును పట్టుపెట్టి, పిల్లలను చేయించి, వాటిని ఒక ఆరునెలలు పెంచితే కోడిగుడ్డు ఇంటిల్లిపాదికీ సరిపోయినంత మాంసం అవుతుంది. అలాగే దైవసేవకునికి కూడా ఓర్పు కావాలి అంటున్నారు పౌలుగారు. ఏం? దైవసేవకునికి ఓర్పు ఎందుకు అవసరం? కారణం: దైవసేవకునికి/ దైవజనుడికి ఎన్నో రకాలైన ఆటంకాలు, అవమానాలు కలుగుతాయి. వాటిని తప్పకుండా ఓర్పుతో ఎదుర్కోవాలి. అవి సంఘం నుండి కావచ్చు! అన్యుల నుండి కావచ్చు! తోటి దైవసేవకులనుండి కావచ్చు! తన కుటుంబం నుండే కావచ్చు! చివరకి సాతానునుండి కావచ్చు! అవి ఎవరినుండి వచ్చినా ఓర్చుకోవాలి! అప్పుడే సేవ అభివృద్ధి పొందుతుంది!

 

   కొందరు భక్తులు ఎలా ఓర్చుకున్నారో తద్వారా వారి సేవా-పరిచర్య ఎలా వృద్ధిచెందిందో క్లుప్తంగా చూద్దాం!

 

దేవుని ప్రణాళిక మోషేగారి ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్టు చెరవిముక్తి చెయ్యాలి. అందుకు గాను మొదట 40 సంవత్సరాలు రాజ విద్యలు, రాజకీయ పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చారు దేవుడు! అది గడిచాక దానికి పూర్తిగా వ్యతిరేఖమైన శిక్షణ- పశువులు కాసుకోవడం! ట్రైనింగ్లో పశువులను ఎలా కాయాలి, ప్రక్కనున్న వాటిని కొమ్ములతో పొడిచే పశువులను ఎలా ట్రీట్ చెయ్యాలి, పాలిచ్చేవాటిని ఎలా మేపాలి, చిన్న పిల్లలను ఎలా మేపాలి? పశువులు సామాన్యంగా బుద్ధిజ్ఞానాలు లేకుండా ప్రవర్తిస్తాయి కాబట్టి ఎలా ఓర్చుకోవాలి, ఎలా నడిపించాలి అనే శిక్షణ ఇచ్చారు దేవుడు! అన్నీ ఓర్చుకున్నారు మోషేగారు. అప్పుడు అనగా 80 సంవత్సరాల ట్రైనింగ్ అనంతరం నాయకుడిగా, ప్రవక్తగా దేవుడు వాడుకొన్నారు. ఇశ్రాయేలు వారికి తిరుగులేని నాయకుడిగా, ధర్మశాస్త్రం దేవునినుండి తెచ్చి ఇచ్చిన గొప్ప దైవజనుడిగా మారిపోయారు. ఈస్తితికి రాడానికి 80 సంవత్సరాల కఠోరమైన శిక్షణ- ఓర్పు ఉంది ఆయనకు!

 

    యోసేపుగారి బాల్యంలో దేవుడు దర్శనరీతిగా మాట్లాడారునిన్ను గొప్ప వ్యక్తిగా, అధికారిగా దేశాన్ని పాలించేవానిగా చేస్తాను అని! బాల్యంలోనే అమ్మబడ్డాడు బానిసగా! బానిసగా బ్రతికారు ఆయన! చివరకు చేయని నేరానికి జైలుకు కూడా వెళ్లారు! అన్ని భాధలు ఓర్చుకున్నారు, దేవా ఇంతన్నావ్, అంతన్నావ్! ఇప్పుడు నన్ను చేయని నేరానికి జైలుపాలు చేశావు అని దేవుణ్ణి నిందించలేదు! అన్ని బాధలు, శ్రమలు సహించారు. ఓర్చుకున్నారు! చివరకు ఐగుప్టు దేశానికి గవర్నర్ కాగలిగారు ఆయన!

 

      బాల్యంలోనే రాజుగా అభిషేకించబడ్డారు దావీదుగారు! మొదట గొర్రెల కాపరి! తర్వాత వాయిద్యాలు వాయించే ఉద్యోగం, రాజుగారి ఆయుధాలు మోసేవాడిగా, సైన్యాధిపతిగా, రాజుకి అల్లుడిగా, కట్టకడకు రాజుగా చక్రవర్తిగా మారారు దావీదుగారు. తనకు ఎన్నో- ఎన్నెన్నో ఇరుకులు ఇబ్బందులు, ప్రాణాలు పోయే పరిస్థితులు ఎన్నోసార్లు కలిగాయి ఆయనకు. అన్ని తట్టుకొన్నారు, ఓర్చుకున్నారు. దేవుణ్ణి స్తుతించారు. అందుకే చక్రవర్తి కాగలిగారు ఆయన! ప్రవక్తగా మారారు!

 

       ఎస్తేరు గారు తల్లిదండ్రులను పోగొట్టుకుని పరాయిదేశంలో బానిసగా మారిపోవలసి వచ్చింది. అన్ని తట్టుకున్నరామే ఆమె! చివరకు ఆశ్చర్యరీతిగా దేశానికే కాకుండా 117 దేశాలకు రాణి- పట్టపురాణి కాగలిగారు ఆమె!

 

   ఇలా ఎంతోమంది విశ్వాస వీరులు ఓర్చుకుని ఘనమైన కార్యాలు చేశారు. ప్రియ దైవజనుడా! నీలో ఓర్పు ఉందా? నిరీక్షణ కలదా? దీర్ఘశాంతము ఉందా? లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది నీకు! ఓర్పుకోసం బైబిల్ లో చాలాసార్లు వ్రాయబడింది.

 

    ప్రసంగి 10:4 ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరుగకుండా చేస్తుంది.

 

రోమా 5: .. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్షను, ... కలిగిస్తుంది.

 

రోమా 12:12...నిరీక్షణ గలవారై సంతోషించుచూ, శ్రమలయందు ఓర్పు గలవారై, ....

 

ప్రకటన :10

నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో- శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను.

 

ప్రకటన 14:12

దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.

 

 కాబట్టి నీవు కూడా ఓర్చుకోవలసిఉంది.

 

ఓర్పునే దీర్ఘశాంతము అనికూడా అంటారని చూసుకున్నాం!

 కీర్తన 40:1.

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.

అంతేకాదు సామెతలు 15:18

కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

 

ఓర్పుగలవారిని యేసుప్రభులవారు మంచినేల మీద పడిన విత్తనాలతో పోలుస్తున్నారు. లూకా 8:15 లో

మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.

కాబట్టి నీవు మంచినేలమీద పడితే ఓర్చుకుంటావు. ఫలిస్తావు.

లూకా 21:19 ప్రకారం అంత్యకాలములో మీ ఓర్పుచేత ప్రాణములు రక్షించుకొంటావు.

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,. .

కొలస్సీ 1:11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, . . .

1థెస్సలొనికయులకు 5: 14

సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.. .

2 తిమోతీ 3:10 .

అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును. .

హెబ్రీ 10:36 .

మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

యాకోబుగారు కూడా అంటున్నారు 5:7-8 .

సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా

 

   కాబట్టి అటువంటి దీర్ఘశాంతము, ఓర్పు మనందరమూ కలిగియుందుము గాక!

 

చివరకు యాకోబు 1:4 మీరు సంపూర్ణులు కావాలి అంటే ఓర్పు తన క్రియను జరిగింపనియ్యుడి! నీవు సంపూర్ణుడిగా ఆత్మీయుడిగా ఉండాలి అంటే ఓర్పు కావాలి!

 

ప్రియ దైవజనుడా! అటువంటి ఓర్పు నీకుందా? తనను ఎన్ని భాదలు పెడుతున్నా, అపహసిస్తున్నా తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అడిగిన ఓర్పు క్షమాపణ నీకుందా? ఒకవేళ లేకపోతే నేడే ఆయన పాదాలు శరణువేడి ఓర్పును పొందుకో!

ఆమెన్!

*యాకోబు పత్రిక 9 భాగము*

*జ్ఞానము లోపిస్తే-1*

యాకోబు 1:58

5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

8. గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

ఇక ఐదవ వచనంలో అంటున్నారు: మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వాడు దేవుని అడుగవలెను! అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును! ఆయన ఎవనిని గద్దింపక అందరికిని దారాళముగా దయచేయువాడు!.....

ప్రియులారా వచనంలో చాలా మర్మాలు- అర్ధాలున్నాయి! అయితే వాటిలో రెండు ప్రాముఖ్యమైన అభిప్రాయాలు కోసం మాత్రం మనం ధ్యానం చేసుకుందాం!

 

మొదటిదిసందర్భానుసారమైన అర్ధం!

రెండు: అక్షరార్ధమైన వాక్యపు అర్ధం!

 

ఈరోజు మనం సందర్బానుసారమైన అర్ధమును ధ్యానం చేసుకుందాం!

 

దైవజనుడైన యాకోబు గారు పత్రిక మొదలుపెట్టిన వెంటనే చెదిరిపోయిన ఇశ్రాయేలు 12 గోత్రాలకు శ్రమలలో కృంగిపోవద్దు అంటూ రాస్తున్నారు. అయితే అది మహానందము అని భావించుకోండి అంటున్నారు కారణం శ్రమలు శోధనలు నిన్ను దేవునికి దగ్గరకు చేరుస్తాయి అంటూ చెబుతూ- అదే సందర్భముగా అంటున్నారు: కొన్నిసార్లు నీకు సంభవించిన శోధనలు శ్రమలను ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు నీకు ఏమిచెయ్యాలో అర్ధము కాని పరిస్తితులు ఎదురవుతాయి! అలాంటప్పుడు నీకు ఏమిచెయ్యాలో అర్ధం కావడానికి జ్ఞానం కావాలి! అది దేవుని నుండి వచ్చినదై యుండాలి! దానిని అనగా జ్ఞానమును నీవు దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా నీకు ఇస్తారు జ్ఞానముదేవుడైతే ఎవరు జ్ఞానమును మరియు పరిశుద్ధాత్మను అడిగిన వెంటనే ఇస్తారు! ఆయన ఎవరిని గద్దించరు! నీ కులాన్ని చూసి, నీ రంగును చూసి, నీ ఆర్ధిక పరిస్థితిని చూసి ప్రేమించే దేవుడు కాదు! ఆయన దృష్టిలో మానవులందరూ ఒక్కటే! కాబట్టి భయపడకుండా అనుమానపడకుండా అడగమంటున్నారు!

 

  చాలాసార్లు చాలామంది దేవుని మీద ఎంత పటిష్టమైన విశ్వాసం బయటకు కనపరుస్తున్నా ఏదైనా పెద్ద సమస్య వస్తే దేవుని మీద ఆదారపడకుండా వెంటనే పోలీస్ స్టేషన్ కి, లేకపోతే పంచాయితీ ఆఫీసుల చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరకు పరుగెడతారు! గాని అలాంటప్పుడు ఇంతవరకు అంత దీర్ఘప్రార్ధనలు చేసిన నీవు, విశ్వాసం కోసం అంత పెద్ద పెద్ద మాటలు పలికిన నీవు దేవుని మీద ఆదారపడవు, దేవుని దగ్గర కొంతసేపు కనిపెట్టి అయ్యా నీవే నాకు దిక్కు! ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో సమయోచితమైన ఆలోచన చెప్పవా!! అని అడగవు!! లేకపోతే అయ్యా పగతీర్చుట నా పని అన్నావు కదా! ఇప్పుడు నేను ఏమిచెయ్యాలి? నేను సమస్యను ఎదుర్కోలేక పోతున్నాను అని దేవుని దగ్గర కనిపెట్టవు! హెబ్రీయులకు 10: 30

పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.

 ఇంకా కొందరు దేవా నీవే నాకు దిక్కు! నీవే పోరాటం పోరాడు అంటారు గాని ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసే లోగా వారు తమ సొంత ఆలోచనతో ఏదో ఒకటి చేసేస్తారు! అది కాస్తా పనిచెయ్యదు! సమస్య మరింత జటిలమైపోయిన తర్వాత దేవుని మీద నిష్టూరం వేస్తావు! చివరకు అయ్యా నీవే నాకు దిక్కు! నీవు తప్ప నాకు ఆధారం లేదు! నేను ప్రయత్నించి అలసిపోయాను! అని భోరున ఏడుస్తావు! ఒక విషయం చెప్పనా....  నీవు కోర్టుల వెనుక, పోలీస్ స్టేషన్ వెనుక, రాజకీయ నాయకుల వెనుక పరుగెత్తితే కొన్నిసార్లు సమస్య తీరిపోయినట్లు కనిపిస్తుంది గాని అది టెంపరరీ పరిష్కారమే తప్ప- శాశ్వతపరిష్కారం కలుగదు! సరికదా- ఇంకా మరింత శత్రువులుగా చేసేస్తుంది నిన్ను- నీ ప్రత్యర్ధిని! దేవునికోసం కనిపెడితే కొంచెం లేటు అయినట్లు కనిపిస్తుంది గాని దేవుని పని దేవుని సమయంలో దేవుని పద్దతిలో పరిష్కారం చేస్తారు! దేవునికి నీకు నచ్చినట్లుగా తీర్పు వచ్చేలా ప్రార్ధించకు! నీవు దేవునిమీద ఆనుకుంటే నీవు కోరుకునే  పరిష్కారం కోసం ఆశించకు! దేవుడు నీ సమస్యకు తాత్కాలిక పరిష్కారం చేసే దేవుడు కాదు! దేవుడు చేసే పరిష్కారం- శాశ్వత మైనవి! ఇంకా కొన్ని సార్లు నీ శత్రువులను అయితే మిత్రులుగానైనా చేసేస్తారు! లేదా మొత్తం కుటుంబాన్ని లేపేస్తారు! ఇది మా స్వానుభవం! నీవు వారిని వెదికినా కనబడరు! బూడిద అయిపోతారు! కాబట్టి నీకు నీవుగా ఆలోచించకు! నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు- దేవుని కోసం ఎదురు చూడు అని రాస్తున్నారు సామెతల గ్రంధకర్త! Proverbs(సామెతలు) 3:5,6,7,8

5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము

6. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

7. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

నీవు కోరుకున్న మార్గం నీకు చాలా బాగా కనిపిస్తుంది గాని అది చివరికి నిన్ను మరణానికి తీసుకుని పోతుంది అని కూడా చెబుతున్నారు!

సామెతలు 14: 12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

 ప్రతీ సమస్యకు పరిష్కారం దేవునినే అడుగు! ఆయన తప్పకుండా నీతో మాట్లాడుతారు. నీకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును నీకు అనుగ్రహిస్తారు. అయితే అడిగినప్పుడు అనుమాన పడుతూ అడుగవద్దు అంటున్నారు!

 

ఒకసారి మోషే గారిని జ్ఞాపకం చేసుకుందాం! ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, వెనుక ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు- వెంటనే మోషేగారు దేవుణ్ణి అడుగుతున్నారు దేవా! ఇప్పుడు నన్నేమి చెయ్యమంటావు? దేవుడు సాగిపోమన్నారు- తన కర్ర పైకి ఎత్తమన్నారు- తూర్పు గాలి వచ్చింది- ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసింది. ఆరిననేల మీద నడిచిపోయారు ఇశ్రాయేలు జాతి!

మరొక సారి అడిగారు మోషేగారు- అయ్యా! భోజనం అడుగుతున్నారు- ఇంతమందికి నేనెక్కడినుండి తేగలను? వెంటనే దేవుడు మన్నాను పంపించారు!

మరో సారి అడిగారు- మాంసం- మరల అడిగారు దేవున్నే: అయ్యా మాంసం అడుగుతున్నారు: పూరేళ్ళను పంపించారు! ఇలా ప్రతీది దేవుణ్ణి అడిగారు తప్ప తనసొంత నిర్ణయాలు తీసుకోలేదు!

 

ఆయన శిష్యుడు యెహోషువా గారు కూడా అదే చేశారు- యోర్దాను నది అడ్డుగా వచ్చింది- అయ్యా ఏమి చెయ్యాలి- దేవుడు చెప్పారు- చేశారు! యెరికో కోట గోడలు అడ్డుగా వచ్చాయి- ఏమి చెయ్యాలి అడిగారు దేవుడు చెప్పారు- గాని వీరిలో ఎవరు కూడా దేవునిమీద అనుమానం పడలేదు! విశ్వాసముంచి దేవుడు చెయ్యమన్నది చేశారు వెంటనే గొప్పకార్యాలు చెయ్యగలిగారు చూడగలిగారు!

 

సందర్భంగా రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను!

 

దేవుడు సమస్యను ఎలా తీరుస్తారో చూద్దాం!

 

  మాకు తెలిసిన ఒక దైవజనులు అండ్రంగి అనే ఊరిలో ఉండేవారు! ఆయన మా తండ్రిగారి సమకాలీకులు, మా తండ్రిగారి స్నేహితుడు! సంఘటన జరిగి సుమారు ముప్పై సంవత్సరాలు అయి ఉంటుంది! దైవజనునికి వారి పిత్రార్జితం  పది ఎకరాల కొబ్బరి తోట ఉండేది! దైవజనునికి బంధువు ఒకరు వారి పొలములో సుమారుగా ఇరవై సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత పొలాన్ని ఆక్రమించుకుని పొలంలోకి అడుగుపెట్టావా చంపేస్తాను అని చెప్పి గూండాలను పెట్టాడు. అయితే దైవజనుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు, పంచాయితీ ఆఫీసుకి వెళ్ళలేదు, కోర్టుకి కూడా వెళ్ళలేదు! తన సంఘస్తులు అయ్యగారు ఏమిటి అలా ఉన్నారు- పది ఎకరాలు వాడు ఆక్రమించుకున్నాడు- మాకు అవకాశం ఇవ్వండి వాడి పని మేము పడతాం అన్నారు, గాని మీరు కలుగుజేసుకోవద్దు అన్నారు ఆయన! ఊరి పెద్దలు వచ్చారు- అయ్యా ఒకసారి పంచాయితీ ఆఫీస్ కి రండి అక్కడకు వచ్చి మాకు చెప్పండి- వాడి సంగతి మేము చూసుకుంటాం అన్నారు! గాని ఆయన అన్నారు- నేనే అనేకులకు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్లొద్దు, కోర్టులకి వెళ్ళవద్దు అని చెబుతున్నాను- ఇప్పుడు నాకు సమస్య వస్తే నేను ఎలా వెళతాను! దేవుడే చూసుకుంటారు అన్నారు! ఇలా ఎక్కడికీ వెళ్ళలేదు! దేవునిమీద ఆదారపడి ప్రార్ధన చేశారు! పది సంవత్సరాలు జరిగాక పొలమును ఆక్రమించుకున్న వాని కోడలు వచ్చి- అయ్యగారు మీ పొలాన్ని మీరే తీసేసుకోండి, మా మామ గారు చేసిన తప్పులు మన్నించి మామీద వచ్చిన మీ దేవుని శాపం పోయేలా ప్రార్ధన చెయ్యండి అని చెప్పింది. ఏమయ్యింది అంటే పది సంవత్సరాలలో కుటుంభంలో మగాడు అన్నవాడు అందరూ పోయారు! ఆక్రమించుకున్నవాడు, వాని ఇద్దరు కొడుకులు పోయారు! ఒకరొకరు పోవడం మొదలుపెట్టింది. పది సంవత్సరాలలో సుమారుగా ఏడుగురు పోయారు! అక్కడున్న వారు చెప్పారంటే మీ కుటుంభం దుంప నాశనం కాకుండా ఉండాలంటే వారిభూమిని వారికి ఇచ్చేయండి. భూమి మీది కాదు! అలాగైతే నీవు నీ కొడుకు నీ కూతురు బ్రతుకుతారు అని చెబితే ఆవిడా తెచ్చి ఇచ్చేసింది! ఇప్పుడు ఊరిలో దేవుని ప్రజలు అంటే అందరూ భయపడతారు! దేవుని బిడ్డలంటే గౌరవిస్తారు! ఇదీ దేవుడు- తన పద్దతిలో చేసిన కార్యం!! రోజు ఆక్రమించుకున్న కుటుంభం కూడా దేవుని నమ్ముకుంది!

 

కాబట్టి దేవుడు తన విధానంలో నీ సమస్యను తీర్చడానికి అవకాశం ఇవ్వు! నీకు నీవుగా ఆలోచించి నిర్ణయం తీసుకోకు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 10 భాగము*

*జ్ఞానము లోపిస్తే-2*

యాకోబు 1:58

5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

8. గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

 

ఇక ఐదవ వచనంలో అంటున్నారు: మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వాడు దేవుని అడుగవలెను! అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును! ఆయన ఎవనిని గద్దింపక అందరికిని దారాళముగా దయచేయువాడు!.....

 

ప్రియులారా వచనంలో చాలా మర్మాలు- అర్ధాలున్నాయి! అయితే వాటిలో రెండు ప్రాముఖ్యమైన అభిప్రాయాలు కోసం మాత్రం మనం ధ్యానం చేసుకుందాం!

 

మొదటిదిసందర్భానుసారమైన అర్ధం!

 

రెండు: అక్షరార్ధమైన వాక్యపు అర్ధం!

 

               (గత భాగం తరువాయి)

 

ఈరోజు మనం అక్షరార్ధమైన వాక్యపు  అర్ధమును ధ్యానం చేసుకుందాం!

 

ఎవనికైనా జ్ఞానం కొదువగా ఉందా? అయితే వాడు దేవుణ్ణి అడగాలి! అడిగితే దేవుడు వానికి జ్ఞానము దయచేస్తారు! అప్పుడు వాడు చేసే పనిలో వాడు జయం పొందుతాడుఇది ప్రతీ విద్యార్ధి గమనించి జ్ఞానం కోసం ప్రార్ధన చెయ్యాలి!

 

మహా జ్ఞానియైన సోలోమోను వెయ్యి బలులు అర్పించి వస్తే దేవుడు అడిగారు- నీకు ఏమి కావాలి అని- అయ్యా నీ దయవలన గొప్ప సామ్రాజ్యాన్ని నా తండ్రికి ఇచ్చావు- ఇంతమంది మనుషులను జ్ఞానముగా పరిపాలించాలి అంటే నాకు నీ జ్ఞానము  కావాలి! దయచేసి నాకు జ్ఞానము మాత్రము దయచేయు అని ప్రార్ధన చేస్తే దేవుడు పొంగిపోయి- నీవు దీర్ఘాయువును గాని, నీ విరోధుల ప్రాణములు గాని, లేక ఆస్తి ఐశ్వర్యం గాని కోరుకోకుండా నా జనులను ఏలడానికి గల జ్ఞానము మాత్రము అడిగావు కాబట్టి నీకు జ్ఞానమును ఇస్తున్నాను దానితో పాటుగా నీకు ఆస్తి ఐశ్వర్యము కూడా ఇస్తాను అని ఆయనను మహాజ్ఞానిని చేసి మహా గొప్ప ఐశ్వర్యము ఇచ్చారు దేవుడు! 1 Kings(మొదటి రాజులు) 3:5,6,7,9,11,12,13

5. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై-నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా

6. సొలొమోను ఈలాగు మనవి చేసెను- నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగు పరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు.

7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;

9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.

11. దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను- దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.

12. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీవంటివాడొకడును ఉండడు.

13. మరియు నీవు ఐశ్వర్య మును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.

 కాబట్టి ప్రియ విధ్యార్దులారా! ప్రియ ఉద్యోగం చేసుకుంటున్న వారలారా! మీరు కూడా జ్ఞానమును అడగండి దేవుడు తప్పకుండా మీకు కూడా ఇస్తారు!

 

కారణం అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నారు! మత్తయి 7:7;  అడుగు ప్రతివాడు పొందుకుంటాడు- అది భౌతిక సంభంధమైన విషయాలు గాని ఆధ్యాత్మిక విషయాలు గాని! అయితే ముఖ్యంగా పరిశుద్ధాత్మను అడగండి తప్పకుండా ఇస్తారు అంటున్నారు లూకా సువార్తలో! లూకా 11: 13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

తట్టు ప్రతివానికి తీయబడుతుంది అంటున్నారు- ఏమి తట్టాలి- దేవుని హృదయాన్ని- పరలోక ద్వారాలను తట్టండి- అవి మీకొరకు తెరువబడతాయి!! ఇంకా వెదకు వానికి దొరకును అంటున్నారు! దేనిని వెదకాలి- పరలోకమును- ఆధ్యాత్మిక విషయాలను- పరలోక రాజ్యమును స్వతంత్రించు కొనే మార్గాలను వెదకాలి! ఆయన మార్గములను వెదకాలి! మేలైనది వెదకి దానిలో ప్రవేశించండి అని సెలవిస్తుంది బైబిల్!

 

ఇంకా అంటున్నారు- ఎవడైనా తన కుమారుడు రొట్టెను అడిగితే రాయి లేక పామును ఇవ్వడు కదా- మీ పరమతండ్రి కూడా మేరు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తారు అంటున్నారు కాబట్టి అడగండి అడగండి అడగండి. తట్టండి వెదకండి! మత్తయి 7:911

9. మీలో మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?

10. మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా

11. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.

 

అలాగే జ్ఞానమును కూడా అడగండి తప్పకుండా దేవుడు మీకు దయచేస్తారు! అంతేకాదు ఇలాంటి జ్ఞానము ఇతరులు కూడా పొందుకొనేలాగ అడగండి.

 

దేవుడు ఎలా దయచేస్తారో చూద్దాం! అంతేకాకుండా దేవుని జ్ఞానము కోసం భక్తులు ఏమి రాశారో అదికూడా ఒకసారి చూసుకుందాం!

 

కొలస్సీ 1:9

అందుచేత సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,

 

కొలస్సీయులకు 2: 3

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

 

ఎఫెసీయులకు 1: 19

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

 

1కొరింథీ 1:31

అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

దానియేలు 2:2022

20. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.

21. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై యున్నాడు.

22. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది.

 

సామెతలు 1:20

జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

సామెతలు 1: 22

ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?

సామెతలు 2: 6

యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

 

సామెతలు 8: 1

జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది

 

కీర్తనాకారుడు అంటున్నారు

కీర్తనలు 111: 10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

ఇదే జ్ఞానాన్ని యాకోబు గారు ఇంకా వర్ణిస్తున్నారు!

యాకోబు 3: 17

అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

 

అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తారు జ్ఞానమును కారణం- ఆయన అబద్దమాడలేని దేవుడు అంటున్నారు పౌలుగారు తీతుకు పత్రిక 1:3లో

నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. * నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను* గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను

 

 ఇక రెండవ ఉదాహరణ : నీవు సేవలో ఆటంకాలు వస్తున్నాయా? అయితే దేవుని మీద ఆనుకో! నీవు బాగా చదువుకోలేదా? వాక్యాన్ని బాగా చెప్పలేక పోతున్నావా? బాగా పాడలేక పోతున్నావా?

 

మా తండ్రిగారు లూకా గారు చేపలు పట్టుకుంటూ ఉండగా దేవుడు రక్షించుకుని కొన్ని రోజుల తర్వాత నా సేవచేయమని చెప్పారు! మా నాన్న గారు చదువుకోలేదు! మా తాతగారు చిన్నప్పుడే చనిపోవడం వలన మరియు కాలంలో మన దేశంలో భయంకరమైన కరువులు ఉండడం వలన- స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నందువలన స్కూళ్ళు కూడా బాగా జరిగేవి కావు! ఇంకా మా ఏరియాలో స్కూళ్ళు కూడా లేవు ఆరోజులలో! గాని లు నేర్చుకున్నారు మా నాన్నగారు. ఇంకా నేర్చుకుంటూ ఉండగా మా పెదన్నాన్న కొట్టేసేవాడట! అందుకే చదువుకోలేదు! అందుకే నాన్నగారు అడిగారు దేవుణ్ణి- నేను మీ సేవ ఎలా చేయగలను? నేను చదువుకోలేదు! నేను బైబిల్ చదువలేను, నేను పాటగాడిని కూడా కాదు అన్నారు! అయితే దేవుడు చెప్పారు- నేను నీకు చదువు నేర్పుతాను, వాక్యం ఎలా చెప్పాలో నేర్పుతాను, పాటలు నేర్పిస్తాను అని చెప్పి- ప్రతీరోజు అర్ధరాత్రి దేవుడే నాన్నగారిని లేపి- బంగారమ్మపాలెంలో (S.రాయవరం మండలం, విశాఖ జిల్లా) గల కొండమీదకి తీసుకుని పోయి దేవుని వెలుగులో దేవుని దగ్గర నేర్చుకున్నారు గ్రంధంలో వాక్యం ఉంది, ఎలా వాక్యం చెప్పాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా ప్రార్ధించాలి అనేవి అన్ని నేర్పారు దేవుడే!! తర్వాత దైవజనులు దేవదాసు గారు (నర్సీపట్నం) నాన్నగారిని అపోస్తలులు P.M. సామ్యేలు గారి దగ్గరకు ట్రైనింగ్ కోసం పంపించారు. ఆయన వాక్యమును ఎక్కువగా నేర్పించకుండా ప్రార్ధనలో సైతానుని ఎలా జయించాలో, ఆటంకాలు శోధనలు కలిగినా దేవుని సేవను ఎలా చెయ్యాలి , మోకాళ్ళ అనుభవాన్ని నేర్పించి పంపించారు. సుమారుగా 50 సంవత్సరాలు అలుపెరుగకుండా సుమారుగా 60 గ్రామాలలో కాలినడకను తర్వాత సైకిల్ మీద తిరుగుతూ సేవచేశారు. ఆంద్ర తెలంగాణా లో ఎన్నో సభలలో వాడుకోబడ్డారు. వేలమందికి భాప్తిస్మం ఇచ్చారు. మధ్యనే దేవుని పిలుపును అందుకుని వెళ్ళారు. *కాబట్టి చదువుకోలేని ఒక చేపలు పట్టే వ్యక్తిని వాడుకున్న దేవుడు నిన్నుకూడా దేవుడు వాడుకుంటారు! నీవు చేయవలసినదంతా ఆయనమీద ఆనుకోవడం, మోకాళ్ళఅనుభవం, ఇంకా జ్ఞానం కోసం దేవుని పాదాలను పట్టుకోవడం అంతే!* అలా కాకుండా *నీవు పొందుకున్న లేక నీవు నేర్చుకున్న నీ బైబిల్ ట్రైనింగ్ నీ బైబిల్ డిగ్రీలు నీకు పేరు తెచ్చిపెట్టగలవు గాని ఆత్మలను సంపాదించలేవు! ఫలవంతమైన సేవ చేయలేవు!*

 

గనుక దేవుణ్ణి అడగండి పొందుకోండిసేవలో ధన సహాయం కావాలా? ఎవరిని అడగవద్దు! నీ సంఘాన్ని కూడా అడుక్కోకు! సంస్థలు వెనకాల పరిగెత్తవద్దు! నిన్ను పిలిచిన వాడు దేవుడు కాబట్టే దేవుడే నీ అవసరాలు తీరుస్తారుమా నాన్నగారు మాకు అదే నేర్పించారు. పెన్ను కావాలన్నా- పుస్తకాలు కావాలన్నా నన్నెందుకు అడుగుతావు- దేవుణ్ణి అడుగు! దేవుడే ఇస్తారు అనేవారు! అలాగే దేవుని మీద ఆనుకోవడం పొందుకోవడం నేర్చుకున్నాము మేము అయిదుగురు పిల్లలము! కొన్నిసార్లు మా పెద్దన్నయ్య- దేవుణ్ణి ఎందుకు అడగాలి- నీవు కన్నావు కాబట్టి నీవే ఇవ్వమని అడిగేవాడు! తర్వాత మారుమనస్సు పొంది ఎన్నెన్నో పొందుకున్నాడు. రిజర్వేషన్ లేకుండా ఉద్యోగం పొందుకున్నాడు, ఆత్మీయ వరాలు ఫలాలు అన్నీ పొందుకున్నాడు. తానేకాదు తన స్నేహితులు నలుగురు అనకాపల్లి కాలేజి ప్రక్కన ఉన్న కొండమీద మోకాళ్ల మీద గంటలు గంటలు ప్రార్ధన చేసేవారు. ఇప్పుడు నలుగురు దేవునిలో బలంగా వాడబడుతున్నారు! కాబట్టి అడగండి దేవుణ్ణి! పొందుకోండి!

 

ఫిలిప్పీ 4:19

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

*యాకోబు పత్రిక 11 భాగము*

*జ్ఞానము లోపిస్తే-3*

యాకోబు 1:58

5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

8. గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

 

ఇక ఐదవ వచనంలో అంటున్నారు: మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వాడు దేవుని అడుగవలెను! అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును! ఆయన ఎవనిని గద్దింపక అందరికిని దారాళముగా దయచేయువాడు అని చెబుతూ అడిగే వాడు సందేహపడకుండా అడగాలి అంటున్నారు!

 

               (గత భాగం తరువాయి)

 

చూడండి ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు ఏమంటున్నారో: అయితే అతడు ఏమాత్రమును సందేహించక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగమును పోలియున్నాడు అంటున్నారు.  అనగా సముద్రపు ఒడ్డునుండి కెరటాలను చూస్తే ఎంతో ఎత్తుగా భయము పుట్టించేవిగా ఉంటాయి. గాని అవి గొప్పగా రేగిపోయి ఒడ్డును తాకినవెంటనే తుస్సుమంటాయి! అంతేకాకుండా ఆగకుండా వచ్చే కెరటాలు లాగ నీలో అనుమానాలు రేపుతాయి అన్నమాట! నిజంగా దేవుడు పని చేస్తారు అంటావా? లేక నా పరువును తీసేస్తారా? ఇలాంటి పనికిమాలిన అనుమానం గలవాడు ఎవడు ఎప్పుడూ దేవుని నుండి ఏమీ పొందుకోలేదు అని తెలుసుకోవాలి! ఇంకా అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్తిరుడు అంటున్నారు. అనగా ఇలాంటి ద్విమనుష్కుడు ఏమార్గము అవలంభించినా దానిలో జయము తెచ్చుకొలేడు. ఒకపని మొదలుపెడతాడు. దానిలో ఉండగా ఎవడో ఏదో అంటాడు, అది వదిలేసి ఇంకో పనిలోకి వెళ్తాడు. అక్కడ కూడా ఓడిపోతాడు! చివరికి ఓడిపోవడం అలవాటుగా మారిపోయి- ఓటమికి కేరాఫ్ అడ్రస్ అయిపోతాడు! అందుకే ఇలాంటి అనుమానపు పక్షిగాడు అస్తిరుడు ద్విమనుష్కుడు దేవుని వలన ఏమైనా నేను పొందుకొంటాను అని అనుకోకూడదు ఎందుకంటే దేవుడు ఇలాంటి వాడికి ఏమీ ఇయ్యరు అంటున్నారు!

 

ఒకసారి మనం యెహోషువా గారి దగ్గరికి వెళ్దాం! దేవుడు చెప్పారు- యాజకుల అరికాళ్ళు యోర్దాను నదిని తాకినవెంటనే నీళ్ళు ఆగిపోతాయి అన్నారు- యెహోషువా గారు అనుమానం పడలేదు- యాజకుల కాళ్ళు యోర్దాను నదిని తాకితే వారి పాదములు మునిగిపోతాయి తప్ప యోర్దాను నది ఆగిపోవడం ఏమిటి అని అనుకోలేదు! యెరికో పట్టణం చుట్టూ ఏడూ రోజులు తిరగండి చివరిరోజు ఏడు సార్లు తిరిగి చివర్లో కేకలు వేయండి యెరికో కోటలు కూలిపోతాయి అన్నారు- యెహోషువా గారు అనుకోలేదు- అరవడం ఏమిటి- అరిస్తే కోట గోడలు కూలిపోవడం ఏమిటి అని! పూర్తిగా నమ్మారు యెహోషువా గారు! గట్టిగా కేకలు వేశారు- దృశ్యము చూసిన దేవుని సేనలు- దూతలు కూడా గట్టిగా స్తోత్రము చేయడం మొదలుపెట్టారు- అనునాదం (Resonance) కలిగింది. కోట గోడలు అదిరిపోయి కూలిపోయాయి! యెరికో పట్టణం ఇశ్రాయేలు వశమయ్యింది. ఇదీ విశ్వాసం!

 

ఇవన్నీ తెలిసినా కొంతమంది విశ్వాసము లేని పీనుగులు దేవుని నుండి ఏమీ పొందుకోకుండా విశ్వాస బ్రష్టులు అయిపోయారు. లోతుభార్య దేవుడు చెప్పిన మాట వినలేదు- హా మా పట్టణాలు కాలిపోతాయా, దేవదూతలు చెప్పడం- మా లోతుగారు వినడం అని నవ్వుకుని వెనుకకు చూసింది. పట్టణాలు అగ్ని గంధకాలతో కాలిపోతున్నాయి. హమ్మబాబోయ్ అనబోయింది. అలా అంటే లోతుగారు అతని కుమార్తెలు చూసేస్తారు అనుకుని దేవుడు ఆమెను ఉప్పు స్తంభముగా చేసేశారు!

 

కాబట్టి విశ్వాసి జీవితమునకు విశ్వాసము అనేది ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా మన ప్రార్ధనలకు జవాబు రావాలంటే విశ్వాసము తప్పకుండా ఉండాలి! అందుకే హెబ్రీ 11:6 లో అంటున్నారు: విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడటం అసాధ్యం, అంతేకాకుండా దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని మొదట నమ్మాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి అంటున్నారు!...

 

ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి చేసే ప్రార్ధన ఎంత గొప్పటి కార్యమైనా చేస్తుంది....

మార్కు 9: 23

అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.

Mark(మార్కు సువార్త) 11:22,23,24

22. అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవునియందు విశ్వాసముంచుడి.

23. ఎవడైనను కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

 

యాకోబు గారు అంటున్నారు: విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్త పరుస్తుంది..

యాకోబు 5: 15

విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును.

 

యోహాను గారు అంటున్నారు: అవిశ్వాసముతో ప్రార్ధించడం అంటే దేవుణ్ణి అబద్దికునిగా చేసినట్లే 1యోహాను 5:910

9. దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.

10. సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; జీవము ఆయన కుమారునియందున్నది.

నీవు సందేహించావు అంటే దేవుని గుణగణాలను అనుమానించినట్లే ఇంకా సందేహించేవాడు దేవుని గురుంచి ఆయన వాక్యం గూర్చి నమ్మకం ఉంచడు కనుక  తన చేసే పనిపాటులలో కూడా నిలకడగా ఉండలేడు! అతనెప్పుడు రెండు వైపులా లాగబడుతూ ఉంటాడు! దేవుడూ కావాలి- లోకమూ కావాలి! లోకాచారాలు కావాలి- దేవుని దీవెనలు కావాలి! ఇలాంటి వాడు రెంటికీ చెందినా రేగడి అయిపోతాడు! దేవునికి పనికిరాడు- దయ్యానికీ పనికిరాడు! ఇతనిది చపలచిత్తమైన మనస్సు!

 

దైవజనులు ఆరార్కే మూర్తిగారు అంటూ ఉండేవారు ఆవగించంత విశ్వాసముంటే ఎంత ఘనమైన కార్యాలు చేయగలవో అలాగే ఆవగించంత అనుమానం ఉన్నా ఏమీ చేయలేవు!!!

 

దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానం ఒకసారి చూద్దాం!

యెహేజ్కేలు 11: 19

వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.

 

అయితే నిజం చెప్పాలంటే విశ్వాసులందరూ ఎప్పుడోఒకప్పుడు సందేహించే స్థితిలో ఉండే ఉంటారు. రకమైన సందేహాలనుండి విడుదల పొందాలి అంటే జయం పొందాలి అంటే ఇలాంటి సందేహాలను ఎదిరించాలి. దేవుడు ఏదైనా చేస్తారు! ఆయన సర్వశక్తుడు సర్వశక్తిమంతుడు అని నమ్మాలి! సాతాను కలిగించే ఇలాంటి నెగిటివ్ భావాలు అనుమానాలు జయించి దేవునిమీద ఆనుకోవాలి! దేవుడు తన ప్రజలను ఎప్పుడూ చేయి విడువడు ఎడబాయడు అని గట్టిగా నమ్మి విశ్వసించాలి! ఇంకా విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకుని వారికోసం బైబిల్ వాక్యాలను చదివి ధైర్యం తెచ్చుకోవాలి! విషయంలో మనకు ఆదర్శప్రాయుడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము గారిని జ్ఞాపకం చేసుకోవాలి ! ఆయనను దేవుడు నేను చూపించబోయే దేశానికి వెల్లిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్తే నాకేంటి అని అడగలేదు! మరలా ఇక్కడికి ఎప్పుడు వస్తాను అని కూడా అడగలేదు! దేవుడు చెప్పారు- అబ్రాహాము గారు  నమ్మి వెళ్ళిపోయారు! అంతే ఆయన విశ్వాసులకు తండ్రిగా అయిపోయారు! రోమాలో అంటున్నారు పౌలుగారు నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి జీవించారు అంటున్నారు. వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చగలిగే శక్తిమంతుడు అని నమ్మి విశ్వసించారు. రోమా 4:1722

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

మరి ఇప్పుడు అడగవచ్చు- సందేహాలు రాకుండా ఏమి చెయ్యాలి? దేవుని వాక్కే మనకు దిక్కు! ఆయన వాక్యమును చదవాలి. విశ్వసించాలి! అందుకే పౌలుగారు అంటున్నారు వినుట వలన విశ్వాసము కలుగును వినడం దేవుని కోసమైనది అయిఉండాలి అంటున్నారు 

రోమీయులకు 10: 17

కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

 

ఇంకా కీర్తనా కారుడు అంటున్నారు: దేవుని వాగ్దానాలను అయన యొక్క గుణగణాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉండాలి కీర్తన 1:23

2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

3. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

 

ఇంకా ఆయన చిత్తానికి పూర్తిగా లోబడి ఉండాలి రోమా 12:12

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు కొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు లోక( లేక, యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

మరి ఆయన చిత్తానికి లోబడి ఆయనమీద పరిపూర్ణ విశ్వాసం కలిగి దేవుణ్ణి అడిగి పొందుకొందామా?

 

ఎట్టి పరిస్థితులలో దేవుణ్ణి అనుమానించవద్దు!

 

అబ్రాహాము గారు నడిచిన బాటలో నడుస్తూ గమ్యానికి చేరుకుందాం!

 

దైవాశీస్సులు!

 

 

 

*యాకోబు పత్రిక 12 భాగము*

*క్రీస్తులో దీనుడు ధనవంతుడు-1*

యాకోబు 1:911

9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.

10. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.

11. సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

 

ఇక 9 వచనంలో అంటున్నారు: దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.

 

దీనుడైన సహోదరునికి తనకు కలిగిన ఉన్నత దశ ఏమిటి?  దీనుడైన సహోదరునికి దేవుడు దయచేసిన రక్షణ వలన దేవుని నుండి పొందుకునే ఎన్నెన్నో ఆధ్యాత్మిక ఫలాలు అన్నమాట! దేవుడు క్రీస్తుయేసులో నమ్మకముంచిన పేదలనూ విద్యలేనివారినీ గొప్ప స్థితికి హెచ్చించారు. వారిని ఆయన తన స్వంత పిల్లలుగా చేసుకుని వారిని ఒక దివ్యమైన భవిష్యత్తుకోసం ఎన్నుకొన్నారు. పేతురు గారు అంటున్నారు: దేవుడు మనలను రాజులైన యాజక సమూహముగా ఉండటానికి పిలుచుకున్నారు!..

1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

1పేతురు 2: 10

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

 

యోహాను 1:12-13;

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

రోమీయులకు 8:29-30;

29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

ఎఫెసీయులకు 2:6-7

6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము,

7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.

 

ఇంకా పౌలుగారు ఆత్మావేశుడై అంటున్నారు: ఈలోకంలో ధనవంతులను విద్యావంతులను హీనపరచడానికి లోకంలో ఎన్నికలేని మనలను ఎన్నుకొన్నారు! .......

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:26,27,28,29,30,31

 

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో- శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27. శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. *జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు*.

29. *ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు*.

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు *దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను*.

 

 మరియమ్మ గారు అంటున్నారు ఆత్మతో నింపబడి:

లూకా 1: 52

సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

లూకా 1: 53

ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

 

 అయితే  క్రీస్తులో ధనికుడని పేదవాడని గానీ దాసుడని యజమాని అని గానీ విద్యావంతుడని విద్యలేనివాడని గానీ తేడా లేదు. అందరూ సమానమే దేవునికి!

 

1కోరింథీయులకు 12: 13

ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

 

గలతియులకు 3:28;

ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

 

 కొలొస్సయులకు 3:11

ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని (అనాగరికమైన ఒక జనము) దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునైయున్నాడు.

 

కాబట్టి పేదవాడు లేదా దీనుడైన సహోదరుడు  దీన్ని గుర్తించి క్రీస్తులో తనకున్న ఉన్నత స్థితి గురించి గొప్ప ఆనందం, సంతృప్తి అనుభవించాలి అంటున్నారు యాకోబు గారు!

 

మనలో చాలామంది తమకున్న పేదరికాన్ని చూసి చాలా కృంగిపోతుంటారు ఇంకా మరికొంతమంది ఆత్మన్యూన్యతా భావంతో మ్రగ్గిపోతుంటారు! అలాంటివి వద్దు అంటున్నారు! నేను Prosperity Gospel చెప్పడం లేదు గాని దేవుడు మనలని పేదరికంలో ఉండటానికి పిలువలేదు గాని యోహాను పత్రికలో చెప్పినట్లు మనము అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నారు! ..

3యోహాను 1: 2

ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

 

అది బౌతిక విషయాలు గాని ఆధ్యాత్మిక సంగతులు గాని. అన్నివిషయాలలో కూడా దేవుడు మనము అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు! అయితే ఇవి ఎప్పుడు వస్తాయి అంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుము అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీ వెనుక వాటికవే పరుగెత్తి కొని వస్తాయి! ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: మీ పరలోకపు తండ్రికి ఇవి మీకు కావాలని తెలుసు! అందుకే మొదట ఆయన రాజ్యమును నీటిని వెదుకు అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అంటున్నారు! 

Matthew(మత్తయి సువార్త) 6:31,32,33

31. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

32. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

 

ఒకసారి- మనము మనము రక్షించబడక ముందు మన పరిస్తితి ఎలా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది మన స్థితి మన ఆర్ధిక పరిస్తితి? ఒకానొకప్పుడు సరియైన ఉద్యోగము లేకుండా సరియైన ఇల్లు లేకుండా ఎంత దుర్భరమైన బ్రతుకును అనుభవించామో కదా! ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది?  కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే యాకోబుగారు చెప్పినట్లు దీనుడా లేక పేదవాడా! మొదట నీవు దేవుడిచ్చిన ఆధ్యాత్మిక మేలులు కోసం, దేవుడు నిన్నుంచిన ఆధ్యాత్మిక స్తితి ఆలోచించుకో! మనకన్నా ధనవంతులు బలవంతులు విద్యావంతులు దినాన్ని చూడలేక పోయారు. మనము ఇంతవరకు సజీవంగా ఉన్నాము! మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు! ఒకసారి హాస్పిటల్ లో ఉంటున్న రోగులను గుర్తుంచుకో! వారికన్నా దేవుడు మనలను ఆరోగ్యంగా ఉంచారు కదా!

మా ఊరిలో ఒక వ్యక్తి సుమారు ముప్పై సంవత్సరాల నుండి రోజుకి 200 గ్రాముల కంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం లేదు! ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ఆస్తి సుమారు 120 కోట్లు! ఇప్పుడు సుమారుగా వెయ్యి కోట్ల కంటే ఎక్కువగా ఉంది, గాని సరియైన ఆహారం తినకూడదు తినలేడు! ఒక్కడే కుమారుడు పుట్టాడు, వాడు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కూతురు మాత్రమే ఉంది! ఎంత ధనమున్నా కడుపునిండా తినే పరిస్థితి అతనికి లేదు. నీవైతే కడుపునిండా తినగలుగుతున్నావు అంటే అది నీకు దేవుడిచ్చిన కృప మాత్రమే కదా!

 

మరీ ముఖ్యంగా నీకు నాకు రక్షణ ఉంది! గాని ధనవంతులలో నూటికి 90% మందికి రక్షణ లేదు! దేవుడంటే భక్తిలేదు భయం లేదు! దేవుడు కూడా వారి సర్వెంట్ అనుకుంటున్నారు! ఈరోజు మరణిస్తే/ దేవుని రాకడైతే నీవు నేను రక్షించబడ్డాము గనుక దేవుని దగ్గరకు వెళ్తాము! గాని వారు మరణిస్తే/ దేవుని రాకడైతే ఖచ్చితంగా నరకానికే పోతారు. మరి ఇంతటి గొప్ప ఆధిక్యత నీకు నాకు దేవుడిచ్చారు కనుక నీకు కలిగిన గొప్ప స్థితి, ఆయన పిల్లలుగా మారిన స్థితి, రాజులైన యాజక సమూహముగా మారిన నీ స్తితిని, ఒకరోజు దేవాది దేవుణ్ణి పరలోక దూతలను చూస్తామన్న నిరీక్షణ, పరలోకములో నీవు నేను పొందబోయే స్వాస్త్యమును జ్ఞాపకం తెచ్చుకుని సంతోషించి గంతులు వేయు గాని క్రుంగిపోకు! దీనినే చెబుతున్నారు యాకోబు గారు!

 

మరినీవు దీనుడా పేదవాడా సంతోషిస్తావా? లేక ఉసూరుమంటూ ఉంటావా!! నీవే తేల్చుకో!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 13 భాగము*

*క్రీస్తులో దీనుడు ధనవంతుడు-2*

యాకోబు 1:911

9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.

10. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.

11. సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

 

ఇక 9 వచనంలో అంటున్నారు: దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఎందుకంటే యితడు అనగా ధనవంతుడు గడ్డిపువ్వు వలె గతించిపోవును..

 

            (గతభాగం తరువాయి)

 

   విశ్వాసి అయిన ఒక ధనికుడికి క్రీస్తులో ఒక పేదవాడికున్న స్థితి ఉంది. కానీ క్రీస్తు మూలంగా అతడు (ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిగా) తన అల్పత్వం, మర్త్యత, బలహీనత గురించి అర్థం చేసుకోగలడు. ఉన్నత స్థితికి రావడానికి స్వార్థమును వదిలిపెట్టడమే  దారి అని అతడు తెలుసుకోగలడు

 

మత్తయి 18:3,4;

3. మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

4. కాగా బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు.

 

మత్తయి 23:12

తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.

 

మార్పు చెందిన ధనిక విశ్వాసి తన భ్రష్టస్వభావాన్ని గురించి అతడు నేర్చుకున్నాడు. దేవుని కృప లేనిదే ఇప్పుడు గానీ రాబోయే కాలంలో గానీ తనకు మేలుకరమైనదేదీ కలగదనే గొప్ప సత్యం నేర్చుకున్నాడు. దీనంతటిలోనూ అతడు ఆనందం, సంతృప్తి అనుభవించాలి. దేవుని ఎదుట మనల్ని వినయంగల స్థితికి తెచ్చే దేన్ని బట్టి అయినా మనం ఆనందించాలి.

 

అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మరొకసారి నన్ను గుర్తుకు చేయనీయండి! దేవునికి ధనవంతులంటే ఏమైనా అసహ్యమా? కానేకాదు! ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం అసంభవం అని కూడా అన్నారు అని అంటారు మీరు!

లూకా 18: 25

ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.

 

ఒకసారి అబ్రాహాము గారిని జ్ఞాపకం తెచ్చుకోండి! ఆయన పేదవాడా? కానేకాదు. గొప్ప ధనవంతుడు! ఆయన ఆరోజులలో ఇప్పటి ముఖేష్ అంభాని కంటే ధనవంతుడు! ఎలీషా గారు పేదవాడా? కాదు కదా! పెద్ద భూస్వామి! యోబు గారు పేదవాడా? కాదుగదా! గొప్ప ధనవంతుడు! మరి వీరిని దేవుడు ఎందుకు ఎన్నుకొన్నారు? కారణం వారు తమకు ఎంత ఆస్తి ఐశ్వర్యము ఉన్నా దేవునికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప అతిశయపడలేదు! అవి దయచేసిన దేవునికి తమ జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉన్నారు! అందుకే ` దేవుని దృష్టిలో ధనవంతులవడానికి ప్రయత్నం చేయకుండా తమ దృష్టిలో ధనవంతులవ్వడానికి ప్రయత్నిస్తే అప్పుడు వారు పరలోక రాజ్యం ప్రవేశించలేరు అంటున్నారు!

లూకా 12: 21

దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.

 

పౌలుగారు తిమోతికి ఉత్తరం రాస్తూ చివరలో అంటున్నారు ఇహలోకమందు ధనవంతులైన వారు మానవులకు వాటిని ధారాళంగా దయచేసే దేవున్నే హెచ్చించి పూజించండి అంటున్నారు...

1 Timothy(మొదటి తిమోతికి) 6:17,18,19

17. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును,

19. సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.

 

సరే ఇక గడ్డిపువ్వు లా వాడిపోవడం కోసం చూసుకుంటే

 

Psalms(కీర్తనల గ్రంథము) 102:3,4,11

3. పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.

4. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.

11. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.

 యెషయా 40:6-8

6. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

 

ఇక 11 వచనంలో అంటున్నారు : సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.

 

కీర్తనలు 103: 15

నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

కీర్తనలు 103: 16

దానిమీద గాలి వీచగా అది లేకపోవును మీదట దాని చోటు దాని నెరుగదు

 

Psalms(కీర్తనల గ్రంథము) 90:3,5,6

3. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

5. వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు

6. ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.

 

1 పేతురు 1:23-25.

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

 

గమనించాలి దేవునికి వేరుగా మనుష్యులు చేసేదంతా తాత్కాలికమే! అశాశ్వతమే! అయితే ఎవరైతే క్రీస్తుయేసునందు విశ్వాసముంచి నమ్మి భాప్తిస్మం పొందితేనే వారు నూతన జన్మ పొంది శాశ్వత జీవం పొందుకొంటారు! 1యోహాను 2:17

1యోహాను 2: 17

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

 

  విషయం తెలిసుకోకుండా చాలామంది భూములు సంపాదిద్దాం, బంగళాలు కడదాం, బంగారం సంపాదిద్దాం అంటూ పగలురాత్రి అలసిపోకుండా కష్టపడుతున్నారు! ఒకరోజు దేవుడు రా అని పిలిస్తే వాని గతి ఏమిటి? లూకా సువార్తలో ఇలాంటి వెర్రివాని కోసం యేసయ్య చెప్పారు కదా లూకా 12 అధ్యాయంలో!

 

కాబట్టి నీవుకూడా వీటికోసం ఆలోచించకు! మరికొందరు అబ్బా ఎన్ని షోకులు చేస్తుంటారో!! ముక్కికి రంగు మూతికి రంగు, పెదాలకు రంగు స్నో రాస్తారు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు పేడముఖం మీద, ఎన్ని రాసినా కొంత ఎండకాసినా సాయంత్రానికి నీ ఒంటినిండా మన్నే వస్తుంది కారణం నీవు మంటినుండి తీయబడ్డావు! అందుకే ప్రసంగి అంటున్నారు: మన్నయినది వెనుకటివలె మన్నైపోవును. ఆత్మ తానూ  దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది అంటున్నారు! 12:7

 

నీవు ఎన్ని షోకులు చేసినా ఒకరోజు నీకు మరణం తప్పదు! మరణం కంటే నీకు వృద్ధాప్యం కూడా తప్పదు! నీ యవ్వనంలో ఉన్న అందం- నీ వృద్ధాప్యంలో అసలు ఉండనే ఉండదు! మరణము చూడని నరుడే లేడు అని బైబిల్ చెబుతుంది.

 

 కాబట్టి అలా వెళ్ళిన తర్వాత నీవు నీ ఆత్మ పరలోకానికి/పరదైసుకి వెళ్ళాలో లేక పాతాళానికి పోవాలో ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి!!!!

 

కాబట్టి ధనవంతుడా! నీవు తొందరలో మట్టిలో కలిసిపోతావు కాబట్టి నీ  భ్రష్టస్వభావాన్ని గురించి  నేర్చుకుని  దేవుని కృప లేనిదే ఇప్పుడు గానీ రాబోయే కాలంలో గానీ తనకు మేలుకరమైనదేదీ కలగదనే గొప్ప సత్యం తెలుసుకో!. దీనంతటిలోనూ నీవు ఆనందం, సంతృప్తి అనుభవించాలి. దేవుని ఎదుట మనల్ని వినయంగల స్థితికి తెచ్చే దీనిని బట్టి మనం ఆనందించాలి. మరి నీ స్వార్ధాన్ని నీ గర్వాన్ని వదిలి దీనత్వం పొందుకుని దేవునికి ఇష్టమైన వాడుగా మారతావా? అబ్రాహాము గారు, ఎలీషా, యోబు గారిలా దేవునిచేత నీవు కూడా అంగీకరించబడతావా? దేవుడిచ్చిన ఆస్తిని దేవుని కోసం ఖర్చు పెడతావా? పేదలకోసం అవసరాలలో ఉన్నవారికి నీ ధనాన్ని సాయం చేస్తావా తద్వారా పరలోకంలో ఆస్తిని సంపాదించుకొంటావా?

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 14 భాగము*

*శోధనలు/శ్రమలు-1*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!

 

ఇక 12 వచనంలో అంటున్నారు: శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. శోధనలను/ శ్రమలను/ పరీక్షలను చూసి పారిపోకూడదు, వాటిని సహించాలి అంటున్నారు. అలా సహిస్తే వారు దేవునిచేత ప్రేమించబడిన వారవుతారు తద్వారా దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు అంటున్నారు యాకోబు గారు!

 

ఇప్పుడు, ఇంకా రాబోయే రోజులలో కూడా  విశ్వాసుల మేలుకే శోధనలు/ శ్రమలు/ విషమ పరీక్షలు పని చేస్తాయి 24; అందుకే మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి అంటున్నారు యాకోబు గారు! అయితే అలాంటి వారికి దేవుడిచ్చే బహుమానం అనే జీవ కిరీటం పొందుకుంటారు అంటున్నారు. ఇప్పుడు నేను కిరీటం కోసం చెప్పడం లేదు కారణం గతంలో అనేకసార్లు కిరీటాలు కోసం మాట్లాడుకున్నాం! అయితే ఎవడైతే శ్రమలను శోధనలను విషమపరీక్షలను తట్టుకుని క్రీస్తుకోసం నిలిచి జయిస్తాడో వాడు మాత్రం జీవకిరీటం పొందుకుంటాడు అన్నమాట! అక్కడ కూడా పరీక్షలో నమ్మకంగా నిలిచినవారికి జీవ కిరీటాన్నిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం అది.  ప్రేమించేవారికి విషమ పరీక్షల్లో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలా తోడ్పడే మానసిక శక్తి ఇదే!. ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం.

 

ఇంకా తర్వాత వచనంలో  దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు అంటున్నారు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మెరుగు పెడతాడు గానీ దుష్ట ప్రేరణ కలిగించడు.

మత్తయి 6:13 లో జవాబివ్వడానికి దేవునికి బహు ఇష్టమైన ప్రార్థన ఉంది.  చెడుతనమూ, పాపమూ కూడా దేవునికి లేశమాత్రమైనా ఇష్టం లేదు. చెడుతనాన్నంతటినీ పూర్తిగా, శాశ్వతంగా ఆయన అసహ్యించుకుంటాడు

 

సరే, రోజు శోధనలను సహించేవాడు ధన్యుడు అంటూ వాడు దేవునిచేత ప్రేమించబడి జీవకిరీటం పొందుకుంటాడు అని యాకోబు గారు  చెబుతున్నారు కదా, ఎవరైనా ఇలా శోధనలను శ్రమలను పరీక్షలను తట్టుకుని కిరీటాలు బహుమానాలు ఆశీర్వాదాలు పొందుకున్నారా లేదా అనేది చూసుకుందాం!

 

బైబిల్ గ్రంధంలో గల గొప్ప వారు ప్రవక్తలు దైవజనులు అందరూ ఇలాంటి శోధనలను పరీక్షలను తట్టుకున్న వారే, అలా శోధనలకు నిలిచి సహించి అసాధారణమైన కార్యాలు చేయగలిగారు! అయితే వీరిలో కొందరిని మాత్రము మనం జ్ఞాపకం చేసుకుందాం!

 

మొదటగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము గారిని జ్ఞాపకం చేసుకోవడం సమంజసం!  దేవుడు అబ్రాహాము గారిని పిలిచి అబ్రాహామా! నీవు నీ తండ్రి ఇంటివారిని నీ స్వజనాన్ని విడిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెబితే- ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్నలు వేయకుండా తిన్నగా తనకు కలిగిన సమస్తము తీసుకుని వెళ్ళిపోయారు! గొప్ప ధనవంతుడు- తన కున్న ఆస్తి బంగళాలు అన్ని వదిలేసి- టెంట్ లలో ఉన్నారు, ఎండకు వానకు ప్రయాణం చేసి- దేవుడా ఇంతన్నావ్ అంతన్నావ్ అని ఎప్పుడు అనలేదు! కొన్ని సంవత్సరాలకు ఊహించలేనంత ఆస్తి ఐశ్వర్యము ఇచ్చి, నూరేళ్ళ వయస్సులో వాగ్ధాన పురుషుడైన కుమారున్ని అనగా ఇస్సాకుని ఇచ్చి, ఒకరోజు హటాత్తుగా అబ్రాహామా నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని మోరియా కొండమీద బలి ఇచ్చేయ్ అన్నారు! ఇంతవరకు వచ్చిన పరీక్షలు కంటే గొప్ప పరీక్ష ఎదురైంది అబ్రాహాము గారికి! వెంటనే తన హృదయం బద్దలై పోయింది, గాని ఏమాత్రము దేవుణ్ణి నిందించలేదు దేవుని వాగ్దానాలను అనుమానించలేదు. కుమారుడైన ఇస్సాకుని ఉదయాన్నే తీసుకుని మోరియా కొండకు వెళ్ళిపోయారు! ప్రయాణంలో ఎన్ని సార్లు తన మనస్సు అడిగిందో , దేవుడు నీ సంతానాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నారు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అన్నారు. ఇప్పుడు నీ కొడుకుని బలి ఇచ్చెయ్యమంటారా దేవుడు! మనుషులను బలికోరే దేవుడా నీ దేవుడు అని, గాని తన మనస్సుతో చెప్పి ఉండాలి- దేవుడు ఒకవేళ తన కుమారున్ని బలికోరితే దహనమైపోయిన తర్వాత మిగిలే భష్మము లేక బుగ్గిలోనుండి   దేవుడు ఇస్సాకుని లేపగలరు, బుగ్గిలోనుండి  నాకు సంతానం అభివృద్ధి చేయగలరు అని నమ్మి విశ్వసించి తన మనస్సుతో చెప్పి ఉంటారు! కొండ ఎక్కేటప్పుడు ఎన్ని కన్నీళ్లు రాలాయో కదా! చివరికి తండ్రీ- దహన బలికి కట్టెలు, నిప్పు ఉన్నాయి గాని మరి ఇంతకీ గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన గుండె ముక్కలుగా విడిపోయి ఉంటుంది, ఇది మరీ పెద్ద పరీక్ష!  గాని ఆయన చెప్పిన సమాధానం- నా కుమారుడా దహనబలికి పశువును దేవుడే చూసుకుంటాడు! జాగ్రత్తగా పరిశీలిస్తే తన హృదయంలో రేగే అలజడిని వెనుకకు పంపించి దృఢమైన విశ్వాసంతో అంటున్నారు: నాకుమారుడా దహనబలికి గొర్రెను కొండమీద దేవుడే చూసుకుంటారు! బలిపీటం కట్టారు, గుండె రాయి చేసుకుని తన కుమారుడైన ఇస్సాకుని ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకుని పొందుకున్న వరపుత్రుని రెండు చేతులు కట్టేసి తన చేతులతో బలిపీటం మీద పెట్టినప్పుడు ఎంతగా మౌనంగా రోధించారో అబ్రాహాము గారు మనకు తెలియదు! అయ్యా అబ్రాహాము గారు ఎలా చేశారో నాకైతే అర్ధం కావడం లేదు త్యాగం, సమర్పణ! వేరేవారికోసం నేను చెప్పలేను గాని అదే నా కొడుకుని దేవుడు బలి ఇచ్చేయ్ అని నన్ను గాని అడిగితే నేను నా చేతులతో ఇవ్వలేనండి, నేను ఒప్పుకోలేనండి- దేవుని సేవకు ఇచ్చెయ్యమంటే ఇవ్వగలను గాని, నా ఆస్తి మొత్తం ఇవ్వమంటే ఇచ్చెయ్యగలను గాని నా చేతులతో నా కుమారుని బలి ఇవ్వమంటే నేను ఇవ్వలేను! గాని ఈయన సిద్ధమైపోయి కత్తి ఎత్తారు!! దృశ్యాన్ని చూడటానికి బహుశా పరలోకం మొత్తం వంగి చూస్తుంది అని నా ఉద్దేశం!!! ఎప్పుడైతే కత్తిఎత్తి ఇస్సాకుని బలి ఇవ్వబోతున్నారో చివరి క్షణంలో దేవుడే కరిగిపోయి అబ్రాహామా అబ్రాహామా అని కంగారుగా పిలిచేశారు, లేకపోతే నిజంగా బలి ఇచ్చేస్తారు అబ్రాహాము గారు! అందుకే అబ్రాహామా అబ్రాహామా! చిన్నవాని మీద కత్తి వేయవద్దు! ఇందును బట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే ఈలోకంలో ఉన్నవారికంటే చివరికి నీ ముద్దుల కొడుకు కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని నాకర్ధమయ్యింది. అన్నికంటే దేవునికే ఎక్కువగా భయపడుతున్నావు! అదిగో పొదలలో చిక్కుకున్న పొట్టేలుని బలి ఇచ్చేయ్ అంటూ గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నారు దేవుడు! పరీక్షలో విజయుడై నిలిచినందుకు ప్రతిఫలం చూశారా ఎంత గొప్ప దీవెనో...

Genesis(ఆదికాండము) 22:2,3,5,7,8,9,10,11,12,13,14,15,16,17,18

 

2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

3. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.

5. తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి

7. ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా

8. అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.

9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.

10. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

11. యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

12. అప్పుడు ఆయన చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందవలన నాకు కనబడుచున్నదనెను.

13. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను.

14. అబ్రాహాము చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

15. యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను

16. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున

17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

 

బలి ఇవ్వకముందు తన కుమారుని రక్షించుకున్నారు, గొర్రెపిల్ల/పోట్టేలుని బలి ఇచ్చాక మరింత దీవెన ఇస్తున్నారు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు లాగ చేస్తాను, సముద్ర తీరంలో ఉన్న ఇసుక ఎంత ఉంటుందో అంతగా చేస్తాను అబ్బో ఎంత దీవెనో కదా!

 

ఇప్పుడు చూడండి ఇశ్రాయేలు వారిని అడగండి మీ తండ్రి ఎవరు? అబ్రాహాము!

ఇస్లామీయులను అడగండి మీ త్రండి ఎవరు? అబ్రాహాము!

క్రైస్తవులను అడగండి మీ తండ్రి ఎవరు? అబ్రాహాము!!!!

 

ఇన్ని పరీక్షలు తట్టుకున్నారు కనుకనే అంతగా ఆశీర్వాదం కలిగింది! అబ్రాహాము గారికి కలిగిన శోధనలో/ పరీక్షలో విధేయత మరియు విశ్వాసం ద్వారా జయించగలిగారు!

 

 అదే కదా రాస్తున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై- శోధన సహించువాడు ధన్యుడు, అతడు దేవునిచేత ప్రేమించబడి జీవ కిరీటం పొందుకుంటాడు! మరి ఇది నిజమే కదా!

 

కాబట్టి ప్రియ దైవజనమా! మనము కూడా శోధనలలో శ్రమలలో జారిపోకుండా పారిపోకుండా నిలకడగా నిలబడదాం! దైవాశీర్వాదాలు ముఖ్యంగా జీవ కిరీటం పొందుదాం!

 

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 15 భాగము*

*శోధనలు/శ్రమలు-2*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! శోధనలు శ్రమలు సహించిన వారి భాగ్యములను ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ప్రియులారా గతభాగంలో అబ్రాహాము గారికి కలిగిన శోధనలో ఎలా జయించారో చూసుకున్నాం! ఇంకా అనేకమంది ఉన్నారు. అబ్రాహాము గారి తర్వాత యాకోబు గారు కూడా శ్రమలను శోధనలను జయించారు! మామ ఎన్నోసార్లు తన ఆస్తిని తారుమారు చేసినా, శోధనలు ఎదురైనా మామ గారి దగ్గరనుండి పారిపోయారు, అయితే యబ్బోకు రేవు వచ్చేసరికి ఎదరనుండి అన్న యాశావు గారు తనను ఎదుర్కొని బహుశా చంపడానికి వస్తున్నారు నాలుగు వందలమందిని తీసుకుని, వెనుక నుండి మామ లాబాను తరుముకుంటూ వస్తున్నాడు! ఏమిచెయ్యాలి? భయంకరమైన పరీక్ష / శోధన/ శ్రమ ఎదురైంది! నిజం చెప్పాలంటే సంఘటన జరిగేసరికి- యాశావు గారు కేవలం నాలుగు వందలమందిని తీసుకుని వస్తున్నారు గాని అంతకంటే ఎక్కువమంది పనివారు తనతో ఉన్నారు, లాబాను కంటే ఎక్కువమంది తనతో ఉన్నారు. యాకోబు గారు యుద్ధం చేయగలరు! గాని దేవుడు చెప్పిన మాట ఉంది అది ఏమిటంటే నీవు నీ స్వదేశానికి వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అని,

ఆదికాండము 31:3

అప్పుడు యెహోవానీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా...

  వాగ్దానం పట్టుకుని యబ్బోకు రేవులో ఒక్కడే రాత్రంతా దేవుని సన్నిధిలో మగసిరిగలవాడై ప్రార్ధనలో మోకాళ్ళపై దేవునితో పోరాడుతున్నారు యాకోబు గారు! తన కాలు లేక తొడ గాయమైపోడానికి ఒప్పుకున్నారు గాని దేవుని దగ్గర మేలు లేక ఆశీర్వాదం పొందకుండా వదలలేదు! నన్ను దీవిస్తావా లేదా అంటూ మొండిపొట్టు ప్రార్ధనలో ఉడుం పట్టు పట్టారు ఆయన! దేవుడు దీవించక తప్పలేదు! ఆశీర్వదించి వెళ్ళిపోయారు దేవుడు! నీవు మనుష్యులతోను దేవునితోను పోరాడి గెలిచావు రా సెహబాష్ అన్నారు దేవుడు! పేరు మార్చేశారు దేవుడు, మోసపూరితమైన బుద్ధి మార్చేశారు దేవుడు! మొత్తం జీవితమే మారిపోయింది!

Genesis(ఆదికాండము) 32:9,10,11,12,24,25,26,27,28,29,30

9. అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

11. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

12. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింప జేయుదునని సెలవిచ్చితివే అనెను.

24. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

25. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.

26. ఆయనతెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడునీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

27. ఆయననీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.

28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

29. అప్పుడు యాకోబునీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.

30. యాకోబునేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.

 

 ఇదయ్యాక శత్రువైన అన్న మిత్రుడుగా అన్నగా మారిపోయి యాకోబు గారి బుజాల మీద పడి బోరున ఏడ్చాడు ఆయన! అందుకే ఒకని ప్రవర్తన మంచిదైతే దేవునికి ఇష్టమైతే వాని శత్రువును కూడా మిత్రుడుగా చేస్తారు అంటున్నారు బైబిల్ లో...

సామెతలు 16: 7

ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

 

యాకోబు గారు తన శోధనను మోకాళ్ళపై జయించారు. చివరికి గొప్ప దీవెనలు పొందుకున్నారు....

 

మరోసారి తన ఒక్కగానొక్క కుమార్తె దీన చేసిన పిచ్చిపని వలన- తన కుమారులు లేవి షిమ్యోను హంతకులై ఒక గ్రామం మొత్తమందరినీ చంపేసి వారి ఆస్తిని దోచేసుకున్నారు. ఇది విని ప్రక్క ప్రాంతాల వారందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు! మరలా మోకాళ్ళమీద పడ్డారు యాకోబు గారు! దేవుడు చెప్పారు: నీవు బయలు దేరి ఎక్కడైతే దేవునికి బలిపీటం కడతాను అని మ్రొక్కుకుని మర్చిపోయావో అక్కడికి వెళ్లి బలి అర్పించు, నేను నీతో ఉంటాను అన్నారు! మరోసారి మోకాళ్ళమీదనే జయించారు. దేవుని భయం ఇరుగుపురుగు వారికి కలిగి ఎవరూ యాకోబు గారిని తరుమలేదు!

 

మరినీకు ఇలాంటి శ్రమలు ఎదురైనప్పుడు నీ సొంతవారిని తీసుకుని యుద్ధానికి వెళ్తావా లేక యాకోబు గారిలా మోకాళ్ళమీద జయిస్తావా?

 

ఇక మరో వ్యక్తీ- దేవుని పరీక్షలను ఎదుర్కొన్న వ్యక్తి యాకోబు గారి పదకొండో కుమారుడు- యోసేపు గారు! చిన్నప్పుడే దేవుడు నీవు అధిపతివి రాజువు అవుతావు అని దర్శనం కలిగితే , అన్నలు పగపట్టి చేయని నేరానికి కొట్టి నీరులేని గుంటలో పడిచేశారు! తర్వాత గొప్ప యువరాజు లాంటి యోసేపు గారిని బానిసగా అమ్మేశారు. అక్కడ చేయని నేరానికి బానిసగా బ్రతికాడు! దేవుని కృప వలన అక్కడ బాగా జీవిస్తున్న సమయంలో ఇంటి యజమానికి కామపిశాచి పట్టి యోసేపు గారితో పాపం చెయ్యమంటే నేను దేవునికి, నా యజమానికి ద్రోహం చెయ్యను అని బట్టలు వదిలించుకుని పారిపోయాడు! మరలా చేయని నేరానికి జైలుశిక్ష అనుభవించాడు! గాని చివరికి దేశానికే గొప్ప అధికారి అయ్యారు (కొందరు ప్రధానమంత్రి అంటారు, కొందరు గవర్నర్ అంటారు) యోసేపు గారు శోధనలను శ్రమలను చూసి దేవుణ్ణి నిందించలేదు- ఇంతన్నావ్ అంతన్నావ్, నేను చేయని నేరానికి నేనెందుకు బాధలు శ్రమలు అనుభవించాలి అని అడుగలేదు! దేవునికి పూర్తిగా తనను తానూ అర్పించుకున్నారు. అయ్యా నీదే భారం! నీ ఇష్టమొచ్చినట్లు నన్ను చెక్కు అని దేవుని చేతులకు అప్పగించుకుంటే ఒకరోజు దేశానికే అధికారి అయ్యారు యోసేపు గారు!

Genesis(ఆదికాండము) 37:18,19,20,22,24,26,27,28

 

18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

19. వారు ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు;

20. వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

22. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.

24. అతని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. గుంట వట్టిది అందులో నీళ్లులేవు.

26. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

27. ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

28. మిద్యానీయు లైన వర్తకులు మీదుగా వెళ్లుచుండగా, వారు గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీ యులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

 

Genesis(ఆదికాండము) 39:1,5,6,7,9,12,19,20,21

1. యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.

5. అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను.

6. అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.

7. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

12. అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

19. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పినమాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

21. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.

 

Genesis(ఆదికాండము) 41:40,41,42,43,44

40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

41. మరియు ఫరోచూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.

42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

43. తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.

44. మరియు ఫరో యోసేపుతోఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.

 

యోసేపు గారు తనకు వచ్చిన శోధనలను దేవుని చిత్తానికి తనను అప్పగించుకోవడం వలన మరియు ఇంద్రియ నిగ్రహం వలన జయించగలిగారు. మరినీకు ఇలాంటి బలహీన క్షణాలు ఎదురైనప్పుడు దేవునికి భయపడుతున్నవా? నీ ఇంద్రియాలను నీ కోరికలను అదుపు చేసుకుంటావా?

ఈలోకంలో మంచివారుగా చెలామణి అయ్యేవారు రెండు రకాలు. మొదటి వర్గం : అవకాశం రాక మంచివారుగా మిగిలిపోయిన వారు! రెండవ వర్గం అవకాశం కలిగినా యోసేపు గారిలా ఇంద్రియాలను నిగ్రహించుకుని దేవునికి భయపడి మంచివారుగా జీవించేవారు! నీవు ఏరకం నా ప్రియ చదువరీ!!!!

 

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 16 భాగము*

*శోధనలు/శ్రమలు-3*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! శోధనలు శ్రమలు సహించిన వారి భాగ్యములను ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

   ఇంకా ఎందఱో వ్యక్తులున్నారు! ఒకసారి దావీదు గారిని జ్ఞాపకం చేసుకుందాం! నేను రాజు అవ్వాలని ఆయన కోరుకోలేదు! తన చిన్న గొర్రెలమందను మేపుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండగా హటాత్తుగా ఒకరోజు ఒకడొచ్చి మీ నాన్న పిలుస్తున్నాడు అని వెళ్తే అక్కడ సమూయేలు గారు తన తండ్రితో కూడా ఉన్నారు! దైవజనుడు కదా అని వందనం చేస్తే దేవుడు చెప్పిన విధముగా నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలమీద రాజుగా చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు దైవజనుడు! ఇశ్రాయేలు ప్రజలు గొల్యాతును చూసి పిల్లుల్లా పారిపోతే వాడ్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపడం అయన చేసిన తప్పా? రాజు గారికి నేను అల్లుడవ్వాలి అని అనుకున్నారా ఆయన లేదు కదా! రాజు కూతురుని పెళ్లి చేసుకోవడం తప్పా? ఇశ్రాయేలు ప్రజలకోసం శత్రువులతో యుద్ధాలు చెయ్యడం తప్పా? ఇలా ఎన్నెన్నో తాను చేయని తప్పులుకి కొన్ని సంవత్సరాలు అరణ్యాలలో అడవులలో కొండలలో తిరగాల్సి వచ్చింది! ఎన్నోన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొన్నారు దావీదు గారు! రాజు కాకముందు, రాజయ్యాక కూడా అనేకమైన శ్రమలను శోధనలు ఎదుర్కొన్నారు!!! ఒకరోజు రాజుగానే కాదు చక్రవర్తి అయ్యారు దావీదు గారు! ఏడ్పు వచ్చినా పాట పాడేవారు లేక పాట రాసేవారు, సంతోషం వచ్చినా పాటే, యుద్ధానికి వెళ్ళినా పాటే, గెల్చినా పాటే, దేవుని మందిరానికి వెళ్ళినా పాటే! ఇలా దేవుని స్తుతి తన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది! ఇదే ఆయనను విజయశీలిగా చేసింది! దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవునిచేతనే సర్టిఫై చేయించుకోగలిగారు!

 

దావీదుగారు తన శ్రమలను శోధనలను కేవలం స్తుతి ఆరాధన ద్వారా జయించగలిగారు! మరి నీకు అలాంటి స్తుతి ఉందా సహోదరుడా! కష్టాలు వచ్చినప్పుడు ఎవడైనా దేవున్నే ప్రార్ధిస్తాడు, కారణం మరో దారిలేదు కాబట్టి! మరి కష్టాలప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? సుఖాలప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లిస్తున్నావా? ప్రతీ విషయంలో దేవుణ్ణి ముందు పెడుతున్నవా? దావీదు గారు ఏమి చెయ్యాలన్నా ముందు దేవుణ్ణి అడుగకుండా ఏమీ చెయ్యలేదు! కేవలం బత్షేబ విషయంలో మాత్రం దేవుణ్ణి అడుగకుండా చేసినందు వలన దేవుని చేత చీవాట్లు పొండుకుని శ్రమలను కోరి తెచ్చుకున్నారాయన! మరినీవు దేవుణ్ణి అడిగి చేస్తున్నావా ఏపని అయినా?

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎలీయా గారు, ఎలీషా గారు, ఇంకా పాత నిబంధన భక్తులందరూ ఎన్నెన్నో శ్రమలనూ శోధనలను ఎదుర్కొన్నారు!! పాపం భక్తుడైన యిర్మియా గారు బ్రతుకంతా ఏడుస్తూనే బ్రతికారు! చేయని నేరానికి ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని అవమానాలు పొందుకున్నారో? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షను పొందుకున్నారో!! అయినా దేవుణ్ణి విడువలేదు! చివరికి తన సొంతవారు ఆయనను రాళ్ళు రువ్వి చంపేశారు! అయినా విశ్వాశాన్ని వదలలేదు ప్రాణం పోయేవరకు!!

 

    దానియేలుగారికి శోధన వచ్చింది! 84 సంవత్సరాల వయస్సులో ఆయనను సింహాలబోనులో వేసేశారు తప్పు చేయకుండా! కేవలం ప్రార్ధిస్తూ గడిపారు! తన ప్రార్ధన సింహాల నోళ్లను మూసింది. ప్రార్ధన ద్వారా శ్రమలను జయించారు! ప్రపంచానికి దేవున్ని పరిచయం చేశారు.

షడ్రక్ మేషాక్ అబెద్నెగోలకు భయంకరమైన శోధన వచ్చింది. బంగారమ్మను మ్రొక్కమన్నాడు చక్రవర్తి, మేము మ్రొక్కమన్నారు, చావడానికి సిద్దమన్నారు! అగ్నిగుండములో త్రోయబడ్డారు! అక్కడున్న వారందరికీ భగవంతుని ప్రత్యక్షత కలిగించారు! నా చేతిలోనుండి తప్పించగలిగిన దేవుడెవడైనా ఉన్నాడా అన్న నోటితోనే జీవముగల దేవుని సేవకులారా అని చెప్పి, ఇవ్విధముగా రక్షించగలిగిన దేవుడెవరూ లేరని పలికించారు! గొప్ప అధికారులు కాగలిగారు!

 

ఇక క్రొత్త నిబంధన  భక్తులందరూ దెబ్బలు శ్రమలు శోధనలు అవమానాలు పొందుకున్న వారే!

 

అంతెందుకు? యేసుక్రీస్తుప్రభులవారే ఎన్ని శ్రమలు శోధనలు అనుభవించారో కదా! తన చిన్నతనంలో తండ్రిలేకుండా పుట్టినోడు అంటూ అవమానించారు! తానూ సేవచేసిన మూడున్నర సంవత్సరాలు ఎన్నెన్నో అవమానాలు చీత్కారాలు పొందారో? పరిచర్య ప్రారంభించాక ముందు సాతాను గాడితో శోధన పరీక్ష అనుభవించారు! చివరకు 39 కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, అవమానాలు, ముళ్ళకిరీటం, సిలువమరణం, మూడు మేకులు ఇవన్నీ పొందారు అనుభవించారు! మరణాన్ని జయించారు! అందుకే పరలోక అధిపతి అయ్యారు! భూమిమీదను పాతాలమందును ఆకాశమందును సర్వాదికారం పొందుకున్నారు! పౌలుగారు అంటున్నారు....

Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8,9,10,11

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6.ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

చివరికి శ్రమల ద్వారా తాను సంపూర్ణత సాధించి అమనలను సంపూర్ణులుగా చేస్తున్నారు!

 

పేతురు గారు ఎన్ని శ్రమలను శోధనలను అనుభవించారు? పౌలుగారు ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు పత్రికలో రాస్తున్నారు!..

 

అయితే ఇవన్నీ అనుభవించాక తిమోతి గారికి చార్జి అప్పగిస్తూ అంటున్నారు: మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుద ముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక నాకొరకు నీతికిరీటం ఉంచబడింది అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు! యాకోబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి సరిగ్గా పౌలుగారు చెబుతున్నారు నా కొరకు నీతికిరీటం ఉంచబడింది!

2తిమోతి 4:7--8

 

మరినీవు అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చే స్తితిలో ఉన్నావా?

 

శ్రమలు శోధనలు లేకుండా నీకు ఆధ్యాత్మిక దీవెనలు, వరాలు ఫలాలు లేవు! పరీక్ష లేకుండా నీవు డిగ్రీ పొందుకోలేవు, ఉద్యోగం పొందుకోలేవు! యేసుక్రీస్తుప్రభులవారు ఎలా శ్రమల బాటలో సంపూర్ణత సాధించారో నీవుకూడా బాటలోనే సంపూర్ణత సాధించగలవు! సంపూర్ణత మరియు జయజీవితం లేకుండా నీవు ఎత్తబడలేవు!

 

చూడండి!  ఒక చెక్క- ఎన్నో ఉలి దెబ్బలను సుత్తి దెబ్బలను తిని ఓర్చుకున్నాకనే మంచి వస్తువుగా లేక విగ్రహంగా తీర్చబడుతుంది! అలాగే ఒక రాయి ఎన్నెన్నో సుత్తి సేనం ఉలి దెబ్బలను తింటుంది బహుశా కొన్ని లక్షల దెబ్బలు తింటుంది. చివరికి అందమైన ఒక రూపానికి వస్తుంది! రూపానికి రావడానికి అది ఎన్నో శ్రమలను దెబ్బలను తిన్నది ఈరోజు ప్రజలందరూ దానిని చూసి ఆహా ఓహో అంటున్నారు!

అదే విధంగా ఒక కుండ అది రూపానికి రావడానికి ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కొంది! పిసకబడింది, బాధపడింది,  దెబ్బలు తింది, కాల్చబడింది! తర్వాతనే అది వాడబడుతుంది! నీవుకూడా దేవునిచేత వాడబడాలి అంటే తప్పకుండా దెబ్బలు శ్రమలు శోధనలు అనుభవించాలి!

 

మరి నీవుకూడా దేవునిచేత వాడబడతావా? అయితే శ్రమలను ఓర్చుకో!

 

యోసేపుగారు ఓర్చుకున్నారు! దేశానికి అధిపతి అయ్యారు!

 

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 17 భాగము*

*శోధనలు/శ్రమలు-4*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! శోధనలు శ్రమలు సహించిన వారి భాగ్యములను ధ్యానం చేసుకున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

   ఇక మనము ఇంతకీ శ్రమలు/శోధనలు/విషమపరీక్షణలు ఎందుకు కలుగుతాయి అనేది చూసుకుందాం ఈరోజు!  శోధనలు పరీక్షలు దేవుని నుండి కలుగవు అంటున్నారు 1314 వచనాలలో!

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మనలని పరీక్షిస్తారు గాని దురాశ కలిగించరు!

 ఉదాహరణకు ఆదికాండం 22 లో అబ్రాహాము గారిని పరీక్షించారు. కీర్తనల గ్రంధంలో 66:1012లో అంటున్నారు:..

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు నేర్పిన పరలోక ప్రార్ధనలో మత్తయి 6:13 లో మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మరియు కీడు నుండి తప్పించుము అని ప్రార్ధన చెయ్యమమని నేర్పారు ప్రభువు! దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే దేవుడు ఎవరిని శోధించరు మరి మనకు కలిగే శోధనలు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి???

 

రోజు మనం మొదటి కారణం చూసుకుందాం! ఇది 14-15 వచనాలలో ఉంది. ప్రతీవాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి శోధనలను తనకుతానుగా శోధనలు తెచ్చుకుంటారు! ఇది మొదటి కారణం! ఎందుకు అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పండిపోయి మరణానికి తీసుకుని వెళ్తుంది అంటున్నారు!

 

మరి యాకోబు గారు చెప్పిన స్టేట్ మెంట్ నిజమా కాదా, నిజమైతే ఎవరికైనా ఇలా జరిగిందా అని మాటలద్వారా కాక వాక్యపు వెలుగులో చూసుకుందాం!

 

మనం ఆదికాండం లో చూసుకుంటే బిలాము గారు కనిపిస్తారు. ఆయనకోసం చూసుకుంటే ఆయన అన్యజనాంగంలో నుండి యెహోవా దేవుడు ఏర్పాటుచేసుకున్న మొదటి ప్రవక్త! నిరంతరం దేవునితో సంభాషించే అనుభవం గలవాడు! ఆయన నోటితో దీవిస్తే వారికి దీవెన, శపిస్తే అవతలి వారు శాపం పొందుకుంటారు అంతటి శక్తివంతమైన పరిచర్య గలవాడు!! ఇంతటి మహా భక్తుడు గాని ధనాశ ఆకర్షించి పాపములో పడిపోయాడు! దేవుడు వద్దని చెప్పినా ఇశ్రాయేలు జనాంగమును శపించడానికి బయలుదేరాడు. గాడిదచేత కూడా బుద్ది చెప్పించుకున్నాడు, వెళ్లి శపించడానికి బదులు ఆశీర్వదించి వెళ్లిపోతుంటే , పెద్దలు బ్రతిమిలాడితే భయంకరమైన సలహ ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలలో 24వేలమంది మరణించడానికి కారణం అయ్యాడు! ఏమని కోరుకున్నాడు అంటే నీతిమంతులకు వచ్చు మరణం వంటి మరణం నాకు కావాలి అని కోరుకున్నా , సంఖ్యాకాండం, యెహోషువా గ్రంధంలో వ్రాయబడి ఉంది చంపబడిన ఇతరులు కాక.. అంటూ రాస్తూ బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి!!! ఇలా గొప్ప ప్రవక్త, దేవునితో మాట్లాడే అనుభవం, దీవెనకరంగా జీవించిన గొప్ప ప్రవక్త- ధనాశ వలన పాపిగా మారి కుక్కచావు చచ్చాడు!  నీతిమంతుని మరణం కావాలని కోరుకున్నా గాని ఒక పాపి దుర్మార్గుడు పొందుకునే మరణం పొందుకుని సరియైన సమాధి చేయబడకుండా కుక్క శవంలా పారవేయబడ్డాడు! Numbers(సంఖ్యాకాండము) 22:5,6,11,12,22,23,28,32,33

5. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.

6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.

11. చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.

12. అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.

22. అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.

23. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా

28. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అదినీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా

32. యెహోవా దూత యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.

33. గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను.

సంఖ్యాకాండము 23:10

10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.

సంఖ్యాకాండము 31: 8

చంపబడిన యితరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.

 

ఇదే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనడం అంటే!!! 

 

   ఈయన లాంటివాడే మరొకడు ఉన్నాడు! పౌలుగారితో సుమారుగా పదిహేను సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి, గొప్ప ప్రసంగీకుడుగా, పరిశుద్ధ వరాలు ఫలాలు పొందుకున్న పరిశుద్దుడుగా పౌలుగారి దగ్గర ఒక కుమారుడిలా పెరిగి, పౌలుగారు రోమా చెరసాల లో ఉంటే కొద్దిరోజులు పరిచర్య చేసి, ఆయనను అంటిపెట్టుకుని సపర్యలు చేయవలసినది పోయి, దూరంనుండి వచ్చిన వార్త విని పౌలుగారిని విడిచిపెట్టి పోయాడు! ఒక అబద్దం చెప్పాడు, అయ్యగారు థెస్సలోనికయ సంఘం నుండి వార్త వచ్చింది, అక్కడ కొన్ని సరిచేయవలసిన విషయాలున్నాయి, నేను వెళ్లి మరలా వస్తాను అని చెప్పి , థెస్సలోనికయ వెళ్లి, సంఘమునకు వెళ్ళకుండా పట్టణం బయట ఉన్న వెండి గనికి వెళ్ళాడు! నిజానికి తెలిసిన వర్తమానం ఏమిటంటే- థెస్సలోనికయ పట్టణం బయట ఉన్న కొండలో వెండి గని ఉంది, దానిని తవ్విన ప్రతీ ఒక్కరికీ బోలెడు వెండి దొరుకుతుంది, త్రవ్విన ప్రతీవాడు ధనవంతుడు అయిపోతున్నాడు అనేమాట విని వీడుకూడా వెండి గనికి వెళ్ళాడు, వెళ్ళిన వెంటనే త్రవ్వడం మొదలుపెట్టాడు. బోలెడు వెండి దొరికింది. సాయంత్రం అయిపోయింది. ఇంకో గంట ఉంటే ఇంకా వెండి దొరుకుతుంది అనుకుని చీకటి పడినా త్రవ్వడం ఆపలేదు. చీకటిలో కాలు జారింది, లోయలో పడిపోయాడు. శవానికి ఆనవాలు కూడా లేకుండా జంతువులూ మరియు రాంబందులు పీక్కుతిన్నాయి! దిక్కులేని చావు చచ్చాడు మరో పరిశుద్ధుడు! దురాశ గర్భం ధరించి చావుకి తీసుకుని పోయింది భక్తుణ్ణి! ఇతని పేరు దేమా! అందుకే పౌలుగారు రాస్తున్నారు దేమా ఇహలోకమును ఆశించి థెస్సలోనికయకు వెళ్ళెను అంటూ! 2తిమోతికి 4: 10

దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

 

యేహెజ్కేలు గ్రంధంలో దేవుడు నిన్ను నేను కావలివానిగా ఉంచుతున్నాను అని చెబుతూ భక్తునితో అంటున్నారు: ఒక దుర్మార్గుడు తన జీవితం అంతా పాపిగా జీవించి, నేను నీ ద్వారా  చెప్పిన గద్దింపు విని లోబడి మారుమనస్సు పొందితే వాడు క్షమించబడిపరిశుద్దుడుగా మారుతాడు అని చెబుతూ, ఒక నీతిమంతుడు తన జీవితమంతా నీతిగా జీవించి చివరలో పాపం చేస్తే వాడి నీతి పోయి నరకానికి పోతాడు, వాడి భక్తీ మరువబడుతుంది అన్నారు! ఇద్దరు భక్తులకు  అదే కలిగింది!......

Ezekiel(యెహెజ్కేలు) 18:23,24,26,27

23. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.

26. నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును?

27. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.

 

 ప్రియ సేవకుడా! సేవకులకు ఎక్కువగా శోధించే శోధనలు మొదటిది: స్త్రీ, రెండు: ధనం, మూడు: పొగడ్త!! వీటిలో పడ్డావా- అట్టర్ ఫ్లాఫ్ అయిపోతుంది నీ జీవితం! ఇద్దరు దైవజనులు- దురాశ వలననే దిక్కుమాలిన చావు చచ్చారు! నీవుకూడా జాగ్రత్తగా ఉండమని మనవిచేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 18 భాగము*

*శోధనలు/శ్రమలు-5*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! తమ స్వకీయ దురాశల వలన శోధనలు శ్రమలు కొని తెచ్చుకున్న కొందరి గూర్చి  ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా రోజు మరికొందరిని జ్ఞాపకం చేసుకుని మనకు మనమే బోధ చేసుకుందాం!

 

ఆదిలోనే దురాశ వలన భయంకరమైన స్థితికి వచ్చిన మరో పరిశుద్దుడు, ఏర్పాటు చేయబడ్డ కెరూబు, వేకువ చుక్క లూసిఫర్! వీడు దేవుని దగ్గర పరలోకంలో ప్రధాన దూతయై, ప్రభువును స్తుతించడానికి ఏర్పరచబడ్డ క్వయిర్ లీడర్! వీడు చేయి ఎత్తితే మ్యూజిక్, దేవదూతలందరూ వీడి సంజ్ఞలు విని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు! ఒకరోజు వీడు అనుకున్నాడు: దేవుడు అలా సింహాసనం మీద కూర్చుంటున్నాడు అంతే, దేవదూతలందరూ నేను ఏమి చెయ్యమంటే అది చేస్తున్నారు. నాకు లోబడుతున్నారు! కాబట్టి ఆయనకు దేవునికి నేనెందుకు లోబడాలి- ఆయనకన్నా నా స్థానాన్ని ఎత్తుగా చేసుకుంటాను! సభా పర్వతం మీద కూర్చుంటాను అని మనస్సులో అనుకున్నాడు అంతే, ఒక్క తాపు తంతే పాతాళంలో ఒక మూలకు పడ్డాడు. వీడికోసం బైబిల్ లో ఏమి వ్రాయబడిందో చూసుకుందాం....

Isaiah(యెషయా గ్రంథము) 14:12,13,14,15

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

Ezekiel(యెహెజ్కేలు) 28:12,13,14,15

12. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంక రింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

14. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

15. నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

 

చూశారా- వీడి దురాశ వలన పరలోక భాగ్యము పోగొట్టుకోవలసి వచ్చింది, ఒక పరిశుద్ధుడు పాపిగా మారిపోయాడు! ఒక కెరూబుగా, దేవుని యొక్క ప్రధాన దూతగా ఉండటం చాలా అల్పమని భావించి దేవుడైపోవాలి అనుకున్నాడు! ఏదీ లేకుండా పోయింది!  వీడిలో మొదట గర్వము, రెండు దురాశ, మూడు జీవపు ఢంభము పనిచేసి వీడ్ని అత్యల్ప స్థానానికి సాతానుగా మార్చింది!

 

  ఇలాంటి పనికిమాలిన బుద్ధే వచ్చింది మరొకనికి, వాడు తనతో మరికొందరిని చేర్చుకున్నాడు! వీడిపేరు కోరహు! వీడు దాతాను అభిరాములను తనతో చేర్చుకున్నారు! వీరు మరో 250 మందిని కలుపుకున్నారు! వీరంతా మోషేగారిమీద వ్యతిరేఖంగా పోగయ్యారు! మోషేగారు భాధపడ్డారు. దేవుడు రౌద్రుడు అయ్యారు! మొత్తానికి అసాధారణ మరణం కలిగి పోయారు! అసాధారణ మరణం అనగా మానవులంతా పోయే సాధారణ దారిలో పోకుండా భూమి నోరు తెరిచి వీరిని మింగేసింది! ఇది మనకు సంఖ్యాకాండంలో కనిపిస్తుంది.....

Numbers(సంఖ్యాకాండము) 16:1,2,3,4,9,10,11,15,20,24,25,27,29,30,31,32,33

 

1. లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

2. ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి

3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

4. మోషే మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను

9. తన మందిరసేవ చేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?

10. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.

11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.

15. అందుకు మోషే మిక్కిలి కోపించినీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.

20. అప్పుడు యెహోవామీరు సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.

24. కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.

25. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.

27. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.

29. మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు.

30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.

31. అతడు మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.

32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.

33. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.

 

వీడికి అధికార కాంక్ష అనే దురాశ మొదటిగా కలిగింది! రెండు ఓర్వలేనితనం పనిచేసింది! జీవపుడంభం కలిగింది. లేవీయులుగా వారు చేయబోయే కార్యాలు అత్యల్పంగా భావించి, యాజకత్వము తమకే కావాలనుకున్నారు! దేవునిచేతనే ప్రధానయాజకునిగా అంగీకరించబడ్డ ఆహారోను గారి ప్రధాన యాజకత్వము కూడా కావాలనుకున్ని భయంకరమైన చావు చచ్చారు!

 

ప్రియ సంఘమా! జాగ్రత్త! ఇలాంటి బుద్ధి ఉంటే వెంటనే విడిచి పెట్టు! చెప్పడానికి బాధగా ఉన్నా కొంతమంది విశ్వాసులు దేవునిచేత పిలువబడ్డ దైవసేవకులను చూసి కుళ్ళిపోతూ అనుకుంటున్నారు, నేను పాటలు పాడితేనే ఆరాధన జరుగుతుంది. నా పాటల కోసమే సంఘం అంతా వస్తున్నారు, ఆయనకు వాక్యం బాగా చెప్పడం రాదు, నేను లేకపోతే సంఘమే లేదు అనేవారు కూడా ఉన్నారు! నా వల్లనే అక్కడ ఆరాధన జరుగుతుంది నేను మానేస్తే పాష్టర్ కదా ఇంతే! అనుకుంటూ ఉన్నారు చాలామంది నేటి రోజులలో! యేసయ్య ఒకరోజు అంటున్నారు: వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తారు అని, అలాగే నీవు గుడి మానేస్తే దేవుడు కుక్కనైనా వాడుకుంటాడు, బిలాముకి బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్న దేవుడు ఎవరినైనా వాడుకుంటారు, నీవు కాకపోతే నీ బాబుని వాడుకుంటారు దేవుడు, గాని రెండు పాటలు రెండు ప్రసంగాలు చేయడం వస్తే,  సంగీత వాయిద్యాలు వాయించడం వస్తే నా అంత మొనగాడు లేడు అనుకుని ఫీల్ అవ్వకు! దేవుని పని ఆగదు! మరొకరిని ఉపయోగించుకుంటారు దేవుడు! అలాగే కొందరు దురాశతో రెండు పాటలు ప్రసంగాలు నేర్చుకుంటే నీ సంఘానికి నీ కాపరికి వ్యతిరేఖంగా మరో సంఘం పెట్టేసుకుంటున్నావు! జాగ్రత్త- దురాశే లూషీఫర్ ని, కోరహు దాతాను అబీరాములను కుక్కచావు చచ్చేలా చేశాయి! నీవు కూడా ఇలాంటి దురాశను అధికార కాంక్షను వదిలిపెట్టు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 19 భాగము*

*శోధనలు/శ్రమలు-6*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! తమ స్వకీయ దురాశల వలన శోధనలు శ్రమలు కొని తెచ్చుకున్న కొందరి గూర్చి  ధ్యానం చేసుకున్నాము! ఇక శోదనలు సంభవించడానికి మరో కారణం : దేవుడు నిన్ను హెచ్చించడానికి, మరియు మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకోడానికి, లేదా నిన్ను ఆధ్యాత్మికంగా మరో మెట్టు ఎక్కించడానికి దేవుని సాధనం!

 

  ఇలా హెచ్చించిన వారిలో మొట్టమొదట మనం యోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి! నిజం చెప్పాలి అంటే యోబు గారి విషయంలో యోబు గారు చేసిన దోషము పాపము ఏమీలేదు! కేవలం దేవుడు మరియు సాతాను గాడు బెట్ కట్టుకుని యోబు గారికి శోధనలు/ పరీక్షలు తీసుకుని వచ్చారు! ఒక్కరోజులో తనకున్న ఆస్తి మొత్తం పోయింది. తనకున్న ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు! తర్వాత మరో సమావేశం- తద్వారా యోబుగారికి ఒళ్ళంతా కురుపులు వచ్చాయి! ఆయన ఆరోగ్యం పాడైపోయింది! భార్య దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది! యోబు 1,2 అధ్యాయాలు.  స్నేహితులు నీవు పాపివి దుర్మార్గుడివి కాబట్టే దేవుడు నీకు శిక్ష విధించాడు అన్నారు! గాని ఆయన దేవుని మీదనే ఆనుకున్నారు! యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనెను! యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నారు!

 యోబు 1: 21

నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

 ఇంకా ముందుకు పోతే నేను శోదించబడిన మీదట సువర్ణముగా మారుదును అనే గొప్ప విశ్వాసముతో కూడిన  స్టేట్మెంట్ ఇచ్చారు! యోబు 23: 10

నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

మరో తిరుగులేని స్టేట్మెంట్ ఏమిటంటే ఒకరోజు నేను దేవుణ్ణి చూస్తాను అనే మాట! యోబు 19: 25

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.

 యోబు 19: 26

ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

 

ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా దేవుణ్ణి విడువలేదు! తన నీతిని తాకట్టుపెట్టలేదు! భార్యను తిట్టలేదు! మూర్ఖురాలు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు అన్నారు! చివరికి ఆయన విశ్వాసం ఆయనను దేవునిని చూసేలా మాట్లాడేలా చేసింది! మొదట కలిగిన ఆస్తికి రెట్టింపు ఆస్తి కలిగింది! తనకు పూర్వమున్న ఆరోగ్యం కంటే మెరుగైన ఆరోగ్యం కలిగింది! మరలా పిల్లలు పుట్టారు!(అదే భార్యతోనే నండి)! కాబట్టి పరీక్ష యోబుగారికి ఆస్తి ఐశ్వర్యం తీసుకుని రావడమే కాకుండా,  దేవుణ్ణి చూసే అనుభవం, మరింత దృఢమైన విశ్వాసపు స్థితి యోబు గారికి తీసుకుని వచ్చింది!

Job(యోబు గ్రంథము) 42:10,12,13

 

10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.

13. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

 

   ప్రియ దైవజనమా! నీకు కలిగే శ్రమలు శోధనలు పరీక్షలు కూడా నీకు కొన్ని రోజులు బాధలు ఇబ్బందులు కలిగించినా తర్వాత మరింత మెరుగైన ఆత్మీయ స్థితిని, ఇంకా దృఢమైన విశ్వాసాన్ని  ఇంకా మెరుగైన ప్రార్ధనా అనుభవం గల స్థితిని, ఇంకా బలమైన అత్మానుభవాన్ని నీకు తీసుకుని వస్తాయి! ఇక అనుభవంతో నీకు ఇంతకంటే కటిన మైన స్థితి గల శోధనలు పరీక్షలు ఎదురయ్యేలా చేస్తారు! అప్పుడు నీవు నిలబడితే దానికన్నా మెరుగైన అనుభవం కలిగేలా చేస్తారు దేవుడు! ఇలా నిన్ను శ్రమలు శోధనలు అనే కొలిమిలో వేసి నిన్ను శుద్ధి చేసి నీకు పుటమి వేసి నిన్ను పూర్ణత నుండి సంపూర్ణతకు, సంపూర్ణత నుండి పరిపూర్ణతకు తీసుకుని పోయి- చివరకు నిన్ను క్రీస్తురూపము లోనికి మార్చుతారు! అప్పుడే నీవు జయించిన వాడవు! జయజీవితపు అనుభవం గలవాడవు!

 

హెబ్రీ పత్రికలో భక్తుడు చెబుతున్నారు: నిన్ను ..... ఇలా శ్రమల ద్వారా నిన్ను సంపూర్ణునిగా మార్చడం దేవునికి అలవాటు అన్నారు.....

Hebrews(హెబ్రీయులకు) 2:10,11,18

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

18.తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే విద్యార్దులకు సంవత్సరం అంతా పాటాలు చెప్పి- సంవత్సరాంతమున వారికి పరీక్షలు పెడతారు! ఎందుకంటే నీవు ఎంతగా నేర్చుకున్నావు, పాటాలను నీవు ఎంతగా అర్ధం చేసుకున్నావో నిన్ను పరీక్షిస్తారు పరీక్షల ద్వారా! వాటిలో ఉత్తీర్ణత సాధిస్తే అంతకంటే పెద్ద తరగతికి లేక డిగ్రీకి వెళ్ళడానికి అర్హత కలుగుతుంది! అదే విధంగా దేవుడు కూడా నిన్ను పరీక్షించి  దానిలో నీవు విజయం సాదిస్తే అంతకన్నా పెద్ద ఆధ్యాత్మిక స్థితి కలిగించి మరిన్ని వరాలు ఫలాలు ఇస్తారు దేవుడు నీకు!

 

ఇక తర్వాత అంటున్నారు: దేవుడు నీవు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే నిన్ను శోధించడానికి ఒప్పుకుంటారు గాని నీవు తట్టుకోలేనంతగా శోధనలను పరీక్షలను దేవుడు నీకు అనుమతించరు అని చెబుతున్నారు! ఇంకా శోధనలను జయించే మార్గము కూడా నీకు చూపిస్తారు! 1కోరింథీయులకు 10: 13

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

 కనుక శ్రమలు రాకుండా సహాయం చెయ్యు అనడం కంటే శ్రమలను తట్టుకునే బలం దయచేయు, వాటిని జయించే మార్గం దయచేయు అని ప్రార్ధించాలి! సామెతల గ్రంధకర్త అంటున్నారు: శ్రమ దినమందు నీవు కృంగిపోతే నీవు చేతకాని వాడవౌతావు అంటున్నారు!సామెతలు 24: 10

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

 కాబట్టి శ్రమలలో శోధనలలో కృంగిపోకు! దైర్యంగా పోరాడి విజయం సాధించు!

 

ముగించే ముందు ఒక్కమాట చెప్పనీయండి:  *ఒక విద్యార్ధి తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు చదువుతాడు? పదిహేను సంవత్సరాలు గాని మరీ ఎక్కువైతే పద్దెనిమిది సంవత్సరాలు మాత్రం చదువుతాడు! ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఎంత కాలం సుఖపడతాడు? దానికి నాలుగైదు రెట్లు సంవత్సరాలు సుఖంతో జీవిస్తాడు! బహుశా 22 నుండి 30 సంవత్సరాల మధ్య ఉద్యోగం సాధిస్తే తాను చనిపోయే వరకు తానూ, తన పిల్లలు కూడా సంతోషంగా బ్రతకటానికి గల సంపాదన కలిగి సంతోషంగా జీవించగలడు! దీనికి అతడు కష్టపడింది కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే! అలాగే ఒక విశ్వాసి తన జీవితంలో శ్రమలు శోధనలు పరీక్షలు అనుభవిస్తూ చప్పిడి పథ్యం చేసేది ఎన్ని సంవత్సరాలుమహా అయితే ఒక నలబై నుండి అరవై సంవత్సరాలు మాత్రమే! అయితే విశ్వాసం, శ్రమలు చప్పిడి పథ్యం వలన నీవు ఒకసారి విజయం సాధిస్తే, పరదైసులో కొంతకాలం, వెయ్యేండ్ల పాలనలో వెయ్యి సంవత్సరాలు, మధ్యాకాశంలో ఏడేండ్లు, చివరకి నిత్యత్వంలో నిరంతరం సుఖసంతోశాలతో జీవించగలవు! కాబట్టి కొంతకాలము ఓర్చుకోండి! ఇప్పుడు ఓర్చుకుంటే అప్పుడు సంతోశిస్తావు! ఇప్పుడు ఓర్చుకోలేక పోతే అప్పుడు నిరంతరం అగ్ని గంధకాలతో మండే గుండములో అలమటిస్తూ ఉంటావు!*

మరి నీకు ఏది కావాలి?

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 20 భాగము*

*శోధనలు/శ్రమలు-7*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! ఇక విశ్వాస జీవితంలో శ్రమలు శోధనలు కలుగటానికి మరో కారణం: సాతాను గాడి శోధన.

 

ఇది సంఘకాపరులకు సేవకులకు సువార్త పరిచర్యలో ముందుకు సాగకుండా సాతాను గాడు ఆటంకాలు కలుగజేస్తాడు!

 

ఇక విశ్వాసులకు వారి విశ్వాస బ్రష్టులు చెయ్యడానికి భయభ్రాంతులను చెయ్యడానికి సాతాను గాడి సాధనము శ్రమలు శోధనలు!

 

మొదటగా దేవుని సేవకులకు సాతాను గాడు కలుగజేయు శోధనలు చూసుకుందాం!

 

ఆదినుండి దేవుని సేవకులను అధైర్యపరచడానికి సాతాను గాడు శ్రమలను శోధనలను సాధనంగా చేసుకున్నాడు! పాత నిబంధన భక్తులు గాని, క్రొత్త నిబంధన భక్తులు గాని, ప్రస్తుతమున్న భక్తులను గాని ఇటువంటి శోధనలు శ్రమలు చూడకుండా వారు విశ్వాసజీవితంలో జయజీవితం జీవించలేదు! ప్రతీ భక్తునికి ఇది మామూలే! పౌలుగారు తన చివరి పత్రికను తిమోతి గారికి రాస్తూ అంటున్నారు: క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువానికి హింసలు శ్రమలు కలుగుతాయి! 2తిమోతికి 3: 12

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

 నిజమైన విశ్వాస జీవితం అనగా సద్భక్తితో బ్రతకాలి అనుకుంటేనే శ్రమలు! నలుగురితో........ కులంతో ....... అన్నవాడికి శోధనలు రానేరావు! నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక పాట పాడేవారు! క్రీస్తుయేసు మంచి సైనికా శ్రమలయందు సోలిపోవక అంటూ.. నిజమైన క్రైస్తవునికి శ్రమలుండుట ఖాయము- న్యాయము, ప్రార్ధనలో ఎదురించుట క్రైస్తవుని ధ్యేయము...  కాబట్టి నిజమైన విశ్వాసం కలిగి జీవించాలి అనుకుంటే తప్పకుండా శ్రమలు శోధనలు కలుగుతాయి! అయితే శ్రమలు శోధనలు కలిగించేవాడు సందర్భాలలో సాతాను గాడే! ఇవి అనేక రకాలుగా ఉంటాయి! వీటికోసం విస్తారంగా విశ్వాసి-ఆత్మీక పోరాటాలు అనే శీర్షికలో ఎంతో వివరంగా రాయడం జరిగింది. మరలా చదవాలి అనుకుంటే లింకుని నొక్కి డౌన్లోడ్ చేసుకోండి

https://drive.google.com/file/d/1u_O7VK2wsopXJkDbwGBKtuWpyax9Bekf/view?usp=drivesdk

 లేక మా వెబ్సైట్ లో చదవండి. https://adhyatmikasandeshalu.blogspot.com/

 

   మా నాన్న గారిమీద ఎలాంటి కేసు పెట్టాలో తెలియక మా ప్రాంత ప్రజలకు మందు రాసి మతంలో కలిపేస్తున్నాడు అని 13 గ్రామాల ప్రజలు నాన్న గారిమీద కేసు పెట్టారు! అది సుమారుగా 12 సంవత్సరాలు కోర్టుల వెనుక తిరగాల్సి వచ్చింది నాన్నగారు! ఇలాంటివి సువార్త పరిచర్యలో మా చిన్నతనంలో సేవకులకు ఎంతో కామన్ గా ఉండేవి!

 

యేసుక్రీస్తు ప్రభులవారికే శోధనలు తప్పలేదు! ఆయన సువార్త పరిచర్య ప్రారంభించేముందు 40 ఉపవాసం చేస్తే- ఉపవాస దీక్ష ముగిసిన వెంటనే సాతాను గాడు శోధించాడు! మత్తయి 4 అధ్యాయం. ఆయన వాడిని జయించారు! ఇలా భక్తులందరికీ ఎన్నెన్నో శ్రమలు కలిగాయి గాని వారు శోధనలకు జడిసి సేవా పరిచర్య మానలేదు! యేసయ్య ఇవి ముందుగానే జరుగుతాయి అని హెచ్చరించారు! యోహాను 16: 33

నాయందు మీకు సమాధానము కలుగునట్లు మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

ఇంకా మీరు ఇలాంటి శ్రమలు శోధనలు కలిగినప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును అంటూ కొండమీద ప్రసంగలో ముందుగానే చెప్పారు! మత్తయి 5: 11

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

మత్తయి 5: 12

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

 

 శిష్యులులందరికీ శ్రమలు శోధనలు ఎదురయ్యాయి! అయినా వారు పరిచర్య మానలేదు! ఆదిలోనే శిష్యుడైన పెద్ద యాకోబు గారిని చంపి సువార్తను  పరిచర్యను ఆపాలని చూశాడు! అపోస్తలుల కార్యంలో వ్రాయబడింది, ఇవి పొందడానికి వారు పాత్రులు అని ఎంచబడినందున వారు సంతోషించుచు  వెళ్లారు అట! 5:41

 

ప్రభువు యొక్క శిష్యులలో ఇలా సభల ముందట, నాయకుల ముందట కోర్టుల యెదుట హాజరవని శిష్యుడు ఎవరూ లేరు! ఇలాంటి శ్రమలు అనుభవించే వారు పరిచర్యను మన వరకు తీసుకుని వచ్చారు! శిష్యులు కూడా పరిచర్య చేసేటప్పుడు మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకం వెళ్ళాలి అంటూ ప్రజలకి ముందుగానే చెప్పారు!

అపో.కార్యములు 14: 22

శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

 పౌలుగారు తెగించి మనము శ్రమలు శోధనలు పొందడానికే పిలువబడ్డాము అన్నారు ....

1థెస్సలొనికయులకు 3: 4

అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

 

కాబట్టి సేవకుడైనా, విశ్వాసి అయినా సువార్త పనిలో ముందుకు సాగుతూ ఉంటే వారిని నిరాశ పరచడానికి అధైర్య పరచడానికి సాతాను గాడు శ్రమలను శోధనలను పంపిస్తాడు! అవి ఇరుగుపొరుగు వారితో కావచ్చు! ఊరిపెద్దలతో కావచ్చు! ప్రభుత్వము నుండి కావచ్చు!  వీరిని కూడా జయిస్తే వాడు విశ్వాసులలో లేక సంఘ పెద్దలలో పడి శోధిస్తాడు!  శోధన చాలా గొప్పది! వేదనతో కూడినది! ఎవరో దేవుణ్ణి తెలియక చేశారంటే ఏమో గాని తోటివిశ్వాసులు, కాపరులు, సంఘపెద్దలు శోధనలు కలిగిస్తున్నారు అంటే ఓర్చుకోవడం కొంచెం కష్టం! గుండె బ్రద్దలవుతూ ఉంటుంది! అందుకే ఒకసారి దావీదు గారు అంటున్నారు- పని చేస్తున్న నీవు పై వాడివి కాదు! నీవు నేను కలిసి భోజనం చేసినవారమే, కలిసి దేవుని మందిరానికి వెళ్ళిన వారమే అంటున్నారు! అంతటి గొప్ప భక్తుడు, ప్రవక్త, పాటగాడు, వాయిద్యకారుడు, రాజు, చక్రవర్తికే ఇలాంటి శోధనలు తప్పలేదు!... కాబట్టి మనకు కూడా ఇలాంటివి వస్తాయి కాబట్టి వాటిని కూడా జయించాలి!

 

ఇక దీనిని కూడా జయించావా- అప్పుడు సాతాను గాడి అంభులుపొది తీసి భార్యమీద పడి భార్యద్వారా శోధిస్తాడు! ఎంతోమంచి భార్య ఇప్పుడు గయ్యాలిగా మారిపోతుంది! ఎంతగానో సాధిస్తుంది! లేదా అలుగుతుంది, పుట్టింటికి కూడా వెళ్ళిపోతుంది! ఇది సాతాను గాడు భార్యమీద పడి శోదిస్తున్నాడు అని గ్రహించి సేవకులారా మనమే తగ్గిపోవాలి! నెమ్మదిగా వారితో మాట్లాడి సాతాను శోధన అని వారికి తెలియజెప్పాలి! ఇది ప్రతీ సేవకునికి ఎదురై ఉంటుంది! నాకు కూడా చాలాసార్లు ఎదురయ్యింది! నా భార్య చాలామంచిది! సువార్త పరిచర్యలో నాకు అన్నివిధాలా సహకరిస్తూ ఉంటుంది. వచ్చిన దైవసేవకులు ఎంతమంది వచ్చినా వండి పెడుతూ ఉంటుంది! గాని నేను గమనించాను- ఎప్పుడైతే మీటింగ్స్ సభలు పెడతానో దానికి ముందుగా ఆమెలో పడి నన్ను శోదిస్తూ ఉంటాడు సాతాను గాడు! ఒక్కోసారి అలిగి కూర్చుంటుంది!  అప్పుడు నేనే తగ్గిపోతాను! కోపం పోయాక వివరంగా చెబుతాను! వెంటనే ప్రార్ధించి సహకరిస్తూ ఉంటుంది!

 

మరో చిన్న సాక్ష్యం చెప్పనీయండి! నేను పోయినసారి షిప్ ఎక్కినప్పుడు రెండు నెలల కోసం ఎక్కితే ఎనిమిది నెలలు వరకు దిగడం అవ్వలేదు!  షిప్ లో ఉండగా సంఘం కోసం ప్రార్ధిస్తూ ఉండగా నీ సంఘం ఎలా ఉందొ చూడు అంటూ దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు! దర్శనంలో మా సంఘం కునికే కోడిలా ఉంది అన్నమాట! ప్రభువా నేను ఏమి చెయ్యగలను? ఉపవాస కూటాలు పెడితే ఒకసారి ఉజ్జీవం వచ్చి, సోడా కాయలో గేస్ పోయిన వెంటనే ఎలా చప్పబడిపోతాడో అలా తుస్సుమంటున్నారు, నేను ఏమి చెయ్యాలి అని ప్రార్ధిస్తే దేవుడు 15 రోజులు ఉపవాస కూటాలు పెట్టమన్నారు! ఆరోజునుండి షిప్ దిగటానికి ప్రయత్నిస్తే సాతాను గాడు నేను షిప్ దిగటానికి చేసే ప్రయత్నాలు అన్నీ వమ్ము చేశాడు! ఎనిమిది నెలలు అయిపోతే నేనే కావాలని నా షిప్ ని ఆపేసి, షిప్ ని అరెస్ట్ చేయించి దిగాల్సి వచ్చింది (నా ర్యాంకుకి అధికారం ఉంది). ఇంకా ఇంటికి రాకముందే దైవసేవకులతో మాట్లాడి, పోస్టర్స్ బ్యానర్స్ వేయించి అప్పుడు ఇంటికి వచ్చాను! గాని ఎవరికీ మీటింగ్స్ అని ముందుగా చెప్పలేదు! సాతాను గాడు నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు విపరీతమైన జ్వరం కలిగించాడు! తర్వాత రోజు నా భార్యకు టైఫాయిడ్ మరియు డెంగ్యూ రెండూ ఒకేసారి కలుగజేశాడు! నా ఇద్దరు కుమారులకు విపరీతమైన జ్వరం కలుగజేశాడు! నేను నా భార్యకు చెప్పాను- ఇది సాతాను గాడి పని అంటూ నాకు వచ్చిన దర్శనం అంతా వివరించాను! మనకు పదిహేను రోజులు కూటాలున్నాయి అని చెప్పాను.  వెంటనే నా భార్య నేను కలిసి ప్రార్ధన చేశాము!  జ్వరాలతోనే కూటాలు ప్రారంభమయ్యాయి! కూటం మధ్యలోనే నా భార్య సంపూర్ణ స్వస్తత పొంది అన్ని రోజులు ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా అందరికీ పరిచర్య చేసింది! కూటాలు జరుగుతుండగానే మా అన్నయ్యలిద్దరికీ వారి భార్యలకు పిల్లలకు టైఫాయిడ్ డెంగ్యూ కలుగుజేసింది సాతాను! వారికి కూడా చెప్పాను!  నాకు తెలుసు- కూటాలు ఆపడానికి సాతాను గాడు ఇంతగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే దేవుడు మా సంఘంలో గొప్ప కార్యాలు చేస్తారు అని! దానిని వివరంగా వివరించాను! నా భార్య సహకరించింది!

 

కాబట్టి సేవకులారా! నీ సేవకు ఆటంకంగా నీ భార్య మారితే నీవు సహనం పాటించు! బయట చిరాకులు నీ భార్యమీద చూపించకు! వారు బలహీన మైన ఘటాలు అని శిష్యులు ముందుగానే చెప్పారు! వారికోపం కొంచెం తగ్గాక వివరంగా వాక్య సహకారంతో వివరించి చెబితే తప్పకుండా సేవకు సహకరిస్తారు! ఒకమాట చెప్పనా మిగిలిన ఆడవారికంటే సేవకుల భార్యలు ఇంకా అధికంగా కష్టపడుతున్నారు! వీరు ఒక గృహిణి లేక భార్య నిర్వర్తించవలసిన భాధ్యతలే కాకుండా ఇంకా ఒక సేవకురాలుగా, సంఘానికి ఒక తల్లిగా ఉంటూ నిర్వర్తించాల్సిన భాద్యతలు, ఇంకా వచ్చిన దైవసేవకులను విశ్వాసులను పరామర్శించవలసిన భాద్యతలు అన్నీ ఎంతో ఓపికగా అలుపులేకుండా పనిచేస్తారు! ఇంకా ఎన్నోసార్లు వచ్చిన దైవసేవకుల కోసం తానూ తినవలసిన భోజనం కూడా సేవకులకు పెట్టేసి- ఇక వండుకోవడానికి ఓపికలేక మంచినీరు త్రాగి పడుకున్న రాత్రులు ఎన్నో ఉంటాయి- ఇది నేను చూశాను! కాబట్టి వారు ముందుగానే బలహీన మైన ఘటాలు కాబట్టి వారి కోపం రేపవద్దు! వారితో సహకరించండి! వారికోసం ప్రత్యేకంగా ప్రార్ధన చేసి ప్రేమించండి! శోధనలు వచ్చినప్పుడు ఓర్చుకుని వివరిస్తే తప్పకుండా వారు సువార్తకు సహకరిస్తారు! భార్య సహకారం లేకపోతే ఒక దైవసేవకుడు తన పరిచర్యను ఏమాత్రము బాగా చెయ్యలేడు! ఆమె సహకరిస్తే తను బయటకు వెళ్లి ఒక సైనికునిలా సాతానుతో పోరాడి విజయోత్సవంతో తిరిగి వస్తాడు దైవజనుడు!

 

కాబట్టి ప్రియ దైవజనుడా! ఎలాంటి శోధన వచ్చినా నీతో దేవుడు ఉన్నారు అని మర్చిపోకు! గ్రామస్తులనుండి సేవకు ఆటంకాలు కలిగినా, ప్రభుత్వ అధికారుల నుండి కలిగినా, ఆర్ధిక ఇబ్బందులు కలిగినా , కొన్నిసార్లు నీ ఆరోగ్యం మీద కొడతాడు, ఎన్ని కలిగినా ప్రార్ధన ద్వారా విశ్వాసం ద్వారా నీకు చూపించే ప్రేమ ద్వారా ఓర్పు ద్వారా వీటిని జయించగలవు! ఒకవేళ సంఘ పెద్దలనుండి విశ్వాసుల నుండి కలిగినా ఓర్చుకో! నోరు జారకు! ఇక నీ భార్యద్వారా కలిగినా ఓర్చుకో! వివరించి చెప్పు! నీ పరిచర్యలో సాగిపో!

 

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక 21 భాగము*

*శోధనలు/శ్రమలు-8*

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

         ప్రియులారా! మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! గతభాగంలో దేవుని సేవకులకు సాతాను గాడు కలుగజేయు శోధనలు చూసుకున్నాం! ఈరోజు విశ్వాసులకు రకమైన శోధనలు శ్రమలు పరీక్షలు కలుగుతాయో చూసుకుందాం!

 

    సాధారణంగా సేవకులకు కలిగేటటువంటివే కలుగుతాయి అయితే సేవకులకు -విశ్వాసులకు కలిగే శ్రమలు శోధనలతో పాటుగా బోనస్ గా సేవలో ఆటంకాలు కలుగుతాయి. విశ్వాసులకు బోనస్ ఉండదు! అయితే మరో రకమైన శ్రమలు శోధనలు కలిగి వారిని విశ్వాస బ్రష్టులు చెయ్యడానికి సాతాను గాడు ప్రయత్నం చేస్తాడు!

 

  మొదటగా సాతానుడు లోకాన్ని చూపించి లోకాశలు చూపించి తిరిగి పాపములోనికి లోకము లోనికి లాగాలని ప్రయత్నిస్తాడు! వీటిని జయించాలి! దీనికోసం వాడు ఉపయోగించే ఆయుధాలు: మొదటివి: శరీరాస, నేత్రాశ, జీవపు డంభము! హవ్వమ్మ గారికి సాతాను గాడు అవునా ఇది నిజమా అని చెప్పి, మీరు చావనే చావరు మీరు వాటిని తింటే మీ కన్నులు తెరువబడి మీరు మంచి చెడ్డలు తెలుసుకుని దేవతలై పోతారు అనబోసరికి (జీవపు డంభము), తినవద్దన్న ఫలాలు చూపునకి అందమైనవి, (నేత్రాశ), ఆహారానికి మంచివి (శరీరాస) అని చెబితే వెంటనే తను తిని తన పెనిమిటికి ఇచ్చేశారు ఆవిడ! రకంగా వారిని బ్రష్టులను చేసేసింది! (ఆదికాండం 3 అధ్యాయం).

 

ఇక రెండవ ఆయుధము: గలతీ పత్రిక 5 అధ్యాయంలో వివరించిన శరీర కార్యాలు మనలో పనిచేసి మనలను బ్రష్టులను చేసేస్తాయి! వ్యభిచార క్రియలు, కోపం ద్వేషం, లాంటివి అన్ని పనిచేస్తాయి! నీవు భక్తిపరుడవే! గాని లోకం నిన్ను ఆకర్షించేలా చేస్తాడు వాడు! దారిన పోతున్నప్పుడు నీ కళ్ళు ఆటోమేటిక్ గా గోడమీద అంటించిన సినిమా వాల్ పోష్టర్ కనిపిస్తుంది. దానిలో స్త్రీలు సగం సగం గుడ్డలు వేసుకుని కనిపిస్తారు, వెంటనే నీలో ఏదో అలజడి మొదలవుతుంది. స్త్రీని ఇంకా చూడాలని సినిమా చూడాలని కూడా ఉంటుంది. మరి దీనిని ఎలా తప్పించుకోవాలి? మొదట నీ కన్నులు సూటిగా  తిన్నగా చూడాలని బైబిల్ చెబుతుంది.

సామెతలు 4: 25

నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

సామెతలు 4: 27

నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.

 ఇంకా , ఇటూ అటూ చూసేది కేవలం సాతాను గాదే అని గ్రహించాలి యోబు మొదటి రెండు అధ్యాయాల ప్రకారం! ఇంకా కీర్తనలు 119:11 ప్రకారం నీ ఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అని వ్రాయబడినట్లు వాక్యము మనలను ఏలనియ్యాలి అప్పుడు ప్రతీ విషయంలో వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటె పరిశుద్ధాత్ముడు వెంటనే నిన్ను సరిచేసి వాటిని చూడకుండా, చూసినా పాపం నిన్ను ఆకర్షించకుండా నిన్ను చేయగలడు!

 

ఇంకా దుష్ట సాంగత్యము వలన వారు మాట్లాడుకునే మాటలలో కలిపి నవ్వడం వలన వారు చేసే దానిలో నిన్నుకూడా పాలిభాగస్తులను చేస్తాడు!

1కోరింథీయులకు 15: 33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

 

చాలామంది స్త్రీలకు నీటి కొళాయి దగ్గర ఎంత నోరు కంట్రోల్ లో పెట్టుకోవాలన్నా ఇతరుల వలన నోరు పారేసుకుంటారు! ఇది కూడా సాతాను గాడి కుట్రయే! దావీదు గారు అంటారు నేను కోరేది సమాధానమే గాని మాట నా నోటినుండి బయటకు రాకముందే వారు నాతో యుద్ధానికి సిద్ధమైపోతున్నారు అంటున్నారు!చాలాసార్లు మనం అందరితో సమాధానంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే వారే నీమీదకు తగవుకు యుద్ధానికి వస్తారు! కీర్తనలు 120: 7

నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

వెంటనే నీవు నన్ను అంతమాట అంటావా అని కచ్చా భిగించి తగువులాడితే నీ భక్తీ నీ విశ్వాసం అన్ని బూడిద పాలైపోతుంది!  నీవు ఏమీ అనకపోతే వారికి తిట్టే అవకాశం లేకపోతే కుక్కమీద, కాకిమీద చేటమీద పెట్టి తిడుతుంటారు! అది నిన్నే తిడుతున్నారు అని నీకు తెలిసినా నీవు ఏమీ అనలేవు! నన్నెందుకు తిడుతున్నావు అని ఒకవేళ అడిగితే అక్కడ రణరంగమే అవుతుంది! ఇలాంటప్పుడు మరి ఏమిచెయ్యాలి? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖము లేదు అన్నట్లు మిన్నకుండి పోవాలి! దీర్ఘశాంతము చూపించాలి! లేకపోతే దేవునికి స్తోత్రము! దేవుడు నిన్ను దీవించును గాక అని వారిని దీవించి చూడండి! వారికి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది! లేకపొతే యేసురక్తం యేసురక్తం దేవా నీకు వందనాలు అని చెప్పండి! కొన్నిరోజులకు వారే సిగ్గుపడి పోతారు! లేకపోతే ఇంటివారితోనే వారికి బుద్ధి చెప్పిస్తారు దేవుడు! ఒక పదిహేను సంవత్సరాల క్రితం బహుశా తూర్పు గోదావరి జిల్లాలో అనుకుంటాను- ఒక విశ్వాసిని ప్రక్కింటి ఒకామె అలానే తిడుతుంటూ ఉండేదట! వెంటనే ఈమె కూడా తిట్టేసేదట! ఒకరోజు పాష్టర్ గారు చూసి ఇది తప్పు అని చెబితే నేను ఏమి చెయ్యాలి అంటే ఆయన యేసురక్తం యేసురక్తం అనమని చెప్పారట! ఇలా కొన్నిరోజులు జరిగాక నన్ను రక్తానికి అప్పగించేస్తావా అంటూ బయటకు వచ్చి రక్తం రక్తం అంటూ రక్తం కక్కుకుని చనిపోయింది అక్కడే! తర్వాత జరిగింది మనకు అప్రస్తుతము గాని రకంగా ఆమెకు దేవుడు బుద్ధిచెప్పారు! నీవు వారిని తిట్టకుండా దీవిస్తూ ఉంటే ఒకరోజు వారు పశ్చాత్తాపం కలిగి తప్పకుండా మారతారు అని నా ఉద్దేశం!

 

ఇంకా అనేకమంది విశ్వాసులకు లంచం లాంటి విషయాలు ద్వారా శోధిస్తాడు వాడు!

 

*ఇంకా దురభిమాన పాపం మనలను ఏలేలా చేస్తాడు!  మొగమాటానికి కొన్ని ఇష్టం లేని పనులు చెయ్యాల్సి వస్తుంది! నీకు ఇష్టం లేకపోయినా నీ బాస్ నిన్ను బార్ కి తీసుకుని పోతాడు, సినిమాకు తీసుకుని పోతారు నీ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్! నీవు ఏమీ అనలేవు! గాని నిజంగా వారి వెనుక వెళ్తే నీవు నరకానికి పోతావు! ఇదే దురభిమాన పాపం! నీవు చర్చికి బయలుదేరి వస్తున్నప్పుడే నీ చుట్టాలు ఇంటికి వస్తారు! వారిని వదిలి రాలేవు నీవు! దురభిమాన పాపం! గాని ఇలాంటప్పుడే నీవు దీనిని జయించాలి! ఎలా కుదురుతుంది అని అడగవచ్చు! అందరికీ ఫోన్లు చేసి చెప్పండి! మీరు ఎప్పుడైనా రండి పర్వాలేదు Always Welcome అని చెప్పండి! అయితే ఆదివారం మాత్రం రావద్దు అని ఖచ్చితంగా చెప్పండి! ఎవడు ఏమనుకుంటే నీకనవసరం! నీవు దేవునికి లెక్కచెప్పవలసిన అవసరం లేదు! గాని నీవు అలా చెప్పలేకపోతే దురభిమాన పాపంలో పడిపోయి నరకానికి పోతావు! ఒకవేళ నీవు చెప్పినా నీ చుట్టాలు కావాలని వచ్చారో అనుకో- సింపుల్ గా ఇదిగో అక్కడ ఉప్పుంది ఇక్కడ పప్పుంది, వండుకొని తినండి, నేను ఆరాధన అయ్యాక వస్తాను అని వారికి అప్పజెప్పి మందిరానికి పొండి! తర్వాత ఎప్పుడూ వారు రారు! ఇక మరికొంతమంది అదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు! ఏమంటే ఆదివారం నాడే అందరికి సెలవుంటుంది అంటున్నారు! అన్యులు అన్నా పర్వాలేదు గాని ప్రభువును అంగీకరించిన కొంతమంది పాపాత్ములు కూడా ఆదివారం నాడే ఫంక్షన్ లు పెట్టుకుంటున్నారు! ఇలా ఫంక్షన్ లకు వెళ్ళేవారు. దేవుని బిడ్డలు ఆదివారం నాడు ఫంక్షన్ లు పెట్టేవారు తప్పకుండా దేవుని దగ్గర లెక్క అప్పగించవలసి వస్తుంది! ఎవడు ఏమనుకుంటే నాకనవసరం! చెప్పవలసిన భాద్యత నాకుంది! ఇలాంటి బేచ్ నరకానికి పోతారు! ఏమి అలా అంటావు అని నన్ను అడిగితే నా జవాబు- వారు దొంగలు దోచుకొనువారు కాబట్టి నరకానికి పోతారు అంటాను! ఎలా అంటే దేవునికి ఇవ్వాల్సిన ధనము, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దేవునికి ఇవ్వాలి! ఆదివారం దేవుని మందిరంలో ఉండాల్సిన అవసరం ప్రతీ విశ్వాసికి ఉంది! దానిని ఎగ్గొట్టి నీ ఫంక్షన్ లకు, సినిమాలకు బీచ్ లకు పార్కులకు టూర్ లకు తిరిగితే దేవుడు నిన్ను లెక్క అడగరా! నీవు దేవుని సమయాన్ని దొంగలించి దొంగయు దోచుకొనువాడవు కావా????? ఇప్పుడు  చాలా సంఘాలలో ముఖ్యంగా పట్టణాలలో ఉదయం ఆరుగంటల ఆరాధనకు కాళీ ఉండటం లేదు! ఎందుకంటే ఎనిమిదిన్నర లోగా ఆరాధన అయిపోతుంది! అది అయ్యాక వారు చుట్టాలింటికి పార్టీలకు ఫంక్షన్ లకు బీచ్ లకు వెళ్ళిపోతున్నారు! ఏమంటే ఆరాధన ఎగ్గోట్టడం లేదు కదా! ఆరాధనకు వెళ్లి ఆయన సమయం ఆయనకు ఇచ్చేశాము అంటున్నారు!  అయ్యా అమ్మా! నాకు తెలిసినది నేను బైబిల్ లో అర్ధం చేసుకున్నది నేను చెబుతున్నాను: ఇదికూడా చెయ్యకూడదు! కారణం యెషయా గ్రంధంలో చెబుతున్నారు: విశ్రాంతి దినము అనగా మనము నేడు ఆచరిస్తున్న పునరుత్థాన దినాన్ని పవిత్రంగా ఆచరించాలి! ఆరోజు లోకవార్తలు చెప్పుకోకూడదు! లోకానికి చెందినా పని చెయ్యకూడదు! వ్యాపారం చెయ్యకూడదు! పని చెయ్యకూడదు! నీకిష్టమైన పని ఏమాత్రము చెయ్యకూడదు.* యెషయా 58: 13

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

యెషయా 58: 14

నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

 

 కనీసం సాయంత్రం వరకు ఇలాంటివి ఏవీ చెయ్యకూడదు అని నా ఉద్దేశం! ఇది కేవలం  బైబిల్ ని చదివి నాకు అర్ధమయిన విషయం ప్రియులారా! కాబట్టి ఇలాంటివి చెయ్యవద్దు! నీకు కావలసిన చుట్టాలు బంధువులు మిత్రులు ఆదివారం ఫంక్షన్ అంటే దయచేసి ఏమీ అనుకోవద్దు- ఆరోజు మేము ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పండి! మరో రోజు వస్తాము అని చెప్పండి. దురభిమాన పాపంలో పడిపోవద్దు! ఇది సాతాను గాడి కుట్ర! ఒకవేళ సాయంత్రం వెల్లవచ్చేమో! నాకు తెలియదు! గాని పగటివేళలో వెళ్ళినవారు ఫంక్షన్ పెట్టిన వారు తప్పకుండా దేవుని దగ్గర లెక్క అప్పగించాలి అని మర్చిపోవద్దు!

 

 ఇక ఇలాంటివి ఎన్నో వస్తాయి శోధనలు పరీక్షలు! ఇవి దేవునినుండి సాతాను నుండి కూడా! ఒక్కోసారి నీవు చిన్న తప్పు చేస్తే దేవుడు వెంటనే ఒక లెంపకాయ మొట్టికాయ కొడుతూ ఉంటారు! మరొకొందరు ఎంతో ఘోరమైన తప్పులు పాపాలు చేసిన దేవుడు వారిని ఏమీ అనరు! నీవు అంటావు దేవుడా నేను కేవలం చిన్న తప్పుచేస్తే వెంటనే లెంపకాయ పీకేస్తున్నావ్ వారైతే భయంకరమైన పాపాలు చేస్తున్నారు అయినా వారిని ఏమీ అనడలం లేదు అంటావు! జవాబు సింపుల్! నీవు దేవునిచేత ప్రేమించబడుతున్నావు. నీవు పరలోకం పోయే బ్యాచ్ లో ఉన్నావు కాబట్టి నీవు తప్పుచేస్తే తండ్రిలా ఒక దెబ్బ కొట్టి నిన్ను సరిచేసి తన రాజ్యం వెళ్ళే ట్రాక్ నుండి తప్పకుండా చూస్తున్నారు! అయితే నీవు ఏమీ తప్పుచెయ్యకుండా నీకు భయంకరమైన శోధనలు శ్రమలు వస్తుంటే అవి సాతాను గాడు కలిగించే శోధనలు అని గ్రహించి సంతోషించి బలంగా సాతానుని ఎదిరించి విశ్వాసంతో సాగిపో ముందుకు! శోధన పోయిన తర్వాత అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఆధ్యాత్మిక స్తితి ఇవ్వబోతున్నారు దేవుడు! పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులకు ఇలాంటివి దాదాపు అందరికి వచ్చాయి! యాకోబు గారికి రాలేదా? దావీదు గారికి మామ చంపాలని చూశాడు, కొడుకు చంపాలని చూశాడు! యిర్మియా గారిని తన సొంత ఊరివారు అనాతోతు గ్రామస్తులు చంపాలని చూశారు! ఏలియా గారిని రాజులు రాణి చంపాలని చూశారు! పౌలుగారిని చంపాలని చూశారు! చేయని నేరానికి దానియేలు గారు సింహాల బోనులో ఉండాల్సి వచ్చింది! పేతురు గారు చెరలో ఉండాల్సి వచ్చింది! కాబట్టి విశ్వాసులందరికీ శ్రమలు శోధనలు వస్తూనే ఉంటాయి! చివరికి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా వచ్చాయి!

 

     కాబట్టి శోధనలను సహిద్దాము! జయిద్డాము! విశ్వాసాన్ని వదలవద్దు! జారిపోకు సోలిపోకు! ధైర్యంగా నిలబడు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -22 భాగము*

 

యాకోబు 1:16

నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇంతవరకు మనము శోధనలు శ్రమలు పరీక్షలు కోసం ధ్యానం చేశాము!

ఇక ముందుకు పోదాము!

 

16 వచనంలో నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నారు! ఎందుకు మోసపోకుడి అంటున్నారు? బైబిల్ లో చాలా సార్లు మోసపోకుడి మోసపోకుడి అని వ్రాయబడింది! మరి ఇక్కడ సందర్భములో మోసపోకుడి అంటున్నారు?

 

నాకు అర్ధమయ్యింది ఏమిటంటే మొదటగా: ఇంతవరకు యాకోబు గారు దేనికోసం చెబుతున్నారు? దేవుడు ఎవరిని శ్రమ పరచరు గాని మనిషి తన స్వకీయ దురాశల వలననే శ్రమల పాలు అవుతున్నాడు అంటూ! ఇంకా శోధన సహించువాడు జయించువాడు ధన్యుడు అంటున్నారు. ఇక 15 వచనంలో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనును అంటున్నారు! కాబట్టి మీరు మోసపోవద్దు! దేవుడైతే మిమ్మల్ని శ్రమలపాలు చెయ్యడం లేదు మీకు మీరుగా చేసుకున్న స్వయంకృతాపరాధం వలననే ఇవన్నీ కలుగుతున్నాయి. అవి దేవుడు చెయ్యడం లేదు అనేది ఒక అర్ధం! ఒకవేళ మీరు పాపాలు చెయ్యకపోయినా మీకు పరీక్షలు శ్రమలు కలుగుతున్నాయి అంటే అవి సాతానుగాడు పెడుతున్నాడు. అయితే వీటిని మనిషి జయించాలి, అలా జయిస్తే దేవుడు వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుకుంటాడు కనుక దేవుని మీద నేరం వెయ్యకుండా ధైర్యంగా సాగిపొండి అంటున్నారు! ఏమి అంటే సాతాను గాడు వాడే పరీక్షలు శ్రమలు తీసుకుని వచ్చి- చూశావా మీ దేవుడు-ఎప్పుడూ ఇలాంటి శ్రమలే కలిగిస్తాడు! నీవుభక్తి చేసి ఉపయోగం ఏమిటి అంటూ నిన్ను దారి తప్పించడానికి ప్రయత్నిస్తాడు. కనుక వాడి మోసంలో పడిపోయి మోసపోవద్దు అంటున్నారు

 

    ఇలా చెబుతూ ఇంకా రెండవది ఏమిటంటే: శ్రేష్టమైన ఈవులు గాని, వరాలు గాని అవి పరలోక సంభంధమైనవి అంతేకాకుండా అవి అత్యంత వెలుగుమయమైన తండ్రి యొద్ద నుండి వస్తాయి, 17 వచనంకాబట్టి మానవులలో గల వరాలు ఫలాలు అవి దేవునికి మహిమను తెచ్చేవిధంగా ఉన్నాయా? వెలుగు సంభంధమైనవా లేక చీకటి లోకానికి సంభంధమైనవా అనేది వారు చేసే క్రియలను బట్టి, వాటిని బైబిల్ తో సరిచేస్కుంటూ ఉండాలి గాని ప్రతీ వ్యక్తిని ప్రతీ ప్రవచనాన్ని నమ్మి మోసపోవద్దు అంటున్నారు! ఇవీ ఇక్కడ మోసపోకుడి అనడానికి గల కారణం!

 అందుకే 22 వచనంలో అంటున్నారు మీరు దేవుని వాక్యాన్ని కేవలం వినువారు మాత్రమై యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు గాని వాక్యప్రకారం జీవించండి అంటున్నారు! ఎవడైతే కేవలం వినువారు మాత్రమై ఉండి వాక్యప్రకారం జీవించక పోతే వాడు కేవలం తననుతానూ మోసపుచ్చుకుంటున్నాడు అని మాట్లాడు తున్నారు!

 

సరే, ఇంకా ఇలా మోసపోకుడి అనేమాట బైబిల్ గ్రంధంలో ఇంకా చాలాచోట్ల వ్రాయబడింది!అయితే అవి పలికిన సందర్భాలు వేరు!ఒకసారి క్లుప్తంగా వాటిని చూసుకుందాం!

 

యిర్మియా 29:8 లో కూడా దేవుడు అంటున్నారు మీమధ్యనున్న అబద్ద ప్రవక్తల చేత మోసపోకుడి, ఇంకా నాకు ఫలాని కల వచ్చింది అంటూ చెప్పే కళల బోధకులను కూడా నమ్మవద్దు అంటున్నారు!...

యిర్మియా 29: 8

ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధి పతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీ మధ్యనున్న ప్రవక్తలచేతనై నను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.

యిర్మియా 29: 9

వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.

 

ఈరోజులలో దుర్భోదలు దావానంలా వ్యాపిస్తున్నాయి! దేవుడు నాకు బయల్పరిచాడు అంటూ మొదలెడుతున్నారు! దేవుడు అయ్యగారికి బయలు పరిచిన ............... అంటూ ఒక సంఘము బయలుదేరింది! మరో సంఘము లేక దుర్భోద శాఖ అంటున్నారు: బలిష్టుడైన దేవదూత వచ్చి ప్రవక్తకు బయలు పరచిన వర్తమానం అంటూ కొన్ని కోట్లమందిని దారి తప్పించి ఇంకా దారి తప్పిస్తున్నాడు సాతాను గాడు! అంత్యకాల వర్తమానాలు అంటూ మొదలుపెట్టారు! కాబట్టి ఇలాంటి దేవుడు బయలుపరిచాడు, బలిష్టుడైన దూత చెప్పాడు, నాకు దేవుడు కలలో కనిపించి ఇలా చెయ్యండి అంటూ వాక్యానికి విరుద్ధంగా ఏమి చెప్పినా అవన్నీ అబద్ద బోధలు! వీటిని నమ్మి అనుసరించి మోసపోవద్దు అంటున్నారు దేవుడు! కాబట్టి తప్పుడు బోధలనుండి దూరంగా ఉందాము!

 

ఇక తర్వాత: 1కొరింథీ 6:9 లో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అంటూ మోసపోకుడి జారులైనను విగ్రహారాదికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను ఇంకా దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అంటున్నారు! దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే వీడు అనేకమైన అన్యాయాలు అక్రమాలు చేసేస్తున్నాడు, సమయానికి మాత్రం ఆరాధనకు వచ్చేస్తున్నాడు, కానుకలు ఇచ్చేస్తున్నాడు. దీర్ఘప్రార్ధనలు చేసేస్తున్నాడు! కానుకలు బాగా ఇస్తున్నాడు కాబట్టి పాదిరి వాడినే ప్రార్ధన చెయ్యమంటున్నారు! అందుకే ఇలాంటి వారి కోసం అంటున్నారు: అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరలేరు అంటున్నారు! వీడు ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంత ప్రార్ధన చేసినా వీడు దేవుని రాజ్యాన్ని చేరలేడు! అంతేకాకుండా అన్యాయస్తుల బ్యాచ్ లేక నరకానికి పోయే బ్యాచ్ ఎవరో చెబుతున్నారు.

 

ప్రియదైవజనమా బ్యాచ్ లో నీవున్నావో లేదో ఒకసారి పరిశీలించుకో! ఒకవేలా భ్యాచ్ లో నీ పేరు ఉంది అనుకో- నరకానికి పోతావు కాబట్టి నీకు నీవు సర్ధిచెప్పుకోవడం మానేసి భయము కలిగి పాపమును వదిలి పశ్చాత్తాప పడి దేవుని పాదాలు పట్టుకో! ఏం పర్వాలేదు దేవుడు క్షమించేస్తాడులే చిన్న ప్రార్ధన, పెద్ద కానుక, రెండు మూడు కన్నీటి చుక్కలు రాలిస్తే దేవుడు కరిగిపోతాడు అని నిన్ను నీవు మోసగించుకోవద్దు!

 

ఇక 1కొరింథీ 15:33 లో మోసపోకుడి, దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటున్నారు! ఎవడైతే దుష్టుల సాంగత్యము చేస్తాడో వాడు ఒకప్పుడు మంచివాడే గాని ఇప్పుడు తప్పకుండా చెడిపోతాడు! ఆరునెలలు సాంగత్యము చేస్తే వాడే వీడవుతాడు అని సామెత ఉంది! కాబట్టి మన స్నేహం ఎవరితో ఉందో మనలను మనం పరీక్షించుకుందాం!సామెతల గ్రంధం మొత్తం దీనికోసమే వ్రాసాడు భక్తుడు! దుష్టులతోను అన్య్యాయస్తుల తోనూ సహవాసం చెయ్యవద్దు అంటున్నారు. ఇంకా వేశ్యలతోను వ్యభిచారుల తోనూ, త్రాగుబోతుల తోనూ ఇంకా పరస్త్రీ తోనూ సాంగత్యం చెయ్యవద్దు అంటూ రాశారు! ఒకవేళ చేసేవో ఖబడ్దార్- నీవు మొదటగా చెడిపోతావు! నీ ప్రార్ధన, భక్తి విశ్వాసము అన్నీ పోతావు. నీవు త్రాగుబోతుగా తిట్టుబోతుగా గూండాగా వ్యభిచారిగా హంతకుడిగా మారిపోయి నీ ఇంటికి నీ తల్లిదండ్రులకు నీ సంఘానికి దేవునికి అవమానం తెచ్చి చివరికి సర్వం కోల్పోయి నరకానికి పోతావు! కాబట్టి మోసపోవద్దు! దేవునికి భయపడి ఆయనయందు భయభక్తులు కలిగి ఉండు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -23 భాగము*

యాకోబు 1:17-18

17. శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్ద నుండి వచ్చును; ఆయనయందు చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయయైనను లేదు.

18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

 

17 వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతీ వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును అంటున్నారు. ఇంకా దేవునిలో ఎటువంటి చంచలత్వము గాని గమనాగమనము వలన అనగా ప్రయాణం చేసేటప్పుడు కలిగే నీడ గాని లేక అలసట గాని ఆయనలో లేదు అంటున్నారు! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రేష్టమైన ప్రతీ ఈవి గాని, సంపూర్ణమైన ప్రతీ వరమును దేవుని నుండి కలిగాయి అంటున్నారు! దేవుడిచ్చే ఈవులు గాని వరాలు గాని అవి సంపూర్ణమైనవి కావు గాని పరిపూర్ణమైనవి అని అర్ధం చేసుకోవాలి. ఆయన సగం సగం ఇచ్చే దేవుడు కానేకాదు! అంతేకాదు ఆయన ఇచ్చేవి ఏమైనా అవి పరలోకసంభంధమైనవి ఇస్తారు. ఇలా చెబితే ఆయన భూలోక సంభందమైనవి ఇవ్వరు అని కాదు, ఆయన ఏవి ఇచ్చినా అవి సంపూర్ణమైనవిగా ఉంటాయి అని గ్రహించాలి. కారణం ఆయన మనలను  తానూ సృష్టించిన వాటిలో ప్రధమఫలముగాఉండేలాగా  తనసంకల్పము అనగా తన చిత్తప్రకారం చేసుకున్నారు లేక కన్నారు అంటున్నారు!

 

మరలా ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈమాట యాకోబు గారు ఎందుకు అంటున్నారు? సంధర్బములో అంటున్నారు అని ఆలోచిస్తే ఇంతవరకు ఆయన దేనికోసం చెబుతున్నారు? దేవుడు ఎవరిని కావాలని పరీక్షలకు శోధనలకు గురి చెయ్యరు గాని మనిషే తన స్వకీయ దురాశల వలన తనకుతానుగా శ్రమలను శోధనలను పరీక్షలను కొని తెచ్చుకుంటున్నాడు అని చెబుతున్నారు కదాకాబట్టి విషయం గమనించి మోసపోవద్దు అంటూ, ఇప్పుడు దేవుడిచ్చేవి ప్రతీది శ్రేష్టమైనది పరిపూర్ణమైనవి ఇస్తారు అంటున్నారు. కాబట్టి రెండు వచనాలలో మనకు రెండు రకాలైన అర్ధాలు గోచరిస్తాయి!

 

మొదటిది: దేవుడిచ్చేవి అన్నీ మంచివి. కేవలం మంచివి. లోపం లేనివి. దేవుడిచ్చే వాటికి పాపపురంగు అనేది ఉండదు! లోపరహితంగా ఉంటాయి. అయితే మానవులు దేవుడిచ్చే తలాంతులను దుర్వినియోగం చేస్తూ పాపానికి పాపం కలుపు కుంటున్నారు అన్నమాట! అనగా దేవుడిచ్చిన తలాంతులతోనే వీరు పాపాన్ని కూడగట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని తప్పులేదు గాని మనిషి యొక్క బుద్ధి వక్రభుద్ది వలన మనిషి దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించి పాపాన్ని కూడాగట్టుకుంటున్నాడు!

 

   అర్ధమయ్యేలా చెబుతాను: (అయ్యా ఇది కేవలం నా అభిప్రాయం): ఆదిలో దేవుడు సృష్టిని చేసి ఆదాము గారిని హవ్వమ్మ గారిని ఏలమని చెప్పి అన్ని ఫలాలు తినండి గాని మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాలు తినొద్దు అన్నారు! వారు అవే తిని శిక్షకు పాత్రమయ్యారు! ఆదికాండం 3; ఇప్పుడు చాలామందికి చాలాసార్లు అనుమానం వచ్చింది. వారు అవి తింటే పాపములో పడిపోతారు అని దేవునికి తెలుసు కదా, మరి దేవుడు ఎందుకు మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టుని ఏదేను వనంలో చెయ్యడం అని! దేవుడు మనిషికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారు! ఒరేయ్ కొడుకా కూతురా! ఇది చేస్తే దీని ప్రతిఫలం ఇది, అది చేస్తే దానిప్రతిఫలం అది! కాబట్టి దానిని చెయ్యకు! మంచిగా బ్రతుకు అని చెబుతారు. కారణం మనము ఆయన కుమారకుమార్తెలం! ఇప్పుడు ఏమి చెయ్యాలో చాయిస్ లేక నిర్ణయించుకునే అవకాశం, స్వేచ్చ దేవుడు నీకిచ్చేశారు! మంచిచేశావా సెహబాస్! పరలోకంలో పరసంబంధమైన ఈవులు అనుభవిస్తావు! దానికి వ్యతిరేఖంగా చేశావా- అగ్ని గుండంలో యాతన పడతావు! కాబట్టి దేవుడుచేసిన  మంచిచెడ్డలు తెలివినిచ్చే చెట్టు చాలా అమూల్యమైనది. అయితే దేవుడు తినవద్దు అన్న ఆజ్ఞను మీరి వీరు పాపం చేశారు!

 

ఒకసారి మోషేగారు తాను చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజలనందరిని పిలిచి అంటున్నారు ద్వితీ 11:2628 లో : నేను మీ ఎదుట దీవెనను శాపమును పెడుతున్నాను, దేవుని ఆజ్ఞలను పాటిస్తే మీకు దీవెన, పాటించకుండా ఇతర దేవతలను పూజిస్తే మీకు శాపం అని! మీకు ఏది నచ్చితే అది చెయ్యండి అంటున్నారు!

 

26. చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.

27. నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక

28. నేడు నేను మీ కాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించిన యెడల శాపమును మీకు కలుగును. ...

 

అలాగే ఆయన శిష్యుడైన యెహోషువా గారు కూడా అదే అంటున్నారు: మీ ఎదుట రెండు మార్గాలు పెడుతున్నాను, నది అవతల మీరు పూజించిన దేవతలను పూజిస్తారో లేక యెహోవా దేవుణ్ణి పూజిస్తారో మీ ఇష్టం! అయితే నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తాము అన్నారు!

Joshua(యెహొషువ) 24:14,15

 

14. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.

15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

 

యిర్మియా గ్రంధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు: 21:8 లో నేను మీ ఎదుట జీవ మార్గాన్ని మరణమార్గాన్ని పెడుతున్నాను. ఏది కావాలో కోరుకోండి. కాబట్టి ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం, నిర్ణయించుకునే హక్కు నీకుంది!

 అయితే ప్రసంగి 11 అధ్యాయం ప్రకారం వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తారని మరిచిపోవద్దు!

ప్రసంగి 11: 9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

మరో ఉదాహరణ చెప్పనీయండి: రోజులలో దేవుడు అనేకులకు స్వస్తత వరం, ప్రవచన వరం లాంటి శ్రేష్టమైన సంపూర్ణమైన వరాలు, మంచి గాత్రము, దేవునికోసం మంచిగా పాడే తలాంతు, దేవుని వాక్యాన్ని బాగా తన ప్రజలకు చెప్పగలిగిన వాక్చాతుర్యం లాంటి తలాంతులను దేవుడు ఇచ్చారు! ఇప్పుడు దేవుడిచ్చిన తలాంతులను దేవుని కోసం వాడాలి! ఇదీ దేవుని ముఖ్య ఉద్దేశం! ఇంకా దేవుడిచ్చిన పిల్లలను దేవునికోసం పెంచి దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడాలి! ఇదీ దేవుని ఆశ! అయితే ఇప్పుడు ప్రసంగీకుడు, లేక పాటగాడు దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగిస్తున్నాడు గాని అది దేవుని మహిమకోసం కాకుండా తన స్వార్ధానికి ఉపయోగిస్తున్నాడు! ప్రసంగానికి ఇంత అని రేటు పెడుతున్నాడు పాపాత్ముడు!పాటకి ఇంత అని రేటు పెడుతున్నాడు! నేను రావాలంటే AC కారు, AC రూమ్, ఇంకా కనీసం ఐదువేలమంది రావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నాడు! ఒకానొకప్పుడు వీడికి ఏదీ ఉండేది కాదు! దేవా నీవే నాకు దిక్కు అని దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడిచ్చిన తలాంతులతో ఇప్పుడు వీడు వ్యాపారం చేస్తున్నాడు! తద్వారా పాపానికి పాపం కూడగట్టుకుంటున్నాడు!

మరి ఇప్పుడు చెప్పండి: దేవుని పాటలు మంచి గాత్రంతో దేవుడు మెచ్చే విధంగా పాడటం మంచిదా కాదా? స్వస్తత వరం కలిగి అనేకులను క్రీస్తుయేసు నామంలో స్వస్తపరచడం మంచిదా కాదా? మంచిగా ప్రసంగాలు చెయ్యడం మంచి తలంతా కాదా? అవన్నీ చాలాచాలా మంచివే! అయితే దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించి తానూ సంపద సంపాదించుకోవడం తప్పు! దేవుని సేవను వ్యాపారంగా చెయ్యడం తప్పు! అయ్యా అమ్మా మనవద్దకు వచ్చిన దైవసేవకులను మన స్తోమతకు మన చర్చి స్తోమతకు తగినట్లుగా మంచి కానుక ఇవ్వడం పద్దతి! అయితే నాకు ప్రసంగానికి యాబై వేలు కావాలి, 75వేలు కావాలి, ముందుగానే 5లక్షలు కట్టాలి, మీటింగులలో మేము కానుకలు ఎత్తుతాము అవి మేమే తీసుకుంటాము అని వ్యాపార ధోరణి చూపించడం అసహ్యమైన క్రియ! వీరు తప్పకుండా ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి!

 

  కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అందం గాని, దేవుడిచ్చిన తలాంతులు గాని వరాలు గాని అవన్నీ దేవుని కోసం వాడాలి! దేవుడిచ్చిన ప్రతీ వరము తలాంతులు ఎంతో శ్రేష్టమైనవి! మంచివి!చెడ్డవి ఇవ్వడానికి ఆయన మనలాంటి వాడు కాదు! ఆయన జ్యోతిర్మయుడు అనగా వెలుగును కలిగి వెలుగును చేసి ఎల్లప్పుడు వెలుగుగా ఉండే దేవుడు! ఆయన ఇచ్చిన తలాంతులు చీకటి పనులకు ఉపయోగించేవి కావు! వాటితో దేవుని మహిమ పరచాలి!

కాబట్టి ప్రియ తమ్ముడా చెల్లీ అన్నయ్య! నీకు దేవుడిచ్చిన మంచి గాత్రము దేవుని మహిమ కోసం! పరపురుషులను పరస్త్రీలను ఆకర్షించి నీ కామకోరిక నీ ధనాశను పూర్తి చేసుకోడానికి కాదు! నీకు దేవుడిచ్చిన మంచి వాగ్ధాటి దేవునికోసం! నీ ఆస్తి పెంచుకోవడానికి కాదు! టీవీల్లో మంచి ప్రసంగం చేసి వాటిక్రింద నీ ఫోన్ పే నంబర్, నీ గూగుల్ పే నంబర్ ఇచ్చి దండుకోడానికి అడుక్కోడానికి కానేకాదు!

 

అయ్యా నేను చేసే సోషల్ మీడియా పరిచర్యలో అనేకులు నేను చివరలో pdf పంపిన తర్వాత నాకు ఫోన్ చేసి నా అకౌంట్ నంబర్, నా గూగుల్ పే నంబర్, నా ఫోన్ పే నంబర్ అడిగారు! నేను అడిగాను ఎందుకు అని? అయ్యా మీకు నా కానుక అన్నారు! నేను చెప్పాను- మీరు ఏదయితే నాకు ఇవ్వాలని అనుకున్నారో అది మీ సొంత సంఘములో ఇవ్వండి లేక మీసొంత సంఘకాపరికి ఇవ్వండి! వారి డబ్బులు దొంగలించి నేను దొంగ కాకూడదు! దేవుడు నాకిచ్చిన తలాంతులు దేవుని కోసమే తప్ప నా ధనమును సంపాదించుకోడానికి కానేకాదు అని చెప్పాను! ప్రభువు దృష్టిలో నేను వేషధారిని దొంగను అవ్వడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు! అంతకన్నా చావడం మేలు!

 

కాబట్టి మన తలాంతులతో వరాలతో ఫలాలుతో స్వస్తత ప్రార్ధనల ద్వారా దేవునికి మహిమను తెద్దాము! ఆయన రాజ్యవ్యాప్తి చేద్దాం!

 

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -24 భాగము*

యాకోబు 1:17-18

17. శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్ద నుండి వచ్చును; ఆయనయందు చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయయైనను లేదు.

18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

 

17 వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతీ వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును అంటున్నారు. ఇంకా దేవునిలో ఎటువంటి చంచలత్వము గాని గమనాగమనము వలన అనగా ప్రయాణం చేసేటప్పుడు కలిగే నీడ గాని లేక అలసట గాని ఆయనలో లేదు అంటున్నారు! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రేష్టమైన ప్రతీ ఈవి గాని, సంపూర్ణమైన ప్రతీ వరమును దేవుని నుండి కలిగాయి అంటున్నారు! దేవుడిచ్చే ఈవులు గాని వరాలు గాని అవి సంపూర్ణమైనవి మరియు పరిపూర్ణమైనవి అని అర్ధం చేసుకోవాలి. ఆయన సగం సగం ఇచ్చే దేవుడు కానేకాదు! అంతేకాదు ఆయన ఇచ్చేవి ఏమైనా అవి పరలోకసంభంధమైనవి ఇస్తారు. ఇలా చెబితే ఆయన భూలోక సంభందమైనవి ఇవ్వరు అని కాదు, ఆయన ఏవి ఇచ్చినా అవి సంపూర్ణమైనవి గా ఉంటాయి అని గ్రహించాలి. కారణం ఆయన మనలను  తానూ సృష్టించిన వాటిలో ప్రధమఫలముగా ఉండేలాగా  తనసంకల్పము అనగా తన చిత్తప్రకారం చేసుకున్నారు లేక కన్నారు అంటున్నారు! ఈవచనాలు ఎందుకు చెబుతున్నారో అనే సందర్బానుసారమైన అర్ధం చూసుకున్నాము!

 

      (గతబాగం తరువాయి)

 

  ఈరోజు మరో అర్ధం చూసుకుందాం!

 

17. శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఛాయయైనను లేదు.

 

దేవుడిచ్చే ప్రతీ ఈవి శ్రేష్టమైనవి ఇంకా ఆయనిచ్చే వరాలు ఉచితమైనవి. ఒకసారి పేతురు గారి దగ్గరకు మారుమనస్సు పొందిన ఒక మాయగాడు మంత్రగాడు వచ్చి అంటున్నాడు నీలాగా నేను కూడా ఎవరి తలమీద నైన చేతులుంచి ప్రార్ధిస్తే వారికి పరిశుద్ధాత్మ వచ్చేలా శక్తిని నాకు ఇవ్వు అంటూ వారిముందు బోలెడు డబ్బులు పెడితే పేతురు గారు ఏమన్నారు? నీ వెండి నీతో నశించును గాక! నీవు దేవుని వరాన్ని డబ్బులిచ్చి కొనాలని చూస్తావా అంటూ అతనిని హెచ్చరించి నట్లు చూడగలం!

Acts(అపొస్తలుల కార్యములు) 8:17,18,19,20,21,22,23

 

17. అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.

18. అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి

19. వారియెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు అధికారము నాకియ్యుడని అడిగెను.

20. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.

21. నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.

22. కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;

23.నీవు ఘోరదుష్టత్వములోను (మూలభాషలో- చేదైన పైత్యములోను) దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.

 

కాబట్టి ఆయన ఇచ్చే వరాలు మొదటగా ఉచితంగా ఇచ్చేవి!

రెండు పరిపూర్ణమైనవి! సంపూర్ణమైనవి!

ఇంకా మూడవది: పర సంబంధమైనవి! అనగా పరలోక సంబంధమైనవి! ఆధ్యాత్మిక మైనవి తప్ప మనిషిలో పాపమును రేపవు!

నీలో శరీరకార్యాలకు చోటివ్వవు వాటిని రేకెత్తించవు. ఒకవేళ నీలో లోకాశలు శరీరాసలు నీకు కలిగిన తలాంతుల వలన పెరిగిపోతున్నాయి అంటే మొదటగా నీలో అతిశయం పెరిగిపోయి సాతాను గాడికి చోటిచ్చావు అన్నమాట! అవి నీలో ఉన్న లేక నీలో సమాధైపోయిన శరీరాశలను పాడుబుద్ధి సాతాను గాడు మరలా వాటికి జీవం పోసి నిన్ను బ్రష్టుడను చేయాలని చూస్తున్నాడు అని గ్రహించు! నీవు కాలుజారే స్థలంలో ఉన్నావని మరచిపోకు!

 

ఇక తర్వాత మాట ఆయన జ్యోతిర్మయుడు! అనగా వెలుగును చేసిన వాడు, వెలుగుతూ ఉండేవాడు! వెలుగును ఇచ్చేవాడు! ఆదికాండం 1: లో ఆయన సూర్య చంద్రులను చేసినట్లు చూడగలం!.. ప్రతి విధమైన వెలుగునూ అది భౌతికమైన వెలుగు గానీ ఆత్మ సంబంధమైన వెలుగు గానీ సృష్టించినదీ, ఇచ్చేదీ దేవుడు ఆదికాండము 1:3,

ఆదికాండము 1:14-16;

14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,

15. భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ప్రకారమాయెను.

 లూకా 1:78-79;

79.మన పాదములను సమాధాన మార్గములోనికి నడి పించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై మహావాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించెను.

 

 యోహాను 1:4-5;

4. ఆయనలో జీవముండెను; జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

5. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

 

ఇంకా ఆయనలో చంచలత్వము గాని గమనాగమనము వలన అనగా ప్రయాణించడం వలన కలిగే ఆయాసం గాని, లేదా ప్రయాణించే టప్పుడు సూర్యుని లేక చంద్రుని వలన కలిగే నీడ లాంటివి ఆయనలో కనబడవు! అనగా ఒకప్పుడు దగ్గరగా ఒకప్పుడు దూరంగా ఉండే దేవుడు కాదు! ఎల్లప్పుడూ నీతో నీలో ఉండే దేవుడు! నీవు అలసిపోయినా ఆయన ఎప్పుడూ అలసిపోడు! నీవు నిద్రపోయినా ఆయన నిద్రపోయే వాడు కానేకాదు! అందుకే ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అంటున్నారు భక్తుడైన దావీదు గారు 121 కీర్తనలో!...

Psalms(కీర్తనల గ్రంథము) 121:3,4

3. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు !

 

ఒకసారి దీనికోసం ఆలోచిద్దాం!

సంఖ్యాకాండము 23:19;

దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

 

1సమూయేలు 15: 29

మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.

 

మలాకీ 3: 6

యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

 

హెబ్రీయులకు 1:10-12;

10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి

11. ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును

12. ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.

 

హెబ్రీయులకు 13: 8

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.

 

దేవుడు శాశ్వతంగా లోప రహితుడు. ఆయన అభివృద్ధి చెందవలసినదీ ఎదగవలసినదీ ఏమీ లేదు. ఆయన గుణగణాలకు కలపవలసినదీ తీసివేయవలసినదీ ఏమీ లేదు

 

ఇక 18 వచనంలో ఆయన తానూ సృష్టించిన వాటిలో మనము ఆయనకు ప్రధమ ఫలంగా ఉండేలాగా ఆయన తన సత్య వాక్యమువలన తన సంకల్పము చొప్పున మనలను కనెను అంటున్నారు!

 

మనము తన స్వకీయ జనముగా ఉండటానికి మనలను ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిద్వారా ఆయన రక్తం ద్వారా మనలను కన్నారు !

 

ప్రధమ ఫలము కోసం చూసుకుంటే ఎన్నో మాటలు కలవు!

ప్రకటన గ్రంథం 14: 4

వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

 

రోమీయులకు 8: 23

అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

 

ఇది బాగా అర్ధము కావాలంటే మనకు నూతన జన్మ ఎలా వచ్చిందో భక్తుడైన పౌలుగారు వివరిస్తున్నారు యోహాను 1:12-13;

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

 యోహాను 3:3-8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేముముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6.శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

ఇది పాపంనుండి మరణంనుండి మనలను తప్పించేందుకు దేవుడు అనుసరించిన పద్ధతి!

 

ఇక సత్యవాక్యము అనగా అది దేవుని సువార్త మరియు దేవుని వాక్యము అని అర్ధం చేసుకోవాలి!,

 

కాబట్టి దేవుడు అమరుడని, ఆయన ఇచ్చేవి శాశ్వత మైనవని, అవి పరిపూర్ణమైనవని గ్రహించి, దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుడిచ్చిన వరాలను ఫలాలను దేవుని మహిమ కోసం ఆయన రాజ్యవ్యాప్తికోసం వాడాలి తప్ప నీ ఆస్తి పెంచుకోడానికి నీ పేరు ప్రతిష్టలు పెంచుకోడానికి కానేకాదు అని గ్రహించాలి!ఆయన ఎప్పుడు కునికేవాడు అలసిపోయే వాడు కూడా కాదు అని గ్రహించాలి! ఆయన మనలను ప్రధమ ఫలముగా ఉండటానికి తన సంకల్పము చొప్పున తన వాక్యమును ఉపయోగించి తన రక్తమిచ్చి కొన్నారు కన్నారు అని గ్రహించాలి!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -25 భాగము*

యాకోబు 1:19-20

19. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

ఇక 19 వచనంలో మీరు సంగతి ఎరుగుదురు గనుక అని మొదలుపెట్టారు. విషం తెలుసు వీరికిమనము క్రీస్తుయేసు రక్తము వలన వాక్యము ద్వారా విమోచించబడ్డాము కనుక అన్యులవలె ఉండకుండా వినడానికి వేగిరపడాలి అనగా వినడానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడటానికి నిదానించాలి. ఇంకా కోపించుటకు కూడా నిదానించాలి. ఎందుకంటే మానవుని కోపం దేవునినీతిని నెరవేర్చదు అంటున్నారు.

 

సరే ఇప్పుడు దేనిని వినడానికి వేగిరపడాలి? మొదటగా అది దేవుని వాక్యమై ఉండాలి! దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడి వెళ్ళాలి అనే అర్ధం వస్తుంది. కారణం వినుటవలన విశ్వాసం కలుగును. వినుట దేవుని వలన కలుగును అంటున్నారు. అనగా వినడం అనేది దేవుని వాక్యమై ఉండాలి. రోమీయులకు 10: 17

కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

అలాంటి వాక్యాన్ని వినడానికి విశ్వాసి కాళ్ళు పరుగెత్తాలి అన్నమాట! అలాగని ప్రతీ పాదిరి వెనుక పరుగెత్తడం కాదు గాని వ్యక్తి చెబుతున్నవి బైబిల్ లో ఉన్నాయా లేదా లేక వాక్యపు విరుద్ధంగా ఉన్నాయో అనేది పరీక్షించి అప్పుడు వెళ్ళాలి అని అర్ధం! నీవు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటావో లేక చదువుతావో నీ విశ్వాసం అంత దృఢమైనది అవుతుంది. అందుకే వినడానికి వేగిరపడు అంటున్నారు.

దీనికి మరో అర్ధం కూడా ఉందండి! అది సామెతల గ్రంధంలో ఉంది. అది ఏమిటంటే సంగతి పూర్తిగా వినకుండా మాట్లాడేవాడు తన మూఢతను బయలుపరచి సిగ్గుపడతాడు అని ఉంది! 18:13; అనగా ఏమైనా సంగతి ఎవరైనా చెబితే ఆసాంతం విని అప్పుడు జవాబు చెప్పాలి గాని మొదట్లో రెండు ముక్కలు విని జడ్జిమెంట్ ఇవ్వకూడదు, కామెంట్ చెయ్యకూడదు. అలా పూర్తిగా వినకుండా కామెంట్ చేస్తే వాడు మూడుడు మరియు మూర్కుడు! అందుకే వినడానికి వేగిర పడాలి అని భక్తుడు సెలవిస్తున్నారు ఆత్మపూర్ణుడై!

 

కాబట్టి మనము వాక్యాన్ని వినడానికి సిద్దపడి ఆత్రుతతో ముందుకు పరుగెట్టుదాము అలాగే ఏదైనా వినడానికి వేగిర పడదాము గాని మాట్లాడటానికి నిదానిద్దాము అనగా ఆచితూచి మాట్లాడదాము!

 

ఎందుకు సార్, మాట్లాడటానికి నిదానించాలి అంటే అదే సామెతల గ్రంధంలో అంటున్నారు విస్తారమైన మాటలలో దోషముండక మానదు. 10:19; మన మాటలలో అనేకమైన తప్పులు అనుకోకుండా దోర్లిపోతాయి. అలా తప్పులు దొర్లకుండా ఉండాలి అంటే మాట్లాడటానికి నిదానించాలి! అదే నోరుమూసుకుని ఉంటే వాడు మూర్ఖుడైన వానిని జ్ఞాని అని అంటారు అని  అదే సామెతల గ్రంధం 17:28 లో ఉంది. ఎక్కువ మాట్లాడేవాళ్ళు తప్పకుండా అనవసరమైన మాటలు, తప్పు మాటలు, లేక హాని చేసే మాటలు మాట్లాడతారు. వారు వినవలసినది వినలేకపోతారు.

 

ఇక దీనికోసం చూసుకుంటే  యాకోబు 3:1-8; నాలుకను భధ్రము చేసుకోవాలి అంటున్నారు.

 సామెతలు 13: 3

తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.

సామెతలు 29:20

ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.

 

మత్తయి 12:36-37.

36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

 

ఇక కోపించడానికి కూడా నిదానించాలి! ఎందుకు కోపించడానికి నిదానించాలి అంటే 20 వచనంలో ఎందుకంటే నరుని కోపం దేవుని నీటిని నెరవేర్చదు. అది న్యాయమైన కోపమైనా సరే కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే కోపించడానికి నిదానించమంటున్నారు. ఇంతకీ న్యాయమైన కోపము అనగా ఒక ఉదాహరణ: పిల్లలు అల్లరిచేస్తూ తప్పులు చేస్తుంటే పెద్దలు గద్దించాలి ఇది న్యాయమైన కోపం! అలాంటి స్తితిలో కోపపడాలి గాని మీ కోపం అనేది సాయంత్రం వరకు ఉండకూడదు! వెంటనే మర్చిపోయి మామూలుగా ఉండాలి. కోపపడుడి గాని పాపము చేయకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు 4: 26

కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.

 మత్తయి 5:22;

నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరునిమీద (కొన్ని ప్రాచీన ప్రతులలో- నిర్నిమిత్తముగా అని కూర్చబడియున్నది.) కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

 సామెతలు 16:32.

పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు

మనిషి కోపం, మాటకొస్తే న్యాయమైన కోపం కూడా దేవుని నీతిన్యాయాలను సాధించదు.

2 తిమోతికి 2:24-25 . నెమ్మది, సాధుగుణం ఎలాంటి కోపం కన్నా కూడా మరెంతో ప్రయోజనకరమైనది.

2తిమోతికి 2: 26

ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! మనము కూడా వినడానికి వేగిర పడుదాం! మాట్లాడుటకు నిదానిద్దాం! కోపగించుకోడానికి కూడా నిదానించి ఆలోచించి ఆచితూచి మాట్లాడదాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -26 భాగము*

యాకోబు 1:21

అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

 

ఇక 21 వచనంలో అందుచేత మీరు సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నారు. గమనించాలి- అందుచేత అని మొదలుపెట్టారు- ఎందుచేత: మొదటిది మనము వెండి బంగారువంటి వెలగల వస్తువుల చేత విమోచించబడక క్రీస్తుయేసు ప్రశస్త రక్తముతో విమోచించబడి కడుగబడి  క్రీస్తులో నూతన జన్మ పొందాము, గనుక నూతన జన్మకు తగినట్లుగా మన జీవితాలు మన మాటలు తలంపులు ఉండాలి! అనుభవం మన జీవితాలలో చూపించాలి అంటున్నారు యాకోబు గారు!

 

రెండవది: నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు కాబట్టి మీరు సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న  దుష్టత్వాన్ని మానమంటున్నారు!

 

ఇక్కడ చూడండి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానివెయ్యాలి అంటున్నారు! తెలుగులో కల్మషం అని తర్జుమా చేసినా కొన్ని ప్రాచీన ప్రతులలో సమస్త మాలిన్యమును విసర్జించండి అని వ్ర్రాయబడి ఉంది! ఎందుకు మాలిన్యము పోగొట్టుకోవాలి అంటే దేవుడు చెప్పారు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్దుడను గనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి అని చెప్పారు దేవుడు! లేవీ 11:44--45

 ఇంకా సంఘము కళంకము గాని మడత గాని మచ్చ గాని లేకుండా నిందారహితముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎఫెసీయులకు 5: 26

అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

ఎఫెసీయులకు 5: 27

నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

 ఇంకా నూతన యేరూషలేములోను ఇంకా పరలోకంలో మొదటిది నిషిద్దమైనది, రెండవది అసహ్యమైనది, మూడవది అబద్దాన్ని ప్రేమించి జరిగించేవారు ప్రవేశించరు!

ప్రకటన గ్రంథం 21: 27

గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 కాబట్టి ఇలాంటి మలినము మాలిన్యము దేవునికి ఇష్టం లేదు కాబట్టి వీటిని దేవుడు విసర్జించమంటున్నారు. మలినాన్ని మాత్రమే కాకుండా అబద్దమైన దానిని ప్రేమించి జరిగించే వాడు కూడా పరలోకంలో ప్రవేశించడు.

ఒకసారి సినిమా అనేది నిజంగా జరుగుతుందా? లేదు కదా, సీరియల్ నిజమా? కాదు కదా, అదో అబద్దాల ప్రపంచము! చచ్చిన వాడు ఎవడూ బ్రతికిరాడు! ప్లాష్టిక్ సర్జరీ చేసుకుని ముఖం మార్చుకుని ఎవడూ రాడు! ఒక్కో స్త్రీకి నలుగురు పురుషులతో మామూలుగా సంబంధముండదు, అలాగుంటే ఆమెను వ్యభిచారి అంటారు. మరి ఇది సీరియల్లో కళ్ళు తిప్పకుండా వ్యభిచారినిలను చూస్తున్నారు! అబద్దాలు చూస్తున్నారు. మరి వీరు అబద్దాన్ని ప్రేమించి జరిగించే వారు కదా, మరి సినిమా తీసేవారు గాని, యాక్టింగ్ చేసే వారు గాని, సినిమా సీరియల్లు చూసేవారు గాని అబద్దాన్ని ప్రేమించి జరిగించే వారే కదా! మరి వీరు పరలోకం చేరలేరు కదా!!! అందుకే వీటిని మానేయ్యమంటున్నారు!

 

ఇక విర్రవీగుచున్న దుష్టత్వము: వాక్యం చెబుతుంది: నీ కన్నులు దుష్టత్వాన్ని చూసి ఆనందించే కన్నులు కానేకావు! దుష్టత్వానికి నీ యెద్ద చోటు లేదు!.కీర్తనలు 5: 4

నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు

.దుష్టులు నరకంలో ఉంటారు, దుష్టుల ఆలోచన చొప్పున చేయక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు ఉండే చోటున నివశించక ఉండాలి అని బైబిల్ చెబుతుంది కీర్తన మొదట అధ్యాయంలో!

 

అయితే వేటివేటిని విసర్జించాలో బైబిల్ చెబుతుంది వాటిని మనం విసర్జిద్దాము!

ఎఫెసీ 4:2232 వరకు పాతస్వభావాలు విసర్జించాలి అంటున్నారు...

22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును (మూలభాషలో- ప్రాచీన పురుషుని) వదలుకొని

23. మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై,

24. నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును (మూలభాషలో- నవీన పురుషుడు) ధరించుకొనవలెను.

25. మనము ఒకరికొకరము అవయవములైయున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

26. కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.

27. అపవాదికి (అనగా సాతాను) చోటియ్యకుడి;

28. దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.

30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

 

ఎఫెసీ 5:4 ప్రకారం బూతులు సరసోక్తులు లాంటివి వదిలెయ్యాలి!

3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

 

కొలస్సీ :510 ప్రకారం మన శరీరాలు లోకాశలు శరీరాసలు విగ్రహారాధన లాంటివి వదిలెయ్యాలి!...

5. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి.

6. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి) వచ్చును.

7. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి.

8. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

9.ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీన స్వభావమును (ప్రాచీన పురుషుని)దాని క్రియలతో కూడ

10. మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.

 

దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది అంటే నూతన జీవితం పొందిన నీవు నూతన స్వభావం పొందుకోవాలి- ఇక నీ పాత బుద్ధులు ఏమీ కనిపించకూడదు. నీ త్రాగుడు, నీ వ్యభిచారం, నీ అబద్దాలు, నీ లోకాశలు , నీ లోక ఆచారాలు, నీ ముహూర్తాలు నీ అలంకారాలు అనగా నగలు వేసుకోవడం, వెలగల వస్త్రాలు ధరించడం నీ అతిశయం ఇవన్నీ పోవాలిఇక నీవు నూతన జన్మ పొందిన శిశువులా ప్రభువు సన్నిధిలో ఉండాలి!

 

ఇక వీటిని విసర్జించిన తర్వాత మన హృదయంలో వాక్యము ఎంతో లోతుగా నాటబడి ఉండాలి అంటున్నారు! మన హృదయాల్లో చల్లిన దేవుని వాక్కు పంటకు రావాలంటే అణుకువతో నమ్మకంతో దాన్ని అంగీకరించాలి. దానికి లోబడి దాన్ని మనలో పని చేయనివ్వాలి. హృదయంలో దేవుని వాక్కుకు మనల్ని మార్చి రక్షించే శక్తి ఉంది.

 

మత్తయి 13:9, 18--22 లో యేసయ్య విత్తనాల కోసం ఒక ఉపమానం చెప్పారు. అయితే వాటిలో కొన్ని రాతినేల మీద కొన్ని రోడ్డు ప్రక్కన మరికొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. కొన్ని మంచినేలమీద పడి ఇరువదంతలు నూరంతలుగా ఫలించాలి...... కొందరికి హృదయంలో నాటుకోలేదు. కొందరికి నాటినా శ్రమల వలన ఆహిక జీవితవిషయాలమీద ఉంది దేవుని ఉంది వేరై జీవిస్తున్నారు.

 

మరి వాక్యము నీ హృదయంలో నాటుకుండా?? నాటుకోక పోతే మీ ఆత్మ రక్షించబడదు! ఇక్కడ మీ ఆత్మలు రక్షించగలిగే సామర్ధ్యము మనాత్మలకు దేవుడిచ్చారు! ఇది ఎలా సాధ్యము అంటే ఆత్మలను రక్షించే సారధ్యము కేవలం ఒక వాక్యమునకు మాత్రమే ఉంది అని గ్రహించాలి! వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి.

మరి మనం వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిద్దామా?

వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించే గుణము కలిగి కోపపడటానికి కూడా నిదానిద్దాము!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -27 భాగము*

యాకోబు 1:2224

22. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.

23. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.

24. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

 

ఇక్కడ వచనాలలో మీరు కేవలం వినువారు మాత్రమై ఉండక దాని ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలి అంటున్నారు. కేవలం వినువారు మాత్రమే అయితే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అంటున్నారు! రోజులలో విశ్వాసులు నూటికి తొంబైఅయిదు మంది కేవలం వినువారు మాత్రమే అయి ఉంటున్నారు తప్ప దాని ప్రకారం జరిగించడం లేదు! బైబిలు మాటల ప్రకారం ప్రవర్తించకుండా వాటిని వినడం వల్ల ప్రయోజనం లేదు. ఊరికే వినడంవల్ల మన దోషం ఎక్కువవుతుంది. విత్తనాలు చల్లేవాని ఉదాహరణలో నాలుగు రకాల మనుషులు వాక్కు విన్నారు (మత్తయి 13:19-20, మత్తయి 13:22-23). కానీ ఒక రకం మనుషులే ఫలించారు. యూదులు వాక్యమును చదవడంలో, వినడంలో, కంఠస్థం చేయడంలో దిట్టలే గానీ తాము విన్నదాని ప్రకారం ప్రవర్తించడంలో అంత గట్టివారు కాదు

అపో. కార్యములు 7:53

దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.

 

రోమీయులకు 2:17-24.

17. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?

18. ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా?

19. జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి-నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,

20. చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?

21. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

22. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?

23. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?

24. వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?

25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును

మత్తయి 7:21-27 లో యేసుప్రభువు తన ఉపదేశానికి లోబడవలసిన అవసరతను నొక్కి చెప్పిన విషయం గమనించండి.

21.ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

22. దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.

23.అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

24.కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25.వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26.మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27.వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.  క్రైస్తవులనబడిన వారనేకమంది వారి పాపవిముక్తి కోసం దేవుని వాక్కు చెప్పినదాన్ని చెయ్యలేదు కాబట్టి శాశ్వతంగా నశించిపోతారు. ఇంకా అనేకమంది దేవుని వాక్కు వారికి చెప్పినదాన్ని చెయ్యలేదు కాబట్టి తమ బహుమానాన్ని పోగొట్టుకుంటారు.

 

దేవుని  మాట విని దాని ప్రకారం చేసే వారు బండమీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నారు యేసయ్య. అలా మాట వినని వాడు ఇసుకమీద తన ఇల్లు కట్టుకున్న వాడు అంటూ ఉపమానం చెప్పారు దేవుడు!

 

చాలామంది మందిరంలో దేవుని వాక్యాన్ని విని ఆల్టర్ కాల్ లో ఏడ్చేస్తూ ఉంటారు. ఇక నేను ఇలా జీవిస్తానయ్య అలా జీవిస్తానయ్య అంటూ దేవునికి వాగ్దానం చేసేస్తారు. రెండు రోజుల తర్వాత మామూలే! వాక్యాన్ని మరచిపోతారు! మరలా పాత బుద్దులు! వేషదారణ పోదు! నీకు అన్యులకు తేడా ఏమీ ఉండదు! వారికి బొట్టు ఉంది, నీకు బొట్టులేదు అంతే! వారికంటే ఘోరంగా జీవిస్తావు! బ్రతుకు మారదు, బుద్ధి మారదు! త్రాగుడు మానలేవు, సిగరెట్లు మానవు, అక్రమ సంభంధాలు విడిచిపెట్టవు వ్యభిచారం మానవు! అన్యుల కన్న ఘోరమైన వస్త్రధారణ! మూతికి రంగు పెదాలకు రంగు ముఖానికి రంగు పగటి వేషగాల్లలా తయారవుతావు! దేవుడంటే అసలు భయం లేకుండా పోతావు! ఇప్పుడు నిన్ను నీవు మోసగించుకుంటున్నావు అని ఆత్మపూర్ణుడై యాకోబు గారు అంటున్నారు!

 

అలా వాక్యాన్ని వినువారు మాతమై ఉండి దాని ప్రకారం చేయ్యకపోతే నీవు అద్దం ముందుకు వెళ్లి నిన్ను నీవు చూసుకుని తర్వాత నీ ముఖాన్ని నీవు మరచిపోయినట్లే ఉంటుంది అంటున్నారు! బైబిలు అద్దం వంటింది. దానిలోకి తదేకంగా తరచి చూస్తే మనం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. కానీ దాని ప్రకారం మనం సరిదిద్దుకోకపోతే అది మనకేమీ మేలు చెయ్యదు. త్వరలోనే దాన్ని మర్చిపోతాం.

 

ప్రతీరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్య వెలుగులో అనగా వాక్యపుటద్దంలో మనల్ని మనం చూసుకుంటే మనలోని తప్పులు దేవునికి ఇష్టం లేని పనులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వెంటనే నిన్ను నీవు సరిచేసుకుని ఒప్పుకుని విడిచిపెడితే నీవు కనికరం పొంది వాటినుండి విడుదల పొందుతావు! నూతన సృష్టిగా ఉంటావు!లేకపోతే నీవు అపవిత్రుడుగా దేవునికి ఇష్టం లేని వాడిగా ఉంటావు! వేలివేయబడతావు!

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు కేవళం వినువాడవు మాత్రమే అయి ఉన్నావా లేక దాని ప్రకారం చేసే వాడిలా ఉన్నావా?

ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకుని దేవునితో సమాధాన పడు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -28 భాగము*

యాకోబు 1:25

25. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇక 25 వచనం చూసుకుంటే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమంలో నిలకడగా ఉండేవాడు విని మంచిపోయే వాడు కాక వాక్యప్రకారం చేయువాడు మరియు వాడు ధన్యుడు అంటున్నారు!

 

దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే స్వాతంత్రం నిచ్చే నియమం అంటున్నారు, అనగా స్వాతంత్ర్రం ఇచ్చే నియమం ఎలా ఉందో దాస్యం క్రింద ఉండేనియమం కూడా ఉంది అని అర్ధమవుతుంది. దీనిని బాగా అర్ధం చేసుకోవాలి అంటే మనం మొదటగా యోహాను సువార్త మొదటి  అధ్యాయంలోనికి వెళ్ళాలి. అక్కడ యోహాను గారు రాస్తున్నారు, ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా మనకు ఇవ్వబడింది, అయితే కృపయు సత్యము అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగెను అంటున్నారు! 1:17;

 

దీనికోసం పౌలుగారు విస్తారంగా రాస్తూ రోమా పత్రికలో ధర్మశాస్త్రం క్రింద మనమందరం పాపానికి దాసులుగా ఉన్నాము, అయితే క్రీస్తుయేసు ద్వారా కృపద్వారా మనము విడుదల పొందాము అంటున్నారు! అనగా దర్మశాస్త్రం అనేది దాస్యము తీసుకుని వస్తే స్వాతంత్ర్యం ఇచ్చే నియమం యేసుక్రీస్తు ప్రభులవారు తీసుకుని వచ్చారు అని మనకు అర్ధమవుతుంది. అందుకే గలతీ పత్రికలో మరలా దాస్యమనే కాడిక్రిండ (అనగా ధర్మశాస్త్రం) చిక్కుకోవద్దు అని సంఘానికి పౌలుగారు హెచ్చరిస్తున్నారు!...

 

అయితే ఇప్పుడు స్వాత్రంత్ర్యం నిచ్చే నియమం క్రింద ఎవడైతే ఉంటాడో వాడు విని మర్చిపోయే వాడు కాదు గాని దాని ప్రకారం చేయువాడు అంటున్నారు యాకోబు గారు! అనగా విని చేసే వాడు మొదటగా స్వాతంత్ర్యం నిచ్చే నియమం క్రింద ఉన్నాడు,

 రెండవది: వాడు బండమీద కట్టబడిన ఇల్లు లాంటివాడు, వాడి విశ్వాసం అనే పునాది గట్టిది దృఢమైంది కాబట్టి నియమాన్నుండి తప్పిపోడు అన్నమాట!

 

మోషే ధర్మశాస్త్రం దాస్యాన్ని తెచ్చింది అపో. కార్యములు 15:10;

గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

 

గలతియులకు 5:1.

1. స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.

 

పాపవిముక్తి సాధించే మార్గంగా స్వప్రయత్నాలు చేయాలనీ, ఆజ్ఞలు, నిబంధనలు, కర్మకాండలు, ఆచారాలు పాటించాలనీ నేర్పించే ఉపదేశమంతా బానిసత్వం కాడి వంటిది దీనికోసం గలతియులకు 4:3-9 చెప్పబడింది. ముఖ్యంగా పౌలుగారు చెప్తున్నది మోషే ధర్మశాస్త్రాన్ని గురించి (అపో. కార్యములు 15:10-11 . అలాంటి కాడినుంచి క్రీస్తు తన విశ్వాసులను విడుదల చేశారు. అంటే మత సంబంధమైన అన్ని దాస్యాలనుంచీ అది యూదా మతమైనా కానివ్వండి, మరి అన్య మతమైనా కానివ్వండి, లేక భ్రష్టమైపోయిన ఏదో రకమైన క్రైస్తవ్యం (RCM) కానివ్వండి దాని నుంచి ఆయన మనకు విడుదల ఇచ్చాడు. విడుదల అంటే నూటికి నూరు శాతం విడుదల. క్రీస్తులో విశ్వాసులు తమ విడుదలను, స్వేచ్ఛను గుర్తించాలి. దాని విలువ గ్రహించాలి. దాన్ని వదులుకోకూడదు. వారు క్రీస్తుతోపాటు ఆయన కాడిక్రింద ఉన్నారు.

Matthew(మత్తయి సువార్త) 11:28,29,30

 

28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

30. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

పాపవిముక్తి విషయంలో వారికి అవసరమైన కాడి ఇదొక్కటే. కాడి స్వతంత్రతను ఇస్తుంది.

 

విశ్వాసులు ధర్మశాస్త్రం అనే దాస్యం కింద లేరు రోమీయులకు 6:14;

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

 

రోమీయులకు 7: 4

కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.

అందుకే మన అవయవాలను క్రీస్తుకు అర్పించుకోవాలి అంటున్నారు.

రోమీయులకు 6: 13

మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా (లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

 

వారు క్రీస్తు నియమం కింద ఉన్నారు

1 కోరింథీయులకు 9:21.

దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.

అది కృప, ప్రేమల నియమం. నియమానికి లోబడితే అది స్వేచ్ఛ ఇస్తుంది పాపం చేసేందుకు స్వేచ్ఛ కాదు, పాపం చేయకపోవడానికి స్వేచ్ఛ.

కాబట్టి ప్రియులారా ఒకసారి మనలని మనం ఒకసారి పరిశీలన చేసుకుదాంవిని మర్చిపోయే వారమా లేక వాక్యాను సారంగా జీవించే వారంగా ఉన్నామా? మన బ్రతుకులు వాక్యానుసారంగా ఉన్నాయా? మన చూపులు వాక్యానుసారంగా ఉన్నాయా? మన మాటలు వాక్యానుసారంగా దేవుని బిడ్డలకు తగినట్లుగా ఉన్నాయా లేదా?

 

ఒకవేళ లేకపోతే నేడే సరిద్దుకుని క్రీస్తుతో సమాధాన పడదాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -29 భాగము*

యాకోబు 1:26, 27

26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇక 26 వచనం చూసుకుంటే ఎవ్వడైనా నోటికి కల్లెము పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసగిచ్చు కొంటే, భక్తిగలవాడను అనుకుంటే వాడి భక్తి వ్యర్ధము అంటున్నారు. అయితే దీనికోసం విస్తారంగా ధ్యానం చేసుకోవాలంటే మనకు మూడో అధ్యాయం చాలావరకు దీనికోసమే వ్రాయబడి ఉంది గనుక మూడో అధ్యాయం ధ్యానించినప్పుడు వివరంగా చూసుకుందాం, గనుక క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుందాం! నోటికి కల్లెము పెట్టుకోవడం అనగా రెండు రకాలుగా నోటికి కళ్ళెము పెట్టుకోవాలని అర్ధం నా ఉద్దేశ్యంలో!

 

నోట్లో ఏముంటుంది? నాలుక మరియు పళ్ళు! మొదటిది: నాలుకను అదుపులో పెట్టుకోవాలి-అనగా మన మాట్లాడే మాటలను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయి!

 

రెండు: మనం తినే తిండి విషయంలో కూడా అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మొదటగా ఊభకాయం అనబడే ఒబెషిటీ,

రెండు షుగర్ వ్యాధి అనబడే డయాబెటిస్, వాటికి బోనస్ గా బిపి వగైరాలు వచ్చేస్తాయి. తినాలని ఉన్నా తినకూడని స్థితికి, తింటే చచ్చే స్థితికి వచ్చేస్తావు గనుక నోటికి కల్లెము వేసుకోరా కొడుకా అంటున్నారు యాకోబు గారు!

 

19. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

 

ప్రసంగి 7:9. ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.

 

యాకోబు 3:2-12.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

 

ఏవైపు చూచినా తమ నాలుకలను అదుపు చేసుకోనివారు చాలామంది కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చాలామంది ఆత్మవంచన చేసుకొంటూ నిష్ప్రయోజనమైన ఆరాధన ఆచారాన్ని పాటిస్తున్నారన్నమాట.

 

కాబట్టి నోటికి కల్లెము పెట్టుకోకుండా అనగా మాటలోనూ, తిండి విషయంలోనూ తన నోటిని నాలుకను అదుపులో పెట్టుకోకుండా నేను భక్తిచేసేస్తున్నాను అనేవాడు వాడి భక్తి వ్యర్ధము అంటున్నారు!

 

సరే ఇక 27 వచనంలో భక్తి కి నిర్వచనం చెబుతున్నారు!

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

దేవుడు అన్ని రకాల ఆరాధనలనూ అంగీకరించడని మనం అర్థం చేసుకోవాలి మత్తయి 15:8-9;

మత్తయి  15

8. ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

(యెషయా 29:13)

9. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

 

కీర్తనల గ్రంథము 50:7-21;

8. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9. నీ యింట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10. అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా

11.కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14. దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.

16. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?

17. దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.

18. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.

19. కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.

20. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు.

21. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

 

యెషయా 1:11-17.

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

18. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

 

దేవుడు చూడగోరేది ప్రేమ, పవిత్రత అనేది మాటల్లో గాక, చర్యల రూపంలో కనిపించేది. దేవునికి బలహీనుల, నిస్సహాయుల, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది నిర్గమకాండము 22:22;

విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.

 

లేవీయకాండము 23: 22

మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడ నైన యెహో వాను.

 

ద్వితియోపదేశకాండము 10: 18

ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

 

ద్వితియోపదేశకాండము 24: 19

నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.

 

కీర్తనలు 146: 9

యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

 

యెషయా 1: 17

కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

 

మనం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనకు కూడా అలాంటి శ్రద్ధ ఉండాలి. ఇహలోక కల్మషాలను దేవుడు అసహ్యించుకుంటాడు. మన ఆరాధన ఆయనకు పూర్తిగా అంగీకారం కావాలంటే మనం కూడా అలా అసహ్యించుకోవాలి.

రోమీయులకు 1: 18

దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

 

2కోరింథీయులకు 6: 17

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

 

2కోరింథీయులకు 7: 1

ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

 

 1 పేతురు 1:15-16

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

యూదా 1: 23

అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మాత్రము నొప్పుకొనక దానిని (మూలభాషలో- శరీరమువలన డాగుపడిన అంగీని) అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -30 భాగము*

యాకోబు 1:26, 27

26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇక 26 వచనం చూసుకుంటే ఎవ్వడైనా నోటికి కల్లెము పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసగిచ్చు కొంటే భక్తిగలవాడను అనుకుంటే వాడి భక్తి వ్యర్ధము అంటు- 27 వచనంలో భక్తికి నిర్వచనం ఇచ్చారు!

 

      (గతభాగం తరువాయి)

 

సరే, భక్తికోసం మన ఆధ్యాత్మిక సందేశాలు శీర్షికలలో అనేకసార్లు వ్ర్రాయడం జరిగింది, దానిని మరోసారి చూసుకుందాం!

 

మనము పవిత్ర భారతదేశంలో పుట్టాము. మన దేశమంతా భక్తికి ప్రాధన్యతనిస్తుంది. క్రైస్తవులుగా మనంకూడా భక్తికి చాలా ప్రాముఖ్యతనిస్తాము.

 

*భక్తి అనగా ఏమిటి*?

 

మన నిర్వచనం ప్రకారం పాపాలు చేయకుండా, అబద్దాలు ఆడకుండా, ప్రార్ధన చేస్తూ, ఉపవాసం ఉంటూ, ఇంకొందరు వీటితో పాటు భాషలు మాట్లాడుతూ, ప్రవచిస్తూ, ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటే అదే భక్తి అనుకొంటాం. ఇదేనా భక్తి? ఇంకా ఏమైనా ఉందా?

 

    మనకి ప్రతీదానికి ఆధారం మన పరిశుద్ధగ్రంధమే! గనుక బైబిల్ లో ఏమి వ్రాయబడి ఉందో చూద్దాం!

 

యేసుప్రభులవారి సహోదరుడు యాకోబుగారు వ్రాసిన పత్రికలో 1:27

 

“*తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కలంకమును ఐన భక్తి ఏదనగా 1. దిక్కుమాలిన పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు (అనగా వారికి సహాయం చేయడం), 2. ఇహలోకమాలిన్యం తనకంటకుండా తననుతాను కాపాడుకొనుటయే!*”

 

ఇదే విషయాన్ని పాతనిభందన గ్రంధంలో యెషయా 58:3-10 లో భక్తిని- ఉపవాసంతో పోలుస్తున్నారు.

“*1. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు (ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం),

2. భాదింపబడేవారికి సహాయం చేయుటయు, 3. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు,

 4. నీరక్త సంభందికి ముఖము తప్పించుకొనకుండుటయు,

5. వస్త్రహీనుడు కనబడితే వానికి వస్త్రములిచ్చుటయు, ఇదేకదా నాకిష్టమైన ఉపవాసము*” అని దేవుడు సెలవిస్తున్నారు.

ఇప్పుడు చూద్దాం మనం అనుకొంటున్న భక్తికి- దేవుడు సెలవిచ్చిన భక్తికి తేడా!!!!

 

మనం చేస్తున్నది ఒకటి! చెయ్యమన్నది ఒకటి!!!

 

అయితే మీరనొచ్చు మేం చేస్తున్నది భక్తి కాదా?!!!!! అని, మీరు చేస్తున్నది భక్తిలో ఒక భాగం మాత్రమే గాని అదే భక్తి కాదు!!!

 

       మనల్ని మనం పరీక్షించుకొందాము ఎలాంటి భక్తి మనం చేస్తున్నాం. మన బంధువులకి, రక్త సంభందికులకు, మన పొరుగువారికి సహాయం చేస్తున్నామా? నీవు ప్రపంచంలో ఉన్న అందరికి సహాయం చేయడం కష్టం గాని కనీసం నీ ఊరువాడికి చేయగలవు కదా! అందరికీ చేయలేకపోయినా నీ పొరుగు వాడికి, నీ స్నేహితునికి లేక నీ సహోదరునికి లేక నీ సంఘసభ్యునికి సహాయం చేయగలవు కదా! మరి చేస్తున్నావా?

 

నీవు ఎంత ప్రార్ధనాపరుడివైనా/పరురాలివైన, ప్రసంగీకుడవైనా, ఉపవాసాలుండినా ఇవి చేయకపోతే నీ భక్తి దండగ!!!

 

చర్చిలో మరియు ఇంట్లో గంటలుగంటలు ప్రార్ధనచేస్తావు గాని నీ పోరుగువానితో సమాధానంగా ఉండవు, సహాయం చేయవు! నీ భక్తి వ్యర్ధం!!

 

భాషలు మాట్లాడుతావు గాని నీ సహోదరుని ప్రేమించవు, ఎవరికీ భిక్షం వేయవు---- నీ భక్తికి అర్ధం లేదు!!!

 

ప్రసంగాలు చేస్తావు నీ పొరుగువాని ప్రేమించమని- నీ పోరుగువానితో గాని, తోటి దైవసేవకునితో గాని సమాధానంగా ఉండవు, మాట్లాడవు- సరికదా వారితో వైరం!!! ఎవరికీ అన్నం పెట్టవు.--- నీ ప్రసంగాలు, నీ భక్తి దండగ!!!!!

 

ఉపవాసాలు ఉంటావు- ఇంట్లో నీ అత్తమామలకు లేక నీ తల్లిదండ్రులకు భోజనం పెట్టవు , నీవు చూడవు నీ భర్తను కూడా చూడనీయవు నీది భక్తా? వేషధారణా????

 

ఉపవాసాలుంటావు, ప్రార్ధనలు చేస్తావు, భాషలు మాట్లాడుతావు, ప్రవచిస్తావు గాని, అన్యుడితో మాట్లాడవు, వారికి సహాయం చేయవు, దేవుని ప్రేమ చూపించవు, సరికదా వారిని అంటరానివారిగా చూస్తావు. ఇంకా వారెప్పుడు రక్షణ పొందుతారు? నిన్ను చూస్తూనే అసహ్యంచుకొంటారు. నీబట్టి యేసయ్యని కూడా ద్వేషిస్తున్నారు!!

 

చెబుతావు గాని చెయ్యవు!! నోరు తెరిస్తే భూతులు! కొళాయిలదగ్గర తగవులు. ఊరిలో ఎవరితోనూ సమాధానంగా ఉండవు!! సరికదా దేవుని పరువుపోయేలా తగవులాడుతావు!!

 

అందుకే యాకోబు పత్రికలో 1:26 లోఎవడైననూ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తానూ భక్తి గలవాడినని అనుకొంటే వాని భక్తి వ్యర్ధముఅని వ్రాయబడింది.

 

     అందుకే యేసయ్య అంటున్నారు శపింపబడిన వారలారా! అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచిన అగ్నిగుండములోనికి పొండి! ఎందుకంటే నేను ఆకలిగొంటిని- భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని- దాహమీయలేదు, పరదేసినై ఉంటిని- నన్ను చేర్చుకోలేదు, రోగినైయుంటిని- పరామర్శించలేదు,... అందుకు ప్రభువా నీవెప్పుడు ఆకలిగొంటివి? దప్పిగొంటివి? ........ దేవుడన్నారు అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు. అంటే వారికి సహాయం చేస్తే దేవునికి చేసినట్టే!!!!

 

   కాబట్టి నీవు చేసేది భక్తా? వేషధారణా? సరిచూసుకో! సరిచేసుకో! 1 యోహాను 3:17 లో ఈలోకపు జీవనోపాధిగలవాడవై ఉండి, తన సహోదరునికి లేమి కలిగియుండుట చూచియు, అతనియెడల కనికరం చూపనివానియందు దేవుని ప్రేమ ఏలాగునిలుచును?

 

దేవుని ప్రేమ లేక పొతే నీవు వ్యర్దుడవే సుమా!!!

 

    సరే నీవు భక్తి చేస్తున్నాను అంటున్నావు కదా! భక్తినే ఒకసారి ఆలోచిద్దాం!

1.ప్రార్ధన:-  ప్రార్ధన ఎలా చేస్తున్నావు?

 

అస్తమాను ప్రభువా నాకు అది ఇచ్చేయ్! ఇది ఇచ్చేయ్! నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చేయ్! నా కోడలికి గర్భఫలం ఇచ్చేయ్! నాకు ఇల్లు ఇచ్చేయ్, కారు ఇచ్చేయ్, ఇంకా చాలా రకాలైన కోరికలు లిస్టు ఇస్తున్నావ్ (భర్త మార్కెట్ కి వెళ్ళినప్పుడు భార్య సరుకులు లిస్టు ఇచ్చినట్లు). లేకపొతే దేవుణ్ణి కాపలాదారులాగా ప్రభువా కాపలాకాయమని అడుగుతున్నావ్రోగం బాగుచేయ్యమని అడుగుతున్నావ్! గాని ప్రభువా నాకిచ్చిన ప్రతీ ఈవికోసం నీకు వందనాలు అని దేవునికి స్తుతి చెయ్యడం లేదు.

 

ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునికి చెప్పడం- తిరిగి జవాబు పొందడం. దేవుడు తిరిగి జవాబిచ్చేవరకు ప్రార్ధనలో కనిపెడుతున్నావా?!

 

దేవుడు నీతండ్రి- తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడు, తండ్రికివ్వవలసిన గౌరవం ఇవ్వు

 

దేవుడు నీరాజు- రాజుతో జాగ్రత్తగా మాట్లాడు

 

దేవుడు నీ స్నేహితుడునీకు సంతోషం కలిగిన, భాదలున్నా అన్నీ ఆయనతో చెప్పేసుకో!!

 

దేవుడు నీకు తల్లిలాంటి వారు నీకు గురువు- ఆయననుండి నేర్చుకో!!

 

2. ఉపవాసం:- అనగా దేవునితో సహవాసం

 

సహవాసం చేస్తున్నావా? వేషదారుల్లాగా అందరికీ కనబడాలని ఉపవాసం చేస్తున్నావా? మత్తయి 6:16

 

యెషయా 58: 5 అట్టి ఉపవాసము నాకనుకూలమా? ..... ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టిది నాకు ప్రీతికరమా? అని అడుగుచున్నారు.

 

6,7,8 వచనాలు దేవునికి కావాల్సిన భక్తి, ఉపవాసం ఏమిటో సెలవిచ్చారు.

 

కాబట్టి ఎలా ఉపవాసం చేస్తున్నావు? నిజమైన ఉపవాసమా? ఆచారపరమైన ఉపవాసమా? దేవుడు చెప్ప్పిన భక్తా? నీ సొంత భక్తా? నీ సంఘంలో చేసే ఆచరించే కట్టుబాట్లు ఆరాధనా క్రమం మాత్రమె భక్తా? ఆలోచించుకో!!

 

3. భాషలు:-  భాషలు మాట్లాడటం తప్పులేదు. అవి కావాలి. కాని భాషలే భక్తి కాదు. అవి అంతరంగపురుషుడు బలపరచబడటానికే మాత్రమే ఉపయోగపడతాయి. ఉదా:- ఒక చంటిబిడ్డకు హార్లిక్స్, బూస్ట్ మాత్రమె ఇస్తే సరిపోదు, సరియైన ఆహారం, పోషక పదార్దాలు ఇవ్వాలి లేకపోతే పిల్లవాడు నీరసించిపోతాడు. అలాగే ప్రార్ధన, ఉపవాసం వీటితో పాటు మంచి కార్యాలు చెయ్యాలి. అప్పుడే దానిని భక్తి అంటారు బైబిల్ ప్రకారం.

 

అపోస్తులుల కార్యంలో కోర్నెలు గారిదగ్గరకు దేవుని దూత వచ్చి ఏమంటున్నాడు? కోర్నేలి! నీవు చేసిన ప్రార్ధన, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి. అంటే ప్రార్ధనతో పాటు ధర్మకార్యాలు మాత్రమే దేవునిని చేరుకొంటాయి కాబట్టి తప్పకుండా ధర్మకార్యాలు కావాలి. లేకపోతే నీ భక్తి వ్యర్ధం!

 

    అసలు భక్తికి మూలం ఏమిటి? 1. దేవుడంటే భయము , 2. ప్రేమ కలిగియుండటం.

 

1. దేవుడంటే భయం ఉంటే పాపం చెయ్యవు. దానినే భక్తి నిర్వచనంలో ఇహలోక మాలిన్యం తనకంటకుండా చూసుకోవడం!

 

భయముంటే అబద్దాలు చెప్పవు. దొంగతనం చేయవు. వ్యభిచారం చేయవు. పొరుగువాని భార్యను/భర్తను ఆశించవు. ఇవి చేస్తున్నావు అంటే దేవుడంటే నీకు భయం లేదన్న మాట!

2. ప్రేమ:- ప్రేమ ఉంటే పొరుగువానిని ప్రేమిస్తావు. స్నేహితునికి సహాయం చేస్తావు. అత్తమామలని, తల్లిదండ్రులని బాగాచూసుకొంటావు. సమాధానంగా ఉంటావు.

 

మరి నీవు ఏం చేస్తున్నావ్? యేసయ్య అంటున్నారు మత్తయి 7:22-23 ప్రభువా నీనామమున ప్రవచింపలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా? అనేక అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు; అప్పుడు నేను అక్రమము చేయు వారలారా! నాయొద్ద నుండి తొలగిపొండని మీతో చెప్పుదును. ఆలోచించుకో! దేవుడు చెప్పినట్లు చెయ్యకుండా మీ సొంత భక్తి చేస్తే అక్రమముచేయు వారలారా అంటే నీ ప్రార్ధన, ఉపవాసం, భాషలు, ప్రవచనాలు అన్నీ వ్యర్ధమే కదా!

 

   పౌలుగారు ఏమంటున్నారు 1 కొరింథీ 13 అధ్యాయం మనుష్యుల భాషలతోను  దేవదూతల భాషలతోను మాట్లాడినా, ప్రవచించే వరం కలిగినా, కొండలు పెకలించే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా, బీదలపోషణ కొరకు నా ఆస్తిఅంతా ఇచ్చేసినా ప్రేమలేని వాడనైతే నేను వ్యర్దుడను. దేవునిచే నేను నిన్ను ఎరుగను అనే స్తితికి చేరుకొంటావు జాగ్రత్త!

 

ఒక విషయం చెప్పనా? యాకోబు పత్రిక 1:27 ప్రకారం, యెషయా 58 ప్రకారం పేదలకు సహాయం చెయ్యడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, బందీఖానాలో ఉన్నవారిని విడిపించడం చేస్తే భక్తి చేసినట్లే!!!

 

అలా అయితే అవిచేస్తే ప్రార్ధన, ఉపవాసాలు వద్దా అంటారేమో!!

 

పైనుదహరించిన ధర్మకార్యాలు చేస్తూనే, వాటితోపాటు దేవునితో సత్సంభందం కోసం నీ అత్మీయాభివృద్ధికోసం, నీ అంతరంగపురుషుడు బలపడేలాగా ప్రార్ధన, ఉపవాసం, వాక్యధ్యానం, భాషలు, సంఘపరిచర్యలో పాల్గొనుట, క్రమం తప్పకుండా ఆరాధనకు హాజరవడం చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను భళానమ్మకమైన మంచిదాసుడా! అని పిలుస్తారు.

 

  అంతేకాదు ఇంకా ఏమంటున్నారు యెషయా 58లో అలాచేస్తే నీ వెలుగు వేకువ చుక్కలా ఉదయించును, స్వస్తత నీకు శీగ్రముగా లభించును, యెహోవా నిన్ను తృప్తి పరచును, నిన్ను పోషించును .... అంటున్నారు.

 

అలాకాకుండా నీ పొరుగువాడు చలికి భాదపడుతుంటే మంటకాచుకో, రగ్గు కప్పుకో, ఆకలితో ఉంటే ఇంటికివెళ్ళి భోజనం వండుకొని తిను అని చెబితే ప్రయోజనం ఏముంది? డబ్బులు ఉంటే రగ్గు కొనుక్కోలేరా? అన్నం వండుకోడానికి సరిపడే ధనం ఉంటే వండుకోలేదా? ఆరోగ్యం ఉంటె చేసుకోలేదాలేకే కదా నిన్ను కోరినది. (యాకోబు పత్రిక 2 అధ్యాయం చదవండి)

 

ఆలోచించుకో! సరి చేసుకో!

 

అక్షరార్ధమైన భక్తి కాకుండా, వేషధారణ భక్తి కాకుండా, ప్రజలు మెచ్చుకొంటారనే భక్తి కాకుండా, నిజమైన దైవిక భక్తి, బైబిల్ చెప్పిన భక్తి కలియుండమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.

 

దేవుని కృపా సమాధానములు మనందరికీ మెండుగా కలుగును గాక!

 

ఆమెన్!

*యాకోబు పత్రిక -31 భాగము*

యాకోబు 2:14

1. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై యుండకుడి.

2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసిన వారగుదురు కారా?

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఇంతవరకు మొదటి అధ్యాయం నుండి అనేక లోతైన విషయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు యాకోబు గారిని ఉపయోగించుకుని సమాజంలో పక్షపాతం చూపించే వారికొరకు వ్రాయించారు! దేవునికి పక్షపాతము లేదు అలాగే విశ్వాసులకు కూడా పక్షపాతం ఉండకూడదు, అసమానతలు పాటించకూడదు అనేది అధ్యాయం యొక్క ఉద్దేశం!

 

 సరే మొదటి వచనం నుండి అంటున్నారు: నా సహోదరులారా! ప్రభువునందు మనమందరం సహోదరులం కాబట్టి, వారెవరైనా సహోదరులు అని పిలుస్తున్నారు: మహిమా స్వరూపియైన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మీరు ఎంతమాత్రము మోమోటం చూపించవద్దు అంటున్నారు! మీరు విషయంలో మోమోటం లేక మొగమాటం చూపించినా గాని దేవుని యందలిగల విశ్వాస విషయంలో ఎంతమాత్రము మొగమాటం చూపించవద్దు అంటున్నారు! దానిని ధ్యానం చేసే ముందుగా మహిమా స్వరూపియగు యేసుక్రీస్తును అంటున్నారు. యోహాను సువార్తలో యేసయ్య వెలుగైన వాడు అంటూ పరిచయం చేస్తే, మనకు కొరింథీ పత్రికలో అంటున్నారు

.2కోరింథీయులకు 4: 5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

ఇంకా తీతు పత్రికలో అంటున్నారు: మహా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురుచూస్తున్నాము ! తీతుకు 2: 13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకు చుండవలెనని మనకు బోధించుచున్నది.

 

ఇక తిమోతి పత్రికలో అంటున్నారు: 1తిమోతి 6:15,16...

15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ప్రత్యక్షతను కనుపరచును. సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు.

16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

 

హెబ్రీ పత్రికలో అంటున్నారు 1:...

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

 

ఇక ప్రకటన గ్రంధంలో అనేకసార్లు ఆయన మహిమ ప్రభావం తేజస్సు గలవాడు అంటూ చెప్పబడింది! కాబట్టి దేవుడు మహిమా ప్ర్రభావం గలవాడు! అయితే మహిమా ప్రభావం ఎవరో కాదు: అది యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే! 

 

ఇక అసలు విషయానికి వద్దాం! నా సహోదరులారా మీరు విశ్వాసం విషయంలో మొగమాటం గలవారై ఉండొద్దు అంటూ 24 వచనాలలో రకంగా మొగమాటం గలవారై ఉండవద్దో చెబుతున్నారు:

ఒకడు బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రాలు అనగా వెలగల వస్త్రాలు కొత్త బట్టలు వేసుకుని మీ సమాజ మందిరం అనగా నేడు మన మందిరాలలోనికి వస్తే, అక్కడే మురికి బట్టలు వేసుకుని మందిరానికి వచ్చిన మరో దీనుడు దరిద్రుడు బీదవాడు ఉంటే, బంగారు ఉంగరం పెట్టుకుని వెలగల వస్త్రాలు వేసుకున్న వానిని మీరు సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలములో కూర్చో అని ధనవంతునికి చెప్పి, అదిగో మూలను లేక నా కుర్చీ ప్రక్కన క్రింద కూర్చో అని దరిద్రునికి చెబితే మీరు మీ మనస్సులో బేదములు పెట్టుకుని దురాలోచనలతో ఉన్నారు అంటున్నారు పరిశుద్ధాత్ముడు!!!

 

అవును కదా, నేటి దినాలలో ఇలాంటివి ఎన్నో జరుగుచున్నాయి! ధనవంతులను కానుకలు ఇచ్చేవారిని ఘనపరుస్తూ, దరిద్రులను హీనంగా చూస్తున్నారు- బయట కాదండి, మన సంఘాలలోనే! అది బాప్తిష్టు సంఘమైనా పెంతుకోస్తు సంఘాలలోను, అన్నీ సంఘాలలోను ఇలానే జరుగుతుంది. ఇది వేషధారణ, దురాలోచన!! అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు!  అయ్యా నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారు: కానుకలు ఎక్కువగా ఇచ్చేవారింటికి మంచి ఆహారం పెట్టేవారింటికి వారు పిలువక పోయినా విశ్వాసుల ఇంటికి వారానికి ఒకటి రెండు సార్లు వెళ్తారు! అదే కానుకలు ఇవ్వలేని బీద వారి ఇంటికి సేవకులు/ కాపరులు వెళ్ళనే వెళ్ళరు, ఏమండి పాష్టర్ గారు మా ఇంటికి ఎందుకు రారు అంటే- అమ్మా నీవు చాలా భాధలలో ఉన్నావు కదా నేను వస్తే నీకు మరింత ఇబ్బంది అవుతుంది కదా అంటున్నారు, మరికొంతమంది నేను వస్తే నీవు ఏమి ఇవ్వగలవు? ఏమీ ఇవ్వలేవు గనుకనే రావడం లేదు అని చెబుతున్నారు! అయ్యా, కష్టాలలో పేదరికంలో ఉన్న దీనులైన విశ్వాసులను వారి కష్టాలలో ఇబ్బందులలో ఆదరిస్తే వారు ఇంకా విశ్వాసంలో బలపడి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తారు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వీరికి ఎప్పుడూ రాబడి కావాలి! అందుకే తారతమ్యాలు చూపిస్తున్నారు!

 ఇక సేవకులే కాదు, సంఘపెద్దలు సంఘస్తులు కూడా బాగా డబ్బున్న వారిని కానుకలు ఇచ్చేవారిని మంచి వెలగల బట్టలు వేసుకునే వారినే ఘనపరుస్తున్నారు తప్ప- పేదవారితో మాట్లాడటం లేదు, వారికొరకుప్రార్ధన కూడా చెయ్యడం లేదు! ఇది తప్పుకాదా??!!!

 

దేవుడు పక్షపాతం చూపనప్పుడు, దేవుడు బేధాలు ఎంచనప్పుడు ఆయన పిల్లలమైన మనము కూడా ఇలాంటి తారతమ్యాలు పక్షపాతాలు చూపనే కూడదు!  ఆయన పిల్లలమయితే ఆయననే అనుసరించాలి, అనుకరించాలి!  ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల్లో నిర్లక్షం చేస్తున్నారు! ఇది చాలా విచారకరం! పరిశుద్ధాత్ముడు ఇలాంటి పక్షపాతాలు చెడ్డ ఉపదేశాల వలన, వినుట మాత్రమే చేస్తూ దానిని పాటించని దైవసేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా ఇలాంటి చెడ్డ అలవాట్లు వస్తున్నాయి అంటున్నారు!

 

క్రీస్తులో మనుష్యులందరూ సమానమే అని మనకు రోమా మరియు కొరింథీ పత్రికల వలన తెలుస్తుంది. దీనిని విశ్వాసి ప్రతీ ఒక్కరు అంగీకరించి పాటించాలి! నీకు రెండు పాటలు మూడు ప్రార్ధనలు ఒక ప్రసంగం వచ్చేసింది, నీవేదో గొప్ప ఉన్నతమైన అనుభవం గలవాడినని మురిసిపోయి ఇలాంటివి పాటించావా దేవుని రాజ్యానికి వారసుడివి కాలేవు అని మనకు 5,6 వచనాలలో చెబ్తున్నాడు పరిశుద్దాత్ముడు!!

రోమా2:11

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

 

1కొరింథీ 12:13

ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

 

ఎఫెసీ 6:9

యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.

 

కోలస్సీ 3:11,25

11. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని (అనాగరికమైన ఒక జనము) దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునైయున్నాడు.

25. అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు.

 

1తిమోతి 5:21

విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియు చేయక, నేను చెప్పిన సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను (సాక్ష్యమిచ్చుచున్నాను).

 

1పేతురు 1:17

పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

 

అయితే ఎలా ఉండాలో చెబుతున్నారు:

 

రోమా 12:10,16

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

16. ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

 

రోమీయులకు 14: 3

తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.

 

కాబట్టి పేదలని దీనులను చిన్నచూపు చూడకుండా, వారి వస్త్రధారణను బట్టి కాకుండా వేషధారణ చూడకుండా అందరిని సమానంగా మన సంఘాలలో చూద్దాం! దైవిక ప్రేమను చూపిద్దాం!

దైవాశీస్సులు!

 

*యాకోబు పత్రిక -32 భాగము*

యాకోబు 2:57

5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

6. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా?

7. మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. పేదవారిని దీనులను హీనపు చూపు చూస్తున్నారు. పక్షపాతాలు చూపకూడదు అని చూసుకున్నాము! ఇక 57 వచనాలలో పేదల పక్షంగా మాట్లాడుచున్నారు!

గ్రంధం ప్రారంభంలో చెప్పడం జరిగింది- బైబిల్ గ్రంధంలో పేదల పక్షంగా ఎవరైనా మాట్లాడారు అంటే మొదటగా యేసుక్రీస్తుప్రభువుల వారు, రెండవదిగా ఆయన తమ్ముడైన యాకోబు గారు! ఇక్కడ భాగంలో పేదలను మీరైతే ఎంతో హీనంగా చూస్తున్నారు గాని పేదలను పరమతండ్రి ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో చెబుతున్నారు! లోకంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యవంతులు గాను, తన్ను ప్రేమించువారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులనుగాను చేయడానికి దేవుడు పేదలను ఏర్పాటుచేసుకున్నారు అంటున్నారు!

 

వచనంలో మనకు పేదలుకున్న రెండు భాగ్యాలు చెబుతున్నారు:

మొదటిది: విశ్వాసమందు భాగ్యవంతులు, రెండు: తన్ను ప్రేమించువారికి తానూ వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు! ఇక్కడ తనను ప్రేమించువారికి అని ఎందుకు అంటున్నారు  అంటే దేవుణ్ణి ప్రేమించువారు ఎవరూ అంటే అది పేదవారు మాత్రమే! ధనవంతులు గొప్పవారు ఐశ్వర్యమంతులు పెదాలమీద దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇక్కడ దీనులకు పేదవారికి దేవుడు తప్ప మరో దిక్కులేదు కాబట్టి వీరు మనసావాచా కర్మేనా దేవుణ్ణి ప్రేమిస్తూ సేవిస్తూ ఉంటారు కాబట్టే దేవుడు తనను ప్రేమించువారికి వాగ్దానం చేసిన రాజ్యము అనగా పరమరాజ్యానికి వారసులుగా పేదవారిని దీనులను చేసారు అని పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు!

 

ఒకసారి యేసుక్రీస్తుప్రభులవారు పేదల కోసం ఏమని చెప్పారో చూద్దాం: లూకా 6:20 పేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది!

 

    యేసుక్రీస్తుప్రభులవారు రెండు ప్రశస్తమైన ప్రసంగాలు చేశారు! కొండమీద ప్రసంగం అని పిలువబడే మత్తయి సువార్త 57 అధ్యాయాలు!

రెండవది: లూకా 6:2049ని మైదానం ప్రసంగం అంటారు బైబిల్ పండితులు! కొండమీద ప్రసంగంలోనూ పేదల పక్షాన మాట్లాడారు! మైదాన ప్రసంగం లోను పేదలకోసమే మాట్లాడుచున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!!!  కొండమీద ప్రసంగంలో ఉన్న విషయాలలో కొన్ని విషయాలు ఇక్కడకూడా కనిపిస్తాయి మనకు!

చూడండి: పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అంటున్నారు పేదల దగ్గరికి వచ్చి!

ఇంకా మనకు లూకా 4:18 లో ఆయన సమాజమందిరంలో దైవవాక్యం చదువుతూ యెషయా గ్రంధం చదువుతుండగా ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు అంటూ ఇంకా గుండె పగిలిన వారిని బాగుచెయ్యడానికి, నలిగిన వారిని విడుదల చెయ్యడానికి, ఖైదీలకు అనగా పాపపు ఖైదీలగు వారిని విడుదల చెయ్యడానికి గుడ్డివారికి చూపు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపాడు అంటూ లేఖనం నేడు నెరవేరింది అంటూ చెప్పారు! కాబట్టి యేసయ్య పేదలను, నలిగిన వారిని సమాజంలో త్రోసివేయబడిన వారిని దీనులను ప్రేమించి రక్షించడానికి వచ్చారు! ఇంకా పాపులను రక్షించడానికి వచ్చారు! కాబట్టి ప్రియ సహోదరుడా ఒకవేళ నీవు పేదవాడివా దీనుడవా మీకోసమే యేసయ్య వచ్చారు అని మరిచిపోవద్దు!

 

పౌలుగారు అంటారు ఆత్మావేశుడై: లోకంలో మీరు పొందుకున్న పిలుపును చూడండి మీరు లోక సంబంధముగా జ్ఞానులు గాని ఘనులు గాని గొప్ప వంశం కాని కారు గాని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు అంటూ లోకంలో అలాంటి ఘనలను గొప్పవారిని సిగ్గుపరచడానికి విలువలేని మనలని ఏర్పరచుకుని వారికంటే ప్రశస్తమైన జ్ఞానము ఇచ్చి వారిని సిగ్గుపరచారు అంటున్నారు 1కొరింథీ 1:2629

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో- శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27. శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

 

చూశారా అప్పటికీ ఇప్పటికీ ఇది నిజమే కదా! మన దేశంలో కూడా దేవుడు మేధావులను పెద్ద కులాలలో పుట్టిన వారిని గొప్ప చదువులు చదివిన వారిని ఏర్పరచుకోలేదు గాని అందరూ తృణీకరించిన మనలను దేవుడు ఏర్పాటుచేసుకున్నారు గనుక మనం దేవునికి ఋణపడి కృతజ్ఞత కలిగి ఉండాలి! అలా అని గొప్ప కులాలలో పుట్టిన వారిని ధనవంతులను ఉన్నత విధ్యకలిగిన వారిని దేవుడు ఏర్పరచుకోలేదు అని కాదు! వారిని కూడా దేవుడు పిలిచారు గాని కొంతమంది మాత్రమే ఆయన స్వరము విని మన దేశంలో మన తెలుగు రాష్ట్రాలలో దేవుని దగ్గరికి వచ్చారు! మిగిలిన వారు కోట్లమంది దేవునికి దూరంగా వ్యతిరేఖంగా ఉంటున్నారు! కాబట్టి మనము తప్పకుండా దేవుడంటే కృతజ్ఞత కలిగి ఉండాలి!

 

ప్రియ దేవుని బిడ్డా! నీవు దేవుడంటే కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఒకరోజు నీకు ఏమీ లేనప్పుడు నీ సొంతవారు నీ బంధువులు నీ కులపు వారు నీ పొరుగువారు ఎవరూ నిన్ను పట్టించుకోలేనప్పుడు, నీ దగ్గర డబ్బులేదని నీ దగ్గర ఆరోగ్యం లేదని, నిన్ను విడిచిపెట్టినప్పుడు దేవుడు నేనున్నాను అని నిన్నుపిలిచి, నిన్ను ఆదరించి, నిన్ను ముట్టి స్వస్తపరచి, నీకు బ్రతుకుతెరువు నిచ్చి, నీకిప్పుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి నిన్ను గొప్పచేశారు కదా! మరి నీవు దేవుడంటే కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేక నీవాళ్ళు పిలిచారు, నిన్ను అన్నింటిలో ముందు పెడుతున్నారు అని దేవుని మందిరాన్ని వదిలిపెట్టి దేవుని దినాన్నే వారి ఫంక్షన్ లకు పెళ్లిళ్లకు పరుగెడుతున్నావా? ఒకరోజు వీరేకదా నిన్ను వెలివేశారు! పదిమంది కుష్టు రోగులు బాగుపడినా కేవలం సమరయుడు ఒక్కడు మాత్రమే యేసయ్య దగ్గరకు వచ్చి అయ్యా నీకు ధన్యవాదాలు, నన్ను ముట్టినందుకు నీకు వందనాలు అని చెప్పడానికి వచ్చాడు, మిగిలిన వారు బాగుపడిన వెంటనే తమ కుటుంభం తమ కులము గుర్తుకు వచ్చి సమాజంలో కలిసిపోయారు! గాని అలా సమాజంలో కలవడానికి కారణమైన వానిని, ఒకరోజు సమాజమే నిన్ను వేలివేసినప్పుడు తిరిగి సమాజంలో కలవడానికి నీలో ఆటంకంగా ఉన్నదానిని తీసివేసి స్వస్తపరచిన వానిని దూరంగా పెట్టారుకదా, మరి వీరు విశ్వాసవీరులా విశ్వాస ఘాతకులా? ఒకసారి నీవు కూడా నిన్ను నీవు పరిశీలించుకో!

దేవుడు నిన్ను విశ్వాసమందు భాగ్యవంతునిగా, తన రాజ్యానికి వారసునిగా చేసిన ఔన్నత్యము మరచిపోవద్దు!

దేవునిపట్ల విశ్వాసం కలిగి కృతజ్ఞత కలిగి జీవించు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -33 భాగము*

 

యాకోబు 2:57

5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

6. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా?

7. మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. పేదవారిని దీనులను హీనపు చూపు చూస్తున్నారు. పక్షపాతాలు చూపకూడదు అని చూసుకున్నాము! ఇక 57 వచనాలలో పేదల పక్షంగా మాట్లాడుచున్నారు!

 

           (గట భాగం తరువాయి)

 

   ప్రియులారా గతభాగంలో పేదలకు దేవుడిచ్చిన ధన్యతలు చూసుకున్నాము! వారు విశ్వాసంలో భాగ్యవంతులు, మరియు దేవుడు తనను ప్రేమించేవారికి అనుగ్రహించే పరమరాజ్యానికి వారసులుగా పేదలను దీనులను ఏర్పాటుచేసుకున్నారు అని ధ్యానం చేసుకున్నాము! అయితే మరికొందరిని కూడా అదే రాజ్యానికి వారసులుగా చేశారు! మరికొందరిని రాజ్యము యొక్క అంచులు కూడా దరిచేరకుండా చేశారు! వారిని ఒకసారి చూసుకుని ముందుకు పోదాం!

మత్తయి 5:5 లో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొంటారు అన్నారు. వీరే దీర్ఘశాంతం కలిగి తర్వాత పరలోకానికి కూడా పాత్రులవుతారు!

ఇంకా ప్రకటన 21:7 ప్రకారం జయించిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు ...

ప్రకటన గ్రంథం 21: 7

జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.

 

చివరిగా ఎవడైతే పశ్చాత్తాప పడి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొందుకుంటాడో వాడు రాజ్యానికి వారసుడౌతాడు మత్తయి 4:17.

 

అయితే రాజ్యంలో స్థానం కోల్పోయినవారు ఎవరంటే 1కొరింథీ 6:910

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను

10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

 

Galatians(గలతీయులకు) 5:19,20,21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ప్రకటన గ్రంథం 21: 8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

మరి నీవు నీ పేరు బ్యాచ్ లో ఉందో సరిచూసుకో!

 

 ఇక 67 వచనాలలో అంటున్నారు: అయితే మీరు దరిద్రులను అవమాన పరుస్తున్నారు! ధనవంతులను ప్రేమిస్తున్నారు, గాని నిజానికి మీమీద కఠినముగా అధికారం చూపేది ధనవంతులే కదా! వీరేకదా మిమ్మును న్యాయసభలకు కూడా ఈడ్చుకుపోతున్నారు. ఇంకా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం అనగా మీకు పెట్టబడిన ఆయన నామం అనగా యేసునామమునుకూడా వీరేకదా దూషిస్తున్నారు అంటున్నారు!

మీరు దరిద్రులను అవమానిస్తున్నారు, ధనవంతులను ప్రేమిస్తున్నారు! అయితే ధనవంతులు మీమీద కఠినంగా ఉంటున్నారు. మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుకు పోతున్నారు. మిమ్మల్ని మీ దేవుణ్ణి దూషిస్తున్నారు అయినా వారినే ప్రేమిస్తున్నారు, వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు యాకోబు గారు!

ఈరోజులలో కూడా అలాగే చేస్తున్నారు కదా! ధనవంతులు పేదలైన విశ్వాసులను దూషిస్తూ అవమానిస్తూ వారిని హింసిస్తూ ఉన్నారు! వారిమీద లేనిపోని కేసులు కూడా పెడుతున్నారు! ఇంకా న్యాయసభలకు ఈడ్చుకు పోతున్నారు!

 

ఇలా జరుగుతుంది అని యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెప్పారు! నానామము బట్టి జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాట లెల్ల పలుకునప్పుడు ధన్యులు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నారు కొండమీద ప్రసంగంలో మత్తయి 5:11,12

అయితే తర్వాత చెప్పారు- మీరు నా నామం నిమిత్తం సభలకు పిలువబడతారు, అక్కడ మీరు ఏమి చెప్పాలి ఏమి మాట్లాడాలి అని హైరానా చెందవద్దు! సమయంలో మీ పక్షంగా మాట్లాడేవాడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు గాని మీరు కాదు!.....

లూకా 21: 12

ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

లూకా 21: 14

కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.

లూకా 21: 15

మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.

 

అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించ వలసిన విషయం ఏమిటంటే మిమ్మల్ని సభలకు ఈడ్చుకుని పోయింది క్రీస్తునామము కొరకైతే మీరు సంతోషించి ఆనందించాలి గాని మీరు చేసిన తప్పుడు పని లేక దొంగపని లేక మరేదో పాడు పనిమీద మీరు సభలకు, లేక పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుని పోబడ్డారా? అయితే మీకు అవమానమే! దేవునికి అవమానమే! ఇంకా సంఘాలకు అవమానమే! మొత్తం క్రైస్తవ సమాజానికి అవమానమే!

క్రైస్తవుడైన వాడు త్రాగుబోతుగా తిరుగుబోతుగా గూండాగా, దొంగగా, వ్యభిచారిగా వావి వరుసలు పాటించనివాడుగా , హంతకుడిగా ఉంటే సర్వసమాజము క్రైస్తవ సమాజాన్నే దూషిస్తుంది. చివరికి దేవుని పేరు పోతుంది. అందుకే బైబిల్ లో వ్రాయబడింది- మీకోసమే కదా నా నామము అవమాన పడుతుంది!!..రోమీయులకు 2: 24

వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?

 అన్యులందరూ అలా ప్రవర్తించినా ఏమీ అనరు గాని, క్రైస్తవుడైన వాడు అలా అవమానకరంగా జీవిస్తే దేవుని బిడ్డ అట, చూశావా ఎలా తాగేసి, పందిలా దొర్లుతున్నాడో, ఎలా లంచాలు తీసుకుంటున్నాడో, అంటారు; చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి....గుడుసులు అంటారు, పైన పటారం, లోన లొటారం, ముందు పర్సనాలిటీ, వెనుక మున్సిపాలిటీ అంటారు!

మరినీవు దేవునికి మంచిపేరు తీసుకుని వస్తావా? లేక దేవుని పేరు చెడగొడతావా?

ఇక్కడ దేవుని నామమునకు దేవుని ప్రశస్తమైన లేక శ్రేష్టమైన నామమునకు మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వారే కదా! అంటున్నారు! ఎందుకు దూషిస్తున్నారు? మన బ్రతుకులు బాగాలేవు కాబట్టి!

 

రెండవది: వారికి గర్వం ఎక్కువై పోయి దేవుణ్ణి దేవుని నామమును ఆయన నామము పెట్టబడిన వారిని దూషిస్తున్నారు. మనమైతే వారికి తీర్పు తీరుస్తున్నాము గాని యేసుక్రీస్తుప్రభువుల వారు తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని క్షమాభిక్ష పెట్టారు!  చాలామంది మన భక్తిని చూసి, మన చప్పిడి పత్యం చేసే జీవిత విధానం చూసి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అయితే అది నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడిన మనకు దేవుని శక్తియై ఉంది! అందుకే వారు దూషిస్తున్నారు. అయితే వారు మనలను దూషించినా యధార్ధతను భక్తిని విశ్వాసమును విడిచిపెట్టకుండా నిందారహితముగా జీవిస్తూ ఉంటే, ఈరోజు దూషించిన వారు ఒకరోజు నిజముగా దేవుని బిడ్డలు అంటే వీరురా! అని చెబుతారు! విధముగా ఉండాలి విశ్వాసి జీవితం! మరి ఆవిధంగా పేరు తెచ్చేవిధంగా జీవిద్దామా? లేక దేవుని పేరుకి అవమానం తెచ్చేవిధంగా జీవిద్దామా?!!

నేడే తేల్చుకో!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -34 భాగము*

యాకోబు 2:811

8. మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించు వారగుదురు.

9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

10. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినయెడల (తొట్రిల్లిన యెడల), ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;

11. వ్యభిచరింప వద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధి వైతివి.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. పేదవారిని దీనులను హీనపు చూపు చూస్తున్నారు. పక్షపాతాలు చూపకూడదు అని చెబుతూ ఇంకా 811 వచనాలలో మరో కోణంలో చెబుతున్నారు.

8 వచనంలో అంటున్నారు: మీరు ఒకవేళ నీవలె నీపొరుగువానిని ప్రేమించుము అనే లేఖనములో ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను  నెరవేరుస్తూ ఉంటే మీరు బాగుగానే ప్రవర్తిస్తున్నారు , అలా చెయ్యకుండా పక్షపాతం గలవారై ఉంటే మీరు ధర్మశాస్త్రం వలన అపరాదులని తీర్చబడి పాపం చేసిన వారైపోతున్నారు అంటున్నారు!

దీనికోసం ఆలోచిస్తే మీరు మీ పొరుగువారిని నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే ప్రేమిస్తూ ఉంటే నీవు దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నావు అంటున్నారు! ఒకసారి ప్రాముఖ్యమైన ఆజ్ఞను అనేమాటను జాగ్రత్తగా గమనించమని మనవిచేస్తున్నాను, ఇది యాకోబుగారు అంటున్నారు లేఖనములలో ఉన్న ఆజ్ఞలన్నింటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటున్నారు! దీనికోసం అనేకసార్లు ఇది ఎంతో ప్రాముఖ్యమైనది అని చెప్పడం జరిగింది!

ధర్మశాస్త్రం లోనే దీనికోసం చెప్పబడింది. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మోషే ధర్మశాస్త్రంలో- మాట పలుకక ముందే లేవీ 19:18 లో అంటున్నారు కీడుకు ప్రతీకీడు ఎవరికీ చెయ్యవద్దు, నీ ప్రజలమీద కోపముంచుకోవద్దు! మిమ్మల్ని మీరు ప్రేమించుకొన్నట్లే మీ పొరుగువారిని కూడా ప్రేమించండి అని చెప్పారు.

దీనిని యేసుక్రీస్తుప్రభులవారు మాటిమాటికి ఎత్తి చెప్పేవారు!

మత్తయి 19: 19

నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.

 

Matthew(మత్తయి సువార్త) 22:36,37,38,39,40

36. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.

37. అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.

38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

39. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

40. రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.

 

ఇది ఆజ్ఞలన్నిటిలో ప్రాముఖ్యమైనది మొదటిది అని ఎంచబడింది.

 

Mark(మార్కు సువార్త) 12:29,30,31,32,33

29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.

30. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.

31. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను

32. శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.

33. పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.

 

లూకా 10:27

అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను.

 

యోహాను 13:34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

యోహాను 15: 12

నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ

 

ఇక రోమా పత్రికలో పౌలుగారు అంటున్నారు 13:910

అసలు ధర్మశాస్త్రమంతా ఒకే ఒక ముక్కలో ఉంది అది మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే మీ పొరుగువారిని ప్రేమించండి

Romans(రోమీయులకు) 13:8,9,10

8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

గలతీ 5:14

ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్కమాటలో సంపూర్ణమైయున్నది.

 

కాబట్టి ఇది ఆజ్ఞలన్నిటిలో ఎంతో ప్రధానమైన ప్రాముఖ్యమైన ఆజ్ఞ! దీనిని పాటిస్తే మీరు ధర్మశాస్త్రమంతా పాటించినట్లే! మీరు బాగుగానే ప్రవర్తిస్తున్నారు అంటున్నారు యాకోబు గారు!

ఈవచనంలో  ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని తర్జుమా చేయబడిన మిగిలిన భాషలలోను ఇంగ్లీస్ లోను ఇది రాజాజ్న అని ఉంది! ఇది దేవాదిదేవుడు రాజాధిరాజు అయిన యేసుక్రీస్తుప్రభులవారు ఇచ్చిన రాజాజ్న! Royal Law!...

యాకోబు 2: 8

మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.

 

James 2: 8

If ye fulfil the royal law according to the scripture, Thou shalt love thy neighbour as thyself, ye do well:

 

దీనిని పాటిస్తున్నావా, నీవు బాగుగానే ప్రవర్తిస్తున్నావు. దీనిని పాటించడం లేదా, మొదటిగా నీవు పక్షపాతం చూపేవాడవు, రెండవదిగా ధర్మశాస్త్రం ప్రకారం నీవు పాపము చేసి పాపిగా మారుతున్నావు! సంఘంలో నీ ప్రక్కన కూర్చున్న విశ్వాసి కాలు పొరపాటున  తగిలితే తాచుపాము కంటే స్పీడుగా ఇంతెత్తున లేచి తగవాడుతున్నావు కదా, నీకు సహోదర ప్రేమ ఉందా? అమ్మా చూసుకోలేదు, క్షమించు అని చెబుతుంది కదా, వెంటనే నీకు కులం గుర్తుకు వస్తుంది, కులం పెట్టి మరీ దూషిస్తూ ఉంటావు కదా, నీవు పరలోకం వెళ్తావా?  నీవు లోకంలో కలిసి ఉండలేక పోతున్నావు కదా, లోకంలో అనగా పరలోకంలో కలిసి ఉండలేవు కదా, అందుకే బహుశా దేవుడు ఇక్కడ ప్రేమించలేక పోతున్నావు కదా నా రాజ్యంలో ఎలా కలిసి ఉండగలవు నీకు నరకమే మంచిది అని పాపులలో చేర్చి నరకానికి పంపించేస్తున్నారు అన్నమాట!

 కాబట్టి నిన్నువలె నీ పోరుగువానిని ప్రేమించలేని స్థితిలో నీవుంటే నేడే మార్పునొంది క్షమాపణ వేడుకుని సరిచేసుకో! లేకపోతే నరకానికి పోతావు అని మర్చిపోకు!

 

చూడండి తొమ్మిదో వచనంలో మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం ప్రకారం అపరాదులుగా తీర్చబడి పాపులగుదురు అంటున్నారు! పేదలను చిన్నచూపు చూస్తూ ధనికులని అభిమానం చూపితే మీరు పక్షపాతం గలవారు వెంటనే నీవు దేవుడు నిర్ణయించిన రాజాజ్ఞను పాటించడం లేదు కాబట్టి నీవు ధర్మశాస్త్రం ప్రకారం పాపివి!

 

ఇక 10,11 వచనాలలో అంటున్నారు: నీవు ధర్మశాస్త్రమంతా పాటించి ఒక్క ఆజ్ఞను మీరితే ధర్మశాస్త్రం అంతా మీరినట్లే!  ధర్మశాస్త్రంలో మీదన చెప్పిన లేవీకాండంలో నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలి, కీడుకు ప్రతికీడు ఎవరికీ చెయ్యవద్దు అనే ఆజ్ఞను దేవుడు ఇచ్చారు. ఇప్పుడు నీవు ఆజ్ఞకు విధేయత చూపకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞలలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరినట్లే, అతిక్రమించినట్లే, కాబట్టి పాపివి కాకుండా ఘోరపాపివి ప్రధాన పాపివి అవుతావు అన్నమాట! కాబట్టి సంఘాలలో పక్షపాతం చూపడం అంటే అది భయంకరమైన పాపము అని గ్రహించాలి!

 

మనము దేవుని ఆజ్ఞలన్నీ పాటించలేకపోతున్నాము! ఏదో ఒక్క ఆజ్ఞను మీరుతున్నాము! అనగా దేవుని వాక్యమంతటిని భంగపరుస్తున్నాము అన్నమాట! అందుకే రోమా :9 లో అందరం పాపం చేసి దేవుని అనుగ్రహాన్ని మహిమను పొందలేక పోతున్నాము అంటూ మనమందరం పాపం క్రింద దాస్యంలో ఉన్నాము, అయితే దేవుని కృపవలన రక్షించబడిన నీవు ఇప్పుడు మరలా దాస్యమనే కాడి క్రిందకు చిక్కుకోకూడదు! నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనే ఆజ్ఞను ప్రాముఖ్యమైన ముఖ్యమైన ఆజ్ఞను తప్పకుండా పాటించాలి!

రోమీయులకు 3: 23

భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

 

నిర్గమకాండము 20 అధ్యాయంలో ముఖ్యమైన పది ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు దానిలో వ్యభిచారం చెయ్యకూడదు అన్నారు , అక్కడే నరహత్య చెయ్యకూడదు అని కూడా ఉంది, నీవు నరహత్య చెయ్యకపోయినా వ్యభిచారం చేస్తే నీవు ధర్మశాస్త్రం ధిక్కరించిన వాడవు అవుతావు, అలాగే వ్యభిచారం చెయ్యకపోయినా నరహత్య చేస్తే నీవు పాపివే కదా అంటున్నారు!

దీనిని అనగా 10,11 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే నీవు పక్షపాతం చూపడం అనేది వ్యభిచారం , నరహత్య చెయ్యడం అనే పాపాలతో సమానంగా ఎత్తి చూపిస్తున్నారు పరిశుద్ధాత్ముడు యాకోబుగారిని ఉపయోగించుకుని! ఏదో చిన్నదే కదా అని నీవనుకుంటున్నావు గాని అది దేవుని దృష్టిలో పక్షపాతం చూపి బీదలను దీనులను చిన్నచూపు చూడడం అనేది వ్యభిచారం తోనూ, నరహత్య తోనూ సమానం అని మర్చిపోకు! యోహాను పత్రిక ప్రకారం, కనీసం తన సోదరున్ని ప్రేమించకపోతే నరహత్య చేసినట్లే అని చెప్పారు!..

కాబట్టి ఇలాంటి చిన్నచూపులు పక్షపాతాలు మానేద్దాం!

 

సహోదరులందరూ సమానం దేవుని దృష్టిలో, అలాగే మనము కూడా మన విశ్వాసులందరినీ మనకంటే ఎక్కువగా భావిద్దాం! ప్రేమిద్దాం! పరలోకం పట్టుకుందాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -35 భాగము*

యాకోబు 2:1213

12. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి.

13. కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. పేదవారిని దీనులను హీనపు చూపు చూస్తున్నారు. పక్షపాతాలు చూపకూడదు అని చెబుతూ ఇంకా 1213 వచనాలలో మరో కోణంలో చెబుతున్నారు.

 

   ప్రియులారా మరలా 12 వచనంలో స్వాతంత్ర్యం ఇచ్చు నియమాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి అధ్యాయంలో కొద్దిగా స్వాతంత్ర్యం ఇచ్చే నియమం అన్నారు, మరోసారి దానిని గుర్తుకు చేస్తున్నారు! స్వాతంత్ర్యం ఇచ్చే నియమం అనగా ధ్యానం చేసుకున్నాము: మోషేగారి ద్వారా మనకు ధర్మశాస్త్రం వచ్చింది గాని కృపయు సత్యము మనకు యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మనము అపరాధాలు చేసినప్పుడు పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించు, ఇకను పాపం చెయ్యను అని ఒప్పుకుంటే దేవుని నుండి ఏరకమైన బలులు అర్పించకుండానే విమోచించబడతాము అని చూసుకున్నాము కదా!

 

ఇక్కడ స్వాతంత్ర్యం ఇచ్చు నియమం చొప్పున మీరు తీర్పు పొందబోవువారికి తగినట్లుగా మాట్లాడండి! అలాగే తీర్పుపొందబోవు వారికి తగ్గట్లుగా ప్రవర్తించండి అంటున్నారు! దీని అర్ధం ఏమిటంటే: మనిషి భూలోకంలో శాశ్వతంగా ఉండిపోడు! జీవిత నాటకంలో తన పాత్రను బ్రతికి ఉన్నంతవరకు పోషించి ఒకరోజు దేహాన్ని వదిలి వెళ్ళాలి! అప్పుడు మనిషి తను భూలోకంలో ఉన్నప్పుడు చేసిన పనుల చొప్పున తీర్పు పొందుతాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి ప్రతీరోజు! మనిషికి విశ్వాసికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా రాబోయే తీర్పును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 5:9,10

 

9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

 

విశ్వాసుల యొక్క చివరి మజిలి క్రీస్తు యేసు సన్నిధానమునకు చేరి అక్కడ శాశ్వతంగా ఉంటారు! విషయం ప్రతీ విశ్వాసి తెలిసికొని మనము శాశ్వతం క్రీస్తుయేసు సన్నిధానములోనే ఉండాలి అనేది మనము చేసే ప్రతీ పనిలోనూ మాట్లాడే ప్రతీ మాటలోనూ విషయం ప్రభావితం చెయ్యాలి! దానికి తగినట్లుగానే జీవించాలి, మాట్లాడాలి, మనము ఒకరోజు తీర్పులో నిలుస్తాము, ఆరోజు తప్పకుండా దేవునిచేత భళా నమ్మకమైన మంచిదాసుడా అని పించుకోవాలి గాని సోమరియైన చెడ్డదాసుడా అని అనిపించుకోకూడదు అనే లక్ష్యం మనకు ఉండాలి! మనము బ్రతికినా చనిపోయినా మన జీవితంలో క్రీస్తుకు సంతోషం కలిగించే విధంగా ఉండాలి. మనం చేసే ప్రతీది క్రీస్తుకు మహిమ తెచ్చేవిధంగాను క్రీస్తురాజ్య వ్యాప్తికి దోహదపడే విధంగాను ఉండాలి! ఇంకా ఇతరులకు మేలు కలిగించే విధంగాను మన మాటలు ప్రవర్తన ఉండాలి, అలాగే జీవించాలి అంటున్నారు యాకోబుగారు! ఒకవేళ దేవునికి మెప్పు మహిమ కలిగే విధంగా జీవించక పోతే ఆవ్యక్తి క్రీస్తుయొక్క దాసుడు సేవకుడు కాదుగాని తన కడుపుకు దాసుడు!

 

పౌలుగారు అంటున్నారు: 1కొరింథీ 9:1923

19. నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.

20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.

22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

23. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

 

1కోరింథీయులకు 10: 23

అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

1కోరింథీయులకు 10: 31

కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.

 

13 వచనంలో కనికరం చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరం తీర్పును మించి అతిశయ పడుతుంది అంటున్నారు. యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇలాగే చాలాసార్లు చెప్పారు! మీరు తీర్పు తీర్చకుడి మీకు తీర్పు తీర్చబడదు! కనికరించు వారు కనికరం పొందుతారు అంటూ

మత్తయి 5:7

కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

 

Matthew(మత్తయి సువార్త) 7:1,2

1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

 

మత్తయి 18:2335 లో ఒక సేవకుడు ఉంటాడు, తన యజమాని దగ్గర తీసుకున్న రుణాన్ని ఇచ్చే స్తితిలో ఉండడు, అందుకు యజమాని దాసుని రుణాన్ని కొట్టివేస్తాడు, దాసుడు ఎంతో సంతోషిస్తాడు, అయితే అదే దాసునికి మరొకడు కేవలం నూరు వరహాలు లేక 50రూపాయలు అప్పు ఉన్నవాడిని డబ్బులు అడిగి, వాడు ఇప్పుడు ఇవ్వలేను కొన్నిరోజులు ఓర్చుకో అంటే వాని గొంతు నులిమి ఇస్తావా చస్తావా అని కూర్చుంటాడు! యజమాని దాసులు దీనిని చూసి యజమానికి చెబితే దాసుణ్ణి పిలిచి, నేను నీ రుణాన్ని మాఫీ చేసిన విధంగా నీవు కూడా ఇతరుల రుణాన్ని మాఫీ చేయవలసి ఉండాల్సింది గాని నీవు మరో విధంగా ప్రవర్తించావు కాబట్టి మొత్తం ఋణం తీర్చమని వాడిని జైలులో వేసినట్లు చూస్తాము! అలాగే మనము కూడా మన రుణాలు దేవుడు క్షమించినట్లు మనము కూడా మన యెడల తప్పు చేసినవారిని క్షమించాలి! అప్పుడే మన తప్పులు దేవుడు క్షమిస్తారు! మనము కనికరం చూపిస్తే మనము కూడా కనికరించబడతాము అని గ్రహించాలి!

లూకా 6:3738          

37. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;

38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు కొలతతో కొలుతురో కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.

 

సామెతలు 21:13

దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.

 

కీర్తన 18:2526

25. దయగలవారి యెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

26. సద్భావముగలవారి యెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

27. శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

 

కాబట్టి మనము కూడా ఇదేవిధంగా కనికరం కలిగి ఉండాలి. స్వాతంత్ర్యం ఇచ్చే నియమాన్ని పాటించి మనకు ఒకరోజు తీర్పు ఉంది, మనము మాట్లాడే ప్రతీ విషయానికి చేసే ప్రతీ పనికి తీర్పు అనేది ఉంది అని గ్రహించి దానిప్రకారంగా నడుకుందాం! తోటివారికి సహాయం చేద్దాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -36 భాగము*

*విశ్వాసము-క్రియలు-1*

 

యాకోబు 2:1417

14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?

15. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై నాటికి భోజనములేక యున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

ప్రియులారా! వచనాలలో గ్రంధానికి ముఖ్య లేక మూలాంశమును రాస్తున్నారు! క్రియలు లేకుండా విశ్వాసము ఉంటే విశ్వాసము మృతమైనది!

 

14 వచనంలో: నా సహోదరులారా! క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం ఉంది అని చెబితే ఏమి ప్రయోజనం ఉంది అంటున్నారు! ఇక్కడ ఒకడు నాకు క్రియలు లేవు గాని ప్రగాఢమైన విశ్వాసం ఉంది అంటున్నాడు!అలాంటి వాడివలన, లేక అలాంటి క్రియలు లేని విశ్వాసం వలన ప్రయోజనం ఏమిటి అని సూటిగా అడుగుచున్నారు యాకోబు గారు!! అలాంటి విశ్వాసం విశ్వాసిని రక్షించగలదా అంటూ 15,16 వచనాలలో ఒక సహోదరుడైన లేక సహోదరియైనా బట్టలు లేకుండా ఆరోజు భోజనం చేసే స్తోమత కూడా లేకుండా ఉంటే మీలో ఎవడైనా ఇలాంటి విశ్వాస వీరుడు వెళ్లి- వారికి బట్టలు ఇవ్వకుండా భోజనం పెట్టకుండా- అమ్మా! లేక అయ్యా! క్షేమంగా వెళ్లి చలిగా ఉంది చలి కాచుకో! ఆకలిగా ఉంది కదా ఇంటికి పోయి అన్నం వండుకుని తృప్తిగా భోజనం చెయ్యమని చెబితే ఏమి ప్రయోజనం అంటున్నారు?

నిజానికి స్త్రీ లేక పురుషుని దగ్గర చలికి రగ్గు కొనుక్కొనే స్తోమత, వంటినిండా బట్టలు కొనుక్కుని వేసుకునే స్థోమత ఉంటే చలికి బాధపడతాడా? విశ్వాసవీరుడు డైలాగులు చెప్పకముందే వంటినిండా బట్టలు వేసుకుని, రగ్గుకప్పుకునే వాడు కదా! అలాగే ఆరోజు బోజనానికి తగిన వంటగింజలు ఆమె దగ్గర ఉంటే విశ్వాసనారి చెప్పకముందే వెళ్లి భోజనం చేసుకుని తినేది కదా దీనురాలు! లేకపోతే వంటచేసుకునే శక్తి ఆరోగ్యం ఉంటే నీవు ఉచిత సలహా ఇచ్చేవరకు ఆమె ఎందుకు ఆగుతుంది! ఎప్పుడో వంటచేసుకుని ఉండేది కదా!

ఇప్పుడు విశ్వాసవీరుడు, విశ్వాస నారి ఇద్దరు కూడా కేవలం మాటలు మాత్రం అన్నారు గాని ఏమాత్రం సహాయం చెయ్యలేదు! ఇప్పుడు వీరి విశ్వాసం వలన ఎవరికీ ఉపయోగం? వీరికి లేదు! భాధలు అనుభవించే వారికీ లేదు! దేవునికి మహిమ కూడా రాదు! మరి ఇలాంటి విశ్వాసమెందుకు అని ప్రశ్నిస్తున్నారు యాకోబు గారు! గమనించాలి యాకోబు గారు పౌలుగారు రాసిన విశ్వాస లేఖనాలను లేక ప్రవచనాలను తూలనాడటం లేదు విమర్శించడం లేదు! విశ్వాసంతో పాటుగా నీకు క్రియలు కూడా ఉండాలి, లేకపోతే నీ విశ్వాసం దండగ! అది చచ్చిన విశ్వాసం అంటున్నారు! దానికి తగిన లేఖనాలు కూడా చూపిస్తున్నారు! పౌలుగారు చెప్పిన విశ్వాస సూత్రాలకు ఇంకా బలమైన విషయాలు చూపి, నీ విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి అంటున్నారు!

ఎవరికైనా విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఎవరిని రక్షించలేదు, కనీసం విశ్వాసిని కూడా క్రియలు లేని విశ్వాసం రక్షించలేదు అంటున్నారు! ఎందుకు రక్షించలేకపోయింది అంటే అది నిజమైన విశ్వాసం కాదు కాబట్టి! ఇక్కడ యాకోబు గారు విశ్వాసము రెండ రకాలుగా చూపిస్తున్నారు! ఒకటి రక్షణ కోసమైన విశ్వాసము! దీనికోసం విస్తారంగా పౌలుగారు రాశారు! ఇది మన క్రియలతో సంబంధం లేకుండా దేవుని కృపద్వారా మనకు పాప క్షమాపణ కల్గింది. దానిని నమ్మడం వలన మనకు రక్షణ కలిగింది.

ఎఫెసీ 2:89

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

 

రోమా :2425, 28

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.

 

రోమీయులకు 4: 5

పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

 

విశ్వాసం ద్వారా కృప ద్వారా దేవుడు మనుష్యులను రక్షించి వారికి నూతన జీవం, ఆధ్త్యాత్మిక జన్మ ఇస్తారు! వారు ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడతారు!

యాకోబు 1: 18

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

2కొరింథీ 5:17

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

 

రెండవ రకమైన విశ్వాసం: అయితే ఇలాంటి విశ్వాసం పొందుకున్నాక, నీవు రక్షించబడ్డాక, నీ విశ్వాసం నిజమైనదైతే నీవు ఇప్పుడు విశ్వాసం క్రియల్లో చూపిస్తావు!

రక్షణకోసమైన విశ్వాసానికి రక్షించబడ్డాక నీ మంచి కార్యాలు, ప్రేమతో నిండిన మంచికార్యాలు కలిస్తే అది నిజమైన విశ్వాసం, విశ్వాసిని రక్షించగలదు విశ్వాసం, ఇంకా అనేకులను క్రీస్తుకోసం రాబట్టగలదు విశ్వాసం! ఇదీ చెబుతున్నారు యాకోబు గారు!

 దీనిని పౌలుగారు కూడా నిర్దారించారు.

హెబ్రీ 6:10

మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.

 

గలతీ 5:6

యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

 

నీలో క్రియలతో కూడిన విశ్వాసం లేక మంచిపనులతో కూడిన విశ్వాసం లేకపోతే నీ విశ్వాసం మాటలకే పరిమితం గాని చేతలలో లేదు కాబట్టి ఇప్పుడు నీ విశ్వాసం మృతమైనది అనగా చచ్చినది అంటున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై! బలమైన దేవుని కృప నీ బ్రతుకులో మార్పు తీసుకుని వస్తుంది గాని మార్పుని నీవు చూపించలేక పోతున్నావు! పెదాలతో పప్పలు వండుతున్నావు గాని నిజానికి ఏమీ లేదు! ఒకవిశ్వాసి జీవితంలో నిజమైన శక్తివంతమైన ప్రభావం ఎప్పుడు కనిపిస్తుంది అంటే నీ జీవితంలో క్రియలతో కూడిన విశ్వాసం కనిపించి నప్పుడే!

పౌలుగారు హెబ్రీ పత్రికలో అంటున్నారు విశ్వాసం వలన హేబెలు కయీను కంటే మంచి బలిని అర్పించాడు! 11:4

ఇంకా విశ్వాసం వలన ఆబ్రాహాము గారు దేవుడు చేసిన వాగ్దానం జరుగుతుంది అని నమ్మి విశ్వసించారు. వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడు అని నమ్మారు అంటున్నారు. అంతేకాకుండా శారా కూడా నమ్మింది అంటున్నారు. ఇలా ఒక్కో విశ్వాస వీరుణ్ణి పరిచయం చేసి వారు విశ్వాసం వలన ఎటువంటి క్రియలు చేసారో చూపిస్తున్నారు!

Hebrews(హెబ్రీయులకు) 11:6,7,8,9,10,11,12,13,17,18,19,23,24,25,26,27

 

6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

7. విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.

8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12.అందుచేత మృతతుల్యుడైన యొకని నుండి, సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

13. వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

17. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

18. ఎవడు వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,

19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.

24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

26. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.

27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.

 

వారికి విశ్వాసం ఉంది కాబట్టే ఇంతటి బలమైన కార్యాలు క్రీస్తు కొరకు చేయగలిగారు అంటున్నారు!

మరినీకు అటువంటి విశ్వాసంతో కూడిన క్రియలు ఉన్నాయా నీ జీవితంలో! లేక పెదాలమీదనే నీ విశ్వాసం ఉందా?

నీ విశ్వాసం కేవలం పెదాల మీదనే ఉంది అంటే నీ విశ్వాసం చచ్చినది అని మర్చిపోకు! ఇప్పుడు క్రియలతో కూడిన విశ్వాసాన్ని అలవరచుకో!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

*యాకోబు పత్రిక -37 భాగము*

*విశ్వాసము-క్రియలు-2*

యాకోబు 2:1820

18. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.

19. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

20. వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసికొనగోరుచున్నావా?

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

ప్రియులారా! వచనాలలో గ్రంధానికి ముఖ్యాంశము లేక మూలాంశమును రాస్తున్నారు! క్రియలు లేకుండా విశ్వాసము ఉంటే విశ్వాసము మృతమైనది అంటూ వివిధ కోణాలలో వివరిస్తున్నారు!

 

ఇక వచనాలలో యాకోబు గారు చెబుతున్నారు: ఒకడు అంటున్నాడు- నీకు విశ్వాసము ఉంది, నా దగ్గర క్రియలున్నాయి, అనగా మంచి పనులు చేస్తాను! నీవు మంచిగా భక్తి చేస్తున్నావు! నేను కూడా చేస్తున్నాను, బాగుంది కదా అంటున్నారు ఇద్దరు! వెంటనే వీరిద్దరినీ యాకోబు గారు ప్రశ్నిస్తున్నారు! చాలెంజ్ చేస్తున్నారు ఏమని అంటున్నారు అంటే: ప్రియ స్నేహితుడా! నీ క్రియలు లేకుండా దమ్ముంటే నీ విశ్వాసాన్ని నాకు చూపించు! నేనైతే నాకున్న మంచి పనులతో నేను నాకున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని నీకు చూపిస్తాను అంటున్నారు!!!

 

మరోసారి చెబుతున్నాను, ఇక్కడ యాకోబుగారు పౌలుగారు చెప్పిన రక్షణ- ఉచితకృప వలన కలిగింది,- అదే మన విశ్వాసము అనే రక్షణ కోసమైన విశ్వాస సూత్రమును రద్దు చెయ్యడం లేదు ఎగతాళి చెయ్యడం లేదు! అది కేవలం రక్షణకోసం సరిపోతుంది గాని నీవు రక్షణ పొందాక పరలోకం చేరాలంటే విశ్వాసానికి నీ మంచిపనులు కలిసినప్పుడే నీవు పరలోకం చేరతావు అని వివరిస్తున్నారు. నీ విశ్వాసమునకు ప్రేమతో కూడిన మంచిపనులు కలవకపోతే నీ విశ్వాసం వలన ఉపయోగం లేదు అంటున్నారు! నీకు దయ్యాలకు తేడా లేదు అంటున్నారు!

 

ఒకసారి ఆగి ఆలోచిద్దాం! విశ్వాసము- క్రియలు అనేది ఒక విశ్వాసికి ప్రార్ధన ముఖ్యమా- వాక్యము ముఖ్యమా అని అడిగినట్లుంది! విశ్వాసి జీవితంలో ప్రార్ధన ఎంత ముఖ్యమో- వాక్యము కూడా అంతే ముఖ్యము! క్రైస్తవ విశ్వాసికైనా సేవకునికైనా ప్రవక్తకైనా చివరికి అపోస్తలుడైనా ప్రార్ధన మరియు వాక్యము రెండు, రెండు కళ్ళు వంటివి! రెంటిలో కన్ను ఇష్టము, కన్ను ప్రాముఖ్యమైనది అనే ప్రశ్న- పిచ్చి ప్రశ్న!! రెండూ కావాలి! ఒక మనిషికి ఆహరం ముఖ్యమా? నీరు ముఖ్యమా? అంటే రెండూ కావాలి! లేకపోతే పోతాడు! అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో కేవలం విశ్వాసము మాత్రమే చాలదు!  విశ్వాసంతో కూడిన క్రియలు కావాలి అని నొక్కివక్కానించి చెబుతున్నారు! నీ విశ్వాసము ప్రేమతో కూడిన నీ క్రియలతో ఋజువు చెయ్యండి అంటున్నారు యాకోబుగారు ఆత్మావేశుడై! అలా చెయ్యకపోతే నీకు దయ్యాలకి తేడా లేదు అంటున్నారు!

 

నన్ను మరో కోణంలో వివరించనీయండి! నీకు విశ్వాసం ఉంటే నీలో దేవుని ప్రేమ పనిచేస్తుంది! నీలోప్రేమ ఉంటే నీ సహోదరుడు ఆకలితో ఉంటే నీవు చూస్తూ ఉండలేవు! ఏదో కొంత సహాయం చేస్తావు! కనీసం ఆరోజుకి లేదా వారానికి సరిపడగా సహాయం చేస్తావు! ఇదీ ప్రేమ యొక్క లక్షణం! ఒక ఉదాహరణ చెప్పనీయండి! ఒకతల్లి ఉంది! తల్లికి ఒక కొడుకు ఉన్నాడు- పరమ తుంటరి! ఒకరోజు భర్త దానిని చూసి గుండగా తన్ని రెండు రోజులు పనికిమాలిన వాడికి అన్నం పెట్టకు! వాడే దారిలోకి వస్తాడు అని శాశించి నిద్రపోడానికి వెళ్ళిపోయాడు భర్త! ఇప్పుడు రాత్రి 11 అయ్యింది! తండ్రి పడుకున్నా తల్లికి నిద్రపట్టదు! ఎందుకంటే తన కొడుకు వాడు తుంటరి వాడైనా గాని భోజనం చెయ్యకుండా పడుకున్నాడే- వాడు ఆకలితో అలమటిస్తున్నాడే అనే తల్లిప్రేమ- నిద్రపోనియ్యక, తన భర్త బాగా నిద్రపోయాక- దొంగచాటుగా తల్లి వెళ్లి కొంచెం ఆహారం బ్రతిమిలాడి తినిపిస్తుంది. మంచి బుద్ధులు చెబుతుంది తల్లిప్రేమ! ఇప్పుడు భర్త శాసనాన్ని కూడా దిక్కరించింది తల్లిప్రేమ! ప్రేమ యొక్క లక్షణం అది! అలాగే నీలో నిజమైన దేవుని ప్రేమ పనిచేస్తే- నీలో నిజమైన విశ్వాసం ఉంటే, తప్పకుండా దైవికప్రేమ పనిచేస్తుంది- దైవికప్రేమ నీ పొరుగువాడు ఆకలిగా ఉంటే వాని ఆకలి తీర్చమని నిన్ను చెవిలో జోరీగలా చెబుతుంది! వానికి ఏదోకొంత సహాయం చేసేవరకు ఊరుకోదు దైవికప్రేమ- దైవిక ప్రేమ విశ్వాసం వలన కలిగింది! నీకున్నదంతా ఇచ్చేయ్యమని చెప్పదు గాని నీకున్నదానిలో కొంత ఇచ్చి వానికి సహాయపడమని చెబుతుంది! ఇది ప్రేమ యొక్క లక్షణం! విశ్వాసం యొక్క పని! మరి నీవు ఇది చెయ్యడం లేదు అంటే నీలో పనిచేసేది నిజమైన విశ్వాసం కాదు అన్నమాట! నీలో దైవికప్రేమ లేదు అన్నమాట! నీలో సహోదర ప్రేమ పనిచెయ్యడం లేదు అన్నమాట! అంటే నీవు నిజమైన మారుమనస్సు నిజమైన పశ్చాత్తాపం లేకుండా ఏదో ఉద్రేకంలో జబ్బు బాగుపడాలని నమ్ముకున్నావు అన్నమాట! విశ్వాసం ప్రేమ నిన్ను పరలోకానికి చేర్చనే చేర్చదు అని గ్రహించాలి!

 

అందుకే 19 వచనంలో దేవుడొక్కడే అని నీవు నమ్ముతున్నావు కదా, మంచిది, ఒరేయ్! వ్యర్దుడా! అనగా తెలివితక్కువవాడా! దయ్యాలు కూడా దేవుడొక్కడే అని నమ్ముతున్నాయి! దయ్యాలు అయితే నమ్మి దేవుండంటే వణుకుతున్నాయ్! నీకైతే దేవుడంటే భక్తి మాత్రమే ఉంది, వాటికి భక్తితో పాటుగా భయము కూడా ఉంది అందుకు వణుకుతున్నాయి అంటున్నారు!

దయ్యాలకు తెలుసు- తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడు! దయ్యాలకు తెలుసు దేవుడు మంచివాడు! దయ్యాలకు తెలుసు- దేవుడు ఒక్కడే! నీకు కూడా తెలుసు తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు మంచివాడు, దేవుడొక్కడే! దేవుడు స్వస్తపరిచేవాడు! దేవుడు బాగుచేసే వాడు! మరి ఇప్పుడు దయ్యాలకున్న విశ్వాసం వలన దయ్యాలకు ఏమి ఉపయోగం లేదు! అవి నమ్మి విశ్వసించి రక్షణ పొందలేవు!  దయ్యాలకు దేవుని కోసం తెలుసు అని మనకు మార్కు 5:27 లో చెప్పిన గెదరేనీయుల ప్రాంతం లో గల దయ్యాల పట్టిన వానియొక్క వృత్తాంతము వలన తెలుస్తుంది! దయ్యాలకు దేవునికోసం ముందుగానే తెలిసిపోతుంది! అలాగే నీకు కూడా విశ్వాసం ఉంది! నీవు కూడా దేవుడొక్కడే అంటూ మీదన చెప్పినవి అన్నీ నమ్ముతున్నావు! గాని నీ విశ్వాసానికి క్రియలు తోడుకాలేనందున నీ విశ్వాసం వలన కూడా దేవునికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు! నీపొరుగువానికి ఉపయోగం లేదు! అందుకే వ్యర్దుడా! దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి, క్రియలు లేని విశ్వాసం నిష్పలమైనది అంటున్నారు! మీదన మృతమైనది అనగా చచ్చినది అంటే ఇక్కడ నిష్ఫలమైనది అనగా ఫలములు లేనిది ఎవరికీ ఉపయోగం లేనిది అంటున్నారు!

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే క్రియలు లేకుండా విశ్వాసం మాత్రము నాకుంది అనే విశ్వాసవీరులకు, విశ్వాస నారీలకు దేవుడిచ్చే జ్ఞానం లేదు! అందుకే వ్యర్దుడా అనియు తెలివితక్కువవాడా/దానా అని దేవుడు పిలుస్తున్నాడు అని గ్రహించాలి!

కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపిద్దాం!

పరమరాజ్యానికి వారసులమవుదాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -38 భాగము*

*విశ్వాసము-క్రియలు-*

 

యాకోబు 2:2126

21. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?

23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.

24. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.

25. అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?

26. ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

 

ప్రియులారా! వచనాలలో గ్రంధానికి ముఖ్యాంశము లేక మూలాంశమును రాస్తున్నారు! క్రియలు లేకుండా విశ్వాసము ఉంటే విశ్వాసము మృతమైనది అంటూ వివిధ కోణాలలో వివరిస్తున్నారు!

 

ప్రియులారా! వచనాలలో రెండు ఉదాహరణలు చెప్పి వారి విశ్వాసం ఎలా క్రియల ద్వారా ధృడంగా పనిచేసిందో చెబుతున్నారు!

 

మొదటి ఉదాహరణ: అబ్రాహాము గారిని చూపించారు! ఇది మనకు ఆదికాండం 22:118 వచనాలలో ఉంది! దీనికోసం ముందుబాగాలలో ధ్యానం చేసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!

మన పితరుడైన అబ్రాహాము గారు తన కుమారుడైన ఇస్సాకును బలిపీటం మీద అర్పించినప్పుడే కదా అతడు అనగా అబ్రాహాము గారు క్రియలవలన అతని విశ్వాసము పరిపూర్ణమయ్యింది! అందుకే అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం చెబుతుంది.  ఇంకా అతడు దేవుని స్నేహితుడు అని పేరు కూడా కలిగింది అంటున్నారు. దేవుని స్నేహితుడు అనేమాట మనకు 2దినవృత్తా 20:7 లో కనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తుప్రభులవారు కూడా మనలను స్నేహితులు అని పిలిచారు యోహాను 15:15 లో!

 

ఎప్పుడు? క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపించాక! అందుకే మనిషి విశ్వాస మూలమున మాత్రమే కాకుండా క్రియల మూలమున కూడా నీతిమంతుడుగా ఎంచబడతాడు అని గ్రహించండి అంటున్నారు యాకోబుగారు! ఇలా అబ్రాహాము గారు ఎంతో విశ్వాసం గల వ్యక్తి మరియు విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకున్న వ్యక్తి కూడా తన క్రియల వలన అనగా తన కుమారుడైన ఇస్సాకుని బలిపీటం మీద ఉపమాన రూపంగా అర్పించినందు వలననే అతడు నీతిమంతుడుగా పిలువబడ్డాడు నీతిమంతుడిగా తీర్చబడ్డారు అని చెబుతున్నారు యాకోబుగారు!

 

ఇక రెండవ ఉదాహరణగా ఆహాబు అనే వేశ్యను చెబుతున్నారు!

ఆహాబు అనే వేశ్య కూడా యెహోషువా గారు పంపించిన వేగు దూతలను చేర్చుకుని, వారు చనిపోకుండా వారికి సహాయం చేసి వారిని వేరొక మార్గమున వెలుపలికి పంపించి క్రియల మూలముగా నీతిమంతురాలు అని ఎంచబడింది అంటున్నారు!

 

మాటలు జాగ్రత్తగా గమనించాలి- ఆహాబు అనే వేశ్య అంటున్నారు వచనం మొదట్లో- అదే చివర్లో నీతిమంతురాలు అని ఎంచబడింది అంటున్నారు! దీనిని రికార్డ్ చేసింది కేవలం యాకోబు గారు మాత్రమే కాదు! హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాటను రికార్డ్ చేయించాడు పరిశుద్ధాత్మ దేవుడు! ఒకవేశ్య- నీతిమంతురాలుగా ఎంచబడింది- అంటే ఆమె చేసిన విశ్వాసముతో కూడిన క్రియ అని మర్చిపోకూడదు! ఆమె విశ్వాసం ఆమె మాటలలో కనిపిస్తుంది ఒకసారి చూద్దాం!....

Joshua(యెహొషువ) 2:4,5,6,7,8,9,10,11,12,14,15,17,18,19,21

 

4. స్త్రీ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే,

5. వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడు చుండగా గవిని వేయబడు వేళను మనుష్యులు వెలు పలికి వెళ్లిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు

6. అని చెప్పి తన మిద్దెమీదికి యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.

7. మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను.

8. వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.

9. యెహోవా దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.

10. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో సంగతి మేము వింటిమి.

11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.

12. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి

14. అందుకు మనుష్యులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.

15. ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.

17. మనుష్యులు ఆమెతో ఇట్లనిరి యిదిగో మేము దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు

18. నీవు మమ్మును దించిన కిటికీకి ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.

19. నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.

21. అందుకు ఆమె మీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను. వారు వెళ్లినతరువాత ఆమె తొగరు దారమును కిటికీకి కట్టెను.

 

అలాచేసి తనవారిని ఇంటికి పిలిచి ఎఱ్ఱని దారం కట్టింది! ఆమె విశ్వసించింది- దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జనానికి దేశాన్ని ఇవ్వబోతున్నారు! అందుకే వేగులను విశ్వాసంతో దాచి, క్రియను చూపించింది- రక్షించబడింది, చివరికి ఆమె చేసిన క్రియ ఆమెను నీతిమంతురాలుగా తీర్చబడటమే కాకుండా యేసుక్రీస్తుప్రభులవారి వంశావలిలో ఆమెకు స్థానం కలిగించింది!

 

మరోసారి గుర్తుకు చేస్తున్నాను- హెబ్రీ పత్రికలో పౌలుగారు ఎవరెవరు విశ్వాసముతో కూడిన క్రియలు చేసి విశ్వాస వీరుల పట్టీలో చేరారో!...

Hebrews(హెబ్రీయులకు) 11:6,7,8,9,10,11,12,13,17,18,19,23,24,25,26,27

 

6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

7. విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.

8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12. అందుచేత మృతతుల్యుడైన యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

13. వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

17. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

18. ఎవడు వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,

19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.

24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.

27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.

 

కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమైనది అంటున్నారు యాకోబుగారు!

 

నీతో మంచిక్రియలను చేయించని విశ్వాసం, విశ్వాసంలో మంచిపనులు అనే క్రియలు అంతర్భాగము అనే నమ్మని విశ్వాసం, ప్రాణం లేని మృతదేహం వంటిది! అందులో ప్రాణం లేదు కాబట్టి దానికి చలనం లేదు! అది తొందరగా కుళ్లిపోయి కంపుకొట్టడం ప్రారంభిస్తుంది!

అలాగే మనలో ఉన్న విశ్వాసం కూడా క్రియలతో కలిసి పనిచేస్తూ ఉంటే విశ్వాసం సజీవంగా ఉంది అని అర్ధం! ఇప్పుడు నీ విశ్వాసం నీలో చురుకుగా పనిచేస్తుందా? దేవునికోసం ఫలిస్తూ ఉందా? లేక దయ్యాల లాగ పనికిమాలిన దానిలా ఉందా? దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి! నీవు కూడా ఒకసారి పరీక్షించుకుని దేవుని సన్నిదిలో నమ్మి వణుకుతున్నావా? ఆవిధంగా పశ్చాతాప పడదాం! క్రియలతో కూడిన విశ్వాసం కలిగిఉందాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -39 భాగము*

*విశ్వాసము-క్రియలు-4*

యాకోబు 2:2126

21. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?

23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.

24. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.

25. అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?

26. ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

ప్రియులారా! వచనాలలో గ్రంధానికి ముఖ్యాంశము లేక మూలాంశమును రాస్తున్నారు! క్రియలు లేకుండా విశ్వాసము ఉంటే విశ్వాసము మృతమైనది అంటూ వివిధ కోణాలలో వివరిస్తున్నారు!

 

ప్రియులారా! విశ్వాసము- క్రియలు అనేదానిని ముగించేముందు మరొకసారి మీకు గుర్తుచెయ్యాలని అనుకుంటున్నాను! విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి, లేకపోతే విశ్వాసము మృతమైనది! దయ్యాలకున్న విశ్వాసముతో సమానమైనది!

 

రెండవది: యాకోబు గారు పౌలుగారు చెప్పిన రక్షణ కోసమైన విశ్వాస సూత్రమును ఏమాత్రము కొట్టివేయడం లేదు! దానిని దృఢపరుస్తూ విశ్వాసంతో పాటుగా పనిచేసే క్రియలు కూడా ఉండాలి అంటున్నారు!

 

ఒకసారి పౌలుగారు చెప్పిన విశ్వాస సూత్రము చూద్దాం! దాని తర్వాత క్రియలు ఉండాలి అన్నారా లేక క్రియలులేకపోయినా పర్వాలేదు పరలోకం పోతారు అన్నారా చూసుకుందాం!

మనకు రోమా పత్రికలో విస్తారంగా రక్షణకోసమైనా కృపా-విశ్వాస సిద్ధాంతము కనిపిస్తుంది!

రోమా 1:1617

16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

 

Romans(రోమీయులకు) 3:21,22,23,24,25,26,27,28

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

27. కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.

28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.

 

రోమీయులకు 4: 5

పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

 

Romans(రోమీయులకు) 10:9,10

9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

 

ఎఫెసీ 2:89

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

 

పైవాటిని బట్టి యాకోబుగారు పౌలుగారు రాసిన సిద్ధాంతము ను వ్యతిరేఖించడం లేదు! పౌలుగారు కూడా మీ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి అంటూ అనేకసార్లు తన పత్రికలలో రాశారు!

 

Romans(రోమీయులకు) 2:6,7,8,9,10

6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

7. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

9. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికి కూడ, శ్రమయు వేదనయు కలుగును.

10. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

ఇక్కడ ఓర్పుతో మేలు చేస్తూ సత్క్రియలు చేస్తూ  ఉండాలి అంటున్నారు!

 

గలతీ 5:6 లో ప్రేమతో పనిచేసే విశ్వాసం కలిగి ఉండాలి అంటూ రాశారు...

యేసుక్రీస్తునందుండు వారికి సున్నతిపొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని *ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును*.

 

ఎఫెసీ 2:10 లో అంటున్నారు దేవుడు ముందుగా ఏర్పాటుచేసిన సత్క్రియలలో /మంచి పనులలో మనం నడవాలని వాటికోసమే దేవుడు మనలను చేశారు అంటున్నారు...

ఎఫెసీయులకు 2: 10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

తీతు పత్రికలో  2:14 లో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తనకోసం తన సొత్తుగా చేసికొన్నారు అంటున్నారు....

తీతుకు 2: 14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

 

ఇంకా హెబ్రీ పత్రికలో

Hebrews(హెబ్రీయులకు) 11:6,7,8,9,10,11,12,13,17,18,19,23,24,25,26,27

 

6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

7. విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.

8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12.అందుచేత మృతతుల్యుడైన యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

13. వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

17. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

18. ఎవడు వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,

19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.

24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.

27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.

 

అనగా సత్క్రియలు తప్పకుండా చెయ్యాలి!

ఇలా దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉంటే లేక దేవునిమాటలు వినడమే కాకుండా దాని ప్రకారం జీవిస్తూ ఉంటే వారు బండమీద కట్టిన ఇల్లులా ఉంటారు అంటున్నారు మత్తయి 7:2427..

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

 

ఇంకా మంచి పనులు ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడం దేవునికి చేసినట్లే అంటూ మత్తయి సువార్త 25:3543 లో చెప్పారు దేవుడు

 

34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

36. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును

37. అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

38. ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?

39. ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

41. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని (అనగా- సాతానుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి.

42. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు;

43. పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.

44. అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.

45. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.

 

కాబట్టి దీనివలన ఏమి అర్ధం అవుతుంది అంటే కైస్తవ విశ్వాస జీవితంలో ఫలించాలి అంటే విశ్వాసముతో పాటుగా మంచిపనులు చెయ్యాలి! మంచిపనులు అనేవి లేక సత్క్రియలు అనేవి విశ్వాసం లో ఒక అంతర్భాగము అని గ్రహించాలి! విశ్వాసంతో కూడిన మంచిపనులు లేకపోతే నీ విశ్వాసము చచ్చిన మృతదేహం!

 

నీ విశ్వాసము అలాంటి క్రియలు లేనిదైతే దయ్యాల విశ్వాసానికి నీ విశ్వాసానికి తేడా లేదు అంటున్నారు. దయ్యాలైతే నమ్మడమే కాకుండా నమ్మి వణకుతున్నాయి. మరి నీవు ఆయన సన్నిధిలో వణుకుతున్నావా? ఆయనంటే భయము భక్తి ఉందా నీకు? అలా భయభక్తులు ఉంటే ఆరాధనకు ఎందుకు ఆలస్యంగా వస్తావు? ఆయన మందిరములో చెప్పులు తీయాలి అని రెండుసార్లు వ్రాయబడి ఉంటే ఎందుకు పాదరక్షలతో మందిరములో ప్రవేశిస్తున్నావు? (నిర్గమ 3:5; యెహోషువా 5:15).

నీవు ఆరాదించడానికి వెళ్లినప్పుడు నీ ఆభరణాలు ధరించకూడదు అని రాసి ఉంటే ఎందుకు వంటినిండా ఆభరణాలు వేసుకుని మందిరానికి వెళ్తున్నావు? (ఆదికాండం 35:1--5: నిర్గమ 33:5)

బంగారునగలు ధరించకూడదు అని బైబిల్ చెబుతూ ఉంటే ఎందుకు నగలు వేసుకుంటున్నావు? నీకు దేవుడంటే భయము భక్తి లేదు కనుక!!! (1 తిమోతి 2:9--10; 1 పేతురు 3:3)

ఇంకా మూర్కులైన ఈతరమువారికి వేరై రక్షణపొందుడి, వారు చేసే పనులు మీరు చేయవద్దు, వారు చేసే ఆచారాలు మీరు చెయ్యవద్దు, వారిలాగ ముహూర్తాలు చూడవద్దు, అన్యాచారాలు చెయ్యవద్దు అంటే ఇంకా ఎందుకు ముహూర్తాలు, జ్యోతిష్యాలు, వాస్తులు??? అంటే నీకు దయ్యాలకున్న విశ్వాసము భక్తి కూడా లేదు! దేవుడంటే భయములేదు భక్తిలేదు! అందుకే నిన్ను వ్యర్ధుడా తెలివితక్కువ వాడా/దానా అని పిలుస్తున్నారు దేవుడు!!!!

 

నీతో మంచిక్రియలను చేయించని విశ్వాసం, విశ్వాసంలో మంచిపనులు అనే క్రియలు అంతర్భాగము అనే నమ్మని విశ్వాసం ప్రాణం లేని మృతదేహం వంటిది! అందులో ప్రాణం లేదు కాబట్టి దానికి చలనం లేదు! అది తొందరగా కుళ్లిపోయి కంపుకొట్టడం ప్రారంభిస్తుంది!

అలాగే మనలో ఉన్న విశ్వాసం కూడా క్రియలతో కలిసి పనిచేస్తూ ఉంటే విశ్వాసం సజీవంగా ఉంది అని అర్ధం! ఇప్పుడు నీ విశ్వాసం నీలో చురుకుగా పనిచేస్తుందా? దేవునికోసం ఫలిస్తూ ఉందా? లేక దయ్యాల లాగ పనికిమాలినదానిలా ఉందా? దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి! నీవు కూడా ఒకసారి పరీక్షించుకుని దేవుని సన్నిదిలో నమ్మి వణుకుతున్నావా? ఆవిధంగా పశ్చాతాప పడదాం! క్రియలతో కూడిన విశ్వాసం కలిగిఉందాం!

దైవాశీస్సులు!

 

          

 

*యాకోబు పత్రిక -40 భాగము*

*నోరు-నాలుక-1*

యాకోబు 3:16

1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. మూడవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చెప్పి వదిలేసిన నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోండి! నోటిని నాలుకను అదుపులో పెట్టుకోకుండా నేను భక్తిచేస్తున్నాను అని ఎవరైనా డైలాగులు చెబితే వాడి భక్తి వ్యర్ధము అని చెప్పారు కదా, దానినే అధ్యాయంలో వివరంగా వివరించారు!

 

     ప్రియులారా! మొదటి వచనం బోధకులు, దైవసేవకులు, కాపరుల కోసం మొదలుపెట్టారు, ఇది కేవలం దైవసేవకులకు మాత్రమే మాకు కాదు అని విశ్వాసులు అనుకోకూడదు! అందరి కోసము అని గ్రహించాలి, అయితే ముఖ్యముగా దైవసేవకులకు కాపరులకు ప్రసంగీకులకు దీని భావం చెందుతుంది అని గ్రహించాలి!

నా సహోదరులారా అంటూ మరలా మొదలుపెట్టారు యాకోబు గారు!

గమనించాలి- విశ్వాసులను నా సహోదరులారా అంటూ సంభోదించడం జరిగింది, ఇక్కడ తోటి దైవసేవకులను కూడా సహోదరులారా అంటూ సంభోదిస్తున్నారు! ఇది నిజమైన క్రైస్తవ లక్షణం! నిజం చెప్పాలంటే యాకోబు గారు ఆదిమ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉంటున్నారు- మరో విధంగా కూడా పిలిచి ఉండవచ్చు! గాని మొదట ఆయన మారి- నూతన స్వభావమును ధరించుకుని- నూతన పిలుపుతోనే అందరినీ సమానంగా చూస్తూ, తనను తానూ తగ్గించుకుని- దైవికప్రేమతో పిలుస్తున్నారు అందరినీ- నా సహోదరులారా! నిజమైన సేవకుడు అందరినీ ఒకేవిధంగా ప్రేమతో పిలవాల్సి ఉంది! పౌలుగారు అంటున్నారు తిమోతి గారితో- నా కుమారుడా! అందరినీ ప్రేమతో పిలువు! వృద్ధుడిని తండ్రితో సమానంగా భావించి అదే పిలుపుతో పిలువు- అనగా ఏమండి తండ్రిగారు బాగున్నారా! యవ్వనస్తులను అన్నా తమ్ముడు అని పిలువు, యవ్వన స్త్రీలను- అక్కా చెల్లి అని పిలువు, అదేవిధంగా పెద్ద స్త్రీలను అమ్మా అని పిలువు, అలాగే వారితో వ్యవహరించు అంటూ క్రమం నేర్పించారు! 1తిమోతి 5; క్రమాన్ని ఎక్కడ తప్పలేదు తిమోతి గారు! నేడు సంఘాలలో దైవసేవకులు- పెద్దలు క్రమాన్ని పాటించడం లేదు! క్రమాన్ని పాటించక- అక్రమ పిలుపులు పిలుస్తూ కొందరు అక్రమసంభంధాలు పెట్టుకుంటున్నారు! ప్రియ సేవకుడా సంఘపెద్డా! తప్పకుండా ఇటువంటి ప్రేమపూర్వక పిలుపుతో అందరినీ పిలువమని మనవిచేస్తున్నాను!

 

   నా సహోదరులారా! బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము అని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కావద్దు అని హితవు పలుకుతున్నారు!  బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంది అంటున్నారు! ఒకసారి ఆగి ఆలోచిద్దాం!

 

  బైబిల్ ను బోధించే వారు ఎవరైనా అతని భాద్యత చాలా గంభీరమైనది! మొట్టమొదట అతడు తాను ఉపదేశించే సత్యానికి అనుగుణంగా తన బ్రతుకును సరిచేసుకుని తాను విధంగా జీవిస్తూ అప్పుడు బోధించవలసిన అవసరం ఉంది! ఒక తండ్రి సిగరెట్టు త్రాగుతూ మత్తు పదార్ధాలు సేవిస్తూ తన కొడుకుతో ఒరేయ్ నీవు సిగరెట్టు తాగొద్దురా, బ్రాంది తాగొద్దురా అంటే కొడుకు ఏమంటాడు? ముందు నీవు మానేసి తర్వాత నాకు నీతులు చెప్పు అంటాడు! అలాగే దైవసేవకుడు/బోధకుడు కూడా మొదట తాను సరియైన మార్గంలో నడుస్తూ తర్వాత చెబితే వినేవారు పాటిస్తారు! అందుకే ముందు పాటించకుండా బోధలు చెయ్యకూడదు!

అంతేకాకుండా దేవుడు దైవసేవకునికి/ బోధకునికి మంచి ఉన్నతమైన జ్ఞానం ఇచ్చారు కాబట్టి దేవుడు అతని నుండి ఎంతో ప్రశస్తమైనవి ఆశిస్తున్నారు! ఇంకా బోధిస్తూ వాటిని పాటించక పోతే విశ్వాసుల కన్నా ఎక్కువ దండనకు గురిచేస్తారు! దీనిని మనం లూకా 12:4748 లో చూడగలం!

47. తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.

48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.

 

ఇక్కడ బైబిల్ ఉపదేశకులందరూ చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా! విశ్వాసులు చాలామంది దేవుని దారినుండు తప్పిపోతూ ఉంటారు! కాపరి/ బోధకుడు సరిచేస్తూ ఉంటాడు! మరి బోధించే వ్యక్తి తప్పిపోతే- దండన ఎక్కువ కదా! తెలియక చేస్తే తక్కువ దెబ్బలు గాని తెలిసి చేస్తే మరి ఎక్కువ దండన కలుగుతుంది అని చెబుతున్నారు. కారణం వ్యక్తి తెలిసిన మూర్ఖుడు కాబట్టి!  ఒకసారి మనం సువార్తలు జాగ్రత్తగా గమనిస్తే- సువార్తలలో పరిసయ్యులను సద్దూకయులను, శాస్త్రులను ధర్మశాస్త్ర బోధకులను యేసుక్రీస్తుప్రభులవారు ఉతికి ఆరేసినట్లు చూడగలం! అయ్యా శాస్త్రులారా అయ్యో పరిసయ్యులారా అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీరు చెబుతారు గాని చెయ్యరు... అంటూ చెప్పారు!

Matthew(మత్తయి సువార్త) 23:1,2,3,4,5,13,14,15,16,23,25,26,27,29,33

 

1. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను

2. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు

3. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.

4. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.

5. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

15.అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో- నరకకుమారునిగా) చేయుదురు.

16. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు

33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు?

 

అందుకే యేసయ్య ప్రజలందరితో చెప్పారు- శాస్త్రులు పరిసయ్యులు మీతో చెప్పినట్లు చెయ్యండి- గాని వారు చేసినట్లు మీరు ఎంతమాత్రము చెయ్యవద్దు అన్నారు! ..

ఇక్కడ కేవలం శాస్త్రులను పరిసయ్యులను మాత్రమే ఎందుకు సువార్త లన్నిటిలో విమర్శించారు? ఎందుకంటే వారు ధర్మశాస్త్ర బోధకులు కాబట్టి దానికి అనుగుణంగా జీవించవలసిన అవసరం ఉంది! గాని వారు చెబుతున్నారు గాని చెయ్యడం లేదు కాబట్టి దేవుడు వారిని విమర్శించవలసి వచ్చింది! అలాగే బోధకులు తాము బోధిస్తూ బోధ ప్రకారం జీవించక పోతే తీర్పు మరియు దండన తప్పదు అని మర్చిపోకూడదు! 

 

గమనించాలి- నీవు కత్తితో జీవిస్తే కత్తితోనే పోతావు అన్నారు యేసుక్రీస్తుప్రభులవారు- ఇక్కడ వీరు అనగా బోధకులు చాలా ప్రమాదకరమైన ఆయుధాన్ని వాడుతున్నారు- అది వారి నాలుక! కాబట్టి నాలుక ప్రకారంగానే వారు తీర్పుతీర్చబడతారు! అందుకే బోధించే పనికి ఎవరూ తొందర పడవద్దు అని హెచ్చరిస్తున్నారు యాకోబు గారు! అయితే ఒకవేళ నీవు పనిని దేవునిచేత పొందుకున్నావా అయితే దీనిని చాలా జాగ్రత్తగా చెయ్యాలి- అందుకే రోమా 12:67 లో అంటున్నారు ..

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. 

దేవుడు ఉపదేశించే సామర్ధ్యాన్ని తనకు ఇచ్చారని, దానిని పరిపూర్ణంగా ఉపయోగించాలని గ్రహించి, బోధించే ముందు బోధించేటప్పుడు బోధను తనకు ముందుగా అన్వయించుకోవాలి అని మర్చిపోవద్దు! కారణం దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్ఘము! అందుకే పౌలుగారు ఇతరులకు బోధించిన తర్వాత నేను తప్పిపోతానేమో అని తననుతాను పరిశీలించుకుంటూ తన దేహాన్ని నలుగ గోట్టుకుంటూ జీవించారు....

1కోరింథీయులకు 9: 27

గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

 

 కాబట్టి భయభక్తులు కలిగి బోధకు తగిన జీవితం జీవిస్తూ తన నాలుకను నోటిని భద్రముగా ఉంచుకుంటూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకుంటూ ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవిద్దాం!

ఉగ్రతనుండి  తీర్పునుండి తప్పించుకుందాం!

దైవాశీస్సులు!

 

*యాకోబు పత్రిక -41 భాగము*

*నోరు-నాలుక-2*

యాకోబు 3:16

1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోండి అంటూ  అధ్యాయంలో వివరంగా వివరిస్తున్నారు!

 

ఇక్కడ రెండవ వచనంలో మనమందరం అనేక విషయాలలో తప్పిపోతున్నాము, ఎవడైనా మాటయందు తప్పిపోకుండా ఉంటే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనంలో ఉంచుకొనే శక్తిగలవాడు అంటున్నారు! ఇంకా చెప్పాలంటే ఎవడైనా తన నాలుకను నోటిని భద్రముగా కాచుకుంటూ అదుపులో ఉంచుకొంటే, వాడు లోపం లేనివాడు కనుక  వాడు పరలోకం పోతాడు అంటున్నారు!

దీనిని బట్టి యాకోబుగారు ఏమంటున్నారు అంటే ఒక వ్యక్తికి ఉన్న అవయవాలు అన్నిటిలో నాలుకను అదుపుచేయడం ఎంతో ఎంతో కష్టము అంటున్నారు! తన నాలుకను అదుపులో ఉంచుకున్న వాడు, తన నాలుకను స్వాధీనంలో ఉంచుకున్న వాడు తన నాలుకపై అదుపు సంపాదించిన వాడు పరిపక్వత సాధించిన పరిపూర్ణ మానవుడు అన్నమాట! దేవుడు తనకు ఇచ్చిన బోధించే పనికి సరిగ్గా సరిపోయినవాడు!!! ఇక్కడ లోపము లేనివాడై అనగా అర్ధము ఇదే! పరిపక్వత సాధించిన పరిపూర్ణ మానవుడు!

కారణం ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం మనకు యాకోబు 2:10 లో కూడా కనిపిస్తుంది. అలాగే మనకు 2పేతురు 1:10 లో కూడా కనిపిస్తుంది.....

దీనికి అర్ధం- తూలిపడిపోవడం, పడిపోవడం, పొరపాటు పడటం, పాపంలో మరలా పడిపోవడం అనేఅర్ధాలు ఉన్నాయి! యాకోబుగారు అంటున్నారు మనమందరం అనేక సార్లు పడిపోతున్నాము అంటున్నారు, అనగా తనతోపాటుగా అనేకులు పడిపోతున్నారు గాని అలా పడకుండా ఉంటే మనుష్యుడు పరిపూర్ణ మానవుడు అంటున్నారు! అందుకే ఎవడైనా మాటయందు తప్పిపోకుండా ఉంటే వ్యక్తి తన సర్వశరీరమును కూడా అదుపులో ఉంచుకున్నవాడు! అనగా మాటయందు తప్పిపోకుండా ఉంటే చూపులో తప్పిపోడు! నడకలో తప్పిపోడు! ప్రార్ధనలో తప్పిపోడు! శరీరముతో పాపం చెయ్యడు! చివరికి ఆలోచనలలో కూడా తప్పుచెయ్యడు! అప్పుడు వ్యక్తి పరిపూర్ణ మానవుడు! యేసుక్రీస్తుప్రభులవారు కూడా వీటిలో దేనియందు తప్పిపోలేదు! అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరగలిగారు యేసయ్య! అంటే ఇలా సర్వ అవయవాలను స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటే మనిషి క్రీస్తు పోలికలోనికి మారిపోయాడు అన్నమాట! 

 

ప్రియ దైవసేవకుడా! బోధకుడా! సంఘకాపరీ! విశ్వాసి! సంఘపెద్డా! నీవు నీ నోటిమీద, నాలుకమీద గెలిచావా? దానిని స్వాధీనములో ఉంచుకోగలుగుతున్నావా?  క్రీస్తు రూపములోనికి మారాలి అంటే నాలుకను స్వాధీనములో ఉంచుకోక తప్పదు అని గ్రహించమని మనవిచేస్తున్నాను!

 

ఇక మూడు నాలుగు వచనాలలో కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు!

మొదటిది గుఱ్ఱము! గుఱ్ఱము చాలా వేగముగా పరిగెత్తుతుంది! మనిషి కంటే బలమైనది!తొందరగా అలసిపోదు! ఇంతటి వేగవంతమైన బలమైన గుఱ్ఱము కూడా కేవలము దాని నోటికి కల్లెము వేస్తే మొత్తము గుఱ్ఱము మనకు లోబడుతుంది కదా! అనగా ఇంతపెద్ద బలమైన వేగవంతమైన గుఱ్ఱము కేవలం కల్లెము వేస్తె మనకు లోబడుతుంది!

 

రెండు: ఓడలు చూడండి! ఎంతో పెద్ద ఓడలు ఉన్నాయి! ఇప్పుడు అర కిలోమీటర్ పొడవున్న షిప్ లు కూడా చేశారు! ఎనిమిది లక్షలు టన్నులు సామగ్రి తీసుకుని పోగలిగిన ఓడలు (ఓబో కేరియర్), తొమ్మిది లక్షల టన్నులు క్రూడ్ ఆయిల్ మోయగలిగిన సూపర్ టాంకర్లు కూడా ఉన్నాయి! అయితే ఇంతపెద్ద ఓడ, కేవలం చిన్న చుక్కాని (rudder) ద్వారా ఎటువైపు వెళ్ళాలంటే అటువైపు తిరుగుతుంది! చుక్కాని ఓడ పరిమాణంలో .5% కూడా ఉండదు! గాని ఓడ మొత్తాన్ని త్రిప్పేస్తుంది.

గాని ఐదో వచనం  ఇంతపెద్ద మనిషి కూడా కేవలం చిన్న నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాడు అంటున్నారు! ఒక పెద్ద కంపెనీను స్వాదీనంలో ఉంచుకున్న వ్యక్తి, పెద్దపెద్ద క్రేన్లు లారీలు రైళ్ళు తన స్వాదీనంలో ఉంచుకున్న వ్యక్తి, తన శరీరాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి, కేవలం చిన్న నాలుకను అదుపులో ఉంచుకోలేక పోతున్నాడు! అది మన శరీరంలో చాలా చాలా చిన్నదైనా బహుగా అదిరిపడుతుంది! ఒకచిన్న నిప్పు ఎంతో పెద్ద అడవిని తగులపెట్టేస్తాది! అలాగే ఎంతో పెద్ద మనిషిని ఎంతో పేరుగల వ్యక్తిని చిన్న నాలుక కాల్చేస్తుంది! వాడి పరువు తీసేస్తుంది, చివరకు యుద్ధాలు తెస్తుంది నాలుక అంటున్నారు!

 

ఇక్క యాకోబుగారు చెప్పేదేమిటంటే చిన్నచిన్న విషయాలకు పెద్దపెద్ద ఫలితాలు వస్తున్నాయి. అలాగే దేహంలో చాలాచిన్న అవయవమైన నాలుక ద్వారా శాంతిని పొందవచ్చు అలాగే యుద్ధాన్ని కూడాకొని తెచ్చుకోవచ్చు! మంచైనా చేస్తుంది, కీడునైనా తెస్తుంది! సామర్ధ్యం మన నాలుకకు ఉంది! నాలుక దొర్లిపోతుంది! తొందరగా అదిరిపడి ఏదో ఒకటి అంటుంది, గాని ఫలితం మొదట వీపుకు, మూతికి దెబ్బలు తగులుతాయి! కొన్నిసార్లు మూతిపళ్లు రాలిపోతాయి! అనేకసార్లు నాలుక వలననే పోలీష్ స్టేషన్లకు కోర్టులకు తిరగాల్సి వస్తుంది! నాలుక నిర్మించగలదు -కూల్చగలదు! కట్టగలదు- కూల్చగలదు! ద్వంసం చేయగలదు!

అందుకే సామెతల గ్రంధంలో నాలుక జీవ వృక్షము అని చెప్పారు

సామెతలు 15: 4

సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.

 

సామెతలు 18: 21

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

 

పాము కోరలు లాగ విషం చిమ్ముతుంది

కీర్తన 140:3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

 

హతమార్చే కత్తిలా ఉంటుంది.

కీర్తనలు 57: 4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

 

వ్యాధిని నయం చేసే మందులా కూడా పనిచేస్తుంది.

సామెతలు 12: 18

కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్య దాయకము.

 

దుర్మార్గతను, కష్టాన్ని తెచ్చిపెట్టగలదు

కీర్తన 10:7

వారి నోరు శాపముతోను కపటముతోను వంచన తోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

 

న్యాయాన్ని నీతిని నిజాయితీని ప్రోత్సహిస్తుంది

కీర్తనలు 37: 30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

 

కీర్తనలు 51: 14

దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

 

ఇక ఆరవ వచనంలో నాలుకను నిప్పుతో పోల్చారు యాకోబు గారు ఆత్మావేశుడై! ఇది మన అవయవాలలో ఉన్న పాప ప్రపంచమై సర్వ శరీరమునకు కూడా మాలిన్యము తీసుకొస్తుంది, అంతేకాకుండా ప్రకృతి చక్రానికి చిచ్చు అనగా నిప్పు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెడుతుంది అనగా చివరికి మనిషికి నరకాన్ని తెస్తుంది అంటున్నారు!

 

అనగా అదుపులేని నాలుక అగ్నిలా వాడబడి మనిషికి నరకాన్ని తెస్తుంది, హృదయంలో శాంతి సమాధానాలు లేకుండా చేసి అందరితోను తగవులాడేలా చేస్తుంది నిన్ను!

గమనించాలి  జాగ్రత్తగా బైబిల్ ని  పరిశీలిస్తే హృదయం నిండిన దానిని బట్టి నాలుక మరియు పెదవులు మాట్లాడతాయి! లూకా 6:45; కాబట్టి తప్పంతా నాలుక మీదన కూడా త్రోసివేయ కూడదు!

 

ఇక నిప్పుతో ఎందుకు పోల్చారు అంటే అది గొప్ప వినాశనాన్ని మనిషికి తెచ్చిపెట్టగలదు కాబట్టి!

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

 

దానినుండి ఎగిరే ఒక నిప్పురవ్వ పెద్ద అడవిని తగులబెట్టగలదు! అంతేకాకుండా నాలుక ఒక పాప ప్రపంచం అంటున్నారు! అయితే ప్రపంచం దుర్మార్గమైనది.

కీర్తనలు 58: 3

తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

 

ఇది కోరికలతోను పాపపు ఆలోచనలతోను నిండి నిత్యమూ మండుతూ ఉంటుంది. మంటలు నరకము నుండి వచ్చి నిన్ను నరకానికే తీసుకుని పోతుంది!  అబద్దాలు, మోసపూరితమైన మాటలు, కొండెములు చాడీలు చెప్పడం, దేవుణ్ణి దూషించడం, శాప వచనాలు పలకడం, పరిహాసాలు సరసాలు ఆడటం ఇవన్నీ సాతాను గాడు నాలుకకు నేర్పించి నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాడు! కాబట్టి నాలుకను అదుపు చేసుకుంటావా?

 

కాబట్టి నాలుకకు అంత శక్తి ఉంది కాబట్టి దీనిని కట్టడానికి ఉపయోగిస్తావా లేక పడగొట్టడానికి ఉపయోగిస్తావా తగులబెట్టడానికి ఉపయోగిస్తావా లేక వంట వండుకోవడానికి ఉపయోగిస్తావా, శాంతికి ఉపయోగిస్తావా లేక యుద్ధానికి ఉపయోగిస్తావా దేనికి ఉపయోగిస్తావో నీ ఇష్టం! ఉపయోగించే విధానం తెలియలేదా నీకే నష్టం అని మర్చిపోవద్దు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -42 భాగము*

*నోరు-నాలుక-*

యాకోబు 3:712

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోండి అంటూ  అధ్యాయంలో వివరంగా వివరిస్తున్నారు!

 

ఇక ఏడవ వచనంలో మృగాలు పక్షులు పాములు జలచరములు అనగా జలములలో బ్రతికేవి అనగా చేపలు తాబేళ్లు మొసళ్ళు లాంటివి మనిషి చేత సాధువు అనగా మచ్చిక అవుతున్నాయి. మనిషి మాట వింటున్నాయి  గాని మనిషి కూడా ఇంతవరకు తన సొంత నాలుకను సాధువు లేక మచ్చిక చేసుకోలేక పోతున్నాడు అంటున్నారు! నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వముతో నిండిపోయింది అంటున్నారు ఎనిమిదవ వచనంలో!

పై వచనాలలో మొదటగా గుఱ్ఱము మరియు ఓడలు కూడా మనిషి మాట వింటున్నాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు వచనాలలో మనిషిచేత మృగాలు పక్షులు పాములు లాంటి ప్రాకే జంతువులూ సముద్రంలో నివశించే ప్రాణులు కూడా మచ్చిక లేక మనిషి స్వాధీనంలోకి వస్తున్నాయి కాని మనిషి తన సొంత నాలుకను మాత్రం స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాడు అంటున్నారు! తన నాలుకను అన్నివేళలా సంపూర్ణంగా తన స్వాధీనంలో ఉంచుకున్న వాడు ఇంతవరకు యేసుక్రీస్తుప్రభులవారు మాత్ర్రమే , నరులలో ఎవరూ లేరు మానవ చరిత్రలో!

 

అబ్రాహాము గారు అలా చెయ్యలేక పోయారు- శారమ్మతో అబద్దమాడమని రెండుసార్లు చెప్పారు! ఆదికాండం 12:1120; 20:29;

 

మోషేగారు కూడా నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక పోయారు! సంఖ్యా 20:1012 అక్కడ ఇశ్రాయేలు వారిని ద్రోహులారా అని సంభోధించారు కోపం తట్టుకోలేక! అంతేనా బండతో మాట్లాడమని చెబితే బండను కర్రతో కొట్టారు మోషేగారు. బండక్రీస్తు కదా!

కీర్తనలు 106: 33

ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.

 

పేతురు గారు కూడా అదుపులో ఉంచుకోలేక పోయారు! మత్తయి 26:6974 లో  యేసుప్రభులవారు ఎవరో నాకు తెలియదు అని అబద్దమాడారు!

 

మరి క్రీస్తుప్రేమ సిద్ధాంతాన్ని బాగా అర్ధం చేసుకున్న వారు ఇద్దరే, మొదటిది యోహాను గారు,రెండవది: పౌలుగారు! పౌలుగారు కూడా తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక ప్రధాన యాజకున్ని నోటిమీద కొట్టమన్నారు! అపో 23:25

 

ఇక దీనిని అనగా పత్రికను రాసిన యాకోబు గారు ముందుగానే ఒప్పుకున్నారు నేను నా స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాను అని. అందుకే మనమందరం తప్పిపోతున్నాము అన్నారు!

 

ఇది చెప్పడంలో నాఉద్దేశం మనం స్వాధీనంలో ఉంచుకోలేము గనుక మీరు కూడా దానికి అనగా అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించవద్దు అని కానేకాదు! తప్పకుండా ప్రయత్నించాలి! అసలు ప్రయత్నం చేయకుండా పూర్తిగా వదిలెయ్యకుండా కనీసం కొంతవరకైనా ప్రయత్నిస్తే మనకు మన శరీరానికి సమాజానికి కూడా ఎంతో మేలు!

 

అందుకే కీర్తనాకారుడు రాస్తున్నాడు : యెహోవా నా నాలుకకు నా నోటికి కావాలి పెట్టు! 141:

కీర్తనలు 141: 3

యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.

 

సామెతల గ్రంధకర్త అంటున్నారు: అధికమైన మాటలలో దోషాలు ఉంటాయి అందుకే మాటలు తక్కువగా ఉండాలి.

సామెతలు 10: 19

విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

 

సామెతలు 11: 12

తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

 

సామెతలు 21: 23

నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

 

అయితే మన నాలుకను మన అదుపులో ఉంచుకోవడం ఎలా సాధ్యం?

మన హృదయం నిండా మన మనస్సు నిండా దేవుని వాక్యముతో నింపుకుంటే, మనలను పరిశుద్ధాత్ముడు ఏలుతూ ఉంటే ఇది సాధ్యమే! అప్పుడు మన నాలుక మంచి సంగతులే మాట్లాడతాయి! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి సువార్తలో అంటున్నారు 12:2437 లో.....

25. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను యిల్లయినను నిలువదు.

28. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.

31. కాబట్టి నేను మీతో చెప్పున దేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.

32. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

33. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

34. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

35. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

 

పౌలుగారు కొలస్సీ పత్రికలో అంటున్నారు

కొలస్సీయులకు 3: 16

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

ఇలాచేస్తే మనం మన నాలుకను అదుపులో ఉంచుకోలేక పోయినా దేవుడు మన హృదయాలలో పనిచేసి ఆయన వాక్యము మన నాలుకను మన ప్రవర్తనను స్వాధీనంలో ఉండేలా చేస్తుంది! ఇది పరిశుద్దాత్మునికి, ఆయన వాక్యమునకు సాధ్యమే!

మరి నీ మనస్సు నీ హృదయం ఆయన వాక్యముతో ఆయన ఆత్మతో నింపబడటానికి ఇష్టపడుతున్నావా!!!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -43 భాగము*

*నోరు-నాలుక-4*

యాకోబు 3:712

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోండి అంటూ  అధ్యాయంలో వివరంగా వివరిస్తున్నారు!

 

       (గతభాగం తరువాయి)

ఇంకా ఎనిమిదో వచనంలో నాలుక విషంతో నిండి ఉంది విషం భయంకరమైన దుష్టత్వము అంటున్నారు! యాకోబు గారే కాదు కీర్తనాకారుడు కూడా ఇది విషంతో నిండి ఉంది అంటున్నారు.

కీర్తనలు 58: 4

వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను

 

కీర్తనలు 140: 3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

 

పౌలుగారు కూడా అంటున్నారు.

రోమీయులకు 3: 13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

 

ఎలాగు విషకరమైనదో మనకు తొమ్మిదో వచనం నుండి 12 వచనం వరకు వివరిస్తున్నారు:

ఇదే నాలుకతో మనం తండ్రియైన దేవుని స్తుతిస్తున్నాము! ఇదే నాలుకతో అదే తండ్రియైన దేవుడు చేసిన మనిషిని శపిస్తున్నాము

ఇంకా ఇదే నోటితో నాలుకతో స్తుతి వస్తుంది శాపం కూడా వస్తుంది. ఇలా ఉండకూడదు అంటున్నారు. పదకొండో వచనంలో ఒకే ఊటనుండి లేక ఒకే నూతినుండి మంచినీరు లేక తియ్యటినీరు, చేదునీరు రావు కదా, పన్నెండో వచనం ఒక అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా అలాగే ఉప్పు నీళ్ళలో నుండి తియ్యటి నీళ్ళు పుడతాయా? గాని మీ నాలుకల నుండి స్తుతి మరియు శాపం ఎందుకు వస్తున్నాయి? మంచి దేవుని పాటలు మరియు బూతులు ఎందుకు వస్తున్నాయి అని అడుగుచున్నారు పరిశుద్ధాత్ముడు!!!

 

బైబిల్ లో మనిషి దేవుని పోలికలో పుట్టాడు లేక దేవుడు తన పోలికలో మనిషిని చేశారు అని వ్రాయబడింది ఆది కాండం 1:2627, మరియు ఎఫెసీ 4:24

మరి ఇప్పుడు దేవుని పోలికలో పుట్టిన నీవు నేను అదే దేవునిపోలిక పుట్టిన వ్యక్తిని ఎందుకు దూషిస్తున్నాము? ఎందుకు శపిస్తున్నాము? అని అడుగుచున్నారు!

 

ఒక ఊట నుండి మంచి నీరు చెడు నీరు లేక ఉప్పు నీరు తియ్యటి నీరు ఎలా పుట్టవో అలాగే మనిషి నోటినుండి ఆశీర్వాదం - శాపం రాకూడదు అంటున్నారు. కాని సృష్టి అంతటిలో మనిషి నాలుకకు మాత్రమే రెండు రకాల మూల స్థానాలు, రెండు రకాల ప్రవాహాలు ఉన్నాయి! అదే మనిషిని నరకానికి తీసుకుని పోతుంది! లేక పరలోకానికి తీసుకుని పోతుంది!

ఇది కుదరదు అంటున్నారు యాకోబు గారు!

 గతభాగంలో చూసుకున్నాము: మోషేగారు ఎంత దేవునికి నమ్మకమైన భక్తుడో- గాని పెదాలతో కానిమాట పలికారు- ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అంతగా కోపం పుట్టించారు! భూమిమీద ఉన్నవారిలో మోషేగారు మాత్రమే సాత్వికుడు అని దేవునిచేత సర్టిఫికేట్ పొందిన మోషేగారు (సంఖ్యాకాండము 12: 3

యెహోవా మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు).

 ఒకరోజు కోపం తట్టుకోలేక ద్రోహులారా అన్నారు! ఈమాట దేవునికి కోపం పుట్టించింది- ఇంతగా ప్రేమించిన మోషేగారిని కనాను దేశాన్ని చూడకుండా చేసేశారు!  తన కోపంలో పలికిన మాట తనను కనాను దేశం వెళ్ళకుండా చేసింది!

 

ఒక్క అబద్దం అననీయ మరియు సప్పీరలను దేవుని మందిరంలోనే చచ్చిపోయేలా చేసింది!

 

ఏలీయా గారు చేసినట్లు మేము కూడా అగ్నిని రప్పించి సమరయులను కాల్చేమంటావా దేవుడా అన్నారు శిష్యులు! అన్నారు గాని పలుకలేదు! వెంటనే యేసయ్యతో గద్దించబడ్డారు!

 

అయితే నాలుక దేనికోసం అంటే దేవుని స్తుతిని ప్రచురించడానికి! దీవెన వాక్యాలు చెప్పడానికి మాత్రమే అని గ్రహించాలి!

కీర్తనలు 35: 28

నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

 

కీర్తనలు 37: 30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

 

కీర్తనలు 45: 1

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది.

 

కీర్తనలు 51: 14

దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

 

కీర్తనలు 119: 172

నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును.

 

ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి!

అయితే దేవుడు ఒకరోజు నాలుకను కోసేస్తాను అంటున్నారు  ఎందుకంటే నాలుక విషపూరితమైనదే కాదు అది కత్తిలాంటిది కీర్తన

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

కీర్తనలు 52: 4

కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

 

కీర్తనలు 57: 4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

 

అందుకే నిప్పులు పోస్తాను అంటున్నారు:

కీర్తనలు 120: 3

మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

కీర్తనలు 120: 4

తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును

 

సామెతలు 10: 31

నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.

 

చివరిగా జీవమరణములు నాలుక వశము అంటున్నారు- నీకు జీవం కావాలా లేక మరణం కావాలా నిన్నీ కోరుకోమంటూన్నారు!

సామెతలు 18: 21

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

 

కాబట్టి నీకేది కావాలో నీవే తేల్చుకో!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -44 భాగము*

యాకోబు 3:1318

13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని (చేదైన) మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15. జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇంతవరకు నోరు-నాలుక చేసే విధ్వసం కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక యాకోబు గారు వచనాలలో రెండు రకాలైన జ్ఞానముల కోసం చెబుతున్నారు!

దానిని ధ్యానించే ముందు యాకోబు గారు 13 వచనంలో తను అనుభవంతో కూడిన ఒక మాటను అంటున్నారు: మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను అంటున్నారు. ఇక్కడ తెలుగులో జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై అని తర్జుమా చేయబడింది గాని ప్రాచీన ప్రతులలో మరియు కొన్ని స్టడీ బైబిల్ లో ఇలా తర్జుమా చేయబడింది:  మీలో ఎవరికీ తెలివి గ్రహింపు ఉన్నాయి? అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తన చేత జ్ఞానమునకు మూలమైన వినయంతో చేసిన క్రియలను కనపరచాలి ...

ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినది ఏమంటే జ్ఞానమునకు మూలము వినయం అంటున్నారు! వినయం ఉంటే జ్ఞానము వస్తుంది. అప్పుడు ఈజ్ఞానము ఉపయోగించి మంచి ప్రవర్తన కలిగి మంచి పనులు చెయ్యాలి ఇదీ ఒక జ్ఞాన వివేకములు ఉన్న వాని లక్షణాలు!!! చూడండి: యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి జ్ఞానమునకు మూలము అని సామెతలు గ్రంధములో వ్రాయబడింది! అదే సమయంలో అదే సామెతల గ్రంధంలో రెండు సార్లు ఘనతకు ముందు వినయం ఉంటాది అని వ్రాయబడింది. సామెతలు 15:33; 18:12;

అక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞానాభ్యాసానికి సాధనము అంటూ ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటున్నారు! దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకడు జ్ఞానవంతుడు కావాలంటే ముందుగా అతనికి దేవుని మీద భయము భక్తి ఉండాలి. అలాంటివాడు వినయం కలిగి ఉంటే అనగా దేవుడంటే భయభక్తులతో జీవిస్తూ వినయం కలిగి ఉంటే అతడు మరింత విజ్ఞానవంతుడై ఘనతను సాధిస్తాడు అని అర్ధమవుతుంది. కాబట్టి జ్ఞానమునకు మూలము మొదట దేవుని యందు భయభక్తులు, రెండు: వినయం కలిగి ఉండాలి!

 

సరే, మన పాఠానికి వచ్చేదాం! మీలో ఎవడికైనా జ్ఞానము వివేకము ఉంటే వాడు మొదట దేవుడంటే భయభక్తులు చూపిస్తూ వినయం కలిగి ఉండి తద్వారా పొందిన జ్ఞానంతో కూడిన సాత్వికము అనగా అణుకువ , నెమ్మది తనము కలవాడై ఉంటూ తన యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి అనడం లేదు- తన యోగ్యప్రవర్తన వలన తన మంచి క్రియలను చూపించాలి అంటున్నారు! అలా చూపించిన వాడే జ్ఞానము మరియు వివేకము గలవాడు అంటున్నారు! ఒకవేళ అలా వినయంతో కూడిన  మంచి ప్రవర్తన గల పనులు లేక క్రియలు చెయ్యకపోతే వాడు జ్ఞానవంతుడు కాదు, వివేకవంతుడు కాదు అంటున్నారు! అసలు మాట ఎందుకు అంటున్నారు అంటే 14 వచనంలో అయితే మీ హృదయాలలో సహించలేనంత మత్సరం అనగా కుళ్ళు కపటం ఉంచుకొని దానివలన కలిగిన తీవ్రమైన అసూయ (మత్సరం) ఉంచుకుని అతిశయ పడుతున్నారు. సత్యానికి విరోధముగా అబద్దమాడుతున్నారు! అంటే ఇలాంటివారు ఎవడూ కూడా జ్ఞానవంతుడు కాదు, వివేకం అసలే లేదు అన్నమాట! ఇక 15 వచనంలో జ్ఞానము ఉందే అనగా మనస్సు నిండా ద్వేషము, తీవ్రమైన అసూయ, సహించలేనంత కుళ్ళు కపటం పెట్టుకుని అతిశయపడుతూ తిరుగుతున్నారు కదా అలాంటి జ్ఞానము పైనుండి అనగా పరలోకం నుండి వచ్చింది కాదు గాని అది భూసంబంధమైనది మరియు ప్రకృతి సంబంధమైనది అయిన దయ్యాల జ్ఞానము వలన జ్ఞానం వచ్చింది అజ్ఞానవంతులకు అంటున్నారు పరిశుద్ధాత్ముడు! తర్వాత వచనంలో ఎందుకంటే మత్సరము (తీవ్రమైన అసూయ)  మరియు వివాదము  ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి మరియు ప్రతీ నీచ కార్యము ఉంటుంది అంటున్నారు. స్టడీ బైబిల్ లో అసూయ కలహభావం ఎక్కడున్నాయో అక్కడ అక్రమ పరిస్తితులు ప్రతీ విధమైన దురాచారాలు ఉంటాయి అంటున్నారు!

 

ఇక్కడ రెండు రకాలైన జ్ఞానముల కోసం చెబుతున్నారు! ఒక జ్ఞానం సైతాను గాడినుండి లేక దయ్యాల ఆత్మ వలన కలిగింది! రెండవది పరమునుండి అనగా దేవుని నుండి కలిగింది! ఒకదాని ద్వారా కలిగే ఫలితాలు వేరోకదాని ద్వారా కలిగే ఫలితాలకు పూర్తిగా భిన్నమైనవి! ఒకవ్యక్తి జీవితంలో కనిపించే క్రియలు అనగా అతని మాటలు, అతని ప్రవర్తనను బట్టి చేసే కార్యాలు బట్టి అతడు నిజంగా జ్ఞానవంతుడో అజ్ఞానవంతుడో తెలుస్తుంది! ఎవరైతే దుర్మార్గంగా దుష్టత్వంతో నడుస్తూ గర్వ హృదయంతో అసూయ కలిగి, కానిపనులు చేస్తూ ఉంటారో వారిలో ఇహలోక సంబంధమైన మనస్సు కలిగిన వారు. వారిలో ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు! వారిలో దేవుడిచ్చిన జ్ఞానము అనేది ఏమాత్రము ఉండదు! దేవుడిచ్చిన జ్ఞానము లేదు అంటే వారిలో వినయము ఉండదు, విధేయత ఉండదు, అణుకువ ఉండదు! కోపం, అసూయ, ద్వేషం, కలహం నిండి ఉంటాయి! పైకి మాత్రం అంటారు- నేను జ్ఞానవంతుడిని , అలా పేరుకూడా తెచ్చుకుంటారు- వారికున్న ధనాన్ని బట్టి బలాన్ని బట్టి అధికారాన్ని బట్టి! గాని వారు జ్ఞానులు కానేకాదు! కీర్తనలు 14 మరియు 53 లో దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమకుతాము అనుకున్నట్లు, లోకంలో వారే తెలివైన వారు అనుకున్నట్లు వీరుకూడా అనుకుంటారు! వారికి తెలివితేటలూ ఉంటే అది కేవలం ఇహలోకమునకు సంభందించినదే కాని పరలోకానికి దేవునికి చెందినది కానేకాదు! రెండు రకాల జ్ఞానాలకు పోలిక చూడాలి అంటే మనము 1కొరింథీ పత్రిక 1:17 నుండి 2:16 వరకు చూడాలి!

సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెఱ్రితనముగా కనిపిస్తుంది. అయితే రక్షించబడిన మనకు ఆదిదేవుని శక్తి!! ఈలోకంలో తెలివిగలవారు అని చెప్పబడే వారిని సిగ్గుపరచడానికి చదువుకోలేని మనలను, కులంలోను, ధనంలోను, చదువులోను అన్నిటిలో హీనమైన మనలను దేవుడు ఎన్నుకుని గొప్పోల్లను సిగ్గుపరచాడు దేవుడు! అయితే క్రీస్తులో ఉన్న మనకు దేవుడు జ్ఞానము, నిర్దోషత్వము, పవిత్రత లేక పరిశుద్ధత, విమోచన అన్నీ ఇచ్చారు! కాబట్టి దేవుని జ్ఞానం గలవాడు ఒకవేళ అతిశయపడితే వాడు ప్రభువును బట్టే అతిశయపడాలి అంటున్నారు! ఎవరికీ లేనట్టి రక్షణ, ఆధ్యాత్మిక మేలులు పరలోక విషయాలు పొందిన మనము ప్రభువును బట్టి అతిశయంచాలి అంటున్నారు!

 

గమనించాలి మంచివారు లేక మంచిపనులు చేస్తూ సాత్వికమైన బుద్దిగలవారు మాత్రమే జ్ఞానం గలవారు! ఒక దుర్మార్గుడికి లేక దుష్టుడికి ఎంత జ్ఞానమున్నా ఎన్ని తెలివితేటలున్నా గాని వాడు మూర్కుడే!!!  నిజమైన జ్ఞానం వలన కలిగేది అణుకువ లేక సాత్వికమైన మనస్సు సాత్వికమైన ప్రవర్తన! అంతేకాకుండా ఇక్కడ మరోమాట : సాత్వికంతో కూడిన మంచిక్రియలు జ్ఞానవంతునిలో కనిపిస్తాయి! గమనించాలి మరలా వదిలిపెట్టిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు! నీకు విశ్వాసముంది నా దగ్గర క్రియలున్నాయి అంటే కుదరదు! మీ విశ్వాసము మంచి క్రియలతో కూడినదై ఉండాలి అంటూ మనం మొదటి రెండు అధ్యాయాలలో చూసుకున్నాము! దానినే ఇక్కడ మరోసారి గుర్తుకుచేస్తూ కేవలం విశ్వాసానికి మాత్రమే క్రియలు అవసరం కాదు,  నీకున్న జ్ఞానమునకు కూడా మంచి క్రియలు లేక సాత్వికమైన మనస్సుతో కూడిన మంచి క్రియలు కావాలి అంటున్నారు!

 

మరోమాట: నిజమైన దేవుని జ్ఞానం గలవారు తమనుతాము గొప్ప చేసుకోరు! తామే దేవుళ్ళు అనుకోరు!

కీర్తన 14:1

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

 

కీర్తనలు 111: 10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించు వారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెతలు 3: 7

నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

 

8:18

1. జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది

4. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.

5. జ్ఞానములేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా, బుద్ధి యెట్టిదైనది యోచించి చూడుడి.

6. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

7. నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము

8. నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు

 

సామెతలు 10: 23

చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.

 

ఇక్కడ వీరికి దైవజ్ఞానం ఉంది!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -45 భాగము*

 

యాకోబు 3:1318

13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని (చేదైన) మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15. జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇంతవరకు నోరు-నాలుక చేసే విధ్వసం కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక యాకోబు గారు వచనాలలో రెండు రకాలైన జ్ఞానముల కోసం చెబుతున్నారు!

 

      (గతభాగం తరువాయి)

 

అదే భూసంభంధమైన జ్ఞానం కలవారికి అసూయ, తీవ్రమైన అసూయ (మత్సరం), కలహాలు కక్షలు ఉంటాయి! మనశ్శాంతి ఉండదు!

యోబు 5: 2

దౌర్భాగ్యమును గూర్చి యేడ్చుట వలన మూఢులు నశించెదరు బుద్ధిలేని వారు అసూయవలన చచ్చెదరు.

సామెతలు 14: 30

సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.

 

సామెతలు 23: 17

పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.

 

మార్కు 7: 21

లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును

మార్కు 7: 22

నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును (మూలభాషలో- చెడ్డ కండ్లును) దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

 

రోమీయులకు 1: 29

అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై....

ఇదీ భూలోకసంబంధమైన జ్ఞానం గలవారిలో కనిపించేవి.

 

అనేకమందికి మతాన్ని అనుసరించేవారికి (క్రైస్తవులతో సహా) దేవుడిచ్చిన జ్ఞానం తమకు ఉందా లేక దయ్యాల జ్ఞానమా అనేది తెలియడం లేదు! కారణం వారి లక్ష్యాలు, వారి గురి, ఆశయాలు వేరేగా ఉంటాయి! దయ్యాల జ్ఞానం గలవారు డబ్బుకోసం, స్త్రీల కోసం- వ్యభిచారం కోసం, పదవికోసం పేరు ప్రతిష్టలు కోసం పరుగెడతారు! అయితే దైవిక జ్ఞానం పొందుకున్నవారు ఆత్మల సంపాదన కోసం, పరలోకం కోసం, ఆధ్యాత్మిక విషయాల కోసం వరాల కోసం ఫలాల కోసం ఆలోచిస్తూ ఉంటారు! కాబట్టి వారు పరుగెత్తే విధానం బట్టి వారు ఎటువంటి జ్ఞానం పొందుకున్న వారో తెలిసిపోతుంది! ఒకవేళ నీవు డబ్బుకోసం పేరు ప్రతిష్టల కోసం పరుగెత్తుతున్నావా? నీవు భూసంబంధమైన జ్ఞానము పొందుకున్నావు! నీవు ఆత్మ కోసం, ఆత్మల సంపాదన కోసం, వరాల కోసం ఫలాల కోసం, పరలోక సంబంధమైన విషయాల కోసం ఆలోచిస్తూ పనులు చేస్తున్నావా, నీలో అణుకువ బుద్ది సాత్వికం మంచితనం దయాళత్వం లాంటివి పనిచేస్తున్నాయా నీలో పైనుండి వచ్చే జ్ఞానం పనిచేస్తుంది అని అర్ధం!

 

అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఉంటే 17, 18 వచనాలలో అంటున్నారు: అది

మొదట పవిత్రమైనది!

రెండు సమాధాన కరమైనది,

మూడు మృదువైనది,

నాలుగు సులభముగా లోబడేది!

 కనికరముతో మంచి ఫలములతోను నిండి ఉండేది,

తర్వాత పక్షపాతము లేనిది,

చివరిది వేషధారణ అనేది లేనిది అంటున్నారు!

 

ఒకవేళ నీలో పక్షపాత బుద్ది రెండో అధ్యాయంలో చూపించిన పక్షపాతం- అనగా డబ్బున్న వారిని ఒకలా, లేని వారిని ఒకలా, చూస్తే నీలో పైనుండి వచ్చే జ్ఞానం లేదు, నీలో వేషధారణ ఉంటే అంటే అందరిముందు ఒకలా, ఎవరూ లేకపోతే ఒకలా ఉంటే, ఇంకా నీకు డబ్బు ఐశ్వర్యము ఉన్నది అనే దర్పమును చూపించడానికి నీవు చేసే వస్త్రధారణ అది వేషధారణ , ఇది ఉన్నా నీవు దయ్యాలజ్ఞానం కలవాడివి/కలదానివి!

పైనుండి వచ్చేజ్ఞానం అనగా పరలోకం నుండి అని చెప్పడం జరిగింది!

 

అయితే పైనుండి కలిగిన జ్ఞానం గలవారిలో ఉంటాయి..

 

1కోరింథీయులకు 13: 4

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

1కోరింథీయులకు 13: 5

అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

1కోరింథీయులకు 13: 6

దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

1కోరింథీయులకు 13: 7

అన్ని టికి తాళుకొనును (లేక, అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

 

గలతియులకు 5: 26

ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

 

సామెతలు 8:2223

22. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.

23. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.

 

1కొరింథీ 1:24, ౩౦,

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

25. దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

 

1కోరింథీయులకు 2: 7

దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

 

కొలస్సీ 2:3

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

 

కాబట్టి పైనుండి వచ్చిన జ్ఞానము గలవారు చూపించేవి పరిశుద్ధత, శాంతి, మృదువైన మాటలు, అణుకువ లేక సాత్వికము, జాలితో నిండిన మంచి ఫలాలు!

 

దేవుడిచ్చిన జ్ఞానం లో ఏవిధమైన పాపము గాని కల్మషము గాని చెడుతనం గాని కల్తీ గాని ఉండవు! ఇలాంటి వాటిచెంతకు పైనుండి వచ్చే జ్ఞానం నడిపించదు! అది ఈలోక జ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది, భిన్నముగా ఆలోచిస్తుంది! పైనుండి వచ్చే జ్ఞానము దేవునికి మనిషికి మనిషికి మనిషికి

మధ్య శాంతి నెలకొల్పాలని ఆశిస్తుంది. శాంతిని తీసుకుని వస్తుంది! జ్ఞానం దయగలది! ఇతరుల క్షేమాన్ని ఆశిస్తుంది! దేవునికి ఎంతో విధేయత చూపిస్తుంది! మత్తయి 5:7, 9 లో చెప్పినట్లు కరుణ కనికరం చూపిస్తుంది! దేవుని మహిమకోసం జ్ఞానం గలతీ పత్రిక 5లో చెప్పిన ఆత్మఫలము ఫలిస్తుంది! తద్వారా అందరికీ మంచిని కలిగిస్తుంది! పక్షపాతధోరణి గాని వేషధారణ గాని అసలు చూపనేచూపదు! అన్నింటిలో తగ్గించుకుని మాదిరికరమైన జీవితం తగ్గించుకున్న జీవితం జీవిస్తుంది! ముఖ్యంగా జీవితమంతా యధార్ధత కలిగి ఉండి నిజాయితీ తో ప్రవర్తించేలా చేస్తుంది!

2కొరింథీ 1:12

మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానముననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే

 

2కోరింథీయులకు 6: 6

పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను

 

1తిమోతికి 1: 5

ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.

 

హెబ్రీ 10:22

మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాస విషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

1పేతురు 1:22

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

 

ఇందులో కపటము ఉండదు!

 

ఇక చివరి వచనంలో అంటున్నారు : నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధాన మందు విత్తబడును అంటున్నారు!

దేవునికి మనిషికి మరియు మనిషికి మనిషికి మధ్య సరైన సంబంధాలుంటే నీతిన్యాయాలు పెరుగుతాయి. శాంతి నీతి న్యాయము కలిసే ఉంటాయి! అవి రెండు దేవుని జ్ఞానము లోనుండే వస్తాయి.

 

కీర్తనలు 85: 10

కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.

 

సామెతలు 3: 17

దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.

 

యెషయా 32:17

నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

 

కాబట్టి మనం దైవక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి లేక పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాం!

ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం!

మనలో ఏకరమైన జ్ఞానం ఉందో పరీక్షించుకొని ఒకవేళ భూసంభంధమైన జ్ఞానం ఉంటే దానిని విసర్జించి పైనుండి కలిగే జ్ఞానం కోసం ప్రయత్నించి పొందుకుందాం! మనలను దేవునితో సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -46 భాగము*

యాకోబు 4:13

1. మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?

2. మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.

3. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఇక నాలుగో అధ్యాయంలో, మూడో అధ్యాయంలో మొదలుపెట్టిన అంశాన్ని కొనసాగిస్తున్నారు! :15 లో చెప్పిన దయ్యాల జ్ఞానమును పొందిన కొంతమంది వలన కలిగే ఫలితాలు కోసం యాకోబు గారు చెబుతున్నారు! అంతేకాకుండా ఒక సంఘపెద్దగా అధ్యక్షునిగా సంఘాలలో తానూ చూస్తున్నది, జరుగుచున్నది గమనించి వాటికోసం ఒక పెద్దగా పరిశుద్ధాత్మ పొందిన వానిగా చెబుతున్నారు!

 

మొదటి వచనంలో మీలో యుద్ధాలు పోరాటాలు దేనినుండి కలుగుచున్నాయి? మీఅవయవాలలో పోరాడు బోగేచ్చలవలననే కదా అంటున్నారు! మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరకడం లేదు, అవి దొరకలేదు కాబట్టి నరహత్యలు చేస్తున్నారు, మత్సరపడుచున్నారు అనగా తీవ్రమైన అసూయ కలిగి కోపంతో రేగిపోతున్నారు గాని మీరు సంపాదించుకోలేరు! పోట్లాడుతున్నారు యుద్ధాలు చేస్తున్నారు గాని మీరు దేవుణ్ణి అడగటం లేదు కాబట్టి మీకేమి దొరకడం లేదు అంటున్నారు పెద్దయిన యాకోబు గారు!!!

దయ్యాలజ్ఞానం వలన సగం సగం తెలిసి విధముగానైనా సంపాదన సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు! అందుకే మీ హృదయంలో భయంకరమైన పోరాటాలు చెలరేగుతున్నాయి. హృదయ పోరాటం చిలికి చిలికి ఇతరులతో తగవులకు తగాదాలకు కారణమౌతున్నాయి అంటున్నారు.  అందుకే పౌలుగారు కొరింథీ : లో అంటున్నారు:మీరు శరీర స్వభావులు అందుకే మీ మద్య అసూయ జగడాలు లాంటివి కనిపిస్తున్నాయి!

1కోరింథీయులకు 3: 3

మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

 ఇక్కడ యాకోబు గారు మీరు పైనుండి వచ్చిన జ్ఞానం గలవారు కాదు, దయ్యాలజ్ఞానం గలవారు కాబట్టే మీ మధ్య తీవ్రమైన అసూయలు కలహాలు ఉన్నాయి అంటున్నారు!

గలతీ పత్రికలో 5:17 లో అంటున్నారు ఎవరికైతే శరీర స్వభావం ఉంటుందో వారు ఆత్మానుసారమైన కార్యాలు చెయ్యలేరు, ఆత్మ దేహానికి, దేహం ఆత్మకు వ్యక్తిరేఖంగా పనిచేస్తాయి!

గలతియులకు 5: 17

శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

 

అందుకే మీరేమి చెయ్యాలి అని అనుకుంటున్నారో దానిని చెయ్యలేకపోతున్నారు అంటున్నారు! మీకుకూడా మంచి చెయ్యాలని ఉంది గాని చెయ్యలేక పోతున్నారు అంటున్నారు.....  పౌలుగారు అంటున్నారు నేను చేయగోరు మంచి చెయ్యక చేయకూడదని నేను అనుకుంటున్న కీడుని చేస్తున్నాను! నేను నశించిపోతున్నాను అంటున్నారు....

Romans(రోమీయులకు) 7:15,18,19,20,21,23,24

15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.

18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

19. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.

21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

 

విశ్వాసులు తాము చెయ్యాలని అనుకుంటున్న మంచి అంతా చెయ్యలేరు ఎందుకంటే వారి శరీర స్వభావాలు దానికి అడ్డుపడుతూ ఉంటాయి!

అదే సమయంలో ఎవరైతే దేవుని ఆత్మ గలవారో, వారు ఒక్కొక్క సారి శరీరకార్యాలు చేద్దామని మనస్సు లాగినా వెంటనే పరిశుద్దాత్ముడు అడ్డుపడుతూ ఉంటాడు! నాకు కూడా చాలాసార్లు అలా అనిపించినా నాలో పరిశుద్ధాత్ముడు- ఒరేయ్ పనికిమాలినవాడా! నీవు దేవుని పవిత్రరక్తంలో కడుగబడిన వాడవని మర్చిపోతున్నావా? నరకానికి పోతావ్ జాగ్రత్త! అంటూ నన్ను పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు! వెంటనే నన్ను క్షమించు పరిశుద్దాత్ముడా, నాలో కాని ఆలోచన, కాని కోరిక వచ్చింది అంటూ వేడుకుని క్షమాపణ పొందుకుంటాను! ఇదీ దేహానికి- పరిశుద్దాత్మునికి నిరంతరం కలిగే పోరాటం! పౌలుగారి పత్రికలలో ఇలాంటి ఆశలు నీలో రేకిత్తకించకుండా కోరికలను తీసివేయమని ప్రార్ధించాలని ఎక్కడా రాయలేదు! దానికి ప్రతికూలంగా మీరు ఆత్మ స్వభావం గలవారై ఉండండి అప్పుడు శరీరకార్యాలు చెయ్యలేరు అంటూ పరిశుద్ధాత్మ పూర్ణుడై రాస్తున్నారు!

గలతియులకు 5: 16

నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

ఇదీ నిరంతరం మన అవయవాలలో- మన మనస్సులో రేగే తలంపులు-ఆత్మీయపోరాటాలు! అయితే మీరు పైనుండి కలిగిన జ్ఞానం కలిగి ఉంటే శరీరపోరాటములో విజయం సాధిస్తారు! అయితే మీరు దయ్యాల జ్ఞానం ఉంటే మీరు అసూయ ద్వేషం పగ కలిగి, సంపాదించుకోవటానికి అవసరమైతే హత్యలు కూడా చేస్తున్నారు అంటున్నారు!

 

యాకోబు గారు మాట రాయడానికి కారణం- రోజులలో యూదులు- క్రైస్తవులంటే భయంకరమైన మత్సరం కలిగి- వారిని చంపించడానికి ప్రయత్నించి తర్వాత వారి ఆస్తులు దోచుకునే వారు! ఇది ఆదిమ సంఘ చరిత్రలో కనిపిస్తుంది! ప్రకటన గ్రంధంలో 2, అధ్యాయాలలో గల సంఘములలో క్రైస్తవ సంఘాలు హింసలు పొందటానికి కారణం వీరే- వీరినే దేవుడు సాతాను సమాజం అని పిలిచారు ప్రకటన గ్రంధంలో! అనగా అప్పుడున్న యూదులు దయ్యాల జ్ఞానముతో నింపబడి కార్యాలు చేశారు అన్నమాట! ఇప్పుడు నీవుకూడా అలాంటి పనులుచేస్తున్నావు అంటే నీవుకూడా దయ్యాల జ్ఞానము పొందుకున్నావు!

అసలు మీరు పొందుకోకపోవడానికి కారణం మీరు దేవుని అడగనందువలననే అంటూ కుండబద్దలుకొట్టినట్లు చెబుతున్నారు! దేవున్ని అడగకుండా మీకు మీరుగా మీ బలంతో భూలోక జ్ఞానంతో పొందుకోవాలని ఆశిస్తున్నారు గనుకనే మీరు ఏమీ సంపాదించుకోలేక పోతున్నారు అంటున్నారు! అడుగుడి మీకివ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును అని వాగ్దానం చేసిన దేవుని మాటను మర్చిపోయారు! అడిగి పొందుకునే విధానం మర్చిపోయారు కనుకనే మీరు దేవునినుంది ఏమీ పొందుకోలేక పోతున్నారు అంటున్నారు!

 

ఇక తర్వాత వచనంలో మీరు అడుగుతున్నారు గాని మీ సుఖబోగాల కోసమే అడుగుతున్నారు, మీరు దురుద్దేశంతో దేవుణ్ణి అడుగుతారు అందుకే మీరేమీ పొందుకోలేక పోతున్నారు అంటున్నారు!

 

అవును కదా నేడు మన ప్రార్ధనలు కూడా అలాగే ఉన్నాయి కదా!

అస్తమాను ప్రభువా నాకు అది ఇచ్చేయ్! ఇది ఇచ్చేయ్! నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చేయ్! నా కోడలికి గర్భఫలం ఇచ్చేయ్! నాకు ఇల్లు ఇచ్చేయ్, కారు ఇచ్చేయ్, ఇంకా చాలా రకాలైన కోరికలు లిస్టు ఇస్తున్నావ్ (భర్త మార్కెట్ కి వెళ్ళినప్పుడు భార్య సరుకులు లిస్టు ఇచ్చినట్లు). లేకపోతే దేవుణ్ణి కాపలాదారులాగా ప్రభువా కాపలాకాయమని అడుగుతున్నావ్!  రోగం బాగుచెయ్యమని అడుగుతున్నావ్! గాని ప్రభువా నాకిచ్చిన ప్రతీ ఈవికోసం నీకు వందనాలు అని దేవునికి స్తుతి చెయ్యడం లేదు.

 

ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునికి చెప్పడం- తిరిగి జవాబుపొందడం. దేవుడు తిరిగి జవాబిచ్చేవరకు ప్రార్ధనలో కనిపెడుతున్నావా?!

దేవుడు నీతండ్రి- తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడు, తండ్రికివ్వవలసిన గౌరవం ఇవ్వు

దేవుడు నీరాజు- రాజుతో జాగ్రత్తగా మాట్లాడు

దేవుడు నీ స్నేహితుడు-  నీకు సంతోషం కలిగిన, భాదలున్నా అన్నీ ఆయనతో చెప్పేసుకో!!

దేవుడు నీకు తల్లిలాంటి వారు నీకు గురువు- ఆయననుండి నేర్చుకో!!

 

గమనించాలి- దేవుడు కొన్నిసార్లు మనము అడిగినవన్నీ ఇవ్వరు!!! దేవుడు అలాచేస్తే మనము మరింత స్వార్ధపరులుగా, కేవలం మెటీరియలిస్ట్ మారిపోతాము అని దేవునికి తెలుసు! నీకు దేవునికి మధ్య కేవలం ఇచ్చుపుచ్చుకునే పరిస్తితులే ఉంటాయి, గాని దేవుడు నీ సృష్టికర్త అని, నిన్ను విమోచించినవాడు అని, తిరిగి రారాజుగా రాబోతున్నాడు అని నీవు మర్చిపోతావు! మనుషులు స్వార్ధపూరితమైన సంతోషాలకోసం తరుచుగా అవి కావాలి ఇవి కావాలి అని దేవుణ్ణి అడుగుతుంటారు, అయితే వాటిని దేవుడు ఇవ్వరు! అప్పుడు మనుష్యులు దేవుణ్ణి తప్పు పడుతూ ఉంటారు! పిల్లలు అడిగిన వెంటనే కొంతమంది బుద్ధిలేని తల్లిదండ్రులు వెంటనే ఇచ్చేస్తుంటారు, అలా ఇవ్వకూడదు! అది వాడికి అవసరమా, లేదా, ఒకవేళ అది ఇస్తే వాడు భవిష్యత్ కి అది ఉపయోగ పడుతుందా లేదా అని ఆలోచించరు! అలా ఆలోచించకుండా ఇస్తే వాడు ఒకరోజు రోడ్డుమీద మాంసం ముద్దలా పడి ఉంటాడు, లేదా ఒక గూండాలా తయారవుతాడు! దేవుడు అలాంటివాడు కాదు, నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఎవరిద్వారా ఇవ్వాలో అన్నీ తెలుసు! ముఖ్యంగా ఏది ఇచ్చినా- ఒక పద్దతిలో ఇస్తారు! ముందు నీవు ప్రార్ధన అనే అప్లికేషన్ పెడితే దానిని పరిశీలించి అప్పుడు ఇస్తారు! నీవు అప్లికేషన్ పెట్టకుండా ఆశిస్తే అవి నీకు దొరకవు అని గ్రహించు! మనకు కావలసినవి దేవుణ్ణి అడుగుదాం!

కీర్తన 139:2324

23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

24. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

 

కీర్తనలు 66: 18

నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.

కాబట్టి ఆయనను అడిగి పొందుకుందాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -47 భాగము*

యాకోబు 4:46

4. వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

5. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

6. కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.

ఇక నాల్గవ వచనంలో ఆత్మపరితాపం తట్టుకోలేక వ్యభిచారులారా వ్యభిచారిణులారా అంటూ మొదలుపెట్టారు! ముందుగానే చెప్పారు యాకోబు గారు, నాలుకను మనమంతా మన స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాము అని! ఇక్కడ ఆత్మ పరితాపం తట్టుకోలేక ఆత్మావేశుడై అంటున్నారు తప్ప- హృదయపూర్వకంగా ఈమాట అనడం లేదు అని నా ఉద్దేశం!

వ్యభిచారుణులారా, ఈలోక స్నేహం దేవునితో వైరమని మీరేరుగరా??!!!! కాబట్టి ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు అంటున్నారు!

చూడండి ఎంత భయంకరమైన మాటో! మన తెలుగులో ఎందువలన కొన్ని తర్జుమాలు ఇలా చేశారో నాకు తెలియదు! మన బైబిల్ ని తర్జుమా చేసింది ప్రభువుని నమ్మని  బాపనోళ్ళు, వారు తమకుతామే తిట్టుకోవడం ఇష్టం లేక బహుశా ఇలా వ్రాసి ఉంటారు! నిజానికి వచనం ఇంగ్లీస్ లో గాని, మరేభాషలో గాని ఏమని రాయబడి ఉందంటే: వ్యభిచారులారా! వ్యభిచారిణులారా ! ఈలోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా?!! ఇక్కడ స్త్రీలను పురుషులను కలిసి వ్యభిచారులారా అంటూ సంభోదించడం జరిగింది, గాని బాపనోళ్ళు కేవలం స్త్రీలింగాన్నే వాడారు గాని పుల్లింగము వాడలేదు!...

యాకోబు 4: 4

వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

 

James 4: 4

Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.

 

సరే, ఇక్కడ ఆత్మ తాపం తట్టుకోలేక మాట అంటున్నారు అని చూసుకున్నాం! అయితే బహుశా నిజంగా అక్కడ వ్యభిచారం చేసే స్త్రీ పురుషులు ఉండి ఉండవచ్చు, అయితే మనకు పూర్తినిజం తెలియదు గాని నా ఉద్దేశం మాట అనగా వ్యభిచారులారా, వ్యభిచారిణులారా అనడం- బహుశా ఆత్మ సంబంధమైన వ్యభిచారంచేస్తున్న స్త్రీ పురుషుల కోసం చెప్పబడింది అన్నది నా ఉద్దేశం! కారణం మాట పలికిన వెంటనే ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు అంటున్నారు కాబట్టి బహుశా ఆత్మ సంబంధమైన వ్యభిచారం కోసమే మాట్లాడుచున్నారని నా ఉద్దేశం!

 

ఆత్మ సంబంధమైన వ్యభిచారమా? అది ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపడకు! దీనికోసం పాతనిబంధన గ్రంధంలో అనేకచోట్ల చెప్పబడింది!

మీరు జాగ్రత్తగా చదువుకోండి: యిర్మియా 2:2; :69; యేహెజ్కేలు 16:314; 23:2; హోషేయ 1:2

 

అన్నింటి దగ్గర ఆయన చెప్పేదేమిటంటే మీరు నన్ను విడిచి విగ్రహాలతో అన్యుల దేవతలతో వ్యభిచారం చేశారు, వాటికి పూజించడం వ్యభిచారమే దేవుని దృష్టిలో! అది ఆత్మీయ వ్యభిచారం!!!

అలాగే ఇప్పుడు  దేవుని బిడ్డలని పిలువబడుతున్న నీవు నేను దేవుడు చెప్పినవి చేయకుండా ఇంకా ఈలోక పద్దతులు ఈలోక ఆచారాలు ఈలోక వేషధారణలు ఈలోక వస్త్రధారణలు చేస్తుంటే చేసేది- ఆత్మీయ వ్యభిచారమే!  ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునితో వైరము అనగా దేవునికి శత్రువు అయిపోతున్నాడు! దేవునితో శత్రుత్వం పెట్టుకుని నీవు బ్రతుకగలవా??!!!

ఇక్కడ లోకము అంటే అన్యులతో సహవాసం చెయ్యకూడదు, బయట మార్కెట్ లో తిరుగకూడదు అని కానేకాదు! ఇక్కడ లోకము అనగా ఎవరైతే బ్రష్టమైన స్వభావం కలిగి పాపపూరితమైన ఆశలతో పాపపూరితమైన కామపూరితమైన పనులు చేస్తూ దేవునికి వ్యతిరేఖమైన పనులు చేసేవారు! పరిశుద్ధమైన జీవితం కాకుండా శరీరకార్యాలను రేకిస్తున్న విషయాలు, మనుష్యులు, కార్యాలూ లోకము!!!

దీనిని ఇంకా వివరించాలి అంటే మనము క్రింది రిఫరెన్సులు అర్ధం చేసుకోవాలి!

యోహాను 3: 19

తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

యోహాను 3: 20

దుష్కార్యము చేయు( లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు (మూలభాషలో- తన క్రియలు గద్దింప బడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు.

 

యోహాను 7: 7

లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.

 

15:1821

18. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

20. దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల

21. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.

 

గలతీ 1:

పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు

 

1యోహాను 2:1517

15. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.

16. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

 

1యోహాను 5: 18

మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టునియందున్నదనియు (దుష్టునియందు పడియున్నదనియు) ఎరుగుదుము.

1యోహాను 5: 19

మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి యున్నాడని యెరుగుదుము.

 

ఇప్పుడు ఈలోకం దేవునిపై తిరుగుబాటు చేసే స్తితిలో ఉంది! ఇది పాపాన్ని ప్రేమిస్తూ పాపిని రక్షించిన క్రీస్తుని ద్వేషిస్తుంది! కాబట్టి ఇటువంటి  లోకముతో స్నేహం చెయ్యడం అంటే పవిత్రుడైన నిజదేవుడైన యేసుక్రీస్తుప్రభులవారి శత్రువులతో చేయి కలుపడమే! 

దయచేసి పాపము చేస్తున్న విశ్వాసి! దైవసేవకుడా! నీకో ప్రశ్న! *యేసుక్రీస్తుప్రభులవారిని  సిలువవేసిన లోకంతో నీవు స్నేహం చేస్తూ మరలా యేసుక్రీస్తుప్రభులవారి రక్తాన్ని కల్ల చూస్తావా? మరలా ఆయన గాయాన్ని రేపుతావా??*

అవును నీవు మరలా ఈలోక పనులు చేస్తే నీవు ఆయన గాయాన్ని రేపినట్లే! నీవు ఆత్మీయ వ్యభిచారివి!

 

దేవుని బిడ్డవి అని చెప్పుకుంటూ ఇంకా లోకాచారాలు- అన్యాచారాలు చేస్తూ ఉంటే నీవు ఆత్మీయ వ్యభిచారివే! అనగా లోకస్తులు చేస్తున్నట్లు ఇంకా ముహూర్తాలు చూడటం, కట్నాలు తీసుకోవడం, ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, పెళ్ళిలలో గంధం రాసుకోవడం, పసుపు ముఖానికి పూసుకోవడం ఇలాంటివి చేస్తే నీవు ఆత్మీయ వ్యభిచారివే!!! ఎవడు ఏమనుకుంటే నాకనవసరం! ఖండించుము గద్ధించుము బుద్ధిచెప్పుము అన్న ఆజ్ఞ ప్రకారం ఉన్నది ఉన్నట్లు చెప్పడం నాకు అలవాటు! యేసుక్రీస్తుప్రశస్తమైన రక్తంలో కడుగబడిన నీకు ఇంకా అన్యుల ఆచారాలు పద్దతులు ఎందుకు? అవి చేస్తున్నావు అంటే నీవు ఆత్మీయ వ్యభిచారివే! శివ పార్వతుల వివాహానికి గుర్తు అయిన తాళి కడుతున్నావు, నీ ఒంటిమీద తాళి ఉంది అంటే నీవు విగ్రహారాధన చేస్తున్నావు, అంటే నీవు ఆత్మీయవ్యభిచారివే! నీకు అన్యులకు తేడా ఏమిటి? భారతీయ సంప్రదాయం అంటూ లోకముతో కలిసిపోయి వాక్యాన్ని కలిపి చెరుపుతున్నావు కదా, వారు త్రిమూర్తులకు పూజించి వేసే తాళి నీవు తండ్రికుమారాపరిశుద్ధాత్మ నామంలో వేస్తున్నాను అంటూ దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తున్న జరిపిస్తున్న బోధకులారా మీరు ఆత్మీయ వ్యభిచారులు కాదా? అలాంటి ఆచారాలు చేసేవారు నరకానికి పోతారు, చేయించేవారు నరకానికి పోతారు! అనగా తాళి కట్టేవారు నరకానికి పోతారు, దగ్గరుండి కట్టించేవారు నరకానికి పోతారు! వీరు ఆత్మీయ వ్యభిచారులు!!!

బంగారు నగలు దరించుకోవద్దు అని పాత నిబంధనలో రెండుసార్లు, క్రొత్త నిబంధనలో రెండు సార్లు చెబితే- ఇంకా లోకాశలు వదిలిపెట్టకుండా ఒంటినిండా నగలు, బంగారునగలు ధరించుకొని ఆత్మీయ వ్యభిచారం చేస్తూ,  మరీ ఘోరంగా దేవుని మందిరంలో నగలు వేసుకోకూడదు అంటే విగ్రహారాధనకు సంబంధించిన నగలు వేసుకుని మందిరానికి వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ అని పాటలు పాడుచున్న వీరు ఆత్మీయ వ్యభిచారులు కాదా! అన్యుల కంటే ఘోరంగా వస్త్రాలు వేసుకుంటూ టైట్ బట్టలు వేసుకుని నీ శరీర సౌష్టవం పూర్తిగా కనబడే విధంగా బట్టలు వేసుకుంటూ ముక్కుకి రంగు మూతికి రంగు పెదాలకు అన్నింటికీ రంగులు పూసుకుని యెజెబెలుకి కలిగిన వ్యభిచార ఆత్మను కలిగిన స్త్రీలారా యవ్వనులారా, యవ్వన పురుషులారా! జాగ్రత్త మీరు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు అని మర్చిపోవద్దు!

 మూర్కులైన తరమువారికి వేరై రక్షణ పొందుడి, అన్యుల ఆచారాలు మీరు చెయ్యవద్దు అంటే ఇంకా లోకం మీద ఆశపోకుండా దేవునిలో ఉంటూ లోకాచారాలు చేస్తున్న సగం సగం చచ్చిన క్రైస్తవులారా మీరు ఆత్మీయ వ్యభిచారులు కాదా!!!! ఎవడు లోకముతో స్నేహం చేస్తాడో వాడు క్రీస్తుకు దేవునికి శత్రువులు అని మర్చిపోవద్దు!

 

నీలో ఏమైనా ఆత్మీయ పౌరుషం ఉంటే ఈలోకాచారాలు లోక పద్దతులు అలవాట్లు మానేయ్! నీ నగలు ఆభరణాలు తీసిపారెయ్!

క్రీస్తు కొరకు రోషంగా జీవించు! దేవునితో స్నేహం మొదలుపెట్టు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -48 భాగము*

 

యాకోబు 4:46

4. వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

5. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

6. కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఈలోక స్నేహము దేవునితో వైరమే కాకుండా అలాంటివారు ఆత్మీయవ్యభిచారులు అంటూ ఇక 5,6 వచనాలలో కూడా దీనినే కొనసాగిస్తూ ఉన్నారు!

 

    ఆయన మనయందు నివశింపజేసిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మత్సరపడునంతగా ఆపేక్షించునా అని వ్రాయబడిన లేఖనం వ్యర్ధమని అంటుకుంటున్నారా??! అంటున్నారు! గమనించాలి- ఇక్కడున్న గ్రీకు పదాలయొక్క అర్ధము కొంచెం కష్టంగా అర్ధం చేసుకోవాలి. దీనిని కొంతమంది ఇలా అనువధించారు : మనలో దేవుడు నివశించేలా చేసిన పరిశుద్ధాత్మ తీవ్రమైన ఆశతో ఆపేక్షిస్తున్నాడు!

 

దీని అర్ధం: దేవుడు మానవులు తనకే పూర్తిగా అంకితమవ్వాలని, మానవులు  తనకే పూర్తిగా చెందాలని, మనయొక్క భక్తి ప్రేమ గౌరవము ఆరాధన అన్నీ తనకే పూర్తిగా చెందాలని కోరుకుంటున్నారు! తనకు చెందిన దాన్ని లోకంలో మరో దానికి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు! అందుకే నాకు చెందవలసిన మహిమను విగ్రహాలకు చెందనివ్వను అని చెబుతున్నారు...యెషయా 42:8

దేవుడు మన ఆత్మల కాపరి మాత్రమే కాకుండా దేవుడు మన ఆత్మల ప్రేమికుడు కూడా! విషయంలో దేవుడు తీవ్రమైన ఆసక్తి గలవాడు, రోషం గలవాడు!

నిర్గమ 20:5

ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు

నిర్గమకాండము 34: 14

ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.

 

ద్వితీ 4:24

ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.

 

యెహోషువ 24: 19

అందుకు యెహోషువయెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధ ములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు.

 

కాబట్టి మనలో ప్రతీ ఒక్కరితోను ఆయన అంటున్నారు: నా కుమారుడా- నా కుమార్తె దయచేసి నీ హృదయాన్ని నాకివ్వు!!!!

 

ఇక ఆరవ వచనంలో అయితే ఆయన ఎక్కువ కృపను ఇచ్చును, అందువలన దేవుడు ఆహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతుంది అంటున్నారు!

సామెతల గ్రంధం 3:34లో అంటున్నారు: దేవుడు హేళన చేసేవారిని వేలాకోసం చేస్తారు, అయితే వినయం గలవారికి ఎంతో కృపను చూపుతాడు!

దీనినే పేతురు గారు రాస్తున్నారు 1పేతురు 5:5 లో యవ్వనస్తులారా మీరు పెద్దలకు లోబడండి అంటూ రాస్తూ ఎందుకంటే దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపిస్తారు అంటున్నారు!

 

దీనిని కొంచెం ఆలోచించే ముందు మన తెలుగు రాష్ట్రాలలో ఒక దైవసేవకుని కుమార్తె (బహుశా పెళ్లి అయ్యిందో లేదో నాకు తెలియదు) ఒక తప్పుడు బోధ చేస్తుంది- ఆయన ఎక్కువ కృప చూపిస్తారు అనే మాటమీద! ఎక్కడ పాపము విస్తరించిందో అక్కడ ఎక్కువ కృప విస్తరిస్తుంది అని పౌలుగారు చెప్పారు కదా రోమా 5:21 వచనంలో! ఆమె ఏమని చెబుతుంది అంటే మీరు పాపం చేస్తున్నారా అయినా పర్వాలేదు, మీమీద ఇంకా ఎక్కువగా దేవుని కృప విస్తరిస్తుంది, కాబట్టి మీరు పాపం చేసినా పర్వాలేదు, మందిరానికి వచ్చెయ్యండి ప్రార్ధన చేసెయ్యండి మొత్తం పాపం పోతాది అన్నట్లు మాట్లాడుతుంది! నిజానికి తర్వాత వచనంలో పౌలుగారు ఏమంటున్నారు రోమా 6:1 లో అలాగని కృప విస్తరించాలని పాపంలో నిలిచియుందామా? కానేకాదు, మనము క్రీస్తుతో పాటుగా పాపములో చనిపోయిన మనము పాపంలో ఎలా జీవించగలము? పాపమును విడిచిపెట్టాలి అంటున్నారు! దీని అర్ధం ఏమిటంటే ఎక్కువ పాపము చేసిన వాడిని రక్షించడానికి దేవునికి ఎక్కువ కృప చూపవలసి వచ్చింది, కాబట్టి రక్షించబడిన మనము ఇకను పాపము చెయ్యకూడదు, నీతిగా బ్రతకాలి! ఇదీ పౌలుగారి ఉద్దేశం అయితే పనికిమాలిన అబద్దబోధకురాలు అంటుంది- మీరు పాపం చేసిన పర్వాలేదు- దేవుని మందిరానికి వస్తే చాలు పాపం పోతూ ఉంటుంది అని చెబుతుంది. దయచేసి సంఘమా! ఇలాంటి పనికిమాలిన అబద్ద బోధకులను పిలువవద్దు, పాపంలో పడిపోవద్దు!

 

సరే, ఇపుడు కృప కోసం చూసుకుందాం!

యోహాను 1:14, 16,17

14. వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని (లేక, జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.

17. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.

 

రోమా 5:10, 20,21

10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

20. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,

21. ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

 

కాబట్టి లోకాన్ని తిరస్కరించి మన స్వార్ధపూరితమైన ఆశలను జయించి దేవునికి మనం కట్టుబడి ఉండాలి అంటే మనకు దేవుని కృప కావాలి! ఇదీ భక్తుని ఉద్దేశ్యం!

 

ఇక గర్విష్టులను ఆయన త్రోసివేస్తాడు అనే దానికోసం మనకు అనేక రిఫరెన్సులు ఉన్నాయి

సామెతలు 6:1617; 16:5; 21:4;  యెషయా 2:1218; 13:11

సామెతలు 16: 5

గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.

దయచేసి అన్ని రిఫరెన్సులు చదవమని మనవిచేస్తున్నాను!

 

కనుక గర్వం మనలని ఏలనిస్తే దేవుడు మనకు విరోధి అయిపోతారు, అప్పుడు మనకు విరోధంగా దేవుడే పోరాటం చేస్తారు అని మర్చిపోవద్దు!

 

ఇక దీనులను, వినయం చూపేవారిని దేవుడు కృపచూపిస్తారు అనేది అనేకసార్లు బైబిల్లో వ్రాయబడింది.

యాకోబు :13;

కీర్తనలు 138: 6

యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.

 

సామెతలు 16:19;

యెషయా 57: 15

మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

 

 62:2;

మత్తయి 5: 3

ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

 

 18:4

కాబట్టి దేవునికి లోబడి ఉందాం, లోకాన్ని విసర్జిద్దాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -49 భాగము*

*రక్షించబడిన పాపి-గర్విష్టులు చేయవలసినవి-1*

యాకోబు 4:710

7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతూ వచనాలలో యాకోబు గారు ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా, ఒక తండ్రిగా, ఒక అనుభవజ్ఞునిగా రక్షించబడి- పాపంలో మళ్ళి- తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి పాపముల నుండి అపరాధాల నుండి విడుదల పొంది దేవునితో సఖ్యమవ్వాలంటే ఏమి చెయ్యాలో ఆత్మపూర్ఞత కలిగి రాస్తున్నారు!!!

 

ఇక ఏడవ వచనంలో అంటున్నారు:  కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును అంటున్నారు!

 

ఇప్పుడు నీవు దేవునికి వ్యతిరేఖంగా ఉన్నావు, మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, నీవు మరలా దేవుని కుమారునిగా మారాలి అంటే, దేవుని యెద్ద క్షమాపణ కావాలి అంటే కొన్ని కార్యాలు నీవు చెయ్యాలి! నీవు ఇంతవరకు గర్విష్టిగా, దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా, పైనుండి వచ్చే జ్ఞానాన్ని కాకుండా భూసంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్నావు గనుక ఇప్పుడు నీకు పైనుండి కలిగే జ్ఞానం కావాలి అంటే పరిశుద్ధాత్ముడు మరలా నీలో పని చెయ్యాలి అంటే నీవు కొన్ని పనులు చెయ్యాల్సి ఉంది! వాటినే వరుసగా యాకోబు భక్తుడు ఆత్మపూర్ణుడై రాస్తున్నారు!

 

మొదటిది: *దేవునికి లోబడి ఉండాలి!*

నీవు దేవునికి సంపూర్ణ విధేయత చూపించాలి. ఆయన సన్నిధిలో అణుకువ కలిగి ఉండాలి! దీనమనస్సు కలిగి ఆయన చెప్పినవి చేయడానికి సిద్ధపడాలి! ప్రభువా నేను ఇంతవరకు చేసిన వాటికోసరం నిజంగా నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పాలి! దానియేలు గారు, నెహేమ్యా గారు, వారు పాపములు చెయ్యకపోయినా వారి పితరులు చేసిన పాప ఫలములు వారు అనుభవిస్తున్నారు కనుక హృదయపూర్వకంగా దేవా మా పితరుల చేసిన పాపముల కోసం నిజంగా మేము పశ్చాత్తాప పడి వాటికోసం సిగ్గుపడుతున్నాము అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్ధన చేశారు!...దానియేలు 9:6--10; నెహెమ్యా 1:6,7. అలాంటి ప్రార్ధన నీకు అవసరం!

 

దేవుడు ఏమి చెప్పారో అదే చెయ్యాలి! దేవుడు కూర్చోమంటే కూర్చొనే విధంగా నిలబడమంటే నిలబడే విధంగా మారిపోవాలి! ఇది చెయ్యాలి అంటే మొదటగా నీ గర్వం వదిలెయ్యాలి! నీకు / నీలో గర్వముంటే ఇది చెయ్యలేవు! అణుకువ కలిగిన బుద్ధి నీలో ఉండదు! కాబట్టి గర్వాన్ని వదిలివేసి దేవునికి సంపూర్తిగా లోబడి ఉండాలి! అందుకే సామెతల గ్రంధంలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు! నీ మార్గముల అంతటియందు నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ మార్గములను సరాళం చేయును అంటున్నారు. మొదట ఆయన అధికారానికి ఒప్పుకో, రెండు ఆయనకులోబడి ఉండు! అప్పుడు ఆయన నీ మార్గములను సరాళం చేస్తారు! సామెతలు 3:5--7

 

రెండవది: *అపవాదిని ఎదిరించుడి*!

ఎందుకు అపవాదిని ఎదిరించాలి అంటే ఇంతవరకు నీవు సాతానుగాడి బానిసగా లోకానికి పాపానికి లోబడి జీవించావు కాబట్టి మరలా వాడు నిన్ను లోకానికి తీసుకుని పోవాలి అని ప్రయత్నం చేస్తాడు! నీలో నీ మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు భయాలను కోరికలను పుట్టిస్తాడు! ఇప్పుడు నీవు వాడిని ఎదిరించి యేసునామంలో వాడిని తరిమికొట్టాలి, లేకపోతే వాడు నిన్ను భక్తిలో ఉండనీయడు! దేవునికి లోబడి ఉండనీయడు అందుకే అపవాదిని ఎదిరించాలి! అప్పుడు వాడు నీ దగ్గరనుండి పారిపోతాడు! ఇది దేవుడు ప్రజలందరితో చేసిన మహత్తరమైన వాగ్దానం! నీవు ఎదిరించే వరకు, నీవు చీ..పో అని తగిలేసే వరకు వాడు నీ దగ్గర నుండి పోడు! నీవు పొమ్మన్నా చాలా సార్లు వాడు పోడు! వాడికి సిగ్గు చరం, చీము నెత్తురు లేవు! ఎన్ని అన్నా దులిపేసుకోవడం అలవాటు!

 

గమనించాలి మత్తయి సువార్త 4 అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారు సేవా పరిచర్య ప్రారంభించే ముందుగా సాతాను గాడు ఆయన దగ్గరికి వచ్చాడు! ఎన్నెన్నో అన్నాడు! అన్నింటికీ దేవుడు వాక్యముతో సమాధానం చెప్పారు! చివరికీ సాతాను నా వద్ద నుండి పో అని పొమ్మని ఆజ్ఞాపిస్తే వాడు తోకముడుచుకొని పోయాడు! మత్తయి 4: 10

యేసు వానితో సాతానా, పొమ్ము! ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.

 

దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తి బలము ఇచ్చారు! ఆత్మబలముతో వాడిని ఎదిరించి పొమ్మని చెబితే వాడు ఉండడు. పారిపోతాడు! యేసయ్యని చూసి నేర్చుకో!

 

గమనించాలి- ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మొదట నీవు దేవునికి సంపూర్తిగా లోబడాలి! అప్పుడు రెండవ కార్యము నీవు వాడ్ని ఎదిరిస్తే అప్పుడువాడు పారిపోతాడు!

 

దీనికోసం రెండుమాటలు చెప్పనీయండి! చాలామంది నేటిరోజులలో అపవాదిని ఎదిరించుడి వాడు మీ యెద్ద నుండి పారిపోతాడు అనే వాక్యమును ఆధారం చేసుకుని మనమీదికి వస్తున్న శోధనలకి కూడా దీనిని ఆపాదించాలి! మనమీదకు వస్తున్న శ్రమలను ఎదిరించాలి మనం! క్రైస్తవుల మీద జరిగే దాడులు ఖండిద్దాం! స్ట్రైకులు చేద్దాం! కోర్టులకు వెళ్దాం! అనే తప్పుడు బోధలు చేస్తూ తప్పుడు త్రోవ నడుస్తున్నారు! గమనించాలి- ఇది దేవుని బోధ కాదు! శోధనలను సహించాలి అన్నారు యేసయ్య! లోకములో మీకు శ్రమ కల్గును! వాటిని తట్టుకోండి అన్నారు యేసుప్రభులవారు! (యోహాను 16:33); అనేక శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యములో చేరాలి అంటూ అపోస్తలులు బోధ చేశారు! (అపో 14:22).

 అలాగే అనుభవించి ఇంతవరకు సేవను సువార్తను విస్తరింపజేశారు! ఇప్పుడు అతి తెలివైన వారు దానికి భిన్నముగా క్రీస్తుప్రేమ తత్వానికి భిన్నముగా రిఫరెన్సు ఉపయోగించి శ్రమలకు శోధనలకు వ్యతిరేఖంగా పోరాడుదాం అనే తప్పుడు బోధను చేస్తున్నారు! మాట అర్ధం: నీ మీదికి సైతాను గాడు డైరెక్ట్ గా ఎటాక్ చేస్తే అప్పుడు వాడిని ఎదిరించు! నీలో తప్పుడు కోరికలు తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు ఎదిరించు! నీమీద చెడుపులు చిల్లంగులు ఉపయోగించినప్పుడు ఆత్మబలముతో ఎదిరించు! తప్పుడు బోధలు వచ్చినప్పుడు ఎదిరించు! వాక్యానికి విరుద్ధమైన కార్యాలు నీవు చేస్తున్నావు, చేయకూడదని అనుకున్నా చేస్తున్నావు, ప్రార్ధన చెయ్యలేకపోతున్నావు. ప్రార్ధనలో కూర్చోలేక పోతున్నావు! అప్పుడు సాతానూ గాడిని ఎదురించు! అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు! అంతేకాని క్రీస్తునామం కోసం నీకు కలిగే శ్రమలను శోధనలని ఎదిరించమని బైబిల్ లో ఎక్కడా లేదు! బైబిల్ ను కలిపిచెరుపుతున్న కొంతమంది అబద్ద బోధకులు చేస్తున్న సాతాను కుట్ర ఇది! బైబిల్ వాక్యాలను తమకు అనుకూలంగా మలచుకుని కాలాన్ని గడుపుకుంటూ పొట్టపోసుకుంటున్నారు వాళ్ళు! సత్యాన్ని గమనించమని మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -50 భాగము*

*రక్షించబడిన పాపి-గర్విష్టులు      చేయవలసినవి-2*

యాకోబు 4:710

7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతూ వచనాలలో యాకోబు గారు ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా, ఒక తండ్రిగా, ఒక అనుభవజ్ఞునిగా రక్షించబడి-పాపంలో మళ్ళి- తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి పాపముల నుండి అపరాధాల నుండి విడుదల పొంది దేవునితో సఖ్యమవ్వాలంటే ఏమి చెయ్యాలో ఆత్మపూర్ణత కలిగి రాస్తున్నారు!!!

 

ఇక ఎనిమిదవ వచనంలో అంటున్నారు:  దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధ పరచుకొనుడి అంటున్నారు!

ఇంతవరకు గర్విష్టులు రక్షించబడి మరలా వెనుకబడిన విశ్వాసులైన పాపులు చేయాల్సిన కార్యాలు రెండు చూసుకున్నాము!

 

మొదటిది: దేవునికి లోబడి ఉండాలి,

రెండవది: అపవాదిని ఎదిరించాలి,

 

ఇక మూడవది: దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును! గమనించాలి, దేవునికి లోబడి, అపవాది కార్యాలను ఎదిరించాక చెయ్యాల్సిన కార్యము: దేవుని యొద్దకు రావాలి! ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో అప్పుడు ఆయన కూడా నీ దగ్గరకు వస్తారు! నీతో మాట్లాడుతారు, నీతో కలిసి సంభాషణ చేస్తారు, నిన్ను ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఒక చంటి పిల్లాడ్ని తండ్రి విధంగా ఎత్తుకుని ముద్దులాడి ఆటలాడుకుంటాడో అలాగే నీతో కూడా పరమతండ్రి అలాగే చేస్తారు! ఎప్పుడు? ముందు నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు!

 

కొంతమంది అతితెలివైన వాళ్ళు అంటారు, మనం దేవుని యొద్దకు వెళ్ళడం ఎందుకు? ఆయన అంతటా వ్యాపించియున్నాడు కదా, మనము వెదుకక పోయినా ఆయనే మనలను వెదికారు, మనం పిలువక పోయినా ఆయనే మనలను పిలిచారు కదా, మరలా ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గరకు రావాలి, మన దగ్గరే ఉన్నారు కదా!

అరే పిచ్చివాడా! నీవు ఇంతవరకు చెప్పినవి- నీవు రక్షించబడక మునుపు పాపములో మ్రగ్గుతుంటే జాలిచూపి, నిన్ను పిలిచి, నీ పాపాలు కడిగి, నిన్ను పవిత్రునిగా చేసి, నిన్ను తన కుమారునిగా చేసికొన్నారు! ఇప్పుడు నీవు ఆయన సొత్తు! ఆయన సొత్తైన నీవు పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధుడిగా ఉండక , పాపము- లోకము నీకు ఇంపుగా కనబడి మరలా కుక్క తనవాంతికి మరలినట్లు, కడుగబడిన పంది బురదలోకి పోయినట్లు (2పేతురు 2:22) మరలా పాపములోనికి- సాతాను గాడి కౌగిలిలోనికి పోయావు కాబట్టి, నీవు తెలిసిన మూర్ఖుడివి కాబట్టి ఇప్పుడు నీవు మరలా దేవుని యొద్దకు రావాలంటే నీవే ముందుగా దేవునికి లోబడి, సాతానుని ఎదిరించి, ఆయన దగ్గరకు పశ్చాత్తాప హృదయంతో, విరిగినలిగిన మనస్సుతో, కన్నీటితో ఆయన పాదాలు దగ్గరకు వస్తే- నీ కన్నీటితో ఆయన పాదాలను కడిగితే, అప్పుడు ఆయన నిన్ను- నీ నిజమైన పశ్చాత్తాపమును చూసి నిన్ను మరలా తన దగ్గరకు తీసుకుంటారు! ఇదీ ప్రాసెస్! నీవు దారి తప్పకపోతే ఆయన ఎల్లప్పుడూ నీతోనే కదా ఉంటారు! అదినీకు తెలుస్తూ ఉంటుంది. అనుక్షణం ఆయన సన్నిదిని అనుభవించేటప్పుడు ఆయన నీ దగ్గర ఉన్నట్లు నీకు తెలుస్తుంది కదా!

 

ఈరోజు దీనిని చదువుచున్న ప్రియ సహోదరుడా/ సహోదరీ/స్నేహితుడా/అమ్మా/అయ్యా!!! ఒకవేళ నీవు దేవుని నుండి దూరమై తప్పిపోతే- దేవుడు మరో తరుణం నీకిస్తున్నారు! ఆయన లోబడనోల్లని పిల్లలకోసం దినమంతా ఆయన చేతులు చాపి పిలుస్తున్నారు అని బైబిల్ చెబుతుంది..యెషయా 65:2. కాబటి మరలా ఆయన యొద్దకు రావడానికి నీకు బహుశా చివరి అవకాశం ఇస్తున్నారు! మరి అవకాశం ఉపయోగించుకుంటావా?

జెకర్యా 1: లో అంటున్నారు దేవుడు: మీరు నావైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను! ఇది దేవుని మహత్తర వాగ్దానం! మరి నీవు దేవునివైపు తిరుగుతావా? ఇంతవరకు లోకం చుట్టూ, ధనం చుట్టూ, వ్యభిచార సంబంధమైన విషయాలు, కామాతురకు సంబంధించిన విషయాల తట్టు, సినిమాలు సీరియల్లు, ఇంకా శరీర ఆశలు, శరీర కార్యాల తట్టు తిరిగిన నీవు నీచూపు దేవుని వైపు త్రిప్పి ఆయన తట్టుచూస్తావా? ఆయన దగ్గరకు వస్తావా?

యిర్మియా 4:1 లో దేవుడంటున్నారు: ఇశ్రాయేలు నీవు తిరిగి రావాలి అనుకుంటే నా దగ్గరకే రావాలి! మరి వస్తావా?

హోషేయ 14:1

ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.

 

మలాకీ :7

మీ పితరుల నాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

 

ఇప్పుడు మీరు మీ విధిని నెరవేరిస్తే దేవుడు తనవంతు కార్యము చేస్తారు!

నిర్గమ 34:67

6. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.

7. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.

 

యేహెజ్కేలు 18:౩౦32

30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.

31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

32. మరణము నొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరకు తిరిగి వస్తావో వెంటనే ఆయన నిన్ను తన కౌగిలిలోనికి తీసుకుంటారు! ఒకసారి తప్పిపోయి దొరికిన కుమారుని ఉపమానం జ్ఞాపకం చేసుకుంటే- వాడు నేను పరలోకమునకు, దేవునికి విరోధముగాను, నీకు విరోధముగాను పాపం చేశాను, నన్ను క్షమించమని బుద్ధి తెలిసికొని తండ్రిని క్షమాపణ వేడిన వెంటనే కుమారుని మెడమీద పడి ఏడ్చి ముద్దుపెట్టుకుని విందుచేసినట్లు చూడగలం! లూకా 15:20-23 రోజు తప్పిపోయిన నీవు తిరిగి ఆయన యొద్దకు వస్తావా?

నిన్ను చేర్చుకోడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు!

నిన్ను చేర్చుకోడానికి ఆయన ఇష్టపడుతున్నారు!

ఆమెన్!

*యాకోబు పత్రిక -51 భాగము*

*రక్షించబడిన పాపి-గర్విష్టులు చేయవలసినవి-3*

యాకోబు 4:710

7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతూ వచనాలలో యాకోబు గారు ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా, ఒక తండ్రిగా, ఒక అనుభవజ్ఞునిగా రక్షించబడి-పాపంలో మళ్ళి- తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి పాపముల నుండి అపరాధాల నుండి విడుదల పొంది దేవునితో సఖ్యమవ్వాలంటే ఏమి చెయ్యాలో ఆత్మపూర్ణత కలిగి రాస్తున్నారు!!!

 

ఇంతవరకు గర్విష్టులు రక్షించబడి మరలా వెనుకబడిన విశ్వాసులైన పాపులు చేయాల్సిన కార్యాలు మూడు చూసుకున్నాము!

మొదటిది: దేవునికి లోబడి ఉండాలి,

రెండవది: అపవాదిని ఎదిరించాలి,

మూడవది: దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును!

ఇక నాల్గవది: పాపులారా! మీ చేతులను శుభ్రము చేసుకోండి!

 

యెషయా 1:1617

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

 

గమనించండి- ఒక్క పాపి ఎంత ఘోరపాపియైనా ఎంతటి ఘోరమైన కార్యాలు చేసినా , వ్యక్తి నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే కార్చాల్సిన కన్నీరు ఆయన సన్నిధిలో కార్చితే దేవుడు వెంటనే కరిగిపోయి తన అక్కున చేర్చుకుంటారు! పాప క్షమాపణ, దీవెనలు ఇస్తారు! ఇది మనకు బైబిల్ గ్రంధం మొత్తం కనిపిస్తుంది!

 

యెషయా 55: 7

భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

 

2దినవృత్తాంతములు 7: 14

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

 

యేహెజ్కేలు 18:2728, 32

27. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.

28. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.

32. మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

లూకా 24:4547

47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

 

ఇంతకీ చేతులు ఎందుకు శుభ్రము చేసుకోవాలి అంటే ఇంతవరకు మీరు మీ చేతులతో చేసిన అపవిత్ర కార్యాలతో మీ చేతులు మురికిగా అసహ్యంగా కంపు కొడుతున్నాయి కాబట్టి మీ చేతులు శుభ్రం చేసుకోమంటున్నారు! మీ చేతులతో ఎత్తిన/ పట్టుకున్న మందు బాటిళ్ళు, సిగరెట్ లు, చెడు లేక మాదకద్రవ్యాలు, మీ చేతులతో అనేకులను అనేకసార్లు కొట్టారు కదా, మీ చేతులతో అనేకసార్లు అనేకమంది రక్తాన్ని చిందించారు కదా, అందుకే మీ చేతులు మలినమైపోయాయి, ఎన్నిసార్లు నీ చేతులు అనేకమందికి మందుబాటిళ్ళు, సిగరెట్లు, మాదకద్రవ్యాలు సప్లై చేసాయి, ఇచ్చాయి కదా; నీ భార్యను ఎన్నిసార్లు కొట్టావో కదా, నీ పిల్లలమీద నీ ఆఫీస్లో చిరాకును చూపించి ఎన్నిసార్లు ఘోరంగా హింసించావో కదా, అది నేడు ఒప్పుకుని నీ చేతులు కడుగుకోవాలి! పాపానికి , లోకానికి నీ చేతులు దూరమై పోవాలి! ఇప్పుడు నీ చేతులు దేవునికి ఇవ్వడానికి ముందు ఉండాలి! నీ చేతులతో దేవునికి చప్పట్లు కొట్టడానికి, మంచి వాయిద్యాలు నేర్చుకుని దేవుని సన్నిధిలో వాయించి ఆయనను మహిమ పరచడానికి వాడబడాలి! దేవునిచేతనే- ఒరే పాపులారా! పాపాత్ముల్లారా! మీ చేతులు కడుగుకొండిరా అని చెప్పించుకున్నారు కదా, ఇప్పుడు ఎప్పుడైతే ఆయన నీవు చేసే స్తుతి, నీవు దేవునికోసం నీ చేతులతో చేస్తున్న మంచి కార్యాలు చూసి నీవు చేతులతో చేసిన ఆయన గాయాలు కలిగిన ఆయన చేతులు ఇప్పుడు నిన్ను ముట్టుకుంటాయి! నా ప్రియమైన కుమారుడా అని ఆయన నోరు నిన్ను పిలుస్తుంది! ఇప్పుడు ఆయన పొందిన గాయాలు కలిగిన ఆయన చేతులు నీ రోగాల్ని స్వయంగా ముట్టి స్వస్తపరుస్తాయి! ఇదీ నీలో మార్పు కలిగితే దేవునిలో కలిగే మార్పు!

మరి నీవు ఇప్పుడే నీ చేతులతో చేస్తున్న పాపపు నీచపుకార్యాలు వదిలి దేవుని దగ్గరకు వస్తావా?

ఆయన నిన్ను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు!!!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -52 భాగము*

*రక్షించబడిన పాపి-గర్విష్టులు చేయవలసినవి-4*

 

యాకోబు 4:710

7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతూ వచనాలలో యాకోబు గారు ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా, ఒక తండ్రిగా, ఒక అనుభవజ్ఞునిగా రక్షించబడి-పాపంలో మళ్ళి- తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి పాపముల నుండి అపరాధాల నుండి విడుదల పొంది దేవునితో సఖ్యమవ్వాలంటే ఏమి చెయ్యాలో ఆత్మపూర్ణత కలిగి రాస్తున్నారు!!!

 

ఇంతవరకు గర్విష్టులు రక్షించబడి మరలా వెనుకబడిన విశ్వాసులైన పాపులు చేయాల్సిన కార్యాలు నాలుగు చూసుకున్నాము!

మొదటిది: దేవునికి లోబడి ఉండాలి,

రెండవది: అపవాదిని ఎదిరించాలి,

మూడవది: దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును!

నాల్గవది: పాపులారా! మీ చేతులను శుభ్రము చేసుకోండి!

 

ఇక ఐదవది: ద్విమనస్కులారా! మీ హృదయాలు పరిశుద్ధపరచుకొనుడి: ఇది ఐదవ కార్యం! దేవునికి లోబడి, సాతానుని ఎదిరించి, దేవుని యొద్దకు వచ్చి, నీ పాపపు చేతులను చేతలను ఆయన సన్నిధిలో కడుగుకొన్న తర్వాత నీవో మరో శుభ్రత -పరిశుభ్రత పని చెయ్యాలి అది నీ హృదయాన్ని శుద్దిచేసుకోవడమే కాకుండా దానిని పరిశుద్ధపరచుకోవాలి!

ఇక్కడ ద్విమనస్కులారా అంటున్నారు యాకోబు గారు, దీనినే కొన్ని ప్రతులలో చపలచిత్తులారా మీ హృదయాలు పవిత్రం చేసుకోండి అని వ్రాయబడింది! ద్విమనస్కులు అనగా రెండు తలంపులు కలిగిన వారు! చపలచిత్తులు అంటే ఒక నిర్ణయం తీసేసుకుంటారు ఆవేశంలో, ఉద్రేకంలో, గాని వెంటనే రెండు రోజులకు ఆవేశం, ఉద్రేకం, సోడాబుడ్డిలో గ్యాస్ తుస్సుమన్నట్లు తుస్సుమని మరలా పాత రోత పాపానికి లోబడిపోతారు! అందుకే ముందుగా మీ హృదయాన్ని పవిత్రం చేసుకోమంటున్నారు! ఎందుకు హృదయాన్నే శుద్ధి చేసుకోమంటున్నారు అంటే హృదయం ఎంతో మోసకరమైనది, అది  భయంకరమైన వ్యాధి కలది! అది పాపరోగం గలది! దానిని గ్రహించేవాడు ఎవడు అని బైబిల్ సెలవిస్తుంది యిర్మియా 17:9 లో..

మానవునిలో రేగే ప్రతీ కోరిక, ప్రతీ దుష్టతలంపు, ప్రతీ పాపము మొదట హృదయంలో పుట్టి, తర్వాత కార్య రూపం దాల్చుతాయి! కాబట్టి హృదయం ఎంతో ఘోరమైన పాపవ్యాది గలది అందుకే దానిని కడుగుకోవడమే కాకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోమంటున్నారు! ఒక్కసారి మానవుణ్ణి అపవిత్రపరిచేవి ఏమిటి అనేదానికోసం యేసుక్రీస్తుప్రభులవారు శిష్యులతో ఏమన్నారో చూద్దాం....

Mark(మార్కు సువార్త) 7:20,21,22,23

 

20. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.

21. లోపలినుండి, అనగా *మనుష్యుల హృదయములోనుండి* దురాలోచనలును జారత్వములును దొంగతనములును

22. నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును (మూలభాషలో- చెడ్డ కండ్లును) దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

23. చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.

కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకుందాం!

 

యెహేజ్కేలు 18: 31

మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రా యేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

ఇలాంటి క్రొత్త హృదయం కొత్త మనస్సు కేవలం పశ్చాత్తాప పడి దేవుని యొద్దకు రావడం వలన మాత్రమే కలుగుతాయి!

యెహేజ్కేలు 36: 26

నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

 

కీర్తనలు 51: 10

దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము.

 

ఇక్కడ శుద్ధ హృదయం అంటే కల్తీలేని ఉద్దేశాలు గల హృదయం, పవిత్రమైన కోరికలతో నిండిన హృదయం! పాపాన్ని అసహ్యించుకొనే హృదయం! ఎల్లప్పుడూ దేవుని పరిశుద్దాత్మతో నింపబడి, పరిశుద్దాత్మ అదుపులో ఉండే హృదయం!

కీర్తన 24:4

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.

 

కీర్తనలు 73: 1

ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.

 

మత్తయి 5:8

హృదయశుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

 

అపో 15:9

వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని భేదమైనను కనుపరచలేదు

 

అయితే మనుష్యులకు ఇలాంటి హృదయం కావాలి అంటే మనిషి దేవుని అదుపులో ఉండాలి! పరిశుద్ధాత్ముడు మరియు వాక్యము వ్యక్తిని ఏలాలి!!

ఎఫెసీ 2:10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

ఎఫెసీయులకు 4: 24

నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును (మూలభాషలో- నవీన పురుషుడు) ధరించుకొనవలెను.

 

యిర్మియా 24:7

వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను.

 

యేహెజ్కేలు 11:19

వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.

 

యెహేజ్కేలు 36: 26

నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

 

మనిషి ఎంతప్రయత్నించినా ఇలాంటి హృదయాన్ని పొందుకోలేడు! అయితే నీవు పరిశుద్దాత్మునితో కలిసి నడిస్తే- వాక్యము హృదయం నిండా నిండి ఉంటే ఇది సాధ్యమే!!

2కొరింథీ 7:1

ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

 

1పేతురు 1: 22

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

 

అయితే ఇప్పుడు పొందుకున్న శుద్ధ హృదయం నిలిచి ఉండాలంటే స్థిరమైన గట్టిమనస్సు, పాపాన్ని వ్యతిరేఖించే అచంచలమైన గుణము నీకుండాలి!

1కోరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.

 

1పేతురు 5:910

9. లోకమందున్న మీ సహోదరులయందు విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

 

కాబట్టి అటువంటి ద్రఢమైన పట్టుదల గలిగిన నిర్ణయం తీసుకుని మన హృదయాలను శుభ్రపరచుకుని ఎల్లప్పుడూ దానిని పరిశుద్ధంగా ఉంచుకుందాం! ఎప్పుడైతే మన హృదయాలు పరిశుద్ధంగా ఉంటాయో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తారు!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*యాకోబు పత్రిక -53 భాగము*

*రక్షించబడిన పాపి- గర్విష్టులు చేయవలసినవి-5*

 

యాకోబు 4:710

7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతూ వచనాలలో యాకోబు గారు ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా, ఒక తండ్రిగా, ఒక అనుభవజ్ఞునిగా రక్షించబడి-పాపంలో మళ్ళి- తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి పాపముల నుండి అపరాధాల నుండి విడుదల పొంది దేవునితో సఖ్యమవ్వాలంటే ఏమి చెయ్యాలో ఆత్మపూర్ణత కలిగి రాస్తున్నారు!!!

 

ఇంతవరకు గర్విష్టులు రక్షించబడి మరలా వెనుకబడిన విశ్వాసులనైన పాపులు చేయాల్సిన కార్యాలు ఐదు చూసుకున్నాము!

మొదటిది: దేవునికి లోబడి ఉండాలి,

రెండవది: అపవాదిని ఎదిరించాలి,

మూడవది: దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును!

నాల్గవది: పాపులారా! మీ చేతులను శుభ్రము చేసుకోండి!

ఐదవది: ద్విమనస్కులారా! మీ హృదయాలు పరిశుద్ధపరచుకొనుడి.

 

ఇక ఆరవది: వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

చూడండి ఆరవదిగా ఏమి చెయ్యాలో చెబుతున్నారు. వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి,  మన నవ్వు దుఃఖముగా మారిపోవాలి, ఆనందము చింతగా మార్చుకోండి అంటున్నారు! దుఃఖపడటం, వ్యాకుల పడటం, ఏడవటం, ఇవన్నీ ఒకే కోణానికి వస్తాయి. ఏడ్పు హృదయంలో గల బాధను బట్టి వస్తుంది. పిల్లలకు వారి వీపు మీద దెబ్బలు పడితే ఏడ్పు వస్తుంది, లేక వారు అడిగినది ఇవ్వకపోతే వస్తుంది. పెద్దలకు తమ హృదయం గాయపడినంత కార్యం జరిగితే ఏడ్పు వస్తుంది. ఏడ్పు వ్యాకులముగా ఎప్పుడు మారుతుంది అంటే నీవు దేనికోసరమైతే ఏడుస్తున్నావో అది మాటిమాటికి నిన్ను బాధిస్తుంది. అస్తమాను గుర్తుకు వచ్చి నిన్ను దుఃఖానికి గురుచేస్తుంది! ఉదాహరణకు ఒక యవ్వనురాలు తన భర్తను కోల్పోతే కలిగేది భయంకరమైన దుఃఖము మరియు వ్యాకులము! పిల్లలుగల స్త్రీ తన భర్తను పోగొట్టుకుంటే కలిగేది వ్యాకులము, తన పిల్లలను ఎలా పెంచాలి, ఎలా పెళ్ళిళ్ళు చెయ్యాలి, అసలు ఒంటరితనమును ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ దుఃఖానికి ఏడ్పుకి, వ్యాకులమునకు దారితీస్తాయి!

 

ఇప్పుడు వీరిని అనగా గర్విష్టులను, రక్షించబడి మరలా పాపానికి తిరిగిన విశ్వాసి- తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మీరు దుఃఖపడండి ఏడవండి, వ్యాకుల పడండి అంటున్నారు! ఇప్పుడు చాలామంది అంటున్నారు- ఏడ్చి ప్రార్ధన చెయ్యమంటున్నారు- నాకు ఏడ్పు అనేది రాదండి ప్రార్ధనలో అంటారు! ఇలాంటివారికి ప్రార్ధనలో దుఃఖము ఎప్పుడు వస్తాది అంటే ఇక లివర్ పాడైపోయింది, నీకు ఆపరేషన్ చెయ్యాలి, నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నాను, లేక నీ పొలాన్ని మరొకడు ఆక్రమించుకున్నాడు లాంటి సందర్భము కలిగితే అమ్మబాబోయ్ మోకాళ్ళు వేస్తె కళ్ళంట నీరు వచ్చేస్తుంది. మరి మామూలు సమయాల్లో ఎందుకు రావడం లేదు?

 

సరే, ఇక వీరు దేనికోసం ఏడవాలి?

దేనికోసం ఏడ్చి విలపించాలి అంటే మీరు ఇంతవరకు చేసిన పాపాలకోసం ఏడ్చి విలపించాలి!!  ఇంతవరకు ఎంతటి ఘోరమైన పాపములు చేసి దోషములు కట్టుకున్నారో గుర్తుకు వచ్చి ఏడవాలి!

 (మరి నీతిగా బ్రతుకుచున్న విశ్వాసులు ఎందుకు ఏడవాలి? నీ ఇరుగుపొరుగు వారు ఇంకా పాపములో మ్రగ్గిపోతున్నారు, ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నారు, నీ పిల్లలు రక్షణ పొందలేదు, నీ భర్త మారుమనస్సు పొందలేదని, నీ కుటుంభం వారు అనగా నీ తల్లి ఇంటివారు గాని నీ భర్త కుటుంబపు వారు రక్షణ పొందలేదని ఏడవాలి! నీకు పరమ వరములు ఫలములు కావాలని ఏడవాలి!!)

 

మన సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోమంటున్నారు!

దేవుడు పాపమును చాలా తేలికగా తీసుకొనే వారి దగ్గరకు రారు, వారిని దీవించరు! ఎవరైతే నిజమైన పశ్చాతాపం కలిగి హృదయపూర్వకంగా ఏడ్చి మొర్రపెడతారో వారి మానవులు విని వారిని చేర్చుకుని ఆశీర్వదిస్తారు! అలాంటి వారికోసం కొండమీద ప్రసంగంలో అంటున్నారు: దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, మత్తయి 5:3

 

లూకా 6: 21

ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.

 

అయితే మనకు రెండు రకాలైన దుఃఖాలు కలుగుతాయి అంటూ పౌలుగారు రాస్తున్నారు: 2కొరింథీ 7:810 లో . ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండు లోక సంబంధమైన దుఃఖము!

 

8. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖపెట్టెనని తెలిసికొనియున్నాను.

9. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.

10. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.

 

దైవచిత్తానుసారమైన దుఃఖము- ఒకవ్యక్తి రక్షించబడేటప్పుడు తనలో తానూ చేసిన పాపమునకు పశ్చాత్తాపపడటం వలన కలిగే దుఃఖము! ఇంకా తోటివారు, పొరుగువారు రక్షణకై, నీ ఇంటివారు రక్షణకై చేసే కన్నీటి ప్రార్ధన, ఇంకా నీసంఘము కోసం, వారి ఆరోగ్యం కోసం, పరిచర్య కోసం చేసే కన్నీటి ప్రార్ధన- దైవ చిత్తానుసారమైన దుఃఖము! ఇది రక్షణార్ధమైన మారుమనస్సు కలుగజేస్తుంది. మరణాన్ని ఏమాత్రం పుట్టించదు.

 

లోకసంబంధమైన దుఃఖము: భౌతికంగా కలిగే దుఃఖాలు.- ఇంటి యజమాని మరణం వలన, తనకునచ్చిన వారి మరణం, తన భర్త కొట్టడం వలన కలిగే దుఃఖాలు ఇవన్నీ లోక సంబంధమైనవి. ఎక్కువగా ఏడిస్తే ఇది మరణాన్ని తీసుకుని వస్తుంది! 

 

సరే, ఇక్కడ పాపముల కోసం ఏడ్చి విలపించి రోదించమంటున్నారు! పశ్చాత్తాప పడమంటున్నారు! సరే, ఇప్పుడు మరో ప్రశ్న!! ఇలా ఎంతవరకు ఏడవాలి? ఎంతవరకు దుఃఖము సలపాలి??

 

దేవుడు మన ప్రార్ధనలు విని మనలను కరుణించేవరకు! నిన్ను క్షమించే వరకు! నీతో మాట్లాడేవరకు!

Psalms(కీర్తనల గ్రంథము) 123:1,2

 

1. ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.

2. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

 

యిర్మియా 29:13 లో మనకు ఒక వాగ్దానం ఉంది. మీరు నన్ను వెదుకుతారు, మీరు హృదయపూర్వకంగా నన్ను వెదకితే నన్ను కనుగొంటారు! ఆయనను హృదయపూర్వకంగా వెదకాలి! పశ్చాత్తాపముతో వెదకాలి!

పదో వచనంలో ప్రభువు సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నారు! అయ్యా నేను పాపిని నా పాపముల కోసం నేను విలపిస్తున్నాను! పశ్చాతాపపడుతున్నాను. నన్ను క్షమించమని అడిగితే అప్పుడు నిన్ను క్షమిస్తారు!

 

యిర్మియా గారు అంటున్నారు: రోదనం చేసే స్త్రీలను కనుగొనండి వారిని పిలువనన్పించుడి ....

Jeremiah(యిర్మీయా) 9:1,17,18,20,21

1. నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

20. స్త్రీలారా, యెహోవా మాటవినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

 

యోవేలు గ్రంధములో అంటున్నారు: ఇప్పుడైనను మీరు ఉపవాస ముండి కన్నీరు విడిచి నా దగ్గరకు రండి అంటున్నారు....

Joel(యోవేలు) 2:12,13,14,15,16,17,18

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత. కృపగలవాడునై యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

14. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

15. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

16. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములో నుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

17. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.

18. అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను.

 

మరి అటువంటి హృదయముతో దేవుని సన్నిధికి వస్తావా?

నిన్ను చేర్చుకోడానికి ఆయన ఇష్టపడుతున్నారు! ఆయన సిద్దంగా ఉన్నారు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -54 భాగము*

*రక్షించబడిన పాపి-గర్విష్టులు చేయవలసినవి-6*

 

యాకోబు 4:710

7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతూ వచనాలలో యాకోబు గారు ఒక పెద్దగా, ఒక అధ్యక్షునిగా, ఒక తండ్రిగా, ఒక అనుభవజ్ఞునిగా రక్షించబడి-పాపంలో మళ్ళి- తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి పాపముల నుండి అపరాధాల నుండి విడుదల పొంది దేవునితో సఖ్యమవ్వాలంటే ఏమి చెయ్యాలో ఆత్మపూర్ణత కలిగి రాస్తున్నారు!!!

ఇంతవరకు గర్విష్టులు రక్షించబడి మరలా వెనుకబడిన విశ్వాసులనిన పాపులు చేయాల్సిన కార్యాలు ఆరు చూసుకున్నాము!

మొదటిది: దేవునికి లోబడి ఉండాలి,

రెండవది: అపవాదిని ఎదిరించాలి,

మూడవది: దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును!

నాల్గవది: పాపులారా! మీ చేతులను శుభ్రము చేసుకోండి!

ఐదవది: ద్విమనస్కులారా! మీ హృదయాలు పరిశుద్ధపరచుకొనుడి.

ఆరవది: వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకోనుడి.

చివరిది :  ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొండి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును!

 

గమనించండి: మొదటిది చివరిది రెండు ఒకలాంటివే! మొదట అన్నారు దేవునికి లోబడి ఉండండి అన్నారు! ఇక చివరిది ఏడవది కూడా అలాంటిదే! ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు అంటున్నారు! ఇక్కడ హెచ్చింపు కోసం ఎందుకు ఎత్తారు అంటే మీదన వచనాలలో మీరు ఆశీర్వాదం కోసం, ఐశ్వర్యం కోసం తీవ్రమైన అసూయ కలిగి అవసరమైతే హత్యలు కూడా చేస్తున్నారు కాని మీరు ఏమీ పొందుకోలేక పోతున్నారు అని రాశారు కదా! ఇప్పుడు తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి మీదన చెప్పిన ఏడు పనులు చేస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు అంటున్నారు భక్తుడు! దేనికోసం ఎదురుచూశారో అది- ఇప్పుడు దేవుని అడిగినందువలన ఆయన అన్నీ ఇవ్వడం మొదలుపెడతారు!

 

సరే, ఇప్పుడు ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోమంటున్నారు!

బైబిల్ చెబుతుంది తనను తానూ తగ్గించుకొనువాడు హెచ్చించబడును! హెచ్చించు కొనువారు తగ్గించబడును! ..

మత్తయి 23:12

ఇలా చెబుతూ యేసుక్రీస్తుప్రభులవారు ఒక ఉపమానం చెప్పారు: ఒక సుంకరి మరియు పరిసయ్యుడు కోసం! ...

.Luke(లూకా సువార్త) 18:10,11,12,13,14

 

10. ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

11. పరిసయ్యుడు నిలువబడి  దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

12. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.

13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు  దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.

14. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

 

చూశారా పరిసయ్యుడు తనకుతాను సొంతడబ్బా కొట్టుకున్నాడు- ఇంకా నేను సుంకరివలె ఉండనందుకు నీకు స్తోత్రం అంటూ సుంకరికంటే హెచ్చించుకున్నాడు, సుంకరి అంటే చిన్నచూపు చూశాడు! తోటివారిని ప్రేమించలేకపోయాడు! అందుకే పాపిగానే మిగిలిపోయాడు! అయితే సుంకరి అయ్యో దేవుడా నేను పాపిని బాబు!, ఆకాశం వైపు నా కన్నులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుడను కాదు! నన్ను క్షమించవా అంటూ కన్నీటితో గుండెలు బాదుకుని విలపించాడు! క్షమాపణ పొందుకుని పాపమునుండి విడుదల పొందుకుని సమాధాన మనస్సుతో నెమ్మదికలిగి ఇంటికి పోయాడు సుంకరి! ఇది తగ్గించుకొనే విధానం!

 

మరొకడు నా చేతిలోనుండి మిమ్మును విడిపించే దేవుడు ఎవడైనా ఉన్నాడా అని విర్రవీగాడు, భగవత్ సాక్షాత్కారం తరువాత మహోన్నతుడైన దేవుని సేవకులారా దయచేసి బయటకు రండి అన్నాడు రాజు నెబుకద్నేజర్! దానియేలు 3 అధ్యాయం! తర్వాత అధ్యాయంలో తాను విర్రవీగి గర్వించినందువలన నేను గాడిదలా గడ్డిమేశాను, నేను తగ్గించుకొన్న తర్వాత నాకు మానవ మనస్సు మరలా నాకు వచ్చింది అంటూ సాక్ష్యం చెబుతున్నాడు ఇదే రాజు! దానియేలు 4 అధ్యాయం!

కాబట్టి ప్రభువు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి!

 

లూకా 1: 52

సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

 

1సమూయేలు 2:78

7. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప జేయుటకును వారిని మంటిలో నుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు.

 

ఎఫెసీ 4:31

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

 

కొలస్సీ :8

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

 

కీర్తనలు 18: 25

దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

కీర్తనలు 18: 26

సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

కీర్తనలు 18: 27

శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

 

సామెతలు 3: 34

అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.

 

యెషయా 57: 15

మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

 

యాకోబు 4:6

కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

 

మరి ఇప్పుడు ఆయన నీకు కృప చూపడానికి సిద్దంగా ఉన్నారు- మరి నీ గర్వాన్ని అహాన్ని వదిలి, ఆయన సన్నిధిని తగ్గించుకొని ఆయన పాదాలు పట్టడానికి సిద్దంగా ఉన్నావా? అయితే ఇప్పుడే ఆయన నిన్ను తన కౌగిలి లోనికి తీసుకోడానికి ఇష్టపడుతున్నారు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -55 భాగము*

యాకోబు 4:1112

11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి (తీర్పరివైతివి).

12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు(తీర్పరి). ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. గర్వము విడిచి దేవుణ్ణి ఆశ్రయించాలి అని ఏడు పనులు చెయ్యాలి అని ఇంతవరకు ధ్యానం చేసుకున్నాము!

ఇక 11,12 వచనాలలో మరో ప్రాముఖ్యమైన విషయం కోసం రాస్తున్నారు! తన సహోదరుడు చేసిన పనులకోసం చాడీలు / కామెంట్లు/ జడ్జిమెంట్లు ఇస్తారు కదా- వారికోసం చెబుతున్నారు! గమనించాలి- ఇంతవరకు ఎంతో కోపంతో ఆత్మతాపంతో రేగిపోయి మాట్లాడిన యాకోబుగారు నా సహోదరులారా అని చెబుతున్న- తన పిల్లలు తప్పులు చేస్తే ఒక తండ్రి ఎలా సరిదిద్దుతారో అలాంటి జాలితో తాలిమితో ఓర్పుతో దయచేసి మీరు అలా చెయ్యకూడదు ఇది తప్పురా నా పిల్లలారా అని చెబుతున్నట్లు ఉంటాయి రెండు వచనాలు!

 

   పదకొండులో అంటున్నారు: సహోదరులారా! ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి! తన సహోదరునికి వ్యతిరేఖంగా మాటలాడి తన సహోదరునికి తీర్పుతీర్చువాడు ధర్మశాస్త్రానికి  తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చితే ధర్మశాస్త్రాన్ని పాటించే వాడివి కాదు గాని న్యాయాన్ని విధించేవాడవు అయిపోయావు!!!

 

జాగ్రత్తగా గమనిస్తే ఎవడైనా తన సోదరునికి వ్యతిరేఖంగా మాట్లాడితే వాడు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చేవాడు అయిపోతాడు అని పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతున్నారు యాకోబు గారు! ఇలా అయితే మనము చాలాసార్లు తప్పులు చేశాము కదా! చాలామంది ఆడవారు మధ్యాహ్నం ఒకదగ్గర కూర్చుని అది ఇలాగ, ఇది ఇలాగ, స్త్రీకి వాడితో లింకు ఉంది, వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అంటూ మాటామంతి వేసుకుంటారు! వీటిలో నూటికి ఎనబైశాతం తమకోసం మాట్లాడుకుంది బహుశా 20% ఉంటాదేమో! కాని ఇతరుల కోసం మాట్లాడుకుంది 80% ఉంటాది! మరి అలాంటప్పుడు అమ్మలక్కలు ప్రతీరోజు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చి జడ్జీలు అయిపోతున్నారు అన్నమాట! ఇది మంచిది కాదు ఇలా చెయ్యకూడదు, కాబట్టి మీరు ఒకరికి విరోధముగా మాట్లాడుకోవద్దు అంటున్నారు! ఇక్కడ ఒకమాట జాగ్రత్తగా గమనించాలి! మరొకరి కోసం మాట్లాడుకోవద్దు అని చెప్పడం లేదు! మానవుడు సంఘజీవి! మామూలుగా ఇతరులకోసం కూడా మాట్లాడుకోవడం మానవనైజం! అయితే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే: నీ సోదరునికి లేక సోదరికి లేక పొరుగువారికి వ్యతిరేఖంగా మాట్లాడుకోవద్దు! అది తప్పు, నీవు ధర్మశాస్త్రానికంటే ఎక్కువగా నిన్ను హెచ్చించుకుని ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు అంటున్నారు! ఇంకా పన్నెండో వచనంలో అంటున్నారు: నిజానికి ధర్మశాస్త్రమును నియమించి న్యాయాన్ని విధించువాడు ఒక్కడే, ఆయనే రక్షించుటకు శిక్షుంచుటకు నశింపజేయుటకు సమర్ధుడు! అసలు పరులకు తీర్పు తీర్చడానికి నీవెవడవు అని సూటిగా అడుగుతున్నారు!!

 

ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే- ఇలా వీడిమీద వాడిమీద చాడీలు చెప్పే డ్యూటీ ఎవరిదీ? యోబు 1,2 అధ్యాయాల ప్రకారం సాతాను గాడిది! ఒరేయ్ సాతానుగా సాతానుగా- నీవు ఎక్కడనుండి వచ్చావురా అని దేవుడు అడిగితే నేను భూమిమీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వస్తున్నాను అన్నాడు వాడు! విశ్వాసులు చేసిన పనులన్నీ దేవునికి చాడీలు చెప్పే డ్యూటీ వాడిది! బాగున్న వారిని పాడుచేసే డ్యూటీ వాడిది! మరి ఇప్పుడు విశ్వాసి- అనగా దేవుని బిడ్డ- సాతాను గాడి పని చెయ్యడమేమిటి బుద్ధి శుద్ధి లేకుండా!!! విశ్వాసి పవిత్రుడు పరిశుద్ధుడు కడుగబడిన వాడు! దేవుని వాడు- మరి ఇప్పుడు విశ్వాసి దేవునికోసం పనిచెయ్యాలి గాని సాతానుగాడి కోసం పనిచెయ్యడం ఏమిటండి?!!!  ఇదీ యాకోబు గారి ప్రశ్న! మనలో ఎవరైనా మరొకరికి వ్యతిరేఖంగా మాట్లాడితే అతడు లేక ఆమె వ్యక్తికీ తీర్పు తీర్చేస్తున్నారు! అసలు నిన్నువలె లేక తననువలే ఇతరులను ప్రేమించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంటే (యాకోబు 2:8), ప్రేమించడం మానేసి ఇతరులకు తీర్పు తీర్చే స్టేజికి నీవు వచ్చేశావు! అంటే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు సరికదా- ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు! ధర్మశాస్త్రం కంటే నిన్ను నీవు హెచ్చుంచుకుని ధర్మశాస్త్రం కంటే పైవాడుగా పైదానిగా నిన్నునీవు చేసేసుకుని- తీర్పు తీర్చేస్తున్నావు, అంటే ధర్మశాస్త్రానికి నీ దగ్గర ఏమీ ప్రాధాన్యత లేదు అన్నమాట! జడ్జీలకే పెద్ద జడ్జివి అన్నమాట నీవు!

నిజానికి తీర్పు తీర్చేవాడు దేవుడు! ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, నియమించింది, శాసించింది దేవుడు నిర్గమ 20:1 ప్రకారం! మాటలు దేవుడే పలికాడు! అనగా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమునకే నీవు తీర్పు తీర్చేస్తున్నావు అన్నమాట!

 

యెషయా 33:23 లో అంటున్నారు: యెహోవాయే మనకు న్యాయమూర్తి, యెహోవాయే శాసనకర్త, ఆయనే మనకు రాజు! ఆయనే మనలను రక్షించువాడు! మరి ఇప్పుడు దేవుని పనిని నీ చేతులలో తీసుకుంటున్నావు! ఇది నీకు మంచిదా? దేవుని కంటే నీవు గొప్పోడివా గొప్పదానివా?!!!

దేవుడు రక్షించడానికి నాశనం చెయ్యడానికి సమర్ధుడు! మరి నీవు అలా రక్షించే కెపాసిటీ నీకేమైనా ఉందా? నాశనం చేసే కెపాసిటీ నీకేమైనా ఉందా? అలాంటప్పుడు కామెంట్లు జడ్జిమెంట్లు ఎందుకు?

 

మత్తయి 10: 28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

యెషయా 43: 11

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

యెషయా 43: 12

ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

 

యోబు 5: 18

ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ పరచును.

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు... మత్తయి 7:12

1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

 

పౌలుగారు కూడా అంటున్నారు:

రోమా 14:4, 1013

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.

11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు

12. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.

 

అందుకే యాకోబు గారు 5:9 లో అంటున్నారు మీకు శిక్షావిధి రాకుండా ఉండాలంటే ఒకనిమీద ఒకడు సణుగుకోవద్దు! కారణం న్యాయమూర్తి తలుపుదగ్గరే నిలుచిని ఉన్నారు! జాగ్రత్త!!!

ద్వితీ 32:36 ఆయన తన ప్రజలకు న్యాయం తీరుస్తారు అంటున్నారు

కీర్తన 7:11

న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

 

కీర్తనలు 50: 6

దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)

 

కీర్తనలు 98: 9

భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

 

హెబ్రీ 12:23

పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,

 

గమనించాలి ఒకరోజు నీవు నేనుక్రీస్తు న్యాయపీఠం వద్ద నిలబడాలి! ఆరోజు నీవు నిందారహితునిగా కనబడాలి అంటే ఇతరులకు తీర్పు తీర్చడం మానేయ్!

దైవాశీస్సులు!

 

*యాకోబు పత్రిక -56 భాగము*

యాకోబు 4:1317

13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,

14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.

16. ఇప్పుడైతే మీరు మీడంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.

17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. 

ఇక 1317  వచనాలలో మరో రెండు ప్రాముఖ్యమైన విషయం కోసం రాస్తున్నారు!

 

మొదటిది: నేడో రేపో ఒకానొక పట్టణానికి వెళ్లి ధనము సంపాదించుకొందాం రా అని చెప్పుకోవడం!

రెండవది: మేలైనది మంచిది ఏదో నీకు తెలిసికూడా చెయ్యకపోవడం- పాపము!!!

 

మొదటిది: మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు- ఊరులో మనకు బాగోలేదు- మరో ఊరుపోయి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అనుకుని బొక్కబొర్లా పడి మరల తమ ప్రాంతం వస్తారు! వచనంలో కూడా నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొందాము రండి అని చెప్పుకొనే వారలారా- రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు! మీజీవమేపాటిది? మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు అంటున్నారు! చాలామంది , క్రైస్తవులలో కూడా అనేకమంది చేసే పొరపాటు ఇది! దేవుడంటే ఏమీ పట్టనట్లు, తమ కార్యాలు తామే నిర్ణయించుకుంటారు. దేవుణ్ణి అడగరు! మరోకొంతమంది- దేవునికి తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియనట్లు తమ పెళ్లి యొక్క నిర్ణయం- తమ జీవిత భాగస్వామిని తామే నిర్ణయించేసుకుంటారు! తర్వాత ఏడుస్తారు!

 

 దేవునికంటే తమకే ఎక్కువ తెలుసును అనుకుని దూర ప్రాంతాలకు పోయి- వ్యాపారం చేసి- నష్టపోతూ ఉంటారు!

రెండు ఉదాహరణలు చెప్పనీయండి!

మొదట బైబిల్ నుండి: బెత్లెహేములో కరువు వచ్చింది- నయోమి ఆమె భర్త పిల్లలు ఎక్కడైనా వెళ్ళవచ్చు- గాని అన్యుల పట్టణమైన విగ్రహారాధన చేసే పట్టణమునకు పోయారు. గమనించాలి మోయాబు దేశం- బెత్లెహేము కి కేవలం 70 మైళ్ళు అనగా సుమారు 110 కి.మీ. కరువు వస్తే మరి మోయాబుకి కూడా వ్యాపిస్తుంది. గాని ఇక్కడ నయోమి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలని అనుకుంది- తన భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయింది- నయోమి- మారాగా మారిపోయింది సొంత నిర్ణయాలు తీసుకుని! (రూతు గ్రంధం)

 

మరొకరు: మా సంఘంలో ఒకామె ఉంది! తన భర్త కూలి పనిచేసుకుంటున్నా గాని రోజుకి 800 నుండి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు! దేవుడు ఆశీర్వదించి రెండు సొంతఇల్లులు కూడా ఇచ్చారు వారికి దేవుణ్ణి నమ్ముకున్నాక! గాని ఈమెకు డబ్బుమీద విపరీతమైన వ్యామోహం! భర్త ఇక్కడే ఉందాము అంటే ఊరు, ఆఊరు తీసుకుని పోతుంది. అక్కడ ఎక్కువ కూలి దొరుకుతుంది అంటూ! పాపం ఆయనకు భార్య అంటే చాలా ఇష్టం! భార్య మాట జవదాటడు! వెళ్తారు, గాని అక్కడ ఏదో అవుతుంది! సంపాదించినది మొత్తం పోతుంది! సంఘంలో చెబుతూ ఉంటాడు- నా భార్యకోసం ప్రార్ధన చెయ్యండి- మా ఆవిడకు డబ్బు దయ్యం పట్టింది అంటూ! ఇలా సొంత నిర్ణయాలు తీసుకుని నాశనం అయ్యేవారు చాలామంది ఉంటారు!

 

పద్నాలుగో వచనంలో అంటున్నారు: రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు! మీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటిది మీ జీవితం!

అవును కదా! ఈరోజు బ్రతికి ఉన్న మనము రేపు లేక వచ్చేనెల ఇదే తారీకున బ్రతికి ఉంటాను అని చెప్పగలమా? ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు! ఎవరికీ ఎప్పుడు విధంగా మరణం వస్తుందో తెలియదు! భయంకరమైన రోజులలో జీవిస్తున్నాము మనము! కాబట్టి గడ్డిపువ్వులాంటి బ్రతుకు మనది కాబట్టి బ్రతికిన రోజులన్నీ సాటివారికి సహాయం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకోసం జీవిస్తూ అందరికీ ప్రేమను పంచుతూ జీవించాలి మనము!

 

యోబు 7:7 లో నా ప్రాణం ఊపిరి లాంటిది అంటున్నారు

 

కీర్తన 39:5 లో నా బ్రతుకు బెత్తెడంతగా చేశావు, నేను బ్రతికిన దినములు నీ దృష్టిలో లేనట్టే ఉన్నాయి అంటున్నారు.

 

కీర్తన 102: లో నా దినములు పొగలాగా హరించుకు పోతున్నాయి అంటున్నారు

 

144:4 లో మనిషి వట్టి ఊపిరి లాంటివాడు, వాని రోజులు దాటిపోయే నీడలా ఉన్నాయి అంటున్నారు.

 

అందుకే సామెతలు 27:1 రేపటి గూర్చి అతిశయపడకు లేక గొప్పలు చెప్పుకోవద్దు! ఏరోజు ఏమి జరుగుతుందో నీకు తెలియదు అంటున్నారు

 

యేసుక్రీస్తుప్రభులవారు లూకా 12:1620 లో ఒక ఉపమానం చెప్పారు- ఒక ధనవంతుడికి పంట బాగా పండేసింది. దానిని చూసి- ఇంకా పంట కోయకముందే, కోసి గోడౌన్ లో పెట్టకముందే అనుకుంటున్నాడు, వీటిని కోసి గోడౌన్ లో పెట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరాలకు సరిపోయిన ఆస్తి నీకోసం సంపాదించాను అని చెప్పుకుంటాను అనుకున్నాడు! గాని దేవుడు రాత్రే వచ్చి- ఒరేయ్ వెఱ్రివాడా అనగా పిచ్చోడా! రాత్రి నీ సీటు చిరిపేస్తున్నాను నీవు సంపాదించినవి ఎవడిపాలు అవుతాయ్ రా అన్నాడు!

 

కాబట్టి ఆస్తిని బట్టి, ఐశ్వర్యం బట్టి, ఉద్యోగాలు బట్టి, సంఘాలు బట్టి అతిశయపడటం మానెయ్యాలి! లేకపోతే ధనవంతునికి పట్టిన గతే పడుతుంది!! రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, రేపు ప్రకృతి వైపరీత్యం వస్తుందో ఎవరికీ తెలుసు!!! ఒకసారి ఆలోచించండి- కరోనా వస్తుంది, ప్రజలు పిట్టల్లాగా రాలిపోతారు, ప్రపంచమంతా వణికిపోతుంది, దాక్కుంటుంది, రెండు సంవత్సరాలు మాస్క్ ముసుకులో బ్రతకాలి అని ఎప్పుడైనా అనుకున్నామా? ఊహించామా? లేదుకదా! వచ్చింది- ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసింది! కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక ఈరోజే చివరి రోజు అనుకుని దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన అవసరం ఉంది! రేపటి గూర్చి అతిశయ పడకూడదు! రేపు అక్కడకి వెళ్లి ధనం, లాభం సంపాదించుకుంటాను అని అనుకోకూడదు! గాని దానికి బదులుగా ప్రభువు చిత్తమైతే ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పమంటున్నారు! అయితే మాటలు ఏదో మ్రొక్కుబడికి చెప్పినట్లు చెప్పకూడదు గాని ప్రభువుని నమ్మి ఆయన చిత్తానికి లోబడి జీవిస్తూ పలకాలి!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -57 భాగము*

యాకోబు 4:1317

13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,

14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.

16. ఇప్పుడైతే మీరు మీడంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.

17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము. 

ఇక 1317  వచనాలలో మరో రెండు ప్రాముఖ్యమైన విషయం కోసం రాస్తున్నారు!

మొదటిది: నేడో రేపో ఒకానొక పట్టణానికి వెళ్లి ధనము సంపాదించుకొందాం రా అని చెప్పుకోవడం!

రెండవది: మేలైనది మంచిది ఏదో నీకు తెలిసికూడా చెయ్యకపోవడం- పాపము!!!

 

    (గతభాగం తరువాయి)

రెండవది: మేలైనది మంచిది ఏదో నీకు తెలిసికూడా చెయ్యకపోవడం- పాపము!!!

 

ప్రియులారా! దీనిలో నాకు రెండు అర్ధాలు గోచరిస్తున్నాయి! ఇవి నా ఉద్దేశం మాత్రమే!

మొదటిది: మంచిది ఏదో, సరియైనది ఏదో నీకు తెలిసి కూడా చెయ్యకపోవడం పాపము!

అనగా ఉదాహరణకు సిగరెట్టు త్రాగడం ప్రమాదం- కేన్సర్ కి కారకమౌతుంది! త్రాగేవారికన్నా ప్రక్కన వాసన పీల్చేవారికే ఎక్కువగా నాశనం చేస్తుంది అని తెలిసినా సిగరెట్ త్రాగుతారు కదా! అది పాపం!

త్రాగుడు: మంచిపని కాదు, మనిషి లివర్ చెడిపోతుంది. లివర్ కన్నా ముందుగా నీ కుటుంబం అప్పుల పాలు అయిపోతుంది. నీవు లివర్ చెడిపోయి చచ్చిపోతే నీ కుటుంబం రోడ్డున పడుతుంది అని తెలిసినా బుద్ధిలేకుండా త్రాగుడుకి బానిసగా జీవిస్తూ భార్యను పిల్లలను హింసిస్తూ బ్రతుకుతున్నావు కదా! అది పాపము!

 

దేవుని దశమ భాగం దేవునికి ఇవ్వాలి, దేవునికి నీ ప్రధమఫలాలు ఇవ్వాలి అని తెలిసినా ఇవ్వకుండా ఏదో కొంత అననీయ సప్పీరాల జీవిస్తున్నావు కదా! అది పాపము!

 

అబద్దమాడకూడదు, దొంగతనం చెయ్యకూడదు! లాంటివి తెలిసి కూడా ఎన్ని అబద్దాలు ఆడుతున్నావో కదా! అది పాపము!

 

పొరుగువాని గాడిదను గాని, భార్యను గాని ఆశించకూడదు అనేది ఆజ్ఞ! పరస్త్రీ వంక కామపుచూపు/ మోహపుచూపు చూస్తేనే ఆమెతో వ్యభిచారం చేసినట్టే అని యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినట్లు తెలుసు! గాని నీ పొరుగువాని భార్య వంక, నీ పొరుగువాని భర్త వంక- కామ వికారచూపుతో చూస్తూ, కళ్ళతోనే ఆమె/అతని కొలతలు కొలుస్తున్న పాపాత్ముడా పాపాత్మురాలా! నీకు తెలిసినా చేస్తున్నావు కదా! ఇది తప్పు- మరియు పాపము!

 

ఇలాంటివి చాలా ఉన్నాయి! దేవుడు మోయాబీయులతో వెళ్ళవద్దు, ఇశ్రాయేలు వారిని శపించవద్దు అని చెప్పినా వెళ్లి దీవించి- తప్పుడు సలహాలు ఇచ్చి కుక్క చావు చచ్చాడు బిలాము! పాపమునకు ఫలితం అనుభవించాడు!

 

తను నాజీరు చేయబడిన వాడు, ద్రాక్షారసం త్రాగకూడదు, చచ్చినవి ముట్టుకోకూడదు! లాంటివి తెలిసినా చేశాడు సమ్సోను! ఇశ్రాయేలు పిల్లలను తప్ప మరో జాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది! తన తల్లి ప్రతీరోజు ధర్మశాస్త్రం చదివించేది! అయినా ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించి- ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తావా? లేపుకు వచ్చెయ్యనా అని అడిగి మరీ ఫీలిష్తీయుల అమ్మాయిని చేసుకున్నాడు! అది పాపము! అందుకే చేసుకున్న పెళ్లి మూడురోజులకే పెటాకులు అయ్యింది!

 

నేటి రోజులలో అనేక యవ్వనస్తులకు ముఖ్యంగా క్రైస్తవ యవ్వనస్తులకు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు! ముఖ్యంగా క్రైస్తవులు హిందువులను మరొకరిని వివాహం చేసుకోకూడదు అని తెలుసు! అయినా దేవుడా!నీవు చెప్పినవి అన్నీ నేను చేస్తాను! గాని ఒక్కటి నేను చెప్పినది నాకు నచ్చినది నన్ను చేయనివ్వు! నా నిర్ణయానికి నీవు ఆమోదించు అని దేవునికి చెబుతావు! ఒకరోజు పెళ్లి పెటాకులు అయ్యాక జీవితమంతా ఏడుస్తావు! ఇది పాపము!

 

ఇలా త్రాగుడు వ్యభిచారం, మొహపుచూపు, కోపం, అసూయలు ఇవన్నీ తప్పు అని తెలిసి కూడా చేస్తున్నావు కదా! మేలైనది ఏదో నీకు తెలిసి కూడా కీడైనది చేస్తున్నావు గనుక నీవు పాపం చేస్తున్నావు అంటున్నారు! పాపమునకు వచ్చు జీతం మరణం అని మర్చిపోతున్నారు! అది నిన్ను నరకానికి తీసుకునిపోతుంది అని తెలిసి కూడా కావాలని చేస్తున్నారు!

 

ఇక రెండవది: నీవు ఇతరులకు మేలు చేసే స్థితిలో / లేక సహాయం చేసే స్థితిలో ఉండి కూడా మేలు చెయ్యకపోవడం కూడా పాపమే!

 

ఉదాహరణ: బైబిల్ చెబుతుంది ద్రవ్యం నీ దగ్గర ఉండగా రేపు ఇస్తాను రా అని చెప్పడం తప్పు!సామెతలు 3: 28

ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.

 ఇలా ఎప్పుడు చెబుతాడు అంటే- వచ్చి డబ్బులు అడిగిన వాడు తీసుకునే రకం గాని తిరిగి ఇచ్చే రకం కాదు అని నీకు తెలుసు! నీకు బంధువు! నేను ఇవ్వను అని చెబితే మరలా బంధుత్వం పాడైపోతుంది, లేక స్నేహం పాడైపోతుంది అని తెలిసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటావు, నిజానికి నీ దగ్గర డబ్బులు ఉన్నా గాని! ఇది తప్పు అని బైబిల్ చెబుతుంది! ఇది కూడా పాపమే!

మొదటిది: నీవు అబద్దమాడకూడదు అనే పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మీరావు! పాపిపి అయ్యావు!

 

రెండు డబ్బులు ఉన్నా గాని సహాయం చేసే స్థితిలో ఉన్నాగాని నీవు చెయ్యలేదు కాబట్టి ఇదికూడా పాపమే! అనగా నీవు రెండు పాపాలు చేశావు!

బైబిల్ చెబుతుంది! అవసరమైతే నిష్టూరపడు, గాని ఇతరులకోసం పూటపడకు! అబద్దాలు ఆడకు! దీని అర్ధం ఏమిటంటే అవసరమైతే నీ బంధుత్వం పోగొట్టుకో! నీవు డబ్బులు ఇవ్వడం లేదు అని తెలిసింది- నేను ఇవ్వలేను ఏమీ అనుకోకు అని చెప్పి- బందుత్వాన్ని పోగొట్టుకుని, నిష్టూరాలు తెచ్చుకో! గాని అబద్దాలు ఆడి నరకానికి పోకు! అయితే నీవు నిజమైన విశ్వాసి అయితే నష్టము కలిగినా గాని నిజానికి ఆవ్యక్తి సహాయం పొందుకునే స్థితిలో ఉంటే తప్పకుండా సహాయం చెయ్యాలి! ఒకవేళ అతడు నిజంగా పేదవాడు, ఇవ్వలేని స్థితిలో ఉండి ఉంటే డబ్బులు ఇచ్చి మరిచిపో!  దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు!

అంతేకాకుండా నీ పొరుగువారు ఆకలితో ఉన్నారని, బట్టలు లేకుండా ఉన్నారని తెలిసికూడా నీవు సహాయం చెయ్యడంలేదు కదా! ఇది కూడా పాపమే!

ఒకసారి మత్తయి 25:4146 లో గొర్రెలు మేకలు ఉపమానంలో దేవుడు ఏమిచెప్పారు? మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేశారు, గనుక నాకు చేసినట్లే అని గొర్రెలు అయిన కుడివైపు నిలుచున్న వారికి, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు ఏవిధమైన సహాయం చెయ్యలేదు కనుక నాకు చెయ్యలేదు, మీరు అపవాదికిని వాడి దూతలకోసం చేసిన నరకానికి పొండి అని మేకలతో పోల్చిన ఎడమవైపు పాపులకు చెప్పినట్లు చూస్తాము.

కాబట్టి సహాయం చేసే స్తితిలో ఉండికూడా చెయ్యక పోవడం పాపము!

 

మూడవది కూడా ఉందండీ!! అది సమూయేలు భక్తుడు చెబుతున్నారు! ఒకసారి శత్రువులు ఇశ్రాయేలు ప్రజలమీదికి యుద్ధానికి వస్తారు! ఇశ్రాయేలు ప్రజల దేవుడు వద్దని చెప్పింది కోరి పాపము చేశారు! అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి- అయ్యా మేము పాపమూ చేశాము గాని దయచేసి మా కోసం ప్రార్ధన చెయ్యడం మానవద్దు అంటే సమూయేలు భక్తుడు అంటున్నారు: మీకోసం ప్రార్ధన చెయ్యడం నేను మానేశాను అంటే యెహోవాకు వ్యతిరేఖంగా నేనుపాపం చేశాను అని అర్ధం! కారణం తానూ దేవునిచేత ఏర్పర్చబడటం దేనికోసమంటే ఇశ్రాయేలు ప్రజలకోసం ప్రార్ధన చెయ్యడం, వారిని దేవుని దగ్గరకు నడిపించడం, దేవునితో సమాధాన పరచడం! మీరు తప్పుచేసినా నేను కోపపడి మీకోసం ప్రార్ధన చెయ్యడం మానేస్తే అదికూడా పాపమే అంటున్నారు!

1సమూయేలు 12: 23

నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

 

ప్రియ సేవకుడా/ కాపరీ! నీ సంఘస్తులు తప్పుచేస్తే, నీకు కోపము తెచ్చే పనులు చేస్తే దయచేసి వారికోసం ప్రార్ధన చెయ్యడం మానవద్దు! వారికోసం దేవుని దగ్గర క్షమాపణ వేడి ప్రార్ధిస్తూ ఉండు! అప్పుడు నీవు పాపము చెయ్యని వాడివి అవుతావు!

 

కాబట్టి మొదటగా: మేలైనది ఏమిటో అది తెలిసి కూడా మేలైనది చెయ్యకుండా ఉండటం పాపము అని తెలుసుకుని మేలైనది చేద్దాం!

రెండవది: ఇతరులకు మేలుచేసే స్థితిలో నీవు ఉండికూడా మేలు లేక సహాయం చెయ్యకపోవడం పాపము! కాబట్టి నష్టము కలిగినా గాని ఇతరులకు సహాయం చెయ్యడం మానవద్దు!

చివరికి: నీకు కోపమున్నా గాని నీ పోరుగువారికోసం, నీ సంఘస్తుల కోసం, నీ బంధువుల కోసం ప్రార్ధించడం మానవద్దు!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -58 భాగము*

యాకోబు 5:16

1. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.

2. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

3. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.

4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

5. మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

6. మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఇంతవరకు నాలుగు అధ్యాయాల నుండి ఎన్నెన్నో గొప్ప విషయాలు కోసం రాశారు! ఇక చివరి అధ్యాయంలో మరెన్నో చిన్ని విషయాలు టూకీగా చెప్పుకుంటూ పోయారు!

 

ఇక పై వచనాలలో మాత్రం ధనవంతులకోసం ఎండారగట్టుచున్నారు! మొదటి భాగాలలో చెప్పడం జరిగింది- యేసుక్రీస్తుప్రభులవారు పేదలపక్షపాతి అని, అణిచివేయబడుతున్న దీనుల పక్షపాతి అని, అలాగే బైబిల్ మరియు యాకోబు గారు కూడా పేదల పక్షమున అణగారిన జనాంగము పక్షమున మాట్లాడారు అని చూసుకున్నాము! ఇంత డైరెక్టుగా మాట్లాడిన వారు యేసుక్రీస్తుప్రభులవారు తర్వాత యాకోబు గారు మాత్రమే! వచనాలలో ధనవంతులను వారు చేసే అక్రమాలను ఎండగట్టుచున్నారు! చాలాసార్లు చెప్పడం జరిగింది- బైబిల్ గాని దేవుడు గాని ధనవంతులకు వ్యతిరేఖం కానేకాదు! అయితే ఎవరైతే కేవలం ధనమును మాత్రమే ఆశ్రయిస్తూ దేవుణ్ణి లెక్కచేయని వారికి, పేదలను పట్టించుకోని వారికి, దేవుణ్ణి కాకుండా ధనమునే వారి ఆశ్రయంగా చేసుకున్న వారికి మాత్రమే దేవుడు మరియు బైబిల్ వ్యతిరేఖం!  అబ్రాహాము గారు అపర కోటీశ్వరుడు! అయినా దేవుడు పిలిచారు! యోబు గారు గొప్ప కోటీశ్వరుడు! ఎలీషాగారు పెద్ద భూస్వామి! అయినా దేవుడు వీరిని పిలిచారు! కాబట్టి ధనవంతులంటే దేవునికి వ్యతిరేఖం కానేకాదు! నూతన నిబంధన సంఘంలో కూడా ఎంతోమంది ధనవంతులను దేవుడు ఎన్నుకున్నారు. ఉదాహరణకు బర్నబా గారు! ఇలాంటివారు అపోస్తలుల కార్యాలు 2:4445; 4:3435 ప్రకారం తమ ఆస్తులు అమ్మి అపోస్తులుల పాదాల దగ్గరపెట్టారు, తమకు ఉన్నదానిని సమిష్టిగా పంచుకుంటూ ఆస్తులను వదిలి దేవుని సువార్త ప్రకటన పరచర్య విషయంలో ముందుకు పోయారు!

 

కాబట్టి వచనాలలో వ్రాసిన సంగతులు కేవలం ధనవంతుల కోసం వ్రాయబడింది గాని- ధనము కలిగి సరియైన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న విశ్వాసుల కోసం కాదు అని గ్రహించాలి! కారణం పత్రిక రాసేటప్పటికి ధనవంతులైన విశ్వాసులు తమ ఆస్తులు ఎప్పుడో అమ్మేసి ప్రభువు సేవకోసం, పేదల పోషణ కోసం ఇచ్చేశారు! అయితే ఇది ఎవరికోసం వ్రాశారు అంటే పేదలను పీడించే ధనవంతుల కోసం, స్వార్ధపరులైన ధనవంతులకోసం, ధనాన్ని పోగుచేసుకోవడమే తప్ప, ఎదుటివారు ఏమైనా నాకు అనవసరం అంటూ, దేవుణ్ణి కూడా లెక్కచెయ్యని గర్విష్టులైన ధనవంతులకోసం రాస్తున్నారు! ఇంకా కేవలం పేరుకు, అవసరానికి లేక రోగం పోవడానికి దేవుణ్ణి నమ్ముకుని, అవసరం తీరాక మరల పాత పద్దతిలో నడుస్తూ కేవలం ధన సంపాదన కోసం పరుగెడుతున్న ధనవంతులైన క్రైస్తవుల కోసం కూడా రాస్తున్నారు!

కీర్తన 52:67

6. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి

7. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధియందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకొనిన వాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు.

 

కీర్తనలు 62: 10

బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.

 

సామెతలు 11: 28

ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

 

మత్తయి 6:1921

19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.

 

ఇంకా లూక 12:1621 లో చెప్పబడిన ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనే వారికోసం చెబుతున్నారు

లూకా 12: 21

దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.

 

చూడండి ఏమని రాస్తున్నారు: ఇదిగో ధనవంతులారా, మీమీడికి వచ్చెడి ఉపద్రవాల కోసం ప్రలాపించి ఏడవండి!!!

ఆగుదాం! ఇంతకీ ధనవంతులకు ఏవిధమైన ఉపద్రవాలు రాబోతున్నాయి?

 

లూకా సువార్త 6:2425 ..

24. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు.

25. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.

 

లూకా 16:1931 లో చెప్పబడిన ధవంతుడు- లాజరు ఉపమానంలో ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు. లాజరుకి సమాధి జరిగిందో లేదో తెలియదు, బహుశా మున్సిపాలిటీ వారు బయటకు ఈడ్చేసి ఉంటారు, గాని దేవుని దూతలచేత తండ్రియైన అబ్రాహాము రొమ్మునకు ఎత్తబడ్డాడు (అనగా పరదైసుకి వెళ్ళాడు అని అర్ధము! పరదైసునే తండ్రియైన అబ్రాహాము ఒడి అంటారు బైబిల్ పండితులు) . ధనవంతుడు చనిపోయి- పాతాళములో బాధపడుచున్నాడు అని వ్రాయబడింది! దీనికోసం నేను విస్తారంగా మాట్లాడను గాని వీడు తిన్నగా పాతాళముకి కొనిపోబడ్డాడు! అక్కడ అగ్నిలో కాలిపోతున్నాడు! ఇదే ధనవంతులకు వచ్చే కడగండ్లు లేక ఉపద్రవాలు!!! ధనవంతులకే కాదు- దేవుని మాట చొప్పున చేయని ఎవరికైనా ఇదే గతి! యేసుక్రీస్తుప్రభులవారిని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించని వారి గతి ఇంతే!!

 

ఇలాంటి సంభవాలు సంభవించబోతున్నాయి కాబట్టే మీరు రోదనం చెయ్యండి, విలాపించి ప్రలాపించండి అంటున్నారు యాకోబు గారు!

(ఇంకాఉంది)

*యాకోబు పత్రిక -59 భాగము*

యాకోబు 5:16

1. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.

2. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

3. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.

4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

5. మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

6. మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ధనవంతులైన చేస్తున్న ఆగడాల కోసం చూసుకుంటున్నాము!

 

   (గతభాగం తరువాయి)

 

ఇంకా అంటున్నారు: మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, అనగా మీ ధనం మీ మూలదాచిన ధనమునకు చీడపురుగులు పట్టి వాటిని తినివేస్తున్నాయి. గవర్నమెంటుకు తెలిస్తే ఎక్కడ టేక్స్ కట్టాలో అని ఎవరికీ తెలియకుండా నల్లదనం దాచుకుంటున్నావు. ఎంతోమంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఏవిధమైన సహాయం చెయ్యడం లేదు! వారికి బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలతో కాలం గడుపుతున్నారు. చలిలో అలమటిస్తున్నారు! నీకైతే ఎన్ని బట్టలున్నాయో నీకే తెలియదు!

 

 (గమనించాలి- రోజులలో చాలామంది క్రైస్తవులైన విశ్వాస స్త్రీలకూ ఆదివారం ఎందుకు మందిరానికి రావడం లేటు అవుతుందో కారణం తెలుసా? ఆదివారం చీర కట్టుకోవాలో నిర్ణయించుకోలేక!! ఎందుకంటే బీరువా నిండా చీరలున్నాయి! ఒక్కసారి కట్టిన చీర మరో సంవత్సరానికే కడతావు! నాప్రియమైన సహోదరి అన్ని చీరలు ఉన్నప్పుడు నీ మందిరంలో, నీ ఇంటిబయట నీ వీధిలో ఎంతోమంది పేదలు సరియైన బట్టలు లేకుండా ఉన్నారు కదా వారికీ ఎందుకు ఇవ్వడం లేదు??!!

దేవునికి స్తోత్రం! మా సంఘంలో అలా చీర కట్టుకోవాలి అనే ఆలోచనే ఎవరికీ రాదు! ఎందుకంటే అందరూ తప్పకుండా తెల్లనిబట్టలు మాత్రమే వేసుకుని రావాలి!!!)

 

సరే, ధనవంతులకు అయితే వాళ్ళ బట్టలు బీరువాల నిండా దొంతరలుగా ఉన్నాయి. వేసిన బట్టలు మరలా వేయరు, కట్టిన చీర మరలా కట్టరు. అందుకే బట్టలకు పురుగులు పట్టి చిన్నచిన్న రంధ్రాలు చేస్తున్నాయి! గాని వీధి చివరన బట్టలు లేకుండా సగం సగం బట్టలతో కాలం గడుపుతున్న వారికీ ఏమీ ఇవ్వవు!

 

ఇంకా మూడో వచనంలో మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టాయి అంటున్నారు!గమనించాలి- బంగారానికి గాని వెండికి గాని తుప్పు పట్టదు. వాటిని వాడకపోతే కిలుము పడుతుంది. అనగా వాటిమీద నున్న మెరుపు పోయి ఒక రకమైన పూత ఏర్పడుతుంది. అయితే ఇక్కడ తుప్పు పట్టింది అని ఎందుకన్నారు అంటే ఇది బాషాలంకారముగా చెప్పబడింది. అనగా అనేక సంవత్సరాల నుండి పేరుకుపోయిన నీ వెండి బంగారముల మీద తుప్పు పట్టింది అనగా ఒకరకమైన కిలుము పట్టింది. అంటే అంత వెండి బంగారం నీ దగ్గర ఉంది. వాటిని నీవు తీయలేని స్థితిలో ఉన్నావు. తుప్పు మీమీద సాక్ష్యం పలుకుతుంది, అది మిమ్మల్ని మీశరీరాలను అగ్నివలె తినివేయును. ఇది అంత్య దినాలలో జరుగుతుంది అంటున్నారు. మీరు అంత్యదినాలలో దేవునికోసం చూడకుండా అంత్యదినాలలో ధనమును కూర్చుకున్నారు అంటున్నారు! దీని అర్ధం - ఒకరోజు వస్తుంది- ఆరోజు మీకు ఏమీ లేకుండా అన్నీ , మీరు కూడబెట్టినవి అన్నీ మీ దగ్గర లేకుండా పోతుంది అంటున్నారు! ఎందుకంటే ఇంతమంది పేదలు అనాదలు లోకంలో ఆకలికి మాడిపోతూ చనిపోతూ ఉండగా మీరు కేవలం మీ సంపాదన కోసమే చూసుకున్నారు గాని పేదలను పట్టించుకోలేదు ధనవంతుడు లాజరు ఉపమానంలో లాగ! ధనవంతుడు ఎప్పుడూ తనకోసం- తన కుటుంభం కోసం ఆలోచించే వాడు గాని లాజరుకి ఒక్క రొట్టెముక్కను కూడా పెట్టలేదు! అందుకే ఈరోజు పాతాళంలో అగ్నిలో యాతన పడుచున్నాడు. ఈరోజు ధనవంతుడా నీవు దేవుణ్ణి లెక్కచేయకుండా పేదలను దీనులను ఆదరించకుండా ఉంటే నీవుకూడా ఒకరోజు పాతాళంలో అగ్నిలో పడి యాతన పడవలసినదే!

 

ఇక్కడ ఒకసారి ఆగుదాం! ఇక్కడ అంత్యదినాలలో మీరు ధనమును పోగుచేసుకున్నారు అంటున్నారు- ఈరోజు అనేకమంది దైవసేవకులు- విశ్వాసులు కూడా ధన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప ఆత్మల సంపాదన కోసం చూడటం లేదు! Prosperity Gospel పేరుతో తమ Property ని పెంచుకుంటున్నారు తప్ప దేవుని సువార్తను వ్యాపింపజేయడం లేదు! దైవసేవకుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి, కార్లు బంగాళాలు మాత్రం పెరుగుచున్నాయి. ఒకరోజు తప్పకుండా వీరు లెక్క చెప్పాలి! చూడండి! ఒకరోజు గేహాజీ నయమాను వెనుక వెళ్లి ఏదైనా సంపాదించుకుంటాను అని పరుగెత్తి కుష్టువ్యాది తెచ్చుకున్నాడు కదా అప్పుడు ఎలీషా గారు ఏమన్నారు?.......

2రాజులు 5: 26

అంతట ఎలీషా వానితో- మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? *ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా*?

2రాజులు 5: 27

కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లెను.

 

కాబట్టి విశ్వాసులారా! దైవసేవకులారా! చివరి రోజులలో ఆస్తులు అంతస్తులు బంగాళాలు సంపాదించుకోవడానికి చూడకుండా ఆత్మల సంపాదనకు పాటుపడదాం!

 

ఇక నాలుగో వచనంలో మీరు మీ చేలు కోసిన కూలీల కూలి ఇవ్వకుండా దాచుకున్నారు, కూలివాని యొక్క కూలి లేక జీతము మొర్ర పెడుతుంది అంటున్నారు! ఇదేమైనా సాధ్యమా అంటే సాధ్యమే! హేబెలుని చంపినప్పుడు హేబెలు రక్తం భూమినుండి మొర్రపెట్టినప్పుడు మొర్ర దేవునికి చేరింది! అదే విధంగా కూలి వారు పెట్టే మొర్ర వినబడుతుంది దేవునికి  అదేవిధంగా కూలి (ధనం)కూడా మొర్రపెడుతుంది. కూలి మొర్ర కూడా దేవునికి వినబడుతుంది!  అప్పుడు దేవుడు కయీనుకి ఎలా తీర్పు తీర్చారో మీకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నారు అని మర్చిపోవద్దు!

 

పూర్వకాలంలో ధనవంతులు, రాజులు (రాజులు అనే కులం వారు), దొరలూ (తెల్లదొరలు కాదు, దొరలూ అనే కులం వారు), కొందరు పెద్ద రెడ్డులు, భూస్వాములు పనిచేయించుకునేవారు గాని కూలి ఇచ్చేవారు కాదు! ఏదో తినడానికి కొన్ని గింజలు ఇస్తూ ఉండేవారు! గట్టిగా అడిగితే చంపేసేవారు. మా ఊరిప్రక్కన కూడా ఒక రాజుల గ్రామం ఉంది. అక్కడ నా చిన్నప్పుడు ఊరుమొత్తం రాజులకే ఊడిగం చేసేవారు! ఊరిలో ఉన్న కులపు వారైనా ఏదో ఒక రాజుల ఇంట్లో పనిచెయ్యాలి! స్త్రీలు ఇంట్లో పనిచెయ్యాలి! పురుషులు వారి పొలాల్లో పనిచెయ్యాలి- కేవలం ధాన్యం మాత్రమే ఇచ్చేవారు తప్ప సంవత్సరంలో ఎప్పుడూ కూలి ఇచ్చేవారు కాదు! ఒక రకమైన వెట్టిచాకిరీ అన్నమాట! ఎవడైనా తిరుగబడితే సాయంత్రం శవమైపోవడమే! ఒకవేళ వారికి పొలమున్నా రాజుగారి పొలం పని అయ్యాకనే వారి పొలం పనులు చెయ్యాలి తప్ప ముందుగా చేసుకున్నా శవమైపోవడమే! ఇలాంటి భయంకరమైన పరిస్తితులు ఉండేవి- అలా వారు ధనాన్ని పోగుచేసుకున్నారు! బోలెడు ఆస్తులు కూడగట్టుకున్నారు! గాని రోజు దేవుడు న్యాయం తీర్చారు! ఎవడూ ఊరిలో లేరు. కేవలం ముసలోళ్ళు మాత్రమే మిగిలారు! కాబట్టి ఇలా కూలివారి కూలి ఇవ్వకుండా దాచుకున్న ధనము, కూలి దేవునికి మొర్రపెడితే అది నీకు శాపం అని మర్చిపోకు!

 

ఇక తర్వాత మీరు భూమిమీద సుఖంగా జీవించి భోగాసక్తులై వధ దినము నందు మీ హృదయాలను పోషించుకున్నారు అంటున్నారు! సుఖంగా విలాసంగా బ్రతకడం కోసం ఆలోచిస్తే మరల మనం ధనవంతుడు - లాజరు ఉపమానం లోకి వెళ్తే దేవుడు ధనవంతునితో ఏమంటున్నారు: కుమారుడా! నీవు భూమిమీద ఎంతో సుఖము అనుభవించావు విలాసాలు అనుభవించావు. అయితే లాజరు కష్టాలు అనుభవించాడు, తినడానికి తిండిలేకుండా బాధపడ్డాడు! ఇప్పుడు వీడు సుఖపడుతున్నాడు నీవు యాతన పడుచున్నావు! ఇదే జరుగుతుంది ధనవంతులకు ఒకరోజు! వారు వారియొక్క సుఖభోగాలకోసం చూస్తున్నారు తప్ప పేదల కోసం గాని పొరుగు వారికోసం పట్టించుకోవడం లేదు! ఇక వధదినము అనగా ఒకరోజు ధనవంతుడైన పేదవాడైనా చనిపోతాడు! అయితే ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళమునకు వెళ్ళాడు! అదే వధ దినము! దీని అర్ధం ఏమిటంటే పేదవారిని పట్టించుకోకుండా తమ ఒంటిలో క్రొవ్వు పెంచుకునే లాగ తమ శరీరాలను పోషించుకుంటూ ఉండేవారికి చివరిలో కలిగే మరణమే వధ దినము అని అర్ధం!

 

ఒకసారి ఆమోసు 4:1 చూద్దాం!..

షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా....

 

ప్రాచీన ప్రతులలో చూద్దాం

1 షోమ్రోను కొండమీద ఉన్న బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ బీదలను అణగద్రొక్కుతూ ఉన్న స్త్రీలారా! “మద్యపానం తీసుకురాఅని మీ భర్తలతో చెప్పేవారలారా...

 

బాషాను ఆవులు అనగా బాగా బలిసిన ధనవంతులు, ముఖ్యంగా కాలంలో ధనవంతులైన స్త్రీలు! వారు తమయొక్క అవసరాల కోసం, చెప్పుల కోసం కూడా వారి ఇంట్లో పనిచేస్తున్న బానిసలైన కూలివారిని అమ్మేసేవారు! పేదలను బీదలను ఎంతో బాధించేవారు వేధించేవారు! కొనుక్కున్న వారు, వీరిని ఎంతో బాధపెట్టేవారు. కొందరిని కోసుకు తినేవారు అని చరిత్ర చెబుతుంది! ఇలాంటివారికి దేవుని ఉగ్రత కలుగుతుంది అంటున్నారు!

 

ఇంకా ఏమిచేస్తున్నారు అంటే ఆరో వచనం: మీరు నీతిమంతుడైన ఒకనిని అన్యాయంగా శిక్ష విధించి చంపుతున్నారు, అతడు నీతిమంతుడు కాబట్టి అతడు మిమ్మల్ని ఎదిరించడు కాబట్టి నీతిమంతులను అన్యాయంగా చంపుతున్నారు! అవును ధనవంతులు మోతుబరులు భూస్వాములు ఎంతోమందిని అన్యాయంగా చంపారు! వీరిమీదికి దేవుని ఉగ్రత ఎప్పుడో వచ్చింది. ఇంకా ఎవరైనా ఇలాంటివారు ఉంటే వారిమీదికి కూడా వస్తుంది!   

పేదవాడు దీనుడు భక్తిపరుడు అయిన నాబోతు గారిని యెజెబెలు అనే పేడగుట్ట లేక పెంటమ్మ అనే రాణి ఘోరంగా అన్యాయంగా చంపించింది. ఫలితం ఏమయ్యింది? విధంగా నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో విధముగానే ఆహాబు రక్తాన్ని, యెజెబెలు రక్తాన్ని వారి కొడుకుల రక్తాన్ని కుక్కలునాకాయి!

 

సరే, ముగించేముందుగా మరి దేవుడు ధనమునకు ప్రతిగా ఏమి సంపాదించుకోమంటున్నారు?

రక్షణ! జ్ఞానము! నీతి! న్యాయము! సత్యము!పరిశుద్ధత మరియు పరిశుద్దాత్మ!!! వీటికోసం వెతికి సంపాదించుకోవాలి అంటున్నారు! మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే మీకు ఏమి కావాలో అవి దేవుడు ఇస్తాను అంటున్నారు!

 

అయితే ఇలాంటి వారికోసం పౌలుగారు ఏమని చెబుతున్నారు?

1తిమోతి 6:610  ; 17--19

6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై యున్నది.

7. మన మీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.

8. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము.

 

9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

 

17.ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక,సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును,

19. సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.

 

చూశారా ధనం మీద మొహం అనేక కీడులకు మూలము! అవసరమైతే హత్యలు కూడా చేయిస్తుంది. మనకు తెలుసు- మా విశాఖపట్నంలో ఉన్న గొప్ప దైవజనులు- అన్నదమ్ములు ఇద్దరు గొప్ప దైవజనులే గాని ఆస్తికోసం సహోదరుడు- మరో సహోదరుని హత్య చేయించేస్థితికి వెళ్ళారు!

కాబట్టి ధనము మీద వ్యామోహాన్ని వదిలి దేవుని నీతిని ఆయన రాజ్యమును వెదికి పొందుకుందాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -60 భాగము*

యాకోబు 5:78

7. సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా

8. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.

10. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.

11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఐదో అధ్యాయంలో యాకోబు గారు ఒక పెద్దగా, తండ్రిగా తన ముగింపు మాటలు పలుకుతున్నారు!

ఇంతవరకు ధనికులతో గరిష్టులతో మాట్లాడిన యాకోబు గారు ఇక మరలా సహోదరులతో ప్రేమతో మాట్లాడటం మొదలుపెట్టారు!

 

నా సహోదరులారా! ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి- ఎలాగంటే- ఒక రైతు తొలకరి వర్షం-కడవరి వర్షం పడేవరకు- తన పంట పూర్తిగా పండేవరకు ఎలా ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడో అలాగే మీరుకూడా దేవుడు వచ్చేవరకు ప్రభువు రాకడ వచ్చేవరకు ఓపికతో కనిపెట్టుకుని ఉండండి! అంటూ ఎనిమిదో వచనంలో ఎందుకంటే ప్రభువు రాకడ సమీపించుచున్నది కాబట్టి మీరు కూడా ఓపిక కలిగి ఉండండి- మీ హృదయాలను స్థిరపరుచుకొండి అంటున్నారు!

 

జాగ్రత్తగా గమనిస్తే రెండు వచనాలలో యాకోబుగారు మూడుసార్లు ఓపికగా ఉండండి అంటున్నారు! మాటకు మరో నానార్ధం: దీర్ఘశాంతము కలిగి ఉండండి అంటున్నారు! వీటికోసం అనేకసార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఇంతకీ దేనికోసం ఓపికపట్టమని చెబుతున్నారు అనేది చూద్దాం!

 

నా ఉద్దేశం ఏమిటంటే యాకోబు గారి కాలంలో మొత్తం నూతన నిబంధన సంఘము భయంకరమైన శ్రమలు హింసలలో ఉంది కాబట్టి మీరుపడుతున్న శ్రమలలో హింసలలో మరికొద్దిగా ఓపికపట్టండి- మన దేవుడు తొందరగా వచ్చేస్తున్నాడు కొద్దిగా ఓపిక పట్టండి అంటున్నారు! ఇంకా 10-11 వచనాలలో ప్రభువు నామం కోసం శ్రమపడిన పాత ప్రవక్తలను, ఇప్పటి ప్రవక్తలను అపోస్తలులును జ్ఞాపకం చేసుకోండి వారి శ్రమానుభవమును మాదిరిగా పెట్టుకోండి అంటూ యోబు గారిని ఉదాహరణగా చెబుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా విశ్వాసులు పడుచున్న శ్రమలలో హింసలలో ఓపిక పట్టమని చెబుతున్నట్లు అర్ధం అవుతుంది!

 

యాకోబుగారు మీరు పడుతున్న శ్రమలలో ఓపిక కలిగి ఉండండి అంటున్నారు! ఇంకా పాత ప్రవక్తలను ప్రభువునామము ప్రకటించిన దైవసేవకులను జ్ఞాపకం తెచ్చుకుని వారి శ్రమానుభవమును జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఓపికగా ఉండండి అంటున్నారు! యోబుగారిని గుర్తు తెచ్చుకోమంటున్నారు! యోబు గారు పాపము చెయ్యలేదు- దేవుడు సైతాను గాడు పందెం వేసుకుంటే ఒక పావుగా మారిపోయారు యోబు గారు! సమస్త ధనము, ఐశ్వర్యం, పశువులు అన్నీ ఒకరోజు పోయాయి. తన ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు ఒకేరోజు చనిపోయారు! అయినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనెను యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నారు! అదీ విశ్వాసం! దేవునిమీద నమ్మకం! భక్తి! అందుకే ఈశోధన తీరిన తర్వాత (బైబిల్ పండితులు యోబుగారు సుమారు మూడు సంవత్సరాలు బాద పడ్డారు అంటారు) రెట్టింపు ఆశీర్వాదం పొందారు! పరీక్షలలో  ధైర్యంగా దేవుని పక్షమున నిలబడ్డ యోబుగారిని దేవుడు వదిలెయ్యలేదు! రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రులుగా చేశారు! కాబట్టి మీరు కూడా మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో శోధనలలో ధైర్యంగా ముఖ్యంగా ఓపికగా ఉండండి అంటున్నారు! మాట వారికే కాదు- పరిశుద్దాత్మ్డు మనకు కూడా చెబుతున్నాడు అని గ్రహించాలి!

 

పాత నిబంధన భక్తులే కాదు కొత్త నిభందన భక్తులు కూడా ప్రభువు నామముకోసం శ్రమలు హింసలు అనుభవించారు! ఒకసారి పౌలుగారు ఎన్ని హింసలు పడ్డారో చూద్దాం.....

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:23,24,25,26,27,32,33

23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.

27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

32. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.

33. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.

 

ఇక విశ్వాస వీరుల పట్టీలో ఉన్నవారు కాకుండా మిగిలిన వీరులు ఎలాంటి బాధలు పడ్డారో హెబ్రీ పత్రికలో చెబుతున్నారు: 11:3239...

 

32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.

33. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;

34. అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.

35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. *కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి*.

36. *మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి*.

37. *రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు*,

38. *అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి లోకము యోగ్యమైనది కాదు*.

39. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనము లేకుండ సంపూర్ణులు కాకుండు నిమిత్తము, ....

 

చూశారా ఎన్ని శ్రమలు హింసలు అనుభవించారో!! మన దేశానికి మనవరకు సువార్త వచ్చింది అంటే ఇలాంటి సువార్త వీరులు తమ ప్రాణాన్ని త్యాగం చేసి తమ ఆస్తులను త్యాగం చేసి మన దేశానికి తీసుకుని వచ్చారు!అందుకే మనవరకు వచ్చింది! మన కల్ల ఎదుటనే జరిగింది:  భక్తుడైన గ్రాహంస్టైన్స్ గారిని తన కుమారులను సజీవదహనం చేసేశారు! గాని తల్లి అనగా ఆయన  భార్య కాల్చిన వారికి క్షమాభిక్ష పెట్టి నిజమైన క్రీస్తు కుమార్తెగా నిల్చిపోయింది!  అందరితోను తల్లి- అమ్మా అని పిలువబడిన మధర్ థెరిశా గారు కూడా మొదట్లో ఎన్నెన్నో హింసలు పొందారు! అంతవరకూ ఎందుకు- మీ ఊరిలో ఇప్పుడు సేవ జరుగుతుంది అంటే మీ కాపరి గాని మరో దైవసేవకుడు ఎన్నెన్నో హింసలు ప్రయాసలు పడి సువార్త ప్రకటించారు- రాళ్ళదెబ్బలు అవమానాలు పిడిగుద్దులు తిన్నారు. కొందరు చంపబడ్డారు కాబట్టి మీ ప్రాంతంలో దేవుని మందిరం ఉంది! కాబట్టి ఇటువంటి దైవజనులను భక్తులను ఆదర్శంగా తీసుకుని మనము శ్రమలు అనుభవించుటకే పిలువబడ్డాము (1థెస్సలోని 3:4) అనే పౌలుగారి సందేశాన్ని గుర్తుకు తెచ్చుకుని - అనేక శ్రమలు అనుభవించి మనము పరలోకం వెళ్ళాలి (అపో 14:22) అనే అపోస్తలుల పిలుపు విని, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యంగా ఉండండి అనే క్రీస్తుమాటలు జ్ఞాపకం తెచ్చుకుని (యోహాను 16:33) ఓపిక కలిగి ముందుకు పోదాం!

 

ఒక రైతు విత్తనాలు విత్తిన వెంటనే పంటరాదు!  దున్నాలి, శుభ్రం చెయ్యాలి- విత్తనాలు జల్లాలి. అప్పుడు మొదటగా తొలకరి వానకోసం ఎదురుచూస్తాడు! అది పడ్డాక మొక్కలువస్తాయి- తర్వాత గొప్పు తీస్తాడు, ఇంకా ఎన్నెన్నో చేస్తాడు. మధ్యలో వర్షం కోసం ఎదురుచూస్తాడు. అవి పడ్డాక పెరుగుతాయి. కడవరి వర్షం కోసం ఎదురుచూస్తాడు చీడపురుగులు పట్టకుండా. అవి అయ్యాక పంట/ విత్తనం బాగా పండిన తర్వాత  కోస్తాడు. మరికొన్ని రోజులకు కుప్ప పెడతాడు! అవి ఆరాక దుళ్ళగొడతాడు! అప్పుడు పంట లేక విత్తనాలు ఇంటికి వస్తాయి! ఇన్నిరోజులు ఆగాడు కష్టపడ్డాడు గనుకనే పంట ఇంటికి వచ్చింది! అలాగే మీరు కూడా ఓపిక కలిగి ఉండండి! ప్రభువు వస్తున్నారు- ఆయన వచ్చే వరకు మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రవక్తలు అపోస్తలులు పడ్డ శ్రమలను గుర్తుకు తెచ్చుకోండి అంటున్నారు!

 

ఆయన తొందరలో రాబోతున్నారు!

మత్తయి 16: 27

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

 

అపో 1:11

గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

 

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

ప్రకటన గ్రంథం 22: 7

ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

 

కాబట్టి కాలం గుర్తెరిగి దానికి తగినట్లుగా ఉండండి అంటున్నారు పౌలుగారు

రోమా 13:1112

11. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము.

 

అందుకే చివరివరకు సహించమని అంటున్నారు. అంత్యము వరకు నమ్మకముగా ఉండు అప్పుడు దేవుడు నీకు జీవకిరీటం ఇచ్చును అని నీవు బాప్తిస్మం పొందినప్పుడు దైవసేవకుడు చెప్పిన మాటగుర్తుకు తెచ్చుకో!

 

మత్తయి 24: 13

అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.

 

1కొరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

1కోరింథీయులకు 16: 13

మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులైయుండుడి;

 

ఎఫెసీ 6:14

ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని

 

కొలస్సీ 1:23

పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను సువార్తకు పరిచారకుడనైతిని.

 

1పేతురు 5:810

8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది (సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

9. లోకమందున్న మీ సహోదరులయందు విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

 

కాబట్టి మనము కూడా ఓపికగా కనిపెడదాం! శ్రమలను సహించిన ప్రవక్తలను భక్తులను ఆదర్శంగా తీసుకుందాం! మనకోసం మరణాన్నే భరించిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -61 భాగము*

యాకోబు 5:9,12

9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.

12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఐదో అధ్యాయంలో యాకోబు గారు ఒక పెద్దగా తండ్రిగా తన ముగింపు మాటలు పలుకుతున్నారు!

 

ప్రియదైవజనమా! ముగింపు మాటలలో రెండు వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాల కోసం చెబుతున్నారు! గమనించాలి: రెండింటి కోసం యేసుక్రీస్తుప్రభులవారు తన పరిచర్యలో చెప్పినవే! మరలా వాటిని గుర్తుకుచేస్తున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై!!

 

 తొమ్మిది: సహోదరులారా! మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకనిమీద మరొకడు సణుగుకోవద్దు! ఇదిగో న్యాయాధిపతి అనగా యేసుక్రీస్తుప్రభులవారు వాకిట దగ్గర నిలిచియున్నాడు అంటున్నారు!

పౌలుగారు అంటున్నారు: మీకు తీర్పు తీర్చువాడు ఎవరు? యేసుక్రీస్తుప్రభువులవారు..

Romans(రోమీయులకు) 8:33,34

33. దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;

34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే .

 

ఇక్కడ మీరు ఎంతమాత్రమూ సణుగుకోవద్దు ఎందుకంటే అలాచేస్తే మీరు తీర్పు పొందుతారు! ఇది యేసుక్రీస్తుప్రభువులవారు ఎప్పుడో తన పరిచర్యలో చెప్పిన మాట! చెదిరిపోయిన విశ్వాసులకు గుర్తు చేయడానికి మరలా యాకోబు గారు రాస్తున్నారు ఆత్మావేశుడై!! మత్తయి  7:12 ..

1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

 

పౌలుగారు అంటున్నారు:

రోమా 2:1

1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?

2. అట్టికార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.

3. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా?

 

కనీసం ఇతరులు తినే ఆహారం కోసం కూడా తీర్పు తీర్చకూడదు

రోమా 14:,4

3. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

 

1కొరింథీ 4:5

కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

జాగ్రత్తగా గమనిస్తే ఇతరులకోసం సణుగుకోవడం తీర్పు తీర్చడమే! అది మన పనికాదు, దేవుని పని అని మనకు నాల్గవ అధ్యాయంలో వివరంగా వివరించారు యాకోబు గారు!

పౌలుగారు కూడా అంటున్నారు 1కొరింథీ పత్రిక 10 అధ్యాయంలో మొదటి నుండి అంటున్నారు అందరూ ఒకేరకమైన బాప్తిస్మము రక్షణ పొందుకున్నారు గాని ఇశ్రాయేలు ప్రజలు- వారిలో కొందరు దేవునికి ఇష్టులుగా ఉండలేదు అందుకే వారు నశించిపోయారు అంటూ కొన్ని పనులుచేయవద్దు అంటున్నారు!!

 

మొదట వారు చెడ్డవాటిని ఆశించి- సంహారకుని చేతిలో చనిపోయారు! కాబట్టి మనము చెడ్డవాటిని ఆశించవద్దు!

 

రెండు: కొందరు వ్యభిచరించి- 23వేల మంది ఒక్కరోజే పోయారు. అలాగే మనము కూడా వ్యభిచారం చేయకుండా ఉందాము!

 

మూడు: కొందరు దేవుణ్ణి శోధించి- సర్పాల చేతిలో చచ్చారు, కాబట్టి మనము కూడా దేవుణ్ణి శోధించవద్దు!

 

నాలుగు: వారిలో కొందరు సణుగుకొన్నారు!సణిగి- సంహారకుని చేతిలో నశించిపోయారు , కాబట్టి మనము కూడా సణుగుకోవద్దు అంటున్నారు!

 

 ఇక చివరిమాట అంటున్నారు 11 వచనంలో సంగతులు వారికి సంభవించి మనకు దృష్టాంతాలుగా ఉండటానికి మనకు బుద్ధి కలుగటకై వ్రాయబడ్డాయి గాబట్టి బుద్ధిగా ఉండండి అంటున్నారు!

 

అక్కడ సణిగిన బ్యాచ్లు రెండు ఉన్నాయి- మొదటిది మోషేగారికి వ్యతిరేకంగా కోరహు దాతాను అబీరాము బ్యాచ్- భూమి నెరవిడిచి అందరిని మ్రింగి వేసింది.

మరొకసారి మాంసం కావాలని సణిగారు: మాంసం నోటిలో ఉండగానే ఉగ్రత దిగి పోయారు!

 

మరో బాచ్: సొంత అక్క సొంత అన్న: సొంత అన్నకు దేవుని అభిషేక తైలము తలమీద ఉంది కాబట్టి బ్రతికి పోయాడు, అభిషేక తైలము లేని అక్కకు భయంకరమైన కుష్టువ్యాది వచ్చేసింది! కాబట్టి అలాంటి సణుగుడు కార్యక్రమాలు మనము చేయవద్దు!

నీ సహోదరుని మీద సణుగుకోవద్దు,

నీ అక్కచెల్లెళ్ళు మీద సణుగుకోవద్దు!

నీ సంఘకాపరి మీద సణుగుకోవద్దు!

నీ సంఘస్తుల మీద సంఘపెద్దల మీదా సణుగుకోవద్దు!

 ఒక్కమాటలో చెప్పాలంటే నీవు సణుగుకున్నావంటే నీకు పోయేకాలం దగ్గరకు వచ్చింది అని అర్ధం! అచ్చమైన తెలుగులో చెబుతున్నాను అండీ: పైన ఉదాహరణలు అన్నీ ఒకసారి చూడండి- సణిగారు పోయారు! మనము అంతే- సణిగామా- పోయామే!!

 

ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం కోసం రాశారు: ఇది కూడా యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మాటనే!!

మీరు ఎట్టి పరిస్తితులలోను ఆకాశం తోడని గాని, భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకోవద్దు!!  ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నారు అంటే తీర్పుపాలు అవుతారు కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అంటున్నారు! యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇదే చెప్పారు మత్తయి 5:౩౩37 లో ....

33. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,

34. నేను మీతో చెప్పునదేమనగా ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడనవద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు,

35. అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము

36. నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.

37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి (లేక- కీడునుండి) పుట్టునది.

 

చూశారా మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అనగా- మనము మాట్లాడే ప్రతీమాటను దేవుడు వింటున్నారు కాబట్టి ప్రతీమాట ఆచి తూచి మాట్లాడాలి, సత్యమే చెప్పాలి, ఎవరినీ మోసగించే ప్రయత్నం చేయకూడదు! ఆకాశం తోడు అనవద్దు- ఎందుకంటే అది దేవుని సింహాసనం, భూమి తోడు అనవద్దు అది దేవుని పాదపీఠము- కారణం ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము అని వ్రాయబడింది బైబిల్ లో! యెషయా 66:1

ఇంకా యెరూషలేము తోడు అనవద్దు ఎందుకంటే అది మహారాజు పట్టణం! ఇంకా నీ తలతోడు అని కూడా అనవద్దు నీవు ఒక్క వెండ్రుకను కూడా తెల్లగా చేయలేవు నల్లగా చేయలేవు , నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి, అలా లేకపోతే మాట దుష్టుని నుండి అనగా సాతాను గాడు నీలోఉండి ఆమాట పలికిస్తున్నాడు!!!

 

కాబట్టి మనముకూడా సణుగుకోవడం మానేద్దాం! ఒట్లు పెట్టుకోవడం మానేద్దాం!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -62 భాగము*

*విశ్వాసి పరిస్తితులు-1*

యాకోబు 5:118

13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.

14. మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.

15. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును.

16. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.

17. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.

18. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఐదో అధ్యాయంలో యాకోబు గారు ఒక పెద్దగా తండ్రిగా తన ముగింపు మాటలు పలుకుతున్నారు!

 

ప్రియ దైవజనమా! ఇక వచనాలలో మరో ప్రాముఖ్యమైన అంశాలు రాస్తున్నారు! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వాస జీవితంలో ప్రతీ ఒక్కరికీ మూడు విషయాలు సంభవిస్తాయి. ఇవి నాకు సంభవించలేదు అని ఇప్పటివరకు ఎవరూ అనలేదు- అనలేరు!! అవి ఏమిటంటే

మొదటిది: శ్రమలు రావడం

రెండు: సంతోషం కలగటం

మూడు: జబ్బు పడటం!

ఇవి నాకెప్పుడూ రాలేదండి అని విశ్వాసి అనగా పాత నిబంధన భక్తుడు గాని క్రొత్త నిబంధన భక్తులు గాని అనలేదు! ఈరోజులలో ఉన్న గొప్ప గొప్ప దైవజనులు గాని గొప్ప విశ్వాసులు కూడా అనలేరు!

అందుకే మూడు పరిస్తితులను ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక పెద్దగా ఒక సంఘ అధ్యక్షునిగా పరిశుద్ధాత్మ పూర్ణునిగా ఆత్మావేశంతో రాస్తున్నారు!!!

 

మొదటిది: శ్రమలు అనుభవించడం! దీనికోసం నేను విస్తారంగా మాట్లాడను! ఎందుకంటే యాకోబు  పత్రిక వివరణలో గాని, మా ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ మొదటినుండి ఇంతవరకు విశ్వాసి శ్రమలను అనుభవించే పరలోకం చేరాలి అనే కాన్సెప్ట్ మొదటనుండి చెబుతున్నాను కాబట్టి ముందుకు పోతాను!

శ్రమలు విశ్వాసులందరికీ వస్తాయి! పౌలుగారు తిమోతి గారికి శ్రమలు అనుభవించాలి. నీవు నిజమైన భక్తిచేస్తే తప్పకుండా శ్రమలు వస్తాయి అన్నారు! ..2తిమోతి 3:12

అందుకే నీవు నిజమైన సైనికుని వలే శ్రమలను అనుభవించరా నా కొడుకా అన్నారు తిమోతి గారిని పౌలుగారు!

2తిమోతికి 2: 3

క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.

 

నీవు శ్రమలను అనుభవిస్తూనే సువార్త ప్రకటించు నీ సేవను కొనసాగించు అని కూడా అన్నారు 2తిమోతి 4:5 లో...

అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.

 

కాబట్టి విశ్వాస జీవితంలో అందరికీ శ్రమలు వస్తాయి!!

అయితే శ్రమ కలిగినప్పుడు ఏమి చెయ్యాలి అనేది భక్తుడు చెప్పిన చిట్కాను ఎలా అనుసరించాలి అనేదానికోసం చూసుకుందాం!

 

మీలో ఎవనికైనా శ్రమ సంభవించెనా?

అతడు ప్రార్ధన చెయ్యాలి!!! ఇదే చిట్కా!!! ప్రతీ సమస్యకు పరిష్కారం ఇదే!!!!

 

ప్రార్ధన ఎందుకు చెయ్యాలి?

ఎందుకంటే మన ప్రార్ధనకు జవాబుగా దేవుడు మన కష్టాల నుండి శ్రమల నుండి తొలగించవచ్చు! లేదా శ్రమలను శోధనలను కష్టాలను తట్టుకునే ధైర్యం ఇస్తారు, ఇంకా వాటిని గెలిచేమార్గం చూపిస్తారు!!! సహించే ఓపికను కూడా ఇస్తారు! ఎప్పుడంటే నీవు ప్రార్ధించినప్పుడు! శ్రమల మార్గం తప్ప మరో మార్గము లేదు జయజీవితానికి- జయజీవితం ద్వారానే నీవు ఎత్తబడగలవు- పరమునకు చేరగలవు!! మరి నీవు శ్రమలలో సహించి, విజయం పొందాలి అంటే ప్రార్ధన నీ జీవితంలో ఒక భాగమై పోవాలి! ఇప్పుడు నీవు అప్లికేషన్ పెట్టుకుంటేనే కదా పై అధికారి నీ సమస్యను పరిష్కరించడానికి వచ్చేది! అలాగే దేవునికి కూడా నీవు ప్రార్ధన అనే అప్లికేషన్ పెట్టాలి- నీకు వచ్చిన శ్రమలు శోధనలు బాధలు కోసం- అప్లికేషన్ తప్పకుండా సప్లికేషన్ తో(విజ్ఞాపనలు) కూడినదై అయ్యుండాలి! అప్పుడు దేవుడు నీకు విజయం చేకూరుస్తారు!!!

 

గమనించాలి- దీని అర్ధం- కేవలం నీకు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్ధన చెయ్యాలి- తర్వాత వద్దు అని కానేకాదు! ఎల్లప్పుడూ ప్రార్ధన చెయ్యాలి. నా చిన్నప్పుడు అనగా సుమారుగా 40 సంవత్సరాల క్రితం మా నాన్నగారితో పాటుగా సేవచేస్తున్న మత్తయి పాష్టర్ గారని ఒక దైవజనుడు ఒక పాట పాడేవారు: కష్టాలొచ్చినప్పుడే కాదు ప్రార్ధన,  నష్టాలొచ్చినప్పుడే కాదు ప్రార్ధన.... అంటూ! అన్ని సమయాలలో అన్ని విషయాల కోసం ప్రార్ధిస్తూ ఉండాలి!

 

అయితే ఇలాంటి శ్రమలు శోధనలు కోసం ప్రత్యేకంగా కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి అంటున్నారు!

ఎఫెసీ 6:18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

1థెస్సలొనికయులకు 5: 17

యెడతెగక ప్రార్థనచేయుడి;

 

కాబట్టి అనుదినం ప్రార్ధన చేద్దాం! ప్రార్ధనలతోను విజ్ఞాపనలతోను దేవుని సన్నిదానమునకు  ప్రతీరోజు వెళ్దాం!

 

ఇక రెండవ పరిష్తితి: సంతోషం వస్తే!!! గమనించాలి-విశ్వాసులు అస్తమాను శ్రమలు పడుతూనే ఉండాలని కాదు, విశ్వాస జీవితంలో సంతోషం వచ్చే సమయాలు కూడా వస్తాయి. అప్పుడు ఏమి చెయ్యాలి?

అతడు కీర్తనలు పాడవలెను!!! చూడండి సంతోషం వస్తే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోమనలేదు! ఏదో మండీకి వెళ్లి ఫుల్లుగా తినమని కూడా అనలేదు గాని కీర్తనలు పాడాలి!

దీనికోసం ఆలోచిస్తే మనకు అన్ని విషయాలలోను కీర్తనలు పాడిన వ్యక్తి ఉన్నారు బైబిల్ లో! కష్టం వచ్చినప్పుడు పాటలు పాడారు, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడారు, రాశారు! మామ చంపుదామని తిరిగినప్పుడు పాటలు పాడారు, రాజు అయినప్పుడు పాటలు పాడారు, సొంతవారు తిరుగబడినప్పుడు పాటలు పాడారు! ప్రజలు అయ్యా మందిరానికి వెళ్దాము అంటే తన రాజ్యము అధికారం అన్నీ వదిలేసి మందిరానికి వెల్లి పాటలుపాడుతూ వాయిద్యాలు వాయించేవారు! ఆయన దావీదు గారు! కీర్తనల గ్రంధంలో ఎక్కువ కీర్తనలు రాసింది ఆయనే! కన్నీటితో రాశారు, సంతోషంతో రాశారు పాడారు! దేవునియందు ప్రేమ కలిగినా రాశారు పాడారు!

కీర్తన 9:1314

13. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము.

14. మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించు వాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము.

 

కీర్తనలు 18: 49

అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను.

 

కీర్తనలు 35: 28

నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

 

కీర్తనలు 47: 6

దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.

 

ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి- తంబురతోనూ నాట్యము తోనూ స్తుతిస్తాను అంటున్నారు కీర్తనలు 14615 వరకు.

 

దేవుణ్ణి స్తుతించేందుకు సమయమైనా మంచిదే!

1థెస్సలొనికయులకు 5: 18

ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

 

ఇలా చెప్పడం చాలా తేలిక! అనుభవిస్తే తెలుస్తుంది!

గమనించాలి- ఒకసారి పౌలుగారిని సీలగారిని ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు అని ఫిలిప్పీయుల కోలనీలో ఘోరంగా కొట్టి చెరశాలలో వేశారు ఇద్దరినీ! గాని వీరు ఏడవలేదు! బాధపడలేదు! అర్ధరాత్రి వరకు పాటలు పాడుతూ వాక్యం చెప్పారు! చెరసాల బ్రద్దలయ్యింది, భూకంపం కలిగింది! అనేకులు రక్షించబడ్డారు! అదీ దేవునిలో ఆనందించడం అంటే!! అపొస్తలుల కార్యాలు 16 అధ్యాయం.

 గుండగా తన్నేసి జైల్లులో పెడ్తే సేవకుడైనా ఏమి సేవ బాబు నీది! మంచి చేసినా కొడుతున్నారు, చెడుచేసినా కొడుతున్నారు, జీవితాంతం నీకోసం తన్నులే తినాలా అని దేవునిమీద అలగలేదు! సంతోషిస్తున్నారు, పాటలు పాడారు! నిజానికి వారు మౌనంగా ఉంటే భూకంపం కలిగేది కాదు, వారు రక్షంచబడేవారు కాదు! వారు సంతోషంతో అర్దరాత్రివరకు పాటలు పాడి దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించారు కాబట్టి అద్భుతం- అసాధారణ అద్భుతం జరిగింది!

 

కాబట్టి అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతలు, పాటలు పాడుతూ ఉండాలి దావీదు గారిలా, మరియు పౌలు సీలలు వలే!

 

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -63 భాగము*

*విశ్వాసి పరిస్తితులు-2*

యాకోబు 5:118

13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.

14. మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.

15. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును.

16. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.

17. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.

18. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఐదో అధ్యాయంలో యాకోబు గారు ఒక పెద్దగా తండ్రిగా తన ముగింపు మాటలు పలుకుతున్నారు!

 

ప్రియ దైవజనమా! ఇక వచనాలలో మరో ప్రాముఖ్యమైన అంశాలు రాస్తున్నారు! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వాస జీవితంలో ప్రతీ ఒక్కరికీ మూడు విషయాలు సంభవిస్తాయి. ఇవి నాకు సంభవించలేదు అని ఇప్పటివరకు ఎవరూ అనలేదు- అనలేరు!! అవి ఏమిటంటే

మొదటిది: శ్రమలు రావడం

రెండు: సంతోషం కలగటం

మూడు: జబ్బు పడటం!

 

       (గతభాగం తరువాయి)

 

ఇక ఈరోజు మూడవ విషయాన్ని ధ్యానం చేద్దాం!

మీలో ఎవడైనా రోగియై ఉన్నాడా? అనగా ఏవిధమైన జబ్బులు వచ్చాయా?

అతడు సంఘపెద్దలను పిలవనంపాలి!

ఎందుకు సంఘపెద్దలను పిలవాలి?

ప్రార్ధన చెయ్యడానికి!

పాష్టర్ గారు సరిపోరా? టీవీ స్పీకర్లు, స్వస్తతవరం గలవారు, స్వస్తిశాలకు వెళ్ళవద్దా?

బైబిల్ చెప్పినట్లు చేయు- స్వస్తత కావాలంటే!!!

వాళ్ళు వచ్చి ఏమిచేస్తారంట?

నూనె రాచి విశ్వాసంతో ప్రార్ధన చెయ్యాలి!

చేస్తే!

విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్తపరచును!

వ్యక్తి పాపాలు చేసి ఉంటే మొదట పెద్దల ముందు తన తప్పులు చేసిన అపరాధాలు ఒప్పుకోవాలి!

ఒప్పుకుంటే!

డబుల్ ధమాకా!!!

ఏమిటి?

మొదట పాపాలు క్షమించబడతాయి!

రెండు: రోగాలు పోతాయి!

అరే! ఇంత స్పష్టమైన చిట్కా మరియు దేవుని- పరిశుద్ధాత్మ ఆజ్ఞను వదిలేసి రోజులలో క్రైస్తవులు నూటికి ఎనబై శాతం సంఘానికి, సంఘానికి, స్వస్తతలు బోధించే పాష్టర్లు దగ్గరికి, ఖర్చీఫ్లు నూనె బోటిల్ లు అమ్మేవారి దగ్గరకు పరుగులు పెడుతున్నారు! అయినా వీరు ఎందుకు స్వస్తత పొందుకోవడం లేదు అంటే!!!

వీరు మూలాలు లేక బేసిక్ మర్చిపోయారు! వాక్యాన్ని వదిలేసి స్వస్తతలు వెనుక పరుగెత్తుతున్నారు కాబట్టి!

బైబిల్ నీకు రోగం కలిగితే నీ పాష్టర్ గారిని గాని ఫలాని స్వస్తత వరం కలిగిన బోధకుని దగ్గరకి వెళ్ళమని చెప్పనేలేదు!! నీ సంఘపు పెద్దలను పిలువమని చెబుతుంది! పిలచిన వెంటనే సంఘపెద్దలు రావాలి! వచ్చినూనె రాచి  విశ్వాసముతో ప్రార్ధన చెయ్యాలి!

గమనించాలి! సంఘకాపరి వచ్చి ప్రార్ధించడంలో తప్పు లేదు! నీ బాగోగులు తప్పకుండా నీకాపరికి తెలియాలి! గాని బైబిల్ నీ కాపరి ప్రార్ధనచేస్తే రోగం తగ్గుతుంది అని చెప్పడం లేదే!!! నీ సంఘపెద్దలనే పిలువమని చెప్పింది! రాయించింది పరిశుద్ధాత్ముడు! మరి ఆయన ఆజ్ఞకు లోబడాలి కదా! అందుకే నీకు రోగాలు పోవడం లేదు!

 

సరే, సంఘపెద్దలు వచ్చారు! వారు నూనె రాచి- విశ్వాసంతో భారంతో కన్నీటితో రోగికోసం ప్రార్ధన చెయ్యాలి!

 

ఆగుదాం! ఇప్పుడు సంఘపెద్దలు కన్నీటితో విశ్వాసంతో ప్రార్ధన చెయ్యాలి అంటే ముందుగా సంఘపెద్దలు ఎలాంటి వారు అయి ఉండాలి! పనికిమాలిన వారు, ధనమున్న వారు, పలుకుబడి ఉన్నవారు కాదండి! పౌలుగారు రాసిన తిమోతి పత్రికలలోనూ, తీతుకు రాసిన  పత్రికలోను వ్యక్తి అనగా సంఘపెద్ద ఏకపత్ని వ్రతుడు, సంఘాన్ని కుటుంభాన్ని ఏలువాడు, మంచిపేరు పొందిన వ్యక్తి, సంఘంలో ఎప్పటినుండో సభ్యత్వం కలిగిన వ్యక్తి అయిఉండాలి అంటున్నారు! ఎవడ్ని పడితే వాడ్ని/ ఆమెను సంఘపెద్దలుగా పెడితే స్వస్తతలు సాధ్యం కాదు!

 

మరొకటి: సంఘపెద్దలు ప్రార్ధన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్తపరచును అంటున్నారు. కాబట్టి సంఘపెద్దలు ప్రార్ధనాపరులు మరియు విశ్వాసపరులు అయిఉండాలి! అప్పుడు వ్యక్తికి స్వస్తత ఇస్తారు దేవుడు!

ఇక్కడ మరోమాట జాగ్రత్తగా గమనించాలి! 14 వచనానికి 15 వచనానికి ఎలా లింకు ఉందో, అలాగే 14 వచనానికి 16 వచనానికి కూడా లింకు ఉందండి!! ఎలా అంటే- ఒకవేళ రోగము సాతాను శోధనల వలన గాని వాతావరణ మార్పుల వలన గాని వచ్చి ఉంటే, సంఘపెద్దల విశ్వాసపు ప్రార్ధన ద్వారా రోగం తగ్గిపోతుంది! గాని రోగం- రోగి చేసిన తప్పుల వలన అపరాధముల వలన కలిగితే- మొదటగా- రోగి- సంఘపెద్దలు వచ్చిన వెంటనే ముందుగా తాను ఎటువంటి రోగముతో బాధపడుచున్నాడో చెప్పిన వెంటనే తాను చేసిన అపరాధాలు సంఘపెద్దలు ముందు ఒప్పుకోవాలి!

 

 ఏమండి- దేవుని ముందు ఒప్పుకోవాలి గాని సంఘపెద్దలు ముందు ఎందుకండీ?

అయ్యా- దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడు అనియు, ఎక్కడ ఇద్దరుముగ్గురు నా నామమున ఉంటారో, ప్రార్ధిస్తారో అక్కడ నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు సంఘపెద్దలు- దేవుని నామమున ప్రార్ధించడానికి వచ్చి ఉన్నారు కాబట్టి- సంఘపెద్దలు ముందు తప్పులు అపరాదాలు ఒప్పుకుంటే ఎవరిముందు ఒప్పుకున్నట్లు??!!!

దేవుని ముందు ఒప్పుకున్నట్లు!

ఎప్పుడైతే దేవుని ముందు తన తప్పులు ఒప్పుకున్నాడో ఈవ్యక్తి-  తప్పకుండా సంఘపెద్దలు ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా, వీరంతా తప్పకుండా తండ్రీ వ్యక్తిచేసిన తప్పులు అపరాధాలు పాపాలు దయచేసి క్షమించండి అని ప్రార్ధన చేస్తారు! వెంటనే వారి మధ్యనే ఉన్న దేవుడు ఆమెన్! అంటారు! వెంటనే మొదట పాపాలు క్షమించబడ్డాయి! తర్వాత నీ రోగం స్వస్తపరచబడుతుంది!!!

ఇదీ పద్దతి!

దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన పద్దతి!

 సంఘంలో ఒక విశ్వాసికి రోగమొచ్చినప్పుడు స్వస్తతపడే విధానం!

దీనిని వదిలేసి ఏవేవో మార్గాలు వెతుకుకుంటున్నారు!

 

ఒకసారి మరోసారి ఆగుదాం! ఇక్కడ 16 వచనంలో ఎవరిముందు అపరాదాలు ఒప్పుకోమన్నారు?

సంఘపెద్దల ముందు! 

మీ  మతగురువు ముందు, కన్ఫెషన్ షెల్ లో కాదు! ఒకరితో ఒకరు ఒప్పుకోండి! సంఘపెద్దల ముందు ఒప్పుకోండి! ధైర్యం ఉంటే నీ సంఘంలో అందరిముందు ఒప్పుకోండి! ఇదీ బైబిల్ చెబుతుంది!

అయ్యబాబోయ్! అలా ఒప్పుకుంటే నా పరువు ఏమవుతుంది? నా ఈగో దెబ్బతినదా??!!

నీ పరువు ఈగో తగలెయ్య!!!

ముందు నీవు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ పరువు- నీ ఈగో! ముందు నీవు పనికిమాలిన రోగంతో ఎంత బాధపడుతున్నావో, ఎంత కుల్లిపోతున్నావో ఎంతగా మూల్గుతున్నావో కదా, ఒక్కసారి ఒప్పుకుని విడిచిపెడితే ఎంతరిలీఫ్ గా ఉంటుందో ఒకసారి చూడు! జీవితాంతం రోగాలతో బాధపడే బదులు ఒప్పుకుని విడిచిపెట్టి స్వస్తత పొందుకోవడమే మంచిది!!!!

 

మరొకటి: సంఘపెద్దలు వచ్చి విశ్వాసంతో నూనెరాచి ఎవరి పేరున ప్రార్ధన చెయ్యాలి? ప్రభువు నామమున! అనగా సంఘపెద్దలలో ఏమీ శక్తిలేదు గాని ప్రభువునామములో యేసునామములో రక్షణ, విడుదల, శక్తి ఉంది కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని స్వస్తపరుస్తుంది! ఒకసారి అపోస్తలుల కార్యములో పేతురు యోహాను గార్లు ఏమన్నారు- మా స్వంత శక్తివలన మేము వ్యక్తిని బాగుపరచలేదు గాని మీరు సిలువ వేసినట్టి యేసునామము వ్యక్తిని స్వస్తపరచింది! అపొ 3:12--17

అవును అన్నింటికీ యేసునామము అనే అమృతపదము వాడండి! రోగాలు పోతాయి, దయ్యాలు పారిపోతాయి!

 

అయ్యా! ఇంత సులువైన టెక్నిక్ వదిలేసి- బేసిక్ వదిలేసి ఇక్కడికి అక్కడికి పరుగెత్తకు! అలా పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి- స్వస్తత పొందుకోలేని వారు వేలమంది ఉన్నారు!

సంఘపెద్దల ప్రార్ధనతో, నీ ప్రార్ధనతో సాధించలేనిది ఏమీ లేదు! పేతురుగారు చెరసాలలో ఉంటే సంఘము అత్యాశక్తితో ప్రార్ధన చేస్తే పరలోకమే కదిలిపోయి దేవుడే తనదూతను పంపించి విడుదల చేయించవలసి వచ్చింది!

ఇదీ ప్రార్ధనాబలం! చూడండి- ఇదే 17 వచనంలో ఏలీయా మనలాంటి వ్యక్తే కాని వాన కురువకూడదు అని ప్రార్ధన చేస్తే మూడున్నర సంవత్సరాలు వాన పడలేదు! మరలా వాన పడమని ప్రార్ధిస్తే వర్షం పడింది అంటున్నారు! ఏలీయా గారు మనలాంటి వ్యక్తే! మనలాగే భయము, ఆకలి ఉన్న వ్యక్తే! కాని ఆయనకు విశ్వాసము మరియు విశ్వాసముతో కూడిన ప్రార్దన ఉంది! అందుకే మూడున్నర సంవత్సరాలు వానను ఆపడమే కాదు! దేవున్నే ఇశ్రాయేలు ప్రజలకు చూపించగలిగారు ఏలీయా గారు! 1రాజులు 17,18 అధ్యాయాలు.

 

మరొకటుందండి!!! ఎవరైతే అలా స్వస్తతపొందలేదో అనగా సంఘపెద్దలను పిలువకుండా- తప్పులు అపరాదాలు ఒప్పుకోకుండా- ఇక్కడికి అక్కడికి పరిగెత్తి రోగాలు పోకుండా బాధపడుతూ ఉంటూ- ఉన్నవారికి- మధ్యన ఒక్క డైలాగ్ అలవాటు అయిపోయింది!! పౌలుగారికి దేవుడు ఎలా ముళ్ళు పెట్టాడో- నాకు కూడా ముళ్ళు పెట్టాడేమో- పోనీలే నాకు రోగం ఉండటం దేవుని చిత్తమేమో!!

ముళ్ళు లేదు చింతకాయ పచ్చడి లేదు!  పౌలుగారిలాగ ముళ్ళు పెట్టాడు అనడం ఫేషన్ అయిపోయింది! పౌలుగారికి కలిగిన ప్రత్యక్షతలు అనేకములు! ఆయన రాసిన పత్రికలలో అనేక విషయాలు దేవుని పాదాల దగ్గర నేర్చుకుని రాశారు, అసలు ఆయనకు ఎవరూ సువార్త ప్రకటించలేదు! యేసుక్రీస్తుప్రభులవారే స్వయంగా వెళ్లి సువార్త ప్రకటించుకుని రక్షించుకున్నారు! ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చారు! మూడో ఆకాశానికి వెళ్లి రహస్యమైన ఎన్నో సంగతులు చూసిన వ్యక్తి కాబట్టి ఇంకా ఎంతో గొప్ప సేవచేసి అలసిపోయిన వ్యక్తి కాబట్టి- దేవునికి ఇష్టుడైన వ్యక్తి కాబట్టి తానూ పొందిన ప్రత్యక్షతల విషయమై గర్వించి అతిశయించి దూరంగా వెళ్ళకుండా దేవుడే కావాలని ప్రేమతో ముళ్ళు పెట్టారు! మరి నీకు ఎన్ని ప్రత్యక్షతలు కలిగాయి, ఎన్ని వరాలు, ఎన్ని ఫలాలున్నాయి! ఎన్నిసార్లు మధ్యాకాశం, మూడో ఆకాశానికి వెళ్లివచ్చావు? ఎన్నిసార్లు పరలోకం వెళ్లి వచ్చావు!! ఇవేమీ లేకుండా పోనీలే దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు అంటూ పౌలుగారితో పోల్చేసుకుంటున్నావు!!

అవునండీ!! మధ్య ఇదే ఫేషన్ అయిపోయింది- కొన్ని కష్టాలు, కష్టాల మీద కష్టాలు వస్తే యోబు గారిలాంటి కష్టాలోచ్చేశాయి అంటున్నారు! కొన్ని శ్రమలు శోధనలు వస్తే పౌలుగారిలాంటి శ్రమలు హింసలు వచ్చేశాయి అంటున్నారు!

 

అమ్మా! అయ్యా! యోబుగారికి ఉన్న ఒంటెలు గాడిదలు గొర్రెలు పశువులు అన్నీ ఒకేరోజు చనిపోయాయి! నీకు ఎన్ని వందల పశువులు చనిపోయాయి?? యోబుగారి ముగ్గురు కూతుర్లు ఏడుగురు కుమారులు ఒకేరోజు చనిపోయారు! నీకు ఎంతమంది పిల్లలు చనిపోయారు! ఆస్తిమొత్తం ఒకేరోజు పోయింది- నీకు ఎంత ఆస్తిపోయింది! పౌలుగారు క్రీస్తునామము కోసం అనేకసార్లు కొరడాదెబ్బలు- బెత్తముల దెబ్బలు అవమానాలు తిన్నారు, ఊరినుండి ఈడ్చివేయబడ్డారు! బట్టలులేకుండా దిగంభరంగా ఉన్నారు! నీవు ఎన్నిసార్లు బట్టలులేకుండా దిగంబరత్వముగా ఉన్నావు? ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావు? ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నావు?

కాబట్టి చిన్న చిన్న రోగాలకు, చిన్న చిన్న శ్రమలకు పౌలుగారితోనూ యోబుగారి తోనూ పోల్చుకోవద్దు! అయ్యా నన్ను పౌలుగారి లాగ దావీదు గారిలాగా వాడుకో అని ప్రార్ధించు తప్పులేదు!

మరల గుర్తు చేస్తున్నాను: మన దేవుడూ తన పిల్లలెవరూ జబ్బులతోనూ అనారోగ్యాలతోను బాధపడాలని కోరుకోవడం లేదు! అన్ని విషయాల లోను సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు!

 

సరే,

దయచేసి బైబిల్ చెప్పిన స్వస్తత విధానము అనగా రోగము కలిగితే నీ సొంత సంఘపెద్దలను పిలిచి వారికి కొబ్బరి నూనె ఇచ్చి ప్రార్ధన చేయించుకొని స్వస్తత పొందుకో! ఎవరో ప్రార్ధన చేసిన నూనె కాదు! యెరూషలేము ఒలీవ నూనె అంతకంటే కాదు! నీదగ్గర ఉన్న నూనె నీ సంఘపెద్దలకు ఇచ్చి ప్రార్ధించమని చెప్పి- వారితోనే నూనె రాయించుకుని ప్రార్ధించి స్వస్తత పొందుకో! తప్పులు అపరాధాలు చేస్తే ఒప్పుకుని విడిచిపెట్టి పాపక్షమాపణ మరియు రోగ విడుదల రెండూ పొందుకో!

దైవాశీస్సులు!

*యాకోబు పత్రిక -64 భాగము*

యాకోబు 5:1920

19. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల

20. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.

 

   ప్రియులారా! మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తున్నాము.  ఐదో అధ్యాయంలో యాకోబు గారు ఒక పెద్దగా తండ్రిగా తన ముగింపు మాటలు పలుకుతున్నారు!

 

ప్రియ దైవజనమా! ఇక వచనాలలో మరో చివరి  ప్రాముఖ్యమైన అంశము రాస్తున్నారు!

మీలో ఎవడైనా కారణం వలన గాని సత్యము నుండి- అనగా మనము వెంబడిస్తున్న విశ్వాసపు సత్య మార్గము నుండి తప్పిపోయి బ్రష్టుడైపోతే అనగా మరలా పాత మతం లోనికి పోయినా, విశ్వాసం నుండి జారిపోయినా గాని, మరియొకడు వెళ్లి వానిమీద జాలిచూపి వానిమీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి, వానితో మాట్లాడి వానిని మరలా దేవుని సత్యములోనికి నడిపిస్తే విశ్వాసి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేకమైన పాపములను కప్పివేస్తున్నాడు అని తెలుసుకోండి అంటున్నారు!

 

అవును మనలో కూడా అనేకమంది తప్పిపోతూ ఉంటారు! పల్లెటూళ్ళలో అయితే చాలామంది వెళ్లి పరామర్శించి ఎందుకు రావడం లేదో కనుక్కుని తిరిగి మందిరానికి దేవుని దగ్గరకు రప్పించడానికి ప్రయత్నం చేస్తారు! గాని పట్టణాల్లలో ఇలా తీరిక ఎవరికీ ఉండదు! గాని అక్కడ కూడా ఎవరైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సత్యమునుండి మరలిన విశ్వాసిని మరలా సత్యమార్గములోనికి నడిపిస్తే అది అనేక పాపాలు కప్పినట్లు అంటున్నారు! అనగా అలా చెయ్యాలి అంటున్నారు యాకోబు గారు!

 

గమనించాలి- యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన నేల- విత్తనాల ఉపమానం ప్రకారం- కొంతమంది రక్షించబడి- కొన్నిరోజులు సత్యములో ఉంటూ మందిరమునకు వస్తారు. తర్వాత బహుశా ఐహిక విచారాల వలన గాని, లోకపు ధనాశ, లోకాశ, పాపము లాగుట వలన గాని, లేక క్రీస్తునామం కొరకు ఏర్పడ్డ శ్రమల వలన గాని చాలామంది తిరిగి విశ్వాస బ్రష్టులు అవుతుంటారు! కొంతమంది వారు ప్రార్దిస్తున్నవి పొందుకోలేనందువలన  అప్పుడు దేవుని నుండి దూరమైపోతూ ఉంటారు! ఇంకా కొందరు కొత్తగా ఆధ్యాత్మికముగా నూతనముగా జన్మించిన వారు ఉంటారు. కొందరు సత్యానికి అనుగుణంగా నడిచే వారుంటారు. కొందరు నడవలేక మార్గము నుండి తొలిగిపోయే వారు ఉంటారు .

1తిమోతి 1:6 లో అంటున్నారు: కొందరు వీటినుండి తొలిగిపోయి వట్టి ముసలమ్మ ముచ్చట్లు కు తిరిగారు అంటున్నారు!

1తిమోతికి 1: 6

కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,

1తిమోతికి 1: 7

నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.

 

2తిమోతికి 1: 15

ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.

 

ఇంకా ఇహలోకమును ప్రేమించి దేమా నన్ను వదలివెళ్ళిపోయాడు అంటున్నారు... దేమా ప్రేమించింది ధనాన్ని!

2తిమోతికి 4: 10

దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

 

1తిమోతి 6:10 లో కొంతమంది డబ్బును ప్రేమించి సత్యమునుండి తోలిగిపోయారు అంటున్నారు!...

ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

 

1తిమోతి 6:21

విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.

 

2తిమోతి 2:18

వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

చూడండి వీరు ఇక్కడ తప్పుడు బోధలకు తిరిగిపోయారు. ఇలాంటివారిని కూడా మరలా సత్యములోనికి నడిపించాలి.

 

2పేతురు 2:15 లో పేతురు గారు అంటున్నారు: బెయోరు కుమారుడైన బిలాము సత్యమార్గాన్ని వదిలివేసి తప్పుడు మార్గమునకు- ధన సంపాదన వైపు తిరిగాడు! చివరికి కుక్కచావు చచ్చాడు...

2పేతురు 2: 15

తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.

 

కాబట్టి ఇలా తిరిగిన వారు అనేకులు ఉన్నారు! ఇలాంటివారిని కలుసుకుని వారితో మాట్లాడి ఒప్పించి మరలా క్రీస్తుయేసు సత్యమార్గము లోనికి తీసుకుని రావాలి! కారణం యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అయి ఉన్నాను, నాద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేరు అన్నారు! కాబట్టి వ్యక్తి మార్గమునుండి తొలిగిపోయాడు కాబట్టి దారి తప్పాడు కాబట్టి దారి అతనిని నరకానికి మరణానికి తీసుకుని పోతుంది! ఎప్పుడైతే ఒకరు వెళ్లి వ్యక్తిని కలుసుకుని మాట్లాడి మరలా సత్యములోనికి నడిపిస్తారో వెంటనే వ్యక్తి మరలా సత్యమార్గములోని పరలోక మార్గము లోనికి వచ్చినట్లు! ఆత్మను నరకము నుండి మరణం నుండి జీవమునకు పరమునకు నడిపినట్లు అంటున్నారు!

 

ఇక్కడ చావు అనగా / మరణం అనగా ఆధ్యాత్మిక మరణం అని! దేవుని నుండి శాశ్వత ఎడబాటు అనే మరణం నుండి!

యోహాను 5:24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

ఎఫెసీ 2:1

మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

 

గనుక పాపపు మార్గము నుండి తప్పిస్తే అది నిజమైన అద్భుతకార్యం! ఇది జరిగినప్పుడు రక్షించబడిన పాపి యొక్క పాపాలు శాశ్వతంగా దేవుని కనుదృష్టి నుండి పూర్తిగా తొలిగించబడతాయి!

 

కాబట్టి ప్రియమైన విశ్వాసి! నీవు ఇలా దారి తప్పిపోయిన వారిని తప్పించావా?

ఇప్పటివరకు తప్పించలేక పోతే ప్రయత్నం చేయకపోతే ఇప్పటినుండి అయినా ప్రయత్నం చేసి అలాంటి వారిని మరణం నుండి జీవానికి నడిపిస్తావా?

దానియేలు గ్రంధంలో అంటున్నారు......

దానియేలు 12: 3

బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

+++++++++++++++++++++++++++++++

 

  ప్రియ దైవజనమా! యాకోబు పత్రిక ధ్యానముల నుండి దేవుడు మీతో మాట్లాడారని భావిస్తున్నాను! ఇందులో నేను వాడిన భాష కొంచెం బాధ కలిగించినా అందరికీ అర్ధమవ్వాలని- మిమ్మల్ని రేపి లోకమునుండి లోకాశలనుండి తప్పించి- క్రీస్తుతో సమాధాన పరచాలని విధమైన బాష వాడటం జరిగింది. ఎవరినైనా నొప్పిస్తే క్షమించమని మనవిచేస్తున్నాను! దయచేసి మాకోసం మా పరిచర్య కోసం, నా ఉద్యోగం కోసం, మా సంఘాల కోసం, మా వాట్సప్ మరియు ఫేస్బుక్ పరిచర్య కోసం, మా వెబ్సైట్ ద్వారా జరుగుతున్న పరిచర్య కోసం దయతో ప్రార్ధన చెయ్యండి! ప్రభువు చిత్తమైతే మరొక అంశముతో మరలా కలుసుకుందాం!

దేవుడు మిమ్మును దీవించి రక్షించును గాక!

ఆమెన్!

 

ఇట్లు

వందనములతో

మీ ఆత్మీయ సహోదరుడు

*రాజ కుమార్ దోనే*


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పక్షిరాజు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు