పోస్ట్‌లు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

చిత్రం
*యెషయా ప్రవచన గ్రంధము* *మొదటి భాగము-ఉపోద్ఘాతము-1*         ఒక యవ్వనస్తుడు రాజ ప్రసాదంలో ధ్యానిస్తూ నడుస్తున్నాడు! గతరాత్రి తండ్రి చెప్పాడు- *దేవుణ్ణి మనస్పూర్తిగా ప్రేమించి, ధ్యానించి, ప్రార్ధిస్తే, మనస్పూర్తిగా అడిగితే దేవుడు జవాబిస్తారు, మనకు కనిపిస్తారు, మోషేతో మాట్లాడినట్లు ముఖాముకిగా ప్రత్యక్షమవుతారు! ఇంకా మరింత పరిపూర్ణమైన అనుబంధం ఏర్పరచుకుంటే తన పరలోక రాజ్య ప్రత్యక్షత కూడా మనకు అనుగ్రహిస్తారు! దేవుణ్ణి ధ్యానించడం ప్రార్దించడం అంటే పనిపాటులు అన్నపానాలు మానేసి దేవుని మందిరంలో గడపడం కాదు- నిలబడినా కూర్చున్నా పనిచేస్తున్నా ఆయనను ధ్యానం చేస్తూ ఆయన ధర్మశాస్త్ర విధులను తలపోస్తూ, ఆయన మన జీవితాలలో ఇంతవరకు చేసిన ఘనమైన కార్యాలకు దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉండటమే*!!  ఈమాటలు తన మస్తిశ్కంలో మారుమ్రోగుతున్నాయి!  నిజంగా దేవుడు మాట్లాడే దేవుడే అయితే తాను చనిపోయే లోగా దేవుణ్ణి చూడాలి ఆయన పరలోక రాజ్య మహిమను ఈలోకంలోనే నేను చూడాలి అనుభవించాలి! అందుకే రాజ ప్రసాదంలో నడుస్తున్నా గాని ధ్యానం చేస్తున్నాడు! ఇంతలో దేవుని ఆత్మ ఆ యవ్వనస్తుని హృదయంలో తెలియని, ఎన్నడూ అనుభవించని చల్లని మెల్లని అనుభూతి