మెల్కీసెదేకు క్రమం చొప్పున....

* మెల్కీసెదెకు క్రమము చొప్పున ...* * మొదటి భాగం - ఉపోధ్ఘాతం * హెబ్రీయులకు 6: 20 నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను . కీర్తనలు 110: 4 మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు , ఆయన మాట తప్పనివాడు . ప్రియ దైవజనమా ! పై రెండు రిఫరెన్సులు ప్రకారం మెల్కీసెదెకు అనే వ్యక్తి క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభులవారు యాజకుడిగా ఉన్నారు అంటున్నారు . బైబిల్ చెబుతుంది ఆదికాండం 14:18 లో మెల్కీసెదెకు షాలేము రాజు , చివర్లో యితడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు ! ఒకసారి ఆగుదాం ! బైబిల్ ప్రకారం యాజకులు అనగా ఆహారోను సంతతి , లేవీ గోత్రపు వారు ! వారు మాత్రమే యాజకత్వము చేయాలి అనేది దేవుని నిత్యకట్టడ ! మరి యితడు ఎవరు ? ఏ గోత్రానికి చెందినవాడు ? సర్వోన్నతుడగు దేవునికి ఎలా యాజకుడు అయ్యాడు ? జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ! ప్రియ దైవజనమా ! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లో భాగంగా ...