పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

గలతిపత్రిక

చిత్రం
  *గలతీ పత్రిక-మొదటిభాగం* *ఉపోద్ఘాతం-1*   గలతీ ౩:౩ మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?      మొట్టమొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు కాగలరా ఓ అవివేకులైన గలతీయులారా! ఇదీ పౌలుగారి సూటైన ప్రశ్న గలతీయులకు! ఇదే ప్రశ్న పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను అడుగుతున్నారు ఈరోజు? మొట్ట మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా లోకానుసారంగా లోక పద్దతులు లోకాచారాలు చేస్తూ పరిపూర్ణులు కాగలరా ఓ క్రైస్తవులారా! నేటి సంఘమా???      పౌలుగారు రాసిన మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక! ఈ పత్రిక ఎందుకు రాశారో నేపధ్యం కొంచెం తెలుసుకుంటే దీనివెనుక పౌలుగారి వేదన, బాధ, దుఃఖం అర్ధం అవుతుంది. పౌలుగారు సంఘాలు ప్రారంభించి, సంఘపెద్దలను నియమించి మిగిలిన ప్రాంతాలకు సేవకు వెళ్తే ఈ లోపుగా క్రైస్తవులము అని చెప్పుకునే కొంతమంది తప్పుడు బోధకులు, తప్పుడోల్లు వచ్చి- తప్పుడు బోధ చేసి వారిలో కొందరిని విశ్వాస భ్రష్టులు చేసేశారు. వారు భోధించిన బోధ ఏమిటంటే రక్షణ విడుదల నీతిమంతులుగా తీ...