శరీర కార్యములు

శరీర కార్యములు

( మొదటి భాగము)

శరీర కార్యములు

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

*శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.*
గలతి 5:17

👉 శరీరానుసారులే శరీర కార్యములను నెరవేర్చుతారు.

🔺 *శరీరానుసారుల యొక్క స్వభావము, గమ్యము*: :

* నీ మనస్సు శరీరవిషయములమీదనే ఉంటుంది.
* శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;
* అది దేవుని ధర్మ శాస్త్రమునకు ఏమాత్రమును లోబడనేరదు.
* శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
* శరీర స్వభావము గలవాడు, క్రీస్తువాడు కాడు.
* దీని గమ్యం మరణం
రోమా 8:5-14
*సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము*. ((రోమా 8:12)

🔺 *శరీరానుసారులు జరిగించే, శరీరకార్యములు*:
* జారత్వము,
* అపవిత్రత,
* కాముకత్వము,
* విగ్రహారాధన,
* అభిచారము,
* ద్వేషములు,
* కలహము,
* మత్సరములు,
* క్రోధములు,
* కక్షలు,భేదములు,
* విమతములు,
* అసూయలు,
* మత్తతలు,
* అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి.
గలతి 5: 19-21

👉 అయితే, ఒక్క విషయం!
*శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును చేరుకోలేరు*. (గలతి 5:21)

కావున, ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే నిరంతర పోరాటంలో శరీర కార్యములను ఎదిరిస్తూ, వాటిని చంపివేస్తూ ఉండాలి.

ఎప్పుడైతే, శరీర కార్యములమీద విజయం సాధించామో?

* నీ మనస్సు ఆత్మవిషయములమీదనే ఉంటుంది.
* దీని గమ్యం జీవము, సమాధానము.
* దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారు.
* దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
(రోమా 8:5-14)

*మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు*. (రోమా 8:13)

*ప్రియ నేస్తమా !* ఏ గుంపులో నీవున్నావ్? ఒక్కసారి యోచించు. శరీరానుసారివైతే దాని గమ్యం అతిభయంకరం. అది నిత్య మరణం.

వద్దు! జీవించిన జీవితానికి, గతించిన కాలమే చాలు!
* శరీరేచ్ఛలను సమాధి చేద్దాం!
* ఆత్మానుసారులుగా జీవిద్దాం!
* ఆయన కుమారులుగా తీర్చబడదాం!
* నిత్యరాజ్యానికి వారసులవుదాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచు కుందాము. ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాము.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( రెండవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.
🔵1. *జారత్వము* 🔵
🔺 *జారత్వము అంటే*?
వివాహమైన వ్యక్తి, తన భర్త, లేదా తనభార్యతో కాకుండా, ఇతర వ్యక్తులతో కొనసాగించే లైంగిక కార్యకలాపాలు.
నేటి దినాల్లో కుటుంబాల విచ్చిన్నానికి, సాతాను వాడుతున్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో “జారత్వము” ఒకటి. తద్వారా, కుటుంబాలలో సమాధానం లేదు. అంతే కాకుండా, హత్యలకు సహితం దారితీసిన సందర్భాలు కోకొల్లలు.
తలిదండ్రులు జారత్వము అనే పాపపు కోరల్లో చిక్కి, నలిగిపోతుంటే, వారి పిల్లలేమో శారీరిక, ఆధ్యాత్మిక అనాధలుగా జీవితాలను కొనసాగించాల్సి వస్తుంది.
🔺 *జారత్వమునకు పుట్టినిల్లు హృదయమే*
మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. మార్కు 7:21,22
🔺 *జారత్వము సమాధానం లేకుండా చేస్తుంది. *
అంతట యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను. 2రాజులు 9:22
🔺 *జారత్వము జరిగించేవాడు తన నాశనాన్ని కోరుకొనేవాడు: *
జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. సామెతలు 6:32
🔺 *జారత్వము జరిగించేవారికి దేవుడు విరోధి: *
చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివే సినదానా, నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. నహూము 3:4,5
🔺 *జారత్వమునకు దూరముగా పారిపోవుడి. *
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 1కొరింధీ 6:18
🔺 *జారత్వమును విసర్జింపవలెను*
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. అపో.కార్యములు 15:28
🔺 *జారత్వమును చంపివేయుడి*
భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.
కొలస్సీయులకు 3:5
🔺 *జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.*
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 1థెస్స 4:3
ఎందుకంటే?
🔺 *దేహము జారత్వము నిమిత్తము కాదు *
దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే. 1కొరింధీ 6:13
*ప్రియనేస్తమా! *
నీ దేహం నీకు నచ్చినట్లుగా జీవించడానికి కాదు. ప్రభువు మెచ్చేటట్లుగా జీవించడానికి. నిన్ను నీవు పరిశీలన చేసుకో! సరిచేసుకో! సాగిపో! గమ్యం చేరేవరకు!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( మూడవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵2. వ్యభిచారము 🔵
🔺 వ్యభిచారము అంటే?
* మోహపు చూపు
* అనైతికమైన లైంగిక ప్రవర్తన
* అనైతికమైన సెక్స్
* హోమో సెక్స్ ( పురుషుడు, పురుషునితో చేసే లైంగిక పాపం)
* లెస్బినిజం (స్త్రీ, మరొక స్త్రీ తో చేసే లైంగిక పాపం)
* బూతు బొమ్మలు చూడడం
* అశ్లీల సాహిత్యం చదవడం
* అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా పొందే ఆనందం.

సాతాను స్మార్ట్ ఫోన్లను మన చేతికిచ్చి, వాడు చాలా స్మార్ట్ గా వాడిపని వాడు చేసుకొని పోతున్నాడు. ఏదైనా సమాచారం కోసం ఇంటర్ నెట్ ఓపెన్ చేస్తే చాలు. click me, click me అంటూ అశ్లీల చిత్రాలు దర్శనమిస్తూనే ఉంటాయి. పొరపాటున టచ్ చేసామా? అంతే. ప్రమాదంలో పడినట్లే.
అందుకే, నేటి దినాలలో జారత్వము, వ్యభిచారం, హోమో సెక్స్ ( పురుషుడు మరొక పురుషునితో చేసే లైంగిక పాపం), లెస్బినిజం ( స్త్రీ మరొక స్త్రీ తో కలసి చేసే లైంగిక పాపం) తారా స్థాయికి చేరాయి.

ఇవి ఇప్పుడే ప్రారంభం కాలేదు గాని, నాటి నుండి సాతాను మనుష్యుల బలహీనతను ఉపయోగించు కోవడంలో సంపూర్తిగా
సఫలమయ్యా డు. ఇప్పుడు మరింత ముందుకు దూసుకుపోతున్నాడు.
❣అనేక దేశాలలో హోమో సెక్స్, లెస్బినిజం చట్ట బద్దమవుతుంది.
❣ఇష్టపడి చేస్తే, వ్యభిచారం తప్పేమి కాదంటూ న్యాయ స్థానాలు సహితం తీర్పులు వెల్లడిస్తున్నాయి.
ఈ తీర్పులతో సాతాను ఎగిరి గంతులు వేస్తూ, రెట్టించిన ఉత్సాహంతో మరింత విజృంభిస్తున్నాడు.

వాడి వలలో ఇప్పటికే చిక్కావో? చిక్కడానికి సమీపంలో వున్నావో? నాకైతే తెలియదు గాని, సాతాను నీమీద సంపూర్ణమైన దృష్టి పెట్టి వుంచాడు అనే విషయం మాత్రం మరచి పోవద్దు.
❣జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ యౌవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. సామెతలు 5:8,9

❣వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట. సామెతలు ‪23:27‬
❣నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. సామెతలు 31:3

కానీ, నీవు చెయ్యాల్సింది ఏమిటంటే?
❣నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి. సామెతలు 5:18,19

ఇంకా వివాహం కాకపొతే, ఆ సమయం వచ్చేవరకు సాతాను వలలో చిక్కకుండా, నిన్ను నీవు కాపాడుకో.
అంతేగాని,
❣వ్యభిచరింప వద్దు. మత్తయి ‪19:18‬

పరిశుద్ధ గ్రంధం వ్యభిచారమనే పాపమును అన్ని పాపముల కంటే ఘోరమైన పాపముగా పేర్కొన్నది.
కారణం?
ఏ పాపమైనా ఒక్కరి వల్లనే జరుగుతుంది. కాని వ్యభిచారము మాత్రము ఒక వ్యక్తి పాపము చేస్తూ మరొకరిని పాపములోనికి లాగుతుంది.

ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. మత్తయి ‪5:28‬
(ఒక పురుషుని మోహపుచూపుతో చూచు ప్రతిస్త్రీ అప్పుడే తనహృదయమందు అతనితో వ్యభిచారము చేసినదగును.)
అంటే? చేసినా? చూచినా? రెండూ ఒక్కటేనా? కానే కాదు. చేసినదానికీ, చూచినదానికీ శిక్ష ఒక్కటేనా? కానే కాదు.
మరెందుకిలా? మోహపు చూపుతో చూస్తే, అది హృదయంలో ముద్రించబడి, ఆతప్పుచెయ్యడానికి శరీరాన్ని బలవంతం చెయ్యొచ్చు. అట్లాంటి చూపులే లేకపోతే? ఆ తప్పు చేసే అవకాశమే లేదు. అందుకే ఆయన వేళ్ళతోసహా ఆ పాపమును పెకిలించి వెయ్యాలని అట్లా చెప్పారు.

అంతేగాని, చేసిన వాడు, చూచినవాడు ఇద్దరూ ఒక్కటే అని మాత్రం తలంచకూడదు. చేసినవాడికి చేసినంత శిక్ష. చూచినవాడికి చూచినంత.
👉అయితే, నేటి దినాలలో, నూతనమైన, వక్రమైన బోధలు పుట్టుకొస్తున్నాయి.
కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచు చున్నారు .... యూదా 1:4

మన మంచి పనులు దేవుని రాజ్యం చేర్చలేవు. కేవలం ఆయన 'కృప' మాత్రమే నిత్య రాజ్యం చేర్చగలదు. కాబట్టి వ్యభిచారం చేసినా తప్పేమి కాదు. దానికి శిక్షేమి లేదంటూ...

ఆయన కృప మనలను రక్షిస్తుంది. మంటి నుండి తీయబడిన శరీరం మన్నై పోతుంది. ఆత్మ మాత్రమే దేవుని యొద్దకు వెళ్తుంది. కాబట్టి, ఆత్మ పరిశుద్ధంగా వుంటే చాలు. నశించిపోయే శరీరానికి పరిశుద్ధత అవసరం లేదు. అనేది వీరి వక్ర బోధ.

శరీరం మాలిన్యమైపోయాక, ఆత్మ ఎట్లా పరిశుద్ధంగా వుండగలుగు తుంది? అది సాధ్యం కానే కాదు. అందుకే పౌలు గారు ఈ రీతిగా మాట్లాడు తున్నారు.
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. 2కొరింధీ 7:1

దేవుని కృపకు కూడా కొన్ని పరిధులుంటాయి. నేనెట్లా జీవించినా దేవుని కృప నన్ను రక్షిస్తుందిలే అనుకోవడం అవివేకం. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా, పశ్చాత్తాప పడకపోతే, శిక్ష అనుభవించ తీరవలసిందే.

సంసోను (న్యాయాధిపతి), దావీదు (రాజు), హొప్ని, ఫీనెహాసు (యాజకులు), సొదొమ గొమొఱ్ఱా ప్రజలు (సామాన్యులు).... ఇట్లా వారెంతటి వారైనా సరే, తప్పించుకోలేక పోయారు.

♻సంసోను పతనం:♻
వ్యభిచారం ఎంతటి భయంకరమైన పరిస్థితి లోనికి నిన్ను నెట్టేస్తోందో సంసోను జీవితాన్ని నీ జ్ఞాపకంలోనికి తీసుకొని రావాలి అనుకొంటున్నాను.
👉 ఆ యౌవనుడు దేవుని కోసం ప్రతిష్ట చేయబడిన వాడు.
👉బైబిల్ గ్రంధములోనే అత్యంత బలవంతుడు.
👉కొదమ సింహాన్ని సహితం అవలీలగా చీల్చివేసిన బలశాలి.
👉300 నక్కలను పట్టుకొని శత్రువుల పంట పొలాలను నాశనం చేసిన ధీరుడు.
👉పట్టణానికి కావలిగా నున్న ఇనుప గేటును సహితం ఊడబెరికి కొండ మీదకు విసిరి వేయగలిగిన వీరుడు.
👉గాడిద పచ్చి దవడ ఎముకచేత వెయ్యి మంది శత్రువులను చంపిన శూరుడు. ఇట్లా ఎన్నో...!

ఇట్లాంటి ఆ యౌవనుడు, వేశ్యయైన స్త్రీ చేత ఆకర్షించ బడ్డాడు. తద్వారా....
👉శత్రువుల చేతిలోబంధీగా మారాడు.
👉తల వెంట్రుకలు గొరిగించ బడ్డాయి.
👉రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి
👉దాగోను దేవతకు బలిగా మారాడు.
❣అతని జీవిత ప్రారంభం ఎట్లా వుంది? ఎట్లా ముగిసింది? దానికి గల కారణం? వ్యభిచారమే.

♻ రాజైన దావీదు పతనం ♻
దేవుని చేత "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు.
ఆయన కూడా ఇదే పాపములో చిక్కుకున్నాడు. దాని ఫలితం?
👉పుట్టిన బిడ్డ చనిపోయాడు.
👉పిల్లలు వ్యభిచారులు,
హంతకులయ్యారు.
👉కన్నకొడుకే అతనిని చంపడానికి కంకణం కట్టుకున్నాడు.
👉కనీసం చెప్పులు లేకుండా అతడు కొండలకు పారిపోవలసి వచ్చింది.
👉కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది.
👉దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.
ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!

❣గొల్యాతుపై విజయం అతని కీర్తిని పతాక స్థాయికి చేరిస్తే, బత్షెబతో పాపం, పతనం అంచులకు చేర్చింది.

♻ యాజకుల వ్యభిచారం♻
ఏలీ కుమారులైన హొప్ని, ఫీనెహాసు మిక్కిలి దుర్మార్గులయ్యారు. వారు చేసిన ఘోరమైన పాపము ఏమిటంటే?
వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించే వారు. (1 సమూ ‪2:22)‬
❣ఫలితం: ఒకే దినాన్న ఇద్దరూ మరణం.

♻ తుచ్ఛమైన అభిలాష ♻
( హోమో సెక్స్ , లెస్బినిజం)
'హోమో సెక్స్' మగవారు మగవారితో కలసి లైంగిక పాపం చెయ్యడానికి పుట్టినిల్లు సొదొమ గొమొఱ్ఱా పట్టాణాలే. ఆనాడు అక్కడ పుట్టిన పాపమే, ఈనాడు మహా వృక్షమై విచ్చలవిడిగా ప్రపంచమంతా వ్యాపించింది. నూరంతలుగా ఇంకా వర్ధిల్లుతూనే వుంది. సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చెయ్యడానికి ఇద్దరు దేవదూతలు ఆ పట్టణములో ప్రవేశించగా, లోతు వారికి ఆతిధ్యమిచ్చుటకు అతని గృహానికి ఆహ్వానించినప్పుడు,

"వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచిఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా" (ఆది 19:4,5)
బాలురు మొదలుకొని వృద్ధుల వరకు, అదే పాపములో కొనసాగుతున్నారట.

❣ఫలితం: అగ్ని గంధకాలతో కలసి మాడిపోయారు.
కొంత కాలం రహస్యముగా జరిగిన ఈ పాపం, నేడు బట్టబయలయ్యింది. మాకు నచ్చినట్లుగా జీవించే స్వేచ్ఛ కావాలంటూ, పోరాటాలు చేస్తున్నారు. చట్టాలు చేయించు కొంటున్నారు. వారి విజయం వారిని గమ్యం చేర్చేది కాదు. నిత్య నాశనమునకు నడిపించేది.

ప్రియా నేస్తమా! లోకం పైశాచిక ఆనందాన్ని కోరుకొంటుంది. వికృత చేష్టలకు అలవాటుపడింది. అక్రమ జీవితం జీవిస్తుంది.
అయితే, ఇట్లాంటి లోకంలో క్రమమైన జీవితాన్ని నీవు జీవించాలి. నీ యవ్వనమందు సంతోషిస్తూనే, వాటన్నిటిని బట్టి తీర్పు వున్నదనే మాట మాత్రం మరచిపోవద్దు.

వ్యభిచారులు...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన 21:8)

వద్దు! అది ఊహలకే భయంకరం.
పశ్చాత్తాప పడదాం! ప్రభు పాదాల చెంత చేరుదాం! ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!



శరీర కార్యములు

( నాలుగవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.
🔵 3. *అపవిత్రత* 🔵

🔺 అపవిత్రత అంటే?
* లైంగిక పాపములు
* దుష్ట క్రియలు
* హృదయంలోనుండి వచ్చే దుష్ట తలంపులు, ఆలోచనలు.

♻ *అపవిత్రత అనే పదాన్ని సహితం ఉచ్ఛరించ కూడదు*.♻
మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, యేవిధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎఫెసీ 5: 1-3

ఎందుకంటే?

🔺 దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడని.
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను.
లేవీ 11:44

🔺 యేసు ప్రభువు వారు లోకానికి సవాలు విసిరారు. నేను పరిశుద్ధుడను. కాదని ఎవరైనా రుజువు చెయ్యండని. ఆ సవాలును స్వీకరించేవారు లేకపోయారు.
*నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?* యోహాను 8:46

🔺 దేవుని దూతలు కూడా ఆయన పరిశుద్ధుడు అని స్తుతిగానములు ఆలపిస్తున్నారు.
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. (యెషయా 6:3 )

🔺 కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవా! ఎప్పటికైనాసరే పరిశుద్ధతయే నీ 'మందిరము'నకు అనుకూలమని.
యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము. కీర్తనలు 93:5

🔺 మందిరము అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు.
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. 1 కొరింది 3:16,17

🔺 నీ దేహమే దేవుని మందిరం.
నాకు డబ్బుంది త్రాగుతా! బలముంది తిరుగుతా! అంటే? కుదరదు. నీవు వ్యర్ధమైన క్రియలచే నీ శరీరాన్ని పాడు చేసుకుంటే, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆయనే పాడు చెయ్యాల్సివస్తే ఇక విడిపించేదెవరు? గొర్రె పిల్లను బలవంతముగా బురదలోనికి త్రోసినా వెళ్ళడానికి ఎంత మాత్రమూ ఇష్ట పడదు. పంది పిల్లను బలవంతముగా బురదలోనుండి బయటకు లాగినా రావడానికి ఎంత మాత్రమూ ఇష్టపడదు. వీటిలో మన జీవితాలు దేనిని పోలి వున్నాయో? మనలను మనమే పరిశీలన చేసుకుందాం!

నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. (1 పేతురు 1:14)
అవును! ఆయన పిల్లలముగా అట్టి పవిత్రమైన జీవితాలనే జీవించగలగాలి.
♻ *నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే*♻
నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు. యెహేజ్కేలు 24:13

🔺 *సోలోమోను:*
* అత్యంత జ్ఞానవంతుడు.
* అత్యంత ఐశ్వర్యవంతుడు
* మూడువేల సామెతలు చెప్పాడు.
* ఒక వెయ్యి ఐదు కీర్తనలు వ్రాసాడు.
* వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రమును రచించాడు.
* యేరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించాడు.

ఇట్లా ఆయన కీర్తిని గురించి చెప్పుకుంటూపోతే లెక్కలేనంత. చెప్పలేనంత.
బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు. నీవు ఐశ్వర్య మును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు. (1 రాజులు 3:12,13).

అయితే, సోలోమోను హృదయంలో ఒక 'విగ్రహం' పాతుకుపోయింది. అదే 'కామం'. దానిలో భాగముగా ( 700 మంది భార్యలు + 300 మంది ఉప పత్నులు) మొత్తం 1000 మందిని చేసుకున్నాడు.

'కామాతురత గలవాడై' వారిని ఉంచుకొనుచు వచ్చెను. (1 రాజులు 11:2)
వీరిని సంతోష పెట్టడంకోసం, "సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను." (1 రాజులు 11:7)

పరిశుద్ధ పట్టణమైన యేరూషలేములో పరిశుద్ధుడైన దేవునికి మందిరం కట్టించిన సోలోమోను, అదే పట్టణంలో *అపవిత్రమైన దేవతలకు* బలిపీఠములను కట్టించి దేవుని ఉగ్రతకు గురియై రాజ్యాన్ని కోల్పోయాడు.

సోలోమోను రాజ్యాన్నే కోల్పోయాడు గాని, నీవయితే ఆ నిత్య రాజాన్నే కోల్పోతావు.



♻ అపవిత్రతను చంపివేయాలి ♻

భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.
కొలస్సీయులకు 3:5

అవును! అపవిత్రతను చంపివేసి, పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయాసపడదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( ఐదవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.


🔵 4. *కాముకత్వము* 🔵

🔺 కాముకత్వము అంటే?
* మోహం
* సిగ్గులేని విచ్చలవిడి ప్రవర్తన
* తన కోరికల ప్రకారం నడచుకోవడం.

“కామంతో కళ్ళు మూసుకుపోయాయి”. అనే మాటలు తరచూ వింటూనే వుంటాము. కామం అనే శరీర కోరికలను కలిగియున్న వ్యక్తి, అతడు చేసేపనులు నిజంగా చాలా నీచాతినీచంగా ఉంటాయి. అనేక సందర్భాల్లో కన్న బిడ్డలతోనే అత్యంత దారుణంగా ప్రవర్తించిన విషయాలు వార్తలలో వింటూనే వుంటాము.

జారత్వము, వ్యభిచారము, అపవిత్రతలకు ప్రధాన కారణం “కామం” అంటే, ఆశ్చర్యపోనవసరం లేదు.


*కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు*.
యిర్మియా 2:33


♻కామాతురతగల అమ్నోను♻

అమ్నోను తన చెల్లెలుతో తన కామవాంఛను తీర్చుకోవడానికి, అతని కపటోపాయము:

దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.
తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.

యెహోనాదాబు నీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవునా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.

అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా
దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడునాకు వద్దని చెప్పిఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండ నెను. వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.

అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము; అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.
2 సమూయేలు 13: 1-14

👉 ఫలితం: హత్య గావించబడ్డాడు.


♻కామాతురతగల సొలోమోను♻

సోలోమోను హృదయం కామంతో నిడినప్పుడు, (700 మంది భార్యలు + 300 మంది ఉపపత్నులు) మొత్తం 1000 మందిని చేసుకున్నాడు.

'కామాతురత గలవాడై' వారిని ఉంచుకొనుచు వచ్చెను. (1 రాజులు 11:2).

👉 ఫలితం: దేవునికి దూరమయ్యాడు. రాజ్యాన్ని కోల్పోయాడు.


అందుకే ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చారు.
“ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”
మత్తయి 5:28

ఎందుకంటే? అది క్రియారూపం దాలిస్తే, ఫలితం అత్యంత దారుణం.

అందుచే, కాముకత్వాన్ని చంపివేసి, పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయాసపడదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( ఆరవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 5. విగ్రహారాధన 🔵
🔺 విగ్రహారాధన అంటే?
* ఆత్మలను, వ్యక్తులను, చెక్కబడిన చిత్రాలను ఆరాధించడం.
* దేవుని కంటే ఎక్కువైనవిగా భావించి, దేవునికంటే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం.
* విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.
* విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు.
దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
* నీ హృదయం దేనితో నిండిపోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.

దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్?
నీ హృదయం దేనితో నిండిపోయింది?
గాళ్ ఫ్రెండా?
బాయ్ ఫ్రెండా?
మోటార్ బైక్సా?
వస్త్రాలా?
సెల్ ఫోన్సా ?
బంగారమా?
ధనమా?
ఆస్థులా?
అంతస్తులా?
నీపిల్లలా?
అసూయా?
ద్వేషమా?
ఏది? ఇవన్నీ విగ్రహాలే. ఇప్పుడు చెప్పగలవా? నేను
విగ్రహారాధికుడను కాదని.

ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ? ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా?
అందుకే కదా! సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా? ఆయన నీ హృదయమనే తలుపునొద్ద(బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది.

♻ గర్వము ♻
దేవుడు పెంట కుప్పల మీద నున్న మనలను మింటపైన ఘనులతో కూర్చుండ బెట్టాడు. కనీస కృతజ్ఞత లేకుండా, మన హృదయాలు గర్వముతో నిండిపోయి దేవునిని సహితం లెక్క చేయని స్థితికి చేరిపోయాము. 'గర్వము' నీ జీవితములో విగ్రహముగా మారితే? పతనం అంచులలో వున్నావని జ్ఞాపకం చేసుకో. నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును (సామెతలు 16:18). అను నిత్యమూ దేవుని సన్నిధిలో వుండే లూసిఫర్ తన హృదయమున గర్వించి పాతాళం లోనికి త్రోసివేయ బడ్డాడు. రాజైన నెబుకద్నెజరు హృదయమున గర్వించి పశువువలే గడ్డి మేయాల్సి వచ్చింది. హిజ్కియా హృదయమున గర్వించినప్పుడు మరణకరమైన రోగము కలిగింది. ఇట్లా చెప్పుకుంటూపొతే? చెప్పలేనన్ని. ఒక్క విషయం గుర్తుంచుకో. దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో వుంచినా? ఎంత అద్భుతమైన నైపుణ్యాలు కలిగియున్నా గాని, అనుగ్రహించిన ఆయనను స్తుతించు తప్ప, వాటిని బట్టి గర్వించకు. 'గర్వం' ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.

♻ అధికారవాంఛ,
పదవీ వ్యామోహం ♻
ప్రియ రక్షకుడైన యేసు ప్రభువును ఆత్మతోనూ సత్యముతోను ఆరాధన చెయ్యడానికి 'లోకము నుండి' ప్రత్యేక పరచబడిన విశ్వాసుల సమూహమే 'సంఘము' ఇట్లాంటి సంఘాలు లెక్కలేనన్ని. సంఘముల ఉద్దేశ్యము మారిపోయింది. దేవునిని ప్రక్కనబెట్టి, మనలను మనమే ఘన పరచుకోవడానికి కొట్టుకు చస్తున్నాం. సంఘములో రాజకీయం దేశ రాజ కీయాలను మించిపోతుంది.
కారణం? 'అధికారం' ఒక విగ్రహముగా మారిపోయింది. అధికారం కోసం సంఘాలు, ముక్క చెక్కలవుతున్నాయి. ప్రేమకు ప్రతిరూపముగా ఉండాల్సిన మన సంఘాలు కక్షలతో కత్తులు దూస్తున్నాయి. సత్యానికి స్తంభాలుగా నిలువాల్సిన సంఘాలు. సత్యానికి స్థానమే లేకుండా పోతున్నాయి. సంఘాలలో అధికారం దక్కించుకోవడానికి ధనం, మధ్యం సహితం పంచే స్థితికి దిగజారిపోయారు. పంచేవాడికి సిగ్గులేదు. తీసుకొనే వాడికి అంతకన్నాలేదు. ఇది వినడానికే అసహ్యం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో ! నీవు నిజమైన క్రైస్తవుడవు అయితే? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడో? ఆ స్థితిలోనేవుండు. అధికారం కోసం ప్రాకులాడవద్దు. ప్రాకులాడే వారిని ప్రోత్సహించవద్దు. 'అధికారం' ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు.

♻ ప్రేమ ♻
బైబిల్ సారాంశమంతా ఒక్క మాటలో ఇమిడి వుంది. "నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము". యేసు ప్రభువు వారు అయితే "నిన్ను వలే నీ శత్రువును కూడా ప్రేమించు" అని చెప్పారు. చెప్పడమే కాదు చేసి చూపించారు కూడా. మన శత్రువులను ప్రేమించడం మనవల్ల కాదుగాని, మన ప్రధాన శత్రువైన సాతానును మాత్రం ప్రేమిస్తూ వాడి అడుగు జాడల్లోనే నడుస్తున్నాం. ఈ లోకంలో అనేకమైన వాటికి మనము పెట్టుకున్న పేరు 'ప్రేమ'. ఉదా: స్త్రీ పురుషుల మధ్య గల ఆకర్షణకు మనము పెట్టిన పేరు ప్రేమ. ప్రేమ పేరుతో ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి నీ హృదయమంతా నిండిపొతే ఆ అబ్బాయే, ఆ అమ్మాయే నీ జీవితంలో ఒక 'విగ్రహం' అని గుర్తించు. తలిదండ్రులు పిల్లలపట్ల కలిగియుండేది 'వాత్సల్యం' దీనినీ మనము 'ప్రేమ' అనే పిలుస్తాము. నీ హృదయం నీ పిల్లలతో నిండిపోతే నీపిల్లలే నీజీవితంలో ఒక ఒక విగ్రహం అని గుర్తించు. అదేంటి? ఆయనే నీ పొరుగు వానిని ప్రేమించమన్నాడు కదా అని తెలివిగా సాకుచూపే ప్రయత్నం చెయ్యొద్దు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. (మత్తయి 19:29) పిల్లలను, కుటుంబాన్ని విడచిపెట్టు అనికాదు గాని, నీ హృదయంలో ప్రధమ స్థానం ఆయనకే ఇవ్వాలి. అంటే? రెండో స్థానం దేనికైనా ఇవ్వొచ్చా? అట్లా అనికాదు. నీ ప్రియ రక్షకునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు రెండవ స్థానం దేనికిబడితే దానికి ఇవ్వలేవు అనే విషయాన్ని గమనించు. 'ప్రేమ' పరిధులు దాటితే అది విగ్రహంలా మారుతుంది.

♻ ధనాపేక్ష ♻
భూమిమీదనున్న మీ అవయవములను, అనగా ........ "విగ్రహారాధనయైన ధనాపేక్షను" చంపి వేయుడి.(కొలస్సీ 3:5)
ధనాపేక్ష అనగా? ధనము పట్ల ప్రేమ. న్యాయమైన రీతిలో ధనము కలిగి యుండుట పాపముకాదు గాని, 
ఆ ధనము పట్ల ప్రేమను కలిగియుండడం 'విగ్రహారాధన''ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము (1 తిమోతి 6:10)
అవును! సందేహం లేనేలేదు. కారణం? జీవం లేని డబ్బును జీవంగలిగిన మనిషి శాషించాలి. కాని, జీవం లేని డబ్బు జీవంగలిగిన మనిషిని శాషిస్తుంది. డబ్బుకు మనిషి దాసోహం అయిపోయాడు. అట్లా అని డబ్బును తప్పు పట్టాల్సిన పనిలేదు. తప్పంతా దానిని 'ప్రేమించే' మనదే. జీవములేని కత్తిలో తప్పేమీ లేదు. అది సామాన్యుని చేతిలో వుంటే? 
కూరగాయలు కోస్తాడు. అదేకత్తి హంతకుని చేతిలో వుంటే? పీకలు కోస్తాడు. తప్పంతా దానిని ఉపయోగించే వానిలోనే వుంది. డబ్బు విషయంలోకూడా అంతే. దేవుడు నీకు సంవృద్ధిని యిస్తే? దేవునిని స్తుతిస్తూ, నీకు కలిగిన దానిలో కొంతయినా దేవుని పరిచర్యలో ఉపయోగించు. పేదలకు సహకరించే ప్రయత్నం చెయ్యి. కాని రోజురోజుకూ పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు గాని, ఎవరికీ పంచడానికి మాత్రం ఇష్టపడడు. ప్రతీ వ్యక్తి ఆశ ధనవంతుడు కావాలనే. అయితే ఒక్క విషయం! ధన వంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము (మార్కు 10:25). అట్లా అయితే? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించనట్లయితే? అబ్రాహాము కూడా దేవుని రాజ్యములో లేనట్లేకదా? ఆయన ఎందుకు ఇట్లా చెప్పారంటే? ధనము మీద ప్రేమ కలిగినవాని హృదయం ధనము చుట్టూనే తిరుగుతుంటుంది. వాని హృదయమంతా డబ్బుతోనే నిండిపోయి వుంటుంది. ఇక దేవునికి చోటెక్కడిది? దేవునికి చోటేలేనప్పుడు ఇక దేవుని రాజ్యంలోనికి ఎట్లా ప్రవేశించగలడు? డబ్బు మీదగల ప్రేమ సమస్తమైన కీడులకు మూలం. అది ఎంతటి ఘోరమైన పనులైనా చేయిస్తుంది. చివరకు మనలను నిత్య రాజ్యంలోనికి అడుగు పెట్టకుండా చేసేయ్యగలదు. బిలాము, గేహాజి, ఇష్కరియోతు యూదా .... డబ్బును ప్రేమించిన వీరిజీవితాలు భయంకరం. 'ధనాపేక్ష' ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.




♻ లోభత్వము ♻

విగ్రహారాధికుడై యున్నలోభి క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును (ఎఫెస్సి 5:5) లోభి అంటే? అత్యాశాపరుడు, పిసినారి లోభత్వము కలిగినవాడు 'విగ్రహారాధికుడు.' కారణం? ఒక వ్యక్తికి దేనిపైన అత్యాశవుందో? దానిని అతడు ఆరాధిస్తున్నట్లే. 'ఆశ' కలిగి వుండాలి. దానిలో తప్పులేదు. ఆశలేకపోతే మనిషి జీవించలేడు.ఒక సైన్స్ పత్రిక ఇచ్చిన నివేదిక ఇది. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 54 రోజులు, నీరు లేకుండా 3 రోజులు, ఆక్సిజెన్ లేకుండా 8 నిమిషాలు జీవించగలడు. కాని, ఆశ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడు. ఆశను కోల్పోయిన వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధపడతాడు. అవును! 
నీ ఆశ సమర్ధనీయమైనది అయితే? ఆశగల నీ ప్రాణమును తప్పక ఆయన తృప్తి పరుస్తాడు. ఒకవేళ నీ ఆశకు అంతేలేకుండా పొతే? ఆశ అత్యాశగా మారితే? నీవు విగ్రహారాధికుడుగా మారతావు. నీ ఆశ హద్దులుమీరినప్పుడు, దానిని నెరవేర్చుకోవడానికి ఎట్లాంటి పని చెయ్యడానికైనా వెనుకాడవు.
కారణం? నీ హృదయం అత్యాశతో నిండిపోయింది. నీవు లోభివి అయితే? నీ కుటుంబ కనీస అవసరాలు కూడా తీర్చలేవు. 'లోభి తన యింటివారిని బాధపెట్టును' (సామెతలు 15:27). నీవు లోభివి అయితే నీ స్నేహాన్ని ఎవ్వరూ కోరుకోరు. లోభితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు. (1 కొరింది 5:11). నీవు లోభివి అయితే? దేవుని రాజ్యమునకు హక్కుదారుడవు కాదు. (ఎఫెస్సి 5:5) నీవు లోభివి అయితే? 'లోభి శాపగ్రస్తుడు' (2పేతురు 2:14). నీవు శాపగ్రస్తుడవైతే? ఆయన అంటున్నాడు. 'శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి'. (మత్తయి 25:41). అంటే, లోభత్వము యొక్క గమ్యము? "నిత్యాగ్ని" లోభత్వము ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారతావు.


'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం. సరి చేసుకుందాం. ఆ నిత్య రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( ఏడవ భాగము)


“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 6. *అభిచారము* 🔵
అభిచారము అంటే?
* మాంత్రిక విద్య
* ప్రేతాత్మల పూజ
* గారడీ
* దయ్యాలను ఆరాధించడం
* ఆధ్యాత్మిక అనుభవాలకొరకు మాదకద్రవ్యాల వాడకం.

దురాత్మ శక్తులను స్వాధీనపరచుకొని, సహజ విరుద్ధమైన క్రియలు జరిగించడం అనాదికాలంగా వస్తూనే వుంది. కానీ, అవేమి కూడా, ఏ సందర్భములోనైనా దేవునిపైన ఆధిపత్యాన్ని కనుపరచలేకపోయాయి. అది ఎప్పటికీ సాధ్యంకూడా కాదు.

🔺 యెహోవా దేవుడు సంధించిన బాణాలను ఐగుప్తు దేవుళ్ళ అడ్డుకోలేకపోయాయి.
శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. నిర్గమ 8:18

🔺 దేవుని జ్ఞానం ముందు దయ్యపు జ్ఞానం నిలువలేదు.
రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దానియేలు 1:19,20

నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను. దానియేలు 5:11

🔺 మాయమంత్రములు మనుష్యులను మోసం చేస్తాయి:
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; ప్రకటన 18:22

సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పు కొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. అపో.కార్యములు 8:9

వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.
అపో.కార్యములు 13:6

🔺 ఎఫెసు పట్టణంలో పౌలుగారు సువార్తను ప్రకటించగా, మాంత్రిక విద్యార్థులు వారి పుస్తకాలను కాల్చివేసిరి.
మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. అపో.కార్యములు 19:19
దయ్యాలు, చేతబడుల పేరుతో, దురాత్మలను ఆశ్రయించేవారు కూడా. ఇట్టి శరీరక్రియలలో పాలిభాగస్తులు.
వద్దు! నీ ప్రతీ విధమైన పరిస్థితియందు దేవునిపైన ఆధారపడడం నేర్చుకో. నీ ప్రతీ ప్రశ్నకు ఆయనే సమాధానం, నీ ప్రతీ సమస్యకూ ఆయనే పరిష్కారం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( ఎనిమిదవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.
🔵 7. *ద్వేషములు* 🔵
ద్వేషము అంటే?
* తీవ్రమైన విరోధ భావము
* తీవ్రమైన చర్యలు
* తీవ్రమైన అయిష్టత
* తీవ్రమైన శత్రుభావం

ఈలోకంలో మనము జన్మించేటప్పుడు మనకు శత్రువులుగాని, మిత్రులుగాని ఎవ్వరూ లేరు. మన ప్రవర్తనే మనకు మిత్రులనుగాని, శత్రువులనుగాని తెచ్చిపెడుతుంది. అయితే, మనలోనున్న ద్వేషము ఎదుటివారిని మనకు శత్రువులుగా మార్చగలుగుతుంది.

నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. కీర్తనలు 25:19

🔺 ద్వేషము చెడునడతకు దారితీస్తుంది.
హృదయం ద్వేషముతో నిండిపోయినప్పుడు, అనుకూల సందర్భంలో బయటపడి, చెడునడతకు కారణమవుతుంది.

వాడు తన ద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. సామెతలు 26:26

🔺 దేవునిని ద్వేషించే వారి క్రియలపట్ల పరిపూర్ణమైన ద్వేషాన్ని కలిగియుండాలి.
యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా? వారియందు నాకు పూర్ణద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను కీర్తనలు 139:21,22

నూతన నిబంధనా విధానాన్ని అనుసరించి, శత్రువును సహితం ప్రేమించగలగాలి. అందుచే శత్రువులను ప్రేమిస్తూనే, వారు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న “వారి క్రియలను” ద్వేషించాలి. అంటే, వాటిలో మనము పాలిభాగస్తులము కాకూడదు.

🔺 ద్వేషమును సమాధానముగా మార్చగలిగినవాడు నీ ప్రియరక్షకుడైన యేసు క్రీస్తే.
ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. ఎఫెసీయులకు 2:14,16

🔺 ద్వేషమును విసర్జించుడి.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు 4:31

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

ద్వేషాన్ని వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( తొమ్మిదవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.
🔵 8. *కలహము* 🔵
కలహము అంటే?
* పోట్లాటలు
* శత్రుత్వం
* అధికారం కోసం పోరాటాలు
మనిషి జరిగించే శరీరకార్యాలెన్నున్నా, దానికి గల కారణం మాత్రం ఒక్కటే. వారి మనస్సులలో దేవునికి చోటియ్యకపోవడమే.

వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య *కలహము* కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. రోమా 1:28-31

♻ కలహమునకు కారణములు?
* పగ కలహమును రేపును. సామెతలు 10:12
* కోపోద్రేకియగువాడు కలహము రేపును. సామెతలు 15:18
• మూర్ఖుడు కలహము పుట్టించును. సామెతలు 16:28
* బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. సామెతలు 18:6
* పేరాసగలవాడు కలహమును రేపును. సామెతలు 28:25
* కోపిష్ఠుడు కలహము రేపును. సామెతలు 29:22
* కోపము రేపగా కలహము పుట్టును సామెతలు 30:33

♻ కలహమునకు దూరముగా వుండాలి.
కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. (సామెతలు 20:3)

♻ కలహము మానాలి.
తిరస్కారబుద్ధిగలవానిని అనడం కంటే, మనలోనున్న తిరస్కారబుద్ధిని తోలివేయగలిగితే, కలహాలకు తావేలేదు.
తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును. (సామెతలు 22:10)

♻ కలహాలను పుట్టించడం ప్రియముగా యెంచేవాడు కలహప్రియుడు.
వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. సామెతలు 26:21

♻ కలహముతో కూడిన యింట ఆతిధ్యము వద్దు.
రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
సామెతలు 17:1

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.
కలహము వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


శరీర కార్యములు

( పదియవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 9. *మత్సరములు* 🔵
🔺 మత్సరము అంటే?
* అసహ్యత
* మరొకరి విజయాలపై అసూయ

🔺 *మత్సరము ఎముకలకు కుళ్లు*.

సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
సామెతలు 14:30

ఒక శవాన్ని పాతిపెడితే?
* మాంసమంతా కుళ్లిపోయి మట్టిలో కలసిపోతుంది. ఎముకలు మాత్రం అట్లానే మిగిలిపోతాయి.
* రాబందులు సహితం ఎముకలను ఏమి చెయ్యలేవు.

కాని, 'మత్సరము' అనేది ఎముకలను సహితం కుళ్లిపోయేటట్లు చెయ్యగలదట. అంతటి భయంకరమైనది.

🔺 *ప్రతీ అల్లరికి, నీచకార్యమునకు మత్సరమే కారణం*:

ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
యాకోబు 3:16

🔺 *దూషణకు కారణం మత్సరమే*:

యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి. అపో.కార్యములు 13:45

🔺 *సత్యమునకు విరోధముగా* మాట్లాడడానికి కారణం మత్సరమే:

అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు. యాకోబు 3:14

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

మత్సరము వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( పదకొండవ భాగము)


“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 10. *క్రోధములు * 🔵
*క్రోధము అంటే*?
* రెచ్చిపోయేంత కోపం
* హింసాయుతమైన మాటలు

క్రోధము అంటే?
కోపము కంటే చాలా రెట్లు అధికం అని చెప్పొచ్చు. అట్లాంటి సందర్భాలలో వారు ఉపయోగించే మాటలు ఎట్లా వుంటాయంటే? కత్తులు అవసర్లేకుండానే మనిషిని చంపేస్తాయి.

🔺 *క్రోధమునకు కారణం?*
హృదయపూర్వకమైన భక్తిలేకపోవడమే.

లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. యోబు 36:13

🔺 *తిరస్కారమునకు కారణము క్రోదము:*

నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము. యోబు 36:18

🔺 *క్రోధము క్రూరమైనది*:
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? సామెతలు 27:4

🔺 *క్రోధముగలవానితో పరిచయము వద్దు:*
కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము. సామెతలు 22:24

🔺 *మృదువైన మాట క్రోధమును చల్లార్చును. *
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15:1

🔺 *క్రోధమును విసర్జించాలి:*
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
ఎఫెసీయులకు 4:31

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

క్రోధమును వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( పండ్రెండవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 11. *కక్షలు* 🔵
కక్షలు అంటే?
* స్వార్ధపు కోరికలు
* అధికారాన్ని కోరుకోవడం

🔺 కక్షలవలన పర్యవసానములు:
* ఏక భావముండదు.
* ఏక మనస్సుండదు.
* ఏక తాత్పర్యముండదు

సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
1కొరింథీ 1:10

🔺 కక్షలకు కారణం?
ఎదుటి వ్యక్తి కంటే మనమే యోగ్యులమని తలంచడం.

కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.
ఫిలిప్పీ 2:3,4

🔺 కక్షలకు ప్రతిఫలం “కీడు”:

మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు. మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
1కొరింథీ 11:18

నేటి మన కుటుంబాలలో, సంఘాలలో కక్షలకు తావిచ్చి, తద్వారా సమాధానం కోల్పోయాము. దానికంతటికి కారణం? మనలను మనము హెచ్చించుకొనే ప్రయత్నమే. వినయమైన మనస్సుగలవారమై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొనుచూ, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగితే, కక్షలకు తావేలేదు.

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

కక్షలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( పదమూడవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 12. *భేదములు* 🔵
భేదములు అంటే?
దేవుని వాక్యముచే సమర్ధించబడని విరుద్ధమైన బోధలను ప్రవేశపెట్టడం.

సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
రోమా 16:17

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్లుగా, బైబిల్ పట్టుకున్నవారిని బైబిలతోనే మోసగించాలనే కుయుక్తితో సాతాను అత్యంత తెలివిగా వాడిపనిని కొనసాగిస్తున్నాడు. దానిలో వాడు చాలా వరకు సఫలీకృతం కాగలుగుతున్నాడనే చెప్పవచ్చు. వాక్యాన్ని వక్రీకరించి బోధించే అనుచరులను ఏర్పరచుకొని, సంఘాలలో భేదములు కలుగజేస్తూ, సత్యమార్గాన్ని నిర్మూలము చేసేపనిలో వాడున్నాడు.

నేటి సంఘాలలో వాక్యానుసారమైన విధానాలకు స్థానం లేకుండా, మనుష్యుల కల్పితాలకే అధికప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

నేటి సంఘాలలో విచిత్రమైన బోధలలో కొన్ని:

* యెహోవా దేవునికి భార్య వున్నది.
* యేసు నామంలో బాప్తీస్మం తీసుకోకపోతే పరలోకం చేరరు.
* భాషలు మాట్లాడకపోతే పరలోకం చేరరు.
* యెహోవా సాక్ష్యులు మాత్రమే యెహోవా రాజ్యంలో చేరతారు. నరకం లేదు, పరలోకం లేదు.
* యేసు క్రీస్తు, లూసిఫర్ ఇద్దరూ అన్నదమ్ములంటూ మోర్మోన్స్.
* ప్రస్తుతం జరుగుతున్నదే వెయ్యేండ్ల పాలన
* నిత్యమూ నివసించేది ఆత్మ కాబట్టి, ఆత్మను మాత్రమే పరిశుద్ధంగా కాపాడుకొంటే చాలు. శరీరంతో మనకు నచ్చినట్లుగా జీవించవచ్చు. అంటూ బిలాము బోధలు, నీకొలాయితుల బోధలు, యెజెబెలు బోధలు.

ఇట్లా చెప్పుకొంటూ పొతే, లెక్కలేనన్ని. అయితే,వీటిని చూచి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీటన్నిటిని గురించి లేఖనాలు ముందుగా హెచ్చరించాయి.

మానవాళికి పాప విముక్తిని కలిగించి, విశ్వాసులను స్థిరపరచి, అభివృద్ధిచేసి దేవుని సాధనం “సత్యం”. అయితే, వారిని నాశనం చేయడానికి సాతాను ఉపయోగించే సాధనం “అబద్దం”.

మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. యోహాను 8:44

🔺 సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు.

ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
2 కొరింథీ 11:13-15
🔺 ఇది సువార్త కాదు. క్రీస్తువార్తను చెరుపగోరే వార్త

క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
గలతి 1:6-8

🔺 దయ్యముల బోధ:

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
1 తిమోతి 4:1,2

🔺 వంకర బోధ:

నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.
అపో. కార్యములు 20:29,30

🔺 మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము

ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొలస్సి 2:8

🔺 నాశనకరమగు భిన్నాభిప్రాయములతోకూడిన రహస్య బోధ:

అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 2 పేతురు 2:1,2

🔺 గొఱ్ఱల చర్మములు వేసికొనిన క్రూరమైన తోడేళ్లు.

అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. మత్తయి 7:15

ఇవన్నీ సంభవించే కాలమిది. ఎందుకనగా ఇది కడవరి గడియ.

చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
1యోహాను 2:18

భేదములు పుట్టించే సాతాను కుయుక్తినుండి మనము తప్పించబడాలంటే? బెరయ సంఘస్థులవలే వాక్యాన్ని పరిశీలించి, అట్టి రీతిగా జీవించడం ద్వారా వాడిపై విజయం సాధించగలము.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

శరీర కార్యములు

( పదునాల్గవ భాగము)


“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.


🔵 13. *విమతములు* 🔵

విమతములు అంటే?
* సమాజంలో వివిధ స్వార్ధ గుంపులు
* ముఠాలుగా విడిపోయి సంఘ ఐక్యతను విచ్చిన్నం చేయడం

లోకంలో సంఘం వుండాలి. గాని, సంఘంలోనికి లోకం ప్రవేశించింది. లోకసంబంధమైన విధానాలే సంఘాల్లో ఏలుబడి చేస్తున్నాయి. ఒక మనిషి తన పంతం నెగ్గించుకోవడానికి, తననుతాను ఘనపరచుకోవడానికి సంఘాన్ని విచ్చిన్నం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తానొక ముఠాను సిద్ధపరచుకొని సంఘంలోనూ, సమాజంలోనూ అల్లరి సృష్టిస్తున్నాడు.

సంఘాల్లో కొనసాగుతున్న రాజకీయాలు, దేశరాజకీయాలకు ఏమాత్రం తీసిపోవు. దేవుని పేరుతో, దేవునికి చెందాల్సిన మహిమను నీకు చెందేలా నేను ప్రయాసపడితే? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా?

విచిత్రమేమిటంటే? సంఘ విచ్చిన్నానికి వున్న ఈ ఐక్యత, వాక్యానుసారమైన విధానాన్ని స్థాపించడానికి మాత్రం ఎక్కడా కానరాదు.
అవును! అదే సాతాను కుతంత్రం.

మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.
కొరింథీ 11:19

అవును! అయితే, సంఘాన్ని, సమాజాన్ని విచ్చిన్నం చేసేవారి గుంపులో మనము చేరకుండా,మన యోగ్యతను కాపాడుకోగలగాలి.

నేటి మన కుటుంబాలలో, సంఘాలలో విమతములకు తావిచ్చి, తద్వారా సమాధానం కోల్పోయాము. దానికంతటికి కారణం? మనలను మనము హెచ్చించుకొనే ప్రయత్నమే. వినయమైన మనస్సుగలవారమై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొనుచూ, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగితే, విమతములకు తావేలేదు.

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

విమతములు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!



శరీర కార్యములు

( పదిహేనవ భాగము)


“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.
🔵 14. *అసూయలు * 🔵
*అసూయ అంటే? *
మనము యిష్టపడి కోరుకొనేది మరొకరి దగ్గర వుంటే, వానిపై అయిష్టత కలిగియుండడం.

మనము బైక్ మీద వెళ్తుంటే?
వేగంగా దూసుకు పోతున్న కారు వైపు చుస్తాముగాని, మన ప్రక్కనే చెమటలుకక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము.
మన ఆశలన్నీ మనపైవాటి మీదే వుంటాయి. నేను ఆ స్థితిలో ఎందుకు లేను? అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని, మనకంటే ఉన్నత స్థితిలో వున్నవారిపైన 'అసూయను' కలిగిస్తుంది.
అసూయ కలిగిన నీవు సంతోషముగా వుండలేవు. ఎదుట వారిని సంతోషముగా వుండనివ్వవు.
🔺 *అసూయకు ముఖ్య కారణం*
* సంతృప్తి లేని జీవితం
* ఇతరుల బాగును సహించుకోలేని స్థితి
* ఇతరుల నైపుణ్యాలను అభినంధించలేని స్థితి

అపోస్తలుడైన పౌలు జైలులో ఖైదీగా వున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు.

నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. ఫిలిప్పి ‪4:11‬
సంతృప్తి కలిగియుంటే? అసూయకు తావే లేదు.

🔺 *అసూయ మరణానికి దారి తీస్తుంది :*
బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు. యోబు 5:2

🔺 *అసూయలేకుండా జీవించాలి.*
ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము. గలతియులకు 5:26

🔺 *అసూయ కలిగియుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము.*
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతియులకు 5:21

🔺 *అసూయను విసర్జించాలి: *
ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. 1పేతురు 2:1-3

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.
అసూయను వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


శరీర కార్యములు

( పదహారవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 15. *హత్యలు* 🔵
హత్య అంటే?
* చట్ట విరుద్ధంగా మనిషిని హతమార్చడం:

ఒక మనిషికి మరొకరి ప్రాణం తీసే అధికారం లేదు. తన ప్రాణం తాను తీసుకొనే అధికారం కూడా లేదు. అయితే, దేశ విద్రోహచర్యలు చేపట్టేవారి ప్రాణం తీసే అధికారం కొంత మంది అధికారులకు దేశచట్టం అనుమతిచ్చింది. వారు మాత్రం హంతకులుగా పరిగణించబడరు. అట్లా అని, వారు కూడా వారి స్వార్ధ ప్రయోజనాలకోసం హత్య చేస్తే, వారునూ హంతకులుగానే పరిగణించ బడతారు.

దావీదు దేవుని పక్షంగా అనేక యుద్దాలు చేసాడు. అనేకమందిని హతమార్చాడు. అవేమి కూడా ఆయనకు రక్తాపరాధాన్ని తీసుకురాలేదు. అయితే, తన స్వార్ధ ప్రయోజనం కోసం ఊరియాను చంపించింది మాత్రం, అతనికి రక్తాపరాధాన్ని తెచ్చిపెట్టింది.

నరహత్య చేయకూడదు.
నిర్గమ 20:13

నరహత్య చేయవద్దు.
మత్తయి 19:18

నరహత్య అంటే?
మనిషిని చంపడమే.

కాని, నరహంతకుడు అంటే ఏమిటో బైబిల్ యేమని చెప్తుందో తెలుసా?

"తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు."
1 యోహాను 3:15

మనం మనిషిని చంపాలంటే కత్తులే అవసర్లేదు. ద్వేషంతో నిండిన మన మాటలనే కత్తులుగా మలచి చంపేస్తాం.

ఇప్పుడు చెప్పండి. మనమెన్ని నరహత్యలు చేసామో? మన లెక్కకుకూడా అందదు కదా?
మన హృదయమంతా ద్వేషమే కదా?

అయితే, ఒక్క విషయం!
"ఏ నరహంతకునియందును నిత్యజీవము లేదు."
అట్లా అయితే? మన సంగతేమిటి?
వద్దు! ద్వేషాన్ని విడచి, ప్రేమను పెంచుకుందాం.
ఆ నిత్య జీవానికి వారసులవుదాం.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్


శరీర కార్యములు

( పదిహేడవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

🔵 16. *మత్తతలు* 🔵

మత్తతలు అంటే?
మత్తు పానీయాల సేవనం ఫలితంగా మానసిక, శారీరిక నియంత్రణ కోల్పోవడం.

త్రాగుడు ఒక ఫ్యాషన్ అయ్యింది. అదొక స్టాటస్ సింబలయ్యింది. త్రాగి తందనాలాడేవాడు హీరో అవుతున్నాడు. త్రాగని వాడెమో జీరో అవుతున్నాడు.

త్రాగిన వాడు ఏమి మాట్లాడతాడో తెలియదు? ఎందుకు నవ్వుతాడో తెలియదు? ఏమి చేస్తాడో తెలియదు? జేబులు ఖాళీ అయ్యేవరకూ త్రాగుతూనే ఉంటాడు. ఊగుతూనే ఉంటాడు.

ఏ భేదం లేదు. పిల్లలూ, యవ్వనులూ, వృద్ధులూ అందరూ త్రాగుతూనే వున్నారు. దాని ఒడిలో ఊగుతూనే వున్నారు? మత్తు పదార్ధాల మత్తులో జోగుతోంది లోకం.

అల్లర్లకు కారణం? యాక్సిడెంట్లకు కారణం? కుటుంబాలు విచ్చిన్నానికి కారణం? రోగాలు, ఆర్ధిక, మానసిక సమస్యలకు కారణం?
ప్రశ్నలు ఎన్నైనా కావొచ్చు. సమాధానం మాత్రం ఒక్కటే. అదే "త్రాగుడు వ్యసనం".

* యువత త్రాగుడుకి బలై పోతుంది. వారి వ్యసనం కోసం వ్యక్తిగత, కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు.
* పెగ్గు కోసం సిగ్గులేకుండా చేతులు చాస్తున్నారు.
* కనీసం బర్త్ డే పార్టీలు కూడా బీర్ లతో బార్ లో గడపడానికే సిద్దపడుతున్నారు?
* ఒక్క మాటలో చెప్పాలి అంటే? పార్టీ అంటేనే మద్యం. మద్యం లేకపొతే అది పార్టీనే కాదు.

కొంత మంది తెలివిగా మాట్లాడతారు. పౌలు తిమోతికి వ్రాసాడు కదా? అని. ఏమని వ్రాసాడు?

ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 1తిమోతి ‪5:23‬

కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకోమని. అయితే, ఈ త్రాగే వాళ్లంతా కడుపు జబ్బుకోసమే త్రాగుతున్నారా? అయినా, ద్రాక్షారసము, మద్యము రెండూ ఒక్కటేనా? ద్రాక్షారసము పులియబెడితే మద్యం అవుతుంది.

కడుపు జబ్బుకు కొంచెం ద్రాక్షారసము త్రాగమని తిమోతికి సూచిస్తున్నాడు పౌలు. అంటే? తిమోతి కడుపు జబ్బుతో బాధ పడుతున్నాడు. అది అతడు త్రాగే నీరు సరైనది కాకపోవడం వలన కలిగినది. ఆ దినాలలో ఔషధాలు అందుబాటులో లేనికారణం చేత, ద్రాక్షారసంలో కొన్ని ఔషధ గుణాలు వుండడం చేత త్రాగే నీటిలో కొంచెం ద్రాక్షారసం కలుపుకొని త్రాగడం సర్వ సాధారణం. మన వాళ్లేమో మద్యంలో నీళ్లు కూడా కలపకుండా త్రాగుతూ దీనిని పౌలు మాటలకు జత కట్టేసారు.

🔺 ఒక్క విషయం గుర్తుంచుకో!
* విషం కలిగి యున్న సీసా మీదా 'విషం' అనే పేరు తీసేసి, 'అమృతం' అని వ్రాసినంత మాత్రాన అది అమృతముగా మారిపోదు కదా?
* 'పాపము' అనే దానిని 'పొరపాటు' అని పిలచుకున్నంత మాత్రాన అది పాపం కాకుండా పోదుగా?

నీవంటావ్! ఆయన త్రాగడం లేదా? ఈయన త్రాగడం లేదా అని. ఆయన సంగతి, ఈయన సంగతి నీకెందుకు? నీవు చూడాల్సింది ఆయనను, ఈయనను కాదు. నీ పరిశుద్ధుడైన దేవునిని మాత్రమే. అనుసరించాల్సింది ఆయనను, ఈయనను కాదు. పరిశుద్ధ గ్రంధమును మాత్రమే.

మరి కొందరంటారు! పరిశుద్ధ గ్రంధంలో ఆయన త్రాగలేదా? ఈయన త్రాగలేదా అని. అవును! త్రాగారు. ప్రతిఫలాన్ని అనుభవించారు. నీ జీవితం అట్లా కాకూడదనే, వారి జీవితాలను దృష్టాంతాలుగా నీ ముందుంచాడు దేవుడు.

🔺 మద్యం వలన నోవాహు వస్త్రహీనుడయ్యాడు. ఆది 6:9

🔺 మద్యం వలన వరసలు తెలియవు: ఆది 19:30-38

🔺 మద్యం వలన అల్లరి పుట్టును. సామెతలు 20:1

🔺 మద్యం వలన జ్ఞానము లేనివారు అగును. సామెతలు 20:1

🔺 మద్యం వలన దరిద్రులగుదురు. సామె ‪23:21‬

🔺 మద్యం వలన శ్రమలు, దుఃఖము, గాయములు కలుగును . సామెతలు 23:29,30

🔺 మద్యం వలన ఆజ్ఞలు మరతురు. సామెతలు 31:4,5

🔺 మద్యం వలన పరలోకం వెళ్లలేరు. 1కొరింది ‪6:10‬

🔺 దుర్వ్యాపారం నడుపుతురు. ఎఫెసి ‪5:18‬

🔺 మతి చెడును హోషేయ ‪4:11‬

🔺 జబ్బు పడుదురు. హోషేయ 7:5

🔺 తత్తర పడుదురు. యెషయా 28:7

🔺 చెడు పాటలు పాడుదురు. కీర్తనలు 69:12

🔺 త్రాగుబోతులకు శ్రమ. యెషయా ‪5:22‬

🔺 నరకానికి వెళ్లెదరు. మత్తయి 24:49-51, ప్రకటన ‪14:10‬

అందుచే,
ఇటువంటి త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. (సామెతలు ‪23:20‬)

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

మత్తతలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

శరీర కార్యములు

( పద్దెనిమిదవ భాగము)

“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థుతులనుబట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.


🔵 17. *అల్లరితో కూడిన ఆట పాటలు* 🔵

అల్లరితో కూడిన ఆట పాటలు అంటే?
* సినిమాలు, సీరియల్స్
* అధికంగా వినోదించడం
* తిండిబోతుతనం
* మత్తు పానీయాలు
* మాదక ద్రవ్యాలు
* లైంగిక సంభోగాలతో కూడిన సమావేశాలు మొదలైనవి.

సినిమాలు చూడకూడదని ఎక్కడ వ్రాయబడి వుంది? అని ప్రశ్నించేవారు నేటి దినాలలో కోకొల్లలు. అవును! అట్లా వ్రాయబడలేదు. బైబిల్ వ్రాయబడే దినాలకు సిమాలు లేవు కాబట్టి, దానిని ప్రత్యక్షంగా వ్రాయవలసి అవసరం లేకపోయింది. కానీ, ఒక్క విషయం! పరోక్షంగా అవన్నీ “అల్లరితో కూడిన ఆటపాటలలో” చేర్చడం జరిగింది.

* సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. ఆయన వేశ్యనైనా క్షమిస్తాడు గాని, వేషధారిని క్షమించడు.

* సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా ఆ రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది.

* సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాటo సన్నివేశాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు.
ఇట్లా చెప్పకుంటూపోతే, చెప్పలేనన్ని.

చాలా ఎక్కువమంది సినిమాలు చూడకూడదు గాని, సీరియల్స్ చూసినా ఏమి కాదు. అని వారికి వారే సర్ది చెప్పేసుకుంటారు. అయితే ఒక్క విషయం! సినిమాయైతే, మూడు గంటకలు అయిపొతుందెమో గాని, ఈ సీరియల్ అయితే? మూడు సంవత్సరాలైనా సమాప్తం కాదు. వీటికి అలవాటుపడిన నీవు, శరీరకార్యాలనే నెరవేర్చుతున్నావనే విషయం ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.

తాగి తందనాలాడడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, శరీరవాంఛలను రేకెత్తించే పదజాలం, ఇవన్నీ అల్లరితోకూడిన ఆటపాటలే.

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

అల్లరితో కూడిన ఆట పాటలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

అబ్రాహాము విశ్వాసయాత్ర

యేసు క్రీస్తు రెండవ రాకడ

పక్షిరాజు

పాపము