తెస్సలోనికయుల పత్రికలు-2

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*69 భాగము- ఉపోద్ఘాతము*

రెండవ థెస్సలొనీకయులకు 2:1,2,3,4

1. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల

2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

 

       దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! ఇంతవరకు మనము మొదటి తెస్సలోనికయులకు వ్రాసిన పత్రికనుండి ఎన్నో విషయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక నేటినుండి రెండవ పత్రికనుండి ధ్యానం చేసుకుందాము!

 

       పత్రిక ధ్యానం చేసుకునే ముందుగా పత్రిక నేపధ్యం మరోసారి జ్ఞాపకం చేసుకుందాము! గమనించవలసిన విషయం ఏమిటంటే: మొదటి పత్రికకు రెండవ పత్రికకు మధ్యకాలం బైబిల్ పండితుల అంచనా ప్రకారం కేవలం ఆరునెలల నుండి ఎనిమిది నెలలు మాత్రమే! మరి ఇంత అర్జంటుగా మరో పత్రిక రాయవలసిన అవసరం పౌలుగారికి ఎందుకు వచ్చింది? దానికి జవాబు మనకు మూడు అధ్యాయాలలో కనిపిస్తుంది.

 

*నేపధ్యము*:

 

*మొదటి కారణం*: అబద్ద బోధకులు అనేకులు బయలుదేరి థెస్సలోనికయుల సంఘాన్ని కలవర పెట్టారు! ఒకప్రక్కన తమ సొంతవారితో అనేకమైన భయంకరమైన శ్రమలు శోధనలు అనుభవిస్తున్నారు! మరో ప్రక్క అబద్ద బోధకులు భిన్నమైన బోధనలు ప్రకటిస్తూ సంఘాన్ని కలవర పెడుతున్నారు! అందుకే మొదటి అధ్యాయం మొత్తం వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు!విశ్వాసమందు కృంగిపోవద్దు అంటున్నారు! మీ కొరకు యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో రాబోతున్నారు! అప్పుడు శ్రమలు శోధనలు కలవరాలు ఉండవు అంటున్నారు!

 

*రెండవ కారణం*: అదే అబద్ద బోధకులు యేసుక్రీస్తుప్రభులవారి  రెండవ రాకడ జరిగిపోయింది అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు! వెంటనే సంఘంలో కలవరం పట్టుకుంది! అయ్యో! సంఘం ఎత్తబడిందా? మేము విడువబడి పోయామా అని అయోమయంలో పడిపోయారు! వెంటనే పౌలుగారు రాస్తున్నారు! దేవుని రాకడ జరగలేదు  సంఘం ఇంకా ఎత్తబడలేదు! మొదట బ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడు, పాపపురుషుడు అనబడే క్రీస్తు విరోధి బయలుపరచబడాలి. వాడు తననుతాను దేవునికంటే హెచ్చించుకుంటాడు. కాబట్టి వాడు ఇంకా రాలేదు కాబట్టి మీరు కంగారు పడవద్దు అని ఉత్తరం రాస్తున్నారు!  గమనించవలసిన విషయం ఏమిటంటే మొదటి పత్రికలో కొంతగా రెండవరాకడ మృతుల పునరుత్థానం కోసం వ్రాసియుండగా మిగిలిన ప్రత్యక్షతలు పత్రికలో బయలుపరచబడ్డాయి!

 

*మూడవ కారణం*: మరి కొందరు అబద్దబోధకులు బయలుదేరి యేసుక్రీస్తుప్రభులవారు ఎలాగు అతి త్వరలో వచ్చి సంఘాన్ని తీసుకునిపోబోతున్నారు కాబట్టి మనం ఈలోక సంబంధమైన కార్యక్రమాలు బ్రతుకుతెరువు కోసం ప్రాకులాటలు మానివేసి అస్తమాను దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రార్ధనలో వాక్యపఠన పరిచర్యలోనే ఉందాము! పనిపాటులు చెయ్యవద్దు! సమయంలో మనం ప్రార్ధనలో కనిపెడితే ఇంకా ఆధ్యాత్మికంగా బలపడతాము అంటూ తప్పుడు బోధలు చెయ్యడమే కాకుండా, వారు మానివేసి ఇతరులను కూడా పనిచేయకుండా ఆపివేశారు! సోమరుపోతులను చేస్తున్నారు! అయ్యో పౌలుగారు తన పత్రికలో చాలా వివరంగా మీ పనిపాటులు మీరు చేసుకుంటూనే దేవునిలో సాగమని చెప్పారు కదా మరి మీరు ఎందుకు ఇలా బోధిస్తున్నారు అని అడిగితే, కాదు ఇదే సరియైన పద్దతి అని వాదించే వారు కొంతమంది! మరికొంతమంది తెగించి పౌలుగారు వ్రాసినట్టు దొంగపత్రికలు రాసి సంఘానికి పంపించారు అంటారు బైబిల్ పండితులు! దానికి బదులుగా పౌలుగారు చెబుతూ వారు చేస్తున్నబోధ తప్పుడు బోధ! అది నా చేతిరాత కానేకాదు! ఇదిగో వందన వచనాలన్ని నేనే నా చేతితో రాస్తున్నాను! ఇదే నారాత! ఇదే మీకు గురుతు అంటూమీరు మమ్మును పోలి నడచుకోండి! మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎలాయితే మేము మా పోషణ కోసం మా సొంతపనులు చేసుకుంటూ సువార్త పరిచర్య చేస్తూ ప్రభువులో సాగామో అలాగేమీరు కూడా మీ సొంత చేతులతో పనిచేసుకుంటూ మీ సొంత డబ్బుతో భోజనం చెయ్యండి!  తప్పుడు బోధకుల మాటలు వినవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు!

మరో విషయం గుర్తుచెయ్యనా... అసలు థెస్సలోనికయ ప్రాంతం, ఎఫెసీ, గ్రీసు సామ్రాజ్యం మొత్తం ఆరోజులలో పనులు చెయ్యడానికి ఇష్టపడేవారు కాదు! ఎపుడూ ఏదో ఒక పనికిమాలిన కబుర్లు గాని క్రొత్త విషయం వినడం మాత్రం చేసేవారు!

ఇక అపోస్తలులు కార్యం మొదటినుండి నుండి గమనిస్తే రెండో అధ్యాయంలో క్రొత్తగా రక్షించబడిన విశ్వాసులు తమ ఆస్తులు అమ్మివేసి ప్రభువు పరిచర్యకు ఇచ్చేసే వారు. దానిని సమిష్టిగా పంచుకుంటూ ప్రభువు పనిని ఘనంగా చేసేవారు అపోస్తలులు! నాలుగో అధ్యాయంలో బర్నబా గారు కూడా తన మొత్తం ఆస్తి అమ్మి తెచ్చారు! 5 అధ్యాయంలో అలా చేద్దామని నటించబోయి చచ్చారు అననీయ సప్పీరాలు! అందుకే అబద్దబోధకులు కూడా సంఘస్తులు కూడా అలాగే ఆస్తులమ్మి తెచ్చిపెడితే తేరగా కూర్చుని తిందామని తప్పుడుబోధలు మొదలుపెట్టారు అన్నమాట!

 

నేటిరోజులలో కూడా అనేకమంది తప్పుడుబోదలు చేస్తూ విశ్వాసులను దోచుకుంటున్నారు! అయితే సందర్బంగా చెప్పేదేమిటంటే పౌలుగారు మీరు స్థితిలో పిలువబడ్డారో స్థితిలోనే దేవుణ్ణి సేవించి పరిచర్య చేయమన్నారు! కేవలం సంపూర్ణ పనికోసం  దేవుని ప్రత్యేకమైన పిలుపు కలిగితే తప్ప నీవు చేస్తున్న పనిపాటులు వదిలివేసి ఆయన సేవచెయ్యమని బైబిల్ లో ఎక్కడా లేదు! మీరు మీ పనిపాటులు చేసుకుంటూనే ఆయన పరిచర్య చేయడం బహు శ్రేష్ఠం! పౌలుగారు సీలగారు తిమోతి గారు అలాగే సేవచేశారు ఎవరిమీదను ఆధారపడలేదు! ఒకవేళ మీలో ఎవరికైనా ఉద్యోగాలు ఉంటూ దేవునిసేవ చేస్తూ ఉంటే ప్రియ సహోదరులారా! మీరు సరిగానే చేస్తున్నారు! పౌలుగారి మార్గంలో నడుస్తున్నారు!

సరే,ఇదీ పత్రిక రాయడానికి గల నేపధ్యం!

మనం కూడా ఇలాంటి తప్పుడు బోధనలకు దూరంగా ఉంటూ ఆయన రాకడకు ఆయత్త పడదాం!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*70 భాగము- పత్రిక విభజణ*

 

       దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! గతభాగంలో పత్రికను రాయడానికి గల నేపధ్యమును వివరంగా చూసుకున్నాము! ఇక పత్రిక ప్రారంభానికి ముందు పత్రిక యొక్క విభజన లేక వివరణను చూసుకుందాము!

 

*రచయిత*: పౌలుగారు (సీలగారు, తిమోతి గారు కూడా ఉన్నారు)

 

*ఎప్పుడు రాశారు?* క్రీ.. 50 –51 మధ్య కాలంలో!

 

ఎందుకు రాశారో గతభాగంలో ధ్యానం చేసుకున్నాము!

 

*ముఖ్య ఉద్దేశం*:

*మొదటిది* : ఆయన రాకడ ఇంతవరకు రాలేదు! అంతవరకూ మనం దీర్ఘశాంతం కలిగి, దేవునియందు విశ్వాసం కలిగి ఇప్పుడు ఉన్న శ్రమలను సహిస్తూ ప్రభువును ఎదుర్కొందాము!

 

*రెండవది*: ఆయన ఎప్పుడు వస్తారు? పరిస్తితులలో వస్తారు?

 

*మూడు*: అంతవరకూ ఎవరూ కాళీగా కూర్చోకుండా ఎవరి సొంతపనులు వారు చేసుకుంటూనే ఆయన సేవలో ముందుకు పోదాము!

 

*అధ్యాయాలు*: మూడు

 

*మొదటి అధ్యాయం*: శ్రమలయందు *ఓదార్పు*:  శ్రమలలో ధైర్యముగా ఉన్నారు! సెహబాస్! అంటూ ఇంకా ఆదరణ మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు రాశారు!

*ఎందుకు శ్రమలు, శోధనలు?* అదే క్రైస్తవవిశ్వాస జీవితం కాబట్టి! శ్రమలలోనే దేవుడు మనకు శాంతిని ఓదార్పును ఇస్తారు! దేవుని ఓదార్పు ఏమిటంటే: మీరు పడే శ్రమలు ఆయనకు తెలుసు! చూస్తున్నారు! ఒకరోజు మిమ్మల్ని శ్రమపెట్టిన వారు శ్రమ పడతారు!

ఆయన రాకడవరకే శ్రమలు శోధనలు! ఆయన వచ్చాక వీటిని వదలి ఆయనతో యుగయుగములు ఆనందిస్తాము!(1:,4,11)

 

*2 అధ్యాయం*: దేవుని ప్రత్యక్షతలు: (2:28)

రాకడ ఎప్పుడు జరుగుతుంది? పరిస్తితులలో జరుగుతుంది? బ్రష్టత్వం సంభవించి, నాశనపుత్రుడు పాపపురుషుడు క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత మాత్రమే రాకడ! అది ఇంకా సంభవించలేదు!! మీరు సరిదిద్దుకొని సిద్దపదండి!

 

ఓదార్పు మామూలే! ఆయన రాకడవరకే శ్రమలు శోధనలు! ఆయన వచ్చాక వీటిని వదలి ఆయనతో యుగయుగములు ఆనందిస్తాము!

 

*౩వ అధ్యాయం*: రాకడవచ్చే వచ్చేవరకు ఎవరిపనులు వారు చేసుకుని కష్టార్జితము వలన కలిగిన ధనముతో ఆహారం తినండి!

మంచి పనులు చేయడంలో అలసిపోవద్దు! ఆయనసేవలో కూడా అలసిపోవద్దు! ఓదార్పు మామూలే! ఆయన రాకడవరకే శ్రమలు శోధనలు! ఆయన వచ్చాక వీటిని వదలి ఆయనతో యుగయుగములు ఆనందిస్తాము! (:412)

 

*విషయసూచిక*

హింసలమధ్య పెరుగుతున్న ప్రేమ, విశ్వాసం 1:3-5

హింసించేవారికి, అవిధేయులకు శిక్ష 1:6-9

క్రీస్తుకు తన ప్రజలలో మహిమ కలుగుతుంది 1:10

వారి కోసం పౌలు ప్రార్థన, దానికి కారణం 1:11-12

క్రీస్తు రాకడ 2:1-2

క్రీస్తు విరోధి రాకడ 2:3-8

క్రీస్తు న్యాయ విరోధిని నాశనం చేస్తాడు 2:8

క్రీస్తు విరోధి ప్రజలను మోసం చేయగలగడానికి కారణం 2:9-12

వింతలు, సూచనలు, అద్భుతాలు 2:9-10

సత్యంపట్ల ప్రేమ లేకపోవడం 2:10

దేవుడు వారిని మోసగించే ప్రభావంతో శిక్షిస్తాడు 2:11-12

ప్రభువైన క్రీస్తు ప్రేమకు పాత్రులై,

దేవుని ఆత్మచేత పవిత్రులై, శుభవార్తద్వారా పిలుపు అందినవారు 2:13-14

నిలకడగా ఉండడం 2:15-17

ప్రార్థన, విన్నపం 3:1-2

పౌలు ప్రార్థన, నమ్మకం 3:3-5

సోమరితనానికి వ్యతిరేకంగా హెచ్చరిక 3:6-15

పౌలు ఉదాహరణ 3:7-9

ముగింపు మాటలు 3:16-18

 

ఆమెన్!

దైవాశీస్సులు!

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*71 భాగము*

   2 థెస్స 1:1-- 

1. మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.

2. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! ఇక మనము రెండవ పత్రిక ధ్యానాన్ని మొదలుపెడదాము!  రెండవ పత్రిక లోను యధావిధిగా తన వందన వచనమును కొనసాగిస్తున్నారు. మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న థెస్సలోనికయ సంఘము అని సంభోదిస్తున్నారు! దీనికోసం మొదటి పత్రిక ఆరంభంలో ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాము! సంఘము తండ్రిలోను క్రీస్తుయేసునందు భద్రముగా దాచబడింది అని మాత్రము గ్రహించండి!

 

       ఇక యధావిధిగా మొదటి పత్రిక మాదిరిగా పౌలను నేను, సిల్వానును, తిమోతియు కలిపి రాస్తున్నాము అంటున్నారు! ఇక్కడ సీలగారి  పేరు సిల్వాను అంటూ సంభోదిస్తున్నారు! సీల అన్నా సిల్వాను అన్నా ఒకటే మరియు ఒకరే! ఉదాహరణకు: ఏమిటి సంగతి ఎలా ఉన్నావు అనడానికి, ఏందబ్బా ఎలా ఉంటివి అని పిలిచే రాయలసీమ భాష యాషకు గల సంబంధము లాగ అన్నమాట! కాబట్టి మొదటి పత్రిక లాగానే పత్రిక కూడా ముగ్గురు ఉపవసించి ధ్యానించి రాస్తున్నారు అన్నమాట!

 

   ఇక రెండో వచనంలో యధావిధిగా తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానము మీకు కలుగును గాక అంటూ దీవిస్తున్నారు! ఇది ఆయన సిగ్నేచర్ వందనాదులు!!! ఇలా రాయడానికి కారణం కూడా ఉంది! దేవుడిచ్చిన వాగ్దానం: మీరు దీవించేవారిని దీవిస్తాను, మిమ్మల్ని దూషించి వారిని శపిస్తాను అన్నారు (ఆది 12:3) కాబట్టి- దీవెన వచనం వలన తన బిడ్డలు లేదా సంఘస్తులు దీవించ బడాలని తండ్రి కోరిక అన్నమాట!

 

  ఇక మూడో వచనంలో మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైయున్నాము ఎందుకంటే మొదటగా: మీ విశ్వాసము రోజురోజుకి బహుగా అభివృద్ధి చెందుతుంది. రెండవదిగా: మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానిఎడల చూపించే ప్రేమ దినదినము వృద్ది పొందుతుంది! అందుకే మీ నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యుక్తమే అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు! విషయాన్ని కొంచెం వివరంగా ఆలోచిద్దాము!

 

    మీ నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యుక్తమే ఎందుకంటే  మొదటగా మీ విశ్వాసం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది అంటున్నారు! ఇదే విషయాన్ని రోమా సంఘం విషయంలో కూడా చెప్పారు పౌలుగారు! 1:8...

మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

ఇక్కడ పరిస్తితులు చూసుకుంటే థెస్సలోనికయ సంఘంలో శ్రమలు రోజురోజుకి పెరిగిపోతుంటే వారు క్రుంగిపోకుండా వారి విశ్వాసం శ్రమలు పెరిగేకొలది ఇంకా అభివృద్ధి చెందుతుంది అని రాస్తున్నారు పౌలుగారు!

 యేసుక్రీస్తుప్రభులవారు నేను వచ్చినప్పుడు విశ్వాసిని విశ్వాసంలో కనుక్కోగలనా అన్నారు, ఇంకా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని కూడా చెప్పారు! మత్తయి 24:18. అయితే లోకంలో ఎంత అక్రమము పెరిగిపోయినా గాని సంఘంలో ప్రేమ విశ్వాసం రెండు పెరిగిపోతున్నాయి! సంఘానికి కావలసింది ఇదే!

 

1 థెస్స 4:2 లో పౌలుగారు అదే కోరుకున్నారు.....

కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.

ఇక్కడ వారు చేసి చూపించారు అన్నమాట!

 

ఇక రెండవదిగా: మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నారు! చూడండి అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని వ్రాయబడినా గాని ఇక్కడ మాత్రం సంఘంలో ఒకరిపట్ల మరొకరికి ప్రేమాభావం ప్రజ్వరిల్లుచున్నది! అలా జరగటానికి కారణం తమ గురువుగారు ఒక ఉత్తరం రాశారు మీరు ఇలా ఇలా ఉండాలి అని! దానిని అక్షరాల పాటిస్తుంది సంఘము! ఎంత గొప్ప సంఘమో కదండీ!

 

1థెస్సలొనికయులకు 3: 13

మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

ఇంకా 4:9,10లో కూడా పౌలుగారు పదే పదే చెప్పారు విషయం!.....

 

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు, ...

 

కాబట్టి పౌలుగారు ఏమని కోరుకున్నారో అలాగే సంఘస్తులు చేశారు! చేస్తున్నారు! నిజంగా ఇలాంటి సంఘము ఉంటే కాపరి చాలా సంతోషిస్తాడు! ఒకసారి అపోస్తలుడైన యోహాను గారు పత్రిక రాస్తూ పొంగిపోతున్నారు: నా పిల్లలు సత్యము ననుసరించి నడవడం కంటే నాకు ఎక్కువైన ఆనందం లేదు అంటున్నారు! ఇక్కడ సంఘం యొక్క విశ్వాసం మరియు ఒకరిపట్ల మరొకరికున్న ప్రేమను చూసి పౌలుగారు పులకరిస్తున్నారు!  ప్రియ సంఘమా! మీరు ఎలా ఉన్నారు? మీకోసం మీ కాపరి ఇలా చెప్పుకోగలుగుతున్నారా? పౌలుగారు ఎంతో ప్రార్ధన చేశారు వీరికోసం! వీరు ప్రేమలో విస్తరించాలని మాత్రమే కాదు ఒకరిపట్ల మరొకరు ప్రేమాభావం కలిగి వర్ధిల్లాలని! వీరు  చేసి చూపించారు! ఇంకా 48 వచనాలు చూసుకుంటే వీరికి ఎన్ని శ్రమలు కలిగినా సరే ఇంకా ఎంతో విశ్వాసంలో ప్రేమలో విస్తరిస్తున్నారు తప్ప ఓలిపోయి సోలిపోవడం లేదు! ఒకరకంగా చెప్పాలంటే థెస్సలోనికయ సంఘము మంచినేల మీద పడ్డ విత్తనాలును పోలిఉంది అన్నమాట!

 

   ప్రియ దేవుని బిడ్డా! మీ సంఘంలో శ్రమలు పెరిగేకొలది ప్రేమ, విశ్వాసాలు ముఖ్యంగా ఒకరిపట్ల మరొకరికి ప్రేమాభావం పెరుగుతుందా లేక సంఘంలో కులబేధాలు వర్గభేధాలు పెరిగిపోయి తగవులాడుకుని పోలిస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా? థెస్సలోనికయ సంఘం వలే మాదిరిగా జీవిస్తున్నారా లేక లవోదోకాయ సంఘం వలె దేవుని నుండి తూ అని ఉమ్మివేయించుకునే స్తితిలో ఉన్నారా? ఒకసారి సరిచూసుకుని సరిచేసుకోమని ప్రభువుపెరిట మనవిచేస్తున్నాను! అపోస్తలుడైన యోహాను గారు ఆత్మావేశుడై నీవు చూడగలుగుతున్న సహోదరుని ప్రేమించ లేకపోతుంటే చూడలేని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని అడుగుతున్నారు? తన సహోదరున్ని ద్వేషిస్తే వాడు నరహంతకుడు అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది! కాబట్టి మనలను సరిచేసుకుందాం! థెస్సలోనికయ సంఘము వలే ప్రేమాభిమానాలతో వర్దిల్లుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*72 భాగము*

   2 థెస్స 1:4—5  

4. అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకుంటున్నాము!

 

     ఇక వచనాలలో అందువలన అనగా మీ ప్రేమ విశ్వాసాలు ప్రభవిల్లుచున్నందున , మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు చాలా అతిశయ పడుచున్నాను అంటున్నారు! ఇక్కడ వారు హింసలు పడుచుంటే పౌలుగారు అతిశయ పడటం ఏమిటి? కారణం పౌలుగారు సీలగారు తిమోతి గారు వారు థెస్సలోనికయ సంఘంలో ఉండి పరిచర్య చేసినప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మేలు కలుగుతుంది మీరు ధనవంతులైపోతారు బిల్డింగ్లు వచ్చేస్తాయి లాంటి మాటలు చెప్పకుండా క్రీస్తుయేసును అనుసరిస్తే మీరు పరలోకవారసులౌతారు అక్కడ మీరు తేజోవాసుల స్వాస్త్యాన్ని పొందుకుంటారు వేవేల పరిశుద్ధులతో సంతోషిస్తారు లాంటి ఆధ్యాత్మిక సంగతులు చెప్పి బలపరిచారు! అంతేకాకుండా అనేక శ్రమలను అనుభవించాలి ఈలోకంలో అంటూ ముందుగానే హెచ్చరించారు!

 

1థెస్సలొనికయులకు 3: 3

మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

1థెస్సలొనికయులకు 3: 4

అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

 

1థెస్సలొనికయులకు 1: 6

పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.

 

1థెస్సలొనికయులకు 2: 14

అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.

 

 అలాగే శ్రమలు వచ్చాయి! వారు బెదరలేదు కలవరపడలేదు వెనుతిరగలేదు! సంతోషంగా అనుభవిస్తున్నారు అందుకే మిమ్మును చూసి నేను చాలా అతిశయపడుతున్నాను ఇతర సంఘాల వద్ద అంటున్నారు!

ఇంకా ఇతర సంఘాలకు మీరు మాదిరిగా జీవిస్తున్నారు అంటున్నారు!

 

ఇంకా వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే మీ హింసలన్నిటిలో అంటున్నారు, అనగా చాలా రకాలైన హింసలు  వారికి కలుగుతున్నాయి అన్నమాట! ఇంకా మీరు సహించుచున్న శ్రమలలోను అంటున్నారు...  అనగా శ్రమలలో వీరు సహనము కలిగి ఉన్నారు అన్నమాట! తుయతైర సంఘము కూడా ఎంతో సహనము గలది ప్రేమ గలది విశ్వాసము గలది క్రియలు గలది అని మనం ప్రకటన 2:1828 వరకు చూడగలము! అలా సహనం కలిగి ఉన్నందుకు జయించినందుకు అనేక పట్టణాలమీద అధికారం ఇచ్చినట్లు చూడగలము!

 

 సహనము ఉంటే ఎన్నెన్నో మేలులు ఉన్నాయి!

యాకోబు 5: 11

సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.

 

మీ ప్రార్ధనకు సమాధానం కావాలంటే సహనం కావాలి!

కీర్తనలు 40: 1

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.

 

విశ్వాస యాత్రలో విజయం కావాలంటే సహనం కావాలి. హెబ్రీ 12:1—2

1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున

2. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

 

నేటి సంఘాలు కుటుంబాలు చితికి పోతున్నాయి విచ్చినమౌతున్నాయి అంటే వారిలో సహనం లేనందువలననే అని గ్రహించాలి!

 

ఇక తర్వాత విషయం సంఘంలో ఓర్పు ఉంది! సహనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది! ఎక్కడ ఓర్పు ఉంటుందో అక్కడ దీర్ఘశాంతం ఉంటుంది! ఎక్కడ మూడు ఉంటాయి అక్కడ ప్రేమానురాగాలు వర్ధిల్లుతాయి! ఆత్మీయ ప్రేమ పూలు పూస్తాయి!  ఇవన్నీ పరిఢవిల్లుతుంటే అక్కడ విశ్వాసపు సెలయేరులు పుష్కలంగా పారుతుంటాయి! అందుకే వీటన్నిటిని చూస్తూ వారి ఆత్మీయ తండ్రియైన పౌలుగారు ఎంతో పులకరించిపోతున్నారు! మిగిలిన సంఘాల దగ్గర మన థెస్సలోనికయ సంఘం ఇలాగా అలాగా అంటూ గొప్పలు చెప్పుకుంటూ పొంగిపోతున్నారు!

 

సందర్భంగా ఒక విషయం చెప్పనీయండి! మా నాన్నగారు తను సంఘంలో వాక్యపరిచర్య చేసినా మా సంఘం ఇలా అలా అంటూ గొప్పలు చెప్పుకునే వారు! మా సంఘం చాలా పేద సంఘము, గాని మా విశ్వాసులు ప్రార్ధనాపరులు! విశ్వాసవీరులు అంతేకాకుండా దేవునికోసం, నాకోసం ప్రాణం పెట్టడానికి సిద్దపడిన వారు అంటూ ఉండేవారు! అవును మా పాత విశ్వాసులు నిజంగా అలాంటివారే! అందుకే వారికోసం అంత గొప్పగా చెప్పుకునే వారు! వారిలో ఇప్పుడు 95 శాతం చనిపోయారు అనుకోండి! గాని వారు అంత గొప్పవారు! ఇలా ఒక కాపరి తమ సంఘం కోసం గొప్పలు చెప్పుకుంటారు ఎందుకంటే అలాగా వారు ప్రేమలో వర్దిల్లుతున్నారు కాబట్టి! సంఘమా! నీవు అలాంటి స్తితిలో ఉన్నావా? లేక మీ సంఘమంటే కాపరి భయపడుతున్నాడా? నాకు తెలిసిన కొన్ని సంఘాలున్నాయి! సంఘాలకు కాపరిగా వెళ్ళాలంటే చాలామంది కాపరులు భయపడతారు ఎందుకంటే సంఘాలు సంఘకాపరులను కొట్టే సంఘాలు! వారికి అనుకూల బోధలు చేస్తూ వారు తప్పుచేస్తున్నా వారిని పొగిడే వారు వారికి కావాలి గాని తప్పుచేస్తే సరిదిద్దితే కొట్టడానికి వెనుకాడని సంఘాలున్నాయి! ఇలాంటి సంఘాలు తప్పకుండా సాతాను గాడి చేతిలో ఉంటూ సాతాను పరిచర్య చేస్తున్నాయి గాని యేసయ్య పరిచర్య అసలు చేయడం లేదు!

 

   ఇక 5 వచనంలో పౌలుగారు అంటున్నారు మీరు దేనికొరకు ఇలా శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు అంటున్నారు! అనగా శ్రమలలో సహనము చూపిస్తూ విశ్వాసంలో పైపైకి ఎదిగేవారు దేవుని రాజ్యంలో యోగ్యులు అన్నమాట! మీరు పడే శ్రమలు, మీరు చూపించే సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, విశ్వాసం, ప్రేమ అన్నీ కలిపి మిమ్మల్ని దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేసింది అంటున్నారు!

 

    వచనంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలున్నాయి! మొదటిది మీరు పడే పాటుల వలన చూపిస్తున్న సహనం, ఓర్పు దీర్ఘశాంతం విశ్వాసం వలన మీరు దేవుని రాజ్యానికి యోగ్యులయ్యారు అంటున్నారు!

 

రెండవదిగా ఇలా ఓర్చుకోవడం దేవుని న్యాయమైన ఉగ్రతకు తీర్పుకు స్పష్టమైన సూచనగా ఉంది అంటున్నారు!

ఇది ఇంకా అర్ధం కావాలంటే 6 నుండి 9 వచనాలు చూసుకోవాలి! దీనిని తర్వాత భాగంలో ధ్యానం చేసుకుందాము!

 

   కాబట్టి సంఘమా మీ పరిస్తితి ఎలా ఉందో మీకుమీరు పరిశీలన చేసుకోండి! శ్రమలను సహిస్తూ ఓర్పు ప్రేమ విశ్వాసం సహనం కలిగి ఉంటున్నారా? లేక కాపరి దుఃఖపడే విధంలో ఉంటున్నారా?

విశ్వాస ప్రేమ సహన నిరీక్షణలు మిమ్మల్ని దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేస్తున్నాయి అని మరచిపోవద్దు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*7౩వ భాగము*

   2 థెస్స 1:5--10   

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకుంటున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

        ప్రియులారా గతభాగంలో 5 వచనంలో గల రెండు ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానం చేస్తున్నాము! దేనికొరకు మీరు శ్రమ పడుచున్నారో దేవుడు రాజ్యమునకు మీరు యోగ్యులయ్యారు అంటున్నారు. ఇక రెండవ విషయం మీరిట్లు ఓర్చుకోవడం దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అంటున్నారు! దానికి కొనసాగింపుగా ఆరునుండి పది వచనాలను రాస్తున్నారు! ఏమంటున్నారు అంటే ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపర్చు దూతలతో కూడా పరలోకమునుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తారు అంటూ అప్పుడు ఇప్పుడు ఎవరైతే మిమ్మును శ్రమ పరస్తున్నారో వారికి శ్రమయు, ఇప్పుడు శ్రమలను సహిస్తూ సహనం చూపుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటున్నారు! మాటలలో మిమ్మల్ని శ్రమ పెట్టే వారికి యేసుక్రీస్తుప్రభులవారు తన దూతలతో ప్రభావాన్ని కనుపరస్తూ అగ్ని జ్వాలలలో పరలోకం నుండి వస్తున్నారు అప్పుడు మిమ్మల్ని శ్రమ పెట్టేవారికి శ్రమ కలుగుతుంది అంటున్నారు! దానిని మనం నిత్యనరకముగా పిలువవచ్చు! అందుకే వారు నరకమునకు పోకుండా వారికోసం ప్రార్ధన చెయ్యవలసిన అవసరం, వారికి సువార్త చెప్పాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది!

 

    ఇక మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మరలా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను గూర్చిన ప్రత్యక్షతలు మరలా అధ్యాయం నుండి వచనాలతో ప్రారంభమయ్యాయి! దీనికోసం తర్వాత ధ్యానం చేద్దాము!

ముందుగా మీరిట్లు ఓర్చుకోవడం దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన తీర్పుకు ఎలా సూచనగా ఉన్నదో వచనాల ద్వారా ధ్యానం చేద్దాం! గతభాగంలో మనం ధ్యానం చేసుకున్నాముపౌలుగారు వీరికి మసిపూసి మారేడు కాయను చేసి వాక్యం చెప్పలేదు! మీరు సత్యవాక్యం చేపట్టిన వెంటనే మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పిన తర్వాతనే సంఘస్తులు వాక్యమును అంగీకరించి విశ్వాసంలో ప్రేమలో బలపడ్డారు! కాబట్టి వీరు ఎలా క్రీస్తు నామము కోసం కష్టాలు కడగల్లు శ్రమలు శోధనలు హింసలు అనుభవిస్తున్నారో అలాగే ఒకరోజు దేవుని న్యాయమైన తీర్పు దినమున వీరిని శ్రమపెడుతున్న వారు తప్పకుండా శ్రమలను అనుభవిస్తారు! అదేవిధంగా ఇప్పుడు శ్రమలను అనుభవిస్తున్న వీరు అనగా సంఘము దైవజనులతో పాటుగా విశ్రాంతిని అనగా శాశ్వత జీవమును తప్పకుండా పొందుతారు! అదే దేవుని న్యాయమైన తీర్పు అంటున్నారు పౌలుగారు!

ఫిలిప్పీ 1:2630 లో కూడా దీనికోసం వివరంగా రాస్తున్నారు....

 

26. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.

27. నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

28. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయైయున్నది. ఇది దేవునివలన కలుగునదే.

29. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున

30. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

 

ఇక అర్హులు కోసం చూస్తే సార్దీస్ సంఘం కోసం దేవుడు చెబుతూ వీరు అర్హులు అంటున్నారు ప్రకటన :4 ...

అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

ప్రకటన గ్రంథం 3: 5

జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.

 

    ఒక విషయం చెప్పనీయండి! నిజం చెప్పాలంటే దేవుడు కోరుకున్నది అంతటా అందరూ మారుమనస్సు పొందాలి! అందుకే తన రాకడను ఆలస్యం చేస్తున్నారు....

2పేతురు 3: 9

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 

అయితే ప్రజలు దీనిని గ్రహించక తమ స్వకీయ దురాశల వెంబడి పోతూ దేవుని మహిమ అనబడే నిత్యరాజ్యము నిత్యజీవమును కోల్పోతున్నారు! అలా దేవుడు అందరికోసం పరలోకం చేసినా అందరూ దానిలో ప్రవేశించడం లేదు!

 

Romans(రోమీయులకు) 3:9,10,11,12,19,20,22,23,24,25,26

9. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

11. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

కొలస్సీ 1:13—14

13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క (మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.

14. కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.

 

   అయితే నిజమైన విశ్వాసులు అలాగుండక అనగా మంచినేలమీద పడిన విశ్వాసులు అలాగుండక తమ ప్రవర్తన ద్వారా విశ్వాసం లో కొనసాగుతూ దేవుడు వారిని ఏరకంగా మార్చారో తమ జీవితాల ద్వారా అందరికీ చూపిస్తారు! అప్పుడు వారు వారు తాము దేవుని రాజ్యానికి తగిన వారు అని వారి జీవితాల ద్వారా అందరికీ నిరూపిస్తారు!

 

అందుకే మత్తయి 5:10 లో నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే అంటున్నారు! ఇంకా నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు! అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అంటున్నారు...(10,11 వచనాలు)

 

ఇక రోమా 8:17 లో మనం సంతానమైతే వారసులము అని చెబుతూ వారసులకు ఆస్తితో పాటు ఎలా హక్కులతో పాటు విధులు వస్తాయో, ఇంకా చెప్పాలంటే వారసులకు ఆస్తితో పాటు అప్పులు కూడా ఎలా సమానంగా పంచుకోవాలో అలాగే క్రీస్తు తో పాటుగా మనము వారసులము కాబట్టి ఆయన పడిన శ్రమలలో మనము కూడా ఆయనలా శ్రమలను అనుభవిస్తే మనము క్రీస్తుతో పాటుగా దేవుని వారసులం! అయన జతపనివారము అంటున్నారు! ...

రోమీయులకు 8: 17

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

  కాబట్టి విశ్వాసి శ్రమలను అనుభవించాలి!

ఇక ఎవరైతే ఆయన బిడ్డలను బాధిస్తారో వారికి దేవుడు తీర్పు తీర్చి ప్రతిఫలమివ్వడం కూడా ఆయన న్యాయమైన తీర్పు!  ఆయన తీర్పు కోసం ధ్యానం చేస్తే దేవుడు మోషే గారితో అంటున్నారుమిమ్మల్ని మిధ్యానీయులు నిర్నిమిత్తముగా బాధించారు కాబట్టి వారితో మీరు యుద్ధం చేసి వారికి ప్రతిఫలమివ్వండి అంటున్నారు! వెంటనే మోషేగారు యెహోషువా గారిని ఇంకా కొంతమందిని పంపించి వారిమీద ప్రతీకారం తీర్చుకున్నట్లు చూడగలం సంఖ్యా :1 — లో!

 

ద్వితీ 32:35 లో పగతీర్చుట నాపని అంటున్నారు.....

వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.

 

రోమా 12:19లో అదే విషయాన్ని ఎత్తి రాస్తున్నారు! మరలా దీనినే హెబ్రీ పత్రికలో కూడా 10:౩౦ లో చెబుతున్నారు.....

పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.

 

ఇంకా ద్వితీ 32:4

ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

 

కీర్తనలు 9: 16

యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్సెలా.)

 

కీర్తనలు 11: 6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

కీర్తనలు 11: 7

యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

 

యెషయా 30: 18

కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

 

దానియేలు 4: 37

ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.

 

ప్రకటన గ్రంథం 15: 3

వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు(అనేక ప్రాచీన ప్రతులలో-జనములకు అని పాఠాంతరము) రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;

ప్రకటన గ్రంథం 15: 4

ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

 

ప్రకటన గ్రంథం 16: 5

అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;

ప్రకటన గ్రంథం 16: 6

దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.

ప్రకటన గ్రంథం 16: 7

అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.

 

ఇక్కడ దేవుడు తను రెండు విధాలుగా తన న్యాయాన్ని చూపిస్తున్నారు ఒకటి పశ్చాత్తాప పడేందుకు నిరాకరించిన వారిని శిక్షించడం!

 

తనకోసం తనరాజ్యం కోసం బాధలు అనుభవించిన వారికి శాశ్వత జీవం శాశ్వత విశ్రాంతిని ఇవ్వడం!

 

రోమా 2:6—13 లో కూడా ఇదే రాస్తున్నారు!

6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

7. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

9. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.

10. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

11. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

12. ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

 

కాబట్టి ఆయన తీర్పులు ఎంతో న్యాయములు! ఆయన ఇచ్చే బహుమానాలు కూడా ఎంతో న్యాయమైనవి! అట్టి న్యామైన ఘనమైన దేవుణ్ణి నీతిగల మహారాజును అనుసరిస్తూ ఆయనకోసం సాక్షులుగా మరణపర్యంతరము కూడా జీవిద్దాం!

 

దైవాశీస్సులు!

   (ఇంకాఉంది)  

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*74 భాగము*

   2 థెస్స 1:5--10    

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకుంటున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

    గతభాగంలో శ్రమపరచు వారికి శ్రమ కలుగుతుంది అని చూసుకున్నాము! రోజు దేవుని నెరుగని వారికీ మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన కలుగుతుంది అనే విషయం కొద్దిగా ధ్యానం చేసుకుందాము! ఇక్కడ దేవుని నెరుగని వారికి ప్రతిదందన కలుగుతుంది అంటున్నారు. మరి దేవుని గురించి తెలుసుకున్న తర్వాత సువార్తను త్రోసివేస్తే ప్రతిదండన కలిగితే పర్వాలేదు గాని దేవుణ్ణి గురించి తెలియకుండా చనిపోతే ఎలా ప్రతిదండన కలుగుతుంది? ఇది న్యాయమా? దీనికోసం పౌలుగారు రోమా పత్రికలో చాలా విస్తారంగా చెప్పారు! ధర్మశాస్త్రం తెలియకుండా చనిపోయిన వారికి ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు తీర్చబడుతుంది! ధర్మశాస్త్రం కలిగి మరణిస్తే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చబడుతుంది అని........

రోమా  2:11,12,13,14,15,16

11. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

12. ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

14. ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.

15. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

16. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

 

అనగా దీని అర్ధము ఏమిటంటే మొదటగా: ఇందుకోసమే దేవుడు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి భాప్తిస్మము పొందువాడు రక్షించబడును నమ్మనివానికి శిక్ష విధించబడును అని చెప్పారు! మార్కు 16:1517 ...

 

కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారి చివరి ఆజ్ఞను పాటిస్తూ అన్యజనులైన వారందరికీ సువార్త ప్రకటించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది! ప్రియ చదువరీ! మీ ఇరుగుపొరుగు వారికి సువార్తను ప్రకటించావా లేదా? వారు నరకానికి పోతే ఆత్మకు ఉత్తరావాదివి నీవే అని మరచిపోవద్దు! పొరుగువారికి రక్షణ కోసం ఎడతెగక ప్రార్ధన చెయ్యాలి వారికి సువార్తను ప్రకటించాలి! వారు దేవుని నెరుగకుండా చనిపోతే వారికి ప్రతిదండన కలుగుతుంది అని లేఖనం ఇక్కడ సెలవిస్తుంది! వారిని నాశనమునకు దయచేసి పంపించవద్దు! క్రీస్తుని పరిచయం చేయకుండా వారిని దయచేసి చావనీయవద్దు!

 

      ఇక మరికొందరికి నిజ  దేవుని తెలుసుకోవాలి అనే ఆశ గాని కోరిక గాని ఉండదు! వారికి ఎప్పుడూ తిండిగోల, లేక ధన సంపాదన, లేక కామకోరికలు లేక మరో సంబంధమైన కోరికలే తప్ప నిజమైన దేవుడు ఎవరు? అనే ఆశ జిజ్ఞాశ ఉండదు! వీరికి దేవునితో సహవాసం కన్నా ఈలోకంలో గడపడమే, లేక పాపం చేయడం లోనే వారి మజా వెదుకుకుంటారు!  ఇలాంటివారి మీదికి తప్పకుండా దేవుని ఉగ్రత దిగివస్తుంది!

 

 యోహాను 3:19—20

19. తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

20. దుష్కార్యము చేయు (లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు (మూలభాషలో-తన క్రియలుగద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు.

 

రోమా 1:18—25

18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.

21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి.

23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

24. హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌.

 

ఎఫెసీయులకు 4:17,18,19

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

 

ఇక తర్వాత అంశము సువార్తకు లోబడని వారిమీదికి దేవుని ఉగ్రత వచ్చును! అనగా వీరి దగ్గరకు సువార్త వచ్చినా సువార్తను హేళన చేయడం, దిక్కరించడము, తృణీకరించడం చేస్తున్నారు అన్నమాట! వీరికి క్రీస్తుకి లోబడటం కన్నా పాపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు! క్రీస్తుయేసు మన పాపములకోసం మరణించి తిరిగి లేచారని నమ్మడం లేదు! నమ్మినా పెదాలమీద భక్తే గాని నిజమైన భక్తి కానేకాదు! వీటికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే

మత్తయి 7:21--24

21. ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

22. దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.

23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

 

రోమీయులకు 6: 17

మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

 

హెబ్రీయులకు 5: 8

ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.

 

1పేతురు 1: 22

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

 

1పేతురు 4: 17

తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?

 

    సువార్తను నమ్మితే దేవుని పట్ల విధేయత కలిగిస్తుంది! ఆయనకు ఇవ్వవలసిన గౌరవం మర్యాద నీవు ఆయనకు ఇవ్వగలవు! అంతేకాకుండా సువార్తకు విధేయత చూపడం వలననే విశ్వాసము నమ్మకము విధేయత మూడు కలుగుతాయి! వీటిని విడదీయడం కష్టం!

 

కాబట్టి ఎవరైతే సువార్తను వినినా గాని సువార్తకు లోబడకుండా అన్యాచారాలు చేస్తూ జీవిస్తుంటే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తారని మరచిపోవద్దు! అలాగే అందరు సువార్త వినేవిధంగా మనం మన ప్రవర్తన మార్చుకుని మొదటగా దేవుని బిడ్డలుగా ఉండటం కోసం మన ప్రవర్తన వస్త్రధారణ నడవడిక అన్నీ మార్చుకుని క్రీస్తుయేసుకు వలె పిలుపుకు తగినట్లుగా జీవిద్దాం!

 

దైవాశీస్సులు!     

  

(ఇంకాఉంది)

   

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*75 భాగము*

   2 తెస్స 1:5--10   

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకుంటున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

   దేవునినెరుగని వారికి సువార్తకు లోబడని వారికి శ్రమ కలుగుతుంది అని గతభాగంలో ధ్యానం చేసుకున్నాము!  ఇక తొమ్మిదో వచనంలో దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంచించబడుటకు ప్రభువు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన సువార్తకు లోబడరో, ఎవరైతే దేవుని బిడ్డలను శ్రమలకు శోధనలకు గురిచేస్తారో వారంతా ఆయన సముఖమునుండియు ఆయన ప్రభావమునందలి మహిమ నుండియు పారద్రోల బడి నిత్యనాశనము దండన పొందుతారు! ఎందుకంటే మేమిచ్చిన సాక్ష్యము మీరు నమ్మారు గాని వారు నమ్మలేదు అంటున్నారు! తొమ్మిదో వచనం కోసం తర్వాత ధ్యానం చేసుకుందాము! ముందుగా పదో వచనము ధ్యానం చేసుకుందాము!

 

   ఎవరైతే దేవునినెరుగకుండా జీవిస్తూ ఉంటారో, దేవుని సువార్త ప్రకటించినా గాని లెక్కచేయకుండా నిర్లక్ష్యం చేస్తారో ఇంకా దేవుని బిడ్డలను బాదిస్తారో వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారద్రోలబడి నిత్యనాశనము పొందుతారు అంటున్నారు!  ఎప్పుడు పొందుతారు అంటే తొమ్మిదో వచనం ప్రకారం ఆయన తన పరిశుద్ధులయందు మహిమ పరచబడేటప్పుడుఅనగా ఆయన రెండో రాకడలో వచ్చేటప్పుడు అన్నమాట!

 

   ఆయన సముఖమునుండి ఎందుకు పారద్రోలబడ్డారు అనగా మొదటగా వీరికోసం యెషయా గారు ముందుగానే ప్రవచించారు రెండో అధ్యాయంలో!  2:9,11,17,18,19,20,21

 

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

11.‌ నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20. దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

 

ఇంకా చెప్పాలంటే కీర్తన 5:4 ప్రకారం దేవుడు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు అంతేకాకుండా చెడుతనమునకు ఆయన యెద్ద చోటులేదు! వీరు చెడుతనము జరిగించే వారు కనుక వీరిని దేవుడు తన సముఖము నుండి వెల్లగొడుతున్నారు అన్నమాట!

 

ఇంకా దేవునికి వ్యతిరేఖముగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆయన సముఖమునుండి లేక సన్నిధి నుండి అగ్ని బయలు వెడలి కాల్చివేసినట్లు మనం పాతనిబంధన గ్రంధంలో చూసుకోవచ్చు!

లేవీ 9:24

లేవీ 10:2

 

ఇంకా ఎవరైతే దుష్క్రియలు చేస్తారో వారికి వ్యతిరేఖంగా ఆయన సన్నిధి లేస్తుంది అంటున్నారు కీర్తన 34:16లో!..

 

ఇక ప్రభావమునుండి ఎందుకు పారద్రోల బడ్డారు అంటే అయన పరిశుద్ధుడు గనుక కేవలం పరిశుద్ధులు మాత్రమే ఆయన సన్నిదిలోను ఆయన సముఖము లోను ఉండగలరు! దేవాదిదేవుడైన యెహోవా ఆజ్ఞా ఇచ్చుచున్నాడు అంటూ ఆయన ముందు అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండవాయువు విసరుచున్నది అంటున్నారు! కీర్తన 50:3; కాబట్టి అంతమహిమ గల దేవుడు ప్రభావం గల దేవుని సన్నిధిలో నిలవాలంటే పరిశుద్ధత కావాలి! సువార్తకు లోబడిన వారు అయ్యుండాలి! మరెవరు కూడా ఆయన సన్నిధిలో నిలువలేరు అన్నమాట!

 

       ఇంకా ఎందుకు వేరైపోతారు లేక పారద్రోల బడతారు అంటే మనకు ప్రకటన గ్రంధంలో చివరలో రెండు రకాలైన గుంపులు ఉన్నాయి గుంపులలోని వారెవరు కూడా పరలోకంలో ప్రవేశించలేరు. ప్రకటన గ్రంథం 21: 8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ప్రకటన గ్రంథం 22: 15

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

ఇంకా మరో గుంపు కొరింథీ పత్రికలో కనిపిస్తారు ......

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:9,10

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను

10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

 

కాబట్టి గుంపులో ఎవరున్నా గాని వారెవరు పరలోకపుటంచులు కూడా దరిచేరలేరు! నిషిద్ధమైనది ఏదియు అందులో ప్రవేశించలేదు ఇంకా అబద్దమును ప్రేమించి దానిని జరిగించువారు వెలుపల నుందురు అంటున్నారు! వెలుపల అనగా పరలోకం బయట! అనగా నరకంలో అన్నమాట! మాట జరుగబోయే సరికి భూమ్యాకాశాలు లేవు గనుక అయితే పరలోకంలో ఉండాలి లేదా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండాలి! వీటికి వారు అనర్హులు కాబట్టి వెలుపల అనగా నరకంలో పడి ఏడుస్తుంటారు అన్నమాట!

 

ఇంకా చెప్పాలంటే వారు దేనినుండి పారద్రోల బడతారు లేక వేరైపోతారు అంటే దేవుడిచ్చే నిత్య శాంతికి నిత్యానందము నుండి ఆయన ఆనందము నుండి వేరైపోతారు ఇంకా చెప్పాలంటే దేవుని నుండే వేరైపోతారు పారద్రోల బడతారు! ఎప్పుడైతే దేవున్నే తిరష్కరించారో వారికి పట్టే గతి నిత్య నాశనం లేక నిత్య నరకం అన్నమాట!

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మత్తయి 7:13...

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

 

పౌలుగారు అంటారు ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో వారు నాశనం అనే పంట కోస్తారు గాని ఆత్మానుసారంగా జీవిస్తే శాశ్వత జీవం అనేపంట కోస్తారు అంటున్నారు గలతీ 6:8

ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

 

ఫిలిప్పీ 3:19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

 

1తిమోతికి 6: 9

ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

 

కాబట్టి ఇదీ దేవుని నెరుగని వారికి, ప్రస్తుతం మనలను బాధపెట్టేవారికి, సువార్తను త్రోసివేసిన వారికీ పట్టే గతి! వారికే కాదు నమ్మి బాప్తిస్మం పొంది కడుగబడిన తర్వాత వాక్యాన్ని త్రోసివేసిన వారికి కూడా ఇదే గతి! చివరకి అధోగతే వారికి!

కాబట్టి నేడే రక్షణ పొందుదాము!

అయన బాటలో నడుద్దాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*76 భాగము*

*ప్రత్యక్షతలు-12*

   2 తెస్స 1:5--10   

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకుంటున్నాము!

 

   మనము ఇంతవరకు దేవుని నెరుగని వారికీ, సువార్తను అంగీకరించకుండా లోబడని వారికి, ప్రస్తుత విశ్వాసులను బాధించేవారికి కలిగే తీర్పుకోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము! ఇక మధ్యలో మనం వదిలేసిన రాకడ ప్రత్యక్షతలు కోసం ధ్యానం చేద్దాము!

 

     మొదటగా 5 వచనంలో దేవుని రాజ్యమునకు వీరు యోగ్యులయ్యారు శ్రమలను సహించడం ద్వారా అంటూ దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది అంటున్నారు!  దేవుని న్యాయమైన తీర్పు ఎప్పుడు కలుగుతుంది? ప్రకటన గ్రంధంలో దీనికోసం విస్తారంగా చెప్పబడింది!

 

మనకు రెండు తీర్పులు కనిపిస్తాయి జాగ్రత్తగా పరిశీలిస్తే- మొదటి తీర్పు : ఏసుక్రీస్తు ప్రభులవారి ఉపమానాల ప్రకారం – యజమాని తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయే ఉపమానాల ప్రకారం (మత్తయి 25:14--30) ఎవరైతే దేవునికోసం నీతిగా విశ్వాసంగా జీవిస్తారో ఇంకా పరిచర్య తాము పొందుకున్న తలాంతుల ప్రకారం ఎంత గొప్పగా దేవునికోసం వాడబడ్డావో ఎంతమందిని రక్షించావో ఎంతగా సాక్షిగా నిలబడ్డావో దాని ఆధారంగా ఎత్తబడిన అనంతరం దేవుడిచ్చే బహుమానాల తీర్పు! ఇది మొదటిది!  

 

ఇక  గొర్రెలు మేకలు వేరుచేసే ఉపమానం ప్రకారం (మత్తయి 25:31--44) మరియు ప్రకటన గ్రంధంలో వివరించబడిన దవళ సింహాసనం తీర్పు చివరది! (ప్రకటన 20:11--15)

అయితే ఇక్కడ పౌలుగారు మాట్లాడుచున్న తీర్పు దేనికి చెందుతుంది అంటే తప్పకుండా దవళ సింహాసనం తీర్పుకోసమే చెబుతున్నారు! తీర్పులో ఎవరైతే దేవుని సేవకులను విశ్వాసులను బాదిస్తారో వారికి, ఇంకా దేవుని నెరుగని వారికి ఇంకా సువార్తకు లోబడని వారికి ప్రతిదండన జరుగుతుంది అన్నమాట! ప్రతిదండన కలుగుతుంది అంటే నా తండ్రిచేత శపించబడినవారలారా! అంటూ సాతానుకి వాని దూతలకు సిద్దపరచబడిన నరకానికి  పొండి అంటారు! అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు! ఇదీ ప్రతిదండన!

అందుకే మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొండువారు రక్షించబడుదురు! నమ్మనివానికి శిక్ష విధించబడును అని యేసుక్రీస్తుప్రభులవారు తన చివరి ఆజ్ఞలో చెప్పారు! మార్కు 16:15--16;

 నమ్మని వానికి శిక్ష తప్పదు! దేనిని నమ్మని వానికి? సువార్తను నమ్మని వారికీ, యేసుక్రీస్తుప్రభులవారు మానవుల రక్షణార్ధం ఈలోకం వచ్చారని ఆయన ద్వారానే తప్ప పరలోకం పోవడానికి మరో మార్గం లేదు అని నమ్మని వారందరికీ శిక్ష ఉంది! అందుకే శిక్షనుండి మన బంధువులను మిత్రులను ఇరుగుపొరుగు వారిని మన గ్రామస్తులను రక్షించడానికి మనం తప్పకుండా సువార్తను ప్రకటించాలి! వారు నమ్మేలా భోధించడమే కాకుండా వారి రక్షణార్ధం ప్రార్ధించాలి భారముతో!

 

ఇక ఆరవ వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై..... అంటున్నారు!

ఇక్కడ చాలా విషయాలున్నాయి! ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో అంటున్నారు ...

యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు అనడానికి వచనం మరో ఋజువు! మనకు యేహెజ్కేలు గ్రంధంలో 1,10 అధ్యాయాలలో కనబడే దేవుని స్వరూప ప్రభావ దర్శనంలో కనబడే మహిమ ప్రభావము ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారికి కూడా ఉందని ఇక్కడ మాటలలో మనకు అర్ధమవుతుంది! ఆయనకు ప్రభావముంది మరియు పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నారు!

కీర్తనల గ్రంధంలో దేవాదిదేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటున్నారు ఆయన ముందు అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండవాయువు విసరుచున్నది అంటున్నారు.... 50:3,4

 

మోషేగారికి దేవుడు మొదట ప్రత్యక్షమైనప్పుడు అగ్నిజ్వాలల్లలో నుండి ఆయన ప్రత్యక్షమైనట్టు చూడగలం మనం నిర్గమ మూడో అధ్యాయంలో!...

నిర్గమకాండము 3: 2

ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.

 

ఏలియా మహాశయుని దేవుడు తనయొద్దకు పిలుచుకున్నప్పుడు అగ్ని రధములతో అగ్ని గుర్రాలతో తీసుకుని పోయినట్లు చూడగలం! 2రాజులు 2: 11

వారు ఇంక వెళ్లుచు మాటలాడు చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను

 

   ఇంకా ప్రకటన గ్రంధంలో మొదటి అధ్యాయంలో అగ్ని జ్వాలలవంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు అంటున్నారు! 1:14,15;  ఇంకా రెండో అధ్యాయంలో తుయతైర సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నారు అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడును అపరంజిని పోలిన పాదములు గలవాడు చెప్పు సంగతులేవనగా అంటూ తననుతానూ పరిచయం చేసుకుంటున్నారు! 2:18

కాబట్టి ఆయనకు ప్రభావముంది! అయన చుట్టూ అగ్ని మండుచున్నది! ఆయనే అగ్ని జ్వాలగా ఉన్నారు! ఇక తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేశారు అని చెబుతుంది బైబిల్! హెబ్రీ 1:7;

 అదే అగ్ని జ్వాలలలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో పరలోకం నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నారు అంటున్నారు!

 

మనం ఒకసారి యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన గొర్రెలు మేకలు ఉపమానం చూసుకుంటే మత్తయి సువార్త 25 అధ్యాయంలో అక్కడ కూడా ఆయన ఎలా భూలోకమునకు వస్తారో వ్రాయబడింది! 31, 32 వచనాలలో!

31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

32. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

 

మత్తయి 16:27

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

 

యూదా 1: 15

భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

 

కాబట్టి దేవుడు అతి త్వరలో తన వేవేల పరిశుద్ధులతో తన ప్రభావముతోను  ప్రధాన దూత శభ్ధముతోను తొందరలో రాబోతున్నారు! మరి నీవు ఆయనను ఎదుర్కోడానికి సిద్దముగా ఉన్నావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*77 భాగము*

*ప్రత్యక్షతలు-13*

   2 తెస్స 1:5--10  

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

  

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

   ఇక తొమ్మిదో వచనం ధ్యానం చేస్తే దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరియందు ప్రశంచించ బడుటకును ప్రభువు వచ్చినప్పుడు.....

దీనిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు తన పరిశుద్ధులయందు మహిమ పరచబడతారు అంటున్నారు. ఇంకా వారందరియందు ప్రశంసించబడతారు అంటున్నారు!

*దేవుడు మన బ్రతుకుల ద్వారా ఎప్పుడు మహిమ పరచబడతారు? ఎప్పుడు ఆయన నామం మనవలన ప్రశంసించబడుతుంది*

 అంటే *మన బ్రతుకులు బాగున్నపుడు ! మనం క్రీస్తుకోసం సాక్షులుగా జీవించినప్పుడు! ఇతరులు మనలో యేసుక్రీస్తుప్రభులవారిని గుర్తించినప్పుడు!*

 *ఎప్పుడు మనలో ఆయనను చూడగలరు*?

*ఆయనలా జీవించినప్పుడు ఆయనలా మాట్లాడినప్పుడు! ఆయనలా క్రీస్తుప్రేమను పంచినప్పుడు! ఆయనలా క్షమించగలిగినప్పుడు!  ఆయనలా ఆత్మపూర్ణులుగా బ్రతుకుతూ శరీరక్రియలు విడిచి పరిశుద్ధంగా జీవించినప్పుడు- మన బ్రతుకే ఒక క్రీస్తు కరపత్రంగా మారిపోయి అనేకులను క్రీస్తువైపు నడుపగలదు!*

 

  ఇంకా వచనంలో ప్రభువు వచ్చినప్పుడు అంటున్నారు... అనగా యేసుక్రీస్తుప్రభులవారు ఆర్బాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో మహా ప్రభావంతో తన మహిమతో వేవేల దూతలను వెంటబెట్టుకుని తన పరిశుద్ధులను వెంటబెట్టుకుని వస్తున్నారు అని ఇంతవరకు అనేకభాగాలలో ధ్యానం చేసుకున్నాము! 1థెస్స 4:16; అలా వచ్చినప్పుడు పరిశుద్దులకు గొప్ప మహిమా ప్రభావాలు కలుగుతాయి దేవునితో ఎల్లప్పుడూ నివాసం చేస్తారు- అదే సమయములో వాక్యానికి విరోధులు సువార్తకు లోబడని వారు తీర్పులు పొంది నరకంలో యాతన పడతారు అన్నమాట!

 

   ఇక ఆయన మహిమ కోసం ధ్యానం చేస్తే నిర్గమ కాండములో అంటున్నారు ఫరో సైన్యాన్ని నాశనం చేసి దానిద్వారా నేను మహిమ తెచ్చుకుంటాను అంటున్నారు! అనగా శత్రువులపై విజయాన్నిచ్చి తనకు మహిమ తెచ్చుకుంటారు. 14:4

ఇంకా నిర్గమ కాండంలో అనేకసార్లు ఆయన మహిమ ప్రజలకు కనపడినట్లు చూడగలం!

దేవుని ప్రజలకు విరోధంగా ఎవరైనా నిలబడితే ఆయన తన పక్ష్యమున ఉన్నవారికోసం తన మహిమను ప్రదర్శించి వారికి అనగా దుష్టులకు బుద్ధిచెప్పేవారు. సంఖ్యా 16:19, 20:6

 

అంతేకాదు దేవుడు ఇచ్చే రక్షణ వలన మనుష్యులకు మహిమ కలుగుతుంది. కీర్తన 21:5

నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి యున్నావు.

 

కీర్తనలు 50: 23

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

 

కీర్తనలు 85: 9

మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

 

కీర్తనలు 97: 6

ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది

 

యెషయా 4: 6

మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

 

యెషయా 40: 5

యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

 

ఇక యేహెజ్కేలు గ్రంధంలో మొదటి అధ్యాయం , తొమ్మిది, పది పదకొండు అధ్యాయాలలో దేవుని మహిమ కెరూబుల మీదను మందిరపు గడపల యొద్దను ఉన్నట్లు చూడగలము!

యెహేజ్కేలు 9: 3

ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా

 

యెహేజ్కేలు 10:4,18,19

యెహేజ్కేలు 11:23

 

హబక్కూకు 3: 3

దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయుచున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.

    అందుకే అదే మహిమతో నేను మరలా రాబోతున్నాను అంటూ యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెప్పారు!

మత్తయి 16: 27

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

 

     ఇంకా ఆయనకు ఎలా మహిమ కలుగుతుంది అంటే ఆయన చేసే అద్భుతాల వలన మహిమ కలుగుతుంది దేవుడికి! యోహాను 11:4

ఇంకా మనము నమ్మగలిగితే దేవుని మహిమ చూడగలము! 11:40

రోమా 8:17లో ఒక ఆశ్చర్యమైన సంగతి చెబుతున్నారు ...

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

8:30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

కొలస్సీయులకు 1: 27

అన్యజనులలో మర్మముయొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు మర్మమును వారికి బయలుపరచెను.

 

హెబ్రీయులకు 1: 3

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

హెబ్రీయులకు 1: 4

మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.

 

1పేతురు 4: 13

క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

 

   కాబట్టి మన దేవుడు మహిమ గలవాడు! ప్రభావము గలవాడు! కాబట్టి ఆయనెవరో ఎందుకు వచ్చారో తెలిసు కాబట్టి పిలుపుకు తగిన జీవిద్ధాము! ఆయన పొందుకున్నట్టి మహిమను ప్రభావాలను పొందుకుని ఆయనకు సాక్షులుగా జీవిద్ధాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*78 భాగము*

*పౌలుగారి ప్రార్ధన --*

2 థెస్స 1:11—12

11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.   

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకున్నాము! ఇక అధ్యాయం చివరలో పౌలు గారి ప్రార్ధన కనిపిస్తుంది! దానిని ధ్యానం చేసుకుందాము!

 

పౌలుగారు ప్రతీ పత్రికలోను ప్రత్యేకమైన ప్రార్ధనలు చేశారు. అవి భూలోక సంబంధమైన విషయాలు కోసం కాదు గాని ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కోసం ప్రార్ధన చేసినట్లు అనేకసార్లు ధ్యానం చేసుకున్నాము! ఇక పత్రికలో పౌలుగారు దేనికోసం ప్రార్ధన చేశారో థెస్సలోనికయ సంఘం కోసం ధ్యానం చేసుకుందాము!

 

 పదకొండవ వచనం: అందువలన మన దేవునియొక్కయు  ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసునామనును , ఆయన యందు మీరును మహిమ పొందునట్లు......

ఇక్కడ చూశారా వచనంలో ఆయన ప్రార్ధన:

మొదటగా: దేవుని కృప చొప్పున ప్రభువైన క్రీస్తుకృప చొప్పున మీ యందు అనగా మనయందు లేక థెస్సలోనికయ సంఘంలో ప్రభువైన యేసునామము మహిమ పరచబడాలి;

రెండవది: ఆయన యందు మీరు కూడా మహిమ పరచబడాలి అనేది ఆయన మొదటి ప్రార్ధన అధ్యాయంలో!

లోక సంబంధమైన ఏదో విషయంలో మీకు మంచిపేరు గొప్ప కలగాలని కోరుకోవడం లేదు గాని మీ బ్రతుకుల ద్వారా మనయందు దేవుని నామము మహిమ పరచబడాలి అనేది పౌలుగారి ప్రార్ధన!

ఇక రెండవది ఆయనద్వారా మనము కూడా మహిమపొందాలి అనేది పౌలుగారి ప్రార్ధన!

 

  ఒక్కసారి ఆలోచిద్దాము! *మనయందు లేక మనద్వారా ఏరకంగా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది?*

గతభాగంలో చెప్పుకున్నాము-- ?

*ఎప్పుడు ఆయన నామం మనవలన ప్రశంసించబడుతుంది లేక మహిమ పరచబడుతుంది  అంటే మన బ్రతుకులు బాగున్నపుడు ! మనం క్రీస్తుకోసం సాక్షులుగా జీవించినప్పుడు! ఇతరులు మనలో యేసుక్రీస్తుప్రభులవారిని గుర్తించినప్పుడు! ఎప్పుడు మనలో ఆయనను చూడగలరు? ఆయనలా జీవించినప్పుడు ఆయనలా మాట్లాడినప్పుడు! ఆయనలా క్రీస్తుప్రేమను పంచినప్పుడు! ఆయనలా క్షమించగలిగినప్పుడు!  ఆయనలా ఆత్మపూర్ణులుగా బ్రతుకుతూ శరీరక్రియలు విడిచి పరిశుద్ధంగా జీవించినప్పుడు- మన బ్రతుకే ఒక క్రీస్తు కరపత్రంగా మారిపోయి అనేకులను క్రీస్తువైపు నడుపగలదు!*

 

  మరి ఇది సాధ్యమా? అంటే సాధ్యమే! నోవాహు గారు అతి భయంకరమైన చెడ్డతరంలో జీవించినా గాని నోవాహు తరంలో నీవే నీతిమంతుడుగా కనబడ్డావు అని దేవునిచేతనే పిలువబడ్డారు అంటే అంట నీతిమంతుడుగా జీవించి ఆయన ద్వారా తన చిత్త ప్రకారం ఓడ కట్టుకుని జలప్రళయం ద్వారా తనకు మహిమను తెచ్చుకున్నారు దేవుడు! ఆయన ద్వారా అనగా  నోవాహు గారి ద్వారా దేవుడు మహిమ పరచబడ్డారు ఇక దేవుని ద్వారా నోవాహు గారికి ఘనత కలిగింది! అనగా ఇక్కడ నోవాహు గారి నీతి ఘనతను మహిమను తెచ్చిపెట్టింది!

 

యోసేపు గారు అవకాశం కలిగినా దేవునికి, కుటుంబానికి, తన ఘటముకు కళంకం కలుగుకుండా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయారు! తద్వారా అనేక సం.లు జైలులో చేయని నేరానికి శిక్ష భరించారు! చివరకు ఒకరోజు భక్తి, యధార్ధత ద్వారా మొదటగా దేవునికి మహిమ కలిగింది నిగూఢమైన కలలకు భావం చెప్పడం ద్వారా! ఇక దేవుని ద్వారా యోసేపు గారికి కూడా ఘనత కలిగింది! ఇక్కడ యోసేపు గారి పవిత్రమైన జీవితం మహిమను ఘనతను తెచ్చిపెట్టింది!

 

     అబ్రాహాము గారిని దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే నాకేమిటి అనే ప్రశ్నలు అడగకుండా సంపూర్ణ విధేయతతో పరిపూర్ణ విశ్వాసంతో అడ్రస్ తెలియని దేశానికి తరలిపోయారు! అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది! కుమారున్ని సంపాదించుకున్నారు! వాగ్ధానములకు వారసుడయ్యారు! విశ్వాసులకు తండ్రిగా దీవించారు దేవుడు! ఇక్కడ ఆయన విశ్వాసం మహిమను ఘనతను తెచ్చిపెట్టింది!

 

  మోషేగారిని నా బిడ్డలను దాస్యం నుండి విడిపించమంటే మొదటగా సాకులు చెప్పినా ఒకసారి మైదానంలో అడుగుపెట్టిన తర్వాత వెనుక తీయకుండా ఒకప్రక్క ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంతో తలపడి, మరోవైపు తనసొంత జనులే సూటిపోటు మాటలు అన్నా సహించి సహనము కల్గి ఉన్నారు! మోషేగారిని ఉపయోగించుకుని దేవుడు ఎర్రసముద్రాన్ని పాయలు చేశారు! బండనుండి నీళ్ళు రప్పించారు! పగలు మేఘ స్తంభము లోను రాత్రి అగ్ని స్తంభంలోను ఉంటూ తన ప్రజలను నడిపించారు! ఇక్కడ దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపించి అనేకమైన అసాధారమైన అద్భుతాలు జరిగేలా చేయగలిగారు!

 

   ఇక ఆయన శిష్యుడు యెహోషువా గారు గురువుగారి అడుగుజాడలలో నడుస్తూ సమయం దొరికితే దేవుని ప్రత్యక్ష గుడారంలో గడుపుతూ గురువు గారి పాదాల దగ్గర భక్తి, విధేయత, లోబడుట నేర్చుకుని దేవుని ద్వారా మరియు గురువుగారి ద్వారా అదే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా చేయబడి శత్రువులే లేని నాయకుడుగా పరిడవిల్లి 23 రాజులను నేలనాకించిన గొప్ప నాయకుడు కాగలిగారు! యోర్దాను నదిని పాయలు చేయగలిగారు! సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ఒక మనిషి సూర్యచంద్రులను శాసిస్తే ఒక్క దినమెల్లా ఆజ్ఞను అతిక్రమించడానికి తొందరపడలేదు అట!

యెహోషువ 10: 12

యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.

యెహోషువ 10: 13

సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.

యెహోషువ 10: 14

యెహోవా ఒక నరుని మనవి వినిన దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.

 

 ఎంత ఆధిక్యత అండి అది! రకంగా దేవునికి మహిమ తెచ్చారు యెహోషువా గారు! అలాగే దేవునికి లోబడి పరిపూర్ణ విధేయత చూపించడం వలన యెహోషువ గారు మహిమను ఘనతను పొందుకున్నారు!

 

  ఇక అనేకమంది భక్తులు తమ జీవితాల ద్వారా దేవునికి లోబడుట ద్వారా దేవునికి మహిమను తెచ్చారు! దావీదుగారు ఆయన గురువుగారు సమూయేలు గారు దేవునికి ఎంత ఘనతను మహిమను తెచ్చారు మనకు తెలుసు! దానియేలు గారు షడ్రాక్ మేషాక్, అబెద్నేగో గార్లు తన ఘటమును కాపాడుకుంటూ అపవిత్రమైనవి తమకు అంటకుండా చూసుకుంటూ ఎంతటి ఆసాధారమైన అద్భుతాలు చేసి దేవునికి మహిమను తెచ్చిపెట్టారో మనకు తెలుసు! సింహాల్ల నోర్లు మూశారు! అగ్ని బలమును చల్లార్చారు! ఇంకా పాతనిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు తమ జీవితాలు దేవునికి సమర్పించుకుని దేవునికోసం నిలబడి అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా సిద్దపడ్డారు! తద్వారా దేవుని ఎంతటి మహిమను ఘనతను తెచ్చిపెట్టారో చూడగలము! అంతేకాకుండా భక్తులు దేవునికోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు కూడా వారికి మహిమను ఘనతను ఇచ్చారు!

 

   అదేవిధంగా ఇప్పుడు పౌలుగారు కూడా అంటున్నారు మీరు కూడా అదేవిధంగా భక్తుల వలె జీవిస్తూ మొదటగా మీయందు మన ప్రభువైన యేసునామము మహిమ పరచబడాలి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు మీరు కూడా మహిమ పరచబడాలి అంటున్నారు!

 

       గతభాగంలో ఆయనకు ఎలా మహిమ వస్తుందో కొన్ని రిఫరెన్సులు చూసుకున్నాము!

కీర్తనలు 21: 5

నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి యున్నావు.

 

కీర్తనలు 50: 23

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

 

కీర్తనలు 85: 9

మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

 

యోహాను 11:40 నమ్మితే దేవుని మహిమను చూస్తావు!

 

మనము బహుగా ఫలిస్తే ఆయన నామము మహిమ పరచబడుతుంది! యోహాను 15:8

 

యేసుక్రీస్తు ప్రభులవారు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి దేవుని మహిమ పరచారు! యోహాను 17:4

 

దేవునితో పాటు శ్రమలను అనుభవిస్తే ఆయన మహిమలో వారసులు అవుతాము రోమా 8:17

 

దేవునికి యోగ్యముగా పరిచర్య చేస్తే దేవుణ్ణి మహిమపరస్తున్నారు

2 కొరింథీ 9:13

 

కాబట్టి మన బ్రతుకుల యందు ఆయనకు మహిమను తెచ్చిపెడదాము!

ఆయనను మహిమ పరుద్ధాము!

ఆయనకు సాక్షులుగా సాగిపోదాము!

(ఇంకాఉంది)

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*79 భాగము*

*పౌలుగారి ప్రార్ధన --4*

   2 థెస్స 1:11—12    

11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.   

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము పౌలుగారి ప్రార్ధన కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

  ఇక పన్నెండో వచనంలో మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతీ కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుచున్నాను అంటున్నారు!

 

   ప్రియులారా! చివరి వచనంలో పౌలుగారు మూడు విషయాల కోసం ప్రార్ధన చేస్తున్నారు!

 

మొదటిది: మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతీ ఆలోచన సఫలం అవ్వాలని,

రెండవది: విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలని;

మూడవది: మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి!!!

 

మొదటిది: *మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతీ ఆలోచన సఫలం కావాలి!*

చూడండి ప్రియులారా! పౌలుగారు ఎలాంటి ప్రార్ధన చేస్తున్నారో! గమనించాలి! వీరికి అనగా సంఘానికి మేలు చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టే ఆలోచన సఫలం కావాలని పౌలుగారు నిండుమనస్సుతో దేవునికి వారి పక్ష్యంగా ప్రార్ధన చేస్తున్నారు! అసలు అలాంటి ఆలోచన వారికి లేకపోతే పౌలుగారు ఎలా ప్రార్ధన చెయ్యగలరు?

 ప్రియ సంఘమా! మీలో ఇతరులకు మేలుచేయాలనే కోరిక ఉందా? అవసరాలలో ఉన్నవారికి, దిక్కులేని వారికి, నిరాశ్రయులకు, విధవరాల్లకు మేలు చేయాలనే ఆశ-- జిజ్ఞాశ మీలో ఎవరికైనా ఉందా? సంఘమంతటికీ ఇలాంటి ఆశ ఉంది! అందుకే దీనిని చూసి వారి కాపరి పొంగిపోతూ దేవునికి ఇంకా పట్టుదలతో ప్రార్ధన చేస్తున్నారు!

మనము మొదటి పత్రిక నుండి చూసుకుంటే వీరు కేవలం వారికోసమే కాకుండా ఇతరులకోసం కూడా ప్రార్ధన చెయ్యడమే కాకుండా ఇతరులకు సహాయం చెయ్యడం మొదలుపెట్టారు! దానికోసం పౌలుగారు అంటున్నారు: అది మీరు మాదగ్గరనుండి నేర్చుకోలేదు గాని దేవుని నుండే మీరు నేర్చుకున్నారు అంటున్నారు....

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:9,10,11

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు,

11. సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,

 ఇంకా అది మీనుండి మాసిదోనియా అంతా మ్రోగింది అంటున్నారు....

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 1:7,8

7. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

8. అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.

 

ఇక తర్వాత పౌలుగారు మీరు ఒకనిఎడల ఒకడు ప్రేమ చూపిస్తూ అది విస్తరించాలి- లేక ప్రేమయందు విస్తరించాలి అని పత్రిక రాస్తే దానిని తు.. తప్పకుండా పాటించారు అంటున్నారు మీదన మూడో వచనంలో!....

1థెస్స 3:13

13.మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:3

3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

 

   కాబట్టి మంచి పనులు అన్నిటిలోనూ వీరు ఎంతో మాదిరిగా జీవిస్తున్నారు కాబట్టి వారు చేసే మంచి ఆలోచనలు లేక మేలు చేయవలెనని వారు చేసే ప్రతీ మంచి ఆలోచన సఫలం కావాలని దేవునికి ప్రత్యేకంగా ప్రార్ధన చేస్తున్నారు పౌలుగారు!

 

 ప్రియ సంఘమా! నీకు ఇలాంటి మంచి ఆలోచనలు, మేలు చేయాలనే తాపత్రయం ఉందా?  క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై! 2:20;

 కాబట్టి ఏదో పెదాలతో పప్పలు వండినట్లు కాకుండా మనసా వాచాః కర్మేనా ఆయన మాటలను అనుసరిస్తూ మేలు చేయడానికి ఇతరులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉందాము! లేకపోతె మ్రోగెడు కంచును గణగణలాడు తాళం అని మర్చిపోవద్దు!

 

రెండవది: *విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలని*;

చూశారా ఇక్కడ! విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము కూడా మీరు బలముతో సంపూర్ణంగా చెయ్యాలని ప్రార్ధన చేస్తున్నారు! లోక సంబంధమైన కార్యములు కాదు, విశ్వాస యుక్తమైన కార్యములు మీరు బలముతో అది పూర్తి అయ్యేవరకు చేస్తుండాలి అంటున్నారు!

 

అసలు అలాంటి ఉద్దేశాలు పుట్టించేది దేవుడే!

ఫిలిప్పీ 2:13

ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

 

ఎఫెసీ 2:10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

అయితే దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగేది స్తిరపరచేవాడు దేవుడు మాత్రమే!

 

అయితే  నేటి దినాలలో అనేకసంఘాలలో దేవునికి మహిమను తెచ్చే క్రియలు తగ్గిపోయి, తమకు పేరు తెచ్చే క్రియలు ప్రోగ్రాం లు చేస్తున్నారు! అవి సువార్త వ్యాప్తికి గాని అన్యులను రక్షించడానికి గాని పనిచేయవు! కేవలం వారి గొప్ప కోసం! అనగా పాష్టరేట్ కమిటీ గొప్పకోసం!

 

 ఉదాహరణకు: క్రిస్మస్ పండుగ సందర్భంగా  కొన్ని లక్షలు ఖర్చుపెట్టి చర్చికి లైటింగ్ లు పెడుతూ, డెకరేషన్ చేస్తున్నారు! దీనివలన దేవునికి మహిమ వస్తుందా? లేదు కదా! కేవలం సంఘం క్రిస్మస్ ఇంత గొప్పగా చేసుకున్నారు, లేదా అన్ని సంఘాలకంటే మనమే క్రిస్మస్ గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాము అని బుజాలు ఎగరేయడానికి! దాని బదులు దిక్కులేని వారికి, దీనులకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు పంచి క్రీస్తుప్రేమను పరిచయం చేస్తే ఒకరైనా రక్షించబడవచ్చు! ఇవన్నీ వేస్ట్ లేదా వ్యర్ధమైన ఖర్చులు! దేవుని డబ్బులు పనికిమాలని విషయాల కోసం ఖర్చు పెడుతున్నారు!

 

మరొకటి: క్రిస్మస్ సందర్బంగా సినిమా స్టైల్ లో డేన్స్లు, నాటికలు! మూర్ఖులైన తరమువారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తలులు వీరికి హెచ్చరిస్తే, (అపో.కార్యములు 2: 40

ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చిమీరు మూర్ఖులగు (మూలభాషలో-వంకరైన) తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.)

 అదే మూర్ఖులైన తరము వారిని రప్పించుకుని వారితో డేన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చెయ్యించుకుని అన్యులు కూడా వెయ్యలేనంత సినీ స్టెప్పులు, అన్యులు కూడా చేయలేనంత భయంకరమైన వస్త్రధారణ చేస్తూ దేవుని నామమునకు మహిమను తేకుండా దేవుని నామమునకు అవమానం తెస్తున్నారు! అందుకే కదా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు: మీ నిమిత్తమే కదా అన్యజనుల ఎదుట నా నామము అవమానం కలుగుతుంది.....

యెషయా 52: 5

నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

 

రోమీయులకు 2: 24

వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?

 

 కాబట్టి ప్రియ సంఘమా! ఇలాంటి పనికి మాలిన పనులు కాకుండా దేవునికి మహిమను తెచ్చే విశ్వాస యుక్తమైన కార్యములు తలపెట్టి వాటిని సంపూర్తి చెయ్యమని పౌలుగారు మనకు హితవు పలుకుతున్నారు! అక్కడ థెస్సలోనికయ సంఘముకోసం వారు చేసే విశ్వాస యుక్తమైన కార్యాలు బలముతో అవి సంపూర్ణం అయ్యేలాగ వారు చేసేలా  ఎంతో పెనుగులాడుతూ ప్రార్ధిస్తున్నారు పౌలుగారు!

 

కాబట్టి ప్రియ సంఘమా! పౌలుగారు కోరుకున్నట్లు, థెస్సలోనికయలు చేసినట్లు విశ్వాస యుక్తమైన కార్యాలు చేద్దాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*80 భాగము*

*పౌలుగారి ప్రార్ధన --5*

   2 థెస్స 1:11—12  

 11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.   

          ప్రియ దైవజనమా!   మనము పౌలుగారి ప్రార్ధన కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

  ఇక పన్నెండో వచనంలో మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతీ కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకోరకు ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుచున్నాను అంటున్నారు!

 

   ప్రియులారా! చివరి వచనంలో పౌలుగారు మూడు విషయాల కోసం ప్రార్ధన చేస్తున్నారు!

 

మొదటిది: మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతీ ఆలోచన సఫలం అవ్వాలని,

రెండవది: విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలని;

మూడవది: మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి!!!

 

     (గతభాగం తరువాయి)

 

     మూడవది: *మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి!*

మీరు యోగ్యులుగా జీవించాలి అనడం లేదు! మీరు చేసే పనులు వలన దేవుడే మిమ్మును యోగ్యులుగా ఎంచాలి అంటున్నారు! ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుడు తాను భూమిమీద నరులను చేసినందుకు ఎంతో సంతాపపడ్డారట! అంత భయంకరమైన పాపభూయిష్టమైన జీవితం వారు జీవించారు నోవాహు తాత గారి కాలంలో! (ఆది 6:5,6)

 

యెషయా ప్రవక్తగారి కాలంలో ఆకాశమా ఆలకించు! భూమి చెవియొగ్గు! నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను గాని వారు నామీద తిరగబడ్డారు అని బాధపడుతూ దూతలతో చెప్పుకుంటే పరువుపోతుంది అని తన బాధను ఎవరికీ చెప్పాలో అర్ధం కాక భూమికి ఆకాశమునకు చెప్పుకుంటున్నారు! అంత భయంకరమైన పాపభూయిష్టమైన స్తితిలో యెషయా గారి సమయంలో ప్రజలు ఉన్నారు! (1:2--4)

 

  ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటును దేవుడు తట్టుకోలేక ఒక్క నిమిషం నీవు ప్రక్కకు రా! వీరందరినీ మాడిమసి చేసేస్తాను అన్నారు మోషే గారితో దేవుడు! అందుకే మోషేగారు మోకరించి కన్నీటితో అయ్యా అలా చేయకు! అంటూ... బ్రతిమిలాడుకొని చివరకు అంటున్నారు మోషేగారు నీ నిర్ణయం కోసం సంతాపపడు అంటున్నారు! ఇంతగా దేవునికి చిరాకు తెప్పించారు! మాటిమాటికి దేవునికి కోపం తెప్పించేవారు ఇశ్రాయేలు ప్రజలు!

 

చివరకు వారు చెరలోనికి పోయే ముందు కేవలం ఇశ్రాయేలు ప్రజలే కాదు, వారి నాయకులు, రాజులు, వారి యాజకులు, ప్రవక్తలు అందరూ దేవునికి దూరమైపోయి దేవుని న్యాయమైన తీర్పును ఎక్కువ చేశారు!  ఇశ్రాయేలు ప్రజలను తనకు స్వకీయమైన జనముగా తన సొత్తుగా చేసుకున్నాను! నాకోసం పిలుచుకున్నాను అని ఎంతో గొప్పగా చెప్పుకున్న దేవుడు ఇప్పుడు తనే వీరిని చెరలు పాలు చేసి వారిని సర్వనాశనం చేసేటంత కోపం ఎందుకు తెచ్చుకున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలు వారిని దేవుడు  పిలుచుకున్న పిలుపుకు తగ్గట్టుగా బ్రతుకక, అన్య దేశస్తుల వలె జీవిస్తూ, అన్యుల కంటే ఘోరంగా దేవునికి వ్యతిరేఖంగా జీవించారు! దేవుని న్యాయమైన కోపాన్ని రేపారు! చివరకు అనుభవించారు!

 

అదేవిధంగా ప్రియ దేవుని జనాంగమా! నీవు పిలిచిన పిలుపుకు తగ్గట్లుగా జీవిస్తున్నావా?

 

పౌలుగారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నారు

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

ఇక రోమా 1:7లో అంటున్నారు ....

మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.

 

రోమీయులకు 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

ఫిలిప్పీ 1:27 లో అంటున్నారు ....

నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

 

కొలస్సీయులకు 1: 10

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

కొలస్సీయులకు 1: 11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

కొలస్సీయులకు 1: 12

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో-మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

 

  అసలు అలా అనడానికి కారణం పేతురు గారు రాస్తున్నారు: మీరు వెండి బంగారం లాంటి వెలగల వస్తువుల ద్వారా విమోచించ బడలేదు గాని అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడ్డారు అంటున్నారు....

1 Peter(మొదటి పేతురు) 1:18,19

18.పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19.అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

అందుకే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అంటున్నారు....

2పేతురు 1: 10

అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

 

   ఇంకా అంటున్నారు మీరు సామాన్యులు కాదు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని మిమ్మల్ని దేవుడు ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా చేసుకుని పరలోక ఆశీర్వాదాలకు పాత్రులుగా చేశారు కాబట్టి మీ పాతజీవితాన్ని వదలి క్రీస్తుకోసం జీవించండి అంటున్నారు....

1 Peter(మొదటి పేతురు) 2:9,10,11,12

 

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

11 .ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును విషయములో దుర్మార్గులని దూషింతురో, విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

   పౌలుగారు ఇంకా విస్తారంగా రాస్తూ ఒకనాడు మీరు ప్రజకాదు, ఇప్పుడైతే ఆయన మిమ్మును పిలుచుకుని ఏర్పాటు చేసుకుని  ఇశ్రాయేలు ప్రజలతో సమానమైన వారసులుగా చేశారు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేఖంగా జీవిస్తే కత్తిరించి పారేశారు, వారు స్వాభావికమైన కొమ్మలు, మీరైతే అంటుకట్టబడిన వారు, వారిని పీకేసిన దేవుడు మిమ్మును కూడా పీకి పారేయ్యగలరు కాబట్టి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఆయన మిమ్మును పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించమంటున్నారు!

 

Romans(రోమీయులకు) 11:17,18,19,20,21,22,23,24,25,26,27,30,31,32

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికి వేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవచెట్టున అంటు కట్టబడరా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.

31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

32. అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.

 

కాబట్టి ప్రియ సంఘమా! నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నావా? సంసోను గారు తాను పిలువబడిన పిలుపు నాజీరు చేయబడి దేవునికోసం ప్రత్యేకంగా జీవించాలి! గాని స్త్రీ లోలుడై , దేవుడు చెప్పిన ఆజ్నలను మరచిపోగా కళ్ళు పీకించుకుని భయంకరమైన చావు తెచ్చుకున్నారు! తన ఉత్తమమైన పిలుపును మరచిపోయారు కాబట్టే ఆయనకు ఇంత ఘోరమైన తీర్పు! యోసేపు గారికి తాను ఎవరు? ఎలా జీవించాలి అనేది ఖచ్చితంగా తెలుసు కాబట్టి పిలుపుకు తగిన జీవితం జీవించి ఫలించే కొమ్మ అయ్యారు!

 సోలోమోను గారు తాను పిలువబడిన పిలుపును మరచిపోయి కామాతురత గలవాడై ఉంచుకుంటూ వచ్చి, బ్రష్టుడైపోయి దేవుని రక్షణను కోల్పోయారు!

గేహాజీ తానూ పిలువబడిన పిలుపును తృణీకరించి ఏదైనా సంపాదించుకుంటాను అని ధనముకై పరుగెత్తి కుష్టు రోగము సంపాదించుకున్నాడు! ఇలా అనేకమైన ఉదాహరణలు కనిపిస్తాయి మనకు బైబిల్ లో!

కాబట్టి ఆయన పిలుపుకు మనము యోగ్యులుగా మారాలి! ఎలా మారగలము? యోగ్యమైన జీవితం, పౌరుషం గల జీవితం క్రీస్తుకై జీవించినప్పుడే మనము దేవుని దృష్టికి యోగ్యులుగా మారగలము ! ఇదే పౌలుగారు సంఘము కోసం ప్రార్ధన చేస్తున్నారు! మనము కూడా అదేరకమైన జీవితం పౌరుషమైన జీవితం జీవించి యోగ్యులుగా మారి దేవునికి ప్రియమైన కుమారకుమార్తెలుగా మారిపోదాం!

ఆయన రాజ్యానికి వారసులమవుదాం!

ఆమెన్!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*81 భాగము*

*ప్రత్యక్షతలు  --14*

   2 థెస్స 2:1—2   

1. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల

2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.   

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా!   ఇంతవరకు మనము రెండో పత్రిక మొదటి అధ్యాయం నుండి ఎన్నో విషయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక రెండో పత్రిక రెండో అధ్యాయం మొత్తం యేసుక్రీస్తుప్రభులవారి రాకడను గూర్చిన ప్రత్యక్షతలు మనకు కనిపిస్తాయి! వాటికోసం ధ్యానం చేద్దాము!

 

  రెండు వచనాలు చూసుకుంటే సహోదరులారా! ప్రభువు దినము ఇప్పుడే వచ్చి యున్నట్లుగా ఆత్మవలనైనను మాటల వలనైనను, లేక మా యొద్ద నుండి వచ్చినదని చెప్పే పత్రికలవలనైనను ఎవడైనా చెబితే నమ్మొద్దు అంటున్నారు!

 

  రెండో పత్రిక ఉపోద్ఘాతములో చెప్పడం జరిగింది! కొంతమంది అబద్ద బోధకులు పొట్టకూటి కోసం ఎన్నెన్నో తప్పుడు బోధలు చేస్తూ వీరిని ఎంతగానో కంగారు పెట్టడం జరిగింది! కొందరైతే యేసయ్య రాకడ జరిగిపోయింది అని చెప్పారు! దానిని వారు నమ్మకపోతే పౌలుగారు రాసినట్లు దొంగ ఉత్తరాలు రాసి సంఘస్తులకు పంపించారు! అప్పుడు వీరంతా ఎంతో కంగారుపడ్డారు! అందుకే ఉత్తరం వివరంగా రాస్తున్నారు!

 

  ప్రభువు దినమిప్పుడే వచ్చినట్లుగా మొదటగా ఆత్మవలన గాని,

రెండు: మాట వలన గాని,

మూడు: మా యొద్ద నుండి వచ్చింది అని చెప్పే పత్రికవలన గాని ఎవడైనా చెబితే నమ్మొద్దు అంటున్నారు!

 

మొదటగా: *ప్రభువు దినము వచ్చేసింది గడిచిపోయింది* అని చెబితే నమ్మొద్దు! ఆత్మవలన ఎలా జరుగుతుంది? గమనించాలిపరిశుద్ధాత్ముడు జరిగేవి జరగబోయేవి తెలిపేదేవుడే గాని ఇలాంటి తప్పుడు బోధలు చెయ్యడు! అంటే ఎవరో కావాలనే తప్పుడు ప్రవచనాలు చెప్పి తప్పుడు బోధలు చేస్తున్నారు అన్నమాట! యెహోషపాతు రాజు కాలంలో, యిర్మియా గారి కాలంలో అనేకమైన అబద్ద ప్రవక్తలు లేచి పొట్టగడవడం కోసం తప్పుడు ప్రవచనాలు, అబద్ద ప్రవచనాలు చెప్పేవారు! రకంగా ఇశ్రాయేలు ప్రజలను, రాజులను మోసగించి వారు చెరలోకి పోవడానికి ఇశ్రాయేలు సామ్రాజ్యం, యేరూషలేము నాశనానికి కారణం అయ్యారు ఇలాంటి పనికిమాలిన అబద్ద ప్రవక్తలే! కాబట్టి ఇలాంటి అబద్ద ప్రవక్తలు మాటలు నమ్మి దేవుని రాకడ అప్పుడే వచ్చేసింది! సంఘం ఎత్తబడిపోయింది! మీరు విడువబడ్డారు అని తొందరపడి కంగారు పడొద్దు అని రాస్తున్నారు!

 

నేటిరోజులలో ప్రవక్తలు పుట్టకొక్కులా వస్తున్నారు! ముఖ్యంగా ఆఫ్రికా దేశాలనుండి! ఇలాంటి వారిని నమ్మొద్దు అని నా మనవి! వారిని చూసి ప్రతీ ఒక్కడు ప్రోఫెట్ అనే పేరుపెట్టేసుకుని తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు చెబుతూ ప్రజలను గందరగోళంలోనికి నెడుతున్నారు! దయచేసి ఇలాంటి తప్పుడు ప్రవక్తలను నమ్మవద్దు అని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను! తప్పుడు ప్రవక్తలు- నేటి అన్య జనాంగంలో ఉన్న బాబాలకు ఏమాత్రం తగ్గరు! వారూ  ప్రజలను మోసం చేస్తున్నారు! అబద్ద ప్రవక్తలు కూడా జనులను మోసం చేస్తున్నారు అని గమనించాలి!

 

నా చిన్నతనంలో లార్న్ గ్రూప్ అనేది ఉండేది చెన్నై లో! యేసుక్రీస్తు ప్రభులవారు తొందరలో వచ్చేస్తున్నారు! ఆయనకు గొప్ప మందిరం కడతాము అంటూ అనేకులను మోసగించి వారి ఆస్తులను దోచుకున్నారు!  ఆయన రాకడ జరుగలేదు! చివరికి వారు క్రైస్తవ్యానికి చెందకుండా, అన్యజనాంగము నకు చెందకుండా వారంతా బ్రష్టులైపోయారు!

 

ఇక రెండు సార్లు విలియం బ్రేన్హాం గారు దేవుని రాకడ పలాని తారీకున వచేస్తుంది అని తప్పుడు ప్రవచనాలు చెప్పి ప్రజలను మోసగించారు! కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలు అసలు నమ్మొద్దు!

 

ఇక 1999 డిసెంబరు 31 రాత్రికి ప్రపంచం అంతమైపోతుంది అన్నారు. అవ్వలేదు!

2012 యుగాంతం అన్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు వినొద్దు నమ్మొద్దు!

 

బైబిల్ చెబుతుంది సాతానుడు తానే వెలుగు దూతవలె మిమ్మల్ని మోసం చేస్తాడు!...

2కోరింథీయులకు 11: 14

ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

2కోరింథీయులకు 11: 15

గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

   ఇక రెండవది: *మాటల వలనైనను మోసపోవద్దు!* అనగా తప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉండగా ప్రసంగాలలో వారి వాగ్దాటిని చూసి మోసపోవద్దు! బెరయ సంఘము వలే నిజంగా విధంగా లేఖనం రాసి ఉన్నదా లేదా అనేది లేఖనములు పరీక్షించి తెలుసుకుని అప్పుడు నమ్మడం గాని నమ్మకపోవడం గాని చేయండి!

 

అబద్ద బోధకులకు బోధించే నేర్పరితనం (Tatctis) బాగా వచ్చు! సిస్టర్ గారు నేను ప్రార్ధన చేస్తుంటే దేవుడు మిమ్మల్నే చూపించారు! మీరు దేవదూతలా ఉన్నారు! మీరు మరియమ్మలా ఉన్నారు, హన్నా లాంటి భక్తులు మీరు! మీకెవరు సాటిరారు అంటూ పొంగించి మిమ్మల్ని ఆత్మీయ బ్రష్టులు చేసేస్తారు జాగ్రత్త! కాబట్టి తీయనైన ప్రసంగాల ద్వారా, నేర్పరితనంఉన్న ప్రసంగాల ద్వారా మోసపోవద్దు అని మనవి చేస్తున్నారు!

 

  ఇక మూడవది: *మా దగ్గరనుండి వచ్చింది అని చెప్పే ఉత్తరాలు ద్వారా- అనగా దొంగ ఉత్తరాల ద్వారా మీరు మోసపోవద్దు!* వారివెంట వెళ్లొద్దు అంటున్నారు! మీదన చెప్పినట్లు పౌలుగారు రాసినట్లు అబద్ద దొంగ బోధకులు ఉత్తరాలు రాసి థెస్సలోనికయ సంఘాన్ని చాలా కలవరపెట్టారు! అందుకే ఇలాంటి ఉత్తరం రాస్తున్నారు పౌలుగారు!

 

    ఇక రెండో వచనంలో మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని బెదరకుండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి  ఆయన యొద్ద మిమ్మును వేడుకొనుచున్నాము అంటున్నారు! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు త్వరపడుతున్నారు? ఎందుకు చంచల మనస్కులు అయిపోతున్నారు? ఎందుకు బెదిరిపోతున్నారు అంటే అబద్ద ప్రవక్తలు చెప్పిన మాటలకు ప్రసంగాలకు బెదిరిపోతున్నారు! వారు దేవుని రాకడ జరిగిపోయింది అంటూ వారిని కలవరపెడుతున్నారు! సంఘానికి ఏమి చెయ్యాలో తెలియడం లేదు! ఇంత భక్తిగా నేను ఉన్నాగాని ఎందుకు విడువబడ్డాను అంటూ కలవరమైపోతున్నారు! అందుకే పౌలుగారు ఇలాంటి తప్పుడు బోధలు, తప్పుడు ప్రసంగాలు, తప్పుడు పత్రికలూ నమ్మొద్దు! అంటూ రాకడకు ముందు ఏమేమి తప్పకుండా జరగాలో కొన్ని గుర్తులు చెబుతూ తర్వాతనే దేవుని రాకడ జరుగుతుంది అంటూ వారిని హెచ్చరిస్తున్నారు!

 

ప్రియ సంఘమా! నీవు కూడా ఇలాంటి తప్పుడు బోధలకు బాధ ననుభవిస్తున్నావా? నీకు వాక్యమే ఆధారం!

వాక్యానుసారంగా నడుద్దాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*82 భాగము*

*ప్రత్యక్షతలు  --15*

   2 థెస్స 2:3—4     

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా!    మనము రెండో అధ్యాయంలో గల ప్రత్యక్షతలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము! గతభాగంలో ప్రభువు దినము ఇంకా రాలేదు! తప్పుడు బోధలు సమాచారాలు నమ్మొద్దు అని ధ్యానం చేసుకున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

   ఇక మూడు నాలుగు వచనాలలో మొదట బ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని దినము రాదు అంటున్నారు! ఇంకా వివరాలు చెబుతూ నాలుగో వచనంలో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనును తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయమలో కూర్చుండును అంటున్నారు!  వీటిని బట్టి అర్ధమయ్యేదేమిటంటే దేవుని రాకడకు ముందుగా మొదట బ్రష్టత్వము సంభవించాలి, రెండవది నాశనపుత్రుడగు పాప పురుషుడు అనగా క్రీస్తు విరోధి బయలుపరచబడాలి, అప్పుడే దినము వస్తుంది అని అర్ధమవుతుంది! దీనిని బట్టి చూస్తే ఇక్కడ దినము అనగా బహిరంగ రాకడ అని అర్ధము అవుతుంది. అయితే ఇక్కడ దినము అనగా సంఘము ఎత్తబడుట కోసం చెప్పడం లేదు అని అనిపిస్తుంది!

 

   దీనికోసం కొంచెం లోతుగా స్టడీ చేస్తే ఇంగ్లీస్ తర్జుమా లలో దీనికోసం చాలా బాగా రాయబడి ఉంది! కొన్ని మచ్చుకు చూద్దాం!

 

*New International Version*

Don’t let anyone deceive you in any way, for that day will not come until the *rebellion occurs* and the man of lawlessness is revealed, the man doomed to destruction.

 

*New Living Translation*

Don’t be fooled by what they say. For that day will not come until *there is a great rebellion against God* and the man of lawlessness is revealed—the one who brings destruction.

 

*English Standard Version*

Let no one deceive you in any way. For that day will not come, unless the* rebellion comes first*, and the man of lawlessness is revealed, the son of destruction,

 

*Berean Study Bible*

Let no one deceive you in any way, for it will not come until the *rebellion occurs* and the man of lawlessness—the son of destruction—is revealed.

 

*International Standard Version*

Do not let anyone deceive you in any way, for it will not come unless *the rebellion takes place first* and the man of sin, who is destined for destruction, is revealed.

 

ముఖ్యంగా మనం Amplified Bible లో చూసుకుంటే....

 

*Amplified Bible*

Let no one in any way deceive or entrap you, for that day will not come *unless the apostasy comes first [that is, the great rebellion, the abandonment of the faith by professed Christians]*, and the man of lawlessness is revealed, the son of destruction [the Antichrist, the one who is destined to be destroyed],

 

ఒకసారి  తెలుగు స్టడీ బైబిల్ కూడా చూసుకుందాము....

3.  విధంచేతనైనా ఎవరూ మిమ్ములను మోసగించకుండా చూచుకోండి. మొదట తిరుగుబాటు లేచిఅపరాధ మనిషివెల్లడి అయ్యేవరకూ క్రీస్తు దినం రాదు. వాడు నాశనపుత్రుడు.

4 . “దేవుడుఅనే పేరు ఉన్న ప్రతిదానినీ, మనుషులు పూజించే ప్రతిదానినీ వాడు ఎదిరిస్తూ దానంతటికీ పైగా తనను హెచ్చించుకొంటాడు, దేవుడుగా తనను ప్రదర్శించుకొంటూ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయంలో కూర్చుంటాడు.

దీని అర్ధం ఏమిటంటే మొట్టమొదట తిరుగుబాటు జరగాలి!

రెండవదిగా బ్రష్టత్వము సంభవించాలి! అనగా దేవుని మీద తిరుగుబాటు రావాలి!

 మూడవదిగా క్రీస్తు విరోధి బయలుపరచబడాలి! అప్పుడే దినము అనగా యేసుక్రీస్తు ప్రభులవారి దినము అనగా యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడ జరుగుతుంది అని అర్ధము!  

 

క్రీస్తు దినము రాకముందు జరుగ బోయే ముఖ్యమైన సంఘటనలు పౌలుగారు ముందుగా రాస్తున్నారు! మొదట తిరుగుబాటు జరుగుతుంది అని రాస్తున్నారు! ఆదికాండం మూడో అధ్యాయం నుండి మనిషి పాపములో పడిపోయి దేవునిమీద తిరుగుబాటు చేస్తూ వస్తున్నాడు! దానికోసం మనం పాత నిబంధన మొత్తం చూసుకోవచ్చు! తిరుగుబాటుకు ప్రతినిధులుగా ఇశ్రాయేలు జనాంగమును మనం పాత నిబంధనలో చూసుకోవచ్చు! అందుకే 1యోహాను 3:4 లో అంటున్నారు.... 

పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

 

  అయితే ఇక్కడ పౌలుగారు పాతరోజులలో జరిగిన,  ప్రస్తుతం జరిగే తిరుగుబాటుకోసం వ్రాయడం లేదు గాని అంత్యదినాలాలో జరుగబోయే తిరుగుబాటు కోసం రాస్తున్నారు!   ఇది ప్రపంచ మతాలన్నిటికి వ్యతిరేఖమైన తిరుగుబాటు అని అర్ధం చేసుకోవాలి! దీనికి నాయకుడు క్రీస్తు విరోధి! వీడు నాలుగో వచనం ప్రకారం ఏది దేవుడు అని పిలువబడుతుందో అనగా బారతదేశంలో దేవుళ్ళు అని పిలువబడే వారికి విరోధంగాను, అరబ్బు దేశాలలో దేవుడు అని పిలువబడే అల్లా కు వ్యతిరేఖంగాను, దేవాదిదేవుడైన యేసుక్రీస్తుప్రభులవారికి యెహోవా దేవునికి వ్యతిరేఖంగా వాడే అనగా క్రీస్తు విరోదే దేవునిగా ప్రకటించుకుని, అందరికంటే తననుతానే హెచ్చించు కొని దేవుని ఆలయములో కూర్చొంటాడు!

ఇక్కడ దేవుని ఆలయము అనగారెండు అర్ధాలు!

మొదటిది  తప్పకుండా యూదులు ఇశ్రాయేలు దేశంలో కట్టబోయే దేవుని ఆలయము అని గ్రహించాలి!

ఇక రెండవది: నీ దేహమే దేవుని ఆలయము! (1కొరింథీ 3:16,17)

 అనగా అందరి దేహాలలోను అందరి హృదయాలలోనూ తానే దేవుడుగా చేసుకోవడానికి ఎన్నో కుతంత్రాలు కలిపించి వాడు గెలుపుపొందుతాడు అన్నమాట! అనగా మానవుని దేహమందు వాడి ముద్ర అనగా 666 ముద్ర కావచ్చు! ఎప్పుడైతే ముద్ర వేయించుకుంటావో ఇక నీవు సంపూర్తిగా వాడి ఆధీనంలోకి వెల్లిపోతావు; నీకు దేవుడు మరియు యజమాని క్రీస్తు విరోధి మాత్రమే అప్పుడు! రకంగా మొదటగా తిరుగుబాటు జరుగుతుంది!

 

గమనించాలి సందర్భంగా బ్రష్తమైపోయిన క్రైస్తవ మతము మరియు బ్రష్టమైపోయిన రోమ్ లో కొలువైన మతసంస్థ కూడా వాడికి లోబడుతుంది అని గ్రహించాలి! దీనికోసం మత్తయి 24:1025 వరకు జరుగబోయే సంఘటనలు లేక యేసయ్య రాకడ సూచనలలో యేసుక్రీస్తుప్రభువారు ముందుగానే చెప్పారు.....

Matthew(మత్తయి సువార్త) 24:11,12,14,15,19,20,23,24,25

11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

12. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.

14. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

15. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక

19. అయ్యో, దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.

20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

23. కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి.

24. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

25. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

 

ఇంకా పౌలుగారు రాస్తున్నారు 2తిమోతి :1—5 ....

 

1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

3. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు

4. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,

5. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.

 

 Revelation(ప్రకటన గ్రంథము) 13:4,5,6,8,13,14,15

4. మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్ప మునకు నమస్కారముచేసిరి. మరియు వారుఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు మృగమునకు నమస్కారముచేసిరి.

5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను (లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

8. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, మృగమునకు నమస్కారము చేయుదురు.

13. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

14. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

15. మరియు మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

 

ఒకసారి బైబిల్ రిఫరెన్సులు చూద్దాం!

The Man of Lawlessness

2. not to be easily disconcerted or alarmed by any spirit or message or letter seeming to be from us, alleging that the Day of the Lord has already come.

3. Let no one  deceive you  in any  way,  for it will not come until the rebellion occurs and the man of lawlessness— the son of destruction— is revealed. 

4. He will oppose and exalt himself above every so-called god or object of worship. So he will seat himself in the temple of God, proclaiming himself to be God.

*Berean Study Bible* · 

 

గమనించాలి దీనికోసం దానియేలు గారు ఎప్పుడో దర్శనములు చూశారు!

దానియేలు 7:8, 11, 20, 25

7. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.

8. నేను కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.

11. అప్పుడు నేను చూచుచుండగా, కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.

20. మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు,వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరునుగల వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన కొమ్ము సంగతియు విచారించితిని.

25. రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశముననుంచబడుదురు.

 

దానియేలు 8: 25

మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతి శయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.

 

Daniel(దానియేలు) 11:32,36,37

32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.

36. రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణ యించినది జరుగును.

37. అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.  

 

యేసుక్రీస్తుప్రభులవారు కూడా వీడికోసం చెప్పారు

యోహాను 17: 12

నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.

 

అందుకే యోహాను గారు అంటున్నారు 1యోహాను 2:18 లో....

చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.

 

పౌలుగారు చెబుతున్నారు

1తిమోతికి 4: 1

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును

1తిమోతికి 4: 2

దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

 

ప్రకటన 17:8,11

Revelation(ప్రకటన గ్రంథము) 17:8,11

8. నీవు చూచిన మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగ దుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.

11. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము యేడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.

ఇంకా ప్రకటన 13 అధ్యాయం మొత్తం చూడండి! ముఖ్యంగా 18 వచనాలు

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*83 భాగము*

*ప్రత్యక్షతలు  --16*

   2 థెస్స 2:3—4  

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

   

           (గతబాగం తరువాయి)

 

    కాబట్టి న్యాయవిరోది లేక పాప పురుషుడు ఎన్నో ప్రతిభా పాటవాలు ఉన్న రాజకీయ వేత్త కావచ్చు, ఇంకా సైనిక నాయకుడు కూడా కావచ్చు! అనగా ఒక సైనిక నాయకుడు రాజకీయ వేత్తగా మారి ఇలాంటివి తీసుకుని వస్తాడన్నమాట! (గమనించాలి: ఇవి నా ఉద్దేశాలు మాత్రమే! ఇదే జరుగుతుంది అని ఖచ్చితంగా అనుకోకూడదు అలా చెబితే నేను ఒక అబద్ధికుడను అవుతాను_)  కాబట్టి వీడు తాను దేవుడనని చెప్పుకుంటూ అందరిని మోసం చేస్తాడు!  నెమ్మదిగా అధికారం చేజిక్కుంచుకుని నన్నే మ్రొక్కమని శాసనం చేస్తాడు! అలా మ్రొక్కని వారిని నిర్దాక్షిణ్యంగా శిరచ్చేదనం చేస్తాడు! 666 ముద్ర తప్పకుండా వేయించుకోవాలి అంటాడు! ప్రకటన గ్రంధంలో  బలిపీటం వద్ద కనబడే హతస్సాక్షుల ఆత్మలు ఇవే! (6:9)

వీడు దేవుని చట్టాలను గాని మనుషులు చేసిన చట్టాలను గాని అసలు లెక్కచేయడు! వాడి స్వభావం విషయంలో గాని వాడు గుణగనాలు గాని మొత్తం యేసుక్రీస్తుప్రభులవారికి విరోధంగా వ్యతిరేఖంగా ఉంటాయి! అందుకే వీడిని క్రీస్తు విరోధి అంటారు! దేవుని చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తుప్రభులవారు లోకానికి వస్తే తన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నెరవేర్చడానికి వీడు వచ్చాడు!

కీర్తనలు 40: 8

నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

 

హెబ్రీయులకు 10: 7

అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

 

అయితే యేసుక్రీస్తుప్రభులవారు ఇన్ని మంచిపనులు చేసినా లోకం కోసం ప్రాణము పెట్టినా లోకము ఆయనను కోరుకోలేదు గాని క్రీస్తు విరోధి మాటలకు లోబడిపోయి వీడు వాడి ఇష్టాలనే నెరవేరుస్తున్నా గాని వాడే కావాలని వాడి వెనుక పోతుంది! అందుకే వాడి ఇష్టానుసారంగా వాడు పరిపాలిస్తాడు!

 

కాబట్టి వీటన్నిటి బట్టి తిరుగుబాటుకి  క్రీస్తు విరోధి లేక పాప పురుషుడు నాయకత్వం వహిస్తాడు!

 

ఇక చివరికి వాడు తాను దేవుడనని ప్రకటించుకుని తానే దేవాలయంలో కూర్చుని నన్నే పూజించమంటాడు! గమనించాలి దేవుని ఆలయం నిజదేవుని ఆరాధన కోసం కట్టబడింది ప్రతిష్టించబడింది! అయితే వీడు ఆదేవున్ని త్రోసివేసి ఆయనకు పైగా వీడు తనను హెచ్చించుకుని నన్నే పూజించమని చెబుతాడు! దీనికోసం యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెప్పారు

మత్తయి 24: 15

కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక

 

మార్కు 13: 14

మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;

 

వీటికంటే ముందుగా దానియేలు గారు చెప్పారు ....

 Daniel(దానియేలు) 11:31,32,36,37

31. అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు.

32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.

36. రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణ యించినది జరుగును.

37. అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.

 

కాబట్టి మొదటగా క్రీస్తు విరోధి ప్రోద్బలం వలన దేవాదిదేవునికి వ్యతిరేఖంగా తిరుగుబాటు కలుగుతుంది అన్నమాట! ఇంకా బాగా అర్ధం చేసుకోవాలి అంటే ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే కరెన్సీ అనేమాట మార్పుచెంది ఒకే నేల, లేక ఒకే ప్రపంచం, ఒకే మతం, ఒకే కరెన్సీ, ఒకే రాజు, ఒకే అధికారం అనేది వస్తుంది! ఇంకా చెప్పాలంటే బహుశా పోపు ఫ్రాన్సిస్ మరియు మరికొంతమంది 2014 లో ప్రారంభించిన క్రిస్లాం (Chrislam) మతం కావచ్చు!

ఇది మొదటిగా 1980లో నైజీరియా లో ప్రారంభమైనా అంతగా వ్యాపించలేదు! గాని 2014లో పోపు ఫ్రాన్సిస్ దృష్టి లో పడి 2015, 2017 లలో ఇస్లాం పెద్దలతో జరిగిన ఒప్పందం ప్రకారం దీనిని అమలులోనికి తీసుకుని వచ్చారు!

క్రిస్ అనగా క్రైస్తవులు, స్లాం అనగా ఇస్లామీయులు అందరు కలిసి క్రిస్లాం అనే మతాన్ని తీసుకుని వచ్చారు! దీని అజెండా ప్రపంచ శాంతి! మతభేదం లేదు! మతాలూ మనిషి పుట్టించుకున్నవే అని చెబుతూ మీ మతాలూ ఆచారాలు మీరు వదలొద్దు! అయితే క్రిస్లాం మతంనకు రండి! మీ ఆచారాలు మాత్రం వదలొద్దు! అలాగని ఇతర మతాలను దూషించకుండా వారి ఆచార పద్దతులు కూడా పాటిస్తూ సమన్వయ న్యాయంతో ప్రపంచ శాంతికి ప్రయత్నం చేద్దాం అనేది మతం యొక్క అజెండా! గమనించాలి దానియేలు గ్రంధం ప్రకారం, ప్రకటన గ్రంధం ప్రకారం క్రీస్తు విరోధి శాంతి శాంతి అంటూనే ప్రజలను మోసం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు! ఇదిగో దీనికి నాంది ప్రస్తావనగా క్రిస్లాం వచ్చింది అన్నమాట! ఇది మరొక తిరుగుబాటు! అలా తీసుకుని వచ్చిఅందరినీ ఒప్పించి సంతకాలు అయ్యాక అధికారం చేజిక్కించుకుంటాడు. అప్పుడు నేనే దేవున్ని అంటాడు! వెంటనే సత్యం తెలుసుకుని ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది తిరుగబడతారు, మరికొందరు పారిపోతారు!

 

కాబట్టి ఇప్పుడు మొత్తమంతా కలిపి చదువుకుంటే మొదటగా బ్రష్టత్వము సంభవించాలి! తర్వాత తిరుగుబాటు జరగాలి! తర్వాత క్రీస్తువిరోది బయలు పరచబడాలి! మూడు విషయాలు కలిపి ఆలోచిస్తే తిరుగుబాటు జరగాలి అన్నా, నాశనకరమైన హేయవస్తువు అర్పించాలి అన్నా, ముందుగా క్రీస్తు విరోధి బయలుపరచబడాలి కదా! అనగా సంఘటనలు వెనువెంటనే జరిగిపోతాయి అన్నమాట!

 

ఒకసారి  మనం బ్రష్టత్వం కోసం ఆలోచన చేసుకుంటే బ్రష్టత్వం ఎప్పటినుండో పనిచేస్తుంది! గత రచనలలో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా దానియేలు గారి దర్శనాలను ధ్యానం చేస్తున్నప్పుడ! మొట్టమొదటిగా బ్రష్టత్వం క్రైస్తవ సంఘాలలో సంభవించిందిదేవుని స్థానంలో పోపును ఉంచారు! దేవుడు మాత్రమే పూజ్యనీయుడు ఆరాధనీయుడు అయితే స్థానాన్ని బిషప్పులు, ఫాదర్లు లాక్కున్నారు- వారి పేరు ముందు రెవరెండు అనే పదం చేర్చారు! ఇక దేవుడు మాత్రమే పాపములు క్షమించగలరు- అదికూడా పాపములు కోసం పశ్చాత్తాపపడి యేసురక్తం లో కడుగబడినప్పుడు మాత్రమే! అయితే బ్రష్టమతం వారు లేక బ్రష్టమైన మతశాఖ వారు పాప పరిహార పత్రాలను అమ్ముతూ –  రక్షణ సిద్దాంతాన్ని రక్షణ ప్రణాలికను అవమానించారు! రకంగా ప్రారంభమయిన బ్రష్టత్వం నేడు కూడా కొనసాగుతుంది! బ్రష్ట శాఖ నుండి ప్రారంభమైన ఆచారాలు నేడు సంఘాచారాలుగా మారిపోయాయి!

 ముఖ్యంగా క్రిస్మస్ ని జరుపుకుంటూ, దేవుడు చెప్పని ఆచారం చేస్తున్నారు! అయితే ఘోరమైన విషయం ఏమిటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా రక్షణ ప్రణాళిక లో లేని క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత, కేకులు, డాన్సులు ఆక్రమించాయి! ఇంకా ఇలాంటి ఆచారాలు ఎన్నెన్నో వారినుండి వచ్చి అవి ప్రస్తుతం సంఘాచారాలుగా మారిపోయాయి! వాటికి బైబిల్ లేఖనాల సపోర్ట్ ఉండవు!

 

ఇక మనదేశంలో కూడా క్రైస్తవ సంఘాలలో ఎన్నెన్నో దురాచారాల ద్వారా బ్రష్టత్వం సంభవించింది! అన్యాచారాలు- క్రైస్తావాచారాలుగా మారిపోయాయి! దానికి వారిచ్చే కవరింగ్- భారతదేశ సంప్రదాయము అంటున్నారు! ఇవన్నీ బైబిల్ కు వ్యతిరేఖమే! ఉదాహరణకు తాళి కట్టడం, ఇంటిముందు పందిరి  వేయడం, పసుపు గంధం రాయడం, ముహూర్తాలు చూడటం, వాస్తు చూడటం, పోములు కట్టించుకోవడం, జ్యోతిష్యాలు చెప్పించుకోవడం, చనిపోయిన వ్యక్తికీ పదకొండో రోజు జ్ఞాపకార్దకూటం చేయడం, ఆడపిల్ల  పెద్దమనిషి అయితే ఫంక్షన్ చేయడం..... ఇలా ఇవన్నీ అన్యాచారాలు కాదా??!! మీరు మూర్కులైన తరము వారికి వేరై రక్షణ పొందుడి (అపో.కార్యములు 2: 40

ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చిమీరు మూర్ఖులగు (మూలభాషలో-వంకరైన) తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.) అని చెబితే అదే మూర్కులైన తరమువారి ఆచారాలు ఎంతో ఇష్టపడి ముచ్చటగా చేస్తున్నావు కదా!

 నీలో బ్రష్టత్వం లేదా? నీలో సాతానుడు ఇప్పటినుండే పనిచేయడం లేదా? పరిశుద్ధ పరిశుద్ధ అని పాటలు పాడతావు గాని చేసేవన్నీ అపవిత్రమైన పనులే! పేరుకి దేవుని బిడ్డ గాని చేసేవన్నీ సాతాను గాడి బిడ్డలాగే చేస్తున్నావు!! ముందు పర్సనాలిటీ వెనుక మున్సిపాలిటీ!

 నీవు పరలోకం వెళ్తావా అసలు??!! ఒకసారి ఆలోచించుకో!!

 

   అందుకే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ముందుగానే యేసుక్రీస్తుప్రభులవారు మరియు పౌలుగారు చెబుతున్నారు ఏవిధంగాను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి!!!  ఇక్కడ ఏవిధముగాను అనగా ఇలాంటి తప్పుడు బోధలు అనికూడా అర్ధమిస్తుంది! మనం భారతదేశంలో ఉన్నాము కాబట్టి భారతదేశ ఆచారాలు పాటించాలి అని చెప్పే తప్పుడు బోధలు! ఇంకా మనము త్రిమూర్తులు పేరున చెయ్యడం లేదు గాని మన తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామంలో ప్రార్ధనచేసుకుని చేస్తున్నాము కాబట్టి పర్వాలేదు అని చెప్పే పనికిమాలిన తప్పుడు బోధలను విని మోసపోవద్దు అని ముందుగానే బైబిల్ మనకు చెబుతుంది! వాస్తు అంటే అన్యాచారాము కాదు అది సైన్సు! దాని ప్రకారం గృహాలు కడితే ఇంట్లోకి వెలుతురూ గాలి బాగా వచ్చి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పే లోకంతో రాజీపడే పనికిమాలిన బోధకుల మాటలు విని మోసపోవద్దు అని మనవిచేస్తున్నాను! అసలు వారు చెప్పేవి బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని బెరయ సంఘస్తులు లేఖనాలు వెదికినట్లు మీరుకూడా వెదికి అప్పుడు లేఖనం ప్రకారం మీ పనులు చెయ్యాలి గాని గుడ్డెద్దు లాగ వారిని గుడ్డిగా నమ్మొద్దు అని మనవిచేస్తున్నాను!

 

మత్తయి 24:4,5 లో యేసయ్య ముందుగానే చెప్పారు....

4. యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

5. అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.

 

రోమా 16:18 లో మోసగాళ్ళు ఎందుకు ఇలాంటివి చెబుతున్నారో పౌలుగారు ముందుగానే చెబుతున్నారు....

అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

 

మోసగాళ్ళు మీ వలన వారి పొట్ట పోషించుకుంటారు అన్నమాట....

2పేతురు 2: 3

వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనముకునికి నిద్రపోదు.

 

ఇంకా అంటున్నారు వారి కడుపే వారి దేవుడు! యేసయ్య కాదు వారి దేవుడు!

ఫిలిప్పీయులకు 3: 19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

 

ఎఫెసీ 5:6

వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి(మూలభాషలో-అవిధేయత కుమారుల మీదికి) వచ్చును

 

కొలస్సీ 2:4

ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు సంగతిని చెప్పుచున్నాను.

 

1తిమోతి 4:1—

1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును

2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

3. అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

 

2 తిమోతి :1—

1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

3. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు

 

2 తిమోతి 4:—4

3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,

4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

 

కాబట్టి బ్రష్ట్వత్వంలో మునిగిపోయి దేవుని నుండి దూరం కాకు! ఉగ్రతను కొని తెచ్చుకోకు! వాక్యాన్ని పరిశీలించు! అబద్దబోధలు ఏమిటి, అబద్ద బోధకులు ఎవరూ అనేది ఆత్మద్వారా వారి భోధనలు ద్వారా వివేచించు!

అప్రమత్తంగా ఉందాం!

మెలుకువ కలిగి జాగ్రత్తగా నడుద్దాం!  నిజమైన మార్గంలో నడిచి పోదాము!

ఎత్తబడే గుంపులో ఉండి లేవనెత్తబడదాం!

దైవాశీస్సులు!

 (ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*84 భాగము*

*ప్రత్యక్షతలు  --17*

   2 థెస్స 2:5—8 

5. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?

6. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డ గించునది ఏదో అది మీరెరుగుదురు.

7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.

8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.    

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో గల ప్రత్యక్షతలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!  తప్పుడు బోధలు సమాచారాలు నమ్మొద్దు అని ధ్యానం చేసుకున్నాము!

 

    (గతబాగం తరువాయి)

 

   ఇక ఐదు నుండి ఎనిమిది వచనాలు ధ్యానం చేసుకుంటే మరెన్నో నిగూఢమైన విషయాలు కనిపిస్తాయి మనకు!

ఐదో వచనంలో విషయాలన్మీ మీకు నేను మీ యొద్ద ఉన్నప్పుడే చెప్పాను గదా అంటున్నారు! గమనించాలి ఇతర సంఘాలకు ఇలాంటి విషయాలు చెప్పి ఉండకపోవచ్చు పౌలుగారు! కారణం వారికి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల మీద అంతగా ఆశక్తి లేదు! గాని వీరికి అస్తమాను ఆధ్యాత్మిక సంగతుల మీదనే ఆసక్తి ఉండేది కాబట్టి పౌలుగారు ఇంకా అక్కడ అనగా థెస్సలోనికయ సంఘంలో పరిచర్య చేసేటప్పుడే విషయాలన్నీ వివరంగా చెప్పారు!

 

  ఇక ఆరో వచనంలో కాగా వాడు తన సొంత కాలమందు బయలు పరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు అంటున్నారు!

దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించ వలసిన అవసరం ఎంతైనా ఉంది!!

కాగా వాడు అనగా క్రీస్తు విరోధి లేక పాప పురుషుడు లేక నాశనపుత్రుడు అని గ్రహించాలి! వాడు తనసొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో మీకు తెలియును అంటున్నారు!

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాడు ఎప్పుడు బయలు పరచబడాలో ముందుగానే నిర్ణయించబడింది! అప్పటివరకు ఏదో ఒక శక్తి వానిని ఆపుతుంది లేక అడ్డగిస్తుంది అన్నమాట! అయితే మరో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే అడ్డగించేది ఏదో పౌలుగారు ముందుగానే సంఘానికి చెప్పారు! గాని అది మనకు స్పష్టంగా తెలియడం లేదు!

 

ముందుగా మనం ఎప్పటివరకు వాడిని అనగా క్రీస్తు విరోధిని శక్తి అడ్డగిస్తుందో మనము కొంచెము వాక్యాధారంగా పరిశీలిద్దాము!

 

రోమా పత్రికలో పౌలుగారు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు రక్షణ పొందుతారు అనే దాని కోసం వివరంగా రాస్తూ ఒక అమోఘమైన మర్మమును చెబుతున్నారు పరిశుద్ధాత్మపూర్ణుడై.. 11:25 లో....

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

 

 ఇక్కడ అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తి అయ్యేవరకు ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందరు అన్నమాట! గమనించాలిఅన్యజనులలోనుండి రక్షణ పొందేవారి సంఖ్య పూర్తి అయిన వెంటనే సంఘం ఎత్తబడి , సంఘంతో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా ఎత్తబడతారు! అప్పుడు వీడు అనగా క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు అనేది బైబిల్ పండితుల ప్రఘాడ నమ్మకం! నేను కూడా దీనినే నమ్ముతాను! కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తి అవ్వాలి, అప్పుడే వాడు బయలు పరచబడతాడు!

 

దీనికి మరో సపోర్టింగ్ రిఫరెన్సుగా మనం ప్రకటన ఆరో ఆధ్యాయంలో బలిపీటం దగ్గర ఆత్మలు అడుగుతాయి దేవుణ్ణి అయ్యా! ఇంకా ఎంతకాలం మా రక్తము కోసం న్యాయం తీర్చకుండా ఉంటారు అని అడిగితే దేవుడు చెప్పారు మీలాగే చంపబడవలసిన మీ సహదాసులు సంఖ్య పూర్తి అయ్యేవరకు ఓర్చుకోండి అంటున్నారు! (6:9--11)

  వచనం సంఘం ఎత్తబడ్డాక మిగిలిన పరిశుద్దులను సూచిస్తున్నా మనకు ఏమి అర్ధం అవుతుంది అంటే దేవుని ప్రణాళికలో ఇంతమంది రక్షించబడాలి అనేది ఉంది సంఖ్య పూర్తి అయ్యేవరకు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నారు అన్నమాట! అందుకే పేతురు గారు రాస్తున్నారు ప్రభువు......

2 Peter(రెండవ పేతురు) 3:9

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 

   ఇక మరో ప్రాముఖ్యమైన విషయం: ఇంతకీ అడ్డగించే శక్తి ఏమిటి? అనగా క్రీస్తు విరోధిని అడ్డగించే శక్తి ఏమిటి?

జవాబు సింపుల్: అది తెలుసుకోవడం మన పని కాదు! బుర్ర పీక్కో వద్దు అని మనవిచేస్తున్నాను!  కారణం యేసుక్రీస్తుప్రభులవారు భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఇలా బుర్రపీక్కుని యేసయ్యను కొన్ని మర్మాల కోసం అడిగితే కొన్నిసార్లు ఇది మీకు మాత్రమే అనుగ్రహించ బడింది అని చెప్పినా కొన్నిసార్లు ఇంతకంటే ఎక్కువ ఆలోచించవద్దు అన్నారు!

Acts(అపొస్తలుల కార్యములు) 1:6,7,8

6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు *ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా* ఆయన

7. *కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.*

8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

మత్తయి 13: 11

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.

 

శిష్యులు యోహాను సువార్తలో పేతురు గారి నిర్గమనం కోసం ప్రభువు  చెబితే యోహాను గారి సంగతి ఏమిటి అని అడిగారు, అప్పుడు దేవుడన్నారు- సంగతి మీరు వదిలెయ్యండి గాని మీరు మాత్రం నేను చెప్పిన సంగతి చెయ్యండి అన్నారు!

కాబట్టి దేవుడు కొన్ని విషయాలు చెబుతారు, కొన్ని చెప్పరు! మనం అంతకంటే ఎక్కువగా ఆలోచించకూడదు! 

Better To Stop Where Bible Stops!

 

అయితే శక్తి ఎవరు అనేది కొన్ని సిద్ధాంతాలున్నాయి! వాటిని మాత్రం చాలా క్లుప్తంగా చూద్దాం! ఒక ఆలోచన ఏమిటంటే శక్తి పరిశుద్ధాత్ముడు అంటారు! నాకు కూడా పరిశుద్ధాత్ముడే అనిపిస్తుంది!   రక్షించబడవలసిన సంఖ్య పూర్తికాడానికి పరిశుద్ధాత్ముడు నిత్యమూ అనేకులను ఒప్పిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేది చాలామంది ఉద్దేశ్యం! ఇక్కడ అడ్డగించేవాడు తీసివేయబడే వరకు అనగా సంఘము ఎత్తబడాలి కారణం సంఘంలో పరిశుద్దాత్ముడు ఉన్నాడు, సంఘముతో పాటుగా పరిశుద్ధాత్ముడు ఎత్తబడినప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు అనేది ఒక బలమైన అభిప్రాయం!

 

     అయితే కొందరు కాదు పరిశుద్ధాత్ముడు ఎవరిని అడ్డగించినట్లు బైబిల్ లో ఎక్కడా లేదు! శక్తి ఏదైనా ఒక దేవదూత కావచ్చు అంటారు! దానికి సపోర్టుగా ఏమని చెబుతారు అంటే దానియేలు గారి దర్శనాలలో దానియేలు గారికి దర్శన భావము మరియు జరుగబోయే విషయాలు చెప్పనీయకుండా పారశీక దేశపు దూత లేదా అధికారి ఎలా గబ్రియేలు దూతను ఆపాడో అలాగే దేవుని దూత వీడిని అనగా క్రీస్తువిరోది ని ఆపుతున్నాడు అంటారు! ఏమో కావచ్చు! ఎందుకంటే ప్రకటన గ్రంధంలో కూడా కొన్నిసార్లు దేవుని దూతలు కొన్ని తీర్పులను ఆపి మేము దేవుని ప్రజలకు ముద్ర వేసేవరకు ఆగు అంటూ తీర్పులను ఆపారు కొంతసేపు! కాబట్టి ఇలాంటి దేవదూత అయినా కావచ్చు! ప్రకటన 7:1; 9:1415 

ప్రకటన గ్రంథం 7: 3

దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.

 

ఏదిఏమైనా ఇంతకంటే ఎక్కువగా ఆలోచించవద్దు! ఇక్కడ పౌలుగారు ధర్మవిరోధసంభంధమైన ఆత్మ ఇప్పటికే పనిచేస్తుంది అనిమాత్రం చెప్పారు! అయితే దానిని ఒక శక్తి అడ్డగిస్తుంది అంటున్నారు! అయితే క్రీస్తు విరోధి రాకడను శక్తి ఆపుతుంది గాని వాడు ఒకరోజున రావాలి అని ముందుగానే నిర్ణయించబడింది అని పైన చదువుకున్నాము కదా! రోజువరకే శక్తి వాని రాకను అడ్డుకోగలదు! ఒకరోజు క్రీస్తు విరోధి లేదా ధర్మ విరోధ సంబంధమైన మర్మము లేదా ఆత్మ విశ్వరూపానికి చేరుకుంటుంది! అప్పుడు దేవుని న్యాయమైన నియమం పూర్తిగా భూమిపై లేకుండా పోతుంది! దానినే దానియేలు గారు చెబుతున్నారు అప్పుడు అభిషక్తుడు ఏమీ లేకుండా తీసివేయబడతాడు అంటూ....

దానియేలు 9: 26

అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.

 

అనగా అభిషక్తుడు అనగా మెస్సీయ అనబడే యేసుక్రీస్తుప్రభులవారు గాని, ఆయనాత్మ గాని ఆయన సంఘము గాని లోకంలో ఉండకుండా నిర్మూలము చేయబడుతుంది. ఇక దుష్టుడు సంకల్పమే లోకమంతా రాజ్యమేలుతుంది!

 

  అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఎనిమిదో వచనం ప్రకారం క్రీస్తువిరోది ఎంత శక్తివంతుడైనా గాని అతడు క్రీస్తును ఎదురించి నిలువలేడు! దానియేలు గ్రంధం ప్రకారం, ప్రకటన గ్రంధం ప్రకారం కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే వాడు నిలువగలుగుతాడు! అప్పుడు ప్రభువైన యేసు తన నోట ఊపిరిచేత క్రీస్తు విరోధిని లేక ధర్మ విరోధిని సంహరిస్తారు! దీనికోసం మనము యేహెజ్కేలు గ్రంధంలో, జెకర్యా గ్రంధంలో, యెషయా గ్రంధంలో చివరికి ప్రకటన గ్రంధంలో ఎంతో వివరంగా వ్రాయబడింది!

 

ప్రకటన 19:19—20

19. మరియు గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

21. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

 

నోటిఊపిరి అనగా ఊపిరి కావచ్చు లేదా ఆయన వాక్యము లేక వాక్కు కూడా కావచ్చు!

 

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

 

హెబ్రీయులకు 1: 3

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

 

హెబ్రీయులకు 4: 12

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.

 

అంతేకాదు వెలుగు కలుగు గాకని పలుకగా వెలుగు కలిగెను అంటున్నారు ఆదికాండం మొదటి అధ్యాయంలో, ఇంకా ఫలానిది కలుగు గాకని పలుకగా అది కలిగెను అని వ్రాయబడింది! ఇంకా యెషయా 55:10,11 లో ఆయన మాట జారీచేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది అది వ్యర్ధముగా పోదు!...

 

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

 

ఇంకా తన ఆగమన ప్రకాశం చేతను వానిని నాశనం చేయును అంటున్నారు! ఆగమన ప్రకాశానికి అంత శక్తి ఉందా అంటే ఉంది!

మత్తయి 24: 30

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

 

మత్తయి 25: 31

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

 

తీతుకు 2: 13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

ప్రకటన 19:11—12

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

 

చివరగా

Psalms(కీర్తనల గ్రంథము) 50:1,2,3

 

1. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచు చున్నాడు.

2. పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించు చున్నాడు

3. మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టు ప్రచండ వాయువు విసరుచున్నది.

 

   కాబట్టి అంత శక్తివంతమైన దేవుడు తన ప్రభావ మహిమతో వచ్చినప్పుడు ఆయన నోటి ఊపిరిచేత వాడిని అంతం చేస్తారు!

కాబట్టి సాతాను గాడు, క్రీస్తువిరోది వచ్చేకాలము, సంఘము ఎత్తబడే కాలము, యేసుక్రీస్తుప్రభులవారు రెండో రాకడలో వచ్చేదినము అతి సమీపముగా ఉంది కాబట్టి ఘోరమైన దినము రాకముందే సిద్దపడి రాకడకు ఎత్తబడదాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*85 భాగము*

*ప్రత్యక్షతలు  --18*

   2 థెస్స 2:9--10   

9. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను

10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో గల ప్రత్యక్షతలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

    (గతబాగం తరువాయి)

 

   ఇక తొమ్మిది పది వచనాలలో మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాస్తున్నారు పౌలుగారు! నశించిపోతున్న వారు అనగా సువార్తకు లోబడని వారు, రక్షణ పొందుకున్న తర్వాత తప్పిపోయిన వారు తాము రక్షించబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబించలేక పోయారు కాబట్టి వారి రాక అనగా క్రీస్తువిరోది మరియు వాడి సైన్యము రాక అబద్ద విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహాత్కార్యాలు తోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించు చున్న వారిలో సాతాను చూపించే బలమును అనుసరించి ఉంటుంది అంటున్నారు!

 

దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తుప్రభులవారి మొదటి  రాకడ దేవుని చిత్తప్రకారం దేవుని పనికి అనుకూలంగా ఉంది! అయితే క్రీస్తు విరోధి రాకడ మాత్రం అది సైతాను పని! వీడు యేసుక్రీస్తుప్రభులవారి కంటే ఎక్కువ ప్రజాదరణ పొందుతాడు! దీనికోసం ఇంకా బాగా అధ్యయనం చెయ్యాలంటే ప్రకటన 13 అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చెయ్యవలసిన అవసరం ఉంది!....

Revelation(ప్రకటన గ్రంథము) 13:1,2,3,4,5,6,7,8,11,12,13,14,15,16

1.మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

2.నేను చూచిన మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.

3.దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్య పడుచుండిరి.

4. మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్ప మునకు నమస్కారముచేసిరి. మరియు వారుఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు మృగమునకు నమస్కారముచేసిరి.

5.డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను(లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6.గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

7.మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.

8.భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, మృగమునకు నమస్కారము చేయుదురు.

11.మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను;

12.అది మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.

13.అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

14.కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

15.మరియు మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

16.కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,

 

ఎందుకంటే యోహాను సువార్త  చూసుకుంటే ఎందుకు యేసుక్రీస్తుప్రభులవారిని అంగీకరించరు, సాతాను గాడి పనులను అంగీకరిస్తారు అంటే ......

John(యోహాను సువార్త) 1:9,10,11

9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

11. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

 

యోహాను 5: 43

నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు,

దీనిని బట్టి మనం మానవజాతి నిజమైన స్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు! ఇక్కడ అంటున్నారు సత్యవిషయమైన ప్రేమను అవలంభించలేకపోయారు అంటున్నారు! కారణం ఇహ సంబంధమైన ఆత్మ నశించుచున్న వారి కన్నులకు గుడ్డితనం కలిగించింది!

2కోరింథీయులకు 4: 4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

 

 అందుకే వీరు నిజ దేవుణ్ణి నిజ సత్యాన్ని నమ్మక అబద్ద జనకుడగు సాతానుని నమ్మి వాడిని అనుసరిస్తారు!

ఇంకా  వాడి రాకడ సైతాను శక్తికి అనుగుణంగా ఉంటుంది. అనగా ఇంకా వివరంగా చెబుతున్నారు వాడి రాక సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహాత్కార్యాలు తోనూ దుర్నీతి తోనూ సాతాను కనపరిచే బలమును అనుసరించి ఉంటుంది అంటున్నారు! దీనికోసం బైబిల్ చెబుతుంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చెయ్యగల శక్తి కలది!మత్తయి 24:24 చూసుకుంటే అబద్ద క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము తప్పుదారి పట్టించడానికి సూచకక్రియలు అద్భుతకార్యాలు చేస్తారు అని ముందుగానే యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు!

 

ప్రకటన 13 అధ్యాయంలో కూడా 13 , 15 వచనాలలో వాడు ఎన్నో సూచక క్రియలు చేస్తున్నట్లు చూడగలము! బహుశా సూచక క్రియలు మహాత్కార్యాలు యేసుక్రీస్తుప్రభులవారు చేసిన అద్భుతాల వలె ఉండొచ్చు!

కాబట్టి వీడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడన్న మాట!

 

ఇంకా దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచే బలమును అనుసరించి ఉంటుంది అంటున్నారు! హెబ్రీ పత్రిక :13 ప్రకారం దుర్నీతి అనేది మోసకరమైనది! దుర్నీతి అనేది లోకంలోని మోసపరిచే శక్తులలో ఒక్కటి! వీడు కూడా ప్రజలను మోసగిస్తూ ఉంటాడు! ప్రకటన 12:9

కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

 

        కాబట్టి దుర్నీతి దేవునిమీద తిరుగుబాటు చివరి దినాలలో మరీ ఎక్కువైపోతుంది అన్నమాట!

ఇక సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును అనగా వాడు చేసే దుర్నీతి క్రియలె సత్యమైనవి కావాల్సినవి అంటూ ఎంతో బలముతో ప్రజలను ఒప్పిస్తూ ఉంటాడు! అందుకు గాను వాడు సూచక క్రియలు మహాత్కార్యాలు చేస్తాడు అని గ్రహించాలి!

 

ఇక మనము పదకొండు పన్నెండు వచనాలు చూసుకుంటే ఇందుచేత అనగా వారు సత్యాన్ని అవలంభించక అసత్యాన్ని అబద్దాన్ని నమ్ముతూ క్రీస్తు విరోధిని అనుసరిస్తున్నారు కనుక వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్దాన్ని నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అంటున్నారు! ఎప్పుడైతే దేవుని మాటలను త్రోసివేసి మనుష్యులు సాతానునే అనుసరిస్తున్నారో దేవుడు వారిని బ్రష్టత్వము నకు అప్పగించేస్తున్నారు అన్నమాట! ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన శిక్ష వారికి!

రోమా 1:28

రోమీయులకు 1: 28

మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.

 

రోమీయులకు 11: 8

ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

 

యెషయా 29: 10

యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి యున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి యున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు.

 

యెషయా 6: 10

వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

 

         వారు సత్యాన్ని నిజదేవుడైన యేసుక్రీస్తుప్రభులవారిని త్రోసివేసి నందువలన శిక్ష వారికి కలిగింది అన్నమాట! ఇది పూర్తిగా న్యాయసమ్మతమైన శిక్ష! కీర్తనల గ్రంధంలో దయగలవారికి నీవు దయచూపుతావు కటినుల ఎడల వికటం చూపుతావు అంటున్నారు 18:2526

 

     ఇదీ చివరికి దేవుణ్ణి అనుసరించక క్రీస్తువిరోధిని పాపపురుషున్ని అనుసరించినందువలన కలిగే శిక్షలు! కాబట్టి మనము అప్రమత్తంగా ఉందాము! సిద్దపడదాము! రాకడలో ఎత్తబడదాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*86 భాగము*

   2 థెస్స 2:13—14  

13. ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును (ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది) ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.

14. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.   

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో గల ప్రత్యక్షతలు కోసం ధ్యానం చేసుకున్నాము!  ఇక పత్రిక  చివరి వరకు విశ్వాసులు ఎలా జీవించాలి అనేది రాస్తూ వీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా స్థితిని రక్షణను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దానికోసం చెబుతున్నారు!

 

    ప్రియ దైవజనమా! 13, 14 వచనాలలో ఎన్నెన్నో ఆత్మీయ సంగతులను రాస్తున్నారు పౌలుగారి త్రయం ఆత్మావేశులై!!

 

మొదటగా: ప్రభువువలన ప్రేమించబడిన సహోదరులారా!

రెండు: ఆత్మ మిమ్మును పరిశుద్ద పరచుట వలన,

మూడు: మీరు సత్యాన్ని నమ్మడం వలన,

నాలుగు: రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆదినుండి లేక ప్రధమ ఫలంగా ఏర్పరచు కొన్నారు గనుక దేవుని స్తోత్రాలు చెబుతూ,

ఐదు: మీరీలాగు రక్షంచబడాలని,

ఆరు: మహిమ పొందాలని సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నారు!

 

    మొట్టమొదటగా *ప్రభువువలన ప్రేమించబడిన సహోదరులారా* అంటున్నారు త్రయం! ఎందుకు అలా అంటున్నారు అంటే అదే రక్షణ సువార్త పట్టణంలో ఎంతోమంది విన్నా గాని వారు అంగీకరించలేదు! కేవలం సంఘం మాత్రమే సత్యసువార్తకు లోబడింది! లోబడటమే కాకుండా శ్రమలను తట్టుకుని క్రీస్తుకు నిజమైన శిష్యులుగా సాక్షులుగా జీవిస్తున్నారు కాబట్టి ప్రభువువలన ప్రేమించబడిన సహోదరులు అంటున్నారు! వీరు అంత స్థిరమైన విశ్వాసంలో ఉండటం వలన దేవుడు వీరిని ఎంతో ప్రేమిస్తున్నారు! దీనికి మరొక  కారణము కూడా  ఉంది!  

 యోహాను :16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటూ.. అందుకే తనసొంత కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారిని లోకానికి పాప విముక్తి యాగము కోసం పంపించారు అంటున్నారు! అనగా ఇక్కడ లోకము అనగా ప్రపంచంలో ఉన్న ప్రతీ మనిషి అని అర్ధం! అందరినీ దేవుడు ప్రేమించి తన సొంత కుమారుని ద్వారా తనవద్దకు రావాలనేది దేవుని రక్షణ ప్రణాళిక! గాని  ఎవరైతే రక్షణ ప్రణాళికలోకి వస్తారో వారు మాత్రమే రక్షించబడతారు తప్ప మిగిలిన లోకమంతా రక్షణ పొందలేరు! అనగా ఒకరకంగా చెప్పాలంటే దేవుడు లోకములోని అందరిని ప్రేమించినా ఎవరైతే రక్షణ సువార్తకు లోబడతారో వారే ప్రేమకు అర్హులు గాని మిగిలిన వారు ప్రేమకు అర్హులు కాదు అందుకే రక్షణ సువార్తను కాళ్ళతో త్రోసివేసి లోకములోనే ఉంటున్నారు! 

కాబట్టి సంఘము ప్రేమకు పాత్రులయ్యారు అన్నమాట! ప్రియ చదువరీ! నీవు కూడా ప్రేమకు పాత్రుడుగా ఉన్నావా లేక కాళ్ళతో త్రోసివేస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో!

 

   అయితే విషయంలో పౌలుగారు మరోమాట చెబుతున్నారు కొలస్సీయులకు :12 లోమీరు దేవుని చేత ప్రేమించబడ్డారు కాబట్టి ఇంకా దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పవిత్రులు, పరిశుద్దులు, దేవునికి ఇష్టమైన ప్రజలు కాబట్టి దేవుని మనస్సును దయను వినయాన్ని సాత్వికమైన బుద్ధి ఓర్పును ధరించుకోండి అంటున్నారు...

 

  మరో విషయం రోమా 8:౩౦ లో అంటున్నారు ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని పిలిచారు, ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా లేక నిర్దోషులుగా తీర్చారు! ఎవరిని నీతిమంతులుగా చేశారో వారిని మహిమ పరిచారు అంటున్నారు! అనగా *దీనిని జాగ్రత్తగా గమనిస్తే ఎవరిని ప్రేమిస్తున్నారో ఎక్కువగా వారిని ముందుగా నిర్ణయించు కొన్నారు, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నారో వారిని పిలిచారు, ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా చేశారు! ఎవరిని నీతిమంతులుగా చేసారో వారిని మహిమ పరచారు అన్నమాట! కాబట్టి ఇంతటి అమోఘమైన ప్రణాళికను నిర్లక్షం  చేస్తే ఎలాగు తప్పించుకోవలవు ఒకసారి ఆలోచన చేసుకో! ఇంతటి అద్భుతమైన ప్రణాళికలో ఉన్నావు గనుక రక్షణను కాపాడుకుంటూ పేరుకు తగ్గ జీవితం జీవించాల్సిన అవసరం ఉంది అని మరచిపోకు!

 

ఇక రెండవది: ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన అంటున్నారు! ఇక్కడ ఎంతో స్పష్టంగా అర్ధమవుతుంది ఏమిటంటే మనిషి పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు కార్యం చేసి మిమ్మును పరిశుద్ధంగా ఉంచుతాడు అన్నమాట! అనగా మన భక్తివలన గాని, పూజాపునస్కారాలు వలన గాని, దానధర్మాలు వలన గాని, లేక కానుకలు ఇవ్వడం వలన గాని లేక భక్తికి సంబందించిన మరో కార్యక్రమము వలన గాని మనం పరిశుద్ధపరచ బడముగాని కేవలము పరిశుద్ధాత్మ మనలను పవిత్రంగా చేస్తేనే మనము పరిశుద్ధపరచబడతాము అని గ్రహించాలి! చివరికి నీవు ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత దీర్ఘ ప్రార్ధనలు చేసినా అది నిన్ను పవిత్రముగా చేయదు అని గ్రహించాలి! ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని దానిని అనుదినం అనుభవించాలి అన్నమాట! భాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు

అపో.కార్యములు 2: 38

పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

 

 గాని పరిశుద్ధాత్ముని ప్రతీరోజు పలకరిస్తూ ఆయనతో నింపబడకపోతే నీవు శుద్ధిచేయబడవు! అర్ధం కాడానికి ఉదాహరణ చెబుతాను! మంచి సబ్బుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన నీ ఒంటికి అంటిన మురుకి పోదు! దానితో నీవు బాగా రుద్దుకుని స్నానం చేస్తేనే నీ మురుకి పోతుంది! మంచి సర్ఫ్ పౌడర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే నీ బట్టలు శుద్ధిచేయబడవు గాని సర్ఫ్ లో బట్టలు నానబెట్టి తర్వాత ఉదికితే బట్టలలో ఉన్న మురుకి శుభ్రంగా పోతుంది! అలాగే పరిశుద్ధాత్మ  అనేది బాప్తిస్మం పొందుకున్న వెంటనే నీలోనికి వచ్చినా అనుదినం ఆయనాత్మతో నింపబడుతుంటేనే నీలో ఉన్న పాప మలినమంతా కడగబడి శుద్దుడుగా మారగలవు!

 

కాబట్టి ఆయనాత్మతో నింపబడుతూ ఆత్మతాకిడి ప్రతీరోజు అనుభవించవలసిన అవసరం ఎంతైనా ఉంది! పరిశుద్ధాత్ముడు నాలోనే ఉన్నాడు అనుకుంటూ ఆయన శక్తిని పొందకపోతే ఇంట్లోకి సబ్బుని తెచ్చుకుని బీరువాలో భద్రంగా దాచుకున్న వాడవు అవుతావు తప్ప సబ్బుతో స్నానం చేసిన వాడవు కాలేవు! కాబట్టి ఆయనాత్మ నీలో ఉన్నాడా? ఎవడు ఆయనాత్మ లేనివాడో వాడు ఆయన వాడు కాదు అని వ్రాయబడింది!

రోమీయులకు 8: 9

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

ఆయన వాడు కాదు అంటే సాతాను గాడి పార్టీ అన్నమాట!

కాబట్టి నేడే ఆయనాత్మను పొందుకుని, ప్రతీరోజు ఆయన ఆత్మ శక్తితో నింపబడుతూ శుద్దులుగా ఉందాము! పరమకానాను చేరుకుందాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*87 భాగము*

   2 థెస్స 2:13—14  

13. ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును (ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది) ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.

14. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.   

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో   విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేస్తూ 1314 వచనాలలో గల ఆరు ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!   

 

మొదటగా: ప్రభువువలన ప్రేమించబడిన సహోదరులారా!

రెండు: ఆత్మ మిమ్మును పరిశుద్ద పరచుట వలన,

మూడు: మీరు సత్యాన్ని నమ్మడం వలన,

నాలుగు: రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆదినుండి లేక ప్రధమ ఫలంగా ఏర్పరచు కొన్నారు గనుక దేవుని స్తోత్రాలు చెబుతూ,

ఐదు: మీరీలాగు రక్షంచబడాలని,

ఆరు: మహిమ పొందాలని సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నారు!

 

    (గతభాగం తరువాయి)

 

ఇక మూడో విషయం : *మీరు సత్యాన్ని నమ్మడం వలన* అంటున్నారు! అనగా సత్యాన్ని నమ్మడం వలన రక్షించబడ్డారు ఇంకా రక్షణ వలన మహిమ పరచబడ్డారు అని అంటున్నారు!

సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది యోహాను సువార్తలో దేవుడు చెబుతున్నారు! 8:32;

 దేనినుండి స్వతంత్రులుగా మారుతారు అంటే పాప బంధకాలనుండి విడుదల పొంది స్వతంత్రులుగా మారతారు! ఎప్పుడు? సత్యాన్ని నమ్మడం వలన!

ఇక్కడ సత్యము అనగా సువార్త సత్యము అని మరచిపోవద్దు! దేవుడు మనుష్యులను రక్షించే పద్దతి ఇదే! సత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది! ఇక్కడ పౌలుగారు చెప్పేది సువార్త సత్యము అని చూసుకున్నాము! అనగా సువార్త సత్యము మనుష్యులను స్వతంత్రులుగా చేస్తూ రక్షణలోకి రప్పిస్తూ మహిమలోనికి తీసుకుని వస్తుంది అన్నమాట!

 

సత్యము కోసం కొంచెం ధ్యానం చేస్తే

మొదటగా వాక్యమే సత్యము!

యోహాను 17: 17

సత్యమందు (మూలభాషలో- సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; *నీ వాక్యమే సత్యము*.

 

రెండు ఆత్మయే సత్యము: 1యోహాను 5:6

నీళ్ల ద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో(లో) మాత్రమేగాక నీళ్లతోను(లో) రక్తముతోను వచ్చెను. *ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే*.

 

సత్యము కోసం సాక్ష్యం చెప్పడానికే ఏసుక్రీస్తుప్రభులవారు ఈలోకమునకు వచ్చియున్నారు. యోహాను 18:37

కాబట్టి సత్యమును నమ్మడం ద్వారా దేవుడు మీకు పాపవిముక్తి చెయ్యాలని మొదట నుండి ఎన్నుకున్నారు అంటున్నారు!  ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుప్రభులవారే నిజమైన రక్షకుడని, ఆయన మన పాపములకొరకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని అర్పించారని,  ఆయనద్వారానే మనం పరలోకం వెళ్తామనే సత్యాన్ని నమ్మాలి! అప్పుడు యేసురక్తము ప్రతిపాపములనుండి మనలను శుద్దిచేస్తుంది....

 1యోహాను 1: 9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 1: 7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

ఇక నాలుగు: *రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆదినుండి లేక ప్రధమ ఫలంగా ఏర్పరచు కొన్నారు* గనుక దేవుని స్తోత్రాలు చెబుతున్నారు!  చూశారా రకంగా రక్షణ పొందాలని దేవుడు ముందుగానే మనలను ఏర్పరచు కొన్నారు!

 

Ephesians(ఎఫెసీయులకు) 1:4,5,6

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

 

ఎందుకు ఎన్నుకున్నారు?

1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

పరిశుద్దులుగా ఉండటానికి పిలుచుకున్నారు.... రోమా 1:2; 1కొరింథీ 1:2

 

తన రాజ్యమునకు మహిమకును పిలచుకొన్నారు!

1థెస్సలొనికయులకు 2: 11

తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,

 

1థెస్సలొనికయులకు 1: 4

ఏలయనగా దేవునివ లన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

 

చివరికి రోమా 8:30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

కాబట్టి ఆయన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని, పిలుపుకు తగిన జీవితం తప్పకుండా జీవించాలి!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

    

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*88 భాగము*

   2 థెస్స 2:13—14  

13. ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును (ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది) ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.

14. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.   

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో   విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేస్తూ 1314 వచనాలలో గల ఆరు ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!   

 

మొదటగా: ప్రభువువలన ప్రేమించబడిన సహోదరులారా!

రెండు: ఆత్మ మిమ్మును పరిశుద్ద పరచుట వలన,

మూడు: మీరు సత్యాన్ని నమ్మడం వలన,

నాలుగు: రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆదినుండి లేక ప్రధమ ఫలంగా ఏర్పరచు కొన్నారు గనుక దేవుని స్తోత్రాలు చెబుతూ,

ఐదు: మీరీలాగు రక్షంచబడాలని,

ఆరు: మహిమ పొందాలని సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నారు!

 

    (గతభాగం తరువాయి)

 

ఇక ఐదు, ఆరు విషయాలు: మీరీలాగు రక్షంచబడాలని, మహిమ పొందాలని సువార్త వలన మిమ్మును పిలిచెను అంటున్నారు!

 

అనగా రకంగా ప్రభువువలన ప్రేమించబడి, దేవునిచేత పిలువబడి, సత్యమును నమ్మి, ఆత్మవలన పరిశుద్దపరచబడి, రక్షణ పొందాలని, తద్వారా మహిమ పరచబడాలనేది దేవుని రక్షణ ప్రణాళిక!

గమనించాలి: చిట్టచివరికి దేవుడు ఏమని కోరుతున్నారు? ఇలా రక్షణ ప్రణాళికలోకి ప్రవేశించి చిట్టచివరికి మహిమలో ప్రవేశించాలి లేక మహిమను పొందుకోవాలి అనేది దేవుని ప్రణాళిక!

ఎందుకు మహిమలోనికి ప్రవేశించాలి అంటే ఆయన ఉండేదే మహిమలో! కాబట్టి తానుండే చోటున మనము కూడా ఉండాలనేది దేవుని ఆశ! అందుకే నేను స్థలం సిద్దపరచ వెళ్ళుచున్నాను! అలాచేస్తే నేను ఉండే చోటున మీరును ఉంటారు అని ముందుగానే యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు యోహాను సువార్తలో... 14: 3

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

 

1థెస్సలొనికయులకు 2: 11

తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,

 

చూశారా ఇక్కడ ఆయన మనలను ఎందుకు పిలుచుకున్నారు అంటే మొదట తన రాజ్యమునకు వారసులుగా ఉండాలి రెండు మహిమకు పాత్రులుగా ఉండాలి! కాబట్టి దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి అని హెచ్చరిస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను, సాక్ష్యమిస్తున్నాను అంటున్నారు.

 

2థెస్సలొనికయులకు 1: 5

దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

 

యాకోబు 2:5

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

 

అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే *తన మహిమకు మనలను పిలుచుకున్నారు గాని ఒక మెలిక (ట్విస్ట్ ఉంది)!*

మెలిక అర్ధం చేసుకోవాలి అంటే రోమా 8:17 చూసుకోవాలి! ...

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

    ఇక్కడ జాగ్రత్తగా గమినిస్తే మనం సంతానమైతే   వారసులం అంటూ వారసులం అయితే క్రీస్తుతో పాటుగా మహిమను అనుభవించడానికి  శ్రమలను అనుభవించాలి అన్నమాట! మర్మాన్ని గ్రహించాలి! కేవలం ఆశీర్వాదాలు, దీవెనలు, మహిమ మాత్రమే కావాలి గాని ఆయన శ్రమలు వద్దు అంటే కుదరదు! శ్రమలను అనుభవిస్తేనే నీకు మహిమ దీవెనలు అన్నీ చెందుతాయి! ఇప్పుడు వారసుడు అంటే తండ్రి ఆస్తి మాత్రమే కాకుండా తండ్రికున్న అప్పులు కూడా పంచుకోవాలి లేక అప్పులు కూడా వారసత్వంగా వస్తాయి! అప్పులే కాదు కొన్ని భాద్యతలు కూడా ఉంటాయి! కేవలం హక్కులు మాత్రమే కావాలి భాద్యతలు వద్దు అంటే కోర్టు బయటకు పోమ్మంటాది ఇది కూడా అంతే!

 

సరే, *ఇంతకీ మహిమలోకి వెళ్ళడానికి శోధనలు శ్రమలు ఎందుకు అవసరం?* జవాబు సింపుల్!

హెబ్రీ 2:10 ప్రకారం శ్రమ ద్వారానే సంపూర్ణతలోనికి ప్రవేశించగలము..

 

     అనగా మహిమలోనికి రావాలి అంటే మొదటగా శ్రమలను అనుభవించాలి, శ్రమలు నిన్ను సంపూర్ణులుగా చేస్తుంది! సంపూర్ణత నిన్ను మహిమలోనికి రప్పిస్తుంది అన్నమాట!

ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే హెబ్రీ 2:10,11 లో అంటున్నారు

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ...

 

 యేసుక్రీస్తుప్రభులవారు మనలను విమోచించడానికి మొదటగా తాను సంపూర్ణత సాధించారు! అలా సంపూర్ణత సాధించడానికి మొదటగా ఆయన శ్రమల ద్వారానే సంపూర్ణత సాధించారు! కాబట్టి 11 వచనం ప్రకారం పరిశుద్ధ పరచేవారికి అనగా యేసుక్రీస్తుప్రభులవారికి,  పరిశుద్ద పరచబడే వారికి అనగా మనకు కూడా ఒక్కటే సిద్దాంతం అంటున్నారు! ఇప్పుడు మరలా మనం పదో వచనం చూసుకుంటే అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశారు దేవుడు అన్నారు! దీనిని బట్టి సంపూర్ణత సాధించడానికి యేసుక్రీస్తుప్రభులవారు ఎలా శ్రమల మార్గమున వెళ్ళారో అలాగే మనము కూడా సంపూర్ణత సాధించడానికి శ్రమల మార్గము లోనే వెళ్ళాలి! మరో షార్ట్ కట్ లేనేలేదు! శ్రమల ద్వారా సంపూర్ణత సాధించి సంపూర్ణత ద్వారానే మనము మహిమ పొందగలము అన్నమాట! ఇదంతా దేవుని రక్షణ ప్రణాళికలో భాగము అని మర్చిపోవద్దు! దీవెనలు ఆశీర్వాదాలతో పాటుగా శ్రమలు కూడా రక్షణ ప్రణాళికలో బాగమే అని గుర్తించాలి!

 

రోమా 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

 

యోహాను 17: 22

మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

 

కాబట్టి ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి! ఒకటి మహిమలోనికి ప్రవేశించే గుంపు! మరొకటి శాశ్వత నరకానికి పోయే గుంపు! మరి నీవు గుంపులో ఉన్నావో తేల్చుకో!

 ఇక చివరగా మిమ్మల్ని ఇలా తన మహిమలోనికి పిలువడానికి దేవుడు మా సువార్త ద్వారా పిలుచుకున్నారు అంటున్నారు! ఇక్కడ మా సువార్త అనగా వారు ప్రకటించిన సిలువ సువార్త లేక సువార్త సత్యము అని గమనించాలి!

 

పౌలుగారు గలతీ పత్రికలో చెబుతున్నారు 1:1112లో

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 

చివరగా సువార్త అంటే ఏమిటి?

1కొరింథీ 15:18

1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.

2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.

3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

 

కాబట్టి రక్షణ ప్రణాలికను అర్ధం చేసుకుంటూ శ్రమలను సహిస్తూ సత్యంలో సాగిపోదాం!

మరోమాట: నీవు శ్రమలను తట్టుకోవాలంటే పైన చెప్పిన విషయాలతో పాటు పరిశుద్ధాత్మ ను పొందుకోవాలి. అప్పుడు ఆయన మనలనుసర్వ సత్యము లోనికి నడిపించి తట్టుకునే శక్తి, శ్రమలను జయించే మార్గము చూపిస్తారు!

చివరకు మహిమలో ప్రవేశిద్దాం!

దైవాశీసులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*89 భాగము*

   2 థెస్స 2:1517   

15. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను (పారంపర్యములను) చేపట్టుడి.

16. మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,

17. మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో   విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేస్తున్నాము!

 

ఇక 15 వచనంలో: కాబట్టి సహోదరులారా! నిలకడగా ఉండి మా నోటి మాటలవలనైనా మా పత్రికల ద్వారా గాని మీకు బోధించబడిన విధులను లేక పారంపర్యములను పాటించండి అంటున్నారు!

 

పౌలుగారు పత్రికలలో చివరలో ఇలాగే ఉంటుంది! అనగా చెప్పాల్సింది అంతా ముందుగా చెప్పేసి కాబట్టి మీరు ఇలా ఉండండి నిలకడగా ఉండండి అంటూ ఉంటారు! కొన్నిచోట్ల అన్నారు మెలుకువగా ఉండండి విశ్వాస మందు స్తిరంగా ఉండండి అంటున్నారు.....

1కొరింథీ 16:13

మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;

 

ఎఫెసీ 6:18, 20

18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

20. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

కొలస్సీ 4:2 .

ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

 

   సరే మరి ఇక్కడ కాబట్టి నిలకడగా ఉండి అంటూ మొదలుపెట్టారు అంటే మీదన దేనికోసం చెప్పారు ఇంతవరకు నేర్పించిన విధంగా  అంటే సత్యంలో స్థిరంగా ఉండండి హెచ్చరిస్తున్నారు!

 

రోమా 12:1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

ఎఫెసీ 4:1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

 

కొలస్సీ 3:1

మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.

 

ఇంకా దేనియందు నిలకడగా ఉండమంటున్నారు అంటే

1కోరింథీయులకు 15: 58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

 Ephesians(ఎఫెసీయులకు) 6:11,13,14,15

11. మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి

14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని

15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.

 

ఇక మరో ప్రాముఖ్యమైన విషయం రాస్తున్నారు: మేము మీ దగ్గర ఉన్నప్పుడు మా నోటితో చెప్పిన మాటల ద్వారా గాని, మేము రాసిన పత్రికలలో బోధించిన విషయాల ద్వారా నేర్పించిన పద్దతులు లేక పారంపర్యాలు అనగా విధులు చేయండి అంటున్నారు! అనగా మేము ఏవి చెప్పామో పద్ధతులనే పాటించండి అంటున్నారు! ఇది పరిశుద్దాత్ముని ద్వారా మనందరికీ లభించిన ఆజ్ఞలు అన్నమాట! క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుప్రభులవారు మరియు అపోస్తలులు చెప్పిన పద్దతులు ఆచారాలు ఆజ్ఞలు అన్నీ తప్పకుండా ప్రతీ విశ్వాసి పాటించాలి అన్నమాట!

 

కాని నేటి దినాలలో దేవుడు చెప్పిన అంశాలు పద్దతులు పాటించకుండా బైబిల్ చెప్పనివి, అంగీకరించని పద్దతులు ఎన్నెన్నో నేటి సంఘము చేస్తుంది! ఉదాహరణకు క్రిస్మస్ అనేది బైబిల్ లో లేదు! క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత బైబిల్ లో లేదు! తాళి కట్టడం, వాస్తులు, జోతిష్యాలు చూడటం లాంటి పనికిమాలిన ఆచారాలు బైబిల్ లో లేవండి! పరిశుద్దాత్ముడు గాని, యేసుక్రీస్తుప్రభులవారు గాని, ఆది అపోస్తలులు గాని చెప్పని అలవాట్లు వింతైన పోకడలు మనకెందుకు అని ఆడుగుతున్నాను! దయచేసి మీరు పాటించే పద్దతులు అవి వాక్యానుసారమా కాదా అనేది దయచేసి ఆలోచించి చేయమని ప్రభువు పేరిట వినయంతో, దుఃఖంతో మనవిచేస్తున్నాను! వాక్యానికి వ్యతిరేఖమైన పనులు దయచేసి చేయవద్దని మనవిచేస్తున్నాను! అంతేకాని భారతీయ సంప్రదాయమనే ముసుకులో దయచేసి బ్రతుకవద్దు అని మనవిచేస్తున్నాను!

 

  ఇక చివరి రెండు వచనాలలో దీవెన వచనాలున్నాయి! మన ప్రభువైన ఏసుక్రీస్తును మనలను కూడా ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడను మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమందు మిమ్మును స్థిర పరచును గాక అంటూ ఆశీర్వదిస్తున్నారు!

 

  ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసయ్యను మనలను కూడా ప్రేమిస్తున్నారు అంటూ కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించారు అంటున్నారు! యిర్మియా గ్రంధం 31:3 లో భక్తుడు చెబుతున్నారు: చాలాకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుతున్నాను అంటున్నారు! అవును కదా మనం మాటిమాటికి తప్పిపోతున్నా సరే ఆయన జాలిచూపించి శాశ్వతమైన ప్రేమ చూపించి మనలను విడువక ఆదరిస్తున్నారు! అందుకు మనం జీవితాంతం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి!

 

ఇక తర్వాత మాటలో శుభ నిరీక్షణ అంటున్నారు: గమనించాలి దీనినే శుభప్రదమైన నిరీక్షణ అంటూ మిగిలిన పత్రికలలో చెప్పారు.... తీతు 2:12

శుభప్రదమైన నిరీక్షణ అనగా ఒకరోజు యేసుక్రీస్తుప్రభులవారు   తిరిగి రాబోతున్నారు  నమ్మిన మనలను, విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారిని, వాక్యానుసారమైన జీవితం, సాక్ష్యార్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న పరిశుద్దులందరినీ ఆయన తనతో ఉండటానికి తీసుకునిపోతారు! అక్కడ భాధలన్నిటిని విడిచిపెట్టి మనం శాశ్వతంగా పరమ దేవునితో పరిశుద్దులతో వేవేల దూతలతో సంతోషిస్తూ ఉంటాము! ఇదే శుభప్రదమైన నిరీక్షణ! అలాంటి శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చారు అంటున్నారు పౌలుగారు!

 

ఇంకా నిత్యమైన ఆదరణ అని అంటున్నారు! కారణం సంఘము భయంకరమైన శ్రమల ద్వారా వెళ్తుంది కాబట్టి దేవుడు నిత్యమైన ఆదరణ దయచేస్తారు! నిరీక్షణ విశ్వాసము దయచేస్తారు అంటున్నారు పౌలుగారు!

 

1పేతురు 1: 4

మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన(జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

 

రోమా 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

 

Romans(రోమీయులకు) 8:24,25

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.

 

ఇక ఓదార్పు కోసం చూసుకుంటే మనుష్యులు ఒకరికొకరు ఓదార్చుకోవాలి గాని దేవుడిచ్చే ఓదార్పుతో ఏదీ సాటిరాదు! అది శ్రేష్టమైన ఆదరణ! అది దేవుని నుండే కలుగుతుంది! కారణం ఆయన పేరే ఆదరణ కర్త! కాబట్టి ఆయనే నిజమైన, నిత్యమైన ఆదరణ ఈయగలరు!

 

ఇంకా ప్రతి సత్కార్యమందు సద్వాక్యమందు స్థిరపరచును గాక అంటున్నారు! చూడండి మనము చేసేవి సత్కార్యాలు అనగా మంచిపనులు కావాలి! ఇంకా మాట్లాడేవి సద్విషయాలు కావాలి! సద్వాక్యాలు కావాలి! నీ సంభాషణ ఉప్పు వేసినట్లు మధురంగా ఉండాలి గాని దుర్బాషలు, హేళన, పోకిరి మాటలు రాకూడదు అని బైబిల్ చెబుతుంది!

కాబట్టి అట్టి విషయాలను నేర్చుకుని వాక్యానుసారమైన జీవితం దేవుడుమెచ్చే జీవితం జీవిస్తూ సత్యంలో స్థిరంగా ఉందాము!

 

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*90 భాగము*

   2 థెస్స :1—5    

1. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి (పరుగెత్తి) మహిమ పరచబడు నిమిత్తమును,

2. మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మా కొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.

3. అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి (దుష్టునినుండి) కాపాడును.

4. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము.

5. దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.

 

        ప్రియులారా! మనము రెండో అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారి ప్రత్యక్షతలు ఇంకా   విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేసుకున్నాము! ఇక మూడో అధ్యాయం కూడా దానికోసమే కొనసాగిస్తున్నారు!

 

   మొదటి వచనంలో తుదకు సహోదరులారా అంటూ మొదలుపెట్టారు అనగా ముగింపుకి వచ్చేశారు అన్నమాట! తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారం ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడునిమిత్తము ఇంకా మేము మూర్కులైన దుష్ట మనుష్యుల చేతిలోనుండి తప్పించబడు నిమిత్తము మాకోసం ప్రార్ధన చేయండి అంటున్నారు!

 

     ప్రియమైన థెస్సలోనికయ సంఘమా! మీలో లేక మీ మధ్య ఎలా జరుతుందో లేక జరిగిందో అలాగే సువార్తసత్యము ఇక్కడ కూడా అలాగే వ్యాపించేలా అనగా సువార్త ప్రకటన మరియు ఒప్పుకోలు విరివిగా విస్తారంగా జరిగేలా ప్రభువు వాక్యం అన్ని ప్రాంతాలలోను తొందరగా వ్యాపించేలా మాకోసం ప్రార్ధన చేయండి అంటున్నారు!

 

    గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలుగారు సీలగారు తిమోతి గార్లు ఇక్కడ నిజంగా కొరింథీ పట్టణంలో అవసరంలో ఇబ్బందులలో ఎన్నో కష్టాలలో ఉన్నారు! గాని మాకు సహాయం చెయ్యండి మాకు అవసరాలున్నాయి లాంటివి రాయడం లేదు అడగడం లేదు! లేదా మాకు ఆస్తుపాస్తులు కలిగేలా లేక మా సువార్త పనికి దేవుడు ధనము సమకూర్చేలా మాకోసం ప్రార్ధన చెయ్యండి అని కూడా అనడం లేదు! ఇక్కడ ఆయన మనస్సు, హృదయం వేరే విషయాల మీద అనగా ఆధ్యాత్మిక సంగతుల మీద కేంద్రీకృతమై ఉన్నాయి! అది ఏమిటంటే కేవలం సువార్త వ్యాప్తి, ఆత్మలపంట! ఇదే ఆయన ధ్యాశ! ఇక ఆర్దికావసరతలా? దానిని దేవుడే చూసుకుంటారని తెలుసు! ఇంకా తనకు తనతోటివారి ఆహార అవసరాల కోసం ఎలాగు ఆయనే తనచేతులతో కష్టపడి వచ్చిన ధనముతో తినడము అలవాటు! వాటికోసం ఏనాడు ఎవరిమీద ఆధారపడలేదు! అందుకే మేము సువార్త బాగా ప్రకటించేలా ప్రార్ధన చెయ్యండి అంటున్నారు!

 

    నేటి సేవకులకు గొప్ప దైవజనుడు పూర్తి వ్యతిరేఖంగా ఉన్నారు! నేటి సేవకులు మేము ఇక్కడ సేవచేస్తున్నాము అక్కడ సేవచేస్తున్నాము ఇది కడుతున్నాము అది కడుతున్నాము! మాకు విరాళాలు ఇవ్వండి అంటూ పేద అరుపులు అరిచి కానుకలు దండుకుని స్థానిక సంఘాలను స్థానిక కాపరులను దోచుకుంటున్నారు! మరికొంతమంది దేవుడు నాకు దీనికి కట్టమన్నారు దానిని కట్టమన్నారు అని చెప్పి కాలేజ్ లు హాస్పటల్ లు కట్టి వాటిని పేదవారికోసం వాడకుండా ధనవంతులకోసం వాడుతున్నారు! తద్వారా వారు కోటీశ్వరులు అవుతున్నారు తప్ప దేవుని సేవకోసం వాటిని వాడటం లేదు! ఇదీ పూర్తిగా దగా మరియు దోపిడీ మాత్రమే! నేటిసేవకులు పౌలుగారిని ఆది అపోస్తలులను చూసి తప్పకుండా వారి విధానాలు నేర్చుకోవాలి! అలాగే కానుకలు ఇచ్చేవారు కూడా ఇది వాక్యానుసారమా కాదా అని ఆలోచించాలి!!

 

   ఇక రెండో వచనంలో మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలో నుండి తప్పించబడేలా మాకోసం ప్రార్ధన చెయ్యండి అంటున్నారు! మీదన చెప్పిన విధంగా ఉత్తరం రాసేటప్పుడు పౌలుగారి త్రయం కొరింథీ పట్టణంలో చాలా నెలలు నుండి ఉంటున్నారు! కొరింథీ పట్టణంలో సేవ ఘనంగా సాగుతుంది! అదే సమయంలో అనేకమంది ఎదురాడువారు బయలుదేరి సువార్తకు ఎన్నెన్నో ఆటంకాలు కలుగజేయడమే కాదు వారిని చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు! అందుకే మూర్ఖుల చేతిలోనుండి కూడా మేము విడిపించబడేలాగా దేవుని సేవ విరివిగా జరిగేల మాకోసం ప్రార్ధన చెయ్యమని కోరుతున్నారు! చూడండి పౌలుగారు కోరే సహాయం కేవలం ప్రార్ధన సహాయమే! అలాగే సేవకులు కాపరులు కూడా ఇతరసంఘాలనుండి కోరాల్సింది ప్రార్ధన సహాయమే తప్ప ఆర్ధిక సహాయం ఎంతమాత్రము కాదు!

 

పౌలుగారు ఇలా ప్రార్ధన చెయ్యండి అంటూ ఎన్నో సంఘాలకు ఉత్తరాలు రాశారు! ఉదాహరణకు

రోమా 15:౩౦—32

30. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర మగునట్లును,

31. నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,

32. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

ఎఫెసీ 6:19,20

19. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు

20. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

కొలస్సీ 4:—4

3. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే

4. మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని (ప్రవేశద్వారము తెరువవలెనని) మాకొరకు ప్రార్థించుడి.

 

     ఇక వచనం చివరిలో విశ్వాసం అందరిలో లేదా అందరికీ లేదు అంటున్నారు! కారణం రక్షంచబడినవారు కూడా వ్యతిరేఖంగా తయారయ్యారన్న మాట! అందుకే విశ్వాసం అందరికీ లేదు కాబట్టి మా కోసం మరెక్కువగా ప్రార్ధన చెయ్యమని చెబుతున్నారు!

 

   ఇక మూడో వచనంలో అయితే ప్రభువు నమ్మదగిన వాడు! ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడతారు అంటున్నారు! అనగా ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని ఇంకా నన్ను కూడా దుష్టత్వము నుండి కాపాడతారు అని రాస్తున్నారు! అవును మన ప్రభువు ఎంతో నమ్మదగిన వారు! మనం నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మన పట్ల జాలిచూపించి తన నమ్మకత్వము చూపిస్తూ తన జాలి కృప చూపించి మనలను విడిపిస్తున్నారు!

 

1కొరింథీ 1:9

మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

 

1కోరింథీయులకు 10: 13

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

 

1థెస్సలొనికయులకు 5: 24

మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

 

2 తిమోతి 2:13

మనము నమ్మదగని వారమైనను (నమ్మకపోయినను), ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు(ఆయన తన్ను తానెరుగననలేడు).

 

1పేతురు 4: 19

కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

 

1యోహాను 1: 9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

ప్రకటన 19:11

మరియు పరలోకము తెరువబడి యుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

 

    కాబట్టి ఆయన నమ్మదగిన వాడు గనుక మనలను విడువడు ఎడబాయడు! ఇప్పుడు ఆయన మిమ్మల్ని కూడా దుష్టత్వం నుండి కాపాడతారు! మమ్మల్ని ఇంతవరకు ఎలా కాపాడారో అలాగే మిమ్మల్ని కూడా కాపాడతారు అంటున్నారు!

 

యోహాను 17: 15

నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి (లేక,కీడునుండి) వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.

 

మత్తయి 6: 13

మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండిలేక-కీడునుండి) మమ్మును తప్పించుము. (కొన్ని ప్రాచీన ప్రతులలో- రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది)

 

కాబట్టి ఆయనలో విశ్వాసంతో ముందుకు సాగుదాం! శ్రమలైనా శోధనలైనా ఏదిఏమైనా ఆయనకోసమే జీవిద్దాం!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*91 భాగము*

   2 థెస్స :1—5  

1. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి (పరుగెత్తి) మహిమ పరచబడు నిమిత్తమును,

2. మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మా కొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.

3. అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి (దుష్టునినుండి) కాపాడును.

4. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము.

5. దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.

  

        ప్రియులారా! మనము మూడో అధ్యాయంలో విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేసుకున్నాము!  

 

      (గతభాగం తరువాయి)

 

    ఇక నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు రెండో అధ్యాయంలో చివర్లో చెప్పిన విషయాలనే మరో కోణంలో చెబుతున్నారు!

నాలుగో వచనంలో మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తున్నారని మాకు తెలుసు! ఇంకా రాబోయే కాలంలో కూడా చేస్తారని ప్రభువునందు మిమ్మును గూర్చి పూర్తి నమ్మకముగా ఉన్నాము అంటున్నారు! చూశారా థెస్సలోనికయ సంఘము అంటే పౌలుగారికి ఎంత భరోశానో కదా! నేను చెప్పినవి మీరు చేస్తున్నారు ఇంకా చేస్తారని ప్రభువు నందు నాకు మీమీద పూర్తి నమ్మకం ఉంది అంటున్నారు! ఇలాంటి నమ్మకం మనమీద దేవునికి ఇంకా మీ సంఘకాపరికి ఉందా? నమ్మకం రావాలి అంటే మీరు ఎంత నమ్మకత్వము చూపించాలి!!!

 

    సరే ఇంతకీ వారికి పౌలుగారు ఇచ్చిన ఆజ్ఞలు ఆదేశాలు ఏమిటి?

మొదటగా దేవునితో సమాధాన పడండి!

 2కొరింథీ 5:20

కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము.

 

ఇక్కడ పౌలుగారు దేవుని యొక్క ప్రత్యేకమైన రాయభారిగా దేవుని సంఘము ఎలా ప్రవర్తించాలి అనేది పరిశుద్దాత్ముని నుండి ఆదేశాలు పొందుకుని రాశారు మరియు చెప్పారు! కారణం సంఘము లోకము నుండి ప్రత్యేకించబడింది ప్రత్యేకముగా జీవించాలి కూడా! అందుకే ప్రత్యేకమైన నియమ నిబంధనలు!

 

తరువాత అంశం: సువార్త కు లోబడాలి ఇంకా ప్రకటించాలి! అది నిజమని నమ్మాలి!

గలతీ 1:11—12

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 

ఎఫెసీ :2—

2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక,గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.

3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

 

ఇక్కడ పౌలుగారు క్రీస్తుయేసు నుండి అనేక ప్రత్యక్షతలు పొందుకుని దేవుడిచ్చిన అధికారంతో మాట్లాడారు మరియు ఎన్నో సంఘాలకు పత్రికలూ రాశారు! ఒక్కో పత్రికలో ఒక్కో రకమైన విషయాలు రాశారు! రోమా పత్రికలో బిబ్లికల్ నాలెడ్జ్ కోసం చెబితే, కొరింథీ సంఘానికి సంఘంలో ఎదురయ్యే విషయాల కోసం రాశారు, ఎఫెసీ పత్రిక కొలస్సీ పత్రికలలో విశ్వాసులు, భర్త, భార్య పిల్లలు ఎలా ప్రవర్తించాలో రాశారు! ఇంకా సంఘానికి అవసరమైన ఆయుధాలు కోసం రాశారు! తిమోతి పత్రిక తీతు పత్రికలలో ఒక దైవజనుడు ఎలా ఉండాలి ఎలాంటి వారిని సంఘ పెద్దలుగా నియమించాలి అనే విషయాలు రాశారు! కాబట్టి సంఘానికి కావలసిన నియమనిబంధనలు అన్నీ పౌలుగారి ద్వారా పరిశుద్ధాత్ముడు సంపూర్తిగా వ్రాయించారు! ఇప్పుడు సంఘానికి అనగా సార్వత్రిక సంఘానికి వాటిని పాటించవలసిన అవసరం ఉంది! దానినే థెస్సలోనికయ సంఘానికి పౌలుగారు రాస్తున్నారునేను బోధించినవి తప్పకుండా పాటిస్తున్నారు ఇంకా పాటించండి అంటున్నారు!

 

    ఇక ఆరో వచనంలో ఎవడైతే వీటిని పాటించడో క్రమాలకు పద్ధతులకు వ్యతిరేఖంగా జీవిస్తాడో క్రమాలవలె కాకుండా అక్రమముగా నడుచుకొంటున్నాడో అలాంటి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము అంటూ శాశనం జారీ చేశారు! ఇంతవరకు మిమ్మును వేడుకుంటున్నాము అన్నారు గాని విషయంలో యేసుక్రీస్తు పేరిట మిమ్మును ఆజ్ఞాపిస్తున్నాము అంటున్నారు! అనగా ఎవడైతే పత్రికలలో ఇంకా క్రొత్త నిబంధనలో ఆజ్ఞాపించిన విషయాలు పాటించడం లేదో, మరియు ఎవడైతే క్రొత్త నిబంధనలో చెప్పని విషయాలు, నిబంధనకు వ్యతిరేఖమైన నియమాలు పద్దతులు పాటిస్తున్నాడో అలాంటి వాడినుండి తొలగిపొండి అంటున్నారు!  ఎందుకంటే వాడు చెడిపోయాడు సరికదా మిగిలిన వారిని కూడా చెరిపేసే చీడపురుగు కాబట్టి అలాంటి వాడికి దూరంగా ఉండండి అంటున్నారు!

 

   ఇక్కడ మరో విషయం ఖండితంగా మనం అర్ధం చేసుకోవాలి ఏమిటంటే పౌలుగారు ఆత్మావేశుడై ఇచ్చిన ప్రతీ ఆజ్ఞ అది క్రీస్తుయేసు నుండి కలిగినదే అని అర్ధం చేసుకోవాలి! తప్పకుండా వాటిని పాటించాలి! అదంతే!!!

 

  ఇక మరో ఆజ్ఞ వీరికి ఇచ్చారు 1థెస్స 4:1112 , 5:14 లో! ఎవడూ సోమరిగా ఉండకుండా తనచేతులతో కష్టపడి సంపాదించి వాటితోనే భోజనం చెయ్యాలి అంటూ! దీనికోసం అధ్యాయంలో కూడా చెప్పారు! వాటిని తర్వాత భాగంలో వీటికోసం చూద్దాం! అయితే ఇక్కడ దీనిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే పౌలుగారు ఎంతో స్పష్టంగా ప్రతీ ఒక్కడు తనచేతులతో పనిచేసి సంపాదించి తినాలి అని చెబితే కొందరు అబద్దబోధకులు యేసుప్రభులవారు అతి తొందరలో వచ్చేస్తున్నారు కాబట్టి ఎప్పుడూ దేవునికే సమయం ఉపయోగించండి గాని మీ పనిపాటులకు కాదు అంటూ వారిని సోమరులుగా చేయడానికి తద్వారా వారు కూడా సోమరులుగా ఉంటూ తమ పోషణ గడుపుకోడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలాంటి పనికిమాలిన అబద్దబోధకులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు అన్నమాట!

 

  ఇక్కడ వేరై ఉండాలి అంటే పూర్తిగా సంబంధాలు తెంచుకోమని అర్ధం కాదు! గాని ఇలాంటి సహోదరునితో గాని సహోదరితో గాని సహవాసం చెయ్యవద్దు! హలో అంటే హలో అనండి గాని వారింటికి వెల్లడ్డం, వారితో సంభాషించడం లాంటివి చేయకూడదు!

 2థెస్సలొనికయులకు 3: 15

అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.

 

ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మన నడవడిక ద్వారా వారికి ఏమని తెలియాలి  అంటే వారి ఉపదేశాలు దేవునికి గాని మనకు గాని, వారి ఉపదేశాల వలన గాని వారి వలన గాని ఏమాత్రం సంతోషం లేదు అని స్పష్టం చెయ్యాలి అంతే తప్ప వారితో విరోధభావం ఉండకూడదు!

 

   ఇక ఐదో వచనంలో అలా చేయడం వలన ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమలోకి క్రీస్తు ఓర్పు లోనికి నడిపిస్తాడు గాక అంటున్నారు!

దేవుని ప్రేమ అనగాఎఫెసీ :1619

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

రోమా 5:5

ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

   ఇక క్రీస్తు చూపిన ఓర్పు మనకు తెలుసు! మరణం పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా తననుతాను తగ్గించుకొని మనకోసం రిక్తుడయ్యారు ఆయన! ఫిలిప్పీయులకు 2: 8

మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

 

బాదించినా నోరు తెరువలేదు యెషయా 53 లో దీనికోసం ఉంది! అలాంటి ఓర్పు మనకు దేవుడు దయచేయును గాక అంటున్నారు

 కాబట్టి హెబ్రీ 12:1—

1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున

2. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ (కొన్నిప్రాచీన ప్రతులలో-తమసొంత హానికే అని పాఠాంతరము) చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.

 

    మనం కూడా అదే ఓర్పు అదే ప్రేమ కలిగి విశ్వాసంలో సాగిపోదాం! అబద్ద బోధకుల భోధలనుండి తొలిగిపోయి నిబంధనలో ఇచ్చి ఆజ్ఞలు పద్దతులు తప్పకుండా పాటిద్దాం!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*92 భాగము*

   2 థెస్స :7—12  

7. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;

8. ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.

9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారములేదనిచేయలేదు.

10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు--ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా.

11. మీలో కొందరు పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.

12. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరించుచున్నాము.   

 

        ప్రియులారా! మనము మూడో అధ్యాయంలో   విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేసుకుంటున్నాము!  

 

     ఇక ఏడో వచనం నుండి పన్నెండో వచనం వరకు గతభాగంలో చెప్పిన విషయాన్ని మరింత వివరంగా చెబుతూ అబద్ద బోధకులకు డైరెక్ట్ ఎటాక్ ఇస్తున్నారు!

 

 మేము మీ యెద్ద ఉన్నప్పుడు అక్రమముగా నడుచుకోలేదు అంటూ ఎలాగు మమ్మును పోలి మీరు నడచుకోవాలో మీకు తెలుసు అంటున్నారు! ఇక్కడ చూసుకుంటే పౌలుగారు మొదటగా తన సాక్ష్యాన్ని కాపాడుకొని, తాను చేసి మీరు కూడా ఇలాగే చేయండి, మీరు కూడా ఇలాగే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పినట్లుంది!

 

ఎనిమిదో వచనంలో మేము ఎవని యొద్ద ఉచితంగా భోజనం చెయ్యలేదు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతో రాత్రింబగల్లు పనిచేస్తూ మా జీవనం చేశాము!

తొమ్మిదో వచనం: ఎందుకు అలా చేసాము అంటే మీరు కూడా మమ్మును పోలి నడచుకొంటారని మా ఆశ! ముందు మేము మాదిరిగా జీవించి మీరుకూడా ఇలాగే చెయ్యాలనే ఆశతో ఇలా చేశాము! మాకు అధికారం లేదని కాదు అంటున్నారు!

 

చూశారా నిజంగా పౌలుగారు సీలగారు తిమోతి గారు ప్రతీ విశ్వాసికే కాకుండా ప్రతీ దైవజనుడికి కాపరికి సేవకునికి రోల్ మోడల్ అన్నమాట! వారిని చూసి మనలో ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలి! దేవుడు నీవు అన్నీ వదిలి వచ్చేసెయ్ అని ఆర్డర్ వేస్తేనే తప్ప నీవు చేసే పనిని ఆపేసి దేవుని సేవకు వచ్చెయ్యకూడదు!! నీవున్న స్థితిలోనే నీవు చేస్తున్న పని చేస్తూనే దేవుని సేవను కొనసాగించాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం! ఇక ప్రతీ విషయం దేవుని మీద ఆధారపడాలి గాని సంఘము మీద ఆధారపడకూడదు!

 

    ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు మీరు మమ్మును పోలి చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఇలా చేశాము! అంతేకాని అధికారం లేదు అని కాదు అంటున్నారు! కాబట్టి సేవకులు గాని విశ్వాసులు గాని పౌలుగారి బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

 

ఇక పదో వచనంలో మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పనిచేయకపోతే వాడు రోజు భోజనం చెయ్యకూడదు అని మీకు ఆజ్ఞాపించాము కదా అంటున్నారు! అలా అజ్నాపించడానికి కారణం 11, 12 వచనాలలో కనిపిస్తుంది!

కొందరు అబద్దకులు చేసిన భోధలకు కొందరు పని చేయకుండా పరులజోలికి పోవుచు అక్రమంగా నడచుకొంటున్నారు అని విన్నాము అంటున్నారు! కాబట్టి ప్రతీ ఒక్కడు నెమ్మదిగా పనిచేస్తూ సొంతముగా సంపాదించుకొన్న ఆహారాన్నే తినాలని మరోసారి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరిస్తున్నాము అంటున్నారు!

 

దీనికి నాంది ప్రస్తావన ఏమిటో పత్రిక యొక్క నేపధ్యం వివరించి నప్పుడు చూసుకున్నాము!..

కొందరు అబద్దబోధకులు బయలుదేరి యేసుక్రీస్తుప్రభులవారు ఎలాగు అతి త్వరలో వచ్చి సంఘాన్ని తీసుకునిపోబోతున్నారు కాబట్టి మనం ఈలోక సంబంధమైన కార్యక్రమాలు బ్రతుకుతెరువు కోసం ప్రాకులాటలు మానివేసి అస్తమాను దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రార్ధనలో వాక్యపఠన పరిచర్యలోనే ఉందాము! పనిపాటులు చెయ్యవద్దు! సమయంలో మనం ప్రార్ధనలో కనిపెడితే ఇంకా ఆధ్యాత్మికంగా బలపడతాము అంటూ తప్పుడు బోధలు చెయ్యడమే కాకుండా, వారు మానివేసి ఇతరులను కూడా పనిచేయకుండా ఆపివేశారు! సోమరుపోతులను చేస్తున్నారు! అయ్యో పౌలుగారు తన పత్రికలో చాలా వివరంగా మీ పనిపాటులు మీరు చేసుకుంటూనే దేవునిలో సాగమని చెప్పారు కదా మరి మీరు ఎందుకు ఇలా బోధిస్తున్నారు అని అడిగితే, కాదు ఇదే సరియైన పద్దతి అని వాదించే వారు కొంతమంది! మరికొంతమంది తెగించి పౌలుగారు వ్రాసినట్టు దొంగపత్రికలు రాసి సంఘానికి పంపించారు అంటారు బైబిల్ పండితులు! దానికి బదులుగా పౌలుగారు చెబుతూ వారు చేస్తున్నబోధ తప్పుడు బోధ! అది నా చేతిరాత కానేకాదు! ఇదిగో వందన వచనాలన్ని నేనే నా చేతితో రాస్తున్నాను! ఇదే నారాత! ఇదే మీకు గురుతు అంటూమీరు మమ్మును పోలి నడచుకోండి! మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎలాయితే మేము మా పోషణ కోసం మా సొంతపనులు చేసుకుంటూ సువార్త పరిచర్య చేస్తూ ప్రభువులో సాగామో అలాగేమీరు కూడా మీ సొంత చేతులతో పనిచేసుకుంటూ మీ సొంత డబ్బుతో భోజనం చెయ్యండి!  తప్పుడు బోధకుల మాటలు వినవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు!

మరో విషయం గుర్తుచెయ్యనా... అసలు థెస్సలోనికయ ప్రాంతం, ఎఫెసీ, గ్రీసు సామ్రాజ్యం మొత్తం ఆరోజులలో పనులు చెయ్యడానికి ఇష్టపడేవారు కాదు! ఎపుడూ ఏదో ఒక పనికిమాలిన కబుర్లు గాని క్రొత్త విషయం వినడం మాత్రం చేసేవారు!

ఇక అపోస్తలులు కార్యం మొదటినుండి నుండి గమనిస్తే రెండో అధ్యాయంలో క్రొత్తగా రక్షించబడిన విశ్వాసులు తమ ఆస్తులు అమ్మివేసి ప్రభువు పరిచర్యకు ఇచ్చేసే వారు. దానిని సమిష్టిగా పంచుకుంటూ ప్రభువు పనిని ఘనంగా చేసేవారు అపోస్తలులు! నాలుగో అధ్యాయంలో బర్నబా గారు కూడా తన మొత్తం ఆస్తి అమ్మి తెచ్చారు! 5 అధ్యాయంలో అలా చేద్దామని నటించబోయి చచ్చారు అననీయ సప్పీరాలు! అందుకే అబద్దబోధకులు కూడా సంఘస్తులు కూడా అలాగే ఆస్తులమ్మి తెచ్చిపెడితే తేరగా కూర్చుని తిందామని తప్పుడుబోధలు మొదలుపెట్టారు అన్నమాట!

అందుకే మరోసారి మరలా రాస్తున్నారు సంగతి!

 

కాబట్టి ప్రతీ క్రైస్తవుడు ఆదర్శంగా జీవించాలి! ముఖ్యంగా సంఘకాపరులు సేవకులు పెద్దలు మాదిరిగా జీవిస్తూ సంఘాన్ని క్రమంలో పెట్టాలి!

1కొరింథీ 11:1

నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

 

ఫిలిప్పీ :17

సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.

 

పౌలుగారు ఆదర్శంగా జీవించారు మరి నీకు అలాంటి ఆదర్శం ఉందా? సేవకుడా ఆదర్శంగా జీవించు! యవ్వనుడా కాళీగా ఇంట్లో కూర్చుని మీ తల్లిదండ్రులకు భారంగా ఉండొద్దు! నీవు చేయగలిగిన పని నీ చేతులతో చేస్తూ ఉండాలనేది పౌలుగారి ద్వారా పరిశుద్దాత్ముని ఆజ్ఞ!

అట్టి కృప భాగ్యము మనందరికీ దేవుడు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*93 భాగము*

   2 థెస్స :13—18    

13. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు.

14. పత్రిక మూలముగా మేము చెప్పినమాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.

15. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.

16. సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.

17. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.

18. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడై యుండును గాక.

 

        ప్రియులారా! మనము మూడో అధ్యాయంలో   విశ్వాసులు ఎలా జీవించాలి అనే దానికోసం ధ్యానం చేసుకుంటున్నాము!  

 

ఇక మనం ముగింపుకి వచ్చేశాము!

 పదమూడో వచనంలో సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు అంటున్నారు! గమనించాలి రెండో పత్రికలో పౌలుగారు మొదటి అధ్యాయంలో సర్టిఫికేట్ ఇస్తున్నారు! మేము మీకు ఆజ్ఞాపించినవి అన్ని చేస్తున్నారు అంటూ 1:12లో మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాస యుక్తమైన ప్రతికార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలి అని దేవునికి ప్రార్ధన చేస్తున్నారు! ఇప్పుడు వచనంలో మేలు చేయడానికి విసుకవద్దు అంటున్నారు! ఒకసారి మనం తుయతైర సంఘం కోసం ఆలోచిస్తే అక్కడ అనగా ప్రకటన :1829 వరకు చూసుకుంటే మీ శ్రమలను ఓర్పును విశ్వాసం క్రియలు అన్నీ నాకు తెలుసు సెహబాస్ అని చెబుతూ నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి అని దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నారు! సంఘమంటే అలా ఉండాలి! నీక్రియలు బాగున్నాయి అంటూ నీ కడపటి క్రియలు మొదటి క్రియల కంటే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు! *సీనియారిటీ పెరిగే కొలదీ సిన్సియారిటీ తగ్గిపోకూడదు!* రెండు సంఘాలు ఎంతో గొప్పగా దేవునికోసం అనేకమైన మంచి పనులు చేస్తూ ముందుకు పోతున్నాయి! ప్రియ సంఘమా మరి నీ పరిస్థితి ఏమిటి?

గలతీ 6:9

మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.

 

1కొరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

  సందర్భంగా ఒక మంచి వచనాన్ని మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను! భక్తుడు రాస్తున్నారు ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు! అలా కొంతమంది తెలియకుండా ఇలాంటి ఉపకారాలు అతిధి మర్యాదలు చేసి ఎన్నెన్నో గొప్ప మేలులు పొందుకున్నారు అంటున్నారు!

హెబ్రీ 13:2,16,

2. ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని.

 

ఉపకారమును ధర్మమును అనగా దిక్కులేని వారిని ఆదరించడం, విధవరాల్ల అవసరాలు తీర్చడం, అవసరములో ఉన్నవారికి సహాయం చెయ్యడం లాంటివి అన్నీ ఉపకారములోకి ధర్మములోనికి వస్తాయి! ఇంకా పై వచనం ప్రకారం అతిధి మర్యాదలు చేయడం కూడా మరిచిపోకూడదు!

ఇంకా రోమా 12:13

పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.

 

1పేతురు 4:9

సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

 

3యోహాను 1: 11

ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.

 

మరో విషయం చెప్పనీయండి. సహాయాలలో ఘనమైన సహాయం ప్రార్థనా సహాయం! కన్నీటితో, కష్టాలలో, భాధలలో ఉన్న వారి కోసం, వారి విడుదల కోసం మరియు పాప బంధకాలలో కొట్టుమిట్టాడుతున్న మన బంధువుల కోసం, ఇరుగుపొరుగు వారి కోసం కూడా తప్పకుండా ప్రార్థన చెయ్యాలి! ఇదికూడా మంచిపని!

 

 ఇక  14, 15 వచనాలలో పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలకు ఎవడైనా లోబడక పొతే అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయొద్దు అంటున్నారు అనగా ఒకరకంగా వెలివేసే మంటున్నారు! ఇంతకీ దేనికి లోబడక పోతే ఇలా చెయ్యమంటున్నారు అంటే పత్రికలో చెప్పినవి అన్ని ముఖ్యంగా సోమరులుగా ఉన్న వారిని, తమచేతులతో కష్టపడి జీవనం చేయని వారితో సాంగత్యము చేయవద్దు అంటున్నరు!

అయితే 15 వచనంలో అయినను వ్యక్తిని శత్రువుగా భావించవద్దు! గాని సహోదరునిగా భావించి బుద్ధిచెప్పండి అంటున్నారు! కొరింథీ పత్రికలో కూడా మొదటి పత్రికలో ఒకనిని వెలివేయమని చెప్పారు, రెండో పత్రికలో శిక్ష చాలు అతనిని సహోదరునిగా భావించి మరలా చేర్చుకోండి అన్నారు! అలాగే ఇక్కడ ఎవడైనా తోక జాడిస్తే మొదట వాడిని కత్తిరించి చివరికి చేర్చుకోండి అంటున్నారు! అయితే యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు: ఎవడైనా తప్పుచేస్తే మొదటిసారి ఒంటరిగా ఉన్నప్పుడు హెచ్చరించమంటున్నారు వినకపోతే సంఘపెద్దలను తీసుకుని పోయి హెచ్చరించమన్నారు. వినకపోతే సంఘంలో అందరిముందు హెచ్చరించమన్నారు! వినకపోతే వెలివేసే మన్నారు! మత్తయి 18:15--17;

 కాబట్టి క్రమాన్ని సంఘం అలవరచుకోవాలి! ఏదిఏమైనా ప్రక్రియ దేనికోసం అంటే విధంగా నైనా వ్యక్తి సిగ్గు తెచ్చుకుని మారుమనస్సు పొంది తిరిగి దేవునితో సమాధాన పడటానికే గాని బ్రష్టుడైపోవడానికి ఎంతమాత్రము కాదు అని గ్రహించాలి!

 

ఇక 16 వచనంలో ఆశీర్వాదం ఇస్తున్నారు లేక ఆశీర్వాద ప్రార్ధన చేసేస్తున్నారు: సమాధాన కర్తయగు దేవు తానే ఎల్లప్పుడూ  ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక! ప్రభువు మీ అందరికీ తోడైయుండును గాక! అన్నారు! ఆమెన్!

ఇక 17 వచనంలో పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను! ప్రతీ పత్రికయందును అదే నా గురుతు! నేను వ్రాయడం ఇలాగే అంటున్నారు!

దీనికో స్టోరీ ఉంది! పత్రిక  నేపధ్యం చెప్పినప్పుడు వివరించడం జరిగింది! తప్పుడుబోధకులు ఎన్నెన్నో తప్పుడు బోధలు చేసినప్పుడు సంఘంలో చాలామంది వినలేదు! వాటిని అంగీకరించలేదు! అందుకని తప్పుడు బోధకులు పౌలుగారి వ్రాసినట్లు తప్పుడు బోధలు  పత్రికలుగా పౌలుగారి పేరుతో పంపించారు! అందుకే ఇలాంటి వాటిని నమ్మొద్దు! ఇది నా చేవ్రాత! ఇలా ఉంటేనే నమ్మండి గాని అలాంటి పనికి మాలిన బోధలు పత్రిలు నమ్మొద్దు అని నొక్కివక్కానించి రాస్తున్నారు!

విధంగా పౌలుగారు తన పత్రికను ముగించారు!

16. సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.

17. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.

18. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడై యుండును గాక.

ఆమెన్!

             ******************************************

ప్రియ సంఘమా! రెండు పత్రికలలోనూ ఎన్నెన్నో మర్మాలు, ఆధ్యాత్మిక సంగతులు పౌలుగారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు వ్రాయించారు! మరీ ముఖ్యంగా యేసుక్రీస్తుప్రభులవారి రెండో రాకడ కోసమైనా ప్రత్యక్షతలు! ఆయన నిజంగా తొందరలో రాబోతున్నారు! దూతలు బూరలు ఊదటానికి బూరలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు! దేవుడు చెప్పిన వెంటనే వారు ఊదుతారు బూరలు! ఇక యేసుక్రీస్తుప్రభులవారు కూడా సిద్ధంగా ఉన్నారు మరలా రాడానికి! ఆత్మకూడా సిద్దంగా ఉన్నాడు!

ప్రకటన 22:17

ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

 

మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన రాకడలో ఎత్తబడే విధంగా నీ జీవితం ఉందా? పరిశుద్దాత్ముని శక్తి నీలో ఉందా? సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, మోకాళ్ళ అనుభవం నీకుందా? లేకపోతే విడువబడతావు అని మరచిపోకు! విడువబడుట బహుఘోరం! అగ్ని ఆరదు పురుగు చావదు! పళ్ళు పటపట కొరుకుతావు యుగయుగాలు! శిక్షను తప్పించుకోవాలంటే నేడే నీ బ్రతుకుని సరిచేసుకుని పశ్చాత్తాప పడి దేవుని పాదాలు పట్టుకుని నీ పాపాలు కడిగివేసుకో!

రాకడకు ఎత్తబడదాం!

తేజోవాసుల స్వాస్త్యములో గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలుపొందుదాం! మన ప్రియ రక్షకునితో యుగయుగాలు ఆనందిద్దాము!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

ప్రభువైన యేసూ! రమ్ము!  

************************************

ప్రియమైన దైవజనమా! థెస్సలోనికయ పత్రికల ధ్యానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను! మాకోసం ప్రార్ధన చెయ్యండి! మా పరిచర్యలు కోసం ప్రార్ధన చెయ్యండి! మా ఫేస్బుక్ పేజీలు , వెబ్సైటు కోసం కూడా ప్రార్ధించండి!

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

ఇట్లు

ప్రభువునందు మీ సహోదరుడు

 

రాజకుమార్. దోనె




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

పక్షిరాజు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు