పోస్ట్‌లు

ఏప్రిల్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ఫలించేడి కొమ్మ

చిత్రం
  * ఫలించెడి కొమ్మ * * మొదటిభాగం - ఉపోద్ఘాతం *            “ అన్నల్లారా ! దయచేసి కొట్టకండి ! చాలా నొప్పిగా ఉంది ! నాన్నతో చెప్పను ! దయచేసి నన్ను వదలండి ! ప్లీజ్ - కొట్టొద్దు - పెద్దన్నయ్యా నీవైనా చెప్పు ” అరుస్తున్నాడు ఒక కుర్రవాడు . గాని వారు ఆపకుండా కొడుతున్నారు , రక్తాలు కారిపోతున్నాయి , రూపం మారిపోతుంది , నామరూపాలు లేకుండా పోయింది , ఒళ్ళంతా రక్తపు ముద్దగా మారింది . పెద్దవానికి జాలివేసింది . “ ఒరేయ్ ఆపండిరా లేకపోతే వాడు చనిపోతాడు !” అన్నాడు పెద్ద అన్న ! “ చావాలనే కొడుతున్నాం కదా అన్నాడు ” రెండో అన్న !   “ వాడిని చంపాలనే కదా అనుకుంటున్నాము ” అన్నారు 5,6,7,8 అన్నలు . “ తప్పురా , మన తమ్ముడి రక్తం మనం చిందించకూడదు ! నాన్నకు ఏమి చెబుతాము ?” అన్నాడు పెద్దోడు ! " లేదు చంపాలి అంతే " అన్నారు 2,3,5,6,7,8 అన్నలు ! ఇక వీరు చంపేసేలాగ ఉన్నారు . ఏవిధముగానైన తప్పించాలి అనుకుని - " అయితే ఒకపని చెయ్యండి - ఈ నీరులేని గోతిలో తోసేద్దాం , అప్పుడు వాడే నీరులేక ఆహారం లేక చస్తాడు ” అన్నాడు పెద్దన్నయ్య , ఎలాగైనా ఇప్పుడు వారు చంపకుండా అడ...