బాప్తిస్మం
బాప్తీస్మము
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
బాప్తీస్మము “బాప్టిజో” అనే గ్రీకు పదమునుండి తర్జుమా చేయబడింది.
బాప్తీస్మము అనగా?
ముంచుట (1పేతురు 3:21)
పాతిపెట్టుట ( రోమా 6:3 )
నూతన జన్మ (యోహాను 3:3 )
బాప్తీస్మము అనగా?
పాపముల విషయమై సమాధిచేయబడి, నూతన సృష్టిగా తిరిగిలేచుట.
క్రైస్తవ జీవితానికి రక్షణ మరియు బాప్తీస్మం రెండూకూడా అత్యంత ప్రాముఖ్యమైనవే. మనము ఏదైనా ఒక స్థలాన్ని కొన్నప్పుడు, అమ్మిన వ్యక్తికి డబ్బు చెల్లించినంత మాత్రాన, అది మన స్వంతమవదు కదా? తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడే అది మన స్వంతమవుతుంది. అట్లానే రక్షణ పొందిన వ్యక్తికి, బాప్తిస్మము అనేది రిజిస్ట్రేషన్ వంటిది.
నేటి దినాన్న అనేకులు రక్షణ పొందాము అని చెప్పుకొంటున్నప్పటికీ, బాప్తిస్మము అంటే మాత్రం ముందుకురారు. దానికిగల కారణమేమిటి? బాప్తీస్మమును గూర్చిన సరియైన అవగాహన లేకనా? లేక రక్షణ తీర్మానమును బహిరంగంగా ఒప్పుకుంటే, రక్షణను కాపాడుకోలేమోననే సందేహమా?రక్షణ పొంది బాప్తీస్మమును నిర్లక్ష్యము చేస్తున్నామంటే, రహస్యముగా ప్రభువుతో ఉండడానికి యిష్టపడుతున్నాముగాని, బహిరంగంగా ఆయనను ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామనేగా దాని అర్ధం. కొందరంటారు బాప్తీస్మము తీసుకొనుటద్వారా రక్షణ రాదుకదా, అట్లాంటప్పుడు బాప్తీస్మమునకు అంత ప్రాధాన్యత ఎందుకని? అవును! ఆయన కృపను ఆశ్రయించి, ఆయనను విశ్వసించడం ద్వారానే రక్షణ. బాప్తీస్మం తీసుకొనుట ద్వారా రక్షణ కలుగదు. కానీ, రక్షించబడిన ప్రతీ వ్యక్తి బాప్తీస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. (మార్కు 16:16) మరికొందరు ఇంకా తెలివిగా సిలువలో దొంగ బాప్తిస్మము తీసుకోలేదు కదా? అంటూ వితండవాదం చేస్తుంటారు. అది రక్షణ కార్యం నెరవేర్చబడకముందు జరిగిన సంభవం. కానీ, యేసుప్రభువు పునరుత్థానమైన తర్వాత, ఆయన శిష్యులకు బాప్తీస్మమును గురించిన స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చారు. మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. (మత్తయి 28:19,20)
బాప్తీస్మము లోని రకాలు:
🔸చిలకరింపు
🔸పైనుండి నీళ్లుపోయుట
🔸జెండా క్రిందకు వెళ్ళుట
ఇట్లా అనేకరకాల ఉన్నప్పటికీ, ఇవేమి మనకు పరిశుద్ధ గ్రంధములో కనబడవు. “ముంచడం” విధానం మాత్రమే బైబిల్ లో వున్న విధానం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; (మత్తయి 3:16) పూర్తిగా నీటిలో ముంచబడితేనే, అది సమాధి అనుభవానికి సాదృశ్యం. అట్లా అని, వేరొకవిధంగా బాప్తిస్మము పొందినవారికి పరలోకంలేదా అని నన్ను ప్రశ్నించొద్దుగాని, వాక్యక్రమాన్ని మాత్రమే అనుసరించగలగాలి.

ఏ నామములో బాప్తీస్మం పొందాలి?
నేటి దినాలలో విశ్వాసులను సహితం గందరగోళంలోనికి నెట్టే పరిస్థితి ఏమిటంటే, ఏ నామములో బాప్తీస్మం పొందాలి? ఈ పరిస్థితికి కారణమేమిటంటే, అపొస్తలులందరూ “యేసు నామము” లోనే బాప్తీస్మమిచ్చారు. కాబట్టి, “తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము”లో తీసుకున్న బాప్తిస్మము చెల్లదని, వారంతా తిరిగి, యేసు నామంలోనే బాప్తీస్మం పొందాలని, లేకుంటే పరలోకం చేరరని బోధించే వాక్యవిరుద్ధమైన బోధ విస్తృతంగా వ్యాపిస్తుంది.
యేసు ప్రభువు సిలువవేయబడి, పునరుత్తానమైన తర్వాత, పరలోకమునకు ఆరోహణముకాక మునుపు, శిష్యులకు యిచ్చిన ఆజ్ఞ ఇది. మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. (మత్తయి 28:19,20)
ప్రభువు చెప్పిందేమో “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తీస్మమివ్వమని, అయితే, శిష్యులేమో యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము ప్రకటించారు. యేసు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి ( అపో. కా. 4:7) అంటే, వీరు ప్రభువు ఆజ్ఞను అతిక్రమించి అట్లా చేసారా? కానే కాదు. ఇక్కడ “యేసుక్రీస్తు నామము” అంటే? యేసు క్రీస్తు “అధికారము చొప్పున”, లేదా “ఆజ్ఞ చొప్పున” అని అర్ధం.
ఏది జరిగినా అది యేసుక్రీస్తు నామమునే జరిగింది. యేసుక్రీస్తు నామమున ప్రార్ధన ( యోహాను 16:23) యేసుక్రీస్తు నామమున స్వస్థత (అపో. కా 4:10 ) యేసు క్రీస్తు నామమున పాప క్షమాపణ (అపో. కా 10:43 ) యేసుక్రీస్తు నామమున నిత్యజీవము ( 1యోహాను 5:13) .... అదే సమయంలో యేసుక్రీస్తు నామములో బాప్తీస్మం. యివన్నీ ఆలోచన చెయ్యగలిగితే, యేసుక్రీస్తు నామములో అంటే? యేసు క్రీస్తు అధికారము చొప్పున జరిగాయి అనే విషయం స్పష్టం.
చివరిగా ఒక్కమాట! బాప్తీస్మం యిచ్చేవారికి ప్రభువు యిచ్చిన ఆజ్ఞ ఏదంటే? “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” (మత్తయి 28:19) బాప్తీస్మమివ్వమని, ఇట్లానే బాప్తీస్మం ఇవ్వాలి. యేసు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి ( అపో. కా. 4:7) అనేది బాప్తీస్మము యిచ్చేవారికి ఇవ్వబడిన ఆజ్ఞకాదు. ఈ విషయం ఇంకా సందేహంగా వుంటే? శిష్యులు ఏమి చేశారు అనేదానికంటే, ప్రభువు ఏమి చెప్పారు అనేదానిమీద దృష్టి సారించగలిగితే, మన సందేహానికి తావేవుండదు. వాక్యానుసారముగా మన జీవితాలను సరిచేసుకొంటూ, నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవించెదము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

యేసుకు బాప్తీస్మమెందుకు?
ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.... ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (మత్తయి 3: 1,2, 13-17)

యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు కాబట్టి, ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలోనూ పరిశుద్ధత వుంది. అందుకే, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అంటూ లోకానికి సవాలు విసరాగలిగారు. (యోహాను ) ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చి, పాపుల మధ్యనే జీవించినప్పటికీ పాపమే సోకని పరిశుద్ధుడాయన.
పేతురు చెప్తున్నదేమిటంటే? మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38) పాపమేలేని పరిశుద్ధునికి పాప క్షమాపణ అవసరమయ్యే పనిలేదు. ఇక బాప్తీస్మమూ అవసరం లేదు. అయితే, ప్రభువు ఎందుకు బాప్తీస్మము పొందినట్లు?
🔸యేసు బాప్తీస్మం కొరకు, గలిలయ నుండి యొర్దానుకు ప్రయాణం చేసి వచ్చారు.
🔸యొర్దానులో బాప్తీస్మం పొందారు.
దీనిని బట్టి బాప్తీస్మం ఎంతటి ప్రాముఖ్యమైనదో అర్ధంచేసుకోగలము.
యేసుకు బాప్తీస్మమెందుకు? అనేది మనకెట్లా సందేహం కలిగిందో, అట్లాంటి సందేహమే బాప్తీస్మమిచ్చు యోహానుగారికి కూడా కలిగింది. “యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా?” అంటూ తదేకంగా ప్రభువువైపు చూస్తున్నాడు. ఇట్లాంటి సందర్భములో మన సందేహాన్ని నివృత్తి చేస్తూ ప్రభువిచ్చిన సమాధానం “నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.”
యేసు ఎందుకు బాప్తీస్మం తీసుకున్నారంటే?
🔸మారుమనసు పొంది కాదు
🔸పాప క్షమాపణ కొరకుకాదు
🔸“దేవుని నీతిని నెరవేర్చడం కొరకే”
ఆయనలో పాపం లేకపోయినా పాపాత్ముల స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మన స్థానంలో ఆయన నిలిచారు. మనము వెళ్ళవలసిన మార్గాన్ని, మనము చేయవలసిన విధానాన్ని చూపించారు. మనము జీవించాల్సిన విధానాన్ని ఆయనలో కనపరిచారు. చివరికి మన స్థానంలో మన పాపాలన్నింటిని తనపై వేసుకొని, శ్రమలలోనికి, మరణం లోనికి బాప్తీస్మం పొందారు ( లూకా 12:50) అట్లా మనమందరమూ అనుభవించాల్సిన శిక్ష, మరణము, ఆయనకు దాపురించింది. అంటే, బాప్తీస్మం తీసుకోవడంతో సహా ఆయన చేసినవన్నీ, దేవుని నీతిన్యాయాలను నెరవేర్చడం, ఆయనను ప్రత్యక్ష పరచడం, ఆయనను ఘనపరచడం కోసం మాత్రమే.

యేసు బాప్తీస్మం దేనికి సూచన?
మనుష్యులను నీతిమంతులుగా చేసేందుకు ఆయన అనుభవింపబోయే మరణం, సమాధి, తిరిగి సజీవునిగా లేవడం అనేవాటికి బాప్తీస్మం ఒక సూచన.
దేవుని ఆత్మ పావురమువలె దిగి ప్రభువు మీదికి వచ్చుట:
ప్రభువే దైవత్వం గలిగిన వారైనప్పుడు, ఇక ఆయనకు పరిశుద్ధాత్మతో పనేముంది? పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగిరావలసిన అవసరం ఏముంది? ఆయనలో నివసింపవలసిన అవసరత ఏముంది? అయితే, ఒక్క విషయం! ఆయన పరిపూర్ణుడైన దేవుడు. అదే సమయంలో పరిపూర్ణమైన మానవుడు అనే విషయం మరచిపోకూడదు. ఆయన దైవత్వమునకు పరిశుద్దాత్ముని యొక్క.అవసరతలేదు గాని, ఆయన మానవత్వానికి మాత్రం పరిశుద్దాత్ముని తోడుకావాలి. ప్రభువైన యేసుకే పరిశుద్దత్ముని తోడు అవసరమయ్యింది అంటే? ఇక మన సంగతేమిటి?

ఈయనే నా ప్రియ కుమారుడు: తండ్రియైన దేవుడు ఏ ప్రవక్తనుగాని, ఏ వ్యక్తినిగాని “నా ప్రియకుమారుడు” అని పిలువలేదు. అట్లా పిలువబడే అర్హత ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే వుంది.
యేసు క్రీస్తు బాప్తీస్మము ద్వారా
🔹తండ్రి నీతిని నెరవేర్చారు
🔹పరిశుద్ధాత్మను పొందుకున్నారు
🔹ప్రియకుమారుడు అని సాక్ష్యాన్ని పొంది, తండ్రి ఆనందానికి కారకులయ్యారు.
యేసు క్రీస్తు బాప్తీస్మము ద్వారా
🔹తండ్రి నీతిని నెరవేర్చారు
🔹పరిశుద్ధాత్మను పొందుకున్నారు
🔹ప్రియకుమారుడు అని సాక్ష్యాన్ని పొంది, తండ్రి ఆనందానికి కారకులయ్యారు.
రక్షించబడి, బాప్తీస్మము పొందిన మనము కూడా ఈ మూడు అనుభవాలను పొందగలము. అట్టిరీతిగా జీవించుటకు ప్రయాసపడుదము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
Note: మనము చదివిన లేఖనభాగమును ధ్యానము చెయ్యగలిగితే, త్రిత్వము అనేమాట బైబిల్ లో లేకపోయినప్పటికీ, త్రిత్వము యొక్క భావన మాత్రం ఖచ్చితంగా వుంది. త్రిత్వము అంటే? ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు మాత్రం కాదు. కుమారుడైన యేసు నీటిలోనుండి బయటకి వస్తున్నారు (కుమారుడు) ఆత్మ పావురమువలే దిగివచ్చుట (పరిశుద్ధాత్ముడు) ఈయన నా ప్రియ కుమారుడు అనే స్వరము (తండ్రి) 🔹ఇక్కడ కుమారుడు - తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కాదు. 🔹తండ్రి - కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు 🔹పరిశుద్ధాత్ముడు - తండ్రి కాదు, కుమారుడు కాదు ఈ ముగ్గురూ ఎవరికివారు ప్రత్యేకం. కానీ, ఒకే దేవుడుగా పరిపూర్ణమైన ఐక్యతలో వున్నారు.
బాప్తీస్మము ఎప్పుడు తీసుకోవాలి?
రక్షణ పొందినవారు బాప్తీస్మం తీసుకోవాలి. అయితే, రక్షణ ఎట్లా పొందాలి ?
- వాక్యము వినాలి
- వినిన వాక్యమును విశ్వసించాలి
- పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు పొందాలి
- యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ప్రభువని ఒప్పుకోవాలి.
- రక్షింపబడుటకు బాప్తీస్మము పొందాలి
- ప్రభువు చేత సంఘములో చేర్చబడాలి
1. వాక్యము వినాలి:
ఈలోకంలో లోకసంబంధమైన మాటలకు గంటల తరబడి వెచ్చిస్తాం. ముసలమ్మ ముచ్చట్లతో కాలక్షాపం చేస్తుంటాం. ఎక్కడా దేవుని గురించిన ప్రస్తావన మాత్రం రానియ్యము. వాటిని ఆదివారమునకు మాత్రమే పరిమితం చేసేసినవాళ్లు కోకొల్లలు. అదైనా వాక్యానికి సమయమిచ్చేదే తక్కువ. ఒక్క నిమిషం ఆలస్యమయ్యిందంటే, వాక్యం చెప్పే సేవకుడు ఎదో భయంకరమైన తప్పు చేసేసినట్లు, ఆయన ముఖమొంకా, వాచీ వంక చూసుకోవడమే సరిపోతుంది. కొంతమంది వాచీ ఆయనకు చూపించేవాళ్ళు, మరికొంతమంది ముగించండని పేపర్ మీద వ్రాసి ఆయన టేబుల్ మీద పెట్టేటోళ్లు. మరికొందరైతే ముగించండని నేరుగా చెప్పేసేటోళ్లు. తప్పు వాళ్ళది కాదులెండి, వాక్యం జీవితాలను మార్చేస్తుందని సాతాను భయపడి ఎవరిచేతనో ఇట్లాంటి పనులన్నీ చేపిస్తాడు. వాక్యము అనగా? దేవుని మాటలే. వాటిని నిర్లక్ష్యం చేస్తే, మన జీవితాలకు సార్ధకత లేదు. నిత్య మరణమే శరణ్యమవుతుంది. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. అవి క్రీస్తును గూర్చిన మాటలై ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. (రోమా 10:17) నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను. (యోహాను 5:24) అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను;
(అపొ. కార్యములు 8 : 5-7) సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, “వాటిని విని” యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. (ప్రకటన 1:3)
2. వినిన వాక్యమును విశ్వసించాలి: క్రైస్తవ కుటుంబాలలో పుట్టి, గతించిన 50 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తూ, వాక్యం వింటున్నప్పటికీ, రక్షణ అంటే ఏమిటో కూడా సరియైన అవగాహన లేనివారు కోకొల్లలు. దేవుని మందిరానికి వెళ్లడం అలవాటయ్యింది. దేవుని వాక్యం వినడం అలవాటయ్యింది. విన్న వాక్యాన్ని విడచి పెట్టడంకూడా అలవాటయ్యింది. అందుకే ఆధ్యాత్మిక జీవితాల్లో ఎట్లాంటి ఎదుగుదల లేదు. విన్న వాక్యాన్ని విడచిపెట్టకుండా, విశ్వసించగలిగితే, ఆ విశ్వాసం నిన్ను రక్షించగలుగుతుంది. అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. (అపొ. కార్యములు 16:32) కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. (యోహాను 8:24) విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; (హెబ్రీ 11:6) వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. (రోమా 10:17)
సువార్త ద్వారాలు మూయబడే సమయం ఆసన్నమయింది. అది మన కళ్ళముందే వుంది. ఆమోసు చెప్పిన ప్రవచనం నెరవేరే సమయం ఇంకెంతో దూరంలో లేదు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు; (ఆమోసు 8:11,12) వద్దు ఆ దినాలు ఊహలకే భయంకరం! సమయముండగానే, కృపాకాలం గతించకముందే జీవితాలను సరిచేసుకొని సాగిపోదాం!
పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు పొందాలి
మనిషి జీవితాన్ని మార్చగలిగేది మారుమనస్సు
యేసు ప్రభువు కూడా తన రాజ్య సువార్తను “మారు మనస్సు” ను గురించి చెప్పడముతోనే ప్రారంభించారు:
🔸యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను”. (మత్తయి 4:17)
🔸మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. ( లూకా 5:32)
బాప్తీస్మమిచ్చు యోహానుగారు కూడా మారు మనస్సును గురించే ప్రకటించారు:
🔸ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. (మత్తయి 3:1,2)
అపొస్తలుడైన పేతురు గారు కూడా మారుమనస్సును గురించే ప్రకటించారు:
🔸పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ( అపొ. కార్యములు 2:38)

మారు మనస్సు అంటే?
🔸తప్పును తప్పుగా ఒప్పుకొని బ్రతుకును మార్చుకోవడమే మారుమనస్సు
🔸మనస్సును మార్చుకొనుట
🔸ఉద్దేశ్యాలను మార్చుకొనుట
🔸మార్పునొందుట
🔸తప్పును తప్పుగా ఒప్పుకొని బ్రతుకును మార్చుకోవడమే మారుమనస్సు
🔸మనస్సును మార్చుకొనుట
🔸ఉద్దేశ్యాలను మార్చుకొనుట
🔸మార్పునొందుట
మారు మనస్సు ఎందుకు పొందాలి?
🔸పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందాలి.
🔸రక్షించబడాలంటే మారుమనస్సు పొందాలి. (అపో. కా. 2:38)
🔸అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ: ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
అపొ. కార్యములు 17:30

మారు మనస్సు ఎట్లా పొందగలము?
🔹తాను పాపినని గ్రహించాలి (రోమా 3:23 ; లూకా 5;8)
🔹పాపములు ఒప్పుకొని, విడిచిపెట్టాలి. ( సామెతలు 28:13; 1యోహాను 1:9)
🔹తనను తాను దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. (రోమా 6:13)
మారు మనస్సు అనేది యేసుతో సహవాసం తోనే ఆరంభమవుతుంది. దేవుడు అనుగ్రహిస్తేనే మారుమనస్సు కలుగుతుంది. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? (రోమా 2:4)
పాపముల విషయంలో పశ్చాత్తాపపడాలి:
పాపముల విషయంలో పశ్చాత్తాపపడేటప్పుడు కొందరికి కన్నీళ్లు రావొచ్చు. మరికొందరికి రాకపోవొచ్చు. వారి ఉద్వేగస్థితిపై ఆధారపడి వుండవచ్చు. ఎంత కన్నీరు కార్చావు అనేదానికంటే, ఎంత హృదయభారముతో నీ పాపములను ఒప్పుకున్నావనేది ముఖ్యం.

మారుమనస్సు పొందినట్లు రుజువేమిటి?
🔹గతించిన కాలంలో వ్యభిచారం. నేడు పవిత్ర జీవితం.
🔹గతించిన కాలంలో త్రాగుడు, జూదం. నేడు వాటికి అందనంత దూరం
🔹గతించిన కాలంలో భార్యాభర్తలు తగవులు, నేడు ప్రేమతో కలసి జీవితం
🔹గతించిన కాలంలో కక్షలు, కార్పణ్యాలు, నేడు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు.
🔹గతించిన కాలంలో వారానికి ఒక్కసారే దేవునితో కలిసేది. నేడు ఆయనతోనే సహవాసం.
🔹గతించిన కాలంలో పాపం చేస్తే ఎవరైనా చూస్తారేమోననే భయం. ఇప్పుడైతే పాపం చెయ్యడానికి మనకు మనమే భయపడతాము.
🔹గతించిన కాలంలో మనకు నచ్చినట్లు జీవించాము. నేడు వాక్యానుసారమైన జీవితం.
🔹గతించిన కాలంలో పాపాలను కప్పుకున్నాం. నేడు ఒప్పుకున్నాం.
🔹గతించిన కాలంలో నటించాం. నేడు దేవుని కోసం జీవిస్తాం.
ప్రియ నేస్తమా! మారు మనస్సు పొందిన అనుభవం నీకుందా? మారు మనస్సు లేకుండా, రక్షణ లేదు. రక్షణ లేకుండా నిత్య జీవం లేదు. నేడైనా మార్పునొంది, ప్రభువును చేర్చుకో. నీ జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🔹గతించిన కాలంలో వ్యభిచారం. నేడు పవిత్ర జీవితం.
🔹గతించిన కాలంలో త్రాగుడు, జూదం. నేడు వాటికి అందనంత దూరం
🔹గతించిన కాలంలో భార్యాభర్తలు తగవులు, నేడు ప్రేమతో కలసి జీవితం
🔹గతించిన కాలంలో కక్షలు, కార్పణ్యాలు, నేడు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు.
🔹గతించిన కాలంలో వారానికి ఒక్కసారే దేవునితో కలిసేది. నేడు ఆయనతోనే సహవాసం.
🔹గతించిన కాలంలో పాపం చేస్తే ఎవరైనా చూస్తారేమోననే భయం. ఇప్పుడైతే పాపం చెయ్యడానికి మనకు మనమే భయపడతాము.
🔹గతించిన కాలంలో మనకు నచ్చినట్లు జీవించాము. నేడు వాక్యానుసారమైన జీవితం.
🔹గతించిన కాలంలో పాపాలను కప్పుకున్నాం. నేడు ఒప్పుకున్నాం.
🔹గతించిన కాలంలో నటించాం. నేడు దేవుని కోసం జీవిస్తాం.
ప్రియ నేస్తమా! మారు మనస్సు పొందిన అనుభవం నీకుందా? మారు మనస్సు లేకుండా, రక్షణ లేదు. రక్షణ లేకుండా నిత్య జీవం లేదు. నేడైనా మార్పునొంది, ప్రభువును చేర్చుకో. నీ జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ప్రభువని ఒప్పుకోవాలి
రక్షింపబడాలి అంటే? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:9,10
రక్షించబడాలి అంటే, హృదయమందు విశ్వసించి, విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకుంటే చాలు. హృదయమందు విశ్వసించినదానిని నోటితో ఒప్పుకోవాలి. కొంతమంది హృదయమందు విశ్వసిస్తారుగాని నోటితో ఒప్పుకోరు. కొంతమంది నోటితో డంబాలు పలుకుతారుగాని, హృదయమందు విశ్వసించరు. అట్లాకాకుండా రెండూ జరిగితేనే రక్షించబడతాము.
ఏమని విశ్వసించాలి? నేను పాపినని, కోడెల, మేకల, గొర్రెల రక్తము నా పాపమును పరిహరించలేనపుడు, నిత్యమరణమే శరణ్యమైనప్పుడు, ప్రభువైన యేసు శరీరధారిగా నా కొరకు ఈలోకానికి వచ్చి, నేను పొందాల్సిన శిక్షను నాకు బదులుగా ఆయన అనుభవించి, సిలువ వేయబడి, మరణించి, సమాధిచేయబడి, మరణపు ముల్లును విరచి మృతులలోనుండి మృత్యుంజయుడై మూడవదినాన్న లేచారని, ఆయన ఎట్లా మృతులలోనుండి లేచెనో, మనలను కూడా అట్టిరీతిగానే ఒకదినాన్న లేపబోతున్నారనే విషయాన్ని హృదయమందు విశ్వసించాలి. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము, మన ప్రతీపాపము నుండి మనలను పావన పరిచిందని విశ్వసించాలి. విశ్వసించిన దానినే బహిరంగంగా నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి మనము సిగ్గుపడితే, ప్రభువు కూడా తండ్రి యెదుట మనలను ఒప్పుకోరు. అనేకులు హృదయమందు విశ్వసిస్తారుగాని, నోటితో ప్రభువును ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. నా జీవితాన్ని ప్రభువు రక్షించారు. ఆయన కోసం జీవిస్తాను. ఆయనే నా హృదయ రారాజు అని ధైర్యముగా చెప్పలేరు.
- నోటితో ఒప్పుకోవాలి
- హృదయమందు విశ్వసించాలి.
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. (రోమా 10: 9,10) హృదయానికి, నోటికి చాలా దగ్గర సంబంధముంది. హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. ( మత్తయి 12:34) హృదయము నిండిన దానినిబట్టే నోరు మాట్లాడితే, అది ఏక భావన లేదా నిష్కపటమైనది అని చెప్పొచ్చు. హృదయంలో ఒకటి, నోటితో మాట్లాడేది మరొకటి అయితే, అది కపటమైనది, వేషధారణతో నిండినది .
నోటితో ఒప్పుకోవాలి: ఏమని ఒప్పుకోవాలి? యేసే ప్రభువని ఒప్పుకోవాలి. అట్లా అని అనేకమంది ప్రభువులలో ఆయన ఒకరు అనికాదు. ఉన్న ఒకే ఒక్క ప్రభువు ఆయనే.
🔸ప్రభువు ఒక్కడే ( ఎఫెసీ 4:5)
🔸మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. (అపొ. కా 2:36)
🔸మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. ( 1 కొరింథీ 8:6)
హృదయములోనున్న నమ్మకమే క్రీస్తును నోటితో ఒప్పుకొనేలా చేస్తుంది. ఒక విశ్వాసి “యేసే ప్రభువని” చెప్పడం యేసును అతడు తన జీవితానికి ప్రభువుగా స్వీకరించి, ఆయనకు చిత్తానికి లోబడడానికి అంగీకరించినట్లు.
🔸ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ( మత్తయి 7:21)
🔸కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. (యోహాను 3:36)
హృదయమందు విశ్వసించాలి:
యేసు శారీరికంగా మరణమునుండి సజీవంగా లేచాడని హృదయమందు విశ్వసించడం రక్షణకు అత్యంత ప్రాముఖ్యం.
🔸 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. (1 కొరింథీ 15:3,4)
🔸మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ( అపొ. కార్యములు 2:24)
🔸మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. (రోమా 4:24,25)
మనము యేసే ప్రభువని మనుష్యుల దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడితే, తండ్రి దగ్గర కూడా ప్రభువు మన విషయంలో అదే చేస్తారు. అదే జరిగితే? అది అత్యంత భయంకరం. యేసే ప్రభువు అని ఒప్పుకోవడానికి నీకంటూ ఏది ఆటంకం కాకూడదు. కుల మతాలు గాని, ఇంట్లోనున్న పరిస్థితులు గాని, బయటనున్న పరిస్థితులుగాని, నీ ఉద్యోగపరంగానున్న పరిస్థితులుగాని ఏవీకూడా నీకు ఆటంకంగా మారకూడదు. కొందరైతే, హైందవ సహోదరులతో కలసి భోజనం చెయ్యాల్సివచ్చినప్పుడు, ప్రార్ధించడానికి సిగ్గుపడి, ప్రార్ధించకుండానే చేసేవాళ్ళు అనేకులు. బైబిల్ చేతిలో వుంటే సిగ్గని, సెల్ ఫోన్ తో నీవు వెళ్తున్నావా? నీతోటి మనిషిదగ్గరే నీవు సిగ్గుపడే పరిస్థితి అయితే, ప్రభువు నీ విషయంలో సిగ్గుపడరు అనుకొంటున్నావా? మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. (గలతీ 6:7)
🔸మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును. మత్తయి 10:32,33
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయనయందే జీవము.
🔸యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యోహాను 20:31
ఆయన ప్రభువుని హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకోవడమే కాకుండా, మనలను మనమే ఆయన ప్రభుత్వానికి అప్పగించుకోవాలి. ఆయనే మన హృదయ రారాజుగా వుండాలి. ఆయన రాజ్యాధికారంలో మనముండాలి. హేరోదు తన జీవితంలో మరొక రాజును అంగీకరించలేకపోయాడు. తన హృదయంలో ప్రభువుకు స్థానమివ్వలేకపోయాడు. నేనే రాజునంటూ తన రాజ్యాధికారాన్నంతా వినియోగించాడు. ఏమి చేయగలిగాడు? శాపగ్రస్తుడుగా, చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. మన హృదయంలోకూడా ప్రభువుకు స్థానం లేకుండా నచ్చినట్లుగా జీవిస్తే, ఒక హేరోదులా మిగిలిపోవలసి వస్తుందేమో? అది ఊహలకే భయంకరం.
వాక్యము విని, విశ్వసించి, పాపముల విషయంలో పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది, యేసే ప్రభువుగా నీ జీవితంలో ఒప్పుకొని, రక్షించబడగలిగితే నీ జీవితం ధన్యమైనది. లేకుంటే, నేడైనా నీ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించు. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
రక్షింపబడుటకు బాప్తీస్మము పొందాలి:
దేవుని కృపను ఆశ్రయించి, ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా రక్షించబడుదుము. అనే విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే, రక్షణ, పాపక్షమాపణ “బాప్తీస్మము ద్వారా” కలుగును అనే విషయాన్ని కొన్ని లేఖనభాగములు తెలియజేస్తున్నాయి
🔸నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. (మార్కు 16:16)
🔸మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
🔸నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
అపొ. కార్యములు 22:16
సంఘ సభ్యులు (లేదా) విశ్వాసులు అంటే ఎవరు?
దేవుని మందిరానికి వెళ్లేవారంతా సంఘ సభ్యులు కాదుగాని, రక్షించబడి, బాప్తీస్మము పొందినవారే ఆత్మీయ సంఘములో సభ్యులవుతారు.
విశ్వాసుల ప్రధాన విధులు:
🔸అపొస్తలుల బోధ
🔸సహవాసము
🔸రొట్టె విరుచుట
🔸ప్రార్థన
ఈ విషయాలలో యెడతెగక అంటే, క్రమముగా ఉండాలి.
అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
అపొ. కార్యములు 2:42
అపొస్తలుల బోధ:
ఇది యేసు ప్రభువు అపొస్తలులకు అప్పగించిన బోధ. నూతన నిబంధనా గ్రంధమంతా దానితో నిండియున్నది.
యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి 28:18-20) నేటి దినాల్లో దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.* అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)
🔹 బేయిజం
🔹 యెహోవా సాక్షులు
🔹 మొర్మాన్స్
🔹 బ్రెన్హ మైట్స్
🔹 జాంగిల్ జా (పరలోకపు తల్లి)
🔹 సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
🔹 సున్నతి లేకుండా గమ్యం లేదు.
🔹 శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.
విశ్వాసులు వీరివలలో చిక్కకుండా, అపొస్తలుల బోధకు కట్టుబడి జీవించగలగాలి.
సహవాసము:
సహవాసము అంటే? మనసులో, హృదయంలో నున్నవాటిని ఇతరులకు తెలియజేసి, వారితో సేవలో, కష్టాలలో, సంతోషములో పాలుపంచుకోవడం (రోమా 12: 15,16)
🔸క్రీస్తుతోనూ, ఆయన ప్రజలతోనూ సహవాసం కలిగియుండాలి. ( 1కొరింథీ 1:9; ఫిలిప్పి 2:1; 3:10; 1యోహాను 1:3,6,7 )
🔸క్రీస్తువలే ప్రేమించడం (యోహాను 13:34)
🔸క్రీస్తును గురించి తెలియజేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడం ( ఎఫెసు 5:19)
రొట్టె విరచుట:
ఆదిమ అపొస్తలులు, ప్రతీదినమూ ఇంటింట రొట్టెవిరిచారు. తర్వాత కాలంలో ప్రతీ ఆదివారము అనగా, పునరుత్తాన దినాన్న రొట్టె విరచినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇదే విధానమును కొనసాగించుట మన ఆధ్యాత్మిక జీవితాలకు అత్యంత శ్రేయస్కరం. 1 కొరింథీ 11: 17-26 వరకు వ్రాయబడిన లేఖన భాగములో ఏరీతిగా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో స్పష్టముగా వ్రాయబడి వుంది. రక్షించబడి, బాప్తీస్మం పొందిననీవు రొట్టెవిరవడానికి దూరమవుతున్నావంటే, ఇంకా పాపములోనే నిలచియున్నావేమో? అట్లా అని, రొట్టె విరవకపోతే, నేనేదో పాపం చేస్తున్నానని ప్రక్కవారు అనుకుంటారని విరిచే ప్రయత్నం చెయ్యనేవద్దు. నీ జీవితాన్ని సరిచేసుకొని, ప్రభువురాత్రి భోజనంచెయ్యి.
ప్రార్ధన:
ప్రార్ధన గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రార్థనకు మించినది మరొకటిలేదు.
ప్రార్థన అంటే?
🔹 ప్రార్థనా సమయం దేవుని సహాయమును అభ్యర్దించే సమయం
🔹ప్రార్ధనా సమయం దేవునితో సంభాషించే సమయం.
🔹ప్రార్ధన మనము మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే సమయం.
🔹 ప్రార్ధన దేవుని కృపను బట్టి ఆయనను స్తుతించే సమయం
🔹ప్రార్ధన అంటే ఆయన ఏమైయున్నాడో? గుర్తెరిగి ఆరాధించే సమయం.
🔹మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయం.
🔹ప్రార్ధన దేవుని మార్గ దర్శకత్వం కోసం ఎదురు చూచే సమయం.
🔹ప్రార్ధన మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగే సమయం.
🔹ప్రార్ధన మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం.
🔹ప్రార్ధన ఇతరుల అక్కరుల నిమిత్తం విజ్ఞాపన చేసే సమయం.
🔹ప్రార్ధన దేవునితో నిబంధన చేసే సమయం.
🔹ప్రార్ధన దేవుని చిత్తం కోసం ఎదురు చూచే సమయం.
🔹ప్రార్ధన దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం.
🔹సాతాను వాడిగల బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందే సమయం.
ప్రార్ధనా విజయాలు:
🔸 ప్రార్ధన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది.
🔸ప్రార్ధన జ్ఞానమునిచ్చి, దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని నెలకొల్పుతుంది.
🔸పాపపు బంధకాలనుండి విడిపిస్తుంది.
🔸శత్రువులను సహితం మిత్రులునుగా చేస్తుంది.
🔸బలహీనులకు బలాన్నిస్తుంది.
🔸నెమ్మది లేనివారికి, నెమ్మది నిస్తుంది.
🔸కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది.
🔸సింహాల నోళ్లను మూయిస్తుంది.
🔸అగ్ని గుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది
🔸సృష్టిని సహితం శాశించ గలుగుతుంది.
🔸సంకెళ్లను తెంపేస్తుంది.
🔸చట్టాలను మార్చేస్తుంది.
🔸ప్రశ్నకు సమాధానమవుతుంది.
🔸సమస్యకు పరిష్కారాన్నిస్తుంది.
🔸కన్నీటి ప్రార్ధన కన్నీటిని తుడిచేస్తుంది.
🔸పాపపు గోడలను పగలగొడుతుంది.
🔸పరిశుద్ధత లోనికి నడిపిస్తుంది.
🔸నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ప్రార్ధన' పాపం చెయ్యకుండా ఆపుతుంది. అట్లానే, 'పాపం' ప్రార్ధన చెయ్యకుండా ఆపుతుంది. _ జాన్ బన్యన్
అందుచే, పాపానికి దూరంగా వుంటూ "ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి." (కొలస్సి 4:2), యెడతెగక ప్రార్థనచేయుడి; (1థెస్స 5:15) ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
పరిశుద్ధాత్మ బాప్తీస్మం
పరిశుద్ధాత్మ బాప్తీస్మం అనగా? పరిశుద్ధాత్మ నింపుదల
🔹కేవలం అన్య భాషలు మాట్లాడేవారు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందినట్లు కాదు.
🔹కేవలం నీటి బాప్తీస్మం పొందినవారే, పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందుతారు అనే నిబంధన ఏదిలేదు.
🔹పరిశుద్ధాత్మ బాప్తీస్మం లేదా పరిశుద్ధాత్మ నింపుదల అనేది అదొక ఉన్నతమైన అనుభవం.
"మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందెదరు" (అపొ. కా 1:5) “మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందెదరు" అని బాప్తీస్మము ఇచ్చు యోహాను చెప్పినప్పుడు భూలోక రాజ్యము అని వారు అనుకొన్నారు. పాతనిబంధనలో యున్న వ్యక్తి ఎల్లప్పుడూ భూసంబంధమైన విషయముల మీదనే తన మనస్సును ఉంచును. అనేకమంది క్రైస్తవులు కూడా దేవుడు మమ్మును ఎంతో ఆశీర్వదించాడు అని చెప్పునప్పుడు వారి ఉద్దేశ్యము ఈ లోకరీతిగా డబ్బు విషయములోను, ఉద్యోగము విషయంలోను, ఇంటి విషయంలోను వారిని దేవుడు ఆశీర్వదించాడు. నీ ఆలోచన కూడా ఆ విధముగా ఉన్నట్లయితే, నీవు పాతనిబంధన క్రైస్తవుడవే. భూసంబంధమైన ఆశీర్వాదమే దేవుని ఆశీర్వాదానికి గుర్తు అయితే, ఈ లోకంలో నీ కంటే ఉన్నతమైన నాస్థికులు నీ కంటే ఎక్కువగా ఆశీర్వదించబడియున్నారని అర్ధము, కాబట్టి అది బుద్ధిహీనమైన ఆలోచన. క్రీస్తువలె అంతకంతకూ రూపాంతరము పొందుటయే క్రొత్తనిబంధన ఆశీర్వాదానికి గుర్తు.
పెంతెకొస్తు రోజుకు ముందు వరకు అపొస్తలులు భూసంబంధమైన మనస్సు కలిగియున్నారు. కాబట్టి వారు త్వరలో పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుతారని ప్రభువు వారితో చెప్పినప్పుడు, వారు వెంటనే భూలోకరాజ్యము పొందుతామని అనుకొన్నారు. కాబట్టి వారు ఈ విధముగా ప్రశ్నించారు, "ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?" (అపొ.కా. 1:6). ప్రభువు ఇట్లన్నారు, "కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పని కాదు" (అపొ.కా. 1:7). అనేకమంది కాలములను, సమయములను తెలుసుకొనుటకు ప్రకటన గ్రంథాన్ని పరిశోధిస్తారు. ప్రభువైనయేసు మరలా ఎప్పుడు వస్తాడో అనియు, తన రాజ్యమును ఎప్పుడు స్థాపిస్తాడో అనియు తెలుసుకొనుట మన పనికాదు. కాని పరిశుద్ధాత్మ శక్తిని అనుభవపూర్వకముగా యెరిగియుండాలి.
పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందియున్నామనుటకు ముఖ్యమైన గుర్తు ఏమిటి?
“పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు.” (అపొ.కా. 1:8) అది దేవునియొక్క శక్తి అని ప్రభువైన యేసు స్పష్టముగా చెప్పియున్నారు.
పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందియున్నామని అనుకొనుటకు గుర్తు?
🔹భాషలు మాట్లాడుట ఒక గుర్తు అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు.
🔹అపొస్తలులు కూడా దీనిని గూర్చి ఏమి చెప్పలేదు.
🔹బైబిలులో ఒక్క వచనము కూడా చెప్పనప్పటికిని తెలియని అన్యభాషలలో మాట్లాడుట మొదట ఋజువు అని అనేకమంది క్రైస్తవులు చెప్పుచున్నారు.
అపొ.కా 19:1లో ఎఫెసీలోని కొందరు శిష్యులను పౌలు ఈ విధముగా అడిగాడు, "మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?" పౌలు యొక్క ప్రశ్న ఒక విషయాన్ని స్పష్టముగా చెప్పుచున్నది.
🔸1. మనము క్రీస్తులో విశ్వాసముంచిన సమయములోనే పరిశుద్ధాత్మను పొందుకొనవచ్చును.
🔸2. ప్రభువైనయేసులో విశ్వాసము ఉంచినప్పటికిని పరిశుద్ధాత్మను పొందకపోవచ్చును అనగా ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించలేదు.
🔸3. పరిశుద్ధాత్మను పొందియున్నామా లేక లేదా అని నిశ్చయముగా తెలుసుకొనవచ్చును.
పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మేము వినలేదని వారు చెప్పారు. అలాగయితే మీరు దేనిని బట్టి బాప్తీస్మము పొందారని వారిని అడిగెను. ప్రభువైనయేసు క్రీస్తు నామములో కాదుగాని తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్క నామములో అప్పటి క్రైస్తవులు బాప్తీస్మము పొందియున్నారని ఇది తెలుపుచున్నది.
ఆవిధముగా వారు బాప్తీస్మము పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మను గురించి విని ఉంటారని పౌలు అనుకొనియున్నాడు. అయితే వారు యోహాను బాప్తీస్మము బట్టియే బాప్తీస్మము పొందియున్నామని చెప్పారు. అప్పుడు తండ్రియొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములో పౌలు వారికి బాప్తీస్మము ఇచ్చాడు. తరువాత పౌలు వారిమీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటను ప్రవచించుటను మొదలుపెట్టిరి.
అపొస్తలుల కార్యములలో పరిశుద్ధాత్మ చేసే అనేక కార్యములను గమనించండి.
🔹2వ అధ్యాయములో 120 మంది ప్రార్ధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద క్రుమ్మరించబడ్డాడు.
🔹8వ అధ్యాయములో పేతురు మరియు యోహానులు వారి మీద చేతులుంచగా సమరీయులు పరిశుద్ధాత్మను పొందియున్నారు.
🔹9వ అధ్యాయములో అననీయ తన మీద చేతులుంచగా పౌలు పరిశుద్ధాత్మను పొందియున్నాడు.
🔹10వ అధ్యాయములో నీటి బాప్తీస్మము తీసుకొనకముందే, అతని మీద ఎవరి చేతులైననూ ఉంచకముందే, వాక్యము వినుచుండగానే కొర్నేలీ పరిశుద్ధాత్మను పొందియున్నాడు.
🔹19వ అధ్యాయములో వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందియున్నారు.
కాబట్టి నీటి బాప్తీస్మము పొందకముందుగానే చేతులు వారిమీద ఉంచబడినప్పుడు లేక చేతులు వారి మీద ఉంచకపోయిననూ పరిశుద్ధాత్మను పొందవచ్చునని ఇది బోధిస్తుంది. పద్ధతి ముఖ్యము కాదు అనుభవము ముఖ్యమైయున్నది. అట్టి అనుభవాన్ని కలిగియుండుటకు ప్రయాసపడుదము. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
బాప్తీస్మము అవసరమా?
దేవుని కృపను ఆశ్రయించి, ఆయనను విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణ, బాప్తీస్మం అంత ప్రాధాన్యమైన విషయం కాదని, బాప్తీస్మం లేకుండానే సిలువలో దొంగ పరదైసులో ప్రవేశించాడని, ఇట్లాంటి సాకులు చెబుతూ వారి హృదయాలను కఠిన పరుచుకొనేవారు లేకపోలేదు. నిజంగా ప్రాధాన్యత లేకుంటే, ప్రభువే బాపీస్మం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? కేవలం బాప్తీసము పొందడాన్ని ఆయన గలిలయ నుండి యొర్దానుకు వచ్చారు. యేసు ప్రభువు శరీరధారిగా నున్నప్పుడు జరిగిన ఈ సంఘటన బాప్తీస్మము యొక్క ప్రాధాన్యతను స్పష్టముగా తెలియజేస్తుంది.
ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను..... ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (మత్తయి 3 : 1,2, 13-17) యేసు ప్రభువు జన్మలో పరిశుద్ధత వుంది. జీవితంలో పరిశుద్ధత వుంది. ఆయన దైవ కుమారుడు. అయితే, యేసు ప్రభువు శరీరధారిగా తన ముప్పయ్యవ యేట, బాప్తీస్మము పొందు దినమువరకు, అనగా గతించిన ముప్పది సంవత్సరాల కాలంలో తండ్రి, ఆయనను తన ప్రియ కుమారుడని, ఆయనయందు నేను ఆనందిస్తున్నాననిగాని ఎప్పుడూ చెప్పలేదు.
అయితే,
🔸యేసు బాప్తీస్మము పొందిన తర్వాత
🔸దేవుని ఆత్మ ఆయన మీదికి దిగివచ్చిన తరువాత
అప్పుడు తండ్రి,
🔸యేసును తన ప్రియకుమారునిగా అంగీకరిస్తున్నారు.
🔸తన కుమారునియందు ఆనందిస్తున్నారు.
ఈ సంఘటనను మనస్సు పెట్టి ధ్యానించగలిగితే, తండ్రి శరీరధారిగానున్న తన కుమారునికి సహితం, బాప్తీస్మం లేకుండా, ఆత్మ నింపుదల లేకుండా, ఆయనను తన ప్రియకుమారునిగా సాక్ష్యామీయలేదు, ఆయనయందు ఆనందించనూలేదు. అట్లాంటప్పుడు మనమెంత? బాప్తీస్మం లేకుండా, ఆత్మ నింపుదల లేకుండా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము అంగీకరించబడతామా? ఆయన మనయందు ఆనందిస్తారా? అది సాధ్యం కానేకాదు. రక్షించబడిన మనకు బాప్తీస్మము, పరిశుద్ధాత్మ నింపుదల తప్పనిసరి.
బాప్తీస్మము పొందినవెంటనే పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుందా?
వాక్యమువిని, విశ్వసించి, తన పాపముల నిమిత్తము ప్రభువు సన్నిధిలో రోధించి, పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది, బాప్తీస్మం పొందినవారిలో మాత్రమే పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుంది. అంతేకాని, బాప్తీస్మము పొందిన వారందరిలో జరుగదు.
ఎందుకు ఈమాటలు చెప్పవలసి వస్తుందంటే?
🔹పెళ్లి కొరకు బాప్తీస్మం
🔹సంఘ సభ్యత్వం కొరకు
🔹సమాధుల దొడ్డెలో స్థలం కోసం
🔹ఇల్లు, మరుగుదొడ్లు, డబ్బులు, నీటి పంపుల కోసం
🔹బాప్తీస్మం తీసుకోకపోతే ఎదో పాపములోనున్నాను అని అనుకొంటారని
🔹ఇంట్లోవారిని, పొరుగువారికి మెప్పించడం కోసం
🔹క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి, ఎవరైనా అడిగితే బాగోదని
🔹పెద్ద పాస్టర్ గారి ద్వారా బాప్తీస్మం తీసుకొనే అవకాశం వచ్చింది, తర్వాత అవకాశం రాదనీ
🔹 జీవితాంతం బాగా గుర్తుండే డేట్ వచ్చిందని
🔹రక్షణ లేకపోయినా, యొర్దానులో తీసుకొనే అవకాశం వచ్చిందని
🔹సంఘాలలో పెత్తనం చెయ్యడం కోసం
🔹 ముందే బాప్తీస్మం తీసేసుకుంటే, జరగకూడనిది ఏదైనా జరిగితే, చివరి క్షణంలో క్షమాపణ అడిగి పరలోకంలో అడుగు పెట్టొచ్చని.
ఈ రీతిగా తలంచి, పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడకుండా తీసుకొనే బాప్తీస్మములు గాని, వాక్య విరుద్ధమైన విధానాలను అనుసరిస్తూ పొందే బాప్తీస్మములు గాని. అవి “నీటి మునకలే” తప్ప బాప్తీస్మములు కావు.
బాప్తీస్మము పట్ల ఎట్లాంటి వైఖరిని నీవు కలిగియున్నావో నాకు తెలియదు గాని, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. (మార్కు 16:16) ఇట్టి అనుభవాన్ని మనము కలిగియుండాలి. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ప్రియ సేవకుడా! మీకు చెప్పేటంతటివాడిని నేను కాదుగాని, అయినా నాదొక చిన్న విన్నపం! యింతమందికి నా చేతుల మీదుగా బాప్తీస్మమిచ్చాను అని చెప్పుకోవడం కోసం, రక్షణ అంటే ఏమిటో కూడా తెలియని వారికి సహితం బాప్తీస్మములిచ్చి, ఆ పాపములో నీవు పాలిభాగస్తుడవు కావొద్దు. నీ లిస్ట్ ను చూచి ప్రభువు మెచ్చరుగాని, ఆయన ఉగ్రతకు గురికావలసివస్తుందేమో యోచించుకో! అట్లాకాకుండా, వాక్యము ప్రకటించి, ఒక వ్యక్తిని వాక్యానుసారముగా ఆత్మీయ సంఘములో చేర్చినవాడవు నీవైతే, నీ జీవితం ధన్యమైనది. ప్రభువు అనుగ్రహించే ఆ మహిమ కిరీటాన్ని తప్పకపొందెదవు. ఆమెన్!
బాప్తీస్మం ఎందుకు తీసుకోవాలి?
బాప్తీస్మము గురించి అనేకులలో ఒక సంకుచిత భావముంది. అది మనము పొందుకున్న రక్షణను, బహిరంగముగా తెలియజేసే కార్యక్రమము తప్ప, అదేమీ అంత ప్రాముఖ్యమైన విషయం కాదనే చులకన భావముతో, బాప్తీస్మమును నిర్లక్ష్యం చేసేవారు అనేకులుగానున్నారు. అయితే, బాప్తీస్మము పొందడము ద్వారా మనము పొందుకొనే ఆత్మీయమైన ప్రయోజనాలను గురించి లేఖనముల వెలుగులో పరిశీలన చెయ్యగలిగితే, ఆధ్యాత్మిక జీవితంలో బాప్తీస్మం యొక్క ప్రాధాన్యత ఎట్టిదో మనకు అర్ధమవుతుంది.
1️ యేసు బాప్తీస్మం పొంది, మనకు మాదిరిగా వుంచారు.
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; (మత్తయి 3:16)
2️ ప్రభువుచే నియమించబడినది:
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు (మత్తయి 28:19)
3️ బాప్తీస్మము ద్వారా పాపక్షమాపణ
అననీయ, సౌలుతో చెప్తున్నమాట నీ పాపములు కడుగుకొనుటకు, లేదా నీ పాప క్షమాపణ కొరకు బాప్తీస్మము తీసుకో.
నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను. (అపొ. కా 22:16) పేతురు కూడా ఇదే విషయాన్ని స్పష్టముగా తెలియజేస్తున్నారు. మారుమనస్సు పొందిన మీరు, మీ పాపములు క్షమించబడుట కొరకు బాప్తీస్మముపొందుడి. పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. (అపొ. కా 2:38)
4️ బాప్తీస్మము ద్వారా రక్షణ:
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; (మార్కు 16:16)
5️ బాప్తీస్మము ద్వారా యేసు క్రీస్తు శిష్యులుగా చేయబడతారు.
యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. (మత్తయి 28:18-20)
6️ బాప్తీస్మము ద్వారా నూతన జన్మ:
యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 3:5)
7️ బాప్తీస్మము ద్వారా క్రీస్తును ధరించుకుంటారు:
క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. (గలతీ 3:27)
8️ బాప్తీస్మముద్వారా నిర్మలమైన మనస్సాక్షిని పొందుతారు:
దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. (1 పేతురు 3:21)
9️ బాప్తీస్మము ద్వారా సంఘములో చేర్చబడతారు:
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను. (అపొ. కా 2:47) బాప్తీస్మం విషయంలో ప్రభువే మాదిరి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది, పాప క్షమాపణ, రక్షణ, నూతన జన్మ, క్రీస్తును ధరించుకొనే అనుభవం, ఇట్లాంటి బాప్తీస్మమును నిర్లక్ష్యం చెయ్యడం, నిర్లక్ష్యం గా తీసుకోవడం మన ఆధ్యాత్మిక జీవితాలకు శ్రేయస్కరమా? సరిచేసుకొని, వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం! ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
బాప్తీస్మము పొందాలనుకొనేవారికి వెంటనే యివ్వాలా? వేచి చూడాలా?
పాప క్షమాపణ నొంది, మారు మనస్సు పొందిన వెంటనే బాప్తీస్మము ఇవ్వాలి అనే విషయం లేఖనాలు చెప్తున్నాయి. అయితే కొంతమంది సేవకులు, బాప్తీస్మమివ్వడానికి వేచిచూచే ధోరణిని అవలంభిస్తారు. అదికూడా ఆధ్యాత్మిక స్థిరత్వానికి, సమంజసమే అనిపిస్తుంది.
బాప్తీస్మము తక్షణమే యివ్వాలి: ఏరోజైతే ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి, పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి, నూతన జీవితాన్ని ఆరంభించాలని తలంచుతాడో ఆ దినమే బాప్తీస్మం తీసుకోవచ్చు.
అననీయ సౌలుతో చెప్తున్నమాటలు: నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను. అపొ. కా 22:16
నపుంసకుడు బాప్తీస్మము పొందిన సందర్భము: ( (త్రోవను వెళ్లుచుండగా)
వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. (అపొ. కార్యములు 8 : 36-38)
చెరసాల నాయకుడు బాప్తీస్మము పొందుట: (అర్ధరాత్రి)
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. (అపొ. కార్యములు 16:33)
పేతురు ప్రసంగించగా సంఘములో చేర్చబడుట
అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. అపొ. కార్యములు 2:41
సంఘ ఆవిర్భావ దినాలయందు, ఉజ్జీవం ఆరీతిగానే రగిలింది. ప్రభువుకొరకు ప్రాణాలను అర్పించడానికి సహితం సిద్ధపడేవారు. రక్షించబడినవారే బాప్తీస్మం తీసుకొనేవారు. కానీ నేటి దినాన్న, బాప్తీస్మం తీసుకోవడానికి వంద కారణాలు అన్నట్లుగా వుంది. అసలైన విశ్వాసం మాత్రం లోపించింది.
వేచిచూచుట ఎందుకు?
అనేకమైన సంఘాలలో ఎప్పుడు బాప్తీస్మం పొందాలనుకొంటే అప్పుడు యివ్వరు. దానికిగల కారణమేమిటి?
కొన్ని సమయాల్లో వినే ప్రసంగాలు అనేకులను పశ్చాత్తాపములోనికి నడిపిస్తాయి. అది ఉద్రేకమే తప్ప, ఉజ్జీవము కాదు. ఉద్రేకము వెంటనే చల్లారిపోతుంది. ఉజ్జీవము స్థిరముగా ఉంటుంది. ఉద్రేకంతో తీసుకొనే తీర్మానాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనం కాదు. వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎవరు ప్రసంగం చేసినా, పశ్చాత్తాపపడుతూ, ఆ దినమే రక్షించబడినవారిలా ప్రతీ ఒక్కరి ప్రసంగానికి చేతులెత్తుతుంటారు. కారణం? వీరికి రక్షణ నిశ్చయత ఉండదు.
అందుకే, ఎవరైనా రక్షించబడ్డాము మాకు బాప్తీస్మం యివ్వండని వారి సేవకుని అడిగితే, ఆయన వెంటనే తొందరపడకుండా, కొన్ని దినాలు వేచిచూస్తూ, వారు క్రమమైన రీతిలో ఆరాధనకు హాజరుగుచున్నారా? మారుమనస్సు పొందిన జీవితం వారి క్రియల్లో కనబడుతుందా? వారు తీసుకున్న తీర్మానం ఉద్రేకంలో తీసుకున్నదా? లేక ఉజ్జీవింపబడి తీసుకున్నదా? అట్లాంటి విషయాలన్నీ పరిశీలన చేసి, వారికి కొన్ని ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి, రక్షణ, బాప్తీస్మం తర్వాత వారి ఆత్మీయ జీవితం ఏరీతిగా ఉండాలి అనే విషయాలు వారికి బోధించి, విశ్వాసములోవారు స్థిరులుగా ఉండగలరు అనుకున్నప్పుడు వారికి బాప్తీస్మము యిస్తూ వుంటారు. ఇది చాలా మంచి విధానమే. ఆదివారం బాప్తీస్మం తీసుకొని, సోమవారం బ్రాందీషాపులో కనబడి దేవుని నామమునకు అవమానము, వారి పాపమును రెట్టింపు చేసుకోనేకంటే, వేచిచూచి, మరింత ఆధ్యాత్మికంగా ప్రభువులోనికి నడిపించి, బాప్తీస్మము ద్వారా సంఘములో చేర్చబడడం మంచి విధానం. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
బాప్తీస్మం పొందిన నీవు ప్రభువు రాత్రి భోజనం చెయ్యవెందుకు?
కొన్ని సంఘాలలో ప్రతీ ఆదివారము, కొన్ని సంఘాలలో నెలకు ఒక్కసారి మాత్రమే, మరికొన్ని సంఘాలలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రభువురాత్రి భోజనం చేస్తున్నారు. వారు చెప్పే కారణాలు ఏవైనప్పటికీ, యెడతెగక అంటే క్రమముగా, ప్రతీ ఆదివారం ప్రభువు రాత్రి భోజనం చెయ్యడం మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరం.
బాప్తీస్మం పొందినవారంతా ఆత్మీయ సంఘములో సభ్యులు. వారు ప్రభువు రాత్రి భోజనం చెయ్యడానికి అర్హులు. అయితే, సంఘాలలో బాప్తీస్మం పొందినవారు చాలా మంది వుండొచ్చు. ప్రభువు రాత్రి భోజనం చేసేది మాత్రం కొందరే. కారణమేమిటి?
రక్షించబడి, బాప్తీస్మం పొంది, ప్రభువు రాత్రి భోజనం చెయ్యడానికి వెనుకంజ వేస్తున్నామంటే? మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేస్తున్నట్లే కదా? ప్రభువు బల్లకు అయోగ్యునిగా చేసేదేదో మన జీవితంలో వుందన్నమాట. అట్లా అని, ప్రభువు రాత్రి చేస్తున్నవారంతా, లోపం లేనివారు, పరిశుద్ధులు అనేది నా ఉద్దేశ్యం కానేకాదు. మీకు కోపం వచ్చినాగాని ఒక మాట చెప్తాను. ప్రభువు రాత్రి భోజనం చేసేవారిలో ఎక్కువమంది, తాము చెయ్యకపోతే, పాస్టర్ గారు గాని, ప్రక్కవాళ్ళు గాని నేనేదో పాపం చేస్తున్నానని అనుకొంటారు. అట్లాంటి ఛాన్స్ వారికివ్వడం ఎందుకులే అని చేసేవారే ఎక్కువ. వారిలో నీవున్నావేమో? సరి చూచుకో! సరి చేసుకో!
రక్షించబడి, బాప్తీస్మం పొందిన నీవు, ప్రభువు రాత్రి భోజనానికి దూరముగా వుంటున్నావంటే? నీ యొక్క బహిరంగ పాపం గాని, నీ రహస్య పాపములు గాని నీకు అడ్డుగా వస్తున్నాయనేది చాలా వరకు వాస్తవం కావొచ్చు. పూర్తిగా నిన్ను నీవు సరిచేసుకొని, ప్రభువురాత్రి భోజనం చెయ్యాలనే తలంపు చాలా కాలం నుండి నీవు కలిగియుండొచ్చు. అది నేటికిని జరుగలేదు. ఇక ముందుకూడా జరుగదు. అయ్యో! అదేంటి? నీకు నీవుగా ఎంత ప్రయత్నించినా నీ జీవితాన్ని మార్చుకోలేవు. అయితే, ఎట్లా సాధ్యం? నీ జీవితాన్ని ప్రభువు చేతుల్లో పెడితే ఆయనే మార్చుతారు. అంతేగాని, నీవు మారిపోయిన తర్వాత, ప్రభువు దగ్గరకు వద్దామంటే అదెప్పటికీ నీకు సాధ్యం కాదు.
అట్లా అని, నీ జీవితం సరిచేసుకొనకపోయినా పర్వాలేదు, ప్రభువు రాత్రి భోజనంలో పాలుపొందు అనేది నా ఉద్దేశ్యం అస్సలు కానేకాదు. గాని, రక్షించబడి, తప్పిపోయినప్పటికీ, తిరిగి మరలా ఉన్నపాటున ప్రభువు దగ్గరకు వస్తే, తప్పక మరలా ఆయన క్షమిస్తారు. మనలను క్షమించడం ఎంత వరకు న్యాయమో అంత వరకు క్షమిస్తారు. అది మించిపోతే, దేవుని కృప ఉగ్రతగా మారబోతుంది. అది అత్యంత భయంకరం.
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. (1యోహాను 2 : 1,2)
అను నిత్యమూ మనకొరకు విజ్ఞాపన చెయ్యడానికి ప్రభువైన యేసు క్రీస్తు, తండ్రి దగ్గర ఉత్తరవాదిగా వున్నారు. గనుకనే, నేటికిని మనము నిర్మూలము కాకుండా వున్నాము. ప్రభువు మనకిచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యము చెయ్యకుండా, తిరిగి, స్థిరమైన తీర్మానంతో ఆయన పాదాల చెంత చేరి, ప్రభువుతో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి ప్రారంభించి, ప్రభువు రాత్రి భోజనం ద్వారా ఆయన మరణ పునరుత్తానములను జ్ఞాపకం చేసుకొంటూ, దినదినము ఆయన సమరూపములోనికి మార్చబడెదము. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దేవుడు స్త్రీలకు రుతు క్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చాలా మందిలోనున్న అపోహ ఏమిటంటే? రుతు క్రమ సమయంలో బల్లారాధనలో పాల్గొనకూడదని, అయితే, ఒక్క విషయం! మనము పాతనిబంధనా కాలంలో లేము. ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తున్నవారము అసలే కాదు. దయచేసి అట్లాంటి అపోహలు అస్సలు పెట్టుకోవద్దు. మీ హృదయం పరిశుద్ధంగా నున్నప్పుడు నిరభ్యంతరంగా ప్రభువు రాత్రి భోజనం చెయ్యొచ్చు. కొంతమంది ఆ దినాలలో దేవుని మందిరానికి కూడా వెళ్లరని విన్నాను. ఇది మన ఆధ్యాత్మిక పరిపక్వతలేని స్థితిని సూచిస్తుంది. యింతవరకూ, ఎవరైనా అట్లా చేస్తే, ఇకముందు కొనసాగింపవద్దు. ప్రభువు సన్నిధికివెళ్ళి ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధన చెయ్యండి.
మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. (అపొ. కార్య 2:38)
రెండవసారి బాప్తీస్మము పొందవచ్చా?
బాప్తీస్మం ఎందుకు పొందాలంటే?
యేసునందు విశ్వాసముంచి, మారు మనస్సు పొందిన తరువాత
▪️పాప క్షమాపణ కొరకు
▪️పరిశుద్దాత్మ వరమును పొందుట కొరకు బాప్తీస్మము పొందాలి.
పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. (అపొ. కార్యములు 2 : 38) రెండవసారి బాప్తీస్మం పొందాలి అని తలంపు వచ్చింది అంటే, మొదటిసారి నీవు పొందిన బాప్తీస్మం సరియైనదికాదని నీకు అర్ధమయ్యిందన్నమాట.
నీవు బాప్తీస్మం పెళ్లికోసం తీసుకొంటే, నీకు భర్త వచ్చాడు/ భార్య వచ్చింది. కానీ, మారు మనస్సు లేదు. పాప క్షమాపణ కలుగలేదు. పరిశుద్ధాత్మ వరమును పొందలేదు.
సమాధుల దొడ్డెలో స్థలం కోసం బాప్తీస్మం పొందితే, ఆ స్థలం కన్ఫర్మ్ అయ్యింది. కానీ, మారు మనస్సు లేదు. పాప క్షమాపణ కలుగలేదు. పరిశుద్ధాత్మ వరమును పొందలేదు.
క్రిష్టియన్ కాలేజీల్లో సీటు కోసం, అమెరికాకు వెళ్లడం కోసం నీవు బాప్తిసం పొందివుంటే, వాటిని పొందుకోగలిగావు. కానీ, మారు మనస్సు లేదు. పాప క్షమాపణ కలుగలేదు. పరిశుద్ధాత్మ వరమును పొందలేదు.
ఇల్లు కోసం, మరుగు దొడ్ల కోసం, నీటి పంపు కోసం, డబ్బు కోసం నీవు బాప్తీస్మం తీసుకున్నట్లయితే, వాటిని పొందుకున్నావు. కానీ, మారు మనస్సు లేదు. పాప క్షమాపణ కలుగలేదు. పరిశుద్ధాత్మ వరమును పొందలేదు.
సంఘములో సభ్యత్వము కోసం బాప్తీస్మము పొందితే, సంఘములో సభ్యత్వాన్ని పొందావు. కానీ, మారు మనస్సు లేదు. పాప క్షమాపణ కలుగలేదు. పరిశుద్ధాత్మ వరమును పొందలేదు.
ఇట్లా, ఏ పరిస్థితులలో మనము బాప్తీస్మము తీసుకున్నామో మనము జ్ఞాపకము చేసికొన్నట్లయితే, మారు మనస్సు లేకుండా, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ వరమును పొందుకోలేని బాప్తీస్మములు, అవి నీటి మునకలే తప్ప, బాప్తీస్మములు కావు. అవి చెల్లవు.
పౌలు శిష్యులకు రెండవసారి బాప్తీస్మమిచ్చుట:
అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు. అపొ. కార్యములు 19 : 1-7
ఇక్కడ శిష్యులు అంటే? యేసు ప్రభువును వెంబడించే వారందరూ శిష్యులుగానే పిలువబడేవారు. వారు బాప్తీస్మము పొందినవారే గాని, పరిశుద్ధాత్మను పొందినవారు కాదు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయమే వారికి తెలియదట. యేసునందు విశ్వాసముంచి, మారుమనస్సు పొందాలని భోధించినప్పుడు అప్పుడు వారు మరలా బాప్తీస్మము పొందారు.
ఇక్కడ యేసు నామము అంటే? తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ నామములో తీసుకున్న వారంతా మరలా ఇప్పుడు యేసు నామములో తీసుకోవాలని అర్ధం కాదు. యేసు నామము అనేది, యేసు యొక్క అధికారమును, ఆయన ఆజ్ఞను గూర్చి తెలియజేసే మాట. నేటి దినాలలో తిరిగి రెండవసారి యేసునామములో బాప్తీస్మం తీసుకొనకపోతే, పరలోకంలోనికి ప్రవేశం లేదని బోధించేవారు అనేకులు. అది వాస్తవం కాదు
చివరిగా ఒక్కమాట!
మారుమనసులేని బాప్తీస్మములు చెల్లవు. అయితే, కొందరు మారుమనస్సు, బాప్తీస్మము పొంది దేవునికోసం నమ్మకంగా జీవించినవారే కొన్ని సందర్భాలలో పాపముచేత ఆకర్షించబడి తొట్రిల్లిపోయారు. వారు మరలా బాప్తీస్మం తీసుకోనవసరం లేదుగాని, వారి జీవితాలను సరిచేసుకొని, నూతనముగా ప్రభువుకొరకు జీవించగలగాలి. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
- మీ సహోదరుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి