రోమా పత్రిక - పార్ట్ -6
* రోమా పత్రిక – 111 వ భాగం* రోమా 12:15 — 16 … 15. సంతోషించు వారితో సంతోషించుడి ; 16. ఏడ్చువారితో ఏడువుడి ; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. . ప్రియులారా! విశ్వాసి సంఘంలోనూ , లోకంలోనూ ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని ద్యానిస్తున్నాం మనం! విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తున్నది. ఇతర విశ్వాసులపట్ల ఎలాంటి ప్రేమగల జీవితం గడపాలి ( వ 9,10,13,15,16), క్రీస్తు పట్ల ఎలా ఉండాలి (వ 11,12), శత్రువుల పట్ల (వ 14,19-21) ఎలా ప్రేమ చూపించాలి అనేదో ఆ జీవితం. ఇక 15 వ వచనంలో సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చేవారితో ఏడవండి అంటున్నారు పౌలుగారు. దీని సామాన్య అర్ధం ఏమిటంటే ఇతరుల సుఖ దుఃఖాలను పంచుకోమంటున్నారు. గాని జ్ఞానియైన సొలోమోను గారు అంటున్నారు విందు జరుగుచున్న ఇంటికి పోవుటకంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటున్నారు. ప్రసంగి 7:2; ఎందుకు వారు ప్రలాపిస్తున్నారు అంటే ఆవచనంలోనే జవాబుంది. మ...