విశ్వాసి ఆత్మీయ పోరాటాలు
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*మొదటి భాగము- ఉపోద్ఘాతము*
*ఒక యవ్వనస్తుడు పనీపాటు లేకుండా తిరుగుతున్నాడు. ఒక తెల్లనిబట్టలు కట్టుకున్న వ్యక్తికి పనిచేయడానికి కొంతమంది కావాలి! ఈ తెల్లని బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగాడు ఈ యవ్వనస్తుడిని నా ఆర్మీలో పనిచేస్తావా? వెంటనే ఆ యవ్వనస్తుడు ఆర్మీ అంటున్నాడు- తెల్లనిబట్టలు వేసుకున్నాడు అని చూసి- ఓ యస్!!! దానికోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు! వెంటనే ఈ యవ్వనస్తుడికి తెల్లనిబట్టలు గల యూనిఫారం మరియు మొత్తం కవచం ఆయుధాలు (AK47 అనుకుందాం) ఇచ్చి – ఒక మహా పెద్ద హాలు తలుపులు తెరచి ఆ హాలులోకి త్రోసేసారు. తలుపు తీసిన వెంటనే చాలా పెద్ద హాలు- ఒక హాలు దాటితే మరో హాలు- అలాంటివి ఎన్నో ఉన్నాయి- మరీ ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలు ధరించి భయంకరులైన శత్రుసైన్యం- తనకు ముందుగా కోట్లాదిమంది ఉన్నారు. ఈ తెల్లనిబట్టలు వేసుకున్న వ్యక్తి అన్నాడు- ఈ హాలునుండి బయటకు పోకూడదు, వెనక్కిపోతే చస్తావు! ముందుకే పోవాలి! నీవు నీకు కనిపిస్తున్న సైనికులను తప్పించుకుంటూ అవసరమైతే వారిని చంపుతూ ఈ హాలులన్నీ దాటుకుని అవతలి గమ్యానికి పోవాలి! వీరోచితంగా పోరాడి చివరి గమ్యస్థానంకి చేరితే అదిగో ఆ కనపడే- వెలిగిపోయే నగరానికి మేజర్ గాని కమాండర్ గాని అవుతావు! మధ్యలో ప్రాణంపోతే పరమవీరచక్ర అవార్డు గెలుచుకుంటావు అని చెప్పి- హాలు డోరు మూసేసి వెళ్ళిపోయాడు! ఆ సైనికులను చూసి మన యవ్వనస్తుడు ఏదో ఆర్మీ అంటే వచ్చాను. నాకు తోడూ ఎవరు లేరు! ఎలా అంటూ ఆలోచనలో పడ్డాడు! చివరకు వెనక్కిపోతే చచ్చిపోతావు అన్నాడు కాబట్టి ఏదైతేఅదే అయింది అనుకుంటూ ముందుకు పోవడం మొదలుపెట్టాడు!*..... ఇది నేను చదివిన ఒక ఆత్మీయ కధ!
నేటి దినాలలో ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న వెంటనే అనుకుంటున్నాడు- ఇక నాకు కష్టాలు లేవు/ రావు. వచ్చినా యేసయ్య చూసుకుంటాడు! నా జీవితం పూలతోట! మల్లెలబాట! ఓ అందాల ఉద్యానవనం! అనుకుంటూ భ్రమపడుతున్నాడు! గాని అదికాదు! అలా ఆలోచించడానికి కారణం ముమ్మాటికి బోధకులే!!! మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అన్నీ ఆశీర్వాదాలే! దేవుని గల్లాపెట్టి నుండి కాసులు దీవెనలు ఆశీర్వాదాలు ప్రతీరోజు మీ ఇంట్లోకి కారిపోతూ ఉంటాయి! దీవెనలతో మీ ఇల్లు నిండిపోతూ ఉంటుంది అంటూ తప్పుడు భోదలు చెబితే వీరు నమ్మి అలా అనుకుంటున్నారు! కాని విశ్వాస జీవితం సామాన్యమైనది కాదు! మీద ఉదాహరించిన కధవలే బాప్తిస్మము తీసుకున్న వెంటనే ఆ వ్యక్తి ఆత్మీయ పోరాటం ప్రారంభమవుతుంది.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. కాబట్టి ఇది తనకుతానుగా ఈ పోరాటం చెయ్యాలి! తన సిలువనెత్తుకుని ప్రతీరోజు పోరాటం చెయ్యాలి! ఎవరూ తోడు ఉండరు! యేసయ్య తోడుగా ఉంటారు, నీకు సలహాలు సహకారం చేస్తారు! గాని నీ యుద్ధము,
నీ పోరాటము నువ్వే చెయ్యాలి! నీ తరుపున ఎవరూ చెయ్యరు!
ఎంత వీరోచితంగా పోరాడతావో అన్ని కిరీటాలు- అవార్డులు-రివార్డులు! పౌలుగారిలా పోరాడి-
మంచిపోరాటం పోరాడాను. నా పరుగు తుద ముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను! ఇక నాకు నీతి కిరీటం మహిమ కిరీటం ఈ కిరీటం ఆకిరీటం ఎదురుచూస్తుంది అని గొప్పగా చెప్పుకోవాలి! 2తిమోతి
4:7,8;
ఇదే నిజమైన విశ్వాస జీవితం!
క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం! ఆత్మీయ యుద్ధం! ఆ యుద్ధంలో జయం పొందితే జయించిన వారిలెక్కలో చేర్చబడి- ఎత్తబడిన గుంపులోనూ, తేజోవాసులైన పరిశుద్ధుల గుంపులోనూ, ఏడేండ్ల పెండ్లి విందులోను, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారితో సహవాసం కలిగి, నిరంతరమూ ఆయనతో ఉంటావు!
లేకపోతే సోమరియైన చెడ్డదాసుడా అనిపించుకుంటావు!
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ఆధ్యాత్మిక
సందేశాలు సిరీస్ లో-
ఆత్మీయ పోరాటాలు అనే మరొక చిన్న శీర్షికతో మిమ్మును మరోసారి కలుసుకోడానికి కృపనిచ్చిన దేవదేవునికి నిండు వందనములు! ఈ శీర్షిక ద్వారా ఆత్మీయ పోరాటాలు ఎన్ని రకాలు, ఎలా ఎదుర్కోవాలి లేక జయించాలి అనేది బైబిల్ నే ప్రామాణికంగా తీసుకుంటూ, నా స్వానుభవంనుండి పరిశుద్దాత్ముని సహాయంతో నాకు అర్ధమైనంత వరకు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను! గమనించాలి-
ఇవి కేవలం నా అనుభవాలనుండి, నేను నేర్చుకున్నవి మరియు పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినవి మాత్రమే రాస్తున్నాను! కాబట్టి ఈ శీర్షికలో రాస్తున్నవి అన్నీ నా ఉద్దేశాలు మాత్రమే! మీరు అర్ధాలు తీసుకుంటే తీసుకోండి లేకపోతే వదిలెయ్యండి!
ప్రియ దైవజనమా! మీదన వివరించినట్లు విశ్వాసి ప్రతీరోజు ఆత్మీయ పోరాటాలు చేస్తున్నాడు!
అవి కొన్ని రకాలుగా నేను
విడదీసుకున్నాను! (నాకు అర్ధం కావడానికి,
సౌలభ్యం కోసం)!
అవి మూడు రకాలు! (అని నా
ఉద్దేశ్యం)
మొదటిది:
*సాతానుతో పోరాటం!*
రెండు:
*ఆత్మీయ యుద్ధం-1. ఇది పాపముతో చేస్తాడు.*
మూడు:
*ఆత్మీయ యుద్ధం—2. ఇది మరలా రెండు రకాలు!*
*ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనద్వారా*
*ఆత్మీయ యుద్ధం—2.2 గిల్టీ (అపరాదభావం, ఆత్మన్యూన్యతా భావం) మరొకటి దేవుని మీద నిష్టూరాలు వెయ్యడం.*
అయితే నూటికి 75% విశ్వాసులు
ఈ ఆత్మీయ పోరాటాలులో ఓడిపోతున్నారు!!!
ఎందుకు ఓడిపోతున్నారు???
సరియైన ఆయుధాలు లేకనా?
కానేకాదు!
ఎఫెసీ 6:11—18
లో సంపూర్ణంగా ఇచ్చారు దేవుడు! యుద్ధానికి నిన్ను పంపి ఆయుధాలు లేకుండా చేసి, నిన్ను చంపాలని చూసే దేవుడు కాదు! అన్ని ఆయుధాలు లోడ్
చేసి మరీ
ఇచ్చారు దేవుడు!
మరెందుకు ఓడిపోతున్నాడు?
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*రెండవ భాగము- ఉపోద్ఘాతము—2*
ప్రియ దైవజనమా! విశ్వాసి ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు గాని నూటికి 75%
ఓడిపోతున్నాడు, ఎందుకు ఓడిపోతున్నాడు అనేది
ధ్యానం చేసుకుంటున్నాము మనము!
ఎందుకు ఓడిపోతున్నాడు అంటే
నా ఉద్దేశం ప్రకారం- (నా ఉద్దేశం మాత్రమే సుమా)
మొదటిది: *సర్వాంగ
కవచము మరియు ఆయుధాలు
ఎలా వాడాలో తెలియక!*
రెండు: *సగం సగం
వాడటం వలన!*
మూడు: *ఎప్పుడు ఏ
ఆయుధం వాడాలో తెలియక! లేక సరియైన
ఆయుధం వాడక!*
మొదటిది: *సర్వాంగ కవచము మరియు ఆయుధాలు ఎలా వాడాలో తెలియక ఓడిపోతున్నాడు!*
అర్ధం అవ్వడానికి ఒక ఉదాహరణ చూడండి:
కారుని మనమందరం చూస్తున్నాము! గాని మనలో అనేకమంది కారుని నడపలేరు! మనందరికీ తెలుసు- కారులో ఇందనం నింపుకుని- సెల్ఫ్ ఆన్ చేసి, ఆక్సిలిరేటర్ త్రొక్కితే కారు ముందుకు పోతుందని, ప్రక్కకి త్రిప్పడానికి స్టీరింగ్ ఇటూ అటూ త్రిప్పాలని, కారుని ఆపడానికి బ్రేక్ వెయ్యాలని, గేరు మార్చడానికి క్లచ్ నొక్కి గేరు రాడ్ సహాయంతో గేరు మార్చాలని, సిగ్నల్ వెయ్యాలని, హార్న్ కొట్టాలని మనందరికీ తెలుసు! సరే, ఇప్పుడు మా కారులో ఇందనం నింపి ఇస్తాను, ఒకసారి కారుని రెండు కి.మీ త్రిప్పి రండి అంటే మీలో ఎంతమంది కారు డ్రైవ్ చేసుకుని రెండు కి.మీ త్రిప్పి తీసుకుని రాగలరు???? నా ఉద్దేశం ఏ ముప్పై శాతం మంది మాత్రమే చెయ్యగలరు? ఏం? మనందరికీ కారు తెలుసు, కారులో స్టీరింగ్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది, హార్న్ ఎక్కడుంది లాంటివి అన్నీ మనకు తెలుసు, ప్రతీరోజు చూస్తున్నాము, గాని ఎందుకు నడుపలేకపోతున్నారు అంటే ప్రాక్టీస్ లేక! ఎప్పుడు నడపక!!!
అలాగే
ఆత్మీయ యుద్ధాలు కూడా ఎలా చెయ్యాలో తెలియక విశ్వాసి ఓడిపోతున్నాడు! ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి అనేది తెలిసికోడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని ఈ ఆత్మీయ పోరాటాలు ఎలా జయించాలి అనేది తెలుసుకోడానికి ప్రయత్నం చెయ్యడం లేదు! బోధకులు కూడా ఆశీర్వాదాలు దీవెనలు కోసం చెబుతున్నారు గాని ఈ ఆత్మీయ పోరాటాలు ఎలా జయించాలో చెప్పడం లేదు!
రెండు: *ఆయుధాలు- సగం సగం వాడటం వలన!!!* అనగా దేవుడు ఎఫెసీ 6:11—18 వరకు చూసుకుంటే సర్వాంగకవచములో అనేకమైనవి ఇచ్చారు. కవచముతో పాటుగా శిరస్త్రానం అనే హెల్మెట్, డాలు, ఖడ్గము, దట్టి అనే బెల్ట్, పాదాలకు జోళ్ళు లేక బూట్లు ఇలాంటివి అన్నీ సంపూర్ణంగా ఇచ్చారు! అయితే మన ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాటిని పూర్తిగా ఉపయోగించుకోకుండా సాతాను గాడ్ని తక్కువగా, తప్పుగా అంచనా వేసి, సగం లేక కొన్ని ఆయుధాలు మాత్రమే వాడి , సాతాను గాడి చేతులలో ఓడిపోతున్నారు! గమనించాలి- దేవుడు సర్వాంగకవచము ఇచ్చింది వాడడానికి—ఇంట్లో పెట్టి తాళం వేసుకోడానికి కాదు! అన్నీ బాగా వాడాలి!
ఇక మూడవది: *ఎప్పుడు ఏ ఆయుధం వాడాలో తెలియక, లేక సరియైన ఆయుధం ఉపయోగించక ఓడిపోతున్నారు!*
ఒకసారి ఎఫెసీ 6:12,13 చదవండి...
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి .
ఉదాహరణకు సాతాను గాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు, నీవు సత్యమనే దట్టి తోనో, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గముతోనో ఎదుర్కొంటే ఆ అగ్నిబాణం సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఆ అగ్ని బాణాలు ఎదుర్కోడానికి దేవుడు విశ్వాసమనే డాలునిచ్చారు! అ డాలునే వాడాలి! మరో ఆయుధంతో దానిని అడ్డుకోలేవు! దానిని వాడడానికి దేవుడిచ్చారు గాని ఇంట్లో పెట్టి పూజ చెయ్యడానికి కాదు!
నీ విశ్వాస యాత్రలో ముందుకు పోతుంటే అడ్డుగా పెద్ద పొట్ట వేసుకుని సాతాను గాడు గాండ్రించుకుంటూ దారికి అడ్డుగా వస్తున్నాడు- నీవేమి చెయ్యాలి- దేవుడిచ్చిన వాక్యమను ఆత్మ ఖడ్గమును తీసి- పనికిమాలినోడా నా దారికి అడ్డుగా వస్తావురా అంటూ ఖడ్గముతో వాడిమీద ఎటాక్ చేసి, వాడి పెద్ద పొట్టలో ఖడ్గముతో పొడిస్తే అక్కడనుండి పరుగోపరుగు! కాబట్టి మొత్తం సర్వాంగకవచమును ధరించుకుని, ఎవర్రెడీ బేటరీలాగ ఎప్పుడు సిద్ధముగా ఉంటూ, సందర్బాన్ని బట్టి సరియైన ఆయుధం వాడాలి అన్నమాట! సరియైన ఆయుధం వాడకపోతే వాడే మనలని చావజంపుతాడు అని గ్రహించాలి!
సరే, ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు! ఆయుధాలు ఎలా వాడాలో, ఎప్పుడు ఏవి వాడాలో మనకు తెలియదు కదా! మనకు ఎవరూ ట్రైనింగ్ ఇవ్వలేదు కదా!
వాటిని వేసుకోవడం ఎలా,
వాడటం ఎలా ఎవరు చెబుతారు? ఎవరు మనకు ట్రైనింగ్ ఇస్తారు అని అనుమానం రావచ్చు!
వీటిని వేసుకోడానికి, వాడటానికి ట్రైనింగ్ అవసరం లేదు! మనకన్నా ముందు పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు ఇదే ఆత్మీయ పోరాట మార్గంలో ప్రయాణం చేసి విశ్వాస వీరులుగా, ఆత్మీయ యోధులుగా నిలిచిపోయారు! వారి అడుగుజాడలలో మనం నడిస్తే వారిని చూసి వారు ఇదే ఆత్మీయ పోరాటంలో ఎలా గెలిచారో, ఏ రకమైన పోరాటాన్ని ఏ రకంగా గెలిచారో మనం తెలుసుకోవచ్చు!
ఎలా తెలిసికోవచ్చు! బైబిల్ గ్రంధమును చదవడం ద్వారా! గమనించాలి ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి అనిబైబిల్ చెబుతుంది....1కోరింథీయులకు 10: 11
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
కాబట్టి ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవలసిన అవసరం లేదు! సత్యవేదాన్ని చదువుతూ పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులైన వారిని ఉదాహరణగా తీసుకుంటూ వారి ఆత్మీయ జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి! ఇంకా హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పబడిన సాక్షి సమూహాన్ని ఉదాహరణంగా తీసుకోవాలి! ఈ రకంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ సర్వాంగకవచం ధరించుకుని మన ఆత్మీయ పోరాటంలో వీరోచితంగా పోరాడుతూ ముందుకు సాగిపోవాలి!
ఆమెన్!
దైవాశీస్సులు!
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*మూడవ భాగము- సాతానుతో పోరాటం-1*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు, మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు, అయితే పోరాడే విధానం- ఆయుధాలు వాడే
విధానం అన్నీ
బైబిల్ లో
గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది
ధ్యానం చేసుకున్నాము!
ఇక ఈ రోజు మొదటి
రకమైన ఆత్మీయ పోరాటం కోసం
ధ్యానం చేసుకుందాము!
పోరాటాలు:
మొదటిది: *సాతానుతో పోరాటం!*
రెండు:
*ఆత్మీయ యుద్ధం-1. ఇది పాపముతో చేస్తాడు.*
మూడు:
*ఆత్మీయ యుద్ధం—2. ఇది మరలా రెండు రకాలు!*
*ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనద్వారా*
*ఆత్మీయ యుద్ధం—2.2 గిల్టీ (అపరాదభావం, ఆత్మన్యూన్యతా భావం) మరొకటి దేవుని మీద నిష్టూరాలు వెయ్యడం.*
సాతానుతో పోరాటం!
ఇవి విశ్వాసి ప్రతీరోజు సాతానుతో చేసే డైరెక్ట్ పోరాటం!
సాతానుతో ఏ రకమైన పోరాటాలు సాధారణంగా విశ్వాసి చేయాల్సి వస్తుంది అంటే నా అనుభవం ప్రకారం:
చెడుపు-చిల్లంగులు, దయ్యం పట్టిన వారికి ప్రార్ధన చెయ్యడం- వదల గొట్టడం,
జబ్బులు-రోగాలు, శ్రమలు-శోధనలు,
లేనిపోని కుటుంబ కలహాలు, మనకు సంబంధం లేని అనుకోని కోర్టు కేసులు, జైలు, అవమానం,
క్రీస్తునామం కోసం దెబ్బలులాంటివి. (నాకు గుర్తున్న కొన్ని మాత్రం రాశాను).
సరే, వీటిని ఎలా ఎదుర్కోవాలి?
మనం చూసుకుందాం! బైబిల్ లో గల సాక్షి సమూహం ఎలా ఎదుర్కొందో చూసి వారి జీవితానుభవాల నుండి నేర్చుకోవాలి! సాతానుతో డైరెక్ట్ పోరాడిన వారు ఎందఱో ఉన్నారు గాని ముందుగా మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు సాతాను గాడ్ని ఎలా ఎదుర్కొన్నారో ఆయన అనుభవం నుండి నేర్చుకుందాం!
ఇది మనకు మత్తయి సువార్త నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది!
4:1—11..
మొదటి వచనం చూసుకుంటే
కొంచెం విచిత్రంగా ఉంటుంది.అప్పుడు యేసు అపవాడి చేత శోదించబడుటకు అరణ్యమునకు ఆత్మచేత కొనిపోబడెను! ఏమిటండి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుప్రభులవారు సాతానుచేత
శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డారా?
చిత్రంగా ఉంది
కదూ!
ఇక్కడ మూడు విషయాలు అర్ధం చేసుకోవాలి!
మొదటిది:
సాతానుగాడికి డైరెక్ట్ access ఉంది పరలోకానికి! యోబు గారి చరిత్ర చూసుకుంటే మొదటి వచనంలో దేవుడు-- దూతలు కలిసి చేసే దేవుని ఆలోచన సభకు రావడానికి వాడికి డైరెక్ట్ అనుమతి ఉంది. కారణం దేవుడు ఇచ్చి తీసుకొనే వాడు కాదు! వాడికి అనుమతి ఎప్పుడో ఇచ్చారు దేవుడు, వాడు పరము నుండి త్రోయబడినా అనుమతి వెనుకకు తీసుకోలేదు! అది ఎప్పుడు పూర్తిగా మూసుకు పోతుంది అంటే హార్మేగిద్దోను యుద్ధము, గోగు మాగోగు యుద్ధముతో వాడి ఆట ముగిసిపోయి- నరకం లోకి శాస్వతంగా పోతాడు! అంతవరకూ వాడికి పరలోకంలో ఆలోచనా సభ జరిగే స్థలము వరకు వాడికి అనుమతి ఉంది. అక్కడకు వెళ్లి దేవుని బిడ్డలమీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు!
రెండవది: సాతాను గాడు కూడా శక్తిమంతుడు! కారణం దేవుడు వీడికి కొన్ని అధికారాలు శక్తులు ఇచ్చారు. వాటిని మరలా దేవుడు తీసుకోరు! వాడికే కాదు ఎవరికైనా ఒక్కసారి ఇచ్చారా- మరలా తీసుకోరు!
మూడవది: తండ్రియైన దేవుని దగ్గరికే వెళ్లి కంప్లైంట్ చేయగలిగిన సాతాను గాడు చాడీలగాడు, కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు
దగ్గరకు
కూడా
వచ్చాడు! చూడండి! యేసుక్రీస్తుప్రభులవారినే
శోధించిన
పనికిమాలిన
వాడు, మన దగ్గరకు రాలేడా?
ఈ భూలోకం మొత్తం వాడి స్వాధీనంలోఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా రాలేడా? మనలను శోధించలేడా? కాబట్టి యేసయ్య ఉన్న పడవకి కూడా ఎలా తుఫాను వచ్చిందో, విశ్వాసి విశ్వాస పడవకు కూడా తుఫానులు గాలివానలు వస్తూ ఉంటాయి! వాటిని తట్టుకుంటూ అణుచుకుంటూ పోవాలి! ఇదే విశ్వాసయాత్ర! మరోదారి లేదు పరమునకు!!!
నాలుగు:
సేవాపరిచర్య ఘనముగా చెయ్యాలి అంటే ఉపవాస ప్రార్ధన చేసి- సిద్ధపడి- సాతాను గాడిమీద విజయం సాధించాలి. ఇది క్రమం! అందుకే దేవుడే గాని భూమిమీద మనిషిగా వచ్చారు కాబట్టి ఉపవాసముండి శక్తి సాధించి, వాడి శోధనను ఎదుర్కొని- వాడిని ఓడించారు!
సరే, సాతాను గాడు వాడు వచ్చాడు- వాడ్ని చూసి యేసుక్రీస్తుప్రభులవారు ఒరేయ్ మూర్కుడా! నా దగ్గరకు రాడానికి నీకెన్ని గుండెలురా అంటూ డైలాగ్లు చెప్పలేదు! ఎందుకంటే తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు అయిన త్రియేకదేవుడు జెంటిల్ మేన్! ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు! ఒకవేళ నిజంగా-- సాతానా నా దగ్గరకు వస్తావా? బయటకు పో! అని ఒక్కమాట అంటే వాడు పారిపోతాడు! గాని చెప్పాను కదా జెంటిల్ మేన్!
అందుకే అడిగారు యేసయ్య వాడిని—ఏమిటి సంగతి?
ఇలా వచ్చావ్ అంటే నీవు నలబై రోజులు ఆకలితో ఉన్నావు, చాలా ఆకలి వేస్తుంది కదా మరి నీవు దేవుని కుమారుడివి కదా, ఆకలితో బాధపడటం ఏమిటి? ఈ రాళ్ళు రొట్టెలవ్వాలని ఆజ్ఞాపించు! వెంటనే అవి రొట్టెలు అయిపోతాయి కదా అన్నాడు!
గమనించాలి! యేసుక్రీస్తుప్రభులవారి శక్తి సాతాను గాడికి తెలిసే ఈమాట అన్నాడు! వెంటనే యేసయ్య ఉక్రోషపడి అది నాకు తెలుసులే నీవు నోర్ముయ్యు అనలేదు ఎందుకంటే చెప్పాను కదా ఆయన జెంటిల్ మేన్ మరియు మర్యాదస్తుడు! లేదా ఆవేశపడి రాళ్ళను రొట్టెలుగా మార్చనులేదు! ప్రశాంతమైన వదనముతో లేఖనం నుండి ఒక వచనాన్ని ఆయుధంగా తీసుకుని మనుష్యుడు రొట్తెవలన మాత్రము జీవించడు గాని దేవుని నోటినుండి వచ్చే ప్రతిమాట వలన జీవిస్తాడు అని అన్నారు యేసయ్య!
మత్తయి 4:4;
ఈ సందర్భంగా ఒక్కమాట మీకు చెప్పనీయండి! దీనిని మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది! యేసయ్యకి రాళ్ళు రొట్టెలుగా చేసే శక్తి ఉంది గాని చెయ్యలేదు! ఎందుకు? అది చెయ్యకూడదు! దేవుడు తాను విధించిన విధులకు రూల్స్ రెగ్యులేషన్ కి తానే వ్యతిరేఖంగా చెయ్యరు! బాగా అర్ధం కావాలంటే సువార్తలలో ఐదు రొట్టెలు రెండు చిన్నచేపలు ఐదువేల మందికి పంచిపెట్టిన అద్భుతములో గాని, ఏడురొట్టెలు కొన్ని చిన్నచేపలు నాలుగువేలమందికి పంచిపెట్టిన అద్భుతములో గాని మీరే వారికి భోజనం పెట్టండి అని యేసుక్రీస్తుప్రభులవారు శిష్యులతో చెప్పినప్పుడు, వారు మన దగ్గర అన్ని రొట్టెలు ఎక్కడ, అన్ని డబ్బులు ఎక్కడ అన్నారు! వెంటనే ఆయన అయితే వారిని కూర్చోబెట్టి రాళ్ళు పట్టుకోమని చెప్పండి, నేను ప్రార్ధన చేస్తాను, వెంటనే రాళ్ళు రొట్టెలవుతాయని అనలేదు. మీ దగ్గర ఏమున్నాయి అన్నారు! ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు! ఉన్నవాటినే ప్రార్ధించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారికి సంపూర్తిగా తినేలాగా పంచారు! దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే అసాధారణ అద్భుతాలు చేసే శక్తి ఆయనకు ఉన్నా ప్రకృతికి వ్యతిరేఖమైన పనులు చెయ్యలేదు!
ఇక
దేవుడు
ఎప్పుడు
మానవ
జీవితంలో
అద్భుతాలు
మహా
అద్భుతాలు
అసాధారణ
అధ్బుతాలు
చెయ్యడానికి
ఇష్టపడుతుంటారు! అయితే దేవుడు తానే స్వయంగా చెయ్యరు! దానికి దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్న విశ్వాసులు కావాలి! అప్పుడు దేవుడు వారిని ఉపయోగించుకుని, వారి కాంబినేషన్ లో అసాధారణ అద్భుతాలు చేస్తారు! అదికూడా వారికున్న, వారిచ్చిన పరిమితి గల వస్తువులను ఉపయోగించుకునే అసాధారణ అద్భుతాలు చేస్తారు! ఇక్కడ ఒక చిన్న కుమారుడు తీసుకుని వచ్చిన రొట్టె లనే దీవించి ప్రార్ధించి 5000మందికి సరిపడేలా ఆశీర్వదించారు! గమనించాలి రొట్టేలనే మరిని రొట్టెలుగా చేశారు గాని మరొక దానిని రొట్టెలుగా చేయలేదు!
నా అనుభవం కూడా పంచుకోనియ్యండి! ప్రతీ సంవత్సరం మా ఊరిలో నేను చిన్న సభలను ఏర్పాటుచేస్తుంటాను మా చిన్న గ్రౌండ్ లో! 2018లో మా చర్చి యవ్వనస్తుడు వచ్చి- అన్నయ్యా ఈ సంవత్సరం సభలకు అవసరమయ్యే ఆకులు నేను పెట్టుకుంటాను అన్నాడు! సరే అన్నాను! నాలుగువేల ఆకులు తీసుకొచ్చాడు! ఆ సంవత్సరం మూడు రోజులు కలిసి వచ్చిన వారి సంఖ్య 5200 మంది కంటే ఎక్కువ! నేను ఎప్పుడూ లెక్కపెట్టిస్తాను ఎందుకంటే సభ అయ్యాక అందరికీ భోజనం పెట్టి పంపించడం అలవాటు! సభలు అయ్యాక ఇంకా 200 ఆకులు మిగిలాయి! ఆ అబ్బాయిని అడిగాను, మరలా ఎన్ని ఆకులు తెచ్చావు అని, నేనేమి తేలేదు అన్నాడు! ఎవరూ తేలేదు! అలాగే వాటర్ పాకెట్లు కూడా రెండు బస్తాలు మిగిలిపోయాయి! వచ్చినవారు భోజనం చెయ్యకుండా మేము వదలం! అందరూ తినేసి వెళ్ళారు! నాలుగువేల ఆకులు-
5200 మందికంటే ఎక్కువ తిన్నా ఇంకా 200 ఆకులు మిగిలిపోయాయి! అలాగే తెచ్చిన సరకులు అన్నీ ఇంకా మిగిలాయి! ఇది అద్భుతం కాదా?
అనగా మనకున్న చిన్న పరిమితి గల వస్తువులు, ధనము, రొట్టెలు, ధాన్యము లాంటివి , అదికూడా దేవుడిచ్చినవే తిరిగి ఆయనకు ఇస్తే వాటినే దీవించి అద్బుతాలు చేసి తిరిగి మనలనే పోషిస్తారు అన్నమాట! అందుకే సాతాను గాడు ప్రలోభపెట్టినా ప్రలోభపడకుండా వాడి ఉచ్చులో పడకుండా శాంతంగా అద్భుతాన్ని ఆయుధంగా చేసుకోకుండా వాక్యాన్ని, వాక్యమనే ఆత్మఖడ్గముతో వాడిని ఎదుర్కొన్నారు యేసుక్రీస్తుప్రభులవారు! మనం కూడా అసాధారణ అద్భుతాలు కోసం ఎదురుచూడకుండా, మనకున్న పరిమితులు అన్ని దేవునికి తెలిపి, మనకున్నవి ఆయన చేతిలో పెడితే, చివరకు మనలనే మనకు మనంగా ఆయన చేతులకు అర్పనగా అప్పగించుకొంటే--- ఇక చెప్పేదేమీ లేదు! నీ జీవితమే మారిపోతుంది. వీడా? ఒకరోజు ఇలా కదా ఉండేవాడు! ఇప్పుడు ఎలా మారిపోయాడో అంటారు! సరే, ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు వాడిన ఆయుధం వాక్యమనే ఆత్మఖడ్గము!
(సశేషం)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*4వ భాగము- సాతానుతో పోరాటం-2*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు, మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు అయితే
పోరాడే విధానం- ఆయుధాలు వాడే
విధానం అన్నీ
బైబిల్ లో
గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది
ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు సాతాను గాడిని ఎలా
ఎదుర్కొన్నారు అనేది
ధ్యానం చేస్తున్నాము!
చూడండి ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు సాతానుతో అంటున్నారు- మనిషి రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చే ప్రతీ మాటవలన జీవించును అని చెప్పారు! ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే ద్వితీ 8:౩ లో.
సాతాను గాడు సంధించిన శోధనను దేవుడు వాక్యమనే ఆత్మఖడ్గముతో ఎదుర్కొన్నారు! కాబట్టి సరియైన ఆయుధాన్ని శత్రువు మీద ప్రయోగించాలి!
ఎప్పుడైతే దేవుడు వాక్యమనే ఆయుధాన్ని సంధించారో- వెంటనే సాతాను గాడు అదే వాక్యమనే ఆయుధాన్ని బాణంగా మరో శోధనను సంధిస్తున్నాడు ఎవరిమీద? యేసుక్రీస్తుప్రభులవారిమీద! సాతాను గాడికి వాక్యము, లేఖనాలు బాగా తెలుసు! ఇప్పుడైతే మనము B Thలు
BDలు చేస్తున్నాము గాని వాడెప్పుడో వాక్యం మీద Ph.D చేసేశాడు!
ఇప్పుడు వాక్యాన్ని వెదికి-
ముందుగా ఆయనను పరిశుద్ధపట్టణం మీదికి తీసుకుని పోయి, దేవాలయ శిఖరం మీద ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవు అయితే ఈ శిఖరం మీదనుండి క్రిందికి దూకెయ్!
ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వ్రాయబడింది కదా! దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తిపట్టుకొందురు అవి వ్రాయబడింది కదా అంటున్నాడు! మత్తయి
4:6...
ఈ మాట/ లేఖనం మనకు కీర్తన 91:12 లో ఉంటుంది...
చూడండి తక్కువ శక్తిగల సాతాను గాడు యేసుక్రీస్తుప్రభులవారినే ఎత్తుకుని దేవాలయ శిఖరం మీదికి తీసుకుని పోయాడు! అయితే దేవుడు వాడికి లోంగిపోలేదు గాని పరిస్తితులను గమనిస్తూ వాడిని ఇప్పుడు జయించాలి గాబట్టి సరియైన ఆయుధంతో వాడిని దెబ్బకొట్టాలని చూస్తున్నారు అన్నమాట!
చూడండి- తన విరోధి తనను తీసుకుని వచ్చినా ఎంతో శాంతంతో జవాబు చెబుతున్నారు యేసుక్రీస్తుప్రభులవారు! హీరోగిరి చూపించడానికి దానిమీద నుండి దూకెయ్యడం లేదు! ఒకరకంగా ఎంత మెంటల్ టెన్షన్ పెడుతున్నా ఆయన శాంతంతో వాక్యం నుండి సరియైన జవాబు చెబుతున్నారు!
నీ
దేవుడైన
ప్రభువును
శోధించకూడదు
అని
కూడా
వ్రాయబడి
ఉంది
కదా
అన్నారు! మత్తయి 4:7. ఇది ద్వితీ 6:16 చెప్పబడిన లేఖనం అన్నమాట! కాబట్టి రెండోసారి కూడా వాడిని వాక్య ఖడ్గముతో ఎదుర్కొన్నారు ప్రభువు!
అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు! ఎందుకు వాక్యంతోనే సమాధానం చెబుతున్నారు ప్రభువు అని!
కారణం వాక్యం బలమైనది! శక్తిగలది! సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలది ప్రాణములను మూలుగులను విభజించునంత శక్తి గలది! బండలు బద్దలు చేసింది!
యిర్మియా 23:29 లో నామాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తివంటిది కాదా? అంటున్నారు.
చివరకు ఆదియందు వాక్యముండెను వాక్యమే దేవుడైయుండెను!
2 తిమోతి ౩:16,17 ప్రకారం వాక్యాన్ని ఇలాంటి వారికోసం, మరి విశ్వాసులను సరిదిద్దడానికి కూడా పనికొస్తుంది!
ఇక
2పేతురు 1:21 ప్రకారం ప్రవచనాలు గాని లేఖనాలు గాని మనుష్యుల ఇచ్చనుండి పుట్టలేదు గాని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కలిగాయి కాబట్టి వాక్యానికి ఇంట శక్తి ఉంది! అందుకే శక్తిగల వాక్యాన్ని ఉపయోగిస్తూ సాతాను గాడిని ఎదుర్కొంటున్నారు అన్నమాట!
మరో విషయం గమనించాలి—ఈ మాటలు పలకబోయేసరికి యేసుక్రీస్తుప్రభులవారు అప్పటికే 40రోజులు ఉపవాసంలోను ప్రార్ధన లోను ఉన్నారు! ఆత్మావేశుడై ఉన్నారు! అన్ని ఆయుధాలు ధరించుకుని ఉన్నారు! ఇప్పుడు సాతాను గాడు వాదిస్తున్నాడు శోదిస్తున్నాడు కాబట్టి వాడికి వాక్యంతోనే బుద్ధిచెబుతున్నారు!
ఇక మూడవదిగా వాడు ఆయనను ఎత్తైన కొండమీదికి తీసుకుని పోయి క్క రాజ్యములు వాటిమహిమను పెద్ద స్క్రీన్ మీద రెండు నిమిషాలలో చూపించేశాడు! చూపించి ఈ భూలోక రాజ్యాలన్నీ ప్రస్తుతం నా చేతిలో ఉన్నాయి!
నన్ను ఒక్కఈ భూలోకం యొసారి మ్రొక్కేసేయ్! వెంటనే ఈ రాజ్యాలన్నీ నీకిచ్చేస్తాను! నీవు సిలువమీద చనిపోవలసిన అవసరం లేదు లాంటి పనికిమాలిన డైలాగ్లు అన్ని వేశాడు!
ఇప్పుడు వాడికి తెలుసు—దేవుని కొడుకు దేవుడే! దేవుని కన్నా నన్ను నేను హెచ్చించుకోవాలి అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుప్రభులవారుకూడా దేవుడే కాబట్టి ఒక్కసారి గాని యేసయ్య ఈ సాతాను గాడికి మ్రొక్కితే ఇప్పుడు దేవునికన్నా తానే గొప్పవాడైనట్లు లెక్క! కాబట్టి తెలివిగా యేసయ్యను బుట్టలో వేసుకొందామని చూస్తున్నాడు!
వెంటనే
యేసుక్రీస్తుప్రభులవారు
కి
కోపం
వచ్చింది- పనికిమాలిన సాతానుగా నోరుమూసుకుని పో! లేఖనం ఏమి చెబుతుంది అంటే ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవించాలి అని వ్రాయబడింది. మూసుకుని పో అన్నారు! మత్తయి 4:9; వెంటనే వాడు పారిపోయాడు!
ఈమాట
నిర్గమ
20:1--6; 23:25 లో
ఉంది.
ఇక్కడ కూడా డైరెక్టుగా సాతానా పో అంటే పోతాడు గాని ఒక లేఖనం చూపించి అది తప్పు అని చెప్పి అప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న నీవు మూసుకుని పొమ్మన్నారు దేవుడు! ఇదీ విధానం! సాతాను గాడిమీద మనకు సంపూర్ణ అధికారం ఉంది! అయితే లేఖనములు చూపించి ఆ వాక్యాధారంగా ఇదిగో ఫలాని లేఖనం ప్రకారం నీకు నా మీద, ఈ పరిస్తితి మీద ఎటువంటి అధికారం లేదు! పో అని గద్ధించాలి! ఇది దేవుడు మనకు చూపించిన విధానం! మనం కూడా ఆ విధానం లోనే వాడ్ని ఎదుర్కోవాలి! అలా చెయ్యాలంటే మొదట మీకు లేఖనములు తెలిసి ఉండాలి. బాగా చదివి అర్థం చేసుకొని ఉండాలి!
మరో అనుమానం వస్తుంది! ఆయన దేవుడు కదా సాతాను గాడితో శోధనకు ఎందుకు అనుమతించారు? అంటే మొదటిది ఆయన భూమిమీద ఉన్నారు అప్పుడు! భూలోకం సాతాను గాడి అధికారంలో ఉంది. కాబట్టి తన పరిచర్య ప్రారంభం చెయ్యాలంటే బలమైన వాడిని ముందు బంధించాలి! కాబట్టి మొదటగా పరిశుద్ధాత్మ శక్తి పూర్తిగా కావాలి!
తర్వాత ఆ శక్తితో సాతాను గాడిని ఎదిరించి బంధించి ఓడించాలి! ఇదేసువార్త విధానం!
కాబట్టి ఆయన దేవుడై యున్నా గాని ఆయన చేసిన విధానాలు- భూమిమీద ఆయనకూడా మీరలేడు! అలా చేస్తే అనగా తాను చేసిన నియమాలు తానే వ్యతిరేకిస్తే ఎలా? అందుకే ఆయన తాను చేసిన విధానంలో తానే ముందుగా ప్రయాణించి మనకు మాదిరిగా ఉంచి పోయారు!
అలాగే
ఆయన భూమిమీద ఉన్నప్పుడు దేవునికి ప్రార్ధనలు- విజ్ఞాపనలు చేసినట్లు చూస్తున్నాము! ఆయన దేవుడు కదా, మరెందుకు
ప్రార్ధన
చేశారు? ఆయనదేవుడు కదా మరెందుకు అందరిలా బాప్తిస్మము పొందారు అంటే అదంతే! నీతియావత్తు అలా జరగాలి! భూమిమీద
నీకు ఏదైనా జరగాలి అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి! అప్పుడు నీ సమస్యకు
పరిష్కారం
లేక నీకు కావలసిన సహాయం దొరుకుతుంది! ఇక్కడ ఆయన భూమిమీద మానవుడుగా వచ్చారు మానవునిగా ఉన్నారు కాబట్టి ప్రార్ధన అనే అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనకూడా ప్రార్ధన చేసారు! అదంతే! ఆయనే ప్రార్ధన చేసినప్పుడు, ఆయనే ఉపవాసముండినప్పుడు నీవు నేను కూడా తప్పకుండా ప్రార్ధించాలి ఉపవాసం ఉండాలి! అదంతే! ఆయన మాదిరిలోనే మనం కూడా నడవాలి!
కాబట్టి ఈ మూడు శోధనలకు ఆయన సంపూర్తిగా సర్వాంగకవచం ధరించి వాక్యము అనే ఆత్మఖడ్గాన్ని వాడి, వాడిని తరిమి జయించారు! మనం కూడా యేసుక్రీస్తుప్రభులవారు చూపించిన మాదిరిగా సాతాను గాడితో యుద్ధం చెయ్యాలంటే సర్వాంగకవచం ధరించి, ప్రార్ధనాబలం, ఉపవాస బలం, ఆత్మపూర్ణత పొంది ఆ శక్తితో సాతాను గాడ్ని సరియైన ఆయుధంతో ఎదిరించాలి! సాతాను చేసే ప్రతీ ఎటాక్ లో మనం వాక్యాన్నిఉపయోగించాలి.
కాబట్టి ఆయన ఉంచిన మాదిరిలో పయనిస్తూ మన ఆత్మీయ పోరాటంలో సాతానుతో పోరాడుదాం!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*5వ భాగము- సాతానుతో పోరాటం-3*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు. అయితే పోరాడే విధానం- ఆయుధాలు వాడే
విధానం అన్నీ
బైబిల్ లో
గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది
ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు సాతాను గాడిని ఎలా
ఎదుర్కొన్నారు అనేది
ధ్యానం చేసుకున్నాము!
అయితే సాతానుతో చేసే
విభిన్న పోరాటాలు చూసుకునే ముందు
ఈరోజు దేవుడు మనకోసం తయారుచేసిన సర్వాంగకవచము- ఆయుధాలు కోసం చాలా
క్లుప్తంగా ధ్యానం చేద్దాం! కారణం వీటికోసం అనేకమంది ఎంతో మంచి
వర్తమానాలు పొందుచేశారు కాబట్టి క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!
ఎఫెసీ 6:11—18 వరకు దీనికోసం వ్రాయబడింది.
.....
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో- రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
గమనించాలి- ప్రతీ విశ్వాసి ఆత్మీయపోరాటం లో
ఉన్నాడు! కారణం మనం రక్షించబడుట సాతానుగాడు జీర్ణించుకోలేక మన విరోధియైన సాతాను ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహములా చూస్తున్నాడు!
అందుకే వీడితో పోరాడటానికి దేవుడు మనకు సర్వాంగకవచము ఇచ్చారు!
11లో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అంటున్నారు... *అపవాది తంత్రములు* అంటే సాతాను గాడు ఎన్నో రకాలుగా మోసపూరితముగా మన ఆధ్యాత్మికతను పోగొట్టడానికి క్రొత్త క్రొత్త టెక్నిక్కులు వాడతాడు. మరో విషయం సాతాను గాడు సిగ్గులేని వాడు! 10సార్లు ఛీ పోరా అంటే 11వ సారి మరో రూపంతో, మరో టెక్నిక్ తో వస్తాడు! కాబట్టి వాడి తంత్రాలు మనం తెలుసుకుంటూ ఉండాలి! వాడి తంత్రాలను ఎదిరించాలి అంటే దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకోండి అంటున్నారు పౌలుగారు! వాడి ఆయుధాలను తంత్రాలను ఎదుర్కోవాలి అంటే తప్పకుండా ఈ సర్వాంగకవచము ధరించుకోవాలి! మరలా చెబుతున్నాను- సర్వాంగకవచమును పూర్తిగా ధరించాలి, సగం సగం ధరించకూడదు! అనగా సత్యమనే దట్టి కట్టుకుని రక్షణ అనే శిరస్త్రానాన్ని మరచిపోకూడదు! శిరస్త్రానాన్ని వేసుకుని ఆత్మఖడ్గము పట్టుకోవడం మరచిపోకూడదు!
ఇక 12 వచనంలో ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోను పోరాడుతున్నాము అంటున్నారు! గమనించాలి విశ్వాసి చేసే ఆత్మీయ పోరాటంలో సాతాను గాడికి అనేకులైన సహకారులున్నారు! ఈ భూలోకంలోను, మధ్యాకాశంలోను, ఇంకా మృతులలోకంలోనూ, ఆత్మలుండే అదృశ్య లోకంలోనూ చాలామంది వాడి పక్షాన ఉన్నారు. దానియేలు 10వ అధ్యాయం ప్రకారం, 1తిమోతి 4:1, ప్రకటన 16:14 ప్రకారం అదృష్యులైన పాలకులు కూడా ఉన్నారు. వీరే మనుష్యులు పూజించే దేవుళ్ళు, దేవతలు! లోకనాదులు అధికారులు ఎవరంటే దేవునిమీద తిరుగబడి పరము నుండి లూసీఫర్ గాడితో పాటు త్రోయబడిన దేవదూతలు అన్నమాట! దేవుడు వీరిని త్రోసివేసారని దేవునికి వ్యతిరేఖంగా ఆయన బిడ్డలను పాడు చెయ్యాలనే మాస్టర్ ప్లాన్ వీరిది! కాబట్టి వీరితో మనం పోరాడుతున్నాము అని గ్రహించాలి!
ఇక 1౩వచనంలో *ఆపద్దినమందు* అంటున్నారు. ఆపద్దినము అనగా ఆపద వచ్చేరోజు అని అర్ధమయినా- అది క్రీస్తులేని రోజు అని అర్ధం చేసుకోవాలి! అనగా మన స్వంత ఆశలకోసం, పాపాల కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టి, మన స్వచిత్తం ముందు పెడితే, మన విశ్వాసం మీద కాకుండా మన ధనం మీద, స్వచిత్తం మీద ఆధారపడితే, ఆరోజు విశ్వాసం సన్నగిల్లిన రోజు, సాతాను గాడు చాలా సులువుగా మనమీద దాడిచేస్తాడు! అదే ఆపద్దినము! కాబట్టి ఈ ఆపద్దినమందు వాడిని ఎదిరించాలన్నా మనం సర్వాంగకవచాన్ని పూర్తిగా ధరించాలి!
14 వ వచనంలో *నడుముకి సత్యమనే దట్టి*! అనగా బెల్ట్! బెల్ట్ ఎందుకు వేసుకుంటాము? నడుముకి బలంగా ఉండటానికి! యోహాను సువార్తలో చెబుతున్నారు- సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును!..యోహాను సువార్త 8:32; యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు నేనే మార్గమును నేనే సత్యమును....యోహాను 14:6; అనగా సత్యము అనే యేసుక్రీస్తు ప్రభులవారిని నీకు బలంగా ధరించుకుంటే ఎటువంటి సాతాను తంత్రాలనైనా జయించగలవు అన్నమాట! అందుకే 2తిమోతి 2:1లో పౌలుగారు అంటున్నారు క్రీస్తుయేసునందు బలవంతుడవు కమ్ము! బలం కావాలంటే క్రీస్తుయేసులోనే ఉంది! ఏ బలము? ఆధ్యాత్మిక బలము! ఆత్మబలము! దానితో మాత్రమే నీవు సైతానుని జయించగలవు!
సత్యమనే దట్టి కట్టుకోవడం అంటే మన మనస్సులోని బైబిల్ సత్యాలు నింపుకుని ఉన్నది ఉన్నట్లు బోధిస్తూ, వాక్యమెత్తి వాక్యాన్ని చూపిస్తూ సైతానుతో పోరాటం చెయ్యడం అన్నమాట!
ఇక
*నీతి అనే మైమరువు*! మైమరువు అనగా కవచం! It protects sensitive parts of the
body! అయితే ఈ మైమరువు అనే కవచం ఒక్కటే ఉండదు 1థెస్స 5:8ప్రకారం... విశ్వాసం మరియు ప్రేమలు కలిసి కవచంగా ఏర్పడుతుంది! గాని ఇక్కడ నీతి అనే మైమరువు అని వ్రాయబడింది! అనగా విశ్వాసం-ప్రేమ కలిసిన కవచమే నీతిఅనే మైమరువుగా నిన్ను కాపాడుతుంది అన్నమాట! గమనించాలి- ఆ కవచం మరేదో కాదు! రక్షకుడు అని పిలువబడే యేసుక్రీస్తుప్రభులవారు! ఆయనే నీకు నీతిగా- ఆయన వలన పొందిన విశ్వాసం-ప్రేమలు పొందుకుని సాతానుతో యుద్ధము చెయ్యాలి అన్నమాట!
15. *పాదములకు సమాదాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే జోడుని* తోడుగుకోవాలి!
మొదటిది: సమాధానం! సాధ్యమైతే సమస్తజనులతో సమాధానంగా సఖ్యముగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది!రోమీయులకు 12: 18
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
కనబడిన ప్రతీ ఒక్కరితో తగవు ఆడాలని జగడమాడమని బైబిల్ చెప్పడం లేదు! సమాధానాన్ని ప్రేమించి దానిని వెంటాడమని చెబుతుంది బైబిల్! కీర్తన 34:14;
కాబట్టి సమాధానం కలిగి ఉండాలి! యేసుక్రీస్తుప్రభులవారు తనకు ఎవరు కనబడినా మీకు సమాధానం కలుగును గాక అనేవారు! షాలోం!!! అలాగే సమాధానంగా ఉండేవారు!
రెండు: సమాధానంగా ఉన్న నీవు ఇప్పుడు దేవుని సువార్త చెబితే అప్పుడు నీ సువార్త ప్రజలు వింటారు గాని అందరితో కయ్యాలు ఆడుతూ సువార్త చెబితే ఎవడూ వినడు! ఇలా అందరితో సమాధానంగా ఉంటూ సువార్త చెప్పుకుంటూ పోతే సాతాను గాడి పునాదులు వణకుతాయి అన్నమాట! ఈ రకంగా మరో రకమైన పోరాటం చెయ్యాలి!
జోడు లేక బూట్లు ఎందుకు? పాదములకు ముళ్ళు, రాళ్ళు గుచ్చుకోకుండా! తొట్రుపడకుండా! కాబట్టి ఈ సమాధానం, సువార్త కలిస్తే నీవు తొట్రుపడవు!
ఇక 16వ వచనంలో *విశ్వాసమనే డాలు*
పట్టుకొనుడి. దానితో సాతాను వేసే అగ్ని బాణములను ఆర్పుటకు శక్తివంతులవుతారు అంటున్నారు! విశ్వాసం అనే డాలు! సాతానుడు వాడు మన మనస్సులో సంధించే ప్రశ్నలు- అనుమానాలు నిజంగా అగ్ని బాణాలు వలే పనిచేస్తాయి! మనకు గనుక ఈ విశ్వాసమనే డాలు లేకపోయిందా అంతే సంగతులు! ఆ బాణము మన గుండెలో గుచ్చుకుపోయి ఆత్మీయ మరణం ఆత్మీయ బ్రష్టులు కావడం ఖాయం! అందుకే విశ్వాసమనే డాలు!
దేవుడు అన్నారు: నేను నిన్ను విడువను! ఎడబాయను! ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే! నిన్ను ఎత్తుకుని రక్షించు వాడను నేనే! ఇలాంటి బలమైన ధృడమైన వాగ్దానాలు మనకు ఉండగా సాతాను గాడు వాటిని పనిచేయకుండా చూడాలని ఈ పనికిమాలిన ప్రశ్నలు- అనుమానాలు హృదయంలో- మనస్సులో పుట్టిస్తున్తాడు వెంటనే మనం చెప్పాలి- ఇదిగో ఫలాని వచనంలో దేవుడు ఇలా అన్నారు! అలా అన్నారు! దేవుడు నాతోనే ఉన్నారు!! నీవు నోరు మూసుకుని పో అనాలి!
ఇలా ఈ విశ్వాసమనే డాలుని వాడాలి!
ఇశ్రాయేలు ప్రజలకి తాము గొలియాతుకి పురుగులులా ఉన్నామని అనుకున్నారు! దావీదు గారు తన సమస్యను తనతో పోల్చుకోకుండా తన సమస్యను- దేవునితో పోల్చుకుంటే గొల్యాతే ఒక పురుగులాగా కుక్కలాగా కనబడ్డాడు! విశ్వాసాన్ని ప్రదర్శించాడు! కారణం బండను బద్దలు చేసిన దేవుడు, సూర్యచంద్రులను ఆపిన దేవుడు, ఎర్రసముద్రం, యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు ఈ గొల్యాతును చంపగలడు అనుకున్నాడు- వెళ్లి ఒక్కదెబ్బతో కొట్టి చంపేశాడు! అదీ విశ్వాసం! మనం కూడా అలాగే చెయ్యాలి!
17 వ వచనం: *రక్షణ అనే శిరస్త్రాణం* అనగా రక్షణ అనే హెల్మెట్! హెల్మెట్ మన తలకు రక్షణగా ఉంటుంది! అయితే మరలా ఈ హెల్మెట్ సింగిల్ గా రాదు! 1థెస్స 5:8 ప్రకారం ఇది రక్షణ-నిరీక్షణ అనే కాంబినేషన్లో దొరుకుతుంది! అనగా రక్షణ ఉంటే నిరీక్షణ వస్తుంది! నిరీక్షణ లేకపోతే రక్షణ నిలబడదు! కాబట్టి ఈ రెండు ఒకదానిమీదొకటి ఆధారపడి ఉంటాయి! దేవుడు నన్ను చేయివిడువడు అనే నిరీక్షణ కలిగి మనకు కలిగిన రక్షణను కాపాడుకుంటే అది నిన్ను అనగా రక్షణ నిన్ను పరలోకం తీసుకెళ్తుంది! ఇక్కడ
మొదటగా: రక్షణ నిన్ను నరకం నుండి తప్పిస్తుంది! కాబట్టి నీ రక్షణను అనగా నీవు పొందుకున్న రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి!
రెండు: *హెల్మెట్ అనేది ఎప్పుడూ తలమీద ఉంటుంది! అలాగే రక్షణ అనేది కూడా నీ తలమీద ఉండాలి! తలలో మెదడు ఏ రకంగా మనిషిని కంట్రోల్ చేస్తుందో అదే రకంగా రక్షణ కూడా నిన్ను కంట్రోల్ చెయ్యనియ్యాలి! అనగా రక్షణ కూడా నీ తలమీద ఉండాలి అనగా అస్తమాను- నేను రక్షణ పొందుకున్నవాడిని/దానను అనే స్పృహ నీకుండాలి! నేను రక్షణ పొందుకున్న వాడిని అనే ఆలోచనతో నీవుంటే- నీ ఆలోచనల ద్వారా గాని, మాటల ద్వారా గాని, చూపుల ద్వారా గాని, ప్రవర్తన ద్వారా గాని పాపం చెయ్యలేవు! ఎందుకంటే రక్షణ పొందుకున్నావు అనే విషయం నిన్ను కంట్రోల్ చేస్తుంది! అంటే చివరికి It Contols your
Attitude!!! ఈ రకంగా రక్షణ అనేది నీవు పాపం చెయ్యకుండా నిన్ను ఆపి నిన్ను నరకంలోకి పోకుండా నిన్ను తప్పిస్తుంది! అదే విధముగా రక్షణను నీవు కూడా కాపాడుకోవాలి!*
ఇక తర్వాతది: *దేవుని వాక్యము అనే ఆత్మఖడ్గము!* దేవుని వాక్యాన్ని ఆత్మఖడ్గము అని ఎందుకు అన్నారు?
ఎందుకంటే వాక్యము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఖడ్గము కాబట్టి! ముందు బాగాలులో చెప్పడం జరిగింది వాక్యమునకు ఎంత శక్తి ఉందో! వాక్యమే దేవుడు! కాబట్టి ఈ ఆత్మఖడ్గమును ఉపయోగిస్తూ ఉండాలి! అనగా వాక్యాన్ని అర్ధం చేసుకుని దానిని ఖడ్గం వలే ఉపయోగిస్తూ ఉండాలి- సాతాను మీద యేసుక్రీస్తుప్రభులవారు వాడినట్లు సాతాను మీద! మనలో రేగే తలంపుల మీద, పాపపు ఆలోచన మీద, తలంపుల మీద, సాతాను సంధించే ప్రశ్నలు -అనుమానాల మీద వాక్యాన్ని ఖడ్గములా వాడాలి!
వాక్యము ఆయుధము!
ఉదాహరణకు కీర్తన 119:95లో భక్తుడు అంటున్నారు: నన్ను సంహరించాలని భక్తిహీనులు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములు తలపోయుచున్నాను అంటున్నారు! అనగా ఇక్కడ వాక్యాన్ని ఖడ్గములా వాడుతున్నారు భక్తుడు! అనగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేసి అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించగలరు!
హెబ్రీ
4:12 ప్రకారం వాక్యము: రెండంచులు గల ఖడ్గము! శక్తిగలది! సజీవమైనది! బలమైనది!
రెండంచులు ఎందుకంటే ఒక అంచుతో మనలను మనం కాపాడుకుంటూ రెండో అంచుతో సాతాను గాడి అంతు చూడాలి అన్నమాట!
ఖడ్గాన్ని ఎప్పుడూ వరలో పెట్టుకోవాలి మరియు పదును పెడుతూ ఉండాలి!
వరలో ఉంచుకోవాలి అనగా నీ మనస్సులో హృదయంలో ఎల్లప్పుడూ వాక్యము నిండిపోవాలి!
పదును పెట్టాలి అంటే ఎల్లప్పుడూ దానిని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి!
అప్పుడే అది పదును గలదై సాతానుతో పోరాడేటప్పుడు షార్ప్ గా ఉండు వాడిని చీల్చగలదు!
18: *ఆత్మవలన ప్రతీ విషయంలోనూ ప్రార్ధన చెయ్యాలి*! ప్రార్ధన ద్వారానే మనం ప్రభుతో మాట్లడగలము కాబట్టి ప్రార్ధన ద్వారా మనం దేవునితో సంబంధం కలిగి ఉంటాము కాబట్టి పరిశుద్ధాత్మను అనుభవిస్తూ మన ఆత్మయందు అనుదినం ప్రతీ సమయంలో కూడా ప్రతీ విధమైన ప్రార్ధన చెయ్యాలి! అవును ఇదే ప్రార్ధన ద్వారా అనేకులైన సాక్షి సమూహము ఎన్నో గొప్ప కార్యాలు, అసాధారణ అద్భుతాలు చెయ్యగలిగారు! మనం కూడా ప్రార్ధనా పూర్ణులై ఉండాలి! సాతానుగాడి కోటలు కూల్చాలి!
ఇదీ సర్వాంగకవచము అంటే! ఈ సర్వాంగ కవచము మనందరం ధరించి ఆత్మీయ పోరాటంలో విజయులై నిలిచిపోదాము!
దైవాశీస్సులు!
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*6వ భాగము- సాతానుతో పోరాటం-4*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు. అయితే పోరాడే విధానం- ఆయుధాలు వాడే
విధానం అన్నీ
బైబిల్ లో
గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది
ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు సాతాను గాడిని ఎలా
ఎదుర్కొన్నారు అనేది
ధ్యానం చేసుకున్నాము!
ఇప్పుడు కొద్దిగా భక్తుడైన యెహోషువా గారు
ఎలా ఎదుర్కొన్నారో క్లుప్తంగా
చూసుకుందాం!
మోషే గారి తర్వాత దేవునిచేత నాయకత్వము అనుగ్రహించబడింది యెహోషువా గారికి! మోషే గారి పాదాల దగ్గరే నాయకత్వపు లక్షణాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా మోషేగారి జీవితపు- నాయకత్వపు అనుభవాల నుండి నేర్చుకుని రాటుదేలారు యెహోషువా గారు! మరీ ముఖ్యంగా మోషే గారి నుండి దేవునిమీద ఆనుకోవడం, నిరీక్షణ, విశ్వాసం అనేవి చాలా బాగా నేర్చుకున్నారు! అంతకంటే శ్రేష్టంగా దేవునితో గడపడం వలన పొందుకునే లాభాలు ఏమిటి? దేవుని సన్నిధిలో గడపడంలో గల మజా మోషేగారి కంటే ఎక్కువగా అనుభవించారు యెహోషువా గారు! ఆ తర్వాత దేవుడు నాయకత్వాన్ని అప్పగించారు!
మోషేగారికి మొదట నుండి శత్రువులే! ఇశ్రాయేలు ప్రజలలో నుండే కాక సొంత బంధువుల నుండి కూడా శత్రువులు ఉన్నారు,
ఆయన చనిపోయే వరకు! గాని యెహోషువా గారికి శత్రువు అనేవాడే లేడు! ఆయనకోసం ప్రాణం పెట్టేవారు ఉన్నారు! ఆయనకు వ్యతిరేఖంగా ఎవడైనా పొరపాటున మాట్లాడితే వారిని చంపెయ్యడానికి అందరూ అనుమతి ఇచ్చేశారు! అంత పవర్ ఫుల్ నాయకుడు యెహోషువా గారు!
అయితే యెహోషువా గారు ఆత్మీయ పోరాటాలు- యుద్దాలు చెయ్యలేదా అంటే-
మోషే గారి కంటే ఎక్కువగా చేశారు! మోషేగారికి సొంతవారితోనూ శత్రువుతోను పోరాటాలు అయితే యెహోషువా గారికి పరిస్తితులు, 36మంది రాజులు, యోర్దాను నది, యెరికో కోట, అరణ్యం లాంటివి ఎదురయ్యాయి! మోషేగారికైతే ఎప్పుడూ దేవుని సన్నిధి తోడుగా నుండి- తండ్రి అంటే కుమారుడా అని పిలిచే దేవుడు- సాన్నిహిత్యం ఉంది! యెహోషువా గారికి లేదు! అయినా వీరోచితంగా ఆత్మీయ యుద్ధాలు- శత్రువులతో యుద్దాలు చేశారు!
మోషేగారు కేవం ముగ్గురు రాజులనే జయించారు! యెహోషువా గారు 36మంది రాజులను జయించారు! మోషేగారు- అమోరీయుల రాజులైన సీహోను ఓగు ప్రాంతాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటే యెహోషువా గారు యెరికోతో మొదలెట్టి మొత్తం కనాను రాజ్యమంతా జయించారు!
యెహోషువా గారికి ఎదురైన మొదటి చాలెంజ్- యెరికో!
దేవుడన్నారు: నీవు బయలుదేరి యోర్దాను దాటిపో! మీతో నేను ఉంటాను అన్నారు! అయితే ఒక వాగ్ధానం ఉంది. నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉందును అన్నారు దేవుడు. ఆ వాగ్దానం పట్టుకుని పోతున్నారు ఇక్కడ. అయితే దేవుడు మోషేగారి తో చెప్పినట్లు ఏ అద్భుతం చేస్తారో చెప్పలేదు! వెంటనే ప్రజలను తయారవమని చెప్పి మిమ్మును మీరు శుద్ధిచేసుకోమని చెబుతూ- మనం రేపు యోర్దాను దాటుతున్నాము! దేవుడు ఏం చేస్తారో నాకయితే తెలియదు గాని మీరు రడీగా ఉండండి! దేవుడు అద్భుతం చేస్తున్నారు, మనం యోర్దాను దాటుతున్నాము అన్నారు అంతే! ప్రజలు నమ్మారు! ముఖ్యంగా యెహోషువా గారు విశ్వాసంతో నమ్మిక ఉంచారు! ఈ నమ్మిక ప్రోసెస్ జరిగాక చివరలో దేవుడు చెప్పారు- యాజకుల కాళ్ళు యోర్దాను తాకిన వెంటనే యోర్దాను విడిపోతుంది అని! ముందుగా చెప్పలేదు! యాజకుల కాళ్ళు యోర్దానును తాకాయి! యోర్దాను ఆగిపోయింది! ఇక్కడ యెహోషువా గారు వాడినవి- విశ్వాసమనే డాలు! నమ్మకం, నిరీక్షణ ఇంకా పూర్తి లొంగుబాటు! (complete submission and full
obedience)! దేవుడికి మనిషిలో కావలసినవి అవే! మోషేగారి పాదాల దగ్గర అవే నేర్చుకున్నారు ఆయన!
తర్వాత ఎదురైంది యెరికో కోటలు! మహా బ్రహ్మాండమైనవి! పడగొట్టడం అసాధ్యం! దేవుడు ఎలా చెయ్యాలో ఏమి చెయ్యాలో చెప్పారు! అయితే సాతాను గాడు ఎప్పటిలా ఈ యెరికో కోటలు పడగొట్టగలవా అంటూ గుసగుసలాడాడు! వెంటనే ధైర్యం చెప్పుకున్నారాయన! యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు యెరికో కోటలు బ్రద్దలు గొట్ట గలడు! అయినా యోర్దాను దాటినా వెంటనే యెహోవా సైన్యాధిపతితో ముఖాముఖి జరిగాక అసలు భయపడటం లేదు! యెహోషువా యెహోవా సైన్యాధిపతి దగ్గరికి వెళ్లి నీవు మా పక్షాన వచ్చావా లేక మా శత్రువుల పక్షాన వచ్చావా? అంటే నేను మీ పక్షం వాడిని కాదు, వారి పక్షం వాడిని కాదు! ఇశ్రాయేలు పక్షంగా యుద్దాలు చెయ్యమని యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు ఆయన! వెంటనే సాష్టాంగపడ్డాడు! ఇప్పుడు ఎందుకు భయపడాలి? దేవుడే తన సైన్యాధిపతిని పంపించారు! విజయం ఖాయం! భయపడలేదు! ఎందుకు ఏమిటి ఎలా? అని అనుమానించలేదు! ఏడురోజులు చుట్టూ తిరిగి ఏడో రోజు కేకలు వేస్తే వచ్చిన అనునాదం (Resonance) వలన కోట బ్రద్ధలయ్యింది. గెలిచేశారు! ఇక్కడ కూడా గెలవడానికి సహాయం చేసింది - విశ్వాసమనే డాలు, నమ్మకం, నిరీక్షణ ఇంకా పూర్తీ లొంగుబాటు! (complete submission and full
obedience)!
తర్వాత
పెద్ద చాలెంజ్! ఐదుగురు రాజులు, లెక్కించలేనంత
సైన్యం! అయితే దేవుడు వారి పక్ష్యాన యుద్ధం చేస్తున్నారు! వీరు కేవలం దొరికిన వారిని దొరికినట్లు నరుకుకుంటూ పోతున్నారు! శత్రువులు
ఓడిపోయి
పారిపోతున్నారు! అది మనలాంటి పీఠభూమి చదును ప్రాంతం కాదు! కొండలు లోయలు అరణ్యాలు గల ప్రాంతం! శత్రువులు ఇప్పుడు పారిపోతున్నారు! వీరు తరుముతున్నారు! ఇంతలో మీదన చూస్తే తొందరలో ప్రొద్దు గుంకే లాగుంది! ఒక్కసారి
చీకటి పడితే శత్రువులను పట్టుకోవడం కష్టం! ఏమి చెయ్యాలి? గెలిచినా
విజయం సగం కూడా సాధించినట్లు అవదు! ఆలోచించి దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకున్నారు! ఎర్రసముద్రం తన కళ్ళముందే
కదా చీలిపోయింది! తన కళ్ళముందే
కదా బండనుండి నీరు వచ్చింది! ఐగుప్టు దేశంలో తన కళ్ళముందు
దేవుడు
ఎన్ని అద్భుతాలు చేసారో తెలుసు! తను నాయకుడయ్యాక ఏవిధంగా యోర్దాను నది పాయలయ్యిందో ఏవిధంగా యెరికోకోటలు బ్రద్ధలయ్యాయో తెలుసు! ఇక
ఆగలేదు! యుద్ధం గంభీరంగా జరుగుతుంది! ఆయన హృదయంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు! (యుద్ధం మానేసి భాషలు మాట్లాడుతున్నారు అని నా ఉద్దేశం). వెంటనే అత్మపూర్నుడై ఒక అసాధారణ ప్రార్ధన చేశారు ఆయన! ఇంతవరకు ఏ మానవుడు
అలాంటి
ప్రార్ధన
చెయ్యలేదు! అలాంటి ప్రార్ధనను దేవుడు కూడా అంగీకరించలేదు! సూర్యుడా! నీవు
గిబియోనులో
ఆగిపో! చంద్రుడా! నీవు అయ్యాలోను లోయలో ఆగిపో! అన్నాడు
ఆయన! సూర్యుడు చంద్రుడు తమ గమనాన్ని ఆపేశాయి! ప్రకృతి స్తంభించింది! వెళ్లారు- ఐదుగురు
రాజ్యాల
సైనికులను
చీల్చి
చెండాడి, అయిదుగురు రాజులను చంపేశారు! అసాధారణ ప్రార్ధన, అసాధారణ
అద్బుతం! మహాద్భుతం!
యెహోషువ 10: 12
యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
యెహోషువ 10: 13
సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు.
యెహోషువ 10: 14
యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.
ఇక్కడ యెహోషువా గారు
వాడిన ఆయుధం
ఆత్మవలన ప్రతీ
విధమైన ప్రార్ధన! ప్రార్థన అనే
కవచం! ఇది ప్రత్యక్షగుడారంలో తను
దేవుని సన్నిధిలో గడపడం వలన
నేర్చుకున్నారు ఆయన! అక్కడే ఆత్మను పొందుకున్నారు! మోషేగారు అయితే గుడారం నుండి పనుల
వలన బయటకు
వచ్చేవారు గాని
యెహోషువా అనే
యువకుడు బయటకు
రాలేదు అని
వ్రాయబడింది! ఇక్కడ యెహోషువా గారికి ఎక్కడ ఏ ఆయుధం ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు! అందుకే పరిశుద్ధాత్మను పొందుకుంటే
ఆయన మనలను
సర్వసత్యములోనికి నడిపిస్తారు!
మనం కూడా ఇలాగే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం
ధరించుకుని ఆతీయపోరాటం చెయ్యాలి!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*7వ భాగము- సాతానుతో పోరాటం-5*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం యేసుక్రీస్తుప్రభులవారు చేసిన విధానం నుండి
యెహోషువా గారి
జీవితానుభవం నుండి
చూసుకున్నాం!
ఇక మిగిలిన సాతానుతో చేసే ఆత్మీయ పోరాటాల కోసం
క్లుప్తంగా చూసుకుందాం!
అవి:
రోగాలు, చెడుపులు-చిల్లంగులు, దయ్యం పట్టడం- వాటిని వదలగొట్టడం, శ్రమలు-శోధనలు, లేనిపోని కుటుంబ కలహాలు, మనకు సంబంధం లేని కోర్టు కేసులు, క్రీస్తు నామం కొరకైన దెబ్బలు-అవమానాలు, జైలు లాంటివి!
అయతే వీటికోసం ధ్యానం చేసే ముందు
కొన్ని విషయాలు ప్రతీ విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి!
మొదటిది:
ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపంతో మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసుకుంటాడో వెంటనే ఆ వ్యక్తి స్టేటస్ మారిపోతుంది! ముందు పాపి, పాపానికి బానిస గా ఉన్న వ్యక్తి, విశ్వాసి, దేవుని కుమారుడు, వాగ్దానాలకు వారసుడు, రాజకుమారుడుగా స్టేటస్ మారిపోతుంది. తనను ఎందరు అంగీకరింతురో వారందరికీ పిల్లలు అగుటకు అనగా ఆయన పిల్లలు వారసులు అవడ్డానికి ఆయన అధికారం ఇచ్చారు! మీరు పిల్లలైతే వారసులు అనికూడా చెప్పారు! అనగా దేవుడు చేసిన వాగ్దానాలకు, పరలోకానికి ఆశీర్వాదాలకు హక్కులకు-విధులకు వారసులు! ఇక పాపానికి బానిసలూ కారు! ఇంకా మార్కు 16:15—18 వరకు చూసుకుంటే అక్కడ రక్షించబడిన వ్యక్తికీ కొన్ని అధికారాలు ఇచ్చారు.
నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడుతారు! పాములను ఎత్తి పట్టుకుంటారు.... రోగుల మీద చేతులుంచినప్పుడు అనగా రోగులమీద చేతులుంచి ప్రార్ధన చేసినప్పుడు వారి స్వస్థత పొందుదురు! ఇంత స్పష్టమైన అధికారాలు దేవుడు తన కుమారులమైన మనకు ఇచ్చి యుండగా ఇంకా పనివాడులాగా, బానిస లాగ ఎందుకు సాతాను గాడి దగ్గర లొంగి ఉంటావు? కాబట్టి అధికారంతో పోరాటం చెయ్యాలి!
రెండు:
రక్షణ పొందిన ప్రతీ వ్యక్తి దేవుడు ఆరోగ్యంగా ఆశీర్వాదంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు! నీవు రోగాలతో, ఆర్ధిక ఇబ్బందులతో, పేదరికంతో అనేకమైన బాధలతో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు లేదు లేదు! అన్ని విషయాలలో నీవు సౌకర్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి! సౌక్యం గా ఉండాలి! ఇదే దేవుడు కోరుకుంటున్నారు! కాబట్టి ఆరోగ్యం నీ హక్కు! దానిని జబ్బులతో బాధపెట్టడానికి సాతాను గాడికి అధికారం లేదు! కాబట్టి అధికారంతో దానిని శాశించాలి! అది పరిస్తితి అయినా, రోగమయి,నా ప్రకృతి అయినా సమస్య అయినా సరే!
సరే, మొదటగా: *రోగాలు-జబ్బులు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి?* ఎలావిడుదల పొందాలి?
జవాబు:
దేవుడిచ్చిన సర్వాంగకవచమును పూర్తిగా వాడాలి! ఇక్కడ ఉపయోగించాల్సిన ఆయుధాలు: సర్వాంగకవచము+ వాక్యఖడ్గము! ఎలా అంటే ఆరోగ్యం/స్వస్థత నీహక్కు! అది నీ జన్మహక్కు! కాబట్టి అధికారంతో చెప్పాలి సాతాను గాడితో- యేసుక్రీస్తుప్రభులవారి నామంలో స్వస్థత ఉంది, ఆయన ఎంతోమందిని స్వస్తపరిచారు, ఆయన పొందిన గాయాల వలన నేను స్వస్తత విడుదల పొందాను... 1పేతురు 2:24 వచనం ప్రకారం, మార్కు 16:16—18 ప్రకారం దేవుడు నాకు అధికారం ఇచ్చాడు!
జన్మహక్కు అని ఎందుకంటున్నాము అంటే నిశ్చయంగా ఆయన మన రోగములను భరించెను. యెషయా 53:4; కాబట్టి ఈ వాగ్ధానాలు స్వతంత్రించుకుని విశ్వాసంతో పలకాలి! కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు అధికారం గల నామంలో నిన్ను ఆజ్ఞాపించేదేమిటంటే నేను దేవుని బిడ్డను, నా మీద నీకు అధికారం ఏమీలేదు! ఆరోగ్యం/స్వస్థత నాహక్కు! కాబట్టి నన్ను బాధిస్తున్న ఓ రోగమా, దురాత్మా, సమస్యా యేసునామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను నన్ను విడచిపో ఇప్పుడే! అని అధికారంతో వాక్యాన్ని అనగా ఆత్మఖడ్గంతో వచనాలు చూపిస్తూ విశ్వాసంతో చెప్పాలి! వెంటనే వాడు పారిపోతాడు! అది ఏ రోగమైనా పోవలసినదే! యేసునామము కంటే బలమైన రోగము సమస్య ఏమీలేదు! యేసుక్రీస్తు స్వస్థ పరచలేని రోగం, సమస్య లోకంలో ఏదీలేదు! భూలోకమందు పరలోకమందు ఆయన నామమునకు ఏదైనా లోబడవలసినదే! కాబట్టి ఉన్న వనరులు వాడండి! అలా కాకుండా ఏమండి దయ్యం గారు! దయచేసి వెళ్ళిపొండి! తట్టుకోలేకపోతున్నాను అని బ్రతిమిలాడితే వాడు- ఎవడ్రా నీవు? నేను పొమ్మంటే పోను అంటాడు! అదే ఓ పనికిమాలిన దయ్యమా! (మీద చెప్పిన అన్నీ చెప్పి) యేసునామంలో బయటకు ఇప్పుడే పో అని విశ్వాసంతో అధికారంతో వాక్యాన్ని ఉపయోగించి చెబితే వెంటనే వాడు పటాపంచలైపోతాడు! రోగం మాయమవుతుంది!
ఈ మధ్యనే నాకు కలిగిన అనుభవం ఒకటి చెబుతాను! ఈ మధ్యన దేవుడు నాకు 5000 మంది ఆత్మలను ఇస్తాను అని వాగ్దానం చేశారు!
దానికి ఈ మధ్యన నేను సరే, దేవుడా!
నా ఆశ నీవు నెరవేర్చావు కాబట్టి నీవు నాకిచ్చిన టాస్క్ నేను నెరవేర్చు తాను అని హృదయపూర్వకంగా వాగ్దానం చేశాను!
దేవుడు వెంటనే అడిగారు నన్ను సరేనా? అన్నారు! నేను సరే ప్రభువా అన్నాను! వెంటనే ఆయన అన్నారు- దానిని నీవు సాధించాలి అంటే ఇంతవరకు నీవు ఎన్ని శోధనలు కష్టాలు అనుభవించావో దానికి రెట్టింపు పరీక్షలు శోధనలు పంపబోతున్నాను, ఆర్ధికంగా, మానసికంగా, కుటుంబపరంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాలలోనూ రెట్టింపు పరీక్షలు ఇప్పటి నుండి పెట్టబోతున్నాను, నీవు తట్టుకుని నేర్చుకున్న తర్వాత నీకు 5000 మంది ఆత్మలను ఇస్తాను అన్నారు! నేను సరే అన్నాను! ఆ రోజునుండి భయంకరమైన పరీక్షలలో నేను వెళ్తున్నాను! అన్ని విషయాలలోనూ శోధించబడుతున్నాను! నా కుమారుని ఆరోగ్యం బాగాలేదు, కొన్ని రోజులకు నాకు కూడా బ్లడ్ లో CRP పెరిగిపోయి ముడుకుల నొప్పి,
జాయింట్ల నొప్పి పెరిగిపోయి చాలారోజులు బాధపడ్డాను! నేను ఏమనుకున్నాను అంటే దేవుడు ముందే చెప్పారు కదా- అదే ఇది అనుకున్నాను! సాతాను గాడు కూడా అదే నా చెవిలో ఊదేవాడు! పదిరోజులముందు నాకు ఏమని గుర్తుకు వచ్చిందంటే ఆరోగ్యం/స్వస్థత నా హక్కు కదా! మరి ఎందుకు అడగకూడదు అనుకున్నాను- వెంటనే మందిరంలోకి పోయాను,
(మందిరానికి- నా మెయిన్ డోర్ కి కేవలం నాలుగు అడుగులే, అలాగే ఇల్లు కట్టుకున్నాను) వెంటనే నోరు తెరిచి- ప్రభువా ఆరోగ్యం నాహక్కు కదా, అందుకే అడుగుతున్నాను అని చెప్పి- వాక్య రిఫరెన్సులు ఎత్తి చెబుతూ నన్ను భాధపెడుతున్న ఓ ముడుకుల నొప్పి,
జాయింట్ నొప్పి, యేసు అధికారం గల నామంలో చెబుతున్నాను- ఆరోగ్యం/స్వస్థత నా హక్కు కాబట్టి వెంటనే విడిచిపో! అని విశ్వాసంతో చెప్పాను! రెండు రోజుల తర్వాత వెదికినా నా నొప్పి తెలియడం లేదు!
మాయమైపోయింది! అది మన హక్కు! అధికారంతో అడగండి!
బ్రతిమిలాడవద్దు! అధికారంతో సాతాను గాడిని పొమ్మని శాశించండి! నోరు మూసుకుని పెట్టె సర్దుకుని పోతాడు! అది ఆరోగ్య సమస్య గాని, బయట సమస్యలు గాని యేసునామంలో వాక్యానుసారమైన అధికారాలతో వాక్యాన్ని ఎత్తి గట్టిగా శాశించండి! అంతే!
వాడు పోక తప్పదు!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*8వ భాగము- సాతానుతో పోరాటం-6*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం యేసుక్రీస్తుప్రభులవారు చేసిన విధానం నుండి
యెహోషువా గారి
జీవితానుభవం నుండి
చూసుకున్నాం! ఇక మిగిలిన సాతానుతో చేసే ఆత్మీయ పోరాటాల కోసం
క్లుప్తంగా చూసుకుందాం!
అవి: రోగాలు, చెడుపులు-చిల్లంగులు, దయ్యం పట్టడం- వాటిని వదలగొట్టడం, శ్రమలు-శోధనలు, లేనిపోని కుటుంబ కలహాలు, మనకు సంబంధం లేని
కోర్టు కేసులు, క్రీస్తు నామం
కొరకైన దెబ్బలు-అవమానాలు, జైలు లాంటివి!
ఇక *దయ్యం పట్టడం, చెడుపు చిల్లంగులు, దయ్యాన్ని వదలగొట్టేటప్పుడు ఏమిచెయ్యాలి అనేది చూసుకుందాం!*
గతభాగం లో చెప్పినట్లు దేవుడు మనకు మార్కు 16:16—18 లో ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి! వాడికి చెప్పాలి- నేను లేదా ఈ వ్యక్తి యేసుక్రీస్తుప్రభులవారి రక్తంలో కడుగబడిన వ్యక్తి, ఈ వ్యక్తిమీద నీకు అధికారం లేదు సరికదా, మార్కు 16:16—18 ప్రకారం దయ్యాలు వెళ్లగొట్టే శక్తి దేవుడు నాకిచ్చారు కాబట్టి ఆ అధికారం బట్టి నీకు ఆజ్ఞాపించేదేమిటంటే యేసునామంలో ఇప్పుడే ఈ వ్యక్తిని లేక నన్ను విడిచిపో!ఆరోగ్యం/స్వస్థత ఈ బిడ్డ హక్కు అని విశ్వాసమనే ఆత్మఖడ్గంతో వాడితో అధికారంతో పోరాడి, వాడిని వెల్లగొట్టాలి!
ఈ సందర్బంగా కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి! దయ్యాలు వెళ్లగొట్టే ముందు నీవు తప్పకుండా ప్రార్ధన చేసుకుని వెళ్ళాలి! ప్రభువా అక్కడ దయ్యాలను వెల్లగొట్టడానికి వెళ్తున్నాను నాతో రండి! తగిన శక్తి నాకు దయచేయండి అని అడగాలి! అదే ప్రతీ విధమైన ప్రార్ధనలు ప్రతీ విషయంలో చెయ్యాలి! మరో విషయం – వాడు నీమీద దాడిచేయ్యకుండా ముందుగా నిన్ను నీవు యేసురక్తంతో కవర్ చేసుకోవాలి!
తర్వాత నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి!
నీలో సరుకు లేకుండా విశ్వాసం లేకుండా స్కెవ అనే యాజకుని ఏడుగురు కుమారుల వలే వెళ్తే వాడు పౌలు ఎవరో తెలుసు యేసు ఎవరో తెలుసు, ఇంతకీ మీరెవరూ అంటూ ఏడుగురిని బట్టలూడదీసి తన్నినట్లు తంతాడు సాతాను గాడు! అపొ 19:14;
కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడవై, విశ్వాసంతో, వాక్యాలు లేఖనాలు అనే వాక్య-ఆత్మఖడ్గాన్ని లోడ్ చేసుకుని వెళ్ళాలి! అవసరమైతే బాషలు మాట్లాడాలి- గమనించండి- బాషలు వాడికి అర్ధం కావు, భయపడి పారిపోతాడు! మార్కు 16:16—18 ప్రకారం క్రొత్త బాషలు మాట్లాడటం అనేది నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము పొందుకున్న ఆశీర్వాదాలు అభిషేకాలు, అధికారాలలో ఇది ఒకటి!
ఉపయోగించండి!
ప్రార్ధనకు, వాక్యముకు, నీలోనుండి
వచ్చే ప్రతీ
వాక్కుకు శక్తి
ఉంది! ఉపయోగించండి!
*చెయ్యకూడనివి ఏమిటంటే*: సాతాను గాడితో డిస్కషన్ పెట్టుకోవద్దు! నీ పేరు ఏమిటి? ఎప్పుడు నుండి ఉన్నావు? ఇలాంటి పనికిమాలిన ఇన్ఫర్మేషన్ మనకి అనవసరం! యేసయ్య ఎప్పుడు ఏ దయ్యాన్ని మాట్లాడనీయలేదు అని వ్రాయబడింది! మనం కూడా వాళ్ళను మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు! యేసునామంలో బయటకు పో అని శాశించాలి అంతే! ఇంకా వాడితో బేరమాడకూడదు! మా పల్లెటూళ్ళలో ఇలాగే బేరాలాడుతుంటారు. అమ్మా తల్లి పో అమ్మా! పోవాలంటే నీకేం చెయ్యాలి? అని అడుగుతుంటారు, వాడు/అది నాకు కోడికోసి వండి పెట్టు,
టీ ఇవ్వు, కాఫీ ఇవ్వు అంటూ ఉంటాడు! అవి చేస్తే వెంటనే పోతాడు,
గాని కొన్ని రోజుల తర్వాత మరలా వస్తాడు! అసలు వాడితో బేరాలాడకూడదు! పొమ్మని చెప్పాలి! ఇన్ఫర్మేషన్ లాగకూడదు! యేసయ్య ఒక్కసారి మాత్రమే నీ పేరు ఏమిటి అని అడిగారు,
కారణం వారు ఎక్కువగా ఉన్నట్లు ఆయనకు తెలిసిపోయింది కాబట్టి! ఒకవేళ నీ గొప్పకోసం వాడి ఇన్ఫర్మేషన్ అడిగితే తప్పకుండా ఒకరోజు వాడు నీ అడ్రస్ తెలుసుకుని నీదగ్గరకు వస్తాడు!
అవసరమా మనకు!
మరో
విషయం
నీకు
ఆ
శక్తి
ఉంటే
దయ్యాన్ని
పాతాళానికి
గాని, అగాదానికి గాని పంపించేయ్! అప్పుడు వాడు మరొకరి దగ్గరికి వెళ్ళలేడు! అందుకే గెరాసేనీయుల దేశంలో దయ్యాలు యేసయ్యను ఆ రెండుచోట్లకు పోకుండా దేవుణ్ణి అడుక్కున్నాయి!
ఇక చెడుపులు-చిలంగులు పట్టిన వారికి ప్రార్ధనచేసే ముందుగా-
రెండు ఉండాలి అని నా ఉద్దేశం!
పైన చెప్పినవి అన్నీ చేస్తూనే మొదటగా ఉపవాస ప్రార్ధన కావాలి! రెండు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి! నీతో పాటు విశ్వాసులైన పరిశుద్ధులైన వారు ఒకరో ఇద్దరో నీకు తోడుగా ఉండాలి! నీవు సాతానుతో పోరాడుతున్నప్పుడు వారిలో ఒకరు నీకోసం నీకు సపోర్టుగా ఉండి ప్రార్ధన చెయ్యాలి నీకోసం! అప్పుడు వాడు నీపై చేసే ఎటాక్ లు నీపై పనిచెయ్యవు!
ఒకవిషయం చెబుతాను- ఏమి చేసినా ఎక్కడకు వెళ్ళినా ప్రార్ధన, ప్రార్ధన ప్రార్ధన! దేవునికి చెప్పకుండా ఏమి చెయ్యవద్దు! ఇలాంటి దయ్యాలతో ప్రార్థన లేకుండా ఇంకా ఒంటరిగా పోరాటం చెయ్యవద్దు!
ఇక చివరగా ఆయన నీతో ఉన్నారు అనే భావన తప్పకుండా ఉండాలి!
ఆయన నీ పక్ష్యంగా పోరాడుతున్నారు, నీతో ఉన్నారు అనే విశ్వాసం నీకు లేకపోతే నీవు గెలుపు పొందలేవు!
ఇక *శ్రమలు-శోధనలు కలిగితే ఏమి చెయ్యాలి!*
శ్రమలు- శోధనలు ఎందుకు కలుగుతాయి? బైబిల్ చెబుతుంది దేవుడు ఎవరిని శోధించడు, మనుష్యుడు తన స్వకీయమైన దురాశలతో ఈడ్వబడి శోదించబడుతున్నాడు! యాకోబు
1:12--15;
కాబట్టి వెంటనే మనలను మనం పరీక్షించుకోవాలి! ఎందువలన ఈ శోధనలు వస్తున్నాయి అనేది పరిశీలించుకుని దేవునికి ఆయాసకరమైనది, దురాశలను తొలిగించుకుని దేవునితో సమాధాన పడాలి!
అయితే కొన్నిసార్లు యోబుగారి విషయంలో జరిగినట్లు శోధనలు వస్తాయి, మరికొన్ని సార్లు దేవుడు నిన్ను ఒక్కో మెట్టు ఎక్కించాలని అనుకుంటారు! అప్పుడు నిన్ను శ్రమల అలలలో పెట్టి వెండిని పరీక్షించినట్లు పరీక్షించి, అప్పుడు నిన్ను ఒక్కోమెట్టు ఎక్కిస్తారు! ఈ విషయంలో బైబిల్ చెబుతుంది 1కొరింథీ 10:13 లో
అంటున్నారు..
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.
కాబట్టి నీవు తట్టుకోగలిగినంత శోధనలే నీకు పెడతారు! అంతేకాకుండా దానిని జయించే మార్గము తప్పించే మార్గము దేవుడు నీకు
చూపిస్తారు! ఈ విషయం గుర్తుపెట్టుకుంటే నీకు వచ్చిన శోధనలలో జయించగలవు!
శోధన
కలిగినప్పుడు
వెంటనే
నీవు
పరీక్షించుకోవాలి- నీలో తప్పు ఉంటే సరిచేసుకోవాలి! తప్పు చెయ్యక పోయినా శోధన వస్తుంది అంటే నీవు తెలుసుకోదగిన విషయం ఏమిటంటే- నీవు దేవునిచేత ప్రేమించబడుతున్నావు! దేవుడు నిన్ను ప్రేమించి శ్రమల మార్గం ద్వారా నిన్ను మొదటగా ఒక్కోమెట్టు ఎక్కిద్దామని, నీ విశ్వాసాన్ని బలపరుద్దామని అనుకుంటున్నారు! రెండవదిగా సంపూర్ణత సాధించాలి అంటే శ్రమల మార్గము ద్వారానే సాధించాలి! దీనికోసం అనేకసార్లు రాశాను కాబట్టి ముందుకు పోదాం! యేసయ్య కూడా శ్రమల మార్గం ద్వారా ఎలా సంపూర్ణత సాధించారో అలాగే మనం కూడా ఆ మార్గంలోనే సంపూర్ణత సాధించాలి అని హెబ్రీ పత్రిక చెబుతుంది! 2:10--11;
కాబట్టి
శ్రమలు- నీవు దేవునిచేత ప్రేమించబడితేనే వస్తాయి అని గ్రహించాలి, పరిపూర్ణత సాధించడానికి వస్తాయి అని గ్రహించాలి! అప్పుడు వెంటనే దేవుడు చెప్పిన పై వాక్యాలు గుర్తుచేసుకుని ఓ పనికిమాలిన సైతానా, నా మదిలో నీవు వాదించవద్దు. దేవుడు శోధన నేను తట్టుకునేటంత మాత్రమే గాని తట్టుకోలేనంతగా ఇవ్వరు, దేవుడు నాకు ప్రమోషన్ ఇద్దామని అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్లవలసినది శ్రమల మార్గం లోనే! కాబట్టి సరియైన మార్గంలోనే వెళ్తున్నాను! నీవు మూసుకో అని చెప్పాలి సైతాను గాడికి! చాలు- వాడిని జయించిన వెంటనే దేవుడు శోధనలో విజయం ఇచ్చి ప్రమోషన్ ఇస్తారు!
*లేనిపోని కుటుంబ కలహాలు తగాదాలు, కోర్తుకేసులు వస్తే:*
దేవుడు అందరితోను సమాధానంగా ఉండండి అన్నారు! అవసరమైతే మీ
ఆస్తులను పోగొట్టుకోవడం మంచిది గాని కోర్టులుకు వెళ్ళడం, తగాదాలు పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్ కి
వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు! కాబట్టి మొదటగా మనమే తగ్గిపోవాలి!
అన్యాయాన్ని సహించమంటున్నారు!
1కోరింథీయులకు 6: 7
ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింప బడనిచ్చుట మేలు కాదా?
అదేకదా మత్తయి సువార్తలో కొండమీద ప్రసంగలో చెబుతున్నారు దేవుడు! దేవుడు చెప్పినట్లు చెయ్యాలి! సాతాను గాడి మాస్టర్ ప్లాన్ ఏమిటంటే కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య, విశ్వాసుల మధ్య, ఇరుగుపొరుగు వారి తోను తగవులు-తగాదాలు పెట్టి- నీ మనస్సు పాడుచేసి, నెమ్మది లేకుండా చేసి- నీవు అలసిపోయి ప్రార్ధన చెయ్యకుండా నిన్ను చేసి- నీవు దేవునిమీద నిష్టూరాలు వెయ్యాలి! ఇదే వాడి ప్లాన్!
కాబట్టి నీవే తగ్గిపో! అవసరమైతే నీవే నష్టపోయి- దేవుని ప్రేమను పంచు! ఇప్పుడు శత్రువులుగా ఉన్నవారు కూడా ఒకరోజు- నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతారు! ఇప్పుడు కొన్నిరోజులు సహించు! ఇక్కడ నీకు కావలసిన ఆయుధాలు- ప్రేమ, ఓర్పు, నిరీక్షణ, నెమ్మది! ఏ పరిస్తితులలో కూడా దేవుడు నిన్ను విడువను ఎడబాయను అన్నారు కాబట్టి- దేవుడు నీతో ఉన్నారు అన్న భావనతో ఇలాంటి ఈ శ్రమలు జయించగలవు!
*ఒకవేళ- క్రీస్తునామం కోసం-అవమానం- దెబ్బలు, కోర్టులు, జైలు సంభవిస్తే:* సంతోషించు ఆనందించు! ఇదే కొండమీద ప్రసంగంలో చెప్పారు! మత్తయి 5:10--12; పెద్ద ఏదో శ్రమలు శోధనలు వచ్చినట్లు ఫీల్ అయిపోకు! అపోస్తలుల కార్యంలోను థెస్సలోనికయులకు పత్రికలోను ఇదే చెప్పారు! ఇలాంటి శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడ్డాం! అనేక శోధనలు అనుభవించిన తర్వాతనే మనం పరలోకం చేరుతామని యేసయ్య చెప్పారు, శిష్యులు కూడా చెప్పారు! మరి ఎందుకు ఊరికినే ఫీల్ అయిపోతావు! కేవలం సంతోషించు! ప్రభువా నీవు పొందిన శ్రమలలో నేను పాలువాడనైనందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పు! ఎక్కడా ఎప్పుడూ అనుభవించలేని ఒకరకమైన మనశ్శాంతి భావన నెమ్మది కలుగుతుంది! ఆత్మ అభిషేకం కల్గుతుంది దానితో సాగిపో! అంతే! ఆయుద్ధాలు లేవు!
కాబట్టి సాతానుతో చేసే
పోరాటానికి సర్వాంగకవచం సరిపోతుంది!
To fight in Spiritual
Warfare with Satan- the Armor of God is sufficient! Use it! Don it properly!
Practice it everyday! Ask God’s help by means of praying every day for
everything in every aspect !!!
Ask help of your church
and your Pastor only to pray for you!
God Bless You!
Amen!
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*9వ భాగము- ఆత్మీయ యుద్ధము-1*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం చూసుకున్నాం!
ఇక మనం
విశ్వాసి చేసే
రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం చూసుకుందాము!
దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-1. ఇది విశ్వాసి- పాపముతో లేక లోకముతో చేస్తాడు!
రకాలు:
శరీరాసలు, నేత్రాస, జీవపుడంభము, కామవాంచ, అధికార కాంక్ష, ధనాశ లాంటివి. ఇంకా చెప్పాలంటే గలతీ 5వ అధ్యాయంలో చెప్పబడిన శరీర కార్యములలో సగం ఈ కోవకు వస్తాయి!
ఇప్పుడు వీటిని ఎలా
జయించాలో కేవలం
బైబిల్ లో
గల సాక్షి సమూహమును చూసి
నేర్చుకుందాము!
మీకు నాలుగు గుంపులు చూపిస్తాను. వీరు ఎలా జయించారు? దేనిలో ఓడిపోయారు?
తద్వారా మనం
ఎలా జయించాలి ఏమి పాఠం
నేర్చుకోవాలి అనేది
మన ఆధ్యాత్మిక జీవితం ఎలా
మలచుకోవాలి అనేది
వారి జీవితానుభవాలనుండి చూసుకుందాం!
మొదటి బాచ్:
*యోసేపు, సంసోను, దావీదు*
రెండు:
*సౌలురాజు, దావీదు రాజు*;
మూడో బ్యాచ్:
*బిలాము, దేమా, గేహాజి, అననీయ-సప్పీర*
నాలుగో బ్యాచ్:
*దానియేలు, షడ్రాక్, మేషాక్, అబెద్నేగో*
మొదటి బ్యాచ్: *యోసేపు గారు, సంసోను గారు, దావీదు గారు*! మహా గొప్ప భక్తులు- దైవజనులు!
ముగ్గురిమీద ఒకే రకమైన శోధన ఎదురైంది! అది కామవాంచ!
(Sexual Desires).
యోసేపు గారి దగ్గరకే అవకాశం వస్తే-
ఈ పాపము నుండి పారిపోయారు!
దావీదు గారు ఈ పాపాన్ని పిలిపించుకున్నారు. పాపం దగ్గర ఆగిపోయారు!
సంసోను గారు వాటి దగ్గరకే పోయారు అనగా వాటివెనుక వెళ్లారు! వాటిలో పడిపోయారు!
ఫలితం: యోసేపు గారు జయజీవితం జీవించగా, దావీదుగారు సంసోను గారు పతనమైపోయారు!
యోసేపు గారి జయజీవితానికి కారణం లేక యోసేపు గారు తన ఆత్మీయ పోరాటంలో సాతాను మీద, పాపం మీద, లోకం మీద ఏ విధముగా జయించగలిగారు అంటే కేవలం వాక్యం వలన! ధర్మశాస్త్రం కూడా లేని మనస్సాక్షి కాలంలో- అబ్రాహాము గారు తన ముత్తాత అయిన నోవాహు గారి దగ్గర వాక్యము-పద్దతులు నేర్చుకుంటే, అబ్రాహము గారి దగ్గర ఇస్సాకు గారు, ఇస్సాకు గారి దగ్గర యాకోబు గారు, యాకోబు గారి దగ్గర యోసేపు గారు నేర్చుకున్నారు! నేర్చుకున్న పాఠమునుండి కుడికి గాని ఎడమకు గాని తొలగలేదు యోసేపు గారు! అవసరమైతే చెరసాల అనుభవించారు గాని సత్యమునుండి తొలిగిపోలేదు! తన యజమానురాలు తనతో పాపం చెయ్యమని అడిగితే- ఆయన జవాబు చూడండి: కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును...??? అది దేవునికి వ్యతిరేఖమైన కార్యం అని తన తండ్రి చెప్పారు. దానిని నేర్చుకున్నారు యోసేపు గారు! అవును పెండ్లి కాకుండా చేసే సెక్స్ అది వ్యభిచారం! పర పురుషునితో లేక పరాయి స్త్రీతో చేసేది వ్యభిచారం! దేవునికి ఇది ఇష్టం ఉండదు! కాబట్టి ఈ యవ్వనస్తునికి ఈ శోధన కలిగిన వెంటనే వాక్యమనే ఆత్మఖడ్గమును వాడి శోధనను జయించారు ఇంకా చెప్పాలంటే శోధన పెరగకుండా పారిపోయారు! చివరకు ఒకరోజు దేశానికే గవర్నర్ కాగలిగారు!
గాని దావీదుగారు, సంసోను గారు ఇద్దరు-
ధర్మశాస్త్రంలో మంచి పట్టున్నవారే, ఇద్దరూ ఆత్మపూర్ణులే! గాని తమ కోరికలు అణచుకోలేక సాతాను వేసిన కామవాంచ అనే అగ్నిబాణం వలన క్లీన్ బౌల్డ్ అయిపోయారు! దావీదుగారు దేవుని శాపం పొందితే,
సంసోను గారు కల్లు పీకించుకుని అవమానాలు పొంది కుక్కచావు చచ్చారు! వీరిద్దరూ వాక్యమనే ఆత్మఖడ్గము తమవద్ద ఉన్నా గాని ఆ పాపం కమ్మగా ఉంది అని వాడలేకపోయారు! నీవు కూడా నీకిచ్చిన ఆయుధాలు వాడకపోతే నీ ఆత్మీయపోరాటంలో నీవు కూడా ఓడిపోతావు జాగ్రత్త!
రెండవ బ్యాచ్: *సౌలురాజు, దావీదు రాజు*!
ఇద్దరు దేవుని చేత ఏర్పాటుచేయబడిన వారే,
ఇద్దరు అభిషేకం పొందిన వారే, ఇద్దరు పరిశుద్ధాత్మను పొందినవారే, ఇద్దరు ప్రార్ధనాపరులే! ఇద్దరు ధర్మశాస్త్రం లో దిట్ట! ఇద్దరిమీద పనిచేసిన శోధన- అధికార కాంక్ష!
సౌలురాజుగారు- అధికారం కోసం దేనిని చేయడానికైనా రెడీ అయిపోయారు! చివరికి దావీదు గారిని అనగా తనసొంత అల్లుడిని చంపడానికి ప్రయత్నించి కుక్కను తరిమినట్లు తరిమారు!
అధికారం నిలబెట్టుకోవడం కోసం ధర్మశాస్త్రం ద్వారా, సమూయేలు గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞను కాలదన్ని, దేవుణ్ణి వదలి కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరకు వెళ్ళాడు! భయంకరమైన చావు చచ్చాడు!
దావీదు గారు దేవునిచేత అభిషేకించబడిన వ్యక్తిని తాకకూడదు అని ధర్మశాస్త్రం అర్ధం చేసుకొని వాక్యమనే ఆత్మఖడ్గంవాడి శోధన జయించారు! నిజం చెప్పాలంటే దావీదు గారు వీరుడు! నీకోసం- దేశం కోసం ఇంతాచేస్తే, నన్ను చంపడానికి వస్తావా అని కత్తి పట్టుకుని వెళ్తే పదినిమిషాలలో సౌలురాజుని చంపెయ్యగలరు దావీదు గారు! కాని సత్యం కోసం- ఆ పాపం నుండి హత్యా నేరం/దోషము నుండి తప్పించుకోడానికి పారిపోయారు ఆయన! రెండుసార్లు దొరికినా చంపలేదు! అది నీతిని కలిగించింది దావీదు గారికి! ఇక్కడ ఆయన ఉపయోగించిన ఆయుధాలు: వాక్యమనే ఆత్మఖడ్గము, దేవునిమీద భయం! ఇంకా పగతీర్చుట నాపని అని వాక్యం చెప్పడం వలన దానిని గౌరవించడం! మనం కూడా దీనినే అనుసరించాలి!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*10వ భాగము- ఆత్మీయ యుద్ధము-1*
ప్రియ దైవజనమా! మనం విశ్వాసి చేసే
రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం చూసుకుంటున్నాము!
దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-1. ఇది విశ్వాసి- పాపముతో లేక
లోకముతో చేస్తాడు!
రకాలు: శరీరాసలు, నేత్రాస, జీవపుడంభము, కామవాంచ, అధికార కాంక్ష, ధనాశ లాంటివి. ఇంకా చెప్పాలంటే గలతీ 5వ అధ్యాయంలో చెప్పబడిన శరీర కార్యములలో సగం ఈ కోవకు వస్తాయి!
(గతభాగం తరువాయి)
మూడో బ్యాచ్: *బిలాము, దేమా, గేహాజి, అననీయ-సప్పీరా*!
నలుగురిమీద పనిచేసిన శోధన: ధనాశ!
బిలాము మహా గొప్ప ప్రవక్త!
దేమా పిలువబడ్డవాడు, ఏర్పరచబడిన వాడు సువార్తకై! సువార్తికుడు!
గేహజీ- గొప్ప ప్రవక్త అయిన ఎలీషాగారి శిష్యుడు!
అననీయ-సప్పీరాలు మంచి విశ్వాసులు!
ధనాశ నలుగురిని లాగుకుంది! బయటకు రాలేకపోయారు! జయించలేకపోయారు! వీరంతా భయంకరమైన చావులు,
కుక్కచావులు దిక్కులేని చావులు చచ్చారు!
అననీయ సప్పీరలు దేవుని మందిరంలోనే చచ్చారు!
నలుగురు అట్టర్ ఫ్లాప్! ప్రియ దేవుని బిడ్డా! ధనాశ నిన్ను ఆకర్షిస్తుందా? జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త! అంతటి గొప్పవారు జయించలేక పోయారు-
బొక్కబోర్లాపడి చచ్చారు. ఈలోకము నైనను దాని ఆశలను గాని ప్రేమించకుడి అన్నారు దేవుడు! 1యోహాను 2: 15
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
ఇక యేసయ్య ధనమును ప్రేమించకుడి భూమిమీద మీ కొరకు ధనమును సంపాదించకండి గాని పరలోకంలో సంపాదించుకోమంటే, భూలోకంలో సంపాదించుకోవాలని చూశారు!
జీవితాలు నాశనమై పోయాయి!
దేవుడు చెప్పిన వాక్యానికి లోబడు! వాక్యమనే ఆత్మఖడ్గము వాడి ఈ శోధనను జయించు!
నాలుగో బ్యాచ్: *దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నేగో*
వీరి నలుగురి మీద పనిచేసిన శోధనలు:
మొదటిది: బోజనపానములు! రాజు భుజించు ఆహారం, రాజు త్రాగే పానము అనగా సురాపానం! అనగా మందు ముక్క! వీరు నలుగురు రాజు భుజించే ఆ ఆహారం రాజు త్రాగే ఆ పానము అనగా మందు ముక్క మనం మానెయ్యాలి! మన జీవితాలు కట్టుకోవాలి! సాక్ష్యాన్ని కాపాడుకోవాలి! తమ ఘటాన్ని శీలాన్ని కాపాడుకోవాలి అనుకున్నారు! సత్యం కోసం నిలబడ్డారు! వాక్యపు వెలుగులో నడిచి వాక్య ఖడ్గాన్ని వాడి శోధనను జయించారు! దానియేలు గారు ప్రపంచానికి ప్రధానమంత్రి అయ్యారు! , షడ్రక్, మేషక్, అబెద్నేగోలు పెద్ద మంత్రులు గవర్నర్ లు అయ్యారు! అంతేకాకుండా దేవుని సాక్షాత్కారం కలిగించారు అందరికీ!
రెండవ శోధన! నిజం చెప్పాలంటే ఇవి సాతానుతో పోరాటం క్రిందన కూడా వస్తాయి!
దానియేలు గారిని ప్రార్ధన ఆపుతావా?
సింహాల బోనులో పడేయ్యాలా అన్నారు!!
షడ్రక్,
మేషక్, అబెద్నేగోలను బంగారుబొమ్మకు మ్రోక్కుతారా అగ్నిగుండములో త్రోసేయ్యాలా అన్నారా?
వీరంతా మేము మ్రొక్కమంటే మ్రొక్కం, చావనైనా చస్తాం గాని మ్రొక్కం! అసలు మా దేవుడు రక్షించడానికి సమర్ధుడు అన్నారు!
దానియేలు గారు నేను ప్రార్ధన మానమంటే మానను!
నీ దిక్కున్నవాడితో చెప్పుకో అన్నారు!
ఫలితం:దానియేలు గారిని సింహాలబోనులో వేసేశారు!
ఆ ముగ్గురిని అగ్నిగుండములో త్రోసేశారు!
పరలోకం పరవశించిపోయింది! పరమునుండి దూతలు వచ్చి నలుగురిని కాపాడాయి!
అక్కడ నెబుకద్నేజర్ రాజు షడ్రక్,
మేషక్, అబెద్నేగోల దేవునివంటి దేవుడు మరో దేవుడు లేడు అన్నాడు!
దర్యావేషు దానియేలు దేవుని లాంటి దేవుడు లేడు!
అన్నాడు! నలుగురు రక్షించబడటమే కాదు-దేవుణ్ణి వారికి చూపించారు!
వీరు వాడింది విశ్వాసమనే డాలు!
దేవుడు తోడున్నాడు అనే వాగ్దానాలు! ప్రార్ధన!
ఇక్కడ కేవలం కొన్ని మాత్రమే పాపంతో చేసే ఆత్మీయ పోరాటాలు చెప్పాను! గలతీ 5:19—21 వ్రాయబడిన శరీరకార్యాలులో సగం అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, చివరిది అల్లరితోకూడిన ఆటపాటలు! ఇవన్నీ లోకం-లోకాశాలను మనకు చూపించి ఎరవేసి మనం పాపము చెయ్యడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు! వీటన్నిటిని...
మొదటగా: సర్వాంగకవచం ద్వారా జయించాలి!
రెండు: వాక్యమును అనుదినం చదువుతూ ఆదిమ భక్తులు ఆ పాపములను శోధనలను ఎలా జయించారో ధ్యానం చెయ్యాలి!
మూడు: కూడా వాక్యమే! వాక్యం ద్వారా పాపం చెయ్యకుండా ఉండగలము! ఎలా అంటే నీ ఎదుట నేను పాపం చెయ్యకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అన్నారు భక్తుడు! కీర్తన 119:11; ఇది నేను ప్రాక్టీస్ చేశాను! పాపం చెయ్యకుండా వాక్యం నన్ను ఆపుతుంది!
ఏమైనా పాపపు ఆలోచన గాని, పాపపు చూపు గాని నా హృదయంలో మెదిలితే ఒరేయ్ నీవు ఎవడవో తెలుసా! దేవుని బిడ్డవు! విలువపెట్టి కొనబడిన వాడవు! ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చూపులు మనం చూడవచ్చా? నరకానికి పోతావు జాగ్రత్త! ఖబడ్దార్ అని నన్ను హెచ్చరిస్తుంది వాక్యము! వాక్యపు రిఫరెన్సులు ఫలాని చోట ఏమన్నారో తెలుసా అని గుర్తుకు చేస్తుంది వాక్యము! వెంటనే సరిచేసుకుని దేవుడా క్షమించు అని వేడుకుంటాను!
ఒకవేళ వాక్యపు గద్దింపు కూడా వినకపోతే మెల్లని చల్లని దుఃఖస్వరముతో పరిశుద్ధాత్ముడు అంటాడు నాతో: ఇందుకోసమేనా నీకోసం సిలువ మోసింది! ఇందుకేనా నీకోసం రక్తం కార్చింది! అంతే నా గుండె బ్రద్దలయిపోతుంది! కన్నీటితో ఒప్పుకుంటాను: ప్రభువా ఇంకెప్పుడు చెయ్యను- పాపపు చూపు గాని, పాపపు ఆలోచన గాని నాలో రానియ్యను అని ఒప్పుకుంటాను! ఈవిధంగా మొదటగా వాక్యము నన్ను పాపం చెయ్యకుండా ఆపుతుంది, రెండు పరిశుద్ధాత్ముడు నన్ను పాపం చెయ్యకుండా ఆపుతున్నాడు!
కాబట్టి పాపం చెయ్యకుండా ఉండాలంటే మన హృదయం నిండా వాక్యముతో నిండిపోవాలి! అనగా ప్రతీరోజు వాక్యముతో ఉదకస్నానం చెయ్యాలి!
అలాగే ప్రతీరోజు ఆత్మతో నింపబడుతూ ఆత్మపూర్ణులుగా ఉండాలి! అపుడు పాపము చెయ్యనే చెయ్యవు! అందుకే గలతీ
5:16,17 లో మీరు ఆత్మతో నడిపించబడితే లేక ఆత్మానుసారంగా నడచుకుంటే శరీరకార్యాలు చెయ్యనే చెయ్యరు!
నాల్గవది: ఇలాంటి పాపం నుండి నీవు తప్పించుకుని ఆత్మీయపోరాటం లో విజయం సాధించాలి అంటే ప్రార్ధనాజీవితం కావాలి! నీవు చేసేప్రతీవిషయం లోను ప్రార్ధించి దేవుని సహాయం తీసుకో! నీకు నీవుగా పరిశుద్దుడుగా పవిత్రుడుగాఉండటం అసాధ్యం! దేవుని సహాయం అడుగు! అది ప్రార్ధనతోనే మనం అడుగగలం!
5. పైన చెప్పిన నలుగురు తమ భక్తిని కాపాడుకున్నట్లు మన భక్తిని కాపాడుకోవాలి! సాఖ్యాన్ని కాపాడుకోవాలి! లేకపోతే సాతాను గాడు వచ్చి అంటాడు- చాలుచాలులే గొప్పగా ప్రార్ధనచేసేస్తున్నావ్ గాని ఫలాని తారీకున అక్కడ ఏంచేశావ్? ఇక ఆపు నీ ప్రార్ధన! ఆపు నీ విశ్వాసం! చాలు నీ బడాయి భక్తి అని నిన్ను దెప్పి పొడుస్తూ నిన్ను డీమోరలైజ్ చేసేసి నిన్ను భ్రష్టుడను చేసేస్తుంది! కాబట్టి భక్తిని- సాక్షాన్ని-శీలాన్ని కాపాడుకోవాలి!
6. పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి!
ఈ రకంగా ఈ ఆయుధాలు ఉయోగించి పాపంతో యుద్ధం చేసి గెలుద్దాము!
దైవాశీస్సులు!
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*11వ భాగము- ఆత్మీయ యుద్ధము-2.1*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం, రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం చూసుకున్నాం!
ఇక మనం
విశ్వాసి చేసే
మూడో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం చూసుకుందాము!
దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు
రకాలు
ఆత్మీయ యుద్ధం
2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ యుద్ధం
2.2—అపరాధభావము, ఆత్మన్యూనత భావం మరియు దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
ఈరోజు మనం ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా చేసే పోరాటాన్ని ధ్యానించుకుందాం! గమనించాలి- విశ్వాసి చేసే ఆత్మీయ పోరాటాలలో అన్నిటికంటే కష్టమైనది బలమైనది ప్రభావశీలి అయినది ఈ ఆత్మీయ యుద్ధం 2.1 మరియు 2.2. ఈ రెండు సాతానుతో చేసే పోరాటాలు కంటే ఘోరమైనవి! ఎందుకు కష్టమైనవి అంటే- విశ్వాసులకు అది పోరాటం/యుద్ధం అని తెలియక! ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటున్నావు గాని అది ఆత్మీయ పోరాటం, దానిని సాతానుగాడు నీకు తెలియకుండా నీమీద కుట్రపన్ని నిన్ను బ్రష్టునిగా చెయ్యాలనే మాస్టర్ ప్లాన్ తో సీన్ లో వాడు ఉండకుండా ఇండైరెక్టుగా వాడు నీతో ఆలోచనల ద్వారా పాపం చెయ్యిస్తున్నాడు!!! అది ఎంతో స్వాభావికంగా కనిపిస్తుంది గాని సాతాను శోధన అని తెలియడం లేదు నీకు!
ఇప్పుడు నీకు శత్రువు ఎవరో తెలిస్తే వాడి శక్తిసామర్ధ్యాలు ఏమిటి? ఎలా జయించాలి అనేది చూడగలవు! అసలు నీ శత్రువు ఎవరో తెలియకుండా ఉంటే ఎలా యుద్ధం చెయ్యగలవు? లేదా నీ మిత్రువే నీకు తెలియకుండా నీమీద యుద్ధం చేస్తే ఎలా గెలువగలవు? ఇక్కడ కూడ అదే జరుగుతుంది!! కాబట్టి తెలుసుకుని జాగ్రత్తపడు!
శోధన రకాలు: భయము, నిరాశ, పిరికితనం, స్వార్ధం, అసూయ, కోపం, సణుగుడు, అనుమానం,
అసహనం, ఇంకా గలతీ 5:19—21 లో శరీరకార్యాలలో మిగిలినవి, చివరగా భర్తమీద పెత్తనం, పిల్లలమీద చిరాకు,
భార్యాభర్తలు మధ్య తగాదాలు!
(నాకు తెలిసినవి మాత్రం రాశాను, ఇంకా ఉండొచ్చు),
వీటిని కూడా మనం
బైబిల్ లో
చెప్పబడిన ఉదాహరణల ద్వారా జయించవచ్చు!
*భయము, పిరికితనం-నిరాశ-నిష్ప్రుహ*:
ఇవి కలిగితే ఏమి చెయ్యాలి!
సింపుల్!
వాక్యాన్ని ధ్యానిస్తూ ధైర్యం తెచ్చుకోవాలి! దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు! అని 2తిమోతి 1:7 లో వ్రాయబడింది! కాబట్టి ఇప్పుడు భయము, పిరికితనం వచ్చాయి అంటే వెంటనే తెలుసుకోవాలి- ఇది దేవుని నుండి వచ్చినది కాదు, సైతాను గాడి నుండి వచ్చాయి కాబట్టి వెంటనే వాక్యఖడ్గము తీసి- ఓ పనికిమాలిన సాతానా! నాలో ఈ పిరికితనం భయమును తీసుకుని వెళ్ళిపో! నేను దేవుని బిడ్డను, అయన ఆత్మను పొందుకున్నవాడిని/దానను! ఆ దేవుడు నాకు దేవుని శక్తి దేవుని ప్రేమను ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాత్రమే ఇచ్చారు గాని ఇలా పిరికితనం ఇవ్వలేదు!యేసునామంలో నాలో పిరికితనం, భయము కలిగించే దురాత్మా బయటకు పో! యేసు నామంలో పిరికితనం భయము భయటకు పో! అనాలి! వెంటనే వాడు పటాపంచలైపోతాడు!
మరికొన్ని సార్లు నిరాశ నిస్పృహ ఆవరిస్తూ ఉంటాయి యాకోబు గారికి ఆవరించినట్లు! ఒకసారి ఆదికాండం 31,32 అధ్యాయాలు చూసుకుంటే దేవుడే- యాకోబు—ఇక్కడ ఉన్నది చాలు, నీవులేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు! నేను నేకు తోడుగా ఉన్నాను అనే వాగ్దానం చేశారు! యాకోబుగారు దానిని నమ్మారు గాని మనసావాచాః కర్మేనా నమ్మలేదు! ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు! బయలుదేరారు యాకోబుగారు తన సమస్తాన్ని తీసుకుని! నేను ఇంటికి వస్తున్నాను అని అన్నయ్యకి కబురు పెడితే అన్నయ్య సంతోషించి నిన్ను ఎదుర్కోడానికి నేను వస్తున్నాను అని చెబితే కమ్యూనికేషన్ గేప్ వలన- అర్ధం మారిపోయి నానా అగచాట్లు పడ్డారు! వెంటనే భయము, నిరాశ, పిరికితనం అన్నీ కలిగాయి యాకోబుగారికి! దేవుడు చేసిన వాగ్దానాలు మరిచిపోయారు యాకోబుగారు! పిరికితనం ఆవరించింది భయము యాకోబుగారిని ఏలింది! ఇక ఏమిచెయ్యాలి అనేది అర్ధం కాక తల్లినుండి తండ్రి నుండి నేర్చుకున్న ప్రార్ధన గుర్తుకు వచ్చింది! పిల్లలను, పశువులను అందరిని పంపించివేసి తను మాత్రం యబ్బోకు రేవుదగ్గర నిలిచిపోయాడు! దేవునితో ముఖాముఖి జరిగింది! ఉడుంపట్టు పట్టారు- నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్నువిడువను! దీవిస్తావా లేదా అని మొదలుపెట్టారు! దూత దిగివచ్చాడు! దీవించి పంపాడు! భయము, నిరాశ ఎగిరిపోయిది! ధైర్యము వచ్చింది! వాగ్దానాలు మరిచిపోయి- సాతాను శోధన ఎదుర్కొన్న యాకోబుగారు- ఏకాంతప్రార్ధన అనే ఆయుధం ద్వారా దేవునితో ముఖాముకి ద్వారా పిరికితనమును నిరాశ నిస్పృహ, భయమును పోగొట్టుకున్నారు! కాబట్టి నీకు కూడా ఇలాంటి పిరికితనం, భయం వస్తున్నాయా? ప్రార్ధనలో ఏకీభవించు!
యాకోబు గారి ఆయుధాలు: ప్రార్ధన!
Complete
obedience!
*అసూయ వస్తుంటే*: అసూయ అనగా ప్రక్కన ఉన్న వ్యక్తి తనకంటే ఆర్ధికముగా గాని, అందంగా గాని,
తలాంతులలో గాని గొప్పగా ఉంటే కుళ్ళుపోవడం! అదింకా ముదిరితే మత్సరం!
ముందు ద్వేషము వస్తుంది, తర్వాత అసూయ వస్తుంది, ఇంకా పెరిగితే క్రోధము వస్తుంది! అది పెరిగితే మత్సరం వస్తుంది! మత్సరం వస్తే అవతల వ్యక్తికి ఏదో హాని చెయ్యకుండా ఉండలేవు! ఇలాంటివి వస్తే వాడెవడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు అని గలతీ
5:21 లో ఉంది!
కాబట్టి నీలో అసూయ కలిగినా,
ద్వేషం కలిగినా, క్రోధము పెరిగినా, మత్సరం పెరిగినా నీవు దేవుని రాజ్యానికి అనర్హుడవు అని గ్రహించాలి ఇంకా నరకానికి దగ్గరగా ఉన్నావు అని గ్రహించి వాటిని విడిచిపెట్టాలి! ఇలా నిన్నునీవు హెచ్చరించుకుంటూ నీలో వస్తున్నా ఆ ఆలోచనలను వాక్యఖడ్గముతో ఖండించాలి!
ఇక *క్రోధములు- కక్షలు, బేదములు విమతములు కలిగితే*: మరలా మీద వ్రాసిన విధంగానే సరిచేసుకోవాలి! అలాంటి ఆలోచనలు మనస్సులో రేగే తలంపులు నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి కాబట్టి నీ హృదయంలో నీవు అనుకోవాలి- నీకు పరలోకం కావాలా? నరకం కావాలా? పరలోకం కావాలంటే ఆసూయను వదిలేయ్, ద్వేషాన్ని వదిలేయ్! స్వార్ధం, లోభము, క్రోధము,మత్సరం లాంటివి వచ్చినవెంటనే అనుకోవాలి- నన్ను నరకానికి పంపించడానికి సైతాను గాడు ఇవన్నీ నాలో పుట్టిస్తున్నాడు, కాబట్టి వీటిని వెంటనే వదిలెయ్యాలి అనే ఉద్దేశ్య వచ్చి వెంటనే వాటిని నీలోనుండి తొలగించు కోవాలి!
*స్వార్ధం, లోభము నిన్ను ఆవరిస్తే*: దేవునివాక్యాలు గుర్తుకు చేసుకోవాలి!కారణం స్వార్ధము, లోభత్వము ధనాశ వలన వస్తుంది! లోభి ఎవడూ దేవుని రాజ్యాన్ని స్వతత్రించుకోలేడు! ఆశకు అంతులేదు! దానిలోనూ ధనాశకు అంతులేదు! వెయ్యి రూపాయలు కావలంటాడు! దేవుడు అదిస్తే లక్ష కావలంటాడు! అది కూడా ఇస్తే పదిలక్షలు కావాలంటాడు, కోట్లు కావాలంటాడు! చివరకు దేవుణ్ణి మరచిపోతాడు! తనకన్నా తక్కువ ఆర్ధిక స్థాయిలో ఉన్నవారు మనిషిలా కనబడరు!
కాబట్టి ఎప్పుడైతే నీలో స్వార్ధము, లోభత్వము ధనాశ పెరగడం మొదలయ్యింది- వెంటనే నీకు అంతము దగ్గరికి వచ్చింది అని గ్రహించి ఈ మూడింటిని వదిలెయ్యాలి!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*12వ భాగము- ఆత్మీయ యుద్ధము-2.1*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం, రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం చూసుకున్నాం!
ఇప్పుడు మూడో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం
చూసుకుంటున్నాము!
దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు
రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాదభావము, ఆత్మన్యూనత
భావం మరియు
దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
(గతభాగం తరువాయి)
*బేదములు- విమతములు*:
సాతాను గాడు నీ హృదయంలో కొన్ని భావాలు పెట్టిస్తూ ఉంటాడు-
ఆ వ్యక్తి ఫలాని కేస్ట్, నీది గొప్ప కులము! నీకు డబ్బుంది వాడ్డికి లేదు!
ఇలాంటి బేధము పుట్టించి వారిమీద ద్వేషము లేదా వారంటే నీలో చిన్నచూపు పుట్టిస్తాడు! ఇలాంటి భావాలు గనుక నీలో ఉంటే నీవు నరకం పోవడం 100% గారంటీ!
క్రైస్తవుడు అన్నవాడు కులాన్ని పట్టించుకుంటే వానిలో క్రీస్తుప్రేమ లేదు! కులాన్ని పట్టించుకున్నవాడు క్రైస్తవుడు కాదు!
బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీ ప్రాచీన పురుషుడుతో పాటుగా నీ కులం కూడా చచ్చింది! కాబట్టి ధనబేధం,
కులభేదం అంతస్తు బేధం, రంగుభేధం, ప్రాంతీయబేదములు ఏవి ఉన్నా నీవు నరకం పోతావు! కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి వెంటనే నీ మనస్సులో నీ హృదయంలో అనుకోవాలి! నీకు నరకం కావాలా పరలోకం కావాలా? జాగ్రత్తపడు! ఇలాంటివారికి దేవుని రాజ్యం లేదు అని బైబిల్ చెబుతుంది! ఓ మనసా! నాకు పరలోకం కావాలి! కాబట్టి గుణపడు అని చెప్పాలి!
తర్వాత సైతానుతో చెప్పాలి! ఓ పనికిమాలిన వాడా! నేను బాప్తిస్మము తీసుకుని కడుగబడిన వాడను/దానను!
నా కులం, నా వర్గం అన్నీ కలువరి సిలువలో చచ్చాయి! కాబట్టి ఇలాంటి బేదములు విమతములకు నాలో చోటులేదు! యేసునామంలో బేదములు విమతములు లాంటి ఆలోచనలు నాలో పుట్టిస్తున్న సైతానా పో బయటకు!
అని చెప్పాలి!
ఒకసారి నరకానికి పోయే
బ్యాచ్ ఏవో
చూసుకుని జాగ్రత్తపడితే ఇక మనం వాటి
జోలికి పోకుండా ఉంటాము!
గలతీ 5:19—21
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. *వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.*
1కొరింథీ 6:9—10
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గల వారైనను పురుష సంయోగులైనను
10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను *దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు*.
ప్రకటన గ్రంథం 21: 8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన గ్రంథం 22: 15
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
చూడండి ఈ బ్యాచ్ అంతా పరలోకానికి వెళ్లరట, అనగా నరకానికి పోతారు! కాబట్టి అలాంటి ఆలోచనలు ఏవైనా వస్తే వెంటనే మనలను మనం వాఖ్యఖడ్గంతో సరిచేసుకోవాలి! వాక్యపుటద్దముతో మనం తప్పులుచూసుకుని సరిచేసుకోవాలి!
సరే, ఇంతకూ పరలోకమునకు ఎవరు వెళ్తారు?
జయించిన వారు!! ప్రకటన 21:7....
జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
వేటిని జయించాలి- సాతానుని, లోకమును అనగా పాపమును, తర్వాత ఇలాంటి ఆలోచనలను జయించిన వానికే దేవుని రాజ్యములో చోటు ఉంటుంది!!!
కాబట్టి దేవుడు నీకిచ్చిన సర్వాంగకవచమును వాడు! దానిలో పెట్టెలో పెట్టుకోవద్దు! సానపెట్టు! సైతానుని జయించు!
ఇక *కోపము*: కోపపడుడి గాని
పాపం చేయకుడి అని బైబిల్ చెబుతుంది.
ఎఫెసీయులకు 4: 26
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.
ఉదయం కోప పడితే సాయంత్రానికి సమాధాన పడమని బైబిల్ చెబుతుంది. అంతకంటే ఎక్కువ సేపు కోపం నీలో ఉంది అంటే సాతాను గాడి క్రియ కాబట్టి వెంటనే గుర్తించి ఆ కోపమును నీలో నుండి తీసివేసి మరలా సమాధాన పడటానికి ప్రయత్నించు లేకపోతే పాపము నిన్ను నరకానికి తీసుకుని పోతుంది జాగ్రత్త!!!
ఇక *సణుగుడు*: కొంతమంది స్త్రీలు పురుషులు- అస్తమాను సణుగుతూ ఉంటారు!
ఇది సాతాను గాడి క్రియ! గమనించాలి—కొంతమంది అనుకుంటారు నేను ఊహించినట్లే అందరూ ఊహించాలి! నేను చేసినట్లు అందరూ చెయ్యాలి! లోకంలో తెలివైన వాడిని/దానను నేనే అనుకుంటారు! వారి ఊహలకు వ్యతిరేఖంగా ఎవరైనా ఏమైనా చేస్తే అనగా వారు అనుకున్నట్లుగా కాకుండా మరో రకంగా చేస్తే వీరికి మండిపోయి సణుగుతూ ఉంటారు! ఉదయం ఆరుగంటలకు మొదలుపెట్టిన సణుగుడు—రాత్రి పన్నెండు అయినా ముగియదు!
మరి ఏమిచెయ్యాలి? సింపుల్!
వాక్యము జ్ఞాపకం చేసుకోవాలి!
మొదటిది: 1కొరింథీ 10:10....
మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.
రెండవది: యాకోబు 5:9
సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
ఈ వాక్యాలు అన్నీ గుర్తుకు చేసుకోవాలి!
ఒకసారి 1కొరింథీ 10:8—10 వరకు చదవండి! ఇలాంటి ఆలోచనలు వస్తే
వెంటనే వీటిని జ్ఞాపకం తెచ్చుకుని ఓ పనికిమాలిన మనసా/ హృదయమా! నరకానికి పోతావట జాగ్రత్త! అంటూ మనలను మనం
వాక్యఖడ్గముచేత హెచ్చరించుకోవాలి!
*అనుమానం*: అనుమానం రెండు రకాలు నా
ఉద్దేశంలో!
మొదటిది:
పిరికితనంతో కూడిన అనుమానం! అయ్యో! అక్కడ ఏదో ఉందేమో!! అయ్యో వాడు నన్నే చూస్తున్నాడేమో!! అక్కడ పాము ఉందేమో!!! అక్కడ దయ్యాలున్నాయేమో!!! ఇలాంటి పిరికితనంతో కూడిన అనుమానం మొదటిది!
వీటికి-
దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనియ్యలేదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చారు అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఇలాంటి ఆలోచనలను గద్ధించాలి!
మరో
అనుమానం ఉంది: భర్తమీద
భార్యకు అనుమానం! భార్యమీద
భర్తకి అనుమానం! ఓ
భర్త! నీ భార్యకు
ఎవరో దారిలో కనబడి అమ్మా
మీ అత్తగారు మామగారు
ఎలా ఉన్నారు లేక
మీ ఆయన ఇంట్లో
ఉన్నారా లేక మరో
విషయం అడిగితే అతనికి
నీ భార్యకు లింకు
పెట్టేస్తావా? భార్య నీతో
కాకుండా మరెవరితోనూ మాట్లాడకూడదా? మాట్లాడితే అది
అక్రమ సంబంధమేనా?
ఓ
భార్యా! నీ భర్త
బయటకు పనిమీద వెళ్ళినప్పుడు
పురుషులతోనే
కాదు స్త్రీలతోను మాట్లాడాలి! అలా మాట్లాడితే
ఆమెతో నీ భర్తకు
అక్రమ సంబంధం అంట
కట్టేస్తావా? నీ భర్త
నీకంటే అందంగా ఉంటే
అనుమాన పడాలా? నీభార్య
అందంగా ఉంటే అనుమానం
పడాలా?
అయ్యా! అమ్మా! ఇది
సాతాను మాస్టర్ ప్లాన్! భార్యభర్తల మధ్య
తగాదాలు పెట్టి కుటుంబాలను
విడదీయాలని, తద్వారా సంఘాన్ని
పాడుచేయ్యాలని
వాడి ప్లాన్! వాడి
ప్లాన్ లో పడిపోయి
మీ చక్కటి సంసారాన్ని
పాడుచేసుకోకండి!
*అవునా! ఇది నిజమా*! అని మొదలయ్యింది అనుమానం! తినవద్దన్న పండు తిన్నది! ఇంతవరకు మనం పీక్కోలేక కక్కుకోలేక పోతున్నాము! ఇంకా ఇది కూడా కావాలా? కాబట్టి అనుమానం అనేది సాతాను గాడి ఆయుధం దానికి లోను కాకండి;
అయితే కొంతమంది ఉంటారు అనుకోండి! వారు కామంతో కళ్ళుబైర్లు కమ్మిపోయి అందరూ వ్యభిచారులు లాగానే కనిపిస్తారు వారికి!
అలాగే తమ భర్త భార్య కూడా ఆలాగే అనుకుని ఉంటారు!
మరికొంతమందికి తన భార్య అందంగా ఉన్నా, తన కళ్ళకి అందంగా కనబడదు—ప్రక్క ఇంట్లో నున్న పేడముఖంది చాలా అందంగా కనిపిస్తుంది! దాని మేకప్ తీసి చూస్తే బండారం బయటపడుతుంది! మరికొందరికి తమ భర్త అందంగా కనబడడు- దారంటపోయే ప్రతీ పురుషుడు ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంటాడు!
అయితే ఈ విషయంలో కొన్నిసార్లు స్త్రీపురుషులది కూడా తప్పు ఉంటుంది! ఎక్కడికో పార్టీకో ప్రయాణానికి వెళ్ళినప్పుడు రడీ అవుతుంటారు గాని ఇంట్లో ఉన్నప్పుడు పేడ ముఖాలు/ జిడ్డు ముఖాలు వేసుకుని ఉంటారు! ఓ స్త్రీ! నీ అందం నీ భర్తకోసమే! కాబట్టి నీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు కనీసం తయారై భర్తకు అందంగా శుభ్రంగా కనిపించు! అలాగని మూతుకి రంగు పెదాలకు రంగు ముఖానికి రంగు పూసుకోమని చెప్పడం లేదు! స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకో చాలు! ఎప్పుడూ నైటీలే కాదు! నీ అందం నీ భర్తకు చూపించు!
ఓ భర్త ఇది నీకు కూడా అప్లై అవుతుంది! కాబట్టి బార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుకోండి! అనుమానాలు పెంచుకోవద్దు! ఈలోకంలో ఉన్న ప్రతీ ఒక్కరు వ్యభిచారులు కాదు! ముందు నీ ఆలోచనా విధానం మార్చుకో!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*1౩వ భాగము- ఆత్మీయ యుద్ధము-2.1*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం, రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం చూసుకుని, విశ్వాసి చేసే మూడో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం
చూసుకుంటున్నాము! దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు
రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాధభావము, ఆత్మన్యూనత
భావం మరియు
దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
(గతభాగం తరువాయి)
*భర్తమీద పెత్తనం*: ఇదికూడా ఒక
పోరాటమే యుద్ధమే! కాని అది
నీకు తెలియదు! బైబిల్ చాలా
స్పష్టముగా చెబుతుంది-
భార్య భర్తకి లోబడి ఉండాలి! ఒక్కసారి కాదు
నాలుగు సార్లు చెప్పబడింది....
ఎఫెసీయులకు 5: 22
స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.
ఎఫెసీయులకు 5: 24
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
కొలస్సీయులకు 3: 18
భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
1పేతురు 3: 1
అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
గాని కొంతమంది భార్యలు-
తామే తెలివైన వారము, భర్త పనికిమాలిన వాడు! వాడికి తెలివిలేదు! నా తెలివితో నేను నా కుటుంబాన్ని కట్టుకుని ధనాన్ని పోగుచేసుకోవాలి అనే భావన కలిగి భర్తమీద పెత్తనం చేస్తున్నారు! ఇది బైబిల్ కి వ్యతిరేఖం! స్త్రీలు నన్నుక్షమించాలి! ఒక్కసారి వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు చూసుకుని అలా వ్రాయబడి ఉంటే మిమ్మల్ని మీరు సరిదిద్దు కోవాలి!
నీవు ఎంతటి పోష్టులో ఉన్నా, నీవు ఎంత ధనవంతురాలవైనా, అమ్మగారి ఇంటినుండి కోట్లు తీసుకుని వచ్చినా, నీవు ఎంత అందమైన దానివైనా, నీవు
MLA, MP, కలెక్టర్ వి అయినా బైబిల్ చెబుతుంది నీవు నీ భర్తకు లోబడవలసినదే!!! నీ భర్త బంట్రోతు అయినా, కూలి పనోడు అయినా నీవు నీ భర్తకు లోబడవలసినదే! ఇదే నా బైబిల్ చెప్పేది! ఇదే క్రమము!
ఈ క్రమము తప్పితే అక్రమము చేయువారలరా! నాయొద్దనుండి తొలిగిపొండి అనిపించుకుని నిత్యనరకానికి పోతావు!!! నరకం కావాలా పరలోకం కావాలా??!!
అమ్మా! అది సాతాను గాడు నీలో పడి ఒకరకమైన గర్వాన్ని నీలో పెట్టి నీ భర్తమీద పెత్తనం చేసి- నిన్ను నరకానికి తీసుకుని పోతూ, ఇంటినే నరకంగా మార్చేయాలని వాడి ఉద్దేశం!
సాతాను యొక్క తంత్రమును అర్ధము చేసుకుని భర్తకు క్షమాపణ చెప్పి ఇప్పటి నుండి అయినా లోబడటం నేర్చుకో! తద్వారా పరలోకం చేరుకో!
*పిల్లలమీద చిరాకు-అసహనం చూపించడం*: ఇది కూడా యుద్ధమే! అది యుద్ధము, ఆత్మీయ పోరాటం అని తెలియక- చిరాకు పెరిగిపోతుంది అంటూ ఈ డాక్టర్ కి- ఆ డాక్టర్ కి చూపిస్తున్నావు గాని పరమ డాక్టర్ దగ్గరకు రావడం లేదు! నీవు చూపించాల్సింది డాక్టర్ కి కాదు! నీలో పనిచేస్తున్న ఆత్మీయ పోరాటంలో- అది పోరాటం అని గ్రహించి- వాడిని తరిమికొట్టు! చాలామందికి ఆఫీసులో ఉన్న చిరాకు, బయట పరిస్తితుల చిరాకు- ఎవరిమీద చూపించాలి తెలియక- ఇంట్లో ఉన్న పసిపిల్లల మీద చూపిస్తుంటారు! లేకపోతే భార్య తేరగా దొరికింది కదా- తిట్టినా ఏమనదు, పడి ఉంటుంది కదా అని చిరాకు అంతా భార్యమీద గాని, పిల్లలమీద గాని చూపిస్తూ ఉంటారు చేతకాని వారు! అయ్యా! నీ పిల్లలు నీతో తప్ప ఎవరితో ప్రేమను పంచుకుంటారు! అయ్యా! నాన్న కదా- డాడీ కదా, డాడీ వచ్చారు అని నీ దగ్గరికి వస్తే పురుగుని చూసి చీత్కరించుకున్నట్లు చిరాకు పడి వారిని గసిరేసి తగిలేస్తే ఎవరి దగ్గరకు వెళ్తారు? ఎవరికి తమ ప్రేమను పంచుకుంటారు? ఎవరికీ తమ భాదను చెప్పుకుంటారు? ఎవరి దగ్గర ప్రేమను పొందుకుంటారు? ఆ పసి మనస్సులు ఎంతగా గాయపడ్డాయో కదా!! ఇదెప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ భార్య నీ దగ్గర కాకపోతే తమ భాధలు ఎవరి దగ్గర చెప్పుకుంటుంది? ఎందుకు ఆ చిరాకు? చివరకు ఆ చిరాకు ఎక్కువై పోయి, కుటుంబాలలో కలహాలు పెరిగి కుటుంభాలు విడిపోతున్నాయి! భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర- పిల్లలు హాస్టలులో! చివరకు పిల్లలకు తల్లి ప్రేమా దక్కక, తండ్రిప్రేమా దక్కక- బ్రష్టులు- దుర్మార్గులు, హంతకులు, రౌడీలు, మారకద్రవ్యాలుకి అలవాటు పడుతున్నారు! కారణం ఓ తండ్రీ! నీవే!
ఇంటికి వస్తున్నప్పుడు నీ చిరాకు అంతా గేటు బయట వదిలేయ్! ఇది నీ ఇల్లు! నీ ప్రేమను పంచు! ప్రేమను అందుకో! ఇంటికి వచ్చిన వెంటనే- పనికిమాలిన ఫోన్ తీసుకుని వీడియోలు చూసుకోవడమో, ఎవరితోనో మాట్లాడుకోవడమో, గేమ్లు ఆడుకోవడమో చేస్తున్నావ్ కదా అందుకే ఈ భాదలు! ఆ పనికిమాలిన ఫోన్లు ప్రక్కన పెట్టేసి నీ పిల్లలతో గడుపు! నీ భార్యతో గడుపు! కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్ధనలో గడపండి! దేవుడు మీ గృహాన్ని కడతారు!
ఓ భార్యా!
ఎల్లప్పుడూ పనికిమాలిన వ్యభిచార సంబంధమైన సీరియల్లు కాకుండా పిల్లలను పట్టించుకో! భర్తను పట్టించుకో! పిల్లలకు భక్తి ప్రార్ధన నేర్పించు! లేకపోతే బుద్ధిహీనురాలు తనచేతులతో తన ఇల్లు ఊడబీకుకొనును అన్న సామెతల గ్రంధ వచనాన్ని సార్ధకం చేసుకుంటావు జాగ్రత్త!
గమనించండి ఇది సాతాను గాడి మాస్టర్ ప్లాన్!
ఇలాంటి చిరాకులు అసహనం మీలో పెంచి, ఇంట్లో శాంతి సమాధానాలు దూరం చేసి, మిమ్మల్ని నరకానికి పంపించాలని వాడి కోరిక! దీనిని తెలిసికొని- ఇది సాతానుపని అని గ్రహించి- హాస్పటల్ కి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా మోకాళ్లమీద జయించు! వాక్యంతో సాతానుని గద్దించు! నేను విడుదల పొందిన దానను! నేను దేవుని బిడ్డను- నాలో చిరాకు అసహనం కలిగించే ఓ దురాత్మా!! యేసు అధికారం గల నామంలో నీకు ఆజ్ఞాపించేదేమిటంటే నామీద నీకు ఎటువంటి అధికారం లేదు! ఇప్పుడే నన్ను విడిచిపెట్టి పో! వెంటనే వాడు పారిపోతాడు! ఇంట్లో శాంతి సమాధానలు వస్తాయి! ఇప్పుడే ప్రయత్నించి విడుదల పొందుకో!
చివరగా *భార్యాభర్తల మధ్య తగాదాలు*: మరలా చెబుతునాను: ఇదికూడా ఆత్మీయ పోరాటమే!!!
అది పోరాటం అని తెలియక-
తగాదాలు పడి కోర్టులకు వెళ్తున్నావు! ఇంటిని నరకం చేసుకుంటున్నావు!
అయ్యా అది సాతాను గాడి ప్లాన్!
మీరు విడిపోవాలి అదే వాడి ప్లాన్! ఇది తెలియక కుటుంబాన్ని పాడుచేసుకొంటున్నావు! దానికి కారణం మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు! ఆదివారం నాడు ఆరాధనకు వెళ్ళడం లేదు! సందు దొరికితే నీవు నీ భర్తను తీసుకుని మీ ఇంటికో అత్తగారి ఇంటికో షికార్లుకో, బీచ్ లకి, పార్కులకి వెళ్తున్నావు దానికోసం ఆరాధన ఉన్నా ఎగ్గొడుతున్నావు కదా, సాతాను గాడికి అవకాశం దొరికింది- వాక్యానికి చోటు తగ్గిపోయింది, ప్రాధాన్యత తగ్గింది గనుక సాతానుగాడు పేట్రేగిపోయి భార్యాభర్తల మధ్య తగాదాలు పెట్టి కుటుంబాలను చీల్చేస్తున్నాడు! ఇది వాడి ప్లాన్!
వాడుచాలా వరకు సక్సెస్ అవుతున్నాడు!
అది యుద్ధమని తెలియక కోర్టులచుట్టూ తిరుగుతున్నారు! ఇప్పుడైనా మోకరించి నీ తప్పులు ఒప్పుకుని నీభార్యతో సమాధాన పడతావా?
సాతాన్ని జయిస్తావా?
మరొక
కారణం
కూడా
ఉంది! స్త్రీలు నన్ను క్షమించాలి- దీనిని బాగా అర్ధం చేసుకోవాలి! ఈ మధ్య నేను ఒక ఫ్యామిలీ కౌన్సలర్ ఇంటర్వూ చూశాను! ఫ్యామిలి కోర్టులలో ఉంటారు వీరు! విడిపోకుండా భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు!
ఆమె చెప్పిన మాటలు విని నాకు షాక్ కలిగింది! మన తెలుగు రాష్ట్రాలలో భార్యాభర్తలు ఎందుకు ఎలా విడిపోతున్నారు అంటే: నూటికి 75% తల్లులు లేక అత్తలు వలన విడిపోతున్నారు అట! తండ్రి లేక మామ గారి వలన ౩% విడిపోతున్నారు అట! అక్రమ సంబంధాలు వలన 17% విడిపోతున్నారు! ఇతర కారణాల వలన మిగిలిన వారు విడిపోతున్నారు! అయ్యా అమ్మా! ఇంకా అయిపోలేదు-- అత్తలవలన లేక తల్లుల వలన ఎలా విడిపోతున్నారో చూడండి! 75% లో మొబైల్
ఫోన్ల
వలన 70%
విడిపోతున్నారు
అట! పూర్వకాలంలో ఫోన్లు అనగా మొబైల్ ఫోన్లు లేనప్పుడు ఇంతగా విడిపోయేవారు కాదట! ఎలాగో చెబుతాను వినండి!
ఇప్పుడు
తుమ్మితే
ఫోన్, దగ్గితే ఫోన్, ఆరోజు తనకు కూర తక్కువైపోతే ఫోన్, అత్తగారు ఏమైనా అంటే ఫోన్! వెంటనే ఆ తల్లి ఏమనాలి? అమ్మా సర్దుకో! కొన్నిరోజులకు అంతా కుదుట పడుతుంది అనాలి! అనడం లేదు- ఎవర్తది- నీకు గతిలేక దిక్కులేక కాదు- ఇదిగో తమ్మున్ని పంపిస్తున్నాను వచ్చేయ్! కోర్టులో చూసుకుందాం!
ఇంకేం
కోర్టులో
చూసుకుంటావు- కాపురం విడిపోయాక!! పిల్లలకి/కూతురికి బుద్ధి చెప్పాల్సిన తల్లి లేక తండ్రి విడిపోమని ప్రోత్సహిస్తున్నారు ఈ పనికిమాలిన సీరియల్లు చూసి! అయ్యా ఇది మంచి పనికాదు! అయితే మొబైల్ ఫోన్ల వలన ఇది చాలా ఈజీ అయిపోయింది! అయితే ఇలాంటి తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్లు లేనప్పుడు ఇలా విడిపోవడం చాలా తక్కువ! ఎవరైనా కూతురు –ఇక్కడ అత్తా గారు అలా అన్నారు, మామ గారు ఇలా అన్నారు, భర్త ఇలా అన్నాడు అంటే- అమ్మా సర్దుకో అనేవారు ఆరోజులలో! మరికొందరైతే భర్తతో కాకుండా ఒంటరిగా వస్తే దవడ వాయగొట్టే వారు! ఏమైనా సరే నీభర్తతోనే రావాలి నీ పుట్టింటికి లేకపోతే పో అనేవారు! కాపురాలు నిలబడేవి!
సరే, ఫోన్లు- లేనప్పుడు ఎలా కాపురాలు నిలబడ్డాయి అంటే ఆదివారం నాడు భర్త తిట్టాడు. ఆదివారం రాత్రికి ఉత్తరం సంపాదించి మా ఆయన ఇలా అన్నాడు .... అని ఉత్తరం రాసి సోమవారం ఉదయానికి పోస్టు చేయగలగింది. ఆ ఉత్తరం గురువారం నాడు తల్లిదండ్రులకు చేరింది! వెంటనే తండ్రి నేను వస్తున్నాను లేక వెంటనే వచ్చేయ్ అని రాసి, శుక్రవారం పోస్టు
చేసాడు
అనుకుందాం. అది సోమవారం గాని మంగళవారం గాని అందింది ఆ అమ్మాయికి! అనగా తొమ్మిది రోజులు గడిచిపోయింది ఉత్తరం అందడానికి! ఈలోగా మొగుడుపెళ్ళాల మధ్య గొడవ తీరిపోవడం, వారు కలిసిపోవడం కూడా జరిగిపోయింది. ఆ ఉత్తరం చూసి మరలా ఈ అమ్మాయే -చూశావా మా అమ్మా నాన్నకు మేము కలిసి ఉండాలని లేదేమో అనుకుంటుంది! కాబట్టి ఈ కమ్యూనికేషన్ డిలే వలన కాపురాలు నిలబడేవి! ఈ మొబైల్ ఫోన్లు కాపురాలను విడదీసేస్తున్నాయి!
దానికి
ఆమె
చెప్పిన
పరిష్కారం
ఒక్కటే! అత్తల దగ్గర లేక అమ్మల దగ్గర ఫోన్లు ఉండకూడదు, వారానికి ఒక్కసారే కూతురు తల్లితో మాట్లాడాలి అంతే! (క్షమించండి- నేను ఫ్యామిలి కౌన్సిలర్ ని కాదు, ఇందుకోసం దేవుడు నన్ను పిలవలేదు, ఉపయోగ పడుతుందేమో అని రాశాను, అంతే)
కాబట్టి
కాపురాలు
పాడుచేసుకుకోకండి! పూర్వకాలములో చదువు లేక భార్య- భర్తను బెడ్ రూమ్ లో తప్ప ఎప్పుడూ చూసేది కాదు! చూడకూడదు! ఇప్పుడు అన్నీ మారిపోయాయి కదా- అందరూ చదువు కున్నవారే కదా. కాబట్టి నీకు ఇష్టం లేనిది, అభ్యంతరం కలిగించేది ఏదో నీ భర్తతో లేక భార్యతో చెప్పేయ్! కేవలం విడిపోదాం అని అనుకుంటేనే సమస్యను నీ తల్లిదండ్రులకు చెప్పు! లేకపోతే నీ సమస్యను నీవే పరిష్కరించుకో! ప్రార్ధనలో కనిపెట్టు! ఆరాధనకు క్రమం తప్పకుండా వెళ్ళు! ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ గృహాధిపతి అని బోర్డు పెట్టుకుంటే కాదు- నిజంగా యేసుక్రీస్తుప్రభులవారు
ని
అధిపతిగా
చేసి
ఆయనకు
మొదటి
స్థానం
ఇవ్వు! నీ కాపురం నిలబడే ఉంటుంది కారణం ఆయన అల్లరికి కర్త కారు! సమాధానాధిపతి, సమాధాన కర్త! మరి ఆయనకు స్థానమిచ్చి ఈ పనికిమాలిన సాతానుగాడు పెట్టిన తగాదాలకు స్వస్తి చెప్పు!
* వాక్యాన్ని హృదయంలో నింపుకుని కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి! ప్రభువా ఫలాని వచనంలో ఇలా అన్నావు కదా! నీవు చేసినవాగ్ధానం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్ధన చెయ్యాలి!
అలాగే సాతానుతో ఆలోచనలతో పోరాడేటప్పుడు వాక్యాన్ని ఎత్తి చెప్పాలి అనగా వాక్యఖడ్గముతో ఎదుర్కోవాలి!
* ఇక తర్వాత దేవునికి మనలను మనం సంపూర్తిగా అప్పగించుకోవాలి! అయ్యా నీకిష్టము వచ్చినట్లుగా నన్ను వాడుకో! నా ఆలోచనలకు కావలిగా ఉండు! నేను మాటయందును, చూపుయందును ప్రవర్తన యందును తప్పిపోకుండా నీ బిడ్డగా జీవించేలా నాకు సహాయం చెయ్యండి అంటూ వేడుకో!
* తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి! ముందు చెప్పినట్లు శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా పనిచేస్తాయి కాబట్టి ఆత్మపూర్ణులుగా ఉంటే శరీరకార్యాలను మనం నేరవేర్చలేము!
* తర్వాత ఉపవాస ప్రార్ధన ద్వారా ఇలాంటి ఆలోచనలను జయించవచ్చు! కాబట్టి ఉపవాస ప్రార్ధన చెయ్యండి! యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఉపవాసమున్నప్పుడు మనం కూడా ఉండాలి!
* చివరగా స్తుతి ఆరాధనలో నోరు తెరిచి గట్టిగా ఆరాధించి నప్పుడు, ప్రార్ధించినప్పుడు, పాటలు పాడినప్పుడు ఇలాంటి ఆలోచనలను కలిగించే దయ్యాలు పారిపోతాయి! నీకు విడుదల కలుగుతుంది! కాబట్టి స్తుతి ఆరాధనలో సమయమును గడుపు!
ఈ రీతిగా నడుచుకోవడం
వలన పైన
చెప్పిన ఆయుధాలు వాడటం వలన
నీవు ఆత్మీయ పోరాటం 2.1 లో విజయం సాధించగలవు!
ఆమెన్!
దైవాశీస్సులు!
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*14వ భాగము- ఆత్మీయ యుద్ధము-2.2*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం, రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం, విశ్వాసి చేసే మూడో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం
చూసుకున్నాము!
ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాధభావము, ఆత్మన్యూనత
భావం మరియు
దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
ఇక చివరగా మనం ఆత్మీయ పోరాటం/యుద్ధం 2.2 కోసం ధ్యానం చేసుకుందాము!
గమనించాలి- ఈ ఆత్మీయ పోరాటం/యుద్ధం 2.2లో సాతానుగాడి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే నిన్ను ప్రార్ధన చెయ్యకుండా ఆలోచనల ద్వారా ఆపి- తద్వారా నిన్ను భ్రష్టుడిని చెయ్యాలి! నిన్ను ప్రార్ధన చెయ్యనివ్వడు సాతాను! తప్పకుండా వీటిని జయించాలి లేదా జయజీవితం జీవించలేవు, సాతానుని జయించలేవు పరలోకం చేరలేవు!!!
మొదటిది:*అపరాధ భావం*: ఎప్పుడో బాప్తిస్మం తీసుకోక మునుపు లేక నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపము పొందక మునుపు, నీవు పాపివి, వ్యభిచారివి, దొంగవు లేక మరో పాపం కావచ్చు! గాని నీ విశ్వాసం ఎప్పుడైనా సన్నగిల్లినప్పుడు ఆరాధనను నిర్లక్షం చేసిన తర్వాత లేక కొన్ని రోజులు గేప్ తర్వాత నీవు ఎప్పుడైతే ప్రార్ధన చేద్దామని మోకరిస్తావో – వెంటనే సాతానుగాడు నీ చెవులలో అంటాడు—చాలుచాలులే ప్రార్ధన చేసేస్తున్నావు గాని అప్పుడు ఏఏ పాపాలు చేసేవాడవో/దానవో మర్చిపోయావా? ఇప్పుడు భక్తిపరుడిలా ప్రార్ధన చేసేస్తున్నావు!! ఇలాంటి పాపుల ప్రార్ధన ఆలకిస్తాడంటావా? నీవు పాపివి అంటూ నీ చెవిలో మ్రోగిస్తూ ఉంటాడు!
లేదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ మధ్యన ఏదో పాపం చేసి, దానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగి విడుదల పొందావు అనుకో, లేక పొందుకోలేదు అనుకో- భక్తిపరుడ్ని అంటావు,
పాటలు పాడేస్తుంటావు, మొన్న ఏమి చేశావో మర్చిపోయావా? నీ సెల్ఫోన్లో ఏమి చూసావో మర్చిపోయావా? ఎలాంటివి చూశావో మర్చిపోయావా? ఇప్పుడు ఏమీ ఎరగనట్లు పెద్ద భక్తిపరుడిలా ప్రార్ధన చేసేస్తున్నావు, వాక్యం చెప్పేస్తున్నావు అంటూ నిన్ను చాలా ఘోరంగా గందరగోళ పరిస్తితులకు నెట్టేస్తూ ఉంటాడు!!
*జయించడం ఎలా*?: మొదటగా: బాప్తిస్మం పొందకముందు పాపాలకోసం మరియు దేవుని క్షమాపణ అడిగి పశ్చాత్తాప పడి విడుదల క్షమాపణ పొందుకున్న పాపాల కోసం:
దేవుడు వాటిని మర్చిపోయారు! దేవుడే తుడిచివేశాను అని చెప్పారు! వాటిని కడిగివేసి- దేవుని వీపు వెనుకభాగానికి త్రోసివేశారు!
యెషయా 38: 17
మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. *నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.*
యెషయా 43: 25
*నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను* *నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను*.
ఈ అన్ని వచనాల ఆధారంగా దేవుడు తానే మన దోషములను హరించినప్పుడు, తుడిచివేసినప్పుడు మనం పాపవిముక్తి పొంది క్షమించబడిన తర్వాత వీడు చెప్పేవి అబద్దాలు- వాడు మోసగాడు! నిన్ను పాడుచెయ్యడానికి బ్రష్టుడుగా మార్చడానికి వాడు నాటకం ఆడుతున్నాడు! వెంటనే ఇటువంటి పరిస్తితులు ఎదురయితే వాడికి చెప్పాలి- ఒరే సాతానుగా! నీవు నోరుమూసుకుని నా దగ్గర నుండి పారిపో! కారణం యెషయా 38:17 ప్రకారం, యెషయా 43:25 ప్రకారం దేవుడు నా పాపములను తుడిచివేశారు క్షమించివేశారు! ఇప్పుడు నేను విముక్తిపొంది ఆ పాపములకు పరిశుద్దుడిగా తీర్చబడిన వాడను, కాబట్టి దేవుడే వాటిని మర్చిపోయాక నీవెవడవురా మరలా గుర్తు చెయ్యడానికి? యేసు అధికారం గల నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను- పో నా దగ్గర నుండి!! అని గద్దించు, తోక ముడుచుకుని పారిపోతాడు!
ఒకవేళ నీవు ఈ మధ్యనే చేసిన పాపాలను ఎత్తిచూపుతూ నిన్ను ప్రార్ధన చెయ్యకుండా గుసగుసలాడుతున్నాడా?? వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళు! నిజమైన పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ దేవుని దగ్గర క్షమాపణ వేడుకో! కేవలం వేడుకోవడమే కాదు, దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు! మరలా పాపం చెయ్యకు! అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టు వాడు కనికరం పొందును అని బైబిల్ వాగ్దానం! సామెతలు 28:23; కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టు! దేవుని దగ్గర క్షమాపణ పొందుకో! ఆ తర్వాత మరలా వాడు వచ్చి మరలా జ్ఞాపకం చేస్తే మీదన చెప్పినట్లు చెప్పు- నేను విడుదల పొందాను, క్షమించబడ్డాను! దేవుడు వాటిని తుడిచేశారు! కాబట్టి నీవు నోరుమూసుకోమని చెప్పండి!
అపరాధభావం దగ్గర వాడాల్సిన ఆయుధాలు: మొదటి కన్నీటి ప్రార్ధన చేసి పాపములను ఒప్పుకోవడం; రెండు వాక్య ఖడ్గము తీసుకుని వాడిని చిత్తుచెయ్యడం! వాక్యాన్ని
చూపిస్తూ వాడ్ని చెండాడాలి!
*ఆత్మన్యూనతా భావం*: అనగా నిన్నునీవు తక్కువ చేసుకోవడం- నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకోవడం! ఇలాంటి ఆలోచనలను వాడే నీకు పుట్టిస్తుంటాడు! దేవుడు నీ ప్రార్ధనలు వినడం లేదు! అందుకే నీ ప్రార్ధనకు జవాబు రావడం లేదు! దేవుడు కూడా నిన్ను వదిలేశాడు! దారంటపోయే ఎవరో ఎందుకో నవ్వుకుంటున్నారు- అది చూపించి చూశావా వాళ్లకు కూడా నీవు లోకువైపోయావు! నీ పని అంతే! ఇదిగో ఇక ఈ రోగం నీకు పోదు! డాక్టర్లకు నీ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది! గాని నీవు బ్రతుకవు! దేవుడు కూడా నిన్ను స్వస్తపరచడు! నీవు చనిపోయాక నీ భార్యకు ఎవరూ సహాయం చెయ్యరు! ఇక నీ భార్య అడుక్కుంటుంది, నీ పిల్లలు బిచ్చమెత్తకుంటారు... ఇలా నీకు నీవు నీ మనస్సులో అనుకుని పూర్తిగా డీమొరలైజ్ అయ్యేలా చేస్తాడు, అవసరమైతే నిన్ను ఆత్మహత్య చేసుకొనేలా చేస్తాడు! ఇదీ వాడి మాస్టర్ ప్లాన్!
*ఎలా
జయించాలి*: వాడు అబద్దకుడు- అబద్దాలకు జనకుడు అని యేసుక్రీస్తుప్రభులవారు
చెప్పిన
మాట
జ్ఞాపకం
చేసుకోవాలి! యోహాను 8:44; నేను నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి! యెహోషువ 1:6; యోహాను 14:18; హెబ్రీ 13:5; నీకు తోడుగా ఉంటాను నిన్ను నడిపిస్తాను అన్నాడు కదా దేవుడు! స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించ కుండా మరుచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను- చూడుము నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను అనే అంత ఘనమైన వాగ్దానం మరిచిపోకు! యెషయా 49:15,16; ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే! నిన్ను ఎత్తుకుని సంరక్షించువాడను నేనే అని చెప్పిన దేవుడు నిన్ను ఎలా వదిలేస్తారు???!! యెషయా 46:4; కాబట్టి ఈ వచనాలు జ్ఞాపకం చేసుకుని మొదట నీవు ధైర్యంగా ఉండాలి! తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడి క్రింద దీన మనష్కులై యుండుడి అని ఆయన చెప్పిన మాటలతో ఆదరణ పొంది ఆయన కోసం కనిపెట్టాలి! 1 పేతురు 5:6; ఒకవేళ ఇలాంటి మాటలు ఆ అబద్దికుడు, మోసగాడుమన చెవిలో ఊదితే ఒరేయ్ సాతానుగా—ఇదిగో ఇన్ని వాగ్దానాలు నా సొత్తు! ఫలాని వచనం ప్రకారం దేవుడు ఎప్పుడూ నాతోడుగా ఉన్నారు! ఇప్పుడు కొంచెం పరీక్ష కాలంలో ఉన్నాను. శోధించబడిన మీదట నేను సువర్ణమై వెలగబోతున్నాను కాబట్టి యేసు అధికారం గల నామంలో నన్ను విడిచిపెట్టి పో! యోబు 23:10; అని గద్దించు! వెంటనే వాడు పారిపోతాడు!
నా చిన్ని సాక్ష్యం చెప్పనీయండి: నేను ఎప్పుడూ ప్రతీ సంవత్సరం సభలు పెట్టిస్తుంటాను! కొన్నిసార్లు అప్పులు అయిపోయాను! 2016 లో కూడా పెడదాము అని డేట్స్ ఫిక్స్ చేసి- సేవకులను బుక్ చేసి ఉంచాను! ఆ రోజులలో విశ్వాసులు కానుకలు ఇస్తే తీసుకొనే వాడిని కేవలం సభలకోసం! (ఇప్పుడు నేనే నా డబ్బులతో పెడుతున్నాను) ఆ సంవత్సరం ఎవరూ ఏమీ ఇవ్వలేదు! డేట్స్ దగ్గరకి వచ్చేస్తున్నాయి! అమ్మగారు అన్నారు- ఈ సారికి మానేయ్ బాబు! నీ దగ్గర కూడా డబ్బులు లేవు కదా, ఇంకా అప్పులు అయిపోతావ్ అన్నారు! ఇక సాతాను గాడు శోధించడం మొదలుపెట్టాడు! ఇదిగో ఈ సంవత్సరం ఎవరూ నీకు డబ్బులు ఇవ్వరు! నీవు అప్పుల పాలు అయిపోతావ్! ఒకవేళ నీవు చచ్చి పోతే నీ భార్యపిల్లలు ఏమవుతారు? వారు అడుక్కోవాలి అంటూ నా బుర్ర తినేసేవాడు సాతాను గాడు! ఒకరోజు రెండు రోజులు కాదు, ఇలా చాలారోజులు గడిచిపోయాయి! అప్పుడు నేను ముంబైలో ఉన్నాను! ఒకరోజు ఇక భరించలేక- నా రూమ్ తలుపులు వేసుకుని గట్టిగా ఇలా అన్నాను- ఒరే సాతానుగా! నేను సంపాదించే సొమ్ములో నాకోసం, నా కుటుంబం కోసం ఖర్చుపేట్టేది తక్కువ, దేవునికి ఖర్చుపెట్టేది ఎక్కువ! కాబట్టి నేను దేవునిపని చేస్తున్నాను కాబట్టి దేవుడు నా పని చేస్తారు! అంతేకాకుండా ఇది కూడా దేవుని పనే! కాబట్టి దేవుని పని దేవుడు చూసుకుంటాడు! నీవు నోర్మూసుకో! అంతేకాదు- నీవు అంటున్నావు కదా- దేవుడు నన్ను ఇలా ఊరికినే చంపెయ్యరు! కారణం నేను ఆయన పని చేసేటప్పుడు నన్ను ఆయనే కాపాడుతారు! ఒకవేళ నేను చనిపోయాను అనుకో ...(కీర్తనలు 37:25!). ప్రకారం నీతిమంతుని కుమారులు భిక్షమెత్తరు, చింపిరి గుడ్డలు ధరించరు అని వ్రాయబడిన ప్రకారం- ఒకవేళ నేను చనిపోతే ఇప్పటికన్నా బాగా నా భార్యాబిడ్డలు బ్రతుకుతారు! అప్పుడు దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు నాకుటుంబంపై దిగుతాయి! కాబట్టి ఓ సైతానా నోరు మూసుకుని బయటకు పో అని గట్టిగా అన్నాను! వెంటనే వాడు పారిపోయాడు! ఇంతవరకు రాలేదు! ఆ సంవత్సరం సభలు ఉజ్జీవంగా జరిగాయి! సుమారు మూడు లక్షలు ఖర్చు అయ్యాయి! కేవలం యాబై వేలు మాత్రమే నేను ఖర్చు చేశాను! ఈ రకంగా ఆరోజు నేను వాడిని వాక్యమును ఉపయోగించి జయించగలిగాను!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*15వ భాగము- ఆత్మీయ యుద్ధము-2.2*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం, రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం, విశ్వాసి చేసే మూడో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం
చూసుకున్నాము!
ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాధభావము, ఆత్మన్యూనత
భావం మరియు
దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
(గతభాగం తరువాయి)
చివరగా *దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం*: ఇది సాతానుగాడు మంచి విశ్వాసుల మీద దాడిచేసే టెక్నిక్!
దానిని ఎదుర్కోవాలి అంటే కొన్ని విషయాలు మీరు గమనించాలి!
దేవుడు కొంతమంది ఎన్ని తప్పులు చేసినా ఏమీ అనరు! వారు ఆర్ధికంగా అభివృద్ధి కూడా పొందుతుంటారు! అయితే విశ్వాసులలో కొంతమంది ఏ చిన్నతప్పు చేసినా దేవుడు లెంపకాయ కొట్టేస్తూ ఉంటారు! కారణం ఏమిటంటే వీరు పరలోకం పోయే బాచ్ లో ఉన్నారు! ఒకవేళ మీరు ఏ తప్పు చేయకపోయినా శోధన కలిగింది అంటే దేవుడు మీకు ప్రమోషన్ ఇస్తున్నారు అందుకే ముందుగా పరీక్ష పెడుతున్నారు అని గ్రహించాలి! గాని సాతానుడు దీనిని త్రిప్పి నీచేత దేవునిమీద నిష్టూరాలు వేయిస్తుంటాడు.
ఇంకా దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు వారియందు ఆయన
సంతోషపడుతున్నారు అంటున్నారు! ఇంకా కొంతమంది దేవుడు న్యాయకర్త అంటారు కదా
దేవుడు, మరిలోకంలో ఇన్ని
అన్యాయాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఏమిచేస్తున్నాడు అంటున్నారు!
ఇంకా సాతానుగాడు మన చెవిలో ఏమంటాడు అంటే భక్తిగా ఉండి ఉపయోగం ఏమిటి? చూడు వాడికి దేవుడంటే భయం లేదు! ఎప్పుడూ త్రాగుతూ, వ్యభిచారంచేస్తూ, లంచాలు పుచ్చుకుంటూ వీడిని వాడిని దోచుకుంటూ ఉంటాడు! వాడికి ఏమీ అవ్వడంలేదు! వాడి పిల్లలు ఎంతో అభివృద్ధి పొందుతున్నారు! బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు! వాడిని వదిలేయ్, నీవు ఎంతోభక్తిగా ఉంటావు , ఉపవాసాలు ఉంటావు, వాడైతే ఎప్పుడో క్రిస్మస్కో, క్రొత్తసంవత్సరానికో ఈష్టర్కో మందిరానికి వస్తాడు! వాడికి ఏ కష్టాలు, శ్రమలు రావు! నీకైతే అన్నీ కష్టాలే! అన్నీ శ్రమలే! నీవు ఏమాత్రం చిన్న పొరపాటుచేసినా దేవుడు వెంటనే లెంపకాయ కొట్టేస్తున్నాడు! వాడు ఎన్ని అవినీతి క్రియలు చేసినా దేవుడు వాడిని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు అని చెబుతున్నాడు. అది నిజమని అనుకుంటున్నారు కదా ఇలా మీరు కూడా!
సరే, భక్తులైన వారు ఎలా దీనిని ఎదుర్కొన్నారో చూసుకుందాం!
ముందుగా బైబిల్ నుండి, ఆ తర్వాత ఇద్దరు గొప్ప దైవజనుల అనుభవాల నుండి
చూసుకుందాం!
మహా గొప్ప భక్తుడైన ఆసాపుగారు కూడా ఇలాగే దేవునిమీద ఆయాసపడ్డారు!
కీర్తనలగ్రంధం 73 లో ఇది కనిపిస్తుంది మనకు! మూడో వచనంలో అంటున్నారు భక్తుడు—భక్తిహీనుల క్షేమము నాకంట పడినప్పుడు, గర్వించువారినిబట్టి నేను మత్సరపడ్డాను! ఆభక్తిలేని వారికి మరణయాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు గాని అందరికీ వచ్చేజ్వరాలు తెగుళ్ళుగాని వారికి రావడం లేదు! అందుకే వారికి గర్వం పెరిగిపోయింది! బలత్కారాన్ని వారి వస్త్రంలా ధరించుకుంటున్నారు! వారికి క్రొవ్వు పెరిగి పోయి కళ్ళు నెత్తిమీదికి వచ్చేశాయి. గర్వంగా మాట్లాడుచున్నారు! భక్తిపరులు
అంటే హేళన చేస్తున్నారు! ఇంకా వారు అంటున్నారు మహోన్నతుడు అనగా దేవునికి ఎట్లు తెలుస్తుంది ? దేవుడికి బుద్ధి తెలివి ఉందా అంటున్నారు! వారు మమ్మల్నే కాదు దేవుడా నిన్ను కూడా తిడుతున్నారు కదా! వారు ప్రతీరోజు ధనవృద్ది కలుగజేసుకుంటున్నారు కదా అని బాధపడుతూ ఇక విసిగిపోయి పదమూడో వచనం రాబోయేసరికి ఇక నేను భక్తిగా ఉండటం వ్యర్ధమే, ఏమీ ఉపయోగం లేదు, నాహృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం వ్యర్ధమే! నిర్మలంగా పవిత్రంగా ఉండటం వ్యర్ధమే!
నాకైతే దినమంతా బాధలు శిక్ష వస్తుంది వారైతే ఏభాధలు లేకుండా నిశ్చింతగా ఉన్నారు అంటున్నారు! ఇక దీనికోసం ఆలోచించి ఆలోచించి చాలా బాధపడి నలిగిపోతున్నారు భక్తుడు! దేవునిమీద ఎంతో కోపం వచ్చింది! దేవునిమీద అలిగాడు ఈభక్తుడు; అయితే ఈయన భక్తుడు కదా దేవుడు లేకుండా ఉండలేడు కదా, అందుకే ఇక వీరిని వారిని అడగడం అనవసరం, దేవునితోనే తేల్చేసుకుందాం అని మందిరానికి పోయి ప్రార్ధన మొదలుపెట్టారు! ధ్యానించడం మొదలుపెట్టారు ఈభక్తుడు! అయ్యా ఇదేమి నీకు న్యాయం? మాకో న్యాయమా వాడికో న్యాయమా? నీకేమేమైనా కొంచెమైనా జాలి ఉందా మాపట్ల అంటూ ప్రార్ధన చేస్తున్నారు! ప్రార్ధన అంతా దేవుడు చాలా ఓపికతో తాపీగా విని నవ్వుతూ ఆయనకు అసలు విషయం బయలు పరిచారు దేవుడు! ఈ భక్తిహీనుల అంతాన్ని దేవుడు 70 mm సినిమా స్కోప్లో
చూపించారు! 16—22 వచనాలలో దీనికోసం వివరంగా ఉంది! దేవుడు ఆయనకు చూపించారు ఈ భక్తిహీనులు కాలుజారు చోటున అంచులో ఉన్నారు అనగా ఒక ఎత్తైన కొండ, ఆశిఖరంలో ఎడ్జ్లో ఉన్నారు, గాని వారు గర్వంతో క్రిందకు చూడటం లేదు కొద్ది నిమిషాలలో లేక క్షణాలలో వీరు కాలు జారిపోయి భయంకరమైన లోతైన గోతిలో పడబోతున్నారు ఒక్కసారి పడ్డారా ఇక లేవరు అన్నమాట! పరదేశులమో ప్రియులారా పాడటానికి వారి శవం కూడా దొరకదు అన్నమాట! ఇది చూసి ముందు ఈ భక్తుడు లెంపలు వేసుకుంటున్నారు అయ్యా నేను పశుప్రాయుడను ఎన్నెన్నో అన్నాను బాబు నిన్ను! నన్ను క్షమించమని అడిగారు ఈయన!
చివరగా ఒక మేలిరత్నం లాంటి మాటలు అంటున్నారు భక్తుడు 25 వచనంలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈలోకము లోనిది ఏదీ నాకు అక్కరలేదు చివరికి నాశరీరము నాహృదయం క్షీణించిపోయినా గాని దేవుడు నిత్యమూ నాహృదయంలో ఆశ్రయదుర్ఘముగా స్వాస్త్యముగా ఉన్నారు అంటున్నారు!
ఈ భక్తుణ్ణి చూసి మనం నేర్చుకోవాలి! ఎన్నోసార్లు ఈభక్తుడిలా మనం దేవునిమీద బాధపడ్దాము కదా! ఇలా దేవుణ్ణి ఎన్నో మాటలాడి ఆయనను ఆయాసపెట్టాము కదా! మనకు చిన్న పొరపాటు చేసిన లెంపకాయ ఎందుకు తగులుతుంది అంటే మనము దేవునికి ఇష్టులము కాబట్టి! తండ్రి తనకు ఇష్టమైన పిల్లలను శిక్షించురీతిగా మనలను ఆయన శిక్షించి తిరిగి ఆయన దారి లోనికి తీసుకుని వస్తున్నారు! ఇంకా మనము ఎత్తబడేగుంపులో, పరలోకం చేరే బాచ్లో ఉన్నాము. కాబట్టి ఏమాత్రం పొరపాటు
చేసినా వెంటనే మనలను సరిచెయ్యడానికి ఇలాంటి లెంపకాయలు వేస్తున్నారు! వారైతే నరకానికి పోయేబాచ్! వారిని దేవుడు అసహ్యించుకుంటున్నారు అందుకే వారు ఎలాపోయినా వదిలేసి, వాడు ఇంకా మూర్కించి మూర్ఖించి తాను త్రవ్వుకున్న గోతిలో వాడేపడి నిత్యనాశనం పొందుకోవడం దేవునిప్లాన్!
గాని సాతాను గాడు దీనిని మరో కోణంలో చూపించి దేవునిమీద నిష్టూరాలు వెయ్యడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడు! ఈ మోసాన్ని గ్రహించి సత్యమును గ్రహించి- సాతాను గాడిని వాక్యఖడ్గముతో ఎదుర్కోవాలి! లేకపోతే ఇంకా నిన్ను ఇలాంటి ఆలోచనలతో సతాయించి నిన్ను దేవునికి దూరంచేస్తాడు! వాడిని నేడే గద్దించు!
(ఇంకాఉంది)
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు*
*16వ భాగము- ఆత్మీయ యుద్ధము-2.2*
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం కోసం, రెండో రకమైన
ఆత్మీయ పోరాటం కోసం, విశ్వాసి చేసే మూడో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం
చూసుకున్నాము!
ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాదభావము, ఆత్మన్యూనత
భావం మరియు
దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
(గతభాగం తరువాయి)
ఇప్పుడు ఇద్దరు గొప్ప దైవజనుల సాక్ష్యాలను గుర్తుకు చేసి వారు
ఇలా దేవునిమీద నిష్టూరాలు వేయించే సాతాను గాడిని ఎలా ఎదుర్కొన్నారో వారి జీవితానుభవాలనుండి నేర్చుకుందాము!
*టెర్రీ లా*: ఈయన అమెరికాలో ఓక్లహోమా అనే రాష్ట్రంలో పరిచర్య ప్రారంభించి సుమారు
75 దేశాలలో సువార్త పరిచర్య చేసి కొన్ని లక్షలమందిని దేవుని యొద్దకు నడిపించారు! ఆయన ముఖ్య పరిచర్య ముఖ్యంగా ఇలాంటి ఆత్మీయ పోరాటాలలో విశ్వాసులు ఎలా విజయం సాధించాలి! వీటిమీద ఎన్నో పుస్తకాలూ కూడా రాశారు! ఆయన గొప్ప పాటగాడు, వాయిద్యకారుడు! ఆయన ఈ వాద్య బృంధమును తీసుకుని ఆ రోజులలో కమ్యూనిస్ట్ దేశాలలోను ముస్లిం దేశాలలోను ధైర్యంగా సువార్త ప్రకటించారు! పోయిన సంవత్సరం 77 సంవత్సరాల వయస్సులో ప్రభువు పిలుపును అందుకున్నారు!
అయితే ఆయన విశ్వాసుల ఆత్మీయ పోరాటాలను ఉత్తేజపరిచే పరిచర్య ఎలా ప్రారంభించారు అంటే ఒకరోజు ఒక దేశంలో పరిచర్య చేస్తుండగా దేవుడు నీ కిష్టమైనది తీసేస్తున్నాను! అయినా నేను నీతో ఉన్నాను అన్నారు! సాయంత్రానికి తనభార్య (మొదటి భార్య) చనిపోయినట్లు తెల్సింది. వెంటనే అమెరికా వెళ్లి సమాధి చేశారు! చాలా దుఖంలో మునిగిపోయారు భక్తుడు! కారణం తన కష్టాలలో తనతో ఎంతగానో సపోర్ట్ గా ఉండేది ఆమె! తనను ఎంతగానో తన సేవలో తన ఆధ్యాత్మిక జీవితంలో బలపడటానికి సహాయపడింది! ఇంట్లో ఏవి ఉన్నా లేకున్నా ఏమనేది కాదు! సేవలో నిజమైన సహకారి ఆమె! అయ్యా ఎందుకు నా భార్యను తీసేసుకున్నావు అంటూ చాలా బాధపడ్డారు! సమయం చూసుకుని సాతాను గాడు ప్రక్కకి చేరాడు! చూశావా—నీవు ఇన్ని సంవత్సరాలు ఇంతకష్టమైన పరిచర్య చేసినందుకు నీ ప్రియమైన దేవుడు నీకిచ్చిన గిఫ్ట్ నీ భార్య మరణం! నీవు ప్రార్ధన చేయగా అనేకమందిని దేవుడు బ్రతికించారు కదా! మరి నీ భార్యను ఎందుకు చంపేశాడు!! నీవు అనుకున్నట్లు ఆయన మంచివాడు కాదు- స్వార్ధపరుడు! నీ భార్య లేకపోతే నీవు ఇంకా ఆయన సేవచేస్తావు అని ఆశించి దేవుడు కుల్లుపోయి నీ భార్యను చంపేశాడు! ఇదీ దేవుని అసలు రూపం! చాలు ఇక, సేవను ఆపెసేయ్! అని చెప్పాడు! కొన్ని రోజులు ఈయన కూడా దేవుణ్ణి నిందించినా, ప్రార్ధన చెయ్యడం ఆయనకు అలవాటు, కష్టాలలో కూడా స్తుతి ఆరాధన చెయ్యడం ఆయనకు అలవాటు! స్తుతి ఆరాధన కాన్సెప్టు తోనే ఆయన దేశవిదేశాలలో పేరు గాంచారు! ప్రపంచంలో స్తుతి ఆరాధన అనగా Praise and Worship నడిపించడంలో ఆయనకు సాటిరారు ఎవరూ! కాబట్టి ఇప్పుడు ప్రార్ధన చేద్దాం అన్నాగాని, స్తుతి ఆరాధన చేద్దామన్నా గాని ప్రారంభించిన వెంటనే ఏమని స్తుతిస్తావు నీవు ఎలా స్తుతిస్తావు నీవు? ఏమని ప్రార్ధన చేస్తావు నీవు! ప్రభువా ప్రేమించిన నా భార్యను చంపేసి నందుకు నీకు ధన్యవాదాలు అని చెబుతావా? నా భార్యను చంపినందుకు నీకు స్తుతి ఆరాధన అని చెబ్తావా? అసలు నీకు భార్యమీద ప్రేమ ఉందా? ప్రేముంటే నీ భార్యను చంపిన దేవునికి ఎలా ప్రార్ధనలు చేస్తావు? ఎలా స్తుతి ఆరాధన చేస్తావు అని చెవులలో వాదించేవాడట! తట్టుకోలేక పోయేవారు ఈ భక్తుడు!
రెండు
నెలలు
గడిచాక, ఒకరోజు-మోకరించి ప్రభువా! నా భార్యను ఏదో ప్రణాళికతో నీ దగ్గరికి తీసుకున్నావని నాకు తెలుసు! నాకు ఏదో పాఠము నేర్పిస్తున్నావని తెలుసు! అయితే నిన్ను స్తుతించలేకపోతున్నాను, నీకు అయిదు నిమిషాలు కూడా ప్రార్ధనచేయలేకపోతున్నాను! ఏమి జరుగుతోందో తెలియడం లేదు! నిన్ను ప్రార్దించేలా సహాయం చెయ్యండి అని చెప్పారట! దేవుడు తప్పు నీదే! అన్నారు! ఏమి ప్రభువా అలా అంటున్నావు, నాది తప్పు ఎలా అవుతుంది? ప్రార్ధన చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాను! గాని సాతాను గాడు నా చెవిలో ఈ మాటలుచెప్పి నన్ను ప్రార్ధన చెయ్యడం లేదు! ఏమిచెయ్యాలి అన్నారు ఆయన! సాతానుని గద్దించావా? అసలు నేను ఏమని చెప్పాను- నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుతాను అని చెబితే (కీర్తనలు 81:10) నోట్లో నోట్లో గొణుక్కుంటే నేను ఎలా సహాయం చెయ్యగలను! నీ నోరు తెరువు! అప్పుడు స్తుతి ఆరాధన ప్రార్ధన రాకపోతే చూడు అన్నారట!
వెంటనే
దేవునికి
సారీ
చెప్పి- ఇంట్లో అందరికీ నేను ప్రార్ధన చెయ్యడానికి వెళ్తున్నాను, నన్నెవరు లేపవద్దు అని చెప్పి- గదికి తాళం వేసుకున్నారు! నోరు తెరిచి గట్టిగా దేవుని స్తుతులు వందనాలు చెప్పడం మొదలుపెట్టారు! సాతాను నీవు దుష్టుడివి దుర్మార్గుడివి! భార్య అంటే నీకు ప్రేమలేదు! సెల్ఫిష్ మనిషివి అనడం మొదలుపెట్టింది! ఇంకా గట్టిగా స్తుతించడం మొదలుపెట్టారు! ఇప్పుడు సాతాను గాడి మాటలు వినబడటం లేదు! కేవలం స్తుతులు మాత్రమే! అరగంట అయ్యింది ప్రార్ధన- స్తుతి ఆరాధనా ఆగలేదు! సాతాను గాడు ఎప్పుడో పారిపోయాడు! పరిశుద్ధాత్ముడు తాకాడు! గంట అయ్యింది, ఆశ్చర్యం ప్రార్ధన కొనసాగుతుంది! మూడు గంటలు నాలుగు గంటలు, ఎనిమిది గంటలు అయ్యాయి! పదమూడు గంటలు గుర్తున్నాయి ఆయనకు! ఎప్పుడు నిద్రపోయారో తెలియదు! తర్వాత రోజు ఉదయం లేచారు! సేవను దివ్యమైన కోణంలో మొదలుపెట్టారు! ఈ సంఘటన జరిగాక ఆయన రాసిన పుస్తకం- The Power of Praise and Worship!! ఆధ్యాత్మిక
పోరాటంలో
గెలవడానికి
ఆయుధాలు
అంటూ
చాలా
పుస్తకాలు
రాశారు! ఇప్పుడు ఈ సాక్ష్యం ఆ పుస్తకం నుండే! కొన్ని లక్షల విశ్వాసులకు మాదిరిగా నిలిచారు! ఇక్కడ ఈయన ఉపయోగించిన ఆయుధం- వాక్యపు ఆత్మఖడ్గం మరియు ప్రార్దన- స్తుతి ఆరాధన! మీరు కూడా దీనిని ఉపయోగించండి!
మనకు
కూడా
చాలా
సార్లు
ప్రార్థన
రానీయకుండా
చేస్తాడు. అప్పుడు మీరుకూడా గద్ధించి, గట్టిగా ప్రార్ధన చెయ్యాలి. గట్టిగా స్తుతులు చెప్పాలి. వెంటనే వాడు పారిపోతాడు!
తర్వాత దైవజనుడు: మన అందరికి తెలిసిన వ్యక్తి: దైవజనుడైన
*DGS దినకరన్ గారు*: మీ అందరికీ తెలుసు- వారు సువార్తకై విమానాశ్రయం కి వెళ్తుండగా వారి కారు ఆక్సిడెంట్ జరిగి దినకరన్ గారికి, ఆయన భార్యకి బలమైన గాయాలు తగిలాయి! గాని వారి ముద్దుల కుమార్తె ఏంజిలిన్ చనిపోయింది! హాస్పటల్ నుండి బయటకు వచ్చాక ఆయన చాలా నిరాశ నిస్పృహ, కన్నీటిలో మునిగిపోయారు! దేవునిమీద నిష్టూరాలు వేసేవారు. అయ్యా నా బిడ్డను ఎందుకు తీసుకున్నావు అని అరిచే వారట బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవారట! ప్రార్ధన నడిపింపు వచ్చేది కాదు! సభలు మానేశారు!
ఇలా కొన్ని నెలలు గడిచాక, దేవుడు ఆయనకు ఓక దర్శనం చూపించారట- ఆయనను పరలోకం తీసుకుని వెళ్లి అక్కడ ఒక పెద్ద రిజిస్టర్ చూపించారు! అక్కడ మనిషి జన్మదినం- మరణ దినం రెండూ ఆ పుస్తకం లో ముందుగానే వ్రాయబడి ఉన్నాయి ఆయన కుమార్తె పేరు కూడా అక్కడ ఉంది! నీ కుమార్తె ఆరోజు చనిపోవాలనేది దేవుని నిర్ణయం అని ఆ దూత చెప్పాడట! ఆ తర్వాత అక్కడ రెండు గుంపులు కనబడ్డాయి, ఒక గుంపు దయ్యాల గుంపు: దినకరన్ ఇక సేవ మానేస్తాడు, ఇక ఏ మొఖం పెట్టుకుని దేవుడు కరుణామయుడు మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పగలడు? ఆయన సొంత కుమార్తెనే దేవుడు కాపాడలేదు, ఇక దినకరన్ సేవ మానేస్తాడు అంటున్నాయి! మరో గుంపు దేవదూతల గుంపు- దినకరన్ దేవుని గొప్ప విశ్వాసి- మరలా సేవ ప్రారంభం చేస్తాడు. మరింతగా గొప్ప సేవ చేసి దేవునికి పేరు తీసుకుని వస్తాడు అని దేవదూతల గుంపు చెబుతుంది-ఇలా ఈ రెండు గుంపులకు వాగ్వివాదం అవుతుండగా, కుమారుడా! ఇప్పుడు నీ జవాబుచెప్పు అన్నారట దేవుడు! వెంటనే కుడిచేయి పైకెత్తి DGS దినకరన్ అనే నేను ఈ రోజునుండి చచ్చేవరకు దేవుని సేవ మానను అన్నారట! దేవదూతల చప్పట్లతో పరలోకం మారుమ్రోగింది అట! క్రిందికి వచ్చి రెండు చేతులు పైకెత్తి ప్రార్ధించడం స్తుతించడం మొదలుపెట్టారు. ప్రభువా నన్ను క్షమించు అన్నారు! ఘనమైన సేవచేసి చనిపోయారు! ఈయన కూడా వాడిన ఆయుధం: ప్రార్ధన మరియు వాక్యం!
మనం ముగింపుకి వచ్చేశాము! ప్రతీ విశ్వాసి ఆత్మీయ పోరాటంలో/యుద్ధంలో ఉన్నాడు! మన శత్రువైన సాతాను అనేక
తంత్రాలు ఉపయోగించి మనలను బ్రష్టులుగా చెయ్యాలని మనం
అనారోగ్యం పాలు
అవ్వాలని, మనం అనేక శోధనలు శ్రమలు అనుభవించాలని తద్వారా దేవునికి దూరంగా చేయాలని వాడి ప్లాన్! కాబట్టి వాడిని ఎదిరించాలంటే ఓడించాలి అంటే ఇంతవరకు చూసుకున్నట్లు:
మొదటగా:
సర్వాంగకవచమును
ధరించుకోవాలి! అదికూడా పూర్తిగా ధరించాలి! సగం సగం వాడకూడదు!
రెండు:
సరియైన ఆయుధం వాడాలి! ఏ శోధనకు ఏ ఆయుధం వాడాలో బైబిల్ నుండే నేర్చుకోవాలి! సరైన ఆయుధం వాడి అపవాదిని ఓడించాలి!
మూడు:
ఆత్మ ఖడ్గము అనే వాక్య ఖడ్గము వాడాలంటే బైబిల్ ని బాగా చదివి అర్ధం చేసుకుని, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ఖడ్గాన్ని వాడుతుండాలి! కాబట్టి బైబిల్ ను అనుదినం పటిస్తూ ఉండాలి!
నాలుగు: ప్రార్ధనా జీవితం కలిగి ఉండాలి!
ఐదు: ఉపవాస ప్రార్ధనా అనుభవం కలిగి ఉండాలి!
ఆరు: ఒకవేళ దేవునికి విరోధమైనవి, ఆయనకు ఆయాసం కలిగించేవి ఏవైనా ఉంటే మొదటగా దేవునితో సమాధాన పడి, పాపములను ఒప్పుకుని కడిగి వేసుకోవాలి, లేకపోతే సాతాను గాడు నిన్ను ప్రార్ధన చేయనివ్వడు, ఆలోచనలతో నిన్ను సతాయిస్తాడు! ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత ప్రార్ధించు! విశ్వాసంతో ప్రార్దించు!
ఏడు:
ప్రతీరోజు నిన్ను నీవు శుద్దీకరించుకుంటూ ఉండాలి! పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉండాలి!
ఎనిమిది:
ఏ పనిచేద్దామనుకున్నా ముందుగా ప్రార్ధించు! దేవునికి చెప్పి చెయ్యు! చివరకు ఎవరికైనా ప్రార్ధన చెయ్యాలన్నా ముందుగా నీవు ప్రార్ధన చేసుకో! ఫలాని దగ్గరకు వెళ్తున్నాను! దేవా నాకు సహాయం చెయ్యు! అని అడుగు! దయ్యాలను వెల్లగొట్టే ముందుగా నిన్ను నీవు యేసురక్తంతో కవర్ చేసుకో! వాక్యాలు ఉపయోగించు! దేవుడు మనకు మార్కు 16:16—18 లో ఇచ్చిన అధికారాలు ఉపయోగించు! అధికారంతో శాశించు!
ఆయన సిలువ శక్తిని రిలీజ్ చెయ్!
తొమ్మిది: విశ్వాసాన్ని విశ్వాస జీవితాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకో!
పది: పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి! అనుదినం ఆయన శక్తితో నింపబడుతూ ఉండాలి! దేవదూతల భాషలు, అన్య భాషలు విస్తారంగా మాట్లాడుతూ శక్తి పొందుకుంటూ ఉండాలి.
పదకొండు: అన్ని విషయాలలోనే దేవునికి నిన్ను నీవు సమర్పించుకో! ఆయనకు పూర్తిగా లోబడు!
అప్పుడు దేవుడు నీకు
జయజీవితం ఇస్తారు. సాతాను గాడు
నిన్ను జయించలేడు!
అట్టి కృప ధన్యత జయజీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక!
దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!ఆమెన్! ఆమెన్!
(సమాప్తం)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ప్రియ దైవజనమా! ఈ విశ్వాసి ఆత్మీయ పోరాటాలు అనే
శీర్షిక మీ
ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడినదని విశ్వసిస్తున్నాను! దయచేసి మాకోసం ప్రార్ధన చెయ్యండి! నేను చేసే పనిపాటుల కోసం ప్రార్ధన చెయ్యండి! మా సేవకోసం, చర్చిల కోసం పార్ధన చెయ్యండి! మా సోషల్ మీడియా పరిచర్య కోసం, పేజీల కోసం, వెబ్సైట్ కోసం
ప్రార్ధన చెయ్యండి! ధన్యవాదాలు!
ఇట్లు
వందనములతో
మీ ఆత్మీయ సహోదరుడు
*రాజకుమార్ దోనే*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి