మహాదేవుని వార్తావహుడు

*మహాదేవుని వార్తావహుడు*

*మొదటిభాగము- ఉపోద్ఘాతము-1*

 

మలాకి 1:6

కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

 

       దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక! యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్త నామములో ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనములు! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లను తన మహిమలో కొనసాగిస్తున్న దేవాదిదేవునికి నిండువందనములు! ఈ సారి మరో ప్రవక్త ప్రవచనాలతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది! మంటి పురుగునైన నన్ను వాడుకుంటూ మరో గ్రంధ పరిశీలన చేసేందుకు కృప నిచ్చిన దేవునికి సర్వదా మహిమ కలుగును గాక!  ఈ మహా దేవుని వార్తావహుని ధ్యానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ మీ హృదయాలను ఆత్మతో/లో మండించాలని రగిలించాలని కోరుకుంటున్నాను!

 

*రచయిత*: తెలియదు

*తండ్రి*: తెలియదు

*తల్లి*: తెలియదు

*ఊరు*: తెలియదు

*పేరు*: తెలియదు

*వ్రాసిన కాలం*: తెలియదు(బహుశా క్రీ.పూ. 430 – 320 మధ్య కావచ్చు)

*రాజుల కాలం*: తెలియదు

*గోత్రం*: తెలియదు

*పేరుకు అర్ధం*: మహాదేవుని వార్తావహుడు! హెబ్రీ, గ్రీకు భాషల అనువాదాల ప్రకారం ఆ పేరుతోనే తనను తాను పరిచయం చేసుకుని రాశారు కాబట్టి మలాకి అంటున్నారు!

 

   పైన పేర్కొన్న వివరాల ప్రకారం మహాదేవుని వార్తావహుడు అని పరిచయం చేసుకుని వ్రాసిన ప్రవచన గ్రంధం మలాకి గ్రంధము! దీనిని ఎవరు రాశారో నిజంగా ఎవరికీ తెలియదు గాని మలాకి అని తన గ్రంధానికి పేరుపెట్టుకున్నారు అనగా మహా దేవుని వార్తావహుడు అంటూ తన గ్రంధాన్ని వ్రాశారు కనుక అందరు మలాకి గ్రంధము అంటున్నారు గాని నిజానికి ఆయన ఎవరో ఆయన పేరేమిటో, తల్లిదండ్రులు ఎవరో, గోత్రమేమిటో రాజుల కాలమేమిటో ఇలాంటి వివరాలు గ్రంధంలోనూ లేదు! చరిత్ర లోను లేదు! మిగిలిన గ్రంధాలు ముఖ్యంగా ప్రవక్తల గ్రంధాలు ఎవరు రాశారో, తన తల్లిదండ్రులు ఎవరో, తమ ఊరు ఏమిటో, ఎప్పుడు రాశారో వివరాలతో రాసేవారు! గాని *ఈ ప్రవక్త బహుశా అవన్నీ అప్రస్తుతం అనుకున్నారేమో* అందుకే డైరెక్టుగా రెండో వచనం నుండే ఎటాక్ మొదలెట్టేశారు! అయితే కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకాం ఈ రచయిత యొక్క రచనా విధానం ప్రకారంఈయన ఒక లేవీయుడు అంటారు! అయితే జెకర్యా గ్రంధం 914 అధ్యాయాలు, ఈ మలాకీ గ్రంధము ఒకేలాగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఒకేవ్యక్తి రాశారని, ఆ వ్యక్తి బహుశా జెకర్యా గారు అని కొంతమంది అంటారు, కాదు నెహేమ్యా గారు గాని ఎజ్రా గారు గాని రాశారు అంటారు! అయితే వాటితో నేను ఏకీభవించను ఎందుకంటే ఆ భక్తులు తమతమ గ్రంధాలను తమ పేర్లతో రాసినప్పుడు ఒకవేళ దీనిని రాస్తే ధైర్యంగా తమ పేరును పెట్టుకునే వారు! కాబట్టి వారు కాదని నా ఉద్దేశ్యం! కొంతమంది మొర్దెకై గారు రాసి ఉంటారని అంటారు! కారణం దినవృత్తాంతాల గ్రంధాలను ఆయనే రాసిన తన పేరు పెట్టుకోలేదు కనుక ఇది కూడా ఆయనే రాసి ఉండొచ్చు అంటారు! ఏమో మనకు తెలియదు! మలాకి అనగా అర్ధం వార్తావహుడు లేక మహాదేవుని వార్తవహుడు! (His Messanger/ Most High God's Messanger/ From the hands of His Angel). కాబట్టి ప్రతి ఒక్కరు రచయిత మలాకి అని అంటున్నారు కాబట్టి మనం కూడా మలాకి అనే పేరుతోనే ముందుకు పోదాము!

 

    ఈ గ్రంధము పాత నిబంధనలో చివరిది మరియు ప్రవక్తల గ్రంధాలలోను చివరిది! చిన్న ప్రవక్తలైన పండ్రెండు ప్రవక్తలలో కూడా చివరి గ్రంధము! గమనించాలి – ఈ గ్రంధ కాలం ముగిసిన తర్వాత 400 సంవత్సరాలను చీకటి కాలము లేక చీకటి యుగము అంటారు! అనగా ఆ కాలంలో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు! దేవునికి కోపం వచ్చి తన వాక్కును ప్రవక్తల ద్వారా గాని దర్శనాల ద్వారా గాని తెలియజెప్పలేదు! అంతగా దేవుడు తన ప్రజలమీద కోపగించారు అన్నమాట! ఈ చీకటి కాలంలో ఏమి జరిగింది అంటే మాదీయ పారశీక అలయన్స్ రాజ్యము కూలిపోయింది! అలగ్జాండర్ ద గ్రేట్ అని పిలువబడే రాజు ప్రపంచాన్ని మొత్తం జయించి, గ్రీకు సామ్రాజ్యాన్ని స్తాపించాడు! ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని కూడా జయించాడు! ఆ రాజులలో అంతియోకాస్ ఎఫిఫానిస్(అసలు పేరు మిత్రుదాతు) అనే దుర్మార్గుడు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అదీకూడా విశ్రాంతి దినాన! తర్వాత దేవాలయం లో తన విగ్రహాన్ని పెట్టి దానికి పంది రక్తాన్ని  అర్పించి, దేవాలయాన్ని అపవిత్రం చేసి ఎవరినీ అక్కడ అర్పణలు బలులు అర్పించకుండా ఆపేశాడు! సుమారు పది లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను చంపేశాడు!

ఇక ఆ రాజ్యాన్ని రోమా సామ్రాజ్యం తుక్కుతుక్కు చేసి రోమా సామ్రాజ్యాన్ని స్థాపించారు! అలా హేరోదు చక్రవర్తి గాను పిలాతు గవర్నర్ గా ఉన్నప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు జన్మించారు! చీకటి కాలం/ ధర్మశాస్త్ర కాలం అంతమై కృపాకాలము మరియు వెలుగు కాలము ప్రారంభమయ్యింది!

(సశేషం)

*మహాదేవుని వార్తావహుడు*

*రెండవ భాగము- ఉపోద్ఘాతము-2*

 

మలాకి 1:6

 కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

 

         (గతభాగం తరువాయి)

 

*ఈ గ్రంధం వ్రాయడానికి నేపధ్యం*: ఈ గ్రంధము వ్రాయబోయేసరికి ఇశ్రాయేలు ప్రజలు సుమారు 210 సంవత్సరాలు అస్శూరులో చెరలోనుండి విడుదల పొంది వచ్చారు, యూదులు  డెబ్బై సంవత్సరాలు బబులోను చెరలో ఉండి విడుదల పొంది వచ్చారు కోరేషు గారి ఆజ్ఞతో! క్రీ.పూ 518లో ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రావడం మొదలుపెట్టినా రెండవ ఆలయాన్ని  క్రీ.పూ 516లో మొదలుపెట్టి 510కి ముగించారు ప్రవక్తలైన హగ్గయి గారు మరియు జెకర్యా గార్ల ప్రోద్భలంతో జెరుబ్బాబెలు గారు గవర్నర్ గా,  యెహోయూదా గారు యాజకుడుగా ఉండి మందిరాన్ని పూర్తి చేశారు! అది జరిగిన కొంతకాలమునకు నెహేమ్యా గారు గవర్నర్ గా వచ్చి యేరూషలేము పట్టణాన్ని, ప్రాకారాన్ని కట్టించారు క్రీ.పూ 430 లో! అది పూర్తయిన తర్వాత ఎజ్రా గారు వచ్చారు! జెకర్యా గారు హగ్గయి చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయారు! అనగా వంద సంవత్సరాలు కూడా పూర్తికాకుండానే మరలా భయంకరమైన పాపంలో పడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు! పైకి మాత్రం భక్తిగా నటిస్తూ లోలోపల దేవునికి ఎంతగానో దూరంగా ఉన్నారు!

 

*గ్రంధం ముఖ్య ఉద్దేశం*: ఇశ్రాయేలు ప్రజలు మరియు యాజకులు ఆరు రకాలైన ముఖ్యమైన నేరాలు లేక తప్పులు చేస్తున్నారు! వాటిని దేవుడు ఎత్తి చెబుతుంటే అడ్డంగా మేమేమి తప్పుచేశాము అంటూ దేవున్నే బుకాయించడం మొదలుపెట్టారు! వెంటనే దేవుడు దానికి జవాబివ్వవలసిన అవసరం లేకపోయినా కారణం చెప్పి వారిని ఎండగడుతున్నారు!  ఈ ఆరు తప్పులు ప్రధానంగా ఈ గ్రంధంలో కనిపిస్తాయి!

ఇక తర్వాత భాప్తిస్మమిచ్చు యోహాను గారి రాకడను ముందుగా చెప్పడం జరిగింది! ఇక చివరలో కూడా మరో వార్తవహుడు వస్తారు అంటూ ఈ వార్తావహుడు మరో వార్తవహుని కోసం చెబుతున్నారు!

 

*ముఖ్య సంఘటనలు*:

మొదటిది: ఇశ్రాయేలు ఆరు తప్పులు

రెండు: రాబోయే ఏలియా

 

 

*ప్రాముఖ్యతలు*:

ఈ గ్రంధంలో చెప్పిన లేఖనాలను క్రొత్త నిబంధనలో ఎన్నో సార్లు ఎంతోమంది వాడుకోవడం జరిగింది:

మలాకి గ్రంథం---- క్రొత్త నిబంధన

మలాకి 1:23     రోమా 9:13

మలాకి 1:6            లూకా 6:46

మలాకి 1:7,12    1 కొరింథీ 10:21

మలాకి 1:11       2 థెస్సలోనికయులకు 1:12

మలాకి 2:78     మత్తయి 23:3

మలాకి 2:10      1 కొరింథీ 8:6

మలాకి 3:1        (మార్కు1:2, మత్తయి 11:10, లూకా 7:27)

మలాకి 3:2        ప్రకటన  6:17

మలాకి 3:3        1 పేతురు 1:7

మలాకి 3:5        యాకోబు 5:4

మలాకి 3:6        హెబ్రీ 13:8

మలాకి 3:7        యాకోబు 4:8

మలాకి 4:2        లూకా 1:78

మలాకి 4:5        (మత్తయి 11:14, మత్తయి 17:12, మార్కు 9:13)

మలాకి 4:56      లూకా 1:17

 

 కాబట్టి ఇన్ని రిఫరెన్సులు క్రొత్త నిబంధనలో మరే గ్రంథమునుండి వాడబడలేదు అని నా ఉద్దేశం!

 

*విషయసూచిక*:

దేవుని ప్రేమను యూదులు ప్రశ్నించడం. 1:1-2

ఎదోమువారిపై దేవుని తీర్పు 1:3-5

యూదులు దేవుని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన విధం 1:6-9

యూదుల అపవిత్రమైన ఆరాధనా విధానం 1:10-14

యాజకులు దేవునికి చేసిన ద్రోహం 2:1-9

ప్రజలు దేవుని ఒడంబడికను, ఆలయాన్ని అపవిత్రం చేయడం 2:10-12

ప్రజలు తమ వివాహ బంధాల విషయంలో చేస్తున్న ద్రోహం 2:13-16

ప్రజలు తమ మాటలచేత దేవునికి కోపం కలిగించడం 2:17

బాప్తిసమిచ్చే యోహాను, అభిషిక్తుడు వచ్చి చేసేపని 3:1-4

దేవుని న్యాయనిరతి 3:5-7

దేవునినుండి ప్రజలు దొంగిలించడంవల్ల ఫలితాలు 3:8-12

ప్రజల మాటల్లో కనిపిస్తున్న గర్వం 3:13-15

భయభక్తులున్న వారి మాటలు 3:16-18

యెహోవా దినం గురించిన వర్ణన 4:1-3

యెహోవా దినానికి ముందు ఏలీయా రాక 4:4-6

 

దైవాశీస్సులు!

   

 

 

 

 

*మహాదేవుని వార్తావహుడు*

*మూడవ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల మొదటి తప్పు*

మలాకి 1:13

1. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు.

2. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.

3. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.

 

     ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ఉపోద్ఘాతము ధ్యానం చేసుకున్నాము! ఇక గ్రంధ ధ్యానము లోనికి పోదాము! ఈ గ్రంధము యొక్క ముఖ్య ఉద్దేశములో ఒకటి ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పులు అని చూసుకున్నాము కదా! ఈ భాగములో ఇశ్రాయేలు ప్రజల మొదటి తప్పుకోసం ఆలోచిద్దాము! తద్వారా మనము కూడా దానిద్వారా సరిచేసుకుందాము!

 

      మొదటి వచనంలో ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు అంటూ మొదలుపెట్టారు! ముందు భాగాలలో చెప్పిన విధముగా తన తండ్రిపేరు, గోత్రం పేరు, తన పేరు, ఊరి పేరు ఏమీ వ్రాయడం లేదు!  ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు అన్నారు కాబట్టి ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే చెప్పబడిన ప్రవచనాలు గాని మరే ఇతర జాతికోసం కాదు అని అర్ధం! అదే సమయంలో ఇవి మనకు కూడా సంబందించవు అయితే మొదటి కొరింథీ పత్రిక ప్రకారం ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి అని చెప్పిన విధముగా ఈ విషయాలు మనకు బుద్ధి కలగటానికి పరిశుద్దాత్ముని ద్వారా వ్రాయ బడ్డాయి గనుక ఈ విషయాలు లేక సంగతులు సార్వత్రిక సంఘానికి అన్వయించు కోవలసిన అవసరం మనకు ఉంది అని గ్రహించాలి!

1కోరింథీయులకు 10: 11

ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

ఒకవేళ సార్వత్రిక సంఘంలో నీవో భాగానివి అని నీకు తెలిస్తే ఈ విషయాలు నీకు కూడా చెందుతాయి అని గ్రహించాలి!

 

  ఇక రెండో వచనంలో ఇశ్రాయేలు ప్రజల మొదటి తప్పును దేవుడు ఎత్తి చూపిస్తున్నారు! అది నేను మీ ఎడల ప్రేమ చూపించాను అంటే మీరు అనగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలో నీవు మా యెడల ప్రేమ చూపించావు అంటున్నారు అని వాపోతున్నారు దేవుడు! ఇది మీకు భాగా అర్ధం కావాలంటే ఒక తండ్రి తన టీనేజ్ లో ఉన్న కుమార్తెకు గాని కుమారునికి గాని నీకోసం నేనింత చేశాను ఇంత కష్టపడుతున్నాను అంటే మహా గొప్ప కష్ట పడ్డావులే, మా గొప్ప చేసావులే , అడుక్కునే వాడు కూడా ఇంతకంటే ఎక్కువగా చేస్తున్నాడు, రిక్షా తొక్కేవాడు కూడా తన కొడుక్కి/ కూతురికి ఇంతకంటే మంచివి కొని పెడుతున్నాడు, నీవు కొన్నావు బోడిది! అంటుంటారు కదా అలాగే అంటున్నారు ఈ ఇశ్రాయేలు ప్రజలు! ఇంకా అంటున్నారు కదా ప్రస్తుత కాలం అబ్బాయిలు అమ్మాయిలూ తమ తల్లిదండ్రులనుఆ మాత్రం చేయలేని వాడివి/దానివి ఎందుకు కన్నావు నన్ను! అప్పుడే చంపేసి ఉండొచ్చు కదా, ఏం? కోరికలను అణచుకోలేక పోయావా అంటున్నారు కదా బుద్ధి లేకుండా ఒళ్ళు కళ్ళు మూసుకుపోయిఅలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నేను మిమ్మును ఎంతో ప్రేమించాను అంటే మా గొప్ప ప్రేమించావులే, ఏం చేశావేంటి మా కోసం అంటున్నారు అన్నమాట!

ప్రియమైన దైవజనమా! నీవు కూడా ఎప్పుడైనా దేవునితో గాని లేక మీ తల్లిదండ్రులతో గాని ఇలా అన్నావా? జాగ్రత్త! దేవుడు చూస్తున్నారు వింటున్నారు! ఒకరోజున నీవు దీనికి లెక్క అప్పగించాలి అని మరచిపోవద్దు! ఒకవేళ మీ తల్లిదండ్రులుతో అజ్ఞానంతో ఈ మాటలు అని ఉంటే ఇది చదివాక పరిశుద్ధాత్ముడు మరియు వాక్యం నిన్ను గద్ధిస్తే ఇప్పుడే మొదటగా మీ తల్లిదండ్రులను క్షమించమని అడుగు! అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా క్షమించమని అడుగు!

 

మీ కోసం మీ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా, ఎన్ని విషయాలు తాము మానుకుని మీ కోసం కష్టపడ్డారో తెలుసా? అవేమి ఆలోచించకుండా బుద్దిలేకుండా అన్నావు కాబట్టి బుద్దిలేని కుమారుడు లేక తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చాక తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అని ఎలా ఒప్పుకున్నాడో (లూకా 15:18) నీవుకూడా నేడే ఒప్పుకో! ఒప్పుకుని పశ్చాత్తాప పడితేనే గాని దేవుడు నిన్ను క్షమించరు అని తెలుసుకోండి! దేవుని దగ్గర కూడా ఇప్పుడే తప్పులు ఒప్పుకోమని మనవిచేస్తున్నాను!

 

    సరే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నిజంగా ప్రేమించారా లేదా అనేది కొన్ని రిఫరెన్సులు చూసుకుందాము!

ద్వితీ 4:37

ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.

 

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 7:7,8,9

7. మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచు కొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కు వేగదా.

8. అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబల ముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

 

1రాజులు 10:9

నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. *యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను* గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.

 

మీద వచనాలు ధ్యానం చేసుకుంటే మీరు ఇతర ప్రజలకంటే గొప్పవారని ఎక్కువగా ఉన్నారని ఆయన ప్రేమించలేదు గాని మీ ఎడల ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టి మిమ్మును ఈ దాస్య గృహం నుండి విడుదల చేశారు అంటున్నారు. ఇంకా కీర్తనలు 44:౩ లో భక్తుడు  అంటున్నారు ....

వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.

 

యిర్మియా 31:౩ లో అంటున్నారు దేవుడు......

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను‌. *శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను*.

 

ఇక రోమా పత్రికలో పౌలుగారు చెబుతున్నారు దేవుడు మనలను ఎంతగా ప్రేమించారో....

రోమీయులకు 5: 8

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 

1యోహాను 4:712 లో అంటున్నారు  ...

7. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

8. దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

9. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ (ఒక్కడే,కుమారుడుగా) కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.

11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.

12. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.

 

ఇవేకాదు ఇంకా ఎన్నెన్నో రిఫరెన్సులు ఉన్నాయి! దేవుడు నిజంగా తన ప్రజలను మనలను కూడా ఎంతగానో ప్రేమించారు! మనమైతే ఆయన ప్రేమను నిర్లక్ష పెట్టి ఆయనకు దుఖం కలిగిస్తున్నాము! అంతేకాకుండా మమ్మల్ని ఏం ప్రేమించేశావులే గొప్ప ప్రేమ బోడి ప్రేమ అంటూ దేవుణ్ణి అవమానిస్తున్నావు! మరి ఇది నీకు భావ్యమా? ఆలోచించండి!

ఒకవేళ దేవుణ్ణి గాని, లేక తల్లిదండ్రుల మీద గాని ఇలాంటి మాటలు అని ఉంటే ఇప్పుడే పశ్చాత్తాప పడి క్షమాపణ అడుగుదాం! గమనించండి తల్లిదండ్రులు దేవుడు మనకోసం భూమి మీద నున్న దేవుని దూతలు అని మరచిపోవద్దు! Parents are God’s Protecting Angles on land for us, sent by the God!!

So Love them! Respect them! Treat them!

Same applies to God also!

May God Bless You!

Amen!

(To be Continued)

*మహాదేవుని వార్తావహుడు*

*నాల్గవ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల మొదటి తప్పు-2*

 

మలాకి 1:13

1. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు.

2. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.

3. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పులలో  ప్రజల మొదటి తప్పుకోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ఇంతవరకు మనం దేవుడు చెప్పిన మాట నేను మిమ్మును ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెబితే మా గొప్ప ప్రేమించావు గాని ఎలా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావో చెప్పమన్నారు! దానికి జవాబుగా దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాము! దేవునికి వారి ప్రశ్నకు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు గాని దేవుడు ప్రేమామయుడు కాబట్టి తన పిల్లలలో మార్పును కోరేవాడే గాని వారిని చావు కోరడం లేదు కాబట్టి దానికి జవాబును చెబుతున్నారు దేవుడు ఇక్కడ!

 

ఏశావు యాకోబుకి అన్నకాడా?? అయితే నేను యాకోబును ప్రేమించాను అంటున్నారు!

 

యాకోబుగారు ఏశావు గారు ఇద్దరు దైవజనుడైన ఇస్సాకు గారి కుమారులే! అయితే దేవుడు చెబుతున్నారు నేను యాకోబునే ప్రేమించాను అంటున్నారు! ఇక మూడో వచనంలో ఏశావును ద్వేషించాను యాకోబుని ప్రేమించాను అంటున్నారు!చూడండి ఏశావును ద్వేషించి అతని స్వాస్త్యాన్ని అతని సంతానాన్ని నక్కల పాలు చేశాను! ఎంతగా నాశనం చేశాను అంటే మనం నాశనమైపోయాము అయినా గాని మరలా మన స్థలములను మరల కట్టుకొందాము రండని ఎదోమీయులు అనుకుంటున్నారు గాని వారు కట్టుకున్నా మరలా దానిని నేను క్రింద పడదోస్తాను అంటున్నారు! అంతగా ఆయన యాకోబుని ప్రేమించి ఏశావుని ద్వేషించారు!

 

మరి దేవుడు మనందరికీ తండ్రి కదా!! ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం ఏమిటండి? దానికి జవాబు ...

Romans(రోమీయులకు) 9:7,11,12,13,14,15,16

7. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,

11. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,

12. పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.

13. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.

14. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.

15. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.

16. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని (మూలభాషలో- పరుగెత్తువాని) వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.

 

కాబట్టి మొదటగా అది దేవుని ఇష్టం! ఆయన ఇష్టమొచ్చినట్లు ఆయన చేయగలరు! నీవేమి చేశావు ఎందుకు చేశావు అనేవాడు శాపగ్రస్తుడు అలా అడగానికి ఎవడికి హక్కు లేదు అని బైబిల్ సెలవిస్తుంది!

 

యోబు 9: 12

ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగిన వాడెవడు?

 

యెషయా 45: 9

మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

యెషయా 45: 10

నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

 

 

ఇక రెండో కారణం చెప్పేముందు దేవుడు చెప్పేమాట విందాము! నేను ఏశావును ద్వేషించి యాకోబుని ప్రేమించి మిమ్మును స్వకీయ జనముగా చేసుకోడానికి కారణం కేవలం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను! మీ దాయాదులు ఎదోమీయులను నేను ద్వేషిస్తున్నాను కనుక నాకు రావలసిన ప్రేమ గౌరవము మర్యాద నాకు ఇవ్వండి అని దేవుడు చెబుతున్నారు ఇక్కడ!

 

  ఇక 4, 5 వచనాలలో కూడా దేవుడు ఎదోమీయులు ఎంతగా ప్రయత్నించినా వారిని నేను పడగొట్టేస్తాను అంటున్నారు! మరి దేవుడు కరుణామయుడు కదా మరి ఎందుకు ఈ ఏశావును ద్వేషించారు అని క్లుప్తంగా ఆలోచిద్దాము!

 

మొదటగా: ఏశావుకి తను ఎవరు? ఎలా జీవించాలి అనేది తెలియదు! దేవుని బిడ్డ జీవించాల్సిన విధంగా జీవించలేదు! చివరికి జేష్టత్వాన్ని ఎందుకు పనికిరాని దానిలా చిక్కుడు కాయల కూరకు అమ్మేసుకున్నాడు! ఆదికాండం 25:31,32

 

హెబ్రీయులకు 12: 16

ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

హెబ్రీయులకు 12: 17

ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశముదొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.

 

రెండవదిగా: తల్లిదండ్రులకు అవిధేయుడు!...

Genesis(ఆదికాండము) 28:6,8,9

6. ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడునీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు

8. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు

9. ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.

మూడు: తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లుల్లు చేసుకున్నాడు! ... ఇక అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని తెలిసినా చేసుకుని, అది తన తల్లిదండ్రులను బాధించింది అని తెలిసి మరింత భాదించడానికి ఇంకా మరో అన్య స్త్రీని పెళ్ళిచేసుకున్నాడు!

ఆదికాండము 27: 46

మరియు రిబ్కా ఇస్సాకుతోహేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.

 

 గమనించండి ఇస్సాకు గారి పెళ్లి కోసం జరిగిన తతంగం మొత్తం విన్నాడు ఏశావు గాని తల్లిదండ్రులను బాధపెట్టాలనే ఎజెండాతో మరిన్ని అన్య స్త్రీలను చేసుకున్నాడు కనుకనే దేవుడు ఏశావును తద్వారా ఎదోమీయులను దేవుడు ద్వేషించారు!

 

నాల్గవది: వారు గర్విష్టులు గనుక వారిని దేవుడు శిక్షించారు! ఇంకా విగ్రహారాదికులు కాబట్టి వారిని శిక్షించారు!

ఓబద్యా 1: 3

అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.

ఓబద్యా 1: 4

పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.

 

చివరగా: ఆమోసు గ్రంధంలో ఇతర ప్రజలను కోసం చెబుతూ ఒక్కక్కరిని శిక్షిస్తూ అలా శిక్షించడానికి కారణం కూడ చెప్పారు! ఒకసారి ఆమోసు గ్రంధము నుండి ఎదోమీయులను ఎందుకు దేవుడు శిక్షించారో చూడవచ్చు!......

ఆమోసు 1: 11

యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.

 

ఓబద్యా 1: 11

నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా.

ఓబద్యా 1: 12

నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు;

ఓబద్యా 1: 13

నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;

ఓబద్యా 1: 14

వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు.

ఇన్ని తప్పులు చేశారు కాబట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నారు!

 

అందుకే వారికి కలిగే శిక్షలు కోసం యెషయా, యిర్మియా, యేహెజ్కేలు భక్తులు ముందుగానే ప్రవచించారు!

యెషయా 34:515

యిర్మియా 49:722

యేహెజ్కేలు 25:1214

35:115

 

కాబట్టి వీటన్నిటి బట్టి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు! ఎదోము వారు మొదటినుండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టే దేవుడు యాకోబుని ప్రేమించి ఏశావును ద్వేషించారు!

 

ప్రియ సంఘమా! నిన్ను నీవు పరిశీలన చేసుకో! దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా లేక దేవునికి ఆయాసం కలిగించే క్రియలు చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నీవు బ్రతకలేవని తెలుసుకో! ఏశావు లాగ బ్రష్టుడవై వ్యభిచారివై జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని నరకానికి పోతావా లేక యాకోబు లా దేవుని కొరకు మగసిరి గలవాడవై పోరాడుతూ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతావో తేల్చుకో! నేడే నీ తప్పులు ఒప్పుకుని ఆయనతో సమాధాన పడు!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*5వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల రెండవ తప్పు*

 

మలాకి 1:69

6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

7. నా బలి పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా

8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఈ రోజు రెండవ తప్పుకోసం ధ్యానం చేసుకుందాము!

 

    కుమారుడు తన తండ్రిని ఘన పరచును గదా! దాసుడు యజమానిని ఘనపరచును గదా! నా నామమును నిర్లక్షపెట్టు యాజకులారా! నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యింది? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? అని దేవుడు అడుగుచున్నారు ఇక్కడ!!! ఇది ఇశ్రాయేలు ప్రజల రెండవ తప్పు!

 

 సాక్షాత్తు దేవుడే బాధపడుతూ అడుగుతున్నారుఎవరిని? యాజకులను మరియు ఇశ్రాయేలు ప్రజలను! మీరు నానామమును నిర్లక్ష పెడుతున్నారు! నాకు ఇవ్వాల్సిన ఘనత, నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదు! మీరు పెదాలతో తండ్రి , నా యజమానుడా అంటున్నారు గాని నిజంగా నేను మీకు తండ్రిలాగా, మీరు నాకు భయపడటం లేదు ఘనపరచడం లేదు! మా యజమానివి నీవే అంటున్నారు గాని యజమాని లేక బాస్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు అంటున్నారు!

 

   మరి వీరికి తండ్రిని గౌరవించాలి యజమానిని గౌరవించాలి ఘనపరచాలి అని తెలియదా అంటే తెలుసండి వీరికి! అయినా పెదాలతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు గాని వారి హృదయం దేవునికి దూరంగా ఉంది......

మత్తయి 15: 8

ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

మార్కు 7: 6

అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.

ఒకసారి తల్లిదండ్రులు ను గౌరవించాలి అనే దానికోసం చూసుకుంటే నిర్గమ 20:12 లో దేవుని ఖండితమైన ఆజ్ఞ కనిపిస్తుంది మనకు!......

నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

 

ఇక లేవీ 20:9లో అలా చేయకపోతే మరణ శిక్ష విధించాలి అనేది కూడా ఉంది.....

ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.

 

మరి వీరు యాజకులు కదా, వీరు ధర్మశాస్త్రాన్ని ప్రతీరోజు పారాయణం చేస్తున్నారు కదా! ప్రతీ విశ్రాంతి దినాన వారి సమాజ మందిరాలలో దీనికోసం వివరించ బడుతుంది కదా మరి వీరు దేవుణ్ణి తండ్రిగాను యజమానుని గాను గౌరవించారా? లేదు కదా! ఒకవేళ నిజంగా గౌరవిస్తే దేవుడే సాక్షాత్తుగా ఈమాట అని ఉండేవారు కాదు కదా??!!! 

చూడండి యెషయా గ్రంధంలో తనబాధ ఎవరికీ చెప్పాలో అర్ధం కాక భూమికి ఆకాశానికి చెప్పుకుంటూ ఏమని దేవుడు వాపోతున్నారో-- .... 1:23

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3.వఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

 

నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను గాని వారు నామీద తిరగబడ్డారు అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే మొదట నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యింది అని అడిగారు కదా దేవుడు! ఇక్కడ కూడా నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను గాని వారు నామీద తిరుగబడ్డారు అంటున్నారు! అనగా తండ్రిగా దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వడం లేదు! ఇక రెండవదిగా అయ్యా నీవే మా రాజువు మా యజమానివి అని ప్రార్ధన చేస్తున్నారు కదా, దానికోసం ఎద్దు తన కామందును అనగా తన యజమాని ఎవరో గుర్తు పడుతుంది! గాడిదకు తన సొంత దొడ్డి అనగా యజమాని తనను సాయంత్రం బద్రపరచి తనకు ఆహారం నీరు సమకూర్చే ప్రదేశం ఏదో గాడిదకు కూడా తెలుసు! అయితే నన్ను యజమానుడా అని పిలిచే ఈ జనాలకు ఆ పశువులకు అనగా ఎద్దులకు గాడిదలకు ఉండే తెలివి కూడా లేదు! నిజమైన దేవుడనైన నన్ను వదిలేసి దేవుళ్ళు కాని వెంట ఇటూ అటూ తిరుగుతున్నారు అంటున్నారు దేవుడు! ఇంకా నా ప్రజలు రెండు నేరములు చేశారు అంటున్నారు!

యిర్మియా 2: 13

నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

 

   ఓ సార్వత్రిక సంఘ సభ్యులారా! మీరు కూడా ఇలాగే నా తండ్రి నా యజమానుడా నా రాజా నాదేవా అని ప్రార్ధిస్తున్నారు కదా! మరి దేవునికి ఇవ్వాల్సిన ఘనత గౌరవం మర్యాద మీరు దేవునికి ఇస్తున్నారా? ఆయన దేవుడు ఆయన తండ్రి అయితే ఆయనకు చెందాల్సిన ఘనతను ఆయనకు ఇస్తున్నారా? ఆయన వింటారు అని తెలుసు కదా, మరి మీ నోట బూతులు ఎందుకు వస్తున్నాయి? సినిమా పాటలు ఎందుకు వస్తున్నాయి? మీ అత్తమీద ఎందుకు సాదిస్తున్నావు? నీ కోడలిని కూతురులా ప్రేమించాల్సిన నీవు ఎందుకు సాదిస్తున్నావు?

ఆయన చూస్తున్నారు అని తెలుసు కదా- మరి ఎందుకు నీ పాదాలు వ్యభిచారానికి పరుగెత్తు తున్నాయి? ఎందుకు నీ పాదాలు సినిమా హాల్లకు పరుగెత్తు తున్నాయి! ఆయన నిజంగా నీ దేవుడు యజమానుడు అయితే ఆదివారం నాడే ఎందుకు ప్రయాణాలు చేస్తున్నావు? ఎందుకు ఆదివారం నాడు ఫంక్షన్ లకు చుట్టాల్ల ఇళ్ళకు ఎందుకు వెళ్తున్నావు?

 కాదండి ఆదివారం సెలవు కదా అని అందరూ ఆదివారం నాడే ఫంక్షన్ లు పెడుతున్నారు , మరి బంధుత్వాలను నిలుపుకోవాలి కదండి అంటున్నావు కదా! మరి ఒకరోజు నీకు రోగం కలిగినప్పుడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఈ బందుత్వాలు, ఈ పేరంటాలకు ఎవరైనా నిన్ను పిలిచారా? అందరూ నిన్ను వదిలేశారు కదా, అప్పుడు దేవుడే కదా నిన్ను ఆదరించారు! మరి ఇవన్నీ మరిచిపోయావా? నీకు ఆస్తి ఐశ్వర్యం, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి మరచిపోయి వారు అనగా బంధువులు వచ్చి నీవు రాకపోతే ఎలాగా? నీవే దగ్గరుండి నడిపించాలి అంటే పొంగిపోతున్నావు దేవుణ్ణి వదిలేసి ఆ పండుగలకు ఫంక్షన్ లకు వెళ్ళిపోతున్నావు కదా! మరి నీవు నిజంగా దేవుణ్ణి గౌరవిస్తున్నావా ఘన పరుస్తున్నావా? పైకి భక్తిగల వానిగా నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వాడవు/దానివి నీవే కదా.....2తిమోతికి 3: 5

పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.

ఆయన చూస్తున్నారు అని తెలిసి కూడా ఎందుకు ఇంకా త్రాగుతున్నావు మధ్యపానాలు? ఎందుకు లంచం తీసుకుంటున్నావు?

ఎందుకు నీలో ఇంకా నీ పాత రోత అలవాట్లు కనిపిస్తున్నాయి?

ఎందుకు నీలో మీలో పాత ఆచారాలు కనిపిస్తున్నాయి?

పైకి క్రైస్తవుడుగా నటిస్తున్నావు గాని నీవు అన్యుని కంటే ఘోరంగా జీవిస్తున్నావు కదా!!!!

మరి నిజంగా దేవునికి గౌరవం ఘనత మర్యాద ఇస్తున్నావా? నీవు నిజంగా దేవునికి గౌరవం ఇస్తే ఆమెన్ అనే ముందు అనగా కూటము ముగించేముందు రావు సన్నిధికి! అందరికంటే ముందుగానే వచ్చి కన్నీటితో ప్రార్ధన చేస్తావు!

ప్రార్ధన లేదు! వాక్య పఠనం లేదు! ఆత్మ నింపుదల లేదు! వరాలు లేవు ఫలాలు లేవు! ఆత్మఫలం ఒక్కటి కూడా ఫలించలేదు నీలో! నీవు భక్తుడువా? లేక వేఁధారివా?!!

నీవే ఆలోచించుకో! పరిశీలించుకో!

ఆ ఇశ్రాయేలు ప్రజలకు నీకు ఏమాత్రం తేడా లేదని గమనించు!

నేడే మార్పునోంది తప్పులు ఒప్పుకో!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మహాదేవుని వార్తావహుడు*

*6వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల రెండవ తప్పు-2*

 

మలాకి 1:69

6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

7. నా బలి పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా

8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!  మనం ఇప్పుడు రెండో తప్పుకోసం గతభాగం నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

        గతభాగంలో నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమయ్యింది? నేను మీకు యజమానిని అయితే నాకు రావలసిన గౌరవం/ మర్యాద/ భయం ఏమయ్యింది అని దేవుడు అడిగినట్లు చూసుకున్నాము! దానికి వీరి జవాబు మేము ఏమి చేసి నిన్ను నీ నామమును నిర్లక్షం చేశాము అంటూ దేవుణ్ణి బుకాయిస్తున్నారు!

దానికి జవాబుగా ఏడు ఎనిమిది వచనాలలో దేవుడు చెబుతున్నారునా బలి పీఠము మీద మీరు అపవిత్రమైన బోజనమును అర్పిస్తున్నారు ! దానికి బుకాయింపుగా మరలా ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు ఏమి అపవిత్రమైన బోజనాన్ని అర్పించాము ఏ రకంగా నిన్ను అపవిత్ర పరిచాము అంటూ బుకాయిస్తున్నారు! దానికి మరలా దేవుడు అంటున్నారు యెహోవా బోజనపు బల్లను మీరు నీచ పరుస్తున్నారుఏరకంగా అంటే గ్రుడ్డిదానిని తీసుకుని నాకు బలి అర్పిస్తున్నారు!  ఇంకా కుంటి దానిని రోగము ఉన్నవాటిని అర్పిస్తున్నారు! ఇలాంటివి ఒకవేళ మీ అధికారికి ఇస్తే వాటిని ఆయన తీసుకుంటాడా? నీకు దయ చూపిస్తాడా అని దేవుడు నిన్ను అడుగుతున్నారు!  చివరికి దేవుడు ఈ అధ్యాయం చివరి వచనంలో అంటున్నారు కాబట్టి మందలో మగది ఉండగా చెడిపోయిన దానిని అర్పించే వాడు మొదటగా వంచకుడు రెండవదిగా శాపగ్రస్తుడు అంటున్నారు!

 

   చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేస్తున్నారో మంచివి వారి దగ్గర ఉంచుకుని ఎవడూ కొనని/ కొనలేని/అంగీకరించని వాటిని దేవునికి కానుకగాను అర్పణగాను తెస్తున్నారు, ఇంకా బలి అర్పిస్తున్నారు! మీరు ఇలా చేసి నా బలిపీఠమును నా బోజనపు బల్లను అపవిత్ర పరచడమే కాదు దానిని నీచ పరుస్తున్నారు! తద్వారా నన్ను మీరు అవమానిస్తున్నారు! అనగా బాగా ఆలోచిస్తే ఎవరో అనామకునికి అలా చేస్తారు గాని ఎవరిమీద గాని అభిమానం గౌరవం మర్యాద భయం ఉంటే ఇలాంటి నీచపు కార్యాలు చెయ్యరు! ఇలాంటివి అర్పిస్తున్నారు అంటే వారు దేవునికి అసలు ఏమీ విలువ ఇవ్వడం లేదు అన్నమాట! అంతేకాదు దేవుడు చూస్తాడా? ఆయనకు కల్లున్నాయా? ఉంటే ఎందుకు అడగడు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు! అందుకే భక్తుడైన పేతురు గారు అంటున్నారు 2పేతురు 2:9, 15; దేవుని కనికరమును దీర్ఘశాంతాన్ని మీరు ఆయన చేతకానితనముగా ఎంచుతున్నారు గాని ఆయనకు చేత గాక కాదు ఆయన మనందరి పట్ల దీర్ఘశాంతము ఎందుకు చూపిస్తున్నారు అంటే అంతటా అందరూ మారుమనస్సు పొంది ఆయన దగ్గరికి వస్తారు అని ఆయన కనికరం చూపిస్తున్నారు! ఇప్పుడైనా మారుతాడు కదా అని ఆయన ఆలోచించి వదిలేస్తున్నారు గాని ఆయన కనికరమునకు కృప కు కూడా హద్దు ఉంది! ఆరోజు దాటిపోతే నీవు ఎంత మొత్తుకున్నా నిన్ను కనికరించేవాడు గాని ఆదుకొనే వాడు గాని ఉండడు! అప్పుడు ఆయన అంటారు నేను పిలిచినప్పుడు మీరు రాలేదు కాబట్టి మీకు బాధ కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటారు.

Proverbs(సామెతలు) 1:24,25,26,27,28

24. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

25. నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

27. భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

28. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.

 

కాబట్టి నేడు అనే దినము ఉండగానే ఇప్పుడైనా మారుమనస్సు నొంది దేవుణ్ణి గౌరవించడం ఆయనకు భయపడటం ఆయనకు మర్యాద నివ్వడం మొదలుపెట్టు!

 

కొందరు అనొచ్చుఇశ్రాయేలు ప్రజలు కాబట్టి అలాంటి పనులు చేశారు గాని నేను అలాంటి పనులు ఎప్పుడు చెయ్యను అంటారు! మరికొందరు అంటారు అసలు దేవుడు ఈ అర్పణలు కోరడం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి తప్పులు ఏమీ చెయ్యడం లేదు అంటారు!

 

జవాబు చెప్పనీయండి! మనలో అనేకమంది ఈ తప్పులు ఇప్పుడు చేస్తున్నాము! చాలామంది పర్సులో వందలు వేలు ఉండగా పది రూపాయలు నోటే ఎందుకు వేస్తున్నారు కానుకగా! మరికొంతమంది కేవలం కాసులు మాత్రమే వేస్తున్నారు అనగా అడుక్కునే వారికిచ్చే గౌరవమే దేవునికి కూడా ఇస్తున్నావు కదా నీవు! మరికొంతమంది చెల్లని నోట్లు చిరిగి పోయిన నోట్లు  ఎంచుకుని తీసుకుని వచ్చి దేవునికి కానుక వేస్తున్నారు!  నీవు అదే చిరిగిపోయిన నోటు చెల్లని నోటుని తీసుకుని షాపుకి వెళ్తే షాపు వాడు ఏమీ ఇవ్వడు కదా, మంచి నోటు ఇచ్చి సామాన్లు పట్టుకెల్లు అంటాడు! మరి షాపు వాడికిచ్చే గౌరవము మర్యాద కూడా దేవునికి ఇవ్వవా? దేవునికి ఆ మాత్రం గౌరవం మర్యాద లేదా? ఏమని అనుకుంటున్నావు నా దేవుణ్ణి!? భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని మాటతో చేసిన దేవుడు కదా! చివరికి నిన్ను నన్ను ప్రేమించి మనకొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు కదా! అలాంటిది వెంట్రుకలా దేవుణ్ణి తీసేస్తున్నావా? దేవునికి ఆ మాత్రం గౌరవం ఇవ్వవా?

నీ పర్సులో వేయి రూపాయలు ఉండగా కనీసం వంద రూపాయలు దేవునికి కానుక వెయ్యలేవా? ఎంచి ఎంచి పది రూపాయల నోటు దాచుకుని కానుక వేస్తావా ఓ పిసినారి!!! నిజం చెప్పండి ఎంతమంది ఇలా చెయ్యడం లేదు?

వారు అనగా ఇశ్రాయేలు వారు అప్పుడు కుంటిదానిని గ్రుడ్డి దానిని, రోగం ఉన్నదానిని అర్పించారుమీరు చిరిగిపోయిన నోట్లు, చెల్లని నోట్లు, మాగిపోయిన అరటిపళ్ళు, కుళ్ళిపోయిన కొబ్బరి కాయలు అర్పిస్తున్నారు అంతే! ఎవరికీ అక్కరలేని వాటిని దేవునికి ఇచ్చేస్తున్నారు! కాబట్టి వారిని అడిగిన ప్రశ్నే దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నారుమరి దీనికి నీ జవాబు ఏమిటి? నీవు కూడా వంచకుడవు, శాప గ్రస్తుడవు కావా?

దేవుడు చూస్తాడా అని అనుకుంటున్నావేమో!!! ఆరోజు కానుక పెట్టి దగ్గర ఉండి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అనిన దేవుడు ఇప్పుడు కూడా అదే కానుక పెట్టి దగ్గర ఉంటూ చూస్తున్నారు జాగ్రత్త!

 

    మరికొంతమంది అతి తెలివైన వారు అసలు దేవునికి ఈ పశువులు అర్పణలు అక్కరలేదుఆకాలంలో అడిగారు గాని ఈ కాలంలో కాదు అంటున్నారు, మరికొంతమంది అసలు దేవుడు పాత నిబంధన లోనే దశమ భాగాలు అర్పణలు అడిగారు గాని క్రొత్త నిబంధనలో అసలు అడగటం లేదు కేవలం మన హృదయాలు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి దశమ భాగాలు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనడమే కాదు కొంతమంది గొప్ప గొప్ప ప్రసంగీకులు అని పిలువబడే వాళ్ళు బల్లగుద్ది బోధలు చేస్తున్నారు! ఇలాంటి అతి తెలివైన వారికి, పనికిమాలిన బోధకులకు నేను అడిగే సూటి ప్రశ్నయేసుక్రీస్తుప్రభులవారిని పరిసయ్యులు శాస్త్రులు శోధిస్తూ కైసరుకి పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగితే యేసుక్రీస్తుప్రభులవారి జవాబు ఏమిటి? కైసరువి కైసరుకి దేవునివి దేవునికి ఇవ్వండి అన్నారు కదా! మత్తయి 22:21, లూకా 20:25;

 మరి దేవునివి అంటే దశమభాగాలు ప్రధమ ఫలాలు, అర్పణలు, కానుకలు స్వేచ్చార్పణలు కావా? దేవునివి అనగా దశమ భాగము దేవుని సొమ్ము కాదా? మిగిలిన అర్పణలు దేవునికి కాదా? పాష్టర్ గారికా లేకా లేవీయులకు యాజకులకా?

 

   సరే, అసలు ఈ బలిఅర్పణలలో దేవుడు ఏమి ఆశిస్తున్నారు అనేది ఒకసారి చూసుకుందాము! కీర్తనలు 50:914....

8. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9. నీ యింట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10. అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా

11. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14. దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15 ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.

 

చూశారా ఇక్కడ మీ పశువులు బలులు రక్తము మాంసము నాకు అక్కరలేదు! అసలు వేయి కొండలమీద పశువులు అన్నీ నేను చేసినవే కదా అంటున్నారు సర్వ సంపదలు నావే కదా అంటున్నారు! నాకు కావలసింది కేవలం కృతజ్ఞత!! మీ స్తుతులు కావాలి! స్తుతియాగం చెల్లించు వాడు నన్ను మహిమ పరుస్తున్నాడు అంటున్నారు! మీ బలులు కాదు మీ జిహ్వాఫలము అనగా నోటితో చేసే స్తుతులు కావాలి అంటున్నారు! ఇక తర్వాత దేవునికి కావలసినది ఏమిటంటే మీ నోటితో ఏమి మ్రొక్కుకుంటే దానిని మాత్రమే చెల్లించండి! మరో దగ్గర మ్రొక్కుకోక పోతే పర్వాలేదు గాని మ్రొక్కుకుంటే తప్పకుండా దానిని చెల్లించాలి! ఇక్కడ మీరు ఏదైతే మ్రొక్కుకున్నారో దానిని మాత్రమే చెల్లించండి! ఆపదలో ఉన్నప్పుడు మ్రోక్కుకుని అది తీరిపోయిన తర్వాత చెల్లించకపోతే ఎలా అని అడుగుతున్నారు!!!

ప్రసంగీ 5:46..

4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.

5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.

6. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?

 

ఇదే విషయాన్ని పౌలుగారు కూడా తన మాటలలో చెబుతున్నారు అపోస్తలుల కార్యములలో

Acts(అపొస్తలుల కార్యములు) 17:24,25,30

24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.

30. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

 

కాబట్టి దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది అంటే దేవునికి మీ హృదయం కావాలి అయితే మీ కానుకలను ఎందుకు అడుగుచున్నారు అంటే మీరు ఎంతవరకు దేవునికి నమ్మకముగా ఉంటున్నారుమీ బుద్ధిని శోధించటానికి మాత్రమే ఆయన మీ కానుకలు అడుగుతున్నారు అన్నమాట! ఇప్పుడు ఒక చిన్న పిల్లవానికి వాని తండ్రి ఏదో ఒకటి తినడానికి కొనిచ్చి చివరలో నాకు కొంత పెట్టవా అంటే వాడు ఇవ్వడు, ఇంతకీ నిజంగా తండ్రి తాను తినాలనే అనగా చిన్న పిల్లోడు తినేదానిలోనే తినాలని నిజంగా కోరుకున్నాడా? కాదు కదా ఈ పిల్లోడు బుద్ధి టెస్ట్ చెయ్యాలని అడిగాడు! అప్పుడు వాని బుద్ధి తెలిసిపోయింది! అలాగే నీ బుద్ధి మంచిదా పనికిమాలినదా అని పరిశీలించడానికి దేవుడు ఇలా నీ కానుకలు అడుగుచున్నాడు అన్నమాట!

 

మరి దీనిలో నీవు ఎంత నమ్మకముగా ఉండగలుగుతున్నావు? దేవుడు చూస్తున్నాడు అని మరచిపోవద్దు!

నీవు ఎలాంటి రూపాయలు వేస్తున్నావు! నీవు ఎలాంటివి అర్పిస్తున్నావు! ఏమి మాట్లాడుతున్నావు!

ఎంతసేపు ప్రార్ధన చేస్తున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు, దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తున్నావా లేదా అని దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అని మరచిపోవద్దు! ఇశ్రాయేలు వారిని దేవుడు ఎలా వంచకుడు శాపగ్రస్తుడు అన్నారో మిమ్మల్ని కూడా అంటారు అని మరచిపోవద్దు!  మందలో మగది ఉండగా చెడిపోయిన దానిని అర్పించేవాడు ఎలా వంచకుడు శాపగ్రస్తుడు అవుతాడో అలాగే పర్సులో లేక జేబులో పెద్ద నోట్లు మంచి నోట్లు ఉండగా, చెల్లని నోట్లు, చిరిగిపోయిన నోట్లు, చిల్లర కాసులు, చిన్న నోట్లు వేసేవాడు కూడా వంచకుడు శాపగ్రస్తుడు అవుతాడు అని నా ఉద్దేశం!

 

ప్రియ చదువరీ! ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని ఆ రకంగా ముందుకు పొమ్మని మనవిచేస్తున్నాను! దేవుని దృష్టిలో వంచకుడు గాను శాపగ్రస్తుడు గాను పిలువబడతావా లేక భళా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటి  విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నావు అంటూ మెచ్చుకునే విధంగా జీవిస్తావో నేడే తేల్చుకో!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మహాదేవుని వార్తావహుడు*

*7వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల రెండవ తప్పు-*

మలాకి 1:1014

10. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11.​​ తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

12. అయితే­యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు

13. అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.

14. నేను ఘనమైన మహారాజునై యున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!  మనం ఇప్పుడు రెండో తప్పుకోసం గతభాగం నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! ఇక పది నుండి పద్నాలుగో వచనం వరకు దానికోసమే చెబుతున్నారు! ఒకసారి పదకొండో వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు మరికొన్ని భయంకరమైన విషయాలు అర్ధమవుతాయి! తూర్పు దిక్కు మొదలుకొని పడమటి వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది సకల స్థలాలలో దూపమును పవిత్రమైన అర్పణ అర్పించబడుతుంది! అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, ఎంచబడుతుంది, అయితే 12 వ వచనం నా ప్రజలనే మీరు మాత్రం యెహోవా బోజనపు బల్ల అపవిత్రమని నీచమని చెబుతూ దూషిస్తున్నారు అని దేవుడు ఉక్రోశపడుతున్నారు!

   చూడండి అన్యజనులు అందరు మన నిజమైన దేవుడంటే ఎంతో భయపడుతున్నారు! ఆయన భయంకరుడని గొప్ప దేవుడని ఘనమైన దేవుడని ఎంచుతూ ఆయనకు పవిత్రమైన అర్పణము దూపము వేస్తున్నారు! గాని నా ప్రజలు అపవిత్రమైనవి నీచమైనవి అర్పిస్తూ యెహోవా అర్పణాన్ని బోజనపు బల్లను అపవిత్రమైనదిగా నీచమైనదిగా ఎంచుతున్నారు! ఎంత ఘోరమండి!!! 

 

 అవును కదా చివరికి అన్యులు వారి దేవుళ్ళకు దేవతలకు అర్పించేవి ఎంతో పవిత్రమైనవిగా ఎంచుతూ వాటికి బలులు అర్పణలు చేస్తున్నారు! అవి నిజమైన దేవుళ్ళు కాకపోయినా వారు ఎంతో భక్తిశ్రద్దలు చూపిస్తున్నారు కదా, ప్రియ దైవజనమా! నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న నీవు/ మీరు నిజంగా అంత భక్తిశ్రద్దలు మన నిజదేవునికి చూపిస్తున్నారా?

చివరికి అన్యులు వారి మందిరాలకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారు తమ పాదరక్షలను/ జోళ్ళు/ షూలు తీసివేసి వెళ్లి మ్రొక్కుకుని వస్తుంటారు కదా, మరి నిజదేవున్ని తెలుసుకున్న ఓ మహా భక్తులారా! మీరు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు మీ చెప్పులు తీసివేస్తున్నారా?  పట్టణాలలో స్టైల్ పెరిగిపోయి చెప్పులతోనే దేవుని మందిరాలలోనికి పోతున్నారు! ఇంకా చాలామంది మన దేశపు నల్లదొరలు పెద్దపెద్ద కూటములలో చెప్పులతోనే స్టేజి ఎక్కేస్తున్నారు!  దైవజనుడైన మోషేగారికి ఆయన శిష్యుడైన యెహోషువా గారికి దేవుని దూత నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ పాదములకు చెప్పులు తీసివేయుము అని చెప్పిన వెంటనే తీసివేసి దేవుణ్ణి ఘనపరిచారు కదా ఆ భక్తులు మరి గొప్ప సేవకులం ప్రసంగీకులం అని పిలువబడే వీరు, పెద్ద సంఘంలో సభ్యులము అని పిలువబడే మీరు ఎందుకు మీ పాదరక్షలు తీసి మందిరములోనికి ప్రవేశించడం లేదు???!!! అన్యజనులు చూపించే భక్తి, అభిమానం, గౌరవం మరి ఎందుకు దేవుని బిడ్డలు చూపించడం లేదు? అన్యులు ఎందుకు చెప్పులు విప్పి లోపలి వెళ్తున్నారు అంటే దేవుడు పవిత్రుడు గనుక మనం కూడా పవిత్రంగా వెళ్ళాలి అని ఆలోచన వారిది! మరి వారి దేవుళ్లేనా పవిత్రం, మన దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు కాదా? ఎంత మూర్ఖంగా తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నారో కదా నేటి క్రైస్తవ మహా భక్తులు!

 

ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తాను, చేయరానిపనులు అనే నేను రాసిన శీర్షిక చదివిన ఒక సహోదరి మా పట్టణంలో గొప్ప దైవజనున్ని ఒక సభాముఖంగా ఇదే ప్రశ్న అడిగింది, అన్యులు పాద రక్షలు తీసేసి గుడిలోకి వెళ్తారు, మోషేగారు, యెహోషువా గారు తీసేశారు! మరి మనమెందుకు చెప్పులతో వస్తున్నాము అంటే ఆ మహా బోధకుడు అన్నారుఆ కాలంలో అనగా పాత నిబంధన కాలంలో దేవుడు- మందిరాలలో ప్రత్యక్ష గుడారాలలో ఉండేవారు, ఇప్పుడైతే దేవుడు మన హృదయాలలో ఉంటున్నారు! కాబట్టి మనం చెప్పులు వేసుకున్నా పర్వాలేదు అంటూ చెప్పారు, అయ్యా మరి నా ప్రశ్న అలాంటప్పుడు మన హృదయంలో దేవుడు ఉంటున్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, చెప్పులు ఎప్పటికీ వేసుకోకూడదు కదా!!! 

 

 ప్రియ చదువరులారా! మన  దేవుడు  పవిత్రుడు పరిశుద్దుడు!! దేవతలకు/ దేవుళ్ళకు దేవుడు! దేవాదిదేవుడు అని అందుకే అంటారు! ఆయన రాజాదిరాజు కూడా! అందుకే ఆయనను గౌరవిద్దాము! భక్తితో సన్నిధిలో ప్రవేశిద్దాము! అందుకు గాను దయచేసి మీ చెప్పులు పాదరక్షలు బయట వదిలేసి మందిరాలలో ప్రవేశిద్దాం!

 

      ఈ సందర్భంగా మరో విషయం గుర్తుచేస్తాను. పుట్టు క్రైస్తవులు కంటే అన్యజనుల నుండి రక్షించబడిన వారే చాలామంది ఎంతో భక్తిగా నిష్టగా ఉంటున్నారు. పుట్టు క్రైస్తవులకు సీనియారిటీ పెరిగిపోయి, సిన్సియారిటీ తగ్గిపోయి వారికిష్టమొచ్చినట్లు దేవున్ని లెక్కచేయకుండా జీవిస్తున్నారు. అదే అన్యజనుల నుండి రక్షించబడిన వారు దేవుడంటే ఎంతో భయము మరియు భక్తితో జీవిస్తున్నారు. ఇంకా అనేకులు దైవసేవకులుగా ఘనమైన సేవ చేస్తున్నారు. అలాంటి సేవ పుట్టు క్రైస్తవులు చేయలేక పోతున్నారు. ముఖ్య కారణం దేవుడంటే భక్తి వుంది గాని భయం లేదు. భయం లేని కోడి బజారులో గ్రుడ్లు పెట్టిందట. దారంటపోయే వారు కాళ్లతోత్రొక్కితే పుటుక్కుమన్నాయి. ఏదోరోజు మీ భక్తి కూడా పుటుక్కుమంటుంది అప్పుడు దేవుడు మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయువారలారా! నా యొద్ద నుండి తొలిగిపోవుడి అంటారు జాగ్రత్త!! దేవుడు నిజంగా ఆయన ఎవరో గ్రహించి భయము కలిగిజీవిద్దాము!

 

 పద్నాలుగో వచనంలో అంటున్నారు నేను ఘనమైన మహారాజునై యున్నాను! అన్యజనులలో నా నానామము భయంకరమైనది అంటున్నారు కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాద భక్తి మనము చేతలలో చూపించాలి! పవిత్రముగా పరిశుద్దులుగా ఆయన మందిరములో ప్రవేశించాలి! 

 

     చివరకు దేవునికి ఇశ్రాయేలు ప్రజల అవినీతి అపరిశుద్దతను చూచి దేవునికి విసికేసి పదో వచనంలో మీలో ఒకడు నా బలి పీఠము మీద నిరర్ధకముగా అనగా అర్ధం పర్ధం లేని అగ్ని రాజబెట్టకుండా నా మందిరపు వాకిండ్లను మూసేసే వాడు ఒకడుంటే అది మీకే మేలు! ఎందుకంటే మీరంటే నా కిష్టము లేదు అంటున్నారు, మీచేత నేను నైవేద్యమును అంగీకరించను అంటున్నారు!

 

       గమనించాలి రెండో వచనములోనే మిమ్మల్ని నేనెంతో ప్రేమిస్తున్నాను అన్నారు, గాని ఈ పదో వచనంలో వారు అర్పించే అపరిశుద్ధమైన బలులు అర్పనలుతో విసికిపోయి మీరంటే నాకిష్టం లేదు! మీ నైవేద్యాలు అర్పణలు నేను అంగీకరించను అని ఖరాఖండిగా చెబుతున్నారు!  మీలో ఎవడైనా నా మందిరాన్ని మూసేస్తే ఎంతోమేలు అంటున్నారు!

దీనికి కారణం ఇంకా వివరంగా యెషయా 1:1117 వచనాలలో ఉన్నాయి.....

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

 

దీనిని బట్టి మనకు ఏమి అర్ధం అవుతుంది అంటే యోహాను 4:2324లో యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినవిధంగా ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించకుండా ఏదో వ్యర్ధమైన ఆచారాలతో దేవుణ్ణి ఆరాధన చేసే కంటే ఆయనను ఆరాదించక పోవడమే మేలు! అపవిత్రమైన హృదయంతో అపవిత్రమైన చేతులతో అపవిత్రమైన ఆచారాలతో ఏదో పెదాలతో పేరుకు ఆరాధనా చేస్తున్నారు అంతే! అలాంటివి దేవునికి ఇష్టం లేదు లేదు లేదు!!!  అలా దేవునికి అప్రతిష్ట చేసే ఆరాధనా స్థలాలలో మనుషులు చేసే అర్ధం పర్ధం లేని ఆచారాలతో ఆత్మవంచన చేసుకోవడం కంటే దేవుని మందిరాలను మూసివేయడమే మేలు!!

 

మీదన చూపిన రిఫరెన్సులో దేవునికి ఏమి కావాలో చాలా స్పష్టముగా ఉంది మీ చేతులనిండా రక్తముంది, ముందుగా మీ చేతులను మీ హృదయాలను కడుక్కోండి! చెడుతనమును మీలోనుండి తీసివేయండి! చెడు చూడటం మానేయండి (సినిమాలలో/సీరియళ్ళలో  కూడా చెడు కదా ఉంది). ఇక మంచి చేయండి హింసకు గురి అయిన వారిని విడిపించండి తండ్రిలేని పిల్లలకు న్యాయం చెయ్యండి! విధవరాల్ల పక్షాన నిలబడండి అంటున్నారు!

 

       దయచేసి ఒకసారి మనలను మనం పరీక్షించు కొందాము! ఎంతమంది మనలో మందిరంలో  ఏదో ఆరాధన క్రమం పాటించి మమః అనిపించుకోడం లేదు! ఏదో మందిరానికి వెళ్ళామా, హల్లెలూయ తండ్రి దేవా అన్నామా, కానుక ఇచ్చేశామా వచ్చేశామా అని ఉంటున్నాము గాని పరిశుద్ధత మనలో కనిపిస్తుందా? మాటలో చేతలలో చూపులలో ప్రవర్తనలో పరిశుద్ధత కనిపిస్తుందా? దేవునికి ఇచ్చే గౌరవం, మర్యాద భక్తి దేవునికి ఇస్తున్నామా? ఒకసారి సరిచేసుకో! భక్తిహీనుడు అర్పించి నట్లు నీవు అర్పించవద్దు అని బైబిల్ సెలవిస్తుంది! ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేస్తున్నామా లేదా? దయచేసి మీ చెప్పులు విప్పి మందిరములోనికి ప్రవేశించండి! పరిశుద్ధంగా ఆయన మందిరావణములలో ప్రవేశిద్దాము!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*8వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల రెండవ తప్పు-4*

మలాకి 1:1014

10. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11.​​ తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

12. అయితే­యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు

13. అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.

14. నేను ఘనమైన మహారాజునై యున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!  మనం ఇప్పుడు రెండో తప్పుకోసం గతభాగం నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

    ఇంతవరకు మనం ఇశ్రాయేలు ప్రజలు చేసిన రెండో తప్పు కోసం ధ్యానం చేశాము! అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులే మనము కూడా చేస్తున్నాము అని ధ్యానం చేసుకున్నాము! అయితే ఇదే రెండో తప్పులో ఒకటి యెహోవా బోజనపు బల్లను అపవిత్ర పరచడం నీచ పరచడం అనే విషయాన్ని మూడు సార్లు ప్రస్తావిస్తున్నారు ఈ అధ్యాయంలో! ఏడో వచనంలో, పన్నెండో వచనంలో ఇంకా పదమూడో వచనంలోను దీనికోసం చెబుతున్నారు! ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి ఆరాధనా విధానంలో బల్యర్పణ విధానంలో అప్పుడు తప్పుచేశారు! అయితే నూతన ఇశ్రాయేలు ప్రజలుగా సార్వత్రిక సంఘంలో సభ్యులమైన మనము చేసేది కూడా అదే! పాత నిబంధన కాలంలో యెహోవా బోజనపు బల్ల అనగా అర్పించే బలులు అర్పణలు అన్నమాట! మరి ఈ నూతన నిబంధన సంఘములో యెహోవా బోజనపు బల్ల అనగా నాకున్న పరిజ్ఞానం ప్రకారం ప్రభురాత్రి సంస్కారం లేక బల్లారాధన! ఆ కాలంలో వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు దానిని నీచముగా ఎంచారు! అపవిత్రమైన బలులు అర్పించారు! మరి ఈ కాలంలో ఎంతమంది ప్రభు సంస్కారాన్ని అపవిత్రముగా ఆచరించడం లేదు??? సరియైన సిద్దపాటు, శుద్ధీకరణ లేకుండా ఎంతమంది ఈ రోజులలో ఆచరించడం లేదు చెప్పండి! కాబట్టి అప్పుడు ఇప్పుడు అనేకమంది ఆ బల్లను అపవిత్రముగా పాటిస్తున్నారు!

 

   దీనికోసం మనం చూసుకుంటే మొదటగా యేసుక్రీస్తుప్రభులవారు తాను మరణించే ముందుగా ఈ ఆరాదన క్రమం నేర్పించి- నేను వచ్చేవరకు దీనిని పాటించండి అన్నారు! ...

.Matthew(మత్తయి సువార్త) 26:26,27,28,29

26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి.

28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

29. నా తండ్రి రాజ్యములో మీతో కూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.

 

  రొట్టెను నా శరీరంగా భావించి, ద్రాక్షారసము ఆయన పవిత్రమైన రక్తమునకు సాదృశ్యముగా భావించి  తీసుకొనమని వివరంగా స్పష్టంగా చెప్పారు! ఈ విషయాన్ని భక్త పౌలుగారు   కూడా వివరంగా చెప్పారు....

1కొరింథీ 11:2331

23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి

24. దానిని విరిచియిది మీకొరకైన (అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

26. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

27. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.

28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

31. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.

32. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

 

           ఇక్కడ మొదటగా 23వ వచనంలో అంటున్నారు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటున్నారు! గమనించాలి  సువార్తలలో శిష్యులందరికీ ఒకేసారి ప్రభురాత్రి సంస్కార విధానం ప్రభువే నేర్పించారు! అయితే ఆ సమయంలో పౌలుగారు ఇంకా రక్షణ పొందలేదు! గాని ఈ విధానం కోసం శిష్యుల వలన నేర్చుకుని ఉండొచ్చు! గాని అలా రాయడం లేదు ఇక్కడ పౌలుగారు నేను దానిని ప్రభువు వలన పొందాను అంటున్నారు! అనగా బహుశా పౌలుగారు దీనికోసం ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రార్ధించి ఉండొచ్చు! అప్పుడు దీని ఉద్దేశం వివరంగా దేవుడే ఆయనకు చెప్పి ఉండొచ్చు! అందుకే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటున్నారు! దీనిని బట్టి అర్ధమయ్యేదేమిటంటే మొదటగా దానిని ప్రభువు నేర్పించారు! అయితే పౌలుగారికి కూడా ప్రభువే నేర్పించి దాని ప్రాధాన్యత మరోసారి రెట్టించారు అన్నమాట!

 

 ఇక అంటున్నారు ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి అప్పుడు దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అన్నారు! ఫుట్నోట్ లో మీ కొరకు విరువబడిన నా శరీరము అని వ్రాయబడింది! అనగా ఆ రొట్టె అనేకులకొరకు కలువరి సిలువలో విరువబడిన ఆయన శరీరము అన్నమాట! ఇక పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన! దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి అని చెప్పారు! అనగా ఆ పాత్రను ఎత్తుకుని ద్రాక్షారసం పుచ్చుకొనునప్పుడు ఎల్లప్పుడూ ఆయన నిబంధన రక్తాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట! ఆయన రొట్టెను తిని  ఆయన పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి! దానిని ప్రచురం కూడా చెయ్యాలి!

 

    మరి ఇప్పుడు చెప్పండి ఎంతమంది ప్రభు బల్లను ఆచరించేటప్పుడు  నిజంగా  ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మనలను మనం సరిచేసుకుంటున్నాము?  ఎంతమంది అది ప్రభు బల్ల, ఆయన శరీరము, ఆయన రక్తము అని ఆలోచించకుండా ఇదేదో రొటీన్ ఆరాధన విధానం లాగ సిద్దపాటు లేకుండా, శుద్ధీకరణ లేకుండా ప్రభు బళ్ళలో పాల్గొంటున్నారు?

మరీ ఘోరంగా త్రాగుడు మానడం లేదు, వ్యభిచారం మానడం లేదు, మొదటి ఆదివారం నాడు ప్రభు బల్లను మానడం లేదు! మరి వీరి మీదికి ప్రభువు తీర్పు న్యాయంగా రాదా? ఎందుకండీ ఇంత బల్లగుద్ది ఖండించి వాక్యము చెబుతున్నా గాని మా సంఘంలో కూడా అనేకమంది త్రాగుడు వ్యభిచారం మానకుండా అపవిత్రంగా ప్రభుబల్లను సమీపిస్తున్నారు! తీసుకుంటున్న ప్రతీసారి నేను వారికి గుర్తుకు చేస్తుంటాను, అయోగ్యంగా తీసుకుంటే దేవుని తీర్పు నాశనం వస్తుంది అని, గాని గాలికి వదిలేస్తున్నారు!

 

   చూడండి 27 వచనంలో కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు రక్తముకోసం, శరీరమును కోసం అపరాదియగును అంటున్నారు! అయోగ్యముగా లేక అపవిత్రముగా అనగా సరియైన సిద్దపాటు శుద్ధీకరణ లేకుండా అని అర్ధము! భార్యను గుండగా తన్నేసి వచ్చి సంస్కారం తీసుకుంటే అది అయోగ్యమే కదా, అత్తమీద తగువాడి నోటికొచ్చిన బూతులాడి వచ్చి సంస్కారం తీసుకుంటే నేరమే కదా, భయంకరమైన వ్యభిచారంలో మునిగి తేలుతూ వచ్చి సంస్కారం తీసుకుంటే అది అపవిత్రమే కదా, నీ చేతుల నిండా అవినీతి అన్యాయం, వడ్డీ వ్యాపారం ఉండి ఏమీ ఎరుగనట్లు సన్నిధికి వచ్చి సంస్కారం తీసుకుంటే అది అపవిత్రమే కదా, అయోగ్యమే కదా!!  నా ఉద్దేశంలో తప్పని పరిస్తితులలో శనివారం రాత్రి లేక ఆరోజు రాత్రి డ్యూటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం కాళీ మరియు సమయం లేనందువలన స్నానం కూడా చెయ్యకుండా మందిరానికి వచ్చి సంస్కారం తీసుకోవడం అపవిత్రం కాదుగాని, ఆ రాత్రి భయంకరమైన వ్యభిచారం, లేక హత్య, లేక రాత్రంతా బూతు బొమ్మలు, సినిమాలు చూసి వచ్చి సంస్కారం తీసుకుంటే అది తప్పకుండ భయంకరమైన అపవిత్రమైన అయోగ్యమైన క్రియ!!! ఇలాంటివి దేవునికి ఇష్టం ఉండదు సరికదా దేవుని న్యాయమైన తీర్పుకు పాత్రులు అవుతారు!

 

     సిద్దపాటు అనగా మనలో చాలా మందికి తెలుసు గాని శుద్దీకరణ అనగా సంస్కారానికి ముందుగా మన పాపములను మనము ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుని కన్నీటితో ఆయన పాదాలు కడగి, మన పాపముల నుండి విడుదల పొందటం. పరిశుద్ధాత్ముడు  మన పాపములను, రహస్య పాపములను ఒప్పుకొనమని బలవంతం చేస్తాడు. పరిశుద్ధాత్మ బోధ, మనస్సాక్షి ప్రభోదము విని మనస్పూర్తిగా నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకునివిడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడటమే శుద్ధీకరణ! నిజంగా దీనిని పాటిస్తున్నావా!

 28వ వచనంలో కాబట్టి ప్రతీ మనుష్యుడు తననుతాను పరీక్షించు కోవాలి  ఆ తర్వాతే సంస్కారం తీసుకోవాలి అంటున్నారు!

29౩౦ లలో అంటున్నారు అది ప్రభువు శరీరమని వివేచించకుండా అనగా సరియైన సిద్దపాటు శుద్ధీకరణ లేకుండా రొట్టెను తిని ద్రాక్షారసం త్రాగువాడు తనకు తాను శిక్షావిధి కలుగజేసుకోడానికే తిని త్రాగుచున్నాడు అంటున్నారు! ఇంకా అందువలననే చాలామంది రోగులు బలహీనులు అవుతున్నారు! కొంతమంది పైకి పోతున్నారు అనగా చచ్చిపోతున్నారు అంటున్నారు! ఇప్పుడు చెప్పండి ఎంతమంది అన్యాయంగా జీవిస్తూ, అపవిత్రంగా జీవిస్తూ, సరియైన సిద్దపాటు లేకుండా ఈ ప్రభు బల్లను సమీపిస్తున్నారు! నీ భార్య ఉండగా మరో స్త్రీ వద్దకు వెళ్తూ ఈ రొట్టెను తీసుకుంటున్నావు కదా, భర్త ఉండగా పరపురుషులతో సంభోగం చేస్తూ ఏమీ ఎరగనట్లు సంస్కారంలో పాల్గొంటున్నావు కదా, త్రాగుడు పోకిరిపనులు కక్షలు క్రోధములు, కలహములు విమతములు అన్నీ పెట్టుకుని ఏమీ ఎరగనట్లు సంస్కారం తీసుకుంటున్నావు కదా! నీవు దోషివి కావా? మరినీవు వంచకుడవు శాపగ్రస్తుడవు/శాపగ్రస్తురాలవు కాదా???  మరి దేవుడు నిన్ను మొత్తడా? తప్పంతా నీలో ఉంచుకుని తర్వాత దేవునిమీద నేరం మోపుతావా/ దేవుని పరువు తీసేస్తూ పరిశుద్ధ పరిశుద్ధ అంటూ పాటలు పాడతావా? జాగ్రత్త! తీర్పు దేవుని ఇంటినుండి ప్రారంభమయ్యే కాలం వచ్చింది అని పేతురు గారు చెబుతున్నారు!

 

   ఒకవేళ మీలో ఎవరైనా ఇలా అయోగ్యముగా ఉంటూ సంస్కారంలో పాల్గొంటూ ఉంటే నేడే అలా ప్రభు సంస్కారంలో పాలుపొందడం మానేయ్! మొదటగా నీ పాపాలు మానేయ్! దేవునితో సమాధాన పడు! అప్పుడు సంస్కారం తీసుకో! అయితే ఆ తర్వాత ఇకను పాపము చేయకు!

దైవాశీస్సులు!   

*మహాదేవుని వార్తావహుడు*

*9వ భాగము*

మలాకి 2:13

1. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడియున్నది.

2. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించియుంటిని.

3.మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!   

ఇంతవరకు మనము ఒకటో అధ్యాయం నుండి ధ్యానం చేసుకున్నాము! ఇక రెండవ అధ్యాయం నుండి కొన్ని విషయాలు చూసుకుందాము!

 

    ఇక్కడ యాజకులతో మాట్లాడుతున్నారు- మీకు ఆజ్ఞ ఇవ్వబడింది ఏమిటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ  ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచించకయు ఉంటే నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు ఇప్పుడున్న ఆశీర్వాద ఫలమును కూడా శపిస్తాను!  ఎందుకంటే మీరు దానిని అనగా మీకిచ్చిన ఆజ్ఞలను మనస్సు తెచ్చుకోలేదు గనుక ఇంతకూ మునుపే నేను వాటిని శపించేశాను అంటున్నారు!

 

   చూడండి, 1:6 లోనే మీరు నన్ను గౌరవించడం లేదు భయపడటం లేదు అని చెప్పారు, నేను తండ్రినైతే తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఎందుకు ఇవ్వడం లేదు. నేను మీకు యజమానిని అయితే యజమానికి రావలసిన భయం, ఘనత ఏది అని అడిగారు, ఇప్పుడు అంటున్నారు నేను మీకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు అయితే మీరు వాటిని గౌరవించడం లేదు అందుకే మిమ్మును శపిస్తాను అంటున్నారు! మత్తయి సువార్త 15:69 లో అంటున్నారు....

6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

7. వేషధారులారా

8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

9. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి ...

 

ఈ ప్రజలు నోటితో నాదగ్గరికి వస్తున్నారు మీ హృదయం నాకు దూరంగా ఉంది!  వారు నన్ను వ్యర్ధంగా ఆరాధిస్తున్నారు అంటున్నారు ఇంకా మానవ కల్పితమైన ఆదేశాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు అంటున్నారు ! మనఃపూర్వకముగా దానిని ఆలోచించడం లేదు అంటున్నారు

కాబట్టి ఇప్పుడైనా మీరు తిరిగి నా ఆజ్ఞలను గౌరవించక పోతే అలా గౌరవించడానికి నిర్ణయం తీసుకోకపోతే నేను మీమీదికి శాపము తీసుకుని వస్తున్నాను అంటున్నారు! చూడండి దీవెనలకు బదులుగా శాపం తీసుకుని వస్తాను అంటున్నారు! ఎవరికండి? యాజకులకు, లేవీయులకు! అనగా దేవునిచేత అభిషేకం పొందినవారు, ప్రత్యేకమైన పిలుపు, అభిషేకం పొందిన వారితో అంటున్నారు దేవుడు! మీకు దీవెనలకు బదులుగా శాపం తీసుకుని వస్తున్నాను ఇంతవరకు మీకున్న ఆశీర్వాద ఫలాలను కూడా శాపంగా మార్చేస్తున్నాను అంటున్నారు! అ దీవెనలు అవి ఏమైనా కావచ్చు, వారికున్న ఆధిక్యతలు కావచ్చు లేక సదుపాయాలూ కావచ్చు లేదా వారు ప్రజలకు పలికే దీవెన వాక్కులు కావచ్చు ఏదైనా సరే దానిని శాపముగా మార్చేస్తున్నారు!

 

        ఒకసారి మనం ద్వితీ 28 అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరు నామాటలు వింటే ఇలా దీవిస్తాను అలా దీవిస్తాను అంటూ 14 వచనాల దీవెనలు కనిపిస్తాయి! అదే మీరు నా మాట వినకుండా త్రోసివేస్తే మిమ్మును శపిస్తాను అంటూ 54 వచనాల శాపాలు కనిపిస్తాయి....

 

15. నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

18. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;

19. నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.

20. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

22. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.

30. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.

31. నీ యెద్దు నీ కన్నులయెదుట వధింప బడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొని పోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు.

38. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.

39. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.

41. కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.

45. నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.

49. యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,

50. క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్థులను కటాక్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పించును.

57. అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారము చేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.

58. నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల

59. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.

67. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.

 

మనము ఆయన మాట వింటే ఎంతో సంతోషంగా దీవెనలు దయచేసిన ఆ పరమతండ్రి నేడు ఆయన మాటలు వినకపోతే అదేవిధంగా శాపములు కూడా కొనితెస్తారు జాగ్రత్త!

 

   ప్రియ చదువరీ! నీకు నాకు కూడా దేవుడు ఎన్నో దీవెనలు ఇచ్చారు! ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు! ఎన్నెన్నో ఆదిక్యతలు ఇచ్చారు!  ఇప్పుడు మనము ఆయన మాట వినకపోతే ఆయన వాటిని శాపంగా మారిస్తే ఆ స్థితి ఎంత భయంకరమైనది ఒకసారి ఆలోచించండి! నీవు అనుభవిస్తున్న ఈ ఆరోగ్యం తీసేసి ఏదైనా దీర్ఘకాల వ్యాది సోకితే నీ పరిస్తితి ఏమిటి? ఈ కరోనా పరిస్తితులు ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి యుండగా ఇలాంటివి మరిన్ని నీ బ్రతుకులో కలిగిస్తే నీ నా పరిస్తితి ఏమిటి? ఇంకెంతమంది ఆత్మీయులను మనం కోల్పోవాలి? అందుకే యాజకులారా/ దైవజనులారా/ కాపరులారా/ సేవకులారా!!! కన్నీరు విడవండి దుఖించండి మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి అని బైబిల్ సెలవిస్తుంది.....

యోవేలు 1: 13

యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.

యోవేలు 1: 14

ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

 

యోవేలు 2:12--18

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

14. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

15. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

16. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

17. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమాన మున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.

18. అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను.

 

  ఇక మూడో వచనంలో మిమ్మును బట్టి మీ విత్తనాలు చెరిపి వేస్తాను అంటున్నారు! మీ ముఖముల మీద పేడవేస్తాను అంటున్నారు! ఇంకా మీరు పండుగలలో మీరు అర్పించిన పశువులు వేసిన పేడను మీ ముఖాలమీద కొడతాను అంటున్నారు! ఇంకా పెంట వేసిన స్థలంలో అనగా పేడ ఎక్కడ ఊడ్చి వేస్తారో అదే స్థలంలోకి మిమ్మును ఊడ్చేస్తాను అంటున్నారు! ఎంత ఘోరమో కదా!

 

ఒక్కసారి ఐదో వచనం చూసుకుటే నేను మీతో చేసిన నిబంధన అది జీవమునకు సమాధానమునకు కారణమైనది అయితే దానిని కూడా మీరు త్రోసివేసారు అంటున్నారు! అందుకే మీ ముఖాలమీద పేడకోడతాను అంటున్నారు!

 

    ఇక్కడ విత్తనములు అనగా రెండు అర్ధాలున్నాయి! మొదటగా మీరు విత్తనాలు వేస్తారు గాని నేను ఆ విత్తనాలు పాడుచేసి అవి మొలకలెత్తకుండా చేసి మీకు పంటలు పండకుండా చేస్తాను అనేది మొదటి అర్ధం!

 

 ఇక రెండవది: చాలా తర్జుమాలలో విత్తనం బదులుగా మీ సంతానం అని తర్జుమా చేయబడింది! అనగా మీ పిల్లలను నేను పాడుచేస్తాను, వారిని హతమయ్యేలా చేస్తాను అంటున్నారు దేవుడు!

చివరకు మీ ముఖం మీద పేడ వేస్తాను అంటున్నారు! అనగా మిమ్మును అవమానం పాలు చేస్తాను అంటున్నారు! కొన్ని కొన్ని ఊర్లలో కొంతమంది రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఆడవారు వారి ముఖాల మీద పేడగాని లేక పేడనీళ్ళు గాని జల్లేస్తూఉంటారు ఎందుకంటే ఎప్పుడో పోయిన ఎలక్షన్ లో కనబడిన ముఖం – మరలా ఈ ఎలక్షన్ కి చూపిస్తున్నాడు- ఇంతవరకు ఏమయ్యిపోయావు అంటూ ముఖం మీద పేడనీళ్ళు కొట్టి అవమానిస్తూ ఉంటారు! అలాగే మిమ్మును కూడా అవమానం పాలు చేస్తాను అంటున్నారు!  అది ఏ పేడ అంటే మీ పండుగలలో మీరర్పించిన పశువులు వేసిన పేడ మీ నెత్తిమీద పడేలా చేస్తాను అంటున్నారు! ఇంకా ఆ పేడ ఉండే జాగాలోకి మిమ్మును విసిరివేస్తాను అంటున్నారు!

 

   కాబట్టి వారిని శిక్షించిన దేవుడు మనలను కూడా శిక్షిస్తారు! ప్రియ విశ్వాసులారా! జాగ్రత్తపడండి! ప్రియ సేవకుడా, కాపరీ! ఒకసారి మనలను పరీక్షించుకుని సరిచేసుకుందాము!

దేవునితో సమాధానపడదాము!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*10వ భాగము*

మలాకి 2:49.

4. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

5. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై

6. సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.

8. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు.

9. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

   గతభాగంలో మీ దీవెనను శాపంగా మార్చి ముఖాలమీద పేడ కొడతాను అన్నారు! ఇంకా ముందుకుపోతే నాలుగో వచనంలో లేవీయులారా మీతో నిబంధన చేసిన వాడను నేనే అని తెలుసుకుందురు అంటున్నారు! అనగా మొదటి వచనంలో యాజకులు అని మొదలుపెట్టిన ఈ నాలుగో వచనంలో అందువలన లేవీయులు తెలుసుకుంటారు అంటున్నారు అంటే ఇది కేవలం యాజకులకు మాత్రమే కాదుగాని లేవీయులకు కూడా చెందుతుంది. ఒకవిషయం గుర్తుపెట్టు కోవాలి- యాజకులు కూడా లేవీ గోత్రమే అనిపించినా యాజకులు ఆహారోను సంతానం కాబట్టి వారికి యాజకత్వం ఇచ్చారు! గాని వారు కూడా లేవీగోత్రమునకు చెందిన వారేకదా!

 

సంఖ్యాకాండము 3:11,12,13

11. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా

12. ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.

13. ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.

 

నెహెమ్యా 13: 29

నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము.

 అయితే దీనిని క్రొత్త నిబంధన సంఘానికి ఎలా ఆపాదించుకోవాలి అంటే ఇది కేవలం  దైవసేవకులకు కాపరులకే కాదు భక్తకోటి విశ్వాసులకు కూడా చెందుతుంది! కారణం మనలనందరినీ దేవుడు రాజులైన యాజక సమూహముగా చేసియున్నారు కాబట్టి పై మూడు వచనాలు అందరికీ చెందుతాయి అన్నమాట!

    ఇక ఐదు ఆరు వచనాలలో అంటున్నారు....

5. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై

6. సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

 

దీనికోసం మనం సంఖ్యా 25:1013 లో ఇంకా వివరంగా చెప్పబడి ఉంది!

10. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

11. వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

12. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

 

 అక్కడ ఫీనేహాసు లేచి పరిష్కారం చేసినండువలన దేవుడు శాంతించి యాజకులకు నిత్య నిబంధన చేశారు. అది వారియొక్క శాంతికి సమాదానమునకు జీవమునకు కారణమైంది. ఆ ఆజ్ఞలను గైకొని పాత యాజకులు ముఖ్యంగా ఫీనేహాసు కుమారులు లేక సంతానం ఎంతోమందిని దేవుని క్రమంలో నడిపించారు! వారు అనగా యాజకులు మొదటగా వారు నాయందు భయభక్తులు కలిగి జీవించారు! తర్వాత నా నామము విషయంలో భయము గలవారై సత్యముగల ధర్మశాస్త్రాన్ని క్రమంగా భోదిస్తూ దుర్భోధలు అనేవి అసలు ఏమాత్రం చేయకుండా ఉన్నది ఉన్నట్లు భోధిస్తూ అనేకులను వారి దోషములనుండి త్రిప్ప గలిగారు అని దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నారు అనగా కొంతకాలము వరకు యాజకులు ఎంతో గొప్ప పవిత్రజీవితం జీవిస్తూ అనేకులను క్రమమైన మార్గంలో నడిపించగలిగారు అయితే కాలక్రమేనా వారు సత్యమునుండి తొలిగి పోయారు అంటున్నారు! చూడండి దీనికోసం దానియేలు గ్రంధంలో ఒకమాట చెబుతున్నారు.

దానియేలు 12: 3

బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

 

ఒకసారి యాజకులు లేవీయులు ఎలా ఉండాలో దేవుడు లేవీ గ్రంధంలో చెబుతున్నారు 10:11

యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.

 

ఇంకా ద్వితీ ౩౩:10లో కూడా మోషేగారు చెబుతున్నారు...

వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

 

 కాబట్టి యాజకులు లేవీయులు ఇలా జీవించవలసి యుంది! అదేవిధంగా నూతన నిబంధన సంఘంలో నేటి కాపరులు సేవకులు అపోస్తలులు కూడా ఇదేవిధంగా మొదటగా తాము సరియైన భక్తిని కలిగి, ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం జీవిస్తూ తన సంఘాన్ని సరియైన బాటలో పెడుతూ, సంఘానికి మాదిరిగా జీవించాలి! మొదటగా వారు త్రాగుడు లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి! తర్వాత దేవుని ప్రజలకు వాక్యాన్ని వివరిస్తూ, సరిచేస్తూ, బుద్ధిచెబుతూ మార్గోపదేశం చెయ్యాలి!

 ఘోరం ఏమిటంటే నేటిదినాలలో మాదిరిగా ఉండాల్సిన కాపరులు సేవకులు త్రాగుబోతులుగా వ్యభిచారులుగా జీవిస్తున్నారు. ఇక వారి సంతానం వారి భార్యలు కూడా మాదిరిగా ఉండకుండా సినీ యాక్తర్లకు పోటీగా తయారవుతున్నారు! ఇలాంటి వారి ముఖాలమీద కూడా దేవుడు తప్పకుండా పేడకోడతాడు!

 

        ఏడో వచనంలో ఎంతో బ్రహ్మాండమైన మాట ఉంది! యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు వారు జ్ఞానమును బట్టి బోధించాలి అంటున్నారు! చూశారా యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు! నేటి కాలంలో కాపరులు దైవసేవకులు అపోస్తలులు ప్రవక్తలు వీరంతా సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు! కాబట్టి వీరు దేవదూతలు లాగ ప్రవర్తించాలి గాని దయ్యం దూతలుగా ప్రవర్తించ కూడదు! వీరు దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన విధులను ప్రజలకు ఉన్నది ఉన్నట్లు నేర్పించాలి! ముందు వారు పాటించి అప్పుడు ప్రజలకు నేర్పించాలి!  ఇక ప్రజలు కూడా ఎందుకు ఏమిటి ఎలా అని అడగకుండా నిజంగా ధర్మశాస్త్రంలో లేక లేఖనాలలో అలా ఉందా లేదా పరిశీలించి వారు చెప్పినట్లు చెయ్యాలి అంతే! అందుకు గాను పరిశుద్ధాత్మ దేవుడు 2తిమోతి ౩ అధ్యాయం చివరిలో నాలుగో అధ్యాయం మొదటి వచనాలలో ఖండితమైన ఆజ్ఞలు ఇచ్చారు!....

 

16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము (ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,

17. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.

2 Timothy(రెండవ తిమోతికి) 4:1,2,3,4,5

1. దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

2. వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; *సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము*.

3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,

4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

5. అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.

 

వీటి ప్రకారం దైవసేవకులు కాపరులు తప్పకుండా బోధించాలి! సంఘాన్ని సరిచేయాలి! సరియైన క్రమంలో పెట్టాలి. కొన్ని గొర్రెలు కాపరినే కొమ్ముతో పొడుస్తాయి అలాగే కొన్ని సంఘాలలో కాపరిమీద పెద్దలు తిరగబడతారు అయినా సరే ఉన్నది ఉన్నట్లు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది! వారు ఇచ్చే కానుకలుకు ఆశించి వారు మెచ్చుకొనే ప్రసంగాలు చేయకూడదు! ఉన్నది ఉన్నట్లు బోధిస్తూ అవసరమైతే ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధిచెబుతూ సరియైన మార్గములో నడిపించాలి!

 

   అయితే ఎనిమిదో వచనంలో అంటున్నారు మీరైతే అనగా ఆ పాత యాజకులైన మీ పితరులు ప్రజలను సరియైన మార్గంలో నడిపించినా మీరైతే మార్గము తప్పిపోయారు ధర్మశాస్త్ర విషయంలో మీరే అనేకులను అభ్యంతర పరుస్తున్నారు! లేవీయులతో నేను చేసిన నిబంధనను నిరర్ధకము అనగా పనికిరానిదిగా చేసియున్నారు! నా మార్గములను అనుసరించక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతం వహిస్తున్నారు. చివరికి మీ ప్రవర్తన మిమ్మల్ని నీచులుగాను తృణీకరించబడిన వారిని గాని చేసింది అలా చేసిన వాడను నేనే అంటున్నారు దేవుడు! ఒకప్పుడు అంత మంచిగా ఉన్న యాజకులు నేడు పాడయిపోయారు అంటున్నారు .....

 

మరి నూతన నిబంధన సంఘంలో యాజకులు ఎవరూ? పరిశుద్ధ స్థలంలో సేవచేయగలిగిన వారు. పిలువబడిన ఏర్పరచబడిన వారు. అనగా మెల్కీసెదెకు క్రమంలో సేవ చేయగల యాజకులు అనగా మొదటగా అపొస్తలులు. ఆ తర్వాత కాపరులు.

ఇక బలిపీఠం దగ్గర సేవచేసే వారెవరు?

బలిపీఠం అనగా నూతన నిబంధనలో మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు. ఇది కేవలం కాపరులు, అపొస్తలులు, ప్రవక్తలు, సేవకులు మాత్రమే కాకుండా ప్రతీ విశ్వాసి చెయ్యాలి. ముఖ్యంగా కాపరులు, అపొస్తలులు, ప్రవక్తలు, సేవకులు తప్పకుండా చెయ్యాలి.

 

ఇక తర్వాత నా దేవుని పరిచారకులారా! గోనెపట్ట కట్టుకుని రాత్రంతా గడపండి అంటున్నారు. అనగా సేవా పరిచర్యలో ఉన్న ప్రతీ సేవకులు పరిచారకులు తప్పకుండా ప్రార్థనలో ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన చెయ్యాలి అని అర్థం!!

 

నేడు ఈ పరిస్తితిలో ఉన్న నేటి యాజకులారా దైవసేవకులారా కాపరులారా ఒకసారి మనలను మనం పరీక్షించు కుందాము! ఒకవేళ మనం కూడా అలాగే ఉంటె నేడే మనలను మనం సరిచేసుకుని దేవునితో సమాధాన పడటానికి సిలువను సమీపించి ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో తప్పు ఒప్పుకుందాము!

Joel(యోవేలు) 2:12

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

అట్టి రీతిగా మనము దేవునితో సమాధాన పడదాం!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*11వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల మూడవ తప్పు*

 

మలాకి 2:1016.

10. మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?

11. యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి.

12. యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును.

13. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయునున్నాడు.

14. అది ఎందుకని మీరడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.

15. కొంచెముగానైనను దైవాత్మనొందిన వారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి.

16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ఇంతవరకు మనం రెండు తప్పుల కోసం చూసుకున్నాము! ఇప్పుడు మూడవ తప్పు కోసం చెబుతున్నారు దేవుడు! అయితే ఈ తప్పుకోసం డైరెక్ట్ గా చెప్పకుండా మొదట ఉపోద్ఘాతము చెప్పి అప్పుడు తప్పు ఎదో చెబుతున్నారు ఇక్కడ దేవుడు!

 

   పదో వచనంలో మనకందరికీ తండ్రి ఒక్కడే కదా, ఒక్కదేవుడే మనలను వారిని సృష్టించ లేదా? ఈలాగుండగా ఒకరి యెడల ఒకరు ఎందుకు ద్రోహము చేయుచు మన పితరులతో చేసిన నిబంధనను ఎందుకు తృణీకరించు చున్నారు అంటున్నారు? ఇంతకీ ఆ ద్రోహము ఏమిటి, మనము అనగా ఎవరు? వారు అనగా ఎవరూ అనేది పదకొండో వచనంలో ఉంది! యూదావారు ద్రోహులై పోయారు! ఇశ్రాయేలు మధ్య యేరూషలేము లోనే హేయక్రియలు జరుగుతున్నాయి!

 

ఇక్కడ ఈ భాగంలో మొదటి తప్పును చెబుతున్నారు అది ఏమిటంటే యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవతలను పూజించే పిల్లలను పెండ్లి చేసుకున్నారు అంటున్నారు!

 

   ఈ ఇశ్రాయేలు ప్రజలయొక్క మూడవ తప్పులో మొదటి తప్పు: ఇశ్రాయేలు ప్రజలలో యూదావారు పరిశుద్ధ స్తలమును అపవిత్రపరచి అన్యదేవతలను పూజించే వారి పిల్లలను పెళ్లి చేసుకున్నారు! ఎక్కడ చేసుకున్నారు? చెరలో!! అనగా వారు చెరలోనికి ఎక్కడికి పోయారు? బబులోనుకి! అక్కడ బబులోను దేశంలో అనగా దక్షిణ ఇరాక్ లో వారు వీరిలాగే చెరలో ఉన్న అన్యదేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కన్నారు! దీనికోసం విస్తారంగా మనం నెహేమ్యా గ్రంధంలోనూ ఎజ్రా గ్రంధంలోనూ చూడగలము! ఎజ్రా 9:12

Ezra(ఎజ్రా) 9:1,2

1. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూ సీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,

2. వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.

 

     ఇలా చేసుకుని వారు అనగా యూదా ప్రజలు పరిశుద్ద స్థలమైన యేరూషలేమును అపవిత్ర పరిచారు అంటున్నారు! ఎందుకు అలా అన్నారు అంటే అన్యజాతి స్త్రీలను పెండ్లి చేసుకోకూడదు అనేది దేవుని యొక్క ఖచ్చితమైన దృఢమైన ఆజ్ఞ!  ఎందుకు నిషేదించారు అంటే వారు తమ దేవతలను పూజిస్తారు ఆ తర్వాత మీ కుమారులను /కుమార్తెలను ఆ బొమ్మల పూజ చెయ్యమంటారు అందుకే విశ్వాసులమైన మనము అన్యజనులకు చెందిన పిల్లలను ఎట్టిపరిస్థితిలోను పెండ్లిచేసుకోకూడదు!

నిర్గమ 34:1516

15. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.

16 .మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.

 

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 7:1,3,4

1. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత

3. నీవు వారితో వియ్యమొందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.

4. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.

 

2కొరింథీ 6:1418

14.మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

15.క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16.దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

17.కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

 

   కాబట్టి అక్కడ అప్పుడు యూదావారు ఈ తప్పులు చేసి దేశాన్నే అపవిత్ర పరిచారు అంటున్నారు దేవుడు! ఇది మొదటి తప్పు! ఇప్పుడు చెప్పండి ఎంతమంది క్రైస్తవ పిల్లలు అన్యుల పిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు? ఇలా చేసి వారి గృహాలనే కాదు వారి సంఘాలను కూడా అపవిత్రం చేస్తున్నారు అన్నమాట! ఇక ఎంతమంది క్రైస్తవులు కట్నాల కోసం, కులం కోసం, బంధుత్వాల కోసం అన్యుల అమ్మాయిలను తమ కుమారులకు, అన్యుల అబ్బాయిలను తమ కుమార్తెలకు పెండ్లి చేయడం లేదు??!! వీరంతా తమ గృహాలను, సంఘాలను అపవిత్రం చేస్తున్నారు! ఇది దేవునికి ఇష్టం లేని పని! ఒకసారి మీరు ఏమి చేశారో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి!

 

                సరే, కాబట్టి ఇక్కడ మనలను అనగా యూదావారు ఇశ్రాయేలు వారు అని అర్ధం చేసుకోవాలి! మరి వారు అనగా ఎవరు? మొదట అర్ధం అన్య స్త్రీలు అన్నమాట! (రెండో అర్ధం కూడా ఉంది, దానికోసం తర్వాత చూసుకొందాం)! అయితే ఎజ్రా గ్రంధం, నెహేమ్యా గ్రంధం ప్రకారం ఇలా వివాహం చేసుకుని పిల్లలు కలిగాక కూడా ఇది దేవునికి వ్యతిరేఖమైన క్రియ కాబట్టి ఎజ్రా గారి ఆద్వర్యంలో యూదావారు, లేవీయులు అనగా చెరలోనుండి వచ్చిన వారు ఎవరైతే అన్యస్త్రీలను వివాహం చేసుకున్నారో వారు తమ భార్యలను వదిలివేశారు! ..

Ezra(ఎజ్రా) 10:2,3,11,19,44

2. ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.

3. కాబట్టి యీ పని ధర్మశాస్త్రాను సారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.

11. కాబట్టి యిప్పుడు మీ పితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసార ముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి.

19. వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.

44. వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు

 

    చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం పదో వచనంలో మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా అనగా మనందరికీ ఒక్కడే దేవుడు కదా, మనలను సృజించిన దేవుడే ఈ అన్య స్త్రీలను కూడా చేశారు కదా! అన్యస్త్రీలను వివాహం చేసుకోవడం తప్పే! గాని పెండ్లి చేసుకున్న తర్వాత వారిని వదిలెయ్యడం ఇంకా నేరం! ఇలా భార్యలను వదిలెయ్యడం మూడో తప్పులో  రెండవ తప్పు! అందుకే ఇదే అధ్యాయం పదహారో వచనంలో భార్యను వదిలెయ్యడం నాకు అసహ్యమైన క్రియ అని యెహోవా సెలవిస్తున్నారు అంటున్నారు!   ఇప్పుడు వారిని ఎందుకు వదిలేశారు? ఇలా వదిలివేయబడిన స్త్రీలు యెహోవా బలిపీఠం లేక మందిరము దగ్గరకు వచ్చి ఎంతో ఏడ్చారు! విలపించారుఅయ్యో ఆ దేశం నుండి పెండ్లి చేసుకుని వచ్చారు! ఇప్పుడు దేశం గాని దేశంలో మమ్మల్ని అన్యాయంగా వదిలేశారు! ఇది న్యాయమా? ఇది నీకు న్యాయమా ఓ యెహోవా దేవుడా! మాకు న్యాయం తీర్చవా అంటూ వారు విలపించి ఏడ్చారు? దానికి జవాబుగానే ఈ ప్రవచన వాక్యములు! ఇది తప్పు అంటున్నారు!  మీరు యవ్వన కాలంలో ఉండగా చేసుకున్న మీ భార్యలను వదిలేశారు!  అంటున్నారు గమనించాలి అక్కడ చెరలో ఎవరూ లేరని కొందరు, అందంగా ఉన్నారని కొందరు  అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు! ఇక్కడ ఎప్పుడైతే పెద్దలు వదిలెయ్యాలి అన్నారో ఇదేదో బాగుంది అని ఇక్కడ మరల ఇశ్రాయేలు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు! ఇది అన్యాయం అక్రమం! అని దేవుడు చెబుతున్నారు! ఇప్పుడు వారి పక్ష్యంగా దేవుడు మాట్లాడుచున్నారు!

అయ్యా అమ్మా మీరు ఎవరైనా విడాకులు తీసుకుందామని అనుకుంటూ ఉంటే అది తప్పు! అన్యాయం! దానికోసం పౌలుగారు ఏమి చెబుతున్నారో చూద్దాం!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:10,11,12,13,14,15

10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

11. ఎడబాసినయెడల పెండ్లి చేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

14. అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పిలిచియున్నాడు.

 

కాబట్టి మనలను మనం సరిచేసుకుందాము

దేవునితో సమాధాన పడదాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

 

*మహాదేవుని వార్తావహుడు*

*12వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల మూడవ తప్పు-2*

మలాకి 2:1016.

10. మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?

11. యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి.

12. యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును.

13. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయునున్నాడు.

14. అది ఎందుకని మీరడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.

15. కొంచెముగానైనను దైవాత్మనొందిన వారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి.

16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! మనము మూడో తప్పు ధ్యానం చేసుకుంటున్నాము! గతభాగంలో మొదటగా అన్యస్త్రీలను వివాహం చేసుకోవడం మొదటి తప్పు అయితే వారిని వదిలెయ్యడం రెండో తప్పుగా చూసుకున్నాము!

 

           (గతభాగం తరువాయి)

 

  ఇక ఇశ్రాయేలు ప్రజల మూడో తప్పులో మూడో తప్పు ఏమిటంటే పదమూడో వచనంలో  రెండోసారి కూడా మీరు ఇలాగే చేశారు అనగా మొదటగా అన్యస్త్రీలను వివాహం చేసుకుని అన్యాయంగా వదిలేశారు! ఇక్కడికి వచ్చి ఇశ్రాయేలు స్త్రీలను వివాహం చేసుకున్నారు! ఇప్పుడు వారు నచ్చలేదని వారిని కూడా వదిలేస్తున్నారు! అలా చేసి యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్ళతోనూ రోధనముతోను తడిపేస్తున్నారు అంటున్నారు! ఇంతకీ ఇలా బలిపీఠమును ఏడ్పుతోనూ రోదనము తోనూ తడిపేసే వారు ఎవరూ? విడాకులు ఇవ్వబడిన స్త్రీలు! దేవుడు ఇప్పుడు వీరి పక్ష్యంగా మాట్లాడుచున్నారు! ఇది మూడో తప్పు! ఇలా చేశారు కాబట్టి మీ నైవేద్యాలు అంగీకరించడం లేదు! ఇలాంటి అర్పణలు దేవునికి అనుకూలం కావు కాబట్టి మీరు తీసుకుని రావద్దు అంటున్నారు. అందుకే యెషయా 1:1319 అంటున్నారు ...

 

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి *పాపులగుంపుకూడిన ఉత్సవ సమాజమును* నే నోర్చ జాలను.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

 

మనము కూడా వారికి మించి చేస్తున్నాము కదా!! గమనించాలి మొదట మీరు మీ భార్యల విషయంలో నమ్మకద్రోహం చేసిన తర్వాత మీకు బాధ కలిగినప్పుడు మీరు ఎంతగా ఏడ్చి విలపించినా దేవుడు మీ ప్రార్ధనలు వినడు!

 

    పద్నాలుగో వచనంలో అంటున్నారు  మీ యవ్వనంలో వివాహం చేసుకున్న మీ భార్యల విషయంలో మీరు అన్యాయంగా విసర్జించారు వారి పక్షమున యెహోవా సాక్షి అయ్యారు ఇప్పుడు! ఆ భార్య నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా! అవును కదా నీవు వివాహం చేసుకున్నప్పుడు ఏమేమి ప్రమాణాలు చేశావో గుర్తుందా?

 కలిమియందును లేమియందును కష్టమందును నష్టమందును నిన్ను హత్తుకుని, నిన్ను ప్రేమించి సంరక్షింతునని దేవుని ఎదుట,  పెద్దల ఎదుట, సంఘము ఎదుట‌, బంధుమిత్రుల ఎదుట ప్రమాణం చేశావు కదా! నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటున్నాను, నిన్ను తప్ప మరో స్త్రీని కూడనని నీవు, అలాగే నిన్ను తప్ప మరో పురుషుని కూడనని ఓ భార్య నీవు చేసిన నిబంధన గుర్తుకు లేదా? ఇప్పుడు ఆ భార్య పాతదై పోయిందా? లేక మొగుడు పాతగిలి పోయాడా? అందుకేనా విడాకులు??

 

 అందుకే పద్నాలుగో వచనంలో అడుగుతున్నారు దేవుడు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియై నేడు నిన్ను అడుగుచున్నాడు! ఆమె నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు లేక హక్కుదారురాలు కదా అంటున్నారు!

 

   ఇక తర్వాత వచనంలో కొంచెమైనా దైవాత్మ నొందిన వారు ఎవరు కూడా ఈలాగున చేయరు కదా అంటున్నారు! అనగా ఇలా విడాకులు ఇచ్చిన ఏ వ్యక్తి అయినా అది స్త్రీ అయినా, పురుషుడైనా, విశ్వాసి అయినా, దైవసేవకుడు దైవసేవకురాలు అయినా గాని, చివరికి గొప్ప ప్రసంగీకుడు/ ప్రసంగీకురాలు/ గొప్ప పాటగాడు/ లేక ప్రస్తుత భాషలో సువార్త గాయకుడవైనా సువార్త గాయకురాలు అయినా అది ఎవరైనా విడాకులు ఇవ్వడం దేవుని దృష్టిలో మొదటగా నేరం!

 

రెండవది మీలో దైవాత్మ అనేది లేదు కాబట్టే మీరు విడాకులు ఇచ్చారు అంటున్నారు దేవుడు ఖరాకండిగా! అందుకే అంటున్నారు మిమ్మును మీరే జాగ్రత్త వహించుకుని యౌవనమున మీరు పెండ్లి చేసికొనిన భార్యల విషయమై విశ్వాస ఘాతకులు కాకుండుడి అంటున్నారు! ఇది కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకూ కూడా చెబుతున్నారు దేవుడు – ఓ స్త్రీలారా! మీరు కూడా మీ యవ్వనంలో వివాహం చేసుకున్న మీ భర్తల విషయంలో విశ్వాస ఘాతకులు కాకుండుడి అంటున్నారు!

 

   ఇక పదహారో వచనంలో భార్యను పరిత్యజించుట అనగా భార్యను వదిలెయ్యడం నాకు అసహ్యమైన క్రియ అంటున్నారు! దీనిని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు- అలాగే భర్తను వదిలెయ్యడం కూడా దేవునికి అసహ్యమైన క్రియగా పరిగణించవచ్చు!

 

మరొకటి కూడా దీనిలోనే అసహ్యమైన క్రియగా చెబుతున్నారు- మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట కూడా దేవునికి అసహ్యమైన క్రియ అనగా చాలా అర్ధాలు వస్తాయి! బలాత్కారముగా మరొకరి ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, బలవంతముగా మరొక స్త్రీని బలాత్కారం అనగా రేప్ చెయ్యడం, నీది కానిది నీవు పొందాలనుకోవడం కూడా దేవునికి అసహ్యమైన క్రియ! నా ఉద్దేశంలో భర్త ఉండగా మరొక పురుషున్ని చేరడం, భార్య ఉండగా మరొక స్త్రీతో పాపం చెయ్యడం కూడా దేవుని దృష్టిలో నీ వస్త్రాలను బలాత్కారంతో నింపడమే! ఇది కూడా దేవుని దృష్టిలో అసహ్యమైన క్రియ!

 

  ముగింపుగా ఒకమాట చెప్పనీయండి! మహా గొప్ప దైవజనులు బెన్ హిన్న్ గారు, హృదయ సంబంధమైన వ్యాధి ద్వారా ఒకసారి చనిపోయి పరలోకపు ద్వారానికి ప్రవేశించారు, అక్కడ జయజీవితం జీవించిన వారికోసం దూతలు ఆర్భాటం చెయ్యడం ఆయన చూశారట! ఆయన విషయంలో కూడా దూతలు ఆర్భాటం చేశారట! గాని యేసుక్రీస్తుప్రభులవారు ఎంతో కన్నీరు కార్చారట! ఈ భక్తుని హృదయం పగిలిపోయింది అట! అయ్యా ఇన్ని లక్షలమందిని నీలోనికి నడిపించి వెలిగించాను కదా! మరి నాకెందుకు ప్రవేశం లేదు, నన్నెందుకు చూసి ఏడుస్తున్నావు అంటే నీకు తెలియదా అన్నారట! చివరికి ఆ భక్తుడు క్రీస్తుకోసం ఎన్నో ఘనమైన కార్యాలు చేసి దేవునికి ఇష్టుడిగా జీవించిన వ్యక్తి కాబట్టి, ఈ విషం అందరికి చెప్పడానికి ఆ మహా దైవజనునికి దేవుడు మరో అవకాశం ఇచ్చారట! నీకు మరో చాన్సు ఇస్తున్నాను ఇప్పుడైనా నాకిష్టమైన కార్యం చెయ్యమన్నారు అట! ఇంతకీ ఆయన చేసిన నేరం పాపం ఏమిటి? ఇంతటి ఆత్మపూర్ణుడు కదా ఆయన, తన భార్యకు ఈయనకు మధ్య కొన్ని ఆర్ధిక లావాదేవీలు వలన మనస్పర్ధలు కలిగి భార్య విడాకులు కోరింది ఈయన ఇచ్చేశారు! అదీ ఆయన చేసిన నేరం! బైబిల్ చెబుతుంది ఎట్టి పరిస్తితులలోను విడాకులు తీసుకోకూడదు! మరి ఈ విషయంలో ఆయన దైవాత్మను నొక్కేశారామో!! ఈ విషయాన్ని అనేక లక్షలమందికి బోధించిన వ్యక్తి తనే విడాకులు తీసుకోవడం దేవునికి ఇష్టం లేకపోయింది!

     గమనించాలి దేవునికి ఇష్టం లేని పని ఏది చేసినా నీకు పరలోక ప్రవేశం లేనేలేదు! ఆ భక్తునికైతే దేవుడు మరో అవకాశం ఇచ్చారు! బహుశా ఈ మెసేజ్ ప్రపంచానికి చాటి చెప్పాలనేమో! నీకు నాకు అయితే అలాంటి అవకాశం లేదు! ఎందుకంటే అలాంటి పరిచర్యను మనం చేయలేదు చేయలేము కూడా! మరి నీకు మరో అవకాశం లేకపోతే పరలోకం పోయినట్లే కదా! అనగా నరకానికి పోవడమే కదా! అందుకే నేడు అనే సమయం ఉండగానే పశ్చాత్తాప పడదాం! భార్యతో లేక భర్తతో సమాధాన పడదాం!

 

  ఈ విడాకులు కోసం మొదటగా యేసుక్రీస్తుప్రభులవారు ఏమి చెప్పారో తర్వాత భక్తుడైన పౌలుగారు ఏమి చెప్పారో చూసుకుని ముగించుకుందాం!

Matthew(మత్తయి సువార్త) 5:31,32

31. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;

32. నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.

 

Matthew(మత్తయి సువార్త) 19:3,4,5,6,7,8,9

3. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా

4. ఆయనసృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు

5. ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?

6. కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.

7. అందుకు వారు ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా

8. ఆయన మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.

9. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.

 

దానికోసం పౌలుగారు ఏమి చెబుతున్నారో చూద్దాం!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:10,11,12,13,14,15

10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

11. ఎడబాసినయెడల పెండ్లి చేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

14. అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పిలిచియున్నాడు.

 

కాబట్టి నేడే మనలను మనం సరిచేసుకుందాం! భార్యతో లేక భర్తతో సమాధాన పడదాం!

 మనం పవిత్రులు అవుదాం! సంఘాన్ని పవిత్రం చేద్దాం!

పరలోక రాజ్యానికి వారసులం అవుదాం!

దైవాశీస్సులు!

 

 

*మహాదేవుని వార్తావహుడు*

*13వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల నాల్గవ తప్పు*

మలాకీ 2: 17

మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగు చున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును;లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పు కొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఈరోజు మనం నాలుగో తప్పును ధ్యానం చేసుకుందాము!

 

పదిహేడో వచనంలో మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారు, అంతేకాకుండా మేము నిన్ను ఎలా ఆయాసపెడుతున్నాము అంటూ బుకాయిస్తున్నారు అంటున్నారు! వీరికి మామూలే కదా మరలా బుకాయిస్తున్నారు దేవుణ్ణి! దేవుడు అంటున్నారు మీరు నన్ను మీ మాటలచేత ఆయాస పెడుతున్నారు లేక దుఃఖపెడుతున్నారు అంటే ఏం ఏమాటలతో నిన్ను ఆయాస పెట్టేశామేమిటి? అంటున్నారు అందుకు దేవుడు అంటున్నారు- దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు వారియందు ఆయన సంతోష పడుతున్నారు అంటున్నారు! ఇంకా కొంతమంది న్యాయకర్త అంటారు కదా దేవుడు, మరి లోకంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఏమి చేస్తున్నాడు అంటున్నారు!

 

  మరి నేటి రోజులలో మనలో ఎంతోమంది ఇలా అనడం లేదా? భక్తిగా ఉండి ఉపయోగం ఏమిటి? చూడు వాడికి దేవుడంటే భయం లేదు! ఎప్పుడూ త్రాగుతూ, వ్యభిచారం చేస్తూ, లంచాలు పుచ్చుకుంటూ వీడిని వాడిని దోచుకుంటూ ఉంటాడు! వాడికి ఏమీ అవ్వడం లేదు! వాడి పిల్లలు ఎంతో అభివృద్ధి పొందుతున్నారు! బిల్డింగ్ ల మీద బిల్డింగ్ లు కడుతున్నారు! వాడిని వదిలేయ్, నేను ఎంతో భక్తిగా ఉంటాను, ఉపవాసాలు ఉంటాను, వాడైతే ఎప్పుడో క్రిస్మస్ కో, క్రొత్త సంవత్సరానికో ఈష్టర్ కో వస్తాడు! వాడికి ఏ కష్టాలు శ్రమలు రావు! నాకైతే అన్నీ కష్టాలే! అన్నీ శ్రమలే! నేను ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా దేవుడు వెంటనే లెంపకాయ కొట్టేస్తున్నాడు! వాడు ఎన్ని అవినీతి క్రియలు చేసినా దేవుడు వాడిని చూసి చూడనట్లు వదిలేస్తున్నాడు అంటున్నారు కదా ఇలా మీరు కూడా! ఇలా కూడా మీరు దేవుణ్ణి ఆయాస పెడుతున్నారు అంటున్నారు!

 

   మహా గొప్ప భక్తుడైన ఆసాపు గారు కూడా ఇలాగే దేవుని మీద ఆయాసపడ్డారు! కీర్తనల గ్రంధం 73 లో ఇది కనిపిస్తుంది మనకు! మూడో వచనంలో అంటున్నారు అ భక్తుడుభక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను! ఆ భక్తిలేని వారికి మరణ యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు గాని అందరికీ వచ్చే జ్వరాలు తెగుళ్ళు గాని వారికి రావడం లేదు! అందుకే వారికి గర్వం పెరిగిపోయింది! బలత్కారాన్ని వారి వస్త్రంలా ధరించుకుంటున్నారు! వారికి క్రొవ్వు పెరిగి పోయి కళ్ళు నెత్తి మీదికి వచ్చేశాయి. గర్వంగా మాట్లాడుచున్నారు! భక్తిపరులు అంటే హేళన చేస్తున్నారు! ఇంకా వారు అంటున్నారు మహోన్నతుడు అనగా దేవునికి ఎట్లు తెలుస్తుంది ? దేవుడికి బుద్ధి తెలివి ఉందా అంటున్నారు! వారు మమ్మల్నే కాదు దేవుడా నిన్నుకూడా తిడుతున్నారు కదా! వారు ప్రతీరోజు ధనవృద్ది కలుగజేసుకుంటున్నారు కదా అని బాధపడుతూ ఇక విసిగి పోయి  పదమూడో  వచనం రాబోయే సరికి ఇక నేను భక్తిగా ఉండటం వ్యర్ధమే ఏమీ ఉపయోగం లేదు, నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం వ్యర్ధమే! నిర్మలంగా పవిత్రంగా ఉండటం వ్యర్ధమేనాకైతే దినమంతా బాధలు శిక్ష వస్తుంది వారైతే ఏ భాధలు లేకుండా నిశ్చింతగా ఉన్నారు అంటున్నారు!  ఇక దీనికోసం ఆలోచించి ఆలోచించి చాలా బాధపడి నలిగిపోతున్నారు భక్తుడు! దేవుని మీద ఎంతో కోపం వచ్చింది! దేవుని మీద అలిగాడు ఈ భక్తుడు; అయితే ఈయన భక్తుడు కదా దేవుడు లేకుండా ఉండలేడు కదా, అందుకే ఇక వీరిని వారిని అడగడం అనవసరం, దేవునితోనే తేల్చేసుకుందాం అని మందిరానికి పోయి ప్రార్ధన మొదలుపెట్టారు! ధ్యానించడం మొదలుపెట్టారు ఈ భక్తుడు!   అయ్యా ఇదేమి నీకు న్యాయం? మాకో న్యాయమా వాడికో న్యాయమా? నీకేమేమైనా కొంచెమైనా జాలి ఉందా మా పట్ల అంటూ ప్రార్ధన చేస్తున్నారు! ప్రార్ధన అంతా దేవుడు చాలా ఓపికతో తాపీగా విని నవ్వుతూ ఆయనకు అసలు విషయం బయలుపరిచారు దేవుడు! ఈ భక్తిహీనుల అంతాన్ని దేవుడు 70 mm సినిమా స్కోప్ లో చూపించారు! 1622 వచనాలలో దీనికోసం వివరంగా ఉంది! దేవుడు ఆయనకు చూపించారు ఈ భక్తిహీనులు కాలు జారుచోటున అంచులో ఉన్నారు అనగా ఒక ఎత్తైన కొండ, ఆ శిఖరంలో ఎడ్జ్ లో ఉన్నారు, గాని వారు గర్వంతో క్రిందకు చూడటం లేదు జస్ట్ కొద్ది నిమిషాలలో లేక క్షణాలలో వీరు కాలు జారిపోయి భయంకరమైన లోతైన గోతిలో పడబోతున్నారు ఒక్కసారి పడ్డారా ఇక లేవరు అన్నమాట! పరదేశులమో ప్రియులారా పాడటానికి వారి శవం కూడా దొరకదు అన్నమాట! ఇది చూసి ముందు ఈ భక్తుడు లెంపలు వేసుకుంటున్నారు అయ్యా నేను పశుప్రాయుడను ఎన్నెన్నో అన్నాను బాబు నిన్ను! నన్ను క్షమించమని అడిగారు ఈయన!

   చివరగా ఒక మేలి రత్నం లాంటి మాటలు అంటున్నారు భక్తుడు 25 వచనంలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు చివరికి నా శరీరము నా హృదయం క్షీణించి పోయినా గాని దేవుడు నిత్యమూ నా హృదయంలో ఆశ్రయ దుర్ఘముగా స్వాస్త్యముగా ఉన్నారు అంటున్నారు!

ఈ భక్తుణ్ణి చూసి మనం నేర్చుకోవాలి! ఎన్నోసార్లు ఈ భక్తుడిలా మనం దేవునిమీద బాధపడ్దాము కదా! ఇలా దేవుణ్ణి ఎన్నో మాటలాడి ఆయనను ఆయాస పెట్టాము కదా! మనకు చిన్న పొరపాటు చేసిన లెంపకాయ ఎందుకు తగులుతుంది అంటే మనము దేవునికి ఇష్టులము కాబట్టి! తండ్రి తనకు ఇష్టమైన పిల్లలను శిక్షించు రీతిగా మనలను ఆయన శిక్షించి తిరిగి ఆయన దారిలోనికి తీసుకుని వస్తున్నారు! ఇంకా మనము ఎత్తబడే గుంపులో, పరలోకం చేరే బాచ్ లో ఉన్నాము కాబట్టి ఏమాత్రం పొరపాటు చేసినా వెంటనే మనలను సరిచెయ్యడానికి ఇలాంటి లెంపకాయలు వేస్తున్నారు! వారైతే నరకానికి పోయే బాచ్! వారిని దేవుడు అసహ్యించు కుంటున్నారు అందుకే వారు ఎలా పోయినా వదిలేసి, వాడు ఇంకా మూర్కించి మూర్ఖించి తాను త్రవ్వుకున్న గోతిలో వాడే పడి నిత్యనాశనం పొందుకోవడం దేవుని ప్లాన్! వానికి రక్షణ పొందటానికి మారుమనస్సు పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చినా త్రోసివేసి గర్వించి దేవుడు ఎవడు? ఆయనకు బుద్ధి ఉందా అంటూ విర్రవీగుతున్నాడు కాబట్టి నరకం ఏమిటో వాడు రుచి చూడాలని వాణ్ని నరకానికి, బ్రష్టత్వానికి వదిలేశారు దేవుడు!

కాబట్టి ఇలాంటి మాటలు అని ఉంటే ప్రియ విశ్వాసి! వెంటనే దేవుణ్ణి క్షమాపణ వేడుకో! నీవు ఎత్తబడే బాచ్ లో, దేవుని చేత ప్రేమించబడే గుంపులో ఉన్నావని సంతోషించు!

 

   ఇక మరికొందరు మరిన్ని మాటలతో దేవుణ్ణి ఆయాసపెడుతున్నారు చూద్దాం పేతురు పత్రికలో ! పితరులకు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి? దేవుడు ఇంకా రాలేదు అంటూ! అందుకే దేవుడు అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఆశించి ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నారు అంటున్నారు!...

 అపో.కార్యములు 17: 30

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

 

2 Peter(రెండవ పేతురు) 3:3,4,8,9,15

3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,

4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

15. మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు.

 

  కాబట్టి ప్రియ చదువరీ! ఒకవేళ నీ మాటల ద్వారా దేవుణ్ణి ఆయాస పెట్టి ఉంటే నేడే క్షమాపణ వేడుకుని ఆయనతో సమాధాన పడు!

ఎత్తబడే గుంపులో చేరిపో!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*14వ భాగము*

*రాబోయే ఏలియా*

మలాకి 3:1

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

    ఈ మొదటి వచనములో  ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్దపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హటాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు అంటున్నారు!

 

ప్రియులారా! ఈ వచనంలో ఇద్దరి రాకకోసం మనము చూడగలము!

 

మొదటిది: రాబోయే ఏలీయా!

రెండవది: మెస్సియా అని పిలువబడే యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకడ!

 

మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే కేవలం రాబోయే ఏలియా గారి గురించే కనిపిస్తుంది గాని కొంచెం లోతుగా చూసుకుంటే అక్కడ మనకు యేసుక్రీస్తుప్రభులవారు కూడా కనిపిస్తారు!  ఈ వచనంలో మొదటి అర్ధ భాగంలో ఏలియా గారు, తర్వాత అర్ధభాగంలో యేసయ్య కనిపిస్తారు మనకు!

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్దపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను! ఇంతవరకు మనం రాబోయే ఏలియా గారి గురించి అని గ్రహించాలి! యెషయా గ్రంధంలో ప్రభువు మార్గము సరాళము చేయుడి అంటూ చెప్పారు కదా...... ఆయన ఈయనే!

Isaiah(యెషయా గ్రంథము) 40:3,4

3. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

4. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.

 

 అనగా బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించిన ప్రవచనము అని గ్రహించాలి!

 

ఇక మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూతచూడండి ఇక్కడ దూత అని సెలవిచ్చినా, దానికి ముందుగా మీరు వెదకుచున్న ప్రభువు అని వ్రాయబడింది కాబట్టి ఆ దూత మరియు ప్రభువు వేరెవ్వరో కాదు యేసుక్రీస్తుప్రభులవారు అని గ్రహించాలి! ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుడు చెబుతున్నారు! మన టాపిక్ రాబోయే ఏలియా గారు అనగా బాప్తిస్మమిచ్చు యోహాను గారు గనుక ఒక్కమాట చెప్పి దీనికోసం ముగిస్తాను! ఈ ప్రవచనం వచ్చేసరికి ఇంకా యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ మెస్సయ్యగా ఇంకా జరుగలేదు! ఆయన కూడా వస్తున్నారు అయితే దానికి ముందుగా నా దూతను పంపిస్తాను అంటున్నారు ఆ దూత బాప్తిస్మ మిచ్చు యోహాను గారు! అయితే ఇక్కడ ఈ మీరు కోరుకున్న ప్రభువు లేక నిబంధన దూత అన్నారు కదా ఏమి నిబంధన చేశారు అనేది చూద్దాం! ఇక్కడ నిబంధన దూత అనగా తండ్రియైన దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఏర్పాటు చేసిన మార్గము సంపూర్ణత  సాధించలేకపోయింది, దానిని ఇశ్రాయేలు ప్రజలు పాటించలేక పోయారు! అందుకే యిర్మియా గ్రంధంలో నేను మరో నిబంధన చేయబోతున్నాను అది మీరు ఇప్పుడు చూస్తున్నది కాదు అంటున్నారు:

యిర్మియా 31:3134...

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33 .ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధ నొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

 

ఇదిగో ఈ నిబంధన దేవుడు చేశారు యిర్మియా గారి సమయంలో అనగా యేసుక్రీస్తుప్రభులవారు రాకపూర్వమే అనగా సుమారుగా క్రీ.పూ. 580 సంవత్సరంలో! ఆ ప్రవచనం యేసుక్రీస్తుప్రభులవారి రూపంలో నెరవేరింది! ఆయన రాకముందే బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆరు నెలల ముందుగా ఆయన జన్మించారు! లూకా 1:26! ఇక్కడ ఆరవనెలలో గబ్రియేలను దేవదూత గలలియ లోని నజరేతు అని ఊరిలో అంటూ ప్రారంభించారు కదా- ఆ ఆరవ నెల అనగా బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల్లియైన ఎలిజబెత్ గారు గర్భవతియైన ఆరునెలలకు దైవజనురాలైన మరియా గారు బాలయేసును గర్భం ధరించారు అన్నమాట! ఇక యేసుక్రీస్తుప్రభులవారు ఏవిధంగా ఈలోకంలో జీవించారో మనకు నాలుగు సువార్తలలో కనిపిస్తుంది!

 

   చివరకు ఆయన ఏ నిబంధన చేశారో కూడా ఆయన మాటలలోనే మనం చూడగలం!

  మత్తయి 26:2628...

26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి.

28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

మార్కు 14:2325

23. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.

24. అప్పుడాయన ఇది నిబంధన విషయమై (కొన్ని ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతరము) అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము.

25. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

 

లూకా 22: 20

ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.

 

1కొరింథీ 11:2326

23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి

24. దానిని విరిచియిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో- మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

26. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

 

    ఈ వచనాలలో ఆయనచేసిన నిబంధన మనకు అర్ధమయ్యింది ఏమిటంటే తన రక్తముతో యేసుక్రీస్తుప్రభులవారు నిబంధన చేశారు ఎలా చేశారు అంటే తన నిర్దోషమైన, పాపములేని యవ్వన రక్తాన్ని మనందరికొరకు తనకుతానుగా అర్పించుకొని మన పాపములకు పరిహారంగా తాను చనిపోయి రక్తముతో పరిహారం చేసి, దేవునికి మానవులకు ఏర్పడిన అడ్డగోడను కూలద్రోసి, తండియైన దేవునితో మనలను సమాధానపరచి మొదట ఆయన సంపూర్ణత సాధించి మనలను పరలోకానికి హక్కుదారులుగా చేశారు! పరలోక మార్గాన్ని సుగమము చేశారు! ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన లోక రక్షకుడని ప్రభువని నమ్మి విశ్విసిస్తే వారికి కూడా ఆ పరలోక రాజ్యంలో వారసులు కావాలనేది ఆ క్రొత్త నిబంధన!

యోహాను 3: 16

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా (లేక, జనితైక కుమారుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

 

మరి ఆయనను విశ్వసిస్తున్నావా? ఆయనను నమ్ముతున్నావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మహాదేవుని వార్తావహుడు*

*15వ భాగము*

*రాబోయే ఏలియా-2*

మలాకి 3:1

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

    ఈ మొదటి వచనములో  ఇద్దరి రాకకోసం మనము చూస్తున్నాము! గతభాగంలో యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకడ కోసం చూసుకున్నాము! మార్గము సిద్దపరిచేది అనగా సిద్ధపరచే దూత బాప్తిస్మమిచ్చు యోహాను గారు అని చూసుకున్నాము! 

ఈ వచనంలో అయితే నా దూతను ముందుగా పంపుతాను అని సెలవిచ్చినా 4:56 ఇంకా స్పష్టముగా యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు అనగా యెహోవా దినము అని చెప్పబడే రెండవరాకడ లేక బహిరంగ రాకడ రాకమునుపు నేను ప్రవక్తయైన ఏలియాను మీ యొద్దకు పంపుతాను! ఆరవ వచనంలో-- నేను వచ్చి దేశాన్ని శపించకుండునట్లు అతడు అనగా రాబోయే ఏలియా అలియాస్ బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పును అని సెలవిస్తున్నారు!

 

    మరి ఇంతకీ ఏలియా గారు వచ్చారా అంటే వచ్చారు! గతభాగంలో యేసుక్రీస్తుప్రభులవారి రాకకు ముందుగా ఆరునెలల ముందుగా ఈలోకంలో జన్మించారు అని చూసుకున్నాము! ఒకసారి లూకా సువార్త మొదటి అధ్యాయంలోకి వెళ్దాము రండి!

1:5 నుండి బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల్లిదండ్రులు కోసం వ్రాయబడింది. యాజక ధర్మము లేక మర్యాద  చొప్పున జెకర్యా గారికి వంతు వచ్చినప్పుడు దూపం వేస్తున్నప్పుడు దేవదర్శనం పొందారు జెకర్యా గారు! ఇక్కడ జాగ్రత్తగా చూస్తే గబ్రియేలు దేవదూత అంటున్నమాటలు పరిశీలిద్దాం! 1317

 

13. అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,

15. తన తల్లిగర్భ మున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై,

16. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.

 

జాగ్రత్తగా పరిశీలించవలసిన ముఖ్యమైన వచనాలు మొదటిది పదిహేను: తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్దాత్మతో నిండుకొన్నవాడై... ఎంతగొప్ప ప్రవక్త కదాతన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు ఈయన! అందుకే సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారే స్త్రీ గర్భములో పుట్టిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు అని స్టేట్మెంట్ ఇచ్చారు! గమనించాలి- యేసయ్య కూడా స్త్రీ గర్భములో పుట్టారు కదా గాని అంటున్నారు స్త్రీ కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేదు అన్నారు! కారణం సింపుల్తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్దాత్మతో నిండుకున్న గొప్ప దైవజనుడు ఈయన! అందుకే మెస్సయ్య ఎవరో అని ఆయన ధ్యానం చేస్తుంటే నీవు భాప్తిస్మము అనే క్రొత్త పద్దతి లేక ప్రణాళిక మొదలుపెట్టు! ఇది కేవలం పశ్చాత్తాపం కొరకు! ఇలా చేసినప్పుడు నీవు బాప్తిస్మమిచ్చుచుండగా ఎవరిమీద పరిశుద్ధాత్ముడు పావురం వలె వ్రాలునో ఆయనే మెస్సయ్యా అని చెప్పారు!

 ఆ తర్వాతే ఇదిగో లోకపాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అంటూ ఆత్మావేశుడై పరవశంతో పలుకుతున్నారు!

 

 అంతెందుకుమరియగారికి గబ్రియేలు దేవదూత కనిపించిన తర్వాత ఎవరితో ఈ విషయాలు పంచుకోవాలో అర్ధం కాక తన బంధువురాలు (బహుశా మేనత్త) అయిన ఎలిజబెత్ గారి (ఈమె యూదా గోత్రికురాలు అయినా గాని లేవీయుడు మరియు యాజకుడు, నీతిమంతుడైన జెకర్యా గారు వివాహం చేసుకున్నారు)  దగ్గరకు వెళ్ళినప్పుడు యోహాను గారు ఇంకా గర్భములో ఉండగానే, దైవజనురాలైన మరియా గర్భములో ఉన్న బాలయేసును చూచి  పరవశించి గంతులు వేస్తున్నారు ఈయన!.....

Luke(లూకా సువార్త) 1:40,41,44

40. జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

41. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండు కొనినదై బిగ్గరగా ఇట్లనెను

44. ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

 

 అంతటి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ప్రవక్త ఈ బాప్తిస్మమిచ్చు యోహాను గారు!

 

తర్వాత పదహారో వచనం: ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును! చూడండి ఇక్కడ ఇశ్రాయేలీయులలో అనేకులను అన్నారు గాని అందరినీ అనలేదు! అందుకే అందరూ  యేసయ్యను మెస్సయ్య గా  అంగీకరించలేదు! అయితే అనేకుల హృదయాలను రేపి దేవుని వైపు త్రిప్పారు! వారిలో అనేకులు ఇదిగో లోకపాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాట విని యేసయ్యను అనుసరించారు!

 

ఇక పదిహేడు: తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి....

ఇక్కడ బ్రెన్హహమైట్లు అనే దొంగబోధకులు ఏమంటున్నారు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గారు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు మాత్రమే త్రిప్పారు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు త్రిప్పలేదు, అలా త్రిప్పడానికే ఏలియా గారు మరలా విలియం బ్రెన్హా గా వచ్చారు అంటున్నారు! ఇది అబద్దం!

ఇలాంటి అబద్ద బోధలు నమ్మి మోసపోవద్దు! నేను నా దూతను పంపిస్తాను అన్నారు  ఆ దూత లేక రాబోయే ఏలియా ఈ బాప్తిస్మమిచ్చు యోహానే అని సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారే చెప్పియుండగా మరో ఏలియా రాడు! ఏలియా వచ్చి సమస్తమును నెరవేర్చారు అని యేసుక్రీస్తు ప్రభులవారు తానే స్వయంగా చెబితే ఈ పనికిమాలిన అబద్ద బోధకులు ఏలియా గారు వచ్చి సగమే చేశారు అంటూ అబద్దాలు చెబుతున్నారు . దీనికోసం తర్వాత చూసుకుందాం!

 

ఇక చివరిగా గబ్రియేలు దేవదూత ఏమి చెబుతున్నాడో చూద్దాం! ప్రజలను సిద్దపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును!

 

మొదటగా ప్రజలను సిద్దపరచుటకైఅవును ఆనాడు ప్రజలు యెహోవా దేవుణ్ణి అనుసరించడానికి వెనుకాడుతున్నప్పుడు ఏలీయా గారు ప్రార్ధించి- రాజుతోను బయలు దేవత ప్రవక్తల తోనూ సవాలు విసరి కర్మెలు పర్వతం మీద దేవుని అగ్నిని భూలోకమునకు రప్పించి ఆయన సాక్షాత్కారముతో మరలా ప్రజలను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చారు! అలాగే ఇప్పుడు ప్రజలను దేవుని దగ్గరకు తీసుకుని రాడానికి ఈ బాలుడు ఉపయోగ పడతాడు అని గబ్రియేలు దూత చెప్పి వెళ్ళిపోయాడు! అలాగే నిజంగా ఆయన జీవితంలో ఎలా ప్రజలను రగిలించి ఆయన యొద్దకు నడిపించారో మనం సువార్తలలో చూడగలం!

 

రెండవది: ఏలియా యొక్క ఆత్మ గలవాడు: మలాకీ గ్రంధంలో నాలుగో అధ్యాయంలో వాగ్దానం చేసిన వాగ్ధానపు దూత లేక మహాదేవుని వార్తావహుడుగా యోహాను గారు ఏలియా గారి ఆత్మను పొందుకుని వచ్చారు! దానిని గబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు దృవీకరించరు. మరలా యేసుక్రీస్తు ప్రభులవారు దానిని రెండు సార్లు దృవీకరించారు!

 

మత్తయి 11: 14

ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.

 

మత్తయి 17:1013

10. అప్పుడాయన శిష్యులుఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.

11. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే;

12. అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను.

13. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.

 

కాబట్టి రాబోయే ఆ ఏలియా గారే ఈ బాప్తిస్మమిచ్చు యోహాను గారు- ఆయన తప్ప మరో మనుష్యుడు రాబోయే ఏలియా కాదు కానేరడు!!!

 

ఇక ఆయనకు ముందుగా వెళ్ళును అంటున్నారు: ఆయన అనగా ఎవరు?

యేసుక్రీస్తు ప్రభులవారు

ఆయనకు ముందుగా వెళ్ళును అనగా ..

బైబిల్ లో ఆయన చెప్పిన మాటల ద్వారా చూద్దాం...

లూకా ౩:1617

16. యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా కంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను (లేక, పరిశుద్దాత్మతోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును;

17. ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.

 

యోహాను 1:15, 1936

15. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు- నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.

19. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.

20.అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) కానని ఒప్పుకొనెను.

21. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.

22. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి

23. అందుకతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.

24. పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు

25. వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా

26. యోహాను నేను నీళ్లలో( లేక, నీళ్ళతో) బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;

27. మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.

28. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.

29. మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

30. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే యీయన.

31. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో (లేక, నీళ్ళతో) బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను.

32. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల (లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్దాత్మతో) బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.

34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.

35. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా

36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.

 

ఇక యేసుక్రీస్తు ప్రభులవారు ఆయనకోసం ఏమి చెప్పారో చూద్దాం!..

మత్తయి 11:715,

7. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

8. సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగోసన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.

9. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును. అవి యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను

11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.

12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.

13. యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను.

14. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.

15. వినుటకు చెవులుగలవాడు వినుగాక.

 

మత్తయి 17:1013

10. అప్పుడాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.

11. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే;

12. అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను.

13. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.

 

కాబట్టి రాబోయే ఏలియా గారు మరెవరో కాదు- బాప్తిస్మమిచ్చు యోహాను గారు మాత్రమే అని గ్రహించాలి!

తప్పుడు బోధలు నమ్మి మోసపోవద్దు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మహాదేవుని వార్తావహుడు*

*16వ భాగము*

*రాబోయే ఏలియా-3*

*విలియం బ్రెన్హాం రాబోయే ఏలియానా? కాదు!!!*

 

మలాకి 3:1

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

       (గతభాగం తరువాయి)

   ప్రియులారా మనం రాబోయే ఏలియా ఎవరూ అనేది ధ్యానం చేసుకుంటూ అది భాప్తిస్మమిచ్చు యోహాను గారు అని యేసుప్రభులవారి మాటల ద్వారా నిర్ధారణ చేసుకున్నాము! అయితే విలియం మారియన్ బ్రెన్హాం అనే వ్యక్తి ఆ రాబోయే ఏలియా నేనే అని చెప్పుకుని ఏడు సంఘకాలాలు ఉన్నాయని, ఏడో సంఘకాలమైన లవొదొకయ సంఘకాలంలో మనము ఉన్నామని, ఆ సంఘానికి దూతగా దేవుడు నన్ను పంపారని ఎన్నెన్నో అబద్దాలు చెప్పారు! నిజంగా ఈ వ్యక్తి రాబోయే ఏలియానా? కాదు కాదు కాదు! ఎందుకు అలా బల్లగుద్ది చెబుతున్నావు అని నన్ను అడిగితే యేసుక్రీస్తుప్రభులవారు తానే స్వయముగా ఒక Remarkable Statement/Declaration  ఇచ్చారు: రాబోయే ఏలియా బాప్తిస్మమిచ్చు యోహాను అని చెప్పారు!

మత్తయి 11: 14

ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.

 ఆయన నోటితేనే చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అబద్దప్రవక్త నేనే రాబోయే ఏలియా అని చెప్పుకుంటే ఆయనను అబద్దప్రవక్త అబద్ద బోధకుడు అని కాక ఏమంటారు? యేసుప్రభులవారు తానూ స్వయముగా చెప్పిన తర్వాత ఇక డిస్కసన్ వద్దు!

 

   విలియం మారియన్ బ్రెన్హాం అబద్దబోధకుడు అనడానికి కొన్ని రుజువులు చూసుకుందాం! బైబిల్ ముందుగా హెచ్చరించినట్లుగానే ఈ అంత్యకాలంలో అనేకమంది అబద్ద ప్రవక్తలు వచ్చి కోట్లమంది క్రైస్తవుల్ని తప్పుమార్గంలోనికి నడిపిస్తున్నారు. ఇలా మోసగించిన అబద్ద ప్రవక్తల్లో 'విలియం మారియన్ బ్రెన్హాం' అతి ముఖ్యుడు. ఇతడు 1909 సం||లో కెంటక్కి (అమెరికా) అనే ప్రాంతంలో జన్మించాడు. 1943లో విలియం హీలింగ్ మినిస్ట్రీని ఇతడు ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే విస్తారమైన పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అనేక దేశాలు తిరిగాడు. ఒకప్రక్క క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడుబోధల్ని ఖండిస్తూ మరోప్రక్క మరింత తప్పుడు బోధలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఆదిమ సంఘానికి పౌలు ఎలాగో ఈ చివరి సంఘానికి తాను అలాంటివాడు అనీ, తనని ప్రవక్తగా అంగీకరించకుంటే రక్షణ దొరకదు అనీ, బైబిల్ లో అతని గురించి ముందుగానే ప్రవచింపబడింది అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

 

తాను పుట్టినప్పుడు అతని గదిలో ఒక వెలుగు ప్రకాశించి అతని తలకి పైగా నిలిచిందని, అతడు బాల్యంలో ఉండగా పక్షులు అతనితో మాట్లాడాయని, అతని 7వ సంవత్సరంలో సుడిగాలిలో నుండి దేవుడు అతనితో మాట్లాడాడు అని చెప్పుకుంటూ అందరి దృష్టిలో ప్రవక్తగా ముద్ర వేయబడ్డాడు. బైబిల్ లోని మర్మాలను వివరించడానికి ఈ లవొదికయ యుగానికి దూతగా దేవుడు తనను పంపాడని చెప్పుకున్నాడు. ఏడు సంఘకాలముల కోసం, ఏడు ముద్రల కోసం పుస్తకాలు రాసి, ఒక దేవదూత తనతో ఉండి వీటన్నిటినీ తనకి బోధించేదని, ఆ దేవదూతే తన పరిచర్య అంతటినీ నడిపిస్తుందనీ చెప్పుకునేవాడు. కానీ *నిజానికి అతడు 1919లో క్లేరెన్స్ లార్కిన్ విడుదల చేసిన 'ది బుక్ ఆఫ్ రెవలేషన్' మరియు చార్లెస్ రస్సెల్ రాసిన 'సంఘకాలములు' అనే పుస్తకాల ఆధారంగా ఈ విషయాలను వ్రాసాడు*. 

Jeremiah(యిర్మీయా) 23:21,25,30,32

21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.

30. *కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.*

32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.

 

          అసలు సంఘకాలములు అనేదే తప్పుడు బోధ! ఎందుకంటే ఒకవేళ సంఘకాలములు ఉంటే అన్నీ ఒకేరకంగా ఒకే కాలవ్యవధి ఉండాలి! ఇక ప్రకటన గ్రంధంలో ఏడూ సంఘాలు ఏడూ సంఘకాలాలు కాదు! ఏడూ రకాలైన సంఘాలు, లేక ఏడు రకాలైన విశ్వాస పరిమాణం  గల సంఘాలు లేక ఏడు రకాలైన విశ్వాసులున్న సంఘాలు అని చెప్పుకోవచ్చు గాని ఏడు సంఘకాలాలు కానేకాదు! వారు చెప్పే సంఘకాలాలలో ఎంతో వ్యత్యాసాలు ఉన్నాయి! ఇక ఏడో సంఘకాలము 1906లో ప్రారంభమయ్యింది అట ఇంకా ముగించబడలేదు అట! అనగా 215 సం.లు గడిచినా ఇంకా ముగియలేదు! ఇక తుయతైరా సంఘకాలమైతే ఏకంగా  900 సంవత్సరాలు సాగింది! ఇదెక్కడి లెక్కండి? కాబట్టి ఇది ఒక కట్టుకధ!

 

       *అయినా, నూతన నిబంధన ప్రజల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తాడు కానీ దేవదూత కాదు*. అసలు దేవదూత దిగివచ్చి చెప్పినా మరొక సువార్తని అంగీకరించవద్దని వాక్యం హెచ్చరిస్తుంది (గలతీ 1:8). బ్రెన్హాం చెప్పిన చాలా ప్రవచనాలు, దర్శనాలు నెరవేరకపోయినప్పటికీ అతని అనుచరులు అతనిని వెంబడిస్తూనే ఉన్నారు. వాటిలో ముఖ్యమైనవి రెండుసార్లు ఫలాని తారీకున రెండో రాకడ వస్తుంది అని చెప్పాడు గాని ఇంతవరకు రాలేదు!

ఈ బోధను అంగీకరించు వారిని  బ్రెన్హమైట్స్ అంటారు. బ్రెన్హాం, బైబిలుకు ఎన్నో వచనాలు కలిపి, మరెన్నో వచనాలు తీసేసాడు. అతడు తప్పుమార్గంలో వెళ్తున్నాడని అతని సన్నిహితులు హెచ్చరించినా అతడు లెక్కచేయలేదు. చివరికి 1965 డిసెంబర్ 18న బ్రెన్హాం ప్రయాణించే కారు యాక్సిడెంట్ అయ్యి, తలకి తీవ్ర గాయమవడంతో అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయి డిసెంబర్ 24న చనిపోయాడు. రెండవ రాకడ వచ్చే వరకూ ఉంటానని చెప్పిన తమ ప్రవక్త ఇలా అకస్మాత్తుగా చనిపోవడాన్ని బ్రెన్హమైట్స్ నమ్మలేకపోయారు. అతడు ఖచ్చితంగా మళ్ళీ బ్రతుకుతాడని గ్రుడ్డి నమ్మకంతో అతని శవాన్ని సుమారు 4 నెలల పాటు జాగ్రత్త పెట్టి, ఇక చేసేది లేక 1966 ఏప్రిల్ 11న సమాధి చేసారు. ఇతడు వ్రాసిన పుస్తకాలు, చెప్పిన వాక్యపు  రికార్డింగులను బ్రెన్హమైట్స్ ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నారు. హ్యూస్టన్ ఇండోర్ స్టేడియంలోఇతనిని ఫోటో  తీసినప్పుడు వెనుక ఉన్న ఫ్లడ్ లైట్ మీద ఫ్లాష్ పడి ప్రింట్లో తెల్లని మచ్చలాగా  వచ్చింది. సాధారణంగా చాలా ఫోటోలు అలా వస్తుంటాయి. ఆ ఫోటో తీసిన డగ్లస్ స్టూడియోవారు, వెనక ఉన్న లైట్ ఫోకస్ పడింది, క్షమించండి అని కూడా బ్రెన్హాంకి లెటర్ రాశారు. కానీ బ్రెన్హాం, అది తనను వెంబడిస్తున్న అగ్ని స్తంభం అని తన అనుచరుల్ని నమ్మించాడు.

 

బ్రెన్హాంవి అనేక ఫోటోలున్నాయి. ఏ ఫోటోలోనూ ఈ అగ్ని స్తంభం ఎందుకు కనిపించదు? కంటికి కనిపించని సహజాతీతమైనవాటిని కెమెరా ఎలా ఫోటో తియ్యగలుగుతుంది? ఇంతకు ముందు ఏ ప్రవక్తనైనా అగ్నిస్తంభం వెంటాడిందా? ఇవేం ఆలోచించకుండా, వారంతా ఆ ఫోటో తమ ఇళ్ళలో పెట్టుకుని అతనిని ఆరాధిస్తున్నారు. (మలాకీ 4:5,6)లో చెప్పబడిన ఏలీయా తానేనని చెప్పుకుంటాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ ప్రవచనంలో సగమే నెరవేర్చాడని, మిగిలిన సగం నెరవేర్చడానికి ఏలీయా ఆత్మతో నేనొచ్చాను అంటాడు. నిజానికి యోహానులో ఆ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరింది. గబ్రియేలు ఇలా చెప్పాడు "ఈ శిశువు ఇశ్రాయేలీయులలో అనేకులను దేవునివైపు త్రిప్పును. అవిధేయులను, నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పును (అనగా పిల్లల హృదయమును తండ్రుల తట్టుకు తిప్పుట), మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు త్రిప్పును" (మత్త 11:14; లూకా 1:16, 17), నిజానికి ఈ ప్రవచనం ఇశ్రాయేలీయుల కోసం వ్రాయబడింది. దేవుడు ఏలీయా వంటి ప్రవక్తను ఇశ్రాయేలీయులైన మీ వద్దకు పంపుతానని చెప్పాడు.(మలా 1:1), (మలా 4:4,5). ఆయన చెప్పినట్లుగానే యోహానును ఇశ్రాయేలీయుల వద్దకు పంపాడు.

 

ఈ బ్రెన్హమైట్లు చెప్పే బోధలో మరో తప్పుడు బోధ ఏమిటంటే ఏలియా గారు ఐదుసార్లు భూమిమీదకు రావాలట! మలాకీ 3:1లో ఒకసారి, నాలుగో అధ్యాయంలో ఒకసారి రెండుసార్లు చెప్పబడింది కాబట్టి ఇలా అనేకసార్లు ఏలియా గారు భూమిమీదకు రావాలి. మొత్తం ఐదుసార్లు వస్తారు అంటారు! మరి దీనికి అనగా ఐదుసార్లు రావాలి అనడానికి వాక్యాధారం చెప్పరు!  మొదట ఏలియా ప్రవక్తలా, రెండోసారి ఎలీషా గారిలా, మూడోసారి భాప్తిస్మమిచ్చు యోహానులా,  నాలుగో సారి లవొదొకయ సంఘకాలమును ఉజ్జీవింపజేయుటకు విలియం మారియన్ బ్రెన్హాం గా, ఐదోసారి సంఘం ఎత్తబడ్డాక దేవుడు ఇశ్రాయేలు ప్రజల రక్షణకోసం సువార్త ప్రకటించడం కోసం పంపించే ఇద్దరు సాక్షులలో ఒకరైన ఏలియాగా వస్తారు అంటారు!

 

ప్రకటన 10:7లో "7వ దూత పలుకు దినములలో" అని వ్రాయబడింది, ఆ దూత నేనే అన్నాడు బ్రెన్హాం. కానీ ఆ దూత పరలోకంలో బూరలు పట్టుకుని ఉన్న 7గురు దేవదూతలలో ఆఖరివాడు (ప్రక 8-10 అధ్యా), '7వ దూత శబ్దము చేయుటకు బూర ఊదబోవుచుండగా' అనేది అక్కడ వ్రాయబడిన వచనానికి అసలు తర్జుమా... బ్రెన్హాం మొదట తనని బాప్తిస్మమిచ్చు యోహానువంటివాడిగా చెప్పుకున్నాడు. అనేకులు తనని అనుసరిస్తుండగా తనను ఏలీయాగా చెప్పుకున్నాడు. 1964వ సం|| నుండి బ్రెన్హాం మరింత దుర్బోధ చెయ్యడం మొదలుపెట్టాడు. (లూకా 17:30)లో మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడని వ్రాయబడినది తన కోసమే అన్నాడు. సుమారు 32సార్లు తనని తాను మనుష్యకుమారుడను అని చెప్పుకున్నాడు. అనేకమంది అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభువు ముందుగా చెప్పినట్లుగానే బ్రెన్హాం రూపంలో మరో అబద్ధ క్రీస్తు వచ్చాడు ((మత్త 24:24)). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల మంది బ్రెన్హాంను అనుసరిస్తున్నారు. వీరంతా రాత్రీ పగలు శ్రమిస్తూ క్రైస్తవుల్ని బ్రెన్హమైట్లుగా మారుస్తున్నారు.

 

ఏదెను తోటలో సాతాను, హవ్వ శారీరకంగా కలిసి వ్యభిచరించడం వల్ల కయీను పుట్టాడు అనీ, ప్రవక్తని అంగీకరిస్తేనే రక్షణ అనీ, అన్యుల కోసం అవతరించిన మెస్సీయ బ్రెన్హామని వీళ్ళు బోధిస్తుంటారు. వీరి 'వర్తమాన సంఘాలలో' (Message Churches) బైబిల్ కన్నా ఎక్కువగా ఇతని బోధలే ప్రకటింపబడతాయి. క్రీస్తు కంటే ఎక్కువగా ఇతనినే ఆరాధిస్తుంటారు, ఇతనిని బట్టే అతిశయిస్తుంటారు. యేసుక్రీస్తు దేవుడు కాడని అన్నా వీరు సహిస్తారు కానీ, బ్రెన్హాం ప్రవక్త కాడు అంటే మాత్రం అస్సలు సహించరు. కాబట్టి సంఘమా!  వీరి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి.

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

 

 

 

*మహాదేవుని వార్తావహుడు*

*17వ భాగము*

*రాబోయే ఏలియా-4*

మలాకి 3:1

ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

       (గతభాగం తరువాయి)

 ప్రియులారా! ఇప్పుడు మనం మరో ప్రాముఖ్యమైన విషయం గురుంచి ధ్యానం చేద్దాం! మలాకి మూడో అధ్యాయం లో నేను నా దూతను పంపిస్తాను అతడు నాకు ముందుగ త్రోవను సరాళం చేస్తాడు అన్నారు! అయితే 4:5,6 వచనాలలో మరోసారి దానికోసం చెబుతూ యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహా దినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతాను అన్నారు! అతడు వచ్చి తండ్రుల హృదయాలను పిల్లల తట్టును పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పును అన్నారు! అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను గారు వచ్చారు తన పని పూర్తిచేసి వెళ్లారు! అయితే ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి! మొదటగా  అతడు వచ్చినప్పుడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టును పిల్ల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పును అన్నారు గాని మరి పిల్లలు మార్పు చెందినట్లు మనం సువార్తలలో చూడలేము! మరి మనకు ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరినట్లు కనబడదు! అందుకే ఈ బ్రెన్హమైట్లు బాప్తిస్మమిచ్చు యోహాను గారు పూర్తిగా ఈ ప్రవచనం నెరవేర్చలేదు దానిని నెరవేర్చడానికి బ్రెన్హాం వచ్చారు అంటారు! గాని నిజం చెప్పాలంటే ఈ ప్రవచనం ఇశ్రాయేలు ప్రజలకోసం వ్రాయబడింది! యోహాను గారి కాలంలో అనేకులు మార్పుచెందారు! అయితే ఈ ప్రవచనం ఎప్పుడు పూర్తిగా నెరవేరుతుంది అంటే జెకర్యా గ్రంధంలో 12:1014లో చెప్పబడిన సంభవం జరిగినప్పుడు!

Zechariah(జెకర్యా) 12:10,11,12,13,14

10. దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద (వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12. దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

అనగా బహిరంగ రాకడ సమయంలో క్రొద్ది నిమిషాల ముందు జరుగుతుంది. ..

అందుకే ఇక రెండవదిగా చాలామంది బైబిల్ పండితులు అంటారు మరోసారి ఇద్దరు సాక్షుల రూపంలో ఏలియా గారు వస్తారు, ఎందుకంటే మలాకి గ్రంధంలో దీనికోసం రెండుసార్లు వ్రాయబడింది కాబట్టి రెండుసార్లు ఏలియాగారు రావాలి అంటారు! మరీ ముఖ్యంగా యెహోవా నియమించిన ఆ మహాదినం రాకముందు అన్నారు కాబట్టి బహిరంగ రాకడకు ముందుగా మరోసారి రావాలి అంటారు! ఏమో నాకు తెలియదు గాని నిజంగా చూసుకుంటే నాలుగో అధ్యాయం స్పష్టంగా బాప్తిస్మమిచ్చు యోహాను గారికోసమే వ్రాయబడింది! అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే కొంచెం బాప్తిస్మమిచ్చు యోహాను గారి కాలంలో మరికొంచెం అనగా ప్రవచనం పూర్తిగా నెరవేర్పు మహాశ్రమల మధ్యలో లేక సెకండ్ హాల్ఫ్ లో జరుగుతుంది అంటారు! కారణం మహాశ్రమల మధ్యకాలంలోనే వీరు అనగా ఇద్దరు సాక్షులు హతం చేయబడతారు!

ఒకసారి ఈ విషయం చూసుకుందాం! జెకర్యా గ్రంధంలోకూడా వీరికోసం వ్రాయబడింది.

జెకర్యా 4:1114......

11. దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,

12. రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా

13. అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా యనెను నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా

14. అతడువీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము (అభిషేకము పొందినవారు) పోయువారై యున్నారనెను.

 

ప్రియులారా! ఇక్కడ జెకర్యా గారు దేవదూతను మరలా ప్రశ్నిస్తున్నారు   దీప స్తంభానికి ఇరుప్రక్కల ఉన్న  రెండు ఒలీవ చెట్లు  భావమేమిటి అని!  మరలా దూత అడిగాడు నీకు తెలియదా అని? బాబు నాకు తెలియదు మీరే చెప్పండి అని మరోసారి నమ్రతతో అడిగారు జెకర్యా గారు! అప్పుడు దేవునిదూత సెలవిస్తున్నాడు:   వీరిద్దరూ సర్వలోకనాధుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయుచున్నవారై ఉన్నారు అంటున్నాడు. అయితే స్టడీ బైబిల్ లో ఇలా ఉంది:   అవి (అనగా  ఒలీవచెట్లు) అభిషక్తులైన ఇద్దరు వ్యక్తులను సూచిస్తాయి. వారు సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధాన సేవకులు.

 

    ప్రియులారా!   ఈ ఒలీవచెట్లు ఎవరు అనగా మొదటి అర్ధం/ భావం  —వీరు ఒకరు జెరుబ్బాబెలు అనియు, మరొకరు ప్రధాన యాజకుడైన యెహోషువ గారు! ఇక రెండవ భావం   అభిషక్తులు అనగా దేవునిచేత అభిషేకం పొందుకున్నవారు ప్రత్యేకమైన పనికోసం!

ఉదాహరణ : యాజకులు – యాజకత్వం చేయడానికి;

సౌలురాజు, దావీదుగారు: రాజ్యాన్ని పరిపాలించడానికి;

అయితే ఇక్కడ వీరిద్దరూ రాబోయేకాలంలో లేక అంత్యదినాలలో జరుగబోయే విషయం కోసం అభిషేకం పొందుకున్న వారన్నమాట! వీరికోసం ప్రకటన 11వ అధ్యాయంలో  కనిపిస్తుంది. .......

Revelation(ప్రకటన గ్రంథము) 11:3,4,5

3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.

5. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.

 

అయితే వీరు ఎవరు అంటే: అంత్యదినాలలో  మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తు కోసం యూదుల మధ్య సాక్ష్యం చెప్పడానికి రాబోతున్నారు. కారణం వీరు దీప స్తంభం అనియు, దీపస్తంబాలు అనియు వ్రాయబడిఉంది అంటే వీరు సాక్ష్యము చెప్పే వారు అని అర్ధం అవుతుంది.  అయితే మరి  ఇద్దరు ఎవరు? దీనిమీద చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. వారు మోషే ఏలియాలనియు,  ఏలియా హనోకు అనియు అంటుంటారు. కారణం మత్తయి 17: లో రూపాంతర కొండమీద మోషే ఏలియాలు యేసుక్రీస్తు ప్రభులవారికి కనబడి ఆయన పొందబోయే సిలువ మరణం కోసం మాట్లాడి వెళ్ళారు కాబట్టి వీరే అంటారు కొంతమంది. 

ఏదిఏమైనప్పటికీ ఎక్కువ శాతం,  ఇద్దరిలో ఏలీయా ఒకరు అనే విషయాన్ని మాత్రం తప్పక అంగీకరిస్తారు. దానికి గల కారణాలేంటి?

 

1. ఇద్దరు సాక్ష్యులకు తమ ప్రవచన కాలమందు వర్షము పడకుండా చేయుటకు వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)

* ఏలియా కూడా ఆలాగు చేసెను. (1రాజులు 17:1, యాకోబు 5:7)

 

2. తమకు కీడు చేయువారిని నోటనుండి వచ్చు అగ్ని చేత నశింపచేయగలరు. (ప్రకటన 11:5)

     ఏలియా ఆకాశము నుండి అగ్నిని దింపినాడు.

 

అందుకు ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.

          ( 2రాజులు 1:10,12)

 

3. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.  (మలాకీ 4:5)

 

4. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై *ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై* ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. (లూకా 1:16,17)

దీని ఆత్మీయ అర్ధము యోహాను అయినా , అక్షరార్ధముగా ఏలీయాను సూచిస్తుంది..

నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. (యోహాను 1:19-21)

 

5. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; (ప్రకటన 11:12)

* ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను:

వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. (2రాజులు 2:11)

 

6. ప్రతి ఒక్కడు ఒకసారి మరణించవలెనని నిబంధన ప్రకారము ఏలీయా మరల వచ్చి, మరణించవలెను అనే అభిప్రాయం అనేకమందిలో వుంది.

       (హెబ్రీ 9:27)

 

ఇక  ఇద్దరు సాక్ష్యులలో ఒకరు ఏలీయా అయితే, మరొకరో మోషే అనే అభ్కిప్రాయం కొందరిలో వుంది. దానికి గల కారణాలు:

1. ఇద్దరు సాక్ష్యులకు నీటిని రక్తముగా మార్చుటకు అధికారము గలదు. (ప్రకటన 11:6)

* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.      (నిర్గమ 7:17,24; 8:11)

2. ప్రతీ విధమైన తెగుళ్లతో భూమిని శ్రమ పెట్టగలరు ( ప్రకటన 11:6)

* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.

   (నిర్గమ 7, 8 అధ్యాయములు)

 

* మోషే, ఏలీయాలు రూపాంతరం కొండపైన ప్రభువు మరణ విషయములను గూర్చి మాటలాడిరి. (లూకా 9:30, మత్తయి 17:3)

* పునరుత్తానమును గూర్చి ప్రకటించింది వీరిని నమ్ము చున్నారు. ( లూకా24:4,7)

* ప్రభువు తిరిగి వచ్చునని ప్రకటించినవారు వీరై యుండాలి. (అపో 1:10,11)

* కనుక వీరు మహాశ్రమల కాలంలో వచ్చి, ప్రభువు రాకడను గురించి, వెయ్యేండ్ల పరిపాలనను గురించి ప్రకటించ వచ్చునని నమ్ముచున్నారు.

* మోషేగారు ధర్మ శాస్త్రమును ఇచ్చారు., ఏలీయాగారు ప్రవక్తలకు మాదిరిగా యున్నారు. కావున, ఆ ఇద్దరు సాక్ష్యులు వీరై వుండవచ్చు అనే అభిప్రాయం కొందరిలో ఉంది..

 

కొందరి అభిప్రాయం ఏలీయా, మోషేలు కాగా, మరికొందరు ఏలీయా, హానోకు అంటారు.

* హానోకు,  ఏలియాలు మరణం లేకుండా కొనిపోబడ్డారు. కావున వారు మరలా వచ్చి మరణించవలెననేది వీరి వాదన.

* హానోకు, ఏలియాలు ఇద్దరూ ప్రవక్తలై యున్నారు. (యూదా 14-15)

* ఏలీయా ధర్మ శాస్త్ర యుగమునకు, హానోకు మనస్సాక్షి యుగమునకు సూచనగా యున్నారు.

 

కాబట్టి హనోకు, ఏలియా కావచ్చు లేదా ఏలియా మోషే అయినా కావచ్చు.

*అయితే హనోకుగారు, ఏలియా ప్రవక్త కావచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నా ఉద్దేశం మాత్రమే సుమా*

 

*మరొకసారి ఈ విషయాన్ని మీ జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. ఆ ఇద్దరు సాక్ష్యులు ఎవరనేది మనకు ముఖ్యం కానేకాదు. దేవుడు ఎవరిని పంపిస్తే, వారు వస్తారు. వారికి అప్పగించిన భాధ్యతను నెరవేర్చి వెళ్తారు.*

 

అయితే, మనకిప్పుడో సందేహం! ఎత్తబడిన సంఘంలో లేకపోయినా, రక్షించబడడానికి మరొక ఆప్షన్ వుంది కదా? ఇప్పుడెందుకు అంత తొందరపడటం? అయితే, ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.  దినం వరకు నేను బ్రతికే వుంటాననే గ్యారంటీ నీకుందా? ఒకవేళ, బ్రతికి యున్నామే అనుకుందాం.  దినాల్లో రక్షించబడడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే? పరిశుద్ధాత్ముడు కూడా సంఘముతోనే ఎత్తబడతాడు కాబట్టి, ఇక మన మనస్సాక్షిని ఒప్పించేవారెవ్వరూ వుండరు.

 ప్రియ చదువరీ! మరి నీవు సిద్ధంగా ఉన్నావా? లేకపోతె నేడే సిద్దపడు

దైవాశీస్సులు!

 

*మహాదేవుని వార్తావహుడు*

*18వ భాగము*

*యెహోవా దినము*

మలాకీ 3: 2

అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు;

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

  ప్రియులారా! ఇంతవరకు మనం రాబోయే ఏలియా గారి గురించి ధ్యానం చేసుకున్నాము! ఇక తర్వాత వచనాలలో మనకు దేవుడు హటాత్తుగా రాబోతున్నారు! అనగా ఆయన పంపించబోయే నిబంధన దూత హటాత్తుగా రాబోతున్నారు- ఆయన గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కొన్ని వచనాలలో ప్రవక్త వివరిస్తున్నారు!

 

     రెండో వచనంలో అంటున్నారు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఎందుకంటే ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బులాంటి వాడు, ఇంకా తర్వాత వచనాలలో వెండిని శోధించి నిర్మలం చేసేవిధంగా ఆయన కూడా అందరిని నిర్మలం చేస్తారు అంటున్నారు!

 

  అయితే  ఆయన వచ్చుదినమున ఎవరు ఓర్వగలరు అనేమాట చూసుకుంటే చాలామంది ప్రవక్తలు చెప్పారు- యెహోవా దినము రావాలి రావాలి అంటున్నారు- అది మంచి దినము కాదు .....

నాలుగో అధ్యాయంలో కూడా అంటున్నారు 4:1,3

1. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

3. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

 యెహోవా దినం కోసం ఆలోచిస్తే యోవేలు గ్రంధంలో నాలుగుసార్లు వ్రాయబడింది.

 యోవేలు 2: 1

సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక.

 

యోవేలు 2: 11

యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?

 

యోవేలు 2: 31

యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

 

యోవేలు 3: 14

తీర్పుతీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.

 

అయితే అన్నిచోట్లా ఒకే అర్ధం రాదు. కొంచెం ఇటు అటుగా ఉంటుంది అర్ధం!  

 

  ఈ యెహోవా దినము అనే మాట కోసం బైబిల్ లో ఇంకా చాలామంది ప్రవచించారు.

యెషయా గారు చెబుతున్నారు: 13:6--12

6. యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

7. అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును

8. జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12. బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.

 

యేహెజ్కేలు గారు చెబుతున్నారు: 13:5

యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.

 

యెహేజ్కేలు 30: 3

యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.

 

ఆమోసు గారు చెబుతున్నారు: 5:18

యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.

 

ఓబధ్యా గారు చెబుతున్నారు: 1:15

యెహోవాదినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.

 

జెఫన్యా గారు అంటున్నారు: 1:7, 14

7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.

14. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.

 

ఇదీ పాత నిబంధనలో యెహోవా దినం గూర్చి వ్రాయబడింది.

 

ఇక క్రొత్త నిబంధనలో చూసుకుంటే యెహోవా దినము అనేమాట *ప్రభువు దినము* అని వ్రాయబడింది.

1థెస్సలొనికయులకు 5: 2

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

 

Thessalonians (రెండవ థెస్సలొనీకయులకు) 2:1,2,3

1. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల

2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.

 

2పేతురు 3: 10

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

 

గమనించండి  అన్ని రిఫరెన్సుల ప్రకారం యెహోవా దినము అనగా  అంత్యదినాలలో యేసుక్రీస్తుప్రభులవారు  లోకానికి తిరిగి వచ్చే దినాలలో జరగబోయే సంభవాలు అని అర్ధం! అవి మంచివైతే కావు! లోకానికి శ్రమ దినాలు! తీర్పు దినాలు!  భక్తిహీనులకు ప్రతిదండన దినాలు!

 

ఇక ఇదే వచనంలో మరో మాట: *యెహోవా దినము వచ్చెనే* కొన్ని ప్రతులలో ఆసన్నమైంది అని ఉంది. అయితే దీనికోసం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎప్పటినుండో భక్తులు యెహోవా దినం ఆసన్నమైంది, దగ్గరపడింది అని చెబుతున్నారు. అయితే దీని అర్ధం బైబిల్ పండితుల బాష ప్రకారం యెహోవా దినం త్వరలో రాబోతుంది అని కాదు-  *యెహోవా దినం సిద్ధంగా ఉంది!* అయితే అది ఎప్పుడో తెలియదు! కాలం పరిపక్వమైనప్పుడు అది జరుగబోతుంది. ఇంకా రక్షించబడవలసిన అన్యజనుల సంఖ్య పూర్తి అయినప్పుడు, క్రీస్తుకోసం హతస్సాక్షులు కావలసిన సంఖ్య పూర్తి అయినప్పుడు దేవుని రాకడ లేక యెహోవా దినం వస్తుంది!

 

2పేతురు 3: 9

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 

ప్రకటన గ్రంథం 6: 10

వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.

ప్రకటన గ్రంథం 6: 11

తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు వారివలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

 

యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా అంటున్నారు  దినము గూర్చి గడియ గూర్చి ఎవరికీ తెలియదు. చివరకు నాకు కూడా తెలియదు! అది తండ్రికి మాత్రమే తెలుసును అంటున్నారు. మత్తయి 24:36; మార్కు 13:32;

 

అయితే మనలను మాత్రం సిద్దంగా ఉండండి. మెలుకువగా ఉండి ప్రార్ధన చెయ్యండి దివిటీలలో నూనెను నింపుకోండి అంటున్నారు. మత్తయి 25.

మత్తయి 24: 42

కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

 

ఇంకా రోమా 13:1112

11. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము.

ప్రకటన 1:

సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

 

అయితే మీదన చెప్పినట్లు పేతురు గారు అంటున్నారు 2పేతురు :8--9లో  దినాన్ని ఖచ్చితంగా లెక్క కట్టి చెప్పలేము

 

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

కాబట్టి ఈ కోణంలో చూస్తే యెహోవా దినం చాలా దగ్గరపడింది.

 

హబక్కూకు 2: 3

ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.

 

అంతేకాకుండా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆయన చెపిన రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి. కాబట్టి మనం సిద్దంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

ఇక తర్వాత అంశం: అది ఎంతో భయంకరమైన దినం అంటున్నారు. దీనికోసం మీద వచనాలలో చూసుకున్నాం. ఇంకా వివరంగా కావాలంటే దీనికోసం యెషయా 2:10--21 వచనాలు చదవండి.

ఇంకా 24:1--13 చదవండి.

ఇంకా ప్రకటన 15 మరియు 16 అధ్యాయాలు చదవండి.

చూశారా యెహోవా దినము అనేది భయంకరమైన రోజు! అందుకే ఆ దినమును ఎవరు తాలగలరు ఎవరు ఓర్వగలరు అని భయపడుతున్నారు!

 

ప్రియ స్నేహితుడా! ఆయన రాకడ సిద్దంగా ఉంది. మరినీవు సిద్ధంగా ఉన్నావా? నీ దివిటీలో పరిశుద్ధాత్ముడు అనే నూనెను నింపుకుని ఉన్నావా? లేకపోతే బుద్ధిలేని కన్యకలు విడువబడినట్లు విడవబడతావు జాగ్రత్త! తలుపు వేయబడిన తర్వాత , సంఘం ఎత్తబడిన   తర్వాత వచ్చి తలుపుకొట్టినా అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు అంటారు!

నేడే మారుమనస్సు పొంది సిద్దపడు!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*19వ భాగము*

*దేవుని గుణగణాలు*

 

మలాకి 3:2--4

2. అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు;

3. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

  ప్రియులారా!  రెండు మూడు వచనాలలో ఉన్న దేవుని గుణగణాలు ఈ రోజు కొన్ని ధ్యానం చేసుకుందాము!

 

మొదటిది: అయన కంసాలి నిప్పులాంటి వాడు;

రెండు: చాకలి సబ్బులాంటి వాడు;

ఈ రెంటి కోసం ఆలోచిస్తే రెండు వివిధ రకాలైన వస్తువులను శుభ్రం చేసేవే!  కంసాలి నిప్పు ఏమి చేస్తుందంటే వెండిని బంగారాన్ని వాటిలో గల మలినాలను శుద్ధిచేసి ఆ తర్వాత మంచి ఆభరణముగా చేయడానికి ఉపయోగపడుతుంది!

 

   ఇక చాకలివాని సబ్బు మనం వేసుకునే బట్టలకు అంటుకున్న మురికిని శుభ్రం చేసి వస్త్రాలను మెరుగు పరుస్తుంది!

అయితే మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు రకాలైన  శుద్దీకరణలు చెయ్యాలంటే బంగారాన్ని నిప్పులమీద పెట్టాలి! బట్టలను బండమీద కొట్టాలి లేక బాగా ఉతికి ఆ తర్వాత జాడించాలి! ఈ రెండు రకాలైన ప్రక్రియలు జరగకపోతే నిప్పు ఏమి చేయలేదు, సబ్బు కూడా ఏమి చేయలేదు! అనగా దీనిలో గల ఆత్మీయ అర్ధం ఏమిటంటే ఆయన కంసాలి అగ్ని, చాకలి సబ్బు లాంటి వారే! అయితే అవి నీమీద పనిచేయాలి నీలోనున్న మలినాలు అనే పాపము మరియు పాపపు ఆలోచనలు పాపపు పనులు పోవాలి అంటే మొదటగా నీవు శ్రమల ద్వారా శోధనల ద్వారా వెళ్ళాలి!  ఈ శ్రమలలో మరలా నీవు దేవునితో సమాధాన పడి, నీకు నీవుగా నీవు చేస్తున్న పాపములకు పశ్చాత్తాప పడి వదిలేస్తావు! అప్పుడు క్రీస్తుయేసు రక్తము నీలో నున్న ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్రునిగా చేసి ఆయన బిడ్డగా చేసి నిన్ను ఆయనతో సమాధాన పడేలా చేస్తుంది!

అందుకే యోబు భక్తుడు అంటున్నారు: నేను వెళ్ళే మార్గము యెహోవాకు తెలియును నేను శోధింపబడిన మీద సువర్ణము వలె మారతాను! 23:10;

 నీవు శుద్ధమైన సువర్ణముగా మారాలి అంటే మొదటగా శ్రమలు అనే కొలిమిలో కాలాలి! చాకలివాని బండ మీద కొట్టబడాలి!  ఈ ఇశ్రాయేలు ప్రజలు అన్నట్లు ఆయన దినానికి ఎవరు తాలగలరు అంటూ శ్రమలలో పారిపోయావా నీవు నిర్మలం చేయబడలేవు! నిర్మలం చేయబడని ఎడల లేక శుద్ధి చేయబడని ఎడల నీవు క్రొత్త ఆభరణముగా మారలేవు, మెరుగు పరచబడలేవు!

ఒకసారి యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం:

యెషయా 1: 25

నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

 

జెకర్యా 13:89

8. దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.

9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమును బట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

 

కీర్తనాకారుడు అంటున్నారు 66:1012

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

దానియేలు 12:10

అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.

 

సరే, నూతన నిబంధన సంఘంలో దేవుడు ప్రతీ విశ్వాసిని, సేవకున్ని ఈ శ్రమల గుండా తీసుకుని వెళ్లి నిర్మలం చేస్తారు! అయితే ఈ మూడో వచనంలో ఏమంటున్నారు అంటే లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యాలు చేయునట్లు వెండి బంగారాలను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేస్తారు అంటున్నారు!

 

అనగా ఈ నిర్మలం చేసే ప్రక్రియ మొట్ట మొదటగా లేవీయుల మీద మొదలుపెడుతున్నారు ఎందుకంటే వారు యెహోవాకు నైవేద్యం అర్పించాలి అంటే మొట్టమొదట వారు పరిశుద్దులుగా ఉండాలి! అలాగే సంఘము పవిత్రంగా నిర్దోషంగా ఉండాలి అంటే మొదట కాపరి/ సేవకుడు పరిశుద్ధమైన జీవితం జీవించాలి! మాదిరిగా ఉండాలి! సంఘకాపరే త్రాగుబోతు, తిరుగుబోతు అయితే, సంఘపెద్దలే జూదగాళ్ళు, వ్యభిచారులు అయితే ఇక సంఘస్తులు వారికి బాబుల్లాగా ఉండరా? అందుకే దేవుడు మొదటగా లేవీయులతో మొదలుపెడుతున్నారు అన్నమాట!

 

      ఎప్పుడైతే ఇలా శ్రమల సుడిగుండాల మార్గంలో లేవీయులు/ సేవకులు నడుస్తారో అప్పుడు మునుపటి రోజులలో లేవీయులు యాజకులు ఎలా నైవేద్యాలు చేసేవారో అలాగే యూదావారు యేరూషలేము వారు తీసుకొచ్చిన అర్పణలు నైవేద్యాలు ఈ లేవీయులు దేవుని అర్పించగా అది యెహోవాకు ఇంపుగా ఉంటుంది అంటున్నారు! అనగా ఎప్పుడైతే దైవసేవకులు పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో అప్పుడు సంఘము కూడా వారిని అనుసరిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ చేసే పవిత్రమైన స్తుతి ఆరాధనలు దేవునికి ఇంపైన సువాసంగా ఉంటుంది!

 

ప్రియ సేవకుడా! కాపరీ! సంఘపెద్డా! నీవు పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా? లేకపోతే నీ ఆరాధన అంగీకరించ బడదు! దేవుడు చేసే లేక దేవుడు పెట్టే శ్రమల అనుభవం ద్వారా పయనించు! ఆయన నిన్ను నిర్మలం లేక పరిశుద్దున్ని చెయ్యనీయు! అప్పుడు నీవు నీ సంఘాన్ని శుద్దులుగా మార్చగలవు! తద్వారా దేవునికి ఇంపైన సువాసన అర్పించగలవు! మరినీవు సిద్ధమా?

దైవాశీస్సులు! 

*మహాదేవుని వార్తావహుడు*

*20వ భాగము*

*దేవుని గుణగణాలు*

మలాకి 3:56  

5. తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికులమీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

6. యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈ మూడో అధ్యాయం నుండి అంత్యకాలంలో జరుగబోయే కొన్ని సంభవాలు చూసుకోవచ్చు!

 

      ప్రియ దైవజనమా! ఇక ఈ రెండు వచనాలలో నేను తీర్పతీర్చబోతున్నాను అంటున్నారు! ఎవరెవరికి తీర్పు తీర్చబోతున్నారో వివరంగా వ్రాయబడింది!

తీర్పు తీర్చడానికి నేను మీ యొద్దకు రాగా అప్పుడు చిల్లంగివాండ్రు అనగా చెడుపులు చిల్లంగులు మాంత్రికుల మీదను, వ్యభిచారం చేసే వారిమీదను, అప్రమాణికులు అనగా అబద్ద సాక్ష్యాలు చెప్పేవారి మీదను ఇంకా నాకు భయపడకుండా కూలి వారి విషయంలో అనేక విషయాలలో కూలివారిని బాధించేవారిని, విధవరాళ్ళను తండ్రిలేని వారిని బాధపెట్టేవారిని ఇంకా పరదేశులు లేక విదేశీయులకు అన్యాయం చేసేవారి మీదను నేను దృఢమైన సాక్ష్యం పలికి వారికీ తీర్పు తీర్చుతాను ఎందుకంటే నేను మార్పులేని వాడను అంటున్నారు!

 

  ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు ఇప్పుడు తీర్పుతీర్చడానికి రాబోతున్నారు! యేసుక్రీస్తుప్రభులవారు మొదటసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు గాని ప్రజలను విమోచించ డానికి వచ్చారు! దేనిని విమోచించడానికి వచ్చారు అంటే పాపముల నుండి మానవులను విమోచించడానికి వచ్చారు!

యోహాను 12:47

ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.

 

   అయితే ఈ సారి రెండోసారి యేసుక్రీస్తుప్రభులవారు రాబోతున్నారు- ఈసారి మాత్రం తీర్పుతీర్చడానికి రాబోతున్నారు!

అపో 17:31

ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

 

2తిమోతికి 4: 1

దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

 

యోహాను 5: 27

మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.

 

రోమీయులకు 2: 16

దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

 

1కోరింథీయులకు 4: 5

కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

2కోరింథీయులకు 5: 10

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

 

   అందుకే ప్రసంగీ గారైన సోలోమోను గారు రాస్తున్నారు యవ్వనుడా అంటూ....

ప్రసంగి 11: 9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

   కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! ఆయన అతి తొందరలో తీర్పుతీర్చడానికి ఈ లోకానికి రాబోతున్నారు! మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఎత్తబడటానికి? నీవు దేవుని త్రాసులో నిలబడతావా లేక సౌలు రాజులా తేలిపోతావా?

 

  సరే, వచ్చి దేవుడు మొదటగా ఎవరిని తీర్పు తీర్చబోతున్నారు లేక ఎవరిమీద వ్యతిరేఖంగా తీర్పు తీర్చబోతున్నారు అంటే మొదటగా మాంత్రికులు/ చిల్లంగి/ చెడుపులు పెట్టేవారి మీద: ద్వితీ 18:913 ప్రకారం అయితే వీరిని తరిమితరిమి కొట్టమన్నారు!..

 

9. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.

10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

12. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

13. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.

ఇక ఇలాంటి మాంత్రికులు దేవుని రాజ్యంలో పాలివారలు కాలేరు

 

గలతీ 5:1921

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ప్రకటన 22:15

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

       కాబట్టి ప్రియ చదువరులారా! మీలో ఎవరైనా ఇలాంటి అలవాట్లు ఉంటే నేడే వాటిని విడిచిపెట్టక పోతే నరకానికి పోతారని మరచిపోవద్దు!

 

   ఇక తర్వాత వ్యభిచారులకు వ్యతిరేఖంగా తీర్పుతీర్చబోతున్నారు:

 

దేవునికి ఇష్టం లేనిది మొదటిది: శారీరక వ్యభిచారం , రెండవది: ఆత్మీయ వ్యభిచారం! శారీరక వ్యభిచారం అంటే భార్య ఉండగా మరో స్త్రీతో అక్రమ సంభంధం కలిగి పాపం చేయడం లేక మరో స్త్రీతో కామకలాపాలు చేయడం! ఇంకా భర్త ఉండగా లేక పెళ్లి కాకుండా మరో పురుషునితో సంభోంగించడం!

 

ఇక ఆత్మీయ వ్యభిచారం అంటే దేవునిలోను లోకం లోను ఉండటం! పైకి భక్తిగలవాని వలె నటిస్తూ, పైకి పరిశుద్ధ పరిశుద్ధ అని పాటలు పాడుతూ ఎవరికీ తెలియకుండా వ్యభిచార పనులు, పాపపు పనులు చేయడం, విగ్రహారాధన చెయ్యడం, లోకాచారాలు అన్యాచారాలు చెయ్యడమే! ఇంకా చెప్పాలంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు గాని చేసేవన్నీ అన్యుల ఆచారాలు చెయ్యడం! ఇదే ఆత్మీయ వ్యభిచారం! ఇలాంటివి దేవునికి అసహ్యమైన క్రియలు! ఇలాంటివి చేస్తే నరకం తప్పదు!

 

నిర్గమ 20:14

వ్యభిచరింపకూడదు.

 

హెబ్రీ 13:4

వివాహము అన్ని విషయములలో (లేక, అందరిలో) ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

 

ప్రకటన గ్రంథం 21: 8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ప్రకటన గ్రంథం 22: 15

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

     అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభులవారు ఒక స్త్రీని మోహపు చూపు చూడటం వ్యభిచారంతో సమానము అన్నారు. కాబట్టి చూపులతోను, తలంపులలోను కూడా ఎటువంటి పాపము చేయకుండా ఉండాలి.

 

    ఇక తర్వాత బ్యాచ్: అప్రమాణికులు అనగా అబద్దసాక్ష్యం చెప్పేవారు: వీరిని కూడా దేవుడు అసహ్యించుకుంటున్నారు! భక్తుడైన నాబోతు గారిని చంపడానికి పెంటమ్మ అనే యెజెబెలు వాడుకుంది ఇలాంటి అబద్ద సాక్ష్యులనే!

నిర్గమ 20:16

నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

 

లేవీ 19:12

నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.

 

ప్రకటన 21:8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము

 

    ఇక తర్వాత బ్యాచ్ కూలివారి జీతం విషయంలో గాని మరి దేని విషయంలోనైనా కూలివారిని బాధించే వారు: అయితే దీనికన్నా ముందుగా దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నాకు భయపడకుండా దీనిని చేస్తున్నారు అన్నమాట!

యిర్మియా 2:19

నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

రోమీయులకు 3: 18

వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

 

    చూశారా దేవునికి భయపడకుండా వీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నమాట! ఎందుకు అలా చేస్తున్నారు అంటే దేవుడు చూడటం లేదు, చూసినా దేవుడు ఏమీచేయలేడు అనేది వీరి నమ్మకం! అందుకే వీరిమీద దేవుడు తీర్పు తీర్చుతున్నారు!

 

ఇప్పుడు వీరు దేవునికి భయపడకుండా ఏమి చేస్తున్నారు అంటే కూలివారి కూలి సమయానికి ఇవ్వడం లేదు! విధవరాల్లను తండ్రిలేని వారిని బాదించడం, ఇంకా పరదేశులు లేక విదేశీయులను బాదించడం! అందుకే వీరిని శిక్షిస్తాను తీర్పు తీర్చుతాను అంటున్నారు దేవుడు!

లేవీ 19:13

నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;

 

యాకోబు 5:4

ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

 

    ప్రియ దేవుని బిడ్డా! నీ పొలంలో గాని, నీ దగ్గర గాని ఎవరినైనా పని చేయించుకుని ఏరోజు జీతం ఆరోజు ఇస్తున్నావా లేదా? ఏరోజు జీతం ఆ రోజు ఇవ్వడం అనేదే వాక్యానుసారమైన పద్దతి! ఆలస్యంగా ఇచ్చావా దేవుని తీర్పుకు గురి అవుతావు అని గ్రహించు!

 

నిర్గమ 22:2122

21. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.

22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.

 

ద్వితీ 24:19

నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచి పోయిన యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.

 

యెషయా 1: 17

కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

 

యెహేజ్కేలు 22: 7

నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

   చివరలో యెహోవా నైన నేను మార్పులేని వాడను కనుక మీరు లయము కాలేదు అంటున్నారు అనగానిజానికి మీరు చేసే పనుల వలన మీకు శాపము మరియు తీర్పు ఉంది. అయితే మిమ్మల్ని కాపాడతాను, నాటుతాను అనే వాగ్ధానం చేశాను కాబట్టి మీరు బ్రతికి పోతున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండమంటున్నారు!

 

     ప్రియ సహోదరి/సహోదరుడా! ఒకవేళ నీవు ఇలాంటి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటే నేడే పశ్చాత్తాప పడి మారుమనస్సు పొంది నీ పాపాలు కడుగుకో! లేకపోతే ఆ తీర్పును తప్పించుకోలేవు సుమీ! ఇంకా ఆ రోజున నీవు ఎత్తబడలేవు జాగ్రత్త! విడువబడుట బహు ఘోరమని మరచి పోవద్దు!

నేడే సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

‌     *21వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల ఐదవ తప్పు*

 

మలాకి 3:712  

7. మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.

9. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

10. నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు

12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

      ఇక 7 నుండి 12 వచనాలలో దేవుడు మరో తప్పును ఎత్తి చూపుతున్నారు! ఐదో తప్పుగా దేవుడు చెబుతున్నారు: మీ పితరుల కాలం నుండి కూడా మీరు నా కట్టడలు వినకుండా త్రోసివేస్తున్నారు! ఐతే ఇప్పుడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నారు! దానికి వారు సరే అనాలి! గాని అలా అనకుండా దేవుణ్ణి బుకాయించడం మొదలుపెట్టారు! మేము దేని విషయంలో నీ తట్టు తిరగాలి! మేము నీ కట్టడలను ఆచరిస్తున్నాము కదా అంటున్నారు!

 

    అందుకు ఎనిమిదో వచనంలో అంటున్నారు: మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తారా లేక చేయగలరా? మీరైతే నా దగ్గర దొంగలించారు అంటున్నారు! వెంటనే వీరికి పౌరుషం పొడుచుకొచ్చింది! మేము ఏ విషయంలో నీ దగ్గర దొంగతనం చేశాము అన్నారు! వెంటనే దేవుడు చెప్పారు మీరు పదో భాగాన్ని అనగా దశమ భాగాలను ప్రతిష్టితార్పణలు ఇవ్వడం మానేసి నా డబ్బులు దొంగిలించారు అంటున్నారు!

 

   ఒకసారి మొదటి నుండి పరిశీలన చేస్తే ఒక్కొక్క తప్పులో దేవుడు వీరికి ఒక్కో డిగ్రీ ఇస్తున్నారు! మొదట వీరు వంచకులు అన్నారు, తర్వాత శాపగ్రస్తులు అన్నారు! ఇప్పుడు దొంగలు అంటున్నారు! చూశారా దేవుని దృష్టిలో వీరి బ్రతుకు ఎలా కనిపిస్తుందో! ఇక ప్రియ చదువరీ దేవుని దృష్టిలో నీ బ్రతుకు ఎలా కనిపిస్తుందో కదా!

 

   సరే ఇప్పుడు దేవుడు మొదటగా అంటున్నారు: మీరు దొంగలైనా గాని మొదట మీరు నా తట్టు తిరగండి అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నారు! గాని దానిని కూడా బుకాయిస్తున్నారు వీరు!  దేవుడు ఇలా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటూ చాలాసార్లు చెప్పారు! విననొల్లని వారివైపు నా చేతులు చాపి పిలుస్తున్నాను అంటున్నారు!...

యెషయా 65: 2

తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.

 

 యిర్మియా 13: 17

అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.

 

యెషయా 44: 2

నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

 

యిర్మియా ౩:12, 14, 22

12. నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.

14. భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

22. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి;మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడ వైనయెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము,

 

యిర్మియా 4: 1

ఇదే యెహోవా వాక్కుఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి తొలగించి

 

హోషేయా 14: 1

ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.

హోషేయా 14: 2

మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.

 

యోవేలు 2:1213

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

 

జెకర్యా 1: 3

కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

 

యాకోబు 4: 8

దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.

     కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నేడైనా దేవుని వైపుకి తిరుగుతావా? ఇంకా ఎంతకాలము లోకములో ఉంటావు? లోకముతో కలిసిపోతావు? లోకమును దాని ఆశలు గతించిపోయేవి అవి నిన్ను నరకానికి తీసుకుని పోతాయని మరచిపోతున్నావు!! కాబట్టి నేడే దేవుని తట్టు తిరిగి క్షమాపణ వేడి ఆయనతో సమాధాన పడు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మహాదేవుని వార్తావహుడు*

*22వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల ఐదవ తప్పు-2*

మలాకి 3:712  

7. మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.

9. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

10. నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు

12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

             (గతభాగము తరువాయి)

 

   సరే దానిని మీరు మేము ఏ తప్పు చేశాము? నీతోనే ఉంటున్నాము కదా, కానుకలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాము ప్రార్ధన చేస్తున్నాం కదా! ఇంకేమి కావాలి అంటున్నారు! అందుకు దేవుడు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు దేవుని దగ్గర దొంగతనం చేస్తారా? మీరైతే నా దగ్గర దొంగతనం చేశారు అంటున్నారు! వెంటనే వారు ఇంకా స్వరాన్ని పెంచి ఏమిటి అలా అంటున్నావు? మేమెప్పుడు నీ దగ్గర దొంగతనం చేశాము అంటూ దబాయిస్తున్నారు బుకాయిస్తున్నారు!

 

 వెంటనే దేవుడు అంటున్నారు: ఒరేయ్! నాకు రావలసిన / చెందవలసిన దశమభాగములు ప్రతిష్టిత అర్పణలు నాకు చెల్లించకుండా మీరు నా డబ్బు దొంగతనం చేసి మెక్కుతున్నారు అంటున్నారు...

అవును కదా మనం కూడా అనేకసార్లు దేవుని డబ్బులు దేవునికి ఇయ్యడం లేదు! ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాము తద్వారా దేవుని దృష్టిలో దొంగలుగా మిగిలిపోతున్నాము! గమనించాలి దొంగలును దోచుకొను వారు వెలుపల ఉంటారు అనగా పరలోకానికి వెలుపల అనగా నరకంలో ఉంటారని బైబిల్ చెబుతుంది.

ఒక్కసారి దశమ భాగం కోసం చూసుకుందాము!

 

లేవీకాండము లో తప్పకుండా దశమభాగాలు ఇవ్వాలి! అది దేవునికి ప్రతిష్టం అని ఖండితముగా చెప్పారు.

లేవీయకాండము 27: 30

భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.

 

ఇక సంఖ్యా కాండములో కూడా మరోసారి చెప్పారు దశమభాగాలు లేవీయులకు వారసత్వంగా హక్కుగా ఇచ్చాను అని!

సంఖ్యాకాండము 18: 21

ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.

 

    కాబట్టి తప్పకుండా దేవునివి దేవునికి ఇవ్వాలి! అయితే నేటి దినాలలో అతి తెలివి గలవాళ్ళు దశమభాగాలు ప్రతిష్ట అర్పణలు పాత నిబంధనవి కదా, క్రొత్త నిబంధనలో లేవు కదా అంటున్నారు!

మరి యేసుక్రీస్తుప్రభులవారు దేవునివి దేవునికి, కైసరువి కైసరుకి ఇమ్మని ఎందుకు చెప్పారు? అక్కడ దేవునివి అనగా దశమభాగాలు, ప్రధమ ఫలాలు, ప్రతిష్టిత అర్పణలు, కానుకలు, స్వేచ్చార్పాణలు కావా? సగం తెలిసి సగం తెలియక మాట్లాడుతున్నారు ఈ అతితెలివైన వారు!..మత్తయి 22:21

 

   ఒకసారి వాక్యపు వెలుగులో ఇంకా పరిశీలిస్తే క్రొత్త నిబంధనలో ఎక్కడా దశమభాగలు ఇవ్వమని లేదు! అవి ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారి వ్రాయబడినవి! మనమైతే ధర్మశాస్త్రము క్రింద లేము గాని కృప క్రింద ఉన్నాము! కాబట్టి దశమభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదా?? అందుకే పౌలుగారు మీరు కృప ఆధారంగా దేవుడు మీకనుగ్రహించిన కృపను బట్టి ధారాళంగా ఇమ్మని రాశారు...

2కోరింథీయులకు 9: 5

కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.

 

2కోరింథీయులకు 8: 12

మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.

 

రెండవ కొరింథీయులకు 9:6,7,9

6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా (మూలభాషలో- దీవెనలతో) విత్తువాడు సమృద్ధిగా (మూలభాషలో- దీవెనలతో) పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.

7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.

 

కాబట్టి ఇప్పుడు మన హృదయాలలో రాజ్యమేలే దేవుని కృప ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదులు కన్నా తక్కువ ఇవ్వండి దేవునికి, లేక ఇవ్వడం మానేయండి అని ఎంతమాత్రము చెప్పనేరదు కదా!

 

1కొరింథీ 16:2

నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

 

2కొరింథీ 8:14

1. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపను గూర్చి మీకు తెలియ జేయుచున్నాము.

2. ఏలాగనగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.

3. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,

4. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.

 

   కాబట్టి దేవుని పనికి తప్పకుండా ఇవ్వాలి! ముఖ్యంగా కనీసం దశమభాగమునైనా క్రమము తప్పకుండా ఇవ్వాలి! ఇంకా స్వేచ్చార్పణలు, కృతజ్ఞతా కానుకలు అనగా ఆపదలో మ్రొక్కుకున్నవి ఇంకా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇచ్చేవి, ప్రధమ ఫలాలు ఇలాంటివి తప్పకుండా ఇవ్వాలి! ఒక విషయం విశ్వాసులు సేవకులు మరచిపోకూడదు! వారికి కలిగి ఉన్నవి ఏమైనా సరే, అది దేవుడు ఇచ్చినదే కనుక దేవునివి దేవునికి ఎంతో ఇష్టంతో ఇవ్వండి!

 

1కొరింథీ 6:1920

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

ఆయన మనకు ఎన్నెన్నో ఇచ్చారు, వివరించడానికి కూడా సాధ్యం కాని ఉచితమైన బహుమతులు ఇచ్చారు కాబట్టి అంతే ఘనంగా దేవునికి ఇద్దాము!

అలా ఇవ్వకపోతే దొంగలు దోచుకొను వారు అని మరిచిపోవద్దు!

 

గమనించండి సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు!

7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

 

    రెండు విషయాలు చెప్పి ముగిస్తాను! మా సంఘంలో అనేకులు పేదవారు! కూలివారు! అయితే కొంతమంది ఉన్నారు, వారిని దేవుడు ఆశీర్వదించారు! గాని మా క్రొత్త ఆలయము కట్టడానికి ఈ ఆశీర్వదించబడిన బ్యాచ్ ఏమీ ఇవ్వలేదు! ఎవరో   ఇద్దరుముగ్గురు ఇచ్చారు! అయితే ఈ డైలీ కూలికి వెళ్లి పొట్ట పోసుకునే వారున్నారు కదా, వారు తమ సామర్ధ్యానికి మించి ఇచ్చారు! అంతగా ఇస్తారని మేము అనుకోలేదు! వారిని దేవుడు దీవించడం మొదలుపెట్టారు! అయితే ఎవరైతే దేవునికి ఇవ్వలేదో వారు ప్రతీనెలా హాస్పటల్ లో హాజర్ వేయించుకుంటున్నారు! దేవుడు తనకు రావలిసిన డబ్బులు ఎలాగైనా రాబట్టుకొంటారు! దానిని నిన్ను అనుభవించనియ్యరు! (ద్వితియోపదేశకాండము 23: 21

నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.)

అయితే ఈ కూలికి వెళ్లేవారికి కూడా జబ్బులు వస్తున్నాయి గాని ఒక రెండు మూడు వందలతో సరిపోతుంది!  గాని వీరికైతే ప్రతీనెలా తక్కువలో ఇరవైముప్పై వేలు ఊడిపోతున్నాయి! అలాగే ఉంటుంది దేవుని తీర్పు!

 

     రెండో విషయం: దేవుని మహిమార్దమై చెబుతున్నాను, నేను ఎంతో డబ్బు సంపాదించాను, సంపాదిస్తున్నాను! గాని దానిలో నా కుటుంబానికి ఖర్చుపెట్టింది తక్కువ! ఎక్కువ భాగం దేవుని పనికే ఇచ్చేస్తాను! చివరికి నేను కొనుక్కున్నవి కూడా దేవునికే ఇచ్చేశాను! అక్కడ మందిరం కూడా కట్టించడం జరిగింది! అయితే మందిరం పని పూర్తి అయ్యాక ఒకే చిన్న ప్రార్ధన చేశాను- ప్రభువా నీ చిత్తమైతే నాకో గృహాన్ని ఇవ్వవా నేను నా పిల్లలు ఉండటానికి అని అడిగాను! (నాన్నగారు కట్టించిన ఇల్లు ఉంది అనుకోండి). ఆశ్చర్యంనేను ఆ ప్రార్ధన చేసి షిప్ ఎక్కి దిగబోయే సరికి  నా ఇళ్ళు కట్టబడి సీలింగ్, పెయింటింగ్, ఇంటీరియాల్ చేయబడి ఉంది! వచ్చి ఓపెనింగ్ మాత్రమే చేశాను! ఇది కట్టే సమయంలో నా చేతిలో అసలు డబ్బులు లేవు! ఎందుకంటే మొత్తం డబ్బు లోన్ తీసుకుని  మరీ నేను దేవుని మందిరం కోసం ఇచ్చేశాను! అయితే దేవుడు నన్ను వదలకుండా నేను దేవుని పని చేస్తే దేవుడు నాపని చేసి నాకు మంచి ఇల్లు ఇచ్చారు! ఇప్పటికీ నా పేరున ఏమి ఆస్తులు లేవు, బ్యాంకు బాలెన్స్ లేదు, పాలసీలు లేవు! అయితే గర్వంగా ధైర్యంగా చెప్పగలను నేను సంపాదించుకున్నవి నాకున్నాయి- మొదటిది – మూడుసార్లు దేవుడు నా పేరు జీవగ్రంధమందు వ్రాయబడి ఉంది అని చెప్పారు! రెండవది: ఎత్తబడే గుంపులో నేను ఉన్నట్లు, నేను ఎత్తబడుతూ మా సంఘంలో ఎవరెవరు ఎత్తబడుతున్నారో నాకు చూపించారు దేవుడు! చాలు నాకు! దీనికన్నా ఎక్కువ ఆస్తులు నేను కోరడం లేదు! బిల్డింగ్లు భూములు బాంకు బాలెన్సు అసలు కోరడం లేదు! నేను నా కుటుంబం ఎత్తబడే గుంపులో ఉండాలి అంతే! ఇక మరో ప్రత్యేక ప్రార్ధన చేస్తున్నాను, నాతోపాటు మా సంఘమంతా ఎత్తబడాలి! ఇదే నా ప్రార్ధన! కోరిక!

 

   కాబట్టి ప్రియ సంఘమా! దేవునికి ఇవ్వడం మానెయ్యవద్దు! అయన దగ్గర దొంగ అని పిలిపించుకోవద్దు! నరకానికి అసలు పోవద్దు! దేవునివి దేవునికి ఇద్దాం! ఆయన ఇచ్చాక ఊరుకుండే దేవుడు కానేకాదు! దానికి ప్రతిఫలం తప్పకుండా ఇచ్చేదేవుడు! కాబట్టి ఆయనకు ఇచ్చి మనం పొందుకుందాము! అలా ఇవ్వకపోతే మీరంతా శాపము క్రింద ఉన్నారు లేక శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నారు!

 

       ఇక తర్వాత మాటలలో ఏమంటున్నారు అంటే నా మందిరములో ఆహారముండునట్లు మీ పదియవ భాగాన్ని నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అంటున్నారు! Paytm గాని గూగుల్ పే గాని చెయ్యమనలేదు! దేవుని మందిరానికి తీసుకుని వచ్చి ఇవ్వాలి అదీకూడా ఆయన సమాజములో, అనగా అందరి ముందు ఇవ్వాలి! దీనిని చేసి నన్ను శోధించండి అప్పుడు నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలు క్రుమ్మరిస్తాను అంటున్నారు! ఇప్పుడు మనకు ఆశీర్వాదాలు దీవెనలు రావడం లేదు అంటే మనం దేవునికి ఇవ్వడం లేదు, ఆయన మనకు ఇవ్వడం లేదు అన్నమాట! మీరు నావైపు తిరిగితే నేను మీవైపు తిరుగుతాను అన్నారు కదా, అలాగే మీరు నాకు చెందినవి నాకిస్తే, మీకివ్వాల్సినవి మీకిస్తాను ఇంకా పట్టజాలనంత దీవెనలు ఇస్తాను అని దేవుడు చెబుతుండగా ఇంకా ఎందుకు ఆలస్యం!!!.

 

   మరో అనుమానం రావచ్చు: ఎక్కడ ఎవరికి ఈ దశమ భాగాలు కానుకలు ఇవ్వాలి? నీ సొంత సంఘం లో ఇవ్వాలి! ఎక్కడ నీకు వాక్యపు ఆహారం ఇవ్వబడుతుందో, నీకోసం ప్రార్థన చేస్తూ, మీ ఇంట్లో జరిగే కధా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీ సంఘంలో, ఇవ్వాలి. నీవు బాప్తిస్మము తీసుకున్న సంఘానికే ఇవ్వాలి. టీవీలో మాయ మాటలు చెబుతున్న వారికి ఇవ్వకూడదు. దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, మ్రొక్కుబడులు కాకుండా ఇంకా ఏమైనా డబ్బులు ఎక్కువగా ఉంటే స్వేచ్చార్పణంగా అప్పుడు పంపు ఈ టీవీ భోధకులకు!

 

    ఇక తర్వాత మాటలలో ఇంకా మీ పంటను పాడుచేసే పురుగులను నేను గద్ధిస్తాను అవి మీ భూమి పంటను నాశనం చెయ్యవు, మీ ద్రాక్షాచెట్లు అకాల ఫలములను రాల్చవు అంతేకాకుండా చివరకు మీరు ఆనంద దేశములో నివశిస్తారు అంటున్నారు! ఆనందకరమైన దేశము అనగా ఒక అర్ధం ఇశ్రాయేలు దేశంలో! మరో అర్ధం పరలోకం ఆ నిత్యానందములో ఉంటారు అంటున్నారు!

 

       మరి ఆయనవి ఆయనకు ఇద్దామా? ఆయనకు లోబడుదామా? ఆయనతో భళానమ్మకమైన మంచిదాసుడా! నీవు ఈ క్రొద్ది విషయంలో ఎంతో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నా తండ్రి ఆనందంలో పాలుపంచుకో అని చెప్పే విధంగా జీవిద్దామా?

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*23వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల  ఆరవ తప్పు*

మలాకి 3:1316

13. యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితిమని మీరడుగుదురు.

14. దేవుని సేవచేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,

15. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు.

16. అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పులను చూసుకుని అవి మన ఆత్మీయ జీవితమునకు ఎలా అన్వయించు కోవాలో ధ్యానం చేసుకున్నాము! ఇక మనం చివరి తప్పును చూసుకుందాం!

 

   పదమూడో వచనంలో దేవుడు చెబుతున్నారు: మీరు నన్ను గూర్చి ఎన్నో గర్వపు మాటలన్నారు అంటున్నారు; అయితే దానికి వారు జవాబుగా ప్రభువా ఒకవేళ మీ దృష్టిలో నా మాటలు గర్వంగా ఉంటే దయచేసి క్షమించండి, నేను/మేము సరిచేసుకుంటున్నాము అనాలి గాని మరలా దేవుణ్ణి బుకాయిస్తున్నారు దబాయిస్తున్నారుమేము ఏ విషయంలో నీకోసం గర్వపు మాటలన్నాము, ఇంతకీ మేము నిన్ను అనిన మాటలేమిటి అన్నారు! వెంటనే దేవుడు అంటున్నారు: దేవుని సేవ చేయుట నిష్ఫలము, మనము యెహోవా సన్నిధిలో మనలను మనం దుఖాక్రాంతులుగా చేసుకోవడం వలన ఏమి ఉపయోగం లేదు, అయితే గర్విష్టులే బాగుంటున్నారు, వారే వర్ధిల్లుతున్నారు, వారే సంరక్షణ పొందుతున్నారు అంటున్నారు! గమనించాలి దేవుడు రెండో అధ్యాయంలో మీరు ఇలాంటి మాటలు పలికి నన్ను ఆయాసపెట్టారు అన్నారు! మరలా ఇక్కడ కూడా మీరు నా మీద గర్వపు మాటలన్నారు అంటున్నారు! అయితే గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే: రెండో అధ్యాయంలో దేవుణ్ణి ఆయాసపెట్టిన వారు ఎవరు అంటే విశ్వాసులు లేక సామాన్యప్రజలు! వారు వాక్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకోక అలా అని ఉంటారు.

మరి ఈ మూడో అధ్యాయంలో ఈ మాటలు అనేవారు ఎవరు? ఇక్కడ దేవుని సేవ చేయడం వేస్ట్ అంటున్నారు అంటే దేవుని సేవ చేసే సేవకులు లేక లేవీయులు లేక యాజకులు అంటున్నారు అన్నమాట! అక్కడ రెండో అధ్యాయంలో మీరు నన్ను ఆయాసపెట్టారు అంటే ఇక్కడ నా భాషలో చెప్పాలి మీకు గీర బాగా బలిసిపోయింది అంటున్నారు. నా మీద ఎన్నో గర్వపు మాటలన్నారు అంటున్నారు! ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు/ నాయకులకు/ యాజకులకు/లేవీయులకు చెప్పిన మరో డిగ్రీ!

మొదట వంచకులు అన్నారు, తర్వాత శాపగ్రస్తులు అన్నారు! ఇదే అధ్యాయంలో తర్వాత మీరు దొంగలు అన్నారు. ఇప్పుడు మీరు గర్విష్టులు అంటున్నారు!

 

   కారణం వాక్యం తెలియని వారు అంటే అన్నారు గాని సేవచేసే మీరు ఎందుకు అంటున్నారు- మేము దేవుని సేవ చేసి ఉపయోగం ఉంది? గర్విష్టులే బాగున్నారు దుర్మార్గులే బాగున్నారు! మేము ఇంత సేవ చేస్తున్నా మాకు కలిగిన ఫలమేమిటి? అన్నీ చీవాట్లు చెప్పుదెబ్బలు తప్ప మాకు కలిగినది ఒరిగినది ఏమిటి అని దేవుణ్ణి నిష్టూరంగా మాట్లాడుతున్నారు! అందుకే మీరు నా మీద గర్వపు మాటలన్నారు అంటున్నారు దేవుడు!

 

   అవును కదా, నేటి రోజులలో అనేకులైన సేవకులు ఇలాగే అంటున్నారు: మేము ఇంత కష్టపడి కన్నీటితో సేవచేస్తున్నాము! తినీ తినక దేవుని సేవ చేస్తుంటే ఎందుకు దేవుడు మా సేవను ఆశీర్వదించడం లేదు? ఎందుకు మాకింకా ఆకలిదప్పులు? ఎందుకు మా సంఘం ఫలించడం లేదు? ఎందుకు ఇంకా దేవుడు మాకు ఇల్లు ఇవ్వలేదు? ఎందుకు నాకు వరాలు ఫలాలు లేవు? చూడు-  ఆ సేవకుడు మాయమాటలు చెబుతున్నాడు, అందరూ అతనినే అనుసరిస్తున్నారు, మా సంఘాన్ని కూడా ఆయన దోచేసుకుంటున్నాడు! దేవుడు ఇదంతా చూసి ఏంచేస్తున్నాడు? మేము ఇంతకాలము చేసిన సేవ వ్యర్ధమైపోయింది కదా, ఇన్నిరోజులు చేసిన నిస్వార్ధమైన సేవ వ్యర్ధమైపోయింది కదా, ఇంకెందుకు మేము సేవచెయ్యడం?? మరలా నా సొంతపని చేసుకోవడం మంచిది! నాకు ఎలాగు విలువ లేదు, గౌరవం దక్కడం లేదు, సొంతిల్లు లేదు, సొంత మందిరం లేదు అంటూ బాధపడుతున్నావు కదూ! దుర్మార్గులే బాగుంటున్నారు మాకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నావా?

 

        పోయిన భాగాలలో చెప్పడం జరిగింది- 73వ కీర్తనలో ఆసాపు గారు కూడా ఇలాగే బాధపడ్డారు! చివరికి దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తే దేవుడు ఆ దుర్మార్గుల అంతము చూపించారు! వారు కాలు జారే చోటున ఉన్నారు! ఇక వారి కాలు జారిందా, ఇక వారు లేచే అవకాశమే లేదు! అప్పుడు ఆ భక్తుడు లెంపలు వేసుకున్నాడు! నేడు ఎంతోమంది సేవకులు ఇలాగే మాట్లాడుచున్నారు! యోబు గారు కూడా ఇలాగే అనుకున్నారు 21:715

 

7. భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

8. వారుండగానే వారితోకూడ వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

9. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారి మీద పడుట లేదు.

10. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును.

11. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.

12. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.

13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు.

 

మనుష్యులకు దేవుని తీర్పులు కోసం తెలియక ఇలాగే అంటుంటారు! దేవుని సేవ చెయ్యడం వ్యర్ధము అనేమాట దేవునికి ఎంతో దుఃఖము కోపము కలిగిస్తాయి!  దేవుడు మంచివాడు కరుణామయుడు, దయామయుడు, నమ్మకమైన వాడు! తన సేవకులను తన పిల్లలను చేయి విడిచే దేవుడు కాడు ఆయన! ఎవరో అలాగన్నా, మంచివారు ఇంకా ఆయన సేవకులు ఇలా అంటే ఆయన చాలా బాధపడతారు! ఇలా ఎవరైనా పలికితే వారు చాలా పెద్ద పొరపాటు చేశారు అన్నమాట!

 

పౌలుగారు అంటున్నారు ప్రియులారా! మీ కష్టాలలో నిబ్బరంగా ధైర్యంగా ఉండండి! మీ ప్రయాస వ్యర్ధము నిష్ఫలము కానేకాదు 1కొరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

ఒకవేళ ప్రియ సేవకుడా! నీవు అలాంటి మాటలు అని ఉంటే నేడే తప్పులు ఒప్పుకుని ఆయనతో సమాధాన పడు!

మనలను సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మహాదేవుని వార్తావహుడు*

*24వ భాగము*

*ఇశ్రాయేలు ప్రజల  ఆరవ తప్పు-2*

మలాకి 3:1618

16. అప్పుడు, యెహోవాయందు భయ భక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

17. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైయుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

18. అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పులను చూసుకుని అవి మన ఆత్మీయ జీవితమునకు ఎలా అన్వయించు కోవాలో ధ్యానం చేసుకున్నాము! ఇక మనం చివరి తప్పును చూసుకుంటున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

    చూడండి ఇలా దేవుని సేవ చెయ్యడం నిష్ఫలం, గర్విష్టులు దుర్మార్గులే బాగున్నారు లాంటి మాటలు మాట్లాడితే దేవుడు వింటున్నారు అట! చూద్దాం! అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా మొదటగా చెవియొగ్గి ఆలకించెను!

రెండు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్ధముగా ఒక గ్రంధము ఆయన సముఖము నందు వ్రాయబడెను అంటున్నారు!

 

  ఇక్కడ మొదటగా యెహోవాయందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా ఆలకించెను అంటున్నారు! మన దేవుడు చెవులుండి వినే దేవుడు! కళ్లుండి చూసే దేవుడు! నోరు ఉండి మాట్లాడే దేవుడు! కాబట్టి ఇక్కడ మొదటగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అంటున్నారు!  దేవునిలో ఉంటున్న నీవు, దేవుని వాక్యాన్ని, వాక్య సత్యాన్ని ఎరిగియున్న నీవు అనాలోచితంగా ఏమి పలికినా దేవుడు నీ ప్రతీమాట వింటున్నారు అనేది మరచిపోవద్దు! నీవు పలికే మంచిమాట ఆదరణ మాటలు దేవుడు వింటున్నారు! నీవు పలికే పోకిరి మాటలు సరసోక్తులు బూతులు కూడా దేవుడు వింటున్నారు అని మరచిపోవద్దు!

 

అందుకే ఈ మలాకే 2:17లో చెబుతున్నారు..

మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగు చున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును; లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పు కొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.

 

మనమాటలు ఎలా ఉండాలి అని కీర్తనాకారుడు కోరుకుంటున్నారు అంటే 19:14

యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.

 

కీర్తనలు 94: 9

చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?

కీర్తనలు 94: 10

అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?

 

కీర్తనలు 139: 4

యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

అసలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి అనేది యేసుక్రీస్తు ప్రభులవారు ముందుగానే చెప్పారు:

మత్తయి 12:3537

35. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

 

కాబట్టి మన మాటలకు కాపు పెడదాం! అనాలోచితంగా ఏమాట పలుకవద్దునోటిని నాలుకను స్వాధీనం చేసుకుంటే..

సామెతలు 21: 23

నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

 

 చేసుకోక పోతే...

James(యాకోబు) 3:2,5,8,9

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

 

ఇక రెండవ విషయం: మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్ధంగా ఒక గ్రంధము ఆయన సముఖము నందు వ్రాయబడెను అంటున్నారు!

 

చూడండి మనం మాట్లాడుకునే మాటలు ఆయన గ్రంధంలో లిఖితములు అవుతున్నాయి అట, అనగా ఆయన గ్రంధములో వ్రాయబడుతున్నాయి అట! అందుకే అనాలోచితంగా పలుకవద్దు అనేది! అలా గర్వపు మాటలు రాకుండా ఉండాలి అంటే

 

కీర్తన 34:1114

11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?

13. చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.

14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

 

కీర్తనలు 111: 10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెతలు 1: 7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

 

ఇక ఆయనయందు భయభక్తులు కలిగి ఆయనకు గౌరవం చూపించాలి!

కీర్తనలు 22: 23

యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి

కీర్తనలు 22: 24

ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

 

సామెతలు 3: 9

నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము.

 

1కోరింథీయులకు 6: 20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

సరే, ఇప్పుడు జ్ఞాపకార్ధముగా ఆయన సన్నిధిని ఒక గ్రంధము వ్రాయబడెను అంటున్నారు! అనగా మనం మాట్లాడే ప్రతీమాటలు, మనం చేసే ప్రతీ పనులు కూడా ఆయన గ్రంధంలో వ్రాయబడుతుంది అన్నమాట! ఇంకా వివరంగా చెప్పాలంటే మనం చేసే పనులు ఒక గ్రంధంలో వ్రాయబడతాయి మాట్లాడే మాటలు కూడా మరో గ్రంధంలో వ్రాయబడతాయి అన్నమాట!

 

నిర్గమకాండము 32: 32

అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాన నెను.

 

కీర్తనలు 56:8...

నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.

 

ఇక్కడ మనము కార్చే కన్నీరు కూడా ఆయన గ్రంధంలో వ్రాసి ఉంది!

ప్రకటన 20:12

మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! దేవుడు ప్రతీక్షణం మనలను గమనిస్తున్నారని ఆయన మన మాటలను వింటున్నారని జ్ఞాపకముంచుకుని మనమాటలను మన స్వాధీనంలో పెట్టుకుందాం!

 

ఇక తర్వాత రెండు వచనాలు చూసుకుంటే ఎవరైతే ఇలా నోటిని నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటారో , దేవుణ్ణి గౌరవిస్తూ ఘనపరచుతారో వారు నేను నియమింపబోవు దినము వచ్చినప్పుడు నాకు వారు, నావారై, నాకు స్వకీయజనముగా ఉంటారు! అలాగే నేను వారిని నా పిల్లలు వలె కనికరిస్తూ ఉంటాను అంటున్నారు! గమనించారో దేవునికి ఇవ్వవలసిన గౌరవము, ఘనత ఆయనకు ఇస్తూ అనాలోచితంగా మాట్లాడుకుండా ఉంటే దేవుడు మొదటగా మాటలు వినడం, ఆయన గ్రంధంలో వ్రాసుకోవడమే కాకుండా ఆయన మనలను తన స్వకీయ జనముగా చేసుకుంటాను అంటున్నారు! ఇంకా కనికరిస్తూ ఉంటాను అంటున్నారు!

 

ఇక చివరి వచనంలో అప్పుడు నీతిగలవారు ఎవరో, దుర్మార్గులెవరో మీకు తెలుసుకుంటారు అంటున్నారు!

 

చూశారా! వారు మాట్లాడుకునే పద్దతిని బట్టి తాము ఎవరమో అనగా దేవునికి చెందిన వారా లేక దయ్యానికి చెందిన వారా అని దేవుడు బయలు పరచి వారిని ఘనపరుస్తారు అన్నమాట!

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! దేవుడు ప్రతీక్షణం మనలను గమనిస్తున్నారని ఆయన మన మాటలను వింటున్నారని జ్ఞాపకముంచుకుని మనమాటలను మన స్వాధీనంలో పెట్టుకుందాం! ఆయనను ఘనపరుద్దాం! ఆయనకు స్వకీయ జనముగా వారసులముగా మారుదాం!

దైవాశీస్సులు!

*మహాదేవుని వార్తావహుడు*

*25వ భాగము*

మలాకి 4:16

1. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2. అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

3. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

4. హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.

5. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.

6. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.

 

     ప్రియ దైవజనమా! ప్రియులారా మనము మలాకి గ్రంధము నుండి  ఇశ్రాయేలు ప్రజల ఆరు తప్పుల కోసం ధ్యానం చేసుకున్నాము!  

 

       ఇక చివరి అధ్యాయంలో ముఖ్యంగా మూడు విషయాలు కనిపిస్తాయి!

మొదటిది: దేవుని మాటలను వినని గర్విష్టులకు కలిగే దేవుని తీర్పు,

రెండు: నీతిమంతులకు కలిగే ఫలము!

మూడు: రాబోయే ఏలియా ! ఈ మూడవ విషయం కోసం ఇంతకూ ముందు భాగాలలో చూసుకున్నాము గనుక ముందుకు పోదాం!

 

మొదటిది: ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది! కొలిమి కాలునట్లు అది కాల్చును! ఇంకా ఆ కొలిమిలో గర్సిష్టులు, దుర్మార్గులు కొయ్యకాలు అనగా ఎండుగడ్డి లేక ఇటుక ఆవములో వేసే చెత్త మరియు కర్రల్లాగా కాలిపోతారు అంటున్నారు. ఇంకా చివరికి వారికి వేరైనను చిగురైనను లేకుండా అందరినీ కాల్చివేస్తుంది అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నారు అంటున్నారు!

 

 నియమించబడిన దినము అనగా యెహోవా దినము అని అర్ధం! ఈ యెహోవా దినము కోసము మనము విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకుపోదాము! అయితే అది మంచి రోజు మాత్రము కాదు! ఆ దినమున దేవుని మాటలు వినకుండా తిరిగే గర్విష్టులకు దుర్మార్గులకు దేవుని తీర్పు కలుగుతుంది!  యెషయా 13:6, 9

6. యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

 

యోవేలు 1: 15

ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.

 

1థెస్సలొనికయులకు 5: 2

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

 

చూడండి ఆరోజున దుర్మార్గులకు గర్విష్టులకు తీర్పు ఎలా జరుగుతుందో:

యెషయా 1: 31

బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

Isaiah(యెషయా గ్రంథము) 66:15,16

15. ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.

16. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

 

2థెస్స 1:78

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

 

చివరికి వారి గతి ఏమవుతుంది అంటే వేరు గాని కొమ్మగాని లేకుండా కాలిపోతారు అంటున్నారు! ఇక్కడ వేరు అనగా తండ్రులు లేక పెద్దలు, కొమ్మలు అనగా కుమారులు, వారసులు అనేవారు లేకుండా మొత్తం కుటుంబాలతో దుంప నాశనం లేక సర్వనాశనం అయిపోతారు అంటున్నారు! ప్రియ దైవజనమా! ఒకవేళ నిన్ను ఎవరైనా బాధపెడుతున్నారా? అయితే ఒకరోజు రాబోతుంది ఆరోజు వీరందరికీ తీర్పు జరుగబోతుంది! ఆరోజున వారు కుటుంబాలతో నాశనం అయిపోతారు! ఒకవేళ నీవే గర్విష్టిగా దుష్టుడుగా జీవిస్తూ ఉంటె నీవుకూడా అలాగే అయిపోతావు అని గ్రహించు!

 

   ఇక రెండవ విషయం ఏమిటంటే అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును! ఇంకా అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేస్తారు అంటున్నారు!

 

   ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించాలి! అయితే ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తారో, వారికైతే దేవుడు వారిమీద నీతిసూర్యునిలా ఉదయిస్తారు అట! ఇంకా అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలు దేరి క్రోవ్వినదూడలా గంతులు వేస్తారు అంటున్నారు! ఇక్కడ అతని రెక్కలు అనగా ఎవరు? అంటే యేసుక్రీస్తుప్రభులవారి చేతులు మీకు ఆరోగ్యము కలుగజేయును గనుక, ఇంకా ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్తత కలుగుతుంది గనుక ఆయనిచ్చే ఆరోగ్యం వలన మనము క్రొవ్విన దూడల గెంతునట్లు హుషారుగా తిరుగుతూ ఉంటాము అన్నమాట! ఎప్పుడంటే ఆయన పేరుకు/ నామమునకు భయపడినప్పుడు, ఆయనకు విధేయత చూపించి నప్పుడు!

మలాకీ 3: 16

అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

 

యెషయా 60:1 లో అందుకే దేవుడు చెబుతున్నారు: లెమ్ము తేజరిల్లుము! నీకు వెలుగు వచ్చియున్నది! ఇంకా చూసుకుంటే భూమిని చీకటి క్రమ్ముతుంది జనాలకు చీకటి క్రమ్ముతుంది గాని యెహోవా నీమీద ఉదయిస్తూ ఉన్నారు! ఆయన యొక్క ప్రభావము, మహిమ నీమీద కనబడుతుంది నీ వెలుగుకు ప్రజలు వస్తారు కారణం వారు అంధకారంలో ఉన్నారు గనుక నీవు వెలుగుతున్నావు కనుక నీ వెలుగుకు ప్రజలు నీ దగ్గరకు వస్తారు రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు అంటున్నారు. 60:13, 19

1.నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

3. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

 

లూకా 1:7879

అంతేకాకుండా అతని రెక్కలు అనగా ఆయన చేతులు నీకు ఆరోగ్యం చేకూర్చుతాయి! ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చూడండి.

యెషయా 35:56

Isaiah(యెషయా గ్రంథము) 65:6,7

 

6. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి కారము చేసెదను.

7. నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించిన దానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును.

యిర్మియా 30: 17

వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

 

రోమా 8:2123

21. స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.

22. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

 

ఇక మీరు క్రొవ్విన దూడ వలె గంతులు వేయడం కోసం ఆలోచిస్తే ఎందుకు గంతులు వేస్తున్నావు అంటే నీకు విడుదల కలిగింది కాబట్టి పాపమనే దాస్యం నుండి, మరణమనే దాస్యం నుండి, విడుదల కలిగి ఇప్పుడు నిత్యత్వము లోనికి వెల్లబోతున్నావు కాబట్టి నీకు ఆరోగ్యం, ఆనందం, సంతోషం కలుగుతుంది! అంతేకాకుండా నీవు ఈలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన నీకు ఎల్లప్పుడూ ఆరోగ్యం దయచేసే దేవుడు! నీకు స్వస్తత ఇచ్చే దేవుడు!

 

   ఇక మూడో వచనంలో అదే సమయంలో ఎవరైతే దుర్మార్గులుగా దుష్టులుగా గర్విష్టులుగా మిమ్మల్ని హింసించారో వారంతా మీ పాదముల క్రింద దూళివలె ఉంటారు. మీరు వారిని అణగద్రొక్కుదురు అంటున్నారు! ఈరోజు బాధపడే మీరు ఒకరోజు మీ శత్రువులను ఏలుతారు! వారిని శాసిస్తారు! జెకర్యా గ్రంధంలో అంటున్నారు 12:69

 

6. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూష లేములో నివసించుదురు.

7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయ పడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.

8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

 

   కాబట్టి మీరు ఆయన మాటలను వినండి అంటున్నారు! నాలుగో వచనంలో ఇవన్నీ జరగాలంటే నా సేవకుడైన మోషే ద్వారా మీకిచ్చిన కట్టడలు జ్ఞాపకం చేసుకుని వాటిప్రకారం నడవండి అంటున్నారు! ఐతే నూతన నిబంధన సంఘమైన మనకు దేవుడు చెబుతున్నారు: ఆయన చెప్పిన పద్దతులు పాటిస్తూ వాక్యానుసారంగా, సాక్ష్యార్ధమైన జీవితాలు జీవిస్తూ, ప్రార్ధనా జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తూ ఉండండి! అప్పుడు ఇవన్నీ మీకు కలుగుతాయి అంటున్నారు!

 

   మరి ప్రియ సేవకుడా! నీవు నీ మాటలు నీ క్రియలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? దేవుడు చెప్పినట్లు లేక బైబిల్ చెప్పినట్లు చేస్తున్నావా లేదా?

ప్రియ విశ్వాసి! దేవుడు మెచ్చే కార్యాలు చేస్తున్నావా? లేక లోకంలో మునిగిపోయి లోకస్తులు మెచ్చే క్రియలు చేస్తున్నావా? జాగ్రత్త! విడువబడితే ఘోరము! అక్కడ అగ్ని ఆరదు! పురుగు చావదు అని గ్రహించు!

నేడే నీ జీవితాన్ని సరిచేసుకో!

దేవునిలో స్థిరంగా ఉన్న ఓ పరిశుద్ధుడా! ఇంకా అలాగే ముందుకు సాగిపో!

దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకో!

దైవాశీస్సులు!

(సమాప్తం)

#################################################

 

   ప్రియ దేవుని బిడ్డలారా! ఈ మహామహుని వార్తావహుడు అనే శీర్షిక ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను! దయచేసి మా కోసం ప్రార్ధన చెయ్యండి! మా సేవకోసం, ఉద్యోగం కోసం, సోషల్ మీడియా పరిచర్య కోసం, మా వెబ్ పేజీలు, వెబ్సైటు కోసం ప్రార్ధన చెయ్యండి! ప్రభువు చిత్తమైతే కొన్ని రోజుల తర్వాత ప్రకటన గ్రంధము ప్రత్యక్షతల వాఖ్యానముతో మరలా కలుసుకుందాము!

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

 

ఇట్లు

ప్రభువునందు వందనములతో

మీ ఆత్మీయ సహోదరుడు

*రాజకుమార్ దోనె*

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

పక్షిరాజు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు