గలతిపత్రిక

 

*గలతీ పత్రిక-మొదటిభాగం*

*ఉపోద్ఘాతం-1*

 

గలతీ ౩:౩

మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?

 

   మొట్టమొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు కాగలరా ఓ అవివేకులైన గలతీయులారా! ఇదీ పౌలుగారి సూటైన ప్రశ్న గలతీయులకు! ఇదే ప్రశ్న పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను అడుగుతున్నారు ఈరోజు?

మొట్ట మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా లోకానుసారంగా లోక పద్దతులు లోకాచారాలు చేస్తూ పరిపూర్ణులు కాగలరా ఓ క్రైస్తవులారా! నేటి సంఘమా???

 

   పౌలుగారు రాసిన మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక! ఈ పత్రిక ఎందుకు రాశారో నేపధ్యం కొంచెం తెలుసుకుంటే దీనివెనుక పౌలుగారి వేదన, బాధ, దుఃఖం అర్ధం అవుతుంది. పౌలుగారు సంఘాలు ప్రారంభించి, సంఘపెద్దలను నియమించి మిగిలిన ప్రాంతాలకు సేవకు వెళ్తే ఈ లోపుగా క్రైస్తవులము అని చెప్పుకునే కొంతమంది తప్పుడు బోధకులు, తప్పుడోల్లు వచ్చి- తప్పుడు బోధ చేసి వారిలో కొందరిని విశ్వాస భ్రష్టులు చేసేశారు. వారు భోధించిన బోధ ఏమిటంటే రక్షణ విడుదల నీతిమంతులుగా తీర్చబడటం కోసం కేవలం క్రీస్తుయేసు నందలి విశ్వాసం చాలదు! ధర్మశాస్త్ర మూలంగా ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందాలి, ధర్మశాస్త్ర క్రియలు జరిగించాలి. అప్పుడే నీకు రక్షణ విడుదల కలుగుతాయి అని భోదిస్తే మోసపోయి అన్యజనులు కొందరు సున్నతి పొందారు. కొంతమందికి ఏమిచెయ్యాలో తెలియక అయోమయంలో ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పౌలుగారికి ఎక్కడలేని దుఃఖం కలిగింది. కోపం కూడా కలిగింది. అందుకే ఈ ఉత్తరం రాశారు. ఇది మొదటి ఉత్తరం! అందుకే కోపముతో ఓ అవివేకులైన గలతీయులారా అని రెండుసార్లు సంభోధించారు పౌలుగారు!

 

    నేటిదినాలలో కూడా ప్రజలు ఇలాగే ఉన్నారు! మొట్టమొదటిగా ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసరంగా ప్రవర్తిస్తూ భక్తి చేస్తున్నాము అని భ్రమ పడుతున్నారు. నేడు విశ్వాసి పరిస్తితిని భాప్తిస్మం తీసుకున్న మొదటి రోజుల పరిస్తితులను బేరీజు వేస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది! రక్షణ పొందిన మొదటిరోజులలో చూసుకుంటే తమ్ముడా! బైబిల్ విడిచేవాడవు కావు! ఎప్పుడూ పటిస్తూ ఉండేవాడవు! కాళీ దొరికితే మోకాళ్ళమీద ఉండి ప్రార్ధన చేసేవాడవు! మోకరిస్తే చాలు కళ్ళంట నీరు కారిపోయేది. నేడు ఆ కన్నీటి ప్రార్ధన ఏది తమ్ముడా? ఆ బైబిల్ పఠనం ఏది? ఆ సువార్త చెప్పడం ఏది? అప్పటి ప్రార్ధన విశ్వాసం భక్తి ఏది? ఎవరేమన్నా తుడిచేసుకుని పోయే నీవు ఇప్పుడు ఎవరైనా నిన్ను ఏమైనా అనడానికి భయపడే స్తితికి వచ్చేశావు. నీ మారుమనస్సు రక్షణ భక్తి అన్ని మూటకట్టేసి కేవలం ఆదివారం గుడిలోనే దానిని తీస్తున్నావు. ఆదివారం ప్రార్ధన అయిపోయిన వెంటనే మరలా మూట కట్టేస్తున్నావు. ప్రార్ధన లేదు! కుటుంబ ప్రార్ధన లేదు! ఉపవాసం ప్రార్ధన అసలే లేదు! నోరు తెరిస్తే స్తుతి స్తుతి అని వచ్చే నీ నోరు ఇప్పుడు నోరు తెరిస్తే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, సినిమా పాటలు వస్తున్నాయి. రక్షణ పొందిన క్రొత్తలో లోతైన అనుభవాలు లోతైన మర్మాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఇప్పుడులేదు. కాళీ దొరికితే పనికిమాలిన సీరియల్లు, సొల్లు కబుర్లు, సోషల్ మీడియాలో చాటింగ్ లు! ఆ భక్తి ఏది? ఆ విశ్వాసం ఏది? ఆ ఆత్మానుభావం ఏది? ఆ భాషలు ఏవి? లేవు లేవు లేవు! కారణం భ్రష్టత్వం! ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పడు లోకానుసారమైన పద్దతులు అనుసరిస్తూ లోకంతో రాజీ పడిపోయి శరీరానుసారంగా ప్రవర్తిస్తూ బ్రష్టుడవైపోయావు. లోకాచారాలు మానడం లేదు!  ఏమంటే ఫలాని వారు చేస్తున్నారు. వారుకూడా క్రైస్తవులే కదా మనం చేస్తే తప్పేమిటి? అనుకుంటున్నారు. వారు హైందవుల వలె అన్ని ఆచారాలు చేస్తున్నారు మనం చేస్తే తప్పేమిటి? వారుకూడా షష్టిపూర్తి చేసుకుంటున్నారు. తాళి కట్టుకుంటున్నారు. వాస్తులు చూస్తున్నారు మనం చేస్తే తప్పేమిటి అని కొందరు!

 

ఇక కాపరులు సేవకులు కూడా అలాగే ఉన్నారు. పొట్టకూటికోసం కొందరు, బ్రతుకుతెరువు కోసం, మనుగడ కోసం కొంతమంది, ప్రజలను మెప్పించడానికి ప్రజలకు నచ్చిన ప్రసంగాలు చేస్తూ క్రొత్త క్రొత్త బోధలు చేస్తున్నారు. అవి నిజమని ప్రజలు నమ్మి మోసపోతున్నారు. నిజమైన ఖచ్చితమైన బోధలు ఇప్పుడు కరువైపోతున్నాయి. ఖండించుము! గద్ధించుము! బుద్ధిచెప్పుము అని బైబిల్ చెబితే (2తిమోతి 4:1--2) ప్రజలను మేగుతూ, వారిని మెచ్చుకుంటూ వారు తప్పులు చేస్తున్న సమర్ధిస్తూ మనుగడ సాగిస్తున్నారు.  అదే భోధలలో మునిగిపోయి ప్రజలు తప్పులు చేస్తున్నారు. లోకాచారాలు సంఘాచారాలుగా మారిపోయాయి. వాటికి నేటి గొప్పగొప్ప పెద్దపెద్ద సంఘాలు ఇస్తున్న కవరింగ్ భారతీయత! భారతీయులం కాబట్టి వీటిని పాటించాలి అంటున్నారు. తాళి కట్టడం, జాతకాలు చూడటం, వాస్తు పాటించడం, పందిరులు వేయడం, షష్టిపూర్తి, ఇదీ అదీ అంటూ పనికిమాలిన ఆచారాలు క్రైస్తవాచారాలుగా మారిపోతే వాటిని ఖండించడం మానేసి భారతీయ క్రైస్తవులం కాబట్టి తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్దాత్ముని యొక్కయు నామములో.... అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. వారు త్రిమూర్తులు పేరుతో చేస్తుంటే మనకు కూడా త్రిత్వం ఉంది అని ఆ పవిత్ర త్రిత్వమైన దేవాదిదేవుడిని హేళన చేస్తున్నారు. ఇది శరీరానుసారమా లేక ఆత్మానుసారమా? లోకానుసారమా లేక  వాక్యానుసారమా???? అసలు గ్రహిస్తున్నారా? అప్పుడు పౌలుగారు అవివేకులైన గలతీయులారా అని సంబోధిస్తే ఇప్పుడు అవివేక క్రైస్తవ జనాంగమా అని వీరిని సంబోధించాలేమో!!! బైబిల్ బోధలను కలిపి చెరుపుతూ వారికి అనుకూలంగా త్రిప్పుకుంటూ అనుకూలమైన బోధలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. వీరికోసం గాఢాంధకారం భద్రం చేయబడినది అనియు, వారి నాశనం కునికి నిద్రపోదు అని బైబిల్ సెలవిస్తుంది.

2పేతురు 2: 3

వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనముకునికి నిద్రపోదు.

 

2పేతురు 2: 17

వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

 

యూదా 1: 13

తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను,మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.

 

  ప్రియ చదువరీ ఒకవేళ నీవుకూడా అదే స్తితిలో ఉంటే నేడే మార్చుకో! లోకాచారాలు వదిలేయ్! మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి అని భైబిల్ చాలా స్పష్టముగా బోధిస్తుంది. అపొ 2:40; కాబట్టి లోకులు చేసినట్టు మనం చెయ్యకూడదు. ఆ ఆచారాలు మనకొద్దు! ఆ తాళి, నగలు, ఆచారాలు, షష్టిపూర్తి, వాస్తులు, జాతకాలు ఇలాంటి చెత్త మనకొద్దు! ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం ఇవీ కావాలి! నీ ప్రవర్తనే ఒక క్రీస్తు కరపత్రికగా మారిపోవాలి. నిన్నుచూసిన వారు నీలో క్రీస్తును చూడగలగాలి! అందుకోసం నీవు తాపత్రయ పడాలి! ఆత్మానుసారంగా జీవించాలి! దీనికోసమే పౌలుగారు ఈ పత్రిక మొత్తం చెప్పారు. అటువంటి లక్షణాలు కలిగి దేవుని రాజ్యములో ప్రవేశిద్దాం!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-రెండవ భాగం*

*ఉపోద్ఘాతం-2*

 

గలతియులకు 1: 6

క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

 

        ప్రియ దైవజనమా! యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాదివందనాలు!   ఆధ్యాత్మిక సందేశాలు-7 లో భాగంగా మరోసారి మిమ్ములను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనాలు! అనేకులు కోరినవిధముగా గలతీపత్రిక ధ్యానమును ప్రారంభించడం జరిగింది. అయితే నేను బైబిల్ పండితుడను కాను కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమి బోధిస్తే అది మాత్రం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం!

 

*రచయిత*: పౌలుగారు, గలతి 1:1-2

 

*ఎప్పుడు రాశారు*? క్రీ.. 47-55 మధ్యలో!

 

*ఎక్కడ రాశారు*? అంతియొకయ నుండి.

 

*గలతీయులు అనగా ఎవరు*? అపోస్తలులు 14 ప్రకారం ఈకోనియ, లుస్త్ర, దెర్బే, ఇవి గలతీయ దక్షిణ ప్రాంతం! అయితే మేప్ చూడండి. చరిత్ర ప్రకారం గలతీయ అనే ప్రాంతం ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంది. గలతీ అనగా బితియ, నైసియా, ఆంక్రియ ఇవి ఉత్తర గలతీయ ప్రాంతాలు. పౌలుగారు తన రెండవ మిషనరీ ప్రయాణంలో పట్టణాలలో సువార్త పరిచర్య చేయగా స్తాపించబడిన సంఘాలు!

 

*ఎందుకు రాశారు*?

గతభాగంలో వివరించినట్లు తప్పుడుభోదలు విస్తరించినప్పుడు రాశారు. ఇది బాగా అర్ధమవ్వాలంటే పూర్తి నేపధ్యం చూసుకుంటేనే అర్ధం అవుతుంది, దానికి మనం అపొస్తలుల కార్యములు 14, 15 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోవలసిన అవసరం ఉంది. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో  పౌలుగారు ఈకోనియ, లుస్త్ర దెర్బే ప్రాంతాలలో సువార్త చేసి చావుదెబ్బలు తిన్నట్లు గమనించవచ్చు! ఇవి గలతీయ దక్షిణ ప్రాంతం! అప్పుడు స్థాపించిన సంఘాలు ఇవి! సంఘాలు స్థాపించి సంఘపెద్దలను నియమించిన తర్వాత అదే ప్రాంతంలో అనగా పిసిదియ, పంపూలియ, ఈకోనియ, ఫెర్గే  అత్తాలియ అంతియొకయ ప్రాంతాలలో ఉండి సేవ చేశారు. ఇలా బహుకాలం గడిపారు. ఎన్ని సంవత్సరాలో తెలియదు. ఈలోగా 15:1 ప్రకారం కొందరు యూదయ నుండి వచ్చి మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే మీకు రక్షణ లేకపోతే మీకు రక్షణ లేదు అని ప్రకటించడం మొదలు పెట్టారు. వీరిని యూదీయులు అంటారు. ఇంగ్లీషులో జూదాడైజర్లు అంటారు. వెంటనే ప్రజలు పౌలుగారికి బర్నబా గారికి కబురుపెడితే వీరిద్దరూ వారితో అనగా ఈ తప్పుడుభోధకులతో తర్కిస్తారు.

అపొస్తలుల 15:2

పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. 

పౌలుగారు బర్నబా గారు వారు చెప్పేది తప్పు అని వాదిస్తారు. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని తలంచి దీనిని కౌన్సిల్ లో తేల్చుకుందామని బయలుదేరుతారు. కౌన్సిల్ అనగా ఆ రోజులలో పేతురు గారు, యేసయ్య తమ్ముడైన యాకోబుగారు, యేసయ్య శిష్యుడైన యోహాను గారు మాత్రము యేరూషలేములో ఉంటూ మిగిలిన శిష్యులు మిగిలిన విశ్వాసులు చెదిరిపోయారు. ఈ ముగ్గురు అక్కడ ఉంటూ ప్రజలను హెచ్చరిస్తూ సంఘాన్ని నడిపించేవారు. వీరే ఆ కౌన్సిల్! కాబట్టి పౌలుగారు బర్నబా గారు సంఘాల ద్వారా అనగా అంతియొకయ గలతీయ మొదలగు సంఘాల ద్వారా ఈ సంగతి ఏమిటి అని తేల్చుకోడానికి వారి దగ్గరకు పంపబడ్డారు. 15:6 ప్రకారం కౌన్సిల్ మరియు ఇంకా సంఘపెద్దలు అందరు కూడారు. వెంటనే పౌలుగారు ఏమి చెప్పకముందే ఇదే విషయం పేతురు గారు చెప్పారు -  మనకు ఏలాగు దేవుని కృపవలన రక్షణ మరియు పరిశుద్ధాత్మ వరం కలిగిందో అలాగే అన్యజనులైన విశ్వాసులకు కూడా కలిగినప్పుడు , పరిశుద్దాత్మునికి సున్నతి అనే ప్రక్రియ అడ్డం రానప్పుడు మరి మనమెందుకు అన్యజనులైన రక్షించబడిన విశ్వాసులను సున్నతి పొందాలి అని చెప్పడం అని అడుగుతారు. ప్రభువైన యేసు కృప చేతనే మనం రక్షణ పొందుతున్నాము అని మనం నమ్ముతున్నాం కాబట్టి వారు కూడా అలాగే రక్షణ పొందుతున్నారు అంటారు. చివరకు కౌన్సిల్ కి ప్రెసిడెంట్ అయిన యేసయ్య తమ్ముడు యాకోబు గారు ఆర్డినెన్సు జారీ చేస్తారు. దానిని ఉత్తరం రూపంలో రాసి- పౌలు, బర్నబాల మాటలు తప్పు అంటారేమో అని యూదా గారిని సీల గారిని తోడిచ్చి ఈ ఉత్తరం లేదా ఆర్డినెన్సు కాపీని ఇచ్చి పంపుతారు. 2329....

Acts(అపొస్తలుల కార్యములు) 15:23,24,25,26,27,28,29

23. వీరు వ్రాసి, వారిచేత పంపినదేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము.

24. *కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి యుండలేదు*

25. గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను

26. మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను.

27. కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు.

28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

29. *ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు*. మీకు క్షేమము కలుగును గాక.

 

సరే, పౌలుగారు, బర్నబా గారు, సీలగారు, యూదా గారు ప్రాంతానికి వచ్చి ఉత్తరం ఇచ్చేలోగా ఏమి జరిగింది అంటే తప్పుడోల్లు గలతీయులలో కొందరిని వారి తప్పుడుభోధల వలన బ్రష్టులుగా చేసేసారు. కొందరు అన్యజనులైన సంఘము సున్నతి పొందడం జరిగింది. గలతీ సంఘం కలవరంలో నిండిపోయింది. ఇలాంటి స్తితిలో పౌలుగారు అంతియొకయ ప్రాంతంలో కొంచెం ముఖ్యమైన సువార్త పనిలో ఉండిపోయి ఉండగా కబురు తెలిసి చాలా భాదపడుతూ- వెంటనే పని విడిచి వెళ్ళలేక ఉత్తరం రాశారు. అదే గలతీ పత్రిక!

 

    గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది ఆయన రాసిన మొదట పత్రిక వలన మిగిలిన పత్రికల వలె దీనిలో పౌలుగారి ప్రార్ధన కనబడదు. ఇంకా చివరి అధ్యాయాలలో కనిపించే పలకరింపు అనగా సంఘంలో ముఖ్యులైన వారికి వందనాలు చెప్పడం కూడా ఉత్తరంలో కనబడదు గాని మొదటినుండి చివరివరకు కొరడా ఝులిపించడమే కనిపిస్తుంది.

 

ముఖ్యాంశం: సున్నతి పొందడంలో ఏమి లేదు. విశ్వాసం వలనక్రీస్తునందలి విశ్వాసం వలననే మనం నీతిమంతులుగా  తీర్చబడతాము తప్ప ధర్మశాస్త్ర సంభంధమైన క్రియల వలన ఎంతమాత్రము రక్షణ పొందలేము!

 

  అవును ప్రియ సంఘమా! మనం కూడా క్రీస్తుయేసు నందలి విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడతాము తప్ప మన యొక్క మంచి పనులవలన ఎంతమాత్రమూ కాదని గ్రహించాలి.

దైవాశీస్సులు!

 


 


*గలతీ పత్రిక-మూడవ భాగం*

గలతీ 1:1

1. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,

2. నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.

3. తండ్రియైన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

 

      ప్రియ దైవజనమా! పౌలుగారు పత్రికను మిగతా పత్రికల కంటే భిన్నముగా ప్రారంభిస్తున్నారు.  మిగతా పత్రికలలో ఎక్కువగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన (రోమా 1:2; 1కొరింథీ 1:2;) వారికి తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు కలుగును గాక అని మామూలుగా మొదలుపెడతారు. అయితే ఇక్కడ తాను చెప్పబోయే విషయం ప్రత్యేకమైనది కాబట్టి అలా మొదలుపెట్టకుండా చాలా సీరియస్ గా మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇది మొదటి పత్రిక కాబట్టి కొంచెం భాషా శైలి ప్రత్యేకంగా ఉంది.  అంతేకాకుండా బైబిల్ మనుష్యుల ఇచ్చవలన కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. పరిశుద్ధాత్ముడు దీనిని రాయించారు. కాబట్టి ఇది ఇక్కడ అవసరం కాబట్టి రచనా శైలి ఇలాగుంది.

 

  మొదటి వచనంలో ఆయన చెబుదామన్న విషయం ఏమిటంటే నేను పొందుకున్న అపోస్తలత్వము మనుషుల నుండి గాని లేక మనుష్యుల మూలముగా పొందుకోలేదు గాని క్రీస్తుయేసు నుండి ఇంకా ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవుని నుండి నేను అపోస్తలుడుగా నియమింపబడ్డాను అంటున్నారు. ఇలా కుండబద్దలు గొట్టినట్లు చెప్పడానికి అసలు కారణం ఎవరో చెబితే లేక ఎవరో బయలుపరిస్తే నేను సువార్త పొందుకోలేదు గాని దేవదేవుడే నాకు ప్రత్యక్షమై బయలుపరచిన సత్యమును సత్యసువార్తను నేను ఉన్నది ఉన్నట్లు మీకు బోధించాను. ఎవరో చెబితే నేను నేర్చుకోలేదు అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే నేను పొందుకున్న సువార్త దేవుని నుండి ప్రత్యక్షంగా నేను పొందుకుని మీకు ప్రకటించాను కాబట్టి నేను ప్రకటించినదే సత్యవాక్యం! అది మనుషులు రాసింది నేర్పింది కాదు కాబట్టి దానిలోనే నిలిచియుండండి. దానికి భిన్నమైన బోధ ఏదైనా ఎవరైనా బోధిస్తే లేక నేను మునుపు బోధించిన సువార్తకు భిన్నముగా నేనైనా సరే బోధిస్తే  శాపగ్రస్తులం అవుతాము అని వ్రాశారు. దానికి ఉపోద్ఘాతముగా ఇలా వ్రాయవలసి వచ్చింది పౌలుగారికి!

 

  సరే, ఆయనైతే చెప్పేసుకున్నారు నేను దేవుని నుండి డైరెక్ట్ గా అపోస్తలత్వము పొందాను. నన్ను ఎవరూ అపోస్తలుడుగా చేయలేదు అని మరి ఇది నిజమా?

లేఖనాలు చూస్తే అది నిజమే! అది తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యములు 9, 1,15 అధ్యాయాలు ధ్యానిస్తేనే తెలుస్తుంది. తొమ్మిదో అధ్యాయంలో హింసకుడుగా సంఘాన్ని బాధ పెట్టేవాడుగా ఉన్న పౌలుగారు దమస్కు మార్గంలో క్రీస్తుయేసు ద్వారా పట్టబడి దేవదర్శనం పొందుకున్నట్లు చూడగలం! తర్వాత కళ్ళు పోగొట్టుకున్న వాడై ఉండగా దేవుడు అననీయ భక్తునితో నీవు వెళ్లి పౌలుకు ప్రార్ధనచేయమంటే ప్రభువా అతను మన సంఘాన్ని ఎంతో పాడుచేస్తున్నాడు అలాంటి వాడికి ప్రార్ధన చేయమంటావా అంటే దేవుడు చెప్పారు యితడు నేను ఏర్పరచుకున్న సాధనము!  యితడు నా నామము కొరకు అనేక శ్రమలను ఓర్చి నా సేవ చేస్తాడు అని దేవుడే చెప్పారు ఈ రకంగా ఆరోజే పౌలుగారు అపోస్తలుడుగా ఏర్పరచుకున్నట్లు అననీయ భక్తుడు గ్రహించి- ఇంతవరకు ఉన్న ద్వేషము పోయి అంత్యంత ప్రేమగలవాడై తన్మయంతో సౌలా సహోదరుడా అని  పిలిచి ప్రార్ధన చేసి దేవుని మార్గములో నడిపించారు. బహుశా అప్పుడు అననీయ భక్తుడు చెప్పి ఉండవచ్చు! ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సువార్తలో సాగిపోతుండగా అపొస్తలుల 13వ అధ్యాయంలో ఒకసారి దేవుని ప్రేరేపణతో ఉపవాసం చేస్తున్నారు. సడన్ గా దేవుడు బర్నబాను పౌలును నేను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచండి అని చెబుతారు. అనగా వారిని నాకొరకు అపోస్తలులుగా చేయండి అంటే వారు వెంటనే పౌలుగారిని బర్నబాస్ గారిని ఇద్దరినీ ప్రార్ధన చేసి వారిమీద చేతులుంచి అభిషేకం చేశారు అనగా ఆర్డినేషన్ చేశారు అపోస్తలులుగా! వారిని అపోస్తలులుగా చేయమని ఏ మనుష్యుడు  చెప్పలేదు. దేవుడు చెప్పారు వీరు చేశారు. మరి అదే కదా పౌలుగారు వ్రాశారు. ఈ విషయం కౌన్సిల్ కి తెలిసి ఉండవచ్చు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పిలుపు కాబట్టి మా ఆమోదం లేకుండా మిమ్మల్ని ఎవడు అపోస్తలులుగా అభిషేకం చెయ్యమన్నారు అని వారు అడగలేదు! ఇలా కొన్ని సంవత్సారాలు గడిచిపోయాయి! అప్పుడు గతభాగాలలో వివరించిన సున్నతి సమస్య వచ్చినప్పుడు పౌలుగారు బర్నబా గారు సంఘముల ద్వారా కౌన్సిల్ కి పంపబడ్డారు 15వ అధ్యాయంలో. ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. అయితే సడన్ గా దేవుడు కౌన్సిల్ కి అనగా పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి ప్రేరేపించి ఆత్మపూర్ణులై గలతీ 2వ అధ్యాయం ప్రకారం తమ కుడిచేతినిచ్చి అభినందించి, మేము యూదులకు అపొస్తలులుగా ఉంటాము. మీరు అన్యజనులకు అపొస్తలులుగా ఉండమని చెప్పారు. అనగా వారు పొందిన అపోస్తలత్వానికి token of Acceptance అన్నమాట!....... గలతియులకు 2: 9

స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

 

మరి పౌలుగారిని బర్నబా గారిని అన్యజనులకు అపొస్తలులుగా ఎందుకు ఉండమన్నారంటే వారి పరిచర్యలో ఎక్కువ భాగం అన్యజనుల మధ్య జరిగింది కాబట్టి!

 

  సరే, మరి పౌలుగారు చెప్పినది నిజమే కదా! పౌలుగారు పొందుకున్న అపోస్తలత్వము మనుష్యుల నుండి కాక దేవుని నుండే పొందుకున్నారు. నేడు అనేకమంది అపోస్తలుడు అనే బిరుదులు కొనుక్కుంటున్నారు. పౌలుగారు దేవుని నుండి పొందుకుని యేసుక్రీస్తు ప్రభులవారి లాగ ఎన్నెన్నో శ్రమలను అనుభవించారు. యేసు ప్రభుల వారికంటే ఎక్కువ రోజులు శ్రమలను పొందారు! గాని డబ్బుతో కొనుక్కున అపోస్తలులుకి అనుభవం లేదు, అభిషేకం లేదు, పిలుపు లేదు గాని బిరుదులున్నాయి. ఇలా సంఘాన్ని మోసగిస్తున్నారు. శ్రమలను అనుభవించాకనే అనుభవం నుండి పరిపూర్ణత సాధించి అప్పుడు అపోస్తలులుగా మారగలరు గాని ఇవేమీ లేకుండా అపోస్తలుడు బిరుదు పొందుకోవడం దండగ అని నా ఉద్దేశ్యం!

 

ఇంతకీ అపొస్తలుడు అనగా ఎవరూ?

పంపబడిన వారు! యోహాను 13: 16

దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు (అనగా అపొస్తలుడు) తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

దేనికోసం పంపబడ్డారు?

పరలోక రాజ్యం సమీపించియున్నది. మారుమనస్సు పొంది రక్షణ పొందమని, రక్షణ మార్గం యేసే అని చెప్పడానికి.

 

అయితే 1కొరింథీ 12 అధ్యాయం ప్రకారం, ఎఫెసీ 4:13-14 ప్రకారం

మనకు Tenfold Ministry, Fivefold Ministry కనబడుతుంది. Fivefold Ministry అది సంపూర్ణ సేవ! Tenfold Ministry లో భాగస్తులు  Part time సేవ చేస్తారు. అయితే ప్రాముఖ్యమైనది Fivefold Ministry.

దీనిలో మొదటగా అపొస్తలులు, రెండు ప్రవక్తలు, మూడు భోధకులు, నాలుగు కాపరులు, ఐదు ఉపదేశకులు/సువార్తికులు. అపొస్తలుడు ఎప్పుడు అవుతాడు అంటే మీద నాలుగు సేవలు జరిగించే వాడు. అనగా సువార్తికుడుగా ఉపదేశకుడుగా ఉంటూ, ఆత్మలను సంపాదించి, సంఘాలు కట్టి, కాపరిగా సంఘాలను నడిపిస్తూ, ఆత్మాభిషేకం కలిగి ప్రవచన వరం అధ్బుతాలు చేసే వరములు కలిగి, రాబోయే సంగతులను ఆత్మ ద్వారా వివేచిస్తూ, సంఘాన్ని నడిపిస్తూ ఉండేవాడు అపొస్తలుడు. ఇవేమి లేకపోతే వ్యక్తి అపొస్తలుడు కానేకాడు.

పైన పేర్కొన్న అన్ని పరిచర్యలలో టాప్ ఎఫెసీ 2:20 ప్రకారం అపొస్తలుడు!

 

 ఇక వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అంటున్నారు. ఇక్కడ త్రిత్వమును చెబుతున్నారు పౌలుగారు. తండ్రియైన దేవుడు కుమారుడు ఏకీభవించి ఉన్నారు గాని వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు కాబట్టి తండ్రియైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభులవారిని వేర్వేరుగా సంభోదిస్తున్నారు.  మత్తయి :1617 లో, యోహాను 17:1 లో కూడా మనం ఇలాంటి సన్నివేశాలు చూడవచ్చు!

 

  ఇక రెండవ వచనంలో పౌలను నేనును నాతోకూడా ఉన్న సహోదరులందరును అంటున్నారుతనతోపాటు ఉన్న సహోదరులు అనగా బహుశా సీలగారు, బర్నబా గారు యూదా గారు ఇంకా అంతియొకయలో ఉన్న సహోదరులు కావచ్చు!

 

   ఇక ౩వ వచనంలో అన్ని లేఖలలో వ్రాసినట్లు తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానం కలుగును గాక అంటున్నారు. గమనించాలి పౌలుగారు కృప సమాధానముతో పత్రికను మొదలుపెట్టి మరలా అదే కృప సమాదానముతో పత్రికను ముగించారు.

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-నాల్గవ భాగం*

 

గలతీ 1:45

4. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి (దుష్ట యుగమునుండి) విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను.

5. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

 

  ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. గతభాగంలో పౌలుగారికి దొరికిన అపోస్తలత్వము మనుషుల నుండి కాకుండా దేవుని నుండి కలిగింది అని చూసుకున్నాం!

 

ఇక  4 వచనంలో మన తండ్రియైన దేవుని చిత్తప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములోనుండి లేదా దుష్ట యుగంలోనుండి విమోచించ వలెనని మన పాపముల నిమిత్తము తననుతాను అప్పగించు కున్నారు అంటున్నారు.

 

  గమనించ వలసిన విషయాలు ఏమనగా మొదటిది: మన తండ్రియైన దేవుని చిత్తప్రకారమే యేసయ్య మన పాపముల నిమిత్తం తననుతాను అప్పగించుకున్నారు. అందుకే ఆయన భూమిమీద ఉన్నప్పుడు తండ్రి చిత్తము చేయడమే నా పని అంటూ ఉండేవారు.  ....

యోహాను 4:4

యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.

యోహాను 6: 39

నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

 ఆయన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించి వెళ్ళిపోయారు. మనకు మార్గదర్శిగా ఉన్నారు యేసయ్య! కీర్తనాకారుడు 40:8 లో నీ  చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పారు.  మనం కూడా అదే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మన విధి!

 మరి మనమేమి చేయాలి?

దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి.

దేవుని చిత్తమేమిటి?

 పరిశుద్దులుగా ఉండాలి; జారత్వం నుండి దూరముగా ఉండాలి.1థెస్స 4:;

 

పరిశుద్ధత యందు ఘనతయందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము. 1థెస్స 4:5

 

ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము. 1థెస్స 5:18

 

అజ్ఞానముగా మాటలాడు వారి నోళ్ళు మూయించడమే దేవుని చిత్తము. 1పేతురు 2:15

 

ఇక రెండవ విషయం: ప్రస్తుత దుష్ట కాలమునుండి అంటున్నారు.  ఎందుకు అలా అంటున్నారు అంటే: లోకంలో గల కోరికలు, ఉద్దేశాలు, చేసే పనులు అనుసరించే పద్దతులు అన్నీ చెడ్డవే! దుష్ట పనులే! అందుకే పౌలుగారు దుష్టకాలము అంటున్నారు.

యోహాను :19

తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

 

రోమీయులకు 3: 23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

 

అందుకే భక్తుడు అంటున్నారు

రోమా 12:2

మీరు ఈ లోక ( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

1యోహాను 2:16

లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

 

1యోహాను 5: 18

మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు (దుష్టునియందు పడియున్నదనియు) ఎరుగుదుము.

 

మూడవది: దుష్టకాలం నుండి విడిపించటానికి మన పాపముల నిమిత్తం తననుతాను అప్పగించుకొనెను అంటున్నారు. ఇలా దుష్ట కాలం నుండి దుష్టలోకం నుండి దుష్ట తలంపులనుండి దుష్ట పనుల నుండి మనలను యేసుక్రీస్తు ప్రభులవారు విడిపించడం జరిగింది. మన పాపాలను క్షమించడానికి పాపాలను తీసివేయడానికి, మనలను పాపపు శిక్షనుండి అనగా మరణం నుండి లేదా ఆధ్యాత్మిక మరణం నుండి తప్పించడానికి క్రీస్తుయేసు మనకొరకు చనిపోయారు. రోమా  8:1,2

1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసు నందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

2. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

 

అయితే దేవుడు మనలను ఎప్పుడు క్షమిస్తారు అంటే: మనం పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకుని ఆయనలో నమ్మకం ఉంచితే అప్పుడు ఆయన మనలను క్షమిస్తారు! అప్పుడు దేవుని ఆత్మ మనలో నివాసం చేయగలడు!  అప్పుడు నీవు నేను లోకాన్ని కాదని దేవునికోసం జీవించగలిగే శక్తి సామర్ధ్యాలు మనకు కలుగుతాయి.  అప్పుడు క్రీస్తురక్తము లోకంలో మనలను దుర్మార్గతకు సంభందించిన దానినంతటినుండి మనలను శుద్దీకరించి, చివరకు ఒకరోజు  నీతిమంతులుగా తీర్చుతారు! ఇదంతా జరగాలి అంటే మనలో ఉన్న పాపం పోవాలి! పాపం పోవాలి అంటే దానిని కేవలం క్రీస్తుయేసు బలియాగం, క్రీస్తు మరణం దీనిని సాధించిపెట్టింది. సిలువ మరణం లేకుండా పాపములనుండి విడుదల సాధ్యం అయ్యేది కాదు!

 

 యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోడానికి ముఖ్య కారణం కేవలం మన పాపాలనుండి మనలను విడిపించడం కోసమే! లోకంలో దుర్మార్గత ప్రభావం నుండి మనుష్యులను బంధించిన బంధకాలు అనగా పాప బంధకాలు నుండి విడిపించడానికి దేవుడు నియమించిన మార్గం ఆయనే సిలువలో మనకోసం  చనిపోవడం!

రోమా 11:26

వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

 

చూశారా ఆయన పేరే విమోచకుడు! రక్షకుడు!

మత్తయి 1:21

తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

 

లూకా 4:18

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

 

కొలస్సీ 1:13,14

ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క (మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.

ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.

 

తీతు 2:14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

 

హెబ్రీ 2:15

జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

 

పాపం అనేది దేవుని నుండి మనలను వేరుచేస్తుంది. పాపం నుండి సిలువమార్గం మనలను విడిపిస్తుంది.

గలతీ 5:1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

యోహాను 8:36

కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

 

రోమా 6:1718

మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయ పూర్వకముగా లోబడినవారై,

పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

 

ప్రియ దైవజనమా! ఆయన నీ కోసమే చనిపోయారు. నిన్ను విడిపించారు. కాబట్టి ఇకను పాపము చేయకు! దేవునికి, వాక్యానికి భయపడు! లేకపోతే ఆయన తీర్పునుండి, శిక్షనుండి తప్పించుకోలేవు అని గ్రహించమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-5 భాగం*

గలతీ 1:6—9

6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

7. అది మరియొక సువార్త కాదు గాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

9. మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.

 

        ప్రియ దైవజనమా! మనం గలతీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము.

ఇక ఈ వచనం నుండి పౌలుగారు చెప్పాలనుకుంటున్న విషయానికి వచ్చేస్తున్నారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నారు.

  వచనంలో కూడా అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలున్నాయి.

మొదటిది క్రీస్తు కృపను బట్టియే మనలను పిలిచారు తప్ప మనయొక్క గొప్పతనం, మనయొక్క మంచితనం, మనయొక్క నీతి మనయొక్క మంచి పనులవలన ఎంతమాత్రము కాదు. కృపచేతనే మనం రక్షించబడ్డాము.......

రోమీయులకు 3: 24

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

ఎఫెసీయులకు 2: 8

మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

 

కాబట్టి అంత గొప్ప దేవుని కృపకు పాత్రులమయ్యాము అంటే కృపకు తగిన జీవితం జీవించాలి తప్ప కృప ఉందికదా అని మాటిమాటికి పాపం చేస్తే కృపాకాలం ముగిసిపోయి దండన కాలం, తీర్పు కాలం వస్తుంది అని మరచిపోవద్దు!

 రోమీయులకు 6: 1

ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?

 

రెండు: మిమ్మును పిలిచిన వానిని :

 రోమా 1:2; 1కొరింథీ 1:2 లో పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడిన వారు అంటున్నారు.

 ఇంకా

మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి అంటున్నారు......1పేతురు 2:9;

కాబట్టి మనం పిలువబడ్డాము. పిలుపుకు తగిన జీవితం జీవించాలి తప్ప ఎలా పడితే అలా నీకిష్టమైనట్ట్లుగా జీవించకూడదు.

లూకా 3: 8

మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను.

 

ఇక క్రైస్తవుడు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారులకు తగిన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కారణం రోమా 8:౩౦....

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

చూశారా నీ పిలుపు ఏర్పాటు సామాన్యమైనది కాదు!

కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్షం చేస్తే ఏలాగు తప్పించుకోగలవు అని అడుగుతున్నాడు భక్తుడు!!! హెబ్రీ 2:3;

 

మూడు: మరి ఇంతఘనమైన పిలుపును నిర్లక్షం చేసి పిలిచిన వానిని విడిచి అంటున్నారు... కారణం గలతీయులు దేవుని సత్యము నుండి దేవుని నుండి దూరమైపోవడం ప్రారంభించారు వీరు. కారణం వీరు తప్పుడుభోధకుల బోధలో పడిపోయి దేవుని నుండి దూరమైపోవడం మొదలుపెట్టారు. మనుష్యుల మాయలో పడిపోయి దేవాది దేవుని పిలుపును కాళ్ళతో త్రొక్కడం మొదలుపెట్టారు. అయితే వీరింకా దేవుని నుండి పూర్తిగా దూరమై పోలేదు! అందుకే కొరడా తీసుకుని చెళ్ళుమని కొడుతున్నట్లు ఉత్తరం రాస్తున్నారు ప్రేమతో!

 

నాలుగు: భిన్నమైన సువార్త తట్టుకు.... భిన్నమైన సువార్త అంటే- పౌలుగారు వీరికి చెప్పారు- మీరు కేవలం క్రీస్తుయేసునందు విశ్వాసం వలన కృపచేతనే రక్షించబడ్డారు, క్రీస్తుయేసు నందలి విశ్వాసం వలననే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని చెబితే నమ్మి బాప్తిస్మము పొంది, ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుని ఇప్పుడు ఎవడో పొట్టకూటికి వచ్చి భిన్నమైన సువార్త ప్రకటిస్తే బోధలో పడిపోయారు. వీరు చెప్పిన భిన్నమైన బోధ ఏమిటంటే: రక్షణ, విడుదల పొందడానికి కేవలం క్రీస్తుయేసు నందలి విశ్వాసం మాత్రమే చాలదు! మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందాలి. ధర్మశాస్త్ర సంభంధమైన కొన్ని ఆచారాలు పద్దతులు పాటించాలి అని వారు బోధిస్తే యేసయ్య మార్గాన్ని వదలి భిన్నమైన మార్గానికి తిరిగిపోయారు వీరు! అదికూడా త్వరగా తిరిగిపోయారు అంటున్నారు పౌలుగారు!

పౌలుగారు పాపవిముక్తి రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇస్తున్నారు, మీరు దానికి వెల చెల్లించవలసిన అవసరం లేదు. కేవలం క్రీస్తుయేసునందు పరిపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు దేవుడు మనలను మన పాపం నుండి విడిపించి రక్షణ ఇస్తారు, రక్షణ క్రీస్తుయేసు నందు విశ్వాసముంచి పొందు కోవాలి అని చాలా వివరంగా బోధించారు.

 

గలతియులకు 2: 15

మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;

 

గలతీ ౩:69, 26

6. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను.

7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

8. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

26. యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు.

 

గలతీయులకు 5:4,5,6

4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయియున్నారు.

5. ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.

6. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతిపొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

 

రోమా 4:5

మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

 

రోమా 6:23

ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

 

ఎఫెసీ 2:89

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

 

      ఇక 7 వచనంలో అది మరియొక సువార్త కానేకాదు అంటున్నారు అనగా అది అసలు సువార్తే కాదు! గాని వారు అనగా తప్పుడుబోధకులు మిమ్మును ఇంకా క్రీస్తుసువార్తను చెరపాలని మిమ్మును కలవరపరచు చున్నారు అంటున్నారు.

ఇక్కడ పౌలుగారు అది సువార్త కానేకాదు అని ఎందుకు చెబుతున్నారు అంటే: ధర్మశాస్త్రం క్రింద ఉన్నారని దానిని పాటించాలని చెప్పడం శుభవార్త కానేకాదు! ధర్మశాస్త్రంలో గల ఆజ్ఞలలో ఒక్కదానిని చేయకపోయినా మీరినా ధర్మశాస్త్రం మొత్తాన్ని అతిక్రమించినట్లే! మనిషి ఎప్పుడు 100% నమ్మకంగా ఉండలేడు! కాబట్టి సువార్త అసలు సువార్తే కాదు అంటున్నారు. సువార్త అనగా మంచివార్త! మంచివార్త ఏమిటంటే క్రీస్తుయేసునందు విశ్వాసం వలన మీరు నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడతారు అని చెప్పడం నిజంగా సువార్త! అర్హత లేనివారికి  దేవుడు మీకు అర్హతను ఇస్తున్నారు అని చెప్పడం నిజంగా సువార్త! రక్షణ విడుదల కోసం మీరు కోడెలు గొర్రెలు కోయ్యక్కర్లేదు. ఏదేదో ఇవ్వక్కర్లేదు గాని ఉచితంగా ఆయనను నమ్మి ఆయనమీద విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా పొందుకుంటారు అని చెబితే అదీ నిజమైన సువార్త!

అపోస్తలులు 15:10

గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

 

లోకంలో సువార్తలు అని పిలువబడేవి చాలా ఉన్నాయి గాని క్రీస్తులో విశ్వాసం ద్వారా కాకుండా వేరే విధంగా కూడా విముక్తి రక్షణ కలుగుతుంది అని చెప్పేది మాత్రం సువార్త కాదు. పాప విముక్తికోసం రక్షణ కోసం నమ్మకంతో విశ్వాసంతో కాకుండా వేరొక మార్గంలోఅది మతాచారాలు మంచి పని లాంటి సొంత ప్రయత్నాలు చేయడం అనగా అది క్రీస్తుయేసు సువార్తను తారుమారు చేసే ప్రయత్నమే అని గ్రహించాలి!

 

   ప్రియ సంఘమా! ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని తప్పుడు బోధలను అనేక సంఘాలు పాటిస్తున్నాయి. దానికి వారు చెప్పే సాకులు-మనం బారతీయులం కాబట్టి మనం తాళి తీయకూడదు, వాస్తును పాటిద్దాం, ఇంకా హైందవ ఆచారాలు ముఖ్యంగా వివాహ సమయంలో, గృహానికి సంబందించిన విషయాలలో మనలో చాలామంది పాతరోత ఆచారాలను వదలలేక పోతున్నారు. 

    

     ఇంకా ఎన్నెన్నో తప్పుడు బోధలు సంఘాన్ని కలవర పరుస్తున్నాయి. కాబట్టి సంఘకాపరులు, దైవసేవకులు, సంఘపెద్దలు వారు తమ ఆదీనంలో ఉన్న సంఘంలో ఇటువంటి తప్పుడు బోధలకు, బోధకులకు తావు ఇవ్వకూడదు. వీరిని చేర్చుకోకూడదు.  అలాచేస్తే వీరు విశ్వాస ఘాతులై సంఘానికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తారు. మొదటి శతాబ్ధంలో ఇలాంటి బోధలు వచ్చినప్పుడు అపోస్తలులు లేచి, ఖండించి సంఘాన్ని సరిచేశారు. నేడు కూడా ఇలాంటి బోధలు చాలా వస్తున్నాయి. నేడు కూడా సంఘకాపరులు, సేవకులు,  సంఘపెద్దలు ఇలాంటి బోధలను తరిమికొట్టాలి. 

 

అబద్ద బోధలు:

దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.

 

▪️యెహోవా సాక్షులు

▪️మొర్మాన్స్

▪️బ్రెన్హ మైట్స్

▪️జాంగిల్ జా

▪️సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.

▪️సున్నతి లేకుండా గమ్యం లేదు.

▪️శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.

ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.

 

అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)

 

*నేటిరోజులలో అనేక తప్పుడుబోదలు వచ్చాయి. మనం యెహోవాదేవున్నే పూజించాలి. యేసుక్రీస్తు దేవుడు కాదు- అని యెహోవా సాక్షులు; శనివారం నాడే ఆరాధన చెయ్యాలి గాని ఆదివారము నాడు చెయ్యకూడదు అని సెవెంత్ డే వారు, సబ్బాతు ఆరాదికులు, సంఘానికి తల్లి అంటూ ఒకరు, మొర్మాన్లు, ఇంకా ఈనాటి సంఘదూత విలియం మారియన్ బ్రెన్హాం, ఆయనను ప్రవక్తగా అంగీకరించాలి ఆయన చెప్పిన బోదలు నమ్మాలి అని మరికొందరు*... ఇలా ఎన్నెన్నో తప్పుడుబోధలు, తప్పుడు బోధకులు సంఘాన్ని కలవరం చేస్తుండగా ప్రియ దైవజనుడా! ప్రియమైన సంఘపెద్దలారా! నీ భాద్యతను నీవు విస్మరిస్తున్నావా? ఇలాంటి వారినుండి నీ సంఘాన్ని నిజమైన బోధలతో సరిచేస్తున్నావా లేదా? ఇప్పుడు అలాంటి బోదచేసి వారినుండి నీ సంఘాన్ని కాపాడుకో! ముందుగానే హెచ్చరించు. అలాంటి వారిని చేర్చుకోవద్దు అని మీ సంఘానికి చెప్పండి.

  ప్రియ దైవజనమా! ఇలాంటి తప్పుడుభోధకులను గమనిస్తున్నావా? వీరు మిమ్మును బలవంతంగా నరకానికి తమతోపాటుగా ఈడ్చుకుని పోతున్నారు అని గ్రహించాలి! మరి అవి తప్పుడుబోదలు అని మనకు ఎలా తెలుస్తాయి అనగా లేఖనముల ప్రకారం బోధ ఉంటే అనగా వాక్యానుసారమైన బోధ అయితే అది మంచి బోధ! బైబిల్ బోధించని కొత్త బోధ అయితే, లేదా బోధకు లేఖనముల ఆధారం లేకపోతే అది కలిపిచెరిపే బోధ అని గ్రహించమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను! ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెబుతాడు ఏది సరియైన బోధ ఏది దుర్భోధ! కాబట్టి ఆత్మపూర్ణులుగా మారడానికి ప్రయత్నం చేయండి!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-6 భాగం*

 

గలతీ 1:69

6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.

 

        ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. గతభాగంలో పౌలుగారు ప్రకటించిన బోధనుండి గలతీయులు తొందరగా తప్పుడుభోధలకు లొంగిపోయినట్లు చూసుకున్నాం!

 

             7 వచనంలో కొందరు సువార్తను తారుమారు చేస్తున్నారు ఎందుకంటే మీరు వారివెంట పరుగులెత్తాలని అంటున్నారు. ఈలోకంలో క్రీస్తుసువార్తను ఉన్నదున్నట్లుగా స్వీకరించి, దానికనుగుణంగా జీవించేవారు చాలా తక్కువమంది. కాబట్టి ఇలా తారుమారు చేసిన బోధలకు ప్రజలు తొందరగానే లొంగిపోతుంటారు.

 

  ఇక 8-9 వచనాలలో చాలా ప్రాముఖ్యమైన మాట రాస్తున్నారు! .....

మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.

 

గమనించండి మేము మీకు ప్రకటించిన మొదట సువార్త కాకుండా మరొక సువార్త మేము గాని, లేక ఇతరులుగాని లేక దేవదూతగాని  ఎవరైనా బోధిస్తే వ్యక్తి శాపగ్రస్తుడవును గాక అంటున్నారు. మాట పలకడానికి కారణం తాను వారికి ఉపదేశించిన లేక ప్రకటించిన సువార్త అత్యంత ప్రాధాన్యమైనదని చెబుతున్నారు. దానిని తారుమారు చేయడానికి ప్రయత్నించేవారికి కలిగే పాపం, శాపం తెలిపే కఠినమైన పదాలను పౌలుగారు ఉపయోగిస్తున్నారు.  ప్రాముఖ్యంగా తాను పొందిన సువార్త తనకు మనుష్యులు వెల్లడి చేయలేదు గాని యేసుక్రీస్తుప్రభులవారే తనకు కనబడి స్వయంగా ప్రకటించిన సువార్త కాబట్టి ఇంకా బల్లగుద్ది నొక్కివక్కానిస్తున్నారు!

(11,12 వచనాలుGalatians

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది. ).

కారణం పాప విముక్తి రక్షణ కలిగించే దేవునిశక్తి ఆ సువార్తకే ఉంది. మరో సువార్తకు లేనేలేదు! రోమా 1:16

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

 

దానిని మార్చేందుకు ఎవరైనా తెలిసిగాని తెలియకగాని లేక పొట్టకూటికోసం, మనుగడ కోసం ప్రయత్నిస్తే వ్యక్తులు పరలోకానికి వెళ్ళే ఏకైక ముక్తిమార్గాన్ని చెరపాలని ప్రయత్నం చేసినట్లే! అప్పుడు వ్యక్తులు శాపగ్రస్తులు అంటున్నారు పౌలుగారు! పౌలుగారే కాదు యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇదే అంటున్నారు.

మత్తయి  23:13,14,35

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

35. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.

 

లూకా 11: 51,52

కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను.

అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.

 

  ఎవరైతే ఇలా తప్పుడుబోదలు చేస్తారో జనాలను దారి తప్పిస్తారో వారు దేవునికి మానవులకు వ్యతిరేఖంగా పాపం, నేరము చేస్తున్నారు అని గ్రహించాలి! దీనిని ఖండించటానికి ఎంత కఠినమైన భాష ఉపయోగించినా పర్వాలేదు. కాబట్టి విషయంలో దోషులైన వారు అనగా తప్పుడుబోధలను ప్రకటించేవారు తాము చేసిన పాపాలు నేరాలు విషయమై పశ్చాత్తాపపడకపోతే నేరానికి తగిన శిక్ష అనుభవిస్తారని తెలియజేస్తున్నారు!

 

    ఇక 9 వచనంలో కూడా ఇదే విషయాన్ని మరోసారి రెట్టిస్తున్నారు. ఎందుకు రెండోసారి చెబుతున్నారు అంటే దీని ప్రాముఖ్యత అంత గొప్పది కాబట్టి! మేము మీకు మరలా చెబుతున్నాము- మీరు స్వీకరించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా మీకు ప్రకటిస్తే వ్యక్తి శాపగ్రస్తుడవును గాక!! అని శాపం పెడుతున్నారు! కారణం దేవుడు వెల్లడిచేసిన సత్యముతో ఆటలాడుకోవాలని చూస్తే అది ఎంత పాపమో దుష్టత్వమో అందరికీ తెలియజేయాలని ఆయన ఆశ! అంతే తప్ప అందరికీ శాపాలు పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు అని నా అభిప్రాయం! తద్వారా అందరూ గుణపడాలని, తప్పుడుబోధలకు లొంగకూడదని అందరూ తెలుసుకోవాలని భక్తుని ఉద్దేశం!

ప్రకటన 22:18—19

18. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

 

బైబిల్ లో అబద్ద బోధకులు వస్తారని, వారు దారి తప్పిస్తారని ఎంతో వివరింగా రాయబడి ఉంది.  అబద్దప్రవక్తలు అబద్ద బోధకులు ఇశ్రాయేలు రాజులను దారితప్పించి వారు విగ్రహారాధన చేసేలాగా, దేవుని నుండి తిరిగిపోయేలా చేసి చివరకు వారు చెరలు పాలవ్వడం జరిగింది. చివరకు దేవుడు ఆహాబు కాలంలో ప్రవక్తల నోట అబద్దాలాడే ఆత్మను పెట్టి ఆహాబును హతం చెయ్యడం జరిగింది.

మత్తయి 7:15

అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.

మత్తయి 24:11

అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

 

అపోస్తలుల 20:29౩౦

29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.

30. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

 

రోమా 16:1718

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

 

2కొరింథీ 11:1315

13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

 

1తిమోతి 4:13

1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును

2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

3. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

 

2తిమోతి 4:4

3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,

4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

 

2పేతురు 2:1

1. మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

 

యూదా 1:4

ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో-వ్రాయబడినవారు) .

 

   కాబట్టి ప్రియ సంఘమా! తప్పుడుభోధకుల నుండి జాగ్రత్త పడండి! తప్పుడుబోదలు చేసేవారలారా జాగ్రత్త! దేవుని శాపాన్ని తప్పించుకోలేరు అని గ్రహించాలి! బిలాము ప్రవక్త దేవుని ప్రజలను దారి తప్పించాలని మోయాబురాజుకు తప్పుడుబోధ చేస్తే బోధను విని యవ్వన స్త్రీలను పంపించి ఇశ్రాయేలు వారు దారితప్పిపోయి పాపం చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులలో అనేకులను హతం చెయ్యడం జరిగింది. చివరకు బిలాము ఒక కోరిక కోరుకున్నాడు- నీతిమంతులకు వచ్చు మరణం వంటి మరణం నాకు కలుగును గాక! అని కోరుకున్నా గాని అత్యంత ఘోరమైన పద్దతిలో ఒక గొప్ప దేవునిప్రవక్త- దేవుని ప్రజలతోనే చంపబడ్డాడు! నీవుకూడా తప్పించుకోలేవు అని తెలుసుకుని తప్పుడుబోధలను వదలమని పశ్చాత్తాప పడమని ప్రభువు ప్రేమతో చెబుతున్నాను! పొట్టకూటికోసమో లేక పేరుకోసమో లేక మనుగడ కోసమో తప్పుడుబోధలను బోధించకు! నీవు చెప్పేది లేఖనాల అనుసారంగా ఉందా లేదా అని ముందు నీకునీవు పరిశీలన చేసుకుని అప్పుడు ప్రకటించు! లేకపోతే ప్రకటన గ్రంధంలో వ్రాయబడిన శాపములు అన్ని రాగలవు జాగ్రత్త! ఇంకా ఆత్మపూర్ణులవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెబుతాడు ఏది సరియైన బోధ ఏది దుర్భోధ! కాబట్టి ఆత్మపూర్ణులుగా మారడానికి ప్రయత్నం చేయండి!

 

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-7 భాగం*

 

గలతీ 1:10

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 

        ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము.

ప్రియ దైవజనమా! 10వ వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించు కొనజూచుచున్నానా లేక దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? అంటున్నారు పౌలుగారు! ఇంకా మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా?  లేక దేవుని సంతోష పెట్టాలని అనుకుంటున్నానా? ఒకవేళ మనుష్యులను సంతోషపెట్టే వాడినైతే నేను దేవుని దాసుడను కానే కాదు అంటున్నారు!

 

  ఇక్కడ మనుషులకు ఏమి వినాలని ఉంటుందో అదే తప్పుడు భోధకులబోధ అని పౌలుగారి ఉద్దేశం అన్నమాట! అయితే పౌలుగారు దేవుడు వెల్లడిచేసిన సత్యాలనే ప్రజలకు ప్రకటిస్తున్నారు. సత్యాలు బోధలు చాలా కఠినంగా ఉంటాయి. అవి మనుష్యులను బాధ పెడతాయి అని ఆయనకు తెలుసు! గాని వారు పరలోకం చేరాలని వారు దేవునితో సత్సంబంధం కలిగియుండాలని ఆయన కోరిక! కాబట్టి అది మనుష్యులను బాధ పెట్టినా సరే నిజాలే, దేవుని సత్యాలే పౌలుగారు చెబుతున్నారు. అయ్యో నేను చెప్పే మాటలు బోధలు మనుష్యులను బాధ పెడతాయో అని చెప్పాల్సిన సత్యాలు పౌలుగారు చెప్పకుండా మానలేదు! దాచిపెట్ట లేదు!

 

  నేటికాలంలో అనేకులు అనేకమంది దైవసేవకులు అయ్యో సంఘస్తులు ఏమనుకొంటారో, లేక సంఘపెద్దలు ఏమంటారో, నన్ను సంఘం నుండి మరో సంఘానికి గెంటేస్తారేమో అని కొందరు, ఇలా చెబితే పెద్దపెద్ద కానుకలు ఇచ్చేవారు సంఘానికి రాకుండా అనుకూల బోధలు చేసే మరో సంఘానికి వెల్లిపోతారేమో అని కొందరు, ఇలా ప్రజలకు మెప్పించే బోధలే చేస్తున్నారు గాని దేవుడు మెచ్చే బోధలు చెయ్యడం లేదు! ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము అనిబైబైల్ చెబుతుంటే (2తిమోతి 4:2-3) పైపైన మేగే బోధలే చేస్తున్నారు. చివరకు బోధలు సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రజలను నరకానికి నడిపిస్తున్నాయి! గమనించాలి ఆత్మలు నరకానికి పోతే దానిభాధ్యత కాపరీ నేదే అని గ్రహించు! దైవజనుడా! దురభిమాన పాపంలో పడవద్దు! కుటుంబ తిరస్కారాలకు జడిసి, ప్రజల ఆగ్రహాలకు జడిసి నోరుమూసుకుని ద్వారం దాటకుండా సత్యాన్ని నీలోనే దాచుకున్నావా పరమండున్న దేవుని దృష్టికి వేషదారివి అని యోబుగారు చెబుతున్నారు!

యోబు 31: 34

మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.

అందుకే పౌలుగారు ఎవరైతే మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారో వారు దేవుని దాసులు కానేకారు అంటున్నారు. దేవుని దాసులు కాకపోతే మరి ఎవరి దాసులు? సాతాను గాడి దాసులు మరియు బానిసలు అన్నమాట!!!

 

    పౌలుగారు ఎవరికైనా నొప్పి కలుగుతుంది అని ఎంతమాత్రము ఎప్పుడూ ఆలోచించలేదు! అందుకే దేవుడు ఆయనను ఏర్పాటుచేసుకున్నారు! అపోస్తలులు 20:20,2627

20. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

26. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను (మూలభాషలో- అందరిరక్తము విషయమై నేను నిర్దోషిని) నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. (లేక-మీకు సాక్ష్యమిచ్చుచున్నాను)

27. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

 

ఇక ఆయన జీవించినంతకాలం క్రీస్తును తప్ప వేరెవరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయలేదు! మనుషులకు నచ్చినా నచ్చకపోయినా క్రీస్తు సందేశం పూర్తిగా ఉపదేశించడానికి సిద్దపడకపోతే ఆయన నిజమైన సేవకులు కాలేరు అని ఆయనకు పూర్తిగా తెలుసు! కాబట్టి ఆయన సత్యాన్ని పూర్తిగా బోధించడానికే ఆయన సిద్దపడ్డారు! తద్వారా ఆయన అనేకమైన బాధలు అవమానాలు హింసలు అనుభవించారు. గాని సత్యాన్ని బోధించడం వదలలేదు! గాని ఇతర విషయాలలో మాత్రం మనుషులను క్రీస్తుకోసం సంపాదించడానికి ప్రయత్నం చేశారు. వారు క్రీస్తులో ఎదిగేలా సహాయం చెయ్యడానికి సంపూర్తిగా ప్రయత్నం చేశారు!

రోమా 15:1—3

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

 

1కొరింథీ 9:1923

19. నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.

20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.

22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

23. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

కాబట్టి ఈ విషయాలలో మనం పౌలుగారిని చూసి నేర్చుకోవాలి!

 

  గతభాగంలో వివరించినట్లు బిలాము మోయాబు రాజును మెప్పించాలి అనుకున్నాడు. తప్పుడుబోదలు చేశాడు! ధనం దక్కలేదు! చివరకు కుక్కచావు చచ్చాడు ఆయన! ప్రియ దైవజనుడా! నీవెవరిని సంతోషపెట్టాలని అనుకుంటున్నావు? నీ సంఘాన్నా? లేక సంఘ పెద్దలనా? లేక ప్రజలతో మాటలు పడ్డా సరే దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తున్నావా? మోషేగారు ఐగుప్టు పాపబోగములు అనుభవించే కన్నా దేవుని ప్రజలతో కష్టాలు పడటమే మంచిది అని బోగాలు వదిలేసి అత్యంత పేదరికమైన జీవితాన్ని ఎన్నుకొన్నారు! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న లగ్జరీ పోతాదేమో, ధనం పోతుందేమో అని ఉన్నదిఉన్నట్టు బోధించక పోయావా- దేవుని నుండి తప్పించుకోలేవు అని తెలుసుకో!

 

   ప్రియ విశ్వాసి! నీవు ఎవరిని సంతోష పెట్టాలని అనుకుంటున్నావు? దేవుడినా లేక మనుష్యులనా? మనుష్యులను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే దేవునికి విరోధివి అని తెలుసుకో! ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి విరోధి అని బైబిల్ సెలవిస్తుంది! యాకోబు 4:4; ఆదివారం నాడే చుట్టాలు ఇంటికి వస్తారు! అదికూడా నీవు చర్చికి బయలుదేరి వెళ్ళేటప్పుడు- అప్పుడు చుట్టాలను సంతోషపెట్టాలని గుడికి వెళ్ళడం మానేస్తున్నావు కదూ! అయ్యో నీవు లేకపోతే కార్యక్రమం అవ్వదు అని చెబితే పొంగిపోయి అన్య సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నావు! అయ్యో చుట్టాలు దగ్గరకు వెళ్తున్నాను- బొట్టు పెట్టుకోకపోతే ఏమనుకుంటారో, నగలు వేసుకోకపోతే ఏమనుకుంటారో, కార్యక్రమానికి వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని దురభిమాన పాపంలో పడిపోతున్నావు కదూ! నీకు బాగులేనప్పుడు ఏమనుకొంటారో- జనాలు నిన్ను బాగుచేశారా? నిన్ను పట్టించుకున్నారా? నీకు ఒకరోజు అయినా తిండిపెట్టారా? లేదు కదా!!! మరి ఇప్పుడెందుకు? నీకు బాగులేనప్పుడు పట్టించుకోని వారు- ఇప్పుడు నీవు బాగున్నప్పుడు, నీవు ఆర్ధికంగా స్థిరపడితే ఆయుస్సు ఇచ్చి ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి దురభిమాన పాపంలో పడిపోయి- ఇప్పుడు చుట్టాలు కావలసి వచ్చారా నీకు?? జాగ్రత్త! కట్టిన దేవుడు పడగొట్టగలరు జాగ్రత్త! దేవునితో నీవు ఆటలాడలేవు!

 

  నేడే మారుమనస్సు పొంది- పశ్చాత్తాప పడు! దురభిమాన పాపంలో నన్ను పడనీయకు అని భక్తుడు ప్రార్ధన చేసినట్లు ప్రార్ధించి (కీర్తనలు 19:13) పాపములను జయించి- జయజీవితం జీవించు!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-8 భాగం*

 

గలతీ 1:1114

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

13. పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు

14. నా పితరుల పారంపర్యాచార మందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి.

 

        ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. ఇక వచనం నుండి రెండో అధ్యాయం చివరివరకు తను రక్షించబడిన తర్వాత జరిగిన అంశాలు, తనకు ఏలాగు అపొస్తలత్వము దేవుని నుండి కలిగిందో చెబుతున్నారు పౌలుగారు! ముఖ్యంగా వచనాలలో ఆయన ఉద్దేశం ఏమిటంటే తాను పొందిన సువార్త మనుషుల ద్వారా పొందుకోలేదు గాని తిన్నగా దేవుని ప్రత్యక్షత వలననే కలిగింది కాబట్టి దీనికోసం నొక్కివక్కానిస్తున్నారు! అది మనుష్యులనుండి లేక మనుష్యుల యోచన ప్రకారమైనది కాదు అంటున్నారు. ఇంకా మనుషులెవరూ తనకు ప్రకటించలేదు. అలా ప్రకటించిన వారిని అపోస్తలుల కార్యములు ప్రకారం కొట్టి తిట్టి చెరశాలలో వేయడమే కాదు చంపినట్లు కూడా చూడగలం! గాని సువార్తను యేసుక్రీస్తుప్రభులవారే ఆయనకు ప్రత్యక్షమై బయలుపరచడం జరిగింది కాబట్టి ఇంత ధైర్యముగా చెబుతున్నారు! మనుష్యులు నుండి సువార్తను వింటే ఓహో ఆయన విన్నది తప్పుగా అర్ధం చేసుకున్నాడు అనుకోవచ్చు లేదా తప్పుగా అర్ధం చేసుకుని లేక అపార్ధం చేసుకుని ప్రకటించాడేమో అనుకోవచ్చు! గాని బోధను విన్నది యేసుక్రీస్తు సాక్షాత్కారం వలననే! కాబట్టి ఇంకా ధైర్యంగా చెబుతున్నారన్నమాట!

 

  ఇలా చాలామంది శిష్యులు ధైర్యంగా చెప్పారు సువార్తకోసం! పౌలుగారు పదేపదే దైర్యంగా ప్రజలముందు అధికారుల ముందు, రాజులముందు కూడా మరణాన్ని లెక్కచేయకుండా చెప్పారు. పేతురుగారు చెప్పారు!

భక్తుడైన యోహాను గారి మాటలు వినండి: ఆదియందు ఏది వింటిమో, ఏది కన్నులారా చూచామో, మాచేతులు దేనిని తాకి చూచాయో దానినే మీకు చెబుతున్నాము. కట్టుకధలు పిట్టకధలు కాదన్నమాట! వారు దేనిని చూచి తాకి అనుభావించారో దానినే ఆయన చెప్పారు. దానికోసమే రాసారు!

1యోహాను 1:1

*జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.*

 

2పేతురు 1:16,17

ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని,

ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమ నుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా..

 

హెబ్రీ 2:4

3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,

4. దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.

 

అపోస్తలుల 1:1,2,3,8,9

1. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన

2. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.

3. ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను (లేక, రుజువులను) చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

9.ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.

 

అపో కా 2:32

32. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి(లేక, ఈయనకు) మేమందరము సాక్షులము.

 

లూకా సువార్త 24:45,46,47,48,49,50,51

45. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

46. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48. ఈ సంగతులకు మీరే సాక్షులు

49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

50. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.

51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

 

కాబట్టి దీనిని దేవుడే వీరందరికీ బయలుపరచారు ఇంకా దానికి వీరందరూ ప్రత్యక్ష సాక్షులు కాబట్టి సాక్షి సమూహమంతా ధైర్యంగా చెబుతున్నారు! సువార్తయే నిజమైన సువార్త! అది మానవుల బోధనుండి కలుగలేదు! అయితే ఇప్పుడు గలతీయ ప్రాంతంలో గల అబద్దబోధకులు దీనిని కాదు అంటున్నారు. అందుకే పౌలుగారు మరింత నొక్కివక్కానిస్తున్నారు! సువార్తసత్యం తను ఊహించి చెప్పడం లేదు లేక ఎవరో చెబితే విని చెప్పలేదు! దేవుడు సత్యాన్ని తానే తనకు కనబడి వివరించి చెప్పారు కాబట్టి పూర్తి అధికారంతో నమ్మకంతో సువార్తకోసం చెబుతున్నారు. సువార్తయే నిజమైనదని మరొకరి నుండి సిఫారసు పత్రికలు కూడా చూపించడం లేదు!

ఎఫెసీ ౩:25

2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక,గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.

3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

4. మీరు దానిని చదివినయెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.

5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు.

 

రోమా 16:2527

25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

26. యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

27. అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

 

1కొరింథీ 15:

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

 

అపో 24:1415

14. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,

15. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

 

అపో 26:14,15,16,17,18,19,20

14. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

15. అప్పుడు నేనుప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేనునీవు హింసించుచున్న యేసును.

16. నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను.నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;

17. నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;

18. వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

20. మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.

 

   ప్రియ దైవజనమా! సాక్షి సమూహం చెప్పిన మాటలను లేఖనాలను పరిశీలిస్తూ మనం కూడా అదే సువార్తలో సాగిపోవాలి తప్ప ఎవడో ఏదో క్రొత్త బోధచేశాడు, దానికి సైన్సు పిట్టకధలు కలిపి మహా బాగా చెప్పాడు అని మోసపోవద్దు! నేటిరోజులలో కాల్వినిజం అంటూ ఎవడో క్రొత్త బోధచేస్తున్నాడు. ఇలాంటి తప్పుడుభోధకుల నుండి జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతభాగాలలో వివరించిన మిగిలిన తప్పుడుబోధలనుండి కూడా జాగ్రత్తగా ఉండాలి! టీవీల్లో చెప్పే కొందరి మాయమాటలు విని మోసపోకండి! బెరయ సంఘస్తుల వలె వారు చెప్పేది నిజమా కాదా అని లేఖనాలను పరిశీలిస్తూ ఉండండి. చివరికి నీ కాపరి చెప్పినది కూడా ఇంటికి వెళ్లి బైబిల్ ను క్షుణ్ణంగా పరిశీలించి అలా రాసి ఉందా లేక సమయానుకూలంగా మీ కాపరి అలా చెప్పారా చూడండి. తప్పు చెప్పారని లేఖనాలను మార్చి చెప్పినట్లు తెలిస్తే వెంటనే ఆయను కలిసి అడగండి! పూర్వకాలంలో ప్రజలు నిరక్షరాస్యులు, అంతేకాదు వారి చేతులలో బైబిల్ కూడా ఉండేది కాదు! దేవుని మహా కృప వలన ఇప్పుడు అందరి చేతులలో బైబిల్ ఉంటుంది. అందరూ చదువుకున్నవారే! కనుక సమయం తీసుకుని బైబిల్ లేఖనాలను పటిస్తూ తప్పుడుబోధకుల నుండి తప్పించుకోండి! దైవసేవకులారా! మీరు కూడా తప్పుడుబోధకుల నుండి మీ సంఘాన్ని తప్పించాలంటే వీరిని కనిపెడుతూ ఉండాలి. లేఖనాల మీద మీకు పట్టు ఉన్నప్పుడు ఇలాంటి పనికిమాలిన బోధకులు ఎన్ని చెప్పినా మీరు మీ సంఘాన్ని తోడేళ్ళ నుండి కాపాడుకోగలరు! అందుకే పౌలుగారు

28. దేవుడు (అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అంటున్నారు అపొ 20:28లో!

మీరు కూడా జాగ్రత్తగా ఉండండి!

ఇంకా గతభాగాలలో చెప్పినట్లు  ఆత్మపూర్ణులవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెబుతాడు ఏది సరియైన బోధ ఏది దుర్భోధ! కాబట్టి ఆత్మపూర్ణులుగా మారడానికి ప్రయత్నం చేయండి!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*గలతీ పత్రిక-9 భాగం*

 

గలతీ 1:1516

15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

16. ఆయనను నా యందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో (మూలభాషలో- రక్తమాంసములతో) నేను సంప్రతింపలేదు.

 

(గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. ఇక వచనం నుండి రెండో అధ్యాయం చివరివరకు తను రక్షించబడిన తర్వాత జరిగిన అంశాలు, తనకు ఏలాగు అపోస్తలత్వము దేవుని నుండి కలిగిందో చెబుతున్నారు పౌలుగారు!

 

  ప్రియులారా! 13 వచనం నుండి తను రకంగా సంఘాన్ని హింసించేవారో, రకంగా పట్టబడ్డారో, తర్వాత జరిగిన సంఘటనలు వివరిస్తున్నారు! సంఘాన్ని నాశనం చేయడానికి నేను ప్రయత్నం చేశాను అని ఒప్పుకుంటున్నారు ఇక్కడ పౌలుగారు!

అపోస్తలుల 7:58 -60లో ....

58. *పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి*.

59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.

60. అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. *సౌలు అతని చావునకు సమ్మతించెను.*

 

అపోస్తలుల 8:1

1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

2. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.

3. సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.

 

అపో 9:12

1. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి

2. యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.

 

ఫిలిప్పీ ౩:56

5. ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై,

6. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రము వలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

 

ఇక 1తిమోతి 1:13 లో తన తప్పు ఒప్పుకుని తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను అంటున్నారు.....

చూడండి ఇంకా అంటున్నారు.....1213 వచనాలు....

12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

13. నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

 

మనం చరిత్ర చూసుకుంటే ఆయన గమలీయేలు అనే ఒక గురువు గారి దగ్గర లేఖనాలు మొత్తం నేర్చుకుని అదే నిజమని యేసుక్రీస్తు ప్రభువు కాదని, రక్షకుడు కాదని సంఘాన్ని హింసించడం మొదలుపెట్టారు. గాని మార్గమధ్యంలో పట్టబడ్డారు.

 అపో 9:9

3. అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.

4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును;

6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

7. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.

8. సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.

9. అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను.

 

  తర్వాత దైవజనుడైన అననీయ గారి దగ్గర దేవునికోసం సంపూర్తిగా తెలుసుకుని దమస్కులో బోధించడం జరిగింది. విషయాల కోసం తర్వాత చూసుకుందాం!

అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ పౌలుగారు చెప్పేది ఏమిటంటే అయినను అనగా నేను సంఘాన్ని అత్యాసక్తిగా హింసించినా సరే, నన్ను తల్లి గర్భమందే లేక తల్లి గర్బము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో అనగా యూదులు కాని ఇతర జనాంగాలకు క్రీస్తుని ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఆయన నాయందు బయలు పరచ ననుగ్రహించినప్పుడు .....

 

ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాటలాడుతున్నారు పౌలుగారు!

 

తల్లిగర్భమునందు పడినది మొదలుకొని...

 

 నన్ను ప్రత్యేక పరచుకున్నారు....

 

తన కృపచేత పిలిచారు....

 

అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి

 

నాయందు బయలుపరచబడిన ....

 

అవును దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో మనం తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఏర్పరచుకున్నారు. నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒక ప్రణాళిక ఉంది. దానిని ముందుగా తెలుసుకోవాలి మనం! అలా కాకుండా గాలికి తిరిగినట్లు గాలిని సంపాదించినట్లు ఈలోకంలో సంపాదన వెనక తిరిగితే నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు! దేవునికి నీ సమయం కేటాయించు! నీ పట్ల ఆయన చిత్తము ఏమిటో కన్నీటితో దేవుని సన్నిధిలో కనిపెట్టి అడిగి తెలుసుకో! అప్పుడే నీవు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలవు!

దేవుడు యిర్మియా తో అంటున్నారు: 1:4-7

4. యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

5. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.

6. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

7. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.

 

నీవు కూడా సాకులు చెప్పవద్దు. బాలుడిని, నత్తివాడిని అనకు మోషేగారు చెప్పినట్లు! ఆయనకు విధేయుడవు కమ్ము! నీవు చదువుకున్నా చదువుకోక పోయినా బైబిల్ ట్రైనింగ్ పొందుకున్నా పొందుకోకపోయినా ప్రతీవారిని వారి స్థాయికి తగ్గట్లుగా వాడుకొనడానికి ప్రభువు సమర్ధుడు! బిలాముకు బుద్ధిచెప్పడానికి గాడిదను వాడుకున్న దేవుడు నిన్నుకూడా వాడుకోగలరు! యోహాను 15:16 లో మీరు నన్ను ఎన్నుకోలేదు గాని నేనే మిమ్ములను ఎన్నుకున్నాను పిలుచుకున్నాను అంటున్నారు. మరి ఆయన మాట విని ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన పని చేస్తావా?

 

ఇంకా యెషయా గారితో 49:1 లో అంటున్నారు: నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి ఒడిలో నన్ను పెట్టుకొనినది మొదలుకుని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను!

 

గమనించాలి- పౌలుగారు పుట్టినప్పుడే లేక గర్బములో ఉన్నప్పుడే పౌలుగారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గాని అది నెరవేరడానికి చాలా రోజులు పట్టింది. వెంటనే ప్రణాళిక కార్యసిద్ధి కాలేదు! అలాగే మోషేగారిని ఉపయోగించుకుని వాడుకుని ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలిపించాలని దేవుని ప్రణాళిక! గాని ఆయన నాయకుడు కావడానికి 80 సంవత్సారాలు పట్టింది. 40 సంవత్సరాలు రాజరికంలో శిక్షణ ఇస్తే, 40 సంవత్సరాలు దానికి భిన్నంగా పశువుల మధ్య ట్రైనింగ్ ఇచ్చారు. 80 సంవత్సరాలు తర్వాత అప్పుడు దేవుడు తనసేవకోసం మోషేగారిని పిలిచారు! అలాగే నిన్నుకూడా ఇప్పుడు ఎన్నో రకాలైన పరీక్షల గుండా నిన్ను దాటించి చివరకు ఒకరోజు నీ ద్వారా ఆయన తన పనిని చేసుకోబోతున్నారు. గాబట్టి పరీక్షల గుండా దేవుడేనిన్ను వెల్లనిస్తున్నారు. ఆయనకు లోబడు! ప్రతీ విషయంలో ఆయనకు లోబడి, ఆయన చిత్తాని తెలుసుకుని ప్రతీ విషయంలో పాటం నేర్చుకో! ఒకరోజు దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకోబోతున్నారు.

 

   1516 వచనాలలో ఆయన చెప్పేది ఏమిటంటే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు.

అపో 9:—4

1కొరింథీ 9:1

నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?

 

అయితే ఇలా క్రీస్తు ప్రత్యక్షమయ్యింది- తనలో దేవుడు ప్రత్యక్ష పరచాలని దేవుని ఉద్దేశం గురుంచి మాట్లాడుతున్నారు పౌలుగారు! క్రీస్తుతనలో జీవిస్తూ తనలో పనిచేస్తున్నారని పౌలుగారు అర్ధం చేసుకున్నారు.

 

గలతీ 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

2కొరింథీ 4:1011

10. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.

11. ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.

 

కొలస్సీ 1:29

అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.

 

కాబట్టి విశ్వాసులందరూ విషయాన్ని గమనించి మీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని , దేవుని కార్యములు మీయందు ప్రత్యక్షం కాబోతున్నాయని ఆయన కృప కోసం కనిపెట్టాలి!

మీ జీవితాలలో క్రీస్తును చూపించాలి!

మీ ప్రవర్తన, జీవితమే ఒక క్రీస్తు కరపత్రిక కావాలి!

పౌలుగారు విధంగా తన జీవితాన్ని మలచుకున్నారు!

 మరి ప్రియ స్నేహితుడా! నీవుకూడా అలా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావా?

 

అలా చేస్తే పౌలుగారిని వాడుకున్న దేవుడు నిన్నుకూడా వాడుకోడానికి ఇష్టపడుతున్నారు!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*గలతీ పత్రిక-10 భాగం*

గలతీ 1:1517

15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

16. ఆయనను నా యందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో (మూలభాషలో- రక్తమాంసములతో) నేను సంప్రతింపలేదు.

17. నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

 

(గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. మనం పౌలుగారి రక్షణ పొందిన తర్వాత వెనువెంటనే జరిగిన సంఘటనలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

   ఇక పౌలుగారు దేవుని ప్రత్యక్షత కలిగి బాప్తిస్మం తీసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు ఆయన మాటలలోనే వివరిస్తున్నారు. ప్రత్యక్షత కలిగిన తర్వాత నేను మనుష్య మాత్రులతో  సంప్రదింప లేదు అంటున్నారు. ఇంకా 17 వచనం ప్రకారం నాకంటే ముందుగా ఉన్న అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు అంటున్నారు అనగా పేతురు గారు, యోహాను గారు యాకోబు గార్ల దగ్గరకు వెళ్ళలేదు. నేను యేరూషలేములో ఉన్న పెద్దల దగ్గరకు లేదా కౌన్సిల్ దగ్గరకు వెళ్లి ఏమీ నేర్చుకోలేదు. వారు నాకు నేర్పించలేదు అంటున్నారుగాని అరేబియా దేశానికి వెళ్లాను అంటున్నారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే పౌలుగారు అరేబియా దేశం వెళ్ళినట్లు బైబిల్ లో ఇక్కడ మాత్రమే చెప్పబడింది. అపోస్తలుల కార్యములు 9:1922 లో జరిగిన సంఘటనలు ఇప్పుడే జరిగాయి అన్నమాట!

 

19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.

20. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.

21. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనముచేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.

22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.

 

   అనగా మొదట దమస్కులో సహోదరుల దగ్గర కొంతకాలం ఉండి ఆత్మలో బలపడి, కొద్దిరోజులు క్రీస్తుసువార్త ప్రకటించిన తర్వాత అరేబియా దేశం వెళ్ళారు అన్నమాట! అరేబియా దేశం అనగా బహుశా ప్రస్తుత సౌదీఅరేబియా కావచ్చు! ఏదిఏమైనా ప్రస్తుత గల్ఫ్ దేశాలలోకి వచ్చి అక్కడున్న విశ్వాసుల మధ్య గడిపి ఉండవచ్చు! ఇక్కడ పౌలుగారు అరేబియా దేశం వెళ్లాను అన్నారు గాని ఎందుకు వెళ్ళారో ఏమి చేశారో వ్రాయలేదు గాని బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం- తాను సేవ ప్రారంభించక ముందు యేసుక్రీస్తుప్రభులవారు ఎలా 40 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టారో అలాగే పౌలుగారు తనయొక్క సువార్త పరిచర్య ప్రారంభించక ముందు అరేబియా దేశం వెళ్లి అక్కడ ప్రార్ధనలోను లేఖనాల పఠనం లోను, ఉపవాసం లోను, ధ్యానం లోను తండ్రి పాదాల దగ్గర గడిపారు అంటారు. అందుకే ఆయన కొత్త నిబంధనలో అత్యధికంగా గ్రంథాలు(14) దైవాత్మ ప్రేరణతో వ్రాయగలిగారు! గమనించాలి నేటి రోజులలో అనేకులు ఇలాంటి కనిపెట్టే అనుభవం లేక సువార్తలో సేవలో ఎక్కువగా ఫలించలేక పోతున్నారు. నీ సేవ ఫలభరితంగా ఉండాలి అంటే దేవుని పాదాల దగ్గర సిద్దపాటు తప్పకుండా ఉండాలి! దేవాదిదేవుడైన యేసుక్రీస్తుప్రభులవారే కనిపెట్టి సిద్ధపడినప్పుడు నీవు కూడా సిద్దపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి నూతన సేవకులకు ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

 

  ఇక్కడ నేను మానవ మాత్రులతో సంప్రదించలేదు అనడానికి కారణం పౌలుగారు మానవులతో కాదు దేవునితోనే సంప్రదించి- దేవుని నుండి మాత్రమే నేర్చుకోవాలని అనుకున్నారు. కారణం తనకు సువార్త సత్యం బయలుపరచింది విశిధపరచింది దేవుడే కాబట్టి డైరెక్టుగా దేవున్నే అడగాలని అనుకున్నారు! దేవుని పాదాల దగ్గరే నేర్చుకున్నారు! యేసయ్య శిష్యులైతే యేసయ్య పాదాల దగ్గర నేర్చుకున్నారు! మరి ఇప్పుడు యేసయ్య భూమి మీద లేరుకదా అందుకనే పౌలుగారు దేవుని దగ్గర మాత్రమే అనగా ప్రార్థనలో ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నారు. ప్రియ దైవజనుడా! విశ్వాసి! నీవుకూడా దేవుని పాదాల దగ్గర నేర్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలా నేర్చుకోడానికి ప్రయత్నించి ఆయన దగ్గరే నేర్చుకో!

 

   1819

Galatians(గలతీయులకు) 1:18,19

18. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడ పదునయిదు దినములుంటిని.

19. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.

 

వచనాలలో మూడు సంవత్సారాలు తర్వాత నేను పేతురును దర్శించడానికి యేరూషలేము వెళ్లాను అంటున్నారు. అనగా అరేబియా దేశంలో కొన్ని సంవత్సారాలు గడిపి, మరల దమస్కు వచ్చి కొన్ని రోజులు అక్కడ సేవచేసినప్పటికి మూడు సంవత్సరాలు గడిచాయి. తర్వాత పేతురుగారిని కలుసుకోడానికి యేరూషలేము వెళ్ళారన్నమాట! వెళ్లి పేతురుగారితో 15 రోజులు సహవాసం చేశారు. అక్కడ పేతురుగారు ఇంకా యేసయ్య తమ్ముడు యాకోబుగారు ఉన్నారు.

 

  ఇప్పుడు సంగతి బాగా అర్ధం చేసుకోవాలంటే అపో 9:26౩౦ వచనాలు చూసుకోవాలి.....

26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.

27. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా భోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.

28. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు,

29. ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను.

30. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.

 

పౌలుగారు యేరూషలేము వచ్చి శిష్యులను కలవాలని ప్రయత్నించినా అతడు శిష్యుడని నమ్మక వారు భయపడ్డారు. కారణం ఇంతవరకు అతడు శిష్యులను అతి ఘోరంగా హింసించినందున వారు నమ్మలేకపోయారు. ఇది శిష్యుల తప్పు కూడా కాదు! అయితే బర్నబా గారు అదే సమయంలో అనగా ఇలా కలిసిన కాలంలో యేరూషలేములో ఉన్నారు కాబట్టి శిష్యులకు పౌలుగారు కోసం మొత్తం చెప్పి సంఘానికి పరిచయం చేశారు. కారణం దమస్కులో సువార్త పరిచర్య చేసినప్పుడు బర్నబా గారు అక్కడే అనగా దమస్కులోనే ఉన్నారు. దీనిని ఆధారంగా బైబిల్ పండితులు అంటారు- పేతురుగారిని కౌన్సిల్ ని పరిచయం చేసుకోవాలి అనే ఆలోచన బహుశా బర్నబా గారే ఇచ్చారు. ఆయనే తీసుకుని వెళ్ళారు యేరూషలేము అంటారు! ఏది ఏమైనా వెళ్లి శిష్యులను కలిసారు. మొదట భయపడినా చివరకు బర్నబా గారి మాటలు నమ్మి చేరదీశారు. అయితే మిగిలిన శిష్యులను పౌలుగారు ఎందుకు కలవలేకపోయారు అంటే ముందు బాగాలలో వివరించినట్లు పౌలుగా మారకముందు సౌలు పెట్టిన హింసల వలన, ఇంకా రోమా సైనికుల వలన సంఘము చెదిరిపోయింది. అందుకే కేవలం పేతురు గారు యాకోబు గారు, యోహాను గారు తప్ప మిగిలిన వారు అనేకదేశాలకు చెదిరిపోయి సువార్తను వ్యాప్తి చెందించారు.

 Acts(అపొస్తలుల కార్యములు) 8:1

1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

 

  ఇక 20 వచనంలో నేను అబద్దం చెప్పడం లేదు అనేమాట వాడటానికి కారణం గలతీ వారు నిజమైన సువార్తను అంగీకరించారు. అయితే అది ఇప్పుడు ప్రమాదంలో పడింది కాబట్టి సంగతిని చాలా గంభీరంగా (సీరియస్ గా) తీసుకుని చెబుతున్నారు! వారు ఇప్పుడు అతనిని నమ్మకపోతే వారు వారిని పిలిచిన దేవుణ్ణి మరచి లోకానికి లొంగిపోయినట్లే! అందుకే ఇంత గంభీరంగా చెబుతున్నారు.

 

 21 వచనం...గలతియులకు 1: 21

పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని.

 

ఇక్కడ నేను సిరియాకు కిలికియాకు వెళ్లాను అంటున్నారు. ఎందుకు వెళ్లారు అంటే సువార్త పనికోసం వెళ్ళారు.

అది ఎక్కడుంది అంటే లూకా గారి డైరీలో! అనగా అపోస్తలుల కార్యములు!

అపో 9:౩౦...

30. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.

 

 మరి ఇక్కడ తార్సు అని ఉంది కదా అంటే తార్సు అనేది ఆయన సొంత ఊరు! ఇది కిలికియ ప్రాంతంలో ఉంది. కిలికియ అనేది ప్రస్తుతం టర్కీ దేశంలో ఉందిఇలా తార్సులో కిలికియ లో సేవచేస్తూ అనేకరోజులు ఆయన గడిపాక అపో 11:2526 ప్రకారం బర్నబా గారు ఇదే తార్సుకి వచ్చి పౌలుగారిని కలసి ఆయనను అంతియొకయకు తీసుకుని వెళ్ళారు! ....

 

25. అంతట అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.

26. వారు కలిసి యొక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్ట మొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.

 

చూశారా వీరు చేసిన సేవా ఫలితమే మనకు క్రైస్తవులు అనగా క్రీస్తుని ధరించిన వారు అనే పేరు వచ్చింది. గమనించాలి! అప్పుడు యేరూషలేములో కౌన్సిల్ ఉన్నా, క్రైస్తవ్యం అంతియొకయ నుండే వ్యాప్తి చెందింది. కారణం యేరూషలేములో గల సేవకు ఉన్న ఆటంకాల వలన సంఘం చెదిరిపోయింది. కాబట్టి ఇలా చెదిరిపోయిన వారిని అంతియొకయ ప్రజలు ఆదరించారు. సంఘాన్ని ఆర్ధికంగా సామాజికంగా బలపరిచారు. అందువలన అపోస్తలులు సేవకులు ప్రవక్తలు సేవా పరిచర్య చేస్తూ మధ్యలో అంతియొకయ వచ్చి అక్కడ నుండి ప్రాంతాలలో సేవ జరగలేదో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకుని అప్పుడు ప్రాంతాలలోకి వెళ్ళేవారు. ఇంకా అవసరతలో ఉన్న సేవకులకు సంఘానికి ఇక్కడనుండే సహాయం వెళ్ళేది. కాబట్టి అంతియొకయ అనేది ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది కాలంలో!

 

2224

Galatians(గలతీయులకు) 1:22,23,24

22. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని

23. మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును (విశ్వాసమును) ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,

24. వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.

 

   పౌలుగారు యేరూషలేములో తాను రక్షించబడిన తర్వాత ఎక్కువకాలం గడపలేదు! సంఘాన్ని హింసించే రోజులలో అక్కడే గడిపేవారు గాని మార్పు పొందిన తర్వాత చాలా తక్కువరోజులు గడిపారు. అందుకే నా ముఖ పరిచయం వారికి లేదు గాని ఒకప్పుడు సంఘాన్ని హింసించినవాడు మార్పుపొంది సంఘ వ్యాప్తికి ప్రయత్నం చేస్తున్నాడు అని విని సంతోషించారు అంటున్నారు. కారణం వారికి తెలుసు పౌలుగారిలో కలిగిన మార్పు ఇది దైవిక మార్పు కాబట్టి పౌలుగారిని మెచ్చుకోవడం లేదు గాని పౌలుగారిని సౌలుని పౌలుగా మార్చిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇదీ దేవుణ్ణి స్తుతించే విధానం! పౌలుగారికి కావలసినది కూడా ఇదే! మనుష్యుల నుండి మెప్పు పొగిడింపు కాదు కావలసినది దేవుని మహిమ కావాలి రావాలి!

 

1 కొరింథీ :47

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు  నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

 

ఎఫేసి 1:6,12,14

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

కాబట్టి ప్రియ సహోదరుడా/ సహోదరి! నీకు మెప్పు రావాలని ప్రయత్నం చేయకు! దేవునికి మహిమ కలగాలని ప్రయత్నం చేయు! అప్పుడు నీవు ఘనమైన స్థానంలోకి చేరుకోగలవు! అప్పుడు ఎప్పుడైతే నీవు దేవుణ్ణి మాత్రమే హెచ్చించాలని కోరుకుంటున్నావు కాబట్టి దేవుడు కూడా నిన్ను హెచ్చిస్తారు! తనను తానూ హెచ్చించు కొనువారు తగ్గించ బడతారు! తనను తానూ తగ్గించుకొనే వారు దేవుణ్ణి ఘనపరచే వారు హెచ్చింపబడతారు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

 

 

*గలతీ పత్రిక-11 భాగం*

 

గలతీ 2:1—4

1. అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని.

2. దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము (కష్టము) వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.

3. అయినను నాతో కూడ నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు.

4. మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది.

 

             (గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. గమనించ వలసిన విషయం ఏమిటంటే రెండవ అధ్యాయం మొదటి అధ్యాయానికి కొనసాగింపు అని గ్రహించాలి. ఇక అధ్యాయంలో చెప్పిన చాలా విషయాలు అపోస్తలుల కార్యములు 15 అధ్యాయంలో జరిగిన సంఘటనలు అని కూడా గమనించాలి! దీనికోసం రెండవ భాగములో విస్తారంగా ధ్యానించడం జరిగింది......

 

   పౌలుగారు సంఘాలు స్థాపించి సంఘపెద్దలను నియమించిన తర్వాత అదే ప్రాంతంలో అనగా పిసిదియ, పంపూలియ, ఈకోనియ, ఫెర్గే  అత్తాలియ అంతియొకయ ప్రాంతాలలో ఉండి సేవ చేశారు. ఇలా బహుకాలం గడిపారు. ఎన్ని సంవత్సరాలో తెలియదు. ఈలోగా 15:1 ప్రకారం కొందరు యూదయ నుండి వచ్చి మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే మీకు రక్షణ లేకపోతే మీకు రక్షణ లేదు అని ప్రకటించడం మొదలు పెట్టారు. వీరిని యూదీయులు అంటారు. ఇంగ్లీషులో జూదాడైజర్లు అంటారు. వెంటనే ప్రజలు పౌలుగారికి బర్నబా గారికి కబురుపెడితే వీరిద్దరూ వారితో అనగా తప్పుడుభోధకులతో తర్కిస్తారు.

అపొస్తలుల 15:2

పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి

 

పౌలుగారు బర్నబా గారు వారు చెప్పేది తప్పు అని వాదిస్తారు. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని తలంచి దీనిని కౌన్సిల్ లో తేల్చుకుందామని బయలుదేరుతారు. కౌన్సిల్ అనగా రోజులలో పేతురు గారు, యేసయ్య తమ్ముడైన యాకోబుగారు, యేసయ్య శిష్యుడైన యోహాను గారు మాత్రము యేరూషలేములో ఉంటూ మిగిలిన శిష్యులు మిగిలిన విశ్వాసులు చెదిరిపోయారు. ముగ్గురు అక్కడ ఉంటూ ప్రజలను హెచ్చరిస్తూ సంఘాన్ని నడిపించేవారు. వీరే కౌన్సిల్! కాబట్టి పౌలుగారు బర్నబా గారు సంఘాల ద్వారా అనగా అంతియొకయ గలతీయ మొదలగు సంఘాల ద్వారా సంగతి ఏమిటి అని తేల్చుకోడానికి వారి దగ్గరకు పంపబడ్డారు. 15:6 ప్రకారం కౌన్సిల్ మరియు ఇంకా సంఘపెద్దలు అందరు కూడారు. వెంటనే పౌలుగారు ఏమి చెప్పకముందే ఇదే విషయం పేతురు గారు చెప్పారుమనకు ఏలాగు దేవుని కృపవలన రక్షణ మరియు పరిశుద్ధాత్మ వరం కలిగిందో అలాగే అన్యజనులైన విశ్వాసులకు కూడా కలిగినప్పుడు , పరిశుద్దాత్మునికి సున్నతి అనే ప్రక్రియ అడ్డం రానప్పుడు మరి మనమెందుకు అన్యజనులైన రక్షించబడిన విశ్వాసులను సున్నతి పొందాలి అని చెప్పడం అని అడుగుతారు. ప్రభువైన యేసు కృప చేతనే మనం రక్షణ పొందుతున్నాము అని మనం నమ్ముతున్నాం కాబట్టి వారు కూడా అలాగే రక్షణ పొందుతున్నారు అంటారు. చివరకు కౌన్సిల్ కి ప్రెసిడెంట్ అయిన యేసయ్య తమ్ముడు యాకోబు గారు ఆర్డినెన్సు జారీ చేస్తారు. దానిని ఉత్తరం రూపంలో రాసి- పౌలు, బర్నబాల మాటలు తప్పు అంటారేమో అని యూదా గారిని సీల గారిని తోడిచ్చి ఉత్తరం లేదా ఆర్డినెన్సు కాపీని ఇచ్చి పంపుతారు.

 

ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే 14 సంవత్సారాలు తర్వాత అంటున్నారు. అనగా రక్షణ పొందిన తర్వాత మూడు సంవత్సారాలు అరేబియా దేశంలో గడిపి, తర్వాత దమస్కు సిరియా కిలికియా అంతియొకయ ప్రాంతాలలో సేవచేసిన తర్వాత 14 సంవత్సారాలు గడిచిపోయాక, అనగా తన రెండవ మిషనరీ యాత్ర కూడా జరిగిన పిమ్మట మరలా బర్నబా గారిని తీతుగారిని తీసుకుని యేరూషలేము రెండోసారి వెళ్లాను అంటున్నారు. అనగా రక్షించబడిన తర్వాత రెండోసారి యేరూషలేము వెళ్ళారన్న మాట! ఎందుకు వెళ్లారు అంటే మీద చెప్పిన విషయం కోసం తేల్చుకుందామని!

వెళ్లడానికి ముఖ్యకారణాలు ఇక్కడ వివరిస్తున్నారు.

మొదటది మీద చెప్పిన విషయాలు తేల్చుకుందామని అయితే;

 

రెండవది: దేవదర్శనం లేదా దేవుని వెల్లడి చేసినందు వలన వెళ్లాను అంటున్నారు. అవును దేవ దర్శనం ప్రకారం, దేవుడు చెప్పినప్పుడు వెళ్తే దాని ఫలితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది.

 

మూడు: తాను ప్రకటిస్తున్న సువార్త కోసం కౌన్సిల్ కి వివరించి చెబుదామని!

ఇలా ఎందుకు వివరించాలి అనుకున్నారంటే నేను ఇది వరకు పడ్డ ప్రయాస వృధాకాకుండా అంటున్నారు. మాట ఎందుకు అంటున్నారు అంటే తాను ప్రకటించే సువార్త నిజమైనదో కాదో తనకు అనుమానం వచ్చి ఎంతమాత్రమూ కాదు, తాను ప్రకటిస్తున్నదే నిజమైన సువార్త అని తనకు తెలుసు! కారణం సువార్త తాను పొందుకున్నది దేవుని నుండి కాబట్టి అది నిజమైన సువార్త అని తెలుసు! అయితే తను ప్రకటించే సువార్తను మిగిలిన  అపోస్తలులు ఎక్కడ వ్యతిరేకిస్తారో, ఎక్కడ ఖండిస్తారో, ఒకవేళ ఖండిస్తే తాను ఇంతవరకు ప్రకటించిన సువార్తకి గొడ్డలిపెట్టు అవుతుందని గ్రహించి వెళ్ళడానికి సిద్దపడ్డారు!

 

ఇంకా 4 వచనం ప్రకారం మీద వివరించిన విషయం కోసం తేల్చుకుందామని వెళ్లానని అంటున్నారు.

 

   అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత ఆయనకు వ్యతిరేఖం ఎంతమాత్రం కలగలేదు! కారణం: వారిలోనూ పౌలుగారి లోను పనిచేస్తున్నది ఒక్కడే పరిశుద్ధాత్ముడు! అందుకే సమస్య పరిష్కారం చేసుకుందామని వెళ్ళిన వెంటనే కౌన్సిల్ ఎంతో సంతోషంగా ఆహ్వానించారు! సమస్యను వెంటనే పరిష్కరించారు. అవును ప్రేమ- ఆత్మ ఉన్నప్పుడు అన్ని ఎంతో సామరస్యంగా పరిష్కారం జరుగుతాయి.  పేతురు గారు అంటున్నారు అపో 15:811...

8. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

9. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు

10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

11. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

 

  ఇక ౩వ వచనంలో మరలా పాత సంగతికి వచ్చారు. నాతో పాటు తీతు యేరూషలేము వచ్చినప్పుడు తీతు గ్రీసు దేశస్తుడు అయినా గాని కౌన్సిల్ గాని పెద్దలు గాని అక్కడున్న సంఘము గాని తీతు సున్నతిని పొందుకోవాలని వారు చెప్పలేదు. అతడు పొందుకోలేదు! గాని ఇవన్నీ దొంగ సహోదరుల వలన కలిగింది అంటున్నారు.

 

 4....మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది.

అందుకే ఇలాంటి కపట సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. వీరు దొంగ వేషం వేసుకుని మేము కూడా క్రైస్తవులమే అంటు వస్తారు. వీరిని చేర్చుకోవద్దు! వారికి వందనం కూడా చెయ్యొద్దు అంటున్నారు భక్తుడు!...2యోహాను 1: 10

ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.

 

5 వచనం ...గలతియులకు 2: 5

సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.

 

 ఇది కూడా  అపొ 15:1 సంబధించిందే! కపట సహోదరులకు లొంగిపోతే గలతీ సంఘస్తులు ఎంతో ప్రమాదంలో పడి ఉండేవారు! అందుకే అంత గట్టిగా ప్రతిఘటించారు బర్నబా గారు పౌలుగారు!

 

ఇక 6 వచనం....గలతియులకు 2: 6

ఎన్నికైన వారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరునివేషము చూడడు (మూలభాషలో-నరుని ముఖము నంగీకరింపడు) . ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

 

 దీనిని  చదివి పేతురు గారు యోహాను గారు యాకోబు గారంటే పౌలుగారికి లెక్కలేదు అని అసలు కానేకాదు! ఇక్కడ ఆయన అసలు ఉద్దేశం ఏమిటంటే మానవులను గొప్ప చేయడం పౌలుగారికి ఇష్టం లేదుఅలాగని ఎవరిని ఎప్పుడూ కించపరచలేదు కూడా!

1కొరింథీ :5,22,23

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.

23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.

 

విషయంలో మనుష్యులు బయటకు ఎలా కనిపిస్తున్నారు వారి ఆధిక్యత ఏమిటి వారి అర్హతలేమిటి వారి పరువు ప్రతిష్ట లేమిటి అనేది ఆయన ఎప్పుడూ చూడలేదు! ఆయన చూచేది ఏమిటంటే దేవుడు తనకు వెల్లడించిన సువార్తను వారు అంగీకరించారా లేదా అనేది మాత్రమే చూశారు! యేరూషలేములో ఉన్న నాయకులు సువార్త అర్ధాన్ని గురించి తనతో ఏకీభవించారు అని గలతీ సంఘస్తులకు పౌలుగారు చెబుతున్నారు తర్వాత వచనాల ప్రకారం!

 

కాబట్టి మనముకూడా అవతలి వ్యక్తియొక్క అర్హతలు ఆస్తి ఐశ్వర్యాలు చూడకుండా అవతలి వ్యక్తి ఎంత ఆత్మీయుడో చూడాలి! వారు దేవుని అంగీకరించిన వారా కాదా? అంగీకరించక పోతే వారికి దేవుని ప్రేమను చెప్పాలి! వారికోసం ప్రార్ధన చేయాలి!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-12 భాగం*

 

గలతీ 2:710

7. అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్పగింపబడెనని వారు చూచినప్పుడు,

8. అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

10. మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని.

 

(గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాము. 710 వచనాలు అర్ధం కావాలంటే ముందు చెప్పినట్లు అపోస్తలుల కార్యములు 15 అధ్యాయం చదువుకోవాలి! గతభాగాలలో పౌలుగారు అపో 15 అధ్యాయంలో కౌన్సిల్ దగ్గరకు ఎందుకు వెళ్ళారో ధ్యానం చేసుకున్నాము. మూడవ భాగంలో పౌలుగారికి అపోస్తలత్వము ఎలా కలిగిందో ధ్యానం చేస్తూ దీనిని ధ్యానం చేసుకున్నాము. .......

 

తొమ్మిదో అధ్యాయంలో హింసకుడుగా సంఘాన్ని బాధ పెట్టేవాడుగా ఉన్న పౌలుగారు దమస్కు మార్గంలో క్రీస్తుయేసు ద్వారా పట్టబడి దేవదర్శనం పొందుకున్నట్లు చూడగలం! తర్వాత కళ్ళు పోగొట్టుకున్న వాడై ఉండగా దేవుడు అననీయ భక్తునితో నీవు వెళ్లి పౌలుకు ప్రార్ధనచేయమంటే ప్రభువా అతను మన సంఘాన్ని ఎంతో పాడుచేస్తున్నాడు అలాంటివాడికి ప్రార్ధన చేయమంటావా అంటే దేవుడు చెప్పారు యితడు నేను ఏర్పరచుకున్న సాధనముయితడు నా నామము కొరకు అనేక శ్రమలను ఓర్చి నా సేవ చేస్తాడు అని దేవుడే చెప్పారు రకంగా ఆరోజే పౌలుగారు అపోస్తలుడుగా ఏర్పరచుకున్నట్లు అననీయ భక్తుడు గ్రహించి- ఇంతవరకు ఉన్న ద్వేషము పోయి అంత్యంత ప్రేమగలవాడై తన్మయంతో సౌలా సహోదరుడా అని  పిలిచి ప్రార్ధన చేసి దేవుని మార్గములో నడిపించారు. బహుశా అప్పుడు అననీయ భక్తుడు చెప్పి ఉండవచ్చు! ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సువార్తలో సాగిపోతుండగా అపొస్తలుల 13 అధ్యాయంలో ఒకసారి దేవుని ప్రేరేపణతో ఉపవాసం చేస్తున్నారు. సడన్ గా దేవుడు బర్నబాను పౌలును నేను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచండి అని చెబుతారు. అనగా వారిని నాకొరకు అపోస్తలులుగా చేయండి అంటే వారు వెంటనే పౌలుగారిని బర్నబాస్ గారిని ఇద్దరికీ ప్రార్ధన చేసి వారిమీద చేతులుంచి అభిషేకం చేశారు అనగా ఆర్డినేషన్ చేశారు అపోస్తలులుగా! వారిని అపోస్తలులుగా చేయమని మనుష్యుడు  చెప్పలేదు. దేవుడు చెప్పారు వీరు చేశారు. మరి అదే కదా పౌలుగారు వ్రాశారు. విషయం కౌన్సిల్ కి తెలిసి ఉండవచ్చు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పిలుపు కాబట్టి మా ఆమోదం లేకుండా మిమ్మల్ని ఎవడు అపోస్తలులుగా అభిషేకం చెయ్యమన్నారు అని వారు అడగలేదు! ఇలా కొన్ని సంవత్సారాలు గడిచిపోయాయి! అప్పుడు గతభాగాలలో వివరించిన సున్నతి సమస్య వచ్చినప్పుడు పౌలుగారు బర్నబా గారు సంఘముల ద్వారా కౌన్సిల్ కి పంపబడ్డారు 15 అధ్యాయంలో. సమస్యకు పరిష్కారం దొరికింది. అయితే సడన్ గా దేవుడు కౌన్సిల్ కి అనగా పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి ప్రేరేపించి ఆత్మపూర్ణులై గలతీ 2 అధ్యాయం ప్రకారం తమ కుడిచేతినిచ్చి అభినందించి, మేము యూదులకు అపొస్తలులుగా ఉంటాము. మీరు అన్యజనులకు అపొస్తలులుగా ఉండమని చెప్పారు.

 

   ఇక్కడ 7 వచనంలో సున్నతిపొందిన వారికి భోధించుటకు సువార్త పేతురుకు ఏలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతిపొందని వారికి భోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు ... అంటున్నారు

 

  ఒకసారి ఇక్కడ ఆగుదాం- సున్నతిపొందిన వారికి అపోస్తలుడుగా భోధించుటకు పేతురు గారికి ఎక్కడ అప్పగింపబడింది?

మొదటగా యేసయ్య ఒకరోజు అడుగుతారు- నేనెవరినని ప్రజలు అనుకుంటున్నారు అని? వెంటనే పేతురు గారు అంటారు- కొందరు ప్రవక్తవని, కొందరు ఏలియావని మరికొందరు ఇలా అనిచెప్పాక- ఇంతకీ మీరు నేనెవరిని అని అనుకుంటున్నారు అని అడిగితే పేతురు గారు చెబుతారు- నీవు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడివైన క్రీస్తువు, మెస్సయ్యవు అని చెబుతారు. వెంటనే యేసయ్య అన్నారు.......

Matthew(మత్తయి సువార్త) 16:16,17,18,19

16. అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని (క్రీస్తు అను శబ్దమునకు- అభిషిక్తుడని అర్థము) చెప్పెను.

17. అందుకు యేసు! సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు (మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు.

18. మరియు నీవు పేతురువు (పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

19. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

 

మొదటగా ఇక్కడ సువార్తభారం పేతురుగారికి అప్పగింప బడింది. బండమీద నా సంఘాన్ని కడతాను అన్నారు. పేతురు అనగా రాయి. బండ! ఇంకా పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువనేరవు అన్నారు. దీని అసలు అర్ధం పేతురుగారి మీద సంఘాన్ని కడతాను అనలేదు గాని రాయి బండ యేసుక్రీస్తు ప్రభులవారే! అయితే క్రీస్తనే బండమీద పేతురుగారిని ఉపయోగించుకుని ఆయనతో మొదటగా సంఘాన్ని కట్టడం ప్రారంభం చేస్తాను అని అర్ధం!

 

    ఇక యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోయి పునరుత్థానుడయ్యాక యోహాను సువార్త 21 అధ్యాయంలో మూడుసార్లు పేతురు గారిని యేసయ్య అడుగుతారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మూడుసార్లు చెబుతారు పేతురుగారు ప్రభువా అది నీకు తెలుసు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మొదటసారి నా గొర్రె పిల్లలను మేపుము అంటారు, రెండోసారి నా గొర్రెలను కాయుము అంటారు, మూడో సారి నా గొర్రెలను మేపుము , నీవు ముసలి వాడయ్యేవరకు ఇలా గొర్రెలను కాస్తూ ఉండమని చెప్పారు! ఇక్కడ చూస్తే ఆయన గొర్రెల భారాన్ని, గొర్రె పిల్లల భారాన్ని పేతురు గారికి అప్పగించారు.

 

   ఇక్కడ గొర్రెలు అనగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన విషయం ఏమిటంటే: గొర్రెలు అనగా ఇశ్రాయేలు జాతి! ఇది అర్ధం కావాలంటే మనం మత్తయి సువార్త 10 మరియు 15 అధ్యాయం ధ్యానం చెయ్యాలి. అక్కడ మొదటగా 15:24 లో యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతారు- ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు! అనగా ఇశ్రాయేలు వారి కోసమే పంపబడ్డారు. ఆయన గొర్రెలు అనగా ఇశ్రాయేలు జాతి! మీకు అనుమానం రావచ్చు! మరి అన్యజనులమైన మనము, రక్షించబడిన మనము ఆయన గొర్రెలము కామా??? కంగారు పడవద్దు!

 

ఇక యేసుక్రీస్తు ప్రభులవారు  మత్తయి 10 అధ్యాయంలో శిష్యులను సేవకు పంపినప్పుడు మీరు ఎవరి దగ్గరకు వెళ్ళవద్దు గాని ఇశ్రాయేలు వంశం లోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అన్నారు! దీనిని బట్టి కూడా గొర్రెలు అనగా ఇశ్రాయేలు ప్రజలు! వీరినే కాయమని యేసయ్య యోహాను 21 అధ్యాయంలో పేతురుగారికి చెప్పారు! మరి ఇశ్రాయేలు ప్రజలు అనగా సున్నతిపొందిన ఇశ్రాయేలు ప్రజలకు సువార్తకు ప్రకటించడానికి పంపబడిన వాడు అనగా అపోస్తలుడు పేతురుగారు అని అర్ధం!

 

  మరి మనమో??? యోహాను సువార్తలో 10 అధ్యాయంలో - యేసయ్య అంటారు- గొర్రెల దొడ్డి, గొర్రెల కాపరి కోసం చెబుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ- నేను గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటూ- 16 వచనంలో దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను. అవికూడా నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అంటారు. కాబట్టి దొడ్డివి కాని గొర్రెలు అనగా ఇశ్రాయేలు దొడ్డికి చెందని అన్యజనాంగమైన గొర్రెలు మనము! వాటిని కూడా యేసయ్య మందలో చేర్చారు!

అందుకే  ఈ మర్మము ఎప్పుడో కీర్తనలు 100 లో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటూ యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము! అంటున్నారు. అనగా సమస్త దేశముల లోని ప్రజలు కూడా ఆయన మేపు గొర్రెలే!

 

  సరే, 7 వచనంలో చెప్పిన విధముగా సున్నతిపొందిన వారికి సువార్త చెప్పడానికి అపోస్తలత్వము పేతురుగారికి పై వచనాల ఆధారంగా అప్పగింపబడింది. మరి ఆయన మేపారా అంటే, బండమీద దేవుని సంఘము ప్రారంభం అయ్యిందా అంటే మనం అపోస్తలుల కార్యములు 2 అధ్యాయం చూసుకోవాలి. పెంతుకోస్తు పండగ దినము నాడు వారందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ప్రజలు ఇదేమిటో అని ఆశ్చర్యపడటం ప్రారంభిస్తే ఒకనాడు- యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకిన పేతురుగారు- ఆత్మాభిషేకము పొందుకున్న తర్వాత  ఆత్మావేశుడై 14 వచనం నుండి పరిచర్య ప్రారంభిస్తే వేలకు వేలమంది నమ్మి బాప్తిస్మం పొందుకోవడం మొదలుపెట్టారు. రకంగా ఆరోజు ఒక్క ప్రసంగానికి ౩౦౦౦ మంది రక్షించబడ్డారు. ఇలా ఎన్నో వేలమంది రక్షణ పొందారు. రకంగా పేతురు గారి ప్రసంగంతో, దేవుని లేక పరిశుద్దాత్ముని రాకతో సంఘం కట్టబడటం మొదలయ్యింది.

 

సరే, మరలా మనం గలతీ 2:7-9 కి వచ్చేద్దాం! ......

7. అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్పగింపబడెనని వారు చూచినప్పుడు,

8. అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

 

 సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురుకు ఏలాగు అప్పగింపబడెనో సున్నతి పొందని వారికి బోధించుటకై నాకప్పగింప బడినదని వారు చూచినప్పుడు...  మరి ఇది ఎప్పుడు జరిగింది? మీద చెప్పిన విధముగా అపో 9:15 లోనే జరిగింది. ..... అన్యజనులకు, రాజుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట, నా నామమును భరించుటకు  అంటున్నారు. ఇలా అప్పగింప బడిందిఇక అపో 22:15 లో నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనను గూర్చి సాక్షివై ఉందువు! అన్నారు, ఇంకా మూడు సంవత్సరాలు తర్వాత వచ్చి పేతురు గారితో 15రోజులు సహవాసం చేసినప్పుడు యేరూషలేము దేవాలయములో పౌలుగారు ప్రార్ధన చేసుకుంటుంటే మరలా యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు- నీవు త్వరపడి యేరూషలేము విడిచి వెళ్ళు, నీ సాక్ష్యం వారు అనగా యేరూషలేము వారు అంగీకరించరు, నేను నిన్ను దూరముగా ఉన్న అన్యజనుల యొద్దకు పంపుదునని చెప్పారు! ఇక్కడ మరోసారి యేసుక్రీస్తు ప్రభులవారు పౌలుగారిని అన్యజనులకు అపోస్తలుడుగా చేసి పంపుతున్నారు. కాబట్టి రకంగా పౌలుగారికి అన్యజనులకు అపోస్తలత్వము దొరికింది.

 

   ఇదంతా చూసిన కౌన్సిల్ అప్పుడు దైవావేశంతో వెంటనే కౌన్సిల్ లో సమస్య పరిష్కారం అయిన వెంటనే పేతురు గారు, యోహాను గారు, యేసయ్య తమ్ముడు కౌన్సిల్ ప్రెసిడెంట్ యాకోబు గారు తమ కుడిచేతిని ఇచ్చి మీరు అన్యజనులకు అపోస్తలులు అని చెప్పారు. అనగా  Its a Token of Acceptance as Apostles to the Gentiles.

ఇంకా ప్రస్తుత భాషలో చెప్పాలంటే  

This is to Certify that: Hereby the Council declared and accepted and Ordained Mr. Paul and Mr. Barnabas as  Apostles to the Gentiles.  అని సర్టిఫికేట్ ఇచ్చారన్న మాట!

 

 ఇదీ పౌలుగారు పొందుకున్న అపోస్తలత్వము విధానము! ఆయన అపోస్తలత్వము పొందుకుని విస్తారమైన కష్టాలు శ్రమలు అనుభవించి- చనిపోయే వరకు కూడా సేవను మానలేదు! కొవ్విత్తిలా కరిగిపోయారు ఆయన! భక్తుడైన జార్జి విట్ ఫీల్డ్ అనేవారు- తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు! అందుకే ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకుండా టీబీ వ్యాధి సోకినా, తన కుటుంబం దూరమైనా సరే, కొన్ని వందల కి.మీ. మంచులో, చలిలో గుర్రం మీద ప్రయాణం చేస్తూ సువార్త చేస్తూ చేస్తూ రక్తం కక్కుకుని చనిపోయారు. అనుకున్నట్లుగానే క్రీస్తుకోసం అరిగిపోయి చనిపోయారు. పేతురు గారు, పౌలుగారు కూడా చనిపోయే వరకు వారు పొందుకున్న అపోస్తలత్వం కోసం, వారు పొందుకున్న పిలుపుకోసం సువార్త చేస్తూ చేస్తూ ఒకే చెరసాలలో పెట్టబడి ఒకే రోజు చనిపోయారు. వీరు క్రీస్తుకోసం క్రీస్తువలే శ్రమలను అనుభవించి కరిగిపోయి చనిపోయారు.

 

        ప్రియ దైవజనమా! మనం కూడా పిలుపును పొందుకున్నాము కాబట్టి ఆయన మన కిచ్చిన పని సమస్త లోకమునకు వెళ్లి సమస్తజనులను శిష్యులను చేయుడి. నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షించబడుదురు నమ్మని వానికి శిక్ష అని ప్రకటించి దేవునికి సాక్షిగా అవసరమైతే హతస్సాక్షిగా జీవించాలి!

నేను సిద్దము! మరి నీవు సిద్దమా?

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-13వ భాగం*

 

గలతీ 2:10

10. మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని.

 

            (గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాముఇంతవరకు పౌలుగారు పొందుకున్న అపొస్తలత్వము కోసం ధ్యానం చేసుకున్నాం! అయితే 10 వచనంలో కౌన్సిల్- అనగా పేతురుగారు యోహాను గారు, యాకోబు గారు కుడిచేతి నిచ్చాక ఒక కోరికను కోరారు- సంఘాల పక్షంగా పౌలుగారిని బర్నబా గారిని- అదేమిటంటే బీదలను జ్ఞాపకం చేసుకోండి. అనగా బీదలను జ్ఞాపకం చేసుకుని వారికి ఆర్ధిక సహాయం చెయ్యమని సంఘాలకు చెప్పి ధనము వారికి అందేలా సహాయం చెయ్యమన్నారు. పౌలుగారు అంటున్నారు అదంటే నాకు కూడా ఇష్టమే అని సంతోషంగా అలా చెయ్యడానికి ఇష్టపడ్డారు!

 

క్రీస్తుప్రేమ ఇలా పేదలకు సహాయం చెయ్యడానికి ఎంతో దోహదం చేస్తుంది. మనదగ్గర లేకపోయినా ఎలాగైనా సహాయం చేసేలా ఒప్పిస్తుందినిజంగా క్రీస్తుప్రేమ, క్రీస్తుఆత్మ నీలో పనిచేస్తే తప్పకుండా బీదలకు గాని, అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చెయ్యకుండా నీవు ఉండలేవు! నీకున్న అప్పులు అవసరాలు దృష్ట్యా నీవు ఇక ఎవరికీ సహాయం చెయ్యకూడదు అని అనుకున్నా సమయం వచ్చినప్పుడు క్రీస్తుప్రేమ ఆయనాత్మ నిన్ను ఒప్పించి ఇలా సహాయం చెయ్యిస్తుంది! ఇది నా స్వానుభవం కూడా!

     గమనించాలి: పౌలుగారు నిజంగా ఎన్నోసార్లు ఇలా పేదలకు పరిశుద్ధులకు సహాయం చేయడానికి కష్టపడ్డారుపౌలుగారు అన్యజనులలో సువార్తకు వెళ్ళినప్పుడు రక్షించబడిన విశ్వాసులకు ఇలా పేదలకు పరిశుద్ధులకు సహాయం చెయ్యాలని ప్రోత్సహించేవారు. అలా చెయ్యమని మిగిలిన అపోస్తలులు పౌలుగారిని ఇంకా మిగిలిన సేవకులకు చెయ్యమని అడిగారువారు కూడా చేసేవారు. అపో 24:17 లో అంటున్నారు ....

కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.

 

ఇంకా రోమా 15:25—28

25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి.

27. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారైయున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరి

28. ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి(మూలభాషలో-ముద్రవేసి), నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.

 

1కొరింథీ 16:14

1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.

2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.

4. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.

 

2కొరింథీ 8 మరియు 9 అధ్యాయాలు పూర్తిగా దీనికోసమే వ్రాసారు పౌలుగారుచూడండి ఇలాంటి విపత్కర పరిస్తితిలో కూడా ఇలా పేదలకు సహాయపడాలన్న మాట కనిపించడం చూస్తుంటే ఇలా బీదలకు సహాయం చెయ్యడానికి అపోస్తలులు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గమనించవచ్చు!

గమినించాలి: నిర్గమ 23:11; ద్వితీ 15:7—8; లో కూడా చెప్పారు దేవుడు బీదలను జ్ఞాపకం చేసుకోమని. నేటి అతి తెలివైన వారు మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా ఎందుకు బీదలను జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చెయ్యాలి అని అడగవచ్చు! అక్కడే కాదు ఇంకా చాలా చోట్ల దేవుడు చెప్పారు.

కీర్తన 41:1

బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.

 

సామెతలు 14:31

దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.

 

సామెతలు 19:17

బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.

 

సామెతలు 21:13

దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.

 

 అంతేనా యేసుప్రభులవారు చెప్పలేదా? ఎన్నోసార్లు చెప్పారు!

మత్తయి 19:21

అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

ఇంకా నీవు ఏదైనా విందు చేసేటప్పుడు తప్పకుండా బీదలను పిలిచి భోజనం పెట్టమంటున్నారు. లూకా 14:13; 14:21;

ఇంకా బాప్తిస్మమిచ్చు యోహాను గారు దైవాత్మ పూర్ణుడై చెబుతున్నారు లూకా :10-11 రెండు అంగీలు కలవాడు లేనివాడికి ఇవ్వాలి, ఆహారం గలవాడు లేనివాడికి పంచాలి అంటున్నారు.

 

ఇంకా భక్తి అంటే నిర్వచనం ఏమిటో చెబుతూ యాకోబు గారు 1:27 లో ..

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

ఇదే నిజమైన భక్తి అంటున్నారు.

ఇంకా యెషయా గారు ఆత్మావేశుడై అంటున్నారు 58:7—8,10.....

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

10. ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

 

ఇదే దేవునికి ఇష్టమైన భక్తి! దేవునికి ఇష్టమైన ఉపవాసం!! అలా కాకుండా పెదాలతో పప్పలు వండినట్లు చిలకపలుకులు పలుకుతూ పేదలకు అవసరతలో ఉన్నవారికి సహాయం చెయ్యకపోతే మ్రోగెడు కంచు గణగణ లాడే తాళము అంటున్నారు. యాకోబు గారు తన పత్రికలో ఇదే రాస్తున్నారు: 2:14—17

 

14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?

15. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

 

గమినించాలి మీరు అందరికీ సహాయం చెయ్యలేరు గాని మీసంఘంలో బీదలకు, మీ ఇరుగుపొరుగున ఉన్న పేదలకు అవసరం లో ఉన్నవారికి సహయం చెయ్యగలరు కదా! మీ స్తోమత మించి చెయ్యమని చెప్పడం లేదు మీకున్నదానిలో కొంత వారికి ఇవ్వమని చెబుతుంది బైబిల్! నీ రక్తసంభందికి నీవు సహాయం చెయ్యగలవు కదా! మరి ఎందుకు నీ సోదరునికి సోదరికి సహాయం చెయ్యడం లేదు?? యోహాను గారు అంటున్నారు 1యోహాను :17,18

17. ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

18. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

 

1యోహాను 4:21

దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.

 

అందుకే కొన్ని సంఘాలలో ప్రభు సంస్కారం తీసుకున్న వెంటనే పేదలకోసం ప్రత్యేకమైన కానుకలు ఎత్తి వారికి సహాయం చేస్తుంటారు. ఇది మంచి పద్దతి! అయితే నెలకోసారి కాకుండా వీలున్నప్పుడు అవసరమైనప్పుడు తప్పకుండ సహాయం చేస్తూ ఉండాలి!

పౌలుగారు తిమోతి తో చెబుతూ విధవరాల్లకు దిక్కులేని వారికి తప్పకుండ సంఘం సహాయం చెయ్యాలి అంటున్నారు!!

 

  కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నీవు నీ సహోదరిని సహోదరుని ప్రేమిస్తున్నావా? వారు ఆపదలలో కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నావా? పేదలకు దిక్కులేని వారికి అనాథలకు విధవరాల్లకు సహాయం చెయ్యమని బైబిల్ చెబుతుంది! మరి నీవు అలా సహాయం చేస్తున్నావా?లేకపోతే నీ విశ్వాసం, నీ ప్రార్ధన నీ భక్తి వ్యర్ధము దండగ అని తెలుసుకోమని మనవి చేస్తున్నాను! ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత భాషలు మాట్లాడినా ఎంత గొప్ప ప్రసంగాలు చేసిన ఎంత రమ్యంగా పాటలు పాడుతూ ప్రార్ధన చేసినా ఇలా పేదలకు అవసరం ఉన్నవారికి అనాధలకు విధవరాల్లకు సహాయం చెయ్యకుండా కేవలం పెదాలతో కబుర్లు చెబితే నీ భక్తి పెద్ద గుండు సున్నా అని తెలుసుకోవాలి! క్రియలు లేని విశ్వాసం వ్యర్ధం! మృతం! కాబట్టి నీ చేతనైనంత మట్టుకు పేదలకు సహాయం చెయ్యాలి! లేకపోతే నీలో దైవిక ప్రేమ, దైవాత్మ లేదని గ్రహించు!

 

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-14 భాగం*

 

గలతీ 2:1115

11. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;

12. ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.

13. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.

14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

15. మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులముకాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలమూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము;

 

                     (గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాముప్రియులారా! వచనాలలో పౌలుగారు ఇంకా తాను అపోస్తలుడుగా తన అధికారాన్ని సమర్ధించుకుంటూ రాస్తున్నారు. యేసుక్రీస్తే తనకు సత్యసువార్తను అనుగ్రహించారు కాబట్టి దీనివిషయంలో గట్టగా వాదిస్తున్నారు. అయితే సత్యాన్ని సందేహంలో ముంచేలా ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిని బహిరంగంగా ఎదిరించడానికి కూడా అతడు సిద్దపడ్డారు! క్రమం లోనే ఒకసారి అంతియొకయ పట్టణంలో పౌలుగారు పేతురుగారు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కోసం రాస్తున్నారు! దీని ప్రకారం చూసుకుంటే కేవలం యేరూషలేములోనే కాకుండా అక్కడక్కడ కొన్ని చోట్ల పౌలుగారు పేతురుగారు కలుసుకున్నారు అని తెలుస్తుంది.

అందరికంటే పెద్ద శిష్యుడు, నాయకుడు అయిన పేతురు గారు చాల మంచివారు! గొప్పవారు! దేవుడు అతన్ని చాలా చాలా గొప్పగా వాడుకున్నారు. అపో 2 నుండి 11 అధ్యాయాలలో ఆయన దేవునికోసం ఎంత గొప్పగా వాడబడ్డారో మనం గమనించవచ్చు! అయితే ఈ భాగం ప్రకారం ఆయన లోపం లేనివాడు కాదు! కాబట్టి పౌలుగారు ముఖాముఖిగా ఈ విషయంలో మందలించినట్లు పౌలుగారు చెబుతున్నారు!  11—13

 

  ఇక్కడ పేతురు గారు అంతియొకయకు ఎప్పుడు వచ్చారో మనకు తెలియదు, వ్రాయబడలేదు. అయితే గత భాగాలలో వివరించినట్లు కాలంలో అంతియొకయ నూతన నిబంధన క్రైస్తవులకు ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది కాబట్టి పేతురుగారు కొన్ని ముఖ్యమైన విషయాలు సంఘాలతో డిస్కస్ చేసి అందరికీ  అనగా అన్ని సంఘాలకు కబురుపెట్టడానికి లేదా అంతియొకయలో గల సంఘాన్ని పరామర్శించడానికి వచ్చారు! వచ్చినప్పుడు యాకోబుగారి దగ్గరనుండి అనగా యేరూషలేము నుండి సహోదరులు రానప్పుడు రక్షించబడిన  అన్యజనులతో కలసి ఎంతో సంతోషంగా భోజనం చేసినా గాని యాకోబుగారి దగ్గరనుండి కొంతమంది వచ్చాక వారికి జడిసి రక్షించబడిన అన్యజనులతో కలిసి భోజనం చెయ్యలేదు! అప్పుడు పౌలుగారికి కోపం వచ్చి ఎందుకు ఇలా చేసావు? మనం రక్షించబడిన తర్వాత మన ఆచారాలు వదిలెయ్యాలి కదా, ఇప్పుడు మనందరం సమానమే కదా, అలాంటప్పుడు యూదుల ఆచారం ప్రకారం అన్యజనులతో భోజనం చెయ్యకూడదు అనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తున్నావు అని అందరిముందు అడిగారట! పౌలుగారికి ఎవరిని ముఖస్తుతి చెయ్యరు! ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు!

 

ఇక ఇక్కడ యాకోబుగారి దగ్గరనుండి మనుషులు అంతియొకయకు ఎందుకు వచ్చారో తెలియదు! యాకోబుగారు పంపించారో లేదో కూడా తెలియదు! యాకోబుగారే పంపించారు అని కూడా ఖచ్చింతంగా తెలియదు! అయితే అప్పటి పరిస్తితులను బట్టి చాలామంది పేతురుగారి పేరు చెప్పుకుని, యాకోబుగారి పేరు చెప్పుకుని వారు మమ్మల్ని పంపించారు అంటూ తప్పుడుభోదలు చేసేవారు! కాబట్టి బహుశా వీరుకూడా ఆ కోవకే చెందినవారు కావచ్చు!

 

  సరే, ఇక్కడ పౌలుగారు పేతురుగారిని అందరిముందు ఆలా అడగవలసిన అవసరం ఏమొచ్చింది అంటే- పౌలుగారికి తెలుసు- పేతురుగారు నమ్మింది ఒకటి- అనగా అన్యజనులతో కలిసి భోజనం చేసినా తప్పులేదని!- గాని ఇక్కడ పేతురుగారు ప్రవర్తించినది వేరోకవిధంగా! అనగా అలా అన్యజనులతో కలిసి యూదుడు భోజనం చెయ్యడం తప్పు అనే విధానంలో ప్రవర్తించారు కాబట్టి అంత బహిరంగంగా పేతురు గారిని ఖండించడం మొదలుపెట్టారు పౌలుగారు! అంతేకాకుండా ఇలా మనుష్యుల ముందు భయపడటం, వారి మెప్పుకోసం ప్రయత్నించడం పౌలుగారి దృష్టిలో కపటమైనది. అందుకే బహిరంగంగా మందలించి విశ్వాసులకు విశ్వాసంలో బలపడే విధంగా చెయ్యాలని పౌలుగారి ఆశ!

 

1415వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్ధమయ్యేది ఏమిటంటే

14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

15. మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులముకాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలమూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము;

 

 అన్యజనుల వలె పేతురుగారు కూడా యూదుల మతాచారాలు పాటించడం లేదు అని పౌలుగారికి తెలుసు, గాని ఇతరులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేసి- అన్యజనులైన విశ్వాసుల విశ్వాసం అనుమానపడేలా ప్రయత్నం చేసారు కాబట్టి అంత బహిరంగంగా ఖండించవలసి వచ్చింది! అక్కడ బలవంతం చేస్తావెందుకు అంటున్నారు- నిజానికి పేతురుగారు ఎవరినీ బలవంతం చెయ్యలేదు, యూదుల ఆచారాలు పాటించమని చెప్పనూ లేదు మరి ఎందుకు అలా అన్నారు అంటే- ఆయన ప్రవర్తన అలా ఉంది! తన ప్రవర్తన ద్వారా వారిపై ఒత్తిడి కలిగించారు అని అర్ధం! సత్యం కోసం ఇలా చెప్పవలసి వచ్చింది పౌలుగారికి పేతురుగారితో!1521వచనాలలో పౌలుగారు సువార్త అంటే ఏమిటో చెబుతున్నారు.

 

   కాబట్టి మనం కూడా ఇలా ఇతరులని మెప్పించాలని ప్రయత్నం చెయ్యకూడదు! నటించకూడదు! దేవుడు చెప్పినట్లు చేద్దాము!

 

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-15 భాగం*

గలతీ 2:15—18

15. మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులముకాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలమూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము;

16. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

17. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.

18. నేను పడగొట్టిన వాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.

                 (గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా! మనం గలతీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకుంటున్నాముప్రియులారా ఇంతవరకు పౌలుగారు తాను పొందిన అపోస్తలత్వము కోసం చెప్పి ఇప్పుడు గలతీపత్రిక యొక్క ముఖ్యాంశం లోకి మరలా వచ్చేశారు. వచనాలలో పౌలుగారు పేతురుగారితో చెప్పిన మాటలను మనకు వినిపిస్తూ పేతురుగారు కూడా విషయాలతో ఏకీభవించారు అయితే ఆయన మనుషులకు భయపడి కొన్నిసార్లు వెనుకడుగు వేశారు అని మీద వచనాలు చెబుతున్నాయి.

 

    మూలాంశము ఏమిటంటే: *మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతుడుగా తీర్చబడతాడు గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడు* అనగా క్రీస్తుయేసునందు గల విశ్వాసము ద్వారా కృపచేతనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము గాని ధర్మశాస్త్ర సంబంధమైన నీతికార్యాలు అనగా ధర్మకార్యాలు ద్వారా గాని, బలియాగాలు అర్చనాదులు ద్వారా గాని మానవుడు నీతిమంతుడుగా తీర్చబడడు! అందుకే మనం కేవలం యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసముంచుదాము అంటున్నారు.

 

  ఇక మరోసారి 16 వచనంలో కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా శరీరియు నీతిమంతుడుగా తీర్చబడదు కదా!!! అంటున్నారు....

ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

 

  ఇక్కడ గమనించవలసిన సత్యము ఏమిటంటే యూదులైన క్రైస్తవ నాయకులు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు- అది ఏమిటంటే దేవుడు మోషేగారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా పాపవిముక్తి కలగనే కలుగదు! కాబట్టి వారు యూదులైనా అన్యజనులైనా గాని పాపుల క్రిందకే వస్తారు!

కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా మనకు పాపవిమోచన కలగడం లేదు కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసి వచ్చింది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆహారోను యాజకత్వము మనిషిని పాప విముక్తులుగా చేయలేదు, పరిపూర్ణులనుగా చేయలేదు కాబట్టే మరో యాజక ధర్మంలో అనగా మెల్కీసెదెకు క్రమంలో క్రీస్తుయేసు మరో ప్రధానయాజకుడుగా వచ్చి బలియాగమై అర్పణ చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేవలం క్రీస్తుయేసుద్వారా మాత్రమే మనకు రక్షణ అని ధైర్యంగా చెబుతున్నారు- చెప్పారు ఆ మొదటి అపోస్తలులు అంతా!

 

అపో.కార్యములు 4: 12

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

 

అపో 13:3839

38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,

39. మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.

 

రోమా ౩:2426,28, ౩౦

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.

30. దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.

రోమా 5:1

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)

 

    కాబట్టి ఇన్ని బోధించాక క్రైస్తవులు ధర్మశాస్త్రంలోని కట్టడలను విధులను కూడా పాటించాలని వారిపై ఒత్తిడి తెస్తే అది సువార్తకు పూర్తిగా భిన్నమైనది అని పౌలుగారి ఉద్దేశం! అది నిజమే కదా! గమనించాలి ఒకవేళ ధర్మశాస్త్రం మనుషులకు పాప విమోచన కలిగిస్తే యేసయ్య ఈలోకానికి రావలసిన అవసరం లేదు! ఆయన సిలువలో బలియాగం అవ్వాల్సిన అవసరం కూడా లేదు! మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం మనుషులకు విమోచనం కలిగించనప్పుడు దానిని పాటించవలసిన అవసరం ఏముంది?? కాబట్టి ఇక మతసంబంధమైన ఆజ్ఞ గాని, కట్టడగాని ఉపదేశం గాని- మానవుల మంచి పనులు స్వప్రయత్నం మనిషి యొక్క మంచి లక్షణాలు పాప విముక్తుని చేస్తాయి అని చెబితే ఉపదేశం ముమ్మాటికి తప్పే అవుతుంది!

 

  ఇక 17,18 వచనాలలో ఒక లాజిక్ చెబుతూ మరలా విషయాన్నే దృవీకరిస్తున్నారు- .......

17. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.

18. నేను పడగొట్టిన వాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.

 

ఏమంటున్నారు అంటే- మనం క్రీస్తునందు నీతిమంతులముగా తీర్చబడ్డాము అని నమ్మి సాగిపోతుండగా ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి మరియు ఇతర కార్యాల వలన నీతిమంతులుగా తీర్చబడతారు అని నమ్మితే ఇక మన భక్తి అనగా యేసుక్రీస్తు ద్వారానే పాప విమోచన అనే నమ్మకము పాపమే కదా! అలాంటప్పుడు క్రీస్తుయేసు పాపమునకు పరిచారకుడా? మీరు చెప్పండి అంటున్నారు! అంతేకదా ఇంతవరకు క్రీస్తుద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, యేసు రక్తము మాత్రమే ప్రతిపాపమును కడిగి శుద్ధిచేస్తుంది అని చెప్పి నమ్మి బాప్తిస్మము తీసుకున్న తర్వాత మరలా యేసురక్తము కాదు I’m Sorry! యేసురక్తం తో పాటు ధర్మశాస్త్ర క్రియలు కూడా ఉండాలి అంటే అది ఎలాగుంటుంది? ఇదీ ఆయన లాజిక్!!

 

  ఇక 18 వచనంలో చెప్పిన లాజిక్ ఏమిటంటే: నేను దేనినైతే పడగొట్టానో దానినే మరలా అదే రీతిలో అదేవిధంగా కడితే ఏమంటారు? నన్ను నేనే అపరాధిగా తీర్చుకుంటున్నాను కదా అంటున్నారు. మన భాషలో అయితే ఎవడైనా దేనినైనా పడగొట్టి మరలా అదేవిధంగా దానినే కడితే వాడిని తిక్కలోడు లేక పిచ్చోడు అంటాము కదా! మరి ధర్మశాస్త్ర క్రియలు మానవుణ్ణి నీతిమంతుడుగా పాపవిముక్తునిగా చేయలేదనే కదా క్రీస్తుయేసు ఈలోకానికి వచ్చి బలియాగంయ్యారు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్నాం! మరి మరలా అదే ధర్మశాస్త్రం వైపు తిరిగితే ఇప్పుడు ఏమంటారు? పిచ్చోళ్ళు వెర్రోల్లు అనరా? అందుకే రెండుసార్లు మూడో అధ్యాయంలో పౌలుగారు అవివేకులైన గలతీయులారా అన్నారు!

 

  కాబట్టి ప్రియ స్నేహితుడా! నీవు కూడా నీవు నమ్మిన సిద్ధాంతం అనగా యేసు రక్తమందే పాప విమోచన, ముక్తి అని నమ్మావు కాబట్టి దానిలోనే నిలిచి ఉండాలి తప్ప ఎవడో ఏదో చెబితే బోధ వెనుకాల బోధకుడి వెనకాల పరుగెత్తి రెంటికీ చెందని రేగడిలా మిగిలిపోవద్దు! ప్రతీ విషయాన్ని బైబిల్ లేఖనములతో సరిచూసుకో! బైబిల్ సంపూర్ణంగా వ్రాయబడింది. ప్రతీ సమస్యకు, ప్రతీ ప్రశ్నకు నీకు జవాబు బైబిల్ లో ఉంది! కాబట్టి లేఖనములను మాత్రమే నమ్మి ముందుకు పోదాం!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-16 భాగం*

 

గలతీ 2:19—21

19. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.

20. నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

21. నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.

               (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం ఇంతవరకు ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా కాకుండా క్రీస్తుయేసునందలి విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడతారు అనే విషయం మీద ధ్యానం చేసుకున్నాం! విషయం ఇక ఎక్కువగా చూసుకోవద్దు కారణం దీనికోసం రోమా పత్రిక ధ్యానాలలోను, గత మెల్కీసెదెకు క్రమం చొప్పున .. ధ్యానాలలోను విస్తారంగా ధ్యానం చేసుకున్నాము కనుక ముందుకు పోదాము! ఇంకా దీనికోసం చదవాలనుకుంటే దయచేసి రోమాపత్రిక , మెల్కీసెదెకు క్రమం చొప్పున శీర్షికలు చదవమని మనవిచేస్తున్నాను!

 

 ఇక పౌలుగారు నేనైతే దేవుని విషయంలో జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని అంటున్నారు. దేవునికోసం బ్రతకటానికి ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను అంటున్నారుఇది బాగా అర్ధం కావాలంటే రోమా 7:14 లో పౌలుగారు ధర్మశాస్త్రం కోసం వివరిస్తూ మనిషి బ్రతికినంత కాలమే వ్యక్తిమీద ధర్మశాస్త్రానికి అధికారం ఉంటుంది, వ్యక్తి చనిపోతే ధర్మశాస్త్రానికి ఏమాత్రం అధికారం ఉండదు అనిచెబుతూ ఒక భర్త బ్రతికి ఉన్నంతవరకే భార్యమీద ధర్మశాస్త్రపు కట్టడ నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే భర్త చనిపోతాడో ఆమె భర్త అనే కట్టడ ఆమెమీద పనిచేయదు. ఇక ఆమె ఎవరినైనా పెళ్ళిచేసుకోవచ్చు! అయితే ఆమె భర్త బ్రతికి ఉండగా మరొక పురుషుని చేరితే ఆమె వ్యభిచారి అనబడతాది అని వివరించారు. అలాగే ఇంకా చెబుతున్నారు మీరు ధర్మశాస్త్రం విషయంలో క్రీస్తుతోపాటు శరీరం విషయంలో చనిపోయారు, ఎలా? భాప్తిస్మం తీసుకున్నప్పుడు శరీర విషయంలో చనిపోయి ఆత్మీయంగా క్రీస్తులో మరలా పుట్టారు లేదా జన్మించారు కాబట్టి ఇక మీరు శరీర విషయంలో చనిపోయారు కాబట్టి ధర్మశాస్త్రానికి మీమీద అధికారం లేదు! మీరు క్రీస్తుతో కూడా సిలువవేయబడ్డారు! క్రీస్తుతో కూడా చనిపోయారు! అలాగే క్రీస్తుతో కూడా లేచారు! కాబట్టి ధర్మశాస్త్రానికి మీమీద అధికారం లేదు అని వివరిస్తున్నారు. అలాగే ఇక్కడ నేను దేవుని విషయంలో జీవించడానికి ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ద్వారాన్నే చనిపోయాను అంటున్నారు. ఎందుకంటే క్రీస్తుయేసు నందు బాప్తిస్మం తీసుకున్నాము కనుక ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాము! ఇక్కడ పాపవిముక్తి కోసం ధర్మశాస్త్రాన్ని త్రోసిపుచ్చడం అనేది పాపముగా పరిగణించబడదు! గాని క్రీస్తులో విశ్వాసులను దేవునికోసం జీవించేలా చేస్తుంది. గాని ధర్మశాస్త్రం అయితే జీవానికి బదులుగా శాపాన్ని తీసుకుని వచ్చింది. పాపవిముక్తికి బదులుగా ఎక్కువ శాపగ్రస్తులనుగా మనలను తీర్పుతీర్చి మరణానికి గురిచేసింది.

రోమా 7:8—11

8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని ( లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.

10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.

11. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని ( లేక, ఆజ్ఞద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.

 

2కొరింథీ ౩:62

ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

 

   ఇక 20 వచనంలో పౌలుగారు చేసిన వాఖ్య చాలా ప్రాముఖ్యమైనది. Remarkable statement!!! .......

*నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.*

 

  నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడ్డాను. చూసారా! దీని అర్ధం ఏమంటే నాలో ఉన్న శరీర ఆశలన్నీ క్రీస్తుయేసు సిలువలో నాతోపాటు చనిపోయాయి. లక్షణాలు ఏమీ ఇప్పుడు లేవు! ఇకను జీవించువాడను నేను కాను గాని క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నాకొరకు తననుతాను అప్పగించుకోనిన దేవుని కుమారునియందలి విశ్వాసంవలన జీవించ చున్నాను అంటున్నారు!

 

   గమనించాలి విశ్వాసులందరూ నిజముగా క్రీస్తులో క్రీస్తుతో పాటు సిలువవేయబడాలి! అప్పుడే నీవు క్రీస్తుతో పాటు లేపబడతావునీలో ఇంకా పాపము, కోపము, వ్యభిచారము, అసూయలు, దురాశలు, అవినీతి, లంచగొండితనం లాంటి పాపములు కనిపిస్తున్నాయి అంటే నీవు క్రీస్తుతో పాటు చావలేదన్న మాట! చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు నీవు సరిగా చావలేదు. సరిగా పాతిపెట్టబడలేదు! పాతరోత జీవితం ఇంకా పోలేదు నీలో! పౌలుగారికి మొత్తం పోయింది! ఒకరోజు సంఘ హింసకుడుగా, హంతకుడుగా, హేళనచేసేవాడుగా ఉన్న సౌలుగారు క్రీస్తుతో కూడా చనిపోయి సిలువవేయబడి క్రీస్తుతో కూడా లేచి పౌలుగా పరివర్తనం చెంది ప్రేమను నేర్పేవాడిగా, పంచేవాడుగాహింసలను శ్రమలను భరించేవాడుగా ఎంతగా కొట్టినా హింసించినా సరే, దూషించకుండా ప్రేమించేవాడుగా మారిపోయారు! ఒకరోజున మార్గంలో ఉన్నవారిని చంపడానికి వచ్చిన వ్యక్తి ఇతడేనా అని ఆశ్చర్యపోయేటంత స్తితికి వచ్చారు! కోపం ద్వేషం విధ్వంసం పోయి ప్రేమ దయాలత్వం మంచితనం అపకారికి ఉపకారం చేయడం నేర్చుకున్నారు! క్రీస్తుయేసుకి మంచి బిడ్డగా ఆయన దాసుడుగా మారిపోయారు! ఒకనాడు అహంకారిగా బ్రతికిన వ్యక్తి, క్రీస్తుపేరు చెబితే కత్తి దూసిన వ్యక్తి , ఇంతగొప్ప చదువు చదువుకుని కూడా ( కాలంలో గొప్ప స్కాలర్) నేను క్రీస్తుకు బానిసను అని అన్ని సంఘాలలోను పరిచయం చేసుకున్నారుఇదీ క్రీస్తుతో కూడా సిలువవేయబడటం అంటే! క్రీస్తుయేసు రూపములోనికి మారడం అంటే!!!

 

ప్రియ విశ్వాసి! దైవజనుడా! నీవు అలా మారావా? లేక ఇంకా పాత రోత జీవితం లోనే ఉమ్ములో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నావా? ఇప్పుడే పాత జీవితాన్ని వదలి మార్పు చెందు! లేకపోతే ఇప్పుడు గొడ్డలి చెట్టువేరున ఉంచబడింది అంటున్నారు

 

   ఇదే విషయాన్ని పౌలుగారు రోమా 6:8 లో చెబుతున్నారు....

3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.

5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

 

క్రీస్తుయేసు మన స్థానంలో చనిపోయారు కాబట్టి మరణాన్ని దేవుడు మన మరణంగానే లెక్కించారు! ఇక మనం జీవించేది నూతన మార్గంలో! నూతన జీవిత విధానంలో జీవించబద్ధులమై ఉన్నాము! మనయొక్క ఆధ్యాత్మిక జీవానికి మూలం మనం మనయొక్క మంచి పనులు భక్తి ఎంతమాత్రము కాదు! మనం జీవానికి మూలం క్రీస్తే! కాబట్టి క్రొత్త జీవితం గడిపేందుకు కావలసిన శక్తి, ఇది విశ్వాసుల భౌతిక మానసిక జీవం నుండి లభించదు గాని వారిని జీవింపజేసే, ఇంకా వారిలో జీవించే క్రీస్తుయేసు నందే లభిస్తుంది. యేసునందే రక్షణ మనకు హల్లెలూయ! యేసునందే నిత్యజీవం హల్లెలూయ!!!

ఇదే విషయాన్ని రోమా 8:1—10 లో చెప్పారు. దయచేసి ఒకసారి భాగాన్ని చదవమని మనవిచేస్తున్నాను! నూతన జీవితం గడపడం అనేది కేవలం క్రీస్తుయేసు నందలి నమ్మకం లేక విశ్వాసం మూలంగానే సాధ్యమవుతుంది. ఆయనలో విశ్వాసం ఉంచడం తోనే నిజ క్రైస్తవ జీవితం ప్రారంభం అవుతుంది!! అది ఆలాగే కొనసాగుతుంది!

కొలస్సీ 2:6—7

6. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

7. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.

 

పౌలుగారు ఇతరులకు చెప్పినది ఇక్కడ స్వయముగా చేసి మాదిరిగా నిలుస్తున్నారు! ఇక జీవిస్తుంది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటున్నారు!

 

  ఇక తర్వాత వచనంలో ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నాకోసం తననుతాను అర్పించుకున్న దేవుని కుమారుని మీద నున్న నా విశ్వాసం వలననే జీవిస్తున్నాను అంటున్నారు! చూడండి క్రీస్తు మనకోసం తన్నుతాను అర్పించుకున్నారు.

గలతీ 1:4

మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి (దుష్టయుగమునుండి) విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను.

 

రోమా 5:68

కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం కలిగి మనం క్రీస్తుకోసమే జీవించవలసిన అవసరం ఉంది!

 

  ఇక చివరి వచనం...

.గలతియులకు 2: 21

నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.

 

దీనిఅర్ధము ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనుషులకు పాపవిముక్తి కలుగుతుంది అనే ఉపదేశం క్రీస్తుమరణమును అర్ధం లేనిదిగా చేస్తుంది. అందువలన ఉపదేశాన్ని తిరస్కరించడానికి పౌలుగారు ఎంతమాత్రము వెనకడుగు వేయడం లేదు! మనుషులు తమ సొంత ప్రయత్నాల ద్వారా దేవునితో ఐక్యమవడం లేక దేవునితో సక్యత సంపాదించుకోగలిగితే క్రీస్టు లోకంలో మరణించవలసిన అవసరం లేదు కదా! కాబట్టి అధ్యాయాన్ని తన మూలాంశం తో ముగిస్తున్నారు- ఇక్కడ మనుషులు ఎన్నుకోవలసింది- తెలుసుకోవలసినది ఏమిటంటేపాపవిమోచననీతిమంతులుగా తీర్చబడటం అనేది కేవలం దేవుని కృప వలన క్రీస్తుయేసునందలి విశ్వాసం వలననే సాధ్యం గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎంతమాత్రమూ కాదు!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-17 భాగం*

 

గలతీ ౩:1

1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

3. మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ఇంతవరకు మనుష్యుడు కేవలం క్రీస్తుయేసు నందలి విశ్వాసం వలన మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడతాడు గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన గాని మన మంచి పనులవలన గాని కానేకాదు అని ధ్యానం చేసుకున్నాము! ఇక మరలా మూడవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చెప్పిన లేక లేఖ రాయడానికి కారణమయిన అంశానికి వచ్చేస్తున్నారు!

 

  మొదటి వచనంలో అవివేకులైన గలతీయులారా!! అని సంభోదిస్తూ అధ్యాయాన్ని మొదలుపెట్టారు! ఇంత ఘోరమైన భాషతో మొదలుపెట్టారు అంటే పౌలుగారు ఎంత బాధపడి ఉంటారో గమనించండి. మనం గమనించ వలసిన విషయం ఏమిటంటే ప్రవచనం గాని లేఖనం గాని మనుషుల ఇచ్చవలన పుట్టదు అని బైబిల్ సెలవిస్తుంది. 2పేతురు 1: 21

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

 ఈభాష బైబిల్ లో దేవుడు అనుమతించారు అంటే పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడి ఉంటాడో తెలుసుకోవాలి!

స్టడీ బైబిల్ లో ఈ వచనం ఇలా వ్రాయబడింది......

1.ఓ తెలివితక్కువ గలతీయవారలారా! మీరు సత్యానికి లోబడకుండా మిమ్ములను భ్రమపెట్టినదెవరు? సిలువకు గురి అయినట్టే యేసు క్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది గదా

3. మీరింత తెలివి తక్కువవారా?  దేవుని ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు శరీర స్వభావంవల్ల మీరు సంపూర్ణులు అవుతున్నారా?

 

గతభాగంలో వివరించడం జరిగింది పౌలుగారు గలతీయులను అవివేకులైన గలతీయులారా అని ఎందుకు అన్నారో ఒక కారణం చెప్పడం జరిగింది! అదేమిటంటే తాను పడగొట్టిన దానినే అదే విధంగా మరలా కడితే వ్యక్తిని అవివేకి అంటారు. అలాగే ధర్మశాస్త్ర మూలంగా పాప విమోచన కలగదు అని నమ్మి బాప్తిస్మం తీసుకుని మరలా ఎవడో ఏదో చెప్పాడని- మరలా క్రీస్తుయేసు నందు విశ్వాసంతో పాటుగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కావాలి అంటే పిచ్చోళ్ళు అంటారు కదా! అందుకే అంటున్నారుక్రీస్తు కారణం లేకుండా చనిపోయారని అనుకోవడం కూడా బుద్ధిహీనతే కదా! ఇంతవరకు విషయమే చెప్పడం జరిగింది- ధర్మశాస్త్ర సంబంధైన క్రియల ద్వారా మనిషికి పాప విమోచన విడుదల, ముక్తి కలుగుతుంది అంటే క్రీస్తుయేసు లోకానికి రావలసిన అవసరము లేదు, మరణించవలసిన అవసరం కూడా లేదు కదా! మరి ఇప్పుడు మరలా ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి పొందు కోవాలి అంటే క్రీస్తు మరణం వ్యర్ధమనే కదా!!! కపట భోధకులు గలతీ సంఘస్తులను అలాంటి తెలివితక్కువ అభిప్రాయంలోకి నడిపించడానికి ప్రయత్నం చేశారు. కొంత విజయాన్ని కూడా సాధించారు. అనగా గలతీయులు అవివేకులయ్యారు అన్నమాట! పౌలుగారు వారికి సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తుయేసు వారి కన్నులముందే సిలువవేయబడినట్లు కళ్ళకు కట్టినట్లు ప్రకటించగా వారు నమ్మి బాప్తిస్మం పొంది ఇప్పుడు తప్పటడుగు వేస్తున్నారు!

 

  ఇక రెండవ వచనంలో ఒక ఋజువు లేదా ఉదాహరణ చూపించి మరో ప్రశ్న సంధిస్తున్నారు! మీరు దేవుని ఆత్మను పొందినది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ ద్వారానా లేక విశ్వాసముతో పొందుకున్నారా నాకు జవాబు చెప్పండి అంటున్నారు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే వీరు కేవలం బాప్తిస్మం తీసుకోవడమే కాకుండా ఇంకా పైమెట్టుకు ఎక్కగలిగారు! అది ఆత్మలో బాప్తిస్మం పొందడం! పౌలుగారు ఇక్కడ దృవీకరిస్తున్నారు- వారు ఆత్మను పొందుకున్నారు అని! మరి ఆత్మను పొందుకున్నంత శ్రేష్టమైన అనుభవం కలిగి కూడా ఈ తప్పుడుబోధలకు ఎలా లొంగిపోయారో పౌలుగారికి అర్ధం అవడం లేదు! అందుకే అదే కారణాన్ని చూపించి మీరు ఆత్మను పొందుకున్నది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టా లేక క్రీస్తుయేసునందలి విశ్వాసం మూలంగానా? ఖచ్చితంగా క్రీస్తుయేసు నందలి విశ్వాసం మూలంగానే పొందుకున్నారు! కాబట్టి నిజమైన బోధనుండి ఎందుకు తొలగిపోయారు అని అడుగుతున్నారు!!

 

 ఇక ౩వ వచనంలో మరలా అడుగుతున్నారు? మీరింత అవివేకులైతిరా? మొట్టమొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరాను సారంగా పరిపూర్ణులు కాగలరా???

4. వ్యర్ధంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా?

ఆత్మను మీకనుగ్రహించి మీలో అద్భుతాలు చేసిన దేవుడు ధర్మశాస్త్ర సంబంధక్రియల వలన చేశారా లేక విశ్వాసము వలన అధ్బుతాలు జరుగుతున్నాయా అని అడుగుతున్నారు!!

 

ఇదే ప్రశ్న దేవుడు మనలను అడుగుతున్నారు!! మొట్టమొదట ప్రార్ధనతో, ఉపవాసంతో, కన్నీటి ప్రార్ధనతో సాక్ష్యంతో వేదనతో ప్రారంభించిన నీవు ఇప్పుడు శరీర సంబంధమైన క్రియలతో మొక్కుబడి ప్రార్ధనతో, అప్పుడప్పుడు ఆరాధన పాల్గోవడంతో, కేవలం పెదాలతో ఆరాధనతో, సంఘంలో చదివే ఆరాధనా క్రమంతో ఇప్పుడు పరిపూర్ణుడు కాగలవా? మొట్టమొదట ఆత్మాభిషేకంతో భాషలతో ఉచ్చరింప శఖ్యముకాని మూల్గులతో ప్రారంభించిన నీవు ఇప్పుడు సినీ స్టెప్పులతో, సినీ సంగీతంతో, పనికిమాలిన డెకరేషన్ చేసుకుంటూ, సినిమాలు షికార్లు చేస్తూ, టీవీసీరియల్లు చూసుకుంటూ, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూసుకుంటూ, పనికిమాలిన చాటింగ్ లు చేసుకుంటూ, నులివెచ్చని స్తితిలో అన్యాచారాలు చేస్తూ, దానికి భారతీయతను ఆపాదిస్తూ లోకంతో రాజీ పడిపోయి, లోకంలో పడిపోయి సాతానుతో ఓడిపోయి పరిపూర్ణతను సాధించగలవా? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ నమ్మిక? ఇదేనా నీ విశ్వాసం? క్రీస్తు నీకోసం మరణించినది ఇందుకేనా?? వాక్యానుసారమైన విశ్వాసివైన నీకు సినిమా పాటలెందుకు? సంఘంలో సినిమా స్టెప్పులెందుకు? అన్యజనులులాగ పనికిమాలిన డేన్సులు ఎందుకు? మరలా కవరింగ్ దావీదు వలె నాట్యము చేస్తున్నాము అంటూ, దావీదుగారు ఇలా పనికిమాలిన డ్రెస్సులు వేసుకుని పనికిమాలిన డేన్సులు వేసారా? అవి మీరు సినిమాలు చూసి సినిమా స్టెప్పులు చూసే నేర్చుకున్నారు కదా! దావీదుగారు ఇలా నేర్చుకున్నారా? వ్యర్ధమయిన డెకరేషన్లు ఎందుకు? ప్రేమలేని జీవితం మాదిరిలేని జీవితం ఎందుకు? అవి మీకు పరిపూర్ణత సాదిస్తాయా? శ్రమలు మాత్రమే పరిపూర్ణతను సాదిస్తాయి అని బైబిల్ చెబితే లగ్జరీలతో బ్రతుకుతూ దేవుని ఆశీర్వాదం అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నందుకు సిగ్గులేదా? ఎందుకు నులివెచ్చని జీవితం??? లోకంతో ఎందుకు రాజీ పడతావు? లోకస్తులులా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? లోకస్తులు వేసుకుంటున్నట్లు ఎందుకు వేషధారణ చేస్తున్నావు? స్త్రీ పురుషవేషం వెయ్యకూడదు, పురుషుడు స్త్రీ వేషం వెయ్యకూడదు అని బైబిల్ చెబితే (ద్వితీయ 22:5) ఎందుకు చెల్లమ్మా నీకు జీన్ ఫేంట్లు టీ షర్ట్లు? దేవుని తీర్పునుండి తప్పించుకోగలవా? మూర్కులైన తరమువారికి వేరై రక్షణ పొందుడి అని చెబితే (అపొ 2:40) అదే మూర్ఖులైన తరమువారు చేసేటటువంటి పనికిమాలిన అలవాట్లు ఆచారాలు చేస్తూ మూర్కులైన తరమువారికి మించినంతగా పాపం చేస్తూ దానికి నాగరికత, మోడరన్ లైఫ్ అని పేరుపెట్టుకుని క్రీస్తుకి- సంఘానికి కుటుంభానికి- చెడ్డపేరు తెస్తూ పరిపూర్ణత సాధించగలవా? వెలగల వస్త్రములు ధరించకూడదు, బంగారు నగలు ధరించకూడదు అని బైబిల్ చెబితే (2తిమోతి 2:9; 1పేతురు 3:3,4) అన్యులు వేసుకున్నట్లుగా నీవుకూడా పనికిమాలిన షోకులు చేస్తున్నావు కదా, మరినీవు పరిపూర్ణత సాధించావా???

 

       కన్నీటితో చెబుతున్నాను ఇవేమీ నీకు పరిపూర్ణత సాధించి పెట్టవు! అవి దేవుని గాయాలను మరలా రేపుతున్నాయి అని గ్రహించండి! శ్రమలద్వారా, ప్రార్ధన ద్వారా, ఆత్మాభిషేకం ద్వారా, వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం ద్వారానే నీవు పరిపూర్ణతను సాధించగలవుప్రియ స్నేహితుడా! లోకముతో రాజీ పడిపోయి మొదట నీకుండిన భక్తి, మొదట నీకుండిన ప్రార్ధన, మొదట నీకుండిన విశ్వాసం, ఆత్మ, భాషలు ప్రవచనాలు, ఉపవాసం అన్నీ పోగొట్టుకుని మొండి బ్రతుకు బ్రతుకుతూ భక్తిగా ఉన్నాను అని భ్రమ పడుతున్నావు! జాగ్రత్త! ప్రకటన 2 లో ఎఫెసీ సంఘానికి దేవుడు లేఖ రాస్తూ నీ క్రియలను సహనమును నేనెరుగుదును గాని మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది అంటున్నారు! అంతేనా నీవు స్తితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసికొని మారుమనస్సు నొంది మొదటి క్రియలను చేయుము అట్లుచేసి మారుమనస్సు పొందావా సరి, లేకపోతే నీయొద్దకు వచ్చి నీ దీపస్థంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నారు. అనగా దీపస్తంభము లేకపోతే గాలి తగిలి నీ దీపం ఆరిపోతుంది. అనగా నీవు చస్తావు అంటున్నారు. అనగా ఆత్మీయంగా చచ్చిపోతావు! తద్వారా నరకానికి నిత్యాగ్నికి ఆహుతైపోతావు ఖబడ్దార్ అంటున్నారు! మరి ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకుంటావా ప్రియ సహోదరి సహోదరుడా! దినమున ప్రభువు వస్తారో మనకు తెలియదు! ఆయన రాకడ అత్యంత సమీపముగా ఉందినేడే మార్పు నొంది, బ్రతుకు దిద్దుకుని ఆయనతో సమాధాన పడు! మొదటి ప్రేమను మొదటి విశ్వాసమును మొదటి ఆత్మను మొదటి త్యాగమును తిరిగి పొందుకో!

అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

*గలతీ పత్రిక-18 భాగం*

 

గలతీ :2,5,6

2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

5. ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు?

6. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ఆత్మానుసారముగా ప్రారంభించిన మీరు ఆత్మానుసారముగానే ఉండాలి గాని శరీరానుసారముగా ఉండకూడదు, శరీరానుసారముగా పరిపూర్ణులు కాలేరు అని చెబుతూ ఇక్కడ పౌలుగారు మూడు రకాలైన ఉదాహరణలు రుజువులు చూపిస్తున్నారు.

 

మొదటిది: మీరు పొందిన ఆత్మ ధర్మశాస్త్ర క్రియల ద్వారానా లేక దేవునిమీద విశ్వాసం తోనా? (2 వచనం)

రెండవది: తన ఆత్మను ఇచ్చి మీమధ్య అధ్బుతాలు చేస్తున్న దేవుడు మీరు చేసే ధర్మశాస్త్ర కార్యాలు వలన చేస్తున్నారా లేక మీరు విశ్వాసంతో ఆయన మాట వినడం వలనా? (5)

మూడవది: అబ్రాహాము గారు ధర్మశాస్త్రమే లేకున్నప్పుడే నీతిమంతుడుగా తీర్చబడ్డారు కదా! ఎలా? కేవలం ఆయనను పూర్తిగా నమ్మడం వల్లనే కదా!! (6)

 

మొదటిది: ఇక్కడ మొదటి ప్రశ్న మీరు దేవుని ఆత్మను పొందింది దేనిని బట్టి? ధర్మశాస్త్ర క్రియలను బట్టా? లేక దేవునిమీద విశ్వాసం వలనా

 

  ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే పౌలుగారు తాను సత్యమును ప్రకటించారనే దానికి ఋజువుగా వారి అనుభవాన్నే పరిశీలించాలని వారికి గుర్తుచేస్తున్నారు! పౌలుగారు గాని, పేతురుగారు ఇంకా అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నప్పుడే విన్నవారు ఇంకా బాప్తిస్మము కూడా పొందుకోకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం అపోస్తలుల కార్యములులో  చూసుకోవచ్చు!

అపో 10:44

పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.

 

దీనిని మీరు కూడా విన్నారు- నమ్మకంతో విశ్వాసంతో అంగీకరించారు కాబట్టే మీరుకూడా పరిశుద్ధాత్మను పొందారు అంటున్నారు ఇక్కడ! ఇంకా గలతీ 4:6 లో...

మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.

 

ఎఫెసి 1:13

మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

 

రోమా 8:15

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.

 

కాబట్టి కేవలం దేవునిమీద నమ్మకం విశ్వాసం ద్వారానే మనమందరమూ పరిశుద్దాత్ముని పొందుకుంటున్నాము! ఇక్కడ ఒకసారి ఆగుదాము! చాలామంది   పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోలేకపోతున్నారు! నమ్మిన వారికందరికీ వరమును ఇవ్వడానికి ఆయన సిద్దముగా ఉన్నారు! బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం వెంటనే దీనిని పొందుకున్నాము! గాని మనలో నమ్మకము విశ్వాసము లేనందువలన ఆయన మనలో ఉన్నట్లు మనకు రుజువులు కనబడటం లేదు! కారణం మనలో విశ్వాసం లేదు! విశ్వాసము పొందుకుని పరిశుద్ధాత్ముడా నన్ను నీ ఆత్మతో నింపు! నన్ను అభిషేకించు అని హృదయపూర్వకముగా నీవు ఆయనను ఆహ్వానిస్తే, ఆయనకు నీ జీవితాన్ని అర్పించుకుంటే, నీవే నాకు నాయకుడుగా ఉండు అని ఆయన హస్తాలకు అప్పగించుకుంటే, అప్పుడు ఆయన నిన్ను నింపి తన ఘనమైన ఆశ్చర్యకార్యాలు చేస్తారు! నీ బ్రతుకు మారడమే కాదు, నిన్ను పరిశుద్దునిగా చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తారు! నిన్ను ఉపయోగించుకుని ఎన్నో తన అద్భుతాలు చేస్తారు! నీకు అనుభవం లేదంటే కేవలం నీయొక్క అవిశ్వాసం అంతే!

 

  సరే, ఇక్కడ దేవుడు తన ఆత్మను వారిలో నివశించేందుకు అనుగ్రహించారు ఇది దేనివలన జరిగింది? వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నందువలన లేక ఆయనను నమ్మి ఆయనే నిజమైన దేవుడు- విముక్తికి మార్గం ఆయనే అని నమ్మడం వలననే కదా! ఇంతవరకు ఎవరూ ఎక్కడా మతాచారాలు, విధులు, నియమాలు పాటించడం ద్వారా దేవుని ఆత్మను ఇంతవరకు పొందుకోలేదు!! గమనించాలి మీద చెప్పన విధముగా అందరిలోనూ స్వభావసిద్ధంగా దేవుని ఆత్మ ఉండదు! ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో సాగిపోతే అప్పుడు ఆయనాత్మ వారిలో నివాసం చేస్తాడు! యోహాను 14:17

లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

 

రెండవది: మీలో జరుగుతున్న అద్భుతాలు- మీరు ధర్మశాస్త్రం పాటిస్తున్నందువలనా లేక ఆయనమీద నున్న విశ్వాసం వలనా?

మీరు కేవలం ఆయన మాట విశ్వాసంతో వినడం వలననే కదా అంటున్నారు! ఇక్కడ కూడా రెండవ వచనంలో ఉన్న విషయాన్నే వేరే విధంగా సంధిస్తున్నారు! ఇదంతా వారు కేవలం వారి బుర్ర ఉపయోగించి ఆలోచించి తెలుసుకుంటారు అని పౌలుగారి ఉద్దేశం అన్నమాట! మొదటగా మీరు ఆత్మను ఎలా పొందుకున్నారు? విశ్వాసం వలనే కదా అంటూ రెండవదిగా మీలో జరిగే అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? ధర్మశాస్త్ర కార్యాలు వలన కాదు కదా! ఆయనమీద గల విశ్వాసం ద్వారానే కదా అంటున్నారు!

 

  ఇక్కడ కూడా ఒకసారి ఆగుదాం! నేటిరోజులలో మనలో చాలామందికి అధ్బుతాలు స్వస్తతలు, ఎందుకు కలగటం లేదు అంటే విశ్వాసం లేనందువలన! కొందరు ప్రభుద్దులు అద్భుతాలు స్వస్తతలు ఆగిపోయాయి అపోస్తులులతో అంటారు! యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు! అవును ఆమెన్!

హెబ్రీయులకు 13: 8

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.

 అని బైబిల్ చెబితే అపోస్తలులు ఉన్నంతవరకే ఆయనకు అద్భుతాలు చేసే శక్తి పవర్ ఉంది గాని అపోస్తలులు అనగా అది అపోస్తలులు చనిపోయాక ఆ శక్తిలేదు అంటున్నారు! ఏమండి ఏది నమ్మాలి? బైబిల్ ని నమ్మాలా లేక వీరి బోధలు నమ్మాలా? ఆయన పవర్ తగ్గిపోలేదు! నీ విశ్వాసం ఎగిరిపోయింది! ఇప్పటికీ పరిశుద్ధాత్ముడు నమ్మినవారిని వాడుకుని అద్భుతాలు దైవిక స్వస్తతలు చేస్తున్నారు! అసాధారణమైన అద్భుతాలు చేస్తున్నారు! పోయిన నెలలో జరిగిన ఒక అద్భుతం విని ఒళ్ళు గగుర్బాటు కలిగింది! ఒక పాస్టర్ గారి కుమారుడు ఆదివారంనాడు ఆరాధనకు ముందుగా చనిపోయాడు! గాని ఆరాధన జరగకుండా ఆపకూడదు, దేవుని కార్యాలను ఆశ్రద్దగా చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు అని కన్నీటితో ఆ ఆరాధనను ముగించి ఆమెన్ అని కన్నీటితో పాష్టర్ గారు, ఆయన భార్య పట్టుకుని ఏడుస్తుంటే విశ్వాసులు అడిగారు ఏం జరిగింది అని? వారు చెప్పారు మా చిన్నకుమారుడు చనిపోయాడు ఉదయం అని! వారు వెళ్లి చూడబోయేసరికి ఆ కుమారుడు బ్రతికి అదే బెడ్ మీద ప్రార్ధన చేసుకుంటూ ఉన్నాడు! హల్లెలూయ! తన బిడ్డలు తనకు విధేయత చూపించి, తనను నమ్మి తన పని చేస్తుంటే ఆయన తాపీగా కూర్చుని వారికి కష్టాలు కలిగించే దేవుడు కాదు! వారి విశ్వాసము చూసి కరిగిపోయి కనికరముతో కదిలించబడి వచ్చి చనిపోయిన కుమారున్ని బ్రతికించారు! ఇదీ విశ్వాసం! ఇదీ నమ్మకం! ఆ విశ్వాసం లేకనే అద్భుతాలు జరగటం లేదు చాలాచోట్ల! ఆ విశ్వాసం గలవారు జయజీవితం జీవిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు! అయితే ఇక్కడ చాలామంది చేసే ఫేక్ హీలింగ్స్ కోసం నేను చెప్పడం లేదు!

 

   కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నీవు ఆత్మను పొందుకోలేకపోతున్నావా? నీకు విశ్వాసం లేనందువలననే! అధ్బుతాలు నీ జీవితంలో నీ ఇంట్లో జరగటం లేదా? కేవలం నీ అవిశ్వాసం వలననే! యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు! అవును! ఆమెన్! అది నమ్మితే నీవు ... చూడగలవు! నమ్మిక లేకపోతే వర్దిల్లలేవు! కాబట్టి నేడే ఆయనయందు విశ్వాసం కలిగి ముందుకు సాగిపోదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*గలతీ పత్రిక-19 భాగం*

 

గలతీ :2,5,6

2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొన గోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

5. ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు?

6. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను.

 

                (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

 

ఇక మూడవదిగా అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను!  ఇంతకీ మాటను ఎందుకు తీసుకుని వచ్చారు పౌలుగారు? అది అతనికి నీతిగా ఎంచబడెను అనగా అబ్రాహాము గారు దేవుని నమ్మడం వలన దేవుడు అతనిని నీతిమంతుడుగా తీర్చేశారు అట! అనగా నిర్దోషిగా తీర్చేశారు అట! సరే, దీనిని ఎందుకు ఎత్తి రాస్తున్నారు అంటే: రోమా 4:1— లో దీనికోసం విస్తారంగా రాశారు పౌలుగారు! అబ్రాహాము గారికి ఇలా నీతిగా ఎంచబడింది స్తితిలో కలిగింది? సున్నతి పొందినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడే కేవలం దేవుని నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడింది కదా! అని రాస్తున్నారు! దీనికోసం గతంలో రోమా పత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తూ దేవుని రక్షణ ప్రణాళిక- రక్షణ సిద్ధాంతం కోసం చూసుకున్నప్పుడు విస్తారంగా ధ్యానం చేసుకున్నాం!

 

ఇది అబ్రాహాము గారి భక్తి కారణంగా గాని, ఆయన చూపించిన విధేయత కారణంగా గాని నీతిమంతుడుగా తీర్చబడలేదు గాని కేవలం దేవుడు నిజంగా ఎవరో తెలుసుకుని ఆయన మీద నున్న అచంచల విశ్వాసం వలన, నమ్మకం వలన అది అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చిదిద్దింది! మనలాగే అబ్రాహము గారు కూడా పాపే! గాని కేవలం ఆయనకు గల దేవునిమీద విశ్వాసం ఆయనను నీతిమంతుడుగా తీర్చింది.

 

దేవునిమీద విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాలను విశ్వసిస్తే మన నమ్మకాన్ని కూడా దేవుడు నీతిగా పరిగణిస్తారు!

రోమా 4:, 9, 10, 21, 22

3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను

9. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతిలేని వారిని గూర్చి కూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా?

10. మంచిది; అది ఏ స్థితియందు ఎంచ బడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

సరే, ఇప్పుడు అబ్రాహాము గారి గురించి మరోసారి ధ్యానం చేద్దాం!

 

రోమా 4:13

1. కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.

2. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.

3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను  . .

 

ఇక్కడ శరీరమును బట్టి అని ఎందుకు అన్నారంటే మనందరికీ తెలుసు యూదులకు మూల పురుషుడు అబ్రాహాము గారు. ఆదికాండము 12—25 అధ్యాయాలుఅందుకే వారు మేము అబ్రాహాము సంతానం అని గర్వపడే వారు. మత్తయి 3:9; యోహాను 8:33,39; యూదులకు/ ఇశ్రాయేలీయులకు తండ్రి యాకోబు గారు, ఆయనకు తండ్రి ఇస్సాకు గారు, ఆయనకు తండ్రి అబ్రాహాము గారు. కాబట్టి వీరికి మూల పురుషుడు అబ్రాహాము గారు! ఇంతకీ ఇక్కడ అబ్రాహముగారిని ఎందుకు రక్షణ సిద్దాంతములోకి  తీసుకుని వచ్చారు పౌలుగారు?? కారణం అబ్రాహాము గారితోనే దేవుడు ప్రత్యేక రక్షణ ప్రణాళిక ప్రారంభించారు కాబట్టి, ఆయననే ముందుగా ఉదాహరిస్తున్నారు.

 

   ఇక మొదటి వచనంలో అడుగుచున్నారు పౌలుగారు శరీరమును బట్టి అబ్రాహామునకేమి దొరికెను?  మొదటగా శరీరమును బట్టి యూదులందరికీ అబ్రాహాముగారు తండ్రి. (విశ్వాస నియమం ప్రకారం అబ్రాహాము గారు మనకు కూడా తండ్రి; మనకు అనగా విశ్వాసులకు తండ్రి).  అయితే ఇక్కడ శరీరమును బట్టి అంటున్నారు పౌలుగారు. శరీరమును బట్టి అబ్రాహాము గారికి ఏమి దొరికింది? మనందరికీ తెలుసు శరీరమును బట్టి అబ్రాహాము గారికి దేవుడు సున్నతి అనే నూతన నిబంధన ఇచ్చారు తన వారిగా చేసుకోడానికి! ఆదికాండం 17.  ఇక ఇశ్రాయేలీయుడు అనిపించుకోవాలన్నా, వారితో కలవాలన్నా ప్రతీ ఒక్కడు సున్నతి పొందుకోవలసినదే! దీనిని ధర్మశాస్త్రం నిర్ధారిస్తుంది. సున్నతికి పూర్తి బలం ఇచ్చింది ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్రం వలన ఏవిధముగాను మనుష్యుడు మోక్షం చేరడని, నీతిమంతుడుగా మారడని మూడవ అధ్యాయంలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాం!  అయితే ఇక్కడ అనగా ఆదికాండం 15:6 లో అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. అబ్రాహముగారు ఊరికినే తనకుతాను మాట రాసుకోలేదు. పరిశుద్ధాత్ముడు మోషేగారిని ఉపయోగించుకుని వ్రాయించిన మాట ఇది!  అది అతనికి నీతిగా ఎంచబడెను. 4:3;  ఇదేమాట క్రొత్త నిభందనలో అనేక చోట్ల ఉంది. గలతీ 3:6; 22; యాకోబు 2:23; 

కాబట్టి నీతిగా ఎంచబడెను అనగా దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చారు.

ఎప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డారు? సున్నతిపొందిన తర్వాత లేక పొందకమునుపా? అబ్రాహాముగారు అతని కుమారుడైన ఇష్మాయేలు, అతని పనివారు మొత్తం సున్నతి పొందినది 17 వ అధ్యాయంలో. ఇక్కడ 15 వ అధ్యాయంలోనే దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా చేసేసారు.

కాబట్టి సున్నతి పొందుకోక మునుపే నీతిమంతుడుగా చేయబడ్డారు.

ఎలా చేయబడ్డారు?

అబ్రాహాము గారు దేవుణ్ణి నమ్మినందువలన! అనగా ఇక్కడ అబ్రాహాముగారికి విశ్వాస నియమం వలననే నీతిమంతుడుగా తీర్చబడ్డారు. ఇదే విషయాన్ని రోమా 4:2 లో వివరిస్తున్నారు పౌలుగారుఅబ్రాహాముగారి క్రియల వలన అతనికి అతిశయం కలుగలేదు కేవలము దేవుణ్ణి నమ్మినందు వలననే నీతిమంతుడుగా అయ్యారు అంటున్నారు. ఇక్కడ క్రియలు అనగా ఆయన పొందిన సున్నతి, దేవుడు చెప్పిన మాట విని ప్రయాణం చేయడం, ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్దపడటం ... మొత్తం అన్ని వస్తాయి. అయితే ఇవన్నీ చేయకుండానే కేవలం దేవుణ్ణి నమ్మి, ఆయనే జీవము గలదేవుడు అని విశ్వసించినందువలన దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చారు. అబ్రాహాముగారికి ఆ విశ్వాసం ఎలా వచ్చిందో గతంలో మీకు బాగా వివరించడం జరిగింది. (యాషారు గ్రంధం ప్రకారం, హనోకు గ్రంధం ప్రకారం, Book of Chronicles ప్రకారం అబ్రాహము గారు పెరిగింది నోవాహు గారిదగ్గర, అబ్రాహాము గారి 56వ సంవత్సరంలో నోవాహు గారు చనిపోయారు, అంతవరకూ అబ్రాహాము గారు నోవాహు గారి దగ్గర దేవునికోసం సంపూర్తిగా తెలుసుకున్నారు).

 

    కాబట్టి ఇక్కడ అబ్రాహాము గారు సున్నతి పొందక మునుపే నిజ దేవుణ్ణి తెలుసుకుని ఎంత కష్టమునకైనా తెగించి, తన తల్లిదండ్రులను, తన బంధువులను వదలి, దేవుడు అడ్రస్ చెప్పని దేశానికి అడ్రస్ లేకుండా, అనుమానాలు లేకుండా ప్రయాణమై వచ్చేశారు కాబట్టి విశ్వాసానికి ముగ్దుడై దేవుడు అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చారు.  అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

ప్రియ విశ్వాసి/ చదువరీ/ స్నేహితుడా! ఎంతకాలం నుండి నీవు వింటున్నావ్ ఆయనే నిజమైన దేవుడని! మరి నీకు అలాంటి విశ్వాసం ఉందా? కేవలం నీ విశ్వాసం నమ్మకం ద్వారానే నీవు పరలోకం చేరుకోగలవు! అవి లేకపోతే నీవు పరలోకం అంచులకు కూడా చేరుకోలేవు! అబ్రాహాము గారు అదే విశ్వాసంతో అన్నింటిని వదులుకోడానికి సిద్దమయ్యారు. తన గ్రామంలో ఆయనకున్న ఆస్తి ప్రకారం ఒక జమిందారు లేక రాజులా బ్రతకగలరు ఆయన! కాని దేవుని పిలుపు విని, ఆయనను నమ్మి, అరణ్యాలు, కొండలు తిరిగారు ఆయన! ఎండా వాన చలి మంచు అనేది లేకుండా 75 సంవత్సరాల నుండి తను చనిపోయేంత వరకు అనగా సుమారు 100 సంవత్సరాలు కొండలు, గుట్టలు, ఎడారులు (ఐగుప్తు) అలా తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిజమైన సత్య దేవుడని! అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి నీవు అలాంటి విశ్వాసం కలిగిఉన్నావా? ఎంతమంది అడిగిఉంటారో ఎక్కడికి పోతున్నావ్? ఎందుకు పోతున్నావ్? అంటే ఒకటే సమాధానం నిజమైన దేవుడు నాకు కనబడి నేను చూపించే దేశం వెళ్ళమన్నారు. నేను వెళ్తున్నాను. అంతే! ప్రియ స్నేహితుడా! నీకు కూడా అలాంటి దృఢమైన విశ్వాసం ఉంటేనే పరలోకం చేరగలవు! మరి నీకు ఉందా?

అట్టి విశ్వాసం దృఢ భక్తి దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

*గలతీ పత్రిక-20 భాగం*

గలతీ :7—9

7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

8. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగాచూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

 

                (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

ఇక 7—9 వరకు అందుచేత విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానము అని తెలుసుకోండి అంటున్నారు. ఎందుకు అందుచేత అంటున్నారు అంటే అబ్రాహముగారు ఎలా దేవుని నమ్మి నీతిమంతుడుగా తీర్చబడ్డారో అలా ఎవరైతే దేవుని నమ్ముతారో వారు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. *అయితే అబ్రహాము గారి సంతానం ఎవరంటే కేవలం విశ్వాస సంబంధులే*! కేవలం ఇశ్రాయేలు సంతానంగా పుట్టినంత మాత్రాన వారు అబ్రాహము సంతానం కాదు! ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారందరూ అబ్రాహాము సంతానమే అంటున్నారు. ఇక్కడ సంతానం అంటే ఆధ్యాత్మిక సంతానము అని గ్రహించాలి!

అందుకే సున్నతి లేకపోయినా అబ్రాహాము గారిలా విశ్వాసం ఉంటే వారందరూ అబ్రాహము సంతానమే అని పౌలుగారు చెబుతున్నారు!

 

రోమా 4:1112, 16,17

11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.

12. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.

16. ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాస మూలమైనదాయెను.

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

 

ఇక 8 వచనం చాలా ప్రాముఖ్యమైన మాటలు రాస్తున్నారు. ఇది మనకోసమే! దేవుని విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అంటున్నారు! ఇప్పుడు జరుగబోయే సంగతులు అబ్రాహాము గారి సమయంలోనే యోచించి దూరదృష్టితో అన్యజనులందరూ నీ బట్టి ఆశీర్వాదం పొందుతారు అని దేవుడు చెప్పారు.

 

ఇక్కడ లేఖనం అనగా రోమా 4:...

 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను

 

అది ఆదికాండం 15:6లో ఉంది.

అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

 

ఇంకా ఆదికాండం 12:1

1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ...

 

ఆదికాండం 18:18

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.

 

ఆదికాండం 22:18

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

 

ఇదీ లేఖనము చెబుతుంది. జరుగబోయేది ముందుగానే యోచించి నీ ద్వారా అన్యజనాంగము లేక సమస్త దేశాలు ఆశీర్వదించ బడతాయి అంటున్నారు. మరి సమస్త దేశాలు ఎలా ఆశీర్వదించబడతాయి అనగా సమస్త దేశాలలోని ప్రజలు అబ్రహాము గారు నమ్మినట్లు దేవుని నమ్మి నిజమైన దేవునిమీద విశ్వాసం ఉంచితే అప్పుడు సున్నతితో పనిలేకుండా అందరినీ దేవుడు విమోచించడానికి, నీతిమంతులుగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు!

 

ఇక 9 వచనంలో....

కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింప బడుదురుచూడండి విశ్వాస సంబంధులే విశ్వాసముంచిన అబ్రాహాము గారితో పాటు ధన్యులవుతారు లేక ఆశీర్వదించబడతారు అంటున్నారు!

 

మత నియమాలు ఆచారాలు పాటించడం ద్వారా, ఇంకా ధర్మశాస్త్ర నియమాలు కట్టడలు పాటించడం ద్వారా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చని మనుష్యులు అనుకుంటారు! యూదుల నమ్మకం- మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి పాటిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అని అనుకుంటారు! అయితే నమ్మకం, స్వప్రయత్నాల వలన దీవెనలు రావు! ఆయన చెప్పినట్లు చేసి ఆయనకు విధేయత చూపిస్తే ఆయనయందు అచంచల నమ్మకం విశ్వాసం చూపిస్తే అప్పుడు అవన్నీ కలుగుతాయి అని గ్రహించాలి!

 

అందుకే అంటున్నారు విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానము! విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడలేము! అబ్రాహము గారు దేవుడు నేను చూపించే దేశం వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అలా వెళ్తే నీవు నాకేటి ఇస్తావు? ఇలాంటి ప్రశ్నలు వేయకుండా దేవుణ్ణి నమ్మి ఆయనమీద భారం వేసుకుని తనకు కలిగిన సమస్తము తీసికొని వెళ్ళిపోయారు! అదే అతనికి నీతిగా ఎంచబడి నీతిమంతుల లిస్టులో పేరు తెచ్చుకున్నారు! అంతేనా ఇంకా విశ్వాసులకు తండ్రి అనే పేరు తెచ్చుకున్నారు!

 

ప్రియ సహోదరి సహోదరుడా! నీవు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడవై పోలేదు! ఆయన చెప్పినట్లు చేస్తే, ఆయన అడుగుజాడలలో నడిస్తే, పేరుకు తగ్గ జీవితం జీవిస్తేనే అప్పుడు నీవు దేవుని కుమారుడవు అబ్రాహాము సంతానం అవుతావు! లేకపోతే లోకాన్ని వెంబడిస్తే దయ్యం కొడుకువి దయ్యం కూతురు చిన్న దయ్యం అవుతావు!

ఏమి కావాలో తేల్చుకో!

ఇంకా విశ్వాస సంబంధులే అబ్రాహాము గారి సంతానము! కాబట్టి విశ్వాస సంబంధులే ఆత్మ సంభంధులు అవుతారు. ఎవరైతే విశ్వాసం ద్వారా లేదా విశ్వాస సంభంధులుగా జీవిస్తారో వారు ఆత్మానుసారంగా నడచుకొంటారన్నమాట! కాబట్టి విశ్వాస సంబంధమైన వారసులమైన మనందరము తప్పకుండా ఆత్మాభిషేకం కలిగి ఆత్మతో నడిపించ బడాలి. ఆత్మ కలిగించే నడిపింపు గద్ధింపు కలిగి విశ్వాసంతో సాగిపోవాలి. ప్రియమైన స్నేహితుడా! మరి నీవు దానికి సిద్దమా?!

 

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-21 భాగం*

 

గలతీ :10—12

10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

12. ధర్మ శాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

 

                (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! గతభాగంలో అబ్రాహాము గారి ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడ్డారు. కేవలం విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానము అని ధ్యానం చేసుకున్నాము!

 ఇక వచనం నుండి అధ్యాయం చివరి వరకు పౌలుగారు ధర్మశాస్త్రం పాటించినందువలన అనగా ధర్మశాస్త్ర క్రియలను పాటించడం వలన నీకు మేలు ఆశీర్వాదాలు లేవు గాని శాపగ్రస్తులుగా మారుతున్నారు అని వివిధమైన కోణాలలో ఋజువుచేస్తున్నారు

 

పదవ వచనంలో ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలు చేసేవారంతా శాపం క్రింద ఉన్నారు, ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంధంలో రాసి ఉన్నవన్నీ పాటించకపోతే శాపగ్రస్తులు అని వ్రాయబడియుంది అంటున్నారు! ఈమాట ద్వితీ 27:26 లో వ్రాయబడియుంది. ......

విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమెన్అనవలెను.

 

కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మనుష్యులు ఆశించిన దీవెనలు వారికి దొరకవు! అందుకు బదులుగా దేవుని శిక్షావిధి వారిపైకి వస్తుంది! కారణం?? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతీదానిని పూర్తిగా లోపం లేకుండా ప్రతీక్షణము పాటించాలని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది! మరి మానవునికి ఇది సాధ్యమా? కానేకాదు! నిర్గమకాండం 19 అధ్యాయంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు గాని పదేపదే చెప్పారువారికి మేరలు పెట్టు, వారు కొండను తాకకూడదు. తాకితే చస్తారు! అంటున్నారు. నిర్గమ 1:5—6, 8, 21—25

 

ఇక, ఒకసారి పౌలుగారి మాటలు వింటే ఫిలిప్పీ పత్రికలో :6 లో ధర్మశాస్త్రాన్ని లోపం లేకుండా పాటించాను అంటున్నారు.  ... ఫిలిప్పీయులకు 3: 6

ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రము వలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

 ఇక్కడ ధర్మశాస్త్రము వలన నీతివిషయమై అనింద్యుడను అంటున్నారు గాని రోమా పత్రికలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని రొమ్ము కొట్టుకొని విలపిస్తున్నారు!

రోమా 7:7—24

7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.

8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని (లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.

10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.

11. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని (లేక, ఆజ్ఞద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.

12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది.

13. ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.

14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాను.

15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.

16. ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.

17. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.

18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

19. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.

21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

22. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని

23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

 

ఇలా అనడానికి కారణం ధర్మశాస్త్రం మొత్తం పాటించలేకపోయారు పౌలుగారు! యాకోబు 2:10—11 ప్రకారం ధర్మశాస్త్రం లోని ఆజ్ఞనైనా పాటించకపోతే మొత్తం ధర్మశాస్త్రమంతా అతిక్రమించినట్లే! ధర్మశాస్త్రమంతటి విషయంలో దోషిగా మారిపోతాడు మనిషి! మరి ఇప్పుడు దేవునితో సఖ్యపడదామని ధర్మశాస్త్ర విధులను పాటిస్తుంటే దేవునితో సఖ్యమవడం కనబడటం లేదు సరికదా వ్యక్తి మీదకు మరింత శాపం తీసుకుని వచ్చి తీర్పుకు శిక్షా విధికి గురిచేసింది ధర్మశాస్త్రం!

 

              అందుకే 11వ వచనంలో .......

ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

 

ధర్మశాస్త్రం వలన దేవుని లెక్కలో ఎవరూ నిర్దోషి లేదా నీతిమంతుడు కాలేరు! ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం వలన లేదా విశ్వాస మూలముగా జీవిస్తాడు! అంటున్నారుఇదేమాట బైబిల్ లో మూడుసార్లు వ్రాయబడింది!

హబక్కూకు 2:4

రోమా 1:17

హెబ్రీ 10:38

ఒక మనిషి దేవునితో సరైన సంబంధం కలిగియుండాలంటే ఆయనయొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలనే ప్రయత్నం వలన అది సాధ్యం కాదు ఎందుకంటే అది కేవలం దేవునియందలి విశ్వాసం నమ్మకం వలననే అది సాధ్యం! అది దేవుని ఉచిత కృప అంతే! మానవుడు తన ప్రయత్నాల వలన దానిని సాధించలేడు!

 

    ఇక 12 వచనంలో ఎందుకు అలా జరగటం లేదు అనగా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడుగా తీర్చబడలేకపోవుటకు మరో కారణం చెబుతున్నారు....

ధర్మ శాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలన బ్రతుకును.

 

ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదుఎందుకంటే కట్టడలప్రకారం జీవిస్తుంటే వారు వాటివల్ల బ్రతుకుతారు అని రాసి ఉంది! ఇది లేవీ 18:5 లో ఉంది....

మీరు నాకట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.

 

ధర్మశాస్త్రం , విశ్వాసం రెండు వేరువేరు సిద్ధాంతాలు, నియమాలువిశ్వాసం అనేది దేవునిపై ఆధారపడితే ఆయనిచ్చే ఉచితమైన ఈవి లేదా కానుక: పాపవిముక్తి, రక్షణ మరియు శాశ్వతజీవము! ఎప్పుడైతే మూడు ఉంటాయో వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు! అయితే ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది అంటే ధర్మశాస్త్ర విధులన్నీ కట్టడలన్నీ పాటించేవాడే దానివలన బ్రతుకుతాడు! గాని కేవలం ఊరకనే అందుకు ప్రయత్నించేవాడు, ఇంకా దాని ప్రకారం చేస్తున్నానని చెప్పేవాడు గాని దానిని సాధించలేడు! కారణం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం పాటించడానికి మానవునికి సహాయం చెయ్యడం లేదు! నియమనిబంధనలు అనే కొలిమిలో చట్రంలో పెట్టి ఇలాగే ఉండమని చెప్పింది గాని అలా చెయ్యడానికి మానవునికి సహాయం చెయ్యడం లేదు! విశ్వాస నియమం అయితే మానవునికి ప్రేమ- క్షమాపణ కలిగించి- నియమం ప్రకారం జీవించడానికి పరిశుద్దాత్మనే కానుకగా ఇచ్చింది! కాబట్టి ధర్మశాస్త్ర నియమం మానవుణ్ణి మరణానికి శిక్షకు గురిచేసింది. రోమా :19—20.

19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

 విశ్వాస నియమం పాపక్షమాపణ, రక్షణ, శాశ్వత జీవాన్ని తీసుకుని వచ్చింది!

 

   ఇక 1314 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు! .....

Galatians(గలతీయులకు) 3:13,14

13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో-శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

14. ఇందును గూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

 

ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించేలా అనగా అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు రావాలని క్రీస్తుయేసు మనకోసం శాపమై పోయారు! అంటూ ఇంకా మ్రానుమీద వ్రేలాడిన ప్రతీవాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే ధర్మశాస్త్రం వలన శాపగ్రస్తులుగా మారిన మనలను దేవుడు విమోచించారు. కారణం మనకోసం అయన శాపగ్రస్తుడయ్యారు! కారణం మనకోసం ఆయన సిలువమీద వ్రేలాడారు. మ్రానుమీద వ్రేలాడేవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెబుతుంది. పాపులైన మనుష్యుల కోసం ఆయన మన స్థానాన్ని తీసుకున్నారు! మనం ఆజ్ఞ మీరినందువలన వచ్చిన శాపాన్ని పాపాన్ని ఆయన తనమీద వేసుకున్నారు. మనం చేసిన నేరాలకు వచ్చే శిక్షను ఆయన అనుభవించారు!

 

రోమా 5:68

6. ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.

7. నీతి మంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.

8. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 

2కొరింథీ 5:21

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

1పేతురు ౩:18

ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

 

మత్తయి 20:28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

చివరకు తన బాధలలో కూడా ఆయన మనకోసమే ఆలోచించారు! తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అడగడమే కాకుండా విశ్వాసులంతా ధర్మశాస్త్రం వలన కలిగిన శాపం నుండి విముక్తులవ్వాలని సిలువమీద నుండి తప్పించుకోకుండా మన బదులుగా శాపాన్ని శిక్షను భరించి మన బదులుగా ఆయనే చనిపోయారు! నిజం చెప్పాలంటే మానుమీద వ్రేలాడవలసినది మనమే!

 

ఇప్పుడు అందువలన మనకు శిక్షావిధి లేదు. రోమా 8:1

రకంగా శాపాన్ని తీసివేసి అబ్రాహాము గారికి ఇచ్చిన ఆశీర్వచనాలకు నిన్ను నన్ను వారసులుగా చేశారు!

 

ప్రియ స్నేహితుడా! ప్రేమకు నీవు ఏమియ్యగలవు? ఏమిచ్చి ఆయన ఋణం తీర్చుకోగలం? ఋణం తీర్చుకోవడం అటుంచి కనీసం ఆయన త్యాగానికి ప్రతిఫలంగా నీవు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది పోయి మాటిమాటికి ఆయన గాయాన్ని రేపుతావా? ఆయన మాటలు వినకుండా, ఆత్మానుసారంగా నడుచుకోండి , ఆత్మపూర్ణులవండి అని చెబితే శరీరానుసారంగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం కలిగే పనులు చేస్తూ ఆయన గాయాలు రేపుతావా ప్రియ సహోదరి సహోదరుడా! ఇది భావ్యమా? ఇంతగొప్ప రక్షణను నిర్లక్షం చేసి తప్పించుకోగలవా ప్రియ స్నేహితుడా??

నేడే నీ బ్రతుకు మార్చుకో!

ఆయనతో సమాధాన పడు!

అబ్రాహము గారి ఆశీర్వచనాలకు హక్కుదారుడవు కమ్ము!

 

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-22వ భాగం*

గలతీ ౩:15—18

15. సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.

16. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.

17. నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.

18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినయెడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.

 

                (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

ఇక 15వ వచనం నుండి వారసత్వం- వాగ్దానాలు కోసం చెబుతున్నారు. దీని మూలార్ధం ఏమిటంటే దేవుడు అబ్రాహాము గారికి చేసిన వాగ్దానాలతో ధర్మశాస్త్రానికి సంబంధం లేదు! ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అనేది చేయడం ద్వారా ఆ వాగ్దానాలు స్వతంత్రించు కోలేము అని పౌలుగారి ఉద్దేశం!

 

15..సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.

  మామూలుగా మానవ వ్యవహారాలలో ఒక ప్రమాణం చేస్తే- ఆ ప్రమాణం చేసిన తర్వాత జరిగే పరిణామాలతో ప్రమాణానికి సంబంధం లేదు! ఒకసారి ప్రమాణం చేసిన తర్వాత దాని పర్వవసానం ఏమైనా గాని ఆ ప్రమాణం చొప్పున చేయాల్సిందే! ఇక దానిని మార్చడానికి వీలులేదు! అయితే ఈ మాట పౌలుగారు అబ్రాహాముగారికి చేసిన వాగ్దానాలకోసం చెబుతున్నారు! అబ్రాహము గారితో దేవుడు చేసిన ప్రమాణం కూడా ఇలాగే ఉంది అంటున్నారు పౌలుగారు! ఆ ప్రమాణం జరిగాక 43౦ సంవత్సారాలు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రానికి ఈ వాగ్దానాలపై ఎటువంటి ప్రభావము లేదు అని అభిప్రాయపడుతున్నారు పౌలుగారు!

 

16.....అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.

ఇక్కడ పౌలుగారి మాట గమనించండి. దేవుడు ప్రమాణం చేసేటప్పుడు నీ సంతానమునకు అని వాగ్దానం చేశారు గాని నీ సంతానములకు అని వాగ్దానం చేయలేదు! అబ్రాహముగారికి కేవలం ఇస్సాకుగారు మాత్రమే సంతానం కాదు! ఇస్సాకుగారి కంటే ముందుగా ఇష్మాయేలు పుట్టాడు. ఇస్సాకు గారి తర్వాత కేతూరా ద్వారా ఇంకా ఆరుగురు పుట్టారు. అయితే వీరెవరు సంతానం కాదు అంటున్నారు. ఆ నిజమైన సంతానం- వాగ్ధాన సంతానం- ఇస్సాకు కూడా కాదు- యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు పౌలుగారు!

 

ఇక వాగ్దానాలు అంటున్నారు కదా ఆ వాగ్దానాలు కోసం చూసుకుంటే మూడుసార్లు దేవుడు వాగ్దానలుచేసారు అబ్రాహాము గారితో!

ఆదికాండం 12:7

యెహోవా అబ్రా మునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

 

ఆదికాండం 13: 15,16

14. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవాఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము;

15. ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.

16. మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణు వులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమునుకూడ లెక్కింపవచ్చును.

 

 అయితే ఈ వాగ్ధానలన్నిటికీ యేసుక్రీస్తే వారసుడు అంటున్నారు. ఏలాగు అంటే: మత్తయి 1:1 చూడండి: అబ్రాహము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి! కాబట్టి అబ్రాహాము గారికి వారసుడు యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు! ఆయన తనకు తానుగా ఈమాటలు అనడం లేదు! గమనించాలి మొదటినుండి చెబుతున్నాను- లేఖనము/ ప్రవచనం మనిషి ఇచ్చనుండి పుట్టదు గాని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలుగుతుంది. అనగా ఈ మాట దేవుడే పౌలుగారికి బయలుపరిచారన్నమాట! కాబట్టి అబ్రాహాము గారి సంతానం ఇంకా అబ్రాహాము గారి వాగ్దానాలకు వారసుడు- యేసుక్రీస్తుప్రభులవారు! అలాగే క్రీస్తులో విశ్వాసులు క్రీస్తుతో జతగా ఉన్నారు కాబట్టి వారు క్రీస్తుతో కూడా సహవారసులు! కాబట్టి ఇప్పుడు విశ్వాస ముంచిన విశ్వాసులు కూడా క్రీస్తుతోపాటుగా అబ్రాహము గారికి వారసులు!

గలతీ ౩:13,29

13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో-శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

29. మీరు క్రీస్తు సంబంధులైతే (మూలభాషలో-క్రీస్తువారైతే) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

రోమా 4:13

అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.

 

రోమా 8:17

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

17వ వచనంలో  పౌలుగారు చెబుతున్నారు 43౦ సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం ఈ వారసత్వ వాగ్దానాన్ని కొట్టివేయదు. ఆ వాగ్ధానాన్ని వ్యర్ధం చేయదు అంటున్నారు.

 

ఇక 18 వ వచనంలో ...ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినయెడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.

చూడండి ఆ వారసత్వము ధర్మశాస్త్రం వలన కలిగితే అది వాగ్ధానం వలన కలిగింది కాదు! అయితే ఆ వారసత్వము ఖచ్చింతంగా వాగ్దానం వలననే అబ్రాహాము గారికి అనుగ్రహించారు అంటున్నారు. ఇక్కడ పౌలుగారు విశ్వాసం, ధర్మశాస్త్రం అనే రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఎలాగున్నాయో అలాగే దేవుడు అబ్రాహముగారికి చేసిన వాగ్దానాలు కూడా వేరు వేరుగా ఉన్నాయి అంటున్నారు. దేవుడు అబ్రాహముగారిని బట్టి మనుష్యులందరినీ ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసారు- ఈ వాగ్దానానికి ధర్మశాస్త్రంతో ఎలాంటి సంబధము లేదు! దేవుడు ఒక వాగ్దానం చేశారంటే మనుష్యులు కేవలం దానిని నమ్మి సంతోషించాలి, అది జరుగుతుంది అని విశ్వసించాలిగాని దానికి గాను కొన్ని ఆచార నియమాలు పాటించడం ద్వారా దేవుణ్ణి ఆ వాగ్దానం నేరవేర్చేలా ప్రయత్నించకూడదు!

అలాగే ఇక్కడ వాగ్దానం కోసం చేసిన వాగ్దానాలకు అలాగే చేయాలి. వాటిని నమ్మి విశ్వసించాలి! వాగ్దానం చేసిన దేవుడు వాటిని నేరవేర్చగలిగిన శక్తిమంతుడు అని నమ్మాలి!

రోమా 4:1314

13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.

14. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థమగును.

 

1కొరింథీ ౩:22

పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.

 

హెబ్రీ 11:810

8. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

 

1పేతురు 1:4

మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

 

యేసుక్రీస్తును విశ్వసించిన విశ్వాసులకు ఈ భూమి ఆకాశం కూడా వారసత్వంగా ఉంటాయి. క్రీస్తుకు లభించే దానంతిటిలో వారికి భాగం ఉంటుంది. అన్నీ క్రీస్తుకే లభిస్తాయి. హెబ్రీ 1:2

ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో- యుగములను) నిర్మించెను.

 

ప్రియ సంఘమా! ఈ వాగ్దానాలన్నీ నీకొరకు నాకొరకు చేశారు! ఆయనను పరిపూర్ణముగా నమ్మి విశ్వసిస్తే క్రీస్తుకు కలిగిన వాగ్దానాలలో నీకు కూడా పాలుపంపులు కలుగుతాయి! ఆయన వాగ్దానలన్నిటికీ వారసుడు హక్కుదారుడవు అవుతావు! సందేహించువానికి ఏదీ దొరకదు! ఇన్ని గొప్ప వాగ్దానాలు, ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని గలిగిన నీవు ధైర్యంగా సాగిపోవాలి తప్ప అవిశ్వాసిగా ఉండకూడదు! అవిశ్వాసం కలిగితే నా అపనమ్మకం తొలగించమని కోరి ప్రార్ధించాలి!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-23వ భాగం*

 

గలతీ ౩:1922

19. ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

20. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని

22. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

 

                (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

ఇక ఈ వచనాలలో అసలు ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చారు దేవుడు- కారణం ధర్మశాస్త్రం దీవెనకు ప్రతిగా శాపమే తీసుకుని వచ్చింది కదా, మరి ఆలాంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు అనుమతించారో చెబుతున్నారు! అందుకే 19వ వచనంలో ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు అని ప్రశ్నిస్తున్నారు పౌలుగారు!

మేలుకు బదులుగా కీడును, ఆశీర్వాదానికి ప్రతిగా శాపాన్ని పెంపొందించే ఈ ధర్మశాస్త్రం ఎందుకు అంటున్నారు? ఇంకా ధర్మశాస్త్రం ద్వారా మనుషుల్ని పాపవిముక్తులుగా చేసి వారిని దీవించాలి అనుకున్న దేవుడు అలా జరగడం లేదు కాబట్టి ఇంతకీ మనుషుల్ని దీవించాలి అనే తలంపు కలిగిన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు?

 దానికి జవాబు కూడా ఆయనే చెబుతున్నారు! ఎవరికైతే ఈ వాగ్దానాలు చేయబడ్డాయో- ఆ సంతానం వచ్చేవరకు అది అత్రిక్రమములనుబట్టి దానికి తర్వాత ఇయ్యబడింది అంటున్నారు. ఇంకా అది మధ్యవర్తిచేత దేవదూతల చేత నియమింపబడింది అంటున్నారు.

 

రోమా ౩:20

ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

 

రోమా 4:15

ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును.

 

రోమా 5:20

మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,

 

రోమా 7:7,8

కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.

అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని( లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

 

వీటన్నిటిని బట్టి పాపాన్ని బయట పెట్టేందుకు అనగా పాపం అంటే ఏమిటో తెలియజేయడానికి దాని యొక్క తీరును, దానియొక్క శక్తిని వెల్లడిచేసేందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని వాడుకున్నారు! ఈ పద్దతి ద్వారా మనుష్యులకు యేసుక్రీస్తుప్రభులవారి అవసరం ఏమిటో లోకం గుర్తించాలని ధర్మశాస్త్రాన్ని తెచ్చారు దేవుడు! యేసుక్రీస్తు మనకు అవసరమని గుర్తించడం, ఆయనను రక్షకునిగా అంగీకరించడం అన్ని ఆశీర్వాదాల కన్నా దీవెనల కన్నా అత్యంత శ్రేష్టమని చెప్పడానికే ఈ ధర్మశాస్త్రాన్ని తెచ్చారు దేవుడు!

 

ఇక ఇదే వచనంలో తర్వాత మాటలలో ఆ సంతానం వచ్చేవరకే ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది అంటున్నారు! గతభాగంలో మనం చూసుకున్నాం- ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తుప్రభులవారు! ఆయన వచ్చేవరకే ఈ ధర్మశాస్త్రము అన్నమాట! అనగా దేవుడు ఆ పాత నిబంధనకు, ధర్మశాస్త్ర ఏలుబడికి ఒక సమయాన్ని నియమించారు! అది ఆ సంతానం వచ్చేవరకు అనగా యేసుక్రీస్తుప్రభులవారి ఆగమనం వరకు! మొదటి రాకడ వరకే! కారణం క్రీస్తుయేసు ఈ లోకానికి వచ్చి ఇక బలియాగాలకు అర్పణ అర్చానాధులకు అవసరం లేకుండా తానే బలియాగమై పరిహారం చెల్లించేవరకు మాత్రమే ఈ ధర్మశాస్త్రం! ఒకసారి ఆయన వచ్చి ఈ యాగాన్ని పూర్తిచేసిన తర్వాత ఇక ధర్మశాస్త్రంతో పనిలేదు! అందుకే యేసయ్య వచ్చి బలియాగమై పరిహారం చేసి నిన్ను నన్ను విముక్తులనుగా చేశారు!

 

ఇక తర్వాత మాట: మధ్యవర్తిచేత దేవదూతల చేత నియమించబడింది!  ఇక్కడ మధ్యవర్తి అనగా ఎవరు? ధర్మశాస్త్రం తేడానికి దేవుడు వాడుకున్న మధ్యవర్తి మనకు తెలుసు- మోషేగారు! అయితే సంపూర్ణ విమోచనం కోసం మధ్యవర్తి – యేసుక్రీస్తుప్రభులవారు! అయితే ఇక్కడ పౌలుగారు మాట్లాడే  ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మధ్యవర్తి మోషేగారు!

సరే, మరి దేవదూతలు ద్వారా ఎలా నియమించబడింది?  ఎవరు- ఎక్కడ మాట్లాడారు? దీనికి సమాధానం :

అపో 7:38

సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.

 

హెబ్రీ 2:2

ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా

 

 కాబట్టి ఈ మధ్యవర్తి మోషేగారు!

 

ఇక తర్వాత వచనంలో మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే! అంటున్నారు- ఇది అర్ధం కాలేదు కదా, దీనిని అర్ధం చేసుకోవాలంటే 20-21 రెండు వచనాలు కలిపి చదువుకోవాలి! ...

మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని ....

 

దీని అర్ధం: దేవుడొక్కడే కదా, అయితే అబ్రాహాముగారికి వాగ్దానం చేసి, ఆ తర్వాత దానికి విరుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు? దీనిని ప్రజలు అపార్ధం చేసుకుంటున్నారు అంటున్నారు పౌలుగారు! దీవెనలు ఆశీర్వాదాలు, స్వాస్త్యము ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు దానికి వ్యతిరేఖంగా ధర్మశాస్త్రం ఇవ్వలేదు! అయితే దీవెనలు ఇస్తానన్న దేవుని వాగ్దానానికి ధర్మశాస్త్రం వ్యతిరేఖం కాదు! గాని మనుష్యులు ధర్మశాస్త్రంపై ఆధారపడినంత కాలము ఆ దేవుని వాగ్దానాలు నెరవేర్పు జరగవు! కారణం ఆధ్యాత్మిక జీవము ఇవ్వడానికి, మనుష్యులను నిర్దోషులుగా నీతిమంతులుగా చేయడం ధర్మశాస్త్రానికి చేతకాదు! ఈ నిర్దోషత్వం- నీతి అనేది కేవలం దేవుని మీద లేక క్రీస్తుయేసు నందలి విశ్వాసమందే సాధ్యం!!!

 

రోమా 7:14

ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను.

 

రోమా 8:3

శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము

 

అందుకే 21వ వచనంలో జీవింపజేయు శక్తిగల ధర్మశాస్త్రం ముందే ఇచ్చి ఉంటే ఆ నీతి ధర్మశాస్త్రం వలననే కలిగియుండేది అంటున్నారు. అనగా ధర్మశాస్త్రానికి నిజంగా ఈ మరణమునుండి అనగా ఆధ్యాత్మిక మరణము నుండి రక్షించగలిగే శక్తిసామర్ధ్యాలు ఉంటే – ధర్మశాస్త్రం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారు! గాని దురదృష్టవశాత్తూ ధర్మశాస్త్రానికి ఆ శక్తిలేదు కాబట్టే విశ్వాసనియమం అనేది వచ్చింది! ఆ క్రమంలో సరిక్రొత్త యాజకధర్మం వచ్చింది! అదే మెల్కీసెదెకు క్రమం లో ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభులవారు రావలసి వచ్చింది!

 

   దీనిని చదువుతున్న కొందరు అనుకోవచ్చు! ఇది ఎప్పుడో జరిగింది- ఇప్పుడు దీనికోసం మనకెందుకు? దానికి సమాధానం- పౌలుగారు ఈ పత్రిక ఎందుకు రాశారు? కొంతమంది అబద్దబోధకులు పాపవిముక్తికి కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం చాలదు! ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలి అని గలతీయులను నమ్మించి వారిని విశ్వాస బ్రష్టులను చేశారు. అనగా విశ్వాస సంబంధమైన విషయాల నుండి శరీరసంబంధమైన విషయాల మీద ఆసక్తిని ప్రజలకు కలిగించి విశ్వాస బ్రష్టులను చేశారు! ధర్మశాస్త్రం శరీరానుసారమైనది! అయితే విశ్వాస నియమం ఆధ్యాత్మిక మైంది! కాబట్టి ప్రియ చదువరీ! నిన్ను కూడా ఈ పాడు అబద్దబోధకులు విశ్వాస సంబంధమైన విషయాలనుండి శరీర సంబంధమైన విషయాల వైపు- లోకం వైపు- అనగా లోకాచారాల వైపు, లోక పద్దతుల వైపు త్రిప్పుతున్నారు కనుక నీవు కూడా సత్యమేమితో గ్రహించి లోకానుసారమైన పద్దతులను విడిచిపెట్టి ఆత్మానుసారమైన విషయాల వైపు తిరగమని చెప్పడానికే ఈ సంగతులు అప్పుడు పౌలుగారు చెప్పారు- ఇప్పుడు మరోసారి మిమ్ములను ప్రభువుపేరిట హెచ్చరిస్తున్నాను!

 

దైవాశీస్సులు!

(ఇంకా ఉంది)

 

*గలతీ పత్రిక-24 భాగం*

 

గలతీ ౩:2225

22. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

23. విశ్వాసము వెల్లడికాకమునుపు (మూలభాషలో- విశ్వాసము రాకమునుపు) , ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మవలంబింప వలసినవారముగా (మూలభాషలో- విశ్వాసమవలంబింప) చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి.

24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

25. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.

 

                (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! ఈ వచనాలలో కూడా ధర్మశాస్త్రం- విశ్వాస నియమం కోసమే చెబుతున్నారు గాని కొంచెం ప్రత్యేక కోణంలో వివరిస్తున్నారు!

 

22 వచనంలో యేసుక్రీస్తు మీది విశ్వాసమూలమైన వాగ్దానం ఆయనను నమ్మేవారందరికీ లభించడానికే లేఖనం అందరినీ పాపం క్రింద మూసేవేసింది అంటున్నారు! ఇక్కడ లేఖనం అనగా ధర్మశాస్త్రమని గ్రహించాలి!

 

ఇక 23-24 వచనాలలో ధర్మశాస్త్రాన్ని ఒక చెరసాల లేక జైలుగా వివరిస్తున్నారు. విశ్వాసం రాకముందు మనమందరం ధర్మశాస్త్రం అనే జైలులో ఖైదీలుగా బందీలుగా ఉన్నాము గాని విశ్వాసం వెల్లడి అయిన తర్వాత విశ్వాసాన్ని నమ్మిన వారందరూ జైలునుండి విముక్తి పొందారు అంటున్నారు.

 

రోమా 3:19-24 వరకు అసలు ధర్మశాస్త్రం యొక్క అవసరం కోసం చెబుతున్నారు పౌలుగారు!....

 

19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

 ధర్మశాస్త్రం మనుష్యులపై నేరము మోపి వారు స్వయంగా కోరుకున్న చెరసాలలో బందించడం మాత్రమే ధర్మశాస్త్రం చెయ్యగలదు! చెరసాల పాపము అంటున్నారు! అయితే యేసుక్రీస్తుప్రభులవారు వచ్చి పాపపు చెరసాల నుండి విముక్తిని పాపవిముక్తిని సిద్ధంచేసి విశ్వాసం అనే మార్గాన్ని నేర్పించకముందు ధర్మశాస్త్రం చెరసాల అధికారిగా పనిచేసింది అంటున్నారు. క్రీస్తుకు వేరుగా ఎంత ఉత్తములైనా జైలులో ఉన్నవారే! దేవుని దృష్టిలో తన ఆజ్ఞలను మీరినవారు నేరస్తులే! వారికి యేసుక్రీస్తు లేకుండా ఆధ్యాత్మిక స్వతంత్రత, విడుదల ఏమాత్రం కలుగవు! ఎవరూ తమ సొంతప్రయత్నాల వలన సత్క్రియల వలన , ధర్మశాస్త్రాన్ని, మత సంబంధమైన నియమాలు, ఆచారాలు పాటించడం వలన, ఇంకా మరేదైనా కార్యక్రమాలు వలన చెరసాల నుండి తప్పించుకోలేరు!! పాప విముక్తి, రక్షణ, విడుదల, ఆధ్యాత్మిక స్వతంత్రత, దేవుని శాశ్వత జీవం, శాశ్వత దీవెనలుకేవలం దేవుడు నియమించిన మార్గమైన విశ్వాసం లేదా క్రీస్తుయేసునందలి విశ్వాసం మూలంగానే సాధ్యం!!

రోమా 1:16-17

16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

 

రోమా  3:21,22,28

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.

 

యోహాను 3:16, 36

16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా (లేక, జనితైక కుమారుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

 

యోహాను 5:24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

ఎఫేసి 2:89

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

కాబట్టి ధర్మశాస్త్రం అందరినీ పాపమనే జైలులో బంధించింది!

 

ఇక 24 వచనంలో అదే ధర్మశాస్త్రాన్ని బాల శిక్షగా చెబుతున్నారు! బాల శిక్ష అనగా మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెద్ద బాలశిక్ష చిన్న బాలశిక్ష అనేవి ఉండేవి. ఇప్పుడున్న యువతరానికి చెప్పేదేమిటంటే మీ తాతలు  బాలశిక్షలనే చదువుకున్నారు. అలాంటిది ధర్మశాస్త్రము అని ఒక అర్ధం వస్తుంది.

 

మరొక అర్ధం ఏమిటంటే పూర్వకాలంలో డబ్బున్న ధనికులు, జమీందారులు, రాజులకు వారి పిల్లలను పెంచడానికి వారి బాగోగులు చూసుకోడానికి సమయం ఉండేది కాదు. అంతేకాకుండా అనేకమంది పిల్లలు వారికుండే వారు! కాబట్టి  వారు పిల్లలకోసం గార్డియన్ లను పెట్టేవారు! వారినే మన అచ్చ తెలుగుభాషలో బాల శిక్షకులు అనేవారు! వీరు పిల్లలకు చదువులు చెప్పడానికి గురువులను నియమించి, వారికి కావలసిన అవసరాలు తీర్చడం లాంటి పనులన్నీ గార్డియన్లు చూసేవారు! వీరి బాధ్యతా ఎంతవరకు అంటే పిల్లలు పెరిగి మేజర్ అయ్యేవరకు. అప్పటివరకు వారు అనగా పిల్లలు వారసులే గాని ఆస్తిని అనుభవించడానికి లేదు! ఖర్చు పెట్టలేరు. కావలసినవి గార్డియన్ కి చెప్పి అడిగి కొనుపించుకుని తినడమే తప్ప అధికారాలు ఉండవు!

 

 ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు- ధర్మశాస్త్రం కూడా ఇలాంటి బాల శిక్షకుడు మాత్రమే అనగా గార్డియన్ మాత్రమే! ఎంతవరకు అంటే వాగ్ధాన పుత్రుడు వచ్చేవరకు! ఇక్కడ ధర్మశాస్త్రం కూడా మనకు అలాగే మనకు బాలశిక్షకుడుగా ఉంటూ విశ్వాస నియమం క్రింద లెక్కలోకి వచ్చేవరకు మనలను క్ర్రీస్తుదగ్గరకు నడిపించడమే ధర్మశాస్త్రం యొక్క పని అంటున్నారు! కారణం గతభాగాలలో చూసుకున్నాం ధర్మశాస్త్రానికి మనుష్యుల పాపవిముక్తి చేసే అధికారం లేదు! కనుక క్రీస్తుద్వారా కలిగే పాపవిముక్తి మార్గం వెల్లడి అయ్యేవరకు ధర్మశాస్త్రం మనుష్యులను క్రమశిక్షణలో ఉంచేందుకు ధర్మశాస్త్రాన్ని దేవుడు వాడుకున్నారు! అందుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు దేవుడు!

25 వచనం- అయితే విశ్వాసం వచ్చిన తర్వాత- అనగా విశ్వాస నియమం వచ్చిన తర్వాత- అనగా యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకడతో ఇక మనకు బాలశిక్షకుడి పనిలేదు! మనం ఇక గార్డియన్ క్రింద ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు! క్రీస్తుయేసు నందలి విశ్వాసం ద్వారా మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడతారు అనే మార్గాన్ని దేవుడు తెలియజేసినప్పటి నుండి ఇక మోషే ధర్మశాస్త్రంతో పనిలేదు. ధర్మశాస్త్రానికి మానవులపై అధికారం లేదు! ధర్మశాస్త్రం అనే జైలు అధికారికి గాని, పాపం అనే జైలు కి గాని మానవులపై అధికారం లేదు అంటున్నారు!

రోమా 8:1

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

 

రోమా 6:14

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

 

ఇదీ పౌలుగారు వారికి అనగా గలతీయులకు స్పష్టం చేస్తున్నారు! గలతీయులారా! ధర్మశాస్త్రము కేవలం మీకు సన్మార్గంలో నడిపించే ఒక జీవితక్రమమే తప్ప ముక్తికి మార్గము కానేకాదు! ముక్తికి మార్గం వదిలి జీవితక్రమమే కావాలి అని చూడవద్దు! జీవితక్రమం మిమ్మలను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం మాత్రం చేసింది తప్ప మిమ్మును పాపవిముక్తులుగా చెయ్యలేదు. మీకు ముక్తిని ప్రసాదించలేదు అవివేక గలతీయులారా! పూర్వకాలంలో మీరంతా ధర్మశాస్త్రమనే జైలు అధికారి క్రింద, పాపమనే జైలులో ఉన్నారు! అయితే క్రీస్తుయేసు రాకడతో ఆయన చేసిన సిలువ బలియాగంతో మనం పాపవిముక్తులము అయ్యాము! దీనిని నమ్మి ఆయనయందు విశ్వాసం ఉంచితే మీరు ఇక పాపమనే జైలుకి గాని, ధర్మశాస్త్రమనే జైలు అధికారికి గాని భయపడనవసరం లేదు! కాబట్టి మీరు ధర్మశాస్త్ర సంభంధమైన పనులు అనగా సున్నతి మరియు బలియాగ అర్చనాదులు చెయ్యక్కర్లేదు అని చెబుతున్నారు!

 

అలాగే పరిశుద్ధాత్ముడు నేటి రోజులలో ఉన్న మోడరన్ గలతీయులకు చెబుతున్నాడు! ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీర సంభంధమైన క్రియలు చేస్తున్న అవివేక మోడరన్ గలతీయులారా! దీనివలన మీరు పరిపూర్ణులు కాలేరు అంటున్నారు! అత్మానుసారమైన విశ్వాస సంబంధమైన క్రియలు కావాలి గాని లోకానుసారమైన క్రియలు ఆచారాలు మీరు చేయకూడదు, లోకంతో కలిసిపోకూడదు, లోకాశలు నెరవేర్చకూడదు, లోకం చేసే పోకడలు మీరు పోకూడదు, క్రిస్మస్ లాంటి పండగలు కాదు కావలసింది- సువార్త ప్రకటన ఆత్మల పంట కావాలి, క్రిస్మస్ డెకరేషన్, డేన్సులు, బట్టలు కాదు మీకు కావాలి- ఆత్మలో ఆనందం, పరిశుద్ధత, నీతి అత్మఫలము, పరిశుద్ధ జీవితం కావాలి! పనికిమాలిన నగలు, షోకులు కాదు మీరు చెయ్యవలసింది- పరిశుద్ధులకు తగినట్లుగా క్రియలు, దైవభక్తిగల వారమని చెప్పే వ్యక్తులకు తగినట్లుగా జీవించాలి అంటున్నారు. పేరుకు తగ్గ జీవితం జీవించాలి. అన్యులు చేసినట్లు మీరు చెయ్యకూడదు! ఆత్మానుసారంగా జీవిస్తేనే శరీరానుసారమైన జీవితాన్ని వదిలెయ్యగలరు అంటున్నారు! ఇదీ పరిశుద్ధాత్ముని ఆవేదన! పౌలుగారి బాధ! ఇంకా నాబాధ కూడా అదే!

 

ప్రియ స్నేహితుడా! పరిశుద్ధాత్ముని పిలుపు వింటావా? నిజమైన క్రైస్తవుడుగా నిలబడి లోకాశలు, శరీరాసలు వదిలి, క్రీస్తుకోసం పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తావా? లేక లోకంతో కలిసిపోయి అవివేక మోడరన్ గలతీయ క్రైస్తవునిగా జీవిస్తావా? ఇప్పుడే తేల్చుకో!

దైవాశీస్సులు!

 

*గలతీపత్రిక-25 భాగం*

గలతీ ౩:2629

26. యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు.

27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

28. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

29. మీరు క్రీస్తు సంబంధులైతే (మూలభాషలో-క్రీస్తువారైతే) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

 

                (గతభాగం తరువాయి)

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాముఇక వచనాలలో ఇంతవరకు ధర్మశాస్త్రము వివిధ కోణాలకోసం వివరించి ఇప్పుడు మనం ఎలాగుండాలి అనగా ధర్మశాస్త్రం క్రిందలేము కాబట్టి విశ్వాసులు అందరూ క్రీస్తుయేసు లో సమానం! అందరూ క్రీస్తుయేసులో క్రీస్తుతోపాటు వారసులు అని చెబుతున్నారు!

 

26. యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు.

క్రీస్తుయేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నారు. 29వ వచనంలో క్రీస్తు సంబంధులైతే వారసులు అంటున్నారు!

మరో దగ్గర కుమారులైతే వారసులు అంటున్నారు.

గమనించాలి స్వభావసిద్దంగా మనుషులు దేవుని సంతానం కాదు! అందరికీ సృష్టికర్త దేవుడే గాని మనుష్యులందరికీ ఆధ్యాత్మిక తండ్రి మాత్రం దేవుడు కాదు- నిదర్శనం యోహాను 8:44..

మీరు మీ తండ్రియగు అపవాది (అనగా, సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక, అబద్దకునికి జనకుడునై) యున్నాడు.

 

 ఇక్కడ మరో జనాంగం ఉంది. వీరికి తండ్రి సాతాను గాడు!! మంచోళ్ళను పాడుచేయడం, మనుష్యులను తప్పుడు దారిలో నడిపించడమే వాడి పని, వాడి అనుచరులు పని! అయితే క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనుష్యులు దేవుని సంతానం / వారసులు / కుమారులు అవుతారు!

 

 యోహాను 1:1213

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

అయితే 27వ వచనం ప్రకారం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు అంటున్నారు. అది ఎవరైనా సరే, యూదుడు కావచ్చు, గ్రీకు దేశస్తుడు కావచ్చు, అది ఎవరైనా సరే, క్రీస్తుయేసు లోనికి బాప్తిస్మం పొందితే వారంతా క్రీస్తును ధరించుకుని ఆయనకు కుమారులు అవుతారు. కుమారులు అయితే ఆయన చేసిన వాగ్దానాలకు వారసులు అవుతారు! మీరంతా క్రీస్తుయేసులో ఒక్కటిగా ఉన్నారు అంటున్నారు. అందరినీ ఒక్కటి చేసింది బాప్తిస్మమా? బాప్తిస్మం కాదు గాని క్రీస్తుయేసునందలి విశ్వాసమే అందరినీ ఒక్కటిగా చేసింది. దానికి దోహదకారి- ఒక చిహ్నం మాత్రమే బాప్తిస్మం!

 

బాప్తిస్మం కోసం చూసుకుంటేబాప్తిసం అనేది బయటకు ఒకచిహ్నం మాత్రమే! అయితే మనలను దేవుని పిల్లలనుగా చేసేది కేవలం విశ్వాసం! నీటి బాప్తిస్మం కాదు! అయితే బాప్తిస్మం తీసుకున్నాక జరిగే ఆత్మ సంబంధమైన మార్పుకు నీటి బాప్తిస్మం ఒక గుర్తుగా పనిచేసి మనిషిలో ఆత్మ పరివర్తనకు దోహదకారి అవుతుంది.  రోమా 6:3

క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

 

యేసుక్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణం లోనికి బాప్తిస్మం పొందాము అంటున్నారు పౌలుగారు ఇక్కడ మాట్లాడుచున్న బాప్తిస్మం ఏమిటి? బాప్తిస్మం అనేది గ్రీకు బాషలోనుండి వచ్చిన పదం- గ్రీకు నుండి పదాన్ని తెలుగులోకి డైరెక్టుగా  అనువదిస్తే *క్రీస్తులోకి ముంచబడిన* లేక *క్రీస్తులోకి ప్రవేశించిన* లేక *యేసుక్రీస్తు లోకి తీసుకుని రాబడిన* అని అర్ధం! అనగా *మనం ఆయన మరణంలోనికి ప్రవేశించాము* అని అర్ధం! అనగా ముంచబడటం అనగా *క్రీస్తులోనికి మునగడం* అని అర్ధం గాని *నీటిలోనికి మునగడం అనికాదు*! అనగా ఇక్కడ బాప్తిస్మం అనేది *యేసుక్రీస్తు ప్రభులవారితో ఐక్యతను* సూచిస్తుంది. ఆయనతో ఒకప్రత్యేక సంబంధం లోకి ప్రవేశించడం, పరిశుద్ధాత్మ మూలంగా ఆయనాధ్యాత్మిక దేహంలో ఒక అవయవంగా మారడం సూచిస్తుంది.

1కొరింథీ 12:1213

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

 

కాబట్టి ఇక్కడ నీటిలోనికి వెళ్ళడం అనగా *క్రీస్తుతో మరణానికి వెళ్లి పాతిపెట్టబడటానికి సూచనయే* బాప్తిస్మం! అనగా *మన పాత- పాప రోత జీవితాన్ని నీటిలో క్రీస్తుతో పాటు సమాధిని చేసి-అదే క్రీస్తుతో పాటు సజీవులుగా నూతన జీవితం కలిగి లేపబడటం* అన్నమాట! కాబట్టి ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నామో ఇక మనలో పాత శరీర సంబంధమైన క్రియలు లోకాశలు లోకాచారాలు ఉండకూడదు! వాటిని అక్కడే పాతేశాము కాబట్టి మరలా అవి మనలోకి వస్తున్నాయి అంటే బాగా చావలేదు, బాగా పాతిపెట్టబడలేదు అన్నమాట!

 

కాబట్టి ఎప్పుడైతే ఇలా బాప్తిస్మం పొందుకున్నారో వెంటనే క్రీస్తుని ధరించుకున్నారు అంటున్నారు! అనగా ఇప్పుడు బాప్తిస్మం పొందుకున్న తర్వాత విశ్వాసులు క్రీస్తులో దేవుని ఎదుట నిలుస్తున్నారు. ఆయన నీతిని వీరు పొందుకుని లేక ధరించుకొని దేవుని ఎదుట నిలుస్తున్నారు!

ఇంకా రోమీయులకు 8: 14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

అనగా బాప్తిస్మము పొందుకుని విశ్వాసముంచిన నీవు ఆయనాత్మచేత తాకబడితే ఆత్మచేత నడిపించబడితే నీవు ఆయన కుమారుడవౌతావు.

ఇప్పుడు ఇలా ధరించుకున్న వారంతా దేవుని దృష్టిలో ఒక్కటే! మనమంతా దేవుని పిల్లలము! వారు దేశస్తులైన దేవునికి ఒక్కటే. పిల్లలమయితే లేక కుమారులైతే వారసులము! దేనికి వారసులం? ఆయన చేసిన వాగ్దానాలకు! ఆయన యొక్క శాశ్వత జీవానికి! నిత్యరాజ్యానికి! పరలోక పట్టణానికి!

అయితే 29 వచనంలో మీరు క్రీస్తుకు చెందినవారైతే మీరు అబ్రాహము సంతానం, అనగా వాగ్దానం ప్రకారమైన ఆయన యొక్క వారసులు! కాబట్టి క్రీస్తును ధరించుకున్న మీరు ఇక లోకానుసారులు కానేకారు! బాలశిక్షకుని క్రింద లేరు! పాపమనే దాస్యంలో, పాపమనే చెరసాలలో ధర్మశాస్త్రమనే జైలు అధికారి క్రింద లేనేలేరు! కాబట్టి ఇప్పడు మీరు పాప సంబంధమైన, లోక సంబంధమైన పనులు ఎంతమాత్రము చెయ్యకూడదు! వారసుడవు వారసుడు గానే ఉండాలి గాని మరలా పాపమనే దాస్యంలో చిక్కుకోకూడదు! బాప్తిస్మం తీసుకున్న నీవు పాపము నుండి, మరణం నుండి సాతాను నుండి, విడుదల పొందిన నీవు మరలా పాపం లోనికి, శాపం లోనికి, మరణం లోనికి, సాతాను దాస్యం లోనికి వెళ్ళకూడదు! బాప్తిస్మం తీసుకున్న నీవు దేవుని కుమారుడవు! వారసుడవు! గాని పాపం చేస్తే దేవుని కుమారుడవు కానేకావు దయ్యం కొడుకువి దయ్యం కూతురువి అన్నమాట! బాప్తిస్మం పొందుకుని ఆధ్యాత్మిక కుమార కుమార్తెగా మారిన నీలో శరీర సంబంధమైన క్రియలు, శరీరాసలు, లోకపు పోకడలు  కనిపిస్తే నీవు దేవుని కుమారునివి కావు! దయ్యం కొడుకువే! పరిశుద్ధాత్మ, మేలు కలిగే మాటలు, నీలో కనబడాలి గాని నీలో బూతులు పోకిరి మాటలు డబుల్ మీనింగ్ డైలాగులు  వస్తే నీవు దయ్యం కొడుకుని దయ్యం కూతురువే తప్ప దేవుని బిడ్డవు కానేకావు! నీలో ఇంకా లోకాచారమైన ఒంటిమీద బంగారు నగలు, మెడలో మంగళ సూత్రం కనిపిస్తే, వెలగల వస్త్రాలు, జీన్ పేంట్లు, టీ షర్ట్లు కనిపిస్తే నీవు దయ్యం కూతురివే గాని దేవుని కుమార్తెవు కానేకావు! నీలో కనిపించవలసినది దేవుని లక్షణాలు గాని లోక పద్దతులు కానేకావు! మూర్కులైన తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్పిన బైబిల్ మాట విని, వారు చేసినట్లు నీవు చేయకూడదు! పరిశుద్ధమైన, పవిత్రమైన , ఆత్మానుసారమైన, వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే నీవు దేవుని కుమారకుమార్తెగా ఉంటావు! అప్పుడే నీవు అబ్రాహాము సంతానమై ఆయన చేసిన వాగ్దానాలకు వారసుడుగా ఉంటావు!

ఏమి కావాలో తేల్చుకో!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-26 భాగం*

గలతీ 4:1—5

1. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.

2. తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.

3. అటువలె మనమును బాలురమైయున్నప్పుడు లోకసంబంధమైన మూలపాఠములకు (భూతములకు) లోబడి దాసులమైయుంటిమి;

4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,

5. మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ఇంతవరకు మూడు అధ్యాయాల నుండి విశ్వాస నియమానికి ధర్మశాస్త్రానికి గల తేడాలు చూసుకున్నాం! ధర్మశాస్త్రం కేవలం బాలశిక్షకుని లాంటిది. అది ఒక గార్డియన్ మాత్రమే! అది ఒక జీవనక్రమం మాత్రమే! అయితే దానికి ముక్తికి చేర్చే అధికారం లేదు. దానిని తప్పించడానికే దేవుడు మానవునిగా వచ్చి విశ్వాస నియమాన్ని తీసుకుని వచ్చారు అది ఉచితముగా కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగానే లభిస్తుంది అని ధ్యానం చేసుకున్నాం! ఇక నాల్గవ అధ్యాయంలో అదే విషయాన్ని మరో కోణం లో చెబుతూ వారసత్వము కలిగి యుంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు. కాబట్టి వారసత్వం ఉన్న మీరు బానిసత్వం పనులు చేయొద్దు అంటూ బానిసత్వపు పనులలో కొన్నింటిని ఎత్తి రాస్తున్నారు.

 

సరే, ఇక 1—3 వచనాలలో గతభాగంలో చూసుకున్న విషయాల కోసమే చెబుతున్నారు. పౌలుగారు తన రచనలలో కొన్నిసార్లు ప్రజలకు అర్ధం అవ్వడానికి కొన్ని కొన్ని సారూప్యాలు చూపిస్తూ ఉంటారు. దానిలో ఒకటి ఇక్కడ గతబాగంలో వివరించిన గార్డియన్ వ్యవస్థ! బాలశిక్షకులను నియమించడం!

పూర్వకాలంలో డబ్బున్న ధనికులు, జమీందారులు, రాజులకు వారి పిల్లలను పెంచడానికి వారి బాగోగులు చూసుకోడానికి సమయం ఉండేది కాదు. అంతేకాకుండా అనేకమంది పిల్లలు వారికుండే వారు! కాబట్టి  వారు పిల్లలకోసం గార్డియన్ లను పెట్టేవారు! వారినే మన అచ్చ తెలుగుభాషలో బాల శిక్షకులు అనేవారు! వీరు పిల్లలకు చదువులు చెప్పడానికి గురువులను నియమించి, వారికి కావలసిన అవసరాలు తీర్చడం లాంటి పనులన్నీ గార్డియన్లు చూసేవారు! వీరి బాధ్యతా ఎంతవరకు అంటే పిల్లలు పెరిగి మేజర్ అయ్యేవరకు. అప్పటివరకు వారు అనగా పిల్లలు వారసులే గాని ఆస్తిని అనుభవించడానికి లేదు! ఖర్చు పెట్టలేరు. కావలసినవి గార్డియన్ కి చెప్పి అడిగి కొనుపించుకుని తినడమే తప్ప అధికారాలు ఉండవుఇక్కడ పౌలుగారు చెబుతున్నారు- ధర్మశాస్త్రం కూడా ఇలాంటి బాల శిక్షకుడు మాత్రమే అనగా గార్డియన్ మాత్రమే! ఎంతవరకు అంటే వాగ్ధాన పుత్రుడు వచ్చేవరకు! ఇక్కడ ధర్మశాస్త్రం కూడా మనకు అలాగే మనకు బాలశిక్షకుడుగా ఉంటూ విశ్వాస నియమం క్రింద లెక్కలోకి వచ్చేవరకు మనలను క్ర్రీస్తుదగ్గరకు నడిపించడమే ధర్మశాస్త్రం యొక్క పని అంటున్నారు! కారణం గతభాగాలలో చూసుకున్నాం ధర్మశాస్త్రానికి మనుష్యుల పాపవిముక్తి చేసే అధికారం లేదు! కనుక క్రీస్తుద్వారా కలిగే పాపవిముక్తి మార్గం వెల్లడి అయ్యేవరకు ధర్మశాస్త్రం మనుష్యులను క్రమశిక్షణలో ఉంచేందుకు ధర్మశాస్త్రాన్ని దేవుడు వాడుకున్నారు! అందుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు దేవుడు!

 

       అయితే మూడు వచనాలలో ఇంకా కొంచెం వివరంగా రాస్తున్నారు. బాలుడు పసితనంలో ఉన్నప్పుడు వారసుడే గానే వారసత్వపు హక్కు మేజర్ అయ్యేవరకు రాదు. అంతవరకూ అనగా మేజర్ అయ్యేవరకు బాలునికి, దాసునికి మధ్య తేడా ఏమి ఉండదు అంటున్నారు. అది తండ్రి నిర్ణయించే రోజు వరకు అనగా మేజర్ అయ్యేవరకు ఇంతే అంటున్నారు. అలాగే ధర్మశాస్త్రం మనయొక్క బాలశిక్షకుడు. గార్డియన్! ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారందరూ బాల్యదశలో ఉన్నవారే! గార్డియన్ క్రింద ఉన్నవారే! పరిపక్వత లేనివారే! ఇంకా మైనర్లే! పరిపక్వత అనేది వారిలో లేదు కాబట్టే దేవుడు వారిని ఆశించిన విధముగా లేరు అని పౌలుగారు చెబుతున్నారు!

 

   అయితే యేసుక్రీస్తు రాకడతో దేవుడు విశ్వాసులకు కుమారత్వం అనే వారసత్వాన్ని ఇచ్చే సమయం వచ్చేసింది అన్నమాట! ఇప్పుడు వారు వారసులు! కాబట్టి వారసులు పరిపక్వత కలిగి జీవించాలి తప్ప పరిపక్వత లేకుండా మరలా చిన్నపిల్లల వలే బాలచేష్టలు చేయకూడదు! అనగా మరల ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలు అనబడే ప్రాధమిక విషయాలు లేక మూల పాఠాలు: సున్నతి, ఆర్చనాదులు, బలియర్పణలు , దినాలు, రోజులు, అమావాస్యలు పండగ దినాలు పాటించకూడదు అంటున్నారు పౌలుగారు! యేసుక్రీస్తు రాకముందు మీరు ఇలాంటి ప్రాధమిక విషయాల క్రింద ఉన్నారు గాని, లేదా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు గాని ఇప్పుడు ఆయన అనగా నిజమైన వారసుడు లేక సంతానమైన క్రీస్తు వచ్చారు కాబట్టి వీటిని పాటించవలసిన అవసరం లేదు! కారణం మీరు ఇప్పుడు బాలశిక్షకులు లేక సంరక్షకులు లేక గార్డియన్ చేతిక్రింద లేరు! ఇప్పుడు మీరు విడుదల పొందారు! మీరు దేవుని పిల్లలుగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు, హక్కులు ఉన్నాయి! హక్కులతో పాటుగా విధులు కూడా ఉన్నాయి! కారణం వారసులకు హక్కులే కాదు విధులు కూడా ఉంటాయి! ఆస్తి మాత్రమే కాదు అప్పుకూడా పంచుకోవాలి!

 

   4-5..అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,

5. మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

  వచనాలలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటున్నారు. ఆయన - కుమారుడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు! కాలం అనగా సుమారు 2000 సంవత్సరాల క్రితం అన్నమాట! ఆయన స్త్రీ గర్భాన జన్మించారు.

మత్తయి 1:1822

18. యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;

21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

 

లూకా 1:2638

ఆయన స్త్రీ గర్బాన జన్మించారు గనుక ఆయనలో నిజమైన మానవ స్వభావం ఉంది! ఆయన దేవుడు గనుక ఆయనలో నిజమైన దైవత్వం ఉంది. ఇప్పుడు ఆయనలో దైవమానవత్వం ఉంది! యోహాను 1:14

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని ( లేక, జనితైకకుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

 

హెబ్రీ 2:14,15

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,

జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

 

ఇక స్త్రీ గర్బాన ఎందుకు జన్మించారో ఇక్కడ మరో కారణం చెబుతున్నారు: మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని విడిపించడానికి ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదులు లాగ ఆయన కూడా యూదుడుగా ఇశ్రాయేలు వాడుగా జన్మించారు!

 

ఇక  విమోచించాలని?

ఏమి విమోచించాలి?

గలతీ 3:1314

13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో-శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

14. ఇందును గూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

 

మనుష్యులు ధర్మశాస్త్రం క్రింద ఉన్నంతవరకు వారు పాపమనే సంకెళ్ళను జైలును తప్పించుకోలేరు! బాలశిక్షకుడు అనే ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు! వాటినుండి విడుదల ఇవ్వడానికే యేసుక్రీస్తు మానవునిగా లోకానికి వచ్చారు! మనుషులు దేవుని సంతానమే గాని సంరక్షుకుల చేతిక్రింద ఉన్నంతవరకు వారికి ఎటువంటి అధికారాలు వారసత్వము లేదు కాబట్టే వారికి విడుదల నిచ్చి మైనర్ నుండి మేజర్ గా మార్చడానికి వచ్చారు! అనగా అపరిపక్వతనుండి పరిపక్వత కలిగిన స్టేజీకి తీసుకుని వచ్చారు! అలా చెయ్యడానికి ఆయన మొదట తాను ధర్మశాస్త్రానికి లోబడి, దానిని నెరవేర్చి, బలియాగము చేసి, ధర్మశాస్త్రమును నెరవేర్చి తర్వాత దానితో పనిలేదు కాబట్టి దానిని కొట్టివేశారు!

 

కాబట్టి ప్రియ దైవజనమా! ఇక నీవు ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద లేవు కాబట్టి మరలా శరీర సంబంధమైన క్రియలు చేయక- పరిపక్వత స్టేజికి రావాలి! అనగా లోక సంబంధమైన విషయాలు వదలి ఆధ్యాత్మిక విషయాలు, పరిశుద్ధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు కోసం ప్రాకులాడాలి! ఆత్మీయ వరాలు ఆత్మ ఫలము పొందుకోవాలి! మరి నీవు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు? ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తే నీవింకా దాసుడవే! కుమారుడవు కావు! వారసుడవు వారసురాలవు కావు! కాబట్టి దాస్యమనే కాడి క్రింద నుండి బయటకు రా! కుమారునిగా మారు!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-27 భాగం*

 

గలతీ 4:67

6. మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.

7. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా రెండు వచనాలలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు పౌలుగారు! దేవుని సంతానమైతే వారు దేవుని ఆత్మపొందుకుని ఆత్మపూర్ణులుగా ఉంటారు! నీవు దాసుడవు అయితే నీవు దేవుని వారసుడవు కావు కాబట్టి నీకు శరీర సంబంధమైన క్రియలకోసమే చూస్తావు గాని పర సంబంధమైన పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు అభిషేకం కోసం చూడవు!

 

     6 వచనంలో కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను మన హృదయములలోనికి పంపించారు అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ మన హృదయాలలో పనిచేస్తుందో అప్పుడు నీవు కుమారుడవు! పనిచేయకపోతే దాసుడవు అన్నమాట! ఆత్మ నీలో ఉంటే దాసుడవు కాక కుమారుడవే అంటున్నారు 7 వచనంలో! ఎప్పుడైతే కుమారుడవో అప్పుడు దేవుని ద్వారా నీవు వారసుడవు అంటున్నారు.

 

    చూడండి గలతీ 3:2 లో అంటున్నారు....

ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

 

విశ్వాసమును బట్టి అందరూ పరిశుద్దాత్మని పొందుకున్నారు. మరలా గుర్తు చేస్తున్నాను. బాప్తిస్మం తీసుకున్న ప్రతీ ఒక్కరికి బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మ అనే సంచకరవు అనగా డిపాజిట్ గా  ఇచ్చారు! డిపాజిట్ ని నీవు కేవలం విశ్వాసం ద్వారానే పొందుకోగలవు! ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే పేతురుగారికి కలిగిన ప్రత్యక్షత చూస్తే విషయం అర్ధం అవుతుంది. అపో.కార్యములు 2: 38,39

పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

 

 చూడండి ప్రజలకు ఏమి చెబుతున్నారో ఆత్మపూర్ణుడై పేతురుగారు! వారు అడిగారు మేమేమి చేయాలి అంటే మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ కోసం బాప్తిస్మం పొందండి యేసు నామంలో, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు ఇదీ పరిశుద్ధాత్ముడు చేసిన వాగ్దానం! కాబట్టి నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారుమనస్సు కలిగి బాప్తిస్మం తీసుకున్న ప్రతీ ఒక్కరికీ దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చేశారు! నిజమైన మారుమనస్సు నిజమైన పశ్చాత్తాపం అనే మాట వాడవలసిన అవసరం ఏమొచ్చిందంటే చాలా మంది పెళ్ళికోసం బాప్తిస్మం తీసుకుంటున్నారు- ఇలాంటి అవసరాల బాప్తిస్మం బాప్తిస్మం గా దేవుడు పరిగణించరు అని నా ఉద్దేశ్యం! ఇలాంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మ అనే గొప్ప వరాన్ని ఇవ్వరు! డిపాజిట్ కూడా ఇవ్వరు!

 

  ఇక పరిశుద్ధాత్మను దేవుడు సంచకరవుగా ఇచ్చారు అని పౌలుగారు చెబుతున్నారు! 2కొరింథీ 1:22 లో ఆయన మనకు ముద్రవేసి మనము ఆయనవారము అనే ముద్ర వేసి, మన హృదయాలలో ఆత్మ అను సంచకరవును ఇచ్చారు అంటున్నారు. అనగా మనము దేవుని పిల్లలము సంతానము అనడానికి ముద్రగా ఆత్మను సంచకరవుగా అనగా డిపాజిట్ గా/హామీగా పెట్టారు అంటున్నారు. 2కొరింథీ 5:5 లోకూడా ఇదే చెబుతున్నారు. అయితే దీనిని ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే  ఎఫేసి 1:14 చూసుకోవాలి! దీనిలో చాలా స్పష్టముగా రాస్తున్నారు: దేవుని మహిమకు కీర్తి కలిగేలా ఆయన సంపాదించుకున్న ప్రజలకు (అనగా మనమే) విమోచనం కలగటానికి ఆత్మ మనము పొందే స్వాస్త్యానికి సంచకరవుగా అనగా డిపాజిట్ గా లేదా హామీగా ఉన్నాడు! ... ఎఫెసీయులకు 1: 14

దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

అనగా తండ్రియైన దేవుడు తన ఆత్మను విశ్వాసులకు తనకోసం కొనుక్కున్నట్లుగా హామీగా డిపాజిట్ గా అడ్వాన్సు ఇచ్చారు, అదే పరిశుద్ధాత్ముడు! అనగా పరిశుద్ధాత్మను ముందుగా మనకు ఇచ్చి మనలో తాను ప్రారంభించిన పనిని కొనసాగిస్తూ ముగించడానికి హామీ ఇస్తున్నారన్న మాట! ఫిలిప్పీ 1:4

మీలో సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

 

 కాబట్టి ఆయన చేసిన వారసత్వ వాగ్దానానికి డిపాజిట్ లేక హామీగా అడ్వాన్సు పరిశుద్ధాత్ముడు! ఇది ఆయన మన దేహాలను విమోచించే వరకు కొనసాగుతుంది.

అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

రోమా 8:23;

అప్పుడు ఆయన తనసొత్తుగా మనలను భద్రంగా ఉంచుతారు.

యోహాను 14:16

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను ( లేక,ఉత్తరవాదిని), అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

 

కాబట్టి దీని అర్ధం ఏమిటంటే మీరు నా సొత్తు అని దేవుడు చెప్పడానికి గుర్తుగా హామీగా పరిశుద్ధాత్మను ఇచ్చారు దేవుడు! మనం ఆయనాత్మను పొందుకుంటేనే ఆయన వారమని ఆయన వారసులమని దేవుడు ముద్రవేస్తారన్న మాటకాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం ఆయన వారసులము! ఆయనాత్మ లేకపోతే దాసులమే తప్ప వారసులము కాలేము! ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆయనాత్మను అనగా పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఇంకా మరోచోట ఆయనాత్మ లేనివాడు ఆయన వాడుకాదు అంటున్నారు. రోమీయులకు 8: 9

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

 ఆయనవాడు కాడు అంటే సాతానుగాడి పార్టీ అన్నమాట! నీవు ఎవరి పార్టీనో దయచేసి నిర్ధారణ చేసుకో!

 

ఇప్పుడు అంటున్నారు మీరు దేవుని సంతానం కాబట్టి దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాలలోనికి పంపించారు అందుకే ఆత్మ మనలో అబ్బా తండ్రీ అని మొర్ర పెడుతుంది అంటున్నారు. ఇక్కడ మాటలలో భావము ఏమి ధ్వనిస్తుందంటే ఆయన నీ సొంత తండ్రి నీవు ఆయన సొంత కుమారుడవు కాబట్టి సొంత తండ్రిని అడిగినట్లు నీ దేవుణ్ణి అడగగలవురోమా 8:15 లో కూడా దీనిని దృవీకరిస్తున్నారు....

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.

 

కాబట్టి నీవు ఆయనాత్మను పొందుకుంటేనే చనువుతో అబ్బా తండ్రి అని ధైర్యముగా దేవునికి మొర్రపెట్టగలవు, ఆత్మ ఉంటే 7 వచనం ప్రకారం నీవు ఇక దాసుడవు కావు కుమారుడవు, అనగా క్రీస్తుతో కూడా వారసుడవు అంటున్నారు.

 

అయితే ఆత్మ కలిగి ఉంటే ఇంకా ఏమేమి చేయగలవు అంటే అపో 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీరు పొందిన వెంటనే మీరు శక్తిపొందుతారు గనుక మీరు యేరూషలేము యూదయ సమరయ దేశములు ఇంకా భూదిగంతములు నాకు సాక్షులై ఉంటారని దేవుడు చెబుతున్నారు.

 

రోమా 15:18 ప్రకారం పరిశుద్దాత్మ శక్తి వలననే నేను ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు చేయగలిగానని పౌలుగారు సాక్ష్యం చెబుతున్నారు! అపో కార్యములలో అపోస్తలులు ఆత్మను పొందుకున్న తర్వాత ఎంతగొప్ప కార్యాలు చేశారో మనం చూస్తున్నాం!

 

ఇంకా పరిశుద్దాత్మ వలన తప్ప ఎవడూ యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోడు అంటున్నారు 2కొరింథీ 12:3

 

ఇంకా అదే ఆత్మ మనలో ఉన్న మంచి పదార్దములు అనగా ఆత్మ వరములు, ఫలములు, సువార్త ప్రకటించే శక్తి వీటన్నిటినీ ఈ పరిశుద్ధాత్మ కాపాడి రక్షించగలడు! 2తిమోతి 1:14

 

మన పాత రోత అలవాట్లు అన్నీ తీసివేసి మనకు నూతన స్వభావము నూతన జీవము కలుగజేయగలడు పరిశుద్దాత్ముడు తీతుకు 3:5

 

సూచక క్రియలు మహత్కార్యాలు పరిశుద్దాత్మ వలననే సాధ్యం హెబ్రీ 2:4

దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.

 

  కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉంటే మనకు ఆదరణ మాత్రమే కాదు, మనము పాపంలో పడకుండా మనలను కాపాడుతూ అనుక్షణం మనలను నడిపిస్తూ ఉంటాడు పరిశుద్దాత్ముడు! ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరానుసారంగా నడుచుకోరు అంటున్నారు 5:16లో! కాబట్టి ఆయన కుమారులకు ఇవన్నీ కలుగుతాయి ఎప్పుడు ఆత్మను పొందుకున్నప్పుడు! ఆత్మను ఎప్పుడు పొందుకుంటావు? ఆయనయందు విశ్వాసముంచి నప్పుడు! మరి ఆయన ఆత్మను పొందుకున్నట్లు రుజువులు ఏమిటి? అదిగో మీదన చెప్పిన క్రియలు అన్ని జరిగినప్పుడు. నీవు శక్తిని పొందుకుని దేవుని సువార్తను ప్రకటిస్తావు. భూదిగంతములలో సాక్షిగా ఉంటావు. నీ బ్రతుకు మారిపోతుంది. నూతన స్వభావము కలిగి ఉంటావు. సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తావు. శరీరానుసారమైన పనులు ఏమీ చేయవు!

 

  అన్యభాషలు పరిశుద్ధాత్మకు ఒక గుర్తు మాత్రమే! కేవలం భాషలు మాత్రమే పరిశుద్ధాత్మ కాదు! ప్రవచనాలు, ఇంకా వివేచనా లాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో రకమైన ప్రత్యక్షతలతో కూడిన ఆత్మను దయచేస్తారు. ఇంకా  రోమా 8:26 ప్రకారం ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ప్రార్ధన చేస్తారు. నీకు కష్టము వచ్చినా ఎదుటివారికి కష్టము వచ్చినా అది నీకే కలిగినట్లు మూల్గులతో ప్రార్ధన చేస్తావు. ఎదుటి వారి రక్షణ పొందుకోలేదని నీ కుటుంబమే నరకానికి పోతున్నంత బాధపడిపోతూ మూల్గులతో ప్రార్ధన చేస్తావు. మోకరిస్తే చాలు, కళ్ళు మూస్తే చాలు కళ్ళంట నీరు బొలబోలా కారిపోతాయి. ఇప్పుడు ఎవడు చచ్చాడనే అలా ఏడుస్తున్నావ్ అంటాడు నీ భర్త, గాని అది నీకు తెలియకుండానే నీ హృదయంలో ఉండి నీ తరుపున నీలో నున్న పరిశుద్ధాత్ముడు చేస్తున్న ప్రార్ధన అది. నీకు బదులుగా పరిశుద్ధాత్ముడు కార్చుతున్న కన్నీళ్లు అవికాబట్టి భాషలు మాత్రమే పరిశుద్ధాత్మ కాదు. కొంతమంది అన్యభాషలు మాట్లాడలేరు. అలా అని వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అని చెప్పలేము. భాషలతో అందరూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. నీనోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను అని సెలవిచ్చారు. కీర్తనలు 81:10;  కాబట్టి నీ నోరు తెరచి దేవున్ని తన భాషలతో, స్తుతితో నింపమని అడుగు. దేవుడు తప్పకుండా నింపుతారు. తన్ను అడుగువారికి తప్పకుండా పరిశుద్ధాత్మను దయచేస్తారు అని యేసుక్రీస్తు ప్రభులవారు తననోటితో స్వయంగా చెప్పారు! లూకా 11:13;

 

ఇంతకీ అన్యభాషలు దేనికి సూచన?

ఆత్మ పొందుకున్నావు అనడానికి ఒక సూచన!

ఇంకా అవిశ్వాసి తాను ఆత్మ పొందుకోలేదు అని గ్రహించడానికి! అవి అవిశ్వాసికోసం! 1కొరింథీ 14:22;

 

ఎందుకు అన్యభాషలు మాట్లాడాలి?

1) దేవునితో మాట్లాడటానికి. 1 కొరింథీ 14:2;

 

2) తన క్షేమాభివృద్ధికోసం! 14:4; అనగా

అనగా అంతరంగ పురుషుడు బలపడటానికి!

 

3) ఆత్మతో ప్రార్థన చేయడానికి! 14:14;

4) పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. 14:5;

కాబట్టి అన్యభాషలు మాటలాడటం అవసరం. ప్రవచనవరం పొందుకోవడం ఇంకా అవసరం!

కాబట్టి మొత్తం ఇవన్నీ, భాషలు, ప్రవచనాలు, వివేచనాత్మ, అద్భుతాలు, ఆత్మ శక్తితో సువార్త ప్రకటించడం, కన్నీటితో ప్రార్ధన చేయడం ఇలా ఎన్నెన్నో విధములు ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యములే! గమనించండి: ఆయనాత్మ లేకపోతే ఆయన వాడు కానేకాడు! కాబట్టి ఆయన ఆత్మను తప్పకుండా పొందుకోవాలి! ఆయన ఇచ్చేశారు నీకు పరిశుద్ధాత్మను అయితే అది కేవలం విశ్వాసంతో మాత్రమే పొందుకోగలవు నీవు! ఆయనాత్మ లేకపోతే నీవింకా దాసుడవే కాని కుమారుడవు కావు! దాసుడే ఇలాంటి శరీర కార్యాలు చేస్తారు. కుమారులు పరిపక్వత కలిగి ఆత్మ కార్యాలు చేస్తారు. కాబట్టి నీవు గుంపులో ఉన్నావో గుర్తెరిగు! ఆయన కుమార/కుమార్తెలగా సాగిపో! శరీర కార్యాలు వదిలి ఆత్మకార్యాలు ఆత్మఫలము ఫలిద్దాము!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-28 భాగం*

గలతీ 4:811

8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని

9. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

10. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు.

11. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

ప్రియమైన దేవుని సంఘమా! ఇంతవరకు క్రైస్తవులు ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలు అనగా సున్నతి, విశ్రాంతిదినం, అర్చానాధులు, బలియర్పణలు చేయాల్సిన అవసరం లేదు! అవి శరీర సంబంధమైనవి. అవి ఆత్మానుసారమైనవి కావు అని ధ్యానం చేసుకున్నాం! ఇకపై నాలుగు వచనాలలో అబద్దబోధకులు చేస్తున్న మరో బోధ- గలతీయులు నేర్చుకున్న క్రొత్త తప్పుడు బోధ అలవాట్లు కోసం రాస్తున్నారు పౌలుగారు! గమనించాలి ఈ నాలుగు వచనాలు- గలతీ ప్రాంతంలో ఉన్న యూదులు కాని క్రైస్తవులు లేక విశ్వాసుల కోసం రాశారు. అనగా మనలాంటి అన్యజనులలో రక్షించబడిన విశ్వాసుల కోసమే రాశారు! కాబట్టి ఈ బోధ నేటి మన భారతదేశ సంఘానికి సరిగా సరిపోతుంది. ఇంకా కావాల్సిన దిద్దుబాటు కూడా!

 

    ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, నిజానికి దేవుళ్ళు కానివారికి దాసులై ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా మీరు దేవునిచేత ఎరుగబడినవారు గనుక ఇప్పుడు మీరు బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆ పాత మూల పాటములకు మరలా ఎందుకు తిరుగుతున్నారు? మునుపటిలాగ మరలా వాటికి దాసులై ఉంటారా? (89 వచనాలు).

 

   ప్రియులారా! నాలుగు వచనాలలో పౌలుగారు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కోసం రాస్తున్నారు! దానిలో మొదటిది: ఒకప్పుడు మీరు దేవుణ్ణి ఎరుగని వారై, నిజానికి దేవుళ్ళు కాని వాటిని పూజిస్తూ అజ్ఞానంలో, పాపంలో, మరణంలో ఉన్నారు. ఇప్పుడు నిజదేవున్ని తెలుసుకున్నాక మరలా ఎందుకు మీ పాత అలవాట్లు ఆచారాలు చేస్తారు? ఇదీ మొదటి ప్రశ్న! అక్కడున్న వారికి అనగా గలతీయులకు పౌలుగారు అడుగుతున్నారుఇంతకుముందు మీరు అబద్ద మతాలకు అబద్ద దేవుళ్ళకు దాసులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు నిజదేవుడెవరో, నీ రక్షకుడు ఎవరో, నిత్యజీవం ఇచ్చేది ఎవరో, ముక్తికి మార్గమేదో తెలుసుకున్నాక రక్షణ పొందాక, దేవునిచేత ఎరుగబడి ప్రేమించబడుతుండగా మరలా పాత దాస్యములో అనగా ధర్మశాస్త్రమనే దాస్యములో, పాపమనే బంధకాలలో ఎందుకు చిక్కుకుంటున్నారు? మరలా మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే మరలా ధర్మశాస్త్రము క్రింద దాస్యములోనికి పోయినట్లే కదా! మరలా మీకు సున్నతి పాత అలవాట్లు ఎందుకు? ఒక దాస్యమునుండి విడుదల పొంది అనగా నిజమైన దేవుళ్ళు కానివారికి దాసులుగా ఉండి, ఇప్పుడు మరో క్రొత్త దాస్యములోనికి అనగా ధర్మశాస్త్ర దాస్యములోనికి ఎందుకు వెళ్తున్నారు అని సూటిగా అడుగుతున్నారు పౌలుగారు!!!!

     ఇదే ప్రశ్న నేటి ఆధునిక క్రైస్తవ లోకానికి దేవుడు అడుగుతున్నారు: ఒకప్పుడు మీరు ఇతర దేవతలను పూజిస్తూ నిజంగా దేవుళ్ళు కాని వారికి అనగా విగ్రహారాధనలో మునిగిపోయి ఉండగా నిజదేవున్ని తెలుసుకుని, విశ్వాసం వలన రక్షణ పొందుకుని, దేవుని ఆత్మను, అనుభవాలను పొందుకుని, ఆయన రక్షణలో విడుదలలో గల మహాత్యమును రుచిచూచి, మరలా దేవునిలో ఉంటూనే మీ పాత ఆచారాలు ఎందుకు చేస్తున్నారు? హైందవత్వంలో వదిలేసిన అలవాట్లు అనగా కుల వ్యవస్థ, మెడలో మంగళసూత్రాలు, తాళిబొట్లు, పందిరులు, తలంబ్రాలు, అక్షింతలు, ఇంకా పాత ఆచారాలైన వాస్తు చూడటాలు, ముహూర్తాలు చూడటాలు, జాతకాలు చూడటాలు, దిష్టిబొమ్మలు లాంటి పనికిమాలిన అలవాట్లు ఎందుకు? నీవు దేవుని బిడ్డగానైనా ఉండాలి లేక దయ్యం బిడ్డగా నైనా ఉండాలి, గుడిలో దేవుని పేరు, బయట పాత పేరు! మదిలో దేవుడు, మెడలో సాతాను సంబంధమైన తాళి, మంగళసూత్రాలు! నాలుగు మూలలలో నాలుగు దిక్కులలో మొత్తం ఎనిమిది మంది దయ్యాలను కాపలా పెట్టి అనగా వాస్తు ప్రకారం ఇల్లు కట్టి, బయట, లోపల యేసుక్రీస్తు గృహాదిపతి అని బోర్డుపెట్టి ఎవరిని మోసం చేస్తున్నావు? దేవా గృహానికి అధిపతిగా ఉండమంటే ఆయన ఉంటారా? బయట పెట్టిన ఎనిమిది మంది దయ్యాల సంగతి ఏమిటి అని అడిగితే  చెబుతావు? దేవుని దగ్గర వేషమా? మోసమా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తునో పంటనే కోస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది? గలతీ 6:7; ఎంతకాలము రెండు పడవల మీద కాలు వేస్తావు? మరలా దానికి భారతీయత అనే బ్యానర్! ఛీ! ఎందుకు వేషదారణ! రోజు ఏలియాగారు అడిగినట్లు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అడుగుచున్నాడు- యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి- మీ పాత భారతీయ ఆచారాలు నిజమైనవైతే  వారినే పూజించండి! అంతేకాని రెంటికీ చెడిపోకండి!! ఎంతకాలం వేషం? ఎంతకాలం మోసం? ఇప్పుడైనా మారండి! నిజం తెలుసుకోండి! మీ పాత ఆచారాలు, అన్యజనుల ఆచారాలు చేయనేకూడదు అని బైబిల్ ఖరాఖండిగా చెబుతుంటే మరలా దానికి భారతీయత అనే సాతాను ప్రలోభంలో ఎందుకు పడిపోతారు????  రక్షించబడిన క్రైస్తవుడు మరలా పాత ఆచారాలు చెయ్యనేకూడదు!!  ఇది మొదటిది!

 

  ఇక రెండవది: మీరు దినములను, మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు.... మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్ధమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను! (10-11 వచనాలు)! అవి పాటిస్తే ఏమిటంట! కారణం అవి పాటించకూడదు! అవి పాటిస్తే బ్రష్టులు అయిపోతారు!!!

 

   ఇక్కడ పౌలుగారు చెబుతున్న దినములు అనగా విశ్రాంతి దినములు అని అర్ధం! కారణం ధర్మశాస్త్రం చాలా స్పష్టముగా చెప్పింది మీరు విశ్రాంతి దినాలను పాటించాలి. అమావాస్య పండగ రోజులలో మీరు వివిధరకాల బలులు అర్పణలు నైవేద్యాలు పెట్టాలి అని! అయితే ఇప్పుడు విశ్వాసి ధర్మశాస్త్రం క్రింద లేడు కాబట్టి వీటిని అనగా విశ్రాంతి దినములను, నెలలు అనగా అమావాస్య పండుగలు ఆచరించవలసిన అవసరం లేదు! తప్పుడుబోధకులు ఇవి మీరు పాటించాలి అని చెబుతున్నారు! అవి పాటిస్తే మరలా మీరు ధర్మశాస్త్రాన్ని పాటించి మరలా దాస్యము క్రిందకు వెళ్ళినట్లే! ఇక మహోత్సవ దినాలు అనగా యూదుల యొక్క పండుగలు! అనగా పస్కా పండుగ, పర్ణశాల పండుగ లాంటివి.

సంవత్సరాలు- అంటే నిర్గమకాండంలో చెప్పబడిన పండుగలు- నిర్గమ 20:8 , నిర్గమ 23:10—11; 14—17; లేవీ 23వ అధ్యాయం; 25:8—12; ఈ పండగలు అన్నీ అన్నమాట! వీటిని నిష్టగా ఆచరించడం అంటే దుర్బలమైన వ్యర్ధమైన నియమాలు, మూల పాటములవైపు మరలా తిరగడమే కదా అంటున్నారు పౌలుగారు! ఆ నియమాలు పండుగలు రాబోయే లేక పొందబోయే ఆధ్యాత్మిక మేలులకు ఆధ్యాత్మిక సత్యాలకు సూచనలే తప్ప అవి నిజం కాదు! వీటికోసం మెల్కీసెదెకు క్రమం చొప్పున అనే శీర్షికలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాం! మరి ఇప్పుడు వాస్తవం వచ్చేసింది కాబట్టి మరలా ఆ నీడలను ఎందుకు పాటిస్తున్నారు? క్రైస్తవులు ఇలాంటి పండుగలు ఆచరించవలసిన అవసరం లేనే లేదు!

హెబ్రీ 8:5

మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

 

హెబ్రీ 10:1

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

 

కాబట్టి ఇప్పుడు పండుగలు చేయకపోతే మనకు విధమైన నష్టం లేదన్నమాట! వాటిని ఆచరిస్తే మరలా మీరు పాత క్రొత్త దాస్యములోనికి పోయినట్లే అని పౌలుగారు చెబుతున్నారు! అనగా పండుగలు చేస్తే నష్టం అని చెబుతున్నారు. ఇంకా 11 వచనం ప్రకారం అవి పాటించకూడదు! అవి పాటిస్తే బ్రష్టులు అయిపోతారు!!! ఇంకా విశ్వాస హీనులవుతారు!!

 

  ఇదే ప్రశ్న నేటి ఆధునిక క్రైస్తవ లోకానికి అడుగుతున్నారు? బైబిల్ లో చెప్పబడని పండగలు ఎందుకు చేస్తున్నారు? బైబిల్ లో పాత నిబంధనలో పండుగలు ఉన్నాయి. అవన్నీ ధర్మశాస్త్రం చెప్పిన పండుగలే! అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చి రద్దుచేశారు! వాటిని ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు! క్రొత్త నిబంధనలో దేవుడు పండుగను చేయమని చెప్పలేదు!! మరి బైబిల్ లో లేని పండుగలు ఎందుకు చేస్తున్నారు???  నాకు తెలిసినంతవరకు క్రొత్త నిబంధన సంఘానికి పండుగలు రెండే రెండు! మొదటవి ఉపవాస పండగలు! అవి దేవునితో నిన్ను ఐక్యం చేస్తాయి! దేవునితో నిన్ను సహవాసం చేయిస్తాయి!

 

రెండు: దేవుని బహిరంగ రాకడ అనగా రెండవ రాకడ జరిగాక జరిగే పండుగలు- ఒకటి వెయ్యేండ్ల విందు, రెండు పర్ణశాల పండుగ! అవి ఇప్పుడు కాదు! జయ జీవితం జీవించిన పరిశుద్ధుల పండుగలు! వాటిని మన యేసుక్రీస్తుప్రభులవారితోనే చేసుకోవాలి! మరి ఇప్పుడు చేస్తున్న పండుగలు బైబిల్ లో ఎక్కడైనా చెప్పబడ్డాయా? క్రిస్మస్, ఈష్టర్? ఇంకా కొన్ని సంఘాలు పాటించే పండుగలు ఉన్నాయి! అవి పాత నిబంధనకు గుర్తుగా ఉన్నాయి! వాటిని చెయ్యమని దేవుడు క్రొత్త నిబంధనలో చెప్పలేదే! దేవుడు చెప్పని పండగలను చెయ్యడం ఎందుకు? ఆర్బాటాలు ఎందుకు? హైందవులు కొన్ని పండగలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా కొన్ని చేస్తున్నాం అంతే కదా! అసలు పండగలు తీసుకుని వచ్చింది రోమన్ కేథలిక్ సంఘం! మిగిలిన వారికి పండుగలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఉండాలని, అన్యదేవతలకు సంబందించిన కొన్ని పండగలకు పేరుమార్చి క్రిస్మస్ అని, ఈష్టర్ అని చెబితే వేలం వెర్రిగా మనం కూడా చేసేస్తున్నాము! సరే, యేసయ్య పుట్టిన రోజు అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే దానిలో క్రీస్తుకు మహిమ కలిగించే అంశాలు ఉన్నాయా? యేసయ్య పుట్టుక కోసం ఇతరులకు చెప్పడం ఏమైనా ఉందా? వెర్రి డేన్సులు ఎందుకు? సినిమా వాళ్ళలాగా డేన్సులు వేస్తున్నారు ఇప్పుడు! సాతాను- లోకమే స్టేజీ మీదకు వచ్చి వికట్టాట్టహాసం చేస్తుంది ఇప్పుడు!!  పనికిరాని డెకరేషన్ ఎందుకు? దేవుని డబ్బు లక్షలులక్షలు తగలెట్టి పనికిమాలిన డెకరేషన్, లైటింగ్ ఎందుకు? సంఘంలో ఉన్న పేదలకు ధనసహాయం చెయ్యొచ్చు కదా! చర్చి ప్రక్కన ఉన్న పేదలకు దానిని పంచి క్రీస్తు ప్రేమను చెబితే క్రీస్తును తెలుసుకోరా వారు! క్రిస్మస్ ట్రీ కోసం బైబిల్ లో ఉందా? క్రిస్మస్ తాత ఉన్నాడా బైబిల్ లో! బైబిల్ లో లేని పనికిమాలిన ఆచారాలు ఎందుకు???

 

   దినములు రోజులు సంవత్సరాలు- బైబిల్ లో ఎక్కడైనా షష్టిపూర్తి ఉందా? మరి ఎందుకు ఆచారం క్రైస్తవ్యంలోకి వచ్చింది? సింపుల్! అన్యులు చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా చేసుకుంటున్నాము! గమనించాలి: దేవుడు ఇన్నిరోజులు దాంపత్య జీవితంలో తోడుగా నడిపించారు అని కృతజ్ఞతలు చెప్పుకోడానికి నీ సంఘాన్ని పిలిపించి కూటం పెట్టుకోవడం మంచిదే! కాని పాత హైందవ ఆచారం ప్రకారం పాత పద్దతులు ఎందుకు చేస్తున్నారు? కాళ్ళకు మొక్కించుకోవడాలు, ఇంకా సింగినాదం జీలకర్ర అన్ని అవసరమా? అవి అన్యుల దేవతారాధనకు చెందినవి కావా? పుట్టినరోజు సందర్బంగా దేవునికి కూటం పెట్టుకోవడం మంచిదే కాని ఆడంబరం హంగు ఎందుకు? దిక్కులేని పిల్లలకు అనాధలకు పుట్టినరోజు సందర్బంగా మేలు చేస్తే దేవుడు దీవిస్తారు కదా, ఇంకా వారికి సహాయం చేసి వారి ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి కదా, బీదలకు సహాయము చేస్తే యెహోవాకు అప్పిచ్చినట్లే కదా! ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నాను! ఇంకా 50 సంవత్సరాల క్రితం మన ఆంద్రప్రదేశ్ తమిళనాడులో ప్రారంభమైన పనికిమాలిన సిగ్గుచేటు ఫంక్షన్ మెచూర్ ఫంక్షన్ లు ఎందుకు? అవి ఇప్పుడు చేయొచ్చా? అప్పుడు ఆడపిల్లలకు తొందరగా పెళ్లి అవ్వాలి లేకపోతే ముస్లిం రాజులు ఆడ పిల్లలను తీసుకుని పోయి రేప్ చేస్తారని బయపడి ఆరోజులలో ప్రారంభమయ్యాయి బాల్యవివాహాలు, బాల్యవివాహానికి ఇంకా ఆడపిల్లల పెళ్ళికి గుర్తుగా మెచూర్ ఫంక్షన్ చేసేవారు- మా ఇంట్లో ఎదిగిన పిల్ల, మెచూర్ అయిన పిల్ల ఉంది దయచేసి వచ్చి సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకోండి అంటూ! ఇప్పుడు వ్యవస్థ లేదు కదా! మరి ఎందుకు ఇంకా పనికిమాలిన సిగ్గుచేటు మెచూర్  ఫంక్షన్, వోణీ ఫంక్షన్?? క్రైస్తవులారా!! ఆలోచించండి!

 

        క్రైస్తవులారా! మనకు షష్టిపూర్తిలు, క్రిస్మస్లు లేవు! నిజమైన ఆనందం, పండుగలు- దేవుని ఆరాధనకు వచ్చి ఆయన సన్నిదానంలో ఆనందించడమే! అనుదినము ఆయన ఆత్మతో నింపబడి ఆత్మీయాశీర్వాదాలు పొందుకోవడమే! ఆత్మలో ఆనందమే మీకు పండుగ! అంతేతప్ప ఇతరులు పండుగలు చేస్తున్నట్లు మనం కూడా పండుగలు, హైందవ ఆచారాలకు భారతీయత అని పేరుపెట్టి మనం కూడా చేస్తే అది విగ్రహారాధనే అవుతుంది జాగ్రత్త!

నేడే ఆ పండుగలు ఆచారాలు వదిలి వేసి- ఆ దాస్యము నుండి బయటకు రమ్మని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

ఈ భాగం మిమ్ములను బాదించవచ్చు  గాని నిజాన్ని తెలుసుకోమని వేదనతో ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

 

 

 

         

 

*గలతీ పత్రిక-29 భాగం*

 

గలతీ 4:1216

12. సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను.

13. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.

14. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీకరించితిరి

15. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

16. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! ఈ వచనాలలో పౌలుగారి కాపరి హృదయం- లేదా తండ్రి హృదయం కనిపిస్తుంది! పౌలుగారు తను గలతీయులను ఎలా ప్రేమిస్తున్నారో ఈ వచనాలలో కనిపిస్తుంది.

 

   ఇంతవరకు పౌలుగారు అత్యంత పాముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ఇప్పుడు తనకు గలతీయులకు మధ్యగల వ్యక్తిగత సంబంధం కోసం రాస్తున్నారు! వారిని తన పిల్లలవలే శ్రద్ధ ప్రేమ చూపిస్తున్నారు! సోదరులారా! నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు కీడేమి చేయలేదు అంటున్నారు!

 

    ఇక్కడ నేను మీలాంటి వాడినయ్యాను అనగా మీలాగే యూదేతరుల వలె మారిపోయాను అనగా నేను కూడా మీలాగే యూదులు చేసే పనులు చేయకుండా అన్యజనుల వలె మారిపోయాను. సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పౌలుగారు కూడా యూదేతరుడు అయిపోయారు. 1కొరింథీ 9:20231

20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.

22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

23. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

 

ఇక్కడ వారు తనకేదో హానిచేశారని మాట్లాడటం లేదు గాని తరువాత వచనాలలో తనకు వారికి మధ్య ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

 

ఇక ఇక్కడ నాలాంటి వారు కావాలి అంటేనాలాగే ధర్మశాస్త్రము అనే దాస్యం నుండి విడుదల పొంది, కేవలం క్రీస్తుయేసు నందలి విశ్వాసం కలిగి దేవుని కృపలో మాత్రమే సంతోషించినట్లు వారు కూడా అలాగే సంతోషించాలని పౌలుగారు కోరుకుంటున్నారు!

 

         13వ వచనంలో పౌలుగారు గలతీయులకు సువార్త ప్రకటించేటప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుచేస్తున్నారు. ......మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.

14. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీకరించితిరి

 నేను మొదటసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు నాలో ఉన్న శారీరక బలహీనతను బట్టి మీరు నన్ను తృణీకరించలేదు! ఇంకా నేను మీకు ఎంతో కష్టంతో సువార్త ప్రకటించాను అని మీకు తెలుసు అంటున్నారు. ఇక్కడ ఆయనకున్న శారీరక బలహీనత ఏమిటో మనకు స్పష్టముగా తెలియదు! కొంతమంది అది 15 వచనం ప్రకారం కంటి జబ్బు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం! అయితే మరికొంతమంది అభిప్రాయం ఏమిటంటే అపో 14 అధ్యాయంలో గలతీయులకు సువార్త ప్రకటించినట్లు చూస్తున్నాము! అయితే ప్రకటించేటప్పుడు 14:19 ప్రకారం ఆయనను రాళ్ళదెబ్బలు కొడతారు. అప్పుడు ఆయన చనిపోయారని వారు అతనిని అక్కడ వదిలేస్తారు. గాని కొంతసేపటి తర్వాతలేస్తారు. అప్పుడు రాళ్ళదెబ్బలుకు ఆయన ప్రక్కటెముకలు కొన్ని విరిగిపోయాయని, ప్రక్కలోను కడుపులోను నొప్పితోనే ఆయన మిగిలిన సమయమంతా గడిపారు అని అంటారు. అయితే మొదట సారి వచ్చినప్పడు దెబ్బలతోనే ఆయన సేవచేశారు కాబట్టి బహుశా ఇదే ముళ్ళు! శారీరక బలహీనత అంటారు. దీనినే కొంతమంది 2కొరింథీ 12:7 లో వివరించిన ముళ్ళు అని కూడా అంటారు!

 

   కాబట్టి దీనిని బట్టి రెండు విషయాలు మనకు అర్ధం అవుతాయి.

మొదటిది: శారీరక బలహీనతను చూసి ఎవరిని ద్వేషించకూడదు. పౌలుగారి ఈ బలహీనతను చూసి గలతీయులు తృణీకరించలేదు సరికదా క్రింద వచనాలు చూస్తే దేవదూత వలె ఆయనను చేర్చుకున్నారు. వీడేదో తప్పుచేశాడు అందుకే దేవుడు ఈరోగం వీడికి తెచ్చారు. అనుకోకూడదు!

 

ఇక రెండవది: ఎంతరోగమైన ఇబ్బంది అయినా సువార్త ప్రకటన మానకూడదు !అంత ఇబ్బందిలో కూడా పౌలుగారు గలతీయులకు సువార్త ప్రకటించడం మానలేదు! ఆలాగే ప్రియమైన దైవజనుడా! నీకొస్తున్న శోధనలు చూసి, కష్టాలు చూసి నిరాశపడకూడదు! ఓలిపోకూడదు సోలిపోకూడదు! ధైర్యంగా సాగిపోవాలి! అప్పుడే నీవు జీవకిరీటం పొందుకోగలవు! భళా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోగలవు! బలహీనతలు చూసి ఒకవేళ పౌలుగారు సువార్త ప్రకటిన ఆపితే ఇంతఘనమైన సేవ చేసి ఉండకపోదురు! శ్రమలు హింసలు చూసి ఆది అపోస్తలులు సువార్త ప్రకటన ఆపేస్తే సువార్త మనదాకా వచ్చేది కాదు కదా!కాబట్టి శ్రమలు శోధనలు హింసలు రోగాలు చూసి సేవను ఆపకూడదు! ఆగిపోక సాగిపోవాలి సేవలో!

 

  ఇక 15 వచనంలో రాస్తున్నారు- సాధ్యమైతే మీ కన్నులు నాకోసం ఊడబీకి ఇచ్చేసి ఉందురు నేను అడిగితే అంటున్నారు! ఇక్కడ వారు ఆయన యెడల చూపించిన ప్రేమను ఆప్యాయతను అభిమానాన్ని గుర్తుకు తెచ్చుకుని రాస్తున్నారు! మీరు నా మీద చూపిన అభిమానం ఎంత అంటే ఒకవేళ నేను మీకళ్ళు ఊడబీకి నాకు ఇచ్చేయండి అంటే మారు మాట్లాడకుండా చాలా సంతోషంతో ఇచ్చేస్తారు మీరు. అలాంటి ప్రేమాభిమానాలు నాపై చూపించారు. అయితే ఇప్పుడు మీరు ఎందుకు నన్ను విరోధిలా చూస్తూ మేము ప్రకటించిన నిజమైన సువార్తను వదిలిపోతున్నారు అని కన్నీటితో బాధపడుతున్నారు పౌలుగారు! ఇలా రాయడానికి కారణం తమను మోషే ధర్మశాస్త్రం అనే దాస్యం క్రిందకు తెస్తున్న అబద్దబోధకులు తమ ఉపదేశాలు ద్వారా వారి ఆనందాన్ని పౌలుగారి పట్ల వారికున్న ప్రేమాభిమానాలు పాడుచేస్తున్నారు! అసలు పాపవిముక్తి కోసం సొంత ప్రయత్నాలు చెయ్యాలన్న సిద్దాంతం నిజమైన ఆనందాన్ని హరించివేస్తుందిఅయితే ఇప్పడు నేను ఉన్నదిఉన్నట్లు సత్యం నిర్భయంగా చెప్పడం వలన నేను మీకు విరోధిని అయ్యానా? వారు మీకు చెప్పే మభ్యపెట్టే బోధకు మీరు లోబడి సత్యమునుండి ఇంత తొందరగా ఎలా తొలిగి పోతున్నారు అని బాధపడుతున్నారు! కారణం మనుష్యులకు దేవుని సత్యం చెప్పడం అనేది వారికి చేసిన నిజమైన ఘనమైన మేలు! అయితే దానిని ఉన్నదిఉన్నట్లు చెప్పడం వలన, తరుచుగా మనుషులు తిరస్కరిస్తారు. ద్వేషిస్తారు. కారణం నిజం నిష్ఠూరంగా ఉంటుంది. చేదుగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. ప్రజలకు నొప్పించని బోధలే ఇష్టమవుతాయి తప్ప ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధలంటే వారికీ చాలా కష్టమనిపిస్తుంది. అయితే అది కష్టమైనా దానిని ఉన్నది ఉన్నట్లు తీసుకుంటే పరలోకం చేరుతారు! లేకపొతే నరకానికి పోతారు!

 

ప్రియమైన దైవజనమా! ఒకవేళ మీ కాపరి మృదువుగా కాకుండా కుండబద్దలు గొట్టినట్లుగా సత్యాన్ని బోధిస్తుంటే అలిగి ఇతర సంఘాలకు పోవద్దు! నీవు సరియైన స్థలం లోనే ఉన్నావు! ఇలా మేగి మేగి వాక్యం చెప్పేవారు నిన్ను నరకానికి నాశనానికి తీసుకుని పోతున్నారు అని తెలుసుకో! అలా ఖండించి గద్దించి వాక్యం చెప్పి నీ మనుస్సును నొప్పించి వాక్యం చెప్పే బోధకుడు నీ మీద ప్రేమతో ఆత్మలపట్ల భారంతో వాక్యం చెబుతున్నారు, నీవు నరకానికి పోకూడదు అనేది ఆయన ఆశ తప్ప నీమీద కోపం కానేకాదు! కాబట్టి సత్యాన్ని తెలుసుకో! దేవుని నిజమైన సువార్త సత్యములో నిలిచి కడవరకు సాగిపో!

దైవాశీస్సులు!

 

        

 

 

*గలతీ పత్రిక-30 భాగం*

గలతీ 4:1720

17. వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయ (మూసివేయ) గోరుచున్నారు.

18. నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.

19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

20. మిమ్మును గూర్చి యెటుతోచకయున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

 

   ఇక 1720 వచనాలలో మరలా దుర్భోధకులు అనగా విముక్తి రక్షణ కోసం కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం చాలదు, ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందాలి, ధర్మశాస్త్ర క్రియలు చేయాలి అని చెప్పేవారు- మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు అనగా మీ మేలు కోసం మిమ్మును వెంటాడువారు కారుగాని మిమ్ములను క్రూర జంతువులు వేటాడునట్లు వెంటాడుతున్నారు. ఇలా తప్పుడుబోధలు చెప్పి మీరే వారిని వెంటాడేలాగ చేసుకుందామని మిమ్మును సత్యమునుండి, నిజమైన రక్షణ, విముక్తినుండి బయటకు గెంటివేద్దామని వారి ఉద్దేశం అంటున్నారు!

గలతీ 1:67

6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

 

వీరు ముఠా నాయకులుగా ఉంటూ మీమీద అధికారం చెయ్యాలని వారి ఉద్దేశం!

రోమా 16:1718

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

 

    కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండాలి అంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దుర్భోధకులు ప్రజలు తమను ఫాలో అవ్వాలని లేక అనుసరించాలని కోరుకుంటారు. అయితే పౌలుగారు దేవున్నే అనుసరించాలని దేవుని విషయంలో ఆసక్తిగా ఉండాలని కోరుకుంటున్నారు. నిజంగా పౌలుగారు మనందరికీ ఆదర్శం!

1కొరింథీ 3:4, 9, 21,22

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

9. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి యైనను రాబోవునవి యైనను సమస్తమును మీవే.

 

అందుకే 18 వచనంలో నేను మీ యెద్ద నున్నప్పుడు మాత్రమేకాక మీ దగ్గర లేనప్పుడు ఇంకా ఎల్లప్పుడూ మీరు మంచి విషయాలలో మీ కోసం ఆసక్తిగా ఉంటున్నాను అంటున్నారు. ఇదీ తండ్రి హృదయం! కాపరి హృదయం! ఎల్లప్పుడూ తన మంద / పిల్లలు మంచి విషయాలలో ఆసక్తి కలిగి బలమైన ఆహరం తిని పుష్టిగా ఉండాలి అనేదే నిజమైన కాపరులు/ తండ్రుల ఉద్దేశం! అందుకే 19 వచనంలో ఇంకా వారిమీద నున్న తన ప్రేమను వ్యక్తం చేస్తూ వారు ఎలా ఉండాలో చెబుతున్నారు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.........

 

నా పిల్లలారా! పిలుపును చూడండి! గలతీ మూడవ అధ్యాయంలో రెండు సార్లు అవివేకులారా అని పిలిచినా- ఇక్కడ ఎంతో ప్రేమతో అనురాగంతో భారంతో కన్నీటితో నా పిల్లలారా! అని పిలుస్తున్నారు. తండ్రి హృదయానికి ఇది మరో నిదర్శనం!

 

 దైవసేవకులు కాపరులు గమనించాలి! పౌలుగారి నుండి మనం నేర్చుకోవలసినది ఇది!!  కోపాన్ని వ్యక్తం చేసినప్పుడు వ్యక్తం చేశాక ఇక దానిని మరచిపోయి వారు తమ ఆత్మీయ పిల్లలుగా భావించి వారికి సరియైన మార్గం బోధించి ప్రేమించి ఆదరించవలసిన అవసరం ఉంది! ఎప్పుడో ఏదో చేశాడని/ చేసిందని ఇంకా అదే భావంలో ఉండకూడదు! ఇప్పుడు మారి ఉండవచ్చు! లేదా మారడానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి! ఇదీ అసలైన తండ్రి హృదయం! వ్యక్తి అలా చేశాడు/ చేసింది గనుక దేవా వ్యక్తికి కాలు తీసెయ్, యాక్సిడెంట్ చేసేయ్, రోగంతో మొత్తేయ్ లాంటి పనికిమాలిన ప్రార్ధనలు చేయకుండా వారిని క్షమించమని దేవుణ్ణి అడిగి, వారు మారడానికి మన తరుపున ప్రయత్నం చెయ్యాలి! సొంత పిల్లలను ప్రేమించినట్లు ప్రేమించాలి! అలా ప్రేమించే, ఆదరించే, పౌలుగారు ఇన్ని దేశాలలో అన్ని సంఘాలు కట్టి, ఎంతోమందికి నిజమైన ఆత్మీయ తండ్రి అయ్యారు!

ప్రియమైన దైవజనుడా! ఈ రకమైన ప్రేమ, ఆసక్తి, అనురాగం, త్యాగం నీ సంఘబిడ్దల మీద నీకుందా??!! లేకపోతే పౌలుగారిని చూసి నేర్చుకోమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నానుఎల్లప్పుడూ వారి తప్పులను ఎత్తి చూపకుండా వారు మారడానికి మనము సహాయం చేస్తుండాలి! ప్రేమిస్తుండాలి!

 

  ఇక నా పిల్లలారా అని ప్రేమానురాగాలుతో పిలిచి- నాలాగా ఉండండి అని గొప్పలు చెప్పకుండా క్రీస్తు రూపంలోకి మీరు మారాలి. అలా మార్చడానికి నేను మరలా మీకోసం ప్రసవవేదన పడుతున్నాను అంటున్నారు. మాట అనడానికి కారణం- మరలా మనం అపో 14 అధ్యాయం చూసుకోవాలి! గలతీయులకు సువార్త చెప్పడానికి ప్రాంతాలలో ఎన్ని బాధలు, హింసలు అవమానాలు, రాళ్ళదెబ్బలు తిన్నారో మనం చూడవచ్చు! ప్రజలు ఆయన చనిపోయారు అనుకున్నారు. ఇక రాళ్ళదెబ్బలుకు ప్రక్కటెముకలు విరిగి ఆయన జీవితాంతం బాధ పడ్డారు! నేను ఇంత కష్టాలుపడి మిమ్మల్ని దేవునికోసం కంటే పనికిమాలిన వారలారా ఇప్పుడు మీరు దారి తొలగిపోతారా అని అనడం లేదు! మీరు ఒకప్పుడు దేవుని రూపంలో దేవుని స్వారూప్యం లో ఉండేవారు- అయితే ఇప్పుడు తప్పుడుబోధలకు లోబడి క్రీస్తు నుండి వేరై ధర్మశాస్త్రం క్రిందకు వచ్చేశారు. కాబట్టి మీకోసం నేను మరలా పురిటినొప్పులు పడుతున్నాను అంటున్నారు. మరలా పురిటినొప్పులు అని ఎందుకు అంటున్నారు అంటే అంత దెబ్బలు అవమానాలు కష్టాలు పడి వారిని దేవునికోసం గెలుచుకోగలిగారు పౌలుగారు! మరి ఇప్పుడు దానినుండి తొలగిపోయారు కదా! అందుకే మరలా పురిటినొప్పులు పడుతున్నాను అంటున్నారు. వారిని శపించడం లేదు! ప్రేమతో మరలా నా దగ్గరకు రండి అనడం లేదు. ప్రేమతో మరలా క్రీస్తు దగ్గరకు- ఆయనయందు గల విశ్వాసానికి రండి అని కన్నీటితో బ్రతిమిలాడుతున్నారు! ఇదీ తండ్రి నైజం! నిజమైన కాపరి లక్షణం! కారణం ఆయన వారికి ఆత్మీయ తండ్రిగా బావించుకుంటున్నారు కాబట్టి ఇలా అంటున్నారు. 1కొరింథీ 4:15

క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.

 

ఎంతో వ్యయప్రయాసల వలన వారు రక్షించబడ్డారు. వారి స్వభావము అన్నీ మార్పు చెందాయి. వారు ఇప్పుడు నూతన జన్మ గల పరిశుద్ధులుయోహాను 3:38

3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

అయితే ఇప్పుడు గలతీయులు దారి తొలగిపోయారు కాబట్టి వారు మార్పునొంది క్రీస్తుయేసు పోలికలోనికి రావాలి అని మనవిచేస్తున్నారు

గలతీ 3:2, 2629

2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

26. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు.

27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

28. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

29. మీరు క్రీస్తు సంబంధులైతే (మూలభాషలో-క్రీస్తువారైతే) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

 

ఇప్పుడు వారు పౌలు భక్తుని వలే వారుకూడా దేవునికి విశ్వాస పాత్రంగా ఉండాలిగలతీ 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

 

వారు తమ ఆలోచనలలో చర్యలలో మార్పునొందాలి! వారి జీవితం మారిపోవాలి!

రోమా 12:2

మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.

 

రోమా 13:14

మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

 

2కొరింథీ 3:18

మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత (లేక,ఆత్మయగు ప్రభువుచేత) ఆ పోలికగానే మార్చబడుచున్నాము.

 

ఎఫెసీయులకు 4:14,15,16,17

14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక,

15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

16. ఆయన శిరస్సయియున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతికీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది.

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

 

మరి సంఘమా ఎలా ఉంది నీ పరిస్తితి? క్రీస్తుయేసు రూపంలోనికి మారుతున్నవా లేక శరీరాస కలిగి లోకాచారాలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో!

అన్యజనులు నడచుకొనునట్లు నడచుకోవద్దని సూటిగా బైబిల్ చెబుతుండగా ఇంకా అన్యజనుల లోకాచారాలు అన్యజనుల వలే చేస్తున్నావా?

 

 ఇంకా పౌలుగారు అంటున్నారు: 20...మిమ్మును గూర్చి యెటుతోచకయున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను

మీకోసం ఏమి రాయాలో, ఏమి చెయ్యాలో ఎటూ తోచక ఉంది నాకు అని భాధపడుతున్నారు! కారణం

 గలతీ 4:11

మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.

 

గలతీ 1:6

క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

 

గలతీ 3:1

ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

 

ప్రియ దైవజనమా! ఇంకా నీవు పాత ఆచారాలలో, లోక సంబంధమైన విషయాల లోనే ఉంటావా లేక ఆధ్యాత్మిక విషయాల కోసం ప్రాకులాడుతావా? నీ కాపరిని దేవుణ్ణి సంతోషపెడతావా లేక లోకాన్ని సాతాను గాడ్ని సంతోషపెడతావా? నీ బాహ్యపురుషున్ని సంతోష పెడతావా లేక అంతరంగపురుషున్ని సంతోషపెడతావా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముని సంతోష పెడతావా లేక లోకాచారాలలో పడి లోకాశాలతో పరిశుద్ధాత్ముని దుఃఖపెడతావా? నేడే తేల్చుకో!

ఇప్పుడైనా దేవునివైపు తిరుగు! పాత అలవాట్లు, లోకాచారాలు లోకాశలు వదిలి దేవుని దగ్గరకు రా!

క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు కలిగి, మహిమ నుండి అత్యధిక మహిమను, సంపూర్ణత నుండి పరిపూర్ణతను పొందుకునిక్రీస్తు స్వారూప్యంలోనికి మారు!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-31 భాగం*

గలతీ 4:21—23

21. ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.

22. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?

23. అయినను దాసివలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మునుబట్టి పుట్టెను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ఇక 21 వచనం నుండి చివరివరకు మరలా ధర్మశాస్త్ర సంబంధులు ఎవరో చెబుతున్నారు! అయితే చాలా పత్రికలలో పౌలుగారు ఏవిషయమైనా చెప్పేటప్పుడు ఎక్కువగా అబ్రాహాము గారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని సంగతులు వివరిస్తూ ఉంటారు. ఇక్కడ మరలా ఆయన జీవితాన్నే ఉదాహరణగా తీసుకుని రెండు విషయాలు చెబుతున్నారు!

 

  21 వచనంలో ధర్మశాస్త్రం క్రింద ఉండగోరేవారలారా! అంటూ మొదలుపెట్టారు! అనగా ఇప్పుడు ఎంతచెప్పినా విననొల్లని ధర్మశాస్త్ర సంబంధులకు ఇంకా దానిని బోధించే అబద్ధబోధకులకు డైరెక్టుగా తన ప్రశ్నలను సంధిస్తున్నారు! అసలు మీరు ధర్మశాస్త్రాన్ని వినలేదా చదవలేదా? మీరు బాగా అర్ధం చేసుకున్నారా లేదా అని అడుగుచున్నారు! కారణం చాలామంది భయంకరమైన తప్పులో పడిపోయారు! ధర్మశాస్త్రమంటే ఏమిటో వీరికి సరిగా తెలియనందు వలన, సరిగా అర్ధం చేసుకోకపోవడం వలననే ఇలా జరిగింది అని పౌలుగారికి బాగా తెలుసు! అందుకే సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు! 22,23....

దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?

23. అయినను దాసివలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.

 

దాసి అనగా హాగరు వలన పుట్టిన వాడు- ఇష్మాయేలు! స్వతంత్రురాలు అనగా శారమ్మ గారి ద్వారా పుట్టిన వాగ్ధాన బిడ్డ- ఇస్సాకు గారు! దాసివలన పుట్టిన వాడు శరీర సంబంధంగా పుట్టాడు. అయితే స్వతంత్రురాలైన శారమ్మ గారి ద్వారా పుట్టిన వాడు వాగ్ధానము వలన పుట్టారు!

దీనికోసం మనం ఆదికాండంలో చూసుకోవచ్చు!

 

ఆదికాండం 16:14

1. అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.

2. కాగా శారయిఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.

3. కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.

4. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.

 

ఆదికాండం 17:1516

15. మరియు దేవుడు నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా

16. నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను.

 

ఆదికాండం 21:15

1. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.

2. ఎట్లనగా దేవుడు అబ్రాహా ముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.

3. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరుపెట్టెను.

4. మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.

5. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి నప్పుడు అతడు నూరేండ్లవాడు.

 

రోమా 4:1821

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

 

  ఇంతవరకు అబ్రాహాము గారి సంతానమైన ఇష్మాయేలు- ఇస్సాకు గార్ల గురుంచి చెప్పారు. అయితే క్రిందన మిగిలిన వచనాలలో వీరి తల్లులైన హాగరు మరియు శారమ్మ గార్లు ఎవరికి సాదృశ్యమో చెబుతున్నారు!

 

2426

24. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలైయున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

25. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.

26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.

 

ఇక్కడ పాత నిబంధన గ్రంధంలో అబ్రాహాము, అతని బార్య, బానిస లేదా దాసి హాగరు సంఘటనల నుండి పౌలుగారు ఆధ్యాత్మిక సత్యాలను ఆధ్యాత్మిక పాఠాలను బయటకు తీసుకొస్తున్నారు! వారు గత చరిత్రలో ఉన్నవారని తెలుసు! అయితే ఆధ్యాత్మిక సత్యాలకు వారు సాదృశ్యంగాను, సూచనలు గాను చూపించి పౌలుగారు గొప్ప సత్యాలు ఆత్మావేశుడై బోధిస్తున్నారు! అయితే గమనించాలి- ఇక్కడ పౌలుగారు వాడిన ఉదాహరణలకు కొంతమంది బైబిల్ పండితులు అభ్యంతరం చెప్పినా రాయించింది పరిశుద్ధాత్ముడు కాబట్టి విషయంలో ఎలాంటి పొరపాటులు జరగలేదని గ్రహించాలి. యేసయ్య చెప్పారు నానుండి సంగతులను తీసుకుని ఆదరణ కర్త అనగా పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు! కాబట్టి పరిశుద్దాత్ముడు దేవుని నుండి సంగతులను తీసుకుని పౌలుగారి ద్వారా రాయించారు కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాహరణలు తీసుకోవడంలో తప్పు జరగలేదని గ్రహించాలి. పరిశుద్దాత్ముని రాతలకు తప్పు పట్టేవాడువారే తప్పు అని గ్రహించాలి! అక్కడ వివరించిన స్త్రీలు ఇద్దరు, ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారం అన్నీ ఆధ్యాత్మిక సత్యాలకు విషయాలకు నీడలే

 

హెబ్రీయులకు 8: 5

మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

 

హెబ్రీయులకు 10: 1

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

 

అంతేకాకుండా పాత నిబంధన మొత్తము యేసుక్రీస్తు ప్రభులవారు స్థాపించిన క్రొత్త నిబంధన లోని ఆధ్యాత్మిక వాస్తవాలకు సాదృశ్యంగా ఉన్నాయి!

 

ఇక్కడ 24,25 వచనాలలో వివరించిన ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలకు సూచనగా ఉన్నారు. ఒకరు సీనాయి కొండ మీద చేసిన పాత నిబంధన- ఇది దాస్యాన్ని తీసుకుని వచ్చింది. ఇది హాగరు! హాగరు అరేబియా దేశంలో ఉన్న సీనాయి పర్వతమునకు సూచనగా ఉంది అంటున్నారు. అది ప్రస్తుతపు యేరూషలేముకి సూచనగా ఉంది. ప్రస్తుతం యేరూషలేము దాస్యం లో ఉంది అంటున్నారు. అనగా అప్పటికి నేటి ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభులవారిని అంగీకరించకపోవడం వలన వారు ఇప్పటికీ ధర్మశాస్త్రం అనబడే దాస్యంలో ఉన్నారు! అయితే శారమ్మ గారు- క్రొత్త నిబంధనకు సాదృశ్యం! ఆమె పైనున్న నూతన యేరూషలేము లేక పరమ యేరూషలేముకి సాదృశ్యంగా ఉన్నారు. ఆమె మనందరికీ తల్లి అంటున్నారు!

 

   సీనాయి కొండమీద దేవుడు మోషేగారితో చేసిన పాత నిబంధన-ధర్మశాస్త్రం యొక్క ప్రతినిధి హాగరు అంటున్నారు! నిర్గమ 19 అధ్యాయం!

మత్తయి సువార 26:28లో యేసుక్రీస్తు ప్రభులవారు చేసిన క్రొత్త నిబంధనకు ప్రతినిధి శారమ్మ గారు! హాగరు ఐగుప్తు దేశానికి చెందిన ఒక దాసి! ఆమె అబ్రాహాము గారికి కన్న సంతానం- స్వతంత్ర సంతానంగా వారసునిగా లెక్కలోకి రాలేదు! రోమా 9:78

7. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును,

8. అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.

 

హాగరు మోషే ధర్మశాస్త్రానికి, దానిని ఇచ్చిన సీనాయి కొండకు, పాత నిబంధనకు, పాత నిబంధన ఆచారాలకు కేంద్రమైన యేరూషలేముకి సాదృశ్యంగా ఉంది! అనగా పాత నిబంధన- ధర్మశాస్త్రం బోధించే ఆత్మ సంబంధమైన బానిసత్వానికి గుర్తు అంటున్నారు పౌలుగారు!

గలతి 4:1, 9;

1. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడై యున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.

9. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల

 

గలతీ 3:10; 23

10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

23.విశ్వాసము వెల్లడికాకమునుపు (మూలభాషలో- విశ్వాసము రాకమునుపు) , ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింప వలసినవారముగా (మూలభాషలో- విశ్వాసమవలంబింప) చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకులోనైన వారమైతిమి.

 

అయితే 26 వచనంలో పైనున్న యేరూషలేము అనగా పరమ యేరూషలేము స్వతంత్రంగా ఉంది. అదే మనకు తల్లి అంటున్నారు! శారమ్మ గారు క్రొత్త నిబంధనకు క్రొత్త నిబంధన వాగ్దానాలకు, క్రొత్త నిబంధనకు చెందిన ఆధ్యాత్మిక వాస్తవాలకు, ఆధ్యాత్మిక సత్యాలకు కేంద్రమైన పరమ యేరూషలేముకి శారమ్మ గారు సాదృశ్యంగా ఉన్నారు!

 హెబ్రీ 12:22

ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును,..

 

కాబట్టి పరమ యేరూషలేముకి మనం పిలువబడ్డాము కాబట్టి అక్కడ దాస్యము- బానిసత్వము లేవుఇప్పుడు విశ్వాసులు క్రొత్త నిబంధనకే చెందుతారు తప్ప దాస్యమునకు అనగా పాతనిబంధనకు కాదు!

 

ఇదంతా పౌలుగారు ఎందుకు ఉదాహరణగా చెబుతున్నారు అంటే ధర్మశాస్త్ర సంబంధికులారా! మీరు చేస్తున్న ఆచార వ్యవహారాలూదాస్యానికి సంభందమైనవి. మీరు హాగరు సంతానం! మీరు దాసికి పుట్టిన వారు! అయితే విశ్వాస సంబంధులు వాగ్దానం వలన పుట్టినవారు కనుక మీరు దాసులు కాదు. స్వతంత్రులు, వారసులు- దేవుని వాగ్దానాలు హక్కుదారులు! కాబట్టి ఇప్పుడు మీరు తేల్చుకోండి- మీకు దాస్యమనే ధర్మశాస్త్రం కావాలా లేక విశ్వాసమనే వారసత్వము-స్వతంత్రత కావాలా అని అడుగుచున్నారు!

 

ప్రియ విశ్వాసి నీకేమి కావాలి?

విశ్వాసమా? లోకచారాలా?

దేవుడా? లోకమా?

 లోకాచారాలా? లేక దేవుని ఆధ్యాత్మిక విషయాలా ? ఏమి కావాలో తేల్చుకో!

 

దైవాశీస్సులు!

 (ఇంకాఉంది)

*గలతీ పత్రిక-32 భాగం*

గలతీ 4:2731

27. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగల దాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.

28. సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమైయున్నాము.

29. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.

30. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండడు.

31. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

 

      (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

 

 ఇక 21 వచనం నుండి చివరివరకు మరలా ధర్మశాస్త్ర సంబంధులు ఎవరో చెబుతున్నారు! ఇక పై వచనాలలో ఇంకా వివరింగా రాస్తున్నారు- ఇస్సాకు ఎవరికి సాదృశ్యమో ఇష్మాయేలు దేనికి సాదృశ్యమో!

 

27. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగల దాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.

ఇక్కడ ప్రవచనం ఎక్కడిదంటే? యెషయా 54:1

గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారి పిల్లల కంటే విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

అక్కడ భక్తుడు దైవావేశుడై అభిషక్తునికోసం- ఆయన స్థాపించబోయే నూతన నిబంధన సంఘం కోసం చెబుతున్నారు! ప్రవచనాన్ని ఎత్తి ఇక్కడ పౌలుగారు మనకు సంగతి వివరిస్తున్నారు! ఇక్కడ గొడ్రాలు ఎవరు? శారమ్మ గారు! పిల్లలు కన్నది ఎవరూ? హాగరు! పిల్లలు కననిదిశారమ్మ గారు! పిల్లలు కననిదానా ఇప్పుడు ఆనందంతో గట్టిగా కేకలు వేయు! ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లల కంటే భర్తలేని దాని పిల్లలు ఎక్కువగా ఉన్నారు అంటున్నారు! పైన చెప్పిన విధంగా ప్రవచనం యేసుక్రీస్తుప్రభులవారు స్థాపింపబోయే నూతన నిబంధన సంఘమునకు సాదృశ్యం! అనగా శరీరానుసారులైన యూదుల కంటే వాగ్ధాన పుత్రుడు స్థాపించిన సంఘ సభ్యులమైన మనమే ఎక్కువగా అవుతాము అని ముందుగానే చెప్పారు!

 

ఇక్కడ 28 వచనంలో సోదరులారా అని సంభోదిస్తున్నారు పౌలుగారు! మొదటగా అవివేకులారా అన్నారు! తర్వాత నా పిల్లలారా అంటున్నారు! ఇప్పుడు సోదరులారా అనగా తనతోపాటు సంఘ సభ్యులను సమానంగా చూస్తున్నారు పౌలుగారు! ఇదీ సేవకునికి కాపరికి ఉండవలసిన మరో లక్షణం! తాను సంఘానికి ఒక అధికారి అని భావించకుండా సంఘమంతా తనతో సమానమని, హెచ్చించుకోకుండా తగ్గించుకుంటే సంఘం తనమాటకు లోబడుతుంది!

 

ఇక్కడ అబ్రాహము గారు దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచారు. అతనికి దేవుడు ఇస్సాకుని అనుగ్రహించారు! ఇంకా ఇస్సాకుకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు దేవుడు! అలాగే వాగ్ధాన పురుషుడు ఇస్సాకు జన్మించారు. ఇక్కడ 28 వచనంలో మనము కూడా ఇస్సాకు లాగే వాగ్ధాన సంతానము అంటున్నారు. అయితే గత అధ్యాయాలలో పౌలుగారు చెబుతున్నారు- వాగ్ధాన పురుషుడు- ఇస్సాకు కాదు- యేసుక్రీస్తుప్రభులవారు! యేసుక్రీస్తుప్రభులవారు స్థాపించిన నూతన నిబంధన సంఘంలో సభ్యులందరూ- ఎలా అబ్రాహాము వాగ్దానాలకు యేసుక్రీస్తు ప్రభులవారు వారసులయ్యారో- అలాగే వాగ్దానాలను విశ్వాసంతో నమ్మితే మనం కూడా ఆయన సంతానమై- వాగ్దానాలకు వారసులం అవుతామని గతభాగాలలో ధ్యానం చేసుకున్నాం! అందుకే ఇక్కడ మనం కూడా ఇస్సాకులాగే వాగ్ధాన సంతానం అంటున్నారు! అయతే ఇప్పుడు విశ్వాసులు నూతన జీవాన్ని పొందుకుని అబ్రాహాము గారికి ఆధ్యాత్మిక వారసులు కావాలి! దానికి ఒకేఒక మార్గం- విశ్వాస మార్గం! విశ్వాస నియమం

యాకోబు 1:18

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

1పేతురు 1: 21

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,...

 

ఇక 29 వచనంలో అప్పుడు జరిగిన సంఘటన మరొకటి రాస్తున్నారు--

అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.  ...

ఆదికాండం 21:8—9 వచనాలలో ఉంది సంఘటన! ఇష్మాయేలు శరీర రీతిగా పుట్టాడు. ఇస్సాకు గారు దేవుని వాగ్దానం ద్వారా పుట్టారు! అది మానవ పరంగా అసాధ్యమైనప్పుడు దేవుని ఆత్మ వారికి కొడుకు పుట్టేలా చేశాడు!

 హెబ్రీ 11:1112

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి, సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

 

రోమా 4:17,18,19,20,21,22

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

29వచనం...అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.  ...

ఈ సంఘటనలు జరిగాక ఇష్మాయేలు ఇస్సాకుని హేళనచేసి హింసించినట్లే ఇప్పటి అప్పటి యూదులు- అనగా ధర్మశాస్త్రమనే బానిసత్వం క్రింద ఉన్న బానిసలు- క్రొత్త నిబంధన క్రింద ఉన్నవారిని అనగా నూతన నిబంధన సంఘమైన క్రైస్తవులను అనేక హింసలు పెట్టారు! ఇది అపో కార్యములలో ఉంది! అపో 5:40

అపో 7:54—58

అపో 13:49—50

అపో 14:19

అలాగే ఆధ్యాత్మికత లేని వ్యక్తులు ఆధ్యాత్మికమైన విశ్వాసులను ఏ కాలంలోనైనా  బాధలు పెడుతుంటారు! అయితే ౩౦ వచనంలో లేఖనం ఏమి చెబుతుంది- ఆ దాసిని- దాని కొడుకుని వెల్లగొట్టు! ఎందుకంటే దాసీ కొడుకు వారసుడు కాబోడు! ఇది ఆదికాండం 21:10 ఓ ఉంది....

ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.

 

ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నాలతో పాపవిముక్తి సంపాదించుకోవాలని చూస్తున్న వారు దాస్యం క్రింద ఉన్నారని, దేవుని కృప మూలంగా పాపవిముక్తి పొందిన వారితో దాసి సంతానమైన ధర్మశాస్త్ర సంబంధులకు చోటు లేదు అని ఇక్కడ పౌలుగారు వివరిస్తున్నారు! కారణం రెండు దారులు కలువవు! ఒకవేళ రెండు దారులను కలిపి క్రొత్త మార్గాన్ని ఏర్పాటుచేద్దామంటే అది వక్రమైన మార్గం వక్రమైన సువార్త అవుతుంది గాని మంచి మార్గం మంచిసువార్త అవదు!

 

31. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

కాబట్టి మనం అనగా విశ్వాస సంబందులం బానిస సంతానం కాదు! స్వతంత్రురాలి సంతానం కాబట్టి ఆ పాత అలవాట్లు శరీర సంబంధమైన ఆచారాలు మానేద్దామని చెబుతున్నారు పౌలుగారు! కారణం క్రీస్తుయేసు విశ్వాస సంబంధులకు పాత నిబంధనతోను యూదా మత ఆచారాలతోను ఎలాంటి సంబంధము లేదు! వారు కేవలం నూతన నిబంధన వాగ్ధాన సంతానమే! క్రీస్తు సువార్త వాగ్దానాల మూలంగా, దేవుని ప్రభావం వలన వీరు క్రీస్తులో నూతన జన్మ పొందిన వారు! కాబట్టి వీరికి పాత నిబంధనతో ఎలాంటి సంబంధమూ లేదు!

2కొరింథీ 3:6—18

హెబ్రీ 8:6—10

హెబ్రీ 12:18—24

 

ప్రియ నూతన నిబంధన సంఘమా! అలాగే మీకు కూడా పాత ఆచారాలతో పాత అలవాట్లతో సంబంధం లేదు! వాటిని వదిలి కేవలం నూతన జన్మ పొందిన వారిలా జీవించాలి తప్ప మరలా పాత అలవాట్లు ప్రక్కకు తిరగకూడదు! తప్పుడుబోధకులు బోధించినా, లోకం ఆకర్షించినా బలంగా నిలబడాలి తప్ప వాటివైపు చూడకూడదు! కుక్క తనవాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదవైపుకి తిరిగినట్లు నీవు మరలా లోకము వైపు చూడకూడదు! 2పేతురు 2:22;

 నాగటిమీద చెయ్యివేసి వెనుకకు తిరుగకూడదు! మరి నీవేమి చేస్తున్నావో ఒకసారి పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-33 భాగం*

గలతీ 5:1—6

1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

2. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.

3. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడైయున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.

4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయియున్నారు.

5. ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.

6. యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా ఇంతవరకు నాలుగు అధ్యాయాల నుండి పౌలుగారు బోధించిన ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను ధ్యానం చేసుకున్నాము! ముఖ్యముగా ధర్మశాస్త్రము, సున్నతి , ఆచారాలు పాటించడం వలన ఉపయోగం లేదు, వాటిని పాటిస్తే మరలా ధర్మశాస్త్రమనే దాస్యం క్రిందకు వచ్చినట్లే, అయితే ఇప్పుడు మీరు కృప విశ్వాసము అనే కాడిక్రిందకు వచ్చారు అంటున్నారు. ఇక 5 అధ్యాయంలో కూడా దీనినే కొనసాగిస్తూ ఒక క్రైస్తవుడు రక్షించబడిన విశ్వాసి- ధర్మశాస్త్ర సంబంధమైన లోకాచార సంబంధమైన శారీరక విషయాలలో కాదు గాని ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తిని కలిగి ఉండాలని చెబుతూ, పరలోకానికి చేరాలంటే ఇంకా ఆధ్యాత్మికంగా బలపడాలంటే విశ్వాసికి ఏమి కావాలి? ఏవేవి విశ్వాసిలో అసలు కనబడకూడదు అనేవాటిని చాలా వివరంగా రాశారు! అనగా చేయకూడనివి పాటించకూడనివి ఏమిటి- చేయవలసినవి లేక పొందుకోవలసినవి ఏమిటి అనేవాటిని అధ్యాయంలో ధ్యానం చేసుకోవచ్చు! గలతీ 5 అధ్యాయం యావత్-క్రైస్తవ ప్రపంచానికి తలమానికమైన అధ్యాయం!

 

  మొదటి వచనంలో : స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు అంటున్నారు- స్వాతంత్ర్యము? అనగా ఇంతవరకు మనకు ధర్మశాస్త్రము అనే దాస్యము క్రింద, కాడి క్రింద, ధర్మశాస్త్రము అనే జైలు అధికారి క్రింద, పాపము అనే జైలులో ఉన్నట్లుగా మనం నాల్గవ అధ్యాయంలో 39 వచనాలలో చూసుకున్నాం! కాబట్టి ఇలాంటి పాపపు దాస్యము నుండి క్రీస్తుయేసు మనలను విడిపించారు కాబట్టి మరలా పాపమనే ధర్మశాస్త్రమనే దాస్యపు కాడిక్రిందకు చిక్కుకోవద్దు అంటున్నారుపాపవిముక్తికి- ముక్తికి స్వప్రయత్నాలు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు, విధులు, ఖర్మకాండలు, ఆచారాలు బలియర్పణలు చేయాలి అని నేర్పించే ఉపదేశం బానిసత్వం లాంటిది అని పౌలుగారు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు గత అధ్యాయాలలో! అనగా పౌలుగారు చెబుతుంది మోషే ధర్మశాస్త్రం గురించి! అపో 15:1011 లో పేతురు గారు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు!...

 

10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

11. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

 

మరి ఇలాంటి కాడినుండి క్రీస్తుయేసు విశ్వాసులను విడుదల చేశారు, అనగా మతసంభంధమైన అన్ని దాస్యాలనుండి విడుదల చేశారు. అది మతమైనా సరే- యూదా మతం కావచ్చు, లేదా బ్రష్టమైపోయిన ఒక రకమైన క్రైస్తవ్యం/ క్రైస్తవ మతసంస్థ కావచ్చు! దానినుండి మనలను దేవుడు విడిపించారు! విడుదల అంటే 100% విడుదల! కాబట్టి క్రీస్తులో విశ్వాసులు స్వేచ్చ- విడుదలను గుర్తించాలి! దాని విలువను గ్రహించాలి! దానిని వదులుకోగూడదు! తుచ్చమైన కోరికలు కోసం, శరీరాశలు కోసం, లోకాచారాల కోసం, ఎవడో ఏదో అనుకుంటారని దురభిమాన పాపం కోసం స్వాతంత్ర్యాన్ని వదులుకోగూడదు! ఇప్పుడు మీరంతా క్రీస్తు అనుగ్రహించిన కాడిక్రింద ఉన్నారు. ఇది సులువైనది, తేలికైనది అని ఆయనే చెబుతున్నారు! కాడిలో శాపం లేదు!

మత్తయి 11:28—౩౦

28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

30. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 

కాబట్టి విశ్వాసులకు/ ప్రజలకు పాపవిముక్తి  విషయంలో వారికి అవసరమైనది కాడి మాత్రమే! కాడి స్వతంత్రతను ఇస్తుంది! మరి విశ్వాసి నీకు కాడి కావాలో తేల్చుకో!

దేవుడిచ్చిన కాడి కావాలా? లేక లోకాచారాలు కావాలా?

ఆత్మానుసారంగా జీవిస్తావా లేక శరీరానుసారంగా జీవిస్తావా?

ఆత్మ కార్యాలు ఆత్మఫలము కావాలా లేక శరీరాశలు, లోకాచారాలు కావాలా?

రెంటి క్రింద నీవు ఉండలేవు!

ఏదో ఒకదానినే కోరుకోవాలి!

లోకాచారాలు, ఇంకా RCM మతసంస్థ నేర్పించిన బోధలు ఆచారాలు కావాలా లేక బైబిల్ బోధించే ఆత్మతోను సత్యముతోను నిజమైన ఆరాధాన కావాలో తేల్చుకో!

 ఒకసారి ఈ పాత ఆచారాలలో పడి నీవుండగా ఆ పాత విగ్రహారాధన అనే దాస్యములో నీవుండగా దేవుని మహాకృపవలన విడుదల పొందిన నీవు మరలా ఆ పాత ఆచారాలు అనే దాస్యములో చిక్కుకోవద్దు అని చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు!

 

2. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.

 

మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తువలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదు అంటున్నారు పౌలుగారు! కారణం ధర్మశాస్త్రం- కృప/ విశ్వాసం అనే రెండు మార్గాలు కలవవు! మనుష్యులు ధర్మశాస్త్ర మార్గాన్ని గాని, కృప/విశ్వాసముల మార్గాన్ని గాని దేనినో ఒకదానినే కోరుకోవాలి! రెండూ కావాలంటే కుదరదు! దేవుని కృప- తమసొంత ప్రయత్నాలు రెండింటినీ కలిపి ఉపయోగించి మనుష్యులు పాప విముక్తిని పొందనేలేరు! ఇటు విశ్వాసంఅటు ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఆచారాలు రెండూ కలిపి మనిషిని రక్షించవు! మీరు సున్నతి పొందితే క్రీస్తువలన కలిగే ప్రయోజనాలు ఏవీ మీకు ఉండవు అంటున్నారు! శారీరకంగా సున్నతి పొందడంలో ఏమీ లేదు అని పౌలుగారు చెబుతున్నారు. దుర్భోధకుల మాటలు విని గలతీయ వారు సున్నతి అనే మతాచారాన్ని ఆచరించి మరలా మోషే ధర్మశాస్త్రం క్రిందకు వెళ్తే ఇప్పుడు క్రొత్త నిబంధనలో  గల ప్రయోజనాలు ఏవీ వారికి వర్తించవు! అయితే క్రీస్తుయేసునైనా కోరుకోవాలి లేక మోషే ధర్మశాస్త్రాన్ని కోరుకోవాలి. ఏదో ఒకదానినే కోరుకోవాలి! ధర్మశాస్త్రం వలన ముక్తిని మార్గం దొరుకుతుంది అంటే క్రీస్తుయేసు ప్రభులవారి విశ్వాస- కృపా మార్గం యొక్క అవసరమే ఉండేది కాదు కదా!

 

3. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడైయున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.

 

వచనంలో మరోసారి చెబుతున్నారు పౌలుగారు: సున్నతి పొందితే నీవు ధర్మశాస్త్రం చెప్పిన ప్రతీ ఆజ్ఞనూ పాటించవలసినదే! ఒక్క ఆజ్ఞ మీరినా ధర్మశాస్త్రమంతతిని అతిక్రమించినట్లే! అనగా నీవు సున్నతి పొందితే- ఇక ధర్మశాస్త్ర విధులన్నిటినీ తప్పకుండ పాటించవలసినదే! అయితే ఇంతకుముందు పౌలుగారు చెప్పినట్లుఒకవేళ నీవు ధర్మశాస్త్ర పద్దతులు చేయడం వలన నీకు శాపమే గాని దీవెన ఏమీ లేదు! గలతీ 3:1వాటి వలననేధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

12. ధర్మ శాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

 

(ఇంకాఉంది)

          

 

 

 

 

*గలతీ పత్రిక-34 భాగం*

గలతీ 5:16

1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

2. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.

3. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడైయున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.

4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయియున్నారు.

5. ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.

6. యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

 

        (గతభాగం తరువాయి)

 

4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయియున్నారు.

 

ఇక వచనంలో చెబుతున్నారు- ఒకవేళ మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడాలని ఆశిస్తే వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడ్డారు అంటున్నారు. ఇంకా కృప నుండి కూడా తొలగిపోయి ఉన్నారు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు- మీరు నానుండి వేరైతే ఫలించలేరు- ద్రాక్షవల్లి దాక్షచెట్టుతో కలిసి ఉంటేనే గాని అది ఫలించదు. ఒకవేళ వేరైతే అది కాల్చబడుటకే తప్ప మరి దేనికి పనికిరాదు!

 

 John(యోహాను సువార్త) 15:2,4,5,6

2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.

4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.

 

మీరు ఫలించాలి అంటే, ముక్తి కావాలి అంటే క్రీస్తులో ఉంటూ క్రీస్తుతో కూడా అంటు కట్టబడి ఉండాలి! అప్పుడే క్రీస్తుయేసులో ఉంటూ క్రీస్తుయేసు దయచేసి మహిమైశ్వర్యాలు అన్ని కలుగుతాయి! .....

 

ఇంకా సున్నతి ధర్మశాస్త్రము పాటిస్తే కృపనుండి బొత్తిగా తొలగిపోయారు అంటున్నారు! కృపచేతనే మీరు రక్షింపబడ్డారు అని మనం విశ్వాసముఉచితకృప అనే నియమం క్రిందకు వచ్చి నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఇప్పుడు సున్నతి ఆచారాలు చేస్తే కృప నుండి తొలగిపోతారు అంటున్నారు. అలాగే కృప క్రింద ఉన్న మనం మరలా మన పాత ఆచారాలు చేస్తే కృప నుండి తొలగిపోయి- సాతాను దాస్యము క్రిందకు వచ్చి మరలా పాపమనే బంధకాలలో, మరణంలోకి వచ్చారు! క్రీస్తుతో కూడా జీవం లోనికి వచ్చిన మీరు- పాత ఆచారాల వలన మరలా సాతానుతో మరణంలోనికి వెళ్ళిపోతారు! కృపలో నుండి తొలగిపోతారు! గమనించాలి: కృప నుండి తొలగిపోవడం అనగా కేవలం క్రీస్తుయేసు నందలి విశ్వాసం ద్వారానే మనం రక్షణ విడుదల విముక్తి పొందుతాము అనే నియమం నుండి తొలిగిపోవడం అన్నమాట! ఎప్పుడైతే ఇలా చేస్తారో వారు క్రీస్తులో లేరు! క్రీస్తులో లేకపొతే లోకంలో ఉన్నారు. అనగా సాతానుతో ఉన్నారు అని అర్ధం!

యోహాను 10:27

27. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.

 

యోహాను 17:1112

11. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.

12. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.

 

   ఇక 5 వచనంలో ఎందుకంటే మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము అంటున్నారు.

ఇక్కడ మనము- అనగా ఎవరైతే ధర్మశాస్త్రం, స్వప్రయత్న మార్గాలు వదిలిన వారు, క్రీస్తుయేసు యొక్క నిజమైన విశ్వాసులమైన మనము అని అర్ధం! ధర్మశాస్త్రం దాస్యాన్ని మరణాన్ని తెస్తుంది. అయితే మన విశ్వాస నియమం- కృపా నియమం శాశ్వత జీవము, విడుదల, తీసుకుని వచ్చింది ఇంకా దేవుడు చేసిన క్రొత్త నిబంధన వాగ్దానాల అంతిమ నెరవేర్పు కోసం ఆసక్తితో ఎదురుచూసే విశ్వాసాన్ని దృఢమైన నమ్మకాన్ని కలిగిస్తుంది!

 

గలతీ 3:18, 29

18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినయెడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.

29. మీరు క్రీస్తు సంబంధులైతే (మూలభాషలో-క్రీస్తువారైతే) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

 

రోమా 8:2325

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.

 

ఇక్కడ పౌలుగారు చెబుతున్న నీతి ఏమిటంటే: దేవుడు విశ్వాసిని- యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా నిర్దోషిగా లేక నీతిమంతుడుగా తీర్చారు- అబ్రాహాము గారు దేవుణ్ణి నమ్మి నీతిమంతుడుగా నిర్దోషిగా ఎంచబడినట్లు మనం కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇదే  పౌలుగారు చెబుతున్న నీతి!

గలతీ 2:16

ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

 

రోమా 3:2124

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

రోమా 5:1

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. (కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)

 

ఇంకా అన్ని విషయాలలోనూ దేవుడు మనలను ఆ విశ్వాసం ద్వారా లోపం లేని నీతిమంతులుగా ఉండేలా చెయ్యడం అన్నమాట!

 

రోమా 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

1యోహాను 3: 3

ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.

 

అయితే ఇది వెంటనే జరిగిపోదు! రాబోయే కాలంలో అంత్యకాలంలో జరుగుతుంది. ఇది దేవుని ఆత్మ మన అందరిలోనూ కలిగించిన ఒక దృఢమైన నమ్మకం, మన నిరీక్షణ! మన విశ్వాసం!

 

   కాబట్టి 6 వచనంలో మరోసారి నొక్కివక్కానిస్తున్నారు: ..... యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

 

యేసుక్రీస్తులో సున్నతి పొందడం గాని, సున్నతి లేకపోవడంలో గాని ఏదీ సాధించదు! సాధించేది యేసుక్రీస్తునందలి  ప్రేమతో పనిచేసే విశ్వాసమే!

 

గలతీ 6:15

క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమియు లేదు, పొందక పోవుట యందేమియు లేదు.

 

1కొరింథీ 7:19

దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.

 

రోమా 2:2829

28. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.

29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

 

రోమా 4:912

9. ఈ ధన్యవచనము సున్నతి గలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేని వారిని గూర్చి కూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా?

10. మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.

11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మిన వారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.

12. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.

 కాబట్టి బహిరంగంగా కనబడే ఆచారమైనా ఇలాగే ఉంటుంది. ఒక మనిషికి దేవునికి అంగీకారమైన ఆచారం ఏదీలేదు! కేవలం నమ్మకము విశ్వాసము మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనుష్యులను తనయందు గల నమ్మకం విశ్వాసం వలన మాత్రమే నీతిమంతులుగా చేయగలరు విధంగా పాప విముక్తిని పొందిన తర్వాత వారు దేవునియందు ఇంకా నమ్మకంతో ఇంకా విధేయతతో ఇంకా కృతజ్ఞతతో జీవించాలి! ఇంకా ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తును అనుసరించాలి!

యోహాను 13:34

3. తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి

4. భోజన పంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.

 

యోహాను 15:12

నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ

 

క్రీస్తులో నమ్మకం ఉంచకుండా ఆయనను ప్రేమించకుండా ఉంటే ఎన్ని నియమాలు, ఎన్ని ఆచారాలు, కట్టడాలు, బలియర్పణలు పాటించినా ఉపయోగం లేదు! మనిషిలో ప్రేమను నింపే విశ్వాస సహిత నమ్మకమే అన్నింటికన్నా ప్రాముఖమైనది! అందుకే పౌలుగారు సున్నతి పొందడం వళ్ళ ఏమీ లేదు పొందకపోవడం వలన ఏదీలేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసం వలననే ప్రయోజనం ఉంది అంటున్నారు!

 

ఇంకా పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రేమకూడా పొందుకోవాలి!

రోమీయులకు 5: 5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారు ఇలాంటి ప్రేమను కలిగిఉంటారు అన్నమాట! ప్రేమ నుండి విశ్వాసం కలుగుతుంది.

 

కాబట్టి ప్రియ దైవజనమా! నీలో అటువంటి ప్రేమ కలిగిన విశ్వాసం ఉందా? లేకపోతే నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా మార్చబడటం అసాధ్యం!

నేడే అటువంటి కార్యసిద్ధి కలిగించే ప్రేమ పూర్వకమైన విశ్వాసం కోసం ప్రార్ధనచేసి పొందుకో!

 

శరీరాసలు లోకాశలు వదిలి- ఆత్మానుసారంగా నడుచుకో!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-35 భాగం*

గలతీ 5:7—10.

7. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?

8. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్నవాని వలన కలుగలేదు.

9. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును.

10. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా పౌలుగారు మరలా మొదటి అధ్యాయంలో మొదలుపెట్టిన అంశానికి వచ్చేశారు! మీరు బాగుగా పరుగెత్తుతున్నారు అయితే ఇప్పుడు సత్యానికి విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను?? అని అడుగుచున్నారు!!

 

ఇక్కడ మీరు బాగా పరుగెత్తుచున్నారు అనగా ప్రతీ విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో విశ్వాసపు పరుగు పరుగెత్తు చున్నాడు! దానికోసం పౌలుగారు- తన జీవిత చివరి దినాలలో ఇలా తిమోతి గారికి చెబుతున్నారు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు (విశ్వాసపు పరుగు) తుదముట్టించితిని ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. 2తిమోతి 4:7,8;

 గమనించారా ఈ విశ్వాసపు పరుగు బాగా పరుగెత్తితేనే నీతి కిరీటం దొరుకుతుంది. అనగా విశ్వాసం వలననే నీతి కలుగుతుంది అని కూడా అర్ధం చేసుకోవచ్చు! అందుకే జెట్టియైన పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడాలి! 2తిమోతికి 2: 5

మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.

 ఎంతో నియమనిబంధన కలిగి ఒక క్రమశిక్షణతో జీవిస్తేనే క్రమశిక్షణతో పరుగు పెడితేనే నీకు ఫలము అనగా నీతి ఫలము, ఆత్మ ఫలము, వాగ్ధాన ఫలము కలుగుతుంది! అప్పుడు నీవు భళా నమ్మకమైన మంచి దాసుడా! అని పిలువబడగలవు! లేకపోతే సోమరియైన చెడ్డదాసుడా! అపవాదికిని వాని దూతలకు సిద్దపరచిన నరకానికి పొమ్మని గెంటేస్తారు! మత్తయి 25:41;

 

 ఇక పరుగుకోసం చూసుకుంటే

1కొరింథీ 9:24,25,26,27

24. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

26. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,

27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

 

హెబ్రీయులకు 12: 2

మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

 

   సరే, పరుగు ఇంతవరకు బాగా పరుగెత్తారు. ఇప్పుడు మిమ్ములను ఎవడు సత్యము నుండి తొలగించారు? ఎందుకు మీరు దారిలోనుండి, సత్యములోనుండి తొలగిపోయారు!!!?? అని అడుగుచున్నారు!

వారు ఎలాంటి వారంటే: గలతీ 1:7

అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

 

ఇక 8 వచనంలో అంటున్నారు- అలా మిమ్ములను పిలుచుచున్న వాని వలన కలిగింది కాదు అనగా మిమ్మును పిలిచిన వాడు దేవుడు! అది దేవుని వలన కలిగినది కాదు అనగా దారినుండి, పరుగునుండి తొలగిపోవడం దేవుని నుండి కలిగినది కాదు! సాతాను నుండి కలిగినది! ఇక్కడ పిలిచినది దేవుడు! సత్యానికి దూరంగా చేసేది లోకము సాతాను!

 గలతీ 1:6

క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

 

ఎందుకు పిలిచారు? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర పరచడానికి! 1పేతురు 2:9;

మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నావా ప్రియ విశ్వాసి లేక పరుగునుండి విరమించుకుని లోకములో కలిసిపోయావా?

 

9. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును.

ఇక్కడ ఈ మాట పౌలుగారు ఎందుకు చెబుతున్నారు? కొంతమంది చీడపురుగులు ఇలా తప్పుడుబోధలను బోధించినందుకు ఆ మాటలు గాని విన్నారామొత్తము సంఘమంతా పాడయిపోతుంది, విశ్వాస బ్రష్టులు అయిపోతారు అంటున్నారు!సంఘమే కాదు మొత్తం శాఖ మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండమని పౌలుగారు గలతీయులకు చెబుతున్నారు! ప్రియ సంఘమా! ఇలాంటి తప్పుడు బోధలు/ బోధకులు వస్తే మీరు కూడా జాగ్రత్తగా ఉండి, ఇలాంటి చీడపురుగులును చేర్చుకోకూడదు! వారికి వందనములు చేయకూడదు! వారికి మంచినీళ్ళు కూడా ఇయ్యకూడదు! సాతాను అవునా ఇది నిజమా అని మొదలుపెట్టింది. విన్న హవ్వమ్మ ఇంత తంటా తెచ్చిపెట్టింది మనకు! కాబట్టి ఇలాంటి వారికి తావివ్వకూడదు!

దైవజనుడా! సంఘపెద్డా! ఇలాంటి వారిమీద ఒక కన్ను వేసి గమనిస్తూ ఉండాలి! ఇలాంటి వారు ఎదురైతే వాక్యంతో ఎదురు చెప్పి వారిని పటాపంచలు చేయాలి! అందుకే పౌలుగారు 1కొరింథీ 5:6—8 లో చెబుతున్నారు..

6. మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?

7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను

8. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.

 

యేసుక్రీస్తుప్రభులవారు చెబుతున్నారు మత్తయి 16:6

అప్పుడు యేసుచూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.

 

మార్కు 8:15

ఆయనచూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా

 

లూకా 12:1

అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి

 

గమనించాలి- ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వీరిని ఎందుకు పులిసిన పిండి అంటున్నారు- అనగా వీరు పులిసిన పిండిగా జనాలను పాడుచేసే వారన్నమాట!

పై వచనాల ప్రకారం వారి దగ్గర వేషధారణ అనే పులిపిండి ఉంది. ఇంకా వారు పరలోకంలో ప్రవేశించరు, వెళ్ళేవారిని వెల్లనీయరు! మత్తయి  23:13—15

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో- నరకకుమారునిగా) చేయుదురు.

 

ఇంకా 23 అధ్యాయం మొత్తం చూసుకుంటే వారి తప్పుడు బోధలు అర్ధమవుతాయి.

ఇంకా పులిసిన పిండి అనడానికి కారణం మూడు రిఫరెన్సులు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మాట అనడానికి నేపధ్యం: పరిసయ్యులు, శాస్త్రులు ఆకాశం నుండి ఒక సూచక క్రియలను చెయ్యమని అడుగుతారు! అనగా బాచ్ అద్భుతాలు బాచ్వీరికి అస్తమాను అద్భుతాలు కావాలి! దేవుని నుండి దిద్దుబాటు మాటలు, రాకడ మాటలు, మనిషిని కట్టే మాటలు, ఆధ్యాత్మిక సత్యాలు అవసరం లేదు! ఎల్లప్పుడూ అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు! నేటి రోజులలో అనేకులు ఈఅద్భుతాలు బాచ్ పిచ్చిలో పడిపోయి తమ సొంత సంఘాన్ని వదిలివేసి అద్భుతాలు బాచ్ లలోకి వెళ్ళిపోతున్నారు! వీరు మరో రకమైన పులిసిన పిండి! వీరికి కూడా దూరంగా ఉండాలి!

 క్రైస్తవ్యం కేవలం అద్భుతమే/ అద్భుతాలే కాదు! క్రీస్తులో ఆనందం నెమ్మది విశ్రాంతి ని ప్రకటిస్తూ క్రీస్తునుక్రీస్తు ప్రేమను ప్రజలకు పరిచయం చేసేది! అద్భుతాలు ఒక బాగమే! అద్భుతాలే క్రైస్తవ్యం కాదు!

కాబట్టి ప్రియ సంఘమా ఇలాంటి జిమ్మిక్కులలో పడిపోవద్దు! పిట్ట కధలు సైన్సు అంటూ చెబితే నమ్మి పడిపోవద్దు! కొంతమంది కేవలం మర్మాలు మాత్రమే చెబుతారు. సువార్త రాకడ లాంటివి ఉండవు! కొంతమంది రాకడ మాత్రమే చెబుతారు- ఇంకేమి చెప్పరు! కాబట్టి వీరిని గమనించాలి! దైవజనుడా! నీవు బోధించవలసినవి ఇవి అన్నీ కలిపే బోధించాలి! క్రీస్తు ఆత్మతో నీవు సాగిపోతూ సంఘాన్ని అత్మపూర్ణులుగా నడిపించగలిగితే అద్భుతాలు వాటికవే జరుగుతాయి! అసాధారమైన ఊహించలేని అద్భుతాలు జరుగుతాయి! కాబట్టి వాక్యం మీద దేవునిమీద నమ్మకం విశ్వాసం కలిగి సాగిపో! పులిసిపోయిన నీ జీవితాన్ని సరిచేసుకో!

 

ఇంకా పులిసిన పిండి లాంటి దొంగబోధలు అబద్ద బోధలమీద ఒక కన్ను వేస్తూ సంఘాన్ని వారి పరుగును సరిగా పరుగెత్తేలా ఒక గైడ్ లా ఉండి నడిపించాలి!

అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-36 భాగం*

గలతీ 5:11—15

11. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా?

12.మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.

13.సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

14.ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్కమాటలో సంపూర్ణమైయున్నది.

15.అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ఇక మొదటి రెండు వచనాలలో పౌలుగారు తను శ్రమలను ఎందుకు పొందుతున్నారో చెబుతున్నారు! ఒకవేళ నేనే గాని మీరు సున్నతికూడా పొందాలి అనేమాట చెప్పి ఉంటే నేను శ్రమలను, చీత్కారాలను, ఆటంకాలను, దెబ్బలను పొందేవాడిని కాదు కదా! ఎందుకు చెప్పలేదు అంటే నిజంగా సున్నతిని పొందవలసిన అవసరం లేదు- అసలు ధర్మశాస్త్ర క్రియలు చేయనవసరం లేదు! అందుకే నేను సున్నతి పొందమని ఎవరికీ చెప్పలేదు అంటున్నారు! కారణం పాపవిముక్తి- రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన మాత్రమే కలుగుతుంది తప్ప సున్నతి వలనను, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాల వలనను, మన సొంతప్రయత్నాలతో చేసే మంచి పనుల వలనను దొరకదు!

ఈ విషయాన్ని ధైర్యంగా అందరికీ చెబుతున్నారు కాబట్టి అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయి పౌలుగారికి! ఒకవేళ పౌలుగారుసున్నతి కూడా పొందాలి అనే ఉంటే ఎవరూ ఆయనను వేలిత్తి చూపేవారు కానేకాదు! నెత్తిమీద పెట్టుకుని మోసేవారు! మనం అపో. కార్యములు జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలుగారు పొందిన హింసలు కేవలం చెదిరిపోయిన యూదుల వలన మాత్రమే పొందారు! అన్యజనుల నుండి చాలా చాలా తక్కువ హింసలు పడ్డారు! ఇంకా అన్యజనుల చేతిలో పడిన హింసలు కూడా వారు స్వయంగా చేసినవి కాదు - యూదుల ప్రేరేపణవలన మాత్రమే చేశారు! కేవలం ఆయన శిరచ్చేధనం మాత్రం- రోమా నాయకుల చేతిలో జరిగింది! కాబట్టి ఆయన ఒకమాటసున్నతి పొందాలి అనేమాట అని ఉంటే ఆయనకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు! ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆయన హింసలైనా పొందారు కాని నిజాన్ని సత్యాన్ని బోధించడం మానలేదు! ఇదీ ఒక దైవసేవకునికి ఉండవలసిన లక్షణం!

 

   ఇక ఇదే వచనంలో పౌలుగారు ఒకమాట వాడారు: *సిలువను గూర్చిన అభ్యంతరం*! ఇదేమిటి?

జవాబు 1కొరింథీ 1:23 లో ఉంది. మేమైతే సిలువవేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఈయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రి తనముగాను ఉన్నాడు!!! 

గమనించాలి ఇక్కడ- యూదులకు ఆటంకము గాను అంటున్నారు

*యూదులకు ఏమి ఆటంకముగా ఉన్నారు యేసయ్య*???

కారణం యూదులు ఎదురుచూసింది, కోరినది సిలువవేయబడిన క్రీస్తును, రక్షకున్ని కాదు. తమ తరుపున యుద్ధాలు చేసి- తమను భాహ్యంగా రక్షించే రక్షకున్ని! అయితే ఆయన వచ్చింది బాహ్యంగా రక్షించడానికి కాదు, వారి ఆత్మలను రక్షించడానికి! వారి ఆత్మలను పాతాళం నుండి తప్పించడానికి! వారి ఆత్మలను ధర్మశాస్త్రం అనే దాస్యం నుండి విడుదల చేసి, పాపమనే నరకం, మరణం నుండి రక్షించడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభులవారు! దీనిని వారు గ్రహించలేకపోయారు! అయితే యేసయ్య వచ్చి సిలువవేయబడ్డారు కాబట్టి ఈ సిలువవేయబడిన రక్షకుడైన అభిషక్తుడు వారికి ఆటంకంగా ఉన్నారు!

 

ఇక *అన్యజనులకు- వెఱ్రితనము ఏమిటి*? 

వీరు అనుకునేది ఏమిటంటే: నేరస్తులకే కదా సిలువవేస్తారు! మరి యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే వారు ఆయనను ఎందుకు సిలువవేశారు? మరి తనకుతానుగా సిలువ మీద నుండి రక్షించుకోలేని యేసుక్రీస్తు -ప్రజలను ఎలా విముక్తి చేస్తాడు? అనేది ఒక ప్రశ్న!

ఇంకా పాపవిముక్తికి ఒక సిలువవేయబడిన నేరస్తుడికి ఏమి సంభంధం? ఎందుకు క్రైస్తవులు ఇలా అజ్ఞానులుగా మాట్లాడుతున్నారు అనేది వారి వెర్రితనము!!!

 దీని అసలు మర్మం వారికి తెలియకనే వారు ఇలాంటి అజ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా మన దేశంలో చాలా ఎక్కువగా అన్యజనుల చేత అడుగబడే ప్రశ్న!

ఇదే- సిలువను గూర్చిన అభ్యంతరం!

 

ఇది యూదులకు ఆటంకంగా ఉంది, అన్యజనులకు వెర్రి తనముగా ఉందిఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తే తొట్రుపాటు- అభ్యంతరం ఎలా తొలిగి పోతుంది? ఇక అభ్యంతరం తొట్రుపాటు మాట ఎందుకు వాడబడింది అంటే: మనిషి పాపంలో పడిపోయి పూర్తిగా పతనమైపోయారని సిలువ ప్రకటిస్తూ ఉంది! కారణం ఆయన కల్వరిసిలువలో మానవుల యొక్క పాపముల కోసం మానవులకు బదులుగా దేవదేవుడే బలైపోయారు అని సిలువచెబుతుంది! ఇంతవరకు వారి స్వప్రయత్నాల వలన, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాల ద్వారా, మతం, మతం యొక్క ఆచారాలు, నియమాలు వలనపాపవిముక్తి ,రక్షణ పొందలేనంత బ్రష్టమైన స్తితిలో మానవుడు ఉన్నాడని- దానికి విరుగుడు అనగా నిజమైన రక్షణ- పాపవిముక్తి కావాలంటే కేవలం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవుని స్థానంలో చనిపోవడం మాత్రమే దీనికి విరుగుడు అని సిలువ ప్రకటిస్తుంది. ఇది వారికి అనగా యూదులకు ధర్మశాస్త్ర సంబంధులకు గొడ్డలిపెట్టులా ఉంది. ఇది వారి అహాన్ని, గర్వాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి- అతనిని క్రీస్తు పాదాల ఎదుటికి తీసుకొస్తుంది! ఇదే యూదులకు అభ్యంతర కారణం! ఇదే అన్యజనులకు వెర్రితనము! ఇది ముక్తి పొందాలంటే మతాచారాలు నియమాలు చాలు అనే ఉపదేశానికి చాలా వ్యతిరేఖంగా ఉంది! చాలామంది చాలా మతాలలో వారు ఇలాంటి ఉపదేశాన్నే ఇష్టపడతారు. అయితే నిజం వేరేగా ఉంది! పాప విముక్తికి సిలువమార్గమే నిజమైనది! ఇదీ పౌలుగారు చెబుతున్నా సిలువను గూర్చిన అభ్యంతరం!

 

  అందుకే ఇలా బోధచేసి మిమ్ములను కలవరపెట్టేవారు తమకుతాము కోసుకుని పోవాలి అంటున్నారు 12 వచనంలో మాట స్టడీ బైబిల్ లో ఇలా ఉంది:మిమ్ములను కలవరపెట్టేవారు అంగచ్చేదం చేసుకోవాలని కోరి ఉండేవాడిని! ఇక్కడ కలవరపెట్టే వారు అనగా అబద్దబోధకులు! వీరు గలతీవారిని సత్యానికి వ్యతిరేఖంగా పురిగొల్పుతున్నారు!

అయితే అంగచ్చేదం అనేమాట ఎందుకు వాడారు అంటే- పూర్వకాలంలో విగ్రహాలను పూజించే మతపిచ్చి ముదిరిపోయిన కొందరు మతపూజారులు- మిమ్ములను దేవుని దగ్గరనుండి ఈ  కామం అనేది దూరం చేస్తుంది కాబట్టి మీ మర్మాంగం కోసి దేవతకు కానుకగా ఇస్తే దేవత మిమ్ములను ఎంతో ఉన్నతమైన వారిగా ఆశీర్వదిస్తుంది! అప్పుడు మీకు ఎన్నెన్నో వరాలు ఫలాలు ఇస్తుంది అని బోధిస్తే అనేకమంది గొప్పకోసం కొంతమంది, ఇంకా నిజమని కొంతమంది ఆ రోజులలో అనగా పౌలుగారి రోజులలో ఆ గలతీయ ప్రాంతంలో గల విగ్రహారాదికులు అలా కోసేసుకొనేవారు! ఇప్పుడు ఈ మతబోధకులు కూడా ఇలాంటి తప్పుడు బోధలనే చెబుతున్నారు. వీరు కూడా అలా కోసుకోవాలని అని ఉండేవాడిని అంటున్నారు! వీరు వారితో అనగా ఇలా కోసుకోవాలని బోధించే అన్య పూజారులతో సమానమని పౌలుగారి అభిప్రాయం!

 

  ప్రియ చదువరీ! ఒకవేళ నీకు కూడా ఇలాంటి సిలువను గూర్చిన అభ్యంతరం ఉందా? దయచేసి గమనించు! ఆయన రాకవలనే, ఆయన సిలువవలనే మనకు విడుదల విముక్తి! గొర్రెలు కోడెలు కోయడం వలన కాదు! మనం చేసిన నేరాలకు పాపాలకు మన స్థానంలో ఆయన విలువ చెల్లించారు! మన స్థానం లో ఆయన చనిపోయారు! అలా చనిపోడానికి ఆయన ఇష్టపడి వచ్చి, ధర్మశాస్త్రాని నెరవేర్చి ముగించారు! కావాలనే తన ప్రాణం పెట్టడానికే వచ్చారు, ఇచ్చారు. అంతేతప్ప తనకు తాను రక్షించుకోలేక కాదు! నిజాన్ని తెలుసుకుని ఆయనమీద జీవితాంతం కృతజ్ఞతకలిగి, భయం కలిగి విశ్వాసంతో సాగిపోవాలి!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*గలతీ పత్రిక-37 భాగం*

గలతీ 5:13—15

13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

14. ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్కమాటలో సంపూర్ణమైయున్నది.

15. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా ఇంతవరకూ ధర్మశాస్త్రం కోసం ఇంకా సున్నతికోసమైన దుర్భోదల కోసం ధ్యానం చేసుకున్నాం! ఇక టాపిక్ ముగించి క్రైస్తవులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనేదానిని రాస్తున్నారు! పౌలుగారు రాసే విధానం ఇదే! మొదటగా ఒక పునాది వేస్తారు. తర్వాత దానియొక్క సారాంశం చెప్పి కాబట్టి ఇలా ఉండాలి అని చెబుతారు! ఇంతవరకు ధర్మశాస్త్ర క్రియలు- ధర్మశాస్త్రం కోసం చెప్పి అందును బట్టి మనం ఎలా ఉండాలో చెబుతున్నారుఇంతవరకు చెప్పిన సత్యాలను జీవితంలో ఆచరించాలని చెబుతున్నారు.

 

                 ఇక్కడ 13 వచనంలో కాబట్టి సహోదరులారా! మీరు స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు. అయితే ఒకమాట, స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు గాని ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండండి అంటున్నారు! దేవుడు మిమ్మల్ని పిలిచింది స్వతంత్రులుగా ఉండటానికే! ధర్మశాస్త్రమనే బంధకాలు, పాపమనే బంధకాలు, సాతాను గాడి బంధకాలు తొలగించి మనం స్వతంత్రులుగా ఉండాలని దేవుని ఆశ! అందుకే మరణబంధకాలు తొలగించడానికే మనకోసం ఆయన చనిపోయారు! మనలను అన్ని బంధకాలునుండి విడిపించి స్వతంత్రులుగా చేశారు. కాబట్టి స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని స్వతంత్రులుగా ఉండండి! దేనినుండి? పాపము నుండి.! సాతాను నుండి.! అయితే స్వాతంత్ర్యాన్ని శరీర ఇచ్చలకు శరీర కోరికలకు వాడవద్దు అంటున్నారు!

అందుకే రోమా 12:1—2 లో అంటున్నారు...

 

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

ఇంకా ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

గమనించారా మన ఇంత విలువైన పిలుపును పొందుకున్నాము కనుక పిలుపుకు తగిన జీవితం జీవించాలి!

గమనించాలి: మనము పొందుకున్న విడుదల క్రీస్తుయేసు ఎందుకు మనకు ఇచ్చారు అంటే అది పాపంలో జీవించడానికి  కాదు! పాపం చెయ్యడం స్వేచ్చకాదు. అది అన్నింటికన్నా దుష్ట కార్యం! అయితే మరి అనొచ్చు దేవుడు ఎందుకు మంచితో పాటు చెడు చేశారు!

దేవుడు మనిషికి స్వాత్రంత్రమిచ్చి ఏది ఎన్నుకోవాలో కోరుకోండి! మంచి చేస్తే పరలోకం, చెడుచేస్తే నరకం అని వారికి చెప్పి , మంచి చెడులు చేసే స్వాతంత్రం వారికి ఇచ్చారు. మంచి చెడులు గ్రహించే మనస్సు కూడా ఇచ్చారు! ఇప్పుడు మానవుడు తనకుతానుగా చెడును ద్వేషించి మంచిని ఎన్నుకుని మంచివైపు సాగిపోవాలి! దేవుడు నియంత కాదు, ఇలాగే జీవించాలి. అలా జీవించక పోతే చంపేస్తాను అనడానికి! దేవుడు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునే మనస్సు ఇచ్చారు, దేనిని ఎన్నుకోవాలో చాయిస్ కూడా మనకే వదిలేశారు! ఉదాహరణ: ఏదేను తోటలో మంచి చెడులు తెలుసుకునే చెట్టు వేశారు, జీవ వృక్షము కూడా వేశారు! అయితే హవ్వమ్మ సాతాను శోధనలో పడి మంచి చెడ్డలు తెలుసుకునే వృక్ష ఫలమునే తిన్నదిఅలా నీకు కూడా దేవుడు చాయిస్ ఇచ్చారు! మంచి కావాలా చెడుకావాలా? ఇక్కడ పౌలుగారు హితవు పలుకుతున్నారు- దేవుడు మనకు స్వాతంత్రము ఇచ్చారు కాబట్టి దీనిని శరీర కోర్కెలు కోసం శారీరాశలు కోసం కాకుండా దేవుని ప్రేమకోసం వాడండి అంటున్నారు! యోహాను 8:4

అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

రోమా 6:16

లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

 

ఇంకా

రోమా 6:1423

14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

15. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

20. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

21. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

 

కారణం ఏమిటంటే మన యొక్క శరీర స్వభావం ఎలాంటిదో , మనం స్వభావ సిద్ధంగా ఎలాంటి వారమో పౌలుగారు రోమా పత్రికలో బాగా చెబుతున్నారు

  7:5,6,17,18

5. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.

6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.

17. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.

18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

 

రోమా  8:3,5,8,9

3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము ...

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

కాబట్టి మీ శరీరాలు పాపం కోసం కాకుండా ప్రేమ కలిగి ఒకరికొకరు సేవచేసుకుంటూ ఒకరికొకరు దాసులుగా ఉండమంటున్నారు!

 

  ఎందుకంటే 14 వచనం: ధర్మశాస్త్రమంతా ఒకే మాటలో ఇమిడి యుంది! నిన్నువలే నీ పొరుగు వానిని ప్రేమించుము! ఇలా చేస్తే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా చేయడమే అంటున్నారుఇక్కడ ఒకమాట గమనించాలి! గలతీ 4:21 లో అసలు మీరు ధర్మశాస్త్రమంటే అర్ధం చేసుకున్నారా? ధర్మశాస్త్ర భావం మీకు తెలుసా, పూర్తిగా చదివారా అనే అర్ధంలో మాట్లాడటానికి కారణం ధర్మశాస్త్ర సంబంధీకులు ధర్మశాస్త్ర భావాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదు! ధర్మశాస్త్రమంటే ధర్మశాస్త్ర క్రియలు అనగా సున్నతి పొందటం, బలులు అర్పించడం లాంటి పనులు కాదు! ధర్మశాస్త్ర సారమేమంటే: ప్రేమను పొందుకోండి ప్రేమను పంచండి! నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించండి!

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే: ప్రజలు-ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం మాత్రమే  గుర్తుంచుకుంటారు గాని అదే ధర్మశాస్త్రంలో లేవీ 19:18 లో చెప్పిన అంశాలుకీడుకి ప్రతికీడు ఎవరికీ చెయ్యొద్దు! నీ ప్రజలమీద కోపం ఉంచుకోవద్దు! మిమ్మును మీరు ప్రేమించు కున్నట్లే మీ పొరుగు వారిని ప్రేమించండి, అన్నారు, ఈ మాటను ఎవరూ గుర్తుకు పెట్టుకోవడం లేదుఇదే మాట దేవుడు చెబుతున్నారు ఒక ధర్మశాస్త్ర బోధకుడు అడిగిన ప్రశ్నకు యేసయ్య జవాబు చెబుతున్నారు మత్తయి 22:37-40 లో....

 

37. అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.

38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

39. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

40. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.

అలా చేస్తే మొత్తం ధర్మశాస్త్రమంతా పాటించినట్లే!

దీనిని ఇంకా విపులంగా పౌలుగారు రోమా 13:810 లో వివరిస్తున్నారు.....

 

8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

యాకోబు గారు కూడా రాస్తున్నారు 2:8

మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించు వారగుదురు.

 

కాబట్టి నిజం చెప్పాలంటే ధర్మశాస్త్ర సారాన్ని నెరవేర్చగలవారు కేవలం క్రీస్తుయేసునందు నమ్మకం ఉంచి- ఆయన ఆత్మ కలిగిన వారు మాత్రమే! అవును రోమా 8:4 చూసుకుందాం! శరీర స్వభావాన్ని అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేరాలి! అవును ఆయనాత్మతో జీవించేవారు మాత్రమే ధర్మశాస్త్ర సంబంధమైన నీటిని నెరవేర్చేవారు! అనగా ధర్మశాస్త్ర సారాన్ని పాటించేవారు, కాబట్టి తన పొరుగు వారిని తనవలె ఎవడైనా ప్రేమిస్తున్నాడు అంటే ధర్మశాస్త్రమంతటిని పాటించినట్లే!

15వ వచనంలో అంటున్నారు: అయితే దురదృష్టం ఏమిటంటే మీరు ఈ ప్రేమను పంచుకోకుండా ఒకరికొకరు కరుచుకుని ఒకరికొకరు భక్షించుకొంటున్నారు అంటున్నారు. అలా చేసి మీరు నశించిపోతారేమో అని అనుమానంగా ఉంది అంటున్నారు! నిజంగా దుర్భోధకుల ఆశ కూడా అదే! క్రైస్తవుల మధ్య ఇలాంటి చీలికలు పెట్టి, వారు ఒకరినొకరు కరచుకుంటూ ఉంటే మధ్యలో వీరి మధ్య చిచ్చును ఇంకా రేపి- వారు వినోదం చూద్దామని, ఇంకా ప్రజలు ఈ చీలికలో తమను అనుసరిస్తారు కదా, వీరిద్వారా వారు లాభం పొందుకుందామని వారి ఆశ! అందుకే వీరిని కనిపెట్టి వీరికి దూరంగా ఉండమంటున్నారు రోమా 16:17 లో!....

సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

 

దేవుడు తనయొక్క ప్రజలంతా ప్రేమతో ఐక్యంగా ఉండాలని కోరుకుంటే వీరు వారిమధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు!

ప్రియా సంఘమా! క్రైస్తవులారా! జాగ్రత్త! ఇలాంటి అబద్దబోధకుల మాయలో పడి మోసపోయి మనలో మనం కొట్టుకోకుండా వాక్యపు వెలుగులో సత్యాన్ని గ్రహించి, మన తప్పులు దిద్దుకుని ముందుకు సాగిపోవాలి! ఇంకా ఇలాంటి అబద్ధబోధకులను తరిమికొట్టాలి గాని మనలో మనం దూషించుకుంటూ విమర్శించుకుంటూ ఉండకూడదునిన్నువలే నీ పొరుగు వానిని ప్రేమిస్తే ధర్మశాస్త్రమంతా నెరవేర్చినట్లే అని బైబిల్ చెబుతుంటే ఎందుకు నీ పొరుగువానిమీద ద్వేషం! ఈరోజుండి రేపు పోతారు మీరు- మీ పొరుగువాడు కూడా! అలాంటిది ఎందుకు నీ పొరుగు వానితో సఖ్యంగా ఉండవు? అందుకే నీవంటేనే కాదు యావత్ క్రైస్తవ లోకాన్ని కూడా నీ పొరుగువాడు ద్వేషిస్తున్నాడు. ఇది కుదరదు! అందరితోను ఐక్యంగా సమాధానంగా ఉండాలని బైబిల్ చెబుతుంది. కేవలం ప్రేమ విషయంలో తప్ప ఎవరికీ ఏమీ అచ్చి ఉండకూడదు అని సెలవిస్తుంది బైబిల్! రోమా 13:8; శఖ్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండమని కూడా చెబుతుంది! రోమా 12:8; మరి నీవు అలా ఉంటావా?

సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు ఎంత మనోహరము... అంటున్నాడు కీర్తనాకారుడుకీర్తనలు 133; మరి నీవు సమాధాన మనే బంధం కలిగించే ఐక్యతలోకి వస్తావా?ఎఫెసీయులకు 4: 1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

 

 అయితే ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించారు! అది పొందుకో!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-38 భాగం*

గలతీ 5:16—18

16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.

 

          ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

 

16 వచనం నుండి 6:10 వరకు పౌలుగారు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు! *క్రైస్తవ జీవితంలో జయ జీవితం జీవించడానికి ఏమి కావాలో వివరంగా వివరిస్తున్నారు*.  *Explains what are the essentials to live victorious life!!*

అన్నింటికన్నా ముఖ్యంగా కావలసినది: *ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాను సారంగా నడుచుకోరు*! నిజం కదా!

 

శరీరానుసారంగా నడుచుకోవడం అంటే: మొదటగా *శరీర కార్యాలు చెయ్యడం* అనగా క్రింద వచనాలలో వివరించిన (19—21 వచనాలు) శరీర కార్యాలు చేయడం . అనగా వ్యభిచారం, జారత్వం, కలహాలు, మంత్రం ప్రయోగం, ద్వేషం, కోపం, కక్షలు ఈర్షభావాలు కలిగి ఉండటం, తప్పుడుబోధలు, కామవికారం కలిగి ఉండటం, విగ్రహాల పూజ, అసూయ, హత్యలు చేయడం, త్రాగుబోతుతనం, అల్లరితో కూడిన ఆటపాటలు అనగా సినిమాలు సీరియల్లు చూడటం, ఇంకా జూడమాడటం, రేసులు ఆడటం లాంటి వ్యసనాలలో ఉండటం అన్నీ శరీరానుసారమైన పనులు చెయ్యడం. వీటి అంతం ఏమిటంటే ఇలా చేసిన వారు ఎవరూ దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదు అంటున్నారు 21 వచనంలో!

 

రెండవదిగా: *లోకానుసారమైన జీవితం జీవించడం* అనగా లోకస్తులు చేస్తున్న పనులు చేయడం- లోకాచారాలు చెయ్యడం! లోకస్తుల వలె వస్త్రధారణ, లోకస్తుల ఆచారాలు అనగా తాళి కట్టుకోవడం, వాస్తులు చూడటం, ముహూర్తాలు చూడటం, జాతకాలు చూపించుకోవడం, లోకాచార పండుగలు, షష్టిపూర్తి లాంటి కార్యాలు చెయ్యడం అనగా అన్యజనుల ఆచారాల వంటి ఆచారాలు చేస్తూ దానికి కొంచెం క్రైస్తవ్యం కలిపినా అది లోకాచారమే! ఇలాంటి కార్యాలు చేస్తే శరీరానుసారులే!

 

   *ఆత్మానుసారంగా ఉండటం అంటే ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడుతూ, ఆత్మాభిషేకాన్ని పొందుకుంటూ, ఆత్మఫలము ఫలిస్తూ ప్రార్ధన వాక్య పఠనం, బాషలు మాట్లాడటం, ఆత్మీయ వరాలతో నింపబడటం,ముఖ్యంగా పాపమంటే అసహ్యించుకుని పాపమునకు దూరంగా పారిపోవడం యోసేపులా! ఇవన్నీ ఆత్మానుసరంగా నడచుకోవడం*!

 

   అయితే ఇక్కడ పౌలుగారు ఇంతగా నొక్కివక్కానించి చెప్పడానికి కారణం ఏమిటంటే: తన జయజీవితానికి కారణం ఇదే! అనగా ఆత్మానుసరంగా నడచుకోవడమే! *క్రీస్తులో ఆధ్యాత్మిక జీవితం అనగా విజయవంతమైన జయజీవితం జీవించటానికి విశ్వాసులకు శక్తినిచ్చేది కేవలం దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మాత్రమే!* ఇలా ఆత్మతో నడిపించబడి జీవిస్తే నేవు శరీరానుసారమైన జీవితం జీవించలేవు! దీనినే రోమా 8:414 వరకు ఎంతో బాగా వివరిస్తున్నారు పౌలుగారు! శరీర స్వభావంతో ఉన్నవారు శరీర సంబంధమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. అయితే దేవుని ఆత్మచేత నడిపించ బడేవారు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. అయితే శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉంటే అది మరణమే అంటున్నారు. దేవుని ఆత్మ సంబంధమైన మనస్సయితే జీవము, శాంతి కలిగి ఉంటుంది అంటున్నారు. అలా జరగటానికి కారణము శరీరస్వభావం దేవునికి వ్యతిరేఖంగా ఉంటుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి కూడా లొంగదు! అయితే మీరు దేవుని ఆత్మతో నడుచుకుంటే లేక దేవుని ఆత్మ మీలో ఉంటే శరీర స్వభావంలో ఉండలేరు. దేవుని ఆత్మ మీలో ఉంటుంది కాబట్టి శరీర సంబంధమైన విషయాలను జయించగలరు అంటున్నారు......

 

4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.

11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.

12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.

13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

దేవుని ఆత్మచేత ఎవడు నడిపించబడతాడో వాడే దేవుని సంతానంగా ఉంటారు!

 అయితే ఇక్కడ పౌలుగారి మాటలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే విశ్వాసులలో లేక ఆత్మచేత నడిపించబడే వారిలో లేక ఆత్మానుసారంగా జీవించే వారిలో ఇలాంటి శరీర సంబంధమైన కోరికలు చెడ్డ భావాలు కలగవు అనడం లేదు! అవికూడా వస్తాయి! అందుకే పౌలుగారు కూడా రోమా 7:14—25 లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటూ విలపిస్తున్నారు కారణం చెయ్యాలన్న మేలు చేయలేక చేయకూడదనే పాపం కీడు చేస్తున్నాను. ఇట్టి మరణం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అంటున్నారు. యోహాను గారు కూడా 1యోహాను 1:8 లో నాలో పాపం లేదని లేక మనలో పాపం లేదని చెబితే మనలను మనమే మోసం చేసుకుంటున్నాము మనలో సత్యముండదు అంటున్నారు!

అయితే ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుచుకొంటామోఈ ఆత్మ బలము చేత శరీర కార్యాలను అణగద్రొక్కగలము!!!  భక్తులకు కూడా ఇలాంటి శరీర సంబంధమైన శోధనలు కలుగుతాయి! అయితే ఆత్మానుసారులైన వారికి ఇలాంటిశోధన ఎదురైతే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారికి బోధిస్తాడు అది తప్పు అని! వెంటనే వారు అలాంటి కోరికలను ఆశలను ఆత్మ నడిపింపు ద్వారా జయించగలరు!

 

నా అనుభవాన్ని కూడా చెప్పనీయండి! నాలోకూడ అనేకసార్లు చెడ్డ భావాలు, మోహపు చూపులు, చెడ్డ తలంపులు కలుగుతుంటాయి- వెంటనే నా అంతరాత్మ- పరిశుద్దాత్మునితో కలిసి- ఒరేయ్ నీవు ఎవడవో, ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో  తెలుసా? నీవు దేవుని పవిత్ర రక్తంలో కడుగబడిన వాడవని మర్చిపోయావా? నీవు దేవుని బిడ్డవని మరచిపోయావా? నరకానికి పోతావు జాగ్రత్త బుద్ధిలేనోడా!! అని నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. వెంటనే ప్రభువా క్షమించమని అడుగుతూ ఉంటాను. సరిచేసుకుంటాను. ఇంకా వినకపోతే పరిశుద్దాత్ముడు అడుగుతాడు నన్ను: ఇందుకేనా యేసయ్య నీకోసం రక్తం కార్చింది? ఇందుకేనా ఆయన నీ కోసం అన్ని దెబ్బలు హింసలు పడింది? మాట వినిన వెంటనే నా హృదయం బద్దలైపోతుంది! వెంటనే దేవుని సన్నిధిలో నా తప్పు క్షమించమని అడిగి నన్ను నేను సరిచేసుకుంటూ ఉంటాను. ఇక వాటిజోలికి పోడానికి ధైర్యం చెయ్యను! గమనించాలి తప్పుడు ఆలోచనలు కోరికలు ఊహలు చూపులు భావాలు రాకుండా లేకుండా పోవడం లేదు గాని పరిశుద్ధాత్ముడు వాటిని వెంటనే జయించడానికి నాకు సహాయం చెయ్యడం వలన దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండగలుగుతున్నాను! ఆత్మానుసారంగా ప్రవర్తించ గలుగుతున్నాను! ఎప్పుడు? ఆత్మతో నింపబడుతూ ఆత్మ మాట వినగలిగేటప్పుడు మాత్రమే! ఇంకా హృదయం నిండా వాక్యము నింపుకుని వాక్యానికి చోటిచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది! ఎప్పుడైతే వాక్యానికి పరిశుద్దాత్మునికి భయపడతావో- పాపం చెయ్యడానికి భయపడతావు! అప్పుడు శరీర కార్యాలు చేస్తూ, శరీరానుసారంగా జీవించలేవు!

 

   గమనించాలి 17 వచనంలో చెబుతున్నారు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తూ అనగా పోరాడుతూ ఉంటున్నాయి. ఇలా జరిగేటప్పుడు మీరేమి చెయ్యాలి అనుకుంటారో అలా చెయ్యలేరు. దీనికి ఉదాహరణ పైన చెప్పినట్లు రోమా పత్రిక 7లో పౌలుగారు చెబుతున్నట్లు చేయకూడని పాపం చేసి చెయ్యాలన్న మేలు చేయలేముశరీర కార్యాలు, శరీర కోరికలు- దేవుని ఆత్మ రెండింటి కోరికలు, తలంపులు లక్ష్యాలు లక్షణాలు పూర్తిగా ఒకదానితో ఒకటి వ్యతిరేఖంగా ఉంటాయి. రోమా 8:58

ఇది మనకు తల్లిదండ్రుల నుండి అనగా జన్మనుండి చిన్నతనం నుండి అలవాటై పోయింది. మనం పవిత్రంగా ఉందామన్నా మనకు మనం ఉండలేము! అయితే ఆత్మ సహాయం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు దీనిని జయించడానికి సహాయం చేస్తారువిశ్వాసులు తాము చెయ్యాలను కున్న మంచి తాము చెయ్యకుండా ఈ శరీర స్వభావం అడ్డుకుంటుంది

రోమా 7:15, 18—20;  అయితే పరిశుద్ధాత్మ వలన ఆ కోరికలను జయించవచ్చు అంటున్నారు పౌలుగారు!

 

ఇక 18వచనంలో అంటున్నారు మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ఇక ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నారు.

కాబట్టి పౌలుగారు చెబుతున్నారు- ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీరనుసారంగా ప్రవర్తించరు!

ప్రియ స్నేహితుడా! ఆత్మానుసారంగా నడచుకుంటున్నావా? లేక శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఇంకా నీలో లోకాశలు, లోకాచారాలు కనిపిస్తున్నాయా? అయితే నీవు ఇంకా పాపం, దాస్యం అనే మార్గం లోనే ఉన్నావు! నీవు సరిగా ఉన్నావు అనుకుంటున్నావు గాని నీవు లేవు! మంచిగా ఉన్నానని సాతాను గాడు నిన్ను భ్రమపెడుతున్నాడు. నీవు మంచిగా ఆత్మానుసారంగా ఉండాలని ఉంది గాని ఉండలేక పోతున్నావా? నీకు నీవుగా ఉండలేవు! పరిశుద్ధాత్ముని సహాయం తీసుకో! దేవుని ఆత్మ లేకపోతే వాడాయన వాడు కాదు అని మీదన చదువుకున్నాము! ఆయన వారము కాకపోతే సాతాను గాడికి చెందుతాము! దాని ఫలితం మరణం నరకం! భాధలు నీవు పడలేవు! నేడే నీ శరీర కార్యాలు, లోకాచారాలు వదిలి దేవుని ఆత్మచేత నడిపించ బడు! ఆయన ఆత్మపూర్ణుడు ఉండు!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-39 భాగం*

*శరీరకార్యాలు-1*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా ఇంతవరకూ ధర్మశాస్త్రం కోసం ఇంకా సున్నతికోసమైన దుర్భోదల కోసం ధ్యానం చేసుకుని, క్రైస్తవులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!! గమనించాలివీటికోసం ఇంతకుముందు ఆధ్యాత్మిక సందేశాలు 17లో  భాగంగా చాలాసార్లు చేయకూడని పనులు, ఉండవలసిన లక్షణాలు, చేయరాని పనులు శీర్షికలతో అనేకమైనవి ధ్యానం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సందర్భాను సారంగా క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము!

 

   గమనించాలి: శరీరకార్యాలు చేయనే కూడదు అని చెబుతూ శరీరకార్యాలు ఏమిటో పౌలుగారు ఇంకా కొంచెం వివరంగా రాస్తున్నారు శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని స్పష్టముగా రాస్తున్నారు పరిశుద్ధాత్మ అభిషేకంతో!

 

శరీరకార్యములలో మొదటిది: *జారత్వము*:

 

1). జారత్వము--- వ్యభిచారము:  

ప్రియ దైవజనమా! మొట్టమొదట నిర్మూలించ వలసినది జారత్వం! దీనికి మరో అర్ధం లైంగిక అవినీతి! అనగా unauthorised sex. నీ భార్యతో తప్ప మరో స్త్రీతో శారీరక సంబంధం కలిగిఉంటే  అది వ్యభిచారం, జారత్వం! నీ భర్తతో కాకుండా మరో వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉంటే  అది వ్యభిచారం. నీకు పెళ్ళికాకుండా sex లో పాల్గొంటే జారత్వం!

 

    మీరు పరిశుధ్దులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;

మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2.     1 ధెస్సలో 4: 3,4

 

ప్రియ సహోదరి/సహోదరులారా - దేవుని చిత్తమును జరిగించుటకే మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు, పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని జారత్వం అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు, రెండు మనస్సులు, రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం. 1 కొరింథీ 6:16. ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టు పట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు దానముగా  దయచేయబడింది. 19 వచనం. అది విలువపెట్టి కొనబడింది(20), విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ 20:28) . ఇప్పుడు నీ దేహము నీదికాదు. దేవునిది. దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ 3:16,17;  6:19-20 వచనాలుమీరు దేవుని ఆలయముదేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని మీకు తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును.

 ఖభడ్దార్. దేవునిలో వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు, అనగా పవిత్రమైన క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు  -దేవుని ఆలయముగా మలచబడిన మీ దేహాలు వేశ్యలతో లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?

 

   1 కొరింథీ 6:13-16 , నీ దేహము జారత్వము కొరకు కాదుగాని ప్రభువు నిమిత్తమే, మీ దేహములు క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో కలుపుతావా? చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతయను పెనుగాలి రాబోతుంది. 1 కొరింథీ 6:8,9 మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం. రెండు నరకం- నిత్య నరకాగ్నిగుండము,అగ్ని ఆరదు పురుగు చావదు.

 

    ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.

ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.

22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.

 

      చూశారా లేఖనం ఏమిసెలవిస్తుంది?  వ్యభిచారం, జారత్వం  దేవునికి అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొందాం.

 

1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో, అన్నల పాశవిక కక్ష క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని భక్తి విశ్వాసాలు వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య యవ్వనస్తుని మోహించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నాయజమానునికి మోసం చేయలేను అనడం లేదు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి  కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం నుండి పారిపోగలవా?

 

2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు దేవుని ప్రవక్త,  సోదెగాడైన బిలామును పిలిచి శపించమని చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో జారత్వం చేస్తారు దేవుని ఉగ్రత మండి తెగులు ప్రారంభమవుతుంది. ఇంతలో ఇశ్రాయేలీయుల ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తెతో పాపం చేయడాన్ని చూసిన ఒక యవ్వనస్తుడు ఫీనెహాసు ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో పొడుస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా 25:10,11లో) నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకుండుట చూచి.............

దేవుడు ఓర్వలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు చేయగలవా?

 

3. ఇక మరో వ్యక్తి దేవునిచే  నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు యుధ్దం చేసేకాలంలో యుద్దానికి పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం చేస్తున్న సైనికుని భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు. పాపానికి ప్రతిఫలంగా స్త్రీ గర్భవతి కాగా, దానిని తనభర్త పై నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే స్త్రీ  భర్త నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని చంపించారు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2 సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా జరిగింది ... విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు గారు రౌద్రుడై " మనుష్యుడు ఎవడు, యెహోవా జీవంతోడు నిశ్చయంగా మనుష్యుడు మరణపాత్రుడు" అని చెప్పగా ప్రవక్త గారు ఏమన్నారు " హంతకుడు, వ్యభిచారివి నీవే." దేవునికి దేవుని ప్రవక్తలకు తన మన తారతమ్యం లేదు దావీదుగారు చక్రవర్తి యైనా సరే దేవుని వాక్కు సెలవిస్తుంది మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవునాకే చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు ఉన్నచోటనే సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహరించారు.

 

  ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది? వ్యభిచారం /జారత్వం దగ్గర ఆగిపోతున్నావా?

జారత్వంలో పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం లో పడిపోతున్నావా?

ఫీనెహాసులాగ పాపాన్ని అంతం చేయగలవా?

 

   గమనించాలి శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21 వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

నీ బ్రతుకు ఇప్పటికైనా మార్చుకో!

                        (సశేషం)

 

*గలతీ పత్రిక-40 భాగం*

*శరీరకార్యాలు-2*

గలతీ 5:1921

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక రెండవది: *అపవిత్రత*!

 

  ప్రియులారా! రెండవదిగా చంపాల్సినది అపవిత్రత!

 

దీనికి మరో అర్ధం కల్మషం అని తర్జుమా చేయబడింది. అపవిత్రత అనగా మనభాషలో మలినం అంటుకోవడం. మలిన పడటం. దీనికోసం పాతనిభంధన గ్రంధంలో చాలాచోట్ల పవిత్ర జంతువులూ, అపవిత్ర జంతువులు, పక్షులు, పవిత్రుడు, అపవిత్రుడు ఇలాంటివి చాలా చెప్పబడ్డాయి. చనిపోయిన కలేభరాన్ని ముట్టుకొంటే అపవిత్రత కలుగుతుందని, అపవిత్రత ఎలా పోతుందో వ్రాయబడియుంది.

 ఇంకా జారత్వం లాంటి పనులు చేస్తే అపవిత్రులు అనియు, కుష్టురోగులు అపవిత్రులు అనియు వ్రాయబడింది. అయితే ఇవన్నీ శారీరక అపవిత్రత!

 

 అదేకాకుండా ఆత్మీయ అపవిత్రత కూడా ఉంది. యేహెజ్కేలు 20:23 ప్రకారం దేవుడు విధించిన కట్టడల ప్రకారం జీవించకపోతే అపవిత్రులు. ఇంకా యేహెజ్కేలు, యిర్మియా గ్రంథాల ప్రకారం విగ్రహారాధన చేస్తే అపవిత్రులు!

 

   అయితే యేసుప్రభులవారు చెప్పిన ప్రకారం అపవిత్రులు ఎవరనగా లేదా అపవిత్రత ఎలా కలుగుతుంది మానవునికి:- మార్కు సువార్త 7:15,16. .

15. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,

16. లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.  . . .

 

దీని అర్ధం వివరంగా 18-23 వచనాలలో ఉంది.

18. *ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?*

19. *అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును*.

20. *మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.*

21. *లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును*

22. *నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును (మూలభాషలో-చెడ్డ కండ్లును) దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును*.

23. *ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను*.  . . .

 

కాబట్టి పై వచనాల ప్రకారం మనిషిని నిజంగా అపవిత్రతకు దారితీసేవి  మనిషి హృదయంలో గల చెడ్డ తలంపులు, దురాశలు, దురాలోచనలు!!!

 

ప్రియ చదువరీ! నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నీ పడక మీద ఏం ఆలోచిస్తున్నావ్? దైవనామస్మరణా? లేక చెడు తలంపులతో, స్త్రీల మీద, సినిమా యాక్టర్ల మీద కామం కోసం ఆలోచిస్తున్నావా?

 

రేపు ఎవడ్ని ముంచాలి, ఎవడి నెత్తిమీద చేయి వేయాలి అని ఆలోచిస్తున్నావా? ఎవడ్ని చంపుదామా? నాశనం చేద్దామా అని ఆలోచిస్తున్నావా?

పక్కవాడి పొలాన్ని, ధనాన్ని ఎలా లాక్కుందామా అని ఆలోచిస్తున్నావా? పొరుగువాడి భార్యను, లేక పొరుగునున్న అమ్మాయిని ఎలా ట్రాప్ చేద్దామా అని ఆలోచిస్తున్నావా?

ఇవే నిన్ను ముఖ్యంగా అపవిత్ర పరిచేవి! జాగ్రత్త! హృదయమును, అంతరంగమును పరిశీలించు నీతిగల దేవుడు మనదేవుడు. యిర్మియా 11:20; 20:12; 

వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడు మన దేవుడు! ఒక్కట్టిచ్చారా నేల నాకేస్తావు జాగ్రత్త! జీవముగల దేవుని చేతిలో పడటం బహు భయంకరం! హెబ్రీ 10:31;

 

   గమనించాలి శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21 వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

 

     అపవిత్రమైనదేదీ/ అపవిత్రుడు ఎవడూ దేవుని పరలోకంలో/ పరలోకరాజ్యంలో స్థానం లేదు అని గ్రహించు! ఎఫెసీ 5:5; పరలోకంలో కేవలం పరిశుద్దులు మాత్రమే ఉంటారు గాని అపవిత్రులు ఎవరూ ఉండరు! నీకు పరలోకం కావాలా అయితే నీలో ఉన్న అపవిత్రత, అపవిత్ర తలంపులు అన్నీ చంపివేసేయ్!

 

ఈలోకంలో పవిత్రులు ఎవరూ లేరు, కేవలం దేవుని దయనొందిన వారు మాత్రం పవిత్రులుగా జీవించగలరు.

ఇంతవరకు అపవిత్రమైన తలంపులతో అపవిత్రుడుగా జీవిస్తున్నట్లు అయితే, నేడే యేసయ్య పాదాలు పట్టుకొని, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ క్షమాపణ వేడుకో!

ఆయన జాలి గలవాడు గనుక నిన్ను క్షమించుటకు సిద్దమనస్సుతో ఉన్నారు. నేడే ఆయన వద్దకు రా!

ఇకను పాపము చేయకు!

పరలోకాన్ని స్వతంత్రించుకో!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-41వ భాగం*

*శరీరకార్యాలు-3*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియదైవజనమా! విసర్జించవలసిన/ చంపవలసిన/ నిర్మూలించవలసిన మరో అలవాటు – *కామాతురత* లేక *కాముకత్వము*! దీనినే కామోద్రేకం అని కూడా అంటారు. దీనిని తప్పకుండా విసర్జించాలి. లేకపోతే దాని పరిమాణాలు ఏమిటో ఈరోజు చూసుకుందాం!

 

    కామాతురత/ కామోద్రేకం అనేది మనుష్యులను పిచ్చివారిని చేస్తుంది. నిద్రను, సుఖాన్ని దూరం చేస్తుంది. చివరికి ఆస్తిని పరులకు దారాదత్తం చేస్తుంది. చివరికి నిన్ను

1) దిక్కులేని బికారిగా గాని,

2) ఏకాకినిగా గాని,

3)  అనారోగ్యం పాలు చేస్తుంది. 

దీర్ఘకాలిక జబ్బులు లేక సుఖవ్యాధులు లేక HIV లాంటి మందులేని జబ్బులతో కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తుంది ఈ కామాతురత!

 

      గతంలో చెప్పిన విధంగా వీటన్నిటికీ  ఒకదానితో ఒకటి లింక్ కలిగివున్నాయి.

*నీకు కామాతురత ఉంది గాబట్టే వ్యభిచారం, జారత్వం చేస్తున్నావు!

*కామాతురత ఉంది గాబట్టే అక్రమ సంభంధాలు కలిగిఉన్నావు!

*నీకు కామాతురత ఉంది గాబట్టే పరస్త్రీలవంక / పరపురుషుల వంక మోహపుచూపు చూస్తున్నావు.

*కామాతురత ఉంది గాబట్టే బిగుతైన బట్టలు వేసుకుని ప్రజలను నీవైపు చూసేలా చేస్తున్నావు.

*కామాతురత ఉంది కాబట్టే ఇంటర్నెట్ లో బూతు బొమ్మలు, బూతు సినిమాలు, బూతు సాహిత్యం చూస్తున్నావు.

*ఎవరూ చూడటం లేదు కదా అని అనుకుంటున్నావు గాని, నిన్ను నన్ను చేసిన దేవుడు, నీకోసం నాకోసం చాడీలు చెప్పే సాతానుగాడు CCTV కెమెరా లో చూస్తున్నారు అని మరచిపోతున్నావు.

 

      ఈ కామాతురత వలననే ఒక మహా గొప్పవ్యక్తి ఎలా పతనమైపోయాడో- మహా జ్ఞాని ఎంతటి బుద్ధిహీనుడయ్యాడో చూసుకొందాం! బైబిల్ గ్రంధం ఎవరినీ ముఖస్తుతి చేయదు. పాపిని పాపి అన్నది, నీతిమంతుడిని నీతిమంతుడు అని వ్రాయబడింది.  మహాజ్ఞాని, మహాచక్రవర్తి అని సోలోమోనును పొగడిన బైబిల్ గ్రంధమే, ఆవ్యక్తి నీతి తప్పి ప్రవర్తించినప్పుడు ఏమని వ్రాయబడిందో చూద్దాం!

 1రాజులు 11: 2

కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

1 రాజులు 11వ అధ్యాయం మొత్తం చూసుకుంటే ఎంతగా సోలోమోను పతనమయ్యాడో చూడవచ్చు! 1,2 వచనాలలో : ఇంకనూ అనేక పరస్త్రీలను మోహించి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను.

చూసారా దేవునికి ఇష్టం లేనిపని ఏదైనా ఉందంటే అది వ్యభిచారమే!

 3వ వచనం 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, ౩౦౦ మంది ఉపపత్నులు . జాగ్రత్తగా పరిశీలిస్తే సోలోమోనుకి ఎంతటి status పిచ్చి ఉందో మనకు తెలుస్తుంది. రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలు కాకపోతే- నచ్చినదానిని ఉంచుకుంటూ వచ్చాడు. ఎంత ఘోరమండి ఇది?

ఈరోజుల్లో ఒక భార్యతో కాపురం చేయలేక కుడితిలో పడిన ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారు చాలామంది పురుషులు. మరి ఈ వ్యక్తి వెయ్యిమందితో ఎలా ఏగాడో కదా!  చివరికి ఏమైయ్యింది? 3వ వచనం వీరు అతని హృదయాన్ని విగ్రహారాధన తట్టు, విగ్రహాలు తట్టు తిప్పివేశారు. అందుకే దేవుడు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని ఖరాఖండిగా చెబితే (ద్వితీ 7:3,4) వినకుండా చేసుకున్నందుకు బ్రష్టుడై పోయాడు సోలోమోను. ప్రియ దేవుని బిడ్డా! నీవు బైబిల్ మాట వినకుండా అన్యస్త్రీలను పెళ్ళిచేసుకుంటే, అన్యుల అమ్మాయిని/ అబ్బాయిని మీ సంతానానికి ఇచ్చి పెళ్లి చేస్తే—మహాజ్ఞానియైన సోలోమోనే బ్రష్టుడైపోయాడు నీవెంత, నీ పిల్లలెంత! జాగ్రత్త! వీరు నీ పిల్లలను ఇట్టే బ్రష్టులు చేయగలరు.

 

 ఇక 4-8 వచనాలలో సోలోమోను కోసం ఇంకా వివరంగా వ్రాయబడింది

4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.

5. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.

7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను.

8. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. . . . .

దానికి బదులుగా దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమై మాట్లాడినా, హెచ్చరించినా వినలేదు. బహుశా సోలోమోను తనకు నచ్చిన దావీదుగారి కుమారుడని రెండుసార్లు వార్నింగ్ ఇచ్చిఉండొచ్చు.

ప్రియ చదువరీ నీకు నాకు ఆ అవుకాశం లేకపోవచ్చు!

11. సెలవిచ్చినదేమనగా-నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. . . . .

చివరికి దేవుడిచ్చిన శాపం ఈ అధ్యాయం పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.

 

  ప్రియ సహోదరీ/ సహోదరుడా! కామాతురత వలన కలిగే ప్రలోభాలు, నష్టాలను మహాజ్ఞానియైన సొలొమోనే తప్పించుకోలేకపోయాడు, నీవు నేను ఎంత?!!! నీకు నాకు సోలోమోనుకు ఉన్నంత జ్ఞానంలో 5% కూడా ఉండి ఉండదు. కాబట్టి నీవు నేను కూడా తప్పించుకోలేము జాగ్రత్త!

 

  అందుకే పౌలుగారు ముందుగానే మనలను హెచ్చరిస్తున్నారు ఈ కొలస్సీ, గలతీ, కొరింథీ పత్రికలు ద్వారా! అందుకే రోమీయులకు 12: 1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

ఎఫెసీయులకు 5: 1

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.

 

  ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు నీ పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నావా? ఎందుకూ పనికిరాని నిన్ను నన్ను దేవుడు రాజులయిన యాజక సమూహంలో చేర్చారు కదా , మరి అందుకు తగిన జీవితం జీవిస్తున్నావా? దేవుడు విశ్వాసులకు క్రీస్తుతోపాటు క్రొత్త జీవితంతో పాటు, తన మహిమను కూడా ఇచ్చారు. ఇలాంటి పాడుపనులు చేస్తే నీవు మహిమను పోగొట్టుకొంటావని మర్చిపోకు! కాబట్టి మన జీవితంలో పాపాన్ని తప్పకుండా నిర్మూలించాలి!

 

    మనం మానవులము, కంట్రోల్ చేసుకోవడం కష్టం; చిన్న చిన్న పాపాలు చేసినా పర్వాలేదు; జారత్వం, వ్యభిచారం తప్పులేదు, అవి మన ఆత్మకు అంటవు అని చెప్పే తప్పుడుబోధకులు—చీడపురుగులు మాట విని మోసపోకు!

ప్రసంగి 11: 9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

 అంతేకాకుండా మనం ఈ పాపాలను జయించగలం! అది మనకు సాధ్యమే! అందుకే పౌలుగారిద్వారా పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాయించారు. మనం చేయలేని పనులు, మోయలేని భారం దేవుడు మనమీద ఎప్పుడూ మోపేదేవుడు కాదు మనదేవుడు!! ఆయన పవిత్రుడు గాబట్టి మనం కూడా పవిత్రంగానే ఉండాలి.

 

 ఎలా?

క్రీస్తుద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మద్వారా, ఆత్మలో నింపబడటం ద్వారా, ఆయన ఆత్మ శక్తిద్వారా సమస్తము సాధ్యమే!

రోమీయులకు 8: 14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా ఎదుట నీ వాక్యము ఉంచుకొందును! కీర్తనలు 119:11;

 మరచిపోకు ఇలాంటివాటిని చేసేమారి మీదకు, అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. 6వ వచనం! ఎఫెసీ 5:5

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

 

   కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నేడే నీ పాపాన్ని/ వ్యభిచారం/జారత్వం / కామాతురత/ pornography విడచిపెట్టి, దేవునిపాదాలు పట్టుకో!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

        

 

 

*గలతీ పత్రిక-42 భాగం*

*శరీరకార్యాలు-4*

గలతీ 5:1921

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! నాల్గవదిగా చంపాల్సినది    

*విగ్రహారాధన!*

 

*విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.

*విగ్రహారాధన అంటే? 

విగ్రహాలను తయారు చేసుకొనివాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.!

 

బైబిల్ చెబుతుంది నీవు రూపంలో కూడా విగ్రహాలు చేసుకోకూడదు! ఇది దేవదేవునికి అసహ్యమైన క్రియ! కారణం జీవము గల దేవుడు, పౌరుషం, అధికారం, శక్తి, మహిమ, ప్రభావాలు గల దేవుడు, సర్వసృష్టికర్తయైన దేవునికి రావలసిన ఘనత, జీవములేని విగ్రహాలు చేసుకుని వాటినే దేవుళ్ళుగా పూజించడం అనేది నిజ దేవునికి ఇష్టం లేని పని!

 

అదేనా

ఇంకా ఏవైనా విగ్రహారాధన ఉందా?

నీవు చెప్తావ్నేను అట్లా విగ్రహారాధన చెయ్యడంలేదునేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని

 

కాని, ఒక్క విషయం!

విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు

దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

 

*దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్? 

నీ హృదయం దేనితో నిండిపోయింది

గాళ్ ఫ్రెండా

బాయ్ ఫ్రెండా

మోటార్ బైక్సా

వస్త్రాలా?

సెల్ ఫోన్సా?

బంగారమా

ధనమా

ఆస్థులా

అంతస్తులా

నీ పిల్లలా

అసూయా

ద్వేషమాఏది

ఇవన్నీ విగ్రహాలే

 

ఇప్పుడు చెప్పగలవా

నేను విగ్రహారాధికుడను కాదని

 

ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ

ఏదో కాస్త ఖాళీ ఉంచినా? చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా

 

అందుకే కదా

సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?

ఆయన నీ హృదయమనే తలుపునొద్ద (బయటమాత్రమే నిలబడిపోవలసి వస్తుంది

 

నేడే విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా

 

*లేకపోతే ఏమవుతుందో తెలుసా? 

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

                ప్రకటన 21:8

గమనించాలిఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

వద్దు

ఇది వినడానికే భయంకరం

 

సరి చేసుకుందాం

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-43 భాగం*

*శరీరకార్యాలు-5*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *ద్వేషము*!

 

      ఇది శరీరకార్యాలు లో చాలా ప్రమాదకరమైనది! ఎందుకంటే లోకంలో మొట్టమొదటి హత్య బైబిల్ ప్రకారం ద్వేషము వలననే జరిగింది. మొట్టమొదటి సంఘము- మొట్టమొదటి కుటుంబము- ఆదాము గారు, హవ్వమ్మగారు, కయీను- హేబెలు చిన్న కుటుంబం! తండ్రి కుమారులకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, దేవునికి అర్పణలు ఇవ్వడం నేర్పించాడు! కుమారులు నేర్చుకున్నారు! కుమారులు ఇద్దరూ అర్పణలు అర్పించారు! చిన్నవాడు శ్రేష్టమైనవి అర్పించాడు! పెద్దోడు ఏవో కొన్ని అర్పించాడు! దేవుడు హృదయాలను అంతరంగాలను పరిశీలించే నీతిగలవాడు గనుక చిన్నవాడు హృదయపూర్వకముగా అర్పించడం చూసి చిన్నవాడి అర్పణ అంగీకరించారు! పెద్దవాడిది అంగీకరించలేదు! కాలంలో అర్పణ అంగీకరించడం అనగా ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి బలిపీఠం మీదనున్న అర్పణను, బలిని దహించాలి! అప్పుడు దానిని దేవుడు అంగీకరించినట్లు! కాబట్టి ఇప్పుడు బహుశా హేబెలు అర్పణను దేవుని అగ్ని వచ్చి దహించినది. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. దీనిని చూసిన అన్న కయీను హేబెలు మీద ద్వేషం పెంచుకున్నాడు! అదును చూసి పొలంలో ఒంటరిగా ఉండి కొట్టేశాడు. హేబెలు రక్తం భూమిమీదకు పారింది. అయితే జంతువులే చనిపోతాయని అనుకున్నాడు గాని మనుషులు కూడా చనిపోతారని తెలియదు! భయంతో పారిపోయాడు. దేవుడు చూసి శపించేశారు! కాబట్టి ద్వేషానికి ప్రతిఫలం- ప్రతిదండన- శాపం!

 

ప్రియ స్నేహితుడా! ద్వేషమును వదిలిపెట్టు!

 

   చిన్న కుంటుంబం కోసం చూసుకున్నాం! ఇక బైబిల్ లో పెద్ద కుటుంబం- యాకోబుగారు, అతనికి నలుగురు బార్యలు! 12గురు కొడుకులు! ఏకైక ముద్దుల చెల్లి! వారిలో చిన్న భార్య పెద్ద కుమారుడు- యోసేపు గారు! తను ప్రేమించిన భార్య కొడుకు, ఇంకా మాట వినే కొడుకు కాబట్టి ఎక్కువగా యోసేపును ప్రేమించారు యాకోబు గారు! ఇది అన్నలకు ఇష్టం లేదు! పగ పట్టారు, ద్వేషించారు! అసూయ పడ్డారు! సమయం కోసం ఎదురుచూశారు! ఈలోగా అన్నలు చేసే చెడ్డ పనులు చూసి తండ్రికి పిర్యాదు చెయ్యడం మొదలుపెట్టారు యోసేపుగారు! అది వారిమీద చాడీలు చెబుతున్నారు అనుకున్నారు వారు! ఎలాగైనా చంపేద్దామని అనుకున్నారు! సమయం కోసం ఎదురుచూశారు! ఒకరోజు వచ్చింది- దూరప్రాంతంలో అన్నలు తమయొక్క మందలు మేపుతుండగా వారి క్షేమ సమాచారం తెలుసుకోడానికి యాకోబు గారు యోసేపుని పంపించారు. అదునుచూసి అక్కడే చంపేద్దామని అనుకున్నారు- రూబేను వీరిచేతిలో నుండి తప్పించి తండ్రికి ఇద్దామని అనుకున్నాడు. అన్నలు చంపేద్దామని ప్రయత్నిస్తుంటే యూదా హత్యాప్రయత్నం మానిపించాలని యోసేపుని ఇష్మాయేలీయులకు అప్పగించేటట్లు చేశాడు. దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి తప్పించుకున్నారు లేకపోతే రోజు అక్కడ మరణమైపోయి ఉండును యోసేపు గారు! కాబట్టి రెండు ఉదాహరణలలో ద్వేషం అనేది హత్యకు దారితీసింది!

 

    మోషేగారికి దేవుడు ఇశ్రాయేలు జాతిని విడిపించి వారిని కనాను దేశానికి నడిపించే నాయకత్వపు భాద్యతలు అప్పగించారు! అయితే ఇది కొంతమందికి  కిట్టలేదు! వారు ఎవరో పరాయి వారు కారు! సొంత పెదనాన్న చిన్నాన్న పిల్లలు! వారికి ఇంకా  మరికొంతమంది తోడుచేసుకున్నారు! ద్వేషము పెంచుకున్నారు! మోషేగారికి అన్నింటిలో ఎదురు తిరుగుతూ ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు! యాజకత్వం, నాయకత్వం మాకు కూడా కావాలని అనుకున్నారు! చివరికి దేవుని తీర్పులో కాలిపోయారు కొంతమంది. భూమి నేరవిడిచి మ్రింగివేసింది కొందరిని! జాగ్రత్త! ద్వేషము మానుము!

 

      అదిగో గొల్యాతు! 6 మూరల జానెడు ఎత్తుమనిషి! ప్రజలు చూసి పారిపోయారుదావీదుగారు చూశారు! తన దేవునితో గొల్యాతు ఎత్తు, తన దేవునితో గొల్యాతు పరాక్రమం పోల్చుకున్నాడు! వీడా! వేడిని నేను చంపేస్తాను అనుకున్నాడు! ప్రార్ధించి చంపేశాడు! ప్రజలు జేజేలు కొట్టారు! స్త్రీలు తంభురాలు తీసుకుని నాట్యము చేసి సౌలు వేలకొలది, దావీదు పదివేలకొలది శత్రువులను హతం చేశారు అని పాట పాడితే నాటినుండి దావీదు మీద ద్వేషం పెంచుకుని విషపు చూపు చూడటం మొదలుపెట్టాడు! వెంటనే దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టింది. చివరకు యుద్దంలో చచ్చాడు సౌలు! తనే కాదు తన కొడుకులు అందరూ చచ్చారు! ద్వేషము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని బైబిల్ చెబుతుంది! సామెతలు 14:౩౦

 

కాబట్టి ప్రియ సహోదరి! సహోదరుడా! నీలో ద్వేషం అనేది ఉంటే దానిని ఇప్పుడే వదిలిపెట్టు! లేకపోతే ద్వేషము నిన్ను హత్య చేయించడానికి కూడా పురికొల్పుతుంది. అది నీ ఎముకలకు కుళ్ళుగాను, నీ శరీరమునకు గొప్ప వ్యాధి గాను పనిచేసి నిన్ను మరణానికి చివరికి ఆత్మీయ మరణానికి దారితీస్తుంది! జాగ్రత్త!

గమనించాలిఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-44 భాగం*

*శరీరకార్యాలు-6*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *కలహము*!

 

     కలహము అంటే?

* పోట్లాటలు

* శత్రుత్వం

* అధికారం కోసం పోరాటాలు

మనిషి జరిగించే శరీరకార్యాలెన్నున్నా, దానికి గల కారణం మాత్రం ఒక్కటే. వారి మనస్సులలో దేవునికి చోటియ్యకపోవడమే.

 

గమనించాలి- యాకోబు యాశావుల మధ్య, ఇష్మాయేలు- ఇశ్రాయేలీయుల మధ్య అప్పుడు మొదలైన కలహము ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన ఇంకా ఆరిపోలేదు! కాబట్టి కలహము మొదలైనవి వెంటనే దానిని ఆర్పివేయుట మంచిది. లేకపోతే అది చిలికిచిలికి గాలివాన అయిపోతుంది. ఇక దానిని ఆర్పడం కష్టం! ఆర్పలేని కాష్టముగా మారిపోతుంది. నిరంతరమూ కుటుంబాలను తగులబెడుతుంది!!

 

వారు తమ మనస్సులో దేవునికి   చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య *కలహము* కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారునుతలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.       రోమా 1:28-31

 

కలహమునకు కారణములు?

పగ కలహమును రేపును.         సామెతలు 10:12

* కోపోద్రేకియగువాడు కలహము రేపును.          సామెతలు 15:18

 •   మూర్ఖుడు కలహము పుట్టించును.           సామెతలు 16:28

బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి.          సామెతలు 18:6

* పేరాసగలవాడు కలహమును రేపును.                   సామెతలు 28:25

* కోపిష్ఠుడు కలహము రేపును.               సామెతలు 29:22

* కోపము రేపగా కలహము పుట్టును                 సామెతలు 30:33

 

కలహమునకు దూరముగా వుండాలి.

కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత.      (సామెతలు 20:3)

 

కలహము మానాలి.

తిరస్కారబుద్ధిగలవానిని అనడం కంటే, మనలోనున్న తిరస్కారబుద్ధిని తోలివేయగలిగితే, కలహాలకు తావేలేదు.

తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును.  (సామెతలు 22:10)

 

కలహాలను పుట్టించడం ప్రియముగా యెంచేవాడు కలహప్రియుడు.

వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.       సామెతలు 26:21

 

కలహముతో కూడిన యింట ఆతిధ్యము వద్దు.

రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.

                 సామెతలు 17:1

 

అయితే బైబిల్ లో కలహానికి శత్రుత్వాలకు విరుగుడు రాయబడింది. మొదటిది క్షమాపణ! నీకు క్షమించే గుణం ఉండాలి!

 

 రెండు ఓర్పు: అవతలి వారు ఏమన్నా సరే, యేసయ్య నేర్పించిన ఓర్పు మనం కూడా చూపించాలి!

 

మూడు: నీ పగవాడు లేదా శత్రువు నీకు కీడుచేసినప్పుడు మనస్సులో ఉంచుకోకుండానీ శత్రువు దప్పిగొంటే పాలు ఇవ్వమని చెబుతుంది బైబిల్! .

Romans(రోమీయులకు) 12:19,20,21

19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

21. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము...

 

 చూశారా అలాచేస్తే వాని నెత్తిమీద నిప్పులు కుప్పగా పోస్తావు అని చెబుతుంది గ్రంధం! ఒకరోజు సిగ్గుపడి- శత్రువులు మిత్రులుగా మారుతారు! విషయంలో సామెతల గ్రంధకర్త రాస్తున్నారు: ఒకని ప్రవర్తన మంచిదైతే వాని శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు! 16;7;

 

 కాబట్టి వాడు చేసినట్లు నేను చేస్తాను! పగతీర్చుకుంటాను అనకుండా క్షమించడం నేర్చుకుందాం! ఇంకా వినకపోతే పగతీర్చుట నాది అని సెలవిచ్చిన దేవునికి వదిలేద్దాం! దేవుడు తనపని తనను చేయనిద్దాం! మనం ఓపికతో కనిపెడదాం!

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

కలహము వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

దైవాశీస్సులు!

 

 

 

 

 

 

 

*గలతీ పత్రిక-45 భాగం*

*శరీరకార్యాలు-7*

గలతీ 5:1921

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *మత్సరము*!

 

శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాత కూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

 

గమనించాలి: శరీర కార్యాలన్నిటికీ ఒకదానితో ఒకటి అనుబంధమై ఉన్నాయి! ద్వేషముంది కాబట్టే కలహము పుట్టింది. రెండు ఉన్నాయి కాబట్టే మత్సరము, క్రోధము, కక్షలు, బేదములు, అసూయలు అన్ని పుడతాయి! మొదట్లోనే వీటిని త్రుంచి వేస్తే మొత్తం మాయమైపోతాయి!

 

🔺 మత్సరము అంటే?

* అసహ్యత

* మరొకరి విజయాలపై అసూయ

 

🔺 *మత్సరము ఎముకలకు కుళ్లు*.

సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.

                 సామెతలు 14:30

 

ఒక శవాన్ని పాతిపెడితే?

* మాంసమంతా కుళ్లిపోయి మట్టిలో కలసిపోతుంది. ఎముకలు మాత్రం అట్లానే మిగిలిపోతాయి.

* రాబందులు సహితం ఎముకలను ఏమి చెయ్యలేవు.

 

కాని, 'మత్సరము' అనేది ఎముకలను సహితం కుళ్లిపోయేటట్లు చెయ్యగలదట. అంతటి భయంకరమైనది.

 

🔺 *ప్రతీ అల్లరికి, నీచకార్యమునకు మత్సరమే కారణం*:

 

ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.      

                   యాకోబు 3:16

 

🔺 *దూషణకు కారణం మత్సరమే*:

యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.       అపో.కార్యములు 13:45

🔺 *సత్యమునకు విరోధముగా* మాట్లాడడానికి కారణం మత్సరమే:

 

అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు.             యాకోబు 3:14

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

మత్సరము వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-46 భాగం*

*శరీరకార్యాలు-8*

 

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *క్రోధము*!

 

  *క్రోధము అంటే*?

* రెచ్చిపోయేంత కోపం

* హింసాయుతమైన మాటలు

 

క్రోధము అంటే?

కోపము కంటే చాలా రెట్లు అధికం అని చెప్పొచ్చు. అట్లాంటి సందర్భాలలో వారు ఉపయోగించే మాటలు ఎట్లా వుంటాయంటే? కత్తులు అవసర్లేకుండానే మనిషిని చంపేస్తాయి.

 

🔺 *క్రోధమునకు కారణం?*

హృదయపూర్వకమైన భక్తి లేకపోవడమే.

 

లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు.              యోబు 36:13

 

🔺 *తిరస్కారమునకు కారణము క్రోదము:*

నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.               యోబు 36:18

🔺 *క్రోధము క్రూరమైనది*:

క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?                సామెతలు 27:4

 

🔺 *క్రోధముగలవానితో పరిచయము వద్దు:*

కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము.           సామెతలు 22:24

 

🔺 *మృదువైన మాట క్రోధమును చల్లార్చును. *

మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.           సామెతలు 15:1

 

🔺 *క్రోధమును విసర్జించాలి:*

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.                 ఎఫెసీయులకు 4:31

 

*ఇంతకీ ఎవరికీ క్రోధము ఉంటుంది?*

యోబుగారు చెబుతున్నారు: లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధమును ఉంచుకొందురు! 36:13

అనగా దీని అర్ధం నీలో క్రోధముంది అంటే నీలో హృదయపూర్వకమైన భక్తి లేదు అని అర్ధం! నీకు క్రోధముంటే పెదాలతో భక్తి చేస్తున్నావు తప్పనిజమైన భక్తిలేదు!

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

క్రోధమును వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-47 భాగం*

*శరీరకార్యాలు-9*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *కక్షలు*!

 

  కక్షలు అంటే?

* స్వార్ధపు కోరికలు

* అధికారాన్ని కోరుకోవడం

 

🔺 కక్షలవలన పర్యవసానములు:

* ఏక భావముండదు.

* ఏక మనస్సుండదు.

* ఏక తాత్పర్యముండదు

 

సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

            1కొరింథీ 1:10

 

🔺 కక్షలకు కారణం?

ఎదుటి వ్యక్తి కంటే మనమే యోగ్యులమని తలంచడం.

 

కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

             ఫిలిప్పీ 2:3,4

 

🔺 కక్షలకు ప్రతిఫలంకీడు”:

 

మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు. మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.

               1కొరింథీ 11:18

 

నేటి మన కుటుంబాలలో, సంఘాలలో కక్షలకు తావిచ్చి, తద్వారా సమాధానం కోల్పోయాము. దానికంతటికి కారణంమనలను మనము హెచ్చించుకొనే ప్రయత్నమే. వినయమైన మనస్సుగలవారమై  యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొనుచూ, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగితే, కక్షలకు తావేలేదు.

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

గమనించాలి: శరీర కార్యములు ఏవి ఉన్నా దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అని 21 వచనంలో చెబుతున్నారు! పరలోకం కావాలంటే శరీర కార్యములు విడిచిపెట్టు!

కక్షలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-48 భాగం*

*శరీరకార్యాలు-10*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *భేదములు*!

 

భేదములు అంటే?

దేవుని వాక్యముచే సమర్ధించబడని విరుద్ధమైన బోధలను ప్రవేశపెట్టడం.

 

గమనించాలి: అబద్దబోధకులు కూడా ఇలాంటి భేదములు కలిగించే, గలతీయ సంఘాన్ని పాడుచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నారు పౌలుగారు!

రోమా పత్రికలో రాస్తున్నారు:

సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

             రోమా 16:17

 

*వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్లుగా, బైబిల్ పట్టుకున్నవారిని బైబిలతోనే మోసగించాలనే కుయుక్తితో సాతాను అత్యంత తెలివిగా వాడిపనిని కొనసాగిస్తున్నాడు. దానిలో వాడు చాలా వరకు సఫలీకృతం కాగలుగుతున్నాడనే చెప్పవచ్చు. వాక్యాన్ని వక్రీకరించి బోధించే అనుచరులను ఏర్పరచుకొని, సంఘాలలో భేదములు కలుగజేస్తూ, సత్యమార్గాన్ని నిర్మూలము చేసేపనిలో వాడున్నాడు*.

 

నేటి సంఘాలలో వాక్యానుసారమైన విధానాలకు స్థానం లేకుండా, మనుష్యుల కల్పితాలకే అధికప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

 

నేటి సంఘాలలో విచిత్రమైన బోధలలో కొన్ని:

 

* యెహోవా దేవునికి భార్య వున్నది.

* యేసు నామంలో బాప్తిస్మం తీసుకోకపోతే పరలోకం చేరరు.

* భాషలు మాట్లాడకపోతే పరలోకం చేరవు.

* యెహోవా సాక్ష్యులు మాత్రమే యెహోవా రాజ్యంలో చేరతారు. నరకం లేదు, పరలోకం లేదు.

* యేసు క్రీస్తు, లూసిఫర్ ఇద్దరూ అన్నదమ్ములంటూ మోర్మోన్స్.

* ప్రస్తుతం జరుగుతున్నదే వెయ్యేండ్ల పాలన

* నిత్యమూ నివసించేది ఆత్మ కాబట్టి, ఆత్మను మాత్రమే పరిశుద్ధంగా కాపాడుకొంటే చాలు. శరీరంతో మనకు నచ్చినట్లుగా జీవించవచ్చు. అంటూ బిలాము బోధలు, నీకొలాయితుల బోధలు, యెజెబెలు బోధలు.

 

ఇట్లా చెప్పుకొంటూ పోతే, లెక్కలేనన్ని. అయితే,వీటిని చూచి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీటన్నిటిని గురించి లేఖనాలు ముందుగా హెచ్చరించాయి.

 

*మానవాళికి పాప విముక్తిని కలిగించి, విశ్వాసులను స్థిరపరచి, అభివృద్ధిచేసి దేవుని సాధనం సత్యం. అయితే, వారిని నాశనం చేయడానికి సాతాను ఉపయోగించే సాధనం అబద్దం*.

 

మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.           యోహాను 8:44

 

🔺 సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు.

 

ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

                       2 కొరింథీ 11:13-15

 

🔺 ఇది సువార్త కాదు. క్రీస్తువార్తను చెరుపగోరే వార్త

 

క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

                    గలతి 1:6-8

 

🔺 దయ్యముల బోధ:

 

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

              1 తిమోతి 4:1,2

 

🔺 వంకర బోధ:

 

నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

        అపో. కార్యములు 20:29,30

 

🔺 మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము

 

ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.           కొలస్సి 2:8

 

🔺 నాశనకరమగు భిన్నాభిప్రాయములతోకూడిన రహస్య బోధ:

 

అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.         2 పేతురు 2:1,2

 

🔺 గొఱ్ఱల చర్మములు వేసికొనిన  క్రూరమైన తోడేళ్లు

 

అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు   గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.        మత్తయి 7:15

ఇవన్నీ సంభవించే కాలమిది. ఎందుకనగా ఇది కడవరి గడియ.

 

చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము

          1యోహాను 2:18

 

భేదములు పుట్టించే సాతాను కుయుక్తినుండి మనము తప్పించబడాలంటే? బెరయ సంఘస్థులవలే వాక్యాన్ని పరిశీలించి, అట్టి రీతిగా జీవించడం ద్వారా వాడిపై విజయం సాధించగలము.

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21 వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పోతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-49 భాగం*

*శరీరకార్యాలు-11*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *విమతములు*!

 

  విమతములు అంటే?

* సమాజంలో వివిధ స్వార్ధ గుంపులు

* ముఠాలుగా విడిపోయి సంఘ ఐక్యతను విచ్చిన్నం చేయడం

 

లోకంలో సంఘం వుండాలి. గాని, సంఘంలోనికి లోకం ప్రవేశించింది. లోకసంబంధమైన విధానాలే సంఘాల్లో ఏలుబడి చేస్తున్నాయి. ఒక మనిషి తన పంతం నెగ్గించుకోవడానికి, తననుతాను ఘనపరచు కోవడానికి సంఘాన్ని విచ్చిన్నం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తానొక ముఠాను సిద్ధపరచుకొని సంఘంలోనూ, సమాజంలోనూ అల్లరి సృష్టిస్తున్నాడు.

 

సంఘాల్లో కొనసాగుతున్న రాజకీయాలు, దేశరాజకీయాలకు ఏమాత్రం తీసిపోవు. దేవుని పేరుతో, దేవునికి చెందాల్సిన మహిమను నీకు చెందేలా నేను ప్రయాసపడితే? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా?

 

విచిత్రమేమిటంటే? సంఘ విచ్చిన్నానికి వున్న ఐక్యత, వాక్యానుసారమైన విధానాన్ని స్థాపించడానికి మాత్రం ఎక్కడా కానరాదు.

అవును! అదే సాతాను కుతంత్రం.

మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.

              కొరింథీ 11:19

 

అవును! అయితే, సంఘాన్ని, సమాజాన్ని విచ్చిన్నం చేసేవారి గుంపులో మనము చేరకుండా,మన యోగ్యతను కాపాడుకోగలగాలి.

 

నేటి మన కుటుంబాలలో, సంఘాలలో  విమతములకు తావిచ్చి, తద్వారా సమాధానం కోల్పోయాము. దానికంతటికి కారణంమనలను మనము హెచ్చించుకొనే ప్రయత్నమే. వినయమైన మనస్సుగలవారమై  యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొనుచూ, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగితే, విమతములకు తావేలేదు.

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

విమతములు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21 వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పోతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి-విమతములు వదిలి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-50 భాగం*

*శరీరకార్యాలు-12*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *అసూయ!*

 

 శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

 

  *అసూయ అంటే? *

మనము యిష్టపడి కోరుకొనేది మరొకరి దగ్గర వుంటే, వానిపై అయిష్టత కలిగియుండడం.

 

మనము బైక్ మీద వెళ్తుంటే?

వేగంగా దూసుకు పోతున్న కారు వైపు చూస్తాము గాని, మన ప్రక్కనే చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము

మన ఆశలన్నీ మన పైవాటి మీదే వుంటాయి. నేను స్థితిలో ఎందుకు లేను? అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని, మనకంటే ఉన్నత స్థితిలో వున్నవారిపైన 'అసూయను' కలిగిస్తుంది

అసూయ కలిగిన నీవు సంతోషముగా వుండలేవు. ఎదుట వారిని సంతోషముగా వుండనివ్వవు.

 

🔺 *అసూయకు ముఖ్య కారణం*

* సంతృప్తి లేని జీవితం

* ఇతరుల బాగును సహించుకోలేని స్థితి 

* ఇతరుల నైపుణ్యాలను అభినంధించలేని స్థితి 

 

అపోస్తలుడైన పౌలు జైలులో ఖైదీగా వున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు

 

నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.           ఫిలిప్పి  4:11

 

సంతృప్తి కలిగియుంటే? అసూయకు తావే లేదు

 

🔺 *అసూయ మరణానికి దారి తీస్తుంది :*

బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.             యోబు 5:2

 

🔺 *అసూయలేకుండా జీవించాలి.*

ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.        గలతియులకు 5:26

 

🔺 *అసూయ కలిగియుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము.*

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.       గలతియులకు 5:21

 

🔺 *అసూయను విసర్జించాలి: *

ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.  1పేతురు 2:1-3

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

అసూయను వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం! అసూయను వీడి, తిరిగి జన్మించిన అనుభవం కలిగి కక్షలు క్రోదాలు లేకుండా చిన్న బిడ్డలా  పరలోకాన్ని చేరుకొందాము!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21 వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పోతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-51 భాగం*

*శరీరకార్యాలు-13*

 

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *మత్తతలు*!

 

  మత్తతలు అంటే?

మత్తు పానీయాల తీసుకోవడం ఫలితంగా మానసిక, శారీరిక నియంత్రణ కోల్పోవడం.

 

త్రాగుడు ఒక ఫ్యాషన్ అయ్యింది. అదొక స్టాటస్ సింబలయ్యింది. త్రాగి తందనాలాడేవాడు హీరో అవుతున్నాడు. త్రాగని వాడేమో జీరో అవుతున్నాడు

 

త్రాగిన వాడు ఏమి మాట్లాడతాడో తెలియదు? ఎందుకు నవ్వుతాడో తెలియదు? ఏమి చేస్తాడో తెలియదు? జేబులు ఖాళీ అయ్యేవరకూ త్రాగుతూనే  ఉంటాడుఊగుతూనే  ఉంటాడు

 

భేదం లేదు. పిల్లలూ, యవ్వనులూ, వృద్ధులూ అందరూ త్రాగుతూనే వున్నారు. దాని ఒడిలో ఊగుతూనే వున్నారు? మత్తు పదార్ధాల మత్తులో జోగుతోంది లోకం

 

అల్లర్లకు కారణంయాక్సిడెంట్లకు కారణం? కుటుంబాలు విచ్చిన్నానికి కారణం? రోగాలు, ఆర్ధికమానసిక సమస్యలకు కారణం

ప్రశ్నలు ఎన్నైనా కావొచ్చు. సమాధానం మాత్రం ఒక్కటే. అదే "త్రాగుడు వ్యసనం".

 

* యువత త్రాగుడుకి బలై పోతుంది. వారి వ్యసనం కోసం వ్యక్తిగత, కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. 

* పెగ్గు కోసం సిగ్గులేకుండా చేతులు చాస్తున్నారు. 

* కనీసం బర్త్ డే పార్టీలు కూడా బీర్ లతో బార్ లో గడపడానికే సిద్దపడుతున్నారు? 

* ఒక్క మాటలో చెప్పాలి అంటే? పార్టీ అంటేనే మద్యం. మద్యం లేకపోతే అది పార్టీనే కాదు. 

 

కొంత మంది తెలివిగా మాట్లాడతారు. పౌలుగారు తిమోతికి వ్రాసారు కదా? అని. ఏమని వ్రాసారు

 

ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 1తిమోతి 5:23

 

కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకోమని. అయితే, త్రాగే వాళ్లంతా కడుపు జబ్బుకోసమే త్రాగుతున్నారా? అయినా, ద్రాక్షారసము, మద్యము రెండూ ఒక్కటేనా? ద్రాక్షారసముకి ఈస్ట్ కలిపి పులియబెడితే మద్యం అవుతుంది

 

కడుపు జబ్బుకు కొంచెం ద్రాక్షారసము త్రాగమని తిమోతికి సూచిస్తున్నారు పౌలుగారు. అంటే? తిమోతి కడుపు జబ్బుతో బాధ పడుతున్నాడు. అది అతడు త్రాగే నీరు సరైనది కాకపోవడం వలన కలిగినది. దినాలలో ఔషధాలు అందుబాటులో లేనికారణం చేత, ద్రాక్షారసంలో కొన్ని ఔషధ గుణాలు వుండడం చేత త్రాగే నీటిలో కొంచెం ద్రాక్షారసం కలుపుకొని త్రాగడం సర్వ సాధారణం. మన వాళ్లేమో మద్యంలో నీళ్లు కూడా కలపకుండా త్రాగుతూ దీనిని పౌలు మాటలకు జత కట్టేసారు

 

🔺 ఒక్క విషయం గుర్తుంచుకో

* విషం కలిగి యున్న సీసా మీదా 'విషం' అనే పేరు తీసేసి, 'అమృతం' అని వ్రాసినంత మాత్రాన అది అమృతముగా మారిపోదు కదా

*  'పాపము' అనే దానిని 'పొరపాటు' అని పిలచుకున్నంత మాత్రాన అది పాపం కాకుండా పోదుగా

 

నీవంటావ్! ఆయన త్రాగడం లేదా? ఈయన త్రాగడం లేదా అని. ఆయన సంగతి, ఈయన సంగతి నీకెందుకు? నీవు చూడాల్సింది ఆయనను, ఈయనను కాదు. నీ *పరిశుద్ధుడైన దేవునిని మాత్రమే*. అనుసరించాల్సింది ఆయనను, ఈయనను కాదు. *పరిశుద్ధ గ్రంధమును మాత్రమే*. 

 

మరి కొందరంటారు! పరిశుద్ధ గ్రంధంలో ఆయన త్రాగలేదా? ఈయన త్రాగలేదా అని. అవును! త్రాగారు. ప్రతిఫలాన్ని అనుభవించారు. నీ జీవితం అట్లా కాకూడదనే, వారి జీవితాలను దృష్టాంతాలుగా నీ ముందుంచాడు దేవుడు

 

🔺 మద్యం వలన నోవాహు వస్త్రహీనుడయ్యాడు.     ఆది 6:9

 

🔺 మద్యం వలన వరసలు తెలియవు:           ఆది 19:30-38 

 

🔺 మద్యం వలన అల్లరి పుట్టును.          సామెతలు 20:1

 

🔺 మద్యం వలన జ్ఞానము లేనివారు    అగును.   సామెతలు 20:1

 

🔺 మద్యం వలన దరిద్రులగుదురు.             సామె 23:21

 

🔺 మద్యం వలన శ్రమలు, దుఃఖము, గాయములు కలుగును .       సామెతలు 23:29,30

 

🔺 మద్యం వలన ఆజ్ఞలు మరతురు.       సామెతలు 31:4,5

 

🔺 మద్యం వలన పరలోకం వెళ్లలేరు.       1కొరింది 6:10

 

🔺 దుర్వ్యాపారం నడుపుతురు.       ఎఫెసి 5:18

 

🔺 మతి చెడును        హోషేయ 4:11

 

 🔺 జబ్బు పడుదురు.          హోషేయ 7:5

 

🔺 తత్తర పడుదురు.      యెషయా 28:7

 

🔺 చెడు పాటలు పాడుదురు.      కీర్తనలు 69:12

 

🔺 త్రాగుబోతులకు శ్రమ.        యెషయా 5:22

 

🔺 నరకానికి వెళ్లెదరు.     మత్తయి 24:49-51, ప్రకటన 14:10

 

అందుచే

ఇటువంటి త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. (సామెతలు 23:20)

 

మత్తు అనగా కేవలం మద్యపానమే కాదు, డ్రగ్స్, గంజాయిలాంటి మాదక ద్రవ్యాలు ఏవైనా, మత్తు కలిగించేవి ఏవైనా సరే అవి శరీర కార్యాలే! అవి దేవుని నుండి నిన్ను దూరం చేస్తాయి! ఇది మరో మత్తు- లోకమనే మత్తు! సాతాను గాడి మత్తు!

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

మత్తతలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21 వచనంలో చెబుతున్నారు!

దేవునిరాజ్యంలో ప్రవేశించక పోతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-52 భాగం*

*శరీరకార్యాలు-14*

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! తరువాత చంపాల్సినది/ విసర్జించవలసినది  *అల్లరితో కూడిన ఆట పాటలు*!

 

శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

 

  అల్లరితో కూడిన ఆట పాటలు అంటే?

* సినిమాలు, సీరియల్స్

* అధికంగా వినోదించడం

* తిండిబోతుతనం

* మత్తు పానీయాలు

* మాదక ద్రవ్యాలు

* లైంగిక సంభోగాలతో కూడిన సమావేశాలు మొదలైనవి.

 

సినిమాలు చూడకూడదని ఎక్కడ వ్రాయబడి వుంది? అని ప్రశ్నించేవారు నేటి దినాలలో కోకొల్లలు. అవును! అట్లా వ్రాయబడలేదు. బైబిల్ వ్రాయబడే దినాలకు సిమాలు లేవు కాబట్టి, దానిని ప్రత్యక్షంగా వ్రాయవలసి అవసరం లేకపోయింది. కానీ, ఒక్క విషయం! పరోక్షంగా అవన్నీఅల్లరితో కూడిన ఆటపాటలలోచేర్చడం జరిగింది.

 

* సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. ఆయన వేశ్యనైనా క్షమిస్తాడు గాని, వేషధారిని క్షమించడు.

 

* సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది.

 

* సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాటo సన్నివేశాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు.

ఇట్లా చెప్పకుంటూపోతే, చెప్పలేనన్ని.

 

చాలా ఎక్కువమంది సినిమాలు చూడకూడదు గాని, సీరియల్స్ చూసినా ఏమి కాదు. అని వారికి వారే సర్ది చెప్పేసుకుంటారు. అయితే ఒక్క విషయం! సినిమాయైతే, మూడు గంటలలో అయిపొతుందేమో గాని, సీరియల్ అయితే? మూడు సంవత్సరాలైనా సమాప్తం కాదు. వీటికి అలవాటుపడిన నీవు, శరీరకార్యాలనే నెరవేర్చుతున్నావనే విషయం ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.

 

తాగి తందనాలాడడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, శరీరవాంఛలను రేకెత్తించే పదజాలం, ఇవన్నీ అల్లరితోకూడిన ఆటపాటలే.

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

అల్లరితో కూడిన ఆట పాటలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

 

ప్రియ దైవజనమా! శరీరకార్యాలు అన్నీ నిన్ను నరకానికి నడిపిస్తున్నాయి! ఇవి గనుక నీలో పనిచేస్తే నీవు పరలోకం దరికూడా చేరలేవు! శరీరకార్యాలు తప్పకుండా నీలో కాలిపోవలసినదే! అయితే నీకు నీవుగా వీటిని వదలలేవు కాల్చలేవు! దానికి తప్పకుండా ఆత్మశక్తి కావాలి! పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తుంటే ఆత్మశక్తి ద్వారానే వీటిని నీవు దహించగలవు! ఆత్మావేషం, ఆత్మాభిషేకం లేకుండా నీవు వీటిపై జయం పొందడం అసాద్యం! కాబట్టి ప్రియమైన స్నేహితుడా! నీకు శరీరకార్యాలు వదిలెయ్యాలని ఉన్నా సరే, వాటిని వదలలేని పరిస్థితిలో ఉన్నావు కదా, నేడే పరిశుద్ధాత్మయొక్క శక్తి కోసం ప్రార్ధించి పొందుకో! అప్పుడు వీటిని చీకొట్టగలవు! కాల్చివేయగలవు!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21 వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పొతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-53 భాగం*

*ఆత్మ ఫలము*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక అతిప్రాముఖ్యమైన విషయానికి వద్దాము! క్రైస్తవునికి విశ్వాసికి పరలోకం కావాలంటే ఆత్మలో ఫలించాలి అంటే, పరిపూర్ణత సాధించాలి అంటే, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నాడు అని తెలియజేసే అంశాలు: ఆత్మఫలము ఫలించాలి! ఫలములు లేకపోతే, గొడ్డు బ్రతుకు బ్రతికితే ఫలించని ప్రతీ చెట్టును, తీగెను కోసి పారేస్తాను అంటున్నారు దేవుడు! కాబట్టి ఆత్మఫలము ఫలిద్దాము!

 

గమనించాలి ఒక మొక్క్క ఫలిస్తుంది అని తెలియడానికి మనకు మొక్క / చెట్టు పచ్చగా ఉండాలి. తర్వాత ఫలములు ఫలించాలి అప్పుడే మనకు మొక్క/చెట్టు ఫలిస్తుంది అని మనకు అర్ధం అవుతుంది మొక్క/ చెట్టు ఎన్నిరోజులు/ సంవత్సరాలు గడిచినా ఫలములు కనబడకపోతే దానిని గొడ్డు మొక్క/ గొడ్డు చెట్టు అంటారు. అలాగే రక్షించబడిన విశ్వాసి జీవితంలో వచనాలలో గల ఫలములు కనిపించకపోతే విశ్వాసి గొడ్డు విశ్వాసి లేదా చచ్చుబడిన విశ్వాసి అని అర్ధం! *అయితే గమనించవలసిన అంశం ఏమిటంటే: పౌలుగారు వచనాలలో చెప్పిన ఆత్మఫలం- విశ్వాసుల ఆత్మఫలం కాదు! విశ్వాసిలో దేవుని ఆత్మ ఫలింపజేసే మంచిఫలమే ఆత్మఫలం!*  ఇది విశ్వాసి యొక్క స్వంత ప్రయత్నాల ద్వారా ఫలము కలగదు! దేవుని పరిశుద్ధాత్మ ఒకని జీవితంలో పనిచేస్తే, అప్పుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తిని వాడుకుని వ్యక్తిలో ఆత్మఫలము ఫలిస్తాడు! కాబట్టి ఇది మన సొంత ప్రయత్నాలు వలన కలిగేవి కావు! అలాగని విశ్వాసి చేతులు ముడుచుకుని కూర్చుంటే లేక కాళ్ళు నిగడదన్ని ఇంట్లో పడుకుంటే కలిగేది అంతకన్నా కాదు! మనిషి పరిశుద్దాత్మతోపరిశుద్దాత్మలో జీవించాలి! ఆత్మ నడిపింపు ప్రకారం నడచుకోవాలి! ఆత్మ వెళ్ళమన్న స్థలాలకు వెళ్ళాలి. ఆత్మ వద్దు అన్న స్థలాలకు వెళ్ళకూడదు! ఆత్మ చెప్పిన పని మాత్రమే చెయ్యాలి- ఆత్మ వద్దు అన్న పని చెయ్యకూడదు! పరిశుద్ధాత్మను నిర్లక్షం చేసి- శరీర కార్యాలు చేస్తే ఫలము కనిపించనే కనిపించదుఫలము అనే పదం అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది!

 

      ఒక చెట్టు ఫలము ఫలించాలి అంటే మంచి నేలపై విత్తనాలు పడాలి అప్పుడే మంచి ఫలాలు ఫలిస్తాము అని యేసయ్య తన ఉపమానం చెప్పారు మత్తయి 13:23 . ప్రకృతిలో ఫలములు ఫలించాలి అంటే ముందు విత్తనాన్ని నాటాలి. నేల మంచిదై యుండాలి. యేసయ్య చెప్పిన ఉపమానంలో కొన్ని నేలలు కనిపిస్తాయి మనకు. మొదటిది రోడ్డు ప్రక్కన లేక త్రోవ పక్కన పడ్డ విత్తనాలు. పక్షులు విత్తనాలను తినేశాయి. అనగా విన్న వాక్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని దాని భావాన్ని గ్రహించాలి. లేకపోతే సాతాను గాడు దానిని ఎత్తుకుని పోతాడు.

 

మరో నేల రాతి నేల. రాతినేల మీద పడిన విత్తనాలలో వేరు లేనందువలన ఫలించలేదు. అనగా వీరు వాక్యం విన్న వెంటనే ఓహ్ ఎంత బాగుందో ఆహ్ ఓహ్ అంటారు. గాని వీరికి దేవుని వాక్యం పట్ల లోతైన ఆశక్తి లేనందువలన మొదట్లో ఆసక్తి చూపినా తర్వాత వాక్యానికి దూరమై పోతారు. మరో రకంగా చెప్పవచ్చు! తన అహం, తన మతం తనను సంతోషపెట్టినంతవరకు వాక్యాన్ని అంగీకరిస్తాడు. ఎప్పుడైతే దీవెనలతో పాటుగా గద్దింపు, దిద్దుబాటు ఎదురౌతుందో వెంటనే వాక్యానికి నొచ్చుకుని దూరమైపోతుంటారు. ఇంకా  ఏవిధమైన చిన్న శోధన కష్టాలు వచ్చినా వెంటనే దూరమైపోతారు.

 

ఇక మూడో నేల ముండ్లపొదల మధ్య నిలిచిన విత్తనాలు! వీరు వాక్యాన్ని వింటారు గాని ఇహలోకము మీద గల ఆశలు, అనగా లోకాశలు, ధనాశ , శరీరాస నేత్రాస, జీవపు ఢంభాలు ఎదురై వాక్యాన్ని అణచివేస్తాయి. తద్వారా ఫలించరుసుఖబోగాలు మీద ఆసక్తి ఎవరికైనా ఉంటే వారు ఎవరైనా సరే వాక్యం నుండి దూరంగా పోతున్నారు అని గ్రహించాలి. వారు అన్యులైనా, విశ్వాసి అయినా, చివరికి పేరుగాంచిన బోధకుడు/ ప్రసంగీకుడు/ దైవజనుడు అయినా సరే! సుఖబోగాలు/ లగ్జరీలకు అలవాటు పడినవాడు వాక్యానికి దూరంగా పోతున్నాడు అని ఉపమానం లో యేసుక్రీస్తు ప్రభులవారు చాలా స్పష్టంగా చెబుతున్నారు!

 

చివరగా మంచినేల మీద పడిన విత్తనాలు అనగా దేవుని వాక్యాన్ని శ్రద్దగా విని దానిని సరిగా అర్ధం చేసుకుని దాని ప్రకారం జీవించేవారు! ఎన్ని కష్టాలయినా నష్టాలయినా వాక్యం కోసం సమస్తము భరించేవారు! వీరిలో దేవుని ఆత్మఫలం ఫలిస్తుంది!

 

యేసయ్య తోటకాపరి- యజమాని ఉపమానంలో అంటున్నారు- తోటకాపరి ఫలము లేని వృక్షాన్ని నరికేయ్! మూడు సంవత్సరాల బట్టి దీనిలో ఫలములు లేవు గొడ్డు బ్రతుకు బ్రతుకుతుంది కాబట్టి నరికేయ్ అంటున్నారు! లూకా 13:6--9;

 ప్రియ విశ్వాసి! నీవు కూడా మంచి ఫలము ఆత్మ ఫలము ఫలించాలి అప్పుడే నిన్ను వాడుకుంటారు దేవుడు! లేకపోతే నిన్ను తననుండి పెరికివేస్తారు!

 

నీలో దేవుని ఆత్మ పనిచెయ్యాలి! అప్పుడే నీవు మొదటి ఫలం ప్రేమ కలిగియుండగలవు! అది లేకుండా ఎన్ని భాషలు మాట్లాడినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎంతో గొప్ప ప్రార్ధనలు చేసిన స్వస్తతలు చేయగలిగినా మొదటిఫలము ఫలించక పోతే వ్యర్ధమే! మొదటి ఫలమే కాదు మొత్తం ఆత్మఫలములోని భాగాలు మొత్తం పరిశుద్ధాత్మ నీలో పనిచేసినప్పుడే ఫలించగలవు! ఒకవేళ ఎవరైనా నాలో పరిశుద్దాత్ముడు ఉన్నాడు అని భావిస్తూ ఆత్మఫలము లేకపోతే అనగా ప్రేమ సంతోషము అందరితో సమాధానము, మంచితనము, విశ్వాసము ఆశానిగ్రహం లాంటి ఫలము ఫలించక పోతే వానిలో పరిశుద్ధాత్ముడు లేడు గాని భ్రమపరిచే ఆత్మ కలిగి ఉన్నాడని గ్రహించాలి!

 

  సరే ఆత్మఫలము ఫలించాలి అంటే ముందుగా దేవుని వాక్యమనే విత్తనం నాటబడాలి అని చూసుకున్నాం! నాట బడిన విత్తనాన్ని అనగా వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకుని దాని భావాన్ని గ్రహించాలి అని కూడా చూసుకున్నాం! అలాగే ఆధ్యాత్మిక ఫలాలు కూడా దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకుని ఆయనయందు పరిపూర్ణ విశ్వాసం కలిగిఉండాలి! అయితే గమనించ వలసిన విషయం ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న మొదట్లో ప్రేమ విశ్వాసం దయ మనశ్శాంతి ఎంతో గొప్పగా పనిచేస్తాయి. అయితే కొద్దిగా సీనియారిటి పెరిగితే సిన్సియారిటి తగ్గిపోతాది. అప్పుడు ఇహలోక ఆశలందు శ్రద్ధ పెరిగిపోతుంది. ఇది తప్పు తప్పు తప్పు! బాప్తిస్మం తీసుకున్న మొదట్లో గల ప్రేమ, ప్రార్ధన, విశ్వాసం కొన్ని సంవత్సరాల తర్వాత కనబడకపోతే వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు పనిచెయ్యడం లేదు! నిజం చెప్పాలంటే నీకు సీనియారిటి పెరిగేకొద్దీ నీవు విశ్వాసిగా మారిన రోజులలో కనబడ్డ ప్రేమ విశ్వాసం ప్రార్ధన కంటే ఇంకా లోతైన అనుభవాలు పొందగలగాలి! పరిపక్వత సాధించాలి! శ్రమలద్వారా పరిపూర్ణత సాధించాలి! కృప వెంబడి కృప, అభిషేకం వెంబడి అభిషేకం, పూర్ణత నుండి సంపూర్ణత సాధించాలి. వరాలు ఫలాలు పొందాలి! ప్రేమ సంతోషం పొందుకున్న నీవు సహనం, ఇంద్రియ నిగ్రహం తోడవ్వాలి!

పేతురు గారు అంటున్నారు 2పేతురు 1:5—9

5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,

6. జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,

7. భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను (ప్రేమను) అమర్చుకొనుడి.

8. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.

9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేని వాడునగును.

 

  మరొక్కసారి గుర్తుకుచేస్తున్నాను- ఆత్మఫలము లేదా ఆత్మ సంబంధమైన పంట- మనుష్యుల హృదయాలలో దేవుడు- దేవుని ఆత్మ పనిచేస్తున్నాడో లేదో చెప్పడానికి ఋజువు! ఆత్మ ఫలము లేదా ఆత్మ సంబంధమైన పంట ఎవరిలో కనబడటం లేదో వారిలో దేవుడు పనిచెయ్యడం లేదు అని గ్రహించాలి! లోకం దాని ఆశలు పనిచేస్తున్నాయి. తద్వారా పేరుకు క్రైస్తవులైనా మీలో పనిచేసేది సాతాను గాడు అని గ్రహించాలి!

 

  సరే,  ఆత్మఫలము ఫలించడానికి మొదటగా వాక్యం విత్తబడాలి. హృదయంలో అర్ధం చేసుకోవాలి నాటబడాలి అని ధ్యానం చేసుకున్నాం- తర్వాత గ్రహించవలసిన విషయం ఏమిటంటే:  నీవు క్రీస్తులో ఐక్యమై ఉన్నంతవరకే నీవు ఫలించగలవు! యోహాను 15:16లో యేసయ్య దీనికోసం విస్తారంగా చెప్పారు! మీరు నాలో ఫలించాలి. నాకు వేరుగా ఉండకూడదు! నాకు వేరుగా ఉంటే మీరు వాడిపోతారు. ఫలములు ఫలించలేరు అంటూ నాలో నిలిచి ఉండని తీగెను నరికివేసి బయట పారవేయబడి అగ్నితో కాల్చబడుతుంది అన్నారు. గాని ఎవరైతే నిలిచి యుంటారో వారు బహుగా ఫలిస్తారు అంటున్నారు.....

John(యోహాను సువార్త) 15:1,2,3,4,5,6

1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.

2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.

3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు.

4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.

 

 ఇంకా హెబ్రీ పత్రికలో పౌలుగారు చెబుతున్నారు 6:712

 

7. ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

8. అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.

9. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.

10. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.

11. మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును

12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.

 

కాబట్టి దేవుని ఆజ్ఞలకు లోబడి వాటి ప్రకారం జీవించిన వాడే ఫలములు ఫలించగలడు. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పినట్లు చేసేవారే సారవంతమైన మంచినేలమీద పడిన విత్తనాలు! వారే నూరంతలుగా ఫలించగలరుకాబట్టి మన హృదయ స్తితి గురుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానికి విధేయులవుతూ ఉండాలి. దేవుని వాక్యం ద్వారా హృదయం దున్నబడుతూ మెత్తబడుతూ రాళ్ళు ముళ్ళు లాంటివి వచ్చినప్పుడూ పెరికివేస్తూ ఉండాలి. అలా కాకపోతే మనం ఫలించలేము అని గ్రహించాలి.

 

  కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డా! నీవు ఆత్మఫలము ఫలిస్తున్నావా? లేదా? లేకపోతే జాగ్రత్త! ఎవరైతే ఆత్మఫలము ఫలించరో వారు అగ్నిలో వేయబడతారు. ఆత్మఫలము ఫలించాలి అంటే నీవు ఆత్మపూర్ణుడవు కావాలి! ఆయనాత్మ లేనివాడు ఆయనవాడు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. రోమా 8:9;  ఒకవేళ నీలో శరీరకార్యాలు కనిపిస్తున్నాయా అయితే మీదన వాక్యం చెబుతుంది 5:16.. ఆత్మానుసారంగా ప్రవర్తించుడి అప్పుడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించరు! కాబట్టి నేడే ఆయనాత్మను పొందుకో! ఆయన ఆత్మ తాకిడిని అభిషేకాన్ని పొందుకుంటూ ఉండాలి! నిత్యమూ అన్యభాషలతో నింపబడుతూ ఆయనాత్మలో గల నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడే నీవు ఆత్మఫలమును పొందుకుని ఆయన చెప్పినట్లు జీవించగలవు! ఇంకా జయ జీవితాన్ని పొందగలవు! సంపూర్ణతను సాధించఫలవు!

అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

 

 

        

 

*గలతీ పత్రిక-54 భాగం*

*ఆత్మ ఫలము-1*

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.       గలతీ 5:22—23

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- విడిచిపెట్టాల్సిన శరీరకార్యాలు కోసం ధ్యానం చేసుకుని ఆత్మఫలము యొక్క అవసరతను ఉపోద్ఘాతం గా చూసుకున్నాము!

ఈ రోజు మొదటగా ఆత్మఫలములో మొదటిది శ్రేష్టమైనది అయిన *ప్రేమ* కోసం ధ్యానం చేసుకుందాం!

 

కొలస్సీయులకు 3: 14

వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.

 

ప్రియులారా! వచనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కారణం పౌలుగారు రాసిన పత్రికలు మామూలుగా చదువుకుంటూ పోతేఏమీ అర్ధం కాదు మనకు. దానిని జాగ్రత్తగా ప్రార్ధనపూర్వకముగా చదివితే అర్ధం అవుతాయి మనకు పౌలుగారిని వాడుకొని పరిశుద్ధాత్ముడు ఎన్ని మంచి సందేశాలు మనకోసం వ్రాయించారో అర్ధం అవుతుంది. వచనంలో అంటున్నారు పౌలుగారుపరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ ఆయన వీటన్నికన్నా ప్రేమను ధరించుకొనుడి అనడం లేదు గాని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటున్నారు. దీని అర్ధం చాలా ఉంది గాని సింపుల్ గా చెప్పాలంటేప్రేమకుపరిపూర్ణతకు సంబంధం ఉంది.

 

పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే పరిచర్య చేయాలి అది fivefold ministry గాని, tenfold ministry అయినా సరే! సంపూర్ణులు పరిపూర్ణులు కావాలి అంటేప్రేమను ధరించుకోవాలి!!! ఒక వ్యక్తికి ఎన్ని ఫలాలు, శక్తులు, టాలెంట్లు ఉన్నా ప్రేమలేకపోతే పరిపూర్ణుడు కాలేడు! పౌలుగారు అంటున్నారు

1 కొరింథీ 13:1-3 లో

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.  . ..

*కాబట్టి ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు వేస్ట్ ఫెల్లో!*

 

     ప్రేమకు ప్రతిరూపం యేసుప్రభులవారు! అందుకే ఆయన మనలను రక్షించడానికి మానవరూపం దాల్చి, పరమును విడచి, భువికి వచ్చారు. Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. . . .. . ఆయన మనకోసం ఎన్ని బాధలు పడ్డారో కదా!

 

  ఇక ప్రేమకోసం బైబిల్ ఎక్కువగా రాసినవారు మొదటగా పౌలుగారు, రెండవదిగా యోహానుగారు! ప్రేమకోసం రాయడానికి కారణం విశ్వాసుల మధ్య ప్రేమ ఒక్కటే వారి మధ్య పరిపూర్ణ ఐక్యతను నెలకొల్పగలదుప్రేమలేకపోతే మనుష్యులు మధ్య స్వార్ధంతో కూడిన ఆశలు, తగాదాలు, కొట్లాటలు, చీలికలు ఉంటాయి. ప్రేమలేకపోతే శరీర కార్యాలు అన్నీ పనిచేస్తాయి!

 

 అందుకే సామెతలు 10:12 లో ప్రేమ దోషములను కప్పును అంటున్నారు. ప్రసంగీ 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది , ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది అంటున్నారుదేవుడు మనపట్ల చూపేది ఆగాపే ప్రేమ! అది అమరమైనది! అమోఘమైనది! అందుకే ఆయన యిర్మియా 31:3 లో అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపు చున్నాను. ఎంత ప్రేమామయుడో మన స్వామి యేసు!!!

అదే ప్రేమను మనము కూడా కలిగియుండాలి అనేది దేవుని ఆశ! అయితే ఈ ప్రేమ చల్లారిపోతుంది మనుష్యులలో! ఎలాఅక్రమము విస్తరించినందువలన అనేకుల ప్రేమ చల్లారును! మత్తయి 24:12;

 

   యోహాను 17:26 జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రియైన దేవుడు యేసుప్రభులవారియందు  ఏ విధమైన ప్రేమను ఉంచారో- అదేప్రేమ యేసుప్రభులవారు మనయందు ఉండేలా తండ్రిని వేడుకున్నారు

పౌలుగారు చెప్పిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి:

రోమా 5:5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

. . దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా!

కాబట్టి ఆ ప్రేమను కోల్పోవద్దు! మరి ఈ ప్రేమ మనలో ఎలా ఉండాలి?

 

*** నిష్కపటమైనదిగా ఉండాలిరోమా 12:9;

*** చెడును అసహ్యించుకొనాలిరోమా 12:9;

*** అనురాగం కలిగినదై యుండాలి. రోమా 12:10;

*** పొరుగువారికి కీడు చేయనిది రోమా 13:10;

*** క్షేమాభివృద్ధి కలుగజేసేది.  1 కొరింథీ 8:1;

 

ఇంకా Romans(రోమీయులకు) 13:8,9,10

8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

* ప్రేమ దీర్ఘకాలము సహించును,

* దయ చూపించును.

* ప్రేమ మత్సరపడదు;

* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;

* అది ఉప్పొంగదు;

* అమర్యాదగా నడువదు;

* స్వప్రయో జనమును విచారించుకొనదు;

* త్వరగా కోపపడదు;

* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

* దుర్నీతివిషయమై సంతోషపడక

* సత్యమునందు సంతోషించును.

* అన్ని టికి తాళుకొనును,

* అన్నిటిని నమ్మును;

* అన్నిటిని నిరీక్షించును;

* అన్నిటిని ఓర్చును.

* ప్రేమ శాశ్వతకాలముండును. 

 

👉 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

            1కొరింది 13:4-8,13

అందుకే 1 కొరింథీ 14:1 లో

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి(మూలభాషలో-ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

గలతీ 5:6 ప్రకారం విశ్వాస కార్యసాధకం కావాలి అంటే ప్రేమ తప్పకుండా కావాలి!

 

గలతీ 5:22

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

 

ఫిలిప్పీ 1:9

మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ...

 

అందుకే హెబ్రీ 10:25 లో

ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము  అంటున్నారు.

 

పేతురుగారు ప్రేమ కోసం ఏమ్మన్నారు ఈ వచనాలలో ఉన్నాయి  1పేతురు 1: 21

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,. . .,

ఇంకా రిఫరెన్సులు 3:8, 4:8;

యోహాను గారు చెప్పినది చూద్దాం. 1 యోహాను 2:5

ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

మరిన్ని రిఫరెన్సులు 3:16; 3:17; 4:7, 12, 18; 2 యోహాను 1:6

 

కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి మహోన్నత ప్రేమ మనలో ఉన్నదా? మన ప్రేమ కేవలం మాటలలోనా, చేతలలో కూడా ఉందా? ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!

అట్టి ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-55 భాగం*

*ఆత్మఫలము-2*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *సంతోషము* దీనినే ఆనందము అని కూడా అనవచ్చు!

 

ఆత్మ ఫలములోని రెండవ అంశము: *సంతోషము*

 

ప్రతీ ఒక్కరు ఆనందంగా ఉండాలనే ఆశపడతారు. దానికోసమే ప్రయాసపడతారు. ఏడ్పు ముఖంతో వుండాలని ఎవ్వరూ కోరుకోరు. అట్లాంటి వారిని ఎవ్వరూ ఇష్టపడరు కూడా. అయితే, సంతోషం కోసం వెదికే క్రమంలో, మనిషి దుఃఖాన్ని కొని తెచ్చుకొంటున్నాడు. ఆనందంకోసం వెదికే క్రమంలో, అలవాట్లకు బానిసయై మృత్యుకోరల్లో నలిగిపోతున్నాడు. క్షణికమైన ఆనందం కోసం, శాశ్వతమైన జీవితాన్ని కాలదన్నుతున్నాడు.

 

🔺 *లోకం దృష్టిలో సంతోషం అంటే*?

* బీర్లతో బార్లలో గడపడం.

* మద్యంతో మత్తులై రోడ్లమీద దొర్లడం.

* బాయ్ ఫ్రెండ్స్ తో , గాళ్ ఫ్రెండ్స్ తో తిరగడం.

* చాటింగ్, డేటింగ్ (సహజీవనం)

* జూదం, సినిమాలు, షికార్లు, సిగరెట్లు, ఖైనీలు, గూట్ఖాలు.... ఇట్లా ఎన్నెన్నో

 

🔺 *ఈ సంతోషం మనిషిని ఎక్కడకి తీసుకెళ్తుంది అంటే?*

* కుటుంబాలు విచ్చిన్నం

* ఆర్ధికంగా పతనం

* ఆరోగ్యం క్షీణించడం

* సమాజంలో గౌరవం శూన్యం

* ఆధ్యాత్మికంగా మృతతుల్యం.

* జీవచ్ఛవాల్లా జీవిస్తూ, రోజులు లెక్కపెట్టుకొనే స్థితికి చేర్చుతుంది.

 

*సంతోషం అంటే ఇదేనా?*

*దీనికోసమేనా ఆరాటం?*

 

ఇంతకీ *నిజమైన సంతోషం ఎట్లా వుంటుందో తెలుసా?* దాన్ని వర్ణించడానికి బాష చాలదు. అది అనుభవించేవారికి మాత్రం అర్ధమవుతుంది. అట్టి అనుభవం లోనికి నీవు రావాలన్నదే నా ప్రార్ధన.

 

🔺 *సంతోషానికి కారణం?*

దేవుని ప్రేమ, కృప, ఆశీర్వాదాలు, వాగ్ధానాలు, దేవునితో సాన్నిహిత్యం.

🔺 *ఈ సంతోషం ఎవరికి సాధ్యమంటే?*

క్రీస్తులో విశ్వాసముంచిన వారికి మాత్రమే.

 

దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము

                    2 కొరింథీ 6:10

 

మాటలు చెప్పగలగడం క్రీస్తులో విశ్వాసముంచిన వారికి మాత్రమే సాధ్యం. ప్రతీ పరిస్థితియందు సంతోషించడం వీరికి మాత్రమే సాధ్యం.

 

దేవుని వాక్యాన్ని బట్టి *సంతోషించే జీవితం* ధన్యమైనది.

 

యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

          కీర్తనలు 112:1

 

మనమైతే? లోకంలో మనకు కలిగిన యోగ్యతలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి హర్షించే వారముగా, అతిశయించే వారముగాఆనందించేవారముగా వున్నాము. కానీ, మనకు కలిగిన ఇట్టి యోగ్యత ఆయనను బట్టే అనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నాము. నిజ సంతోషానికి కారకుడైన క్రీస్తుని విడచి, లోకంలోని సంతోషాలకోసం పరుగులు తీస్తున్నాం. ధన్యతను ( ఆశీర్వాదం) పోగొట్టుకొంటున్నాం!

 

దేవుని కృపను బట్టి *సంతోషించే జీవితం* పరిపూర్ణమైనది.

 

నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.

                      2 కొరింథీ 12:9

 

దేవుని కృపను బట్టి సంతోషించే వ్యక్తి, బలహీన సమయంలో కూడా బలవంతుడుగానే వుండగలడు. శ్రమను, సంతోషాన్ని కలసి అనుభవించడం అతనికే సాధ్యం. అట్టి అనుభవం నీకుందా?

 

*క్రీస్తులో విశ్వాసముంచినవారు చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.*

 

మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

        1 పేతురు 1:8,9

 

 🔺 *ప్రియ నేస్తమా!*

యేసులో ఆనందం శాశ్వతమైనది.

ఆయనలో ఆనందించడానికి మన జీవితాలను సిద్ధపరచు కుందాము. ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాము.

ఆత్మ ఫలము ఫలిద్దాము!

 

అట్టి కృప, ధన్యత

దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-56 భాగం*

*ఆత్మఫలము-3*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *సమాధానము*

కొలస్సీ 3:15

క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

 

   వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి అంటున్నారు పౌలుగారు!

 

1). ఇది కూడా ఆత్మఫలములో ఒక భాగము. గలతీ 5:22;

 

2) వచనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటున్నారు. సమాధానమునకు మరో నానార్ధం శాంతి! శాంతి ఉంటేనే సమాధానం ఉంటుంది. అయితే ఇది ఎవరిచ్చే సమాధానం? క్రీస్తు అనుగ్రహించే సమాధానం! అందుకే యేసుప్రభులవారు తను పరమునకు వెల్లకమునుపు అంటున్నారు.

యోహాను 14: 27

శాంతి (లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే (లేక, సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

 కాబట్టి ఆ శాంతిని మనం పొందుకుంటే, మన హృదయాలలో శాంతి ఉంటుంది, అప్పుడు మనుష్యుల మధ్య సమాధానం ఉంటుంది.

 

3) ఇక్కడ పౌలుగారు సమాధానం కలిగియుండుడి అనడం లేదుసమాధానం ఏలుచుండనియ్యుడి అంటున్నారు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనమీద అధికారం చేయాలి, ఏలాలి. అప్పుడే ఆయన శాంతి, సమాధానం సంపూర్తిగా పొందుకోవచ్చు!

 

       నేటిదినాల్లో శాంతి-సమాధానం లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి! భార్యాభర్తలమధ్య సమాధానం లేదు! తల్లిదండ్రులు- పిల్లలమధ్య సమాధానం లేదు! పిల్లల మధ్య సమాధానం లేదు! సంఘంలో సమాధానం లేదు! సంఘకాపరిసంఘపెద్దల మధ్య సమాధానం లేదు! సంఘపెద్దలుసంఘసభ్యులమధ్య సమాధానం లేదు! సంఘకాపరులు/ సేవకుల మధ్య సమాధానం లేదు! వీరిమధ్య సమాధానమును తీసివేసి, అశాంతిని కలిగించి, ఈర్ష్యద్వేషాలు రగిలించి , వీరు కొట్టుకుంటుంటే, తగాదాలు పడుతుంటే సాతాను గాడు తెగ సంభరపడుతున్నాడు. గెంతులేస్తున్నాడు! పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు!!! ప్రియ సంఘమా! ఒకసారి ఆలోచించు! పరిశుద్దాత్ముని సంతోషపరుస్తావా? దుఃఖపరుస్తావా? ఆలోచించుకో!

 

     ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది కీర్తన 133 ప్రకారము

1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

2. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును

3. సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

కాబట్టి మన జీవితాలలో ఆశీర్వాదం లేదు అంటే మనలో సమాధానం లేదన్నమాట! ఐక్యత లేదన్నమాట!

 

   ఐక్యతసమాధానం లేనందువలన మొట్టమొదటి కుటుంబంలో హత్య జరిగింది! కయీనుహేబెలు మధ్య సమాధానం లేక, కయీను హేబెలును చంపివేశాడు. శాపగ్రస్తుడయ్యాడు! యాకోబుగారి కుమారుల మధ్య సమాధానం లేక తమ్ముడిని చంపబోయారు. చివరికి బానిసగా అన్యులకి అమ్మివేశారు యోసేపును!

 

   అదే ఐక్యతగా ఉన్నప్పుడు ఏం చేశారు? అదే యాకోబు కుమారులు శత్రువుల మీద పగతీర్చుకున్నారు. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగో సమాధానంగా, ఐక్యంగా ప్రార్ధన చేశారు. రాజు మరచిపోయిన కలను చెప్పగలిగారు. తమ ప్రాణములు కాపాడుకోగలిగారు. అసాధ్యాలనుసుసాధ్యం చేశారు. సింహపు నోళ్లను మూశారు. అగ్నిగుండములో ఏమీ ఇబ్బందులు పడకుండా తిరిగి, ప్రాణములతో బయటికి వచ్చారు. ఆదిమ సంఘం, ఆది అపోస్తలులు కలసిమెలసి ఉండి, సమైక్యతతో ఉన్నందువలన ఎన్నో అధ్బుతకార్యాలు చేసారు. భూలోకమును తల్లక్రిందులు చేయువారు అనే బిరుదు పొందుకున్నారు! అదీ సమాధానమునకు ఉన్న శక్తి!

 

   సమాధానమును బంధముచేత పోల్చారు పౌలుగారు. ఎఫెసీయులకు 4: 1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

ఈ సమాధానమను బంధము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాంతిసమాధానం, అద్భుతాలు ఉంటాయి. లేకపోతే తగవులు, కొట్లాటలు, కోర్టులు ఉంటాయి!

 

  అందుకే యేసు ప్రభులవారు తన శిష్యులను సేవకు పంపిస్తూ, మీరు వెళ్ళిన గృహానికి సమాధానము కలుగును గాక అని దీవించమంటున్నారు! మత్తయి 10:12,13;

రోమీయులకు 5: 1

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.

 

అలాచేస్తే

ఫిలిప్పీయులకు 4: 7

అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.

 

 ఇంకా

2థెస్సలొనికయులకు 3: 16

సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.

 

   అట్టి సమాధానము మనలో లేకపోతే ఇప్పుడే సమాధాన పడుదాం! కారణం యోహాను గారు రాస్తున్నారు తన సహోదరున్ని ప్రేమించని వాడు, తన సోదరునితో సమాధానముగా ఉండని వాడు వేషధారి, నరహంతకుడు, 1 యోహాను 4,5 అధ్యాయాలు. . . కాబట్టి అందరితో సమాధానముగా ఉందాం. పౌలుగారు అంటున్నారు సఖ్యమైతే సమస్తమైన వారితో సమాధానముగా ఉండుడి. రోమా 12:18;

అట్టి సమాధానము, శాంతి మనందరం పొందుకుందుము గాక!

క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాలను ఏలుచుండును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

*గలతీ పత్రిక-57 భాగం*

*ఆత్మఫలము-4*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *దీర్ఘశాంతము*

 

కొలస్సీ 3:12

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి

 

*దీర్ఘశాంతము*: అనగా ఓర్చుకొనే బుద్ధి. ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు! కొన్ని ప్రతులలో దీర్ఘశాంతానికి ఓర్పు అని తర్జుమా చేశారు.

 

   ఇది కూడా

1. దేవుని గుణగణాలలో ఒకటి.

 

 నిర్గమకాండము 34: 6

అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.;

 

 2. ఆత్మఫలములో ఒక ఒకభాగము.

గలతీ 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, *దీర్ఘశాంతము*, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

 

కాబట్టి దేవుని లక్షణాలను మనం కూడా అలవర్చుకోవాలి!

సామెతలు 19:11 లో

ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

సుబుద్ధి ఉంటే దీర్ఘశాంతము ఉంటుంది/ వస్తుంది. అదే దుర్బుద్ధి/ సుండుబుద్ధి ఉంటే అతికోపం/ షార్ట్ టెంపర్ ఉంటుంది. అప్పుడు బుద్ధిహీనుడుగా, మూర్ఖుడిగా పేరు తెచ్చుకొని, ప్రజలచేత ద్వేషించబడతావు. కొన్నిసార్లు దెబ్బలుకూడా తినవలసివస్తుంది.

 

    మరి అనొచ్చు నిర్ఘమ 34:6 లో దేవుడు దీర్ఘశాంతుడు అని వ్రాయబడింది కదా మరి ఇశ్రాయేలీయుల మీద ఎందుకు అలా కోపపడ్డారు? ఎందుకు వారిని అన్ని ఇబ్బందుల పాలు చేశారు

జవాబు: మీకా 2:7.

యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?

 

   అనగా వారు యధార్ధముగా ప్రవర్తించనందున దేవుడు వారిమీద ప్రతీకారం చేయవలసివచ్చింది.

 

   అదే విషయాన్ని యేసుప్రభులవారు ప్రస్తావించారు లూకా 18:8 లో

ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని (లేక ఆలస్యము చేయుచున్నాడు) మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద (ఆ విశ్వాసము) విశ్వాసము కనుగొనునా?

 

   అనగా మనం ఎన్ని తప్పు పనులు చేసినా ఇంకా మారతారు కదా అని దేవుడు మనయెడల దీర్ఘశాంతము చూపిస్తున్నారు. అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నారు 2 పేతురు 3:9; లేనియెడల మనం ఇప్పటికి నాశనమైపోయి ఉండేవారము. దీర్ఘశాంతాన్ని చేతకానితనముగా అనుకోవద్దు!

 

పేతురు గారు మాట్లాడుతూ 1 పేతురు 3:20లో.

దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

 

అందుకే 2 పేతురు 3:15 లో మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్ధమైనదని ఎంచుకోండి. అది చేతకానితనముగా జమకట్టవద్దు.

 

2పేతురు 3: 9

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 

 రోమీయులకు 2: 4

లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?

 

    యోసేపుగారు దీర్ఘశాంతము చూపించారు. చివరికి ఐగుప్తు దేశానికి గవర్నర్ కాగలిగారు. యోబుగారు దీర్ఘశాంతముతో శ్రమలను ఓర్చుకున్నారు. రెట్టింపు దీవెన/ ఆశీర్వాదం పొందుకున్నారు. అటువంటి దీర్ఘశాంతము నీకు నాకు కావాలి.

 

   దీర్ఘశాంతమునే ఓర్పు అనికూడా అంటారని చూసుకున్నాం! కాబట్టి నీవు  కూడా ఓర్చుకోవలసిఉంది.

 కీర్తన 40:1.

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.

 

అంతేకాదు సామెతలు 15:18

కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

 

ఈ ఓర్పుగలవారిని యేసుప్రభులవారు మంచినేల మీద పడిన విత్తనాలతో పోలుస్తున్నారు. లూకా 8:15 లో

మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.

 

కాబట్టి నీవు మంచినేలమీద పడితే ఓర్చుకుంటావు. ఫలిస్తావు.

 

లూకా 21:19 ప్రకారం అంత్యకాలములో మీ ఓర్పుచేత ప్రాణములు రక్షించుకొంటావు.

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,. . 

 

ఇదే విషయాన్ని మనం మొదటిబాగాలలో ధ్యానం చేసుకున్న పౌలుగారి ప్రార్ధనలలో కూడా రాశారు.

కొలస్సీ 1:11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, . . .

 

1థెస్సలొనికయులకు 5: 14

సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.. .

 

తిమోతికి లేఖ రాస్తూ పౌలుగారు అంటున్నారు 1 తిమోతీ 6:11

దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి (విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము (వెంటాడుము).

 

2 తిమోతీ 3:10 .

అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును. .

 

హెబ్రీ 10:36 .

మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.

 

యాకోబుగారు కూడా అంటున్నారు 5:7-8 .

సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా

 

   కాబట్టి అటువంటి దీర్ఘశాంతము, ఓర్పు మనందరమూ కలిగియుందుము గాక!

ప్రకటన 3:10 .

నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో- శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను.

ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-58 భాగం*

*ఆత్మఫలము-5*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *దయాళత్వము*

 

దయాళుత్వము అంటే?

* ఇతరులను బాధ పరచకపోవడం,

* నొప్పించక పోవడం.

 

ఇతరులు తప్పుచేసినా వారిని శిక్షింపక, క్షమించే గుణందయ”. అయితే, దీనికి భిన్నంగా వున్నాయి కదా మన జీవితాలుతప్పుచెయ్యక పోయినా ఏదో ఒకటి మోపి, వారిని శిక్షించాలని ఆరాట పడుతున్నాము.

 

అయితే, ప్రభువు మన పట్ల ఎట్లాంటి దయచూపగలిగాడో అర్ధం చేసుకొని, ఆయన పిల్లలముగా అట్లాంటి దయార్ధ హృదయాన్ని కలిగియుండాలి. మన జీవితాలకు ఆయనే గొప్ప రోల్ మోడల్.

 

ప్రభువు మన దోషముల విషయమై దయగలిగి యున్నాడు. దోషములు అంటే? “పాపము (తప్పు) అని తెలిసికూడా మనము చేసే పనులు.” వాటి విషయంలో మనలను శిక్షించక, వాటిని మరెన్నటికి జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు.

 

అవును! ఆయన దయగలవాడు కాబట్టే, నేటికిని మనము నిర్మూలము కాకుండా జీవించగలుగుతున్నాము. (అట్లా అని ఇదే జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చెయ్యొద్దు. ఆయన కృప, ఉగ్రతగా మారనివ్వొద్దు.)

 

నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.             హెబ్రీ 8:12

 

ఆయన పిల్లలముగా, మనమునూ, ఒకరిపట్ల ఒకరు దయగలిగి యుండాలి. ఒకరినొకరు నొప్పించక జీవించగలగాలి. ( అట్లా అని ఒకరు తప్పు చేస్తున్నా వారిని నొప్పించక ప్రోత్సహించు అనేది దీని అర్ధం కాదు)

 

ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.       ఎఫెసీ  4:32

 

దేవుని చేత ఏర్పరచబడిన మనము, లోకమునుండి ప్రత్యేకించబడిన మనము, పరిశుద్ధ జీవితం జీవించడానికి తగినవిధంగా దయాళుత్వమును ఒక ఆభరణముగా ధరించుకోవాలి:

 

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.              కొలస్సి 3:12

 

ఆత్మ ఫలమనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే, ఏకీకృత జీవన విధానం. ఆత్మ ఫలములో ఒక్క అంశము సక్రమముగా లేకున్నా, ఆత్మ ఫలము దెబ్బతిన్నట్లే.

 

ఏస్థితిలో తప్పిపోతున్నామో, జ్ఞాపకం చేసుకొని, సరిచేసుకొని, ఆత్మ ఫలాన్ని ఫలించి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడదాం!

దయాళత్వము: దీనికి మరోపేరు దయ! అనగా దయగల హృదయం. ప్రేమ ఉంటే జాలి ఉంటుంది. జాలి ఉంటే దయ ఉంటుందిదయ అనగా kindness- మంచితనము అని మరో నానార్ధం ఉంది. ఇది దేవుని గుణాతిశయములలో ఒకటి.

 నిర్గమకాండము 34: 6

అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.

 

దేవుడు దయగలవాడు  2 దిన వృత్తాంతాలు 30:19;

దేవుని ఆత్మ దయగలది కీర్తన 143:10;

ఇలాంటి దయగల మాటలు దేవుని దృష్టికి పవిత్రములు సామెతలు 15:26;

 

మరి దయాళత్వము- దయ ఎలా వస్తుంది?

యేసయ్య ప్రేమ నీ మదిలో మెదలినప్పుడు.

 

   ప్రియ స్నేహితుడా! దేవునికున్న గుణాతిశయములలో ఒకటి దయ! అందుకే నీవు నేను ఎన్నిసార్లు తప్పిపోయినా, దయచూపించి మరలా నిన్ను నన్ను చేర్చు కుంటున్నారు. దయను, కృపను, వాత్సల్యతను చేతకానితనముగా తీసుకోవద్దు!

అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఆశిస్తున్నారు ఆయన!

కాబట్టి నేడే పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువద్దకు రా!

అంతేకాదు, నీవు కూడా దయగల మనస్సుని పొందుకో!

కనికరం గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7;   అలాగే దయగలవారు ధన్యులు వారికి దయ చూపించబడును అని కూడా వస్తుంది.

నీవు దయ చూపించకపోతే దేవుడు కూడా నీకు దయ చూపించరు!

నేడే మార్పుపొందు!

దయ గల హృదయాన్ని, జాలిగల మనస్సును పొందుకో!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-59 భాగం*

*ఆత్మఫలము-6*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *మంచితనము*

 

ఆత్మ ఫలము లోని ఆరవ అంశము: *మంచితనము*

 

🔺 *మంచితనము అంటే?*

సత్యం, నీతి విషయాల్లో రోషం కలిగి, దుష్టత్వం విషయంలో ద్వేషం కలిగియుండడం.

 

🔺 *వెలుగుయొక్క ఫలము మంచితనము:*

వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. (ఎఫెసీ 5:6)

 

   *మంచితనము రెండు విషయాల ద్వారా వ్యక్తం కావాలి.*

🔺 1. *దయాపూర్వకమైన విషయాలలో*:

దయచూపడంలో ప్రభువుకు సాటి మరెవ్వరూ లేరు. ఆయన పేరే దయామయుడు.

 

* కుంటివారికి కాళ్ళిచ్చారు

* గ్రుడ్డివారికి కళ్ళు ఇచ్చారు

* కుష్టు రోగులను స్వస్థపరిచారు.

* చనిపోయినవారిని బ్రతికించారు.

* రోగులను స్వస్థపరిచారు

* పాపములను క్షమించారు.

* ఆయన ప్రాణమునే ఇచ్చారు

ఇట్లా లెక్కలేనన్ని.

 

ఇవి మనము చేయలేకపోయినా, కనీసం మన పొరుగువారికి ప్రేమించగలగాలి. కష్టసమయాలలో ఆదరించాలి, ఆదుకోవాలి. నశించిపోతున్నవారి కొరకు ప్రార్ధించి, వారిని నిత్యమరణం నుండి తప్పించాలి.

 

🔺 2.  *చెడుతనాన్ని గద్దించి, సరిదిద్దడంలో* :

దయామయుడుగా, శాంతమూర్తిగా కనబడే ప్రభువు, దుష్టత్వం విషయంలో మాత్రం రాజీపడే వాడు కాదు. చూచీ చూడనట్లు తప్పించుకొని పోయేవాడు కాదు.

యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని  దొంగల గుహగా చేసెడివారనెను.

     మత్తయి 21:12,13

 

పరిస్ధితి నేటి దినాలలో లేదు కదా? ఆయన పని ఆయన చూచుకుంటాడులే అని ఎవరికీ వారిమే తప్పించుకొనిపోతుంటే, ఇక రాజ్యమేలేది దుష్టత్వమే కదా?

దయాపూర్వకమైన విషయాలలోనూ, చెడుతనాన్ని గద్దించి, సరిదిద్దడంలోనూ రెండింటిలో ఏది లోపించినా? “మంచితనములోపించినట్లే. తద్వారా ఆత్మఫలము లోపము గలిగినదిగానే మిగిలిపోతుంది. దేవుడు మననుండి కోరుకొనేది లోపభూయిష్టమైనది కాదు గాని, శ్రేష్టమైన ఫలాన్ని ఆశిస్తున్నాడు.

 

ఇంకా యెషయా ప్రవక్త ప్రవచించిన విషయాలు జరిగించడం కూడా మంచితనమే!

 

Isaiah(యెషయా గ్రంథము) 58:6,7,8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

 

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

ఆత్మఫలమును పొందుకుని , మంచితనమును మన జీవితాలలో కలిగి పేరుకు తగ్గట్టుగా దేవుని బిడ్డలుగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-60 భాగం*

*ఆత్మఫలము-7*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *విశ్వాసము*

 

ఆత్మ ఫలము లోని  ఏడవ అంశము: *విశ్వాసము* :

 

🔺 విశ్వాసము అంటే?

*నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు*.

                     హెబ్రీ 11:1

 

🔺 *విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది*.

1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.

2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.

 

🔺 *విశ్వాసం అంటే*?

చీకటిలోనికి దూకడం కాదు.

* గాలిలో మేడలు కట్టడం కాదు.

* దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.

* నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.

* దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.

* పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.

 

నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసములోనికి నడిపించగలగాలి.

 

ఒకవేళ పాస్ పోర్ట్, విసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్లిపోగలవేమో గాని, యేసు క్రీస్తు లేకుండా, నిత్యరాజ్యం చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు.

 

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6)

 

నిత్యజీవాన్ని నీవు చేరాలంటే? దాని 'మార్గమైన' యేసు ప్రభువును నీవు చేరాలి. 'విశ్వాసమే' నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు.

 

🔺 1. 'విశ్వాసమే' రక్షణకు మార్గము.

మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. (ఎఫెస్సి 2:8)

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. (మార్కు 16:16)

 

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9)

 

🔺 2. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఆయన పిల్లలు.

 

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను 1:12)

 

🔺 3. ఎవరయితే ఆయనను నిజముగా యధార్థంగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగియుంటారో వారు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.

 

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. (యోహాను 6:47)

 

🔺 4. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు తీర్పులోనికి రారు.

ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. (యోహాను 3:36)

 

🔺 5. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు.

 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.  (యోహాను 3:16)

 

దేవుని రాకడ సమీపం కానుంది. అబద్దబోధకులు యేసు క్రీస్తు దేవుడు కాదని అసత్య ప్రకటనలు ముమ్మరం  చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంధము 'సాతాను సమాజము' అని పిలుస్తుంది.

 

🔺 అయితే ఒక్క విషయం ఆలోచించు!!!

* యేసు క్రీస్తును దేవునినిగాఅంగీకరించనివారు, విశ్వసించనివారు ఎట్లా రక్షించ బడతారు?

* ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు?

* ఎట్లా ఎత్తబడే సంఘములో వుంటారు?

* ఎట్లా తీర్పు నుండి తప్పించ బడతారు?

* ఎట్లా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు?

 

సాధ్యం కానేకాదు. నిత్య మరణమే వారి గమ్యం.

 

వద్దు!

విశ్వసిద్దాంఆత్మఫలము ఫలిద్దాం!

 

విశ్వాసము కలిగి విశ్వాసవీరులు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనము కూడా చేద్దాం!

అదే విశ్వాసంతో అబ్రాహాము గారు తన కుమారుడైన ఇస్సాకును మరలా పొందుకోగలిగారు,

అదే విశ్వాసముతో మోషేగారు ఐగుప్తులో, కనాను మార్గములో ఎన్నో అసాధారణ అద్భుతాలు జరిగించారు!

అదే విశ్వాసముతో సూర్యచంద్రులను ఆపారు యెహోషువా!

అదే విశ్వాసముతో గొల్యాతును ఒక్క దెబ్బతో చంపారు దావీదు గారు!

ఇంకా విశ్వాస వీరులు చేసిన గొప్పగొప్ప కార్యాలు మనం హెబ్రీ 11లో చూడగలం!

విశ్వాసవీరులకు కలిగినటువంటి విశ్వాసము మనకు కూడా కావాలి!

విశ్వాసం పొందుకుందాం!

నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం!

 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-61 భాగం*

*ఆత్మఫలము-8*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము    సాత్వికము

 

    సాత్వికము అనగా చాలా నెమ్మదస్తుడు, ఎవరు ఎన్ని మాటలన్నా కోపపడకుండా భరిస్తూ- పరుషమైన మాటలతో కాకుండా ప్రేమతో జవాబు చెప్పేవారు సాత్వికులు. సాత్వికము అనే మాట వస్తే మనకు గుర్తుకు వచ్చేది మోషేగారు! మోషే భూమిమీద నున్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని దేవుడే certify చేశారు. సంఖ్యా 12:3; ఈసాత్వికమే ఆయనను నాయకుణ్ణి చేసింది. ఐగుప్తులో యుద్ధవిన్యాసాలలో ప్రావీణ్యం పొందితే, మిధ్యాను దేశంలో 40 సం.లు పశువులు- మందలు కాయడం ఎలా అని ట్రైనింగ్ ఇచ్చారు. పశువులు అన్ని ఒక రకంగా ప్రవర్తించవు. వాటిని కంట్రోల్ చేయడం ఎలా, మేపడం ఎలా, నిర్వహించడం ఎలా అన్నీ నేర్పించారు. బహుశా ఇదే ఆయనకు సాత్వికము నేర్పించి ఉంటుందని నా ఉద్దేశ్యము! మండుచున్న పొద ఆయనకు దేవునితో సాంగత్యము నేర్పించింది. మూడు అనుభవాలు ఆయనను మహా గొప్పనాయకున్ని చేశాయి! సాత్వికమును ఉపయోగించి ఆయన దేవుని దృష్టిలో అత్యంత సాత్వికుడు అయ్యారు.

 

    యేసుప్రభులవారు తన కొండమీద ప్రసంగంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నారు. మత్తయి 5:5; కాబట్టి సాత్వికమునకు అంత గొప్పశక్తి ఉంది. యేసయ్య గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పారు ఆయన సాత్వికుడని! అది మత్తయి 21:5 లో నెరవేరింది.

ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.

 

 అందుకే ఆయనను అన్ని చిత్రహింసలు పెట్టినా, హింసించినా, గేలిచేసినా, అవమానపరచినా సాత్వికుడైతండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని మన పక్షముగా దేవుని దగ్గర క్షమాపణ అడిగి, మనకు క్షమాభిక్ష పెట్టారు. అందుకే ఆయన మనందరికీ గురువు అయ్యారు. ఆయన సాత్వికుడు కాబట్టి మనము కూడా సాత్వికులమై ఉండాలి,

   2 సమూయేలు 22:36

నీ సాత్వికము నన్ను గొప్పచేసెను. అదేమాట కీర్తనాకారుడు కూడా అంటున్నారు 18:35 లో.

నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.

 

    చూసారా! ఎవరైతే సాత్వికముగా ఉంటారో వారిని దేవుడు గొప్పచేస్తారు. గర్వించిన వారిని నేలపడగొట్టి దీనులను పైకి లేపుతారు. లూకా 1:51-53; అంతేకాకుండా గలతీ 5:22 లో గల ఆత్మఫలములో ఇది కూడా ఒక భాగము!

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, *సాత్వికము*, ఆశానిగ్రహము.

 

    పౌలుగారికి ఎంతో నచ్చినది ఈ సాత్వికము. అందుకే 2 కొరింథీ 10:1 లో

మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. అంటున్నారు. చూశారా పౌలుగారి సాత్వికము.

 

కొలస్సీ 3:12

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి

 

 గలతీ 6:1లో ఎవరైనా అతిక్రమము చేస్తే వారితో సాత్వికముగా ప్రవర్తించి తిరిగి వారిని దేవుని దారిలోనికి తీసుకుని రావాలి అని చెబుతున్నారు.

 

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. . .

 

ఫిలిప్పీయులకు 4: 5

మీ సహనమును (లేక,మృదుత్వమును/ సాత్వికమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

 

2 తిమోతీ 2:25 లో ఎదురించేవారిని సాత్వికముతో సరిదిద్దాలి. అంటున్నారు,

 

తీతుకు 3:2

ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.

 

1 పేతురు 3:15

నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

 

   కాబట్టి క్రీస్తుయేసుకు కలిగిన మనస్సు మీరును కలిగియుండాలని దేవునిపేరిట మనవి చేస్తున్నాను.

ఇది విశ్వాసులకు ఉండవలసిన మంచి లక్షణాలలో ఉత్తమమైనది *సాత్వికము*

 

కాబట్టి అట్టి సాత్వికమును అలవరచుకొని దేవునికి ఇష్టులుగా ఉందాం!

దేవునిచే ఘనపరచ బడుదాం!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-62 భాగం*

*ఆత్మఫలము-9*

గలతీ 5:22—23

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాము.

 

ఇక మనము పొందుకోవలసిన తర్వాత ఆత్మఫలము: *ఆశానిగ్రహము*

 

ఆత్మ ఫలము లోని తొమ్మిదవ అంశము: *ఆశానిగ్రహము* :

 

🔺 *ఆశానిగ్రహము అంటే? *

* ఇంద్రియ నిగ్రహం

* కోరికలను అనుభూతులను అదుపులో వుంచుకోగలిగే సామర్ధ్యం.

 

మనిషి భ్రష్ట ప్రవర్తనకు ప్రధమ కారణం ఆశానిగ్రహం (self Control)(ఇంద్రియ నిగ్రహం) లేకపోవడమే!.

 

🔺 *తన ధనాన్ని రెట్టింపు చేసుకోవాలనే కోరిక గలిగిన వ్యక్తి: *

* లంచాలు తీసుకొంటున్నాడు,

* దొంగతనాలు చేస్తున్నాడు.

* బలాత్కారం చేస్తున్నాడు.

 

🔺 *శరీర కోరికలు తీర్చుకోవాలనుకొనే వ్యక్తి*:

* వావివరుసలు మరచిపోతున్నాడు.

* మానభంగాలు చేస్తున్నాడు

* నైతిక విలువలను కోల్పోతున్నాడు.

 

🔺 *కోరికలు కోటలు దాటిన వ్యక్తి:*

* ఊహాలోకంలో తెలియాడుతున్నాడు.

* ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూ  జీవితమంతా గడుపుతున్నాడు.

* ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నాడు.

 

ఎందుకీ పరిస్థితి అంటే? ఆశలను నిగ్రహించుకోలేక, తద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబపు కోరల్లో చిక్కి, మరణానికి మరింత దగ్గరవుతున్నాడు.

 

🔺 *క్షయమైన వాటికోసమే ఆశను కలిగియున్నాము తప్ప, అక్షయమైనవాటి ధ్యాసే లేకుండా జీవిస్తున్నాము. *

పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.            1 కొరింధీ 9:25

 

🔺 *అద్యక్ష పదవిని ఆశించేవాడు కూడా తన కోరికలు నియంత్రించు కోవాలని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. *

అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, *ఆశానిగ్రహము* గలవాడునై యుండి,          తీతు 1: 7,8

 

*పైనున్న వాటివైపు చూడగలిగినప్పుడే, భూసంబంధమైన కోరికలను చంపుకొని, ఆత్మఫలము ఫలించగలము. *

 

గమనించాలి ఆత్మఫలమునకు వ్యతిరేకంగా ఏదీలేదు అంటున్నారు 23 వచనంలో. ఇది ఉన్నదా దేవునితో నీవు అత్యంత సన్నిహిత సంబంధం కలిగి, పరిపూర్ణత సాధించగలవు! దివ్యరాజ్యాన్ని చేరుకోగలవు!

 

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

*గలతీ పత్రిక-63 భాగం*

గలతీ 5:24—26

24. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

25. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

26. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- శరీరకార్యాలు-ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకున్నాము.

 

ఇక పై వచనాలలో కాబట్టి మనం ఆత్మకలిగిన వారంగా శరీరక్రియలు విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకుందాం అని ముగిస్తున్నారు అధ్యాయాన్ని!

 

23 క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

క్రీస్తుయేసు సంబంధులు శరీరాన్ని దాని కోరికలతోపాటుగా దురాశలను కూడా సిలువవేసియున్నారు అంటున్నారు. చూడండి ఇక్కడ పౌలుగారు సిలువ వేయండి అనడం లేదు! మీరు సిలువవేసి యున్నారు అంటున్నారు. అనగా మనం  బాప్తిస్మం తీసుకొన్న రోజున మన శరీర కోరికలు, దురాశలు కూడా సిలువవేసేసాము అన్నమాట!

ఇక్కడ ఎవరో మహనీయులు లేదా గొప్ప దైవభక్తులు కోరికలకు సిలువవేశారు అని అనడం లేదు! ఇది విశ్వాసులందరి విషయంలో కూడా జరిగింది! అందుకే గలతీ 2:20 లో నేను క్రీస్తుతోపాటుగా సిలువమరణం పొందాను. ఇక జీవించు చున్నది నేనుకాదు! క్రీస్తే నాలో జీవించుచున్నాడు అంటున్నారు! ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు- విశ్వాసులు క్రీస్తుతో కూడా సిలువమరణం చెందిన విషయం ఆత్మావేశుడై చెబుతున్నారు పౌలుగారు! విశ్వాసులు ఇలా ఉండాలి అనడం లేదు! వారు సిలువవేయబడ్డారు అంటున్నారు! వారు నిజంగా పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం ఉంచి బాప్తిస్మం పొందినప్పుడే ఇలా సిలువవేయబడ్డారు అన్నమాట! దీని అర్ధం ఏమిటంటే మనలో ఉన్న బ్రష్ట స్వభావం, పాప స్వభావంపాత జీవిత విధానం పూర్తిగా దాని శరీర క్రియలతో పాటుగా సిలువవేయబడి పూర్తి తెగతెంపులు చేసుకుంది అన్నమాట! క్రీస్తులో ఉన్న నమ్మకం ఆయన విశ్వాసుల స్థానంలో మరణించినట్లు అంగీకరిస్తుంది. అనగా సిలువను ఎక్కాల్సింది మరణించవలసినది నిజంగా నేను, గాని యేసుక్రీస్తుప్రభులవారు నా స్థానంలో ఆయనుండి నా కోసం మరణించారు అని అంగీకరించినట్లు! తన పాప స్వభావానికి తగినచోటు సిలువే అని ఒప్పుకుంటున్నాడు విశ్వాసి! అతడు దేవుని తీర్పుతో ఏకీభవిస్తున్నాడు! ఇప్పుడు విశ్వాసి తననుతాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకుని క్రీస్తును అనుసరిస్తున్నాడు!

మత్తయి 10:38—39

38. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

39. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

 

మత్తయి 16:24—26

24. అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.

25. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?

 

కాబట్టి ఇలా చేసేటందుకు వ్యక్తి సిద్దంగా లేకపోతే లేక ఇలా చేయకపోతే అతడు నిజవిశ్వాసి/ నిజ క్రైస్తవుడు కాదు అన్నమాట!

 

ఇక్కడ పౌలుగారు నిజక్రైస్తవులు ఎలా ఉండాలో వివరిస్తున్నారు! ఒకవేళ విశ్వాసి తమ బ్రష్ట పాప స్వభావానికి సిలువవేయకపోతే వారు ఇప్పుడు క్రీస్తుకు చెందిన వారు కానేకాదు! ఇంకా తమ పాత బాస్/ అధిపతి అయిన సాతానుగాడితోనే ఉన్నారు అన్నమాట!

గమనించాలి అధ్యాయంలో 16 వచనం నుండి చివరి వరకు చూసుకుంటే విశ్వాసిలో బ్రష్ట స్వభావం, శరీర క్రియలు తాము బాప్తిస్మం పొందిన వెంటనే చనిపోవు! అవి అలా రేగుతూ ఉంటాయి! అందుకనే మనం ప్రతిరోజు మన సిలువను ఎత్తుకుని ఆయనతో పాటు నడచుకుంటూ సాగిపోవాలి! లూకా 9:23

మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

 

      ఇక 25 వచనంలో దానికి విరుగుడు కూడా చెబుతున్నారు పౌలుగారు! అయితే ఎవరైతే ఆయనాత్మను అనుసరించి నడుస్తుంటారో వారు శరీరక్రియలను భ్రష్ట స్వభావాన్ని జయించి ఆత్మఫలము ఫలిస్తూ, జయజీవితం జీవిస్తారు  ....

అందుకే ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

 

విశ్వాసులందరికీ దేవుని ఆత్మ ఆధ్యాత్మిక నూతన జీవమును ఇచ్చాడు యోహాను 3:3—8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేముముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

ఇది నిజం కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఆత్మానుసారంగా నడుస్తూ, జీవిస్తూ ఆత్మ నడిపింపులో, ఆత్మ నడిపించిన చోటికి, ఆయనతో పాటు అడుగులో అడుగువేసుకుంటూ నడవాలి! శరీర స్వభావం మీద, శరీర కార్యాలు, శరీర ఆశల మీద జయానికి మార్గం ఇదే! ఆత్మానుసారంగా ప్రవర్తించుడి అప్పుడు శరీర రీతిలో మీరు నడుచుకోరు అన్నారు మీద వచనాలలో! ఎప్పుడైతే మనం మన సిలువను మోస్తూ, క్రీస్తుయేసు మోసిన సిలువను చూస్తూ, ఆత్మతో నడుస్తూ, ఆత్మలో నడుస్తూ, ఆత్మానుసారంగా నడుస్తామో ఆత్మఫలం ఫలించి శరీర కార్యాలను సిలువకు వేసి/ కొట్టి చంపుతాము! జయ జీవితం జీవిస్తాము! పరిపూర్ణతను సాధిస్తాము!

 

అందుకే 26 వచనంలో అంతేతప్ప ఊరికినే అతిశయపడవద్దు! ఇలా చెయ్యాలే తప్ప ఊరికినే అతిశయ పడి డంబాలు పలకొద్దు! ఒకరికొకరం వివాదాలు రేపుకోవద్దు అంటున్నారు. ఇక్కడ పౌలుగారి ఉద్దేశ్యం ఏమిటంటే కొన్ని అనుదిన వ్యవహారాలలో దేవుని ఆత్మ నడిపించినట్లు దేవునాత్మ చూపించిన దారిలోనే నడవాలి గాని మన శరీరం చెప్పినట్లు శరీరానికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించకూడదు! మనిషిలో అహంకారం, కలహం, అసూయలు ఉంటే పరిశుద్ధాత్ముడు సహించలేడు! శరీర కార్యాలంటే పరిశుద్దాత్మునికి పరమ అసహ్యం! మనం కూడా వీటిని అసహ్యించుకోవాలి!

 

గమనించాలి: చర్చిలో గొప్ప గంభీరమైన ప్రార్ధనలు చేసి వచ్చి నీ సొంత అత్తను గాని, నీ సొంత కోడలిని గాని ప్రేమించకపోతే నీలో ఆత్మఫలము లేదు శరీర కార్యాలున్నాయి! అనగా నీలో ఆత్మ లేనే లేడు!

ఇంకా మంచిగా చర్చిలో వర్షిప్ లో పాల్గొని, వర్షిప్ నడిపించి సినిమాలకు షికార్లకు తిరిగావంటే నీలో ఆత్మ లేడు! భ్రమపరిచే ఆత్మ ఉన్నాడు అని అర్ధం!

పరలోకం క్రిందికి దించినంతగా ఆరాధన నడిపించి, భాషలు మాట్లాడి, బిగుతైన బట్టలు, శరీరం సౌష్టవం కనిపించే బట్టలు వేసుకుంటే ప్రియ సహోదరీ నీలో ఆత్మ లేడు! వెలుగు దూత ఉన్నాడు! నీలో కామకోరికలు రేపించే బ్రష్ట ఆత్మ, పిశాచి పనిచేస్తుంది అన్నమాట!

గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ తోటి కాపరిని ప్రేమించలేకపోతే విరోధ భావంతో ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు నా ప్రియ సహోదరుడా!

అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ, ఎన్నెన్నో ఆత్మీయమర్మాలు బోధిస్తున్నావు గాని ముసుగులేని ప్రార్ధనలు, ముసుగులేని ప్రసంగాలు, మాదిరిలేని వస్త్రధారణ లేకపోతే ప్రియ సహోదరి- నీలో  పనిచేసేది భ్రమపరిచే ఆత్మ అన్నమాట! నీలో పైన చెప్పిన ఆత్మఫలము లేకుండా శరీర కార్యాలలో ఏది ఉన్నా నీలో పరిశుద్ధాత్మ లేడు అని గ్రహించండి!

 

కాబట్టి ఢాంభిక మైన జీవితం వదలి- క్రీస్తుయేసు మాదిరిగా మాదిరికలిగిన జీవితం కలిగి తగుమాత్రపు వస్త్రదారణతో దేవుని బిడ్డలకు తగినట్లుగా జీవిద్దాం!

శరీర క్రియలు వదిలేద్దాం! అనుదినము ఆత్మానుసారంగా నడుస్తూ ఆత్మఫలమును ఫలిద్దాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-64 భాగం*

గలతీ 6:1—2

1. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.

2. ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ- శరీరకార్యాలు-ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకున్నాము.

ఇక ఈ ఆరవ అధ్యాయంలో సంఘము ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది చెబుతున్నారు! ఇదే ప్రతీ ప్రతికలో ఆయన చెప్పే విధానము! అయితే మొదటిభాగంలో చెప్పిన విధముగా ఈ పత్రికలో పెద్దలందరికీ వందనాలు అభినందనలు పలకరింపులు లేవు! మిగిలిన పత్రికలలో అవి కనిపిస్తాయి! ఈ పత్రికలో అవి లేకపోవడానికి కారాణాలు బహుశా మొదటగా ఇది ఆయన రాసిన మొదటి పత్రిక కాబట్టి!

 

రెండవది: ఇది ఆయన చనిపోయేముందు రాసినది కాదు! తనసేవ మధ్యలో రాశారు! అందువలనే పత్రికలో వందనాలు- పలకరింపులు- అభినందనలు లేవు! అయితే instruction's మాత్రము ఉన్నాయి మిగిలిన పత్రికల మాదిరి!

 

     మొదటి వచనంలో సహోదరులారా ఒకడు ఏదైనా తప్పిదములో చిక్కుకుంటే ఆత్మసంబందులైన మీలో ప్రతీవాడు తాను శోధింపబడతానేమో అని మొదటగా తననుతాను పరీక్షించుకొని తర్వాత సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకుని రావాలి అంటున్నారు!

 

  వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా ప్రాముఖ్యమైన మాటలు కనిపిస్తాయి! ముఖ్యంగా మీలో ప్రతివాడు: అనగా ఆత్మసంబంధంగా నడచుకొనే ప్రతీవాడు కూడా అట్టివానిని అనగా తప్పిదంలో, అతిక్రమంలో, పాపంలో చిక్కుకున్న వానిని దర్శించి, ప్రార్ధించి, బుద్ధిచెప్పి వానిని మరలా మంచిదారికి తీసుకుని రావాలి అంటున్నారు!

హా మనకెందుకు?పాష్టర్ గారు చూసుకుంటారు లే! సంఘపెద్దలు చూసుకుంటారు లే! అనకూడదు!

వాడికి పెద్ద గీర, భక్తిపరుడను అనే పొగరు! అందుకే ఇలా చేశాడు అనకూడదు!

నాకు తెలియదా! వీడో పెద్ద వ్యభిచారి, వాడి కుటుంబం అంతా అంతే! మరలా ఏమీ ఎరగనట్లు సంఘంలో ఫోజు కొడతాడు! వాడు నాశనమై పోవాలి అనకూడదు!

క్షమించి ప్రార్ధించి మరలా వానిని సమాజములోనికి తీసుకుని రావాలి తప్ప సూటిపోటు మాటలతో ఇంకా కష్టపెట్ట కూడదు!

అయితే 2తిమోతి 3,4 అధ్యాయాల ప్రకారం అట్టివానిని లేఖనములు చూపించి ఖండించి, గద్దించి, బుద్ధిచెప్పి మరలా దారికి తీసుకుని రావాలి!

 

విషయంగా మూడు ఉదాహరణలు మీకు గుర్తుచేస్తున్నాను:

 

మొదటిది: మనకందరికీ మార్ఘదర్శి యేసుక్రీస్తుప్రభులవారు: ఆయన దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ తీసుకుని రాబడినప్పుడు యేసయ్య ఏమన్నారు? యోహాను 8:1--11;

 నీకు బుద్ధుందా లేదా, ఓ వ్యభిచారి అంటూ ఊగిపోలేదు! అలాగని ఆ వ్యభిచారం చేయమని ప్రోత్సహించనూ లేదు! ఆ వ్యక్తి సంపూర్ణంగా మారి హృదయంలో పశ్చాత్తాపం కలగడానికి ప్రయత్నం చేశారు! మొదటగా మీలో పాపం లేనివాడు ఈమెపై ముందుగా రాయి వెయ్యమని చెప్పి ఆమెను ఆ భయంకరమైన మరణం నుండి తప్పించారు! ఇక ఆమె ఎప్పటికీ ఈ పాడుపని చేయకుండా మొదటి మాట: *అమ్మా! ఎవరును నిన్ను శిక్షించలేదా*??!! ఎంత గొప్ప మాటండి! ఒక వ్యభిచారం చేసే స్త్రీని అమ్మా అని పిలిచిన మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమేనా ఉద్దేశం ఆ అమ్మా అనే పిలుపు ఆమె గుండెను బద్ధలు చేసింది! ఇంతవరకు ఆమెకు ఇలాంటి పలకరింపు దొరకలేదు! ఆమెను చూసి చీత్కరించుకుని మొఖం మీద తిట్టేవారు, అపహిసించే వారే గాని, బహిరంగంగా ఆమెను అవమాన పరచేవారే గాని, మొదటగా తనను ఒక సాటి మనిషిగా గౌరవమైన వ్యక్తిగా పలకరించిన వారు యేసుక్రీస్తు ప్రభులవారే! వెంటనే ఆమె హృదయం బ్రద్ధలయ్యింది! *అమ్మా ఇకను పాపం చెయ్యకు అన్నారు*! ఆమె పగిలిన హృదయంతో పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నిండు మనస్సుతో చెప్పింది అయ్యా ఇకను పాపం చెయ్యను! అంతే! జీవితాంతం పాపాన్ని విడిచిపెట్టి- యేసయ్యను వెంబడించి సాక్షిగా మిగిలిపోయింది! అదీ మనిషిలో పరివర్తన తీసుకుని రావడం! యేసుప్రభులవారు సూటిపోటి మాటలు అనకుండా ఆమె హృదయ పరివర్తనకు ప్రయత్నం చేశారు! మనము కూడా అలాగే చెయ్యాలి తప్ప మనము తీర్పు తీర్చకూడదు! ఇతరుల మనస్సులను గాయపర్చకూడదు! ఇది పౌలుగారు యేసుక్రీస్తు ప్రభులవారి బోధనల నుండి గ్రహించి అందరికీ హితవు చెబుతున్నారు ఎవరైనా తప్పిపోతే తిరిగి ఎలా సంఘంలోనికి తీసుకుని రావాలో చెబుతున్నారు! గమనించండి తప్పుచేయని వాడు ఎవడూ లేడు! మనమే గొప్ప భక్తిపరులమని ఫీలైపోకూడదు! తీర్పు తీర్చకూడదు!

 

రెండవది: కొరింథీ సంఘములో ఒకడు భయంకరమైన తప్పు చేశాడు! ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట! వెంటనే పౌలుగారు ఇక్కడ అతడిని ప్రోత్సహించలేదు 1కొరింథీ 5 అధ్యాయంలో! నోరుమూసుకుని కూర్చున్న కొరింథీ సంఘానికి చీవాట్లు పెట్టి అలాంటి వానిని వెలివేసేమని చెప్పారు! సంఘం వెలివేసింది! ఇక రెండో కొరింథీ పత్రికలో వ్యక్తిని మర్చిపోకుండా రాస్తున్నారు ఇక శిక్ష చాలు! వానిని దరికి చేర్చుకోండి! 2కొరింథీ 2; బుద్ధిచెప్పి మరలా సంఘంలో చేర్చుకోండి అని రాస్తున్నారు! అనగా నా ఉద్దేశం వ్యక్తికోసం తండ్రి హృదయం ఎంతో వేదన చెందింది అన్నమాట! మొదట శిక్షించి, తర్వాత మరలా దారిలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు! తప్పు చేశాడు గనుక శిక్షించారు- శిక్షతో వదిలెయ్యలేదు! తిరిగి సాత్వికముతో తీసుకుని రమ్మని చెబుతున్నారు! ఇదీ పద్దతి! ఇదే పద్దతి మన సంఘాలలో కూడా చెయ్యాలి! లేకపోతే మొదటగా తప్పుచేసిన వారు విర్రవీగిపోతారు బుద్ధిచేప్పకపోతే! ఇంకా మిగిలిన వారు కూడా అదే పని చేస్తారు! కాబట్టి బుద్ధిచెప్పాలి! తర్వాత మరలా ప్రేమతో దారికి తీసుకుని రావాలి! ఇది ప్రతీ ఒక్కరి విధి! కేవలం దైవసేవకులే కాదు! సంఘపెద్దలే కాదు! అందరు కూడా చెయ్యాలి!

 

ఇక మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: పౌలుగారు చెబుతున్నారు: ఇలా బుద్ధిచెప్పే ముందు మొదటగా ఆత్మసంబందులైన ప్రతీవాడు తననుతాను పరీక్షించుకోవాలి అంటున్నారు! ఎందుకు?

నాకు రెండు ఉద్దేశాలు కనిపిస్తున్నాయి! కేవలం నా అభిప్రాయమే సుమా!

 

 మొదటగా! ఎదుటివానికి చెప్పేముందు మనలను మనం పరీక్షించుకోవాలి మనం ఒకవేళ ఇలాంటి స్తితిలో గాని ఉన్నామా అని!! కారణం మనమే స్తితిలో ఉండి, అలా చెయ్యకూడదు అంటే ఓస్ చెప్పేవు గాని ముందు నీ బ్రతుకు నీవు చూసుకో అంటాడు! కాబట్టి మొదటగా మనలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి! అంతేకాదు హెచ్చరికగా ఉండాలి! తర్వాత చెప్పాలి!

 

ఇక రెండవది: దీనివలన ఏమి అర్ధం అవుతుంది అంటే ఆత్మసంబంధియైన వాడు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎదుటివారికి చెప్పేముందు దారిలోనికి తీసుకుని వచ్చేముందు మనం మన హృదయాలతో చెప్పుకోవాలి, జాగ్రత్త! ఇలాంటి పాపంలో ఎవడైనా ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని మనకు మనమే బోధించుకోవాలి! ఇంకా వ్యక్తి పాపంలో పడిపోవడానికి కారణాలు ఏమైఉండొచ్చు అనేది కారణాలు యోచించి బహుశా వ్యక్తి సన్నిధికి రావడం లేదు, బైబిల్ పఠనం ఎక్కువగా చెయ్యడం లేదు లేదా స్తితిలో ఉండగా ఇలా పడిపోయాడో కారణాలు గ్రహించడానికి ప్రయత్నం చేసి- అదే తప్పులు మనలో లేకుండా మనలను మనం హెచ్చరిక చేసుకుంటూ ఆత్మానుసారంగా నడచుకోవాలి! అందుకే పౌలుగారు మీలో ప్రతీవాడు తానును శోధించబడుదునెమో అని తన విషయమై పరిశీలన చేసుకోమంటున్నారు! 2తిమోతి 2:24—25

గలతీ 6:4

 

    ప్రియ విశ్వాసి! సంఘపెద్డా! కాపరి! దైవజనుడా! మొదటగా నిన్ను నీవు పరిశీలన చేసుకుని తర్వాతనే మిగిలిన వారికి బోధించు! కారణం నీవు కూడా మనిషివే! నీవుకూడా ఇదే పాపలోకంలో ఉన్నావు! కాబట్టి నీవుకూడా పడిపోయే అవకాశం ఉంది! అందుకే హెచ్చరికగా ఉండాలి! ఎల్లప్పుడూ వాక్యపు వెలుగులో, ఆయన ముఖకాంతిలో మనలను మనం చూసుకుంటూ మనలో ఏదైనా రహస్యపాపములుంటే వాక్యపు అద్దములో చూసుకుంటూ తుడుచుకోవాలి!

 

ఇక తర్వాత మాట: సాత్వికమైన మనస్సుతో అంటున్నారు: సాత్వికం కోసం గతభాగాలలో ఆత్మఫలము కోసం ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాం! సాత్వికం అనగా ఇతరులు ఏమన్నా కోపపడకుండా క్షమించి సహించి ముందుకు పోవడం! వారితో ప్రేమగా మాట్లాడటం! వారు నిన్ను దూషించినా, ప్రేమించి సహించి మాట్లాడటం! అంటే ఇక్కడ ఆ వ్యక్తి తప్పుచేశాడని తెలిసినా పరుషంగా ప్రవర్తించకుండా బైబిల్ లేఖనాలు చూపించి వాటి ఫలితం ఏమిటో వివరించి మరలా సాత్వికంతో ప్రేమతో మాట్లాడి, వాడు చేసిన తప్పులు మరచిపోయి ఆవ్యక్తి క్షమాపణ కోసం వానితో ప్రార్ధించి మరలా ఆ వ్యక్తిని మంచిదారిలోనికి తీసుకుని రావాలి! ఇదీ పౌలుగారు నేర్పిస్తున్న మంచి బోధ! మనకు మనమే గొప్ప పవిత్రులం, పతివ్రతలం అనుకోకుండా ప్రేమతో సహిస్తూ మనలను మనం హెచ్చరిక చేసుకుని ఎదుట వారిని క్షమించి తిరిగి దారిలోనికి తీసుకుని రావాలి!

 

మూడవది: పెద్ద శిష్యుడు పేతురు గారు! యేసయ్య ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకారు! అదికూడా యేసయ్య ఎదురుగా! తర్వాత పేతురుగారు పశ్చాత్తాపపడి, సంతాపపడి భిగ్గరగా ఏడ్చారు! అది తర్వాత విషయం! ఈలోగా యేసయ్య మనస్సుని చాలా చాలా బాధపెట్టారు పేతురుగారు! తను ఎంతో నమ్మిన వ్యక్తి తానెవరో తెలియదని చెప్పాడు! సరేఆయన భయంకరమైన మరణం పొంది తిరిగి లేచారు! పేతురుగారు కనబడ్డారు: పనికిమాలిన వాడా! నేనెవరినో నీకు తెలియదా? అబద్దమాడతావా? ఇప్పుడు ఏముఖం పెట్టుకుని నా ముందు నిలబడ్డావు అనలేదు! ఎంతో జాలిగా, ఎంతో సాత్వికంతో, ఎంతో క్షమాపణగా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడుసార్లు అడిగారు! పేతురు గారి హృదయం బ్రద్దలైపోయింది! అయ్యా అది నీకే తెలుసు! నేను పరిస్తితులలో విధంగా చెప్పాల్సి వచ్చిందో హృదయాలను అంతరంగాలను ఎరిగిన వానిగా నీకు తెలుసు! నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని ఆయన పాదములపై పడ్డారు ఆయన! ఇక జీవితంలో ఎప్పుడూ క్రీస్తు ఎవరో నాకు తెలియదు అనకుండా అదే క్రీస్తుకోసం చెరశాల అనుభవించి, అనేకమైన హింసలు పొంది, చివరికి ఆయనకోసమే చనిపోయారు పేతురుగారు! ఇదీ సాత్వికమైన మనస్సు అంటే!

మనం కూడా ఇలాగే ప్రవర్తించాలి!

అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*గలతీ పత్రిక-65 భాగం*

 

గలతీ 6:2—3

2. ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.

3. ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటున్నాము!

 

ఇక రెండవ వచనంలో ఒకని భారములు ఒకడు భరించమంటున్నారు- అలా చేసి క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి అంటున్నారు. మరి ఇక్కడ భారము అనే మాట ఎందుకు వాడారు పౌలుగారుజాగ్రత్తగా పరిశీలిస్తే విశ్వాసులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు ఇప్పుడు! గలతీ 3:25; 5:1 ప్రకారం! అయితే వారు ఇప్పుడు విశ్వాస నియమం క్రిందన ఉన్నారు! విశ్వాస నియమంలో క్రీస్తు ప్రేమతత్వం, ప్రేమ నియమం నేర్పించారు! నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించండి ఇది ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ అన్నారు! యోహాను 13:4

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

మనం ఇప్పుడు మన సాటి విశ్వాసులను ప్రేమతో ఆదరించాలి! వారి భారములు అనగా వారి అవసరాలలో సహాయం చెయ్యాలి! ఇంకా వారికి భారముగా అనిపించే ప్రతీ దానిలోనూ తోటివిశ్వాసి తన చేతనైనంత సహాయం చెయ్యాలి! దీని అర్ధం ఒకవేళ వ్యక్తి పదిలక్షల అప్పుంటే దానిలో సగం నీవు తీర్చాలి అనేది ఇక్కడ నా ఉద్దేశం కాదు! వ్యక్తి ఇబ్బందులలో ఉన్నాడో చూసి మన చేతనైనంత సహాయం చెయ్యాలి! ముఖ్యముగా వారి బాధలు, వారి రోగాలు, కష్టాలు తమవి అన్నట్లు తమ సొంత సహోదరునికి కష్టం వస్తే నీవు ఎలా స్పందిస్తావో అలానే స్పందించాలి! వారి కష్టాలలో వారికోసం ప్రార్ధన చెయ్యాలి! వారి రోగాలలో ఆదరించాలి! దేవుని సన్నిధిలో వారి భాధలు నీవి అన్నట్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రార్ధన చెయ్యాలి! అవసరమైతే ఉపవాసముండి ప్రార్ధించాలి! వారి భాధలను ఇబ్బందులను వారితో పాటు పంచుకోవాలి! కావలసిన మోరల్ సపోర్ట్ ఇవ్వాలి! భయపడకు నీతోపాటు నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి! నీతో పాటు నేనే కాదు మన సంఘమంతా ఉంది అనే భరోసా కలిగించాలి! ఒకవేళ నీకు చేతనైతే ఆర్ధిక సహాయం కూడా చెయ్యాలి! ఇదీ భారం భరించడం అంటే! ప్రియ సహోదరి/ సహోదరుడా నీవు అలా చేస్తున్నావా?

యాకోబు గారు చెబుతున్నారు నీ సహోదరుడు...

James(యాకోబు) 2:15,16,17

15. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

 

యోహాను గారు చెబుతున్నారు....

1 John(మొదటి యోహాను) 3:15,16,17

15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

16. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

17. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

 

అలా చేసి క్రీస్తునియమాన్ని పూర్తి చేద్దాం!

 

 క్రీస్తు నియమం ఏమిటి? మీద చెప్పిన క్రొత్త ఆజ్ఞ! మీరు ఒకరి నొకరు ప్రేమించవలెను- నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడి! మీరు ఒకరినొకరు ప్రేమిస్తేనే మీరు నా శిష్యులు అని అందరు తెలుసుకుంటారు అంటున్నారు యేసయ్య యోహాను 13:435లో! ఇదే క్రీస్తు నియమం!

 

  ఇక మూడో వచనంలో అంటున్నారు....

ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును

ఎవడైనా వట్టివాడై ఉండి తానేదో ఎన్నికైన వాడని ఎంచుకొంటే వాడు తన్నుతానే మోసగించుకుంటున్నాడు అంటున్నారు! అపోస్తలుల కాలంలో సీమోను అనే గారడీవాడు ఇలాగే తనేదో గొప్ప వ్యక్తి అని అనుకున్నాడు. అయితే భక్తుడైన ఫిలిప్పు అంతకంటే గొప్ప కార్యాలు చేసి దేవుని వాక్యం ప్రకటించి నప్పుడు నమ్మి మారుమనస్సు పొందుకున్నాడు అపో 8:9—24

కాబట్టి ఇలాంటి అహంభావం మనిషికి ఉండకూడదు ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసికి ఉండకూడదు! గలతీ 5:26

ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

ఇతరులకు నిజంగా సహాయం చెయ్యాలి అనుకుంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా చెయ్యాలి. నీవుకుడిచేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చెయ్యాలి సహాయం అని యేసయ్య స్వయంగా చెప్పారు... మత్తయి 6:3;

 

ఇంకా ఎవరైనా దేవుని సేవ చాలా ఘనంగా చేస్తుంటే మంచిది, గాని తనకుతానే సెహబాస్ అనుకోకూడదు, గొప్పలు చెప్పుకో కూడదు! సోషల్ మీడియాలో ఇంతమందికి సహాయం చేశాం, అంతమందికి సహాయం చేశాం అని గొప్పలు చెప్పుకో కూడదు, ఇప్పుడు కరోనా కి ప్రజలకు సహాయం చేసి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినట్లు పెట్టకూడదు! ఇంకా ఘనమైన సేవ కోసం గొప్పలు చెప్పుకుని డప్పులు సొంతడబ్బాలు కొట్టుకోకూడదు! ఇది నేను అనడం లేదండి! యేసుక్రీస్తుప్రభులవారే అంటున్నారు లూకా 17:10 లో....

*అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను*.

 

 చూశారా అయ్యా మేము నిష్ప్రయోజనమైన సేవకులం! మేము చేయవలసిన విధిని మాత్రం అనగా మేము పని చెయ్యడానికి కూలికి పిలువబడ్డాము! దానినే చేశాం బాబు అని తగ్గించుకుని దేవునితో పలకమంటున్నారు దేవుడు! అంతేతప్ప నేను ప్రార్ధన చేస్తే రోగం పోయింది, అంతమంది స్వస్తత పొందారు, ఇంతమంది బాప్తిస్మం పొందారు, అయ్యగారు ప్రార్ధన చేస్తే, నాకు ఇది జరిగింది అని గొప్పలు చెప్పుకుని లేక గొప్పలు చెప్పించుకుని దేవునికి రావలసిన ఘనతను మీరు కొట్టెయ్యకూడదు! తాము నిష్ప్రయోజనమైన లేక పనికిమాలిన సేవకులం అని ఒప్పుకోవాలి! అయ్యా అర్హత లేని నాకు నీ రక్షణ భాగ్యం ఇచ్చావు ఇంతేచాలు! నీ సేవ చేసే బాగ్యం నాకిచ్చావు చాలు బాబు అనుకోవాలి!

ఇంకా రోమా 12:16

ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

 

ఇంకా ఫిలిప్పీ 2:3 లో ఎలా ఉండాలి చెబుతున్నారు పౌలుగారు ...

కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

 

ప్రియ దేవుని బిడ్డా! నీవుకూడా గొప్పలకు పోకు! అయ్యా అర్హతలేని వానిని ఇంతవరకు తీసుకొచ్చావు నీకు ధన్యవాదాలు అని చెప్పు! గర్వాన్ని అహాన్ని అహంభావాన్ని వదలేద్దాం!

తోటివారికి చేతనైనంత సహాయం చేద్దాం! చేసి గొప్ప సహాయం చేసినట్లు ఫోజులు, ఫోటోలు ఇవ్వొద్దు!

చేయవలసిన పనినే చేశాం నిష్ప్రయోజనమైన సేవకులం అని తగ్గించుకుందాం!

 

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-66 భాగం*

 

గలతీ 6:4—5

4. ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరుని బట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.

5. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ పౌలుగారి చివరి హెచ్చరికలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 4 వచనంలో ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకోవాలి అంటున్నారు! అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగుతుంది అంటున్నారు

 

      దీనికోసం 2కొరింథీ 10:1218 వచనాలలో చాలా వివరంగా రాస్తునారు పౌలుగారు...

12. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసికొని యొకరితోనొకరు సరిచూచు కొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు.

13. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.

14. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్నవారము కాము.

15. మేము మేరకు మించి యితరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధియైన కొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,

16. మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.

17. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.

18. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.

 

మేము మా మేరలో అనగా మా సరిహద్దులలో మేముంటున్నాము. హద్దుమీరి అతిశయించడం లేదు అంటున్నారు. అతిశయించే వాడు ప్రభువును బట్టే అతిశయించాలి తప్ప తనకుతాను పొగుడుకునే వాడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అంటున్నారు- అనగా తనకుతాను పొగుడు కొనేవాడు పొగిడించు కునేవాడు ఆమోదయోగ్యుడు కాడు అంటున్నారు!

 

  అలాగే మనం కూడా మిగిలిన విశ్వాసులందరి కంటే నేనే ప్రార్ధనాపరుడను, నేనే భక్తిపరుడ్ని, నేనే మంచి పాటగాడిని, నేనే మండలంలో మంచి ప్రసంగీకుడ్నిమాకే పెద్ద సంఘం ఉంది, మాకే మంచి క్వయిర్ టీం ఉంది, మాకే గొప్ప ఇనుస్ట్రుమెంట్లు ఉన్నాయి ఇలా అతిశయంచకూడదు! నీకు ప్రభువు ఉన్నారు అని అతిశయించాలి! నీకు గొప్ప రక్షణభాగ్యం కలిగింది అని అతిశయించాలి తప్ప నీక కలిగిన ఐశ్వర్యం బట్టి గాని, భక్తి బట్టి గాని, అందం బట్టి గాని, మేడమిద్దేలు బట్టి గాని, ఆరోగ్యం బట్టి గాని మరి దేనిని బట్టి అతిశయించకూడదు గాని ప్రభువును బట్టి ప్రభువు నీకిచ్చిన రక్షణ బట్టి ఆయనెవరో దానిని బట్టి అతిశయంచాలి! ఇతరుల కంటే మనమే మంచి వారం గొప్పవారం ఇతరుల పరిచర్య కంటే నా పరిచర్యే గొప్పది అనుకుంటే అది గర్వానికి దారితీస్తుంది! క్రీస్తు నియమానికి ఇది అడ్డంకిగా మారుతుంది!

 

ఇంకా తానుచేసే పనిని పరీక్షించి తెలుసుకోవాలి- ఇది మంచిదా కాదా అని బేరీజువేసుకుంటూ ఉండాలి! ఇది వాక్యానుసారమైన పనేనా? లేక వాక్యానికి విరుద్ధమైన పని చేస్తున్నానా? దీనిని జరిగిస్తే శరీరాన్ని ఘనపరుస్తున్నానా లేక ప్రభును ఘనపరుస్తున్నానా అని ఎల్లప్పుడూ మనలను మనం పరీక్షించు కుంటూ ఉండాలి!

 

    5 వచనం

ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?

ప్రతీవాడు తన బరువును తానే మోసుకోవాలి లేక భరించాలి అంటున్నారు! ప్రతీ ఒక్కరు తనయొక్క బాధ్యతలను తెలుసుకుని తమ బాధ్యతలను తామే భరించాలి అంటున్నారు. కారణం వాటి ఫలితం చివర్లో మనమే భరించాలి. రోమా 14:12

అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

 

అందుకే భాద్యత కలిగి ప్రవర్తించాలి!అంతేకాకుండా ఎవరిమీదనో ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు పనిచేయాలి అంటున్నారు. పనిచెయ్యకుండా అన్నం తినకూడదు అనికూడా చెబుతున్నారు ... తనచేతులతో పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించి అప్పుడు తినాలి అంటున్నారు.

1థెస్సలొనికయులకు 4: 12

మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 3:10,11,12

10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు--ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా.

11. మీలో కొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.

12. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరించుచున్నాము.

 

ఎఫెసి 4:28

దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

 

కాబటి ఎవరి బరువును వారే మోసుకోవాలి! బద్ధకంగా ఉండకూడదు! బద్ధకం దరిద్రాన్ని తీసుకొస్తుంది అని సామెతల గ్రంధకర్త తెలియజేస్తున్నారు. సామెతలు 6:9--11;  దోపిడీ దారుడు వచినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది అంటున్నారు. కాబట్టి బద్ధకం వదిలేయు! మన బాధ్యతలు మనం భరించాలి! మన పనులు మనమే చేసుకోవాలి! మన చేతులతో మనం కష్టపడి ధనం సంపాదించి సొమ్ముతో తింటే కష్టం యొక్క విలువ డబ్బుయొక్క విలువ తెలుస్తుంది. దీనివిలువ తెలియకనే నేటి యువత చెడుదారులు త్రొక్కుతున్నారు! కష్టం విలువ, పని విలువ, ధనం విలువ తెలియడం లేదు వారికి! నిన్ను ఎవడు కనమన్నాడు అని అడుగుతున్నారు వీరు!

 

 ఘోరమేమంటే నేటి యవ్వన స్త్రీలు అమ్మాయిలు తమ బట్టలు తాము ఉదుకుకోవడం లేదు! అన్నీ అమ్మే చేయాలి! చివరికి వీరు అత్తగారింటికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారు! మొట్టికాయలు తింటున్నారు. మరికొంతమంది వారి సంసారాలు కూలిపోతున్నాయి! కారణం అమ్మగారి ఇంట్లో వారు పనిపాటులు నేర్చుకోక గారాభం వలన పనులు చేయడం లేదు! అత్తగారింటి దగ్గర గారాబం చేసేవారు ఎవరూ ఉండరు! కేవలం బరువుభాద్యతలు తప్ప! కాబట్టి ప్రియ యవ్వన పురుషులారా కష్టపడండి! ఎప్పుడూ మీ తల్లిదండ్రుల డబ్బులతోనే కాదు మీరు కూడా కష్టపడండి! యవ్వన స్త్రీలారా దయచేసి మీ చేతులతో కష్టపడండి పనుల నేర్చుకోండి. మీ తల్లికి సహాయం చెయ్యండి! బద్దకస్తులుగా ఉండకండి మీ బట్టలు మీరు ఉతుక్కోండి మీ భారం మీరు మోయండి! తర్వాత బాధపడకండి!

 

ప్రియ దైవజనమా! ఎవరి పనులు వారు చేసుకోండి! ఇంకా ఇతరులకు సహాయం చెయ్యండి! ఇలా చేస్తే మీరు క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేస్తారు! అట్లుచేసి దేవుని దీవెనలు పొందండి!

దైవాశీస్సులు!

*గలతీ పత్రిక-67 భాగం*

గలతీ 6:6—8

6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను (లేక వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషములలో భోధించువానితో పాలివాడైయుండవలెను) .

7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

8. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ పౌలుగారి చివరి హెచ్చరికలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 6 వచనంలో వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్ధములన్నిలో భాగమివ్వవలెను అంటున్నారు! వాక్యోపదేశం పొందేవాడు అనగా ఒక సంఘమునకు వెళ్తున్న విశ్వాసి- ఉపదేశించువాడు అనగా తనకు దేవుని వర్తమానములను వినిపిస్తున్న తమకాపరికి తనకున్న మంచి పదార్ధములలో భాగమివ్వాలి అంటున్నారు! కొంతమంది అతితెలివి గలవారు క్రొత్త నిబంధనలో దశమభాగాలివ్వాలి, కానుకలు ఇవ్వాలి అని ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధన కొట్టివేయబడింది. కాబట్టి దేవునికి కానుకలు దశమభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. వారు బహుశా దీనిని చదవలేదేమో! నీకున్న మంచి పదార్ధములన్నిటిలోను భాగమివ్వాలి!

 

పౌలుగారు దీనికోసం కొరింథీ సంఘానికి మొదటి ఉత్తరం రాస్తున్నప్పుడు 9:9—14 లో చాలా వివరంగా వివరించారు! ఎందుకు ఇవ్వాలి అంటే మొదటగా నూర్చే ఎద్దు మూతికి చిక్కం లేక కళ్ళెం వేయకూడదు అని మాట ఎత్తిరాస్తున్నారు! దైవజనుడు సంఘముకోసం దివారాత్రులు కష్టపడుతున్నాడు కనుక సంఘంలో వచ్చే దశమభాగాలు, కానుకలు తీసుకుని తన కుటుంబపోషణకు వినియోగించుకుంటాడు. ఇంకా తర్వాత సంఘానికి అవసరమయ్యే ఖర్చులను భరించడానికి వాటిని వినియోగిస్తాడు! ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ! ఎందుకంటే బలిపీఠం దగ్గర సేవచేసేవాడు బలిపీటం మీద నున్న అర్పణలో కూడా భాగముంది అంటున్నారు పౌలుగారు! మీకోసం ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను బోధిస్తూ మిమ్మును ఆధ్యాత్మికంగా ప్రభువులో నడిపిస్తున్నారు గనుక మీ శరీర సంబంధమైన విషయాలలో కూడా వారికి బాగముంది అంటున్నారు. అనగా శరీర క్రియల్లో భాగముంది అనడం లేదు, శరీర సంభంధమైన పోషణలో కూడా వారిని భాగస్వాములుగా చెయ్యాలి అంటున్నారు పౌలుగారు......

 

9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు (నూర్చెడి యెద్దు) మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా?

12. ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.

13. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో (బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారై యున్నారనియు మీరెరుగరా?

14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.

 

రోమీయులకు కూడా ఇలాగే ఆజ్ఞాపించి అసలు ఎందుకు ఇలా చెయ్యాలి అంటున్నారో చెప్పారు 15:26—27

26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి.

27. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారైయున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులైయున్నారు ....

చూసారా ఆధ్యాత్మిక విషయాలలో వారు అనగా దైవసేవకులు మీ పట్ల భాగస్వాములయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు వారి శారీరక విషయాలలో మీరు వారికి పరిచర్య చెయ్యాలి!

 

ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా పౌలుగారు విషయం రాస్తున్నారు; ఇక్కడ మరోమాట చెబుతున్నారు పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి మీకోసం మీ కాపరి పనిచేస్తున్నాడు కాబట్టి అతడు జీతానికి పాత్రుడు! ఇక్కడ ఆయన జీతం- మీ కానుకలు దశమభాగాలు అర్పణలు! 5:17—18

17. బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.

18. ఇందుకు నూర్చెడి (కళ్ళము త్రొక్కుచున్న) యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.

19. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషారోపణ అంగీకరింపకుము

 

అయితే గతభాగాల్లో వివరించడం జరిగింది- కానుకలు దశమభాగాలు అర్పణలు ఎవరికీ ఇవ్వాలి అంటే: టీవీల్లో చక్కగా వాక్యం చెప్పేవారికి, వీరికి వారికి కాదు! ఎక్కడైతే నీవు ప్రతీవారం వెళ్లి సహవాసంలో పాల్గొంటున్నావో, ఎక్కడైతే నీవు ప్రభుసంస్కారం తీసుకుంటున్నావో, ఎవరైతే నీకోసం దివారాత్రులు ప్రార్ధనచేసి నీ కుటుంబ వ్యవహారాలలో జరిగే కార్యక్రమాలు చావులు పెళ్ళిళ్ళు ఇంకా మిగిలిన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో, నీ కోసం కష్టమైనా సుఖమైనా నీకోసం ప్రార్ధన చేస్తున్నారో వారికి నీకానుకలు ఇవ్వాలి. నీ దశమ భాగం ఇవ్వాలి! సంఘంలో సభ్యుడవో సంఘానికే నీ దశమభాగాలు కానుకలు ఇవ్వాలి! నీకు ఇంకా డబ్బులు కలిగిఉంటే దేవుడు నీకు ప్రేరేపణ కలిగిస్తే అప్పుడు నీ స్వేచ్చార్పనలు టీవీ పరిచర్యకు పంపించవచ్చు గాని నీ సంఘాన్ని నీ సంఘకాపరిని వదిలెయ్యకూడదు! నీ కుటుంబంలో ఏదైనా కధా కార్యక్రమం వచ్చినా చావు పుట్టుకలు వచ్చినా నీకోసం వచ్చేవారు ప్రార్ధన చేసేవారు నీ సంఘము- నీ సంఘకాపరే అని గుర్తుంచుకోవాలి! వేలు, లక్షలు కానుకలు టీవీల్లో వాక్యం చెప్పేవారికి ఇస్తున్నావు కదా, మరి నీ ఇంట్లో ఎవరైనా చనిపోతే దయచేసి వచ్చి సమాధి చేయమంటే టీవీ బోధకుడు చేస్తాడా, కనీసం నీ ఫోన్ అటెండ్ చేస్తాడా?? దయచేసి నిజాన్ని గ్రహించమని ప్రేమపూర్వకంగా మనవిచేస్తున్నాను!

కాబట్టి ఇవన్నీ నీ సంఘానికి తప్పకుండ ఇవ్వాలి!

 

ఇంకా అవి ఎలా ఇవ్వాలో కూడా చెబుతున్నారు భక్తుడు: సణుగుకోకుండా, పిసినితనంగా కాకుండా ధారాళంగా మంచి మనస్సాక్షితో ఇవ్వాలి . 2కొరింథీ పత్రికలో 9 అధ్యాయంలో పౌలుగారు దీనికోసం విస్తారంగా రాశారు! 5—10, 12

5. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.

6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా (మూలభాషలో-దీవెనలతో) విత్తువాడు సమృద్ధిగా (మూలభాషలో-దీవెనలతో) పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.

7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

8. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.

10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధి పొందించును.

12. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.

 

కాబట్టి విషయం జాగ్రత్తగా ఉండమని మనవిచేస్తున్నాను! ఇక్కడ దారాళముగా ఇవ్వమంటున్నారు! ఇంకా కొంచెంగా విత్తువాడు కొంచెం పంట కోస్తాడు ఎక్కువగా విత్తువాడు ఎక్కువ పంట కోస్తారు!

 

అందుకే మన గలతీ 6:7 లో అంటున్నారు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఎలా విత్తునో పంటనే కోస్తాడు అంటున్నారు. వచనం యొక్క అర్ధం రెండు రకాలుగా చూసుకోవచ్చు!

 

మొదటిది నీవు పిసినితనంగా కాకుండా ధారాళంగా విత్తితే మంచి మనస్సాక్షితో దేవునికిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు! నాకిచ్చి నన్ను శోధించు అన్నారు దేవుడు! లేవీ 26 అధ్యాయంలో నాకిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని మేలులు దీవెనలు కుమ్మరిస్తాను. వానాకాలంలో వాన, ఎండా కాలంలో ఎండా కురుపిస్తాను. మీ పంటలను పాడుచేసే చీడపురుగులను నేను గద్ధిస్తాను అంటున్నారు!

 

మరి నీవు ఆయన మాట వింటావా? ఆయన చెప్పినట్లు చేస్తావా? ఆయన భాగం ఆయనకు ఇస్తావా? మీరు నా సన్నిధిలో దొంగలించారు అంటున్నారు దేవుడు మేమెప్పుడు దొంగిలించాము అంటే పదియవభాగమును కానుకలు ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు అంటున్నారు. మలాకి 3:8; మరి నీవు దేవునివి దేవునికి ఇస్తావా? ఆలోచించుకో! అలా ఇచ్చి నీవు పొండదుకోవాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకో!

 

దైవాశీస్సులు!

 

 

 

 

*గలతీ పత్రిక-68 భాగం*

గలతీ 6:710

7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

8. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

9. మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.

10. కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ పౌలుగారి చివరి హెచ్చరికలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 7 వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో పంటనే కోయును. వచనానికి రెండవభావము లేక అర్ధము ఇప్పుడు ధ్యానం చేసుకుందాం!

 

గమనించాలి 7 వచనానికి కొనసాగింపు 8—9 వచనాలు కాబట్టి వీటిని కలిపి చదువుకుంటే పరిశుద్ధాత్ముని ఉద్దేశ్యం అర్ధమవుతుంది. ......ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

9. మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.

అంటే దీని అర్ధం మొదటిది పోయిన భాగంలో వివరించడం జరిగింది.

ఇక రెండవది: నీవు ఏమి విత్తితే ఆ పంటనే కోస్తావు. అలాగే నీవు శరీరేచ్చలకు సంబంధమైన క్రియలను విత్తితే శరీరేచ్చలకు ఫలితం అనుభవిస్తావు! అది క్షయమైపోయేది అంటున్నారు. అలా కాకుండా ఆత్మసంభంధమైన క్రియలను చేస్తే అక్షయమైనది నిత్యజీవమును కోస్తావు అంటున్నారు. అనగా 5వ అధ్యాయంలో వివరించిన శరీర కార్యాలు చేస్తే నీవు క్షయమైపోయే పంట అనగా నాశనానికి దారితీసే నరకానికి పోతావు! ఆత్మానుసారమైన పనులు చేసి ఆత్మఫలము ఫలిస్తే నీకు నిత్యజీవము మోక్షరాజ్యము కలుగుతుంది అంటున్నారు! ఈ బోధ ఇప్పటి బోధ కాదు మొదట నుండి దేవుడు దీనిని బోధిస్తూ ఉన్నారు!

ద్వితీ ౩౦:15—19. ఇక్కడ మోషేగారు తానూ చనిపోయే సమయం వచ్చినప్పుడు చివరి పలుకులు చెబుతుండగా ఆత్మావేశుడై పలుకుతున్నారు ఈ మాటలు! .....

15. చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.

16. నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడ లను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించు చున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచు కొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.

17.అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన యెడల

18.మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేకదినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను.

19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

 

ఇక్కడ జీవాన్ని-మేలునుమరణాన్ని- కీడును, మీ ఎదుట పెడుతున్నాను అయితే ఏది కావాలో ఎన్నుకోవడం మాత్రం మీదే చాయిస్! మీరు దేవుని మాటలను అనుసరిస్తూ జీవిస్తే మీకు జీవము మేలు, దేవునిమాటలను వదిలేస్తే మీకు నాశనము అంటున్నారు. ఇక్కడ కూడా దానినే తీసుకోవాలి మనం దేవుని మార్గములలో అనగా ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తే మనకు నిత్యజీవము మేలులు ఆశీర్వాదాలు కలుగుతాయి! అలా కాకుండా నాకు శరీరకార్యాలు మహాబాగా నచ్చేశాయి. వీటిని వదలలేను! వదలలేక పోతున్నాను అంటే మంచిది- నీవు నరకానికి పోతున్నావు అని గ్రహించాలి! అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు! నీవు శరీరసంభంధమైన కార్యాలను చేస్తే లేక శరీర సంభంధమైన క్రియలను విత్తితే శరీరసంబంధమైన క్రియలకు ఫలితం అనుభవిస్తావు! క్రియలకు ఫలితం ఏమిటి?

 గలతీ 5:21

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇంకా ప్రకటన గ్రంథం 21: 8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ప్రకటన 22:15

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

ఇదీ శరీరపంటలను విత్తితే కలిగే ఫలము!

 

ఇక ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే ఆత్మఫలము ఫలిస్తే నీకు నిత్యజీవము అని చెబుతున్నారు! ఆశీర్వాదమును శాశ్వత జీవమును దొరుకుతుంది!

దేవుని మాటలను వినని వారికోసం, శరీరానుసారంగా నడిచేవారికోసం ఇంకా ఏమి వ్రాయబడింది అంటే

హోషేయ 8:7

వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.

 

హోషేయ 10:12

నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.

 

సామెతలు 22:8

దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.

 

కీర్తనలు 18:2527

25. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

26. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

27. శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

 

యోబు 4:8

నేను చూచినంత వరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.

 

కాబట్టి మనకు ఏమి అర్ధమవుతుంది అంటే మనకు జీవిత గమ్యాలు రెండే రెండు! ఒకటి శరీరాన్ని అనుసరించి శరీర కార్యాలు చేయడం లేదా దేవుని ఆత్మను అనుసరించి ఆత్మను పొందుకుని ఆత్మానుసారంగా నడచుకోవడం! ఒకమార్గం సహజంగా నరకానికి దారితీస్తుంది! మరొకటి నిత్యజీవమునకు దారితీస్తుంది!

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

రోమా 2:512

5. నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

7. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

9. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.

10. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

11. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

12. ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

 

రోమా 8:56; 1214

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.

13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

కాబట్టి దేవుని ఆత్మను అనుసరిస్తావా లేక శరీరాన్ని అనుసరిస్తావో నీవే తేల్చుకోవాలి!

అయితే పౌలుగారు చెబుతున్నారు- విశ్వాసులు ఇప్పటికే తమ శరీర స్వభావాన్ని సిలువవేశారు అంటున్నారు గలతీ 5:24లో. అయితే ఇప్పుడు ఎవరైనా ఇంకా శరీరకార్యాలు చేస్తున్నారు అంటే వాడు క్రీస్తు విశ్వాసి కాదు! వాడి బాస్ సాతానుగాడి విశ్వాసి! కేవలం నేను క్రైస్తవుడను అని అనుకుంటూ తననుతాను మోసగిచ్చుకుంటున్నాడు ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నాడు! దానికి ఫలితం రోమా 6:23. పాపమునకు వచ్చు జీతం మరణంఅయితే ఆత్మానుసారంగా జీవిస్తే నిత్యజీవము అంటున్నారు!

 

రోమా 2:7—10

7. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

9. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.

10. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

 

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పౌలుగారు మనం మంచిపనులు చేస్తే పాపవిముక్తి కలుగుతుంది అని నేర్పడం లేదు! దేవుని ఆత్మవలన మన జీవితం మారిపోతుంది. కాబట్టి ఆత్మను అనుసరించండి. ఆత్మకార్యాలు చేసి ఆత్మఫలము అనుభవించండి. ఫలించండి. అప్పుడు మీకు నిత్యజీవమనే పరలోకం కలుగుతుంది! ఇదే ముక్తికి మార్గం అంటున్నారు!

 

ప్రియ దైవజనమా! నీకు మార్గం కావాలి? ఆత్మానుసారమైన మార్గం అనగా ఆత్మఫలము ఫలించేమార్గమా? లేక శరీరకార్యాలు చేసి నరకానికి పోయే మార్గమా? దేవుడు చాయిస్ మనకే వదిలేశారు! గమనించండి పౌలుగారి మాటల ప్రకారం ఎవడైనా ఇంకా శరీరకార్యాలు చేస్తున్నాడు అంటే వాడు దేవుని బిడ్డ కాదు! దేవుని బిడ్డ/ విశ్వాసి అయితే వాడు శరీరకార్యాలు చేయడు! ఎందుకంటే వాడు తన శరీరస్వభావాన్ని శరీర క్రియలను ఎప్పుడో సిలువవేశాడు!

 

 ప్రియ సహోదరి సహోదరుడా! ఒకసారి నిన్నునీవు పరీక్షించుకో! ఒకవేళ నీలో శరీరకార్యాలు కనిపిస్తున్నాయా జాగ్రత్త! నీవు నాశనానికి అడుగుదూరంలో ఉన్నావన్న మాట! నేడు అనే సమయం ఉండగానే ఇప్పుడే పశ్చాత్తాప పడి కన్నీటితో దేవుని పాదాలు కడిగి శరీర కార్యాలు వదలి దేవుని మార్గాన్ని పట్టుకో! దేవుడు నిన్ను క్షమించడానికి సిద్దంగా ఉన్నారు!

నేడే అనుకూల సమయం!

ఇదే రక్షణ దినం!

రేపు నీకు లేదేమో జాగ్రత్త!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*గలతీ పత్రిక-69 భాగం*

గలతీ 6:9—10

9. మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.

10. కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.

 

      (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ పౌలుగారి చివరి హెచ్చరికలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇంతవరకు మనం గతభాగాలలో మనుష్యుడు ఏమి విత్తితే పంటనే కోస్తాడు అనేదానిని ధ్యానం చేసుకున్నాం! ఇక్కడ 9—10 వచనాలలో కాబట్టి మనం శరీరకార్యాలు కాకుండా మేలు చేయుటయందు విసుగక ఉందాము అంటున్నారు. అదికూడా అలసిపోకుండా చెయ్యాలి అంటున్నారు.

 

  ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మేలు చెయ్యాలి.

ఎలా చెయ్యాలి?

మొదటగా విసుకక చెయ్యాలి!

రెండు: అలయకుండా చెయ్యాలి!

అనగా చేస్తూనే ఉండాలి అన్నమాట!

అలా చేస్తే తగినకాలమందు ఆ మేలు ఫలము యొక్క పంటను కోస్తాము అంటున్నారు!

గమనించాలి! ఇలా మంచిపనులు లేదా మంచిచేస్తూ ఉండడం అనేది కేవలం మంచిపనులు చేయడమే కాకుండా దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లే విధానం అన్నమాట! వారిలో అనగా విశ్వాసులలో దేవుడు నివశిస్తున్నారు అనడానికి ఋజువు ఇది!

 

అసలు మంచి పనులు చేయడం ఇంకా ఆత్మఫలం ఫలించడం ఏమిటి?

 అత్మఫలం ఏమిటి?

గలతీ 5:22

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

 

ఎప్పుడైతే వీటిని అనుసరించి పంటను విత్తుతారో నిత్యజీవమనే ఫలం ఫలిస్తారు! కోస్తారు! లేక నిత్యజీవమునకు వారసులవుతారు!

మత్తయి 5:12

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

 

మత్తయి 10: 42

మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

 

మత్తయి 25: 21

అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో- ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

 

1కోరింథీయులకు 3: 14

పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

 

1కొరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

ప్రకటన 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

గమనించాలి: ఇలా లోకంలో మంచిపనులు చేద్దాం! మంచిని విత్తుదాం అనుకునే వారికి ఎన్నో అవకాశాలు కలుగుతాయి ఇంకా నిరుత్సాహాలు, ఆటంకాలు కూడా కలుగుతాయి! కొన్నిసార్లు వీటిని వదిలేద్దామా అని పిస్తుంది. గాని వదలకూడదు! మార్గంలోనే పయనించాలి అని పౌలుగారు మనలను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు! కాబట్టి మనం పట్టు విడువకుండా అలసిపోకుండా దీనిలో సాగిపోతేనే మనకు నిత్యజీవం!

 

   ఇక 10 వచనంలో అంటున్నారు కాబట్టి అవకాశం వచ్చినప్పుడెల్లా ఇలా అందరికీ మంచిపనులు చేద్దాం అంటున్నారు. ముఖ్యంగా మన విశ్వాస గృహానికి చెందిన వారికి! దీని అర్ధం అన్యులకు మేలు చెయ్యవద్దు కేవలం మన సంఘ విశ్వాసులకు మాత్రమే మంచి చేద్దాం అనడం లేదు! అందరికీ చేద్దాం!

అయితే మొదటగా మన విశ్వాస సమూహంలో, విశ్వాస గృహంలో చెందిన వారైన విశ్వాసులు అవసరాలలో ఉంటే తప్పకుండా వారికి మంచి చేసి, వారి కష్ట నష్టాలలో వారికి సహయం చేస్తూ ఉందాము! ఆ తర్వాత మన ఇరుగుపొరుగు వారికి మన రక్త సంబంధులకు కూడా సహాయం చేద్దాం అంటున్నారు!

 

Isaiah(యెషయా గ్రంథము) 58:7,8

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

 

యేసుక్రీస్తు ప్రభులవారు ఏమని చెప్పారో చూద్దాం!

మత్తయి 5:4348

43. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

45. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

46. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా.

47. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.

48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

 

లూకా 6:35

మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

 

పౌలుగారు ఆత్మావేశంతో అంటున్నారు రోమా 12:2021

20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

21. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

 

యాకోబుగారు అంటున్నారు 1:27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

చూశారా ఇదే భక్తి అంటూ భక్తికి నిర్వచనం చెబుతున్నారు.

 

యోహాను గారు అంటున్నారు

1యోహాను 3:17

ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

 

మరి మనం అలా చేస్తున్నామా? ఒకసారి మనలను మనం పరీక్షించుకోవడం అవసరం! మన రక్త సంభందికులకు మనం అవసరాలలో సహాయం చేస్తున్నామా? కొంతమంది మన సొంతవారికి చేయరు గాని పేరు రావాలని ఎవరికో చేస్తుంటారు- గొప్పలు చెప్పుకుంటారు. ఫోటోలు వేయించుకుంటారు!

మా పల్లెటూర్లలో ఒక సామెత ఉంది: ఇంట్లో ఉన్న అమ్మకు బువ్వ పెట్టడు గాని కాశీలో ఉన్న పిన్నమ్మకు చీర కొన్నాడట! అలాగే ఉంది లోకం ఇప్పుడు!

మొదటగా మన భాద్యత మన తల్లిదండ్రులను వారి బాగోగులు చూడాలి! తర్వాత మన రక్త సంబందికులను వారి అక్కరలలో ఆదుకోవాలి!

తర్వాత మన సంఘంలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి!

ఇంకా నీ దగ్గర ధనముంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలదీ మన ఇరుగుపొరుగువారికి దిక్కులేని వారికి అనాధలకు అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి!

 ఇదే భక్తి అంటున్నారు యాకోబుగారు! ఒకవేళ నీవు అలా చెయ్యడం లేదు అంటే నీవు భక్తిచేయ్యడం లేదు అన్నమాట!

 

  కాబట్టి బైబిల్ చెప్పినట్లు చేస్తూ నిత్యరాజ్యానికి వారసులవుదాం!

దైవాశీస్సులు!

 

 

*గలతీ పత్రిక-70వ భాగం*

గలతీ 6:11—16

11. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి.

12. శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు

13. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు.

14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము

15. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియు లేదు, పొందక పోవుట యందేమియు లేదు.

16. ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక.

 

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ పౌలుగారి చివరి హెచ్చరికలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 11 వచనంలో నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరాలతో వ్రాయుచున్నానో చూడుడి అంటున్నారు! ఐతే పెద్ద అక్షరాలలో రాయడానికి కారణం ఏమిటి?

 

 దీనికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది: కొంతమంది బైబిల్ పండితులు పౌలుగారికి కంటిచూపు మందగించింది అందుకే  చివర్లోపెద్ద అక్షారాలతో రాశారు. ఇంకా ఉత్తరాలు ఇతరులతో వ్రాయించేవారు అంటారు.

 

రెండవది: తాను ఉత్తరం రాసి ఉత్తరం యొక్క ముఖ్య ఉద్దేశం, భావము చివరలో తనచేతులతో రాయడం ఆయనకు అలవాటు! అందుకే చివరలో అన్ని పత్రికలూ ఆయన సొంత రాతతో పెద్ద అక్షరాలు వ్రాయడం అలవాటు అంటారు!

 

మూడవది: పౌలుగారు సువార్త విషయంలో అనేకమైన శ్రమలు హింసలు పొందారు! క్రమంలో చెరసాలలోను, ఇంకా రాళ్ళదెబ్బల వలన ఆయన చేతివ్రేళ్ళు దెబ్బతిన్నాయి. ఆయన తన చేతితో బాగా రాయలేకపోయేవారు. అందుకే తన శిష్యులతో ఆయన ఆత్మావేశుడై చెబుతూ ఉంటే శిష్యులు రాసేవారు! అయితే ఆయన ప్రేమ ఏమిటంటే చివర్లో తన మార్కు కనబడాలని కొన్ని లైన్లు తన చేతితో పెద్ద అక్షరాలతో రాసేవారు!

కాబట్టి మూడు కారణాలలో ఏదో ఒకటి లేదా రెండు కారణాల వలన ఆయన పెద్ద అక్షరాలతో రాసేవారు చివర్లో!

 

   సరే, ఇప్పుడు 1216 వచనాలలో ఉత్తరం రాయడానికి ముఖ్య ఉద్దేశం, ఉత్తరం యొక్క భావము మనకు తెలియజేస్తున్నారు:

సున్నతి పొందాలని ఎవరైతే మిమ్మును బలవంతం చేస్తున్నారో వారి ఆశ ఏమిటంటే మిమ్మును దారి తప్పించి తాము ఘనులమైనట్లు గొప్పలు చెప్పుకోడానికే! ఇంకా ఆ బోధించే వారు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా పాటించడం లేదు గాని మిమ్మల్ని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలని బలవంతం చేసి మీరు దారి తప్పిపోతే మీ శరీరం విషయంలో వారు అతిశయపడాలని వారి ఆశ అంటున్నారు!

ఈ అబద్దబోధకులు మనుష్యులను సంతోషపెట్టేవారే గాని దేవుణ్ణి సంతోషపెట్టేవారు కానేకాదు! తమ వాక్చాతుర్యం, సామర్ధ్యం, ఆసక్తి ప్రదర్శించి యూదులను ఆశ్చర్యపోయేలా చెయ్యాలని వారి ఉద్దేశం! ముందు భాగాలలో సిలువను గూర్చిన అభ్యంతరం లేక శ్రమలను భరించడానికి వారికి ఇష్టం లేదు! గలతీ 5:11

 

 కారణం క్రీస్తు సేవకులమని చెబితే, ఇంకా సున్నతి పాటించకూడదు అని ధర్మశాస్త్రమునకు విరోధముగా బోధిస్తే యూదుల నుండి శ్రమలు హింసలు ఎదురౌతున్నాయి గనుక శ్రమలను తప్పించుకోడానికి యూదులను సంతోషపెట్టడానికి క్రొత్త బోధ మొదలుపెట్టారు వీరు- ముక్తికి కేవలం క్రీస్తుయేసు నందు విశ్వాసం చాలదు! ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతిని కూడా పొందుకోవాలని! అలా చెప్పి పేరు ప్రతిష్టలు పొందుకోవాలని వారి ఆశ! గాని వారు అవే సంపాదించుకుంటున్నారు గాని సంపూర్ణత సాధించడం లేదు ఇంకా క్రీస్తుయేసు నుండి దూరమైపోయారు! కారణం శ్రమల ద్వారానే మనం సంపూర్ణత సాధించగలము అని హెబ్రీపత్రిక ద్వారా చూసుకున్నాం!   కాబట్టి ఇక్కడ వీరు అనగా అబద్దబోధకులు ఇలాంటి పేరుప్రఖ్యాతులు తెచ్చుకోడానికి దేనికైనా తెగిస్తారు! వారి ముఖ్య ఉద్దేశం క్రీస్తు సిలువను గూర్చిన హింసలను భరించడం వారికి ఇష్టం లేదు! వారికి సులువుగా పరలోకం కావాలి! దేవునికోసం శ్రమలను అనుభవించడం వారికి ఇష్టం లేదు!

 

ఇక, 13 వచనంలో అంటున్నారు: సున్నతి పొందిన వారు కూడా అనగా అబద్దబోధకులు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం లేదు! గాని మీతో సున్నతి చేయించి, మిమ్మల్ని ధర్మశాస్త్రాన్ని పాటించమని బలవంతం చేసి, మీరు దారి తప్పిపోతే మీ వలన మీ శరీరం కోసం అతిశయంగా మాట్లాడాలని వారి ఆశ! ఇంతకు ముందు కూడా మనం ధ్యానం చేసుకున్నాం గలతీ 4 అధ్యాయంలో. ధర్మశాస్త్ర సంబంధమైన అబద్దబోధకులు సరిగా ధర్మశాస్త్రాన్ని అర్ధం చేసుకోలేదు! వారికి ధర్మశాస్త్ర సారం తెలియనే తెలియదు! వారు దానిని ఆచరణలో పెట్టరు! గాని తెలిసినట్లు ఫోజులు కొడతారు!

రోమా 2:17—25

17. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?

18. ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా?

19. జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి- నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,

20. చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?

21. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

22. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?

23. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?

24. వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?

25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.

 

ఇంకా యేసుప్రభులవారు కూడా పరిసయ్యులు శాస్త్రలకోసం ఇలాగే చెబుతున్నారు .......

మత్తయి సువార్త 23:13,14,15,16,23,25,26,28,29,30

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో- నరకకుమారునిగా) చేయుదురు.

16.అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

28. ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు

30. మనము మన (లేక, మేము, మా) పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో (మూలభాషలో- రక్తవిషయములో) వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.

కాబట్టి మనము అబద్దబోధకులు బోధలలో పడిపోకూడదు, ఇంకా వీరిలాగ గొప్పలు డంబాలు చెప్పుకోకూడదు!

 

ఇంతవరకు బాగుంది. అయితే దేనికోసం అతిశయించాలి అనేదానిని ఇప్పుడు పౌలుగారు తన జీవితానుభవాలనుండి చెబుతున్నారు! 14..అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము

 

వీరైతే ఇలా చేస్తున్నారు గాని నేనైతే లేదా నాకైతే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి తప్ప మరి దేనివిషయంలో కూడా నేను అతిశయ పడను. అది నాకు దూరమవును గాక అంటున్నారు! చూశారా కేవలం సిలువను బట్టి మాత్రమే అతిశయపడతాను అంటున్నారు. సిలువ శ్రమలకు సాదృశ్యం అనగా తాను పొందిన సిలువను గూర్చిన శ్రమలను బట్టి నేను అతిశయపడతాను అంటున్నారుఇంకా ఆయన ద్వారా నాకు లోకమును, లోకమునకు నేనును సిలువవేయబడ్డాము అంటున్నారు!

 

   దీనిని బట్టి చూసుకుంటే సిలువను బట్టి విశ్వాసికి మహిమ కలుగుతుంది అన్నమాట! అతిశయానికీ నిజమైన కారణం సిలువే!! తనలో గాని, తాను చేసిన కార్యాలలో గాని దేని విషయంలో అతిశయపడలేదు గాని పాపులకోసం మరణించిన క్రీస్తుకోసం ఆయన పొందిన సిలువ మరణం కోసం పౌలుగారు అతిశయపడుతున్నారు.

 

రోమా 3:27

కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.

 

1కొరింథీ 1:2731

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

రోమా 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

 

1కొరింథీ 9:16

నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.

 

2కొరింథీ 11:1218, ౩౦31

12. అతిశయ కారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనేయున్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును.

13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

16. నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పుచున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి.

17. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను.

18. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

30. అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును.

31. నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.

 

2కొరింథీ 12:110

1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.

2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.

4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

5. అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.

6. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను.

7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.

 

2థెస్స 1:4...

అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.

 

కాబట్టి మనం కూడా పౌలుగారి ఆదర్శంలో నడవాలి. తాము చేసిన వాటికోసం గొప్పలు చెప్పుకుని టీవీల్లో సోషల్ మీడియాలో సొంతడబ్బాలు కొట్టుకోకూడదు! అలా సొంత గొప్పలు చెప్పుకునే వారి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవ్యక్తి దేనిగురుంచి అతిశయపడుతున్నాడు అనేది అతని యొక్క గుణగణాలను తెలియజేస్తుంది!

 

(ఇంకాఉంది)

 

        

 

 

 

 

 

 

 

 

 

 

*గలతీ పత్రిక-71 భాగం*

గలతీ 6:11—16

 

           (గతభాగం తరువాయి)

   ప్రియ దైవజనమా! మనం గలతీపత్రిక ధ్యానాలు ధ్యానం చేసుకొంటూ పౌలుగారి చివరి హెచ్చరికలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక తర్వాత నేను లోకానికి సిలువవేయబడి యున్నాము, సిలువమరణము చెంది యున్నాను అని ఎందుకు అంటున్నారు అంటే లోకము చెడ్డది గాబట్టి చెడ్డ స్వభావాన్ని బాప్తిస్మం ద్వారా పాతిపెట్టేశాను కాబట్టి నా శరీరస్వభావము పాతిపెట్ట బడింది. క్రీస్తుతో కూడా నాశరీర స్వభావము సిలువమరణం చెందింది అంటున్నారు!

 

గలతీ 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

 

గలతీ 5:24

క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

 

ఇక్కడ సిలువవేసింది మనుష్యులు కోరేవాటన్నిటిని, లేదా మనుష్యులు అతిశయించే వాటన్నిటిని సిలువవేశాను అంటున్నారుపౌలుగారు లోకమును లోకాశను, లోకములో పేరును ఆశించలేదు గాని కేవలం క్రీస్తు నామ మహిమ కోసం ఆయన నామ వ్యాప్తి కోసమే బ్రతికారు! లోకంలో పేరు ప్రఖ్యాతులు ధన భోగాలు ఆయనకు హీనమైనవి నిర్జీవమైనవి. అందుకే వాటిని పెంటగా ఎంచుకున్నాను అంటున్నారు....Philippians(ఫిలిప్పీయులకు) 3:7,11

7. అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

11. ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

 

ఇప్పుడు లోకానికి అతడు సిలువ వేయబడ్డారు. అయితే ఇది లోకం దృష్టిలో వెర్రితనముగా కనిపిస్తుంది. పౌలుగారు వారికి వెర్రివానిలా కనిపిస్తున్నారు. కారణం సిలువ నశించిపోయే వారికి వెర్రితనము, గాని రక్షించబడిన పౌలుగారి కయితే దేవుని శక్తిగా ఉంది....1కోరింథీయులకు 1: 18

సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

 

  అందుకే ఆయన సిలువ శక్తితో గొప్ప కార్యాలు చేయగలిగారు. అయితే క్రీస్తుయేసు మరణం లోకానికి అతనికి మధ్య పెద్ద తేడా చూపించింది. కారణం తాను నమ్మిన తన ప్రభువును లోకం సిలువవేసి చంపింది. ఇక ఇలాంటి  క్రీస్తును హత్యచేసిన లోకంతో పౌలుగారికి పనేమిటి అని యోచిస్తున్నారు!!!

 

ఇదేవిధంగా రక్షించబడిన ప్రతీ విశ్వాసి ఆలోచిస్తే విశ్వాసి కూడా శరీర సంబంధమైన క్రియలు చేయడానికి లేదా లోకానుసారమైన పనులు చేయడానికి లోకాచారాలు చెయ్యడానికి ఇష్టపడరు విషయం అర్ధం కాకనే మనిషి పాపంలో లోకంలో పడిపోయి దేవునికి దూరమైపోతున్నాడు! ప్రియ విశ్వాసి నీవు లోకంతో లోకంలో ఉన్నావా/ ఉంటావా? లేక దేవునితో ఉంటావా? లోకానుసారంగా ఉంటావా? లేక ఆత్మానుసారంగా ఉంటావో తేల్చుకో!

 

  ఇక 1516వచనాలలో పత్రికయొక్క తన ముఖ్య ఉద్దేశం రాస్తున్నారు: క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందడంలో ఏమీలేదు, పొందకపోవడంలో కూడా ఏమీలేదు అంటున్నారు. అలాచేస్తే ఇంకా అలా చేసేవారికి దేవుని కృప సమాధానము కలుగును గాక అంటున్నారు! పత్రిక మొత్తం ఆయన సున్నతి పొందడం వలన మనిషి దేనిని కోల్పోతున్నాడో రాస్తున్నారు! ముక్తికి మార్గం కేవలం క్రీస్తుయేసునందు గల విశ్వాసం మాత్రమే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా, సున్నతి పొందడం వలన, ధర్మశాస్త్ర సంబంధమైన మతాచారాలు, కర్మకాండలు, చట్టాలు, బల్యర్పణలు, పాటించడం వలన ముక్తి రాదు అని స్పష్టముగా చెబుతున్నారు.

ఇక్కడ నూతన సృష్టి లేదా క్రొత్తగా జన్మించాలి అని ఎందుకు చెబుతున్నారు అంటే మొదటగా యేసయ్య తన మాటలలో చెబుతున్నారు

మనిషి నీటిమూలంగా ఆత్మమూలంగా జన్మించడానికి నూతన జన్మ కావాలి!

 

యోహాను 3:3—8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా ( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

రెండు: ఇలా నూతన జన్మ పొందినప్పుడు మనస్సుమారి రూపాంతరం పొందుతారు!రోమా 12:1—2

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

2కొరింథీ 5:17

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

 

కాబట్టి నీవు క్రీస్తులో ఉంటే పాతవి గతించిపోయాయి. పాత రోత పాప బ్రతుకు పోయి ఇప్పుడు నూతన జీవము, నూతన జీవితము, నూతన జననము కలిగి క్రొత్త జీవితం కలిగి ఉంటావు కాబట్టి పాత అలవాట్లను వదిలిపెట్టాలి! లోకాచారాలు లోకానుసారమైన పద్దతులు వదిలివెయ్యాలి!

 

  ఇక 17 వచనంలో నేను ప్రభువైన యేసు ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను కనుక ఇకమీదట ఎవడూ నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నారుదీని అర్ధం ఏమిటంటే తన ఉపదేశాన్ని స్వీకరించి అబద్దబోధకుల బోధలను విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకోండి! ఇకమీదట నన్ను కష్టపెట్టకుండా ఉండాలని పౌలుగారు గలతీయ సంఘాన్ని కోరుతున్నారు!

 

ఇక యేసు యొక్క ముద్రలు ఏమిటి? ముద్రలు ఏమో కావు అవి ఆయన పొందిన శ్రమలు గాయాలు మాత్రమే! యేసుక్రీస్తు ప్రభులవారు ఎలా గాయాలు అనుభవించారోశ్రమలు అనుభవించారో పౌలుగారు కూడా చాలా శ్రమలను అనుభవించారు కాబట్టి ముద్రలు తన శరీరమందు ఉన్నాయి అంటున్నారు.

2కొరింథీ 1:52

క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.

 

2కొరింథీ 11:2327

23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.

27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

 

కొలస్సీ 1:24

ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.

 

కాబట్టి ఇలాంటి కష్టాలు పడి ఆయనయొక్క ముద్రలను తన శరీరమందు ఉంచుకున్నారు కనుక ఇకను తనను కష్టపెట్టవద్దు అంటున్నారు. వారు ఎలా కష్టపెడుతున్నారు అంటే దారి తప్పిపోతున్నారు కాబట్టి అందుకే ఇదే గలతీ పత్రికలో... మీ నిమిత్తం మరలా ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నారు. అనగా ఎంతో వ్యయప్రయాసలతో ఎన్నో శ్రమలను పొంది అక్కడ సంఘాన్ని స్తాపించారు,. వారి రక్షణకోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు వీరు అబద్దబోధకుల బోధలో పడి దారి తప్పిపోతున్నారు కనుక ఇకను దారి తప్పకుండ దారిలో నడవాలని చెబుతున్నారు.

 

ఇక చివరి వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక అని ముగించారు! గమనించాలి మొదటి అధ్యాయంలో ఇదే కృపతో లేఖను మొదలు పెట్టారు ఇక్కడ ఇదే కృపతో లేఖను ముగించారు!

 

  కాబట్టి ప్రియ దైవజనమా! ప్రియ విశ్వాసి నీవు లోకంతో లోకంలో ఉన్నావా/ ఉంటావా? లేక దేవునితో ఉంటావా? లోకానుసారంగా ఉంటావా? లేక ఆత్మానుసారంగా ఉంటావో తేల్చుకో! లోకానుసారమైన పనులు చేస్తే నీకు నరకం తప్పదు! దురభిమానపాపంలో పడిపోయి ఎవరు ఏమనుకుంటారో అనుకుని అన్యాచారాలు లోకాచారాలు చేస్తూ దానికి భారతీయత అనే ముద్రను వేసుకుని నిన్ను నీవు మోసం చేసుకుంటూ లోకంతో కలిసిపోయావా జాగ్రత్త దేవుని ఉగ్రతను తప్పించుకోలేవు సుమీ! Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

 

జీవముగల దేవునిచేతిలో పడుట భయంకరం అని మరచిపోవద్దు!

కాబట్టి నీ మొదట ప్రేమను మొదట విశ్వాసాన్ని గుర్తుకు చేసుకో!....

...Revelation(ప్రకటన గ్రంథము) 2:4,5

4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.

5. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.

 

Revelation(ప్రకటన గ్రంథము) 2:16

16. కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండివచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.

 

Revelation(ప్రకటన గ్రంథము) 3:3

3. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

 

Revelation(ప్రకటన గ్రంథము) 3:15,16

15. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.

16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.

 

నీవు లోకంతోనూ దేవునితోనూ ఉండలేవు!

యాకోబు 4: 4

వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

 

మొట్టమొదట ఆత్మనుసారంగా ప్రారంభించావు కాబట్టి శరీరానుసారంగా పరిపూర్ణత సాధించలేవు! విశ్వాసం ద్వారానే నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు!

ఇప్పుడే నిర్ణయించుకో!

ఆత్మానుసారమైన పనులను చేద్దాం! ఆత్మతో నింపబడదాం!

ఆత్మఫలము ఫలిద్దాం!

ఆత్మకార్యాలు చేద్దాం!

 

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

దైవాశీస్సులు!

 

                                                                                &&&&&&&&&&&&&&&&&&&

 

 ప్రియమైన దైవజనమా! గలతీపత్రిక ధ్యానములు మీతో మాట్లాడాయని తలస్తున్నాను అనేకమందిని భాదపెట్టాయని కూడా తెలుసు! అయితే కేవలము సత్యాన్ని గ్రహించాలనే తలంపే తప్ప మిమ్మును మీ హృదయాలను గాయపర్చాలని నా ఉద్దేశం కాదు! మీ హృదయాలను రేకెత్తించి మిమ్మును ఆయన రాకడకై ఆయత్త పరచాలనే నా తపన ఆలోచన!

 

 నాకోసం, మా కుటుంభం కోసం, మా పరిచర్య కోసం, ఇంకా మా సోషల్ మీడియా పరిచర్య, మా పేజీలు  యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నిరీక్షణ ద్వారం, మా వెబ్సైటు ఆధ్యాత్మిక సందేశాలు కోసం ప్రార్ధన చేయండి. మీ విలువైన అభిప్రాయాలు సూచనలు పంపుతున్నారు వందనాలు! ఇంకా పంపమని మనవిచేస్తున్నాను!

ప్రభువు చిత్తమైతే మరొక టాపిక్ తో మరలా కలుసుకొందాము!

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

ఇట్లు

ప్రభువునండు మీ ఆత్మీయ సహోదరుడు

రాజకుమార్ దోనె!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పక్షిరాజు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు