రోమా పత్రిక - పార్ట్-౩
*రోమా పత్రిక-49వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-6*
రోమా 4:4--6
4. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు.
5. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.
6. ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.
ప్రియులారా! దేవుని రక్షణ సిద్దాంతాన్ని అబ్రాహాము గారి జీవిత వృత్తాంతమునుండి ధ్యానం చేసుకుంటున్నాం.
4 వ వచనంలో పనిచేయు వానికి జీతం, రుణమే గాని దానం అనబడదు అంటున్నారు. అవును కదా, మనం నెలంతా కష్టపడితే వచ్చే జీతం, అది మన ఓనర్ మనకు ఇవ్వాల్సిన రుణమే తప్ప అది మనకు ఏమీ ఉచితంగా దానం చెయ్యడం లేదు కదా! అయితే పనిచెయ్యకుండా మనకు ఎవ్వరైనా ఏదైనా జీతం ఇస్తే, గిఫ్ట్ ఇస్తే అది దానం అంటారు! దీనిని ఉదాహరణగా చూపుతూ అంటున్నారు పౌలుగారు అలాగే దేవుడు కూడా ఒక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చారు అంటే అది గిఫ్ట్! దానం! అబ్రాహము గారు నిజం చెప్పాలంటే వారి వృత్తి విగ్రాహాలు అమ్ముకోవడం! ఇలాంటి విగ్రహారాధన చేసే కుటుంబం నుండి దేవుడు అబ్రాహాము గారిని ఏర్పరచుకొన్నారు కాబట్టి ఇక్కడ భక్తిహీనుడు అనేమాట ఉపయోగించారు. అయితే అబ్రాహాము గారు తను ఎలాంటి కుటుంబం నుండి వచ్చినా దేవుణ్ణి మనసా వాచా కర్మేనా నమ్మారు కాబట్టి ఆ నమ్మకమే అబ్రాహాము గారిని నీతిమంతుడుగా తీర్చింది. ఇంతకీ నీతిమంతుడుగా తీర్చడం ఏమిటి? మొదటగా అబ్రాహాము గారిది విగ్రహాలు అమ్ముకుంటూ, విగ్రాహారాధన చేసే కుటుంబం, రెండవదిగా పుట్టిన ప్రతీ మనిషి ధర్మశాస్త్రం ప్రకారం ఉగ్రతకు పాత్రుడు/ శిక్షకు పాత్రుడు! ఇలాంటి శిక్షకు పాత్రుడైన వానిని దేవుడు నీతిమంతుడుగా ఉచితముగా తీర్చారు అంటే అది దానమే కదా!
ఒకసారి ఆలోచన చేస్తే మనుష్యుల మత సంభంధమైన క్రియలను బట్టి దేవుడు వారిని రక్షిస్తాడు అంటే వారు తమ రక్షణను తామే సంపాదించుకొన్నట్లు! అలాంటప్పుడు వారికి నేను ఫలాని పని చేసినందువలన నాకు ఈ రక్షణ దొరికింది అని గొప్పలు చెప్పుకొనే అవకాశం ఉంటుంది. అయితే 3వ అధ్యాయం ప్రకారం ధర్మశాస్త్రం సంభంధమైన క్రియలు, ఆచారాలు ద్వారా గాని, మంచి పనుల వలన గాని రక్షణ కలుగడం లేదు అని చూసుకున్నాం! అది కేవలం దేవుని యందు విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇక్కడ పాప విముక్తి, రక్షణ, దేవుని నీతి ఇలాంటివి దేవుడు ఉచితంగా ఇచ్చేవే! వాటిని పొందడానికి ఏకైక మార్గం విశ్వాసంతో దేవున్ని అడిగి పొందుకోవడమే! 3:21—28; 6:23; 11:6; ఇది మనుష్యులు స్వాభావికముగా ఆలోచించేదానికి పూర్తి విరుద్దం! తాము చేసే మంచి పనులు వలననే తాము నీతిమంతులుగా పిలువబడుతున్నాం అని చెప్పుకోవడం అంటే వారికి చాలా ఇష్టం. వీటితో పాటు తమ మంచిపనులతో వారు తమయొక్క రక్షణ, మోక్షం, నీతి సంపాదించుకోగలము అని వారు అనుకుంటున్నారు. అయితే పౌలుగారు అలా జరుగనే జరుగదు అని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే అనేకమంది ఆయనకు వ్యతిరేకులై ఆయనను చాలా హింసించారు. వారు తలంచేదేమిటంటే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు, ఆచారాలు పాటిస్తే, విముక్తి, మోక్షం, రక్షణ వచ్చేస్తుంది అని అనుకునే వారు. పౌలుగారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వారిని ఎదిరించి అలా జరుగదు- కేవలం విశ్వాసం ద్వారానే కలుగుతుంది అని చెప్పేవారు. అందుకని ఆయన అనేకచోట్ల ఘోరంగా హింసించారు. అపో 9:23; 13:45; 14:5, 19; 15:1; 17:5; 21:11; 2కొరింథీ 11:24; 1థెస్సలోనికయ 2:14—16; ఇదే మాటను రోమీయులకు కూడా వివరిస్తూ అబ్రాహాము గారి జీవితం నుండి వివరిస్తున్నారు పౌలుగారు!
దేవుడు నిర్దోషులనుగా ఎవరిని ఎంచుతున్నారు? పాపులను! కారణం ధర్మశాస్త్రం నిరూపిస్తుంది పుట్టిన ప్రతీఒక్కరు పాపులే! దేవుని దృష్టిలో పాపం లేనివారు ఎవరూ లేరు. 3:9—19; మత్తయి 7:11; పశ్చాత్తాప పడి యేసయ్య పాదాలు పట్టుకుని, పాపిని ప్రభువా క్షమించమని వేడితే దేవుడు ఎవరినైనా, ఎంత ఘోరపాపినైనా క్షమిస్తారు. దేవుడు క్షమించలేని దుర్మార్గుడు ఎవరు లేరు! దానికి పౌలుగారే సాక్షం! అపో 8:3; 9:1—5; సిలువపై వ్రేలాడే దొంగ సంగతి ఒకసారి ఆలోచించడి. దొంగను కూడా దేవుడు క్షమించారు. లూకా 23:39—43; అసలు దేవుని ఉద్దేశ్యం ఏమిటి?
యెషయా 55: 7
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
ఇంకా ఒకసారి 1కొరింథీ 6:9—11 చూడండి
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను
10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
11. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి. . . . కాబట్టి ఒకరోజు మనం ఆకోవకు చెందిన వారమే గాని దేవుడు దయతలచి మనలను విమోచించారు.
కాబట్టి దేవుడు ప్రేమించలేని, క్షమించలేని పాపి, దుర్మార్గుడు లేదు! నీవు ఎవరివైనా సరే క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను కూడా క్షమిస్తారు.
అయితే ఒక ఆజ్ఞ! ఇకను పాపము చేయకుము!
అబ్రాహాము గారిని క్షమించారు దేవుడు! రాజైన దావీదును క్షమించారు దేవుడు!
ఎంతఘోరపాపినైనా క్షమించడానికి సిద్దంగా ఉన్నారు!
మరి నీవు వస్తావా?
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-50వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-7*
రోమా 4:6—9
6. ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.
7. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
8. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
9. ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేని వారిని గూర్చి కూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా? . . .
ప్రియులారా! ఇక్కడ 6వ వచనంలో పౌలుగారు దావీదు గారు చెప్పిన కొన్ని ప్రవచనాలను చెబుతూ అది అబ్రాహాము గారి జీవితంలో ఎలా నెరవేరిందో చెబుతున్నారు. దావీదు గారు ఏం చెప్పారు 7-8.ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
8. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు, . . . ఈ విషయాలు పాత నిబంధనలో కీర్తనలు 32:1—2 లో చెప్పబడ్డాయి. ఇక్కడ అతిక్రమములకు పరిహారం పొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు, ప్రభువుచేత నిర్దోషి అని పిలువబడిన వాడు ఎవరు? అబ్రాహాము గారు. మరి మీరు అనొచ్చు అబ్రాహాముగారు ఏ అతిక్రమములను చేశారు? అవి వ్రాయబడలేదు కదా, కారణం అబ్రాహాము గారు తన దోషాలకు పరిహారం పొందినది ఇంకా సున్నతి అనేదానిని పొందకమునుపే ఆదికాండం 15వ అధ్యాయంలో. అంతకుముందు ఏమయ్యిందో బైబిల్ లో వ్రాయబడలేదు గాని మూడవ అధ్యాయంలో మనం ధ్యానం చేసిన విధముగా భూమిమీద పుట్టిన ప్రతీ మనిషి పాపే, నేరస్తుడే! కాబట్టి దాని ప్రకారం అబ్రాహాము గారు కూడా పాపే! అందుకే ఈ అతిక్రమాలు, పాపములు దేవుడు తన ఉచిత కృపతో క్షమించేశారు. అతనిని నిర్దోషిగా ఎంచారు. కారణం 15:6 లో అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అనగా దేవుడు అతనిని నీతిమంతుడుగా తీర్చారు. ఎందువలనా? ఆయనచేసిన మంచి పనుల వలననా? కాదుకాదు! కేవలం నమ్మి, విశ్వసించినందువలన!
దేవుడు చాలా చాలా దయామయుడు! అందుకే మనం అర్హులం, నమ్మదగిన వారము, మంచివారము కాకపోయినా మనలను ప్రేమించి మనకు తన రక్షణను ప్రసాదించారు. దేవునికి తనను నమ్మిన వారికి ఉచిత కృపా వరములు ఇవ్వడం అంటే చాలా ఇష్టం! అంతేకాని వారు మంచివారనీ ఎంతమాత్రము కాదు. వారు మంచిపనులు చేశారు కాబట్టి వారు అర్హులు అని ఎంతమాత్రము కాదు. ఇక్కడ అబ్రాహాము గారి పట్ల కూడా అదే జరిగింది. అబ్రాహాము గారు తనను మనసా వాచా కర్మేనా నమ్మారు కాబట్టి తన ఉచిత కృపావరం అనగా నీతిమంతులుగా తీర్చారు. ఉచితముగా ఇచ్చారు. ఇక్కడ నిర్దోషులుగా ఎంచడం అంటే ఇంతకుముందు వారు చేసిన పాపములను ఇక ఆయన తీసివేసి, ఇకను వాటిని గుర్తుకు చేసుకోకపోవడం! 8:౩౩—34
33. దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;
34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే . . .
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఎన్నుకున్నవారిమీద ఎవరు నేరం మోపుతారు? వారిని నిర్దోషులుగా ఎంచే దేవుడే! ఎవరు శిక్ష విధిస్తారు? వారికోసం చనిపోయిన క్రీస్తే! కాబట్టి ఇక్కడ నిర్దోషులుగా చేయడం అనేది దేవుని యొక్క ఉచిత కృప లేక కృపావరం.
ఈ కృపావరముల కోసం ఒక విషయం చెప్పనీయండి. దేవునికి కృపావరములు ఇవ్వడం అంటే ఇష్టం! ఇస్తారు గాని మరలా తీసుకోరు. అయితే ఇక్కడ ముఖ్యముగా చెప్పేది ఏమిటంటే: *కృపావరములు పొందుకోవడం అంటే పరలోకానికి టికెట్ ఎంతమాత్రము కాదు. కృపావరములు కలిగిన వారు పరలోకానికి డైరెక్ట్గా పోతారు అనేది అబద్దం*. ఉదాహరణ: ఇప్పుడు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల వారు అంతగా అభివృద్ధి చెందటానికి కారణం ఏమిటి? వారు దేవునికి ఇవ్వడం వలన మాత్రమే! ఎందుకంటే దేవుడు ఒకసారి ఒక వాగ్దానం చేసేశారు, మీరు నాకు ఇస్తే మీకు విస్తారంగా ఇస్తాను. నాకు ఇచ్చి నన్ను శోదించండి అన్నారు. మనలో కూడా ఎంతోమంది వారు త్రాగుబోతులే, వ్యభిచారులే, దేవుని నమ్ముకున్నవారే గాని వారి బ్రతుకులు మారలేదు. గాని వారు చాలా ఎక్కువగా ఆశీరవదించబడుతున్నారు కారణం వారి బ్రతుకు బాగోలేకపోయినా వారు ఆశీర్వదించ బడుతున్నారంటే వారు దేవునికి విస్తారంగా ఇవ్వడమే! అది దేవుని కృపావరం! *అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే వారు (పాశ్చాత్య దేశాలు వారు కూడా) ఆశీర్వదించబడుతున్నారు అంటే వారు తప్పులు చేసిన వారు దేవునికి ఇస్తున్నారు కాబట్టి దేవుడు వారు చేసిన తప్పులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు, వారి తప్పులు దేవునిచే అంగీకరించబడ్డాయి అనుకోవద్దు. Don’t Thinck you are accepted or You are Granted. No. నీవు ఇస్తున్నావు కాబట్టి ఆశీర్వదించడం అనేది దేవుని అలవాటు. అది కృపావరం! అయితే నీవు తప్పులు చేస్తున్నావు కాబట్టి శిక్షించడం అది దేవుని న్యాయం! న్యాయపుతీర్పు. ఉదాహరణ దేవుడు కొంతమందికి గొప్ప వరాలు ఇచ్చారు. దానితో వారు గొప్పగొప్ప అద్భుతాలు చేస్తున్నారు. అయితే ఆ తర్వాత వారు గర్వించి చాలా తప్పులు పాపాలు చేస్తున్నా కూడా వారు అద్భుతాలు చేయగలుగుతున్నారు అంటే దేవుడు వారిని అంగీకరించినట్లు కానేకాదు. ఇలాంటివారిమీదకు దేవుని తీర్పు చాలాచాలా ఘోరంగా ఉంటుంది. రెండింతలు కాదు ఏడింతలు శిక్ష ఉండొచ్చు అని నా ఉద్దేశ్యం! కాబట్టి దేవుడు తన స్వభావానికి వ్యతిరేఖంగా ఏమీ చేయలేరు. కృపావరాలు ఉచితంగా ఇవ్వడం ఆయనకు ఇష్టం*!
ఇక్కడ ఉచితముగా అర్హులు కాకపోయినా నీతిమంతులుగా తీర్చడం దేవునికి ఇష్టం! అంతే! ఇక ఆ తర్వాత వచనాలు చూసుకుంటే మరి ఈ దీవెన లేక కృపావరం కేవలము సున్నతిపొందిన వారికా లేక సున్నతిపొందని వారికి కూడానా? సున్నతిలేనివారి కూడా ఈ ధన్యత కలదు. ఇక్కడ సున్నతిపొందిన వారు అనగా యూదులు మరియు అబ్రాహాము సంతానానికి. సున్నతిపొందనివారు అనగా అన్యజనులు! గతభాగాలలో ధ్యానం చేసిన విధముగా ఈ ధన్యత అతనికి ఎప్పుడు కలిగింది? సున్నతి పొందినప్పుడా? సున్నతిపొందనప్పుడా? 15వ అధ్యాయంలో దేవుడు అతనిని నీతిమంతుడుగా తీర్చితే 17వ అధ్యాయంలో సున్నతి అనే టోకెన్ దొరికింది. ఇక్కడ ఒకసారి ఆగుదాం!
11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. . . . ఈ వచనం బాగా అర్ధమవ్వాలంటే study Bible నుండి దీనిని చదువుకుందాం!
*సున్నతి పొందకముందే విశ్వాసంవల్లే అబ్రాహాముకు ఎంచబడిన నిర్దోషత్వానికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. సున్నతి లేకపోయినా, నమ్మేవారందరూ కూడా లెక్కలోకి నిర్దోషులుగా వచ్చేలా వారికి ఈ విధంగా అబ్రాహాము తండ్రిగా ఉన్నాడు*. . . . చూశారా? సున్నతిని పొందక మునుపే నిర్దోషత్వానికి ముద్రగా సున్నతిని పొందారు. అనగా నేను నిన్ను నిర్దోషిగా ఎంచాను, నీ పాపములు క్షమించాను అని దేవుడు చెబుతూ దానికి ముద్రగా సున్నతి అనే గుర్తు ఇచ్చారు దేవుడు! కాబట్టి ఎవరైతే అబ్రాహాము గారిలాగా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి విశ్వసిస్తే దేవుడు వారిని కూడా నీతిమంతులుగా తీర్చుతారు అంతేకాకుండా అబ్రాహాము గారిని విశ్వాసులకు తండ్రిగా చేశారు కాబట్టి, అబ్రాహాము వలన దేవుని సంతానముగా తీర్చబడుతున్నాం కాబట్టి ఇలా విశ్వశించిన వారందరికీ అబ్రాహాము గారు తండ్రిగా అవుతారు.
ప్రియ స్నేహితుడా! ఆ విశ్వాసం నీకుందా? అయితే నీవు కూడా అబ్రాహాము సంతానమే! లేకపోతే సైతాను సంతానమే! దేవుని సంతానంగా ఉంటావా? లేక దయ్యం సంతానంగా ఉంటావా?
పరలోకం కావాలా? నరకం కావాలా?
ఏదికావాలో నేడే నిర్ణయించుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-51వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-8*
రోమా 4:11—13
11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
12. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.
13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను. . . .
ప్రియులారా! అబ్రాహము గారు సున్నతిని పొందకమునుపే విశ్వాసం వలన అబ్రాహాముకు ఎంచబడిన నిర్దోషత్వానికి గుర్తుగా సున్నతిని ముద్రగా పొందినట్లు గత భాగంలో ధ్యానం చేసుకున్నాం! అలాగే సున్నతి లేకపోయినా అబ్రాహాము గారిలా దేవుణ్ణి నమ్మేవారందరూ కూడా నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చబడతారు అనికూడా ధ్యానం చేసుకున్నాం. ఇక 12వ వచనం ప్రకారం సున్నతి కలవారికి కూడా ఆయన తండ్రిగా ఉన్నారు కారణం సున్నతి అనే ముద్ర ప్రప్రధమముగా పొందుకుంది ఆయనే కదా! దీని అర్ధం ఏమిటంటే సున్నతి పొందడమే కాదు సున్నతిలేనప్పుడు కూడా అబ్రాహాము గారు దేవునిపై గల అచంచల విశ్వాసం ద్వారా దేవుని అడుగుజాడలలో నడిచి సున్నతిని పొందినవారికి, సున్నతి లేని వారికి కూడా విశ్వాసపు తండ్రిగా ఉన్నారు.
ఇక 13వ వచనం ధ్యానం చేసుకుంటే 13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను. . ఇక్కడ అతడు ఎవరు? అబ్రాహముగారు. లోకమునకు వారసుడు అట! కారణం దేవుడు చెప్పారు నీ ద్వారా నేను సమస్త దేశాలను ఆశీర్వదిస్తాను . ఆదికాండము 12: 3
నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా
. ... అయితే ఈ వాగ్దానం ఎప్పుడు కలిగింది? ఎలా కలిగింది? ధర్మశాస్త్రమూలముగా కలుగలేదు గాని కేవలం విశ్వాసం ద్వారాను, నీతి మూలముగాను కలిగింది.
గత భాగాలలో వివరించినట్లు దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రంతో సంభంధం లేకుండానే దేవుడు అబ్రాహామును నీతిమంతుడుగా చేశారు. అయితే యూదులు కేవలం ధర్మశాస్త్రం పాటించితేనే గాని విముక్తి రాదు అని బోధిస్తున్నారు. అందువల్లే యూదులకు, పౌలుగారికి మాటిమాటికి తేడాలు వచ్చేవి,. ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు దేవుడు అబ్రాహామును నీతిమంతుడుగా చేసిన కొన్ని వందల సంవత్సరాల తర్వాతనే ధర్మశాస్త్రం వచ్చింది. ఇదేమాట 13వ వచనంలో చెబుతున్నారు. ఇదే విషయాన్ని గలతీ 3:17 లో కుండ బద్దలుగోటినట్లు వివరంగా చెబుతున్నారు.
నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
. . ..
ఇక ఈ వచనంలో గల మరో ముఖ్యాంశం ఏమిటంటే : మొదటగా దేవుడు అబ్రాహాముగారికి ప్రమాణం చేశారు నీకు ఈ కనాను దేశాన్ని స్వాస్త్యముగా ఇస్తాను. ఆదికాండం 15:7,18;19,20,21
7. మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
18. ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
19. కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను
20. హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను
21. అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
ఎందుకిస్తాను అన్నారంటే అబ్రాహాము దేవుణ్ణి నమ్మి, విశ్వసించారు కాబట్టి! అది ఎప్పుడూ? ధర్మశాస్త్రం ఇవ్వనప్పుడే! అంతేకాకుండా నీ ద్వారా లోకమంతా ఆశీర్వదింప బడుతుందని కూడా వాగ్దానం చేశారు. ఆదికాండం 12:1—3.
1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ..;
అయితే ఈ ధన్యత అబ్రాహాము సంతానములో అభిషక్తుడు అనే వ్యక్తిద్వారా కలుగుతుంది. అభిషక్తుడు అనగా క్రీస్తు! కీర్తన 2; 72:5—11;
ఈ వచనంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఆ అబ్రాహాముగారి వారసుడు ఇస్సాకు గారు కాదు, అది క్రీస్తుయేసు అని పౌలుగారు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గలతీ 3:16—18 లో కుండ బద్దలుగోటినట్లు వివరంగా చెబుతున్నారు .
16. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు *నీ సంతానములకును* అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ *సంతానమునకును* అనెను; *ఆ సంతానము క్రీస్తు*.
17. నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినయెడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. . . ..;
హెబ్రీ 1:2
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. *ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను*. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను.
ఈ విషయాన్ని నమ్మితే మనం కూడా వారసులమే! రోమా 8:17
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
ఇక 14వ వచనం చూసుకుంటే
ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును.
. . . దేవుని ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా మనుష్యులు దేవునివారసులు కాగలిగితే దేవుడు చెప్పిన వాగ్దానాల మీద నమ్మకం, విశ్వాసం పెట్టుకోవడం అనవసరం! కేవలం ధర్మశాస్త్రం పాటిస్తే చాలు! ఇక వాగ్దానాలు కూడా అనవసరం. కాబట్టి ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలద్వారా పాప విముక్తి, రక్షణ అనే తలంపే తప్పు! ఎందుకు ఈమాట చెబుతున్నారు పౌలుగారు? 15
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును.
కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం వలన దేవుని కోపం మనుష్యుల మీదకు వస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం లేకపోతే దాని అతిక్రమించుట అనేది లేదుకదా! దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొనేవారు తమ మీదకు దేవుని కోపాన్ని మాత్రమే తెచ్చుకుంటున్నారు కారణం ధర్మశాస్త్రాన్ని పాటించడానికి బదులుగా దాన్ని వారు మీరుతున్నారు. యాకోబు 2:10 ప్రకారం .. ధర్మశాస్త్రం పాటించడం కష్టం. ధర్మశాస్త్రం మొత్తం పాటించి, ఒక ఆజ్నలో మీరితే మొత్తం ధర్మశాస్త్రం అంతటికీ విరోధంగా పాపం చేసినట్లే! కాబట్టి ఇక్కడ వీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి బదులుగా మీరుతున్నారు తద్వారా దేవుని కోపాన్ని మరింత పెంచుతున్నారు! రోమా 5:20
మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,
రోమా 7:7--11
7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని( లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.
10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.
11. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని( లేక, ఆజ్ఞద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. ; గలతీ 3:10,11
10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. .. .
కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా పరిశుద్దులు ఎవరూ కాలేరు. గాని ఎవరైతే అబ్రాహాము గారిలా దేవునియందు నమ్మి విశ్వసిస్తారో వారంతా క్రీస్తుతో కూడా వారసులు! నీకు కూడా ఆ వారసత్వం కావాలా? అయితే నేడే యేసుక్రీస్తు ప్రభులవారే నిజమైన దేవుడని, నీ సొంత రక్షకునిగా నమ్మి విశ్వసించు! నేడే ఆయన నిన్ను తన వారసునిగా స్వకీయ జనముగా చేసుకొనుటకు సిద్ధంగా ఉన్నారు.
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*రోమా పత్రిక-52వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-9*
రోమా 4:16—17
16. ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.
17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. . .
ప్రియులారా! ఈ వచనాలలో అబ్రాహాము గారి విశ్వాస జీవితమును మనకు ఉదాహరణముగా చూపిస్తున్నారు పౌలుగారు! ముందుగా 16వ వచనంలో ముందుగా చెప్పినట్లుగా ఈ వాగ్ధానము కేవలం ధర్మశాస్త్ర సంభందులకే కాకుండా అబ్రాహాముగారిలా విశ్వాసం ఉంచేవారందరికి దేవుడు ఆ వాగ్దానాలు చేశారు అంటున్నారు. ఈ విముక్తి వాగ్దానం లేక రక్షణ ప్రణాళిక అనేది ధర్మశాస్త్రంతో సంభంధం లేదు, కేవలం విశ్వాసం ద్వారానే కలుగుతుంది, కాబట్టి ఇది అన్ని జనాంగాలకు చెందుతుంది. దేవుడు ఈ విముక్తి మార్గం లేకం ఈ రక్షణ ప్రణాళికకు విశ్వాసమే మూలంగా ఎందుకు చేసారో ఈ వచనంలో కనిపిస్తుంది. దేవుడు విముక్తిని, రక్షణను తన కృపద్వారా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు. అంతేగాని అది మనం చేసిన మంచిపనులకు జీతం ఎంతమాత్రం కాదు!
17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. ఇక ఈ వచనంలో చాలా ఆధ్యాత్మిక గూఢమైన విషయాలున్నాయి. అబ్రాహాముగారి విశ్వాసం మనందరికీ తెలుసు. అందుకే అబ్రాహాముగారిని విశ్వాసులకు తండ్రిగా చేశారు దేవుడు! ముందుగా అబ్రాహాము గారికి దేవుడు ఆ ఆధిక్యత ఎలా ఇచ్చారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. . . . . .
అందుకు యేసు: ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. లూకా 19:9.
ఇక్కడ యేసుప్రభులవారే స్వయముగా అబ్రహాము కుమారుడు అని జక్కయ్యకోసం చెప్పారు! తద్వారా రక్షింపబడిన వారందరికోసం చెబుతున్నారు. అబ్రాహాము గారు మానవ మాత్రుడు. గాని ఆయనకోసం పరిశుద్ద గ్రంధంలో చాలా సార్లు వ్రాయబడింది. యేసయ్య తన ప్రసంగాలలో కొద్దిమందిని మాత్రం సంభోదించారు. వారిలో అబ్రాహాము, దావీదు లాంటివారున్నారు. అబ్రాహాము గారిని యేసయ్య తన ఉపమానాలలో వాడుకొన్నారు. ధనవంతుడు-లాజరు ఉపమానంలో “తండ్రివైన అబ్రహామా!” అనియు, అబ్రాహాము రొమ్మున ఆనుకొనెను అని అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొనెను అంటే ఒకవిధముగా అబ్రాహాము – తండ్రియైన దేవునితో ఉపమానాలంకారముగా పోల్చారు! ఇక లూకా 19:9 లో ఇతడును అబ్రాహాము కుమారుడే అంటున్నారు!
ఒక సామాన్య మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? అబ్రాహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధిక్యతకు కారణాలు కనిపిస్తాయి:
1. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడచి, నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెబితే (ఆది 12, హెబ్రీ 11:8)- ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను ఎందుకు నమ్మాలి? అక్కడ ఏముంటాయి? ఇలాంటివి ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశం నుండి సుమారు 300 మైళ్ళు నడచి హారాను వెళ్ళిపోయారు. మరలా అక్కడనుండి ఐగుప్తు, కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన తన జీవితమంతా! ధనవంతుడైన అబ్రాహాము గుడారాలలో జీవిస్తూ, అరణ్యాలలో, ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తు గడిపారు.గాని ఎప్పుడూ దేవునిని ప్రశ్నించలేదు. ఇది చేస్తాను అది చేస్తాను అన్నావు. ఏదీ? అనలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను” ఆదికాండము 15:6, రోమా 4:3. ఈ అనుకూల ప్రవర్తనే అబ్రాహాము గారిని విశ్వాసులకు తండ్రిగా మార్చింది, అందుకే యేసయ్య జక్కయ్యతో అంటున్నారు ఇతడునూ అబ్రాహాము కుమారుడే!
2. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-23. ఎందుకంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్డుడని విశ్వశించి బలముపొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
3. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెబితే, ఏ అడ్డంకము చెప్పకుండా బలి అర్పించడానికి సిద్దమయ్యాడు, మృతులను సహితము ఆయన లేపడానికి శక్తిమంతుడని ప్రగాఢ విశ్వాసం కలియుండెను. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయారు అబ్రహాము గారు!
ఈ హేతువు చేతనే పౌలుగారు అంటున్నారు లేనివి ఉన్నట్లుగా పిలుచేవాడు దేవుడు. కారణం అబ్రాహాము గారు పిలువబడినప్పుడు ఆయన పేరు అబ్రాము అనగా High Father, ఘనతనొందిన తండ్రి.. . కానీ దేవుడు అబ్రాహాము అని పిలిచారు. అనగా అనేకజనములకు తండ్రి.
ఆదికాండం 17:5.
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.
ఈ వాగ్దానం చేసినప్పటికి ఇస్సాకు పుట్టలేదు . కేవలం ఇష్మాయేలు పుట్టాడు. మరి అనేకజనములకు తండ్రి ఎలా అయ్యారు? అదే లేనివి ఉన్నట్లుగా పిలవడం! ఇక దేవుడు పిలవడం అలాగే ఉంది—అబ్రాహాము గారి విశ్వాసం కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే దేవుడు అబ్రామును అబ్రాహాముగా పిలిచారో వెంటనే అబ్రాహాముగారు విశ్వసించడం, తను అనేక జనాలకు తండ్రిగా ఊహించడం మొదలుపెట్టారు. అప్పుడైతే ఆయనకు అంత సంతానం లేదు! మరి ఇప్పటి పరిస్తితి ఏమిటి? యూదులకు మీ తండ్రి ఎవరూ అని అడిగితే అబ్రాహాము అంటారు. ముస్లింలకు మీతండ్రి ఎవరూ అని అడిగితే టక్కున జవాబు చెబుతారు మాత్రండ్రి అబ్రాహాము(ఇబ్రహీము). క్రైస్తవులకు మీ తండ్రి ఎవరూ అంటే అబ్రాహాము అంటారు. ఇంతమందికి దేవుడు తండ్రిగా చేయడానికి కారణం అబ్రాహాము గారి అచంచల విశ్వాసం!
మృతులను సజీవులుగా చేయువాడు... యేసుప్రభుల వారు మృతులను సజీవులుగా చేశారు. ఏలియా ప్రార్ధించగా, ఎలిషా ప్రార్ధించగా చనిపోయిన వారిని దేవుడు సజీవులనుగా చేశారు. అయితే ఇక్కడ మృతులను సజీవులనుగా చేయడం అనేది బహుశా వాటికోసం వ్రాయలేదు పౌలుగారు. అది హెబ్రీ 11:18,19, 35
18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.
35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి. వచనాలలో వివరంగా వ్రాయబడింది.. . . .
ఇట్టి విశ్వాసం నీకుంటే నీవు కూడా అబ్రాహాము సంతానం అవుతావు. ఆ వాగ్దానాలు నీకు కూడా సొంతమే! మరి ఆ విశ్వాసాన్ని సొంతం చేసుకుంటావా?
అట్టి విశ్వాసం నమ్మకం దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*రోమా పత్రిక-53వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-10*
రోమా 4:18—21
18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. . .
ప్రియులారా ఈ వచనాలలో అబ్రాహాము గారి విశ్వాస జీవితమును మనకు ఉదాహరణముగా చూపిస్తున్నారు పౌలుగారు!
ప్రియులారా! ఈ 18వ వచనంలో ముఖ్యంగా ధ్యానం చేయవలసినది: నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మడం! మొదటగా అబ్రాహాము గారి గురించి ఆలోచిస్తే 99 సంవత్సరాల వయస్సులో దేవుడు మరుసటిఏటకు నీకు ఒక కుమారున్ని ఇస్తాను అంటే దానిని నమ్మారు. నిజం చెప్పాలంటే అప్పటికి అబ్రాహాము గారు వృద్ధుడైపోయారు. ఒక విషయం చెప్పనీయండి; ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికీ 85 సంవత్సరాలు వచ్చేవరకు ఒక పురుషుని యవ్వనస్తుడే అంటారు, కారణం ఈ వయసు వరకు అక్కడ వారు తన కారు తనే నడుపుకోగలడు, తన సైకిల్ తను తొక్కుకుంటూ పోగలడు. 90 వస్తే వృద్దుడు అని పిలవడం మొదలెడతారు. ఇక్కడ అబ్రాహాము గారికి 99 వచ్చేసాయి ఆదికాండం 17వ అధ్యాయం ప్రకారం. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నారు: దానిని మనఃస్పూర్తిగా నమ్ముతున్నారు అబ్రాహాము గారు,. అయ్యో నేను వృద్దుడను ఇదెలా సాధ్యము అని తన గురించి ఆలోచించలేదు. ఇక తన భార్య కూడా వృద్దురాలు 90 సంవత్సరాలు వచ్చేసాయి. ఇదెలా సాధ్యము అని తన భార్య కోసం కూడా ఆలోచించలేదు గాని వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చడానికి శక్తిమంతుడు అని 100% నమ్మారు. ఇదే విషయాన్ని 21వ పౌలుగారు నొక్కి వక్కానిస్తున్నారు. అందుకే ఈయన విశ్వాసులకు తండ్రి అయ్యారు.
ఇప్పుడు శారా గారి గురించి ఆలోచిస్తే మొదట నవ్వినా, దేవుడు తాను చెప్పినది నెరవేర్చే శక్తిమంతుడు అని ఆమె నమ్మారు. అందుకే జగడగొండి అనే పేరును దేవుడు రాజకుమారి అని మార్చేశారు. 90సంవత్సరాలు అంటే అది ఏ దేశమైనా అప్పటికి స్త్రీలు మెనోపాజ్ కి వచ్చేస్తారు అనగా స్త్రీ ఋతువులు ఆగిపోతాయి. అయితే దానికోసం ఆలోచించలేదు. దేవుడు వాగ్దానం చేశారు. మాకు ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారు అని ఆమె కూడా 100% నమ్మారు. అందుకే ఆమెపేరు అబ్రాహాము గారితో పాటు చిరస్తాయిగా నిలచిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరు ఆది దంపతులు కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి నమ్మారు. అదే వీరికి నీతిగా ఎంచబడింది. ఎందుకు నీతిగా ఎంచబడింది అంటే మనం ఒకసారి 19—21 వచనాలు కలిపి చదువుకుందాం .
19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. . . ఇందువలననే ఇది నీతిగా ఎంచబడింది.
చూడండి 19వ వచనంలో అబ్రాహాము గారు కూడా సామాన్యమైన మనిషి కాబట్టి తమ శరీరాలు మృతతుల్యమైనట్లు ఆలోచించారు. 20 వ వచనం ప్రకారం గాని ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని శంకించలేదు; గాని 21వ వచనం ప్రకారం మొదటగా దేవుణ్ణి మహిమపరిచారు; రెండవదిగా వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్దుడు అని రూడిగా విశ్వసించారు. ఎప్పుడైతే అలా విశ్వసించారో దానివలన అనగా ఆ విశ్వాసం వలన బలము పొందారు అని వ్రాయబడింది. ఇదే అబ్రాహాము గారికి మనకు ఉన్న తేడా!! మొదటగా దేవుడు వాగ్దానం చేసినందుకు దేవుణ్ణి మహిమ పరిచారు. బైబిల్ సెలవిస్తుంది అన్ని విషయాలలోనూ దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించమని! అనగా కష్టమొచ్చినా దేవుణ్ణి స్తుతించాలి, సుఖం కలిగినా దేవుణ్ణి స్తుతించాలి యోబుగారు స్తుతించిన విధంగా! తర్వాత వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేరుస్తారు అనే దృఢమైన విశ్వాసం ఉండాలి. అప్పుడే నీవు కార్యసిద్ధి పొందగలవు! ఇక సందేహించు వారికొరకు యాకోబుగారు అంటున్నారు 1:6—8.
6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు
8. గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. . .
లోతుభార్య సందేహించి ఉప్పు స్తంభమై పోయింది. విశ్వాస వీరుల జీవితాలు చూసుకుంటే వారు ఎప్పుడు దేవుని వాగ్దానాల విషయమై గాని, దేవునిమీద భక్తి శ్రద్దల విషయంలో గాని సందేహించలేదు. దానికోసం చావును కూడా లెక్కచేయలేదు. అందుకే విశ్వాస వీరుల పట్టీలో వారి పేరులు వ్రాయబడ్డాయి. మనకు కూడా అలాంటి అచంచల విశ్వాసం కలిగి ఉండాలి.
ప్రియ సహోదరీ సహోదరుడా! నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు గొప్పవాడని తెలుసు! ఆయన అద్బుతాలు చేస్తారని తెలుసు! గాని ఒక్కోసారి అనుమానం కలుగుతుంది. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను మొదటగా దేవునికి విన్నవించుకోకుండా మానవ ప్రయత్నం చేస్తారు. అన్నీ ఫెయిల్ అయ్యాక, ఓడిపోయాక దేవుడా నీవే దిక్కు! నీవు తప్ప నాకు మరో దారి లేదు అంటారు. ఇదే మంచిది కాదు! నీ ఆలోచనలు దేవుని నీతిని నెరవేర్చదు. మానవ ప్రయత్నాలు చేయకూడదు అనేది నా ఉద్దేశ్యం కాదు గాని మొదట నీకు వచ్చిన సమస్యను దేవుని పాదాల ముందు పెట్టి, ప్రభువా ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అని దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఆయన జవాబు ఇచ్చేవరకు కనిపెట్టాలి. అప్పుడు ప్రార్ధనలో గాని లేక వాక్యం ద్వారా గాని దేవుడు ఆయన మెల్లని చల్లని స్వరం నీకు వినిపిస్తారు. లేదా అదే ప్రార్ధనలో నీకు ఒక మంచి ఆలోచన ఇస్తారు. దాని ప్రకారం చేస్తే నీ సమస్య శాశ్వత పరిష్కారం జరుగుతుంది. అలా చేయక మనుష్యులను ఆశ్రయిస్తే సమస్య జటిలమైనా అవుతుంది లేదా సమస్య తీరినా అది తాత్కాలికమే అవుతుంది. అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే అది శాశ్వత పరిష్కారం అంతేకాకుండా ఆయన శత్రువులను సహితము మిత్రులుగా మార్చగలరు! కాబట్టి అబ్రాహాము గారు దేవుణ్ణి ఆశ్రయించి నమ్మి, విశ్వసించినట్లు నీవు విశ్వసించగలవా?
అయితే అబ్రాహాము గారిలా నీవుకూడా నీతిమంతుడుగా, పరిశుద్దుడుగా ,, నిర్దోషిగా తీర్చబడతావు!
మరినీవు సిద్దమా?
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-54వ భాగం*
*దేవుని రక్షణ సిద్ధాంతం-11*
రోమా 4:23—25
23. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
24. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.
25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.. . .
ప్రియులారా ఈ వచనాలలో అబ్రాహాము గారి విశ్వాస జీవితమును మనకు ఉదాహరణముగా చూపిస్తున్నారు పౌలుగారు! ప్రియులారా ఈ వచనాలలో పౌలుగారు ఒక విషయం చాలా స్పష్టముగా చెబుతున్నారు. విముక్తి, రక్షణ పొందడానికి, లోకానికి వారసుడు కావడానికి మన విశ్వాసం, నమ్మకం-- అబ్రాహాము గారిలాంటి విశ్వాసం నమ్మకం లాంటిది కావాలి!
13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను. .... దేవుడు ఉన్నాడు అని ప్రజలందరూ బావించినట్లు నీవుకూడా ఏదో ఒక దేవుణ్ణి లేక దేవతను నమ్ముకుంటే చాలదు. మొదటగా చనిపోయిన యేసుక్రీస్తు ప్రభులవారిని దేవుడు సజీవంగా లేపారు అని నమ్మి, ఆ లేపిన దేవుని యందు స్థిరమైన విశ్వాసం కలిగిఉండాలి. 24. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను..
10:9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. .. ఎందుకంటే దేవుడు ఒక్కడే! ఈ ఒక్కదేవుడు ఉన్నారని, ఆయన మాత్రమే శక్తిమంతుండు అని నమ్మినంత మాత్రాన సరిపోదు ఎందుకంటే యాకోబు 2:19 ప్రకారం దయ్యాలు కూడా నమ్మి వణకుతున్నాయి.
దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.
. . . ఆయన మనకు చేసిన వాగ్దానాలును కూడా నమ్మాలి. వాగ్దానం చేసిన దేవుడు వాటిని నెరవేర్చుటకు శక్తిగలవాడు అని నమ్మాలి. ఆయన మీద ఆయన చేసిన వాగ్దానాల మీద నమ్మకం విశ్వాసం పెట్టి ఆయన మీద సంపూర్తిగా ఆధారపడాలి! ఏం ఎందుకు నమ్మాలి అలా??!! హెబ్రీ 11:6
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి.
.. కాబట్టి దేవుణ్ణి, ఆయన వాగ్దానాలు తప్పకుండా నమ్మితీరాలి!
ఆయన చేసిన వాగ్దానాలు కొన్నింటిని ఈ సందర్బంగా జ్ఞాపకం చేసుకుందాం!
యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
4:14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
5:24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
6:35,36
35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
11:25—26
25. అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
26. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
ప్రియ చదువరీ! మనం కూడా ఈ వాగ్దానాలు అన్నీ నమ్మి విశ్వసిస్తే, అబ్రాహాము గారిని నీతిమంతుడిగా చేసిన దేవుడు మనలను కూడా నీతిమంతుల లెక్కలో, నిర్దోషుల లెక్కలోకి చేరుస్తారు.
ఇక 25వ వచనం చూసుకుంటే.
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.. . *మన అపరాధాలబట్టి అప్పగింపబడ్డారు ఎవరికీ? యూదుల చేతులకు! ఎందుకు? ఆయన బలియాగమై చనిపోడానికి ! చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి తిరిగి లేపబడ్డారు. ఇదే రక్షణ సిద్దాంతం! రక్షణ ప్రణాళిక! విశ్వాసులకు విముక్తి, రక్షణ అనేది ఈ ఒక్క పునాది మీదనే ఉంది. క్రీస్తు మరణం, పునరుత్థానం*!
ఇదే విషయాన్ని 1కొరింథీ 15:1—4 వరకు చూసుకుంటే .
1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,
4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. . . .
క్రీస్తు పాపుల స్థానంలో వారు పాపాలను బట్టి వారు పొందవలసిన మరణాన్ని అనుభవించారు. యేసుక్రీసు ప్రభులవారి బలిని బట్టి దేవుడు ఆయనను అంగీకరించడానికి రుజువు ఆయనను సజీవముగా లేపడమే! ఈ విషయాన్ని మనం నమ్మితే మన పాపాలు, శాపాలు క్షమించబడ్డాయి ! యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి విశ్వాసులమైన మనకు దేవునితో సరైన సంభంధం ఉందనీ, నిర్దోషుల లెక్కలో చేరామని, పాపం నుండి విడుదల పొందామని మనం తెలుసుకోవచ్చు! దేవునిఎదుట మనలను నిర్దోషులుగా నిలబెట్టేవాడు మన నీతిన్యాయాలు అన్నీ యేసుక్రీస్తు ప్రభులవారే!
1కొరింథీ 1:30—31
30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. . .
ప్రియ చదువరీ! మనం కూడా ఈ వాగ్దానాలు అన్నీ నమ్మి విశ్వసిస్తే, అబ్రాహాము గారిని నీతిమంతుడిగా చేసిన దేవుడు మనలను కూడా నీతిమంతుల లెక్కలో, నిర్దోషుల లెక్కలోకి చేరుస్తారు.
మరి నీవు సిద్ధమా!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-55వ భాగం*
రోమా 5:1—2
1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)
2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. . . .
ప్రియులారా ఇంతవరకు 4వ అధ్యాయంలో అబ్రాహాము గారి విశ్వాస జీవితమును మనకు ఉదాహరణముగా చూపిస్తు పౌలుగారు ఎన్నో ఆత్మీయ మర్మాలు చెప్పారు! ఇక 5-11 అధ్యాయాలలో దేవుని స్తిరమైన రక్షణ ప్రణాళిక కోసం చెబుతున్నారు. ఇక 5:1—11 వరకు సువార్త వలన కలుగు దీవెనలేమిటి? సువార్త యొక్క అవసరం ఏమిటి అనేది చూసుకోవచ్చు! అదేవిధంగా 5:12—19 వరకు ఆదాము వలన ఏవిధంగా శాపము, మరణము ఈ లోకంలోకి ప్రవేశించాయో, అదేవిధముగా క్రీస్తుద్వారా విడుదల, జీవం, నీతి, నిర్దోషత్వం వచ్చాయి అనే విషయాన్ని వివరంగా రాస్తున్నారు. మొత్తానికి 5:1—21 వరకు అందరూ పాపులేనని , పాప విముక్తికి, రక్షణకు మార్గం యేసుక్రీస్తు ప్రభులవారిపై గల విశ్వాసమే కారణం అని చెబుతున్నారు. ఈ అధ్యాయంలో దేవుడు నిర్దోషులుగా ఎంచినవారి గురించి మరికొన్ని సంగతులను పౌలుగారు వివరిస్తున్నారు. ఇక్కడ అంశం విశ్వాసులందరికీ రక్షణ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అది శాశ్వతం కూడా! మరీముఖ్యంగా వారు దేవునితో సమాధానం కలిగియున్నారు. (1వ వచనం); దేవుని సన్నిదిలోనికి వారి ప్రవేశం ఎప్పుడూ ఉంది (2వ వచనం); దేవునిలోనే వారికి ఆశాభావం/ నిరీక్షణ ఉంది, (2); అప్పుడు వారికి భాధలలో కూడా ఆనందించే సామర్ధ్యం కలుగుతుంది.(3); అంతేకాకుండా శ్రమలు లేక భాదల వలన విశ్వాసం ఎక్కువౌతుంది (4); అంతేకాకుండా పరిశుద్ధాత్మ అనే ఉచితమైన వరం కలుగుతుంది (5); దేవుని ప్రేమ గురించిన జ్ఞానం కలుగుతుంది (5—8); నిశ్చయమైన భద్రతా లభిస్తుంది (9—10); దేవునిలో ఆనందం (11); దేవునితో ఒక నూతన సంభంధం కలిగి తద్వారా శాశ్వత జీవం కలుగుతుంది (12—21);
ఇక ఈ మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం! కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి దేవునితో యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగియున్నాము అంటున్నారు. ఈ మొదటి వచనంలో 1—4 అధ్యాయాల సారాంశమంతా ఒకేమాటలో చెబుతున్నారు. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం తప్ప అది ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలద్వారా ఎంతమాత్రమూ కాదు. అదేవిధముగా ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో మనం దేవునితో సమాధానం కలిగియున్నాం అంటున్నారు. ఇంతకీ సమాధానం కలిగిఉండడం ఏమిటి? సమాధానం లేదా? సమాధానం కోల్పోయాడు మానవుడు దేవునితో- పాపములు అతిక్రమములు చేయడం ద్వారా! కారణం దేవుడు పరిశుద్దుడు—కాబట్టి మనలను కూడా పరిశుద్దులుగా ఉండమన్నారు. అయితే మానవుడు పాపములు చేసి దేవుడు అనుగ్రహించు నీతిని పొందలేకపోతున్నాడు. పాపముల ద్వారా దేవునికి దూరమైపోయాడు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనుష్యుల పాపములను పరిహరించి, నీతిమంతులుగా నిర్దోషులనుగా చేసి శిలువతో సంధిచేసి దేవునితో తిరిగి ఐక్యం చేశారు. తద్వారా దేవునితో సమాధానం కలిగింది.
కొలస్సీ 1:19,20,21,22
19. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,
20. ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.
21. మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధ భావముగలవారునై యుండిన మిమ్మును కూడ
22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
ఎఫెసీ 2:13,14,15,16,17,18
13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
2కొరింథీ 5:18—21
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.
20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము.
21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.
యెషయా 53: 5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
కాబట్టి ఎవరైతే క్రీస్తుయేసు నందు విశ్వాసముంచుతారో వారందరూ దేవునితో సమాధానపడతారు అన్నమాట!
ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు దేవునితో సమాధానంగా ఉన్నావా? నీ అంతరంగమును ఒకసారి అడుగు! దేవునితో సమాధానంగా లేకపోతే సైతానుగాడితో స్నేహం చేస్తున్నావన్నమాట! లోకంతో సహవాసం చేస్తున్నావన్నమాట! యాకోబుగారంటున్నారు: వ్యభిచారిణులారా! ఈ లోకస్నేహం దేవునితో వైరము అని మీకు తెలియదా!4:4 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునితో వైరము పెంచుకొని నీవు బ్రతకలేవు జాగ్రత్త! ఒక గ్రామ సర్పంచితో వైరము పెంచుకుని ఆ గ్రామంలో జీవించడం కష్టమౌతుంది. అలాంటిది రాజులరాజు ప్రభువుల ప్రభువు, సృష్టికర్త తో వైరం పెంచుకుని బ్రతకగలవా? కాబట్టి
నేడే నీ పాపములు ఒప్పుకొని, కడుగుకుని, దేవునితో సమాధానపడు! లేకపోతే ఆ ఉగ్రతదినమును నీవు భరించలేవు! అగ్ని ఆరదు, పురుగుచావదు! మండే అగ్నిలో యుగయుగాలు మండుతావు. సామెతల గ్రంధకర్త అంటున్నారు: బుద్ధిమంతుడైనవాడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోడానికి పైనున్న పరమునకు దారిని అన్వేషిస్తాడు. 15:24; మరి నీవు బుద్ధిమంతుడువా లేక బుద్ధిహీనుడువా?
ఆలోచించుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-56వ భాగం*
రోమా 5:1—2 .
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము)
2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. . . .. .
ప్రియ దైవజనమా! గతభాగంలో మొదటి వచనంలో వివరించబడిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడుటకోసం ధ్యానం చేసాము. మరలా గుర్తుకు చేస్తున్నాను ఈ 5:1—11 వరకు సువార్త వలన కలుగు దీవెనలేమిటి? సువార్త యొక్క అవసరం ఏమిటి అనేది చూసుకోవచ్చు! ఇక ఈ రెండవ వచనంలో అంటున్నారు; ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశంగలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయ పడుచున్నాము అంటున్నారు.
చూడండి మొదటగా ఆయనద్వారా మనము విశ్వాసం వలన . . . మొదటగా యేసుక్రీస్తు ద్వారా , రెండవదిగా విశ్వాసం వలన ఈ కృపయందు అనగా దేవునితో సమాధానపడుట అనే కృపయందు ప్రవేశం గలవారమై అంటున్నారు. దేవునితో సమాధానపడుట అనేది కేవలం విశ్వాసం వలన మాత్రమే తప్ప, మనం చేసిన ప్రయత్నాల వలన గాని, మనం చేసిన పుణ్యకారణాల వలన గాని ఆ దేవుని కృపయందు ప్రవేశం దొరకలేదు. ఇక కృపయందు ప్రవేశం అని తేలికగా చదువుకుని పోతే మనకు ఏవిధమైన ఉపయోగం లేదు. దీనిని కొంచెం డీప్ గా ఆలోచిస్తే దీనిలో చాలా అర్ధం ఉంది. ఇక్కడ పౌలుగారి ముఖ్య ఉద్దేశ్యం విశ్వాసులు దేవుని సముఖములోనికి ఎప్పుడైనా రావచ్చు! ఏమిటి ఎప్పుడైనా రావచ్చు ఏమిటి? కారణం: ధర్మశాస్త్ర ప్రకారం ఎవడుపడితే వాడు, ఎప్పుడుపడితే అప్పుడు, ఎలాపడితే అలా దేవుని సన్నిధికి రావడానికి వీలులేదు! ఒకసారి హెబ్రీ 9:1—9 వరకు జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రత్యక్ష గుదారములో సేవా విధానం కోసం వివరంగా వుంటుంది.
1. మొదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.
2. ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.
3. రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.
5. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.
6. ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని
7. సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.
8. దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.
9. ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి. . . .
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కేవలం యాజకులు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో పరిశుద్దస్థలం లోనికి ప్రవేశిస్తారు. ఇక అతి పరిశుద్ద స్తలానికి కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి కేవలం ఇక్కసారి, బలి రక్తం తీసుకుని వెళ్తాడు. మామూలు సామాన్య జనులు కేవలం గుడారము దగ్గరకు వస్తారు అంతే, పరిశుద్ధ స్తలములోనికి ప్రవేశం లేదు. అయితే ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు ఈ రోమా 5:2 లో దేవుని కృప ద్వారా విశ్వాసం వలన ఇప్పుడు మనం ఆ కృప యందు అనగా దేవుని సన్నిధిలోనికి ఎప్పుడూ/ ఎల్లప్పుడూ ప్రవేశం కలిగి ఉన్నాము. ఇప్పుడు బలి అవసరం లేదు. కారణం నిజమైన , మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు తనసొంత రక్తము చేత పట్టుకుని శాశ్వత బలియాగం చేసి, శాశ్వత పరిష్కారం చేసేసారు కాబట్టి. ఇప్పుడు ఆ అతి పరిశుద్ద స్తలములోనికి ఎవరైనా ఎప్పుడైనా, విరిగిన మనస్సుతో దీన మనస్సుతో ప్రార్ధనా విజ్ఞాపనలు అనే బలిద్రవ్యం పట్టుకుని, వాటిని స్తుతులతో కలిపి వెళ్ళవచ్చు! ఇదే ఈ కృపయందు ప్రవేశం. అంతేకాకుండా తర్వాత పదాలలో, అందులో నిలిచియుండి ... అంటున్నారు. యాజకుడు బలిద్రవ్యం అర్పించి, సాయంత్రానికి లేక తన లెక్కపూర్తిచేసి, తనవంతు ప్రకారం సేవచేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ అందులో నిలిచియుండి అంటున్నారు. అనగా దేవుని సన్నిధిలో మనం నిత్యమూ ఉండే అవకాశం దేవుడు మనకు కలిగించారు.
ఒకసారి మనం నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ధ్యానం చేస్తే – మోషేగారు దేవునితో మాట్లాడినప్పుడు మాత్రం ప్రత్యక్ష గుడారంలో ఉండేవారు. తర్వాత ప్రజల దగ్గరకు వచ్చేసేవారు. అయితే మోషే సేవకుడైన యెహోషువా గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు అని గ్రంధం సెలవిస్తుంది. నిర్గమ 33:11; ఏమండి యెహోషువా గారు యాజకుడా? కాదు! లేవీయుడా? కాదు! మరి ఎవరు? మోషే గారి సేవకుడు అనగా సర్వెంట్! ఎఫ్రాయిమీయుడు గాని ప్రత్యక్ష గుడారములోనే ఉండేవాడు! అదే ఆయనను అనగా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ గడపాలి అనే తపనే ఆయనను గొప్ప తిరుగులేని నాయకుణ్ణి చేసింది. ప్రియ సేవకుడా/ విశ్వాసి! నీకు నాకు ఇలాంటి ఆత్రుత, తెగింపు, త్యాగం కావాలి. అప్పుడే సేవలో జయం పొందగలవు! దేవునికోసం వాడబడగలవు!
ఇక మరో అర్ధం ఏమిటంటే దేవుని కృపను, రక్షణను పొందుకున్న నీవు, దానిలో స్థిరంగా నిలిచియుండాలి. ఇటూ అటూ తిరిగితే నరకానికి పోతావు. కుక్క తనవాంతికి, కడుగబడిన పంది బురదకు మల్లినల్టు మరల కూడదు! 2పేతురు 2:22; అలా చేస్తే వారిని వర్షం లేని మేఘాలతోనూ, రెండుమార్లు చచ్చిన చెట్లతోనూ పోల్చారు. యూదా 1: 12,13
వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు (మూలభాషలో-మేపుకొనుచు), మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను;
తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.
ప్రియ స్నేహితుడా! నీవు పొందుకున్న కృపలో నిలిచియుంటున్నావా లేక లోకాశాలతో లోకం లోనికి చూస్తున్నావా? అయితే ఇలా కృపలో నిలిచియుండాలి అంటే షడ్రక్, మేషక్, అబెద్నేగోలకు శ్రమలు వచ్చినట్లు వస్తాయి. అయితే వాటిని తట్టుకుంటే అభిషేకం వెంబడి అభిషేకం పొందగలవు! ఇదేం భక్తిరా అన్ని కష్టాలే అని వెనుదిరిగితే నీ గతి అధోగతే! అందుకే ప్రకటన గ్రంధంలో ఇదిగో నేను దొంగవలె వస్తున్నాను. నీకు కలిగినది గట్టిగా పట్టుకో అంటున్నారు! 2:25; 3:11;
అంతేకాదు పౌలుగారు ఇంకా చెబుతున్నారు ఇలా అభిషేకం, కృప పొందుకున్న తర్వాత నీవు మహిమను పొందుకుంటావు ఆ మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడాలి అంటే తప్ప కలిగే శ్రమలయందు సోలిపోకూడదు! శ్రమ దినమందు నీవు క్రుంగి పోతే చేతకాని వాడవు అని బైబిల్ సెలవిస్తుంది. సామెతలు 24:10;
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు పొందుకున్న కృపను, అభిషేకాన్ని నిలబెట్టుకో! అందులోనే నిలిచియుండు! ఆయన సన్నిధిలో ఆనందించు! అప్పుడు నీవు దేవుని సన్నిదిలో గల దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలవు.
కృప వెంబడి కృపను, అభిషేకం వెంబడి అభిషేకాన్ని, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని పొందుకోగలవు!
మరి నీకు అవి కావాలా?
అయితే ఆయన చెప్పినట్లు చేయు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-57వ భాగం*
రోమా 5:3—5
3. ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.
4. మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.
5. అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.
ప్రియులారా! ఇంతవరకు పౌలుగారు ధర్మశాస్త్రం, విశ్వాసం అంటూ చెబుతూ ఇప్పుడు హటాత్తుగా శ్రమలు, నిరీక్షణ అంటారేమిటి? కారణం ఎవరైతే విశ్వాస మూలముగా జీవిస్తారో, వెంటనే సాతాను శోధనలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే పౌలుగారు గారు తిమోతికి ఉత్తరం వ్రాస్తూ నా కుమారుడా క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారికి శ్రమలు కలుగును అంటున్నారు. 2తిమోతి 3:12; గమనించారా ఎవరైతే సద్భక్తితో ఉండాలి అనుకుంటారో వారికే శ్రమలు! ఏదో ఆడుతూ పాడుతూ ఉంటూ, ఆదివారము నాడే భక్తిచేస్తూ, మిగిలిన రోజులు లోకంలో కలిసిపోయే ఈ ఆదివారం భక్తులకు శ్రమలు రానేరావు! అయితే ఎవరైతే భక్తిగా, విశ్వాసంగా ఉంటూ, క్రమం తప్పకుండా ఆరాధనకు, అన్ని కూటములకు హాజరవుతారో వారికి తప్పకుండా శ్రమలు విస్తరిస్తాయి. యేసుప్రభులవారు గాని, శిష్యులు గాని మీరు శ్రమలు అనుభవించిన తర్వాతనే దేవునిరాజ్యమునకు చేరుతారు అని ఎంతస్పష్టముగా చెప్పారు.
ఈ సందర్భంగా ఒక విషయం చెప్పనీయండి: మా సంఘంలో ఒక పనికిమాలిన విశ్వాసి ఉంది. మా నాన్నగారి చేత భాప్తిస్మం తీసుకుంది. ఎప్పుడో నేను పుట్టకముందు దేవుణ్ణి నమ్ముకుంది. ఇప్పుడు వాళ్ళ కోలనీలో, ఇంకా మా ఊరిలో ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. ఏమిటో తెలుసా: కొర్నేలు పాష్టర్ గారు (మాచిన్న అన్నయ్య, 46 సం.లు) అంటారు గాని ఎప్పుడూ మందిరానికి వస్తూ ఉండాలి, అప్పుడే దేవుడు ప్రేమిస్తాడు అంటారు గాని, అలా చేస్తే కష్టాలు వచ్చేస్తాయి. దేవుణ్ణి ప్రేమించి- ప్రేమించినట్లుండాలి, అంటి అంటినట్టుండాలి. అప్పుడప్పుడు గుడికి వస్తూ పోతూ ఉండాలి, లేకపోతే కష్టాలు వచ్చేస్తాయి. నేను చూడండి అంటి అంటనట్లు, దేవుణ్ణి ప్రేమించి ప్రేమించనట్లు ఉంటాను. ఇప్పటివరకు నాకు కష్టమంటే రాలేదు, శ్రమలు అంటే రాలేదు చూడండి అని చెడు ప్రచారం చేస్తుంది. ఇలాంటి పనికిమాలిన తప్పుడు బోధలు వింటే నరకానికి పోతారు. దేవుణ్ణి ప్రేమించేవారికి ఆయన చెప్పినట్లు చేసేవారికి తప్పకుండా శ్రమలు కలుగుతాయి. అయితే పౌలుగారు చెబుతున్నారు: ఈ శ్రమలు ఓర్పును కలుగజేస్తాయి; ఓర్పు పరీక్షను తీసుకుని వస్తుంది, (పరీక్ష అనగా శోధనలే కాదు, Temptations , అనగా యేసయ్యను సాతానుగాడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే శోధించినట్లు); ఇక ఈ పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. కొన్ని ప్రాచీన ప్రతులలో నిరీక్షణ అనేమాటకు బదులుగా పరీక్ష శీలమును కలుగజేస్తుంది. శీలము అనగా కేరక్టర్! (నేటి మన దౌర్భాగ్యం ఏమిటంటే ప్రస్తుత మన తెలుగుభాషలో కొన్ని పదాలను ఇంగ్లీష్లో చెబితేనే అర్ధం చేసుకోగలుగు తున్నాం) .ఇంకా అంటున్నారు శ్రమలు యందు అతిశయ పడుచున్నాము!
ప్రియ దైవజనమా! ఈ 5:3—4 వచనాల ప్రకారం మనకు రెండు ప్రశ్నలు మనకు వస్తాయి! 1) దేవునితో విశ్వాసులకున్న సమాధానం ఈ శ్రమలు, శోధనలు భంగం చేస్తాయా? 2) పరలోకం కోసం వారికున్న నిరీక్షణ ఈ శ్రమలు ద్వారా కోల్పోతారా? జవాబు: కానేకాదు! సామెతల గ్రంధకర్త రాస్తున్నారు: శ్రమదినమందు నీవు కృంగిన యెడల చేతకానివాడవౌదువు! 24:10; పౌలుగారు చెబుతున్నారు: శ్రమల యందే విశ్వాసం అధికమవుతుంది. ఫలం ఎక్కువవుతుంది. కాబట్టి ఈ శ్రమలను బట్టే నేను అతిశయపడతాను అంటున్నారు అనేకమార్లు పౌలుగారు! నా నిమిత్తం జనులు ముంమును నిందించి, హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు! సంతోషించి ఆనందించుడి, అప్పడు పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నారు యేసుప్రభులవారు! మత్తయి 5:11,12; ;
యాకోబుగారు అంటున్నారు .
1:12,13,14
12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవుని చేత శోధింప బడుచున్నానని అనకూడదు.
14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. . . .;
పేతురు గారు అంటున్నారు:
1పేతురు 3: 14
మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
1 Peter(మొదటి పేతురు) 4:1,2,12,13,14,15,16
1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
2. శరీర విషయములో(శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
13. క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.
14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.
16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.
. ..1కోరింథీయులకు 10: 13
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.
కాబట్టి ఈ విశ్వాసవీరుల భోధల ప్రకారం శ్రమలు, హింసలు, శోధనలు విశ్వాసుల విశ్వాసాన్ని, నిరీక్షణను పెంచుతాయే గాని, వారి విశ్వాసాన్ని ఎంతమాత్రము ఆర్పివేయవు. ఒకవేళ శ్రమలయందు కృంగిపోయి వెనుదిరిగిపోయాడు అంటే నిజంగా ఆ వ్యక్తి నిజమైన మారుమనస్సు, నిజమైన విశ్వాసం పొందుకోలేదు గాని అ వ్యక్తి ముండ్ల మధ్య పడిన విత్తనం లాంటి వాడు! కాబట్టి నిజమైన విశ్వాసి ఈ భాదలను, శ్రమలను మరింత బలమైన నిరీక్షణగా మార్చుకొనే ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసులు తమకు కలిగిన అనుభవాలను బట్టి, శోధనలు బట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ప్రతీశోధనలోను ఒక క్రొత్త పాఠం నేర్చుకుని, ఒకమెట్టు నుండి మరో మెట్టు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, అభిషేకం వెంబడి అభిషేకం పొందుకుంటారు. ఇది ఒకేరోజుకి వచ్చెయ్యదు క్రమక్రమంగా విశ్వాస జీవితంలో నేర్చుకుంటారు. ఒకసారి ఈ వచనాలు బాగా అర్ధం చేసుకునేందుకు స్టడీ బైబిల్ నుండి చదువుకుందాం .
3. అంతేగాక, మన బాధలలో కూడా ఉత్సాహపడుతున్నాం. ఎందుకంటే, బాధ సహనాన్ని కలిగిస్తుందనీ
4 సహనం అనుభవాన్ని కలిగిస్తుందనీ అనుభవం ఆశాభావాన్ని కలిగిస్తుందనీ మనకు తెలుసు.
5 ఈ ఆశాభావం మనకుఆశాభంగం కలిగించదు. ఎందుకంటే, మనకు ప్రసాదించబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం జరిగింది.
చూశారా బాధలు సహనాన్ని పెంచుతాయి; సహనం అనుభవాన్ని కలిగిస్తుంది; అనుభవం ఆశాభావం (నిరీక్షణ) కలిగిస్తుంది. 5వ వచనంలో ఈ ఆశాభావం అనగా నిరీక్షణ మనకు ఆశాభంగం కలిగించదు – అనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు.
ఇక్కడ భాధలు సహనాన్ని పెంచుతాయి అనగా తమకు కష్టాలు, భాధలు సహించగలిగేలా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అనే దృఢమైన విశ్వాసం వారికి కలుగుతుంది తప్ప అవిశ్వాసం, అపనమ్మకం అనేవి వారికి రావు!
హెబ్రీ 10:35—39.
35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.
38. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.
39. అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు(లేక, సంపాదించుకొనుటకు) విశ్వాసము కలిగినవారమై యున్నాము. . . .
కాబట్టి వారికి కలిగే ఘోరమైన భాధలు, శ్రమలలో కూడా దేవుడు తమతో ఎల్లప్పుడూ ఉన్నారని, ఆ నమ్మకంలో దేవుడే వారిని ష్టిరంగా ఉంచుతారని వారు గ్రహిస్తారు.
8:35—39
35. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
36. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము.
37. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,
39. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
ఇక దేవుని పిల్లలు దేవునిమాట వింటారు.
యోహాను 10:27—28
27. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
28. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.
1పేతురు 1:5—7
5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
విశ్వాసుల విషయంలో సహనం లేదా ఓర్పు అనేది మంచి వ్యక్తిత్వాన్ని తీసుకుని వస్తుంది. వారి విశ్వాసానికి పదును పెడుతుంది. ఈ భాధలు, కష్టాలు, విషమ పరీక్షలు అన్నీ ఒర్చుకోవడం విశ్వాసులను మెరుగుపెట్టి వారిని విశ్వాసంలో బలవంతులుగా, విశ్వాస వీరులుగా చేస్తుంది , భవిష్యత్లో అలాంటివి ఎదుర్కోడానికి సంసిద్దులుగా చేస్తుంది. ఉదాహరణ: అభ్రాహాముగారు విశ్వాస వీరుడే గాని ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు ఇస్సాకుని బలి ఇమ్మని పరీక్ష పెడితే ధైర్యంగా బలి ఇవ్వడానికి తయారయ్యారు ఆయన! ఇదీ విశ్వాస వీరుడు అంటే! కారణం ఇస్సాకు వలనైనదే నీ సంతానం, అంతేకాకుండా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలే చేస్తాను, సముద్రతీరమందలి ఇసుకలా చేస్తాను అని వాగ్దానం చేశారు దేవుడు! ఆదికాండం 21:12; 22:17; 26:4; ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరాలి అంటే ఇస్సాకు బ్రతికి ఉండాలి. కాబట్టి ఆయన విశ్వాసం ఏమిటంటే: దేవుడు ఇస్సాకు బలిగా ఇవ్వనీయరు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నారు. ఒకవేళ నిజంగా నేను బలి ఇచ్చినా ఆయన వాగ్దానం నెరవేర్చడానికి చనిపోయిన ఇస్సాకుని తిరిగి లేపుతారు దేవుడు! ఇదీ ఆయన దృడమైన విశ్వాసం! అదే ఆయనను విశ్వాసులకు తండ్రిగా చేసింది! కాబట్టి ఈ ఇస్సాకు—బలి పరీక్ష అబ్రాహాము గారి విశ్వాసాన్ని నీరుగార్చలేదు గాని ఇంకా రాటుదేలిన విశ్వాస వీరుడుగా చేసింది. కాబట్టి అదే పద్దతి మనము కూడా అవలంభిస్తే మనకు కూడా ఈ నిరీక్షణ ఇంకా బలపడుతుంది. తద్వారా మన విశ్వాసం ఇంకా బలపడుతుంది!
(ఇంకాఉంది)
*రోమా పత్రిక-58వ భాగం*
రోమా 5:3—5
3. ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.
4. మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.
5. అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.
ప్రియులారా మనం శ్రమ, ఓర్పు కోసం ధ్యానం చేస్తున్నాం.
ఇప్పుడు మరలా మన పాఠ్య భాగానికి వద్దాం! శ్రమ ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు పరీక్షను తీసుకొస్తుంది. పరీక్ష నిరీక్షణ లేక శీలమును పెంచుతుంది. భక్తుడు పైన చెప్పినట్లు 1పేతురు 4లో అంటున్నారు: మీకు కలిగే శ్రమలు చూసి మీకు ఏవో భయానకమైన శ్రమలు ఊహించనటువంటివి కలిగాయి అనుకోవద్దు, మీరు తట్టుకోలేనంతగా శ్రమలను దేవుడు అనుమతించరు, అంతేకాకుండా శ్రమలు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తారు అంటున్నారు. ఇక శ్రమ ఓర్పు ఎలా . షడ్రక్, మేషక్, అబెద్నేగో, దానియేలు ఈ నలుగురికి ఒకేసారి శ్రమ వచ్చింది. అది వీరిని ఒకేసారి యేహెజ్కేలు గారితోపాటు బందీలుగా చెరలోకి తీసుకుని వచ్చేసి, వారిని concentration కేంపులో పెట్టారు. ఇక ఆగిపోయిందా శ్రమ? లేదు! దేవునికి నిషిద్ధమైన ఆహారం తినమని బలవంతపెట్టారు. దానిని తప్పించుకుంటే, షడ్రాక్, మేషాక్, అబెద్నేగో లను అగ్ని గుండములో వేశారు. దానిని జయిస్తే, దానియేలు గారిని సింహాల బోనులో వేశారు. ఇలా శోధన మీద శోధన ఎన్నో వచ్చాయి. అన్యులనుండి శోధనల కంటే సొంతవారినుండే ఎక్కువగా శోధనలు కలిగాయి. వీటన్నిటిలో ఎంతో ఓర్పుగా సహించారు ఈ భక్తులు!! ఏమయ్యింది? దానియేలు గారు అనేక రాజ్యాలకు ప్రధానమంత్రి అయ్యారు కల్దీయుల కాలంలోను, ఇంకా మాదీయులు కాలంలోనూ! ఇంకా ఈ ముగ్గురు స్నేహితులు గొప్పగొప్ప పదవులలో కొనసాగారు! షడ్రాక్, మేషాక్, అబెద్నేగోలు ఆ రోజు అగ్నిగుండానికి బెదిరిపోయి ఆ బంగారమ్మబొమ్మ కు మ్రొక్కి ఉంటే నేడు ఈ ఘనత వచ్చియుండేది కాదు! దేవుడు ప్రత్యక్షమై ఉండేవారు కాదు. గర్విష్టియైన రాజుకి బుద్ది వచ్చేది కాదు! వారు ఓర్పుగా, విశ్వాసంగా, సహనంగా, ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి అందరూ దేవునికి జేజేలు పలికారు. నేడుకూడా నీవు అదే ధైర్యవిశ్వాసాలు చూపిస్తే నీద్వారా కూడా దేవుని నామము మహిమ పరచబడుతుంది. లేదంటే దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. ఈ 5గురు భక్తులు (అబ్రాహాముగారు, దానియేలు, ముగ్గురు మిత్రులు) శ్రమలలో కృంగిపోలేదు, ఓర్చుకున్నారు; అది వారిని పరీక్షించింది. ఈ పరీక్ష వారి శీలాన్ని బలపరిచింది. వారి విశ్వాసాన్ని దృడపరచింది. దేవునికి మహిమను తెచ్చింది. అందుకే అతిశయ పడుతున్నారు.
కాబట్టి నీవు కూడా శ్రమలయందు ఆనందించే గుణాన్ని కలిగి ఉండాలి.
ఇక 4వ వచనంలో శ్రమలయందు అతిశయపడుదము అంటున్నారు. శ్రమలయందు బాధపడుదము అనడం లేదు అతిశయపడదాం అంటున్నారు. ఇంకా శ్రమలయందు తప్ప నేను మరిదేని విషయంలోనూ అతిశయపడను అంటున్నారు పౌలుగారు!ఏం? ఏం?
కారణం అర్ధమవ్వాలంటే: పౌలుగారు ఆకాంక్ష: క్రీస్తురూపము లోనికి మారిపోవాలని! క్రీస్తునే అనుసరించాలి అని! చివరికి అంటున్నారు రెండవ తిమోతి 4:7,8
7. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
8. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.
ఇంకా తెగించి అంటున్నారు యేసయ్య సవాలు చేసినట్లుగా (నాలో పాపమున్నాదని ఎవడు స్తాపించును) : నేను క్రీస్తుని పోలి నడుచుకొన్న ప్రకారం మీరును నన్ను పోలి నడచుకోనుడి అంటున్నారు. 1కొరింథీ 11:1; గమనించాలి: పౌలుగారు నేను క్రీస్తుని పోలి నడచుకొన్న ప్రకారం మీరును క్రీస్తుని పోలి నడచుకోండి అనడం లేదు, నన్నుపోలి నడచుకోనుడి అని ధైర్యంగా చెబుతున్నారు. మరి పౌలుగారు క్రీస్తుని పోలి ఎలా నడచుకొన్నారు? అన్ని విషయాలలోనూ! సువార్త ప్రకటన విషయంలోనేమి, వాక్య వివరణ, సంస్కరణ విషయంలోనేమి, అద్భుతాల విషయంలోనేమి, శ్రమల విషయంలోనేమి, అన్నింటిలోను క్రీస్తునిపోలి నడచుకొన్నారు. అయితే ఒకటే తేడా యేసుప్రభులవారు మరకొరకు చనిపోతే పౌలుగారు క్రీస్తు సేవ కోసం చనిపోయారు. యేసుప్రభులవారు దేవుడు కనుక చనిపోయి లేచారు. పౌలుగారు మనిషి గనుక చనిపోయారు. ఒకరోజు పునరుత్థాన దినమందు తప్పకుండా మనకన్నా ముందుగా లేస్తారు. అది క్రీస్తుని పోలి నడచుకొనుట! అందుకే ఈ శ్రమలయందు అతిశయ పడుతున్నారు ఎందుకు? క్రీస్తుని పోలి నడచుకుంటూ, క్రీస్తురూపము లోనికి మారిపోతున్నాను అని! అలాంటి శ్రమలయందు అతిశయ పడే, శ్రమలయందు ఆనందించే గుణము, భాగ్యము మనకు కావాలి!
ప్రియ స్నేహితుడా! అలాంటి గుణం నీకుందా? అయితే నీవు ధన్యుడవు!
ఇక 5వ వచనంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు అంటున్నారు. నిజంగా ఇది చాలా దొడ్డమాట! నాకు నచ్చినమాట! దైవజనుడు యేసన్న గారికి ఎంతో నచ్చినమాట: ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు! అవును అబ్రాహాము గారి నిరీక్షణ అతని కొడుకుని బలికోరింది. అయితే ఆ నిరీక్షణ ఆయనను సిగ్గు పరచలేదు. విశ్వాసవీరుడుగా మార్చింది. దానియేలు గారికి, అతని ముగ్గురు స్నేహితుల యొక్క విశ్వాసం, నిరీక్షణ వారిని ఎన్నో శ్రమలకు గురిచేసింది. గాని వారిని అవమానాల పాలు చేయలేదు, సిగ్గు పరచలేదు. దేవుడు అసాధారణ రీతిలో ప్రత్యక్షమై వారిని రక్షించారు. సింహాల నోరు మూశారు. అగ్ని గుండమును AC రూముగా మార్చేశారు. ఈ నిరీక్షణ వారిని ఘనపరచిందే గాని సిగ్గు పరచలేదు!
ప్రియ స్నేహితుడా! నీకున్న నిరీక్షణ వలన, శ్రమల వలన నీకు 100% శ్రమలు వస్తాయి. అయితే నీవు గమనించాలి: ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు,
ఆ నిరీక్షణ మీద ఆనుకొన్నావా: పరలోకం ఖాయం!
వెనుదిరిగావా! నరకం తధ్యం!
అబ్రాహాముగారి విశ్వాసం, త్యాగం, దానియేలు-షడ్రక్-మేషక్-అబెద్నేగోల విశ్వాసం నిరీక్షణ దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-59వ భాగం*
రోమా 5:6—8
6. ఏలయనగా మనమింక *బలహీనులమై యుండగా*, క్రీస్తు యుక్తకాలమున *భక్తిహీనులకొరకు* చనిపోయెను.
7. నీతి మంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.
8. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను *పాపులమై* యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. . .
ప్రియులారా! ఈ వచనాలలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం ఇంకా బలహీనులముగా ఉండగా, ఇంకా ముందుకు వెళితే పాపులమై యుండగా, ఇంకా చదువుకొంటే భక్తిహీనులుగా ఉండగా క్రీస్తు మనకొరకు చనిపోయారు అంటున్నారు పౌలుగారు. నీతిమంతులు, మంచివారి కోసం కూడా ఒకరు చనిపోవడం అరుదు. అలాంటిది మనలో ఏ మంచి లేకపోయినా సరే, క్రీస్తు మనలను ప్రేమించి మనకొరకు తను చనిపోయారు. ఎందుకంటే మనయెడల తన ప్రేమను వెల్లడి చేయడానికి మాత్రమే!
ప్రియులారా ఈ 6—8 వచనాలలో మనం విశ్వాసులం కాకముందటి స్తితిని గురుంచి వివరిస్తున్నారు పౌలుగారు! అవును మనం ఒకానొకప్పుడు పాపులం, భక్తిహీనులం, బలహీనులం ! ఇక 10వ వచనంలో మరొకటి చెబుతున్నారు దేవునికి విరోదులం! ఇలాంటి స్తితిలో దేవునితో వైరంగా ఉన్నమనలను క్రీస్తు రక్తం ద్వారా సంధిచేసి మనలను పవిత్రులనుగా, నీతిమంతులుగా, బలవంతులుగా చేశారు దేవుడు! బైబిల్ గ్రంధం మొదటినుండి చూసుకుంటే మనం అనగా మానవజాతి మొదటినుండి చెడ్డది. ఆదికాండం 6,7,8 అధ్యాయాలు. యిర్మియా గ్రంధంలో 17:9 హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అంటున్నారు. మత్తయి 7:11 లో యేసయ్య చెబుతున్నారు మనం చెడ్డవారం! రోమా 3:23 లో ఏ భేదమును లేదు అందరునూ పాపం చేశారు అంటున్నారు. ఇలా చెడ్డవారంగా ఉన్నప్పుడు , మనం విశ్వాసులం కానప్పుడు మనకు నిజమైన దేవుడు మన జీవితాలలో లేడు! నిజదేవుని కన్నా మన పాపాలనే ఎక్కువగా ప్రేమించాము. ఇది దేవునితో వైరము కలిగించింది. కారణం దేవునికి పాపం అంటే పరమ అసహ్యం! అందుకే యెషయా గ్రంధంలో రక్షించనేరకయుండునట్లు యెహోవా హస్తం కురుచకాలేదు అంటూ, మీ పాపములు మీకును దేవునికి అడ్డం వస్తున్నాయి అంటున్నారు. యెషయా 59:1,2; అందుకే కీర్తనాకారుడు నేను నా తల్లిగర్భమందు పాపిగా పుట్టాను. అనగా నా జన్మలోనే పాపం ఉంది అని ఒప్పుకుంటున్నారు. ఇలాంటి పాపులమై దేవునికి వ్యతిరేఖంగా ఉంటున్న మనం దేవుని దగ్గరకు రాకుండా లోకంతోనే స్నేహం చేస్తూ ఇంకా దేవునితో వైరం పెంచుకున్నాం. యాకోబు 4:4
వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ....
ఇలా దేవునికి దూరమై పోతుండగా మనకు మనం మంచివారుగా మారడానికి, పాపమును విడిచిపెట్టడానికి, దేవునితో తిరిగి సఖ్యం పెంచుకోడానికి మనకు మనకు శక్తి లేకపోయింది. ఇవి మనకు అసాధ్యాలుగా మారిపోయాయి! కొన్నిసార్లు మనుషులు ఉపయోగించే ముక్తిమార్గాలు ప్రయత్నం చేశాము, అనగా జ్ఞానమార్గం, కర్మ మార్గం, భక్తిమార్గం కూడా ప్రయత్నించాము గాని పవిత్రులం కాకపోయాము. దేవునితో సన్నిహితం పెరగలేదు! ఇలాంటి ఆసాధ్యమైన స్తితిలో మనం చేయలేని దానిని దేవుడు మనలను ప్రేమించి తానే చేశారు. క్రీస్తువచ్చి మన స్థానంలో తానే చనిపోయారు. తానే తనరక్తంతో మన పాపాలకు పరిహారం చేసి, మన పాపాలను తొలగించేశారు. ఎప్పుడైతే మనం ఆయనను నమ్మి స్వంత రక్షకునిగా అంగీకరించామో ఆయన రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా నిర్దోషులుగా చేశారు. అంతేకాకుండా దేవునితో ఉన్న వైరమును తొలగించి, మనలను స్నేహితులుగా, వారసులుగా చేసుకున్నారు. (10 వ వచనం). మన అనుభవ దృక్పదాన్ని మార్చేశారు. తన ఆత్మను మనలో ఉంచి మనలను నూతన సృష్టిగా చేశారు. ఇది కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే! ఇది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమయ్యింది.
బైబిల్ లో ఉపయోగించిన పదాలు నిజంగా అమూల్యమైనవి. ఇక్కడ 6వ వచనంలో మనమింకా పాపులమై బలహీనులమై యుండగా క్రీస్తు చనిపోయెను అనడం లేదు గాని, భక్తిహీనులమై , బలహీనులమే యుండగా *యుక్తకాలమున* క్రీస్తు చనిపోయెను అంటున్నారు. గమనించాలి. ఆదికాండం మొదటినుండి చూసుకుంటే మొదటినుండి మానవజాతి పాపులే! గాని అప్పుడు క్రీస్తు మనకోసం చనిపోలేదు గాని యుక్తకాలమందు అనగా సరియైన సమయంలో క్రీస్తు మనకోసం చనిపోయారు. దేవుని పని, దేవుని సమయంలో, దేవుని విధానంలో జరుగుతుంది. మనం తొందర పడకూడదు. ఇశ్రాయేలీయులు చెరలో బాధపడుతున్నారు అని దేవునికి తెలుసు. గాని మోషేను ఏర్పరచుకుని, 40 సంవత్సరాలు రాజవిధ్యలు, యుద్ధ నైపుణ్యం, రాజనీతి అన్నీ నేర్పించి, ఆ తర్వాత పశువుల మంద దగ్గర 40 సంవత్సరాలు మరో రకమైన ట్రైనింగ్ ఇచ్చి, ఆ పిదప యుక్తకాలమందు మరలా ఐగుప్తుకి పంపించారు దేవుడు! అది యుక్తకాలం. అందుకే దేవుడు చెబుతున్నారు:
.2కోరింథీయులకు 6: 2
అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
ఇక పౌలుగారు చెబుతున్న మరోమాట: మంచివారి కోసం/ నీతిమంతుల కోసం ఒకడు చనిపోవడం అరుదు. అలాంటిది మనం పాపులమై యుండగా క్రీస్తు మనకొరకు చనిపోయారు.. అవును మనం స్వాభావికముగా పాపులం! ఏమంచి మనలో లేదు గాని క్రీస్తు తానే తన ప్రేమను వెల్లడి పరచి మనకోసం చనిపోయారు. ఈ కృపను మనకు ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా ఇచ్చారు కదా అని నీవు పొందుకున్న రక్షణను కాలితో త్రొక్కేస్తున్నావు. నీవు కష్టపడితే దానివిలువ తెలిసి ఉండేది. ఆయన దానిని సంపాదించదానికి ఎంతో కష్టపడ్డారు. సిలువమరణం పొందారు. కొరడా దెబ్బలు తిన్నారు. పిడిగుద్దులు తిన్నారు. ఉమ్మి వేయించు కున్నారు. తన మహిమను విడచి పెట్టి సామాన్య మానవునిగా మనం పడే కష్టాలన్నీ మనకోసం పడ్డారు. చివరకు నీకోసం నాకోసం తన అమూల్యమైన పవిత్ర రక్తం చిందించి మనలను పాపము నుండి విడుదల చేసి, నీవు ఏమి రుసుమ చెల్లించకుండా రక్షణను ఉచితంగా ఇస్తే దానిని కాలితో త్రొక్కుతావా? ఇలా చేసి బ్రతకగలవా? 1 Peter(మొదటి పేతురు) 1:18,19
18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా మరి దీనికి ఫలితం ఏమిటో తెలుసా? నిత్య నరకం!
Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6
4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై
5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,
6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
కాబట్టి జాగ్రత్త! నేడే పశ్చాతాపం పొంది, నీ పాపములను ఒప్పుకుని తిరిగి దేవుని దగ్గరకు రా!
లేకపోతే ఆ ఘోరమైన భాదలు నీవు పడలేవు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-60వ భాగం*
రోమా 5:9—11
9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.
10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
11. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము. . .
ప్రియ దైవజనమా! ఈ 6—8 వచనాలకు కొనసాగింపుగా ఇంకా ఈ 9—11 వచనాలలో దేవుని ప్రేమకోసం ఇంకా వివరంగా రాస్తున్నారు. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రతనుండి రక్షించబడుదుము. ఎందుకు ఉగ్రత వచ్చింది మనం ఆయనకు శత్రువులమై యున్నాము అయితే దేవుని తనకుమారుని లోకమునకు పంపించి ఆయన మరణం ద్వారా మనం దేవునితో సమాధానం పరచబడుతున్నాం . ఎప్పుడైతే దేవునితో సమాధాన పరచబడుతున్నామో యేసుక్రీస్తు ప్రభులవారు జీవిస్తున్నారు కాబట్టి మనం కూడా రక్షించబడతాము . అంతేకాదు ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్తితి పొందియున్నాము అంటున్నారు.
వివరంగా చూసుకుంటే; 9వ వచనంలో అయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటున్నారు. ఆయన రక్తము వలన అంటారేమిటి? నిజం చెప్పాలంటే దేవునిప్రేమ ఆయన సిలువ దగ్గరే వెల్లడి అయింది. పిడిగుద్దులు గుద్దినా, ముళ్ళ కిరీటం పెట్టినా, సిలువ మోయించినా, అపహాసం చేసినా, కొరడా దెబ్బలు కొట్టినా, ఓర్చుకుని చివరకు వారు చేసినదానికి వారి మీదకు భయంకరమైన ఉగ్రత శాపం వస్తాదని దేవుడు గ్రహించి—యేసుప్రభులవారు అంటున్నారు సిలువలో: తండ్రి! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము! ఎంత ప్రేమ స్వరూపి అండి మన యేసయ్య! ఎంత ప్రేమ! ఎంత త్యాగం!!! అలా ప్రారంభమైన ఆ ప్రేమ యుగం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇలా క్రీస్తు సిలువ దగ్గర వెల్లడి అయిన దేవుని ప్రేమ మీద ఆధారపడి జీవిస్తున్న మనకు నేర్పుతున్న విషయాలేమిటంటే: విశ్వాసులింకా అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఆయనకు శత్రువులుగా ఉండగానే క్రీస్తు వారికోసరం చనిపోయారు. కాబట్టి ఈ విషయం తెలుసుకుని పశ్చాత్తాప పడి పాపములు ఒప్పుకుని, ఆయనే నిజమైన దేవుడని, రక్షకుడని ఒప్పుకుంటే వారిని పవిత్రపరిచి, శుద్దులుగా చేసి, నీతిమంతులుగా తీర్చుతారు, ఇంకా ఆయన స్నేహితులుగా చేస్తారు. ఇది తిరుగలేని సత్యం! అంతేకాకుండా రక్షించబడిన ఇలాంటి విశ్వాసులను అదే రక్షణ స్తితిలో ఉంచుతూ, వారికోసం తాను చనిపోయినప్పుడు ఆరంభించిన పనిని ఆయన పూర్తిగా ముగిస్తారు అనేది కూడా తిరుగులేని సత్యం! అయితే ఇక్కడ దేవుని కోపం అనేది వాక్యం వినికూడా రక్షించబడకుండా ఉన్నవారిమీద , ఇంకా రక్షించబడిన తర్వాత వెనుకడుగు వేసిన వారు ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నారు కనుక వారిమీదకు దేవుని పవిత్ర కోపం రాబోతుంది.
రోమా 2:5,8
5. నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
ఎఫెసీ 5:5—6
5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి(మూలభాషలో-అవిధేయత కుమారుల మీదికి) వచ్చును
కొలస్సీ 3:6
వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును.
ప్రకటన 6:16—17
16. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
అంతేకాదు యేసుప్రభులవారు విశ్వాసులందరినీ ఆ కోపం నుండి రక్షిస్తారు.
1థెస్సలొనికయులకు 1: 10
దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.
1థెస్సలొనికయులకు 5: 9
ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు దేవుని కోపం నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఇంకా 10వ వచనంలో మనం దేవునికి విరోదులమై ఉన్నప్పుడు తనకుమారుని మరణం ద్వారా మనలను దేవునితో సఖ్యపరిచారు/ సమాధాన పరిచారు. ఎప్పుడైతే ఇలా సఖ్యపడతామో అప్పుడు మరింతగా ఆయన కుమారుని ద్వారా విముక్తి కలుతుతుంది కారణం ఈ విముక్తికి నాంది పలికిన క్రీస్తు జీవిస్తున్నారు కాబట్టి ఈ నిభందనను ఆయన మరచిపోరు. దేవునికి నిత్యమూ జ్ఞాపకం చేస్తుంటారు.
ఇక దేవునితో సమాధాన పడటం కోసం విస్తారంగా బైబిల్ లో వ్రాయబడింది.
2కొరింథీ 5:18—212 Corinthians(రెండవ కొరింథీయులకు) 5:18,19,20,21
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.
20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము.
21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
10వ వచనంలో దేవుడు జీవిస్తున్నాడు కనుక మనకు రక్షణ ఉంది అంటున్నారు. యేసుప్రభులవారి మాటలలో ఇదే చెప్పబడింది
యోహాను 11:25
25. అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
26. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. .. .
14:19
అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. . .
విశ్వాసులు ఆయనజీవముతో ఏకమయ్యారు
యోహాను 17:21,23
21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
కొలస్సీ 3:3—4
3. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
4. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.
అంతేకాదు వారికోసం అనగా విశ్వాసుల కోసం విజ్ఞాపనలు చేయడానికి ఆయన శాశ్వతంగా జీవించే ఉంటారు
రోమా 8:34
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే
హెబ్రీయులకు 7: 25
ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
అందువల్ల వారు అంతం వరకు క్షేమంగా భద్రంగా ఉంటారు. *అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే విశ్వాసులు నమ్మడం మానుకుంటే ఏం జరుగుతుంది? వారు నశించిపోతారా*? దీనికి పౌలుగారు చెబుతున్నారు: వారు నశించిపోతారు అనడం లేదు. *వారికి విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ కలుగజేసిన దేవుడు, అంతం వరకు అదే నమ్మికలో, విశ్వాసం కొనసాగేలా చేస్తారు*. ఉదా: లూకా 22:31—32; ఫిలిప్పీ 1:4.
మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. . . .;
అయితే విశ్వాసులను సంరక్షించేందుకు భద్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న దేవుడు వారి విశ్వాసం అనే ఈ అత్యంత ప్రాముఖ్యమైన విషయంలో వారు తప్పిపోకుండా కాపాడడు అనేది సత్యదూరం! అయితే ఇలా అనుకుని గర్వించి, బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే, నేను పాపం చేయను అనుకుంటూ పాపం చేస్తూ, తప్పులు చేస్తున్న దేవుడు శిక్షంచకుండా ఉంటే దేవుడు నా పాపములు అంగీకరించారు అని అనుకోవడం బుద్ధిహీనం! అలాంటప్పుడు వారి నాశనం కునికి నిద్రించదు! కాబట్టి నీవు పొందుకున్న రక్షణ, విశ్వాసం అనేది దేవుడు కాపాడుతారు. అదే సమయంలో నీ ప్రవర్తన కూడా విశ్వాసులకు మాదిగిగానే జీవించాలి గని ఇక పాతరోత జీవితమును జీవించకూడదు!
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక – 61వ భాగం*
రోమా 5:12—14
12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.( మూలభాషలో-అందరి ద్వారా వ్యాపించెను)
13. ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
14. అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను,
ప్రియులారా ఈ వచనాలలో ఒక మనుష్యుని ద్వారా పాపము , పాపము ద్వారా మరణం లోకంలో ఎలా వచ్చిందో అలాగే మనుష్యులందరూ పాపం చేసినందువలన అందరికీ మరణం సంప్రాప్తమయ్యింది అంటున్నారు. ఇంతకీ ఆ మనుష్యుడు ఎవరు? మనందరికీ తెలుసు ఆ మనుష్యుడు ఆదాముగారు. ఆయనద్వారా ఈ మానవాళి మొత్తానికి పాపం అంటుకుంది.
ఈ 12—21 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మానవజాతికి మూల పురుషుడు, మానవాళికి ప్రతినిధి ఆదాము గారు, ఇక నీతిమంతులకు, నిర్దోషులుగా ఎంచినవారికి లేక నీతిమంతులుగా తీర్చబడిన వారి ప్రతినిధి యేసుక్రీస్తుపభులవారు! వీరిద్దరికీ గల తేడాలు, పోలికలు ఇక్కడ పౌలుగారు వివరిస్తున్నారు. ఆదాముద్వారా మానవజాతి మొత్తానికి పాపం, ఆ పాపం వలన మరణం వచ్చింది అని మనకు ఆదికాండం ౩వ అధ్యాయంలో చూడగలం! అలాగే క్రీస్తుద్వారా జీవం, నిత్య జీవం, నీతి మానవజాతికి వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఆదాము ద్వారా మనిషికి మరణం సంప్రాప్తమయ్యింది. ఇది ఖాయం! అలాగే యేసుక్రీస్తు ద్వారా అందరికీ జీవం, నిత్యజీవం కలుగుతుంది ఇదీ మరింత ఖాయం! ఆదాముగారు పాపంలో, మరణంలో కూరుకుపోయినందు వలన కలిగిన ఫలితాలను మార్చడానికే దేవుడు తన కుమారుడైన క్రీస్తుయేసును ఈ భూమిమీదకు పంపించి ఆయన చేసిన త్యాగం వివరించడమే ఈ వచనాలలో వ్రాయబడింది.
మొదటి మనిషి పాపం చేసి పాపి అయ్యాడు. ఎలా పాపి అయ్యాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం! 1యోహాను 3:4; మరి ఏ ఆజ్ఞను అతిక్రమించారు ఆదాము గారు? ఆదికాండం 2:17 . తినవద్దన్న ఫలము తిని ఆజ్ఞను మీరారు. తద్వారా పాపిగా మారారు. అయితే బైబిల్ చెబుతుంది పాపము వలన వచ్చుజీతం మరణం అది నిత్య నరకం! కాబట్టి ఇప్పుడు సమస్త మానవాళి పాపులే, మరణ పాత్రులే! ఆదాము ఒక్కడు పాపం చేస్తే మానవాళి మొత్తం పాపం చేసినట్టా అంటే అవును! కారణం ఆదికాండం 4:1 ప్రకారం ఆదాము తనపోలికలో కయీనును కన్నాడు అని వ్రాయబడింది. అప్పటికే ఆదాము పాపి అని నిర్దారించబడ్డారు. కాబట్టి పాపి కొడుకు పాపి! ఆదికాండం ౩:1—19 ప్రకారం, 8:21; కీర్తన 51:5; 58:3; యిర్మియా 17:9 ప్రకారం మానవుడు మొదట నుండి వారి ఊహలు అన్నీ పాపభూయిష్టమైనవే! కాబట్టి ఈ పాపం ఒకతరం నుండి మరో తరానికి అంటువ్యాధిలా సోకిపోయింది. ఈ పాపరోగం రోమా 6:23 ప్రకారం మరణానికి దారితీసింది.
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
.. . ఇంకా చెప్పాలంటే *ఆదాములో* మనుషులంతా పాపం చేశారు. ఎందుకంటే ఆదాము గారు పాపం చేసినప్పుడు మానవజాతి మొత్తం అతనిలో ఉంది. ఇది అర్ధం కావాలంటే హెబ్రీ 7:8—10 అర్ధం కావాలి.
8. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.
9. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.
10. ఏలాగనగా మెల్కీ సెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. . . . . కాబట్టి ఇదే పోలికలో మానవాళి మొత్తం పాపానికి, మరణానికి గురయ్యింది. ఆదాము చేసినది మనుష్యులంతా అతనిలో ఉండి చేసినట్టే! కారణం ఆ సమయంలో భూమిపై ఉన్నవారు ఆదాము మారియు హవ్వలే! వీరిద్దరూ పాపులే కాబట్టి మానవజాతి మొత్తం పాపులే!
ఇక 13వ వచనం చూసుకుంటే ధర్మశాస్త్రం రాకముందు కూడా పాపం ఉంది గాని అది పాపము అని లెక్కలోకి రాలేదు లేక అది పాపము అని నిర్ధారించబడలేదు. కారణం ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే పాపం అంటే ఏమిటి, ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యకూడదు అనేది తెలిసింది. కాబట్టి ధర్మశాస్త్ర లేనప్పటికీ ఆదామునుండి మోషే వరకు చావు రాజ్యమేలింది. ఎందుకంటే ఆదాముచేసిన ఆజ్ఞాతిక్రమం వలన, ఆదాముచేసిన పాపం లాంటిది చేయనివారి మీద కూడా ఈ చావు ఏలింది! చివరకు ఏ పాపము చెయ్యని చంటి పిల్లలకు కూడా చావు వచ్చింది. పాపం రాజ్యమేలింది. తద్వారా చావు రాజ్యమేలింది. వీరు ఎలాంటి ఆజ్ఞను మీరలేదు అయినా చావు రాజ్యమేలింది. అలాంటి పాపం చేయనివారిమీద చావు రాజ్యమేలడం ఏమిటి అంటే పైన వివరించిన విధముగా ఆదాము ద్వారా సంక్రమించిన పాపం ఒక అంటువ్యాదిలా తరతరాలకు అది అంటుకుంటూ వస్తుంది.
ఇక్కడ మోషేవరకు మాత్రమే చావు రాజ్యమేలింది అన్నారంటే బహుశా మోషేగారి దగ్గరనుండి బల్యర్పణలు ప్రారంభమయ్యాయి, పాప పరిహారార్ధబలి లాంటి చాలా రకాలైన బలులు ప్రారంభమయ్యాయి. కాబట్టి మోషేగారి కాలం వరకు ఈ పాపాలకు పరిహారంగా బలులు చెల్లించబడలేదు. అందుకే ఆదాము నుండి మోషే వరకు చావు రాజ్యమేలింది అంటున్నారు.
అంతేకాకుండా ఆ తర్వాత మాటలలో ఆదాముగారు రాబోయేవానికి గురుతుగా ఉన్నారు అంటున్నారు. ఏ రకంగా గుర్తుగా లేక పోలికగా ఉన్నారు అంటే ఆదాము అవిదేయతకు ప్రతీకగా మానవాళి మొత్తానికి చావును/ మరణాన్ని/ పాపాన్ని తీసుకొస్తే, కడవరి ఆదాము అని పిలువబడే (1కొరింథీ 15:45) యేసుక్రీస్తు ప్రభులవారు చూపించిన విధేయత వలన నిత్యజీవము/ జీవము లోకం లోనికి వచ్చింది. కాబట్టి ఈ రకంగా ఆదాముగారు రాబోయే యేసయ్యకు సూచనగా ఉన్నారు అంటున్నారు పౌలుగారు. అంతేకాని పాపం విషయంలో , అజ్ఞాతిక్రమంలో గాని ఎంతమాత్రము యేసయ్య ఆదాము కి పోలికగా లేరు. బైబిల్ మొత్తం యేసుప్రభులవారు పాపం చెయ్యలేదు అని చెబుతుంది. యేసుప్రభులవారు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసిరారు. యోహాను 8:46;
2 కొరింథీ 5:212
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
హెబ్రీ 4:15
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
7:26
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)
1పేతురు 2:22
ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
కాబట్టి యేసయ్య పాపం అనేది చేయలేదు. ఆదాము క్రీస్తుకి ఏ రకంగా పోలికగా ఉన్నారు అంటే ఆదాము అవిధేయత వలన కోటానుకోట్ల ప్రజలు చావు/ మరణమునకు ఎలా గురయ్యారో, అలాగే క్రీస్తు చూపించిన విధేయత వలన కోటానుకోట్ల మంది జీవమునకు వచ్చారు. 15వ వచనం ప్రకారం *ఆదాములో* ఉన్నవారంతా అతనిమూలంగా చనిపోవాలి. *క్రీస్తులో ఉన్నవారంతా క్రీస్టు మూలంగా జీవిస్తారు (18,19 వచనాలు)
కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? క్రీస్తునా లేక ఆదామునా? దేవుని మాటకు విధేయత చూపిస్తే నీవు క్రీస్తును అనుసరిస్తున్నట్లే—అలా చేస్తే మీరు జీవాన్ని అనుసరిస్తున్నట్లు! పొరపాటున దేవునిమాటకు విధేయత చూపించక పోతున్నట్లయితే జాగ్రత్త! మీరు ఆదామును అనుసరిస్తున్నారు అనగా మరణమును/ చావును అనుసరిస్తున్నారు. ఆ మరణం శారీరకమైనది కాదు! ఆత్మీయ మరణం! దాని ఫలితం అగ్ని ఆరదు పురుగు చావదు! యుగయుగాలు ఆ నరకంలో కాలుతూ ఉండాలి. అందుకే బుద్ధిమంతుడైన వాడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు పైనున్న పరమునకు పోయే దారిని అన్వేషిస్తాడు అని సామెతల గ్రంధకర్త రాస్తున్నారు! నీవు క్రిందన్నున్న పాతాల మార్గం అనుసరిస్తావా? పైనున్న పరమునకు పోయే దారిని అన్వేషిస్తావా?
ఏం కావాలో కోరుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక – 62వ భాగం*
రోమా 5:15—17
15. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ పచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.
16. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.
17. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. . . .
ప్రభువునందు ప్రియులకు, పరిశుద్దులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామంలో శుభాది వందనాలు. బాగున్నారా?
మరలా చాలా రోజులకు ఇలా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.
ఇంతవరకు మనం ఈ రోమా పత్రిక ధ్యానం లో అపొస్తలుడు అనగా ఎవరు, పౌలు గారి ప్రార్థన, దేవుని రక్షణ సిధ్ధాంతం/ ప్రణాళిక, అబ్రాహాము గారి జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఈ సిద్ధాంతాన్ని వివరించారు, ఇంకా సువార్త భారం, మరణపాత్రులు, దేవుని తీర్పు కోసం చాలా వివరంగా ధ్యానం చేసుకున్నాము.
ఇక గత 61వ భాగంలో మొదటి ఆదాము కడపటి ఆదాము గార్ల కోసం ధ్యానం చేసుకున్నాం.
ప్రియులారా! ఇక ఈ మూడు వచనలాలో ఇంకా ఈ అధ్యాయం మొత్తం ధ్యానం చేస్తే మనకు మూడు మాటలు విస్తారంగా కనిపిస్తాయి. అవి కృపావరము, కృపాదానము, కృపాబాహుళ్యము. ఈ మూడు వేర్వేరు అర్ధములిచ్చులాగున ఒకే విషయం కోసం పౌలుగారు చెప్పారు. అది ఏమిటంటే దేవుడిచ్చే నిత్యజీవం కోసం. ఇంకా చెప్పాలంటే దేవుడు ఉచితంగా, ఆయన కృపాభాహుళ్యం చొప్పున మానవులందరికీ ఇచ్చిన రక్షణతో కూడిన నిత్యజీవం. ఇదే ఆ దానము. ఎందుకు దానమయ్యింది అంటే అది ఆయన ఉచితంగా ఇచ్చారు కాబట్టి. ఎందుకు బాహుళ్యం అయ్యింది అంటే అర్హత లేని మనకొరకు ఆయన చనిపోయి, మనశిక్ష ఆయన భరించి ఉచితముగా ఇచ్చారు కాబట్టి అది ఆయన కృపాబాహుళ్యం. ఈ ఉచిత కృపావరం కోసం ఇంకా విస్తారంగా 17 వచనం, 6:23..; ఎఫెసి 2:8—9 చూడవచ్చు.
ఇక ఈ మూడు వచనాలలో పౌలుగారు ఏమంటున్నారు అంటే .. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ పచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను......
ఆదాముగారు చేసిన అపరాధం వలన సమస్త జనులకు పాపము శాపము వచ్చినట్లు ఈ ఉచిత కృపావరం రాలేదు అంటున్నారు. ఒక్కమనిషి అపరాధం వలన అనేకులకు చావు కలిగింది గాని యేసుక్రీస్తు అనే మనిషి వలన వచ్చే ఉచిత కృపావరం దేవుని అనుగ్రహం మరి నిశ్చయముగా అనేకులకు విస్తరించాయి అంటున్నారు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా 6:23 లో చెప్పబడినట్లు పాపానికి వచ్చే జీతం మరణం అయితే పాపానికి బానిసలుగా లేక సేవకులుగా ఉండటానికి, దేవునికి సేవకులుగా లేక బానిసలుగా ఉండటానికి చాలా తేడా ఉంది. పాపం తన బానిసలకు/ సేవకులకు జీతం ఇస్తుంది- అది 23 వచనం ప్రకారం అది మరణం. ఏ మరణం అంటే దేవునినుండి (దేవుని సన్నిధి నుండి) నిన్ను శాశ్వతంగా దూరం చేసి ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తుంది. చివరకు శారీరక మరణానికి కూడా ఈ పాపం దోహదపడుతుంది. ప్రకటన 21:8; 2 థెస్సలోని 1:8—9; మత్తయి 25:41; అయితే దేవునికి దాసులుగా/సేవకులుగా/ బానిసలుగా ఉంటే దేవుడు నీకు ఇచ్చేది శాశ్వత జీవం. అది ఉచిత కృపావరం. మనిషి చేసే పనులను బట్టి చూస్తే దానికి వారు తగినవారు కారు. అయినా దేవుడు ప్రేమించి ఉచితంగా ఇచ్చారు. ఇక దీనిని అనగా నిత్యజీవాన్ని మరియు రక్షణను మనిషి కొనలేడు. తన సొంత నీతిద్వారా గాని, మంచి పనుల ద్వారా గాని సంపాదించలేడు. అందుకే దేవుడు ఉచితంగా ఇచ్చారు. రోమా 4:4; 5:17; లూకా 17:10; ఎఫేసి 2:8—9; యోహాను 3:16; 4:14;
ఇక్కడ పౌలుగారు శాపం వచ్చినట్లు కృపావరం రాలేదు అని ఎందుకు అంటున్నారు అంటే ఆదాము చేసిన తిరుగుబాటు వలన ఆటోమాటిక్ గా అందరికి ఆదాముగారికి తెలియకుండానే పాపం శాపం సంప్రాప్తమయ్యింది. అయితే కృపావరం/ కృపాబాహుళ్యం మాత్రం ఎంతో కష్టపడి విలువ చెల్లించి సంపాదించినది. శాపం/ పాపం ఇలా అంటే అలా వచ్చింది గాని కృపావరం అనబడే నిత్యజీవం మనిషికి కలగడానికి దేవాదిదేవుడు ఈ భూలోకానికి రావలసి వచ్చింది. ౩౩ సం.లు ఎంతో కష్టపడి జీవించి, ఎన్ని ఇబ్బందులు పడి, సాక్ష్యమును నిలబెట్టుకొని, తన పరిశుద్ధ విలువైన ప్రాణం చిందించవలసి వచ్చింది. అది మనకు ఉచితంగా దేవుడు ఇచ్చారు గాని ఆయనకు ఉచితంగా రాలేదు. వెల చెల్లించాల్సి వచ్చింది.
ఇక ఇదే వచనంలో మరోమాట అనేకులకు /అనేకులు చావు కలిగింది అంటున్నారు. ఇక్కడ *అనేకులు* అనగా ఆదాముగారి సంతానం అన్నమాట! అనగా మనం కూడా! ఏదేను వనం ఆదామవ్వలు చేసిన పాపం వలన అందరూ అనగా ఆదాముతోపాటుగా మానవాళి చనిపోవడం నిశ్చయం. అదేవిధంగా దేవుని కృప మానవాళి అంతటికీ ప్రవహించడం అనేది అంతకంటే మరెక్కువగా నిశ్చయం! *ఇక్కడ అందరికీ పాపవిముక్తి కలుగుతుంది అని కాదు- దేవుని కృప అందరికీ అందుబాటులోకి వచ్చింది అని అర్ధం*. యేసుక్రీస్తులో విశ్వాసం/ నమ్మకం ఉంచితే అలా నమ్మకం ఉంచిన వారంతా విముక్తి/రక్షణ/ నిత్యజీవం పొందుతారు అని అర్ధం. ఉదాహరణ: ఒక వ్యక్తి(మంగల వృత్తి) తన స్నేహితునితో అన్నాడు మీ దేవుడు మంచోడు కాదు. మంచోడు అయితే ఈ లోకంలో ఇన్ని కష్టాలు, మనిషికి ఇన్ని బాధలు , దేశంలో ఇలాంటి భద్రతా లేని పరిస్తితులు ఎందుకు ఉంటాయి అని అడిగాడట! వెంటనే ఆ స్నేహితునికి ఏం చెప్పాలో పాలుపోలేక చిన్న ప్రార్ధన మనస్సులో చేసుకుంటూన్నాడట. ఈలోగా ఒక మతి స్తిమితం తప్పిన పిచ్చి వ్యక్తి అలా నడచుకుంటూ పోతున్నాడు. వానిని చూపించి ఈ స్నేహితుడు అంటున్నాడు: నీవు అసలు మంచి బార్బర్ వి కావు. మంచి బార్బర్ వి అయితే వాడికి అంత పిచ్చితల ఎందుకుంది? బాగా క్రాఫ్ చేసి ఉందువు కదా అన్నాడంట. అందుకు ఆయన అన్నాడు, ఆ మతిస్తిమితం లేని వ్యక్తి నా దగ్గరకు వచ్చి కటింగ్ చేయమని నన్ను అడిగితే కూర్చోబెట్టి ఉచితముగా చేయడానికి నేను సిద్దమే, గాని వాడు రావాలి కదా, వాడు నా దగ్గరకు రాకపోతే నేనేమి చేయగలను ఆన్నాడంట. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు: దేవుడు కూడా అంతే! తన దగ్గరకు వచ్చిన వారినందరినీ రక్షించి, వారిని కాపాడటానికి, వారి జీవితంలో వెలుగు నింపడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అయితే మనిషి లోకమును వదలి ఆయన దగ్గరకు రావాలి. అలా వస్తేనే రక్షణ! అలాగే ఈ రక్షణ కూడా అందరికీ అందుబాటులో పెట్టారు దేవుడు. నీవు కేవలం ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని నీ పాపాలు ఆయన మాత్రమే క్షమించగలరని విశ్వసించి నీ పాపాలు ఆయన రక్తములో కడుగుకొంటే నీకు వెంటనే రక్షణ/ శాశ్వతజీవం! మరినీవు సిద్దమా?
మరి ఇంతగొప్ప రక్షణ పొందుకున్న ప్రియ చదువరీ! నీ బ్రతుకు ఎలా ఉంది? నీ రక్షణను కాపాడుకొంటున్నావా? లేక తుచ్చమైన కోరికలు కోసం ఆ రక్షణతో కూడిన నిత్యజీవాన్ని కాలదన్నుతున్నావా? ఒక చిన్న సిగరెట్టుకోసం రక్షణను తాకట్టు పెడుతున్నావా? 5 నిమిషాల కోరిక కోసం వ్యభిచారం చేస్తున్నావా? చిన్న అబద్దం కోసం దానిని అమ్మేస్తున్నావా? జాగ్రత్త! బైబిల్ ఏమి సెలవిస్తుందో తెలుసా? ఇంతగొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందువు? హెబ్రీ 2:3; ఆ ఉగ్రతను తట్టుకోలేవు సుమీ! నేడే మారుమనస్సు నొంది పశ్చాత్తాప పడి యేసయ్య దగ్గరకు మరల రా! దేవుడు నిన్ను తన దగ్గరకు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-63వ భాగం*
రోమా 5:15—17 .
15. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ పచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.
16. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.
17. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. . . . .
ప్రియులారా! గతభాగం నుండి మనం పై మూడు వచనాలు ధ్యానం చేస్తున్నాము. ఇక ఈ మూడు వచనాలలో పౌలుగారు ఏమంటున్నారు అంటే ఆదాముగారు చేసిన అపరాధం వలన సమస్త జనులకు పాపము శాపము వచ్చినట్లు ఈ ఉచిత కృపావరం రాలేదు అంటున్నారు. ఒక్కమనిషి అపరాధం వలన అనేకులకు చావు కలిగింది గాని యేసుక్రీస్తు అనే మనిషి వలన వచ్చే ఉచిత కృపావరం దేవుని అనుగ్రహం మరి నిశ్చయముగా అనేకులకు విస్తరించాయి అంటున్నారు. ఏవిధంగా అది వ్యత్యాసమైనదో గతభాగంలో చూసుకున్నాం. ఇక ఈ 17 వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు పౌలుగారు! మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. . . . .... . .
మరణము ఒకని అపరాధమూలముగా వచ్చినది ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల. . . . . ఇదే విషయాన్ని 14 వ వచనంలో కూడా పాపము ఏలింది అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మోషేగారి వరకు మరణం రాజ్యమేలింది అంటున్నారు పౌలుగారు. యేసుప్రభులవారు స్వయంగా అన్నారు: పాపము చేయు ప్రతీవాడు పాపమునకు దాసుడు. అంటే పాపం వారిని ఏలుతుంది. యోహాను 8: 34
అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
క్రీస్తుని తెలుసుకొనక మునుపు మనం కూడా అదే పాపమనే దాస్యంలో మ్రగ్గిన వారమే! అందుకే పౌలుగారు మరల ఆ పాపదాస్యమనే సంకెళ్ళ క్రింద చిక్కుకోవద్దు అంటున్నారు. గలతియులకు 5: 1
ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.
కారణం ఈ పాపపు సంకెళ్ళు తెంపడానికి/చేదించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ఎన్నో కష్టాలు/ ఇబ్బందులు/ అవమానాలు భరించారు. వాటిని జయించారు. ఇప్పుడు సమస్తమానవాళిని తన రక్తముద్వారా విమోచించారు. ఇంతవరకు మరణ దాస్యం క్రింద ఉన్నవారిని ఆ సంకెళ్ళు త్రెంచి విముక్తులనుగా చేశారు. దీనికోసం కొలస్సీపత్రిక . ., ఇంకా ఎఫెసీ పత్రికలో చాలా వివరంగా వ్రాసి ఉంది.
ఎఫెసీయులకు 2:1,2,4,8,12,13,14,15,16,18,19
1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున(మూలభాషలో-యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.
4. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.
8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.
కొలొస్సయులకు 2:13,14,15
13. మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా,
14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,
15. ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.
ఎఫెసీయులకు 4: 8
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
ఇక్కడ చెరను చెరగా తీసుకుని పోవడం ఏమిటి? దీనికోసం విస్తారంగా నేను వ్రాయను కారణం మీ సంఘకాపరి మీకు వివరించి ఉంటారు. యేసుప్రభులవారు చనిపోయిన తర్వాత ఆ రెండురోజులు ఏమి జరిగింది అనేది చాలామంది బైబిల్ పండితులు వివరించడం జరిగింది. *అంతవరకూ ఎంతో వికట్టాట్టహాసం చేసే మరణానికి ఒక ప్రక్క ఆనందం మరో ప్రక్క ఆత్రుత పెరిగిపోయింది అట! ఇంతవరకు పుట్టిన ప్రతీ ఒక్కరిని నేను మ్రింగివేశాను. వారిని నా బందీలుగా మార్చేశాను. కేవలం ఇద్దరు తప్పిపోయారు. ఇప్పుడు దేవుడే భూమిమీదకు వచ్చాడు కదా! ఈయనను కూడా మ్రింగివేస్తే నాకు ఇక తిరుగులేదు అనుకుందట మరణం! అయితే యేసయ్య రావడం సరాసరి వచ్చి ఇంతవరకు మరణపు బందీలుగా ఉన్నవారినందరిని/ అనగా వారి ఆత్మలను అనగా ఆదాముగారి దగ్గరనుండి యేసుప్రభులవారి సమయం వరకు చనిపోయిన వారి ఆత్మలను అన్నింటిని పరదైసునుండి వారి ఆత్మలను- అనగా ఇంతవరకు మరణపు చెరలో ఉన్న ఆదిమ వ్యక్తుల ఆత్మలను ఆ చెరనుండి చెరను చెరగా తీసుకుని తనతోపాటు తీసుకునిపోయారు. మరణాన్ని జయించారు యేసయ్య! నిత్యజీవానికి/ పరలోకానికి అర్హమైన ఆత్మలను పరలోకానికి తీసుకునిపోయారు. మిగతా ఆత్మలను బహుశా నరకానికి అప్పగించి ఉంటారు. (ఇది నా ఊహ మాత్రమే సుమా!).
ఈ విధముగా మరణపు చెరలో ఉన్న ఆత్మలను మరియు సాతాను బంధకాలలో ఉన్న మనుష్యులను, వారి ఆత్మలను యేసుక్రీస్తుప్రభులవారు తన రక్తముద్వారా విమోచించారు. అందుకే పౌలుగారు మరల పాపమనే దాస్యంలో/ దాస్యమనే కాడిక్రింద చిక్కుకోవద్దు అంటున్నారు.
ఇక మరో విషయం ఏమిటంటే పాపం ఆదాము ద్వారా ఎలా మనుష్యులను ఏలిందో, అలానే కృపాబాహుళ్యమును, నీతిదానమును పొందువారు కూడా జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారా ఏలుతారు అంటున్నారు. యేసయ్య తన ఉపమానంలో లూకా సువార్తలో భళానమ్మకమైన మంచిదాసుడా! ఈ పట్టణములమీద అధికారిగా ఉండు అంటున్నారు. అనగా ఏలుబడి చేయమని చెబుతున్నారు. లూకా 19:17; పౌలుగారు మనం దేవుదూతలకు తీర్పు తీర్చుతామని చెబుతున్నారు. 1 కొరింథీ 6:2--3; ఇంకా అనేకచోట్ల మనం రాజకుమారులుగా రాజ్యమేలుతాము అని వ్రాయబడి ఉంది. ఎప్పుడు? పాపాన్ని జయించినప్పుడు! నీతికి, దేవునికి దాసులుగా ఉంటే అప్పుడు దేవుడు మనలను రారాజులుగా చేస్తారు. నీవొక్కడివే కాదు. ఎందరు ఆయనను అంగీకరిస్తారో వారినందరినీ ఆయన కుమారులుగా చేసి, ఆ కుమారులను వారసులనుగా చేసి, నీతికి వారసులుగా చేసి, రాజులుగా యాజకులుగా చేశారు.
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా పాపానికి దాసుడుగా ఉంటావా? లేక రారాజువై దేవుని కొలువులో రాజుగా ఉంటావా? ఏదికావాలో కోరుకో! పాపానికి వచ్చు జీతం మరణం! అది నరకానికి దారితీస్తుంది. నీతికి దేవునికి దాసుడివా? అయితే నీకు నిత్యజీవము- రారాజువి. ఏదికావాలి?
దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక-64వ భాగం*
రోమా 5:18—19
18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను.
19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. . .
ప్రియులారా! ఈ రెండు వచనాలు కూడా ఈ అధ్యాయానికి కొనసాగింపు. ఇక్కడ పౌలుగారు మనకు అర్ధమయ్యే రీతిలో తన యొక్క భావాన్ని వివిధ సమీకరణములతో ఋజువుచేస్తున్నారు. అది ఏమిటంటే ఆదాము ద్వారా పాపము- పాపముద్వారా శాపము మరియు తీర్పు ఎలా వచ్చాయో అలాగే యేసుక్రీస్తుప్రభులవారి విధేయత వలన ఆయన చేసిన పుణ్యయాగం వలన అందరి అనగా మానవాళి అందరి పాపములు తొలగిపోయే అవకాశం కలిగింది. ఇంకా 19వ వచనంలో అంటున్నారు ఆదాముచేసిన అవిధేయత/ తిరుగుబాటు ద్వారా ఉగ్రత ఎలా వచ్చిందో అలాగే యేసుక్రీస్తుప్రభులవారు చూపిన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు అంటున్నారు. ఈ విధేయత కోసం ఫిలిప్పీ 2:8లో పౌలుగారు అంటున్నారు. 2:6,7,8
6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. ...
ఇక్కడ మానవునిలో దేవునికి కావలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే విధేయత. Complete obedience. సంపూర్ణ విధేయత! విధేయత వలన లాబాలు ఏమిటో బైబిల్ గ్రంధంలో విస్తారంగా చూసుకోవచ్చు! అబ్రాహముగారిని దేవుడు నీ తండ్రి ఇంటిని, నీవారిని, నీ ఊరిని వదలి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నేను ఏ ఊరు వెళ్ళాలి? ఎన్నిరోజులు ఉండాలి? దాని అడ్రస్ ఏమిటి? ఇలాంటివి ఏమీ అడగలేదు. విధేయత చూపించారు. లేకలేక పుట్టిన కుమారున్ని మోరియా కొండమీద బలి ఇచ్చేయ్ అంటే మారుమాట్లాడకుండ బలి ఇవ్వడానికి సిద్దమైపోయారు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయారు. ఆ విదేయతయే ఆయనను అత్యున్నతుడిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చివేసింది.,
ఇలా చూసుకుంటూ పోతే మోషేగారు, యెహోషువా గారు, దావీదుగారు, సమూయేలుగారు, ఏలియాగారు, ఎలీషా గారు ఇలా భక్తులంతా దేవునిమాటకు సంపూర్ణ విధేయత చూపించారు. అందుకే దేవుడు వారిని వాడుకున్నారు.
హవ్వ దేవుని మాటకు విధేయత చూపించకుండా సాతాను/ సర్పము మాటకు లొంగిపోయింది. మన అందరికీ శాపానికి కారణమయ్యింది. లోతుబార్య అవిధేయత ఆమెను ఉప్పుస్తంభంగా మార్చివేసింది. బిలాము అవిధేయత ఖడ్ఘముతో చంపబడటానికి కారణమయ్యింది.గేహాజి అవిధేయత అతనిని అతని కుటుంబాన్ని కుష్టురోగులుగా మార్చివేసింది. అననీయ సప్పీర అవిధేయత వారిని చంపింది. ఇలా ఎన్నోన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి.
కాబట్టి ప్రియ చదువరీ! దేవుని పట్ల విదేయత కలిగి ఉండు. దేవాదిదేవుడు అయిన యేసుప్రభులవారే విధేయత చూపించినప్పుడు నీవు నేను కూడా దేవునికి విధేయత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక 18వ వచనంలో మనుష్యులందరికీ.. అంటున్నారు. అనగా మనష్యులందరికీ ఈ నిత్యజీవం/ శాశ్వతజీవం/ రక్షణను దేవుడు అందుబాటులో ఉంచారు. అయితే అది కేవలం క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రం ఆ జీవం/ నిత్యజీవం/ శాశ్వతజీవం కలుగుతుంది. ప్రకటన 22:17; 1యోహాను 5:11—12; యోహాను సువార్త 7:37—38;
ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడటానికి, నిత్యజీవానికి మధ్యగల సంభందాన్ని గ్రహించాలి. ఈ పరలోకం/నిత్యజీవం కావాలి అంటే మొదట నీతిమంతులుగా తీర్చబడాలి. కారణం అపవిత్రమైనదేది అందులో ప్రవేశించదు అని బైబిల్ సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని యేసయ్య చెబుతున్నారు. కేవలం పరిశుద్దులకు మాత్రమే ఆ పరమ రాజ్యంలో చోటుంది. ఆ రాకడనే రైలుబండిలో ప్రయాణం చేయాలంటే కేవలన్ రక్షణ అనే టిక్కెట్ ఉంటే చాలదు, పరిశుద్ధతయే ఆ బండిలో ప్రయాణం చేయడానికి అర్హత! ప్రియ సహోదరీ/సహోదరుడా! నీ పరిస్తితి ఎలా ఉంది? పరిశుద్దుడువా లేక అపవిత్రంగా ఉన్నావా? పౌలుగారు చెబుతున్నారు మనం మన నీతిక్రియలు/ పుణ్యకార్యాలు ద్వారా నీతిమంతులుగా తీర్చబడము గాని విశ్వాసం ద్వారా ఆయనను విశ్వసిస్తే కృపద్వారా మనం నీతిమంతులుగా, పరిశుద్దులుగా తీర్చబడతాము అంటున్నారు. అపొస్తలుల 13:39; 1కొరింథీ 6:11; గలతీ 3:8; మరి నీవు కృపకు పాత్రుడిగా ఉంటున్నావా? చెత్త పనులుచేస్తూ అపాత్రుడిగా మిగిలిపోతున్నావా?
ఒకసారి సరిచేసుకో. సరిదిద్దుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-65వ భాగం*
రోమా 5:20—21
20. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,
21. ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.. .
ప్రియులారా! ఈ వచనాలలో అపరాదము విస్తరించునట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది అంటున్నారు పౌలుగారు. ఇది చాలా వివాదాస్పదంగా ఉందికదా ఈ మాట! అయితే పౌలుగారు ఈ మాట అనడానికి చాలా రీసెర్చ్ చేసి అన్నారు. దానికి వివరణ కూడా ఇచ్చారు. 13-15 వచనాలు చూసుకుంటే అర్ధమవుతుంది మనకు. ధర్మశాస్త్రం వచ్చే వరకు మనకు పాపం ఏమిటో అనేది తెలియదు. ధర్మశాస్త్రంలో కొన్ని Rules & Regulations పెట్టారు దేవుడు. అవి మీరితే అపరాదులుగా మారిపోతారు. చివరకు బైబిల్ సెలవిస్తుంది: పాపమంటే ఏమిటో కాదు- ఆజ్ఞాతి క్రమమే పాపం. 1యోహాను 3:4; చేయవద్దు అని దేవుడు చెప్పిన పనిని మనం చేయడం పాపం! ఇప్పుడు ఆ ఆజ్ఞే లేకపోతే మీరడమే లేదు కదా! 4:15
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును. మరి ఇప్పుడు ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా? నేరమా? ఇందుకుగాను 7:7—12 లో దేవుని ఆజ్ఞలు వాస్తవానికి పాపాన్ని ఎలా వృద్ధిచేస్తాయో పౌలుగారు విస్తారంగా రాస్తున్నారు.
7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని( లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.
10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.
11. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని( లేక, ఆజ్ఞద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.
12.కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునైయున్నది. . . . . .
*ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ధర్మశాస్త్రము ఇవ్వడంలో దేవుని ఉద్దేశ్యం పాపం అభివృద్ధి చెందాలని కానేకాదు. ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం లేనప్పుడే పాపం చాలా ఘోరంగా విస్తరించింది. అందుకే జలప్రళయం ద్వారా దేవుడు ప్రజలను అంతం చేయాల్సి వచ్చింది. ఆదికాండం 6:5,11; 8:11.* ధర్మశాస్త్రం వచ్చాక నియమాలు చెప్పి వీటిని చేయవద్దు అని దేవుడు చెప్పారు. ఇప్పడు నియమాలు బ్లాక్ & వైట్ లో , documented గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మీరితే అపరాదులే! దోషులే! అందుకే పౌలుగారు ధర్మశాస్త్రం వచ్చాక అపరాధం విస్తరించింది అంటున్నారు. *దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడానికి మరో కారణం ఉంది. అది ఏమిటంటే మనుషులు తమకు దేవుని కృప ఎంత అవసరమో గ్రహించాలి, దాని మహిమ- ప్రభావం తెలుసుకుని ఆ మహిమాప్రభావంతో తానూ ప్రత్యక్షం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు*. ఇదే అంటున్నారు పౌలుగారు తర్వాత మాటలలో ఇదే వచనంలో! అయితే పాపం ఎక్కడ వృద్ధి చెందిందో అక్కడ దేవుని కృప మరింతగా వృద్ధి అయ్యింది.
ఇక తర్వాత మాటలలో మరొక్కసారి ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని నొక్కి వక్కానిస్తున్నారు. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తం పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించెను. ఇంతవరకు గతబాగాలలో మనం చూసుకున్నాం—పాపాన్ని బట్టే మరణం ఏలింది. పాపమును ఆధారం చేసుకుని మనుష్యులమీద మరణం రాజ్యం చేసింది. పాపం తనను సేవించే వారికి ఇచ్చే జీతం మరణం. పాపం మహాఘోరమైన నియంత! అందుకే 6:23 లో
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.. .; యోహాను 8:34
అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అయితే దేవుని కృపావరం పాపముకంటే ఎక్కువ శక్తివంతమైనది. అది పాపాన్ని లయపరుస్తుంది. మనుష్యులను నిర్దోషులుగా తీర్చి వారిని నిత్యజీవానికి లేక శాశ్వత జీవానికి నడిపిస్తుంది. తీతుకు 3:3—7; యేసుప్రభులవారిద్వారా కృప ఏలుతూ, (హెబ్రీ 4:16) ఆయనలో నమ్మకముంచే వారందరి పాపాలను అది క్షమించి శిక్షావిధిని పూర్తిగా తొలగిస్తుంది. 6:14; 8:1; ఇక్కడ మనకు ఇద్దరు యజమానులు కనిపిస్తున్నారు. ఆదాముగారి ద్వారా వచ్చిన పాపము (12వ), క్రీస్తుయేసు ద్వారా వచ్చిన కృప (17వ) యోహాను 1:16—17;
ప్రియ చదువరీ! ఇప్పుడు నీకు ఏ యజమాని కావాలి? కృప? లేక పాపమా? కృప కావాలి అంటే క్రీస్తుమార్గంలో పయనిస్తూ ఇరుకు మార్గంలో పయనించాలి. శ్రమల లోయల గుండా పయనించాల్సి వస్తుంది. చివరకు నిన్ను ఆ మార్గం పరమునకు నిత్యజీవానికి తీసుకుని వెళ్తుంది.
మత్తయి సువార్త 7:13,14
13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
ఇక మరో మార్గం – పాపమార్గం. ఎంతో కుషి ఇస్తుంది ఈ లోకంలో. నీకు ఇష్టమొచ్చినట్లు బ్రతకొచ్చు. దానికి మరో పేరు విశాలమార్గం. సినిమాలు-షికార్లు- బార్లు-బీర్లు, లోకపుటాసలు అన్నీ ఉంటాయి. గాని చివరకు నిన్ను మరణానికి/నరకానికి నడిపిస్తుంది. ఒకవేళ నీవు ఆల్రెడీ ఇదే మార్గంలో ఉన్నావా? జాగ్రత్త! కాలుజారే స్థలంలో ఉన్నావు. ఎప్పుడైనా అధోపాతాళానికి పోతావు. ఇకనైనా కళ్ళు తెరువు!
నిజమైన మార్గం తెలుసుకో!
పరలోక గమ్యాన్ని చేరుకో!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-66వ భాగం*
రోమా 6:1—3
1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?
2. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? . . .
ప్రియమైన దైవజనమా! ఈ మూడు వచనాలలో మూడు పాముఖ్యమైన విషయాల గురించి పౌలుగారు చెబుతున్నారు.
1. పాపము- కృప;
2. క్రీస్తుతోపాటు చనిపోవుట;
3. బాప్తిస్మము.
ఈ అధ్యాయం కూడా 5వ అధ్యాయానికి కొనిసాగింపు మాటలనే మరో కోణంలో దృవీకరిస్తున్నారు. లేదా మరికొన్ని సమీకరణములతో రుజువుచేస్తున్నారు పౌలుగారు. ఆదాముగారి ద్వారా పాపము ఎలా విస్తరించిందో చెబుతూ కడపటి ఆదాము యైన యేసుక్రీస్తుప్రభుల వారి ద్వారా జీవము, నిత్యజీవము, పరలోకం ఎలా సంప్రాప్తిస్తుందో ఇంకా మరికొన్ని దృష్టాంతాలను చెబుతూ రుజువుచేస్తున్నారు.
అయితే ఇక్కడ ఈ మొదటి రెండు వచనాలు 5:20-21 కి కొనసాగింపు. ఆ వచనాలలో అపరాధము విస్తరించేటట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది అంటూ, పాపమెక్కడ విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించెను అంటున్నారు. దానికి కొనసాగింపుగా పౌలుగారు చెబుతున్నారు: అలాగైతే ఏమందుము? కృప విస్తరించాలి అని పాపంలో ఇంకా ఉంటామా? ఇంకా చెప్పాలంటే—కొంతమంది అతి తెలివిగలవారుంటారు కదా వాళ్ళకోసం, పాపులకోసం పౌలుగారు చెబుతున్నారు—పాపులు/ అతితెలివి గలవారు ఇలా అనుకోవచ్చు: పాపం చేయడం వలన భలే మంచి ఫలితం వస్తుంది కదా! దేవుని కృప వృద్దిచెందటానికి పాపం దోహదం చేస్తుంది కాబట్టి- మన శక్తికొలదీ ఎక్కువగా పాపం చేస్తే – దానిని క్షమించడానికి దేవుడు ఇంకా ఎక్కువగా అపరిమితమైన కృపను దేవుడిస్తారు కదా!! అని అంటుంటారు. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలున్న వారికోసం ఈ అధ్యాయంలో బాగా రాశారు పౌలుగారు.
మొదటగా దీనికి జవాబు చెప్పనీయండి: పాపమెక్కడ విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించెను అనడానికి కారణం ఏమిటంటే మొదట దేవుని ప్రేమను తెలుసుకోలేని వారిని రక్షించడానికి దేవుడు తన కృపను చాలా విస్తారంగా చూపిస్తున్నారు, వారు కూడా తన కృపాబాహుళ్యమును తెలుసుకొని, రక్షించబడతారు కదా అని దేవుని ఆశ! అందుకే ఎక్కడ అపరాధం విస్తరించెనో అక్కడ కృపకూడా విస్తారంగా విస్తరించెను. అయితే ఒకసారి రుచిచూసి కూడా, మరలా పాపం వైపు పరుగిడితే నీ గతి- అధోగతి అయిపోతుంది జాగ్రత్త!
హెబ్రీయులకు 6:4,5,6
4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై
5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. పౌలుగారు దీనికి ఉదాహరణగా చాలాసార్లు తన సాక్ష్యాన్ని చెప్పారు. నేను అపోస్తలుడు అని పిలిపించుకోడానికి యోగ్యుడను కాను కారణం నేను సంఘాన్ని బహుగా హింసించాను.. ఇలా చెప్పుకుంటూ పోతూ, గాని దేవుని మహా కృప వలన క్షమించబడి కనికరం పొందాను కారణం నేను తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను.
మొదటి తిమోతికి 1:12,13
12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
13. నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. అయితే తెలిసిచేస్తే దాని పర్యవశానం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెబుతున్నారు పౌలుగారు. కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! అతితెలివి, పనికిమాలిన తెలివితేటలు ప్రయోగించక మారుమనస్సు పొందు! రక్షణ పొందు! పొందిన తర్వాత ఇకను పాపము చేయవద్దు!
ఇక రక్షించబడిన విశ్వాసికి ఇలాంటి పనికిమాలిన తలంపులు వస్తే ఎంత చెండాలంగా ఉంటుందో, ఈ అధ్యాయంలో అలాంటి తలంపులకు జవాబుగా పౌలుగారు కొన్ని రకాలైన మాటలు/పదాలు ఉపయోగించారు. మీకు తెలియదా లేక మీరెరుగరా? అని రెండుసార్లు వాడారు 3, 16వచనాలలో. మనకు తెలుసు లేదా మనము ఎరుగుదుము అనేమాట/పదము కూడా రెండు సార్లు వాడారు పౌలుగారు 6, 9 వచనాలలో! ఇక్కడ ఈ వచనాలలో పౌలుగారి ఉద్దేశ్యం ఏమిటంటే విశ్వాసి పవిత్రమైన లేక పరిశుద్ధమైన జీవితం తప్పకుండా గడపాలి! అలా పవిత్రజీవితం జీవించాలి అనే ఉద్దేశ్యంతోనే దేవుడు రక్షించబడిన విశ్వాసిని నిర్దోషులుగా తీరుస్తారు. ఈ విషయాన్ని చాలాసార్లు చాలాచోట్ల పౌలుగారు వివరంగా రాస్తున్నారు.. రోమా 2:13; 5:16, 19; 8:30, 33; 1కొరింథీ 6:11; గలతీ 3:8;. . .మనము కూడా ఇదే నూతన జీవంతో/ నూతన జీవన విదానముతో అంతము వరకు బ్రతకాలి అనేది పౌలుగారి ముఖ్య ఉద్దేశ్యం ఈ అధ్యాయం ప్రకారం. ఇదే విషయాన్ని పౌలుగారు 8వ అధ్యాయం చివరి వరకు ఇదే విషయాన్ని బోదిస్తూ వచ్చారు. యోహాను 17:17—19 వరకు ఇదే నూతన జీవితం కోసం వివరిస్తున్నారు పౌలుగారు.
కాబట్టి ప్రియ విశ్వాసి! ఇంకా పాపమనే ఆ ఊభిలోనే ఉండిపోతావా? పరమునకు చేరే మార్గాన్ని అవలంభిస్తావా? సామెతల గ్రంధకర్త అంటున్నారు: బుద్ధిమంతుడైన వాడు క్రిందనున్న పాతాలమును తప్పించుకుందాం అని అనుకుని పైనున్న పరమునకు పోయే దారి కోసం వెదుకుదాం అని అనుకుంటాడు. సామెతలు 15:24; దానికికోసం ప్రయత్నం చేస్తాడు.
నీవు ఇంకా బురద పనులు చేస్తున్నావు అంటే నీవు ఇంకా పాపంలోనే, ఆ ఊభిలోనే, నరకమార్గం లోనే ఉన్నావన్నమాట!
నేడే నీజీవితాని పరీక్షించుకో!
సమీక్షించుకో!
దేవుడు నిన్ను దీవించును గాక!
ఆమెన్!
*రోమా పత్రిక-67వ భాగం*
రోమా 6:1—3
1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?
2. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? . . .
ప్రియమైన దైవజనమా! ఈ మూడు వచనాలలో మూడు పాముఖ్యమైన విషయాల గురించి పౌలుగారు చెబుతున్నారు.
1. పాపము- కృప;
2. క్రీస్తుతోపాటు చనిపోవుట;
3. బాప్తిస్మము.
ప్రియులారా! గతభాగంలో ఈ మూడు వచనాలలో గల మొదటి ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకొన్నాం. ఈ రోజు మనం రెండవ విషయం కోసం ధ్యానం చేసుకుందాం. *పాపము విషయమై చనిపోయిన మనం ఇకమీదట దానిలో ఏలాగు జీవించెదము?*
ఈరోజు పౌలుగారు ఇదే ప్రశ్న నిన్ను నన్ను అడుగుతున్నారు!!! పాపము విషయమై చనిపోయిన మనం ఇకమీదట ఆ పాపములోనే ఎలా జీవిస్తాము? *ఇంకా మనలో పాపం ఉంది అంటే మనం చచ్చేటప్పుడు సరిగ్గా చావలేదన్నమాట*! *అనగా నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన మారుమనస్సు పొందకుండా నీటిలో మునిగేసావన్నమాట*! *లేకపోతే ఏదో ఆవేశంలో, ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయమే తప్ప నిజమైన మారుమనస్సు లేదు నీలో*! *లేదా అప్పుడు బాగా వెలిగించబడ్డావు కాని ఇహలోకం నిన్ను ఆకర్షిస్తే పంది బురదకు తిరిగినట్లు, కుక్క తనవాంతినే మరలా తినినట్లు నీవు విసర్జించిన వాటిని మరలా చేస్తున్నావు అంటే ఆ కుక్కకు, పందికి నీకు తేడా లేదన్నమాట!*
ఇంతకీ విశ్వాసులు పాపం విషయమై ఎక్కడ, ఎప్పుడు, ఎలా మరణించారు???!!! దీనికి జవాబు ఇదే అధ్యాయం 3,6,8 వచనాలలో చాలా వివరింగా చెబుతున్నారు పౌలుగారు!
3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.
8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, . . .
*క్రీస్తుతో సిలువ మరణం పాలైందని*, *క్రీస్తుతో చనిపోయామని*, ఇంకా విశ్వాసులు క్రీస్తుతో ఐక్యంగా/ ఏకమై ఉన్నారని ఈ వచనాలలో మనం చూడవచ్చు! యేసుక్రీస్తుప్రభులవారు ఇలా మరణించిన అనగా పాపము విషయమై మరణించిన వారికి, తిరిగి క్రీస్తు పునరుత్థానంలో పాలుపొందిన వారికందరికీ నాయకుడు! మరియు ప్రతినిధి! దేవుడు యేసయ్య కి సంభవించినది యేసయ్య శిష్యులు అనగా తనను వెంబడించి, పాపము విషయంలో చనిపోయిన వారికందరికీ జరిగినట్టే భావిస్తారు! కారణం యేసుక్రీస్తుప్రభులవారు వారికి బదులుగా పొందవలసిన శిక్షనంతటినీ భరించారు. ఇక్కడ దేవుని దృష్టిలో విశ్వాసులు తమ పాత భ్రష్ట స్వభావాన్ని బట్టి ఏమైయున్నారో అదంతా యేసు సిలువ వేయబడి మరణించినట్లుగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పాపం విషయంలో చనిపోయిన మనం ఇంకా అదే పాపంలో ఎలా జీవించగలం?? క్రీస్తు చనిపోయి తిరిగిలేచినట్లే మనం కూడా పాపం విషయంలో చనిపోయి, యేసయ్య పునరుత్తానుడైనట్లు మనం కూడా నూతన జీవితంతో నూతనంగా పాపం లేని, మచ్చలేని జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి!
అలాకాకుండా ఇంకా నీ బ్రతుకులో వ్యభిచారం ఉంది అంటే నీవింకా సరిగ్గా చావలేదు! నీలో అబద్దాలు, అబద్దపు బ్రతుకు కనబడుతుంది అంటే నీవింకా సరియైన విధంలో చావలేదు. ఈ లోకపు బూతులు, పాపం, త్రాగుడు, సినిమాలు-షికార్లు, జూదం, చెడు అలవాట్లు ఉన్నాయి ఉంటే నీవింకా పాపం విషయంలో చావలేదు! అందుకే నీలో ఇంకా ఈ పాపపు బుద్దులు అలవాట్లు కనిపిస్తున్నాయి. గోధుమ గింజ చనిపోతేనే అది మొలకెడుతుంది. ఏ గింజ అయిన మొదటగా అది చస్తుంది,. ఆ తర్వాతనే నూతన జన్మ తనకు వస్తుంది. యోహాను 12: 24
గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
మొదటి కొరింథీయులకు 15:36,37,38,42,43,44,45
36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.
37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.
38. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.
42. మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;
43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;
44. ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.
45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
అలాగే పాపము విషయంలో లోకంలో నీవు చావాలి. పాపం, లోకాశలు, అత్యాసలు చావాలి. అప్పుడు క్రీస్తులో నూతన జీవము, నిత్యజీవం పొందుకోగలవు! పాపపు ఆశలు అనే పేరెన్నికగన్న శరీరాశలు నీలో చావాలి అనగా . గలతీయులకు 5:19,20,21
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి ఎప్పుడైతే చస్తాయో అప్పుడు ఆత్మఫలము వృద్దిపొందుతుంది. అవి
22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. . . . . ..
ప్రియ సహోదరీ/ సహోదరుడా! నిన్ను నీవే పరీక్షించుకో! ఇంకా నీలో శారీరక క్రియలు కనిపిస్తున్నాయి అంటే నీవు ఇంకా చావలేదు. ఒకవేళ చస్తే అవి చేస్తుండేవాడవు/దానవు కాదు! అయితే నీలో ఆత్మఫలములు ఫలిస్తే నీవు లోకంలో చచ్చి, ఆధ్యాత్మికముగా జీవిస్తున్నావు అన్నమాట! ఈ శారీర ఫలాలు ఫలించే వారి అంతము నరకం. అగ్ని ఆరదు పురుగు చావదు! యుగయుగములు ఆ అగ్నిలో మాడ వలసినదే!
ఏదికావాలి నీకు?
జీవమా? మరణమా?
లోకమా? దైవమా?
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-68వ భాగం*
రోమా 6:1—3 .
1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?
2. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? . . .
ప్రియమైన దైవజనమా! ఈ మూడు వచనాలలో మూడు పాముఖ్యమైన విషయాల గురించి పౌలుగారు చెబుతున్నారు.
1. పాపము- కృప;
2. క్రీస్తుతోపాటు చనిపోవుట;
3. బాప్తిస్మము. . .
ప్రియులారా! గతభాగంలో ఈ మూడు వచనాలలో గల మొదటి ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకొన్నాం. ఈ రోజు మనం మూడవ విషయం కోసం ధ్యానం చేసుకుందాం. *క్రీస్తుయేసు లోనికి భాప్తిస్మము పొందిన మనమందరమూ ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా*??!!!
ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు—యేసుక్రీస్తులో బాప్తిస్మం పొందడం అంటే కేవలము నీటిలో మునిగెయ్యడం కాదు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందేము అని అర్ధము. బాప్తిస్మం పొందేము అంటే మన పాత అలవాట్లు, పాపపు అలవాట్లు, పాప/పాతరోత జీవితమును కూడా సమాదిచేస్తున్నాం అన్నమాట! మన పాపపు జీవితాన్ని బాప్తిస్మం ద్వారా సమాధి చేశాం అన్నమాట! మరి సమాధిచేయబడ్డ అలవాట్లు మరల కనిపించాయి అంటే నీ అలవాట్లు, నీవు, నీ పాతరోత జీవితం చావలేదు అన్నమాట!
పౌలుగారు ఈ 3—4 వచనాలలో చెబుతున్న బాప్తిస్మం ఏమిటి? బాప్తిస్మం అనేమాట గ్రీకు భాషనుండి వచ్చింది. ఒకవేళ ఈ పదాన్ని తెలుగులోకి డైరెక్ట్ గా గ్రీకునుండి తర్జుమా చేస్తే దాని అర్ధం ఇలా వస్తుంది: *క్రీస్తులోకి ముంచబడిన*, *క్రీస్తులోకి ప్రవేశించిన*, *యేసుక్రీస్తులోనికి తీసుకుని రాబడిన* అని అర్ధాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే ఇలా వస్తుంది *మనం ఆయన మరణంలో ముంచబడ్డాము* లేక *ఆయన మరణం లోనికి ప్రవేశించాము* లేక *ఆయన మరణములోనికి తీసుకుని రాబడితిమి* అని అర్ధం! కాబట్టి ముంచబడటం అంటే క్రీస్తులోనికి మునగడం అని అర్ధము, గాని నీటిలో మునగడం అని మాత్రం కానేకాదు! అంటే ఇక్కడ బాప్తిస్మం అనేది క్రీస్తుతో ఐక్యమవడాన్ని సూచిస్తుంది. ఆయనతో ఒక ప్రత్యేక సంబంధం లోనికి ప్రవేశించడం, పరిశుద్ధాత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మిక దేహంలో ఒక అవయవంగా మారడం అని అర్ధం! దానికి ఉదాహరణ 1కొరింథీ 12:12—13
12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి..; యోహాను 17:21, 23
21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
బాప్తిస్మం అనేది క్రొత్త నిబంధనలో ఇతరచోట్ల కూడా ఒక గుర్తుగా , సాదృశ్యంగా వాడారు. లూకా 12:50, 1కొరింథీ 10:2; నీటి బాప్తిస్మం అనేది ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక చిహ్నంగా పౌలుగారు చెబుతున్నారు. *నీటిలోనికి వెళ్ళడం అంటే క్రీస్తుతో కూడా మరణానికి వెళ్లి పాటిపెట్టడాన్ని సూచించడమే కాకుండా 4వ వచనం ప్రకారం నీటిలోనుండి బయటికి రావడం అంటే ఆయన పునరుత్తానుడైనట్లు మనం కూడా ఆయనతో పాటు ఆధ్యాత్మికంగా పునరుత్థానులం అయ్యామన్నమాట*! అనగా మన పాప/పాతరోత జీవితాన్ని ఆ నీటిలోనే వదిలేసి నూతన జీవన విధానంలో తిరిగి జన్మించాము అన్నమాట! మత్తయి 3:6; 28:19; మార్కు 16:16; అపోస్తలుల 2:38; ఇక పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం అపోస్తలుల 1:5 లో చూసుకోవచ్చు!
కాబట్టి దీనంతటి ఆర్ధం/ ఫలితార్ధం ఏమిటంటే: క్రీస్తులో దేవుడు మనకోసం చేసిన దానంతటి ఉద్దేశం ఏమిటంటే—మనం బాప్తిస్మం పొందాక క్రొత్త జీవితం గడపాలి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. పాపం నుండి విడుదల, మరణం అనగా ఆధ్యాత్మిక మరణం నుండి విడుదల, బంధకాల నుండి విడుదల కలిగి పునర్జీవిత సంభంధమైన నూతన జీవితం మనకు కలగాలి, అట్టి జీవితం మనం జీవించాలి అనేది దేవుని ఆశ మనపట్ల! 2కొరింథీ 5:17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
తీతు 2:11—14.
11. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,
13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
14. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. ...
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీ జీవితం ఎలా ఉంది? కేవలం పేరుకు మాత్రం బాప్తిస్మం పొందావు గాని నీ బ్రతుకు ఇంకా అలాగే ఉందా? లేక నూతన జీవిత విధానాన్ని జీవిస్తున్నావా? నీ పాపపు అలవాట్లు మారిపోయాయా? లేక ఇంకా పాపపు ఊభిలోనే మునిగి తెలుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో! ఒకసారి వెలిగించబడిన తర్వాత ఇంకా / మరలా పాపం చేస్తే నిన్ను బాగుచెయ్యడం/ నీవు బాగుపడం దుర్లభం! నేడైనా , ఈ నీ దినమందైనా సమాధాన సంభంధమైన సంగతులకోసం ఆలోచిస్తావా?లూకా 19: 42
నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.
మరలుతావా ఆ పాపం నుండి? ఆ రోతనుండి!!!
నేడే అనుకూల సమయం!
ఇదే రక్షణ దినం!
మరో దినం, మరో తరుణం నీ బ్రతుకులో లేదేమో ఒకసారి ఆలోచించు!
నేడు అనే దినం ఉండగానే, సమయం ఉండగానే మార్పునొందు!
భయము నొంది పాపము చేయకు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-69వ భాగం*
రోమా 6:5—7
5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.
6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.
7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు. . . .
ప్రియ దైవజనమా! బాప్తిస్మం ద్వారా క్రీస్తు మరణంలో పాలుపంచుకుని, తిరిగి పాపం చేయకుండా నూతన జీవిత విధానం జీవిస్తాము, జీవించాలి అని గత భాగాలలో చూసుకున్నాం. ఈ వచనాలే కాకుండా ఈ అధ్యాయం మొత్తం అదే విషయాన్ని నొక్కివక్కానిస్తున్నారు పౌలుగారు. ఇక్కడ 5వ వచనంలో ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో ఐక్యముగలవారమై యుందుము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పౌలుగారు బాప్తిస్మము ద్వారా మొదటగా అయన మరణములో ఆయనతో ఐక్యముగలవారము అంటున్నారు, తర్వాత ఆయన పునరుత్థానములో కూడా ఆయనతో ఐక్యముగలవారము అంటున్నారు. ఇక్కడ దేవునితో బాప్తిస్మం ద్వారా ఐక్యమవుతున్నాం అంటున్నారు పౌలుగారు.
కాబట్టి దేవునితో ఐక్యమవడమే ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం! విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు లేక క్రీస్తులో ఐక్యమైయున్నారు అని బైబిల్ ఘోసిస్తుంది. 8:1.కాబట్టి యిప్పుడు *క్రీస్తుయేసునందున్న వారికి* ఏ శిక్షావిధియు లేదు. .
యోహాను 15:4
నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.
ఇంకా క్రీస్తుతో ఐక్యమై ఉన్నారు 12:5
4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,
5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.1కొరింథీ 6:15, 17
15. మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.
17. అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు. ; 12:13
12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.
యోహాను 17:21—23
21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
22. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. .....
ఈ అన్ని వచనాలు ధ్యానం చేస్తే క్రీస్తు మరణం విశ్వాసుల పాపజీవిత మరణం అయినట్లే, ఆయన పునరుత్థానం విశ్వాసులందరి పునరుత్థానం అవుతుంది. ఎఫెసీయులకు 2: 7
క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.
కొలస్సీ 2:12
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.
కొలస్సీయులకు 3: 1
మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.
ఇంకా 6వ వచనం ధ్యానం చేస్తే మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను అని ఎరుగుదుము. చూసారా ఇక్కడ ఎరుగుదుము అంటున్నారు. 3వ వచనంలో మీకు తెలియదా అంటున్నారు. ఇక్కడ ఈ రెండు పదాలు పౌలుగారు వాడటానికి కారణం కొంతమంది అతితెలివి చూపిస్తున్నారు కాబట్టి, ఈ మాటలు ప్రయోగించి వారిని హెచ్చరిస్తూ గద్దిస్తున్నారు పౌలుగారు.
ఇక్కడ పాత /ప్రాచీన స్వభావం లేదా పాపమునకు దాసులు అనగా మనం విశ్వాసులుగా మారకముందు అనగా క్రీస్తును ఎరుగక ముందు అదంతా మనం బాప్తిస్మము తీసుకున్నప్పుడు క్రీస్తుతో పాటు ఆ పాత స్వభావం కూడా పాతిపెట్టబడింది. ఇక ఇక్కడ ఉదాహరించిన సిలువ మరణం అనగా సుమారు క్రీ.శ. 30 లో యేసుక్రీస్తుప్రభులవారు సిలువవేయబడ్డారు కదా, దానికోసం చెబుతున్నారు. అప్పుడే విశ్వాసులమైన మనమంతా యేసుక్రీస్తుప్రభులవారితో పాటుగా సిలువ వేయబడ్డాము! 3వ వచనం, గలతీ 2:20
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
ఇక ఇక్కడ ఉదహరించబడిన పాప శరీరము అనగా విశ్వాసుల శరీరాలలో ఉన్న మారుమనస్సు బాప్తిస్మం పొందకమునుపు గల భ్రష్ట స్వభావము. రోమీయులకు 7: 18
నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
యేసుక్రీస్తు ప్రభులవారు మన స్థానంలో చనిపోయినప్పుడు అది నాశనమైపోలేదు గాని ఎప్పుడైతే మనం విశ్వసించి సంపూర్ణ / నిజమైన మారుమనస్సుతో నమ్మి బాప్తిస్మం పొందామో అప్పుడు క్రీస్తుతో ఐక్యమై, మనం కూడా ఆయన సిలువ మరణంలో పాలుపొందుతాము! అప్పుడు మన బ్రష్ట స్వభావం నాశనమయ్యింది. కాబట్టి యేసుక్రీస్తు సిలువ మరణం బ్రష్ట స్వభావం ప్రభావం నుండి అనగా నాశనము నుండి మనలను తప్పించేందుకు క్రీస్తు మరణం మనకు మార్గం సుగమం చేసింది. వ 14, 22, 5:21. కాబట్టి ఇప్పుడు దేవుని మహా కృపవలన దానికి అనగా పాపానికి దాసులుగా జీవించనక్కరలేదు! ఎందుకంటే దానికి జవాబు 7వ వచనంలో ఉంది
చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.
ఇక్కడ చనిపోయిన వాడు పాప విముక్తుడు అని సెలవిస్తుంది బైబిల్! ఈ మాట చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. *ఒక వ్యక్తి బ్రతుకంతా పాపములో జీవించి, చచ్చిపోతే ఆ మరణం ద్వారా తన పాపముల నుండి విముక్తి అయిపోతుందా*? కానేకాదు. మనం చనిపోయాక మనతోపాటే వచ్చేవి రెండేరెండు. ఒకటి పుణ్యం, రెండు పాపం. పుణ్యం అనగా నీతికార్యాలు, పరిశుద్ద జీవితం వలన పరలోకం కలుగుతుంది. రెండు పాపం- పాపం వలన వచ్చు జీతం మరణం- ఆధ్యాత్మిక మరణం- ఫలితం నరకం! మరి ఇక్కడ చనిపోయిన వాడు పాప విముక్తుడు అంటున్నారేం??!! దీని అర్ధం పౌలుగారు చచ్చినోళ్ళ అందరికోసం మాట్లాడటం లేదు. క్రీస్తులో పాపం విషయంలో మరణమైపోయిన విశ్వాసుల కోసం మాట్లాడుతున్నారు. విశ్వాసి ఎప్పుడైతే నిజమైన మారుమనస్సు పొంది బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు పాపంలో లోకంలో చచ్చి- క్రీస్తులో- జీవంలో- ఆధ్యాత్మికంగా పుడతాడు. అప్పుడు పాపం నుండి విముక్తుడు అవుతాడు.
ఇంకా వివరంగా చెప్పాలంటే ఆదాము ద్వారా మనం అందరం ఆదాములో పాపం చేసాము! అనగా క్రీస్తులో చనిపోయాము.
2 కొరింథీ 5:14
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
కొలస్సీ 3:3
ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
కాబట్టి ఈ ఆదాము గారి పాపం అనే మూలం నుండి మనకు మరణం అనే శిక్షావిధి మనమీదకు వచ్చింది. 5:16,18
16. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.
18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను. .. అయితే ఇప్పుడు క్రీస్తు మరణం ద్వారా దానినుండి విముక్తి కలిగింది. కాబట్టి బాప్తిస్మం ద్వారా ఆయనతో ఐక్యమై ఆ సిలువమరణం లో కూడా ఏకమై, ఆయనతోపాటు మనం కూడా చనిపోయి- పాపం నుండి విడుదల పొందాము అన్నమాట! కాబట్టి ఇప్పుడు పాపంతో మనకున్న సంభంధం తెగిపోయింది. ఇప్పుడు దేవుడు మనం చేసిన పాపాలను మనవిగా లెక్కచేయడం లేదు! 4:7—8 దీనికి గాను క్రీస్తు వెల చెల్లించారు. కాబట్టి పై విజయాలన్నీ క్రీస్తులో విశ్వాస ముంచి బాప్తిసం తీసుకున్న నిజ విశ్వసులందరికీ, ఆత్మీయజీవితం, వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం జీవిస్తున విశ్వాసులందరి విషయంలో కూడా వాస్తవాలే!
ఇక 8వ వచనం ప్రకారం మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు . . మనం క్రీస్తుతోపాటు చనిపోయామంటే ఆయనతోపాటు జీవిస్తాం అని కూడా నమ్ముతున్నాం! కారణం ఆయన చనిపోయి ఆ సమాధిలో ఉండిపోలేదు! మూడవ దినమున విజేయుడై, సజీవుడయ్యారు యేసుక్రీస్తుప్రభులవారు! కాబట్టి ప్రియ విశ్వాసి! నీ పాపాన్ని వదిలేశావా? అయితే ఇప్పుడు నీవు నూతన సృష్టి! పాతవి గతించెను! ఇపుడు నీవు క్రీస్తుతో కూడా నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నావు. కాబట్టి భయమునొంది పాపం చేయకు! అప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాలన్నిటికి నీవు హక్కుదారుడవు! యోహాను 5:24
నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
14:23
యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.
ఇలా నిరంతరమూ ఆయనతోపాటు జీవిస్తావు. 1 థెస్స 4:17
ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
మరినీవు సిద్ధమా?
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-70వ భాగం*
రోమా 6:9—10
9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.
10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు . . .
చూసారా మరణమునకు ఆయనమీద అనగా యేసయ్య మీద ఇకను ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతోపాటు జీవిస్తున్నాము అని నమ్ముచున్నాము అంటున్నారు. మరణమునకు ఆయనమీద ప్రభుత్వము లేదు ఎందుకంటే ఆయన 1) మరణాన్ని జయించారు కాబట్టి; 2) ఒకసారి ఆయన చనిపోయారు కాబట్టి మరలా చనిపోయే అవకాశం లేదు కాబట్టి. ఇక ఆయన చనిపోవడం చూస్తే మనకోసం పాపముల కోసం ఒక్కమారు చనిపోయారు కాని జీవించడం చూస్తే దేవుని విషయమై జీవిస్తున్నారు.
మరణం అనేది పాపం యొక్క ఫలితము లేదా జీతము. 5:12; 6:23; క్రీస్తు విశ్వాసుల స్థానంలో వారి పాపాలకు పరిహారంగా పరిహారం చెల్లించేందుకు మరణించారు కాబట్టి ఇక పాపమునకు, మరణమునకు విశ్వాసులపై అధికారం ఎంతమాత్రము లేదు! 3:25; యోహాను 1:29; 1కొరింథీ 15:3; ఇది అనగా పాపమునకు పరిహారం లేదా బలియాగం ఒక్కసారే చేసి ముగించారు. మరల మరల చేయాల్సిన అవసరం లేదు. మానవాళి అందరి పాపములకు పరిహారానికి చాలినంత రక్తము ఒక్కసారే కార్చారు. హెబ్రీ 10:10, 14; యోహాను 19:30. ఇప్పుడు ఆయన శాశ్వతంగా జీవిస్తున్నారు. ప్రకటన 1:18; కాబట్టి విశ్వాసులు కూడా ఆయనతో పాటు శాశ్వత జీవానికి అర్హులు! ఇప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు జీవించేది తండ్రి అయిన దేవునికి ఆనందం కలిగించడానికి, ఆయనకు కీర్తి మహిమలు తేవడానికి , ఆయన సంకల్పం నెరవేర్చడానికి మాత్రమే! కాబట్టి రక్షించబడిన విశ్వాసి కూడా కేవలం క్రీస్తుకోసం, దేవుని మహిమకోసం, సువార్త వ్యాప్తి కోసం జీవించాలి గాని స్వార్ధం కోసం, తన పాపం కోసం అనగా తన తుచ్చమైన కోర్కెలు తీర్చుకోవడం కోసం కాదు. అనగా రక్షించబడిన విశ్వాసి ఇప్పుడు జీవించాల్సింది క్రీస్తుకోసమే గాని వ్యభిచారం కోసం గాని, ధనాపేక్ష కోసం, శారీరక కోర్కెలు కోసం ఎంతమాత్రము కాదు. ఒకవేళ విశ్వాసిలో ఈ శారీరక కోర్కెలు / శారీరక పాప స్వభావం కనిపిస్తుంది అంటే వాడింకా చావలేదు. క్రీస్తులో పునరుత్థానుడు కాలేదు. ఇంకా అతనిపై/ఆమెపై పాపము/మరణము ఏలుబడి చేస్తుంది అన్నమాట!
అందుకే పౌలుగారు చెబుతున్నారు 11వ వచనంలో మీరు పాపం విషయంలో చనిపోయారని దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తుయేసులో సజీవులని ఎంచుకోండి. కారణం విశ్వాసులు కూడా క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తులా పాపం అంటకుండా జీవించాలి. క్రీస్తులా దేవునికోసం జీవించాలి. అప్పుడు విశ్వాసిపై మరణానికి ఏవిధమైన అధికారం ఉండదు. యోహాను 11:25—26
25. అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
26. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. ..
దేవుడు చూసినట్లుగానే వారు ఈ విషయాలు చూడాలి. క్రీస్తు చనిపోయినట్లు తాము చనిపోయామని, ఆయనలో నూతన జీవమునకు మరలా లేచామని ఎంచుకోవాలి!
అందుకే 12వ వచనం
కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
చావునకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి. శరీరము యొక్క చెడ్డ కోరికలకు లోబడవద్దు అని చెబుతున్నారు. *ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే విశ్వాసుల విషయం చూస్తే చావుకు లోనయ్యే శరీరాల్లో ఇక పాపం లేదు అని పౌలుగారు చెప్పడం లేదు. అది ఉంటుంది అని పౌలుగారికి తెలుసు*! 7:15,19,20,25
15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.
19. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.
20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.
25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనైయున్నాను.
గలతీ 5:17
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
ఎఫెసీ 4:22
కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును(మూలభాషలో-ప్రాచీన పురుషుని) వదలుకొని
ఇంకా యోహాను గారు ఏమంటున్నారంటే 1యోహాను 1:8..
మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.
*అయితే ఇక్కడ పౌలుగారు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రక్షించబడిన నీవు ఇక నీపై పాపాన్ని ఏలనివ్వవద్దు*! 5:21.
ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను...
విశ్వాసులపై పాపం ఇక అధికారం చేసే యజమానిలా ఉండకూడదు!
14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. .
యోహాను 8:31—36
31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
33. వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
34. అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.
36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.
కాబట్టి 13—14 వచనాల ప్రకారం
13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ...
మీ శరీర భాగాలు దుర్మార్గానికి సాధనాలుగా ఉండనివ్వవద్దు గాని ఆయనతో మరణం నుండి జీవములోనికి లేచిన వారము కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి కానుకగా అప్పగించుకోండి. మీ అవయవాలను నీతికి, న్యాయానికి సాధనాలుగా దేవునికే అర్పించుకోండి అంటున్నారు. కారణం దేవుడు విశ్వాసులను మరణం నుండి జీవంలోనికి తెచ్చారు. యోహాను 5:24.. ఇప్పుడు వారు మళ్ళీ తమ పాత యజమాని అంటే పాపం వైపుకు, సాతాను వైపుకు తిరగకూడదు. తమ చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు, నోరు .. అన్నీ పాపానికి ఇవ్వకూడదు. కారణం వారికి ఇప్పుడు ఒక క్రొత్త యజమాని ఉన్నారు—ఆయనే ఏకైక నిజమైన సత్యదేవుడు! ఆయన పేరు యేసుక్రీస్తు! వారు తమను, తమ కున్నదంతటిని క్రీస్తుకే సమర్పించుకోవాలి. 12:1
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
కాబట్టి ఇప్పుడు పాపం గాని, తమకుతాము గాని వారిపై యజమానులుగా ఉండకూడదు! దేవుడే వారి యజమాని! విశ్వాసులు దీనిని గుర్తించి ప్రవర్తించక పోతే పాపం వారిపై తిరిగి అధికారం సాధించడానికి , లోపరచుకోడానికి ప్రయత్నం చేస్తుంది.
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీపై అధికారి ఎవరు?
దేవుడా? దయ్యమా?
మరణమా? జీవమా?
పాపమా? నీతి కార్యములా?
*నీ చేతులతో ఇంకా పాపం చేస్తున్నావు అంటే అనగా చేతులతో లంచాలు తీసుకుంటే, చేతులతో దేవునికి ఇష్టం కాని వస్తువులు, నీ ఆరోగ్యాన్ని పాడుచేసే వస్తువులు పట్టుకుంటుంటే నీ చేతులు మీద పాపం అధికారిగా ఉంది అన్నమాట! నీ కాళ్ళు సినిమాలకు, వ్యభిచార గృహాలకు, పరుగిడుతుంటే నీ కాళ్ళు దుర్నీతికి సాధనముగా ఉంది అన్నమాట! నీ చేతులు కాళ్ళతో నీ భార్యను హింసిస్తున్నావు అంటే సాతానుగాడు నిన్ను వశపరచుకున్నాడు అన్నమాట! నీ చెవులు పాడు మాటలు, పాడు పాటలు వింటుంటే నీ చెవులు పాపానికి దాసులు అన్నమాట! నీ కళ్ళతో చెడు సినిమాలు, చెత్త సీరియల్లు, పనికిమాలిన చెత్త బూతు సినిమాలు, ఫోటోలు చూస్తున్నావు అంటే నీ కళ్ళు చావలేదు అన్నమాట! నీ నోటితో బూతులు, పాపపు పాటలు పాడుతున్నావు అంటే నీవు పైకి భక్తిగలవానిగా యాక్షన్ చేస్తున్నావు గాని నీ బ్రతుకు మారలేదు. సాతానుడే నీమీద రాజ్యం చేస్తున్నాడు*. దయచేసి ఇప్పుడే నీ బ్రతుకు ఎలా ఉందో చూసుకో!
సరిచేసుకో!
రాబోయే ఉగ్రతనుండి తప్పించుకో!
నేడే యేసయ్య పాదాలపై పడి నీ తప్పులు ఒప్పుకో!
భయమునోంది ఇకను పాపము చేయకు!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-71వ భాగం*
రోమా 6:14—15
14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
15. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు. . . .
ప్రియులారా! ఈ 14వ వచనంలో మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కాదు కాబట్టి మీమీద పాపము ప్రభుత్వం చేయదు అంటున్నారు. అంటే ఇక పాపానికి మీమీద అధికారం ఇంకేమాత్రము లేదు. ఇంతవరకు పాపానికి దాసులై ఉన్నవారికి ఇది ఎంతో మధురమైన వాగ్దానం. *ఇక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం వలన పాపాన్ని జయించగలమని మనం ఆలోచించకూడదు. పాపం మనపై చేసే అధికారాన్ని వదిలించుకునేందుకు దేవుని కృప మాత్రమే చేయగలదు*. పాప క్షమాపణ, శాశ్వత జీవము, పరిశుద్దాత్మ, పాపానికి వ్యతిరేఖంగా మనం చేసే పోరాటం జయం పొందే శక్తిని, బలాన్ని ఈ *కృపమాత్రమే* మనకు ఇస్తుంది. 5:21: ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.....
అలాగైతే మనం కృపకే గాని ధర్మశాస్త్రం క్రింద లేము కాబట్టి పాపం చేసేద్దామా? ఎట్టి పరిస్తితిలో కూడా చేయకూడదు అంటున్నారు పౌలుగారు. నిజం చెప్పాలంటే మనుష్యులు అనుకుంటారు తమకు పాపం చేసే స్వేచ్చ ఉంది. మంచి చెడులు మాకు తెలుసు అని భ్రమపడతారు. ఈ భ్రమలో వారు మరచిపోతున్నారు...—ఈ పాపం చేయడం స్వేచ్చకాదు గాని పాపానికి దాసులుగా బానిసలుగా మారిపోతున్నారు.
16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? కారణం యేసుక్రీస్తుప్రభులవారు చెబుతున్నారు పాపం చేసే ప్రతీవాడు పాపానికి దాసుడు! యోహాను 8:34; కాబట్టి ఇప్పుడు విశ్వాసి బాప్తిస్మం ద్వారా ఆ బానిసత్వం నుండి విడుదల పొందాడు. కాబట్టి ఇకను పాపం చేయకూడదు. చేస్తే మరలా దాస్యమనే కాడిక్రిందకు వచ్చి పాపానికి బానిసైపోతాడు. అది మరలా అతనిని పాపం చేయిస్తుంది. ఇది తిన్నగా విశ్వాసిని నరకానికి తీసుకుని పోతుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న మరోదారి ఉంది- అది దేవుని పట్ల విధేయతా దారి! దానిపేరు ఇరుకుమార్గం! అంటే మనకుమనంగా పాపాన్ని విసర్జించి, ద్వేషించి – పాపానికి చచ్చిన వారంగా ఎంచుకోవడమే విధేయతా దారి! ఈ మార్గం మనలను నీతిన్యాయాలకు- నిత్యజీవానికి నడిపిస్తుంది. కాబట్టి విశ్వాసికి గాని మానవజాతికి గాని ఉన్నవి ఈ రెండు దారులే! ఏదో ఒక దారిని తప్పకుండా ఎంచుకోవాలి!! మత్తయి 7:13—14
13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. . .
కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు దేనికి దాసుడుగా ఉన్నావా?
పాపానికా? విధేయతకా?
17—18
17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. .. మీరు పాపానికి మరణానికి మునుపు దాసులుగా ఉన్నారు అయితే పాపమునుండి మీరు విమోచింపబడి నీతికి దాసులుగా ఉన్నారు. ఇందుకు దేవునికి స్తోత్రం అంటున్నారు. విశ్వాసులుకు స్వేచ్చ ఎలా వస్తుందో ఇక్కడ వ్రాయబడి ఉంది. క్రీస్తు సువార్తకు ఉపదేశానికి లోబడడమే ఈ స్వేచ్చకు మార్గం!
ఇక్కడ పౌలుగారు హృదయపూర్వకముగా అనేమాటను ఉపయోగించారు. కారణం మనిషి దేవునికి, వాక్యానికి , ఉపదేశానికి హృదయపూర్వకముగా లోబడాలి. మనసా వాచా కర్మేనా లోబడాలి. చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు వాక్యానికి, బోధకు లోబడ్డారు కాబట్టి విడుదల పొందారు. ఇక్కడ నీతికి దాసులైరి అనగా ఎవరో బలవంతంగా వీళ్ళను బానిసలుగా చేశారు అని కాదు. విశ్వాసి దేవుని సంకల్పం ప్రకారం చేయడానికి సంతోషంగా మనసారా సమ్మతించి ఆ యజమానికి లోబడి ఉండడం!
ఇక తర్వాత వచనాలలో అనగా 19—23 వచనాలలో ఇంతవరకు చెప్పినదానిని మరోకోణంలో వివరిస్తున్నారు పౌలుగారు! అర్ధం ఒకటే!
19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
20. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.
21. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము......
మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు అక్రమము, అపవిత్రత చేయడానికి మీ అవయవములను అపవిత్రతకు, అక్రమముకు ఏలాగు అప్పగించుకున్నారో ఇప్పుడు నీతికి దాసులుగా అనగా దేవునికి దాసులుగా ఉండటానికి మీ అవయవాలు నీతికి అప్పగించుకోండి అంటున్నారు. 13వ వచనంలో కూడా ఇదే చెప్పారు..
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. ..
మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతివిషయమై ఆటంకం లేకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు నీతికి దాసులుగా ఉన్నారు కాబట్టి అక్రమము, అవినీతి, అపవిత్రతను విసర్జించాలి. అనగా గలతీ 5:19-21 వ్రాయబడిన శారీరక క్రియలు అన్నీ వదిలెయ్యాలి. ఏదో ఒకటో రెండు వదిలేసి మిగిలినవి చేస్తే పర్వాలేదు అనుకుంటే తప్పే! మొత్తం శారీరక క్రియలు అన్నీ వదిలెయ్యాలి. కారణం ఏ మనిషి ఇద్దరు యజమానులకు లోబడి ఉండలేడు! అయితే పాపానికి—సాతానికి! లేదా నీతికి—దేవునికి! ఇద్దరి క్రింద చేయడం అసాధ్యం! మత్తయి 6:24
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. పాపానికి దాసులుగా ఉన్నమనుష్యులు, మనుష్యుల దృష్టిలో మంచి పనులు చెయ్యరని, వారిలో మత సంభంధమైన భక్తి అనేది వారిలో కనిపించదు అని కాదు. నిజానికి ఇలాంటి వారు చాలా మతనిష్టగా నటిస్తారు. అయితే వీరి జీవితాలలో యజమాని ఎవరు అంటే అది పాపం- సాతాను! మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: పాపులు చేసే నీతి క్రియలు దేవుని దృష్టిలో పాపపు రంగు అంటి ఉంటాయి. అనగా దేవుని దృష్టికి అవి మురికిగుడ్డలుగా కనిపిస్తాయి! యెషయ 64:6.
మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను
ఇక 21—23 వరకు వివరిస్తున్నారు—అప్పటి పనులవలన అనగా ఆ పాపపు పనుల వలన మీకు ఏం ప్రయోజనం కలిగింది? వాటిని గురుంచి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కదా! ఇప్పుడు రక్షంచబడి పవిత్రులుగా ఉన్నారు కాబట్టి అప్పటి పాపపు జీవితం మీకు సిగ్గు అవమానం తెచ్చింది. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తమ పూర్వపు పాపాల విషయమై సిగ్గుపడి నిజమైన పశ్చాత్తాపము పొందకపోతే ఈ విశ్వాసిలో ఏదో లోపం ఉందన్నమాట! ఇది తిరిగి ఆ వ్యక్తీ పాపానికి తిరిగిపోయే దానికి దోహదపడుతుంది. 2 పేతురు 2:22
కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
అయితే ఇప్పుడు మీరు విడుదల పొందారు కాబట్టి దేవునికి దాసులయ్యారు! దానికి ఫలంగా పరిశుద్ధత, శాశ్వతజీవం కలిగిస్తుంది. కాబట్టి ఇకను పాపం చేయవద్దు!
ప్రియ విశ్వాసి! నీ పరిస్తితి ఎలా ఉంది?
ఒకసారి పరిశీలను చేసుకో!
దైవాశీస్సులు!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి