పక్షిరాజు
పక్షిరాజు
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితి 32:11
గూడు: పర్వత శిఖరంమీద నిర్మిస్తుంది. మొదటగా బలమైన కర్రలు వాటిపైన చిన్న చిన్న కొమ్మలను పేర్చుతుంది. దానిపైన పీచువంటి పదార్ధాన్ని ఉంచుతుంది. దానిపైన మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు మొదలగునవి పేర్చుతుంది. దానిపైన మెత్తని బట్టలు, దూది వంటి పదార్ధాలతో గూడును నిర్మించి, దానిలో గుడ్లనుపెట్టి పొదుగుతుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది. సమయానికి పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతుంది. మావంటి తల్లి ఇంకెవ్వరికి ఉండదని, పిల్లల ఆనందానికి అవధులుండవు. ఎంతో ప్రేమగా తనబిడ్డలను సాకుతున్న తల్లి, ఒక్కసారిగా దాని హృదయం బండబారిపోతుంది. గూడు రేపేస్తుంది. మెత్తటి బట్టలు, దూదిని గాలిలోకి విసిరేస్తుంది. ఇకదానిక్రింద వుండేవేమిటి? మేకులు, గాజుముక్కలు, బ్లేడు ముక్కలు, ముళ్ళు, ఆ చిన్ని పిల్లల పసి దేహాలకు ఈ ముళ్ళు గాయాలు చేస్తుంటే, వాటి బాధ వర్ణనాతీతం. అంతవరకు సమయానికి ఆహారం తెచ్చిపెట్టే తల్లి అడ్రస్ లేకుండా పోతుంది. ఒకప్రక్క ముళ్ళు బాధ, మరొకప్రక్క ఆకలి బాధ. వీటిని భరించలేక ఆ గూటిలోనుండి క్రిందకి దూకేస్తాయి ఆ పిల్లలు. ఎగరడంరాని, ఆ పసిపిల్లలు పర్వత శిఖరం నుండి క్రిందపడితే, బ్రతుకుతాయా? అవి మరికొద్ది క్షణాల్లో నేలను తాకబోతున్నాయనగా, ఎక్కడనుండి వస్తుందో రెక్కలు చాచుకొంటూ ఆతల్లి. ఆ పిల్లలు క్రిందపడకుండా దాని రెక్కల మీద పడేటట్లు, భద్రంగా తన పిల్లలను రక్షిస్తుంది. పిల్లల ఆనందానికి అంతే లేదు. అది ఎంతోసేపు కాదు. మరలా తీసుకొనివెళ్ళి అదే గూటిలో పెడుతుంది. ఇట్లా కొన్నిసార్లు జరిగిన తర్వాత. ఇక పిల్లలు క్రిందపడకుండా, వాటంతట అవే ఎగరడం నేర్చుకుంటాయి. ఇదంతా తన పిల్లలు స్వేచ్ఛగా ఎగరడానికి తల్లి ఇచ్చే ట్రైనింగ్.
శోధనలు వెంబడి శోధనలా? ప్రేమించి, ప్రాణమిచ్చిన దేవుడు కూడా, విడచిపెట్టేసారు అనే సందేహమా? వద్దు! అబ్రాహాము కత్తి ఎత్తేటంత వరకు దేవుడు పరీక్షించారు. కానీ, కత్తిమాత్రం ఇస్సాకు మీదికి దిగనివ్వలేదు. పక్షిరాజు తన పిల్లలు శిఖరం మీదనుండి ఇంచుమించుగా క్రిందపడేవరకూ మౌనం వహించినట్లు కనబడుతున్నప్పటికీ, వాటిని మాత్రం క్రింద పడనివ్వదు. ఆ పిల్లలకు తెలియకుండానే, వాటిని వెంబడిస్తూ వస్తుంది. తల్లి హృదయం కఠినం చేసుకోకపోతే, పిల్లలకు స్వేచ్చాజీవితం లేక, జీవితాంతం గూటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. మన పట్ల దేవుడు కూడా ఇట్లాంటి విధానాన్నే అనుసరిస్తారు. విశ్వాసములో పరిపూర్ణులను చెయ్యడానికి మన జీవితంలోకి అనేకసార్లు శోధనలను అనుమతిస్తారు. లేకపోతే, ఆధ్యాత్మిక మరగుజ్జులుగానే మిగిలిపోతాము. శోధనలే మనము దేవునిపై ఎట్లా ఆధారపడాలో నేర్పిస్తాయి. అదే సమయంలో ఆయన కృప మనలను వెంబడిస్తూనే మనలను ముందుకు నడిపిస్తుంది. పక్షిరాజు తన గూడు రేపకపొతే తన పిల్లలకు స్వేచ్చా జీవితం లేదు. దేవుడు మన గూడు రేపకపోతే (శోధనలు లేకపోతే) ఆధ్యాత్మిక మరగుజ్జులమే అనే విషయం గుర్తెరిగి, శ్రమలయందునూ అతిశయిస్తూ, ఆయనపైనే ఆధారపడుతూ, విశ్వాసములో బలము పొందెదము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యెహోవాకొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40:31
పక్షిరాజు ¸యవ్వనమువలె నీ యవ్వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు కీర్తనలు 103:5
నూతనజన్మ :
గతించన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగిరాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యం ముంచుకొస్తుందితప్ప, కోల్పోయిన యవ్వనం తిరిగిరాదు. ఇది నిత్య సత్యం. కాని, వాక్యం చెప్తూవుంది. పక్షిరాజు కోల్పోయిన యవ్వనము తిరిగి పొందుకొంటుంది అని. ఇది వాస్తవమా? అవును! వాక్యం చెప్పేది ఏదయినా వాస్తవమే. ఇది పక్షి రాజులో మాత్రమే వున్న ఒక ప్రత్యేకమైన లక్షణము. పక్షిరాజు జీవితకాలం 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరములు గడిచేసరికి, ముక్కు వంకర తిరిగిపోతుంది. తద్వారా ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. విస్తారమైన ఈకలవలన ఎగరలేకపోతుంది. దాని చాతి కూడా అందుకు సహకరించదు. గోర్లు ఆహారం పట్టుకోవడానికి వీలులేకుండా వంకర్లు తిరిగిపోతాయి.
ఇట్లాంటి సందర్భములో, రెండు అవకాశాలు దాని ముందు వున్నాయి.
- చనిపోవడం
- బాధాకరమైన అనుభవంగుండా నూతన జన్మను పొందడం.
పక్షి రాజు 40 సంవత్సరాలు జీవించి, వృద్ధాప్యం లోనికి చేరుతుంది. ఆసమయంలో అది ఒక ఎత్తయిన శిఖరానికి వెళ్లి,
🔹తన ఈకలన్నీ పెరికివేసు కొంటుంది.
🔹తన గోర్లు లాగివేస్తుంది.
🔹తన పదునైన ముక్కును బండకేసి బ్రద్దల గొట్టేస్తుంది.
🔹అట్లా ఆ రక్తపు మడుగులో ఏవిధమైన ఆహారం లేకుండా 150 రోజులు ( ఐదు నెలలు) ఉండిపోతుంది.
🔹ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో క్రొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి.
దానితో పాటు, నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకుంటుంది.
🔹నూతన జన్మను పొంది, మరళా మరొక 30 సంవత్సరాలు జీవించి, తర్వాత మరణమవుతుంది.
అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. పక్షిరాజు నూతన బలము పొందాలంటే? తనకుతానే తన శరీరంను నలుగగొట్టు కొంటుంది. శ్రమ పడుతుంది. కాని, నీకు నూతన బలము, నూతన యవ్వనము ఇవ్వడానికి, నీకు బదులుగా నీ ప్రియ రక్షకుడైన యేసయ్య నలుగ గొట్టబడ్డారు, శ్రమ పడ్డారు. మేలుతో నీ హృదయాన్ని తృప్తి పరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఇంతచేసిన ఆయన కోసం నీవేమి చెయ్యగలవు? విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతచేరి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతించు. అది చాలు. అంతకుమించి దేనినీ నీ నుండి ఆయన ఆశించరు. పాత రోత జీవితాన్ని విడచిపెట్టి, నూతన సృష్టిగా ప్రభువుకొరకు జీవించగలగాలి.
ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు. (న్యాయాధి 5:31) ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరం? 85 సంవత్సరాల వయసుగలిగిన కాలేబు, 45 సంవత్సరాల క్రితం జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బలమున్నది. (యెహోషువ 14:11) అంటే, 85 సంవత్సరాల వయస్సులో అతనికెంత బలముందో, 45 సంవత్సరాల వయస్సులోకూడా అతనికి అంతే బలముందట. ఇది దేవుని యందు భయభక్తుల మూలముగా కలిగే బలము. అట్టి బలాన్ని మనమునూ పొందుకొని, నూతనోత్తేజముతో ప్రభువులో సాగిపోవుదము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
యెహోవాకొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40:31
సమస్యల ఎదురీత :
తుఫాను సంభవించే సమయంలో పక్షులన్నీ గూళ్లకు చేరుకుంటాయి. భయం భయంగా గూళ్ళలో గడుపుతుంటాయి. కానీ, పక్షిరాజు మాత్రం తన గూడును విడచి, రెక్కలు చాచుకొని, తుఫానుకు ఎదురీది దూసుకుపోతుంది. ఎంతటి తుఫాను అయినాసరే, ఎంత బలమైన గాలులు వీస్తూవున్నాకూడా వేటిని లెక్కచెయ్యకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. క్రిందకు చూచే ప్రయత్నమెంత మాత్రమూ చెయ్యదు. ముందుకే దూసుకుపోతుంది. ఎంతవరకూ అంటే, ఆకాశంలో చెలరేగిన ఆభయంకరమైన పరిస్థితులను దాటి, నిర్మలమైన వాతావరణంలో అడుగుపెట్టేవరకూ ముందుకు దూసుకుపోతుంది. పక్షిరాజు తన జీవితకాలంలో అత్యంత ఎత్తుకు ఎగిరే సందర్భం ఎప్పుడు అంటే, తుఫాను సంభవించినప్పుడేనట.
కష్టాల కడలిలో, కన్నీళ్లే అన్నపానములై, అలలకు ఎదురీదలేక, గమ్యం కానరాక, నిరాశా, నిస్ప్రుహలతో కృంగినజీవితాన్ని నీవు జీవిస్తుంటే, పక్షిరాజు పాఠం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్తపాఠం. పక్షిరాజును తన జీవితకాలంలో అత్యంత ఎత్తుకు చేర్చేవి భీకరమైన తుఫానులే. ఆలోచించగలిగితే, ఆనందించగలిగితే, మన జీవితకాలంలో మనలను అత్యంత ఉన్నతంగా, దేవునికి సామీప్యముగా చేర్చగలిగే సందర్భాలు శ్రమలు, శోధనలు, వేధనలే. అయితే, వాటిని చూచి నీరసించిపోకూడదు, కృంగిపోకూడదు, తుఫానులొచ్చినప్పుడు పక్షిరాజు తన శక్తినంతా కూర్చుకొని, ఏరీతిగా భీకరమైన గాలులకు ఎదురీదుతోందో, ఆరీతిగానే, ప్రభువుపట్ల అచంచలమైన విశ్వాసముతో, ఆయనయందే బలాన్ని పొందుకొని, సమస్యలకు ఎదురీదగలగాలి, వాటిని ఛేదిస్తూ, వాటికి అందనంత ఎత్తులోనికి వెళ్లిపోగలగాలి.
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా 43:2
నీవు సమస్యలు అనే జలములలో బడి దాటునప్పుడు ఆయన నీకు తోడుగా వుంటారు. వాటినిచూచి కృంగిపోవద్దు. జలాల్లో అడుగుపెట్టు. ఆయనపై ఆధారపడి, దాటుకుంటూ వెళ్ళిపో, నీవువేసే ప్రతీ అడుగుకు ఆయన తోడై వుంటారు. శోధనలు అనే నదులను చూచి, నిరాశ చెందొద్దు. దానిలో అడుగుపెట్టి సాగిపో, ఎగిసిపడే కెరటాలు నిన్ను భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, అవి నీమీద పొర్లిపారవు. నిన్ను ముంచెత్తవు. ఎందుకంటే? ప్రభువు నీతోనే వున్నారు. అగ్నివంటి శ్రమలు నిన్ను చుట్టిముట్టినా భీతిచెందక ముందుకు సాగిపో! అవెంతమాత్రమూ నిన్ను కాల్చవు. ప్రభువుపైన విశ్వాసముంచిన హెబ్రీ యువకులవలే ఆయనపై ఆధారపడినప్పుడు అగ్నిగుండం సహితం ఆహ్లాదకరమే! పక్షిరాజువలే శక్తినంతా కూడదీసుకుని రెక్కలుచాచి పైకెగిరిపో. క్రీస్తులో నూతన బలాన్ని పొందుకొని, సమస్యల సుడిగుండాలగుండా సాగిపో! ప్రభువు నీతోనున్నారు నిర్మలమైన చోటకునడిపించి, సమాధానకరమైన జీవితాన్ని ప్రభువు నీకిస్తారు. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా? అదిరాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును. *అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును* యోబు 39: 27-29
పక్షిరాజు దృష్టి:
పక్షిరాజు దృష్టి మన దృష్టితో పోలిస్తే సుమారు 8 రెట్లు అధికంగా వుంటుందట. భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న పక్షిరాజు, భూమిమీదనున్న చిన్న కోడిపిల్లను స్పష్టముగా చూడగలుగుతుంది. అంటే దానిచూపు అంత తేటగా ఉంటుంది. ఉన్నతమైన స్థలాలలో సంచరిస్తూ ఏరీతిగా తేటనైన చూపుగలిగివుంటుందో, అదేరీతిగా మన ఆత్మీయ యాత్రలో ఉన్నతంగా జీవించడానికి పరిశుద్ధమైన కళ్ళు, చక్కని చూపు కలిగియుండాలి. ఎందుకంటే? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; (మత్తయి 6:22,23 )
చూపులలో పరిశుద్ధతను కోల్పోతే?తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము. తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే? మాటలలోనూ, క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా మన ప్రవర్తన మలినమై, పాపమునకు మరింత దగ్గరై, దేవునికి దూరమై పోతాము. నీ సంగతేమిటి? ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూ, చూపులలో పరిశుద్ధతను కోల్పోయి, తద్వారా హృదయ తలంపులను పాడుచేసుకొని, పాపం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నావా? వద్దు! దేవుని హృదయానుసారుడైన దావీదు తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. దేవునిచే నాజీరు చేయబడిన సంసోను తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. తద్వారా వాటి ఫలితాలు అత్యంత భాధాకరము. వెలుగైయున్న కన్ను, చెడ్డదైతే జీవితం అంధకారమవుతుంది.
అయితే, మనము చేయాల్సిందేమిటి? వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము. (కీర్తనలు 119 :37) అంటూ కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నారు. మనకన్నులను మనము త్రిప్పుకోలేమా? దానికొరకు దేవునిని ప్రార్ధించాలా? దీనినిబట్టి అర్థంచేసుకోవచ్చు కనులద్వారా జరిగే పాపము ఎంతటి బలమైనదో. అది ఎంతటి బలమైనదంటే? ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. (మత్తయి 5:28) అందుచే వ్యర్ధమైనవాటిని చూడకుండా, మనకన్నులను త్రిప్పివేయమని, వాటిని పరిశుద్ధపరచమని ప్రభువును ప్రార్ధించగలగాలి. దానితోపాటు భక్తుడైన యోబువలే మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? (యోబు 31:1) ఇట్టి అనుభవం లేకుంటే? వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి, తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. (2 పేతురు 2:14,15) దానిఫలితం అత్యంత భయంకరం. మన చూపులను పరిశుద్ధపరచుకొని, పైనున్నవాటియందే లక్ష్యముంచి, అత్యుత్తమ జీవితము జీవించుటకు మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

పక్షిరాజు సిద్ధపాటు:
పక్షిరాజు శత్రువులనుండి వచ్చే దాడుల నుండి తప్పించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కనీసం ఆహారం తినేటప్పుడు కూడా, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎగిరిపోవడానికి వీలుగా, రెక్కలు సగం చాచుకొని తింటుంది. శత్రు జాడలను పసిగట్టడంలో నేర్పుగా వ్యవహరిస్తోంది. విశ్వాసులు కూడా శత్రు పన్నాగాల విషయంలో అప్రమత్తముగా ఉండాలి. ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహమువలే సాతాను తిరుగుచుండగా (1 పేతురు 5:8) ఏవయస్సువారికి తగిన ఉచ్చులు వారికొరకు సిద్ధంచేసి, వాడి ఉచ్చులోనికి లాగాలని వాడు ప్రయాసపడుతుండగా, వాడి ఉచ్చులో పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తముగాను, సిద్ధంగా ఉండాలి. అదెట్లా సాధ్యం? దేవుడిచ్చు సర్వాంగకవచం ధరించుకొనుట ద్వారామాత్రమే సాధ్యం.
సర్వాంగ కవచములోని కవచములు:
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ 6: 12-17
- నడుమునకు సత్యమను దట్టి
- నీతియను మైమరువు
- పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు
- విశ్వాసమను డాలు
- రక్షణయను శిరస్త్రాణము
- దేవుని వాక్యమను ఆత్మఖడ్గము
సర్వాంగ కవచములోనున్న 6 కవచాలు మన ముందుభాగంలోనే యివ్వబడ్డాయిగాని, వెనుక భాగంలో ఎట్లాంటి కవచము యివ్వబడలేదు. అంటే వెనుదిరిగి పారిపోతే, సాతానుకు దొరికిపోవడం అత్యంత సులభమన్నమాట. వాడు విసిరే బాణం నేరుగా దిగబడుతుంది. మనము క్రిందపడిన వెంటనే వాడి కాలితో త్రొక్కేస్తాడు. ఆ పరిస్థితి రాకుండా ప్రతీ క్షణం మనము అప్రమత్తముగా ఉండాలి. పక్షిరాజు తన రెండు రెక్కలను పూర్తిగా చాపితే, ఈ చివరనుండి, ఆ చివరకు సుమారు 7 అడుగులు విస్తరిస్తాయి. ఆప్రాంతములోనున్న గాలినంతటిని ఎగరడానికి అనుకూలముగా మలచుకొంటాయి. అట్లానే మన జీవితంలో మనకు ఎదురుపడే ప్రతీవిధమైన సమస్యను శోధనను ఓర్చుకొంటూ, దేవునిలో మరింత ముందుకు వెళ్ళడానికి అనువుగా మలచుకోవాలి.
దేనికొరకు సిద్ధపడాలి:
▫️సువార్త ప్రకటించుటకు (రోమా 1:15 )
▫️దేవుని సన్నిధిలో కనబడుటకు ( ఆమోసు 4:12)
▫️హేతువు అడుగు ప్రతీవానికి ▫️సమాధానము చెప్పుటకు (1పేతురు 3:16 )
▫️ప్రభువు రాకడ కొరకు ( మత్తయి 24:44 )
▫️పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు (మత్తయి 25:10)
▫️ప్రతీ సత్కార్యము చేయుటకు (తీతు 3:2)
▫️బంధించ బడుటకు మాత్రమేకాక, చనిపోవుటకు సహితం ( అపో. కా 21:13) సిద్ధపడాలి.
ప్రియ నేస్తమా! కృపాకాలం గతించిపోనుంది. ప్రభువురాకడ సమీపమయ్యింది. ఆయన రాకడెప్పుడో, మన ప్రాణం పోకడెప్పుడో తెలియదు కాబట్టి, రాకడకొరకు రెడీ అవుదాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
పవిత్రత:
ఆడపక్షి, మగపక్షిని తొందరగా చేరదీయడట. అనేక పరీక్షలకు గురిచేసి, చాలా కాలం వేచిచూచి, మగ పక్షియొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్ధంచేసుకున్న తర్వాతనే తన భర్తగా స్వీకరిస్తుందట. ఆతర్వాత రెండుపక్షులు కలసి జీవిస్తాయి. పిల్లలను చేసే విషయంలో కూడా రెండూ సమానముగా వాటి బాధ్యతలను పంచుకుంటాయి. రాత్రి సమయంలో ఆడపక్షి గుడ్లను పొదిగితే, పగటి సమయంలో మగ పక్షి గుడ్లను పొదుగుతుంది. రెండింటిలో ఏ పక్షి ముందు చనిపోయినాగాని, మిగిలిన పక్షి, పావురమువలెనే తన జీవితకాలంలో వేరొకపక్షితో జతకట్టదట. సృష్టిలో అత్యున్నత సృష్టమైన మనిషికి, పక్షులు పరిశుద్ధపాఠాలు నేర్పుతున్నాయి కదా?
Love is at first sight అన్నట్లు, కనీసం వారిపట్ల ఏమాత్రం అవగాహన లేకుండా, పై పై ఆకర్షణకు, ఆకర్షింపబడి, సర్వస్వాన్ని కోల్పోయిన జీవితాలు కోకొల్లలు కదా? జీవితాంతం కలిసి జీవించాల్సిన పవిత్ర బంధానికి, ప్రేమ అనే పేరుతో, చివరకు ఆ ప్రేమకునోచుకోక, ఎవ్వరితోనూ చెప్పుకోలేక, జీవచ్ఛవాలలా బ్రతికేవారు కొందరైతే, తెగదెంపులు చేసుకొనేవారు మరికొందరైతే, అసలు నాకు ఈ జీవితమే వద్దంటూ అర్ధాంతరంగా లోకానికి గుడ్ బై చెప్పేస్తున్నవాళ్ళు లెక్కలేనంత.
ఇది ఇట్లా వుండగా, వ్యభిచారము కారణముగా విడాకులు తీసుకోవడాన్ని గాని, భార్యాభర్తల ఇరువురిలో ఒకరు మరణిస్తే, మరొకరిని వివాహం చేసుకోవడాన్ని బైబిల్ తప్పుబట్టదు. కానీ, నేటి దినాల్లో చాలా వరకు కుటుంబాలు విచ్చిన్నమై, సమాధానం కోల్పోయి నరకప్రాయం కావడానికి కారణం? అక్రమ సంబంధాలే కదా! ఇద్దరిలో ఎవ్వరు తన పవిత్రతను కోల్పోయినాగాని, కుటుంబమంతా కల్లోలమే కదా? నీవనుకోవచ్చు నేనెవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నానని, నీ పాపం బట్టబయలయ్యే రోజు దగ్గరలోనే వుందనే విషయం మరచిపోవద్దు. ఇప్పటికే నీవు నీ మనస్సాక్షిని పీకనులిమి చంపేసి, నీవు మాత్రమే బ్రతుకుతున్న సంగతి నీకు పూర్తిగా తెలుసు. నీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి, నీ ఆత్మను నిత్య మరణానికి అప్పగించడం నీకు క్షేమమా? నీ స్థానమెక్కడో ఒక్కసారి ఆలోచించు!
కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవా! ఎప్పటికైనాసరే పరిశుద్ధతయే నీ 'మందిరము'నకు అనుకూలమని. (కీర్తనలు 93:5 ) మందిరము అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు (1 కొరింది 3:16,17) నీ దేహమే దేవుని మందిరం.
నాకు నచ్చినట్లుగా జీవిస్తానని నీవంటే? దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త ! ఆయనే పాడు చెయ్యాల్సివస్తే ఇక విడిపించేదెవరు? నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. (1 పేతురు 1:14).
ప్రియ నేస్తమా! కృపాకాలం గతించిపోనుంది. ప్రభువురాకడ సమీపమయ్యింది. ఆయన రాకడెప్పుడో, మన ప్రాణం పోకడెప్పుడో తెలియదు కాబట్టి, మనలను పరిశుద్ధపరచుకొని, ఎత్తబడే సంఘములో, సిగ్గులేని ముఖాలతో ప్రభువును ఎదుర్కొనడానికి మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మరణం:
పక్షిరాజు తాను ఎప్పుడు మరణిస్తుందో దానిని గ్రహించగలిగే జ్ఞానమును దానికిచ్చారు. దాని మరణ సమయం సమీపిస్తున్నప్పుడు అది ఎత్తైన శిఖరాన్ని చేరుకొని, సూర్యునివైపు తీక్షణంగా చూస్తూనే ప్రాణం విడస్తుందట. అది ఎంతసేపైనాసరే అట్లానే సూర్యునివైపు రెప్పవాల్చకుండా చూస్తుందట. మరణ సమయంలోనే కాదు, తన జీవితకాలంలో ఎప్పుడైనా నేరుగా సూర్యునివైపు చూడగలిగే శక్తి దాని కళ్ళకు వుంది. పక్షిరాజు జీవితమంతా సూర్యునివైపే చూడగలుగుతుంది. కారుమబ్బులు అలుముకున్న సందర్భంలో సూర్యుడు ఎటువైపున ఉదయిస్తాడో అటువైపుగా తన పయనాన్ని కొనసాగిస్తుంది. మబ్బులను దాటుకొని, సూర్యుడు ప్రకాశించే వెలుగులోనికి చేరిపోతుంది. చివరకు మరణంకూడా సూర్యుని చూస్తూనే చివరిశ్వాస విడచిపెడుతుంది.
మన జీవితంలో కూడా శోధనలు అనే కారుమబ్బులు కమ్ముతున్నప్పుడు, కృంగిపోకుండా నీతి సూర్యుడైన (మలాకీ 4:2) ప్రభువు వైపు చూస్తూ, ఆయన కృపలో కారుమబ్బులు దాటుకొని, ఆయనకు మరింత సమీపముగా సాగిపోవాలి. మరణ సమయం వరకూ నీతి సూర్యుడైన యేసయ్యను మాత్రమే చూడగలగాలి. మన జీవమైనా మరణమైనా ఆయనతోనే ఆయన కోసమే జీవించాలి. మరణించాల్సివస్తే ఆయనకోసమే మరణించాలి.
త్యాగం:
ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలనకోసం ఒక బృందం అక్కడకి వెళ్తే, రెక్కలు చాచుకొని, కాలిపోయి, మరణించిన పక్షిరాజును చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఎందుకిది ఇట్లా చనిపోవాలి? మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా! అని. ఎందుకో వాళ్లకి అనుమానం వచ్చి ఆ పక్షిని పైకిలేపితే, దాని రెక్కల క్రింద సజీవంగా వున్నా పక్షి పిల్లలు వున్నాయట. అవును! నీకును ఆయన రెక్కల క్రింద అట్లాంటి కాపుదల, భద్రత, క్షేమం వుంది. నిన్ను సంరక్షించడం కోసం ఆయన ఆహుతి అయ్యారు.
🔹సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
🔹39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
🔹వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
🔹ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
🔹గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
🔹కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
🔹ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
🔹ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
ఇదంతా దేనికోసం? మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఆయన స్థానాన్నిమనకిచ్చారు. లోకపాపములు మోసికొనిపోతుంది ఆ దేవుని గొర్రెపిల్ల. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
యెషయా 53:5
యింత చేసిన ఆయన కొరకు, నీవేమివ్వగలవు? నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోచాలు. నీ హృదయాన్ని తప్ప, నీ నుండి దేనిని ఆయన ఆశించరు. కనీసం నేడైనా ఆయన త్యాగాన్ని అర్ధం చేసుకోగలవా? ఆయన పాదాల చెంతచేరి, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలవా? అట్లా చెయ్యగలిగితే? నిజంగా నీ జీవితం ధన్యమే. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

మరిన్ని వర్తమానములకై
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
- మీ సహోదరుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి