తెస్సలోనికయుల పత్రికలు

* థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు * * ఉపోద్ఘాతము -1* దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ! యేసుక్రీస్తుప్రభులవారి పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనములు ! ఆధ్యాత్మిక సందేశాలు -8 సిరీస్ లో భాగంగా మరో పత్రిక ధ్యానములతో మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది . అట్టి కృప నిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనములు ! ఈ సారి మనం అపోస్తలుడైన పౌలుగారు థెస్సలోనికయులకు వ్రాసిన రెండు పత్రికలను ఆధారం చేసుకుని ఈ సంవత్సరం ధ్యానం చేసుకుందాము . పరిశుద్ధాత్ముడు వ్రాయించిన పత్రికలలో థెస్సలోనికయులకు వ్రాసిన ఈ రెండు పత్రికలలో ఉన్నన్ని ప్రత్యక్షతలు మరే పత్రికలలో కూడా లేవు . యేసుక్రీస్తుప్రభులవారు తన రెండవరాకడకు సంబందించిన విషయాలు సువార్తలలో చెప్పారు . ఇక ప్రకటన గ్రంధం మొత్తం ప్రత్యక్షతలే ! అయితే మిగిలిన ప్రతీ పత్రికలలోనూ రెండవరాకడ కోసం వ్రాయబడింది . అంతెందుకు ? క్రొత్త నిబంధన మొత్తం అన్ని గ్రంధాలలోను అయన రాకడకోసం వ్రాయబడ్డాయి . అయితే సువార్తలు , ప్రక...