యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు


యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(మొదటి భాగము)

1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*

*యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.* (లూకా.23:34)

యేసు ప్రభువును సిలువ మరణమునకు అప్పగించి, సిలువకు భయంకరమేకులతో బిగించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువ మ్రానుపై మూడు మేకుల మీద మాంసపు ముద్దలా వ్రేలాడదీసినప్పుడు *ఆయన పలికిన అమూల్యమైన ఏడు మాటలలో* మొట్ట మొదటి మాట మనం ధ్యానిస్తున్న మాట.
👉 ఈ కేక సర్వమానవాళి పాపక్షమాపణకై పాప విమోచకుడైన యేసు వేసిన గొప్ప ప్రార్ధనా కేక. అవమానమును, దూషణను, భయంకర చిత్రవధను తనలో తాను దిగమింగుకుంటూ తాను ఏ జానాంగ రక్షణకై పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్నుతాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చెనో
(ఫిలి.2:6,7)
ఆ దైవచిత్త నెరవేర్చుకొరకును (యోహాను 6:40)
తన పేరులోని భావసార్ధకత కొరకు
(మత్తయి 1:21)
అమానుష జనం కొరకు, యేసు చేసిన విఙ్ఞాపన కేకయే ఈ కేక. *ఈ కేకలో క్షమాగుణం వున్నది.*

👉 ఇట్టి ప్రేమ తత్వాన్ని ఎప్పుడు చూచి యుండలేదు.
👉తన్ను చంపుచున్న వారిని శిక్షించుటకు బదులుగ వారిని ప్రేమించి, వారి హింసను సహించి, దుఃఖమును, వేదనను తనలో తాను అనుభవిస్తూ అనేకులకు బదులుగ విమోచనా క్రాయధనముగ అర్పించుటకు ఈ లోకమున కేతెంచెనని ఎరిగి
(మార్కు 10:45),
ఆ సిలువ కొయ్యనే మరణ శయ్యగా ఎంచి, ఆ సిలువ మ్రానే విఙ్ఞాపనలర్పించు బలిపీఠముగ మారెనన్నట్లు, ఆయన దూషించబడియు బదులు దూషింపక, శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగ తీర్పు తీర్పు దేవునికి తన్ను తను అప్పగించుకొనెను (1పేతురు2:23).
ఈ మాటను మనం లోతుగా వాక్యానుసారంగా ధ్యానం చేసిన ఎడల ఎన్నో ఆత్మీయ భావములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచును.
*ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.*

1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*

1⃣ *తండ్రీ!*
*మొదటి మాటలో మనం తండ్రిని మానవాళి పాపక్షమాపణకై ప్రార్ధింస్తున్న లోకరక్షకుడైన యేసును* (యోహాను 4:42) చూస్తున్నాము.
*ప్రార్ధించే ప్రభువు.*
👉రోమా రౌడీలు మన ప్రాణప్రియుడైన యేసును క్రూరమృగాల్లా వేటాడుతున్నా, ఆయన కాళ్ళు చేతులు ఎంతో కఠినంగా సిలువలో మేకులకు కర్కసంగా కొట్టిన ఈ రోమా రౌడీలు వీరి దుష్కార్యములను *వారి ఉద్యోగ ధర్మంగా భావించియుండవచ్చు.* అంతే కాదు వీరిని ఈ అమానుషకాండకు పురికొల్పిన అధికారులు కూడ అఙ్ఞానంగానే ప్రవర్తించినట్లున్నారు. యూదా వీరికి ఈ క్రమంలోనే ప్రభువును అప్పగించటం ద్వారా తన నిజస్వరూపాన్ని బయలు పరచుకొన్నాడు.

*పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడ చోటుచేసుకొని ఓ భయంకర దృశ్యం మనం ఇక్కడ చూస్తున్బాము.*
👉 మీరు అదికాండములోని ఆదాము దగ్గర నుండి ఏ అంశాన్ని చూసిన ఇంత ఘోరం మానవులు జరిగించలేదు. లోకం అంతా అంధకారం, గాడాంధకారంతో నిండుకుంది. పరమ పవిత్రుడైన యేసు (లూకా 1:35)
*"పాదాలు" ఆయాస్ధలాలు సంచరించి ఎందరో అభాగ్యులను దర్శించటం ద్వారా, వారి గృహాలలోనికి, రోగుల చెంతకు వెళ్ళిన పాదాలు ఇక ఎన్నటికిని, ఎవరి గృహాలను దర్శించకుండ, మారెన్నడు అవి పాపుల రక్షణకై తిరుగాడకుండగ వాటిని పెద్దమేకులతో ఆ సిలువ కొయ్యకు కొట్టివేసారు.*

👉 *అదిగో ఆ "చేతులు"చూడండి, మరెన్నడు చంటి పిల్లలను ఎత్తుకొనకుండగ, కుంటివారి కన్నులు ముట్టకుండగ, పాపమనే కుష్ఠులో వున్న వారిని తాకి స్వస్ధపరచకుండగ, అభాగ్యులైన వారిని తన దయగల హస్తములతో లేవనెత్త కుండగ వాటిని సిలువ మ్రానుపై ఎంత అమానుషంగా భయంకర మేకులతో బిగించినారో!*

👉 *ఆపరమ విభుని శిరస్సు, విశాలమైన నుదురు వాటిపై స్రవిస్తున్న రక్తం ఎండిపోయి ఎంత దయనీయంగా వున్నవో చూడండి.*

🔹 అసలు పసిబాలుడుగా పరలోకం నుండి రక్షణ భాగ్యాన్ని ఈ భువికి తెచ్చినప్పుడే ఈ మానవ లోకం ఆ ప్రభువుకు స్ధలం ఇయ్యలేదు సరికదా (మత్తయి 8:20),
🔹 హేరోదు రూపంలో ఆ పసిబాలుని అంతమొందించటానికి కసాయి కార్యం చేబూనింది.
🔹ఆయనను తరువాత కూడ వదల్లేదు ఈ రాక్షసలోకం. ఇస్కారియోతు యూదా సాయంతో దొమ్మిగా వచ్చి దొంగను బందించినట్టు బందించి, జాలి, దయ, కరుణ అనేవి ఏ కోశానా లేకుండగ కర్కశంగా భూమిని దున్నినట్లు వీపును దున్నిరి (కీర్తన 129:3).
*ఆయన వీపు మీద ఒకటి తక్కువ నలుబది దెబ్బలు గాలాలవంటి కొరడాలతో కొట్టినందున చర్మం చిట్లి మాంసపు ముక్కలు వ్రేలాడుతున్నాను,*
*ఏ మాత్రం చలించక ఆ బరువైన శరీరాన్ని బిగించిన సిలువ కొయ్యను ఒక్కసారిగా ఎత్తి సిలువమ్రానుకై త్రవ్విన గుంటలో కుదించగ అప్పటికే రక్తసిక్తముగా మారిన ఆ సుకుమార దేహం చూస్తున్న అల్లరిమూక వారి దుర్మార్గాన్ని బయలు పరచుకొన్నదే గాని ఒక్కింతైన ఆలోచన కూడ వారిలో కలుగలేదు.*

🔹 ఈ గుంపు ఇతరులను రక్షించినవాడు తన్నుతాను రక్షించుకొనలేడా అని హేళన చేసినది
(మత్తయి 27:42)
🔹వీరు ఆయన వస్త్రములకై చీట్లు వేసుకున్నారు.
*మన రక్షకుడును, విఙ్ఞాపన కర్తయైన యేసు చేసిన ప్రార్ధన అద్భుతమైన ప్రార్ధన.*

ప్రియులారా! అట్టి భయంకర సమయంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను (లూకా 19:10).
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను
(1తిమోతీ 1:15)
👉అనే విషయాన్ని ఎరిగి, ఏమిటి నాకీ శిక్ష తండ్రీ! ఈ శిక్ష తగ్గించవా ప్రభు అని ప్రాధేయపడి కన్నీటితో ప్రార్ధించటంలేదు. ఆయన ఎలాంటి ప్రార్ధనా విఙ్ఞాపన చేయుచున్నాడో చదవండి. *“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”* (లూకా 23:34).

*ప్రార్ధన :-*
ఇది ఓ అద్భుతమైన ప్రార్ధన. *ఆయన సిలువపై మాట్లాడిన మాటలు ప్రార్ధనతోనే ప్రారంభించినాడు.*
👉 ఏ పనైన ప్రార్ధనతో ప్రారంభించటం యేసు మాదిరి. క్రీస్తు బాప్తిస్మం పొంది యోర్ధాను నది నుంచి బయటకు వచ్చి *సువార్తను ప్రార్ధనతోనే ప్రారంభించినాడు.*
(లూకా 3:21)
*అటులనే ఈ 7మాటల ముగింపు కూడ ప్రార్ధనతోనే!*
👉 ఏడు మాటల్లో 3 సార్లు ప్రభుని ప్రార్ధించాడు. ప్రారంభం ప్రార్ధనతో ముగింపు ప్రార్ధనతో అలానే మధ్యలో కూడ ప్రార్ధించెను.

🔸యేసు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి జనసమూహముకు పంచినప్పుడు,

🔸కుష్ఠురోగులను ముట్టి స్వస్ధపరచినప్పుడు ప్రార్ధించెను.
*ఆయన అవసరంలో వున్న వారికి సహాయం చేయాలన్న, వారిని ముట్టాలన్నా లేక వారికి సహాయం చేయాలన్నా ఇక చేయలేడు. కాని ఇట్టి పరిస్ధితులలో నిస్సహాయుడే అయినా ఏ విధమైన స్వస్ధలు లేకసహాయం చేయలేకపోయిన ఆయన అద్భుతమైన ప్రార్ధన మాత్రం చేయగలుగుతున్నాడు.*

👉 యేసు సిలువపై వ్రేలాడుతూ చేస్తున్న ప్రార్ధన చాలా శక్తి వంతమైన ప్రార్ధన. తండ్రిని ఉద్దేశించి చేస్తున్న ఈ ప్రార్ధన,
*సిలువ కొయ్యపై ఆయన క్రూరాతి క్రూరంగా మేకులతో కొట్టబడినప్పటికిని, తండ్రితో తనకున్న ప్రత్యేకమైన, సహావాసాన్ని, సంబంధాన్ని కోల్పోలేదని ఆర్ధం అవుతుంది. మానమును ఇలాంటి సందర్బములలో తండ్రితో మనకున్న సంబంధాన్ని గుర్తెరిగి ప్రార్ధించినట్లయిన సహాయం పొందగలం.*

👉 ఈ భయంకర పరిస్ధితులలో యేసు ఎంతో ఘోరంగ చిత్రవధచేయబడుతు, హించించబడి విడువబడిన వాడైనను,
*తండ్రిమీద ఆయనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన.*
👉 ఈ లోకంలో నీతిమంతులు అనీతిమంతుల పాదాల క్రింద త్రోక్తివేయబడినట్లుగను, పరిశుద్ధత, శ్రేష్టత అపవాది చేతిలో అణగగొట్టబడినను తండ్రిపై ఆయన నమ్మకం మాత్రం తొలగిపోలేదు.
*ఆ చీకటి ఘడియలో వెలుగురేఖవలె ప్రకాశించెను. మరియు తండ్రి మీద ఆయన కున్న నమ్మకం మరింతగ బలపరచబడింది. అందుకే తండ్రీ! అని ధైర్యంగా నమ్మకంగా ప్రార్ధించగలిగెను.*
ఆమెన్!..


యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(రెండవ భాగము)

1⃣ *మొదటి మాట*

*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*

*యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.* (లూకా.23:34)
ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.*

1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*

1⃣ *తండ్రీ!* (మొదటి భాగములో ద్యానించాము)

2⃣ *తండ్రి తనయుల అనుబంధం*

👉 తండ్రీ, అనే పిలుపు తండ్రికి ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఙ్ఞాపకం చేస్తుంది.
🔹ఏ మానవుడు పొందని హింసను పొందుచూ,
🔹 ఏ ఒక్కరు సహించని అవమానాన్ని సహిస్తూ,
🔹 ఏ కోసాన భరించలేని బాధను భరిస్తూ,
🔹వీటన్నిటిని తనలోనే దిగమింగుకుంటూ,
🔹తన కళ్ళముందే రోమా కిరాయి రౌడీలు వేయుచున్న వెర్రికేకలను ఆలకిస్తూనే *ప్రేమామయుడైన యేసయ్య చేయుచున్న శ్రేష్టమైన విఙ్ఞాపన ఇది.*

👉 మరణ శిక్ష కళ్ళముందే క్రూరంగా విలయతాండవం చేస్తుంటే ఏ వ్యక్తయిన సాధారణంగా తన నిజాయితీని,
👉 తన నిర్ధోషత్వన్ని నిరూపించుకోవటానికి ప్రయాసపడతాడు లేదా క్షమాబిక్షనో మరేదో కోరుకోవటానికి తాపత్రయ పడతాడు.
*కాని ఈయనేమో ఆశ్చర్యకరంగ అట్టి కిరాతకులకొరకు ప్రార్ధిస్తునాడు.*
👉 ఇట్టి ఆశ్చర్యకరమైన ప్రార్ధన ఆయన *“ఆశ్చర్యకరుడు”* అనే ఆయన నామధేయాన్ని, ఆయన ఆశ్చర్యకార్యాలను రుజువు చేస్తున్నది. (యెషయా 9:6; మార్కు1:27 ;5:20).

*తండ్రీ!* అనే ఈ మాటను యేసయ్య చాలాసార్లు వాడినట్లు క్రొత్త నిబంధన గ్రంధంలో మనం చూస్తాము. *సువార్తలలోనే దాదాపు 150 సార్లు ఈ మాట కనిపిస్తుంది.*
ఉదా:- తండ్రియిల్లు, తండ్రిపని, తండ్రి రాజ్యము, తండ్రిచెయ్యి, తండ్రినామము. (లూకా 15:18, 16:24, 2:49; మత్తయి 26:29; యోహాను 4:12, 2:16, 4:34, 10:29, 15:10, 5:43 మొదలైనవి). *తండ్రి తాను ఏకమైయున్నామని,*
*తనద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారని ఇలా ఎన్నో విషయాలు యేసయ్య తెలియజేసేను.*
👉 మరియు తండ్రి దేవుడు గనుక బిడ్డలను క్షమించేవాడు తండ్రే గనుక అట్టి ప్రేమగల తండ్రికి కుమారుడైన యేసు ప్రార్ధిస్తున్నాడు.


అంతవరకు ఎన్నో విధాలుగ శ్రమనొందుచూ, మౌనాన్ని, సహనాన్ని కనపరచిన యేసయ్య
(1 పేతురు 2:22,23) ఒక్కసారిగా నోరు తెరచినప్పుడు తనతో తనకుమారుడు ఏదో చెప్పబోవుచున్నాడని సిలువకు దగ్గరగానే వుండి తన దుఃఖాన్నంతా తనలోనే దిగమింగుకుంటూ, కుమిలిపోతున్న కన్నతల్లి మరియు ఎంతో ఆశతో యేసువైపు చూడగా ఆ మాటలు ఆమెతోకాదు మాట్లాడింది. *పరలోకమందున్న తన తండ్రితో యేసయ్య సిలువే ఓ ప్రసంగ పీఠమై అక్కడనుండి జాలువారిన ఈ ప్రార్ధన విఙ్ఞాపన తన కొరకు కాదు. తనను హింసిస్తున్న రాక్షస సైన్యము కోసమే!*
👉 తనను ఎన్నో విధాలుగా చిత్రవధ చేసిన కర్కస మూక కోసమే! సర్వమానవాళి పాపక్షమాపణ కోసమే! ఇట్టి ప్రార్ధన విఙ్ఞాపన మన జీవితాలలో కూడా చాలా అవసరం ప్రియులారా!

1). *ప్రార్ధిస్తున్న ప్రభువు* కఠిన రోమా రౌడీలు ప్రభును సిలువ మ్రానుపై బందించగలిగినారే గాని *ఆయనను ప్రార్ధించకుండగ నిరోధించలేక పోయారు.*
👉 సిలువమ్రానుపై యేసు ఒంటరిగలేడని తండ్రి సన్నిధి ఆయనతో వున్నదనే నమ్మకాన్ని ఈ ప్రార్ధన తెలియజేయుచున్నది.
🔹 ఆయన వీపు చీల్చబడింది. తలపై ముండ్లకిరీటము మొత్తబడింది.
🔹శిరస్సుపై నుండి రక్తం స్రవిస్తుంది.
🔹లోకరక్షకుడుగా వచ్చిననాడు శాపగ్రస్తమైన మ్రానుపై శరీరవేదనను అనుభవిస్తున్న సుకూరమైన యేసు – తండ్రిని ప్రార్ధిస్తున్న తీరు మనలను అబ్బురపరచేదిగా వున్నది.

*ప్రభువు జీవితంలో ఇది చాలా భయంకరమైన మరియు క్లిష్టమైన సమయం.*
👉 తనకున్న దైవాధికారాన్ని ప్రదర్శించగల సమయం కూడా ఇది.
👉కానీ ఆయన ప్రేమ గల హృదయం ఈ భయంకరుల క్షమాపణకై ప్రార్ధించ పురికొల్పి, తండ్రికి విఙ్ఞాపనచేస్తున్నది. సిలువపై యేసు చేసిన ప్రార్ధన శక్తిని దాని విలువను మనం కొలవలేము.

యేసు తాను సిలువపై అనుభవిస్తున్న మనోవేదనను ఙ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని ఏమిటి నాకీ శిక్ష అని ప్రశ్నించటం లేదు. లేక తండ్రిని నిందించటమూ లేదు. తనకు విధించిన సిలువ మరణాన్ని లేక శిక్షను తగ్గించమని ప్రాధేయపడి తండ్రిని అడగటమూ లేదు. మరి ఏమని అంటునన్నాడు. తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్ధిస్తున్నాడు. (లూకా 23:34). ప్రభువు ఎంత దయామూర్తియో గమనించండి. అందుకే ఈయన కరుణామయుడని ప్రేమామయుడు అని ఆరాధించబడుచున్నడు.

*ప్రియులారా! ఇట్టి త్యాగపూరితమైన ప్రార్ధన మీరు చేయగలరా?* పరీక్షించుకొనుము.
👉ఉదయం 9 గం.లకు యేసును సిలువకొయ్యపై పడుకోబెట్టి, కాళ్ళలో చేతులలో సూదిమేకులతో కొట్టీ, ఆ సిలువను పైకెత్తగా, ఆ ప్రియుని శరీర బరువంటా ఆయన చేతుల్లో కొట్టిన మేకుల మీదనే మోపబడింది. ఆ మండుటెండలో ఆయన చెమట రక్తం మిళితమై ఆ ఎండక ఎండుచుండగ భూమికి ఆకాశానికి మధ్యలో మాంసపు ముద్దలా వ్రేలాడుచున్నాడు. అట్టి స్ధితిలో పాలిపోయిన ఆయన పెదవులు కదలుచున్నట్లుగా ఆ సిలువను వెంబడించినవారు, సిలువ భారము మోపినవారు, పాపిస్టీ జనం అంతా ఆయననే చూస్తున్నారు. ఏదైన సహాయాన్ని ఆర్ధిస్తాడో, లేక సిలువ వేయచున్నవారిని దూషించునో అని వారు కనిపెడుతూ వుండవచ్చు, కానీ అందరూ వినేలా ఎంతో చక్కటి ప్రార్ధన అద్భుతమైన ప్రార్ధన చేసాడు ప్రభువు.

(2). *శత్రువులకై ప్రార్ధించిన ప్రభువు*
యేసును హింసించి, చంపటానికి సిద్ధమై సిలువకొయ్యకు బిగించిన ఆ క్రూరాజనంగాన్ని చూచి వారిని దూషించలేదు సరికదా! వారి క్షమాపణకై తండ్రిని వేడుకుంటున్నాడు. మనము ఎప్పుడయిన ఏదైనవేదనలో శ్రమలో ఉన్నప్పుడు మన బాధలలో పాలుపొందువారు మనతో వుంటే బాగుండునని ఆశిస్తాము. వారు మనపై సానుభూతి కనపర్చాలని కోరుకుంటాము.
*నిజానికి ఆత్మీయంగా మన హృదయం దేవుని ఆలయం అని*
(1 కొరింధీ 3:16) అందులో మన ప్రభువు నివసిస్తున్నాడని మనం గ్రహించం.
👉కానీ యేసయ్య ఎంతో అవమానాన్ని దిగమించుకుంటూ తాను ఇంతగా చిత్రవధ పొందుతున్నా తన గురించి ఆలోచించకుండగ తనను భయంకర క్షోభకు గురిచేసిన రోమా దుష్టమృగాల గురించి ఆలోసిస్తూ అట్టి దుష్కార్యములు చేయుచున్న వారి కొరకు ప్రార్ధించున్నాడు. ఇది ఎంత గొప్ప ప్రేమనో గమనించుము. ఇట్టి ప్రేమను కనుపరచు నిమిత్తమే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడని ఎరిగినాడు (యోహాను 3:16). అందు నిమిత్తమే ఆయన శరీరధారియైనాడని తెలియజేయునట్లుగ (యోహాను 1:14) ఈ ప్రార్ధన విఙ్ఞాపన చేయుచున్నాడు.

యేసు సిలువపై పలికిన ఏడు మాటల్లో ఈ మొదటి మాట ఎంతో విలువైనది.
*తన ప్రజలను వారిపాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడునను*
(మత్తయి 1:21) ప్రవచన నెరవేర్పు కొరకు యేసయ్య ఈ ప్రార్ధన చేసాడు అన్నట్లుగా మనం గుర్తించాలి.
*యేసు నోరు తెరచి అభయంకర సిలువ మ్రానుపై పలికిన మొదటి మాటే శత్రువుల క్షమాపణను గూర్చినదైయున్నది.*
👉 ఇట్టి కరుణ, ప్రేమ ఎవరు చూపగలరు?
ఆయన పాపము చేయలేదు. అయన నోట ఈ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు శ్రమ పెట్టువారిని బెదిరింపక న్యాయముగ తీర్పుతోర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకున్నాడు. (1పేతురు 2:22,23).

👉మానవుడు జన్మపాపి. పాపములోనే మానవుడు జన్మించాడు. పాపములోనే తల్లి గర్భములో రూపము దాల్చుకున్నాడు (కీర్తన 51:5). కనుక మానవుడు చేసే ఏ పాపమైన దేవునికి విరోధమైనదే. అందుకే ఇట్టి విఙ్ఞాపన ప్రార్ధన యేసయ్య చేసినట్లు గమనించుము (కీర్తన 51:4). ఈ ప్రార్ధన ద్వారా యేసయ్య దేవునికి పాపులకు మధ్య సమాధానకర్తగాను (యేషయా 9:6) మధ్యవర్తిగాను వుండి (1తిమోతీ 2:5). ఈ ప్రార్ధన చేసెను.

(3). *శత్రువులు తమను హింసించినను వారి రక్షణకై ప్రార్ధించిన వారి ప్రార్ధనలు కొన్నింటిని గమనింతము :*

♻ *సైఫను ప్రార్ధన*
ప్ర
భువా! వారి మీద ఈ పాపము మోపకుము (అపో.కా.7:60).

♻ *పౌలు ప్రార్ధన*
నిందించబడియు దీవించుచున్నము, హింసించబడియు ఓర్చుకొనుచున్నాము(1కొరింధీ4:12). మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు (రోమా 12:14).

♻ *పేతురు ప్రార్ధన*
ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిరి. గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణమైన చేయక దీవించుడి (1పేతురు 3:9)

♻ *యేసయ్య ప్రార్ధన*
ఆయన నోట ఏ కపటమును లేదు (1పేతురు 2:21-23)

➡ *యేసయ్య తండ్రికి చేసిన ప్రార్ధనలు*
యేసయ్య శరీరధారిగ వున్న దినములలో ఆయా సందర్భములలో *“తండ్రీ!”* అనే పిలుపుతో చేసిన ప్రార్ధన అంశములు వున్నవి. వాటిలో కొన్ని సందర్భములు గమనించెదము.

1.తండ్రీ, నీవు ఙ్ఞానులకును వివేకులకును మరుగు చేసిన సంగతులు పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను (మత్తయి 11:25).

2.నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా యిష్టము కాదు నీచిత్తము కానిమ్ము అనెను (మత్తయి 26:39).

3.తండ్రీ, యీ గిన్నెనా యొద్దనుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము... (లూకా 22:42).

4.తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను (లూకా 22:46).

5.తండ్రీ, నీచేతికి నా ఆత్మను అప్పగించుకోనుచున్నాననెను (లూకా 23:46).

6....తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతఙ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను (యోహాను11:41).

7.తండ్రీ, నా గడియ వచ్చియున్నది (యోహాను 17:1)

8.తండ్రీ, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము (యోహాను17:5).

9.తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెను... (యోహాను 17:24).

*ఇలా తండ్రినుద్దేశించి చాలా సందర్భములలో యేసయ్య ప్రార్ధించాడు.*
👉 విఙ్ఞాపన కూడా చేసాడు. కానీ ఈ సిలువ మ్రానుపై వుండి చేసిన ప్రార్ధన అద్భుతమైన ప్రార్ధన. ఈ ప్రార్ధనలో ఎన్నో ఆత్మీయ సత్యములు బయలుపడుచున్నవి. ఇట్టి ప్రార్ధన మన జీవితాలలో చాలా అవసరమైయున్నది. ఆయన చేసిన ఉపదేశాన్ని లేక బోధలను మరువలేదు. ఆయన వాటిని నెరవేర్చెను.

యేసయ్య తన పరిచర్యలో తండ్రిని కనుపరస్తూ చాలా సార్లు తండ్రీ అనే పదన్ని ఉపయోగించాడు.
(యోహాను 16:3,17,23,32; 17:1; 5:24, 15:1,9,10,15;, మత్తయి 6:10)
*ఇలా తండ్రిని ఎన్నో సార్లు ఆయన ప్రత్యక్షపరచెను.*

యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(మూడవ భాగము)

1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*

*యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.* (లూకా.23:34)
ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.*

1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*

1⃣ *తండ్రీ!*
♻ *తండ్రి తనయుల అనుబంధం*
(రెండవ భాగములో ద్యానించాము)
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*

యేసు – *“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.*

♻ *ఎరుగరు*
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనేమాట మనం ద్యానం చేస్తున్న
*మొదటి మాటలో రెండవ భాగానికి చెందినది.*
👉 వీరుపిలాతుతో సిలువవేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. ఈ కేకలు తెలియక వేసినవి కాదు.
(మత్తయి 27:22, మార్కు 15:13,14; లూకా 23:21)

ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాకని కోరిరి (మత్తయి 27:25)
ఈ కోరిక కూడ వారికి తెలుసు. యేసుకు విరోధంగా వీరు మోపిననేరములు అన్నీ అబద్దాలని తెలుసు. యేసయ్య తిన్న దెబ్బలు, ఆయన పొందిన వేదన, అవమానం అన్నీ వీరికి తెలుసు. ఈయన ఈ భయంకర చిత్రవధకు కొన్ని గంటల్లో చనిపోతాడనికూడ వీరికి తెలుసు.

*కాని వారు చేయుచున్న పని (యేసును అనగ రక్షకుని సిలువవేయుట) ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో తెలుయదు.*
👉 ఈయన సర్వలోక పాపపరిహారార్ధం బలిగావించబోవుచున్నాడని ఎరుగరు.

*ఈయనే మెసయ్య అని ఎరుగరు. ఇంకా...*

(i). *ఈయన యూదులకు రాజు అని ఎరుగరు*
(మత్తయి 2:2).

(ii). *లోకపాపములు మోయు దేవుని గొఱ్ఱెపిల్ల అని ఎరుగరు* (యోహాను 1:29).
(iii). *ఈయన దేవుని కుమారుడని ఎరుగరు* (యోహాను 3:16).
(iv). *నశించిన దానిని వెదకి రక్షించు వాడని ఎరుగరు* (లూకా 19:10).
(v). *ఈయనే రక్షకుడని ఎరుగరు* (లూకా 2:11).
(vi). *ఈయన దేవుని ప్రియకుమారుడని ఎరుగరు* (మత్తయి 3:17).
(vii). *యేసు అనేక అద్భుతాలు చేసాడని ఎరుగరు* (యోహాను 11:47).
(viii). *లోకం ఆయన వెంట పోయినదని ఎరుగరు* (యోహాను 12:19).
(ix). *యేసులో ఏ పాపములేదని వీరు ఎరుగరు* (యోహాను 8:46).
(x). *యేసే దేవుడని వీరు ఎరుగరు* (రోమా 9:5).
(xi) *శిష్యులు యేసుప్రేమ సువార్త చాటి చెప్పాలని ఎరుగరు* (మార్కు 16:15).
(xii). *అనేకులు యేసునందు విశ్వాసముంచిరని ఎరుగరు* (యోహాను 7:31).
(xiii). *యేసు రాజ్యం అనంతమైనదని బలీయమైనదని ఎరుగరు* (దానియేలు 7:14).
(xiv). *యేసు నీతిమంతుడని ఎరుగరు* (మత్తయి 27:19).
(xv). *వీరు అసూయచేత యేసును అప్పగించిరని ఎరుగరు* (మత్తయి 27:18).
(xvi). *యేసులో ఏదోషము లేదని పిలాతు ఎరుగడా?* (లూకా 23:14).

ప్రియులారా! ఇలా వ్రాసుకుంటూపోతే ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. గనుకపైన చెప్పిన వాటిని పరిశుద్ధాత్ముని సహాయంతో ధ్యానిస్తే ఇంకా దేవుడు మిమ్మును లోతుగా నడుపును. ప్రార్ధించుము. ధ్యానించుము.

👉 ఇంతఘోరంగా యేసును సిలువకు అప్పగించి చిత్రవధకు గురిచేస్తే కూడ ఈయన నోరు తెరువలేదు ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడియు బదులు దూషింపలేదు... న్యాయముగ తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను (1పేతురు 2:22,23).
మన హృదయంలోని బాధను ఇతరులతో పంచుకుంటే భారం తగ్గుతుంది అంటారు. కాని మన యేసయ్య ఆ సిలువ వేదననంతా హృదయంలోనే దిగమింగుకుంటూ నోటిని బిగబట్టి మంచిగావుండి వారి విషయమై తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు. ఇది ఘోరమైన యాతన

*ప్రియులారా! రక్షకుని మాటలు ఆయన ప్రేమను బయలు పరచుచున్నవి. ఆయన హృదయంలో వారిపట్ల వున్న కరుణ ప్రత్యక్షమగుచున్నది.*
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పుతీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు (యోహాను 3:17). నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకమునకు వచ్చెను
(లూకా 19:10). అందువలననే యేసయ్య, తండ్రీ, వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు.

*యేసయ్య చూపిన మాదిరి* ప్రియులారా! మరణము పొందుతూ కూడ యేసయ్య ధాన్యతలకోండపై చెప్పిన సందేశాన్ని ఙ్ఞాపకం చేసుకుంటున్నాడు.
*మనకు మాదిరి కనపరచుచున్నాడు.*
👉అనేక సందర్భములలో యేసు తన ప్రార్ధన ద్వారా ఆయన ప్రార్ధనపరుడని రుజువు చేసుకున్నాడు.
👉 ఆయన ప్రారంభించిన బహిరంగ పరిచర్య ప్రార్ధనతోనే ప్రారంభించినాడు.
👉తన శిష్యబృంధాన్ని కూడ ప్రార్ధన ద్వారానే ఎంచుకున్నాడు.
👉వారికి కూడ ప్రార్ధించుట నేర్పించాడు. తన వాడుక చొప్పున ఒలీవకొండలకు వెళ్ళి ప్రార్ధించేవాడు.
(లూకా 22:39,40)
*ఆయనకు ప్రార్ధించటం అంటే చాలా ఇష్టం.*
👉 ఇక్కడ అక్కడ అని లేకుండక ఆయన ప్రార్ధించేవాడు.
*అందుకే మార్కు తన సువార్తలో యేసు పెందలకడలేచి, ఇంకా చీకటి వుండగానే అరణ్యముకు వెళ్ళి ప్రార్ధించేవాడని వ్రాశాడు.*
(మార్కు 1:35).

*ఇట్టి ప్రార్ధనానుభవం వున్న ప్రభువు ఈ విపత్కర పరిస్ధితిలో కూడ ఆయన మనకుమాదిరి నేర్పినాడు.*
👉 ఈ ప్రార్ధన ఎంతో విలువైనది. వీళ్ళయొక్క అఙ్ఞానాన్ని ఎరిగి ప్రభువు ప్రార్ధిస్తున్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి అని వీరు ఎరుగలేదు.
🔹ఆయన ముఖము మీద ఉమ్మివేసారు.
🔹ఆయనను పిడిగుద్దులు గుద్దారు.
🔹అరచేతులతో ఆయన చెంపల మీద కొట్టారు. *ఇంతచేసి నిన్నెవరు కొట్టారో ప్రవసించుము అని అపహాస్వం చేసారు.*
👉 అయనను యేసు ప్రేమ ఎంత దృఢమైనదో, స్ధిరమైనదో ఈ ప్రార్ధనే రుజువు చేయుచున్నది. వీరు ప్రభువును సిలువ వేయుట ద్వారా ఎంత ఘోరానికి పాల్పడుతున్నారో వీరికి తెలియదు.

ఏ మానవుడు సహించలేని అవమానాన్ని, భరించలేని బాధను, భయంకరమైన చిత్రవధను తన మనస్సులోనే దాచుకుంటూ
*తన కళ్ళముందే వుండి ఎంతో భయంకరత్వాన్ని కనుపరస్తూవున్న రోమా రౌడీలను ఇతరత్రా అక్కడ నిలుచున్న వారిని ఉద్దేశించి చేస్తున్న ప్రార్ధన ఆయనే మనకు నిజమైన ప్రధానయాజకుడు అని రుజువు చేయుచున్నది* (హెబ్రి 7:26)
మరియు ఆయన మానవులకు దేవునికి మధ్యవర్తి అనే విషయం కూడ బోధపడుతున్నది
(1తిమోతీ 2:5).
*ఈ ప్రార్ధన మనకు మాదిరికరమైన ప్రార్ధన. కనుక ఇట్టి ప్రార్ధన అనుభవం కలిగి జీవించుదము గాక!* ఆమేన్.
(To be continued)







యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(నాలుగవ భాగము)

1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*

*యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.* (లూకా.23:34)
ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.*

1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*

1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*

*వీరేమి చేయుచున్నారో*

వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చేయుచున్న ఈ ప్రార్ధన మనం కొంచెం లోతుగ చూస్తే, *యేసును భయంకరంగ చిత్రవధకు గురిచేసిన వీరు, అనే పదంలో ఎందరున్నారు?*

*వీరు అనె గుంపులో ఎవరెవరు ఇమిడి ఉన్నారో గమనించుము సహోదరా!*
👉 ఆయన స్వజనులైన యూదులు మరియు ఆన్యులు అనే ఈ రెండు గుంపులు ఏకముగా కూడి ఆయనను సిలువ వేసినందున వీరి మీద నేరారోపణ చేయక,
👉వారిని శిక్షకు గురిచేయ్యక వీరి క్షమాపణ కొరకు యేసయ్య ప్రార్ధిస్తున్నాడు.
*యేసయ్యను యూదులు అప్పగించగ, అన్యులు ఆయనను సిలువ వేసిరి.*

👉ఈ సందర్భములో *మతనాయకులు,*
*యూదులు,*
*ఆన్యులు,*
*సామాన్య ప్రజలు,*
*అధికారులు*
ఏకమైనారు.
*వీరందరు ఏకముగ కూడి యేసుకు వ్యతిరేకముగ ఆలోచన చేసిరి, ఆయనను సిలువకు అప్పగించిరి.*
👉 అందువలననే యేసయ్య వీరందరి నుద్దేశించి ఈ ప్రార్ధన చేయుచున్నాడు.

*వీరు*:-
*“వీరు”* అను మాటలో కొన్ని ముఖ్యమైన గుంపులను చూడగలము. వీరు యూదులు మరియు ఆన్యులు.

ఆయన స్వజనులైన యూదులు యేసుపై నేరారోపణ చేయగ ఆన్యులు విమర్శించిరి. యూదులు యేసును అప్పగించగ. ఆన్యులు ఆయనను సిలువవేసిరి. రాజకీయ నాయకులు, మతనాయకులు, సామాన్య ప్రజానికం, అధికారులు అందరు పొరపడియున్నారు. లోక రక్షకుడైన యేసును సిలువకు బిగించిరి. ఆయన రక్షకుడని వీరెరుగరైతిరి. అందుకే యేసయ్య తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రార్ధిస్తున్నాడు.

*ఇంతకు “వీరు” ఎవరు?*

*ఆ వీరులో నీవు వున్నావా?*
ప్రియులారా! ఈ విషయమును బాగుగా ఎరుగుము.
*దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము*
(హెబ్రి.6:5,6). వీరు అనే గుంపులో వున్న వారిని గూర్చి ధ్యానింతము. వీరు...ఎవరు వీరు?

1⃣ *శాస్త్రులు*

వీరు దర్మశాస్త్రమును బహుగా ఎరిగిన వారు మరియు దర్మశాస్త్రోపదేశకులు. *మెసయ్యను గూర్చిన లేఖన భాగములు బాగుగా ఎరిగి వాటి సారాంశమును వివరించుచున్న వారు వీరు.*
👉 ఏ మెస్సయ్యను గురించి వీరు బోధించిరో ఆ మెసయ్య వచ్చెను గాని ఆయనను వీరు గుర్తించలేదు. వీరు ప్రవక్తల ప్రవచనములను మరియు దర్మశాస్త్రలేఖనములను వాటి సారాంశాన్ని ఎరుగక పొరపడియున్నారు. వీరు లోక రక్షకుడైన యేసుకు అభ్యంతర కారణమాయెను. అందువలనే యేసు వీరేమి చేయుచున్నారో వీరెరుగరనెను.

2⃣ *ప్రధాన యాజకులు*
ప్రధాన యాజకుడయిన కయప తాను ఏమి మాట్లాడుచున్నాడో, దాని భావము ఏమైయున్నదో ఎరుగక-మీకేమియు తెలియదు
*మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని చెప్పెను*
(యోహాను 11:49,50).
👉 ఇతని చెవిలో బాప్తిస్మమిచ్చు యోహాను పలికిన – యేసులోకపాపములు మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లయని అన్న మాటలు పడినను, వాటిని గ్రహింపక లేక ఎరుగక ఆయన మరణమును గూర్చి మాట్లాడుచునన్నారు (యోహాను 1:29,36).
👉ఈ మాటలు చెవులారా విని కూడ ఆ మాటలయందు నమ్మకముంచని కారణాన్న వీరు యేసును అపహసించినారు
(మత్తయి 27:41) దీనిని వీరెరుగరు.

3⃣ *పరిసయ్యులు*

👉
వీరు స్వనీతిపరులు తమ్మును తాము హెచ్చించు కొనుటకు ఆరాటపడువారు. *వీరు దేవునికి చెందవలసిన మహిమను దొంగలించుటకు ప్రయాసపడువారు.*
👉 దేవుని ప్రేమింపనివారు అక్షరార్ధముగ ధర్మశాస్త్రమును పాటించువారు. ఆత్మకార్యములను గాని ఆత్మనడిపింపును గాని ఎరుగని వారు మరియు గుర్తింపని వారు.
👉వీరు వేషధారణ జీవితాల్ని యేసయ్య బోధలు బయట పెట్టినవి. ఈ బోధలు వీరి వేషధారణ జీవితానికి అభ్యంతర కారణముగనున్నవి.
*వీరు ప్రజలను ప్రభువుపై ఉసిగొలిపి, వారిని ప్రేరేపించి, యేసును సిలువ వేయుటకొరకు సామాన్య ప్రజానికాన్ని రెచ్చగొట్టి రక్షకుడైన యేసును సిలువవేయించిరి.*
గనుకనే వీరేమి చేయుచున్నారో వీరేరుగరని యేసు ప్రభువుల వారు వీరి నిమిత్తం తండ్రికి ప్రార్ధించుచున్నారు.

4⃣ *హేరోదీయులు*

*రోమా సామ్రాజ్యాన్ని పాలాస్తీనా దేశములో స్ధిరపచాలనే సంకల్పంతో ప్రయాసపడిన రాజకీయగుంపు ఈ హేరోదీయుల గుంపు.*
👉 యేసయ్య తనను గురించి యూదులకు రాజును అని చెప్పినప్పుడు
(మత్తయి 27:11) వీరు.
👉 అందరు యేసుక్రీస్తు మీద *“రాజద్రోహి”* అని నేరము మోపినవారు.
👉యేసయ్య చెప్పిన మాటలలోని ఆత్మీయ భావమును వీరేరుగక ఈ నేరము యేసయ్య మీదమోపిరి. అందుకే ఆయన తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్ధించుచున్నాడు.

5⃣ *సద్దూకయ్యలు*

*వీరొక విచిత్రమైన గుంపు వీరు పునరుత్ధానము లేదని చెప్పెడి గుంపు*
(మార్కు 12:18).
👉వీరు విశ్వాసములేనివారు. శరీరానుసారమైన మనస్సుతో ఆత్మచెప్పు సంగతులను గ్రహించాలని ఆలోచించువారు.

👉యేసుక్రీస్తు తన పునరుత్ధానమును గూర్చి ముందుగ చెప్పిన సంగతులను వీరెరుగలేదు. పునరుత్ధానమును నమ్మెడి పరిసయ్యులు వీరికి విరోధులు. వీరు క్రీస్తు బోధలు నమ్మలేదు. వీరు క్రీస్తుకు విరోధముగ తమ విరోధులతో కలిసిరి. క్రీస్తునందు శత్రువులు మిత్రులుగ మార్చబడినారు. వీరు చేయుచున్న ఈ క్రియలన్నియు ఎరుగకయే చేయుచున్నారు. ఇలాంటి సిలువ విరోధులు యేసును దూషించినారు (మార్కు 15:31,32).

6⃣ *యూదా మతనాయకులు*

*వీరు యేసుక్రీస్తు మీద నేరారోపణలు చేసినవారు.* నేరములను క్రీస్తు నాధునిపై మోపిరి. వీరు ముఖ్యముగ రెండు నేరములు ఆరోపించిరి.
(a) *తాను క్రీస్తు అను ఒక రాజు అనియు*
(లూకా 23:2).
(b) *కైసరుకు పన్ను ఇయ్యవద్దని చెప్పెననిరి* (లూకా 23:2).
👉 ప్రియులారా వీరి ఙ్ఞానమును దేవుడు వెర్రితనమూగ జేసెను.
*వీరు దేవాలయాన్ని పడగొట్టి మరొక దేవాలయాన్ని కడతానన్నాడని కూడ యేసుమీద నేరము మోపిరి* (మార్కు 14:57-59).
👉యేసు తన శరీరమనే దేవాలయాన్ని గూర్చి ఈ మాటలు చెప్పెనని (యోహాను 2:21) వీరు ఎరుగరు. వీరిని తమ అఙ్ఞానము నుండి రక్షించుటకే యేసు వచ్చెనని వీరెరుగరు

7⃣ *పిలాతు*

👉ఇతడు పిరికివాడు అని చరిత్ర చెప్పుతుంది. యేసయ్య సువార్త పరిచర్య బహిరంగముగ చేయుట ప్రారంభించిన దినాలలో పిలాతు రోమా సామ్రాజ్య చట్టాన్ని అమలుపరచే పదవిని అధిరోహించాడు. ఈ పదవిని పొందిన 15 మందిలో ఇతడు ‘6’వ వాడు అని అంటారు. *యూదుల పండుగల సందర్భములో ఎలాంటి గొడవలు జరుగకుండగ చూడటానికని తన అధికార నివాసమైయున్న కైసరయను విడచి యెరూషలేములో వుండేవాడు.*
👉 ఇతడు న్యాయము కంటే స్వార్ధముతోనే తన ఉద్యోగమును ఎక్కువగా ప్రేమించినవాడు. కాఠిన్యం, క్రూరత్వం మొదలగునని ఇతని సహజగుణములు అని పండితుల అభిప్రాయం.

ఇతడు రోమా పాలకులవలె క్రూర హింసకు లోనై చనిపోవుచున్నవారిని చూచి ఆనందించటం ఇతనికి చాలా సరద. గలిలయుల్లో కొందరిని ఆకారణముగ చంపించి, వారి రక్తాన్ని బలులతో కలిపించిన మానవతోడేలు పిలాతు అనుటలో అతిశయోక్తిలేదు (మత్తయి 27:25,26; లూకా 13:1).
👉తీర్పు చెప్పె అధికారము ఇతనికి ఉన్న తప్పించుకొని యేసును హేరోదు దగ్గరకు పంపాడు (లూకా 23:7,12)

👉ఇతను ఈ విధంగా పిలాతు (ESCAPISM) ను ప్రదర్శించెను. ఇతనిలో ఏ దోషము నాకు కనబడలేదు అని ముమ్మారు చెప్పికూడ సిలువ వేయటానికి యేసును అప్పగించి తన చేతులు కడుక్కున్న పిరికివాడు పిలాతు (లూకా 23:4, యోహాను19:4,6).
*యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించి, సిలువ వేయటానికి అప్పగించిన క్రూరుడు పిలాతు*
(యోహాను 19:1,16).

పిలాతు తన మనస్సాక్షికి విరోధముగా, చట్టంను ఉల్లంగించి, కేవలం తన పదవిని కాపాడుకోవటం కోసం, అన్యాయపు తీర్పును తీర్చుటానికి సహితం దిగజారి పోయాడు (లూకా 23:23,24). పిరికివాడైన పిలాతు, తానుకూడ ఒకరోజు ప్రభువు న్యాయపీఠము ఎదుట నిలవాల్సివుందని, తన ముందు నేరస్ధుడుగ నిలచిన ఆ ప్రభువే న్యాయాధిపతిగ ధవళసింహాసనం మీద ఆసీనుడై తీర్పుతీర్చునని ఎరుగలేదు (2కొరింధీ 5:10; ప్రకటన 20:11).
*ఎరుగకయే “యూదుల రాజైన నజరేయుడైన యేసు (INRI) అని సిలువపై వ్రాయించి సిలువ మీదపెట్టి.*
(యోహాను 19:19) నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను (యోహాను 19:22).
*INRI అనగ*
I=JESUS; N=NAZARENUS;
R=REX;
I=JUDAEORUM;
👉దీనికి JESUS OF NAZARETH KING OF THE JESUS అని అర్ధం. (లాటిన్ బాషలో I,J లు ఒకేలా ఉచ్చరించబడతాయి).

8⃣ *ఇస్కరియోతు యూదా*

ఇతడు యేసయ్య శిష్యులలో ఒకడు.
*యూదా అనగ “దైవస్తుతి”* 👉శిష్యులు అంతా గలతీ వాళ్ళు.
*ఒక్క యూదా మాత్రం యూదయవాడు.* *ఇస్కరియోతు అనేది ఇతని యింటి పేరు.*
యూదా డబ్బు మనిషి, ఇతని దగ్గర డబ్బు సంచి వుండేది (యోహాను 12:6, 13:29). అందుకే యేసయ్యను ముప్పది వెండి నాణెములకు అమ్మివేసాడు (మత్తయి 26:15).

ఇతడు తన పాపముల నిమిత్తమును, యేసయ్యకు తాను చేసిన ద్రోహాన్ని గ్రహించి యేసు పాదాల మీద పడి క్షమాపణను వేడుకొనక ఉరిపెట్టుకొని (మత్తయి 27:5) తలక్రిందులుగ పడి చచ్చెను (ఆపో.1:18,19). ధనాపేక్షసమస్త కీడులకు మూలము (1తిమోతీ 6:10) అని యూదా ఎరుగలేదు.

9⃣ *రోమా సైనికులు*

*వీరు మహాభయంకరులు, కర్కసులు, కఠినులు, క్రూరులు.*
👉 యేసు సర్వమానవాళి రక్షణ కొరకు సిలువ యాగం గావిస్తుంటే వీరు ఆయన అంగీకోసం చీట్లు వేసుకుంటున్నారు
(మార్కు 15:15,24; మత్తయి 27:26,35).
👉 వీరు యేసు చేతులలో, కాళ్ళలో భయంకరముగ మేకులు కొట్టి ఆయన తల మీద ముళ్ళకిరీటము మొత్తినారు. ఒకటి తక్కువ నలుబది దెబ్బలు కొరడాలతో ఆయనను కొట్టిరి.

ఈ రోమా రౌడీలు ఆయన వస్త్రాన్ని ఒక్కొక సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లుగ నాలుగ భాగములుగ చేసిరి (యోహాను 19:23) ఈ నలుగురు సైనికులు నాలుగు దిక్కులలో (EAST,WEST,SOUTH & NORTH) నున్న పాపుల గుంపుకు (పాపిష్టి జనాంగానికి) గుర్తుగా వున్నారు. సిలువ సర్వలోక పాపములను బహిరంగముగ, బాహాటముగ ప్రత్యక్ష పరచుచున్నది. ఈ నలుగురు ప్రపంచములోనున్న అన్ని జనాంగములలోని పాపులకు ముంగుర్తుగా నున్నారు.

🔟 *ఇంకా ఎందరో*

యేసు ఎవరినుద్దేశించి *“వీరు”* అనిసంబోధించెనో వారిలో ఇంకా చాలామంది వున్నారు. *“వీరు”* లో
🔹జీలట్లు (యూదా జీలటు అని కొందరి అభిప్రాయము),
🔹 అన్నా,
🔹మార్గస్తులు,
🔹యెరూషలేము కుమార్తెలు,
🔹 సిలువను వెంబడించిన మూఢభక్తులు,
🔹రోమీయులు,
🔹శతాధిపతి,
🔹 రాణువవారు,
🔹యేసయ్య శిష్యబృందం మొదలగువారు ఉన్నారు.



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(ఐదవ భాగము)

1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*

*యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.* (లూకా.23:34)
ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.*

1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*

3⃣ *వీరిని క్షమించుము.*

👉 తాము చేయుచున్న పని ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో వీరికి తెలియదు.
👉 తమ పితరుల కాలం నుండి ఎదురుచూస్తున్న మెస్సయ్యనే వీరు చిత్రహింసలు పెడుతున్నారని వీరికి తెలియదు.
👉నిజముగ ఆయన లోక కళ్యాణం కోసం జన్మించిన జీవాధిపతి అని వీరికి తెలియదు.
*వీరు చేయుచున్న పని ఏమిటో వీరికి తెలియదు.*

*యేసులో ఏ పాపము లేదని వీరికి తెలుసు.*
*నాలో పాపమున్నదని ఎవడు స్ధాపించగలడు అని ఆయన విసరిన సవాలుకు ఎవరూ కిమ్మనలేదు* (యోహాను 8:46).

👉ప్రభువు చేసిన ఎన్నో అద్భుతాలు వీళ్ళు చూసారు. విశ్రాంతి దినాన్ని ప్రభువు చేసిన కార్యాలను వీళ్ళు విమర్శించారు.
👉ఆయన దేవుని కుమారుడని వీరికి తెలియదా? *వీరి హృదయాలకు మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించింది*
(2కొరింధీ4:4).

👉 దుష్ట మృగాల్లా చెలరేగి పోయిన రౌడీ రోమియులపట్ల ప్రేమామయుని ప్రార్ధన ఓ అద్భుతమైన విఙ్ఞాపన ప్రార్ధనగా మార్చివేయబడింది.
👉 వీరి క్రూరత్వము యేసులో దయార్ధహృదయాన్ని ప్రేరేపించింది.

👉అందుకే వీరి క్షమాపణ కొరకు ప్రార్ధిస్తున్నాడు. *శత్రువులను క్షమించండి. వారి కొరకు ప్రార్ధించండి. అని ధన్యతల కొండ మీద చేసిన ప్రసంగం, ఈ కల్వరి కొండ మీద నెరవేర్చుచున్నాడు* (మత్తయి 5:44).

*యూదామత సంప్రదాయం ప్రకారం ఒకనిని ఏడుసార్లు మాత్రమే క్షమించమని బోధకులు బోధించేవారు.*
🔹 కానీ పేతురు ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే ఎన్ని సార్లు క్షమించాలి అంటే – యేసు ఏడుసారులు మట్టుకే కాదు *డెబ్బది ఏడు మారుల మట్టుకు క్షమించమన్నాడు. అంత ఉదార స్వభావము గలవాడు మన ప్రభువు.*

*క్షమించుట చాలా కష్టమైన విషయం.*
👉 సిలువలో అలసిన యేసయ్యను చూడండి.
🔹అబద్దసాక్ష్యాలతో,
🔹 దుషారోపణలతో ప్రభువును సిలువకు కొట్టి,
🔹 తలపై ముళ్ళ కిరీటము మొత్తి,
🔹రక్తము ప్రవాహమువలె ప్రవహించునట్లుగా ఆయన వీపును చీరి,
🔹 కాళ్ళు చేతులలో మేకులు కొట్టి,
🔹శాపగ్రస్తమైన సిలువ మ్రానుపై వ్రేలాడ దీసీ,
🔹శారీరక వేదనతో పాటు మానసిక వేదనకు కూడ గురి చేసిన *ఈ వక్రజనాంగాన్ని క్షమించమని ప్రార్ధిస్తున్న ప్రభువును ఆయన ప్రేమను గమనించుము.*

👉 సిలువ నాధుడు మన కొరకు తండ్రిని ప్రార్ధించుచున్నాడు.
*ఈ ప్రార్ధనలో ఎంతో ఆత్మీయత దాగివుంది.*
పాపులుగ, దుర్మార్గులుగ, దూషకులుగ, సిలువకు విరోధులుగ, ఇంకా ఎన్నో శరీర కార్యములకు దాసులుగ ప్రభువు ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ జీవించుచున్నవారి విషయమై కూడ ప్రార్ధిస్తున్నాడు. గనుక *క్షమాగుణమే క్రైస్తవ జీవితానికి వునాది అని గమనించుము.*
👉ప్రభువుచే క్షమించబడినవారు ఇతరులను క్షమించగలవారై యుండవలెను. ప్రేమ దయతో సంపూర్ణముగ క్షమించవలెను.

*యేసు ప్రార్ధనలోని మర్మము*
👉
యేసు చేసిన ఈ ప్రార్ధన ఎంతో మర్మయుక్తమైనది. *యేసు సిలువ శ్రమలు అనుభవిస్తూ కూడ ఆత్మీయ సత్యాలను ఎరిగియున్నాడు.*
👉 ఆయన సిలువ కొయ్యకు బిగించబడకమునుపు ఎందరినో నీ పాపములు క్షమించబడి యున్నవని చేప్పి వారి పాపాలు క్షమించాడు. ఎందుకంటే ఆయనకే పాపాలు క్షమించే అధికారం ఇయ్యబడింది (మత్తయి 9:6; అపో 4:12).

1⃣ *యేసు పాపములు క్షమించిన కొన్ని సంఘటనలు*

(a). పక్షవాయువు గల వానిని క్షమించెను (మత్తయి 9:2).

(b). పాపాత్మురాలైన స్త్రీ పాపాలు క్షమించెను. (లూకా 7:48) మొదలైనవి..

2⃣ *యేసు ప్రార్ధన ఉపదేశసారం*

యేసు బోధలలోని ఉపదేశసారమే ఈ ప్రార్ధన. మీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్ధించండి, వారిని ప్రేమించండి. (మత్తయి 5:43,44) ఇలాంటి ఎన్నో ఉపదేశాల సారమే ఈ ప్రార్ధన. ఆయన బలహీన స్ధితిలో కూడ ఇట్టి ప్రార్ధన చేయటం మనకు ఆశీర్వాదకరం.

3⃣ *యేసు ప్రార్ధన దేవుని సహవాసాన్ని చూపుతుంది*

“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు చేసిన ప్రార్ధన తండ్రికి, కుమారునికి గల సన్నిహిత సంబంధాన్ని, ఐక్యతను, వారి సహవాసాన్ని ఙ్ఞాపకం చేస్తుంది. తండ్రి నేను ఏకమైయున్నాను. నన్ను చూపిన వాడు తండ్రిని చూచును అని చెప్పిన మాట ఈ సహవాసాన్ని బలపరచుచున్నది(యోహాను 10:30).

4⃣ *యేసు ప్రార్ధన బాల్యర్పణను ఙ్ఞాపకం చేయుచున్నది*

కొందరు చేయుప్రార్ధనలు వ్యర్ధముగ వుంటాయి. అర్ధం లేనివిగ కూడ వుంటాయి. కానీ యేసు చేసిన ప్రార్ధన ఎంతో భావయుక్తమైనది. ఈ ప్రార్ధన ఆయన చేయుచున్న బల్యర్పణను ఙ్ఞాపకం చేస్తున్నది. *“ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను..”* (యెషయా 53:12).

5⃣ *యేసు ప్రార్ధన లేఖన నెరవేర్పు*

యేసయ్య చేసిన ఈ ప్రార్ధన లేఖనముల నెరవేర్పు అని గమనించుము. ఈ సంఘటన జరుగక పూర్యము దాదాపు 510 సం. ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు.
*అనేకులు పాపములు భరించును తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విఙ్ఞాపన చేసెను*
(యెషయా 53:12).
👉అందుకే ఆయనకు ఇరుప్రక్కల తిరుగుబాటు దారులను సిలువవేసెను. ఆయన బదులు దూషించలేదు. బెదిరించలేదు. కాని మాదిరికర మార్గమును మన కొరకు వుంచెను (1పేతురు 2:21-23).

♻ *కొన్ని ఇతర సందర్భములు*
👉 పరిశుద్ధ గ్రంధంలో ఎన్నో ప్రార్ధనలు లేక విఙ్ఞాపనలు వ్రాయబడియున్నవి. వాటిని గూర్చిన కొన్ని విషయములు గమనింతము.
(i). *హేబేలు రక్తం* పగతో రగిలిపోయి శత్రువు శిక్షకై ప్రార్ధించింది (అది 4:10).
(ii). *నాబోతు రక్తం* శత్రువు మరణానికి గుర్తుగా వుంది (1రాజులు 21:19).
(iii). *పస్కాగొఱ్ఱెపిల్ల రక్తం* ఇశ్రాయేలీయుల వికోచనకు గుర్తు (నిర్గ 12:13).
(iv). *యేసు రక్తం* పాపక్షమాపణకై చిందించబడిన నిబంధన రక్తం (మత్తయి 26:28).

♻ *పగతీర్చుకొనే స్వభావం*
👉యేసును ఇంతగ చిత్రవధకు గురిచేసిన వారిని క్షమించమని తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు.

♻ *కొందరు వారి తప్పును కప్పి పుచ్చుకొనుటకు ఎదుటవారిపై పగతీర్చుకున్నారు గమనించండి..*

*దావీదు*
దావీదు చేసిన తప్పును దాచుకోవటానికి ప్రయాసపడ్డాడు. నమ్మకమైన సైనికుని చంపించిననాడు (2 సమూయేలు 11:17).

*హేరోదు రాజు*
బప్తిస్మమిచ్చు యోహాను హేరోదు చేసిన పాపాన్ని గద్దించిన కారణాన యోహాను తల నరికించివేసెను
(మత్తయి 14:10).

ప్రియులరా! *యేసు మాత్రం సిలువ శత్రువుల కొరకై ప్రార్ధించుచున్నాడు.*
👉 వారిని ప్రేమించాడు.
👉 వారిలోని పాపాన్ని ద్వేషించాడు.
*కానీ వీరి కోసం, వీరి క్షమాపణ కోసం ప్రార్ధిస్తున్నాడు.*
👉 మన ప్రభువుది ఎంత దయార్ధహృదయమో గమనించండి.
*తీర్పు తీర్పు పని మనది కాదు అని యేసు న్యాయముగ తీర్పు తీర్చే దేవునికి తన్నుతాను అప్పగించుకున్నాడు*
(1పేతురు 2:23)
👉 మనం పాపం చేసినను ఆయన కృపాక్షమాపణలు గల దేవుడు (దానియేలు 9:9) గనుక ఆయన మనలను క్షమించును. అందుకే యేసు చూపిన మార్గమున సాగిపొమ్ము!
*నీవును ఇట్టి ఆత్మీయ అనుభవమును పొందుకొనుము. యేసును మాదిరిని ఎరిగి అట్టి మాదిరి కనపరచుము. దేవుడు నిన్నును క్షమించుగాక! దీవించుగాక ! ఆమెన్...*

యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(ఆరవ భాగము)

2⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన రెండవ మాట....✍*
2⃣ *విమోచన* (PROMISE OF PARADISE) :-


*“....అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”*
లూకా 23:43

👉 సిలువ మ్రానుపై వ్రేలాడుచు రక్షకుడైన యేసు పలికిన మాటలలో ఇది రెండవది.

*ఏ పాపము లేని నిర్దోషియు, నిష్కళంకుడునగు ప్రభువును ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేసిరి. యెరూషలేము పట్టణము వెలుపట గొల్గొత కొండ మీద ఆకాశమునంటు నట్లు మూడు సిలువలు అగపడచున్నవి. యేసున కిరువైపుల ఉన్న దొంగలు సిలువ మరణానికి తగినవారు. అట్టి తీర్పు వారికి సరియైనది.*
👉 కాని యేసు మాత్రం *“అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను”* అనే ప్రవచనము నెరవేర్చుబడునట్లుగ ఆయన సిలువ మరణానికి అప్పగించబడ్డాడు.
(యెషయా 53:8).
ఆయన తృణీకరించబడిన వాడుగ ఎంచి, మనుష్యుల వలన విసర్జించబడిన వాడాయెను
(యెషయా 53:3).
అతిక్రమము చేసిన వారిలో ఎంచబడినవాడాయెను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారికొరకు విఙ్ఞాపన చేసెను
(యెషయా 53:12).

ప్రభువు గురువారము (THURSDAY) సాయంకాలపు వేళ్ళలలో తండ్రీ, యీగిన్నె నాయొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము అయినను నీ చిత్తమే సిద్దించుగాకని ప్రార్ధించుచుండగ ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను (లూకా 22:42-44). యూదా ఇంతలో జనులతో గుంపులుగా వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొనుట ద్వారా యేసును అప్పగించాడు.

👉వారు ఆయన ముఖముపై ఉమ్మివేసి, కళ్ళు చేతులలో మేకులు కొట్టి సిలువ వేసిరి. *ఆయన తలపై ముళ్ళ కిరీటము మెత్తుట చేత శ్రవించిన రక్త ధారలు ఆయన ముఖము మీదుగా కారుట ద్వారా, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి ఆపేక్షించునట్లుగా అతని యందు స్వరూపము లేదు*
(యెషయ్య 53:2) అనే ప్రవచనం నెరవేరింది.

ఆయనతో సిలువ వేయబడిన వారు విద్రోహులు, హంతకులు, విప్లవకారులు. వీరు బరబ్బాకు స్నేహితులని, రోమా ప్రభుత్వము నెదిరించి ప్రత్యేక రాజ్యస్ధపనకు పాటుపడిరని చరిత్ర చెప్పుతుంది. ఈ ఇద్దరు దొంగలు ప్రభువుతో కూడ సిలువలో వ్రేలాడబడుచున్నారు.
👉 ఈ ఇద్దరు ప్రభువుకు అనగ రక్షకునికి దగ్గరగ సమీపముగా వున్నారు. *ప్రభుని ఆయన ప్రేమను, ఆయన చేసిన ప్రార్ధనను విన్నారు. నరహంతకుల కొరకైన యేసు విఙ్ఞాపనా ప్రార్ధనల ప్రభావము ఓ దొంగ హృదయానికి అగోచరమైన శక్తిగా తాకిందికాబోలు. ఈ దొంగ తన మరణ సమయంలో ఆ ఘోర సిలువలో పశ్చాత్తాప్తుడై క్రీస్తు కృపకొరకు ప్రార్ధించాడు.*

1⃣ *ఇద్దరు బందిపోటు దొంగలు*

*కుడివైపు ఒకడును ఎడమవైపున ఒకడను ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువ వేయబడిరి*
(మత్తయి 27:33).

ఆ మార్గమున వెళ్ళుచుండినవారు తలలూపుచు-దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధానయాజకులు కూడ ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్నుతాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజుగదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణి నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పును గనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పి (మత్తయి 27:39-43) హేళన చేసిరి. ఆయనతో సిలువ వేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి (మత్తయి 27:44). ఈ ఇద్దరు కూడ ఆయనతో చంపబడటానికి తేబడ్డారు. వీరు నేరము చేసిన వారు (లూకా 23:32) వీరు నేరస్ధులు (లూకా 23:33)

(a). *ఎడమవైపు దొంగ* :-

ఆ దినాలలో ఈ ఇద్దరు బందిపోటు దొంగల గురించి చరిత్రకారులు కొన్ని విషయాలు పొందుపరిచారు. దానిప్రకారం *ఎడమవైపు దొంగ నెస్టాస్* అని చెప్పుతారు.
(బైబిల్ లో హ్రయబడలేదు)
*నెస్టాస్ అనగ శిలాహృదయుడు లేక అణచబడినవాడు అనే భావన.*
(ఇతనికి ఇంకా కొన్ని పేర్లు అలియాస్ గా వుండెడివని కూడ ఉవాచ) అందుకే యేసుతో పాటు సిలువ వేదన పొందుతూ, యేసు చూపిన ప్రేమను చూచిననూ ఈ కఠిన హృదయం కరగలేదు చలించనూలేదు.

(b). *కుడివైపు దొంగ*

చరిత్రకారుల పారంపర్యం ప్రకారం ఈ కూడివైపున సిలువ వేయబడిన దొంగపేరు *“డిస్మాస్” అని చెప్పుతారు.*
(బైబిల్ లో హ్రయబడలేదు)
డిస్మాస్ అనగ అస్తమించుచున్న సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరుగువాడు అంటారు. *వీరిద్దరు కూడ బరబ్బ వలెనే విప్లకారులని, మతోన్మాదులని, ధనవంతులను దోచుకొని పేదలకు పెట్టేవారని చరిత్రకారులు వ్రాసిరి.*

(c). *దొంగలను గూర్చిన మరో సంప్రదాయం*

లూకా 10:30 ప్రకారం ఆ దినాలలో చాలా మంది యవ్వనస్ధులు – హేరోదురాజు యెరుషలేము దేవాలయాన్ని పునర్నిమించిన తరువాత – నిరుద్యోగులై దొంగలుగ మారిపోయి దొంగతనాలు చేస్తూ జీవనోపాది పొందే వారని, వారి ముఠాకు చెందిన వారే ఈ ఇద్దరు దొంగలని అంటారు.

ప్రియులారా! ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం.
*ఈ ఇద్దరు దొంగలు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డారు.*

2⃣ *మూడు సిలువ మ్రానులు* :-

గొల్గొత కొండ మీద యేసుతోపాటు ఇద్దరు దొంగలు సిలువవేయబడిరి. ఈ కొండ మీద మూడు సిలువలు అగపడుచున్నవి. వీటిని గమనించెదము.

(a). *యేసు సిలువమ్రాను*

యేసు సిలువ మ్రానులోని సత్యములు తెలుసుకొనెదము.
(i). యేసువ్రేలాడిన సిలువమ్రాను
(ii). యేసు రక్తం శ్రవించిన మ్రాను
(iii). రక్షకుడుగా యేసు చనిపోయిన మ్రాను
(iv). విమోచకుడుగా యేసు నిలచిన మ్రాను
(v). పాపపరిహారార్ధ బలిపశువుగా యేసు వ్రేలాడిన మ్రాను

(b). *కుడి ప్రక్క దొంగ సిలువ మ్రాను*
ఇందులోని ఆత్మీయతను గమనించెదము.
(i). రక్షించబడిన దొంగ సిలువ మ్రాను
(ii). రక్షించబడిన దొంగ రక్తం శ్రవించిన మ్రాను
(iii). విశ్వాసిగ చనిపోయిన దొంగ సిలువ మ్రాను
(iv). యేసును అంగీకరించిన దొంగ మ్రాను
(v). పాపక్షమాపణ పొందిన దొంగ మ్రాను

(c). *ఎడమవైపు దొంగ సిలువ మ్రాను*
దీనిని గూర్చియు గమనింతము.
(i). పాపిగానున్న రెండవ దొంగ మ్రాను
(ii). పాపపు రక్తము శ్రవించిన మ్రాను
(iii). దూషకుడిగా చనిపోయిన దొంగమ్రాను
(iv). యేసును తృణీకరించిన దొంగమ్రాను
(v). పాపపు శిక్షకు పాత్రుడైన దొంగ మ్రాను

యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగలకు నైతిక విలువలు ఈ మాత్రము లేవు. యేసును ఒక్కడినే సిలువ మ్రాను మీద వుంచలేదు. అయితే లేఖనాలు నెరవేర్చబడవలసియున్నది కనుక ఇలా జరిగింది. *“అతిక్రమము చేయు వారిలో ఎంచబడినవాడాయెను.”* అనే ప్రవచనాను సారం ఇది జరిగింది (యెషయా 53:12).
👉 ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో పశువుల మధ్యలో జన్మించాడు.
👉మరణం చెందుతున్న సమయంలో పశువుల వంటి మనుష్యుల మధ్యలో సిలువ వేయబడ్డాడు.
*ఇక్కడ వున్నవారు ఇద్దరూ దొంగలే! ఇద్దరూ యేసయ్య పలికిన ఆణిముత్యం లాంటి మొదటి మాట విన్నారు.*

*మన మందరము రక్షించబడాలని యేసయ్య ఉద్దేశం.*
👉 నీతిమంతుడైన యేసయ్య అనీతిమంతులైన మానవాళి కొరకు ఈ సిలువ మ్రాను మీద మరణం చెందాడు.
*ఈ లోక న్యాయాధిపతులు ఈ ఇద్దరి దొంగలను క్షమీంచక సిలువకు అప్పగించారు. అయితే పరలోక న్యాయాధిపతియైన యేసు మాత్రం ఈ దొంగలను క్షమించటానికి ఇష్టపడ్డాడు.*
👉 ఇందులో ఒక దొంగ మాత్రం బాహాటంగ యేసును అంగీకరించాడు రక్షణపొందాడు.

ఈ అంశం చదువుతున్న స్నేహితులారా...! నేను మీకు ఒక అన్నగా & ప్రియా తమ్ముడుగా చెప్తున్నా. ఇద్దరి దొంగ ప్రవర్తన గురించి వ్రాసాను, ఒక దొంగ ప్రవర్తన గూర్చి కూడా రాసాను.
*మరో వైపు దొంగ దొంగే కాని తన ప్రవర్తనతో యేసు మనస్సు దొంగ తనం చేసి పరదైసుకు యేసు తో వెళ్ళాడు.*
👉🏻 నీవు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్న, చివరికి దొంగలా పాపపు జీవితం జీవిస్తూ మంచి వాడిలా నటుస్తున్నా సరే, పాపములో ఉన్న, శాపములో ఉన్న, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కసారి ఒకేఒక్కసారి యేసు అని పిలువు, నీ మనవి వింటాడు. క్రియలు లేకుండా ఎన్ని శ్రమల దినాలు గడిచిన, ఎన్ని Good Friday లు జరిగిన ఫలితం ఉండదు. *కాబట్టి ఒక వైపునవున్న దొంగలా ఒక్కసారి యేసు అని పిలిచి, ప్రభుచేంతకు చేరి, మీ పాపాలు ఒప్పుకొని, సిలువలో నీ కొరకై కార్చిన రక్తముచే నీ పాపాలు కడిగి నూతన పర్చుకొని, పరిశుద్ధ జీవితం గడపాలి అని మనసారా కోరుకుంటూ...✍*


యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

ఏడవ భాగము)

2⃣
(2వ భాగము)

2⃣ *విమోచన* (PROMISE OF PARADISE) :-

*“....అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”*
లూకా 23:43

*కుడివైపు దొంగ ఇచ్చిన సాక్ష్యము* :

*యేసు – నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను ఙ్ఞాపకము చేసికొనుమనెను*
(లూకా 23:42).
👉 యేసు సిలువలో నరహంతకుల కొరకు చేసిన ప్రార్ధన ఫలితమే ఈ సాక్ష్యము. *ఈ దొంగ ఎక్కడ యేసు బోధలు విన్నట్టుగాని, యేసు సహవాసం చేసినట్టుగాని, మేలు, ఉపకారం పొందినట్టుగాని, స్వస్ధత విడుదల పొందినట్లుగాని లేదు. కాని “యేసూ” (రక్షకా) అని పిలుస్తున్నాడు.*
రోమా రౌడీలు, శాస్త్రులు, పెద్దలు, యూదులు, మార్గము వెంబడి వెళ్ళుచున్నవారు ఇలా ఎందరో యేసును హింసించి, బాధించి, అపహసించి, ముఖము మీద ఉమ్మివేసి, పిడి గుద్దులు గుద్ది గేలి చేస్తూ వుంటే వీరందరికి విరుద్దంగా ఇంతమంది వింటుండగ ఈ అద్భుతమైన పిలుపు లేక సాక్ష్యం వినబడుతుంది.

*సువార్తలు అన్నీ తిరగేసి చూడండి ఎక్కడ ఇలాంటి పిలుపు లేదు. “యేసూ” అని ఎవరూ సంబోధించలేదు.*
🔹ప్రభూ అన్నారు.
🔹బోధకుడా అని పిలిచారు.
🔹దావీదు కుమారుడా అని కేకలు వేసారు.
🔹క్రీస్తూ అని కూడ అన్నారు. *కాని యేసూ (రక్షణ) అన్నవాడు ఈ దొంగ మాత్రమే!*
(నిజానికి సిలువ మీద వ్రేలాడుతు వేదన పొందుతున్న వారు ఆ బాధను భరించలేక మతిబ్రమించి పిచ్చిపట్టిన వారై వారి బాధను తట్టుకోలేక రాయటానికి వీలులేని భయంకరమైన దుర్భాషలాడతారని కొందరి నేరస్తుల నాలుకలు ముందే కొసే అలవాటు ఉన్నదట. కాని ఈ దొంగ విషయంలో అది జరగలేదు. అందుకే యేసూ అన్న మాట చాలా స్పష్టముగా వినబడుతున్నది.

♻ *యేసుని గూర్చిన సాక్ష్యములు* :

*కుడివైపు దొంగ వేరొక దొంగను గద్దిస్తున్నాడు. నీవు శిక్షలో వున్నావు. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము. గాని యీయన ఏ తప్పిదము చేయలేదు*
(లూకా 23:40,41).
🔹 యేసు సహనాన్ని,
🔹ఆయన ప్రేమను,
🔹ఆయన నేత్రాలలో జనించిన కరుణ,
🔹 ఆయన పెదాలమీద మీటబడిన క్షమా ప్రార్ధన భారం *ఇవన్నీ ఈ దొంగ హృదయాన్ని తట్టాయి.*
👉 తన పేరుకు తగినట్టుగానే (డిస్మాస్) హస్తమిస్తున్న సూర్యుని వైపు (యేసువైపు) ఎంతో ఆశతో చూస్తూ హృదయానందంతో వేసిన సంతోషపు కేకే ఈ సాక్ష్యం.

సిలువ దగ్గరున్న అధికారులు, యూదులు అందరు యేసును అపహస్యం చేస్తూ, దూషిస్తూ, విమర్షిస్తూ వుంటే, మరోవైపు నీవు దేవుని కుమారునివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్ము రక్షించు అని ఎడమవైపు దొంగ హేళన చేస్తూ వుంటే. ,
*“నీవు అదే శిక్షలో వున్నావు దేవునికి భయపడవా”* అని గద్దింపుకేక వేసాడు రెండవ దొంగ.
👉 ఈ గద్దింపు మాట యేసుది కాదు. తన సహచరుడిదే!

♻ *యేసుని గూర్చిన కొన్ని సాక్ష్యములు గమనిద్దాం.*

1⃣ *పేతురు సాక్ష్యం* :-
అందరు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను (మత్తయి 16:16).

2⃣ *ఇస్కారియోతు యూదా సాక్ష్యం*
నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను (మత్తయి 27:4).

3⃣ *పిలాతు భార్య సాక్ష్యం*
అతడు న్యాయపీఠము మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య – నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు – అని వర్తమానము పంపెను (మత్తయి 27:19).

4⃣ *దయ్యముల సాక్ష్యము*
నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి... నీ వెవడవో.. తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను (మార్కు 1:24).

5⃣ *శతాధిపతి సాక్ష్యము*
శతాధిపతి జరిగినది చూచి – ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమ పరచెను (లూకా 23:47).

6⃣ *సమరయుల సాక్ష్యము*
మా మట్టుకు మేమువిని, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి (యోహాను 4:42).

7⃣ *పిలాతు ఇచ్చిన సాక్ష్యము*
పిలాతు యేసుని గూర్చి ఆయనలో ఏ పాపము లేదని ముమ్మారు సాక్ష్యం ఇచ్చాడు.
(a). అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు (యోహాను 18:38).
(b). ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు (యోహాను 19:4).
(c). ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు (యోహాను 19:6).

ప్రియులారా! పైన మనం చూచిన సాక్ష్యములు యేసును ఎరిగినవారు, ఆయనతో సహవాసంలో వున్నవారు, ఆయన చేసిన అద్బుతములను కన్నులారా చూసినమొదలగు వారు ఇచ్ఛన సాక్ష్యము.

*కాని మనం ధ్యానించు సాక్ష్యం మాత్రం అందరి సాక్ష్యముల కంటే గొప్ప సాక్ష్యం. ఇక్కడ విచిత్ర మేమిటంటే ప్రజానికం గాని, అధికారులు గాని ఎవ్వరూ యేసును లెక్కచేయటంలేదు.*
👉 యేసును పురుగులా ఎంచినారు. ఆయనను తృణీకరించారు
(యెషయా 53:3).
*అయితే ఈ కుడివైపు దొంగ మాత్రం యేసూ నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఙ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇతని గురి యేసు మీద వున్నది. ఇది నిజముగ ఓ గొప్ప అద్భుతం.*
👉 అప్పటికి ఇంకా (యేసును సిలువేసిన రోజు) ఎలాంటి అద్భుతాలు జరగలేదు. అంటే, భూమి వణకలేదు, కొండలు కదలలేదు, సూర్యుడు చీకటిగామారలేదు. దేవాలయపు తెర చినగలేదు, దేశమంతా చీకటి కమ్మలేదు *కాని శిలలాంటి ఈ దొంగ హృదయం మాత్రం కదిలింది. అంతే కాదు ఆ హృదయం కరిగింది.యేసు మహిమను గైకొన్నది. ఆ హృదయ ఆక్రందనే ఈ ప్రార్ధనా విఙ్ఞాపన...*

ఈ అంశం చదువుతున్న స్నేహితులారా...! నేను మీకు ఒక అన్నగా & ప్రియా తమ్ముడుగా చెప్తున్నా. ఇద్దరి దొంగ ప్రవర్తన గురించి వ్రాసాను, ఒక దొంగ ప్రవర్తన గూర్చి కూడా రాసాను.
*మరో వైపు దొంగ దొంగే కాని తన ప్రవర్తనతో యేసు మనస్సు దొంగ తనం చేసి పరదైసుకు యేసు తో వెళ్ళాడు.*
👉🏻 నీవు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్న, చివరికి దొంగలా పాపపు జీవితం జీవిస్తూ మంచి వాడిలా నటుస్తున్నా సరే, పాపములో ఉన్న, శాపములో ఉన్న, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కసారి ఒకేఒక్కసారి యేసు అని పిలువు, నీ మనవి వింటాడు. క్రియలు లేకుండా ఎన్ని శ్రమల దినాలు గడిచిన, ఎన్ని Good Friday లు జరిగిన ఫలితం ఉండదు. *కాబట్టి ఒక వైపునవున్న దొంగలా ఒక్కసారి యేసు అని పిలిచి, ప్రభుచేంతకు చేరి, మీ పాపాలు ఒప్పుకొని, సిలువలో నీ కొరకై కార్చిన రక్తముచే నీ పాపాలు కడిగి నూతన పర్చుకొని, పరిశుద్ధ జీవితం గడపాలి అని మనసారా కోరుకుంటూ...✍*



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(ఎనిమిదవ భాగము)


2⃣ *విమోచన* (PROMISE OF PARADISE) :-

*“....అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”*
లూకా 23:43

♻ *కుడివైపు దొంగ విఙ్ఞాపన* (లూకా 23:22)

ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఙ్ఞాపకము చేసుకొనుమని విఙ్ఞాపన చేసెను.
👉ఈ ప్రార్ధన ఎంత చిన్నదయిన
*ఇందులో ఎంతో వినయము, విధేయత ప్రభువు పట్ల నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ, ధైర్యం, నిశ్చయత వున్నవి.*
👉 ఆయన నామములో ఏది అడిగిన ఇస్తానని యేసు వాగ్ధానం చేసెను. (యోహాను 14:14; 1యోహాను 5:14; మత్తయి 6:33).
👉నిజానికి బందిపోటు దొంగలు హృదయాలు రాతి హృదయాలై వుంటాయి.
*అట్టి నేరములో వున్న బండ హృదయం యేసు రక్తధారలతో తాకబడింది.*
ఆ ఘడియలో చక్కటి విఙ్ఞాపన చేస్తున్నాడు.

♻ *ఈ విఙ్ఞాపలో 4 ముఖ్యమైన అంశములు దాగివున్నవి.*
ఒక్కొక్కటి ధ్యానం చేయుదము.

1⃣ *యేసూ*

*యేసూ అనే ఈ మాటకు రక్షకుడు అని అర్ధం.*
👉 ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను
(మత్తయి 1:21).
*రక్షకుడు ఇచ్చేది రక్షణ.*
👉 రక్షకుని దగ్గర దొరికేది రక్షణ; పాపము నుండి రక్షణ. ఇది ఉన్నతమైనది.
*ఆకాశము క్రింద ఈయబడిన ఏ నామమున రక్షణలేదు కాని యేసునామముననే రక్షణ పొందవలెను*
(ఆపో.4:12).
🔹రోగముల నుండో,
🔹 శరీర బాధలనుండో,
🔹 ప్రమాదములనుండో ఈ దొంగ రక్షణ కోరుకొనుట లేదు.
🔹 సిలువ మరణం నుండి విడిపించు ప్రభూ అని ప్రార్ధించటం లేదు. ఇతని పిలుపులోనే అతని ఉద్దేశం, భావం స్పురిస్తున్నాయి.
👉 యేసులో ఏ పాపము లేదని అనేకులు సాక్ష్యం ఇచ్చారు. ఈ దొంగ కూడ సాక్ష్యంపలికాడు. అలాంటి రక్షకుడే ఇతనికి కావాలి. *ఈయనే (యేసు) పాపరోగము నుండి శాపము నుండి విడిపించునాడు,*
👉 విమోచించువాడని ఈ దొంగ ఎరిగి,
*యేసూ, అని అద్భుతమైన పశ్చాత్తాపపు కేక వేస్తున్నాడు.*
👉 ఇతని హృదయ కాఠిన్యం తొలగించబడింది. ఇతని రాతి హృదయం మాంసపు హృదయంగా మారింది (యెహెజ్యేలు 36:26). “యేసూ” అని నోటితో ఒప్పుకున్నాడు
(రోమా 10:9,10)

♻ *అతడు హృదయంలో విశ్వసించాడు.*

(a). *యేసును ఒప్పుకున్నాడు* : ఈ దొంగ యేసును రక్షకుడని ఒప్పుకొన్నాడు. అంగీకరించాడు.

(i). యేసును రక్షకుడని మనుష్యుల ఎదుట ఒప్పుకొన్నాడు (మత్తయి 10:32).

(ii). యేసు దూతల ఎదుట ఇతనిని ఒప్పుకొనుట (లూకా 12:8).

(iii). యేసు ప్రభువని ఇతడు ఒప్పుకున్నాడు (రోమా 10:9).

(iv). దేవుని మహిమార్ధమై యేసును ఒప్పుకొనెను (ఫిలిప్ 2:11)

(v). కుమారుడైన యేసును ఒప్పుకొనెను (1యోహాను 2:23).

(vi). తండ్రియైన దేవుని అంగీకరించెను (1యోహాను 2:23).

(vii). ఈ దొంగలో దేవుడు నిలచియున్నాడు (1యోహాను 4:15).

(viii). ఈ దొంగ దేవునియందు ఉన్నాడు (1యోహాను 4:15).

(b). *రక్షించు విశ్వాసము* :
ఇతను యేసులో కనుపరచిన విశ్వాసము నమ్మకమే ఇతనికి రక్షణ అనుగ్రహించెను.

(i). ఇతడు యేసునందు విశ్వాసముంచెను (యోహాను 3:15).

(ii). కుమారునికి విధేయుడయ్యెను (యోహాను 5:24).

(iii). విశ్వాసముంచెను గనుక తీర్పులేదు (యోహాను 5:24).

(iv). విశ్వాసముచే నిత్యజీవము పొందెను (యోహాను 6:40).

(v). విశ్వాసముంచినవాడు మరల బ్రతుకును (యోహాను 11:25).

(vi). వీడు చీకటిలో లేడు, వెలుగులో వున్నాడు (యోహాను 12:46).

(vii). యేసునామములో జీవమున్నది (యోహాను 20:31).

(viii). విశ్వాసముంచువాడే పాపక్షమాపణ పొందును (అపో. 10:43).

(c) *రక్షణ భాగ్యము పొందుట* :
ఇతడు సిలువపై వుండి అట్టి బాధనుండి విమోచన కోరక పాపము నుండి రక్షణ, పరలోక భాగ్యం కోరుకున్నాడు. అందుకే ప్రభువుతో గొప్ప వాగ్ధానము పొందెను.

(i). యేసు నామములో ....రక్షణ (మత్తయి 10:22).

(ii). రక్షణ దేవుని దయాపూర్వక సంకల్పము (1కొరింధీ 1:21).

(iii). సువార్త వలననే రక్షణ కలిగెను (1కొరింధీ 15:2).

(iv). విశ్వాసము ద్వారా రక్షణర్ధమైన ఙ్ఞానము (2తిమోతీ 3:14-15).

(v). శక్తిగల వాక్యము (మాటల) ద్వారా రక్షణ (యాకోబు 1:21).

(vi). నిత్య రాజ్యప్రవేశము దొరికెను (2పేతురు 1:11).

ప్రియులారా!
*“యేసూ” అని ఈ దొంగ పిలుపులోనే యేసును అంగీకరించెను.*
👉 తద్వారా రక్షణ అనుభవమును ప్రభువు ద్వారా పొందెను. ఇతను ఎంతో గొప్ప ఆత్మీయ దీవెనానుభవమును పొందగలిగెను.

2⃣ *నీవు నీ రాజ్యముతో*

ఈ కుడివైపున ఉన్న దొంగ దాదాపు యేసుతో పాటు తననుకూడ సిలువ వేసినప్పటి నుండి ప్రభువు యొక్క దీనత్వం, ఆయన సహనం, తనను హింసించి అవమానపరచుచున్న వారి కొరకు యేసు చేసిన ప్రార్ధన విఙ్ఞాపన, ఆయన దేవుని కుమారుడైయుండి శత్రువులను బెదిరింపక న్యాయముగ తీర్పుతీర్చే దేవునికి అప్పగించుకోవటం ఇలాంటి సందర్భాలెన్నో చూస్తున్న దొంగ హృదయం చలించి పోయింది.
*నీవు దేవునికి భయపడవా? ఇది మనకు న్యాయమే అని సహచరుడ్ని గద్దించినాడు.*
👉 తన పాపాన్ని తన భయంకరత్వాన్ని గుర్తించాడు. మరణ శిక్ష అతను అనుభవించటం న్యాయమే అని గ్రహించాడు.

అలానే యేసు యొక్క నిర్ధోషత్వాన్ని కూడ ఈ దొంగ ఒప్పుక్కునాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదనియు, నేను నిరపరాధిరక్తం అప్పగించానని *యూదా* అన్నాడు (మత్తయి 27:4). అసలు ఈ సంఘటనకు ఏ మాత్రం సంబంధంలేని *పిలాతు భార్యా* కూడ ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతుకు వర్తమానం పంపింది. (మత్తయి 27:19).

ఈ దొంగ మాత్రం యేసు రొట్టెలు పంచినప్పుడు ఆ అద్భుతం చూడలేదు. కుష్ఠిరోగి స్వస్ధపరచటం చూడలేదు. దేవుని దర్శనం చూడలేదు. కాని ఆ చివరి ఘడియల్లో యేసు ప్రేమను చూసాడు. ఆయన దైవత్వాన్ని చూసాడు. ఆయనలో ఉన్న అపారమైన కరుణ, జాలి ఇలా ఎన్నో సద్గుణాలు చూసాడు. యేసును వేడుకున్నాడు.

(i). *యేసును రాజుగ అంగీకరిస్తున్నాడు*
సిలువ మీద కాదు దీనముగా వ్రేలాడుచున్న యేసును ఈ దొంగ చూస్తున్నాడు. సిలువపైనున్న యేసులో మహిమ సింహాసనాన్ని చూస్తునాడు (ప్రకటన 3:21). ఆయన రాజ్యాన్ని కూడ చూడగలుగుచున్నాడు. అది నిత్యరాజ్యమని, పొందిన వారికి తప్ప మరెవరికి అది చెందదని ఆయన రాజుల రాజుగ రాబోవుచున్నాడని గ్రహించాడు.
(దానియేలు 2:44, 7:14,18,27; ప్రకటన 20:11). అలానే ఆయన ముళ్ళ కీరీటంలో ప్రభుని మహిమా కిరీటాన్ని చూస్తున్నాడు (1పేతురు 5:4). తన మహిమ రాజ్యములో సింహాసనా సీనుడైయుండగ పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు అని రాత్రింబగళ్ళు గాన ప్రతి గానాలు చేయవలసిన దూతలు, సెరూపులు, కెరూపులకు బదులుగా దూషకులు, హింసకులు, అల్లరిమూక ఆయన చుట్టుముట్టారు. లేతమొక్కలా ఎండిన భూమిలో మొలసిన మొక్కవలె పెరిగిన యేసు (యెషయా 53:2)
యొక్క నేత్రాలలో రాజఠీవిని, ఆ కళ్ళలో కనికరముతో నిండిన కరుణను పంచి ఇచ్చే జాలిని చూసాడు. అతని హృదయ ద్రవించింది. వెంటనే ప్రార్ధిస్తున్నాడు.

నిజానికి సిలువ దగ్గరున్న అల్లరిమూకలు, ప్రభును ఎగతాళి చేస్తున్నారు. పిలాతు కూడ ప్రభుని నీవు యూదులకు రాజావా? అన్నాడు. ఇలా హేళన చేస్తున్న గుంపును కూడా ఈ దొంగ చూసాడు. కాని యేసులోని కరుణా సముద్రం అతడ్ని ఆకర్షించింది. అతని గుండె చేరువై ఒక్కసారిగా ఓ కేక వేసాడు.
*యేసూ – “నీ రాజ్యముతో వచ్చునప్పుడు అంటున్నాడు. ఈ యూదులు, ప్రధాన యాజకులు యేసు భూమి మీద రాజ్యాన్ని స్ధాపిస్తాడని, రాజకీయంగా వారికి పోటీ అవుతాడని ఇహలోక ఙ్ఞానంతో ఆలోచించారు*
(యోహాను 18:36).
*కాని ఈ దొంగ దేవుని నిత్య రాజ్యాన్ని, శ్రేష్ఠమైన రాజ్యాన్ని చూస్తున్నాడు.*
👉 యెషయా దర్శనంలో దేవుని చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకొనెనని అన్నాడు. (యెషయా 6:1) ఇక్కడ ఆయన అంగీని 4గురు రోమాసైనికులు 4 భాగాలుగ పంచుకున్నారు (యోహాను 19:23). అయితే ఆ ప్రభువు ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగ మహామహిమతో తిరిగి రాబోవుచున్నాడని ఈ దొంగ ఆత్మ ఙ్ఞానంతో ఎరిగియున్నాడు. (1తిమోతీ 6:15). ఇతను యేసును ఎందరి సమక్షంలో ఇంకొక దొంగతో కలసిహేళన, అపహాస్యం చేసాడో, (మార్కు115:32) అలానే వారందరిముందు ఏ మాత్రం సంకోసము లేకుండగ యేసూ (రక్షకా) అని పిలిచి ప్రభును వేడుకుంటున్నాడు. రాబోయే రాజ్యాన్ని గురించి ఆ రాజ్య జీవితాన్ని గురించి ప్రార్ధిస్తున్నాడు.

యేసు రాజులకు రాజని ఆయన రాజ్యపాలన చేయటానికి మరలా వస్తాడని ఆయన రాజ్యము నిత్యమైనదని, ఆయన సింహాసనానికి నీటి న్యాయములు ఆధారములని (కీర్తన 97:2) ఆయన సన్నిధిలో ఘనతాప్రభావములు, బలసౌందర్యములు కలవని ఎరిగినాడు (కీర్తన 96:6). ఇతడు రాబోయే రారాజు రాజ్యమును మరియు రాజులకు రాజుగా మహిమతో రాబోవుచున్న రాజును ప్రభువును ఒప్పుకుంటున్నాడు. ఇతని జీవితానికి యేసే ఇక రాజని ఎరిగినాడు.

(ii). *రెండవ రాకడ కోసం ఎదురుచూస్తున్నాడు*

యేసు జీవితంలో ప్రతీ సంఘటనకు ఓ అద్భుతమైన స్పందన ప్రజలలో మనం చూడగలం. యేసు రాబోయే దినాలలో ఒక రాజ్యం స్ధాపించబోతున్నాడని, ఆ రాజ్యం కోసమే ఈ దొంగ నమ్మి ఎదురు చూస్తున్నాడని గమనించాలి.

*ఆయన సిలువపై పలికిన మొదటి మాట ఆయన ప్రేమను, కరుణాను, క్షమాహృదయాన్ని తెలియజేస్తే,*
*ఈ రెండవ మాట ఆయనను రక్షకుడుగాను, ఆయనలోని కరుణాగుణాన్ని కనుపరస్తుంది.*
అయితే ఈ దొంగ యేసు మరణం చెందుతాడని, మరణాన్ని జయించి లేస్తాడని, పరలోకానికి తండ్రి యొద్దకు కొనుపోబడతాడని, తన స్వరక్తంలో కడగబడి శ్రేష్టమైన గొఱ్ఱెపిల్లగ సిద్దపడబోయే సంఘాన్ని తన తండ్రి యింటికి తీసుకొని పోవటానికి మరలా వస్తాడని, ఒక రాజ్యాన్ని నిర్మిస్తాడని ఎరిగి ఈ విఙ్ఞాపన చేస్తున్నాను
(యోహాను 14:1-3).

3⃣ *వచ్చునప్పుడు*

ఈ మాటలోని ఆంతర్యాన్ని గమనిస్తే ఈ దొంగలో దాగివున్న విశ్వాసము, నిరీక్షణ ఎంత గొప్పవో కనబడుచున్నవి. అసాధ్యమైన పరిస్ధితులలో ఈ దొంగలో ఇట్టి మార్పు చోటుచేసుకున్నది. నిజానికి ఇతడు కూడ దూషకుడే (మార్కు 15:32). కాని అద్భుతమైన కోరిక లేక పరివర్తన అతనిలో జనించింది. *ఇతనిలో అంకురించిన విశ్వాసము అతని ఒప్పుదలను యేసు రక్షకుడనే అంగీకారాన్ని బలపరచి ఇతనిలోని అధ్యాత్మికతను బట్టబయలు చేసింది. ఇది రాకడ విశ్వాసమును చూపిస్తుంది.*
👉 ఈ దినాలలో చాలా మంది క్రైస్తవులలో రాకడ విశ్వాసము కనపడదు. విశ్వాసులం అంటారు కాని నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఇట్టి విశ్వాసులలోను అంతే విశ్వాసముంటుంది.

క్రైస్తవులు రాకడ అంశాన్ని చాలా వివాదానికి గురి చేసారు. రాకడలేదని కొందరు, అయిపోయిందని కొందరు, రాకడ రాదని కొందరు ఇలా వారివారి అభిప్రాయాలతో కాలయాపన చేస్తూ ప్రభువు రాకడ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాని ఈ దొంగ ప్రభు రాకడను గట్టిగ నమ్మాడు. ఆ రాకడకై ఎదురు చూస్తున్నట్టు అతని ప్రార్ధన తెలియజేస్తున్నది. ఇంకకొందరైతే పరలోకంలో వుండే యేసయ్య మానవహృదయంలో జన్మించటమే రెండవ రాకడ అని అంటుంటారు. పైగా వాదిస్తారు కూడ. ఇది ఎంతో ఘోరం.

ప్రియులారా! ఒకసారి ఆలోచించండి. మిమ్మును మీరు పరిశీలించుకోండి. ఇట్టి తప్పుడు అభిప్రాయాలతో దేవుని ఉగ్రతకు గురికావద్దు.

*యేసు వస్తాడు అనేది తధ్యం. ఈ విశ్వసమే దొంగలో మనం చూస్తున్నాము.*

యేసూ, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు” అంటున్నాడు. అనగ ప్రభువు రెండవసారి వస్తాడనే నమ్మకం ఇతనిలో వుంది.
*రాకడ విశ్వాసం కావాలి. సిద్దపడిన పెండ్లికుమార్తె సంఘంవలే “ప్రభువైన యేసూ రమ్ము” అని ప్రార్ధించాలి*
(ప్రకటన 22:20).
👉 అందుకే పౌలుగారు థెస్సలోనికయులకు ఈ రాకడ విషయాన్ని బోధిస్తూ... సజీవులమై నిలచియుండు మనము వారితో కూడ ఏకముగ ప్రభువును ఎదుర్కొనుటను ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడుదము (1ధెస్స 4:17) అన్నాడు.
*చనిపోయిన మన పూర్యికులు (ఈ దొంగతో సహా) అందరు రాకడ విశ్వాసముతోనే చనిపోయారు.*

*ఈ దొంగ లేఖనాలను ఎరిగినాడు. వాటి నేరవేర్పు పట్ల తన విశ్వాసాన్ని కనుపరిచాడు.*
👉 కనుక మానవ జీవితాలలో విశ్వాసము చాలా అవసరమనే విషయాన్ని మనం గమనించాలి.
♻ *యేసు నందు నమ్మకం, విశ్వాసం కనపరచినవారు ఎన్నో దీవెనలు పొందారు. వారిలో కొందరిని గమనించెదము.*

(i). రక్తస్రావ రోగము గల స్త్రీ (మత్తయి 9:22).

(ii). కనాను స్త్రీ విశ్వాసము (మత్తయి 15:28).

(iii). పాపాత్మురాలైన స్త్రీ (లూకా 7:50).

(iv). సమరయ స్త్రీలు (యోహాను 4:42).

కనుక రాకడ విశ్వాసం మనకు కూడ అవసరం. ఈ కడవరి దినాల్లోని మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాము. రాకడను నమ్మి రాకడకొరకు ఎదురు చూడవలసియున్నాము. మనము అనుకొనని ఘడియలో మనష్యు కుమారుడు వచ్చును (24:44) ఆయన మాటలు గతించవు (మత్తయి 24:35). గనుక మనము విశ్వాసము కలిగియున్నామో లేమో మనలను మనమే పరీక్షించుకుందాము (2కొరింధీ 13:5).

(రాజ్యాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానించండి మత్తయి 16:28, లూకా 22:30, 23:42, యోహాను 18:36, ఫిలిప్ 2:10, హెబ్రి1:8, ప్రకటన 11:15; 17:14).

4⃣ *ఙ్ఞాపకము చేసుకో* :

👉ఈ ప్రార్ధన విధేయతతో కూడిన ప్రార్ధనా విన్నపము.
*ఈ సందర్భం మనం వున్న పరిస్ధితుల ప్రభావం ఎంత బలముగా మనలను నిర్వీర్యం చేస్తున్నా, యేసువైపు మన చూపు, గురి వుంటే మన హృదయాన్ని స్పురించగల లేక మీటగల ప్రభువు మాటలు మనలను మరింతగ, ఆత్మీయంగ బలపరచేవై వుంటాయి.*

శ్రమలలో ప్రార్ధించినవారు లేక విఙ్ఞాపన చేసినవారు చాలా మంది బైబిల్ లో వున్నారు వారిని గూర్చి కొన్ని విషయాలు గమనిద్దాము.

(i). పేతురు (మత్తయి 14:31).

(ii). కనాను స్త్రీ (మత్తయి 15:25).

(iii). సమూహములోని ఒకడు (మత్తయి 17:15).

(iv). గ్రుడ్డివారు (మత్తయి 20:30).

(v). బర్తిమయి (మార్కు 10:47).

(vi). 10 మంది కుష్టు రోగులు (లూకా 17:12).

వీరందరూ యేసూ కరుణించుమని లు అని కేకలు వేసి ప్రార్ధించి జవాబు పొందిన వారే!
*శ్రమలో ప్రార్ధించగ జవాబిచ్చుదేవుడు ఈయన.*
శ్రమలలో మనం మొఱ్ఱపెట్టినచో నిజముగ మొఱ్ఱపెట్టినచో ఆయన మన ప్రార్ధన వింటాడు.
(కీర్తన 145:18,19; నిర్గ 3:7; యోబు 34:28; కీర్తన 4:3; 18:6, 34:17; సామెతలు 15:29; మీకా 7:7; జక 10:6).

(i). *ఙ్ఞాపకముంచుకొనుటను గూర్చికొన్ని విషయాలు :-*

భక్తులు ఎందరో ఇట్టి ప్రార్ధన విఙ్ఞాపనలు చేసినట్టుగ పరిశుద్ద గ్రంధంలో మనం చూడగలం.

(a). నెహెమ్యా ప్రార్ధన (నెహెమ్యా 13:31).

(b). దావీదు ప్రార్ధన (కీర్తన 25:6).

(c). కీర్తనకారుని ప్రార్ధన (కీర్తన 106:5).

(d). యిర్మియా ప్రార్ధన (యిర్మీయా 15:15).

(e). సిలువలో దొంగ ప్రార్ధన (లూకా 23:42).

మన దీన ప్రార్ధనలు వినడానికి మన ప్రభువు అన్నీ వేళలలోను సిద్దంగా వుంటాడు. ఆయన సమీపముగ వుండగానే వేడుకోవాలి. అలా వేడుకుంటే ఆయన మనకు దొరుకుతాడు (యెషయా 55:6). వారు వేడుకొనక మునుపే ఆయన ఉత్తరమిస్తానన్నాడు (యెషయా 65:24). ఈ రెండవ దొంగ సిలువలో వ్రేలాడుతున్నాడు. ఉదయం 9గం. ప్రాంతంలో సిలువేసారు. ఎండలో భయంకర వేదన. ఆ ఎండకు నోరు ఎండిపోయి వుండవచ్చు. నాలుక అంగటిలో అంటుకొని వుండవచ్చు. శ్రమలవలన నోరు ఇగిరిపోయి వుండవచ్చు. అట్టి భయంకరమైన వేళ్ళలలో ఈ దీనప్రార్ధన ప్రతిధ్వనించింది *యేసూ... ఙ్ఞాపకముంచుకో అంటున్నాడు.*
👉 ఇది ఎంతో గొప్ప ప్రార్ధన. ఇతను సిలువ మీదనే పరలోకానికి సిద్దపరచబడ్డాడు. అతడు భవిష్యత్తును చూస్తున్నాడు. యేసు రాజ్యాన్ని అనగ ఆయన మహిమ రాజ్యాన్ని ఇప్పుడే సిలువ మీదనే చూస్తున్నాడు. యేసు చెంతనే సిలువలో వ్రేలాడుతూ ఆయన సహవాసాన్ని అనుభవించినట్టు, ఆత్మతో నింపబడినట్టు రాకడ ఘట్టాన్ని చూస్తున్నాడు. ఎంతో ఆశతో ఈ ప్రార్ధన విఙ్ఞాపన వినిపిస్తున్నాడు.

(ii). దేవుడు కొందరిని ఙ్ఞాపకం చేసుకున్నాడు :-
*దేవుని చేత ఙ్ఞాపకం చేసుకోబడిన వారిని కొందరిని గమనించెదము.*

(a). నోవాహును ఙ్ఞాపకము చేసుకొనెను (అది 8:1).

(b). అబ్రాహామును ఙ్ఞాపకము చేసుకొనెను (అది 19:29).

(c). ఇశ్రాయేలీయులను ఙ్ఞాపకము చేసుకొనెను (సంఖ్యా 10:9).

(d). ఇశ్రాయేలు సంతతిని ఙ్ఞాపకము చేసుకొనెను (కీర్తన 98:3).

(e). మనలను ఙ్ఞాపకము చేసుకొనెను (కీర్తన 136:23).

(f). సీయోనును ఙ్ఞాపకము చేసుకొనెను (యెషయా 49:14,15).

మనలను అట్టి నమ్మకమును, విశ్వాసమును కలిగి వినయవిధేయతలతో ప్రార్ధించినచో దేవుని కృపాను సహాయమును వాగ్ధానమును పొందెదము ప్రార్ధించుము.

5⃣ *సిలువలో కుడివైపు దొంగ పలికిన 7 (ఏడు) మాటలు* :-

సిలువలో యేసుతో పాటు వ్రేలాడిన దొంగలలో ఒకడైన కుడివైపు దొంగ ఈ భయంకర సమయంలో కొన్ని అమూల్యమైన మాటలు పలికాడు. వాటిని గైకుంటే మనకు ఏడు మాటలుగా గోచరమగుచున్నవి. అవి ఏవనగా...

1. నీవు అదే శిక్షాలో ఉన్నావు (లూకా 23:40).

2. నీవు దేవునికి భయపడవా (లూకా 23:40).

3. మనకైతే యిది న్యాయమే (లూకా 23:41).

4. ఈయన ఏ తప్పిదమును చేయలేదు (లూకా 23:41).

5. యేసూ (లూకా 23:42).

6. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు (లూకా 23:42).

7. నన్ను ఙ్ఞాపకము చేసుకొనుము (లూకా 23:42).

ప్రియులారా! ఈ అమూల్యమైన, సంపూర్ణమైన మాటలు తనకు రక్షణ భాగ్యమును అనుగ్రహించెను. *సిలువపై యేసు మాట్లాడిన ఏడు మాటలు సర్వమానవాళి పాపక్షమాపణకై ఉద్దేశించినవి* కాగ,
👉కుడివైపు దొంగ సిలువలో పలికిన ఏడు మాటలు (యేసు ద్వారా) తనకు రక్షణ భాగ్యమును అనుగ్రహించెను. ఈ సత్యమును గ్రహించుము మరియు గమనించుము.
*నీకు ప్రభువిచ్చిన సందేశమును, సమయమును సద్వినియోగము చేసుకొనుము ప్రభుని ఆశ్రయించుము. ...✍*

యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(తొమ్మిదవ భాగము)

2⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన రెండవ మాట....✍*
(4వ భాగము)


2⃣ *విమోచన* (PROMISE OF PARADISE) :-

*“....అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”*
లూకా 23:43

♻ *యేసు జవాబు* :

*నేడు నీవు నాతోకూడ పరదైసులో వుందువనెను* (లూకా 23:43).
👉దొంగ ఒప్పుకోలు,
👉అతని హృదయ వేదన,
👉 యేసును రక్షకుడుగ అంగీకరించుట ఇలా ఎన్నో మార్పులు ఈ దొంగ పరివర్తన చెందాడని రుజువు చేయుచున్నవి.
👉ఇతడు రక్షణానుభవం పొందాడు.
👉ఇది ఈ దొంగ యొక్క గొప్ప విశ్వాసము.
*అసాధారణమైన పరిస్ధితులలో ప్రార్ధించాడు. ఇతని సాక్ష్యాన్ని ఎవ్వరు అడ్డుకొనలేకపోయారు.*
👉 ఈ ప్రార్ధనకే యేసు హృదయం కరిగింది, అతని నేత్రాలు ఈ దొంగను కనికరంతో చూసాయి.
*వెంటనే ప్రభువు వాగ్ధానం చేసాడు నేడు నీవు నాతో కూడ పరదైసులో వుందువని నిశ్చయముగా చెప్పుచున్నాననెను.*
👉 ఈ మాటలోని లేక వాగ్ధానములోని భావమును మర్మములను ధ్యానము చేయుదము.

1⃣ *నేడు* -

*నేడు* అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు ఈ పాపియైన దొంగ ఆక్రందన విన్నాడు. అతని విఙ్ఞాపనకు చెవియెగ్గాడు. అతని ప్రార్ధనకు వెంటనే జవాబు ఇచ్చాడు. ఆ వరుసలోనే “నేడు” అనే మాట వాడబడింది
👉 ఇది దేవుని మాటలోని నమ్మకత్వాన్ని, సత్యాన్ని బయలుపరుస్తుంది మన దేవుడు బ్రమపరచేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. అబద్దమాడువాడుకాదు. (1కొరింధీ 1:9; సంఖ్యా 23:19).
👉రక్షణ క్రియ నేడే మానవ హృదయంలో జరగాలి అని బోధించిన దేవుడు ఆరోజే (నేడే / TODAY IS THE DAY OF SALVATION) సిలువపైనున్న దొంగను రక్షించెను.

ప్రియులారా!
👉మన పితరులు ప్రభువు మాటను విని నిర్లక్ష్యం చేసారు.
👉 దేవునికి కోపం పుట్టించారు.
*కనుక మనము మన హృదయాలను కఠిపరచుకొనకుండగనేడే ఆ ప్రియుని స్వరమునకులోబడి ఆయనను అంగీకరించవలసియున్నాము*
(హెబ్రి 3:8).
👉గనుక పాపము వలన కలుగు భ్రమవలన మనలో ఎవరును కఠిన పరచబడకుందునట్లు నేడు అను సమయముండగానే... మనకున్న ధృఢ విశ్వాసమును అంతకంతకు బలపరచుకుంటూ ఆయనలో పాలివారమైయుండాలి (హెబ్రి 3:13-15).

రేపుకాదు ప్రియులారా!
*“రేపు అను మాటకు రూపులేదు”* అంటారు.
🔹 ఎందుకంటే గతించిపోయిన (రేపు) దినము మనలో ఎన్నటికిని రాదు గనక. దేవుని వాక్యం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము అని బోధిస్తుంది (2కొరింధీ 6:2).
🔹మరణము చెందిన పిదప రక్షణలేదు. తీర్పు మాత్రం వుంది. రక్షణ వ్యక్తిగతమైనది (SALVATION IS PERSONAL AND INDIVIDUAL).
👉ఈ తరుణము చేజారిపోతే మరొక తరుణం రాదు గనుక సిలువలో దొంగ తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మనుష్యులు ఒక్కసారే మృతిపొందురని ఆ తరువాత తీర్పు జరుగునని గమనించుము (హెబ్రి 9:27).

*“నేడే”* అని తెలియజేయబడిన కొన్ని అంశములు పరిశుద్ధ గ్రంధంలో నుండి చూసెదము.

(i). *నేడు శుభవర్తమానము గల దినము* (2రాజులు 7:9).

(ii). *నేడు దేవుని మాట అంగీకరిస్తే మేలు* (కీర్తన 95:7).

(iii). *నేడు రక్షకుడు జన్మించెను* (లూకా 2:11).

(iv). *నేడు నీ యింటికి రక్షణవచ్చెను* (లూకా 19:9).

(v). *దేవునితో నేడే సమాధానపడుము* (లూకా 19:42).

(vi). *నేడే రక్షణ దినము* (2కొరింధీ 6:2).

(vii). *నేడే అనుకూల సమయం* (2కొరింధీ 6:2).

(viii). *నేడే బుద్ధి తెప్పుకొనుడి* (హెబ్రి 3:15).

ప్రియులారా! యేసు దొంగతో “నేడే” పరదైసులో వుంటావు అని వాగ్ధానం చేసాడు. యేసయ్య మనకు నిరంతర యాజకుడు (హెబ్రి 5:6). ఈ యాజక ధర్మాన్ని బట్టి ప్రభువు ఇట్టి వాగ్ధానం చేస్తున్నాడు. మన కొరకు తండ్రి కుడిపార్శమున వుండి ప్రార్ధిస్తున్నాడు.
*నేరస్ధులలో ఒకడైన ఈ దొంగ ఆ నేరములో నుండి ప్రత్యేకించబడ్డాడు*
(2కొరింధీ 6:18).

👉అందుకే యేసు నేడు నీవు నాతో కూడ పరదైసులో వుంటావు అంటున్నాడు.

ప్రియచదువరీ!
*నీవును జీవితంలో యేసును కలిగి ఆయనను నేడే అంగీకరించవలసియున్నావు అని గ్రహించుము.*

*నీ హృదయంలో అట్టి మార్పు జరిగినట్లయిన దేవునికి స్తోత్రము.*
👉 లేనట్లయితే వెంటనే ఈ message చదువుతుండగానే యేసును స్వీకరించి పశ్చాత్తాపముతో ప్రార్ధించుము. రక్షణానుభవం పొందుము.

2⃣ *నీవు* -

👉ఈ మాట రక్షణ వ్యక్తిగతమైనదనియు అది పొందిన వారికే చెందునని, ఇది ప్రతివ్యక్తిలో జరగాలని దేవుని ఉద్దేశం (Salvation is Personal).
*ఎవరు రక్షణ పొందితే వారే ఈ రక్షణానందాన్ని పొందగలరు.*
👉 అందులో వున్న ఆత్మీయ దీవెనలు కూడ పొందుకొందురు.
*క్రైస్తవ కుటుంబములో జన్మిస్తే రక్షణ దానంతట అదిరాదు. నీలో నూతన క్రియ జరగాలి. నీ హృదయంలో యేసు జన్మించుట ద్వారా ఈ పరివర్తన కలుగును.*
👉 పుట్టుకతో ప్రతీవాడు పాపియే అని గమనించాలి. అబ్రాహాము మా తండ్రి అని యూదులు అనుకున్నారు. కాని వారికి అబ్రహామును బట్టి పరలోకం దొరకలేదు. పుట్టికతోనే మానవుడు పాపి. పాపములోనే పుట్టాడు (కీర్తన 51:5). గనుక నూతన జన్మ అవసరం (యోహాను 3:3).
*ఇది వ్యక్తిగతమైనది. ఎవరి పాపములు క్షమించబడితే వారే రక్షించబడుదురు.*
👉 కనుక రక్షణ గంపులో కలిగినను, అది వ్యక్తిగతమైనదై వుండాలి.
*అందుకే యేసయ్య ఈ దొంగతో నీవు అని వ్యక్తిగతమైన క్రియను గూర్చి మాట్లాడుతున్నాడు. ఇతనిలో కలిగిన రక్షణ నిశ్చయమైనది. విశ్వసించిన వెంటనే రక్షణ జరుగుతుంది. అందుకే యేసయ్య నేడే అని చెప్పెను* (అపో. 16:30-31)

3⃣ *నాతో కూడ*-

👉నాతో కూడ అనే ఈ మాటను మనం లోతుగ గమనించాలి.
*ఇది దేవుని సహవాసాన్ని ఙ్ఞాపకం చేస్తుంది.*
దేవుని నివాసము మనుష్యులతో కూడ వున్నది అది గమనించాలి (ప్రక 21:3). *నాతోకూడ అనుటలో దైవ సహవాసము కనబడుచున్నది. ఇది రక్షణ ఫలితము. యేసును అంగీకరించినవారికి ఆయనతో సహవాసము దొరకును.*
👉 ఆయన పిల్లలగులకు అధికారము దొరుకును. మరియు తండ్రితో కుమారత్వము దొరుకును (యోహాను 1:12).

(i). ఆయనతో ఉండుటలో మనకు *“బద్రత”* వున్నది *(SECURITY AND SAFETY)* :

ఆయనతో ఆయనలో ఉన్నట్లయిన మనకు ఎలాంటి తొందరవుండదు. భయమువుండదు. ఆయనే మనలను జీవజలముల బుగ్గయొద్దకు నడిపించును (ప్రకటన 7:17). మరికొన్ని సత్యములు గమనించుదము.

(a). తండ్రియందు నిలచి వుండుట (1యోహాను 2:24).

(b). కుమారునియందును నిలచివుండుట (1యోహాను 2:24).

(c). తండ్రి చేతిలో వుండుట (యోహాను 10:29).

(d). దేవుడు సంఘమునకు తోడైవుండుట (ప్రకటన 21:3).

(e). యేసులో నిలచి వుండుట (యోహాను 15:5).

(f). దేవునియందు నిలచివుండుట (యోహాను 15:4).

(g). యేసను వెంబడించుట (యోహాను 12:26).

(h). సిద్ధపరచిన స్ధలములో ప్రవేశించుట (యోహాను 14:3).

(i). తండ్రితో కూడ ఉండుట (యోహాను 17:24).

(j). ప్రభువు నొద్ద నివసించుట (2కొరింధీ 5:8).

(k). క్రీస్తుతో కూడ వుండుట (ఫిలిప్ 1:23).

(l). సదాకాలము ప్రభుతో వుండుట (1థెస్స 4:17).

పైనా వివరించిన ఆత్మీయ అనుభవముల ద్వారా ఆయనతో కూడ వున్నందు వలన మనకు సంరక్షణ, బద్రత లేక క్షేమకరమైన స్ధితి కలిగియుందుము.
*ఇలా ఎవరైతే ఆయనతో కూడ వుంటారో వారు ఆయనతో కలసి విందులో పాలుపొందుదురు*
(ప్రకటన 3:20).
👉విందు ఆయన సహవాసమును లేక ప్రభువుతో కూడ జీవించు జీవిత విధానాన్ని తెలియజేయుచున్నది.

దూతలు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు అని మానక రాత్రింబగళ్ళు (ఆయన సన్నిధిలో వుండి ఆయన సహవాసమును పొందుకుంటూ) గాన ప్రతిగానములు చేయుచున్నవి. ఇది ఆయనతో కూడ వుండుటను తెలియ చేయుచున్నది (యెషయా 6:3; ప్రకటన 4:8; 5:12-14). ఇది కూడ దేవుని సహవాసాన్ని మరియు ఆత్మీయ కాపుదలను చూచిస్తుంది. అంత మాత్రమే కాదు వారు రాత్రింబగలు ఆయనతో కూడ ఆయన సన్నిధిలో వుండి ఆయన ఆలయములో ప్రభుని సేవించువారైయున్నారు. ఆయన తానే తన గుడారము వారి మీద కప్పును (ప్రకటన 7:15). ఆది అపోస్తలులు యేసుతో కూడ వున్నవారు అని గుర్తించబడిరి (అపో. 4:13). అలానే మన పూర్వికులైన హనోకు, నోవహులు దేవునితో నడచిరి (అది 5:22; 6:9). వీరు దేవునితో కూడ సహవాసము చేసిరి.
కనుక
*ఆయనతో ఆయన సహవాసములో జీవించుట ద్వారా*
🔹 నీ జీవితంలో దేవుని ఉద్దేశమును,
🔹ఆయన చిత్తమును గుర్తెరిగి ఆయన కొరకు జీవించుము.
🔹 నీ పిలుపును నీ ఏర్పాటును గుర్తెరుగుము. నిన్ను పిలిచిన పిలుపును చూడుము.
🔹ఈ పరుగు రంగములో ఓపికతో బహుమానము పొందునట్లుగ పరుగెత్తి బహుమానము పొందుము (1పేతురు 3:9; 1కొరింధీ1:26; ఫిలి 3:13,14; 1కొరింధీ9:24; 2తిమోతీ4:8).

4⃣ *పరదైసులో వుందువు*

👉 రక్షించబడిన వారు చేరుకొనే స్ధలమని, యేసు ప్రభువు వలననే పరదైసు ప్రవేశం ప్రాప్తించును
👉పరదైసు అనే పదం “పారశీక” భాషా పదమనియు;
👉 పరదైసు అనగ ఓ అందమైన పూలతోటని, ఉద్యానవనమని దానిలో ఎవరూ ప్రవేశించకుండ తను ఇష్టపడు వారిని మాత్రమే ప్రవేశింపజేయు స్ధలమని అంటారు.
👉ఇది ఊర్ధ్వలోకమున ఒక భాగమనియు, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు రెండవ రాకడ వరకు వీరుండు స్ధలము పరదైసు అని అంటారు. పరదైసు పరలోకములో ఒక భాగమని, యేసు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులు అనుగ్రహించెనని, ఆరోహణమాయెను అనగా ఆయన భూమి క్రింద భాగమునకు దిగెనని, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునైయున్నాడు అని (ఎఫెసీ 4:8-10).

*పరదైసు ద్వారము ఈ దొంగ కొరకు తెరువబడెను.*
👉 మరణం తరువాత విశ్వాసికి దొరికేది పరదైసు. అక్కడ నరకయాతన గాని, పాపముగాని వుండవు. అంతవరకు పాపములో వున్న దొంగ తనలో జరిగిన మార్పును బట్టి ప్రభువును వేడుకొనక *“నీవు నాతో కూడ”* పరదైసులో వుందువు అనిన క్షణమే పరిశుద్దాత్మతో దొంగ నింపబడుట ద్వారా అతడు తీర్పులోనికి తేబడక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు (యోహాను 5:24).

కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు (రోమా 8:1). ఉదయకాలంలో శ్రమలో, సిలువపై వున్న ఈ దొంగ యేసును ప్రార్ధించిన తోడనే పరదైసులో ప్రవేశించెను. ఇంతవరకు నరకపాత్రుడు. కాని ఇప్పుడు పరలోక వాసియాయెను.

*మరణ శిక్షకు పాత్రుడై సిలువపై ఆ శిక్షను అనుభవించునట్లుగ వ్రేలాడదీయబడగ*
🔹 అతడు యేసును అంగీకరించుట ద్వారా
🔹 ఆయనను ప్రార్ధించుట ద్వారా,
🔹యేసూ అని నోరారా పిలచి ఆయనను తన సొంత రక్షకుడుగా తన హృదయములోనికి ఆహ్వానించుట ద్వారా
🔹 ఇతనిలో నూతన క్రియజరిగెను.
*వెంటనే ఇతడు జీవములోనికి దాటియున్నాడు*
(1యోహాను 3:14).
*ఇతడు (ఈ దొంగ) అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలపొంది, దేవుని యొక్క రాజ్యవాసి యాయెను.*
👉 ఆ కుమారునియందు మనకు విమోచన మరియు పాపక్షమాపణ కలుగుచున్నవి (కొలసి 1:13,14)...
*చీకటిలో నుండి వెలుగులోనికిని,*
*సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరుగుట ద్వారా, విశ్వాసము ద్వారా పాపక్షమాపణ మరియు పరిశుద్ద పరచబడిన వారిలో స్వాస్ధ్యము కలుగునని ఎరుగుము*
(అపో.26:18).

యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించు అని చేసిన ప్రార్ధన ఫలితాన్ని యేసయ్య సిలువలోని కుడివైపు దొంగ మారుమనస్సు పొందుట ద్వారా చూస్తున్నాడు. “నీవు నాతోకూడ పరదైసులో వుందువు” అనేమాట ద్వారా పరలోకములో దొరుకు దివ్యానందాన్ని ఆయనే తెలియజేయుచున్నాడు.

*క్రీస్తువున్న చోట ఎంతో ఆనందము సంతోషము కలుగును.*
👉అట్టి ఆనంద సంతోషములు దొరుకు స్ధలమే పరలోకము లేక పరదైసు, గనుక క్రీస్తే ఆ పరదైసు అనుగ్రహించుము గాక!

సహోదరుడా! సహోదరీ! *సిలువను ఆశ్రయించినచో, సిలువ మ్రానుపై వేలాడిన పరమ రక్షకుడైన యేసును చేరినచో అంతా సంతోషమే.*
👉 ఎందుకంటే యేసు సమస్త దుర్నీతి నుండి మనలను పరిత్రులుగా చేయు శక్తి గలవాడు గనుక (1పేతురు 1:9). అందుకే ఈ దొంగకు సంతోషం మరియు పరదైసును దొరికెను.


*ముగింపు* -

👉సిలువలోని కుడివైపు దొంగవలే సత్యాన్ని గ్రహించి,
👉 మారుమనస్సు అనుభవం కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించవలసియున్నావని ఎరిగి జీవించుము. *దైవాశీర్వాదము పొందుకొనుము.*
👉 ఈ దొంగవలె నీకున్న చక్కటి అవకాశమును వినియోగించుకొని ప్రభువును ఒప్పుకొని,
👉ఆయనలో నూతనముగ జన్మించి,
👉ఆయన నిరంతరము నిన్ను కాయుననియు,
👉జయించు వారిని నిత్యము నడిపించు ప్రభువని నమ్మి సకాలాశీర్వాదములు పొందుకొనుము. *సమయమును పోనియ్యక ఙ్ఞానము కలిగి జీవించుము* (ఎఫెసీ 5:15).
*“సిలువను గూర్చిన వార్త నశించువారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి”*
(1కొరింధీ 1:18) అని గమనించి ప్రార్ధించుము. పరదైసును పొందుకొనుము.ఆమేన్.



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(పదవ భాగము)

2⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన మూడవ మాట...✍*
(మొదటి భాగము)


3⃣ *విధేయత (BEHOLD THY SON)*
*“....ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి – అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను”*
(యోహాను19:26,27).

👉 ఇది మూడవ మాట. యేసు సిలువ చెంత ఆయన తల్లియైన మరియ, క్లోపా భార్యాయైన మరియ, మగ్దలేనే మరియ, తల్లి మరియ సహోదరి నిలిచివున్నారు.
*తల్లి యేసు పెదవుల ద్వారా వస్తున్న ప్రతీమాటను ఆమె ఎంతో భారముతో, వేదనతో, శ్రద్దాభక్తులతో వింటుంది.*
👉 ఈమె సిలువకు సమీపముగ వున్నందున యేసు అనుభవించుచున్న ఆ భయంకర యాతన ఈమె చూస్తూనే వుంది.
*యేసు పాదాలలో దిగగొట్టిన ఆ సూది మేకు ఆ తల్లి హృదయంలో దిగబడినట్లున్నది.*
*ఆయన వీపును చీరిన కొరడాదెబ్బలు ఆమె హృదయాన్ని చీల్చినట్లున్నవి.*
*లోక రక్షకుడైన యేసును ఈమె భూమి మీదకు తెచ్చినప్పుడు పడిన ప్రసవవేదన కన్నా ఈ వేదన ఎక్కువనే గమనించాలి.*
👉 ఇట్టి స్ధితిలో ఆమె హృదయవేదన వర్ణనాతీతము. తల్లిగ ఆమెకు యేసు మీద నున్న ప్రేమ తరుగనిది.

👉యేసయ్యకు శ్రమలు అనుభవించటం క్రొత్తేమీ కాదు. *అలానే తల్లియైన మరియకు కూడ శ్రమలు, వేదనలు తెలియనివి కావు.*
👉 గాబ్రియేలు దూత దర్శనములో కనబడి ఆమెతో మాట్లాడిన దినము మొదలుకొని ఎన్నో శ్రమలు ఆమె అనుభవించింది. *పెళ్ళికాక ముందే ఈమె తల్లి అయిత్యంది. ఈ దీనస్ధితిని ఈ లోకంలో ఎవరు గ్రహించగలరు. ఆమె ఎంత మనోవేదన పొందివుండినదో మనకు తెలియదు.*
👉 ఈమె దైవ చిత్తానికి లోబడిన విధానాన్ని చూస్తే ఒళ్ళు జలదరించి పోతుంది. అందుకు మరియ *“ఇదిగో ప్రభువు దాసురాలను; నీమాట చొప్పున నాకు జరుగునుగాక” అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్లెను*
(లూకా 1:38).
👉ఈ విధేయత ఎంత గొప్పదో గమనించుము.

*ఆ సమయంలో దేవుని మాట నిరర్ధకం కాదు అనే సత్యాన్ని ఈమె ఎరిగి దేవుని మాటకు లోబడింది. ఇంతలో యేసేపు మరియ గర్భవతి అని ఎరిగి ఈమెను రహస్యముగా విడిచివేయాలని ఆలోచించటం కూడ ఈమెను గుండె కోత కలిగించి వుంటుంది.*
👉 ఇలా పెండ్లి కాకుండా గర్భవతులైన వారిపట్ల ఇరుగు పొరుగు వారి మాటలు ఎంత భయంకరమో మనకు తెలుసు. ఇవన్నీ తనలో తాను దిగమింగు కొని దైవ చిత్త నెరవేర్చు కొరకు కనిపెట్టింది. *లోకుల మాటలు భరించలేకనో బంధుత్వముతోనో గాని మరియ ఎలిజబెత్తు దగ్గరకెళ్ళి ఇంచుమించు మూడు నెలలు గడిపింది.*
👉 సరే యేసు జన్మించనే జన్మించాడు, ఇంతలో హేరోదు పసిబాలుని చంపటానికి ప్రయత్నం,
*నెలల పిల్లవాడిని తీసుకొని సుదీర్ఘ ప్రమాణం, దేశంకాని దేశంలో సంవత్సరాల తరబడి వుండవలసిరావటం. ఇలా వేదన అంటే మరియకేమి క్రొత్త కాదు.*

👉 యేసును గూర్చి సుమెయోను మాట్లాడుచు వీరిని దీవించి.
*ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి యున్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను*
(లూకా 2:34,35).

👉పాపుల రక్షకుడైన యేసుకు దైవ సంకల్పము ప్రకారము జన్మనిచ్చిన తల్లి హృదయంలో ఖడ్గమును గూర్చిన ప్రవచనం ఇది.
*ఒక్కసారిగా ఖడ్గం హృదయములోకి దూసుకొని పోతే ఒక్కసారిగా మరణం చెందవచ్చు. కానీ ఈమె పొందుచున్న వేదన చిత్రవధతో కూడుకున్నది. ఈ వేదన ప్రాణం తియ్యదు. నెమ్మదిగా వుండ నియ్యదు. ఈమె సిలువ చెంతనే వుంది. సిలువ మీద కుమారుడైన యేసు అనుభవించుచున్న వేదన, చుట్టూ వున్నవారు చేస్తున్న అపహాస్యం ఈమెకు గుండె కోట కలిగిస్తున్నాయి. కడుపు తరుక్క పోతుంది. ఇల్లంటి కడుపుకోత ఎవరు భరించగలరు.*

👉 తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తున్న బాలయేసును ఎంత అల్లరు ముద్దుగా ఆమె పెంచినదో ఒక్కసారి తల పోసుకుంటూ
*ఆ చిన్నారి పాదాలు ఇప్పుడు భయంకర కొయ్యకు ఎలా సూదిమేకులతో బిగించబడినవో,*
*తాను అనురాగముతో తనివితీరా ముద్దాడిన ఆ చిన్నారి చేతులు ఎంత కర్కసంగా ఆ సిలువ మ్రానుకు దిగగొట్టబడినవో,*

*తండ్రియైన యోసేపు పనిలో వున్నప్పుడు తండ్రికి చిన్న చిన్న పనులలో సహాయం చేసి, అలసిపోయి చెమటలు కార్చుకుంటూ తన దగ్గరకు వస్తే ఎంతగానో మురిసిపోయి తన పైబట్టతో ఆ చెమట బిందులు తుడిచి ఆనందించినదో కాని ఇప్పుడు ఆ ప్రభుని ముఖము నిండుగా రక్తధారలు ప్రవహించి చెమటతో మిళితమై ఆరిపోయిన రక్తధారలతో బెరడు కట్టినట్లున్న ఆయన ముఖారవిందమును చూచి ఆ తల్లి హృదయం ఎంత శోకంతో నిండిపోయిందో గమనించుము.*

*యేసును గూర్చిన ప్రవచన సారాంశం*

*యేసయ్య దేవునితో సమానముగా వుండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు గాని తనను తాను రిక్తునిగా చేసికొని మన కొరకు భూమి మీదకు దిగి వచ్చాడు*
(ఫిలి 2:6-9).
👉అలాంటి పరలోకమునకును భూమికిని మధ్యలో యేసయ్య వ్రేలాడుచున్నడు. ఇవన్నీ సిలువకు దగ్గరగా వుండి చూస్తున్న మరియ ప్రవచనాలను నెమరు వేసుకొని వుంటుంది.
*ప్రవచనాలను ధ్యానించండి.*

(i). దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు. (లూకా 2:28) భయపడకు దేవుని వలన కృప పొందితివి, నీకు పుట్టబోయె కుమారుడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. దావీదు సింహాసన మియ్యబడును. అతని రాజ్యము అంతము లేనిదై యుండునని చెప్పెను (లూకా 2:30,32,33).

(ii). తూర్పు దేశపు ఙ్ఞానులు కూడ ఈయన యూదుల రాజని ఆరాధించి కానుకలిచ్చి వెళ్ళిరి (మత్తయి 2:2; 10:11).

(iii). నీతిమంతుడును, భక్తిపరుడైన సుమెయోను – నీవు అన్యజనులకు వెలుగైయున్నావు. ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకు లేచుటకు గురుతు (లూకా 2:34,35) అన్నాడు.

(iv). ఈయన యెరూషలేము విమోచకూడని అన్న ప్రవక్తి అన్నది (లూకా 2:38).

(v). బాప్తిస్మమిచ్చు యోహాను నాకంటే గొప్పవాడు నా వెనుక వస్తున్నాడు. అతని చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాననెను (మత్తయి 3:11).

(vi). మట్టలాదివరము రోజున ప్రజలంతా జనసమూహమంతా హోసన్నా జయము, జయము అని స్తుతి గానాలు ఆలపించినారు (మత్తయి 21:9).

*ఇంతగా ఈయనను గూర్చి అద్భుతమైన ప్రవచనాలు వున్నాయి గదా?*
👉 ఏమి ఈ అన్యాయము, ఏమిటి ఈ విచిత్రమని ఆమె హృదయ వేదనను ఆమె లోలోపలే అనుభవిస్తున్నది.

యేసేపు (వృద్ధి)తో ప్రధానం, గబ్రియేలు దూత (దేవుని బలము) సందేశం, పరిశుద్ధాత్మని శక్తితో గర్భధారణం, ఎలిజబెత్ (దైవ ప్రమాణం) దగ్గరకు ప్రయాణం, బేత్లేహేముకు నజరేతు నుండి గమనం, తదుపరి లేఖనాల ప్రకారం యేసు జననం, పరలోక సైన్య సమూహపు స్తుతిగానం, గొర్రెల కాపారుల సందర్శనం, తూర్పు దేశపు ఙ్ఞానులు అర్పణ గీతం, శిశువుతో యెరూషలేముకు తిరిగి ప్రయాణం, సుమెయోను (ఆదరణ) ప్రవచనం, అన్న ప్రార్ధనా పరురాలుతో పరిచయం, హేరోదు విధించిన ఖడ్గ శాసనం, యేసు బాలుడుగా పెరిగిన విధానం, ఇలా ఎన్నో సంగతులు మరియ హృదయంలో మెదులాడుతూనే వున్నాయి. *ఎన్నో ఆపూర్వ అనుభవాలు ఈమె హృదయపు లోతులలో ముసురు కుంటుంటే గుండె భారంతో నిండిపోయింది. భర్తతో ఈ వేదన పంచుకొందామంటే భర్త లేడు మరణించాడు. విధవగా, సిలువ చెంత నిలిచివుంది. ఇక కుమారుడైన యేసు చనిపోతే ఈమె అనాధగ ఉండవలసినదే.*

👉 సిలువ దగ్గర ఉన్న నలుగురు స్త్రీలు,
*శిష్యుడైన యోహాను తప్ప స్నేహితులుగాని,* శిష్యులుగానిలేరు.

👉ఆయన రొట్టెలు పంచగా తిన్నవారుగాని, ఆయన స్వస్ధపరచగా శుద్దులైన వారుగాని, ఆయనను గృహములో చేర్చుకుని దీవించబడిన వారు గాని ఎవరూ ఆ సిలువ దగ్గరగా లేరు.

*జాతి యావత్తు ఆ ప్రాణప్రియుని ద్వేషించింది. కాని తల్లి మాత్రం సమీపముగా వుంది.*
👉 ఆమె హృదయం కోతను ఎవరు వర్ణించగలరు. ఆ హృదయ లోతులలో రగులుతున్న ఆక్రందన ధ్వని ఎవరు చూడగలరు?
👉ఆమె గొండెలు అదురునట్లు బాదుకొంటూ ఆమె శోకాన్ని వేదనను కనపరచలేదు.
*ఇంత ఘోరం కళ్ళముందే జరుగుతున్నా, తన కుమారుడు తన కళ్ళముందే చిత్రవధకు గురవుతున్న ఆమె నోరు తెరచి ఒక్కమాట కూడ అన్నట్లు సువార్తలలో ఎక్కడ ప్రస్తావనకు రాలేదు.*

👉 ప్రియులారా! హృదయ లోతుల్లో ఈ వేదన ఆమెను తోలుస్తూనే వుంది.
*ఎక్కువ లోతులోనున్న నీళ్ళు చాలా ప్రశాంతముగా, కదలకుండగా నెమ్మదిగా వుంటాయి. పైజలాలు గాలికి కదులునుగాని లోతులోని నీళ్ళు నిమ్మళంగా వుంటాయి. అటులనే మరియ హృదయలోతులలో నున్న వేదనను ఆమె లోలోపలనే దిగమింగుతూ వుంది.*

🔹సిలువ దృశ్యం చూస్తున్న మరియ హృదయంలో బాలయేసు జీవితం స్పురించి వుంటుంది.
🔹ఆయన బోధలు,
🔹 ఆలయంలో ఆయన లేఖన పఠన,
🔹ఆయన చేసిన అద్భుతములు,
🔹చెప్పిన ఉపమానాలు,
🔹 కానా పెండ్లిలోని కొరత తీర్చటం,
🔹లాజరును సమాధి నుండి లేపటం,
🔹పగలు మందిరములో, రాత్రి ఒలీవ కొండలో చేసిన ప్రార్ధన ఇలా ఎన్నో విషయాలు హృదయంలో మెదులుతూనే వున్నాయి.

*గుండెలు పిండే ఈ ఘోర దృశ్యాం చూచి ఆమె సృహతప్పి నెలకూలలేదు. గుండె దిటవు చేసుకొని ఆమె అక్కడనే సిలువకు దగ్గరనే నిలచివుంది.*
👉 సిలువను దానిపై నున్న తన ప్రియకుమారుని, ఆ సిలువకు బిగించిన ఆయన చేతులను, కాళ్ళను ఆరిపోయిన ఆయన పెదాలను, రక్తపు తేరులైన ఆయన శరీరం ఎండకు, గాలికి ఆరిపోగా ఆ విదారకమైన ముఖవర్చసును
*లేత మొక్కవలె పెరిగినను సొగసైనను, సురూపమైన లేనివాడుగ, తృణీకరించబడిన*
(యెషయా 53:2)

👉ఆయనను చూస్తూ దుఃఖాన్ని తనలోనే దిగమింగు కుంటూ ఆ దయామయుని దీనత్వానికి మురిసిపోతునే ఆమె దుఃఖాన్ని ఆపుకుంటుంది. కాని లోలోపల విలసిస్తుంది.

👉 సిలువ చుట్టూ అపహాసకులు, హింసకులు, దూషకులు ఇలా ఎందరో వున్నారు. వీరంతా వీరి హృదయ స్ధితిని బట్టి ప్రభుని గేలిచేస్తూ హేళనచేస్తూనే వున్నారు.
*వీరి ప్రవర్తన, మాట, వీరి ఆలోచన విధానం మానవులుగా లేదు మృగాల్లావున్నారు.*
👉 ఆయనకు ఆదరణ కలిగే మాటలు పలుకువారే లేరక్కడ. ఆయన మానవుడుగా శ్రమలు అనుభవించుచున్నాడు. ఈయన శత్రువుల చేతికి అప్పగించబడెను. జన సందోహము అల్లరిమూకలా ప్రభువును అనేక విధములుగా దూషించుచుండగ ఆయన చెంతనే
*ఓ చిన్న గుంపు (4 స్త్రీలు + యోహాను) నిశ్శబ్దముగ లోలోపల వేదనచెందుచు నిలచివున్నది.*
👉 ఈ చిన్న గుంపు యేసును ఎక్కువగా ప్రేమించినవారు. అయితే వీరు ముందు సిలువను దూరము నుండి వెంబడించారు (మార్కు 15:40).
*కాని నెమ్మదిగా ఇప్పుడు సిలువ చెంత, దగ్గరగా వున్నారు.*

🔹 దాదాపుగా మూడున్నారా (3 ½) సం.లు ఆయనతో సేవలో పాలు పొందిన శిష్యుడు యోహాను ఆయన సిలువ దగ్గరగా వుండి ఆయన పొందుచున్న మహావేదన చూస్తునాడు గాని మిగిలిన శిష్యులు ఒక్కరు కూడ లేరక్కడ.
🔹వాక్యమును లోతుగా చూచినట్లయిన స్త్రీలు ఎవరూ ప్రభువును నిందించినట్లుగాని, క్రీస్తు విరోధులతో ఏకీభవించి ఆయనను అపహసించినట్లుగాని మనకు కనపడదు.
*కాని ఇద్దరు పనికత్తెలు మాత్రము పేతురును నిందించిరి.*

*స్త్రీల పరిచర్యను గమనించండి.*

(i). స్త్రీలు ఎంతో భక్తి శ్రద్దలతో ప్రభువుకు ఉపచారము చేసిరి (లూకా 8:3).

(ii). పిలాతు భార్య కూడ యేసును నీతిమంతుడు అని సంబోధించి, ఆయన సిర్ధోషత్వమును గూర్చి తన భర్తను హెచ్చరించినది (మత్తయి 27:19).

(iii). ఇంకొక స్త్రీ ఆయన మరణమును గుర్తు చేస్తూ ఆయనను అచ్చజటామాంసి అత్తరుతో అభిషేకించినది (యోహాను 12:3-7).

(iv). స్త్రీలు సిలువకు సమీపముగా వున్నారు. ప్రభువు వేదనను కళ్ళారా దగ్గరగా వుండి చూస్తున్నారు (యోహాను 19:25).

(v). ఎందరో స్త్రీలు యేసును గూర్చి రొమ్ముకొట్టుకుంటూ ఆయనను వెంబడించిరి (లూకా 23:27).

(vi). సమాధి యొద్దకు స్త్రీలు చేరి పునరుత్ధానుడైన యేసును చూచుటకుగాను ముందుగా వెళ్ళిరి (మత్తయి 28:1).

(vii). పునరుత్ధాన వర్తమానము తన శిష్యులకు తెలియజేయమని పంపబడినది స్త్రీయే.

(viii). మానవుని యొక్క పతనములో కూడ స్త్రీ తన పాత్రతాను నిర్వర్తించింది (అది 3:4).

(ix). *పైన చెప్పిన అనేక విషయములలో స్త్రీ తన పాత్ర నిర్వర్తించినది గాని; సిలువకు సమీపముగా వున్నను యేసయ్య అవమానకరమైన క్రూరమైన మరణములో మాత్రము స్త్రీలు పాలుపొందలేదు.*

👉శరీర రీతిగ స్త్రీ ఎంత బలహీనమైనదో ప్రేమలో అంత బలమైనది.
*దైవ సంబంధమైన ప్రేమ అంకురించే విషయములోను పురుషులకన్న స్త్రీల హృదయమే బలమైనది.*
👉 శిష్యులు ఎవరి మార్గమున వారు వెళ్ళిపోయారు. కాని నలుగురు స్త్రీలు, ఒక శిష్యుడు మాత్రము సిలువ వరకు వెంబడించిరి.
*ఈ స్త్రీలు అబలలే అయిన వారు బలవంతులు అని రుజువు చేసారు.*

ప్రియులారా! నేటి మన సంఘాలలో, ఇజ్జీవ సభలలో, ప్రత్యేక కూడికలలో, గృహ కూడికలలో కూడ స్త్రీలు భాగము పురుషుల కన్న ఎక్కువగానే వుంటుంది. ఒక వేళ సంఘస్ధాపనలో పురుషులు ముందున్న వాటిని ఆత్మీయమైన వాటిగా అలంకరించి నడిపించుటకు కావలసిన ఆత్మీయ తోట్పాటులో స్త్రీలు ప్రముఖ పాత్ర పోషించుచున్నారు.

*సిలువపైన క్రీస్తు, సిలువ క్రింద (సమీపముగ) ఓ చిన్న గుంపు.*
🔹 ఈ చిన్న గుంపు ప్రభుని శ్రమలు సహించలేని వారిగా వున్నారు గాని
*సిలువనున్న యేసునాధుని హృదయానికి వీరిని చూస్తున్నంత సేపు ఎంతో అదరణ కలిగి వుండవచ్చు.*
🔹 ఆయనను అందరూ విడిచివెళ్ళిపోయారు. కుడివైపున ఎడమపైపున వుండాలని ఆశించిన శిష్యులు కూడ ఇక్కడ లేరు.
*అందుకే ఆయన నేనుత్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగులేరనెను*
(మార్కు 10:37-40).
🔹ఇంత ప్రాముఖ్యాన్ని పొందాలని ఆసించిన వారుకూడ ఈ భయంకర సమయములో లేరు.
*నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను మాత్రము నిన్ను గూర్చి అభ్యంతర పడనని చెప్పిన పేతురు కూడ సిలువ చెంతలేడు*
(మత్తయి 26:33).

*సిలువ చెంతనున్న చిన్న మందను (గుంపును) చూచి ఆయన ఎంతగ బలపరచబడ్డాడో, ఆదరించబడ్డాడో వివరింపలేని అద్భుతమైన విషయము.


యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(పదకొండవ భాగము)

1⃣1⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన మూడవ మాట...✍*
(2వ భాగము)


3⃣ *విధేయత (BEHOLD THY SON)*
*“....ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి – అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను”*
(యోహాను19:26,27).

♻ *అమ్మా! ఇదిగో నీ కుమారుడు*

సిలువ చుట్టూ కూడివున్న వారంతా ఏదేదో మాట్లాడుచు, యేసును నిందిస్తూ, దూషిస్తూ ఆ ప్రాంతమంతా ఎంతో గోలగ వున్నది.
*ఇంతలో యేసయ్య తడారిపోయిన పెదవులు కదిలాయి. ఆయన ఏమిమాట్లాడుచున్నాడో అని అందరు ఆసక్తితో చూచివుండవచ్చు. తల్లియైన మరియ కూడ ఎంతో ఆశతో చూచి వుంటుంది. ఆయన తన తల్లిని చూచి. అమ్మా! ఇదిగో నీ కుమారుడు అన్నాడు.*

👉 భయంకర సిలువ భరిస్తూ కూడ యేసయ్య ఇతరులను గూర్చే ఎక్కువగా ఆలోచించాడు.
👉ఆయన పలికిన *“7”*
👉మాటలలో 3 మాటలు ఇతరుల కొరకే వారి శ్రేయస్సు కొరకే మాట్లాడాడు.

🔹 *మొదటిది* తనను క్రూరంగా చిత్రవధకు గురిచేసి, సిలువ వేసిన జనాంగము యొక్క రక్ష కోసం తండ్రికి విఙ్ఞాపన చేసాడు.

🔹 *రెండవది* సిలువపై చనిపోతున్న దొంగ ప్రార్ధించగా వానికి పరదైసును గూర్చిన వాగ్ధానం చేసాడు.

🔹 *మూడవది* తనకు దగ్గరగ సిలువ చెంతనే నిలిచున్న తల్లి క్షేమార్ధం మాట్లాడుచున్నాడు.

👉 తెలుగు తర్జుమాలో మరియను *“అమ్మా”* అని సంబోధించినట్లు వ్రాయబడింది.
*నిజానికి మూలభాషయైన గ్రీకులో మాత్రం గైనై (GYNAI) అని వ్రాయబడింది.*
*గైనై* అనగ స్త్రీ అని అర్ధము. దీనిని గూర్చి ఇంగ్లీషు బైబిల్ లో *“WOMAN”* అని వ్రాయబడింది.

👉యోహాను సువార్తలో ప్రసావించిన కానా వివాహములో *“అమ్మా”* అనే పదము కూడ ఇంగ్లీషులో WOMAN అనే తర్జుమా చేయబడింది (యోహాను 2:4). *దీనిని బట్టి తర్జుమా తప్పు అని చెప్పడం కాదుకాని దీనిలో దాగివున్న భావాన్ని మనం గ్రహించాలి.*

🔺 *సువార్తలలో యేసయ్య మరియతో మాట్లాడిన సందర్భాలు నాలుగే నాలుగు.*
🔺 ఆ నాలుగు చోట్ల అమ్మా అని తెలుగులో వున్నా ఇంగ్లీషులో ఓ స్త్రీ (WOMAN) అనే వ్రాయబడెను.

(a). *కానాలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు* (యోహాను 2:4).

(b). *పస్కాపండుగ సందర్భములో* (లూకా 2:43).

(c). *వాక్యమును అనుసరించి జీవించు విధము* (లూకా 8:19,21).

(d). *సిలువలో పలికిన మూడవ మాట* (యోహాను 19:26).

పై సందర్భములాన్నిటిలోను స్త్రీ (WOMAN) అనే భావమే మనము చూడగలము
*ఇక మరియ కూడ యేసును రక్షకునిగాను, దేవుని గాను సంబోధించుచున్నది.*

(a). *నా ఆత్మ ప్రభువును ఘనపరచుచున్నది* (లూకా 1:46).

(b). *నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించెను* (లూకా 1:48).

👉పైన ఉదహరించిన విధముగా మరియను తల్లిగా ప్రభువు గౌరవించినను, *ఆత్మీయముగా ఆమెను స్త్రీ గానే చూచెను.*
👉 మరియకూడ యేసును ప్రభువుగాను, రక్షకునిగాను, దేవుని గాను అంగీకరించెను.

1⃣ *“అమ్మా”* :

అని యేసయ్య పిలచిన పిలుపును బట్టి
*ఆయన అంతిమ శ్రమలోవున్న, భయంకర వేదన అనుభవిస్తున్నా తన తల్లిని మరువలేదు అని గమనించాలి.*
👉 అమ్మ అనే పదం ఎంతో కమనీయమైనది. ఎంతో తియ్యనిది. మమతానురాగాల మూట తల్లి. అమ్మా అనే పదం లేక శబ్దం సార్వత్రికతను సంపాదించినది. ప్రపంచంలో ఏ బాష వారైన అమ్మా (మమ్మా, మా మామ్ మొ..) అనిపిలువలసినదే. భావాన్ని లోతుగా ఆలోచించండి

ప్రియులారా! భాష ఏదైన భావము ఒక్కటే. ఏ పెదాలు ఈ పదాన్ని ఉచ్చరించిన, ఎవరి పెదాల మీద ఈ మాట కదిలిన వారి వారి గుండెల్లో, హృదయాంతరంగాలలో మెదిలేది మాత్రం అమ్మే.

*“అమ్మ”* అనురాగానికి, ఆప్యాయతకు మరో పేరు. నీకు జన్మనిచ్చిన నాటి నుండి ఎన్నో విధాలుగా *“అమ్మ”* నీ జీవితంలో ఆమె భాధ్యతను నెరవేర్చుతూనే వుంది. అమ్మ తన భాద్యతను ఏనాడు విస్మరించదు.

(i). నీ ఆకలి చూచి నీకు పాలిచ్చి నీ ఆకలి తీర్చేది అమ్మ.

(ii). నీవు కలత చెంది కన్నీరు కార్చితే నిన్ను ఎత్తుకొని, గుండెల కద్దుకొని నిన్ను నిదురింపజేసేది అమ్మ.

(iii). నిన్ను ఊయలలో పరుండ జేసి, దానిని వూపి నీవు కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తూ ఆడుకుంటూ వుంటే నిన్ను చూచి పరవసించిపోయి తన సంతోషాన్ని నీతో పంచుకొనటానికి నిన్ను ముద్దాడేది అమ్మే.

(iv). నీవు ఆకలితో వున్నప్పుడు నీవు భోజనము చేయటానికి మారాం చేస్తుంటే తనకే ఆకలేస్తున్నంతగా నిన్ను లాలాంచి, కధలు చెప్పి నీకు గోరు ముద్దలు తినిపించేది అమ్మే!

(v) నీవు అనారోగ్యముతో పడివున్నప్పుడు నిన్ను కంటికి రెప్పలా చూస్తూ నీకు సమయాను కూలముగా పరిచర్య చేసేది అమ్మే.

(vi) తనకున్న లేకున్న నీకడుపు చూచి, నీ ఆకలి తీర్చేది అమ్మే.

(vii). నీవు విసర్జించిన మలమూత్రాదులను శుభ్రము చేసి నిన్ను ఆరోగ్యముగా వుంచేది అమ్మే.

(viii). నీ కొరకు ప్రార్ధించేది, నిన్ను దేవుని సన్నిధిలోపెంచేది అమ్మే!

(ix). నీ కొరకు ఎన్నికష్టములైన భరించేది, వహించేది అమ్మే.

(x). నిన్ను ఒంటరిగా విడువక అన్నీ వేళ్ళలలోను నిన్ను కనిపెట్టి నీ అవసరములన్నీ తీర్చుచూ చూచుకొనేది అమ్మే!

*ఇలా అమ్మ మమతాను రాగాలను గూర్చి వ్రాసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం వ్రాసుకోవచ్చు.*

👉 కాని ప్రియులారా! తల్లి స్ధానాన్ని మరువకూడదు. తల్లి తనయుల బాంధవ్యం చాలా గొప్పది. అమ్మ లేనిలోటు ఎవరూ తీర్చలేరు.
👉గృహములో ఎవరు చనిపోయిన సర్ధుకోగల మేమోగాని తల్లి చనిపోతే ఆలోటు తీరనిది పూడ్చలేనిది. *ఒకాయన అంటాడు “దేవుడు ప్రతీయింట్లోను ఒక దూతను ఉంచక ఒక అమ్మను ఉంచాడని,*
ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది.
*అమ్మలేని గృహము చీకటిమయం. గనుక అమ్మ చూపిన ప్రేమకు ప్రతిస్పందించక పోతే ఆ కుమారుడు కుమారుడే కాదు. ఆ తల్లి ప్రేమకు సంతృప్తి ఉండదు.*

2⃣ *యేసయ్య చూపిన మాదిరి*

👉 యేసయ్య లోకరక్షకుడు, సర్వమానవాళి పాపపరిహారకుడు. అయితే యేసయ్య తన తల్లికి కూడ రక్షకుడు మరియు సంరక్షకుడైయున్నాడు.
*ఆయన తన తల్లిని మరువలేదు. తన భాధ్యతతో కూడ యేసయ్య పరిపూర్ణుడు*
(మత్తయి 5:48).
👉ఆయన తన కున్న భాంధవ్యాన్ని మరువలేదు, విడువలేదు. తన భాద్యతను విడువలేదు. దగ్గరే వుండి రోధిస్తున్న తల్లివైపు యేసయ్య చూచి ఆమెకు ఒక ఏర్పాటు చేసినట్లు చెప్పతున్నాడు. *(యోసేపు మరణించినందున యోహానుకు యేసయ్య తనతల్లిని చూసుకొనే బాధ్యతను అప్పగించినట్లు గమనింపుము)*.

👉 మరియను గూర్చిన ప్రవచనం మనం చూస్తే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. అన్నీ తరముల వారు నిన్ను ధన్యురాలందరు (లూకా 1:49). అని ఎలిజబెతు చెప్పటం జరిగింది. కాని ఇక్కడ ఈమె జీవితము విషాదకరమాయెను. సిలువకు సమీపములో వున్న తల్లి తనను ఏ విధముగ (బాల్యము నుంచి అందరి తల్లులు లాగే) నవమాసాలు మోసి, ఎంతో వేదన సహించి, వర్ణించ నలవికాని విషపుజ్వాల లాంటి లోకుల మాటలు, దూషకుల దూషణ వాక్కులు సహించ లేని హృదయ వేదనతో నిండివున్న తల్లి మనోభావాలు ఎరిగిన తనయుడు ఆమెను చూసాడు.

🔹 గతాన్ని తలపోసుకుంటూ శోకంతో నిండిన వదనంతో, సిలువ ఎదుట దీనముగా, విషాద శిల్పంలాగ నిలబడి వుండగ
(యోహాను 19:26). *మరియను చూసాడు. ఆ చూపులో చెప్ప లేనంత కరుణ*
(మత్తయి 9:37; 14:14).
*ఆ చూపులో ప్రేమ*
(మార్కు 10:21),
*అనురాగం, ఆప్యాయత, జాలి వున్నాయి. సిలువపై నుండి కుమారుని మాటల కొరకు ఎదురుచూస్తున్న తల్లి ముఖంలో ఆనందం వికసించింది.*
👉 భర్తను కోల్పోయింది గనుక ఆమె భాధ్యత తన కుమారుని మీదనే వున్నది. ఇక కొన్ని ఘడియలలో కుమారుడు కూడ సిలువపై మరణించబోవు చున్నాడు. ఇక ఈమెకు దిక్కు ఎవరు? ఆదరించువారెవరు? ఈమెకు ఇక ఎవరు అండగ నిలబడగలరు? ఆమె హృదయంలో ఇలా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు మెదులుతూనే వుండవచ్చు.

🔹 ఇట్టి విషాదకరమైన సమయంలో కుమారుని హృదయంలో వున్న ప్రేమ పురివిప్పింది.
*సిలువలోని కల్వరి నాధుని ప్రేమ ఒక్కసారిగా గొంతు తెరచింది.*
🔹 అమ్మా! అనే పిలుపు ఈ హృదయాన్ని పులకరింపజేసింది.
🔹 ఈ మాటలు ఆమె హృదయాన్ని ఒకసారిగా మీటినట్లయ్యింది.
🔹 ఆనందజల్లులు వర్షించినట్లుంది.
🔹ఆయన ముఖము రక్తసికమై వుండగ ఆ సుకుమార ముఖారవిందాన్ని ఆమె చూచింది.
*నాయనా ఇంకా మాట్లాడు అంటున్నట్లు ఆప్యాయతగా చూస్తుందా తల్లి. ఆయన ప్రేమతో కూడిన పలకరింపు విని ఎన్నాళ్ళయ్యిందో.*
🔹 చివరిసారిగా వీరిరువురు ఎప్పుడు మాట్లాడుకున్నారో? ఏమో?

*వీరిద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కేవలం మూడేమూడు మనకు పరిశుద్ద గ్రంధములో కనబడతాయి*
(యోహాను 2:4; లూకా 2:48-50); యోహాను 19:26). *కాని ఇక్కడ అమ్మ మౌనమే ప్రతిస్పందనగా వున్నది.*
🔹 కుమారుని మధురమైన స్వరాన్ని విన్న తల్లి మానవ ఙ్ఞానానికి అందనంత ఆనందాన్ని చవిచూసి వుండవచ్చు. అదే తల్లి ప్రేమ.

3⃣ *తల్లి దండ్రులపట్ల పిల్లల భాధ్యత*

👉ఇది పిల్లలకున్న భాద్యతను గుర్తు చేస్తున్నది.
*యేసయ్య మనకు చూపిన మాదిరి.*
👉 యేసు తనకు జమానిచ్చిన తల్లిని మరువకపోవటం. మనము గుర్తుంచుకోవలసి యున్నాము.

ప్రియులారా! ఒకటి గమనించండి. మనము ఈ లోకములో చిన్న బిడ్డలుగా వున్నప్పుడు మనలను తల్లి దండ్రులు అల్లారు ముద్దుగా, ఎంతో ప్రేమతో పెంచగా
🔹మనం పెద్దవాళ్ళమయ్యాము.
🔹 అయితే కొందరు ప్రయోజకులుగాను దేవుని యందు భయభక్తులు గలవారుగాను ఎదిగి ఫలించుచున్నారు
(యెషయా 1:2; కీర్తన 92:12)
🔹 మరి కొందరు దేవుని వాక్యమును గ్రహించ లేని వారుగాను తిరుగుబాటు దారులుగాను ఎదుగుచున్నారు (యెషయా 1:2).
*ఎవరైన తల్లిదండ్రులు పట్ల వారి భాద్యత మరువకూడదు.*

👉 ఇప్పుడు మనలను ముద్దుగా పెంచిన తలిదండ్రులు వృద్దులయ్యారు. *వీరికి చిన్న పిల్లల మనస్తత్వము వస్తుంది.*
👉 మనము ఇప్పుడు వారిని ప్రేమగా చూసుకోవాలి.
👉చిన్న పిల్లలుగా వారిని ఎంచి పెంచవలసియున్నాము.

*వృద్ధాప్యము రెండవ బాల్యదశ ప్రియులారా!*
👉 కొందరు తమ తల్లిదండ్రుల పట్ల కనపరచు తీరు భాదాకరముగా నుండును. *వారిని ఏ మాత్రము వీరు ప్రేమించరు. వారి భాద్యతను గుర్తించరు.*
👉 ఏ స్ధానానైన్న భర్తి చేయగలరేమో గాని అమ్మ మరణిస్తే ఆ స్ధానాన్ని ఎవరూ పూడ్చలేరు.
*గనుక నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించిన ఎడల దీవించబడెదవు.*

(a). *“దీర్ఘాయుషు”* దొరుకును (నిర్గ 20:12)

🔸 దేవుని వాగ్ధానములతో కూడిన మొదటి ఆఙ్ఞ – నీవు దీర్ఘాయుస్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము (నిర్గ 20:12).
🔸 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండిడి. ఇది ధర్మమే. నీకు మేలుకలుగునట్లు నీ తల్లి సన్నానింపుము. ఇది వాగ్ధానముతో కూడిన మొదటి ఆఙ్ఞ (ఎఫెసి 6:1-3).

ప్రియులారా!
*ఈ ఆఙ్ఞను, ప్రభువు నియమించిన ధర్మమని ఎరుగుము.*
👉 ఈ ధర్మమును యేసయ్య సిలువలో వుండి కూడ తన భాద్యతగా ఎరిగి తల్లి క్షేమాన్ని కోరి ఈ మాట మాట్లాడుచున్నాడు.
*తల్లి దండ్రులను గౌరవించడం ధర్మశాస్త్ర బోధయైయున్నది.*
👉 ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చువాడుగా ఈ లోకానికి వచ్చెను.
*ఇది యేసయ్య చూపిన మాదిరి.*
👉 ఈ వాగ్ధానములో మేలు దాగివున్నది. ఎంతో భయంకర శ్రమలో వుండి యేసయ్య తన భాద్యతను గుర్తించాడు.
*కాని మనలో ఎందరో ఈ విషయాన్ని విస్మరించుచున్నారు.*
👉 వారు కలిగివున్నది కొంచెమే అయినను ఎంతో గర్వాన్ని సంపాదించుకొనుము. రాకడ గుర్తులలో *“తల్లిదండ్రులకు అవిధేయులు”* అనే గుర్తు ఒకటి (2తిమోతీ 3:2).
👉కనుక అవిధేయులుగా వుండక (రోమా 1:28-31) *యేసయ్య బోధలను ఆయన చూపిన మాదిరిని కలిగి జీవించుము.*

చెమటోడ్చి, కష్టించి పోషించిన తల్లిదండ్రులను దూషించేవారు, ద్వేషించేవారు, దూరపర్చేవారు ఎందరో వున్నారు. వీరిని విధులలోనికి ఈడ్చి వేసేవారువున్నారు. వీరందరు రాకడ గుర్తులలో ఒకరిగా వుండియున్నారు.

ప్రియులారా! యేసయ్య ఇంచుమించు 30 సం.రాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఈయన దైవ సందేశాన్ని మరువరాదు. అందుకే సోలోమోను సామెతలలో అంటాడు – *నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము*
(సామెతలు 23:22).
*నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచుము* (సామెతలు 23:24,25).

ప్రియులారా! తల్లిదండ్రులను దూషించక వారిని ప్రేమించవలెను. ద్వేషించువారిని దేవుడు శిక్షించును. కనుక తల్లిదండ్రులకు విధేయులై జీవించుటయు వృద్దాప్యములో వారిని ఆడుకొనుటయు మన కర్తవ్యమును మరియు మన భాద్యతయునైయున్నది.
*తన తండ్రినైనను, తల్లినైనను ద్వేషించువారి దీపము కారు చీకటిలో ఆరిపోవును*
(సామెతలు 20:20).
వీరు తుదవరకు జీవించరు మధ్యలోనే తమ ప్రాణమును పోగొట్టుకొందురు. కనుక మీ దీపము (ప్రాణము) ఆరిపోకుండగ వుండు నిమిత్తము దేవుని వాక్యమును గమనించుము. *దీర్ఘాయుషుగల వానివై జీవించుము. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దాని తినును*
(సామెతలు 30:17)
*తమ తండ్రిని శపించుచూ తల్లిని దీవించని తరము కలదు*
(సామెతలు 30:11).

ప్రియులారా! ఒక్కింత హృదయ పూర్వకముగ ఈ మాటలు ధ్యానించండి. భయంకర పరిస్ధితులు మీకు రాకుండగ జీవించుడి. యేసు సిలువలో చూపిన మాదిరిని చూపించండి. నీ తల్లి దండ్రుల పట్ల నీ బాధ్యతను గుర్తెరుగుము. తద్వారా దొరుకు ఆత్మీయ మేలులన్ని సంపాదించుకొనుము. నిజానికి మీ తల్లి దండ్రులను ప్రేమించండని, వారిని బాగుగా భాద్యతతలో చూడండి అని చెప్పడమే సిగ్గుచేటు. ఇలాంటి వారినుద్దేశించి యేసయ్య (మార్కు 7:11,12) వచనాలలో ఓ భయంకరమైన సత్యాన్ని చెప్పాడు. ఇది ఎంత భయంకరమో గమనించండి. *ఎవడైన తన స్వకీయులను విశేషముగా తన యింటివారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును*
(1 తిమోతీ 5:8).
విశ్వాసులైన (పిల్లలారా) వారలారా! ఈ సత్యాన్ని గమనించండి. జాగ్రత్తగా జీవించండి.

(b). *సన్మానము అనగ లోబడుట అని అర్ధము* :
👉 దీనిలో చాలా భావాలు ఇమిడియున్నవి.
🔹చిన్నగావున్నప్పుడు లోబడాలి.
🔹ఎదిగిన తరువాత భాద్యత కలిగి జీవించాలి. మరియు తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో చూచుకొనుట మరువకూడనివి. యేసయ్య బాల్యంలో తన తండ్రి పనులలో సహాయం చేసాడు. తల్లిని కూడ ప్రేమించి, విధేయుడై ఆరాధనలో పాలుపొందాడు.
*తల్లి తనయుల బాంధవ్యము ఎంతో గొప్పదని యేసయ్య పలికిన ఈ మాటలు రుజువు చేయుచున్నవి.*

తల్లిదండ్రులను సన్మానించే విషయంలో అనగ ప్రేమించే విషయంలో కొందరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.
🔹 వృద్దులైన తల్లిదండ్రులను సంపన్నులైతే వృద్దాశ్రయంలో (HOME FOR THE AGED) పడేస్తారు.
🔹 కొందరయితే చదువు లేని తల్లిదండ్రుల నుద్దేశించి తమ పనిమనుష్యులు అని అంటుంటారు.
🔹మరికొందరు బిక్షగాళ్ళకు వేసినట్టు ఒక ముద్ద పారేస్తారు.

*ప్రియులారా! నీ స్ధితి (నీ విషయం) పరిశుద్ద వాక్యముల వెలుగులో పరీక్షించుకొమ్ము!*

4⃣ *కృతఙ్ఞత చూపిన యేసు* :

ఇకకొన్ని ఘడియలలో యేసు మరణించబోవుచున్నాడు. పరమునకు వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది. తండ్రి యింటిలో వున్న నివాసములు తన ప్రియుల కొరకు సిద్దం చేసి మరలా వస్తాను అని ముందుగానే తన శిష్యులకు బోధించాడు (యోహాను 14:1-3). ఈ మాటలు యేసయ్య హృదిలో మెదిలాడుచున్నవి. ఆయన షుడియవచ్చినది.
*కనుక ఇక తల్లి అనాధగా వుండ కూడదని ఆయన ఆలోచన. తన తల్లి బాల్యము నుండి ఎన్నో శ్రమలకోర్చి లేఖన నెరవేర్పులో తన భాగమును ఆమె ఏవిధముగ నెరవేర్చునో అటులనే యేసు కూడ లేఖన సారమును ఎరిగి తన బాధ్యతను నిర్వర్తించుచున్నాడు.*
👉 ఈమె యేసును పెంచే సమయంలో ఎన్ని శ్రమలు పొందినదో అన్నీ ఎరిగిన యేసు ఈ ఏర్పాటు చేసి తన కృతఙ్ఞతను చూపుచున్నాడని గుర్తించుము.

మరియ యేసు మరణం తరువాత తన స్ధితి ఏమిటో ఆలోచించుకోక ముందే యేసు ఈ విషయాన్ని ఆలోచించటం ఎంతో శ్రేష్ఠమైన ఏర్పాటు. మరియ పొందిన అవమానములు దూషణలు, ఎదుర్కొనె గడ్డు పరిస్ధితులు, పసిబాలునితో మైళ్ళకొలది ప్రయాణం చేయటం, హేరోదు క్రూరత్వపు ఏర్పాట్ల నుండి తప్పించబడటం ఇలా ఎన్నో విధాలుగ ఆమె పొందిన శ్రమలన్నిటిలో దేవుడు తోడుగా వుండి (లూకా 1:28) ఆయన వాగ్ధానమును నెరవేర్చుకొని యున్నాడు. *ఇప్పుడు యేసయ్య తన తల్లిని గూర్చి ఆలోచన కలిగినవాడై ఆమెను యోహానుకు అప్పగించుచున్నాడు.*
👉 ఈ ఏర్పాటు దైవ ఏర్పాటుగా జరిగెను. మరియ యేసయ్య తల్లిగా ప్రేమించాడు. తల్లి ఋణమును ఈ విధముగ కృతఙ్ఞతతో తీర్చుకొనుచున్నాడు.

కనుక ప్రియులారా!
*మీరును మీ తల్లిదండ్రుల పట్ల కృతఙ్ఞతా భావము గలవారై వారిని ప్రేమించి వారికి ఏ కొదువలేకుండగ మీ బాధ్యతను ఎరిగి జీవించవలసి యున్నారు. అని గుర్తుంచుకొనుము. ప్రభువు మిమ్ము దీవించుగాక ! ఆమేన్.*



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(పన్నెండవ భాగము)

1⃣2⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన మూడవ మాట...✍*
(3వ భాగము)


3⃣ *విధేయత (BEHOLD THY SON)*
*“....ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి – అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను”*
(యోహాను19:26,27).
♻ *అమ్మా! ఇదిగో నీ కుమారుడు*

♻ *ఇదిగో నీ తల్లి*
(యోహాను 19:27)

👉 యేసయ్య సిలువలో మాట్లాడిన మూడవ మాటలో ఇంకొక బాధ్యతను చూస్తున్నాము.
*తన (పిల్లలకు) బిడ్డలకు ఏది అవసరమో మన దేవునికి తెలుసు.*
👉 మన అవసరములన్నిటిని తీర్చువాడు. అడిగే ప్రతీది మనకు అనుగ్రహించువాడు (మత్తయి 7:7; 18:19,20; యోహాను 14:12).

మనము వేడుకొనకమునుపే ఆయన మనకు అనుగ్రహించును
(యెషయా 65:24; 1యోహాను 5:14).

మన అవసరములన్నియు ఆయనే చూచుకొనును. *ఇస్సాకు తన తండ్రిని – నా తండ్రీ... కట్టెలును, నిప్పును ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా "దేవుడే చూసుకొనుననెను". అందుకే ఆ స్ధలానికి “యెహోవా యీరే” అని పేరు పెట్టెను* (అది 22:7,8;13).

ప్రియులారా!
🔹మనకు ఏది అవసరమో మన దేవునికి తెలుసు.
🔹 ఆయనే మనకు అన్నీ అనుగ్రహించును.
🔹ఆయనే అన్నీ ఏర్పరచును.

*సిలువ మీద వ్రేలాడుచున్న యేసు హృదయాలు ఎరిగినవాడు, పరిశోధించువాడు గనుక ఆయన తల్లికి ఏది అవసరమో అది అనుగ్రహించెను.*
👉 అంత వేదనలోను కూడ ఆయన మనలను మరువ లేదు. “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండ మరచునా? నేను నిన్ను మరువను (యెషయా 49:15).
కనుక *యేసు ఈ ఆత్మీయ బాధ్యతను ఎరిగి తాను మిక్కిలిగా ప్రేమించిన శిష్యునికి (యోహానుకు తన తల్లిని అప్పగించుచున్నాడు.*

యేసు అన్నీ ఎరిగినవాడు. ఆయన ప్రేమించినవాడు ఆయన రొమ్మున ఆనుకున్నవాడు యోహాను (యోహాను 21:20)
*సిలువ మ్రానుపై యేసయ్యను బంధించగానే శిష్యులు అందరు ఆయనను విడిచి పారిపోయారు. కానీ యోహాను సిలువ చెంతనే యేసుకు దగ్గరగా వున్నాడు*
(యోహాను 19:26,27).

ఆ రోజు క్రైస్తవుల పరిస్ధితి చాలా భయంకరముగా నున్నది. చలిమంట కాచుకొనుచున్న వారితో *పేతురు* చలి కాచుకొను చుండగా అక్కడున్నవారు పేతురు దగ్గరకు వచ్చి – నిజమే నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్ను వట్టి సాక్ష్యామిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
*ఆ మనుష్యుని నేనెరుగనని పేతురు బొంకెను*
(మత్తయి 26:73,74).
👉దీనిని బట్టి పరిస్ధితి గమనించుము.
*అట్టి శ్రమలలో కూడ యోహాను ధైర్యముగ యేసును వెంబడించెను. సిలువకు దగ్గరే నిలబడెను. యోహాను తన ప్రాణమును లెక్కచేయక అక్కడనే వుండి ప్రభువు పొందుచున్న సిలువ వేదనను చూచుచున్నాడు.*

యేసు పరిచర్యలో పాలు పొందిన వారి సంఖ్యను గురించి ఆలోచించినచో

1. మొదటగా – 5000 మంది (మార్కు 6:43)
2. రెండవదిగా – 500 మంది (1కొరింధీ 15:6)
3. మూడవదిగా – 120 మేడగదిలో (ఆపో 1:15)
4. నాల్గవదిగా – 70 మంది (లూకా 10:1)
5. ఐదవదిగా – 12 మంది (మత్తయి 10:1)
6. ఆరవదిగా – 1 ఒక్కడే (యోహాను 19:26)

*ఈ యోహానుకు పరమార్ద జ్ఞానియనె పేరు పెట్టబడింది.*
👉 ప్రకటన గ్రంధమర్మాలు పరిశుద్ధాత్ముడే చెప్పి వ్రాయించాడు.
*యేసయ్యకు సన్నిహితంగా, ఆయన సన్నిధానంలో వుండి రొమ్మున అనుకుని ఆయనలో దాగివున్న మర్మాలను రహస్య విషయాలను ఆస్వాదించగ, ఇప్పుడు ముఖ్యమైన బాధ్యతలు ఈవులు కూడ దేవుడు యోహానుకు అనుగ్రహించెను.*
కనుక ప్రియులారా!
👉ఈ గ్రంధమును చదువుచున్న ప్రియ చదువరులారా! మీరును యోహానువలే ఆయన రొమ్మున అనుకొని దైవ జ్ఞాన సముపార్జన చేసుకొని మరిన్ని దీవెనలు పొందుకొనవలెననియు, ఆయన అప్పగించిన పనిలో నమ్మకముగ జీవించాలని కోరుకొనుచున్నాను.

🔹యోహానుకు ఈ బాధ్యతను అప్పగించటంలో యేసు యొక్క వివేకం బయలు పడుతుంది. మరియు
🔹 యోహాను మీద ఈయనకున్న నమ్మకం కూడ కనపడుచున్నది. ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చించబడి ప్రసిద్దుడై మహాఘనుడుగా ఎంచబడును (యెషయా 52:13). అని దేవుడు యేసును గూర్చి ముందుగానే తెలియజేసెను. యేసు జీవితంలో తల్లియైన మరియ తప్ప మరెవరూ ఇంతకాలం ఆయనతో ఉన్నవారు లేరు. అయితే యోహాను తప్ప తన తల్లిని అప్పగించటానికి తగిన వాళ్ళు కూడ లేరు. యోహాను మహాజ్ఞాని.
*ప్రభువు యొక్క ప్రేమను ఆకళింపుచేసుకున్నవాడు ఒక యోహానే!*
👉 ఈ ఇద్దరి క్షేమాన్ని యేసయ్య కోరుకున్నాడు.

♻ *యోహాను ధన్యుడు*

యేసు సిలువ కొయ్యపై వ్రేలాడుచుండగ ఆయనకు ఓదార్పు కరువయ్యింది.
🔸 ఆయనను దావీదు కుమారుడా! నన్ను కరుణించు అంటూ పిలిచే వాళ్ళు లేరు.
🔸 ఆయనతో ఎంతో నమ్మకముతో సేవలో పాలుపంచుకున్న శిష్యులు కూడ ఆయనతో లేరు.
*ఆయన ఏకాకిగా మిగిలిపోయిన ఈ భయంకర తరుణంలో ఆయనతో వున్న యోహాను ధన్యుడు.*

గెత్సమనే తోటలో ప్రార్ధించుచున్నపుడే ప్రభువు వీరి నిజస్ధితిని గుర్తించాడు. రానున్న భయంకర శ్రమలను గూర్చి ముందుగానే బోధించాడు. నన్ను గూర్చి మీరంతా అభ్యంతర పడతారు అనికూడ యేసయ్య చెప్పాడు. పేతురు నేను నీతో చనిపోవటానికైనా సిద్ధమే అన్నాడు కాని యేసయ్య మాటే నిజమయ్యింది. ఆత్మ సిద్దమేగాని శరీరం బలహీనం అని ఆయనకు తెలుసు (మత్తయి 26:31; 26:35; యోహాను 18:19,20).

యేసు ఈ సిలువ భారాన్ని ఒంటరిగా మోయటం దేవుని చిత్తం గనుక, అతని నాలుగ గొట్టుటకు యోహోవాకు ఇష్టమాయెను
(యెషయా 53:10).
*పాపాన్ని అసహ్యించుకొనే దేవుడు పాపభారాన్ని యేసు మీద వుంచి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొఱ్ఱెపిల్లగ యేసును ఎంచి ఒంటరిగానే సిలువమీద వుండునట్లుగ ఏర్పాటు చేసెను* (యోహాను 1:29).

*యోహాను యేసు స్ధానాన్ని తీసుకున్నాడు.*
ప్రియులారా!
*మీ వ్యక్తిగత జీవితాలలో యేసు స్ధానమును నీవు తీసుకోవటానికి సిద్దంగావున్నారా? పరీక్షించుకో నీ కుటుంబములో, సంఘములో, సువార్తసేవలో, ఇంకా పరిచర్యలో ఆయా స్ధానాలలో నీ పాత్ర ఏమిటి?*

(i). యూదుల రక్షణకై *“ఎస్తేరు”* రాణి అయ్యింది.

(ii). లోకాన్ని రక్షించాలని *“యేసయ్య”* లోక రక్షకుడుగా జన్మించాడు.

(iii). ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యములో నుండి విడిపించటానికి, కానానుకు, నడిపించటానికి *“మోషే, అహారోనులు”* నాయకులయ్యారు.

(iv). నీనెవె పట్టణ వాసుల రక్షణకు *“యోనా”* బోధకుడయ్యాడు.

(v). సిలువను గూర్చిన వార్తను ప్రకటించడానికి *“పౌలు”* అపోస్తలుడైనాడు.

(vi). మరియకు *“యోహాను”* సంరక్షకుడైనాడు.

(vii). మరి *“నీ స్ధానము ఏమిటి”. నీవు ఏమి చేయబోవుచున్నావు? ప్రశ్నించుకో!*

♻ *మూడవ మాటలోని ఆత్మీయ భావము*

ఈ మూడవ మాటలోని ఆత్మీయ భావాన్ని గ్రహించినట్లయిన ఎంతో లోతైన విషయము తెలియజేయబడుచున్నది. ఇందులో ముఖ్యముగా
1⃣ తల్లి,
2⃣యోహాను,
3⃣ఇల్లు మనకు కనబడుచున్నవి.

1⃣ *తల్లి* :-

👉ఆత్మీయ భావాన్ని చూస్తే *మన తల్లి అనగ విశ్వాసులకు తల్లి క్రైస్తవ సంఘమే.*
👉 మనము ఆ తల్లి బిడ్డలం. బిడ్డల పోషణ, సంరక్షణ, బాధ్యత, పరిచర్య అన్నీ
*ఆ సంఘానివే (తల్లివే).*
👉 వాక్యమనే పాలతో పెంచింది తల్లే.
👉విశ్వాస అనుభవములోనికి నడిపింది, కొనసాగింపజేసేది కూడ తల్లే.
*మన తల్లి పైనున్న యెరుషలేము అని పౌలు గలతీ సంఘానకి వ్రాస్తున్నాడు*
(1పేతురు 2:1-3; హెబ్రి 5:12; గలతి 4:26).
యెరూషలేము అనగ శాంతి సమాధానమలు నివసించునది. ఇది సమాధానపురము. క్రీస్తు స్వరక్తములో కడుగబడి, శ్రేష్టమైన సంఘముగ వాక్యమనే ఉదక స్నానంతో శుద్దీకరించి పవిత్ర పరచబడిన సంఘం ఈ తల్లే లేక స్త్రీయే. స్త్రీ సంఘానికి సూచన ఈ సంఘము కొరకే ఆదరణకర్తను పంపుతానన్న యేసయ్య వాగ్ధానము (యోహాను 14:26) చేసింది.

2⃣ *యోహాను*

*యోహాను అనగ కృపావరము.*
👉 యోహాను యేసుచేత ప్రేమించబడినవాడు. యేసు రొమ్మున ఆనుకున్నవాడు. కృపకలిగిన దేవుడు (యేసు) భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు సంఘమును కాపాడుటకును, సంరక్షించి పోషించుటకును, దుష్టుని నుండి విడిపించుటకును ఆదరణకర్తను అను గ్రహిస్తాననియు, పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును బోధించుననియు చెప్పెను (యోహాను 14:26). సత్యా స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యామిచ్చునని చెప్పెను (యోహాను 15:26).

*యోహాను పరిశుద్దాత్మ దేవునికి సాదృశ్యము.*
👉 ఎందుకనగ యోహాను అనగ కృపావరము అని అర్ధము. కృపావరములు పరిశుద్ధాత్ముని వలన కలుగును (1కొరింధీ 12:4-11).

3⃣ *ఇల్లు*
కనుక యోహాను తన తల్లిని అప్పటి నుండి తన యింట చేర్చుకొనెను (యోహాను 19:27).
👉 *ఇక్కడ యిల్లు అనగ మన గమ్యస్ధానము.*
అదే పరలోకము ఈ ప్రవచన నెరవేర్పు కొరకే వీరందరు మేడగదిలో ఒక్క మనస్సుతో ప్రార్ధించినారు. వీరిలో మరియ యోహాను లుండిరి
(ఆపో. 1:14).

ప్రియులారా! ఇక్కడ ఓ ఆత్మీయ సత్యాన్ని గమనించుదాము. మన పూర్వికుడైన అబ్రాహాము యింటి యొద్ద నుండి బయలుదేరిన ఇస్సాకు, తన తల్లి దండ్రుల యింటి నుండి బయలు దేరిన రిబ్కా వీరిద్దరు పొలములో కలుసుకున్నారు. (అది 24:63-67).

అటులనే
*పెండ్లి కుమారుడైన యేసు, తన స్వరక్తముతో కడగబడి, కొనబడి, సిద్దపరచబడిన సంఘమును మధ్యాకాశములో కలుసుకొని తదుపరి గుడారములోనికి అనగ పరలోక రాజ్య నివాసములోనికి అనగ నూతన యెరూషలేములోనికి పోవును. ఇదే ఇల్లు.*
ఆయింటిలో నివసించుదము గాక!

ముగింపు :- యేసు సిలువలో వ్రేలాడుతూ కూడ తన బాధ్యతను గుర్తెరిగి లేఖన నెరవేర్చు కొరకు సిలువ చెంతనే వున్న తల్లిని, తన ప్రియతమ శిష్యుడైన యోహానును చూచి అమ్మ! ఇదిగో నీ కుమారుడు అని మరియతోను, ఇదిగో నీ తల్లి అని యోహానుతోను చెప్పెను. ఈ సందర్భాన్ని వివరించుకొనుటలో ఎన్నో సత్యములు గమనించాము.

అమ్మా! అని ఆయన పిలిచినను అమ్మ అనగ స్త్రీ అనే భావము స్పురించగా (స్త్రీ) తల్లి సంఘానికి గుర్తుగాను. కృపావరము అనే భావము గల పేరున్న యోహాను పరిశుద్దాత్మకు గుర్తుగాను, ప్రభువైన యేసు క్రీస్తు పైకెత్తబడును గనుక భూమి మీద నున్న సంఘమును పోషించి సంరక్షించుటకు అవసరమైన ఆదరణకర్త పరిశుద్దాత్ముడని, సంఘము ఆయన సంరక్షణలో (యేసు మహా మహిమతో పెండ్లి కుమారుడు దిగివచ్చు పర్యంతము). ఎదుగునట్లు నిర్ణయించి ఏర్పరచెను. కనుక ఈ ఆత్మీయ అనుభవము నీలో జరుగునట్లు పరిశుద్దాత్ముడే నీలో కార్యము చేయునుగాక!
ఆమేన్.



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(పదమూడవ భాగము)

1⃣3⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన నాలుగవ మాట...✍*
4⃣ *వియోగము (FORSAKEN)*

*ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడచితివని అర్ధము*
(మార్కు 15:33,34).

యేసయ్య పలికిన పలుకులలో ఇది నాల్గవది.
*మొదటి మూడు సందేశాలు ఇతరుల కొరకు అందించినవి.*
*ఇది తన గురించి తెలియజేయుచున్న మాట.*
👉 నాదేవా నాదేవా నన్నెండు చెయ్యి విడిచితివి అనగ,
🔹దగ్గర నిలిచియున్న వారిలో కొందరు ఈ మాటలకు ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనిరి.
🔹ఒకడు పరుగెత్తి పోయి స్పంజీ చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి, ఎలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను
(మార్కు 15:36).
*కానీ యేసు ప్రశ్నలో గాఢమైన అచంచలమైన విశ్వాసము కనబడుతుంది.*
*నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి?*

👉 దేవుడు చెయ్యి విడచినను ఆయనకు ఆశ్రయము దేవుడే అనే విషయాన్ని ఈ ప్రశ్నద్వారా యేసయ్య వ్యక్తపరచుచున్నాడు.
*ఈ ప్రశ్న ఎంతో విశ్వాసాన్ని కనపరచుచున్నది.*

👉 దీనుడైన యేసుని హృదయ ఆక్రందన ఇది.
🔹 ఇది నిరాశ నిస్ప్రోహలతో వేసిన కేక కాదు.
*ఇది పరలోక రాజ్యపు విజయ సునాదము. ఈ కేక బహునిగూఢమైనది. భయకంపిత హృదయాలతో ఈ మాట ధ్యానించాలి.*
👉 ఇది సిలువ వేదనను చూచిస్తుంది.
*ఆయన గెత్సమనె తోటలో ఉన్నపుడే ఆయన తనవేదన, బాధ వ్యక్తపరిచాడు. దుఃఖపడుటకును, చింతా క్రాంతుడగుటకును మొదలు పెట్టాడు*
(మత్తయి 26:37).

ఆ సమయంలో యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి యున్నది అన్నాడు (మత్తయి 26:38).

మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చికటి కమ్మెను (మత్తయి 27:45). ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా కేక వేసెను. *ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము*
(మత్తయి 27:46).

👉ఈ దుఃఖము ఎందుకు?
👉 ఈ కేక ఎందుకు?
👉 ప్రకృతిలోనూ ఈ మార్పు ఎందుకు?
🔹యేసయ్యను తన శిష్యులందరు విడిచి వెళ్ళిపోయారనా?
🔹ఆయనను హింసించుచు, అపహసిస్తున్న ప్రజానికం చేస్తున్న చిత్రవధను సహించలేకనా?
🔹మరణపు కోరలలో ఆయన కబళించబడబోతున్నాడనా? *కాదు కానేకాదు. ఆయనకు బాల్యం నుంచి శ్రమలు అనుభవించటం అలవాటే.*
👉 సేవ ప్రారంభములోనే అపవాది భయంకరముగా శోధించాడు. ఇదంతా ఆయనకు క్రొత్తేమికాదు.

ఈ సందర్భములో యెషయా ప్రవచన భాగాలు ఙ్ఞాపకం చేసుకుంటే మనమతని చూచి ఆపేక్షించునట్లుగా ఆయన యందు సురూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయెను మనష్యుల వలన విసర్జించినవాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి ననుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి
(యెషయా 53:3).

మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను (యెషయా 53:6)
👉నిజానికి యేసయ్య పరిశుద్దుడు ఆయనలో ఏ పాపములేదు. ఆయన నీతిమంతుడు
(లూకా 1:35; యోహాను 8:46; 19:4).
అయితే *ఈ పరిశుద్దుడు ఆయన మీద మోసబడిన ఈ భయంకర పాపమును* (యెషయా 1:29)
👉ఙ్ఞాపకము చేసుకుంటూ ఒంటరి తనముతో బిగ్గరగా వేసిన కేక ఈ ఆక్రందన కేక (మత్తయి 27:46; మార్కు 15:34) నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి.

*ఈ మాటల్లో ఎంతో ఆవేదన దుఃఖమ, విషాదం వున్నాయి.*
👉 సిలువ కొయ్య చుట్టూ చేరిన అల్లరి మూక, సైనికులు ఎందరో ఆయినను అవమానపరిచారు. కొరడాలతో కొట్టారు. ఉమ్మివేసారు. ఆయన వస్త్రాలు తీసివేసి వాటిని పంచుకున్నారు. చేతులలో కాళ్ళలో మేకులు గుచ్చి సిలువకు కొట్టారు. ఇంత జరుగుతున్నా ఆయన మౌనంగానే వున్నాడు. బాధించబడినను ఆయన నోరు మెదపలేదు. వధకు తబడిన గొర్రెపిల్లలా బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱె మౌనముగా నున్నట్లు ఆయన నోరు తెరువలేదు
(యెషయా 53:7).
👉 ఇలా మౌనం గానే ఈ శ్రమలన్నీ భరించాడు.

*కాని ఇప్పుడు మాత్రం ఆయన ఈ ఒంటరి తనాన్ని భరించలేక బిగ్గరగా ఈ కేక వేసాడు.*

(a). *చీకటి శక్తుల ప్రభావము*
(మత్తయి 27:45) :-

యేసయ్య ఈ లోకములోనికి రక్షకుడుగా ఉద్భవించినప్పుడు లోకానికి వెలుగు ప్రసాదించునట్లు చీకటిలోను మరణచ్చాయలలోను జీవించువారిని వెలుగిచ్చునట్లు నక్షత్రం ఉద్భవించింది.
*కాని ఆయన మరణ సమయంలో లోకానికి చీకటి కమ్మింది.*
అప్పుడు ఆయన రక్షకుడుగా ఆనందాన్ని తెచ్చాడు. వెలుగుగా ఉద్భవించాడు. *ఇప్పుడు ఆ పాపపు శిక్షను అనుభవిస్తు ఆ భారాన్ని మోయుచుండగ పాపముకు సాదృశ్యమైన చీకటి లోకాన్ని కమ్మింది.*
👉 ఆయనలో జీవముండెను. జీవము మనుష్యులకు వెలుగైయుండెను. చీకటి ఆ వెలుగును గ్రహింపకున్నది (యోహాను 1:4,5).

యేసు ఈ నాల్గవ మాట మాట్లాడే సమయానికి దేశమంతట చీకటి కమ్మింది. చీకటి ఆవరించింది. చీకటి కమ్మటానికి అది మధ్యరాత్రి కాదు అది మిట్టమధ్యాహ్నం. ఆ సమయంలో సూర్చుడు తన సూర్యరశ్మిని ప్రసరించవలసినది. ఇంత అకస్మాత్తుగ చీకటి ఎందుకు ఆవరించింది. ఎందుకు ఒక్కసారిగా వెలుగును చీకటి ఆక్రమించుకున్నట్టు ఇలా జరిగింది? ఈ మార్పు సూర్య గ్రహణం వలన గాని ప్రకృతిలో ఏదో తెలియని మార్పు వలన సూర్యుడుపై చీకటి కమ్మిందనిగాని మనం చెప్పలేము *నిజానికి చరిత్ర ప్రకారం అది పస్కాపండగ జరుగుదినాలు గనుక సూర్యగ్రహణానికి అవకాశము లేదు.*

🔸 లూకా సువార్తలో సూర్చుడు అదృశ్యుడయ్యెనని వ్రాయబడింది
(లూకా 23:45).
🔸ఈ చీకటి రమారమి మూడు గంటలు వున్నదని లూకా అంటాడు
(లూకా 23:44).

👉ఈ చీకటి ఐగుప్తులో మూడు దినాలు వున్న చీకటిని పోలివున్నది. (నిర్గ 10:22). ఇలా సంభవించినప్పుడు ఆ కల్వారి కొండపై వున్న వారంతా ఆశ్చర్యచకితులై భయకంపెతులై వుండవచ్చు.

(i). ప్రకృతిలో సంభవించిన ఈ మార్పుకు సిలువ దగ్గరే వుండి ప్రభును దూషిస్తూ, అపహసిస్తూ, అవమానపరుస్తూ ప్రభును సవాలుచేస్తూ ఉన్నవారంతా ఒక్క సారిగి విస్తుపోయి వుండవచ్చు. ఏమీ ఈ చీకటిని. ఈ మార్పు వారి ఙ్ఞానానికి తలంపుకు అందలేదు. కాని పరిశుద్ద గ్రంధాన్ని చూస్తే ఎన్నో విధాలైన చీకటులు మనలను ఆవరించి వున్నవి. ఈ సంభావమును ఆత్మీయముగా ధ్యనించినట్లయిన నీతి సూర్యుని శ్రమలను ప్రకృతి సూర్యుడు చూచి సహించలేక తన కాంతిని ప్రసరించలేదని భావించాలి. ఎక్కడ వెలుతురు (వెలుగు) లేదో అక్కడ చీకటి వుంటుంది.

♻ *చీకటిని గూర్చిన కొన్ని విషయములు: చీకటి శ్రమలకు గుర్తు.*

(i). చీకటి కమ్ముట (DARKNESS) (మత్తయి 27:45).

(ii). మరణాంధకారము (DARKNESS OF DEATH) (యోబు 16:16).

(iii). గాఢాంధకారము (SHADOW OF DEATH) (యోబు 3:5).

(iv). శ్రమల అంధకారము (DARKNESS OF AFFLICTION) (యోబు 30:26).

సూర్యప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను (యోబు 30:28). అంధకారములోనుండి వెలుగు కలుగుగాక అని పలికిన వాడు (2కొరింధీ 4:5,6), వెలుగు ప్రకాశింపజేసిన వాడు ఇప్పుడు చీకటిలో వున్నాడు. అనగా చీకటి శక్తి భూమిని ఆవరించియున్నదని గమనించుము. వెలుగైయున్న యేసు ఇప్పుడు చీకటిలో నున్నట్లు ఎరుగుము. ఆకాశమందున్నవి. భూమి మీదున్న సర్వము ఆయనలోనే నిర్మించబడి యున్నవి. ఈయనే సమస్తమునకు ఆధారభూతుడు (కొలసి 1:16,17). మృతులను సజీవులనుగా చేయువాడు (రోమా 4:17). సముద్రము మీద నడిచినవాడు (మత్తయి 14:25). నీటిని ద్రాక్షరసముగ మార్చినవాడు (యోహాను 4:39) ఇంత శక్తి, ప్రభావములు గలవాడు లోకంలో చీకటి ఆవరించి తన అధికారమును కనుపరచువేళ, మనందరి పాపభారము ఆయన మీద మోపగ ఆయన పాపిస్ధానములో పాపిగ నిలబడి సిలువలో వ్రేలాడుతుండగ పాపపు శిక్ష ఆయన అనుభవించుచుండగ *ఒక్కసారిగా తండ్రి ఎడబాటు, ఆ ఒంటరితనం సహించలేక వేసిన గావు కేక ఈ కేక.*

(ii). *చీకటి* :-

చీకటిని గూర్చి పరిశుద్దాత్ముడు ముందుగానే కీర్తన కర్త ద్వారా ఈ విషయాన్ని (చీకటిని) ప్రవచించాడు. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను (కీర్తన 88:18). అలానే యోబు చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను అన్నాడు (యోబు 17:13). చీకటియే నాకు బంధు వర్గమాయెను. ఎంతభయంకరమో చూడండి. ఈ అంశమును మరింతగా (లోతుగా) ధ్యానం చేయగ మనుష్యకుమారుడు అనుభవించుచున్న అన్యాయపు శిక్షను శ్రమ వేదనను ప్రకృతి సూర్యుడు చూచి సహించలేక తన నిరసన తెలియజేయుచున్నట్లున్నది. యేసుక్రీస్తు వెలుగైయుండెను ఆయనలో ఏదోషము పాపము లేదు. కనుక *ఆయన మీద మోపిన పాపపు శిక్షకు గుర్తుగా ఈ చీకటి వున్నదని గమనించుము.*
లేఖన భాగములు మనము చూచినప్పుడు చీకటి అనేక సందర్భములలో పాపమునకు పోల్చబడియున్నది. చీకటి అనగ పాపపు క్రియలు, దుష్కార్యములు, చెడ్డక్రియలు లేక దుష్ క్రియలకు సాదృశ్యము (యోహాను 3:19,20).

ప్రియులారా ఈ లోకములో రాత్రివేళ్ళలలో జరిగే నిర్జీవ క్రియలు పాపపు క్రియలు ఎంత భయంకరమైనవో గమనించండి. దొంగలు, దోచుకొనువారు, అనైతిక క్రియలు జరిగించువారు చీకటిలో సంచరించి వారి క్రియలు యధేశ్చగా జరిగింతురు.

(iii). యేసు కల్వరీ కొండయే చీకటి శక్తుల ప్రభావమును ఓడించు స్ధలమని ఎరిగి అపవాదిని అక్కడ నుంచే జయించెను. ఈ చీకటి వేళ్ళలో అపవాది విజృంబించి చీకటి తీర్చును యేసుమీద మోపగా ఆయన పాపపు శిక్షను భరిస్తున్నాడు. పాపమునకు ప్రభువుకు పొత్తులేదు గనుక (2కొరింధీ 6:14). *వెలుగైయున్న యేసు ఒక్కసారిగా చీకటనే పాపుల శిక్షను సిలువపై మోయవలసిరాగా దేవుడు ఆ క్షణంలో పాపిస్ధానములో నున్న యేసు చెయ్యి విడిచెను.*
👉 అందుకే ఈ ఒంటరితనం భరించలేక ఒక్కసారిగా బిగ్గరగా నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అని కేక వేసెను.

*దేవుడు మనలను ఆయన కుమారులుగా చేసికొనుటకు తన కుమారుని చెయ్యి విడిచెను.*
అందుచేతనే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే వాగ్ధానం నెరవేరింది.

*నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఆప్తులు ఎంత మంది నిన్ను విడిచినా ఆయన నిన్ను విడువడు. ఆ వాగ్దానం నెరవేర్చుటకు తన కుమారుని చెయ్యి విడిచెను.*

👉ఈ సందేశం చదువుతున్నా నా ప్రియ స్నేహితుడా...
*ఈ లోకములో ఎంత మందిని నమ్మి, ఆశ్రమం కోరినా, ఎంత మందిని నమ్మినా ఏదో ఒక సమయములో వారు వారి అవసరతలు కోసం నీ
చెయ్యి విడిచి వేస్తారు.*
👉 అదే ప్రభు దగ్గరకు ఈ సమయములోనే రా, ఇంకెప్పుడు నిన్ను విడువక నిన్ను ఆదరిస్తారు. వస్తావా మరీ?



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(పదునాలుగవ భాగము)

1⃣4⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఐదవ మాట...✍*
♻ *...ఆవేదన...* ♻


*"లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను"*
(
యోహాను19:28).

👉నన్ను అధ్యాత్మికమంగా ఎంతో బలపరచిన అంశం. *పలికిన పలుకు చిన్నదే, కాని భావం చాలా లోతైనది.*
👉 ఆధ్యాత్మికంగా , ప్రార్ధనా పూర్వకముగా చదివి బలపడండి. మీ స్నేహుతులకు Share చేయండి. వారు కూడా చదివి ఆశీర్వదించ బడతారు.

ఇక ధ్యానాంశములోకి వెళ్తే, *"నేను దప్పిగొనుచున్నాను"*
👉 ఈ మాటను యెహను ఒక్కడే వ్రాసెను. ఇంకా కొంచెము సేపటిలో చనిపోయే ముందు ప్రభువు ఈ మాట అన్నారు. *' I Thirst '* చిన్నమాట గాని లోతైన భావన గలది ఇందులో ఎంత విషాదం కనిపిస్తుంది!

భూమ్యాకాశములు సృజించిన సృష్టి కర్త కుమారుడు ఎండిన పెదవులతో ఉన్నాడు. మహిమ గల ప్రభువునకే త్రాగేందుకు నీళ్లు అవసరం వచ్చాయి. *"నేను దప్పిగొనుచున్నాను"* అని రోధిస్తున్నాడు.

👉 ఎంతటి హృదయ విధారకరమైన దృశ్యం. గుండెల్ని పిండేసే మాట! *ఇలాంటి దృశ్యాన్ని ఏ కలం కూడా వర్ణించలేదు.*

👉యేసుప్రభువు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు.

*"దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను."*
యోహాను 7:37

👉ఆయనిచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడునూ దప్పిగొనమట. దాహం వేస్తే నాదగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండిని చెప్పిన ప్రభువు వారే దప్పిక గొనడమేమిటి?

👉 అంతటి శ్రమలు, నిందలు, బాధలు భరించిన ప్రభు దాహాన్ని ఎందుకు భరించలేక పోయారు?

♻ *యేసు సిలువలో దప్పిగొనడానికి గల కారణాలు?*

*ఆయన దప్పిగొన్నది కేవలం లేఖనములు నెరవేరుటకై మాత్రమే.*

👉 ఏమిటా లేఖనము?

👉 *యేసు ప్రభువు వారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే, అనేకమైన ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి.*
👉 వాటిలో ఒక్కటైననూ తప్పిపోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన నేరవేర్పులో భాగముగా ఆయన దప్పిగొన్నారు.

*"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి."*
కీర్తనలు 69:21
👉ఇందులో ఒక్క పొల్లు కూడా తప్పిపోలేదు.

👉అప్పటికే, యేసుప్రభువువారు
ఆమండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోసారు.
👉 ఒకవైపు శరీరంనుండి రక్తం కారుతూనే వుంది.
*అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజము.*

👉ఎందుకంటే?
సిలువ వేయబడినప్పుడు ఆయన *'పరిపూర్ణ మైన మానవుడు'.*
అదే సమయంలో *'పరిపూర్ణమైన దేవుడు'.*

వాస్తవానికి క్రీస్తు శ్రమలను గురించిన అంశాలు అన్ని ముందుగానే ప్రవచించబడ్డాయి.

◆ తన సహచరుడు తనను అప్పగించుట (కీర్త 41:9)
◆ తన శిష్యులు తన్ను ఒంటరిగా వదిలి పారిపోవుట (కీర్త 31:11)
◆ అబద్ధ నేరారోపన (కీర్త 35:11)
◆ న్యాయమూర్తుల ఎదుట మౌనముగా ఉండుట (యెషయా 53:7)
◆ నిర్దోషిగా తీర్పు తీర్చుట (యెషయా 53:12)
◆ సిలువ వేయబడుట (కీర్త 22:16)
◆ అపహసించుట (కీర్త 109:25)
◆ విడుదల పొందనదుకు అవహేళన (కీర్త 22:7,8)
◆ అంగీ కొరకు చీట్లు వేయుట ( కీర్త 22:18)
◆ శత్రువుల కొరకు ప్రార్ధించుట ( యెషయా 53:12)
◆ దేవునిచే విడువబడుట (కీర్త 22:1)
◆ దప్పిగొనుట (కీర్త 69:21)
◆ తండ్రి చేతికి ఆత్మను అప్పగించుట (కీర్త 31:5)
◆ ఎముకలు విరుగగొట్ట బడుట (కీర్త 34:20)
◆ ధనవంతుని సమాధిలో భూస్థాపితం గావించుట (యెషయా 53:9)

ఇవన్నీ కూడా శతాబ్దాల క్రితమే ప్రవచించబడ్డాయి.
*ప్రభువును విశ్వసించిన పరిశుద్దులారా...*
👉 వాక్యమందలి విశ్వాసానికి ఇదేంత మంచి పునాది! *ప్రవచనానుసారం యేసు జీవితం గడిచింది.*
👉 దేవుని చిత్తాన్ని నెరవేర్చారు.

👉నేను దప్పిగొనుచున్నాను అని దేవుడు అనగా వారు ఏమి చేసారు?
*చిరకతో ఇచ్చారు. చిరకతో నిండి యున్న ఒక పాత్ర అక్కడ పెట్టబడెను. గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించారు.*
👉 ఆశ్చర్యముగా లేదు? మానవులు ఎంత దుర్మార్గులు!

🔸సముద్రానికి హద్దులు నియముంచిన వాని కుమారుడు,
🔸40 పగుళ్లు40 రాత్రుళ్ళు ప్రచండ వర్షం కురిపించిన వాని కుమారుడు,
🔸ఎడారిలో నీటి ఊటను చూపించి,
🔸దప్పికతో మరణించబోతున్న హాగారుని తన కుమారుని దప్పిక తీర్చిన,
🔸 ఇశ్రాయేలీయులకు బండ నుండి విస్తార జల ప్రవహము రప్పించిన,
🔸అరణ్యములో నదులు పరాజేతును అని వాగ్దానము చేసిన దేవుడు దప్పి గొన్నాడు.
👉 ఎంత ఆశ్చర్యం? నిజమే. *ఆయన మనుష్య కుమారుడు.*

👉అప్పటికే, యేసుప్రభువువారు
ఆమండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోసారు.
👉 ఒకవైపు శరీరంనుండి రక్తం కారుతూనే వుంది.
*అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజము.*

👉ఎందుకంటే?
సిలువ వేయబడినప్పుడు ఆయన *'పరిపూర్ణ మైన మానవుడు'.*
అదే సమయంలో *'పరిపూర్ణమైన దేవుడు'.*

*ఆయన మన మధ్య నివసించిన సమయములో తన మానవత్వాన్ని గూర్చి అనగా పాపరహితత్వాన్ని గూర్చి ఋజువు చేసాడు.*

🔹పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు (లూకా 2:7)
🔹 జ్ఞానమందును, వయస్సునందును అభివృద్ధి పొందాడు (లూకా 2:52)
🔹 ప్రశ్నలు సంధించారు (లూకా 2:46)
🔹అలసిపోయాడు (యెహను 4:6)
🔹 ఆకలిగొన్నారు (మత్త 4:2)
🔹 నిద్రించాడు (మార్కు 4:38)
🔹 ఆశ్చర్యపడ్డాడు (మార్కు 6:6)
🔹 ఏడ్చాడు (యెహను 11:35)
🔹 ప్రార్ధించాడు (మార్కు 1:35)
🔹 ఆనందించాడు (లూకా 10:21)
🔹 మూల్లాడు (యెహను 11:33)
🔹 *ఇప్పుడు దప్పిగొన్నాడు* (యెహను 19:28)

ఈ లేఖనాలు ఆయన మానవత్వాన్ని సూచిస్తున్నాయి.

దేవుడు దప్పిగొనడు, దేవధూతలు కూడా దప్పిగొనరు, ఆయన మహిమలో ప్రవేశించిన తరువాత మనం కూడా దప్పిగొనము.
*"వారికి ఇకమీదట ఆకలియైనను దహమైనను ఉండదు"* (ప్రక 7:16). అయితే ఇప్పుడు ఆయన మానవుడు కాబట్టే దప్పిగొన్నాడు. *"కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను "*
(హెబ్రీ 2:17). ఆయనకు దప్పిక వేయవలసిన అవసరం లేదు. అయినా దప్పిగొన్నాడు. ఎందుకు?

1). లేఖనము నెరవేరాలి.

2). మానవుని పాప దాహము తీర్చాలి.

3). నిత్య నరకంలో మనము దప్పిగొనకూడదని, మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నారు.

1⃣ *లేఖనము నెరవేరాలి.*

*"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి."*
కీర్తనలు 69:21
👉ఇందులో ఒక్క పొల్లు కూడా తప్పిపోలేదు.

2⃣ *మానవుని పాప దాహము తీర్చాలి.*

👉మానవునికి అనేక దాహాలు ఉంటాయి.
▪ధనదాహం,
▪పదవీదాహం,
▪కీర్తిదాహం,
▪రాజకీయ దాహం,
▪ వ్యభిచార దాహం ఇంకా చాలా దాహాలు ఉంటాయి. *మానవుని దాహానికి అంతులేదు.*
👉 ఈ నీ & నా పాపాదాహాన్ని తీర్చుటకు ఆయన బలి అవుతున్నాడు.
*తద్వారా శాంతి పోగొట్టుకొని అశాంతి తొలగించి శాశ్వత శాంతిని ప్రసాధించేవాడు యేసు మాత్రమే.*
👉 నేనిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పి సమరయ స్త్రీ పాపదాహం తీర్చాడు.

*మరి నీ సంగతి ఏంటి నా ప్రియ సోదరుడా! సోదరి!*
👉 ఈ క్షణమే యేసు దగ్గరికి రా, నీ సమస్త దాహం తీర్చి, నిత్య జీవము ఇస్తాడు. వస్తావా మరి?
*ప్రభు పాద సన్నిధికి వచ్చి నీ పాపం ఒప్పుకొని నిత్యజీవములో పాలుపంచుకోవాలి మనస్ఫూర్తిగా ఆశిస్తూన్నాను.*

3⃣ *నిత్య నరకంలో మనము దప్పిగొనకూడదని, మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నారు.*

👉 ధనవంతుడు ఒక్క నీటిబొట్టు కొరకు ఎంత అల్లాడిపోతున్నాడో?
*అట్లాంటి పరిస్థితి నుండి నిన్నూ,నన్నూ తప్పించడానికి ఆయనే దప్పిగొంటున్నారు.*

*"తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికర పడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి"*
లూకా 16:24

🔹అనంత కాలము మనకు దాహము లేకుండా చెయ్యడానికి ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు దప్పిగొన్నారు.

*"వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును."*
ప్రకటన 7:16,17

👉 ఆయన నీకోసం ఇంతచేస్తే?
*దేనికోసం నీ దప్పిక?*
🔺శరీరాశా?
🔺నేత్రాశా?
🔺జీవపుడంబమా?
👉 వీటికోసమేనా నీ ప్రాకులాట?
*ఆత్మ ఫలాలు ఫలించకుండా, శరీర కార్యములనే నెరవేర్చుకుంటూ నేటికినీ ఆయనకు ఆచేదు చిరకనే మరళా, మరళా త్రాగిస్తావా?*
👉వద్దు! ఒక్కసారి చాలు.*

🔹ఆ బండ ఒక్కసారే కొట్టబడాలి. అది చాలు. మోషే మరళా కొట్టాడు. కనానులో అడుగు పెట్టలేకపోయాడు.

🔹ఆయన ఆ చేదుచిరకను ఒక్కసారి త్రాగితే చాలు. మనము మరళా త్రాగించే ప్రయత్నం చేస్తే? ఆ పరమ కనానులో అడుగు పెట్టలేము.

వద్దు!
*శరీరకార్యాలకు గతించిన కాలమే చాలు. ఆ దివ్య ప్రేమను అర్ధం చేసుకో.*

👉కోరహు కుమారులు వారికిగల దప్పికను గురించి ఈరీతిగా పాడుతున్నారు.

*"నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది."*
కీర్తనలు 42:2

*యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.*
కీర్తనలు 84:2

అవును!
👉మనమునూ నిత్య జీవములోనికి చేర్చగల, జీవముగల దేవుని కొరకు ఇట్లాంటి తృష్ణను కలిగి యుండాలి.

*ఇటువంటి దప్పికతో ఆయన కోసం ఎదురుచూద్దాం!*

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

పదిహేనవ భాగము)

1⃣5⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఆరవ మాట...✍*
♻ *....విజయం....* ♻


*"యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను"* (యెహను 19:30)

👉 *సమాప్తమైందని ప్రభు చెప్పగా,*
👉 ఇక. *'ఇతను పని అయిపోయింది '* అని సాతానుడు, వాడి అనుచరులు చాలా సంతోషించి ఉంటారు.

👉 అయితే ప్రియులారా... యేసు ప్రభు నీరసంగా, బాధతో చెప్పలేదు. *బిగ్గరగా కేక వేస్తూ విజయోత్సాహముతో పలికెను.*
*"సమాప్తమైనది"* అనే తెలుగు మాటకు మూల బాషయైన గ్రీకు భాషలో *'టెటెలెస్టాయ్'* అని వాడారు. అనగా నెరవేరినది అని, ముగించుట, సమాప్తం అనే అర్ధాలున్నాయి.

👉 *ఎలిజబెత్ రాణి* తన మరణపడకపై చివరి క్షణాల్లో తన పనికత్తెతోఇట్లా అందట. *అయ్యో! నేను జీవిత చివరి క్షణాల్లోవున్నానే?నాకున్న ఒకే ఒక్క జీవితం అంతమై పోతుందే? జీవితాన్నిప్రేమించాను, ఉన్నత శిఖరాలను అధిరో హించాను. కాని ఆజీవితం అంతమై పోతుందన్న తలంపే నన్ను చెప్పలేనంతగా భాధిస్తుంది అని చెప్తూనే, తన నోరు శాశ్వతంగామూత పడిందట.*

👉కాని *ప్రియ రక్షకుని అంతము ఎంత భిన్నంగా ఉందంటే?*
👉 మరణంఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే వుంది.
🔹 *లేఖనాలనేరవేర్పుకు ఇక ప్రక్కలో బల్లెపు పోటు,*
🔹 *తండ్రికి తనఆత్మను అప్పగించడం మాత్రమే మిగిలివుంది.*
👉 అయినప్పటికీ,
*గొప్ప సంతృప్తితో, గొప్ప విజయంతో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. 'సమాప్తమయ్యింది'*

👉అవును సమాప్తం అయ్యాయి.
♻ *ఏమేమి సమాప్తమైనవో ధ్యానిద్దాము.*

1⃣ *శారీరక శ్రమలు సమాప్తమైనవి.*

👉రక్షకుని శ్రమానుభవము గూర్చి ఏ నాలుక వివరించగలదు.
👉ఏ కలము వ్రాయగలదు.
*అది చెప్పశక్యము కాని భౌతిక, మానసిక, శారీరక వేదన.*
👉 ఆ వేధనలన్ని ఆయన సహించాడు.

*మానవుని చేతిలోను, సాతాను చేతిలోనూ, దేవుని చేతిలోనూ హింసించబడి '"వ్యసనాక్రాంతుడు'" అని సరైన పేరే పెట్టారు.*

యెషయా 52: 14
*"నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ మును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని "*

*"వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను హింసింప చేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి"*
(లూకా 23:33).

👉 *యేసు యొక్క శారీరక శ్రమ తీవ్రమయింది.*
👉 అది కొరడాచే చర్మముపై కొట్టబడినప్పుడు ఆయన వీపుపై లోతైన గాయము అవడంతో ప్రారంభమయింది.
👉అలా నలుగగొట్టడం ద్వారా చాలా మంది చనిపోయారు. తరువాత,
👉ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపై దించారు.
*పదునైన ముళ్ళు ఆయన నెత్తిపై ఉన్న చర్మములో గుచ్చుకొని, రక్తము ఆయన ముఖముపై ప్రవహించింది.*
👉వారు ఆయనను ముఖముపై కొట్టి, ఉమ్మివేసి, వారి చేతులతో ఆయన గడ్డాన్ని చీల్చారు.
👉తరువాత వారు యేరూషలేము వీధుల ద్వారా, ఆయనను సిలువ మోయించి శిక్ష విధించే కల్వరి వరకు తీసుకెళ్ళారు.
👉చివరిగా, ఆయన కాళ్ళకు, చేతుల దిగువ బాగాన మేకులు కొట్టారు. ఆలా ఆయన సిలువ వేయబడ్డాడు.

బైబిలు చెప్తుంది:
*"నిన్ను చూచి (ఆయన ఆకారము)ఏ మనిషి రూపము (చాలా వికారమని) కంటే అతని ముఖమును, (నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని)చాలామంది ఎలాగు విస్మయమొందిరో"* (యెషయా 52:14).

🔹హాలీవుడ్ నటులు సినిమాలలో యేసును ప్రదర్శించడం చూడడం మనకు అలవాటు అయింది.
🔹ఈ సినిమాలు లోతైన భయాన్ని సిలువ వేసేటప్పుడు ఊడ్ క్రూరత్వాన్ని సరిపడినంతగా చూపించవు.

*యేసు వాస్తవంగా సిలువపై అనుభవించిన దానిని మనం సినిమాలో చూసే వానితో పోలిస్తే అసలు లెక్కలోనికి రాదు.*

👉 *"క్రీస్తు తపన"* లో ఆయనకు నిజంగా ఏమి జరిగిందో చూస్తాం.
*అది నిజంగా భయంకరం.*

*ఆయన పుట్టెపై భాగము తెరుచుకుంది.*

*ఆయన ముఖముపై మెడపై రక్తము ప్రవహించింది.*

*ఆయన కళ్ళు పూర్తిగా మూతలు పడిపోయాయి.*

*ఆయన ముక్కు బహుశా పగిలిపోయింది ఆయన బుగ్గ ఎముక కూడ.*

*ఆయన పెదవులు పగిలి రక్తము కారుతుంది.*

👉 *ఆయనను గుర్తు పట్టడం కష్టతరం.*

👉అయినను ప్రవక్తయైన యెషయా సేవకుని శ్రమను గూర్చి అదే ముందుగా తెలియ చేసాడు,

*"ఏ మనిషి రూపము కంటెను అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారము ఆయెను"* (యెషయా 52:14).

🔹అపహాస్యం చెయ్యడం ఉమ్మివేయడం కూడ ముందుగానే ప్రవక్త ఊహించాడు:
*"కొట్టువానికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని; ఉమ్మివేయు వారికి అవమాన పరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు"*
(యెషయా 50:6).

*ఇది మనలను సిలువ దగ్గరకు చేరుస్తుంది. యేసు రక్తాన్ని కారుస్తూ, అక్కడ సిలువ వేయబడ్డాడు*

*మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమైజీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములనుమ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరుస్వస్థత నొందితిరి.*
1 పేతురు 2:24

*"బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధపడితిని"*
(కీర్త 88:15)
అని విలపించారు.
👉 విశేషమేమిటి అంటే ఆయన పొందే శ్రమలు గూర్చి ముందే ఆయనకు తెలుసు, అయినా ఓర్చుకున్నాడు.

*"అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసెను"*
(మత్త 16:21).

👉అయన ఉదయం నుండి ఎన్ని శ్రమలు పొందేనో చెప్పలేము. నిందలు, హింసలు, విమర్శలు అన్ని భరించెను.

*"త్రోవనునడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి."*
(విలాప 1:12).
👉అవును, భరించలేని శ్రమలు సమాప్తమైనవి.

2⃣ *తండ్రి అప్పగించిన పని సమాప్తమైంది.*

👉 ప్రభువైన యేసు ఈ లోకానికి రాకమునుపు ఆయనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగింపబడింది.
*12 ఏళ్ళ వయస్సు* ఉన్నప్పుడే అయన మనసంతా *"తన తండ్రి పని "* పైననే కేంద్రికరించబడింది.

యెహను 5:36 లో ఆయన ఇలా అన్నట్టుగా మనం చూస్తాం. *"అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడాని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి."*

👉ఏ పని నిమిత్తం పరలోక మహిమను విడచి, దాసుని రూపముధరించి భూలోకానికి వచ్చాడో? ఆ కార్యము సమాప్తమయ్యింది.

*"చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని"*
(యెహను 5:36)
👉అని తన మరణానికి ముందు చివరి రాత్రి ప్రార్ధనలో ఈ విధముగా ప్రార్ధించాడు.
*" ఆయన తన తండ్రి చెప్పిన పని నెరవేర్చాడు.*
👉 మరి మనకు అప్పగింపబడిన పని నమ్మకంగా చేసి భళా అని అనిపించుకోవడానికి ప్రయాసపడుదాం.

3⃣ *ధర్మశాస్త్రం నెరవేర్చబడింది.*

👉 ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి, అది మనకు విధించే శిక్షను ఆయనభరించడం సమాప్త మయ్యింది.

*"విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు."*
రోమా 10:4

*ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకునేను రాలేదు.*
(మత్తయి 5:17).

4⃣ *పాపపు ఋణం చెల్లించుట సమాప్తమైనది.*

👉 సర్వలోకాన్ని పాపము నుండి విమోచించి, వారిని రక్షణలోనికినడిపించే కార్యము సమాప్తమయ్యింది.

*"నశించినదానిని వెదకిరక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను"*
(లూకా 19:10).

*పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను*
( 1 తిమోతి1:15).

*"మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను."*
(కొలస్స 2:13-15)
👉చెయ్యాల్సిన బలిఅర్పణ, ప్రాయశ్చిత్తము సమాప్తమయ్యింది.

5⃣ *సాతాను శక్తిని సర్వ నాశనం చెయ్యడం సమాప్తమయ్యింది.*

👉సాతాను ఇంకనూ బంధించబడలేదు గాని,
*వాడి నాశనంప్రకటించబడింది.*

*"ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును"*.(యోహాను 12:31).

👉తనకు చేతనైనంత మందిని నాశనం చెయ్యడానికీ, మనుషుల్ని వేధించడానికీ వాడు తిరుగుతున్నాడు
(యోబు 1:12-19; 2:6-7; లూకా 13:16; 1 పేతురు 5:8).
👉 అందరూ తనను పూజించాలని వాడి కోరిక (మత్తయి 4:9).
👉పాపం చేసేలా మనుషుల్ని వాడు ప్రేరేపిస్తాడు
(1 తెస్స 3:5).
👉దేవుని పనికి ఆటంకం కలిగించేందుకు వాడు అనేక కుట్రలు పన్నుతుంటాడు
(2 కొరింతు 2:11).
👉వాడు బహు మోసకారి
(2 కొరింతు 11:14).

♻ *వాడు దేవునికీ మానవునికీ కూడా శత్రువైతే దేవుడు వాణ్ణి వెంటనే ఎందుకు నాశనం చెయ్యడు?*
👉ఈ ప్రశ్నకు పూర్తి జవాబును దేవుడు బైబిల్లో ఇవ్వలేదు గాని కొన్ని సూచనలు మాత్రం లేకపోలేదు.
🔺తన ప్రజలను పరీక్షించి శుద్ధి చేసేందుకూ,
🔺వారి విశ్వాసం నిజమైనదని నిరూపించేందుకూ,
🔺 పాపం, అపనమ్మకం మార్గాల వెంట వెళ్ళేవారిని శిక్షించేందుకూ దేవుడు వాడి చర్యలను వాడుకుంటాడు.

👉 *యేసు క్రీస్తు మూలంగా మనం సైతానును ఓడించగలమనీ,*

*ఈ లోకంలో తన పని కొనసాగించేలా సైతాన్ను దేవుడు ఉండనివ్వడం దేవుని పరిపూర్ణ జ్ఞానం,*

🔺 నీతిన్యాయాల ప్రకారమనీ మనం ఇప్పుడు తెలుసుకుంటే చాలు.

*సాతాను (దయ్యములు/పడిపోయిన దూతలు )దేవుని విరోధులు, కాని వారు ఓడిపోయిన విరోధులు.*

*“ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను”* (కొలస్సి. 2:15).

👉మనం దేవునికి లోబడి అపవాదిని ఎదురించుచుండగా, మనకు భయపడవలసిన పని లేదు.

*“మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు”* (1 యోహాను 4:4).

👉చివరికి యేసు గొల్గొతా కొండమీద సాతానుని జయించారు సాతాను ని నిరాయుధ దారుడిగా చేసి
*ఏదేను లో పోగొట్టుకున్న రాజ్యం తిరిగి మానవుడికి ఇచ్చారు..*

♻ *ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి.* ♻

*యేసు క్రీస్తు సిలువ మరణం, పునరుత్దానము, ఆరోహణం గురించిన ప్రవచనాలు మరియు వాటి యొక్క నెరవేర్పు.*

1 ) స్నేహితుడే అప్పగించుట – కీర్తనలు 41:9 (మత్తయి 26:49,50)

2 ) 30 వెండి నాణెములకు అమ్మివేయబడుట – జెకర్యా 11:12 (మత్తయి 26:15)

3 ) వెండి నాణెములను దేవాలయంలో పారవేయుట – జెకర్యా 11:13 (మత్తయి 27:5)

4 ) ఆ వెండి నాణెములతో కుమ్మరి పొలం కొనుట – జెకర్యా 11:13 (మత్తయి 27:7)

5 ) శిష్యులు విడిచిపెట్టుట – జెకర్యా 13:7 (మత్తయి 26:31,56)

6 ) అబద్ద సాక్షములు పలుకుట – కీర్తనలు 35:11 (మత్తయి 26:59-61)

7 ) ఆయన మౌనముగా ఉండుట – యెషయా 53:7 (మత్తయి 27:12-14)

8 ) అరచేతితో కొట్టి, ముఖమున ఉమ్మివేయుట – యెషయా 50:6, మీకా 5:1 (మత్తయి 26:67-68)

9 ) ప్రజలు ఆయనను అపహసించుట – కీర్తనలు 22:8 (మత్తయి 27:41-44)

10) గాయపరచబడుట – యెషయా 53:5 (మత్తయి 27:26)

11 ) కాళ్ళు, చేతులను పొడుచుట – కీర్తనలు 22:16 (యోహాను 20:26-27)

12 ) దొంగలతో పాటు సిలువ వేయుట – యెషయా 53:12 (లూకా 23:33, గలతీ 3:14)

13 ) తన స్వంత ప్రజలే తిరస్కరించుట – యెషయా 53:3 (మత్తయి 27:21-26, యోహాను 7:5,48)

14 ) స్నేహితులు దూరమగుట – కీర్తనలు 38:11 (మత్తయి 26:56; 27:55)

15 ) ప్రజలు తలలు ఊపుట – కీర్తనలు 22:7; 109:25 (మత్తయి 27:39)

16 ) ఆయనను తేరి చూచుట – కీర్తనలు 22:17 (లూకా 23:35)

17 ) వస్త్రములు పంచుకొనుట, అంగీ కొరకు చీట్లు వేయుట – కీర్తనలు 22:18 (యోహాను 19:23,24)

18 ) దప్పిగొనుట – కీర్తనలు 69:21 (యోహాను 19:28)

19 ) చేదు చిరకను త్రాగడానికి ఇచ్చుట - కీర్తనలు 69:21 (మత్తయి 27:34)

20 ) విజ్ఞాపన చేయుట – యెషయా 53:12 (లూకా 23:34)

21 ) దేవునిచే విడువబడి కేక వేయుట – కీర్తనలు 22:1 (మత్తయి 27:46)

22 ) అయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకోనుట – కీర్తనలు 31:5 (లూకా 23:46)

23 ) ఎముకలు ఒకటి కూడా విరగకుండుట – కీర్తనలు 34:20 (యోహాను 19:33-37)

24 ) ప్రక్కలో పొడుచుట – జెకర్యా 12:10 (యోహాను 19:34)

25 ) దేశమంతా చీకటి కమ్ముట – ఆమోసు 8:9 (మత్తయి 27:45)

26 ) ధనవంతుడి సమాధిలో పాతి పెట్టబడుట – యెషయా 53:9 (మత్తయి 27:57-60)

27 ) మరణమును జయించి తిరిగి లేచుట – కీర్తనలు 16:8-10; 30:3 (మత్తయి 28:2-9)

28 ) పరలోకమునకు ఆరోహణం – కీర్తనలు 68:18 (లూకా 24:51)

29 ) దేవుని కుడి పార్శమున ఆసీనుడగుట – కీర్తనలు 110:1 (మార్కు 16:19)

👉ఇక్కడ ఇవ్వబడిన ప్రవచనాలు అన్ని కూడా
*క్రీస్తు పూర్వం 1000 నుండి 470 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినవి.*
అయన మరణం, పునరుత్ధానం, ఆరోహణం గురించి దావీదు క్రీస్తు పూర్వం 1000 లోనే ప్రవచించాడు.
*అయన ముప్పది వెండి నాణెములకు అమ్మబడతాడని జెకర్యా క్రీస్తు పూర్వం 475 లో,*

*తన మరణ శిక్ష గురించి యెషయా క్రీస్తు పూర్వం 730 లో ప్రవచించారు.*

👉 ఈ ప్రవచనాలన్ని కూడా రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసు క్రీస్తులో నెరవేరాయి.
👉దీనిని బట్టి బైబిలు దైవ గ్రంధమని, యేసు క్రీస్తు లోకరక్షకుడని అర్థం చేసుకోవచ్చు.
*ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.* (2పేతురు 1:21)

👉మానవుడు రక్షణ విషయములో చేయవలసినది ఏమి లేదు. అంతా ప్రభు వారు సిలువలో చేశారు.
👉కాబట్టి నువ్వు చేయవలసినది ఒక్కటే. *సిలువలో ఆయన చేసిన కార్యం విశ్వసించుటే.*
👉 మరి ఆయనను సొంత రక్షకునిగా విశ్వసిస్తావా? విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణ ఉచితముగా పొందుకొనుమని ప్రాధేయపడుతున్నాను.

👉 ఆయన తనపని సమాప్తంచేసి చాలాకాలమయ్యింది.
*యుగ సమాప్తికి రోజులు దగ్గరయ్యాయి కుడా.*

*'ఆరు'* అనే సంఖ్య సమాప్తాన్ని సూచిస్తుంది.

*దేవుడు సృష్టిని'ఆరు'దినాలలో సమాప్తం చేసాడు.*

*యేసు ప్రభువు వారు సిలువలోపలికిన 'ఆరవమాట' సమాప్తమైనది.*

👉ఆదాము మొదలుకొని ఇప్పటివరకు *'ఆరువేల సంవత్సరాలు'.*
👉 ఇవి దేవుని దృష్టిలోఆరుదినములు. *'ఆరు'* సమాప్తానికి సూచనగా వుంది కాబట్టి,
👉ఇకయుగసమాప్తి, అంటే? *ఆయన రెండవరాకడ సమపం కానుందిఅనే అంచనాకు రావొచ్చు.*
👉 ఈ లెక్కలు కాదుగాని, లేఖనాలు,
*భూమిమీద జరుగుతున్న సంభవాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి.*
👉 ఇవేమీపట్టించుకోకుండా, రాకడకు సిద్ధపాటు లేకుండా, అంతం వెంటనేరాదులే అనే ధీమాతో బ్రతికేస్తున్నాము.

వద్దు!
*ఆయన రక్షణకార్యమును సమాప్తము చేసి, ఆరక్షణను ఉచితముగానే నీకుఅనుగ్రహించాడు.*
👉 నిర్లక్ష్యము చేస్తే?
శిక్ష నుండితప్పించుకోలేవు. కనీసం నేడైనా ఆ రక్షణను నీవు స్వీకరించగలిగితే?
*ధన్యత లోనికి ప్రవేశించగలవు.*
*దైవాశ్శీసులు!!!*



యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు

(పదిహరవ భాగము)
1⃣6⃣ *యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడవ మాట...✍*
♻ *....సమర్పణ....* ♻

*"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి- తండ్రీ! నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను అనెను, ఆయన ఈలాగున చెప్పి, ప్రాణము విడిచెను"*
(లూకా 23:46).

👉యేసు ప్రభువు వారు మరణానికి ముందు నేరవేరవలసిన చిట్టచివరి ప్రవచనం ఈ మాటతో నెరవేరింది.

*నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను*
కీర్తనలు 31:5

*గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు.*
👉 ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేదు. ఆయనే అప్పగించాడు. ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం వుంది.

🔺 *యేసు ప్రభువు వారు ఆయన రాజ్య సువార్తను '"ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు"' అంటూ...* ప్రారంభించి.
🔺 ఈ లోకంలో సశరీరుడుగా చివరి మాటగా *'ఆత్మను అప్పగించుకొను చున్నాను'.*
అంటూ ముగించడం ద్వారా *ఆయన ఆత్మకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతుంది.*

👉 *జీవింప చేసేది ఆత్మ మాత్రమే.*
👉 *శరీరం ప్రయోజనం లేనిది.*
🔹 కాని, మనమయితే ప్రయోజనంలేని దానికోసం ప్రాకులాడుతున్నాము.
🔹 నిత్యమూ జీవింపజేసే ఆత్మను గూర్చిన ఆలోచనగాని, అవగాహనగాని లేకుండా బ్రతికేస్తున్నాము.

*ఆత్మయే జీవింప చేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము.*
యోహాను 6:63

*శరీరము ఎందుకు నిష్ప్రయోజనము అంటే?*
👉 మట్టిలోనుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలో కలసిపోవాల్సిందే.

*మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.*
ప్రసంగి 12:7

అయితే,
*మన శరీర అవయవములను దేవునికి సజీవయాగముగా సమర్పించు కోవాలి.*
👉 మన శరీరమున దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు,
*ఎంత మాత్రమూ మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము.*

*పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.*
రోమా 12:1

అవును!
👉యేసు ప్రభువు వారు తన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకోగలిగారు కాబట్టే, తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారు.

*మనము కూడా దేవుని కోసం శ్రమపడుతూ, మన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకొంటూ మంచి ప్రవర్తన గలవారమై సృష్టి కర్తయైన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి.*

👉దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
1 పేతురు 4:19

👉యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణము విడిచెను.
♻ *"మరణం"* ♻

👉ఒక మనిషిని మరొక మనిషి పలకరిస్తే స్పందించడానికి ఆ మనిషి బ్రతికేఉంటాడు,
👉కాని ఒకవేళ *"మరణం"* ఒక మనిషిని పలకరిస్తే *"అహ్!!!"* అనడానికి ఆ మనిషి బ్రతికిఉండడు.

సముద్రం ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడి తన అలలను ఉధృతం చేస్తుంది దాని ప్రయత్నం విఫలమైనప్పుడు ఆ అల నేలను తాకుతుంది కొన్ని కిలోమీటర్ల జనజీవన ప్రదేశాలను తాకుతుంది, కొన్ని లక్షలమందిని పొట్టన పెట్టుకుంది. దానికి జపాన్ దేశస్తులు *"సునామి"*(TSUNAMI)అని పేరు పెట్టారు.

👉కాని నిశబ్ద తరంగంగా అదృష్య ప్రవాహంగా కొన్ని వేళ సంవత్సరాల నుండి లక్షలమంది మానవులను ప్రతీ దినం హరించివేస్తున్న *"సంహారక సునామి"*
👉 అదే *"మరణం"*. ప్రతీ కుటుంబం లోని విషాదానికీ, ఆవేదనలకు, ఆర్తనాదాలకు, ఆహాకారాలకూ కారణం ఈ మరణమే.
👉సంతోషాన్ని సర్వనాశనంచేసేది ఈ మరణమే.
👉ఇది చాలా శక్తివంతమైనది కూడా ఎంత శక్తివంతమైనది అంటే.....
*ఈ భూమిమీద జననోత్పత్తి ఒక్క క్షణం ఆగి పోత మరుక్షణం ఈ భూగ్రహాన్ని "స్మశాన వాటిక" గా మార్చేసెటంత ప్రమాదకరమైనది.*

*ఏం జరిగితే మరణమంటాము???*

👉 దేవుడు మానవున్ని నిర్మాణం చేసినపుడు నేలమంటితో శరీరాన్ని నిర్మించి దానిలోనికి తన జీవవాయువును ఊదాడు నరుడు జీవాత్మ ఆయెను, *జీవాత్మను సంధి విడదీస్తే జీవం + ఆత్మ*
👉 అంటే మానవుడు :- *శరీరం, జీవం మరియు ఆత్మల కలయిక.*

*మొదటి థెస్సలొనీకయులకు 5:23*
*సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.*

👉 చనిపోయిన ఒక వ్యక్తి ని గూర్చి ఏం జరిగింది?
అని ప్రశ్నిస్తే
*"ప్రాణం పోయింది"* అనే సమాధానం వస్తుంది.

*ప్రాణం పోయింది అంటే ఇంతకు ముందు శరీరం లో ఉంది ఇపుడు శరీరం ను వదలి పోయింది అని.*

👉దీని విషయమై బైబిల్ చాలా స్పష్టంగా వివరించింది.
కీర్తన 90 : 10
*"మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము".*

ఈ వాక్య భాగంలో *" అది త్వరగా గతించు పోవును, మేము ఎగిరి పోదుము"*
ఈ మాటలో *"అది"* *"మేము"* అది ఏకవచనము, మేము బహువచనము

👉 *అది అనగా శరీరం*
👉 *మేము అనగా ప్రాణం, ఆత్మ*

👉అది గతించుపోవును అనగా శరీరం భూస్ధాపితం చేయబడిన తరువాత మట్టి లో కలసిపోయి గతించిపోతుంది....
👉మేము ఎగిరిపోదుము అనగా ప్రాణం ఆత్మలు ఎగిరి పోవును, దేవుని చెంతకు చేరిపోవును.

*ఏ శరీరంలో నుండి ప్రాణ ఆత్మలు వెళ్లిపోతాయో ఆ వ్యక్తి చనిపోయినట్లే.*

👉 *అదే మరణం*

👉ఒక రోజు ఖచ్చితంగా నీ నుండి ప్రాణ ఆత్మలు నిన్ను వదలి వెళ్లి పోతాయు

*"" సిద్ధంగా ఉండు""*

👉 *మన శరీరమున దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు,*

*ఎంత మాత్రమూ మన మరణం తర్వాత ఆత్మను దేవునికి అప్పగించుకోలేము.*

👉యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణము విడిచెను.

*యేసు పలికిన 7 మాటల్లో 3 మాటలు కేక వేసి పలికినవే.*
🔹 4వ మాట (మత్త 27:46),
🔹 6వ మాట (యెహను 19:30),
🔹7వ మాట ( లూకా 23:46).
👉ఆయన బిగ్గరగా కేక వేసి మరణించుట వలన *ఆయన ఓడిపోయిన వానిగా కాకుండా, జయశాలిగా మరణించాడు.*

*"నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను"*
యోహాను 10:18
👉 యేసుక్రీస్తు వారి జన్మము ఒక అద్భుతము, ఆయన జీవించిన సమయములో అనేకులను స్వస్థపరచి,చనిపోయిన వారిని సజీవులను చేసి గొప్ప అద్భుతములను చేసారు

*మరణం* :-
🔹ఈ లోకానికి ఆశ్చర్యము,అద్భుతమును
🔹 దేవునికి మహిమను కలుగజేసింది

👉 లూకా 23: 49
ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
*నెళవరులందరు దూరముగా ఉన్నారు*

*బంధిపోటు దొంగలు,మరియు సైనికులు ప్రభువుకు సమీపముగా ఉన్నారు*

✝ *సిలువ మరణం సృష్టించిన అద్భుతాలు*

1⃣ మత్తయి 27: 51
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;

2⃣ మత్తయి 27: 52, 53
సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.

3⃣ మత్తయి 27: 54
శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.
▪లూకా 23: 47
*శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.*

4⃣ లూకా 23: 48
చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి.

*ప్రియదైవజనమా సిలువలో యేసు పలికిన చివరిమాటకు సృష్టి అంతయు శోకసముద్రములో మునిగి విల విల లాడింది*

🔹 సర్వలోక సృష్టికర్త మరణం చూడలేక సూర్యుడు స్విచ్ ఆపేసాడు చీకటి కమ్ముకుంది

🔹 భూమి తట్టుకోలేక ఇక పాతిపెట్ట బడిన పరిశుద్ధులందరిని తిరిగి శరీరములతో సజీవులగుటకు సహాకరించింది
🔹 పరిశుద్ధుని మరణ వార్త విని భూమి తట్టుకోలేక తన మౌనాన్నీ వీడి నోరు తెరచింది
🔹 దేవుని ఘనపరచే స్థలం,ఆయన మహిమకు నిలయమైన దేవాలయము సృష్టికర్త మరణాన్ని చూడలేక రెండుగా చిరిగిపోయింది

*వీటిని కళ్లార చూచిన శతాధిపతి అప్పటివరకు యేసుక్రీస్తును శిక్షించుటకు,దూషించుటకు,హేళనచేయుటకు తెగబడిన అతనిలో భయముకల్గి ,నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యమిచ్చి దేవునిని మహిమపరచాడు*

*కఠినులను మార్చింది యేసురక్తము,వారి ద్వారనే మహిమపర్చుటకు కారణం ఆయన మరణం*

👉 *ఈ సిలువ మరణమే నిన్ను నన్ను మార్చింది , నిత్యరాజ్యములో ప్రవేశించుటకు మార్గము చూపింది*

*ఆలోచించు, యేసుక్రీస్తును శిక్షించిన శతాధిపతి ప్రభువును మహిమపర్చాడు.సృష్టి అంత ప్రభువు మరణాన్నీ ప్రచుర పరచి ప్రభువు కొరకు అద్భుతములు సృష్టించాయి*

👉 *మరి నీవు?*
🔹 నీ కొరకే ప్రాణం పెట్టి నీ పాపములనుండి విమోచించిన యేసుక్రీస్తు కొరకు ఏమి చెయ్యగలవు?

*దేవుని సృష్టిలో ప్రధానమైన వారు మానవులే అనగా నీవే సృష్టి ప్రభువును మహిమపర్చగా మనము దేవుని నామానికి అవమానము తెచ్చేవారిగా ఉన్నమేమో*

ఎఫెసీ 4: 22
*కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని*

👉 యోబు 13: 15
ఇదిగో ఆయన నన్ను, చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
*మనము కూడా దేవుని కోసం శ్రమపడుతూ, మన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకొంటూ మంచి ప్రవర్తన గలవారమై సృష్టి కర్తయైన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి.*

దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను1 పేతురు 4:19

👉 పాపులమైన మనలను పరిశుద్ధుని చేయుటకే తన ప్రాణం బలిగా అర్పించిన యేసుక్రీస్తు కొరకు జీవిద్దాం..ఆయన రక్షణ సువార్తను నలుదిశలా చాటుదాం!!

👉 ఆయన చనిపోయింది సాయంత్రం 3గంటల తరువాత,
*అది సాయంకాలం బలి అర్పించే సమయం.*
👉 బలి అర్పించుట పూర్తి అయిన తరువాత యాజకుడు బూర ఉదుతాడు.
*ఆయన గోప్ప శబ్దముతో వేసిన కేక యాజకుని బూరకి సాదృశ్యముగా మనం చెప్పుకోవచ్చు.*

👉 ఈ రీతిగా ఆత్మను అప్పగుంచుటలో
*5 విషయాలు జ్ఞాపకం* చేసుకుందాము.

1⃣ *యేసు పరిశుద్ధ జీవితం జీవించి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు.*
👉 మనము కూడా పరిశుద్ధ జీవితం జీవించాలి.
యేసు ప్రభువు వారు తన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకోగలిగారు

*నాలో పాపమున్నది అని నిరూపించ గలరా?* అని సవాలు చేసాడు పరిశుద్ధుడైన ప్రభువు కాబట్టే, తన ఆత్మను నేరుగా తండ్రికి అప్పగించుకోగలిగారు

2⃣ *తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు.*

"కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను" (1 పేతురు 4:19).

3⃣ *మరల తీసుకోవడానికి అప్పగించాడు.*

" నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను"
(యెహను 10:17-18)

4⃣ *మరణ భయం తొలగించుటకే తన ఆత్మను అప్పగించాడు.*

హెబ్రీయులకు 2: 15
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

1కోరింథీయులకు 15: 55
ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?

ప్రియులారా... ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. మరణ భయం తొలగించుటకే ఆయన మరణములో పాలివాడాయెను.

5⃣ *చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయుడిగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు.*
👉 అదే విధముగా మనం కూడా తండ్రు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి.

*కొట్టేవారికి తన వీపును అప్పగించాడు. సైనికులకు తన అప్పగించాడు. ఉమ్మి వేసే వారికి తన ముఖము అప్పగించాడు.*

*తనను ఆశ్రహించిన దొంగకు పరదైసు అప్పగించాడు.*
*సమాప్తమైనది అని తన పరిచర్య లెక్కను తన తండ్రికి అప్పగించాడు.*
👉 4వ మాటలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అని అక్రనాధం చేసినపుడు తండ్రీ కుమారుల సంబంధం తెగిపోయినది.
👉 మరల ఇప్పుడు తండ్రీ కొడుకుల సంబంధం పునరుద్ధింపబడింది.

*ప్రియులారా... తండ్రీ చేతిలో మన ఆత్మను పెట్టాలి అంటే ముందు మనకు దేవునికి మధ్య సంబంధం ఉండాలిగా.*

*మొదటి మాటలో తండ్రీ అని పిలిచినట్లే,*
*చివరి మాటలో తండ్రీ అని పిలుచుట ద్వారా తండ్రీ కుమారుల సంబంధం వ్యక్తవవుతున్నది.*
👉 మనం కూడా అట్టి సంబంధం కలిగి ఉండాలి.
*ప్రభు నేర్పిన ప్రార్ధనలో కూడా పరలోకమందున్న మా తండ్రీ అంటాము.*
👉 ఈ ప్రార్ధన చిలకపలుకుల్లా ఉండకూడదు.

యెహను 1:12 ప్రకారం, ఆయనను అంగీకరించి ఆయన కుమారునిగా, కుమార్తెగా అధికారం సంపాదించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక!
*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు నేను మరియు కొంతమంది దైవజనులు కొన్ని గంటలు శ్రమించి మీ ముందుకు తెస్తున్నాము.*
గనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.
👉 *అను దిన ఆత్మీయ సందేశాల కొరకు WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి*
👇👇👇👇👇👇👇👇
*WhatsApp* -
*8520848788*
*8309305240*

ప్రభుసేవలో....✍
మీ సహోదరుడు
*పాస్టర్ పాల్ కిరణ్ ,*
తాడిపత్రి,
అనంతపురం జిల్లా. A.P

👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*


కామెంట్‌లు

  1. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుని నామంలో వందనములు...
    మంచి సందేశము సోదరా...
    ఇంకా క్రైస్తవులకు ఆత్మీయంగా ఎదగడానికి. ఇంకా మంచి సందేశాలు పంపగలరనీ ప్రార్ధీస్తున్నాను

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్రిస్మస్

శరీర కార్యములు

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1

పక్షిరాజు

సమరయ స్త్రీ

పాపము

విశ్వాసము

ప్రభువు నేర్పిన ప్రార్ధన - పరలోక ప్రార్ధన