రోమా పత్రిక - పార్ట్-4

*రోమా పత్రిక-72వ భాగం*
రోమా 7:14 
1. సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. 
2. భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. 
3. కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని( అసలుమాట-వివాహము చేసికొనినయెడల) చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును. 
4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి. . . 

      ప్రియ దైవజనమా! ఈ 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యత కలది. ఈ అధ్యాయంలో ధర్మశాస్త్రం వలన పాపం ఎలా రూఢిపరచబడిందో, అలాగో మన శరీరంలో గల పాపనియమముదేవుని నియమము ఎలా ఒకదానితో నొకటి టకరారు చేస్తుందో పౌలుగారు చాలా వివరంగా రాసారు. దానితోపాటు ఒక భార్యాభర్తల మద్య సంబందం ఎంతవరకు ఉంటుందో ఇక్కడ మనకు చాలా విశదంగా రాశారు పౌలుగారు.  

   మొదటివచనంలో పౌలుగారు చెబుతున్నారు ఒకవ్యక్తి బ్రతికి ఉన్నంతకాలమే ధర్మశాస్త్రం అతనిమీద అధికారం కలిగియుంటుంది గాని ఒకవ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిమీద మరణానికి ఎటువంటి అధికారం లేదు! అదేవిధంగా ఇప్పుడు విశ్వాసి ఎప్పుడైతే భాప్తిస్మం తీసుకున్నాడో అప్పుడే పాపం విషయంలో చనిపోయాడు, అనగా ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాడుకారణం పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రం అని ధ్యానం చేసాం. కాబట్టి ఎప్పుడైతే పాపం విషయంలో విశ్వాసి మరణించాడో ఇక అతనిపై ధర్మశాస్త్రానికి- మరణానికి ఎటువంటి అధికారం లేదు!  రోమా 6:68,14
6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము. 
7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు. 
8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, 
14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ...

    ఇది చెప్పాక పౌలుగారు మానవ సంబంధం ఎత్తి రాస్తున్నారు- అది భార్య-భర్త మధ్య ఉన్న సంబంధం. ఒక పెళ్లి అయిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంతకాలము ఆమె ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి అతని అధికారం క్రింద ఉంటుంది, గాని భర్త చనిపోతే ఆమె భర్తను గురించిన చట్టం నుండి విడుదల అవుతుంది అంటున్నారు.  భర్త చనిపోయాక ఆమె వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా పెండ్లి చేసుకోవచ్చు! ఇది బైబిల్ అంగీకరిస్తుంది. ఇంకా ఎన్నో గ్రంధాలు, చట్టాలు అంగీకరిస్తున్నాయి అలాగే ధర్మశాస్త్రం కూడా అంగీకరిస్తుంది. అయితే భర్త బ్రతికి ఉండగా ఆమె మరొకనితో సంభంధం కలిగిఉన్నా అనగా అక్రమ సంభందం ఉన్నా, వ్యభిచారం చేసినా ఆమెను వ్యభిచారిణి అంటారు. ఇది కేవలం స్త్రీ కోసమే కాదు పురుషుని కోసం కూడా చెబుతుంది. ఒక పురుషుడు భార్య బ్రతికి ఉండగా మరో స్త్రీతో అక్రమ సంభందం పెట్టుకున్నా, లేక సహనివాసం చేస్తున్నా, లేక వ్యభిచారం చేస్తున్నా వాడు వ్యభిచారి! ఈ వ్యభిచారులు అన్ని చట్టాల ప్రకారం , మత గ్రంథాల ప్రకారం శిక్షార్హుడు! భార్య చనిపోతే అతడు ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతాడు. ఆదికాండం 2:24
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
... దీనినే యేసుక్రీస్తుప్రభులవారు మరలా చెబుతున్నారు మత్తయి 19:39
3. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చిఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా 
4. ఆయనసృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు 
5. ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? 
6. కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. 
7. అందుకు వారు ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా 
8. ఆయన మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. 
9. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను. .

   చాలామంది విశ్వాసులైన విడాకులు తీసుకున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈ ప్రశ్న నన్ను అడిగారు. వారికికూడా ఇదే వర్తిస్తుంది. 
1. బైబిల్ విడాకులు తీసుకోడానికి అనుమతించడం లేదు. 1 కొరింథీయులకు 7:10,11
10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. 
11. ఎడబాసినయెడల పెండ్లిచేసి కొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. .... కేవలం వ్యభిచారం కారణాన, అది దృవీకరించబడితే విడాకులు తీసుకోవచ్చు.

  1a). భర్త లేదా భార్య అవిశ్వాసి అయి ఉండి, ఆమెతో/అతనితో అతడు/ఆమె కాపురం చేయనిష్టపడితే ఎట్టి పరిస్తితిలోనూ బైబిల్ విడాకులకు అనుమతించడం లేదు. ప్రార్ధన మరియు మంచి ప్రవర్తన ద్వారా అతనిని రాబట్టవచ్చు అనగా అతనిని/ఆమెను మార్చవచ్చు అంటున్నారు పౌలుగారు మరియు బైబిల్!1కొరింథీ 7:12,13,14,15
12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. 
13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు. 
14. అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి(మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. 
15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను(అనేక ప్రాచీన ప్రతులలో-మిమ్మును అని పాఠాంతరము) పిలిచియున్నాడు. 

 2. (పైన ఇవ్వబడిన రిఫరెన్సుల ప్రకారం) ఏ కారణం చేతనైనా విశ్వాసి విడాకులు తీసుకుంటే లేక విడాకులు ఇవ్వబడినా, తిరిగి వివాహం చేసుకోకూడదు. ఎంతవరకూ? ఆ వ్యక్తియొక్క పార్టనర్ (భర్త/బార్య) బ్రతికి ఉన్నంతవరకూ ఆమె/అతడు వివాహం చేసుకోకూడదు!! ఇదీ బైబిల్ చెబుతుంది. ఒకవేళ పార్టనర్ అతడు/ఆమె మరో వివాహం చేసుకున్న విశ్వాసి మాత్రం అవతలి వ్యక్తి మరణించేవరకు పునర్వివాహం చేసుకోకూడదు! ఇది బైబిల్ శాసనం!  దీనిని బైబిల్ నొక్కి వక్కానిస్తుంది!  ప్రియ విశ్వాసులైన విడాకులు తీసుకున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు దీనిని గ్రహించమని మనవి చేస్తున్నాను! 

   కాబట్టి భార్య/భర్త బ్రతికి ఉన్నంతవరకూ భర్త/భార్య అతని అధికారానికి లోబడి ఉండాల్సిందే! పార్టనర్ చనిపోయాక మరలా వివాహం చేసుకోవచ్చు. అలాగే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి పాపం విషయంలో చనిపోయాడు కాబట్టి ధర్మశాస్త్రానికి మరణానికి అతనిపై/ఆమెపై అధికారం లేదు!

        ఇంకా ఈ విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే మొదటిభర్త అనగా యేసుక్రీస్తు ప్రభులవారికి ముందుగా ఉన్న మోషేగారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం! అయితే యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయినప్పుడు విశ్వాసులకు సంభందించినంతవరకూ ఈ ధర్మశాస్త్రం చనిపోయింది. కారణం యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు! తన సిలువమరణంతో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు.   సరే, క్రీస్తు మరణించినప్పుడు బాప్తిస్మం ద్వారా విశ్వాసులు కూడా పాపం విషయంలో మరణించారు. అప్పుడు మరో పురుషుని చేరుకోడానికి స్వేచ్చ కలిగింది.
 ఇక ఇప్పుడు విశ్వాసి ధర్మశాస్త్రం క్రిందనుండి బాప్తిస్మం ద్వారా విశ్వాసి క్రీస్తుతో ప్రధానం చేయబడ్డాడు. 2కోరింథీయులకు 11: 2
దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,. .
క్రీస్తుని తనస్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా విశ్వాసి వధువు కాబడ్డాడు. . ఇప్పుడు కృపక్రింద ఉన్నాడు కాబట్టి మరలా పాపం చేస్తే మరలా ధర్మశాస్త్రం అనే పరపురుషుడు/ లేక పాపాన్ని కంట్రోల్ చేస్తున్న సాతాను గాడి అధికారం క్రిందకు వస్తావు. అది వ్యభిచారం అనగా ఆత్మీయవ్యభిచారం! క్రీస్తుతో ప్రధానం చేసుకున్న నీవు పాపం అనగా వ్యభిచార క్రియలు, త్రాగుడు, సినిమాలు, సీరియల్లు చూస్తే, శారీరక క్రియలు చేస్తే నీవు ఒక భర్త ఉండగా మరో పరపురుషుడు అనే సాతాను/లోకాన్ని స్నేహం చేసి వాటితో వ్యభిచారం చేసినట్టే! ఇది కూడదు! 

         ఒక విశ్వాసి క్రీస్తును చేరుకొన్నాడు అంటే అతని లక్ష్యం ఏమిటంటే: దేవుని కోసం ఫలించాలి తప్ప లోకంతో స్నేహం చేసి వ్యభిచారులు కాకూడదు. 
యాకోబు 4:4
వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ..  
ఫలించడం అంటే యోహాను 15:18
1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 
2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. 
3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు. 
4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. 
5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. 
6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. 
7. నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 
8. మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. .. కనుక రక్షించబడిన విశ్వాసి క్రీస్తులో నిలిచియుండాలి గాని లోకంతో తైతక్కలాడకూడదు.

   ప్రియ విశ్వాసి! నీ స్నేహం ఎవరితో? దేవునితోనా? లోకంతోనా? ఏదికావాలో తేల్చుకో!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-73వ భాగం*

రోమా 7:58 
5. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను. 
6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము. 
7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 
8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని( లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.  . . 

      ప్రియ దైవజనమా! ఈ 7వ అధ్యాయంలో గల చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి గతభాగం నుండి ధ్యానం చేస్తున్నాం. ఇక ఈ రోజు ధర్మశాస్త్రం యొక్క విశిష్టత, అది మంచిదా/ చెడ్డదా? ఇలాంటి విషయాల కోసం ధ్యానం చేద్దాం. ధర్మశాస్త్రం కోసం గత భాగాలలో చాలా విపులంగా ధ్యానం చేశాం కాబట్టి కొద్దిగా కావలసినంత మట్టుకు ధ్యానం చేద్దాం! 

     5వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు అనగా రక్షించబడక మునుపు, మారుమనస్సు, పశ్చాత్తాపం, బాప్తిస్మము లేకమునుపు, మరణార్ధమైన ఫలాలు ఫలించాము. అలా ఫలించటానికి, ధర్మశాస్త్రము వలనైన పాపేచ్చలు అనగా ధర్మశాస్త్రం ఏవి చేయవద్దు అని ఆజ్ఞాపించిందో ఆ పాపపు ఇచ్చలు/కోరికలు మన అవయవాలలో అనగా మన శరీరమంతా కార్యసాధకములై ఉండెను అంటే మన శరీర భాగాలు మొత్తం పాపం చేయడానికి పరుగులు తీసేవి. 3:20, 4:15, 5:20 ల ప్రకారం ధర్మశాస్త్రం పాప సంభందమైన కోరికలను రేకెత్తించింది. ఏది చెయ్యవద్దని ఆజ్ఞాపించిందో, మన బ్రష్ట స్వభావం దానినే చేయాలని కోరుకుంది. తద్వారా ధర్మశాస్త్రం మూలంగా ఒకరకంగా పాపానికి పురికొల్పడానికి సమానమైన పని చేసింది. అయితే 6:21 ప్రకారం దీని ఫలితం మరణం. అయితే ఇప్పుడు మనం అనగా బాప్తిస్మం తీసుకున్న మనం ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాము. (6వ వచనం)  మనలను ఏది బందించిందో దాని విషయంలో చనిపోయాము. కారణం: మనం దేవుని ఆత్మను అనుసరించే క్రొత్త విధానంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారమైన సేవచేయాలి గాని ధర్మశాస్త్రం ప్రకారం అక్షరానుసారమైన పాత విధానంలో కాదు. 

   ఈ వచనంలో పౌలుగారు ధర్మశాస్త్రం క్రింద పనిచేయడానికి, కృప క్రింద దేవుని ఆత్మ ఇచ్చిన స్వేచ్చలో సేవ చేయడానికి గల తేడాను వివరిస్తున్నారు.  ఇదేమాట 2కొరింథీ 3:6,17 లో కూడా చెబుతున్నారు. 
6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. 
17. ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. .... 
ఇక్కడ అక్షరం చంపుతుంది ఆత్మ జీవింపజేస్తుంది అనగా అక్షరం అనగా ధర్మశాస్త్రం, ఆత్మ అనగా దేవుని పరిశుద్ధాత్మ! ఇక 8వ అధ్యాయం మొత్తం దేవుని ఆత్మసంబంధమైన నూతన విధానంలో సేవచేయడం కోసం పౌలుగారు చెబుతున్నారు. దీనినే క్రొత్త మార్గం అని చెబుతున్నారు పౌలుగారు. కారణం యేసయ్య పునరుత్థాడైన తర్వాత వారికి అనగా శిష్యులకు ఒక నూతన విధానంలో తన ఆత్మను ఇచ్చారు. అపో 1:4, 2:4, యోహాను 14:1617..

     7వ వచనంలో అంటున్నారు: కాబట్టి ధర్మశాస్త్రం పాపమయ్యిందా? అంటే కాదు! ధర్మశాస్త్రం వల్లనే మనకు పాపం అంటే ఏమిటి అనేది తెలిసింది. కారణం ధర్మశాస్త్రంలో చేయవలసిన పనులుచేయకూడని పనులు ఒక చట్టంలా బ్లాక్ & వైట్ లో documented గా కనబడుతున్నాయి. 8వ వచనం ప్రకారం అయితే ఈ పాపం ఆజ్ఞను అనగా ధర్మశాస్త్రంలో గల చట్టాలను హేతువు చేసుకుని సకల దురాశలను నాలో పుట్టిస్తుంది ధర్మశాస్త్రం లేన్నప్పుడు పాపం మృతము అంటున్నారు. 

*ఇక్కడ పౌలుగారి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ధర్మశాస్త్రం పాప సంబంధమైన కోర్కెలను రేకేత్తెస్తుంది. కాబట్టి ఇప్పుడు అలా జరింగింది అంటే అదికూడా అనగా ధర్మశాస్త్రంకూడా పాప సంబంధమైనదే కదా! అంటే కాదు. ధర్మశాస్త్రం చాలా పవిత్రమైనది. న్యాయమైనది. మేలైనది.  (దీనికోసం వివరంగా 1తిమోతి పత్రికలో వివరించారు.) అయితే స్వభావరీత్యా మనుషులు అపవిత్రులు, అవినీతిపరులు, చెడ్డవారు!  3:919..  కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం మీరాలని మనుషులు ఇష్టపడితే అది మనుషుల తప్పే గాని ధర్మశాస్త్రం తప్పు ఎలా అవుతుంది???  ఇక తర్వాత వచనాలలో దీనినే తన స్వానుభావాన్ని జోడించి అనగా తన సొంత అనుభవాన్ని కూడా చెబుతున్నారు పౌలుగారు*.  
  *తనకున్న మంచి అభిప్రాయాలను పాడు చేసిన ఆజ్ఞలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉదాహరణ: ఆశింపవద్దు అనేది బైబిల్ ఆజ్ఞ నిర్గమ 20:17;  ఇక్కడ బయట విషయాల్లో పౌలుగారు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరకుండా చాలా జాగ్రత్తగా కాచుకోగలిగారు గాని తన అంతరంగంలో ఉద్భవించే కోరికలను మాత్రం తన అదుపులో ఉంచుకోలేకపోయారు.  అది అనగా మనస్సులోని పాపపు తలంపులను అదుపులోనికి తెచ్చుకోవడం అనేది మనిషి అదుపులో ఉండదు అని గ్రహించారు పౌలుగారు. ఆశింపవద్దు అని చెప్పిన ఆజ్ఞ అదే ఆశలను పురిగొల్పుతుంది. మనిషి హృదయం పాపిష్టి కోరికలతో నిండి ఉంది.  అయితే దేవుని ధర్మశాస్త్రం కూడా వీటిలో దేనినీ అనగా ఈ పాపిష్టి కోరికలను నెరవేర్చకూడదు అనే చెబుతుంది. అయితే అదే కోరికలు మరింత బలపడటానికి కూడా ఇదే ధర్మశాస్త్రం దోహదం చేస్తుంది అని అంటున్నారు పౌలుగారు!*

  అయితే 8 వచనంలో ధర్మశాస్త్రానికి వేరుగా పాపం లేదు అంటున్నారు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మృతం!  ఎలా? ఇతరుల వస్తువులను ఆశించకూడదు అని ధర్మశాస్త్రం తనకు బోధించనంతవరకూ, అది పాపం, తప్పు అని తనకు అర్ధం అవనంతవరకూ అది పాపంగా బావించలేదు పౌలుగారు. అయితే ఎప్పుడైతే అది తప్పు, అపరాధం అని గ్రహించారో వెంటనే దానినే చేయాలనే కోరిక పెరగడం మొదలుపెట్టింది. కాబట్టి ఆజ్ఞ లేకపోతే కోరికలు ఉద్రేకం అయ్యేవి కాదు.  పాపం అనేది ఏమీ కదలకుండా మెదలకుండా ఉన్నట్ట్లుంటుది. అయితే తన హృదయం మంచిది అని తను అనుకున్నారు. అయితే అది ఒక విష సర్పాల గుంట అని వెంటనే తెలుసుకున్నారు పౌలుగారు. 

    అయితే 9,10 వచనంలో అంటున్నారు జీవాన్ని తీసుకుని రావలసిన ఆజ్ఞ నాకు చావును తెచ్చిపెట్టింది ఎలాగంటే పాపం అదే ఆజ్ఞ ద్వారా అవకాశం చిక్కించుకొని నన్ను పూర్తిగా మోసపుచ్చింది. నన్ను చంపింది. *దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది మనుషులను చంపాలని ఎంతమాత్రము కాదు. తన ప్రజలలో న్యాయమైన. నీతియుక్తమైన మంచి జీవిత విధానాన్ని పెంపొందించాలని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు. అయితే అది పౌలుగారికి మరణాన్ని తెచ్చింది*. ధర్మశాస్త్రం మూలంగా అతడు తన పాపాన్ని గ్రహించారు. దానికి ఫలితంగా మరణం వచ్చింది. 

   ఇక 12వ వచనం ధర్మశాస్త్రం పవిత్రమైనది. ఆజ్ఞకూడా పవిత్రమైనది, న్యాయమైనది, మంచిది అంటున్నారు. ఎలా 1తిమోతి 1:9--11
9. ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును(భ్రష్టులకును) పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, 
10. హితబోధకు(ఆరోగ్యకరమైన బోధకు) విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని, 
11. *నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము*. ...

     13 వ వచనంలో ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? కానేకాదు అంటున్నారు. అయితే పాపము ఉత్తమమైన దానిని అనగా ధర్మశాస్త్రాన్ని మూలముగా చేసుకుని నాకు మరణం కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తం అదినాకు మరణకరమాయెను. అంటున్నారు. అర్ధం కాలేదు కదా! మంచిదాని ద్వారా నాకు చావు తెచ్చిపెట్టడం వలన అది పాపంగా కనిపించాలని ఆ ఆజ్ఞమూలంగా పాపం ,  అతి పాపిష్టిగా కావాలని అలా జరిగింది అంటున్నారు.  కారణం ధర్మశాస్త్రంలో పొరపాటు అనేది లేదు. మనిషికి వచ్చిన సమస్య ఏమిటంటే అతనిలోని బ్రష్ట స్వభావమే! పాపం అనేది ఏమిటో చూపించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించారు. అయితే చిక్కు ఏమిటంటే: *పాపం ధర్మశాస్త్రానికి కూడా లోబడదు.  అలా లోబడటం దానికి చేతకాదు కూడా!*  8:7
కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
  ఇక్కడ అతిక్రమించిన దైవాజ్ఞలు పాపం అనేదాన్ని మరింత పాపంగా చేస్తున్నాయి.
    (ఇంకాఉంది)
*రోమా పత్రిక-74వ భాగం*

రోమీయులకు 7:14--20
14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. 
15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 
16. ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. 
17. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. 
18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. 
19. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 
20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. 

     14వ వచనంలో ధర్మశాస్త్రం ఆత్మసంబంధమైనది అని మనకు తెలుసు. అయితే నేను పాపమునకు అమ్మబడి మనిషి శరీర సంబంధినైపోయాను అంటున్నారు పౌలుగారు. ఎందుకు శరీరసంబందినైపోయాను అంటున్నారు? కారణం 15వ. నేను చేయునది నాకు తెలియదు. నేను చేయనిచ్చయించునది నేను చేయడం లేదు గాని ద్వేషించునదే చేస్తున్నాను.  కాబట్టి నేను కోరుకోనిది నేను చేస్తున్నాను అంటే ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అని ఒప్పుకుంటున్నాం అంటున్తున్నారు. కాబట్టి 16వ ఇప్పుడు అలా పాపాన్ని చేసేది నేను కాదు గాని నాయందు నివశించు పాపమే అంటున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 7వ అధ్యాయంలో 713వచనాలలో పౌలుగారు గతంలో తనకు సంభవించిన విషయాలు గురుంచి రాశారు. అయితే ఇప్పుడు 1425 వచనాల వరకు వర్తమానకాలంలో ఎలా జరుగబోతుందో చెబుతున్నారు.  ఈ వచనాలలో క్రీస్తు విశ్వాసిగా పౌలుగారు తాన స్వభావ సిద్ధంగా, స్వయంగా ఏమిటో వివరిస్తున్నారు.  అయితే క్రీస్తును ఎరుగక ముందటి విషయాలు గురించి చెప్పడం లేదు. పౌలుగారు నేను, నాలో, నాకు మొదలైన మాటలను ఈ వచనాల్లో చాలా విస్తారంగా ఉపయోగించారు. సుమారు 40సార్లు వాడారు. చివర్లో ఒక్కసారి మాత్రం క్రీస్తును ప్రస్తావించారు.  దేవుని ఆత్మను గురించి కూడా చెప్పడం లేదు. అయితే తన దౌర్భాగ్య స్తితిని గురించి విచారిస్తూ చివరలో 25వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రాలు చెబుతున్నారు.  దీనికి ముందు వచనాలలో ఒక విశ్వాసిగా తన హృదయంలో/ మనస్సులో అనుభవిస్తున్న ఆధ్యాత్మిక అలజడిని, అంతర్లీనంగా ఉన్న భావాలను ఉటంకిస్తూ మాట్లాడారు. 
ఇక 14 వచనంలో తానూ శరీర స్వభావం గలవాడిని అని చెబుతూ తానుకూడా పాపానికి దాసుడనై అమ్ముడుపోయాను అని చెప్పారు. తద్వారా తన సహజ స్తితిని వర్ణిస్తున్నారు పౌలుగారు.  గాని ఇక్కడ ఈ వచనాలలో మాత్రం క్రీస్తు తనకోసం ఏం చేశారో చెప్పలేదు. గాని మిగతా చోట్ల అనేకపత్రికలలో చెప్పారు.  ఇక్కడ దేవుని ఆధ్యాత్మిక నియమం ప్రకారం  అతని ప్రస్తుత స్తితి ఎంత దరిద్రంగా ఉందో, పాపం విషయంలో అతనికి తెలియజేసింది. అయితే ఈ 1425 జాగ్రత్తగా పరిశీలిస్తే కేవలం ఆత్మను పొందుకుని నిజమైన పశ్చాత్తాపంతో దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తిమాత్రమే అలాంటి వారు అని తెలుసుకుంటారు.  పౌలు తన పాపం కోసం శోకించినట్లు దేవుని ఆత్మ లేనివారు, దేవుని ఆత్మ ఒప్పించని వారు శోకించరు. మత్తయి 5:34; 7:1425లో కనిపించే వ్యక్తి తన ఆధ్యాత్మిక స్తితి గుర్తించి ఎలా విలపిస్తున్నాడో మనం చూడవచ్చు. తద్వారా అతడు పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యం పొందుకొన్నట్లు చూడగలం! పౌలుగారు కూడా ఇలానే విలపిస్తున్నారు ఇక్కడ!  ఈ మార్పు దమస్కు అనుభవం తర్వాత కలిగినది.  

ఇక్కడ 16, 17వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే తనకు జరుగుతున్నా అనుభవాన్ని పౌలుగారు వివరిస్తున్నారు కదా, అది పౌలుగారు తను చేసిన అపరాధాలకు సాకులు ఎంతమాత్రమూ చెప్పడం లేదు. తనలో అంతర్లీనంగా ఒక శత్రువు జీవిస్తున్నాడు అనే ఒక భయంకరమైన వాస్తవాన్ని అతడు చవిచూసి, దానిని ప్రతీ ఒక్కరు కూడా అనుభవిస్తున్నారు అని దృవీకరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా అందరికీ తేటతెల్లం చేస్తున్నారు. అ శత్రువు పేరు పాపము! అది తనకంటే బలమైనది అని ఒప్పుకుంటున్నారు పౌలుగారు! 

    మరోసారి 1820 వచనాల ప్రకారం నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేస్తున్నాను అంటే దానిని చేసేది నేను కాదుగాని నాలో నివశించు పాపమే అంటున్నారు.  18వ వచనంలో నాలో అంటే నా శరీర స్వభావంలో మంచిది అనేది ఏదీ నివాసం చేయడం లేదు అంటున్నారు.  మనిషియొక్క బ్రష్ట స్వభావం ఎలాంటిదో దేవుని ఆత్మ పౌలుగారికి చాలా బాగా నేర్పించాడు.  అది స్వభావ రీతిగా ఆదాముగారి నుంచి అందరికీ వారసత్వంగా వచ్చింది. రోమా 1:2932; 3:919; 8:58; ఆదికాండం 8:21; యిర్మియా 17:9;  మత్తయి 15:19; ఎఫెసీ 2:13; 1తిమోతి 1:15 .  ఈ అన్ని వచనాలలో (పౌలుగారు రాసిన వచనాలు) పౌలుగారు పాపులందరిలోను నేను ప్రధాన పాపిని అని ఒప్పుకుంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలుగారు వాడిన భాషలో, వ్యాకరణంలో ఎక్కడా భూతకాలాన్ని వాడటం లేదు, ప్రస్తుతస్తితిని వివరిస్తున్నారు.  నేను పాపిని అంటున్నారు.  మనిషి యొక్క అసలు స్వరూపాన్ని పౌలుగారు ఇక్కడ బయట పెట్టారు. అది చెడ్డదే కాబట్టి దానిని పరిత్యజించాలి అని ఏసుప్రభువు చెబుతున్నారు. కారణం దానికి మరణమే తగినది. మత్తయి 10:39; లూకా 9:23;  ఈ పై రెండు వచనాలలో యేసుప్రభులవారు ప్రతీరోజూ అంటున్నారుఅనగా శరీర స్వభావానికి తగినది మరణమే అంటూ ప్రతీరోజూ మనం దానిని అనగా శరీర స్వాభావిక ఆశలను నిరాకరిస్తూ- పరిత్యజిస్తూ ఉండాలి.  అలా చేయని పక్షంలో శరీర స్వభావం మరలా పుంజుకుంటుంది.

    కాబట్టి దీనంతటి ప్రకారం పాపం ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని మనిషిలో పాపపు ఆలోచనలను రేకేత్తెస్తుంది. అయితే మనిషి/ విశ్వాసి దానిని ఎదుర్కొని- పరిత్యజిస్తూ- జయిస్తూ ఉండాలి. లేకపోతే ఆ పాపం నిన్ను వశపరచుకొని, తిరిగి నాశనానికి, మరణానికి నడిపిస్తుంది. మరి నీకునీవుగా అది చేయగలవా? అది నీ చేతకాదు. దానికి అనుదిన వాక్య పఠనం, ప్రార్ధనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నీవు దానిని జయించగలవు. 

ప్రియ చదువరీ! మరి నీకు అవి ఉన్నాయా?
లేకపోతే ఇప్పుడే వాటికోసం ప్రార్ధించు! ప్రార్ధనాత్మ కోసం, అనుదినం వాక్య పఠనం కోసం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్ధన చేసి పొందుకో!
నిత్యజీవాన్ని పొందుకో!
దైవాశీస్సులు!
     
*రోమా పత్రిక-75వ భాగం*
*పాప నియమం-1*

రోమా 7:2125
21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 
22. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని 
23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. 
24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? 
25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను..  

      ప్రియ దైవజనమా! ఈ 7వ అధ్యాయంలో గల చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి గతకొన్ని రోజుల నుండి ధ్యానం చేస్తున్నాం.  గతభాగంలో తనలోనూ, ఇంకా సర్వజనులలోనూ ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరు పాపము. దానిని జయించడానికి తనకు శక్తిలేదు అంటున్నారు అని చూసుకున్నాం.  ఇప్పుడు ఈ వచనాలలో ఆ శత్రువుచేసే పనిని ఒక నియమంగా చెబుతున్నారు.  అది తన అవయవాలలో ఉంది.  ఈ నియమం ఎల్లప్పుడూ నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. అంటున్నారు. 

    22వచనంలో అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నాను గాని ఈ నియమం నన్ను ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి బలవంతంగా లోబరచుకొంటుంది అని వాపోతున్నారు పౌలుగారు. ఇలా పాప విముక్తిలేని ఏ వ్యక్తి గాని, ఏ అవిశ్వాసి గాని చెప్పలేడు!!  పౌలుగారు ఇలా బాదపడుతూ అంటున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు! ఆక్రోశిస్తున్నారు: అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను!  ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును ? అని విమోచన కోసం ఎదురుచూస్తున్నారు. కారణం ఈ పాప నియమం తనను చావుకు నడిపిస్తుంది. 

    తనలోని దుష్టత్వాన్ని ఈ విధంగా గుర్తించడం, మంచిగా బ్రతకాలని, మంచి చేయాలి అనే తాపత్రయం పౌలుగారి హృదయంలో ఈ రకమైన మూలుగును, ఆవేదనను కలిగించింది. తనలోని స్వాభావికమైన, సంపూర్ణమైన, సరిదిద్దుకోవడానికి అసాధ్యమైన బ్రష్ట హృదయాన్ని అనుభవిస్తున్న పౌలుగారు పెట్టే గావుకేక ఇది!  ఇంకా ఇదే వచనంలో మరణమునకు లోనగు శరీరం అంటున్నారు. రోమీయులకు 6:6,12
6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము. 
12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.   చూశారా ఈ దేహంలో/ శరీరంలో పాపం నివశిస్తూ ఉంది కాబట్టి అది చావుకు లోనవుతుంది. కారణం 6:21 చెబుతుంది పాపమునకు జీతం మరణం! 7:17 కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. .. 8:10
క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
...  మరి ఈ చావు దేహం నుండి తాను విడుదల పొందడం కోసం పౌలుగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ మాటలు రాయబోయేసరికి ఇంకా విడుదల కలగలేదు అన్నమాట! 8:23.
అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

  దీనిప్రకారం మనం అంతా విడుదల కోసం ఎదురు చూస్తున్నాం అన్నమాట! ఇంకా 1కొరింథీ 15:5354 చూద్దాం.
53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. 
54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ... 
యెషయా 25:8
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.
 ఫిలిప్పీ 3:21.
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
 ఈ జీవితకాలంలో అది ప్రాప్తిస్తుంది అని పౌలుగారు చెప్పడం లేదు.

   ఇక తర్వాత వచనంలో, ఇంత చావుకేకలు పెడుతున్నా తనకు కారుచీకటిలో కాంతిరేఖలా యేసయ్య సిలువ రక్తం, విమోచన రక్తం కనబడి అంటున్నారు: మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను అంటున్నారు.  ఎందుకంటే మనస్సు విషయంలో దైవనియమమునకు, శరీర విషయంలో పాపనియమమునకు దాసుడనై ఉన్నాను అంటున్నారు.  పౌలుగారు తన మరణమునకు లోనగు శరీరం నుండి తనకు క్రీస్తుయేసు ద్వారా కలుగబోయే విడుదల కోసం తెలుసుకుని దేవునికి యేసుప్రభులవారి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.  అదే సమయంలో మరో విషయాన్ని ఒప్పుకుంటున్నారు:  ఇంకా శరీరం మాత్రం పాపనియమానికి దాసుడిగా ఉంది అంటున్నారు. కారణం దాని ఫలితం తనకు తెలుసు. గలతీ 5:17
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు..... 

    అయితే ఇప్పుడు ఒక ప్రశ్న పుడుతుంది. విశ్వాసులలో గల బ్రష్ట స్వభావం యొక్క శక్తి నుండి వారికి విడుదల/ స్వేచ్చ లేదా??!!  వారు స్వేచ్చగా, ఆనందంగా సేవ చేయలేరా? ఇప్పుడు లోపలిశత్రువుపై విజయం సాదించడం అసాధ్యమా?? అయితే పౌలుగారు ఇంతకుముందు 6వ అధ్యాయంలో విజయము ఉందని, దానికి మార్గం కూడా చెప్పారు కదా! 8వ అధ్యాయంలో కూడా చెప్పారు కదా! మరి ఈ 7వ అధ్యాయంలో ఇలా చెబుతున్నారేమిటి??  
 *7వ అధ్యాయంలో పౌలుగారి మాటల సారాంశం ఏమిటంటే: తనలోనున్న పాపనియమాన్ని, పాపాన్ని జయించడానికి తన సొంతబలంతో, సొంత తెలివితో ప్రయత్నం చేసినా విజయం సాదించలేకపోయారు పౌలుగారు. చివరికి అది అసాధ్యం అని తేలిపోయింది. ఈ పాపలోకంలో ఈ శరీరంలో గల పాపనియమం, పాపం చాలా శక్తివంతమైనది. దృఢమైనది. ఫారో చెప్పినట్లుగా యెహోవా ఎవడో నాకు తెలియదు. ఆయన ప్రజలను వెళ్ళనివ్వను (నిర్గమ 5:2) అంటుంది ఈ పాపం కూడా! అయితే విశ్వాసులు నిరాశ చెంది, తమ లోని పాపానికి లొంగిపోకూడదు! దానికి మార్గం ఉంది. అది యేసయ్య సిలువ! ఆయన పవిత్రమైన సిలువరక్తం మన పాపముల నుండి విడుదల కలిగించి ఈ పాపనియమం నుండి మనలను విమోచించి , ఆయన రాజ్య వారసులుగా చేశారు.*  రోమా 8:12
1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. 
2. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. ...కాబట్టి విశ్వాసులందరూ ఈ విషయాన్ని గ్రహించి ఆయన ద్వారా, ఆయన మార్గం ద్వారా విజయాన్ని వెదికి సాధించాలని పౌలుగారి ఆకాంక్ష! 

   ప్రియ విశ్వాసి! నీవు, నేను కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నాము. సాతానుడు నిన్ను నన్ను అలాగే ఈ పాప నియమం ద్వారా శోదిస్తున్నాడు. ఇప్పుడు నీవు పాప నియమానికి లొంగిపోతున్నావా లేక పౌలుగారిలా ఆత్మ నియమం ద్వారా పోరాడి యేసురక్తం ద్వారా జయిస్తున్నావా? జయించువానికి దేవుడిచ్చు బహుమానాలు ప్రకటన గ్రంధంలో చాలా వివరంగా ఉంది! 2:7, 3:12.
 నీకు ఏమి కావాలో నేడే కోరుకో!

దైవాశీస్సులు!   
*రోమా పత్రిక-76వ భాగం*
*ఆత్మనియమం-1*

రోమా 8:13
1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. 
2. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. 
3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము. .

    ప్రియ దైవజనమా! ఇంతవరకూ మనం ధర్మశాస్త్రం గురించి, పాపం గురించి విస్తారంగా ధ్యానం చేసాం. గతభాగంలో పాపనియమం కోసం ధ్యానం చేశాం. అయితే ఈరోజు ఆత్మనియమం కోసం ధ్యానం చేద్దాం! ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, అవసరం కోసం ఎక్కువగా పౌలుగారు నొక్కివక్కానిస్తున్నారు. 

   8:1 కాబట్టి అని మొదలయ్యింది అంటే ఇది రోమా 7:1425 వచనాలలో పౌలుగారి ఆక్రందనకు జవాబుగా కొనసాగింపుగా దీనిని చెబుతున్నారు.  ఆ వచనాలలో తన శరీరంలో గల పాపనియమం, తన శత్రువు అయిన పాపం కోసం రాస్తూ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటూ మొత్తుకుంటున్నారు పౌలుగారు! అయ్యో ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు అని దిక్కులు చూస్తున్నారు. ఈ సమయములో కనబడిన కారుచీకటిలో కాంతిరేఖగా యేసుప్రభులవారి ఆత్మనియమం కనబడింది. ఈ మొదటి వచనం ఆత్మ నియమం కోసం రాస్తూ ఎవరైతే క్రీస్తుయేసులో ఉంటారో వారికి ఏవిధమైన శిక్షావిధి లేదు అంటున్నారు.  కారణం 7:1425లో పాపనియమం వలన శిక్షకు లోబడి వలసి వచ్చింది.  అయితే క్రీస్తుయేసులో ఉంటే అలంటి శిక్షలేదు అంటున్నారు పౌలుగారు! 

  అయితే ఈ ఆత్మ నియమం కోసం ధ్యానం చేయకముందు మరో ప్రాముఖ్యమైన విషయం కోసం చెప్పి అప్పుడు ఆత్మనియమం ధ్యానం చేద్దాం! *ఈ రోజులలో అనేకమంది పెద్ద పెద్ద భోధకులు ఇదే 8:1 వచనాన్ని ఆధారం చేసుకుని యేసుప్రభుని నమ్ముకుంటే చాలు! మీకు తీర్పులేదు గీర్పులేదు. శిక్షా లేదు! నరకం లేదు! అని బోధిస్తున్నారు! గాని సంపూర్ణంగా దానిని వివరించడం లేదు!  అయితే విశ్వాసులు దీనిని సరిగా అర్ధం చేసుకోలేక నరకానికి పోతున్నారు. ఈ 8:1 లో ఉన్నదానిని మనమంతా సంపూర్ణంగా నమ్మాలి. అయితే క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు ! ఆమెన్! నిజమే! అది ఎంతవరకు*??? 
జవాబు రెండో వచనంలో ఉంది! *శిక్షావిధి ఎందుకు లేదు అంటే వారు అనగా క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు శరీర స్వభావం అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడుస్తారు! ఇక్కడ ఆగుదాం! ఒక విశ్వాసి ఆత్మనియమంలో ఉన్నంతవరకూ అనగా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించినంతకాలం ఆ విశ్వాసికి శిక్షావిధి లేదు! అయితే ఎప్పుడైతే మరలా శరీరానుసారంగా నడుస్తాడో, ఆత్మనియమం వదలి, పాపనియమం క్రిందకు వస్తాడో వెంటనే పాపం అతనిని ఏలడం ప్రారంభించి, తిరిగి మరణపు దాస్యం క్రిందకు నెట్టి, మరణానికి/చావుకి తీసుకుని పోతుంది*.  
*నీవు పేరుకు క్రీస్తుయేసులో ఉన్నావు గాని శరీర నియమం ప్రకారం శరీరకార్యములు చేస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు శిక్ష ఉంది! విధి ఉంది జాగ్రత్త! ఖబడ్దార్! ఒకసారి వెలిగింప బడి, పరిశుద్ధాత్మను రుచిచూచిన తర్వాత తప్పిపోతే ఏం జరుగుతుందో బైబిల్ సెలవిస్తుంది* . Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6
4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై 
5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు, 
6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. .... 

*పెద్దపెద్ద/ గొప్పగొప్ప బోధకులు సగం చెప్పి సగం వదిలేస్తున్నారు! ప్రియ సేవకుడా! కాపరీ! నీవు నీ సంఘాన్ని జాగ్రత్తగా మేపాలి! ఈ విషయాలు చాల వివరంగా అర్ధమయ్యేలా బోధించాలి! లేకపోతే ఇలాంటి అఫీషియల్ బోధకుల వలన సంఘం మిస్ లీడ్ అవుతుంది చివరకు బ్రష్టులైపోయే అవకాశం ఉంది జాగ్రత్త! విశ్వాసి ఆత్మానుసారంగా ఆత్మనియమం క్రింద ఉండాలి తప్ప శరీర నియమం క్రింద ఎట్టి పరిస్తితులలో ఉండకూడదు! కేవలం నమ్మి బాప్తిస్మం పొందుకుంటే చాలదు! విశ్వాసాన్ని కాపాడుకోవాలి! సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అనగా శీలాన్ని/ కేరెక్టర్ ని కాపాడుకోవాలి! సాక్ష్యార్ధమైన జీవితం జీవించాలి!  ఆత్మానుసారంగా నడవాలి! ఆత్మపూర్నునిగా జీవించాలి. అప్పుడే శరీర క్రియలను జయించగలవు! వచ్చి నీటిలో మునిగేస్తే పరలోకం టిక్కెట్ పట్టుకుని పరలోకం పోవు! సరియైన జీవితం జీవించకపోతే, ఆత్మానుసారంగా, ఆత్మనియమం ప్రకారం జీవించక పోతే తీర్పు ఉంది! గీర్పు ఉంది! శిక్ష కూడా ఉంది జాగ్రత్త!*

  ప్రియ విశ్వాసి! ఈ విషయంలో జాగ్రత్త పడు! 
ప్రియ సేవకుడా! సంఘాన్ని ఈ విషయంలో హెచ్చరించు! 
ప్రియ చదువరీ! ఒకవేళ నీవు ఇంకా పాపనియమంలోనే జీవిస్తున్నావా? అయితే ఆత్మనియమం క్రిందకు వెంటనే రా! నీకు నీవుగా ఈ పాపనియమం నుండి విడుదల పొందలేవు! నీకు ఆ సత్తా లేదు! పౌలుగారికే సాధ్యం కాలేదు! యేసయ్య పాదాలను, యేసయ్య సిలువను ఆశ్రయించు! నిన్ను వెంటనే హక్కున చేర్చుకుని, పాపనియమం క్రిందనుండి తప్పించి తనరెక్కల నీడన నీకు ఆశ్రయమిచ్చి తన ఆశ్రయపురములో చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు!

 మరి వస్తావా?
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-77వ భాగం*
*ఆత్మనియమం-2*

రోమా 8:13.. 1. 
1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. 
2. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. 
3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము. .

     ప్రియులారా! మనం ఆత్మనియమం కోసం ధ్యానం చేస్తున్నాం! ఇక్కడ క్రీస్తుయేసు నందున్న వారికి అంటున్నారు అనగా క్రీస్తుయేసులో ఐక్యంగా లేక క్రీస్తులో ఏకమై ఉన్నవారికి ఏ శిక్షావిది లేదు అంటున్నారు. ఎప్పుడైతే క్రీస్తురక్తం క్రింద ఉంటారో వెంటనే దేవుడు వారిని నీతిమంతులుగా, నిర్దోషులుగా, పాపము లేనివారిగా తీరుస్తారు. తద్వారా వారిమీద పాపమునకు ఇంక ఏమాత్రం అధికారం ఉండదు! 3:24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
 4:7-8
7. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 
8. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు, ; 
5:1 
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము) .; 
యోహాను 5:24
నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 ఇక శిక్షావిధి లేకపోవడానికి మరో కారణం ఏమిటంటే క్రీస్తులో గల ఈ విశ్వాసమార్గం పాప, మరణాల నియమం నుండి అనగా పాపనియమం నుండి విశ్వాసుల్ని విడుదల చేస్తుంది. దేవుడు తను ఎవరిని న్యాయవంతులుగా నిర్దోషులుగా చేయాలని అనుకుంటారో వారిని చేస్తారు.  పాప స్వభావం నుండి దాని శక్తినుండి రక్షిస్తారు. శుద్దులుగా చేస్తారు. తద్వారా లోకంమీద, సైతాను మీద విజయం సాదించవచ్చు విశ్వాసి! 

   ఇక రెండో వచనం చెబుతుంది: క్రీస్తుయేసులో జీవమిచ్చే ఆత్మనియమం నన్ను, నిన్ను పాప మరణాల నియమం నుండి విడిపించింది. ఈ అధ్యాయం అంతటికీ 7:1425 కి చాలా తేడా ఉంది. కారణం ఆ 7వ అధ్యాయంలో విశ్వాసి తన బ్రష్టస్వభావం అనే భయంకరమైన వాస్తవాన్ని ఎదుర్కొన్నప్పుడు తనలోతాను ఏమిటో తెలుసుకుని తన నిజస్తితిని చూసి నిట్టూర్పు విడుస్తున్నాడు. అయితే ఈ అధ్యాయంలో క్రీస్తులో ఉండడం అంటే ఏమిటో వర్ణిస్తున్నారు పౌలుగారు. 7వ అధ్యాయంలో చెప్పబడ్డ పాపమరణాల నియమం కన్నా ఎంతో బలమైన, ఉన్నతమైన, ఉత్తమమైన నియమం ఉంది! అది జీవమిచ్చే ఆత్మనియమం! విశ్వాసుల్లో నివశించే పరిశుద్ధాత్మ, మనుష్యులు తమకుతాముగా చేయలేనటువంటి కార్యాన్ని కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఇట్టే అవలీలగా చేస్తాడు. ఈ 8వ అధ్యాయంలో పౌలుగారు క్రీస్తును, ఇంకా పరిశుద్ధాత్మను ఉద్దేశించి 30సార్లు రాశారు.  ఇక్కడ విశ్వాసుల శరీరాల్లో ఆత్మలో నివసించేందుకు దేవుడు తన ఆత్మను ఉచితంగా ఇచ్చారు అన్న సత్యాన్ని పౌలుగారు చాలు గట్టిగా నొక్కివక్కానిస్తున్నారు. 
లోకాన్ని, పాపాన్ని జయించడానికి వారికున్న బలం ఆయన మాత్రమే! 4, 13 వచనాలు.
ఆయన జీవాన్ని శాంతిని ఇస్తారు. 6వ వచనం
వారిని నడిపించేవాడు. 14వ వచనం.
వారు దేవుని పిల్లలని వారు గ్రహించేలా చేస్తారు. 14,15 వచనాలు.
ఆయన వారిలో ఉండి వారికోసం ప్రార్ధన చేస్తున్నారు. 26,27 వచనాలు.

    ఇక ఈ పరిశుద్ధాత్మ కోసం ధ్యానం చేస్తే ఇది యేసుక్రీస్తుప్రభులవారు తన మరణానికి ముందు తన శిష్యులతో దీనికోసం వాగ్దానం చేశారు. యోహాను 14:1617
16. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను( లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. 
17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును. 
18. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; 
26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మలేక,ఉత్తరవాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. .

   ఇక 3వ వచనంలో ధర్మశాస్త్రం శరీరస్వభావం బట్టి బలహీనమై ఉన్నకారణంగా అది ఏమిచేయలేకపోయిందో దానిని దేవుడే చేశాడు. ఎలా అంటే తన సొంతకుమారున్ని ఈ పాప శరీరాకారంలో పంపించి, మానవుల పాపాలకోసం బలిగా పంపారు.  అలాచేసి శరీర స్వభావంలో ఉన్న పాపానికి తీర్పు తీర్చారు దేవుడు!  ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అది మోషేగారి ద్వారా దేవుడిచ్చినది.  అయితే దానికి మనుషులను విముక్తుల్ని చేసి రక్షించేందుకు , వారి పాపాలమీద బ్రష్టస్వభావం యొక్క శక్తిమీద విజయం సాదించేలా చేయడానికి, సహాయపడటానికి దానికి శక్తిలేదు. 3:1920; 4:15; 7:5,7,14. 
ధర్మశాస్త్రం ఇచ్చినా ఫలితం లేకపోగా దేవునికి చివరకి తన సొంత కుమారున్నే బలిగా అర్పించడానికి పంపవలసి వచ్చింది. యోహాను 3:1416
14. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, 
15. ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. 
16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ... 
ఈ కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు పాప శరీరాకారంలో వచ్చినా గాని భ్రష్టస్వభావం ఉన్న మనిషిగా రాలేదు. 
హెబ్రీ 4:15
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
7:26
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)
... 2కొరింథీ 5::21
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
1పేతురు 2:22 
ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

.. శరీరస్వభావమున్న మనుషుల పోలికతో వచ్చారు అంటే ఆయన ఆకారం మానవులందరి ఆకారంలాగే ఉంది అన్నమాట! గాని ఆయనకు పాపం లేదు. అనగా పాపంలేని మానవ స్వభావం, శరీరం రెండూ ఉన్నాయి! కారణం ఆయన దైవమానవుడు!   ఆయన పవిత్రమైన జీవితం జీవించి పాపంలేని మనిషిగా జీవించారు.  చివరికి పాపాలకోసం బలైపోయారు.  మనుష్యుల పాపం అనే పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. పాపాన్ని కడతేర్చి, దానికోసం చనిపోయారు. పాపాన్ని, మరణాన్ని జయించి తిరిగి లేచారు!  రోమా 3:24-25
24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 
25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని ..

   కాబట్టి ఇప్పుడు విశ్వాసి పాపమరణాల నియమం క్రింద లేడు గాని ఆత్మనియమం క్రింద ఉన్నాడు.  4వ వచనం ప్రకారం దేవుని ఉద్దేశ్యమేమిటంటే శరీర స్వభావాన్ని అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిన్యాయాలు నెరవేర్చాలి. అప్పుడు పాపనియమం నుండి ఆత్మనియమంలో జీవిస్తాము. ఇందుకోసమే దేవుడు తనసొంత కుమారుని లోకంలోకి పంపించారు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని మహా సంకల్పం మనుషులను పాపదోషం నుండి, మరణశిక్ష నుండి విమోచించి, వారిని తనకొరకు ఒక పవిత్రమైన పరిశుద్దమైన ప్రజగా చేయాలని, తద్వారా వారు నీతిన్యాయాలతో జీవించి, పవిత్రమైన జీవితం జీవించిన ఆధ్యాత్మిక ధర్మశాస్త్రంలోని నీతిన్యాయాలను నేరవేర్చగలిగే ఆధ్యాత్మిక వ్యక్తులుగా చేయడమే ఆయన ఉద్దేశం! 7:12,14
12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునైయున్నది. 
14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను. .. 
హెబ్రీ 8:10 
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.

   అయితే ఇక్కడ ధర్మశాస్త్రం అని చెబుతున్నారు గాని విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద లేరు. 6:14; 7:4..  ఇప్పుడు విశ్వాసి ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకదినాలు, కర్మకాండలు, ఆహారనియమాలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు! గాని ధర్మశాస్త్రంలోని నీతి సంబంధమైన న్యాయ సమ్మతమైన నియమాలు వారిలో నెరవేరాలని దేవుని కోరిక! ఈ నియమాలన్నీ రెండు ఆజ్ఞల్లో ఇమిడియున్నాయి.  రోమా 13:810
8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 
9. ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. 
10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. . 
మత్తయి 22:3740
36. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. 
37. అందుకాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. 
38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. 
39. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. 
40. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను. ....  
*ఇంతవరకు బాగుంది గాని ఈ ఆజ్ఞలు నెరవేర్చాలి అంటే తప్పకుండా ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి లేదా అత్మానుసారంగా జీవించాలి.*  
గలతీ 5:1618
16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 
17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. 
18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. .. 

   దీని అర్ధం ఏమిటంటే క్రీస్తు మనలో నివసిస్తున్నారని గుర్తించాలి. 9, 15 వచనాలు. 
మనల్ని మనకు ఆయనకు సమర్పించుకోవాలి! 6:13; 
ఆయన మాటకు లోబడాలి. 14వ వచనం. గలతీ 5:25;  
ఆయన మనకు బలప్రభావాలు ఇచ్చారని నమ్మి, వాటిని పొందుకుని వాటిని ఉపయోగించాలి. 13వ వచనం. 
మనం ఆత్మయొక్క అదుపులోను యేసుక్రీస్తుప్రభులవారి అదుపులోను ఉండాలి. 9వ వచనం, ఎఫెసీ 5:18 

   ప్రియ విశ్వాసి! నీవు ఏ నియమం క్రింద ఉన్నావు? 
ఆత్మ నియమం క్రింద ఉంటే పైన చెప్పిన ప్రకారం నడచుకోవాలి! 
అప్పుడు పాపాన్ని, మరణాన్ని జయించి వాటి అదుపులో ఉండకుండా పరలోక బాటలో పయనిస్తావు. 
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-78వ భాగం*
*ఆత్మనియమం-3*

రోమా 8:58
5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; 
6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. 
7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 
8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ..  

     ప్రియులారా! మనం ఆత్మనియమం కోసం ధ్యానం చేస్తున్నాం! ఇక్కడ శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సునుంతురు.  ఆత్మానుసారులు ఆత్మవిషయముల మీద మనస్సుపెడతారు అంటున్నారు, అవును ఈ మాట నిజం! లోకానుసారులు. శరీరానుసారులు ఈ లోక విషయాలమీద ఆలోచిస్తుంటారు. శరీరకార్యాలు చేస్తారు. దేవుని ఆత్మపొందుకున్న విశ్వాసి దేవునిమీద, సువార్త కోసం, మరిన్ని ఆత్మఫలాలు పొందాలని, ఇంకా అనేక ఆత్మలను క్రీస్తులోనికి తీసుకుని రాడానికి ప్రయత్నిస్తారు. శరీరానుసారి కాళీ దొరికితే సినిమాలు-షికార్లు, sex కోసం, కామం రేపే విషయాలకోసం, ధన సంపాదనకోసం, కార్లు బంగళాలను సంపాదించడం కోసం, ఎవడి ఆస్తి ఆక్రమించుకోవాలా, అన్యాయం ఎలా చేయాలా... ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటాడు.   
ఆత్మానుసారి కాళీ దొరికితే ప్రార్ధన, ఏకాంత ప్రార్ధన , పాటలు పాడుకోవడం, సువార్త ప్రకటించాలి, లేదా ఆరోజు సంఘంలో ఎక్కడ ఆరాధన ఉంది అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటాడు. 
ప్రియ చదువరీ! నీవు పైకి భక్తిపరుడిలా నటిస్తూ, ఇంకా శారీరక విషయాలకోసం ఆలోచిస్తున్నావు అంటే నీవు ఇంకా లోకానుసారివే! విశ్వాసి అయిన నీవు దేవుని విషయాలు ఆత్మీయ విషయాలకోసం ఆలోచించకుండా, సినిమాలు- షికార్లు, అక్రమ సంభంధాలు, ఈలోకపు కామ ఉద్రేకాలు పెంచే ప్రోగ్రాంలు చూస్తూ , సెల్ ఫోన్లో బూతు బొమ్మలు, సినిమాలు చూస్తున్నావ్ అంటే, ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలి అనే తపనలో ఉన్నావు అంటే నీవు శరీరానుసారివే గాని ఆత్మానుసారివి కాదు. లోకాన్ని బ్రమపెడుతున్నావ్ అన్నమాట! వేషదారివి అన్నమాట! 

     జాగ్రతగా గమనించు! శరీరానుసారమైన మనస్సు మరణమునకు దారితీస్తుంది. ఆత్మీయ మరణమునకు దారితీస్తుంది అనగా నరకానికి దారితీస్తుంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు జీవము అనగా నిత్యజీవమునకు దారితీసి, జీవితమంతా శాంతి సమాధానాలతో నింపుతుంది. 

  పౌలుగారు ఇక్కడ రెండు రకాలైన గుంపులకోసం వివరిస్తున్నారు. ఈ భూమిపై ఉన్నవారంతా ఈ గుంపులకే చెందుతారు. ఒక గుంపువారి మనస్సులోకి శరీరస్వభావం గల కోరికలు అన్నీ ప్రవేశపెడుతుంది.  వెంటనే వారు వాటివెనకాల పరుగెడతారు.  అయితే దేవుని ఆత్మ తనకోరికలను విశ్వాసుల మనస్సుల లోనికి ప్రవేశపెడుతుంది. వారు ప్రభువు, వారికోసం ఆశించే విషయాలతో వారి మనస్సు నిండి ఉంటే ఈ విశ్వాసులు ఈ ఆత్మ సంభంధమైన విషయాల వెనుక పరుగెడతారు! 

   కారణం ఒకవ్యక్తి ఆలోచించే విధానం అతని జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే 2కొరింథీ 10:5.
మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి...
ఇంకా పౌలుగారు దేనికోసం ఆలోచించాలో చెబుతున్నారు ఫిలిప్పీ 4:8
మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
కొలస్సీ 3:16
సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

ఇంకా దావీదుగారు చెబుతున్నారు కీర్తనలు 1:2
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
   అయితే ఈ శరీర స్వభావానికి సంబంధించిన విషయాలలో కొన్ని మనుషులకు పాపభూయిష్టముగ అనిపించక పోవచ్చు!  అవి మత సంబంధమైన, బుద్ధి సంబంధమైన విషయాలు కూడా కావచ్చు! అయితే అవి మాత్రం ఖచ్చితంగా దేవునికి సంబంధించినవి కావు. మత్తయి 16:23
(అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను).
 అవిమాత్రం భూ సంబంధమైనవే! ఫిలిప్పీ 3:19; దేవుని ఆత్మలేని వ్యక్తులకు అవి సహజముగా సబబుగానే అనిపిస్తాయి గాని ఈ 6వ వచనం ప్రకారం మరణానికి దారితీస్తాయి. అది ఆత్మీయ మరణం. దేవుని సన్నిధినుంది నిన్ను దూరం చేస్తుంది. ఉదాహరణ: యోగా! 
ఒకసారి యెషయా 59:2 చూద్దాం.
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
ఎఫేసి 2:1.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
 4:18.
వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

  క్రీస్తులో లేని ప్రతీ వ్యక్తి సహజమనస్సు తనకేవి ప్రియంగా సంతోషంగా అనిపిస్తాయో వాటిమీదే ఉంటాయి. అయితే వాటితో దేవునికేమీ సంబంధం లేదు! ఆయనకు వ్యతిరేఖమైనవి! 

   ఈ సందర్భంగా మీకో విషయం చెప్పనీయండి: మాకు చాలా దగ్గర చుట్టం ఒక అమ్మాయి ఉంది. నాకు వివాహం జరిగిన కొద్దిరోజులకే ఆమె తన తొమ్మిదో తరగతిలోనే సమర్పించుకొని నగలు తీసివేసింది. ఎంతో భక్తిపరురాలు అనుకున్నాను. అయితే నేను ఆమె ఇంటికి వెల్లినప్పుడెల్లా(సినిమా హాలుకు వెళ్ళదు గాని) పనికిమాలిన సినిమాలు టీవీలో చూస్తూ ఉంటుంది. చివరకు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ బైబిల్ చదువుతున్నట్లు గాని, ప్రార్ధన చేస్తున్నట్లు గాని ఈ 12సంవత్సరాలలో నేను చూడలేదు. (మా ఇంట్లో టీవీ లేదు).  ఇది లోకాన్ని భ్రమపరచడం కాదా!! ఎవరికోసం నగలు తీసివేసింది. సరే, తీసివేసినప్పుడు ఆత్మానుసారమైన పనులు చేయాలి గాని ఈ లోకానుసారమైన ఈ సినిమాలు ఎందుకు? ప్రార్ధన లేని జీవితం ఎందుకు? ఏదో ఉద్రేకంతో ఊగిపోయి తీసుకున్న నిర్ణయం తప్ప! 

   కాబట్టి ఇలాంటి మనుష్యులు తాము దేవుని పక్షానే ఉన్నానని తలంచవచ్చు!  ఆయనను ప్రేమిస్తున్నానని కూడా చెప్పవచ్చు! కాని ఇది కేవలం భ్రమ మాత్రమే! కారణం పాపాత్ముడి మనస్సు మారదు, దేవునికి లోబడదు!  ఒక వ్యక్తి దేవునికి లోబడటం ప్రారంభించాలి అంటే ఆ వ్యక్తిలో మౌలికమైన గొప్ప మార్పు అవసరం! దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతనికి నూతన జీవనం ఇచ్చి అతడు ఆలోచించే విధానాన్ని మార్చివేయాలి! ఇది జరుగకుండా ఎవరూ దేవునికి ఆనందం కలిగించే వారుగా ఉండలేరు,.  ఒక వ్యక్తి చాలా మతనిష్ట కలిగిఉండచ్చు!  చాలా నీతిగలవాడై, బాగా చదువుకున్న వాడై దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు! కాని అ వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేయకపోతే, దేవునిఆత్మ లేని పనులుచేస్తే ఇదంతా పాపమే! మరణమే!  అందుకే యేసుప్రభులవారు నీకోదేముతో అంటున్నారు మీరు క్రొత్తగా జన్మించాలి.  యోహాను 3:38
3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా 
5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. 
7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 
8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. ... 
ఇలా చేస్తే మనస్సుమారి నూతన పరచబడతారు.(రోమా 12:2); అప్పుడు lifestyle మారిపోతుంది.  ఒక మనిషిలోని బ్రష్టమైన స్వభావం అతడు మతం, నైతిక ప్రవర్తన, అనే ముసుగులో ఉన్నంతమాత్రాన అది దేవునికి ఇష్టమౌతుంది అని అనుకోకూడదు. దేవుడు మతం పొరలు తొలగించి హృదయాన్ని ఉన్నది ఉన్నట్లుగానే చూస్తారు. అందుకే హెబ్రీ 4:1213 లో దేవుని వాక్యానికి, దేవునికి చూడలేని విషయం, కనబడని విషయం ఏదీలేదు అంటున్నారు. 
12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. 
13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ...  
పాపులైన వారి మత సంభంధమైన ఆలోచనలు అనుభూతులు అతనిలోని ఇతర విషయాలన్నిటిలాగే పాపంతో కూడినవి అని దేవునికి తెలుసు!

      ఇక ఎందుకు ఇలా జరుగుతంది అంటే 7,8 వచనాలలో జవాబుంది: ఎందుకంటే శరీర స్వభావానికి చెందే మనస్సు దేవునికి విరోధం! అది దేవుని ధర్మశాస్త్రానికి లొంగదు. అలా లొంగడం అసాధ్యం!  కాబట్టి శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేరు! 

  కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు ఏరకమైన మనస్సు, స్వభావం కలిగి ఉన్నావు? శరీర సంబంధమైనదా లేక ఆత్మ సంభంధమైన మనస్సా? తేల్చుకో! 
శరీర సంబంధమైన మనస్సు మరణం అని మరచిపోకు! 
ఆత్మసంబంధమైన మనస్సు, స్వభావం నిన్ను పరమునకు తీసుకుని పోతుంది! దేనికి లోబడతావు? 
శరీర నియమానికా? లేక ఆత్మనియమానికా?
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-79వ భాగం*
*ఆత్మనియమం-4*
రోమా 8:911
9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. 
10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. 
11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. .  

     ప్రియులారా! మనం ఆత్మనియమం కోసం ధ్యానం చేస్తున్నాం! ఇక్కడ శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సునుంతురు.  ఆత్మానుసారులు ఆత్మవిషయముల మీద మనస్సుపెడతారు అనే విషయం మీద గతభాగంలో చూసుకున్నాం! ఇక ఈ భాగంలో ఇక remarkable statement కోసం ధ్యానం చేద్దాం! అది:
*దేవుని ఆత్మ మీలో నివశించి ఉన్నఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాదు!*  
ఇక్కడ రెండు statements ఉన్నాయి. 

*మొదటిది*: ఒకటి దేవునిఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం గలవారు గాని శరీర స్వభావం గలవారు కారు అనగా క్రీస్తు ఆత్మ మీలో ఉంటే మీరు శరీర స్వభావం గల పనులు చేయరు. మీరు లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు శరీర స్వభావం గలవారే గాని ఆత్మానుసారులు కాదు! ఇంకా చెప్పాలంటే మీరు శరీరానుసారమైన పనులు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఇంకా ఆత్మను పొందుకోలేదు కాబట్టి! ఆయన ఆత్మను పొందుకుని ఆయన అత్మచేత నడిపింపబడితే మీరు ఆత్మానుసరమైన పనులే చేస్తారు గాని ఈ బురద పనులు చేయరు!  

       58 వచనాలలో వర్ణించిన రెండు రకాల మనుషులు రెండు వేర్వేరు ప్రపంచాలలో ఉన్నారు. దేవుని ఆత్మ లేనివాడు తమ శరీర స్వభావానికి చెందినవారు. దాని ప్రకారం గానే జీవిస్తూ ఉంటారు.  దేవుని ఆత్మ ఉన్నవారు పాపాన్ని, తమ బ్రష్ట స్వభావాన్ని పరిత్యజించినవారు. వీరు దేవుని ఆత్మకు చెందినవారు. ఆయన వారిలో నివసిస్తూ, వారిలో పనిచేస్తూ ఉంటారు. ఈ వచనంలో దేవుని ఆత్మను క్రీస్తు ఆత్మ అంటున్నారు భక్తుడు! ఇక్కడ క్రీస్తు దేవుడే అనేకాక ఇంకా వేరే అర్ధాలున్నాయి. ఫిలిప్పీ 2:6.. లూకా 2:11
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)

క్రీస్తు ఆత్మ లేకుంటే ఎవరూ క్రీస్తుకు దేవుని చెందినవారు కారు. పాప విముక్తి నిర్దోషుల లెక్కలోనికి రావడమూ ఉండదు,. ఇలాంటి వారికి క్రైస్తవుడు అని పేరు ఉన్నాగాని, వారు మాత్రం క్రీస్తుకు చెందిన వారు కానేకారు! 
  
*రెండవది*: ఎవడైననూ క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడు క్రీస్తువాడు కాదు! మరి క్రీస్తు ఆత్మను పొందడం ఎలా? క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది అనే నిశ్చయం ఎలా కలుగుతుంది? క్రీస్తు ఆత్మలో నమ్మకముండడం ద్వారానే ఇది సాధ్యం! దేవుడు తన పరిశుద్ధాత్మను మన ఆత్మలకు ఉచితంగా ఇస్తారు దేవుడు! 5:5.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
సరే, ఇప్పుడు క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది అని మనకు నిశ్చయం ఎలా కలుగుతుంది? 
     మా పెంతుకోస్తు వారు చెబుతున్నట్లు భాషలు మాట్లాడినప్పుడే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నివాసం చేస్తున్నాడా లేక భాషలు మాట్లాడకపోయినా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివాసం చేస్తాడా? ఇలాంటి వివాదాస్పద విషయాలలో ప్రవేశించకుండా వాక్యానుసారంగా ఆలోచన చేద్దాం! 

1). సింపుల్ జవాబు: ఆత్మానుసారంగా ప్రవర్తించి నప్పుడు. అనగా శారీరక క్రియలు విసర్జించి ఆత్మనుసారమైన క్రియలు చేసినప్పుడు. వివరంగా చెప్పాలంటే విశ్వాసి నోట బూతులు రాకుండా, చెడుమాటలు పలుకకుండా, వ్యభిచార క్రియలు చేయకుండా, మోహపు చూపులు చూడకుండా, జూదమాడకుండా , మద్యానికి బానిస కాకుండా, ప్రార్ధనా జీవితం, సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడుఅత్మానుసారంగా జీవించడం! అప్పుడు ఆ వ్యక్తిలో ఆత్మ నివశిస్తున్నట్లు!

2.  మరో సింపుల్ జవాబు: ఆత్మఫలము ఫలించినప్పుడు! ఆత్మఫలమంటే:  గలతియులకు 5: 22
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
..... ఇవన్నీ ఒక విశ్వాసిలో కనిపిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నట్లు ఆ విశ్వాసిలో! 
*ఒక విశ్వాసి మందిరంలో, ఇంట్లో విస్తారమైన బాషలు మాట్లాడినా బ్రతుకు మారకపోతే ఆ వ్యక్తి మ్రోగెడు కంచు గణగణలాడే తాళం అంటి చెబుతున్నారు పౌలుగారు. 1కొరింథీ 13:1; సంఘంలో దీర్ఘ ప్రసంగాలు చేస్తూ, దీర్ఘ ప్రార్ధనలు చేస్తూ, సాక్ష్యాలు చెబుతూ తోటి సహోదరుని/సేవకుని/ తోటికోడలిని/ సొంతకోడలిని/ అత్తను/ మామగారిని ప్రేమించకపోతే నీ భాషలు, నీ ప్రార్ధనలు, ఉపవాసాలు దండగ! నీవో వేషదారివి! నేను కాదు పౌలుగారు చెబుతున్నారు. ఆత్మఫలములో మొట్టమొదటి ప్రేమ లేకపోతే నీకున్నవన్నీ దండగ! సంతోషం లేని జీవితం, సమాధానం లేని జీవితం వ్యర్ధం. తోటి విశ్వాసితో సమాధానంగా లేని నీవు పరలోకంలో సమాధానంగా ఉండగలవా? 1యోహాను 4; అందుకే నీకు నరకం ఖాయం! కారణం క్రీస్తు ఆత్మలేని వాడైతే వాడాయన వాడు కాదు అనగా క్రీస్తు ఆత్మ లేకపోతే నీవు దయ్యం పార్టీకి చెందిన వాడవు. నీలో భ్రమ పరచే ఆత్మ ఉంది అన్నమాట! నీతో ఉన్నవాడు దేవుడు కాదు గాని వెలుగుదూత నీలో ప్రవేశించింది అన్నమాట! మాట్లాడితే చాలు బుష్ మని త్రాచుపాములా కోపంతో బుసకొడుతున్నావు.  కోపంతో ఊగుతున్నావు. అప్పుడు నీకు దీర్ఘశాంతం లేదు అన్నమాట! దారంటపోయే ప్రతీ వస్తువు కొనేద్దామంటావు నీ భర్తతో! అందంగా కనబడిన స్త్రీమీద వ్యామోహం పెంచుకుంటావు ఇక నీకు ఆశా నిగ్రహం ఎక్కడుంది? పొరుగువాడు ఆకలితో అలమటిస్తే కనీసం ఒకరోజు భోజనం అయినా పెట్టవు- ఇక నీకు మంచితనం, దయాళత్వము ఎక్కడుంది? ఆరంభశూరత్వం తప్ప! గొప్పలు తప్ప! వేషధారణ తప్ప! నీవు లోకాన్ని మోసగించగలిగిన దేవుణ్ణి మోసగించలేవు జాగ్రత్త*!  

   నీలో ఎప్పుడైతే ఆత్మఫలము లేకపోతే నీలో శరీర కార్యాలు పనిచేస్తున్నాయి అన్నమాట! గలతీయులకు 5:19,20,21
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. . . .
ఎప్పుడైతే శరీర కార్యాలు నీలో కనిపిస్తున్నాయో నీవు ధర్మశాస్త్రం క్రింద ఉన్నావు, మరణం క్రింద ఉన్నావు! సాతాను బంధకాలలో ఉన్నావన్నమాట! నీవింకా పాప-నియమం క్రింద ఉన్నావు గాని ఆత్మనియమం క్రింద లేదు అని అర్ధం!

   ప్రియ సహోదరి/ సహోదరుడా! ఏ నియమం క్రింద ఉన్నావ్ నీవు? సరిచేసుకో! సరిచూసుకో! 
పాప నియమం క్రింద ఉంటే నీ బ్రతుకు అధోగతి జాగ్రత్త! 
ఆత్మఫలము ఫలించు! 
భాషలు మాట్లాడు! 
క్రియలతో కూడైన విశ్వాసం కలిగి ఉండు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-80వ భాగం*
*ఆత్మనియమం-5*
రోమా 8:1011..
 10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. 
11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. .  

     ప్రియులారా! మనం ఆత్మనియమం కోసం ధ్యానం చేస్తున్నాం! ఈ 10, 11 వచనాలలో క్రీస్తు మీలో ఉంటే మీ శరీరము పాపం విషయంలో మృతమైనది.  మీ ఆత్మ నీతి విషయంలో జీవం కలది అంటున్నారు.  మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో ఉంటే అనగా పరిశుద్ధాత్ముడు మీలో నివాసం చేస్తే అదే పరిశుద్ధాత్ముడు చావునకు లోనైన మీ శరీరములను కూడా జీవింప జేయును అంటున్నారు. 

  ఇదే విషయాలకోసం ముందు బాగాలలో పౌలుగారు మరో కోణంలో చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు ఆత్మీయ కోణంలో లేక ఆత్మనియమం ప్రకారం వివరిస్తున్నారు. గతభాగాలలో మనిషి ధర్మశాస్త్రం క్రింద ఉండి, చావుకు లోనైఉన్నాడు.  అందుకే 7వ అధ్యాయంలో ఈ చావుకు లోనైన శరీరం మృతమైపోతుంది. ఇట్టి మరణమునకు లోనైన నన్ను ఎవడు తప్పించును అని పౌలుగారు ఆక్రందన చేసారు 1425 వచనాల వరకు.  ఇప్పుడు ఆత్మీయకోణంలో వివరిస్తున్నారు. ఇలాంటి చావునకు లోనైన శరీరంలో, లేక చావునకు లోనైన వ్యక్తిలో పాపం ఉంటే మీ శరీరం మృతం. అనగా ఒక మనిషి శరీరంలో / మనిషిలో గలతీ పత్రిక 5:19--21.. వివరించిన శారీరక క్రియలు ఉంటే ఆ వ్యక్తి శరీరం మృతం! అదే అదేవ్యక్తి శరీరంలో క్రీస్తు నివాసం చేస్తే మీ ఆత్మ సజీవం అంటున్నారు.  దేవుడు ఆత్మయై ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. అనగా ఎవని హృదయంలో క్రీస్తు ఆత్మ నివాసం చేస్తుందో అతని అంతరంగ పురుషుడు సజీవుడు అన్నమాట! నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను (యోహాను 14:6) అని సెలవిచ్చిన యేసయ్య ఎవరిలో ఉంటారో వారిలో సత్యము జీవిస్తుంది, జీవము నివాసం చేస్తుంది.  ఇంకా చెప్పాలంటే ఎవని బ్రతుకులో సత్యం తాండవమాడుతుందో వానిలో యేసయ్య ఉన్నారు. వాని ఆత్మ జీవమైనది.

     9వ వచనంలో క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని చెబుతూ దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు శరీర స్వభావం కలవారు కారు గాని దేవుని ఆత్మ లోనే ఉన్నారు అని చెబుతున్నారు.  కాబట్టి ఎప్పుడైతే మనిషి తన దుర్గుణాలు వదలి, క్రీస్తును వెంబడిస్తాడో క్రీస్తు రక్తంలో కడగాబడతాడో వెంటనే దేవుడు వానిని నిర్దోషిగా, నీతిమంతుడిగా తీర్చుతారు. అప్పుడు ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది.  బైబిల్లో ఎన్నో చోట్ల దేవుడు చెబుతున్నారు నేనే వారిలో ఉంటాను అని. యేసయ్య కూడా క్రొత్త నిబంధనలో చెప్పారు. యోహాను 17:23
వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
2 కొరింథీ 13;5
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?
 కొలస్సీ 1:27
అన్యజనులలో ఈ మర్మముయొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.
ప్రకటన 3:20
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
... 
 పై వచనాల ప్రకారం దేవుడు తన ఆత్మద్వారా వారిలో ఉన్నారు. ఈ అన్ని వచనాలలో దేవుడు, క్రీస్తు, దేవుని ఆత్మల మధ ఏకత్వం కనిపిస్తుంది.  అయితే ఇప్పుడు విశ్వాసి దేహం కూడా మృతం 7:24; అందరిలో లాగానే క్రీస్తుకు చెందినవారిలో కూడా మరణం పనిచేస్తూనే ఉంది. క్రీస్తు మన జీవితకాలంలో తిరిగి రాకపోతే మనమంతా కూడా చనిపోతాం! పాపమే దీనికి కారణం. కానీ జీవమిచ్చే (8:2) ఆత్మ విశ్వాసి హృదయంలో పనిచేస్తున్నాడు మరియు నివాసం చేస్తున్నాడు. కనుక ఆయన మూలంగా విశ్వాసుల ఆత్మలు సజీవంగా ఉన్నాయి!

   ఇక 11వ వచనం ప్రకారం ఇక్కడ రెండు సత్యాలున్నాయి. 1. క్రీస్తు మరణించి సజీవముగా లేవడం (1:5; మత్తయి 28:6); 2. భవిష్యత్తులో ఆయనయందు విశ్వావముంచిన విశ్వాసులు, మరణం నుండి సజీవంగా లేవడం (23వచనం, యోహాను 6:40; 1కొరింథీ 15:52; 1 థెస్స 4:16). కాబట్టి క్రీస్తు సువార్త ప్రకారం ఇక విశ్వాసి శరీరం దేవుని ఆత్మ జీవించే ఇల్లు,. మీ దేహం దేవుని ఆలయమని తెలియదా అని చెబుతుంది బైబిల్. 1కొరింథీ 3:16--17; దేవుని ఆలయంలో దేవుడు నిలిచియున్నాడు అనికూడా బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇప్పుడు దేహంలో దేవుడు నిలిచుయుంటారు. *అంతేకాకుండా శరీరం అనేది మన ఆత్మలు తమనుతాము దేవునికి వెల్లడిచేసుకోవాలంటే ఈ దేహంతో జరిగించిన క్రియల ద్వారానే వెల్లడి చేసుకుంటుంది ఈ దేహం*! ఈ దేహముతో జరిగించిన క్రియలే నిన్ను పరమునకైనా లేక మరణం/ నరకమునకైనా నడిపిస్తుంది. చిట్టచివరికి ఫిలిప్పీ 3:21 ప్రకారం విశ్వాసి యొక్క దేహం చివరికి మరణం నుండి సజీవంగా లేచి క్రీస్తు దేహం లాగ దివ్య శరీరంలా మారుతుంది.
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.

   అందుకే 12వ వచనంలో కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనం శరీరమునకు ఋణస్తులం కాదు. అంతేకాకుండా మీరు శరీర స్వభావం ప్రకారం నడచుకుంటే మీరు చనిపోతారు గాని దేవునిఆత్మ మూలంగా శరీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు అంటున్నారు. 

8:12-13 వచనాలలో పౌలుగారి ద్వారా దేవుడు ఇంతవరకు వెల్లడించిన దివ్య సత్యాలను విని విశ్వాసులు ఏమి అనుకోవాలి? ఏం చేయాలి? దేవుని అద్భుత కృప వెలుగులో విశ్వాసుల బాధ్యత ఏమిటి? అనేది పౌలుగారు  6:11-13,19లో ఈ విషయం కొంత రాశారు. స్వార్థ పూరితంగా కాకుండా స్థిరత్యాగం చేసుకుని, తమ శరీర స్వభావానికి లోబడక శరీర క్రియలను చావుకు గురి చేసేందుకుదేవుని ఆత్మ ఇచ్చే బలప్రభావాలను ఉపయోగించుకోవాలి (కొలస్సి 3:5-10 చూడండి. 
5. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి. 
6. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును. 
7. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. 
8. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. 
9. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీన స్వభావమును (ప్రాచీన పురుషుని)దాని క్రియలతో కూడ 
10. మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు. 
ఇంకా
మత్తయి 5:29-30
29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. 
30. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. ; 
గలతీ 5:24 
క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

ఇది ఎప్పుడో ఒకప్పుడు కాదు ఎప్పుడూ చేస్తూ ఉండవలసిన పని ఇది. ప్రతి చెడ్డ పనినీ విసర్జించి, దాన్ని చంపేసేందుకు దేవుని ఆత్మకు దాన్ని అప్పగించాలి మన జీవితాల్లో పాపాన్ని చంపేసే బలప్రభావాలు ఆయనవే, మనవి కాదు. కానీ మనం ఆయనతో సహకరించి ఆయన మనకిచ్చే శక్తిని ఉపయోగించాలి.ఫిలిప్పీ 2:12-13 ను చూడండి
12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 
13. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. . 

          మన ఇంట్లో విష సర్పాలను ఎలా ఉంచుకోమో అదే విధంగా చెడ్డ క్రియలు, ప్రవర్తన, పాపమైన తలంపులూ ఆశలూ అనగా శరీర క్రియలు మన బ్రతుకుల్లో ఉండనీయకూడదు. నిజ విశ్వాసి తన పాపాల విషయం పశ్చాత్తాప పడ్డాడు, తన జీవితంలోని పాపాలకు విరోధంగా పోరాడుతూ, వాటిపై దేవుని ఆత్మ బలాన్ని ప్రయోగించడం నేర్చుకుంటూ ఉన్నాడు. అతడు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా చేయాలని నిర్ణయించు కున్నాడు. అది అప్పటికప్పుడు హఠాత్తుగా చేసుకున్న నిర్ణయం. అయితే దాన్ని నెరవేర్చడం మాత్రం మెల్లగా చాలా కష్టతరంగా జరగవచ్చు. బహుశా కొద్దిమందే నిలకడగా సంపూర్ణంగా దీన్ని చేయగలుగుతారేమో. అయితే విశ్వాసులందరి జీవితాల్లోనూ ఇలా చెయ్యాలన్న మనస్తత్వం, ధోరణి ఉంటుంది. సోదరుడుఅని పిలవబడిన వాడెవడైనా శరీర క్రియలను చావుకు గురి చేస్తూ ఉండకపోతే తనలో జీవమిచ్చే ఆత్మలో లేడనీ, లేదా అతనిలో ఆ ఆత్మ పని చేయడం లేదనీ బయట పెట్టుకుంటున్నాడన్నమాట (1 యోహాను 3:6, 9). ఎవరైనా సరే ఎప్పుడూ శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నివసించడం లేదనేదానికి రుజువు. అలా జీవించడం మరణమే, మరణానికే దారి తీస్తుంది (వ 6; 6:16, 23).

   ఇక్కడ పౌలుగారు మరో ముఖ్యమైన విషయం చెబుతున్నారు: శరీర కార్యాలను చంపడం ఎలా? జవాబు 13వ వచనం దేవుని ఆత్మ మూలంగా మాత్రమే మనం శరీర క్రియలను చంపగలం! దీనికి మరో సపోర్టింగ్ రిఫరెన్స్ ఆత్మానుసారంగా నడచుకోనుడి అప్పుడు మీరు శరీరానుసారంగా నడచుకోరు! గలతీ5:16. అనగా శరీర క్రియలను చంపుతారు. 

కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు ఎలా నడస్తున్నావ్? 
ఆత్మానుసారంగా లేక శరీరానుసారంగానా?
 శరీరానుసారంగా జీవిస్తే మీ శరీరము ఆత్మ మృతం అని మరచిపోవద్దు!
 ఆత్మానుసారంగా జీవిస్తే నీ ఆత్మ ఫలభరితం!  
నీ ఆత్మ జీవమైనది.  

అట్టి జీవం , ఆత్మ చదువరులందరికీ దేవుడు దయచేయును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
            *రోమా పత్రిక-81వ భాగం* 
                   *ఆత్మనియమం-6*

రోమా 8:1417
14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. 
15. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. 
16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. 
17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. .  

     ప్రియులారా! మనం ఆత్మనియమం కోసం ధ్యానం చేస్తున్నాం!  ఈ వచనాలలో దేవుడు మనలను విడుదల చేయడమే కాకుండా మనలను తన కుమారులుగా చేశారు అని చెబుతున్నారు ఇక్కడ! ఇది మరో కోణం! 

      ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటున్నారు పౌలుగారు. దేవుని సంతానమంటే ఏమిటో వివరించే వచనం ఇది. దేవుని సంతానమంటే ఆయన ఆత్మమూలంగా పుట్టినవారు 
యోహాను 1:12-13
12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 
13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. . 
అంతేకాదు, దేవుని ఆత్మ దారి చూపుతూ ఉండగా వారు అనుసరిస్తారు .యోహాను 10:27
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
.. . ఆత్మ వారి శరీర క్రియలను చావుకు గురిచేసేలా చేస్తాడు. అంతేకాకుండా మనిషిలో ఉన్న శరీరక్రియలను మనిషి తనకుతానుగా చంపేల చేస్తాడు. దేవుని ఆత్మ ఎప్పుడూ విశ్వాసులను స్వార్థం నుంచీ పాపం నుంచీ దూరంగా నడిపిస్తాడు. ఈ అనుభవం లేని వ్యక్తిలో/విశ్వాసిలో నిజమైన పశ్చాత్తాపం, నమ్మకం లేవన్నమాట. అతడు పాపవిముక్తి, రక్షణ పొందలేదన్నమాట (1 యోహాను 2:4-6; 3:3, 7-10; యోహాను 14:23-24). 
పౌలుగారు విశ్వాసులను దేవుని సంతానం అంటున్నాడు. 6:16-22లో వారిని బానిసలు/దాసులు అన్నాడు. ఈ రెండూ పరస్పర విరుద్ధ భావాలుగా కనిపిస్తున్నాయి. గాని బానిసత్వం/ దాసులు అనడంలో బలవంతంగా దాస్యంలో ఉండడమని అతని ఉద్దేశం కాదు. సమ్మతించి ఆనందంగా దేవుణ్ణి సేవించడమే. సంతోషంగా దేవునికి బానిసలు/దాసులు కావడంద్వారా విశ్వాసులు తాము దేవుని సంతానమని రుజువు పరచుకుంటారు. దేవుని దాసులుగా ఉండేందుకు వారికి ఇష్టం లేకపోతే ఆయన సంతానంగా ఉండేందుకు వారు అర్హులు కాదని తమంతట తామే బయట పెట్టుకుంటున్నరన్నమాట. నిజానికి అలాంటివారు దేవుని సంతానం కారు

     ఇక 15వ వచనంలో ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మకలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టు చున్నాము.
ఇదే వచనం మరికొన్ని ప్రతులలో ఇలా ఉంది: మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మద్వారా మనం తండ్రీ, తండ్రీఅని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం.
16 • మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.

   ఈ వచనాలలో దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ అనే రెండు ఆత్మలు కనిపిస్తున్నాయి మనకు. దాస్యపు ఆత్మ పాపానికి ఫలితం. అది నిన్ను దాస్యం క్రిందకు నెట్టివేస్తుంది. పాపము చేయు ప్రతీవాడు పాపమునకు దాసులు అని యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పారు.  అయితే మనలను తన పుత్రులుగా పిలుస్తున్నారు దేవుడు! విశ్వాసులు ఎవరి బలవంతం లేకుండా తమకు తామే దేవునికి దాసులైనవారు. భయానికి అయిష్టంగా దాసులైనవారు కాదు (హీబ్రూ 2:14-15). వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మమూలంగా (వ 9) వారు తమకు తామే దేవుణ్ణి తమ తండ్రిగా తలంచి అలా సంబోధిస్తారు
ఇక అబ్బా తండ్రి అని పిలువడం కోసం అటువలె ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు .8:26
అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

 దేవుణ్ణి అబ్బా తండ్రి అని ఎప్పుడు పిలుస్తాము అంటే దేవునితో మనకు అంత దగ్గర రిలేషన్ ఉన్నప్పుడు, ఆ సంబంధం మైంటైన్ చేసినప్పుడు మాత్రమే మనం అలా పిలువగలం!  
ప్రియ చదువరీ! దేవునితో నీవు అలాంటి అబ్బా తండ్రి అని పిలువగలిగే స్తితిలో నీవున్నావా?  ఒక దాసుడు తన యజమానిని అయ్యగారు అని మాత్రం పిలువగలడు గాని డాడీ అని పిలువలేడు! మరినీవు నీ పరలోకపు తండ్రిని ఎలా పిలుస్తున్నావు?

  16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు అంటున్నారు. దేవుని ఆత్మ వేరు, విశ్వాసుల ఆత్మ వేరు అని జాగ్రత్తగా గమనించండి. అద్వైత వేదాంతం బోధిస్తున్నది తప్పు. దేవుని ఆత్మ, విశ్వాసి ఆత్మ ఒకటి కాదు. యోహాను సువార్త 14:16,17,26
16. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను( లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. 
17. లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును. 
26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మలేక,ఉత్తరవాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. 

       విశ్వాసుల హృదయాల్లో వారు దేవుని ఆత్మ ప్రకారం నడుస్తూ శరీర క్రియల్ని చావుకు గురి చేస్తూ ఉంటే (వ 13,14), వారి ఆత్మలకూ దేవుని ఆత్మకూ మధ్య ఆనందకరమైన సమ్మతి, అంగీకారం ఉంటుంది. దేవుని ఆత్మ వారు దేవుని పిల్లలన్న నిశ్చయతలోకి వారిని నడిపిస్తూ ఉంటాడు (1 యోహాను 3:24; 4:13). విశ్వాసుల హృదయాల్లో దేవుని ఆత్మ ఏ విధంగా ఈ సాక్ష్యం చెప్తాడో ఇక్కడ పౌలు వివరించలేదు. అయితే అది ఒక వ్యక్తిగత అంతరంగ అనుభవమన్నది స్పష్టముగా కనుపిస్తున్నాయి. అంతరంగంలో ఆత్మ సాక్ష్యం, బయటనుంచి బైబిలు సాక్ష్యం ఒకదానికొకటి పూర్తిగా ఏకీభవిస్తాయని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు. ఒక విషయం సత్యం కాదని దేవుని వాక్కు చెప్తుంటే అది సత్యమేనని దేవుని ఆత్మ ఎప్పటికీ చెప్పడు. దేవుని ఆత్మ దేవుని వాక్కును విశ్వాసుల హృదయాలకు వ్యక్తిగతమైనదానిగా, వాస్తవంగా, సజీవంగా అయ్యేలా చేస్తాడు. విశ్వాసులకు లభించగల జ్ఞానం, నిశ్చయత గురించి 5:5; 1 యోహాను 5:10, 20; 1 కొరింతు 2:9-12; యోహాను 16:13-15 కూడా చూడండి..
 ఒక విశ్వాసి పాపం చేస్తే పరిశుధ్ధాత్మను దుఃఖపెట్టి, నిశ్చయత నిచ్చే ఆయన మాటలను ఆపివేసిన వాడౌతాడు (ఎఫెసు 4:30)
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

 వారసులు అన్నిటికీ వారసుడు క్రీస్తు (హెబ్రీ 1:2). కాబట్టి ఆయనతో వారసులు కావడమంటే అన్నిటినీ ఆస్తిగా స్వీకరించడమన్నమాట. 4:13; 1 కొరింతు 3:21-23; ఎఫెసు 1:14; కొలస్సయి 1:12; ప్రకటన 21:7; మత్తయి 5:5 చూడండి.

    కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు దేవుని కుమారుడిగా ఉన్నావా? లేక సాతాను సంతానంగా ఉన్నావా? కుమారుడివైతే నీవు వారసుడవు. దేవుని రాజ్యానికి దేవుని వాగ్దానాలకు హక్కుదారుడవు! 
పాపానికి దాసుడవా? అయితే నీ అంతం మరణం- నరకం అని మరచిపోవద్దు! 
నేడే నీ బ్రతుకు మార్చుకుని పాప నియమం నుండి ఆత్మ నియమానికి రా! 
వెంటనే దేవుడు నిన్నుకూడా నా కుమారుడా అని పిలిచి తన రాజ్యమహిమకు, నిత్యమహిమకు, వారసుడిగా చేస్తారు! 

నేడే రక్షణ దినం! 
ఇదే అనుకూలసమయం!
ఆమెన్!

*రోమా పత్రిక-83వ భాగం*
రోమా 8:1923
19. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 
20. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, 
21. స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. 
22. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. 
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము   

     ప్రియులారా! ఇంతవరకు ఆత్మనియమం కోసం ధ్యానం చేసాం. ఇంకా ముందుకు పోయే ముందు పౌలుగారు చెప్పిన మరో ప్రాముఖ్యమైన సంగతి కోసం ఈ రోజు ధ్యానం చేద్దాం! ఈ 1923 వరకు సృష్టి విడుదల కోసం ఎదురుచూస్తుంది అంటున్నారు. ఇంతకీ సృష్టికి అంతకర్మ ఏం పట్టింది? విడుదల కోసం ఎదురు చూస్తుంది అనగా ఇంతవరకు దాస్యంలో ఉన్నట్లే కదా!! మరి ఇది ఎలా జరిగింది?  జవాబు ఆదికాండం మూడో అధ్యాయంలో గల సంఘటన! ఆదాముగారి ద్వారా ఈ సమస్త సృష్టికి పాపం, శాపం, దాస్యం అంటుకుంది. ఆదికాండం 1:31 ప్రకారం దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అది మంచిదే గాని మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపం వలన ఆదాముతో పాటు సమస్త సృష్టి శపించబడింది. ౩:1719 
17. ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; 
18. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; 
19. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ;
   ఇలా శపింపబడిన నేల/సృష్టి ఎప్పటినుండో విడుదల కోసం ఎదురుచూస్తుంది. అయితే నేలమీద ఎవరున్నారు? మనం అనగా మానవులు. మానవుల ఊహలు బాల్యం నుండి చెడ్డవి అని బైబిల్ సెలవిస్తుంది ఆదికాండం 6 వ అధ్యాయం ప్రకారం.  అందుకే ఒకసారి నోవహుగారి సమయంలో జలప్రళయం ద్వారా ఈ సృష్టిని నాశనం చేసేసారు. మరల పాపం పెరిగిపోయింది. అప్పుడు నాశనం చేసినా దాస్యం విడుదల కాలేదు. ఆ దాస్యం విడుదల కావాలంటే మానవుల పాపం ఆగిపోవాలి. మొదటగా మానవుల దాస్యం అనగా పాపం దాస్యం నుండి విడుదల కావాలి. అప్పుడే మానవులతో పాటుగా సృష్టికూడా విడుదల పొందుతుంది. అందుకే ఈ సృష్టి మూలుగుచు ప్రసవవేదన పడుతుంది అంటున్నారు పౌలుగారు. సృష్టి మూలగడం ఏమిటి? అవును ! ఇంతకుముందు ఈ భూమి, సృష్టికూడా మొర్రపెట్టాయి దేవునికి! ఆదికాండం 6వ అధ్యాయంలో, 18, 19 అధ్యాయాలలో భూమి మొర్ర దేవుని దగ్గరకు చేరి తన దూతలను పంపించారు నిజంగా అలా జరిగిందో లేదో అని! నిర్ధారణ చేసుకుని సోదొమ, గొమోర్రా, అద్మా, సెబాయిము, మరియు మరో చిన్న గ్రామాన్ని అగ్ని గంధకాలతో నాశనం చేశారు. ఆ ప్రాంతమే నేడున్న Dead Sea! మృత సముద్రం! 

    అయితే ఇంకా దానికి అనగా సృష్టికి విమోచనం కలుగలేదు. అందుకే 1922 లో సృష్టి మూలుగుతుంది అంటున్నారు.
8:19 “దేవుని కుమారుల ప్రత్యక్షతకోసం 23; 
కొలస్సయి 3:4
మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.
1 పేతురు 1:5
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
1 యోహాను 3:1-2
1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో(మనకెట్టిప్రేమచూపెనో) చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. 
2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. ...

కాబట్టి ఇప్పుడు ఇలా చెరలో ఉండి మూలుగుతూ ఉన్న ఈ సృష్టే విడుదల పొంది రాబోయే మహిమలో భాగం పంచుకుంటుంది.  యెషయా గ్రంధంలో నాలుగుచోట్ల ఈ సృష్టి విడుదల పొందుతుంది. అప్పుడు ఎలా ఉంటుందో చాలా వివరంగా ప్రవచనాత్మకంగా వివరించారు యెషయా గారు! 
యెషయా 11:6-9
6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. 
7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. 
8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును 
9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును. ....; 
25:6-8
6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును. 
7. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును 
8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు. ; 
35:1-10
1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును 
2. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. 
3. సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. 
4. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. 
5. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును 
6.కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును 
7. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. 
8. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు 
9. అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు 
10. వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.; 
49:8-13
8. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. 
9. మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును 
10. వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. 
11. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. 
12. చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు. 
13. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి. 
చూశారా ఎంత స్పష్టంగా చెబుతున్నారో!

 సృష్టి మొదట్లో ఎలా ఉందో అలా ఇప్పుడు లేదు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అది ఇప్పటిలాగా ఉండదు. మానవజాతి పాపంలో పడిపోయినదాని ఫలితాన్ని భూమి ఎలా పంచుకుందో, క్రీస్తు మానవజాతిని పాపం నుంచి విమోచించిన ఫలితాన్ని కూడా అది పంచుకుంటుంది.

                     ప్రియులారా! ఇక 23వ వచనం ప్రకారం సృష్టితో పాటు మనం కూడా అనగా ఆత్మయొక్క ప్రధమ ఫలములు పొందిన మనం కూడా దత్తపుత్రత్వము కోసం, అనగా మన దేహము యొక్క విమోచనం కోసం కనిపెట్టుచు మానంలో మనం మూలుగుచున్నాము అనటున్నారు. చూసారా 7:24లో కూడా ఇదే అంటున్నారు పౌలుగారు 
అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
.... .2కోరింథీయులకు 5: 3,4
ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము.
ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.

విశ్వాసుల విముక్తి, రక్షణలో గల ఆకరి మెట్టు! దానినే మృతుల పునరుత్థానం మరియు మహిమ పరచబడటం అంటారు.౩౦వ .  విశ్వసులంతా ఆ సమయం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. మూలుగుతూ ఉన్నారు.  ఇక్కడ దీనిని పౌలుగారు శరీర విమోచనం అంటున్నారు.  
1కొరింథీ 15:5154
51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము. 
52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. 
53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. 
54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. .. 
ఫిలిప్పీ ౩: 21.
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
యోహాను 5:2829.
28. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని 
29. మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. .

  ఇక్కడ దత్తపుత్రత్వము అనగా పూర్తిగా శాశ్వత విమోచనం అనుభవించి, శరీరం, మనస్సు, ఆత్మ, క్రీస్తు పోలికలో లేక ఆత్మలో క్రీస్తు పోలికగా మార్చబడిన విశ్వాసులు , రూపాంతరం పొంది, విడుదల పొందిన లేక రూపాంతరం చెందిన సృష్టిలో దేవుడు తమ కొరకు లేక దేవుని సంతానం కొరకు దేవుడు ఏర్పాటుచేసిన స్థానాలకు చేరడం అన్నమాట!  అందుకే యేసుక్రీస్తుప్రభులవారు నేను స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను.  నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అన్నారు కదా! యోహాను 14:2,3; అదే సిద్ద పరచిన స్థలానికి మనం చేరి ఏర్పాటు చేయబడ్డ స్థలాన్ని అలంకరించడమే దత్తపుత్రత్వం పొందడం! ఇక్కడ దత్తపుత్రత్వం అని ఎందుకు అన్నారంటే: మొదటగా మనం యూదులం కాదు! పాపులం! గాని యేసయ్య తన ఉచితమైన కృపతో మనకు ఆయన కుమారులు అవడానికి అవకాశం ఇచ్చి, మనకోసం విమోచన క్రయధనం ఇచ్చి, మనం కుమారులం కాకపోయినా మనలను పాప దాస్యం నుండి విముక్తి చేసి, మనలను కుమారులుగా చేసారు కాబట్టి దత్తపుత్రులం అయ్యాము. ఇప్పుడు మన విశ్వాసం, సాక్ష్యం, ఘటము కాపాడుకొన్నందుకు దేవుడు మెచ్చి మనకు ఇచ్చిన స్వాస్థ్యం పొందుకోవడం దత్తపుత్రత్వం! 

     ప్రియ సేవకుడా! విశ్వాసి! చదువరీ! నీ ఘటమును, రక్షణను కాపాడుకొన్నావా? లేక తుచ్చమైన కోరికలు కోసం నీ రక్షణను తాకట్టు పెట్టేశావా? 
భళా నమ్మకమైన మంచి దాసుడా! అని అనిపించుకొంటావా? 
లేక సోమరివైన చెడ్డ దాసుడా! అని పిలిపించుకుని అగ్నిగంధకములతో మందు గుండములో పాలుపొందుతావా? 
ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో! 
సరిలేనివి- సరిచేసుకో! 
ఆ దత్తపుత్రత్వము పొందుకో!

ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-84వ భాగం*
*ఆత్మ నియమం-8*

రోమా 8:2427
24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? 
25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము. 
26. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. 
27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 

     ప్రియులారా! మరోసారి ఆత్మనియమం కోసం ధ్యానం చేద్దాం! ఈ అధ్యాయంలో చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతులున్నాయి. ఇంతవరకు ధర్మశాస్త్రం నుండి ఎలా విడుదల పొందుతామో, శరీరకార్యాలను ఆత్మద్వారా ఎలా చంపవచ్చో, ఆత్మయొక్క విశిష్టత కోసం, దత్తపుత్రత్వం కోసం ఇంతవరకు ధ్యానం చేశాం. ఇక విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితం, దేవుని రక్షణ ప్రణాళిక, అంతిమ ముక్తి ఇలాంటి విషయాల కోసం ధ్యానం చేద్దాం! 

   ఇక 24-25 వచనాలలో మనం నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము. అంటూ *నిరీక్షణ కోసం* చెబుతున్నారు.  మనం ఇంతవరకు ఆదరణ కర్తయైన పరిశుద్దాత్ముని కోసం నిరీక్షిస్తున్నాము. ఇప్పుడు పొందుకున్నాం.  క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది చాలా అవుసరం. మన అందరికి ఒక నిరీక్షణ ఉంది. దీనికి పౌలుగారి పెట్టిన పేరు శుభప్రదమైన నిరీక్షణ! అదేమిటంటే మనమందరం ఒకరోజు బూర మ్రోగగానే దేవుని దగ్గరకు మేఘాలమీద కొనిపోబడతాము. రారాజుతో అనుదినం జీవిస్తాం! నిత్యజీవంలో, నిత్యరాజ్యంలో ఎల్లప్పుడూ మన పరమతండ్రితో ఉంటాము. ఇదే శుభప్రదమైన నిరీక్షణ! విశ్వాసి ప్రతీ ఒక్కరు ఈ నిరీక్షణ కలిగియుండాలి. అందుకే అనగా దానిని పొందుకోడానికే ఈ చప్పిడి పథ్యం! 5:2 లోకూడా పౌలుగారు ఆయనద్వారా మనము విశ్వాసంవలన ఏ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అంటున్నారు.

 అయితే ఈ నిరీక్షణ ఎలా కలుగుతుందో కూడా పౌలుగారు రోమా 5:౩లో చెబుతున్నారు: శ్రమ ద్వారా ఓర్పు, ఓర్పు ద్వారా పరీక్ష, పరీక్ష ద్వారా నిరీక్షణ (దీనినే శీలం/ కారెక్టర్ అని కూడా చెబ్తుతారు.) కలుగుతుంది.అనగా ఈ నిరీక్షణ శ్రమలద్వారా కలుగుతుంది అన్నమాట! మరోమాట : విశ్వాసులకే శ్రమలు/ శోధనలు వస్తాయి గాని పిశాచాలుగా ఉన్నవారికి అనగా నరుగురిలో ... కులంతో ... అని తిరిగే సగం సచ్చిన క్రైస్తవులకు శ్రమలు రావు. అంతా హేపీస్! చివరకు వారికి నరకం ఖాయం! 

   ఈ వచనంలో నిరీక్షణ కోసం వాడిన గ్రీకు పదం తెలుగు కన్నా చాలా బలమైన అర్ధంతో కూడి ఉంది. దానిని భవిష్యత్ లో తప్పక వస్తుందిఅని ఒక అర్ధం, “ దేవుడు వెల్లడి చేసినది తప్పక జరుగుతుంది అని దృఢవిశ్వాసంతో కూడిన నిబ్బరంతో ఎదురుచూడడంఅని అర్ధం! తెలుగులో   కేవలం నిరీక్షణ అని మాత్రం తర్జుమా చేసేశారు.  ఈ నిరీక్షణ నమ్మకం వలన లేదా విశ్వాసం వలన కలుగుతుంది. కాబట్టి నిరీక్షణ, విశ్వాసం నాణేనికి బొమ్మ బొరుసులు లాంటివి.  తీతుకు 1:2
నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో
1పేతురు 1: 20
ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

  ఇక ఈ వచనాలలో తర్వాత ప్రాముఖ్యమైన అంశం: *దేవుని ఆత్మ మన బలహీనతలో మనకోసం ప్రార్ధించుట* లేక *ఆత్మ ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ప్రార్ధించుట* కోసం వ్రాయబడింది. 2627 వచనాలు. ఈ వచనాలలో ఆత్మ మన బలహీనతల విషయంలో చూచి మనకోసం ప్రార్ధన చేస్తున్నాడుఎందుకంటే మనం ఎలా ప్రార్ధన చేయాలో మనకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మనపక్ష్యంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని చెబుతున్నారు. పరిశుద్ధాత్ముడు మనకోసం ఉచ్చరింపశక్యం కాని మూల్గులతో ప్రార్ధించటానికి రెండు కారణాలు ఉన్నాయి.

1). 26 లో చెప్పినట్లు ఎలా ప్రార్ధన చేయాలో మనకు తెలియదు కనుక మనకు సహాయం చేయడానికి మూల్గులతో కూడిన ప్రార్ధన మన పక్ష్యంగా చేస్తున్నాడు. మూల్గులు ఎప్పుడు వస్తాయికన్నీరు/దుఖం వచ్చినప్పుడు! మరి పరిశుద్దాత్ముడికి దుఖం ఎందుకు వస్తుంది? మన బ్రతుకులు లేక ఇరుగుపొరుగు వారు/ సంఘం బాగోలేనందువలన. మనకోసం మరియు ఇతరుల కోసం కన్నీటితో ప్రార్ధన చేస్తున్నాడు పరిశుద్దాత్ముడు!  ఈ కన్నీటి ప్రార్ధన ఎప్పుడు వస్తుంది? సామాన్యంగా ఏమైనా తీరని కష్టాలు, తీరని రోగం వస్తే ఎంత ప్రార్ధన, కన్నీటి ప్రార్ధన వస్తుందో మనకు తెలియదు. ఆ ప్రార్ధనలో గోల్డ్ మెడల్ కొట్టెయ్యగలరు. గాని ఆ రోగం/ కష్టం పొతే ప్రార్ధన అటుకెక్కుతుంది- మొక్కుబడి ప్రార్ధనగా ఏవో రెండు ముక్కలు చేసి ముగించేస్తారు. గాని నిజంగా ఏవిధమైన కష్టనష్టాలు లేకపోయినా/ వ్యాదిబాధలు లేకపోయినా ఒక విశ్వాసికి ఎప్పుడు కన్నీరు వస్తుంది అంటే: ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసినప్పుడు!! మోకరిస్తే చాలుబోరుమని కన్నీళ్లు వచ్చేస్తాయి. భయంకరమైన దుఖం వచేస్తుంది. ఇప్పుడు నిన్ను ఎవడు కొట్టేడు, ఎవరు ఏమన్నారు? ఎందుకు అలా ఏడుస్తావే ఏడుపుగొట్టుదానా అంటాడు భర్త! గాని అతనికి తెలియదు ఆమె కావాలని ఏడవటం లేదు! అది పరిశుద్దాత్ముని కార్యం! ప్రజల పక్షంగా ఆమె ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రార్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవం లేని సగం సచ్చిన విశ్వాసికి ఈ అనుభవం ఎప్పటికీ రాదు! 
    మీకో విషయం గుర్తుచెయ్యనివ్వండి: దేవుడు సృష్టి తర్వాత ఏమిచేసినా సొంతంగా చేయలేదు. మానవుని సహకారంతో చేస్తున్నారు. దేవుడు చెయ్యగలరు. గాని చెయ్యరు! దేవునికోసం సంపూర్ణంగా సమర్పించుకున్న, దేవునికి తనకుతానుగా అర్పించుకున్న హృదయాలు కావాలి దేవునికి! వారిద్వారా దేవుడు మానవాతీత అద్భుతాలు చేస్తారు. బైబిల్ గ్రంధంలో అలాంటివారినే ఉపయోగించుకుని ఎన్నో అసాధారణమైన అద్భుతాలు చేసారు దేవుడు! ఇక్కడ కూడా పరిశుద్దాత్ముడు ప్రార్ధన చేయగలరుగాని తనకు పూర్తిగా సమర్పించుకున్న హృదయం కావాలి. అప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షంగా తానే ప్రార్ధన చేస్తాడు. 

2. 27వ వచనం ప్రకారం ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో పరిశుద్దాత్ముడు ప్రార్ధించటానికి కారణం : పరిశుద్దాత్మునికి దేవుని యొక్క మనసు తెలుసు! కాబట్టి ఎప్పుడైతే మనిషి తననుతాను దేవునికి సమర్పించుకుంటాడో, ప్రార్ధనలో తన హృదయాన్ని కుమ్మరించడానికి పూనుకున్నాడో పరిశుద్దాత్ముడు వెంటనే ఆ వ్యక్తిని స్వాధీనం చేసుకుని, దేవుని యొక్క మనస్సును, పరిశుద్దాత్ముడు తెలుసుకుని, దేవుని మనస్సును తన మనస్సుగా చేసుకుంటాడు. వెంటనే ఆత్మపూర్ణుడైన విశ్వాసి ఆత్మయొక్క మనస్సుని తెలుసుకుని విజ్ఞాపనం చేయడం ప్రారంబిస్తాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు ఈ విశ్వాసికి సహాయం చేస్తాడు. ఈకారణాల వలన పరిశుద్దాత్ముడు తానే మనపక్ష్యంగా ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో ప్రార్ధన చేస్తాడు.

    ఈ సంధర్బంలో దైవజనుడు హిజ్కియా ఫ్రాన్సిస్ గారి సాక్ష్యం గుర్తుకువస్తుంది నాకు. ఆయన రక్షించబడిన మొదట్లో అనగా ఇంకా టీన్స్ లో ఉన్నప్పుడు ఆయన ఎంతో భారంతో కన్నీళ్ళతో వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్దించేవారంట! ఇది చూసిన ఆయన తల్లిదండ్రులు దైవజనులు డి.జి.ఎస్. దినకరన్ అయ్యగారికి ఉత్తరం రాసారట. అయ్యా మా అబ్బాయి ప్రార్ధన చేస్తున్నాడు, బాగుంది గాని చాలా వెక్కిక్కి ఏడుస్తున్నాడు. అలా ఏడవడం మానేసి ప్రార్ధన చెయ్యమని చెప్పండి అని రాసారట! వెంటనే దినకరన్ అయ్యగారు హిజ్కియా ఫ్రాన్సిస్ గారికి ఉత్తరం రాసారట, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? మీ తల్లిదండ్రులు ఇలా అంటున్నారు అని! దానికి ఆయన జవాబు: అంకుల్ నేను ఏడుస్తూ ప్రార్దిస్తున్నది నాకోసం కాదు. నాకు యేసయ్య అంటే చచ్చేంత ఇష్టం! ఆయన సిలువయాగం గుర్తుకు వస్తే నాకు ఏడుపు ఆగదు! నాకు అదిమాత్రం గుర్తుంటుంది. తర్వాత ఎందుకు ఏడుస్తానో ఎలా ఏడుస్తానో, ఎంతసేపు ఏడుస్తానో నాకే తెలియదు. బోజనమైనా మానేస్తాను గాని ఈ కన్నీటితో ప్రార్ధించడం మాత్రం నేను మానలేను అని రిప్లై ఇచ్చారంట! అది ప్రార్ధనా జీవితం! ఒకసారి దేవుని హస్తాలలోనికి/ పరిశుద్దాత్ముని హస్తాలలోనికి ప్రార్ధనలో వెళ్ళిన నీవు ఆయనకు సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఉపయోగించుకుని సంఘక్షేమం కోసం, ఇరుగుపొరుగు వారి రక్షణ కోసం, నీ సంఘకాపరికోసం ప్రజలకోసం ప్రార్ధన చేస్తాడు. ఈ క్రమంలో నీవు ఎట్టి పరిస్తితిలోనూ టైం చూసుకోకూడదు! ప్రార్ధన మొదలుపెట్టడం నీవంతు! ముగించడం, ఎలా ప్రార్ధన చేయాలో చేయడం ఆయన వంతు!

              బైబిల్ గ్రంధం ప్రకారం ఇద్దరే ఇద్దరు విశ్వాసుల పక్షంగా ప్రార్ధనావిజ్ఞాపనలు చేస్తున్నారు.  ఒకరు పరిశుద్ధాత్ముడు! 26,27 వచనాలు. మరొకరు యేసుక్రీస్తుప్రభులవారు! ౩4వచనం. ఈ ఇద్దరి ప్రార్ధనలు వినే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ప్రార్ధనలు విని మనకు సహాయం చేస్తారు. కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ దేవుని సంకల్పం చొప్పుననే ప్రార్ధన చేస్తుంటారు. దేనికోసం ? విశ్వాసుల బలహీనతలో సహాయం చేసేందుకు! లోకాన్ని, శరీరాన్ని , సైతానుని జయించడానికి కావలసిన శక్తిని మనిషికి కలగాలని వీరు ఎప్పుడూ ప్రార్ధన చేస్తుంటారు. ఈ విధంగా త్రిత్వమై యున్న దేవుడు మనిషికి ఎప్పుడూ సహాయం చేస్తున్నారు. 

   ప్రియ చదువరీ! నీకు అలంటి ప్రార్ధన జీవితం ఉందా లేక పైపైన పెదాలతో రెండు ముక్కలు చేసి ఆమెన్ అంటున్నావా? ఆ భక్తులు అలా ప్రార్ధనచేశారు కాబట్టే దేవుడు ఆ భక్తులను అంతగొప్పగా వాడుకుంటున్నారు, వాడుకుంటారు. నీవునేను చేయడం లేదు కాబట్టే మనమింకా ఇలాగే ఉన్నాం! 
మరి నేడైనా అలా ప్రార్ధించడానికి ఇష్టపడతావా?
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-85వ భాగం*
రోమా 8:2830
28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. 
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. .  
     ప్రియులారా! ఈ వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు రాస్తున్నారు పౌలుగారు.
1). దేవుని ప్రేమించువారికి- ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి- మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును!
2) దేవుని రక్షణ ప్రణాలికా విధానం! 

   మొదటగా 28వ వచనంలో వ్రాయబడిన దేవుని ప్రేమించువారికి సమస్తము సమకూడి జరుగుతాయి కోసం ధ్యానం చేద్దాం! మనం మానవులం! ఏదైనా వస్తే వెంటనే దేవునికి ప్రార్ధన చేస్తాం! చేసి కళ్ళు తెరిచిచూసిన వెంటనే అధ్బుతాలు జరిగిపోవాలి అనికోరుకుంటాం. అయితే దేవుడు వెంటనే దానిని చేయరు! ఎప్పుడు అవసరమో అప్పుడే చేస్తారు. మన ఆలోచనలు వేరు! దేవుని ఆలోచనలు వేరు! మన ఆలోచనా విధానం వేరు! దేవుని ఆలోచనా విధానం వేరు! మన ఆలోచనా విధానం యొక్క ఫలితం టెంపరరీ! అయితే దేవుని ఆలోచనా విధానం యొక్క ఫలితం పర్మినెంట్! దేవుని పని, దేవుని సమయంలో, దేవుని విధానంలో జరుగుతుంది తప్ప మనిషి కోరుకున్నట్లు, మనిషి అనుకున్న సమయంలో జరుగనే జరుగదు! అందుకే నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అంటున్నాడు భక్తుడు! విలాప వాక్యములు 3:26;
 ఇందుకే ఇక్కడ దేవుని ప్రేమించినవారికి దేవుని ప్రేమించిన వారు ఎవరు? అంటే ఆయన సంకల్పం చొప్పున లేక దేవునికోరిక చొప్పున లేక  దేవుడు ఇష్టపడి ఆయన ఇష్టం చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరురుగుచున్నవి అని ఎరుగుదుము అంటున్నారు పౌలుగారు! 

            బైబిల్లోని గొప్ప వచనాల్లో ఇదొకటి. చాలామంది క్రైస్తవులు ఇలాంటి వచనాలను ఇతరులకు వినిపిస్తుంటారు గానీ వారిలో కొద్దిమంది మాత్రమే ఇందులోని సత్యం నిజంగా అర్ధం చేసుకుంటారు. అది తనకు మరియు అందరికి వర్తిస్తుంది అని గ్రహిస్తారు.. ఈ వచనంలోని మాటలు నమ్మి ఇవి తమ విషయంలో ఎప్పుడూ నిజమని తెలిసినవారికి మాత్రం వేడిమి, అలసట ఉన్న ఎడారి భూమిలో గొప్ప బండ చాటున ఉండే చల్లని నీడలాంటి వచనం ఇది. ఇది నిజం కావడం అసాధ్యం అనిపించినప్పటికీ ఇది ఎప్పుడూ నిజమే (వ 35-39లో విశ్వాసులకు కలిగే కొన్ని అనుభవాలు చూడండి). తమ అనుదిన జీవితాల్లో తమకెదురయ్యే సంఘటనలన్నిటికీ ఈ సత్యాన్ని వర్తింపజేసుకోగలిగినవారు ధన్యులు. పౌలుగారు ఏమంటున్నారో చూడండి. మనకు ఎక్కడో కొద్దిగా ఆశ ఉంది”, లేదా ఇది నిజమేమో అని ఊహిస్తున్నాంఅనడం లేదు పౌలు. మనకు తెలుసుఅని నొక్కి వక్కానిస్తున్నారు. దేవుడు దీన్ని ఇలా వెల్లడించాడు కాబట్టి, బైబిల్లో అనేక చోట్ల ఇది సత్యమని ఆధారాలు చూపించాడు కాబట్టి ఇది సత్యమని మనం తెలుసుకోగలం (ఉదాహరణకు ఆది 50:20 చూడండి). 

దేవుణ్ణి ప్రేమించేవారికిఅనేది, “ఆయన...పిలిచిన వారికిఅనే ఈ రెండు వేరు వేరు మాటలు నిజ విశ్వాసులందరినీ సూచించే మాటలు. వారంతా దేవుణ్ణి ప్రేమించేవారే, తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు వారందరినీ ఆయన పిలిచాడు (వ 30; 1:5-7
6. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. 
7. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.). విశ్వాసులను దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకువచ్చినా అందులో మేలే చేకూరుస్తున్నారు. వాటన్నిటి ద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదిగి మరింతగా క్రీస్తులాగా మారాలని ఆయన ఉద్దేశం. జరిగిన కొన్ని విషయాలద్వారా తమకు ఏ మేలు జరిగిందో విశ్వాసులు ప్రతి సారీ గ్రహించలేకపోవచ్చు. కానీ గ్రహించవలసిన అవసరమే లేదు, నమ్మకమే చాలు.

         ప్రియులారా కాబట్టి! నీవు అడిగింది ఇంకా ఎందుకు జరుగలేదు అంటూ కంగారు పడకు! దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకోకు! దేవుడికి వాళ్ళంటేనే ఇష్టం! నేనంటే ఇష్టం లేదు అనుకోకు! ఉదాహరణకు తన కుమారుడు ఒక పుస్తకం కాని బొమ్మగాని అడిగాడు అనుకో! వెంటనే తండ్రి కొని ఇస్తాడు. గాని కొన్ని ఎంత అడిగినా ఇవ్వడు! ఎందుకంటే తండ్రికి కుమారుడి అవుసరం తెలుసు! అది కోరికా? అవసరమా? అవుసరం అయితే ఎంతవరకు అవుసరమో చూసి ఇస్తాడు. ఉదాహరణకు అదే కొడుకు నిజమైన విమానం కావాలి అని అడిగితే తండ్రి కొని ఇస్తాడా? కొని ఇవ్వగలడా? అలాగే దేవుడు మన ఆత్మీయ స్తితి చూసి, మనకు నిజంగా అది ఎంతవరకో అవసరమో నీకంటే దేవునికే బాగా తెలుసు! 2కోరింథీయులకు 6: 2
అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! .....

  దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు నీవు ఊహించని రీతిలో ది బెస్ట్ ఐటెం నీకు ఇస్తారు! నీ సమస్య తీరుస్తారు. 
Just wait and See!. 
God is going to do Very Fantastic and the Best for your life! 
అదే సమస్తము సమకూడి జరుగడం!  కాబట్టి దేవుని సమయం కోసం ఎదురుచూడు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-86వ భాగం*
రోమా 8:2930.
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. .  .  

     ప్రియులారా! ఈ వచనాలలో రెండవ ప్రాముఖ్యమైన విషయం కోసం ధ్యానం చేద్దాం!

2) దేవుని రక్షణ ప్రణాలికా విధానం!  ప్రియులారా! గత భాగంలో దేవుని ప్రేమించువారికి సమస్తం సమకూడి జరుగుతాయి అని చూసుకున్నాం!
28లో దేవుని ఉద్దేశం ఇది: విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (హెబ్రీ 2:10-11
10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. 
11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే(లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక.... ; 
1 యోహాను 3:1-2
1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో(మనకెట్టిప్రేమచూపెనో) చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. 
2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. 
3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును. ).

 ఇంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం, గొప్ప లక్ష్యం వేరొకటి ఉండబోదు. ఈ ఉద్దేశం నెరవేరడానికి అవసరమైన ఐదు మెట్లను పౌలుగారు ఇక్కడ చెప్తున్నారు. వీటిలో రెండు లోక సృష్టికి ముందున్నవి. రెండు క్రీస్తులో విశ్వాసి జీవితం ఆరంభంలో ఉన్నవి. ఒకటి ఇకముందు రాబోయేది. వీటిలో ప్రతి మెట్టుకూ మిగతా నాలుగింటితో సంబంధం ఉంది. అన్ని మెట్లూ దేవుడు వాటినెంత ఖచ్చితంగా చేయగలడో అంత ఖచ్చితమైనవి.

     *ప్రియులారా! ఆమెట్లు లేక రక్షణ ప్రణాళిక విధానం ఏమిటంటే: మొదటగా తన కుమారుని సారూప్యం గలవారవుటకు ముందుగ నిర్ణయించెను. ఎవరిని ముందుగ నిర్ణయించేనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమ పరిచెను*! 

"ముందుగానే...తనకు తెలిసిన తనవారు విశ్వాసులు తన కుమారుని పోలికలోకి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించడం వారిని గురించి ఆయనకున్న భవిష్యత్ జ్ఞానంపై ఆధారపడిన సంగతి. 
1 పేతురు 1:1-2
1. యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్‌ జ్ఞానమునుబట్టి, 
2. ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. 

ఈ భవిష్యత్ జ్ఞానం ఏమిటో పౌలుగారు ఇక్కడ వివరించడం లేదు. దీనికీ దేవుడు విశ్వాసులను ముందుగానే నిర్ణయించడానికీ గల సంబంధమేమిటో చెప్పలేదు 

"ముందుగానే నిర్ణయించాడు గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ పదం ఆరు సార్లు మాత్రమే కనిపిస్తున్నది (ఇక్కడ, 30; అపొ కా 4:28; 1 కొరింతు 2:7; ఎఫెసు 1:5, 11). దీనికీ కర్మ సిద్ధాంతానికీ ఏ సంబంధమూ లేదు. జరిగేదానంతటికీ అదృష్టమే కారణమనే భావనకూ దీనికీ ఏ పోలికా లేదు. ఏమి జరగాలో ముందుగానే తెలిసిన దేవుడు అలా జరగాలని నియమించాడని దీని అర్థం. సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు అయిన దేవుడు పూర్వ నిర్ణయం ప్రకారం ఏమి జరగాలని నియమిస్తాడో అది తప్పక జరిగి తీరుతుందని ఏమీ అనుమానం లేకుండా నమ్మవచ్చు. ఒక సంఘటన గురించి చెప్పిన అపొ కా 4:28 మినహా క్రొత్త ఒడంబడిక గ్రంథమంతట్లో దేవుని పూర్వ నిర్ణయాన్ని గురించిన మాటలు విశ్వాసుల విషయంలో మాత్రమే కనిపిస్తున్నవి. దేవుడు ఎవరినైనా శాశ్వత నరక శిక్షకు పూర్వమే నిర్ణయించినట్టు ఎక్కడా చెప్పలేదు. కొత్త నిబంధనలో పూర్వ నిర్ణయం సిద్ధాంతం విశ్వాసులకు గొప్ప ఆదరణను, గొప్ప ఆశాభావాన్ని ఇవ్వాలి. తనను పాపవిముక్తికి దేవుడు ముందుగా నిర్ణయించాడో లేదోనని ఎవరూ భయ సందేహాలకు తావియ్యనక్కర లేదు. యోహాను 6:37, 44 . ఇష్టమున్న వారెవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు (ప్రకటన 22:17, )
యోహాను 3:37;45
37.మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. 
45.నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. . 
ఆయన చెంతకు రావడం, ఆయనలో నమ్మకముంచడం అన్న చర్యలే దేవుడు ఆ వ్యక్తిని పూర్వం ఎన్నుకున్నాడని రుజువు.

"పిలిచాడు 28; 1:5. అంటే క్రీస్తుదగ్గరకు వచ్చి ఆయన్ను నమ్ముకునేలా పిలవడం. దేవుని పిలుపు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది రిఫరెన్సులు చూడండి: గలతీ 1:6; 5:13; 1 కొరింతు 1:9, 24; కొలస్సయి 3:15; 2 తెస్స 2:14; 1 తిమోతి 6:12; 2 తిమోతి 1:9; హీబ్రూ 3:1; 1 పేతురు 2:9, 20, 21; 3:9; యూదా 1; రోమ్ 11:29. దేవుడు తమను పిలిచాడని ఖచ్చితంగా తెలుసుకోవలసిన బాధ్యత విశ్వాసులది 2 పేతురు 1:10-11. దేవుడు తమను ఎన్నుకున్నాడని, పిలిచాడని, నిర్దోషులుగా తీర్చాడని విశ్వాసులు తెలుసుకోగలగడం సాధ్యమే. వారు అలా తెలుసుకోవాలి.

"నిర్దోషులుగా ఎంచాడు దేవుని పిలుపు అనే పదాన్ని ఉపయోగించడంలో పౌలు ఉద్దేశాన్ని బట్టి చూస్తే దేవుడు పిలిచినవారంతా దేవుని చెంతకు వచ్చి యేసుప్రభువులో నమ్మకం ఉంచుతారు. వెంటనే దేవుడు వారి పాపాలన్నిటినీ క్షమించి వారిని లోపం లేని న్యాయవంతులుగా ఎంచుతాడు. 1:16-17; 3:21-28; 4:5; 5:1; 10:10 చూడండి

ప్రియులారా! మీ పిలుపు సామాన్యమైనది కాదు. దేవుడు నిన్ను తన ప్రణాళికలో నిన్ను పిలిచారు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దానిని నీవు తెలుసుకోవాలి. అందుకే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అంటున్నారు భక్తుడు! ముందు నీ పిలుపు ఏమిటో తెలుసుకో! ఆ తర్వాత నీవు దేవుని రక్షణ ప్రణాళిక లో ఉన్నావని గుర్తెరిగి భయమునొంది పాపం చేయకుండా దేవుడు చెప్పిన పనిని చేయు! 
అప్పుడు అబ్రాహముగారిని వాడుకున్న దేవుడు, సమూయేలుగారిని వాడుకున్న దేవుడు, సంసోనును వాడుకున్న దేవుడు, నోరులేని గాడిదను వాడుకున్న దేవుడు, ఎందరినో వాడుకున్న దేవుడు నిన్నుకూడా బలంగా వాడుకోగలరు! 
మరి నీవు సిద్ధమా!

దైవాశీస్సులు! 
*రోమా పత్రిక-87వ భాగం*
రోమా 8:3135
31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? 
32. తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 
33. దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; 
34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే 
35. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? .  

     ప్రియులారా! ఈ వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు రాస్తున్నారు పౌలుగారు. 
దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? అంటున్నారు పౌలుగారు! దీనికి ముందుగ ఇట్లుండగా.... అంటున్నారు. దీనికి నేపద్యం తెలుసుకోవాలి.  గత భాగంలో మనం విశ్వాసి ముందుగా నిర్ణయింపబడ్డాడు- పిలువబడ్డాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు- మహిమ పరచబడినట్లు చూసుకున్నాం! కాబట్టి ఇటువంటి మహత్తరమైన పిలుపు, ఏర్పాటు విశ్వాసి పట్ల దేవునికి ఉంది కాబట్టి దేవుడే మన పక్షముగా ఉన్నారు కాబట్టి మనకు విరోధి ఎవడు అని ప్రశ్నిస్తున్నారు పౌలుగారు! 
ఇందులో రెండు అర్ధాలున్నాయి: 
1. మనకు విరోధంగా ఆరోపించువాడెవడు? మనకు అడ్డుగా నిలబడి గెలిచేవాడు ఎవడు? అని ఒక అర్ధం వస్తుంది. ౩౩వ వచనం ప్రకారం నేరం మోపువాడు నీతిమంతులుగా తీర్చువాడైన దేవుడే! ఎందుకంటే మన బ్రతుకు బాగోలేక! శిక్ష విధించు వాడు ఎవడు? ఏ మానవశిక్ష కోసం చనిపోయాడో, ఎవరు చనిపోయారో, అదే యేసుక్రీస్తుప్రభులవారు మనం తిరిగి పాపం చేసి బాహాటంగా క్రీస్తుని మరలా సిలువ వేస్తే, అదే క్షమాభిక్ష పెట్టిన యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడే తీర్పుతీర్చి శిక్ష వేస్తారు.

2.  ఇక రెండవ అర్ధం ఏమిటంటే: ఇంత గొప్ప రక్షణప్రణాళికలో ఉన్నాను కదా , నాకు ఏమీ కాదుకదా! నన్నెవడు ఏంచేస్తాడు అని విర్రవీగావా జాగ్రత్త! ఫలించని ప్రతీ తీగె, కారుద్రాక్షలు కాసే తీగలను దేవుడు కత్తిరించేస్తారు.

   కాబట్టి దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు?
 దేవుడు తన ప్రజలకు చేస్తాననుకునే వాటినీ, చేసేవాటినీ గురించిన మన మాటలన్నీ నమ్మకంతో, కృతజ్ఞతాస్తుతితో, గొప్ప నిశ్చయతతో కూడినవై ఉండాలి. వాటిల్లో ఏ ఒక్కటైనా నిజమా కాదా అన్న సందేహాన్ని మన మాటలేవీ బయట పెట్టకూడదు. దేవుడు ఆయనను నమ్ముతున్నవారమైన మన పక్షాన ఉన్నారు. మనతో, మనలో ఉన్నారు. లోపల గానీ, బయట గానీ ఉండే ఏ శత్రువైనా మనకోసం దేవునికున్న ఉద్దేశాలను ఓడించలేడు 37; హెబ్రీయులకు 13: 6
కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
యోహాను 10:29
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు;

      ఇక 32వచనములో సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికోసం యేసుక్రీస్తుప్రభులవారిని అప్పగించిన వాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ఇవ్వడమంటే ఆయనకు మహా ప్రీతి (1 యోహాను 4:8
దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
2 పేతురు 1:2
తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,
; 2 కొరింతు 9:15; 
అపొ కా 14:17
అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.
; మత్తయి 5:45; 7:10; కీర్తన 145:9).

 ఆయన సర్వ కృపానిధి అయిన దేవుడు (1 పేతురు 5:10)
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

        ఆయన కూర్చుని ఉన్నది కృపా సింహాసనం. ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ప్రజలపై ఆయన కృప ఏలుతున్నది (5:21). వారి అన్ని బలహీనతలపై, వారి భ్రష్ట స్వభావమంతటిపై కృప విజయం సాధిస్తుంది. దేవుడు ఈలోకంలోని అన్ని బహుమతులకంటే అతి శ్రేష్ఠమైనదిగా తన కుమారుణ్ణి ఇచ్చాడు. కాబట్టి విశ్వాసుల అంతిమ విముక్తికి పనికొచ్చే దేనినైనా తప్పకుండా  ఆయన దయ చేయకుండా దాచుకుంటారా? 
ఇక్కడ పౌలుగారి ప్రశ్న తనసొంత కుమారునే బలిగా ఈ లోకములో అర్పించిన యేసయ్య, తన కుమారునితోపాటు ఆయన స్వాస్త్యమును కూడా ఎందుకు అనుగ్రహించడు అని అడుగుతున్నారు.
8:33. దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;  
తన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నేరారోపణనూ దేవుడు అంగీకరించడు. 4:8 చూడండి. 
వారి విముక్తిని, రక్షణను వారినుంచి దోచుకోగలిగినది పాపం మాత్రమే. అయితే దేవుడు వారి పాపాల్ని వారి లెక్కలో చేర్చడు. అంటే పాపం చెయ్యడానికి వారిక స్వేచ్ఛ ఉందనా? ఏ మాత్రం కాదు 6:1
ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?
15. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.
8:4, 12-14.

8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే
  నేరారోపణను దేవుడు అంగీకరించే విధంగా ఒక్క విశ్వాసి మీదైనా నేరం మోపగలిగినది ఎవరు? ఎవరూ లేరు. యోబు గ్రంధం ప్రకారం సైతానుగాడు చేస్తాడు. యోబు 1;  ఇంకా ప్రధాన యాజకుడైన యెహోషువా మలిన వస్త్రం కలిగి ఉన్నాడని సైతాను గాడు కంప్లైట్ చేశాడు. జెకర్యా 3:1--5;  ఇంకా మోషే కానిమాట పలికినందుకు ఆయన మృతదేహం కోసం సాతానుడు కంప్లైంట్ చేశాడని కూడా ఉంది! యూదా 1:9; అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే వాడు కంప్లైంట్ చేసాడని ఉంది గాని దేవుడు దానిని అంగీకరించారా అంటే లేదు! దానికి విరుగుడుగా లేక సరిదిద్దే క్రియ చేసి సమస్యను పరిష్కరించేశారు.
 క్రీస్తు దేవుని కుడివైపున ఉండి తన ప్రజల పక్షంగా ప్రతి నేరారోపణకూ లేక శిక్షావిధి తెచ్చే ప్రతి ప్రయత్నానికీ జవాబు ఇస్తూ ఉన్నాడు. ఆయన జీవం, ఆయన చేస్తున్న విన్నపాలు వారిని శాశ్వతంగా క్షేమంగా భద్రంగా ఉంచుతాయి 
5:9-10
9 .కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. 
10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.  
హెబ్రీ 7:25
25. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. ; 
1 యోహాను 2:11యోహాను 2: 1
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది(ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు.
ఆయన మనకోసం నిరంతరం తండ్రి యొద్ద విజ్ఞపన చేస్తూ మనలను తండ్రి తో ఏకం చేస్తున్నారు.
(సశేషం)
*రోమా పత్రిక-88వ భాగం*
రోమీయులకు 8:35,36,37,38,39
35. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 
36. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. 
37. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 
38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, 
39.  మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
    ఇక్కడ క్రీస్తు ప్రేమఅంటే విశ్వాసుల పట్ల ఆయనకున్న ప్రేమ. వారికి ఆయనపై ఉన్న ప్రేమ కాదు. వారి పాపం మూలంగా క్రీస్తుకు వారిపట్ల ఉన్న ప్రేమ తొలగిపోతే అప్పుడెలా? ఆయన ప్రేమ ఎన్నటికీ తొలగిపోదు. అది శాశ్వతమైన ప్రేమ (యిర్మీయా 31:3). అయితే దీనికి కూడా ఒక లిమిట్ ఉంది. ప్రేమగల దేవుడే కదా క్షమించేస్తాడులే అనుకున్నావా, ఎన్నిమారులు గద్ధించినా విననివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును అని సామెతలు గ్రంథం 29:1 చెబుతుంది.

అది ఆటంకాలన్నిటినీ దాటుకుని ఆయన వారందరినీ చివరికి తన ప్రేమభరితమైన సన్నిధికి తీసుకువస్తుంది (పరమగీతం 8:6-7 
6. ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. 
7. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును). 

     అయితే ఒకసారి యెషయా గ్రంధం 59వ అధ్యాయం చూసుకుంటే దేవుడు మన మనవి ఎందుకు వినడం లేదు అంటే మన పాపాలు దేవునికి మనకు అడ్డుగోడలా నిల్చుంటాయి. మన ప్రార్ధనలు దేవునికి చేరకుండా ఈ పాపాలు అడ్డువేస్తాయి. అందువలన మన పాపాలు , ప్రేమ గల యేసయ్య ఎంత ప్రేమగలవారు అయినా నీ పాపాలు ఆయనతో నీకున్న సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే దేవుని ప్రేమను రుచిచూడని వారిమీద దేవునికి వల్లమాలిన ప్రేమ! వారు కూడా మారాలని! గాని నీవైతే ఒకసారి దేవుని ప్రేమను రుచిచూసి కూడా తెలిసి మరీ పాపాలు చేస్తున్నావు అంటే మరలా యేసయ్యని సిలువ వేస్తున్నావు. మరి ఇది భావ్యం కాదు కదా!  

    పౌలుగారు ఇక్కడ బాధలు, అపాయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే అవి దేవుని ప్రజలకు సామాన్యంగా సంభవించేవే (యోహాను 16:33; అపొ కా 14:22; మొ।।) కాబట్టి, విశ్వాసులను లొంగదీసే ప్రయత్నంలో సైతాను వాటిని వాడుకుంటాడు కాబట్టి, వాటి మూలంగా విశ్వాసులు ఒక్కోసారి క్రీస్తు తమను ప్రేమిస్తున్నాడా లేదా అనీ సందేహం రావచ్చు కాబట్టి, వాటి మూలంగా కొన్ని సార్లు పాపం చేసి తాత్కాలికంగా అపనమ్మకంలో పడిపోవచ్చు కాబట్టి పౌలు వాటిని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఇది జరిగితే క్రీస్తు వారిని విడిచిపెడతాడా? ఆయన వారిని ఇంకా ప్రేమించడా? అలా ఎన్నటికీ కాదు. వారికి సంభవించగల జీవిత అనుభవాలన్నిటిలో నుంచీ వారిని క్షేమంగా పరలోకంలో చేర్చుకుంటాడు. ఎప్పుడూ? పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకుని, పాపం మానుకుని, ఇకను చేయకున్నప్పుడు!

8:37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 
 ప్రత్యేక వ్యక్తులైన పౌలులాంటి వారికే గాక విశ్వాసులందరికీ క్రీస్తు అత్యధిక విజయం లభించేలా చేస్తారు. వారిని అపరాజితులుగా చేస్తాడు. మనకుఅనే మాటను గమనించండి. అత్యధిక విజయంఅంటే ఏమిటి? అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు. ఏ పద్ధతి ఉపయోగించి అయినా సరే అతణ్ణి చివరకు ఓడించడం అనేది అసాధ్యం. పౌలుగారు అంటున్నారు అత్యధిక విజయం కలుగుతూ ఉంది”, గానీ కలగవచ్చునేమోఅని కాదు, “కలిగే అవకాశం ఉందిఅని కాదు. పాపం, సైతాను, లోకం, శరీర స్వభావం విశ్వాసులను గాయపరచవచ్చు, కొద్ది కాలానికి వారిని నేలకూల్చవచ్చు. కానీ వారిపై అంతిమ విజయం సాధించలేవు. అత్యధిక విజయం పొందుతున్నవారిని ఓడించడం అసాధ్యం. వారికి నమ్మకాన్ని ఇచ్చిన దేవుడు అంతంవరకు వారిని ఆ నమ్మకంలో ఉంచుతాడు. క్రీస్తులోకి వారిని తెచ్చినవాడు అంతంవరకు క్రీస్తులో వారిని ఉంచుతాడు. అంతిమ శాశ్వత విజయం వారికిస్తాడు. విశ్వాసులకు అత్యధిక విజయం కలగడానికి కారణం ఒక్కటే పాపం, సైతాను, మరణంపై మహా ఘనమైన విజయం సాధించిన యేసుక్రీస్తుప్రభులవారితో వారు ఐక్యంగా ఉన్నారు. ఆయన విజయంలో వారు భాగస్వాములు.

38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, 
39.  మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
  
      నిజ విశ్వాసులు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమభరితమైన ఆలన పాలనలో భద్రంగా ఉన్నారన్న విషయాన్ని పౌలుగారు నొక్కి వక్కానిస్తున్నారు ఇక్కడ. విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలతో నిండిన ప్రపంచ జీవితం వారిని ఆయన నుంచి వేరుచేయలేదు. భవిష్యత్తులో వారికి తెలియని సంభవాలేవీ అలా చెయ్యలేవు. జీవితాంతంలో వారికెలాంటి మరణం వచ్చినా అది వారిని క్రీస్తు నుంచి వేరుచేయడం అసాధ్యం. ఏ దుష్ట శక్తి గానీ మంచి శక్తి గానీ వారినలా చెయ్యలేవు. కానీ ఎవరైనా ఇక్కడ పాపం అనే మాట లేదు గదాఅనవచ్చు. అయితే జీవితంలో ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా అనడంలో పాపం కూడా ఉన్నట్టుంది. అంతేగాక విశ్వాసుల పాపం గురించి దేవుడు చెప్పిన మాటలను ఇంతకుముందే చూశాం గదా 33,34; 4:8. కృప రాజ్యమేలుతున్నది (5:21)!

   మరి కృప రాజ్యమేలుతుంది అని పాపం చెయ్యొచ్చా అంటే చేయనే కూడదు! 

    ప్రియులారా! కాబట్టి క్రీస్తుప్రేమ నుండి నిన్ను ఏవీ వేరుచేసేలా నీవుండకూడదు. యోబుగారికి శోధనలు రాలేదా? ఒక్కరోజులో ఆగర్భశ్రీమంతుడు భికారి అయిపోయారు. పది బిడ్డల తండ్రి ఎవరూ లేనివాడైపోయారు. గాని ఆయన తన నీతిని గాని, యధార్ధతను గాని, భక్తిని గాని, దేవునిమీద ప్రేమను గాని వదలలేదు! దావీదుగారికి శోదనలు కష్టాలు వచ్చాయి గాని దావీదుగారు ఇంకా దేవునిలో సాగారు. ఇలా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడిన విశ్వాస వీరుల సాక్షి సమూహం మొత్తం వీటిగుండా వెళ్ళిన వారే! దేవునికోసం ఎన్నో కష్టాలు పడ్డారు గాని వారు తమ భక్తిని, నీతిని, యధార్థతను, తద్వారా దేవునిప్రేమనుండి వేరు కాలేదు. శ్రమలు విస్తరించే కొలది ఇంకా దేవుని ప్రేమించడం మొదలు పెట్టారు. అందుకే విశ్వాస వీరుల పట్టీలో పేర్లు సంపాదించుకున్నారు. 

   ప్రియ సహోదరీ/సహోదరుడా! నీ విశ్వాసం,  దేవునిమీద నీ ప్రేమ ఎలా ఉంది? శ్రమయైనా, బాధయైనా, హింసయైనా, కరువైనా, వస్త్రహీనతయైన, ఉపద్రవమైనా, ఖడ్గమైన, మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రదానులైనా, అధికారులైనా, ఉన్నవైనా, రాబోయేవైనా మరి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపవు! అటువంటి స్తిరమైన విశ్వాసం నీకుందా?

  ఇక మరొక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే: ఈ అధ్యాయంలో పౌలుగారు ఒక మర్మం తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మపూర్ణుడై: యేసుక్రీస్తుప్రభులవారు మరణమును గెలిచి, ఆరోహణమైన తర్వాత , నేను వెళ్ళిన పని అయిపోయిందిలే అని ACరూమ్లో మనలాగా రెస్ట్ తీసుకోవడం లేదు! మనకోసం తండ్రి కుడి పార్శ్వమున ఉండి విజ్ఞాపనం చేస్తున్నారు. అయ్యా మరో అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ దేవునియెద్ద మనకోసం మొర్రపెడుతున్నారు. ఇక భూమిపై మనతోపాటు ఉంటున్న పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతల విషయమై మన పక్షంగా దేవుని యొద్ద ఉచ్చరింపశక్యముకాని మూల్గులతో విజ్ఞాపనం చేస్తున్నారు.

   ప్రియ చదువరీ! యేసుక్రీస్తు ప్రభులవారు, పరిశుద్ధాత్ముడే ప్రార్ధన యాచనలు చేస్తుండగా నీవు నేను కూడా చేయాలి కదా! వారికంటే నీవు గోప్పోడివా? 
దయచేసి నేడే ప్రార్ధనాయాచనలు చేయడం మొదలుపెట్టు!
దైవాశీస్సులు!

*రోమా పత్రిక-89వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-1*

రోమా 9:13..
1. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. 
2. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. 
3. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.   

     ప్రియులారా! పౌలుగారు రోమా 18 అధ్యాయాల వరకు దేవుడు మానవజాతి కోసం సిద్ధపరచిన విముక్తి లేక రక్షణ ప్రణాళిక, దేవుని రక్షణ సిద్దాంతం కోసం వివరింగా రాసి, 8వ అధ్యాయంతో ముగించారు. ఇక 9, 10, 11 అధ్యాయాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురుంచి తన రక్షణ ప్రణాళిక ఏమిటి? వారు దానిని ఎలా తిరస్కరించారుతద్వారా వారికి ఏమి సంభవించింది? తెలుపుతూ దానివలన అన్యజనులకు రక్షణ భాగ్యం ఎలా కలిగింది, వారు తిరస్కరించినందువలన అన్యుల దగ్గరకు రక్షణ సువార్త చేరింది. అన్యులు ఇశ్రాయేలీయులతో అంటుకట్టబడి ఇశ్రాయేలీయులతో పాటు సహపౌరులుగా చేయబడ్డారు.  అంటూ వివరించారు. ఇలా చేసి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి అన్యాయం చేశారా అంటే కాదు ఇది దేవుని రక్షణ ప్రణాళిక అని వివరించారు. ఇక  ఇశ్రాయేలీయుల భవిష్యత్ ఏమిటి? వారు ఎప్పుడు రక్షణ పొందుతారు? అనేదానిని రాశారు.
    అయితే పౌలుగారు తన సొంత భావాలేమీ వ్రాయలేదు ఈ మూడు అధ్యాయాలలో! మనం గ్రహించాలి: లేఖనం గాని ప్రవచనం గాని, ఈ బైబిల్ గాని తమ సొంతభావాలతో రాలేదు గాని దేవుని భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ద్వారా రాశారు. 1పేతురు 1:21; కాబట్టి ఈ మాటలు పరిశుద్దాత్ముడు పలికించిన మాటలు! పరిశుద్ధాత్ముడు తన సొంతమాటలు చెప్పడు! పరిశుద్ధాత్మునికి దేవుని మనస్సు తెలుసు అని అందుకే ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మనకోసం మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం గతభాగాలలో వివరంగా చూసుకున్నాం. అయితే ఈ మాటలు ఎలా పౌలుగారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించారు అంటే: దీనికి సపోర్టింగ్ మాటలు యేసుక్రీస్తు ప్రభులవారు తన ఉపమానంలో వివరించారు మూడు సువార్తలలో! మత్తయి 22; లూకా 14;  ఒక రాజు తన కుమారుని వివాహసందర్భంగా విందు ఏర్పాటు చేసి తన స్నేహితులను ఆహ్వానించాడు. అయితే ఆ పిలువబడిన స్నేహితులు ఎన్నో వల్లమాలిన పనికిమాలిన సాకులు చెప్పి విందుకు వెళ్ళడం మానేస్తారు. అప్పుడు రాజు కోపగించి, రోడ్లుమీద ఉన్నవారిని, కనబడిన ప్రతీవారిని, పిలువమన్నారు విందుకు. ఇంకా కాళీఉంటే కుంటివారిని గ్రుడ్డివారిని ఇలా అందరిని విందుకు రమ్మని చెబుతారు. ఈ ప్రవచానాత్మక ఉపమానం మనకి బాగా తెలుసు! అయితే దీని భావం, మరో అర్ధం ఏమిటంటే: పిలువబడిన స్నేహితులు ఎవరనగా ఇశ్రాయేలీయులు, ఇక వారిలో గల  పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు! అయితే మిగిలిన జనులు ఎవరనగా అన్యజనులైన మనమే! వారు (ఇశ్రాయేలీయులు) తిరస్కరించారు కాబట్టి మనం పిలువబడ్డాము!  

  సరే! ఈ 9:15 వరకు ఇశ్రాయేలీయుల పట్ల పౌలుగారి యొక్క ఆవేదన, దుఖం ఏమిటో వివరిస్తున్నారు. నాకు హృదయంలో ఎంతో దుఃఖం, ఎడతెగని బాధ ఉన్నాయి. నేను క్రీస్తులో సత్యమే చెబుతున్నాను. అబద్దం చెప్పడం లేదు. ఇంకా అంటున్నారు నా మనస్సాక్షి, నాలో ఉన్న పరిశుద్ధాత్మ కలసి చెబుతూ ఉన్నాం. సాధ్యమైతే దేహ సంబంధమైన నా సహోదరులుకోసం నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై పోడానికి కూడా నేను సిద్దమే అంటున్నారు. పౌలుగారు ఇంతగా నొక్కి వక్కాణించి చెప్పడానికి అనగా అబద్దం చెప్పడం లేదు నిజమే చెబుతున్నాను. నా మనస్సాక్షి, నాలో ఉన్న పరిశుద్దాత్మ ... అంటూ వ్రాయడానికి కారణం ఏమిటంటే అనేకమంది యూదులు పౌలుగారిని తమ విరోధిగా ఎంచుతున్నందు చేత పౌలుగారు ఈ వచనాలను అంత గట్టిగా నొక్కి చెప్తున్నాడు (అపొ కా 21:21
అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.
28. ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ద స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.
; 24:5). వాస్తవమేమిటంటే అతడు వారిని ప్రేమతో చూస్తున్నారు. వారికి పాపవిముక్తి కలగాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తాను క్రీస్తునుంచి వేరై నశించి పోవడం (అది సాధ్యం అయితే) వల్ల వారికి విముక్తి కలుగుతుందనుకుంటే అందుకైనా సిద్ధమే. నిర్గమకాండం లో మోషే గారి ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది. నిర్గమ 32:32 అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాన నెను.
యేసయ్య కూడా మనకోసం అలాగే చేశారు. 
గలతీ 3:13
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో-శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను; ఇది క్రీస్తు మనసు.

 మనస్సాక్షికోసం: పౌలుగారు ఎప్పుడూ మంచి మనస్సాక్షి కలిగియుండాలి అని చెప్పేవారు. ఆయన కూడా అలాగే ఉండేవారు. అపొ కా 23:1
పౌలు మహా సభవారిని తేరిచూచిసహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.
24:16
ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.
1 కొరింతు 4:4; 8:7; 
2 కొరింతు 1:12
మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానముననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
1 తిమోతి 1:5
ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.
;19; 3:9.

        ప్రియదైవజనమా! పౌలుగారికున్న సువార్త భారం, నశించుఆత్మల పట్ల భారం నీకుందా? తన సొంతప్రజలు నాశనానికి జోగుపడుతున్నారు, నిజదేవున్ని వదలి ఆయనను ద్వేషిస్తూ నరకానికి పోతున్నారు అనేది ఆయన తపన! అవసరం అయితే నేను శాపగ్రస్తుడనై పోడానికి నేను రెడీ! గాని వారు మాత్రం రక్షించబడాలి అనేది ఆయన భారం! ప్రియ విశ్వాసి! నీ అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, నీ పిల్లలు, నీ ఇరుగుపొరుగువారు , నీ గ్రామస్తులు నిజదేవున్ని తెలిసికొనక విగ్రహారాదికులై నాశనానికి పోతుండగా నేవు వారికోసం ప్రార్దిస్తున్నావా? వారికి రక్షణసువార్త ప్రకటిస్తున్నావా? లేక తాపీగా పనికిమాలిన సీరియల్లు చూస్తూ కూర్చుంటున్నావా? మరచిపోకు వారి ఆత్మల గురించి దేవుడు నిన్నే ఉత్తరవాదిగా ఉంచారు.  తీర్పులో ఏమని చెబుతావు దేవుని దగ్గర! 
నేడే పౌలుగారికున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్ధించి ఆత్మలను పొందుకో! 
నీ వారిని రక్షించుకో!

ఆమెన్!
దైవాశీస్సులు!
*రోమా పత్రిక-90వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-2*

రోమా 9:46.. 
4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. 
5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 
6. అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రా యేలీయులు కారు. 

     ప్రియులారా! పౌలుగారు 9, 10, 11 అధ్యాయాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురుంచిన రక్షణ ప్రణాళిక కోసం వివరిస్తున్నారు. ఇక 4వ వచనం నుండి ఇశ్రాయేలీయులు అన్యులైన మనకంటే, ఇతరుల కంటే ఏ రకంగా శ్రేష్టులో, ఎటువంటి ఆధిక్యత కలిగి ఉన్నారో వివరిస్తున్నారు ఈ వచనాలలో.

   వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము మహిమయు నిభందనలు ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు వాగ్దానాలు అన్నీ వీరివే అంటున్నారు. దత్తపుత్రత్వం కోసం మనం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాం. .. దత్తస్వీకారం... వారికి చెందుతాయి అంటూ వర్తమాన కాలంలోనే రాస్తున్నాడు. 

ఇక్కడ దత్తస్వీకారం అంటే దేవుడు వారిని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు (ద్వితీ 7:6; 14:1-2)లోకంలోని దత్తపుత్రత్వము అనగా పూర్తిగా శాశ్వత విమోచనం అనుభవించి, శరీరం, మనస్సు, ఆత్మ, క్రీస్తు పోలికలో లేక ఆత్మలో క్రీస్తు పోలికగా మార్చబడిన విశ్వాసులు , రూపాంతరం పొంది, విడుదల పొందిన లేక రూపాంతరం చెందిన సృష్టిలో దేవుడు తమ కొరకు లేక దేవుని సంతానం కొరకు దేవుడు ఏర్పాటుచేసిన స్థానాలకు చేరడం అన్నమాట!  అందుకే యేసుక్రీస్తుప్రభులవారు నేను స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను.  నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అన్నారు కదా! యోహాను 14:2,3; అదే సిద్ద పరచిన స్థలానికి మనం చేరి ఏర్పాటు చేయబడ్డ స్థలాన్ని అలంకరించడమే దత్తపుత్రత్వం పొందడం!  ఇప్పుడు మన విశ్వాసం, సాక్ష్యం, ఘటము కాపాడుకొన్నందుకు దేవుడు మెచ్చి మనకు ఇచ్చిన స్వాస్థ్యం పొందుకోవడం దత్తపుత్రత్వం! 

    లోకంలోని ప్రజలందరిలోకీ వారికి(ఇశ్రాయేలీయులకు) మాత్రమే వారి ఆరాధన స్థలంలో దేవుని మహిమ ప్రకాశం ప్రత్యక్షంగా ఉంది. రాబోయే కాలంకోసం ఆ మహిమను గురించిన వాగ్దానం ఉంది (నిర్గమ 40:34-35
34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. 
35. ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.  
1 రాజులు 8:11; యెహె 43:2-5; 44:4). 
.. ఇక నిబంధన అనగా దేవుడు అబ్రాహాముగారితో చేసిన వాగ్ధానం, నిబంధనలు అన్నమాట. ఒడంభిక!  ధర్మశాస్త్రం అనగా మోషే గారిద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, వివిధరకాల బలులు, ఆచారాలు, యాజకులు,  ఇలాంటి ఆదిక్యతలు అన్నీ వారికే ఉన్నాయి. దేవుడు వారితో చేసిన ఒడంబడికలు వారివి (ఆది 15:18;
18. ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా 
19. కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను 
20. హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను 
21. అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. నిర్గమ 24:8; 2 సమూ 7:16; 23:5; 
యిర్మీయా 31:31-33
31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. 
32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. 
33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. 
34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు. ; 32:40). 
దేవుడు వారికి మాత్రమే తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు (నిర్గమ 20:1-2; ద్వితీ 4:8). చరిత్రలో ఇతర జనాలన్నిటిలోనూ వారికి మాత్రమే దేవుడే సాక్షాత్తూ నియమించిన ఆరాధన పద్ధతి ఉంది (నిర్గమ 2540 అధ్యాయాలు; 1 రాజులు 6 అధ్యాయం). పాత నిబంధన గ్రంథమంతటా అక్కడక్కడా కనిపించే వాగ్దానాలన్నీ వారివే. భవిష్యత్తులో వారికి కలుగబోయే దీవెనల గురించిన వాగ్దానాలు అవి.

   ఇంకా విశ్వాస వీరుల పట్టీలో గల పితరులు వీరివారే! పితరులు అంటే ఆ ప్రజల మూల పురుషులనూ నాయకులనూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడే ఎన్నుకున్నాడు (11:28; ఆది 12:1-3; నిర్గమ 3:6). యేసుప్రభువు ఇస్రాయేల్ జాతిలో అబ్రాహాము, దావీదుల వంశంలో జన్మించాడు (మత్తయి 1:1). 5లో యేసుప్రభువు దేవుడని స్పష్టంగా ప్రకటించడం కనిపిస్తూ ఉంది (ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 చూడండి). యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ వ్రాయబడి ఉంది అనేవారికి కొలస్సీ పత్రిక ధ్యానంలో గతంలో వివరించడం జరిగింది. ఇప్పుడు దానికోసం నేను వ్రాయడం లేదు! ఈ 5 వచనంలో మరోసారి ఆయన దేవుడు అని పౌలుగారు రాస్తున్నారు. చివరికి యేసుక్రీస్తుప్రభులవారు కూడా శరీరమును బట్టి వీరిలోనే పుట్టారు. ఇశ్రాయేలు దేశంలోనే పుట్టారు. కాబట్టి అన్ని విధాలుగాను అధిక్యులే! అన్నీ వీరివే! గానీ ఈ పత్రిక రాసినప్పటికీ గాని, ఇప్పటికి అనగా ఈ 2020 కి గాని ఇంకా వారు నిజరక్షకుడు నిజ దేవుడైన ఏసుక్రీస్తును అంగీకరించలేదు. యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. అనగా యేసు అనగా రక్షకుడు- ఈయనను, క్రీస్తు అనగా అభిషక్తుడు- అనగా మెస్సయ్యగా అంగీకరించలేదు! అదే పౌలుగారి బాధ! ఆవేదన! దుఃఖం!  
    ఇన్ని అధిక్యతలున్నా ఒక ప్రజగా ఇస్రాయేల్‌వారు క్రీస్తును, ఆయన శుభవార్తను స్వీకరించలేదు. దేవుడు తన రాజ్యాన్ని వారి నుంచి తీసివేసి ఇతరులకు ఇచ్చాడు (యోహాను 1:11
ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.; 
మత్తయి 21:42-43
42. మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? 
43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. ). 
అంటే దేవుని వాక్కు విఫలమైపోయి ఆయన వాగ్దానాలు భంగమైపోయాయనా? కాదంటున్నారు పౌలుగారు. 

ఇక రోమీయులకు 9: 6
అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రా యేలీయులు కారు.
.ఇక్కడ రెండు రకాల యూదుల మధ్య తేడాలను మన ముందుంచుతున్నారు. ఒకటి అబ్రాహాముగారికి శరీర సంబంధమైన సంతానం, రెండోది వారిలోనుంచి దేవుడు ఎన్నుకొని తన చెంతకు పిలుచుకొన్న వ్యక్తులు. ఈ తరువాతి వారే నిజమైన ఇశ్రాయేలు వారు. 
2:28-29
28. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. 
29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.; మత్తయి 3:9; యోహాను 8:39-41కూడా చూడండి. కాబట్టి ఎవరైతే దేవుని వాగ్దానాలను నమ్మి సాగుతారో వారే యూదులు గాని శరీర సంబంధమైన యూదులు, దేవుని దృష్టిలో యూదులు కాదు. ప్రియ దైవజనమా! ఒకవేళ నీవు ఆయన వాగ్ధానాలు నమ్మి సాగితే, అయన చెప్పినట్లు చేస్తే నీవుకూడా యూదుడవే!

   ఇప్పుడు ప్రియదైవజనమా! ఆలోచించు! ఒకా పాపివి! ఎందుకూ పనికిరాని నిన్ను నన్ను దేవుడు తన మహా ప్రణాళిక చొప్పున అత్యున్నత కృప వలన రక్షించబడి ఈ ఉన్నత స్తితి, రక్షణ భాగ్యం నీకిచ్చారు కదా! ఇశ్రాయేలీయులకు చెందవలసిన రక్షణ వారినుండి తీసివేసి నీకు ఇచ్చారు కదా! మరి నీ ప్రవర్తన, నడవడిక, ఎలా ఉంది? దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించారు కదా క్రీస్తుకోసం నీవు ఏమిచ్చావు? 
ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో!
క్రీస్తు బిడ్డవు, క్రీస్తు బిడ్డలాగే ఉండు!
మారుమనస్సుకు తగిన ఫలము ఫలియించు!
దైవాశీస్సులు!
                                                                 *రోమా పత్రిక-91వ భాగం*
                                                      *ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-3*
రోమా 9:710.
7. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,
8.
అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.
9.
వాగ్దానరూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.

     ప్రియులారా! పౌలుగారు 9, 10, 11 అధ్యాయాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురుంచిన రక్షణ ప్రణాళిక కోసం వివరిస్తున్నారు.  7వ వచనం ప్రకారం అబ్రాహాముగారికి పుట్టిన వారంతా అబ్రాహముగారి సంతానం కాదు గానీ ఇస్సాకు మూలంగా పుట్టినదే నీ సంతానం అని పిలువడం జరుగుతుంది అని దేవుడు చెప్పారు.  దీని అర్ధం ఏమిటంటే శరీరరీతిగా పుట్టినవారు దేవుని సంతానం కాదుగాని దేవుని వాగ్దానం మూలంగా పుట్టినవారు మాత్రమే దేవుని సంతానం లెక్కలోకి వస్తారన్న మాట అంటున్నారు పౌలుగారు. ఆది 21:12 ప్రకారం.

 అబ్రాహాముగారికి ఇతర సంతానం కూడా ఉన్నారు (ఆది 16:15
తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మా యేలను పేరు పెట్టెను.
;
 25:1-2.
1. అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
2.
ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. ;).
కానీ దేవుడు అబ్రాహాముకు వారసుడుగా ఆధ్యాత్మిక సంతానంగా ఇస్సాకును మాత్రమే ఎన్నుకున్నాడు. అతడు వాగ్దానంమూలంగా పుట్టిన కొడుకు – 4:18-21
18.
నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
19.
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
20.
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21.
దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. ; 
ఆది 15:4
యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.
 17:15-16
16.
నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను. ; 
18:10
అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
;
 21:1-3.

అంటే దేవుడు అబ్రాహాముతో చేసిన ఒడంబడిక, వాగ్దానాలు అతని శారీరక సంతానమంతటి కోసమూ కాదు గాని దేవుడు ఎన్నుకున్న కొందరికోసమే అని అర్థం.   కారణం 8,9 వచనాలు ప్రకారం వాగ్ధానరూపమైన వాక్యం ఏమిటంటే మీదటికి ఈ సమయానికి మరల వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును!!!  ఇది వాగ్దానం!

9:10,11,12,13
10. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతి యైనప్పుడు,
11.
ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,
12.
పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.
13.
ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. ......

 10-13 ప్రకారం  ఇదే సత్యం అనగా మీద వివరించిన వాగ్ధాన సంతానం- ఇస్సాకు సంతానానికి కూడా వర్తిస్తుంది. దేవుడు ఇస్సాకుకు వారసుడుగా తన ప్రజల నాయకుడుగా, అబ్రాహాము వంశంలో దేవుని వాగ్దానాలకు వారసుడిగా యాకోబును ఎన్నుకొన్నారు. దేవుడు యాకోబును ఎన్నుకొని ఏశావును తిరస్కరించినది వారు ఆ తరువాత చేయబోయే పనులమీద ఆధారపడి కాదు. తన జ్ఞానం చొప్పున దేవుడు ఒకణ్ణి ఎన్నుకొన్నారు. అతనిలో దేవుని వాక్కు నెరవేరింది. పెద్దవాడు నరకానికి, చిన్నవాడు పరలోకానికి పోతాడుఅని దేవుడు అనలేదు పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడుఅని మాత్రమే అన్నారు ",
గమనించండి. 911 అధ్యాయాల్లోని విషయం వ్యక్తుల పాపవిముక్తి లేక నాశనం కాదు గాని ప్రజలతో జాతులతో దేవుడు వ్యవహరించిన విధానమే ఉదహరించారు.

9:13
ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.

దేవుడు యాకోబుని ప్రేమించి ఏశావుని ద్వేషించడం న్యాయమా?
మలాకి 1:2-3.
2. యెహోవా సెలవిచ్చున దేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.
3.
ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.  

దేవునికి యాకోబు పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది. దాన్ని చరిత్రలో ఆయన కనపరిచాడు. ఏశావు సంతతివారి చరిత్ర చూస్తే అదే ప్రేమ దేవునికి వారిపై లేదని అర్థమవుతుంది. వ 12 చరిత్రలో నెరవేరిందని రుజువు చేసేందుకు పౌలుగారు మలాకీప్రవక్త మాటలను ఎత్తి రాస్తున్నారు.
 
రోమీయులకు 9: 14
కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు....

ఇక్కడ మనకు కలిగిన అనుమానాన్ని పౌలుగారు నివృత్తి చేస్తున్నారు.
14-24 ఈ కాలంలో ఇస్రాయేల్ జాతి మొత్తాన్ని దేవుడు తిరస్కరించడం పూర్తిగా న్యాయమే. దేవుడు చేసినది న్యాయమేనా అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది (వ 14). దీనికి జవాబేమిటంటే దేవుడు సర్వాధికారి. మనుషుల విషయంలో తన ఇష్టప్రకారం జరిగించగలడు. అందరూ పాపులే (3:9, 23). దేవుడు న్యాయంగా అందరినీ తిరస్కరించవచ్చు. దానికి బదులు ఆయన కొందరిని తన ప్రజలుగా ఉండాలని ఎన్నుకున్నాడు. అది పూర్తిగా న్యాయమే. దేవునికి ఎదురు చెప్పే హక్కు ఎవరికీ లేదు (వ 20,21). దేవుడు దేవుడే. విశ్వానికంతటికీ ఆయన గొప్ప రాజు (కీర్తన 47:1-3; యెషయా 40:22-23; దాని 4:34-35). తన ఇష్టం, సంకల్పం ప్రకారం జరిగించగలడు, జరిగిస్తాడు. 
యెషయా 29:16
అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చిఇతనికి బుద్ధిలేదనవచ్చునా?
;45:9
మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
10.
నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ; 64:8; యిర్మీయా 18:4-6

               కాబట్టి దేవుడు తన ఇష్టం, సంకల్పం ప్రకారం జరిగించగలడు, జరిగిస్తాడు. ఆయన కొందరిని ఎన్నుకొని, మిగతావారిని ఎన్నుకోక పోవడానికి కర్మ సిద్ధాంతంతోను, గత జన్మం పుణ్యంవంటి తప్పుడు సిద్ధాంతాలతోను ఏ సంబంధమూ లేదు (యోబు 11:12; యోహాను 9:3  చూడండి).
అంతేగాక ఎవరో ప్రజాపీడకుడు, నియంత చేసే నిరంకుశమైన నిర్ణయం లాంటిది కాదిది. దేవుడు సర్వాధికారే, ఏ విషయంలోనైనా తన ఇష్టం వచ్చినట్టు చేయగలవాడే. కానీ ఆయన ప్రేమ స్వరూపియైన సర్వాధికారి అని మనం అర్థం చేసుకోవాలి (1 యోహాను 4:9). తన స్వభావాన్ని అనుసరించే ఆయనెప్పుడూ ప్రవర్తిస్తాడు. కరుణ చూపడం న్యాయం అయినప్పుడు కరుణ చూపడం ఆయనకు ఆనందం (10:12; 11:32; నిర్గమ 34:6-7; మీకా 7:18).
ఇక్కడ ఈ అధ్యాయంలోని వచనాలను మాత్రమే తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. వీటిని బైబిలంతటిలో వెల్లడి అయినదాని వెలుగులో పరిశీలించి అర్థం చేసుకోవాలి. దేవుని సర్వాధిపత్యం, పూర్వజ్ఞానం, పూర్వ నిర్ణయం అనేవాటిలోని రహస్యం ఏదైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం తన వాక్కులో తన గురించి ఆయన వెల్లడి చేసుకున్నదానికి వ్యతిరేకంగా అవేవీ ఆయనచేత చేయించవు. దేవుడు ఎలాంటి పొరపాటూ చెయ్యడు. ఆయన చేసేదంతా అఖండ న్యాయం, అమిత ప్రేమలపై ఆధారపడి ఉంటుంది. ఆ స్థిరమైన బండపై మన హృదయాలు విశ్రాంతి తీసుకోవచ్చు.
(
ఇంకాఉంది)
*రోమా పత్రిక-92వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-4*
రోమీయులకు 9:15,16,17,18
15. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. 
16. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును. 
17. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. 
18. కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును. 

     ప్రియదైవజనమా! పై వచనాలలో ఎవరి పట్ల కరుణ చూపాలో ఎవర్ని శిక్షించాలో దేవునికి మాత్రమే తెలుసు. ఆయన కరుణ ఉచితమైనది. దాన్ని ఎవరిపట్ల అయినా చూపాలన్న బాధ్యత ఆయనకు లేదు. మనుషులు తమ ప్రయత్నాల ద్వారా దాన్ని సంపాదించుకోలేరు. లేక తమకు అది కావాలి కాబట్టి బలవంతంగా దేవునినుంచి దాన్ని స్వాధీనం చేసుకోలేరు. దీన్నిబట్టి దేవుడు కఠిన హృదయుడనీ, కరుణ చూపడం ఆయనకంతగా ఇష్టం లేదనీ మనం అనుకోకూడదు. ఎవరైనా తన పాపాలను విడిచిపెట్టి దేవునివైపుకు తిరిగితే వారిపై ఆయన తప్పక కరుణ చూపుతాడు (11:32
అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
; యెషయా 55:7
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.). 
దేవుని జాలి, దయ, ప్రేమగల సంకల్పానికి వ్యతిరేకమైన కఠిన సంకల్పం మరొకటి ఆయనలో లేదు. వీలైన చోటెల్లా కరుణ చూపుతారు. తప్పనిసరైతే శిక్షిస్తారు. ఆయన సర్వాధిపత్యం ఆయన ప్రేమకు విరుద్ధంగా ఎన్నడూ పని చేయదు.

 నిర్గమ 9:16
నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.
7:17. తన గురించిన జ్ఞానం లోకంలో అభివృద్ధి చెంది, తన మహిమకు దోహదం కలిగే రీతిలో దేవుడు దుర్మార్గుల పట్ల ప్రవర్తించగలడు. ఇది లోకం విషయంలో గొప్ప లాభదాయకమైనది, ఆయన లోకంపట్ల కనపరచిన గొప్ప కరుణ.

9:17.మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.  నిర్గమ 4:21
అప్పుడు యెహోవామోషేతో ఇట్లనెనునీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యము లన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హ్రుదయమును కఠిన పరచెదను,అతడు ఈ జనులను పోనియ్యడు.
 ఫరో హృదయాన్ని మొద్దుబారిపోయేలా చేయడం దేవుడు ఐగుప్తీయులకు తీర్పు తీర్చటానికి. దేవుడు జాలి చూపి దేశంమీదికి పంపిన తెగుళ్ళను తొలగించాలని ఫరో కోరాడు. కానీ పశ్చాత్తాపపడి దేవునికి సేవ చేసేందుకు దేవుడు ఇష్టపడలేదు. మరింత పాపానికి అతణ్ణి వదిలివెయ్యడం ద్వారా, అతని హృదయాన్ని కఠినం చెయ్యడం ద్వారా దేవుడు అతని పాపాన్ని శిక్షించాడు. 1:21-26, 28 పోల్చి చూడండి. అలాంటి శిక్షకు పూర్తిగా తగినవారిని తప్ప మరెవరినీ దేవుడు అలా కఠినపరచడని మనం నిశ్చయంగా నమ్మవచ్చు. ప్రతి వ్యక్తి విషయంలోనూ తనకు సరి అనిపించిన రీతిలో ప్రవర్తించేందుకు దేవునికి స్వేచ్ఛ ఉంది.

9:19-21
19.అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. 
20.అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? 
21.ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా? ...... 
     
     మనుషులు తమ భ్రష్ట స్థితికీ, హృదయ కాఠిన్యతకూ దేవుణ్ణే తప్పుపట్టడం మామూలు సంగతి అని పౌలుకు తెలుసు. నిజానికి అందుకు బాధ్యులు వారే అయినప్పటికీ అలా చేస్తారు. ఆది 3:12-13 పోల్చి చూడండి. సృష్టికర్త అయిన దేవునిపై సృష్టి అయిన మనుషుడికి ఏమి చెప్పడానికీ హక్కు లేదని కూడా పౌలుకు తెలుసు. మనుషుల్లో చూచినప్పటికీ ఒక కుమ్మరివాడు తనకు ఇష్టం వచ్చిన కుండను చేయగలడు. ఈ విషయంలో ఏమి అనడానికి కూడా కుండకు హక్కు లేదు, హక్కు ఉండకూడదు. 

యెషయా 29:16  అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చిఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

45:9  మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చే యుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? 
10. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ; 

సరే మరి ఏమనాలి?
యెషయా 64: 8
యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.
; యిర్మీయా  18:3,4,5,6,7
3. నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను. 
4. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. 
5. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 
6. ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. 
7. దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదు ననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా నియై యున్నాము.

ఆదికాండం గ్రంథంలో సృష్టి గురించి చెప్పినదాన్ని బట్టి దేవుడు దివ్య కుమ్మరిగా చెడ్డ పాత్రలేవీ చేయలేదని గ్రహించవచ్చు (ఆది 1:31
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను). 
జ్ఞానం, ప్రేమ గలవాడైన మంచి కుమ్మరి ఎన్నడూ వికారమైన భ్రష్ట పాత్రలుచెయ్యడు. దేవుడు అలాంటి కుమ్మరే. ఏ పాత్రఅయినా చెడ్డదైతే, ఆ చెడ్డతనానికి మూలం మనిషే గాని దేవుడు కాదు. దేవుని ఎదుట ధూళిలో ఉండవలసినవాడే మనిషి. అతడు తన దోషాలనూ అసమర్థతనూ ఒప్పుకొంటూ దేవుడు దేవుడని గ్రహిస్తూ, మనం ఎలా ఉండాలో అలా ఉండేలా చేయగలవాడు ఆయనేనని గుర్తిస్తూ ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మన స్థితికి ఆయన్ను నిందిస్తూ ఉండే బదులు, మనసారా ఆయన్ను నమ్మి మనల్ని మనం ఆయన చేతుల్లో ఉంచుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ఘనతకు, మహిమ గల ప్రయోజనాలకు తగిన పాత్రలుగా చేస్తాడు.

 అటువంటి దీన స్థితి మనందరికి దేవుడు దయచేయను గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*రోమా పత్రిక-93వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-5*

Romans(రోమీయులకు) 9:21,22,23,24,25
21. ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా? 
22. ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? 
23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, 
24. అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? 
25. ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును. 

9:21 “ఒకే ముద్ద” (21) మనుషులంతా ఒకటే స్వభావం గలవారు. అంటే వారందరిదీ పాపభరితమైన భ్రష్ట స్వభావం (3:9 ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. ; 
ఎఫెసు 2:3
వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై(మూలభాషలో-ఉగ్రత పిల్లలమై) యుంటిమి). 

   అయితే వారు తమను తాము చెడు మట్టి ముద్దగా చేసుకున్నారు. మంచిగా మలచబడేందుకు వారెవరికీ అర్హత లేదు. మనుషుల్లో కొందరు మంచి, ఘనమైన మట్టి ముద్దలు, మరి కొందరు నీచమైన భ్రష్టమైన మట్టి ముద్దలు అని లేరు. మనందరమూ ఒకే మానవజాతి మట్టి ముద్దలోని వాళ్ళం. ఒకే మనిషి ఆదాము సంతతివాళ్ళం. అందరిలోనూ పాపం ఉంది (5:12; ఎఫెసు 2:1-3).

22-24
22. ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? 
23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, 
24. అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? 

     మానవజాతిపట్ల దేవుడు ప్రవర్తించే దానంతటి లోనూ దేవునికి మంచి ఉద్దేశం ఉంది. దేవునికి పాపమంటే అమిత కోపమనీ, ఆయన ఏదైనా చేయగల దేవుడనీ మనుషులు అర్థం చేసుకోగలిగే అవకాశాలు ఉండడం లోకమంతటికీ ప్రయోజనకరం. ఆయన ఫరోకూ, ఈజిప్ట్ వారికీ (వ 17) మానవ చరిత్రలో ఇంకా కొందరికి వ్యతిరేకంగా తన ఉగ్రతను, బలప్రభావాల్ని ప్రదర్శించాలని నిర్ణయించాడు. ఇక్కడ పౌలుగారు రెండు గుంపులవారిని వేరుచేసి చెప్తున్నారు మహిమ కోసం సిద్ధం చేసిన...కరుణ పొందిన పాత్రలు”, “నాశనానికి సిద్ధమై కోపానికి గురి అయిన పాత్రలు.అంటే విశ్వాసులు, అవిశ్వాసులు అన్నమాట. పాపవిముక్తి, రక్షణకోసం ఆయన ఎన్నుకొన్నవారు, అలా ఎన్నుకోనివారు. దేవుడు విశ్వాసుల గురించి మహిమ కోసం సిద్ధం చేశాడని పౌలుగారు చెప్తున్నారు (8:17-18). 
అవిశ్వాసుల గురించి వారు నాశనం కోసం సిద్ధమైనవారని రాస్తున్నారు, గానీ వారిని అలా సిద్ధం చేసినదెవరో చెప్పలేదు. సిద్ధం చేసినది దేవుడు అని చెప్పలేదు కాబట్టి వేరెవరైనా అలా సిద్ధం చేసి ఉండవచ్చు అనుకునేందుకు అవకాశం ఉంది, లేదా వారు తమను తామే అలా సిద్ధం చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. 1:18-32; 2:4-11; సామెత 1:24-33; యెహె 18:30-32; మత్తయి 23:37; 1 తిమోతి 2:3-4 వంటి వచనాలను ఆధారం చేసుకుని మనుషులు నాశనానికి తమను తామే సిద్ధం చేసుకుంటారని మనం నమ్మవచ్చు. రోమా 18--32
18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 
19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. 
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 
22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. 
24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 
25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌. 
26. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. 
27. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి 
28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును 
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
మత్తయి 13:38-39మొ।। కూడా చూడండి. దేవుని ఉగ్రత గురించి  1:18; సంఖ్యా 25:3; కీర్తన 90:7-11; యోహాను 3:36చూడండి.

9:24 “అన్యజనులు 1:7, 16. పైన చెప్పిన దానంతటిలో పౌలు ఉద్దేశమేమిటంటే ఇశ్రాయేల్‌జాతిలో నుంచి కొద్దిమందిని మాత్రమే ఎన్నుకుని, మిగతావారిని తిరస్కరించడానికీ, ఇతర ప్రజలపై కరుణ చూపడానికీ దేవునికి హక్కు ఉంది. 25-29 వచనాల్లో ఇదంతా పాత ఒడంబడిక గ్రంథానికి అనుగుణంగానే ఉందని అతడు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్కు నెరవేరకుండా పోలేదు .
(ఇంకాఉంది)
*రోమా పత్రిక-94వ భాగం*
*ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక-6*

రోమా 9:2528.
25. ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును. 
26. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. 
27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని 
28. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు.   

     ప్రియ దైవజనమా! గత కొన్నిరోజులుగా మనం ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అనేది ధ్యానం చేసుకుంటున్నాం!  2526 వచనాలలో భక్తుడు, ప్రవక్తయైన హోషేయ గారు చెప్పిన ప్రవచనాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ హోషేయ గ్రంధంలో ఈ వచనాల యొక్క నేపధ్యం ఏమిటంటే ఇశ్రాయేలీయులు అన్యాచారాలతో, అన్యదేవతారాధనలతో చెడిపోయి ఉండగా దేవుడు భక్తునికి ఒక వ్యభిచారం చేసే స్త్రీని పెండ్లి చేసుకోమని చెబితే, దేవుని ఆజ్ఞమేరకు ప్రవక్త ఒక వ్యభిచారం చేసే స్త్రీ- గోమెరు అనే స్త్రీని పెండ్లి చేసుకుంటారు. ఆమె ద్వారా ప్రవక్తకు ముగ్గురు సంతానం కలుగుతారు. దేవుడు ఆ ముగ్గురు పిల్లలను, ప్రవక్త కుటుంబాన్ని ఉదాహరణగా చూపించి ఇశ్రాయేలు ప్రజలకు సందేశం పంపుతారు. 
    రెండవ సంతానంగా పుట్టిన కుమార్తెకు *లోరుహామా* అని పేరు పెట్టమని చెబుతారు దేవుడు. లోరుహామా అనగా *జాలినొందనిది* అని అర్ధం! మూడవ సంతానంగా కుమారుడు పుడితే *లోఅమ్మీ* అనగా నా జనము కాదు అని పేరుపెట్టమని చెప్పారు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పాపం అంత ఘోరంగా ఉంది. కనుకనే మిమ్మల్ని కనికరించను, మీరు నా పిల్లలు నా సంతానం కాదు అని సెలవిచ్చారు దేవుడు.  గాని దేవుడు ఇంత తీర్పులు చెప్పిన తర్వాత కరుణించి కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని దీవిస్తాను. ఏ స్తలమందు మీరు నా జనులు కాదని చెప్పబడ్డారో అదే స్తలంలో మీరు జీవముగల దేవుని కుమారులై యున్నారని వారితో చెప్పుదురు అని సెలవిచ్చారు దేవుడు! హోషేయ 1:210.

    ఇదే విషయాన్ని ఉదాహరిస్తూ భక్తుడు రాస్తున్నారు. హోషేయ 2:23 లో మరలా ఆమె పట్ల వాత్సల్యం చూపించి ఆమెను అనగా ఇశ్రాయేలీయులను దేశంలో నాటుతాను! అదేవిధంగా *నా ప్రజలు కానివారిని మీరు నా ప్రజలు* అని చెబుతాను అంటున్నారు దేవుడు! వెంటనే వారు అనగా *దేవుని ప్రజలు కానివారైనా- దేవునిచే పిలువబడిన వారు, నీవు మా దేవుడివి* అంటారు- అని చెబుతున్నారు. ఈ మాట అన్యజనులైన మనకోసం అనగా ఇశ్రాయేలీయులు కానివారికోసం చెబుతున్నారు అని అర్ధం చేసుకోవచ్చు!

   కాబట్టి 22వ వచనం నుండి చదువుకుంటూ ఈ వచనాలలో మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ఇశ్రాయేలీయులు చేసిన పాపం వలన దేవుణ్ణి తిరస్కరించినందువలన ఈ రక్షణ భాగ్యం మనకు కలిగింది. 24వ వచనం ప్రకారం అన్యజనులైన మనలను రక్షించడానికి ఇశ్రాయేలీయులలో కొందరిని మాత్రం రక్షించి, మిగిలిన వారిని అలాగే ఉంచి, ఆ శేషాన్ని మనతో పూరుస్తున్నారు దేవుడు! మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్దపరచిన కరుణాపాత్ర ఘటములు యూదులలో నుండి మాత్రమే కాక, అన్యజనులలో నుండి ఆయన మనలను పిలిచారు. ఎవరిని? ఆయన ప్రజలు కానివారమైన మనలను పిలిచి, ఆయనయొక్క ప్రియురాలు కాని మనలను నా ప్రియురాలా అని పిలిచి పేరు పెట్టారు.  ఇది మనకోసం!

   ఇక 2728 వచనాలు తిరిగి ఇశ్రాయేలు కోసం వ్రాస్తున్నారు. ఈ వచనాలు భక్తుడు, పెద్ద ప్రవక్తయైన యెషయా గారు ప్రవచించిన పుస్తకం 10:2223 వచనాలలో గల ప్రవచనాన్ని రాస్తున్నారు పౌలు మహాశయుడు! హోషేయ 1:10లో మిమ్మును లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారంగా దీవిస్తాను అని క్రీ.పూ. 800లో ప్రమాణం చేశారు. గాని యెషయాగారి సమయానికి దేవుడు చెబుతున్నారు సుమారు క్రీ.పూ. 740700 మధ్యలో చెబుతున్నారు 10:2223 లో ఇశ్రాయేలీయులు సముద్రపు ఇసుకలా విస్తరించినా కేవలం శేషమే రక్షించబడుతుంది అనియు, శేషమే తిరిగి వస్తుంది అని దేవుడు సెలవిచ్చారు. అయితే ఈ శేషం ద్వారా నీతి వరదలా ప్రవహిస్తాయి అని కూడా చెప్పారు. దీనినే భక్తుడు ఉదహరిస్తున్నారు. ఇంకా అంటున్నారు ఎందుకంటే ఆయన మిగిలిపోయిన శేషానికే రక్షణ భాగ్యం కలుగుతుంది. ఆయన ఈ పనిని త్వరగా ముగించి పూర్తిచేస్తారు, దానిని న్యాయంతో సంక్షిప్తం చేస్తారు.  (గమనిక: *హోషేయ గ్రంధం యెషయా గ్రంధం కంటే ముందు వరుసలో ఉన్నా హేషేయగారి తర్వాతనే యెషయాగారు పుట్టారు. యెషయా గ్రంధం క్రీ.పూ. 740700 మధ్యలో జరిగిన చరిత్ర/ ప్రవచనాలు). 

  ఇంకా 29వ వచనంలో కూడా యెషయాగారి ప్రవచనం ఆధారంగానే చెబుతున్నారు: సైన్యములకు అధిపతియైన ప్రభువు/యెహోవా మనకు సంతానాన్ని శేషింపక పోయిన యెడల మనం సోదొమ వలె నగుదుము, గోమోర్రాను పోలియుండుము! అంటున్నారు. 

9:30,31,32,33
30. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; 
31. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు, 
32. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. 
33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
౩౦౩౩ వచనాలు ప్రకారం . . .
చూడండి నీతిని వెంటాడని అన్యజనులు అనగా మనం నీతిని, విశ్వాసపు మూలమైన నీతిని పొందుకున్నాం! అయితే ఇశ్రాయేలు వారు నీతిని వెంటాడక, ఆ నీతికి కారణమైన నియమాన్ని అనగా ధర్మశాస్త్రమును వెంటాడి అ నీతిని పొందుకోలేకపోయారు అంటున్నారు. 
యూదులు తమ మతం విషయంలో కష్టపడ్డారు. వారికి దేవుని ధర్మశాస్త్రం ఉంది. దాన్ని పాటించడానికి ప్రయత్నించడమనే మార్గం ద్వారా దేవునికి అంగీకారం కావాలని చూశారు. కానీ తమ క్రియలను బట్టి నిర్దోషులూ న్యాయవంతులూ కావాలన్న ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యారు (3:9, 19, 20). ఇతర ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం లేదు. నిర్దోషత్వం గురించి అంతగా పట్టింపు లేదు. కానీ వారు క్రీస్తు శుభవార్తను విన్నప్పుడు నమ్మకం ఉంచి నిర్దోషులయ్యారు/ నీతిమంతులుగా తీర్చబడ్డారు. నమ్మకం మూలంగానే దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచారన్నమాట (3:22, 26, 28; 5:1).
32,౩౩.... యూదులైతే అలా కాకుండా దేవుడు యెరూషలేములో ఉంచిన రాయియైన యేసుప్రభువును నిరాకరించారు (యోహాను 1:11
ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
; మత్తయి 21:42; అపొ కా 4:11; 1 పేతురు 2:6-8).

   కీర్తనలు 118:22లో భక్తుడు ప్రవచించారు: ఇల్లు కట్టువారు నిషేదించిన రాయి మూలకు తలరాయి ఆయెను! దానినే యేసుక్రీస్తు ప్రభులవారు మత్తయి 21:42లో , లూకా 20:17 లో ఎత్తి చెబుతున్నారు. ఆ మూలరాయి, ఆ అడ్డురాయి యేసుక్రీస్తు ప్రభులవారు! ఇశ్రాయేలీయులు ఆ రాయిని తిరస్కరించారు. పతనమయ్యారు.
యూదులు అలా పతనం కావాలని దేవుడు ముందుగా నిర్ణయించినందువల్ల వారలా అయ్యారని పౌలు అనడం లేదని గమనించండి. వారి సొంత విధానాలవల్లే పతనమయ్యారు. 
     ప్రియ దైవజనమా! ఆ మూలరాయిని తెలుసుకున్న నీ పరిస్తితి ఎలా ఉంది? ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. పతనమయ్యారు. నీవు తెలుసుకుని కూడా తిరస్కరించావా? నీవుకూడా పతనమైపోతావు జాగ్రత్త! 
దైవాశీస్సులు! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

శరీర కార్యములు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

సమరయ స్త్రీ

యేసు క్రీస్తు రెండవ రాకడ

పాపము

బాప్తిస్మం