విశ్వాసి ఆత్మీయ పోరాటాలు
* విశ్వాసి - ఆత్మీయ పోరాటాలు * * మొదటి భాగము - ఉపోద్ఘాతము * * ఒక యవ్వనస్తుడు పనీపాటు లేకుండా తిరుగుతున్నాడు . ఒక తెల్లనిబట్టలు కట్టుకున్న వ్యక్తికి పనిచేయడానికి కొంతమంది కావాలి ! ఈ తెల్లని బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగాడు ఈ యవ్వనస్తుడిని నా ఆర్మీలో పనిచేస్తావా ? వెంటనే ఆ యవ్వనస్తుడు ఆర్మీ అంటున్నాడు - తెల్లనిబట్టలు వేసుకున్నాడు అని చూసి - ఓ యస్ !!! దానికోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు ! వెంటనే ఈ యవ్వనస్తుడికి తెల్లనిబట్టలు గల యూనిఫారం మరియు మొత్తం కవచం ఆయుధాలు (AK47 అనుకుందాం ) ఇచ్చి – ఒక మహా పెద్ద హాలు తలుపులు తెరచి ఆ హాలులోకి త్రోసేసారు . తలుపు తీసిన వెంటనే చాలా పెద్ద హాలు - ఒక హాలు దాటితే మరో హాలు - అలాంటివి ఎన్నో ఉన్నాయి - మరీ ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలు ధరించి భయంకరులైన శత్రుసైన్యం - తనకు ముందుగా కోట్లాదిమంది ఉన్నారు . ఈ తెల్లనిబట్టలు వేసుకున్న వ్యక్తి అన్నాడు - ఈ హాలునుండి బయటకు పోకూడదు , వెనక్కిపోతే చస్తావు ! ముందుకే ...