ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ
ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు- కనీస క్రమశిక్షణ.....1
ప్రియ దేవుని సంఘమా! మనమందరం ఆదివారం ఆరాధనకి వెల్లడానికి ఇష్టపడతాం.(దేవుణ్ణి ప్రేమించే వారంతా). అయితే ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఆరాధన మీద – వాక్యం మీద మన మనస్సు, ధ్యానం లఘ్నం చేస్తున్నామా లేదా? ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం ? కొంచెం ఆలోచిద్దాం.
దేవుని సమాజంలో దేవ్వుడు నిలిచియున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చు చున్నాడు. కీర్తన 82:1.
దీనికి సపోర్టింగ్ రిఫరెన్సు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుంటారో వారి మధ్య నేను వుంటాను అని యేసయ్య సెలవిచ్చారు. మత్తయి 18:20;
కాబట్టి దేవుని ఆలయంలో దేవుడు వున్నారు, ఆయనకి భయపడాలి, ఆయనని గౌరవించాలి అన్న ధ్యాష మనలో వుంటే, వాక్యం మీదనే లక్ష్యం ఉంచుతాం తప్ప ఇటు అటు చూడము, ఇటు అటు తిరగం.
ఆయన దేవాదిదేవుడు, రాజాధిరాజు, మహోన్నతుడు. (కీర్తనలు గ్రంధం). ఆకాశం నా సింహాసనం, భూమి నా పాధపీటం. అన్న పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడు (reverend--- ఆయన మాత్రమే). ఆయనని ఆరాధించడానికి వచ్చియున్నాము అన్న విషయం గుర్తుంటే దేవుని సన్నిధిని అజాగ్రత్తగా ఉండము.
మరికొంతమంది ఆరాధనలో నిద్రపోతూ వుంటారు. ఇంకొంతమంది ప్రక్కవారితో మాట్లాడుకొంటూ వుంటారు. మొబైల్ లో గేమ్ ఆడుకొనేది కొంతమంది. ఆదివారం నాడు ఆరాధనకి రాకుండా సినిమాలకి, షికార్లకి వెళ్ళేవారు కొంతమంది.
కీర్తన 84:10, నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది. అదేవిధంగా ఒక్క దినం మిస్ అవడం వెయ్యి దినాల ఆశీర్వాదంను పోగొట్టుకోవడమే. అందుకే ఆరాధనకి వస్తాము, వచ్చి నిద్రపోతాం. వాక్యం వినం. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రసంగం అయ్యాక వచ్చేది కొంతమంది. కానుకల సమయంలో గాని, ఆశీర్వాదం ఇచ్చే సమయంలో గాని వచ్చేవారు కొంతమంది. వారి ఆలోచన ఆదివారంనాడు గుడికి వచ్చి, Attendance వేయిన్చుకొంటే చాలు.1000 days blessings వచేస్తాయ్ అని పొరబడుతున్నారు. అలా చేస్తే దేవుని ఆశీర్వదాలకి ప్రతికూలంగా దేవుని శాపాన్ని పొందుకొంటున్నావ్ అని మర్చిపోకు.
మరి ఏం చెయ్యాలి???
1.దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము. ప్రసంగీ 5:1
నీ ప్రవర్తన, నీ మాటలు, నీ వస్త్రధారణ అన్ని జాగ్రతగాచూసుకోవాలి. ఎందుకు? ముందు చెప్పిన విధంగా దేవుడు మనమధ్య వున్నారు, ఆయన రాజులరాజు, ప్రభువుల ప్రభువు, భయంకరుడైన దేవుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి.
దయచేసి ఒక విషయం గమనించాలి. మనం వెళ్ళేది మార్కెట్ కి కాదు, సినిమా హాల్ కి కూడా కాదు. క్రిస్టియన్ గెట్ టుగెదర్ కి అంతకన్నా కాదు, పెళ్ళికో , ఫంక్షన్ కో, వ్యాపారానికో కూడా కాదు. రారాజుని పూజించటానికి వెళ్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన, మన వస్త్రధారణ క్రమబద్ధంగా వుండాలి . కొంతమంది యువతి యువకులు నేటి కాలంలో ఘోరమైన వస్త్రధారణతో సంఘానికి వస్తున్నారు. Tight T-shirt వేసుకొని, ఖండలు, 6 pack చూపించేవారు కొంతమంది. స్త్రీలు పెదాలకి రంగు, కనుబోమలకి రంగు, ఇంకా భయంకరమైన వస్త్రధారణతో వస్తున్నారు. విచారం ఏమిటంటే, మాదిరిగా ఉండాల్సిన సేవకుల భార్యలు, పిల్లలు సంఘస్తుల కంటే భయంకరంగా తయారై , బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేషం వేసుకొని సంఘానికి వస్తున్నారు. ఇక సంఘస్తులు ఇంక ఎలా వుంటారు.
CHURCH IS NOT A FASHION SHOW.
మన వస్త్రధారణ, నడక దేవునికి అనుకూలంగా వుండాలి గాని, లోకస్తులు చేసినట్టు, లోకాన్ని మరియు ఇతరురలను ఆకర్షించేదిగా ఉండరాదు. ఒక కలెక్టర్ ఆఫీస్ కి ఆ రకమైన వస్త్రధారణతో వెళ్ళగలవా? దయచేసి గమనించమని మనవి.
2. ఆరాధనకి వచ్చి నిద్రపోతారు. దేవుడంటే భయం వుంటే నీకు నిద్రరాదు. దేవుడంటే నిజమైన ప్రేమ వున్నా నిద్ర రాదు. ప్రియ సహోదరీ/సహోదరుడా! శనివారం నాడు సాయంత్రం తర్వాత దయచేసి TV చూడకు,TV కట్టేసి, ప్రార్ధన చేసుకొని, భోజనం చేసి తొందరగా నిద్రపో! ఆదివారం గుడిలో నీకు నిద్రరాదు. రాత్రి ఒంటిగంట వరకు నివు TV చూస్తే నీకు ఆదివారం చర్చి లో నిద్ర వస్తుంది.చాల మంది ఆదివారం నాడే పనులు పెట్టుకొంటారు. ఎదో మ్రొక్కుబడికి గుడికి వచ్చినా, వాక్యం వినరు. మీరు చేసేది ఆచారం తప్ప ఆరాధన కాదు. దేవునికి మీ ఆచారాలు అవసరం లేదు. ఆత్మతోను సత్యం తోనూ చేసే ఆరాధనా కావాలి.
౩. దయచేసి ఆరాధనలో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక రెండు మూడు గంటలు మీ మొబైల్ కట్టేస్తే కొంపలు మునిగిపోయేదేమి లేదు. నీవు ఎవరో ముఖ్యమైన వారిని కలిసి నప్పుడు గాని, ఒక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గాని మొబైల్ కట్టేస్తావ్ కదా. ఆ కలెక్టర్ ని కూడా పుట్టించింది నా యేసయ్య అని మర్చిపోతున్నావ్. మరి చర్చి లో ఎందుకీ మొబైల్ ఆపడం లేదు. మొబైల్ లో గేమ్స్ ఆడుకొనే వారు కొంతమంది. కొంతమంది మొబైల్ లో బైబుల్ వుంది అందుకే ఆపడం లేదు అంటారు. ప్రియ దేవుని బిడ్డా! మొబైల్ లో బైబుల్ ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు చదువుకోడానికే తప్ప ఆదివారం ఉపయోగించడానికి కాదు. నీవు దైవ గ్రంధాన్ని మోస్తే అది నిన్ను ఒకరోజు మోస్తుంది. మరి ముక్యంగా అది జీవ గ్రంధం.దానిని ప్రతీరోజు చదవాలి అంతే కాకుండా ఆదివారం గుడికి తీసుకు రావాలి. అలా కాకుండా మొబైల్ తో సరిపెట్టుకోగూడదు. నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవునికి ఇచ్చే మర్యాద ఇదేనా? నీ మొబైల్ లో బైబుల్ తో పాటు ఇంకా ఏమేమి వున్నాయి? సినిమా పాటలు, గేమ్స్ , ఇంకా నానా చెత్త అంత దానిలోనే స్టోర్ చేస్తున్నావ్ కదా. వాటి ప్రక్కనే బైబుల్. దయచేసి బైబుల్ ని మోయండి. బైబుల్ కి ఇచ్చే ప్రాధాన్యత బైబుల్ కి ఇవ్వండి.
4. ప్రార్ధనా పూర్వకంగా రావాలి. ప్రభువా ఈరోజు నాతొ మాట్లాడండి. నన్ను నీ ఆత్మతో తాకండి, ముట్టండి. అని ప్రార్ధన పూర్వకంగా వస్తే దేవుడు తప్పకుండా తన మెల్లని చల్లని స్వరం నీకు వినిపిస్తారు. ఎదో విదంగా, ఎదో రకంగా దేవుడు నీతో మాట్లాడతారు.
Do not Expect Anything If You Do not Concentrate On Word Of God.
5. నీకు ఎవరిమీదనైన కోపం, ద్వేషం గాని వుంటే మొదట వారితో సమాధాన పడు. లేదా ఆ వారంలో నీవు ఎవరినైన ఏమైనా అంటే, ఎవరినైనా నొప్పించి వుంటే మొదట వారిని క్షమాపణ అడుగు. లేకపోతె నివు గుడిలో ప్రార్ధించడం మొదలుపెట్టిన వెంటనే సాతాను గాడు గొప్ప ప్రార్ధన చేసేస్తున్నావ్ గాని ఫలాని వాళ్ళని ఇన్ని మాటలు అన్నావ్. ఇప్పుడు ఏమి ఎరగనట్టు ప్రార్ధన చేస్తున్నావ్. దేవుడు నీ ప్రార్ధన వింటాడా? వినడు. అని నీకు చెప్పి నిన్ను ప్రార్ధన చెయ్యకుండా ఆపెస్తుంటాడు. వాడి మాటలు విన్నావా నీవ్ చివరకు బ్రష్టుడవైపోతావ్. అందుకే దేవుని దగ్గర మరియు ఆ వ్యక్తీ దగ్గర క్షమాపణ అడుగు. నీ ఇగో ని వదిలేయ్. నిన్నూ పరలోకం చేర్చేది నీ ఇగో కాదు. ఒకసారి నీ ఇగో వదేలేయ్. నీకు మనశ్శాంతి , ఆ వ్యక్తీ నీకు మద్య శాంతి. దేవునితోను ఆ వ్యక్తితోను సమాధానం కలిగి వుంటావ్. నీ ఇగో ని సంతృప్తి పరచాలని చూసావా 100% నరకానికి పోతావ్.
దయచేసి ఈ రకమైన సిద్దపాటు క్రమశిక్షణ కలిగి ఆరాధనకి వస్తే ఆ ఆరాధన నీకు ఆశీర్వదకరంగా వుంటుంది, మరుసటి ఆదివారం ఎప్పుడొస్తుందా అని నీ హృదయం తహతహలాడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమెన్
ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ -2
ముసుకు వేసుకొనుటఏ పురుషుడు తలమీద ముసుకు వేసుకొని ప్రార్ధన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమాన పర్చును. ఏ స్త్రీ తన తలమీద ముసుకు వేసుకొనక ప్రార్ధనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమాన పరచును.1 కొరింధి 11:4-16.
గమనించారా! పురుషుడు ఆరాధనలో ముసుకు వేసుకోకూడదు.(టోపీ/cap పెట్టుకోకూడదు) అలానే స్త్రీలు ముసుకులేకుండా ప్రార్ధన చేయకూడదు. ప్రవచింప కూడదు.
ఇక్కడ ప్రార్ధన అంటే కేవలం ప్రార్ధన అనే కాదు పాటలు పాడటం, వాక్యం చెప్పడం, వినడం, ప్రార్ధన చేయడం,ఆరాధనా/worship చేయడం ఇవన్నీ ప్రార్ధన చేయడమే. చివరకి సీయోనులో మౌనముగా వుండటం కూడా స్తుతి చెల్లించడమే. అనగా సంఘంలో మౌనంగా వుండి వాక్యాన్ని వినడం కూడా దేవునికి స్తుతి చెల్లించడమే.
మరి ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ప్రార్ధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, worship చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, చెప్పేటప్పుడు ముసుకువేసుకొంటున్నారు?
ఈకాలంలో దేవుడు యవ్వన స్త్రీలకి మంచి తలాంతులు ఇచ్చారు. బాగా పాటలు పాడుతున్నారు. ఆరాధనా నడిపిస్తున్నారు. పరలోకాన్నే క్రిందకు దింపగలుగు తున్నారు.అందుకు దేవునికి స్తోత్రం. కాని చాల మంది పాటలు పాడేటప్పుడు సంఘాల్లోను, TV లోను ముసుగు వేసుకోవడం లేదు.ఏమంటే హెయిర్ స్టైల్ పాడైపోతుంది అంటున్నారు. దేవునికంటే వీరికి హెయిర్ స్టైల్ అనగా తమ షోకే ఎక్కువై పోయింది. 1 కొరింధి 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇప్పుడు స్త్రీ తన తలమీద ముసుకులేకుండా పాడినా ప్రార్ధించినా తన తల అనగా అది యేసయ్యను అవమాన పరచినట్లే. దేవునికోసం లేక యేసయ్య కోసం లేక పరిశుద్దాత్మ కోసం స్తుతి పాటలు పాడుతూ , ముసుకు వేసుకోకుండా ఆయనని అవమాన పరచడం న్యాయమా? పరిశుద్ధాత్మను దుఃఖ పరుస్తారా?
ఇక చాలా మంది దైవ సేవకురాళ్ళు టీవీలో సంఘాల్లో వాక్యము చెబుతున్నారు. అందుకు దేవునికి స్త్రోత్రం. వారిలో చాలా మంది బైబుల్ చెప్పిన కనీస క్రమ శిక్షణను పాటించడం లేదు అనగా ముసుగు వేసుకోవడం లేదు. భోదిస్తున్న నీవే Rules & Regulations పాటించక పొతే వినే వారు పాటిస్తారా? భోదకులకి ఏడంతల శిక్ష అని మరచిపోతున్నారు. మాదిరిగా ఉండాల్సిన సేవకురాండ్రు ముసుకు వేసుకోవడం లేదు తద్వారా దేవునికి మహిమ తేవాల్సినదానికి ప్రతికూలంగా సంఘాన్ని తమ విపరీత వస్త్రధారణ ద్వారా మరియు ముసుకువేసుకోక పోవడం ద్వారా సంఘాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు.
చాలా సంఘాల్లో ఈ విషయాన్ని ఖరాఖండిగా చెప్పడం లేదు. ప్రియమైన దేవుని సేవకుడా! దయచేసి ఈ విషయాన్ని వున్నది ఉన్నట్లుగా భోదించండి. ప్రతి స్త్రీ సంఘంలో ముసుకు వేసుకోవాలి అని చెప్పండి.
కాబట్టి ప్రియ సహోదరి! నీవు ప్రార్ధన చేస్తున్నప్పుడు గాని , పాటలు పాడేటప్పుడు గాని, వాక్యం వినేటప్పుడు గాని చెప్పేటప్పుడు గాని, తప్పకుండా ముసుకు వేసుకోమని యేసయ్య నామంలో మనవి చేస్తున్నాను. సరే! నీకు ముసుకు వేసుకోవడం ఒకవేళ ఇష్టం లేదా? మంచిది! మానేయ్! గాని గుండు గీయుంచుకో! లేక పురుషులు కట్ చేసుకోనేలాగా తల కట్ చేసుకో! బాబ్డ్ హెయిర్ చేసుకో. నేను కాదు దేవుడే సెలవిచ్చారు. 11:6లో. తల కత్తిరించుకోవడం అవమానమా? అయితే ముసుకు వేసుకో! మరో దారి లేదు.
యేసు ప్రభుల వారే క్రమాన్ని పాటించినప్పుడు నీవు క్రమాన్ని పాటించలేవా? ఆయనకీ భాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అదే విషయం యోహాను గారు అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారు? నీతి యావత్తు నేరవేర్చబడాలి కావున బాప్తిస్మం తీసుకొన్నారు. నీవు కూడా దేవుని ఆలయంలోనికి ఆరాధనకి వచ్చినప్పుడు తప్పకుండా ముసుకు వేసుకోవాలి. అంతే.
కాబట్ట్టి ప్రియమైన సహోదరి! నిన్ను నీవు సరిచేసుకో! దేవుణ్ణి అవమానపరచకు. దుఃఖ పరచకు. దేవుని శాపం కాకుండా దేవుని ఆశీర్వాదం పొందుకో!
అట్టి కృప మీ అందరికి మెండుగా కలుగును గాక! దైవాశీస్సులు!
ఆమెన్
ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ-3
వస్త్రధారణస్త్రీ పురుష వేషం వేసుకోనకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోనకూడదు.ఆలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ద్వితీ 22:5.
గమనిచారా? బైబుల్ గ్రంధం క్లియర్ గా చెబుతుంది స్త్రీ పురుష వేషం వేయకూడదు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అనగా స్త్రీ పురుషుని వలె వస్త్రధారణ చేసుకోకూడదు. ఐతే నేటి దినాల్లో మోడరన్ కల్చర్ మన దేశంలో రాజ్యం చేస్తుంది, మన దేశ ఆచార వ్యవహారాలను మించిపోయింది మోడరన్ కల్చర్.దానివల్ల ఇప్పడు అమ్మాయిలు స్త్రీలు Jeans ప్యాంటు- టైట్ T-షర్టు వేసుకొని తిరుగుతున్నారు. ఏమంటే చాల కంఫర్ట్ గా వుందని కొందరు, లేటెస్ట్ ఫాషన్ అని కొందరు, లేటెస్ట్ ట్రెండ్ అని కొందరు, ఫలానా హీరొయిన్ వేసుకోంది కాబట్టి నేను వేసుకొంటున్నాను అంటున్నారు.
అయితే బైబిల్ దీనిని ఖండిస్తుంది. స్త్రీ పురుషునిలాగా బట్టలు వేసుకోకూడదు. మన భారత దేశ వస్త్రధారణ ప్రకారం జీన్స్ ప్యాంటు T షర్టు స్త్రీ వేషం కాదు. అది ఏ దేశ మైన అది పురుషుని వేషమే. మరి వీరు దేవుడైన యెహోవాకు అసహ్యులు కారా? దేవునికి అసహ్యులు అంటే పరలోకం చేరలేరు. పరలోకం లేదు అంటే నరకానికి సీట్ ఖాయం అన్న మాట.
సరే బయటి వారి కోసం మనకు అనవసరం. అయితే నేటి దినాల్లో చాల మంది అమ్మాయిలు పాటలు చాలా బాగా పాడుతున్నారు. worship చేస్తున్నారు. నడిపిస్తున్నారు.పరలోకాన్ని క్రిందికి దించుతున్నారు అందుకు దేవునికే మహిమ. గాని వారిలో కొందరు జీన్స్ ప్యాంటు లు T షర్టులు ,షర్టు లు వేసుకొని పాటలు పాడుతున్నారు. ఇది దీవెనా? శాపమా?
ప్రియమైన సంఘకాపరి! ఎప్పుడైనా వీరిని వారించావా? ఎవరైనా చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? వారి కానుకలు ఆశించి ఇలాంటివి భోదించడం మానేశావా?ఖండించుము గద్ధించుము భుద్ధిచెప్పుము. (2 తిమోతి 4:2)లో నీకు అధికారం ఇస్తే వారి కానుకలు ఆశించి వారికి అనుకూల భోదలు చేస్తున్నావా? అవి భోదించక పొతే వారి ఆత్మలకి వుత్తరవాదివి నీవే అని మరచి పోతున్నావా? యేహెజ్కేలు 3: 16 -21.
ప్రియమైన తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను వాక్యపు వెలుగులో పెంచుతున్నారా లేదా? బైబిల్ ని వారికి ప్రతీ రోజు భోదిస్తున్నారా లేదా? వాళ్ళు వేసుకొంటున్న వస్త్రధారణ వాక్యానుసారమైనదా లేదా కనిపెడుతున్నారా? దేవుని బిడ్డలకు తగిన వస్త్రధారనా కాదా అని చూస్తున్నారా? లేక వారు కోరిన బట్టలు కొని పెడుతున్నారా? అవి మంచివా కావా? వాక్యానికి వ్యతిరేఖమా అని సరి చేస్తున్నారా లేదా? వాక్యానికి వ్యతిరేఖమైన ఈ వస్త్రధారణ శరీరాన్ని కప్పేది పోయి శరీరపు కొలతలు చూపించేదిగా, పురుషులకి కోర్కెలు పెంచేవిగా ఉంటున్నాయి, అలాంటివి వేసుకొని ఆరాధనకి వస్తే ఆరాధన ఎలా జరుగుతుంది. మీరు ఎలా ఒప్పుకొంటున్నారు?
ప్రియమైన సహోదరి! ఒకవేళ మీ భోదకుడు , మీ పేరంట్స్ చెప్పకపోతే ఎప్పుడైనా వాక్యాన్ని చదివావా? నీవు చేసే ప్రతీదానికి అది మంచిదైన సరే చెడ్డదైన సరే విమర్శ దినమందు లెక్క చెప్పాలని తెలియదా?
నేటి దినాల్లో అనేక మంది దైవ సేవకుల కుమార్లు కుమార్తెలు మాదిరిగా వుండటం మానేసి వారే లోకస్తుల మాదిరి విచ్ల్చల విడిగా వస్త్రధారణ చేస్తూ, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దైవ సేవకుల కుమార్తెలే టైట్ బట్టలు పాంట్ షర్టులు వేసుకొని సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
ప్రియమైన సహోదరి! నిజంగా ఈ వాక్యాన్ని ఇంతవరకు చదివి యుండకపొతే, నీకు ఎవరు భోదించకపొతే, ఇప్పుడైనా సరే అటువంటి వస్త్రధారణ మానేయ్. ముఖ్యంగా సంఘంలో అట్టివి కుదరనే కుదరదు. దైవ భక్తీ గలవారమని చెప్పుకొనే స్త్రీలకూ తగినట్టుగా వస్త్రధారణ చేసుకోమని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను.
ఇక పురుషులారా! సినిమా హీరోలు చేసే చెత్త హెయిర్ స్టైల్, చెత్త బట్టలు పొట్టి బట్టలు వేసుకొని బ్రస్తుడవై పోవద్దు. జేఫన్యా 1:8 అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొనే వారినందరినీ నేను శిక్షింతును. అని సెలవిస్తుంది, అన్య దేశస్తుల వలె వస్త్రధారణ చేసుకొనే స్త్రీని గాని పురుషున్ని గాని దేవుడు శిక్షిస్తాను అంటున్నారు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. గడ్డపు ప్రక్కలు కత్తిరించుకో కూడదు అని బైబుల్ క్లియర్ గా సెలవిస్తుంది లేవీఖాండము 19:27; అనగా ఫ్రెంచ్ కటింగ్,హిప్పీ కటింగ్ దేవునికి ఇష్టం లేదు. లోకస్తుల వలె నీవు స్టైల్ చేస్తే దేవునికి ఇస్టుడిగా వుండలేవు. యాకోబు 4:4 ఎవరైతే ఈ లోకాన్ని స్నేహం చేస్తారో వారు దేవునికి వైరం అనగా శత్రుత్వం చేస్తున్నారు. దయచేసి లోకస్తుల వలె వేషం వేసుకొని సంఘంలో పాటలు పాడకు. సంఘాన్ని నీవు కాదు క్రీస్తే ఆకర్షించనీ. సంఘంలో పాటించాల్సిన కనీస క్రమ శిక్షణ ప్రియ సహోదరి సహోదరుడా పాటించమని దైవ దీవనలు పొందమని మనవి చేస్తున్నాను. అట్టి కృప మనందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు . ఆమెన్
ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ-4
పాదరక్షలు విడుచుట
మనం భారత్ దేశంలో నివశిస్తున్నాం. మన దేశంలో ఏ మతస్తులైన దైవ మందిరానికి వెళ్ళినప్పుడు తమ పాదరక్షలు తీసివేసి వెళ్తారు.
మన క్రైస్తవులు కూడా చాలావరకు పల్లెటూర్లలో అది ఏ సంఘమైనా సరే చెప్పులు తీసి మందిరం లోనికి వెళ్తారు ఆరాధనకి. పట్టణాలలో కూడా చాలా సంఘాల వారు పాదరక్షలు బయట విడచి ఆరాధనకు వెళ్తారు, మిగిలిన వాళ్ళు పాదరక్షలతోనే గుడిలోకి వెళ్తారు. అన్ని మతాలవారు చెప్పులు తీసి వెళ్తారు కాని దేవాది దేవుణ్ణి ఆరాదిస్తున్నాం అని చెప్పుకొనే మనం దౌర్భాగ్యం ఏమిటంటే పాదరక్షలతోనే గుడిలోకి పోతాం. ఇదేనా దేవునికిచ్చే గౌరవం?
ముఖ్య విషయం ఏమిటంటే అన్ని సంఘాల్లోను ఆదివారం నాడు వాక్యం చెప్పినప్పుడు సంఘకాపరి చెప్పులు విడచి వాక్యం చెబుతారు. మంచిది. మరి సభలలోను, మిగిలిన ఆరాధనల్లోను ఎందుకు చెప్పులు వేసుకొని వాక్యం చెబుతున్నారు? ఇది వాక్యనుసారమా? వాక్యానికి వ్యతిరేఖమా? చూద్దామ్
1) దైవ గ్రంధంలో మొదటసారిగా నిర్గమ ఖండంలో మోషే గారికి దేవుడు చెబుతున్నారు నిర్ఘమ 3:5 లో, అందుకాయన
దగ్గరకు రావద్దు. నీ పాదములనుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలచియున్నస్థలము పరిశుద్ధ ప్రదేశము. చూశారా? అది ఒక పర్వతము మాత్రమే దాని పేరు హోరేబు పర్వతము.అది దేవుని మందిరం కాదు గాని దాని మీద దేవుని ప్రత్యక్ష్యత కలిగింది మోషె గారికి మొట్టమొదటగా. ఎక్కడైతే దేవుడుంటారో అదే పరిశుద్ద ప్రదేశం అందుకే నీ పాదములనుండి నీ చెప్పులు విడువుము అని దేవాది దేవుడే తన నోటితో చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? ఒక సామాన్యునితో కాదు ఒక గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఒక ప్రవక్తతో.
2. ఇక బైబుల్ లో వ్రాయబడిన ఏ లేఖనానికైన మరో సపోర్టింగ్ లేఖనం వుంటాది. అప్పుడే అది సరియైనది. పై లేఖనానికి మరో సపోర్టింగ్ లేఖనం యెహోషువా 5:13-15వరకు. ఇక్కడ యెహోషువా మరియు ఇజ్రాయెలీలు యోర్దాను దాటి యెరికోను స్వాధీనం చేసుకొందామని సిద్ధంగా వున్నారు. అప్పుడు యెహోవా సేనాధిపతి అనగా ఒక దేవదూత కనబడతాడు యెహోషువా గారికి. వెంటనే ఆయన అడుగుతారు దూతతో నీవు మా పక్ష్యమున వున్నవాడివా? మా విరోధుల పక్ష్యాన ఉన్నవాడివా? అంటే ఆ దేవదూత నేను మీ పక్ష్యాన రాలేదు మీ విరోదుల పక్ష్యాన రాలేదుగాని యెహోవా సేనాధిపతిగా వచ్చాను.దాని అర్ధం యుద్ధం చేసేది మీరు కాదు దేవుడే మీ పక్ష్యంగా యుద్ధం చేస్తారు. వెంటనే యెహోషువా గారు సాష్టాంగనమస్కారం చేస్తారు. అప్పుడు ఆ యెహోవా సేనాధిపతి ఏమన్నాడు? నీవు నిలచియున్న ఈ స్థలము పరిశుద్దమైనది కాబట్టి నీ పాదరక్షలు తీసివేయుమని చెప్పగా యెహోషువా ఆలాగు చేసెను.
మరి ఇది కూడా దేవమందిరం కాదు. అయినా సరే ఎక్కడైతే దేవుని దూతలు దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ దేవుని సన్నిధి వుంటుంది. అప్పుడది పరిశుద్ధ ప్రదేశంగా మారిపోతుంది. అప్పుడు మనం మన పాదరక్షలు తీసివేసి దేవుణ్ణి ఘనపర్చాలి అని దైవ గ్రంధం సెలవిస్తుంది.
మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుంటారో అక్కడ వారిమద్యన నేను ఉందునని యేసయ్య సెలవిచ్చారు మత్తయి 18:20లో. మరి ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కూడిన సభల్లో దేవుడు 100% ఉంటారు కదా! అలాంటప్పుడు పాదరక్షలు తీసివేయాలి కదా?మరి సభల్లో ఎందుకు తీసివేయడం లేదు?
తెల్లభోదకులు అనగా యూరోపియన్ దేశాలు, అమెరికా దేశాల్లో వున్నవారు ఎప్పుడూ తమ షూ వేసుకొని వుండాలి లేకపోతె చలికి రక్తం విరిగిపోయి ఫ్రాస్ట్ బైట్ అనే వ్యాధితో రక్తం పోయి చనిపోతారు. నేను కూడా చలి దేశాల్లో పని చేస్తున్నప్పుడు ఎన్ని వేడి కలిగించే దుస్తులు తొడుగులు వేసుకొన్నా ఒక అయిదు నిమిషాలు బయట పనిచేసి వస్తే చలికి వణికి పోయేవాడిని. అక్కడ ఇవన్నీ తప్పవు. మరి నీవు ఉండేది చలి దేశం కాదు కదా? ఒక్క హిమాలయాలు పరిసర ప్రాంతంలో తప్ప ఇంకా ఎక్కడా ఎప్పుడూ మంచు కురవదు. ఆలాంటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మన దేశంలో పాదరక్షలు ఎందుకు? తెల్ల భోదకులని నల్ల భోదకులు కూడా ఫాలో అవుతున్నారు. దేవుడు చెప్పినా సరే వీరు మానడం లేదు. మరి వీరికి వాక్యం తెలియదా అంటే చాలా బాగా తెలుసు. తెలిసే చేస్తున్నారు పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకొన్నట్లు. ఇది పక్కా వాక్య విరుద్ధం.
దయచేసి ప్రియ సహోదరి/సహోదరుడా! దేవుని సమాజంలో దేవుడు నిలచియున్నాడని గ్రహిచు(కీర్తన 82:1) కాబట్టి ఆయనకీ ఇవ్వాల్సిన గౌరవం ఆయనకివ్వు. మందిరంలో సభలలో నీ పాదరక్షలు తీసివేసేయ్. దేవుని దీవెనలు పొందుకో.
అట్టి కృప మనందరికీ కలుగును గాక ! దైవాశీస్స్సులు! ఆమెన్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి