యాకోబు ఇశ్రాయేలుగా


*యాకోబు-ఇశ్రాయేలుగా*

*మొదటి భాగం*

ఆదికాండం 25:2226, 2934

22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

23. రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

24. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.

25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.

26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ట బడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్లవాడు.

29. ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండుకొను చుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి

30. నేను అలసియున్నాను; యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.

31. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా

32. ఏశావు నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను

33. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా

34. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

 

     దేవుని పరిశుద్ధ నామమునకు యుగయుగములు మహిమ కలుగును గాక! ప్రియదైవజనమా ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ -10 లో భాగంగా వాగ్ధాన పుత్రుడైన ఇస్సాకుగారి కుమారుడైన యాకోబు గారి జీవిత విశేషాలు తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాటాల ద్వారా మరోసారి విధంగా కలవడం ఆనందంగా ఉంది. అట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కారణం గత పది సంవత్సరాలుగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకే దేవునికి వందనాలు! ఇక మనం  యాకోబు అనగా మడిమెను పట్టుకునే వాడు లేక మోసగాడు ఇశ్రాయేలు అనగా దేవునిచేత ఆశీర్వదించబడినవాడుగా రకంగా మారినాడో ధ్యానం చేసుకుందాం!

 

 ప్రియులారా గత వాగ్ధానపుత్రుడు శీర్షికలో రిబ్కా గారు గొడ్రాలు కాబట్టి ఇస్సాకుగారు ఒకే ఒకసారి దేవునికి ప్రార్ధిస్తే దేవుడు కరుణించి రిబ్కా గర్భవతి అయినట్లు ఇద్దరు కవల పిల్లలు గర్భములోనే తన్నుకుంటున్నట్లు, చివరికి బాధ తట్టుకోలేక ఆమె దేవుని సన్నిధిని ప్రార్ధించి జవాబులు పొందుకున్నట్లు చూసుకున్నాము! రిబ్కా దేవుని సన్నిధిలో మోకరించింది అయ్యా ఏమి జరుగుతుంది నాకు చెప్పండి, చెప్పేవరకు నేను కదలను అని మొండి పట్టు పట్టింది- వెంటనే దేవుడు చెబుతున్నారు 23 వచనంలో రిబ్కా నీ గర్భములో రెండు జనాలు ఉన్నారు. రెండు జనపదములు నీ గర్భమునుండి ప్రత్యేకముగా వస్తున్నాయి. ఒక జనము కంటే మరో జనము బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉంటాడు అని దేవుడు స్పష్టముగా సినిమారీలు చూపించినట్లు వివరించి చెప్పారు! రిబ్కా దేవుణ్ణి అడిగింది, జవాబు పొందుకుంది! ఎక్కువ సార్లు ప్రార్ధించలేదు విషయంలో! మోకరించింది! దేవుడా జవాబివ్వండి అని అడిగింది- వెంటనే దేవుడు జవాబిచ్చారు!

 

ఇక 2633 వచనాలలో మనం చూడవచ్చు- యాకోబు గారు ఏశావు యొక్క మడిమెను అనగా కాలు పట్టుకుని యాకోబు గారు కూడా బయటికి వచ్చేశారు తల్లి గర్భము నుండి. అనగా బహుశా ఒక పది నిమిషాల నుండి గంటలోపులో యాకోబు గారు కూడా బయటకి వచ్చేశారు. తన అన్న కాలుయొక్క మడిమె లేక మడము పట్టుకుని బయటకు వచ్చారు కాబట్టి ఆయనకు యాకోబు అనే పేరు పెట్టారు. ఏశావు ఎఱ్ఱని రోమములతో పుట్టాడు కాబట్టి ఎదోము లేక ఎఱ్ఱని అనే ఏశావు అని పేరు పెట్టారు.

 

   ఇక 27 వచనంలో ఏశావు ఎదిగి వేటాడటంలో నేర్పరితనం సాధించి అరణ్యంలో జీవిస్తూ ఉంటే యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ తన తల్లితో ఉంటున్నాడు.  28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసం తింటూ ఉండేవారు కాబట్టి ఇస్సాకు ఏశావుని ప్రేమించెను అని వ్రాయబడింది. అనగా కవల పిల్లలలో పెద్దవాడిని ఇస్సాకు/ తండ్రి ప్రేమించగా చిన్నవాడు తల్లికి సహాయం చేస్తూ తల్లికి ఫేవరేట్ గా మారిపోయాడుగమనించాలి తల్లిదండ్రులు పిల్లలు అందరినీ ఒకేలా ప్రేమించాలి లేకపోతే వారిమధ్యలో అపోహలు అపార్ధాలు వచ్చి కుటుంబ కలహాలకు తావు తీస్తాయి. తల్లిదండ్రులు చెరొకరిని ప్రేమించడం వలన తర్వాత వచనాలలో చూసుకుంటే చిన్నవాడు పెద్దవాడిని కేవలం చిక్కుడు కాయల కూరకోసం, చిక్కుడు కాయల కూరతో జ్యేష్టత్వాన్ని కొని అన్నను మోసగించాడు. అన్న అంటే మహా అయితే పది నిమిషాల పెద్ద అంతే కదా! తల్లిదండ్రులారా దయచేసి విషయాన్ని గమనించమని మనవిచేస్తున్నాను!

 

2933 వచనాలలో యాకోబు గారు కేవలం చిక్కుడు కాయల కూర చేస్తున్నప్పుడు అన్న వేటకు వెళ్లి అలసిపోయి వచ్చినప్పుడు ఆకలితో ఉండగా చిక్కుడుకాయల కూరద్వారా జ్యేష్టత్వము అన్న నుండి కొనుక్కున్నట్లు చూడగలం!

 

అయితే బైబిల్ చెబుతుంది ఏశావు కోసం- కేవలం చిక్కుడు కాయల కూరకోసం జ్యేష్టత్వమును అమ్ముకున్న ఏశావు లాంటి బ్రష్టుడు , వ్యభిచారి అని. అయితే అది జ్యేష్టత్వమును కాకుండా దేవుని కృపను ఆశీర్వాదమును రక్షణను కోల్పోవడాన్ని సూచిస్తుంది అంటూ మనకు పౌలుగారు హెబ్రీ పత్రికలో 12:1517 లో చెబుతున్నారు....

 

15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,

16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

17. ఏశావు తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.

 

    ఇంకా అంటున్నారుపోగొట్టుకున్న తర్వాత ఏశావు ఎంతో కన్నీటితో ఆశీర్వాదం కోసం ప్రార్ధించినా వేడుకున్నా చివరికి మారుమనస్సు పొందే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు అని చెబుతున్నారు. రోజు చాలామంది చిన్న కోరిక చిన్న శరీరాస కోసం త్రాగుడు కోసం, వ్యభిచారం కోసం, డబ్బుకోసం దేవుని కృపను దేవుని రక్షణను పరిశుద్దాత్మను పోగొట్టుకుంటున్నారు అనేకమంది! అయితే నేడు అనే సమయముండగానే మారుమనస్సు పొంది తిరిగి దేవుని సన్నిధికి వచ్చారా సరి! లేకపోతే మారుమనస్సు పొందే అవకాశాన్ని కోల్పోతారు అని బైబిల్ చెబుతుంది. అప్పుడు నీవు నిత్య నరకంలో పడతావు అని మర్చిపోవద్దు!

 

సరే, యాకోబు గారి చరిత్రను ధ్యానించేముందు మనం ఇది ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం!

 

      ఎప్పుడు జరిగింది:

బైబిల్ ప్రకారం- ఆదాముగారి నుండి అబ్రహాముగారికి 2000 సం.లు. అబ్రహాముగారినుండి యేసుప్రభులవారి వరకు 2000 సం.లు. క్రీ.పూ. 2000 లో అబ్రహాం గారు పుట్టారు. అబ్రహాం గారికి 100 సం. వయస్సులో ఇస్సాకు గారు పుట్టారు అనగా BC 1900 లో పుట్టారు. ఇస్సాకు గారికి సుమారు 60 సం. వయస్సులో యాకోబుగారు పుట్టారు

 

చరిత్ర ప్రకారం ఆదికాండం 25--50 అధ్యాయాలు BC 1840-1693 వరకు జరిగినవి. సం.లలోనే యాకోబుగారు లేయాను, రాహేలుని వివాహం చేసుకోవడం, వారిద్వారా 12మంది కుమారులను, ఒక కుమార్తెను కనడం, ఆస్తి సంపాదించుకొని తిరిగి తన తండ్రియొద్దకు రావడం జరిగింది.

 

   అదే సమయంలో మిగతా దేశాలలో ఏం జరుగుతుంది:

యాకోబు  చరిత్ర జరిగే రోజులలో- - చైనాలో *యు*-చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఈజిప్టు దేశంలో మధ్యంతర రాజ్యాలు పుట్టుకొచ్చి వాటిపాలన సాగుతుంది. అస్సీరియా ప్రాంతం రమ్మన్ పరిపాలనలో ఉందిటర్కీని హిత్తీయులు ఆక్రమించుకొని పాలిస్తున్నారు. బబులోను ప్రాంతం అనగా నేటి ఇరాక్ హమ్మురబి బబులోను సామ్రాజ్య నిర్మాణం చేయడం జరిగింది.

దైవాశీస్సులు!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*రెండవ భాగం*

ఆదికాండం 27:14

1. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.

2. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.

3. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.

4. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

      గతభాగంలో తన అన్న మడిమె అనగా కాలి మడం పట్టుకుని బయటకి వచ్చాడు కాబట్టి యాకోబు అనే పేరుపెట్టారు అని చూసుకున్నాము! మడిమె పట్టుకునే వాడు అనగా మరొకరి స్థానాన్ని లాగుకొనేవాడు లేదా మోసగాడు అని అర్ధం! నాకు అర్ధమయ్యింది ఏమిటంటే ఎవడైనా ముందుకు వెళ్తుంటే చూడకుండా కాలు లాగేసేవాడు, లేక నిలబడిన వాడి కాలుక్రింద గోతులు తీసేవాడు! ఒకడు వర్ధిల్లుతుంటే వాడిని పడగొట్టాలని ఆశించేవాడు! సింపుల్ బాషలో మోసగాడు! అవతలి వారికి తెలియకుండానే మోసగించేవాడు! కాలంలో పిల్లలకు చాలా ఆలోచించి పేర్లు పెట్టేవారు. అదికూడా బైబిల్ లో పేరుపెట్టడం అంటే దానికి ఎంతో అర్ధం ఉంటుంది! కాబట్టి గోతులు తీసే యాకోబు- మోసగాడు ఎలా ఇశ్రాయేలు అయ్యారు?

 

దేవుడు దర్శించినంతవరకు మొదట అన్నను మోసగించాడు! నాకంటే ముందుగా బయటకు వెళ్తే బాగోదు అని తల్లి గర్భములోనే ఫైటింగ్ చేశాడు. బయటకి వచ్చాక ఏశావు లొసుగు (వీక్ పాయింట్) చూసి చిక్కుడు కాయల కూరతో జ్యేష్టత్వం కొట్టేసి మోసం చేశాడు. తర్వాత తండ్రి దగ్గర ఆశీర్వాదాలు మోసపూరితంగా కొట్టేసి మరోసారి అన్నను తండ్రిని మోసం చేశాడు!

 

   వాగ్దానపుత్రుడు అనే మన చివరి శీర్షికలో దీనికోసం ధ్యానం చేశాము! సందర్భం కాబట్టి మరోసారి సన్నివేశమును మరోసారి జ్ఞాపకం చేసుకుందాం!

 

ప్రియులారా! ఇక 27 అధ్యాయం నిజంగా ఇస్సాకు గారి జీవితంలో దేవుని ఉద్దేశానికి వ్యతిరేఖంగా జరిగిన ఒక సంఘటన! తద్వారా అన్నదమ్ముల మధ్య గొడవలకు కారణం- జీవితాంతం వారు అనగా అన్నదమ్ములు మరియు ఇంతవరకు వారి సంతానం మధ్య వైరముతో ఉండవలసిన పరిస్తితి కనిపిస్తుంది.

 

గమనించాలి- దేవుడు రిబ్కా తో వారి కొడుకులు పుట్టకముందే చెప్పారు- పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. నేను యాకోబుని ప్రేమించాను యాశావుని ద్వేషించాను అని దేవుడు చెప్పడం, రిబ్కా తన భర్తకు చెప్పడం జరిగింది. అయితే అధ్యాయంలో దేవుని ఉద్దేశానికి వ్యతిరేఖంగా ఇస్సాకు గారు యాశావుని దీవించాలి, జన్మ స్వాతంత్ర్యం, జ్యేష్టత్వం యాశావుకే ఇవ్వాలని అనుకున్నారు. ఇది ఎంతటి వాగ్ధాన పుత్రుడైన గాని తన వృద్ధాప్యంలో ఇస్సాకు గారు చేసిన తప్పుడు ఆలోచన! దేవుడు దానిని జరుగనీయలేదు గాని యాకోబు యాశావుల మధ్య తరతరాల వైరమునకు కారణమైంది! మొదటి తప్పు ఇస్సాకు గారిది అని గమనించాలి! ఇస్సాకు గారిలో కూడా మనుష్యులందరిలోను పనిచేసే పాత స్వభావం పనిచేసింది.

 

గత బాగాలలో చూసుకున్నాము- యాశావును ఇస్సాకు గారు ప్రేమించారు ఎందుకంటే వేటగాడు వేటకు వెళ్లి మంచి వేట మాంసం తెచ్చి పెడితే తినేవారు ఇస్సాకు గారు! కాబట్టి కుమారుడా నీవు వెళ్లి వేటాడి మాంసం తెచ్చి నా దగ్గరకు వండి తీసుకుని రా! నేను ముసలోడ్ని అయిపోయాను కదానేను పోయేముందు నిన్ను దీవిస్తాను అన్నారు! ఇది రిబ్కా విన్నది! వెంటనే చిన్నకొడుకుని అనగా యాకోబుని రిబ్కా ఎంతో ప్రేమించేది అని చూసుకున్నాము కదా, ఇప్పుడు రిబ్కా యాకోబుతో అంటుంది- నీ తండ్రి నీకు బదులుగా నీ అన్నను దీవించాలని అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పినట్లు చేసి మోసంతో ఆశీర్వాదం దీవెనలు కొట్టెయ్యమంటుంది! ఎలా అంటే నీవు మంచి మేకపిల్లలను తీసుకుని రా, నేను మీ డాడీకి నచ్చినట్లు వండి నీకు ఇస్తాను. నీవు తండ్రి దగ్గరకు మీ అన్న బట్టలు వేసుకుని వెళ్ళిపో అంటూ తప్పుడు సలహా ఇస్తుంది. ఇది రిబ్కా గారి తప్పు అనగా తల్లి యొక్క తప్పు!

 

ఒకసారి ఆలోచించండి: దేవుడు యాకోబునే ప్రేమించి దీవిస్తాను- యాకోబు సంతానం ద్వారా దేవుడు అబ్రాహము గారికి చేసిన వాగ్దానాలు, ఇస్సాకు గారికి చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను అని పిల్లలు పుట్టకముందే అంత స్పష్టంగా చెప్పి ఉంటే యాశావుని దీవించాలి అనేది తండ్రి తప్పు అయితే, దీవెనను మోసంతో కొట్టెయ్యాలి అనేది తల్లి తప్పు! రిబ్కా ఇస్సాకుగారి దగ్గరకు వచ్చి- ఏమండి మన దేవుడు యాశావుని కాకుండా యాకోబుని దీవిస్తాను అని చెప్పారు కదా, ఇదేమిటి! యాశావుని దీవించండి గాని దేవుడు చెప్పినట్లుగా మీ జ్యేష్టులకు చెందవలసిన ఆశీర్వాదాలు యాకోబుకే ఇవ్వండి అని చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా మోసంతో కొట్టెయ్యాలి అనే ఆలోచన తప్పు, దానికి ఎలా మోసం చెయ్యాలో ట్రైనింగ్ ఇచ్చి పంపడం మరో తప్పు! విషయంలో యాకోబు గారు చేసినది అంత తప్పు కాదు అని నా ఉద్దేశ్యం! ప్రతీ విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినమని, లోబడి ఉండమని దేవుడు చెప్పారు. ఇప్పుడు తల్లి మాట వినడం న్యాయము కదా!

 

అయితే ఒకరకంగా యాకోబు గారిది కూడా తప్పే! ఎలా అంటే సంఘటన జరిగేసరికి యాశావు గారికి 40 సంవత్సరాలు, యాకోబు గారికి కూడా 40 సంవత్సరాలే! అనగా వీరు ఇంకా బాలురు కాదు, ఇద్దరూ యవ్వనస్తులే! కాబట్టి ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునే వయస్సు! కాబట్టి తల్లి చెప్పినప్పుడు అలా చెయ్యకూడదు అని అతనికి తెలుసు, తల్లికి వద్దని చెప్పారు, గాని తండ్రిని మోసం చెయ్యకూడదని ఆలోచించి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను యాశావుని అని చెప్పకుండా నేను యాకోబుని, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని వాగ్దానాలు నాకు రావాలి కాబట్టి నాన్నగారు నన్ను దీవించండి అని చెప్పి ఉంటే బాగుణ్ణు! నాన్నగారు నేను ఆశీర్వదించబడినవాడను అని అమ్మ చెప్పింది. అన్నను దీవించండి అలాగే నన్నుకూడా దీవించండి అంటే బాగుణ్ణు!

 

ఇది యధార్ధత! యాకోబు గారి దగ్గర ఇది లోపించింది!

 

మొత్తానికి యాకోబు గారు తండ్రి దగ్గరకు వెళ్లి మోసపూరితముగా ఆశీర్వాదాలు దీవెనలు కొట్టేశారు!

 

28 వచనంలో దీవిస్తున్నారు ఇస్సాకు గారు యాకోబుని యాశావు అనుకుని: ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక!

 

ఆగుదాం! ఆకాశపు మంచు అంటున్నారు ఏమండి? మొదటగా దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించిన పదాలనే మార్చి ఇక్కడ దీవిస్తున్నారు అని గ్రహించాలి! ఆకాశపు మంచు అని ఎందుకు అంటున్నారు అంటే: గతభాగాలలో చెప్పడం జరిగింది- అబ్రాహము గారు ఇస్సాకు గారు నివాసం చేసింది ఎడారులలో/అరణ్యాలలో! ఎడారులు ఎందుకు అయ్యాయి? వర్షాలులేక! అక్కడ వర్షాలు పడవు! ఎప్పుడో తుఫాను వస్తే అప్పుడప్పుడు వర్షాలు పడతాయి! ఇసుక తుఫానులు ఉంటాయి! మరి అక్కడ ఏదైనా జీవం ఉంది అంటే అది కేవలం ఆకాశపు మంచు మాత్రమే! అందుకే సమృద్ధిగల ఆకాశపు మంచు దేవుడు నీకు అనుగ్రహించును గాక అని దీవిస్తున్నారు!

 

ఇక విస్తారమైన ధాన్యము- ఎందుకంటే తనకు తన దాసులకు గొడ్లకు అన్నింటికీ సరిపోయిన ధాన్యము అన్నమాట! ఇక విస్తారమైన ద్రాక్షారసము! ఆరోజులలో అన్ని దేశాలవారు ద్రాక్షారసము వాడేవారు కనుక, వీరు త్రాగటానికి మరియు అందరికీ అమ్మడానికి! ద్రాక్షారసం ఎన్నో దేశాలకు సరఫరా అయ్యేది! తద్వారా వ్యాపారం చేసేవారు! రకంగా సమృద్ధిగా ఆశీర్వదించబడతావు అని దీవిస్తున్నారు!

 

ఇంకా జనములు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలపడతారు, నీ బంధువులకు కూడా నీవు ఏలికయై ఉంటావు! నీ తల్లిపుత్రులు నీకు సాగిల పడతారు! గమనించాలి- ఇది దేవుడు రిబ్కాతో చెప్పిన మాటయే! నిన్ను దీవించిన వారిని దీవించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారు! గమనించాలి- ఇది దేవుడు అబ్రాహము గారితో చేసిన వాగ్దానం!

 

ఈరకంగా ఇస్సాకు గారు యాకోబు దీవించారు! మోసపూరితముగా యాకోబు తండ్రి యొద్దనుండి దీవెనలు కొట్టేశారు!

 

ఇక యాకోబుగారు తండ్రి వద్దనుండి కాబట్టి వెళ్ళిపోయిన వెంటనే యాశావు రావడం, ఆశీర్వాదాలు కోసం అడగటం, ఇస్సాకు గారి కోపం రేపటం జరుగుతుంది. సంగతి మనకు తెలుసు ముందుకు పోదాం!

 

చివరికి యాశావుకి శాపముతో కూడిన దీవెన ఇచ్చినట్లు చూడగలం! మొదట యాశావు నివాసం భూసారము అనేది లేకుండా ఎడారిగానే మిగిలిపోతుంది- గమనించాలి మొత్తం గల్ఫ్ దేశాలు యాశావు సంతానమే! అక్కడ భూమిపంటలు పండవు! ఖర్జూరాలు మాత్రమే పండుతాయి! పైనుండి పడు ఆకాశపు మంచు నీకు రాదు! ఎందుకంటే ఆకాశపు మంచు యాకోబు గారికి ఇచ్చేశారు కదా!

 

అదే ఇశ్రాయేలు దేశంలో పంటలు సమృద్ధిగా పండుతాయి!

 

నీవు బ్రతికికంత కాలము నీ కత్తిచేతనే బ్రతుకుతావు! అనగా నీ జీవితాంతం కష్టపడి బ్రతుకుతావు, అదికూడా సుఖశాంతులు అనేవి లేకుండా! నీ తమ్ముడికి నీవు దాసుడవు అవుతారు

 

అలా నీవు నీ కత్తితో బ్రతుకుతూ ఉండగా నీవు నీ తమ్ముడి కాడిని విరిచేస్తావు ! ఇదీ శాపముతో కూడిన దీవెన!

 

ఈరకంగా దీవెన మరియు శాపములు కలిగాయి! దేవుడు యాకోబుని దీవించారు, అయితే ఇస్సాకు గారు యాశావుని దీవించాలి అనుకున్నారు, గాని దేవుని ఉద్దేశమే స్తిరమైంది గాని ఇస్సాకుగారి ఆలోచన నెరవేరలేదు! అందుకే బైబిల్ చెబుతుంది యెహోవా ఆలోచనలే స్తిరము!

 

సామెతలు 19: 21

నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

 

కాబట్టి మనము కూడా దేవుని చిత్తానుసారముగా దేవుని వాగ్దానాలు నమ్మి ఆయన చెప్పినట్లే చేద్దాం!

లేకపోతే యాశావు- యాకోబుల మధ్య జరిగిన జరుగుతున్న సంభవాలే మనము కూడా ఎదుర్కోవలసి వస్తుంది!

కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

 

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*మూడవ భాగం*

ఆదికాండం 28:14

1. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.

2. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

3. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు

4. ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి ...

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! గతభాగంలో రెండోసారి ఆశీర్వాదాలు విషయంలో మరోసారి అనగా రెండోసారి అన్నను తల్లి ప్రోద్భలంతో  మోసగించినట్లు చూసుకున్నాము! తద్వారా యాశావు యాకోబు గారిని చంపాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే తన తండ్రి వృద్దుడు కాబట్టి ఆయన మరణకాలం సమీపించింది కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత యాకోబుగారిని చంపాలని అన్న ఏశావు నిర్ణయం తీసుకున్నాడు!

 

       ఈమాట తెలుసుకున్న రిబ్కా మీ అన్నయ్య నీమీద పగపట్టాడు, నిన్ను చంపుతాను అంటున్నాడు కాబట్టి నీవు హారానుకి వెళ్ళిపో, అక్కడ మా అన్నయ్య లాబాను ఉన్నాడు, అక్కడ ఉండు, మీ అన్న కోపం తీరిన తర్వాత నేనే కబురుపెడతాను అప్పుడు మరలా ఇక్కడికి వద్దువు అని చెప్పింది. లేకపోతే ఒకేరోజున నేను మీ ఇద్దరినీ కోల్పోతాను అని చెప్పింది!

చూడండి- మోసపూరితముగా ఆశీర్వాదాలు కొట్టెయ్యాలి అని ఆలోచన చెప్పింది ఎవరు? తల్లి!!! ఇప్పుడు ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? కుమారుడు! అందుకే ఏమి చేసినా ఆలోచించి చెయ్యాలి! బహుశా ఇలా అవుతుంది అని ఎరిగి ఉంటే యాకోబు అలా చేసి ఉండేవారు కాదు, రిబ్కా కూడా అలా చెప్పి ఉండేది కాదు! ఇప్పుడు చేతులు కాలాక ఆకులు కాలిన చందముగా చిన్న కొడుకుని తన అన్నయ్య దగ్గరకు సిరియా పంపించి వేస్తుంది. తల్లిదండ్రులారా! దయచేసి దీనిని ఆలోచించమని మనవిచేస్తున్నాను! పిల్లలను అందరినీ మీరు సమానంగా చూస్తూ అందరికీ ఒకేవిధమైన ప్రేమనుచూపిస్తే తగాదాలు రావు! హత్యలు జరుగవు!

 

ఇక కొసమెరుపులా చివరలో అంటున్నారు ఆవిడ: నీవుకూడా మీ అన్న లాగ ఇక్కడున్న హేతు కుమార్తెలు లాంటివారిని పెళ్లాడితే నేను బ్రతకడం కంటే చావడం మేలు అంటుంది. అనగా స్త్రీలు అనగా ఆమె కోడళ్ళు  ఆమెకు అంతగా విసికించి  దుఃఖం కలిగించారు అన్నమాట!

 

ఇక 28 అధ్యాయంలో స్టోరీ మొత్తం నిజాలు ఇస్సాకు గారికి తెలిసిపోయి దీవించి హారాను పంపివేస్తున్నారు! బహుశా అప్పుడు ఇస్సాకు గారికి తప్పు అర్ధమై ఉంటుంది. దేవుని ప్రణాళికకు వ్యతిరేఖంగా నేను ఆలోచించినందువలననే ఇలా జరుగుతుంది అని తెలుస్కుని ఉంటారు! అందుకే చిన్నకుమారుని పిలిచి ఎందుకురా మోసపూరితముగా ఇలా ఆశీర్వాదాలు కొట్టేశావు అనిగాని, ఎందుకురా నన్ను మోసగించావు అని గాని అడగలేదు! యితడు దీవించబడినవాడు కాబట్టి నిండుమనస్సుతో మరోసారి దీవించి పంపుతున్నారు తన బావమరిది దగ్గరికి! అయితే ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టారు! నీవు కనాను స్త్రీలలో ఎవరిని పెండ్లి చేసుకోకూడదు!

 

ఇక 28 అధ్యాయంలో ఇస్సాకుగారు యాకోబుని పిలచి రెండు ఆజ్ఞలు- ఒక అమోఘమైన దీవెన ఇచ్చి పంపించారు. ఆజ్ఞలు ఏమిటంటేనీవు కనాను దేశపు స్త్రీలను ఎవరిని పెళ్లి చేసుకోకూడదుపద్దనరాములో ఉంటున్న నీ మేనమామ ఇంటికి వెళ్లి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో అని చెప్పారు

1. నీవు కనాను దేశపు స్త్రీలలో ఎవతెను పెళ్లి చేసుకోకూడదు. (నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రం యాకోబుగారితో ప్రారంభమైంది. మోషేగారి సమయానికి పుస్తకరూపంలో వచ్చిందిఅదేవిధంగా రక్షింపబడిన వారు ఎవరూ అన్యులను పెళ్లి చేసుకోకూడదు.

 

2. నీవు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో! ఇదే బైబిల్ విధానం!!! ఒకవ్యక్తి ఒకదానినే వివాహం చేసుకోవాలి. భాగస్వామి చనిపోతే మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు గాని బ్రతికి ఉండగా మరొకతెను చేసుకూకూడదుఅయితే యాకోబుగారు అజ్ఞను మీరి లాబాను ఇద్దరి కూతుర్లను పెళ్ళిచేసుకొని, నలుగురితో కాపురం చేసాడు! జీవితాంతం అశాంతితో గడిపి భార్యను ప్రేమించని వాడు అనే మచ్చను తెచ్చుకొన్నాడు! ఆజ్ఞలను తు.. తప్పకుండా పాటిస్తే అతనికి ఇంకా ఎవరికీ ఇబ్బంది రాదు. ఉదా: రోడ్డు నియమనిభందనలను పాటిస్తే మన రోడ్లపై ప్రమాదాలే జరుగవు.

 

     ఆది 28:3-4

 

ఇక దీవెనలు: సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింప జేసి నీవు పరవాసియైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్త్యముగా చేసుకోనునట్లు ఆయన నీకు అనగా నీకు నీతో కూడా నీ సంతానమునకు కూడా అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక! చూడండి ఎంత దీవెనో! దీవెనలో అబ్రాహము గారికి దేవుడు ఇచ్చిన వాగ్ధానము కేవలం యాకోబు గారిద్వారా మాత్రమే  నెరవేరుతుంది!

 

   బాగా ఆలోచిద్దాం! నిన్ను ఆశీర్వదించి- నిజంగా యాకోబు ఒంటరిగా హారాను వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైన సంపదతోపశు సంపదతో, పనివారితో తిరిగివచ్చినట్లు చూస్తాం!

 

 నీవు అనేక జనములగునట్లు- ఒంటరిగా వెళ్ళిన యాకోబు ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉప పత్నులు, 12మంది పిల్లలతో తిరిగి వచ్చాడు.

 

నిన్ను విస్తరింపజేసి- నిజంగా యాకోబు సంతానం 450 సం. తర్వాత ఒక దేశంగానే మారిపోయింది.

 

నీవు పరవాసియైన దేశమును నీకు స్వాస్త్యముగా, నీ సంతానముకి ఇచ్చును. ఇది అక్షరాలా నెరవేరింది యాకోబు జీవితంలో!!!

ఇంకా చూడండి: దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానాలు నీవు నీతో కూడా నీ సంతానమునకు అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు వాగ్దానాలు నేరవేర్చును గాక అంటున్నారు!

 

అబ్రాహాము గారికి ఏఏ వాగ్దానాలు ఇచ్చారు?

Genesis(ఆదికాండము) 12:1,2,3

1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

 

Genesis(ఆదికాండము) 15:18,19,20,21

18. దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు దేశమును, అనగా

19. కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను

20. హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను

21. అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

 

వాగ్దానాలు అన్నీ నిజానికి యాకోబు గారి సంతానం ద్వారానే నెరవేరాయి!

 

విధంగా ఇస్సాకు గారు యాకోబుని దీవించి పంపించేశారు సిరియాకు! వెంటనే యాకోబు గారు సిరియాకు బయలుదేరి వెళ్లారు!

దైవాశీస్సులు!

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*నాల్గవ భాగం*

ఆదికాండం 28:14

1. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.

2. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

3. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు

4. ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి ...

 

ఆదికాండము 28:10-22

10. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు

11. ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి, చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.

12. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.

13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.

14. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.

15. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా

16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని

17. భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;

18. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.

19. మరియు అతడు స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు.

20. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

21. తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.

22. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

ఈవిధంగా ఆశీర్వాదాలు పొందుకొన్న యాకోబుగారు జీవితంలో మొట్టమొదటిసారిగా తన తల్లిదండ్రులను వదలి ఒంటరిగా పద్దనరాముకి పారిపోవలసి వచ్చింది. బెయేర్షేబా నుండి పద్దనరాముకి 500  మైళ్ళు అనగా 825 కి.మీ.లు. మనం ప్రాంత బౌగోళిక స్వరూపం చూస్తే బెయేర్షేబా ఫిలిస్తియా ప్రాంతానికి చెందింది. దానిని ఆనుకొని కనాను ప్రాంతం ఉంది. బెయేర్షేబా కు ఎడమప్రక్కన ఫిలిస్తియా, దాని ప్రక్కన మధ్యధరా సముద్రం, బెయేర్షేబాకు కుడి ప్రక్కన కనాను దేశం, యోర్దాను లోయ, dead sea ఉన్నాయి.  Dead sea చివరలో యోర్దాను నది ప్రారంభం అవుతుంది. అయితే రెండు కలసి లేవు. నదీ పరీవాహక ప్రాంతంలోనే అనగా యోర్దాను లోయ ప్రాంతంలోనే కనాను దేశం ఉంది. ఫిలిస్తియాను ఆనుకొని ఫెనూకియ ఉంది అనగా తూరు, సీదోను ప్రాంతం. దానిని ఆనుకొని లెబానాన్, హమాతు తర్వాత సిరియా. సిరియా ప్రాంతాన్ని పూర్వకాలంలో మెసపటోమియా అనేవారు. మెసపటోమియా నాగరికత (mesapatomian civilisation) ఇక్కడే ప్రారంభం అయ్యింది. సిరియాలోనే హారాను ఉంది. హారాను అనేది సామాన్యుల వాడుక భాష. దీనినే యాజకుల భాషలో, పండితుల భాషలో పద్దనరాము అనేవారు. హారాను డమాస్కస్ కి 10 మైళ్ళు దూరంలో ఉంది. అయితే యాకోబుగారు మార్గంలో కాకుండా బెయేర్షేబా, హేబ్రోను, బెత్లెహేము మీదుగా బెతేలు వెళ్లి, యోర్దాను నది దాటి, సుక్కోతు, మహానయీము, మిజ్పా మీదుగా హారాను వెళ్ళారు. ఈప్రాంతమంతా యాకోబుగారు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది.

 

   మార్గమధ్యంలో బేతేలు చేరుకొని అక్కడ దైవదర్శనం పొందుకొన్నారు. దేవుడు అబ్రాహాము గారితో మాట్లాడారు. తర్వాత ఇస్సాకు గారితో మాట్లాడారు! ఇప్పుడు ప్రార్ధన చెయ్యకుండానే అడగకుండానే యాకోబు గారితో మాట్లాడి ఆశీర్వదిస్తున్నారు! ఎందుకంటే యాకోబు యొక్క తాతగారైన అబ్రాహము గారితో దేవుడు వాగ్దానం చేశారు. అది యాకోబు గారి ద్వారానే నెరవేరబోతుంది. అందుకే దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుచున్నారు! ఆది 28:10-22

 

 యాకోబుగారు తల్లిదగ్గర వంటలే కాకుండా తనతల్లి లాగే ప్రార్ధనా జీవితం నేర్చుకొన్నారు. అందుకే అక్కడ దేవుని దర్శనం పొందుకొన్నారు. ఇక్కడ దేవుడు అబ్రాహాముకి చేసిన ప్రమాణం, ఇస్సాకుకి చేసిన వాగ్దానం మరోసారి యాకోబుతో చేసారు. భూమిని నీ సంతానం కి ఇస్తాను అని చెప్పారు. (అంటే నీకు సంతానం కలుగుతుంది అని ముందే చెప్పారు). నీ సంతానం లెక్కకి ఇసుకరేణువుల వలే అవుతుంది అని చెప్పారు. మరో ప్రాముఖ్యమైన వాగ్దానం ఏమిటంటే భూమిమీద నున్న సమస్త జనములు నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడతాయి అని చెప్పారు. హల్లెలూయ!!! నేడు మన దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం వలన ఆశీర్వదించ బడుతున్నాయి. అంతేకాకుండా నీవు వెళ్ళు ప్రతీ స్తలములోను నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేసారు..

 

వెంటనే యాకోబు అక్కడే దేవునికి మ్రొక్కి, స్థలానికి బేతేలు అనగా దేవుని మందిరం అని పేరుపెట్టాడు. అంతేకాకుండా నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే నాకు కలిగిన దాంట్లో పదోవంతు చెల్లిస్తాను అని మ్రొక్కుకున్నాడు. (గతంలో చెప్పిన విధముగా ధర్మశాస్త్రం యాకోబు గారితో ప్రారంభమయ్యింది) ఇంకా ప్రాంతంలో దేవుని మందిరం కడతాను అని మ్రొక్కుకున్నాడు.

 

   ఈరకంగా యాకోబు ఎటువంటి ఆశలేకుండా, బిక్కుబిక్కుమంటూ, భయంతో ప్రయాణం చేసేటప్పుడు దేవుడే అతనికి ప్రత్యక్షమై దర్శనం ఇచ్చి, భయపడకు- నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను అని దీవించి పంపారు!!! వాగ్దానం చేయడమే కాదు హారాను చేరేవరకు యాకోబుతో తోడుగా ఉన్నారు.

కావున ప్రియ సహోదరీ/సహోదరుడా! భయపడకు! దిగులుపడకు! నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాఆయన వాగ్దానాలను నమ్మి ముందుకు సాగిపో!

 

God Bless You!!!

Amen!

(సశేషం)

 

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*5 భాగం-లేయా-1*

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

       ప్రియులారా! ఆదికాండం 29 అధ్యాయంలో మనం యాకోబుగారు హారాను అనగా పద్దనరాము చేరుకోవడం, లేయాను, రాహేలుని పెండ్లి చేసుకోవడం, ఇంతవరకు ప్రజలను మోసగించిన యాకోబు మొదటిసారిగా తనమామ చేతిలో మోసపోవడం, లేయా పిల్లలు కనడం చూడొచ్చు!

 

  యాకోబు 500 మైళ్ళు నడచి చివరకు హారాను చేరుకొని, ఒక బావిని చూసి, భావి దగ్గర కూర్చున్నవారిని అడుగుతాడు అన్నలారా! ఇది ఊరు? వారు అన్నారు ఇది హారాను, అయితే మీకు నాహోరు కుమారుడగు లాబాను తెలుసా? అతడు క్షేమంగా ఉన్నాడా? అని అడిగాడు. నిజంగా లాబాను నాహోరు యొక్క కుమారుడు కాదు, మనవడు! నాహోరు కుమారుడు బెతూయేలు, బెతూయేలు కుమారుడు లాబాను. అయితే ఆకాలంలో ఆకుటుంభంలో  ఎవరైతే ఘనత వహిస్తారో వారి కుమారుడుగా పిలువబడటం వాడుక! ఉదాహరణకు దావీదు కుమారుడు- యేసుప్రభువు!!!

సరే! హారాను వారు లాబాను బాగానే ఉన్నాడు, అతని చిన్న కుమార్తె రాహేలు తమ తండ్రి మందను మేపుకుంటూ ఇక్కడకే వస్తుంది చూడు! అని ఆమెను చూపించారు.

 

 పూర్వకాలంలో దేశాల్లో కుటుంబానికి చిన్నవారికి మందలు మేపే భాద్యత ఇచ్చేవారు. పెద్దవారు మిగతా పనులు చేసేవారు. అందుకే దావీదుగారు తమ తండ్రి మందలు మేపారుఅందుకే రాహేలు తమ తండ్రి మంద మేపుతుందిగాని అక్కడ పెద్ద భావి, భావికి మూతగా పెద్దరాయి! రాయి తీయడం అంత తేలిక కాదు. యాకోబుగారు రాహేలుని చూసిన వెంటనే Hero అయిపోయి, రాతిని తొలగించి, మందకు నీరు పెట్టారు. రాహేలుపై పడి ఏడ్చాడు. నేను నీ మేనత్త కుమారుడిని అని చెప్పాడు! రాహేలుని చూసి ప్రేమించాడు. Love At First Sight అన్నమాట! లాబాను పరుగెత్తుకొంటూ వచ్చి యాకోబుని ముద్దుపెట్టుకొన్నాడు!

 నెలరోజులు గడిచాక ఊరకయే నా దగ్గర కొలువు చేస్తావా? నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు. ఇక్కడ ఒకసారి ఆగుదాం!

 

 అబ్రాహాముగారు గొప్ప ఐశ్వర్యవంతుడు. అతని కుమారుడు ఇస్సాకు ఆగర్భ శ్రీమంతుడు. మరి అతని కుమారుడు యాకోబు కూడా చాలా ధనవంతుడేఇట్టి ధనవంతుడైన యాకోబు అన్నను మోసగించినందువలన కుటుంబానికి దూరంగా పారిపోవలసి వచ్చింది. ఎందరికో పనిచెప్పే యాకోబు మరొకరి దగ్గర పనిచేయాల్సి వచ్చింది. తనక్రింద ఎందరో కూలివాల్లుండగా యాకోబు తనే ఒక కూలివానిగా మారాల్సి వచ్చింది. ఎండలో వానలో మందలవెనుక తిరగాల్సి వచ్చింది.

 

     యాకోబు- రాహేలుది Love At First Sight కాబట్టి నీ చిన్న కుమార్తె కోసం 7 సం.లు కొలువుచేస్తాను అన్నాడు. లాబాను సరే అన్నాడు. ఇది బాగుంది అనుకొన్నాడు లాబాను. ఏడు సం.లు ఏడు రోజులులాగా గడచిపోయాయి యాకోబుగారికి. మరి ప్రేమ అలాంటిది. 7 సం.లు గడచిన తర్వాత నీ చిన్నకూతురుని నాకు పెళ్లి చేయు అంటే, చీకట్లో ముసుకు వేసి పెద్ద కుమార్తె ఐన లేయాను ఇచ్చి పెళ్లి చేసాడు లాబాను. ఇక్కడ లేయా పేరు మొట్టమొదటగా కనబడుతుంది మనకు. ఇలా జరుగుతుంది అని లేయాకు, రాహేలుకి కూడా చివరి క్షణం వరకు తెలియదు. ఇది యాకోబుకి అంతుచిక్కలేదు. చరిత్ర ప్రకారం యాకోబుగారు లేయాని ఒక మనిషిలా కూడా ఎప్పుడూ చూడలేదు.

 

  ప్రజల్ని మోసగించిన యాకోబు మొదటిసారిగా మామ చేతిలో మోసపోయాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఎవరూ నిన్ను మోసగించకపోయినా ప్రజల్ని మోసగిస్తున్న నీవు, నీవు మోసగించడం ముగించిన తర్వాత మోసగించబడతావు. యాకోబు మోసపోయాడు గాని కోపాన్ని లేయా మీద చూపించాడు. ప్రార్ధనా పరుడే! భక్తిపరుడే! గాని భార్యను ప్రేమించలేదు! ఆమెతో సరిగా కాపురం చేయలేదు.

 

   మోసపోయి తర్వాత మామను నిలదీస్తాడు నీవు చేసిన పని ఏమిటి? నీ చిన్నకూతురు కోసం ఏడేళ్ళు కొలువుచేస్తే పెద్దకూతురుని ఎందుకు పెల్లిచేసావ్? ఇదెక్కడి న్యాయం! లాబాను మా ఊరు న్యాయం ప్రకారం పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయకూడదు. చిన్నదానిని కూడా నీకే ఇస్తాను, మరో ఏడేళ్ళు సేవ చేయమంటాడుఇలా మరో ఏడేళ్ళు కొలువుచేసాడు రాహేలుకోసం!

 

      ఆది 29:31 లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరచెను! రాహేలు గొడ్రాలై యుండెను. హృదయాలు అంతరంగాలు ఎరిగినవాడు మనదేవుడు!! అందరిని చూస్తున్నాడు! అందుకే దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భవతి అయ్యేలా చేసారు. అందుకే 29:32 లో అంటుంది యెహోవా నా శ్రమను చూసి యున్నాడుగనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెనుయెహోవా నాశ్రమను చూశాడు అంటుంది. నిజంగా ఎవరూ లేయాను శ్రమ పెట్టలేదుఅయితే యాకోబుగారు రాహేలునే ప్రేమిస్తూ, లేయాను పట్టించుకోక పోవడం, అప్పుడప్పుడు మొక్కుబడిగా లేయాతో కాపురం చేయడం నిజంగా అది ఒక mental torture. ఇదే గొప్పశ్రమ! అందుకే దేవుడు ఆమె శ్రమను చూసి ఆమెకు కుమారుడిని అనుగ్రహించారు.

 

   ప్రియ సహోదరీ! అందరూ నిన్ను వదలివేసారా? నీ భర్త నిన్ను ప్రేమించడం లేదా? ప్రజలు నిన్ను పట్టించుకోవడం లేదా? భాదపడకు!! భయపడకు!! యెహోవా మీకోరకు చింతించుచున్నాడు!!  మీ చింత యావత్తు ఆయనపై వేయు. ఆయనే నీ హృదయవాంచలు తీర్చుతారు. లేయాను ఆదరించిన దేవుడు నిన్నుకూడా ఆదరించగలరు!! కేవలం ఆయనపై ఆధారపడు!

 

దైవాశీస్సులు!

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*6 భాగం-లేయా-2*

ఆదికాండము 30: 20

అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

1కొరింథీ 10:11  సంగతులు వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై  వ్రాయబడియున్నవి. చూశారా బైబిల్ గ్రంధం మొత్తం ఇశ్రాయేలీయుల కోసమో, లేక BCలో ఉన్నవారి కోసమో లేక యేసుప్రభులవారు ఈలోకంలో ఉన్నప్పుడు ఉన్న వారికోసమో వ్రాయబడలేదు గాని, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడియున్నది.

 

    స్త్రీ పాత్ర ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న కోట్లాదిమంది స్త్రీలకూ అతికినట్లు సరిపోతుంది. ఆమె తన జీవితకాలమంతా, తన భర్తతో కాపురం చేసినంత కాలం ఏమీ కోరుకోలేదు. మణులు మాణిక్యాలు, చీరలు ఆభరణాలు కోరుకోలేదు. గాని కేవలం తన భర్తనుండి ప్రేమను కోరుకొంది. తన భర్త తనతో ప్రేమగా మాట్లాడితే చాలు, తనతో కాపురం చేస్తే చాలు. తనని హత్తుకొంటే చాలు అనుకొంది అంతే!! ఇదేమీ పెద్ద కోరిక కాదు. సాటిస్త్రీ ఆశించే కనీస కోరిక! హక్కు! దీనికి కూడా నోచుకోలేక పోయిన దురదృష్టవంతురాలు ఈమె!

 

        ఇంతకీ ఆమె భర్త ఎవరు? త్రాగుబోతా? శాడిస్టా? మోనార్కా? దేవుడంటే తెలియని వాడా? కాదు! కాదు! కాదు గొప్ప దైవభక్తుడు!!! గొప్ప ప్రార్ధనాపరుడు! దర్శనాలు చూసి, దేవునితోనే మాట్లాడిన అనుభవం కలవాడు! గొప్ప దైవజనుని కుమారుడు. గొప్ప ప్రార్ధనాపరురాలి కుమారుడు. గొప్ప విశ్వాస వీరుడి మనవడు. ఆతని భక్తికి మెచ్చి దేవునిసేన (దేవుని దూతలు) ఎదురెల్లి అతనిసేనతో కలసి మహానయీము దగ్గర నాట్యం చేసాయిహవ్వ! ఇంత గొప్ప భక్తుడు, దర్శన అనుభవం కలవాడు చేయవలసిన పనేనా ఇది? దేవుడెప్పుడు అతనిని గద్ధించలేదా? కనీసం అతని మనస్శాక్షి గద్ధించలేదా? ఇంతకీ అతని పేరేమిటి? అతని పేరు యాకోబు అనే ఇశ్రాయేలు!! ఆమె పేరు లేయా!! మరి లేయా చేసిన ద్రోహమేమిటి? పాపమేమిటి? ఎందుకు తనభర్త లేయాను ప్రేమించలేదు? లేయా ఏమైనా చెడు తిరుగులు తిరిగేదా? వ్యభిచారా? కోపిష్టా? భర్తని సాధించే గయ్యాలా? కాదు! కానేకాదుమరి ఆమె చేసిన నేరమేమిటి? ఆమె చేసిన నేరం ఆమె అందవిహీనంగా పుట్టడమే! బలహీనమైన కన్నులు కలిగి ఉండడం! అంటే మన వాడుక బాషలో చెప్పాలంటే పుసికల్లు కలది. (కంట్లో ఎప్పుడూ పుసులు కారుతుంటాయి) .

 

   లేయా నన్ను పెళ్లి చేసుకోమని యాకోబుగారిని అడగలేదు. తన తండ్రి చేసిన మోసానికి యాకోబుగారితో పాటు తను కూడా మోసపోయింది. తనచెల్లి పెళ్లి జరుగవలసి యుండగా, తన చెల్లిని పంపక, చీకట్లో ముసుకువేసి, చెల్లికి బదులుగా లేయాను పెళ్లి చేసాడు.( దేశంలో ఇప్పుడు కూడా స్త్రీకి పెల్లయినంత వరకు ముసుకు తీయరు. భర్త పెళ్లి జరిగేటప్పుడు ముసుకు తీయాలి) దీనిని మనస్సులో ఉంచుకొని ఇంత భక్తిపరుడు కూడా తన భార్యకు అన్యాయం చేసాడు. మొక్కుబడిగా అప్పుడప్పుడు కాపురం చేసాడు. ప్రేమతో చేయలేదు. లేయా తన జీవితంలో ఎంత భాద పడింది మీద వచనం ప్రకారం చూడొచ్చు! దేవుడు నాకు మంచి బహుమతిని ఇచ్చాడు! నా భర్తకు నేను ఆరుగురు కుమారులను కంటిని కనుక  అతడికను నాతో కాపురం చేయును అని అనుకొంటుంది. ఎంతఘోరమో చూడండి. ఆరుగురు సంతానం కన్న తర్వాత కూడా ఇంకా నా భర్త నాతో కాపురం చేస్తాడో లేదో అన్న అనుమానం! భయం! నేటిరోజుల్లో మన దేశంలో చాలామంది స్త్రీలు ఇలానే భాదపడుచున్నారు. నా భర్త నన్ను ప్రేమగా చూసుకొంటే చాలు అని అనుకొంటున్నారు. విదేశీ సంస్కృతిలో తన భర్త ప్రేమగా చూడకపోతే మరొకరిని చూసుకొంటుంది గాని మన సంస్కృతి, ఇశ్రాయేలీ సంస్కృతి అది కాదు. జీవితాంతం భర్తతో జీవించాల్సిందే!

 

   మరి దీంట్లో లేయా తప్పేముంది త్రాగుబోతు భాషలో చెప్పాలంటే అది దేవుడు చేసిన తప్పు! విధాత రాసిన గీతమన భారతీయ భాషలో అది ఆమె కర్మ! మన క్రైస్తవ భాషలో అది దేవుని ప్రణాళిక! దానిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు! అది దేవుని చిత్తం! మరలా వచనాన్ని జ్ఞాపకం చేసుకొందాం! 1కొరింథీ 10:11 వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. ప్రియ విశ్వాసి! ఒకవేళ నీవుకూడా అలాగే భర్తప్రేమకు నోచుకోలేక, పిల్లల ప్రేమ నోచుకోలేక భాదపడుతున్నావా? దయచేసి విచారించకు! ఒక విషయం చెప్పనా దేవుడు ఆమెను దీవించి ఆమె గర్భం నుండి గొప్ప గొప్ప వారు వచ్చేలా చేసారు. ఆమె గర్భం నుండే ఇశ్రాయేలీయులకు ముఖ్యమైన రాజరికం, యాజకత్వం రెండూ వచ్చాయి. బైబిల్ గ్రంధంలో వ్రాయబడిన అనేక గొప్ప వ్యక్తులు ఆమె గర్భం నుండే వచ్చారు. కాబట్టి తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడిక్రింద దీన మనస్కులై యుండిడి .

 

అట్టి దీనమనస్సు, తగ్గింపు, నిరీక్షణ మనందరికీ మెండుగా కలుగును గాక! ఆమెన్!

దైవాశీస్సులు!

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*7 భాగం-లేయా-3*

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

    మనం ఆదికాండం 29 అధ్యాయం ధ్యానిస్తున్నాంలేయా తన కుమారులకి పేర్లు రకంగా పెడుతుందో చూద్దాం!

1. యెహోవా నాశ్రమను చూచియున్నాడు అని చెప్పి మొదటి కుమారునికి రూబేను అని పేరు పెట్టెను! ఆది: 29:32

 

2. నేను ద్వేషించబడితినని యెహోవా విన్నాడు కనుక ఇతనిని నాకు దయచేశాడు అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. 29:33

3. తుదకు నాపెనిమిటి నన్ను హత్తుకొనును, నేను అతనికి ముగ్గురు కుమారులను కంటిని అని అతనికి లేవి అని పేరు పెట్టెను. 29:34.

 

4. ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. 29:35

 

     ఇక్కడ కొద్దిగా ఆలోచిద్దాం! లేయా తన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మొదటగా యెహోవాను సంభోదిస్తుంది. గతంలో చెప్పిన విధముగా ఆమెగాని, ఆమె తల్లిదండ్రులు గాని యెహోవాను అనుసరించేవారు కాదు, గాని ఎప్పుడైతే లేయా యాకోబుగారిని పెళ్లి చేసుకుందో, వెంటనే తన సమస్త విగ్రహారాధన వదలి యెహోవాను అనుసరించడం మొదలుపెట్టింది. తనను నిజముగా మొర్రపెట్టువారికి ఆయన సమీపముగా ఉన్నాడు అను వాగ్దానం ఆమె జీవితంలో అక్షరాలా నెరవేరింది. తన భర్త తనను ప్రేమించకపోయినా, మ్రొక్కుబడిగా అప్పుడప్పుడు కాపురం చేస్తున్నా, దేవుడు ఆమెను కనికరించి ఆమె గర్భం తెరచి, ఆమె వెంటవెంటనే నలుగురు కుమారులను కనేలాగా చేసారు. అందుకు ప్రతిఫలంగా ఆమె దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. దేవుని నుండి ఉపకారాలు పొందుకున్న ప్రతీ విశ్వాసి తప్పకుండా దేవుణ్ణి స్తుతించాలి.

 

   మరో ముఖ్యమైన విషయం మనం లేయానుండి నేర్చుకోవచ్చుఅదేమిటంటే లేయా భర్తతో ద్వేషింపబడి, తన చెల్లి తనతో శత్రుత్వం పెంచుకుంటున్నా సరే, ఆమె దేవుణ్ణి గాని, తన భర్తను గాని, తన తండ్రిని గాని నిందించడం లేదు, పరిస్తితిలకు సర్దుకుపోవడం మొదలు పెట్టింది. దేవునిపై ఆనుకోవడం మొదలుపెట్టింది. పొందిన ఉపకారాలకు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిందియూదా పుట్టుకతో ఆమె దేవుణ్ణి స్తుతించడం ఎక్కువ చేసింది. ప్రతిఫలం ఏమిటంటే ఆమె కానుపు ఉడుగుపోయినా సరే, మరో ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను కనగలిగింది. తన దాసీ ద్వారా మరో ఇద్దరినీ సంపాదించుకోగలిగింది. కాబట్టి ప్రియవిశ్వాసి! నీకు కలిగిన కష్టాలకు దేవుణ్ణి నిందించకు!! నీ తల్లిదండ్రులను, నీ భర్తను నిందించకు! పరిస్తితులకు సర్దుకుపోయి, లేయా వలే స్తుతించడం మొదలుపెట్టుదేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు.

 

       ఆదికాండం 30 అధ్యాయంలో రాహేలు- లేయా- యాకోబుల సంభాషణ చూడొచ్చు! రాహేలు గొడ్రాలై పోయింది. దేవునిదగ్గర మొర్రపెట్టకుండా భర్తను నిలదీస్తుంది, సాదిస్తుంది, గొడవాడుతుంది నాకు గర్భ ఫలమిమ్ము అంటుంది. లేకపోతే నేను చస్తాను అంటుంది. 30:1-2. 

 

   రోజు ప్రియవిశ్వాసి! నీవుకూడా నీ భర్తను ఇలా భాదపెడుతున్నావా? frustration లో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావా? యాకోబుగారు అంటున్నారు నీకు గర్భఫలం ఇయ్యడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? అది దేవుడే నీకు ఇవ్వాలి అంటున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్త్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు భక్తుడైన సొలోమోను కీర్తనలు 127:3. గర్భఫలం ఇయ్యడం అది దేవుని చిత్తంస్త్రీలు frustrationలో తొందరపడి నిర్ణయం తీసుకొంటారు. నోరు పారేసుకొంటారు. శారమ్మ లాగ రాహేలుకూడా తొందరపడి నిర్ణయం తీసుకుంది నా దాసితో పో, ఆమెద్వారా పిల్లలను కను అన్నది. యాకోబు బిల్హా తో సంసారం చేసాడు. గమనించండి. *తండ్రియైన ఇస్సాకు లాబాను కుమార్తెలలో ఒకదానిని పెళ్లి చేసుకో అని స్తిరమైన ఆజ్ఞ ఇస్తే , లాబాను ఇద్దరి కుమార్తెలను పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు భార్య మాటలాలకించి, దాసితో కూడా కాపురం చేస్తున్నాడు*.

 

5. బిల్హా కుమారుని కంటే రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర్ర వినెను అని అతనికి దాను అని పేరు పెట్టెను. 30:6

 

6. మరో కుమారుని కంటే దేవుని కృపవిషయమై నా అక్కతో పోరాడి గెలిచితినని నఫ్తాలి అని పేరుపెట్టింది.

 

  ఇక్కడ కొన్నివిషయాలు ఆలోచిద్దాంలేయా పిల్లలు కన్నప్పుడు యెహోవా నాకు ఇది చేసాడు, అది చేసాడు, నా మొర్ర విన్నాడు అని చెబితే రాహేలు దేవుడు అంటుంది. లేయాకు తన దేవుడెవరో క్లారిటీగా తెలుసు, తమ దేవుడు యెహోవా అని ప్రగాడంగా విశ్వసించింది.. గాని రాహేలు రెండు పడవల మధ్య కాలు వేసి తచ్చాడుతుంది. రాహేలుకి లేయాకు ఉన్న పరిపక్వత లేక విగ్రహాలు మీద మోజుపెట్టుకోంది.

 

       మరో విషయం: పిల్లలకు రాహేలు, లేయా పేర్లు పెడుతుంటే యాకోబుగారు ఏం చేస్తున్నారుపూర్వకాలంలో దేశాలలో తల్లులే పిల్లలకు పేర్లు పెట్టేవారు. ఎందుకంటే నవమాసాలు కని, వారిని సాకేది వారే కాబట్టి పూర్వికులు పేరు పెట్టే అధికారం వారికే ఇచ్చారు.

 

      మరో ప్రాముఖ్యమైన సంగతి: యాకోబుగారు ఎప్పుడూ రాహేలు ప్రక్కలో పడుకొనేవారు కదా, రాహేలునే ప్రేమించేవారు, గాని ఆశ్చర్యంగా దేవుడు నాకు తీర్పు తీర్చాడు అంటుంది. దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను అంటుంది. ఇదికూడా frustration లో అనే మాటే!

 

మరో విషయం ఆమెకు క్షుణ్ణంగా అర్ధమయ్యింది ఏమిటంటే: దేవుని కృపలేకుండా సంతానం కలుగదు అని. అందుకే దేవుని కృప విషయంలో అని అంటుంది.

 

    ప్రియ విశ్వాసి! నీవుకూడా గ్రహించు దేవుని కృపలేకుండా నీవు ఏమి చేయలేవు, ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేవు. విషయం గ్రహించనంతకాలం రాహేలుకి పిల్లలు కలగలేదు. గ్రహించిన తర్వాత సంతానం పొందుకొంది. లేయాకు తన దేవుడెవరో తెలుసు. నిజ దేవుడెవరో తెలుసుకొని పరిస్తితులకు సర్దుకుపోయి, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టి, దైవాశీర్వాదాలు పొందుకోండి. అట్టి ఆశీర్వాదాలు నీకు కావాలంటే నీవుకూడా దేవునిపై ఆనుకోవడం మొదలుపెట్టు!

 

అట్టి కృప మనందరికీ కలుగును గాక!

ఆమెన్!

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*8 భాగం-లేయా-4*

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

ఆదికాండం 30:10-24 వరకు చూసుకొంటే రాహేలు తనదాసియైన బిల్హాను యాకోబుకి ఇవ్వడం , తద్వారా ఇద్దరినీ కనడం చూసిన లేయా, తనుకూడా తనదాసియైన జిల్ఫాను యాకోబుకి ఇచ్చింది. మరలా ఇదికూడా యాకోబు తన తండ్రి ఆజ్ఞను దిక్కరించినట్లయింది. జిల్ఫా ద్వారా మరో ఇద్దరు కుమారులు కలిగారు యాకోబుకి.

 

7. లేయా- ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టింది. 30:11

 

8. స్త్రీలు నన్ను భాగ్యవంతురాలు అంటారు అనుకుని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.30:13

 

   ఒకసారి కొద్దిగా ఆగి ఆలోచిద్దాం! లేయా ఇంతవరకు పిల్లలు పుడితే యెహోవా నాకు ఇది చేసాడు, అది చేసాడు, నా మొర్రవినెను అంటూ దేవుణ్ణి పొగడిన లేయా ఇప్పుడు దేవుని మాట మరచిపోయి తనకు తానూ పొగడుకోవడం మొదలుపెట్టింది. తనకు తనే శభాస్! అనుకొంటుంది. Seniority పెరిగితే Sincerity తగ్గడం అంటే ఇదే! నాకు అదృష్టం పట్టింది, నేను భాగ్యవంతురాలను అనడం ప్రారంభించింది, విశ్వాస జీవితంలో ఎప్పుడైతే *నేను* అనే అహంభావం మొదలవుతుందో, అది పతనానికి నాంది పలుకుతుందిప్రియ విశ్వాసి! ఒకవేళ నీవు కూడా అదే స్తితిలో ఉన్నావేమో సరిచూసుకో! సరిచేసుకో!

 

  14-16 వచనాలలో పుత్రదాత వృక్షపు పండ్లకోసం(Mandrakes) వ్రాయబడింది. పుత్రదాత వృక్షపు పండ్లు తింటే గొడ్రాలు కూడా గర్భవతి అవుతుంది అనే అపోహ రోజులలో ఉండేది. ఇవి మనదేశంలో ఉండే ముల్లంగి దుంప లాగ ఉంటాయివీటిని మాంత్రికులు ఎక్కువగా వాడేవారు. మనుష్యులకు చెడుపు పెట్టడానికి, మనుష్యులను మాంత్రిక విద్యలతో చంపడానికి ఎక్కువగా వాడేవారు రకంగా చెప్పాలంటే ఇవి సాతాను సాధనం!

 

   సరే! రూబేనుకి దొరికిన Mandrakes కోసం లేయా- రాహేలు తగవులాడుకొని, చివరకు యాకోబుని చాలా రోజుల తర్వాత తన దగ్గరకు రాత్రికి రప్పించుకొంటుంది లేయా! 17 వచనంలో దేవుడు లేయా మొరవినెను అని వ్రాయబడింది. 13 వచనానికి, 17 వచనానికి మధ్య చాలా జరిగిందన్నమాట! తనను తాను పొగడుకోవడం మొదలుపెట్టిన లేయాకు మరలా కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యాకోబు- లేయాతో మాట్లాడటం కాని, కాపురం చేయడం గాని మానేసాడు. లేయా చాలా నిరాశ నిస్పృహలో మునిగిపోయింది. అందుకే తన తప్పు తను తెలిసికొని, దేవునికి ప్రార్ధించడం మొదలుపెట్టింది. దేవుడు ఆమె మొరవిని, అద్భుతం చేసారు. ఆమె తిరిగి గర్భవతి అయ్యింది. గమనించండి: 29:35లో ఆమె కానుపు ఉడిగెను అని వ్రాయబడింది. 30:17 లో ఆమె తిరిగి గర్భవతి అయ్యింది. ఇది చరిత్రలో అసాధ్యం, అసంభవం!!! గాని అసాధ్యాలను సుసాధ్యం చేయడమే దేవుని ప్రత్యేకత. అంత శక్తి, అధికారం ఆయనకుందిఆయనకు సమస్తము సాధ్యమే!

 

9. అందుకే లేయా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని అతనికి ఇశ్శాకారు అని పేరు పెట్టింది.

 

10. మరో కుమారుని కని దేవుడు నాకు మంచి బహుమతిని ఇచ్చాడు అని జెబూలూను అని పేరు పెట్టింది.

 

తర్వాత ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టింది. దీనా అనగా న్యాయము, ప్రతీకారం తీర్చుకొనుట, పగతీర్చుకొనుట అనే అర్ధాలు వస్తాయి. దేవుణ్ణి హత్తుకొని ఉంటే కలిగే ప్రతిఫలమే ఇది.

 

    ఇక మనం ఇప్పుడు యాకోబుగారి గురించి ఆలోచిద్దాం! గొప్ప దైవభక్తుల కుమారుడు! భక్తిలో పెరిగిన వ్యక్తి! దేవుని దర్శనాలు పొందుకొని, దేవునితో మాట్లాడిన వ్యక్తిమొదటగా తన తండ్రి ఆజ్ఞను మీరినట్లు చూసాం! తర్వాత తన సొంత పెద్ద భార్యను ప్రేమించలేదు. మ్రొక్కుబడిగా అప్పుడప్పుడు ఆమెతో కాపురం చేసినట్లు చూసాం! పేరుకి దైవ భక్తుడే! బయట గొప్ప పేరు! గాని ఇంట్లో మంచి సాక్ష్యం లేదుప్రియ దేవుని బిడ్డా! నీకు కూడా పై ఊర్లో మంచి పేరు సాక్ష్యం ఉండొచ్చు! నీ సొంత ఇంట్లో ఒక త్రాగుబోతుగా, భార్యను కొట్టేవానిగా, తిట్టుబోతుగా, నీ ఆఫీస్లో లంచగొండిగా ఉంటే విలువ ఏముందిసొంత ఊర్లో మంచి సాక్ష్యం లేకపోతే నీ బ్రతుకికి అర్ధం ఏముంది? కాబట్టి నీ సాక్ష్యమును కాపాడుకోమని దేవునిపేరిట మనవి చేస్తున్నాను!

 

    యాకోబుగారు తన భార్యను ప్రేమించకపోవడానికి కారణం ఆమె అందంగా లేకపోవడం, తనను మోసగించి పెళ్ళిచేసుకొంది అని అపోహపడటం! నేటిదినాల్లో చాలా మంది ఇలాగే అపోహలు పడి, తన భార్య- తన స్నేహితుని భార్యకంటే బాగోలేదనుకొని, స్నేహితుని భార్యతో పోల్చుకోవడం, మరికొంతమంది చెప్పుడు మాటలువిని భార్యమీద అనుమానపడటం, భార్యను ప్రేమించకపోవడం చేస్తున్నారు. మరికొంతమంది భార్య మరబొమ్మ అని, తనింట్లో పనిమనిషిగా చూసేవారు కొంతమంది, భార్య పిల్లలను కనే యంత్రంగా చూసేవారు కొంతమంది, కేవలం తనకు పడక సుఖం ఇచ్చే సాధనంలా భావించే ప్రభుద్దులు కొంతమంది. భార్యకూడా తనలాగే మనిషని, దేవుడిచ్చిన బహుమతి అని, తనలో అర్ధభాగమని మరచిపోతున్నారు!! ఆవేశంలో , కోపంలో భార్యను కొట్టే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఒకసారి ఎఫెసీ 5:22-33, కొలస్సి 3:18-19 వరకు చదవమని మనవి చేస్తున్నాను. దయచేసి భార్యను ఆటబొమ్మగా చూడవద్దు! యాకోబు దైవభక్తుడే, ప్రార్ధనాపరుడే గాని, భార్యను ప్రేమించకపోవడం అతని జీవితంలో ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. చివరకు యబ్బోకు రేవుదగ్గర యాకోబు దేవుని పాదాలు పట్టుకొని తన తప్పు ఒప్పుకొని, దేవునితో సమాధానపడడం జరిగింది. ఆది 32:22-32. నీవు కూడా స్తితిలో ఉంటె, తప్పు తెలుసుకొని, దేవునిపాదాలను ఆశ్రయించి, తప్పులు సరిదిద్దుకోమని మనవి చేస్తున్నాను! అంతేకాకుండా భార్యతో సమాధానపడమని, భార్యను ప్రేమించడం మొదలుపెట్టమని యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను!

 

అట్టి కృప ఆనందరికి కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*9 భాగం-రాహేలు*

 ఆదికాండం ౩౦:1--4 

1. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.

2. యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడునేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.

3. అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి

4. తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా

        ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి బార్య లేయా కోసం చూసుకున్నాము! ఈరోజు రాహేలు కోసం చూసుకుందాం!

 

*రాహేలు- అందగత్తె!*

భావి దగ్గర యాకోబు గారు రాహేలుని చూసారు. ఒక్క వాలుచూపుతో యాకోబుని వశపరచుకుంది. క్లీన్ బౌల్డ్ అయిపోయారు యాకోబు గారు! షూలమ్మితి సోలోమోను గారిని కూడా అలాగే వశపరచుకున్నావు అంటూ రాసుకున్నారు...పరమగీతము 4: 9

నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.

   అయితే బైబిల్ చెబ్తుంది అందము మోసకరము, సౌందర్యము వ్యర్ధము!..సామెతలు 31: 30

అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును

 రాహేలు ఎంతో అందగత్తె గాని అణకువ, మంచితనం, లోబడేగుణం , ప్రేమ లాంటివి లేవు. తన అక్కను ప్రేమించడం పోయి ద్వేషించింది!

లేయా పెద్దది. రాహేలు లేయాకు చెల్లి. లేయా అందగత్తె కాదు సరికదా జబ్బుకల్లది. రాహేలు చాలా అందగత్తె! ఎంత అందగత్తె అంటే ఆగర్భ శ్రీమంతుడు ఐన యాకోబుగారిని ఒకేఒక కంటిచూపుతో ఆకర్షించుకోండి. Love At First Sight అన్నమాట!

 

*రాహేలు- ద్వేషభావం గలది*:

   చిన్నప్పుడు అక్కచెల్లెళ్ళు తగవులాడుకొని కొట్టుకొన్నా, పెద్దయ్యాక అనగా వివాహాలు అయ్యాక కలసిపోతారు. ఇది సర్వసాధారణం! అయితే రాహేలు- లేయాలు పెద్దయ్యాక కలవక శత్రువులుగా మారిపోయారు. కారణాలు: రాహేలు తన అందాన్ని చూసి గర్వించడం మొదలుపెట్టి, తన అక్క తనకంటే అందంగా లేకపోవడం చూసి, అక్కను చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది. నిజానికి అక్కమీద జాలిపడాల్సింది పోయి, అసహ్యించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు తండ్రి చేసిన తప్పుకి, అనగా ఇద్దరినీ యాకోబుకే ఇచ్చి పెళ్ళిచేయడం వాళ్ళ, వారిమధ్యలో అనుభందం తెగిపోయి, శత్రువులుగా మారిపోయారుపెద్దకూతురుకి మేలుచేదాం అనే అతని ఆలోచన:

1.రాహేలుని-లేయాకు శత్రువుగా చేసింది.

 

2. బైబిల్ ప్రకారం యాకోబుగారు రాహేలునే ప్రేమించారు. ఆమె కోసమే 14సం.లు కొలువుచేసారు. వీరిద్దరి మద్య ప్రేమ అంకురించింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్యకు లేయాను తీసుకురావడం వలన, లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యాయి. యాకోబు తనకే సొంతమనుకొన్న రాహేలు, ఇప్పుడు యాకోబుని మరొకరితో పంచుకోవడం, అదికూడా తను ఎవరినైతే ఇష్టపడటం లేదో ఆమెతో తనభర్తను, తనతో సమానంగా పంచుకోవడం అసలు జీర్ణించుకోలేక పోయింది. తండ్రి చేసిన మోసంలో తన అక్కకి కూడా భాగం ఉంది అనుకుని అక్కని మరింత ద్వేషించడం మొదలుపెట్టింది. యాకోబుకి లేనిపోనివి నూరిపోసింది. ఎంతగా యాకోబుని కట్టడ చేసింది అంటే లేయా పెద్ద భార్య అయినా  సరే లేయా దగ్గరకి వెళ్ళకుండా, అప్పుడప్పుడు మొక్కుబడిగా వెళ్ళేలా చేసింది. లేయాతో మనస్పూర్తిగా కాపురం చేయకుండా చేసిందిఎంతఘోరం అంటే 30:14-16 లో చూస్తే రూబేను తెచ్చిన పుత్రధాత వృక్షపు పల్లుకోసం యాకోబుని ఒక్కరాత్రి లేయాతో పడుకోవడం కోసం బేరమాడుకున్నారు.

 

3.  లేయా భర్తతోను, చెల్లితోను ద్వేషించబడటం చూసిన దేవుడు ఆమె వెంటవెంటనే కుమారులను కనే లాగ చేసారు. రాహేలైతే గొడ్రాలుగా మిగిలిపోయింది. ఇది చూసి రాహేలు మరింత కుల్లుపోవడం జరిగింది. ఈర్ష్య ఎముకలకి కుళ్ళు అని వ్రాయబడింది. ఆమె అక్కపై కుల్లుపోయే కొలది, మరింత దేవునిప్రేమకు దూరమై, మనశ్శాంతి లేక తిప్పలు పడింది. చివరకి దేవుడే సంతానమిచ్చువాడు అని గ్రహించి తప్పుతెలిసికొన్నపుడు రాహేలు కూడా పిల్లలను కన్నది.

 

  *రాహేలు- విగ్రహారాధికురాలు*:

 లేయా యాకోబుగారితో వివాహం జరిగిన మరుక్షణం తన విగ్రహారాధనను మానేసి, యెహోవా దేవుణ్ణి సంపూర్ణంగా సేవించడం మొదలుపెట్టింది. ఎంతగా దేవునిపై అనుకొంది అంటే- తను ద్వేషించబడుతున్నా సరే, పరిస్తితిలకు సర్దుకుపోయి, దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టింది. అబ్రహాము- శారమ్మలకు దేవుడు చేసిన అత్యద్భుతం తను తెలుసుకోంది కాబట్టి, యెహోవాయే నిజమైన దేవుడు అని నమ్మింది. రాహేలుకి అటువంటి భక్తిలేదు!! తనకి గృహదేవతలు అంటే ప్రాణం! యాకోబుని సంతోషపెట్టాలని యెహోవాను మొక్కుబడిగా పూజించేది తప్ప ఆయనపై నమ్మిక ఉంచి కాదు! అందుకే యాకోబుగారి తిరుగు ప్రయాణంలో తనతో పాటు, తమ గృహదేవతను మోసుకుపోయింది. శాపాన్నితెచ్చుకొని చనిపోయింది. ఇక అదే విగ్రహం కోసం తన తండ్రితో అబద్దమాడింది. (31:35). అనగా జీవితంలో యధార్దత లేదు రాహేలుకి.

 

ఒకసారి ఆగుదాం! రెండు తరాలు ముందుకు వెళ్దాం! అబ్రాహము గారు- శారాయి అనే శారాను వివాహం చేసుకునేసరికి ఆమె విగ్రహారాధికురాలు! గాని అబ్రాహముగారిని వివాహంచేసుకున్న వెంటనే విగ్రహారాధన వదిలేసి అబ్రాహము గారితో కలసి నిజదేవున్ని యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. భక్తి కుమారునికి నేర్పింది!

 ఇస్సాకుగారు- రిబ్కాను వివాహం చేసుకునేసరిని రిబ్కా పక్కా విగ్రహారాధికురాలు! గాని వివాహం కోసం రిబ్కా వచ్చేసరికి ఇస్సాకుగారు పొలంలో ప్రార్ధిస్తూ ధ్యానం చేస్తున్నారు! ఓహో తన భర్త భక్తిపరుడు ప్రార్ధనాపరుడు అని తెలుసుకుని, భర్తకు అనుగుణంగా విగ్రహారాధన వదిలేసి- భర్తను అడిగి దేవుణ్ణి ప్రార్ధించడం, దేవునితో మాట్లాడటం నేర్చుకుంది! చివరికి దేవుణ్ణి అడిగి పొందుకునే స్తితికి వెళ్ళింది. చివరికి అదే భక్తి అదే ప్రార్ధనా జీవితం కుమారునికి అనగా యాకోబుకి నేర్పించింది!

 

ఇక మూడో తరం యాకోబు! యాకోబు గారు తన భార్యలిద్దరికి భక్తిని నేర్పడంలో విఫలం అయ్యారు! లేయాకి మరో దిక్కులేక దేవుణ్ణి ఆశ్రయించింది. దేవునిని ఆశ్రయించినందువలనే వెనువెంటనే కుమారులను కన్నది! అందుకే తన పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ముందు దేవుణ్ణి ఉంచింది! గాని  రాహేలు మాత్రం తన విగ్రహారాధనను వదలలేదు! భర్తను ఏదో సంతోషింపజేయ్యాలి అని మ్రొక్కుబడిగా అప్పుడప్పుడు యాకోబు గారితో ప్రార్ధించేది- యాకోబుగారు కూడా పూర్తిగా ఆమెను ప్రార్ధనలో నడిపించలేదు! ప్రార్ధన చేద్దాము అంటే నాకు బాగోలేదులాంటి సాకులు చెప్పి ఉంటుంది బహుశా! భార్యమీద ప్రేమ మోజు వలన గట్టిగా చెప్పలేకపోయారు యాకోబుగారు! సోలోమోను గారు కూడా అలాచేసి బార్యలకు భక్తిని నేర్పలేక- చివరికి తానే విగ్రహారాదికునిగా మారిపోయినట్లు మనము రాజుల గ్రంధములోను దినవృత్తాంతాల గ్రంధంలోనూ చూడవచ్చు!

కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! అన్యులను వివాహం చేసుకుంటే ఇలా అవుతుంది! రోజులలో అబ్రాహాము గారికి, ఇస్సాకుగారికి యాకోబు గారికి దేవుని బిడ్డలను వివాహం చేసుకోడానికి దేవుని బిడ్డలు లేరు గనుక అన్యులను వివాహం చేసుకోవలసి వచ్చింది! ఈరోజు మనకు దేవుని బిడ్డలు ఎంతో సులభంగా దొరుకుతున్నారు! మరి ఇప్పుడు నీవు కూడా అన్యులను చేసుకుంటే, నీ బిడ్డలకు అన్య సంబంధాలు చేస్తే నీవు శిక్షను తప్పించుకోలేవు! ఎందుకంటే వారు నీ పిల్లలను విగ్రహారాధికులుగా మార్చేస్తారు! తద్వారా నీ పిల్లలు వారి కుటుంబాలతో నరకానికి పోతారని మర్చిపోవద్దు!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*10 భాగం-రాహేలు-2*

ఆదికాండం 30:2224

22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.

23. అప్పుడామె గర్భవతియై కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను.

24. మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి బార్య   రాహేలు కోసం చూసుకుంటున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

*రాహేలు-గొడ్రాలు:*

ఆదికాండం 30 అధ్యాయంలో రాహేలు- లేయా- యాకోబుల సంభాషణ చూడొచ్చు! రాహేలు గొడ్రాలై పోయింది. దేవునిదగ్గర మొర్రపెట్టకుండా భర్తను నిలదీస్తుంది, సాదిస్తుంది, గొడవాడుతుంది నాకు గర్భఫలమిమ్ము అంటుంది. లేకపోతె నేను చస్తాను అంటుంది. 30:1-2.  రోజు ప్రియవిశ్వాసి! నీవుకూడా నీ భర్తను ఇలా భాదపెడుతున్నావా? frustration లో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావా? యాకోబుగారు అంటున్నారు నీకు గర్భఫలం ఇయ్యడానికి నేను దేవుని ప్రతిగా ఉన్నానా? అది దేవుడే నీకు ఇవ్వాలి అంటున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్త్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు భక్తుడైన సొలోమోను కీర్తనలు 127:3. గర్భఫలం ఇయ్యడం అది దేవుని చిత్తంస్త్రీలు frustrationలో తొందరపడి నిర్ణయం తీసుకొంటారు. నోరు పారేసుకొంటారు. శారమ్మ లాగ రాహేలుకూడా తొందరపడి నిర్ణయం తీసుకుంది నా దాసితో పో, ఆమెద్వారా పిల్లలను కను అన్నది. యాకోబు బిల్హా తో సంసారం చేసాడు. *గమనించండి. తండ్రియైన ఇస్సాకు లాబాను కుమార్తెలలో ఒకదానిని పెళ్లి చేసుకో అని స్తిరమైన ఆజ్ఞ ఇస్తే , లాబాను ఇద్దరి కుమార్తెలను పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు భార్య మాటలాలకించి, దాసితో కూడా కాపురం చేస్తున్నాడు*.

5. బిల్హా కుమారుని కంటే రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నామొర్ర వినెను అని అతనికి దాను అని పేరు పెట్టెను. 30:6

6. మరో కుమారుని కంటే దేవుని కృపవిషయమై నా అక్కతో పోరాడి గెలిచితినని నఫ్తాలి అని పేరుపెట్టింది.

 

  ఇక్కడ కొన్నివిషయాలు ఆలోచిద్దాంలేయా పిల్లలు కన్నప్పుడు యెహోవా నాకు ఇది చేసాడు, అది చేసాడు, నా మొర్ర విన్నాడు అని చెబితే రాహేలు దేవుడు అంటుంది. లేయాకు తన దేవుడెవరో క్లారిటీగా తెలుసు, తమ దేవుడు యెహోవా అని ప్రగాడంగా విశ్వసించింది.. గాని రాహేలు రెండు పడవల మధ్య కాలు వేసి తచ్చాడుతుంది. రాహేలుకి లేయాకు ఉన్న పరిపక్వత లేక విగ్రహాలు మీద మోజుపెట్టుకోంది.

 

*రాహేలు-పిల్లలను కన్నది*!

ఆదికాండం ౩౦:2224

వచనాలలో చూసుకుంటే యెహోవా రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను.. హల్లెలూయ! దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె మనవి విన్నారు!

ఆగుదాం ఒకసారి! రాహేలు విగ్రహాలను ఆశ్రయించి నిరాశపడిపోయింది, భర్తను నిలదీసింది, అరిచింది గోలపెట్టింది! అయితే గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానం అని ఆమెకు తెలిసేటంతవరకు ఎన్నో తిప్పలు పడింది గాని అది దేవుడే ఇవ్వాలి అని తెలిసాక, అవి విగ్రహాల ద్వారా సాధ్యపడదు అని తెలిసాక దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టింది! నన్ను క్షమించి నాకు పిల్లలను ఇమ్మని దేవుని దగ్గర వేడుకుంది! దేవుడు ఆమె మొర విన్నారు! ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు! అప్పుడు ఆమె గర్భము ధరించి కుమారుని కని అతనికి యోసేపు అనే పేరు పెట్టింది. ఎందుకంటే దేవుడు నాకు కుమారుని ఇచ్చును గాక అనిఅందుకే యాకోబు గారు చనిపోయేటప్పుడు యోసేపు ఫలించెడి కొమ్మ అన్నారు!

ఇక రాహేలు చనిపోయేముందు లేక చనిపోయేటప్పుడు మరో కుమారుని కన్నది- అతని పేరు బెన్యామీను! ఆమె పెట్టిన పేరు బెనోని. గాని బెన్యామీను అని యాకోబు పేరు మార్చారు! ఇలా ఇద్దరు పిల్లలను కన్నది!

 

*రాహేలు- అబద్దికురాలు*:

ఇక ఆమె చనిపోడానికి కారణం ఆమెయే కారణం! యాకోబుగారి మీద మామ లాబాను ఆరోపణ చేశాడు, నీవు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, నా గృహ దేవతను ఎందుకు దొంగిలించావు అని! రాహేలు దగ్గర ఉన్నా లేదని అబద్దమాడింది. యాకోబుకి కోపం వచ్చి అది ఎవరి దగ్గర ఉంటే వాడు చావాలి అన్నారు! రాహేలు దొంగతనంగా తన దగ్గర ఉంచుకుంది తద్వారా శాపఫలం వలన చనిపోయింది!

 

   అయితే ఇంతగా తగవులాడుకొన్న రాహేలుకూడా గర్భం ధరించి, యోసేపుని కన్న తర్వాత వారిలో మార్పు వచ్చింది. యాకోబుగారు దేవుడు తనను తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళమన్నారు అని అంటే వెంటనే యాకోబుతో అన్నారు ఇద్దరో ఏకస్వరంతో మేముకూడా నీతోనే వస్తాం అన్నారు. ఇద్దరు ఏకీభవించింది ఇక్కడే! ఇద్దరూ అడ్డుచెప్పలేదు. తమ తండ్రిని- తమ దేవుళ్ళను వదలడానికి సిద్దమయ్యారు. రాహేలుకి సంపూర్ణ సమర్పణ లేక గృహదేవతను తెచ్చుకొని ప్రాణహాని తెచ్చుకొంది.

 

   సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు! ఎంత మనోహరము! కీర్తనలు 133:1. ఇక్కడ సహోదరులు అంటే కేవలం అన్నదమ్ములు అని మాత్రమె అనుకోవద్దు! అక్కచెల్లెళ్ళు అని కూడా అర్ధం! యాకోబు పత్రికలో వ్యభిచారిణులారా! అని పిలిచినందుకు కేవలం స్తీలే అనుకోన్నారేమో! వ్యభిచారం చేసే పురుషులకోసం కూడా వ్రాయబడింది. కాబట్టి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నచెల్లెల్లు అందరూ ఐక్యమత్యంగా ఉంటె దేవదీవెనలు పొందుకోగలరు.

 

ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవుకూడా అలాంటి స్తితిలో ఉన్నావా? నీ సహోదరుని/ సోదరిని ప్రేమించలేని స్తితిలో ఉన్నావా? నీ సోదరుని/ సోదరిని బాగున్నావా అని అడిగి ఎంతకాలమయ్యింది? నీ సోదరుని/ సోదరిని ప్రేమించలేని వాడవు/దానవు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? అందుకే 1 యోహాను 4:20-21 వరకు.

20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (ఎట్లు ప్రేమింప గలడు?)

21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. . ..

కాబట్టి సోదరుని/సోదరిని ప్రేమించలేని వాడు అబద్దికుడు! అంతేకాదు తన సోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వ్రాయబడింది. 1 యోహాను 3:15.

కాబట్టి ప్రియ సహోదరి/సహోదరుడా! సహోదర ప్రేమ మీలో నిలువరముగా నిలువనీయుడని యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను.

God Bless You!

ఆమెన్!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*11 భాగం-యాకోబు ఆశీర్వదించబడుట*

ఆదికాండం ౩౦:2543

25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతోనన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.

26. నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పెను.

27. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

28. మరియు అతడునీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.

29. అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;

30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందు ననెను.

31. అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.

32. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.

33. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.

34. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.

35. దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతికప్పగించి

36. తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను.

37. యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి

38. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా

39. మందలు చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.

40. యాకోబు గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.

41. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో చువ్వలు పెట్టెను.

42. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబు నకును వచ్చెను.

43. ప్రకారము మనుష్యుడు అత్యధి కముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి బార్యలు లేయా మరియు   రాహేలు కోసం చూసుకున్నాము! ఇక యాకోబు గారు ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎలా అభివృద్ధి కలిగిందో ధ్యానం చేసుకుందాం!

 

    పై వచనాలలో యోసేపు జననము తర్వాత యాకోబు గారు నేను వెళ్ళిపోతాను మా తండ్రి దగ్గరకు, నా భార్యలను పిల్లలను నాతో పంపించేయ్ అంటూ అడిగారు. లాబాను అన్నాడు: దయచేసి నీ కటాక్షము నా మీద రానీయ్, ఎందుకంటే నేను శకునము చూసి కనుగొన్నది ఏమిటంటే- నిన్నుబట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నీవు నా దగ్గర మరికొన్ని రోజులు ఉంటే దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. అలాగని ఊరికినే ఉండొద్దు! ఇప్పుడు నీవు నాతో ఉన్న రోజులకు జీతం తీసుకో అన్నాడు! దయచేసి ఒక్కసారి ఆగుదాం!

ఇక్కడ మనము రెండు విషయాలు కోసం లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది!

 

మొదటిది: యాకోబు కోసం దేవుడు లాబానుని దీవించారు.

రెండు: యాకోబు గారు హారాను అలియాస్ పద్దనరాములో అనగా సిరియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?

 

మొదటిది: *యాకోబు కోసం దేవుడు లాబానుని దీవించారు.*

ఇది మనకు బాగా అర్ధమవ్వాలి అంటే బేతేలులో దేవుడు ఏమని వాగ్దానం చేశారు? ఒకసారి ఆదికాండం 28:1315..

13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.

14. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.

15. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా

14 వచనంలో నీ సంతానమునకు దేశము ఇస్తాను అన్నారు. ఇంకా భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును!

అదే కదా లాబాను అన్నాడు- నేను శకునము చూసి కనుగొన్నది ఏమిటంటే నీ దేవుడు నీ మూలముగా నన్ను ఆశీర్వదించాడు. దేవుడు చెప్పిన మాటలు తప్పకుండా నెరవేరుతాయి! అక్కడ వాగ్దానం చేశారు, ఇక్కడ నెరవేరింది! ఒక అన్యుడు విగ్రహారాధికుడు అంటున్నాడు యాకోబుతో- నీవలన నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు!

 

 ప్రియ చదువరీ! నిన్నుబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రాంతాన్ని నీ ఊరుని ఆశీర్వదిస్తున్నారా? నిన్నుబట్టి నీవు పనిచేసే సంస్తను, పనిచేసే ఆఫీసుని దేవుడు దీవిస్తున్నారా? నీవు ఆశీర్వాదానికి కారకమైయుండాలి గాని యోనా గారిలా వారు నశించిపోడానికి చనిపోడానికి కారణం కాకూడదు! యోనా గారు తప్పుతెలిసి వెంటనే అంటున్నారు- నన్ను బట్టి గొప్ప శోధన మీమీదికి వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో విసిరివేయండి అన్నారు! ఇక్కడైతే నిన్ను బట్టి నీ దేవుడు నన్ను దీవించాడు అన్నాడు మరో అన్యుడు!

ప్రియ చదువరీ! నీవు యాకోబులా ఉన్నావా? లేక యోనా లా ఉన్నావా? దేవుడు ఆశీర్వాదాలకే కర్త! నీవు నీ బ్రతుకు బాగోలేక పోతే నిన్నుబట్టి నీ ప్రాంతాన్ని కూడా నాశనం చెయ్యవచ్చు! కాబట్టి మనము దేవుని మాట వింటూ మన ప్రాంతాన్ని మనం పనిచేసే ప్రాంతం, ఆఫీసు/యజమాని అభివృద్ధికి కారణం అవ్వాలి!

 

రెండు: యాకోబు గారు హారాను అలియాస్ పద్దనరాములో అనగా సిరియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?

ఇది మనకు అర్ధం కావాలంటే 31:3842 ..

 

38. యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.

39. దుష్ట మృగములచేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.

40. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను.

41. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.

42. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.

 

చాలామంది ఏమని తలస్తారు అంటే యాకోబుగారు లాబాను దగ్గర కేవలం ఇరవై సంవత్సరాలు ఉన్నారు! లేదండి- యాకోబు గారు 40 సంవత్సరాలు సిరియాలో ఉన్నారు! ఏడు సంవత్సరాలు రాహేలు కోసం పనిచేశారు, అయితే లేయాను ఇచ్చి పెళ్ళిచేశాడు మామ లాబాను! మరి ఏడు సంవత్సరాలు మరలా రాహేలు కోసం పనిచేశారుఇక ఆస్తికోసం ఏడు సంవత్సరాలు పనిచేశారు. మొత్తం 20 సంవత్సరాలు,. మీదన ఉదహరించిన 30:2543 జరిగిన సందర్బము ఇదే! 20 సంవత్సరాలు గడిచాక యాకోబు గారు నేను మా తండ్రిదగ్గరకు వెళ్ళిపోతాను, నా భార్యలను నా పిల్లలను దయచేసి నాతో పంపించెయ్యండి అని అడిగితే బాబ్బాబు! దయచేసి వెళ్ళవద్దు! నిన్ను బట్టి నీ దేవుడు నన్ను దీవించాడు అని శకునము చూసి తెలిసికొన్నాను కాబట్టి మరికొంత కాలం నా దగ్గర ఉండు అని బ్రతిమిలాడితే ఒక స్నేహితునిగా మరలా 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉన్నారు యాకోబు గారు! అయితే జీతం కోసం లేక ఆస్తి కోసం ఉన్న ఆరు సంవత్సరాలు- స్నేహితునిగా ఉన్న 20 సంవత్సరాలు కూడా అందరిని మోసగించిన యాకోబు మామ లాబాను చేతిలో పదిసార్లు మోసపోయాడు! దానిని చూసుకునే ముందు 20 కాదు 40 సంవత్సరాలు అనడానికి మరిన్ని ఋజువులు చూపిస్తాను.

 

1. ఆది 37:3. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. . . ఆది 30:20-24 ప్రకారం యోసేపు దీనా కంటే చిన్నవాడు. మరి ఇక్కడ వృద్ధాప్యమందు పుట్టిన వాడు అని వ్రాయబడింది. ఆకాలంలో అక్కడ మనిషి సగటు వయస్సు 120 సం.లు. మరి వృద్దాప్యమంటే 80+ అన్నమాట. మరి కేవలం 20సంలు మాత్రమే అక్కడ ఉంటే, యాకోబుగారి 40 సం.లు వయస్సులో వెళ్ళినప్పుడు 40+20=60 అవుతుంది, అది వృద్దాప్యం కాదు. 40+40=80 వృద్ధాప్యం మొదలయ్యింది.

 

2. ఆది 29:35 ప్రకారం లేయా యూదాను కన్న తర్వాత ఆమె కానుపు ఉడిగెను అంటే ఆమె menopause కి వచ్చింది. ఇంకా పిల్లలు కనలేరు. లేయాకు సుమారు 15 సం. వయస్సులో యాకోబు హారాను వెళ్తే, ఏడు సం. తర్వాత అనగా 22 సం. వయస్సులో యాకోబు- లేయాల వివాహం జరిగిందిఆకాలంలో దేశాలలో స్త్రీల menopause వయస్సు 60+. మరి 20సం.లే ఉంటే 22+20=42. అనగా మెనోపాజ్ వయస్సు కాదు! 40 సం.లు ఉంటె 22+40=62. ఒకవేళ ఆమెకు తొందరగా menopause కి వచ్చింది అనుకొన్నా 55కి వస్తే మరలా దేవుడు కరుణించి ఆమెకు పిల్లలను దయచేశారు.

 

3. యాకోబుగారి తిరుగు ప్రయాణంలో దీనాను షెకెము అనే రాజకుమారుడు బలాత్కరించడం జరిగింది. అప్పుడు దీనా సోదరులు షిమ్యోను, లేవీలు ఊరివారిని, షెకెమును, అతని తండ్రిని కత్తితో చంపినట్లు చూస్తాం. ఒకవేళ యాకోబుగారు హారానులో 20 సం.లు మాత్రమే ఉంటే, షిమ్యోను, లేవీల వయస్సు కేవలం 12/13 సం.లు మాత్రమే. వయస్సులో గ్రామస్తులను చంపడం, చంపాలనే క్రూరమైన ఆలోచన రావడం అసంభవం. 40 సం.లు ఉంటే 12+20=32 , వయస్సులో చంపడానికి అవకాశాలు ఉన్నాయి.

 

4.  ఐగుప్తు రాజైన ఫరో యాకోబు గారితో- నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని ఆదికాండం 47:8 లో అడిగితే యాకోబు గారు అన్నారు 130  అయినా అవి నా పితరులు యాత్ర చేసిన రోజులన్నీ కాదు! మనం చూసుకున్నాం గతభాగాలలో 40 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రుల దగ్గరనుండి సిరియా దేశం వెళ్ళిపోయారు యాకోబు గారు! ఇక్కడ సిరియాలో మరో 40 సంవత్సరాలు ఉండాలి, అప్పుడే అక్కడ యాబై సంవత్సరాలు కనాను ప్రాంతంలో పరవాసిగా యాత్ర చేస్తూ గడిపారు! 20 సంవత్సరాలు అయితే మిగిలిన 20 సంవత్సరాలకు మనకులెక్క తెలియదు!

ఇంకా చాలా ఉన్నాయి గాని యాకోబుగారు 40 సం.లు ఉన్నారు అనడానికి కొన్ని ఉదహరించడం జరిగింది.

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*12 భాగం-యాకోబు ఆశీర్వదించబడుట-2*

 

ఆదికాండం ౩౦:2543

25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతోనన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.

26. నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పెను.

27. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

28. మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.

29. అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;

30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.

31. అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.

32. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.

33. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.

34. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.

35. దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతికప్పగించి

36. తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను.

37. యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి

38. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా

39. మందలు చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.

40. యాకోబు గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.

41. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో చువ్వలు పెట్టెను.

42. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబు నకును వచ్చెను.

43. ప్రకారము మనుష్యుడు అత్యధి కముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారు ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎలా అభివృద్ధి కలిగిందో ధ్యానం చేసుకుంటున్నాం.

యోసేపు జననము తర్వాత యాకోబు గారు నేను వెళ్ళిపోతాను మా తండ్రి దగ్గరకు, నా భార్యలను పిల్లలను నాతో పంపించేయ్ అంటూ అడిగారు. లాబాను అన్నాడు: దయచేసి నీ కటాక్షము నా మీద రానీ, ఎందుకంటే నేను శకునము చూసి కనుగొన్నది ఏమిటంటే- నిన్నుబట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నీవు నా దగ్గర మరికొన్ని రోజులు ఉంటే దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. అలాగని ఊరికినే ఉండొద్దు! ఇప్పుడు నీవు నాతో ఉన్న రోజులకు జీతం తీసుకో అన్నాడు!

         (గతభాగం తరువాయి)

 

28 వచనం లో లాబాను అన్నాడు: నీకు ఎంతజీతం కావాలో చెప్పు ఇస్తాను- అయితే ఇక్కడే ఉండు అన్నాడు! 29 లో అంటున్నారు యాకోబుగారు- నేను నీకెట్లు కొలువుచేశానో నీకు తెలుసు! నేను రాకముందు నీ మందలు చాలా కొంచెమే, గాని నేను వచ్చాక మందలు బహుగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే (౩౦) నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నన్ను ఆశీర్వదించెను. ఇప్పుడు నేను ఇక ఎప్పుడు నా పిల్లలకోసం ఆస్తి సంపాదించుకుంటాను అని అడుగుతున్నారు యాకోబు గారు!

 

ఇక్కడ మనకు రెండు విషయాలు అర్దమవుతున్నాయి!

మొదటిది: ఆగర్భ శ్రీమంతుడు కుమారుడు మరియు మనుమడు- కోటీశ్వరుడు- ఇక్కడ పనివాడులా బ్రతుకుతున్నాడు!

 

రెండు:అందరినీ మోసగించిన యాకోబు మామ చేతిలో మోసపోవడమే కాదు, మేక గొర్రె గాని దొంగిలించబడినా జంతువుల చేత చీల్చబడినా దాని నష్టం యాకోబే భరించవలసి వచ్చింది! అనగా ఇక్కడ అల్లుడులా లేడు, ఒక పక్కా జీతగాడిలా బానిసలా పనిచేయవలసి వచ్చింది అన్నమాట! జీతం కోసం లేక ఆస్తి కోసం ఉన్న ఆరు సంవత్సరాలు- స్నేహితునిగా ఉన్న 20 సంవత్సరాలు కూడా అందరిని మోసగించిన యాకోబు మామ లాబాను చేతిలో పదిసార్లు మోసపోయాడు! అందుకే బైబిల్ చెబుతుంది- నిన్ను ఎవరూ మోసగించక పోయినా నిన్ను ఎవడూ దోచుకొనక పోయినా మోసగిస్తూ దోచుకుంటున్న నీవు, నీవు దోచుకొనుట ముగించిన తర్వాత నీవు దోచుకోబడతావు!

యెషయా 33: 1

దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు.

 

 అదేజరిగింది యాకోబు జీవితంలో! రెండుసార్లు అన్నను మోసగించాడు యాకోబు! ఇక్కడ పదిసార్లు మామచేతిలో మోసగించబడ్డాడు!

ఇక 31 వచనంలో లాబాను అంటున్నాడు: మరి అయితే నీకేమి చెయ్యాలి నేను అన్నాడు! యాకోబు గారు అన్నారు- నీవు ఏమీ చెయ్యవద్దు గాని నేను నీకోసం మరలా మందను కాస్తాను, ఈరోజు నీవు మందలో చూడు మేకలలో  దేనికైనా మచ్చలు గాని పొడలు గాని ఉంటే అవి, గొర్రెలలో నల్ల గొర్రెలుంటే అవి వేరు చేసేయ్! అలాంటివి నాకు జీతం! మచ్చలు పొడలు లేనివి నీకు  అన్నాడు! లాబానుకి తెలుసు తన మందలలో పొడలు మచ్చలు ఉన్నవి చాలా చాలా తక్కువ! యాకోబు పిచ్చోడు అనుకున్నాడు సరే అన్నాడు!

 

వెంటనే లాబాను రోజునుండి అన్నావ్ కాబట్టి- ఆరోజు వరకు మచ్చలు పొడలు ఉన్నవాటిని తీసి నల్లగొర్రెలు తీసి వేరుగా తన కుమారుల చేతికి అప్పగించేసాడు! ఇక రోజునుండి మచ్చలు పొడలు నల్లగొర్రెలు నీవే అన్నాడు!

ఇలా ఇద్దరి మందలు వేరు అయ్యాయి! మొత్తం మందను యాకోబే కాయాలి గాని ఏవైనా మచ్చలు పొడలు కలిగి పుడితే అవి యాకోబువి అవుతాయి! నల్లగొర్రెలు పుడితే అవి యాకోబువి అవుతాయి! రోజు నల్ల గొర్రెలు ఒకటి కూడా లేదు, మచ్చలు పొడలు కలిగినవి యాకోబు మందలో ఒకటి కూడా లేదు! ఎందుకంటే లాబాను అన్నింటిని తీసుకుని తన కుమారుల చేతికి ఇచ్చేసి వాటిని మూడురోజుల ప్రయాణమంత దూరం ఉంచాడు! ఇప్పుడు యాకోబు జీరో- లాబాను బోలెడు ఆస్తిపరుడు!

 

సరే, ఇప్పుడు యాకోబు గారు ఎలా ఆస్తి సంపాదించారో చూసుకుందాం! 37 వచనం నుండి చివరి వరకు చూసుకుంటే మందలు నీరు త్రాగడానికి వచ్చినప్పుడు ఒక కార్యము చేశారు! ఏఏ మేకలు లేక గొర్రెలు గర్భము ధరించి ఉన్నాయో- అవి నీరు త్రాగడానికి వచ్చినప్పుడు వాటిముందు ఒక ఎరేంజ్మేంట్ చేశారు. అది ఏమిటంటే- చినారు జంగి సాలు అనే మూడు రకాల చెట్ల యొక్క కొమ్మల యొక్క బెరడు వలిచి రకరకాల రంగుల చువ్వలను కడుపుతో ఉన్న గొర్రెమేకల ముందు నీరు త్రాగేటప్పుడు వాటిముందర పెట్టేవారు! చినారు జంగి సాలు అంటే ఏవేవో అని అనుకోవద్దు! చినారు అనగా గంగిరేవు చెట్టు, జంగి అనగా బాదం చెట్టు, సాలు అనగా సాల చెట్టు ఇది బిళ్ళ కర్ర చెట్టులా ఉంటుంది! గంగిరేవు గాని, బిల్లకర్ర గాని బెరడు వలిస్తే తెల్లగా ఉంటుంది! మా పల్లెటూర్లలో ఏమిచేస్తారు అంటే అందంగా ఉండటానికి మధ్యమధ్యలో బెరడు వలిచి కొంచెం సేపు మంటలో వేస్తారు! తర్వాత కాలిపోకుండా తీసివేసి ఇప్పుడు మొత్తం బెరడును వలిచేస్తారు. అప్పుడు కొంచెం అతి తెల్లగాను కొంచెం బాగం పసుపుగాను నలుపుగాను ఎరుపుగాను ఉంది అందంగా ఉంటాయి కర్రలు లేక చువ్వలుఇప్పుడు యాకోబు గారు కూడా చూలు కట్టిన గొర్రెమేకల ముందు నీరు త్రాగేటప్పుడు ముందు పెడితే అవి పిల్లలను కనేటప్పుడు రంగురంగుల లేక మచ్చలు పొడలు గల మేకలను గొర్రెలను కన్నాయి! అదికూడా బలమైన గొర్రెమేకలకే అలా చేశారు కాబట్టి బలమైనవి యాకోబు గారికి బలహీనమైనవి లాబానుకి వెళ్ళాయి!

 

అయితే ఇది యాకోబు గారి ఐడియా అయితే కాదు! ఇది తన భార్యలతో ఒప్పుకుంటున్నారు యాకోబు గారు! ఐడియా ఇచ్చింది దేవుడు! ఇది అనకు 31 అధ్యాయంలో ఉంటుంది!31:1013 ప్రకారం దేవుడు సిరియా దేశంలో యాకోబు గారికి రెండుసార్లు కనబడి దర్శన రూపంలో మాట్లాడారు! మొదటసారి లాబాను చేస్తున్న మోసం చూసి దేవుడే ఇచ్చిన ఐడియా లేక ఆలోచన ఏమిటంటే మచ్చలు పొడలు గల గొర్రె మేకలు ఎలా వస్తాయో! దర్శనములో దేవుడు చెప్పినట్లు యాకోబు గారు చేశారు! వెంటనే మచ్చలు పొడలు గల మేకలు గొర్రెలు యాకోబు గారికి వచ్చాయి! దేవుడు చెప్పినట్లు మనం చేస్తే అన్ని ఆశీర్వాదాలే వస్తాయి! యాకోబు గారు దేవుడు చెప్పిన మాటను విన్నారు ఆశీర్వదించబడ్డారు! మనము దేవుని మాటను వినడం లేదు! లోకము కావాలి దేవుడు కావాలి మనకు! అందుకే రెంటికీ చెందని రేగడి అయిపోతున్నాము! ఎదుగుబొదుగూ లేని బ్రతుకులు అయిపోతున్నాయి మనకు! కాబట్టి దేవుని మాటను విందాం! ఆశీర్వదించబడదాం!

 

అయితే కధ అయిపోలేదు! 31:7 లో అంటున్నారు యాకోబు గారు తన భార్యలతో మీ తండ్రి పదిమార్లు నా జీతం మార్చెను అంటున్నారుఎలా మార్చారు అంటే 89 వచనాలలో..

7. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు.

8. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.

9. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.

 

ఎప్పుడైతే మచ్చలు పొడలు ఉన్నాయి నీ జీతం అని చెబితే యాకోబు మందలు పెరిగిపోవడం చూసి సొంత అల్లుడుమీద ఈర్శ్యపడి యాకోబు- కాదు కాదు నీ జీతం మచ్చలు పొడలు లేనివి, నావి మచ్చలు పొడలు ఉన్నవి అన్నాడు మామ! వెంటనే చినారు జంగి సాలు చెట్ల బెరడు కార్యక్రమం ఆపేశారు! అప్పుడు దేవుడు మచ్చలు లేని మందలను దేవుడు యాకోబుకి ఇచ్చారు! మరలా అన్నాడు మచ్చలున్నవి నీవి మచ్చలు లేనివి నావి అన్నాడు! దేవుడు అప్పుడు మచ్చలు పొడలు ఉన్నవి యాకోబుకి ఇచ్చారు! ఇలా పదిమార్లు మోసం చేశాడు మామ! రెండుసార్లు మాత్రమే అన్నను మోసగిస్తే పదిసార్లు మామ తనను మోసం చేశాడు!అయినా దేవుడు యాకోబుకి ఆశ్రయ దుర్ఘమై నిలిచారు!

 

అందుకే దేవునిమాట మనం వింటే ఆయన మనచేయి విడిచే దేవుడు కాదు! నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చారు! బేతేలు దగ్గర అదే అన్నారు దేవుడు! ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతిస్తలమందు నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నేను నిన్ను విడువను అని వాగ్దానం చేశారు 28:15 లో...

దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చారు! మనము కూడా దేవుని వాగ్దానాలు నమ్మి ముందుకు సాగిపోదాం!

దైవాశీస్సులు!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*13 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం*

ఆదికాండం 1:3,1213

3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా

11. మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.

12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని

13. నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారు ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎలా అభివృద్ధి కలిగిందో ధ్యానం చేసుకున్నాం.

   ఇక అధ్యాయంలో దేవుడు మరలా యాకోబుతో మాట్లాడుచున్నారు. యాకోబు ఇక నీవు తిరిగి నీ పితరుల దేశమునకు నీ బందువుల యొద్దకు తిరిగి వెళ్ళు! గమనించాలి గతభాగాలలో చెప్పినట్లు యాకోబు గారు సిరియాకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. తన తల్లిదండ్రులను చూసి 40 సంవత్సరాలు అయిపోయింది. బహుశా అన్నకోపం కూడా తగ్గిపోయి ఉంటుంది. యవ్వనుడు ఇప్పుడు వృద్ధుడు అయిపోయాడు! దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో- ఇక చాలు నీవు మరలా నీ పితరుల దేశానికి వెళ్ళు! ఎందుకు పితరుల దేశానికి అంటున్నారు అంటే తన తండ్రి 120 సంవత్సరాలు కనాను దేశం లో పరవాసిగా జీవించారు, తన తాతగారు అబ్రాహము గారు వంద సంవత్సరాలు అదే కనాను దేశంలో పరవాసిగా జీవించారు! ఇలా సుమారు 200 సంవత్సరాలు కంటే ఎక్కువ సంవత్సరాలు నుండి కనాను దేశంలో పరవాసిగా ఉంటున్నారు కాబట్టి ఇక కనాను దేశమే తమయొక్క పితరుల దేశము అయిపోయింది అని గ్రహించాలి!

 

అయితే దేవుడు మాట్లాడిన సందర్బము ఏమిటంటే: తన మామ కొడుకులు అనగా తన బావమరుదులు గుసగుసలాడుకుంటున్నారు ఏమని అంటే- యాకోబు ఒక్కడు వచ్చాడు- ఇప్పుడు బోలెడు ఆస్తి సంపాదించేశాడు, నిజానికి అదంతా మా నాన్న సొమ్ము! దానివలనే ఆస్తి సంపాదించాడు అంటూ నిష్టూరంగా మాట్లాడటం మొదలుపెట్టారు! ఇంతవరకు వారికోసం యాకోబు పడిన కష్టాన్ని వారు చులకనగా చూశారు! బహుశా అప్పుడు యాకోబు గారు దేవునికి మొర్ర్రపెట్టి ఉండవచ్చు- అయ్యా పరదేశంలో నేను కూలివాడిలా ఉన్నాను- ఇక్కడ కూడా నాకు గౌరవం మర్యాద లేదు- నీవే నాకు దిక్కు అంటూ! వెంటనే దేవుడు మాట్లాడుచున్నారు యాకోబుతో- ఇక నీవు మీ పితరుల దేశానికి నీ బందువుల యొద్దకు తిరిగి వెళ్ళు!

 

  వెంటనే తన భార్య లిద్దరిని తన దగ్గరకి పిలిపించుకున్నారు- గమనించాలి- యాకోబు ఎల్లప్పుడూ తన మందల దగ్గరే ఉండేవాడు! అందుకే భార్యలను పిలిపించుకున్నారు! అంటున్నారు 59 ...

 

5. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు;

6. మీ తండ్రికి నా యావచ్ఛ క్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.

7. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.

8. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.

9. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.

ఇక్కడ మామ లాబాను తనను ఏవిధంగా మోసం చేశాడో తన భార్యలకు వివరిస్తున్నారు యాకోబు గారు!

 

ఇక తర్వాత వచనంలో తనకు ఆస్తి ఎలా అభివృద్ధి కలిగిందో నిజాన్ని ఒప్పుకుంటున్నారు- ఇది దేవుడు నాకు చూపించిన దర్శనం ప్రకారం నేను ఆస్తిని అభివృద్ధి చెందించాను తప్ప, అది నావలన కాదు అని తన భార్యల యెద్ద ఒప్పుకుంటున్నారు!

 

అయితే ఇక్కడ ఒక  విషయము చెప్పాలని అనుకుంటున్నాను:

మొదటిది: 5 వచనంలో తన భార్యలతో మాట్లాడుతూ- నా తండ్రియొక్క దేవుడు అంటున్నారు గాని నా దేవుడు అని అనడం లేదు! ఇప్పటికే దేవుడు యాకోబు గారితో మూడుసార్లకు పైగా మాట్లాడారు- అయినా నా దేవుడు అనడం లేదు, నా తండ్రి దేవుడు అంటున్నారు! యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు! దేవుడు ఎప్పుడో యాకోబుని తనవాడు అనుకున్నారు గాని యాకోబు ఇంకా దేవుణ్ణి తన దేవుడు తన సొంతమని అనుకోవడం లేదు! అనేకమంది నేటిరోజులలో అయ్యగారు మాకోసం ప్రార్ధన చెయ్యండి దీనికోసం ప్రార్ధన చెయ్యండి అంటున్నారు గాని నేను ఫలాని దానికోసం ప్రార్ధిస్తున్నాను, మీరు కూడా నాకోసం ప్రార్ధన చెయ్యండి అనడం లేదు! అన్యులు మా పల్లెటూర్లలో అంటూ ఉంటారు- మాకు ఇంట్లో ఎంతో కష్టంగా ఉంది లేక మా కుమారుడికి బాగోలేదు, కొంచెం మీ దేవుడికి ప్రార్ధన చేస్తారా, మీ దేవుడికి చెబుతారా బాగుచెయ్యమని అంటూ ఉంటారు! ఇక్కడ యాకోబు పరిస్తితి కూడా అలాగే ఉంది. దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నా గాని ఇంకా నా తండ్రి దేవుడు అంటున్నారు!

 

     ఎప్పుడైతే తన భార్యలు మాటలు విన్నారో వెంటనే ఇద్దరూ ఏకీభవించి మా తండ్రి మమ్మల్ని అన్యులుగా చేసేసాడు కాబట్టి మీరు ఏమి చెబితే అది చేస్తాముదేవుడు నీతో చెప్పిన విధంగా మనం వెల్లిపోదాం అన్నారు! ఇక్కడ యాకోబు గారి భార్యలిద్దరూ దేవుణ్ణి తమ దేవునిగా అంగీకరిస్తున్నారు.

తర్వాత వారికి కలిగిన సమస్తమును తీసుకుని పిల్లలతో మందలతో దాసులతో కలసి బయలుదేరి వెళ్ళిపోయారు! అయితే తన మామతో చెప్పకుండా వెళ్ళిపోవడం మోసగించినట్లు అని బైబిలే చెబుతుంది.

కూతుర్ల విషయంలో ఒకసారి, ఆస్తి విషయంలో  పదిమార్లు మామ తనను మోసగిస్తే చివర్లో మామకు చెప్పకుండా వెళ్ళిపోతూ మామను మోసగిస్తున్నాడు యాకోబు! సమయంలో లాబాను గొర్రెబొచ్చు కత్తిరించడానికి తన మందను తీసుకుని దూరం వెళ్ళాడు! ఇదే అదను అనుకుని యాకోబు బయలుదేరి ఉండగా ఇదే అదను అనుకుని రాహేలు తన తండ్రి యొక్క గృహ దేవతను దొంగిలించింది!

 

ఇక్కడ మూడు విషయాలు చెప్పనీయండి:

మొదటిది: లాబానుకి తెలుసు ఏకైక సత్య దేవుడు నిజదేవుడు ఒకరున్నారు, ఆయనే అబ్రాహము గారితోనూ తన పూర్వికులతోను మాట్లాడారు అని తెలుసు! శకునము చూసుకుని యాకోబుని బట్టి నిజదేవుడు తనను దీవించినట్లు తెలుసుకున్నాడు. అయినా ఇంకా గృహదేవతలను వదలలేదు. తన బ్రష్ట స్వభావాన్ని తన కోరికలను లోకాశలను వదలక లోకంతో కలిసి జీవిస్తున్నాడు! మనలో అనేకమందికి మనం పూజించేది నిజ దేవుణ్ణి, ఆయనే మనకోసం మరణించి తిరిగి లేచారు తిరిగి రాబోతున్నారు అని తెలుసు, ఆయన మాట్లాడే దేవుడు చూసే దేవుడు అని తెలిసినా లోకపుటాసలు వదలలేక పోతున్నారు! లోకాచారాలు మానలేక పోతున్నారు లాబానులా! లోకంతో కలసిపోతున్నారు. తద్వారా నరకానికి పోతున్నారు!

 

రెండవదిరాహేలుకి యెహోవా దేవుడే నిజదేవుడు అని తెలిసింది. ఆయన కృప వలననే తనకు యోసేపు పుట్టాడని తెలుసు! ఆయన తన భర్తతోను తన మామ గారితోనూ తన పూర్వికులతోను మాట్లాడారని, మాట్లాడే దేవుడని తెలిసినా ఇంకా విగ్రహారాధనను తన ఊరి ఆచారాన్ని మానక, తన తండ్రి విగ్రహాన్ని దొంగిలించింది!

 

మూడవది: అంతకన్నా సిగ్గు కలిగించే విషయం ఏమిటంటే: దేవుడు తనతో మాట్లాడుతున్నా- దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నాగాని- తన ముద్దుల భార్యకు బోధించే తీరిక లేదు యాకోబు గారికి! ధన సంపాదనకే సమయం కేటాయించారు గాని యాకోబు గారు తన కుటుంభం ఏమి చేస్తున్నారు, తన భార్యలు భక్తిగా ఉంటున్నారా లేదా, తన పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది పట్టించుకునే తీరిక లేకుండా పోయింది యాకోబు గారికి! అందుకే మార్గమధ్యంలో తన ముద్దులు భార్యను కోల్పోవలసి వచ్చింది! ఈరోజులలో అనేకమంది యాకోబు గారిలా ధన సంపాదనలో మునిగి పోతున్నారు తప్ప తన భార్య ఏమి చేస్తుంది, తన పిల్లలు ఏమి చేస్తున్నారు, వారు భక్తిమార్గంలో ఉంటున్నారా లేదా, తన తల్లిదండ్రులను అనగా తాతలతో అమ్మమ్మతో నాన్నమ్మతో బంధువులతో సరిగా మాట్లాడుతున్నారా లేదా, గౌరవంగా నడుచుకుంటున్నారా లేదా, వారు వేసుకునే వస్త్రధారణ వాక్యానుసారంగా ఉంటుందా లేదా, చక్కగా చదువుకుంటున్నారా లేదా అనేది గమనించే సమయం లేకుండా పోతుంది! అందుకే ఒకరోజు కుటుంభానికి దుఃఖం మిగిలిస్తున్నారు పిల్లలు! ఇది తప్పకుండా కుటుంబ యజమాని లోపమే! కాబట్టి మనం కూడా మన భార్యను మన పిల్లలను పట్టించుకుంటూ దేవుని మార్గంలో నడిపిస్తూ బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

దైవాశీస్సులు!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*14 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం-2*

ఆదికాండం 1:2232

22. యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను.

23. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదుకొండ మీద అతని కలిసికొనెను.

24. రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.

25. లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.

26. అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?

27. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.

28. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.

29. మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.

30. నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా

31. యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని

32. ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకుంటున్నాము.

యాకోబు గారు తన మామ వలన తను సంపాదించిన ఆస్తిని తన భార్యలను తీసుకుని పారిపోయారు. యూఫ్రటీస్ నది దాటి గిలాదుకొండసీమకు వెళ్ళిపోయారు. గమనించాలి బోలెడు ఆస్తి, విస్తారమైన పశువులు కలిగి వెళ్ళిపోయారు- అంతేకాకుండా యూఫ్రటీస్ నది దాటి వెళ్లిపోయినట్లు బైబిల్ చెబుతుంది. యూఫ్రటీస్ నది చాలా పొడవైనది వెడల్పైనది. మరి ఏరకంగా ఆయన తనకు కలిగిన ఆస్తి మొత్తాన్ని యూఫ్రటీస్ నది దాటించారో మనకు తెలియదు! ఇది ఒక్కరోజులో అయిపోయేది ఎంతమాత్రము కాదు! ఇక వారు గిలాదు కొండసీమకు చేరుకున్నారు అనగా కనాను దేశపు బోర్డర్ అన్నమాట!

మూడురోజుల తర్వాత లాబానుకి యాకోబు పారిపోయినట్లు తెలిస్తే అప్పుడే తరుముకుంటూ బయలుదేరితే ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదో రోజున యాకోబు దగ్గరకు వచ్చాడు మామ!

 

ఇప్పుడు మామ యాకోబుని అనగా తన అల్లుడిని చంపేసి తన పిల్లలను ఆస్తిని తీసుకుని పోదాము అనుకుంటున్నాడు, అయితే దేవుడు రాత్రి లాబానుతో మాట్లాడారు- ఖబడ్దార్! యాకోబుతో మంచి గాని చెడ్డగాని మాట్లాడేవో జాగ్రత్త! అయిపోతావ్ జాగ్రత్త అన్నారు! అంటే ఒకరకంగా యాకోబుకి ఏవిధమైన అపాయం కలిగించినా యాకోబుని శపించినా తిట్టినా నీవు అయిపోతావ్ జాగ్రత్త! యాకోబు నా మనిషి అని దేవుడే లాబాను ని గద్దించారు అన్నమాట! ఎంతగొప్ప దేవుడో కదా! తనయందు భయభక్తులు గలవారిని తన పిల్లలను ఏమాత్రము విడువని దేవుడు! బేతెలు దగ్గర నిన్ను విడువను అని సెలవిచ్చిన దేవుడు, సిరియాలో నీవు నీ పితరుల దేశమునకు తిరిగి వెళ్ళు నేను నీతో ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు- ఇప్పుడు మామ యాకోబుకి అపాయం తలపెడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు!మనము ఆయనను ఆశ్రయించాలి నమ్ముకోవాలి అంతే, మిగిలిన కార్యము ఆయనే చూసుకుంటారు! మోషే గారు అంటున్నారు- మీరు యెహోవా కలుగజేసే రక్షణ ఊరకనే నిలుచియుండి చూడండి అంటున్నారు, ఈరోజు కనిపించే ఐగుప్తీయులు రేపు మీకు కనబడరు అన్నారు!

Exodus(నిర్గమకాండము) 14:13,14

13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

 

అలాగే నాశనమై పోయారు, తర్వాత రోజు శవాలుగా కనిపించారు! అదీ దేవుని శక్తి! మనము ఆయన శక్తిని బలమును ప్రభావమును నమ్ముకుని ఆశ్రయించాలి అంతే!

 

   ఉదయాన్నే లాబాను తన బంధువులతో కలసి యాకోబుని కలుసుకున్నాడు. నా పిల్లలను ముద్దు పెట్టుకోకుండా ఎందుకు దొంగతనముగా తీసుకుని పోతున్నావ్! నీవు ఇంటికి పోతాను అంటే నిన్ను డప్పులతో బ్యాండ్ మేళంతో పంపించేవాడను కదా! పిచ్చోడులా నీవు ప్రవర్తించావ్ అంటున్నాడు! నీకు నేను హాని చెయ్యగలను గాని నీ తండ్రిదేవుడు రాత్రి నాతో మాట్లాడి నీతో మంచిగాని చెడ్డగాని పలుకవద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చారు! లేకపోతేనా... అంటూ అన్నాడు!

 

   చివర్లో అంటున్నాడు- వెళ్ళిపోతే వెల్లిపోయావ్ గాని నా గృహదేవతను ఎందుకు దొంగతనం చేసి వెళ్ళిపోతున్నావు అంటూ గట్టిగా అడిగాడు! ఇంతవరకు నెమ్మదిగా మాట్లాడిన యాకోబు గారు, ఎప్పుడైతే దేవుడు రాత్రి గద్దించారు మామను అని తెలిసిందో, ఇంకా జీవితంలో ఎప్పుడూ విగ్రహాలకు మ్రొక్కని యాకోబు, ఇప్పుడు విగ్రహాన్ని దొంగిలించావు అని అభాండం విన్నాడో వెంటనే విగ్రహం ఎవరి దగ్గర దొరుకుతుందో వాడు బ్రతుకకూడదు అన్నాడు! లాబాను వెదికాడు, గాని దొరకలేదు! రాహేలు దానిమీద కూర్చొని నాకు బాగోలేదు అని అబద్దమాడింది. మధ్య దారిలో చనిపోయింది!

   ఇక్కడ మొట్టమొదటి సారిగా యాకోబు గారు మామను అడుగుచున్నాడు- ఎందుకు నన్ను పదిమార్లు నన్ను మోసగించావు నేను ఎంత కష్ట పడ్డానో నీకు తెలుసా అంటున్నారు 3642....

 

36. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?

37. నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.

38. యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.

39. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.

40. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.

41. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.

42. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.

 

ఇక తర్వాత వచనాలలో లాబాను మరియు యాకోబు గారు ప్రమాణం లేక ఒప్పందం చేసుకుంటున్నారు- నీవు నన్ను మోసం చెయ్యకూడదు, నాకు హాని చెయ్యకూడదు, నేను నీకు హాని చెయ్యను, అలాగే లాబాను కూతుళ్ళను తప్ప మరొకరిని వివాహం చేసుకోకూడదు. అప్పుడు మరోసారి మరో స్తంభాన్ని నిలిపారు యాకోబు గారు! గమనించాలి 28 అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడిన చోట ఒక స్తంభం నిలిపారుఆనగా దేవున్నే సాక్షిగా లేదా దేవునినే ఆధారంగా చేసుకుంటున్నారు అన్నమాట! అక్కడ రాళ్ళకుప్పగా కూడా పోశారు. దానికి సిరియా బాషలో లాబాను యగర్ శాహదూత అన్నాడు, యాకోబు గారు హెబ్రీ భాషలో గలేదు అన్నారు! రెండింటి అర్ధం ఒక్కటే- సాక్షి కుప్ప లేక సాక్ష్యం కుట్ట!

 

ఇంకా యాకోబు ఒక అడుగుముందుకు వేసి మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయం చేసుకుని అంటున్నారు: మనం ఒకరికొకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవా నీకు నాకు నాకు మధ్య కావలిగా ఉంటారు అని కుప్పకు మరో పేరు పెట్టారు-మిస్పా!! అంటే కావలి గోపురం! అవును దేవుడే మనకు కావలి! మన ఆశ్రయం, మన ప్రాకారం, మన కొండ కోట! మన తల కాయువాడు! ఇది నీకు తెలిసిందా నీవు దేని విషయంలో కూడా భయపడవుయాకోబు గారు దేవుణ్ణి ఆశ్రయంగా కావలిగా చేసుకున్నారు! మరినీవు ఆశ్రయంగా చేసుకోడానికి ఇష్టపడుతున్నావా?

దైవాశీస్సులు!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*15 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం-3*

ఆదికాండం 32:12

1. యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.

2. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి చోటికి మహనయీము అను పేరు పెట్టెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకుంటున్నాము.

ప్రియులారా! లాబానుతో నిబంధన చేసిన తర్వాత యాకోబు గారు తన పరివారంతో కలసి తన దారిన వెళ్ళిపోతూ ఉండగా దేవదూతలు యాకోబు గారిని ఎదుర్కొన్నారు! ఎంత భాగ్యమో కదా! అయ్యా కలలో కాదు! నిజంగా ముఖాముకిగా ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేలకోట్ల మంది దేవునిదూతలు యాకోబుగారు సిరియా వదలి కనాను ప్రాంతం అడుగుపెట్టిన తర్వాత దేవదూతలు యాకోబుగారిని ఆయన సమూహాన్ని ఎదుర్కొన్నారు! ఎలా అంటే ఒక రాజు లేక రాజకుమారుడు లేక పెండ్లి కుమారుడు తమ గృహానికి వస్తే ఎలా మేళతాళాలతో ఎదుర్కొంటారో అలాగే యాకోబు గారిని ఎదుర్కోడానికి దేవదూతలు ఎదురొచ్చారు, నాట్యమాడారుఅది ఒక అందమైన సుందర దృశ్యముగా కనిపించింది అందుకే ప్రాంతానికి మహానయీము అని పేరు పెట్టారు యాకోబు గారు! మహానయీము అంటే రెండు సేనలు లేక రెండు శిభిరాలు! ఒకటి దేవుని సేన, రెండవది యాకోబు గారి సేన అన్నమాట! సుందర దృశ్యాన్ని ఒక మంచి నాటకముగా హెబ్రీ లేక ఇశ్రాయేలీ కవులు/గాయకులూ మలిచారు తర్వాత కాలంలో! అందుకే దీనిని ఎత్తిరాస్తూ పరమగీతంలో అంటున్నారు సంఘమును గూర్చి ఆమె మహానయీము నాటకమంత వింత అయినదా అంటూ.....

పరమగీతము 6: 13

షూలమ్మతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?

 

ఇంకా బైబిల్ పండితులు కూడా దీనికోసం ఎన్నెన్నో ఆత్మీయ మర్మాలతో చెబుతూ ఉంటారు- దేవుని రాకడను- పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారిని ఉద్దేశించి! పెండ్లికుమారుడైన యేసుక్రీస్తుప్రభువుల వారు తన భార్య ఆయన వధువు సంఘమును తీసుకుని పరమ కనానులో అడుగుపెట్టిన వెంటనే మరోసారి పరమ దూతలు పెండ్లికుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారిని ఎదుర్కోడానికి వస్తారు! సంఘముతో కూడిన యేసుక్రీస్తుప్రభులవారి సేన- పరలోక దూతల సేనఅదే నిజమైన మహానయీము అని వివరిస్తారు!

 

ఇక తర్వాత వచనాలలో యాకోబు గారు తన అన్నయైన యాశావుకి తను మరలా తమ దేశానికి ప్రాంతానికి వస్తున్నట్లు కబురు పెడుతున్నారు! ఇక్కడ ఎదోము దేశము ఇంకా శేయీరు దేశము అంటున్నారు! అనగా నిజానికి ఎదోము అనగా ఇరాక్ గాని ఇక్కడ ఉద్దేశించి రాసినది ప్రస్తుతం ఉన్న లెబనాను, పాలస్తీనా, సౌదీఅరేబియా జోర్డాన్ ఇంకా మరిన్ని ప్రాంతాలు అన్నమాట! ఎదోము దేశము మృత సముద్రానికి దక్షిణముగా దూరముగా ఉన్నది. అక్కడ యాశావు ఉంటున్నాడు.

 

సరే ఏమని కబురు పెడుతున్నారు అంటే 45..

4. మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;

5. నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.

 

       దీని ఉద్దేశం ఏమిటంటే నేను ఇంతవరకు మన మేనమామ లాబాను ఇంటిదగ్గర ఉన్నాను 40 సంవత్సరాలు. ఇప్పుడు నేను తిరిగి వస్తున్నాను. ఇప్పుడు నాకు ఆస్తి పశువులు గాడిదలు మందలు దాసులు దాసీలు అందరూ ఉన్నారు. నేను మరలా వస్తున్నాను. ఇక్కడ సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడిగా చెబుతున్నారు- దయచేసి నన్ను క్షమించి నన్ను ఇక్కడ ఉండనీయు! తండ్రి నుండి సంక్రమించే ఆస్తి మొత్తము నీవు తీసేసుకో! కేవలం నన్ను బ్రతకనీయు! నాకైతే ఇప్పుడు బోలెడు ఆస్తి ఐశ్వర్యము ఉంది! నన్ను క్షమించు అని అర్ధము!

 

ఇంకా యాశావుని నీవు నా ప్రభువు అంటున్నాడు, నేను నీ దాసుణ్ణి అంటున్నాడు! రెండుసార్లు నా ప్రభువైన యాశావు అని సంభోదించడం మనకు కనిపిస్తుంది! ఇక్కడ యాకోబు భయము ఎంతో స్పష్టముగా కనిపిస్తుంది. తల్లి గర్భమందే యాశావుని యాకోబుకి దాసుడిగా చేశారు దేవుడు! ఇక తండ్రి కూడా ఏమని దీవించారు అంటే నీ సహోదరులు నిన్ను సేవిస్తారు! అనగా నీసహోదరున్ని నీవు ఏలుతావు. ఇక యాశావుని దీవించేటప్పుడు ఇలా నీవు నీ తమ్ముడికి లోబడి దాసుడిగా ఉన్నప్పుడు నీ కత్తిచేత దాస్యము నుండి విడుదల పొందుతావు అని అంత స్పష్టముగా వాగ్దానాలు ఉండగా ఇక్కడ ప్రాణ భయముచేత యాశావుని నా ప్రభువు అంటూ నేను నీ దాసుణ్ణి అంటూ సంభోదిస్తున్నారు యాకోబుగారు!

అయితే మానవ రీతిలో చెప్పుకోవాలంటే ఇక్కడ యాశావుని యాకోబు గారు ప్రభువు అంటూ, నేను నీ దాసుణ్ణి అంటూ సంభోదించడంలో తానూ కేవలం శాంతిని మాత్రము కోరుకుంటున్నాను ఆస్తిని కోరుకోవడం లేదు అని తెలుపుతున్నట్లు కనిపిస్తుంది. అందుకోసం అవసరమైతే అన్నకు దాసుడిగా లోబడడానికి కూడా సిద్దమౌతున్నట్లుగా కనిపిస్తుంది.

 గమనించాలి- ఇద్దరు ఒకేరోజు పుట్టారు గాని తనకన్నా కొన్ని నిమిషాలు ముందుగా పుట్టాడు కాబట్టి అన్న అంటున్నారు గాని జ్యేష్టత్వం కావాలని పనులు మోసపూరితముగా చేశాడు గాని ఇప్పుడు దాని పర్యవసానం అనుభవించాడు అది ఎంత భాదాకరంగా ఉందో తనకు అనుభవం వచ్చింది! తన సొంత వారిదగ్గర తన మామ దగ్గర ఒక అల్లుడిలా ఉండకుండా ఒక కూలివాడిలా ఇంతవరకు పనిచేశారు ఆయన! ఒకటి కాదు, రెండు కాదు నలబై సుదీర్ఘ సంవత్సరాలు కూలివాడిలా ఉన్నారాయన ఒక గౌరవం అనేది లేకుండా!! ఇప్పుడు బహుశా అనుకుంటున్నారు- ఎవరి దగ్గరో కూలివాడిలా దాసుడిలా పనిచేసిన నేను ఇప్పుడు తగ్గించుకుని నా సొంత అన్నదగ్గర కూలివాడిలా దాసుడిలా పనిచేసినా పర్వాలేదు! గాని నాకు బంధుత్వము మరియు అనుబంధము మరియు గౌరవము లభిస్తుంది, ఇంకా తన తండ్రి దగ్గర తన తల్లిదగ్గర ఉండే అవకాశం ఉంటుంది, అందుకోసం తన అన్నను ప్రభువుగాను తానూ అతని దాసునిగాను ఉండటానికి అంగీకరిస్తున్నట్లు కనిపిస్తుంది మనకుయాకోబు గారి జీవితంలో ఇప్పుడు ఆయన మాటలద్వారా ఎంతో పరివర్తన కనిపిస్తుంది!

గమనించాలి- తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చించబడతాడు హెచ్చించు కొనువాడు తగ్గించబడతాడు అని యేసుక్రీస్తు ప్రభువల వారు స్వయముగా అన్నారు! మత్తయి 23:12; లూకా 14:11; 18:14

  ఇక్కడ యాకోబు తగ్గించుకున్నాడు! అందుకే తర్వాత రోజులలో హెచ్చించబడ్డారు. ముఖ్యముగా అన్నతో ఉన్న శత్రుత్వము పోగొట్టుకున్నారు ఆయన! మరి నీవు తగ్గించుకుంటావా? లోబడి ఉంటావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 *యాకోబు-ఇశ్రాయేలుగా..*

*16 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం-4*

ఆదికాండం 32:612

6. దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి; అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా

7. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి

8. ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.

9. అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

11. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

12. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకుంటున్నాము.

ప్రియులారా! యాకోబుగారు తగ్గించుకుని అన్నకు సమాచారం పంపించారు.

 

       (గతభాగం తరువాయి)

 

   వెంటనే అక్కడనుండి జవాబు వచ్చింది. మీ అన్న నిన్ను ఎదుర్కోడానికి 400 మందితో ఎదురొస్తున్నాడు!

 

గమనించాలి- కమ్యూనికేషన్ గేప్ అంటే ఇది! సమాచారాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం అన్నమాటఅయ్యా అమ్మా! నాకు అర్ధమయ్యింది మాత్రమూ నేను రాస్తున్నాను! వార్తావహులు వెళ్లి మీ తమ్ముడు ఇలా నేను వస్తున్నాను అని నా ప్రభువైన యాశావుకి తెలపండి అని సమాచారం చెబితే వెంటనే అన్న కోపముతో సమాధానం చెప్పినట్లు కనబడదు అక్కడ! సరే అలాగా- అయితే నేను అతనిని ఎదుర్కోడానికి 400 మందితో వస్తున్నాను అని చెప్పండి అన్నారు! వీరు దానిని మరోలా అర్ధం చేసుకుని ఇదీ అదీ కలిపి మీ అన్న నీ మీద ప్రతీకారం చెయ్యడానికి 400 మందితో ఎదుర్కొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది! అర్ధం మారిపోయింది! యుద్ధవాతావరణం నెలకొంది!

 

     ఇలా మధ్యలో ఉన్న వారి మాటలు వింటే కొంపలంటుకుపోతాయి! అదిగో పులి అని ఎవడైనా అంటే ఇదిగో నా చేతికి తోక దొరికింది అంటారు వీరు! అది పులి కాదు పిల్లి తోక! విధంగా యాకోబు గారు బెంబేలెత్తిపోయారు! 7 వచనంలో యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి .. అంటున్నారు. గమనించాలి మొదట భయపడ్డాడు, రెండు తొందర పడ్డాడు!

 

క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండకూడనివి రెండు! భయపడొద్దు అని దేవుడు బైబిల్ గ్రంధంలో 365 సార్లు రాశారు! అనగా సంవత్సరం మొత్తం నీవు భయపడవద్దు అని చెప్పినట్లు! నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడే చెప్పిన తర్వాత మరి ఇంకెందుకు భయం! అనుమానం ఎందుకు?

ఇక 912 వచనాలలో ప్రార్ధన చేస్తున్నారు యాకోబు గారు దేవునికి! ..

 

9. అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

11. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

12. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

 

ప్రార్ధనలో మనకు మొదటసారి దేవునితో మాట్లాడటం కనిపిస్తుంది మనకు యాకోబు గారు! ఇందుకు అతనికి కలిగిన భయమే కారణం! అయితే ప్రార్ధనలో నేను ఎంతో మంచివాడిని భక్తిపరుడిని నా తాత ఇంత అని అనడం లేదు గాని అయ్యా నాకు నీవు చేసిన వాగ్దానాలు దయచేసి జ్ఞాపకం చేసుకో! నాతో ఉంటాను అన్నారు కదా, మీరే కదా నాకు చెప్పారు నీవు నీ పితరుల దేశానికి వెళ్ళమని! ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది! నేను పాపినే మోసగాడినే గాని మీరు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కదా, దయచేసి ఇంతవరకు నాకు ఎంతో వాత్సల్యత చూపించావు, దానికి నేను అర్హున్ని యోగ్యుడను అయితే కాదుకేవలం చేతికర్రతో ఇక్కడికి వస్తే ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను! కాబట్టి ఇంతవరకు దయచూపిన దేవుడా ఇప్పుడు నా అన్న యాశావు చేతినుండి రక్షించు! నన్ను నా పిల్లలను అతడు చంపకుండా చూడు అని భయపడి ప్రార్ధన చేశారు! అంతేకాకుండా బేతెలులో దేవుడు చేసిన వాగ్ధానమును కూడా దేవునికి గుర్తుచేస్తున్నారు ఇక్కడ- నిన్ను లెక్కించలేనంత జనాంగముగా చేస్తాను, సముద్రంలో ఇసుక రేణువులుల చేస్తాను అన్నావు కదా అని వాగ్దానాలు ఎత్తి చూపుతూ కన్నీటితో యాకోబు గారు ప్రార్ధన చేశారు అక్కడ!

 

   మరో విషయం చెప్పనీయండి: ఇంతవరకు ధన సంపాదనే ధ్యేయంగా బ్రతికిన యాకోబు గారు మొట్టమొదట అన్న భయం పట్టుకుంది కాబట్టి కన్నీటితో యధార్ధంగా, హృదయం బ్రద్దలై ప్రార్ధన చేస్తున్నారు ఇక్కడ!

మనము కూడా అంతేకదా! బాగున్నప్పుడు అన్ని పరిస్తితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్ధన రాదు మనకు! వచ్చినా ఏదో మ్రొక్కుబడి ప్రార్ధన- చిన్న పిల్లలు ప్రార్దించినట్లు అమ్మను కాపాడు, నాన్నను కాపాడు, తాతయ్యను కాపాడు- పాడు పాడు అంటూ (కా)పాడు ప్రార్ధనలే తప్ప హృదయం బద్దలై కన్నీటి ప్రార్ధన రాదు. అదే ఏదైనా శోధన వచ్చినప్పుడు- హాస్పటల్ లో బెడ్ మీద ఉన్నప్పుడు, రేపో మాపో ఆపరేషన్ అన్నప్పుడు- అయ్యబాబోయ్- ఎప్పుడు రాని ప్రార్ధన వచ్చేస్తుంది. బైబిల్ లేఖనాలు అన్ని ప్రార్ధనలో వచ్చేస్తుంటాయి. కళ్ళు మూసినా మోకరించినా కళ్ళంట నీరు ధారలా కారిపోతుంది! అంతా అవసరాల ప్రార్ధన మనది! అవకాశవాదులము మనము! ఇక్కడ యాకోబుగారు కూడా అలాగే ప్రార్ధన చేస్తున్నారు ఇక్కడ!

 

ఇక 1316 వచనాలలో ఇంత కన్నీటి ప్రార్ధన చేసిన యాకోబు గారు దేవుని మీద సంపూర్ణ విశ్వాసం లేకుండా అన్నను మచ్చిక చేసుకోవడానికి అన్నను శాంత పరచడానికి కానుకలు పంపిస్తున్నారు. ఒకరకమైన లంచం అన్నమాట!! 

Genesis(ఆదికాండము) 32:13,14,15,16

13. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను

14. అనగా రెండువందల మేకలను ఇరువది మేక పోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను

15. ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

16. తన దాసులచేతి కప్పగించిమీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

 

     దేవుని భద్రతకోసం ఇంతగా కన్నీటితో ప్రార్ధించిన తర్వాత యాకోబు గారు తన స్వంత ప్రయత్నాలు చేస్తున్నారుబహుశా దేవుడు భద్రత ఇవ్వలేరు అని అనుకోన్నారో ఏమో తెలియదు! మనం కూడా మన స్వంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అవి విఫలం అయిపోతే చివరలో అయ్యా నీవే నాకు దిక్కు అంటూ దేవుని దగ్గరకు వస్తాము! యాకోబు గారు కూడా అదే చేస్తున్నారు! దేవుడే తాను తోడుగా ఉంటాను, నీవు నీ తండ్రి దగ్గరకు నీ బందువుల యొద్దకు వెళ్ళు అని సెలవిచ్చిన తర్వాత- ఇక మానవ ప్రయత్నాలు ఎందుకో!!!

ఇంకా తన సేవకులతో అంటున్నారు యాకోబు గారు:1620..

Genesis(ఆదికాండము) 32:16,17,18,19,20

16. తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

17. మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల

18. నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.

19. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు చొప్పున అతనితో చెప్పవలెననియు

20. మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్ప వలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.

 

గమనించాలి బైబిల్ గంధంలో ఒక వ్యక్తి ఉన్నారు- ఆయన దేవుని మీద ఆనుకున్న తర్వాత మానవుల ఆశ్రయం భద్రతా కోరలేదుఇశ్రాయేలు ప్రజలు చెర విముక్తి పొంది వస్తున్నప్పుడు చివరి విడతగా యాజకుడు శాస్త్రియైన ఎజ్రా గారు మరికొంతమందితో ఇశ్రాయేలు దేశం వస్తారు. మా దేవుడు గొప్పవాడు మమ్మల్ని కాపాడుతారు అని రాజుదగ్గర గొప్పలు చెప్పారు! తీరా బంగారంతో వెండితో మనుష్యులు బయలుదేరాక ఇప్పుడు ఇంత బంగారం చూస్తే దొంగలు దోచుకుంటారు అని భయం వేసింది. అవును ఆరోజులలో దొంగలు ఎక్కువ. ఇంకా దేశం మీద దేశం, రాజుమీద ఆరాజు యుద్ధం చేస్తూ ప్రశాంతత లేని రోజులవి! అప్పుడు ఎజ్రా గారు తన కధను రాసుకుంటూ అంటున్నారు- రాజుగారిని మాభద్రత కోసం సైనికులని  అడగాలంటే సిగ్గుగా మాకు తోచింది. అందుకే ఉపవాసం ఉండి ప్రార్ధన చేశాము అంటున్నారు ఎజ్రా 8:2123 లో...

 

21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.

22. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.

23. మేము ఉపవాసముండి సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను

 

యాకోబు గారు భయంకరమైన కన్నీటి ప్రార్ధన చేసేశారు. తర్వాత మానవ ప్రయత్నం చేస్తున్నారు దేవుని మీద ఆనుకోకుండా! నీవు కూడా ఇలా రెండు పడవల మీద కాళువేసి ప్రయాణం చేస్తున్నావా? జాగ్రత్త దేనికీ చెందకుండా మధ్యలో మునిగిపోతావు జాగ్రత్త!

దైవాశీస్సులు!

(సశేషం)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*17 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం-5*

ఆదికాండం 32:2232

22. రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.

23. యాకోబు వారిని తీసికొని యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను.

24. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

25. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడు వసిలెను.

26. ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

27. ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.

28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.

30. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.

31. అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.

32. అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకుంటున్నాము.

ప్రియులారా! అన్నకు కానుకను ముందుగా పంపించి రాత్రివేళ తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుమంది కుమారులను ఒక కుమార్తెను తీసుకుని యబ్బోకు రేవు దాటించేశారు. యబ్బోకు రేవు అనగా ఇది మృతసముద్రానికి ఉత్తరంగా ౩౦ కి.మీ దూరంలో యోర్దాను నదిలోకి కలుస్తున్న చిన్న పిల్లవాగు అన్నమాట! పెద్దకాలువ లేక చిన్నవాగు అన్నమాట!

 

ఇక 24 వచనంలో వారిని కూడా రాత్రి పంపించివేసి యాకోబు గారు ఒక్కరే యబ్బోకు రేవు దగ్గర ఉండిపోయారు! ఎందుకంటే అది జీవన్మరణ సమస్యగా మారిపోయిందికొద్ది రోజుల క్రితమే తన మామతో ఒప్పందం చేసుకున్నారు ఏమని అంటే- సాక్షి కుప్పను దాటి లాబాను యాకోబు వైపుకి రాకూడదు, యాకోబు లాబాను వైపు సిరియా వెళ్ళకూడదు! ఇప్పుడు వెనుకను వెళ్తే తన మామ తనను చంపివేస్తాడు, ముందుకు వెళ్తుంటే తనను చంపాలని తన అన్న నాలుగువందల మందితో బయలుదేరాడు అని వర్తమానం వచ్చింది! ముందు నుయ్యి- వెనుక గొయ్యి పరిస్తితి వచ్చింది! ఇక మానవులు ఎవరూ తనకు సహాయం చెయ్యలేరు, కేవలం దేవుడే తనను రక్షించగలరు అనే నిర్ణయానికి వచ్చేశారు యాకోబు గారు! కేవలం దేవుని ఆశీర్వాదం ఉంటేనే తను తన పిల్లలు బ్రతుకగలరు! దేవుడు తనను కాపాడుతాను, ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశారు కాబట్టి దేవున్నే మరలా అడుగుదాం అని స్థిరమైన నిర్ణయానికి వచ్చేసి- తనకున్న సమస్తాన్ని కుటుంభాన్ని అందరిని పంపించేసి కేవలం ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయాడు! తనకు తెలుసు తాను ఒక్కడే చిన్న చేతికర్రను పట్టుకుని సిరియా వెళ్ళాడు- ఇప్పుడు విస్తారమైన సంపదతో వందలమంది దాసులు దాసీలతో పశువులతో 12మంది పిల్లలు ఇద్దరు బార్యలు ఇద్దరు దాసీలైన ఉప పత్నులతో తిరిగి వెళ్తున్నారు. వీరంతా సజీవంగా ఉండాలంటే కేవలం దేవుని ఆశీర్వాదం దేవుని కృప మాత్రము కావాలి! అందుకే ఉడుంపట్టు పట్టారు అక్కడ! ప్రార్ధనలో స్థిరమైన నిర్ణయం తీసుకుని దేవుడు తనతో కనబడి మాట్లాడి దీవించే వరకు తాను రేవు వదలడు! సంఘటన యాకోబు గారి జీవితాన్నే మార్చేసింది. విప్లవాత్మకమైన మార్పులు తన జీవితంలో కలిగాయి! మోషేగారికి మండుచున్న పొద ఏవిధమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చాయో అదేవిధమైన మార్పులు యబ్బోకు రేవు యాకోబు గారికి తీసుకుని వచ్చాయి!

 

24 వచనం మరోసారి చూసుకుంటే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అంటూ ఒక వ్యక్తి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తానూ అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను!

 

ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను! ఒక నరుడు అనగా మానవ రూపంలో యాకోబు గారికి కనబడిన పెనుగులాడిన దేవదూత అన్నమాట! తానూ అతని గెలువకుండుట చూచి అనగా దేవుని దూతతో యాకోబు గారు పెనుగులాడెను అయితే పెనుగులాడేటప్పుడు యాకోబు గారితో దేవునిదూత పెనుగులాడలేక యాకోబుగారి యొక్క తొడగూడు మీద ఒక్క దెబ్బ వేశారు. వెంటనే యాకోబు తొడ గూడు వసిలిపోయింది. వాచిపోయింది, ఇంకా డిస్లోకేట్ అయ్యింది. అయినా యాకోబు గారు పట్టు వదలలేదు!

 

 దీనికోసం మనకు వివరంగా హోషేయ 12:35 లో వ్రాయబడింది....

3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను.

4. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;

5. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.

 

మగసిరి గలవాడై యాకోబుగారు దూతతో పోరాడారు అన్నమాట!

గమనించాలి ఇక్కడ పోరాటం లేక పెనుగులాట అనేది శారీరకంగా కాదు అనేది నా ఉద్దేశం! ఎందుకంటే తెల్లవారేవరకూ పోరాటం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి రాజుల గ్రంధంలోనూ దినవృత్తాంతాల గంధంలోను చూసుకుంటే ఒక్క దేవదూత లక్ష ఎనబై ఐదు వేలమంది చంపినట్లు చూడగలం! అంతబలం ఉంది దేవదూతలకు! 2రాజులు 19: 35

రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.

 కాబట్టి శారీరకంగా కాదు, అతని సంకల్పంతో కన్నీటి ప్రార్ధనతో నిజమైన స్థిరమైన విశ్వాసంతో ప్రార్ధన చేస్తుంటే దానిని దాటి వెళ్ళలేక పోయాడు దేవుడు, దేవుని దూత పాదాలు వదలలేదు! నన్ను దీవిస్తావా లేదా అనే మొండిపట్టు పట్టుకు కూర్చున్నారు యాకోబు గారు! అరే తెల్లవారై పోతుంది, నేను వెళ్లిపోవాలి వదలవయ్యా అంటున్నాడు దేవునిదూత! నీవు ముందు నన్ను దీవించు, అప్పుడు నిన్ను వదిలేస్తాను అంటున్నారు యాకోబు! చివరికి తెల్లవారిపోయింది- ఇంతకీ నీ పేరు ఏమిటి అని దూత అడిగాడు! గమనించాలి- దేవుని దూతకు యాకోబుగారి యొక్క పేరు తెలియదా? తెలుసు గాని అతని నోటనుండి యధార్ధత రావాలి అనేది దూత ఉద్దేశ్యం! అందుకే నీ పేరేమిటి అని అడిగితే యాకోబు యదార్ధంగా చెబుతున్నారు- నా పేరు యాకోబు! అనగా మోసగాడిని!

వెంటనే 28 వచనంలో అంటున్నాడు దేవుని దూత: ఇక నీపేరు యాకోబు అనగా మోసగాడు అనబడదు, మడమును పట్టుకునే వాడవు అనబడదు గాని నీవు దేవునితోనూ మనుష్యులతోను పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది అనగా పోరాడేవాడు, లేక దేవుని యొక్క రాజకుమారుడు, దేవునిచేత ఆశీర్వదించబడిన వాడు! చూశారా ఆరాత్రి దేవుడు యాకోబులో లోతైన మార్పు తీసుకుని వచ్చారు! యాకోబు గారు తన మరణం వరకు తన పాప స్వభావం నుండి, మోసపూరితమైన జీవితం నుండి, జిత్తులుమారిన ఆలోచనల నుండి, అందరిని మోసగించే స్వభావం నుండి తనకుతానుగా బయటకు రాలేడు- అందుకే దేవుడే అతనిని మార్చి పోరాడేవాడుగా ఆశీర్వదించబడిన వాడుగా దేవునియొక్క రాజకుమారునిగా తీర్చిదిద్దారు దేవుడే! గమనించాలి- దేవుని దూత అంటున్నాడు- నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచావు కాబట్టి నీపేరు ఇశ్రాయేలు. రోజు గెలిచింది కేవలం యాకోబుగారు మాత్రమే కాదు- ఇద్దరు గెలిచారు. యాకోబు గెలిచినది నిజమే గాని దేవుని దూత కూడా గెలిచాడు ఎందుకంటే యాకోబులో గల మోసపూరితమైన స్వభావాన్ని వెళ్ళగొట్టి యధార్ధత, దేవునిమీద ఆనుకునే స్వభావం- కన్నీటి ప్రార్ధన లాంటి స్వభావాలు మార్పులు రాబట్టగలిగారు! ఇద్దరు విజేతలే ఇప్పుడు!

 

సరే, పేరు మార్చినా ఇంకా దీవించలేదు దేవునిదూత! పేరు మార్చేశాడు దీవించబడ్డాను అనుకోలేదు! నా పేరు మారుస్తున్నావు గాని నా పేరు చెప్పాను, ఇప్పుడు నీ పేరు చెబుతావా లేదా అని కూర్చున్నాడు, అరే మొండివాడా నా పేరు ఎందుకు అడుగుచున్నావ్ అని చెప్పి అక్కడే అప్పుడే నిండు మనస్సుతో దేవుడు యాకోబుని యబ్బోకు రేవుదగ్గర తెల్లవారుజామున దీవించారు! ఇప్పుడు యాకోబు గారు తాను కోరిన దానిని తను పొందుకున్నారు! ఇప్పుడు ఎవరూ ఆయనను అడ్డుకోలేరు! దేవుడే దీవించిన తర్వాత దానిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు!

 

అందుకే నేను మాటిమాటికి ఒకమాట చెబుతూ ఉంటాను- మనుష్యుడు- మనలను దీవిస్తే ఆశీర్వదించి ఏదైనా ఇస్తే ఆమనిషి గాని లేక మరో మనిషి గాని దానిని తిరిగి తీసుకోగలడు! అదే దేవుడే మనిషిని దీవించి ఏదైనా ఇస్తే దానిని తీసుకోవడం మనుషుని తరముకాదు! చివరికి దేవుడు కూడా దానిని తీసుకోరుదేవుడు ఒకసారి ఏదైనా వరము గాని అభిషేకం గాని దీవెన గాని ఇస్తే దానిని తిరిగి తీసుకోరు! గాని మనిషి బ్రతుకు బాగోలేక పోతే గర్వముతో పడిపోయి చెడిపోతే సాతాను గాడు వాని మనస్సుతో మాట్లాడి పోరాడి గెలిచి దేవుని నుండి వ్యక్తిని దూరం చేస్తాడు. అప్పుడు మనిషి నేను దానిని పోగొట్టుకున్నాను అని అనుకుని తిరిగి ఆశీర్వాదము అభిషేకం, వరము పోగొట్టుకున్నాను అని తలచి దానిని మరలా ఉపయోగించడు! తిరిగి ప్రార్ధించడానికి కూడా ఎంతో ఇబ్బంది పడతాడు! అలా ఇబ్బంది పడి తిరిగి పొందుకున్న వారు బైబిల్ లో ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఒకరు సంసోను, రెండు దావీదు గారు!

 

వెంటనే దేవునిదూత దీవించి వెళ్ళిపోయాడు! యాకోబు గారు యబ్బోకు రేవు ప్రాంతాన్ని పెనూయేలు అనే పేరు పెట్టారు! అనగా దేవుని ముఖం! ఎందుకంటే దేవుని ముఖాన్ని చూశారు యాకోబుగారు! దేవునితో అతనికి ప్రత్యక్ష పోరాటం జరిగింది కనుక పెనూయేలు అనే పేరు పెట్టారు! తర్వాత యాకోబు గారు తొడగూడు వసిలిపోయింది డిస్లోకేట్ అయ్యింది కదా అందుకే కుంటుకుంటూ సంతోషంతో తన కుటుంభం దగ్గరికి చేరారు.

 

ముగించే ముందుగా యాకోబు యొక్క ఆశీర్వాదానికి కారణం ఏమిటి? ఆశీర్వాదం పొందుకోవడానికి యాకోబు గారు ఏమిచేశారు?

మొదట: దేవుడే తన ఆశ్రయం, ఆయన తప్ప మరో దిక్కులేదని దేవునిపై ఆనుకున్నారు,

 తర్వాత దేవునితో మాట్లాడి జవాబు పొందేవరకు, ఆశీర్వాదం పొందేవరకు దేవుని కాలు వదలకూడదు అనే స్తిరమైన నిర్ణయానికి వచ్చారు!

మూడవది: కన్నీటి ప్రార్ధన!

నాల్గవది మోకాళ్ళ ప్రార్ధన!

తర్వాత: తన కున్న పాత బ్రష్ట స్వభావం మోసపూరితమైన బ్రతుకుని వదిలేశారు!

 చివరగా యధార్ధత! తాను మోసగాడినని  కన్నీటితో నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకున్నారు ఆయన దూత ముందు! అందుకే నిండు దీవెనలు పొందుకున్నారు! దీవెనలు ఆయనకే కాదు ఆయన సంతానమునకు కూడా లభించాయి!

నీకు కూడా అలాంటి ఆశీర్వాదాలు కావాలంటే నీవు కూడా అలాంటి యధార్ధత, స్తిరమైన నిర్ణయం, దేవునితో మాట్లాడే వరకు నేను కదలను ప్రార్ధన నుండి అనే స్తిరమైన నిర్ణయం కావాలి! కన్నీటి ప్రార్ధన మోకాళ్ళ ప్రార్ధన కావాలి! పాత రోత పాప  స్వభావం వదిలేయాలి. అప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా రాజకుమారుడిగా మార్చగలరు!

మరి నీవు సిద్దమా!!!

దైవాశీస్సులు!

 

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*18 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం-6*

*శత్రువులు మిత్రులుగా మారుట*

ఆదికాండం ౩౩:111

1. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును  అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.

2. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను వెనుక రాహేలును యోసేపును ఉంచి

3. తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

4. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.

5. ఏశావు కన్నులెత్తి స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.

6. అప్పుడు దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి.

7. లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.

8. ఏశావు నాకు ఎదురుగావచ్చిన గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను.

9. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.

10. అప్పుడు యాకోబు అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా;

11. నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బల వంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని ....

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకుంటున్నాము.

ప్రియులారా!!  ఇక ౩౩వ అధ్యాయంలో మనము యాకోబు గారు యాశావు గారు కలుసుకుని శత్రువులు మిత్రులుగా మారిపోయి ఒకరిమీద ఒకరు పడి ఏడ్చినట్లు మనం చూడగలం! మరీముఖ్యంగా దేవుడు చేసిన అద్భుతం ఇంకా దేవుని ఆశీర్వాదం ఉంటే శత్రువులు కూడా ఎలా మిత్రులుగా మారగలరో చూడగలం!

ఒకసారి మరలా 15 వరకు చదువుకుందాం..

1. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును  అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.

2. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలుల కును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను వెనుక రాహేలును యోసేపును ఉంచి

3. తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

4. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.

5. ఏశావు కన్నులెత్తి స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.

యాకోబుగారికి యాశావు అతనితో పాటు 400మంది రావడం కనిపించింది వెంటనే తను ముందుగా పరుగెత్తి వెళ్ళాడు, తన వెనుక లేయా ఆమె పిల్లలు దాసీలు ఆమె పిల్లలు, వారి వెనుక రాహేలు- యోసేపు వచ్చారు. యాకోబుగారు అన్నముందు ఏడుసార్లు సాష్టాంగనమస్కారం చేశారుఏడుసార్లు అనగా యాశావు పట్ల అణుకువ నమ్రత మరియు సంపూర్ణ విధేయత చూపించారు యాకోబు గారుయాశావు పరుగెత్తి యాకోబుని ఆలింగనం అనగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఇద్దరూ ఏడ్చినంత సేపు ఏడ్చారు! ఎందుకంటే వారిద్దరూ కలుసుకుని 40 సంవత్సరాలు అయిపోయింది!

 

దృశ్యం మీకు ఇంకా ఉన్నది ఉన్నట్లు రక్తి కట్టించేలా అర్ధమవ్వాలి అంటే దయచేసి మరలా 32:1320 వచనాలు చూసుకుంటే బాగా అర్ధమవుతుంది!

 

13. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను

14. అనగా రెండువందల మేకలను ఇరువది మేక పోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను

15. ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

16. తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

17. మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల

18. నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.

19. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు చొప్పున అతనితో చెప్పవలెననియు

20. మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను. ...

 

తెల్లవారింది: ముందు యాశావుముందు ఒక మంద, 200 మేకలు, 20 మేకపోతులు- వాటిని కాస్తున్న కాపరులు ఎదురయ్యారు! యాశావుని యాశావు బంధువులు 400 మందిని చూసిన వెంటనే పనివారు సాష్టాంగనమస్కారం చేశారు! వారేమో సిరియా వారు సిరియా బట్టలు వేసుకున్నారు, తనకేమో సాష్టాంగనమస్కారం చేస్తున్నారు- ఎవర్రా మీరు? మందలు ఏమిటి అని అడిగాడు యాశావు! అయ్యా! ఇవి తమరి దాసుడైన యాకోబు మీకోసం పంపిస్తున్న కానుక అన్నారు! అలాగా నా తమ్ముడెక్కడ రా అని అడిగాడు! అయ్యా వెనుక వస్తున్నారండి! సరే లే అన్నాడు యాశావు!

 

ఇంకా ఒక ౩౦౦ మీటర్లు వెళ్ళాక మరో మంద- 200 గొర్రెలు 20 గొర్రెపోతులూ- వాటిని కాస్తున్న పనివారు! మరలా వీరుకూడా యాశావుకి సాష్టాంగనమస్కారం చేశారు! ఒరేయ్ మీరెవరురా! ఏమిటి గొర్రెలు- అయ్యా! మేము నీ దాసుడైన యాకోబు పనివారం! కానుక మీ దాసుడైన యాకోబు గారు మీకోసం పంపించారు!ఒరేయ్- మీ కానుక తగలెయ్య- మా తమ్ముడేడిరా! అయ్యా వెనుక వస్తున్నారు!

 

సరే, ఇంకా ౩౦౦ మీటర్లు నడిచారు అక్కడ మరో మంద- ౩౦ పాలు ఇచ్చే ఒంటెలు- వాటి పిల్లలు- వాటిని కాస్తున్న పనివారు- యాశావుకి సాష్టాంగనమస్కారం- ఒరేయ్ ఎవరురా మీరు! అయ్యా యాకోబుగారు పంపించారు మమ్మల్ని- ఇవి మీ కోసమే!

మీ గౌరవం కానుకలు తగలెయ్య- నా తమ్ముడిని చూసి 40 సంవత్సరాలు అయ్యిందిరా- నా తమ్ముడేడి అయ్యా వెనుక వస్తున్నాడు!

 

యాశావు హృదయం కరిగిపోయింది- తమ్ముడ్ని చూడాలనే ఆశ తహతహలాడుతుంది! వెనుక ౩౦౦ మీటర్ల వెనుక మరో మంద-40 ఆవులు- 10 ఆబోతులు అనగా తాడిబెద్దులు- వాటిని కాచే పనివారు- సాష్టాంగనమస్కారం- ఒరేయ్ మీ కానుకలుకు ఒక నమస్కారం- మా తమ్ముడేడి రా! వాడిని చూడాలి రా! అయ్యా అదిగో చూడండి! పిల్లల్ని తీసుకుని నెమ్మదిగా వస్తున్నారు. చూడండి అన్నారు! ఇవన్నీ మీకోసమే అన్నారు! అప్పుడే తెలవారుతుంది- చిక్కటి మంచుతెర పొగమంచు ఇప్పుడే కరగడం మొదలయ్యింది- దూరంగా తన తమ్ముడు కనిపించాడు- ఇక ఆగలేక పరుగెత్తుతున్నాడు యాశావు గారు తమ్ముడిని కావలించుకుని ఏడవాలి- ఎప్పుడైతే పరుగెత్తుకుంటూ వస్తున్న అన్నను చూశారో యాకోబు గారు- తాను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళారు- చూపులలో కనబడింది యాకోబు గారికి తనను చంపాలని కాదు, తనను కలుసుకోవాలని వస్తున్నాడు తన అన్నయ్య! తనమీద అన్నకు కోపం తీరిపోయింది. తనను చూడాలనే ఆశ కనిపించింది! ఇద్దరూ ఒకరి మెడమీద ఒకరు పడి తనివి తీర ఏడ్చారు! పగలు ప్రతీకారాలు పోయాయి! ప్రేమానురాగాలు పుష్కలంగా పొర్లిపారాయి! ఆత్మీయ పంట పండింది! మమతానురాగాల పూలు వికశించాయి! ఆనందం వెల్లివిరిసింది! చూస్తున్న కుటుంబ సభ్యుల కళ్ళు చెమర్చాయి ఆనందభాష్పాలతో! ఇది కేవలం దేవుడు చేసిన కార్యం! లేకపోతే ఇక్కడ హత్యలు జరగాల్సింది. రక్తం ఏరులై పారాల్సింది దేవుని కార్యము కాబట్టి సంతోషం పండింది పొంగింది!!

 

అడుగుతున్నాడు నిండు హృదయంతో తమ్ముడా ఎలా ఉన్నావ్ రా! ద్వేషం మోసం పోయి- నిండు హృదయంతో అంటున్నారు యాకోబు గారు- అన్నయ్యా చూస్తున్నావ్ కదా- ఒకే ఒక చేతికర్రతో సిరియా వెళ్ళిపోయాను మావయ్య దగ్గరకి! అక్కడ దేవుడు నన్ను దీవించారు! ఇదిగో చూస్తున్నావు కదా, ఇంత గొప్ప విస్తారమైన పశువులు సంపదతో దేవుడు నన్ను ఆశీర్వదించారు! వీరెవరు రా అడిగాడు యాశావు! మావయ్య ఇద్దరు కూతుర్లు, అదిగో ఆమె లేయా, అదిగో ఆమె పిల్లలు, అదిగో మావయ్య చిన్న కూతురు రాహేలు- దేవుడు మధ్యనే కుమారుడిని ఇచ్చారు! అదిగో వారి ఇద్దరు దాసీలు! వారివలన మరో నలుగురు పిల్లలు! ఒకే ఒక కూతురు దీనా! అందరినీ పరిచయం చేశాడు- అందరూ అతనికి సాష్టాంగనమస్కారం చేశారు! అక్కడ సంతోషంతో విందు చేసుకున్నారు!

రకంగా కోపతాపాలు ఈర్ష్య ద్వేషాలు పోయి అన్నదమ్ములు కలిసిపోయారు! దేవుడు చేసే కార్యం ఇలాగే ఉంటుంది! అందుకే బైబిల్ చెబుతుంది ఒకని ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారు! సామెతలు 16: 7

ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

 ఇది అక్షరాలా నెరవేరింది యాకోబు గారి జీవితంలో! పగలు కక్షలు మోసం ఉన్నప్పుడు ఎప్పుడూ అశాంతి, భయము వెంటాడింది యాకోబులో! అయితే యబ్బోకురేవు అనుభవం కలిగిన తర్వాత యధార్ధత పనిచేసిన తర్వాత శత్రువులు మిత్రులుగా మారడమే కాకుండా హృదయం నిండా శాంతి ప్రశాంతి!

నీకు కూడా ఇలాంటి శాంతి సంతోషాలు కావాలంటే యాకోబు గారు చేసినట్లు నీవు కూడా చెయ్యాలి!

దైవాశీస్సులు!

(సశేషం)

 

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*19 భాగం-యాకోబు తిరుగు ప్రయాణం-7*

*శత్రువులు మిత్రులుగా మారుట*

ఆదికాండం ౩౩:811

8. ఏశావు నాకు ఎదురుగావచ్చిన గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను.

9. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.

10. అప్పుడు యాకోబు అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా;

11. నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని ....

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకుంటున్నాము.

ప్రియులారా!!  ఇక ౩౩వ అధ్యాయంలో మనము యాకోబు గారు యాశావు గారు కలుసుకుని శత్రువులు మిత్రులుగా మారిపోయి ఒకరిమీద ఒకరు పడి ఏడ్చినట్లు మనం చూశాము.! మరీముఖ్యంగా దేవుడు చేసిన అద్భుతం ఇంకా దేవుని ఆశీర్వాదం ఉంటే శత్రువులు కూడా ఎలా మిత్రులుగా మారగలరో చూసుకుంటున్నాము!

 

                  (గతభాగం తరువాయి)

 

    ఇంకా సంభాషణ చూసుకుంటే అన్న తమ్ముడితో అంటున్నాడు: తమ్ముడా నీకు ముందుగా నాకు ఎదురుగా వచ్చిన మందల గుంపు ఎందుకు?

యాకోబు చెబుతున్నాడు: నా ప్రభువు కటాక్షం కోసమే పంపించాను. మాట ఒకసారి గమనించండి!

దానికి జవాబుగా యాశావు అంటున్నాడు: తమ్ముడా నాకు కావలసినంత ఉంది. నాకు ఏమీ వద్దు! నీవు వచ్చావు అదే చాలు! అవన్నీ నీవు తీసేసుకో! అంటున్నాడుఅవును కదా- ఇప్పుడు ఇస్సాకు గారి ఆస్తి మొత్తం యాశావు దగ్గరే ఉంది! అందుకే అంటున్నాడు- తమ్ముడా నాకు కావలసినంత ఉంది. నీవే ఉంచుకో!

అందుకే యాకోబు అంటున్నారు: నీ కటాక్షం నామీద ఉంటే చిత్తగించి నాచేత కానుక పుచ్చుకో-( ఇంతవరకు బాగుంది) దేవునిముఖము చూచినట్లు నీ ముఖాన్ని చూచాను. అందుకు నీ కటాక్షము కూడా నామీద వచ్చింది కదా  ( మాటలు కూడా గమనించండి). ఇంకా అంటున్నారు: నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను దయచేసి పుచ్చుకో, దేవుడు నన్ను కనికరించెను, నాకు కూడా కావలసినంత ఉన్నదని చెప్పి బలవంతము చేసి అతనికి ఇచ్చారు కానుకలు అనగా మందలు!!!

 

అన్నను మచ్చిక చేసుకోవడానికి లేక ప్రసన్నం చేసుకోవడానికి పొగిడింపు మాటలు అనడం సహజమే! గాని దేవుని ముఖాన్ని చూసినట్లు నీ ముఖాన్ని చూశాను అనడం, ఇంకా నా ప్రభువు కటాక్షం కోసం నేను కానుకను పంపించాను అనడం ఎలా ఉంది!!! చాలామంది అవసరం తీరాక తెప్ప తగలేస్తూ ఉంటారు! యాకోబు కూడా అంతే! దేవుని కటాక్షం వలన మన మధ్యనున్న కోపతాపాలు కక్ష్యలు పోయి ఇద్దరికీ సమ్మతి- నెమ్మది- స్నేహం కలుగజేశాడు దేవుడు, ఇప్పుడు దయచేసి మన మైత్రికి చిహ్నంగా కానుకను పుచ్చుకో! రాత్రి/ఉదయం  దేవుని ముఖాన్ని ముఖాముకిగా చూశాను, అది జరిగిన వెంటనే దేవుని దూతలా ఉన్న నిన్ను కూడా చూశాను అనాల్సింది పోయి- నా ప్రభువు కటాక్షం- దేవుని ముఖాన్ని చూసినట్లు నీ ముఖాన్ని చూశాను అంటూ దేవునితో సమానం చేసి మాట్లాడుచున్నారు యాకోబు గారు! అన్నను పొగుడుతున్నారు. ఇది మానవుల నైజం! బ్రష్ట స్వభావం! ఇది ఆదినుండి వచ్చిందే!

 

ఆదియందు దేవుడు ఆదికాండంలో సృష్టి మొత్తం చేసి జంతువులూ పశువులు మొక్కలు అన్నీ చేసి చివరికి మానవుని చేసి ఆదాముగారిని పేర్లు పెట్టమంటే పెట్టారు. దేవుడు చేసిన సృష్టి మొత్తం బాగుంది లేక మంచిగా కనిపించింది కాని దేవునికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తోచింది! ఎందుకంటే సమస్త జంతువులూ పశువులు అన్నీ జంటగా ఉన్నాయి గాని ఆదాము గారు మాత్రం ఒంటరిగా ఉన్నారు! అందుకే మంచిగా కనబడలేదు! వెంటనే ఆదాముగారికి గాఢ నిద్ర కలిగించి ఆపరేషన్ చేసి ప్రక్కటెముక తీసి ప్రక్కటెముకతో స్త్రీని చేసి ఆదాము గారిని నిద్రలేపి స్త్రీని అనగా హవ్వమ్మ గారిని ఎదురుగా నిలబెడితే- మహాప్రభో మీకు శతకోటి వందనాలు! నాకు సాటియైన సహాయం చేశావు అని దేవుణ్ణి స్తుతించకుండా హవ్వమ్మగారి అందచందాలు చూసి మైమరచిపోయి నా ఎముకలలో ఎముకా, నా మాంసంలో మాంసమా, నీవు నరునిలో నుండి తీయబడ్డావు గనుక నీవు నారీ అనబడతావు, నీవు అంతా ఇంతా, నీవే నా బంగారం, ఇలా ఉన్నావు అలా ఉన్నావు  అంటూ లవ్యు చెప్పుకున్నారు ఆదాము గారు! ఆదాము గారికి Love at First Sight అన్నమాట! గాని  దేవునికి స్తోత్రములు ఏవీ లేవు! అయినా పాపం దేవుడు ఏమీ అనలేదు! ఎందుకంటే దేవునికి మానవులంటే పిచ్చిప్రేమ!

ఇక్కడ యాకోబు గారు కూడా అన్నను ప్రసన్నం చేసుకోవడానికి అన్నను దేవునితో సమానం చేసి మాట్లాడుచున్నారు! మనము కూడా ఇలానే చేస్తుంటాము కదా!

 

  ఇక తర్వాత వచనాలలో యాశావు కానుకను తీసుకుని మరల తన శేయీరు మన్యమునకు వెళ్ళిపోతారు! యాకోబు గారు నెమ్మదిగా వెళ్తూ సుక్కోతు అనే ప్రాంతంలో తనకు ఇల్లు కట్టుకుని పశువుల కోసం  కొన్ని పాకలు వేసుకుని అక్కడ కొంతకాలం నివశిస్తారు!సుక్కోతు అనగా పాకలు! అందుకే ప్రాంతము సుక్కోతు అనబడింది! ఇంకా అక్కడనుండి ముందుకు వెళ్లి షెకెము అనే ప్రాంతం వెళ్లి ఊరిముందర గుడారం వేసుకుని- గుడారం వేసుకున్న ప్రాంతాన్ని  పొలాన్ని నూరు వరహాలకు కొంటారు యాకోబు గారు! అక్కడ కొన్ని రోజులు నివాసం చేస్తారు

 

రకంగా యాకోబుగారు సిరియా వెళ్లి 40 సంవత్సరాలు అక్కడ ఉండి, విస్తారమైన పశు సంపద 12మంది పిల్లలు నలుగురు భార్యలతో అనేకమంది దాసులు దాసీలతో కనాను దేశం వచ్చి అక్కడ నివాసం చేశారు! దేవుడు చెప్పిన మాట నెరవేరింది!

 

మనము కూడా దేవుని మాటను వింటే ఆయన చెప్పినట్లు చేస్తే దేవుడు మనలను కూడా దీవించి ఆశీర్వదిస్తారు!

దైవాశీస్సులు!

       

 

 

 

 

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*20 భాగం*

ఆదికాండం 4:112

1. లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా, దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.

2. దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను.

3. అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి

4. చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.

5. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.

6. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.

7. యాకోబు కుమారులు సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.

8. అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.

9. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి.

10. దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.

11. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.

12. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! యాకోబు గారి తిరుగు ప్రయాణం కోసం చూసుకున్నాము.

ప్రియులారా!!  ఇక 4 అధ్యాయంలో మనము యాకోబు గారి జీవితంలో మూడు గుండెలు పగిలే సంఘటనలు కనిపిస్తాయి!

మొదటిది: తన ఏకైన కుమార్తె దీనాను షెకెము యొక్క రాజకుమారుడు బలాత్కరించడం,

రెండు: తన కుమారులు హంతకులుగా మారడం

మూడు: ప్రాంతపు వారు యాకోబు గారి మీద పగబట్టడం

 

   ప్రియులారా గతభాగాలలో చూసుకున్నాము- లేయాకు ఆరుగురు కుమారులు పుట్టాక చివరలో దీనా పుట్టింది. ఆమె యోసేపు కంటే కొన్ని రోజులు పెద్దది! 11 మంది అన్నదమ్ములకు ఒక్కతే  సోదరి! పాడింది పాట, ఆడింది  ఆటలా ఉంది ఆమెకు! ఎంతో గారాభంగా చూసుకుంటున్నారు ఆమెను! బహుశా సంఘటన జరిగినప్పటికీ ఆమె వయస్సు సుమారుగా 15సంవత్సరాలు (Maximum Possible Age is 15 Years). గత అధ్యాయంలో చూసుకున్నాము- యాకోబు గారు సుక్కోతులో ఇల్లు కట్టించుకున్నారు, తర్వాత షెకెము అనే ఊరు చేరుకొని ఊరిముందు గుడారము వేసుకుని కొన్ని రోజులు నివశించారు. గుడారం వేసుకున్న పొలాన్ని నూరు వరహాలకు కొనుక్కున్నారు. మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు నివాసం చేశారో బైబిల్ లో లేదు గాని కొన్ని నెలలు తర్వాత లేక కొన్ని సంవత్సరాలు తర్వాత తన కుమార్తె దీనా తన తండ్ర్రిని అడిగింది- ఇంతవరకు నేను ఎక్కడకు వెళ్ళలేదు-ఎవరిని చూడలేదు మన పనివారితోనే ఉన్నాను! మన ఎదురుగా ఉన్న ఊరిలో ఏదో వాయిద్యాలు వినబడుతున్నారు ఏదో సంబరం జరుగుతున్నట్లుంది. ఒకసారి చూసివస్తాను అక్కడున్న అమ్మాయిలు ఎలా ఉన్నారో ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో చూసివస్తాను అని చెప్పింది. యాకోబు గారు అన్నారు- ఇప్పుడు వద్దు, అన్నయ్యలు పొలంలోకి వెళ్లారు, వారు వచ్చిన తర్వాత వారిని తీసుకుని వెళ్ళు అంటే కాదు ఇప్పుడే వెళ్తాను, నా చెలికత్తెలతో వెళ్తాను అని మొండిపట్టు పట్టింది. ఆమె షెకెము అనే ఊరిలోకి వెళ్ళడం, షెకెమును పాలించే రాజు యొక్క కుమారుడు హమోరు కుమారుడైన షెకెము దీనాను చూడటం, వెంటనే ఆమెను ఎత్తుకుని పోయి ఆమెను బలాత్కరించడం జరిగిపోయింది! కబురు ఆమె చెలికత్తెలు పరుగెత్తుకుని వచ్చి ఏడ్చుకుంటూ చెప్పారు! యాకోబుకి ఏమి చెయ్యాలో తెలియలేదు! నిశ్చేష్టుడయ్యాడు! తన కుమారులు పొలంలో ఉన్నారు! విషయం తెలిసిన కుమారులు ఇంటికి వచ్చారు!

 

   ఈలోగా షెకెము అతని తండ్రి హమోరు యాకోబు గారి దగ్గరకు వచ్చి అయ్యా మీ కుమార్తెను మా కుమారునికి ఇవ్వండి! ఆమెని ఎంతో ఇష్టపడుతున్నాడు నా కుమారుడు! మీరు ప్రాంతంలో స్థిరపడండి, మా మధ్యను వ్యాపారం చెయ్యండి, మా పిల్లలను మీరు పెళ్లి చేసుకోండి, మీ పిల్లలను మేము పెళ్లి చేసుకుని బంధువులము అవుదాము అన్నారు! అయితే యాకోబు కుమారులు షిమ్యోను లేవీ ఇద్దరు కపటముగా జవాబు చెబుతారు- మీరు సున్నతిలేని వారు, మీ పిల్లలను మేము చేసుకోలేము, మీరు సున్నతి పొందండి అప్పుడు చేసుకుంటాము అని జవాబు చెప్పడం, ఊరువారు మొత్తం పురుషులు సున్నతి పొందడం, మూడో రోజున వారు బాధపడుతుంటే ఊరి మొత్తం పురుషులను హమోరును, షెకెమును కత్తితో చంపి తమ చెల్లిలిని తీసుకుని రావడం- ఊరి ఆడవారిని పిల్లలను పశువులను చెరపట్టుకు రావడం, చరిత్ర ప్రకారం యాకోబు గారు వారిని అనగా ఆడవారిని పిల్లలను తిరిగి పంపించి వెయ్యడం- దానికి ప్రతిఫలంగా ప్రాంతంలో ఉన్న హివ్వీయులు మొత్తం యాకోబు గారిమీద పగపట్టడం జరుగుతుంది! ఇదీ 34వద్యాయంలో జరిగిన సంఘటన!

 

అయితే దీనిలో యాకోబు గారి యొక్క వైఫల్యం చాలా స్పష్టముగా కనిపిస్తుంది. అనగా తన కుమార్తె తను చెప్పిన మాట వినలేదు, అందుకే చెరపబడింది, రెండు తన కుమారులు తనకు లాగే జిత్తులమారి తెలివితేటలూ గలవారవ్వడం, హంతకులవ్వడం ఇవన్నీ యాకోబు గారు తండ్రిగా వైఫల్యం చెందటాన్ని చూపిస్తున్నాయి!

 

 గతభాగాలలో చూసుకున్నాము- యాకోబు గారు అస్తమాను ధన సంపాదనలోను ఆస్తి సంపాదన లోను మునిగిపోయేవారు గాని తన భార్యలు ఏమిచేస్తున్నారు, తన కుమారులు భక్తిగా ఉంటున్నారా లేదా అనేది ఆయన పట్టించుకోలేదు! కాబట్టి ఇది ముమ్మాటికి యాకోబు గారి తప్పే!

 

ప్రియ తల్లిదండ్రులారా! దయచేసి మీ పిల్లలను పట్టించుకోండి! మీ పిల్లలు ఎలా చదువుతున్నారో పట్టించుకోండి! కొందరు పిల్లల చదువుకోసం పట్టించుకుంటున్నారు గాని వారి ఆత్మీయ జీవితం కోసం అసలు పట్టించుకోవడం లేదు! ఆదివారాలు స్పెషల్ క్లాసులు ఉన్నాయి అంటే పంపించివేస్తున్నారు. స్పెషల్ క్లాసుల పేరుతో వారు ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలియదు! వారు ప్రార్ధన చేస్తున్నారా లేదా వారు బైబిల్ చదువుతున్నారా లేదా అనేది పట్టించుకోవడం లేదు! వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది పట్టించుకోవడం లేదు! తండ్రులకు ధన సంపాదనతో సరిపోతుంది, తల్లులకు పనికిమాలిన సీరియల్లతో సమయం గడిచిపోతుంది. పిల్లలు తిన్నారా లేదా అనేది కూడా చూడటం లేదు! ఒకరోజు వారు జీవితం చేజారిపోయి ఏడుస్తుంటే తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారుమీ పిల్లలు అడిగినవి అన్నీ ఇచ్చేస్తుంటే వారు చెడిపోతారు! అడిగిన బట్టలు కొని ఇస్తే వారు లోకాచారాల లోక వ్యవహారాల బట్టలు వేసుకుంటూ లోకస్తుల వలే వ్యవహరిస్తూ ఉంటే అది ప్రజెంట్ ట్రెండ్ అంటూ చూసి చూడనట్లు ఉంటే ఒకరోజు నీకు శోకం తెచ్చిపెడతారు దీనాలా! మీ కుమార్తె లేక కుమారుడు వేసుకుంటున్న వస్త్రధారణ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది పట్టించుకుంటున్నావా?!!! పట్టించుకోకపోతే దీనా పరిస్తితి నీకు వస్తుంది జాగ్రత్త!

 

అలాగే నేటిరోజులలో పిల్లలు ముఖ్యంగా కుమార్తెలు తల్లిని తండ్రిని ఎదిరిస్తున్నారుకోరిన మొబైల్ ఫోన్, కోరిన డ్రెస్, కోరిన బండి కొని ఇవ్వకపోతే మాత్రం దిక్కులేని దానివి/దిక్కులేని వాడవు నన్ను ఎందుకు కన్నావ్ అని అడుగుతున్నారు! మాత్రం కొని ఇవ్వడానికి నీకు గతిలేదా!! నీకు గతిలేనప్పుడు ఏమి పుట్టినవెంటనే ఎందుకు చంపెయ్యలేదు నన్ను అంటున్నారు బరితెగించి!!! ఇంకా మాత్రం కోరికలు అణుచుకోలేకపోయావా అంటున్నారు! తల్లిదండ్రులు వారి పిల్లలు చెప్పే మాటలు వింటూ ఉంటె గుండె తరుక్కుపోతుంది! అయ్యా అమ్మా! దీనికి కారణం మీరే! వారిని వాక్యానుసారంగా పెంచలేని కారణంగా భక్తిలో పెంచలేని కారణంగా, వారు చిన్న పిల్లలై ఉండగా వారి తల దగ్గర ఏడ్చి మోకరించి ప్రార్ధించలేని కారణంగా ఇప్పుడు వారు మిమ్మును ఏడిపిస్తున్నారు! ఏడవండి ఇప్పడు!! 

 

యవ్వనస్తుడా! యవ్వనస్తురాలా! ఒకవేళ నీవు నీ తండ్రితో/తల్లితో ఇలాంటి మాటలు అంటూ ఉంటే నీవు శాపగ్రస్తుడవు అని బైబిల్ చెబుతుంది! దీనాలా అనుభవిస్తావు జాగ్రత్త!

ఇక రెండవది: పిల్లలు కపటముగా జవాబివ్వడం, ఊరివారిని మోసగించడం, చివరగా వారిని చంపడం ఇది తండ్రి బుద్ధులు పిల్లలకు వచ్చాయి అని చాలా స్పష్టముగా అర్ధమవుతుంది! యాకోబు అన్నను రెండుసార్లు నాన్నను ఒక్కసారి, మామను ఒకసారి మోసగించారు. అదే బుద్ధులు కుమారులకు అనగా లేవీకి షిమ్యోనుకు వచ్చాయి. మీరు సున్నతిలేని వారు- సున్నతి పొందండి అప్పుడు మా చెల్లెను ఇస్తాము అన్నారు! చివరికి ఊరి మగాళ్ళను మొత్తం చంపేశారు! దీనిని బట్టి యాకోబు గారు పిల్లలను బాగా పెంచలేదు అని అర్ధమవుతుంది! నా ఉద్దేశం ఏమిటంటే యబ్బోకు రేవు అనుభవం వరకు పిల్లలకు భక్తి నేర్పించాలి అనే ఆలోచన రాలేదు యాకోబుగారికి! అప్పటికే వారు పెద్దవారు అయిపోయారు! సంఘటన జరిగేసరికి షిమ్యోను లేవీ వయస్సు సుమారుగా కనీసం  ౩౩, 32 సంవత్సరాలు ఉండవచ్చు. మొక్కై వంగనిది మ్రానై వంగునా అని తెలుగు నానుడి పలుకుతుంది! తండ్రులు తాగుబోతులైతే పిల్లలు తాగుబోతులౌతారు. వారు వ్యభిచారులైతే పిల్లలు కూడా అలాగే మారతారు. కాబట్టి మొదట మీరు మారండి. తర్వాత మీ పిల్లలను భక్తిలో ప్రార్ధనలో వాక్యములో పెంచండి! లేకపోతే యాకోబు గారి పిల్లలవలె మీ పిల్లలు తయారవుతారు!

దైవాశీస్సులు!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*21 భాగం*

ఆదికాండం 35:110

1. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా

2. యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

3. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నాశ్రమ దినమున నా కుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.

4. వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.

5. వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.

6. యాకోబును అతనితో నున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.

7. అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి చోటికి ఏల్బేతేలను పేరుపెట్టిరి.

8. రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్అను పేరు పెట్టబడెను.

9. యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.

10. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

ఇక 35 అధ్యాయంలో మనకు యాకోబు గారి జీవితంలో ఒక మంచి సంఘటన మరియు ఆయన గుండె పగిలే సంఘటన చూడవచ్చు!

 

గమనించాలి- 35 అధ్యాయానికి నేపధ్యం తెలుసుకోకుండా కేవలం 35 అధ్యాయం చూసుకుంటే అధ్యాయం అర్ధం కాదు! గత భాగంలో చూసుకున్నాము- యాకోబుగారి జీవితంలో గుండెలు పగిలే మూడు సంఘటనలు జరిగాయని!  .......

మొదటిది: తన ఏకైన కుమార్తె దీనాను షెకెము యొక్క రాజకుమారుడు బలాత్కరించడం,

రెండు: తన కుమారులు హంతకులుగా మారడం

మూడు: ప్రాంతపు వారు యాకోబు గారి మీద పగబట్టడం

 

      (గతభాగం తరువాయి)

 

ఎప్పుడైతే హివ్వీయులంతా కూడి ఏకమై యాకోబు గారిని ఆయన కుమారులని చంపాలని కూడుకున్నారో- వెంటనే యాకోబు గారు దేవుని సన్నిధిని మొర్రపెడుతున్నారు- దేవుడా! దేశము తిరిగి రమ్మని నాతో చెప్పారు. మా అన్నయ్యని శత్రువుని మిత్రునిగా చేశారు, ఇప్పుడు సంతోషంగా ఉన్న సమయమలో నా కూతురు చెరపబడింది, నా కుమారులు హంతకులయ్యారు! ఇప్పుడు దానికి ప్రతిఫలంగా దేశస్తులు నన్ను నా వారిని చంపాలని వస్తున్నారు. ఏమి చెయ్యాలయ్యా! నీవు తప్ప నాకు దిక్కులేదు మహాప్రభో! అని దేవుని పాదాలు పట్టుకున్నారు! ఇదీ 35 అధ్యాయానికి నేపధ్యం!

 

దేవుడు చెప్పారు- నీవు లేచి బయలుదేరి బేతెలుకి వెళ్లి అక్కడ కాపరముండు!! నీవు నీ అన్నయ్య దగ్గరనుండి పారిపోయినప్పుడు నీవు ఏమని వాగ్దానం చేశావో గుర్తుకు తెచ్చుకుని అక్కడ నాకు ఒక బలిపీటం కట్టు, అక్కడే ఉండు అని చెబుతున్నారు దేవుడు!

 

గమనించాలి- కొన్ని సంవత్సరాల ముందు అనగా సుమారుగా 50 సంవత్సరాల ముందు దేవునికి ఒక మ్రొక్కుబడి చేసుకున్నారు యాకోబు గారు! అది మనకు ఆదికాండం 28:1122 లో కనిపిస్తుంది!

Genesis(ఆదికాండము) 28:20,21,22

20. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

21. తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.

22. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

 

అన్న దగ్గరనుండి పారిపోయేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడి దైర్యపరచి- నీతో నేను ఉన్నాను, మరలా నేను ఈదేశానికి తీసుకుని వస్తాను అని మాట్లాడితే- ఆవేశంతో ఉద్రేకంతో ఊగిపోయి- దేవుడా- నీవే గనుక నన్ను మా మామ దగ్గరకు తీసుకుని వెళ్లి మరలా నన్ను క్షేమంగా తీసుకుని వస్తే నేను తప్పకుండా నూనె పోసిన స్థంభం దగ్గర నీకు బలిపీటం కడతాను, మందిరం కడతాను. ఇంకా నీవు నాకు ఇచ్చిన ప్రతీ ఆస్తిలోను నీకు దశమభాగం ఇస్తానని వీరావేశంతో ఉద్రేకంతో ఊగిపోయి ప్రతిజ్ఞ చేసిన పెద్దమనిషి- అక్కడకు వెళ్లి నలుగురిని పెళ్ళాడి 12 మందిని కనీ, విస్తారమైన ఆస్తిపాస్తులు పశువులు దాసదాసీలు కలిగి తిరిగి వచ్చాక- దేవుడు మరోసారి మాట్లాడితే దేవునికి ధన్యవాదాలు చెప్పకుండా అన్నని దేవుని ముఖం చూసినట్లు నిన్ను చూశాను, నీవు నా ప్రభువువి నా యజమానివి అని పొగిడారు గాని దేవుణ్ణి స్తుతించడం మానేశారు! తాను చేసిన వాగ్దానం మరిచిపోయారు యాకోబుగారు! అందుకే దేవుడు ఒక శ్రమను పంపించి- ఎందుకు మర్చిపోయావు అని గుర్తుకు చేసి మరీ ఇప్పుడు నీవు తప్పించుకోవాలి అంటే ఈప్రాంతం వదిలి బేతెలు అనగా దేవుని మందిరం దగ్గరకు వెళ్లి అక్కడ ఉండు! అక్కడే నీకు ఆదరణ కలుగుతుంది, బయలుదేరి వెళ్ళు అంటున్నారు దేవుడు!

 

అవును కదా- మనం కూడా అనేకసార్లు దేవునికి మ్రొక్కుకుంటాము ఆపద వచ్చినప్పుడు! ఇది మానవ సహజ లక్షణం! బాగుంది! అయితే దేవుడు తీరా కరుణించి ఆపదనుండి గట్టేక్కిస్తే అనేకమంది మ్రొక్కుబడి తీర్చడం మర్చిపోతారు యాకోబుగారిలా! వెంటనే దేవుడు మరో ఆపద కలిగిస్తారు యాకోబుకి చేసినట్లు! అప్పుడు అయ్యో దేవుడా నన్ను క్షమించు ఇప్పుడు రెండూ తీరుస్తాను అంటారు! ఇది కూడా మానవ సహజలక్షణం! ఆదికాండం 40 చివరి వచనంలో ఒకమాట ఉంటుంది: అయితే పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయెను! అలాగే మనము కూడా ఆపద తీరాక దేవుణ్ణి మర్చిపోతున్నాము! దేవుడు యాకోబుకి ఆపద కలిగించి తాను చేసిన మ్రొక్కుబడి కోసం గుర్తు చేస్తున్నారు!

 

ఇక్కడ ఒక అనుమానం రావచ్చు- దేవుడు మనం అర్పించే కానుకలు- తీసుకోరు! కోడెల రక్తము మేకల రక్తము ఆయన త్రాగరు కదా, మరి ఎందుకు మ్రొక్కుబడులను అడిగి మరీ తీర్పించుకుంటారు! ఎందుకంటే దేవునికి మనిషిలో యధార్ధత కావాలి! నిన్ను మ్రొక్కుకో అని దేవుడు నీకు చెప్పలేదు కదా! నీవే నీ ఆపదలో మ్రొక్కుకున్నావు కాబట్టి నోరుమూసుకుని దానిని తీర్చాలి! మ్రొక్కుకుని తీర్చకపోతే అది నీకు ఉరి అని బైబిల్ చెబుతుంది! దానికి బదులు నీవు మ్రొక్కుకొనక పోతేనే మంచిది అని చెబుతుంది. ...

Ecclesiastes(ప్రసంగి) 5:4,5

4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.

5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.

 

ఇప్పుడు యాకోబు గారు, తన కుటుంభం కలిసి బయలుదేరుతున్నారు బేతెలుకి! అయితే ఐదో వచనం చూసుకుంటే వారు అనగా యాకోబు గారి పరివారం మొత్తం వారి ఆస్తిపాస్తులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే- వారి చుట్టూ ఉన్న ఊళ్లకు దేవుడు భయం కలిగించారు కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు!!! హల్లెలూయ! ఇదీ దేవుడు చేసే అద్భుతంనీవు దేవుడు మాట వింటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారు! హివ్వీయులకు దేవుడు భయం పుట్టించారు అందుకే వారు యాకోబుగారిని ఆయన కుమారులను తరుమలేదు! ఇలా  ఇశ్రాయేలీయులకు కూడా చేశారు దేవుడు.

నిర్గమకాండము 15: 15

ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధికభయము వారికి కలుగును.

 

నిర్గమకాండము 23: 27

నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశములవారిని ఓడ గొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.

 

ద్వితీ 2:25

నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.

 

దేవుడు మన ప్రార్ధనలకు జవాబిచ్చే దేవుడు! యాకోబు గారి ప్రార్ధనలకు జవాబిచ్చారు. దావీదు గారి ప్రార్ధనలు జవాబిచ్చారు

కీర్తన 34:4, 6, 17;

4. నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.

6. దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.

17. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.

 

కీర్తనలు 107: 6

వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

 

కీర్తనలు 116: 1

యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.

 

మన పార్ధనలకు కూడా దేవుడు జవాబిస్తారు!

మరి ప్రార్ధన చేస్తావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*22 భాగం*

ఆదికాండం 35:110

1. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా

2. యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

3. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నాశ్రమ దినమున నా కుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.

4. వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.

5. వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.

6. యాకోబును అతనితో నున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.

7. అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి చోటికి ఏల్బేతేలను పేరుపెట్టిరి.

8. రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్అను పేరు పెట్టబడెను.

9. యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.

10. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము! 35 అధ్యాయానికి నేపధ్యం చూసుకున్నాము! దేవుడు నీవు వారినుండి తప్పించుకోవాలంటే బేతెలుకి వెళ్లి అక్కడ నివాసంచెయ్యు, అక్కడ నీవు మ్రొక్కుకున్నట్లు బలిపీటం కట్టు అని దేవుడు చెబితే యాకోబు గారు బయలు దేరి వెళ్తున్నారు!! ఇది నేపధ్యం!

 

      (గతభాగం తరువాయి)

 

  వెంటనే యాకోబు గారు వచ్చి తన భార్యలతో తన పిల్లలతో తన పనివారితో అంటున్నారు- బయలుదేరండి మనం ప్రాంతం వదిలేసి బేతెలు వెళ్తున్నాము! అక్కడ మన దేవునికి అనగా నా ఆపదలో నేను మ్రొక్కుకున్నప్పుడు నా శ్రమ దినమందు నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండి నన్ను నడిపించిన దేవునికి బలిపీటం కడదాము! అయితే మీరు మీ యొద్దనున్న అన్య దేవతలను పారేయాలి, ఇది మొదటిది, రెండు మిమ్మును మీరు శుద్ధి చేసుకోవాలి, మూడు: మీ వస్త్రాలు మార్చుకోవాలి! మూడు పనులు చెయ్యమంటున్నారు!

 

ఇక్కడ తన జీవితంలో మొట్టమొదట సారిగా యాకోబు గారు- తన తప్పును తాను తెలిసికొని తన భార్యలతో, తన పిల్లలతో ఇంకా తన పనివారితో చెబుతున్నారు- మీరు మీ దగ్గర నున్న అన్యదేవతలను తీసి పారెయ్యండి! ఇక మీ సిరియా బొమ్మలు విగ్రహాలు పారెయ్యండి! ఏకైక నిజ దేవుడైన యెహోవా దేవుణ్ణి మనం ఆరాధించాలి! ఇప్పుడు ఆయనకు బలిపీటం కట్టాలి! అలా చెయ్యాలంటే ముందుగా మీ దగ్గరనున్న, మీరు సిరియా నుండి మోసుకుని వచ్చిన అన్య విగ్రహాలు తీసిపారెయ్యండి! మనిషి జీవితంలో దేవుని దగ్గరకు చేరాలంటే మొదటగా మనిషి- తన దగ్గర ఉన్న విగ్రహం ఏదైనా కాని దానిని తీసి పారెయ్యాలి! దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక??? మనము దేవుని ఆలయమై ఉన్నామని బైబిల్ చెబుతుంది...

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:16,17

 

16. మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:15,16

15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

 

దైవజనుడైన యెహోషువా గారు తానూ చనిపోయే ముందు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు 24:15, 23  ఇలాంటి స్తిరమైన నిర్ణయం మీరు కూడా తీసుకోవాలి!

Joshua(యెహొషువ) 24:15,23

15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; *మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను*.

23. అందుకతడు ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.

 

 దేవుణ్ణి కలుసుకోవాలంటే ఇది ప్రధమ మెట్టు!

మనకు తెలుసు- లాబాను వచ్చి నీవు పోతే పోయావు గాని నా గృహదేవతను ఎందుకు దొంగిలించి పట్టుకుపోతున్నావు అని అడిగాడు, అప్పుడు అర్ధమై ఉంటుంది, ఎవరో అన్య విగ్రహాలు తీసుకుని వచ్చారు అని! అందుకే మొట్టమొదటసారిగా గట్టిగా స్తిరమైన నిర్ణయం తీసుకుని అందరికీ చెబుతున్నారు- మీరు మీ విగ్రహాలు తీసి పారెయ్యండి!

 

ఇక తర్వాత: మీ వస్త్రాలు మార్చుకొనండి! వస్త్రములు అనగా వేషధారణ! ఇంతవరకు వారు సిరియా వేషదారణలో ఉన్నారు! ఇప్పుడు మీరు ఇశ్రాయేలు దేశం వచ్చారు! హెబ్రీయులు! మీరు హెబ్రీయులు గానే ఉండాలి గాని సిరియనుల భాష గాని సిరియనుల వేషధారణ గాని ఉండకూడదు! దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకు తగిన వస్త్రధారణ మాత్రమే చెయ్యాలి అన్యుల వలే, సినిమా యాక్టర్ల లాగ పనికిమాలిన వస్త్రధారణ చెయ్యకూడదు! బిగుతుగా ఉండే బట్టలు వేసుకుని మీ శరీర సౌష్టవం పూర్తిగా కనిపించే పనికిమాలిన బట్టలు వేసుకోకూడదు! అది స్త్రీ గాని పురుషుడు గాని! అదేవిధంగా ద్వితీ 22:5 లో చెప్పినట్లు స్త్రీ పురుషు వేషం వెయ్యకూడదు, పురుషుడు స్త్రీ వేషం వెయ్యకూడదు అని చెప్పినట్లు స్త్రీలు టీ-షర్ట్ జీన్ పేంటులు వెయ్యకూడదు! అలా చేస్తే దేవుని దృష్టిలో శాపగ్రస్తులు అని చెబుతుంది బైబిల్! ద్వితియోపదేశకాండము 22: 5

స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.

అన్యుల ఆచారాలు అన్యుల అలవాట్లు మనం చెయ్యకూడదు! గడ్డం ప్రక్కన కత్తిరించుకోవడం అనగా ఫ్రెంచ్ కటింగ్ లు, ఇంకా హిప్పీ కటింగ్ జిప్పీ కటింగ్లు చేసుకోకూడదు! దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉండాలి! లోకస్తులను చూసి లోకస్తుల వలే వస్త్రాలు వేషాలు వెయ్యకూడదు! ఇదీ దేవుని నియమం! ఇదే చెబుతున్నారు యాకోబు గారు!

నేడు అనేకమంది దైవసేవకుల పిల్లలు ఇలా పనికిమాలిన వేషధారణ వస్త్రధారణ చేసుకుంటూ మందిరాలను సంఘాలను పాడుచేస్తున్నారు! దైవ సేవకులారా! ఇది గమనించండి! సరిచెయ్యండి! ముందు మీ పిల్లలకు చెప్పి అప్పుడు సంఘములో చెప్పమని బ్రతిమాలుతున్నాను!!!

 

సరే, వారేమి చేశారు చూద్దాం!

మొదటగా తన యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తీసివేశారు! దేవునికి స్తోత్రం!

రెండు: తమ చెవులకు ఉన్న పోగులను తీసి యాకోబు గారికి ఇచ్చేశారు ఏమి చేస్తావో అది చెయ్యు! వెంటనే యాకోబు గారు అన్య విగ్రహాలను వారి చెవులకున్న పోగులను తీసేసి- వాటిని మస్తకి వృక్షం క్రింద అనగా సిందూర వృక్షం క్రింద గొయ్యి తీసి లోతుగా పాతేశారు. ఇక వాటిని ఎవరూ తీసుకోకుండా!

 

 చూడండి ఇక్కడ వారి విగ్రహాలు తీసేశారు! ఇంకా వారి చెవులకున్న పోగులను తీసేశారు! గమనించండి- సిరియనులు రోజులలో చెవులకు చెవుల చుట్టూ చిన్న చిన్న పోగులు లేక రింగులు లా పెట్టుకునే వారు. నేడు అనేకమంది అమెరికా వారు ఆఫ్రికన్లు పెట్టుకుంటున్నారు- చెవికి కనీసం మూడు నుండి ఐదు చిన్న చిన్న రింగులు ఉంటాయి. అలాంటివి వారు పెట్టుకునే వారు, వాటిని తీసేసి యాకోబు గారికి ఇస్తే ఆయన వాటిని శాస్వతంగా వాటిని పాతేశారు!!!

 

ఆగుదాం ఒకసారి! మీ విగ్రహాలు తీసెయ్యండిమిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి- మనము దేవుని మందిరానికి వెళ్తున్నాము! అక్కడ బలిపీటం కట్టాలి అంటే వారు మొదటగా విగ్రహాలు తీసేశారు రెండవదిగా వారికున్న నగలు తీసేశారు! ఎందుకు నగలు తీసేశారు అంటే మొదటగా చెవి పోగులు సిరియనుల విగ్రహారాధనకు చెందినవి కాబట్టి! విగ్రహాల ఆరాధన నుండి చెవి పోగులు వచ్చాయి కాబట్టి వారి నగలు తీసిపారేశారుఅనగా ఏమని అర్ధమవుతుంది అంటే దేవుని ఆరాధనకు వెళ్ళినప్పుడు- దేవుణ్ణి ఆరాదించేటప్పుడు, దేవునికి బలిపీటం అనగా ప్రార్ధనా బలిపీటం కట్టినప్పుడు గాని, స్తుతుల బలిపీటం- స్తుతుల సింహాసనం కట్టేటప్పుడు గాని స్త్రీల ఒంటిమీద గాని పురుషుల ఒంటిమీద గాని నగలు అనేవి ఏవీ ఉండకూడదు! చివరికి మ్యారేజ్ రింగు కూడా ఉండకూడదు! ఇదీ నాకు అర్ధమయ్యింది! నగలు వేసుకుని మందిరానికి రాకూడదు! అవి మీ ఒంటిమీద ఉండగా మందిరంలోకి వచ్చి ప్రార్ధన చెయ్యకూడదుఇదే కాదుసార్- ఇదే పాత నిబంధనలో మరోసారి ఇదే చెబుతున్నారు! ఎవరూ? మోషేగారా! కాదుకాదు సార్! దేవుడే స్వయంగా చెబుతున్నారు! ఇది మనకు నిర్గమ కాండం ౩౩:5 లో ఉంటుంది. మోషేగారు సీనాయి కొండమీద 40 రోజులు దేవునితో ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉంటే - ఈలోగా వారు తమకోసం పోత విగ్రహం చేసుకుని మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన దేవుడివి నీవే అంటూ భయంకర విగ్రహరాధన చేస్తూ, భయంకరమైన వ్యభిచారం చేస్తూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటె దేవుడు మోషే గారిని పంపించి- నీ ప్రజలు చెడిపోయారు వారిని చంపేస్తాను అన్నారు! మోషేగారు ఇశ్రాయేలీ ప్రజలకు అడ్డుగా నిలబడి చంపకుండా అడ్డుపడ్డారు! తర్వాత మోషేగారు అయ్యా ప్రజల దోషమును అపరాదాన్ని పాపములు క్షమించండి అని సాష్టాంగనమస్కారం చేస్తూ దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు అంటున్నారుఇశ్రాయేలీయులు లోబడనొల్లని ప్రజలు, ఒక్కసారి మీ మధ్యకు వచ్చానా, మిమ్మును నిర్మూలం చేసేస్తాను, నేను వారిమీద కోప పడకుండా ఉండాలంటే మీ ఒంటిమీద ఉన్న ఆభరణాలు తీసివేయండి అంటున్నారు దేవుడే!!!!!!

నిర్గమకాండము 33: 5

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు *మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి* అని చెప్పుమనెను.

 

వెంటనే 6 వచనంలో హోరేబు కొండ యెద్ద తమ ఆభరణములు తీసివేసిరి!!

 

ఇక్కడ కూడా ఇశ్రాయేలు వారు తమ నగలను ఆభరణాలు తీసి వేశారు! *దేవుణ్ణి ఆరాధించాలి అంటే మీ ఒంటిమీద ఆభరణాలు ఏవీ ఉండకూడదు*! అదే కదా క్రొత్త నిబంధనలో కూడా చెబుతున్నారు రెండుసార్లు...

1పేతురు 3: 3

జడలు అల్లుకొనుటయు, *బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక*,

1పేతురు 3: 4

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

 

1తిమోతికి 2: 9

మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను *బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక*,

1తిమోతికి 2: 10

దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.

 

బంగారు నగలు ఆభరణాలు వెలగల వస్త్రాలు ఇవిమీకు అలంకారముగా ఉండక అంటే వేసుకోకూడదు అని అర్ధం! అలా కాకుండా ఆభరణాలు వేసుకోకూడదు అని ఎక్కడుంది అనే అడిగే భయములేని క్రైస్తవులారా, భిషప్ లారా, కాపరులారా, దైవసేవకులారా, ఆడ పాష్టర్ లారా, ఆడ భిషప్ లారా! ఇది మీరు చదువలేదా! ఇది మీకు అర్ధం కాలేదా?? దేవుని వాక్యాన్ని లేఖనాలను మీకు అనుకూలంగా బోధించుకుంటూ మీ పొట్టలు పోసుకుంటున్న సేవకులారా, జాగ్రత్త! ఉన్నది ఉన్నట్లు బోధించండి! *నగలు ఆభరణాలు వేసుకుని దేవుని ఆరాధించడం ఖండించండి! ఇది దేవునికి అనుకూలం కాదు అని గ్రహించండి! ఆరాధనకు వెళ్లినప్పుడు ఒంటిమీద విధమైన విగ్రహము గాని నగలు గాని ఉండకూడదు*! సిరియా దేశంలో ఆభరణాలువిగ్రహారాధన నుండి వచ్చినట్లే మన దేశంలోను అన్ని ఆభరణాలు నగలు  వివిధ దేవతల పూజలనుండి వచ్చినవే! కాబట్టి ఆభరణాలు ధరించకూడదు. మంగళసూత్రం కూడా ధరించకూడదు!

 

విధంగా గానే యాకోబు గారు ఆయన పరివారం వెళ్లి అక్కడ బలిపీటం కట్టి ఆరాధించారు! అలా ఆరాదించినప్పుడే దేవుడు మరోసారి యాకోబు గారితో మాట్లాడి దీవిస్తున్నారు!

 

మరి నీవు నీ విగ్రహాలను వదిలేస్తావా? అన్యుల విగ్రహారాధన నుండి వచ్చిన నగలను ఆభరణములు విసర్జించి దేవుణ్ణి నిజంగా ఆరాదిస్తావా!

*మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటే మీ నగలను తీసి పారెయ్యమని! మీరు నగలతో ఆభరణములతో ఆరాధన చేస్తే మీరు అశుచిగా అపరిశుద్ధంగా ఆరాదిస్తున్నట్లు అర్ధమవుతుంది*! కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాదిద్దాం!

 

దైవాశీస్సులు!

           

 

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*23 భాగం*

ఆదికాండం 35:915

9. యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.

10.అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.

11. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.

12. నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.

13. దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.

14. ఆయనతనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.

15. తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

ప్రియ దైవజనమా! ఇక యాకోబు గారు బేతేలుకి వచ్చి అక్కడ బలిపీటం కట్టి బల్యర్పణ చేశాక- దానికి ఏల్ బేతెల్ అని పేరుపెట్టారు! మనకు తెలుసు- బేతెలు అనగా దేవుని మందిరం, ఏల్ అనగా దేవుడు. అనగా దేవుని మందిరంలో ఉండేదేవుడు! లేక బేతెలు దేవుడు!

ఇప్పుడు యాకోబు గారు తన మ్రొక్కుబడి నెరవేర్చి- తన ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దేవునియందలి భయభక్తులలో మరో ముందడుగు వేయడం మొదలుపెట్టారు!

 

 ఎప్పుడైతే దేవునియందలి భయభక్తులు పెరిగాయో 912 వచనాలలో దేవుడు మరోసారి ప్రత్యక్షమై యాకోబుని దీవించారు: ఇక్కడ మరోసారి అంటున్నారు నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అంటున్నారు! గమనించాలి- 32:28 లో చూసుకున్నాము- కొన్నిరోజుల క్రితం దేవుడు యబ్బోకు రేవు దగ్గర యాకోబుని దీవించి నీవు మనుష్యులతోను దేవునితోను పోరాడి గెలిచావు కాబట్టి నీపేరు ఇశ్రాయేలు అనబడుతుంది అని దీవించిన దేవుడు- మరలా రెండోసారి నీపేరు యాకోబు, అయితే ఇక నీపేరు ఇశ్రాయేలు అని ఎందుకు చెబుతున్నారు??!

అనగా యాకోబు గారి జీవితం దేవుడు దీవించిన తర్వాత కూడా బాగోలేదు! యబ్బొకురేవు అనుభవం తర్వాత దేవుడు యాకోబు తనతోనే ఉంటాడు అనుకున్నారు గాని దేవునితో తానుచేసిన వాగ్దానాలు, మ్రొక్కుబడులు అన్నీ మర్చిపోయారు! పిల్లలను తన భార్యలను భక్తిలో నడిపించడం మర్చిపోయారు! సంతోషంలో ఊగిపోవడం తప్పించి దేవునికోసం బ్ర్రతకడం- తన కుటుంభాన్ని దేవుని వాగ్దానాల అనుభవం లోనికి లేక వాగ్దానాలను స్వాధీనం చేసుకోవడానికి సరిపోయే భక్తిశ్రద్ధలు నేర్పడంలో విఫలం అయిపోయారు యాకోబు గారు!

విషయంలో దేవుడే అబ్రాహాము గారి విషయంలోసర్టిఫికేట్ఇస్తున్నారు- అబ్రాహాము తన భక్తిమార్గము తన సంతానమునకు నేర్పిస్తాడుఅని నాకు తెలుసు అంటున్నారు.

Genesis(ఆదికాండము) 18:19

19. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

 

యాకోబుగారికి ఇదిలేదు! మరలా శ్రమ వచ్చి దేవుడు మాట్లాడిన తర్వాత- తన కుటుంభంలోనుండి తన పరివారంలో నుండి విగ్రహాలు ఆభరణాలు తొలిగించాక దేవుడు మరలా అంటున్నారు- నీ పేరు యాకోబు అనగా మోసగాడివి- అయితే ఈరోజునుండి నీపేరు యాకోబు కాదు ఇశ్రాయేలు! నీవు పోరాడే వాడివి! దేవుని రాజకుమారుడివి!

 

ఇంకా  అంటున్నారు దేవుడు: నేను సర్వశక్తిగల దేవుణ్ణి! ఇదే మాటతో అబ్రాహము గారితో వాగ్దానం చేశారు దేవుడు ఆదికాండం 17 :38 లో! మరలా అదేమాటతో మరలా వాగ్దానం చేస్తున్నారు యాకోబుగారితో! అనగా అబ్రాహము గారితో చేసిన వాగ్దానాలు- యాకోబులో స్థిరం అయ్యాయి అన్నమాట! యాకోబు గారు అబ్రాహాము గారితో చేసిన వాగ్దానాలకు వారసుడు అయ్యారు అన్నమాట!

ఇంకా అంటున్నారు: నీవు ఫలించి అభివృద్ధి పొందు! జనమును జనముల సమూహమును నీవలన కలుగుతారు, రాజులు నీ గర్భవాసమున పుడతారు. నేను అబ్రాహామునకు ఇస్సాకునకును ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను! నీ తరువాత నీ సంతానమునకు దేశమును ఇస్తాను అని మరోసారి వాగ్దానం చేసి అబ్రాహము గారితో ఇస్సాకు గారితో చేసిన వాగ్దానాలు యాకోబుతో పునరుద్ఘాటిస్తున్నారు! ఋజువుచేస్తున్నారు!

 

ఇది ఎప్పుడు? మార్పు వచ్చిన తర్వాత! విగ్రహాలు తీసిపారేసిన తర్వాత! మొదట దేవునిలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత దేవుడు రెండు అడుగులు వేసి దీవెనలతో ఆశీర్వాదాలతో నింపుతున్నారు! అవును మనము కూడా దేవుని నుండి ఏమైనా పొందుకోవాలంటే ముందు మనము ఆక అడుగు దేవునిలో ముందుకు వెయ్యాలి- అప్పుడు దేవుడు మనతో కలిసి నడుస్తారు, మనల్ని ఆయన బాటలో నడిపిస్తారు! వాగ్దానాలతో ఆశీర్వాదములతో నింపుతారు!

 

 ఇప్పుడు యాకోబు గారు మరోసారి మరో స్థంభము నిలిపారు. దానిమీద పానార్పణముగా నూనె పోశారు! నా హృదయాన్ని నీ కుమ్మరిస్తున్నాను అంటూ!!!

 

   ఇక తర్వాత వచనాలలో యాకోబుగారికి గుండె పగిలే సంఘటన జరిగింది. వారు ఇంకా ముందుకు ప్రయాణమై సాగిపోతూ ఉన్నారు. ఎఫ్రాతా మార్గముతో వెళ్తున్నారు, ఎఫ్రాతా మార్గము అనగా బెత్లెహేము మార్గము అన్నమాట! బెత్లెహేము వైపు వెళ్తూ ఉండగా రాహేలు బహు కష్టంగా వేదనతో  ప్రసవిస్తూ కుమారుని కని నా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి చనిపోయింది! లాబానుతో యాకోబు గారు అన్నారు- ఎవరి దగ్గర నీ గృహదేవత ఉంటాదో వాడు చావాలి అన్నారు! రాహేలు దగ్గర గృహ దేవత ఉన్నది గనుక రాహేలు చనిపోయిందిబెత్లెహేము ఎఫ్రాతా మార్గములో ఆమెను పాతిపెట్టారు!

 

అధ్యాయములో యాకోబు గారికి గుండెపగిలే మరో సంఘటన జరిగింది! ఇది పిల్లలను పెంచడంలో యాకోబు గారి వైఫల్యం మరోసారి ఎత్తి చూపిస్తుంది! 22 వచనంలో వారు మిగ్ధల్ ఏదేరు దగ్గర ఉన్నప్పుడు యాకోబు గారి పెద్ద కుమారుడు తన ఉప పత్నియైన బిల్హాతో పాపం చేశాడు! తను వరుసకు పిన్ని అవుతుంది. గాని ఆమెతో పాపం చేశాడు పెద్ద కుమారుడైన రూబేను! ఆమె రూబేను కంటే కొన్ని  సంవత్సరాలు వయస్సులో పెద్దదిబహుశా యాకోబు గారు ఆమెతో పిల్లలు పుట్టాక సంసారం చేయడం మానివేసి ఉంటారు. మరి ఆమె ప్రోద్భలమో లేక రూబేను ప్రోద్భలమో తెలియదు గాని వీరిద్దరూ పాపం చేశారు వావివరుసలు తప్పి! నిజంగా యాకోబు గారు లేయా ఇద్దరు పిల్లలను భక్తిమార్గంలో నడిపిస్తే ఇలాంటి విపరీతమైన పని జరిగి ఉండేది కాదు! యాకోబు గారు అస్తమాను ఆస్తి సంపాదనలో మునిగిపోతే- లేయా నా మొగుడు నన్ను ప్రేమిస్తే చాలు నా మొగుడికి అనుకూలంగా ఎలా నడుచుకోవాలి అనేదే పట్టించుకున్నది గాని తన పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది పట్టించుకోలేదు! రకంగా ఇద్దరు వైఫల్యం వలన ఇలాంటి పని జరిగింది!

 

ఇక అధ్యాయం చివరిలో తిరిగి యాకోబు గారు తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు! అనగా తండ్రి దగ్గరనుండి సిరియా వెళ్ళాక 60 సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గరకు వచ్చారు యాకోబు గారు! (ఇస్సాకు గారి 40 సంవత్సరాలకు వారి వివాహం జరిగితే, 60 సంవత్సరాల వయస్సులో యాకోబు పుట్టారు. యాకోబు 40 సంవత్సరాల వయస్సు అనగా ఇస్సాకు గారి 100 సంవత్సరాల వయస్సులో యాకోబు గారు సిరియా వెళ్లారు, 40 సంవత్సరాలకు మరలా కనాను దేశం వచ్చారు, అనగా ఇస్సాకు గారికి 140 )  అనగా సిరియా నుండి వచ్చిన 20 సంవత్సరాలకు యాకోబు గారు తండ్రి దగ్గరకు వచ్చారు. మరో 20 సంవత్సరముల తర్వాత  ఇస్సాకు గారు చనిపోతే అన్నదమ్ములు ఇద్దరు ఆయనను పాతిపెట్టారు!

 

దైవాశీస్సులు!

*యాకోబు-ఇశ్రాయేలుగా..*

*24 భాగం*

ఆదికాండం 37:14

1. యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.

2. యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.

3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.

4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.

 

    ప్రియదైవజనమా! మనం యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! ఇక 37 అధ్యాయంలో మనకు యోసేపు గారి బయోగ్రఫీ కనిపిస్తుంది. యోసేపు గారి కోసం వివరంగా తర్వాత అంశములో చూసుకుందాం గాని ఇది యాకోబు గారి జీవితంలో మరో వైఫల్యము ను చూపిస్తుంది కాబట్టి చాలా క్లుప్తంగా చూసుకుందాం!

 

యాకోబు గారు కనానులో పరదేషిగా ఉన్నారు! యోసేపు గారికి 17 సంవత్సరాలు వచ్చేశాయి. అనగా లేయా కుమారులకు 35+ అన్నమాట! ఇక జిల్హా కుమారులు బిల్హా కుమారులు 25+ అన్నమాట! యోసేపు గారు కూడా తన అన్నలైన జిల్ఫా కుమారులతో అనగా గాదు ఆషేరుతో, ఇంకా బిల్హా కుమారులతో అనగా దాను నఫ్తాలి తో కలిసి మందలు కాస్తున్నారు అన్నమాట! అప్పుడు నలుగురు నడిచే చెడు ప్రవర్తన కోసం నాన్న కి ఎప్పుడూ వర్తమానం చెబుతుంటే నాన్న వీరికి వీపు విమానం మోత చేసేవారు. అందుకే నలుగురు అన్నలు యోసేపు మీద పగపట్టడమే కాకుండా మిగిలిన అన్నలకు లేనిపోనివి కలిపించి చెప్పారు! అందువలన మొత్తం పదిమంది అన్నలు కోపంగా ఉన్నారు! అయితే ఇదే సమయంలో విచిత్రమైన నిలువుటంగీ ఒకటి కుట్టించి యోసేపుకి ఇచ్చారు యాకోబు గారు! ఇప్పుడు మొత్తం పదిమంది అన్నలకి కోపం వచ్చింది!

 

ఇలా పదిమంది అన్నలు కోపపడటానికి కారణం మొదటిది నలుగురు అన్నదమ్ముల చెడు ప్రవర్తనకు యోసేపు గారి చాడీల బుద్ధి అయితే, దానికన్నా ముఖ్యమైనది యాకోబు గారి పార్షియాలిటీ! ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొక లాగ ప్రేమించడం వలన ఈర్ష్య కోప ద్వేషాలకు తావిచ్చింది. ఎంతవరకు వచ్చింది అంటే తన తమ్ముడు తన ప్రక్కన మందలు కాస్తున్న మాట్లాడేవారు కాదు! ఇంటిదగ్గరనుండి వారికి భోజనం తీసుకుని వచ్చినా అన్నయ్య ఎలా ఉన్నావు అంటే ఎవడూ మాట్లాడేవాడు కాదు, యోసేపుకి దెబ్బ తగిలినా పట్టించుకునే వారు కాదు! ఇంతటి పగ పెట్టుకున్నారు!

 

 యాకోబు గారు రంగురంగుల విచిత్రమైన నిలువుటంగీ ఇస్తే అందరికీ ఇవ్వాలి! కేవలం యోసేపు గారికే ఎందుకు ఇవ్వాలి? అవును యోసేపు గారు తండ్రి దగ్గర ఉంది భక్తి నేర్చుకుంటున్నారు, ప్రార్ధన విశ్వాసము నేర్చుకుంటున్నారు బాగుంది! మిగిలిన వారు వినకపోవడానికి కారణం యాకోబు గారే కదా! వారు చిన్నప్పుడు ఆయన పట్టించుకోకుండా ధన సంపాదన కోసం తిరగడం వలన పిల్లలు చెడు ప్రవర్తన కలవారు అయిపోయారు! ఒక కొడుకు తన ఉప పత్నితోనే శయనించే స్తితికి వచ్చేశాడు! మిగిలిన వారు కూడా చెడిపోయారు! ఇప్పుడు నా కొడుకు నా మాట వింటున్నాడు భక్తిగా ఉంటున్నాడు అని అతని మీదనే ప్రత్యేక ప్రేమ చూపిస్తే మిగిలిన అన్నలకు కోపం వచ్చింది!

తల్లిదండ్రులారా! దయచేసి ఇలాంటి పార్షియాలిటీ మీ పిల్లలమీద చూపించవద్దు! ఇదే కదా చివరికి యోసేపు గారిని హత్య చెయ్యాలి అనే ఆలోచన తెప్పించింది అన్నలకు! బానిసగా అమ్మారు దీనివలననే కదా! మీ వైఫల్యాలు వలన దయచేసి పిల్లలను బాదించవద్దు! ఒకరిని ఒకలాగా మరొకరిని మరోకలాగా ప్రేమిస్తే ఇలాంటి పరిస్తితులే ఏర్పడతాయి! దయచేసి అందరినీ ఒకేలాగా ప్రేమించండి! మీ పిల్లలను భక్తిలోను వాక్యములోను ప్రార్ధన లోను పెంచండి! మందిరానికి క్రమం తప్పకుండా తీసుకుని రండి! చిన్న పిల్లలను సండేస్కూల్ కి తప్పకుండా పంపండి! అప్పుడు వారు భక్తిలో పెరుగుతారు!

 

తర్వాత యోసేపు గారికి కల వచ్చింది- తన పనకు 11 పనలు మోకరించినట్లు! ఏమిరా మేము నీకు సాష్టాంగనమస్కారం చేస్తామా? అన్నారు. మరలా కల వచ్చింది దానిలో పదకొండు నక్షత్రాలు సూర్యుడు చంద్రులు మోకరించినట్లు- ఏమిరా మేమేకాకుండా అమ్మ నాన్న కూడా నీకు నమస్కారం చేస్తారా అని మరింత పగబట్టారు వారు!

 

చివరికి యోసేపుని చంపాలని అనుకోవడం- రూబేను కాపాడటం, గోతిలో వెయ్యడం- యూదా గారు తప్పించి ఇష్మాయేలు వర్తకులకు అమ్మివేయడం జరుగుతుంది. ఇదిగో విచిత్రమైన నిలువటంగీ బహుశా నీ కొడుకుదేమో అంటూ అంగీ తీసుకుని వచ్చి బొల్లి ఏడ్పులు ఏడ్చేశారు అన్నలు! పీడ విరగడి అయ్యింది అనుకున్నారు! యాకోబు గారికైతే గుండె బ్రద్దలయ్యింది! అయ్యో నా కుమారుడా అంటూ ఏడవడం మొదలుపెట్టారు. ఎందఱో ఓదార్చినా ఓదార్పుపొందకుండా ఏడ్చి ఏడ్చి కనుచూపు పోగొట్టుకున్నారు యాకోబు గారు! తన తండ్రి కూడా 100 సంవత్సరాల తర్వాత కంటిచూపు పోగొట్టుకున్నారు, అయితే యాకోబు గారు ఏడ్చి ఏడ్చి సుమారు 110  సంవత్సరాల వయస్సులో చూపు పోగొట్టుకున్నారు!  

 

     అక్కడ యోసేపు గారు బానిసగా అమ్మివేయబడటం, ఫోతీఫర్ కొనుక్కోవడం, దేవుడు యోసేపుకి సహాయంగా నిలబడటం, మరలా శ్రమ కలగటం చెరసాల కి వెళ్ళడం- అక్కడ పానదాయకుల అధిపతికి భక్షకారుల అధిపతికి కలలు రావడం- చివరికి ఫరోకు కల రావడం దాని భావము యోసేపు గారు తెలియజేసి- ఐగుప్తు దేశానికే గవర్నర్ కావడం జరుగుతుంది. తర్వాత ఏడేళ్ళు కరువు రావడం- అన్నలకు తను ఎవరో తెలియజేసిన తర్వాత యాకోబు గారు ఐగుప్తు వస్తారు!

దానికి ముందు దేవుడు మరోసారి బెయేర్శెబా లో మాట్లాడుతున్నారు యాకోబుతో 46:24 లో...!

Genesis(ఆదికాండము) 46:2,3,4

2. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

3. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను.

4. నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా ...

 

 దేవుడు: యాకోబు నేనే దేవుణ్ణి , నిన్ను మరలా ఐగుప్తు నుండి దేశానికి తీసుకుని వస్తాను దైర్యంగా ఐగుప్తు వెళ్ళమని చెప్పారు! అక్కడ చనిపోయాడు అనుకున్న కుమారుని చూసి సంతోషించారు! ఇప్పుడు యాకోబు గారికి అన్నీ రాజభోగాలే! ఒరేయ్ కాఫీ అంటే కాఫీ వచ్చేది, నీరు అంటే నీరువచ్చేది, ఏది కావాలన్నా పనివారు తీసుకుని వచ్చేవారు. రాజుకి కలిగిన సౌకర్యాలు అన్నీ 17 సంవత్సరాలు అనుభవించారు యాకోబు గారు చనిపోయే ముందు! చివరికి అక్కడే 147 సంవత్సరాల వయస్సులో చనిపోయి- తన తండ్రి సమాధి దగ్గర, తన తల్లి సమాధి దగ్గర, తన తాత నాన్నమ్మ సమాధి దగ్గర ఐగుప్తు రాజ లాంచనాలతో పాతిపెట్టడం జరిగింది క్రీ.పూ  1693లో!

 

ఇదీ యాకోబు గారి జీవితం, యాకోబు ఇశ్రాయేలుగా మారిన వైనము

ఆయన ప్రార్ధనా జీవితం, ఆయన వైఫల్యము! మనము కూడా ప్రార్ధనలో పట్టుదలగా ఉందాము!

చేసిన వాగ్దానాలు మ్రొక్కుబడులు చెల్లిద్దాం!

పిల్లలను భక్తిలో పెంచుదాం!

యాకోబు గారిలా- ఇశ్రాయేలు గా జీవిద్దాం!

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

ప్రియదైవజనమా! యాకోబు- ఇశ్రాయేలుగా అనే శీర్షిక మీ హృదయాలను కదిలించింది అని నమ్ముతున్నాను! ప్రభువు చిత్తమైతే  యోసేపు గారి జీవిత అనుభవాలతో మరలా కలుసుకుందాం! దయచేసి మా కోసం ప్రార్ధన చెయ్యండి!

 

ఇట్లు

వందనములతో

ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు

*రాజ కుమార్.దోనె*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పాపము

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

శరీర కార్యములు

విశ్వాసము

సమరయ స్త్రీ

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు