గీతములకు గీతము-2 (5--8 అధ్యాయాలు)
*గీతాలకు గీతము-పరమగీతము*
*88వ భాగము*
*నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని*
పరమగీతము 5: 1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని
నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత
ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము
చేయుడి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇంతవరకు 4 అధ్యాయాలలోనుండి అనేకమైన విషయాలు ధ్యానం చేశాము!
ఇక 5 వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి
బోధిస్తారో నేర్చుకుందాం!
ఇక
మొదటి వచనంలో ప్రియుడైన సోలోమోను అంటున్నాడు నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను
తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను.
నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా,
పానము చేయుడి.
ప్రియులారా! ఈ వచనం యేసుక్రీస్తుప్రభులవారి
యొక్క రెండవరాకడ తర్వాత జరిగే సన్నివేశమును సూచిస్తుంది!
నా సహోదరీ, ప్రాణేశ్వరీ అనుచు ఒకానొక దినమున ప్రియుడైన క్రీస్తు ప్రభువు ఉద్యానవనమునకు
అనగా వధువు సంఘమునకు వస్తారు. అలా వచ్చిన క్రీస్తు ప్రభువు అక్కడ ఆయనకు సంబంధించిన జటామాంసిని గంధవర్గములను
కూర్చుట చేయును. అనగా
జయించినవారిని వారి వారి వర్గములుగా విభజించుట చేయును. ఇలా ఏడు వర్గములుగ విభజిస్తాడు. ప్రకటన రెండవ, మూడవ అధ్యాయాలలో జయించిన వారిని ఏడు వర్గములుగా విభజించి వారికి జయించిన వర్గమును
బట్టి వారితో కూడ వారికి సంబంధమైన బహుమానముతో సత్కరిస్తాడు. అటుతరువాత అందరు కలిసి ప్రియుడైన
క్రీస్తు ప్రభువు ఇచ్చు విందులో పాల్గొనుట జరుగును.
ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి
తట్టుచున్నాను. ఎవడైనను
నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో
నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.'' ఇక్కడ మారుమనస్సు పొందిన అందరు అనగా ఆయనకు తమ హృదయములో చోటు ఇచ్చిన
వారందరు కలిసి భుజించుట జరుగును. అందుకే ప్రకటన
19:9, ''మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను-గొఱ్ఱెపిల్ల
పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు
దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.'' ఈ విందులో పాల్గొనువారు ధన్యులని వ్రాయబడింది.
కనుక వధువు సంఘములో ఉన్నవారికి
ప్రియుని రాక ఒక పండుగే. అందరిని వారి వారి క్రియలను బట్టి వర్గములుగా విభజించి వారిని సత్కరించి చివరకు
వారితోకూడ విందు చేయును. అక్కడ ఆయన ఇచ్చు తేనెను తియ్యటి తేనెపట్టును, పాలతో కలిపిన
పులియని ద్రాక్షారసమును పానము చేస్తారు.
అప్పుడు క్రీస్తు ప్రభువు వారినుద్దేశించి - నా వధువు సంఘములో ఉండి నాకు భార్యగా అనగా సాటి సహాయులుగా మారుచున్న విశ్వాసులారా
- ''తృప్తిగా భుజించమని పానము చేయమని చెప్పును.'' అని చెప్పుచూనే వారందరు ఆయనకు స్నేహితులు
అనగా సహోదరులు కనుక అది గుర్తు చేస్తూ ఇంకను పానము చేయమని ప్రేరేపించును. ఈ విధముగా క్రీస్తు ప్రభువు వధువుసంఘములో ప్రవేశించి విందును ఏర్పాటు చేయుట
వారు ప్రభువుతో కూడ అత్యానందము పొందుదురు.
ఇంకా
వివరంగా చూసుకుంటే రమ్మని ఆమె అనగా ప్రియురాలు ఇచ్చిన
ఆహ్వానాన్ని ఎంత త్వరగా ఆయన మన్నించాడో చూడండి. యెషయా 65:24, అన్నట్లుగా జరుగును. వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా
నేను ఆలంకిచెదను.
ఆమెతో
లేక సంఘముతో కలిసి ఉండడంలో ఆయనకెంత హాయి,
సంతృప్తి ఉన్నాయో చూడండి. యేసుప్రభువు తనకోసం ఎవరైతే
ఆశిస్తారో సిద్ధపడి ఉంటారో వారితో ముచ్చటించేందుకు తప్పక వస్తాడు (యోహాను 14:23, యేసు ఒకడు
నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి
వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము
చేతుము). సంఘంలో
తనతోబాటు తన స్నేహితులను ప్రేమికులనూ కూడా పాలుపంచుకొనేందుకు పిలుస్తాడు.
మరి
ప్రియ సంఘమా! నీవు ఆయన పిలుపును విని ఆయనతో ఆ విందులో
పాల్గొనడానికి సిద్దంగా ఉన్నావా?
ఎత్తబడతానికి
సిద్దంగా ఉన్నావా?
ఎత్తబడే
గుంపులో ఉండటానికి నీకు అర్హత ఉందా? అనగా నీ జీవితం లేక నీ ఆత్మీయ జీవితం సరిగా ఉందా?
నీ ప్రార్ధనా జీవితం నీ విశ్వాస జీవితం దేవునికి ఇష్టముగా ఉందా లేక ఆయాసకరంగా
ఉందా?
సరిచూసుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*89వ భాగము*
*నా సఖులారా, భుజించుడి లెస్సగా
పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి*
పరమగీతము 5: 1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని
నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత
ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము
చేయుడి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
మొదటి వచనంలో ప్రియుడైన సోలోమోను అంటున్నాడు నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను
తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను.
నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా,
పానము చేయుడి.
ప్రియులారా! ఈ వచనం యేసుక్రీస్తుప్రభులవారి యొక్క రెండవరాకడ తర్వాత
జరిగే సన్నివేశమును సూచిస్తుంది!
ఇక తర్వాత భాగము చూసుకుంటే ఇది మధ్యాకాశంలో జరిగే గొర్రెపిల్ల పెండ్లి
విందును సూచిస్తుంది ప్రియులారా! నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని
నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత
ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము
చేయుడి అంటున్నారు!
ప్రభువు రెండవరాకడలో మొదట సంఘాన్ని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారు! సిద్ధపడిన
వారు జయజీవితం జీవిస్తున్న వారు పరిశుద్ధతను సాక్షాన్ని కాపాడుకున్నవారు ఎత్తబడి మేఘాలమీద
మధ్యాకాశానికి కొనిపోబడి ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారిని కలుసుకుంటారు!
అక్కడ వారి ప్రతి భాషపబిందువును ప్రభువు తుడుస్తారు! అప్పుడే విందు జరుగుతుంది!
ఇది
మనకు 1
థెస్స 4: 16లో కనబడుతుంది! ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు
దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా
ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
ఇంకా 1 కోరింథీ 15: 51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము
గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర
మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.
52 బూర మ్రోగును; అప్పుడు మృతులు
అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
కాబట్టి
బూర స్వరము విని ఎత్తబడ్డ వారు మహిమ దేహాలతో మధ్యాకాశంలో ప్రవేశించి ప్రియుడైన యేసయ్యతో
ప్రేమ విందులో పాల్గొనబోతున్నాము!
నిజానికి కీర్తనాకారుడు ఎప్పుడో దీనిని
కోరుకున్నాడు 49: 15 దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి
ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)
కీర్తన 71 లో కూడా భక్తుడు ఆశిస్తున్నాడు
20 అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము
లేవనెత్తెదవు.
హొషేయా
భక్తుడు మృతులకు పునరుత్థానం ఉందని ముందే ఆత్మలో గ్రహించి అంటున్నారు ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయామెక్కడ
అంటూ 13:14!!!
కాబట్టి
మరణించిన వారిలో ప్రధమ ఫలముగా క్రీస్తు లేచారు అని నమ్మిన వారు ఆయన వలె పునరుత్థానం
పొంది మరణమును జయించి లేచి ప్రభువును కలుసుకుంటారు! దానిని ప్రభువు ముందుగానే చెప్పారు యోహాను 5 లో
25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఇదే
సత్యము మనము 6:40 లోనూ, 11:25 లో కూడా కనిపిస్తుంది! అందుకే పౌలుగారు నేను మృతుల పునరుత్థానం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పారు!
అయితే
ఈ జయించిన వారు మొదటగా ప్రభువును కలుసుకుంటారు! వారికే ఈ విందు! అయితే అక్కడ
తీర్పు కూడా ఉంటుంది! అయితే ఇది కేవలం బహుమతి ప్రధానం మాత్రమే
ఉంటుంది. ఎందుకంటే శిక్ష పడటానికి వారు పాపులు కాదు!
క్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధతను
పవిత్రతను భక్తిని కాపాడుకుంటూ జయజీవితం జీవించిన వీరికి జరిగే బహుమతి ప్రధానం మరియు
విందు మాత్రమే ఈ మధ్యాకాశంలో జరిగే గొర్రెపిల్ల పెండ్లి విందు!
అయితే
జయజీవితం లేకుండా సాధారణంగా బ్రతికిన వారు వెయ్యి సంవత్సరాల తర్వాత లేచి తీర్పులో పాల్గొని
మంచిగా బ్రతికితే పరలోకం,
ఎలాపడితే అలా జీవించిన వారికి నరకము కలుగుతుంది! అనగా వారివారి క్రియల చొప్పున తీర్పు-ఇది దవళ సింహాసన
తీర్పు!!
అయితే
మనము ఈ మధ్యాకాశంలో జరిగే విందుకోసం కొంత వివరంగా చూసుకుందాము
తర్వాత భాగములో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*90వ భాగము*
*నా సఖులారా, భుజించుడి లెస్సగా
పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి*
పరమగీతము 5: 1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని
నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత
ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము
చేయుడి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
మొదటి వచనంలో ప్రియుడైన సోలోమోను అంటున్నాడు నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను
తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను.
నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా,
పానము చేయుడి.
(గతభాగం తరువాయి)
మొదటగా మత్తయి 16:27
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు.
అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.
ఈ
వచనంలో రెండు అర్ధాలున్నాయి ప్రియులారా! మొదటగా లూకా 19వ అధ్యాయం
ప్రకారం ఎవరు చేసిన సేవా ఫలితము ప్రకారం వారికి మెప్పు కలుగుతుంది! పట్టణాల మీద అధికారం కలుగుతుంది!
ఇక
రెండవ అర్ధం గతభాగంలో చెప్పినట్లు దవళ సింహాసన తీర్పులో మనుష్యులు చేసిన ప్రతీ పనికి
పలికిన ప్రతీ మాటకు జవాబు చెప్పాలి. దాని ప్రకారం ఎవని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తారు
దేవుడు!
కాబట్టి
ఎవరి సేవను బట్టి, పరిచర్యను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తారు!
ఇక
మత్తయి 5:11—12 ప్రకారం: 11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి
మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు
మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను
హింసించిరి.
కాబట్టి
ప్రభువు కొరకు ఆయన సేవ కొరకు ఆయన మహిమ కొరకు జీవించినప్పుడు మన విశ్వాస జీవితంలో ఎదురైన
శ్రమలకు శోధనలకు మనము సహించిన విధానం బట్టి మనం ఫలము పొందుకోబోతున్నాము! అది మధ్యాకాశంలో గొర్రెపిల్ల
పెండ్లి విందులో ప్రియులారా! కాబట్టి శ్రమలను శోధనలను హింసలను
చూసి బెంబేలు పడిపోవద్దు! మన ప్రభువు ఇంకా ఆది అపోస్టలులు ఆదిమ
విశ్వాసులు అదే మార్గములో నడిచారు! మనము కూడా అదే శ్రమల బాటలో
పయనించాలి! ఆ తర్వాత దానికి పరలోకమందు మన ఫలము అనగా పరలోకంలో
మనము పొందుకోబోయే ఫలము స్వాస్థ్యం అధికమౌతుంది!
ఇక లూకా సువార్తలో 19 వ అధ్యాయంలో మనకు ఏసయ్య చెప్పిన ఒక ఉపమానం ఉంది.
దానిలో యజమానుడు అందరికీ ఒకే మీనా ఇస్తారు! అయితే
వారి వారి స్థాయిని బట్టి ఒకడు 10 మినాలు, మరొకడు 5 మినాలు మరొకడు రెండు మినాలు సంపాదిస్తాడు,
ఒకడు రుమాలులో చుట్టి భూమిలో పాతిపెడతాడు ఇది మన అందరికీ తెలుసు!
అయితే 10 మినాలు సంపాదించిన వానికి దేవుడు
10 పట్టణాల మీద అధికారిగా చేశారు! అలా వారి స్థాయిని
బట్టి అనగా వారి ఆత్మీయ విశ్వాస స్థాయిని బట్టి వారిని పట్టణాల మీద అధికారులుగా చేశారు!
కాబట్టి పెండ్లి విందు జరిగాక వేయేండ్ల పాలనలో దేవుడు మనకు ఇచ్చే అధికారం
హోదా అనేది ఈ పెండ్లి విందులోనే మనము పొందుకోబోతున్నాము ప్రియులరా! అందుకే ఇది బహుమతి
ప్రధానోత్సవము అంటున్నాను ప్రియులారా ఈ గొర్రెపిల్ల పెండ్లి విందు!!
ఇక కీర్తన 56:8 ప్రకారం మనము కార్చిన కన్నీరు దేవుని బుడ్డిలో
భద్రపరచబడి ఉంటాయి! ఇక ఆ ప్రార్ధనలు అన్నీ అంత్య దినాలలో పరలోకమందు
గల దేవుని నిజమైన బలిపీటము మందసము మీద గల అగ్నితో జత చేయబడతాయి. దేవుని సన్నిధికి జ్నాపకార్ధంగా చేరుతాయి! ఇప్పుడు ఆ
కన్నీటికి ప్రతిఫలము కూడా అదే మధ్యాకాశంలో పొందుకోబోతున్నాము మరియు దేవుని చేత ఆయన
ఒడిలో కూర్చుని మన ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచి వేస్తారు అక్కడ! అంతేకాకుండా కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతిఫలము అక్కడే దొరుకుతుంది
ప్రియులారా!
ఇక 2 తిమోతి 4:8 లో పౌలుగారు మంచి
పోరాటం పోరాడితిని నా పరుగు తుదముట్టించితిని విశ్వాసం కాపాడుకుంటిని ఇక నాకు నీతి
కిరీటం ఉంచబడింది అని చెప్పారు కదా తన సేవా ఫలితముగా, ఇంకా తన
విశ్వాసమును కాపాడుకున్నందుకు! ఆ ప్రతిఫలముగా పొందబోయే నీతి కిరీటం
గాని మరే కిరీటం గాని అన్నీ ఈ గొర్రెపిల్ల పెండ్లి విందులోనే పొందుకుంటాము ప్రియులారా!
సోలోమోను గారు చెప్పే ఆ విందు ఇదే!!!
కాబట్టి
ఆ విందులో పాల్గొనే కెపాసిటీ నీకుందా!!!
అట్టి
రీతిలో నీవు జీవిస్తున్నావా?
7 మంచి పోరాటము పోరాడితిని, నా
పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
8 ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది.
ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ప్రభువైన
యేసూ! రమ్ము!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*91వ భాగము*
*నా సఖులారా, భుజించుడి లెస్సగా
పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి*
పరమగీతము 5: 1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని
నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత
ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము
చేయుడి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
మొదటి వచనంలో ప్రియుడైన సోలోమోను అంటున్నాడు నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను
తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను.
నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా,
పానము చేయుడి.
(గతభాగం తరువాయి)
ఇక తర్వాత తేనేయు తేనె పట్టును నేను భుజించుచున్నాను- క్షీర
సహిత ద్రాక్షారసము అనగా పాలు కలిపిన ద్రాక్షారసము నేను త్రాగుతున్నాను, నా సఖులారా అనగా నా స్నేహితులారా భుజించుడి పానము చేయుడి అంటున్నారు!
మొదటగా స్నేహితులు ఎవరు?
రెండు తేనె తేనె పట్టు ఏమిటి?
క్షీర సహిత ద్రాక్షారసము ఏమిటి?
గమనించాలి! ప్రభువు ఇప్పుడు మధ్యాకాశంలోనికి వచ్చేశారు!
సంఘము ఎత్తబడింది! ఇప్పుడు ప్రభువు తన ప్రియురాలైన
వధువు సంఘముతో ఉన్నారు! అప్పుడు మధురమైన తియ్యగా ఉండే తేనె మరియు
తేనె పట్టు తింటే ఇంకా మధురముగా ఉంటుంది!
అయితే సఖులు ఎవరు అంటే బైబిల్ పండితుల మొదటి అర్ధం: సంఘమే!
రెండవ అర్ధం: తండ్రి కుమార పరిశుద్దాత్ములు-
ఇప్పుడు కుమారుడు అంటున్నాడు గనుక- తండ్రి మరియు
పరిశుద్దాత్ముడు అనేది రెండవ అభిప్రాయం!
మూడవ అభిప్రాయం: 24 గురు పెద్దలు- నాలుగు జీవులు అనేది కూడా మరో అభిప్రాయం!
దీనికి ఇంకా లోతుగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోవద్దు! బైబిల్
ఇంతకంటే లోతుగా చెప్పడం లేదు కాబట్టి Better to Stop Where Bible Stops!
దీనికి
ముందు వచనము అనగా 4:16 లో ప్రభువు తనకు ఇష్టమైన ఫలాలు భుజిస్తారు అని చూసుకున్నాము! 2:3 లో ప్రభువు ఇచ్చే ఫలమును షూలమ్మితి భుజించినట్లు చూడగలము!! అనగా ఇక్కడ ప్రభువు నొద్ద మనం పొందుకునే వరములు ఫలములు అని అర్ధం! అంతేకాకుండా ఎత్తబడిన వారు పెండ్లి విందులో తినబోయే పొందుకొన బోయే భాగ్యాలే
ఈ తేనె తేనెపట్టు! ఇంకా ఆ జీవజలములు మరియు జీవ వృక్ష ఫలములు అని
అర్ధము ప్రియులారా!
సరే ఇక్కడ ప్రజలు లేక సంఘము ఆయనతో చేసే అన్నపానాదులు ఇవి! ఇవి మామూలు బోజనము కానేకాదు
ప్రియులారా! మత్తయి 26:29 లో ఒకమాట అంటున్నారు
ప్రభువు: 29 నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము
క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.
ఇది ప్రభువు సంఘముతో కలిసి చేసే ఆరాధనగా కనిపిస్తుంది! తనకిష్టమైన ప్రజలు తనకు
ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తూ ఉంటే అక్కడే ఉన్న ప్రభువు పరవశమై పోవడమే ఇది! దానికి సాధ్రుష్యమైన ప్రభు సంస్కారమును అనేకులు తమ బ్రతుకులు సరి లేనందున తినడం
మానేస్తున్నారు! తద్వారా దేవుని ప్రభావమును పొందుకోలేక పోతున్నారు!
మరికొందరు ఏదో ఆచారంగా మొదటి ఆదివారం నాడు వచ్చి సరియైన సిద్దపాటులేకుండా
అది ప్రభువు శరీరమని కొంచెమైనా ఆలోచన లేకుండా గర్విశ్టులై సంస్కారము తీసుకుంటున్నారు
తమకు శాపమును కొని తెచ్చుకుంటున్నారు!
ప్రకటన 19:9 లో 9 మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు
ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో
చెప్పెను.
మరి
ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన యోగ్యత నీకుందా!! ఆ పరిశుద్ధత విశ్వాసము
పరిశుద్దాత్మ క్రియలు నీలో ఉన్నాయా!?
ఇక ప్రభువు నా స్నేహితులారా రండి పానము చేయుడి నాతో పాటు తినండి అంటున్నాడు
ప్రభువు! మరి ఆ పిలుపును విని నీవు ఆయనతో విందు ఆరగించడానికి వస్తావా? మత్తయి సువార్తలో కొందరిని విందుకు ఆహ్వానిస్తే వారు సాకులు చెప్పి రావడం మానేశారు!
అప్పుడు దేవుడు వీదులలో ఉన్నవారిని రమ్మని చెప్పారు- అందుకే పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచ బడిన వారు కొద్దిమందే అన్నారు దేవుడు!
మరి ఆ ఏర్పరచబడిన గుంపులో నీవున్నావా?
ప్రకటన 3:20 లో 20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను
నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో
నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. మరి ఈ పిలుపును విని
నీ హృదయపు ద్వారము తెరచి ఆయనను ఆహ్వానిస్తావా? ఆయనతో బోజనం చేస్తావా?
ఇక
ప్రకటన 17 వ అధ్యాయములో చూసుకుంటే
14 వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై,
నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
ప్రియ
సహోదరి సహోదరుడా!! మరి ఈ పిలువబడిన వారి గుంపులో ఏర్పరచబడిన వారి గుంపులో నీవున్నా గాని ఇప్పుడు
నమ్మకమైన వారి గుంపులో నీవున్నావా?
ప్రాణం
పోయేంతవరకు నీతోనేనయా అని పాటలు పాడేస్తున్నావు గాని ప్రాణము పోయేటంతగా శ్రమలు శోధనలు
ఎదురైతే దానియేలు భక్తుని వలె అజర్యా మిషాయేలు హనన్యా వలె- ఆది అపోస్టులుల వలె మరణాన్ని
కూడా లెక్కచేయకుండా దేవునితోనే నడిచారు! మరి నీవు ఆ గుంపులో ఉన్నావా?
ఏ గుంపులో ఉంటివో ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి
తెలుసుకో
జాగు చేయక వేగ మేలుకో ||ఏ గుంపులో||
మరణమనెడి మొదటి గుంపుమారని గుంపు –
నిర్జీవపు గుంపు దురాత్మ బలముతో తిరిగెడి గుంపు ||ఏ గుంపులో||.
. . . . . . . .
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*92వ భాగము*
*నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది*
పరమగీతము 5: 2. నేను నిద్రించితినే గాని నా
మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము
నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
రెండవ వచనంలో ఇప్పుడు ప్రియుడు సోలోమోను
చెప్పిన మాటలకు ప్రియురాలు షూలమ్మితి జవాబు చెబుతూ తనకు ఎదురైన అనుభవం పంచుకుంటుంది!
నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ,
నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు
రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు
వాకిలి తట్టుచున్నాడు.
గమనించాలి!
ప్రియుడు షూలమ్మితి దగ్గరకు వచ్చాడు! అప్పుడు షూలమ్మితి
మంచము మీద పడుకుంది, మనసు మేలుకుని ఉంది అట! ఈ సమయంలో ప్రియుడు వచ్చి పిలుస్తున్నాడు ఏమని? నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా,
ఆలంకిపుము నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు
తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
మరో దృశ్యం, మరో సమయం. ఆమె రాత్రివేళ
ఒంటరిగా ఎక్కడో ఉండగా వరుడు వచ్చి ఆమెను పిలిచాడు. అతను దూరం
నుంచి ప్రయాణం చేసి వచ్చాడు. లేదా బయట చాలా సేపు నిలబడ్డాడు – మంచువల్ల
అతని తల తడిగా ఉంది. ఏవిధంగా చూచుకొన్నా అతని ప్రేమ అర్థమౌతూనే
ఉంది. అతడు వచ్చినందువల్ల ఆమె మురిసిపోయింది గాని లేచి తలుపు
తీయడానికి ఏమంత ఇష్టం ఉన్నట్టు లేదు (వ 3). ఆలస్యం చేస్తూ ఉంది. మొత్తానికి ఎలానో లేచినప్పుడు కూడా
తన గురించి పట్టింపే గాని అతని విషయం ఎక్కువగా ఆలోచించడం లేదు (వ 5).
ఇంతకుముందు
కూడా ఆమెలో ఈ పొరపాటు కనిపించకపోలేదు (పరమగీతము 1:5, , పరమగీతము
1:12, ; పరమగీతము 2:1, ).
ఆమె
జాగు చేయడం, తానంటే పెద్దగా ఆసక్తి చూపకపోవడం అతనికి బాధ కలిగించి అతను వెళ్ళిపోయాడు
(వ 6).
క్రీస్తు తనకోసం అభిలాష లేని చోట ఎంతో
కాలం నిలిచి ఉండడు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో అతనికీ క్రీస్తుకూ
మధ్య సహవాస బంధం తెగిపోయిందంటే అందుకు కారణం క్రీస్తు ఎంత మాత్రం కాదు. సహవాసం కోసం ఎంత దూరమైనా ఆయన వస్తాడు. సహనంతో వేచి ఉంటాడు.
అయితే తలుపు తీసేందుకు అయిష్టత, నిర్లక్ష్యం
(ఇది ఆరంభ ప్రేమ అంతరించిందని సూచిస్తుంది) ఆయనకు
బాధ కలిగిస్తుంది. స్వంత వ్యవహారాల్లో మునిగి ఉన్న స్థితి ఆయనతో
సహవాసానికి అడ్డుపడుతుంది. తన ప్రేమలో యేసుప్రభువు మనలను పిలిచేది
మనం బద్దకంగానూ మన అందాలను మనం చూసుకుని మురిసిపోయే ధోరణిలోనూ ఉండాలని కాదు.
మనకు అబ్బిన దేవుని కృప, ఉచిత వరాలు మనల్ని మనం
చూచుకొంటూ చంకలు కొట్టుకునేందుకు కాదు. ఆయన సన్నిధే మరీ మరీ కావాలని
కోరేవారికీ, ఆ కోరికను వెల్లడించే వారికీ అది తప్పక దొరుకుతుంది.
ప్రేమించే ప్రతి వ్యక్తీ తాను ప్రేమించిన వ్యక్తీ అదే విధంగా తనను ప్రేమించాలని
కోరడం సహజమే కదా
పరమగీతము 8:6-7, 6 ప్రేమ మరణమంత బలవంతమైనది
ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల
నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.
7 అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు
దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.;
మత్తయి 22:37, అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను
నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే.
మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం
ఏమంటే మన సావకాశం, మన సుఖం గురించి చూచుకోవడం కాకుండా కేవలం క్రీస్తునే
సంతోష పెట్టే విధంగా ఆయన్ను ప్రేమించాలి.
ఒకవేళ
ఇలాంటి నిర్లక్ష్య దోరణి నీలో ఉంటే నీవు కూడా విడిచిపెట్ట బడతావు జాగ్రత్త!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*93వ భాగము*
*నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది*
పరమగీతము 5: 2. నేను నిద్రించితినే గాని నా
మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము
నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
రెండవ వచనంలో ఇప్పుడు ప్రియుడు సోలోమోను
చెప్పిన మాటలకు ప్రియురాలు షూలమ్మితి జవాబు చెబుతూ తనకు ఎదురైన అనుభవం పంచుకుంటుంది!
నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ,
నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు
రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు
వాకిలి తట్టుచున్నాడు.
(గతభాగం తరువాయి)
ఇక
మరో కోణంలో చూసుకుందాం ఈ రోజు!
ప్రకటన
3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన
యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.'' ఇలా ప్రియుడైన క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరి హృదయమనే తలుపును
తీయుమని తట్టుచున్నాడు. ఇలా తట్టుచున్నట్లుగా ఇప్పుడు చెప్పుచున్నది
ప్రియురాలైన వధువు సంఘము అనగా విశ్వాసులమైన మనమే అంటే ప్రియుని పిలుపును విశ్వాసులు
గుర్తించారు. ఆయన తట్టుచున్న సంగతిని గుర్తించారు. అంతేకాదు తట్టుచూ క్రీస్తు ప్రభువు
ఏమి చెప్పుచున్నాడో తెలుసుకొందము.
''నేను నిద్రించితినేగాని నా మనస్సు మేలుకొని యున్నది,'' అంటే క్రీస్తు
ప్రభువు నశించినవారి కొరకు వారిలో సువార్త బీజమును విత్తుట కొరకు నిరంతరము ఆయన మనస్సు
ఆలోచిస్తూ మేలుకొని యున్నది. కనీసము నిద్రించినప్పుడు కూడ ఆయన
మనస్సు ఎవరిని ఎలా నిజదైవములోనికి రక్షణలోకి వచ్చుటకు ప్రేరేపించాలి? ఎవరు తననుగూర్చి నిజాన్ని పరిశోధించుటకు
మొదలుపెట్టారు అను సంగతులను ప్రతి క్షణము ఆయన మనస్సు మేలుకొని ఆలోచిస్తూ పరిశోధిస్తున్నట్లుగా
మనము గ్రహించాలి. ఆ కారణము
చేతనే విశ్వాసిగా మారాలని నిజదైవమును పరిశోధించాలన్న తలంపుతో పరిశోధించువారికి ప్రతినిత్యము
వారికి సహకరిస్తూ చివరకు తన వద్దకు చేర్చుకొంటారు కనుకనే ఆయన నిద్రించినను ఆయన మనస్సు
నల్లనిదియైన బబులోనులోని నరులలో మార్పు కోసము వారిని విశ్వాసులుగా మార్చి సీయోనులో
తరువాత పరమ యెరూషలేములో చేర్చుట కొరకు పరితపిస్తున్నట్లుగా గ్రహించాలి. ఇలా ప్రియురాలికి ప్రియుడైన క్రీస్తు ప్రభువు చెప్పుచూ - నా సహోదరీ, నా ప్రియురాలా అని సంబోధిస్తున్నాడు. అంటే మనమందరము ఈ భూమిమీద పుట్టిన
ప్రతి ఒక్కరు తనకు సహోదరులే. వీరంతా మారుమనస్సు పొంది వధువు సంఘములో పాలు పంపులు కలిగినట్లయితే వారు ఆయనకు
సహోదరిగాను ప్రియురాలుగాను మారుతారు.
అంటే ఈ వచనము విశ్వాసులు వధువు గాను లేక భార్యగాను మారినప్పటిది
కాదు. ఆయనకు ప్రియురాలుగా
ఉన్నప్పుడు జరుగు సంఘటనలతో వ్రాసిన వాక్యము. ఇంతకు ముందు నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ అన్న సంబోధన వేరు.
ఇందులో భార్యను పిలిచిన పిలుపు కనబడుతుంది. కనుక విందుతో ఆ పిలుపును ముగించి
మరల ప్రియురాలుగా సంఘము ఉన్నప్పుడు తాను ప్రియునిగా పడ్డ కష్టమును ఈ సందర్భములో క్రీస్తు
ప్రభువు గుర్తు చేస్తున్నారు.
ఇలా గుర్తు
చేస్తూనే - సంఘములో క్రియ జరిగించు పరిశుద్ధాత్మను సంఘముతో కలిపి
ఉచ్ఛరిస్తూ - ''నా పావురమా, నిష్కళంకురాలా,
ఆలకింపుము,'' అని చెప్పుచున్నారు. పరిశుద్ధాత్మ పావుర రూపములో వారిలో
క్రియ జరిగించితేనే సంఘమునకు నిండుదనము ఆశీర్వాదము. సంఘములో చేరువారిని పరిశుద్ధాత్మ
పావుర రూపములో వారిని చేరి వారిని నిష్కల్మషముగా మార్చుట ద్వారా సంఘమును పరిశుద్ధముగా
ఉంచుట కళంకము లేకుండ ఉంచుట జరిగింది.
కనుకనే క్రీస్తు ప్రభువు దేవుని శక్తియైన పరిశుద్ధాత్మతో నిండిన
సంఘమును నా పావురమా, నిష్కళంకురాలా అని సంబోధించుచు నేను చెప్పునది
ఆలకించుమని చెప్పుచున్నారు. విశ్వాసిగా మారువారు మారుమనస్సు పొంది బాప్తిస్మము ద్వారా సంఘములో చేరుచున్నారు. సంఘములో చేరి నీతి మార్గములో ఎదిగినవారు
పరిశుద్ధాత్మకు నిలయమై అనేక క్రియలు మహత్కార్యాలు సూచక క్రియలు జరిగిస్తున్నారు. ఇలాంటి వారితో నిండుట వలన సంఘము కళంకము
లేనిదిగా ఉంటుంది. కాని
ఒక పాపి విశ్వాసిగా మారుటకు మన ప్రియుడైన క్రీస్తు ప్రభువు అనేక బాధలకు ఓర్చినట్లుగా
ఈ వచనములో మనకు అర్థమగుచున్నది.
అలాగే మన హృదయమనే
తలుపు బయట ఆయన ఉండి తట్టుట వలన ఆయన వెలుపల ఉండుట వలన రాత్రి మంచుకు చినుకులకు ఆయన తడిసినట్లుగా
చెప్పుచున్నారు అంటే ఆయన నిత్యము అనగా చలికాలము వర్షాకాలము అన్న తేడా లేకుండ ప్రతినిత్యము
ఆయన మనకోసము మన హృదయమనే తలుపును తట్టుచూనే ఉన్నారు.
ప్రకటన 3:15-16, ''-నీ క్రియలను నేనెరుగుదును,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను
వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు
గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.'' చలికాలము చల్లనిదానికి వర్షాకాలము నులివెచ్చని జీవితములో ఉన్నదానికి
సూచనగా ఉన్నది. ఈ రెండు స్థితులలో జీవించువారి హృదయమనే
తలుపును తెరుచుటకు తట్టుచున్నట్లుగా చెప్పబడింది అలాంటి వారి కోసము తాను నిద్రించుచున్నను
ఆయన మనస్సు మేలుకొని యున్నది. అంతేకాదు, ఎవరికొరకు ఆయన మేల్కొని వారి హృదయమనే తలుపు
తట్టాడో వారు తలుపు తీయనప్పటికి, వారిలోని పాపపు జీవితము నులివెచ్చని
జీవితము రెండును మంచుగాను, చినుకులుగాను వచ్చి ఆయన తలను,
వెండ్రుకలకు అంటుకొనుచున్నట్లుగా చెప్పుచున్నారు. అంటే మనము నిజదైవమును గుర్తించి ఆయన
యందు బాప్తిస్మము పొంది రక్షణలోకి వచ్చామని ఆనందించుచున్నాము. కాని మనము రక్షణలోకి వచ్చునప్పటికి
మనలోని పాపపు జీవితాన్ని క్రీస్తు ప్రభువు ప్రక్షాళన చేస్తున్నట్లుగా మనము గుర్తించాలి. అలా ప్రక్షాళన చేయునప్పుడు మన జీవితమను
వస్త్రమును క్రీస్తు ప్రభువు రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకొంటున్నారు. ఈ పాపపు జీవితము ఆయన తలకు వెండ్రుకలకు
ధూళి మరకలుగాను మంచుగాను చినుకులుగాను అంటుకొను చున్నవి. అందుకే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ
క్రీస్తు ప్రభువు మన పాపములను ఆయన భరించెనని వ్రాయబడింది. దీనిని భరించుటకు క్రీస్తు ప్రభువు
సిలువపై నలుగగొట్టబడినట్లుగా వ్రాయబడింది.
ఇలాంటి సంగతులను పరిశుద్ధాత్మ పావురము రూపములో ఉండగా కళంకము లేని
స్థితిలో ఉన్న తన ప్రియురాలైన సంఘమునకు క్రీస్తు ప్రభువు తాను పొందిన కష్టమును,
తాను ఆమె కోసము నిద్రించినను మనస్సు మేలుకొని ఉన్న సందర్భాలను గుర్తు
చేస్తున్నారు. కనుక విశ్వాసిగా
మారిన ఓ నరుడా! మరల పాపము
చేసి నీ రక్షకుని కష్టపెట్టవద్దు.
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*94వ భాగము*
*నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు*
పరమగీతము 5: 2. నేను నిద్రించితినే గాని నా
మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము
నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
రెండవ వచనంలో ఇప్పుడు ప్రియుడు సోలోమోను
చెప్పిన మాటలకు ప్రియురాలు షూలమ్మితి జవాబు చెబుతూ తనకు ఎదురైన అనుభవం పంచుకుంటుంది!
నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ,
నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు
రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు
వాకిలి తట్టుచున్నాడు.
(గతభాగం తరువాయి)
ఇప్పుడు ప్రియుడు తలుపు తట్టుచున్నాడు నాకు తలుపు తీయు అంటూ!! సంఘములో అందరికీ ప్రభువు
అంటే ఇష్టమే! ఆయనకోసం జీవించాలి అని ఉంటుంది! గాని ఆయన కార్యాలను ఆశ్రద్దగా చేసేవారు చాలామంది ఉన్నారు! సువార్త ప్రకటించాలి అంటే కొంతమందికి భయము! కొంతమందికి
మొగమాటం! మరికొంతమందికి దురభిమాన పాపం! మరికొంతమందికి అశ్రద్ద! ప్రార్ధన చేయమంటే బద్ధకం అశ్రద్ద!
దేవునికివ్వాలంటే అశ్రద్ధ! ఇలా ఆశ్రద్దగా బద్దకంగా
ఉంటున్న హృదయాలను ఇప్పుడు నాకు తలుపు తీయు! నేను లోపలికి వస్తాను
అంటు తలుపు తట్టుచున్నారు ఆయన!
ప్రకటన గ్రంధము 3 వ అధ్యాయములో అంటున్నారు
20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు
వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
కాబట్టి ఈ సంఘము పరమ చెత్త సంఘముగా కనిపిస్తుంది. పేరుకు క్రైస్తవులు గాని
దాని శక్తిని ఆశ్రయించకుండా లోకస్తులతో కలిసిపోయి ఉన్నారు! దేవుడు
బుద్ధి చెప్పాక అంటున్నారు ఒరేయ్! I Love You so much ra! నాకు
నీవు తలుపు తీయు! నేను లోపలికి వస్తాను అంటున్నారు! ఏడు సంఘాలలో ఏ సంఘమును అంతగా తిట్టలేదు దేవుడు! కేవలం
ఈ సంఘమునే తిట్టారు! చివరకు ఏ సంఘమును కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అనలేదు! ఈ లవోదొకయ సంఘానికి మాత్రమే దేవుడు ఐ లవ్ యు చెప్పారు!
చెప్పి నా తలుపు తీయు అంటున్నారు! ఒకవేళ నీవు కూడా
అదే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను గద్ధిస్తూ ఉంటే విని మారుమనస్సు పొంది ఆయనకు తలుపు
తీయు! దేవుడు నీ గృహము లోనికి వచ్చి నీతో కలసి బోజనం చేయాలని
నీతో ముచ్చటించాలని నీకు తన ఆశీర్వాద ఐశ్వర్యాలు అన్నీ ఇవ్వాలని ఆశిస్తున్నారు!
మరి తీస్తావా తలుపు!!!
యెషయా 32:9 ప్రకారం దేవుడు ఎన్నోసార్లు
వారి హృదయాలు తట్టారు కానీ వీరు తలుపు తీయలేదు! ఎందుకు తీయలేదు
అంటే వీరికి సుఖాసక్తి ఎక్కువ!! అందుకే రక్షణ పొందలేక పోయారు!
ఒకవేళ నీకు కూడా సుఖాసక్తి లగ్జరీల మీద మనస్సు ఉంటే దేవుని మాటలు వినలేవు!
ఈ రోజుల్లో అనేక సంఘాలలో విశ్వాసులు లగ్జరీలకు అలవాటు పడి తమ మంచాలను విడువలేక సంపూర్ణ రాత్రి
ప్రార్ధనకు ఉపవాస కూటములకు రావడం లేదు! ఇలాంటి వారినే అంటున్నారు
మీ సుఖాసక్తి వదిలేయ్ లేకపోతే ఆయుదదారుడు వచ్చేటట్టు కీడు నాశనం నీ మీదికి రాబోతుంది!
దేవుని స్వరాన్ని విని నీ సుఖాసక్తి వదులుతావా మరి!!!
యెషయా 64:7 లో వారు దేవుని రక్షణను నిర్లక్ష్యపెట్టారు!
ఆయనకు మొర్రపెట్టేవారు లేరు! దేవుణ్ణి ఆధారం చేసుకుని
ఆయనకోసం కనిపెట్టే వారు లేకపోయారు! ఆయనకు ప్రార్ధించే వారు లేకపోయారు!
అందుకే దేవుడు వారికి కనబడకుండా తన ముఖమును దాచుకున్నారు!
ఆమోసు 6:1 ప్రకారం: వారు దేవుని కార్యాలంటే పట్టించుకోకుండా నిర్విచారముగా ఉన్నారు! సంఘము పాడైపోతూ ఉంటే పట్టించుకునే వారు లేరు! సంఘములో
విశ్వాసులు వ్యభిచారులై పోతూ ఉంటే పట్టించుకునే వారు లేరు! సరిచేసే
వారు లేరు! మందిరము శిధిలమై పడిపోయే విధంగా ఉంటే మందిరమును కట్టేవారు
గాని రిపేర్ చేసేవారు కనబడటం లేదు!
ఆయనకోసం కనిపెట్టే వారు లేరు! యెహోవా కార్యమును
ఆశ్రద్దగా చేయువారు శాపగ్రస్తుడు అంటున్నారు యిర్మీయా గారు!!! 48:10
జెఫన్యా 1:12 ప్రకారం చాలామంది దేవుడు ఏమి
చేస్తాడు! ఆయన మేలైనను కీడైనను విచారించడు అంటూ గర్విష్టి మాటలు
పలుకుతున్నారు! వీరిని దేవుడు శిక్షిస్తారు!
మత్తయి 22 వ అధ్యాయంలో దేవుడు తన కుమారుని
పెండ్లి విందుకు పిలిచారు కానీ వారు వెళ్లలేదు! సాకులు చెప్పారు!
మరికొంతమంది ఆయన సేవకులను తిట్టారు అపహసించారు! మరికొంతమందిని చంపారు! అందుకే వారిని సంహరించారు దేవుడు!
మత్తయి 24:12 లో ఆక్రమము విస్తరించి అనేకుల
ప్రేమ చల్లారిపోయింది! ఈరోజు సంఘాలలో కూడా ఆక్రమము విస్తరించి
సంఘములో దేవుని ప్రేమ గాని సహోదర ప్రేమ గాని లేదు! చల్లారిపోయింది!
అందుకే ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు! మరి నీవు వీటిని
సరిదిద్దగలవా! క్రీస్తుకోసం బ్రతుకుతావా!! సరిచేయవలసిన వాటిని సరిచేస్తావా?
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*95వ భాగము*
*నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు
తడిసినవి*
పరమగీతము 5: 2. నేను నిద్రించితినే గాని నా
మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము
నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఇక
రెండవ వచనంలో ఇప్పుడు ప్రియుడు సోలోమోను
చెప్పిన మాటలకు ప్రియురాలు షూలమ్మితి జవాబు చెబుతూ తనకు ఎదురైన అనుభవం పంచుకుంటుంది!
నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా,
ఆలంకిపుము నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు
తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * *
మరిన్ని
భాగములకు, శీర్షికలకు సంప్రదించండి
Facebook
page “యేసుక్రీస్తు అందరికీ ప్రభువు”,
https://www.facebook.com/share/18KPDoLwfe/
. . . .
https://adhyatmikasandeshalu.blogspot.com/
Website:
ఆధ్యాత్మిక సందేశాలు 👆👆
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * *
(గతభాగం తరువాయి)
ఇప్పుడు దేవుని రక్షణను అశ్రద్ద చేసిన యూదులతో మాటలు అంటున్నారు దేవుడు! నా తల మంచుకు తడిసిపోయింది!
తొందరగా తలుపు తీయు!! ఇశ్రాయేలు దేశంలో రాత్రిపూట
మంచు ఎక్కువగా కురుస్తుంది! అందుకే ఆ మంచుతోనే పంటలు పండుతాయి
అని ఇశ్రాయేలు దేశంలో పనిచేస్తున్న స్నేహితులు చెప్పారు నాకు! ఇప్పుడు అదే మంచుకు ప్రియుని తల తడిసిపోతుంది! యూదా సంఘమును
దేవుడు ఎంతగానో ప్రేమించాడు! అందుకే నా సహోదరి అన్నారు దేవుడు!
శరీరమును బట్టి క్రీస్తు వారిలో నుండి పుట్టారు కాబట్టి నా సహోదరి అని
పిలుస్తున్నారు ఇక్కడ! అయితే ఒకరోజు వివాహం చేసుకోబోతున్నారు
అందుకోసం ఆయన తన ప్రాణము కూడా పెట్టారు ఎంతో ప్రేమించారు అందుకే నా ప్రియురాలా అని
పిలుస్తున్నారు! అవిధేయులై మెడవంచని తరము వారికోసం దినమెల్ల చేతులు
చాచి పిలుస్తున్నారు! ఎంతగా ఎదురు చూస్తున్నారు అంటే ఆయన తల మంచుకు తడిసిపోతున్నా తలుపుతీస్తుంది
కదా అని ఎదురుచూస్తున్నారు!
ఈ
మంచుకోసం ధ్యానం చేస్తే:
ఆదికాండం 27:28 లో ఆకాశపు మంచు
అన్నారు 28 ఆకాశపుమంచును భూసారమును
విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక!
ఈ మంచు ఆకాశము నుండి వచ్చినట్లు పరలోకం నుండి దిగివచ్చిన వాడు మన ప్రభువు!
ఆకాశపు మంచు భూమియొక్క సారముతో కలిసి
పంటలు ఎంతో బాగా పండుతాయి! ఆదేవిదంగా ప్రభువైన యేసు పరలోకం నుండి దిగివచ్చి మనకు మేలు కలుగజేశారు!
పరలోకపు మంచు అనే పరిశుద్దాత్మ దేవుడు మోడుబారిపోయిన మన జీవితాలను వెలిగిస్తున్నారు!
ఇక ఇదే మంచు ఇశ్రాయేలు జాతికి అరణ్యంలో 40 సంవత్సరాలు
పోషించింది మన్నా రూపములో!!! నిర్గమ 16:13 ప్రకారం! అలాగే పరిశుద్దాత్మ దేవుడు కూడా నిన్ను పోషించగలడు
నిన్ను నడిపించ గలాడు నిన్ను ఆదరించగలడు!
ఇక మోషే గారు దీవిస్తున్నారు ద్వితీ 33:28 లో:
28 ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు
ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.
ఇక్కడ శాశ్వతుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలమీదికి ఆకాశపు మంచు
కురిపిస్తారు అంటూ! అదే ఆకాశపు మంచు పెంతుకొస్తు దినాన ఇశ్రాయేలు దేశం
మీద ఇశ్రాయేలు ప్రజలమీద
అనగా ఆది అపోస్టలుల మీద కురిసింది! పరిశుద్దాత్మ దేవుడు దిగివచ్చాడు!
సంఘము కట్టబడింది! పెంతుకొస్తు అనే తొలకరి వర్షమును
అనుభవించారు వారు!
రాజులు 17:1 లో మీ మీద మంచు గాని వర్షము
గాని పడదు అని ఏలీయా గారు చెప్పి వెళ్లారు! అలాగే మూడున్నర సంవత్సరాలు
మంచు గాని వర్షం గాని పడలేదు! అలాగే ఏ సంఘము మీదగాని ఏ వ్యక్తి మీద గాని ఏ దేశంలో గాని ఏ పట్టణంలో గాని పరిశుద్దాత్ముడు
కురవడో ఎక్కడైతే పరిశుద్దాత్మ క్రియలు జరగడం లేదో ఆ సంఘము లేక ఆవ్యక్తి ఏ విధముగానైనా
ఆశీర్వదించ బడదు ఇంకా దేవుని శాపము నిలుస్తుంది అక్కడ!! అక్కడ
విశ్వాసులు ఆత్మీయ బ్రష్టులుగ మారిపోతారు!
కాబట్టి
ఆ మంచును కలిగి ఉన్నావా!!!
ఆత్మపూర్ణుడైన
ప్రభువు అదే మంచు తలమీద కురిసి తన తలను తడిపేస్తున్న కొండలమీద ప్రార్ధన ఆపకుండా నశించిపోతున్న
వారి కోసం రాత్రంతా ప్రార్ధించేవారు! ఆయన శ్రమలన్నీ ఓర్చుకున్నారు! మరి ఆయనకోసం నీవు నిలబడతావా!!
ఆయన
మంచును పొందుకుంటావా!!
దైవాశీస్సులు!!!
# # # #
# # # # # # # # # # # # # # #
📢
గమనిక: ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని
ఆశిస్తున్నాము. కంటెంట్
లో ఎట్లాంటి మార్పులు చెయ్యకుండా షేర్ చేసి, మీరునూ ప్రభువు పరిచర్యలో
పాలిభాగస్తులు కాగలరు. వందనములు!!
✍️ ఇట్లు మీ సహోదరుడు
బ్రదర్. రాజకుమార్ దోనె
📧
Email: rajkumardone@gmail.com
గీతాలకు
గీతము-పరమగీతము

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి