పోస్ట్‌లు

2026లోని పోస్ట్‌లను చూపుతోంది

శిలువ శ్రమలు

చిత్రం
  — సిలువ శ్రమలు — Day 1 🩸 గెత్సెమనే వేదన   సిలువ మరణం కంటే ముందే , యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఒక భయంకరమైన ' ఆత్మీయ మరణాన్ని ' రుచి చూశారు.   1. గెత్సెమనే: "నూనె గానుగ" ( The Oil Press) ❣ ️' గెత్సెమనే ' అంటే హీబ్రూ భాషలో "నూనె గానుగ" అని అర్థం. ఒలీవ పండ్లను గానుగలో వేసి ఎలాగైతే నలిపి నూనె తీస్తారో , లోక పాపపు భారమనే గానుగలో యేసు ప్రభువు ఆ రాత్రి నలిగిపోయారు. ( Ref: యెషయా 53:10 ; మత్తయి 26:36). 👉 తోటలో మొదటి ' ఆదాము ' దేవునికి విరోధంగా పాపం చేస్తే ( Ref: ఆదికాండము 3:1-7) , రెండవ ఆదాము (యేసు) అదే తోటలో దేవుని చిత్తానికి తనను తాను పూర్తిగా నలుపుకొని లోకానికి రక్షణ తెచ్చారు. ( Ref: 1 కొరింథీయులకు 15:45).   NOTE: ఒలీవ కాయలను మూడు దశల్లో నలుపుతారు (మొదటిది దేవుని కొరకు , రెండోది ఆహారం కొరకు , మూడోది వెలుగు కొరకు). అలాగే యేసు కూడా మూడుసార్లు ప్రార్థించి , నలగొట్టబడి మనకు రక్షణ అనే తైలాన్ని ఇచ్చారు అనే అంశాన్ని ఇది బలపరుస్తుంది.   2. వైద్యపరమైన అద్భుతం: హెమటిడ్రోసిస్ ( Hematidrosis) ఆయన చెమట రక్త బిందువులవలె ఆయెను లూ...