యెషయా ప్రవచన గ్రంధము- Part-1

*యెషయా ప్రవచన గ్రంధము*

*మొదటి భాగము-ఉపోద్ఘాతము-1*

        ఒక యవ్వనస్తుడు రాజ ప్రసాదంలో ధ్యానిస్తూ నడుస్తున్నాడు! గతరాత్రి తండ్రి చెప్పాడు- *దేవుణ్ణి మనస్పూర్తిగా ప్రేమించి, ధ్యానించి, ప్రార్ధిస్తే, మనస్పూర్తిగా అడిగితే దేవుడు జవాబిస్తారు, మనకు కనిపిస్తారు, మోషేతో మాట్లాడినట్లు ముఖాముకిగా ప్రత్యక్షమవుతారు! ఇంకా మరింత పరిపూర్ణమైన అనుబంధం ఏర్పరచుకుంటే తన పరలోక రాజ్య ప్రత్యక్షత కూడా మనకు అనుగ్రహిస్తారు! దేవుణ్ణి ధ్యానించడం ప్రార్దించడం అంటే పనిపాటులు అన్నపానాలు మానేసి దేవుని మందిరంలో గడపడం కాదు- నిలబడినా కూర్చున్నా పనిచేస్తున్నా ఆయనను ధ్యానం చేస్తూ ఆయన ధర్మశాస్త్ర విధులను తలపోస్తూ, ఆయన మన జీవితాలలో ఇంతవరకు చేసిన ఘనమైన కార్యాలకు దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉండటమే*!!  ఈమాటలు తన మస్తిశ్కంలో మారుమ్రోగుతున్నాయి!  నిజంగా దేవుడు మాట్లాడే దేవుడే అయితే తాను చనిపోయే లోగా దేవుణ్ణి చూడాలి ఆయన పరలోక రాజ్య మహిమను ఈలోకంలోనే నేను చూడాలి అనుభవించాలి! అందుకే రాజ ప్రసాదంలో నడుస్తున్నా గాని ధ్యానం చేస్తున్నాడు! ఇంతలో దేవుని ఆత్మ ఆ యవ్వనస్తుని హృదయంలో తెలియని, ఎన్నడూ అనుభవించని చల్లని మెల్లని అనుభూతిని కలిగించింది! ఆత్మావేశుడై పోయాడు!  ఇంతలో పరలోకం తెరువబడింది!  అదిగో ఒక దివ్యమహిమ గల సింహాసనం అత్యున్నతమైన స్థానంలో ఉంది , దానిమీద గొప్ప తేజోమయుడైన ఒక వృద్దుడైన వ్యక్తి కూర్చుని ఉన్నారు! ఆయన దేవాదిదేవుడు అని తెలిసిపోయింది! దర్శనాన్ని ఇంకా చూస్తున్నాడు ఆ యవ్వనస్తుడు- ఆయన చొక్కాయి యొక్క అంచులు పరలోకంలో ఉన్న నిజమైన దేవాలయం మొత్తం నిండిపోయాయి!! ఆయనకుపైగా సెరాపులు అనెడి పరలోక జీవులు ఎగురుతున్నారు. వారికి ఆరు రెక్కలున్నాయి! రెంటితో తమ దిసమొలను కప్పుకుని, రెంటితో దేవుని మహిమను చూడలేక  తాళలేక  ముఖాన్ని కప్పుకున్నారు, రెంటితో ఎగురుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఇంకా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అంటూ గాన ప్రతిగానములు చేస్తున్నారు! వారి అరుపుకి దేవాలపు గడపలు కమ్ములు అదిరిపోతున్నాయి అనునాధంతో (resonance)!

 

   ఎప్పుడైతే ఈ దివ్యదర్శనం ఈ యవ్వనస్తుడు చూశాడో- వెంటనే మోకరించి గుండెలు బాదుకుని అరుస్తున్నాడుఅయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన పెదవులు కలిగిన మనుష్యుల మధ్య నివాసం చేస్తూ దేవాదిదేవుని దర్శనాన్ని పొందుకున్నాను! దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎవడూ బ్రతుకడు- అదికూడా అపవిత్రమైన పెదవులు కలిగిన నాలాంటివాడు దేవుణ్ణి చూస్తే వెంటనే చస్తాడు! అయ్యో ఇప్పుడు నేను నశించిపోతున్నాను అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు!!   ఇంతలో సెరాపులలో ఒకడు వచ్చాడు తన దగ్గరికి- ఎందుకంటే ఆయన సన్నిదిలో ఉన్న ప్రతీ జీవికి దేవుని హృదయం కలిగి ఉంటారు కాబట్టి ఎదురుగా ఉన్న బలిపీటం మీదన ఉన్న నిప్పులు పట్టకారుతో పట్టుకుని ఆ యవ్వనస్తుని దగ్గరకు వచ్చి ఆ యవ్వనస్తుని అపవిత్రమైన పెదాలకు అంటించి అంటున్నాడు: ఇది దేవుని పవిత్రమైన బలిపీటం మీదనున్న పరిశుద్ధ నిప్పులు- నీపెదాలకు తగిలాయి కాబట్టి ఇప్పుడు నీపాపాలు అన్నీ ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి, ఇప్పుడు నీవు పవిత్రుడవు! ఇక ఏడవటం ఆపేయ్ అన్నాడు! వెంటనే ఆ యవ్వనస్తుడు ఏడుపు ఆపేసాడు!

 

        ఇంకా ఆ దర్శనంలో చూస్తుంటే అక్కడ దేవుని యొక్క ఆలోచన సభ (రౌండ్ టేబుల్ సమావేశం) (యోబు 15:8, మరియు 1,2 అధ్యాయాలు) జరుగుతుంది! అప్పుడు సర్వోన్నతుడైన దేవాదిదేవుడు అడుగుచున్నారు అందరినీ- నేను ఎవరిని పంపించాలి? ఎవడు భూమిమీదికి వెళ్లి నా మాట ప్రజలకు చెబుతాడు?  వెంటనే ఈ యవ్వనస్తుడు ఆ దేవుని ఆలోచనా సభలో ప్రవేశించి- క్షమించండి నేను వెళ్ళడానికి సిద్దంగా ఉన్నాను! నన్ను పంపించండి అన్నాడు!   సరే, నేను నిన్ను పంపుతాను- గాని వారు నీ మాట వినకుండా నిన్ను తిట్టి కొట్టి నిన్ను అవమానిస్తారు, వాటిని భరించడానికి సిద్దమా అన్నారు దేవుడు!! అయ్యా అవసరమైతే నీనామం కోసం నా ప్రాణం పెట్టడానికి సిద్ధమే అన్నాడు!

సెహబాస్ అయితే వెళ్ళు అన్నారు దేవుడు! 

ఆ యవ్వనస్తుడు ఇంకా అడుగుచున్నాడు: అయ్యా నేను వెళ్లి వారికి ఏమని చెప్పాలి? దేవుడు చెప్పారు:  మీరు నిత్యము వింటారు గాని గ్రహించరు! నిత్యమూ నా కార్యాలను చూస్తున్నారు గాని వాటిని వాటి అర్ధాన్ని గ్రహించరు!!  నీవు అలా పలికే కొలదీ వారి హృదయాలు క్రొవ్వి వారి హృదయాలు చెవులు మందగించి వారి కళ్ళు (ఆత్మీయనేత్రాలు) మూయిస్తావు అన్నారు! అయ్యా! ఇలా ఎంతకాలం?   దేవుడు చెప్పారు: నివాసులు లేక పట్టణాలు గ్రామాలు బోడి అయిపోతాయి, దేశమంతా బీడుభూమిగా మారిపోయే వరకు!  ఈ దేశమునుండి మనుష్యులు దూరంగా కొనిపోబడి, దేశము ప్రజలులేని అడివిలా మారిపోతుంది! చెట్లు నరికేసిన తర్వాత కేవలం మొద్దు మిగిలినట్లు ఉంటుంది! ఇలా మారిపోయిన తర్వాత ఆ మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అన్నారు!

ఆ దర్శనం అంతర్ధానమైపోయింది! గాని ఆ యవ్వనస్తుడు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే అక్కడున్న సైనికులు తండ్రి వచ్చి అడిగారు ఏమి జరిగింది అని! ఆ యవ్వనస్తుడు తన దర్శనాన్ని తన తండ్రికి చెప్పాడు!

ఆ యవ్వనుని పేరు యెషయా!

తండ్రి: ఆమోజు!

 

నిజానికి ఇది యేసుక్రీస్తు ప్రభులవారిని గూర్చిన మొదటి రాకడకు చెందిన దర్శనం గాని ఇది మొదట యెషయా గారికి చూపించి తన సేవకు పిలుచుకున్నారు దేవుడు! అలా ప్రారంభించిన ప్రవచన పరిచర్య సుమారుగా 64 సంవత్సరాలు- నాలుగు రాజుల కాలంలో చేసి- గొప్పగొప్ప కార్యాలు చేసి- ఐదో రాజు కాలంలో హతస్సాక్షి అయిపోయారు!

 

తాను దేవునికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఈ యవ్వనస్తుడు! ప్రియ చదువరీ నీవు దేవునికి ఎన్నెన్నో వాగ్దానాలు చేశావు కదా! మరి నీవు నిలబెట్టుకున్నావా? ప్రియ దైవజనుడా! నీవు చేసిన ప్రమాణం నిలబెట్టుకుంటున్నావా?!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*రెండవ భాగము-ఉపోద్ఘాతము-2*

 

          దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు-11 సిరీస్ లో భాగంగా మరోసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది!  మంటి పురుగునైన నాకు ఇట్టి మహా కృపను ఇచ్చిన ఆ దేవాదిదేవునికి హృదయపూర్వకమైన నిండు కృతజ్ఞతలు!!!!

 

    ప్రియులారా!!  ఈ సారి దైవజనుడు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అని పేరుపొందిన మహా గొప్ప దైవజనుడు యెషయా గారు ఆత్మావేశుడై వ్రాసిన గ్రంథమునుండి వివరంగా ధ్యానం చేసుకుందాం! ఈ గ్రంధం మనకు బాగా అర్ధం కావాలి అంటే అసలు అక్కడి పరిస్తితులు ఏమిటి? రాజకీయ పరిణామాలు ఏమిటి? ప్రజల యొక్క భక్తిశ్రద్దలు- దేవునితో ఎలా  ఉన్నాయి? ఇలాంటి విషయాలు చూసుకుంటే ఈ గ్రంధము మనకు బాగా అర్ధం అవుతుంది కాబట్టి ఉపోద్ఘాతమును వివరంగా చూసుకుందాం!!

 

పేరు: యెషయా , ఇంగ్లీస్ లో Isaiah;  హీబ్రూ లో యెషయా

పేరుకు అర్ధం: యెహోవాయే నా రక్షకుడు! లేదా దేవుని రక్షణ లేక దేవుడు అనుగ్రహించే రక్షణ!!

తండ్రి: ఆమోజు!!

గోత్రము: యూదా!

సమీప బంధువు: రాజైన ఉజ్జియా!!! ఈయన యెషయా గారికి అన్నయ్య!! అనగా పెద్దమ్మ/పెదనాన్న కుమారుడు!! ఈ విషయం బాగా అర్ధం కావాలంటే మనకు రెండో రాజుల గ్రంధం ప్రకారం, ఇంకా రెండో దిన వృత్తాంతాల గ్రంధాల ప్రకారం: రాణియైన అతల్యా తన కుమారుడు అహాజ్యా  చనిపోయాడని రాజకుమారుల నందరినీ హత్య చేయించినప్పుడు (2 దిన 22:1012) అతని మేనత్త అయిన యెహోషబెతు- యోవాషు అనే రాజు యొక్క కుమారున్ని దాచిపెట్టి పెంచినట్లు మనం చూడగలం! ఆ తర్వాత అధ్యాయాలలో అతని మామయ్య అనగా యెహోషబెతు భర్త మరియు ప్రధాన యాజకుడైన యెహోయూదా గారు ఆ కుమారునికి ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు అతల్యాను ఎదిరించి ఆమెను చంపించి యోవాసుని రాజుగా చేసినట్లు మనం చూడగలం! ఈ యెహోయూదా గారు యోవాసుని అతని సంతానాన్ని భక్తిమార్గంలో పెంచారు! యోవాసుకి ఇద్దరు భార్యలను అతనికి వివాహం చేశారు!  అలా పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడు అమజ్యా రాజు! అతని పెద్ద కుమారుడు రాజైన ఉజ్జియా! రెండవ భార్య యొక్క కుమారుడు ఈ యెషయా గారి యొక్క తండ్రి ఆమోజు గారు!!!

 

చరిత్ర ప్రకారం మరియు బైబిల్ ప్రకారం యెహోయూదా గారు బ్రతికినంత కాలం యోవాసు రాజు గాని, అతని కుమారులైన అమజ్యా, ఆమోజు గారు భక్తిమార్గం లో నడిచారు! యెహోయూదా గారు చనిపోయాక యోవాసు, అమజ్యా భక్తిమార్గం నుండి తోలిగిపోయారు గాని అతని కుమారుడైన ఉజ్జియా భక్తిమార్గంలో నడిచాడు! ఇక తన గురువైన యెహోయూదా గారు నేర్పించిన భక్తిమారం నుండి ఆమోజు గారు కుడికి గాని ఎడమకు గాని తిరుగక భక్తిమార్గాన్ని కొనసాగిస్తూ తన కుమారులను కూడా అదే భక్తిమార్గంలో నడిపించారు ఆమోజు గారు! అదే భక్తిని అతని చిన్న కుమారుడైన యెషయా గారు చనిపోయేవరకు వదలక స్థిరంగా నిలిచారు!!!

 

జననం: యేరూషలేము పట్టణం, పుట్టిన సంవత్సరం తెలియదు

అయితే మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారం: ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో ప్రవచన పరిచర్య చేసినట్లు ఆయన వ్రాయడం దానిని రెండు రాజుల గ్రంధం, రెండు దిన వృత్తాంతాల గ్రంధం స్థిర పరుస్తుంది కాబట్టి ఉజ్జియా  కాలంలో పుట్టారు. అయితే చరిత్ర చెబుతుంది యవ్వనస్తునిగా ప్రవక్తగా పరిచర్య ప్రారంభించారు కాబట్టి సుమారుగా క్రీ.పూ. 760 కాలంలో  పుట్టి ఉండవచ్చు!

 

పరిచర్య ప్రారంభం: ఉజ్జియా రాజు కాలంలో ప్రారంభించారు! అయితే యెషయా ఆరో అధ్యాయం ప్రకారం రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరం ఆయన దేవుని పరలోక దర్శనం పొందుకున్నారు కాబట్టి చరిత్ర కారుల లెక్క ప్రకారం ఉజ్జియా రాజ్యము చేసింది క్రీ.పూ. 793 నుండి 740 ! కాబట్టి సుమారుగా 744 లో బహుశా పరిచర్య ప్రారంభించారు!

 

విద్యాభ్యాసం: మొత్తం యేరూషలేము నగరంలో రాజ కుటింబికుల స్కూలులో చదువుకున్నారు!

 

వివాహం: ఎప్పుడు జరిగిందో సరిగా తెలియదు గాని పరిచర్య ప్రారంభించాకనే వివాహం జరిగింది! అది కూడా దేవుడు చెప్పిన అమ్మాయిని /ప్రవక్తినిని చేసుకున్నారు!

 

భార్య: ఒక ప్రవక్తిని! ఆమె నిజంగా దెబోరా, హుల్దా ప్రవక్తినిల వలె ఆమె నిజంగా ప్రవక్తా లేక ప్రవక్త గారి భార్య అయినందువలన ప్రవక్తిని అని పిలువబడిందో మనకు అంతగా తెలియదు గాని 8వ అధ్యాయంలో నేను ప్రవక్తిని వద్దకు పోతిని ఆమె కుమారులను కన్నది అని ఉంది కాబట్టి ఆమెను మనం ప్రవక్తిని గానే చూద్దాం!

 

కుమారులు: ఇద్దరు!  పెద్ద కుమారుడు: 7:3 ప్రకారం: షేయర్యాషూబు!  అర్ధము: కొద్దిమంది మాత్రమే ఇశ్రాయేలు దేశానికి తిరిగి వస్తారు!!

రెండవ కుమారుడు: 8:1 మరియు 8:3 ప్రకారం: మహేర్ షాలాల్ హాజ్ బజ్! ఇది దేవుడు పెట్టిన పేరు!  అర్ధము: త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును!! ......

యెషయా 8:3

నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌ అను పేరు పెట్టుము.

యెషయా 8:4

ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

 

34 వచనాల ప్రకారం ఆ కుమారుడు అమ్మా నాన్న అనక మునుపు షోమ్రోను అనగా సమరయ అనగా ఇశ్రాయేలు సామ్రాజ్యం (యూదా కాదు) నాశనమైపోతుంది! ఇది నిజంగా క్రీ.పూ. 722 లో మొదలై 721 కి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది కాబట్టి ఈ రెండో కుమారుడు సుమారుగా 724 లో పుట్టి ఉంటాడు!!

 

ఆసక్తిగల విషయమేమిటంటే:  8:14 లో ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును సీయోను కొండమీద నివశించు సైన్యములకు అధిపతియైన యెహోవా వలని సూచనలు గాను మహాత్కార్యముల గాను ఉన్నాము అంటున్నారు! అలాగే చిన్న కుమారుడు పుట్టిన తర్వాత అమ్మా నాన్న అనకమునుపు షోమ్రోను సామ్రాజ్యం పతనమైపోయింది!

అలాగే ఆరవ అధ్యాయంలో దేవుని ఆలోచనా సభ జరిగింది! అక్కడ యెషయా గారు నేనున్నాను నన్ను పంపమని చెప్పారు దేవునితో! సరిగా అదే జరిగింది యేసుక్రీస్తుప్రభులవారి విషయంలో: భూమిమీద మనుష్యుల పాప పరిహారం కోసం ఎవరు నా కోసం వెళ్తారు అని పరమ తండ్రి అడిగితే కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు నేనున్నాను నన్ను పంపమని తండ్రికి చెప్పారు! మీద వచనంలో కుమారుడు, ఆరవ అధ్యాయం ప్రకారం యెషయా గారు దేవునికోసం ఇశ్రాయేల ప్రజలకు సూచనలుగా ఉన్నారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*మూడవ భాగము-ఉపోద్ఘాతము-3*

పరిచర్య చేసిన కాలము:  యెషయా 1:1 ప్రకారం ఉజ్జియా యోతాము ఆహాజు అనే యూదా రాజుల కాలములో ఆయన పరిచర్యచేశారు! 

అనగా ఉజ్జియా కాలము: క్రీ.పూ. 793 నుండి 740, హిజ్కియా కాలము:క్రీ.పూ. 710 నుండి 684, కాబట్టి సుమారుగా సుమారుగా క్రీ.పూ. 744 ప్రాంతంలో పరిచర్య మొదలు పెట్టి క్రీ.పూ. 675 వరకు పరిచర్య చేసి ఉండవచ్చు. మొత్తం 64 సంవత్సరాలు పరిచర్య చేసినట్లు చరిత్రకారులు చెబుతారు!

 

నాలుగు రాజుల కాలంలో ఏ ప్రవక్తకు దక్కని రాజ వైభవముతో కూడిన ఆధిక్యత దక్కింది! రాజ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి ఆయనకీ రాజు దగ్గరికి వెళ్లి దేవుని మాట చెప్పడానికి ఏవిధమైన అడ్డంకులు ఉండేవి కావు! కాని ఐదవ రాజైన మనష్షేకి దేవుడంటే గిట్టదు కాబట్టి ఆయనను ఘోరంగా చంపించాడు!!

 

మరణం:  సుమారుగా క్రీ.పూ. 675 లో! చరిత్రకారుడైన తల్మూదు ప్రకారం మరియు ఆర్ధడాక్ష్ చర్చ్ ఇన్ అమెరికా చరిత్రకారుల ప్రకారం:  హిజ్కియా రాజు మరణించాక అతని కుమారుడైన మనష్షేకి బోధించడానికి వెళ్తే మనష్షే వినకుండా తిరుగబడ్డాడు యెషయా గారిమీద! రోజురోజుకి మనష్షే విగ్రహారాధన మరియు చిన్న పిల్లలను బలి ఇవ్వడం లాంటి ఆకృత్యాలు చూసి కొన్ని సంవత్సరాలు తర్వాత మరలా ప్రవక్త- మనష్షే దగ్గరకి వెళ్లి నీవు చేస్తుంది తప్పు!  నిజమైన దేవుడు యెహోవాని వదిలి ఎందుకు రాతి బొమ్మలను కర్ర బొమ్మలను ఆరాధిస్తావు? అవి కళ్లుండి చూడవు, నోరుండి మాట్లాడవు!  గాని మన దేవుడైన యెహోవా చూసే దేవుడు మాట్లాడే దేవుడు! నాకు కనబడి నాతో మాట్లాడారు అని చెప్పారు! మనష్షే అన్నాడు: నీవు నీ యజమాని అయిన మోషేకి వ్యతిరేఖంగా మాట్లాడుతున్నావు! మోషే నిర్గమకాండం 33:20 లో ఏ నరుడు దేవుణ్ణి చూసి బ్రతుకలేడు అనివ్రాస్తే నీవేమో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువుని చూశాను, అది కూడా అపవిత్రమైన పెదవులు కలిగి చూశాను అని వ్రాశావు! నీవు అబద్దమాడుతున్నావు నీవు బ్రతుక కూడదు! నీకు నీవుగా ప్రవక్తనని ప్రకటించుకున్నావు! దేవుడు మాట్లాడడు చూడడు! నీవు అబద్దాలు చెబుతున్నావు అన్నాడు! ప్రవక్త: నీవు దేవునికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నావు! దేవుని ఉగ్రత నీమీదికి రాబోతుంది అనిచెప్పి కోపంతో వెళ్ళిపోయారు యెషయా గారు! వెంటనే ఆయనను చంపడానికి భటులను పంపగా యెషయా గారు పరుగెత్తి అక్కడ పెద్ద కేదారు చెట్టు ఉంటె దాని తొర్రలోకి పోయి దాక్కున్నారు!  సైనికులు అయ్యా ఆయన దొరకడం లేదు, కేదారు వృక్షపు తొర్రలో ఉన్నారు అని చెబితో ఆ కేదారు చెట్టుని రెండుగా రంపాలతో కోయమని ఆజ్ఞాపించాడు మనష్షే రాజు! ఈ విధంగా ఆయన బ్రతికుండగానే చెట్టుతో పాటుగా రెండుగా రంపాలతో కోయించి చంపించాడు రాజైన హిజ్కియా గారి కుమారుడైన మనష్షే! దీనినే నీతిమంతుల పట్టీ చెబుతూ హెబ్రీ పత్రిక 11:37 లో రంపములతో కోయబడిరి అనేది ఈ ప్రవక్త కోసమే వ్రాసారు అంటారు!

 

ఈ రీతిగా దేవునికోసం ఆయన నామముకోసం పౌరుషముగా జీవించి దేవునికిచ్చిన మాట ప్రకారం హతస్సాక్షి అయిపోయారు BC675 లో!!

 

యెషయా గారి కాలంలో పరిస్తితులు: అష్షూరు రాజు శల్మనేశార్-5  తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు! అష్షూరు రాజ్యానికి వ్యతిరేఖంగా అలయన్స్ మొదలైంది- అది సిరియా, ఈజిప్ట్ మరియు షోమ్రోను!  అందుకు శల్మనేశర్ కి కోపం వచ్చి మొదటగా సిరియాను ఆ తర్వాత షోమ్రోను ను ఆక్రమించుకుని- చివరికి క్రీ.పూ. 722-721 లో షోమ్రోను అనగా ఇశ్రాయేలు పది గోత్రాలను చెరపట్టుకు పోయాడు! ఇది మనకు రెండోరాజుల గ్రంధంలో 17వ అధ్యాయంలో కనిపిస్తుంది . ఎప్పుడైతే షోమ్రోనుని నాశనం చేశాడో ఆ మూడు దేశాల కూటమిలో రాజైన హిజ్కియా కూడా చేరుతాడు! గాని అష్షూరు రాజైన సన్హేరీబు ఐగుప్తుని జయిస్తాడు! అప్పుడు హిజ్కియా  కూటమి మీద కాకుండా దేవునిమీద నమ్మకం ఉంచి సన్హేరీబు సైన్యం మీద విజయం సాధిస్తాడు! ఈ రకంగా అస్సీరియా సామ్రాజ్య వ్యాప్తి మరియు దానికి వ్యతిరేఖంగా సిరియా ఈజిప్ట్, షోమ్రోను చుట్టూ ప్రక్కల దేశాల అలయన్స్ మద్యన జరిగే యుద్దాల కాలంలో యెషయా ప్రవక్త పరిచర్య చేశారు!

 

ప్రజల భక్తిశ్రద్దలు: ఇశ్రాయేలు ప్రజలు: భ్రష్టులై పోయారు

 2రాజులు 17:723

7. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో నుండియు, ఐగుప్తురాజైన ఫరో యొక్క బలముక్రింద నుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి

8. తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.

9. మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని

10. యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి

11. తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి

12. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.

13. అయినను- మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,

14. వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.

15. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.

17. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.

 

యూదులు: వారు కూడా బ్రష్టులుగానే ఉన్నారు

2రాజులు 21:211

2. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.

3. తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను.

4. మరియు- నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను.

5. మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.

6. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను

7. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి- ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను.

8.​​ మరియు- ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దంతటిని, నా సేవకుడగు మోషే వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనినయెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగి పోనియ్యనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక

9.​​ ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.

11. యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.

 

ఇలా యూదులు, ఇశ్రాయేలు ప్రజలు భక్తిలేనివారుగా విగ్రహారాధికులుగా జీవించిన కాలంలో దేవునికొరకు పౌరుషంగా జీవించారు యెషయా గారు!

దైవాశీస్సులు!

 

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*నాల్గవ భాగము-ఉపోద్ఘాతము-4*

 

యెషయా గ్రంధ విశిష్టతలు::

1). ఈ గ్రంధములో ప్రతీ అధ్యాయంలోను యేసుక్రీస్తుప్రభులవారి కోసం ఉంటుంది. లేక ప్రతీ అధ్యాయంలోను యేసుక్రీస్తుప్రభులవారు కనిపిస్తారు!

 

2) యేసుక్రీస్తుప్రభులవారి మొదట రాకడ, రెండవ రాకడ మరియు వెయ్యేండ్ల పరిపాలన కోసం మొత్తమన్నీ చెప్పిన ఏకైక గ్రంధము!

 

3) గ్రంధం మీద పట్టులేని వారికీ బైబిల్ కోసమైన జ్ఞానం తక్కువగా ఉండి చదివే వారికి ఈ గ్రంధము ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు మరియు యేరూషలేము నకు జరుగబోయే వినాశనము మరియు దేవుడు ప్రకటించిన తీర్పులు, మరియు దేవునిదినము లేక యెహోవా దినము యొక్క వివరాలు తెలియజేసే గ్రంధములా కనిపిస్తుంది!!!  గాని నిజానికి లోతుగా పరిశీలించి చదివితే ఈ గ్రంధము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సిద్దపరచిన గొప్ప సువార్త!  కారణం రక్షకుని జనన మరణ పునరుత్థానములకోసం తెలియజేసిన పాత నిబంధనలో ఏకైక గ్రంధం, ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చే రక్షణ విధానం ఈ గ్రంధములోనే కనిపిస్తుంది!

 

4) ఇశ్రాయేలు ప్ర్రజలకు ఇప్పటివరకూ యెషయా ప్రవక్త రాబోయే సంగతులు తెలియజేసిన ప్రవక్తలాగే కనిపిస్తున్నారు! గాని లోతుగా పరిశీలిస్తే ఇశ్రాయేలు యొక్క రక్షణ ప్రణాళిక తెలియజేసిన మొట్టమొదటి సువార్తికుడు! నిజం చెప్పాలంటే యెషయా గారు ఇశ్రాయేలు మరియు యూదా జనులకోసం దేవునిచేత పంపబడిన గొప్ప సువార్తికుడు! గాని దీనిని ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అంగీకరించలేక పోతున్నారు అంటే: ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్యని అనగా రక్షకుని ఊహించుకున్న విధానం  వేరు, గాని యెషయా గ్రంధం ప్రకారం దేవుడు బయల్పరచిన విధానం వేరు!! వారు మెస్సయ్య తమ పక్షముగా వచ్చి తమకోసమైన యుద్దాలు చేసి వారిని రక్షించి, వారికి యెషయా గ్రంధ ప్రకారం శాశ్వతరాజ్యం నిత్యమూ ఉండే రాజ్యము అనుగ్రహిస్తారు!

గాని నిజానికి యెషయా గ్రంధం ప్రకారం రక్షకుడు కన్య గర్భమందు జన్మించి , దీనులకు రక్షణ సువార్త ప్రకటించి 42, 61వ అధ్యాయాల ప్రకారం;  53 వ అధ్యాయం ప్రకారం అందరికొరకు శ్రమలను సహించి మరణమైపోయి తనరక్తము ద్వారా మానవాళికి పాప క్షమాపణ కలుగజేయాలి! తిరిగిలేవాలి, నిత్యరాజ్యము స్తాపించాలి. అప్పుడు మరోసారి రెండవ రాకడలో రావాలి. అప్పుడు యెహోవా దినము అనే చెప్పబడే దినములలో దుష్టులకు న్యాయమైన ప్రతిదండన చేయాలి! ఆ తర్వాత వెయ్యేండ్ల పాలన, తర్వాత కలిగేదే శాశ్వత రాజ్యము! ఇదీ యెషయా గ్రంధంలో చెప్పబడింది! గాని వారు దీనిని తమకు అనుకూలంగా అర్ధాలు చెప్పుకుని ఇంకా రక్షకుని కోసం నిరీక్షిస్తున్నారు! యేసుక్రీస్తుప్రభులవారిని రక్షకునిగా మెస్సయ్యగా అంగీకరించలేకపోతున్నారు!

 

5) మెస్సయ్యా కన్యక గర్భములో జన్మిస్తాడు అని తెలియజేసిన గ్రంధము! 7:14

 

6) ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచన కర్తయని, బలవంతుడైన దేవుడు అనగా కుమారుడే దేవుడు, ఇంకా నిత్యుడగు తండ్రి  Everlasting Father అని , అనగా కుమారుడు ఆయనే, తండ్రికూడా ఆయనే అని తెలియజేసిన గ్రంధము! ఇంకా సమాధాన కర్త Prince Of Peace, అనగా సమాధానానికి యువరాజు!! ఇంకా ఆయన భుజముమీద రాజ్య భారముండును అనగా ఈ భూలోకములో ఉన్న సమస్త రాజ్యాల యొక్క ప్రజల రక్షణ భారము మాత్రమే కాకుండా, ఈ రాజ్యాలను నిర్వహించే భారము ఆయనమీదనే ఉంది అని ముందుగానే చెప్పారు యెషయా గారు, దీనిని హెబ్రీ గ్రంధకర్త పునరుద్ఘాటించారు ...

 

Isaiah(యెషయా గ్రంథము) 9:6,7

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

Hebrews(హెబ్రీయులకు) 1:2,3

2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో- యుగములను) నిర్మించెను.

3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

 

ఇంకా సర్వకాలము ఆయన దావీదు సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడు అని కూడా చెప్పిన గ్రంధము!! దీనినే గబ్రియేలు దేవదూత చెబుతున్నాడు దైవజనురాలైన మరియమ్మ గారితో నీవు గర్భము ధరించి కుమారుని కనీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును! ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును! ఆయన యాకోబు వంశస్తులను యుగయుగాలును ఏలును! ఇంకా ఆయన రాజ్యము అంతములేనిదై యుండును!!! లూకా‌1:26-30  అదే గబ్రియేలు దూత యోసేపు గారితో అంటున్నాడు: ఆమె యొక కుమారుని కనును! తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరుపెట్టుదువు!! మత్తయి 1:18--22

 

7) వెయ్యేండ్ల పరిపాలన కోసం వివరంగా చెప్పిన గ్రంధము!

 

8) యేసుక్రీస్తుప్రభులవారు ఎట్టి మరణము పొందుతారో, ఎటువంటి శ్రమలు అనుభవిస్తారో తెలియజేసిన గ్రంధము! 53

 

9) యెహోవా దినము అనేది సంతోషదినం కాదు, అది దుష్టుల మీదికి ప్రళయం నాశనం తెచ్చే దినము అని వివరంగా చెప్పిన గ్రంధము!

 

10) అన్య దేశాలకు జరుగబోయే దేవుని తీర్పును తెలియజేసిన గ్రంధము!

 

11) ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి పోతారు అనియు, చివరికి కోరేషు అనే వ్యక్తి ద్వారా వారికి విడుదల కలుగుతుంది. అప్పుడు యేరూషలేము మరలా కట్టబడుతుంది అని తెలియజేసిన గ్రంధం!   అయితే విచారమేమంటే ఈ అధ్యాయాన్ని ఆధారంగా ఇశ్రాయేలు ప్రజలలో ఒక వర్గము వారు కోరేషు రాజే వారి యొక్క మెస్సయ్యా అని భావించారు! 44:28

 

12) ఈ గ్రంధంలో యేసుక్రీస్తుప్రభులవారిని అనేక విధాలుగా చూపించారు పరిశుద్ధాత్ముడు:

 2:4 ప్రకారం దేశాలమధ్య తీర్పు తీరుస్తారు

4:2, 11:1 ప్రకారం ఆయనే కొమ్మ అనియు చిగురు అనియు

7:14, 8:8,10 ప్రకారం కన్యక గర్భమందు పుట్టి ఇమ్మానుయేలుగా పిలువబడతారు

8:14, 28:14  ప్రకారం తత్తరపడే రాయిగా, నిషేదించిన వారికి మూలకు తలరాయిగా

9:710 ప్రకారం ఆశ్చర్యకరుడని,  ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా సమాధాన అధిపతిగా , ఇశ్రాయేలు ప్రజలను ఎల్లప్పుడూ ఏలే రాజుగా

42:1 లో అతనిమీద నా ఆత్మను ఉంచి యున్నాను

53 వ అధ్యాయం ప్రకారం వారికోసం శ్రమలు అనుభవించి మరణించే వానిగా , వారి వ్యాధులు భాధలు భరించే వానిగా, ఆయన పొందిన గాయముల ద్వారానే లోకానికి స్వస్థత అని ప్రకటించారు!

 

13) బైబిల్ గ్రంధములో గల ఆదరణ వాక్యాలలో అనేకము ఈ గ్రంధములోనే ఉన్నాయి: ఉదాహరణకు

41:89; 49:  నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఎన్నుకున్నాను,

43: నేను నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను, నేను నిన్ను విమోచించి యున్నాను, భయపడకు- నీవు జలముల మీద వెళ్ళినా నీకు తోడై ఉంటాను అగ్నిమధ్య నడిచినా నీవు కాలిపోవు; నిన్ను రక్షించువాడను, నిన్ను సంరక్షించు వాడను నేనే; నీ ప్రాణానికి బదులుగా అనగా నీకు బదులుగా మరొకరు చస్తారు గాని నీవు రక్షించబడుదువు .

44: గర్భములో నుండి నిన్ను తీసినవాడను నేనే

45: నీ కుడిచేతిని పట్టుకున్నాను పేరుపెట్టి పిలిచాను; నీకు ముందుగా మెట్టుగా ఉన్న ప్రాంతాలను సరాళం చేస్తాను

ఇంకా స్త్రీ తన గర్బమున పుట్టిన తన చంటిబిడ్డను మరచినా నేను నిన్ను మరువను; నా అరచేతుల మీద నిన్ను చెక్కుకుని ఉన్నాను

ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకుని రక్షించు వాడను నేనే

ఇంకా కుటుంబం కోసం- నీ పిల్లలను రప్పించెదను నీ పిల్లలను నేనే పోషిస్తాను .... ఇలాంటి వాగ్దానాలు అన్నీ ఈ గ్రంధములోనే ఉన్నాయి!

 

14) బైబిల్ గ్రంధములో గల అత్యధిక వాగ్దానాలు ఈ గ్రంధములోనే ఉన్నాయి!

 

15) జరుగబోయే అత్యధిక ప్రవచనాలు ఈ గ్రంధములోనే ఉన్నాయి! ఇంకా నెరవేరిన అత్యధిక ప్రవచనాలు ఈ గ్రంధములోనే ఉన్నాయి! సుమారుగా 102 ప్రవచనాలు ఇంతవరకు నెరవేరాయి! నెరవేర వలసినవి- రెండవరాకడ కోసం, వెయ్యేండ్ల పరిపాలన కోసం, దేవుడు స్థాపించబోయే నిత్యరాజ్యము- లేక దేవుని రాజ్యము కోసం గల ప్రవచనాలు నెరవేరాలి!

 

16) దేవుని రాజ్యము కోసం గల అత్యధిక ప్రవచనాలు గల గ్రంధము: ఉదాహరణకు

2:24  అంత్యదినాలలో అనగా వెయ్యేండ్ల పాలనలో ప్రపంచానికి కేపిటల్ యేరూషలేము అక్కడ నుండే తీర్పులు వెలువడతాయి

4:26 యెహోవా చిగురు అనెడి యేసుక్రీస్తుప్రభులవారు రాజ్యము స్తాపించి భూమి మొత్తం ఏలుతారు! అక్కడ నుండి ఆయన సమస్త ప్రజలను శుద్దిచేసి పరిపాలిస్తుండగా కుమారుని మహిమ లేక దేవుని మహిమ సీయోను కొండమీద నిలుస్తుంది

9:67 ప్రకారం లోకభారం ప్రపంచ భారం ఆయనమీద ఉంది ఆయన యుగయుగాలు పరిపాలిస్తాడు

11:19  యెహోవా మొద్దునుంది చిగురు పుట్టి దేవుని ఏడు ఆత్మలు అతనిమీద నిలిచి ప్రపంచానికి తీర్పు తీర్చును, అప్పుడు అన్ని జంతువులూ కలసిమెలసి ఉంటాయి! మనుషులు క్రూర జంతువులూ కూడా కలసిమెలసి ఉంటారు! పిల్లవాడు వాటిని ఏలుతాడు! క్రూర జంతువులూ పశువుల వలె గడ్డిమేస్తాయి

11:1016; 14:12  దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరల సమకూర్చి అక్కడనుండి రాజ్యము చేస్తారు

29:18, 2224 ఆ రాజ్యంలో చెవిటివారు దేవుని గ్రంధ వాక్యాలు వినగలరు,గ్రుడ్డివారు చూస్తారు, ప్రజలందరూ గుణపడతారు

32:118 ఆయన రాజ్యము కోసం మరింత వివరణలు

35:110 ఆయన రాజ్యము చేసేటప్పుడు అరణ్యమును ఎండిన భూమి అనగా ఎడారి సంతోషించి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె ఫలిస్తుంది

 

ఇవి కొన్ని మాత్రమే! ఇలాంటివి ఈ గ్రంధము నిండా ఉన్నాయి ఆయన రాజ్యము కోసం!!!

 

మొత్తానికి ఈ గ్రంధంలో యేసుక్రీస్తుప్రభులవారు ఒక రాజు గాను, ప్రజల భారం వహించే సేవకుని గాను, సమాధానపు యువరాజు గాను, నిత్యమూ పరిపాలించే రాజుగాను,  అనేక దేశాలను జయించే జయశీలిగాను, ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు లేక మెస్సయ్యగా, ప్రజలకు తీర్పు తీర్చే అధిపతిగా తీర్పరిగా, దేశాలను శాశించి పాలించి వాటిమీదికి వినాశనం తెచ్చే వినాశనకారిగా  అనగా సృష్టికర్తగాను, లయకర్తగాను చూడగలము!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*5వ భాగము-ఉపోద్ఘాతము-5*

*క్రొత్త నిబంధనలో నెరవేరిన/ఉపయోగించిన  ప్రవచనాలు*

యెషయా 9:67

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

    ప్రియ దైవజనమా! ఈరోజు యెషయా గ్రంధములో నెరవేరిన ప్రవచనాలు చూసుకుందాం! గమనించండి ఈ ప్రవచనాలు కేవలం రక్షకుని కోసం మరియు క్రొత్త నిబంధనలో నెరవేరినవి మరియు క్రొత్త నిబంధన గ్రంధములో ఎత్తి రాసినవి మాత్రమే! నలుగురు రాజులకాలంలో ఆ కాలం కోసం చెప్పిన ప్రవచనాలు ఎప్పుడో నెరవేరిపోయాయి!

 

1.         6:17  యెషయా దేవుని మహిమను చూసి వ్రాసారు యోహాను 12:4041

2.         6:910 యూదుల అవిశ్వాసం కోసం   మత్తయి 13:1315

3.         7:14 కన్యక గర్భము ధరించి కుమారుని కనును లూకా 1:35

4.         7:14; 8:8   ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు మత్తయి 1:23 

5.         8:14  తత్తరపడే రాయి, నిషేదింప బడిన రాయి మూలకు తలరాయి 1 పేతురు 2:8

6.         9:12 గలిలియ ప్రాంతం దేవుని సువార్తతో నిండుతుంది  మత్తయి 4:1217

7.         9:6 మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడును లూకా 1:౩1

8.         9:6 కుమారునికి దేవత్వము ఉంది లూకా 1:32

9.         9:6  ఆశ్చర్య కరుడు  లూకా 4:22

10.       9:6  ఆలోచన కర్త  మత్తయి 13:54

11.       9:6  బలవంతుడైన దేవుడు లూకా 19:37,38

12.       9:6 నిత్యుడగు తండ్రి  యోహాను 10:౩౦

13.       9:6 సమాధాన అధిపతి/యువరాజు . లూకా  2:14

14.       9:7 "ఆయన రాజ్యమునకు అంతము లేదు .  లూకా  1:32-33

15.       9:7 ఆయన తీర్పులు న్యాయమైనవి .  యోహాను 5:30

16.       11:2 దేవుని ఆత్మ అతనిపై నిలుచును.  మత్తయి 3:16,17

17.       11:2 ఆయనకు జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ ఉండును.  లూకా 2:40

18.       11:2 ఆయనకు వివేకమునకు ఆధారమగు ఆత్మ ఉండును.  లూకా 2:40

19.       11:2 ఆయనకు ఆలోచననకు ఆధారమగు ఆత్మ ఉండును.  మత్తయి 7:28-29

20.       11:2 ఆయనకు బలమునకు ఆధారమగు ఆత్మ ఉండును.  మత్తయి 8:27

21.       11:2 తెలివిని కలుగజేసే ఆత్మ యుండును.  యోహాను 7:29

22.       11:2 దేవుని యెడల భయము పుట్టించే ఆత్మ కలిగి యుండును. హెబ్రీ  5:7

23.       11:10 యెష్షయి వేరు చిగురు . రోమా  15:12

24.       12:2 యెహోవా రక్షణయై ఉండును.  మత్తయి 1:21

25.       16:5 దావీదు సింహాసనము మీదనుండి ఏలును.  లూకా 1:31-33

26.       22:22 దావీదు తాళపు చెవులు కలిగి ఉండును. ప్రకటన 3:7

27.       25:8 మరణమును విజయముతో మ్రింగివేయును ". 1 కొరింథీ 15:54

28.       28:16 యేసే ముఖ్యమైన మూలరాయి .  అపొ.కా.  4:11-12

29.       29:13 పెదవులతో స్తుతిస్తారు గాని హృదయము దూరంగా ఉంది.  మత్తయి 15:7-9

30.       29:14 సిలువను గూర్చిన వార్త/సువార్త జ్ఞానుల జ్ఞానమును వ్యర్ధపరచును వివేకుల జ్ఞానమును శూన్యపరచును . 1 కొరింథీ 1:18-19

31.       35:4 ఆయనవచ్చి మిమ్మును రక్షించును.  మత్తయి 1:21

32.       35:5-6 గ్రుడ్డివారికి, చెవిటి వారికి, మూగవారికి అంగవిహీనులను బాగుచేయును.  యోహాను 9:1-7, మార్కు 7:32-35,  మత్తయి 12:10-13 and  9:32-33

33.       40:3 అరణ్యములో కేకలు వేయు స్వరము తర్వాత వచ్చును".  యోహాను 1:23

34.       40:11 ఆయన గొర్రెలకు మంచి కాపరి.  యోహాను 10:11

35.       42:1-4 ఏర్పరచబడిన సేవకుడు.  మత్తయి 12:15-21

36.       42:6 అన్యులకు వెలుగు.  లూకా 2:32

37.       42:7 గ్రుడ్డివారికి చూపు కలుగజేయును.  మత్తయి 9:37-20

38.       43:11 యేసు మాత్రమే రక్షకుడు.  అపొ.కా.  4:12

39.       44:3 ఆయన అందరిమీద దేవుని ఆత్మ క్రుమ్మరించును.  అపొ.కా.  2:1-2, 3-4

40.       45:23. ఆయన నామమందు దేవునికి ప్రతీ మోకాలు వంగును, ప్రతీ నాలుక స్తుతించును.  రోమా. 14:11

41.       48:12 ఆయనే ఆది మరియు అంతమునై ఉన్నాడు. ప్రకటన. 1:17

42.       48:17 ఆయనే మనలను విడిపించును/విమోచకుడు . తీతు 2:14

43.       49:1 గర్భములోనే నిన్ను పిలిచితిని.  మత్తయి 1:18

44.       49:5 యేసు తల్లి గర్భమునుండి సేవకుడు.  లూకా 1:31; ఫిలిప్పీ. 2:7

45.       49:6 ఆయనే ఇశ్రాయేలుకు రక్షకుడు.  లూకా 2:29-32

46.       49:6 అన్యులకు వెలుగు.  అపొ.కా.  13:47-48

47.       49:6  భూమి దిగంతముల వరకు ఆయనే రక్షణ

48.       50:4 ప్రయాసపడే వారికి ఆదరణ.  మత్తయి 11:28-29

49.       50:5 దేవుని చిత్తానికి లోబడేవాడు యేసు.  యోహాను 12:27

50.       50:6 కొట్టువారికి వీపును అప్పగించెను .  మత్తయి 27:26

51.       50:6 వెండ్రుకలు పెరికివేయు వారికి చెంపలను అప్పగించెను.  మత్తయి 26:67

52.       50:6 ఉమ్మివేయువారికి అవమాన పరచువారికి ముఖమును దాచుకోలేదు.  మత్తయి 27:30

53.       52:7 "సువార్త ప్రకటించువారి పాదములు పర్వతముల  మీద ఎంతో సుందరములు."  రోమా  10:13,14-15

54.       52:13 యేసు ఎంతగానో హెచ్చించబడును. ఫిలిప్పీ  2:9-11

55.       52:13 యేసు దేవునిసేవకుడు  ఫిలిప్పీ 2:5- 8

56.       52:14 "ఆయన ముఖము మనిషి రూపము కంటే వికారము".  లూకా 18:31-34;  మత్తయి 26:67-68;  మత్తయి 27:26-30

57.       52:15 అతడు అనేకులను చిలకరించును/సువార్త ప్రకటించును రోమా 15:18-21

58.       53:1 ప్రజలు ఆయనను నమ్మరు.  యోహాను 12:37-38

59.       53:2 అతడు పేద కుటుంబంలో పెరుగును.  లూకా 2:7

60.       53:2 సురూపమైనను సొగసైనను లేదు. Phil. 2:7-8

61.       53:3 అతడు తృణీకరించబడినవాడు.  లూకా 4:28-29

62.       53:3 మనుష్యుల చేత విసర్జించ బడినవాడు.  మత్తయి 27:21-23

63.       53:3 వ్యసనాక్రాంతుడు.  లూకా 19:41-42

64.       53:3 మనుష్యులు చూడనొల్లని వాడు. మార్కు 14:50-52,  మత్తయి 26:73-74

65.       53:4 స్వస్తత పరిచర్య గలవాడు.  మత్తయి 8:16-17

66.       53:4 లోక పాపములు భరించును. 1పేతురు 3:18

67.       53:4 దేవుని వలన బాదింప బడినవానిగాను మొత్తబడిన వానిగాను ఎంచబడును.  మత్తయి 27:41-43

68.       53:5 మన అతిక్రమములను భరించును.  లూకా 23:33

69.       53:5 మన సమాధానార్ధమైనశిక్ష భరించి దేవునికి మానవునికి సమాధానం కలుగజేయును. కొలస్సీ. 1:20

70.       53:5 ఆయన పొందిన గాయముల చేత స్వస్తత కలుగును. 1 పేతురు 2:24

71.       53:6 అతడు మానవుల అందరి దోషములను/పాపములను భరించును. గలతీ 1:4

72.       53:6 దేవుడు శరీరధారియై మన దోషములను వహించెను. 1 యోహాను 4:10

73.       53:7 అతడు దౌర్జన్యము పొందెను.  మత్తయి 27:27-31

74.       53:7 భాదించబడినను నోరు తెరువలేదు.  మత్తయి 27:12-14

75.       53:7 ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల.  యోహాను 1:29

76.       53:8 అన్యాయపు తీర్పు పొందును.  మత్తయి 27:22

77.       53:8 "సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడును".  మత్తయి 27:35

78.       53:8 జనుల అతిక్రమముల కోసం చనిపోవును. 1 యోహాను 2:2

79.       53:9 ధనవంతుని సమాధిలో పాతిపెట్టబడును.  మత్తయి 27:57-60

80.       53:9 అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట కపటం లేదు.  యోహాను 18:38

81.       53:10 అతడు మానవులకోసం చనిపోవడమే దేవుని చిత్తము. యోహాను 18:11

82.       53:10 ఆయన అపరాద పరిహారార్ధ బలియగును.  హెబ్రీ 10:12

83.       53:10 అతడు తిరిగిలేచును, దీర్ఘాయుష్మంతుడగును. ప్రకటన 1:17-18

84.       53:10 అతడు అభివృద్ధి చెందును.  యోహాను 17:1-5

85.       53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును.  యోహాను 12:27

86.       53:11 అతడు దేవుని యొక్క నీతిమంతుడైన సేవకుడు.  యోహాను 17:4

87.       53:11 అతడు తనకు కలిగన అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.  రోమా. 5:8-9

88.       53:11, 12 జనముల దోషములను భరించును.  హెబ్రీ 9:28

89.       53:12 అనేకుల పాపముల కోసం చనిపోయి అనేకుల పాపములను భరించును.  హెబ్రీ 2:9

90.       53:12 "అతిక్రమము చేయువారితో కూడా ఎంచబడెను".  మత్తయి 27:38

91.       53:12 తిరుగుబాటు చేయువారికోసం విజ్ఞాపణం చేయును.  లూకా 23:34

92.       55:3 దేవుడు మరణమునుండి అతనిని లేపెను. అపొ.కా. 13:34

93.       55:4 అతడు జనములకు సాక్షిగా నియమించ బడెను.  యోహాను 18:37

94.       59:15-16 మానవులకు దేవునికి మధ్యవర్తిగా పంపబడెను.  యోహాను 6:40

95.       59:20 సీయోను విమోచకుడు.  లూకా 2:38

96.       60:1-3 యేసు లోకానికి వెలుగు.  లూకా 2:32

97.       61:1-2 "యెహోవా ఆత్మ అతనిమీద ఉండెను".  లూకా 4:18

98.       61:1-2 దీనులకు సువార్త ప్రకటించును.  లూకా 4:18

99.       61:1-2 పాప బంధకములలో ఉన్నవారికి విడుదల కలిగించును.  లూకా 4:18

100.    61:1-2 ఆయన రాకతో దేవుని కృప లోకానికి వచ్చును.  లూకా 4:19

101.    62:1-2 క్రొత్త పేరుతో పిలువబడును.  మత్తయి 1:21

102.    65:9 ప్రజలు దేవుని సొత్తుగా పిలువబడుడురు , ఎఫెసీ  1:11, 1 పేతురు 1:2-4

 

గమనించాలి ఇవన్నీ క్రొత్త నిబంధనలో ఉపయోగించినవి మాత్రమే!  యెషయా గారు జీవించిన కాలంలో నాలుగు రాజుల కాలంలో అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి అని గమనించాలి!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*6వ భాగము-ఉపోద్ఘాతము-6*

*నెరవేరిన చారిత్రాత్మక ప్రవచనాలు*

యెషయా 9:67

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

    ప్రియ దైవజనమా! యెషయా గారు ప్రవచించిన కొన్ని చారిత్రాత్మక ప్రవచనాలు ఎప్పుడో నెరవేరాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మాత్రమేచూసుకుందాం!

 

యెషయా 3:18 యేరూషలేము పాడై పోతుంది పోషణమును పోషణాధారమును అన్నమును నీరును యేరూషలేములో ఉండకుండా చేయును, శూరులు, యోధులు, న్యాయాధిపతులు మంత్రులు మాంత్రికులు సోదే గాళ్ళు యేరూషలేములో నుండి తీసివేయబడును

BC 722-721 లోఅస్సీరియా ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకుపోయింది.

 BC 609 లో ఫరోనెకో యెహోయాహాజును రాజుగా చేస్తాడు.

 BC 605 లో నెబుకద్నేజరు ఈజిప్టుని గెలిచి ఇశ్రాయేలీయులకు- ఐగుప్తీయులకు ఉన్న alliance భంగంచేస్తారు.

 BC 597 లో నెబుకద్నేజర్ స్వయంగా యేరూషలేముమీదకు దండెత్తి వస్తాడు

BC 592 లో సిద్కియా తన సైన్యాధిపతి, సలహాదారుల సలహాలు ఆలకించి నెబుకద్నేజర్ మీద తిరుగబడతాడు.

 BC 588  జూలై నెలలో యేరూషలేము ముట్టడి వేయబడుతుంది.

 BC 587 లో నెబుకద్నేజర్ స్వయంగా వచ్చి యేరూషలెంమీద దండెత్తుతాడు.

 BC 586 ఆగష్టు, 14 వ తారీకున యేరూషలేము పట్టణం పట్టబడి, పడగొట్టబడుతుంది, మందిరం అగ్నితో కాల్చబడింది.

 

ఈ రకంగా మొదట షోమ్రోను అనబడే పది గోత్రాల వారు, యూదా అనబడే రెండు గోత్రాల వారు మొత్తం చెరలోనికి వెళ్ళిపోయారు! కేవలం దిక్కులేని వారు కడుపేద వారు మాత్రమే విడిచిపెట్ట బడ్డారు .2రాజులు 25:11,12 ప్రకారం!!!

 

యెషయా 6:1113 మనుష్యులు లేకుండా దేశము పాడై పోవునుఇది కూడా BC 586 లో నెరవేరింది

యెషయా 7:710    65 సంవత్సరాలలో ఎఫ్రాయిము అనగా షోమ్రోను పది గోత్రాలు గల ఇశ్రాయేలు రాజ్యము- జనము కాకుండా పోతుంది అనగా రాజ్యముగా ఉండకుండా నశించిపోతుంది!--- 

ఈ ప్రవచనం BC 722-721 మధ్యలో నెరవేరింది! ఆష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజలను చెరలోనికి తీసికొని పోయి అన్యజనులను అనగా ఇతర దేశాలలో చెర పట్టబడిన వారిని ఇశ్రాయేలు దేశంలో పెట్టాడు- వారే సమరయులు అనగా సంకరజాతి వారు! 2రాజులు 17

 

యెషయా 8:14   ఆ బాలుడు అమ్మా నాన్న అనక మునుపు ఆష్షూరు రాజు దమస్కు యొక్క ఐశ్వర్యము అనగా సిరియా దేశము యొక్క ధనమును, షోమ్రోను యొక్క ఐశ్వర్యము అనగా ఇశ్రాయేలు దేశం యొక్క ధనమును ఎత్తుకుని పోతాడు!

ఇది రాజైన హిజ్కియా పాలనకు ముందుగానే అనగా ఇశ్రాయేలు రాజైన హోషేయ పాలనలో జరిగిపోయింది! శల్మనేశార్-5 దండెత్తి సిరియాను గెలిచి దాని ఐశ్వర్యమును నీనేవే పట్టణానికి తీసుకుని పోయాడు అదే విధముగా ఆ తర్వాత షోమ్రోనుని గెలిచి ధనమును ఉత్తర  ఇరాక్ కి తీసుకుని పోయాడు! 2రాజులు 17వ అధ్యాయం!!

 

యెషయా 10:519 అస్సీరియా సామ్రాజ్యము నాశనమై పోతుంది!  

అస్సీరియా సామ్రాజ్యము క్రీ.పూ. 8 వ శతాబ్దములో ప్రారంభమై క్రీ.పూ 6వ శతాభ్దములో అంతమైపోయింది!  రాజైన నెబుకద్నేజర్ యొక్క తండ్రి అస్సీరియా సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెల్లగించాడు. మిగిలిన నాశనం బబులోను రాజైన అనగా దక్షిణ ఇరాక్ రాజైన నెబుకద్నేజర్ చేశాడు!

 

యెషయా 13 బబులోను లేక కల్దీయులు సర్వ రాజ్యాలను ఆక్రమించు కుంటారు. ఆ తర్వాత బబులోను సర్వనాశనం అయిపోతుంది!

దీనికోసం చరిత్రలో చూసుకుంటే బబులోను సామ్రాజ్యం మొదలుపెట్టింది

1)నెబుకద్నెజర్  రాజుయొక్క తండ్రి నెబోపోలస్సార్, ఆ తర్వాత నెబుకద్నెజర్ 43 సంవత్సారాలు పాలించాడు. బబులోను సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది కూడా నెబుకద్నెజర్. BC 605 నుండి 562 వరకు పాలించాడు.

2) అతనికొడుకు ఎవిల్-మెరోదాక్ 2 సం.లు; BC 561560

౩)ఎవిల్-మెరోదాక్ని చంపి అతని అల్లుడు నెరిగ్లిస్సర్ 4 సం.లు; BC 560556

4) నెరిగ్లిస్సర్ కొడుకు లాబాస్ముర్డుక్ 9 నెలలు BC 556(ఒక సంవత్సరం కంటే తక్కువకాలము)

5) నెబుకద్నేజర్ రెండవభార్య కొడుకు నబోనిదాస్- 1౩సం.లు; BC 555542;

6) నెబుకద్నేజర్ మనవడు, నబోనిదాస్ కొడుకు బెల్షస్సర్ ౩సం.లు ; BC 542539..........

 

అయితే గమనించాలి నబోనిదాస్ మరియు బెల్షస్సర్ కలిసి పాలించారు కాబట్టి కొన్ని చరిత్ర పుస్తకాలలో బెల్షస్సర్ 555 నుండి క్రీ.పూ 539 వరకు పాలించినట్లు చూడవచ్చు. చివరి మూడు సంవత్సరాలు ఆయన ఒక్కడే పాలించాడు. ఈ బబులోను సామ్రాజ్యం క్రీ.పూ. 539 లో కోరేషు బెల్షస్సర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో ముగిసింది. అనగా బబులోను సామ్రాజ్యం BC 605 నుండి 539 వరకుసాగింది.

ఈ విధంగా బబులోను సామ్రాజ్యం BC 539 లో మాదీయ- పారశీక అలయన్స్ సామ్రాజ్యము ద్వారా అంతమైపోయింది!

 

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే గత పది సంవత్సరాల క్రితం మరోసారి బబులోను దేశం సర్వనాశనం అయిపోయింది అమెరికా దాడుల ద్వారా సద్దాం హుస్శేన్ సమయంలో! 

మరీ ముఖ్యమైన విషయమేమిటంటే ఇది మరోసారి నెరవేరబోతుంది! ఎప్పుడంటే రెండో రాకడ సమయంలో- అయితే ఇది నిజమైన అనగా అక్షరార్ధమైన బబులోను కాదు! ఆత్మీయ బబులోను లేక మర్మమై యున్న బబులోను- ఇదే దానియేలు గ్రంధంలో, ఇంకా ప్రకటన గ్రంధంలో పునరుత్థరించబడే బబులోను అనగా రోమా సామ్రాజ్యం- దీనిని దేవుడు తీర్పుకాలంలో మరోసారి నాశనం చేస్తారు అంత్యదినాలలో!!

 

యెషయా 15, 16 అధ్యాయాలు: మోయాబు దేశం నాశనమైపోతుంది! ఇది రెండుసార్లు జరిగింది- ఆష్షూరు రాజు చేతను, బబులోను రాజుచేతను జరిగింది క్రీ.పూ 6వ శతాబ్దంలోను 5వ శతాబ్దం లోను!

 

యెషయా 17వ అధ్యాయం:  దమస్కు అనగా సిరియా దేశం సర్వనాశనం అయిపోతుంది!  ఇది మొదటగా రాజైన శల్మనేశార్ -5 కాలంలో జరిగింది. అదేవిధంగా బబులోను సామ్రాజ్యం నిర్మించాక మరోసారి నెబుకద్నేజర్ రాజు ద్వారా మరోసారి ద్వంసం చేయబడింది

 

యెషయా 18, 19, 20 అధ్యాయాలు: ఐగుప్టు దేశం నాశనమైపోతుంది:  ఇది ఆష్షూరు రాజైన శల్మనేశార్-5 కాలంలోనూ, ఆష్షూరు రాజైన సర్గోను కాలంలోనూ, బబులోను రాజైన నెబుకద్నేజర్ కాలంలోనూ జరిగింది. సుమారుగా మూడుసార్లు సర్వనాశనం అయ్యింది!

 

యెషయా 21:110 బబులోను దేశం పాడైపోతుంది. సామ్రాజ్యం నాశనమై పోతుంది!  మీదన వివరించినట్లు ఇది మాదీయ-పారశీక అలయన్స్ సామ్రాజ్యము ద్వారా క్రీ.పూ. 539 లో జరింగింది!

 

21:1112: ఎదోము దేశం నాశనం అయిపోతుంది. ఎదోము అనగా ప్రస్తుతపు ఇరాక్! ఇది నెబుకద్నేజర్ ద్వారా, మాదీయ-పారశీక అలయన్స్ సామ్రాజ్యం ద్వారా మరియు అలగ్జాండర్ ద గ్రేట్ ద్వారా, ఇంకా అమెరికా ద్వారా నాశనమైపోయింది.

 

21:1317 అరేబియా దేశాలు చెరపట్ట బడతాయి:  ఇవి అలగ్జాండర్ ద్వారా మరియు రోమా సామ్రాజ్యము ద్వారా జరిగాయి

 

22:118  యేరూషలేము పట్టబడి కాల్చబడుతుంది! ఇది BC 586 ఆగష్టు 14 న నెబుకద్నేజర్ ద్వారా జరిగింది!

 

23:118 తూరు దేశం : నెబుకద్నేజర్ ద్వారా జరిగింది

 

యెషయా 45:114 : కోరేషు అనే రాజుద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెర విముక్తి మరియు మందిర నిర్మాణం జరుగుతుంది!

BC 539 లో బబులోను సామ్రాజ్యాన్ని కూల్చి మాదీయ- పారశీక అలయన్స్ రాజైన కోరేషు- ఇశ్రాయేలు దేశం మీద మాదీయుడైన దర్యావేషుని రాజుగా నియమించి అనేక దేశాలలో చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి వెళ్ళవచ్చు అనియు, అక్కడ మందిరం కట్టవచ్చు అనియు ఆజ్ఞాపించాడు!

 

ప్రియులారా! ఇది కేవలం ఇశ్రాయేలీయుల చెరనుండి విముక్తి చేయడానికే దేవుడు కోరేషును ఏర్పాటుచేసుకుని ఆయన గెలిచేలా చేశారు. ద్వారములు వేయకుండా తలుపులు తీస్తాను అనగా ఆ తలుపులు బబులోనునగరం యొక్క నది తలుపులు/గేట్లు. అందుకే వెంటనే ఆయన రాజ్యపరిపాలనకు వచ్చిన వెంటనే ఇశ్రాయేలీయులు తిరిగి తమదేశానికి వెళ్లిపోవచ్చు అని శాసనంచే శాడు. 2దినవృత్తా 36:23;.ఎజ్రా 1:2;

యెషయా 62:112 యేరూషలేము తిరిగి కట్టబడుట: మీదన చెప్పిన వివరణ! కోరేషు ఆజ్ఞతో మందిరం కట్టబడింది, గాని నెహేమ్యా గారి ఆద్వర్యంలో యేరూషలేము పట్టణం కోటగోడలు తిరిగి నిర్మించబడ్డాయి.

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*7వ భాగము-ఉపోద్ఘాతము-7*

యెషయా 9:68

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

    ప్రియ దైవజనమా! యెషయా గారు ప్రవచించిన కొన్ని చారిత్రాత్మక ప్రవచనాలు ఎప్పుడో నెరవేరాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మాత్రమేచూసుకుందాం!

 

*యేసుక్రీస్తుప్రభులవారి కోసమైన చారిత్రాత్మక ప్రవచనాలు*

 

యెషయా 7:14... కన్యక గర్భమందు జన్మిస్తారు,

14. కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

 

 మత్తయి 1:22,23

22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

23. అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

 

9:610 ఆయన ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన యువరాజు, దావీదు సింహాసనం యుగయుగాలు ఏలును 

లూకా 1:2636

Luke(లూకా సువార్త) 1:31,32,33,34,35

31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

34. అందుకు మరియ   నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

35. దూత: పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

ఇది చరిత్రకారుల లెక్క ప్రకారం క్రీ.పూ 4 లో జరిగింది

 

యెషయా 61 మరియు 42 అధ్యాయాలు: దీనులకు సువార్త ప్రకటించి వ్యాధిగ్రస్తులను స్వస్తపరచును:

Isaiah(యెషయా గ్రంథము) 61:1,2,3

 

1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 

క్రొత్త నిబంధన నాలుగు సువార్తలు

 

యెషయా  53: ఆయన పడే భాధలు, మరణం, పునరుత్థానం : నాలుగు సువార్తలు

 

ఈ రకంగా యెషయా దైవజనుడు ప్రవచించిన ప్రవచనాలు చారిత్రాత్మకంగా నెరవేరాయి. ఇంకా రెండవరాకడ కోసం, వెయ్యేండ్ల పాలనకోసం శాశ్వత రాజ్యం కోసం, దుష్టులకు కలుగబోయే తీర్పులు అనెడి యెహోవాదినము కోసం చెప్పిన ప్రవచనాలు నూటికి నూరుపాళ్ళు జరిగి తీరుతాయి!

 

ప్రియ సహోదరుడా! సహోదరీ! ఆయన రాకడ అతి సమీపముగా ఉంది! మరి నీవుసిద్ధంగా ఉన్నావా? రాకడలో ఎత్తబడే విధంగా ఉన్నావా?

ఒకసారి సరిచూసుకుని సరిచేసుకో!

 

విషయ సూచిక:

దుర్మార్గానికి పాల్పడి చెడిపోయిన యూదులు 1:2-10

వారి దొంగ మత భక్తిని దేవుడు తిరస్కరించాడు 1:11-17

దేవుడిచ్చిన ఆహ్వానం, వాగ్దానం, హెచ్చరిక 1:18-20

జెరుసలం పై దేవుని తీర్పు, ఒక క్రొత్త దినం గురించి ఆయనిచ్చిన వాగ్దానం 1:21-31

రానున్న దేవుని రాజ్యం 2:1-5

ప్రభువు దినం 2:6-22

యూదా, జెరుసలం పై తీర్పు 3:14:1

ప్రభువు కొమ్మ 4:2-6

దుష్టమైన ద్రాక్షతోట 5:1-7

బాధ తప్పదు 5:8-30

దేవుడు యెషయాను పిలిచి, పవిత్రపరచి, ముందుకు పంపించాడు 6:1-13

ఆహాజు రాజు 7:1-12

కన్యక కుమారుడు 7:14

యూదులను శిక్షించడానికి దేవుడు అష్షూరు రాజ్యాన్ని వాడడం 7:188:10

రానున్న రక్షకుడైన యేసుక్రీస్తును గురించి దేవుని మూలంగా వచ్చిన మాటలు

“మనకు శిశువు కలిగాడు” 9:1-7

సర్వశక్తుడైన దేవుని కోపం 9:810:4

అష్షూరుపై దేవుని శిక్ష 10:5-34

యెష్షయి మొద్దునుండి చిగురు, క్రీస్తు భవిష్యత్ రాజ్యం 11:1-16

స్తుతి గీతం 12:1-6

ఇతర దేశాలగురించి దేవుని నుంచి వచ్చిన మాటలు 13:124:22

బబులోను గురించి 13:114:23

“వేకువ చుక్క” (లూసీఫర్‌) పడిపోవడం 14:12-15

అష్షూరు గురించి 14:24-27

ఫిలిష్తీయుల గురించి 14:28-32

మోయాబు గురించి 15:116:14

దమస్కు గురించి 17:1-14

నదులకు ఆవలనున్న ప్రాంతాల గురించి, ఇతియోపియా (కూషు) గురించి 18:1-7

ఈజిప్ట్ గురించి 19:1-25

ఈజిప్ట్, కూషు గురించి 20:1-6

బబులోను గురించి 21:1-10

ఎదోము గురించి 21:11-12

అరేబియా గురించి 21:13-17

జెరుసలం గురించి 22:1-18

తూరు గురించి 23:1-18

లోకములో ప్రజల గురించి 24:1-22

యెహోవాదేవుడు జెరుసలంలో పరిపాలన చేస్తాడు 24:23

యెహోవా దేవునికి స్తుతి పలుకులు 25:1-12

యూదాలో పాడవలసిన పాట 26:1-21

దేవుడు ఇస్రాయేల్‌ను విమోచిస్తాడు 27:1-13

ఇస్రాయేల్‌లో త్రాగుబోతులు, పరిహాసకులు 28:1-29

అమూల్యమైన మూలరాయి 28:16

జెరుసలంకు చేటు 29:1-16

హెచ్చరికల మధ్య వాగ్దానాలు 29:17-24

మూర్ఖ జనానికి (ఇస్రాయేల్‌కు) చేటు 30:1-17

మరికొన్ని దీవెనలకు సంబంధించిన వాగ్దానాలు 30:18-26

దేవుడు కోపంతో వస్తాడు 30:27-33

దేవుని మీద కాక మనుషుల మీద ఆధారపడిన వారికి బాధ 31:1-3

దేవుడు జెరుసలంను కాపాడతాడు 31:4-9

నీతిగల క్రీస్తు రాజ్యం 32:1-20

మనుషులనుండి కష్టాలు, పై నుండి సహాయం 33:1-24

భక్తిహీనమైన దుర్మార్గమైన ఇహలోక శక్తులను దేవుడు నాశనం చేస్తాడు 34:1-17

దేవుడు విమోచించిన వారికి ముందు దొరికే దివ్య స్థితి 35:1-10

సన్‌హెరీబు చేతులలో నుండి జెరుసలంను దేవుడు రక్షించాడు 36:137:38

హిజ్కియా ప్రార్థన 37:14-20

సన్‌హెరీబు గురించి యెషయా దేవుని మూలంగా పలికినది 37:21-35

సన్‌హెరీబు సైన్యాలు అద్భుత రీతిలో నాశనమయింది 37:36-37

హిజ్కియాకు జబ్బు చేయడం, ఆరోగ్యం చేకూరడం 38:1-22

హిజ్కియా వ్రాత 38:9-20

బబులోను నుండి రాజదూతలు రావడం,

హిజ్కియా అహంకారం 39:1-2

హిజ్కియాను యెషయా మందలించి, దేవుని తీర్పును ప్రకటించాడు 39:3-8

యెహోవాదేవుడు తన ప్రజలను ఆదరించేవాడు 40:1-31

ఆదరణ సందేశం రక్షకుని గూర్చి వాగ్దానం 40:1-11

ఆదరణకు ఆధారం దేవుని గొప్పతనం 40:12-31

ఇస్రాయేల్‌కు సహాయకుడైన దేవుడు 41:146:13

భూరాజ్యాలతో దేవుని వివాదం 41:1-29

దేశాలు విగ్రహాలను చేసుకొని వాటిమీద ఆధారపడడం 41:5-7

దేవుని దాసుడైన ఇస్రాయేల్ 41:8-20

భూరాజ్యాల విగ్రహాలు లేక దేవుళ్ళు భవిష్యత్తును గురించి చెప్పలేవు 41:21-29

యెహోవా సేవకులు 42:1-9

దేవునికి స్తుతి 42:10-17

ఇస్రాయేల్ ఆత్మసంబంధమైన గ్రుడ్డితనం 42:18-25

సహాయకుడు, రక్షకుడు యెహోవా దేవుడు మాత్రమే 43:1-13

నమ్మదగని ఇస్రాయేల్, దేవుని కనికరం,

“ఎడారిలో సెలయేళ్ళు” 43:14-28

దేవుడు ఇస్రాయేల్‌ను దీవిస్తాడు 44:1-5

విగ్రహాలు పనికిమాలినవని నిజ దేవుడు బయట పెడతాడు 44:6-20

ఇస్రాయేల్ విమోచన పొందాలి, జెరుసలం తిరిగి కట్టబడాలి 44:21-28

యెహోవా కోరెషును లేవనెత్తడం 45:1-14

ఏకైక దేవుడు అందరికీ ఆహ్వానమిస్తాడు 45:18-25

బబులోను విగ్రహాలు ఏమీ చేయలేవు, దేవుడు అన్నీ చేయగలడు 46:1-13

బబులోను పతనం 47:1-15

భక్తిహీనంగా, మూర్ఖంగా ఉన్న ఇస్రాయేల్‌కు సందేశం 48:1-22

యేసుప్రభు యెహోవా సేవకుడు 49:155:13

దేవుని సంకల్పాలు 49:5-7

ఆయన ఇస్రాయేల్‌ను కాపాడతాడు 49:8-26

ఆయన విధేయత, ఇస్రాయేల్ అవిధేయత 50:1-11

ఆయనను నిందించడం, ఆయన మీద ఉమ్మివేయడం 50:6-7

ఆయన విమోచన 51:1-16

దేవుని ఉగ్రత పాత్ర 51:17-23

ఆయన జెరుసలంకు తిరిగి వస్తాడు 52:1-12

యెహోవా సేవకుని బాధలు, విజయం 52:1353:12

ఆయన అనుభవించిన బాధల ఫలితంగా ఇస్రాయేల్‌కు గొప్ప దీవెన 54:1-17

యేసుప్రభు బాధల ఆధారంగా ఆహ్వానం 55:1-7

మానవుని మార్గాలకంటే దేవుని మార్గాలు మహోన్నతమైనవి 55:8-13

ఇస్రాయేల్ దీవెనలలో ఇస్రాయేల్ ప్రజలు కానివారు పాలుపొందుతారు 56:1-8

ఇస్రాయేల్ దుష్ట పాలకుల ఖండన 56:957:13

సాత్వికులకు ఆదరణ 57:14-21

యథార్థమైన ఆరాధనకు, అబద్ధమైన దానికి మధ్యగల వ్యత్యాసం 58:1-14

ఇస్రాయేల్ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు దేవుడిచ్చే విమోచన అందుబాటులో ఉంటుంది 59:1-21

ఇస్రాయేల్‌కు శాంతి సమాధానాలు, సంపదలు 60:1-22

యేసుప్రభు ఆత్మతో నిండిన యెహోవా సేవకుడు, ఆయనద్వారానే ఘనమైన దేవుని రాజ్యం వస్తుంది

61:1-11

జెరుసలం నిర్మాణం, ఘనస్థితికి రావడం 62:1-12

ప్రతీకార దినం, విమోచన దినం 63:1-6

దేవుని ప్రజల స్తుతి, ప్రార్థన 63:764:12

దేవుని జవాబు 65:166:24

ఆయన ఇతర ప్రజల గురించి చెప్పాడు 65:1

ఇస్రాయేల్ మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని,

దొంగ భక్తిని ఆయన ఖండించాడు 65:2-5

ఆయన పగతీర్చుకుంటాడు గాని తన నిమిత్తం ఇస్రాయేల్‌లో

కొందరిని ఉంచుకుంటాడు 65:6-16

ఆయన నూతన భూమినీ ఆకాశాన్నీ సృష్టిస్తాడు 65:17-25

ఆయన సాత్వికులను సన్మానిస్తాడు 66:1-2

ఆయన ఇస్రాయేల్‌ను రక్షిస్తాడు గాని పశ్చాత్తాపపడని

పాపుల పై తప్పక తీర్పును అమలు చేస్తాడు 66:3-24

 

ప్రభువైన యేసూ రమ్ము!!

మరనాత!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*8వ భాగము*

యెషయా 6:14

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

4. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా ..

 

    ప్రియ దైవజనమా! ఇంతవరకు మనము నెరవేరిన యెషయా గారు ప్రవచించిన కొన్ని చారిత్రాత్మక ప్రవచనాలు కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక గ్రంధాన్ని అందులో ప్రవచనాలను ధ్యానం చేసుకుందాం! అయితే ముందుగా నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుని ఆ తర్వాత మనం అన్ని ప్రవచనాలు ధ్యానం చేసుకుందాం!

 

యెషయా 1:1 లో ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా రాజుల కాలంలో ఆమోజు కుమారుడైన యెషయాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు అని ఉంది! అనగా పై నాలుగు రాజుల కాలంలో అతడు పరిచర్య చేసినట్లు తెలుస్తుంది. దీనికోసం ఉపోద్ఘాతంలో వివరంగా చూసుకున్నాము! ఉజ్జియా రాజు చనిపోయే ముందు అనగా సుమారుగా క్రీ,పూ. 744 కాలంలో యెషయా గారు పరిచర్య ప్రారంభించారు!  అయితే ఉజ్జియా కాలంలో ప్రవచించిన ప్రవచనాలు జరిగిన సంభవాలు మనకు యెషయా గ్రంధములో గాని, రాజుల గ్రంధములలో గాని దినవృత్తాంతాల గ్రంధాలలో గాని లేదు! దానికోసం చూసుకోవాలంటే మనం జరిగిన సంగతి కొంచెం వివరంగా చూసుకోవాలి!

మనము మొదటగా ఉజ్జియా రాజు కాలంలో జరిగిన సంగతులు ధ్యానం చేసుకుందాం!

 

యెషయా 6:1లో రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమందు నేను అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉండుట చూశాను అంటూ మొదలుపెట్టారు! అయితే ఇక్కడ మనకు రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరము అన్నారు గాని మృతినొందక ముందో మృతినొందిన తర్వాతనో స్పష్టముగా చెప్పలేదు! అయితే చరిత్రకారులు మరియు బైబిల్ పండితుల అధ్యయనం ప్రకారం- మృతినొందిన తర్వాతనే యెషయా గారు పరలోక దర్శనం పొందుకున్నారు! అసలు ఏమి జరిగింది అంటే రాజు మంచోడే గాని దేవుడు కోపగించి తన దర్శనం ఇవ్వడం మానేశారు! ఎందుకు మానేశారో తెలుసుకోవాలంటే మనం 2రాజుల గ్రంధం 15:17  మరియు  రెండో దినవృత్తాంతాల గ్రంధం 26:123 వరకు చూడాల్సిన అవసరం ఉంది!

2రాజులు 15వ అధ్యాయంలో అతడు 16 సంవత్సరాల వయస్సులో రాజ్యపాలన ప్రారంభించి 52 సంవత్సరాల కాలం పరిపాలన చేశాడు.  3వ వచనం ప్రకారం అజర్యా తన తండ్రియైన అమజ్యా చర్యల ప్రకారం యెహోవాను సరిగానే అనుసరించాడు అని ఉంది. మరి ఇంతటి భక్తిపరుని పట్ల దేవునికి కోపం ఎలా వచ్చింది!  కారణం 5వ వచనం ప్రకారం యెహోవా అతని మొత్తెను అని ఉంది ఇంతటి భక్తిపరుని మొత్తాల్సిన అవసరం దేవునికి ఏమొచ్చింది? ఆయన కరుణాసంపన్నుడు న్యాయవంతుడు కదా!!!

 

కొంచెం వివరంగా చూసుకుంటే ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాము- యెహోయూదా అనే ప్రధానయాజకుడు బ్రతికి ఉన్నంత కాలము రాజైన యోవాసు మరియు అతని కుమారులు అనగా ఉజ్జియా రాజు తండ్రి అమజ్యా, యెషయా గారి తండ్రి ఆమోజు భక్తిమార్గంలో నడిచారు! ఆ భక్తి వారి కుమారులకు అనగా అమజ్యా కుమారుడైన ఉజ్జియాకు, ఆమోజు కుమారుడైన యెషయా గారికి వచ్చింది! యెహోయూదా గారు చనిపోయాక  యోవాసు, అతని కుమారుడు అమజ్యా చెడిపోయారు! యెహోయూదా గారి కుమారుడైన జెకర్యాను చంపించారు.

గమనించాలి- ఈ జెకర్యా మనకు పాతనిబంధన గ్రంధంలో కనిపించే చిన్న ప్రవక్త జెకర్యా గారు కాదు! ఆయన తండ్రి పేరు బెరక్యా!  ఈ జెకర్యా గారి యొక్క తండ్రి ప్రధాన యాజకుడైన యెహోయూదా, అతనికే మరో పేరు లేక బిరుదు ఉంది- అది యేబెరాక్యా!!!

 

అమజ్యా చెడిపోయినా గాని నీతిమార్గం తప్పలేదు అనగా దేవుని నుండి పూర్తిగా తొలిగిపోలేదు గాని ప్రజలు విగ్రహారాదికులు అయిపోతే చూసీచూడనట్లు వదిలేశాడు! గాని అతని కుమారుడైన ఉజ్జియా దేవుణ్ణి హత్తుకుని నడిచాడు!  మరి దేవుడు ఎందుకు మొత్తారు అతనిని?

 

 దానికి జవాబు 2దినవృత్తాంతాల 26 లో ఉంది. గమనించాలి రాజుల గ్రంధంలో ఉజ్జియా పేరు అజర్యా అని ఉంటుంది, ఇక్కడ అనగా దినవృత్తాంతాల గ్రంధంలోనూ యెషయా గ్రంధంలోనూ ఉజ్జియా అని ఉందేమిటి అని ఆశ్చర్యపడవద్దు! అజర్యా అనేది ఆయన మరో పేరు లేక ముద్దుపేరు!!!

 

ఇక్కడ 4వ వచనంలో అతడు యెహోవా దృష్టికి సరిగానే ప్రవర్తించెను అని వ్రాయబడింది. ఇంకా దేవుని దర్శనాల విషయంలో అతనికి జెకర్యా ఉపదేశించేవాడు. జెకర్యా బ్రతికినంత కాలం ఉజ్జియా యెహోవాను వెదికి అనుసరించాడు అని వ్రాయబడి ఉంది! ఇంకా అతడు యెహోవాను వెదికినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లేలా చేశారు అని వ్రాయబడింది. అతడు ఎన్నో విజయాలు పొందుకున్నాడు దేవుని ద్వారా! అలాగే దేవునికోసం కూడా ఎన్నెన్నో కార్యాలు చేశాడు!  యేరూషలేము పట్టణం కోసం, మందిరం కోసం, వ్యవసాయం కోసం ఎన్నెన్నో కార్యాలు చేశాడు!  అతడు స్థిరమయ్యే వరకు దేవుని నుండి అద్భుతమైన సహాయం కలిగింది అని 15వ వచనం చెబుతుంది మనకు! 

 

అయితే 16వ వచనంలో అంటున్నారు: ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను.

మనిషిలో గర్వం ప్రవేశించింది అంటే పడిపోతున్నాడు అన్నమాట! చెడిపోతున్నాడు అన్నమాట!  ద్వితీ 32:15 లో యెషూరూను అనగా యాకోబు క్రొవ్విన వాడై కాలు జాడించెను అని ఉంది. నిజానికి యాకోబు గారు దేవునిమీద కాలు జాడించలేదు! ఇక్కడ యెషూరూను అనగా యాకోబు అనగా యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు గర్వించి దేవునిమీద  కాలుజాడించి తమను పుట్టించిన దేవుణ్ణి విడిచారు అని వ్రాయబడింది.

 

సామెతలు 16:18 లో నాశనమునకు ముందు గర్వము నడుచును ఇంకా పడిపోవడానికి ముందు మనిషిలో అహంకారమైన మనస్సు నడచును అంటున్నారు గ్రంధకర్త!! అలాగే ఇక్కడ ఉజ్జియా గారు చెడిపోయే ముందు ఎంతగానో గర్వించి అహంకారమైన మనస్సుతో ప్రవర్తించారు!

 

ఇంకా సామెతల గ్రంధకర్త 29:23 లో అంటున్నారు ఎవరి గర్వం వారిని హీనదశకు తీసుకుని వెళ్తుంది, వినయం మరియు అణుకువగలవారు ఎంతో గౌరవం పొందుతారు అంటున్నారు!

 

   ప్రియమైన సహోదరి సహోదరుడా! ప్రియ చదువరీ! గర్వం గడ్డిమేయిస్తుంది. రాజైన నెబుకద్నెజర్ గర్వించాడు ఏడు సంవత్సరాలు గడ్డిమేశాడు గాడిదలా! గర్వించిన ప్రతీవాడు అలాగే అయ్యాడు! ఆష్షూరు రాజు గర్వించాడు బెన్హదదు ఘోరమైన మరణం పొందాడు! ఒకవేళ నీలో గర్వముందా ప్రియ స్నేహితుడా ఇప్పుడే వదిలేయ్! లేకపోతే నీవు కూడా పడిపోతావ్! నీవు కూడా గడ్డిమేస్తావు!

నేడే పరిశీలించుకుని దానిని వదిలేయ్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*9వ భాగము*

యెషయా 6:14

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

4. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా ..

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము! మొదటగా ఉజ్జియా రాజు కాలంలో జరిగిన సంభవాలు- దేవుడు అతనిని ఎందుకోసం మొత్తారో ధ్యానం చేసుకుంటున్నాము!

 

    గతభాగంలో అతడు మనసున గర్వించి చెడిపోయినట్లు చూసుకున్నాము! అయితే గర్వించి ఏమి చేశాడో చూసుకుందాం!

 2దినవృత్తాంతాల 26:16 లో అతడు ఏమిచేశాడంటే మనసున గర్వంచి యెహోవాకు దూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి దూపవేదిక పైకి ఎక్కాడు! గమనించాలి ఇంతవరకు అతడు చేసే ప్రతీ పనిని ప్రతీ కార్యమును దేవుడు ఆశీర్వదిస్తున్నారు కదా అనుకుని నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని కోరుకున్న వ్యక్తిని అనుకుని దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేఖంగా లేవీయులైన యాజకులు చేయాల్సిన పనిని అతడు చేద్దాం అనుకున్నాడు! నిజానికి ఎవరికి దూపం వేద్దాము అనుకున్నాడు ఈ రాజు! దేవాదిదేవుడు రాజులరాజైన యెహోవా దేవునికే! అన్యజనుల విగ్రహాలకు కానేకాదు! గాని దేవుడు ఎందుకు కోపగించారు అంటే దూపము తీసుకుని వెళ్లి యాజకుల చేతిలో పెట్టాల్సినంత వరకే అతని పని! గాని దూపము వేయడం- యాజకుల పని! యాజకులను ప్రక్కన పెడదాం నేనే దేవునితో సహవాసం పెంచుకుందాం అనుకున్నాడు! గమనించాలి ధర్మశాస్త్ర కాలంలో అది సామాన్య మానవుల పని కాదు! అందుకే కదా సామాన్య మానవులు కూడా ఏవిధమైన బలులు రక్తము తీసుకుని వెళ్లి బలి అర్పించి ప్రార్ధించాలి అనే దానిని కొట్టివేయాలి అనడానికే కదా యేసుక్రీస్తుప్రభులవారి దివ్యబలియాగం!!! ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు కొట్టివేయబడింది! గాని ఆ రోజులలో ఎవరిపని వారే చెయ్యాలి!  రాజుగా ఉన్నప్పుడు ఆయన చేసే రాచకార్యాలలో  సామాజిక కార్యాలలో దేవుడు అతనికి సహాయంగా ఉన్నారు! గాని దేవకార్యాలలో యాజకులు చేయాల్సిన పనిని తాను చేయాలనుకున్నాడో దేవుడు వెంటనే మొత్తేశారు!

 

   గమనించాలి- తెలుగు సామెత చెబుతుంది- గాడిద పని గాడిద చేయాలి- కుక్క పని కుక్క చేయాలి- కుక్క పని గాడిద చేయాలి అనుకుంటే నడుం విరిగిపోతుంది! ఇక్కడ రాజు యాజకులు చేయాల్సిన పనిని తాను చేయాలని అనుకోవడమే కాకుండా, యాజకులు అతడు రాజైనా గాని ఎప్పుడైతే తప్పుచేస్తున్నాడో వెంటనే 80 మంది ఎదిరించారు! ఆ ఎదిరించిన యాజకులపై రౌద్రుడై కోపము చూపెను అని ఉంది 19వ వచనంలో ! వారు యాజకులే- అతడు రాజే గాని తప్పుచేస్తున్నప్పుడు ఉజ్జియా నీవు ద్రోహం చేస్తున్నావు- దేవాలయంలో ఉన్న పరిశుద్ద స్థలం నుండి బయటకు పో అన్నారు! Get out from the Holy  place అన్నారు ధైర్యంగా!!!    అవును దేవుడు యాజకులకు అంత పవర్ ఇచ్చారు దేవుడు! వారి మాటలను మనం వినాల్సిందే!!!

అందుకే 2తిమోతి 4 లో అంటున్నారు తప్పుచేస్తే ఖండించుము, గద్ధించుము బుద్ధిచెప్పుము! ఈ అధికారం పరిశుద్ధాత్ముడు ప్రతీ దైవజనునికి ఇచ్చారు.

దావీదు గారు ఇలాగే ఒక తప్పుడు పనిచేస్తే నాతాను ప్రవక్త వచ్చి ఒక వ్యక్తికి 100 గొర్రెలున్నాయి మరో వ్యక్తికి ఒకటే గొర్రె ఉంది, ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది అని ఉపమానం చెబితే దావీదు రాజుగారు అన్నారు పుసుక్కున్న వాడెవడు- వాడు మరణపాత్రుడు అంటే నాతాను ప్రవక్త భయపడలేదు- ఆ మరణపాత్రుడవు నీవే అని చెప్పారు ధైర్యంగా!  దావీదు గారికి ఇతర రాజులకు తేడా ఏమిటంటే తాను తప్పుచేసినట్లు తెలిసిన వెంటనే అక్కడే మోకరించి కన్నీరు విడిచి దేవుణ్ణి క్షమించమని వేడుకున్నారు!  గాని ఉజ్జియా రాజు, ఆసా రాజులు పుసుక్కున ఫీలైపోయి ఇక దేవుణ్ణి ప్రార్ధించడం మానేశారు!

2దినవృత్తాంతములు 16:10

ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.

2దినవృత్తాంతములు 16:12

ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.

 

  అయితే ఈ సంగతి ఇంకా చూసుకుంటే : ఎప్పుడైతే ఉజ్జియా రాజు యాజకులమీద వెర్రిచూపు చూసి రౌద్రుడైపోయాడో వెంటనే దేవుడు అతని నొసటిమీద కుష్టువ్యాది పెట్టారు!  ఎప్పుడైతే యాజకులు, రాజు నొసటిమీద కుష్టువ్యాది చూశారో వెంటనే అతనిని వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కుష్టువ్యాధి గలవాడు మందిరంలోనే కాదు పట్టణంలో మరియు పాలెం లో కూడా ఉండకూడదు. ఊరు బయట నివశించాలి! అందుకే వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు! అదే సమయంలో రాజుకూడా తాను చేసిన పనికి దేవుడు తనను మొత్తారని తెలిసికొని బయటకు పోవడానికి సిద్దమైపోయాడు!

 

 ఈ రకంగా అతడు దేవాలయం లోనికి రాకుండా రాజ మందిరంలోనికి గాని, సింహాసనం మీద కూర్చోడానికి గాని అవకాశం లేకుండా ఊరికి చివర్లో ఒక ఇంటిలో ప్రత్యేకంగా ఉండటం మొదలుపెట్టాడు!

 

   ఈ కారణం బట్టి బైబిల్ పండితుల ప్రకారం దేవుడు కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు- యూదా ప్రజలతో మాట్లాడటం దర్శించడం మానేశారు!  ఆ సమయంలో నమ్మకమైన వ్యక్తి కోసం కనిపెట్టినప్పుడు దేవునికి యెషయా ప్రవక్త కనిపించారు.  అతనితో మాట్లాడటం ప్రారంభించారు గాని సంపూర్తిగా కాదు!  ఉజ్జియా రాజు చనిపోయే వరకు సంపూర్ణ ప్రత్యక్షతను ఇవ్వలేదు ఎవరికీ! రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యోతాము సంపూర్తిగా అధికారం చేపట్టాక అదే నెలలో దేవుడు తన ప్రత్యక్షతను యెషయా గారికి ఇచ్చారు!

 

 గమనించాలి ఇలాంటిదే దైవజనుడైన యెహోషువా గారి కాలంలో కూడా జరిగింది.  ఆకాను శపించబడిన వాటిలో కొన్ని తీసుకుని దాచుకున్నందుకు దేవుడు ఆకానును అతని సంబంధులను రాళ్ళతో కొట్టి చంపేవరకు ఇశ్రాయేలు ప్రజలతో ఉండటం మానేశారు!

యెహోషువ 7:12

కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్య నుండకుండ మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడైయుండను.

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీతో దేవుడు మాట్లాడటం మానేశారా? దేవుని ఆత్మసన్నిది నీవు అనుభవించడం లేదా? నీలో ప్రార్ధనకు నడిపింపు రావడం లేదా? అయితే నిన్ను నీవే పరిశీలించుకోవలసిన అవసరం ఉంది! నీలో దేవునికి ఇష్టం లేనిది, ఆయనాత్మకు ఆయాసం కలిగించేది ఏదో ఉంది!  అది ఏదైనా కావచ్చు! నీ ఆలోచనలు, నీ పనులు, నీ అలవాట్లు నీకున్న గుణాలు దేవునికి ఆయాసంగా ఉన్నాయేమో!!! పరిశీలించుకుని వాటిని ఒప్పుకుని విడిచిపెడితే వెంటనే దేవుడు మరలా నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు! ఆయనకు నీతో సంభాషించాలని ఎంతగానో ఇష్టపడుతున్నారు! అయితే నీ పాపములు నీకును నీ దేవునికి మధ్యన అడ్డుపడుతున్నాయి!

 కాబట్టి నేడే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకో! దేవుడు నిన్ను సందించడానికి సిద్ధంగా ఉన్నారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*10వ భాగము*

యెషయా 6:14

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

4. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా ..

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము! మొదటగా ఉజ్జియా రాజు కాలంలో జరిగిన సంభవాలు- దేవుడు అతనిని ఎందుకోసం మొత్తారో ధ్యానం చేసుకున్నాము! ఇక అతని కుమారుడైన యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుందాం!

 

    ప్రియులారా! యోతాము దినములలో ఏమి జరిగాయో బైబిల్ లో స్పష్టముగా వ్రాయబడి లేవు గాని ఉజ్జియాకు కుష్టువ్యాది కలిగాక అతని కుమారుడే యాక్టింగ్ రాజుగా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు కాబట్టి గత భాగాలలో జరిగినవి అతని కాలంలోనే జరిగినట్లు అనుకోవచ్చు మరియు ఉజ్జియా  మృతినొందిన తర్వాత యెషయా గారికి ఈ దర్శనం కలిగింది కాబట్టి ఈ ఆరవ అధ్యాయంలో కనిపించే పరలోక ప్రత్యక్షత మరియు దేవుని ఆలోచనా సభ దర్శనము యోతాము దినములలోనే జరిగింది అని నిర్దారణకు రావచ్చు!

 

   ఇక మొదటివచనంలో రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటున్నారు! దీనికోసరమైన వివరణ మొట్టమొదటి భాగంలోనే ఇవ్వడం జరిగింది.  తన తండ్రి దేవునికోసం దేవుని ప్రత్యక్షత కోసం చెప్పిన మాటలను తలపోస్తూ రాజ ప్రసాదంలో నడుస్తూ దేవుణ్ణి ధ్యానం చేస్తుండగా ఈ దర్శనం కలిగినట్లు మనం చూసుకున్నాము!

 

మొట్టమొదటగా ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నారు! కారణం ఆయనకంటే గొప్పవాడు పెద్దవాడు ఎవడూ లేడు! ఆయనకంటే అత్యున్నతమైన సింహాసనం మరొకటి లేదు!  ఆయనకంటే  ఎత్తైన సింహాసనమందు కూర్చోవాలి అని కేవలం ఊహ కలిగింది లూసీఫర్ గాడికి, ఆ ఊహను గ్రహించి దేవుడు ఒక్క తాపు తంతే వాడు పాతాళంలో ఒక మూలన పడ్డాడు!.....

యెషయా 14:12

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

యెషయా 14:13

నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

యెషయా 14:14

మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

యెషయా 14:15

నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

ఇక రెండవది:  ఆయన చొక్కాయి దేవాలయమును నిండుకొనెను అంటున్నారు! ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము అని చెప్పిన దేవుని యొక్క చొక్కాయి దేవాలయం మొత్తం నిండిపోయాయి అంటున్నారు! అనగా దేవుడు వేసుకునే వస్త్రాలు శరీరభాగాలు కనిపించేలా కాకుండా నిండుగా ఉంటాయి! ఇదే మనకు ప్రకటన 1వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. 13వ వచనంలో ఆయన తలనుండి పాదముల వరకు దిగుచున్న వస్త్రము ధరించుకుని ఉన్నట్లు చూడగలము.....ప్రకటన గ్రంథం 1:13

తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

 

    ఒకసారి  ఆగుదాం! ఓ అయ్యా! అమ్మా! దైవసేవకుడా! కాపరి! విశ్వాసి! యేసుక్రీస్తుప్రభులవారే సాక్షాత్తుగా పాదములు వరకు ఉండే బట్టలు కట్టుకుంటే మరి నీవెందుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నావు? నీవు ఆయన మాదిరిగా జీవించలేవా? ఆయన బిడ్డవైతే ఆయన లాంటి వస్త్రధారణ చెయ్యాలి కదా! మరి ఎందుకు పొట్టి టీ షర్ట్లు?  ఎందుకు పొట్టి బట్టలు?

దైవజనుడా! తప్పకుండా నీ వస్త్రధారణ నీ ఒళ్ళంతా కప్పుకునేది కావాలి!

విశ్వాసి! నీ వస్త్రధారణ నీ శరీరం మొత్తం కప్పుకోవాలి! అలా కాకుండా నీదేహాన్ని చూపిస్తుంటే నీలో వ్యభిచార ఆత్మ మరియు యెజెబెలు ఆత్మ పనిచేస్తుంది. అది నిన్ను నరకానికి దారితీస్తుంది అని గ్రహించాలి! దైవసేవకులారా! దైవసేవకుని భార్యలారా! దైవసేవకుల పిల్లలారా! మీరు మాదిరిగా ఉండాలి గాని సంఘాన్ని మీ వస్త్రధారణతో కలిపి చెరపవద్దు!! మీరు విమర్శలో నిలుస్తారు అని మర్చిపోవద్దు! సంఘంలో గాని, బయట గాని విశ్వాసులకు దేవుని పిల్లలకు స్లీవ్ లెస్ లు పనికిరావు. మీ చిన్నపిల్లలకు కూడా వారు చిన్న పిల్లలే కదా అని వాటిని అలవాటు చెయ్యవద్దని మనవి చేస్తున్నాను! కన్నీటితో వ్రాసేది ఏమిటంటే అనేకులైన విశ్వాసులైన స్త్రీలు కూడా వారు వేసుకునే జాకెట్లు వీపు అంతా కనిపించేలా వేసుకుంటున్నారు నేటి రోజులలో! ఏమంటే ప్రజెంట్ ట్రెండ్ అదే అంటున్నారు! అమ్మా! ఆ ట్రెండ్ నిన్ను 100% నరకానికి తీసుకుని పోతుంది! యెజెబెలు ఆత్మ వ్యభిచార ఆత్మ మీలో పనిచేస్తుంది! తొందరగా సరిదిద్దుకున్నారా- లేకపోతే నరకానికి అతి దగ్గరలో ఉన్నారు అని గ్రహించండి! స్త్రీలు మీరు బాధపడినా ఉన్నదిఉన్నట్లు చెప్పడం నాకు అలవాటు! మీరు బాధపడితే నన్ను క్షమించండి గాని తప్పకుండా మీలో ఆ పనికిమాలిన ఆత్మ పనిచేస్తుంది కాబట్టి వెంటనే సరిదిద్దుకోండి మరియు మీ చిన్న పిల్లలకు కూడా వాటిని అలవాటు చెయ్యకండి! పురుషులారా పొట్టిపొట్టి బట్టలు మనకు తగవు! విశ్వాసికి మాదిరిగా దైవభక్తిగల స్త్రీ పురుషులకు మాదిరిగా మనం జీవించాలి అని మరచిపోవద్దు!

దైవాశీస్షులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*11వ భాగము*

యెషయా 6:14

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారు సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

4. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా ..

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

ఇక రెండో వచనంలో ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి అంటున్నారు. ఇంకా వారికి ఆరు రెక్కలున్నాయి. రెంటితో దేవుని మహిమను చూడలేక తన ముఖాన్ని కప్పుకుంటూ రెంటితో ఎగురుతూ రెంటితో తమ దిసమొలను కప్పుకున్నారు! ఇదే సెరాపులు మనకు యేహెజ్కేలు గ్రంధంలోనూ ప్రకటన గ్రంధంలోనూ కనిపిస్తారు! దీనికోసం మనం గతంలో ధ్యానం చేసుకున్నా గాని ఒకసారి నెమరు వేసుకుందాం!

 

   *నాలుగు జీవులు-సెరాపులు-కెరూబులు*

 

వీరికోసం మనకు ప్రకటన గ్రంధంలోనూ యేహెజ్కేలు గ్రంధంలోనూ కనిపిస్తుంది అని మీదన చూసుకున్నాము!

ప్రకటన 4:68

6. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసన మునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.

7. మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.

8. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.

 

  ఇక మనకు ఆరోవచనం నుండి ఎనిమిదో వచనం వరకు నాలుగు జీవులు కనిపిస్తున్నారు! వీరు సింహాసనమునకు చుట్టూ ఉన్నారు. వీరికి ముందు వెనుక కూడా కన్నులు కలిగి ఉన్నారు.  మొదట జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడో జీవి మనుష్యుని వంటి ముఖముగలది! నాల్గవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అంటున్నారు. ఇక ఎనిమిదో వచనంలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలున్నాయి, ఆ రెక్కలలో కూడా కన్నులున్నాయి. అవి దేవుణ్ణి అనుదినము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నాయి అంటున్నారు!

 

ఇదే నాలుగు జీవులను యెహెజ్కేలు గారు దేవుని స్వరూప ప్రభావ దర్శనములో చూశారు మొదటి అధ్యాయంలో! యెషయా గారు కూడా ఆరవ అధ్యాయంలో చూశారు. 6:2,3

2. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

 

అయితే ఈ నాలుగు జీవులు ఎవరు? ఏమిటి అనే దానికోసం అనేక రకాలైన వాదనలు అభిప్రాయాలున్నాయి.

 కొందరు ఈ నాలుగు జీవులు నూతన నిబంధన సంఘానికి క్రీస్తు సంఘానికి సూచనగా ఉన్నాయి అంటారు! అది తప్పు!

 

మరికొందరు ఈ నాలుగు జీవులు మనస్సాక్షి కాలంలో గల నలుగురు పరిశుద్ధులు అంటారు! అది కూడా తప్పే!

 

మరికొందరు నూతన నిబంధన సంఘానికి చెందిన నలుగురు గొప్ప పరిశుద్ధులు అంటారు! దేవుడు వారికి అంతటి ఆధిక్యత ఇచ్చారు అంటారు! ఇదికూడా తప్పుడు అభిప్రాయం అని నా ఉద్దేశం!

 

ఎందుకంటే యెహెజ్కేలు గారు మొదటి అధ్యాయంలో అవి నాలుగు జీవులు అంటూ వాటిని వివరించిన భక్తుడు, పదో అధ్యాయం రాబోయేసరికి అవి కెరూబులు అని గుర్తుపట్టితిని అని చాలా స్పష్టముగా చెప్పారు కాబట్టి ఇక మరొక వాదనకి తావు ఇయ్యకుండా అవి కెరూబులు గాని సెరూపులు గాని అనుకోవాలి మనము! ముందు చెప్పడం జరిగింది- లేఖనమును లేఖనముతోనే పోల్చుకోవాలి! ఇక్కడ అనగా ప్రకటన 4వ అధ్యాయంలో ఈ మూడు వచనాలలో ఏమేమి వివరణ ఇవ్వడం జరిగిందో అదే వివరణ ఇంకా చాలా స్పష్టముగా మనకు యెహెజ్కేలు గ్రంధంలోనూ యెషయా గ్రంధంలోనూ ఇవ్వడం జరిగింది కాబట్టి అవి కెరూబులు గాని సెరాపులు గాని అని నిర్దారణకు రావడం జరిగింది.

 

ఇక వాటికి ఉన్న నాలుగు రూపాలు మనకు నాలుగు రకాలైన వ్యక్తిత్వాలను సూచిస్తున్నాయి. అయితే నిజం చెప్పాలంటే అవి యేసుక్రీస్తుప్రభులవారిలో ఉన్న నాలుగు రకాలైన స్వభావాలను సూచిస్తున్నాయి. వీటికోసం గతంలో దర్శనపు ప్రవక్త అనే శీర్షికలో యేహెజ్కేలు గ్రంధము వివరించి నప్పుడు చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక సందేశాలు-5 లో. వాటిని మరోసారి గుర్తుకు చేస్తున్నాను!

 

       ప్రియులారా! ఇప్పుడు మనం ఆ దర్శనంలో గల నాలుగు జీవులకోసం ధ్యానం చేద్దాం! యెహోవా ప్రభావ స్వరూప దర్శనంలో యేహెజ్కేలుగారికి నాలుగు జీవులు కనబడ్డారు. యోహానుగారికి కూడా దేవుని సింహాసనం, ప్రభావముతో పాటు నాలుగుజీవులు కనబడ్డారు. ప్రకటన 4 అధ్యాయం. ఒక్కొక్క జీవికి నాలుగు ముఖాలున్నాయి.  మొదటి ముఖం మానవ ముఖం, వాటి కుడిప్రక్కన ముఖరూపం- సింహపుముఖం, ఎడమ ప్రక్కన ఉన్న ముఖరూపం- ఎద్దుముఖం, వెనుక ప్రక్క ఉన్న ముఖరూపం- పక్షి ముఖం.  ఇక యోహానుగారు కూడా తన దర్శనంలో ఇవే రూపాలు చూసినట్లు చూస్తాం. ఇద్దరూ రెక్కలలో కళ్ళు ఉన్నట్లు, ఇవే కాక బోలెడు కళ్ళు ఉన్నట్లు చూస్తాం. దేవుడు ఇద్దరికీ ఒకే దర్శనాలు చూపించారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఒకే రీతిగా ఉన్నారు. హెబ్రీ 13:8;  అయితే ఇద్దరి దర్శనాలలో ఒకే ఒక తేడా ఉంది.  యేహెజ్కేలుగారు ఆ జీవులకు నాలుగు రెక్కలున్నాయి అన్నారు, యోహానుగారు వాటికి ఆరు రెక్కలున్నాయి అన్నారు. మరి ఎందుకు ఇలా తేడాగా రాసారు అంటే బహుశా యెషయా 6వ అధ్యాయంలో సెరూపులుకు వలే వీరికి కూడా ఆరు రెక్కలు ఉండవచ్చు.  వీటిలో రెండేసి రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొంటున్నారు. ఎందుకంటే బహుశా  1) దేవుని ప్రభావము, దహించు అగ్నిని తాళలేక; లేక

2) తమ దిశమొలను కప్పుకోడానికి; లేక

3) జీవులకు ఒకదానితో ఒకదానికి కనెక్షన్/ లింక్ ఉందని చదువుకొన్నాం కదా- బహుశా రెండు రెక్కలతో ఒకదానితో ఒకటి పట్టుకొని- లింక్ ఏర్పరచి ఉండొచ్చు. అందుకే రెండు రెక్కలను బహుశా యేహెజ్కేలు గారు గుర్తించక నాలుగు రెక్కలు అని ఉండొచ్చు.

 

    అయితే 10వ అధ్యాయంలో రెండుసార్లు ఈ జీవులు కెరూబులు అంటున్నారు యేహెజ్కేలుగారు. 10:15, 20. .    10:20 లో  అవి కెరూబులే అని గుర్తించితిని అని రాసారు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఆయన మొదట్లో జీవులు అన్నారు ఇప్పుడు కెరూబులు అని ఎందుకంటున్నారు? ముందు ఎందుకు గుర్తించలేదు?

సింపుల్ ఆన్సర్: ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిలో, పరలోకంలో ఉన్నప్పుడు వివేచన అనే వరం పనిచేస్తుంది. దానితో ఆటోమేటిక్ గా మనం ఇతరులను గుర్తించగలం. ఉదా: పౌలుగారు 2 కొరింథీ 12వ అధ్యాయంలో పరదైసుకి వెళ్ళి అనేకమంది భక్తులను చూసివచ్చారు. వారే కాదు అనేకమంది భక్తులకు దేవుడు పరలోకం చూపించి తిరిగి భూమిమీదకు పంపినట్లు సాక్ష్యాలు విన్నాం. మరి ఆ పూర్వ భక్తులు జీవించిన కాలం వేరు, వీరు జీవించిన కాలం వేరు! మరి వారిని వీరు ఎలా గుర్తుపట్టగలిగారు? అంటే పరలోకంలో దేవుని పరిశుద్ద సన్నిధిలో ఈ వివేచనా వరాలు పనిచేస్తాయి కాబట్టి వారు చాలా సులువుగా గుర్తుపట్టగలిగారు. అంతేకాదు మనం కూడా ఒకరోజు ఆ విశ్వాస వీరులను, ఆ పరిశుద్ధుల సంఘమును కలుసుకొంటాము. కలిసికొని దావీదు గారిని చూస్తాం! పౌలుగారికి పరిశుద్ధమైన ముద్దు పెట్టుకొంటాం! యోబుగారికి షేక్హ్యాండ్ ఇస్తాం! యోనాగారు మీరు చేప కడుపులో మూడు దినాలు ఎలా ఉండగలిగారు అని అడుగవచ్చు! దానియేలుగారు మీరు సింహాల నోళ్లను ఎలా మూయించగలిగారు అని అడుగుదాం! ఎప్పుడూ? మనం కూడా వారిలా జీవించినప్పుడే!!! మరి అప్పుడు వారు దానియేలు, పేతురు, యోహాను, అబ్రహాముగారు అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ వివేచన ద్వారానే! ఆత్మలో వివేచించి అవతలివారి బయోడేటా మొత్తం మనకు తెలిసిపోతుంది. వారితో ముచ్చటించగలం! దీనినే శుభప్రదమైన నిరీక్షణ అంటారు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు!!! రోమా 5:5;  ఆ నిరీక్షణ నాకుంది! మరి ఆ నిరీక్షణ నీకుందా???

 

   సరే, ఇప్పుడు జీవుల ముఖాలకోసం ధ్యానం చేద్దాం!

 

1).  మొదటి ముఖం- మానవ రూపం: ఇది మంచి చెడ్డలను, తెలివితేటలు, అర్ధం చేసుకొనే శక్తిని సూచిస్తుంది. ఈ సృష్టిలోనూ అన్ని జీవులలో మానవుడు తెలివైనవాడు. అయితే మానవునికి తెలివి నిచ్చిన ఆ దేవుడు మరీ తెలివైనవాడు. అందుకే మానవులను ఉద్ధరించడానికి, రక్షించడానికి దేవుడే మానవ రూపములో వచ్చారు భూమిమీదకు! ఇది యేసుప్రభులవారు దైవమానవుడు అని తెలియజేస్తుంది.

 

2). రెండవ ముఖం: సింహం రూపం:  సింహం అడవికి రాజు. అన్ని మృగాలుకి రాజు. అది చాలా ధైర్యమైనది. సింహం దేవుడు సర్వాదికారియని, సార్వభౌముడని ఈ జగానికి ఒకే రాజు అని సూచిస్తుంది. సింహం ముందు అన్ని మృగములు, జంతువులూ తలవంచి భయపడి పారిపోతాయో, అలానే రాజులరాజైన యేసయ్యకి అన్నింటికన్నా పై నామము కలిగి, భూలోక రాజ్యాలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించ వలసినదే అని సూచిస్తుంది.

 

3). మూడవ ముఖం: ఎద్దు రూపం:  ఎద్దు- సేవకుడు/ పరిచారకునికి సాదృశ్యం. ఎద్దులు అవి కష్టపడి యజమానికి లాభం చేకూర్చుతాయి. కష్టపడే గుణం.

అలాగే లోబడే స్వభావము గలవి. తగ్గింపు స్వభావము గలవి.

అలాగే యేసుప్రభుల వారు దేవుడై యుండి కూడా అది విడచిపెట్టకూడని భాగ్యం అని తలంచక దాసుడై పుట్టి తనను తాను తగ్గించుకొన్నారు. ఎంతగా తగ్గించుకొన్నారంటే సిలువమరణం పొందునంతగా! ఫిలిప్పీ 2:8; అన్ని భాదలు భరించి, తన రక్తాన్ని చిందించి మన పాపములకు పరిహారం చేసిన దేవుడు- దాసుడు అని సూచిస్తుంది.

 

4).  నాల్గవ ముఖం- పక్షిరాజు రూపం: పక్షిరాజు- బలమునకు సాదృశ్యం, ఇంకా అధికారమునకు, దైవత్వానికి సాదృశ్యం. ఇంకా దూరదృష్టి కలది. దూరము నుండే ప్రతీది కనిపెట్ట గలది. అలాగే యేసుక్రీస్తుప్రభులవారి ఏడాత్మలకి సాదృశ్యంగా ఉంది. ఆలోచన కర్త, వివేచనాత్మ, జరుగబోయే కార్యములు ముందుగానే చెప్పే ప్రవచనాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇంకా పైనుండి సమస్త జీవులను‌ కనిపెట్టడాన్ని కూడా సూచిస్తుంది.

 

 ఈ దర్శనం చూస్తున్నప్పుడు యేహెజ్కేలుగారికి అర్ధం కాలేదు గాని దేవుడు చూపించారు అని రాసారు ఆయన. అయితే మరుగై ఉన్నవి తన భక్తులకు బయలుపరిచేవాడు మన దేవుడు. ఆయన మరుగైయున్న మర్మాలు బయలు పరచేవాడు. ఈ నాలుగు జీవులు- వాటి ముఖాలు దేవుని గుణగణాలను సూచిస్తున్నాయి.  ఆయన దైవమానవుడు, సర్వాదికారి, సర్వోన్నతుడు, సార్వభౌముడు,  రాజులరాజు, ప్రభావము, బలము కలవాడు గాని దాసునిరూపం దాల్చి నీకోసం నాకోసం మరణించినవాడు అని తెలియజేసే దర్శనం ఇది.

 

ఇంతగొప్ప దేవుణ్ణి నీవు కలిగియున్నావు ప్రియ దేవునిబిడ్డా! ఈ దేవుడు మనకు సరిపోయినవాడు. ఆయనను దేనితో సమానం చేస్తావు. ఆయనను దేనికోసం తాకట్టు పెట్టేసున్నావు? త్రాగుడుకా? జూదానికా? వ్యభిచారానికా? మరి దేనికి? అంతే కాదు ఆయన మానవుడు. ఆయనకు నీభాధ తెలుసు. కాబట్టి ఓలిపోకు, సోలిపోకు! తగినకాలమందు ఆయన నీ మనవి ఆలకించబోతున్నారు.

ఇటువంటి దర్శనాలు నీవు పొందుకోవాలని ఉందా? అయితే ఆయనను నీ గృహానికి, నీ హృదయానికి రారాజుని చేయు! సంపూర్ణ అధికారం ఇవ్వు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*12వ భాగము*

యెషయా 6:14

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

4. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా ..

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటున్నాము!

                                                                

             (గతభాగం తరువాయి)

 

         ఇక మూడవ వచనంలో వారు అనగా సెరాపులు/కెరూబులు/నాలుగు జీవులు సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు  పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి యున్నది అంటూ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు అంటున్నారు. 

 

   ప్రియులారా! ప్రకటన 4: 811 వచనాలు కూడా మొదటగా నాలుగు జీవులు తర్వాత ఇరవైనలుగురు పెద్దలు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు చూడగలము!

 

ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో నాలుగు జీవులు భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు  పరిశుద్దుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ మానక  చెప్పుచున్నారు అంటున్నారు. ఇదే దర్శనాన్ని యెషయా గారు కూడా 6:2౩ లో ఇదేవిధమైన దర్శనము చూశారు అని గతభాగంలో చెప్పుకున్నాము....

 

2. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్దులుగా జీవిస్తూ నిత్యమూ ఆయనను స్తుతించబద్ధులమై యున్నాము! పరిశుద్దులుగా జీవించవలసిన అవసరం ప్రతీ శీర్షికలోనూ చెప్పుకుంటున్నాము కాబట్టి ముందుకుపోదాం!

ఇంకా ప్రకటన 4వ అధ్యాయంలో ముందుకు పోతే  తొమ్మిదో వచనంలో ఆ సింహాసనమందు ఆసీనుడైయుండు యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగును గాక అంటూ మరింతగా స్తుతులు చెప్పుచున్నారు! ఇక్కడ వారు అంటున్నారు- దేవుడు యుగయుగములు జీవించువాడు! మన దేవుడు శాశ్వతుడు! నిన్ననేడు నిరంతరమూ జీవించే వాడు! ఆల్ఫా మరియు ఒమేగా, ఆదియు మరియు అంతమునై ఉన్నవాడు! ఆయన సజీవుడు! కన్నులుండి చూసేవాడు! నోరుండి మాట్లాడేవాడు! చెవులుకలిగి వినేవాడు- జవాబిచ్చేవాడు! ఆయన సృజించబడిన వాడు కాదు- ఆయనే ఈ సృష్టిని సృజించిన వాడు- సృష్టికర్త!

 

ఇక వీరు ఇలా కీర్తిస్తూ స్తుతిస్తూ ఉండగా పదో వచనంలో ఇరవై నలుగురు పెద్దలు కూడా సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు... ఇంకా స్తుతిస్తున్నారు!

 

దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ దూతలు, కెరూబులు, సెరాపులు, ఇరవైనలుగురు పెద్దలు, నాలుగు జీవులు, కోట్ల కొలది దూతలు అందరూ ఆయనను అనగా ఘనమైన దేవుణ్ణి ప్రభావము గల దేవుణ్ణి స్తుతిస్తున్నారు! ఆయన చేతితో రూపించబడ్డ నీవు నేను అలాంటి స్తుతులను దేవునికి చెల్లిస్తున్నామా?

నిజం చెప్పాలంటే దేవుడు మానవులను ఆయనను స్తుతించడానికే చేసుకున్నారు!  కాబట్టి నిజంగా మనిషి/ లేక విశ్వాసి కూడా ప్రతీరోజు చేయాల్సింది ఇదే! ఆయనను స్తుతించడమే!

చూడండి ఆయనను ఎలా స్తుతిస్తున్నారో...

ప్రకటన 1:6

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో-  కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

5:1214

12. వారు వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

13. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.

14. ఆ నాలుగు జీవులు - ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారముచేసిరి.

 

రోమీయులకు 11: 36

ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

 

రోమీయులకు 16: 27

అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

 

పౌలుగారు అంటున్నారు

1కొరింథీ 6:19,20

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

1కోరింథీయులకు 10: 31

కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.

ఎఫెసీయులకు 5: 20

మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,

ఎఫెసీయులకు 5: 21

క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.

 

1థెస్సలొనికయులకు 5: 18

ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

 

1తిమోతికి 1: 17

సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

 

1తిమోతికి 6: 16

సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

 

హెబ్రీ 13:15

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

 

  ఇక 11వ వచనంలో 24గురు పెద్దలు తమ కిరీటాలు సింహాసనం ముందు వేసి లేక పడవేసి స్తుతిస్తున్నట్లు చూడగలము! పదో వచనంలో సాష్టాంగనమస్కారం చేస్తే పదకొండో వచనంలో తమ కిరీటాలు దేవుని సింహాసనం ముందు పడవేసారు. అనగా దేవునికి సంపూర్ణ విధేయత చూపించి ఆయనకు భయపడి ఆయనను పూజిస్తూ ఆయనకు మ్రొక్కుతున్నారు! ఇదీ ఆయనను పూజించవలసిన విధానము! దీనిని తప్పకుండా ఈ 24గురు పెద్దలనుండి నేర్చుకోవాలి! దేవునికి భయపడాలి! గౌరవించాలి! పూజించాలి! మ్రొక్కాలి!

 

ఇంకా చివరి వచనంలో వీరంతా అనగా 24గురు పెద్దలు మరియు నాలుగు జీవులు ఆయనను సృష్టికర్తగా స్తుతిస్తున్నారు. కారణం ఆయన నిజంగా సృష్టికర్త కాబట్టి. మనము కూడా అదేరకంగా పూజించవలసిన మ్రొక్కవలసిన అవసరం ఉంది!

ప్రకటన 10:6; ఆదికాండం 1:1; యోబు 38:47; కీర్తన 19:1; యెషయా 40:2526; అపో 14:15; 17:2428; రోమా 11:36

 

ఇక మన పాఠ్యభాగంలో 4వ వచనంలో వారు అనగా నాలుగుజీవులు/సెరాపులు/కెరూబులు చేసే స్తుతులవలన కలిగిన అనునాధంతో (Resonance) దేవాలయపు గడప కమ్ముల యొక్క పునాదులే అదిరిపోయాయి అట!  మరి నీవు ఎలా స్తుతిస్తున్నావు దేవుణ్ణి!! బైబిల్ చెబుతుంది ఆయనాత్మ గనుక ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని, (యోహాను 4:23,24); దాని తర్వాత మరో దగ్గర నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన ప్రభువును సేవించాలి స్తుతించాలి పూజించాలి ఆరాధించాలి! ద్వితీ 6:5; మనమైతే మన కంట స్వరాలు బయటకు రాకుండా నోట్లో నోట్లో గొణుక్కుంటున్నాము! ఇది ఆరాధనా పద్దతి కానేకాదు! నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపుతాను అంటున్నారు దేవుడు! కాబట్టి మన కంటస్వరము దేవునికి వినబడేలా గొంతెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం!....కీర్తనలు 5:3

యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

యెషయా 58:4

మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు *మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా* మీరిప్పుడు ఉపవాసముండరు.

 

కాబట్టి ఇటువంటి సృష్టికర్త మరియు యుగయుగాలుండే దేవుణ్ణి మనము కూడా కలిగి యున్నాము కాబట్టి ఆయనకు నిజంగా భయపడి ఆయనను గౌరవస్తూ బ్రతుకు దినములన్నియు ఆయనను స్తుతిద్దాము! కెరూబుల లక్షణాలతో సెరాపుల లక్షణాలతో నాలుగు జీవుల లక్షణాలు కలిగి అనుదినము హృదయపూర్వకముగా మనఃస్పూర్తిగా పూర్ణబలంతో పూర్ణాత్మతో ఆయనను స్తుతిద్దాం! ఆయనని సేవిద్దాం!

దైవాశీస్సులు!!!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*13వ భాగము*

యెషయా 6:57

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటున్నాము!

                                                      

            (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా ఎప్పుడైతే దేవాదిదేవుని దివ్య దర్శనం చూశారో యవ్వనుడైన యెషయా గారు   5వ వచనంలో గట్టిగా ఏడుస్తూ అరుస్తున్నారు: అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల  మధ్యలో నివాసం చేస్తున్నాను! నేను నశించిపోయాను ఇప్పుడు; ఎందుకంటే నేను ఇలాంటి అపవిత్రుడనైన నేను సెరాపులు దేవునిదూతలు స్తుతిస్తున్నట్లు పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి కన్నులారా చూశాను. దేవుణ్ణి చూసిన వారు ఎవరూ బ్రతుకలేరు అని వ్రాయబడింది కాబట్టి ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను/ చచ్చిపోబోతున్నాను అంటూ అరుస్తున్నారు!

 నిజానికి ఇలా దేవుని దర్శనాలు- దేవదేవుని ముఖాముకిగా చూసినవారు కూడా ఉన్నారు. వారుకూడా అలాగే అనుకున్నారు గాని వారు చావలేదు! ఎందుకంటే దేవుడు కావాలనే తన ప్రత్యక్షత వారికి అనుగ్రహించారు!

మొట్టమొదటిగా ఆదికాండం 32:30 లో యాకోబు గారు అంటున్నారు నేను దేవుణ్ణి చూచి కూడా ప్రాణాలతో ఉన్నాను అనిచెప్పి దానికి పెనూయేలు అని పేరు పెట్టారు ఆ స్థలానికి!...

ఆదికాండము 32:30

యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.

 

నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అరిచారు మేము చనిపోబోతున్నాము అని.....

Exodus(నిర్గమకాండము) 20:18,19,20

18. ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి

19. నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము

20. అందుకు మోషే భయపడకుడి; మిమ్ము పరీక్షించుట కును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.

 

24:911

9. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి

10. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.

11. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.

 

సంసోను గారి తండ్రి మనోహా గారు కూడా అలాగే అరిచారు- మనం దేవుని చూశాము కాబట్టి చనిపోతాము అని, గాని అతని భార్య మాటలు వినండి ....  న్యాయాధిపతులు 13:2224

22. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా

23. అతని భార్య యెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.

 

అయితే ఇలా దేవుణ్ణి చూసిన వారు చనిపోతారు అనేమాట ఎందుకు వచ్చింది అంటే నిర్గమ 33:20 లో మోషేగారు దేవుడా నేను నిన్ను చూడాలి నీ ముఖం నాకు చూపించు అని అడిగితే దేవాదిదేవుడే చెప్పారు- నీవు నా ముఖాన్ని చూడలేవు, చూస్తే చనిపోతావు!...

నిర్గమకాండము 33:20

మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.

 

దానియేలు గారు కూడా దేవుని దర్శనాన్ని గబ్రియేలు దూతను చూసి అలాగే అనుకున్నారు. 8:1718 , 10:9

 

కాబట్టి వీరంతా ఆయన దర్శనాన్ని మాత్రం చూసి ఆయన సన్నిధిని అనుభవించారు అన్నమాట!

ఈ వచనంలో ధ్యానం చెయ్యాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి గాని ఒక మూడు నాలుగు చాలా క్లుప్తంగా చూసుకుందాం!

 

మొదటగా: యెషయా ఎప్పుడైతే దర్శనం చూశారో- వెంటనే ఈలోకపు రాజుల కంటే పరలోకపు రాజుమీద దృష్టి నిలుపుతున్నారు! ఎందుకంటే ఈ లోకరాజుల యొక్క పరిపాలనా కాలం చాలా తక్కువ! అయితే పరలోకపు రాజుయొక్క పాలన శాశ్వతమైనది మరియు మచ్చలేనిది! మరయు ఆయన నిరంతరము జీవించేవాడు!  అందుకే ఎప్పుడైతే దేవుణ్ణి చూశారో వెంటనే తన దృష్టి తన లక్ష్యము దేవునిపై పెట్టారు యెషయా గారు!

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీ దృష్టి నీ లక్ష్యము దేనివైపు??

ధనమా?

అధికారమా?

స్త్రీలా?

గర్ల్ ఫ్రెండా?

ఉద్యోగమా?

కామమా?

మరి దేనివైపు???

పౌలుగారు మన పౌరస్తితి పరలోకమందు ఉంది కాబట్టి క్రిందివాటిని అనగా భూలోకసంబంధమైన వాటిమీద లక్ష్యముంచక పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టిని పెట్టమని చెబుతున్నారు!

ఫిలిప్పీయులకు 3:19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

ఫిలిప్పీయులకు 3:20

మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

 

కొలస్సీయులకు 3:1

మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.

కొలస్సీయులకు 3:2

పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

 

రెండవది: ఎప్పుడైతే దేవునిపై పెట్టారో ఆయన సన్నిధిలో మనయొక్క రహస్యపాపములు కనబడతాయి అని వ్రాయబడిన ప్రకారం నేను పాపిని అనియు దేవుడు అత్యంత పరిశుద్ధుడు అనియు యిట్టె తెలిసిపోయింది! దేవుడు అత్యంత పవిత్రుడు పరిశుద్ధుడు- నేనైతే ఆయన తట్టు చూడటానికి కూడా అర్హుడను కాను అని అర్ధమై పోయి అపవిత్రుడను అని అరుస్తున్నారు ఆయన! వెంటనే దేవుడు సెరాపుని పంపించి పాపం పరిహరించారు!   యేసుప్రభులవారు చెప్పిన సుంకరి పరిసయ్యుడు ఉపమానంలో కూడా యేసయ్య ఇదే చెప్పారు- పరిసయ్యుడు హెచ్చించు కుని తనయొక్క భక్తికోసం తానే డబ్బా కొట్టుకుంటున్నాడు! సుంకరి ఆకాశము వైపుకి తల ఎత్తడానికి ధైర్యము లేనివాడై యెషయా గారు మొర్రపెట్టినట్లు అయ్యో దేవా నేను అపవిత్రుడను పాపిని, నన్ను క్షమించుము అని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నాడు! వెంటనే దేవుడు ఆ సుంకరిని క్షమించి  పాప పరిహారం చేశారు! లూకా 18:13,14

  

    కాబట్టి మనము కూడా మన యొక్క ఆత్మీయ స్థితి మనకు తెలుసు కాబట్టి మనము మన పాపాలు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి ఉండాలి గాని హెచ్చించుకుంటే పరిసయ్యునిలా ఇక్కడే మిగిలిపోవాల్సి వస్తుంది!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*14వ భాగము*

యెషయా 6:57

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటున్నాము!

                                                      

                (గతభాగం తరువాయి)

     ఇక ఈ వచనంలో గమనించవలసిన మూడవ విషయం ఏమిటంటే దేవుని సన్నిధిలో యెషయా గారు తన మాలిన్యమును గుర్తించగలిగారు! ఎందుకంటే గతభాగంలో చెప్పుకున్నట్లు ఆయన సన్నిధిలో మన రహస్య పాపములు కనబడతాయి!  కీర్తనలు 90:8

మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

ఆయన సన్నిధిని అనుభవించిన వెంటనే దేవుడు ఎవరూ, ఆయన పరిశుద్ధత ఏమిటి అనేది తెలిసిపోతుంది ఇంకా మనము ఎవరము మన యొక్క ఆత్మీయ స్థితి, మన అపవిత్రమైన స్థితి కూడా ఇట్టే తెలిసిపోతుంది! అందుకే అయ్యా నేను అపవిత్రుడను అంటూ కేక వేశారు! దేవుని సన్నిధిలో మనుష్యులలో అతిశ్రేష్టులు అని పిలువబడిన వారు సైతం తమయొక్క బ్రష్ట స్వభావం కోసం దేవునికి మొర్రపెడతారు!

 దావీదు గారు కూడా అలాగే మొర్ర పెడుతున్నారు కీర్తన 32:15 లో....

1. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

2. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.

3. నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.

4. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)

5. నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)

 

అందుకే దైవజనుడైన పౌలుగారు కొరింథీ పత్రికలో అంటున్నారు సంఘక్రమము నేర్పిస్తూ భాషలు మాట్లాడండి ప్రవచన వరంకోసం ప్రార్ధించండి అంటూ భాషలు అవిశ్వాసులకు,  ప్రవచించడం విశ్వాసుల కోసము అని చెబుతూ , ఎవరైనా అన్యుడు మన ఆరాధనలోకి వస్తే మనము ప్రవచించే ప్రవచనాల వలన భాషలకు అర్ధం చెబుతూ దేవుణ్ణి స్తుతించడం వలన అన్యుడు వాటివలన తాను అపవిత్రుడను అని గ్రహించి తమ పాపములకొరకు పశ్చాత్తాపపడతాడు అంటూ రాస్తున్నారు, కారణం దేవుని సన్నిధిలో పాపి తన పాపముల విషయమై పశ్చాత్తాప పడగలడు! 1కొరింథీ 14:2225..

 

22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది.

23. సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడు చున్నారని అనుకొందురు కదా?

24. అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.

25. అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును.ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.

 

నాల్గవది:  ఇక ఈ వచనంలో నేను అపవిత్రుడను అనకుండా అపవిత్రమైన పెదవులు గలవాడను అనడానికి కారణం ఏమిటి?

ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకునేవారు అనేకసార్లు తమ నోటిని మరియు పెదవులను అదుపులో పెట్టుకోలేరు! అనగా మాట్లాడే విషయంలోనూ కోప్పడే విషయంలోనూ, ఇంకా ఆహార పదార్ధాలు తినడం కొన్ని పానీయాలు త్రాగడం విషయంలో తత్తరపడుతూ తొందరపడుతూ ఉంటారు. తద్వారా అపవిత్రులు అవుతుంటారు!  ఇలాంటివారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవిస్తారో వెంటనే తమ బ్రష్ట స్వభావము కోసం వారికి అర్ధమై దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటారు!

కీర్తన 39:113

1. నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.

2. నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను.

8. నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.

9. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.

12. యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను

 

యాకోబు 3:28

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

 

కాబట్టి అందుకే నేను అపవిత్రుడను అంటూ గగ్గోలు పెడుతున్నారు యెషయా గారు!

ప్రియ చదువరీ ఎప్పుడైనా దేవుని సన్నిధిని అనుభవించావా ?

అనుభవించినప్పుడు పాపినని గ్రహించి ఇలా మొర్రపెట్టావా?

నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపం పొందిన విశ్వాసులందరూ ఈ విధంగా మొర్రపెట్టిన వారే!!!

నీవుకూడా అలా మొర్రపెట్టి నీ పాపాలు కడిగేసుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*15వ భాగము*

యెషయా 6:56

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠము మీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటున్నాము!

                                                       

           (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇక ఆరవ వచనంలో కూడా చూసుకుంటే ఘోరంగా విలపిస్తున్న యెషయా గారిని చూసి దేవునిమనస్సుని అర్ధం చేసుకున్న సెరాపులలో ఒకడు బలిపీటం మీదనుండి పట్టకారుతో ఒక నిప్పుకణికను తీసుకుని వచ్చి అతని పెదాలకు తగిలించి అంటున్నారు: ఇది నీ పెదాలకు తగిలింది కాబట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది నీ దోషము తొలిగిపోయింది అంటున్నారు!  ఎందుకంటే ఆ నిప్పుకణిక పరలోకంలో ఉండే నిజమైన దేవాలయములో గల నిజమైన బలిపీటం మీదనుండి తీయబడినది కాబట్టి అతని పాపమునకు పరిహారం కలిగింది!

 

గమనించాలి ఇక్కడ యెషయా గారు పరమ దర్శనాన్ని చూస్తున్నారు. ఈ దర్శనం ద్వారా అతని పాపములు క్షమించబడినవి అని నిశ్చయత కలిగింది ఇక్కడ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ దేవుడు అతనిని తన పనికోసరం పంపబోతూ ఈ దర్శనాన్ని చూపించారు! అనగా సేవాపరిచర్య ప్రారంభానికి ముందుగా ఈ దర్శనాన్ని చూపించారు దేవుడు!

 

 *ఇక్కడ స్పష్టముగా అర్ధమయ్యేది ఏమిటంటే ఏ సేవకుడైనా తన సేవాపరిచర్య ప్రారంభించాలంటే మొదట అతడు తన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది అని నిర్దారణకు వచ్చాకనే, అనగా సిలువరక్తములో తన పాపములు కడుగబడి, అలా కడుగబడినవి అని నిశ్చయతకు వచ్చాకనే సేవ ప్రారంభించాలి అని అర్ధమవుతుంది!*  నేటి రోజులలో అనేకులు పొట్టకూటి కోసం ఇలాంటి నిశ్చయత లేకుండా సువార్తను చేస్తూ పడిపోతూ దేవునినామమునకు అవమానం తెస్తున్నారు! అసలు నీ పాపాలు పోగొట్టుకోకూకుండా ఎదుటవారి పాపముల కోసం ఎలా బోధించగలవు ప్రియ సహోదరుడా! అందుకే యేసయ్య అంటున్నారు: మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు ఎదుటవాని కంటిలో ఉన్న నలుసుని నీవు తీసివేయగలవు!!!

మత్తయి 7:5

వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

 

కాబట్టి పరిచర్యకు సిద్దమవుతున్న లేక పరిచర్యలో ఉన్న ఓ ప్రియ సహోదరీ సహోదరుడా! మొదటగా నీలోనున్న మలినాలను కడుగుకో! ముఖ్యముగా నోటి మాలిన్యము అనగా నోటితో పలికే చెడుమాటలు కడుగుకోవాలి. దానికిగాను భాప్తిస్మము పొందుకున్న అనంతరము దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను నీనోటిని తాకి కాల్చాలి. మలినాలు కడుగబడాలి. అట్టి అభిషేకం, అట్టి నిశ్చయతను పొందుకుని అప్పుడు పరిచర్య చేయమని క్రీస్తుపేరిట మనవిచేస్తున్నాను!

ఇలాంటి పరిచర్య మాత్రమే దేవుని దృష్టికి అంగీకారమవుతుంది అని గ్రహించాలి!

 

ఇక్కడ మరోసారి గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ సెరాపులలో ఒక్కడు వచ్చి నిప్పుతో ఏ శరీరభాగాన్ని ముట్టాడు అంటే పెదాలను!  కాబట్టి విశ్వాసి గాని, ముఖ్యంగా సేవాపరిచర్యకు వెళ్ళవలసిన / చేస్తున్న వారు తప్పకుండా నోటిని నాలుకను ఎంతో జాగ్రత్తగా కాచుకోవాలి!

అందుకే యాకోబు గారు అంటున్నారు మూడో అధ్యాయంలో నోటిని నాలుకను బద్రం చేసుకోవాలి అంటూ....

యాకోబు 1:26, 27

26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

   ప్రియులారా! ఈ  వచనం చూసుకుంటే ఎవ్వడైనా నోటికి కల్లెము పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసగిచ్చు కొంటే, భక్తిగలవాడను అనుకుంటే వాడి భక్తి వ్యర్ధము అంటున్నారు. నోటికి కల్లెము పెట్టుకోవడం అనగా రెండు రకాలుగా నోటికి కళ్ళెము పెట్టుకోవాలని అర్ధం నా ఉద్దేశ్యంలో!

 

నోట్లో ఏముంటుంది? నాలుక మరియు పళ్ళు! మొదటిది: నాలుకను అదుపులో పెట్టుకోవాలి- అనగా మన మాట్లాడే మాటలను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయి!

 

రెండు: మనం తినే తిండి విషయంలో కూడా అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మొదటగా ఊభకాయం అనబడే ఒబెషిటీ,

రెండు షుగర్ వ్యాధి అనబడే డయాబెటిస్, వాటికి బోనస్ గా బిపి వగైరాలు వచ్చేస్తాయి. తినాలని ఉన్నా తినకూడని స్థితికి, తింటే చచ్చే స్థితికి వచ్చేస్తావు గనుక నోటికి కల్లెము వేసుకోరా కొడుకా అంటున్నారు యాకోబు గారు!

 

19. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

 

ప్రసంగి 7:9. ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.

 

యాకోబు 3:2-12.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

ఏవైపు చూచినా తమ నాలుకలను అదుపు చేసుకోనివారు చాలామంది కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చాలామంది ఆత్మవంచన చేసుకొంటూ నిష్ప్రయోజనమైన ఆరాధన ఆచారాన్ని పాటిస్తున్నారన్నమాట.

కాబట్టి నోటికి కల్లెము పెట్టుకోకుండా అనగా మాటలోనూ, తిండి విషయంలోనూ తన నోటిని నాలుకను అదుపులో పెట్టుకోకుండా నేను భక్తిచేసేస్తున్నాను అనేవాడు వాడి భక్తి వ్యర్ధము అంటున్నారు!

గనుక నీ నోటినినాలుకను అదుపులో పెట్టుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*16వ భాగము*

యెషయా 6:56

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటూ నోటిని నాలుకను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాని ధ్యానం చేస్తున్నాము!

                                                       

           (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంకా యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూసుకుంటే

యాకోబు 3:16

1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

 

*నోరు-నాలుక-1*

 

   ఈ మూడవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చెప్పి వదిలేసిన నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోండి! నోటిని నాలుకను అదుపులో పెట్టుకోకుండా నేను భక్తిచేస్తున్నాను అని ఎవరైనా డైలాగులు చెబితే వాడి భక్తి వ్యర్ధము అని చెప్పారు కదా, దానినే ఈ అధ్యాయంలో వివరంగా వివరించారు!

 

     ప్రియులారా! మొదటి వచనం బోధకులు, దైవసేవకులు, కాపరుల కోసం మొదలుపెట్టారు, ఇది కేవలం దైవసేవకులకు మాత్రమే మాకు కాదు అని విశ్వాసులు అనుకోకూడదు! అందరి కోసము అని గ్రహించాలి, అయితే ముఖ్యముగా దైవసేవకులకు కాపరులకు ప్రసంగీకులకు దీని భావం చెందుతుంది అని గ్రహించాలి!

   నా సహోదరులారా! బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము అని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కావద్దు అని హితవు పలుకుతున్నారు!  బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంది అంటున్నారు! ఒకసారి ఆగి ఆలోచిద్దాం!

 

  బైబిల్ ను బోధించే వారు ఎవరైనా అతని భాద్యత చాలా గంభీరమైనది! మొట్టమొదట అతడు తాను ఉపదేశించే సత్యానికి అనుగుణంగా తన బ్రతుకును సరిచేసుకుని తాను ఆ విధంగా జీవిస్తూ అప్పుడు బోధించవలసిన అవసరం ఉంది! ఒక తండ్రి సిగరెట్టు త్రాగుతూ మత్తు పదార్ధాలు సేవిస్తూ తన కొడుకుతో ఒరేయ్ నీవు సిగరెట్టు తాగొద్దురా, బ్రాంది తాగొద్దురా అంటే కొడుకు ఏమంటాడు? ముందు నీవు మానేసి తర్వాత నాకు నీతులు చెప్పు అంటాడు! అలాగే దైవసేవకుడు/బోధకుడు కూడా మొదట తాను సరియైన మార్గంలో నడుస్తూ ఆ తర్వాత చెబితే వినేవారు పాటిస్తారు! అందుకే ముందు పాటించకుండా బోధలు చెయ్యకూడదు!

అంతేకాకుండా దేవుడు దైవసేవకునికి/ బోధకునికి మంచి ఉన్నతమైన జ్ఞానం ఇచ్చారు కాబట్టి దేవుడు అతని నుండి ఎంతో ప్రశస్తమైనవి ఆశిస్తున్నారు! ఇంకా బోధిస్తూ వాటిని పాటించక పోతే విశ్వాసుల కన్నా ఎక్కువ దండనకు గురిచేస్తారు! దీనిని మనం లూకా 12:4748 లో చూడగలం!

47. తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.

48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.

 

ఇక్కడ బైబిల్ ఉపదేశకులందరూ చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా! విశ్వాసులు చాలామంది దేవుని దారినుండి తప్పిపోతూ ఉంటారు! కాపరి/ బోధకుడు సరిచేస్తూ ఉంటాడు! మరి బోధించే ఈ వ్యక్తి తప్పిపోతే- దండన ఎక్కువ కదా! తెలియక చేస్తే తక్కువ దెబ్బలు గాని తెలిసి చేస్తే మరి ఎక్కువ దండన కలుగుతుంది అని చెబుతున్నారు. కారణం ఈ వ్యక్తి తెలిసిన మూర్ఖుడు కాబట్టి!  ఒకసారి మనం సువార్తలు జాగ్రత్తగా గమనిస్తే- ఈ సువార్తలలో పరిసయ్యులను సద్దూకయులను, శాస్త్రులను ధర్మశాస్త్ర బోధకులను యేసుక్రీస్తుప్రభులవారు ఉతికి ఆరేసినట్లు చూడగలం! అయ్యో శాస్త్రులారా అయ్యో పరిసయ్యులారా అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీరు చెబుతారు గాని చెయ్యరు... అంటూ చెప్పారు!

Matthew(మత్తయి సువార్త) 23:1,2,3,4,5,13,14,15,16,23,25,26,27,29,33

1. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను

2. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు

3. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.

4. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.

5. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో- నరకకుమారునిగా) చేయుదురు.

16. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు

33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు?

 

అందుకే యేసయ్య ప్రజలందరితో చెప్పారు- శాస్త్రులు పరిసయ్యులు మీతో చెప్పినట్లు చెయ్యండి- గాని వారు చేసినట్లు మీరు ఎంతమాత్రము చెయ్యవద్దు అన్నారు! ..

ఇక్కడ కేవలం శాస్త్రులను పరిసయ్యులను మాత్రమే ఎందుకు సువార్త లన్నిటిలో విమర్శించారు? ఎందుకంటే వారు ధర్మశాస్త్ర బోధకులు కాబట్టి దానికి అనుగుణంగా జీవించవలసిన అవసరం ఉంది! గాని వారు చెబుతున్నారు గాని చెయ్యడం లేదు కాబట్టి దేవుడు వారిని విమర్శించవలసి వచ్చింది! అలాగే బోధకులు తాము బోధిస్తూ ఆ బోధ ప్రకారం జీవించక పోతే తీర్పు మరియు దండన తప్పదు అని మర్చిపోకూడదు! 

 

గమనించాలి- నీవు కత్తితో జీవిస్తే కత్తితోనే పోతావు అన్నారు యేసుక్రీస్తుప్రభులవారు- ఇక్కడ వీరు అనగా బోధకులు చాలా ప్రమాదకరమైన ఆయుధాన్ని వాడుతున్నారు- అది వారి నాలుక! కాబట్టి ఆ నాలుక ప్రకారంగానే వారు తీర్పుతీర్చబడతారు! అందుకే బోధించే పనికి ఎవరూ తొందర పడవద్దు అని హెచ్చరిస్తున్నారు యాకోబు గారు! అయితే ఒకవేళ నీవు ఈ పనిని దేవునిచేత పొందుకున్నావా అయితే దీనిని చాలా జాగ్రత్తగా చెయ్యాలి- అందుకే రోమా 12:67 లో అంటున్నారు ..

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. 

 

దేవుడు ఉపదేశించే సామర్ధ్యాన్ని తనకు ఇచ్చారని, దానిని పరిపూర్ణంగా ఉపయోగించాలని గ్రహించి, బోధించే ముందు బోధించేటప్పుడు ఆ బోధను తనకు ముందుగా అన్వయించుకోవాలి అని మర్చిపోవద్దు! కారణం దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్ఘము! అందుకే పౌలుగారు ఇతరులకు బోధించిన తర్వాత నేను తప్పిపోతానేమో అని తననుతాను పరిశీలించుకుంటూ తన దేహాన్ని నలుగగొట్టుకుంటూ జీవించారు....

1కోరింథీయులకు 9: 27

గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

 

 కాబట్టి భయభక్తులు కలిగి బోధకు తగిన జీవితం జీవిస్తూ తన నాలుకను నోటిని భద్రముగా ఉంచుకుంటూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకుంటూ ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవిద్దాం!

ఉగ్రతనుండి  తీర్పునుండి తప్పించుకుందాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*17వ భాగము*

*నోరు-నాలుక-2*

యెషయా 6:57

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటూ నోటిని నాలుకను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాని ధ్యానం చేస్తున్నాము! ఇంకా ముఖ్యంగా పరిచర్య ప్రారంభించబోయేవారు పరిచర్యలో ఉన్నవారు నాలుకను ఎలా అదుపులో పెట్టుకొవాలో చెబుతున్నారు!

                                                       

          (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంకా యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూసుకుంటే

యాకోబు 3:16

1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

 

ఇక్కడ రెండవ వచనంలో మనమందరం అనేక విషయాలలో తప్పిపోతున్నాము, ఎవడైనా మాటయందు తప్పిపోకుండా ఉంటే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనంలో ఉంచుకొనే శక్తిగలవాడు అంటున్నారు! ఇంకా చెప్పాలంటే ఎవడైనా తన నాలుకను నోటిని భద్రముగా కాచుకుంటూ అదుపులో ఉంచుకొంటే, వాడు లోపం లేనివాడు కనుక  వాడు పరలోకం పోతాడు అంటున్నారు!

దీనిని బట్టి యాకోబుగారు ఏమంటున్నారు అంటే ఒక వ్యక్తికి ఉన్న అవయవాలు అన్నిటిలో నాలుకను అదుపుచేయడం ఎంతో ఎంతో కష్టము అంటున్నారు! తన నాలుకను అదుపులో ఉంచుకున్న వాడు, తన నాలుకను స్వాధీనంలో ఉంచుకున్న వాడు తన నాలుకపై అదుపు సంపాదించిన వాడు పరిపక్వత సాధించిన పరిపూర్ణ మానవుడు అన్నమాట! దేవుడు తనకు ఇచ్చిన బోధించే పనికి సరిగ్గా సరిపోయినవాడు!!! ఇక్కడ లోపము లేనివాడై అనగా అర్ధము ఇదే! పరిపక్వత సాధించిన పరిపూర్ణ మానవుడు!

 

కారణం ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం మనకు యాకోబు 2:10 లో కూడా కనిపిస్తుంది. అలాగే మనకు 2పేతురు 1:10 లో కూడా కనిపిస్తుంది.....

దీనికి అర్ధం- తూలిపడిపోవడం, పడిపోవడం, పొరపాటు పడటం, పాపంలో మరలా పడిపోవడం అనేఅర్ధాలు ఉన్నాయి! యాకోబుగారు అంటున్నారు మనమందరం అనేకసార్లు పడిపోతున్నాము అంటున్నారు, అనగా తనతోపాటుగా అనేకులు పడిపోతున్నారు గాని అలా పడకుండా ఉంటే ఆ మనుష్యుడు పరిపూర్ణ మానవుడు అంటున్నారు! అందుకే ఎవడైనా మాటయందు తప్పిపోకుండా ఉంటే ఆ వ్యక్తి తన సర్వశరీరమును కూడా అదుపులో ఉంచుకున్నవాడు! అనగా మాటయందు తప్పిపోకుండా ఉంటే చూపులో తప్పిపోడు! నడకలో తప్పిపోడు! ప్రార్ధనలో తప్పిపోడు! శరీరముతో పాపం చెయ్యడు! చివరికి ఆలోచనలలో కూడా తప్పుచెయ్యడు! అప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణ మానవుడు! యేసుక్రీస్తుప్రభులవారు కూడా వీటిలో దేనియందు తప్పిపోలేదు! అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరగలిగారు యేసయ్య! అంటే ఇలా సర్వ అవయవాలను స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటే ఆ మనిషి క్రీస్తు పోలికలోనికి మారిపోయాడు అన్నమాట! 

 

ప్రియ దైవసేవకుడా! బోధకుడా! సంఘకాపరీ! విశ్వాసి! సంఘపెద్డా! నీవు నీ నోటిమీద, నాలుకమీద గెలిచావా? దానిని స్వాధీనములో ఉంచుకోగలుగుతున్నావా?  క్రీస్తు రూపములోనికి మారాలి అంటే నాలుకను స్వాధీనములో ఉంచుకోక తప్పదు అని గ్రహించమని మనవిచేస్తున్నాను!

 

ఇక మూడు నాలుగు వచనాలలో కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు!

మొదటిది గుఱ్ఱము! గుఱ్ఱము చాలా వేగముగా పరిగెత్తుతుంది! మనిషి కంటే బలమైనది!తొందరగా అలసిపోదు! ఇంతటి వేగవంతమైన బలమైన గుఱ్ఱము కూడా కేవలము దాని నోటికి కల్లెము వేస్తే మొత్తము గుఱ్ఱము మనకు లోబడుతుంది కదా! అనగా ఇంతపెద్ద బలమైన వేగవంతమైన గుఱ్ఱము కేవలం కల్లెము వేస్తె మనకు లోబడుతుంది!

 

రెండు: ఓడలు చూడండి! ఎంతో పెద్ద ఓడలు ఉన్నాయి! ఇప్పుడు అర కిలోమీటర్ పొడవున్న షిప్ లు కూడా చేశారు! ఎనిమిది లక్షలు టన్నులు సామగ్రి తీసుకుని పోగలిగిన ఓడలు (ఓబో కేరియర్), తొమ్మిది లక్షల టన్నులు క్రూడ్ ఆయిల్ మోయగలిగిన సూపర్ టాంకర్లు కూడా ఉన్నాయి! అయితే ఇంతపెద్ద ఓడ, కేవలం చిన్న చుక్కాని (rudder) ద్వారా ఎటువైపు వెళ్ళాలంటే అటువైపు తిరుగుతుంది! చుక్కాని ఓడ పరిమాణంలో ౦.5% కూడా ఉండదు! గాని ఓడ మొత్తాన్ని త్రిప్పేస్తుంది.

గాని ఐదో వచనం  ఇంతపెద్ద మనిషి కూడా కేవలం చిన్న నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాడు అంటున్నారు! ఒక పెద్ద కంపెనీను స్వాదీనంలో ఉంచుకున్న వ్యక్తి, పెద్దపెద్ద క్రేన్లు లారీలు రైళ్ళు తన స్వాదీనంలో ఉంచుకున్న వ్యక్తి, తన శరీరాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి, కేవలం చిన్న నాలుకను అదుపులో ఉంచుకోలేక పోతున్నాడు! అది మన శరీరంలో చాలా చాలా చిన్నదైనా బహుగా అదిరిపడుతుంది! ఒకచిన్న నిప్పు ఎంతో పెద్ద అడవిని తగులపెట్టేస్తాది! అలాగే ఎంతో పెద్ద మనిషిని ఎంతో పేరుగల వ్యక్తిని చిన్న నాలుక కాల్చేస్తుంది! వాడి పరువు తీసేస్తుంది, చివరకు యుద్ధాలు తెస్తుంది ఈ నాలుక అంటున్నారు!

 

ఇక్క యాకోబుగారు చెప్పేదేమిటంటే చిన్నచిన్న విషయాలకు పెద్దపెద్ద ఫలితాలు వస్తున్నాయి. అలాగే దేహంలో చాలాచిన్న అవయవమైన నాలుక ద్వారా శాంతిని పొందవచ్చు అలాగే యుద్ధాన్ని కూడాకొని తెచ్చుకోవచ్చు! మంచైనా చేస్తుంది, కీడునైనా తెస్తుంది! ఆ సామర్ధ్యం మన నాలుకకు ఉంది! నాలుక దొర్లిపోతుంది! తొందరగా అదిరిపడి ఏదో ఒకటి అంటుంది, గాని ఫలితం మొదట వీపుకు, మూతికి దెబ్బలు తగులుతాయి! కొన్నిసార్లు మూతిపళ్లు రాలిపోతాయి! అనేకసార్లు ఈ నాలుక వలననే పోలీష్ స్టేషన్లకు కోర్టులకు తిరగాల్సి వస్తుంది! నాలుక నిర్మించగలదు -కూల్చగలదు! కట్టగలదు- కూల్చగలదు! ద్వంసం చేయగలదు!

అందుకే సామెతల గ్రంధంలో నాలుక జీవ వృక్షము అని చెప్పారు

సామెతలు 15: 4

సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.

 

సామెతలు 18: 21

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

 

పాము కోరలు లాగ విషం చిమ్ముతుంది

కీర్తన 140:3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

 

హతమార్చే కత్తిలా ఉంటుంది.

కీర్తనలు 57: 4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

 

వ్యాధిని నయం చేసే మందులా కూడా పనిచేస్తుంది.

సామెతలు 12: 18

కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్య దాయకము.

 

దుర్మార్గతను, కష్టాన్ని తెచ్చిపెట్టగలదు

కీర్తన 10:7

వారి నోరు శాపముతోను కపటముతోను వంచన తోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

 

న్యాయాన్ని నీతిని నిజాయితీని ప్రోత్సహిస్తుంది

కీర్తనలు 37: 30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

 

కీర్తనలు 51: 14

దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

 

ఇక ఆరవ వచనంలో నాలుకను నిప్పుతో పోల్చారు యాకోబు గారు ఆత్మావేశుడై! ఇది మన అవయవాలలో ఉన్న పాప ప్రపంచమై సర్వ శరీరమునకు కూడా మాలిన్యము తీసుకొస్తుంది, అంతేకాకుండా ప్రకృతి చక్రానికి చిచ్చు అనగా నిప్పు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెడుతుంది అనగా చివరికి మనిషికి నరకాన్ని తెస్తుంది అంటున్నారు!

 

అనగా అదుపులేని నాలుక అగ్నిలా వాడబడి మనిషికి నరకాన్ని తెస్తుంది, హృదయంలో శాంతి సమాధానాలు లేకుండా చేసి అందరితోను తగవులాడేలా చేస్తుంది నిన్ను!

గమనించాలి  జాగ్రత్తగా బైబిల్ ని  పరిశీలిస్తే హృదయం నిండిన దానిని బట్టి నాలుక మరియు పెదవులు మాట్లాడతాయి! లూకా 6:45; కాబట్టి తప్పంతా నాలుక మీదన కూడా త్రోసివేయ కూడదు!

 

ఇక నిప్పుతో ఎందుకు పోల్చారు అంటే అది గొప్ప వినాశనాన్ని మనిషికి తెచ్చిపెట్టగలదు కాబట్టి!

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

 

దానినుండి ఎగిరే ఒక నిప్పురవ్వ పెద్ద అడవిని తగులబెట్టగలదు! అంతేకాకుండా నాలుక ఒక పాప ప్రపంచం అంటున్నారు! అయితే ఈ ప్రపంచం దుర్మార్గమైనది.

కీర్తనలు 58: 3

తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

 

ఇది కోరికలతోను పాపపు ఆలోచనలతోను నిండి నిత్యమూ మండుతూ ఉంటుంది. ఆ మంటలు నరకము నుండి వచ్చి నిన్ను నరకానికే తీసుకుని పోతుంది!  అబద్దాలు, మోసపూరితమైన మాటలు, కొండెములు చాడీలు చెప్పడం, దేవుణ్ణి దూషించడం, శాపవచనాలు పలకడం, పరిహాసాలు సరసాలు ఆడటం ఇవన్నీ సాతాను గాడు ఈ నాలుకకు నేర్పించి నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాడు! కాబట్టి నాలుకను అదుపు చేసుకుంటావా?

 

కాబట్టి నాలుకకు అంత శక్తి ఉంది కాబట్టి దీనిని కట్టడానికి ఉపయోగిస్తావా లేక పడగొట్టడానికి ఉపయోగిస్తావా తగులబెట్టడానికి ఉపయోగిస్తావా లేక వంట వండుకోవడానికి ఉపయోగిస్తావా, శాంతికి ఉపయోగిస్తావా లేక యుద్ధానికి ఉపయోగిస్తావా దేనికి ఉపయోగిస్తావో నీ ఇష్టం! ఆ ఉపయోగించే విధానం తెలియలేదా నీకే నష్టం అని మర్చిపోవద్దు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*18వ భాగము*

*నోరు-నాలుక-3*

యెషయా 6:56

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటూ నోటిని నాలుకను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాని ధ్యానం చేస్తున్నాము! ఇంకా ముఖ్యంగా పరిచర్య ప్రారంభించబోయేవారు పరిచర్యలో ఉన్నవారు నాలుకను ఎలా అదుపులో పెట్టుకొవాలో చెబుతున్నారు!                                                      

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంకా యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూసుకుంటే

యాకోబు 3:712

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

 

ఇక ఏడవ వచనంలో మృగాలు పక్షులు పాములు జలచరములు అనగా జలములలో బ్రతికేవి అనగా చేపలు తాబేళ్లు మొసళ్ళు లాంటివి మనిషి చేత సాధువు అనగా మచ్చిక అవుతున్నాయి. మనిషి మాట వింటున్నాయి  గాని ఏ మనిషి కూడా ఇంతవరకు తన సొంత నాలుకను సాధువు లేక మచ్చిక చేసుకోలేక పోతున్నాడు అంటున్నారు! ఈ నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వముతో నిండిపోయింది అంటున్నారు ఎనిమిదవ వచనంలో!

పై వచనాలలో మొదటగా గుఱ్ఱము మరియు ఓడలు కూడా మనిషి మాట వింటున్నాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వచనాలలో మనిషిచేత మృగాలు పక్షులు పాములు లాంటి ప్రాకే జంతువులూ సముద్రంలో నివశించే ప్రాణులు కూడా మచ్చిక లేక మనిషి స్వాధీనంలోకి వస్తున్నాయి కాని మనిషి తన సొంత నాలుకను మాత్రం స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాడు అంటున్నారు! తన నాలుకను అన్నివేళలా సంపూర్ణంగా తన స్వాధీనంలో ఉంచుకున్న వాడు ఇంతవరకు యేసుక్రీస్తుప్రభులవారు మాత్ర్రమే , నరులలో ఎవరూ లేరు మానవ చరిత్రలో!

 

అబ్రాహాము గారు అలా చెయ్యలేక పోయారు- శారమ్మతో అబద్దమాడమని రెండుసార్లు చెప్పారు! ఆదికాండం 12:1120; 20:29;

 

మోషేగారు కూడా నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక పోయారు! సంఖ్యా 20:1012 అక్కడ ఇశ్రాయేలు వారిని ద్రోహులారా అని సంభోధించారు కోపం తట్టుకోలేక! అంతేనా బండతో మాట్లాడమని చెబితే బండను కర్రతో కొట్టారు మోషేగారు. ఆ బండక్రీస్తు కదా!

కీర్తనలు 106: 33

ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.

 

పేతురు గారు కూడా అదుపులో ఉంచుకోలేక పోయారు! మత్తయి 26:6974 లో  యేసుప్రభులవారు ఎవరో నాకు తెలియదు అని అబద్దమాడారు!

 

మరి క్రీస్తుప్రేమ సిద్ధాంతాన్ని బాగా అర్ధం చేసుకున్న వారు ఇద్దరే, మొదటిది యోహాను గారు, రెండవది: పౌలుగారు!

పౌలుగారు కూడా తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక ప్రధాన యాజకున్ని నోటిమీద కొట్టమన్నారు! అపో 23:25

 

ఇక యాకోబు గారు ముందుగానే ఒప్పుకున్నారు నేను నా స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాను అని. అందుకే మనమందరం తప్పిపోతున్నాము అన్నారు!

 

ఇది చెప్పడంలో నాఉద్దేశం మనం స్వాధీనంలో ఉంచుకోలేము గనుక మీరు కూడా దానికి అనగా అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించవద్దు అని కానేకాదు! తప్పకుండా ప్రయత్నించాలి! అసలు ప్రయత్నం చేయకుండా పూర్తిగా వదిలెయ్యకుండా కనీసం కొంతవరకైనా ప్రయత్నిస్తే మనకు మన శరీరానికి సమాజానికి కూడా ఎంతో మేలు!

 

అందుకే కీర్తనాకారుడు రాస్తున్నాడు : యెహోవా నా నాలుకకు నా నోటికి కావాలి పెట్టు!

కీర్తనలు 141: 3

యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.

 

సామెతల గ్రంధకర్త అంటున్నారు: అధికమైన మాటలలో దోషాలు ఉంటాయి అందుకే మాటలు తక్కువగా ఉండాలి.

సామెతలు 10: 19

విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

 

సామెతలు 11: 12

తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

 

సామెతలు 21: 23

నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

 

అయితే మన నాలుకను మన అదుపులో ఉంచుకోవడం ఎలా సాధ్యం?

మన హృదయం నిండా మన మనస్సునిండా దేవుని వాక్యముతో నింపుకుంటే, మనలను పరిశుద్ధాత్ముడు ఏలుతూ ఉంటే ఇది సాధ్యమే! అప్పుడు మన నాలుక మంచి సంగతులే మాట్లాడతాయి! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి సువార్తలో అంటున్నారు 12:2437 లో.....

25. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.

28. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.

31. కాబట్టి నేను మీతో చెప్పున దేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.

32. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

33. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

34. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

35. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

 

పౌలుగారు కొలస్సీ పత్రికలో అంటున్నారు

కొలస్సీయులకు 3: 16

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 

ఇలాచేస్తే మనం మన నాలుకను అదుపులో ఉంచుకోలేక పోయినా దేవుడు మన హృదయాలలో పనిచేసి ఆయన వాక్యము మన నాలుకను మన ప్రవర్తనను స్వాధీనంలో ఉండేలా చేస్తుంది! ఇది పరిశుద్దాత్మునికి, ఆయన వాక్యమునకు సాధ్యమే!

మరి నీ మనస్సు నీ హృదయం ఆయన వాక్యముతో ఆయన ఆత్మతో నింపబడటానికి ఇష్టపడుతున్నావా!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*19వ భాగము*

*నోరు-నాలుక-4*

యెషయా 6:56

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటూ నోటిని నాలుకను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాని ధ్యానం చేస్తున్నాము! ఇంకా ముఖ్యంగా పరిచర్య ప్రారంభించబోయేవారు పరిచర్యలో ఉన్నవారు నాలుకను ఎలా అదుపులో పెట్టుకొవాలో చెబుతున్నారు!

                                                       

         (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంకా యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూసుకుంటే

యాకోబు 3:712

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

ఇంకా ఎనిమిదో వచనంలో నాలుక విషంతో నిండి ఉంది ఆ విషం భయంకరమైన దుష్టత్వము అంటున్నారు! యాకోబు గారే కాదు కీర్తనాకారుడు కూడా ఇది విషంతో నిండి ఉంది అంటున్నారు.

కీర్తనలు 58: 4

వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను

 

కీర్తనలు 140: 3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

 

పౌలుగారు కూడా అంటున్నారు.

రోమీయులకు 3: 13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

 

ఎలాగు విషకరమైనదో మనకు తొమ్మిదో వచనం నుండి 12వ వచనం వరకు వివరిస్తున్నారు:

ఇదే నాలుకతో మనం తండ్రియైన దేవుని స్తుతిస్తున్నాము! ఇదే నాలుకతో అదే తండ్రియైన దేవుడు చేసిన మనిషిని శపిస్తున్నాము

ఇంకా ఇదే నోటితో నాలుకతో స్తుతి వస్తుంది శాపం కూడా వస్తుంది. ఇలా ఉండకూడదు అంటున్నారు. పదకొండో వచనంలో ఒకే ఊటనుండి లేక ఒకే నూతినుండి మంచినీరు లేక తియ్యటినీరు, చేదునీరు రావు కదా, పన్నెండో వచనం ఒక అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా అలాగే ఉప్పు నీళ్ళలో నుండి తియ్యటి నీళ్ళు పుడతాయా? గాని మీ నాలుకల నుండి స్తుతి మరియు శాపం ఎందుకు వస్తున్నాయి? మంచి దేవుని పాటలు మరియు బూతులు ఎందుకు వస్తున్నాయి అని అడుగుచున్నారు పరిశుద్ధాత్ముడు!!!

 

బైబిల్ లో మనిషి దేవుని పోలికలో పుట్టాడు లేక దేవుడు తన పోలికలో మనిషిని చేశారు అని వ్రాయబడింది ఆది కాండం 1:2627, మరియు ఎఫెసీ 4:24

మరి ఇప్పుడు దేవుని పోలికలో పుట్టిన నీవు నేను అదే దేవునిపోలిక పుట్టిన వ్యక్తిని ఎందుకు దూషిస్తున్నాము? ఎందుకు శపిస్తున్నాము? అని అడుగుచున్నారు!

 

ఒక ఊట నుండి మంచి నీరు చెడు నీరు లేక ఉప్పు నీరు తియ్యటి నీరు ఎలా పుట్టవో అలాగే మనిషి నోటినుండి ఆశీర్వాదం - శాపం రాకూడదు అంటున్నారు. కాని సృష్టి అంతటిలో మనిషి నాలుకకు మాత్రమే రెండు రకాల మూల స్థానాలు, రెండు రకాల ప్రవాహాలు ఉన్నాయి! అదే మనిషిని నరకానికి తీసుకుని పోతుంది! లేక పరలోకానికి తీసుకుని పోతుంది!

ఇది కుదరదు అంటున్నారు యాకోబు గారు!

 గతభాగంలో చూసుకున్నాము: మోషేగారు ఎంత దేవునికి నమ్మకమైన భక్తుడో- గాని పెదాలతో కానిమాట పలికారు- ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అంతగా కోపం పుట్టించారు! భూమిమీద ఉన్నవారిలో మోషేగారు మాత్రమే సాత్వికుడు అని దేవునిచేత సర్టిఫికేట్ పొందిన మోషేగారు (సంఖ్యాకాండము 12: 3

యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు).

 ఒకరోజు కోపం తట్టుకోలేక ద్రోహులారా అన్నారు! ఈమాట దేవునికి కోపం పుట్టించింది- ఇంతగా ప్రేమించిన మోషేగారిని కనాను దేశాన్ని చూడకుండా చేసేశారు!  తన కోపంలో పలికిన మాట తనను కనాను దేశం వెళ్ళకుండా చేసింది!

 

ఒక్క అబద్దం అననీయ మరియు సప్పీరలను దేవుని మందిరంలోనే చచ్చిపోయేలా చేసింది!

 

ఏలీయా గారు చేసినట్లు మేము కూడా అగ్నిని రప్పించి ఈ సమరయులను కాల్చేమంటావా దేవుడా అన్నారు శిష్యులు! అన్నారు గాని పలుకలేదు! వెంటనే యేసయ్యతో గద్దించబడ్డారు!

 

అయితే ఈ నాలుక దేనికోసం అంటే దేవుని స్తుతిని ప్రచురించడానికి! దీవెన వాక్యాలు చెప్పడానికి మాత్రమే అని గ్రహించాలి!

కీర్తనలు 35: 28

నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

 

కీర్తనలు 37: 30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

 

కీర్తనలు 45: 1

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది.

 

కీర్తనలు 51: 14

దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

 

కీర్తనలు 119: 172

నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును.

 

ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి!

అయితే దేవుడు ఒకరోజు ఈ నాలుకను కోసేస్తాను అంటున్నారు  ఎందుకంటే ఆ నాలుక విషపూరితమైనదే కాదు అది కత్తిలాంటిది కీర్తన

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

కీర్తనలు 52: 4

కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

 

కీర్తనలు 57: 4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

 

అందుకే నిప్పులు పోస్తాను అంటున్నారు:

కీర్తనలు 120: 3

మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

కీర్తనలు 120: 4

తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును

 

సామెతలు 10: 31

నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.

 

చివరిగా జీవమరణములు నాలుక వశము అంటున్నారు- నీకు జీవం కావాలా లేక మరణం కావాలా నిన్నీ కోరుకోమంటూన్నారు!

సామెతలు 18: 21

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

 

కాబట్టి నీకేది కావాలో నీవే తేల్చుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*20వ భాగము*

యెషయా 6:813

8. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా

9. ఆయన నీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

10.వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

11. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

12. యెహోవా మనుష్యులను దూరముగా తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.

13.దానిలో పదియవ భాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!  యెషయా 6వ అధ్యాయపు దర్శనాన్ని మనం చూసుకుంటూ నోటిని నాలుకను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాని ధ్యానం చేసుకున్నాము!

 

   ఇక 8వ వచనం నుండి చూసుకుంటే అక్కడ దర్శనం మారి- దేవుని ఆలోచనా సభకు వచ్చేసింది! దేవుని ఆలోచనా సభ అనేది జరుగుతూ ఉంటుంది అని మనకు యోబు  1,2  అధ్యాయలలోను మరియు 15:8 వలన మనకు స్పష్టమవుతుంది.  ఈ దేవుని ఆలోచనా సభల్లోనే దేవునియొక్క ముఖ్యమైన విషయాల కోసం అనగా భూమిమీద జరుగబోయే ముఖ్యమైన విషయాల కోసం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని ఈ అన్ని రిఫరెన్సుల ప్రకారం మనకు అర్ధమవుతుంది......

యోబు 1:6

దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

యోబు 1:7

యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

యోబు 1:8

అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు.

 

యోబు 2:1

దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

యోబు 2:2

యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

 

యోబు 15:8

నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

 

సరే, దర్శనంలో దేవుని ఆలోచనా సభ జరుగుతుంది. అప్పుడు దేవుడు అందరినీ అడిగారు- ఎవని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా యవ్వనస్తుడైన యెషయా గారు దయచేసి నన్ను పంపించండి అన్నారు! గమనించాలి ఈ దర్శనం ద్వారా దేవుడు యెషయా గారిని తనసేవకు పంపించారు!  గతంలో చెప్పినట్లు యెషయా గారు ఆయన పిల్లలు దేవుని కోసం సూచనలుగా ఉన్నాము అని చెప్పినట్లు ఇక్కడ యెషయా గారు యేసుక్రీస్తుప్రభులవారికి సూచనగా ఉన్నారు, ఒక సమయంలో అనగా ధర్మశాస్త్రము అట్టర్ ప్లాఫ్ అయిపోయి ఉండగా అదే దేవుని ఆలోచనా సభలో నేను ఎవని పంపుదును అని అడుగగా యేసుక్రీస్తుప్రభులవారు నేనున్నాను తండ్రి నన్ను పంపమని చెప్పి కాలము సంపూర్తిగా అయినప్పుడు మనుష్యకుమారుని రూపులో ఈ భూలోకమునకు వచ్చారు!

 

ఇక్కడ యెషయా గారు కూడా నేనున్నాను నన్ను దయచేసి పంపండి అని దేవుని అడిగారు!

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎవని పంపెదను? మానిమిత్తం ఎవడు పోవును అని తండ్రియైన దేవుడు అడుగుచున్నారు!! ఇక్కడ దేవుడు మా అనే బహువచనం వాడారు!! ఎందుకంటే ఆయన త్రిత్వమై ఉన్నారు కాబట్టి ఇక్కడ మానిమిత్తం అని అడిగినట్లు చూడగలము! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవునికి- తనకోసం శక్తివంచన లేకుండా నిజమైన హృదయంతో పనిచేసే మనుష్యులు భూమిమీద కావాలి! ఎందుకంటే ఈ లోకంలో దేవునికి జరుగవలసిన పని ఎంతో ఉంది. తన ప్రజలయొక్క పాపాలు క్షమించబడాలి! వారు తమ కుమారుని రక్తంలో కడుగబడి, పోగొట్టుకున్న తనతోటి అనుబంధం మరలా పొందుకోవాలి వారితో తానూ సంభాషించాలి అనేది దేవుని ఆశ! అందుకోసం ఆయన తనకోసం హృదయపూర్వకంగా పనిచేసే నిజమైన సేవకుల కోసం ఎదురుచూస్తున్నారు!!! కాబట్టి సేవకు పిలువబడిన సేవకుడు తన పాపాలను దేవుడు కడిగారని, తాను పొందవలసిన శిక్షను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భరించి తన కోసం చనిపోయి తన శిక్షను తొలిగించారు ఇంకా తన పరమరాజ్యానికి వారసునిగా చేశారు అనే నిజమైన కృతజ్ఞత కలిగి సేవ చేయాల్సిన అవసరం ఉంది! అదే కృతజ్ఞత ఇక్కడ యెషయా గారు చూపిస్తున్నారు- అయ్యా నా పాపములు మీరు క్షమించారు కాబట్టి మీపని నేను చేస్తాను అంటున్నారు!

 

 అయితే తోరా మరియు కొన్ని యూదుల చరిత్రకారుల పుస్తకాల ప్రకారం వెంటనే దేవుడు అడిగారు....

   *సరే, నేను నిన్ను పంపుతాను- గాని వారు నీ మాట వినకుండా నిన్ను తిట్టి కొట్టి నిన్ను అవమానిస్తారు, వాటిని భరించడానికి సిద్దమా అన్నారు దేవుడు!! అయ్యా అవసరమైతే నీనామం కోసం నా ప్రాణం పెట్టడానికి సిద్ధమే అన్నాడు!*

సెహబాస్ అయితే వెళ్ళు అన్నారు దేవుడు! 

*ఆ యవ్వనస్తుడు ఇంకా అడుగుచున్నాడు: అయ్యా నేను వెళ్లి వారికి ఏమని చెప్పాలి? దేవుడు చెప్పారు:  మీరు నిత్యము వింటారు గాని గ్రహించరు! నిత్యమూ నా కార్యాలను చూస్తున్నారు గాని వాటిని వాటి అర్ధాన్ని గ్రహించరు!!  నీవు అలా పలికే కొలదీ వారి హృదయాలు క్రొవ్వి వారి హృదయాలు చెవులు మందగించి వారి కళ్ళు (ఆత్మీయనేత్రాలు) మూయిస్తావు!!అన్నారు! అయ్యా! ఇలా ఎంతకాలం?   దేవుడు చెప్పారు: నివాసులు లేక పట్టణాలు గ్రామాలు బోడి అయిపోతాయి, దేశమంతా బీడుభూమిగా మారిపోయే వరకు!  ఈ దేశమునుండి మనుష్యులు దూరంగా కొనిపోబడి, దేశము ప్రజలులేని అడివిలా మారిపోతుంది! చెట్లు నరికేసిన తర్వాత కేవలం మొద్దు మిగిలినట్లు ఉంటుంది! ఇలా మారిపోయిన తర్వాత ఆ మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అన్నారు!

ఆ దర్శనం అంతర్ధానమైపోయింది!*

 

ఇక్కడ 910 వచనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే యెషయా గారి సేవలో బాగమేమంటే దేవుని ప్రజలు అని పేరుపెట్టుకున్న ఇశ్రాయేలు జాతి నీతి తప్పిపోయింది కాబట్టి దేవుడు దానికి ప్రతిఫలంగా వారిమీద కీడును తీర్పును రప్పిస్తున్నారు! ఆయనకు చెప్పి చేయడం అలవాటు, ఎందుకంటే తీర్పు విని కొందరైనా మారుమనస్సు పొందుతారేమో అనే తండ్రి హృదయం ఆయనది! కాబట్టి ఇక్కడ యెషయా గారి సేవ ఏమిటంటే వారిమీద దేవుని తీర్పులు ప్రకటించడం!!  అలా ప్రకటించే కొలదీ దేవుడు వారు ఇంకా మొండిదేరి పోయి దేవుని నుండి దూరమై పోతారు తద్వారా వారికి నాశనం కలుగజేయడం దేవుని ఉద్దేశం! దానికోసం ఇక్కడ దేవుడు యెషయా గారిని ఒక సాధనంగా వాడుకుంటున్నారు! 

 

ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, దేవుడు వారి హృదయాలు బండబారిపోయేలా చేయడం ఎందుకు? వారు మారుమనస్సు పొందేలా చేయవచ్చు కదా అని!

అయ్యా! ఆ ప్రయత్నాలు అన్ని ఎప్పుడో జరిగిపోయాయి! వారు దెబ్బ తగిలితే అయ్యో దేవా అనడం, శ్రమ తీరిన వెంటనే- అవసరం తీరాక తెప్ప తగలేసిన చందంగా- శ్రమ తీరిన వెంటనే విగ్రహాల వెనుక తమ పాపపు అలవాట్లు వెనుక తిరగడం వారికి ఒక అలవాటు (habit) గా మారిపోయింది!  మనం ఇతర ప్రవచన గ్రంధాలు, రాజులు, దిన వృత్తాంతాల గ్రంధాలు చూసుకుంటే పెందలకడే వారికోసం నేను నా సేవకులను పంపించినా వారు వినలేదు అని దేవుడే బాధపడ్డారు! అందుకే వారిని నాశనం చేద్దాం అని దేవుడు నిర్ణయానికి వచ్చేశారు! దానికోసం ఒక సాధనంగా దేవుడు యెషయా గారిని వాడు కుంటున్నారు!

2దినవృత్తాంతములు 36:15

వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచువచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను

2దినవృత్తాంతములు 36:16

వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.

 

యిర్మియా 7:13

నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక

 

యిర్మియా 7:25

మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.

 

యిర్మియా 25:6

యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.

 

ఇలాగే పూర్వకాలంలో అనగా మోషే గారి కాలంలో కూడా జరిగింది. దేవుడు ఫరో ని నాశనం చేద్దామనే ఉద్దేశంతో ఫరో హృదయాన్ని కఠినం చేసినట్లు మనం నిర్గమ 4:21 లో చూడగలం!

 

ఇంకా మరో విషయం ఏమిటంటే ఇదే వచనాలను యేసుక్రీస్తుప్రభులవారి కూడా వాడారు మత్తయి 13:1415 వచనాలలో!...

 

14. మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

15. గనుక మీరు వినుటమట్టుకువిందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.

 

అపోస్తులుల కార్యాలలో ఇంకా రోమా పత్రికలో పౌలుగారు మరోసారి వాడుతున్నారు ఈ మాటలు! 

అపొ 28:2629;

26. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము.

27. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.

28. కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక,

29. వారు దాని విందురు. (కొన్ని ప్రాచీన ప్రతులలో-అతడీ సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలోతాము చాల తర్కించుకొని వెళ్లిపోయిరి అని 29వ వచనము కూర్చబడియున్నది)

 

రోమీయులకు 11:25

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

 

ఇక ఈ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు అంటున్నారు: ఈ ప్రజలయొక్క కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి స్వస్తత పొందక పోవునట్లు అంటూ వారి కన్నులు మూయించుము వారి చెవులను మందపరచు అంటున్నారు భక్తునితో! అనగా దేవునిమాటలు వినకుండా వారి తిరుగబడి నాశనమైపోయేలా!

అయితే నిజానికి ఏ కన్నులు మూయించాలి? ఏ చెవులు మందగించేలా చేయాలి అంటే:

వారు ఉద్దేశ్యపూర్వకంగానే వాక్యానికి లోబడకుండా చేయడం అన్నమాట! అనగా వారి ఆత్మీయ చెవులు మూసుకుని పోవాలి! దేవునిమాటలకు లోబడని మనస్తత్వం వారికి కలుగుతుంది.

ఇక కండ్లు అంటే వారి ఆత్మీయనేత్రాలు అన్నమాట! వారు నిజమైన ఆత్మీయ కాంతిని పొందుకోకుండా నిజమైన సత్యమును గ్రహించకుండా వారి నేత్రాలను మూయించడం అన్నమాట! పౌలుగారు అంటున్నారు వారు దేవుని వాక్యానికి చెవి యొగ్గకుండా ఈ లోక సంబంధమైన దేవత వారి కన్నులకు చీకటి కలిగించింది అన్నారు!

2కోరింథీయులకు 4:4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

 

అయితే ఇక్కడ అనగా యెషయా గారికాలంలో దేవుడే యెషయా గారికి నీ బోధలతోవారికి అంధత్వం కలుగజేయు అంటున్నారు! ఎందుకంటే వారు నాశనపాత్రులు నరకపాత్రులు కాబట్టి!

 

నిజానికి ఇలాంటి బోధ యెషయా గారికే బాధను కలుగజేసి ఉండవచ్చు గాని దేవుడు చెప్పారు కాబట్టి చెప్పడానికి సిద్దమైపోయారు!  యెషయా గారికి కూడా వారు చేస్తున్న చెడుపనులు తెలుసు కాబట్టి ఆత్మలో ఎంతగానో క్షోభను అనుభవించి ఉంటారు! అందుకే ఎంతకాలం ఇలా ప్రభువా అంటే దేశంలో నివాసులు లేకుండా దేశం సర్వనాశనం అయిపోయేవరకు అని దేవుడు చెప్పారు!

 

నిజానికి యెషయా గారి సేవాపరిచర్యకు నేటి సేవాపరిచర్యకు ఎంతగానో వ్యత్యాసం ఉంది!  యెషయా గారికి అనుగ్రహించిన సేవ- తీర్పు సేవ, శిక్షా దండము గల సేవ!!

అయితే మనకు దేవుడు మత్తయి మార్కు సువార్తలలో అనుగ్రహించిన పరిచర్య మహిమగల పరిచర్య!!

మత్తయి 28:1820

18. అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.

19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

 

మార్కు 16:1518

15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

17. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును (మూలభాషలో- నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు,

18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.

 

2కొరింథీ 3:611

6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

7. మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.

8. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?

9. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కలదగును.

10. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.

11. తగ్గిపోవునదే (లేక,కొట్టివేయబడు) మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.

 

అయితే యెషయా గారి పరిచర్యను జాగ్రత్తగా గమనిస్తే మొదట వారికి అనగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఉగ్రతను తెలియజేస్తూ అంతములో క్రీస్తు మొదటి రాకను, రెండవరాకను, దేవునియొక్క శాశ్వత రాజ్య ప్రణాలికను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు!

 

అందుకే ఈ అధ్యాయం చివర్లో అయితే ఆ మొద్దు నుండి చిగురు పుడుతుంది అన్నారు. ఆ మొద్దు కోసం వివరంగా యెషయా 11:1 లో ఉంది. ఆ కొమ్మ చిగురు యేసుక్రీస్తుప్రభులవారే!!!

 

ప్రియ దైవజనమా! నీవు కూడా దేవుని మాటలు లోబడాలి అని ఉంది గాని నిన్నునీవు స్వాదీనం చేసుకోలేక పోతున్నావా? దేవుని ఆశ్చర్యకార్యాలు చూడలేకుండా నీకళ్ళు మందమై పోయాయా? జాగ్రత్త- నీవు దేవుని ఉగ్రతా గుంపులో ఉన్నావేమో!! సమయం గతించపోకముందే దేవుని పాదాలు పట్టుకో! ఆయన యవ్వన పవిత్ర రక్తము ఇప్పుడు కూడా కారుతుంది! అందులో నీ పాపము నేడే కడుగుని పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకో!

లేకపోతే ఆ ఉగ్రతను, నరక బాధను తట్టుకోలేవు సుమా!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*21వ భాగము*

యెషయా 7:12

1. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను

2. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  ఇంతవరకు యోతాము దినములలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకున్నాము!  

ఇక మనము మూడవ రాజైన ఆహాజు సమయంలో జరిగిన విషయాలు మాత్రం ధ్యానం చేసుకుందాం! ప్రవచనాలు తర్వాత ధ్యానం చేసుకుందాం!

 

ఈ 7వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు క్రీ.పూ. 735 లో జరిగిన సంభవము అని గమనించాలి! అనగా యెషయా  గారు పరిచర్య ప్రారంభించి సుమారుగా పది సంవత్సరాలు అవుతుంది. 

 

ఈ మొదటి వచనం చూసుకుంటే ఉజ్జియా మనుమడు, యోతాము కొడుకైన ఆహాజు దినములలో జరిగిన సంగతులు ఏమిటంటే సిరియా రాజు రెజీను  మరియు ఇశ్రాయేలు రాజు రెమల్యా కుమారుడన పెకహు ఇద్దరిమధ్య సంధి కుదిరింది.  వారిద్దరూ కలిసి యూదా దేశం మీద దండెత్తి ఆహాజు రాజుని తొలిగించి టాబెయేలు అనే వాడి కుమారుని  రాజుగా చేయాలి అనుకున్నారు. ఇది మనకు 410 వచనాలలో తెలుస్తుంది. నిజానికి దీనికోసం మరింత వివరంగా 2రాజులు 16:518 లోను, 2దినవృత్తాంతాల 28:1624 లోను కనిపిస్తుంది.  అయితే మనం కేవలం కొన్ని విషయాలే ధ్యానం చేసుకుందాం!  ఆ రెండు గ్రందాల ప్రకారం ఈ రాజు ఎప్పుడైతే సిరియనులు ఎఫ్రామీయులు అనబడే ఇశ్రాయేలు 10 గోత్రాలు సంధిచేసుకుని యూదా రాజ్యము మీదికి యుద్ధానికి వస్తారో భయపడి పోతారు రాజైన ఆహాజు మరియు అతని సైన్యము! అప్పుడు దేవుడు ఆహాజుతో మాట్లాడతారు.  అదే ఈ అధ్యాయం!!

 

అయితే ఈ రాజు దేవునిమీద నమ్మకముంచకుండా అష్షూరు రాజుకు వర్తమానం పంపి కీడును తెచ్చుకుంటాడు ఆ రెండు గ్రందాల ప్రకారం. అంతేకాకుండా దేవుని ఆరాధన మానేసి సిరియా బొమ్మలను కొలుస్తాడు!

 

సరే, మన పాట్యభాగం ధ్యానం చేసుకుందాం!

2వ వచనంలో సిరియా వాళ్ళు ఎఫ్రామీయులతో సంధి చేసుకున్నారు అని వినిన వెంటనే గాలికి చెట్లు కొమ్మలు కదిలిపోయినట్లు యూదుల మదులు కూడా ఊగిపోయాయి! ఆ సమయంలో మూడో వచనంలో దేవుడు ఆదరణ కరమైన వర్తమానం పంపిస్తున్నారు యెషయా గారితోనూ అతని కుమారుడైన షెయర్యాషూబు తోనూ!!

దేవుడు యెషయా గారితో చెబుతున్నారు: నీవు నీ కుమారుడైన షెయర్యాషూబుని వెంటబెట్టుకుని రాజైన ఆహాజుతో ఇలా చెప్పు: భద్రము సుమీ, నిమ్మలించుము పొగ రాజుచున్న ఈ రెండు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు రెమల్యా కుమారుడైన పెకహుకి భయపడకు వారి కోపానికి జడిసిపోకు! నీ గుండె అవిసిపోనీయకు!! సిరియా, ఎఫ్రాయిము సైన్యాధిపతులు, వారి రాజైన పెకహు నీకు కీడు చేయాలి అని ఆలోచిస్తున్నారు- వారి ఆలోచన ఏమిటంటే యూదా దేశము మీదికి పోయి యూదా ప్రాకారాలు పడగొట్టి రాజైన ఆహాజుని దించి లేక చంపి టాబెయేలు అనేవాడి కొడుకుని దానిమీద రాజుగా చేద్దాం అనుకుంటున్నారు గాని ఆ మాట నిలువదు అని చెబుతున్నారు దేవుడు!

 

ఇక్కడ మూడో వచనంలో యెషయా గారి పెద్ద కుమారుని పేరు కనిపిస్తుంది. ఇది దేవుడు చెప్పిన పెట్టిన పేరు.  దీని అర్ధం చెర పట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు కొద్దిమంది మాత్రమే తిరిగి వస్తారు! ఎప్పుడో పెద్ద కుమారుడు పుట్టినప్పుడు దేవుడు చెప్పారు! ఆ కుమారుడు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు.  బహుశా పది సంవత్సరాలు ఉండవచ్చు అనుకుంటాను నేను! ఆ కుమారుని తీసుకుని వెళ్తున్నారు యెషయా గారు ఇప్పుడు!!

 

యెషయా గారు వెళ్ళారు సందేశం చెప్పారు- సిరియనులు ఇశ్రాయేలు సైన్యము మీమీదికి యుద్దానికి వస్తున్నారు, అయితే నీవు భయపడకు, వారు నిన్ను తొలిగించి టాబెయేలు అనేవాడి కొడుకుని రాజుగా చేసి యూదా ప్రాకారాలు పడగొడదాం అనుకుంటున్నారు గాని  ఆ మాట నిలువదు అని దేవదేవుడే చెబుతున్నారు!

 

నిజానికి 2రాజులు 16:14 చూసుకుంటే రాజైన ఆహాజు చెడ్డవాడు అని మనకు అర్ధమవుతుంది. .....

1. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదు నేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను.

2. ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.

3. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.

4. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

 

యితడు భయంకరమైన విగ్రహారాదికుడుగా తయారయ్యాడు! అయినా దేవుడు ఇప్పుడు  ఈరెండు రాజుల నుండి నేను నిన్ను కాపాడుతాను అని సెలవిస్తున్నారు! ఇక్కడ ఆ రెండు రాజులను సైన్యాలను అగ్ని కొరువులతో పోలుస్తున్నారు! ఈ రెండు త్వరలోనే ఆరిపోయేవే!!

 క్రీ.పూ. 732 లో అనగా ఈ ప్రవచనం కలిగిన మూడు సంవత్సరాలకు సిరియా దేశం అష్షూరు రాజు చేత పట్టబడి నాశనం చేయబడింది. అనగా ఒక కొరివి ఆరిపోయింది! 

721 లో మరో కొరివి ఇశ్రాయేలు దేశం నాశనమైపోయింది. రెండో కొరివి కూడా ఆరిపోయింది!

 

సరే, ఈ ప్రవచనం ఇంకా ధ్యానం చేసుకుంటే ఆ మాట నిలువదు- ఏమాత నిలువదు అంటే ఆహాజుని తొలిగించి టాబెయేలు అనేవాడి కొడుకుని రాజుగా చేద్దాం అనేమాట నిలువదు అంటున్నారు! ఎందుకంటే 8వ వచనం: సిరియాకు రాజధాని దమస్కు!  దమస్కు అధిపతి రెజీను! ఇంకా అంటున్నారు ఇశ్రాయేలు రాజు, ఒక అన్యదేశపు రాజుతో కలిసి దేవుని మందిరము గల దేవుని దేశాన్ని నాశనం చేద్దామని వస్తున్నాడు కాబట్టి 65 సంవత్సరాలు పూర్తికాకుండా ఎఫ్రాయిము జనముగా కాకుండా అనగా ఇశ్రాయేలు అనే దేశమే లేకుండా పోతుంది అన్నారు!

 

ఈ మాట నిజంగా జరిగింది 2రాజులు 17వ అధ్యాయం చూసుకుంటే అష్షూరు రాజు  ఇశ్రాయేలు రాజైన  హోషేయ రాజు కాలంలో ఇశ్రాయేలుని నాశనం చేసి అక్కడి ప్రజలను చెరలోనికి అనగా అష్షూరు దేశానికి తీసుకుని పోయి- పదిగోత్రాల గల దేశమే లేకుండా చేశాడు!

 

 అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 65 సంవత్సరాలు సమయం ఇచ్చినా క్రీ.పూ. 721 లోనే అంతమైపోయింది ఎఫ్రాయిము సామ్రాజ్యము. అనగా ఈ ప్రవచనం చెప్పిన 15 సంవత్సరాలకే ఇశ్రాయేలు దేశము కాకుండా పోయింది. ఎందుకని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇశ్రాయేలు ప్రజలు రోజులు గడిచేకొలదీ మరింత దిగజారిపోయారు గాని వారు మారుమనస్సు పొందనే లేదు! అందుకే 65 కాకుండా 15 సంవత్సరాలకే సర్వనాశనం అయిపోయారు యెషయా గారి ప్రవచనం ప్రకారం!

 

ప్రియ దైవజనమా! దేవుడు నీకు గడువు ఇస్తే  ఆ గడువులోగా పశ్చాత్తాపపడి మార్పునొందాలి గాని ఇంకా సమయముంది కదా అని చెడిపోతే ఇలాగే ఉంటుంది. కాబట్టి మార్పునొంది పాపములు విడిచిపెట్టమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*22వ భాగము*

యెషయా 7:79

7. అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు, జరుగదు.

8. దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీనురాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.

9. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ఇంకా ఈ ప్రవచనాన్ని ధ్యానం చేస్తూ ముందుకుపోతే అక్కడ దేవుడు ఒకమాట అన్నారు: మీరు నమ్మకుండిన యెడల స్థిరపడక యుందురు!!!

 

ఈ మాట దేవుడు అనడానికి కారణం ఏమిటంటే దేవునికి తెలుసు- వీడు నా మాట వినడు అని!! అందుకే దేవుడు ఒకసారి హెచ్చరిస్తున్నారు!  మీరు విశ్వాసంలో నిలువకపోతే నా మాట వినకపోతే ఎంతమాత్రము నిలువరు అని యూదా రాజైన ఆహాజుకి చెబుతున్నారు!

దీనికోసం మనం వివరంగా చూసుకుంటే 2రాజులు 16:518 లోను, 2దినవృత్తాంతాల 28:1624 ప్రకారం: దేవుడు ఇంతగా ఆదరణ కరమైన మాటలు చెప్పినా ఈ రాజు వినకుండా అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ కి వర్తమానం పంపాడు, ఏమని అంటే నీ దాసుడు నీ కుమారుడైన నన్ను కరుణించి సిరియా రాజు ఇశ్రాయేలు రాజు నామీదికి దండెత్తి వచ్చారు కాబట్టి దయచేసి నీవు వచ్చి నాకు తోడుగా వారితో యుద్ధం చేయమని!!!

ఒక రాజు దేవుని మాట వినకుండా పరాయి రాజుతో సంధి చేసుకుంటున్నాడు! దేవుడు చెప్పారు నీతో నేనుంటాను అయినా వినలేదు ఈ రాజు! దేవునిమీద నమ్మకముంచకుండా పరాయి రాజు సైన్యము మీద విశ్వాసముంచాడు ఈ రాజు!

మరి ఆ రాజు ఊరికినే వస్తాడా? అందుకని దేవాలయంలో కనబడిన బంగారమంతా అష్షూరు రాజుకి కానుకగా పంపించాడు! దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి పనికిమాలిన పనివలన రెండు పనులు చేయాల్సి వచ్చింది!

 

మొదటిది: యూదా రాజు తన రాజ్యాన్ని సామంత రాజ్యముగా చేయాల్సి వచ్చింది జీవితాంతం! ఆహాజు రాజు, హిజ్కియా రాజు కాలంలో కొంతకాలం అష్షూరు రాజు చేతిక్రింద ఉండాల్సి వచ్చింది!

 

రెండవది: దేవుని ధనమును విగ్రహాలను పూజించే రాజుకి ఇవ్వాల్సి వచ్చింది. అదికూడా దేవుని మందిరములోని ధనము విగ్రహాల ఆలయములోనికి పోయింది! ఎంత సిగ్గుచేటు కదా ఇది!!!

 

   సరే, ఈ వర్తమానం మరియు ధనమును అందుకున్న తిగ్పట్లేసర్ మొదటగా దమస్కు అనగా సిరియా రాజధాని మీద దండెత్తి దాని రాజైన రెజీనుని చంపేశాడు.  గమనించాలి మనము చదువుకుంటే ఇది వెంటనే అయిపోయినట్లు కనిపిస్తుంది. గాని నిజానికి క్రీ.పూ. 735 లో తిగ్పట్లేసర్ కి కబురుపెడితే అతడు చదువుకుని తన సైన్యాలను సిద్ధపరచుకుని సిరియాను ముట్టడి వేయబోయే సరికి రెండు సంవత్సరాలు అయిపోయింది. రెజీనుని చంపి ఆ దేశం యొక్క ధనమును నీనేవే ఎత్తుకుని పట్టణం ఎత్తుకుని పోడానికి మరో సంవత్సరం అయ్యింది. అనగా సుమారుగా మూడు సంవత్సరాలు అయిపోయింది. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది. రెండు కొరకంచులలో ఒక కొరకంచి ఆరిపోయింది.

 

   అయితే విచారకరమైన విషయం ఏమిటంటే మనము 2రాజులు 16:1018 చూసుకుంటే ఎప్పుడైతే అష్షూరు రాజు సిరియా రాజుని దండెత్తి చంపేశాడు అని తెలిసిందో యూదా రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ ని కలుసుకోడానికి సిరియా రాజధాని యైన దమస్కుకి వెళ్ళాడు! దమస్కులో  అష్షూరు రాజుని కలిసాడు. అక్కడ సిరియా విగ్రహ సంబంధమైన బలిపీఠం చూసి దాని మచ్చు యూదా దేశానికి పంపించి దేవుని దేవాలయంలో ఆ బొమ్మకి ఈ బలిపీటం కట్టమని పంపించాడు. యేరూషలేము మందిరంలో ఉన్న యాజకుడు ఆ బలిపీఠం యేరూషలేము దేవాలయంలో కట్టించాడు!  ఈ రాజు సిరియా నుండి వచ్చి  దేవాలయంలో కట్టబడిన విగ్రహ సంబంధమైన బలిపీటానికి బలి అర్పించాడు!

 

    నిజానికి దేవుడు చెప్పినట్లు ఆ ఇద్దరు రాజులు యేరూషలేము మీద యుద్ధం చేయలేదు, గెలువలేదు గాని దేవునిమాట వినకుండా ఈ రాజు పరాయి రాజుమీద అతని సైన్యము మీద ఆడారపడ్డాడు సరికదా విగ్రహారాధనలో మునిగిపోయాడు! రక్షించింది దేవుడు! పూజించింది విగ్రహాలను!!! నమ్మక ద్రోహము!!!

 అందుకే దేవుడు ఏడుస్తున్నాడు- నమ్మకమైన దేశం /నగరము ఎట్లు వేశ్య అయిపొయింది అంటూ యెషయా 1:21 లో...

యెషయా 1:21

అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

 

ఈ రకంగా దేవుడు ఈ రాజుకి సహాయం చేసినా ఈ రాజు విగ్రహాలను హత్తుకున్నాడు- దేవునికి నమ్మకద్రోహం చేశాడు! అందుకే మీరు వినకపోతే చెడిపోతారు అని ముందుగానే చెప్పారు దేవుడు!

 

దేవునికి ఇలాంటి నమ్మకద్రోహులు అవసరం లేదు! నమ్మకమైన వారు కావాలి!  దేవునికోసం చనిపోవడానికైనా సిద్దపడే వారు కావాలి. షడ్రక్ మేషాక్ అబెద్నేగో ఇంకా దానియేలు ఇంకా అనేక భక్తులు దేవునికోసం చనిపోవడానికైనా తెగించారు గాని వారి విశ్వాసమును విడువలేదు! అది అపోస్తులులు గాని, ఆదిమ సంఘము గాని, మన దేశానికి అనేకదేశాలలో పరిచర్య చేసి చనిపోయిన దైవజనులైన మిషనరీలు గాని దేవునికోసం చనిపోడానికే సిద్దపడ్డారు గాని ఎవరునూ నమ్మకద్రోహం చేయలేదు!

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు ఎలా ఉంటున్నావు? నమ్మకముగా ఉంటున్నావా? నమ్మకద్రోహం చేస్తున్నావా? కేవలం caste సర్టిఫికేట్ కోసం నేను క్రైస్తవుడు కాను క్రైస్తవురాలును కాను అని ఎన్నిసార్లు సర్టిఫికేట్ తెచ్చుకుని నా దేవునికి నమ్మకద్రోహం చేశావు?!!!  కేవలం రేషన్ కార్డు కోసం, ఉద్యోగం కోసం ఎన్నిసార్లు నేను క్రైస్తవుడను కాను అని చెప్పి నమ్మకద్రోహం చేయలేదు!!!  పేతురుగారు ఆత్మను పొందకమునుపు క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకారు, జీవితాంతం పశ్చాత్తాపపడుతూనే ఉన్నారు! నీవు కూడా యేసు ఎవరో నాకు తెలియదు అని ఆయనకు నమ్మక ద్రోహం చేస్తున్నావా?  ఇరుకైనా ఇబ్బందైనా కరువైనా ఏమొచ్చినా నేను దేవునికోసమే జీవిస్తాను అని పీకలలోతు నీళ్ళలో ప్రమాణం చేశావు కదా బాప్తిస్మం తీసుకున్నప్పుడు!! మరి కేవలం ఒక సిగరెట్ కోసం, కేవలం ఒక పెగ్గు మందుకోసం , గర్ల్ ఫ్రెండ్ కోసం, కామం తీర్చుకోవడం కోసం దేవుడు నీ కిచ్చిన రక్షణను తాకట్టు పెట్టి ఎన్నిసార్లు దేవునికి నమ్మకద్రోహం చేస్తావు?

యూదా ఇష్కరియోతులా ఎన్నిసార్లు దేవునికి ద్రోహం చేస్తావు?

ఎన్నిసార్లు ఆయన గాయాలను రేపుతావు??!!! నమ్మకద్రోహం చేసిన యూదా ఇష్కరియోతు ఉరి పోసుకుని చచ్చాడు చివరకు! జాగ్రత్త!

ఇక నమ్మకద్రోహం మానివేసి ప్రభువుతో సమాధాన పడి పాపములు కడుగుకో!

లేకపోతే అగ్ని ఆరదు పురుగు చావదు! 666 ముద్ర వేసుకుని ఘోరమైన బాధలు పడకతప్పదు!!

1థెస్స 5:24 లో బైబిల్ చెబుతుంది మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక......

1థెస్సలొనికయులకు 5:24

మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

దేవుడు నమ్మకమైన వాడు గనుక మనము కూడా నమ్మకముగా ఉండాలి దేవునికి! మరి నీవు అలా ఉంటావా???  మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చారు.

 సంఖ్యాకాండము 12:7

అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.

మరి నీవు అలాంటి స్తితిలో ఉన్నావా???

దేవుని చేత భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిపించుకునేలా ఉన్నావా లేక సోమరియైన చెడ్డదాసుడా అని పిలిపించుకుంటావా?

ఏది కావాలో తేల్చుకో!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*23వ భాగము*

యెషయా 7:1017

10. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను

11. నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.

12. ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా

13. అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?

14. కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

15. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.

16. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.

17. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇక మన పాఠ్యభాగంలో ఇంకా ముందుకుపోతే 10వ వచనంలో అంటున్నారు దేవుడు ఇంకా ప్రవక్తయైన యెషయా గారిద్వారా ఇంకా మాట్లాడుచున్నారు: ఆహాజు నీవు నీ దేవుడైన యెహోవా వలన ఒక సూచన అడుగు, అది పాతాళమంత లోతైనా గాని ఊర్ధ్వలోకమంతా అనగా పరలోకమంత ఎత్తైనా సరే, అని దేవుడే చెప్పారు!

 

  దీనికోసం ఆలోచిస్తే: దేవుడే కొన్నిసార్లు తాను చెప్పిన మాట యొక్క తీవ్రత తన ప్రజలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో, ఇంకా వారు విశ్వాసంలో బలపడాలి అనే ఉద్దేశంతో దేవుడు కొన్ని సూచనలు, గుర్తులు ఇస్తారు వారు దేవుడు తప్పకుండా దానిని చేస్తారు అనే నిర్ధారణకు రావాలి అనే ఉద్దేశంతో! ఉదాహరణకు నిర్గమ 3,4 అధ్యాయాలలో దేవుడు మోషే గారికి కొన్ని సూచనలు చేసి చూపించారు ఇంకా మరో గంభీరమైన ప్రమాణం చేశారు- నీవు నా ప్రజలను విడిపించుకుని వచ్చి ఇదే పర్వతం మీద ఆరాదిస్తావు అని!  4వ అధ్యాయంలో కర్ర పాముగా కావడం, కుష్టువ్యాది సోకడం లాంటి సూచనలు చేసి మోషేగారికి దేవుడు తాను వారితో ఉన్నట్లు తానే స్వయముగా ఐగుప్తుకి పంపుతున్నట్లు నిర్ధారణకు వచ్చేలా చేశారు!

అలాగే గిద్యోనుని యుద్ధానికి పంపడానికి కూడా యెహోవా దూత కొన్ని సూచనలు చేసినట్లు మనం న్యాయాధిపతులు 6:1622, 3640 వచనాలలో చూడగలం!

 

ఇక్కడైతే దేవుడే ఆహాజుని ఒక సూచన అడగమని చెబుతున్నారు!  అయితే మనం మత్తయి 12:3839 వచనాలలో యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు సూచనలు అడుగుచున్నారు అంటున్నారు! దీనిని బట్టి ఏమి అర్ధమవుతుంది అంటే ఇలా దేవుణ్ణి సూచనలు అడగడం అనేది కొన్నిసార్లు మంచిది! కొన్నిసార్లు మంచిదికాదు సరికదా దేవుని కోపానికి గురి అవుతాము! మరి ఇప్పుడు అడుగవచ్చు మరి మనకు ఎలా తెలుస్తుంది ఎప్పుడు మంచిది ఎప్పుడు మంచిది కాదు అనేది!  అంటే: అది అడిగే వ్యక్తిమీదనూ , అప్పటి పరిస్తితుల మీదను, ఆ అడిగే ఉద్దేశం మీదనూ ఆదారపడి ఉంటుంది! అది మంచి ఉద్దేశముతో క్లిష్టమైన పరిస్తితులలో అడిగితే దేవుడు సూచనలు చూపిస్తారు, ఆ తర్వాత మహాత్కార్యాలు జరిగిస్తారు!!!

 

సరే, ఇక్కడ 12వ వచనంలో అంటున్నాడు ఆహాజు రాజు నేను దేవుణ్ణి సూచన అడుగను యెహోవాను పరిశోదించను అని డప్పాలు కొడుతున్నాడు!     నిజానికి ఇక్కడ తాను గొప్ప భక్తిపరుడను అని యెషయా గారికి చూపించాలి అనే ఉద్దేశముతోనే అంటున్నాడు! ఇక్కడ నేను దేవుణ్ణి విశ్వసించడానికి నాకు సూచనలు అవసరం లేదు, నాకు దేవుడంటే నమ్మకం అనే ఉద్దేశాన్ని ప్రదర్శించాలి అనుకుంటున్నాడు, దేవుణ్ణి పరిశోధించడం అనేది పాపము అని ద్వితీ 6:16 లో ఉంది కదా నీ దేవుడైన యెహోవాను పరిశోధించకూడదు, ఈ తరహాలో డైలాగులు కొడుతున్నాడు! వాస్తవానికి ఆహాజు రాజు ఒక విగ్రహారాదికుడుగా దుర్మార్గుడుగా బైబిల్ లో ఉంది! ఇతనికి దేవునితో ఎలాంటి పొత్తు లేక సంబంధం పెట్టుకోవాలి అనే ఆశయే లేదు! అప్పటికే తాను అష్షూరు రాజుకి కబురుపెట్టాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు! గాని దేవుని ప్రవక్త ముందు డప్పాలు కొడుతున్నాడు! నిజానికి ఆహాజు కోరలేదు- దేవుడే చెబుతున్నారు సూచన కోరుకో- గాని ఇక్కడ డంబాలు కొడుతున్నాడు గొప్ప భక్తిపరుడిలా ఫోజులు ఇస్తున్నాడు ఈ రాజు!

 

అప్పుడు దేవుడు చెబుతున్నారు: దావీదు వంశస్తులారా! వినండి మనుష్యులను విసికించింది చాలక దేవుణ్ణి కూడా విసికిస్తారా?? అంటున్నారు! ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కరిస్తున్నాడు రాజు! నీవు సూచన అడుగు అంటే నేను అడగను దేవుణ్ణి పరిశోదించను అన్నాడు గాని హృదయరహస్యాలు ఎరిగిన దేవునికి ఇతని హృదయంలో ఏముందో తెలుసు అందుకే అంటున్నారు దేవుడు మీరు మనుష్యులను విసికించింది చాలు- దేవుణ్ణి కూడా విసికిస్తారా?!!!

దేవున్ని ఇలా అనేకసార్లు విసికించారు ప్రజలు!

Psalms(కీర్తనల గ్రంథము) 78:17,18,40,41

17. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

18. వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.

40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

41. మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి.

 

కీర్తనలు 106:14

అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి

 

హెబ్రీ 3:9

నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.

 

ప్రియ సహోదరీ నీవు కూడా ఆలాగు చేస్తున్నావా? అలా చేసిన వారు పిట్టల్లా రాలిపోయారు! నీవు కూడా అలాచేస్తే దేవుని ఉగ్రత రాక తప్పదు- నేడే పశ్చాత్తాప పడి ప్రభుని క్షమాపణ వేడుకో!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*24వ భాగము*

యెషయా 7:1316

13. అతడుఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడ విసికింతురా?

14. కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

15. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.

16. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇక మన పాఠ్యభాగంలో ఇంకా ముందుకుపోతే 14వ వచనంలో అంటున్నారు అందుచేత ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతియై కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును!!!

 

      ప్రియులారా! ఈ ప్రవచనం ఎవరు ఎవరితో చెబుతున్నారు- యెషయా ప్రవక్తగారు ఆహాజు రాజుకి చెప్పడం లేదు- దావీదు వంశస్తులకు అనగా రాజ వంశస్తులకు చెబుతున్నారు ఏమని అంటే: కాబట్టి అనగా మీరు మనుష్యులనే కాదు దేవుణ్ణి కూడా విసికిస్తున్నారు, కాబట్టి దేవుడు మీకు అనగా దావీదు వంశస్తులై రాజ కుటుంభానికి చెందిన మీకు దేవుడు తానే స్వయంగా ఒక సూచన చూపించబోతున్నారు అది ఏమిటంటే  కన్యక గర్భవతియై కుమారుని కనీ ఆయనకు ఇమ్మానుయేలు అని పేరుపెట్టబడును.   హల్లెలూయ!!!

ఇది యేసుక్రీస్తుప్రభులవారి కోసమైన ప్రవచనం అని మనకు అందరికీ తెలుసు!  ఆ కన్యక దైవజనురాలైన మరియమ్మ గారు!

ఇమ్మానుయేలు మన ప్రియ రక్షుకుడైన యేసుక్రీస్తుప్రభులవారే!!!

 

అయితే ఇక్కడ మరొక అపోహ ఉంది.  కొంతమంది ఏమని అపోహ పడ్డారంటే యెషయా గారి సమయంలో దేవుడు ఒక కన్యక గర్భవతి అయ్యేలా చేస్తారు అని. కొంతమంది అంటారు నిజంగానే యెషయా గారి కాలంలో ఒక కన్యక గర్భవతియై కుమారుని కన్నది గమనించాలి- ఇవన్నీ కట్టుకధలు! చరిత్ర గాని బైబిల్ గాని ఎక్కడా యెషయా గారి కాలంలో గాని యిర్మియా గారి కాలంలో గాని ఎక్కడా ఒక కన్యక గర్భవతియై కుమారుని కన్నట్లు లేదు, ఇంకా ఆ బాలునికి ఇమ్మానుయేలు అని పెరుపెట్టినట్లు గాని లేదు అని గ్రహించాలి!

 

  ఈ ప్రవచనం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక కోసం తెలియజేసే స్పష్టమైన ప్రవచనం ఇది! అందుకే పరిశుద్ధాత్ముడు దీనిని ఉటంకించి మత్తయి భక్తుని వాడుకుని మరోసారి ఈ ప్రవచనాన్ని నెరవేరింది అని చెప్పారు!

మత్తయి 1:1823

18. యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;

21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

22. *ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు*

23. *అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము*.

 

ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు!  ఈ నామము కేవలం యేసుక్రీస్తుప్రభులవారికే చెల్లుతుంది తప్ప మరెవరికి చెందదు!  కారణం యేసుక్రీస్తుప్రభులవారే తండ్రియైన దేవుని అవతారం! దానిని మనకు యెషయా 9:67 వచనాలు నిర్ధారిస్తున్నాయి....

 

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

ఇంకా యోహాను 1:1, 14...

1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

2. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,

14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని (లేక, జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

 

గమనించవలసిన విషయం ఏమంటే ఈ ప్రవచనం పలికిన సరిగ్గా 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుప్రభులవారు కన్యకయైన మరియమ్మ గర్భంలో జన్మించారు! ఇది మానవాతీతమైన అద్భుతం! గమనించాలి- కన్యక గర్భవతి అవ్వడం గొప్ప కాదు! ఈ రోజులలో అనేకులైన కన్యకలు గర్భవతులు అవుతున్నారు వివాహం కాకుండానే! ఎందుకంటే వారు పెళ్ళికాకుండా మరో పురుషునితో వివాహేతర సంభంధం పెట్టుకుని కంటున్నారు! అయితే  ఇక్కడ మానవాతీతమైన అద్భుతం ఎప్పుడు అవుతుంది అంటే దైవజనురాలైన మరియ గారు ప్రధానం యోసేపు గారితో చేయబడినా ఇంకా వారు ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నారు. అనగా ప్రధానమైన 12 నెలలు వరకు ఎటువంటి శారీరక సంబంధం పెట్టుకోకూడదు- ఇది ఇశ్రాయేలు ప్రజలయొక్క కట్టడ! అలా పెట్టుకుంటే ఇద్దరినీ రాళ్లురువ్వి చంపుతారు!  అయితే ఇక్కడ మానవాతీతమైన అద్భుతం ఎలా అయ్యింది అంటే యేసుక్రీస్తుప్రభులవారే ఆత్మరూపంగా  తానే మరియమ్మ గారి గర్భములో ప్రవేశించారు ఎప్పుడు అంటే ఆమె పరిశుద్దాత్మ అభిషేకంతో నిండి ఆ శక్తి ఆమెమీద పనిచేస్తున్నప్పుడు జరిగిన అసాధారమైన అద్భుతం! అందుకే మత్తయి సువార్తలో అంటున్నారు ఆమె గర్భము ధరించినది పరిశుద్దాత్మ వలన కలిగినది! లూకా సువార్తలో అంటున్నారు-  గబ్రియేలు దూత ఇలా చెబుతున్నాడు: పరిశుద్దాత్మ నీమీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి అనగా పరిశుద్దాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును!!! 1:3536

 

ఈవిధంగా మానవాతీతంగా యేసుక్రీస్తుప్రభులవారి జననం జరిగింది! 

ఇదీ దేవుడిచ్చే సూచన!!!  ఎవరికీ ? దావీదు వంశస్తులై రాజ వంశానికి చెందిన వారికీ, అవిధేయులైన వారికి దేవుడిచ్చిన సూచన!!!

 

ఇంకా ప్రవచనంలో ముందుకుపోతే 15వ వచనంలో కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టే ఇద్దరు రాజుల దేశములు పాడుచేయబడును!

 

ఇక్కడ కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివిరాక ముందు అనగా యేసుక్రీస్తుప్రభులవారు ఎదిగేసరికి నిన్ను భయపెట్టే ఇద్దరు రాజులు మరియు వారి దేశం పాడుచేయబడుతుంది అంటున్నారు!

 

సరిగా ఈ ప్రవచనం చెప్పిన మూడు సంవత్సరాలకు మొట్టమొదటసారి అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ ద్వారా మొదటసారి, ఇంకా ఆ తర్వాత సిరియా దేశం యేసుక్రీస్తుప్రభులవారి జననం ముందు సుమారుగా నాలుగు సార్లు నాశనం చెయ్యబడింది. ఇంకా ఎఫ్రాయిము అనగా పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం 15 సంవత్సరాల తర్వాత ఒకసారి సర్వనాశనం అయ్యింది, ఇంకా యేసుక్రీస్తుప్రభులవారి జననం ముందు మరో రెండుసార్లు నాశనం అయ్యింది!!! ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది!

 

అవును దేవుడు చెప్పే ప్రతీ ప్రవచనం నెరవేరుతుంది!  ఆయన మాట ఇచ్చి నెరవేర్చే వాడు! అందుకే పౌలుగారు  అంటున్నారు అబ్రహాము గారి గురించి ప్రస్తావిస్తూ అబ్రహాము గారు వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చగలిగే శక్తిమంతుడు అని తెలిసికొని దేవునిమీద మరింతగా విశ్వాసముంచారు అదే అతనికి నీతిగా ఎంచబడింది అంటున్నారు....

రోమీయులకు 4:19

మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

రోమీయులకు 4:20

అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

రోమీయులకు 4:21

దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

రోమీయులకు 4:22

అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

మరినీకు అటువంటి అచంచలమైన విశ్వాసం నమ్మకం నీకుందా!!

ఆయన చెప్పిన ప్రతీమాట నెరవేరుతుంది. ఆకాశం గతించినా భూమి గతించినా గాని నేను చెప్పిన మాట జరుగి తీరుతుంది అని దేవుడే చెప్పారు...

మత్తయి 24:35

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

కాబట్టి ఆయన వాగ్దానాలను ప్రవచనాలను నమ్మి గమ్యానికి చేరుకుందాం!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*25వ భాగము*

యెషయా 7:1525

15. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.

16. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.

17. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

19. అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.

20. ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.

21. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱెలను పెంచుకొనగా

22. అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.

23. ఆ దినమున వెయ్యి వెండి నాణముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలు రక్కసి చెట్లును పెరుగును.

24. ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్క డికి పోవుదురు.

25. పారచేత త్రవ్వబడుచుండిన కొండ లన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చ పొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱెలు త్రొక్కుటకును ఉప యోగమగును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇక మన పాఠ్యభాగంలో ఇంకా ముందుకుపోతే 15వ వచనంలో అంటున్నారు: కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు అతని తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును!  దీని అర్ధం మామూలుగా చదువుకుంటూపోతే మనకు అర్ధం కాదు గాని ఈ అధ్యాయాన్ని చివరి వరకు చదువుకుంటూ వెళ్లి అర్ధం చేసుకుంటే మనకు దీని యొక్క తాత్పర్యం సంపూర్తిగా అర్ధమవుతుంది.

 

16వ వచనంలో కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టే ఇద్దరు రాజులు వారి రాజ్యములు పాడుచేయబడతాయి అని చెప్పారు కదా! మొదటిది సిరియా మరియు ఎఫ్రాయిము అనగా పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యములు పాడైపోతాయి!

 

ఇక 17వ వచనంలో అంటున్నారు- ఆ రాజ్యాలు పాడైపోతాయి అని నీవు సంభరపడుతున్నావేమో యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములు రాబోతున్నాయి అవి ఎఫ్రాయిము దేశము పాడుచేయబడినటువంటి ఉగ్రత కన్నా మహా ఘోరమైన విపత్తు దినములు రాబోతున్నాయి.  నీవు ఎవరినైతే నమ్ముకుంటున్నావో అదే అష్షూరు రాజుని దేవుడు నీ మీదికి రప్పించి ఇష్రాయేలు దేశము ఏర్పరచబడిన దినము మొదలుకుని ఇంతవరకూ కలుగని ఘోరమైన విపత్తు దినాలు నీమీదికి రాబోతున్నాయి.  ఇంకా 18వ వచనం ఆ దినమున ఐగుప్టు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశము లోని కందిరీగలను దేవుడు ఈలవేసి రప్పిస్తారు నీమీదికి! అవి వచ్చి నీ దేశాన్ని నాకివేస్తాయి!  ఇంకా అష్షూరు రాజుచేత కందిరీగల వంటి ప్రజలచేత దేవుడు నీకు క్షౌరము చేయిస్తారు!  అనగా నీ దేశము సర్వనాశనం అయిపోతుంది. గుండు గీయించుకుంటే తలమీద ఏమీ లేనట్లు యూదా రాజ్యంలో మనుషులు గాని పాడిపంటలు గాని ధనమూ గాని వెండి బంగారాలు గాని అధికారులు గాని లేకుండా సర్వమూ నశించిపోతుంది.  కేవలం కొందరు మాత్రం విడిచిపెట్టబడతారు అలా విడిచిపెట్టబడిన వారిలో ఒకడు చిన్న ఆవును రెండు గొర్రె పిల్లలను పెంచుకుంటే అవి సమృద్ధిగా పాలిచ్చినందు వలన ఆ పాలను త్రాగేవారు పెరుగు తినేవారు లేనందువలన విడువబడిన వారు పాలు పెరుగు తేనెను విస్తారంగా తింటారు!!!

 

    ఇంకా నీ దేశమంతా ద్రాక్షాచెట్లుకి బదులుగా గచ్చపొదలు ఉంటాయి బలురక్కసి చెట్లు ఉంటాయి దేశమంతా బాణములతో ఉంటాయి. ఇంకా ప్రజలు బయటకి వెళ్ళాలంటే బాణములు తీసుకునే వెళ్ళాలి ఎందుకంటే బలురక్కసి చెట్లు ఇంకా అడవిలోని క్రూరజంతువుల వలన భయముతో జీవిస్తారు ప్రజలు అంటున్నారు.

ఇదీ పెరుగు తేనెను తినడం అంటే! అనగా దేశములో ప్రజలు చనిపోయినందు వలన దేశములో ప్రజలు చాలాచాల తక్కువగా ఉండటంవలన విడువబడిన శేషము చిన్న ఆవును రెండు గొర్రె పిల్లలు పెంచుకుంటే చాలు విస్తారంగా పాలు పెరుగులు తింటారు అంటునారు!

 

    ప్రియులారా! ఇదీ దేవునిమీద విశ్వాసం తప్పితే జరిగే కార్యం! ప్రియులారా ఈ ప్రవచనం కూడా అక్షరాలా జరిగింది. దీనికోసం తర్వాత అధ్యాయంలో కూడా చెప్పారు దేవుడు యెషయ 8:78 ...

7. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరురాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.

8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.

 

అయితే ఇది హిజ్కియా గారి కాలంలో జరిగింది యెషయా 36:1 ప్రకారం......

హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

మొదట అష్షూరు రాజైన సన్హేరీబు తర్వాత బబులోను రాజైన నెబుకద్నేజర్, అతడి సేవకుడు నెబూజరదాను వీరంతా యూదా రాజ్యాన్ని యేరూషలేమును సర్వనాశనంచేశారు! ఆ తర్వాత అలగ్జాండర్ ద్వారా, అంతియోకాస్ ఎఫిఫానిస్ ద్వారా, రోమన్ల ద్వారా టైటస్ ద్వారా అనేకసార్లు యూదా రాజ్యము సర్వనాశనం అయ్యింది!

 

ఇక 18వ వచనంలో చెప్పిన జోరీగలు కందిరీగలు వీటి అర్ధం ఏమిటంటే శత్రుసైన్యం వచ్చి కందిరీగల వలె జోరీగల వలె ప్రజలను కుట్టి- కొట్టి పాడిపంటలను ఆస్తిపాస్తులను పాడుచేస్తారు అని అర్ధం!  వారు ఒకరిద్దరు కాకుండా వేవేల మందిగా కీటకాలవలె దాడి చేస్తారు అన్నమాట! వారంతా వచ్చి యూదా దేశాన్ని ఆక్రమించుకుంటారు అని అర్ధం!

 

ఇక 20వ వచనంలో అష్షూరు అనే మంగలకత్తి- క్షౌరము అనే మాట వాడుతున్నారు! దీని అర్ధం మొదటిగా ఏమీ లేకుండా దేశం సర్వనాశనం అయిపోతుంది.

 

రెండవది: ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా క్షౌరము చేయించుకోవడం అవమానంగా భావిస్తారు! వారు గడ్డాలు పెంచుకుంటారు! తలవెండ్రుకలు కూడా చాలామంది పెంచుకుంటారు! గుండు గీయించుకోరు షేవింగ్ చేసుకోరు! అది వారికి అవమానంగా భావిస్తారు! అనగా ఇక్కడ వారికి సంపూర్ణ అవమానం కలుగుతుంది అని చెబుతున్నారు దేవుడు!

ఈరకంగా మొదట వారి దేశాలు అనగా సిరియా మరియు ఎఫ్రాయిము అనబడే పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యము ఆ తర్వాత  కొన్ని రోజులలో నీదేశమైన యూదా రాజ్యము కూడా సర్వనాశనం అయిపోతుంది అని దేవుడు చెప్పారు!

కాబట్టి దేవుడు చెప్పినమాటకు లోబడి పశ్చాత్తాప పడితే దేవుడు కరుణిస్తారు గాని ఆయనకు వ్యతిరేఖంగా చేస్తే బ్రతికి బట్టకట్టడం అసంభవం! కాబట్టి నేడే మనము దేవునితో సమాధాన పడదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*26వ భాగము*

యెషయా 8:14

1. మరియు యెహోవా నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్‌, హాష్‌ బజ్‌, అను మాటలు సామాన్య మైన అక్షరములతో దానిమీద వ్రాయుము.

2. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా

3. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌ అను పేరు పెట్టుము.

4. ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

    ప్రియులారా! ఈ 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో జరిగిన సంభవాలకు తర్వాత జరిగినదే! అనగా ఇంకా ఆహాజు రాజు కాలంలోనే జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే: 7వ అధ్యాయంలో దేవుడు ఆహాజు రాజు దేవుణ్ణి వేడుకోకపోయినా దేవుడే నేను నీకు తోడుగా ఉన్నాను- నీవు సిరియా దేశం కోసం, ఎఫ్రాయిము అనబడే పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం కోసం భయపడకు! నేను ఆ దేశాలను పాడుచేస్తాను. నీకు తోడుగా ఉంటాను, అవసరమైతే నీకు నమ్మకం కలగడానికి ఏదైనా ఒక సూచన అడుగు అంటే నేను అడగను దేవుణ్ణి శోధించను అనిచెప్పి దేవునిమీద విశ్వసముంచకుండా అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ కి తనను రక్షించమని కబురుపెట్టాడు ఆహాజు రాజు! ఆ సందర్భములో దేవుడు మాట్లాడుతున్న మాటలే ఈ 8వ అధ్యాయము అని గ్రహించాలి!

 

  దేవుడు చెప్పారు మొదటి వచనంలో యెషయాతో: యెషయా నీవు నీవు ఒక గొప్ప పెద్ద పలక తీసుకో! దానిమీద మహేర్ షాలాల్, హాష్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరాలతో వ్రాయు ఆ పలకమీద! అది నెరవేరుతుంది అనడానికి నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యము పలకడానికి యాజకుడైన ఊరియాను, యెబెరెక్యా అనగా యెహోయూదా గారి కుమారుడు జెకర్యాను సాక్షులుగా పెట్టాను అని చెప్పారు దేవుడు!

ఒక పెద్ద పలక తీసుకుని వ్రాయమని చెబుతున్నారు అందరికీ అర్ధమయ్యేలా పెద్ద అక్షరాలూ సామాన్యమైన అక్షరాలతో వ్రాయు ఆ పలకమీద; ఏమని అంటే మహేర్ షాలాల్ హాష్బజ్ ! దీని అర్ధం  త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్లపెట్టబడును!!!

 

దేవుడు ఈ మాటలు ఎవరికోసం చెబుతున్నారు అంటే ఇంకా క్రిందికిపోతే యూదా ప్రజలను భయపెట్టే సిరియా రాజు అతని సైన్యము మరియు ఎఫ్రాయిము అనబడే ఇశ్రాయేలు పది  గోత్రాల రాజ్యమునకు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు కోసం చెబుతున్నారు! వీరిద్దరూ అనగా ఈ రెండు రాజ్యాలు త్వరితముగా దోపిడీ అయిపోతాయి,  ఆతురముగా కొల్లపెట్టబడతాయి అంటున్నారు దేవుడు!!

ఎలా అంటే: అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ సిరియా దేశము మీదికి ఇశ్రాయేలు పదిగోత్రాల మీదికి వచ్చి ఆ రెండు దేశాలను సర్వనాశనం చేస్తాడు అనేదానికోసం చెబుతున్నారు దేవుడు ఇక్కడ!!! ఈ మాటలు యూదా అధికారులు రాజులు ప్రజలు అందరూ ఉలిక్కిపడేలా చెబుతున్నారు దేవుడు!!!

 

ఇంకా ఈ సంబవాలు జరుగక ముందే దేవుడు ఇద్దరు ప్రముఖమైన వారిని సాక్షులుగా ఉంచుతున్నారు దేవుడు! ఒకరు యాజకుడైన ఊరియా, రెండు యెహోయూదా(యేబేరెక్యా) గారి కుమారుడైన జెకర్యా!!!

 

   దేవుడు చెప్పినట్లు యెషయా గారు పెద్ద అక్షరాలతో ఈ మాటలు వ్రాయడం జరిగింది. దారిన పోయే ప్రతి ఒక్కరూ దీని అర్ధం మాకు చెప్పవా అని అడుగడం మొదలుపెట్టారు! అప్పుడు దాని అర్ధం చెప్పడం మొదలుపెట్టారు యెషయా గారు! ఆ రాత్రి దేవుడు చెప్పారు: నీవు నీ భార్య దగ్గరికి వెళ్ళు- తద్వారా ఆమె ఒక కుమారుని కంటుంది ఆ కుమారునికి మహేర్ షాలాల్ హాష్ బజ్ అనే పేరుపెట్టు! ఆ పిల్లవాడు అమ్మా నాన్న అనకముందే అష్షూరు రాజు వచ్చి దమష్కు సంపద అనగా సిరియా దేశ సంపదను, షోమ్రోను సంపదను  దోచుకుని పోతాడు అని చెప్పారు!

 

ఆ విధం గానే యెషయా గారు చేస్తే- అతని భార్య గర్భవతి అయ్యింది తర్వాత కుమారుని కన్నది!  ఇక్కడ యెషయా గారు నేను ప్రవక్తిని వద్దకు వెళ్లాను అని చెబుతున్నారు! ఇక్కడ అతని భార్య నిజంగా దెబోరా మరియు హుల్దా వలే నిజంగానే ప్రవక్తినా లేక ప్రవక్తను వివాహం చేసుకున్నందువలన ప్రవక్తిని అని పిలుబడిందో మనకు తెలియదు గాని ఆమె కోసం బైబిల్ ప్రవక్తిని అని చెబుతుంది కాబట్టి మనం ప్రవక్తిని అని అనుకుందాం!

 

ఇక్కడ గమనించవలసిన మరో విషయం- ఇక్కడ  యెషయా గారి రెండో కుమారునికి కూడా దేవుడే పేరుపెట్టారు! మహేర్ షాలాల్ హాష్ బజ్ అని!

 

ఇది క్రీ.పూ 735 లో జరిగితే, 732 లో అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ సిరియా మీద దండెత్తి దాని సంపదను మొత్తం నీనేవే కి తీసుకుని పోయాడు!అప్పటికి యెషయా గారి రెండో కుమారుడు పుట్టాడు, తప్పటడుగులు వేస్తున్నాడు గాని ఇంకా అమ్మా నాన్న అనడం మొదలుపెట్టలేదు! దేవుని మాట అక్షరాలా నెరవేరింది! ఇది మనకు 2రాజులు 15:19 లోను, 16:9లోను కనిపిస్తుంది.

2రాజులు 15:19

అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.

2000 మణుగులు అనగా 31 టన్నుల వెండి ఇశ్రాయేలు రాజు అష్షూరురాజుకి ఇచ్చాడు.

 

ప్రియులారా అష్షూరు కోసం ఒకమాట చెప్పనీయండి: అసలు అష్షూరు రాజ్యం అంటే ఏమిటంటే: ఇదిమనకు ఇశ్రాయేలు దేశానికి ఈశాన్యంగా ఉంది. ఆ కాలంలో అష్షూరు అంటే ప్రస్తుతం ఉన్న ఇరాక్ ఉత్తరభాగం, సిరియాదేశం, ఇరాన్ టర్కీ దేశాలలో కొంత భాగాన్ని కలిపి అష్షూరు అనేవారు.  ఈ సామ్రాజ్యం పెరిగి  మహాగొప్ప సామ్రాజ్యంగా మారింది. దీనికి ప్రధానం పట్టణం అష్షూరు. దాని దేవత లేక జాతీయ దేవుడు పేరు అష్షూరు! దీనికి రాజధాని నిమ్రోదు కట్టిన /స్థాపించిన నీనెవే!!! క్రీ.పూ 740 నుండి క్రీ.పూ 650 వరకు దీని యొక ప్రభావం ఎంతో వ్యాపించింది. అయితే నెబుకద్నేజర్ తండ్రి రాకతో అష్షూరు రాజ్యం క్షీణించింది. క్రీ.పూ 612 లో నెబుకద్నేజర్ చేత ఈ నీనెవే నిర్మూలం అయిపోయింది!!!  అష్షూరు సామ్రాజ్యం అంతమైపోయి బబులోను సామ్రాజ్యం వ్యాప్తి చెందింది. అష్షూరు యొక్క బల ప్రభావాలు బబులోనుకి సంక్రమించాయి!!!

 

సరే, మొదటగా ప్రవచనం పలికిన మూడు సంవత్సరాలకు దమష్కు సిరియా నాశనమై పోయింది.  క్రీ.పూ 721 లో ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యమైన ఎఫ్రాయిము లేక షోమ్రోను రాజ్యం సర్వనాశనం అయిపోయింది!

కాబట్టి దేవుడు చెప్పిన ప్రతీమాట నెరవేరి తీరుతుంది అని తెలుసుకోవాలి!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*27వ భాగము*

యెషయా 8:58

5. మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను

6. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.

7. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును.

8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

     ప్రియులారా! ఈ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే దేవుడు ఇంకా యెషయా గారితో మాట్లాడుచున్నారు! 5వ వచనం ఈ జనులు మెల్లగా లేక ప్రశాంతంగా పారే షిలోహు నీళ్ళు వద్దని చెప్పి రెజీనుని బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషిస్తున్నారు, కాబట్టి ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంటితిని వారిమీదికి రప్పించును అప్పుడు అదిదాని కాలువలకు పైగా పొంగి వరదై ప్రవహిస్తుంది అంటున్నారు!

 

ఈ జనులు అనగా యూదా రాజు మరియు యూదా ప్రజలు; షిలోహు అనగా యెరూషలేము ప్రక్కన ఉన్న మంచి మంచినీటి ఊట అని ఊహిస్తారు. ఇది దేవుని దీవెన మరియు ఆశీర్వాదమునకు, ఇంకా దేవుడిచ్చే శాంతి సమాధానాలకు , దేవుడిచ్చే శాంతి భద్రతలకు సూచనగా భావిస్తారు ఇశ్రాయేలు జాతి!

 

ఇక్కడ షిలోహు నీళ్ళు వద్దని అంటే దేవుడిచ్చే దీవెన ప్రశాంతత కాదని రెజీను అనగా సిరియా రాజు, రెమల్యా కుమారుడు అనగా పెకహు కోసం అష్షూరు రాజైన తిగ్పట్లేసర్ కి కబురు పెట్టారు అంటున్నారు దేవుడు!   ఇది మనకు 2రాజులు 16:79 లో కనిపిస్తుంది. అందుకే ఇక్కడ  దేవుని ఉద్దేశం ఏమిటంటే యూదా ప్రజలు నన్ను కాదని అష్షూరు రాజుమీద నమ్మకం ఉంచుతున్నారు కాబట్టి, 7వ వచనం యూఫ్రటీసు అనే సముద్రం యొక తరంగాలను విస్తారమైన నీటిని రప్పిస్తాను, అప్పుడు యెరూషలేము ప్రాంతమంతా వరదలై పారుతుంది అంటున్నారు! 

ఇక్కడ యూఫ్రటీసు అనగా మహా సముద్రంలో నీటిని నేను రప్పిస్తాను ఎందుకంటే షిలోహు నీరు నెమ్మదిగా పారుతుంది అని మీరు భావిస్తున్నారు, దాని ప్రక్కనే చెబుతున్నారు నేనిచ్చే శాంతిభద్రతలు మీకు అవసరం లేదు అని మీరు ఏ అష్షూరు రాజుకి కబురు పెట్టారో అదే అష్షూరు రాజుచేతనే మీ దేశమంతా పాడై పోయేలా చేస్తాను అంటున్నారు దేవుడు!

 8వ వచనం ఆ నీరు మెడల వరకు మిమ్మును ముంచివేస్తుంది అంటున్నారు! చిన్న ఊట నీరు కాదని అన్నారు కాబట్టి  మహా సముద్రపు నీరు మిమ్మును ముంచివేసేలా చేస్తాను అంటున్నారు.

 

 ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పూర్తిగా మునిగిపోతారు అనడం లేదు, కుతికల లోతు అనగా మెడల వరకు మునిగిపోతారు  అంటున్నారు. అనగా అష్షూరు రాజుచేత మీరు సర్వనాశనం అవ్వరు, గాని మరో రాజుచేత సర్వనాశనం అవుతారు. అయితే మీరు ఏ రాజు కోసం రక్షించమని కబురు పెట్టారో అదే రాజుచేత మీకు వినాశనం కలుగజేస్తాను అంటున్నారు. ఇది మనకు హిజ్కియా రాజు కాలంలో జరిగింది.

 

అయితే ఈ ప్రవచనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇమ్మానుయేలు!!! పక్షి రెక్కలు విప్పినప్పుడు దాని రెక్కలు దూరంగా వ్యాపించినట్లు నీ దేశమంతటా వ్యాపించును అనగా దేవుడు నిన్ను కాపాడుతాడు!!!  ఇక్కడ దీని అర్ధం దేవుడు అష్షూరు రాజు చేతి నుండి నిన్ను కాపాడతారు అని చెప్పడం మాత్రమే కాకుండా దేవుడు రాబోయే కాలంలో రాబోయే ఇమ్మానుయేలు అనగా రాబోయే మెస్సయా ద్వారా దేశమంతటినీ కాపాడతారు అని అర్ధము!

 

 ఇంకా ముందుకుపోతే 910 వచనాలలో .....

9. జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

10. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.

 

జనులారా మీరు రేగండి గాని మీరు ఓడిపోతారు దూర దేశాల్లారా మీరు నడుము కట్టుకున్నా మీరు ఆయుధాలు కట్టుకున్నా మీరు ఓడిపోతారు మీ ఆలోచనలు భంగమైపోతాయి ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు అనగా ఇమ్మానుయేలు మాకు తోడుగా ఉన్నాడు అంటున్నారు!

 

దీని అర్ధం ఏమిటంటే యూదా ప్రజలు అంటున్నారు: దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి ఓ సైన్యములారా జనములారా మీరు రేగండి, మీరు ఎంత రేగినా ఎన్ని ఆలోచనలు చేసినా మీరు ఓడిపోతారు ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు అని చెబుతారు యూదులు అంటున్నారు! అందుకే దేవుడు మన పక్షమై ఉండగా శత్రువులు మనలను ఏమి చెయ్యగలరు అని సెలవిస్తుంది బైబిల్.....

రోమీయులకు 8:31

ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?

కీర్తన 56:9

నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును.

 

కీర్తనలు 118:6

యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?

కీర్తనలు 118:7

యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.

 

యిర్మియా 20:11

అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్న డును మరువబడని నిత్యావమానము పొందుదురు.

 

హెబ్రీయులకు 13:6

కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

 

అవును దేవుడు మన పక్షముగా ఉంటే ఎవరూ మనలని ఏమీ చెయ్యలేరు! మన దేవుడు మనకు బలమైన కోట మరియు ఆశ్రయముగా ఉన్నారు కాబట్టి నరులు నన్నేమి చేయగలరు అంటున్నారు కీర్తనాకారుడు....

కీర్తనలు 56:11

నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?

నీవు కూడా అలాగే దేవుణ్ణి ఆశ్రయించి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి ముందుకు సాగిపో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*28వ భాగము*

యెషయా 8:1115

11. ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను

12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.

13. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.

14. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును

15. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ప్రియులారా! ఇంకా 11వ వచనం నుండి అంటున్నారు ఈ జనుల మార్గమున నడువకూడదని యెహోవా నాకు బలముగా చెప్పియున్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను:  ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పేది బందుకట్టు అనుకోవద్దు వారు భయపడే దానికి బయపడవద్దు దానివలన దిగులుపడవద్దు ..

 

ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రజలు అనుసరించే మార్గమున నీవు నడువకూడదు అంటున్నారు, అదికూడా యెహోవానాకు బలముగా చెప్పియున్నారు అంటున్నారు.  దీనికోసం అనేకసార్లు చూసుకున్నాము!  అన్యజనుల మార్గములు అనుసరించవద్దు అంటూ...

యిర్మియా 10:23

2. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.

3. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.

 

కాబట్టి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలవలె ప్రవర్తించాలి. మన మాటలు ప్రవర్తన వస్త్రధారణ, పద్దతులు ఏవీకూడా అన్యజనులు చేసినట్లు ఉండకూడదు!  మనం పరిశుద్దులుగా ఉండటానికి దేవునిచేత పిలువబడి ఎన్నుకొన బడ్డాము కాబట్టి పరిశుద్దులుగానే జీవించాలి!

 

      ప్రియ దైవజనమా నీవునేను కూడా ప్రత్యేకించబడిన జనము. మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని అనిపించగలిగారు! దానియేలు 3;

నీవు ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడుఅని అనిపించగలిగావా??!!

పౌలుగారు 2 కొరింథీ 6:17 లో అంటున్నారు

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . . 

 

 కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడ్డావు కాబట్టి పాపిష్టి పనులు చేయకూడదు. మీరు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడ్డారు.1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

 అంతేకాకుండా వెండి బంగారముల వంటి వెలగల వస్తువులచేత మీరు విమోచించ బడలేదు గాని క్రీస్తు రక్తముద్వారా విమోచించ బడ్డారు 1పేతురు 1:18; కాబట్టి ప్రత్యేకముగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎందుకు అంటే:

 

    ఇంకా మనం  దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారము: మొట్టమొదట దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డాము. హనోకు గారి జీవితమును ధ్యానం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టులుగా లేక ప్రియులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ధ్యానం చేసుకున్నాం. మొదటగా విశ్వాసం కలిగియుండాలని, దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి యుండాలని, మన మాటలు దేవునిని సంతోషపెట్టే విధముగా ఉండాలని, ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల నమ్మకముగా, ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని, పరిశుద్దముగా జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వకముగా నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవినికి ఇష్టులుగా జీవించగలము! 

 

  ఇక్కడ పౌలుగారు ఇంకా స్పష్టముగా దేవునికి ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చెబుతున్నారు. గమనించాలి- దేవుడు చెప్పారు నేను పరిశుద్దుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండుడి అన్నారు. లేవీ 11:44-45; 20:26; 21:8;

 అంతేతప్ప నన్ను కేవలం నమ్ముకో! కేవలం నీటిలో నా పేరున మునిగేయ్, ఆ తరువాత నీవెలా ఉన్నా పర్వాలేదు. వెంటనే నీకు గోల్డ్ మెడల్, నిత్యజీవము, పరలోకరాజ్యము ఇచ్చేస్తానని దేవుడు చెప్పలేదు. మీరు పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు కారణం నేను పరిశుద్దుడను కనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి. అలా చేస్తే నేనుండే చోటున మీరును ఉంటారు. అదే విషయాన్ని దావీదుగారు చెబుతున్నారు కీర్తన 15 లో

1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.  . . . .

 

 ఇంకా అంటున్నారు ప్రకటన గ్రంధంలో అపవిత్రమైనది ఏదీ ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు! కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! దేవుడు నీనుండి ఆశించేది కేవలం పరిశుద్దమైన జీవితం. నీ డబ్బులు, ఇంకా మరేదో ఆశించడం లేదు. కేవలం పరిశుద్దమైన నీ హృదయం ఆయనకు కావాలి, అది ఆయనకు మందిరమైపోవాలి,. ఆ మందిరములో దేవుడు నిత్యమూ ఉండాలని ఆశిస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్దమైన జీవితం జీవిస్తావో, అప్పుడే దేవునికి ఇష్టుడుగా మారి, దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. అంతేకాకుండా దేవుడు పరిశుద్దుడు కాబట్టి నీవు పరిశుద్దముగా జీవిస్తే దేవుడే దిగివచ్చి, హనోకు గారితో దేవుడు ముచ్చటించినట్లు, ఆదాము అవ్వలతో దేవుడు ముచ్చటించినట్లు దేవుడే దిగివచ్చి నీతో ముచ్చటిస్తూ నీతోనే ఉంటారు. నీతో నిత్యమూ నివాసం చేస్తారు.

 

   కాబట్టి ప్రియ దైవజనమా! నీలో ఎటువంటి అపవిత్రత అయినా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు! ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవుని పాదాలు పట్టుకో! ఇకను పాపము చేయకు! పరిశుద్ధమైన జీవితం జీవించు! సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పేరుకు తగ్గట్టు జీవించు! అప్పుడు దేవుడు నీతో అనునిత్యమూ సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నారు!

మరి నీవు సిద్ధమా?

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*29వ భాగము*

యెషయా 8:1115

11. ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను

12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.

13. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.

14. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును

15. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లుచేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

           (గతభాగం తరువాయి)

 

      ప్రియులారా ఇంకా ముందుకుపోతే ఈ ప్రజలు బందుకట్టు అనగా కుట్ర అని చెప్పేది కుట్ర అనుకోవద్దు, వారు భయపడే దానికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు హడలిపోవద్దు ఎందుకంటే మీరు భయపడవలసినది దిగులుపడవలసినది సైన్యములకు అధిపతియగు యెహోవాకే!!! అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటారు అంటున్నారు! అన్యజనుల వలె మీరు లోకపు సంగతులకు భయపడవద్దు అంటున్నారు. దేవుడంటే భయభక్తులు గలవారు మనుష్యులకు భయపడవలసిన అవసరం లేదు. అయితే దేవునియందలి భయభక్తులు కలిగి ఉంటే అది నీకు ఎంతో మేలు!

కీర్తన ౩4:1114

11 .పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా?

13. చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.

14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

 

కీర్తనలు 111:10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెతలు 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

 

అయితే మనము నిజముగా భయపడవలసినది నిన్ను నన్ను ఈ సమస్త సృష్టిని చేసి నడిపిస్తున్న దేవునికే! ఆయనే సృష్టికర్త ఆయనే లయకర్త! కాబట్టి ఆయనకే భయపడాలి! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మీరు భయపడవలసినది....

మత్తయి 10:28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

 

ఎప్పుడైతే మనము దేవునికి భయపడతామో ఆయనకీ తగిన గౌరవం భక్తిశ్రద్దలు చూపిస్తామో దేవుడు మనకు ఆశ్రయముగా కోటగా ఉంటారు.  అలా నమ్మనివారికి పతనానికి నాశనమునకు అప్పగిస్తారు.

ఇక 14 వ వచనంలో అంటున్నారు.......

14. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును

15. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

 

దీనిని రోమా 9:33 లో పౌలుగారు ఎత్తి రాస్తున్నారు.....

రోమీయులకు 9:33

ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

 

పేతురు గారు కూడా దీనినే ఎత్తి రాస్తున్నారు

1పేతురు 2:7

విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

1పేతురు 2:8

కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

 

దేవుని విధులకు సత్యానికి లోబడని వారు నిజమైన సత్యము విషయంలో తొట్రుపడతారు ఆ సత్యము ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారే ఆ సత్యము! నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను,  నాద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు చేరలేడు అంటున్నారు......

యోహాను 14:6

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

 

కాబట్టి ఆ సత్యమైన యేసుక్రీస్తుప్రభులవారిని కోరుకున్నవారు పై స్థాయికి వస్తారు. ఆయనను తృణీకరించే వారు పడిపోతారు!

 

ఈ వచనంలో మరోమాట కూడ చెబుతున్నారు ఇశ్రాయేలు రెండు రాజవంశాలు లేదా రెండు రాజ్యాలకు తొట్రుపాటు పడే రాయిగా అభ్యంతరకరమైన రాయిగా ఉంటారు. అవును అందుకే కదా ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలు యూదులు యేసుక్రీస్తుప్రభులవారిని ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించలేదు. ఎంతవరకు అంటే పౌలుగారు చెబుతున్నారుఅన్యజనుల ప్రవేశం పూర్తి అయ్యేవరకు ....

రోమీయులకు 11:25

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

రోమీయులకు 11:26

వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

రోమీయులకు 11:27

నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

 

కాబట్టి మనము భయపడవలసినది దేవునికే తప్ప మనుష్యులకు, లోకమునకు కానేకాదు!  మనుష్యులు నన్నేమి చేయగలరు అంటున్నారు కీర్తనాకారుడు!

యెహోవాయే నా ఆశ్రయము ఎత్తైన కోట అంటున్నారు....

కీర్తనలు 28:7

యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

కీర్తనలు 59:16

నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసెదను

 

కాబట్టి దేవుని మీదనే లక్ష్యముంచుదాము ఆయనకే భయపడదాం!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*30వ భాగము*

యెషయా 8:1619

16. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.

17. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.

18. ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.

19. వారు మిమ్మును చూచి కర్ణపిశాచిగల వారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్లదగునా?

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

     ప్రియులారా! ఇంకా ఈ అధ్యాయములో ముందుకుపోతే 16వ వచనంలో దేవుడు చెబుతున్నారు ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధనుముద్రించి నా శిష్యులకు అప్పగించుము అంటున్నారు! ఎందుకంటే ఇవన్నీ త్వరలో సంభవించబోతున్నాయి గనుక!

 

 దేవుడు యిర్మియా గారికి కూడా ఈ సంగతులు వ్రాయమని చెప్పారు...

యిర్మియా 36:1

యూదారాజైన యోషీయా కుమారుడగు యెహో యాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యిర్మియా 36:2

నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.

యిర్మియా 36:3

నేను యూదావారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.

యిర్మియా 36:4

యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పినమాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.

 

అలాగే అపోస్తలుడైన యోహాను గారికి కూడా నీవుచూస్తున్న సంగతులు ఇంకా నీకు చూపించబోయే సంగతులు వ్రాసి పంపమని చెబుతున్నారు....

ప్రకటన గ్రంథం 1:10

ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము

ప్రకటన గ్రంథం 1:11

నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.

ప్రకటన గ్రంథం 1:19

కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,

ప్రకటన గ్రంథం 1:20

అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములకు దూతలు. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు.

 

దేవుడు తన ప్రజలు నశించిపోవాలని కోరుకోవడం లేదు. మీరు ఫలాని తప్పుడు పనిచేస్తున్నారు కనుక ఇది తప్పు, దానిని వదలమని ప్రజలకు తన ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా హెచ్చరిస్తారు, అప్పుడు విని సరిచేసుకోవడం మానవుల లేక తన పిల్లలయొక్క విధి. అందుకే ముద్రించి వారికి పంపమని చెబుతున్నారు.

 

ఇక 17, 18 వచనాలు యెషయా గారు చెబుతున్న మాటలు: యాకోబు వంశానికి ముఖము మరుగుచేసుకొనే యెహోవాను నేను నమ్ముకొని ఆయనకోసం ఎదురుచూస్తున్నాను అంటున్నారు, నేను ఆయన కోసమే కనిపెడుతున్నాను అంటున్నారు. ఇంకా 18వ వచనంలో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును సీయోను కొండమీద నివశించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు గాను మహాత్కార్యములు గాను మేము ఇశ్రాయేలు ప్రజలమధ్య ఉన్నాము అంటున్నారు!

 

ఈ రెండు వచనాలు కొన్నిసార్లు ఎవరు పలుకుతున్నారో తేల్చి చెప్పడం కష్టం! ఎందుంటే 17వ వచనంలో మాట్లాడేవ్యక్తి దేవుడైన యెహోవా కోసం కనిపెడుతున్నాడు. ఇంకా 17వ వచనం ఆఖరు భాగం, 18వ వచనం మొదటి భాగమును ఎత్తి హెబ్రీ పత్రిక 2:1213 లో పత్రికాకారుడు రాస్తున్నారు.....

హెబ్రీయులకు 2:12

నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య (లేక, సంఘముమధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను.

హెబ్రీయులకు 2:13

మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 2:14

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా- సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,

హెబ్రీయులకు 2:15

జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

కాబట్టి ఇది యెషయా భక్తుని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు రాబోయే అభిషక్తుడైన యేసుక్రీస్తుప్రభులవారి కోసం వ్రాయించారు అని అర్ధమవుతుంది.  బైబిల్ లో కొన్నిసార్లు ప్రవక్తలు వారికోసం రాసుకున్నట్లు లేక వారే చెబుతున్నట్లు కనిపిస్తాయి గాని అవి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుప్రభులవారి కోసం వ్రాయించారు !! ఉదాహరణకు 16, 40,  41, 69 , 72 కీర్తనలు! కీర్తనాకారుడు భాధతో రాసినట్లు కనబడినా అవి యేసుక్రీస్తుప్రభులవారు పెట్టబోయే కేకలుగా అనుభవించే బాధలుగా కనిపిస్తాయి!!

 

సరే, ఇక్కడ యాకోబు వంశానికి తన ముఖము మరుగుచేసుకొనే యెహోవాను నేను నమ్ముకొని ఆయనకోసం ఎదురుచూస్తున్నాను అని ఎందుకు రాస్తున్నారు అంటే ప్రజలు మరియు తనతోటి దావీదు వంశస్తులు ,ఇంకా తనతోటి రాజ వంశస్తులు దేవుణ్ణి వదిలేశారు. ఇప్పుడు దేవుడు వారికి తన తీర్పులు బయలుపరిచారు. గాని ఏదిఏమైనా నేను దేవున్నే నమ్ముకుంటాను ఆయననే ఆశ్రయిస్తాను అంటున్నారు!

 

ఇక్కడ యాకోబు వంశానికి తన ముఖం మరుగుచేసుకొనే యెహోవా అని ఎందుకు అంటున్నారు?  ఎందుకంటే యాకోబు వంశస్తులు అనగా ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేస్తున్న పాపములు మరియు అవినీతి అక్రమకార్యాలకు దేవుడు కోపగించుకుని తన ముఖాన్ని ఇక వారికి చూపకూడదు అని వారిమీద ఇష్టమును ప్రదర్శించకుండా ప్రతికూలతను చూపిస్తున్నారు అని అర్ధం!

 

ఇలా కీర్తనాకారులు అనేకసార్లు మొర్రపెట్టారు

కీర్తనలు 13:1

యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?

 

కీర్తనలు 27:9

నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

 

కీర్తనలు 30:7

యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని

 

కీర్తనలు 69:17

నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.

 

ఇక్కడ చివరకి అంటున్నారు ఎవరో ఎలాపోతే నాకనవసరం! నేను దేవున్నే ఆశ్రయిస్తాను అంటున్నారు. ఇలాగే బైబిల్ లో మరో భక్తుడు చెబుతున్నారు:  మీరు నది అవతల దేవతలను అనుసరిస్తారో ఈ ప్రజలను అనుసరిస్తారో అది మీ ఇష్టం గాని నేనును నా పిల్లలను యెహోవానే ఆశ్రయిస్తాను అంటున్నారు యెహోషువా భక్తుడు!....

యెహోషువ 24:15

యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

 

మరి నీవు ఎవరిని అనుసరిస్తావు ప్రియ చదువరీ!!!

 

దేవున్నా? లేక ఈ లోక పద్దతులనా? లేక ఈ లోక ప్రజలనా? నీవే తేల్చుకో!!

 

ఇక 18వ వచనంలో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను సీయోను కొండమీద సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు సూచనలు గాను మహాత్కార్యాలు గాను ఉన్నాము అంటున్నారు. గతంలో దీనికోసం చూసుకున్నాము!

6వ అధ్యాయంలో- యెషయా గారు-యేసుక్రీస్తుప్రభులవారికి!

7:3, 8:4 ప్రకారం తన యొక్క పిల్లలు ఇశ్రాయేలు ప్రజలకు- వారికి జరుగబోయే సంభవాలకు సూచనలుగా ఉన్నారు.

 

అందుకే హెబ్రీ 2:13 లో దీనిని ఎత్తిరాశారు!!

 

మరి నీవును నీ పిల్లలను దేవునికొరకు సాక్షులుగా నిలబడగలరా?

కష్టాలు ఎదురైనా నష్టాలు వచ్చినా చివరికి మరణమే వచ్చినా నా దేవునికోసం నిలబడ గలరా?

వారినే దేవుడు భళా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తారు!

 

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*31వ భాగము*

యెషయా 8:1922

19.వారు మిమ్మును చూచి కర్ణపిశాచిగలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్లదగునా?

20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

21.అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;

22. భూమి తట్టు తేరిచూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

     ప్రియులారా! ఇంకా ఈ అధ్యాయములో ముందుకుపోతే 19వ వచనంలో దేవుడు అంటున్నారు మరలా: వారు మిమ్మును చూసి కర్ణ పిశాచం గలవారి వద్దకు, కిచకిచలాడి గొనుక్కుంటూ మంత్రాలూ చదివే మంత్రజ్నుల యొద్దకు వెళ్లి విచారించండి అని చెబితే మీరు దేవుని దగ్గర విచారించాలి గాని అలాంటి మంత్రగాళ్ళ యొద్దకు శకునగాండ్ర వద్దకు వెళ్లి విచారిస్తారా? సజీవుల పక్షముగా చచ్చినోల్ల దగ్గర విచారిస్తారా అని అడుగుచున్నారు దేవుడు!!! అసలు అలాంటి వారి వద్దకు వెళ్ళకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు!

లేవీయకాండము 19:26

రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు,

 

ఇంకా ద్వితీ 18:915

9. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.

10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

12. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

14. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

 

దేవుడు ఇంత ఖండితముగా ఆజ్ఞాపించినా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఇలాంటి వారి వద్దకు వెళ్తున్నారు. అందుకే దేవుడు ఇక్కడ బాధపడుతున్నారు ఆయాసపడుతున్నారు అందుకే తనముఖాన్ని వారికి మరుగుచేసుకున్నారు!

 

గమనించాలి ఒక ఇశ్రాయేలు రాజు ఏలీయా గారి సమయంలో గాయపడి రోగి అయిపోతే ఎక్రోను దేవత దగ్గరకు పతి చెప్పించుకోవడానికి తన దాసులను పంపించాడు. అప్పుడు ఏలీయా గారు వారికి ఎదురై చెబుతున్నారు- ఇశ్రాయేలీయులలో దేవుడు అన్నవాడు లేడు అనుకుని ఎక్రోను దేవతయైన బయెల్జేబూబు దగ్గరకు మనుష్యులను పంపుతావా? నీవు ఎక్కిన మంచం దిగకుండా చస్తావు రా అని చెప్పమన్నారు. ఆ రాజు చచ్చాడు......

2 Kings(రెండవ రాజులు) 1:2,3,4

2. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా

3. యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోవుచున్నారా?

4. కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.

దీనిని బట్టి అర్ధమవుతుంది ఇది ఎంత తప్పో!!!

 

యెషయా 3:23:- ఆ దినమున యెహోవా నీ రక్షరేకులను, ఉంగరములను,..... తీసివేయును.

మీరు కర్ణపిశాచము గలవారియొద్దకు,చిల్లంగి వారియొద్దకు, మాంత్రికులు యొద్దకు వెళ్ళకూడదు, వారిని అవశ్యముగా వెళ్లగొట్టవలెను. అని ప్రభువు చెప్పియుండగా (ద్వితీ 18:9-13), నేడు అనేకమంది గ్రామాలలో వీరియొద్దకు పోయి పోములు/తావీదులు/రక్షరేకులు కట్టించుకొని దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నారు. తద్వారా దేవుని కోపానికి గురైపోతున్నారు. అత్యంత శక్తివంతమైన (యిర్మియా 32:17), బలమైన (యెషయా 6:9), దేవున్ని చేతకాని వానిగా చూస్తున్నారు (యెషయా 59:1-3). నీ రోగాన్ని నయం చేయడానికి దేవునికి శక్తి చాలదని తలస్తున్నావా? అందుకే పనికిమాలిన వ్యక్తుల దగ్గరకు వెళ్లి, పనికిమాలిన దయ్యాలకు పూజచేసిన పనికమాలిన తావీదులు/రక్షరేకులు/పోములు కట్టించుకొంటున్నావా? ఇవి కట్టించుకొని నీ దైవసేవకుని దగ్గరకు పోయి ప్రార్థన చేయించుకొంటున్నావు, ఒకవేళ ఆ దైవసేవకునికి ప్రార్థనా బలం తక్కువైతే ఆ దయ్యాలు ఆయన మీద ఎటాక్ చేస్తున్నాయి.

 

     అసలు నా దేవుని గురించి ఏమనుకొంటున్నావు? మాటమాత్రము చేత సర్వసృష్టిని, సమస్త భూ జల చరాదులను సృష్టించిన వారు నా దేవుడు (ఆది 1,2 అధ్యాయాలు) , కలుగును గాక అంటే వెంటనే అన్నీ కలిగాయి. ఎర్రసముద్రాన్ని మరియు యోర్దాను నదిని పాయలు చేసినవారు నా దేవుడు (నిర్గమ 14:21,22 & యెహోషువ 3:15,16). ఓ సాధారణ వ్యక్తి చేసిన అసాధారణ ప్రార్థన విని సూర్య చంద్ర గమనాగమనాలనే ఆపివేసిన శక్తిమంతుడు (యెహోషువ 10: 12-14), తనబిడ్డల మొరనాలకించి శత్రుసైన్యాలను చెల్లాచెదురు చేసినవారు, ఒక రాత్రిలో ఒకేఒక దూతనంపి 1,85,000 మంది సైనికులను హతమార్చారు (2రాజులు 19:35). మాటమాత్రము సెలవిచ్చి రోగాలను స్వస్తపర్చిన నా దేవుడు, మాటమాత్రము చేత దయ్యాలను వెళ్ళగొట్టిన నా యేసుప్రభుల వారు నీ దయ్యాలను వెళ్ళగొట్టలేరా? ఆయన పేరు వినగానే దయ్యాలు హడలెత్తి పారిపోయాయి, పారిపోతున్నాయి కదా . ఒక దయ్యం ఆవహించిందని మరో దయ్యం దగ్గరకు వెళ్తావా? దేవుని మీద ఆధారపడతావా? దయ్యాలను ఆశ్రయిస్తావా? ఆయన మాటలో శక్తి (లూకా 7వ అధ్యాయం) , ఆయన ఉమ్ములో శక్తి(యోహాను 9: 6,7), ఆయన వస్త్రపు చెంగులో శక్తి(లూకా 8: 41-44), ఆయన చల్లని తాకిడిలో శక్తి! (లూకా 8: 54,55). ఇంత శక్తికలిగిన దేవుడు ఇప్పుడు నీకు చేతకాని వానిలా కనిపించారా? అందుకేనా దయ్యాలని ఆశ్రయించి పోములు రక్షరేకులు కట్టించుకొంటున్నావ్. జాగ్రత్త! జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.(హెబ్రీ 10:31).

 

       అసలు నీకు విశ్వాసం ఉంటేనే కదా నీ రోగము /దయ్యం పోడానికి!  క్రీస్తులో సగం / లోకంలో సగం. సగం భక్తి, సగం దుష్టాచారాలు, లోకాచారాలు, భ్రష్టాచారాలు. దేవునిలో ఉంటూనే నీ అన్యాచారాలు మానవు. దేవుని బిడ్డనంటావు దయ్యం పనులు చేస్తావు. నులువెచ్చని జీవితం. అందుకే యేసుప్రభులవారు అంటున్నారు- నీవు చల్లగానైననూ వెచ్చగానైననూ లేక నులువెచ్చగా ఉన్నావ్ కాబట్టి నా నీటినుండి ఉమ్మివేయనుధ్దేశించుచున్నాను. (ప్రకటన 3: 15-17). నీ బ్రతుకు మార్చుకోకపోతే ఇంతవరకూ చేసిన నీ వేషధారణ భక్తి వ్యర్ధం!

 

      నేను ప్రార్థన చేసినా నాకు స్వస్థత కలగడం లేదు. అందుకే పోములు కట్టించుకొంటున్నాను అంటున్నావ్. నీవు ఉపవాసం ఉండి లోకవార్తలు చెప్పుకొంటూ లోక వ్యాపారం చేసుకొంటూ, ప్రార్థన చేస్తున్నావు. అది నాకిష్టంలేదు అంటున్నారు దేవుడు (యెషయా 58). మీరు ఆశిస్తున్నారు గాని దొరకడం లేదు, దేవున్ని అడగటం లేదు అందుకే దొరకడం లేదు, అడిగినా మీ భోగముల నిమిత్తమై అడుగుచున్నారు అని అంటున్నారు దేవుడు (యాకోబు 4: 2-10). ఇలాంటి రెండు తలంపులు గలవారికి దేవుడిచ్చే బిరుదు:- వ్యభిచారిణులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని తెలియదా?

ఎవడు ఈలోకముతో స్నేహించునో వాడు దేవునికు శత్రువగును. ఖబడ్దార్! దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి అప్పుడాయన మీయొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ఎందుకంటే మీ చేతులనిండా అన్యాయం, అన్యాయపు సొమ్ము, వ్యభిచారపు క్రియలు, వాటినే శుభ్రం చేసుకొనండి అంటున్నారు. ద్విమనస్కులారా! మీ హృదయాలను పరిశుధ్ధ పరచుకోండి .. హృదయంలో సగం దేవుడు - సగం లోకం, సగం భక్తి- సగం వ్యభిచారపు తలంపులు. అందుకే దుఃఖపడుడి వ్యాకులపడుడి మీ ఆనందాన్ని చింతగా మార్చుకొండి ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నారు. అప్పుడు ఆయన మీ దగ్గరకొచ్చి మీ రోగాలను తీసేస్తారు. మీ దయ్యాలను తరిమికొడతారు. అసలు దయ్యాలను తరిమి కొట్టడానికి మీకే ఎప్పుడో అధికారం ఇచ్చారు (మార్కు 16: 15-18). మీ దగ్గర సత్తాలేక వెళ్లగొట్టడం లేదు, సరికదా దయ్యాలను ఆశ్రయిస్తున్నారు. ఎంత విచారము. ఎంత సిగ్గు చేటు! ఇంకా అంటున్నారు రక్షింపకనేరకుండునట్లు యెహోవా హస్తం కురుచకాలేదు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు,  మీ పాపములు మీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి వాటిని తీసెయ్ (యెషయా 59: 1,2)

  అందుకే 20వ వచనంలో అంటున్నారు: మీరు విచారించవలసినది ధర్మశాస్త్రాన్ని ప్రమాణ వాక్యాలను, అలా చేయకపోతే దేవునియొక్క అరుణోదయ కాంతి వారిమీద ఉండదు!

 

     కాబట్టి ఇంకెంతకాలం దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తావు? ఈ లోకాన్ని వదలి యేసయ్య దగ్గరకు పరిపూర్ణ విశ్వాసంతో రా! షడ్రక్, మేషాక్, అబెద్నెగోల వలె మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించడానికి సమర్ధుడు. ఒకవేళ రక్షించకపోతే చావనైనా చస్తాం గాని నీ బంగారు బొమ్మకు మొక్కం అని ఖరాకండిగా చెప్పగలగాలి (దానియేలు 3: 16-28). ఆ అచంచలమైన విశ్వాసం దేవునిదూత వాళ్ళతోపాటు అగ్నిగుండంలోనికి దూకాల్సి వచ్చింది అగ్ని గుండం A/C Room అయిపోయింది. నీకు కూడా అదే విశ్వాసం కావాలి. అప్పుడే దయ్యాలు నిన్ను చూసి పారిపోతాయి. నీవు ప్రార్థన చేస్తే ఎటువంటి మొండి దయ్యమైనా సరే పేరుచెప్పి పారిపోవల్సిందే. నాయందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్న యేసయ్య మాట నేడే నమ్ము. అవిశ్వాసి కాక విశ్వాసంలో ముందుకు నడు.

నీ పాపాలు తీసెయ్.

విజయాలు పొందుకో!

 

      కృప మీకు తోడైయుండును గాక!

      ఆమెన్!

       దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*32వ భాగము*

యెషయా 36:1

హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము ఆహాజు రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక హిజ్కియా రాజు కాలంలో జరిగిన సంభవాలు చూసుకుందాం!

 

    ప్రియులారా! హిజ్కియా రాజు కోసం బైబిల్ లో మూడు చోట్ల విస్తారంగా వ్రాయబడింది అంటే యితడు ఎంత మంచిరాజో మనకు అర్ధమవుతుంది. ఈ రాజుకోసం మనకు రెండో రాజుల గ్రంధంలోనూ రెండో దిన వృత్తాంతాల గ్రంధంలోనూ ఇంకా ఇదే యెషయా గ్రంధంలోనూ విస్తారంగా వ్రాయబడి ఉంది.  యెషయా 38:920 తప్పించి మిగిలిన భాగమంతా 2రాజులు 1820 అధ్యాయలలోను, రెండో దిన వృత్తాంతాల గ్రంధములోను ఉంది.  మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండో రాజుల గ్రంధంలో యెషయా గారు రాసినట్లే అదేవిధంగా వ్రాయబడి ఉంది అనగా వాడిన భాషా ప్రయోగం ఒకేవిధంగా ఉంది.

   ఈ యెషయా గ్రంధంలో 36వ అధ్యాయం క్రీ.పూ. 701 లో జరిగింది అని గ్రహించాలి. అప్పటికి హిజ్కియా పరిపాలన ప్రారంభించి 14 సంవత్సరాలు అయ్యింది అని గ్రహించవచ్చు  మొదటి వచనం ప్రకారం. ఈ అధ్యాయం ధ్యానం చేసేముందుగా అసలు ఈ రాజు ఎలాంటివాడు, అంతమంచి భక్తి ఎక్కడనుండి వచ్చిందో చూసుకుంటే ఇంకా మనకు బాగా అర్ధమవుతుంది. కాబట్టి హిజ్కియా రాజు కోసం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం!

 

బైబిల్ గ్రంధంలో దావీదుగారి తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పాలించిన మంచి రాజులు ఎవరు అంటే  లేనేలేరు అని చెప్పవచ్చు! యూదా రాజులు ఎవరు అంటే ఆసా గారు, హిజ్కియా గారు, యెహోషాపాతు, ఇంకా యోషీయా అని చెప్పవచ్చు! దావీదు గారి తర్వాత మంచి రాజులలో అతిశ్రేష్టులలో ప్రముఖుడు ఈ హిజ్కియా గారు.  మరి దావీదు గారి కాలం  తర్వాత  దుర్మార్గులైన ఇశ్రాయేలు రాజులు ఎవరు అంటే అందరూ! యూదా రాజులలోను అనేకులున్నారు. వారికి గాని ర్యాంకులు ఇస్తే మొదటిర్యాంకు హిజ్కియా గారి కుమారుడు మనస్షేకి రెండో ర్యాంకు హిజ్కియా గారి తండ్రి ఆహాజుకి చెందుతుంది. ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే అతి మూర్ఖుడైన రాజు కడుపునుండి అతిశ్రేష్టుడైన రాజు ఎలా వచ్చాడు అంటే అది నిజంగా దేవుని సంకల్పము మొదటిది అయితే, రెండవది: అత్యంత సాధ్వి, ప్రార్ధనాపరురాలు, భక్తిపరురాలు అయిన అతి మూర్ఖుడైన రాజు భార్య అబీయా వలన హిజ్కియా గారు అతిశ్రేష్టుడైన రాజుగా మారారు! ఈ అబీయా అనే ఈ తల్లి ఎవరూ అంటే ఆమె యాజకుడైన జెకర్యా గారి కుమార్తె! ఈ జెకర్యా గారి కోసమే యేసుక్రీస్తుప్రభులవారు బలిపీటమునకును దేవాలయమునకును మద్య మీరు హత్యచేసిన బెరెక్యా కుమారుడైన జెకర్యా అని చెప్పారు. మత్తయి23:35, లూకా 11:51; ఈ బెరెక్యా గారికి మరో పేరు యెబెరెక్యా అనే యెహోయూదా గారు. ఈ జెకర్యా గారి చిన్న కుమార్తెను బంధువుడు కాబట్టి అతి మూర్కుడైన ఆహాజుకి ఇచ్చి పెళ్లి చేశారు!  యెషయా 8వ అధ్యాయంలో నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి యాజకుడైన ఊరియాను యెబెరెక్యా కుమారుడైన జెకర్యాను సాక్షులుగా పెట్టాను అని చెప్పింది కూడా ఇదే బెరెక్యా అని గ్రహించాలి! జెకర్యా యాజకుడు మరియు ప్రవక్త కాబట్టి (జెకర్యా గ్రంధాన్ని రాసిన ప్రవక్త కాదు) తను తన తండ్రివద్ద  నేర్చుకున్న భక్తీ తన పిల్లలకు నేర్పి అదే క్రమములో ఉండేలాగా పెంచారు! ఆ భక్తిని అలవర్చుకున్న అతని చిన్న కుమార్తె తన భర్త అతి మూర్ఖుడై దేవుని ఆలయమను పాడుచేసి అందులో విగ్రహారాధనను ప్రారంభించినా, యూదా దేశమంతా విగ్రహాలతో నింపివేస్తున్నా భర్తను వారిస్తూ తన కుమారున్ని మాత్రం భక్తిమార్గం నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకుండా ప్రార్ధనలో పెంచిన మహా తల్లి ఈ అబీయా గారు!

అబీయా అనగా యెహోవా నా తండ్రి లేక యెహోవాయే తండ్రి అని అర్ధము! దేవున్నే తన తండ్రిగా చేసుకుంది ఈ తల్లి!  ఈ తల్లిచేతులలో పెరిగిన హిజ్కియా అనే ఈ భక్తుడు రాజుగా అయినా గాని తండ్రి మార్గములో నడువక తల్లి పెంచిన భక్తిమార్గంలో నడుస్తూ తండ్రి మరణించిన వెంటనే రాజుగా అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని- మొదటి నెల మొదటిరోజున తన తండ్రి మూయించిన దేవాలయపు తలుపులు తెరిపించి లేవీయులకు యాజకులకు ఇచ్చిన ఆజ్ఞ- దేవాలయాన్ని శుద్ధిచేసి పరిశుద్ధ పరచండి అని!  

 

ఈ రాజుకోసం ఇంకా ముందుకు వెళ్లకముందు మనకు ఏమని అర్ధమవుతుంది అంటే పిల్లలను పెంచడంలో తల్లిపాత్ర ఎంతో ముఖ్యమైనది అని అర్ధమవుతుంది. తల్లి భక్తిపరురాలు అయితే చాలావరకు పిల్లలు భక్తిలో ఉంటారు. తల్లి ప్రార్ధనాపరురాలు అయితే పిల్లలు కూడా ప్రార్ధన నేర్చుకుని ప్రార్ధనాపరులుగా మారతారు. తల్లి నిద్రపోతు సోమరిపోతు చాడీగొట్టు త్రాగుబోతు అయితే పిల్లలకు భక్తిలేక సోమరులు గాను దుర్మార్గులు గాను భక్తిహీనులు గాను మారతారు. అబీయా గారివలన హిజ్కియా గారు భక్తీమార్గము అలవడితే , హిజ్కియా గారి భార్య  హెఫ్సిబా వలన హిజ్కియా గారి కుమారుడు అతి మూర్ఖుడిగా తయారయ్యాడు!

 

     హన్నా తనకుమారునికి భక్తిమార్గం నేర్పారు. సమూయేలు గారు గొప్ప ప్రవక్తగా దీర్ఘధర్షిగా ప్రజ్వరిల్లారు. తిమోతి గారి కోసం పౌలుగారు సర్టిఫికేట్ ఇస్తున్నారు నీవు పొందుకొన్న భక్తీ నీ తల్లి నుండి నీ అమ్మమ్మ నుండి పొందుకున్నావు అని!  తిమోతి గారు గొప్ప దైవజనుడిగా మారినట్లు మనము చూడగలము! యేసుక్రీస్తుప్రభులవారికి బహుశా తన తల్లియైన మరియమ్మ గారు ధర్మశాస్త్రం మొత్తం నూరిపోశారు!

ఇలా పిల్లలు భక్తిలో నడువడానికి కారణం తల్లే కారణం!

ఓ తల్లీ నీ పిల్లలను భక్తిలో పెంచుతున్నావా? ప్రార్ధన నేర్పిస్తున్నావా?

అసలు నీవు ప్రార్ధన చేస్తున్నావా?

లేక సీరియల్లు మోజులో పడి పిల్లలను భర్తను పట్టించుకోవడం లేదా? ప్రైవేట్ క్లాస్ లు అని ట్యూషన్ అని నీ పిల్లలను చర్చికి రాకుండా క్లాసులకు పంపిస్తున్నావా!!! జాగ్రత్త! వారిని భక్తిలో పెంచకుండా మందిరాన్ని పరిచర్యను పరిచయం చేయకుండా ర్యాంకుల కోసం పెంచితే ఒకరోజు అదే ర్యాంకు సాధించి నిన్ను ఏడ్చేలా చేస్తారు వారు.

దయచేసి నీ పిల్లలకు ప్రార్ధన నేర్పు, భక్తినేర్పు! పరిచర్య నేర్పు!

అప్పుడు వారు ఘనులైన వారిగా తయారవుతారు!

 దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*33వ భాగము*

యెషయా 36:1

హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ప్రియులారా! ఇంకా ఈ రాజుకోసం చూసుకోవాలంటే:  ఈ రాజు గారు 25 సంవత్సరాల వయస్సులో తన తండ్రి మరణం తర్వాత రాజుగా అయ్యారు. గమనించాలి- యితడు 29 సంవత్సరాలు రాజుగా  పరిపాలిస్తే మూడు సంవత్సరాలు తన తండ్రితో పాటుగా రాజుగా ఉన్నారు. తన తండ్రి చనిపోయిన వెంటనే మొదటిరోజున యెహోవా మందిరపు ద్వారములు తెరిచి- వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలిపించి అంటున్నారు 2దిన వృత్తాంతాల 29 లో : లేవీయులారా యాజకులారా! మొట్టమొదట మిమ్మును మీరు ప్రతిష్టించుకొని యెహోవా మందిరాన్ని శుద్ధిచేసి ప్రతిష్ట చేయమంటున్నారు. ఎందుకంటే తన తండ్రి మరియు పూర్వీకులలో అనేకులు యెహోవా మందిరాన్ని విగ్రహాలతో నింపేశారు. అందుకే పరిశుద్ధ పరచండి ఇంకా పరిశుద్ద స్థలములోనుంది నిషిద్ధ వస్తువులను తొలిగించుడి అంటున్నారు!  కాబట్టి ఈ రాజుకి దేవుని ఆలయము మీద ఆయన పరిచర్య మీద ఆరాధన మీద ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్ధమవుతుంది. 

రాజుకోసం ముందుకు ధ్యానం చేసేముందు ఒకమాట:  దేవుని సన్నిధి హృదయపూర్వకంగా అనుభవించాలి అంటే దేవుని ఆత్మతో నిజంగా బలంగా నింపబడాలి అంటే  మొట్టమొదట మనలను పవిత్రం చేసుకోవాలి యేసురక్తములో! ఆ తర్వాత మన శరీరంలో మనస్సులో హృదయంలో ఉన్న అన్ని రకాలైన కల్మషాలను పాపాలను అవినీతిని అపరాధాలను తీసివేయాలి! అప్పుడు దేవుని సన్నిధిని వెదికితే ఆయన సన్నిధి నిన్ను ఆవరించి నిన్ను ఆత్మపూర్ణునిగా చేస్తుంది.  ఇలాంటివారే దేవునిపనిని యదార్ధంగా బలంగా చేయగలరు!  ఇలాంటివారి కోసమే దేవుడు ఎదురుచూస్తున్నారు!  దేవునికి ఇలాంటి యవ్వనస్తుడు దొరికాడు. ఆయన రాజైన హిజ్కియా!!!

 

   రాజు ఆజ్ఞ వలన యెహోవా మందిరాన్ని శుద్ధిచేయడం మొదలు పెడితే 16 రోజులు పట్టింది దేవాలయాన్ని శుద్ధిచేయడానికి! ఇంతగా దేవాలయాన్ని పాడుచేశారు తన తండ్రి మరియు పూర్వీకులు! 6వ వచనం చూసుకుంటే మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దేవుని మందిరాన్ని అలక్ష్యము చేశారు అంటున్నారు!

ఈరోజు అనేకమంది పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటూ దీనినే చేస్తున్నారు. వీరిపేరు పండుగ క్రైస్తవులు అనవచ్చు. క్రిస్మస్ కి, జనవరి 1 కి, ఇంకా ఈష్టర్ కి మందిరంలో కనిపిస్తారు. మరలా కనబడరు. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసేవారు. వీరినే ఈ యెషయా గ్రంధంలో దేవుడు ఏరేస్తాను అంటున్నారు. ప్రియ చదువరీ ఒకసారి దీనిని గమనించమని మనవిచేస్తున్నాను!

 

  ఇక ఇలా మందిరాన్ని పరిశుద్ధపరచి ప్రతిష్టించిన వెంటనే 17వ రోజున ఉదయాన్నే రాజ్యముకొరకు పరిశుద్ధస్థలము కొరకు యూదా వారి కొరకు పాప పరిహారార్ధబలి చేయించారు.

 ఇంకా 29వ అధ్యాయంలో దేవుని పరిచర్య దేవాలయములో ప్రారంభించినట్లు చూడగలము!

 

౩౦ వ అధ్యాయంలో పస్కా పండుగ జరిగించినట్లు చూడగలం!  కేవలం యూదులే కాదు విడువబడిన శేషమైన ఇశ్రాయేలు పది గోత్రాలను కూడా ఈరాజు కబురు పంపుతున్నారు- దేవునికి పస్కా పండుగ చేద్దాము రండి అని!  గమనించాలి- హిజ్కియా రాజు కాలములోనే పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యము క్రీ.పూ 721 లో సంపూర్ణంగా నాశనం చేయబడింది.  ఇప్పుడు పదిగోత్రాల విడువబడిన ఇశ్రాయేలు ప్రజలను యూదులను అందరినీ రమ్మని పిలుస్తున్నారు పస్కా పండుగకు! పది గోత్రాలలో కొంతమంది ఈవార్తవాహులను అవమానించారు. మిగిలిన వారు కృంగిన హృదయంతో యేరూషలేముకి వచ్చినట్లు మనం 2దిన ౩౦:11 లో చూడగలము!

 

 ఈవిధంగా దావీదు గారి కాలం తర్వాత మరలా ఘనముగా పస్కా పండుగను ఆచరించి,  అన్య విగ్రహాలను యూదాలోను ఇశ్రాయేలు రాజ్యములోను తొలిగించినట్లు యూదులను ఇశ్రాయేలు పప్రజలను తిరిగి దేవుని భక్తిలో నడిపించి నట్లు మనము ఈ అధ్యాయంలో చూడగలము! అయితే 27వ వచనంలో వ్రాయబడింది: వారి ప్రార్ధన ఆకాశమున ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను!!!...

2దినవృత్తాంతములు 30:27

అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.

 

ఎప్పుడంటే పరిశుద్ధ పరచుకొని కల్మషాలను తొలిగించి యదార్ధ హృదయముతో ప్రార్ధించగా వారి ప్రార్ధన దేవుని నివాసమునకు చేరింది!

 

ఇక ౩1వ అధ్యాయం కంటే ముందుగా 2రాజులు 18వ అధ్యాయంలో హిజ్కియా చేసిన మరో సాహేసోపితమైన కార్యము కనిపిస్తుంది.

18:38

4వ వచనం చూడండి.

2రాజులు 18:4

ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి యుండిరి...

 

యితడు మోషే చేసిన ఇత్తడి పాముని ముక్కలుముక్కలుగా నరికించేసాడు. ఎందుకంటే దానికి నెహూష్టాన్ అని పేరుపెట్టి దానిని ఒక దేవతగా కొలుస్తున్నారు ప్రజలు! దీనికోసం మనకు సంఖ్యా 21:89 లో ఉంటుంది...

8. మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.

9. కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

 

గతంలో దీవెనగా ఉన్నది ఇప్పుడు విగ్రహంగా మారిపోయింది.  ఇది మానవులలో ఉన్న సాధారణ బ్రష్ట స్వభావము! దీనిని ఎదిరించాలి.  దేవుడు మనకు ఏదైతే దీవెనకరంగా మార్చారో దానిని పూజించకూడదు! అది ఏదైనా కావచ్చు, నీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా పిల్లలైనా అది ఏదైనా గాని! దేవునికి ఇవ్వాల్సిన సమయం, ఆరాధన గౌరవం పూజ దేవునికే చెందాలి! మరెవరికి చెందకూడదు! ఈ రోజు నీ వ్యాపారం పెరిగింది అని సమయం లేదు అని ఆరాధన మానకూడదు.  ఆ దీవెన ఇచ్చిన దేవునికి మరింత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ ఆకారమును వస్తువును విషయాన్ని దేవునికి సమానంగా చేయకూడదు! ఈ రాజు ఏరాజు చేయనటువంటి సాహసమైన కార్యమును చేశాడు.

ఇంకా ఈ రాజుకోసం చూసుకుంటే......

2 Kings(రెండవ రాజులు) 18:3,4,5,6,7,8

3. *తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను*.

4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి యుండిరి

5. *అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు*.

6. *అతడు యెహోవాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను*.

7. *కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతని మీద తిరుగబడెను*.

8. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

 

చూడండి అత్యంత ప్రముఖమైన రాజుగా దేవుడు ఇతనిని చేశారు!

 

ఇక ౩1:1 లో చూసుకుంటే....

2దినవృత్తాంతములు 31:1

ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదాదేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి

విగ్రహాలను పడగోట్టినట్లు చూడగలం!

 

ఇంకా ఈ 31 వ అధ్యాయంలో సేవా ధర్మమును మరలా పునరుద్ధరించినట్లు కనిపిస్తుంది.  ఆ తర్వాత దశమ భాగాలు దేవునికి అర్పణలు తీసుకుని రావాలి అని రాజ్యమంతటా ప్రకటన చేస్తే ప్రజలు ఎంతో విస్తారంగా దేవునికి దశమ భాగాలు అర్పణలు తెచ్చినట్లు కనిపిస్తుంది. ఒకసారి 31:510 చూద్దాం....

2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 31:5,6,7,8,9,10

5. ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.

6. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి.

7. వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి.

8. హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి.

9. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజ కుడునగు అజర్యా

10. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులుచున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా

 

గమనించండి: దేవునికి యదార్ధ హృదయంతో ప్రార్ధిస్తే దేవుడు తననిజమైన ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఉండలేరు!  మనము నిజమైన యధార్ధమైన మనస్సుతో హృదయంతో ఆరాదిస్తే ఆయన మనకు మేలుచేయకుండా ఉండలేరు!

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీకు ఇట్టి యదార్ధ హృదయం ఉందా!!! దేవునికి ఇలాంటి యధార్ధవంతులే కావాలి!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*34వ భాగము*

యెషయా 36:1

హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూన్నాము!

 

  ప్రియులారా!  ఈ యెషయా 36:1 వచనం- రాజైన హిజ్కియా పరిపాలన ప్రారంభించి దేవుని కొరకు నమ్మకమైన పనివాడుగా ఉన్న 14 సంవత్సరాలకు జరిగింది. అనగా క్రీ. పూ. 701 లో జరిగింది.  ఇది మనకు బాగా అర్ధం కావాలంటే అప్పటి పరిస్తితులు కొంచెం తెలుసుకోవాలి!

అప్పటి పరిస్తితులు ఏమిటంటే:

మొదటిగా: ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యమే లేకుండా పోయింది.

 

రెండు: అష్షూరు రాజ్యములో తిగ్పట్లేసర్ చనిపోయి శల్మనేశర్ రాజయ్యాడు. శల్మనేశర్ చనిపోయి సన్హేరీబు రాజయ్యాడు.

 

మూడు: 2రాజులు 18వ అధ్యాయం ప్రకారం 25 సంవత్సరాల వయస్సులో రాజై, 29 సంవత్సరాలు హిజ్కియా పాలించినట్లు, దేవుడు మధ్యలో 15సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చినట్లు రాజులు, దినవృత్తాంతాల యెషయా గ్రంధాలలో ఉంది. అనగా హిజ్కియా గారి పాలనలో 14వ సంవత్సరం ఆయనకు మరణకరమైన రోగము కలిగింది. చివర్లో పుండుమీద అంజూరపు ముద్ద వేసినట్లు చూడగలం కాబట్టి హిజ్కియా గారి 39 సంవత్సరంలో ఆయనకి ఒకరకమైన కేన్సర్ పుండు కలిగి భాధపడుతున్నారు అన్నమాట!

 

నాలుగు:: హిజ్కియా తండ్రి ఆహాజు చేసిన పనికిమాలిన పని వలన యూదా రాజ్యము అష్షూరు రాజుకి సామంత రాజ్యముగా ఉంది.  హిజ్కియా కూడా కొన్ని సంవత్సరాలు అష్షూరు రాజుకి సామంత రాజుగా ఉన్నారు. ఆ తర్వాత దేవునితో సన్నిహిత సంభంధం ఏర్పడిన తర్వాత అష్షూరు రాజుని కాకుండా దేవుణ్ణి ఆరాధించడం, దేవునిమీద ఆనుకోవడం ప్రారంభించి అష్షూరు రాజుమీద తిరుగబడ్డారు! ఇక నీ రాజ్యము నీదే, నా రాజ్యము నీదే, నీకు పన్ను గాని సుంకము గాని ఇవ్వను అని ఖరాకండిగా చెప్పారు. మరి అలాచేస్తే అష్షూరు రాజు ఊరుకోడు కదా, యూదా రాజ్యము మీద దండెత్తాడు. ఇప్పుడు మొదలవుతుంది మన 36వ అధ్యాయం!

 

ఐదు: 2రాజులు 18 మరియు 2దిన వృత్తాంతాల 16 ప్రకారం వ్యవసాయం కొరకు ఎన్నో కాలువలు కట్టించినట్లు యేరూషలేము కోటని బలపరచినట్లు పట్టణం బయట ప్రవహిస్తున్న నీటిని పట్టణములోనికి కాలువ ద్వారా మళ్లించినట్లు చూడగలము!

 

వీటన్నిటిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే 39 సంవత్సరాల వయస్సులో యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ, దేవుని మందిరం పనులు చూస్తూ దేవునికోసం నీతిగా న్యాయంగా జీవిస్తూ వ్యవసాయ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం కోటలు కట్టిస్తూ తన ప్రజలను దేవునిమీద ఆనుకోనేలా చేస్తూ ఒక ప్రక్క కేన్సర్ తో బాధపడుతూ మరో ప్రక్క అష్షూరు రాజు మీద తిరుగబడినందువలన యుద్ధం చేస్తూ ఉండగా ఈ 36 వ అధ్యాయం ప్రారంభమయ్యింది అని అర్ధం చేసుకోవాలి! ప్రియులారా ఈ 36వ అధ్యాయం నుండి కేవలం యెషయా గ్రంధం మాత్రమే చూసుకుంటే బాగా అర్ధం చేసుకోలేము గాని 2రాజులు 1822, 2దినవృత్తాంతాల 32 నుండి కలిపి చూసుకుంటే మనం ఇంకా బాగా అర్ధం చేసుకోగలము అని గమనించాలి!

 

36:1 లో ....

హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

ఇక్కడ అష్షూరు రాజు యూదా లోకి వచ్చి ప్రాకారాలు కోటలు ఉన్న పట్టణాలపై దండెత్తి వాటిలో కొన్ని లోబరచుకోన్నట్లు చూడగలం!

 

ఇక 2రాజులు 18:1316 చూసుకుంటే....

13. రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా

14. యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి- నావలన తప్పు వచ్చినది; నాయొద్ద నుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.

15. కావున హిజ్కియా యెహోవా మందిర మందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను.

16. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.

ఇక్కడ నా వలన తప్పు వచ్చింది అని కొంత బంగారం అష్షూరు రాజుకి పంపినట్లు చూడగలం!

 

ఇక 2దిన వృత్తాంతాల 32:18 ...

 

1. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొరబడి ప్రాకారపురముల యెదుట దిగి వాటిని లోపరచుకొనజూచెను.

2. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధము చేయనుద్దేశించి యున్నాడని హిజ్కియాచూచి

3. పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.

4. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి.

5. మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.

6. జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను

7. మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.

8. మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.

 

ఇక్కడ చూసుకుంటే మనకు ఏమని అర్ధమవుతుంది అంటే హిజ్కియా గారు అష్షూరు రాజుమీద తిరుగబడితే అతడు తనసైన్యము పంపి ప్రాకారాలు గల పట్టణాలను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు కొన్ని పట్టణాల యొక్క కోటలను గోడలను బలం చేయించారు హిజ్కియా. శత్రుసైన్యాలకు నీరు దొరకకుండా ప్రయత్నాలు చేసి వారిని దూరంగా పంపగలిగారు. అయినా కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్నాడు అష్షూరు రాజైన సన్హేరీబు!!!

 

అప్పుడు అప్పుడు 2రాజులు 18:1316 ప్రకారం అష్షూరు రాజుకి నా వలన తప్పు వచ్చింది దయచేసి ఈ కానుకను స్వీకరించు అని వెండి బంగారాలు పంపించారు. ఎక్కడ నుండి అంటే యెహోవా మందిరంలో గల తలుపులు ధనాగారం నుండి.

 

ఇలా చేయడానికి కారణం మొదటగా అష్షూరు రాజు కొంతవరకు విజయం సాధించాడు. రెండు: యితడు కేన్సర్ తో బాధపడుతున్నాడు! అందుకే కానుకను పంపి శాంతి మార్గం ఎన్నుకున్నాడు గాని అష్షూరు రాజు ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యాన్ని సమూల నాశనం చేసినట్లు యూదా రాజ్యాన్ని కూడా చేయాలని అనుకుని మరింతగా యుద్దమును బలపరచి మరిన్ని పట్టణాలను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు!

 

 అప్పుడు అంటున్నారు హిజ్కియా గారు:

2దిన వృత్తా 32:68 ..

మీరు భయపడవద్దు దిగులు పడవద్దు అష్షూరు రాజుకంటే మనకు ఎక్కువ సహాయం ఉంది అష్షూరు రాజుకి మాంస సంబంధమైన అండ ఉంది అనగా కొన్ని లక్షలమంది సైన్యబలం ఉంది. అయితే మనకు సహాయం చెయ్యడానికి మన యుద్ధాలను జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనతో తోడుగా ఉన్నారు  మీరు భయపడవద్దు అంటూ ప్రజలను సైన్యాదికారులకు ధైర్యం చెబుతున్నారు!

 

చూడండి ఒక ప్రక్క ఆరోగ్యపరంగా బాధపడుతూ దేవుణ్ణి నిందించకుండా దేవునిమీద ఆనుకున్నారు. మరోప్రక్క ఆర్ధికంగా చతికిల పడిపోయారు. మరో ప్రక్క శత్రువుల దాడులు విస్తారమై పోయింది. అయినా దేవునిమీదనే ఆనుకుంటున్నారు తప్ప తన తండ్రి చేసినట్లు పరాయి దేశం యొక్క సహాయం కోసం చూడలేదు.  క్లిష్టమైన పరిస్తితులలో మానవుల సహాయం కోసం చూడకుండా దేవుని మీదనే ఆనుకున్నారు ఈయన!

 

ఇలా అనుకుని విజయం సాధించిన పరిస్తితులు బైబిల్ లో కొన్ని ఉన్నాయి!

 

యెహోషువా 1:7, 9

1సమూయేలు 14:6

2రాజులు 6:16

1దిన 22:13

1యోహాను 4:4

ఇల నీవు నమ్మకంగా ఉండగలవా ప్రియ సహోదరీ సహోదరుడా!

నీవు ఇలా దేవునిమీద ఆనుకుంటే తప్పకుండా దేవుడు నీకు కూడా సహాయం చేస్తారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*35వ భాగము*

యెషయా 36:210

2. అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా

3. హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహకుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.

4. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?

5. యుద్ధవిషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?

6. నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.

7. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.

8. కావున చిత్తగించి అష్షూరురాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండు వేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.

9. లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.

10. యెహోవా సెలవునొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

  ప్రియులారా! మనము 2వ వచనం నుండి 2రాజులు 18:1737 తో మరియు 2దిన 32:9 నుండి  కలిసి చదువుకోవాలి...

ఇప్పుడు అష్షూరు రాజు లాకీషును ముట్టడి వేశాడు. లాకీషు అంటే ఇశ్రాయేలు దేశం ప్రక్కనే ఉంది.  లాకీషుని చుట్టుముట్టి దాని తర్వాత మీ దేశాన్నే నేను ముట్టడించి నా సామ్రాజ్యంలో కలుపుకుంటాను అని లాకీషు నుండి యూదా రాజైన హిజ్కియా గారికి కబురు పంపించాడు. అయితే ఈ కబురు తిన్నగా రాజుకి చెప్పకుండా ప్రాకారం దగ్గర గోడమీద ప్రజలందరూ వినేలా దండోరా వేయిస్తున్నాడు హెబ్రీ బాషలో!

 

మొదటగా రాజుకి అనగా హిజ్కియాకి వర్తమానం: మహారాజైన అష్షూరు రాజు చెప్పేదేమిటంటే: నీవు నమ్ముకున్న ఆధారం ఎంతమాత్రం? యుద్ధం చేయడానికి ఆలోచించడానికి కేవలం వట్టిమాటలు సరిపోతాయా? నీవు ఎవరిమీద తిరుగబడ్డావు? నీవు ఎవర్ని ఆనుకుని నామీద తిరుగబడ్డావు?  నలిగిన రెళ్ళు లాంటి ఐగుప్తు మీద నీవు ఆనుకున్నావు కదా, అంటున్నాడు. 

ఇక్కడ దేవునిమీద, రాజుమీద ప్రలాభాలు పలుకుతున్నాడు. నీవు ఎవర్ని నమ్ముకున్నావ్? మా దేవుడైన యెహోవా మమ్మల్ని కాపాడుతాడు అంటున్నావు- మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు ఇంకా నేను యెహోవా సెలవు పొందకుండానే మీమీద యుద్ధానికి వచ్చాను అనుకుంటున్నావా అంటున్నాడు, ఇంకా అంటున్నాడు మీదేవుడైన యెహోవాయే నాకు మీ దేశము మీదికి పోయి దానిని పాడుచేయమని చెప్పాడు అంటున్నాడు.

 

ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి-

మొదటిది: నిజంగా ఐగుప్టు రాజుకి హిజ్కియా సహాయం కోసం అర్దించారా అనేది మనకు తెలియదు. అయితే చరిత్ర చూసుకుంటే మొదట అష్షూరుకి వ్యతిరేఖంగా సిరియా, ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యము ఒక ఒప్పందానికి వచ్చారు. ఐగుప్టుని కూడా కలుపుకున్నారు. యూదా రాజైన ఆహాజుని తమ కూటమి లోనికి రమ్మని ఆహ్వానిస్తే ఆహాజు వ్యతిరేఖించాడు అందుకే కదా సిరియా రాజు ఇశ్రాయేలు రాజు ఇద్దరు వచ్చి ఆహాజు మీద దండెత్తి కొన్ని లక్షలమందిని చెర పట్టుకున్నాడు, అప్పుడు ఒకప్రవక్త వలన యూదా జనులను వదిలేసి యూదాని దోచుకుని పోయాడు! అయితే యూదా రాజ్యానికి ఐగుప్టు రాజ్యానికి అలయన్స్ ఉంది. అయితే ఇక్కడ ఐగుప్తు రాజుని సహాయానికి రమ్మని హిజ్కియా రాజు ఆహ్వానించినట్లు లేదు మనకు! బహుశా ఈ రెండు దేశాలకు అలయన్స్ ఉంది కాబట్టి బహుశా రాజైన హిజ్కియా , ఐగుప్తు రాజుకి కబురుపెట్టినట్లు అనుకుని ఉండవచ్చు!

 

ఇక రెండవ విషయం: యెహోవా సెలవులేకుండా నేను మీ దేశానికి రాలేదు, మీ దేవుడే నాకు చెప్పాడు- మీ దేశాన్ని నాశనం చెయ్యమని! అయితే దీనిలో పూర్తి నిజము లేదు! ఎందుకంటే ఆహాజు రాజు కాలంలో దేవుడు ఇదే యెషయా గారిని ఉపయోగించుకుని మీరు నన్ను నమ్ముకోకుండా అష్షూరు రాజుని నమ్మకున్నారు గనుక అదే అష్షూరు రాజు చేత మిమ్మల్ని బోడి చేయిస్తాను అన్నారు గాని, అష్షూరు చేత మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను అనలేదు. మరోరాజు చేత చేయిస్తాను అన్నారు. ఆ మరో రాజు బబులోను!! యెషయా 7,8,9 అధ్యాయాలు!!  ఈ  ప్రవచనాలు అష్షూరు రాజుకి తెలుసు గనుక మీ దేవుడే నాకు మీ దేశానికి వెళ్లి నాశనం చెయ్యమని చెప్పాడు అంటూ అబద్దాలు చెబుతున్నాడు!

ఇది రాజైన హిజ్కియా కి చెప్పిన వర్తమానం!!

 

ఇక రెండవది:  ఇది ప్రజలకు చెబుతున్నాడు: అది ఏమంటే అష్షూరు రాజైన సన్హేరీబు చెప్పేది ఏమంటే దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడియున్న యేరూషలేములో ఇంకా ఉన్నారు ఓ ప్రజలారా అంటున్నాడు! ఇలా అనడానికి కారణం మొదటి వచనంలోనే మనం చూసుకున్నాము- అప్పటికే ప్రాకారాలు కోటలు గల పట్టణాలు కొన్ని యూదా రాజ్యంలో వశం చేసుకున్నాడు, బయట శత్రుసైన్యము ఉంది. అందుకే ముట్టడి వేయబడియున్న యేరూషలేము అంటున్నాడు. ఇప్పుడు మీ యేరూషలేము కరువుచేత దాహం చేత ఉంది. కరువుచేత దాహం చేత మిమ్మల్ని చంపాలని అనుకుంటున్నాడు మీ హిజ్కియా రాజు! మన దేవుడైన యెహోవా అస్శూరు రాజు చేతినుండి మనలను తప్పిస్తారు అని హిజ్కియా రాజు చెబుతున్నాడు, నేనును నా పితరులను- అనగా తిగ్పట్లేసర్, శల్మనేశర్ ఇతర దేశాలకు ఏమేమి చేశామో మీకు తెలుసు కదా, ఆ దేశ దేవతలు వారి దేశాలను మా చేతిలోనుండి రక్షించలేక పోయాయే-  మీ దేవుడు నా చేతిలోనుండి మీ దేశాన్ని రక్షించగలడా? అని దేవునిమీదనే ప్రలాబాలు పలుకుతూ ఇంకా అంటున్నాడు మీరు ఇప్పుడు హిజ్కియా మాటలు నమ్మి మోసపోవద్దు, మీ దేశాన్ని విడిచి మా దగ్గరకి వచ్చి లొంగిపొండి. అప్పుడు నేను మిమ్మల్ని చంపక మరో దేశానికి మిమ్మును తీసుకుని పోయి అక్కడ మీరు నివశించే ఏర్పాట్లు చేస్తాను అంటున్నాడు!

 

ఇంకా ఏమంటున్నాడు అంటే అర్పాదు దేవతలు ఏమాయేను? సేపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత అనగా యరోబాము చేయించిన దూడలు నా చేతిలోనుండి విడిపించ లేక పోయింది కదా, మీ దేవుడు నా చేతిలోనుండి విడిపించగలడా అని ప్రేలుతున్నాడు!!

 

 ఇక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి యూదా రాజ్యములో అంతర్యుద్ధము కలిగించి హిజ్కియా రాజు మీద ప్రజలను తిరుగబడేలా చేస్తున్నాడు. ఒక రకమైన మైండ్ గేము ఆడుతున్నాడు ఇక్కడ!!!

 

గమనించాలి- ఇలాంటి ప్రలాభాలు ఆడిన ఎవడు మన దేవుని దగ్గర నిలువలేక లొంగిపోయారు, నెబుకద్నేజర్ గాని మరెవరైనా గాని!

అయితే తమ సమయం బాగోలేదు గనుక రాజు వారికి ఏవిధమైన సమాధానం చెప్పవద్దు అని చెప్పారు గాబట్టి అష్షూరు సేవకులకు/వార్తావహులకు వీరు ఏవిధమైన సమాధానం చెప్పలేదు గాని ఇక్కడ 22 వ వచనంలో ....

 

22. గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

చూడండి వీరు ఇక్కడ బట్టలు చింపుకుని హిజ్కియా వద్దకు వచ్చి అష్షూరు రాజు చెప్పిన మాటలు తెలియజేస్తున్నారు!

ఇక్కడ బట్టలు చింపుకోవడం అంటే కృంగిన మనస్సు కలిగి తగ్గించుకుని దేవుడా! నీవు తప్ప మాకు మరో దిక్కులేదు అనడానికి సూచనగా ఉంది!!

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే రాజు భక్తిగా ఉంటే ప్రజలు కూడా భక్తిమార్గంలో ఉంటారు! రాజే విగ్రహారాదికుడుగా ఉంటే ప్రజలు ఇంకా విచ్చలవిడిగా ఉంటారు!  రాజు యొక్క భక్తి తన సేవకులకు కూడా ఇక్కడ అలవడింది!

తండ్రి భక్తిగా ఉంటే పిల్లలు కూడా భక్తిగా ఉంటారు! తండ్రి త్రాగుబోతు తిరుగుబోతు అయితే పిల్లలు చెడిపోతారు!

తల్లి ప్రార్ధనాపరురాలు అయితే పిల్లలు కూడా ప్రార్ధనాపరులుగా ఉంటారు/.

ఓ కుటుంభ యజమాని నీవు నీ పిల్లలకు మాదిరిగా ఉండాలి!

మరి నీవు అలా ఉంటున్నావా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*36వ భాగము*

యెషయా 37:17

1. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి

2. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయాయొద్దకు పంపెను.

3. వీరు గోనెపట్ట కట్టు కొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.

4. జీవముగల దేవుని దూషించుటకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.

5. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా

6. యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.

7. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇలాంటి క్లిష్ట పరిస్తితులలో హిజ్కియా రాజు ఏమి చేస్తున్నారో చూద్దాం! మొదటి వచనంలో హిజ్కియా రాజు తన బట్టలు చింపుకున్నాడు.  గమనించాలి- తన సేవకులు అష్షూరు రాజు సేవకుల మాటలు విని తమ బట్టలు చింపుకున్నారు, రాజుకూడా ఈ మాటలు విని తమ బట్టలు చింపుకున్నాడు! అనగా ఇక్కడ ఆయన కూడా బట్టలు చింపుకోవడం అనగా తగ్గించుకుని ప్రభువా ఇప్పుడు నీవే మాకు దిక్కు అంటూ మొర్రపెట్టారు దేవునికి!

 

ఇక రెండవది: యెహోవా ఆలయములోనికి వెళ్లారు. మొదట తగ్గించుకుని వినయముతో బట్టలు చింపుకున్న తర్వాత యెహోవా మందిరములోనికి ప్రవేశించి ప్రార్ధన చేస్తున్నారు.

 ఇక్కడ మనకు తండ్రికి- కుమారునికి తేడా తెలుస్తుంది. అనగా ఆహాజుకి- హిజ్కియాకి తేడా!  ఆపత్కాలమున తండ్రి దగ్గరకు దేవుడే తన ప్రవక్తయైన  యెషయాను పంపించినా దేవునిమీద ఆనుకోకుండా అష్షూరు రాజుమీద ఆనుకున్నాడు!  కుమారుడు అదే కష్టకాలంలో దేవుని వద్దకు తానే వెళ్లి ప్రార్ధన చేసి- ప్రవక్త యొద్దకు కబురు పెడుతున్నారు...

ఎవడు యెహోవా మీద ఆనుకుంటాడో దేవుడు వారి పక్షాన నిలబడతారు.

 

యెహోవా నలిగినా హృదయమును అలక్ష్యము చేయరు.

కీర్తనలు 34:18

విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

 

కీర్తనలు 51:17

విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

 

యెషయా 57:15

మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

 

యెషయా 66:2

అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

 

దేవుడు ఇలాంటి విరిగినలిగిన హృదయమును విడిచిపెట్టలేరు వెంటనే సహాయం చేస్తారు.

రాజైన ఆసా ఇలాగే ప్రార్ధన చేశారు. దేవుడు వెంటనే సహాయం చేశారు....

2దినవృత్తాంతములు 14:11

ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

 

సరే, ఇప్పుడు హిజ్కియా రాజు ప్రవక్తయైన యెషయా వద్దకు తన దాసులను పంపుతున్నారు- ఎలాగు వెళ్ళారు వారు!!

3.వీరు గోనెపట్ట కట్టు కొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.   37:3 లో వారు గోనెపట్ట కట్టుకున్న వారై- అనగా తగ్గించుకుని వినయముతో తాము దుఃఖముతో ఉన్నట్లు సూచన అన్నమాట!  వారు వచ్చి అంటున్నారు యెషయా గారితో:

ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము! పిల్లలు పుట్టవచ్చిరి గాని కనడానికి శక్తిలేదు! జీవముగల దేవుణ్ణి దూషించుటకై  అష్షూరు రాజు తన సేవకులను పంపగా వారు వచ్చి పలికిన మాటలు దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడిన ఆ మాటలను బట్టి దేవుడు- అష్షూరు రాజును గద్దించునేమో కనుక నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్ధన చేయుము అంటున్నారు.

 

ఇక్కడ వారికి అనగా అష్షూరు రాజుని శపించమని  చెప్పి పంపలేదు. జీవముగల దేవుణ్ణి ఆ రాజుసేవకులు దూషించారు. దేవుడు ఆ మాటలు విని ఉండవచ్చు అయితే వాటికోసం నీవు దయచేసి ప్రార్ధన చేయుము అని బ్రతిమిలాడుతున్నారు!

 

అయితే ఇక్కడ రెండుమాటలు మనకు అభ్యంతరముగా కనిపిస్తాయి. నాకైతే అభ్యంతరముగా అనిపించాయి!

 

మొదటిది: నీ దేవుడైన యెహోవా అంటున్నారు హిజ్కియా గారు

రెండవది: ఒకవేళ విని యుంటే.....

 

హిజ్కియా రాజు తన చిన్నతనమందే తన తల్లి పెంపకములో ఉండి నిజమైన దేవుడైన యెహోవాను తన దేవునిగా చేసుకున్నారు. ఎన్ని ఆపదలు వచ్చినా దేవున్నే నమ్ముకుని, ఇప్పుడు తన దేవుణ్ణి నీ దేవుడైన యెహోవా అంటున్నారు. ఇలా అనడానికి బహుశా ఫ్రష్టేసన్ కావచ్చు! ఒక ప్రక్క ఆర్ధికముగా చితికిపోయి యున్నారు ఆయన, ఒక ప్రక్క భయంకరమైన కేన్సర్ తో బాధపడుతున్నారు. దేవుడు నాకెందుకు ఇన్ని శ్రమలు పరీక్షలు తీసుకుని వచ్చారు అనే ఫ్రష్టేసన్/ నిరాశలో నిర్లిప్తతలో ఉండి బహుశా ఇలా నీ దేవుడైన యెహోవా అని అని ఉండవచ్చు అనుకుంటున్నాను!!

 లేకపోతే దేవుడు అస్తమాను యెషయా గారితో మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకే దేవుడ్ని నీ దేవుడైన యెహోవా అని అనియుండవచ్చు!!!

 

ఇక రెండవది: ఒకవేళ యెహోవా ఆలకించి....    మన దేవుడైన యెహోవా- ఆయన కల్లుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు! ఇదే యెషయా గ్రంధంలో అంటున్నారు:  59:12 లో.....

1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

 

కాబట్టి ఆయన వినే దేవుడు చూసే దేవుడు మాట్లాడే దేవుడు! మరి ఎందుకు హిజ్కియా గారు అలా అన్నారు అంటే ఎంత రాజైనా మనిషే కాబట్టి బహుశా అదే ఫ్రష్టేసన్ లో అని ఉండవచ్చు!

 

సరే, ఎంత భాధలో/ నిర్లిప్తతలో ఎలాంటి మాటల అన్నా దేవుడు మన తండ్రి కాబట్టి హిజ్కియా రాజు సేవకులు ఈ మాటలు యెషయా గారితో చెప్పిన వెంటనే దేవుడు జవాబిస్తున్నారు:

6. యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.

7. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.

 

చూడండి దేవుని జవాబు: హిజ్కియా నీవు అష్షూరు రాజు మాటలకు భయపడవద్దు! నేను అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తాను, ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు, అతని దేశమందు ఖడ్గము చేతనే అతనిని కూలజేయుదును అంటున్నారు దేవుడు. హల్లెలూయ!  ఇక్కడ దేవుడు వెంటనే జవాబిస్తున్నారు!!! ఒకవేళ వినియుంటే అన్నారు కదా- ఇప్పుడు దేవుడు అంటున్నారు నేను విన్నాను, భయపడవద్దు, ఒక వదంతివిని మీ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అయితే నామీద వదిరిన మాటలకొరకు ఆ రాజు తన దేశంలోనే తన వారితోనే ఖడ్గముతో హత్య చేయబడతాడు అని దేవుడు ముందుగానే చెప్పారు.

ఇది నిజంగా జరిగినట్లు 3738 వచనాలలో కనిపిస్తుంది...

Isaiah(యెషయా గ్రంథము) 37:36,37,38

36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబర ములుగా ఉండిరి.

37. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

38. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కు చుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

 

కాబట్టి దేవుడు తనను ఆశ్రయించువారికి సమీపముగా ఉండే దేవుడు!! మనము నిజముగా మొర్రపెడితే ఆయన కార్యములు చేయకుండా ఉండలేరు! అయితే మొర్రపెట్టాక సహనముతో కనిపెట్టవలసి ఉంది. అప్పుడు దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తారు.

కీర్తనా కారులు ఇలా స్తుతించారు దేవుణ్ణి

కీర్తనలు 5:11

నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.

 

కీర్తనలు 9:10

యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ము కొందురు

కీర్తనలు 31:19

నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

 

కీర్తనలు 34:8

యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

కీర్తనలు 34:10

సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

 

కీర్తనలు 118:8

మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

కీర్తనలు 118:9

రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

 

విలాప 3:25

తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

 

కాబట్టి నీవు ఎవరిని ఆశ్రయిస్తావు? హిజ్కియా తన ఆపత్కాలములో రాజులను సైన్యాలను ఆశ్రయించకుండా దేవున్నే ఆశ్రయిస్తే దేవుడే జయాన్ని ఇచ్చారు! నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తావా? లేక నా దగ్గర ధనము బలము పలుకుబడి ఉంది అని మనుష్యులను కోర్టులను పోలీస్ స్టేషన్ లను రాజకీయ నాయకులను బంధువులను నమ్ముకుంటే బొక్కబోర్లాపడతావు జాగ్రత్త!

 

కాబట్టి దేవున్నే ఆశ్రయించి ముందుకు సాగిపోదాం!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*37వ భాగము*

యెషయా 37:812

8. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

9. అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

10. యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

11. అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

12. నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

    ప్రియులారా! ఇది జరిగిన తర్వాత అష్షూరు రాజు లాకీషుని జయించి  దాని ప్రక్కనే ఉన్న లిబ్నా మీద దండెత్తాడు! అప్పుడు అతని సేవకులు- వారిలో ముఖ్యుడు రబ్శాకే ! రబ్శాకే వచ్చి అష్షూరు రాజుకి సమాచారం చెబుతున్నాడు! అయ్యా!  మీరు చెప్పిన వర్తమానం యూదా ప్రజలకు చెప్పాను! ప్రాకారం మీద దండోరా వేయించి ప్రజలను భయాబ్రాంతులు చేశాను అన్నాడు! అడిగాడు అష్షూరు రాజైన సన్హేరీబు- హిజ్కియా ఏమన్నాడు? అయ్యా రాజుగాని రాజు యొక్క సేవకులు గాని ఏమీ అనలేదు ఎందుకంటే వారికి జవాబు ఇవ్వవద్దు అని వారి రాజు చెప్పాడట!

ఈలోగా అతనికి ఒక సమాచారం వచ్చింది ఏమని అంటే కూషు రాజైన తిర్హాకా నీ దేశం మీదికి యుద్ధానికి వచ్చాడు అని! కూషు అనగా ఇతియోపియా అని గ్రహించాలి! నిజానికి ఇతియోపియా చాలా చిన్న సామ్రాజ్యము!  వెంటనే లిబ్నా ను వదిలి ఇతియోపియా ఎంత, వాడు  పిల్లబచ్చా గాడు - ఇలా వెళ్లి వారిని అంతము చేసి వస్తాను అనుకుని అస్సీరియా బయలుదేరి వెళ్ళాడు! వెళ్తూ ఒక ఉత్తరము రాసి రాజైన హిజ్కియాకు పంపించాడు!

 

ఆ ఉత్తరంలో ఏముంది అంటే 1013 .....

Isaiah(యెషయా గ్రంథము) 37:10,11,12,13

10. యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

11. అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

12. నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

13. హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

 

చూడండి గత అధ్యాయములో వధరిన మాటలే మరలా అంటున్నాడు- అష్షూరు రాజులు సకల దేశాలను నాశనం చేసి వాటిని స్వాధీనం చేసుకున్న సంగతి నీకు తెలుసు కదా అంటూ ఈ రాజు ఏమయ్యెను ఆ రాజు ఏమయ్యెను ఏ దేవతలు తప్పించుకున్నారు అంటూ హేళన చేస్తూ ఉత్తరం పంపించాడు!

 

అయితే ఇక్కడ హిజ్కియా రాజుగారు చేసిన పని ఎంతో ఉన్నతమైనది సరియైనది!

ఆయన ఆ ఉత్తరాన్ని చదివి తిన్నగా యెహోవా మందిరములోని వెళ్లి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో విప్పి పరచి- ఒక అమూల్యమైన ప్రార్ధన చేస్తున్నారు! నిజానికి బైబిల్ గ్రంధములో ఉన్న ప్రార్ధనలలో చాలా ముఖ్యమైనది ఈ ప్రార్ధన!!

 

Isaiah(యెషయా గ్రంథము) 37:15,16,17,18,19,20

15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను

16. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.

17. సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.

18. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి

19. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

20. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.

 

ప్రార్ధన చూడండి: యెహోవా సైన్యములకు అధిపతియగు ప్రభువా! ఇశ్రాయేలు దేవా! అనగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడా! కెరూబులకు పైగా సింహాసనాసీనుడా!! నీవే దేవుడవు!!! భూ రాజ్యాలన్నిటి మీదా నీవే నీవు ఒక్కడవే దేవుడవు!!  ఆకాశం భూమి కూడా నీవే చేశావు

అవును మన దేవుడు ఆయన ఒక్కడే దేవుడు! ఈ మాట ఈ గ్రంధంలో అనేకసార్లు కనిపిస్తుంది.... 43:12; 15; 45:21,22; 46:9

 

ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు కాబట్టి!

ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉండే దేవుడు! భూమిని ఆకాశమును కలుగజేసింది ఆయనే! ఇది మనకు ఆదికాండం మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది.

 

ఇలా దేవున్ని స్తుతించి అప్పుడు అప్లికేషన్ పెడుతున్నారు ఈ భక్తుడు! ప్రార్ధించే విధానము ఇది! ఈ ప్రార్ధన ద్వారా మనము ప్రార్ధించే విధానమును నేర్చుకోవచ్చు!

 

ముందుగా దేవునికి స్తుతుల సింహాసనం వేసి- ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడయ్యాక అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడితే అప్పుడు మన ప్రశ్నలకు సమస్యలకు జవాబులు ఇట్టే లభిస్తాయి!  ఇదీ పద్దతి!

ఇంకా ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని సెలవిస్తుంది బైబిల్! యెషయా 55:6

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

 

స్తుతుల సింహాసనం వెయ్యకుండా దేవుడు నీకేదో అచ్చున్నట్లు- లేక దేవుడు నీ పాలేరు లేక పనోడులా- దేవా నీకు ఒక వందనం! యీల్లను కాపాడు ఆల్లను కాపాడు, నా కూతురికి పెళ్లి చేసేయ్ నా కొడుకుని ఉద్యోగం ఇచ్చేయ్ ఇదిచ్చేయ్ అదిచ్చేయ్ అంటూ ఆర్డర్లు వేసేసి- యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి అనేస్తే ఏదీ రాదు! ఒక పద్దతి ప్రకారం అడిగి- విరిగి నల్గిన హృదయముతో దేవుని పాదాలు సమీపిస్తే మన కన్నీరు ఆయన పాదాలకు తగిలితే- ఆ తడిచిన పాదాలు దాటుకుని దేవుడు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు అంటూ దైవజనులు ఆరార్కే మూర్తి గారు అంటూ ఉండేవారు!! హిజ్కియా భక్తుడు చేసిన ప్రార్ధన మన అందరికీ కనువిప్పు కావాలి! ఈ మాదిరి మనం నేర్చుకోవాలి!

 

ఇక అప్లికేషన్ ఏమని పెట్టారంటే: దేవుడా! అష్షూరు రాజైన సన్హేరీబు నిన్ను దూషిస్తూ పలికిన మాటలు మీరు విన్నారు కదా! అవును ఆ రాజులు నిజంగానే చాలా రాజ్యాలను పాడుచేశారు సర్వనాశనం చేశారు!  ఎందుకంటే వారి దేవుళ్లలో ఎవరూ నిజానికి దేవుళ్ళు కారు కేవలం రాళ్ళతోనో కర్రతోనో చేయబడ్డారు. అవన్నీ మనుషుల చేతిపనులే!  అందుకే ఆ రాజు వారిని సర్వనాశనం చేయగలిగాడు!  మీరైతే నిజమైన దేవుడు కాబట్టి ఇప్పుడు దయచేసి మమ్మల్ని సన్హేరీబు చేతిలోనుండి విడిపించవా దేవుడా! నీవు అలాచేస్తే అప్పుడు భూమిమీద ఉన్న రాజ్యాలన్నీ నీవు మాత్రమే దేవుడవు అని తెలుసుకుంటారు  అంటూ కన్నీటితో ప్రార్ధిస్తున్నారు!

 

చూడండి ఎంత చక్కటి ప్రార్ధనో కదా! అందుకే  హోషేయ భక్తుడు  అంటున్నారు మాటలను సిద్దపరచుకుని ఆయన సన్నిధిలో ప్రార్ధించాలి.

హోషేయా 14:2

మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.

 

మరినీవు అలా చేస్తున్నావా? ఏ చీర కట్టుకోవాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి అనే శ్రద్ధ ఉంటుంది గాని ఈ రోజు ప్రార్ధనలో ఏమని ప్రార్ధించాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ భక్తుడు మాటలను సిద్దపరచుకుని దేవుని సన్నిధిలో విరిగినలిగిన మనస్సుతో ప్రార్ధించినప్పుడు ఇప్పుడు దేవుడే తన భక్తుడైన యెషయా ను హిజ్కియా వద్దకు పంపించి వర్తమానం చెబుతున్నారు ఉపమాన రీతిలో!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*37వ భాగము*

యెషయా 37:812

8. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

9. అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

10. యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

11. అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

12. నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇది జరిగిన తర్వాత అష్షూరు రాజు లాకీషుని జయించి  దాని ప్రక్కనే ఉన్న లిబ్నా మీద దండెత్తాడు! అప్పుడు అతని సేవకులు- వారిలో ముఖ్యుడు రబ్శాకే ! రబ్శాకే వచ్చి అష్షూరు రాజుకి సమాచారం చెబుతున్నాడు! అయ్యా!  మీరు చెప్పిన వర్తమానం యూదా ప్రజలకు చెప్పాను! ప్రాకారం మీద దండోరా వేయించి ప్రజలను భయాబ్రాంతులు చేశాను అన్నాడు! అడిగాడు అష్షూరు రాజైన సన్హేరీబు- హిజ్కియా ఏమన్నాడు? అయ్యా రాజుగాని రాజు యొక్క సేవకులు గాని ఏమీ అనలేదు ఎందుకంటే వారికి జవాబు ఇవ్వవద్దు అని వారి రాజు చెప్పాడట!

ఈలోగా అతనికి ఒక సమాచారం వచ్చింది ఏమని అంటే కూషు రాజైన తిర్హాకా నీ దేశం మీదికి యుద్ధానికి వచ్చాడు అని! కూషు అనగా ఇతియోపియా అని గ్రహించాలి! నిజానికి ఇతియోపియా చాలా చిన్న సామ్రాజ్యము!  వెంటనే లిబ్నా ను వదిలి ఇతియోపియా ఎంత, వాడు  పిల్లబచ్చా గాడు - ఇలా వెళ్లి వారిని అంతము చేసి వస్తాను అనుకుని అస్సీరియా బయలుదేరి వెళ్ళాడు! వెళ్తూ ఒక ఉత్తరము రాసి రాజైన హిజ్కియాకు పంపించాడు!

 

ఆ ఉత్తరంలో ఏముంది అంటే 1013 .....

Isaiah(యెషయా గ్రంథము) 37:10,11,12,13

10. యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

11. అష్షూరురాజులు సకలదేశము లను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

12. నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

13. హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

 

చూడండి గత అధ్యాయములో వధరిన మాటలే మరలా అంటున్నాడు- అష్షూరు రాజులు సకల దేశాలను నాశనం చేసి వాటిని స్వాధీనం చేసుకున్న సంగతి నీకు తెలుసు కదా అంటూ ఈ రాజు ఏమయ్యెను ఆ రాజు ఏమయ్యెను ఏ దేవతలు తప్పించుకున్నారు అంటూ హేళన చేస్తూ ఉత్తరం పంపించాడు!

 

అయితే ఇక్కడ హిజ్కియా రాజుగారు చేసిన పని ఎంతో ఉన్నతమైనది సరియైనది!

ఆయన ఆ ఉత్తరాన్ని చదివి తిన్నగా యెహోవా మందిరములోని వెళ్లి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో విప్పి పరచి- ఒక అమూల్యమైన ప్రార్ధన చేస్తున్నారు! నిజానికి బైబిల్ గ్రంధములో ఉన్న ప్రార్ధనలలో చాలా ముఖ్యమైనది ఈ ప్రార్ధన!!

 

Isaiah(యెషయా గ్రంథము) 37:15,16,17,18,19,20

15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను

16. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.

17. సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.

18. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి

19. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

20. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.

 

ప్రార్ధన చూడండి: యెహోవా సైన్యములకు అధిపతియగు ప్రభువా! ఇశ్రాయేలు దేవా! అనగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడా! కెరూబులకు పైగా సింహాసనాసీనుడా!! నీవే దేవుడవు!!! భూ రాజ్యాలన్నిటి మీదా నీవే నీవు ఒక్కడవే దేవుడవు!!  ఆకాశం భూమి కూడా నీవే చేశావు

అవును మన దేవుడు ఆయన ఒక్కడే దేవుడు! ఈ మాట ఈ గ్రంధంలో అనేకసార్లు కనిపిస్తుంది.... 43:12; 15; 45:21,22; 46:9

 

ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు కాబట్టి!

ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉండే దేవుడు! భూమిని ఆకాశమును కలుగజేసింది ఆయనే! ఇది మనకు ఆదికాండం మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది.

 

ఇలా దేవున్ని స్తుతించి అప్పుడు అప్లికేషన్ పెడుతున్నారు ఈ భక్తుడు! ప్రార్ధించే విధానము ఇది! ఈ ప్రార్ధన ద్వారా మనము ప్రార్ధించే విధానమును నేర్చుకోవచ్చు!

 

ముందుగా దేవునికి స్తుతుల సింహాసనం వేసి- ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడయ్యాక అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడితే అప్పుడు మన ప్రశ్నలకు సమస్యలకు జవాబులు ఇట్టే లభిస్తాయి!  ఇదీ పద్దతి!

ఇంకా ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని సెలవిస్తుంది బైబిల్! యెషయా 55:6

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

 

స్తుతుల సింహాసనం వెయ్యకుండా దేవుడు నీకేదో అచ్చున్నట్లు- లేక దేవుడు నీ పాలేరు లేక పనోడులా- దేవా నీకు ఒక వందనం! యీల్లను కాపాడు ఆల్లను కాపాడు, నా కూతురికి పెళ్లి చేసేయ్ నా కొడుకుని ఉద్యోగం ఇచ్చేయ్ ఇదిచ్చేయ్ అదిచ్చేయ్ అంటూ ఆర్డర్లు వేసేసి- యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి అనేస్తే ఏదీ రాదు! ఒక పద్దతి ప్రకారం అడిగి- విరిగి నల్గిన హృదయముతో దేవుని పాదాలు సమీపిస్తే మన కన్నీరు ఆయన పాదాలకు తగిలితే- ఆ తడిచిన పాదాలు దాటుకుని దేవుడు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు అంటూ దైవజనులు ఆరార్కే మూర్తి గారు అంటూ ఉండేవారు!! హిజ్కియా భక్తుడు చేసిన ప్రార్ధన మన అందరికీ కనువిప్పు కావాలి! ఈ మాదిరి మనం నేర్చుకోవాలి!

 

ఇక అప్లికేషన్ ఏమని పెట్టారంటే: దేవుడా! అష్షూరు రాజైన సన్హేరీబు నిన్ను దూషిస్తూ పలికిన మాటలు మీరు విన్నారు కదా! అవును ఆ రాజులు నిజంగానే చాలా రాజ్యాలను పాడుచేశారు సర్వనాశనం చేశారు!  ఎందుకంటే వారి దేవుళ్లలో ఎవరూ నిజానికి దేవుళ్ళు కారు కేవలం రాళ్ళతోనో కర్రతోనో చేయబడ్డారు. అవన్నీ మనుషుల చేతిపనులే!  అందుకే ఆ రాజు వారిని సర్వనాశనం చేయగలిగాడు!  మీరైతే నిజమైన దేవుడు కాబట్టి ఇప్పుడు దయచేసి మమ్మల్ని సన్హేరీబు చేతిలోనుండి విడిపించవా దేవుడా! నీవు అలాచేస్తే అప్పుడు భూమిమీద ఉన్న రాజ్యాలన్నీ నీవు మాత్రమే దేవుడవు అని తెలుసుకుంటారు  అంటూ కన్నీటితో ప్రార్ధిస్తున్నారు!

 

చూడండి ఎంత చక్కటి ప్రార్ధనో కదా! అందుకే  హోషేయ భక్తుడు  అంటున్నారు మాటలను సిద్దపరచుకుని ఆయన సన్నిధిలో ప్రార్ధించాలి.

హోషేయా 14:2

మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.

 

మరినీవు అలా చేస్తున్నావా? ఏ చీర కట్టుకోవాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి అనే శ్రద్ధ ఉంటుంది గాని ఈ రోజు ప్రార్ధనలో ఏమని ప్రార్ధించాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ భక్తుడు మాటలను సిద్దపరచుకుని దేవుని సన్నిధిలో విరిగినలిగిన మనస్సుతో ప్రార్ధించినప్పుడు ఇప్పుడు దేవుడే తన భక్తుడైన యెషయా ను హిజ్కియా వద్దకు పంపించి వర్తమానం చెబుతున్నారు ఉపమాన రీతిలో!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*38వ భాగము*

యెషయా 37:2129

21. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.

22. అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.

23. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా?

24. నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను.

25. నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను

26. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది.

27. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

28. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

29. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక దేవుని జవాబుని చూసుకుందాం! గతభాగంలో చెప్పినట్లు దేవుడే- తన దాసుని వద్దకు ప్రవక్త ద్వారా సమాధానం రప్పించారు!!

దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా: అష్షూరు రాజైన సన్హేరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్ధన చేసితివే- అతని గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా...

 

గమనించాలి- గత అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని అష్షూరు రాజుని గద్ధించునేమో అంటూ కబురు పెట్టినట్లు చూశాము! ఇప్పుడు ఇక్కడ దానికి జవాబు చెబుతున్నారు దేవుడు- నీవు నా ఎదుట అష్షూరు రాజైన సన్హేరీబు విషయంలో ప్రార్ధన చేశావు కదా అంటూ!

హిజ్కియా రాజు ఎక్కడ ప్రార్ధన చేశారు?  అష్షూరు రాజు పంపిన ఉత్తరాన్ని యెహోవా మందిరానికి వెళ్లి దానిని పరచి కృంగిన హృదయముతో కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్ధించారు. ఇక్కడ దేవుడు అంటున్నారు నా ఎదుట ప్రార్ధన చేశావు కదా అంటున్నారు!  దేవుని సమాజములో దేవుని మందిరములో దేవుడు నివాసం చేస్తారుంటూ బైబిల్ సెలవిస్తుంది....

కీర్తనలు 82:1

దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.

 

ఇక అష్షూరు రాజుకోసం దేవుని జవాబు ఉపమానాలంకారముగా ఇలా చెబుతున్నారు: సీయోను కుమారి కన్యక నిన్ను దూషణ చేస్తుంది, ఆమె నిన్ను అపహాస్యం చేస్తుంది యేరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది అంటూ మొదలు పెట్టారు.

 

ఈ వచనంలో సీయోనుకుమారి కన్యక, ఇంకా యేరూషలేము కుమారి అంటూ సంభోదిస్తున్నారు! గమనించాలి- దేవుడు ఇశ్రాయేలు మరియు యూదా జనులను లేక సంఘాన్ని కన్యకతో పోలుస్తున్నారు!  ఇక సార్వత్రిక సంఘాన్ని కూడా కన్యకతోనే పోలుస్తున్నారు. కన్యకయైన సంఘము క్రీస్తుయేసు కొరకు ప్రధానం చేయబడింది. అలాగే సీయోనుకుమారి అనగా యూదారాజ్యములో ఉన్న సంఘము/ ప్రజలు కన్యకవలె ఒక్కడే పురుషుడైన దేవునికి లోబడి ఉండాలని దేవుడు అనుకుంటే వారు అనేకసార్లు ఇతరులతో అనగా అన్య విగ్రహాలకు పూజించి వ్యభిచారం చేశారు అని ప్రవక్తల గ్రంధాలలో అనేకసార్లు చూడగలం!

 

ఇక 23వ వచనం చూసుకుంటే: నీవు ఎవరిని తిరస్కించావు ఎవరిని దూశించావు? ఎవరిని భయపెట్టావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా!! ఇంకా తర్వాత వచనంలో నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీవీలాగు పలికావు అంటున్నారు...

గమనించాలి- ఆ దేవతలు ఏమి చెయ్యగలిగారు? ఈ దేవతలు ఏమి చెయ్యగలిగారు? మీ దేవుడుకూడా ఇంకేమీ చెయ్యలేడు కదా అని తన దూతలచేత ప్రలాభాలు పలికించడమే కాకుండా ఉత్తరాన్ని కూడా పంపించాడు కదా- అందుకే దేవుడు సమాధానం చెబుతున్నారు ఇక్కడ! ఇక్కడ 2425 వచనాలలో అష్షూరు రాజైన సన్హేరీబు యొక్క హృదయ గర్వమును దేవుడు తెలియజేస్తున్నారు: నేను  నా రధముల సముదాయముతో  ఎత్తైన పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వవములకును ఎక్కి యున్నాను, ఇంకా ఎత్తుగల దాని దేవదారు వృక్షాలను శ్రేష్టమైన సరళ వృక్షాలను నరికివేసి యున్నాను, వాని దూరపుసరిహద్దులలో ఉన్న సత్రములలోనికి కర్మెలు ఫలవంతమగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించ గలిగియున్నాను, నేను త్రవ్వి నీళ్ళు పానము చేసి యున్నాను, నా అరకాలిచేత దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోజేసియున్నాను అంటూ అనుకుంటున్నావు అంటున్నారు దేవుడు! దేవునికి మనిషియొక్క హృదయ రహస్యాలు బాగా తెలుసు! అందుకే బైబిల్ సెలవిస్తుంది దేవుని మాట హృదయాన్ని అంతరంగాన్ని మాత్రమే కాదు కీళ్ళు కూడా విభజించగలదు ....

కీర్తనలు 7:9

హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,

హెబ్రీయులకు 4:12

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.

 

ఇక 26వ వచనంలో యెషయా గారి ద్వారా దేవుడుసెలవిచ్చిన ప్రవచనాలను ఎట్టి చెబుతున్నారు. అవి మనకు 7,8 అధ్యాయాలలో ఉంటాయి: నేనే పూర్వమందు దేని కలుగజేసితినని, పురాతన కాలమందే అనగా తన తాత కాలంలోనే దీనిని నిర్ణయించాను అని నీకు వినబడలేదా?!!! అవును ప్రాకారములు గల పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించింది, అందుకే వాటి కాపురస్తులు బలహీనులై జడిసిపోయారు. విభ్రాంతి నొంది పొలంలో గడ్డిలా కాడవేయని చేలు వలే అయ్యారు అంటున్నారు.

 

చూడండి 7వ అధ్యాయంలో దేవుడు ముందుగానే సిరియా కోసం, ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యముకోసం, ఇంకా చుట్టూ ప్రక్కల రాజ్యాల కోసం చెప్పారు దేవుడు, వారంతా అష్షూరు రాజుచేతిలో నశించిపోతారు అంటూ 7:1620,

Isaiah(యెషయా గ్రంథము) 7:16,17,18,19,20

 

16. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ బాలునికి తెలివిరాకమునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును.

17. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

19. అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.

20. ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.

 

8:710

7. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును.

8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.

9. జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

10. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.

 

ఇక్కడ అంటున్నారు దేవుడు: ఒరేయ్ నేనే ముందుగా చెప్పాను- మీ తాత మీ నాన్న నీవు ఇలా చేస్తారని, అలాగే ప్రజలను త్రొక్కావు!అయితే అలా సెలవిచ్చిన నామీదనే నీవు రంకెలు వేస్తున్నావు ఇప్పుడు 29వ వచనం:  నామీద నీవు వేయు రంకెలును నీవుచేసిన కలహామును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీనోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మల్లించెదను అంటున్నారు

 

ఇక్కడ దేవుడు అంటున్నారు నీవు వేసిన రంకెలు నాకు కనబడ్డాయి, నీవు చేసిన కలహము నా చెవులలోకి వచ్చింది అంటూ! ఆయన వినే దేవుడు! చూసే దేవుడు! ఆ తర్వాత మాట్లాడే దేవుడు! ఇప్పుడు దేవుడు చెబుతున్నారు: నా గాలము నీకు వేస్తాను అంటున్నారు: అనగా ఇక్కడ ఆ రాజుని మొసలి లేక చేపతో పోలుస్తున్నారు! ఇంకా నా కళ్ళెము నీ నోటికి వేస్తాను అంటున్నారు- అనగా ఇక్కడ గుఱ్ఱము లేక బరువులు మోసే పశువుతో పోలుస్తున్నారు! ఒరేయ్ నీవు పశువువు రా, నీవు మొసలివి రా! నా ప్రజలను నన్ను దూషించి ఇప్పుడు తప్పుచేశావు కాబట్టి ఇప్పుడు నా ప్రభావం చూపిస్తాను అంటున్నారు దేవుడు! అందుకే దేవుడు అంటున్నారు మిమ్మును ముట్టిన వారు నా కంటిపాపను తాకినట్లే! ఈలోకంలో ఎవరు ఏమిచేసినా సహిస్తాము గాని మన కంట్లో చేయి పెడితే అది మన చిన్నబిడ్డలైన సరే సహించక రెండు వేస్తాము. దేవుడు అంటున్నారు ఎవడైనా మిమ్మల్ని ఏమైనా చేస్తే వాడు నా కంట్లో వేలు పెట్టినట్లే!...

జెకర్యా 2:8

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.

 

అవును! దేవుని మీద నిజంగా నూటికి నూరుపాళ్ళు ఆనుకుంటే మానవ ప్రయత్నం మానేసి దేవునిమీదనే ఆనుకుంటే దేవుడు అసాధారణమైన అద్భుతాలు చేస్తారు. ఇక్కడ హిజ్కియా దేవునిమీద సంపూర్తిగా అనుకున్నారు కాబట్టి హిజ్కియా యుద్ధము దేవుని యుద్ధముగా మారిపోయి- హిజ్కియాకు బదులుగా దేవుడే సమాధానం చెబుతున్నారు!

మరి నీవు హిజ్కియా గారు దేవునిమీద ఆశ్రయము పెట్టుకున్నట్లు నీవు దేవునిమీద నీ భారం వేసి నీ సొంత ప్రయత్నాలను వదిలేసి ఆయన కొరకు కనిపెట్టగలవా!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*39వ భాగము*

యెషయా 37:౩౦38

30. మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.

31. యూదా వంశములో తప్పించు కొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

32. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.

33. కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.

34. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.

35. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబర ములుగా ఉండిరి.

37. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

38 .అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక  తర్వాత  యెషయా ప్రవక్త  హిజ్కియాతో మాట్లాడుచున్నారు:  ౩౦వ వచనం నుండి చూసుకుంటే హిజ్కియా దేవుడు నీకు ఒక సూచన ఇచ్చారు- ఏమిటంటే ఈ సంవత్సరమందు పంట దానంతట అదే పండుతుంది. అనగా మీరు విత్తనాలు జల్లకుండా  నాటకుండా దానికదే పండుతుంది. రెండవ సంవత్సరము కూడా ఈ సంవత్సరం పండిన పంటనే మీరు తింటారు. అనగా అంత విస్తారముగా పండుతుంది. మూడో సంవత్సరం మీరు విత్తనాలు విత్తి చేలు కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలములు అనుభవిస్తారు, ఇంకా యూదా వంశములో తప్పించుకున్న శేషము వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది, శేషించువారు యేరూషలేమునుండి బయలుదేరుతారు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును అంటున్నారు!

 

చూడండి ఎంత మంచి శ్రేష్టమైన నిశ్చితమైన సూచన ఇస్తున్నారో దేవుడు!  మీరు పంట పండించడానికి విత్తనాలు విత్తడానికి పట్టణం వెలుపలికి వెళ్లి పొలంలో పనిచెయ్యాలి- గాని బయట శత్రుసైన్యాలు ముట్టడించినందువలన మీరు ఈ సంవత్సరం పంటలు వేయలేకపోయారు. అయితే ఇప్పుడు దేవుడు ఏమి చెబుతున్నారు అంటే మీరు విత్తనాలు విత్తకపోయినా దానంతట అదే పండుతుంది. ఎంతగా పండుతుంది అంటే రెండు సంవత్సరాలకు సరిపడే ఆహరం పండుతుంది. మీరు మూడో సంవత్సరంలో విత్తనాలు విత్తి చేలు కోస్తారు. అంతవరకూ ఈ సంవత్సరం పంట సరిపోతుంది. హల్లెలూయ!

 

36వ అధ్యాయంలో సన్హేరీబు ఏమని చెప్పాడు? మీరు నీరులేక ఆహారం లేక ఇక్కడ పట్టణంలోనే ఉండిపోయి చనిపోయేలా మీ రాజు మీమీద కుట్ర చేశాడు అంటూ ప్రేలారు!  దేవుడు చెబుతున్నారు వారు ముట్టడి దిబ్బవేసి మిమ్మల్ని వ్యవసాయం చెయ్యకుండా చేసినా నేను ఆశ్చర్యకరంగా మీ పంటలు పండిస్తాను- మిమ్మల్ని పోషిస్తాను అంటున్నారు!  గమనించాలి- ఇదీ నమ్మకత్వానికి దేవునిమీద సంపూర్తిగా అనుకున్నందుకు దేవుడు చేసే అసాధారమైన అధ్బుతము!! దేవునిమీద మనం సంపూర్తిగా అనుకుంటే దేవుడే కార్యములు చేస్తారు!

 

ఇంకా అంటున్నారు  యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను వేరు తన్ని ఫలిస్తుంది అనగా ప్రజలు ఇంకా విస్తరిస్తారు, వారు అభివృద్ధి పొందుతారు, శేషించువారు యేరూషలేము నుండి బయలుదేరుతారు, తప్పించుకొన్న వారు సీయోను కొండలోనుండి బయలుదేరుతారు.

సీయోను అనగా యేరూషలేము పట్టణంలో అత్యున్నతమైన ఎత్తుగా ఉన్న పర్వతము! ఇది ఆధ్యాత్మికంగా దేవునియందు నమ్మకంగా సంపూర్ణత సాధించిన పరిణితి గల ఆధ్యాత్మిక స్తితికి గుర్తు!! ఇలాంటి సీయోనులో నుండి ప్రజలు బయలుదేరుతారు అంటున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును అంటున్నారు! చూడండి దేవుడు ఎంతటి నెమ్మది ఆదరణ కలిగించే మాటలు చెబుతున్నారో! దేవుడే మనలను కట్టేవాడు, దేవుడే మనలను ఆదరించే వాడు దేవుడే మనలను పోషించేవాడు దేవుడే మన పక్షముగా యుద్ధాలు చేసేవాడు దేవుడే మనలను గాయపరిచేవాడు కూడా మనము ఆయనకు వ్యతిరేఖమైన పనులుచేస్తే!!

 

ఇంకా ౩౩35 వచనాలు చూసుకుంటే....

33. కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.

34. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.

35. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

అష్షూరు రాజు ఈ నగరంలోనే అడుగుపెట్టడు , ఈ పట్టణం మీద ఒక్క భాణము కూడా వేయడు ఎదురుగా ముట్టడి కూడా కట్టడు వచ్చినదారినే వెళ్ళిపోతాడు వాడు లిబ్నా నుండి తన దేశం వెళ్ళాడు కదా అక్కడే వాడుచస్తాడు, నాకోసం నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ నగరాన్ని కాపాడుతాను అంటున్నారు! చూడండి దేవుడు చెప్పిన ఆశ్చర్యకరమైన మాటలు!

 

దేవుడు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తారు. 3638 వచనాలు చూసుకుంటే....

 

36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబర ములుగా ఉండిరి.

37. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

38. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కు చుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

 

చూడండి ఇక్కడ సన్హేరీబు చేసిన/ మాట్లాడిన పనికిమాలిన మాటల వలన మొదటగా తనసైన్యాన్ని కోల్పోయాడు ఆ తర్వాత తన ప్రాణాన్నే కోల్పోయాడు! అందుకే గర్వం గడ్డిమేయిస్తుంది అంటారు.  అష్షూరు రాజు మాట్లాడిన గర్వమైన మాటలు వలన అమాయకులైన 1,85,౦౦౦ మంది ఒక్కరాత్రిలోనే నిద్రలోనే చనిపోయారు. దేవుడు తన దూతను పంపించి హతం చేశారు. ఇది కేవలం ఒక్క దూత చేయగల కార్యం! మరి దేవుని దూతలందరూ వస్తే ... అయ్యబాబోయ్! తలచుకుంటే గుండె గగుర్బాటు కలుగుతుంది..

 

రెండవది: తన సొంత కొడుకులే నీ గర్వము వలన ఇప్పుడు మన దేశానికి సైన్యమే లేకుండా పోయిందిరా పనికిమాలిన వాడా అంటూ తన సొంత కొడుకులు అద్రమ్మెలుకు షెరేజేరు తన తండ్రిని నిస్రోకు అనే దేవతను మ్రోక్కుతుండగా ఆ దేవాలయంలోనే కత్తితో చంపి పారిపోయారు!ఈ విధంగా ఈ గర్విష్టి చనిపోయాడు!

 

గర్వించిన నెబుకద్నేజర్ గాడిదలా ఏడు సంవత్సరాలు గడ్డిమేశాడు! గర్వముతో పలికిన ఇదే నెబుకద్నేజర్ నా చేతిలోనుండి మిమ్మును విడిపించగలిగిన దేవుడెవడైనా ఉన్నాడా అని పలికిన వాడు- సాష్టాంగనమస్కారం చేసి మహోన్నతమైన దేవుని సేవకులారా అన్నాడు....

 

ఇదీ మన దేవుని మహాశక్తి!

కాబట్టి గర్వమును వదిలేద్దాం!

సమాధానముతో మెలుగుదాం!

దేవుని బిడ్డలకు తగిన విధంగా జీవిద్దాం!

అదే సమయంలో ప్రతీ విషయం లోను దేవుని చిత్తానికి లోబడుదాం!

దేవునికి ఇష్టులుగా జీవిద్దాం!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*40వ భాగము*

యెషయా 38:18

1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టు కొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

2. అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని

3. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

4. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;

6. ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.

7. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;

8. ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక 38వ అధ్యాయంలో హిజ్కియా రాజుగారికి కలిగిన కేన్సర్ పుండు కోసం దేవుడు ఇచ్చిన మరో 15 సంవత్సరాల ఆయుస్సు కోసం వ్రాయబడింది. దీనికోసం కూడా 2రాజులు 20:111 లోను, 2దిన వృత్తాంతాల 32లోను వ్రాయబడింది.

 

ఆ రోజులలో అంటూ ప్రారంభమయ్యింది ఈ అధ్యాయం! అనగా అష్షూరు రాజు దండెత్తి వచ్చిన రోజులలోనే ఈ సంఘటన జరిగింది అనగా అష్షూరు రాజు దండయాత్ర ప్రారంభమైనప్పుడు ఒక మరణకరమైన రోగము కలిగింది. అప్పట్లో దానికి పేరు లేదు కాబట్టి మరణకరమైన రోగము అన్నారు! అయితే 21వ వచనంలో యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టాలి అప్పుడు అతడు బాగుపడతాడు అని దేవుడు చెబితే యెషయా గారు హిజ్కియాకి చెప్పినట్లు చూడగలం కాబట్టి అది ఒక రకమైన కేన్సర్ పుండు అని గ్రహించాలి.

 

సరే, మొదటి వచనం నుండి ధ్యానం చేస్తే హిజ్కియాకి మరణకరమైన రోగం అనగా కేన్సర్ కలిగింది. బషుశా అనేకమంది వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చి ఉంటారు. హిజ్కియా గారు ప్రార్ధనచేస్తున్నారు గాని ఆ వ్యాధి నయం కాలేదు. ఈలోగా హటాత్తుగా ఒక రోజు ప్రవక్తయైన యెషయా గారు దేవుని దగ్గరనుండి ఒక పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు!  ఏమని అంటే : యెహోవా సెలవిచ్చేదేమనగా నీవు మరణమవుచున్నావు, నీవు బ్రదుకవు గనుక నీ ఇల్లు చక్కపెట్టుకోమని దేవుడు నాకు చెప్పమని చెప్పారు అన్నారు.  ఈ మాట వినిన వెంటనే హిజ్కియా గారి గుండె బ్రద్దలైపోయింది.

 

అయితే ఇక్కడ గమనించవలసినది ఏమంటే దేవుడు తన భక్తులకు భవిష్యత్తులో  జరుగబోయే అతి ముఖ్యమైన విషయాలు ముందుగానే చెబుతారు.  అందుకే ఆమోసు 3:7 లో భక్తుడు పరవశుడై పలుకుతున్నాడు: తన సేవకులైన ప్రవక్తలకు తానూ సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు చేయడు!!!!

 

అవును జరిగేది జరుగబోయేది కూడా దేవుడు తన భక్తులకు ముందుగానే వెల్లడిస్తారు.  ఇదే యెషయా గ్రంధంలో అనేకసార్లు ముందుగా జరుగబోయే సంగతులను నేను తెలియజెప్పేవాడను అని చెబుతున్నారు. మిగిలిన వారు నిజంగా దేవుళ్ళు అయితే జరుగబోయేది ముందుగానే చెప్పాలి అని సవాలు విసిరారు. అందుకే ఇప్పుడు తన కుమారుడు తనకు నమ్మకముగా ఉన్నాడు కనుక తన మరణ గడియ సమీపించింది గనుక తన భక్తుని పంపించి బాబు హిజ్కియా నీవు చనిపోతున్నావు గనుక నీ ఇల్లు చక్కపెట్టుకో అంటున్నారు! అనగా ముఖ్యమైన విషయాలు సెటిల్ చేసేసుకో! 

గమనించాలి అప్పటికి యెషయా గారి వయస్సు 39 సంవత్సరాలు!! అప్పటికి అతనికి ఇంకా పిల్లలు పుట్టలేదు. కేవలం హెఫ్షిబాతో వివాహం మాత్రం జరిగింది.  ఇక రాజ్యము ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలాంటి సమయంలో హిజ్కియా గారు చనిపోతే ఎలా అని హిజ్కియా గారు ఏడుస్తున్నారు!

 

    అయితే గమనించవలసిన విషయం ఏమంటే రాజైన ఆసాలా, రాజైన ఉజ్జియా గారిలా పుసుక్కున ఫీలై పోయి దేవునిమీద అలగలేదు! సృష్టికర్త దేవుడే లయకర్త దేవుడే, ఒకరిని పుట్టించేది చంపేది దేవుడే, గాయ పరిచేది ఆయనే గాయము కట్టేది దేవుడే అని హిజ్కియా గారికి బాగా తెలుసు కాబట్టి- అయ్యో తాత గారు అనగా యెషయా గారు నాకోసం ప్రార్ధన చెయ్యండి అని యెషయా గారిని అడుగలేదు. మనమైతే అయ్యగారు నాకోసం ప్రార్ధన చెయ్యండి అంటూ ఈ పాష్టర్ గారికి ఆ పాష్టర్ గారికి చెప్పేస్తాము. గాని హిజ్కియా గారు దేవునితో సత్సంభంధం కలిగి ఉన్నారు కాబట్టి నరులతో చెప్పుకోకుండా దేవునికే కన్నీళ్లు విడుస్తూ మొర్రపెట్టడం మొదలుపెట్టారు. 23 వచనాలు

2. అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని

3. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

 

చూడండి ఏమని ప్రార్దిస్తున్నారో: యెహోవా దేవుడా, నేను నీ ఎదుట ఎలా నమ్మకంతో యదార్ధ హృదయముతో ప్రవర్తించానో నీకు తెలుసు కదా, నేను జరిగించినవి అన్నీ నీకు అనుకూలమైనవా కావా అని తెలిసికొని అప్పుడు సమస్తం జరిగించాను కదా కాబట్టి ఇప్పుడు కృపతో జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్ధించెను.... గమనించాలి- ఇక్కడ ప్రార్ధనలోను కూడా దేవుణ్ణి నిష్టూరపెట్టె మాటలు వాడటం లేదు. జాలిగా దేవుణ్ణి అడుగుతున్నారు- దేవుడా నేను నీకోసం ఇది చేశాను అది చేశాను, దానికి నీవిచ్చే ఫలితం ఇదేనా? ఇది నీకు ధర్మమా అంటూ నిలదీయలేదు- అయ్యా- నేను నీకోసం యదార్ధంగా జీవించాను. నీకు ఏది ఇష్టమో అదే కదా చేశాను కాబట్టి ఇప్పుడు నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్తపరచవా అంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఇలాంటి దయగల ప్రార్ధనలు బైబిల్ లో చాలా తక్కువ కనిపిస్తాయి.

దానియేలు గారి ప్రార్ధన, ఎజ్రా గారి ప్రార్ధన, ఆసా ప్రార్ధన

 

దానియేలు 9:78, 18

7. ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితిమి; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.

8. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది.

18. నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.

 

2దినవృత్తాంతములు 14:11

ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

 

ఎజ్రా 9:15

యెహోవా ఇశ్రా యేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

నెహేమ్యా 1:67

 

ఇలాంటి విరిగి నలిగిన ప్రార్ధనను అలక్ష్యం చేసే దేవుడు మన దేవుడు కాదు. గతంలో చెప్పినట్లు తడిచిన పాదాలు దాటుకుని ఒక్క అడుగైన వెళ్ళలేరు మన దేవుడు!! వెంటనే తన దాసుడైన ప్రవక్తయైన యెషయా గారు ఇంకా రాజ ప్రసాదం దాటకుండానే ఇంకా నడిమిశాల కూడా దాటకుండానే తన దాసునికి చెబుతున్నారు నీవు తిరిగి నాప్రజలకు అధిపతియైన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇలా చెప్పు: నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చేది ఏమంటే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. నీ ప్రార్ధన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజుకే నీవు బాగయ్యి యెహోవా మందిరానికి ఎక్కి పోతావు. నీకు 15 సంవత్సరాలు ఆయుష్షు ఇచ్చాను అని చెప్పారు!!

హల్లెలూయ!!

 

దేవుడు కన్నీటి ప్రార్ధనను విరిగినలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయరు! వెంటనే జవాబిచ్చారు.

 

నీ ప్రార్ధనకు నా ప్రార్ధనకు జవాబు కావాలి అంటే నీకు నాకు కావాలి-

మొదటిది యదార్ధ హృదయం,

రెండవది: కన్నీటి ప్రార్ధన!!

మూడు: ఎలుగెత్తి చేసే ప్రార్ధన!!

 

మరి చేస్తావా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*41వ భాగము*

యెషయా 38:18

1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టు కొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

2. అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని

3. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

4. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;

6. ఇంక పదిహేను సంవత్సర ముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.

7. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;

8. ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక 38వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఇక్కడ కొన్నిమాటలు మనకు ఆశ్చర్యముగా ఉంటాయి.  బైబిల్ గ్రంధంలో పాత నిబంధనలో ఎక్కువగా నీ పితరుల దేవుడైన యెహోవా అంటూ, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇంకా ఇశ్రాయేలు దేవుడను అంటూ ఎన్నోసార్లు దేవుడు తనను పిలుచుకుంటే- ఈ యెషయా గ్రంధంలో హిజ్కియాతో మాత్రం నీ పితరుడైన దావీదు దేవుణ్ణి అంటూ తనను పిలుచుకుంటున్నారు.

 

 దీనిని బట్టి మొదటగా: దేవుడు దావీదు గారిని ఎంతగా ప్రేమించారో- దావీదుగారు దేవునికి ఎలా ఇష్టుడుగా జీవించారో అర్ధమవుతుంది. మూలపితరుడైన అబ్రాహాము గారిని చెప్పకుండా దావీదు గారిని చెబుతున్నారు ఇక్కడ!

బహుశా- హిజ్కియా గారికి పితరుడైన దావీదు గారు అంటే ఎంతో ఇష్టమై ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే మనం 2దిన 29 వ అధ్యాయంలో కనిపిస్తుంది దావీదు వ్రాసిన కీర్తనలు, ఆసాపు రాసిన కీర్తనలు ఎత్తి ప్రతీరోజు దేవుని మందిరంలో స్తుతించాలి అని ఆజ్ఞ ఇచ్చారు హిజ్కియా యాజకులకు లేవీయులకు!!    మరి ఇంతగా హిజ్కియా రాజు దావీదు గారిని ప్రేమించారు కనుక, దావీదు గారు దేవునికి ఎంతో ఇష్టమైన వాడు కనుక హిజ్కియాతో నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా అంటున్నారు.

 

ఇక రెండవ విషయం కూడా 6వ వచనంలో అంటున్నారు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్షు నీకిస్తున్నాను అంటూ- అష్షూరు రాజు చేతినుండి నిన్ను కాపాడతాను అంటున్నారు, ఇంకా అంటున్నారు 2రాజులు 20:6 లో అంటున్నారు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడతాను అంటున్నారు! ఈవచనంలో కూడా దావీదుగారు అంటే దేవునికి ఎంతో ఇష్టమని అర్ధమవుతుంది. ఎందుకంటే దేవుడు దావీదు గారికి ఒక వాగ్దానం చేశారు. నా సేవకుడైన దావీదుకి ఒక దీపం ఉంటుంది. దావీదు సంతతి వారు నిరంతరం ఏలుతారు అని.....

2సమూయేలు 7:13

అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

2సమూయేలు 7:16

నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

 

దానికోసమే ఇక్కడ నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడతాను అంటున్నారు.

 

ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే: నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను అంటున్నారు దేవుడు! అవును దేవుడు మన కన్నీరుని చూసే దేవుడు!

కీర్తన 56:8 లో అంటున్నారు....

కీర్తనలు 56:8

నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.

నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, ఇంకా అవి నీ కవిలెలో అనగా నీ పుస్తకంలో కనబడును అంటున్నారు.

అవును. ఈ కన్నీరు ఎప్పుడు బయటకు తీయబడుతుంది అంటే ప్రకటన గ్రంధంలో 5వ అధ్యాయంలో కనిపిస్తాయి మనకు!

 

ప్రకటన గ్రంథం 5:8

ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

 

Revelation(ప్రకటన గ్రంథము) 8:3,4,5

3. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై (మూలభాషలో- ఇచ్చుటకై) అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.

4. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

5. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.

 

కాబట్టి మన కన్నీరు వ్యర్ధముగా పోవడం లేదు అని గ్రహించాలి. అవి మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళడమే కాకుండా 24గురు పెద్దలు ఆ ప్రార్ధనలు తమ చేతిలో ఉన్న పాత్రలలో భద్రం చేస్తున్నారు అని గ్రహించాలి. దేవుడు తగినకాలమందు మనకు తప్పకుండా జవాబు ఇస్తారు అయితే అంతవరకూ మనం ఓపికతో కనిపెట్టవలసి ఉంది అని గ్రహించాలి.

 

ఇక తర్వాత నేను నిన్ను బాగుచేసేదను అంటున్నారు! నిర్గమ మరియు ద్వితీయోప కాండాలలో నిన్ను స్వస్తపరచు యెహోవాను నేనే అంటున్నారు.

నిర్గమ 15:26

మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.

 

ద్వితీ 32:39

*ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు*

 

2దిన 7:14

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

 

కీర్తన 41:3

రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.

 

యెషయా 57:18

నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

 

యిర్మియా గారు ప్రార్ధిస్తున్నారు 17:14

యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడు దును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.

 

యిర్మియా 33:6

నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

 

అందుకే హోషేయ భక్తుడు అంటున్నారు 6:1

మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

 

కాబట్టి దేవుడు మనలను స్వస్తపరిచే దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు! మనలను ఆదరించే దేవుడు! అందుకే నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్షు ఇచ్చాను అంటూ ఆదరిస్తున్నారు.

 

అప్పుడు దేవుడు యెషయా గారికి చెప్పారు అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండుమీద వేయమని చెప్పు, నేను స్వస్తపరుస్తాను అంటూ!

 

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే: దేవుడు అసాధారణమైన అధ్బుతాలు చేసే దేవుడే! అదే సమయంలో మందులు వాడటానికి దేవుడు ఇష్టపడడు అంటూ కొందరు ప్రచారం చేస్తారు ఇది తప్పు అని అనుకుంటాను నేను! ఎందుకంటే ఇక్కడ దేవుడే అంజూరపు పండ్ల ముద్ద పుండుమీద వేయు అని సెలవిస్తున్నారు. అంజూరపు ఆకులకు, పండ్లకు, ఇంకా ఒలీవ ఆకులకు, ద్రాక్షరసానికి పుళ్ళు, గాయాలు బాగుచేసే ఔషధగుణం ఇచ్చారు దేవుడు! అయితే దేవుడే అంజూరపు పండ్ల ముద్ద వేయు అన్నారంటే కొన్నిసార్లు సరియైన మందులు వాడినా మనకు స్వస్తత కలుగదు!  ఎందుకంటే దేవుడు తనకాలంలో మనకు తన విధానంలో స్వస్తతను ఇస్తారు. ఎప్పుడు అంటే మన తప్పులు మనం తెలుసుకుని ప్రభువా నేను తప్పుచేశాను క్షమించు అని చెప్పేవరకు! ఆ తర్వాత దేవుడు తప్పకుండా స్వస్తపరుస్తారు. దైవిక స్వస్తతలు జరుగవా అని అడగొచ్చు కొందరు! అయ్యా జరుగుతాయి! దేవుడు మందులు లేకుండా కూడా స్వస్తపరచడానికి సమర్దుడే! అయితే సమయం బట్టి చేస్తారు! అయితే మందులు వాడటానికి దేవుడు వ్యతిరేఖి కారు అని మాత్రం ఇక్కడ చెప్పదలచుకున్నాను!

ఈ విధంగా దేవుడు తన భక్తుడైన హిజ్కియా కు స్వస్థత ఇచ్చారు దేవుడు!

హల్లెలూయ!

ఆమెన్!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*42వ భాగము*

యెషయా 38:811

8. ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.

9. యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

10. నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక 38వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 78 వచనాలలో యెహోవా తానుచెప్పిన మాట నెరవేర్చును అనడానికి ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే- ఆహాజు చేయించిన నీడ గడియారం మీద ముందుకు పోయిన నీడ పది అంకెలు వెనకకు పోయేలా చేస్తాను. అప్పుడు సూర్యకాంతి పది అంకెలు తిరిగి వెనుకను ఎక్కింది అని వ్రాయబడింది.  అయితే 2రాజుల గ్రంధంలో మరింత వివరంగా ఉంది: 20:911 ...

2 Kings(రెండవ రాజులు) 20:8,9,10,11

8. యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను

9. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా?

10. అందుకు హిజ్కియా యిట్లనెను- నీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును.

11. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను.

 

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే హిజ్కియా గారే యెషయా గారిని దేవుడు నన్ను స్వస్తపరుస్తారు మరియు అష్షూరు రాజుచేతినుండి రక్షిస్తారు అనడానికి సూచన ఏమిటి అని  అడిగినట్లు చూడగలం!

ఇందుకోసం గతంలో చూసుకున్నాము!  దేవుడు తాను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను అంటూ దానికి కొన్ని సూచనలు చేస్తారు. ఉదాహరణకు దేవుడు మోషేగారికి హోరేబు పర్వతము మీద చూపినవి, ఇంకా గిద్యోనుకి ఇచ్చినవి ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే మత్తయి 12:3839 వచనాలలో యేసుక్రీస్తుప్రభులవారు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు అన్నారు. దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఇలాంటి సూచనలు దేవునిని అడగడం కొన్ని సారులు మంచిది కొన్నిసార్లు మంచిదికాదు! మరి ఎప్పుడు మంచిది ఎప్పుడు మంచిదికాదు అనేది మనకు ఎలా అర్ధమవుతుంది అంటే: అప్పటి పరిస్తితులమీద అడిగే వ్యక్తిమీద ఎందుకు అడుగుచున్నాడో ఆ ఉద్దేశం మీద ఆధారపడియుంటుంది. అదే దేవునికోసం అడిగితే దేవుడు ఎప్పుడూ కోపపడరు అని నా ఉద్దేశం! ఒకవేళ మన స్వార్ధము కోసం అడిగితే దేవుడు తప్పకుండా శిక్షిస్తారు.

 

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే తన తండ్రికి దేవుడే సూచన ఇచ్చారు అడుగకుండానే- కనీసం దానినైనా చూసి విశ్వసిస్తాడు కదా అని! గాని ఇక్కడ హిజ్కియా గారే సూచన అడిగినా దేవుడు మందలించలేదు సరికదా అసాధారణమైన అధ్బుతం చేసి చూపించారు! ఎందుకంటే హిజ్కియా గారు దేవునికి మనస్పూరిగా భయపడే వ్యక్తి అని తెలుసు కాబట్టి!

 

   సూచన అడిగిన వెంటనే దేవుడు యెషయా గారి ద్వారా సూచన ఇస్తున్నారు యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారు అనడానికి నిదర్శనం ఏమిటంటే మీ తండ్రి చేయించిన  నీడ గడియారం ఇప్పుడు పదిమెట్లు దిగిపోయింది కదా- అది తిరిగి పదిమెట్లు ఎక్కించాలా అని అడిగారు-  వెంటనే హిజ్కియా అంటున్నారు= నీడ పదిమెట్లు దిగడం సులువే గాని వెనుకకు ఎక్కడం అసాధ్యం! ఎక్కితే చాలు అన్నారు! వెంటనే యెషయా గారు దేవునికి ప్రార్ధన చేస్తే ముందుకు వెళ్ళిపోయిన నీడ వెనుకకు తిరిగింది. అనగా నీడ గడియారం లేక సూర్య గడియారం సమయాన్ని తెలియజేస్తుంది కదా ఇది సూర్యుని యొక్క గమనాగమనాల వలన నీడ ముందుకు పోతుంది.  సూర్యుడు పశ్చిమము నుండి తూర్పుగా పయనిస్తాడు. కారణం భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన ఇలా పడమర నుండి తూర్పుకి సూర్యుని పయనం జరుగుతుంది. అయితే నీడ దిగిన మెట్లు ఎక్కడం అంటే ప్రకృతి ధర్మానికి వ్యతిరేఖం! అనగా ముందుకు వెళ్ళిన సూర్యుడు మరలా వెనుకకు వచ్చాడు అన్నమాట!

 

 దీనివలన సూర్యుడు చంద్రుడు భూమి సమస్త సృష్టి దేవుని ఆధీనంలో ఉన్నాయి అని మనకు స్పష్టముగా అర్ధమవుతుంది. దేవుడు తన బిడ్డలకోసం ఇలాంటి అసాధారణ మైన అద్భుతాలు చేస్తారు. యెహోషువా గారు ప్రార్ధించగా సుమారు  23గంటలు సూర్యుడు తన గమనాన్ని ఆపినట్లు చూడగలం....

Joshua(యెహొషువ) 10:12,13,14

12. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.

13. *సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు*.

14. *యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.*

 

చూడండి  ఒకనాడు మొత్తం సూర్యభ్రమణం- భూభ్రమణం ఆగిపోయింది.

దేవునికి సమస్తము సాధ్యమే!!!

 

మనము చేయాల్సింది ఆయనమీద సంపూర్తిగా ఆనుకోవడం మాత్రమే! కేవలం ఆయనను మాత్రమే విశ్వసించడం మాత్రమే!

 

ఆ తర్వాత అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండుమీద వేయగా దేవుడు అద్భుతంగా హిజ్కియా గారిని స్వస్తపరచడం మూడవ రోజున దేవుని మందిరమునకు వెళ్లి దేవునికి మ్రొక్కి అక్కడ ఒక క్రొత్త పాట రాసి పాడినట్లు మనం 38:920 వచనాలలో చూడగలం!

 

మరి నీవు అలాంటి విశ్వాసం కలిగి ఉంటావా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*43వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-1*

యెషయా 38:915

9. యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

10. నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

12. నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తికొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు

14. మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడి యుండుము.

15. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచుకొందును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక 38వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 1020 వరకు తాను రచించిన ఒక పాట కనిపిస్తుంది. ఇది 9వ వచనం ప్రకారం హిజ్కియా గారు కేన్సర్ నుండి నయమయ్యాక రాసినది అని వ్రాసిఉంది. అయితే నాకు అనిపిస్తుంది- తాను చావు పడకమీద ఉన్నప్పుడు మొదలుపెట్టి ఉంటారు. ఇక దేవుడు బాగుచేశాక మూడవరోజున మందిరంలో ప్రవేశించినప్పుడు ఈ పాట ఆనందంతో తన్నుకుంటూ వచ్చేసి ఉంటుంది.

గమనించాలి- ఈ పాట మన అందరికీ చెందుతుంది.

 

10వ వచనం చూసుకుంటే: నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, ఇంకా నా ఆయుశ్షేషమును పోగొట్టుకొని యున్నాను! గమనించాలి- ఇక్కడ మధ్యాహ్నం అని వ్రాయడానికి కారణం ఈ పాట రాయబోయేసరికి లేక హిజ్కియా గారికి కేన్సర్ వచ్చేసరికి ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలే! ఇంకా ఆయనకు పిల్లలు కూడా పుట్టలేదు! అందుకే నా జీవితకాలం మధ్యలో నేను మృత్యులోక ద్వారానికి పోవలసి వచ్చింది అంటున్నారు!

 ఇంకా జాగ్రత్తగా గమనిస్తే కీర్తనలు గ్రంధము అంటే హిజ్కియా గారికి ఎంతో ఇష్టమని మనం గతంలో చూసుకున్నాము! ఇక్కడ ఇలా వ్రాయడానికి బహుశా 90వ కీర్తనను మదిలో పెట్టుకుని ఇలా వ్రాసి ఉండవచ్చు! 90:10 లో అంటున్నారు కదా భక్తుడు: మా ఆయుష్కాలమంతా కలిపితే 70 ఏళ్ళు! అధిక బలముంటే 80 సంవత్సరాలు. అయినా వాటి ప్రయాస వ్యర్ధమే- గతించి పోయేదే అంటున్నారు.

కీర్తనలు 90:10

మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

 

 ఇక్కడ మధ్యాహ్నం అనడానికి 70 లో సగం 35 కదా, తనకి 39 సంవత్సరాలు- అందుకే మధ్యాహ్నం అనగా సగం రోజు మాత్రమే గడిచింది అంటున్నారు నా ఆయుష్షు కాలం అనగా 70 సంవత్సరాల మధ్యలోనే నేను చనిపోతున్నాను- పాతాళ లోక ద్వారమునకు వెళ్ళిపోవలసి వచ్చింది అంటున్నారు,

 

11 వ వచనంలో యెహోవాను- సజీవుల దేశములో యెహోవాను చూడకపోదును , మృతుల లోక నివాసిని ఇక నేను మనుష్యులకు కానరాక పోవుదును అని నేను అనుకున్నాను అంటున్నారు!

 

ఇక్కడ అతడు రెండు భాధలు వ్యక్తము చేశారు! అయితే దానిలో ప్రధమమైనది: యెహోవాను - సజీవుల దేశములో ఇక నేను యెహోవా దేవుణ్ణి చూడకపోవుదునే అనగా ఇక నేను దేవుని మందిరానికి వెళ్లి ఆయనను ఆరాధన చేయలేనే అని అనుకున్నాను అంటూ బాధపడుతున్నారు. దీనిని బట్టి అర్ధమవుతుంది హిజ్కియా గారికి దేవుడు అన్నా దేవుని మందిరము అన్నా ఎంతగా ఇష్టపడ్డారో! దావీదు గారు కూడా ఇలాగే ఆత్రుత పడ్డారు. జనులు యెహోవా మందిరములోనికి వెళ్దాము అంటే తనకు ఎంతో ఇష్టం కలిగేది అట....

కీర్తనలు 122:1

యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

ఈ భక్తుడు కూడా అనుకున్నాడు- తనకి మరణకరమైన తెలియని వ్యాధి వచ్చింది- దానికి మందు లేదు- ఇక నేను చనిపోతాను, ఇక నేను యెహోవా మందిరంలో ప్రవేశించి ఆయనను ఆరాధించలేనే అంటూ ఎంతగానో బాధపడ్డాను అంటున్నారు. ఇది మొదటి ఆందోళన!

 

ప్రియ చదువరీ స్నేహితుడా! ఇలాంటి ఆత్రుత నీకు ఉందా?  అప్పుడే ఆదివారం వచ్చేసిందా!అయ్యో వెళ్ళకపోతే మా బాబుతో లేక మా అమ్మతో పడలేను- లేక వెళ్ళకపోతే పాష్టర్ గారితో పడలేను- ఒకసారి వెళ్లి పాష్టర్ గారికి ముఖం చూపించి వచ్చేస్తాను అనుకునే వారు చాలాచాలా మంది ఉన్నారు. ఆదివారం వస్తే సినిమాలు, షికార్లు, బంధువుల ఇంట్లో ఫంక్షన్ లు, మందు పార్టీలు, బీచ్ విహారాలు చేసే పనికిమాలిన, భక్తిమాలిన, చెత్త క్రైస్తవులు అనేకులు కనిపిస్తున్నారు ఈ రోజులలో! అయితే ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వెళ్లి అక్కడ ప్రార్ధన చేస్తానా ఎప్పుడు మందిరంలో పాటలు పాడతానా ఎప్పుడు ఆరాదిస్తానా అని ఆత్రుతతో ఎదురుచూసే నిజమైన క్రైస్తవులు కూడా కోకొల్లలు ఉన్నారు! ఈ రెండవ గ్రూపుకి చెందిన వారే మన హిజ్కియా గారు! అందుకే అయ్యో ఈ వ్యాధి నా మరణానికి వచ్చింది అని నాకు తెలుసు! ఇక నేను దేవుని మందిరములోనికి వెల్లలేనే అంటూ ఎంతగానో బాధపడ్డాడు ఈ భక్తుడు! చనిపోతున్నాను- నాకు పిల్లలు కూడా పుట్టలేదు- నా భార్య విధవరాలు అయిపోతుంది- నా దేశం అనాధ అయిపోతుంది అనే భాదలేదు అతనికి, ముఖ్యమైన బాధ ఏమిటంటే నేను దేవుని మందిరానికి వెళ్లి యెహోవా ముఖ దర్శనాన్ని చేయలేనే ఆయన సన్నిధిని అనుభవించలేనే అని ఎంతగానో బాధ పడ్డాడు! అందుకే దేవుడు హృదయ రహస్యాలు తెలిసిన వాడు కనుక హిజ్కియా గారిని స్వస్తపరచి తిరిగి తన మందిరానికి మూడో రోజున తీసుకుని పోయారు! హల్లెలూయ!

ప్రియ స్నేహితుడా! నీకు అటువంటి మందిరమంటే ఆసక్తి ఉందా??!!!

 

ఇక రెండవ ఆందోళన: మృతుల లోక నివాసినై ఇక నేను మనుష్యులను చూడలేక పోతాను కదా అనుకున్నారు! ఇక నేను లేవలేను! ఇక నాకు స్వస్తత కలుగడం అసంభవం! నా పని అయిపోయింది, నా జబ్బుకి మందులేదు! అయ్యో సగం కాలం లోనే చచ్చిపోతున్నానే- ఇక అందరిలా నేను మనుష్యులతో తిరుగలేనే అంటూ బాధపడ్డారు! 

మనం కూడా అనేకసార్లు అనుకున్నాము కదా- ఇక నేను బ్రతుకను- ఈ జబ్బుతో చనిపోవలసిందే- ఇక నా అప్పులు తీరవు, నా పరిస్తితి మారదు, నా బిడ్డలు అభివృద్ధి పొందలేరు, ఈ అప్పులతో ఈ రోగాలతో ఈ ఇక్కట్లుతో నేను ఉండాల్సిందే, ఇలాగే చావాల్సిందే అని అనేకసార్లు అనుకున్నావు కదా!!  నిజమైన విశ్వాసి ప్రతీ ఒక్కరు- ఇలాంటి అనుభవం నుండి వెళ్ళాల్సిందే! నిజానికి ఈరోజు ఆ రోజులను అనగా మనం జబ్బుగా ఉన్న రోజులను, ఆర్ధిక ఇబ్బందులలో ఉద్యోగం లేక ఆరోగ్యం లేక ఆదరించే వారు ఆదుకునే వారు లేక మనలను పలకరించే వారే లేక బాధపడిన రోజులను ఇప్పుడు తలచుకుంటే- అయ్యా దేవా- అసలు నేను వాటినుండి బయటకు రాలేనే అనుకున్నాను గాని నీవు నామీద చూపిన కృపను బట్టి నేను ఈ స్తితిలో ఉన్నాన్నయ్యా నీకు వందనాలయ్యా అని ఎన్నోసార్లు చెబుతున్నాము కదా!

గమనించాలి: దేవుడు తన అసాధారణమైన అద్భుతం- దేవుడు తన కరుణగల దక్షిణ హస్తం ఎప్పుడు ఇస్తారు అంటే ఇకనేను అయిపోయాను, నా కధ ముగిసిపోయింది, Game Over, The End అని ఎప్పుడు అనుకుంటామో- అప్పుడే దేవుడు తన అధ్బుతం చేస్తారు. ఆశ్చర్యకర్యమైన అద్భుతాలు చేసి సమస్యను రోగాన్ని ఇబ్బందులను ఇట్టే చేతితో తీసేసి మనస్సుకు హృదయానికి ఆనందం సంతోషం- శరీరానికి ఆరోగ్యం ఇస్తారు!

అయితే నీవు అంతవరకూ ఆయన కోసం పిచ్చుకలా కనిపెట్ట గలవా!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*44వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-2*

యెషయా 38:1013

10. నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

12. నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక 12వ వచనం చూసుకుంటే: నా నివాసము పెరికివేయ బడెను గొర్రెల కాపరి గుడిసె వలె అది నాయొద్దనుండి ఎత్తివేయ బడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన బద్దెనుండి నన్ను కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను  సమాప్తి చేసియున్నావు అంటున్నారు.

 

దీని గురించి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ తన జీవితాన్ని హిజ్కియా గారు మొదటగా గొర్రెల కాపరి యొక్క గుడిసె లేక డేరాతో పోల్చుకుంటున్నారు,

రెండవది: నేతగాడి మగ్గంతో పోల్చుకున్నారు.

 

ఇక్కడ మానవుని జీవితం ఎంత అల్పమైనదో హిజ్కియా గారు కళా రూపకంగా ఉపమానమెత్తి చెబుతున్నారు! నా జీవితం ఎంత అల్పమైనది అంటే గొర్రెల కాపరి తన డేరాను ఈరోజు ఇక్కడ వేస్తాడు, తర్వాత దానిని మడిచి రేపు మరో దగ్గర వేస్తాడు. అలాగే నా జీవితం కూడా ఈరోజు ఉండి రేపు మాయమైపోతుంది అంటూ జీవితాన్ని పోల్చుకున్నారు!

 

పౌలుగారు కూడా మన జీవితాలను డేరాతో పోల్చారు! మన శరీరాన్ని డేరాతో పోల్చారు! 2కొరింథీ 5:1

భూమిమీద ఉన్న మన గుడారం శిధిలమైపోయేది, అయితే చేతులతో చేయని మన నిత్యనివాసం పరలోకంలో ఉంది అంటున్నారు.....

2కోరింథీయులకు 5:1

భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

 

శాశ్వత నివాసం అనేది మనకు ప్రభువుతోనే ఉంది. అదికూడా నిత్యత్వములో ఉంది. 2కొరింథీ 5:14 లో విస్తారంగా చెబుతున్నారు. ప్రభుతో కలిసి ఉండటమే మనకు శాశ్వత మైనది అంటున్నారు. ఇంకా అంటున్నారు ఈ అధ్యాయంలో కాబట్టి భూమిమీద ఉన్న విషయాలమీద మనస్సు పెట్టుకోవద్దు! పరలోకమందు ఉన్న ఆధ్యాత్మిక / పరలోక సంబంధనమైన విషయాలమీద మనం మన మనస్సు లగ్నం చేద్దాం అంటున్నారు!

 

2కోరింథీయులకు 4:17

మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

2కోరింథీయులకు 4:18

ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.

 

పౌలుగారు అంటున్నారు: భూమిమీద ఉన్న మన నివాసం లేక గుడారం అనేది మన దేహము- ఇవి శాశ్వతమైనవి కావు గాని అవి మరణిస్తాయి. ఎంతటి స్థిరుడైన ఒకరోజు మరణిస్తారు అంటున్నారు....

 

కీర్తనలు 39:4

యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను.

కీర్తనలు 39:5

నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు.(సెలా.)

కీర్తనలు 39:6

మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

 

అయితే దేవుడు నిర్మిస్తున్న నివాసం లేక ఇల్లు లేక కట్టడం మనకు పరలోకంలో ఉంది. యోహాను 15:2 లో నేను మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను. అలా మీకు స్థలము సిద్దపరిస్తే నేనుండే చోటున మీరు ఉండేలా నేను మరలా వచ్చి మిమ్మును నాతో ఉండేలా తీసుకుని పోతాను అని చెప్పారు.  ఇంకా ఆ శాశ్వత రాజ్యానికి నిర్మాత శిల్పి దేవుడే అంటున్నారు పౌలుగారు:

హెబ్రీయులకు 11:10

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

 

హెబ్రీయులకు 13:14

నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.(మూలభాషలో- వెదకుచున్నాము)

 

అది ప్రకటన 20:1027 లో దాని పొడుగు వెడల్పు ఎత్తు ఇంకా బిల్డింగ్ కనస్ట్రక్షన్ వివరాలు మొత్తం ఉన్నాయి.

 

కాబట్టి గుడారం అనేది మన భౌతిక దేహముతో పోల్చారు. ఇల్లు అనేది పరలోకంలో మనకు లబించే మహిమ దేహము అని గ్రహించాలి!

 

ఇక్కడ హిజ్కియా గారి భాషలో గొర్రెల కాపరి గుడిసె లేక డేరాలా నా దేహము అనే ఈ డేరా కాపరి దానిని మడిచి వేసేస్తున్నాడేమో అనుకున్నాను అని తలంచారు అన్నమాట!

 

ఇక తర్వాత నేసేవాడి మగ్గంలా నా జీవితకాలాన్ని చుట్టుకుని ముగించి వేశాను అంటున్నారు. ఒక నేతగాడు నేసేటప్పుడు దారమును ఒక చిన్న చెక్క లేక కర్రమీద చుట్టుకుని మగ్గంలో దారాలను ఇటుప్రక్క అటుప్రక్క దారాల మధ్యలో త్రిప్పుతాడు. ఇప్పుడు హిజ్కియా గారు కూడా అనుకున్నారు- ఇక నా జీవితం అనే మగ్గం లో నేత గాడు దారం యొక్క అవసరము తీరిపోయింది కాబట్టి దానిని చుట్టేసి విసిరేశాడేమో అనుకున్నారు!

నేతగాడు- దారము పని అయిపోయాక మగ్గం నుండి అనగా దారాల మధ్యనుండి చుట్టిన దారాన్ని కత్తిరించి వేస్తాడు. అలా నన్ను నేతగాడు అనే దేవుడు నన్ను కత్తిరించి వేస్తున్నాడేమో అని అనుకున్నారు.

 

యోబు గారు కూడా ఇలా ఎన్నోసార్లు బాధపడ్డారు తాను వ్యాధితో బాధపదేరోజులలో!

 

యోబు 7:6

నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

యోబు 7:7

నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీవుకూడా ఇలాగే బాధపడుతూ ఉంటే నీకొక ఆశ్రయము ఉంది అని మర్చిపోకు! అది యేసుక్రీస్తుప్రభులవారే ఆ ఆశ్రయము అని మర్చిపోవద్దు! అదే సమయంలో నీ జీవితం నాజీవితం స్థిరమైనవి కావు కాబట్టి ఈలోక విషయాల మీద లక్ష్యముంచక పరసంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడదాం!

 

దైవాశీస్సులు!

 

 

 

యెషయా ప్రవచన గ్రంధము*

*45వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-3*

యెషయా 38:1314

13. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14. మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే 13వ వచనంలో ఉదయమగు వరకు ఓర్చుకున్నాను, సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా ఎముకలన్నియు విరువబడెను, ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు అంటూ బాధపడుతున్నారు.

 

నిజానికి ఈ 1314 వచనాలలో ఉన్న విషయాల వలే యోబు గారు కూడా అలాగే బాధపడ్డారు! యోబుగారు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసే వారు. 7:14

యోబు 7:13

నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా

యోబు 7:14

నీవు స్వప్నముల వలన నన్ను బెదరించెదవు దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు.

యోబు 7:16

అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

 

కీర్తనా కారుడు కావలివాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసినట్లు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నారు...

కీర్తనలు 130:6

కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.

 

యెషయా 21:1112

11. దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

12. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.

 

ద్వితియోపదేశకాండము 28:67

నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.

ఇక సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా ఎముకలన్నియు విరువబడెను ...

 

యోబుగారు కూడా ఇలాగే బాధపడ్డారు.

యోబు 30:17

రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.

 

యోబు 10:17

సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

 

యిర్మియా గారు కూడా అంటున్నారు విలాప వాక్యములు 3:1013

10. నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు

11. నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కు లేకుండ చేసియున్నాడు

12. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు

13. తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.

 

 

   ఇప్పుడు అలాగే సింహము వలె నా ఎముకలన్నియు నీవు విరిచేస్తున్నావు అంటున్నారు హిజ్కియా గారు. ఇక్కడ అతడు ఎంతగా ఈ కేన్సర్ వలన బాధపడుతున్నారో మనకు అర్ధమవుతుంది.  బాధకు ఓర్వలేక ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్నారు. రాత్రుళ్ళు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈవిధంగా రాత్రనక పగలనక తను అనుభవించే భాధకు విలవిలలాడుచు ప్రార్ధిస్తున్నారు.

 

Job(యోబు గ్రంథము) 16:8,9,12,13

8. నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇదికూడ నా మీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.

9. ఆయన తన కోపముచేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

12. నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్నుముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసియున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

13. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెనునా పైత్యరసమును నేలను పారబోసెను.

 

యోబు 30:30

నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.

 

కీర్తనాకారుడు కూడా ఇలాగే మొర్రపెట్టారు

కీర్తనలు 6:2

యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము.

 

కీర్తనలు 32:3

నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.

 

కీర్తనలు 51:8

ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.

 

విలాపవాక్యాలు 3:4

ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు

 

 

అయితే ఇలాంటి బాధలప్పుడే మనము ధైర్యముగా ఉండాలి. యోబుగారు అంతగా బాధపడినా ఆయన చెప్పిన ఒకమాట ఎంతో తలమానిక మైనది. 

19:2527

25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.

26. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

27. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

 

యోబు 23:10

నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

యోబు 30:23

మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.

 

ఇలాంటి బాధలో యోబు గారు చెప్పినట్లు నీవు ధైర్యముగా దేవునికోసం కనిపెట్టగలవా?!!

యోబు గారు కనిపెట్టారు కాబట్టే రెండింతల ఆశీర్వాదము పొందారు.

హిజ్కియాగారు కనిపెట్టారు కాబట్టే 15 సంవత్సరాల ఆయుష్షు పొందుకున్నారు!

మరినీవు అలా దేవునికోసం కనిపెట్ట గలవా!!! కష్టమొచ్చినా నష్టమొచ్చినా మరణమొచ్చినా ఏమొచ్చినా ప్రభువుకోసం నిలువగలవా!!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*46వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-4*

 

యెషయా 38:1415

14. మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

15. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే 14వ వచనంలో అంటున్నారు: మంగలకత్తి పిట్టవలె ఓదెకొరుకువలె నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించేను నాకు శ్రమ కలిగెను యెహోవా నాకొరకు పూటపడియుండుము అంటున్నారు.

మంగలకత్తి అనేది ఒక పిట్ట, చెక్కలను చెట్టులను ముక్కుతో చెక్కి తింటుంది. ఓదెకొరుకు కూడా ఒక పక్షి- ఈ రెండూ ఎప్పుడు కిచకిచలాడుతూ ఉంటాయి. అలాగే నా నొప్పితో నేను కిచకిచలాడుతున్నాను అంటున్నారు. గువ్వవలె మూల్గుచున్నాను అంటున్నారు.

 

కీర్తనాకారుడు కూడా ఇలాగే బాధపడుతున్నాడు

కీర్తనలు 55:6

ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

కీర్తనలు 55:7

త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

 

కీర్తనలు 74:19

దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకుము శ్రమనొందు నీ వారిని నిత్యము మరువకుము.

 

యెషయా 59:11

మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది

 

ఇలా భక్తులందరు తమను గువ్వలతో పోల్చుకున్నారు.

 

ఇంకా కీర్తనాకారుడు పిచ్చుకలా కూడా పోల్చుకున్నారు.

కీర్తనలు 102:7

రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.

 

కీర్తనలు 84:3

సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.

 

గతభాగంలో చూసుకున్నాము హిజ్కియా గారు ఇంకా యోబుగారు నొప్పిని ఓర్వలేక ఎంతో మూల్గులు విడిచారు! ఈ రోజు నీవు కూడా నీకు కలిగిన రోగమువలన బాధలవలన ఆక్సిడెంట్ వలన బాధల వలన అప్పుల వలన మూల్గుచున్నావా- అయితే బాధపడకు కలవరపడకు! ఇలాంటి బాధలు 15వ వచనం రాబోయేసరికి స్తుతిగా మారిపోయింది, ఎందుకంటే దేవుడు హిజ్కియాను స్వస్తపరిచారు.  నిన్నుకూడా ఆయన స్వస్తపరచగలరు, నీ దుఃఖగీతాన్ని ఆనంద గీతముగా మార్చగలరు!

 

15వ వచనం: నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములు అన్నియు నేను మెల్లగా అనగా అణకువగా నడుచుకొందును అంటున్నారు! అవును ఇదే అధ్యాయం 58 వచనాలలో దేవుడు మాట ఇచ్చారు. నేను నిన్ను స్వస్తపరుస్తున్నాను, నీవు మూడో రోజున నా మందిరానికి వెళ్తావు నన్ను ఆరాదిస్తావు అని. నిజంగా అదేవిధంగా హిజ్కియాగారికి ఆశ్చర్యకరంగా స్వస్తత కలిగింది. ఇప్పుడు అదే మూడవరోజున మందిరములో ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు భక్తుడు!

 

అవును దేవుడు హిజ్కియా గారి కన్నీళ్లు చూసి కరిగిపోయి ఇంకా నడిమిశాల దాటకముందే జవాబిచ్చారు. నీవు నేను కూడా అలాగే కన్నీళ్లు విడిస్తే తప్పకుండా నీకు నాకు జవాబిస్తారు!!!

ఎప్పుడైతే జవాబిచ్చారో వెంటనే మనము దేవుణ్ణి స్తుతించి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అందరికీ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది!!

 

చూడండి: నిర్గమ 2:2324 వచనాలు చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు దాస్యములో ఉండి మొరపెడితే దేవుడు విన్నారు జవాబిచ్చారు..

Exodus(నిర్గమకాండము) 2:23,24,25

23. ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.

24. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.

25. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

 

కీర్తనాకరుడు ఎన్నోసార్లు ఇలాగే మొర్రపెట్టి దేవుని నుండి ఆశ్రయము పొందుకున్నారు.

Psalms(కీర్తనల గ్రంథము) 34:4,17,18

4. నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.

17. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.

18.విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

 

Psalms(కీర్తనల గ్రంథము) 103:11,13,14

11. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.

13. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.

14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.

 

కీర్తనలు 147:3

గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.

 

కీర్తనలు 27:1

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

కీర్తనలు 27:2

నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి

 

కీర్తనలు 31:4

నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.

 

Psalms(కీర్తనల గ్రంథము) 41:5,6

5. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.

6. ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.

 

కీర్తనలు 55:18

నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.

 

కీర్తనలు 143:3

శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.

 

ఎన్ని కష్టాలు శ్రమలు కలిగినా దావీదు గారు దేవునిమీదనే నమ్మకం పెట్టుకున్నారు!

కీర్తనలు 56:11

నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?

కీర్తనలు 56:12

దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.

 

కీర్తనలు 118:6

యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?

కీర్తనలు 118:7

యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.

కీర్తనలు 118:8

మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

కీర్తనలు 118:9

రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

 

అందుకై యిర్మియా ఇలా స్తుతిస్తున్నారు దేవుణ్ణి:

యిర్మియా 10:7

జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.

 

కాబట్టి మనము కూడా దేవునిమీదనే ఆశ పెట్టుకుందాం!

ఆయనను స్తుతిద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*47వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-5*

యెషయా 38:1517

15. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచుకొందును.

16. ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే అదే 15వ వచనం చివరి పాదంలో అంటున్నారు: నాకు కలిగిన వ్యాకులము బట్టి నా సంవత్సరములన్నీ మెల్లగా నడుచుకొందును అంటున్నారు.  నేను వ్యాకులపడ్డాను. ఇప్పుడు దేవుడు నాకు ఆయుష్షు ఇచ్చారు కాబట్టి దేవుడు నాకిచ్చిన ఆయుష్షు మరో 15 సంవత్సరాలు- నేను దేవుని సన్నిధిలో మెల్లగా అనగా అణుకువగా నడుచుకుంటాను అంటున్నారు.  నా జీవితకాలమంతా దేవునికి విధేయుడుగా నడుచుకుంటాను అంటున్నారు. ఇంతకు ముందు నా ప్రవర్తన ఎలా ఉండేదో ఇక అలాగుండక జీవితాంతం దేవునికి విధేయుడనై ఆయనకు అనుకూలంగా నడుచుకుంటాను అంటున్నారు. అయితే మనం 2దిన 32:2426 వచనాలు చూసుకుంటే ధనము కలిగాక పేరు కలిగాక హిజ్కియా మనస్సున గర్వించెను అని వ్రాయబడింది.....

 

25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా

26. హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు.

 

కాబట్టి దేవుడు మనకు స్వస్థత ఇచ్చాక, ఐశ్వర్యము లేక ఉద్యోగం ఇచ్చాక, చేయడానికి మంచి పని ఇచ్చాక, దేవుణ్ణి మరచిపోకుండా ఆ పని ఇచ్చిన దేవునికి, ఆ పని చేయడానికి శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఋణపడి కృతజ్ఞత కలిగి జీవించాలి!

 

ఇక 16వ వచనం చూసుకుంటే: ప్రభువా వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు.....

 

ఇక్కడ ప్రభువా నీవుచూపిస్తున్న కృపల వలననే మనుష్యులు జీవిస్తున్నారు. నీ వలననే నా ఆత్మ ఇప్పుడు జీవిస్తుంది. ఎందుకంటే నీవు నన్ను బాగుచేశావు, ఇంకా బాగుచేస్తావు అంటున్నారు.  నిజానికి మానవ జీవితం అనేది కేవలం దేవుని కృప మీద ఆయన సంకల్పం మీద ఆయన దయాదాక్షిణ్యాల మీదన ఆధారపడి ఉంది.

 

 అందుకే భక్తులు ఇలా స్తుతించారు. మరికొందరు ప్రవచించారు!

ద్వితీ 32:39

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

 

1సమూయేలు 2:6

జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించు చుండువాడు ఆయనే.

1సమూయేలు 2:7

యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

 

యోబు 12:10

జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

 

దానియేలు 5:23

ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.

 

అపో.కార్యములు 17:28

మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.

 

అవును దేవునికి సర్వాదికారముంది. అందుకే కదా కీర్తనాకారుడు 103వ కీర్తనలో ఎంతటి చక్కటి మాటలు చెబుతున్నారో.......

1. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.

2. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

3. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.

4. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు

5. పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

10. మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

11. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.

12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచియున్నాడు.

13. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.

14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.

15. నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

16. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

18. ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

 

ఇంకా 139 వ కీర్తనలోను చక్కటిమాటలు జీవిత గమ్యము తెలిసి చెబుతున్నారు అనుభవముతో.....

1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు

2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు.

7. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?

8. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను

10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11. అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల

12. చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండ లేదు

16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

 

కాబట్టి మనము కూడా మన జీవిత విలువను తెలుసుకుని మనకు ఆయుష్షుని ఆరోగ్యాన్ని ఆనందమును ఇస్తున్న దేవుని యెడల భయభక్తులు కలిగి నమ్మకంగా విశ్వాసంగా జీవించవలసిన అవసరం ఉంది!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*48వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-6*

యెషయా 38:1718

17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

18. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే 17వ వచనంలో అంటున్నారు: మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణము గోతి నుండి విడిపించితివి నీ వీపు వెనుక తట్టు నా పాపములు పారవేశావు అంటున్నారు! హల్లెలూయ! ఇక్కడ ఎన్నో మంచిమాటలు చెబుతూ ఒక ఆత్మీయమర్మము చెబుతున్నారు హిజ్కియా! దేవుడు ఒకసారి మనల్ని క్షమిస్తే, మనము ఒకసారి ఆయన సిలువరక్తములో కడుగబడితే ఆయన ఇక ఎల్లప్పుడూ మన పాపములను జ్ఞాపకం చేసుకోరు! సాతాను గాడు మనకి వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నా దేవుడు మాత్రం వాటిని జ్ఞాపకం చేసుకోరు!

 

దీనికోసం గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది గాని సందర్భం గనుక మరోసారి గుర్తు చేస్తున్నాను.

 

*అపరాధ భావం*: ఎప్పుడో బాప్తిస్మం తీసుకోక మునుపు లేక నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపము పొందక మునుపు,  నీవు పాపివి, వ్యభిచారివి, దొంగవు లేక మరోవిధమైన పాపివి కావచ్చు! గాని నీ విశ్వాసం ఎప్పుడైనా సన్నగిల్లినప్పుడు ఆరాధనను నిర్లక్షం చేసిన తర్వాత లేక కొన్ని రోజులు గేప్ తర్వాత నీవు ఎప్పుడైతే ప్రార్ధన చేద్దామని మోకరిస్తావో వెంటనే సాతానుగాడు నీ చెవులలో అంటాడుచాలుచాలులే ప్రార్ధన చేసేస్తున్నావు గాని అప్పుడు ఏఏ పాపాలు చేసేవాడవో/దానవో మర్చిపోయావా? ఇప్పుడు భక్తిపరుడిలా ప్రార్ధన చేసేస్తున్నావు!! ఇలాంటి పాపుల ప్రార్ధన ఆలకిస్తాడంటావా? నీవు పాపివి అంటూ నీ చెవిలో మ్రోగిస్తూ ఉంటాడు! లేదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ మధ్యన ఏదో పాపం చేసి, దానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగి విడుదల పొందావు అనుకో, లేక పొందుకోలేదు అనుకో- భక్తిపరుడ్ని అంటావు, పాటలు పాడేస్తుంటావు, మొన్న ఏమి చేశావో మర్చిపోయావా? నీ సెల్ఫోన్లో ఏమి చూసావో మర్చిపోయావా? ఎలాంటివి చూశావో మర్చిపోయావా? ఇప్పుడు ఏమీ ఎరగనట్లు పెద్ద భక్తిపరుడిలా ప్రార్ధన చేసేస్తున్నావు, వాక్యం చెప్పేస్తున్నావు అంటూ నిన్ను చాలా ఘోరంగా గందరగోళ పరిస్తితులకు నెట్టేస్తూ ఉంటాడు!!

 

*జయించడం ఎలా*?:  మొదటగా: బాప్తిస్మం పొందకముందు పాపాలకోసం మరియు దేవుని క్షమాపణ అడిగి పశ్చాత్తాప పడి విడుదల క్షమాపణ పొందుకున్న పాపాల కోసం:

దేవుడు వాటిని మర్చిపోయారు! దేవుడే తుడిచివేశాను అని చెప్పారు! వాటిని కడిగివేసి- దేవుని వీపు వెనుకభాగానికి త్రోసివేశారు!

 

యెషయా 38: 17

మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. *నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.*

 

యెషయా 43: 25

*నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను* *నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను*.

 

కీర్తన 103:12

*పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచియున్నాడు.*

 

మీకా 7:1819

18. తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

19. *ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.*

 

1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

ఈ అన్ని వచనాల ఆధారంగా దేవుడు తానే మన దోషములను హరించినప్పుడు, తుడిచివేసినప్పుడు మనం పాపవిముక్తి పొంది క్షమించబడిన తర్వాత వీడు చెప్పేవి అబద్దాలు- వాడు మోసగాడు! నిన్ను పాడుచెయ్యడానికి బ్రష్టుడుగా మార్చడానికి వాడు నాటకం ఆడుతున్నాడు! వెంటనే ఇటువంటి పరిస్తితులు ఎదురయితే వాడికి చెప్పాలి- ఒరే సాతానుగా! నీవు నోరుమూసుకుని నా దగ్గర నుండి పారిపో! కారణం యెషయా 38:17 ప్రకారం, యెషయా 43:25 ప్రకారం, కీర్తన‌103:12, మీకా 7:19 ప్రకారం దేవుడు నా పాపములను తుడిచివేశారు క్షమించివేశారు! ఇప్పుడు నేను విముక్తిపొంది ఆ పాపములకు పరిశుద్దుడిగా తీర్చబడిన వాడను, కాబట్టి దేవుడే వాటిని మర్చిపోయాక నీవెవడవురా మరలా గుర్తు చెయ్యడానికి? యేసు అధికారం గల నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను- పో నా దగ్గర నుండి!! అని గద్దించు, తోక ముడుచుకుని పారిపోతాడు!

 

ఒకవేళ నీవు ఈ మధ్యనే చేసిన పాపాలను ఎత్తిచూపుతూ నిన్ను ప్రార్ధన చెయ్యకుండా గుసగుసలాడుతున్నాడా?? వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళు! నిజమైన పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ దేవుని దగ్గర క్షమాపణ వేడుకో! కేవలం వేడుకోవడమే కాదు, దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు! మరలా పాపం చెయ్యకు! అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టు వాడు కనికరం పొందును అని బైబిల్ వాగ్దానం! సామెతలు 28:23;

కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టు! దేవుని దగ్గర క్షమాపణ పొందుకో! ఆ తర్వాత మరలా వాడు వచ్చి మరలా జ్ఞాపకం చేస్తే మీదన చెప్పినట్లు చెప్పు- నేను విడుదల పొందాను, క్షమించబడ్డాను! దేవుడు వాటిని తుడిచేశారు! కాబట్టి నీవు నోరుమూసుకోమని చెప్పండి!

ఈవిధముగా వాక్యాదారంగా మనలను మనం ధైర్యపరచుకోవాలి!

 

హిజ్కియా గారు చేసిన ప్రార్ధన మనకు కనువిప్పు కలిగించాలి. మన పాపములు దేవుడు మర్చిపోయారనే నిశ్చయతతో ముందుకు సాగిపోతూ అపరాధభావాన్ని వదిలెయ్యాలి!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*49వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-7*

యెషయా 38:1718

17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

18. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు.

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే 17వ వచనంలో అంటున్నారు: మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణము గోతి నుండి విడిపించితివి నీ వీపు వెనుక తట్టు నా పాపములు పారవేశావు అంటున్నారు! హల్లెలూయ!

 

హిజ్కియా గారు కేన్సర్ తో ఎంతగానో బాధపడ్డారు. ఎముకలలో నొప్పి, ఇంకా భయంకరమైన చెడ్డపుండు! ఇవన్నీ ఆయనకు నిద్రలేకుండా సంతోషం లేకుండా చేశాయి. ఎంతగా భాధపడ్డారో దేవుడు ఆ బాధను తీసివేశాక అంతగా ఆనందం సంతోషం దయచేశారు! దానినే పాటరూపంగా పాడుతున్నారు ఇక్కడ! ఇప్పుడు నాకు క్షేమము ఇచ్చావు దేవా నీకు వందనాలు అంటున్నారు!

 

కీర్తన గ్రంధంలో కీర్తనాకారుడు కూడా ఇలాగే అంటున్నారు:

కీర్తన 119 :67, 71,  75

67. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.

71. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.

75. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.

 

పౌలు భక్తుడు కూడా అంటున్నారు రోమా 8:28 లో

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

ఇది నిజంగా సత్యము!....

 

దేవుడే మనలను బాగుచేసే వాడు దేవుడే మనలను స్వస్తపరచువాడు గాయపరచువాడు ఆయనే గాయము కట్టువాడు ఆయనే!

 

ఇక ఈ ప్రార్ధనలో ఈ వచనంలో తర్వాత మాట నీవు నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనము అనే గోతినుండి విడిపించావు!

 

దీనిని ధ్యానం చేసే ముందుగా బైబిల్ లో అనేకసార్లు నీవు కృపచేతనే నన్ను రక్షించావు, కృపచేతనే నన్ను చావునుండి తప్పించావు అని వ్రాయబడింది, అయితే ఇక్కడ భక్తుడు ఆత్మావేశుడై పలుకుతున్నారు: అయ్యా నీవు నీ ప్రేమచేత నన్ను నాశనమను గోతినుండి తప్పించావు! 

దీనినిబట్టి ఏమని అర్ధమవుతుంది అంటే దేవుడు అంటే హిజ్కియా గారికి ఎంత ఇష్టమో- హిజ్కియా అంటే దేవునికి కూడా అంటే ఇష్టము!!! మనము కూడా దేవుణ్ణి అలా ప్రేమించి ఆయనతో అలాంటి సత్సంబంధం పెట్టుకోవాలి!

 

ఇక ఇక్కడ నాశనమగు గోతినుండి తప్పించావు అంటున్నారు. అనగా ఇది మరణము లేక పాతాళము లేక సమాధి లేక అదృశ్యంగా ఉన్న మృతుల లోకము అనే పాతాళమును సూచిస్తుంది అని తెలిసికోవాలి!!!

 

కీర్తన గ్రంధంలో ఇది అనేకసార్లు చెప్పబడింది.

కీర్తన 28:1

యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.

 

కీర్తనలు 30:3

యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి.

 

కీర్తనలు 40:2

నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.

 

కీర్తనలు 55:23

దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.

 

Psalms(కీర్తనల గ్రంథము) 69:2,14,15

2. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.

14. నేను దిగిపోకుండ ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలో నుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము.

15. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.

 

కీర్తనలు 86:13

ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.

 

       గమనించాలి దేవుని బిడ్డలలో, నిజమైన విశ్వాసులలో దాదాపు అందరికీ ఈ అనుభవం అనుభవించే ఉంటారు. ఈ అనుభవం గుండా వెళ్తారు కూడా కేవలం నిజవిశ్వాసులు మాత్రమే! దావీదుగారికి అయితే ఈ అనుభవం ఒక్కరోజే కాదు- అనేకసార్లు చావు వరకు వెళ్లి వచ్చేశారు. అందుకే ఆయన జీవిత అనుభవాలు ఇక్కడ పొందుపరిచారు.  దావీదు గారు మాత్రమే కాదు, యోబు గారు, యిర్మియా ఇలా ఎందఱో భక్తులు అనుభవించారు. చివరికి దేవాదిదేవుడు మానవావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుప్రభులవారికి గెత్సేమనే వనములో, ఇంకా కల్వరి సిలువలో  ఇదే అనుభవం ఎదురయ్యింది!!!

ఇది చాలా ఘోరమైన కష్టము, అపాయము మరియు దీనావస్తతో కూడిన అనుభవం! నిజానికి జీవిత పునాదులే కుప్పకూలిపోయినట్లు అనిపిస్తుంది. హృదయమంతా వేదన, బయట అవమానాలు- వెక్కిరింతలు, మనతో ప్రేమగా మాట్లాడేవారే ఉండరు, ఇక నాకు ఆధారం అనేది లేనేలేదు, ఇక నా చాప్టర్ క్లోజ్ , ది ఎండ్, గేమ్ ఓవర్ అనుకుంటాము. అలాంటి  ఆ సమయంలో దేవుడు వచ్చి నేనున్నాను భయపడకు అని చెప్పి ఇన్ని బాధలనుండి ఇబ్బందుల నుండి అనారోగ్యము నుండి తప్పించి మరలా మంచి స్తితిలో అంతకంటే ఘనమైన స్థితిలో నిలబెడతారు. అప్పుడు నీకు కూడా ఇలాంటి పాటలే వస్తాయి!!

 

ప్రియమైన సహోదరీ సహోదరుడా! ఒకవేళ నీవు కూడా ఇలాంటి అనుభవంతో బాధపడుతున్నావా? బాధపడకు- వీరందరినీ ఆదరించిన దేవుడు నిన్ను కూడా తన కృపచేత తన ప్రేమచేత ఆదరించి నిన్ను నన్ను కూడా చావుగోతినుండి, భయంకరమైన పరిస్తితుల నుండి విడిపించి విమోచించగలరు!!

అప్పుడు నీవు నేను కూడా ఇలా జయోత్సవముతో పాటలు పాడగలము!

ఆమెన్!

కాబట్టి ధైర్యముగా ఉండు!

దైవాశీస్సులు!

 

 

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*50వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-8*

యెషయా 38:1819

18. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.

19.  సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే 18-19 వచనాలలో అంటున్నారు: పాతాళమున నీకుస్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లించదు.  సమాదిలోనికి దిగువారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను గనుకనే నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నారు.

 

ఇక్కడ హిజ్కియా గారు అంటున్నారు- ప్రభువా చచ్చినోళ్ళు నీకు స్తుతి చెల్లించలేరు కదా, నన్ను సజీవునిగా ఉంచావు కాబట్టే ఇప్పుడు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నారు.

ఇలా కీర్తనాకారులు కూడా స్తుతించారు.

కీర్తన 6:5

మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?

 

కీర్తనలు 30:9

మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?

 

Psalms(కీర్తనల గ్రంథము) 88:10,11,12

10. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా.)

11. సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా?

12. అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?

 

115:1718

17. మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు

18. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

 

ప్రసంగి 9:10

చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

 

గమనించాలి- దావీదు గారి రోజుల్లోనూ ఇంకా హిజ్కియా గారి రోజుల్లోనూ చనిపోయిన వారు ఏమవుతారు అనేది తెలియదు ఎందుకంటే దేవుడు అప్పుడు వెల్లడించలేదు. ఆ రోజులలో విశ్వాసుల దృష్టిలో పాతాళము మరియు మరణ లోకము అంటే చీకటి నిండిన ఒక నిశ్శబ్ధమైన ఒకచోటు! అంతే!

యోబు 10:2122

21. అంధకారము మరణాంధ కారముగల దేశమునకు

22. కటికచీకటియై గాఢాంధ కారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లు నట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.

 

చూడండి ఇక్కడ యోబు గారు ఇలా అనడానికి కారణం పరలోకాన్ని గురించిన నిశ్చయత అప్పుడు వారికి లేదు.  యేసుక్రీస్తుప్రభులవారు వచ్చాకనే వాటిని బయలుపరిచారు.

యోహాను 14:23

2. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

3. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

 

ప్రకటన 21:1023

ఇప్పుడైతే మనకు  యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మాటలు, ఇంకా చనిపోయినవారు ఏమవుతారో పౌలుగారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు కొరింథీ పత్రికలోను థెస్సలోనికయ పత్రికలోను వివరంగా వ్రాయించారు. మనకు పరలోకము కోసం స్థిరమైన నిశ్చయం ఉంది. నిజంగా సంపూర్ణ బైబిల్ గల మనం అదృష్టవంతులము.  .......

2తిమోతి 1:10

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:12,13,20,22,23,35,38,44,50,51,52,53,54

12. క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

13. మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు.

20. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు.

22. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

35. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.

38. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.

44. ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.

50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.

52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:13,14,15,16,17

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

 

మరలా ఒకసారి కీర్తన 115:1718 వచనాలు చూసుకుంటే.....

17. మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు

18. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

 

ఇక్కడ భక్తుడు ఇలా అనడానికి కారణం చనిపోయిన వారు భూమిపై దేవుణ్ణి ఇక స్తుతించలేరు.  అయితే ఈ లోకంలోనే క్రీస్తును అంగీకరించి పాపవిముక్తిని పొందిన పరిశుద్ధులు జయించిన వారు పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారని ప్రకటన గ్రంధంలో ఉంది

ప్రకటన 7:917; 14:13; 15:24

 

కాబట్టి దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే భూమిపై బ్రతికి ఉన్న ప్రతీ ఒక్కరు ఈ భూమిమీద దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అందుకే దేవుడు మానవుని చేసుకున్నారు. అయితే ఇప్పుడు బ్రతికి ఉన్న మనిషి అది స్త్రీ అయినా పురుషుడైనా ప్రతీ ఒక్కరూ తప్పకుండా దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతించని వాడు బ్రతికున్నా సచ్చినోడే అన్నమాట! దేవుడు నీకిచ్చిన ఆయుస్సు కోసం, దేవుడు నీకిచ్చిన ఆరోగ్యం కోసం, దేవుడు నీకిచ్చిన ఆస్తిపాస్తులు ఉద్యోగం సంపదలు, భార్యాబిడ్డలు, దేవుడిచ్చిన ఊపిరి కోసం తప్పకుండా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు ఉచితముగా ఇచ్చిన నీరు దేవుడు ఉచితముగా ఇచ్చిన గాలి ఇవన్నీ మనము ఉచితముగానే అనుభవిస్తున్నాము. దేవుడు ఎప్పుడూ వాటికి టాక్స్ కట్టమని లేక ఖర్చుకు డబ్బులు అడుగలేదు. కాబట్టి వాటికోసమైనా మనం అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవడూ దేవుణ్ణి స్తుతించలేరు ఈ లోకములో! నీవు బ్రతికి ఉండగానే ఏదైనా చేయగలవు!

కాబట్టి నేడే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు!

 సచ్చినోడే దేవుణ్ణి స్తుతించడు. నీవు బ్రతికున్న వాడవు అయితే ఇప్పుడే దేవునికి నిండు వందనములు చెప్పు!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యెషయా ప్రవచన గ్రంధము*

*51వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-9*

 

యెషయా 38:1820

18. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.

19. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

20. మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! హిజ్కియా గారి ప్రార్ధనలో ఇంకా ముందుకుపోతే 18-19 వచనాలలో అంటున్నారు: పాతాళమున నీకుస్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లించదు.  సమాదిలోనికి దిగువారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను గనుకనే నిన్ను స్తుతిస్తున్నాను అంటూ ఇంకా అంటున్నారు-

 ఇలా దేవుడు చేసిన అద్భుతాలు కోసం తండ్రులు తమ కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు, యెహోవా నన్ను రక్షించు వాడు, అందుకే మన జీవిత దినములన్నియు మనము యెహోవా మందిరములో తంతి వాద్యములు అనగా తీగలతో  మంచి స్వరాలు పలికించే వాయిద్యములు అనగా గిటార్, సితార లాంటి వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతిద్దాము అంటున్నారు!

 

ఇక్కడ దేవుడు చేసిన ఉపకారాలకు తండ్రులు తమ కుమారులకు ఇవన్నీ తెలియజేసి వారిని భక్తిమార్గంలో నడిపించాలి అంటున్నారు.

 ప్రియమైన తండ్రీ నీవే నీ పిల్లలకు భక్తి నేర్పించాలి. తల్లికోసం వ్రాయడం లేదు, తండ్రులు తమ కుమారులకు దేవుని కోసం చెప్పాలి!

 

మోషే గారు చెబుతున్నారు ద్వితీయోప దేశకాండం లో 6:7...

నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.

 

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 11:18,19,20

18. కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.

19. నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి

20. నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.

 

ద్వితియోపదేశకాండము 4:9

అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి

 

ఎఫెసీ 6:4

తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

 

కీర్తన 78:2-5

2. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.

3. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.

4. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

5. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి

 

కీర్తనలు 145:4

ఒక తరమువారు మరియొక తరమువారి యెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు

 

కాబట్టి మనం తప్పకుండా దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు మన పిల్లలకు చెప్పి భక్తిని నేర్పించాలి. ఇంకా దేవుడు బైబిల్ గ్రంధములో చేసిన ఘనమైన అద్భుతాలు మన పిల్లలకు నేర్పాలి. సండేస్కూల్ కి పంపుతూ వారిని దేవునికి దగ్గరకు నడిపించాలి. తల్ల్లులారా మీరు తప్పకుండా మీ పిల్లలకు ప్రార్ధన చేయడం నేర్పాలి! అప్పుడే సంఘములో ఒక సమూయేలు, ఒక ఏలియా ఒక ఎలీషా ఒక మోషే తయారవుతారు. అప్పుడే ఒక జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఒక బిల్లీ గ్రాహం ఒక జార్జ్ విట్ ఫీల్డ్ ఒక పి ఎం సామ్యేలు ఒక పరంజోతి, కే ఆర్ డేవిడ్ ఒక ఆరార్కేమూర్తి ఒక దినకరన్, ఒక యేసన్న సంఘాలలో లేస్తారు. లేకపోతే త్రాగుబోతులు జూదగాల్లు రౌడీలు తయారవుతారు.

 

  సరే, ఇంకా ముందుకుపోతే తంతివాధ్యాలతో దేవుణ్ణి స్తుతించాలి అంటున్నారు. హిజ్కియా గారు, బహుశా ఆయనకు తీగలతో చేసిన వాద్యపరికరాలు ఇష్టమేమో, ఆయనకూడా వాయించేవారేమో! అయితే దావీదు గారు కూడా ఇలాంటి తంతివాధ్యాలు వాయించేవారు. అందుకే ఎన్నోసార్లు దావీదుగారు మరియు ఆసాపు గారు ఇంకా భక్తులు మీరు తంతివాధ్యాలతో దేవుణ్ణి స్తుతించండి అన్నారు కీర్తనల గ్రంధంలో!

Psalms(కీర్తనల గ్రంథము) 33:1,2,3

1. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

2. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి

3. ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.

 

51:1415

14. దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.

 

63:36

3. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.

4. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

5. క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది

6. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.

 

116:1214

12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

13. రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

14. యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను

 

ఇక 15౦ కీర్తనమొత్తం దేవుణ్ణి స్తుతించండి అంటున్నారు...

1. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.

3. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

4. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

5. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

 

కాబట్టి దేవుణ్ణి స్తుతిద్దాం, ఎందుకంటే మనం బ్రతికి ఉన్న కాబట్టి!!

సచ్చినోళ్ళు దేవుణ్ణి స్తుతించరు.

కాబట్టి దేవుడిచ్చిన ప్రతీ ఈవికోసం ఈ ఆయుష్షు ఆరోగ్యం కోసం దేవునికి ఋణపడి స్తుతిద్దాం! అంతేకాకుండా మన పిల్లలకు దేవుడు చేసిన అద్భుతాలు వివరించి వారిని కూడా దేవుణ్ణి ఆరాధించేలా చేద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*52వ భాగము*

*హిజ్కియా ప్రార్ధన-10*

యిర్మియా 26:1819

18. యూదారాజైన హిజ్కియా దినములలో మోర ష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

19. అట్లు పలికినందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి.

 

యెషయా 39:18

1. ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగు పడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా

2. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తవస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను.

3. పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చిఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియా  బబులోనను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను.

4. నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా  నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.

5. అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను యెహోవా సెలవిచ్చు మాట వినుము

6. రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

8. అందుకు హిజ్కియానీవు తెలియజేసిన యెహోవాఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకుంటున్నాము!  అయితే ఇంతవరకు యెషయా గ్రంధాన్ని ధ్యానిస్తూ యిర్మియా గ్రంధంలోని రిఫరెన్సులు ఎందుకు పెట్టారు అని మీకు అనుమానం రావచ్చు! అయితే యిర్మియా గ్రంధంలో హిజ్కియా గారు చేసిన మరో ప్రార్ధన కనబడుతుంది మనకు! మరి మనము హిజ్కియా గారి ప్రార్ధనలు ధ్యానం చేస్తున్నాము గనుక దీనిని కూడా ఒకసారి చూసుకుందాం!

అయితే హిజ్కియా గారు ఏ సందర్భములో ఈ ప్రార్ధన చేశారో దానికి నేపధ్యం చూసుకుంటే ఈ ప్రార్ధన మనకు అర్ధమవుతుంది. అయితే 2రాజుల గ్రంధంలోనూ, 2దినవృత్తాంతాల గ్రంధంలోనూ మరియు యెషయా గ్రంధంలోనూ ఈ ప్రార్ధన రికార్డ్ చేయబడిలేదు. అయితే యిర్మియా గ్రంధంలో ఇది యూదా పెద్దలు ఈ ప్రార్ధన జ్ఞాపకం చేసుకుంటూ పలికారు కాబట్టి అక్కడ యిర్మియా గారు ఆ రోజున అక్కడ ఉన్నారు కాబట్టి యిర్మియా గారికి ఈ ప్రార్ధన లభ్యమై మనకు దానికోసం ఒకవచనం రాశారు!

 

ఇక్కడ హిజ్కియా మరియు యూదా ప్రజలు దేవునికి భయపడి దయచూపమని దేవుణ్ణి వేడుకున్నారు అని వ్రాయబడి ఉంది.  ఎందుకు అలా వేడుకోవలసి వచ్చింది అంటే యెషయా 39, 2రాజులు 20, 2దిన గ్రంధం 32లోనూ హిజ్కియా గారు కేన్సర్ నుండి బాగయ్యాక అనేక రాజులు శ్రేయోభిలాషులు వచ్చి హిజ్కియా గారిని పరామర్శించినట్లు చూడగలం! అలా పరామర్శించిన వారిలో బబులోను రాజైన మెరోదక్బలదాను అనగా నేబుకద్నేజర్ తండ్రి యొక్క రాజ సేవకులు అతని యజమానితో పంపబడ్డారు. ఆ రాజు మీరు ఈ రోగం నుండి బాగుపడటం హర్షం ప్రకటించారు. మీతో సంఘీభావం ప్రకటిస్తున్నారు అంటూ కానుకలు పంపించారు. అందుకు గాను హిజ్కియా స్వయముగా తన రాజ్యంలో ఏముందో ఇంకా తన ఖజానాలో ఏముందో చూపించారు!

 

వెంటనే దేవుడు ప్రవక్త అయిన యెషయాను హిజ్కియా గారి దగ్గరకు పంపించి అడుగుతున్నారు- ఆ మనుష్యులు ఎవరు? వారికి ఏమేమి చూపించావు?

అంటే అయ్యా వారు బబులోను అనే దూరపు దేశం నుండి వచ్చారు. నా జబ్బు బాగుపడిందని కానుకలు తీసుకుని, మన దేశంతో సంఘీభావం తెలపడానికి వచ్చారు ఎందుకంటే మనకు తెలుసు కదా అష్షూరు వారికి బబులోను వారికి మధ్య వైరం ఉంది కదా, అష్షూరు విరోధులు మనకు స్నేహితులు అని భావించి బబులోను వారు మనకు సంఘీభావం ప్రకటించారు. అందుకే మన రాజ్యంలో మరియు ఖజానాలో ఉన్నదంతా చూపించాను అన్నారు.

వెంటనే దేవుడు చెబుతున్నారు 39:57....

5. అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను యెహోవా సెలవిచ్చు మాట వినుము

6. రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

 

చూశారా ఎంత ఘోరమైన శాపమో!!!!

అయితే 38వ అధ్యాయం తర్వాత 39వ అధ్యాయంలో ఇది వ్రాయబడింది అని కేన్సర్ తగ్గిన వెంటనే అని అనుకున్నారు గనుక! నా లెక్క ప్రకారం కనీసం సంవత్సరం గడిచి కనీసం రెండో సంవత్సరం వచ్చి ఉంటుంది. అప్పుడు ఈ బబులోను వారు వచ్చారు. అయితే దేవుడు ఇలా కఠినమైన నిర్ణయం తీసుకుని శపించడానికి అదికూడా హిజ్కియా గారిని శపించడానికి కారణం ఏమిటి?

దానికి జవాబు మనకు యెషయా గ్రంధంలోనూ, 2రాజుల గ్రంధములోను లేదు కాని మనము 2దిన వృత్తాంతాల గ్రంధం 32:25--31 వచనాలు చూసుకోవాలి. ....

 

25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా

26. హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు.

27. హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.

28. ధాన్యమును ద్రాక్షా రసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.

29. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.

30. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.

31. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృద యములోని ఉద్ధేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.

 

చూశారా అయితే హిజ్కియా హృదయములో గర్వించినట్లు చూస్తున్నాము! ఎందుకు గర్వించారు అంటే ఇక్కడ మనకు నాలుగుకారణలు కనిపిస్తున్నాయి.

 

మొదటిది: తనతో దేవుడు ఉన్నాడు. తను ఏమి చేసినా దేవుడు దానిని సఫలం చేస్తున్నారు కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. దానివలన గర్వం ప్రవేశించింది.  తను ఏమిచేశారో అది మనకు ఇదే అధ్యాయంలో 28-- 31 వచనాలలో కనిపిస్తుంది

 

రెండు: తన పట్ల పొరుగు దేశాలవారు చూపిస్తున్న గౌరవం- ఎందుకంటే మహా రాజైన అష్షూరు రాజునే ఎదిరించి ధైర్యముగా నిలిచాడు, రెండు కేన్సర్ నుండి కూడా మరణాన్ని జయించి నిలిచాడు అనేది. దానిపట్ల అనేక దేశాలు నుండి అతనికి గౌరవం లభించింది. అలా గౌరవముతోనే ఈ బబులోను రాజు కూడా సేవకులను పంపినందువలన గర్వం ప్రవేశించింది హిజ్కియా గారిలో!!!

 

మూడు: దేవుడు చేసిన సూచనలు అద్భుతాలు అతనికి నిర్భయాన్ని కలుగజేసి (Feels Everything is Granted) గర్వాన్ని తెచ్చాయి. 24 మరియు ౩1 వచనాలు..

 

నాలుగు: తనకు కలిగిన అంతులేని ఐశ్వర్యం: (జీవపు డంభం)

 

కలిగిన ఐశ్వర్యం ఏమిటి? మీదన చెప్పిన 2729 వచనాలు....

 

ఎప్పుడైతే ఇవన్నీ కలిగిన వెంటనే గర్వించారు. వెంటనే మొదట యెషయా గారి ద్వారా గద్దించబడి శాపం పొందారు.

 

రెండవది మీద చెప్పిన యిర్మియా గ్రంధంలో ప్రవక్త అయిన మీకా గారు కూడా హిజ్కియా గారికి దేవుని ప్రవచనాలు చెప్పి గద్దించారు. చేను దున్నబడినట్లు  ఈ దేశం దున్నబడుతుంది. యేరూషలేము పాడు దిబ్బగా మారిపోతుంది అని దేవుడు వర్తమానం పంపించారు. వెంటనే హిజ్కియా గారు అక్కడే మోకాల్లూని దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రాజు తగ్గించుకుని గర్వాన్ని అణచుకుని ప్రభుని సన్నిధిలో గోనెపట్ట కట్టుకుని ప్రార్ధించడం మొదలుపెట్టారో వెంటనే యూదా ప్రజలు కూడా ప్రార్ధించడం మొదలుపెట్టారు.

 

ప్రార్దిన చేస్తున్నారు హిజ్కియా గారు : వారు యెహోవాకు భయపడి దయ చూపమని అందరూ వేడుకున్నారు దేవుణ్ణి! ఎప్పుడైతే వారు కన్నీటితో ప్రార్ధన చేశారో దేవుడు జాలిపడి ఆ ఆపదను రప్పించలేదు వారికాలంలో! అప్పుడు యెషయా గారు వచ్చి అంటున్నారు నీకాలంలో కాదు, నీ కుమారుని కాలంలో ఇది జరుగుతుంది అని చెప్పారు! ఈ విధంగా నాశనాన్ని తప్పించుకున్నారు కన్నీటి ప్రార్ధనతో మరియు విరిగినలిగిన హృదయముతో చేసిన ప్రార్ధనతో!

 

ప్రియ సహోదరీ సహోదరుడా! ఒకవేళ నీకు కూడా ఇలాంటి గర్వం వెంటాడుతుందా??!! దేవుడు నాతో ఉన్నాడు! నేను ప్రార్ధన చేస్తే అనేకులు బాగుపడుతున్నారు! ప్రార్ధన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి! వాక్యం చెబితే అనేకులు రక్షణ పొందుతున్నారు! దేవుడు నాతో ఉన్నాడు అనుకుని ఒక రకమైన గర్వము మరియు జీవపుడంభము ప్రవేశించాయా?!!!

నీ వాక్యం వినడానికి నీ సాక్ష్యం వినడానికి నీ పాటలు పాడితే వినడానికి అనేకులు వస్తున్నారు అనే జీవపుడంభము , గర్వము వచ్చాయా జాగ్రత్త!

గర్వము పడిపోవడానికి ముందుగా వస్తుంది అని గ్రహించి, హిజ్కియా గారు గుణపడినట్లు తగ్గించుకొని గర్వాన్ని వదిలేసి ప్రార్ధించు!

 లేకపోతె నీవు పడిపోతావు జాగ్రత్త!

Joel(యోవేలు) 2:12,13

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

ఆమెన్!!

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము

53వ భాగము

యెషయా 38:19

19. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకుంటున్నాము!  మనము హిజ్కియా రాజు కాలంలో జరిగిన విషయాలు ధ్యానం చేసుకుంటూహిజ్కియా ప్రార్ధనలు ధ్యానం చేసుకున్నాము! అయితే యెషయా గారు నాలుగు రాజుల కాలంలో తాను ప్రవచించిన ప్రవచనాలు మాత్రమే ఈ గ్రంధంలో పొందుపరిచారు. మరి చరిత్ర చూసుకుంటే నాలుగు రాజుల తర్వాత ఐదో రాజు మనష్షే కాలంలో మనష్షే చేత యెషయా గారు చంపబడ్డారు కాబట్టి ఈ ఐదో రాజు ఎలాంటివాడు, ఎలాంటి సందర్భములో యెషయా గారు చంపబడ్డారో చూసుకుంటే యెషయా గారి మరణం కోసం కూడా చూసుకున్నట్లు అవుతుంది.

 

ఐదో రాజు పేరు : మనష్శే

తండ్రి పేరు: హిజ్కియా

తల్లి పేరు: హెఫ్శిబా

బైబిల్ పండితులు ఇచ్చిన బిరుదు: పాత నిబంధన యొక్క తప్పిపోయిన కుమారుడు!!

ప్రత్యేకతలు: యూదా రాజులలో అతి దుష్టుడు, అతి మూర్ఖుడు, పనికిమాలిన రాజులలో మొదటి ర్యాంకు!!!

 

ఎందుకు అలా చెబుతున్నారు- ఈయన హిజ్కియా గారి కుమారుడు కదా! అవును హిజ్కియా గారి కుమారుడే! గాని పండిత పుత్ర పరమశుంటః !! జ్యేష్ఠ పుత్ర కొంప పీకరా అన్నట్లు ఉంటుంది ఇతని కద!!

తండ్రి ఎంతటి భక్తిపరుడో- యితడు అంత విగ్రహారాదికుడు!!

తండ్రి ఎంత జాలిగల వాడో మంచి వాడో- యితడు అంత మూర్ఖుడు, పనికిమాలిన వాడు!!!

 

దీనికి నిదర్శనం మనం 2రాజులు 21:118 లోను, 2దిన 33లోను కనబడుతుంది.

 

రాజుల గ్రంధంలో చూసుకుంటే.....

2 Kings(రెండవ రాజులు) 21:1,2,3,4,5,6,7,8,9

1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా.

2. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.

3. తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను.

4. మరియు-నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను.

5. మరియు యెహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.

6. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను

7. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి- ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను.

8.​​ మరియు- ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దంతటిని, నా సేవకుడగు మోషే వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనినయెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగి పోనియ్యనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక

9.​​ ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.

 

చూడండి- తండ్రి తీసివేయించిన విగ్రహాలను మరలా పెట్టడమే కాకుండా యెహోవా మందిరంలో విగ్రహాలకు బలిపీటములు కట్టి ఆకాశ సమూహములకు బలిపీటములు కట్టాడు. ఇంకా కుమారుని అగ్ని గుండాలు దాటించి శకునగాండ్రతోనూ చెడుపు పెట్టేవాల్లతోను సోదే చెప్పే వాళ్ళతోనూ యక్షిణిగాండ్రు అనగా శివాలాడే స్త్రీలతోను, కాష్మోరా లాంటి దయ్యాలతో దుష్టశక్తులతో తిరిగే వారితోనూ సహవాసం చేసి వాటిని వాడకం చేశాడు!

 ఎవరండి? ఒక గొప్ప భక్తిపరుని యొక్క కుమారుడు!

మరిదేవుడు ఊరుకుంటారా? లేదు తన భక్తులతో కబురు పెట్టారు. ఏమని? 1216

2 Kings(రెండవ రాజులు) 21:12,13,14,15,16

12. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా - వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు

13. నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును; ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను.

14. మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను.

15. వారు తమ పితరులు ఐగుప్తుదేశములో నుండి వచ్చిన నాటనుండి నేటివరకు నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరిచేత దోచబడి నష్టము నొందుదురు.

16. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడతనడిచి, యూదా వారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.

 

అయితే మిగిలిన చరిత్ర మనకు 2దిన ౩౩ లో కనిపిస్తుంది.  11వ వచనం ప్రకారం అష్షూరు రాజు సైన్యాధిపతులు వచ్చి ఈ మనష్షేను బందించి గొలుసులతో కట్టి బబులోను దేశం తీసికొని పోయి అక్కడ చెరసాలలో పెట్టారు. దేవుడు నీ ముక్కుకు గాలం వేస్తాను అని అష్షూరు రాజుకి చెప్పారు హిజ్కియా రాజు కాలంలో- అదే ముక్కుకి గాలం వేసి అదే హిజ్కియా గారి కుమారున్ని మనష్షేని బంధించి అష్షూరు వారు బబులోను చెరలో వేశారు!

 

ఇదంతా ఎందుకు జరిగింది అంటే తండ్రి భక్తిపరుడే, తల్లి ప్రార్ధనాపరురాలే- గాని గారాబం అతని కుమారుని భక్తిహీనునిగా చేసింది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేయును అని కొరింథీ పత్రిక లో వ్రాయబడింది.

1కోరింథీయులకు 15:33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

 

ఇది అక్షరాలా నెరవేరింది.  తండ్రి భక్తి నేర్పించారు, తల్లి ప్రార్ధన నేర్పించింది. గాని స్నేహితులు చెడుపులు చిల్లంగులు విగ్రహారాధనలు ఖూనీలు చేయడం దోచుకోవడం వ్యభిచారం చేయడం నేర్పించారు. మరి ఎందుకు గారాబం అని అన్నారు అంటే హిజ్కియా గారికి లేకలేక పుట్టిన సంతానం మనష్షే! వివాహం జరిగాక సుమారుగా 20 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. 42 సంవత్సరాల వయస్సులో పుట్టాడు ఈ మనష్షే! అందుకే గారాబం!!! ఈ గారాబం భక్తిహీనున్ని చేసింది. యితడు బాలుడై ఉండగానే 12 సంవత్సరాల వయస్సులో తండ్రి హిజ్కియా గారు చనిపోతే ఇతనిని రాజుగా చేశారు. అప్పుడు తప్పుడుగాళ్ళు ఇతనిని తప్పుడు దారి పట్టించారు.

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీ సహవాసం ఎవరితో ఉంది?   నీసహవాసం నిన్ను నరకానికి తీసుకుని పోతుంది అని మర్చిపోవద్దు!  పాత నిబంధన తప్పిపోయిన కుమారుడు మనష్షే తప్పుడు స్నేహితులతో సహవాసం చేసి నశించిపోయాడు! క్రొత్త నిబంధన తప్పిపోయిన కుమారుడు అదే దుష్టులతో సహావాసం చేసి నశించిపోయాడు!

 

మరి తల్లి ఏమీ చెప్పలేదా అంటే చెబుతూ ఉండేది గాని స్నేహితుల మాటలకే విలువనిచ్చి తల్లిమాటలను ఖాతరుచేయడం మానేశాడు! అందుకే అష్షూరు రాజు చెరలోనికి పోయాడు.  అయితే సామెతల గ్రంధంలో 22:6 లో చెప్పబడినట్లు:  బాలుడు నడువవలసిన మార్గము వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలిగిపోడు అని చెప్పబడిన ప్రకారం- ఆ పరాయి దేశంలో భయంకరమైన చెరసాలలో కళ్ళు తెరిచాడు- క్రొత్త నిబంధన తప్పిపోయిన కుమారుడు పందులపొట్టు దగ్గర కళ్ళు తెరిచినట్లు యితడు చెరసాలలో కళ్ళు తెరిచాడు- అప్పుడు తల్లి నేర్పిన ప్రార్ధన గుర్తుకొచ్చి కన్నీటితో ప్రార్దిస్తున్నాడు, తప్పు ఒప్పుకుంటున్నాడు చూడండి 1216 వచనాలు-..

 

2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 33:12,13,14,15,16

12.  అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించు కొని.

13. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.

14. ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.

15. మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతము నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను.

16. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను.

 

చూడండి అతని ప్రార్ధన  దేవునికి వినబడింది. ఒకసారి18-- 19వ వచనం కూడా చూడండి

2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 33:18,19

18. మనష్షే చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పినమాటలను గూర్చియు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

19. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు, అతని మనవి వినబడుటను గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణ పడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.

 

అతని ప్రార్ధనల కోసం, అతని ప్రార్ధన వినబడుట కోసం దీర్ఘదర్షుల గ్రంధములో వ్రాయబడింది. అంతగా ప్రార్ధన చేశాడు. దేవుడు కరుణిస్తే తిరిగి యేరూషలేము వచ్చి విగ్రహాలు మొత్తం తీసివేసి- యెహోవా మందిరాన్ని బాగుచేసి దేవునికి ఇష్టంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇదీ మనష్షే గురించిన చరిత్ర!

 

అయితే ఇప్పుడు యెషయా గారి మరణం ఎలా జరిగింది అంటే ఎప్పుడైతే దేవుని ఆరాధన మానేసి విగ్రహారాధన చేస్తూ చెడుపు చిల్లంగులు ప్రారంభించి నిరపరాదుల రక్తాన్ని చిన్నపిల్లలను విగ్రహారాలకు బలిస్తూ వచ్చాడో దేవుడు మొదటగా యెషయా గారిని పంపించారు, ఇంకా దీర్ఘదర్శులను పంపించారు అతని దగ్గరకు ! అయితే అతడు వినలేదు!

అయితే ఇలాంటి పరిష్టితులలో రెండుసార్లు యెషయా గారు మనష్షేను గద్ధించారు.

 

 యెషయా గారి మరణం:  సుమారుగా క్రీ.పూ. 675 లో! చరిత్రకారుడైన తల్మూదు ప్రకారం మరియు ఆర్ధడాక్ష్ చర్చ్ ఇన్ అమెరికా చరిత్రకారుల ప్రకారం:  హిజ్కియా రాజు మరణించాక అతని కుమారుడైన మనష్షేకి బోధించడానికి వెళ్తే మనష్షే వినకుండా తిరుగబడ్డాడు యెషయా గారిమీద! రోజురోజుకి మనష్షే విగ్రహారాధన మరియు చిన్న పిల్లలను బలి ఇవ్వడం లాంటి ఆకృత్యాలు చూసి కొన్ని సంవత్సరాలు తర్వాత మరలా ప్రవక్త- మనష్షే దగ్గరకి వెళ్లి నీవు చేస్తుంది తప్పు!  నిజమైన దేవుడు యెహోవాని వదిలి ఎందుకు రాతి బొమ్మలను కర్ర బొమ్మలను ఆరాధిస్తావు? అవి కళ్లుండి చూడవు, నోరుండి మాట్లాడవు!  గాని మన దేవుడైన యెహోవా చూసే దేవుడు మాట్లాడే దేవుడు! నాకు కనబడి నాతో మాట్లాడారు అని చెప్పారు!

 

అందుకు మనష్షే అన్నాడు: నీవు నీ యజమాని అయిన మోషేకి వ్యతిరేఖంగా మాట్లాడుతున్నావు! మోషే నిర్గమకాండం ౩౩:20 లో ఏ నరుడు దేవుణ్ణి చూసి బ్రతుకలేడు అనివ్రాస్తే నీవేమో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువుని చూశాను, అది కూడా అపవిత్రమైన పెదవులు కలిగి చూశాను అని వ్రాశావు! నీవు అబద్దమాడుతున్నావు నీవు బ్రతుక కూడదు! నీకు నీవుగా ప్రవక్తనని ప్రకటించుకున్నావు! దేవుడు మాట్లాడడు చూడడు! నీవు అబద్దాలు చెబుతున్నావు అన్నాడు!

ప్రవక్త: నీవు దేవునికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నావు! దేవుని ఉగ్రత నీమీదికి రాబోతుంది అనిచెప్పి కోపంతో వెళ్ళిపోయారు యెషయా గారు! వెంటనే ఆయనను చంపడానికి భటులను పంపగా యెషయా గారు పరుగెత్తి అక్కడ పెద్ద కేదారు చెట్టు ఉంటే దాని తొర్రలోకి పోయి దాక్కున్నారు!  సైనికులు అయ్యా ఆయన దొరకడం లేదు, కేదారు వృక్షపు తొర్రలో ఉన్నారు అని చేబితో ఆ కేదారు చెట్టుని రెండుగా రంపాలతో కోయమని ఆజ్ఞాపించాడు మనష్షే రాజు! ఈ విధంగా ఆయన బ్రతికుండగానే చెట్టుతో పాటుగా రెండుగా రంపాలతో కోయించి చంపించాడు రాజైన హిజ్కియా గారి కుమారుడైన మనష్షే! దీనినే నీతిమంతుల పట్టీ చెబుతూ హెబ్రీ పత్రిక 11:37 లో రంపములతో కోయబడిరి అనేది ఈ ప్రవక్త కోసమే వ్రాసారు అంటారు!

 

ఈ రీతిగా దేవునికోసం ఆయన నామముకోసం పౌరుషముగా జీవించి దేవునికిచ్చిన మాట ప్రకారం హతస్సాక్షి అయిపోయారు BC675 లో!!

 

        ఈ విధంగా ఐదో రాజు కాలంలో ప్రవక్త అయిన యెషయా గారు చనిపోయారు!  నాలుగు రాజుల కాలంలో గొప్పగా ప్రవక్తగా రాజ గురువుగా ఉన్న యెషయా గారు తప్పుడు స్నేహితుల మోజులో ఉన్న మనష్షే చేతిలో బలిగా మారిపోయి దేవునికి హతస్సాక్షిగా అయ్యారు!

దైవాశీస్సులు

*యెషయా ప్రవచన గ్రంధము*

*54వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-1*

 

యెషయా 9:14

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

 

    ప్రియ దైవజనమా!  మనము  నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు చూసుకున్నాము! ఇక మనము గ్రంధాన్ని ప్రవచనాలను ధ్యానం చేద్దాం! అయితే మనము నాలుగు రాజుల కాలంలో జరిగిన సంభవాలు ధ్యానం చేస్తూ యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకడ కోసం 7,8 అధ్యాయాలలో ధ్యానం చేశాము కాబట్టి ఇక రక్షకుడు అభిషక్తుడు అయిన మెస్సయ్య, యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ కోసం ఈ గ్రంధంలో వ్రాయబడిన విషయాలు మొదట ధ్యానం చేసుకుని ఆ తర్వాత మిగిలిన గ్రంధము ధ్యానం చేసుకుందాం!

 

ప్రియులారా ఈరోజునుండి మనం 9వ అధ్యాయంలో అభిషక్తుని కోసం వ్రాయబడిన ప్రవచనాలు ధ్యానం చేసుకుందాం!!

గమనించాలి- ఈ 9వ అధ్యాయం యేసుక్రీస్తుప్రభులవారు జన్మించక ముందు 700 సంవత్సరాలకు ముందే వ్రాయబడింది అని గ్రహించాలి!

 

మొదటి వచనం అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన ఈ సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు....

 

దీని నేపధ్యం ఏమిటంటే 7,8 అధ్యాయాలలో యూదా రాజ్యము అష్షూరు రాజుచేత బాధించబడుతుంది యేరూషలేము నాశనం చేయబడుతుంది, అయితే ఇమ్మానుయేలు గ్రద్దరెక్కల మీద మోసినట్లు దేశాన్ని కాపాడుతారు అంటూ ఇమ్మానుయేలు కోసం చెప్పారు. దీనిని మనం గతంలో ధ్యానం చేశాము! అయితే ఇలాంటి క్లిష్ట సమయములో దేవుడు వేదన నొందిన దేశము మీద మబ్బు నిలువకుండా చేస్తారు. ఇక్కడ మబ్బు అనగా శ్రమలు వేదన మరియు క్రీస్తుయేసు కోసం నిజమైన వెలుగు రాకుండా చేస్తున్న /అడ్డుకుంటున్న చీకటిని లేకుండా చేస్తారు అంటున్నారు!   ఇంకా చీకటి అనగా ఆధ్యాత్మిక అంధకారమని గ్రహించాలి! దీనిని లేకుండా చేస్తున్నారు.

 యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు: నేను లోకమును వెలుగునై యున్నాను, మీరు కూడా లోకానికి వెలుగులా ఉండాలి అన్నారు!

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

 

యోహాను 9:5

నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

 

లూకా 2:30

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

లూకా 2:31

నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన....

 

యోహాను 12:35

అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు

యోహాను 12:36

మీరు వెలుగు సంబంధులగునట్లు (మూలభాషలో- వెలుగుకుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

యోహాను 12:40

వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

యోహాను 12:46

నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

 

 ఇంకా వెలుగుకోసం అనేక రిఫరెన్సులు ఉన్నాయి గాని కొన్నిమాత్రం చెప్పడం జరిగింది, యోహాను గారు సువార్త వ్రాయడం మొదలుపెట్టి నిజమైన వెలుగు ఉంది దానిని లోకము గ్రహించడం లేదు, ఆ వెలుగు యేసుక్రీస్తుప్రభులవారే అని మొదటి అధ్యాయంలో చాలా స్పష్టముగా చెప్పడం జరిగింది.

 

సరే ప్రవచనం ఇంకా ముందుకుపోతే ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును పూర్వకారంలో అవమాన పరిచారు అయితే అంత్యకాలములో ఆయన అనగా రక్షకుడు/అభిషక్తుడు/మెస్సయ్య సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిలో ఉన్న అన్యజనుల గలిలయ ప్రదేశాన్ని మహిమగల దానిగా చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాలు ఇంతవరకు మబ్బుకలిగి అనగా నిజమైన సత్యము ఆధ్యాత్మిక సత్యాలు వారు గ్రహించలేక చీకటిలో ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన అనగా అభిషక్తుడు/ మెస్సయ్య/రక్షకుడు అనే యేసుక్రీస్తుప్రభులవారు ఆ ప్రాంతంలో సంచరించబోతున్నారు అంటూ 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా ప్రవక్తగారు చెబుతున్నారు ఆత్మావేశుడై!!! ఇక్కడ యోర్దాను అద్దరిని గలిలయ ప్రాంతము అనగా జెబూలూను నఫ్తాలి వారు నివశించే ప్రాంతము మరియు గలిలియ సముద్రపు ఒడ్డున నివశించే ఇశ్రాయేలు ప్రజలు అని గ్రహించాలి!

ఇంకా చీకటిలో నివశించు ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు అంటున్నారు! ఆ వెలుగు యేసుక్రీస్తుప్రభులవారే!!!

 

దీనికోసం మత్తయి గారు సువార్త రాస్తూ ఈ మొదటి రెండు వచనాలలో గల ప్రవచనం నెరవేరింది అని మర్మము బయలుపరిచారు పరిశుద్ధాత్మ ద్వారా!  ఒకసారి దానిని చూద్దాం!

మత్తయి 4:1216

12. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి

13.నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

14. జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

15. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను

16.అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)

 

చూడండి యేసుక్రీస్తుప్రభులవారు వచ్చాక ఈ ప్రాంతాలలో మొదట సంచరించి ఈ ప్రవచనాన్ని సంపూర్తి చేశారు!

 

ఇక పూర్వకాలంలో ఆయన నఫ్తాలి దేశాన్ని జెబూలూను దేశాన్ని అవమాన పరిచెను అనగా ఆహాజ్యా కాలంలో అష్షూరు వారు శల్మనేశర్-5 అనేవాడు ఈ నఫ్తాలి దేశము, జెబూలూను దేశమును నాశనం చేశాడు. అక్కడే కాదు ఇశ్రాయేలు పది గోత్రాలను ఆదేశంలో లేకుండా చేశాడు. క్రీ.పూ. 734, 732 సంవత్సరాలలో ఈ ప్రాంతాల వారిని అనేక చిత్ర హింసలకు గురిచేసి చివరకు 721 లో దేశంలో ఇశ్రాయేలు ప్రజలే లేకుండా చేశాడు! దానినే ఇక్కడ భక్తుడు నఫ్తాలి దేశాన్ని జెబూలూను దేశాన్ని దేవుడు అవమాన పరిచారు అంటున్నారు భక్తుడు ఆత్మావేశుడై!అయితే ఇప్పుడు రక్షకుని  పాద దూళితో ఆయన రాకతో మరణచ్చాయ గల దేశంలో చీకటిగల దేశంలో వెలుగు ప్రవేశించింది! యేసుక్రీస్తుప్రభులవారు ఈ దేశాలలో/ప్రాంతాలలో పరిచర్య చేస్తూ మారుమనస్సు పొందమని చెప్పి దేవుని రాజ్యం సమీపించింది అని చెబుతూ అనేకమైన సూచక క్రియలు చేయడం ద్వారా సువార్త జ్వాల సువార్త వెలుగు ప్రపంచమంతా ప్రజ్వలించింది!

Matthew(మత్తయి సువార్త) 4:17

17. అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

 

అవును ఆయన రాకతో కేవలం జెబూలూను నఫ్తాలి ప్రాంతాలే కాకుండా సమస్త ప్రపంచం సమస్త మానవాళికి వెలుగు మరియు రక్షణ కలిగింది. మరి ఆ వెలుగు నీ హృదయంలో నీ కుటుంభంలో నీ ఇరుగుపొరుగు లో ప్రజ్వలిస్తుందా? మీరు లోకానికి వెలుగుగా ఉండాలి ప్రజలు మీ వెలుగును చూసేలా అందరికీ మీ వెలుగును చూపించండి అన్నారు యేసుక్రీస్తుప్రభులవారు!!

మరి నీ వెలుగు ప్రజ్వలిస్తుందా లేక ఆరిపోతుందా!!

సరిచూసుకుని సరిచేసుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*55వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-2*

యెషయా 9:14

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక రెండవ వచనంలో అంటున్నారు: చీకటిలో నడుచువారు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్చాయగల దేశనివాసులు మీద వెలుగు ప్రకాశించును!

 

 చీకటిలో నడిచే ప్రజలు అనగా గతభాగంలో చూసుకున్నాము- ఆధ్యాత్మిక అంధకారంలో జీవిస్తున్న నడుస్తున్న ప్రజలు నిజమైన వెలుగు అనే క్రీస్తుని తెలుసుకున్నారు అని!  గతభాగంలో చూసుకున్నాము ఆ వెలుగు క్రీస్తుయేసు అని!

ఇక పౌలుగారు అంటున్నారు ఈ ప్రజలు వెలుగును చూడకుండా ఈ లోక దేవత ఈ ప్రజలకు గ్రుడ్డితనము కలిగిస్తుంది అందుకే వీరు సత్యాన్ని  తెలుసుకోలేక పోతున్నారు అంటున్నారు....

2కోరింథీయులకు 4:4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

వారికి వెలుగు రావాలంటే క్రీస్తుయేసు సన్నిధికాంతి వారిమీద ప్రకాశించాలి- అందుకే భక్తుడు అంటున్నారు గనుక నిద్రిస్తున్న నీవు మేలుకో, క్రీస్తు మహిమ ప్రకాశిస్తుంది నీ మీద....

 

ఎఫెసీయులకు 5:14

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.

 

యెషయా 60:1

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

యెషయా 60:2

చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

యెషయా 60:3

జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

యెషయా 60:5

నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

 

కీర్తనాకారుడు అంటున్నారు యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు నేను ఎవరికీ భయపడుదును?!!!

కీర్తనలు 27:1

యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఈయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

 

ఇంకా వారు ఆయన తట్టు అనగా క్రీస్తు తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అంటున్నారు 34:5 లో...

వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.

 

ఇంకా నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము అంటున్నారు 36:9 లో

కీర్తనలు 36:9

నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.

 

43:3 లో అంటున్నారు..

కీర్తనలు 43:3

నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.

 

ఇక 118:27 లో అంటున్నారు...

కీర్తనలు 118:27

యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.

 

మరింత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగునై ఉంది అంటున్నారు 119:105 లో

కీర్తనలు 119:105

(నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.

 

కీర్తనలు 119:130

నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును

 

అందుకే యెషయా గారు 2:5 లో అంటున్నారు...

యెషయా 2:5

యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

 

యెషయా 60:1

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

యెషయా 60:19

ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

యెషయా 60:20

నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

 

ఇవి కలిగిన తర్వాత నీ వెలుగును అందరిమీద ప్రకాశించనీయాలి !

మత్తయి 5:16

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

 

లూకా  11:33,34,36

33. ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.

34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.

35. కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము.

36. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చు నప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.

 

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

 

యోహాను 9:5

నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

 

యోహాను 12:36

మీరు వెలుగు సంబంధులగునట్లు (మూలభాషలో- వెలుగుకుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

యోహాను 12:46

నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

 

అపొ 26:18,22

18. వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

22. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని

 

2కొరింథీ 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

అయితే ఈ వెలుగును ప్రకాశించడం ఎలా ?!!!

ఎఫెసి 5:910,13

9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.

10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి

13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్ష పరచబడును; ప్రత్యక్ష పరచునది ఏదో అది వెలుగే గదా

 

1థెస్సలొనికయులకు 5:5

మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునైయున్నారు (వెలుగు కుమారులును పగలు కుమారులునై యున్నాను); మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.

 

మనమందరం సువార్తవలన వెలుగులోకి వచ్చాము అంటున్నారు పౌలుగారు

2తిమోతికి 1:10

క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

యోహాను గారు అంటున్నారు

1యోహాను 1:7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

1యోహాను 2:9

వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.

1యోహాను 2:10

తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.

 

కాబట్టి వెలుగై ఉన్న నీవు ఆ వెలుగును అందరికీ పంచాలి! ఎలా అంటే నీలో ఉన్న వెలుగు ఫలము అనబడే ఆత్మఫలము ఫలిస్తే ప్రేమ సంతోషము సమాధానం మంచితనము ఆశానిగ్రహము దయాలత్వము దీర్ఘశాంతము ఇవన్నీ పనిచేస్తే ప్రజలు నీ వెలుగులోనికి నిన్నుచూసి వస్తారు! నీలో పనిచేస్తున్న వెలుగుతున్న వెలుగే అనగా నీలో పనిచేస్తున్న ఈ ఆత్మఫలము అనేకమందిని నీ దగ్గరకు ఆకర్షిస్తుంది. అప్పుడు అనేక జనాలకు నీవే ఒక కరపత్రికగా మారి దేవుని వెలుగులోనికి వస్తారు! నీవే చీకటి అయితే నీవే వ్యభిచారివి త్రాగుబోతువి మధ్యపానివి దొంగవు దోచుకొనువాడవు అయితే ఎవరు నీ దగ్గరికి వస్తారు??? దేవుని నామానికి అవమానం తెచ్చి నీవే చీకటిలో ఉన్నవాడవుగా ఉన్నావు! 

 

ప్రియమైన సహోదరీ సహోదరుడా! నీ కుమారుడు కుమార్తె/ నీ భర్త/ బంధువులు/ ఇరుగుపొరుగు వారు ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా అన్యులుగా చీకటిలో జీవిస్తున్నారు కదా, మరి వారికోసం ప్రార్దిస్తున్నావా?

వారికి సువార్త వెలుగును రుచి చూపించావా? వారికి రక్షణ వార్తను ప్రకటించావా?!!

లేకపోతే వారి ఆత్మలయొక్క లెక్క దేవుడు నిన్ను అడుగుతారు అని మర్చిపోకు!

నీవు వెలుగుగా జీవించి అనేకులకు నీ వెలుగును క్రీస్తుని అందరికీ పంచు!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*56వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-3*

యెషయా 9:14

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      ప్రియులారా! ఇక రెండవ వచనంలో అంటున్నారు: చీకటిలో నడుచువారు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్చాయగల దేశానివాసులు మీద వెలుగు ప్రకాశించును!   ఇక్కడ మరణచ్చాయగల లోయ అనగా ఆ లోయలోనికి వెళ్తే చావు ఖాయమన్నమాట! అలాంటి మరణచ్చాయగల దేశము మీద కూడా వెలుగు ప్రకాశించును అంటున్నారు! 

ఈ మాట అనడానికి కారణం అష్షూరు రాజు ఎన్నోసార్లు ఈ ప్రాంతం మీద దండెత్తి అనేకులను ఊచకోత కోశాడు క్రీ పూ 734 లో మరియు 732 లో, చివరికి 721 లో చంపగలగిన వారిని చంపి అనగా వీరు ఎందుకు పనికిరారు అలాంటి వాళ్ళను చంపి, తన పనికోసం ఉపయోగ పడేవారిని బానిసలుగా తీసుకుని పోయాడు 722 లోను 721 లోను. కాబట్టి ఈ ప్రాంతాలలో మరణం రాజ్యమేలింది క్రీ.పూ. 7వ శతాబ్దంలో! అందుకే మరణచ్చాయ గల దేశమందు కూడా వెలుగు ప్రకాశించును అని దేవుడు చెబుతున్నారు!

 

 దీని ఆధ్యాత్మిక అర్ధమేమిటంటే: మరణపు నీడ అనగా తీవ్రమైన ఆత్మీయ/ఆధ్యాత్మిక అంధకారంతో మ్రగ్గుతున్న దేశము మీద దేవుని సువార్త కాంతి ప్రకాశిస్తుంది. ఇది యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకతో నెరవేరింది.

గత భాగాలలో చెప్పుకున్నట్లు మత్తయి గారు దీనిని ఎత్తి రాస్తున్నారు 4:....మత్తయి సువార్త 4:13,14,15,16,17

 

13. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

14. జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

15. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను

16. అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)

17. అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.

 

అయతే యేసుక్రీస్తుప్రభులవారిని ఎనిమిదో రోజున దేవాలయమునకు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రవక్త మరియు భక్తుడైన జెకర్యా గారు కూడా ప్రవచించారు : లూకా 1:79..

79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించెను.

 

ఇక దావీదు గారు ఎన్నోసార్లు రాశారు మరణపు ఉరులు నన్ను ఆవరించినప్పుడు దేవుడు నా దగ్గరకు చేరి నన్ను విడిపించి వెలుగు ఇచ్చారు అంటూ 2సమూయేలు 22:6

2సమూయేలు 22:5

మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను

2సమూయేలు 22:6

పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను

2సమూయేలు 22:7

నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.

 

కీర్తన 18:5

పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

 

యోబు గారు ఇదే మరణాందకార దేశమునకు త్వరలో వెళ్ళిపోతాను అని బాధపడ్డారు 10:22

యోబు 10:21

అంధకారము మరణాంధ కారముగల దేశమునకు

యోబు 10:22

కటికచీకటియై గాఢాంధ కారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లు నట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.

 

అయితే కీర్తనాకారుడు అంటున్నారు అలాంటి మరణాందకారములో కూడా దేవుడు మనలను విడిపించగలరు అంటున్నారు 107:11,14

కీర్తనలు 107:11

బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును

కీర్తనలు 107:14

వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.

 

అయితే పౌలుగారు ఇలాంటి మరణాందకారమునకు విరుగుడుగా యేసుక్రీస్తుప్రభులవారు ఈ లోకానికి వచ్చి వెలుగు నిచ్చారు అంతేకాకుండా ఆ వెలుగును పొందుకున్న మనముకూడా  ఇలాంటి మరణాందకారములో మ్రగ్గిన వారికి జీవపు వాసనగా చేశారు దేవుడు మనలను అంటున్నారు!

 

2కోరింథీయులకు 2:14

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

2కోరింథీయులకు 2:15

రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము.

2కోరింథీయులకు 2:16

నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.

 

కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు నేను పాపపు మరణాందకారములో ఉన్నవారికి క్రీస్తు జీవపు వెలుగును చూపించి వారికి క్రీస్తుని పరిచయం చేసి వారికి మనలో ప్రసరిస్తున్న క్రీస్తుయేసు జీవపు రక్షణ సువాసన అందరికీ పంచాలి! లేకపోతే మనము కూడా వారిలాగే మరణపువాసన కలిగి ఉంటామని మర్చిపోవద్దు!!!

 

ఇక మూడువ వచనంలో అంటున్నారు: ఎందుకంటే నీవు జనమును విస్తరించిజేసి యున్నావు వారి సంతోషమును ఇప్పుడు వృద్ధిచేస్తున్నావు కోతకాలమున మనుష్యులు ఎలా సంతోషిస్తారో దోపుడు సొమ్ము దొరికినప్పుడు జనులు ఎలా సంతోషిస్తారో వారు ఇప్పుడు నీ సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి మరణాందకారపు దేశాలలో సంచరిస్తున్న వారు దేవుని వెలుగును ఇప్పుడు చూశారు కాబట్టి వారికి సంతోషం కలిగింది. ఎంత సంతోషం అంటే పంట బాగా పండి , పండిన పంట ఇంటికి చేరినప్పుడు రైతుకి ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే యుద్ధానికి వెళ్లి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు తమతోపాటుగా విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వచ్చేటప్పుడు సైనికులకు ఎంతటి ఆనందం సంతోషం కలుగుతుందో అంతటి సంతోషంతో ప్రజలు ఇప్పుడు ఉన్నారు ఎందుకంటే మొదటగా: వారిమీద జీవపు వెలుగు ప్రసరించింది.

రెండవదిగా: నీవు ప్రజలను అభివృద్ధి చేశావు!

 

 మీదన చెప్పినట్లు ఇదే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల ముందు చావు రాజ్యమేలింది. ఎక్కడ చూసినా శవాల కుప్పలే! వారిని పాతిపెట్టేవారే లేకుండా పోయింది. పక్షులు వారి శవాలను పీక్కుని తిన్నాయి! ఇప్పుడైతే ఆలాంటి దేశంలో ప్రజలను తీసుకుని వచ్చి వారిని వృద్ధిచేశావు అందుకే ఇప్పుడు ఇంతటి ఆనందం సంతోషం!!!

 

అవును నిజమైన దేవుని కాంతిలోనికి వస్తున్న ప్రజలు నేడు అనేకులవుతున్నారు. యేసుక్రీస్తుప్రభులవారి రాకతో వందల దేశాలలో ఈ సన్నిధి కాంతి ప్రవహించి లక్షలాదిమంది దేవుణ్ణి నిజదేవున్ని అంగీకరించారు. ఆయన ఈ భూమిమీదికి నిజమైన ఆనందం తీసుకుని వచ్చారు! ఆయనను అంగీకరించిన వారికి ఈ ఆనందం ఎల్లప్పుడు ఉంటుంది. వారికి శ్రమలు శోధనలు ఎదురైనా ఈ ఆనందం వారినుండి తొలిగిపోదు!!

యెషయా 61:3

సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 

యోహాను 15:11

మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.

 

16:2024

20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

22. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్ద నుండి తీసివేయడు.

24. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

 

రోమా 14:17

దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.

 

మరి ఈ వెలుగు నీలోను నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈ వెలుగును అందరికీ చూపిస్తున్నావా? క్రీస్తు సువాసనగా నీవున్నావా? దేవునికి మహిమార్ధముగాను ఇరుగుపొరుగు వారికి ఆశీర్వాదకరంగాను నీవు ఉండగలుగు తున్నావా?

సరిచూసుకోమని ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*57వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-4*

యెషయా 9:14

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక నాల్గవ వచనంలో అంటున్నారు: మిద్యాను దినమందు జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచియున్నావు వాని మెడను కట్టుకర్రను తోలేవాని కొరడాలను నీవు విరిచియున్నావు అంటున్నారు!

 

ఇక్కడ మిద్యాను దినమందు జరిగినట్లు వాని బరువుకాడిని విరిచేశావు అంటున్నారు. అసలు మిధ్యాను దినము ఏమిటి అని ఆలోచిస్తే ఇది మనకు న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. 6వ అధ్యాయం మొదట్లో వ్రాయబడింది- ఇశ్రాయేలు ప్రజలు దేవునిని విడిచినందువలన దేవుడు వారిని మిధ్యానీయులకు బానిసలుగా అప్పగించేశారు. ఇశ్రాయేలు వారిని వారు శ్రమ పెట్టడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు పండించిన ప్రతీ పంట వారు బలవంతంగా ఎత్తుకుని పోయేవారు. ఇలా వారు ఖటినమైన భాధలు అనుభవించారు మిద్యానీయుల చేతిలో! ఇది ఆరో అధ్యాయం చెబుతుంది. ఆలాంటి స్థితిలో దేవుడు గిద్యోనుని పిలచుకుని గిద్యోను ద్వారా దేవుడు మిద్యానీయుల చెరనుండి విముక్తి చేశారు! 7వ అధ్యాయంలో గిద్యోనుకి తోడుగా యుద్ధం చేయడానికి ౩౩౦౦౦ మంది వచ్చారు. దేవుడు వారి సంఖ్య ఎక్కువ అంటూ కొన్ని పరీక్షలు పెట్టాక కేవలం ౩౦౦ మంది మాత్రం మిగిలారు గిద్యోనుతో! దేవుడు ఆ ౩౦౦ మంది ద్వారా గొప్ప విజయం చేకూర్చారు. ఈ రకంగా మిధ్యాను కాడిని దేవుడు విరిచేశారు!  ఇక్కడ భక్తుడు ఆ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకుని దేవా! నీవు మిధ్యాను దినమందు జరిగినట్లు నీవుకార్యము చేసి మమ్మును  మా ప్రజలయొక్క కాడిని విరిచేశావు అంటున్నారు!  ఆశ్చర్యకరంగా కేవలం ౩౦౦ మందితో కొన్ని లక్షలమంది సైన్యమును ఓడించావు. ఇప్పుడు వీరియొక్క కాడిని నీవు విరిచేశావు అంటున్నారు!

 

నిజానికి ఈ ప్రవచనం రెండు విధాలుగా నెరవేరింది! 

మొదటిది: అక్షరార్ధంగా (Literally) లేక అక్షరార్ధమైన నెరవేర్పు:: క్రీ.పూ. 701 లో అష్షూరు సామ్రాజ్యం పూర్తిగా నాశనం అయిపోయింది. అలా అష్షూరు వారు నాశనమైపోతారు అంటూ భక్తుడు ముందుగానే ప్రవచించారు

Isaiah(యెషయా గ్రంథము) 10:5,24,25,26,27,28

5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

24. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును

25. వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

26. ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.

27. ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి వేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.

28. అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు

 

అలా ప్రవచించిన ప్రవచనం సుమారుగా ౩౩ సంవత్సరాల తర్వాత నెరవేరింది. అష్షూరు సామ్రాజ్యం- బబులోను వారి ద్వారా సర్వనాశనం చేయబడింది. ఇది అక్షరార్ధంగా! అస్శూరు వారి కాడినుండి విడుదల పొందారు!

 

రెండవది: ఆధ్యాత్మిక నెరవేర్పు:  యేసుక్రీస్తుప్రభులవారి రాకతో అదే ప్రాంతం అనగా జెబూలూను నఫ్తాలి ప్రజలకు గలిలయ వారికి ఇంకా సర్వ ప్రపంచానికి పాపపుదాస్యం తొలిగిపోయింది పాపపు దాస్యపు కాడిని దేవుడు విరిచేసి విడుదలనిచ్చారు పాపము నుండి!!! ఇది మనకు పౌలుగారు రాసిన పత్రికలలో విస్తారంగా చూడగలము!!

 

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

యెషయా 61:2

యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

 

లూకా 4:17

ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

లూకా 4:18

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

లూకా 4:19

ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

లూకా 4:21

సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

 

యోహాను 8:3436

34. అందుకు యేసు: పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.

36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

 

Romans(రోమీయులకు) 6:8,9,10,11,12,13

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా (లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

Romans(రోమీయులకు) 6:17,18,19,20,21,22

 

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

19.మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

20. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

21. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

 

గలతీ 5:1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

గమనించాలి ఇక్కడ దేవునికి దాసులుగా ఉండాలి అన్నా, పాపపుదాస్యము నుండి విడుదల పొందాలి అన్నా మొదటగా క్రీస్తుయేసు పాదాలను సమీపించి పశ్చాత్తాపముతో మన కన్నీటితో ఆయన పాదాలు కడిగితే క్రీస్తుయేసు రక్తము మన ప్రతిపాపము నుండి కడిగి మనలను పాపపుదాస్యము నుండి విడుదల కలిగిస్తుంది. ఇక అప్పటినుండి పవిత్రమైన జీవితం జీవిస్తూ ఇంతవరకు పాపమునకు లోకమునకు ఘోరమైన చెడు అలవాట్లకు బానిసలుగా ఉన్న మనము దేవునికి దాసులుగా జీవిస్తే ఆయన సొత్తుగా మారుతాము! ఎప్పుడైతే అలా మారతామో ఆయన స్వరానికి ఆయన ఆజ్ఞలకు లోబడతాము!  అలా దేవునికి లోబడటమే అనగా లోకాన్ని ఎదిరించి దేవునికి లోబడటమే ఆత్మీయ లేక ఆధ్యాత్మిక స్వతంత్రత!! అది దేవుణ్ణి ఆనందంగా స్వచ్చందంగా పూర్తి సంతోషంతో సేవించగలిగిన ఆధ్యాత్మిక స్వతంత్రత!! ఇక పాపపు కాడికి ధర్మశాస్త్రపు కాడికి మనం లోబడము! దేవునికే సంపూర్ణ అధికారం ఇచ్చి వాక్యానుసారమైన జీవితం సాక్షార్ధమైన జీవితం కలిగి పవిత్రమైన జీవితం జీవించగలం!!

 

ఇది క్రీస్తుయేసు బలియాగం ద్వారా మరియు ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గములో సాగినప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది!

 

మరినీవు క్రీస్తు రక్తంలో కడుగబడ్డావు కదా మరి నీకు లోకం మీద పాపం మీద జయం మరియు విడుదల ఉందా? వాక్యానుసారమైన జీవితం సాక్షార్ధమైన జీవితం కలిగి పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా!!

సరిచూసుకో!

సరిచేసుకో!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*58వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-5*

యెషయా 9:57          

5. యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక ఐదవ వచనంలో అంటున్నారు:  యుద్దపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొర్లింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును!  ప్రియులారా- మొదటి నాలుగు వచనాలు యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడను తెలియజేస్తే ఈ ఐదవ వచనం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడలో జరిగే సంభవాలు తెలియజేస్తుంది. ఇది దేవుడిచ్చే శాంతిని తెలియజేస్తుంది. రెండవరాకడలో హార్మెగిద్దోను యుద్ధం తర్వాత వెయ్యేండ్ల పాలనలో ప్రపంచమంతా శాంతితో నిండి ఉంటుంది. దీనినే యెషయా 2:4 లో కూడా చెప్పడం జరిగింది....

యెషయా 2:4

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

 

రెండవరాకడను ధ్యానం చేసేటప్పుడు దీనికోసం బాగా ధ్యానం చేద్దాం!

 

ఇక ఈ అధ్యాయం మొదటినుండి ఐదో వచనం వరకు చెప్పి అంటున్నారు: ఎందుకంత ఘంటాపధంగా చెబుతున్నాను అంటే : ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను! ఆయన భుజము మీద రాజ్యభారముండును! ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్త అగు అధిపతి అని అతనికి పేరుపెట్టబడును...

 

చూడండి ఈ ఆరో వచనంలో అంటున్నారు:  మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను అంటూ ఆయన బిరుదులను చెబుతున్నారు: ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి!!!!

 

ఈయన ఎవరో కాదు- మన యేసుక్రీస్తుప్రభులవారే!!! యేసుక్రీస్తుప్రభులవారు పుట్టకముందు 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా ప్రవక్త గారు ఆత్మావేశుడై ప్రవచిస్తున్నారు!!!

 

సరే ఇప్పుడు ఆయన బిరుదులను లేక లక్షణాలను లేక ఆయన నిజానికి ఏమైయున్నారో ఒకో దానిని ధ్యానం చేద్దాం! దానికి ముందుగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను అంటున్నారు కదా! అలా అనడానికి కారణం క్లుప్తంగా చూద్దాం!

 

గమనించాలి ఇక్కడ ప్రవక్త ఆత్మావేశుడై పలుకుతున్నారు- మీద 5 వచనాలు- మన దాస్యపు కాడినుండి విడుదల పొందబోతున్నాము సాతాను పాప బంధకాలనుండి విడుదల పొందబోతున్నాము ఎలాగు అంటే మనకు లేక మనకొరకు ఒక శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను అందుకే ఈ విడుదల మరియు ఈ రక్షణ మరియు ఈ వెలుగు అంటున్నారు! ఆయన ద్వారానే ప్రజలయొక్క అంధకారం పోయి, గలలియ నఫ్తాలి జెబూలూను ప్రాంతాలలో దేవుని కాంతి ప్రసరిస్తుంది అంటున్నారు. ఇక్కడ గలలియ జెబూలూను అనగా చీకటిలో ఉన్న దేశాలు అని అర్ధం! గతంలో చెప్పిన విధంగా చీకటి అనగా ఆత్మీయాంధకారము అని అర్ధము!!  ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వము మరియు మానవత్వము రెండు కనిపిస్తాయి ఇక్కడ! ఆయన దైవమానవుడు అని ఈ వచనం ద్వారా లేక ఈ ప్రవచనం ద్వారా రుజువుకాబడింది.

 

యెషయా 7:14 లో కన్యక గర్భవతి అయ్యి కుమారుని కంటుంది అతనికి ఇమ్మానుయేలు అని పెరుపెడతారు అని చెబితే ఆ ఇమ్మానుయేలు ఎవరు? ఆయన లక్షణాలు మరియు బిరుదులూ ఏమిటి అనేది ఈ వచనం మనకు తెలియజేస్తుంది.  చివరికి అతడు లోకానికి రారాజుగా పరిపాలిస్తారు అంటూ చెబుతున్నారు!

 

ఇక శిశువుగా ఎందుకు పుట్టారు అంటే ఇది దేవుడే చేసిన విధి! ఆయన చేసిన నిర్ణయాలను రీతి-రివాజులను ఆయన మార్చరు కదా! భూమిమీద పుట్టిన వారు ఎవరైనా శిశువుగా పుట్టాలి బాలుగుగా ఎదగాలి యవ్వనుడు కావాలి చివరికి వృద్దుడు కావాలి మరణించాలి! ఇది దేవుడు చేసిన శాసనం! కాబట్టి దేవుడు మానవాళి పాపములను తీసివేయడానికి యెషయా 6వ అధ్యాయంలో నా నిమిత్తం ఎవరు వెళ్తారు భూలోకానికి అని అడిగినప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు తన తండ్రితో చెప్పారు నేనున్నాను నన్ను పంపమని చెబితే అనుకూల సమయంలో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు!  అయితే ఆయన పుట్టడానికి ఒక తల్లి గర్భము కావాలి కాబట్టి పవిత్రురాలు ఎన్నడు పురుషునితో సంభోగం చేయని నీతిమంతురాలు కన్యక అయిన మరియగారి గర్భములో దేవుడు పుట్టాలని 700 సంవత్సరాలకు ముందుగానే నిర్ణయం జరిగింది!! అతడే ఈ శిశువు- యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఇక కుమారుడు అని ఎందుకు అన్నారు అంటే అనేక మతగ్రంధాలలో కుమారుని ద్వారానే పాపం పోయి పరలోకం వెళ్తారు అని వ్రాసి ఉంది.  మన గ్రంధాలలోను అనగా మన దేశపు హైందవ గ్రందాల లోను చెప్పబడింది- పుత్రుడు లేకపోతే మోక్షం లేదు, ఎందుకంటే పుత్రుడు పున్నామి నరకం అనగా ఎప్పటినుండో మన కుటుంబంలో లేక కుటుంబం మీద ఉన్న నరకం అనగా శాపము నుండి పుత్రుడు విమోచిస్తాడు! చివరికి పౌలుగారు కూడా చెబుతున్నారు ఆమె శిశు ప్రశూతి ద్వారా ఆమె రక్షించబడును అన్నారు! 1తిమోతి 2:15 లో స్త్రీలకోసం చెబుతూ!!  నిజానికి ఈ కుమారులు నరకం నుండి మనలను తప్పించగలరా ?? లేదు! కుమారుడు అనగా అర్ధం: కు: అంటే కుత్సిత గుణములు అనగా పాపములు, మారః : అనగా చంపేవాడు- మొత్తం అర్ధం తీసుకుంటే కుత్సిత మైన గుణములను చంపేవాడు అనగా మానవులు చేసే పాపములు తీసివేసే వాడు హరించేవాడు కుమారుడు అని అర్ధం!!

 

ఈ కొడుకులు తల్లిదండ్రులు బ్రతికుండగానే చంపేస్తున్నారు! తల్లిదండ్రులు కొంచెం వృద్ధాప్యం లోనికి వస్తే అనాద శరణాయలకు పంపించేస్తున్నారు ఈ పనికిమాలిన కొడుకులు! అలాంటిది వీరు మన పాపములను ఎలా తీసివేయగలరు???

 

లేదు- వీరికి అంత శక్తిలేదు! అయితే ఏ కుమారునికోసం భక్తుడు చెబుతున్నారు అంటే దేవ కుమారుడు- మానవులు అందరికోసం కుమారుడై ఈ భూలోకానికి వచ్చి మన పాపముల కోసం తానే రక్తము కార్చి తన రక్తంతో మానవుల పాపములను కడిగిన యేసుక్రీస్తుప్రభులవారే ఆ నిజమైన కుమారుడు! ఆ కుమారుని మన రక్షకునిగా అంగీకరిస్తే ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన రక్తములో మన పాపములను కడిగి అప్పుడు మనలను పరిశుద్దులుగా చేసి మనలను మోక్షము అనగా పరలోకమునకు చేర్చగలరు యేసుక్రీస్తుప్రభులవారు!!! ఇతడే ఆ నిజమైన కుమారుడు!

 

కాబట్టి ఆ కుమారుని నీకు తండ్రిగాను రక్షకునిగాను చేసుకో! అప్పుడు ఆయన మన ప్రతిపాపము నుండి కడిగి విమోచించి పరమునకు చేర్చుతారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*59వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-6*

యెషయా 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఈ 6వ వచనంలో ఆయన భుజము మీద రాజ్యభారముండును!!!

చూడండి ఆయన ప్రపంచాలను ఏలుతారు అని ముందుగానే చెబుతున్నారు! ఆయన రాజులరాజు ప్రభువులకు ప్రభువు!

చూడండి జ్ఞానులు వచ్చి హేరోదుని ఏమని అడిగారు! రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను కొలువడానికి లేక పూజించటానికి వచ్చాము అన్నారు

మత్తయి 2:2 లో....

మత్తయి 2:1

రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి

మత్తయి 2:2

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

 

మత్తయి 27:11

యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి: యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను

 

యిర్మియా గారు ప్రవచిస్తున్నారు

యిర్మియా 23:5

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

 

ప్రకటన గ్రంధంలో మనము చూడగలం:

ప్రకటన గ్రంథం 19:16

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

 

ప్రకటన గ్రంథం 17:14

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

 

ఇంకా దానియేలు గ్రంధంలో నెబుకద్నేజర్ అంటున్నాడు 2:47

దానియేలు 2:47

మరియు రాజు ఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.

 

దానియేలు 8:25

మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు *రాజాధిరాజుతో* యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును.

 

1తిమోతికి 6:15

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు.

1తిమోతికి 6:16

సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

 

అయితే బైబిల్ లో అనేకసార్లు కొమ్మ లేక దావీదు వేరు చిగురు భూలోకాన్ని నీతిన్యాయాలతో పరిపాలిస్తారు అని వ్రాయబడింది. కొమ్మ లేక చిగురు లేక వేరు అనేది యేసుక్రీస్తుప్రభులవారి బిరుడు అని గ్రహించాలి!

 

యిర్మియా 33:15

​​ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.

యిర్మియా 33:16

ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షిత ముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.

 

యెషయా 11:19

యెషయా 11:1

యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

యెషయా 11:2

యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

యెషయా 11:10

ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావముగల దగును.

 

జెకర్యా 6:12

అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.

జెకర్యా 6:13

అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు(ఒకడు) యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.

 

ఇక ఆయన దావీదు వంశానికి చెందిన వాడు అని ఉంది లూకా 1:30--33

30. దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.

31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

 

రోమా 1:5

యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

 

ఆయన రాజుగా పరిపాలన చేస్తారు అని పాత నిబంధన గ్రంధంలో అనేకసార్లు చెప్పబడింది

కీర్తన 2:69

45:17

72:57

యెషయా 32:13

జెకర్యా 14:921

 

కాబట్టి ఆయన రాజులరాజు ప్రభులకు ప్రభువు! ఆయన భుజము మీద రాజ భారముండును ఇంకా మానవుల పాప భారముండును దానిని తానే తనరక్తముతో కొట్టి వేశారు!

రాజ్య భారము కోసం పౌలుగారు చెబుతూ హెబ్రీ మొదటి అధ్యాయములో  కుమారుని ద్వారా ఈ ప్రపంచాన్ని నిర్మించి ఇంకా తన మహాత్తుగల మాటచేత సమస్తమును (ప్రపంచములను) నిర్వహిస్తున్నారు అంటున్నారు.అనగా ప్రపంచములో జరిగే ప్రతీది ఆయన ద్వారానే ఆయన అనుమతితోనే జరుగుతుంది అని గ్రహించాలి!

 

కాబట్టి ఆయనకు భయపడు!

ఇంకా నీ రాజు ప్రపంచ భారాన్నే మోస్తున్నారు కదా నీ భారమును కూడా ఆయన మీద ఎందుకు వేయకూడదు!!! ప్రపంచంలో నీవే ఎన్నో బాధలు హింసలు కష్టాలు పడుతున్నట్లు ఫోజులిస్తూ బాధపడుతున్నావు కదా- నీ భారం ఆయన మీద వేసేయ్ ఇప్పుడు! ఆయన అంటున్నారు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు! మత్తయి 11:28; 

నీ భారము అది ఏమైనా ఎన్నైనా అన్నీ అంతా ఆయన మీద వేసేయ్ ఇప్పుడు!

 నిశ్చింతగా ఉండు!

ప్రశాంతంగా ఉండు!

ఆయన నీకు నెమ్మదిని శాంతిని వెలుగును మనశ్శాంతిని ప్రశాంతిని రక్షణను పరలోకమును ఇస్తారు!

మరి నీ హృదయము ఆయనకిచ్చి నీ భారాన్ని ఆయనమీద మోపుతావా?!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*60వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-7*

 

యెషయా 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఈ 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అంటున్నారు! అవును నిజంగా యేసుక్రీస్తుప్రభులవారు ఆశ్చర్యకరుడు! ఆయన ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుతకార్యాలు చేశారు!  చనిపోయి నాలుగు రోజుల సమాధిలో ఉన్న  లాజరును బ్రతికించడం ఆశ్చర్యం కాదా!!

యోహాను 11:39

యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

యోహాను 11:44

చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

 

చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించడం ఆశ్చర్యం కాదా!

లూకా 8:41

యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.

లూకా 8:48

ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చినీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను.

లూకా 8:49

యేసు ఆ మాటవినిభయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి

లూకా 8:54

అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా

లూకా 8:55

ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.

 

నాయీను ఊరిలో విధవరాలి ఒక్కడే కుమారున్ని బ్రతికించడం ఆశ్చర్యం కాదా!

లూకా 7:12

ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.

లూకా 7:13

ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

లూకా 7:14

ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా

లూకా 7:15

ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.

 

పుట్టి గ్రుడ్డివానికి కళ్ళు ప్రసాదించడం ఆశ్చర్యం కాదా!

యోహాను 9:6

ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి

యోహాను 9:7

నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.

యోహాను 9:13

అంతకుముందు గ్రుడ్డియై యుండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసికొనిపోయిరి.

యోహాను 9:32

పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.

 

38 సంవత్సరాలనుండి ఊచకాలుచేతులతో ఉన్న వ్యక్తిని స్వస్తపరచడం మహాశ్చర్యం కాదా!!

యోహాను 5:5

అక్కడ ముప్పది యెనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.

యోహాను 5:8

యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా

యోహాను 5:9

వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.

 

ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఆయన ఆశ్చర్యకరుడు!

 

ఎర్ర సముద్రమును పాయలు చేయడం ఆశ్చర్యం కాదా! నిర్గమ 14:14--22;

 

యోర్దాను నదిని పాయలు చేయడం ఆశ్చర్యం కాదా! యెహోషువ 3:13--17;

 

బండనుండి నీటిని రప్పించి సుమారుగా 40 లక్షలమందికి మరియు వారి పశువులకు దాహం తీర్చడం ఆశ్చర్యం కాదా!!

నిర్గమ‌ 20:8--11;

 

పగలు మేఘస్తంభములో నుండి రాత్రి అగ్ని స్థంభములో నుండి మాట్లాడి కాపాడటం ఆశ్చర్యం కాదా!!

 

సూర్యుని గమనాగమనాలనే ఆపడం మహాదాశ్చర్యం కాదా!!

యెహోషువా 10:12--14;

 

కాబట్టి ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేసిన యేసుక్రీస్తుప్రభులవారు నిజంగా ఆశ్చర్యకరుడైన దేవుడు! నీకు నాకు సరిపోయిన వాడు!!!

ఆయన స్వభావంలో ఆశ్చర్యకరుడు, తన గుణాలలో లేక లక్షణాలలో ఆశ్చర్యకరుడు! చివరికి ఆయన జన్మలో కూడా ఆశ్చర్యముంది కదా! కన్యక- పురుషుని ప్రమేయం లేకుండా గర్భము ధరించడం కుమారుని కనడం అసాధారణమైన అద్భుతము మరియు ఆశ్చర్యము కాదా!!!!

 

చివరికి మచ్చలేని పవిత్రమైన జీవితం జీవించి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించగలడు అంటూ సవాలు చేసిన సవాలుకరమైన జీవితం జీవించడం ఆశ్చర్యం కాదా!!!

 

చివరకు ఆయన మానవుల పాపముల కోసం సిలువలో మరణించడం ఆశ్చర్యం కాదా!!!

 

చనిపోయి తిరిగి లేవడం ఆశ్చర్యం కాదా!!!

 

పరలోకానికి ఆరోహణమవడం ఆశ్చర్యం కాదా!!!

 

 ఈ రకంగా ఏవిధంగా చూసుకున్నా ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు!!!

అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయన ఆశ్చర్యకరుడు!

 

అందుకే కీర్తనాకారుడు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు మాటిమాటికి తలంచుకుంటూ ఆయనను స్తుతించేవాడు!

 

కీర్తనలు 71:17

దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.

 

కీర్తనలు 98:1

యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.

 

అటువంటి ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా ప్రియ చదువరీ!! ఆయన నీకు నీకుటుంబానికి నీ ఇంటికి రక్షకుడుగా దేవుడుగా చేసుకున్నావా?!!

ఆయన ద్వారానే పరలోకం అని మర్చిపోవద్దు!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*61వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-8*

 

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా! ఈ 6వ వచనంలో ఆయన ఆలోచన కర్త అంటున్నారు!

మనదేవుడు మనకు ఆలోచన ఇచ్చే దేవుడు!

యెషయా గ్రంధంలో ఆయనకు ఎటువంటి ఆత్మకలిగి ఉంటారో ముందుగానే చెప్పారు!

యెషయా 11:2

యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.

 

యెషయా 28:29

జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్ర హించువాడు ఆయనే!

 

దీనినే దేవుని ఏడాత్మలు గలవాడు అంటూ ప్రకటన గ్రంధములో కూడా చెప్పారు.....

ప్రకటన గ్రంథం 3:1

సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే

 

నిజానికి ఆత్మలు ఏడు లేవు గాని ఒకే పరిశుద్దాత్మునికి ఏడు లక్షణాలు లేక గుణాలున్నాయి! చూడండి ఆయన యొక్క ఆత్మలు:

ఇంతకీ ఆ ఏడు ఆత్మలు ఏమిటి అని చూసుకుంటే యెషయా గ్రంధంలో మనకు జవాబు దొరుకుతుంది! 11:2...

యెహోవా ఆత్మ

1. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ

2. వివేకమునకు ఆధారమగు ఆత్మ

౩. ఆలోచనకు ఆధారమగు ఆత్మ

4. బలమునకు ఆధారమగు ఆత్మ

5. తెలివిని పుట్టించు ఆత్మ

6. భయమును పుట్టించు ఆత్మ

7. భక్తిని పుట్టించు ఆత్మ!

 

వీటన్నిట్లోను ఒకటి ఉంది ఆలోచనకు ఆధారమైన ఆత్మ!

 

సామెతలు 8:14

ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.

 

ఒకసారి ఆగి ఆలోచిస్తే యెషయా 61వ అధ్యాయంలో అంటున్నారు.......

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

 

చూడండి ఇక్కడ యెహోవా ఆత్మ నామీద ఉన్నాడు పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి పంపించారు అంటున్నారు!

 

ఈ అభిషేకించిన ఆత్మలో ఏడు గుణాలున్నాయి! అవన్నీ యేసుక్రీస్తుప్రభులవారిలో పుష్కలంగా ఉన్నాయి!

 

మత్తయి 3:16 లో ఇంకా యోహాను సువార్తలో ఆయన బాప్తిస్మం పొందుకుని బయటకు వచ్చేటప్పుడు ఆయనమీద పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వ్రాలినట్లు చూడగలం.

మత్తయి 3:16

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

 

మార్కు 1:10

వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

 

లూకా 3:22

పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు: నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

 

యోహాను 1:31

నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో( లేక, నీళ్ళతో) బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను.

యోహాను 1:32

మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

యోహాను 1:33

నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల (లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్దాత్మతో) బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.

 

Acts(అపొస్తలుల కార్యములు) 10:38

38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా-సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.

 

ఇక్కడ ఒక విషయం అర్ధమవుతుంది. యేసుక్రీస్తుప్రభులవారిని దేవుడు ఈ భూలోకానికి పంపించే ముందు ఆయనను ఆత్మపూర్ణునిగా అభిషేకించి దేవుడు ఈ భూలోకానికి పంపించారు! అదేవిధంగా ఎవరైనా పరిచర్య చేయాలి అంటే మొదటగా ఆయన ఏడాత్మలు గల పరిశుద్దాత్మను పొందుకుని అప్పుడు పరిచర్య ప్రారంబించాలి! ఆయన ఆత్మను పొందుకోకుండా పరిచర్య ప్రారంభిస్తే నీ ఆలోచనకు ఆధారమైన ఆత్మ వివేచనకు ఆధారమైన ఆత్మ బలమునకు ఆధారమైన ఆత్మ ఇలాంటివి లేవు గనుక నీ పరిచర్యలో చతికిల పడతావు జాగ్రత్త!!

 

అయితే నీవు అడుగకుండా ఏమీ రాదు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు అడుగుడి మీకు దొరకును తట్టుడి తీయబడును వెదకుడి మీకు దొరకును అంటూ... చివరకు వచ్చేసరికి అడిగే ప్రతీవారికి తన పరిశుద్దాత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తారు అంటున్నారు....

లూకా 11:9

అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.

లూకా 11:10

అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.

లూకా 11:13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

 

ఇలాంటి ఆత్మను పొంది పరిచర్య ప్రారంభిస్తే మొదటగా నీవు దేవునికి ఇష్టమైనవి మాత్రమే చేస్తావు, ధనము వెంట పరుగెత్తవు అస్తమాను దేవునికి మహిమార్ధముగాను ఆయనకు ఘనత కలిగించే పనులుచేస్తూ ఆయనకు విధేయుడుగా జీవించగలవు లేకపోతే నీ పరిచర్య బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

 

గమనించాలి: మనము తెలుసుకోవలసినవి చెయ్యవలసినవి ఏ విషయములోనైనా మనకు కావలసినవి ఇచ్చేవాడు ఆలోచన చెప్పేవాడు సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తుప్రభులవారే!

 అందుకే పౌలుగారు అంటున్నారు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనయందే గుప్తమై ఉన్నవి అంటున్నారు కొలస్సీ పత్రికలో...

కొలస్సీయులకు 2:3

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

 

కాబట్టి ఆలోచన కర్తయైన దేవుణ్ణి ప్రతీ విషయంలోను ఆలోచన అడుగు! సామెతల గ్రంధంలో అంటున్నారు నీకు నీవు బుద్ధిమంతుడవు ఆలోచన గలవాడవు అనుకోకుండా ప్రతీ విషయంలోనూ ఆయన ఆలోచనకు ఒప్పుకో అంటున్నారు....

సామెతలు 3:5

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము

సామెతలు 3:6

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

సామెతలు 3:7

నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

 

దావీదు గారు అంటున్నారు:

1దిన 28:9

సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.

 

యోబు 12:13

జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

 

కీర్తనలు 16:7

నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది.

 

కీర్తనలు 32:8

నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

 

కీర్తనలు 33:11

యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.

 

కీర్తనలు 73:24

నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు

 

కీర్తనలు 92:5

యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు,

 

119:24

నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.

కాబట్టి అలాంటి ఆలోచన కర్త నీకు దేవుడుగా ఉన్నారు కనుక ఆయన ఆలోచన కొరకు కనిపెడదాం! ఆయన చెప్పినట్లు చేద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*62వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-9*

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఈ 6వ వచనంలో ఆయన బలవంతుడైన దేవుడు అంటున్నారు!  ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన పదాలు కనిపిస్తున్నాయి!

మొదటిది : బలవంతుడు;

రెండు: దేవుడు:

అనగా యెహోవా దేవుడు= యేసుక్రీస్తుప్రభులవారు

మొదట మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అంటూ ఇప్పుడు బలవంతుడైన దేవుడు అంటున్నారు. ఇక్కడ ఆయన యొక్క దైవత్వమును ముందుగానే చెబుతున్నారు! దీని అర్ధం యేసుక్రీస్తుప్రభులవారు యెహోవా దేవుని సంతానమే కాకుండా ఏకైక వారసుడు ! ఆయనే తండ్రి మరియు ఆయనే కుమారుడు! దీనికోసం తర్వాత ధ్యానం చేద్దాం! ఈరోజు బలవంతుడైన దేవుని కోసం ఆలోచిద్దాం!

 

మరలా మనం యెషయా 11:2 కి వస్తే మరలా దేవుని ఏడాత్మలు కనిపిస్తాయి .....

ఇంతకీ ఆ ఏడు ఆత్మలు ఏమిటి అని చూసుకుంటే

యెహోవా ఆత్మ

1. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ

2. వివేకమునకు ఆధారమగు ఆత్మ

౩. ఆలోచనకు ఆధారమగు ఆత్మ

4. బలమునకు ఆధారమగు ఆత్మ

5. తెలివిని పుట్టించు ఆత్మ

6. భయమును పుట్టించు ఆత్మ

7. భక్తిని పుట్టించు ఆత్మ!

ఇప్పుడు వీటిలో ఒక ఆత్మ 4. బలమునకు ఆధారమగు ఆత్మ!!!

 

యేసుక్రీస్తుప్రభులవారు బలవంతుడు! దేవుడు బలవంతుడు!!!

ఆయన బలమును ఇచ్చే దేవుడు మాత్రమే కాదు- ఆయనే బలవంతుడు!

మాటతో సృష్టిని చేసిన దేవుడు! మాటతో ఎన్నెన్నో అద్భుతాలు చేశారు! 

కేవలం ఒక్క దేవదూతను పంపి 1,85,000 మంది శత్రు సైనికులను హతమార్చిన శక్తివంతుడు!!!...

యెషయా 37:36

అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.

 

మాకు బలము చాలదు- దేవా నీవే మాకు దిక్కు అని ప్రార్ధించిన వారి పక్షముగా ఆయనే యుద్ధాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన వాడు!...

 

2దినవృత్తాంతములు 20:12

మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.

2దినవృత్తాంతములు 20:17

ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చినిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.

2దినవృత్తాంతములు 20:22

వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.

2దినవృత్తాంతములు 20:23

అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.

2దినవృత్తాంతములు 20:24

యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.

 

తన మహాశక్తిని బలమును చూపించి ఎర్ర సముద్రమును పాయలు చేసిన శక్తిమంతుడు బలవంతుడు!!!..

నిర్గమకాండము 14:16

నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.

నిర్గమకాండము 14:21

మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

నిర్గమకాండము 14:22

నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

 

ఇంత బలవంతుడు గాని తన సేవకుల పక్షంలో లేక తన దాసుల పక్ష్యంగా తన కుమారుల పక్ష్యంగా యుద్ధాలు చేసేవాడు! సుమారు 40 లక్షలమందిని వారి పశువులను   40 సంవత్సరాలు పోషించి కనాను దేశంలో అనేక జాతులను సంహరించి వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్త్యముగా ఇచ్చిన బలవంతుడు మన దేవుడు!

అందుకే భక్తులు ఇలా అని కీర్తిస్తున్నారు ఆ బలవంతుడైన దేవుణ్ణి!

 

యోబు 36:5

ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.

 

సామెతలు 23:11

వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

 

యెషయా 49:26

యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.

 

యిర్మియా 50:34

వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడముట్టించును.

 

నిర్గమ 15:2

యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.

 

కీర్తన 21:1, 13

కీర్తనలు 21:1

యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.

కీర్తనలు 21:13

యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించు కొనుము మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.

 

కీర్తనలు 29:11

యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.

 

కీర్తనలు 59:11

వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లాచెదరు చేసి అణగగొట్టుము.

కీర్తనలు 59:16

నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసెదను

 

కీర్తనలు 62:11

బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

 

కీర్తనలు 63:2

నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

 

కీర్తనలు 65:6

బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే.

 

కీర్తనలు 68:28

నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము

74:4

78:4,26

84:5

93:1

105:4

15౦:1

ఇలా ఎన్నెన్నో రిఫరెన్సులు ఉన్నాయి. ఆయన బలవంతుడైన దేవుడు!  అటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు గనుక నీకంటే బలిష్టులు ధనవంతులైన నీ పగవారిని చూసి భయపడకు! నిన్ను రక్షించువాడు నిన్ను పోషించువాడు నీ దేవుడే!

కాబట్టి ఆయనమీద ఆనుకుని గమ్యానికి చేరుకుందాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*63వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-1*

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఈ 6వ వచనంలో ఆయన  నిత్యుడగు తండ్రి అంటున్నారు!  ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన పదాలు కనిపిస్తున్నాయి!

మొదటిది : నిత్యుడు అనగా ఎల్లప్పుడూ ఉండేవాడు, పూర్వకాలంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రాబోయేకాలంలో కూడా ఉంటారు;

 

రెండు: తండ్రి :

అనగా యెహోవా దేవుడు= యేసుక్రీస్తుప్రభులవారు

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తుప్రభులవారు ఈ భూలోకములో ఉన్నప్పుడు తండ్రిని ముందుకు పెట్టారు. తండ్రినే ఘనపరిచారు. ఇది మనకు బాగా అర్ధమవ్వాలంటే ఫిలిప్పీ పత్రిక 2:6 లో ఆయన దేవుని స్వరూపము కలిగి , దేవునితో సమానంగా అనగా తండ్రితో సమానంగా పరలోకంలో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు గాని దాసుని స్వరూపం దాల్చి తనను తానూ రిక్తునిగా చేసుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు అంటే సిలువమరణం పొందునంతగా తగ్గించుకున్నారు అంటున్నారు. అనేకచోట్ల బైబిల్ లో యేసుక్రీస్తు దేవుడే అని వ్రాయబడి ఉంది. అయితే ఇంతటి ఆధిక్యత ఉన్నా గాని ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ తండ్రియైన దేవునికి లోబడి ఆయనకు మహిమ తెచ్చే పనులు మాత్రమే చేశారు! యేసుక్రీస్తుప్రభులవారు తను ఈ భూలోకంలో జీవించినంత కాలము తండ్రికి లోబడి ఆయనకు విధేయుడుగానే జీవించారు. తండ్రికంటే ఉన్నతమైన స్థానాన్ని తనకు ఆపాదించుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు.

 

యోహాను 4:34

యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.

5:౩౦, 6:38, 8:29, 9:4, 14:౩1, 15:10, 17:4

 

అయితే తండ్రియైన దేవునితో సమానంగా ఉన్నా గాని ఈ భూలోకంలో ఆయననే మహిమ పరిచారు. అయితే తండ్రి మరియు తానూ కలిసే పనిచేస్తున్నట్లు చెబుతూ ఉండేవారు.

కాబట్టి ఈ వచనంలో రెండుసార్లు తండ్రితో సమానుడు అని ప్రవచిస్తున్నారు యెషయా గారు. మొదటగా ఆయన శిశువు,

రెండు ఆయన కుమారుడు-అనగా యేసుక్రీస్తుప్రభులవారు!

మూడు: ఆయన బలవంతుడైన దేవుడు! అనగా యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు!

నాలుగు ఇక్కడ నిత్యుడగు తండ్రి: అనగా తండ్రీ కుమారుడు ఏకీభవించి ఉన్నారు! దీనినే 1యోహాను పత్రికలో యోహాను గారు చెబుతున్నారు, గతంలో చెప్పినట్లు తెలుగులో తర్జుమా తప్పుగా చేశారు. ఇంగ్లీష్ లో సరిగా ఉంది......

1 యోహాను 5:7 లో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు: అనగా తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు.,

For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.

వీరు ముగ్గురు ఒక్కటే! అనగా ముగ్గురు ఒకరే!

ఇదీ సరియైన అనువాదం!

కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు మరియు తండ్రితో సమానుడు అని అర్ధం అవుతుంది ఇక్కడ!

 

యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వం కోసం గతంలో చెప్పడం జరిగింది కొలస్సీ పత్రిక మరియు కొరింథీ పత్రిక ధ్యానాలలో! అయితే మరలా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చూసుకుందాం!

 

           *యేసుక్రీస్తు దైవత్వము-1*

 

కొలస్సీయులకు 1: 15

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

 

    గతంలో చెప్పిన విధముగా యేసుప్రభులవారి దైవత్వాన్ని సవాలు చేసినట్లుగా మరి ఏ దేవుణ్ణి, దేవతను ఏ దేశములో కూడా ఇంతవరకు సవాలు చేయలేదు! అందుకే పరిశుద్ధాత్ముడు ముందుగా గుర్తెరిగి, పౌలుగారిని వాడుకొని, ఆ సవాళ్లు అన్నింటికీ ధీటైన జవాబుగా కొలస్సీపత్రికను వ్రాయించడం జరిగింది!

 

      ఈ వచనంలో ఆయన అనగా యేసుప్రభులవారు అదృశ్యదేవుని స్వరూపి అని రాస్తున్నారు! దేవుడు అదృశ్యుడు!! ఆయన మన కన్నులకు కనిపించరు!!! ఒకవేళ మన కన్నులు ఆయనను, ఆయన మహిమను, ఆ కోటివేల సూర్యకాంతులను చూస్తే మన కళ్ళు పేలిపోతాయి!! కీర్తనలు 50:2,3; ప్రకటన 4:3-5;

1తిమోతికి 6: 16

సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌!

 

  కాబట్టి మన కళ్ళతో ఆయనను చూడలేము! యోహాను 1:18 యేసుప్రభులవారు చెబుతున్నారు: ఎవరూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, ఆయన కుమారుడే లోకానికి దేవుణ్ణి బయలు పరిచాడు! అనగా ఆయన ఎలాంటివాడు, ఆయన గుణగణాలు ఎలాంటివి లోకానికి యేసుప్రభులవారి ద్వారానే తెలిసింది! ఇదే విషయం పౌలుగారు: సకల యుగములకు రాజై ఉన్నట్టియు, అక్షయుడగు అనగా క్షయము కాని వాడు, నాశనం కానివాడు, అదృశ్యుడును అనగా ఎవరికీ కనపడని వాడునూ, ఇంకా అధ్వితీయుడునూ- అనగా ఏకైక దేవుడు, మరో దేవుడు లేదు అంటున్నారు! 1 తిమోతీ 1:17;

ఇక 6:16 మరోసారి చూసుకుంటే

 సమీపింపరాని తేజస్సు, అమరుడు అనగా చావులేనివాడు, మనుష్యులలో ఇంతవరకు ఎవరూ ఆయనను చూడలేదు, చూడలేడు అంటున్నారు! అందుకే ఇలాంటి దేవుణ్ణి మోషేగారు అదృశ్యుడైనవానిని చూస్తున్నట్టుగా స్తిరబుద్ధికలవాడై విశ్వసించినట్లు చూస్తాం హెబ్రీ 11:27; ఆ తర్వాత నిజంగా మోషేగారు దేవునిమహిమను, మహిమ రూపాన్ని వెనుకనుంచి  చూసారు. ఇలా ఆయన మహిమను మంటిరూపముతో చూసిన వ్యక్తి మోషేగారు మాత్రమే! ఆ తర్వాత దేవుడు యేసుప్రభులవారి రూపంలో ఈలోకానికి వచ్చాక, అనేకులు దేవుణ్ణి/ యేసుప్రభులవారిని చూడగలిగారు! ఇలాంటి అదృశ్యదేవుణ్ణి ఆయన ఎలాంటివారో, యేసుప్రభులవారు వెల్లడిచేశారు! కారణం ఆయన మానవరూపం దాల్చిన దేవుడు! అందుకే కొలస్సీ 2:9 లో పౌలుగారు ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అని నొక్కివక్కానించి యేసుప్రభులవారే దేవుడు అని చెబుతున్నారు!

 

  యోహాను సువార్త మొదటి అధ్యాయం జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇది క్లియర్ గా అర్ధం అవుతుంది. 1:1 & 1:14 రెండూ కలిపి చదవాలి!  ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యమే దేవుడైయుండెను. . ఇదే వాక్యము శరీరదారియై కృపా సత్యసంపూర్ణునిగా మనమధ్య నివసించుచుండెను! ఆ శరీరదారి యేసుప్రభులవారు!

 Mathematics లో ఆల్జీబ్రా అనే విభాగం చేసినవారికి ఇది బాగా అర్ధం అవుతుంది. ఇవో పెద్ద సమీకరణాలు! ఇలాంటివి బైబిల్ లో చాలా ఉన్నాయి గాని మచ్చుకు రెండు చూద్దాం!

1). ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము= దేవుడు; వాక్యము శరీరధారియై భూలోకానికి వచ్చెను. అలా వచ్చినది ఎవరు?  శరీరదారి= యేసుప్రభులవారు.  కావున వాక్యము= శరీరదారి= యేసుప్రభులవారు. కాబట్టి దేవుడు = యేసుప్రభులవారు!!!

 

2). 2&3 వచనాలు ప్రకారం ఆయన సృష్టికర్త! అనగా దేవుడు. 4,5,6,9 ప్రకారం వెలుగు ఉంది, ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది గాని లోకము దానిని గ్రహించలేదు! యేసుప్రభులవారు నేను లోకమునకు వెలుగును అన్నారు 8:12;

కావున సృష్టికర్త= దేవుడు; వెలుగు= ఏసుప్రభువు; వెలుగు = దేవుడు; కావున దేవుడు = యేసుప్రభులవారు!!!

 

    యోహాను 14:9 లో ఫిలిప్పు యేసయ్యను అడుగుతారుమాకు తండ్రిని చూపించు, అంతేచాలు! అందుకు యేసుప్రభులవారు అన్నారు: ఫిలిప్పు నన్ను చూస్తే, తండ్రిని అనగా దేవుణ్ణి చూసినట్టే, కారణం మేమిద్దరం కలసి యున్నాము! 14:20; అనగా నేనే తండ్రి, తండ్రి= నేను,

కావున తండ్రి= దేవుడు = యేసుప్రభులవారు!!

కావున ఆయనే తండ్రి, దేవుని స్వరూపం!

 

 మరొకసారి మీకు గుర్తుచేస్తున్నాను, ఇశ్రాయేలీయులు యేసుప్రభువులవారిని ఎందుకు చంపించారు?

1. నేను దేవుని కుమారుణ్ణి అనడం,

2. తండ్రి నేను కలసి ఉన్నాము అనడం. అంటే నేనే దేవుణ్ణి అనడం వల్లనే!!

ఇప్పడు పందికి పిల్ల పుడితే పంది అవుతుంది. కోతికి పిల్ల పుడితే కోతి అవుతుంది. మనిషికి పిల్ల పుడితే మనిషి అవుతాడు. అదే దేవుడికి కుమారుడు ఉంటే దేవుడౌతాడు. అంతేకదా! ఈ విషయం యూదులకు తెలుసు కాబట్టి వారు మండిపడి యేసయ్యని చంపారు. ఇంత చిన్నవిషయం వీరికి తెలియకుండా పోయింది.  ఇంత చిన్న లాజిక్ ప్రజలకి అర్ధం కాకుండా పోతుంది.

 

   ఇంకా మనకు 2 కొరింథీ 4:4 లో దేవుని స్వరూపియైన క్రీస్తుమహిమ . . . అంటున్నారు. యేసుప్రభులవారు= దేవునిస్వరూపి; ఇంకా హెబ్రీ 1:3 .హెబ్రీయులకు 1: 3

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక . .  చూడండి ఎంతక్లియర్ గా చెబుతున్నారో.

కాబట్టి యేసుక్రీస్తు = దేవునిస్వరూపి = దేవుడు!

ఆ నిజదేవున్ని ఎవరైతే తెలుసుకోగలరో వారు జ్ఞానము గలవారు, ధన్యులు! పరలోకానికి హక్కుదారులు!!

 

అట్టి ధన్యత ప్రతీ ఒక్కరికీ కలుగును గాక!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*64వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-2*

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తూ- యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వాన్ని ధ్యానం చేస్తున్నాము!! కొద్దిగా కొలస్సీ పత్రికలో ఇవ్వబడిన వివరాలను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

        కొలస్సీయులకు 1: 15

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

 

   సర్వసృష్టికి ఆదిసంభూతుడు! ఆదిసంభూతుడు అనగా చాలా అర్ధాలున్నాయి: సృష్టిని చేసినవాడు/ సృష్టికర్త, ప్రముఖుడు, ప్రధముడు, అధిపతి . . .

ఆదిసంభూతుడు ప్రముఖుడు= ఇది ప్రోటోటొకస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి తెలుగులో అర్ధం ప్రముఖత్వాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో మనకు కనబడే సృష్టికర్తయైన తండ్రియైన దేవుణ్ణి కూడా ఇదేమాటతో అభివర్ణించారు! ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని లోకమంతటికి ప్రభువని, సృష్టికర్తయని, ప్రముఖుడు అని అంటున్నారు! తర్వాత వచనాలు అనగా 16,17 చూసుకుంటే పౌలుగారు అదేభావంతో ఈ మాటను పలికినట్లు అర్ధం అవుతుంది. 16వ వచనం ప్రకారం ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయనకోసం ఈ సమస్తసృష్టి చేయబడింది అనగా సృష్టికర్త!! మరి ఆదికాండం మొదటి అధ్యాయం ప్రకారం, యెషయా 44, హెబ్రీ 11:3 యెహోవా దేవుడు సృష్టికర్త! మరి పౌలుగారు యేసుప్రభులవారు సృష్టికర్త అంటున్నారు. ఇద్దరు సృష్టికర్తలున్నారా? లేదు! ఒక్కరే! ఎందుకంటే ఇద్దరూ ఒక్కరే! తండ్రియైన యెహోవాదేవుడే కుమారుడైన యేసుప్రభువు!!!

అది ఎలాగో, ఆయన ఎలా సృష్టికర్త అయ్యారో ధ్యానం చేద్దాం! అదేవిధముగా ఆయన ఎలా ప్రభువు అయ్యారో కూడా ధ్యానం చేద్దాం!

 

 1).  1కోరింథీయులకు 8: 6

ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

తండ్రియైన దేవుడు= సృష్టికర్త

కుమారుడు= ప్రభువు= సృష్టికర్త

కావున తండ్రియైన దేవుడు= సృష్టికర్త= యేసుక్రీస్తు.

 

2). హెబ్రీ 1:10-12 జాగ్రత్తగా ధ్యానం చేస్తే . .. దీని అర్ధం భూమికి పునాదులు వేసింది యేసుప్రభులవారు అనగా సృష్టికర్త= తండ్రియైన దేవుడు.

 

3)  ఇక గతభాగం లో చూసుకున్న రెండు సమీకరణాలు చూస్తే:

     వాక్యము= దేవుడు/తండ్రి;

వాక్యము శరీరధారియై భూలోకానికి వచ్చెను. అలా వచ్చినది ఎవరు?  శరీరదారి= యేసుప్రభులవారు.  కావున వాక్యము= శరీరదారి= యేసుప్రభులవారు. కాబట్టి దేవుడు = యేసుప్రభులవారు!!!

వాక్యము= దేవుడు = యేసుప్రభులవారు       కలిగియున్నదేదియు ఆయనలేకుండా కలుగులేదు= సృష్టికర్త

వాక్యము= శరీరదారి= సృష్టికర్త= యేసుప్రభులవారు

 

4). ఇక ఎఫెసీ 3:9 ఈ వచనం కూడా తెలుగు భాషలో సరిగా తర్జుమా చేయబడలేదు. ఇంగ్లీష్లో “Ephesians 3: 9

And to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ:

  “ అనగా సమస్తమును యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడెను!! అనగా యేసుక్రీస్తు సృష్టికర్త!!

 

5). ఇక ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్న కొలస్సీ 1:16-17 వచనాలలో యేసుక్రీస్తు సృష్టికర్త అని రూడిగా తెలియజేస్తున్నాయి!

ఇంకా చాలా రెఫెరెన్సులు ఉన్నాయి గాని ఇవి చాలు యేసుప్రభులవారు సృష్టికర్త అనియు, ఆయనే తండ్రి అనియు చెప్పడానికి!!!

 

   ఇక  ప్రోటోటొకస్ కి మరో అర్ధం ప్రభువు అనగా యేసుప్రభులవారిని ప్రభువు అనికూడా చెప్పబడింది. క్రొత్తనిబంధనలో యేసయ్యను ప్రభువు అని కొన్నివందల సార్లు వ్రాయబడింది! వాటిలో కొన్నింటిని మాత్రం చూద్దాం!

 

1). లూకా 2:11 లో దేవునిదూత గొర్రెలకాపరులతో దావీదు పట్టణమందు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు!! అని చెప్పడం జరిగింది. మొదటగా రక్షుకుడు, తర్వాత ప్రభువు! యేసయ్యను ప్రభువుగా లోకమునకు పరిచయం చేసింది దేవదూతలే!!!

 

2). మత్తయిసువార్త 22:41-45 లో పరిసయ్యులతో యేసయ్య మాట్లాడుతూ దావీదు: ప్రభువు నా ప్రభువుతో అంటున్నారు, మీరు మెస్సయ్యను/ క్రీస్తుని దావీదు కుమారుడు అంటున్నారు కదా మరి మెస్సయ్య దావీదు కుమారుడు ఎలా అవుతాడు? దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుంటే అన్నారు. కాబట్టి మెస్సయ్య అనగా క్రీస్తు , అభిషక్తుడు ప్రభువు అని దావీదుగారు ముందే ప్రవచించారు!

 

3) అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు దినాన్న ఆది అపోస్తులులపై ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత పేతురుగారు ఆత్మావేశుడై అంటున్నారు ప్రజలతో: మీరు సిలువవేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, రక్షకునిగాను, అభిషక్తునిగాను నియమించెను అంటున్నారు!!!  2:36; ఇది తిరుగులేని మాట!!

 

4) ఇక మీద ఉదహరించినట్లు 1 కొరింథీ 8:6 ప్రకారం ఒకే దేవుడు, ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త; ఒకే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త!!!

 

5) ఫిలిప్పీ 2:10-11 ప్రకారం ప్రతీ నాలుక యేసు- ప్రభువని ఒప్పుకొనును.

 

  కాబట్టి యేసుక్రీస్తు పభువు ఆయన. రక్షకుడు, అభిషక్తుడు! గ్రీకు భాషలో ప్రభువు అనేమాట కురియస్ అని కూడా ఉపయోగించారు. పాతనిబంధనలో యెహోవా దేవుణ్ణి ఇదే కురియస్ అనే మాటతో అభివర్ణించారు.

క్రొత్తనిబంధనలో యెహోవా అనే మాటకు బదులుగా అదే అర్ధమిచ్చే ప్రభువు అనేమాట వాడారు!!

ఇంకా యేసు- ప్రభువు అని ఎక్కడ రాసి ఉంది రిఫరెన్సులు కావాలంటే: మత్తయి 3:3; 23:27; యోహాను 8:24-25, 58; 10:11; 12:41; అపో 2:21; రోమా 10:9-10, 13; 1 కొరింథీ 1:31; 2:8; 10:4; ఎఫెసీ 4:10; ఫిలిప్పీ 2:10-11; తీతు 2:13; హెబ్రీ 1:10-12; యూదా 5; ప్రకటన 19:16. చివరికి బైబిల్ ప్రభువైన యేసు అనే వచనముతో ముగుస్తుంది!!!

 

  కాబట్టి యేసుప్రభుల వారు సృష్టికర్త, ప్రముఖుడు, ప్రభువు అని గుర్తెరిగి, ఆయనకు ఇవ్వాల్సిన ఘనత, గౌరవం ఇద్దాం!

ఆయన దైవత్వాన్ని గుర్తించి మనలో ఉన్న అవిశ్వాన్ని, సందేహాలను తొలగించుకొందాం!

 

ప్రభువైన యేసూ! రమ్ము! ప్రకటన 22:20;

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*65వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-3*

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తూ- యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వాన్ని ధ్యానం చేస్తున్నాము!! కొద్దిగా కొలస్సీ పత్రికలో ఇవ్వబడిన వివరాలను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా! మనం గత రెండురోజులుగా యేసుప్రభులవారు దైవత్వం కోసం ధ్యానం చేస్తున్నాం! ఎలాగూ సందర్బం వచ్చింది కాబట్టి ఈరోజు యేసుప్రభులవారు- యెహోవాదేవుడు ఒక్కరేనా? ఇద్దరా? వీరిద్దరిలో ఎవరిని పూజించాలి? అనే ప్రశ్నలకోసం క్లుప్తంగా ధ్యానం చేద్దాం! దీనికోసం ఎంతోమంది బైబిల్ పండితులు ఎప్పుడో చెప్పారు, నేను బైబిల్ పండితుడిని కాను, మేధావిని కాను గాని నాకు తెలిసినంతవరకు క్లుప్తంగా చూసుకుందాం!

 

   మొదటగా మరలా యోహానుసువార్తలో గల సమీకరణం మరోసారి చూసుకుందాం!

1). వాక్యము = దేవుడు = యెహోవాదేవుడు

వాక్యము = శరీరదారి = యేసుక్రీస్తు

వాక్యము = యెహోవాదేవుడు = యేసుక్రీస్తు ;

 

2). వాక్యము = సృష్టికర్త = యెహోవాదేవుడు

    వాక్యము = సృష్టికర్త= యేసుక్రీస్తు

   యెహోవాదేవుడు = యేసుక్రీస్తు

 

3) 1 కొరింథీ 8:6 ప్రకారం ఒకేదేవుడు = తండ్రి= సృష్టికర్త

       ఒకే ప్రభువు= యేసుక్రీస్తు = సృష్టికర్త

   తండ్రి/ యెహోవాదేవుడు = యేసుక్రీస్తు

 ఇలా ఎన్నో సమీకరణాలు నిరూపించవచ్చు యేసుక్రీస్తు= యెహోవాదేవుడు అని!

 

    ఇక యోహానుసువార్తలో యేసుప్రభులవారు తన నోటితో చాలా స్పష్టముగా చెప్పారు నేను- తండ్రి ఏకమై యున్నాము. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే! అనగా నేను తండ్రి ఒక్కటే! అనగా నేనే దేవుణ్ణి. యోహాను 14వ అధ్యాయం. ఈ సువార్తలో అనేకసార్లు యేసయ్య నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పారు. అనగా నేను దేవుణ్ణి= యెహోవాను అని. ఇక గతభాగంలో మనం యేసుక్రీస్తు సృష్టికర్త అని నిరూపించుకున్నాం!

ఇక ఈరోజు యేసుప్రభులవారే- తండ్రియైన దేవుడు అది ఎలాగో చూద్దాం!

 

1). యెషయా 9: 6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు *కుమారుడు* అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త *బలవంతుడైన దేవుడు* *నిత్యుడగు తండ్రి* సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

మొదట కుమారుడు, తరువాత దేవుడు, ఆయనే నిత్యుడగు తండ్రి.  Son= Everlasting Father.

ఈ వచనంలో కుమారుడు అని ఎవరిని అన్నారో మానవాళి మొత్తానికి తెలుసు! కాబట్టి కుమారుడు= యేసుక్రీస్తు= నిత్యుడగు తండ్రి = యెహోవా దేవుడు!!

 

2) పాత నిబంధనలో యెహోవాదేవుడు మాత్రమే “నేను” అనే మాట వాడారు! నేను ఉన్న వాడను, అనువాడను. నిర్గమ 3:14-15;

 అదేమాట క్రొత్తనిబంధనలో కేవలం యేసుప్రభులవారు మాత్రమే వాడారు! నేను లోకమునకు వెలుగును! యోహాను 8:12; నేను నిజమైన ద్రాక్షావల్లిని యోహాను 15; నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును; యోహాను 14:6; ఇంకా చాలా రిఫరెన్సులు ఉన్నాయి. కాబట్టి యెహోవా దేవుడు= యేసుక్రీస్తు.

 

3) నేను మొదటివాడను, కడపటి వాడను. యెషయా 44:6, 48:12;

 యేసుప్రభులవారు అంటున్నారు: నేను ఆల్ఫా ఒమేగాను, మొదటివాడను, కడపటి వాడను ప్రకటన 22:13, 16;

కావున యేసుక్రీస్తు= యెహోవాదేవుడు;

 

4) దేవాదిదేవుడు, రాజాదిరాజు : దానియేలు 2:47= యెహోవా దేవుడు;

యేసయ్య= దేవాదిదేవుడు, రాజాదిరాజు : 1 తిమోతీ 6:13-15; ప్రకటన 17:14; 19: 16;

కాబట్టి యెహోవా దేవుడు = యేసుక్రీస్తు

 

5) యెషయా 44:6 లో యెహోవాదేవుడు అంటున్నారు: నేనే దేవుడ్ని మరో దేవుడు లేడు! అయితే యేసుప్రభులవారు పునరుత్థానుడైన తర్వాత తోమాకు కనిపించినప్పుడు తోమాకు కలిగిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతతో అంటున్నారు తోమాగారు: నా ప్రభువా! నా దేవా!  యోహాను 20:28-29; మొదట ఆయన నా ప్రభువా అని పిలచి, తర్వాత నా దేవా అంటున్నారు. యేసుప్రభులవారి మాటల ప్రకారం పేతురుగారితో: శరీరమాత్రులు నీకు బయలుపరచలేదు గాని నాతండ్రి బయలు పరిచారు. మత్తయి 16:17;  అలాగే ఇక్కడ తోమాగారికి కలిగిన ప్రత్యక్షత ఇది!! గతభాగంలో యేసయ్య ప్రభువు అని నిరూపించాము,

ఇక ఫిలిప్పీ 2:10-11 ప్రకారం ప్రతీనాలుక యేసుప్రభువని ఒప్పుకోవలసినదే!!

1 కొరింథీ 8:6; ఎఫెసీ 4:4-5; యూదా 4; తీతు 2:13 ప్రకారం ఆయన ప్రభువు, మహాదేవుడు, యజమాని. కాబట్టి యేసుక్రీస్తు= యెహోవా దేవుడు!

 

6) యెహోవా దేవునికోసం వాడబడిన బిరుదులు యేసుప్రభులవారికోసం కూడా వాడారు! ఆయన నిత్యత్వము, సృష్టికర్త, నిత్యుడు యోహాను 1:1-2; కొలస్సీ 1:17; హెబ్రీ 1:10-12, కీర్తనలు 102:25-27

 

7) పరిశుద్ధుడు:  మార్కు 1:24; లూకా 4:34; యోహాను 6:69 యేసు పరిశుద్ధుడు! అపో 2:27; 13:35; ప్రకటన 3:7; పరిశుద్దుడు, నీతిమంతుడు అపో 3:14; కీర్తన 81:18; యెషయా 48:17; యిర్మియా 51:5, యేహెజ్కేలు 39:7;

 

8) యెహోవాదేవుడు చేసిన పనులు యేసుప్రభులవారు చేసారు.

a) సృష్టికర్త యోహాను 1:3; కొలస్సీ 1:16; హెబ్రీ 1:2; == యెషయా 44:24; నెహేమ్యా 9:6.

b) భూమికి పునాది వేసెను: హెబ్రీ 1:8,10 == కీర్తనలు 102:12,25; ఆది 1:1; 2:4; యెషయా 42:5

c) పాప క్షమాపణ: మత్తయి 9:2-6; మార్కు 2:5-10; లూకా 5:20-24; 7:47-49, 1 యోహాను 1:9 == యెహోషువా 24:19; కీర్తన 25:18; 2:5; 79:9; యెషయా 42:5;

d) తీర్పుతీర్చువాడు: యోహాను 5:22,27; అపో 10:42; 17:3; రోమా 2:16; 2 కొరింథీ 5:10; 2 తిమోతీ 4:18 == ఆదికాండం 18:25; 1 సమూయేలు 2:10; 1 దినవృత్తాంతాలు 16:33;కీర్తన 9:7,19 . . . .

 

    ప్రియులారా! ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి గాని, ఇవి చాలును మనకు యేసుక్రీస్తు ప్రభువే, తండ్రియైన యెహోవాదేవుడు!

 

మరి ఇప్పుడు వీరిద్దరిలో ఎవరిని పూజించాలి? 

 It’s a Stupid Question! యెహోవాదేవుడే యేసుక్రీస్తు అయినప్పుడు యేసయ్యను పూజిస్తే యెహోవాదేవుణ్ణి పూజించినట్టే! ఇక యెహోవాదేవుణ్ణి పూజించే విధివిదానాలే వేరు, ఆయనను పూజించేటప్పుడు బలియర్పణ తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ లేకుండా వాటికి ఒక్కమారే పరిష్కారంగా యేసయ్య సిలువలో బలియాగమై ఆ పద్దతులు కొట్టివేశారు. అందుకే మనం యేసయ్యను పూజిస్తున్నాం అనగా తండ్రియైన దేవుణ్ణి కూడా పాతనిభందన పద్దతిలో కాకుండా క్రొత్తనిబంధన పద్దతిలో పూజిస్తున్నాం!

 

  ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా యేసుక్రీస్తు- యెహోవాదేవుడు ఒకరే అయినప్పుడు కేవలం యేసుక్రీస్తునే ఎందుకు పూజిస్తున్నారు, యెహోవాదేవుణ్ణి directగా ఎందుకు పూజించటం లేదు అని అడిగితే: పైన చెప్పిన జవాబు చెప్పి, ఈ క్రింది జవాబు చెప్పండి:

 

1) యేసుప్రభులవారు తండ్రియొద్దకు వెళ్ళడానికి నేనే మార్గము అన్నారు కాబట్టి అనగా పరలోకం, రక్షణ, పాపక్షమాపణ కావాలంటే యేసుప్రభులవారే కావాలి కాబట్టి,

 2) మన ప్రార్ధన చివరలో యేసునామమున అడుగుచున్నాము తండ్రి అని తండ్రినే ప్రార్ధిస్తున్నాము కాబట్టి,

3) మనం భాప్తిస్మము పొందినది: తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మునియొక్కయు నామములోనికి అనగా ఈ ముగ్గురి నామమైన యేసునామములో భాప్తిస్మము తీసుకున్నాం కాబట్టి యేసుప్రభులవారినే పూజిస్తున్నాము!!!

 

   కాబట్టి ప్రియులారా! ఎవరైనా మీకు తప్పుడుభోదలు చేస్తుంటే, ముఖ్యంగా యెహోవాసాక్షులు , వారికి సమాదానముగా ఇవి చెప్పండి. యేసుప్రభువుని పూజిస్తూ మీరు సరియైన మార్గములోనే ఉన్నారని నిర్ధారణ చేసుకుని, ఆయనకు భయపడి, ఆయనను భయభక్తులతో పూజిద్దాం!

ఆమెన్!

 

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*66వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-4*

 

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తూ- యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వాన్ని ధ్యానం చేస్తున్నాము!! కొద్దిగా కొలస్సీ పత్రికలో ఇవ్వబడిన వివరాలను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

*యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ లో ఎక్కడుంది?*

 

    ఈరోజు యేసుప్రభులవారు దేవుడు అని బైబిల్ లో ఎక్కడ వ్రాయబడింది అని చాలామంది అడుగుతుంటారు కదా! ఎక్కడ వ్రాయబడి ఉన్నదో చూసుకుందాం!

 

   గతభాగాలలో మనం ధ్యానం చేస్తూ- యేసుప్రభులవారు అనేకసార్లు తండ్రీ-నేను ఏకమైయున్నాము, (యోహాను 10:30), నన్ను చూసినవారు తండ్రిని చూసినట్లే (యోహాను 14:9), అనగా నేనే తండ్రిని, దేవుణ్ణి అని చెప్పారు. ఇక్కడ కొంతమందికి సందేహం కలుగువచ్చు, అది ఎలా?  ఒకసారి ఆగి ఆలోచిద్దాం! యెషయా 44:2; హెబ్రీ 11:3; కీర్తనలు 33:6 సమస్తమును తండ్రియైన దేవునిమూలముగా , ఆయన వాక్కుద్వారా కలిగెను. యోహానుసువార్త మొదటి అధ్యాయం ప్రకారం. ఆ వాక్యము శరీరదారిగా, కృపాసత్య ... మనమధ్య వశించెను. వాక్యము= శరీరదారి, ఇదే వాక్కు సమస్తమును సృష్టించెను!  కావున యేసుప్రభులవారు సృష్టికర్త మరియు దేవుడు!

 

    ఇక ఆ దేవునికి మనుష్యులతో గడపటం ఇష్టం! అందుకే మానవులను చేసుకున్నారు, అందుకే చల్లనిపూట ఆదాము హవ్వలతో షికారు చేయడానికి ఏదేను వనముకి దేవుడు వచ్చి, వారితో ముచ్చటించేవారు. ఆదికాండం 3:8. అయితే సర్పము/ సాతాను కుయుక్తి వలన మోసపోయి, పాపంలో పడిపోయి, ఆ సహవాసం కోల్పోయాడు మానవుడు. దేవునితో సహవాసం ఆగిపోయింది. అయితే జెకర్యా 2:10 లో దేవుడు మరలా మానవులతో వాగ్దానం చేస్తున్నారు “సీయోను వాసులారా! నేను మీ మధ్య నివాసం చేస్తాను” ఇదే *యెహోవావాక్కు*!!! *అదే వాక్కు శరీరదారిగా మనమధ్య నివసించెను*.

యోహాను 1:14; శరీరదారి అనగా వాక్కు అనగా యేసుప్రభులవారు మనతో నివాసం చేయడానికి భూలోకానికి వచ్చారు.

అయితే ఎందుకు వచ్చారు?

1) మానవులతో సహవాసం చేసి, తిరిగి దేవునితో వారిని సమాధాన పరచి, సందిచేసి, దేవునితో సహవాసం/ లింక్ ఏర్పాటు చేద్దామని; కొలస్సీ 1:20-22;

 2) వారి పాపాలు తీసివేయాలని;

 

    మరి యెహోవాదేవుడు భూమిమీదకు వచ్చారా? అంటే ఆయనవాక్కు ఆయన వాక్యము యేసయ్య రూపంలో శరీరదారిగా భూమిమీదకు రావడం జరిగింది. ఇది ఇంకా బాగా అర్ధం కావడానికి బైబిల్ పండితులు చక్కని ఉదాహరణ చెబుతారు: ఒక మనిషి గోతిలో పడిపోయి రక్షించండి అని అరుస్తున్నాడు. మరి ఆవ్యక్తిని గోతిలోనుండి తీయాలి అంటే మరో వ్యక్తి ఆగోతిలోనికి దిగితే పడిన వ్యక్తిని తీయగలడా? తీయలేడు కదా! ఆ వ్యక్తి ఒడ్డున ఉండి, తనచేయి చాపిగాని, ఒక త్రాడు ఇచ్చి గాని ఆ వ్యక్తిని తీయాలి. *ఇక్కడ గోతిలో పడిన వ్యక్తి మానవుడు; ఒడ్డున ఉండి చేయి అందించినది యెహోవాదేవుడు. ఆ చేయి అనగా ఆయనవాక్కు = యేసుప్రభులవారు*!!! ఇదీ బైబిల్ పండితుల వివరణ!!

 

   అయితే దురదృష్టవశాత్తు ఆ గొయ్య సాతానుగాడి వశంలో ఉంది! ఇప్పుడు మానవుని రక్షించడానికి వాడు ఒప్పుకోవడం లేదు, దానికి మూల్యం చెల్లించమన్నాడు, అది ఆయన ప్రాణం, ఆయన రక్తం! యేసుప్రభులవారు ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మానవులకోసం బలిగా ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకోసమే ఆయన వచ్చారు! రక్తమిచ్చి, మనల్ని పాపగోతినుండి విడిపించారు, ఆయన చనిపోయారు. సాతానుగాడు గెలిచినట్లు పండగచేసుకున్నాడు, గాని ఆయన మూడవరోజు విజయుడై, లేచి, చెరను చెరగా తీసుకుపోయారు. ఎఫెసీ 4:8; వాడి కబంధహస్తాలలో ఉన్న మానవాళిని విడిపించారు. ఆయన దేవుడు, దైవ మానవుడు; ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఇదీ జరిగింది! జెకర్యా 2:10 ప్రకారం దేవుడు తనవాక్కును పంపించి, మానవులను విడిపించి, మానవులతో సహవాసం చేస్తున్నారు!

 

  ఇంతవరకు యేసుప్రభులవారు శరీరదారిగా ఎందుకు వచ్చారో చూసుకున్నాం! ఇక దేవుడు అని ఎక్కడుందో చూసుకుందాం! ఆయన నోటితోనే నేను- తండ్రి ఏకమైఉన్నాము , నేనే తండ్రిని అని చెబుతున్నా చాలామందికి అర్ధం కావడం లేదు, గాని యూదులకు అర్ధమయ్యింది, అందుకే ఆయనను ఘోరాతిగోరంగా చంపించారు!

ఇక మనం Direct References చూసుకుందాం!

 

1). మొదటగా పాతనిబంధన నుండి ధ్యానం చేసుకుందాం!

యెషయా 9: 6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు *కుమారుడు* అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త *బలవంతుడైన దేవుడు* *నిత్యుడగు తండ్రి* సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

  ఆయన మొదట కుమారుడు = యేసుప్రభువు, తర్వాత బలవంతుడైన దేవుడు, చూశారా ఎంత స్పష్టంగా రాయబడిందో, ఆ తర్వాత నిత్యుడగు తండ్రి= యెహోవాదేవుడు. కాబట్టి ఇక్కడ యెహోవాదేవుడే యేసుప్రభులవారుగా జన్మిస్తారు అని ఏడువందల సం.ల క్రితమే యెషయా గారు ప్రవచించారు!

 

2) మరలా యోహాను సువార్త మొదటి అధ్యాయము. వాక్యము= దేవుడు; వాక్యము= శరీరదారి = యేసుక్రీస్తు; కాబట్టి దేవుడు= యేసుక్రీస్తు

 

3) గతభాగంలో చూసుకున్నట్లు , యేసయ్య పునరుత్థానం అనంతరం- తోమాగారికి కలిగిన ప్రత్యక్షత : నా ప్రభువా! నాదేవా! ఇక్కడ తోమాగారు యేసుప్రభులవారిని దేవా అనగా నా దేవుడా అని పిలుస్తున్నారు! యోహాను 20:28-29;

 

4) అపోస్తలుల కార్యములు 20:28 లో లూకాగారు, పౌలుగారు అత్మాభిషేకంతో చెబుతున్న మాటను రికార్డు చేసి రాస్తున్నారు: దేవుడు తన స్వరక్తమిచ్చి, సంపాదించిన సంఘము . . ..   ఈ భాగం ప్రకారం తన స్వరక్తమిచ్చినది ఎవరు? ఏ దేవుడు? యేసుప్రభులవారు మాత్రమే!! కాబట్టి ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని దేవుడు అని పిలుస్తున్నారు!

 

5) రోమీయులకు 9: 5

పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. *ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.*

   ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని సర్వాదికారియైన దేవుడు అంటున్నారు! ఇది డైరెక్ట్ రెఫరెన్సు కాదా!

 

6) కొలస్సీ 1:15-17 ఈయన అదృశ్య దేవుని స్వరూపి అంటున్నారు. ఇంకా సృష్టికర్త అంటున్నారు. అనగా దేవుడే కదా!

 

7)  కొలస్సీయులకు 2: 9

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

 ఇది తిరుగులేని statement!! దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అనగా దేవుడు ఎప్పుడైనా మానవునిగా మారితే, దేవునియొక్క సంపూర్ణ లక్షణాలు కలిగినది  అది యేసుప్రభులవారే!!

 

8) ఫిలిప్పీ 2:6-8; ఆయన దేవుని స్వరూపము గలవాడైయుండి. . . . అనగా దేవుని స్వారూప్యము అనగా దేవుడు, మానవులకోసం పరలోకం వదలి భూలోకానికి వచ్చారు అని స్పష్టముగా రాస్తున్నారు!

 

9) 1 తిమోతీ 4:10; మనుష్యులందరికీ రక్షకుడు, విశ్వాసులకు రక్షకుడునైన *జీవముగల దేవునియందు* . .. . ఇక్కడ మనుష్యులందరికీ రక్షకుడు ఎవరు? యేసుప్రభులవారు మాత్రమే కదా! ఆయన పేరే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు!! కాబట్టి ఇక్కడ యేసుప్రభులవారిని జీవముగల దేవుడు అని అభివర్ణించారు!

 

10) 2 పేతురు 1:1 మన దేవునియొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు . . . ఇక్కడ పౌలుగారే కాదు పేతురు గారు కూడా యేసయ్యను దేవుడు అని పిలుస్తున్నారు!

 

11) చివరగా తిరుగులేని Direct Super Statement: తీతుకు 2:13

అనగా *మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు* మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

ఇక్కడ పౌలుగారు *యేసయ్యను దేవుడు అనడం లేదు- మహాదేవుడు* అంటున్నారు!!! Great God and Saviour Jesus Christ.

 

   మరి ఇన్ని direct statements/ references ఉంటే ఎక్కడ రాసి ఉంది చూపించండి అని అడుగుతున్నారు కదా, అసలు వీడెప్పుడైనా బైబిల్ చదివితే కదా! దేవునివాక్యం జాగ్రత్తగా చదివి, పరిశీలిస్తే ఇవన్నీ మనకు అర్ధం అవుతాయి గాని ఏదో అలా చదువుకుంటూ పోతే ఏమీ అర్ధం కాదు! కాబట్టి ప్రియ క్రైస్తవులారా! బైబిల్ ప్రతీరోజు చదవండి! అర్ధం చేసుకోండి! ఇలాంటి తప్పుడుబోధలకు, ముఖ్యంగా యెహోవా సాక్షులు లాంటివారికి బుద్ధి చెప్పండి! 

 

  పైన ఉదాహరించినట్లు యేసుప్రభులవారు రక్షకుడు, దేవుడు, ప్రభువు,సృష్టికర్త! మరి నీవు ఆయనను నీ రక్షకుడిగా, యజమానిగా, ప్రభువుగా అంగీకరించావా? అయితే నీవు ధన్యుడవు!!

ఒకవేళ ఇంకా అంగీకరించలేదా? ఇప్పుడే నీ పాపములు ఒప్పుకుని, నీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించు!

నీ హృదయం ఆయనకివ్వు!

ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్ధముగా ఉన్నారు!

 

God Bless You!

Amen!

*యెషయా ప్రవచన గ్రంధము*

*67వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-5*

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తూ- యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వాన్ని ధ్యానం చేస్తున్నాము!! కొద్దిగా కొలస్సీ పత్రికలో ఇవ్వబడిన వివరాలను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

      కొలస్సీయులకు 1: 16

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

 

   ప్రియ దైవజనమా! ఇక 1:16 లో యేసయ్య సృష్టికర్త ఎలా అయ్యారో వివరంగా రాస్తున్నారు. దీనికోసం గతభాగాలలో విపులంగా ధ్యానం చేసుకున్నాం కాబట్టి అంతగా లోతుగా కాకుండా క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!

 

    ఏలయనగా ఆకాశమందున్నవి గాని, భూమియందున్నవిగాని, అనగా ఆకాశ నక్షత్రాలు, గ్రహాలూ, దూరంలో ఉన్నవి, దగ్గరలో ఉన్నవి, మన నేత్రాలకు కనిపించేవి, కనబడనివి, కేవలం టెలిస్కోప్ లోనే కనిపించేవి , ఇక భూమిపై ఉన్న జీవరాశులు, అనగా మనుష్యులు, పశువులు, జంతువులూ, పక్షులు, సముద్రంలో గల జలచరాలు అన్నీ దేవుడే సృష్టించారు! అది ఇక్కడ ఆ సృష్టికర్త యేసుప్రభులవారు అని పౌలుగారు రూడిగా చెబుతున్నారు! ఆయన భూమిని ఎలా తయారుచేసారో మనకు ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నా, ఆయన జ్ఞానం, ఆయన వాక్కు ఎలా భూమిని చేసెనో, ఎలా స్తిరపరచెనో , ఈ ఋతువులన్నీ సక్రమంగా ఎలా జరుగుతున్నాయో సామెతలు 8:21-34 వరకు మనకు స్పష్టముగా కనిపిస్తుంది. ఆయన జ్ఞానము వర్ణింపలేనిది, వివరించలేనిది!! అందుకే ఆయన సృష్టి మొత్తము చేసి, మానవునికి కావలసినవి అన్నీ ముందుచేసి ఆ తర్వాత మానవుని చేసారు. కాబట్టి ఇవన్నీ చేసినది దేవుడే కాబట్టి మనం ఆయనకు భయపడాలి!

 

  ఇంకా ముందుకుపోతే, దృశ్యమైనవి, అదృశ్యమైనవి అనగా ఇక్కడ అదృశ్యమైనవి అనగా- తర్వాత మాటలలో సింహాసనములు ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు సర్వమును ఆయనయందు, ఆయనద్వారా సృజింపబడెను అంటున్నారు. english బైబిల్ లోను, ఇంకా కొన్ని ప్రతులలోను ఆయనద్వారా, ఆయనయందు, ఆయనకోసం సృజింపబడెను అని రాసున్నారు.

For by him were all things created, that are in heaven, and that are in earth, visible and invisible, whether they be thrones, or dominions, or principalities, or powers: all things were created by him, and for him:

 

  కొద్దిగా ఆగి ఆలోచిద్దాం! ఇక్కడ పౌలుగారు సమస్తమును ఆయనద్వారా, ఆయన బట్టి సృజింపబడెను అని చెబుతూ, అవి: సింహాసనములు, ప్రధానులు, అధికారులు అని ప్రత్యేకముగా చెప్పటానికి బహుశా రెండు కారణాలున్నాయి.

 

1). మొదటిభాగంలో వివరించినట్లు కొలస్సీసంఘానికి తప్పుడుభోదకులు వచ్చి, యేసుప్రభులవారు దేవుడు కాదు అని కొంతమంది, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు కాదు ఆయనతో పాటు ప్రధానులు, అంధకార సంబంధమైన లోకనాదులు ఇలాంటివారున్నారు. వారినికూడా మనం ప్రసన్నం చేసుకోవాలి! అప్పుడే మనం ఈలోకంలో సుఖముగా నివశించగలం, లేకపోతే గ్రహాలూ అనుగ్రహించకపోతే , ఈలోకనాదుల అనుగ్రహం లేకపోతే కష్టాలు తప్పవు అని భోదించడం మొదలుపెట్టారు! దానికి జవాబుగా పౌలుగారు యేసుప్రభులవారి దైవత్వం కోసం మొదట రాస్తూ, చివరికి వీరు భోదిస్తున్న ప్రధానులు, అధికారులు, అంధకారసంభంధమైన లోకనాదులు ఇవన్నీ చేసినది యేసుప్రభులవారే అంటున్నారు. ఇక్కడ అదృశ్యమైనవి అంటే ఇవే, ఈలోకనాదులు, అంధకార శక్తులు మనకు కనపడవు! అయితే మొదట ఈ శక్తులు అన్నీ మంచివే , దేవునిదూతలే గాని సాతానుగాడు పాపం చేసినప్పుడు దేవుడు సాతానుని, వాడి అనుచరులను వెళ్ళగొట్టడం జరిగింది, దీనికోసం మనం యేహెజ్కేలుగారి జీవితం కోసం ధ్యానం చేసుకున్నప్పుడు చూసుకున్నాం! అలా వెల్లగొట్టబడిన తర్వాత అవి ఈ లోకాన్ని దురాత్మలతో నింపి వేయడం జరిగింది. అవే లోకనాధులు అని  వివరంగా యాషారు గ్రంధంలోనూ, హనోకు గ్రంధం లోను వ్రాయబడింది! (ఇంతకంటే వివరాలు మనకు అనవసరం, మన ఆత్మీయజీవితానికి ఇవి చాలు!) ఈ లోకనాధులకోసమే పౌలుగారు ఎఫెసీ పత్రిక 6:12 లో రాస్తున్నారు:.

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో- రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

 

2) ఇక తర్వాత అర్ధం ఏమిటంటే: అనగా దృశ్యమైనవి: ఈలోక ప్రభుత్వాలు, అధికారులు, సింహాసనాలు, ఇవన్నీ దేవుని వలననే కలిగాయి! ప్రస్తుతం అధికారం లోనున్న ప్రతీవ్యక్తికి ఆ అధికారం దేవుడే ఇచ్చారు! కాబట్టి

1. అధికారులు: వీరందరికీ అధికారి దేవుడు ఉన్నాడని ఎరిగి, విర్రవీగకుండా నీతిన్యాయములతో పాలించాలి!

2. ప్రజలు: ఈ అధికారం దేవుని నుండే వారికి కలిగింది అని గ్రహించి, అధికారులకు, ప్రభుత్వాలకు లోబడి ఉండాలి! అలాకాకుండా “వీడా! వీడి బ్రతుకు నాకు తెలియదా? వీడెలా అధికారంలోకి వచ్చాడో , ఎలా ప్రెసిడెంట్ అయ్యాడో, ఎలా అధికారి అయ్యాడో నాకు తెలియదా!” అనుకోకూడదు! వాడు ఎలాంటివాడైనా, వాడికి అధికారం ఇచ్చింది దేవుడే కాబట్టి అన్ని విషయాలలో లోబడియుండాలి! ఇది దేవుని ఆజ్ఞ! ప్రతీ పౌరుడు/ క్రైస్తవుడు గవర్నమెంటు రూల్స్ పాటించాలి! రోమా 13:3 ప్రకారం అధికారులు= దేవుని పరిచారకులు! ఇంకా ప్రతీ అధికారం దేవునినుండే కలిగింది. రోమా 13:1.

 

   కాబట్టి అది ఏ అధికారమైన, గ్రామంలో గాని, మండలంలో గాని, రాష్ట్రంలో, దేశంలో , చివరికి నీ సంఘంలో ఉన్న ప్రెసిడెంట్, నీ దైవసేవకుడు ఎవరైనా సరే ఆధికారం, హోదా దేవుడిచ్చినదే అని గుర్తెరిగి లోబడియుండాలి!

 

   అందుకే పౌలుగారు చెబుతున్నారు: ఇవన్నీ ఆయనద్వారా, ఆయనబట్టి, ఆయనకోసం సృజింపబడ్డాయి కాబట్టి అట్టి సర్వాధికారి, సర్వసృష్టికర్తయైన దేవుణ్ణి కలిగియున్నందుకు వినయ విధేయతలు కలిగి, భయభక్తులతో, దేవునికి లోబడియుండాలి. ప్రభుత్వానికి కూడా లోబడి యుండాలి!

 

దైవాశీస్సులు!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*68వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-6*

 

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తూ- యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వాన్ని ధ్యానం చేస్తున్నాము!! కొద్దిగా కొలస్సీ పత్రికలో ఇవ్వబడిన వివరాలను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

     కొలస్సీయులకు 1: 17

ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

 

    ప్రియులారా! ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆయన అనగా యేసుప్రభులవారు అన్నింటికన్నా ముందుగా ఉన్నవాడు!! చాలామంది పొరబడుచున్నట్లుగా యేసుప్రభులవారు కేవలం సుమారు 2024 సం.ల క్రితం నుండే ఉన్నారు, అంతకముందు యేసుప్రభులవారు లేరు, తండ్రియైన యెహోవా దేవుడే ఉన్నారు అనుకుంటున్నారు!!! ఇది తప్పు అని వాక్యము ఖరాఖండిగా సెలవిస్తుంది! ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవారు! అనగా ఈ సృష్టిని చేయకముందే ఆయన ఉన్నారు. అందుకే ఆదికాండం 1:2 దేవునిఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అప్పుడు ఆ ఆత్మ- తనవాక్కు ద్వారా వెలుగు కమ్మని పలుకగా (వాక్కు) (1:3) వెలుగు కలిగెను. . . ఈ రకంగా సమస్త సృష్టి జరిగింది!!

 

   మరలా మనం యోహానుసువార్త మొదటి అధ్యాయానికి రావాలి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. కలిగియున్నవేమియు ఆయన లేకుండా కలుగలేదు! ఇక్కడ వాక్యము= దేవుడు; వాక్యము = కుమారుడు. ఈ వాక్యము దేవునియొద్ద ఉన్నది అనగా తండ్రి, కుమారుడు అక్కడే కలసి ఉన్నారు. ఎందుకంటే వీరిద్దరూ ఒక్కటే! కలిగియున్నదేదియు ఆయనలేకుండా కలుగలేదు అనగా యేసుప్రభులవారు తండ్రియైన దేవునిని సంప్రదించి, ఈ సృష్టిని రచించి, ఆయనే చేసారు! తెలుగులో ఈ వచనము తర్జుమా: ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారసంభూతుడు అని తర్జుమా చేయబడింది, అయితే కొన్ని తర్జుమాలలో ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తున్నాయి అని వ్రాయబడింది. అనగా ఈ సమస్త సృష్టి నక్షత్రములు, గ్రహాలూ, ఋతువులు అవి సక్రమంగా తిరిగేలా, గతి తప్పకుండా, మానవ వినాశనం కాకుండా ఈ సమస్త సృష్టిని నిర్వహించేది యేసుప్రభులవారే!!!! హల్లెలూయ!

 

     కాబట్టి కుమారుడైన యేసయ్య, రెండువేల సం.ల క్రితము పుట్టినవారు కారు, పెద్దదేవుడు చేసిన చిన్నదేవుడు అంతకంటే కాదు!!! సృష్టికన్నా ముందున్నవాడు, సృష్టి చేసినవాడు, ఆదియు- అంతమునై ఉన్నవాడు!!! ప్రకటన1:8; 21:6; 22:13;

 సృష్టికర్త ఆయనే- సృష్టి లయకర్త ఆయనే!!!

 

  ఈ సమస్త విశ్వము ఉనికిలోనికి రాకముందే దేవునికి కుమారుడు ఉన్నాడు!! కేవలం భూమిపై జన్మించినప్పుడు ఆయన కుమారుడు కాలేదు! ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను యోహాను 1:2; ఆయన ఇప్పుడు కాదు ఆదియందే దేవుని యొద్ద ఉన్నారు. యోహాను 17:5 లో యేసుప్రభులవారు తండ్రితో అంటున్నారు: తండ్రీ! లోకము పుట్టకముందు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను బలపరచుము” . ఎంత స్పష్టముగా వ్రాయబడిందో చూడండి. లోకము పుట్టకముందే ఆయన ఉనికిని కలిగియున్నారు!!! అందుకే మీద వచనంలో కొలస్సీ 1:17 ఆయన అన్నింటికన్నా ముందున్నవాడు అంటున్నారు పౌలుగారు! 1 కొరింథీ 8:6 ప్రకారం సమస్తం చేసింది ఆయనే!

 

   ఒకసారి కుమారుడు కోసం మనం ఆలోచిద్దాం! దేవునికి కుమారుడు ఉన్నాడు అని పూర్వకాలమందే అనగా సుమారు ౩౦౦౦ సం.ల క్రితమే వ్రాయబడింది. సామెతలు గ్రంధం 30వ అధ్యాయంలో మనకు ఒక ప్రవక్త కనిపిస్తారు. ఆయన పేరు ఆగూరు. ఆయన నేను పశుప్రాయున్ని, నాకు జ్ఞానం లేదు, జ్ఞానాభ్యాసం లేదు అనగా చదువులేదు అంటూ దేవోక్తులు పలుకుతున్నారు. 30:1 దేవోక్తి అనగా ప్రవచనం.

సామెతలు 30: 4

ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

 . . . (నిజంగా ఈ అధ్యాయం మొత్తం అర్ధం చేసుకుంటే మనకు జీవిత పరమావధి అర్ధం అవుతుంది కాబట్టి ఒకసారి మొత్తం అధ్యాయం చదవండి).

 

సరే ఈ వచనంలో ఆకాశానికి ఎక్కి దిగినవాడు ఎవడు?  దీనికి జవాబు యేసుప్రభులవారే కదా! భూమియొక్క దిక్కులు స్తాపించిన వారు ఎవరు? అయన పేరు ఏమిటి? ఆయన కుమారుని పేరు ఏమిటి?   అనగా దేవునికి కుమారుడు ఉన్నాడు, కుమారునికి పేరు ఉంది, అయితే ఆ పేరు ఆగూరుగారికి తెలియదు! ఇక కీర్తనలు 2  లో కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును” అంటున్నారు! ఇక్కడ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు! ఆయనను ముద్దుపెట్టుకోకపొతే అనగా ఆయనను ఇష్టపడకపోతే, సేవించకపోతే తండ్రియైన దేవునికి కోపం వస్తుంది. ఇక ఆయనకు కుమారుడుగా భూలోకంలో పుడతారు అని యెషయా గారు నేటికి సుమారు 2759 సం.ల పూర్వమే అనగా క్రీ.పూ. 740లో ప్రవచించారు! యెషయా 9: 6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

  ఇక ఎలా పుడతారో 7:14 లో చెప్పారు. ఒక కన్యక గర్భమందు జన్మిస్తారు, ఆయనకు ఇమ్మానుయేలు అనిపేరు. ఆ కుమారుడు పుట్టాడు, వెళ్లి చూడండి అని 2014 సం.ల క్రితం గొల్లలకు దేవదూతలు చెబితే వారు వెల్లిచూసి అందరికీ చెప్పారు. ఆ వార్త మనవరకు వచ్చింది!! లూకా 2:11; కాబట్టి ఆయన సృజింపబడిన వాడు కాదు, సృష్టికర్త!సమస్తమును నిర్వహిస్తున్నవాడు!!

 

  యేసయ్య భాప్తిస్మము పొంది బయటకు వచ్చిన వెంటనే “ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను” అని దేవుడు పరవశుడై పలుకుతున్నారు!! మత్తయి3:17; లూకా 3:22;

  మరి అట్టి దేవాదిదేవుడ్ని నీవు పూజిస్తున్నావా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును అంటున్నారు. కీర్తనలు 2:12; కాబట్టి ఆయనను ప్రేమించి, సేవిస్తున్నావా?

 

  ఇక్కడ మరో విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు! మన హైందవ సోదరులు అంటారు: పుత్రుడు లేనివానికి స్వర్గం లేదు, పుత్రుడు పున్నామి నరకం నుండి తప్పిస్తాడు” . అందుకే కొడుకు పుట్టేలాగా మొక్కుకుంటారు! అయితే కుమారుడు అనగా అర్ధం: కు- అనగా కుచ్చిత గుణములు, పాపములు; మారుడు- చంపేవాడు! అనగా పాపములు హరించేవాడు, పరిహరించేవాడు! . నిజంగా ఈ కొడుక్కి అంత దమ్ము, అధికారం ఉందా? నరకం నుండి తప్పించడం అటుంచండి- పీకపిసికి చంపకపోతే చాలు! అయితే ఈ కుమారులు మనల్ని రక్షించలేరు గాని, మనందరికీ ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన యెషయా 9:6 లో ఉదహరింపబడిన యేసుప్రభులవారు! ఆయన పేరు రక్షకుడు! పాప రక్షకుడు/ పరిహారకుడు! ఆయన నీకోసం, నాకోసం ఈ భూలోకానికి వచ్చి, మన పాపములకోసం కల్వరి సిలువలో బలియాగమై, మన పాపములులను పరిహరించినవాడు. యేసు రక్తము ప్రతీ పాపములనుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును! 1 యోహాను 1:7; మరి ఆ రక్తంలో కడుగబడతావా?

అట్టి పాప పరిహారకుడు, కుమారుడు, సృష్టికర్త, సృష్టిని నిర్వహించువాడు అయిన యేసుప్రభులవారిని నమ్ముకో!

రక్షణ పొందుకో!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*69వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-10*

*యేసుక్రీస్తు దైవత్వము-7*

 

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తూ- యేసుక్రీస్తుప్రభులవారి దైవత్వాన్ని ధ్యానం చేస్తున్నాము!! కొద్దిగా కొలస్సీ పత్రికలో ఇవ్వబడిన వివరాలను ధ్యానం చేస్తున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

    కొలస్సీయులకు 2: 9

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

 

     యేసుప్రభులవారి దైవత్వాన్ని నిర్ధారించే తిరుగులేని సాటిలేని వచనం ఇది. ఏలయనగా అని ఎందుకు అన్నారంటే: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అంటూ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత  . . . . . .. దేవుడు అనడానికి ఏవైనా క్వాలిటీలు, లక్షణాలు, అర్హతలు, అధికారం ఏవైనా ఉన్నాయంటే అవి యేసుప్రభులవారిలోనే ఉన్నాయి అని నొక్కివక్కానిస్తున్నారు!! ఇక అదే క్వాలిటీస్ కలిగి ఏ దేవుడైనా ఎప్పుడైనా శరీరంతో భూమిమీదకు వచ్చారు అంటే అది యేసుప్రభువే అని నిర్ధారించి చెబుతున్నారు!

 

   ఒకసారి ఆగి ఆలోచిద్దాం! ఇంతకీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు, అధికారాలు, అర్హతలు ఏమిటి? మరి మనం పూజించే దేవుడు ఎలాంటివాడై ఉండాలి అనేది తెలుసుకోవలసి యుంది కదా! మన భారతదేశం పూర్వకాలం నుండి ఎంతో సనాతన ధర్మము, ఆచారాలు కలిగిన దేశం! అలాగే ఎన్నో మతపరమైన గ్రంధాలు మనకున్నాయి. వాటిప్రకారము, ఇంకా మిగతా దేశాలవారికి చెందిన మతాలవారి గ్రంథాల ప్రకారం దేవునికి ఉండవలసిన ముఖ్యలక్షణాలు కొన్ని ఉన్నాయి. Someone says God must have Three characteristics, 7 Attributes, 15 qualities like that

 

Characteristics are: God must be

1. Omnipotence- - God is All Powerful;

2. OmniscienceGod knows everything;

3. OmnipresenceGod is Everywhere.

 

1). దేవుడు సృష్టికర్తయై ఉండాలి, సృజింపబడినవాడు కాకూడదు.

2). నిరాకారుడు, నిర్గుణుడై ఉండాలి! అనగా ఒక ఆకారం కలిగి ఉండకూడదు, అరిషడ్వర్గాలు అని పిలువబడే కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యము గలవాడై ఉండకూడదు!

3) నిత్యమూ ఉండేవాడై ఉండాలి!

4) గురువై ఉండాలి, మాదిరిగా ఉండాలి;

5) పాపాలు తీయగలిగిన వాడై ఉండాలి! అనగా పాప సంహారకుడై ఉండాలి!

6) లోక కల్యాణం కోసం పాటుపడినవాడై ఉండాలి! అనగా లోక కల్యాణం కోసం, ప్రజల శ్రేయస్సుకోసం తనను తానూ అర్పించుకోడానికైనా సిద్ధమై ఉండాలి! ;

7) మంచివాడై యుండాలి. మంచిని కాపాడుతూ చెడును సంహరించేవాడై ఉండాలి!

8) స్వర్గమిచ్చువాడై ఉండాలి.

 

  ఇలాంటివి చాలా ఉన్నాయి గాని ముఖ్యమైనవి ఇవి! అది ఏ మతమైనా, ఏ దేశమైనా సరే! మరి ఈ లక్షణాలు కల దేవుడు ఎవరు ఉన్నారు? దేవుళ్ళు అని పిలవబడే కొంతమంది ఉన్నారు గాని వారికి వీటిలో ఒకటో రెండో లక్షణాలు ఉన్నాయి గాని, మొత్తమన్నీ ఎవరిలో ఉన్నాయి? *ఇక రెండో లక్షణమైన నిర్ఘుణుడు అనగా అరిషడ్వర్గాలు లేనివాడు- అవి ఉంటే తను కూడా మనలాగ మనిషే తప్ప దేవుడు కాదు*. దేవునికి కామం ఉండి మనలాగే పెళ్లి చేసుకుంటే మనకి దేవునికి తేడా ఏమిటి?

 

    కాబట్టి చివరికి ఈ లక్షణాలు అనగా దేవునికి ఉండవలసిన, ఒకటో రెండో కాదు మొత్తము అన్ని లక్షణాలు కలిగిన వాడు యేసుప్రభులవారు మాత్రమే!!!

 

1). సృష్టికర్త యోహాను 1: 2,3;  2 కొరింథీ 8:6;

2) నిర్ఘుణుడు- పాపము లేనివాడు యేసుప్రభు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసరినవాడు! యోహాను 8:46;

3) నిత్యమూ ఉండేవాడు: ఆయన నిత్యుడగు తండ్రి, యెషయా 9:6; ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను మత్తయి 28:20.

4) గురువై ఉండాలి- క్రీస్తు ఒక్కడే మీకు గురువు మత్తయి 23:10; యేసయ్యను అందరూ భోదకుడా, గురువుగారు అని పిలిచేవారు- ఆయనకు 12 మంది ముఖ్య శిష్యులు, వారే కాక అనేకమంది శిష్యులు.

5) పాపాలు తీయగలిగిన వాడు: ఆయన బ్రతికి ఉండగానే కొందరి పాపములు క్షమించారు. లూకా 5:20-24; చనిపోయి అందరి పాపములు క్షమించారు. ఇదిగో ఇది మీ కొరకు చిందింప బడుచున్న క్రొత్త నిభందన రక్తము అన్నారు, మత్తయి 26:28 యేసురక్తము ప్రతీ పాపము నుండి మనలను కడిగి పవిత్ర పరచును అని గ్రంధం సెలవిస్తుంది. 1 యోహాను 1:7;

6) లోక కల్యాణం కోసం పాటు పడినవాడు: ఆయన ఈలోకానికి వచ్చిందే పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగినవారిని విడిపించడానికి, (లూకా 4:18), తద్వారా అందరిని దేవునిరాజ్యానికి వారసులుగా చేయడానికి యోహాను 1:12;

7) మంచివాడై యుండాలి: నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచికాపరి తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టును అని చెప్పడమే కాదు చేసి చూపించారు! యోహాను 10:11

8) పరలోకం ఇవ్వగలిగిన వాడై యుండాలి. : యోహాను 14: 2,3

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

కాబట్టి కొన్ని కాకుండా అన్ని క్వాలిటీస్ కలిగిన దేవుడు యేసుప్రభులవారు!

 

   ఇక్కడ పౌలుగారు దేవత్వము యొక్క సంపూర్ణత అంటున్నారు. ఇక ఆయన పరిపూర్ణుడు ఎలా కాగలిగారు? దైవత్వం- పరిపూర్ణత ఎప్పుడ అవుతుందో మనకు చక్కగా వివరించగలిగినది యోహాను సువార్త మొదటి అధ్యాయం. మిగిలిన అధ్యాయాలలోను కొద్దిగా ఉన్నాయిగాని ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి. నిజంగా ఇంతటి ప్రత్యక్షత/ Revelation ఏమీ చదువుకోని, ఒక చేపలు పట్టుకొనే జాలరి యైన యోహాను గారికి ఎలా దేవుడు ఇచ్చారో నిజంగా ఆశ్చర్యము! Biblical concept కి పునాది ఇది.  దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను అంటున్నారు. మొదటి వచనంలో వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద అనగా వాక్యమై ఉన్న కుమారుడు తండ్రియైన దేవుని యొద్ద ఉన్నారు అందుకే రెండవ వచనంలో అనుమానాలు లేకుండా ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను అనగా కేవలం 2020 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు, సృష్టి జరుగకముందే ఆయన దేవునియొద్ద ఉన్నారు. ఇక మూడవ వచనం ప్రకారం ఆయనలేకుండా ఏమీ కలుగులేదు. సమస్తము ఆయనద్వారా కలిగెను! అనగా ఆయనే సృష్టికర్త! ఇంకా క్రిందకు చదివితే ఆయన మిగతా లక్షణాలు కనిపిస్తాయి. ఆయన వెలుగు అని , లోకానికి వెలుగుకు మధ్య వ్యత్యాసం ఉందని, చెబుతూ 12వ వచనంలో తనను ఎందరో అంగీకరిస్తారో వారిని ఆయన దేవుని పిల్లలుగా మార్చగలిగిన అధికారం కలిగిన వాడని వ్రాయబడింది. ఇక 14వ వచనంలో ఆయన శరీరధారిగా భూమిమీదకు వచ్చారని రాశారు! కృపా, సత్య సంపూర్ణునిగా మనమధ్య నివశించెను అని రాస్తున్నారు! 18వ వచనంలో ఎవడూ తండ్రిని చూడలేదు గాని యేసుప్రభులవారే తండ్రిని మానవులకు వెల్లడిచేశారు అంటున్నారు. 29-34 వచనాలలో మనకు పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు! అనగా ఆయనే ఆత్మ, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ- అనగా దేవుడు ఒక్కడే కాని ఆయనకు మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళు కానేకాదు! బైబిల్ గ్రంధంలో దేవుని మూడు వ్యక్తిత్వాలు ఒకేదగ్గర, ఒకేసారి ప్రత్యక్ష్యం అయ్యింది ఇక్కడే! మత్తయి 3:17, లూకా 3:22 ప్రకారం యేసుప్రభులవారు బాప్తిస్మము తీసుకొని బయటకు వస్తారు, పరిశుద్ధాత్ముడు పావురం వలే ఆయనమీద వ్రాలుతాడు, అప్పుడు పరలోకం నుండి తండ్రి స్వరము అనగా ఆయన వాక్కు సెలవిస్తుంది: ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను. ఇదీ సంపూర్ణత. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ- త్రియేకదేవుడు!!! అందుకే  1 యోహాను 5:7 లో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు: అనగా తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు.,

For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.

వీరు ముగ్గురు ఒక్కటే! అనగా ముగ్గురు ఒకరే! ఆయన మూడు వ్యక్తిత్వాలుగా ఎందుకు ఉండాల్సివచ్చింది? ఎందుకంటే అది సంపూర్ణం కాబట్టి! కేవలం మూడు సంపూర్ణ సంఖ్య అయినందువలెనే ఆయన సంపూర్ణుడు అయ్యారా కాదుకాదు! సంపూర్ణత అంటే:

 

1). ఆయన తండ్రి: తండ్రి ప్రేమ చూపించారు. ఒక తండ్రి తన పిల్లలకు ఏమి కావాలో అవన్నీ అమర్చినట్లు ముందు సృష్టిని చేసి, తర్వాత మానవుణ్ణి చేసారు. తండ్రిలా ప్రేమించి, లాలిస్తున్నారు. మాట విననప్పుడు దండించారు, దండిస్తున్నారు. ఆదికాండం 6-8 అధ్యాయాలు, పాత నిబంధన మొత్తం; ఇంకా నిన్ను విడువను ఎడబాయను అంటూ మనల్ని కాస్తున్నారు. యెహోషువ 1:6; యిర్మియా 46:26; యోహాను 14:18; హెబ్రీ 13:5;

 

2) మరి తండ్రిగానే ఉంటే మానవులు నాశనమైపోతారు. కాబట్టి కుమారునిగా భూమిమీదకు శరీరాకృతిలో వచ్చి, మానవులకు రక్షణసువార్తను అందించి, రక్షణ కార్యక్రమం చేసి, పేదలకు సువార్త ప్రకటించడంతో మొదలుపెట్టి, దేవునిరాజ్యమును స్థాపించారు. చివరకు మన పాపములకోసమై సిలువలో యాగమై, బలియాగమై తన రక్తముద్వారా మన పాపములకు పరిహారం చేసి, మనలను పరలోకానికి హక్కుదారులుగా చేసారు. (యోహాను 1:12)  తిరిగి తండ్రికి మనకి ఒక లింక్ ఏర్పాటు చేసారు.

 

3) ఇక తను తండ్రి యొద్దకు వెళ్ళాలి కాబట్టి మనలను అనాదలనుగా వదలడం ఇష్టం లేక తన ఆత్మను మనకు కాపలాగా, నడిపించే నాయకునిగా , సంచకరవు అనగా డిపాజిట్ గా పెట్టి; మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను, ఎక్కడ? తనుండే చోటు అనగా పరలోకంలో! యోహాను 14:2,3; ఇక్కడ పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు.

 

 ఇక్కడ రెండు వచనాలు మీకు గుర్తుచేయాలి అంటుకుంటున్నాను రోమా పత్రిక 8వ అధ్యాయం నుండి. ఈ ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరే, ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి అనడానికి మంచి ఉదాహరణ. 26వ వచనంలో అటువలె మనకు ఎలా ప్రార్ధనచేయాలో తెలియదు కాబట్టి ఆత్మ మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు, ఎలా ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో!!

 అందుకే పరిశుద్ధాత్మ అనుభవం గల వ్యక్తి ప్రార్ధించడం మొదలుపెడితే కళ్ళంట నీరు వాటికవే కారిపోతాయి. ఈ విషయం ఇంటివారికి అర్ధంకాక, ఇప్పుడు ఎవడు చనిపోయాడని అలా ఏడుస్తున్నావు అంటుంటారు!!!  సరే; ఇక 34 వ వచనంలో శిక్షించువాడు, Judge ఎవరు? యేసుప్రభువే, అందుకే ముందుగా వారు/మనం తప్పిపోకుండా, యేసయ్య మన పక్ష్యంగా దేవుని కుడిప్రక్కన కూర్చొని మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు! ఇక్కడ అనగా భూమిమీద ఆయన ఆత్మ మనుష్యులను సిద్దపరచి అదే విజ్ఞాపనం చేస్తున్నారు, అక్కడ యేసుప్రభులవారు కూడా ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ అంటూ మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత జడ్జి స్థానం లోకూర్చుంటే ఇక తనకు క్షమించే అవకాసం ఉండదు కాబట్టి! ఇక్కడ ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలతో మానవ శ్రేయస్సుకోసం పాటుపడుచున్నారు! ఇదే సంపూర్ణత! అందుకే పౌలుగారు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివాశం చేస్తున్నది అని ఘంటాపథంగా చెబుతున్నారు.

 

   కాబట్టి ఈలోకంలో దేవుడు అని ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుప్రభులవారే! పాపములేని దేవుడు ఆయన! నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరిన ఏకైక, అద్వితీయ దేవుడు!! యోహాను 8:46;

 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చాటి చెప్పగలిగిన సత్తాగాలిగిన ఏకైక సత్యదేవుడు! యోహాను 14:6;

మరి ఆదేవుడు నీకు కావాలా? నిజదైవమెవరో, నీ రక్షకుడు ఎవరో గుర్తెరుగు!

 నేడే ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు!

ఆయన నిన్నుతన స్వంత బిడ్డగా స్వీకరించి, తన రక్తముతో కడిగి, తనరాజ్యానికి వారసునిగా చేస్తారు!యోహాను 1:12;

 

ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు 'ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరునూ,ఎన్నడునూ మాట్లాడలేదు' అని సాక్ష్యం పొందారు. అంటే ఆయన మాటలో కూడా 'పరిశుద్ధత' గలవారు.

              మాట, తలంపు, ఆలోచన, నడత, ప్రవర్తన అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకమైన విధంగానూ,పరిశుద్ధంగానూ జీవించారు. హెబ్రీ పత్రిక 7:26లో చెప్పినట్లుగా 'పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు'.

 

మనకు ఒక మాదిరినీ, మార్గాన్నీ చూపిన ఆ ప్రభువు అడుగుజాడలలో నడుద్దాం...

ఆయన అన్ని విషయములలో పరిపూర్ణుడైయున్న ప్రకారము మనము కూడా ఆయన వలే పరిపూర్ణులమయ్యే ఆ స్థితికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించును గాక......

ఆమేన్!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*70వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-11*

 

యెషయా 9:6    

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! ఆయన యొక్క లక్షణాలను లేక బిరుదులను ధ్యానం చేస్తున్నాము!

 

   ప్రియులారా! ఇక ఇదే ఆరో వచనంలో మరో బిరుదు లేక లక్షణం: సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటున్నారు.  మన తెలుగులో సమాధానకర్తయగు అధిపతి అని తర్జుమా చేయబడింది గాని ఇంగ్లీస్ మరియు ఇతర తర్జుమాలలో సమాధానపు యువరాజు అని తర్జుమా చేయబడింది. మరికొన్ని ప్రతులలో శాంతికర్త అని తర్జుమా చేయబడింది.

ఏదిఏమైనా మనకు సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తుప్రభులవారు ఈ భూలోకానికి వచ్చారు. అయితే ఈ సమాధానం అనేది మొదటగా మన మనస్సులలోను హృదయాలలోనూ ఇస్తారు.

లూకా 1:79

మన పాదములను సమాధాన మార్గములోనికి నడి పించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించెను.

 

లూకా 2:14

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

 

యోహాను 14:27

శాంతి (లేక, సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే (లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

 

అపొ 10:36

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

 

 ఇక రెండవదిగా దేవునికి మానవులకు మధ్య సమాధాన కర్తగా లేక శాంతి దూతగా, మధ్యవర్తిగా ఉన్నారు యేసుక్రీస్తుప్రభులవారు!!!

 

మీకా 4:3

ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.

 

1కోరింథీయులకు 8:6

ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

హెబ్రీయులకు 8:6

ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియ మింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

హెబ్రీయులకు 9:15

ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

హెబ్రీయులకు 12:24

క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

 

రోమా 5:1 , 10

రోమీయులకు 5:1

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. (కొన్ని ప్రాచీనప్రతులలో- కలిగియున్నాము అని పాఠాంతరము)

రోమీయులకు 5:10

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

 

గమనించాలి దేవుడు తన విశ్వాసులకు పాపములేని వారుగా నిర్దోషులుగా చేయాలని ఆయన కుమారుని రక్తము ద్వారా సంధిచేశారు. కాబట్టి ఎవరైతే ఆయన రక్తములో కడుగబడతారో వారికి దేవునితో సమాధానము ఉంటుంది క్రీస్తుయేసు ద్వారా! పాపముల ద్వారా దేవునికి దూరమైనా మనము ఇప్పుడు సిలువ రక్తములో కడుగబడి పవిత్రులుగా మారి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయడానికి మార్గము సుగమం చేయబడింది. ఆ మార్గము యేసుక్రీస్తుప్రభులవారే! అందుకే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై యున్నాను, నాద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేరు అని చెప్పారు యేసుక్రీస్తుప్రభులవారు!! యోహాను 14:6;

 

కొలస్సీ 1:20

ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:13,14,15,16,17,18,19

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 

2కొరింథీ 5:1821

18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.

19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.

20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము.

21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

యెషయా 53:5

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

 

ఈ  రకంగా మానవులకు అనగా ఆయన కుమారుని యందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడుగబడిన వారికి దేవునికి మధ్య సమాధానం శాంతి ఒప్పందం చేకూర్చిన వారు యేసుక్రీస్తుప్రభులవారు!!!

   కాబట్టి ప్రియ చదువరీ! మన దేవుడు సమాధాన కర్తయగు అధిపతి! నీ మనస్సులో సమాధానము లేదా, నీ పొరుగువారితో సమాధానం లేదా, నీ భర్తతో సమాధానం లేదా? అయితే నేడే యేసు దగ్గరకు రా! ఆయన నీ మనస్సులో, నీ ఇంట్లో నీ శత్రువుల మధ్య కూడా సమాధానం కలిగించే వాడు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*71వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-12*

 

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ఇక 7వ వచనంలో ఇంకా ఆయన మొదటిరాకలో ఎలా ఉంటుందో స్పష్టముగా చెబుతున్నారు : ఇది మొదలుకుని మితిలేకుండా అనగా అంతములేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును ఇంకా ముందుకుపోతే న్యాయము వలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచడానికి సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును అంటున్నారు!

 

ఇక్కడ క్రీస్తు పరిపాలన అంతములేనిదై ఉంటుంది అంటున్నారు.  అందుకే లూకా 1:33 లో గబ్రియేలు దూత అంటున్నాడు మరియమ్మ గారితో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన యాకోబు వంశస్తులను యుగయుగాలును ఏలును అంటున్నారు! అసలు ఈ వాగ్దానం సమూయేలు గ్రంధంలో దావీదుగారితో చేశారు దేవుడు!!

2సమూయేలు 7:1126

11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా- నేను నీకు సంతానము కలుగజేయుదును.

12. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.

13. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

 

23:15

3. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును.

4. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.

5. నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

 

 

ఇక రెండవదిగా ఆయన నీతివలనను న్యాయము వలనను సింహాసనమును స్థాపించి ఎల్లప్పుడూ పరిపాలన చేయును:

కీర్తన 72:2

నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయవిధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.

 

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును.

 

16:5

కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

 

Isaiah(యెషయా గ్రంథము) 32:1,16,17

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

 

యెషయా 33:5

యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.

 

యెషయా 42:1

ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

 

యిర్మియా 23:5

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

 

Jeremiah(యిర్మీయా) 33:6,15,16

6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

15.​​ ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.

16. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.

 

ప్రకటన 19:11

మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

 

ఆయన రాజ్యము అంతములేనిదై దావీదు వంశస్తులను యుగయుగాలు ఏలుతారు. నీతిన్యాయాలతో పాలిస్తారు. అది రెండవ రాకడ తర్వాత వెయ్యేండ్ల పాలనలో జరుగుతుంది. అది పొందుకోవాలంటే ఆయన రక్తములో కడుగబడి ఆయన యందు విశ్వాసముంచాలి!! అప్పుడు నీకు దేవునితో సమాధానం కలుగుతుంది. అప్పుడే నీకు మనస్సులో నెమ్మది శాంతి కలిగి ఆ శాశ్వత రాజ్యములో ఉండగలవు!!

కాబట్టి నేడే దేవునితో సమాధాన పడు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*72వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-13*

 

యెషయా 11:13        

1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

2. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! ఇక 9వ అధ్యాయంలో తర్వాత వచనాలు యూదా ప్రజలు చేసిన దుర్మార్గతకు దేవుని తీర్పులున్నాయి. ఇక రక్షకుని మొదటి రాకడను తెలియజేసే ప్రవచనాలు మనకు 11వ అధ్యాయం మొదటి మూడు వచనాలు, 42వ అధ్యాయం,  53 వ అధ్యాయం మరియు 61వ అధ్యాయంలో ఉన్నాయి!

 

11వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నారు: యెష్షయి మొద్దునుండి చిగురు పుడుతుంది వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది అంటున్నారు. దీనికోసం మరలా మనము 6వ అధ్యాయంలో చివరి వచనాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి!  ....

యెషయా 6:13

దానిలో పదియవ భాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.

 

ఆరో అధ్యాయంలో యెషయా గారికి దర్శనం చూపించి- నీవు ప్రజలకు నా వర్తమానాలు చెప్పాలి- నీవు చెప్పేకొలదీ వారు బండబారిపోయి నానుండి దూరం అయిపోతారు. ఎంతవరకూ అంటే వారు చేసిన ఘోరాలకు నేరాలకు ఈ దేశం మనుష్యులు లేక పాడైపోతుంది. పట్టణాలు ఖాళీ అయిపోతాయి.  దేశం ఇలా ఖాళీ అయిపోయిన తర్వాత సిందూర మస్తకి వృక్షాలు నరకబడిన తర్వాత మొద్దు విడువబడతాది కదా, అలాగే ఈ దేశంలో ఎవరో కొద్దిమంది మిగిలి ఉంటారు. అయితే సిందూర మస్తకి వృక్షాలు యొక్క మొద్దు ఎలా కొన్ని రోజుల తర్వాత చిగురిస్తుందో అలాగే అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు లేస్తుంది అన్నారు! దీనికోసం గతంలో ధ్యానం చేశాము!

 

అయితే ఇక్కడ ఆ మొద్దుపేరు రాస్తున్నారు- ఆ మొద్దు యెష్షయి అంటున్నారు.  ఆ మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. అనగా యెష్షయి కుమారుడైన దావీదు నుండి అంకురం అనబడే యేసుక్రీస్తుప్రభులవారు అనే చిగురు ఎదిగి ఫలిస్తుంది అంటున్నారు.

 

ఇక్కడ ప్రవక్త గారు చెబ్తున్న కొమ్మ లేక అంకురం 7:14 (ఇమ్మానుయేలు), 9:67 లో చెప్పిన అభిషక్తుడు రక్షకుడు అయిన శిశువు, కుమారుడు అయిన యేసుక్రీస్తుప్రభులవారే! ఆయన సర్వాధికారియైన దేవుని అవతారం!! ప్రపంచాన్ని త్వరలో పాలించబోతున్నారు!

 

 యెష్షయి అనగా దావీదుగారి తండ్రి! కాబట్టి ఈ కొమ్మ పుట్టేది దావీదు వంశం నుండే!

ఇక మొద్దు అనగా 6:13 లో చెప్పినట్లు దావీదుగారి రాజ్యం- ఆష్షూరి వారి చేతులలో పూర్తిగా నాశనమైపోయి కేవలం మొద్దు మరియు వేరు మాత్రమే మిగులుతుంది! అది యెష్షయి! అక్కడ నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది! అది యేసుక్రీస్తుప్రభులవారే! 

 

ఇక వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అనగా యెష్షయి వేరునుండి పుట్టిన కొమ్మ లేక అంకురం యేసుక్రీస్తుప్రభులవారు ఎదిగి ఫలించి ఈ ప్రపంచాన్ని ఏలుతారు అంటున్నారు!

 

యెషయా 4:2

ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

 

యిర్మియా 23:5

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

 

యిర్మియా 33:15

​​ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.

 

జెకర్యా 3:8

ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.

 

జెకర్యా 6:12

అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.

గమనించాలి- అనేకసార్లు చెప్పడం జరిగింది : కొమ్మ అనగా ప్రవక్తల గ్రంధాలలో కొమ్మ అనేది అభిషక్తుడై రాబోతున్న యేసుక్రీస్తుప్రభులవారికి ఇచ్చిన పేరు/బిరుదు!! యెషయా ౩౩:15, 11:1

ఈ కొమ్మ మానవావతారంలో దావీదు వంశంలో కన్యక గర్భమందు ఇమ్మానుయేలుగా జన్మించబోతున్నారు అని మనకు ఈ గ్రంధం ద్వారా స్పష్టమైంది!

7:14,  లూకా 1:౩౦౩౩; రోమా 1:5

 

ఈయన అనగా అభిషక్తుడైన యేసుక్రీస్తుప్రభులవారు రాజుగా సర్వలోకాన్ని పరిపాలిస్తారు అంటూ పాతనిబందనలో అనేకచోట్ల చెప్పబడింది

కీర్తన 2:69; 45:17; 72:57;  యెషయా 9:67; 11:19; 32:13 ; జెకర్యా 14:921

 

కాబట్టి ఈయన కొమ్మ, చిగురు మరియు అంకురము- ఈయన యేసుక్రీస్తుప్రభులవారే! ఈయనే సర్వలోకాన్ని పరిపాలించబోతున్నారు ప్రత్యక్షముగా అది వెయ్యేండ్ల పాలనలో! ఆ రాజ్యంలో నీతి మరియు న్యాయమే కనిపిస్తుంది. అన్యాయం అనేది ఉండదు!

మరి ఆ రాజ్యమునకు నీవు వస్తావా??!!

దానికి తగినట్లుగా నీవు జీవిస్తున్నావా!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*73వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-14*

యెషయా 11:13        

1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

2. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 11వ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక 11వ అధ్యాయంలో తర్వాత వచనము యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును! అతని మీద అనగా యెష్షయి మొద్దునుండి పుట్టబోయే చిగురు- దావీదు కొమ్మ అనబడే యేసుక్రీస్తుప్రభులవారిమీద ఈ ఆత్మ నిలుచును అంటున్నారు!

 

గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏడు రకాలైన ఆత్మ ఆయన మీద నిలుచును! దీనినే ప్రకటన గ్రంధంలో కూడా  దేవుని ఏడాత్మలు అంటున్నారు!

 

ప్రకటన 1:45

4. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,

5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

 

ఇదే ఏడు ఆత్మల కోసం ఈ గ్రంధంలో వ్రాయబడ్డాయి

ప్రకటన గ్రంథం 3: 1

సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే

 

ప్రకటన గ్రంథం 4: 5

ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

 

ప్రకటన గ్రంథం 5: 6

మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

 

ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు.... అంటున్నారు! ఇక్కడ యోహాను గారు దేవుని సింహాసనము చూశారన్న మాట! ఆ సింహాసనము ఎదుట ఏడు ఆత్మలు ఉన్నాయి అంటున్నారు.

 

కాబట్టి ఏడు ఆత్మల నుండి మీకు శాంతి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు యోహాను గారు! అయితే ఏడు ఆత్మలు దేనికి సాదృశ్యము??

 

పరిశుద్దాత్మలు ఏడుగురా? కానేకాదు! ఆత్మలు ఏడా? అనేకమైన ఆత్మలున్నాయి గాని అనగా దురాత్మ, గాఢనిద్రాత్మ అపవిత్రాత్మ లాంటి ఆత్మలున్నాయి గాని ఇక్కడ సింహాసనము ఎదుట నున్న ఏడు ఆత్మలు అంటున్నారు కాబట్టి ఇవి పరిశుద్ధమైన ఆత్మలు! 

ఇంతకీ ఆ ఏడు ఆత్మలు ఏమిటి అని చూసుకుంటే యెషయా గ్రంధంలో మనకు జవాబు దొరుకుతుంది! 11:2...

యెహోవా ఆత్మ

1. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ

2. వివేకమునకు ఆధారమగు ఆత్మ

౩. ఆలోచనకు ఆధారమగు ఆత్మ

4. బలమునకు ఆధారమగు ఆత్మ

5. తెలివిని పుట్టించు ఆత్మ

6. భయమును పుట్టించు ఆత్మ

7. భక్తిని పుట్టించు ఆత్మ!

 

*నిజం చెప్పాలంటే ఆత్మలు ఏడు కాదు గాని ఆత్మ ఒక్కడే- ఆయనే పరిశుద్ధాత్ముడు! గాని ఆత్మ జరిగించే ఏడు కార్యాలు అని లేక స్వభావాలు అని అర్ధము చేసుకోవాలి*!

గతభాగంలో చూసుకున్నాము- ఏడు అనేది సంపూర్ణ సంఖ్య!  కాబట్టి ఏడు ఆత్మలు అనగా సంపూర్ణుడు పరిపూర్ణుడు అయిన పరిశుద్ధాత్ముడు కోసమే ఇక్కడ యోహాను గారు చెబుతున్నారు అని గ్రహించాలి! అనగా సింహాసనము ఎదుట నున్న ఏడు ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ నుండి కూడా మీకు... అంటున్నారు.,

 

అయితే గతంలో చెప్పిన విధంగా ఈ ఆత్మలతో తండియైన దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని అభిషేకించి పంపుతున్నారు  ఎందుకు? ఎందుకంటే ఆయన భూమిమీద పరిచర్య చేయబోతున్నారు. కాబట్టి పరిచర్య చేద్దామని అనుకుంటున్న వారు ఎవరైనా ముందుగా వారు తమ పాపముల కొరకు యేసయ్య ప్రాయశ్చిత్తం చేసారని నమ్మి- వారి పాపం పోయింది అని నిశ్చయతకు వచ్చి- అప్పుడు నిజమైన మారుమనస్సుతో తీసుకున్న బాప్తిస్మము వలన పొందుకున్న పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మబలం పొందుకుని అప్పుడు పరిచర్య చేయాలి! అప్పుడే నీవు సేవను బలంగా దేవుడు మెచ్చేవిధంగా చేయగలవు! లేకపోతే నీ సేవ ఫలభరితంగా ఉండదు. నీవు ఆత్మల భారముతో సేవచేయక- డబ్భు వ్యామోహంతో సేవ చేస్తావు!!

 

ఇక అలా ఆత్మల భారంతో పరిశుద్ధాత్మ శక్తితో సేవచేస్తున్న వారు యేసుక్రీస్తు ప్రభులవారు ఎలా తండ్రికి విధేయుడై సేవచేశారో అలాగే దేవునికి విధేయులుగా దేవుడు మెచ్చేవిధంగా సేవచేయాలి తప్ప మన సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలతో సైన్సు మరియు తత్వ శాస్త్రం లాంటి వాటితో పిట్టకధలతో ప్రజలకు మెచ్చేవిధంగా చేయకూడదు! కారణం యేసుక్రీస్తుప్రభులవారు దేవునికి విధేయుడుగా ఆయనకు ఘనత తెచ్చేపనులు మాత్రమే చేయాలి! మనము కూడా ఆ దేవుని ఏడాత్మలు గల పరిశుద్దాత్మను పొందుకుని ఆ శక్తితో దేవునికి మెచ్చేపనులు చేస్తూ ఆయన రాజ్య వ్యాప్తిలో పాలుపంచుకోవాలి!

మరినీవు అలా చేస్తావా!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*74వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-15*

యెషయా 11:3  

యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 11వ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ప్రియులారా! ఇక 11వ అధ్యాయంలో తర్వాత వచనము యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును!

 

ఇక్కడ ఆయన దేవుడైనా గాని తండ్రియైన దేవునికి ఇవ్వవలసిన గౌరవము ఇస్తూ ఉంటారు అని అర్ధము! అందుకే గతభాగాలలో చెప్పినట్లు ఆయన స్వయంగా దేవుడైనా గాని ఈలోకంలో మనిషిగా జన్మించారు కనుక మనిషిలా దేవునికి భయపడుతూ, ఒక కుమారుడు తండ్రికి లోబడినట్లు తండ్రియైన దేవునికి లోబడుతూ జవాబుదారీతనముతో జీవించారు. అందుకే మాటిమాటికి నా తండ్రి చిత్తము చేయడానికే నేను వచ్చాను అంటూ ఉండేవారు యోహాను సువార్తలో!!..

యోహాను 4:34

యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.

 

యోహాను 6:39, 41

39. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

41. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

 

యోహాను 7:17

ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.

 

యోహాను 10:37

నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,

 

     చివరకు యేసుక్రీస్తుప్రభులవారు అన్ని అద్భుతాలు చేసినా తననుతాను మహిమ పరచుకోలేదు గాని తండ్రికే మహిమను ఆపాదిస్తూ నాకు నేనుగా ఇవిచేయడంలేదు గాని తండ్రి నాకుచెప్పినవే నేను చేస్తున్నాను అన్నారు! ఈ విధంగా యేసయ్య తండ్రినే మహిమ పరిచేవారు!

 

John(యోహాను సువార్త) 5:19,20,24,30,36

19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

20. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.

24. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

30. నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.

36. అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

 

ఇది ప్రతీ విశ్వాసి జీవితములో ఉండాల్సిన లక్షణము!!! యేసయ్య తండ్రికి లోబడినట్లు మనము క్రీస్తుకు లోబడి ఆయనకు మహిమ తెచ్చేవిధంగా ప్రవర్తించాలి! ప్రతీరోజు ప్రతీ విషయములోను దేవునికి భయపడి జీవించాలి!

 

ఒకసారి యోసేపు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే పాపమే ఆయన దగ్గరకు పరుగెత్తి వచ్చినా పాపమును చేయలేదు- తన యజమాని భార్య మాటిమాటికి అతనిని ప్రలోభపెట్టినా ప్రలోభానికి లొంగక ఆయన పలికిన మాటలు మనకు కనువిప్పు కావాలి!

ఆదికాండము 39: 710

7. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

8. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. *కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను*.

10. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.

చూడండి ఇక్కడ ఆయన మాటలు: నేనెట్లు ఇంతటి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును అని దేవునికి భయపడుతున్నారు. తన యజమాని భార్య అంటే తనకు తల్లి సమానంగా చూస్తున్నారు ఇక్కడ! దేవునికి విరోధంగా నేనెలా పాపం చేయగలను అంటున్నారు! యజమానికి ఎలా ద్రోహం చేయగలను అనకుండా దేవునికి విరోధంగా ఎలా పాపం చేయగలను అంటూ దేవునికి భయపడి తన మనస్సాక్షి అతనికి దర్మశాస్త్రంగా పనిచేసి పాపమును చేయకుండా పాపమును విడిచి పారిపోయారు యోసేపు భక్తుడు!!! ఇలాంటి దైవభయము ప్రతీ విశ్వాసికి అవసరం!

 

ఇలాంటి దైవభక్తి మనము దావీదు గారిలోనూ చూడగలం! సుమారుగా పది సంవత్సరాలు తనకు పిల్లనిచ్చిన మామగారు తనను కుక్కను తరిమినట్లు తరుముతున్నా- రెండుసార్లు తనకు అతనిని చంపడానికి అవకాశం వచ్చినా యెహోవాచేత అభిషేకం పొందిన ఇతనిని నేనెట్లు చంపగలను అంటూ రెండుసార్లు చంపకుండా వదిలేశారు!!...

1 Samuel(మొదటి సమూయేలు) 24:5,6,7

5. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి

6. ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.

7. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.

 

1 Samuel(మొదటి సమూయేలు) 26:8,9,10,11

8. అప్పుడు అబీషై దావీదుతో- దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా

9. దావీదు- నీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?

10. యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;

11. యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి

 

ఆ దైవభయమే అతనిని అనేకమందికి మాదిరిగా నిలిపింది. ఇలాంటి భయము మనకు కావాలి!

 

అదే దావీదుగారి కుమారుడు అమ్నోను అనే పనికిమాలిన కొడుకు తన తండ్రి కుమార్తె అనగా తన సోదరిని మోహించి కట్టుకధలుచెప్పి ఆమెను పాడుచేశాడు. ఇది మనకు 2సమూయేలు 13వ అధ్యాయంలో ఉంటుంది. వీడికి తండ్రి భయము లేదు దేవుని భయము అంతకంటే లేదు! ధర్మశాస్త్రము అలాంటివి చేయకూడదు అని చెప్పినా వీడు చెల్లిని పాడుచేశాడు! కుక్కచావు చచ్చాడు. ఇంకా తన తండ్రికి తన సోదరునికి మధ్యలో వివాదం కలిగించాడు ఈ పనికిమాలిన వాడు!!!

 

బైబిల్ చెబుతుంది మనము యెహోవా యందలి భయము కలిగి ఉండాలి!

కీర్తన 4:4

భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)

 

కీర్తనలు 19:9

యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.

 

కీర్తనలు 111:10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

కీర్తనలు 119:38

నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.

 

కాబట్టి మనము ఎల్లప్పుడు దేవునియందు భయము మరియు భక్తీ కలిగి యుండాలి!

 

1సమూయేలు 12:14,24

14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును.

23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

24. ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.

 

కీర్తన 25:12, 14

12. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.

14. యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

 

Psalms(కీర్తనల గ్రంథము) 33:8,19

8. లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.

19. యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది.

 

 

Psalms(కీర్తనల గ్రంథము) 34:7,9,11

7. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును

9. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.

11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

 

కీర్తనలు 115:13

పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

 

సామెతలు 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

సామెతలు 3:7

నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

 

సామెతలు 9:10

యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.

14:26

22:4

కాబట్టి ఆయనయందు భయభక్తులు కలిగి జీవితమంతా నడుచుకుందాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*75వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-16*

యెషయా 42:13        

1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 11వ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు ధ్యానం చేసుకున్నాము!

 

ప్రియులారా! ఇక 11వ అధ్యాయం తర్వాత మనకు 35వ అధ్యాయంలో రక్షకుని కోసం లేక అభిషక్తుడైన యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకడకోసం ఉన్నట్లు కన్నబడినా నిజానికి అది రెండవరాకడ తర్వాత వెయ్యేండ్ల పాలనలో జరిగే సంభవాలుగా కనిపిస్తున్నాయి కనుక దానిని తర్వాత ధ్యానం చేద్దాం! నిజానికి అక్కడ గుడ్డివారి కన్నులు తెరువబడును కుంటివారు లేడివలే గంతులు వేయును ఈ వచనాలు మొదటి రాకడలో జరిగాయి గాని మొత్తం అధ్యాయమంతా చూసుకుంటే అవి వెయ్యేండ్ల పాలనలోనే జరుగుతాయి అనిపిస్తున్నాయి.

 

ఇక మనకు 35వ అధ్యాయం తరువాత 42వ అధ్యాయంలో రక్షకుని యొక్క పరిచర్య విధానము ప్రవచించబడింది.  ఆయన పరిచర్య విధానము, ఆయన చేయబోయే అద్భుతకార్యాలు కనిపిస్తాయి.

 

సరే, ఇక్కడ మొదటివచనంలో అంటున్నారు: ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను యితడు అన్యజనులకు న్యాయము కనపరచును అంటున్నారు!

 

ఇది మనకు క్రొత్త నిబంధనలో నెరవేరినట్లు చూడగలము!!

మత్తయి 3:17

మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

 

మత్తయి 17:5

అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్ధము ఆ మేఘములోనుండి పుట్టెను.

 

2పేతురు 1:17

ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమ నుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా

2పేతురు 1:18

మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.

 

మార్కు 9:7

మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

లూకా 9:35

మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, (అనేక ప్రాచీన ప్రతులలో- నా ప్రియకుమారుడు అని పాఠాంతరము) ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

 

యేసుక్రీస్తుప్రభులవారు దేవుని హృదయాన్ని ఆనందింపజేసిన వారు!!

 

సరే, ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారిని నా సేవకుడు అంటూ సంభోదిస్తున్నారు!!

సేవకుడు అనే మాటకు ఉపయోగించిన పదం యొక్క అర్ధము అభిషక్తుడు!! అనగా యేసుక్రీస్తుప్రభులవారే!! 

ఇది మనకు ఇదే యెషయా 49:17, 50:410, 52:1315 వచనాలను కూడా చదువుకుంటే అర్ధమవుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా తన సేవకులుగా పిలుచుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సేవకులైనా మాటిమాటికి తప్పిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు! అయితే ఇక్కడ కనబడే మరో సేవకుడు కూడా ఇశ్రాయేలు జాతివాడే- అయితే ఈ సేవకుడు దేవుని చిత్తానికి సంపూర్తిగా అప్పగించుకున్నవాడు, బలవంతుడు, పవిత్రుడు దేవునికి విధేయుడు!!!

అపొ 3:26

దేవుడు తన సేవకుని పుట్టించి, (లేక, లేపి) మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

 

రోమీయులకు 5:8

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 

ఇంకా ఆయన ఈలోకంలో నివశించిన  కాలంలో నేనుసేవ చేయించుకోడానికి రాలేదు గాని సేవచేయడానికి ఇంకా అనేకుల పక్షముగా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అన్నారు!

మత్తయి 20:28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

లూకా 22:27

గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండువాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను.

 

అందుకే ఈ అధ్యాయం అనగా 42వ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మత్తయి గారు ఆత్మావేశుడై యేసుక్రీస్తుప్రభులవారికి వర్తింపజేస్తున్నారు మత్తయి 12:1821 వచనాలలో....!

Matthew(మత్తయి సువార్త) 12:17,18,19,20,21

17. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా

18. ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.

19. ఈయన జగడమాడడు, కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు

20. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు

21. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే.

ఇట్టి సేవకుడు నీకు నాకు తగినవాడు! ఆయనయందలి విశ్వాసమే మనలను పరమునకు నడిపించగలదు!!

మరినీవు ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన దేవునికి భయపడి విదేయునిగా జీవించినట్లు నీవు దేవునికి విధేయుడుగా ఉండగలవా?!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*76వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-17*

 

యెషయా 42:13        

1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

   ప్రియులారా! ఇక 42 వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇంకా అంటున్నారు: ఇతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును అంటున్నారు.  అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అనే దానికోసం గతంలో చూసుకున్నాము! 

 

యెషయా 11:2

యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

 

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

 

Mark(మార్కు సువార్త) 1:9,10,11,12

9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.

10. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

11. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.

 

యోహాను 1:32౩4

32. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల( లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో( లేక, పరిశుద్దాత్మతో) బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.

34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.

 

యోహాను 3:34

ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.

 

ఇక అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును లేక న్యాయము జరిగించును,

 ఇది  రెండవ రాకడలో జరిగే సంభవము!! రెండవరాకడ తర్వాత వెయ్యేండ్ల పాలనకోసం వ్రాయబడిన మాట! యేసుక్రీస్తుప్రభులవారు సర్వలోకానికి రాజై ప్రత్యక్ష పరిపాలన జరిగిస్తారు.  దానికోసం రాస్తున్నారు. దీనికోసం ఇక్కడే కాకుండా ఈ గ్రంధంలో చాలాచోట్ల ఉంది!

 

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

 

యెషయా 16:5

కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

 

Isaiah(యెషయా గ్రంథము) 32:1,13,16,17

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

 

యెషయా 33:5

యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.

 

ఇక రెండవ వచనంలో ఆయన సేవాపరిచర్య విధానం గూర్చి చెబుతున్నారు:  అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు , మూడో వచనం నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును అంటున్నారు!

 

ఇది యేసుక్రీస్తుప్రభులవారు సాత్వికుడై పలికే మాటల కోసం, ఆయన సువార్త విధానం కోసం, ఆయన దీనత్వం సాత్వికము కోసం వివరిస్తున్న మాటలు/ ప్రవచనాలు!! ఇక్కడ దీని అర్ధమేమిటంటే యేసుక్రీస్తుప్రభులవారు తన పరిచర్యలో దేవుని సువార్తను దేవుని సంకల్పాన్ని నిమ్మళంగా చాలా ప్రశాంతంగా దేవుని ప్రేమను తన మాటలలో ప్రసరిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చుతారు!!!  గొప్ప గొప్ప ధ్వనులు చేస్తూ శపిస్తూ కాదు! ఆర్భాటము చేస్తూ ఆయన తిరుగరు. అవును కదా ఆయన సువార్త పరిచర్య చేసేటప్పుడు ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. ఆర్భాటముగా వెళ్ళలేదు. అయితే ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారు ఆయన వెనుక తండోపతండాలుగా వెళ్ళేవారు! గొప్పగొప్ప అద్భుతాలు చేసినా అసాధారణమైన అద్భుతాలు చేసినా ఎవ్వరికీ ప్రసిద్ధి చేయవద్దు అంటూ ఖండితముగా చెప్పేవారు....

మత్తయి 12:16

ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.

మార్కు 3:12

తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.

మార్కు 7:36

అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు

మార్కు 7:37

ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.

 

ఇక మూడవ వచనంలో నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న వత్తిని ఆర్పడు అనగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రజలతో చాలా మృదువుగా జాలిగా సాత్వికంతో వ్యవహరిస్తారు అని అర్ధం!!! ఎందుకంటే క్రీస్తు మార్గము చాలా కఠినమైనది. అది బలవంతంగా జరిగించేది కాదు!  ఆయన ఈ లోకానికి వచ్చింది మానవులను రక్షించడానికి మాత్రమే! కాబట్టి నన్ను నమ్ముకుంటావా లేక నిన్ను శపించాలా లేక కుక్కనో నక్కనో చేసేయ్యాలా అని ఆయన అనరు!!! యోహాను 10:10 లో అదే అన్నారు..

యోహాను 10:10

దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; *గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను*.

 

కాబట్టి ఇక్కడ నలిగిన రెళ్ళు అనగా జీవితంలో చితికిపోయిన వ్యక్తులకు గుర్తు, లేక చాలా బలహీనంగా ఉన్న వ్యక్తులకు గుర్తు. అలాంటివారిని మరింత బలహీనం చెయ్యకుండా వారిని సేదదీర్చేవాడు అని అర్ధం!

ఇక మకమకలాడే వత్తిలో కొద్దిగా నిప్పు ఉంటుంది. ఇప్పుడు దానిని బాగా వెలిగించాలి అంటే కొద్దిగా ఊదాలి! లేక దానిమీద ఉన్న వత్తిచివర ఒడిగట్టిన వత్తిని సరిచెయ్యాలి. అయితే అలాచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దీపము ఆరిపోకుండా వెలిగిస్తారు అని అర్ధం! అనగా ఇలా దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటప్పుడు ప్రజలతో చాలా మృదువుగా జాలిగా వ్యవహరిస్తారు అని అర్ధం!!

అలాగే మనము మాట్లాడే మాటలు- పలికే సువార్త పలుకులు ప్రజలను ఆకట్టుకొనేలా హృదయాలకు హత్తుకునేలా ఉండాలి గాని ప్రజలను భయభ్రాంతులను చేసేలా ఉండకూడదు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*77వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-18*

 

యెషయా 42:48        

4. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.

5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

8. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! ఇక 42 వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే భూలోకమున న్యాయము స్థాపించువారు అతడు మందగిలడు, నలుగుడు పడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును అంటున్నారు.  ప్రియులారా కొన్ని ప్రతులలో ఇంకా ప్రాచీన ప్రతులలో ద్వీపములు అనే పదానికి బదులుగా సముద్ర తీరమునున్న ప్రజలు అని తర్జుమా చేయబడి ఉన్నాయి.

సరే ఇక్కడ లోకములో న్యాయము స్థాపించేవరకు అతడు మందగిలడు అనగా అతడు నీరసించిపోడు అని అర్ధము! అలసిపోడు అంటున్నారు. దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి దానిని ముగించకుండా అతడు విశ్రాంతి తీసుకోడు అని అర్ధము,

నిజానికి సర్వమూ జరిగించేవరకు యేసుక్రీస్తుప్రభులవారు రెస్ట్ తీసుకోలేదు. ఆయన రెస్ట్ తీసుకున్నది కేవలం సిలువమీదనే! అదికూడా చనిపోయే ముందుగానే!

యోహాను 19:28

అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొనుచున్నాననెను.

యోహాను 19:30

యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

 

ఇక ఈ విషయం కేవలం ఇశ్రాయేలు జాతికి మాత్రమే కాకుండా మొత్తం సర్వలోకానికి చెందిన విషయం అన్నమాట ఇది! అందుకే దేవదూత గొల్లల దగ్గరికి వచ్చి అన్నాడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను- దావీదు పట్టణమందు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు! ఇంకా వెంటనే పరలోక సైన్యసమూహము దూతతో నాట్యమాడుతూ అంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు సమాధానం అనకుండా ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానం కలుగును గాక అన్నారు! అందుకే అపొ కార్యములలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నారు. కొందరికి కాదు అందరికీ! సర్వలోకానికి!!!

అపో.కార్యములు 10:36

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

 

ఇక భూమిపై న్యాయస్తాపన చేయాలి అంటే మొదటగా అన్యాయాన్ని అక్రమాన్ని పాపమును తొలిగించాలి! అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా న్యాయ సమ్మతమైన నీతివంతమైన ఒక రాజ్యాన్ని స్థాపించి స్థిరపరచాలి! అందుకే మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చి తన రాజ్యమును స్థాపించి విస్తరించే పనిని మనకు లేక శిష్యులకు అప్పగించి- మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును నమ్మనివానికి శిక్ష విధించబడును అంటూ కొన్నిమాటలు చెప్పారు!  ఈ రాజ్యాన్ని ప్రజలు ఇంకా చూడలేదు. చూడాలని అనేకులు కోరుకుంటున్నారు.  ఒకరోజున తప్పకుండా నీవు నేను చూస్తాము మన భక్తిని విశ్వాసమును సాక్ష్యమును కాపాడుకుంటే!!! 

దీనికోసం యెషయా 11:35 లో ముందుగానే చెప్పారు....

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

 

ఇక ద్వీపములు లేక సముద్రతీరంలో నివాసం చేసేవారు ఈయన ఉపదేశం కొరకు ఎదురుచూస్తారు ఎలా అంటే ఆశాభావంతో లేక నిరీక్షణతో!!!

అందుకే ఆయన సువార్తను ప్రారంభించిన వెంటనే మత్తయి సువార్త నాలుగో అధ్యాయం ప్రకారం  మొదటగా నఫ్తాలి జెబూలూను ప్రాంతాలకు వెళ్లారు, నఫ్తాలి జెబూలూను ప్రాంతాలు గలలియ సముద్రపు ఒడ్డున ఉన్నాయి! అంతేకాకుండా గెన్నేసరతు  ఇంకా గదరేనీయుల ప్రదేశము వెళ్లారు. గెరాసేనీయులు లేక గదరేనీయుల ప్రాంతం అనేది ద్వీపము. ఇలాంటి ద్వీపాలలోకీ వెళ్లి యేసుక్రీస్తుప్రభులవారు సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఇవి మారుమూల ప్రాంతాలు, చదువు నాగరికత లేని ప్రాంతాలు. ప్రజలతో చీత్కరించబడిన ప్రాంతాలు! చీకటిలో- ఆధ్యాత్మిక అంధకారంలో విగ్రహారాధన లాంటి విధానంలో ఉన్న ప్రాంతాలను యేసుక్రీస్తుప్రభులవారు సంచరించి దేవునిరాజ్యము సమీపించింది కనుక మారుమనస్సు పొంది రక్షణ పొందమని పరిచర్య ప్రారంభించారు.

 

Matthew(మత్తయి సువార్త) 4:12,13,14,15,16,17,18

12. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి

13. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

14. జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

15. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను

16. అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)

17. అప్పటినుండి యేసు: పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

18. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

 

మార్కు 1:1417

14. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

15. కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.

16. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

17. యేసు: నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.

 

ఇలా ఆ ప్రాంతాలు సంచరించి వారికి సువార్త వెలుగును నిజమైన వెలుగును దేవుని పరిశుద్ధమైన మార్గమును తెలియజేసి దివ్యమార్గంలో వారిని నడిపించారు!

 

ఇక 5వ వచనం నుండి 8వ వచనం వరకు తండ్రియైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికి చెబుతున్న మాటలు అని అర్ధం చేసుకోవాలి!

ఇక్కడ తండ్రియైన దేవుడు తననుతాను పరిచయం చేసుకుంటున్నారు- ఎలాగు అంటే ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: అవును కదా ఆకాశములు అనగా మొదటి ఆకాశము, మధ్యాకాశము, మూడో ఆకాశములు చేసి, వాటిని విశాలపరిచారు దేవుడు!  భూమిని చేసి దానిమీద చెట్లు జంతువులూ నదులు చేసి మనిషిని చేసి అన్నింటికీ జీవాత్మను ఇచ్చి వాటిని పోషిస్తున్న వారు దేవుడు! ఆ దేవుడు ఏమని అంటున్నారు అంటే కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారితో:

గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధించబడిన వారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివశించువారిని ఇంకా బందీ గృహములోనుండి వెలుపలి తెచ్చుటకును యెహోవానాగు నేనే నిన్ను నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడుతాను ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించి యున్నాను అంటున్నారు! హల్లెలూయ!!!

 

ఈరోజు నీవు నేను సర్వలోకము తెలుసుకోవలసింది ఏమంటే ఈ లోకానికి రక్షణగా యేసుక్రీస్తుప్రభులవారిని తండ్రియైన దేవుడు ఈ భూలోకమునకు పంపించారు! అందుకే యోహాను 3:16 లో అంటున్నారు...

యోహాను 3:16

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా (లేక, జనితైక కుమారుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

యోహాను 3:17

లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.

కాబట్టి ఆయనను నమ్ముకొని ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే దేవుడు తయారుచేసిన ఆ వాగ్ధాన రాజ్యములో భాగముంటుంది. లేకపోతే ఏడ్పును పండ్లు కొరుకుట మాత్రమే ఉంటుంది!

ఏదికావాలో నేడే నిర్ణయించుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*78వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-19*

 

యెషయా 42:58        

5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! ఇక 42వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఆరవ వచనంలో అంటున్నారు: గ్రుడ్డివారి కన్నులు తెరచుటకు బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివశించువారిని ఇంకా బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానాగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని యున్నాను అంటున్నారు.

 

ఇక్కడ నిన్ను అనగా యేసుక్రీస్తుప్రభులవారిని అని అర్ధం చేసుకోవాలి. గతభాగంలో చెప్పడంజరిగింది 58 వచనాలు తండ్రియైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికి చెబుతున్న మాటలు ఇవి!!

 

సరే ఇక్కడ ఏమంటున్నారు అంటే నేను నిన్ను పిలుచుకున్నాను, నీ చేయి పట్టుకుని నడిపిస్తాను ఎందుకంటే నీవు చేయాల్సిన పనులు ఏమంటే: గ్రుడ్డివారి కన్నులు తెరవాలి. బంధించబడిన వారిని చెరసాల నుండి విడిపించాలి! చీకటిలో ఉన్నవారికి వెలుగునిచ్చి వారి చెరలోనుండి విడిపించాలి అంటున్నారు. అయితే ఈ చెర మరియు బందీగృహము ఏమిటంటే ధర్మశాస్త్రము అనే చెర, ఇంకా పాపము అనే చెరసాల, పాప బంధకాల నుండి విడిపించి పరలోకము చేర్చే పనిని తండ్రియైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికి ఇచ్చారు! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే: దీనిని ఇశ్రాయేలు ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇదే మాట ఇదే గ్రంధంలో చాలా సార్లు ఉంది కనుక వారు ఏమని అపోహపడ్డారు అంటే మెస్సయా అనే అభిషక్తుడు వచ్చి- ప్రస్తుతం వారున్న అష్షూరు చెరనుండి, బబులోను చెరనుండి విడిపిస్తారు. మెస్సయ్య వారిపక్ష్యంగా యుద్దాలు చేస్తారు. ఆయనే రాజుగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించి మోషేలా చెరనుండి విముక్తి చేస్తారు అని అపోహపడ్డారు! అయితే నిజానికి చెర అనగా ఆధ్యాత్మిక అంధకారమనే సాతాను పాపపు చెరనుండి దేవుడు వారిని విడుదల చేయడానికి ఎంచుకున్న సాధనం యేసుక్రీస్తుప్రభులవారు అని, ఆయన చేసే యుద్ధము సాతానుతో అని, ప్రజలందరికోసం మొదటిరాకడలో యేసుక్రీస్తుప్రభులవారు చనిపోతారు అని బల్యర్పణ చేయబోతున్నారు అని వారు అర్ధం చేసుకోలేకపోయారు!!

 

ఇక గ్రుడ్డివారి కన్నులు తెరుస్తారు, అద్భుతాలు చేస్తారు అని ఇదే గ్రంధంలో ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే:

యెషయా 29:18

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

 

యెషయా 32:3

చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

యెషయా 32:4

చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

 

యెషయా 35:5

గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

యెషయా 35:6

కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

 

యెషయా 49:6

నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

యెషయా 49:8

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

 

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును

 

ఇక ఇది ఎప్పుడు నెరవేరింది అంటే లూకా సువార్త 4:..

Luke(లూకా సువార్త) 4:16,17,18,19,20,21

16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

 

ఇక మనము నాలుగు సువార్తలను చూసుకుంటే యేసుక్రీస్తుప్రభులవారు ఈ లోకంలో సువార్త పరిచర్య చేసేటప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. గ్రుడ్డివారికి చూపునిచ్చారు. కుంటివారికి కాళ్ళునిచ్చారు. ఊచకాలుచేతులతో ఉన్నవారిని బాగుచేశారు అంగహీనులను స్వస్తపరిచారు మూగవారిని మాట్లాడే శక్తినిచ్చారు. చివరికి చనిపోయిన వారిని సహితము లేపారు! ఇలా ఎన్నెన్నో మహా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారు! తండ్రి చిత్తము నెరవేర్చారు! ఇంకా తాను చేయడమే కాకుండా తనను అంగీకరించిన వారు కూడా ఇలాంటి అద్భుతాలు చేసే శక్తిని అధికారమును ఇచ్చారు! హల్లెలూయ!!!

 

అలాగే ఆయన శిష్యులు అనేకమైన అద్భుతాలు చేశారు....

లూకా 10:17

ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా

లూకా 10:19

ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.

లూకా 10:20

అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.

 

చివరికి ఆయన శిష్యులు కూడా చనిపోయిన వారిని తిరిగి లేపారు....

అపో.కార్యములు 9:36

మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా (అనగా, లేడి) అని పేరు. ఆమె సత్‌ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను.

అపో.కార్యములు 9:37

ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.

అపో.కార్యములు 9:40

పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగితబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.

 

అపో.కార్యములు 20:9

అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను.

అపో.కార్యములు 20:10

అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.

అపో.కార్యములు 20:12

వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.

 

యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు అంటూ అవును ఆమెన్ అంటున్నారు.

హెబ్రీయులకు 13:8

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.

ఆరోజు అద్భుతాలు చేసిన దేవుడు- ఈరోజు కూడా సజీవుడు ఈరోజు కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నారు! ఈరోజు ఎంతోమంది దైవజనులు దేవుణ్ణి ఆశ్రయించి అద్భుతాలు జరిగిస్తున్నారు. ఇంకా ప్రార్ధించగా సంఘాలలో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. కేన్సర్ వ్యాధులు పారిపోతున్నాయి. భయంకరమైన రోగాలు స్వస్థత పడుతున్నాయి. దయ్యాలు పారిపోతున్నాయి! ఆయన సజీవుడు! బలముగల వాడు! నిత్యుడైన దేవుడు! మరి ఆయనను అంగీకరించి ఆ పునరుత్థాన బలముతో నీవు జీవిస్తున్నావా?! దేవుని పేరు పెట్టుకున్న నీవు ఆ పేరుకు తగినట్లుగా జీవిస్తున్నావా? అన్యజనులకు వెలుగుగా బ్రతుక గలుగుతున్నావా?!!!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యెషయా ప్రవచన గ్రంధము*

*79వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-20*

యెషయా 42:58        

5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక 42 వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఇక ఇదే వచనంలో మరోమాట అంటున్నారు తండ్రియైన దేవుడు: నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధన గాను అన్యజనులకు వెలుగు గాను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నారు!!

 

చూడండి ఇక్కడ, మొదట నిబంధన గాను, రెండు అన్యజనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను అంటున్నారు!

 

ఇదేమాట మరలా 49:8 లో కూడా అంటున్నారు: ...

యెషయా 49:8

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

 

ఇక్కడ నీవు నిబంధన చేసేలా చేస్తాను అంటున్నారు. నిన్ను ప్రజలకు నిబంధనగా చేస్తాను అంటున్నారు. ఇది ఏ నిబంధన అనగా క్రొత్త నిబంధన అని అర్ధమౌతుంది. అనగా యేసుక్రీస్తుప్రభులవారు మానవులకు దేవునికి మధ్య మధ్యవర్తిగా దేవుడు చేశారు అన్నమాట!

ఆ నిబంధన ఏమిటి?

యిర్మియా ౩1:3134

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.

 

చూడండి ఎంతటి గొప్ప నిబంధనో! ఇదే క్రొత్త నిబంధన! ఇక్కడ చేస్తాను అన్నారు! అయితే యేసుక్రీస్తుప్రభులవారు ఈలోకానికి వచ్చిన తర్వాత తన రక్తముతో క్రొత్త నిబంధన చేశారు!

మత్తయి 26:2728

26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి.

28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

1తిమోతికి 2:5

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

హెబ్రీయులకు 8:6

ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

 

హెబ్రీయులకు 9:15

ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

 

గమనించాలి: మరలా మనము మత్తయి 26:2728 లో గల క్రొత్త నిబంధన కోసం ఆలోచిస్తే  ఆ గిన్నెలో గల ద్రాక్షారసం యేసుక్రీస్తు సిలువపై చిందించిన రక్తమును సూచిస్తుంది. ఇలా రక్తము కార్చడం, బాధలకు యాతనలకు గురికావడం మానవులు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా తానే మానవుల పక్షంగా బాధలు అనుభవించి మనము చెల్లించాల్సిన వెల, మనము అనుభవించాల్సిన శిక్ష తాను భరించి మానవులకు పాప విమోచన జరిగించారు! ఇదీ తండ్రి చేసిన నిబంధన! మానవుల కొరకు తండ్రి రచించిన విమోచినా ప్రణాళిక!!! దానిని అక్షరాల కుమారుడు జరిగించారు! 

 

అయితే క్రొత్త నిబంధన అని ఎందుకు అంటున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారి సమయంలో చేసిన నిబంధన- పశువుల రక్తముతో చేసిన నిబంధన!  నిందలేని పాపము లేని పశువులను అర్పించి ఆ రక్తముతో చేసిన  నిబంధన అది!  అయితే అది అట్టర్ఫ్లాఫ్ అయిపోయింది అని మనకు హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తే అర్ధమవుతుంది. అయితే ఈ నిబంధన తన కుమారుడైన యేసు రక్తముతో చేసిన పరిశుద్ధ నిబంధన!  ఇది బలము గలది! ఎన్నడూ నిలిచేది!  ఆ నిబంధనకు గుర్తుగా నీవు నేను బాప్తిస్మం పొందిన ప్రతీవారు ప్రభురాత్రి సంస్కారములో పాలుపొందులు పొంది ఆయన రక్తములో ఆయన శరీరములో పాలుపొందులు పొందితే ఆయనతో సరియైన సహవాసము కలిగి ఆయనకు తగినట్లుగా జీవిస్తే ఆధ్యాత్మిక మేలులతో మనము వర్ధిల్లుతూ ఆయన రాజ్యము చేరగలము!!

 

పాత నిబంధన అనేది బలులకు మరియు క్రియలకు సంబంధించినది అయితే క్రొత్త నిబంధన కృపకు సంబంధించినది!!! యేసుక్రీస్తుప్రభులవారిని నమ్మి విశ్వసించిన ప్రతీ ఒక్కరు ఈ కృపకు పాత్రులై పాపమునుండి విడుదల పొందగలరు!!!

అపొ 13:3839

38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,

39. మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.

 

Romans(రోమీయులకు) 3:21,22,23,24,25,26

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

కాబట్టి ఆ కృప నీకు కావాలంటే యేసురక్తములో కడుగబడాలి! నిజమైన మారుమనస్సు నిజమైన పశ్చాత్తాపము కలిగి క్రీస్తు పాదాలు పట్టుకోవాలి!అప్పుడు ఆయన కుమారుడైన యేసురక్తము ప్రతిపాపం నుండి మనలను కడిగి విమోచిస్తుంది.

1యోహాను 1:7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 నేడే ఆయన వద్దకు రా!

నీ పాపములు కడుగుకుని పరిశుద్ధుడవై పరమునకు పొమ్ము!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*80వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-21*

యెషయా 42:58        

5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! ఇక 42 వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 7వ వచనం చివరి పాదంలో అంటున్నారు అన్యజనులకు వెలుగు గాను నేను నిన్ను నియమించి యున్నాను!

 

దీనికోసం గతంలో కూడా ధ్యానం చేసుకున్నాము!  ఇదేమాట యెషయా 49:6 లో కూడా చెబుతున్నారు దేవుడు!....

నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

 

ఇదేమాట యేసుక్రీస్తుప్రభులవారిని సున్నతి చేయించడానికి తీసుకుని వచ్చినప్పుడు సుమియోను ప్రవక్త ప్రవచిస్తున్నారు ...

 

లూకా 2:30

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

లూకా 2:31

నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన

లూకా 2:32

నీ రక్షణ నేను కన్నులార చూచితిని.

 

ఇక యేసుక్రీస్తుప్రభులవారు తానే స్వయముగా అంటున్నారు నేను లోకానికి వెలుగును!

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

 

నిజమైన వెలుగుకోసం రాస్తూ యోహాను గారు అంటున్నారు:

 

యోహాను 1:4

ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

యోహాను 1:5

ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

 

3:1920

19. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

20. దుష్కార్యము చేయు (లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు (మూలభాషలో- తన క్రియలు గద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు.

 

John(యోహాను సువార్త) 12:35,36

35. అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు

36. మీరు వెలుగు సంబంధులగునట్లు (మూలభాషలో- వెలుగు కుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

 

మత్తయి 4:15

చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను

 

లూకా 1:79

మన పాదములను సమాధాన మార్గములోనికి నడి పించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించెను.

 

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

1యోహాను 1:5

మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

 

కాబట్టి దేవుడు ఈ లోకానికి ప్రసాదించిన వెలుగు యేసుక్రీస్తుప్రభులవారు!!! సూర్యుడు ఈ భూమికి ఎలా వెలుతురుని ప్రసాదిస్తున్నాడో అలాగే మానవాళికి యేసుక్రీస్తుప్రభులవారు వారి హృదయాలలో ఉన్న అంధకారమును దూరం చేయడానికి వారి జీవితం మనస్సు హృదయం వారి నడవడిక అన్నీ వెలుగొందడానికి దేవుడు పంపించిన వెలుగు యేసుక్రీస్తుప్రభులవారే!!!  దీనిని మనకు ఆయన జీవితం, ఆయన చేసిన పనులు ఆయన బోధించిన మాటలు అన్నీ ధ్యానం చేయడం ద్వారా, ఇంకా పాప విముక్తి కోసం దేవుడు ఆయనను ఎలా ఎందుకు పంపించారో, పాప విముక్తిని చేసిన విధానం ఇవన్నీ మనకు ఆ నిజమైన వెలుగుకోసమైన సత్యాన్ని తెలియజేస్తాయి!!  అయితే యోహాను సువార్త ప్రకారం ఈ నిజమైన వెలుగును స్వీకరించడానికి మనకు సమయం పడుతుంది. కారణం ఈ యుగ సంభంధమైన దేవత మానవులు ఆ వెలుగులోనికి రాకుండా అడ్డుపడుతూ వారి ఆత్మీయ నేత్రాలకు గ్రుడ్డితనం కలిగిస్తుంది.  అందుకే నిజమైన వెలుగుకి , అవాస్తవమైన వెలుగుకి తేడాను ప్రజలు గుర్తించలేకపోతున్నారు!  నిజమైన వెలుగు పరలోకానికి మార్గం చూపిస్తుంది. అవాస్తవమైన వెలుగు లేక లోకము  నరకానికి తీసుకుని పోతుంది! అయితే క్రీస్తుయేసుని అనుసరించే వారికి ఈ వెలుగు జీవపు మార్గము! అది మనలను పరమునకు నడిపిస్తూ దేవుని రాజ్యములో చేర్చుతుంది.

 

అయితే క్రీస్తుని అనుసరించడమంటే కేవలం ఆయనకు ఆయన చెప్పిన మాటలకు బైబిల్ కి విధేయత చూపడమే!! ఆయన చెప్పిన మాటలమీదనే మనము మన మనస్సు నిలపాలి తప్ప- లోకమువైపు లోకాశలవైపు చూడకూడదు!  ఆయన నుండి వెనుకతీస్తే మరలా మనం అజ్ఞానంలోనికి నరక దారికి పోతాము! కాబటి యేసుక్రీస్తుప్రభులవారిని అనుసరించే వారు ఇప్పుడు నిజమైన వెలుగులో ఉన్నారు! లోకము గ్రహించలేని అనేకమైన విషయాలు, కార్యాలు నిజమైన వెలుగులో ఉన్న వారు స్పష్టముగా చూడగలరు! తాము వెళ్లేమార్గం వారికి తెలుసు! వారి గమ్యము వారికి తెలుసు!

 

అయితే ఈ నిజమైన వెలుగును నిరాకరిస్తూ లోకములో ఆధ్యాత్మిక అంధకారంలో విగ్రహారాదనలో ఉన్నవారు శాశ్వతమైన అంధకారములోనికి వెళ్ళిపోతున్నారు! దాని గమ్యము నరకం!! అక్కడ అగ్ని ఆరదు! పురుగు చావదు!! పండ్లు పటపట కొరుకుతారు నరక వేడి తాపము తట్టుకోలేక!!

మత్తయి 8:12

రాజ్య సంబంధులు (మూలభాషలో- రాజ్యకుమారులు) వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.

 

మత్తయి 22:13

అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

 

2పేతురు 2:17

వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

 

నిజమైన వెలుగు లేక జీవకాంతి అనేమాటకు సజీవమైన వెలుగు లేక జీవము నుండి ప్రసరించే కాంతి- అది యేసుక్రీస్తుప్రభులవారే!

 

ప్రియ స్నేహితుడా! మరి నీవు క్రీస్తు ఇచ్చే జీవపు కాంతిలో నీవున్నావా!!! ఆయన కాంతిని కోరుతున్నావా?! లేక చీకటితో తృప్తి పడి ఊరుకుంటున్నావా?

సరిచూసుకో! సరిచేసుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*81వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-22*

యెషయా 50:48        

4. అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

5. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.

8. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! 42వ అధ్యాయంలో మిగిలిన వచనాలు అవి రెండవ రాకడలో సంభవించేవి కనుక మనము 50 అధ్యాయము ధ్యానం చేసుకుందాం! గమనించాలి- యెషయా గ్రంధంలో ప్రతీ అధ్యాయంలోను యేసుక్రీస్తుప్రభులవారు కనిపిస్తారు. అయితే ఇప్పుడు మనము మొదటిరాకడలో సంభవించిన విషయాలు- లేక మొదటిరాకడ కోసం యెషయా గారు ప్రవచించిన వాటికోసం మాత్రమే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము!

 

ఇక  ఇంతవరకు మనము ఆయన సేవా పరిచర్య విధానం కోసం చూసుకున్నాము!  అయితే  61వ అధ్యాయం కూడా సేవా పరిచర్యకు సంబంధించినదే! అయితే గతభాగాలలో 61వ అధ్యాయములో ఉన్న విషయాలనే అనేకసార్లు ధ్యానం చేసుకున్నాము కాబట్టి ఇక 61వ అధ్యాయంలో గల సేవాపరిచర్య కోసమైన విషయాలు ఇక చూసుకోవద్దు! ఈ అధ్యాయం నుండి అనగా 50వ అధ్యాయం నుండి మనకు ఆయన సిలువయాగం కోసం ధ్యానం చేసుకుందాం! ఆయన అనుభవించబోయే శ్రమలు కోసం ప్రవక్త, ఆయన పుట్టకముందు ఆయన జననం కోసం 700 సంవత్సరాల క్రితం ఎలా ప్రవచించారో అలాగే ఆయన పొందబోయే శ్రమలు, మరణ విధానం కూడా ప్రవచించారు! వాటినే ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాం!

 

అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతీ ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించియున్నాడు అంటున్నారు!

గమనించాలి- గత 42వ అధ్యాయంలో తండ్రియైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారితో పలికిన మాటలైతే, ఈ 50వ అధ్యాయంలో మాటలు కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు అందరితో/ ఇశ్రాయేలు ప్రజలతో మరియు  తనలోతాను అనుకుంటున్న మాటలు! ఇక్కడ ఈ అధ్యాయంలో మీద మూడు వచనాలు తండ్రియైన దేవుడు విసిగిపోయి ఇశ్రాయేలు ప్రజలతో పలికిన మాటలయితే ఈ మాటలు తండ్రిచేత సేవకునిగా పంపబడిన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నారు!  మీద మూడు వచనాలలో మీరు చేసిన అపరాధాల వలననే మీకు నేడు ఈ శ్రమలు కలిగాయి అని తండ్రియైన దేవుడు చెబితే- 4వ వచనం నుండి నేను మీ మధ్య పరిచర్య చేస్తుంటే మీరు నన్ను ఎన్నెన్నో మాటలన్నారు, నాకు ఎన్నో బాధలు కలుగజేశారు. నన్ను ఘోరంగా అవమానించారు. నిందలు మోపారు, ఉమ్మివేశారు, కొట్టారు, తిట్టారు,  అయితే అవన్నీ సహించమని తండ్రి నాకు చెప్పి పంపించారు. మీరు నన్ను ఎన్ని హింసలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా అవమానించినా నా తండ్రియైన దేవుడు నన్ను వదలలేదు, నాతోనే ఉన్నారు అంటున్నారు! ఇవే ఈ వచనాల భావము!!

 

సరే, ఇప్పుడు ఒక్కో వచనమును ధ్యానం చేసుకుందాం!

 

అలసినవానిని మాటలచేత ఊరడించే జ్ఞానము నాకు కలిగేలా ఇంకా శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు ఇచ్చారు అంటున్నారు!

ఇక్కడ శిష్యునికి తగిన నోరు అని, ఇంకా శిష్యులు వినునట్లుగా నేను వినడానికి ప్రతీ ఉదయాన్న నాకు వినే బుద్ధి పుట్టిస్తున్నారు అనడానికి కారణం ఏమిటంటే: యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు మరియు మానవుడు! దైవమానవుడు!!  ఆయన దేవుడే గాని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం సేవకుని రూపం దాల్చి తనను తాను రిక్తుడై జీవించారు. కాబట్టి శిష్యుడు లేక సేవకుడు ఎలా ఉండాలో ఆ విధానం దేవుడే స్వయముగా యేసుక్రీస్తుప్రభులవారికి నేర్పుతున్నారు అంటున్నారు ఇక్కడ! ఇక్కడ సేవకుడు లేక శిష్యుడు అనగా 42వ అధ్యాయం మొదటి వచనం ఇదిగో నా సేవకుడు అని ఎవరికోసం అన్నారో ఆ సేవకుడు ఇప్పుడు జవాబు ఇస్తున్నారు......

యెషయా 42:1

ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

యెషయా 42:2

అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

యెషయా 42:3

నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

 

ఇప్పుడు నేను శిష్యుడను లేక సేవకుడను కనుక సేవకుడు యజమానికి ఎలా లోబడి ఉంటాడో, అలాగే నేను కూడా లోబడి ఉన్నాను. ఇక ఒక సేవకున్ని లేక శిష్యుని సామాన్యజనులు ఎలా నీచంగా తక్కువవానిగా ఎంచి మాట్లాడుతారో అలాగే ఇప్పుడు మీరు అనగా ఇశ్రాయేలు ప్రజలు నాతో అదేవిధంగా మాట్లాడుచున్నారు  కనుక- మీరు అలా నాతో మాట్లాడినా కోపగించుకోకుండా సాత్వికమైన బుద్ధి, సేవకుడు తగ్గించుకొని ఎలా జవాబిస్తాడో అలాంటి తగ్గింపు, యజమాని మాటలు అందరి మాటలు వినే బుద్ధి దేవుడు నాకు ప్రతీ ఉదయాన్న ఇస్తున్నారు అంటున్నారు!

 

నిజంగా సేవాపరిచర్య చేస్తున్న ప్రతీ దైవజనుడు ఇలాంటి మనస్సు, వినే బుద్ధి నేర్చుకోవాలి లేక పొందుకోవాలి! అప్పుడే సేవకుడు తన పరిచర్య చేయగలడు!  అవును సేవకులను అనేకులు మీరు అడుక్కునే వారు అంటారు, సిగ్గులేని వారు అంటారు, అమెరికా నుండి డబ్బులు వస్తే తీసుకుని ఎంగిలి మెతుకులు కోసం అమ్ముడు పోయిన వారు అని తిడుతూ ఉంటారు. వాటిని వింటూనే నేను పెరిగాను.  గాని మా తండ్రి ఎప్పుడు వారికి జవాబు ఇవ్వలేదు. ఇది మా నాన్నగారు యేసయ్య నుండి నేర్చుకున్నారు!  కరపత్రాలు పంచుతున్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కాండ్రించి ఉమ్మివేసేవారు. అది నాకు చిన్నప్పటి నుండే అలవాటు అయ్యింది. ఇది సేవకుల జీవితంలో తప్పకుండా ఏదో ఒకరోజున అనుభవించి ఉంటారు.  జీతం కోసం పనిచేసే సేవకులకు అన్యుల నుండి ఇలాంటివి ఎదురవక పోయినా సొంత సంఘ పెద్దలనుండి ఎదురవుతాది కొన్నిసార్లు- మేమిచ్చే జీతంతో నీవు బ్రతుకుతున్నావు అని మర్చిపోవద్దు, మేము చెప్పినట్లే నీవు చెయ్యాలి, మేము చెప్పినట్లు ప్రసంగాలు చెయ్యాలి అంటూ ఉంటారు కొంతమంది నరకానికి పోయే సంఘపెద్దలు!!! సేవకుడు ఇలాంటివి అన్నీ సహించాలి! శపించకూడదు! శపిస్తే వారు నిజంగా నరకానికి పోతారు. సహించి వారిని క్షమిస్తే దేవుడు వారిని మార్చుతారు లేక ఒక దెబ్బ కొడతారు. గాని దేవుడు మనకు ఇచ్చిన పనిని గొర్రెలను మేకలను మేపడం వరకే!

కాబట్టి ఇలాంటి లోబడే బుద్ధి దేవుడు నాకు ప్రతీ రోజు ఇస్తున్నారు అంటున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఇలాంటి బుద్ధి లోబడే అనుభవం దేవుడు ప్రతీ దైవసేవకునికి విశ్వాసికి దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*82వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-23*

యెషయా 50:48             

4. అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

5. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.

8. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! 50వ అధ్యాయంలో మాటలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం!

అలసిన వానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు...

ఇదే గ్రంధంలో కూడా అంటున్నారు 40:29 లో అలసిపోయిన వారిని ఆయన బలం ఇస్తారు, నీరసించిపోయిన వారికి బలాబివృద్ధి చేకూరుస్తారు అని.

యెషయా 40:29

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

అయితే ఎలా చేస్తారు అంటే ఆయన మాటలచేత ఆదరణ మరియు బలం చేకూర్చుతారు అని ఇక్కడ వివరణ ఇస్తున్నారు.

 

అదేవిధంగా 42:3 లో నా సేవకుడు నలిగినరెల్లును విరువడు, మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పడు అంటూ వ్రాసారు. అనగా గతభాగాలలో చూసుకున్నాము- చాలా నెమ్మదిగా సాత్వికముగా ఆయన మాట్లాడతారు అని!!

 

అయితే నిజానికి ఆయనెప్పుడు ఇలాంటి ఆదరణ మాటలు బలం చేకూర్చే మాటలు చెప్పారు అని చూస్తే మనకు సువార్తలలో విస్తారంగా చూసుకోవచ్చు!

 

నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని శ్రమపెట్టవద్దు అని యాయీరుకి కబురు వస్తే యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు: నమ్మికమాత్రముంచుము, నీ కుమార్తె బాగుపడును అన్నారు! లూకా 8:49

యేసు ఆ మాటవిని భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి...

 

అదే రోజున రక్తస్రావ రోగముతో బాధపడుచున్న ఒక స్త్రీతో అంటున్నారు: కుమారి! నీ విశ్వాసమే నిన్ను స్వస్తపరచింది, సమాధానము గలదానివై ఇంటికి పొమ్ము అన్నారు!

లూకా 8:47

అందుకాయన: కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను.

 

మరో స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది, మా మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటివారిని రాళ్ళతో కొట్టి చంపాలి, నీవేమంటావు అని ఒక స్త్రీని తీసుకుని వస్తే- మొదట మీలో ఏ పాపము చేయనివాడు ఆమె మీద రాయి విసరండి అని ఆమెను తప్పించిన రక్షకుడు! వారు వెళ్ళిపోయాక- నేను కూడా నిన్ను శిక్షంచను గాని ఇకను పాపము చేయవద్దు అని చెప్పి పంపించిన ఆదరణ కర్త!

యోహాను 8:10

యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో- నీమీద నేరము మోపిన వారెక్కడ నున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు...

యోహాను 8:11

ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

 

పాపము చేసే స్త్రీని కూడా అమ్మా! అని పిలిచిన మహా మనీషి ఆయన!! ఇలా చెప్పుకుంటూపోతే బోలెడున్నాయి గాని ముఖ్యమైనవి రెండు చూసుకుందాం!

 

కొండమీద ప్రసంగము మరియు మత్తయి 11:28౩౦ లో వ్రాయబడిన/ చెప్పబడిన ఆణిముత్యాలు లాంటి మాటలు!

ప్రయాసపడి భారము మోసుకొను సమస్త జనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును!  నా కాడి మీమీద ఎత్తుకొని దానిని మోయడం నేర్చుకోండి ఎందుకంటే నా కాడి మృదువైనది నా భారం తేలికైనది.నేను సాదుశీలున్ని అహంబావం లేని వాడిని అని చెప్పారు....

మత్తయి 11:28

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

మత్తయి 11:29

నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

 

ఈలోకంలో ఎటువంటి భారము మోసుకుంటున్న నా యొద్దకు రండి అన్నారు! నిజానికి ఆ భారము పాప భారము! ఇక అంతేకాకుండా సమస్త జనులారా అని పిలుస్తున్నారు! ఇండియా పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇంకా అమెరికా రష్యా ఇలా అన్ని దేశాల వారిని పిలుస్తున్నారు. ఎవరైనా సరే, ఆయన వద్దకు రావచ్చు, అంతేకాకుండా పూర్వం ఆ వ్యక్తి పాపి కావచ్చు, వ్యభిచారి కావచ్చు దొంగ కావచ్చు త్రాగుబోతు కావచ్చు, ఎవరైనా రావచ్చు వచ్చి ఆయనను ఆశ్రయించి పాప క్షమాపణ పొందుకుని పరిశుద్దుడుగా మారి- ఆయన సిలువను ఎత్తుకోవచ్చు!  గాని సిలువను ఎత్తుకున్న తర్వాత ఇకను పాపం చేయకూడదు అంతే! అదే కండిషన్!!!   మరి ఇవి ఆదరణ మాటలు, అలసిన వారిని ఊరడించే మాటలు కావా!!!

 

ఇక కొండమీద ప్రసంగంలో అంటున్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో:

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు! సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు; నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు! కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుతారు, హృదయ శుద్ధిగలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు, సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు, నీతినిమిత్తం హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటూ ఎన్నెన్నో ఆదరణ మాటలు చెప్పారు!  ఇంకా నీ పొరుగువారిని ప్రేమించండి, నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పారు!  ఇక అదే కొండమీద ప్రసంగంలో అంటున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింత పడకుండా మీ చింతయావత్తు దేవుని మీదను వెయ్యండి అంటున్నారు. మీకు అన్నము పానము బట్టలు కావాలి అని దేవునికి తెలుసు! వాటిని తప్పకుండా దేవుడు మీకిస్తారు అన్నారు మత్తయి 5,6,7 అధ్యాయాలలో! 

కాబట్టి అలసిపోయిన వారిపట్ల దేవుడు జాలిచూపే దేవుడు! తన సేవకుడైన యేసుక్రీస్తుప్రభులవారికి తన ప్రజలను ఏవిధంగా ఆదరించాలో ప్రతీరోజూ దేవుడు చెప్పేవారు! అలాగే సేవకు పిలువబడిన సేవకుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ప్రతీరోజు ఏమి బోధించాలా ఎలా ఆదరించాలా అనే మాటలు కనిపెట్టి పొందుకోవాలి!

 

ఇలాంటి ఆదరణ కర్త, అలసిన వారిని ఊరడించే వాడు మన దేవుడు!

మరి ఆయన ఆశ్రయము కోరుతావా!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*83వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-24*

యెషయా 50:48        

4. అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

5. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.

8. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! 50వ అధ్యాయంలో మాటలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం!

అలసిన వానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు... ఇంకా శిష్యులు వినునట్లుగా వినేటట్లు నాకు బుద్ధి పుట్టించుచున్నాడు అంటున్నారు. అయితే ప్రాచీన ప్రతులు చూసుకుంటే యెహోవా నాకు అలసిన వారిని ఊరడించేలా నేర్పుగల నోరు నాకిచ్చారు అని వ్రాయబడి ఉంది!

 

దీనికోసం ఆలోచిస్తే ఇది యేసుక్రీస్తుప్రభులవారి జీవితంలో ప్రతీరోజు కనిపించేది.

కీర్తన 45:2

నరుల కంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.

 

లూకా 4:22

అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడుకాడా? అని చెప్పుకొనుచుండగా

 

John(యోహాను సువార్త) 7:16,17

16. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.

 

12:4950

49. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞయిచ్చియున్నాడు.

50. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.

 

యోహాను 14:24

నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.

 

చూడండి: యేసుక్రీస్తుప్రభులవారి సువార్త పరిచర్యలో జరిగిన రెండు సంఘటనలు చూసుకుంటే నేర్పుగల మాటలను దేవుడు ఎలా ఇచ్చారో మనకు అర్ధమవుతుంది.

 

మొదటిది: పరిసయ్యులు సద్దూకయ్యులు ఇంకా ప్రధానయాజకులు అందరూ ఆయనను శోధిస్తూ ఒకమాట అన్నారు: నీవు ఇంతటోడివి అంతటోడివి దేవునిమాటలను ఉన్నది ఉన్నట్లే బోధిస్తున్నావు అని ముఖస్తుతి మొదట చేసి- ఆ తర్వాత అన్నారు- కైసరుకి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అన్నారు! దేవుడు వారియొక్క హృదయ దురాలోచనలు ముందుగానే పసిగట్టి అన్నారు- దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి, కైసరుకి ఇవ్వాల్సినవి కైసరుకి ఇవ్వండి అనే సమయోచితంగా జవాబిచ్చారు!

లూకా 20:25

అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.

 

మరో సందర్భములో ఆయనను చిక్కుపెట్టే మాటలతో సంధించడానికి మనుష్యులను పంపితే వారు వచ్చి పలికిన మాటలు: ఆ మనుష్యుడు పలికినట్లు ఎవడూ పలకలేదు!!! హల్లెలూయ!

యోహాను 7:46

ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.

 

దేవుడు మనకు ఇలాంటి సమయోచితమైన మాటలు, నేర్పుగల మాటలను దయచేయువాడు!!!

అందుకే హెబ్రీ 4:16 లో భక్తుడు రాస్తున్నారు....

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము.

 

ఇక యేసయ్య పలికిన మాటలు చూసుకుంటే:

మత్తయి 10:1920

Matthew(మత్తయి సువార్త) 10:18,19,20

18. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.

19. వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.

20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.

 

యెషయా గ్రంధంలో అంటున్నారు 51:16

నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.

 

మోషేతో అన్నారు దేవుడు

Exodus(నిర్గమకాండము) 4:10,11,12

10. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా

11. యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

12. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

 

   కాబట్టి దేవుడు మనకు మాటలను సరియైన మాటలను ఇచ్చి సమయోచితంగా పలికేలా చేస్తారు! కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు ఇంకా ఎదురాడే మనుష్యులు ఎదురైనప్పుడు ఏమి చెప్పాలా ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించకుండా దేవునికి మనలను మనము అప్పగించుకుంటే దేవుడే మనలను ఉపయోగించుకుని సరియైన జవాబును ఇస్తారు! ఇలాంటి అనుభవం మా తండ్రిగారికి కూడా ఒకసారి తారసపడింది అట! నాన్నగారు ఎప్పుడు తెల్లనిబట్టలు వేసుకునే వారు. ఒకరోజు మా సొంతఊరినుండి బయలుదేరి ప్రస్తుతం ఉన్న గ్రామానికి నడిచి సువార్తకై వస్తుంటే వెంకటాపురం అనే గ్రామస్తులు అడ్డుకున్నారు! దేవుడు ముందుగానే ఎవరు దారిలో వస్తారో ఏమని సమాధానం చెప్పాలో ముందుగానే చెప్పారట! గ్రామస్తులు- ఓ యేసుబాబు! మేము ఇంత సంపాదిస్తున్న మేము తెల్లనిబట్టలు వేసుకోలేక పోతున్నాము! నీవు ప్రతీరోజు తెల్లబట్టలు వేసుకుంటున్నావు, నీకు ఇలా బోధించడానికి  ఎంత ఇస్తున్నారు ఏమిటి అన్నారు. (అప్పటికి నాన్నగారు ఇంకా సేవకు రాలేదు, విశ్వాసిగా ఉంటూ రాత్రుళ్ళు  చేపలు పట్టుకుంటూ  ఉదయమున  సువార్త ప్రకటించేవారు).  నాన్నగారు అన్నారు నా దగ్గర బోలెడు డబ్బుంది. దేవుడు నాకిచ్చారు. చూపించు అంటే: కీర్తన 119:72 వేలకొలది వెండిబంగారు నాణెముల కంటే నీవిచ్చు ధర్మశాస్త్రము గొప్పది/ నాకు మేలు అనేమాట చూపించి, నాదగ్గర ఈ బైబిల్ ఉంది! ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. అందుకే నాకు కొదువ ఏమీలేదు. అందుకే తెల్లనిబట్టలు ప్రతీరోజు వేసుకుంటున్నాను అన్నారు. అయితే ఆ మాట ఉన్న కాగితం బైబిల్ నుండి చింపి మాకిచ్చేయ్ అన్నారు, వాక్యము దేవుడు- నేను చింపలేను మీరే చింపుకొండి అన్నారట! మీ దేవుడితో మమ్మల్ని శపించేద్దాము అనుకుంటున్నావా అంటూ ఊరి బయటకు గెంటేశారు. కాబట్టి ఇలాంటి సమయోచితమైన మాటలు దేవుడు ఇచ్చేవారు!

ఆయనమీద ఆనుకో! ఆయన సేవలో ముందుకు సాగిపో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*84వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-25*

యెషయా 50:48        

4. అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

5. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.

8. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! 50వ అధ్యాయంలో మాటలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం!

అలసిన వానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు... ఇంకా శిష్యులు వినునట్లుగా వినేటట్లు నాకు బుద్ధి పుట్టించుచున్నాడు అన్నారు.

ఇక శిష్యుడు వినేటట్టు వినే బుద్ది పుట్టించుచున్నాడు...  ప్రాచీన ప్రతులలో శిష్యుడు వినేవిధంగా నేను వినాలని నా చెవిని మేలుకొలుపుతాడు అని తర్జుమా చేయబడింది!

ఇలా వ్రాయడానికి కారణం ఏమిటి? శిష్యుడు లేక సేవకుడు పరిచారకుడు ఎన్ని మాటలన్నా ఓర్చుకుంటారు! తిరగబడి సమాధానం చెప్పరు!  అలాగే గురువుదగ్గర శిష్యుడు నేర్చుకుంటాడు. గురువుగారు తిట్టినా విని ఊరుకుంటాడు, ఎదురు చెప్పడు! అలాగే ఎవరు ఎన్ని మాటలన్నా విని ఎదురు జవాబు చెప్పరు అని అర్ధము!

 

అవును యేసుక్రీస్తుప్రభులవారి జీవితంలో కూడా ఇదే జరిగింది!

ఆయన పరిచర్య చేసేటప్పుడు వీడు దయ్యము పట్టినవాడు అన్నారు, బయెల్జెబూబు అనే దయ్యాల అధిపతి ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు అన్నారు....

మత్తయి 9:34

అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

 

మత్తయి 11:19

మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి (అనేక ప్రాచీన ప్రతులలో- దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము) తీర్పుపొందుననెను.

 

మత్తయి 12:24

పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

 

ఇంకా పిచ్చిపట్టినవాడు అన్నారు, అయినా సహించారు....

మార్కు 3:21

ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

మార్కు 3:22

యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

 

ఇంకా త్రాగుబోతు తిండిబోతు అన్నారు మీద వచనాలలో!!!

 

భాధలలో ఉన్నవారిని వెలివేయబడిన వారిని రక్షించడానికి వారి దగ్గరికి వెళ్తే ఎన్నెన్నో మాటలు అన్నారు! వేశ్యలను మార్చడానికి రక్షించడానికి వెల్తే వేశ్యలతో సహవాసం చేస్తున్నాడు అన్నారు.

సుంకరులను రక్షించడానికి వెళ్తే సుంకరులతో పాపులతో సహవాసం చేస్తున్నాడు అన్నారు .

ఎవరు ఎన్నిమాటలు ఎన్ని నిందలు వేసినా మారుమాట చెప్పలేదు!

 

చివరికి ఆయనను అన్యాయముగా పట్టుకుని ఎన్ని హింసలు పెట్టినా తిట్టినా ఉమ్మివేసినా సహించారు. వారిని క్షమించారు!

ఇలా జరుగుతుంది అని ఈ అధ్యాయములో మరియు 53 వ అధ్యాయంలో ముందుగానే చెప్పారు. 67 వచనాలు

Isaiah(యెషయా గ్రంథము) 50:6,7

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకి రాతివలె చేసికొంటిని.

 

53:3,7

3. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.

7. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

 

అక్షరాలా ఇలాగే జరిగింది. మనము నాలుగు సువార్తలలో చూసుకుంటే అదే వ్రాయబడింది. ఆయనను ఎన్నిమాటలు అన్నా నోరు తెరువకుండా సహించారు. నిజానికి ఆరోజున క్షమించకుండా ఒక్కమాట శపిస్తే ఈరోజు మనకు ఈ పాపక్షమాపణ కలిగేది కాదు! ఇది ఆయనకు దేవుడే నేర్పించారు అంటున్నారు ఈ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఇక చరిత్ర చూసుకుంటే యేసుక్రీస్తుప్రభులవారిని తన బాల్యంలో ఎవరూ వారితో ఆడుకోనిచ్చేవారు కాదట! ఎదురుపడితే Bastard అని తిట్టేవారు అట! బాష్టార్డ్ అంటే తండ్రి ఎవడో తెలియకుండా పుట్టాడు అని! ఇది నిజానికి వేశ్యలకు పుట్టిన కుమారులను తిట్టే మాట! కొందరు వేశ్యలు ఆ వృత్తిలో ఉన్నప్పుడు వయస్సు కొంచెం మీదకు వచ్చాక పిల్లలను అలాగే కనేసేవారు. వారికి పుట్టిన వారిని ఇలా నీచంగా పిలిచేవారు. గాని చరిత్ర చెబుతుంది- ఆయనను బాష్టార్డ్ అని తిట్టినా తన బాల్యంలో అలాగే ఏమీ అనకుండా పెరిగారు! తండ్రి చనిపోయాక కూడా తన నలుగురు తమ్ముళ్ళను తన ఇద్దరు చెల్లెళ్ళను ఇలాంటి అవమానాలు ఎదుర్కుంటూనే పెద్దవారిని చేసి ఇంటివారిని చేశారు ఆయన!

 

కాబట్టి ఆయన జీవితంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా తన పరిచర్యకు ముందురోజులలో గాని పరిచర్య చేసే రోజులలో గాని మారుమాట పలుకకుండా ముందుకుపోయే వారు! ఇది ప్రతీ దైవజనుడు మరియు ప్రతీ విశ్వాసి నేర్చుకోవాలి! ఓర్పు అనేక ఘోరమైన కార్యాలు జరుగకుండా కాస్తుంది అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనకు కూడా ఎంతటి అవమానాలు ఎదురైనా క్రీస్తుని పోలి నడుచుకుంటూ ప్రతిమాట పలుకకుండా పరమునకు చేరుదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*85వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-26*

యెషయా 50:48        

4. అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

5. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.

6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకి రాతివలె చేసికొంటిని.

8. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! 50వ అధ్యాయంలో మాటలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం!

ఇక ఆరో వచనం చూసుకుంటే కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెండ్రుకలు పెరుకువారికి నా చెంపలను అప్పగించితిని.  ఉమ్మివేయువారికి అవమాన పరచువారికిని నా ముఖమును దాచుకొనలేదు అంటున్నారు!

 

 ప్రియులారా! ఈవచనం కూడా యేసుక్రీస్తుప్రభులవారు పొందిన లేక పొందబోయే శ్రమలను అవమానాలను ముందుగానే భక్తుడు ప్రవచిస్తున్నారు!  ప్రస్తుతం మొదటి రాకడలో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా వచ్చారు కాబట్టి గొర్రెలా మౌనముగా ఉన్నారు. ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దీనిని మనం నాలుగు సువార్తలలో చూడగలం!

 

నిజానికి జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు ఆయన అంతటి శ్రమలను అవమానాలను సహించవలసి వచ్చింది అంటే యేసుక్రీస్తుప్రభులవారు ఈ భూలోకానికి వచ్చినది మూడు పవిత్రమైన కార్యాలు చెయ్యడానికి!

 

అవి: మొదటగా ఇశ్రాయేలు ప్రజలను తిరిగి దేవుని దగ్గరకు తీసుకుని రావాలి! ప్రస్తుతం వారు ధర్మశాస్త్రం క్రిందను శాపము క్రిందను పాపము క్రిందను బానిసలుగా ఉన్నారు! అందుకే యేసయ్య వచ్చారు.

యెషయా 49:5

యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు

యెషయా 49:6

నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

యెషయా 49:7

ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

 

రెండు: సీయోనుని పరిశుద్ధంగా చెయ్యాలి, దానిని మహిమగల దానిగా చెయ్యాలి 

 4:26

Isaiah(యెషయా గ్రంథము) 4:2,3,4,5,6

2. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

3. సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5. సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలము మీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6. మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

 

యెషయా 52:1

సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

 

Isaiah(యెషయా గ్రంథము) 60:1,2,3

1. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

3. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

 

మూడు: సమస్త మానవాళి పాపమును కడిగి వారిని శుద్దులుగా చేసి తండ్రియైన దేవునితో సమాధానం పరచాలి!....

ఎఫెసీయులకు 2:13

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

ఎఫెసీయులకు 2:14

ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

ఎఫెసీయులకు 2:16

తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

 

రోమీయులకు 5:1

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. (కొన్ని ప్రాచీనప్రతులలో- కలిగియున్నాము అని పాఠాంతరము)

రోమీయులకు 5:10

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

రోమీయులకు 5:11

అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము.

 

అయితే ఈమూడు పవిత్రకార్యాలు చేయడం సామాన్యం కాదు! ఇంతవరకు మానవాళి మరియు ఇశ్రాయేలు ప్రజలు పాపములో శాపములో ఉన్నారు! పాపము చేయువారు పాపమునకు దాసులై ఉన్నారు...

ఇప్పుడు పాపమువలన వచ్చు జీతము మరణం. అది వారిని నిత్యనరకమునకు తీసుకుని పోతుంది. ఆ నరకము సాతాను గాడి చేతిలో ఉంది. అందుకే ఇప్పుడు మరణ బంధకాల నుండి, పాతాళ బంధకాల నుండి సాతాను చెరనుండి విడిపించాలి అంటే వెల చెల్లించాలి!  కాబట్టి మనము లేక మానవాళి చేసిన పాపములకు పరిహారం చెల్లించాలి ముందుగా!!  అందుకే మానవాళి తరుపున మానవులు ఇశ్రాయేలు ప్రజలు పొందవలసిన శిక్షను తాను అనుభవించడానికి వారికోసం/మనకోసం బలైపోయి మనకోసం చనిపోవడానికి యేసుక్రీస్తుప్రభులవారు సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకే ఆరవ అధ్యాయంలో నేనున్నాను నన్ను పంపమన్నారు. ఆయన వచ్చారు. మనం పొందవలసిన శిక్షను ఆయన భరించారు. మన సమాధానార్ధమైన శిక్షను ఆయనే భరించారు. యెషయా 53:4,5

అందుకే ఆయన ఇన్ని అవమానాలు, ఇన్ని శ్రమలు సహించారు! అదే కల్వరి ప్రేమ! వెలకట్టలేని పరిశుద్ధ ప్రేమ! శాశ్వత ప్రేమ! తండ్రిప్రేమ!!

 

కీర్తనాకారుడు కూడా దీనికోసం ముందుగానే రాశారు 22:618

ఇక నాలుగు సువార్తలలో ఆయన అనుభవించిన శ్రమలను అవమానాలను చూడవచ్చు!

మత్తయి 27:26, ౩౦

మార్కు 14:65

15:19

లూకా 22:3

యోహాను 19:1

ప్రియ స్నేహితుడా! ఆయన పొందిన గాయాలవలన మనం స్వస్తత పొందుతున్నాము! ఆయన భరించిన కల్వరి సిలువ బలియాగం ద్వారానే మనకు రక్షణ వచ్చింది. అది ఉచితముగా రాలేడు! యేసుక్రీస్తుప్రభులవారు వెల చెల్లించారు! మరి ఆయన ఇంతటి ఘోరమైన అవమానాలు బాధలను నీ కొరకు నాకొరకు సహించారు కదా, మరి నీవు ఆయన కొరకు నమ్మకంగా ఉండగలుగు తున్నావా? లేక మాటిమాటికి తప్పిపోయి ఆయన గాయాలను రేపుతున్నావా?!!

సరిచూసుకో! సరిచేసుకో!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*86వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-27*

 

యెషయా 50:79        

7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకి రాతివలె చేసికొంటిని.

8. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

9. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! 50వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు! గనుక నేను సిగ్గుపడలేదు! నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలె చేసుకుంటిని అంటున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!!!

వారు నన్ను అని మాటలు అంటున్నా, అన్ని హింసలు పెడుతున్నా అవమానిస్తున్నా గాని నాకు తెలుసు యెహోవా నాకు సహాయకుడు మరియు ఆయన నన్ను సిగ్గుపడేలా ఎన్నడూ చేయరు! అందుకే నేను సిగ్గుపడలేదు. అందుకే వారి మాటలకు కృంగిపోకుండా ఆవేశం తెచ్చుకోకుండా నా ముఖమును నేను చెకుముకి రాతిలా చేసుకున్నాను అంటున్నారు!

చెకుముకి రాయి అనగా సుత్తితో కొట్టినా అది తొందరగా పగలదు! అందుకే దానితో కత్తులకు సాన / దార పెడతారు! ఆ రాయి అంత గట్టిది!  అలాగే నా ముఖాన్ని కూడా నేను రాయిలా చేసుకున్నాను అంటున్నారు యేసయ్య!!

 

తనకు ఎదురైన అవమానాలు కష్టాలు శ్రమలూ నిందలూ అన్ని యేసుక్రీస్తుప్రభులవారు ఎంతో ఓర్పుతో దైర్యముతో భరించారు ఎదుర్కొన్నారు!

 

లూకా 9:51

ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు

లూకా 9:52

ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని...

 

లూకా 22:42

వారి యొద్దనుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని

లూకా 22:43

తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.

లూకా 22:45

ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.

 

యోహాను 18:10

సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.

యోహాను 18:11

ఆ దాసునిపేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

 

అయితే యేసుప్రభులవారికి తెలుసు- తన తండ్రి తనను ఎప్పుడూ సిగ్గుపడేలా చేయరు అని! ప్రపంచానికి పాప విముక్తిని కలిగించే కార్యంలో తనకు అపజయం గాని నిరాశ గాని కలుగదు అని ఆయనకు తెలుసు!

 

యెషయా 49:6

నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

 

హెబ్రీ 12:23

2. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో- సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ (కొన్నిప్రాచీన ప్రతులలో- తమసొంత హానికే అని పాఠాంతరము) చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.

 

కారణం దేవుడే సహాయకుడు: 9వ వచనం..

9. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

 

కీర్తనాకారుడు కూడా అంటున్నారు:

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

 

కీర్తనలు 54:4

ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు

 

ఇక 8,9 వచనాలలో అంటున్నారు: నన్ను నీతిమంతునిగా లేక నిర్దోషిగా ఎంచువాడు ఆసన్నుడై లేక నా దగ్గరలో ఉన్నాడు, ఇప్పుడు నాతో వ్యాజ్యమాడేవాడు ఎవడు? మనము కూడుకొని వ్యాజ్యం తీర్చుకోడానికి నా ప్రతివాది ఎవడు? అతనిని నా దగ్గరకు రానీయండి, ఇంకా ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్తాపన చేసేవాడు ఎవడు? వారు వస్త్రము వలె పాతగిలిపోయి చిమ్మెట వారిని తినివేస్తుంది అంటున్నారు!

 

ఈ మాట అనడానికి కారణం యేసుక్రీస్తుప్రభులవారిని బంధించి ఆయన మీద నేరం మోపాలని ప్రయత్నించినా ఏ నేరము బలము గలదిగా కనబడలేదు అని మనకు సువార్తలలో తెలుస్తుంది. ఇక అవి నిలువక దేవాలయమును పడగొట్టి మూడురోజులలో లేపుతాను అనే మాట ఒకటి,  నేను దేవుని కుమారుడిని అనేమాటను పట్టుకుని దేవదూషణ చేశాడు అనే నేరం మోపారు ఆయన మీద!  అదే నేరం మీద నేరస్తుడిగా నిర్ణయించి నేరస్తులతో పాటుగా సిలువవేసి ఆయనను చంపారు!

మత్తయి 26:59

ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని

మత్తయి 26:60

అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.

మత్తయి 26:61

తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి.

మత్తయి 26:62

ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.

మత్తయి 26:63

అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు: నీవన్నట్టే

మత్తయి 26:64

ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా

మత్తయి 26:65

ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని-- వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;

మత్తయి 26:66

మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.

 

అయితే నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని నగర నడిబొడ్డులో సవాలు విసిరితే ఎవడూ కిమ్మనకుండా నోరుమూసుకున్నారు!!!...

యోహాను 8:46

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

 

ఈ యెషయా గ్రంధంలో కూడా అలాగే సవాలుచేస్తున్నారు!

అందుకే యెహోవా నాకు సహాయంగా ఉన్నారు ఎవడు నాకు ప్రతివాది, ఎవడు నామీద నేరస్తాపన చేయగలడు అంటూ ప్రశ్నించారు!

 

అందుకే కీర్తనాకారుడు అడుగుచున్నారు

కీర్తనలు 118:6

యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?

 

పౌలుగారు కూడా ఇలాగే అడుగుచున్నాడు యెహోవా నా పక్షమందు ఉండగా నాకు విరోధి ఎవడు?...

రోమీయులకు 8:31

ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?

 

అయితే ఇప్పుడు ప్రశ్న? దేవుడు ఎలా యేసుక్రీస్తుప్రభులవారిని నిర్దోషిగా నిరూపించారు?

 

యేసుక్రీస్తుప్రభులవారిని చనిపోయిన మూడవ రోజున సజీవంగా మరల లేపడం ద్వారా- ఆయనను నిర్దోషిగా నిరూపించారు!!

అపొ 13:2831

28. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.

29. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.

30. అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.

 

రోమీయులకు 1:5

యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

 

ఆయన సజీవుడు- ఆయనమీద ఎన్నెన్నో నేరాలు మోపారు, అవమానించారు. దయ్యం పట్టినవాడు అన్నారు! పిచ్చోడు అన్నారు! పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపి అన్నారు! చివరికి వారే సిగ్గుపడ్డారు! యేసుక్రీస్తు మరణం గెలిచి విజయోత్సవముతో నిలిచారు! ఆరోహనుడై తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నారు! ఇప్పుడు ఆయన మీద తిరుగబడి ఆయనను అపహసించేవారు సాక్షాత్తు దేవునితోనే పెట్టుకుంటున్నారు అన్నమాట! వారు చెదలుపట్టిన బట్టలులా ఎందుకు పనికిరాకుండా పోతారు! వేసుకోడానికి పనిచేయదు, చివరికి మసిగుడ్డలా కూడా పనిచెయ్యని బట్టలా వారు ఎందుకు పనికిరాకుండా పోతారు అంటున్నారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*87వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-28*

యెషయా 50:1011   

10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.

11. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

     ప్రియులారా! 50వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 11,12 వచనాలలో అంటున్నారు: మీలో ఎవడు మొదటగా యెహోవాకు బయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి అంటున్నారు!

 

ఇక్కడ రెండింటికి భయపడాలి అంటున్నారు:

మొదటగా తండ్రియైన దేవునికి భయపడాలి

రెండవదిగా తన సేవకునికి అనగా 42వ అధ్యాయమునుండి, ఇంకా ఈ అధ్యాయంలో కూడా 49 వచనాలలో మాట్లాడుచున్న సేవకుడు అనగా యేసుక్రీస్తుప్రభులవారికి భయపడాలి!

 

ఈమాటలు చెబుతుంది ప్రవక్తయైన యెషయా ఆత్మావేశుడై ఆత్మపూర్ణుడై ప్రవచిస్తున్నారు ఇక్కడ మీరు దేవునికి మరియు యేసుక్రీస్తుప్రభులవారికి భయపడాలి!! ఈరోజు అనేకమందికి భక్తి ఉంది గాని భయము లేకుండా పోయింది! భక్తి టన్నుల కొద్ది ఉందిగాని భయము కేజీ కూడా లేదు! హా మా దేవుడే కదా, ఏమి చేసినా పర్వాలేదు క్షమించేస్తాడులే అని అనుకుంటున్నారు! నీకు దేవుడంటే భయము ఉంటే ఆరాధనకు లేటుగా రావు! ఆరాధనలో నిద్రపోవు! ఆరాధన జరుగుతుండగా ప్రక్కనున్న వారితో కబుర్లు చెప్పవు! ఆరాధనలో సెల్లు ఫోను నొక్కుకోవు, సెల్లుఫోనులో వాట్సప్ మెసేజ్ లు చూడవు! ఆరాధనలో మొబైల్ లో ఆటలాడవు! మీద చెప్పినవి చేస్తున్న ప్రతీ విశ్వాసికి దేవుడంటే భయము లేదు గనుకనే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు!

అందుకే భయమునొంది పాపము చేయవద్దు అంటున్నారు!

కీర్తనలు 4:4

భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)

 

కీర్తనాకారుడు అంటున్నారు:

కీర్తన 34:1114

11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా?

13. చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.

14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

 

కీర్తనలు 111:10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెతలు 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

గనుక ఆయనయందు భయభక్తులు కలిగి ఉండాలి!

 

ఇక తర్వాత మాటలలో వెలుగు లేక చీకటిలో నడిచే వ్యక్తి యెహోవా నామమందు నమ్మిక ఉంచాలి అని ఎందుకు అంటున్నారు అంటే నిజమైన వెలుగులో లేకుండా వ్యర్ధమైన విగ్రహాలను ఆశ్రయించి నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేనివారు, నిజమైన దేవుడు ఎవరు నిజమైన వెలుగు ఏమిటి అని తెలుసుకుని ఆ దేవుని నామాన్ని ఆశ్రయించాలి అంటున్నారు!  ఆయన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారిని దేవునిగా తమ స్వంత రక్షకునిగా అంగీకరించాలి!  అప్పుడే ఆయన కుమారుడు ఇచ్చే నిజమైన రక్షణను సంపూర్తిగా అనుభవించగలరు!!

 

ఇంకా ప్రతీ విశ్వాసి జీవితంలో కొన్నిసార్లు నిరాశ నిష్ప్రుహ ఎదురయ్యే రోజులు వస్తాయి.  దేవుడు తమను ఎందుకు వదిలేశారు, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అనేది తెలియక తికమక పడుతూ నిరాశలో ఉండే రోజులు ప్రతి విశ్వాసికి తారసపడతాయి! అలాంటప్పుడు కేవలం దేవునియందు నిరీక్షణ ఉంచి ఆయన నామమును నమ్ముకుని ఉండాలి అంటున్నారు! ఇంకా యేసుక్రీస్తుప్రభులవారి పట్ల భయభక్తులతో కూడిన నిజమైన భయము, దేవునికి సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి! దేవునిమీద ఆనుకుని ముందుకు సాగిపోవాలి అని భక్తుడు ఆత్మావేశుడై ప్రవచిస్తున్నారు!

 

ఇక 11వ వచనం లో మరలా యేసుక్రీస్తుప్రభులవారే పలుకుతున్నారు: ఇదిగో నిప్పు రాజబెట్టే వారలారా కొరకంచులను మీ చుట్టూ పట్టుకొనే వారలారా, మీ నిప్పు వెలుగులో మీరు నడుస్తారు రాజబెట్టిన కొరకంచుల వెలుగులో మీరు నడుస్తారు!  ఎందుకంటే మీరు మీ చేతులతో చేసిన విగ్రహాలను మ్రొక్కారు కాబట్టి నా చేతులతో మీరు పొందబోయేది ఏమిటంటే మీరు వేదనలోనే ఉంటారు, వేదనలో పండుకుంటారు అంటున్నారు!

 

ఇక్కడ నిప్పు అనగా రెండు అర్ధాలు కనబడుతున్నాయి- ఒకటి అగ్నిలాంటి దుష్టకార్యాలు చేస్తున్న మీరు అదే అగ్నిలో రగులుతారు!

 

ఇక రెండవది: యేసుక్రీస్తుప్రభులవారు ఇచ్చే నిజమైన వెలుగును నిరాకరించి తమ స్వంత వెలుగును కల్పించుకునేందుకు ప్రయత్నిస్తూ వ్యర్ధమైన విగ్రహాలను ఆశ్రయించి వాటికి దీపం వెలిగించి బల్యర్పనలు చేసే మీకు దేవుని నుండి కలిగేది ఏమిటంటే దేవుడు వారిని అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబోతున్నారు! వారి అంతము ఆరిపోని మంటలలో కాలిపోవడమే! అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ! నరకయాతనే వారికి!

 

యెషయా 66:24

వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబర ములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును..

 

మత్తయి 25:41

అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని (అనగా- సాతానుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి.

మార్కు 9:44

నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.

మార్కు 9:48

నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.

 

లూకా 16:24

తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను.

 

ప్రకటన 20:15

 

ఎవని పేరైనను (మూలభాషలో- ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

 

కాబట్టి దేవుడంటే భయము మరియు భక్తి కలిగి ఆయనమీద సంపూర్ణ నమ్మకంతో విధేయతతో నడుచుకుందాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*88వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-29*

యెషయా 53:13        

1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

2. లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

3. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! ఇక 50 వ అధ్యాయం తరువాత మనకు అభిషక్తుని మొదటి రాకడ కొరకు 52వ అధ్యాయం చివరి మూడు వచనాలు మరియు 53వ అద్యాయం లో చూసుకోవచ్చు! వీటిలో కూడా యేసుక్రీస్తుప్రభులవారి సిలువమరణ విశేషమే కనిపిస్తుంది!  నిజానికి  బైబిల్ గ్రంధం మొత్తం మీద యేసుక్రీస్తుప్రభులవారి మరణ వివరము పునరుత్థానం క్షుణ్ణంగా వివరించిన అధ్యాయం ఇది! యేసుక్రీస్తుప్రభులవారి జననానికి ముందుగా 700 సంవత్సరాలకు ముందుగా జననం కోసం ఎలా వివరించారో అలాగే 700 సంవత్సరాలకు ముందుగానే మరణం కోసం కూడా వ్రాయబడింది.  ఆయన పాపుల చేతిలో పడే బాధలు, అనుభవించే మరణం, పొందిన అవమానాలు అన్నీ ఉన్నాయి ఈ అధ్యాయంలో! ఈ అధ్యాయం 22 వ కీర్తనకు ఎంతో దగ్గరగా ఉంటుంది. 

 

ఈ అధ్యాయంలో కనిపించే మరో విశేషం ఏమిటంటే మెస్సయ్యా లేక యేసుక్రీస్తుప్రభులవారి మీద ఇశ్రాయేలు ప్రజలకున్న అవిశ్వాసం ఈ అధ్యాయంలో కనిపిస్తుంది.

 

సరే, మొదటి వచనం చూసుకుందాం! మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా భాహువు ఎవరికి బయలు పరచబడెను?

ఇది ముమ్మాటికి ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిశ్వాసమును- వారు యేసుక్రీస్తుప్రభులవారిని రక్షకునిగా మెస్సయ్యగా అంగీకరించకుండా ఆయనను సిలువవేసే విధానం కోసం చెబుతున్నారు!  నిజానికి యేసయ్య తీసుకుని వచ్చిన సువర్తమానం ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు, దీనిని యోహాను గారు ఎత్తి రాస్తున్నారు యోహాను 12:38

యోహాను 12:38

ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.

యోహాను 12:39

ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా

యోహాను 12:40

వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

యోహాను 12:41

యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను.

 

రోమా 10:16 లో పౌలు మహాశయుడు కూడా అంటున్నారు....

రోమీయులకు 10:16

అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?

 

నేను మెస్సయ్యను అని చెప్పినా అద్భుతాలు చేసినా నమ్మలేదు!

 

ఇక యెహోవా బాహువు లేక హస్తము ఎవరికి బయలుపరచ బడింది?  యెహోవా హస్తము అనగా యెహోవా ప్రభావము యేసుక్రీస్తుప్రభులవారి జననము, జీవించిన విధానము ఆయన సువార్త పరిచర్య, ఇంకా ఆయన మరణము మరియు పునరుత్థానములలో దేవునియొక్క బలప్రభావాలు సంపూర్తిగా కనిపిస్తాయి.  అయితే అది దేవుని హస్తము చేస్తుంది అని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేదు.

 

ఒకసారి యూదులు ఏమన్నారు, దానికి యేసుక్రీస్తుప్రభులవారి జవాబు చూసుకుంటే ఇది అర్ధం అవుతుంది.

మత్తయి 12:24

పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

మత్తయి 12:25

ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.

మత్తయి 12:26

సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?

మత్తయి 12:27

నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.

మత్తయి 12:28

దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.

 

లూకా 11:15

అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.

లూకా 11:17

ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.

లూకా 11:18

సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.

లూకా 11:19

నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టు చున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.

లూకా 11:20

అయితే *నేను దేవుని వ్రేలితో* దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.

 

యోహాను 8:48

అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

యోహాను 8:49

యేసు నేను దయ్యముపట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.

 

సరే, ఇక్కడ వెల్లడి అయ్యింది అని వ్రాయడానికి కారణం : దేవుని భాహువు వెల్లడి అయిన తర్వాత జరిగే భవిష్యత్ కార్యము ముందుగానే చెబుతున్నారు యెషయా గారు ఆత్మావేశుడై! ఎందుకంటే ఆయన బాహువు వెల్లడి అయిన తర్వాత యేసుక్రీస్తుప్రభులవారి జనన మరణ పునరుత్తానములు జరిగిన తర్వాత లోకములో జరిగే మహత్తర కార్యము కోసం రాస్తున్నారు:  55:1011

Isaiah(యెషయా గ్రంథము) 55:10,11

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

 

చూడండి, దీని ద్వారా అనగా యెహోవా హస్తము ద్వారా దేవుని యొక్క సంకల్పము నెరవేరి అనేకులను రక్షణలోనికి వెలుగులోనికి నడిపించింది.

 

ఇక రెండో వచనంలో లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు పెరిగెను అయితే ఇప్పుడు సురూపమైనను సొగసైనను లేదు, మనము అతని చూచి ఆపేక్షించునట్లు అతని యందు సురూపము లేదు అంటున్నారు!

చూడండి పుట్టడం పెరగడం చూసుకుంటే లేత మొక్కలా అనగా సుకుమారంగా అందంగా పెరిగారు. గాని ఆ సిలువకార్యం జరిగేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరియు రోమా సైనికులు పెట్టిన ఘోర హింసలు వలన ఆయనకు సురూపమైన సొగసైన లేదు! దీనిని గూర్చి 52వ అధ్యాయమ చివరి మూడు వచనాలలో కూడా వ్రాయబడింది. ....

Isaiah(యెషయా గ్రంథము) 52:13,14,15

 

13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.

14. నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖమును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ

15. ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.

 

నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారము అని చాలామంది ఎలాగు విస్మయమొందిరో......

చూడండి ఈ వచనాలు చూసుకుంటే వారు యేసుక్రీస్తుప్రభులవారిని పెట్టిన హింసలకు కొట్టిన దెబ్బలకు పిడిగుద్దులకు ఆయన ముఖము ఉబ్బిపోయింది. ఎర్రగా కందిపోయింది. కొన్ని వందలమంది సైనికులు కాండ్రించి ముఖముమీద ఉమ్మివేశారు. దానివలన ఆయన ముఖము కమిలిపోయింది. అందవికారముగా తయారయ్యింది. దవళవర్నుడు రత్నవర్నుడు అని ఇంకా పదివేల మందిలో నా ప్రియుని గుర్తించవచ్చును అని షూలమ్మితి అనే సంఘము ఎలా మురిసిపోయిందో- ఇప్పుడు అదే ముఖము ఏ నరరూపము కంటే వికారంగా పోల్చుకోలేనంతగా ఆయన ముఖము అందవికారముగా తయారయ్యింది. అతనికి సొగసైనను సురూపమైనను లేకుండా పోయింది.

 

ఇక మూడవ వచనంలో అతడు తృణీకరించబడిన వాడును ఆయెను. మనుష్యులవలన విసర్జించబడిన వాడును వ్యసనా క్రాంతుడు గాను వ్యాధిని అనుభవించే వాడు గాను మనుష్యులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి! ఇక్కడ మనము అనగా ఇశ్రాయేలు ప్రజలు అని గమనించాలి!

 

ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలతో తృణీకరించబడి విసర్జించబడి అవమాన పరచబడి వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవిస్తున్న వానిలాగా కనబడెను అంటున్నారు!

నిజానికి యేసుక్రీస్తుప్రభులవారు ధనవంతుల ఇంటిలో గాని రాజుల ఇంటిలో గాని పుట్టలేదు. పేదరికంలో పుట్టారు. పేదరికంలో పెరిగారు. ఏవిధమైన పేరుప్రఖ్యాతులు లేకుండా పెరిగారు. అందుకే ఆయన పరిచర్య చేసిన కాలంలో అన్నారు : హా వీడా, వీడెందుకు మాకు తెలియదు? వీడి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మన మధ్య లేరా అన్నారు.

 

మార్కు 6:3

ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతోనున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.

 

లూకా 9:58

అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.

 

ఆయనకు భూలోకంలో సెంటు స్థలము గాని ఇల్లు గాని లేదు! చివరకి ఆయనను పెట్టిన సమాధి కూడా అరువుదే!

 

యోహాను 9:2829

28. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;

29. దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.

 

ఫిలిప్పీ 2:7

మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

 

ఆయన ఏవిధమైన రాజరిక వైభవాలు ఆడంభరాలు లేకుండా వస్తే ఆయనను అంగీకరించలేదు! వారు తమ మెస్సయ్య శూరునిగా రాజుగా వచ్చి తమను అష్షూరు మరియు బబులోను దాస్యము నుండి విడుదల చేస్తాడు అని యెషయా మరియు యిర్మియా గారి కాలంలో తలంచగా, తమను రోమా దాస్యమునుండి విడిపిస్తాడు అని యేసుక్రీస్తుప్రభులవారి కాలంలో తలంచారు! తమ మెస్సయ్యా సోలోమోను చక్రవర్తి వలె ఆడంభరంగా వస్తాడు అని తలంచారు గాని ఆయన వచ్చింది యిర్మియా వలె విలపించే ప్రవక్తలా వస్తే అంగీకరించలేకపోయారు!!!  అందుకే ఆయనను అంత క్రూరంగా హింసించారు! అందుకే ఆయనకు సొగసైనను సురూపమైనను లేదు.

 

ప్రియ సహోదరీ సహోదరుడా! ఆయన పడిన బాధలు హింసలు అన్నీ మనకొరకే! మరి మనకొరకు అన్ని హింసలు అనుభవించి రక్తమును కార్చి మనలను విమోచించిన దేవునికి నమ్మకముగా యదార్ధంగా ఉండగలుగుతున్నావా?!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*89వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-30*

యెషయా 53:34        

3. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.

4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

   ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే మూడవ వచనంలో అతడు తృణీకరించబడిన వాడు ఆయెను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి అంటున్నారు!

 

యేసుక్రీస్తుప్రభులవారు మనుష్యులచేత  తృణీకరించ బడి అవమానించబడ్డారు. ఆ మనుష్యులు యూదులు మరియు రోమా సైనికులు! అందుకే అందరిచేత నిరాకరించబడ్డారు!

 

యెషయా 49:7

ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

 

గతంలో చెప్పినట్లు కీర్తనాకారుడు 22వ అధ్యాయం మొత్తం దీనికోసమే ప్రవచిస్తున్నారు! కీర్తన 22:68

6. నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

7. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.

8. యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు.

 

యోహాను 15:23

నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.

యోహాను 15:24

ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.

యోహాను 15:25

అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.

 

ఇక యూదులు ఆయనను నిరాకరించారు మెస్సయ్యగా:

మత్తయి 26:66

మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.

27:2123

21. అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.

22. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి.

23. అధిపతిఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

 

యోహాను 1:11

ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

 

19:1516

15. అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.

16. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

 

అపొ 3:1314

13. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.

14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.

ఇలా అందరిచేత నిరాకరించబడ్డారు యేసయ్య నీకోసం నాకోసం!

 

ఇక వ్యసనాక్రాంతుడు అనగా దుఃఖమును అనుభవించేవాడు- అనగా ఎల్లప్పుడూ తనకు కలిగిన బాధలచేత ఏడ్చేవాడు యిర్మియా వలె!

మనము బైబిల్ గ్రంధములో క్రొత్త నిబంధనలో గాని నాలుగు సువార్తలలో గాని యేసు కన్నీరు విడిచెను అని ఉంది గాని ఆయన నవ్వెను లేక పరిహాసం చేసెను అని లేదు! ఆత్మలో ఆనందించి అని మాత్రం ఉంది! అసలు ఆయన సువార్త పరిచర్య చేసిన రోజులలో ఆయన నవ్వలేక పోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా? నీవు ఎవరికైతే సహాయం చేస్తున్నావో, ఇంకా ఎక్కువగా వారికి సహాయం చెయ్యాలని అనుకుంటున్నావో, ఎవరినైతే రక్షించాలి అనుకున్నావో వారే నిన్ను ద్వేషించి అవమానించి తృణీకారం చేస్తే నీకు నవ్వు వస్తుందా?!!!  బాధ నిట్టూర్పు అవమానం తప్ప!  అయితే ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తుప్రభులవారి మీద మానవుల అందరి దోషాలకు, వారి దురవస్తలకు పాపాలకు శాపాలకు గల దోష ఋణభారం పాపభారం ఆయన మీద ఉంది ఇప్పుడు, అందుకే దుఃఖమును అనుభవించేవానిలా ఆయన ముఖము కనబడుతుంది ఆ రోజున!!!

కీర్తనాకారుడు రాస్తున్నారు ఆత్మావేశుడై: 69:712, 1921

7. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.

8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.

9. నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.

10. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.

11. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.

12. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

19. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.

20. నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.

21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.

22. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.

 

లూకా 12:50

అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను.

లూకా 19:41

ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

లూకా 19:42

నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

లూకా 19:43

(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

 

యోహాను 11:35

యేసు కన్నీళ్లు విడిచెను.

 

వ్యాధిని అనుభవించే వాడు గాను: అనగా అనేక సంవత్సరాలనుండి రోగముతో పడకమీద ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు అక్కడ యేసుప్రభువు!  కారణం గత రాత్రినుండి ఆయనను అవమానిస్తూ కొడుతూ తిడుతూ ఉమ్మివేస్తూ వచ్చారు. అవమానంతో భాధలను సహిస్తూ ఆయన ఉన్నారు. ఇప్పుడు వ్యాధితో బాధపడే వ్యక్తిలా కనిపిస్తున్నారు. నిజానికి అలా కనబడటానికి మరో కారణం ఉంది. అది మనకు నాలుగో వచనంలో కనిపిస్తుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాడుగాను దేవునివలన బాధించబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచాము అంటున్నారు! ఇక 5వ వచనంలో మన సమాధానార్ధమైన శిక్ష అతనిమీద పడెను అంటున్నారు. కాబట్టే ఆయన ముఖము వ్యాధిని అనుభవించే వానిలా కనిపిస్తుంది!

 

ఇక మనుష్యులు చూడనొల్లని వాడు: దీనికోసం గతభాగంలో చూసుకున్నాము!

 

అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నికచేయక పోతిమి:  ఆరోజు చాలామంది ఆయన వైపు చూడటమే అసహ్యంగా కంటకప్రాయంగా భావించారు. తృణీకరించారు! ఈ కారణం చేత ప్రజలు గాని నాయకులు గాని వారు ఆయనను లెక్క చేయలేదు. ఆయన లోకంలో జీవించినప్పుడు నాయకులు ప్రజలు మొదట్లో శిష్యులు ఇంకా ఆయన సోదరులు కూడా ఆయన గొప్పతనాన్ని చూడక తృణీకరించారు. ఆయనలోని దైవత్వాన్ని చూడలేకపోయారు. అందుకే ఆయన అన్ని శ్రమలను అనుభవించారు!

 

అయితే ఆయన అన్ని శ్రమలను అనుభవించిన గాని బాధపడలేదు ఎందుకంటే తను తండ్రి తనకు అప్పగించిన దైవకార్యమును నెరవేస్తున్నారు కనుక!  అన్ని శ్రమలను బాధలను అవమానాలను ఓర్చి నీకు నాకు మానవాళికి పాప పరిహారం చేశారు! మరి అన్ని చేసిన దేవునికి నీవు ఏమి చేస్తున్నావు? ఆయనకు నీ ధనము బలము ఏమీ వద్దు! కేవలం నీ హృదయం కావాలి! నీ భయభక్తులు కావాలి! మరి నీవు ఆయనకు అవి ఇస్తున్నావా?!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*90వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-31*

యెషయా 53:45        

4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

5. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే నాల్గవ వచనం నుండి చూసుకంటే నిశ్చయముగా అతడు మనరోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవునివలన బాధించబడిన వానిగాను అతనిని ఎంచాము, ఇంకా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడెను.  అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నారు!  ఇక్కడ మనకు ఇది బాగా అర్ధమవుతుంది గాని ఇంకా స్పష్టముగా అర్ధం కావాలి అంటే ప్రాచీన ప్రతులలో మరియు స్టడీబైబిల్ లో ఇలా తర్జుమా చేయబడి ఉంది.

ఆయన మన బాధలను భరించాడు, మన దుఃఖాలను వహించాడు దేవుడు ఆయనను కొట్టాడని, దేవుడే మొత్తి అతనిని భాదించాడనీ మనము భావించుకున్నాము, గాని ఆయన మన అక్రమకార్యాల నిమిత్తమే గాయపడ్డాడు, మన అపరాధాల నిమిత్తమే ఆయనను నలుగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల మూలంగా మనకు ఆరోగ్యం కలుగుతుంది...

 

ఇప్పుడు ఈ వచనాలు మీకు బాగా అర్ధమయ్యాయి అని భావిస్తున్నాను!

అవును యూదులు ఆరోజు ఆయనను తృణీకరించి బాధలను పెట్టారు ఎందుకంటే ఆయనని దేవుడే కొట్టాడని, దేవుడే మొత్తాడని భావించారు.  గాని అన్నీ సహించారు యేసుక్రీస్తుప్రభులవారు! కారణం నిజానికి ఆయన మన అక్రమకార్యాల వలన అపరాధాల వలన కలిగిన దోషభారమును మనము అనుభవించవలసిన శిక్షను దేవుడు అతనిమీద లేక యేసుక్రీస్తుప్రభులవారి మీద మోపడం వలన ఆయన అన్ని బాధలు అనుభవించారు!

 

సరే, ఒకసారి మన భాధలను భరించాడు అనే మాటకోసం క్లుప్తంగా ఆలోచిస్తే: మత్తయి 8:17 లో దీని అర్ధం ఇతరులను బాగుచేసే సేవ అని తెలుస్తుంది.

మత్తయి 8:17

ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పబడినది నెరవేరెను.

అలాంటప్పుడు ఇక్కడ ఆయన మనరోగాలను బాగుచేసేవాడు అని రాసి ఉండాలి గాని భరించాడు అని రాసి ఉంది కాబట్టి దీని అసలు అర్ధం అదికాదు అని అర్ధం అవుతుంది. ఆయన మరేదో చేశారు.

మానవులు చేసిన అపరాదాలకు శిక్షలు వారు ఈ భూలోకములో కొద్దిగా అనుభవించాలి. దాని ప్రకారం ఇప్పుడు అనేకులు రోగులవుతున్నారు. అయితే తనను ఆశ్రయించిన వారిని ఆయన స్వస్తపరచాలి అయితే వారు చేసిన అపరాదాలకు వారు రోగములను భరించాలి- అందుకే మన దోషాలకు శిక్షగా వచ్చిన రోగాలు కూడా ఆయన భరించాడు అని నాకు అర్ధం అవుతుంది. అందుకే ఆయన మన రోగాలను భరించాడు అని వ్రాయబడింది!

ఒకసారి యెషయా 63:9 చదివితే ఇది కొంచెం బాగా అర్ధమవుతుంది!..

యెషయా 63:9

వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

 

ఇక తర్వాత మన దుఃఖాలను లేక మన వ్యసనములను వహించెను: పాపము దోషము చేసినందువలన కలిగే శిక్షవలన కలిగిన రోగములు భారముల వలన మనకు లభించే దుఃఖమును భారము వేదనలను కూడా ఆయనే మన పక్షముగా భరించారు అని అర్ధము! అందుకే ఆయన మీకోసం చింతించుచున్నాడు అంటూ మీ చింత యావత్తు ఆయన మీదనే వేయండి అన్నారు!.....

మత్తయి 6:34

రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

 

1పేతురు 5:6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

1పేతురు 5:7

ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు (లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

 

ఇంకా దేనికోసం మీరు చింతించవద్దు అన్నారు.

కాబట్టి ఆయన మనకోసమే బాధపడ్డారు. మనము అనుభవించ వలసిన శిక్షను ఆయన అనుభవించారు! నిన్ను నన్ను పాప విముక్తి, దోష విమిక్తి దుఃఖ విముక్తి చేశారు కాబట్టి మన జీవితకాలమంతా ఆయనకు ఋణపడి జీవిద్దాం! ఆయనకు సాక్షులుగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*91వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-32*

యెషయా 53:45        

4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

5. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఐదవ వచనం చూసుకుంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను,  మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను.  మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నారు!

 

ఈ వచనాలలో అసలు విషయం చెబుతున్నారు- ఓ ఇశ్రాయేలు జనాంగమా / సంఘమా! నిజానికి ఆయన మనము చేసిన అతిక్రమ కార్యాలను బట్టి, దోషాలను పాపాలను బట్టి యేసుక్రీస్తుప్రభులవారు నలుగగొట్టబడ్డారు కొట్టబడ్డారు, శిక్షలు పొందారు. మనమీద పడాల్సిన పాప భారం ఆయన మీద పడి, మన సమాధానార్ధమైన శిక్షను ఆయన భరించి సాతాను చెరనుండి విమోచించి తండ్రితో మరలా సమాధాన పరిచారు మనలను అంటున్నారు భక్తుడు ఆత్మావేశుడై!!! ఇంకా ఆరో వచనంలో ఏడో వచనంలో మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి నరక మార్గంలో పయనిస్తూ ఉండగా మరలా మనలను దారిలోకి తీసుకుని రావడానికి మన భారం తాను భరించి మనలను దారిలోకి తెచ్చారు. తెచ్చే విధానంలో ఆయన ఎన్నెన్నో హింసలు పొందారు అంటున్నారు.

 

అవును నిజానికి ఆయనపొందిన శ్రమలు మనకోసమే! ఆయన ఎన్ని హింసలు పొందారో, ఎలా నలుగగొట్టబడ్డారో ఒకసారి చూసుకుంటే మనకు అర్ధమవుతుంది.

కీర్తన 22:1121

11. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.

12. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

13. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

14. నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.

15. నా బలము యెండిపోయి చిల్ల పెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.

16. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

17. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు

18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

20. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.

21. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు

 

మత్తయి 26:6768

67. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;

68.కొందరు ఆయనను అర చేతులతో కొట్టి, క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.

 

Matthew(మత్తయి సువార్త) 27:26,28,29,30,31,33,34,35,39,40,41,42,43,44

26. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

28. వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి

29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయన యెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

30. ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

31. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.

33. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి

34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.

35. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.

39. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు

40. దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

41. ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

42. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

43. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

44. ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

 

John(యోహాను సువార్త) 19:1,2,3,5,15,16,17,18,23,24,29,30,32,33,34,35,36,37

1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.

2. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి

3. ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చియూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.

5. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

15. అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.

16. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

17. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.

18. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడ ఇద్దరిని సిలువవేసిరి.

23. సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక

24. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.

29. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.

30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.

33. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని

34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

35. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.

36. అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.

37. మరియు తాము పొడిచినవాని తట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.

 

ఇక ఇవేకాకుండా ఎన్నెన్నో అవమానాలు అనుభవించారు.

 

మనము ఆలోచించే అపవిత్రమైన మరియు క్రూరమైన తలంపుల కోసరం ఆయన ముళ్ళకిరీటం ధరించవలసి వచ్చింది.

మనము మాట్లాడే ఘోరమైన అపవిత్రమైన మాటలకోసం ఆయన చిరకను లేక వెనిగార్ త్రాగవలసి వచ్చింది. ఇంకా ఆయన మూతిమీద ముఖము మీద దెబ్బలు తినవలసి వచ్చింది.

మానవులు దేహముతో చేసిన పాపములకోసం ఆయన కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది. పిడిగుద్దులు తినవలసి వచ్చింది.  ఆ దెబ్బలకు ఆయన దేహంలో గాయము లేని ప్రాంతం లేకుండా పోయింది. అందుకే కీర్తనాకారుడు నా ఎముకలన్నీ నేను లెక్కించగలను అన్నారు. కొట్టిన దెబ్బలవలన కొరడా దెబ్బలకు ఆయన శరీరం చీరుకుపోయింది.

నేను విన్నది ఏమిటంటే యేరూషలేము శివార్లలో సుమారుగా 17 రకాలైన ముళ్ళు ఉంటాయి అట. వాటితో ముళ్ళ కిరీటం చేసి కొరడాల చివర్లలో కూడా కొన్ని ముళ్ళు కట్టారట! అందువలన దేహము మొత్తం చీరుకుపోయింది.

 

ఇక నీవు నేను చేతులతో చేసిన పాపముల కోసం ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నారు!

మనము నడిచిన కాని నడతల వలన కానిచోట్లకు వెళ్ళినందు వలన ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకొనవలసి వచ్చింది.  నిజానికి ఆరోజు నాలుగు పాత వాసం మేకులు కోసం వెదికితే ఆ షాపులో కేవలం మూడే దొరికాయి అట!  అందుకే మూడు మేకులు కొట్టారు. లేకపోతే అందరినీ త్రాళ్ళతో కట్టి కేవలం యేసుక్రీస్తుప్రభులవారిని మాత్రమే మేకులు కొట్టారు. రెండు చేతులలో రెండు రెండు కాళ్ళలో రెండు మేకులు కొట్టాలని అనుకున్నారు గాని మూడు మేకులే దొరికితే రెండు చేతులలో రెండు కొట్టి రెండు కాళ్ళ పాదాలు ఒకదానిమీద మరొకటి పెట్టి ఒకే మేకు కొట్టారు!

 

ఈ విధంగా ఆయన ఎన్నెన్నో హింసలు పొందినా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని క్షమాభిక్ష పెట్టారు తప్ప ఒక్కమాట అనలేదు! కేవలం అది నీ మీద ప్రేమతో జాలితో చేశారు. అనుభవించారు! చివరకు చనిపోయాక కూడా వారి క్రోధం కోపం తీరక బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచాడు ఒక సైనికుడు!  కొరడాల వలన రక్తమంతా కారిపోతే, బల్లెము పోటు వలన ఆయన శరీరంలో రక్తము లేక మొత్తం నీరు కారిపోయింది. ఆయన తన రక్తమంతా నీరంతా మనకోసమే కార్చారు! సిలువయాగం చేసి మనలను పాపవిముక్తులుగా చేశారు!

దీనిని గుర్తెరుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా!  ఆయన నీకోసం వెల చెల్లించారు అని మర్చిపోతున్నావా?

 

ఒకసారి ఆయన సిలువయాగం గుర్తు తెచ్చుకో! పాపములకు పశ్చాత్తాప పడు! దైవజనుడు యోహాను గారు ఆయన పొందిన శ్రమలకు ప్రత్యక్ష సాక్షి గనుక ప్రతీరోజు ఆయన పొందిన శ్రమలను తలంచుకొని ఏడ్చేవారు అట! ఎంతవరకు అంటే ప్రకటన గ్రంధం వ్రాయడానికి పత్మసు దీవిలో అతడు పరవశం అయ్యి దేవుని ప్రత్యక్షత కలిగి యేసుక్రీస్తుప్రభులవారే ఆయనతో మాట్లాడి ఓదార్చేవరకు సుమారుగా 70 సంవత్సరాలు ఆయన ప్రతీరోజు ఆయన సిలువ శ్రమలు తలంచుకుంటూ ఏడ్చారట!! మరి నీవు ఆయన శ్రమలను తలంచుకుని నిజమైన పశ్చాత్తాపంతో ఒక్క బొట్టు కన్నీరు కార్చావా?

ఒకసారి గుర్తుచేసుకో!

మన అపరాధాలు మన పాపాలు మన దోషాలను బట్టే ఆయన ఇంత ఘోరమైన మరణమును సహించారు భరించారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*92వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-33*

యెషయా 53:45        

4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

5. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఐదవ వచనం చూసుకుంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయ పరచబడెను మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను.  మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నారు!

 

ఇక గాయపరచబడుట కోసం, సమాధానార్ధమైన శిక్ష కోసం ఆలోచిస్తే : ఈ వచనంలో గాయపరచబడుట అనేమాటకు వాడిన హెబ్రీ పదానికి అర్ధం పదునైన పరికరం వలన గాయాలు పొందటం!! కాబట్టి ఆయనను పదునైన ఆయుధాల వలన గాయపరిచారు. వారు అజ్ఞానంతో ఆ పని చేశారు. ఆయన పొందిన గాయాలు పొందిన వేదనలు అన్నీ మనకు బదులుగా మన స్థానంలో పొందినవి అని గ్రహించాలి!

 

అందుకే బాప్తిస్మమిచ్చే యోహాను గారు రెండుసార్లు ఇదుగో లోకపాపములు మోయు దేవుని గొర్రెపిల్ల అని పిలిచారు.

John(యోహాను సువార్త) 1:29,30,35,36

29. మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

30. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే యీయన.

35. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా

36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.

 

2కొరింథీ 5:21 లో అపోస్తలుడైన పౌలుగారు ఆత్మావేశుడై అంటున్నారు ...

2కోరింథీయులకు 5:21

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

పేతురు గారు కూడా అంటున్నారు:

1పేతురు 2:22

ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

1పేతురు 2:23

ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

1పేతురు 2:24

మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

 

ఇక్కడ ఆయన మన పాపాలు కోసం చనిపోయి- వాటిని కడిగి లేచారు కాబట్టి మన పాపములు విడిచిపెట్టాలి అంటున్నారు పౌలుగారు!

రోమా 6:1014

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా (లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

 

గలతీ 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

 

గలతియులకు 5:24

క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

గలతియులకు 5:25

మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

 

కొలస్సీయులకు 3:5

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి.

కొలస్సీయులకు 3:6

వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి) వచ్చును.

కొలస్సీయులకు 3:7

పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి.

 

ఇక సమాధానార్ధమైన శిక్ష అనగా మన పాపములను తీసివేసే శిక్ష అని అర్ధం! మీదన వచనాల ప్రకారం మనం దేవునితో సఖ్యపడేందుకు మార్గాన్ని తెరిచింది ఆ సమాధానార్ధమైన శిక్ష! ఇది పాపుల యొక్క పాపములను కడిగి వారు దేవునితో సమాధానం పొందుకునేలా చేసింది ఈ శాంతి ప్రక్రియ! ఇప్పుడు ఆయనను నమ్మిన వారికి వారు చేసిన పాపముల కోసం వారు శిక్షను అనుభవించవలసిన అవసరం లేదు. కారణం వారి శిక్షను క్రీస్తు భరించారు! మన స్థానంలో ఆయనను శిక్షించారు. 

పౌలుగారు అంటున్నారు 2కొరింథీ 5:1821

18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.

19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.

20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము.

21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

ఇక్కడ మనకు నాలుగు విషయాలు కనిపిస్తున్నాయి.

మొదటిది క్రీస్తులో ఏవిధమైన పాపము లేదు (యోహాను 8:46; హెబ్రీ 4:15; 7:26; 1పేతురు 2:22; 1యోహాను 3:5)

రెండవది: పాపము చేయని ఆయనను దేవుడు మనకోసం పాపముగా చేశారు- అంటే మానవాళి మొత్తం పాపములు మోయడానికి శిక్షను భరించడానికి ప్రాయశ్చిత్తంగా బలి రక్తం ఇవ్వడానికి దేవుడే తన కుమారుడైన క్రీస్తుని పంపించారు! దేనికోసం ?- మనకోసం మన స్థానంలో తన కుమారుడు చనిపోవాలని! ఎప్పుడైతే మానవుల పాపము ఆయన భుజముల మీద మోపబడిందో వెంటనే పరిశుద్ధుడైన దేవుడు దేవుని కుమారుడు పాపిగా మారిపోయాడు. అంతవరకూ తనతోనే ఉన్న పరిశుద్ధాత్ముడు ఇప్పుడు దూరమైపోయాడు. తండ్రి దూరమునుండి చూడవలసి వచ్చింది గాని తనతో ఉండలేక పోయారు ఆ పుణ్యకార్యం పూర్తి అయ్యే వరకు!

మూడవది: ఈ పరిశుద్ధ కార్యము మనకోసమే చేశారు అని గ్రహించాలి!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 5:14,15

14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.

 

1పేతురు 3:18

ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

1పేతురు 3:19

ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

 

1యోహాను 4:10

మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.

 

నాల్గవది: ఇందులో దేవుని ఉద్దేశమేమంటే విశ్వాసులైన మనము క్రీస్తుయేసు ద్వారా ఆయన యొక్క నీతిని పరిశుద్ధతను పొందుకుని పరిశుద్దులుగా చేయాలి మరియు వారు పాపులుగా ఎంచకుండా వారిని నిర్దోషులుగా చేయాలని దేవుని ప్రణాళిక!!!

రోమా 3:2126

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

ఇదే క్రీస్తుతో ఐక్యత యోహాను 17:2023

రోమా 6:38

దేవుని యొక్క నీతిన్యాయములు యేసుక్రీస్తుప్రభులవారే! ఇప్పుడు విశ్వాసులు ఆయనతో ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఆయనలో పరిశుద్దులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన మనము తిరిగి పాపములు చేయకూడదు! ఆయన కొరకు సాక్షులుగా నమ్మకంగా జీవించాలి!

 

ఎఫెసీ 2:1319

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 

కాబట్టి ఆయనకొరకు నమ్మకంగా యదార్ధంగా పరిశుద్ధత కలిగి జీవిస్తావా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*93వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-34*

యెషయా 53:68        

6. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

7. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

8. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఆరవ వచనంలో మనమందరం గొర్రెలవలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతీవాడు తన కిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములను అతనిమీద మోపెను అంటున్నారు.

 

చూడండి ఇక్కడ మనము అందరం గొర్రెలవలే త్రోవ తప్పిపోయి తనకు ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోయాము అంటున్నారు. అవును ఒకానొకప్పుడు ఎవరికి ఇష్టమైన దేవుళ్ళను దేవతలను పూజిస్తూ నానావిధములైన పాపములను చేస్తూ వివిధమైన రీతులలో జీవిస్తున్నప్పుడు క్రీస్తుయేసు మనకొరకు ఈలోకానికి వచ్చి తప్పిపోయిన గొర్రెలను వెదకటానికి తానే గొర్రెల కాపరిగా వచ్చి- చివరకు లోకపాపములను పరిహరించుటకు బలి అర్పించాలి కాబట్టి తానే వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా మారిపోయారు!

 

గమనించాలి: దేవుని సరియైన మార్గమునుండి తొలిగి లోకము వైపునకు ఎవిరికిష్టమైన దారిలో నడవడమే అన్ని పాపాలకంటే పెద్ద పాపము!  ఆదాము హవ్వలు తినవద్దు అని ఆజ్ఞాపించిన పండునే తిని ఆజ్ఞను అతిక్రమించి పాపమును మూటకట్టుకుని మనకు అంటించారు! అలాగే సమస్త మానవులు కూడా దేవుడు ఏది వద్దు అని చెప్పారో దానినే చేస్తూ పాపములమీద పాపములను కట్టుకుంటున్నారు తద్వారా నరకపాత్రులుగా మారిపోతున్నారు!

 

రోమా 5:12

ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.( మూలభాషలో- అందరి ద్వారా వ్యాపించెను)

 

కీర్తనలు 58:3

తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

కీర్తనలు 119:67

శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.

కీర్తనలు 119:176

తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

 

యిర్మియా 2:13

నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

 

రోమీయులకు 3:12

అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

 

1పేతురు 2:25

మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

 

ఇలా అందరూ త్రోవ తప్పిపోయినందువలన వచ్చిన అపరాధఫలం భారము యేసుక్రీస్తుప్రభులవారి మీద పడింది. ఇది లేవీ 16వ అధ్యాయములో ఉన్నట్లు జరిగింది...

Leviticus(లేవీయకాండము) 16:9,10,14,15,20,21,22

9. ఏ మేక మీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

10. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.

14. అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.

15. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధ బలియగు మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.

20. అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను.

21. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.

22. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్ట వలెను.

అది యేసుక్రీస్తుప్రభులవారే!

 

ఇక ఏడవ వచనం చూసుకుంటే: అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువానిఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరువలేదు!!!

 

గతభాగంలో అతడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు ఎలాంటి బాధలు అనుభవించారో చూసుకున్నాము! ఇలా అతడు దౌర్జన్యము నొందెను అన్యాయముగా ఆయనని చిత్రహింసలకు గురిచేశారు!  అయినా అన్నింటిని ఓర్చుకుని సహనముతో సహించారు ఆయన! ఇన్ని భాధలను పెడుతున్న నోరు తెరిచి శపించలేదు. ఎందుకు నన్ను ఇన్ని చిత్రహింసలు చేస్తున్నారు అని అనలేదు ఆయన!  లేక తననుతాను సమర్ధించుకునే ప్రయత్నం చేయలేదు! నోరు తెరువకుండా సహించారు ఆయన! ఇది మనకు సువార్తలో కనిపిస్తుంది

మత్తయి 27:1214

12. ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

13. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

14. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.

 

మార్కు 14:6061

60. ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచిఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసు నడిగెను.

61. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా

 

మార్కు 15:5

అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.

 

John(యోహాను సువార్త) 19:9,10,11

9. నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

10. గనుక పిలాతు నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.

11. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

 

1పేతురు 2:2125

21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

25. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

 

ఇక సహించడం అనేది రెండు రకాలుగా పోల్చాడు భక్తుడు: మొదటగా వధకు సిద్ధమైన గొర్రెపిల్ల, రెండు: బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె ఏవిధముగా మౌనముగా ఉంటుందో అలాగే యేసుక్రీస్తుప్రభులవారు కూడా మౌనముగా ఉన్నారు అంటున్నారు! నిజానికి ఆయన వచ్చింది మానవుల కోసం గొర్రెపిల్లగా బలి అవ్వడానికే, అందుకే ఆయన మౌనముగా ఉన్నారు!

ఒకసారి దీనిని మనము నిర్గమ కాండములో జరిగిన పస్కా బలితో పోల్చుకోవాలి!

Exodus(నిర్గమకాండము) 12:3,4,5,6,7,8,11,13

3. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.

4. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొన వలెను.

5. ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

6. నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.

7. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి

8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను

11. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహో వాకు పస్కాబలి.

13. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.

ఆ రక్తము యేసురక్తమే!!

 

ఈ పస్కా పశువుగా క్రీస్తు మనకోసం తనే అర్పించుకుని తననుతాను అర్పించుకున్నారు!

అందుకే ఇదిగో లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు బాప్తిస్మమిచ్చు యోహాను భక్తుడు! 1:29, 36

29. మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.

 

అదే వదించబడిన గొర్రెపిల్ల మనకు ప్రకటన గ్రంధములో కనిపిస్తుంది.

Revelation(ప్రకటన గ్రంథము) 5:5,6,7,9,10,12,13

5. ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన (లేక, వేరైన) యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.

6. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, *వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల* నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

7. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

9. ఆ పెద్దలు *నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, (లేక, రక్తములో)  ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని*,

10. *మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి*; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

12. వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

13. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.

 

ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తుప్రభులవారే!!!

మరి ఆ గొర్రెపిల్ల నీకోసం బలైపోయి నీకోసం ఖర్చు అయిపోగా నీవు ఆయనకోసం ఏమిచేస్తున్నావు కృతజ్ఞతగా? కనీసం ఆయనకు నమ్మకంగా సాక్షిగానైనా ఉండగలుగు తున్నావా?!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*94వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-35*

యెషయా 53:89        

8. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?

9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే ఎనిమిదో వచనంలో అంటున్నారు:  అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను- ఎక్కడికి అంటే గొల్గొతా గిరికి సిలువ వేయబడటానికి!! అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొత్తబడెను కదా అంటున్నారు. ఇక్కడ యెషయా గారు ఆయన పొందబోవుచున్న సిలువ మరణ విధానాన్ని ముందుగానే చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అంటున్నారు ఆత్మావేశుడై: అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా...  నా జనులు అనగా ఇశ్రాయేలు ప్రజలు- ఇంకా సర్వమానవాళి!! అందరి అతిక్రమ క్రియలను బట్టి తప్పులేని పాపములేని పరిశుద్ధుడు దౌర్జన్యముగా హింసించబడి చంపబడ్డారు అంటున్నారు!

ఆ అన్యాయపు తీర్పు- తీసుకుని పోబడటం గూర్చి సువార్తలలో ఉంది.....

Matthew (మత్తయి సువార్త) 27:1,2,3,4,12,13,22,23,24,25,26,29,31,32

 

1. ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి

2. ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

4. నేను నిరపరాధరక్తమును (అనేక ప్రాచీన ప్రతులలో- నీతిమంతుని రక్తమును అని పాఠాంతరము) అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

12. ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

13. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

22. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి.

23. అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

24. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.

25. అందుకు ప్రజలందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.

26. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

31. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.

32. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.

 

ఇంకా సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అనగా చనిపోయెను! అయినను ఈ తరము వారిలో ఎవడు ఈ సంగతి ఆలోచించడం లేదు అంటున్నారు!

ఈ వచనంలో కొట్టడం, వధించబడటం, మొత్తడం, మొత్తి భాదించడం, గాయపడటం, నలుగ గొట్టబడటం, శిక్ష, దౌర్జన్యం, ఇవన్నీ యేసుక్రీస్తుప్రభులవారు సిలువమరణ క్రమంలో ఆయన అనుభవించిన శ్రమలను సూచిస్తుంది.  అయితే ఇన్నిచేసినా వారు గాని ఈ తరమువారు గాని దీనిని ఆలోచించడం లేదు అంటున్నారు. మొదటి వచనంలో ఆయన చెప్పిన విషయానికి మరలా వస్తున్నారు- మేము తెలియజేసిన సమాచారం ఎవరు విన్నారు అంటూ ఇక్కడ ఎవడూ దీనిని ఆలోచించడం లేదు అంటున్నారు!

 

ఇక తొమ్మిదో వచనంలో :అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యెద్ద అతడు ఉంచబడెను ఇంకా అంటున్నారు నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అంటున్నారు.

 

ఇక్క భక్తిహీనులతో సమాధి నియమించబడటం అనగా అందరినీ సమాధి చేసిన విధంగానే యేసుక్రీస్తుప్రభులవారిని కూడా సమాధి చేశారు అనేదానిని సూచిస్తుంది. అయితే దానిని దేవుడు ధనవంతుని సమాధిలో జరిగేలా చేశారు! ఆ ధనవంతుని సమాధి అరిమతయ యోసేపు గారిది. ఇది మనకు మత్తయి 27:5760 లో కనిపిస్తుంది....

57. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి

58. పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.

59. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

60. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

 

Luke(లూకా సువార్త) 23:50,51,52,53

50. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.

51. అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టుచుండినవాడు.

52. అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని

53. దానిని క్రిందికిదించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుమునుపెప్పుడును ఉంచబడలేదు.

 

ఇలా ఆయన సమాధి కూడా జరిగిపోయింది.

ఆయన పుట్టినప్పుడు పశువుల శాల అద్దెది.  బ్రతికున్నప్పుడు ఆకాశపక్షులకు గూళ్ళు నక్కలకు బొరియలు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకు నీడ లేదు అన్నారు. చివరికి ఆయనను సమాధి చేసింది కూడా అద్దె సమాధిలోనే!

ఇలా తనకంటూ ఏమీ ఉంచుకోకుండా తన కున్నదంతా మనకిచ్చి- చివరికి తన రక్తం, తన నీరు తన జీవము కూడా ఇచ్చి వెళ్ళిపోయారు యేసుక్రీస్తుప్రభులవారు!!!

అందుకే అంటున్నాడు భక్తుడు నిశ్చయముగా అతడు ఏ నేరము చేయలేదు ఆయన నోట ఏవిధమైన కపటము లేదు అయినా ఆయనను ఇన్ని చిత్ర హింసలు చేశారు అంటున్నారు: ఈ మాటలు ఆయన జీవితంలో పవిత్రమైన సాత్వికమైన పాపరహితమైన స్వభావాన్ని సూచిస్తున్నాయి. యేసుక్రీస్తుప్రభులవారు తప్పించి ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి నోట కనీసం కొంచెమైన పాపము మరియు మోసం ఉంటాయి. గాని యేసులో అది కోశానా కూడా లేదు!

కీర్తన 12:2

అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

 

Jeremiah(యిర్మీయా) 9:8,9

8. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.

9. నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

 

యిర్మియా 17:9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

 

రోమా 3:13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

 

రోమీయులకు 3:23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

 

కానీ యేసులో ఏ పాపమును దోషమును లేదు!

అటువంటి పరిశుద్ధమైన దేవుడే నిన్ను నన్ను విమోచించ గలరు! ఆయనను నమ్ముకుని నీవు కూడా అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తున్నారు!!

మరినీవు అలాగా జీవించగలవా?!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*95వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-36*

యెషయా 53:10           

అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థ బలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 10వ వచనంలో అంటున్నారు: అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధిని కలుగుజేసెను. అతడు తన్నుతానే అపరాదపరిహారార్ధ బలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు అగును. యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును!!!

 

దీనిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అంటున్నారు.  ఎందుకు నలుగ గొట్టవలసి వచ్చింది మనము ఇంతవరకు గతభాగాలలో చూసుకున్నాం! అయితే అలా నలుగగొట్టడం యెహోవాకు ఇష్టమయ్యింది. అనగా తన ఏక కుమారున్ని ఇంత ఘోరమైన మరణానికి గురిచేయడం తండ్రియైన దేవునికి ఇష్టపడ్డారు- దేనికోసం? తన పిల్లలైన సమస్తమానవాళిని  తన నిజకుమారుని మరణం ద్వారా తిరిగి తన దారిలోనికి తీసుకుని రావాలి అన్నదే అక్కడ ముఖ్య ఉద్దేశం! దీనిని బట్టి ఒక విషయం స్పష్టమవుతుంది

 

 ఏమిటంటే :యేసుక్రీస్తుప్రభులవారిని ఇంత ఘోరంగా అన్యాయంగా చంపినా వారు కూడా దేవుని చేతిలో ఆయన ప్రణాళిక నెరవేరడంలో సాధనాలు అనే సత్యాన్ని ఈ వచనం ద్వారా గ్రహించవచ్చు!!

ఆయనను చిత్రహింసలకు గురిచేసింది మానవులే! అయితే వారు దేవుని ప్రణాళిక నెరవేరే క్రమంలో దేవుని ఉద్దేశపూర్వకంగానే అలా చేశారు! లేకపోతే ఎవరినీ మేకులతో బందించలేదు రోమా సైనికులు. కేవలం త్రాళ్ళతో కట్టి సిలువవేసేవారు. గాని యేసుక్రీస్తుప్రభులవారిని మాత్రమే మేకులతో సిలువకు కొట్టారు. ఇక ఎవరికీ ముళ్ళకిరీటం పెట్టలేదు, గాని యేసయ్యకి ముళ్ళకిరీటం పెట్టారు. అందరినీ సాధారణ కొరడాలతో కొట్టేవారు, గాని యేసయ్యను కొట్టిన కొరడాల చివరలో కొన్ని ముళ్ళు పెట్టారు. ఇలా సాతాను గాడు వారిలో పనిచేసి అత్యంత క్రూరంగా ఆయనను హింసించి చంపేలా చూసాడు. అయితే వారికి తెలియనిది ఏమిటంటే అది దేవుని ప్రణాళిక!! వారు ఆయన ప్రణాళిక నెరవేరడానికి సాధనాలు!!

 

అందుకే అపోస్తలులు అంటున్నారు:

అపో.కార్యములు 2:23

దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత (లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.

 

అపో.కార్యములు 4:27

ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

అపో.కార్యములు 4:28

వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

 

కొన్నిసార్లు దేవుడు తన ఉద్దేశాలు నెరవేరడానికి కొందరిని సాధనాలుగా చేసుకున్నారు. ఐగుప్టు దేశము మీదికి దేవుడు ఉగ్రత పంపించాలి. అది నెరవేరడానికి మోషేగారి కాలంలో అప్పటి ఫరోని వాడుకున్నారు.

ఇశ్రాయేలు సిరియా ఐగుప్టు మరియు తక్కిన రాజ్యాలను శిక్షించాలి అనుకుని అష్షూరు రాజులను దేవుడు వాడుకున్నారు, ఇది మనకు యెషయా గ్రంధంలో కనిపిస్తుంది.

మరోసారి అష్షూరుతో సహా మిగిలిన దేశాలను శిక్షించాలని బబులోను వారిని వాడుకున్నారు. ఇలా దేవుని సాధనాలుగా అనేకమంది అనేక సందర్భాలలో వాడబడ్డారు!

 

రోమీయులకు 3:25

పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

రోమీయులకు 3:26

క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

రోమీయులకు 8:3

శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము

రోమీయులకు 8:4

దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

 

2కోరింథీయులకు 5:21

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

హెబ్రీ 9:1215

11. అయితే క్రీస్తు రాబోవుచున్న (అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా,

12. మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

13. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,

14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ (మన, అని పాఠాంతరము) మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

15. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

 

హెబ్రీయులకు 10:14

ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

 

1యోహాను 2:2

ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు (ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

 

అయితే ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏమిటంటే: తండ్రి చిత్తానికి యేసుక్రీస్తుప్రభులవారు లోబడి ఆయన చెప్పిన ఘోరమైన మరణానికి చిత్ర హింసలకు ఒప్పుకుని బరించడం!!! తన సంపూర్ణ సమ్మతితో ఈ పుణ్యకార్యం నెరవేర్చడం!!! తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ముఖ్యమైన పనిగా ఉత్తమమైన పనిగా ఎంచుకుని ఇంతటి ఘోరమైన మరణమును ఎదుర్కొన్నారు యేసుక్రీస్తుప్రభులవారు!!! తనకుతానుగా ఆయన మనకోసం అపరాదపరిహారార్ధబలిగా అర్పించుకున్నారు!!!

మత్తయి 26:39

కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

 

యోహాను 10:1718

17. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.

18. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

 

Hebrews(హెబ్రీయులకు) 10:4,5,6,7,8,9,10

4. ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.

5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.

6. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు.

7. అప్పుడు నేను గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

8. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.

 

తండ్రి చిత్తానికి లోబడి తననుతాను అపరాదపరిహారార్ధబలిగా అర్పించుకున్నారు యేసయ్య! మరినీవు తండ్రి చిత్తానికి లోబడతావా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*96వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-37*

యెషయా 53:10           

అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

     ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 10వ వచనంలో అంటున్నారు: అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధిని కలుగుజేసెను. అతడు తన్నుతానే అపరాదపరిహారార్ధ బలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు అగును. యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును!!!

 

                  (గతభాగం తరువాయి)

 

ఇక తర్వాత ఆశ్చర్యమైన మాట ఏమిటంటే: అతడు తన్నుతానే అపరాదపరిహారార్ధ బలిగా చేయగా అతని సంతానం చూచును అతడు దీర్ఘాయుష్మంతుడు అగును!

ఇక్కడ ఏమని అర్ధమవుతుంది అంటే సిలువమీద చనిపోయిన వాడు దీర్ఘాయుష్మంతుడు ఎలా ఎప్పుడు అవుతాడు? అంటే ఆయన తిరిగి లేస్తారని, యుగయుగాలు జీవిస్తారని ముందుగానే తెలుసు అన్నమాట! అదేవిధంగా ఆయన మూడో రోజున మృత్యుంజయుడై లేచి పరమునకు వెళ్లి యుగయుగాలు జీవిస్తున్నారు.

 

ఇక ఆయన సంతానం చూచును?? ఆయనకు సంతానం ఎవరు? మనమే! ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో కడుగబడిన వారిని దేవుడు ఆయన సంతానముగా చేశారు.  వారిని సంఘము అంటారు. ఈ పరిశుద్ధ వధువు సంఘము కట్టబడటం యేసయ్య పరిచర్యతో ఆయన మరణంతో ప్రారంభించబడి ఇప్పటివరకూ కట్టబడుతూ, ఇంకా కట్టబడుతూనే ఉంటుంది ఆయన రెండవరాకడ వచ్చేవరకు! ఇలా రక్షించబడిన వారు ఆయన సంతానం! ఇప్పుడు ఆయన సంతానమైన మనము యేసుక్రీస్తుప్రభులవారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సజీవుడుగా ఉండటం చూస్తున్నాము! చూస్తారు కూడా!! ఇదే ఆయన దీర్ఘాయుష్మంతుడు అగుట ఆయన సంతానము చూచును అనగా!!!! ఆయన సంతానం అనగా ఆత్మమూలంగా ఆధ్యాత్మిక జీవాన్ని పొందుకున్న సంఘములో ప్రతీ విశ్వాసి ఆయన సంతానమే!

యోహాను 1:12

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

యోహాను 1:13

వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

ప్రకటన 1:18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

 

కీర్తన 45:6

దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.

 

కీర్తనలు 72:5

సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.

 

హెబ్రీయులకు 13:8

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.

ఆమెన్!!!!

 

ఇక యెహోవా ఉద్దేశం అతనిద్వారా సఫలమగును అనగా ఆయన భూమిమీద ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు! మాటిమాటికి నేను తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చాను అన్నారు!

యోహాను 17:4

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని.

   

ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి తండ్రివద్దకు వెళ్ళిపోయారు! అక్కడ కూడా ఇప్పుడు తండ్రి చిత్తమే నెరవేరుస్తున్నారు- అది భూమిమీద ఉన్న ప్రజలు ఆయన మార్గాన్ని తెలుసుకుని తన జీవమార్గంలోనికి ప్రవేశించడానికి తన ప్రజలను వాడుకుని వారిద్వారా సంఘాన్ని కడుతున్నారు. అది తండ్రి చిత్తము!!

 

Ephesians(ఎఫెసీయులకు) 1:8,9,10,11,12

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.

10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

 

యెషయా 42:14

1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

4. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.

6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

 

అపో.కార్యములు 2:33

కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.

అపో.కార్యములు 2:36

మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

 

మత్తయి 28:18

అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.

 

యోహాను 17:2

నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.

 

కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన సంకల్పాన్ని తండ్రి ఉద్దేశాన్ని పూర్ణంగా సఫలము చేశారు!  అందుకే చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాను అన్నారు యోహాను 17:4 లో!  నెరవేర్చిన తరవాతనే సిలువమీద సమాప్తమాయెను అని పలికారు!!!  ఇక ఇప్పుడు కూడా తండ్రి యొక్క సంకల్పాన్ని ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు! మరి ఆయన రక్తంలో కడుగబడిన నీవు ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన చిత్తానికి లోబడుతున్నావా??

లోకాశలకు దూరంగా ఉండడం ఆయన చిత్తం! మన ఘటమును అపవిత్రతకు దూరంగా మరియు జారత్వమునకు దూరంగా ఉండటం ఆయన చిత్తం! దేవుణ్ణి స్తుతించడం ఆయన చిత్తం! మరి ఇలాంటి దేవుని చిత్తాలను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నావా లేక నీ కోరికలను పూర్తిచేసుకోడానికి ప్రయత్నిస్తున్నావా?? ఒక్కసారి ఆలోచించుకో! సరిచూసుకో!

సరిచేసుకో!

దైవాశీస్సులు!!!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*97వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-38*

యెషయా 53:1112   

11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

12. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

   ప్రియులారా! ఇక 53వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 11వ వచనంలో అంటున్నారు: అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులనుగా చేయును!

 

ప్రియులారా! ఈ వచనం 52 వ అధ్యాయం చివరి మూడువచనాలతో కలుపుకుని చదువుకుంటూనే దీని అర్ధం పరిపూర్ణమవుతుంది.

అతడు తాను పడుతున్న వేదనలను చూచి తృప్తి పడతాడు ఎందుకంటే 52:13 నాసేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడు అవుతాడు మహాఘనుడుగా ఎంచబడతాడు ఎందుకంటే సమస్త మానవాళి పక్ష్యంగా అతడు పాపములకోసం హింసించబడి నలుగగొట్టబడి  అతనికి సురూపము సొగసు లేకుండా బాధించబడి మరణమై పోయి తిరిగిలేచాడు కాబట్టి ఇప్పుడు నీ రూపము ఏ మనిషి రూపము కంటే నరరూపము కంటే చాలా చాలా వికారమని ఎలా అన్నారో, ఇప్పుడు అయన మృత్యుంజయుడై లేచి చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించాక సంఘము అయ్యా నీవు దవళవర్ణుడవు రక్తవర్ణుడవు పదివేల మందిలో అతిప్రియుడవు అంటూ కీర్తిస్తుంది. అలా చేయడానికి అతడు అనేక జనములను చిలకరించును అనగా తన నామములో అనేకమంది బాప్తిస్మము పొంది తండ్రియైన దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు!!! ఇక్కడ అనేక జనములు అనగా అనేక దేశములలో గల రకరకాలైన జాతులకు మతాలకు గోత్రాలకు చెందిన ప్రజలు అని అర్ధం!!!

 

వీరు ఎంతమంది అని ఆలోచిస్తే అది మనకు లెక్కకు తెలియదు దీనిని ప్రకటన 7:910 లో చెబుతున్నారు! ఆయనలో నమ్మకముంచిన వారంతా ఆయన సంతానమే!!!...

9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్లయెదుటను నిలువబడి.

10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

 

ఇలా తన సిలువ మరణ పునరుత్థానం వలన అనేకులను తండ్రియైన దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేశారు. అదే అంటున్నారు 24 పెద్దలు మరియు అక్కడున్న వారంతా.......

Revelation(ప్రకటన గ్రంథము) 5:8,9,10

8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

9. ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, (లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

10. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

అందుకే ముందుగానే చెబుతున్నారు దేవుడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులనుగా అనగా పాపములేని వారిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన తన రక్తమును చిందించి అనేకులను ఆయన రక్తములో కడిగి వారిని శుద్దులుగా చేశారు, చేస్తున్నారు కాబట్టి!

 

ఇక తనకున్న అనుభవజ్ఞానము అంటే ఏమిటి? బహుశా ఇది యోహాను 17:౩లో చెప్పినట్లు ఏకైక సత్యదేవుడు అయిన తండ్రియైన దేవుణ్ణి ఆయన భూమిమీద నరుల రక్షణ కోసం పంపించిన యేసుక్రీస్తుప్రభులవారిని తెలుసుకుని అంగీకరించడమే నిత్యజీవం!!  ఇదే తనకున్న అనుభవజ్ఞానం అని నాకు అర్ధమయ్యింది. యేసుక్రీస్తుప్రభులవారిని గురించి తెలుసుకోవడం, ఆయన గూర్చి నేర్చుకోవడం, ఆయనకున్న పవిత్ర లక్షణాలను గ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లక్షణాలను అలవర్చుకుని, ఆత్మను పొందుకుని ఆత్మఫలమును ఫలిస్తూ ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆత్మానుసారంగా జీవించడమే ఈ అనుభవజ్ఞానము ఎరగడం! ఆయన బలి ఎందుకోసం చేశారో దాని లక్షాన్ని తెలుసుకుని అందరికీ చాటిచెప్పడం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం!!

 

ఇక నిర్దోషులనుగా చేయును అనగా పాపము లేనివారిగా చేస్తారు అని! ఇది మనకు క్రొత్తనిబంధన మొత్తం కనిపిస్తుంది

రోమా 3:24; 26, 28

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.

 

రోమీయులకు 4:25

ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

 

5:1;  10:10

1కొరింథీ 6:11

మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

గలతీ 2:16

తీతు 3:7

 

ఇక 12వ వచనం చూసుకుంటే అందుకే గొప్పవారితో నేనతనికి పాలుపంచిపెట్టెదను, ఘనులతో కలిసి కొల్లసోమ్ము విభాగించుకొనును ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసేను అతిక్రమము చేయువారిలో ఎంచబడ్డాడు కాబట్టి ఇంకా అనేకుల పాపమును భరించాడు. ఇంకా ఇంతటి ఘోరమైన శ్రమలను అనుభవిస్తున్నారు వారిని గూర్చి క్షమించమని విజ్ఞాపనము చేశారు కాబట్టి అతనికి నేను ఘనమైన నామమును ఇస్తున్నాను అంటున్నారు!

 

గమనించాలి ఇక్కడ బలాఢ్యులతో గొప్పవారితో కొల్లసోమ్ము పంచుకోవడం అంటే ఆయన రెండవరాకడలో చేయబోయే యుద్ధాలను సూచిస్తుంది హార్మేగిద్దోను మరియు గోగుమాగోగు యుద్ధాలలో ఆయన పొందబోయే యుద్ధాలను- భూలోకం మొత్తం మీద ఆయన ప్రత్యక్షంగా చేయబోయే పరిపాలన మరియు ఇనుపదండంతో ప్రజలను ఏలే విధానమును సూచిస్తుంది! ఇంకా అభిషక్తుడైన రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు చేసిన ఆధ్యాత్మిక యుద్ధాన్ని మరియు ఇంకా తన ప్రజల పక్ష్యంగా పోరాడుతున్న ఆధ్యాత్మిక యుద్ధాన్ని కూడా సూచిస్తుంది. 

కొలస్సీ 2:15

ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

హెబ్రీ 2:1415

ఇక కొల్లసొమ్ము అనగా ఏమిటి? అవి విమోచించబడిన ఆత్మలు- మరియు విమోచించబడిన నూతన ఆకాశము మరియు నూతన భూమి- మరియు వాటిమీద ఉండే సమస్తము!!! ఇది బైబిల్ పండితుల అభిప్రాయం!!

 

ఇక ఆయన అక్రమకారులలో ఎంచబడెను దీనిని మార్కు గారు ఎత్తి రాస్తున్నారు...

మార్కు 15:28

ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి. (అనేక ప్రాచీన ప్రతులలో-అప్పుడు ఆయన అక్రమకారులలో నొకడుగా నెంచబడెనని చెప్పు లేఖనము నెరవేరినది, అనికూర్చబడియున్నది)

ఎందుకంటే సిలువమరణం కేవలం నేరము చేసిన వారికే విధిస్తారు. కాబట్టి ఆయనను నేరం చేసిన వాడిగా తీర్పు తీర్చి బందిపోటు దొంగలమద్య సిలువవేశారు.

 

 ఇక అనేకుల పాపములను భరించడం- ఇదేమాట వివిధ రకాలుగా 5,6,8,10,11 వచనాలలో ఉపయోగించారు.

 

ఇక అక్రమము చేసేవారి పక్షంగా విన్నపం చేయడం అనగా: ఇంతగా వారు యేసుక్రీస్తుప్రభులవారిని బాధిస్తున్నా తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్ధించి సర్వమానవాళికి క్షమాభిక్ష పెట్టడం!! లూకా 23:౩4

ఆరోజు ఆయన అలా క్షమాభిక్ష పెట్టకపోతే ఆయనను అన్ని ఘోరమైన బాధలు పెట్టినవారిని తండ్రియైన దేవుడు వదులుతారా? లేదుకదా!! అందుకే ముందుగానే ఆయన మనలని క్షమించారు! అలాగే మనము కూడా ఒకరిని ఒకరు క్షమించాలి!

 

సరే, ఇంతగా చేశారు కాబట్టి ఆయన అందరికంటే హెచ్చుగా హెచ్చించబడ్డారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలుగారు అంటున్నారు...2:511

5 .క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

కాబట్టి 12వ వచనంలో చెప్పినట్లు యేసుక్రీస్తుప్రభులవారికి విధేయులుగా ఉందాము, ఆయన పట్ల భయుతోను వణకుతోనూ ఉంటూ మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుందాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*98వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-39*

యెషయా 61:13        

1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా!  ఇక 53వ అధ్యాయం తర్వాత రక్షకుని మొదటిరాకడ కోసం చెబుతున్న మరో అధ్యాయం 61వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారి సువార్త పరిచర్య విధానం కనిపిస్తుంది ఆయన ఈ భూలోకానికి వచ్చిన కారణం కనిపిస్తుంది.

 

ఇక మొదటివచనంలో ప్రభువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును చెరలో ఉన్నవారిని విడుదలను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరం మనదేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును .... అంటూ మొదలుపెట్టారు.

 

ఈ అధ్యాయం మొదలుపెట్టే ముందు నన్ను ఒకమాట చెప్పనీయండి. ఈ అధ్యాయం మొదటి వచనం తప్పుగా తర్జుమా చేశారు మన తెలుగులో తర్జుమా చేసిన బ్రాహ్మణులు!  యెహోవాఆత్మ నా మీదికి వచ్చి యున్నది అంటూ, నిజానికి ప్రాచీన ప్రతులలో యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నాడు అని ఉంది.  ఒకసారి ఆ వచనం మీకోసం చదవండి.....

 

యెహోవాప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు.

పేదలకు శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

గుండె పగిలినవారిని బాగు చేయడానికీ,

ఖైదీలకు విడుదలనూ బంధితులకు బంధ విముక్తినీ

ప్రకటించడానికి నన్ను పంపాడు.

 

గాని మన బారతీయ పండితులకు తమ గ్రంధాలలో చెప్పినట్లు దేవతలు అనగా స్త్రీలు కాబట్టి బైబిల్ లో దేవదూతలు కూడా స్త్రీలు అనుకున్నారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా స్త్రీ అని అనుకుని వచ్చియున్నది అని  తర్జుమా చేశారు. గమనించాలి పరిశుద్ధాత్మ దేవుడు పురుషుడు! స్త్రీ కాదు!

 

ఇక ఈ వచనంలో ప్రభువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నాడు.  దేనికోసం? దీనులకు సువర్తమానం అనగా దీనులకు పేదలకు సువార్త ప్రకటించడానికి! దీనికోసం ఇంకా ముందుకు వెళ్లబోయే ముందు యేసుక్రీస్తుప్రభులవారు కేవలం సువార్త ప్రకటించడానికి- తర్వాత తన ప్రాణం మానవాళికోసం పెట్టడానికి వచ్చారు అని గ్రహించాలి. అందుకే లూకా సువార్తలో యేసయ్య తన పరిచర్య ప్రారంభంలోనే ఈ 60:13 వచనాలు చదివి ఇది ఇప్పుడు మీ వినికిడిలో నెరవేరింది అన్నారు. లూకా 4:1621 లో...

Luke(లూకా సువార్త) 4:17,18,19,20,21

17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

 

అంతేకాదు ద్వితీయోపదేశకాండంలో 18:1719 లో చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తుప్రభులవారే అని గ్రహించాలి....

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 18:17,18,19

17. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పినమాట మంచిది;

18. వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.

19. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.

 

ఈ గొప్ప దేవుడు ప్రవక్త రక్షకుడు తన పరిచర్యను సువార్తతోనే ప్రారంభించారు! అయితే ప్రారంభించే ముందు దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని పరిశుద్ధాత్మ పూర్నుడుగా చేసి అప్పుడు తన సువార్తను ప్రకటింపజేశారు.  కాబట్టి సువార్తను ప్రకటించేవారు పరిచర్య చేసేవారు ముందుగా తాము తమ పాపముల నుండి విముక్తులై పరిశుద్ధాత్మ పూర్నులై అప్పుడు సువార్త ప్రకటిస్తే అనేకమంది ప్రభువు దగ్గరకు వస్తారు!

 

కాబట్టి ముందుగా సువార్త అంటే ఏమిటి? ఎవరు ఎలా ప్రకటించాలి అనేది చూసుకుని అప్పుడు ముందుకుపోదాం!

కొలస్సీయులకు 1: 5

మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

 

   ప్రియులారా! ఇక్కడ  సువార్త సత్యము అని సంభోదిస్తూ ఆ నిరీక్షణ గూర్చి ఇంతకుముందు వింటిరి అంటున్నారు. ఈ నిరీక్షణ మనుష్యులు దేనికోసమో ఎదురుచూస్తున్న నిరీక్షణకోసం చెప్పడం లేదు! అది తీతుకు 2:13 లో చెప్పబడిన శుభప్రదమైన నిరీక్షణకోసం వ్రాయబడింది. ఇంకా కొలస్సీ 1:12లో చెప్పబడిన తేజోవాసులైన పరిశుద్ధులస్వాస్త్యములో పాలివారగుటను గూర్చిన నిరీక్షణకోసం వ్రాయబడింది!!!

 

   మీయొద్దకు వచ్చిన సువార్త సత్యము గూర్చిన బోధ అంటున్నారు. . అనగా సువార్త సత్యమైనది. అది కల్పిత కధకాదు! గలతీ 2:5;14;  మొదటగా సువార్తకోసం ధ్యానం చేస్తే- బైబిల్ లో చాలాచోట్ల సువార్తకోసం వ్రాయబడింది. కేవలం యేసుప్రభులవారు వచ్చిన తర్వాతనే సువార్తకోసం వ్రాయబడింది అనుకుంటే పొరపాటు.  యెషయా గ్రంధం నుండి ఈ సువార్తకోసం చూసుకోవచ్చు! యెషయా 40:9 సీయోనూ- సువార్త ప్రకటించుచున్నదానా! . . . బలముగా ప్రకటించుము! భయపడక ప్రకటించుము అని వ్రాయబడింది.

 

  ఇంతకీ *సువార్త అంటే మంచివార్త. ఆ మంచివార్త భౌతికసంభందమైన వార్తకాదు*! *యేసుక్రీస్తుప్రభులవారు నీకోసం నాకోసం ఈ భూలోకానికి వచ్చి, మన పాపములకోసం బలియాగమై, పాపములను కడిగి, మరణించి తిరిగి లేచారు. ఒకరోజు ఆయన తిరిగివచ్చి ఆయనయందు విశ్వాసముంచిన వారిని తనతోపాటు ఉండటానికి వారిని తీసుకుని పోతారు! ఇదే సువార్త*! ఇదే విషయాన్ని పౌలుగారు చెబుతున్నారు:

1 కొరింథీ 15: 3-10; లేఖనముల ప్రకారం క్రీస్తు మనకోసం చనిపోయి, లేఖనముల ప్రకారం పాతిపెట్టబడెను, మూడవరోజున సజీవంగా లేచారు, లేచిన తర్వాత పేతురుకి కనబడ్డారు, 12మందికి ఒకసారి, తర్వాత 500 మందికంటే ఎక్కువైన వారికి కనబడెను అంటున్నారు. ఇక్కడ 500 మంది అని క్లియర్ గా చెప్పడానికి కారణం ధర్మశాస్త్ర ప్రకారం ఏదైనా విషయం దృవీకరించాలంటే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులుండాలి! ఇక్కడ 500 మంది సాక్షులను చూపెడుతున్నారు పౌలుగారు- అంటే ఇది కధ కాదురా నిజంగా జరిగింది అని నొక్కివక్కానించి చెబుతున్నారు! ఇంకా అంటున్నారు అకాలమందు పుట్టిన నాకు కూడా కనబడ్డారు! ఆయన కల్పిత కధలు కాకుండా తన సజీవసాక్ష్యం చెబుతున్నారు. అదే మనకు కూడా మాదిరి!!

 

 సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను దెలుపటయే! సాక్ష్యమిచ్చేటందుకు స్వామి రక్షించేననుచు సాక్ష్యమిచ్చెద!!!... 

కాబట్టి మన సాక్ష్యాన్ని, యేసయ్య రక్షణసువార్తను ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన అవుసరం ఉంది! అయితే ఇది పౌలుగారు చెప్పినట్లు : వాక్చాతుర్యం లేకుండా, నేను సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తున్నాను అంటున్నారు! 1 కొరింథీ 1:17-21; ఇంకా అంటున్నారు: సిలువను గూర్చిన వార్త (సువార్త), నశించుచున్న వారికి వెర్రితనముగా కనిపిస్తుంది, అయితే రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి!! కాబట్టి ఆ శక్తిగల సువార్తను ఆసక్తితో ప్రకటన చేద్దాం! పౌలుగారు సిలువను గూర్చిన భారం నామీద ఉంది. నన్ను భక్షిస్తుంది అంటున్నారు! సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నారు! 1 కొరింథీ 9:16.

 

    సరే ఇప్పడు సువార్త కోసం బైబిల్ లో ఎక్కడ వ్రాయబడిందో చూద్దాం! మీద చెప్పినట్టు యెషయా 40:9 బలము గాను, భయంలేకుండా ప్రకటించమంటున్నారు! అవును నిజవార్తను చెప్పడానికి భయమెందుకు? అన్య దేవతలను దూషించకుండా, మన దేవునివార్తను ధైర్యంగా ప్రకటిద్దాం! ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శాసనాలు వచ్చినా దేవునివార్తను చాటిద్దాం!

 

 ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక! దేవుని దయవలన నా 6వ సంవత్సరం నుండే మా తండ్రిగారితో కలసి సువార్తప్రకటనలో పాల్గొనుట మొదలుపెట్టాను. 6వ సంవత్సరంలోనే దేవుని పాటలు గట్టిగా పాడుచున్నందుకు రాళ్ళదెబ్బలు తిన్నాను, సువార్త చెబితే చంపుతామని గ్రామస్తులు- నేను బ్రతికినంతకాలం సువార్త ప్రకటన మాననని  మా తండ్రిగారు చెప్పడం జరిగింది. అయితే చంపుదామని అనుకున్నప్పుడు రాళ్లదెబ్బలకు నా నుదిటిమీద రక్తం కారుచున్న నన్ను చూసి, ఏమనుకున్నారో- గ్రామం నుండి మమ్మల్ని బయటకు గెంటివేసారు. ఆ రోజు మరలా సాతానుగాడు నన్ను చంపాలని చూశాడు! పెద్ద వర్షం వలన బురదలో సైకిల్ జారిపోయి (ఆకాలంలో (1982) ఇప్పటిలా పక్కా రోడ్లు లేవు, మట్టిరోడ్డులే) నేను పీకలలోతు బురదలో కూరుకుపోవడం జరిగింది. ఆ నిషీదరాత్రిలో నా ఏడ్పు ప్రక్కనున్న కాలువ నీటి ప్రవాహానికి వినబడటం లేదు. 5 నిమిషాల తర్వాత దేవుడు గొప్ప మెరుపును పంపించి నేను మా తండ్రిగారికి కనబడేలా చేసారు. అప్పుడు మా తండ్రిగారు, మరో దైవసేవకుడు కలసి నన్ను బురదలో నుండి తీయడం జరిగింది. అప్పుడు ప్రారంభమైన ప్రస్థానం నేటికీ ఆగకుండా జరుగుతుంది. ఎన్నోసార్లు అవమానాలు, హేళనలు, తిట్లు ఎదురైనా, గ్రామములనుండి గెంటివేయబడినా సరే, ఎన్నో ప్రాంతాలలో, దేశాలలో కూడా దేవుని రక్షణ వార్తను ప్రకటించడం జరుగుతుంది! ఇన్ని ఆపదల నుండి నన్ను తప్పించిన దేవుడు మీకు కూడా తోడుగా ఉంటారు! కాబట్టి భయపడొద్దు! జడియవద్దు!

 

  ఇంకా యెషయ 52:7 లో సువార్త ప్రకటిస్తూ సమాధాన సువార్తను ప్రకటించువారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటున్నారు. అదే విషయాన్ని నహూము 1:15లో దృవీకరించడం జరిగింది. యేసయ్య తన సువార్త పరిచర్య సువార్తతోనే ప్రారంభమయ్యింది. ప్రభువు ఆత్మ నామీద నున్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని చెబుతున్నారు.

 లూకా 4:18;  ప్రభువురాజ్యము సమీపించినది, గనుక మారుమనస్సు పొంది రక్షణపొందుడి అంటూ సువార్త ప్రారంభించారు యేసయ్య! మార్కు 1:15; అందరికీ సువార్త ప్రకటించాలి అని చెబుతూ- మొదట సకలజనులకు అనగా సమస్త దేశాలకు సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది అని చెప్పారు!

మార్కు 13:15; చివరకు ఆయన చనిపోయి, తిరిగి లేచి చివరి ఆజ్ఞను ఇచ్చారు: మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి భాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. . . మార్కు 16:15-18

పౌలుగారు అదే ఆజ్ఞను పాటిస్తూ అనేక దేశాలలో సువార్తను ప్రకటించారు. దానికోసం ఎన్నోచోట్ల దెబ్బలు, చెరశాల అనుభవించారు. పౌలుగారే కాదు ఆదిమ అపోస్తలులు, ఆదిమ సంఘము ఎన్నో అగచాట్లు పడ్డారు. తమ మానప్రాణాలను అర్పించారు. అందుకే ఆ రక్షణ సువార్త మనవరకు చేరగలిగింది!! నీవు నేను నిజదేవున్ని తెలిసికోగలిగాము. ఈ సువార్తకోసము/ యేసయ్య కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును, ప్రాణం రక్షించుకోవాలి అనుకొనువాడు దానిని (పరలోకం) పోగొట్టుకోనును అని చెప్పారు యేసయ్య! మార్కు 8:35; ఇక రోమా 10వ అధ్యాయం మొత్తం సువార్తకోసమే చాలా deep గా వ్రాయబడింది! ప్రకటించకపోతే ప్రజలు ఎలా వింటారు? . . అంటూ వినుటవలన విశ్వాసం కలుగును వినుట దేవుని వాక్యం వలన కలుగును అంటున్నారు! కాబట్టి దేవుని సువార్తను మనం అందరికీ ప్రకటించాలి! క్రొత్త నిభందన మొత్తం సువార్త ప్రకటించాల్సిన అవసరంకోసం వ్రాయబడింది.

 

   ఈరోజుల్లో: వదినా! ఈరోజు పనిమీద బయటికి వెళ్ళిపోయాను- ఫలానా సీరియల్ చూడలేకపోయాను, ఏమైందో కాస్త చెప్పవూ అని అడగడం తరువాయి- కధ- స్క్రీన్ ప్లే దర్శకత్వం తో పాటు frame to frame తప్పకుండా చెబుతావు కదా పనికిమాలిన సీరియళ్ళ కోసం! నిజదేవుని కోసం, యేసుప్రభువు నీజీవితంలో చేసిన మేలులు, అద్భుతాలు రోజుకొకటి ఎప్పుడైనా చెప్పావా ఆ వదినకు?!!! ఆ వదిన/ అక్క నరకానికి పోతే ఆ ఆత్మకు నీవే లెక్క అప్పగించాలని తెలియదా? ఇక ఈ మరదళ్ళుకూడా పనికిమాలిన సీరియల్లుకోసం అడుగుతారు గాని- ఈరోజు నేను మందిరానికి రాలేకపోయాను- ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పారో కాస్త చెప్పవూ అనిమాత్రం అడగరు!! ఎందుకంటే వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ లేదు! 

 

కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరులా! లోకవార్తలు చెప్పుకోకుండా యేసయ్య సిలువ సువార్తను చెబుదాం!

 అందరికీ ప్రకటిద్దాం!

 సాక్షిగా నిలబడుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*99వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-40*

యెషయా 61:13        

1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!  ప్రస్తుతం సువార్తకోసం ధ్యానం చేస్తున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

 ప్రియులారా! పౌలుగారు సువార్తకోసం చెబుతూ సువార్తీకరణ చేయాలి అంటున్నారు! అనగా దానిని మనము వ్యాప్తి చెందించాలి అంటున్నారు. ఎందుకంటే యేసయ్య ఇచ్చిన చివరి ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు మత్తయి 28:19--20

19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

 

మార్కు 16:15 –16

15. మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

అందుకే పౌలుగారు సువార్త సత్యమును అందరిలో వ్యాపించాలి అంటున్నారు.

 

    కొలస్సీ 1:6  ఈ సువార్త సర్వలోకములో ఫలించుచూ, వ్యాపించుచున్నట్లుగా మీరు దేవునికృపను గూర్చి విని, సత్యముగా గ్రహించిన నాటనుండి, మీలో సహితము ఫలించుచూ వ్యాపించుచున్నది!!

 

    ప్రియ దైవజనమా! పౌలుగారు వ్రాసిన ప్రతీపత్రికలోని ప్రతీ వచనములో, ప్రతీ పదములోను ఎన్నో ఆత్మీయ మర్మాలుంటాయి. అంతటి పరిశుద్ధాత్మ అభిషేకం గలవారాయన! మనం వాటిని వెదుక్కోవాలి! ఈ 6వ వచనంలో ఈ సువార్త సర్వలోకములో ఫలించుచూ వ్యాపించుచున్నట్లుగా. . . అంటున్నారు. అవును ఈ సువార్త ప్రకాశము ఆదిమ సంఘంనుండి, ఇంతవరకు సర్వలోకములో ఒక సువార్త విప్లవముగా వ్యాపిస్తూ ఉంది. అది మనవరకు ఎప్పుడో వచ్చింది తోమా గారిద్వారా!

 

అయితే ఇక్కడ కొంచెం లోతుగా అర్ధం చేసుకుంటే సువార్త అయితే వ్యాపిస్తుంది. అది ఎప్పుడు ఫలిస్తుంది? ఎప్పుడు వ్యాపిస్తుంది? అంటే ఆ తర్వాత గల పదాలను అర్ధం చేసుకోవాలి. అది మీరు విని సత్యముగా గ్రహించిన నాటినుండి- అనగా ఈసువార్త కేవలం ఒక కధ అనుకుని వదిలివేయకుండా, అది సత్యము అని గ్రహించాలి. అది గ్రహించిన తర్వాత నమ్మాలి! నమ్మిన తర్వాత విశ్వసించాలి! అప్పుడు అందరికి ప్రకటించాలి! అప్పుడే అది ఫలిస్తుంది- వ్యాపిస్తుంది!! ఏదో timepass కోసం చేసేది సువార్త కానేకాదు!  నశించిపోతున్న ఆత్మలపట్ల భారం కలిగి, కన్నీటితో- ఆశక్తితో చేస్తే అది సువార్తశక్తిగా మారుతుంది! అది ఫలిస్తుంది, వ్యాపిస్తుంది!!!

 

  ఫలించుట: అనగా మొదట మనకు జ్ఞాపకం వచ్చేది అతడు నీటికాలువల ఓరన నాటబడినదై తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండును. . కీర్తన 1వ అధ్యాయం. ఎవడు? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ఫలిస్తాడు! ఆయన వాక్యాన్ని మొదట నీవు దివారాత్రము ధ్యానిస్తే- ఫలిస్తావు. తర్వాత నీవు చెప్పే సువార్త సాక్ష్యముద్వారా ఇతరులను రాబట్టి ఫలించుటకు ఆస్కారముంటుంది. నీలో సరుకు లేకపోతే అది వ్యర్ధము!

 

 ఇంకా ఫలించుట కోసం ధ్యానం చేస్తే- - నీవు వేసే సువార్త విత్తనాలు ఫలిస్తాయో- ఎండిపోతాయో నీకు తెలియదు!! మత్తయి 13:3-8 ఉపమానం ప్రకారం రైతు విత్తనాలు జల్లాడు, అయితే అవి ఎక్కడ పడ్డాయో, పడిన నేలనుబట్టి ఫలితం ఉంటుంది! అలాగే విత్తడం నీవంతు! సువార్త చెప్పడం నీవంతు! రక్షించబడటం, లేకపోవడం దేవుని చిత్తం! వారు చెప్పినా వినరండి- హేళన చేస్తారు అని అనకూడదు! వినినా- వినకపోయినా, కొట్టినా- విమర్శించినా సువార్త చెప్పడం మనవంతు- కార్యం చేయడం దేవుని వంతు!!!  అందుకే పౌలుగారు సువార్త చెప్పడం నా భాద్యత, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను, చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నారు! 1 కొరింథీ 9:16. కాబట్టి పాపవిముక్తి కోసమైన ఈ సువార్త అందరికీ ప్రకటించాలి!

 

   ఇంకా ఫలించుట కోసం లోతుగా ధ్యానం చేసుకుంటే- ఇంతకీ నీవు ఏం ఫలిస్తున్నావు? మంచివిత్తనాలా? కారుద్రాక్షలా? యెషయా, యిర్మియా గ్రంధాలలో దేవుడు బాధపడుతున్నారు: నేను మంచిద్రాక్షలు ఫలించాలని ఆశిస్తే- కారుద్రాక్షలు కాసాయి, కాబట్టి నేనేం చేయాలి? దానికంచెను అనగా దేవుని కాపుదలను తీసివేస్తాను! అగ్నితో కాల్చివేస్తాను అంటున్నారు! యెషయా 5; యిర్మియా 2:21; కాబట్టి ప్రియ దైవజనమా! ఎటువంటి కాపు కాస్తున్నావు? ఆత్మఫలము ఫలిస్తున్నావా లేక శారీరక కార్యములా? ఆత్మఫలం ఫలిస్తే పరలోకం! శారీరకఫలము ఫలిస్తే నరకం!!!

 

కొంతమంది గంభీరమైన సాక్ష్యం చెబుతారు. చాలామంది ఆ సాక్ష్యంద్వారా రక్షణకూడా పొందుతారు గాని వారి ఇంటిప్రక్కన ఉన్నవారు మాత్రం మారరు! కారణం ఆ వ్యక్తికి తనసొంత గ్రామంలో/ గృహంలో సరియైన సాక్ష్యం లేనందువల్ల! నీకు మంచిసాక్ష్యం ఉంటే నీప్రవర్తనయే ఒక కరపత్రికగా మారి అనేకులను క్రీస్తు వద్దకు నడిపిస్తుంది! మరికొంతమందికి సువార్త చెబితే ఏమనుకుంటారో అని భయం! అందుకే యోబుగారు  31: 34లో

మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును అంటున్నారు! కాబట్టి ఏం ఫలములు ఫలిస్తున్నావు? అసలు ఫలాలే ఫలించడం లేదా? గొడ్డుబ్రతుకు జీవిస్తున్నావా? ఇంతవరకు ఒక్క ఆత్మను కూడా రక్షించాలేదా? ఫలించని ప్రతీతీగెను నరికి అగ్నిలో వేస్తాను అంటున్నారు దేవుడు! ఇదిగో చేట్టువేరున గొడ్డలి ఉంచబడింది అని మరచిపోకు!! లూకా 3:9

 

  ఇక వ్యాపించుట కోసం ధ్యానం చేద్దాం! ఎప్పుడైతే నీవు ఫలిస్తావో, నీద్వారా సువార్త వ్యాపిస్తుంది! ఈసువార్తవ్యాప్తిని ఎవడూ అడ్డుకోలేడు!!! ఎందరెందరో చక్రవర్తులు, గొప్పవారు, నియంతలు, అధికారులు దీనిని ఆపాలని చూసినా వారిచేతకాలేదు!! వస్తున్న ఉప్పెనను ఎవడూ అడ్డుకోలేడు- అలాగే సువార్తశక్తిముందు ఏ శక్తి పనిచేయలేదు! నీరోలాంటి గొప్పగొప్ప వారు ప్రయతించి ఓడిపోయారు! ఈ సువార్తను / నిజసువార్తను ప్రకటిస్తున్న కొన్ని కోట్లమందిని చంపారు కాని నేటికీ క్రైస్తవ్యం పెరుగుతుంది గాని తగ్గడం లేదు!  దాని శక్తి అలాంటిది! ప్రస్తుతకాలంలో సువార్తకోసం ప్రజలు ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవిస్తున్నారు అనేకదేశాలలో! ఆఫ్రికా ఖండంలో క్రైస్తవులను సజీవదహనం చేస్తున్నారు. తల్లిని పిల్లలని సామూహికంగా రేప్ చేస్తున్నారు! భయంకరంగా హింసిస్తున్నారు! ముస్లిం దేశాలలో క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు గాని సువార్త ఆగడం లేదు! మన ప్రక్కనున్న చైనాలో హింస పెరిగేకొలదీ క్రైస్తవ్యం లావాలా ప్రవహిస్తుంది! పాకిస్తాన్ లో దావాణంలా వ్యాపిస్తుంది! ఇక మనదేశంలో హింస పెరుగుతుంది గాని క్రైస్తవ్యం నెమ్మది నెమ్మదిగా వ్యాపిస్తుంది!!

 

    ఇక్కడ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకొంటున్నాను. అవి నా ఉద్దేశ్యాలు మాత్రమే! మనదేశంలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందకపోవడానికి కారణం శ్రమలు-హింసలు లేకపోవడమే! ప్రజాస్వామ్యమే! WHERE THERE IS PERSICUTION , THERE IS BIG ERUPTION OF EVANGELISM/ GOSPEL! ఎక్కడైతే శ్రమలు- హింసలు ఉంటాయో అక్కడ సువార్త ప్రవాహం లావాలా వ్యాపిస్తుంది! దానికి అనేక దేశాల చరిత్రే సాక్ష్యం చెబుతుంది.

1960’s లో ఒకసారి అనేకపార్టీల వారు కలసి వచ్చి- బ్రిటిష్ వారు మనదేశం నుండి వెళ్ళిపోయినా క్రైస్తవ్యం మాత్రం ఉంది. క్రైస్తవులను మనదేశం నుండి వెలివేయాలి, దానికి శాసనం చెయ్యండి అన్నారు! అందుకు నెహ్రూ గారి సమాధానం: “క్రైస్తవ్యం నిద్రించుచున్న సింహం- దానిని లేపకూడదు! లేపితే మనకే ప్రమాదం”. ఆ విషయం తెలిసిన నెహ్రూగారు క్రైస్తవ్యాన్ని జోకోట్టారు! ఈ విషయం గ్రహించలేక ప్రస్తుతం మోడిగారు వచ్చాక దానిని హింసల ద్వారా లేపుతున్నారు! లేపనీయండి! లేచాక ఈ సువార్త సింహం విశ్వరూపం చూపిస్తుంది! ఎలా: ఒక్కో క్రైస్తవుని రక్తపుబొట్టు వెయ్యిమందిని లేపగల సత్తా ఉంది! దానికి చరిత్రే సాక్ష్యం! ఆదిమసంఘం తమ రక్తాన్ని, ప్రాణాన్ని ప్రభువుకై పెట్టారు కాబట్టి ఈ దివ్యసువార్త మనవరకు వ్యాపించింది! *అలాకాకుండా నేడు మనదేశంలో చేస్తున్నట్లు హింసకు వ్యతిరేఖంగా పోరాటం, ధర్నాలు, కోర్టులు, christian ఫోరం లు పెట్టడం చేస్తే మనం రక్షించబడి ఉండేవారము కాదు! వారు హింసకు ప్రతిగా ప్రేమను చూపించారు గాని పోలిస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ హక్కులకోసం తిరగలేదు*!

 

   నేను ఇలా వ్రాయడం చాలామందికి అభ్యంతరంగా ఉండొచ్చు గాని బైబిల్ లో, ఇంకా యేసుప్రభులవారు : వారు మిమ్మల్ని ఒక దగ్గర హింసిస్తే మరో ప్రాంతం పారిపొమ్మని చెప్పారు కాని నిరశన వ్యక్తపరచి, కోర్టులను ఆశ్రయించడం చేయమని చెప్పలేదు, ఇది బైబిల్ కి వ్యతిరేఖమైనది! యేసుప్రభులవారు, ఇంకా అపోస్తలులు క్లియర్ గా చెప్పారుక్రైస్తవులకు శ్రమలు విస్తరిస్తాయి అని. క్రైస్తవులు శ్రమలు గుండా నడవాల్సిందే! మత్తయి 10: 22,23

మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.

వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 24:9;  లూకా 21.

  అసలు యేసుప్రభులవారే శ్రమలు పొందినప్పుడు, చివరకు మరణశిక్షను భరించినప్పుడు- నీవు నేను పొందితే గొప్ప విచిత్రమేమి కాదు. నీవు యేసయ్యకంటే గొప్పవాడవేమి కాదు! ఒకవేళ ఏ క్రైస్తవుడైనా శ్రమలు పొందటం లేదు అంటే వాడు నామకార్ధ క్రైస్తవుడని, నిజ క్రైస్తవుడు కాదని అర్ధం!

 

   అయితే ఇక్కడ అందరినీ విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు! ఆ అధికారం నాకులేదు! నా ఉద్దేశ్యం మాత్రం నేను చెప్పాను! దేవుడు ఒక్కో రాయిని ఒకో రకంగా చెక్కుతారు అలాగే దేవుడు కొంతమందిని కొన్ని ప్రత్యేకమైన పనులకోసం ఉపయోగించుకొంటారు! ఈరోజుల్లో దేవుడు కొంతమందిని youtube, social media లో క్రైస్తవ్యంపై బురద చల్లే వారికి బుద్ధి చెప్పడానికి వాడుకుంటున్నారు! మరికొంతమందిని మరో రకంగా వాడుకుంటున్నారు! *ఏదీఏమైనా ఈ దేశాన్ని ప్రేమతోనే ప్రభువుకోసం గెలవగలం గాని, కోర్టుల రక్షణ ద్వారా, హక్కులద్వారా ఎంతమాత్రమూ గెలవలేమని మాత్రం చెప్పదలచు కున్నాను*.

శ్రమలద్వారా మరో విషయం తేటతెల్లం అవుతుంది. నిజక్రైస్తవులు ఎవరో- చెత్త ఎవరో తేలిపోతుంది! యేసయ్యకు షడ్రక్, మేషాక్, అబెద్నేగో లాంటి వారు కావాలి. చావడానికైనా సిద్దమైనవారు కావాలి గాని చెత్త అవసరం లేదు!!!

 

 నేడు మన భారతదేశంలో శ్రమలు ఎక్కువౌతున్నాయి. IT’S A GOOD SIGN TO PROPAGATE CHRIST’S GOSPEL IN THIS SITUATION! యేసయ్య మనకోసం తన యవ్వన, పవిత్రమైన రక్తం చిందించి చనిపోయారు కదా, మనం కూడా యేసయ్య కోసం శ్రమలు పొందడం, చనిపోవడం భావ్యమే కదా!

 

నా ప్రాణాన్ని, రక్తాన్ని దేవునికోసం  చిందించటానికి నేను సిద్ధంగా ఉన్నాను! నీవు సిద్ధమా?

అప్పుడే మనం యేసయ్యకోసం మనదేశాన్ని గెలవగలం!

నేను రడీ! నీవు రడీనా?

యేసయ్యకోసం సాక్షిగా, సిలువ సాక్షిగా, అవసరమైతే హతస్సాక్షిగా జీవిద్దాం!

 

అట్టి సిద్దపాటు మనందరికీ దేవుడు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*100వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-41*

యెషయా 61:13        

1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!  ప్రస్తుతం సువార్తకోసం ధ్యానం చేస్తున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా! ఇక ఈరోజు సువార్త ఎవరు ప్రకటించాలి? అనేది చూసుకుందాం!

 

*సువార్త*

*ఎవరు ప్రకటించాలి*?

 

మత్తయి 28:19--20

19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

 

మార్కు 16:15 –16

15. మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

 

   ప్రియులారా! పైనుదహరించిన వచనాలు యేసుక్రీస్తు ప్రభులవారు ఇచ్చిన చివరి ఆజ్ఞ! మీరు సమస్త సృష్టికి సువార్త ప్రకటించుడి, వారిని శిష్యులుగా చేయుడి అని దేవుడు చెప్పారు. చాలామంది హైందవ సోదరులు మనలను అడుగుతూ ఉంటారు మేము ఎవరికీ మీలాగా మా దేవుడి కోసం చెప్పము, మీరైతే ఊర్లంట తిరుగుతూ సందుల్లో, వీదులలో  ఎందుకు ఇలా ప్రకటిస్తున్నారు అని: దానికి సమాధానమే ఈ రెండు వచనాలు. యేసయ్య ఇచ్చిన చివరి ఆజ్ఞ కాబట్టి మనం అందరికీ సువార్త ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా ఇది రక్షించబడిన ప్రతీ విశ్వాసి చేయవలసిన విధి! అదంతే! మనలాగా వారుకూడా యేసుప్రభులవారిని నమ్ముకోవాలి! ఎందుకంటే అలా నమ్ముకోకపొతే వారంతా ఆరని అగ్నిలో యుగయుగాలు మండవలసి వస్తుంది. వారిని ఈ అగ్నిగుండము లేదా నరకము నుండి తప్పించగలవారు యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే! కారణం ఈ లోకంలో మానవుల పాపంకోసం తనప్రాణాన్నే అర్పించి, తన రక్తాన్ని చిందించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే! అంతేకాకుండా మరణాన్ని జయించినది, తిరిగి రాబోయేది కూడా యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే! కాబట్టి ఈ రక్షణ సువార్తను ఇంటింటా ప్రకటించ వలసిన భాద్యత ప్రతీ ఒక్కరిమీద ఉంది. 

 

   అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: *సువార్త ఎవరు ప్రకటించాలి*? కేవలం సువార్తికులేనా? లేక విశ్వాసులు, రక్షించబడిన వారందరూ ప్రకటించాలా? సమాధానం రక్షించబడిన ప్రతీ విశ్వాసి ప్రకటించాలి!! దానికి ప్రూఫ్ ఏమిటి?

 

   మొదటగా సువార్త అన్నింటిలో మనం కొన్నివిషయాలు కామన్ గా చూడగలం! అదేమిటంటే యేసయ్య మొదటగా 12మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని అపోస్తలులుగా అభిషేకించి, వారికి సువార్త ప్రకటించమని పంపుతారు. ఆ తర్వాత డెబ్బదిమందిని పంపుతారు. ఇలా చెప్పాక మీద చెప్పిన వచనాల ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. ఇక్కడ మీరు అనగా ఎవరు? సువార్తలలో 12 మంది శిష్యులు అని ఉంది. మత్తయి, మార్కులలో! అయితే అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం ప్రకారం వీరు కేవలం అపోస్తలులు మాత్రమే కాదు, ఒకసారి 1:1315 చూద్దాం

13. *వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే (మతాభిమానియను) అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు (లేక, సహోదరుడగు) యూదా అనువారు*.

14. *వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి*.

15. *ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను*

 

  . . . ఈ వచనాల ప్రకారం అక్కడున్న వారందరికీ యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఇది! ఈ రోజులలో కొందరు అతితెలివిగలవారు ఈ ఆజ్ఞ కేవలం అపోస్తలులుకి మాత్రమే ఇచ్చారు అని ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అపోస్తలులు, ఇంకా శిష్యులు, ఆయనతో పాటు మూడన్నర ఏళ్ళు ఉండిన స్త్రీలు, ఇంకా యేసయ్య తల్లియైన మరియ అందరూ ఉన్నారు. వీరు 120 మంది.  కాబట్టి ఇక్కడ  మీరు అనగా అర్ధం రక్షించబడిన ప్రతీవిశ్వాసి అనిఅర్ధం! బైబిల్ లో ఏదైనా రాసి ఉంటే దానికి సపోర్టింగ్ వచనాలు ఇంకా ఉంటాయి. అప్పుడే అది సరియైన అర్ధం వస్తుంది. మనం అపోస్తలులకార్యములు ఇంకా ముందుకు చదువుకుంటూ పొతే 4వ అధ్యాయంలో వారు (పెద్దలు, యాజకులు, పరిసయ్యులు)  పేతురు యోహానులను  బంధించి యేసునామమున బోధించకూడదు అని ఆజ్ఞాపించిన తర్వాత వారి వివరణ ఉంటుంది. ఆ తర్వాత 4:31 చూసుకుంటే . .

31. వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; *అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి*.

32. *విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి*. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.  .  

 

ఇక్కడ వారు అనగా కేవలం అపోస్తలులు మాత్రమే కాదు 120 మంది, మొదటగా రక్షించబడిన ౩౦౦౦ మంది తర్వాత రక్షించబడినవారు మొత్తం అందరూ పరిశుద్దాత్మను పొందుకుని, అందరూ దేవునివాక్యమును బోధించారు. బైబిల్ లో ఎక్కడా కేవలం సేవకులు లేక సేవకు పిలువబడిన వారు మాత్రమే సువార్త ప్రకటించాలి అని ఎక్కడా వ్రాయబడలేదు. ఇంకా ఇదే అపోస్తలులు కార్యములు 8వ అధ్యాయంలో కూడా ఇదే వ్రాయబడింది 8:1,4

1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

4. *కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి*. ....

ఇక్కడ చెదిరిపోయిన వారు ఎవరు? అపోస్తలులు కాదు. విశ్వాసులు, రక్షించబడి క్రీస్తుకోసం హింసపొందుతున్న వారు. వారు చెదిరిపోయి భయపడి ఉండలేదు. ఎక్కడికైతే చెదిరిపోయారో అక్కడ బలమైన సాక్షులుగా నిలబడ్డారు. వేలమంది అక్కడే చివరికి హతస్సాక్షులుగా మారారు సువార్త కోసం! కాబట్టి సువార్త అనేది కేవలం సేవకులు, పాష్టర్లు మాత్రమే ప్రకటించాలి అని ఎవరైనా అంటే అది సత్యదూరమైన మాటలు! అవి అబద్దబోధలు!

 

     కేవలం సువార్తికులు, సేవకులు, సేవకు పిలువబడిన మాత్రమే సువార్తను ప్రకటించాలి అని అబద్ద ప్రచారం చేస్తున్న పనికిమాలిన వారందరికీ సవాల్ ఏమిటంటే: కేవలం అభిషేకం పొందినవారు, లేక సువార్తకోసం పిలువబడిన వారు మాత్రమే సువార్త ప్రకటించాలి అని బైబిల్ లో ఎక్కడైనా ఉందా? ఉంటే దానికి రిఫరెన్స్ చూపండి. దేవుని వాక్యాన్ని కలిపిచెరిపితే నిత్యనాశనానికి పోతారు ఖబడ్దార్!!! ప్రకటన 22 వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు: ఈ గ్రంధంలో ఉన్నవాటికి ఏమీ కలుపకూడదు! తీసివేయకూడదు. అలాచేస్తే ఏమవుతుందో చాలా స్పష్టముగా వ్రాయబడింది . .Revelation(ప్రకటన గ్రంథము) 22:18,19

18. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.  . . కాబట్టి జాగ్రత్త! దేవుని ఉగ్రతను తప్పించుకోలేవు! వారి ఉగ్రత కునికి నిద్రించదు అని వ్రాయబడింది! ఉగ్రతను తప్పించుకోవాలి అంటే ఈ తప్పుడుబోధలకోసం దేవుని దగ్గర ప్రజల దగ్గర క్షమాపణ వేడుకుని యేసయ్య పాదాలు పట్టుకోండి! కారణం మీరు : అపొస్తలుల కార్యములు 8:23 నీవు ఘోర దుష్టత్వములోను( మూలభాషలో- చేదైన పైత్యములోను) దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.  .

 

   చూడండి సువార్తను ఎవరు ప్రకటించారో, ఎక్కడ ప్రకటించారో చూసుకుందాం! బైబిల్ గ్రంధం మొత్తం చదివితే అనేకమంది ప్రవక్తలు, భక్తులు సువార్త ప్రకటించారు. యేసయ్య సువార్త చెబుతూ ఉదాహరిస్తున్నారు: నోవాహు గారు 12౦ సంవత్సరాలు సువార్త ప్రకటించారు. గాని వారు వినలేదు! సమూయేలు గారు, ఏలీయాగారు, ఎలీషా గారు ఒక్కదగ్గరే ఉండకుండా దేశమంతా సంచరిస్తూ సువార్త చేస్తూ వారిని సరిచేసినట్లు మనం చూడగలం! యెషయా లో మొదటగా దేవుడు సువార్త ప్రకటించమని చెబుతున్నారు 40:9

*సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము*.

 

 ఇంకా 52:7

సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

 

ఇదేమాట నహూముగారు నిర్ధారిస్తున్నారు 1:15

సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.

 

    సిరియా దేశానికి చెరగొనిపోయిన ఒక చిన్నది సువార్తను ప్రకటించి నయమాను కుష్ఠురోగం బాగయ్యేలా చేసింది. ఒక చిన్న ఆడపిల్ల సువార్తను ప్రకటించింది. 2రాజులు 5; 

ఇంకా సువార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. కీర్తనలు 68:11

 చూడండి కేవలం సేవకులే కాదు! స్త్రీలు సువార్తను ప్రకటిస్తున్నారు, వారంతా గొప్పసైన్యముగా ఉన్నారు. కాబట్టి రక్షించబడిన ప్రతీ స్త్రీ కూడా సువార్తను ప్రకటించాలి. స్త్రీలు మౌనముగా ఉండాలి అనేవారికి కూడా ఇదే జవాబు! ఆ కాలంలోనే సువార్తను స్త్రీలు ప్రకటించారు. కొరింథీ సంఘ పరిస్తితులను బట్టి పౌలుగారు ఆ మాట అనాల్సివచ్చింది. మరి అదే కొరింథీ పట్టాణానికి 18 కి.మీ దూరంలో ఉన్న కేంక్రేయ సంఘానికి ఒక స్త్రీని (ఫెబే) ఎందుకు డీకన్ గా పెడతారు పౌలుగారు? ఆ కాలంలో డీకన్లే సంఘాన్ని నడిపించేవారు. కాబట్టి స్త్రీలు సువార్తను ప్రకటించవచ్చు!

 

ఇంకా క్రొత్త నిభందన సమయానికి మొదటగా దూతలు సువార్తను ప్రకటించారు గొల్లలకు!  కాబట్టి దూతలు కూడా సువార్తను ప్రకటించారు. ఇంకా ఆ సువార్తను విన్న గొల్లలు కూడా విని ఊరుకోకుండా వారు కూడా బాలయేసుని చూచిన వెంటనే మేము రక్షకుని చూసాం అంటూ సువార్తను ప్రకటించారు. గొల్లలు ఏమీ చదువు సంధ్యలు లేనివారు. కాబట్టి నీకు చదువు ఉన్నా, లేకపోయినా సరే నీవుకూడా సువార్తను ప్రకటించాలి. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాదు, చదువు లేకపోయినా సువార్తను ప్రకటించాలి. కాబట్టి కారెవరూ సువార్త ప్రకటనకు అనర్హులు! అందరూ అర్హులే! అందుకే మీరు సమస్త సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమంటున్నారు దేవుడు!

 

   మిమ్మల్ని ఇక ప్రశ్న అడగనీయండి! ఇప్పుడు గొర్రెలు/ మేకలు / పశువులు పిల్లలను కంటాయా లేకా కాపరి కంటాడా? గొర్రెలు/ మేకలు/ పశువులే కదా! కాపరి పని మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్లి మంచి ఆహారాన్ని, కడుపునిండా నీటిని పెట్టడమే! అలాగే ఒక సంఘకాపరి/ సేవకుడు పని నీకు సరిపడే ఆత్మీయాహారాన్ని నీకు పెట్టి, నిన్ను బలపరచడమే! గాని నీవు వాటిని తిని పిల్లలను పెట్టాల్సిన పని నీదే! అనగా సువార్తను, వాక్యమును విన్న నీవు నీ ఇరుగుపొరుగు వారికి, బంధువులకు స్నేహితులకు సువార్తను ప్రకటించి వారిని ప్రభువు దగ్గరకు నడిపించాల్సిన భాద్యత నీదే కదా!!

 

    పౌలుగారి ఆవేదనను ఒకసారి గుర్తుకు చేసుకుందాం.  రోమా 10:1315 .

13. ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.

14. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?

15. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది . . . 

   

    చూశారా కాబట్టి సువార్తను అందరూ ప్రకటించాలి. కనుక ఇలాంటి తప్పుడు బోధలను ఆపేద్దాం! సంఘాన్ని పాడుచేయవద్దు! *కూసే గాడిద మేసే గాడిదను చెరిపినట్లు, మీరు సువార్తను ప్రకటించరు, ప్రకటించేవారిని ప్రకటించనియ్యరు*. జాగ్రత్త! దేవుని ఉగ్రత రాగలదు! ఇశ్రాయేలు రాజుల కాలంలో అనేకమంది అబద్ద ప్రవక్తలు దేవుడు చెప్పకపోయినా ఇదే యెహోవా వాక్కు అంటూ ప్రకటిస్తూ ప్రజలను మోసగిస్తూ ఇశ్రాయేలు దేశం యొక్క పతనానికి కారణమయ్యారు. యిర్మియా 23, 25 అధ్యాయాలు.  అందుకే దేవుడు మొట్టమొదట తీర్పు వారిమీదనే ఇచ్చారు.  మీరు కూడా అలాంటి తీర్పు పొందకూడదు అంటే ఇలాంటి తప్పుడు బోధలను విడచిపెట్టమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. 

 

  నీ పొరుగువారు సువార్తను వినకుండా నాశనానికి జోగుపడుతుండగా నీవు తాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? వారికి ప్రకటించకుండా నీవు హాయిగా టీవీల్లో సీరియల్లు చూస్తూ కూర్చుంటున్నావే ! వారి ఆత్మల రక్షణభారం నీమీదన ఉంది అని మరచిపోతున్నావా? ఒకవేళ వారు నరకానికి పోతే ఆ ఆత్మ కోసం దేవుడు నిన్ను లెక్క అడగరా ప్రియ విశ్వాసి!  నీ కొలీగ్ కు ఎప్పుడైనా దేవుని ప్రేమ కోసం చెప్పావా? నీ ఇరుగుపొరుగు వారికి, నీ బంధువులకు దేవుని ప్రేమకోసం ఆయన అధ్బుత శక్తికోసం, ఆయన మరల రాబోతున్నారని, ఆయన జనన మరణ పునరుత్థానముల గురుంచి ఎప్పుడైనా చెప్పావా? లేకపోతే జాగ్రత్త! దేవుడు వారికోసం నిన్ను లెక్క అడుగుతారు! అప్పుడు నీవు ఏమని సమాధానం చెబుతావు? కాబట్టి నేడే నీ తప్పును తెలుసుకొని, తప్పును ఒప్పుకుని, దేవునితో సమాధాన పడి, ఆయన సువార్తను ప్రకటించడం నేడైనా ప్రారంభించు!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*101వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-42*

యెషయా 61:13        

1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము!  ప్రస్తుతం సువార్తకోసం ధ్యానం చేస్తున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక ఈరోజు సువార్త ఎప్పుడు ఎక్కడ ఎలా  ప్రకటించాలి? అనేది చూసుకుందాం!

 

*సువార్త*

*ఎప్పుడు, ఎక్కడ, ఎలా  ప్రకటించాలి*?

 

   ప్రియులారా! గతభాగంలో సువార్త ఎవరు ప్రకటించాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం! రక్షించబడిన ప్రతీవిశ్వాసి సువార్తను ప్రకటించాలి!  ఈరోజు సువార్త ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రకటించాలి అనేదానిని ధ్యానం చేద్దాం!

 

*ఎప్పుడు ప్రకటించాలి*?

సమయమందును, ఆసమయమందును ప్రకటించాలి!!! 2తిమోతి 4:2

వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.

 

 .. .   ఈమాటలు పౌలుగారు తన చనిపోయే ముందు తిమోతి గారికి చార్జి అప్పగిస్తూ చెబుతున్న మాటలు! వాక్యమును ప్రకటించుము! ఎప్పుడు? సమయమందును, అసమయమందును ప్రకటిస్తూ, ప్రయాస పడుము,

 

*ఎలా*?  సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి సరే దీనికోసం తర్వాత ధ్యానం చేద్దాం!

 

*ఎక్కడ ప్రకటించాలి*? ఇక్కడా అక్కడా అని కాదు! ఎక్కడ ప్రజలుంటారో అక్కడ! సరే, ఈ విషయంలో ఇద్దరి వ్యక్తుల కోసం మీకు చెప్పాలని ఉంది.

 

జార్జి విట్ఫీల్డ్ అనే దైవజనుడికి సువార్త ప్రకటన భారం ఎక్కువ! మంచి వక్త! అయితే ఆ కాలంలో సువార్త ప్రకటనకు గాని, వాక్య ప్రకటనకు గాని అక్కడ ఆ ఏరియా బిషప్ ల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈయనకు తొందరగా పర్మిషన్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా బోధించేవారు. అంతేకాకుండా మరికొన్ని సంఘాలకు ఎవరూ వస్తుండేవారు కాదు. ఎవరో కొందరు ముసలివాళ్ళు, ధనవంతులు మాత్రమే వచ్చేవారు కానీ సామాన్య ప్రజానీకం, మాస్ వచ్చేవారు కాదు. వారు వీధులలో, బ్రాందీ షాపుల్లో ఎప్పుడూ ఉండేవారు. వారికి సువార్త ప్రకటించాలి అని ఉండేది గాని ఆరోజులలో దేవునిమందిరంలో తప్ప బయట సువార్త ప్రకటన నిషేధం! అంతేకాదు ఆరాధన క్రమంలో ఉన్న ప్రార్ధన తప్పా మరో ప్రార్ధన చేయడం నేరం! అంతేకాదు కేవలం దేవుని మందిరంలో తప్ప బయట లేక మరే ప్రాంతంలోనూ వాక్యం చదవడం కూడా నేరం! ఇలాంటి పరిస్తితులలో ఈ మాస్ ప్రజలు, సామాన్య ప్రజలు ఎప్పుడూ గుడిలోకి వస్తుండేవారు కాదు. మరి వీరికి సువార్త సత్యం ఎలా ప్రకటించాలి? ఇదే పెద్ద సమస్య  ఈ భక్తునికి! ఒకరోజు ఏమైతే అదే అయ్యింది అని లండన్ బొగ్గు గనుల కార్మికులకు ఒకసారి, బ్రిస్టల్ కార్మికులకు వీధిలో ఒక బెంచిమీద నిలబడి సువార్త ప్రకటించగా అనేకమంది మారుమనస్సు పొంది రక్షణ పొందారు. ఈ విషయం తెలుసుకొన్న ఈ బిషప్ లు, డయాస్ లు జార్జి గారిని వెలివేశారు.  మొదట భాదపడినా వీరు దేవున్నే వెలివేశారు గుడిలోకి రాకుండా నన్ను వెలివేయడం ఆశ్చర్యం లేదు అని ఇక వీదులలోనే సువార్త ప్రకటించడం, సామాన్యుల మద్య దండయాత్ర, వీది సభలు ప్రారంభించారు. అదే సువార్తకు అనగా వీదులలో సువార్తకు నాంది. అప్పటినుండి చనిపోయే వరకు సువార్త ప్రకటిసూనే ఉన్నారు. తుప్పుపట్టడం కన్నా అరిగిపోవడమే మేలు అనే నినాదంతో సువార్త చేసిచేసి, చివరకు -40°ల చలిలో కూడా వాక్యం చెబుతూ రక్తం కక్కుకుని చనిపోయారు ఆయన! చర్చిలలో సువార్తను ప్రకటించారు, వీధులలో, బడులలో, ఎక్కడపడితే అక్కడ, అనేక దేశాలలో వారు వినినా వినకపోయినా సువార్త చెబుతూ చనిపోయారు.

 

   ఇంకా ఇలాంటి వారు ఎందఱో ఉన్నారు గాని నాకు బాగా తెలిసిన వ్యక్తి నేను దగ్గరనుండి గమనించిన వ్యక్తి, నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి  మా తండ్రిగారు పాష్టర్. లూకాగారు. ఈ మధ్యనే దేవుని పిలుపును అందుకున్నారు. ఆయన మంచం మీద ఉన్నప్పుడు తప్ప, బాగా నడిచేటప్పుడు రోజుకి కనీసం 20 మందికైనా సువార్త ప్రకటించకుండా ఎప్పుడూ ఉండలేదు. నా చిన్నప్పుడు మా నాన్నగారితో బస్సులో, ట్రైన్లో వెళ్తుంటే నాకు చాలా సిగ్గు అనిపించేది. కారణం నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడ గందరగోళంగా ఉండేది కారణం ఎప్పుడూ నెమ్మదిగా ఉండేవారు కాదు. సువార్త చెబుతూ ఉండేవారు. అది బస్ అయినా, ట్రైన్ అయినా, వీధి అయినా ఎక్కడైనా సరే! ఒకటే మాట బస్ లో వెళ్ళేటప్పుడు బాబు / అమ్మా! మా ఊరు వస్తావా? వారు అడిగేవారు వస్తాను బాబు, ఇంతకీ మీ ఊరు ఏమిటి? నాన్నగారు చెప్పేవారు మీరు మా ఊరు రాలేరు. రావాలంటే టికెట్టు కావాలి! ఆ టికెట్టు రక్షణ! మా ఊరు పరలోకం అంటూ సువార్త ప్రారంభించేవారు. ఎప్పుడూ ఇదే, నాన్నగారు చనిపోయేవరకు! నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాన్నగారికి పిచ్చి అని! ఆ తర్వాత రక్షించబడిన తర్వాత తెలిసింది అది పిచ్చికాదు భాద్యత! సువార్త భారము అని! తను చనిపోయే వరకు నాన్నగారు తన భాద్యత నిర్వర్తించారు. కాలినడకను, ఒకేఒక టీ త్రాగి  సైకిల్ మీద రోజుకి 40 గ్రామాలు తిరుగుతూ సేవ చేశారు. నాన్నగారు ఎక్కడెక్కడ సేవ చేశారో ఈరోజు అదే గ్రామాలలో కనీసం ఒక చర్చి ఉంది. ఈరోజు నాన్నగారు సేవచేసిన గ్రామాలలో చర్చిలేని గ్రామం లేదు! అయితే అప్పుడు నాన్నగారు రాళ్ళదెబ్బలు, అరెస్టులు, చీవాట్లు, కర్ర దెబ్బలు తిన్నారు. ఇప్పుడు సేవచేస్తున్న వారు ఆ ఫలాలు అందుకుంటున్నారు. రాళ్ళదెబ్బలు లేవు. నాన్నగారితో వెళ్లి అనేకసార్లు నేనుకూడా రాళ్ళదెబ్బలు తిన్నాను, ఊరిలోనుండి ఈడ్వబడ్డాను. అవమానాలు, తిట్లు, ఉమ్మివేయించుకోవడం జరిగింది. అప్పుడు నాకు అవమానంగా అనిపించేది గాని ఇప్పుడు ఒకసారి వెనుతిరిగి ఆలోచిస్తే నేను ఎంతగొప్ప భాగ్యంలో పాలుపొందుకున్నానో ఆలోచిస్తుంటే నా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. 

   ఇప్పుడు నేను షిప్ లలో ఉద్యోగం చేస్తున్నాను. అయితే షిప్ లో ఎంతోమంది, ఎన్నో దేశాలవారు, ఎన్నో మతాలూ వారు ఉంటారు కాబట్టి ఇలాంటి మతప్రచారం నేరం! చెప్పకూడదు! కాబట్టి నేను ప్రార్దిస్తూ ఉంటాను ప్రభువా! వీరికి సువార్తను ప్రకటించే అవకాశం ఇవ్వు! కాబట్టి ఒక్కో షిప్ లో కనీసం ఇద్దరు ముగ్గురుకైనా నాకు యేసయ్య ప్రేమను తెలిపే అవకాశం వస్తుంది. ఎలాగంటే నేను సువార్త చెబితే తప్పు గాని వారికి వారే అడిగితే చెప్పినప్పుడు తప్పులేదు! నేను షిప్లో గాని, ఎక్కడా గాని ఎప్పుడూ త్రాగుడు తాగను, సిగరెట్లు త్రాగను, అబద్దాలు చెప్పడం, సినిమాలు చూడటం లాంటివి వారు ఎప్పుడూ చూడరు. చివరికి నేను కాఫీ, టీ, పాలు కూడా త్రాగను. నేను పెద్ద ఆఫీసర్ ని అయినా చిన్నకేడర్ వాళ్ళను  గౌరవించి మాట్లాడుతూ ఎవరిని నీవు అనను, మీరు అంటాను.  ఇలాంటి పరిస్తితులలో అడుగుతుంటారు ఏమండి మీ క్రైస్తవులు మందు తాగుతారు కదా, మిగత వారిలా మీరెందుకు ఉండడం లేదు. వారి దృష్టిలో క్రైస్తవులు అంటే RCM వారు. అప్పుడు బైబిలో కోసం చెబుతూ ఉంటాను. చివరకు వారు ఒంటరిగా ఉన్నప్పుడు, నేను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమంది మీ యేసుక్రీస్తు కోసం చెప్పండి అని అడిగారు. అప్పుడు వారికి ప్రార్ధించి, భారంతో సువార్త చెప్పడం జరిగింది. షిప్పుల్లో చెప్పాను, అనేక ముస్లిం దేశాలలో, ఆఫ్రికా ఖండంలో, యూరోప్ ఖండంలో మా షిప్ వెళ్ళిన అనేక చోట్ల దేవునిప్రేమ కోసం చెప్పడం జరిగింది. ఈ విషయం నాకు మాదిరి దైవజనురాలు అమ్మ మదర్ థెరిసా గారు. ఆమె తన మంచి ప్రవర్తనతో వేలమందిని ప్రభువు లోకి నడిపించారు. మనం కూడా మన మంచి ప్రవర్తన ద్వారా అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించగలము. మన మంచి ప్రవర్తనే ఒక క్రీస్తు కరపత్రికగా మారిపోవాలి. అదే అనేకమందిని ప్రభువు దగ్గరకు తీసుకుని రాగలదు!

 

  కాబట్టి ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే: సమయమైనా, అసమయమైనా, అది వీధి అయినా సరే, ఎక్కడైనా అవకాశం ఉన్న లేకున్నా ఎప్పుడైనా సువార్తను ప్రకటించాలి.

 

*ఎక్కడ ప్రకటించాలి* అనేదానికి ఒకమాట చెబుతాను. ఎక్కడైనా ప్రకటించాలి అని హైందవ దేవాలయంలో గాని, దాని దగ్గర గాని ప్రకటించకూడదు. కారణం మనదేశంలో అది నిషేధం. గుడికి 100 మీటర్ల దగ్గరలో ఇలాంటి మత ప్రచారాలు చేయకూడదు అనే శాసనం ఉంది కాబట్టి దానిని మనం గౌరవించాలి. వారి గుడి దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటిస్తే వారికి కోపం రాదా? దేవుడు మనకు కనీస బుద్ధి అనేది ఇచ్చారు కదా, దానిని వాడాలి కదా! రెండు సంవత్సరాల క్రితం ఇలాంటి అత్యుత్సాహంతో ఒక సేవకుడు తిరుపతి లో వారి దేవాలయం దగ్గరలో సువార్త చెప్పి తను ఇబ్బందుల పాలయ్యాడు, అనేకులను ఇబ్బందులు పాలుచేశాడు. కాబట్టి ఇలాంటివి చేయకూడదు!

 

  ఇక *ఎలా ప్రకటించాలి*? అంటే మీద చూసుకున్నాం! సంపూర్ణ దీర్ఘశాంతంతో! ఎందుకు దీర్ఘశాంతం? కారణం సువార్తకు ఎక్కడైనా అడ్డంకులే కలుగుతాయి. రికార్డింగ్ డాన్స్ కి గాని, వ్యభిచార సంభంధమైన వాటికి ఆటంకాలు ఉండవు గాని సువార్తకు తప్పకుండా ఆటంకాలు కలుగుతాయి కాబట్టి ఓర్చుకుంటూ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో సువార్తను ప్రకటించాలి. ఇదే సమయంలో మనం యేసుప్రభులవారిని, పౌలుగారిని గుర్తుకు తెచ్చుకుని సువార్త చేయాలి. కారణం యేసయ్య గాని, పౌలుగారు గాని ఎప్పుడూ ఇతర మతస్తులను దూషించలేదు! నేడు మన క్రైస్తవ్యానికి ఇంతగా మన దేశంలో ఆటంకం కలగడానికి సగం కారణం మన క్రైస్తవులే! వారి దేవుడు రాయి అని, కర్ర అని, ఇలా వారికి అవమానం కలిగేలా బోధిస్తున్నారు. ఇలా భోదిస్తే రక్షించబడిన వారు నూటికి ఇద్దరు ఉంటారేమే! గాని కేవలం యేసయ్య ప్రేమ కోసం జనన మరణ పునరుత్థానంకోసం, దేవుడు మన బ్రతుకులలో చేసిన మేలులు సాక్ష్యం రూపములో చెబితే విని రక్షించ బడిన వారు నూటికి 50 మంది ఉంటారు. కారణం వంద ప్రసంగాల కంటే ఒక రక్షించబడిన వ్యక్తియొక్క రక్షణసాక్ష్యం బలము గలది. అది వ్యక్తులను మార్చగలదు. ఈరోజు మారకపోయినా వారు ఒకరోజు, వారు కష్టాలలో ఉన్నప్పుడు ఈ సాక్ష్యం తప్పకుండా గుర్తుకు వస్తుంది. అదే పట్టుకుంటుంది. గాని నీవు గంటసేపు చెప్పిన పవర్ ఫుల్   వాక్యం వారికి గుర్తుకు ఉండదు గాని, 5 నిమిషాలు చెప్పిన చిన్న సాక్ష్యం తప్పకుండా ఒకరోజు గుర్తుకు వచ్చి మారతారు. కాబట్టి పరమత దూషణం లేకుండా సువార్తను ప్రకటించాలి. వారి దేవుడు రాయి అయితే నీకెందుకు? కర్ర అయితే నీకెందుకు? ఎంతమంది భార్యలు ఉంటే నీకెందుకు? వారి దేవుడ్ని విమర్శిస్తే వారికి ద్వేషం కోపం రాదా? కేవలం నీ దేవుని గొప్పతనం కోసం చెప్పుకో! ఎవడికి ఏమీ రాదు. *మన దేవుడు చేసిన అద్భుతాలు కోసం, ఆయనచేసిన బోధలు కోసం, రెండో రాకడకోసం, ఆయన నీ జీవితంలో చేసిన మేలులు కోసం చెప్పడానికి బోలెడుంది. వాటిని చెప్పండి*. మిగతా వాటిని వదిలెయ్యండి.

 

  కాబట్టి *సువార్తను ఎవరు ప్రకటించాలి*?

రక్షించబడిన ప్రతీవ్యక్తి!

 

*ఎప్పుడు ప్రకటించాలి*?

సమయమందును, అసమయమందును

ఎక్కడ ప్రకటించాలి?

ఎక్కడపడితే అక్కడ! కాదేది సువార్తకు అనర్హం!

 

*ఎలా ప్రకటించాలి*?

ప్రేమతో, దీర్ఘశాంతంతో, పరమత దూషణ లేకుండా, కేవలం యేసయ్య జనన మరణ పునరుత్థానం, రాకడ మరియు యేసయ్య నీ జీవితంలో చేసిన మేలులు మాత్రం చెప్పు!

 

*ఎందుకు చెప్పాలి*?

అది యేసయ్య ఇచ్చిన చివరి ఆజ్ఞ కాబట్టి ప్రతీ ఒక్కరు సువార్త ప్రకటించాల్సినదే!

 

కాబట్టి ప్రియ సహోదరీ! సహోదరుడా! నేడే సువార్తను చెప్పడం మొదలు పెట్టు!

సువార్త ప్రకటిస్తున్నావా?

దేవుడు నిన్ను ఆత్యధికంగా దీవించును గాక!

 

God Bless  You!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*102వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-43*

యెషయా 61:13        

1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 

 

            (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! ఇక  ఈ అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు, దీనులకు లేక పేదలకు సువర్తమానము ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి చెరలో ఉన్నవారికి విడుదల బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి యెహోవా నన్ను పంపించారు అంటున్నారు!

 

యెహోవా ఆత్మ నామీద ఉన్నాడు అనే దానిని గతభాగాలలో విస్తారంగా చూసుకున్నాము! దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారిని తన సేవకునిగా ఈ లోకములోనికి పంపించేముందుగా ఆయనను ఆత్మపూర్ణునిగా అభిషేకించినట్లు అవే దేవుని ఏడాత్మలు గా ధ్యానం చేశాము!

 

ఇక దీనులకు లేక పేదలకు సువర్తమానము ప్రకటించడానికి నన్ను పంపించారు: ఇది యేసుక్రీస్తుప్రభులవారి పరిచర్యలో దీనులకు పేదలకు నలిగిన వారిని ఆదరించడం అనేది ఆయన పరిచర్యలో ఒక భాగము! ఆయన ధనవంతుల వద్దకు పండితుల వద్దకు చదువు గలవారి యొద్దకు వెళ్ళకుండా పేదలవద్దకు రోగుల వద్దకు దీనుల యొద్దకు అందరితో వెలివేయ బడిన వారి యొద్దకు వెళ్లి దేవుని రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మారుమనస్సు పొంది మీ పాపములను వదిలేసి రక్షణపొందండి అంటూ సువార్త ప్రకటించారు.  కారణం పేదలు చదువులేని వారు అందరితో నిరాకరించబడి దూరంగా ఉన్నారు దేవుని రాజ్యమునకు! ఇక పాపులంతా పాపముచేసి పాపపు సంకెళ్ళతో సాతాను బంధకాలతో సాతాను చెరలో ఉన్నారు. అందుకే వీరిని విమోచించడానికి యేసయ్య వచ్చారు! వారినే పిలిచారు. ఇక చెరలో ఉన్నవారిని విడిపించడం ఇంకా బందించబడిన వారికి విడుదల అనగా సాతాను పాపపుచెరనుండి విడిపించడం అని గ్రహించాలి!

 

యోహాను 8:34, 44

34. అందుకు యేసు: పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

44. మీరు మీ తండ్రియగు అపవాది ( అనగా, సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక,అబద్దకునికి జనకుడునై) యున్నాడు.

 

రోమా 6:20

మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:1,2,3

1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున (మూలభాషలో- యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.

3. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై (మూలభాషలో- ఉగ్రత పిల్లలమై) యుంటిమి.

 

ఇక ఆయన కొండమీద ప్రసంగంలో ఇలాంటి దీనులను పేదలైనవారినే ధన్యులు అంటూ ప్రసంగం మొదలుపెట్టారు....

Matthew(మత్తయి సువార్త) 5:4,5,7,10

4. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

5. సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

7. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

10. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

 

    ప్రియ సహోదరి సహోదరుడా! యేసుక్రీస్తుప్రభులవారు వచ్చిందే పేదలకోసం, దీనులకోసం, విరిగినలిగిన హృదయం, గలవారికోసం, కృంగిన వారికోసం, ఆశలేక అల్లాడే వారికోసం రోగులకోసం పాపుల కోసం! ఒకవేళ నీవు ఈకోవకు చెందినవాడవు చెందినదానవు అయితే ఆయన నీకోసమే వచ్చారని గ్రహించి ఆయన పాదాలు పట్టుకో! ప్రయాసపడి భారము మోసుకోనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి అంటూ ఆయన పిలుస్తున్నారు! ఆయన రెక్కలనీడ క్రింద నీకు ఆశ్రయము! ఆయన రక్తములో నీకు పాపపు విడుదల!  ఆయన పొందిన గాయములచేత నీకు స్వస్థత!  కాబట్టి నేడే ఆయన వద్దకు వచ్చి నీ పాపములను నీ వ్యాధులను తొలిగించుకో! అంతేకాకుండా పరలోకరాజ్యమును పట్టుకో!!

 

ఇక రెండవ వచనంలో యెహోవా హితవత్సరం ను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు బూడెదకు ప్రతిగా పూదండ దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము  భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతివస్త్రము వారికివ్వడానికి ఆయన నన్ను పంపియున్నాడు అంటున్నారు!

దీనికి జవాబు కూడా కొండమీద ప్రసంగంలో చెబుతున్నారు.

 

ఇక్కడ హితవత్సరం అనగా ఒక్క సంవత్సరం అనికాదు దేవుడు కరుణచూపించే కాలము వచ్చింది అని అర్ధం!

2కోరింథీయులకు 6:2

అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!

2కోరింథీయులకు 6:3

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.

 

ఇంకా ప్రతిదండన దినము అనగా యెహోవా దినము- ఇది రెండవరాకడలో జరుగుతుంది. తన జనులను ఆయన తీసుకుని వెళ్ళిపోయాక సాతాను మరియు వాడి అనుచరులను భూమిమీద దంఢించడానికి దేవుడు ఏర్పాటుచేసిన రోజులు అని అర్ధం!!

యెషయా 34:2,8

2. యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.

8. అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.

 

యెషయా 35:4

తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.

 

యెషయా 63:4

పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

 

ఇక సీయోనులో విలపించే వారికి లేక సీయోనులో దుఃఖించేవారికీ ఓదార్చేకాలము: ఇదికూడా ఇంకా రాలేదు! రెండవరాకడ సమయంలో జరిగేది ఇది!

 

యెషయా 40:12

1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

2. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

 

యెషయా 49:13

శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

 

సీయోనులో దుఃఖించేవారికి స్తుతి వస్త్రము, ఆనందతైలము పూలదండ ఇచ్చేరోజు ఇశ్రాయేలు జాతి యేసుక్రీస్తుప్రభులవారిని తమ మెస్సయ్యగా అంగీకరించిన రోజు- యేరూషలేము చుట్టూ శత్రువుల సైన్యముల ఆవరించినప్పుడు ఇశ్రాయేలు జాతి ప్రభువుకి మొర్రపెట్టినప్పుడు తన ప్రజల పక్షముగా ఈ భూలోకానికి ఒలీవల కొండమీద కాలుపెట్టి హార్మేగిద్దోను యుద్ధంలో తన శత్రువులను సంహరించినప్పుడు జరిగే సన్నివేశము ఇది! అప్పుడు జరగబోతుంది! ఆరోజు ఇశ్రాయేలు ప్రజలకు పూర్తి విడుదల, సంపూర్ణ విమోచన- దాస్యము నుండి మరియు పాపము నుండి కలిగి వారి క్షేమస్థితి వారికి మరలా కలుగుతుంది.

యెషయా 12:16

1. ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు.

2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను

3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు

Isaiah(యెషయా గ్రంథము) 26:1,2,3,4,5,6

1. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

2. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.

3. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

4. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

 

35:110

Isaiah(యెషయా గ్రంథము) 51:3,5

3. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును

5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు.

 

అయితే ఇక్కడ మరో అనుమానం రావచ్చు కృపాయుగం అనగా నేడు జరుగుచున్న కృపా యుగము యొక్క ఆధ్యాత్మిక అర్ధం లేదా అంటే ఉంది!  ఇప్పుడుయేసుక్రీస్తుప్రభులవారిని నమ్ముకుని ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని ఒకరోజు ఆయన వారి బాధలను శ్రమలను దుఖాలను తీసి వారికి నిజమైన ఆనందం మరియు దేవుని రాజ్యవారసులుగా చేసి తనతోపాటుగా నిలబెట్టుకునే సన్నివేశం, ఇంకా మనలను హింసిస్తూ ఆనందిస్తున్న వారికి దేవుని తీర్పుని సూచిస్తుంది!

 

ఇక రక్షించబడిన వారికి దేవుడు పెట్టే పేరులు కనిపిస్తాయి ఇక్కడమూడవ వచనం చివరి పాదంలో!! యెహోవా తననుతాను మహిమపరచుకొనేటట్లు నీతి అనే మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లు అనియు వారికి అనగా విడుదల నొందిన వారికి దుఃఖించేవారికి దేవునిచేత ఓదార్చబడిన వారికి పేరుపెట్టబడుతుంది అంటున్నారు!

ఇక్కడ నీతి అనే మస్తకి వృక్షము అంటున్నారు. మస్తకి వృక్షము నీతికి మరియు పరిశుద్ధతకు సాదృశ్యము! అనగా తన బిడ్డలు లేక విశ్వాసులు నీతిమంతులుగా జీవిస్తారు‌. ప్రభువు ఆరోజు ప్రతీ ఒక్కరి పాపములను పరిహరించి నీతిమంతులుగా చేస్తారు.

రోమీయులకు 5:16

మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

రోమీయులకు 5:19

ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.

రోమీయులకు 8:30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

రోమీయులకు 8:33

దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;

 

అయితే ఇలా నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసమందు స్థిరముగా నిలిచి జయజీవితం జీవించేవారు సీయోను అనుభవమునకు వెళ్తారు అని గత శీర్షికలలో చెప్పడం జరిగింది. సీయోను అనగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవము గలవారు. ఆత్మానుసారమైన జీవితము, వాక్యానుసారమైన జీవితం కలిగి సాక్ష్యమును కాపాడుకొనే పరిశుద్దులు! అయితే ఇప్పుడు వీరు సీయోనులో దుఃఖిస్తున్నారు లోకపు శ్రమలవలన మరియు ఆత్మలరక్షణ భారము కలిగి! వీరు ఇప్పుడు రక్షకుని రాకవలన వారి దుఃఖము ఆనందముగాను, భారభరితముగా వారు చేసే ప్రార్ధనలకు ప్రతిఫలముగా స్తుతివస్త్రము, దేవుడు ఇవ్వబోతున్నారు!!!

 

యెహోవా నాటిన చెట్టు అనగా మనకు కీర్తన మొదటి అధ్యాయం గుర్తుకు వస్తుంది. ఆకువాడక తనకాలమందు ఫలమిచ్చే చెట్టులా, నీటివారన నాటబడిన చెట్టు అనగా వాక్యముతో ఎదిగే ఆధ్యాత్మిక జీవితము గలవారుగా తన ప్రజలు ఉంటారు!

అనగా ఇలా విమోచించిన వారు దేవునికి ఘనత తెచ్చేవిధంగా జీవిస్తారు అని అర్ధం!

 

మరి నీవు ఆయన రక్తములో కడుగబడి ఆయన పేరుపెట్టుకొన్నావు కదా, మరి ఆయనకు ఘనత తెచ్చే పనులు చేస్తున్నావా? లేక ఆయనకు అవమానం తెచ్చేలా జీవిస్తున్నావా?

ఒక్కసారి పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*103వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-44*

 

యెషయా 61:46

4. చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు.

5. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు

6. మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 

 

ప్రియులారా! ఇక 61వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 4వ వచనంలో చాలాకాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు మరలా కడతారు పూర్వకాలమున పాడిన స్థలాలను కడతారు పాడిన పట్టణాలను నూతనముగా స్థాపిస్తారు. తరతరములనుండి శిధిలమై ఉన్న పురములను బాగుచేస్తారు అంటున్నారు. ఇది నిజానికి ఇశ్రాయేలు జాతి విమోచనం జరిగాక వారు పొందబోయే ఉన్నత స్థితిని సూచిస్తుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు పూర్వపు వైభవము మరలా కలుగుతుంది.  ఇది వెయ్యేండ్లపాలనలో యేరూషలేము ప్రపంచ రాజధానిగా తేజరిల్లే సమయంలో జరిగే కార్యము అని నాకు అర్ధమవుతుంది!

ఇది మనకు ఈ యెషయా గ్రంధంలో అనేకసారులు కనిపిస్తుంది.

యెషయా 49:8

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

యెషయా 54:3

కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

 

యెషయా 58:12

పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ వనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.

 

ఇక 5వ వచనంలో అన్యులు నిలువబడి మీ మందలను కాస్తారు పరదేశులు మీ వ్యవసాయాన్ని చేస్తారు మీ ద్రాక్షాతోటలు కాస్తారు: ఇదికూడా ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడి వారి క్షేమస్థితి వారికి కలిగినప్పుడు జరిగే సంభవాలు అని గ్రహించాలి! ఇప్పుడు మన దేశమునుండి అనేకమంది గల్ఫ్ దేశాలలో పనికి వెళ్లి అక్కడ ప్రజలకు గృహాలలో ఫాక్టరీలలో ఎలా పనిచేస్తున్నారో అలాగే సర్వ దేశాలనుండి ప్రజలు వచ్చి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళలో మరియు వారి తోటలలో వారి ఫాక్టరీలలో పనిచేస్తారు అన్నమాట! మరి ఈ రోజులలో ఇశ్రాయేలు దేశంలో పనిచేయడం లేదా అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు గాని అప్పుడు మరి విస్తారంగా చేస్తారు అన్నమాట!

 

Isaiah(యెషయా గ్రంథము) 14:1,2,3

1. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు

2. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

3. తమ్మును బాధించినవారిని ఏలుదురు.

 

Isaiah(యెషయా గ్రంథము) 60:10,11,12,14

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

11. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

14. నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.

 

ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే: యెహోవా యాజకులని పిలువబడతారు! ఇది ఇశ్రాయేలు ప్రజలకు మరియు రక్షించబడిన విశ్వాసులకు చెందిన ప్రవచనం!

ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు జరుగుతుంది అంటే: వెయ్యేండ్ల పాలనలో జరుగుతుంది విశ్వాసులంతా  క్రీస్తుతో ఆరోహణం అయినప్పుడు బహుశా ఇశ్రాయేలు చేతిలో యాజకత్వం ఉండవచ్చు!  విమోచించబడిన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిమీద వారు యాజకులుగా ఉంటారు!

 

యెషయా 66:21

మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

 

Jeremiah(యిర్మీయా) 33:15,16,17,18

15.​​ ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.

16. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షిత ముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.

17. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.

18. ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.

 

మరలా ఇశ్రాయేలు ప్రజలు యాజకులుగా ఉంటారు!  ఇది మరి ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు బైబిల్ లో స్పష్టంగా లేదు గాని అలా జరుగదు అనడానికి ఆధారాలు మాత్రం లేవు! వారు అనగా ఇశ్రాయేలు జాతిలో మరలా యాజకులు ఉండరు అనడం కూడా సరికాదు అని నా ఉద్దేశం!

 

ఇక రక్షించబడిన విశ్వాసులకు ఎలా జరుగుతుంది అంటే దేవుడు మనలను పిలుచుకోవడమే రాజులైన యాజకులుగా ఉండటానికి పిలుచుకొన్నారు! ఇది మనకు క్రొత్త నిబంధన లో కనిపిస్తుంది.

అందుకే దీనిని ప్రకటన గ్రంధంలో కూడా చెబుతున్నారు!

ప్రకటన గ్రంథం 1: 6

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అంటున్నారు! ముందుభాగాలలో చెప్పినట్లు ఒక వచనానికి మరో వచనం సపోర్టింగ్ గా ఉంటేనే మన అర్ధము సరియైనది!! ఇక్కడ తండ్రియైన దేవునికి రాజ్యముగాను యాజకులను గాను చేసెను అంటే ఇంకా వివరంగా పేతురు గారు చెబుతున్నారు రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను చేశారు!

1పేతురు 2:5,9

5. యేసుక్రీస్తు ద్వారా *దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు*, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, *రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును*, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

మొదటగా రాజులుగా చేశారు:  ఇదే ప్రకటన గ్రంధంలో అనేకసార్లు జయించిన వానికి జనముల మీద అధికారం ఇస్తాను, వాడు ప్రజలను ఏలుతాడు, వాడు నా సింహాసనం మీద నాతో కూర్చుంటాడు, వారు వెయ్యి సంవత్సరాలు ఏలుతారు అంటూ ఉన్నాయి....

ప్రకటన 2:2627

26. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి (లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.

27. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;

 

ప్రకటన గ్రంథం 3: 21

నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

 

 ప్రకటన గ్రంథం 20: 4

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

 

గమనించాలి ఈ వచనం వెయ్యేండ్ల పాలనలో నెరవేరుతుంది!!! అనగా జయించిన వాడు మొదటగా రహస్యరాకడలో ఎత్తబడతాడు, ఏడేండ్ల పెండ్లివిందులో పాల్గొంటాడు! రెండో రాకడలో క్రీస్తుతో పాటుగా భూమిమీదికి వచ్చి వెయ్యేండ్ల పాలనలో క్రీస్తుతో పాటు వెయ్యేండ్లు ఏలుతాడు! మరి ఇప్పుడు రాజులే కదా ఏలేది!

 

2తిమోతి 2:12

సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.

 

ఇక యాజకులుగా కూడా చేశారు:

ప్రకటన 5:10 ఇక్కడ కూడా అదేమాట అంటున్నారు!

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

ప్రకటన గ్రంథం 7: 15

అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;

 

ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు సేవ చేసేది ఎవరు? యాజకులే కదా!...

ఇక మీదన వివరించిన 1పేతురు 2:5,9లో కూడా అదే అంటున్నారు!

 

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను! కొంతమంది అంటుంటారు: దేవుడు అందరిని రాజులుగాను యాజకులు గాను చెయ్యలేదు! కేవలం పాస్టర్లు, అపోస్తలులు, సేవకులు అనగా వీరందరిలో జయించిన అనుభవము గల వారు మాత్రమే యాజకులు ఈలోకంలోనూ పరలోకం లోను, విశ్వాసులు మాత్రమే రాజులుగా ఉంటారు అంటారు! ఈ భావము ఈ కాన్సెప్ట్ తప్పు అని నా ఉద్దేశ్యము! దేవుడు అందరినీ రాజులైన యాజక సమూహముగా పిలిచారు ఏర్పాటుచేసుకున్నారు! దీనికి మనము మరో భాషలో అనువాదాలు భావాలు చెప్పుకోకూడదు! జయించిన వారంతా అది విశ్వాసులైనా గాని సేవకులు పాష్టర్లు అయినా గాని రాజులు మరియు యాజకులే అని గ్రహించాలి!

 

కాబట్టి ఇట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక అంటున్నారు!

 

ప్రియ సంఘమా! నీ పిలుపు ఏర్పాటు ఎంత గొప్పదో గ్రహించావా? ఆయన మనలను రాజులుగాను యాజకులుగాను పిలుచుకుని ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఎందుకు బురద పనులు పాపపు పనులు చేస్తావు?

నేడే సరిదిద్దుకో!

పశ్చాత్తాప పడు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*104వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-45*

యెషయా 61:78        

7. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.

8. ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 

ప్రియులారా! ఇక 61 వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 7వ వచనంలో : మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుదురు. వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందం వారికి కలుగును అంటున్నారు! గమనించాలి వీరంతా సీయోనులో దుఃఖించు వారు అని అర్ధం చేసుకోవాలి!

 

ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నారు: మీరు ఎక్కడైతే అవమానము పొందారో అక్కడే ఒకరోజు రెట్టింపు ఘనతకు పాత్రులు అవుతారు. ఎక్కడైతే మీరు నిందలు అనుభవిస్తారో అక్కడే ఘనత మరియు అభివృద్ధి పొందుతారు! అవును: యోసేపు గారు చేయని నేరానికి శిక్షించబడ్డారు అవమానించబడ్డారు. గాని యోసేపు గారు కృంగిపోలేదు దేవుణ్ణి నిందించలేదు ఒకరోజు అదే ఐగుప్తులో అదే చెరసాలలో ఆయనకు కబురు వచ్చి తిన్నగా రాజ ప్రసాదంలో గొప్ప పదవి దొరికింది. తనను కొట్టిన వారే తనను అవమానించిన వారే ఆరోజు వంగి వంగి సలాము చేశారు. దేవుడు రెట్టింపు ఘనతకు పాత్రునిగా చేశారు యోసేపు గారిని!  మనదేవుడు అలాంటి శక్తిమంతుడు! అయితే శ్రమలను ఓర్చుకునే సమయంలో కొన్ని నిందలు బాధలు పడక తప్పదు! దేవుని రాజ్య మార్గము శ్రమలమార్గము! అదే తిన్నని మార్గము! అయితే ఈ మార్గము గుండానే మనము గమ్యము చేరగలము! చివరకు మార్గమును స్థాపించిన రక్షకుడు కూడా అదే మార్గములో పయనించే గమ్యము చేరారు- అదే మార్గములోనే సంపూర్ణత సాధించారు అని మనకు హెబ్రీ పత్రిక చెబుతుంది...

హెబ్రీయులకు 2:10

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

హెబ్రీయులకు 2:11

పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక....

 

కాబట్టి శ్రమలను నిందలను ఓర్చుకున్న విశ్వాసికి రెట్టింపు ఘనత కలుగుతుంది!! ఇది నా జీవితంలో కూడా జరిగింది! అనేకుల విశ్వాసుల జీవితంలో జరుగుతుంది.

 

అయితే ఇక్కడ గమనించవలసిన మరో విషయం కూడా ఈ వచనంలో కనిపిస్తుంది. తమ దేశములో వారు రెట్టింపు భాగమునకు కర్తలగుదురు!! దీనిని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది జ్యేష్టుడైన ఇశ్రాయేలు జాతికి చెందుతుంది!

జెకర్యాలో అంటున్నారు

జెకర్యా 9:12

బంధకములలో పడియుండియు నిరీక్షణగల వారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.

 

అయితే బైబిల్ గ్రంధంలో అనేకచోట్ల ఇశ్రాయేలు నా ప్రధమ కుమారుడు అన్నారు:

నిర్గమకాండము 4:22

అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;

 

యిర్మియా 31:9

వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?

 

ఇక్కడ ఎఫ్రాయిము అనగా ఎఫ్రాయిము గోత్రపు వారు కాదు! పాత నిబంధనలో ప్రవక్తల గ్రంధాలలోఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు జాతిని అనగా పదిగోత్రాల ఇశ్రాయేల జాతిని సూచిస్తుంది అని గ్రహించాలి!

 

సరే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన స్వకీయమైన జనముగా చేసుకోవడమే కాకుండా వారిని జ్యేష్టులుగా చేసుకున్నారు! మరి ఇప్పుడు ధర్మశాస్త్రము ప్ర్రకారం జ్యేష్టుడైన వానికి రెట్టింపు భాగము ఇవ్వాలి! కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎక్కడైతే అవమానమునకు పాలయ్యారో అక్కడ రెండింతల భాగమునకు పాత్రులగునట్లు చేస్తారు అన్నమాట!

ద్వితీ 21:17

ద్వేషింపబడినదాని కుమారు నికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.

...

ఇక ఎనిమిదో వచనం చూసుకుంటే ఎందుకంటే న్యాయం జరిగించడం అంటే యెహోవా అనే నాకు ఎంతో ఇష్టము లేక ప్రీతికరము అంటున్నారు!  ఇంకా సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేస్తాను అంటున్నారు!

 

బైబిల్ గ్రంధములో దేవుడు న్యాయవంతుడు!నీతిని బట్టి న్యాయమును విధిస్తారు అంటూ వ్రాయబడింది.

యోబు 34:12

దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

 

యోబు 36:6

భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.

 

యోబు 37:23

సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగల వాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు.

 

కీర్తన 7:11;17;

కీర్తనలు 7:11

న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

కీర్తనలు 7:17

యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

 9:7,8  ౩౩:5   37:28 72:2  ఇంకా అనేకమైన రిఫరెన్సులు ఉన్నాయి! ఆయన న్యాయమును ప్రేమించి జరిగిస్తారు!

 

ఇక ఇదే వచనంలో వారితో నిత్యనిబంధన చేయుదును అంటున్నారు! అయితే ఇక్కడ ఏమని నిత్యనిబంధన చేస్తారో స్పష్టముగా లేదు ఇంకా 55:3 లోను చేస్తున్నారు.

యెషయా 55:3

చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

అయితే 59:21 లో పరిశుద్ధాత్మను గూర్చిన నిబంధన చేస్తున్నారు...

యెషయా 59:21

నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

ఇక ఆ నిత్యనిబంధన మనకు యిర్మియా గ్రంధంలో కనిపిస్తుంది

Jeremiah(యిర్మీయా) 31:31,32,33,34,35,36,37

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.

35. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

36. ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.

37. యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.

 

32:40

40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయ ములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.

 

ఈ నిత్య నిబంధన కేవలం ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాకుండా ఇది సర్వమానవాళితో దేవుడు చేసిన నిత్యనిబంధన!!

 

ఆ నిబంధనకు పాత్రులుగా దేవుడు మనలను కూడా చేశారు! కేవలం ఇశ్రాయేలు ప్రజలే కాకుండా మనలను కూడా జ్యేష్టులుగా ఉండాలని అనుకుంటున్నారు!  అందుకే ఆ జ్యేష్టుల సంఘమునకు మనలను పాత్రులుగా చేశారు అంటున్నారు పౌలుగారు హెబ్రీ 12:23-24 వచనాలలో...

23. పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,

24. క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

 

ఒకానొక రోజులలో ఎటువంటి ఘనత లేక ఆరోగ్యం లేక, అవమానాలతో ఉన్న మనలను దేవుడు రక్షించి దీవించి ఇప్పుడు  ఘనతకుపాత్రులుగా చేశారు  కాబట్టి మనము ఆ చేసిన ఉపకారమునకు పొందిన మేలుల విషయములో కృతజ్ఞులమై ఆయనకు సాక్షులుగా జీవిస్తూ పేరుకు తగిన జీవించవలసి యున్నది!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*105వ భాగము*

*అభిషక్తుని మొదటి రాకడ-46*

యెషయా 61:911     

9. జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచినవారందరు ఒప్పుకొందురు

10. శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది

11. భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేస్తున్నాము! 

 

ప్రియులారా! ఇక 61 వ అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 9వ వచనంలో : జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధిచెందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని చూచిన వారందరూ ఒప్పుకుంటారు!

 

ప్రియులారా ఇది ముమ్మాటికీ ఇశ్రాయేలు ప్రజలకోసం చేసిన వాగ్ధానము అని గ్రహించాలి! ఆరోజు దేవుడు వారిని విమోచించిన తర్వాత వారు ఎంతో ఘనులుగా ప్రసిద్ధి చెందుతారు! అప్పుడే కాదు ఇప్పుడు కూడా సమస్తదేశాలకంటే ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులే ఎంతో తెలివైన వారు అని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది!  ఇదంతా వారి తెలివికాదు! దేవుడు వారితో ఉండడం వలన మరియు దేవుడు వారితో వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్ధానమును నమ్మి వారి ముందుకుపోతున్నారు కాబట్టి ఇదంతా సాధ్యము అవుతుంది. వారేకాదు ఆయనయందు విమోచనము పొంది ఆయన మార్గములో సాగుతున్న క్రైస్తవ బిడ్డలు కూడా ఈరోజు అనేకదేశాలలో ఎంతో తెలివైన వారిగా ఎంతో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు!

 

ఇక ఇక్కడ వారి సంతతి లేక సంతానం వారు అంటున్నారు: వారి సంతానం వారు అనగా చెరలో నుండి విడుదల పొందిన వారు అని అర్ధమవుతుంది.

యెషయా 43:5

భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.

 

యెషయా 48:19

నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు

 

యెషయా 49:25

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

 

యెషయా 54:3

కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

 

యిర్మియా 31:1213

12. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉప కారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.

13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.

 

ఇక 10వ వచనంలో : శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లికుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు దరింప జేసియున్నాడు. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు కాగా నేను యెహోవాను బట్టి మహా ఆనందముతో ఆనందించుచున్నాను దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించు చున్నది అంటున్నారు యెషయా గారు!

 

ఇక్కడ శృంగారమైన పాగాతో పెండ్లి కుమారుడు  ఆభరణములతో అలంకరించు కున్న పెండ్లి కుమార్తె- ఇది ఇశ్రాయేలు ప్రజలమధ్య మరియు దేవునికి గల సంబంధాన్ని సూచిస్తుంది మరియు జరుగబోయే పెండ్లి విందును సూచిస్తుంది.

 

 ఇంకా మూడో వచనంలో సీయోనులో దుఃఖించే వారికి దేవుడిచ్చే స్తుతి వస్త్రములు కూడా గుర్తుకు చేస్తుంది. అందుకే ఇప్పుడు రక్షణ వస్త్రమును దేవుడు తొడుగుతున్నారు. ఇంకా నీతి అనే పైబట్ట కూడా దేవుడు తొడిగించినట్లు చూస్తున్నాము! మరియు ఈ వస్త్రములు ఏమిటి అని ఆలోచిస్తే ప్రకటన గ్రంధంలో అవి పరిశుద్ధుల నీతిక్రియలు అని స్పష్టముగా చెబుతున్నారు....

ప్రకటన గ్రంథం 19:8

మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.

 

ఇక ఈ వస్త్రములు కోసం చూసుకుంటే

యెషయా 52:1

సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

 

రోమీయులకు 13:14

మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

 

గమనించాలి దేవుడిచ్చే నీతి మనిషి యొక్క స్వంత నీతికి వేరుగా ఉంటుంది.

 

రోమీయులకు 3:21

ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

రోమీయులకు 3:22

అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

 

1కోరింథీయులకు 1:31

అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

ఫిలిప్పీ 3:9

క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,

 

కేవలం క్రీస్తుయేసు నందు గల విశ్వాసం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము తప్ప మన స్వనీతి వలన కానేకాదు!

 

అందుకే ఇక్కడ యెషయా గారు అంటున్నారు నేను దేవుని యందు ఆనందిస్తున్నాను! దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుంది అంటున్నారు! ఈమాటలు యెషయా గారు అంటున్నారు! ఒకరోజు విమోచించ బడే ఇశ్రాయేలు జాతి కూడా పలుకబోతుంది ఇదేమాట!

 

ఇక 11వ వచనంలో భూమి మొలకను మొలిపించునట్లు తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లు నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని ఇంకా స్త్రోత్రమును ఉజ్జీవింపజేయును అంటున్నారు!

 

గమనించాలి- ఇదంతా రక్షకుని రాకడ వలన ఆయన చేసే సువార్త పరిచర్య వలన- ఆ సువార్తను నమ్మిన వారి వలన ప్రపంచమంతా మొలిచే సువార్త మొలకలు! నీతి మొలకలు కోసం చెబుతున్నారు ఇక్కడ! ఆ సువార్తీకరణ ఇప్పుడు ప్రపంచంలో ప్రాకి నీతిమొలకలు మొలవగా ఇశ్రాయేలు దేశంలో ఇంకా మొలవలేదు! అవి ఒకరోజు సంఘము ఎత్తబడిన తర్వాత సువార్తీకరణ జరిగి వారు కూడా యేసుక్రీస్తుప్రభులవారిని రక్షకునిగా అభిషక్తునిగా అంగీకరించిన తర్వాత అక్కడ కూడా నీతి మొలకలు ఫలించి ఆయన బిడ్డలుగా మారతారు! అప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలలో దేవునికి స్త్రోత్రము ఎలా ఉజ్జీవించబడిందో అక్కడ కూడా యేసునామము ద్వారా దేవునికి స్తోత్రము ఉజ్జీవించబడబోతుంది అంటున్నారు యెషయా గారు!

ఇదంతా రక్షకుని సువార్త పరిచర్యకు ప్రతిఫలము అని గమనించాలి!

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీ ద్వారా దేవునికి ఘనత మహిమ స్తుతి కలుగుతున్నాయా లేక దేవుని నామమునకు అవమానం కలుగుతుందా?

ఒకసారి పరిశీలన చేసుకోమని ప్రభువును బట్టి మనవిచేస్తున్నాను!

మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండేలా దేవుడు మనలను స్తిరపరచి నడిపించును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*106వ భాగము*

యెషయా 13:14        

1. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి

2. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.

3. నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి యున్నాను.

4. బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ రక్షకుని మొదటిరాకడ కోసం ధ్యానం చేసుకున్నాము! 

 

ప్రియులారా! ఇక రెండవ రాకడ కోసం ధ్యానం చేసేముందుగా ఇతర దేశాలకు దేవుడు విధించిన శిక్ష లేక అన్య దేశాల వారు తమ విగ్రహారాదన ద్వారా మరియు ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడం ద్వారా దేవుడు విధించిన తీర్పుల కోసం ధ్యానం చేసుకుందాం! ఇవి మనకు 13వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఉన్నాయి!

 అయితే బబులోను కోసం మూడుసార్లు ప్రస్తావించడం జరిగింది ఈ గ్రంధంలో!!

వీటిని క్రమంలో చూసుకుంటే

 

బబులోను కోసం: 13:114:23 (బబులోను కోసం చెబుతూనే లూసీఫర్ పరమునుండి త్రోయబడటం కోసం కూడా ఉంది)

అష్షూరు కోసం: 14:2427

ఫిలిష్తీయుల కోసం: 14:2832

మోయాబు కోసం: 15:116:14

దమస్కు అనగా సిరియా కోసం: 17:114

కూషు లేక ఇతియోపియా కోసం: 18:17

ఈజిప్ట్ కోసం: 19:125

ఈజిప్ట్ మరియు కూషు కోసం: 20:16

మరలా బబులోను కోసం: 21:110

ఎదోము అనగా ఇరాక్ అనగా  అష్షూరు మరియు బబులోను కలసి: 21:1112

అరేబియా దేశాలు అనగా గల్ఫ్ దేశాలు అనగా ఇశ్రాయేలు దేశపు చుట్టుప్రక్కల దేశాలు:21:1317

తూరు కోసం:23:118

సమస్త లోకంలో గల జనుల కోసం: 24:122

మరలా బబులోను కోసం:46:113

బబులోను పతనం కోసం: 47:115

ఇదీ ఇతర దేశాల కోసం దేవుడు విధించిన శిక్షలు/తీర్పులు!

 

ఇక మొదటగా మనము బబులోను కోసం చూసుకుందాం! బబులోను అనగా దక్షిణ ఇరాక్ అని గ్రహించాలి! అయితే ఈ అధ్యాయం లేక ఈ ప్రవచనం చెప్పబోయే సరికి బబులోను దేశం అష్షూరు రాజ్యపు పాలన క్రింద ఉన్నదని గ్రహించాలి. అప్పటికే నెబుకద్నేజర్ రాజు యొక్క తండ్రి అష్షూరుకి వ్యతిరేఖంగా పోరాడుతున్నాడు అని గ్రహించాలి! అష్షూరు అనగా ఉత్తర ఇరాక్ అని కూడా గ్రహించాలి! ఈ కారణంగానే కొన్నిసార్లు అష్షూరు రాజులు తమనుతాము బబులోను రాజులము అనికూడా చెప్పుకున్నారు!

ముఖ్యపట్టణం నీనేవే!!!

 

ఇక బబులోను సామ్రాజ్యం కోసం చూసుకుంటే: గతంలో కొద్దిగా చెప్పడం జరిగింది!

దీనికోసం చరిత్రలో చూసుకుంటే బబులోను సామ్రాజ్యం మొదలుపెట్టింది

1) నెబుకద్నెజర్ రాజుయొక్క తండ్రి నెబోపోలస్సార్, ఆ తర్వాత నెబుకద్నెజర్ 43 సంవత్సరాలు పాలించాడు. బబులోను సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది కూడా నెబుకద్నెజర్. BC 605 నుండి 562 వరకు పాలించాడు.

2) అతనికొడుకు ఎవిల్-మెరోదాక్ 2 సం.లు; BC 561560

౩) ఎవిల్-మెరోదాక్ని చంపి అతని అల్లుడు నెరిగ్లిస్సర్ 4 సం.లు; BC 560556

4) నెరిగ్లిస్సర్ కొడుకు లాబాస్ముర్డుక్ 9 నెలలు BC 556(ఒక సంవత్సరం కంటే తక్కువకాలము)

5) నెబుకద్నేజర్ రెండవభార్య కొడుకు నబోనిదాస్- 1౩సం.లు; BC 555542;

6) నెబుకద్నేజర్ మనవడు, నబోనిదాస్ కొడుకు బెల్షస్సర్ ౩సం.లు ; BC 542539..........

 

అయితే గమనించాలి నబోనిదాస్ మరియు బెల్షస్సర్ కలిసి పాలించారు కాబట్టి కొన్ని చరిత్ర పుస్తకాలలో బెల్షస్సర్ 555 నుండి క్రీ.పూ 539 వరకు పాలించినట్లు చూడవచ్చు. చివరి మూడు సంవత్సరాలు ఆయన ఒక్కడే పాలించాడు. ఈ బబులోను సామ్రాజ్యం క్రీ.పూ. 539 లో కోరేషు బెల్షస్సర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో ముగిసింది. అనగా బబులోను సామ్రాజ్యం BC 605 నుండి 539 వరకు సాగింది.

ఈ విధంగా బబులోను సామ్రాజ్యం BC 539 లో మాదీయ- పారశీక అలయన్స్ సామ్రాజ్యము ద్వారా అంతమైపోయింది!

 

ఇక బబులోను కోసం- దాని తీర్పు కోసం యెషయా గ్రంధం తర్వాత ఎక్కువగా యిర్మియా గ్రంధంలో కనిపిస్తుంది. కారణం యెషయా గారి కాలంలో అష్షూరు వారి పాలన మరియు ప్రపంచ దేశాలను ఆక్రమించాలనే తపనతో అనేకదేశాల మీద దండయాత్ర చేయగా యిర్మియా గారి కాలానికి అష్షూరు పాలన అంతమై పోయింది.  బబులోను పాలన ప్రపంచ దేశాలమీదికి విస్తరిస్తుంది. అప్పటికే ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యం నాశనమై పోయింది. యూదా రాజ్యం బబులోను దండయాత్రలతో శిధిలమైపోయింది! అందుకే ఎక్కువగా యిర్మియా గ్రంధంలో బబులోను కోసం వ్రాయబడింది. ఇక తర్వాత యేహెజ్కేలు గ్రంధములోను, మీకా మరియు జెకర్యా గ్రంధాలలో బబులోను కోసం వ్రాయబడింది!!

 

అయితే నహూము మరియు ఓబధ్యా గ్రంధాలలో ఎదోము అంటూ వ్రాయబడింది. అదికూడా బబులోను మరియు అష్షూరు అని గ్రహించాలి!

 

సరే, ఇప్పుడు మనం మన పాఠము లోనికి వచ్చేద్దాం! బబులోను సామ్రాజ్యం విస్తరించకుండానే దాని పతనం కోసం దేవుడు ప్రణాళిక రచించారని గ్రహించాలి! అందుకే దీనిని బబులోను నెబుకద్నేజర్ రాజుకి చెప్పారు- సర్వోన్నతుడైన దేవుడు తానూ ఎవరికి రాజ్యము అధికారము ఇవ్వాలని నిర్ణయిస్తారో వారికి రాజ్యము మరియు అధికారం ఇస్తారు అని, ఆయనకు వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే ఆయన త్రోసివేస్తారు అని నెబుకద్నేజర్ తానే ప్రపంచ దేశాలకు ఉత్తరం రాస్తూ తెలియజేశాడు! ఇది మనకు దానియేలు గారు ఆ ఉత్తరాన్ని గ్రంధస్తం చేశారు!!...

Daniel(దానియేలు) 4:24,25,26,34,35,37

24. రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా

25. తమయొద్దనుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీ మీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును.

26. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన (ఆకాశములు అధికారమని యున్నది) సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.

34. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవ బుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకునున్నవి.

35. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

37. ఈలాగు నెబు కద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునైయున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచునున్నాను.

 

కాబట్టి ప్రియ దైవజనమా! నీకున్న అధికారం ధనం బలము ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించి, మన కాలగతులు అన్నీ దేవుని చేతిలో ఉన్నాయని గ్రహించి దేవునికి భయపడుతూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అని మరిచిపోవద్దు!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*107వ భాగము*

 

యెషయా 13:14        

1. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి

2. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.

3. నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి యున్నాను.

4. బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ ఇతర దేశాలకు దేవుడు విధించిన శిక్షకోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

ప్రియులారా!  13వ అధ్యాయం మొదటి నుండి ధ్యానంచేస్తే ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి అంటున్నారు:

దేవోక్తి అనగా దేవుడు సెలవిచ్చిన మాట అని అర్ధం! ఇదిమనకు బైబిల్ లో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇదే గ్రంధంలో 14:28; 15:1; 21:1;

ఇంకా ఇతర గ్రంధాలలో నహూము 1:1;  హబక్కూకు 1:1;  జెకర్యా 9:1;  మలాకి 1:1

ఇవన్నీ దేవుడు సెలవిచ్చిన మాటలు లేక ప్రవచనాలు అని అర్ధం! ఇవి వారికివారు చెప్పినవి కావు పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెబితే వారు ఆత్మావేశులై ప్రవచించిన ప్రవచనాలు అని గ్రహించాలి!

 

సరే, ఈ దేవోక్తి అనబడే ప్రవచనం: ఆమోజు కుమారుడైన యెషయా గారికి వచ్చింది!

ఎవరికోసం ? బబులోను వారి కోసం!   గతభాగంలో చెప్పడం జరిగింది- బబులోను సామ్రాజ్యం ఇంకా విస్తరించక ముందే దాని పతనం కోసం దేవుడు చెప్పారు!

 

గమనించాలి: ఈ 25 వచనాలు చూసుకుంటే దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని నాశనం చేసేందుకు సైన్యాలను సిద్ధపరుస్తున్నారు! యూదా దేశంపై ఉన్న దేవుని కోపము అది తీరాక శత్రు దేశాలపై మళ్ళుతుంది. అయితే దేవుడు పిలుస్తున్న ఆ సైన్యాలు 17వ వచనం ప్రకారం అవి మాదీయ పారశీక అలయన్స్ సైన్యాలు! దీనికోసం 17వ వచనంలోనే కాకుండా 45వ అధ్యాయంలో కూడా ఉంది, ఇంకా దానియేలు గ్రంధంలో కూడా ఉంది....

Daniel(దానియేలు) 5:30,31

30. ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.

31. మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరములవాడై సింహాసనము నెక్కెను.

Isaiah(యెషయా గ్రంథము) 13:17,18

17. వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు

18. వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు.

 

దానియేలు గ్రంధము ధ్యానం చేసేటప్పుడు అష్షూరు వారిని నాశనం చేయడానికి బబులోను వారు ఎలా ప్రయత్నాలు చేశారో- అలాగే బబులోను వారు ఇతర దేశాలను ఆక్రమించుకునేటప్పుడు మాదీయులు పారశీకులు చాలా ప్రయత్నించారు. విడివిడిగా ప్రయత్నించి ఓడిపోయి ఇక కలిసికట్టుగా పోరాడాలి అని నిర్ణయానికి వచ్చి ఒక ట్రీటీ (రెండు లేక మూడు దేశాలు ఒకే ప్రయోజనాన్ని ఆశించి చేసుకునే అంతర్జాతీయ ఒప్పందం- ఇది కేవలం సంతకాలతో సరిపోదు- ఇరుదేశాల పార్లమెంటులోను బిల్లు పాసు కావాలి) చేసుకున్నారు! దాని ప్రకారం- మాదీయులు లేక అనగా ఇరాన్ బోర్డర్ లో ఉండే వారు, పారశీకులు అనగా ఇరాన్ దేశానికి చెందిన మరో తెగ  కలిసి ఒప్పందం చేసుకుని వారు కలసి చేసిన యుద్ధాలలో దోపుడు సొమ్ము చెరిసగం చేసుకుని- ఆ మొదటి రాజ్యానికి రాజ్యానికి మాదీయ రాజు పాలిస్తాడు, తర్వాత రాజ్యానికి పారశీక రాజు పాలిస్తాడు!  అందుకే బబులోను పాలనలో ఉన్న యూదా రాజ్యాన్ని పారశీకపు వాడైన కోరేసు చక్రవర్తి జయించి మాదీయుడైన దర్యావేషుని ట్రీటీ ప్రకారం యూదాకు రాజుగా చేశాడు! ఇది మీకు అర్ధం కావడానికి చెప్పడం జరిగింది.

కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు పిలిచే ఆ సైన్యాలు మాదీయ పారశీక రాజ్యాలకు చెందిన సైన్యాలు అని గ్రహించాలి!

 

సరే, ఇక రెండో వచనానికి వస్తే జనుల ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలవండి సంజ్న చేయండి ఇంకా నాకు ప్రతిష్టితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి యున్నాను నా కోపము తీర్చుకోవాలని నా పరాక్రమశాలురను పిలిపించాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను అంటున్నారు! ఇంకా నాలుగో వచనంలో బహుజనుల ఘోషవలె కొండలలోను జన సమూహము వలన కలుగు శబ్దము వినండి కూడుకొను రాజ్యాల యొక్క జనములు చేసే అల్లరి శబ్దము వస్తుంది సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధానికి తన సేనను వ్యూహపరుస్తున్నారు అంటున్నారు!

 

ఇదంతా బబులోను దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు పిలిపిస్తున్న సైన్యాన్ని , వారి అల్లరిని సూచిస్తుంది!

ఇక నా ప్రతిష్టులు లేక నా పవిత్రులు అనగా దేవుడు తన శిక్షను అమలుచేయడానికి ఎన్నుకున్న వారు అని అర్ధము! అవి మాదీయ పారశీక సైన్యాలు అని తెలిసికోవాలి! అయితే దీనికి మరో అర్ధము కూడా ఉంది. అది ఏమిటంటే బబులోను సామ్రాజ్యం నాశనం కావడానికి కావలసిన సైన్యాలను సమీకరించే దేవుని యొక్క దేవదూతలు అనికూడా అర్ధం వస్తుంది! మొత్తానికి ఏది ఏమైనా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోడానికి తాను పిలుచుకున్న లేక ఏర్పాటుచేసుకున్న వారు ఆయన ప్రతిష్టులు అని తెలిసికోవాలి!   ఈ ప్రతిష్టితమైన సైన్యము ఎందుకు వస్తుంది అంటే బబులోను సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి!

 

5వ వచనంలో అంటున్నారు వారు అనగా ఆ సైన్యము యెహోవా యొక్క కోప సాధనాలుగా ఉన్నారు! వారు దేశాన్ని మొత్తము అనగా బబులోను దేశాన్ని మొత్తం నాశనం చేయడానికి దేవుడైన యెహోవా కూడా వాళ్ళతో కూడా దూరదేశం నుండి  ఆకాశదిగంతాల నుండి వస్తూ ఉన్నాడు అంటున్నారు!

 

చూడండి ఇక్కడ యెహోవాయును ఆయన క్రోధాన్ని తీర్చే ఆయుధాలును వస్తున్నారు అంటున్నారు!

దేవుడు తీర్చిన తీర్పులు నెరవేర్చడానికి దేవుడే స్వయంగా తరలి వస్తున్నట్లు చూడగలము ఇక్కడ! ఎందుకంటే దేవుడుతన కోపాన్ని తీర్చుకుందాం అని తన ప్రజలకు వ్యతిరేఖంగా వీరిని పంపిస్తే ఆయన క్రోధానికి తోడూ వీరు కూడా చిన్నపిల్లలనని ముసలివారని కరుణించకుండా వారిని హతమార్చి గర్భిణీ స్త్రీల కడుపులు చించారు కాబట్టి దేవుడు ఇలా చేయడం జరుగుతుంది.

కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానమే! ఎవరైనా తప్పించుకోలేరు అని దీనిని బట్టి అర్ధమవుతుంది!

దైవాశీస్సులు!

 

 

 

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*109వ భాగము*

 

యెషయా 13:6  

యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ ఇతర దేశాలకు దేవుడు విధించిన శిక్షకోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

     ప్రియులారా!  13వ అధ్యాయం  ఆరవ వచనం చూసుకుంటే యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని వద్దనుండి వచ్చుచున్నది అంటు యెహోవా దినము కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

       (గతభాగం తరువాయి)

 

  యోవేలు 2:15  

1. సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక.

2. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

3. వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను.

4. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.

5. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.

          

      ఈ రెండవ అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే సీయోను కొండమీద బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీదన హెచ్చరిక నాదము చెయ్యండి అంటున్నారు. హెచ్చరిక నాదము ఎప్పుడు చేస్తారు అంటే ఏదైనా ఆపద / ప్రమాదం వస్తుంది అప్రమత్తంగా ఉండండి. యుద్దానికి సిద్దంగా ఉండండి అంటూ హెచ్చరిక నాదం చేస్తారు. ఇక్కడ దేనికోసం హెచ్చరిక నాదం చెయ్యాలి అంటే యెహోవా దినం వస్తుంది కాబట్టి హెచ్చరిక నాదం చెయ్యమంటున్నారు.

ఏం? ఎందుకు చెయ్యాలి? అంటే జవాబు రెండవ వచనంలో ఉంది. యెహోవా దినం మంచిరోజు కాదు! చీకటి మహాంధకారం గలదినం అంటున్నారు.

 

   ఒకసారి ఆగి ఆలోచన చేస్తే- సీయోను కొండమీద బాకా ఊదండి అంటున్నారు. మొదటగా సీయోను కొండ అనగా ఏమిటి? అనేక శీర్షికలలో వివరించినట్లు కీర్తన 2:6 ప్రకారం సీయోను అనగా యేరూషలేము.

నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.

 ఇంకా దేవుని పట్టణము! మహారాజు పట్టణము! పరిశుద్ధ పట్టణము!

నూతన నిబంధన సంఘము పరమ సీయోనుగా కట్టబడుతుంది.

 

  ఇక బాకా కోసం ఆలోచిస్తే సంఖ్యా కాండంలో మనము ఈ బాకా నాదం కోసం చాల వివరంగా రాయబడింది. 10వ అధ్యాయంలో దేవుడు మోషేగారికి చెప్పారు రెండు బూరలు వెండితో చేయించు! అవి ఎప్పుడూ ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఒక సారి ఊదితే కేవలం ఇశ్రాయేలు నాయకులు మాత్రమే రావాలి. ఎక్కువ సార్లు మాటిమాటికి ఊదితే ఏదో అపాయం అని గ్రహించాలి. అది ప్రమాదానికి ఆపదకు సూచనగా ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ రావాలి. మొదట ఆపద సూచనగా ఊదితే తూర్పు దిక్కున ఉన్నవారు రావాలి, రెండోసారి అలాగే ఊదితే దక్షిణ దిక్కున వారు రావాలి. ఇలా రకరకాలైన పరిస్తితులు కోసం వ్రాయబడింది. అంతేకాకుండా దేవుని ప్రతిష్ట దినాలలో ఇంకా పండుగ రోజులలో కూడా ఈ భూరలు ఊదాలి అని దేవుడు చెప్పారు.  లేవీ 23:24; 25:9; హోషేయ 5:8; 8:1;

 

అయితే గమనించాలి ఇక్కడ ఈ వచనం ప్రకారం మరి ఏ రకమైన బూర ఊదమంటున్నారు దేవుడు ఇక్కడ? హెచ్చరికనాదము లేక ఆపదను సూచించే బూర! అనగా ఎక్కువ సార్లు ఊదాలి బూరను! ఎందుకు ఊదాలి అంటే యెహోవా దినము రాబోతుంది.  అది మంచిరోజు కానేకాదు! అది సమీపమాయెను అని చెప్పమంటున్నారు. గతభాగం లో చెప్పిన విధముగా సమీపముగా ఉంది అంటే వెంటనే/ తొందరలో రాబోతుంది అని కాదు! యెహోవా దినము సిద్దముగా ఉంది అని గ్రహించాలి!  అయితే దాని ETA అనగా Estimated Time of Arrival  ఎవరికీ తెలియదు! గాని ఒక్కటి మాత్రం నిజం అది వచ్చిందాదేశనివాసులంతా వణుకుదురు అంటున్నారు.

 

  ఇక ఆరోజు మంచిరోజు కాదు అనేది గతభాగంలో ధ్యానం చేసుకున్నాము!

ఆమోసు 5:18

యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్న వారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.

 

జెఫన్యా 1:15

ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.

 

అయితే యెహోవా దినము చీకటి దినము అంటున్నారు. దానినే ఇదే అధ్యాయంలో రెండుసార్లు నొక్కివక్కానిస్తున్నారు.

2:10; 31.

10. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.

31. యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

 

యెషయా గ్రంధంలో కూడా అదే రాయబడింది యెషయా గ్రంథము 13:9,10

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

 

మీదన వివరించిన వచనాలలో కూడా ఇదే వ్రాయబడింది.

రెండో వచనంలో కూడా అదే అంటున్నారు.....

ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

 

దీనినే ప్రకటన 9వ అధ్యాయంలో కూడా చెబుతున్నారు. మొదటగా పొగ వస్తుంది. ఆ పొగలోనుండి మిడుతలు రాబోతున్నాయి.

దీనినే మహా సమూహాలు/ సైన్యాలు వస్తున్నాయి అని కూడి ఇదే వచనంలో చెబుతున్నారు.  ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు మిడుతల కోసం మాట్లాడుచున్నారా లేక నిజంగా శత్రుసైన్యాలు రాబోతున్నాయా అంటే రెండూ అనుకోవచ్చు మనం! ప్రకటన 16వ అధ్యాయం ప్రకారం, ప్రకటన 19వ అధ్యాయం ప్రకారం గోగుమాగోగు యుద్ధంలోను, హార్మేగిద్దోను యుద్ధంలోను ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేఖంగా భూమిమీదనున్న సైన్యాలన్నీ కూడి యేరూషలేము మీదకు దండెత్తి వస్తాయి అని గ్రంధం చెబుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు- ఎప్పుడైతే ఇశ్రాయేలు లేక యేరూషలేము చుట్టూ దండ్లు లేక సైన్యాలు యుద్ధానికి వస్తాయో అప్పుడే అంతం రాబోతుంది ఆయన రాకడ లేక యెహోవా దినము రాబోతుంది అని గ్రహించమని చెబుతున్నారు. కాబట్టి ఆరోజు తప్పకుండా మానవ సైన్యాలు యేరూషలేము మీదకు రాబోతున్నాయి. జెకర్యా గ్రంధంలో దీనికోసం చాలాసార్లు వివరంగా రాశారు.  12:౩; 9; Zechariah(జెకర్యా) 12:3,9

3. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

 

అయితే ఈ యోవేలు 1,2 అధ్యాయాలు ప్రకారం, ఇంకా ప్రకటన 9వ అధ్యాయం ప్రకారం మిడుతలు కూడా యేరూషలేము మీదకు దండెత్తబోతున్నాయి అని గ్రహించాలి!

 

ప్రియ సహోదరి/ సహోదరుడా! ఆ రోజు చాలా సిద్దంగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?

లేకపోతే ఆ శ్రమలు నీవు పడలేవు గనుక మారుమనస్సు పొంది సిద్దపడు!

దైవాశీస్సులు!

 (ఇంకాఉంది)

*యెషయా ప్రవచన గ్రంధము*

*110వ భాగము*

 

యెషయా 13:6  

యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

 

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ ఇతర దేశాలకు దేవుడు విధించిన శిక్షకోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

     ప్రియులారా!  13వ అధ్యాయం  ఆరవ వచనం చూసుకుంటే యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని వద్దనుండి వచ్చుచున్నది అంటు యెహోవా దినము కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

       (గతభాగం తరువాయి)

 

      ఇక ఇంతవరకు ప్రభువుదినము అనగా ఏమిటి అనేది తెలుసుకున్నాము!  ప్రభువుదినము ఎప్పుడొస్తుంది అనగా దొంగ వచ్చినట్లు చెప్పకుండా వస్తుంది అని ధ్యానం చేసుకున్నాము! అదే సమయంలో దొంగలా వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు వెలుగు సంబంధులు గనుక ఆయన వచ్చేముందు ఆయన రాకడ సూచనలు నెరవేరుతూ ఉంటాయి కాబట్టి మనకు ఆయన రాకడ సమయం మనకు అర్ధమవుతుంది అని కూడా మనం ధ్యానం చేసుకున్నాము!

 

   ఇక మూడవ వచనంలో లోకులు లోకమంతా నెమ్మదిగా ఉంది భయమేమియులేదని చెప్పుకొనుచుండగా గర్భిణీస్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం వస్తుంది అప్పుడు వారెంత మాత్రము తప్పించుకోలేరు అంటున్నారు! ఇప్పుడు కూడా అందరూ అనుకుంటున్నారు అంతా బాగుంది! భయమేమి లేదు అని! అయితే ఇలాంటి సమయంలోనే ప్రభువురాకడ ఉంటుంది! మరికొందరు అనుకుంటున్నారు రాకడ వస్తుంది వస్తుంది అంటున్నారు, మా తాతలు చెప్పారు రాకడ వస్తుందని, మా తాతలు చనిపోయారు గాని రాకడ రాలేదు! మా తల్లిదండ్రులు చెబుతున్నారు మాకాపరి చెబుతున్నారు కాని రాలేదు! వీళ్ళు ఇలాగే అంటుంటారు! గాని రాకడ రాదు అని అనుకుంటున్నారు! దానికోసం పేతురు గారు రాస్తున్నారు 2పేతురు 3:312 వచనాలలో దీనికోసము రాస్తూ అంటున్నారు:..

3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,

4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

5. ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.

6. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు (త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

  అందుకే పౌలుగారు ఆత్మావేశుడై అంటున్నారు లోకులంతా లోకం నెమ్మదిగా ఉంది భయాలు ఏమీ లేవు అని చెప్పుకుంటున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ఎలా చెప్పకుండా నెప్పులు ప్రారంభమవుతాయో అలాగే ప్రజలకు నాశనం వస్తుంది అంటున్నారు! ప్రజలకు ఎంతచెప్పినా వినడం లేదు! పాపము మానడం లేదు! పాపములో నడవడం అలవాటు అయిపోయింది! అది ఎంతో రుచిగా కంటికి ఇంపుగా మనస్సుకి శరీరానికి హాయిగా ఉంటుంది! అందుకే దానినుండి బయట పడలేక పోతున్నారు! బయటపడటానికి ఇష్టపడటం లేదు! ఒకరోజు వస్తుంది ఆరోజు నీవు తప్పించుకోలేవు! ఆహాబురాజు తప్పించుకోలేక పోయాడు! సౌలురాజు తప్పించుకోలేక పోయాడు! ఇశ్రాయేలు ప్రజలను ఏలిన రాజులు తప్పించుకోలేక పోయారు! నీవు కూడా తప్పించుకోలేవు జాగ్రత్త! సామెతలు 29:1 ఎన్నిమారులు గద్దించినా వినని వానికి మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమవును ...

దేవుని గద్దింపును దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి తిరుగుతున్నావు కదా! ఆ రోజు నీకు వార్నింగ్ లేకుండా తప్పించుకొనే చాయిస్ లేకుండా మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమైపోతావు జాగ్రత్త! అప్పుడు వారెంతమాత్రము తప్పించుకోలేరు అని బైబిల్ స్పష్టముగా చెబుతుంది!

 

                   ఇశ్రాయేలు దేశంలో ఆ రోజులలో   మరికొంతమంది ప్రవక్తలు క్షేమము లేకపోయినా క్షేమం క్షేమం అంటూ వారిని దారి తప్పించారు!

 యిర్మియా 6: 14

సమాధానములేని సమయమునసమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయు దురు.

 

యెహేజ్కేలు 13: 10

సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

 

అయితే దేవుడు ఇలా తప్పుడు ప్రవచనాలను చెప్పి తన ప్రజలను మోసగించిన ప్రవక్తలకు భయంకరమైన తీర్పు తీర్చారు! నేటి దినాలలో కూడా ఆయన రాకడ సిద్దముగా ఉంటే ప్రజలను రాకడకోసం సిద్దపరచకుండా ఎప్పుడూ దేవుడు మిమ్మును దీవిస్తాడు, మిమ్ములను ఆశీర్వదిస్తాడు, మిమ్మును ఓదార్చబోతున్నారు, మిమ్మును స్వస్థత పరుస్తారు అంటూ ప్రసంగాలు చేసి ప్రజలను సోమరులను చేస్తున్నారు! రాకడకు  ఆయత్తపరచకుండా ఖండించి  గద్దించి బుద్ధిచెప్పకుండా ప్రజలు మెచ్చే ప్రసంగాలు చేస్తున్నారు! ఈ భోధకులు కూడా ఎవరూ తప్పించుకోలేరు!

 

ఇలా సిద్దపాటు లేనివారికి హటాత్తుగా నాశనం వస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది

సామెతలు 6: 15

కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.

యెషయా 10: 25

వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

 

యెషయా 47: 11

కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును.

 

యెషయా 48: 3

పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను.

 

కీర్తనలు 145: 20

యెహోవా తన్ను ప్రేమించు వారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును

 

కాబట్టి మార్పుచెంది ప్రవర్తనను సరిదిద్దుకుని దేవునితో సమాధానపడి ఆయన రాకడకు సిద్ధపడుదాము!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*యెషయా ప్రవచన గ్రంధము*

*111వ భాగము*

 

యెషయా 13:6

యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

               

    ప్రియ దైవజనమా!  మనము  యెషయా గ్రంధాన్ని ధ్యానం చేస్తూ ఇతర దేశాలకు దేవుడు విధించిన శిక్షకోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

    ప్రియులారా!  13వ అధ్యాయం  ఆరవ వచనం చూసుకుంటే యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని వద్దనుండి వచ్చుచున్నది అంటు యెహోవా దినము కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 

 

       (గతభాగం తరువాయి)

 

    ఇక మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: ప్రకటన  ఆరవ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి ఐదు ముద్రలు పూర్తి కాబడి ఆరవ ముద్ర విప్పకముందే మహాశ్రమల కాలం పూర్తి అయిపోతుంది.

 

  మహాశ్రమల కాలం అయిపోయిన వెంటనే రాకడ రావడం లేదు! దేవునితీర్పు కాలం అనబడే ప్రభువుదినము మొదలవుతుంది. మహాశ్రమల కాలంలో మొదటి అర్ధభాగం అన్యజనులలోనుండి వచ్చిన విశ్వాసులకు శ్రమలు కలుగుతాయి! ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు విరోధితో ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి శ్రమలు కలుగవు!

 

 *మహాశ్రమల కాలము అనగా దేవునిబిడ్దల మీద సాతానుడు- క్రీస్తు విరోధి మరియు వాడి అనుచరులు కలిగించే బాధలు*! *ప్రభువుదినము లేక యెహోవాదినము అనేది దేవుడు యెషయా గ్రంధంలో, యిర్మియా యెహెజ్కేలు జెఫన్యా మలాకి తదితర గ్రంధాలలో, పౌలుగారు రాసిన పత్రికలలో చెప్పబడిన దుష్టుల మీద మరియు క్రీస్తువిరోధి వాడి అనుచరుల మీద దేవుడు కుమ్మరించే ఉగ్రత*!

 

మహాశ్రమల అర్ధభాగంలోనే ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళికలో భాగంగా ఇద్దరు సాక్షులు వస్తారు! వారి ప్రవచన పరిచర్య మూలంగానే ఇశ్రాయేలు ప్రజలలో ముద్రించబడే 144000 మంది రక్షించబడతారు! వారే  రెండవ అర్ధభాగంలో మహాశ్రమలనుండి తప్పించబడి ఎక్కడో పోషించబడతారు!

 

రెండవ అర్ధభాగంలో వాడు అనగా క్రీస్తు విరోధి - దేవుడు అనబడే ప్రతీవాటిమీద తననుతాను హెచ్చించుకుని దేవాలయంలో నాశనకరమైన హేయవస్తువు నిలబెట్టిన తర్వాత యూదులు వాడిని తిరస్కరిస్తారు! కొందరు చెబుతున్నట్లు వాడిని అనగా ఏడవ నియంత అయిన క్రీస్తువిరోధిని బహుశా చంపుతారు.  వాడే అగాధం నుండి చావుదెబ్బ తిని బాగుపడిన మృగంగా మరియు ఎనిమిదవ నియంతగా వచ్చి- ఇశ్రాయేలు ప్రజలకు శోధనలు శ్రమలు కలిగిస్తాడు. దానియేలు గ్రంధము ప్రకారము మరియు ప్రకటన గ్రంధం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు కాలము కాలములు అర్ధకాలము లేక నలుబది రెండు నెలలు లేక 1260  వాడిచేతులలో హింసించ బడతారు.

 

మహా శ్రమలకాలం అయిపోయింది. అయితే ప్రకటన గ్రంధం 6వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అయిదు ముద్రలకాలంలో మహాశ్రమలకాలం పూర్తి అయిపోతుంది. అనగా ఐదుముద్రలతో మహాశ్రమలకాలం పూర్తి అయిపోతుంది. ఎందుకంటే ఆరవ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కాంతి తగ్గిపోతుంది చంద్రుడు ఎర్రగా మారిపోతాడు! ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే మత్తయి 24:29 లో సంభవించబోయే సంభవం! అక్కడ చాలా స్పష్టముగా శ్రమలు ముగిసిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఈయడు అని వ్రాసి ఉంది, చెప్పింది యేసుక్రీస్తుప్రభులవారు, 35వ వచనం ప్రకారం ఆకాశం భూమి గతించినా  నామాటలు గతించవు అని చెప్పారు కాబట్టి ఆరవ ముద్ర సమయానికి మహాశ్రమలు పూర్తి అయిపోతాయి అన్నమాట!

 

ఇక ఏడవ ముద్రతో దేవుని తీర్పులు అనబడే ప్రభువుదినము లేక యెహోవా దినము ప్రారంభమవుతుంది.. అయితే ప్రభువుదినము అనేది ఒక్కరోజులో లేక రెండు రోజులలో అయిపోవడం లేదు! యూదుల కోణంలో దేవుని తీర్పులు అనబడే ఏడుబూరలు , సంఘపు కోణంలో దేవుని తీర్పులు అనబడే ఏడు పాత్రలు జరుగుతాయి. ఇవి పూర్తి కావడానికి (నా అంచనా ప్రకారం) అయిదు నెలలు గాని లేక 45/75 రోజులు గాని పడుతుంది. (కొందరు విదేశీ దైవజనుల లెక్క ప్రకారం సంవత్సరమున్నర పడుతుంది) . అయిదునెలల కాలము ఎందుకంటే ప్రకటన తొమ్మిదో అధ్యాయంలో ఐదో బూర ఊదిన తర్వాత మిడతలు వస్తాయి. వాటికి నరులను బాధించడానికి అయిదునెలలు పర్మిషన్ ఉంది. ఇక 45 రోజులు ఎందుకంటే- దానియేలు 12వ అధ్యాయం ప్రకారం 1290 రోజులు అనగా 43 నెలలు పరిశుద్ధ స్థలం త్రొక్కబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల బలం కొట్టివేయబడుతుంది. అనగా మూడున్నర సంవత్సరాలు. గాని 12వ వచనంలో 1335 రోజులు తాళుకొనువాడు ధన్యుడు అంటున్నారు. అంటే మహాశ్రమలు ముగిసాక మరో 45/75 రోజుల వరకు దేవుని ఉగ్రతా కాలం ఉంటుంది.  ఈ 45/75 రోజులలో దాచబడిన ఇశ్రాయేలు ప్రజలు మరియు అదివరకే హింసలు పొందుచున్న బ్రతికి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు దేశంలో ఉంటారు. అక్కడ తాళుకొనువాడు ధన్యుడు అంటున్నారు అంటే బహుశా ఈ 45/75 రోజులు కూడా వాడు వీరిని హింసించడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు! అంతేకాదు ఏర్పరచబడిన వారికోసం ఆ దినములు తక్కువ చేయబడతాయి అని వ్రాయబడిన ప్రకారం  ఈ దినములు- శ్రమలకాలం తక్కువ చేయబడుతుంది  బహుశా ఈ  5 నెలల కాలం గాని  45 రోజులు కాలం గాని మహా శ్రమల కాలంలో కుదింపు చేయబడవచ్చు! లేదా మూడున్నర సంవత్సరాల కాలం కుదించబడవచ్చు!  ఇదే 45/75 రోజులలో అక్కడ ఉజ్జీవం కలుగుతుంది. అప్పుడు జెకర్యా గ్రంధం 12వ అధ్యాయంలో చెప్పబడిన విధముగా విలపిస్తారు. అప్పుడు 144000 మంది ముద్రించబడిన వారు మరియు విలపించి పశ్చాత్తాప పడిన ఇశ్రాయేలు ప్రజలు మొత్తం అందరూ రక్షించబడతారు రోమా 11:27 ప్రకారం! వెంటనే దేవుడు వారి పక్షముగా యుద్ధము చేయడానికి వస్తారు ఒలీవల కొండమీదికి! అదే రెండవరాకడ!

 

     అయ్యా! నాకు  ఇదీ నాకు అర్ధమయ్యింది నేను గ్రహించింది మాత్రమే నేను రాస్తున్నాను! దీనితో మీరు ఏకీభవిస్తే ఏకీభవించవచ్చు లేకపోతే వదిలెయ్య వచ్చు! అయితే ఇలానే జరుగుతుంది అని చెప్పకూడదు!

 

ఇది మీకు రాబోయే సంఘటనలు బాగా అర్ధం చేసుకోవాలని ముందుగానే వివరిస్తున్నాను!

 

ఆ క్రీస్తు విరోధి రాకడ అతి దగ్గరలో ఉంది. మరి ఆయన రహస్య రాకడ అంతకంటే ముందుగానే వస్తుంది. మరి నీవు ఎత్తబడటానికి సిద్దంగా ఉన్నావా?

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*112వ భాగము*

 

యెషయా 13:6

6. యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

 

     ప్రియా  దైవజనమా! మనము ఇంతవరకు యెహోవా దినము అనగా ఏమిటి? అది మంచిదా చెడ్డదా అనే వివరాలు చూసుకున్నాము! ఇక మరలా మన పాఠ్య భాగ్యమునకు వచ్చేద్దాం!  ఈ ఆరవ వచనంలో  అంటున్నారు యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అంటున్నారు! ఎందుకంటే అది సర్వశక్తుడగు దేవుని వద్దనుండి వస్తుంది అంటున్నారు! ఇక్కడ మన తెలుగు తర్జుమాలో ఘోషించుడి అని ఉన్నది గాని ప్రాచీన ప్రతులలో ఇంకా ఇంగ్షీషు బైబిల్ లో రోధనం చేయుడి లేక కేకలు వేయుడి అని తర్జుమా చేయబడింది. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ లో ఎలా వ్రాయబడి ఉందో చూసుకుందాం!

 

Howl you; for the day of the LORD is at hand; it shall come as a destruction from the Almighty.

 

చూడండి ఏమని వ్రాయబడిందో: అందరూ కేకలు వేయండి, రోధనం చేయండి ఎందుకంటే సర్వశక్తుడగు దేవుని నుండి నాశనం వస్తుంది.  అయితే మన తెలుగులో యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును. అని తర్జుమా చేయబడింది.  ఇంకా దీనికోసం వివరంగా చూసుకుంటే రోధనము ఇంకా కేకలు వేయమంటున్నారు ఎందుకంటే మొదటగా

 

1). సర్వశక్తుడగు దేవుని నుండి నాశనం అనేది ప్రళయము వలె వస్తుంది! ఇంకా ఇదే అధ్యాయములో ముందుకు పోతే

 

2) 9 వ వచనంలో అంటున్నారు 9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

 

3) 10 వ వచనంలో 10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

 

4) ఇంకా క్రిందికి చదువుకుంటే పోతే 11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12. బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.

13. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.

15. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును

16. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ గొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.

17. వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు

20. అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ నియ్యరు

21. నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును

22. వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.

 

చూశారా ఎంత వివరముగా వ్రాయబడిందో!! యెహోవా దినము అనేది సమీపిస్తే ఏమేమి జరుగబోతున్నాయో చాలా వివరంగా చెప్పారు దేవుడు ఇక్కడ! అందుకే విలపించుడీ రోధనము చేయండి అంటున్నారు యెషయా గారు! దేశాన్ని పాడుచేయుటకు అందులోనుండి పాపి అనేవాడు లేకుండా చేయడానికి దేవుని ఉగ్రత రాబోతుంది అప్పుడు మనుష్యులు బంగారము కంటే ఓఫీరు బంగారం అనగా శ్రేష్టమైన బంగారం కంటే మనుష్యులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే వారంతా శత్రువుల యొక్క వధలో హతం చేయబడతారు ఇంకా దేశమంతా వట్టిదై పోతుంది అంటున్నారు!

 

యిర్మీయా ప్రవక్త మరియు యోవేలు ప్రవక్త కూడా ఇదే విధముగా ప్రవచించారు!..

 

ఈరోజు ఈ వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మరియు సమస్త జనులకు చెబుతున్నారు: మీరు కూడా రోధనం చేయండి, ఎందుకంటే యెహోవా దగ్గరనుండి యెహోవా దినము అనే నాశనం దేవుని ఉగ్రత రాబోతుంది. దానిని తప్పించుకోవాలి అంటే రాకడలో ఎత్తబడాలి. లేకపోతే దానిని తప్పించుకోవడం అసాధ్యం! మరి నీ భర్త  లేక నీ భార్య లేక నీ పిల్లలు, లేక నీ బంధువులు , ఇంకా నీ ఇరుగుపొరుగువారు నీ గ్రామస్తులు రక్షణ పొందలేదే, ఇప్పుడు ప్రభువు దినము వస్తే వారంతా నరకానికి పోతారు ఇంకా దేవుని ఉగ్రతాదినములో భాధలు అనుభవిస్తారు! మరి అలా నశించిపోవడం నీకు మంచిదా? వారి ఆత్మలకు లెక్క ఒకరోజు దేవుడు నిన్ను ఆడగరా?

 

కాబట్టి నేడే విలపించు! మొర్రపెట్టు! భక్తుడు జాన్ నాక్స్: నా దేశాన్ని రక్షిస్తావా లేక నన్ను చంపేస్తావా అని ప్రార్ధించి ప్రార్ధించి ప్రేగులు భయటకు వచ్చి ప్రాణాలు వదిలారు! వెంటనే దేశం మొత్తం రక్షించబడింది! నీకు అలాంటి ప్రార్ధన మరియు ఆత్మల పట్ల భారము ఉందా?

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*113వ భాగము*

 

యెషయా 13:6 10

6. యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

7. అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును

8. జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

 

     ప్రియా  దైవజనమా! మనము ఇంతవరకు యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము! గతభాగంలో యెహోవా దినము ప్రళయము వలె వస్తుంది అది సర్వశక్తుడైన దేవుని నుండి వస్తుంది అందుకే గట్టిగా ప్రలాపించండి ఏడవండి అనే విషయం కోసం ధ్యానం చేస్తూ ఎందువలన గట్టిగా ఘోషించమని చెబుతున్నారో క్లుప్తంగా చూసుకున్నాము. ఈరోజు కూడా దానినే కొనసాగిద్దాం!

 

ఎందువలన ఘోషించమంటున్నారు అంటే 7 వ వచనం ప్రకారం ఆ యెహోవా దినమున బాహువులు అనగా యుద్దవీరుల భుజములు దుర్భలము అనగా బలము లేకుండా అయిపోతాయి అంటున్నారు. ఇంకా ప్రతివాని గుండె కూడా కరిగిపోతుంది అంటున్నారు! ఎందుకంటే దేశంలో జరుగబోయే హత్యలు వధలు అంతా ఘోరంగా ఉండబోతున్నాయి అన్నమాట!

 

ఇక 8 వ వచనంలో  జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.  చూశారా ఎలా ఉండబోతుందో ఆ దినము! జనులు విభ్రాంతి నొందుతారు వేదనలు దుఖములు కలుగుతాయి ప్రసవించు స్త్రీ ఎలాంటి భాధ పడుతుందో అలానే బాధపడతారు అంటున్నారు!

 

గమనించాలి ఇలా జరుగుతుంది అని కేవలం యెషయా గారు మాత్రమే కాకుండా చాలామంది భక్తులు ప్రవచించినారు.

 

యెషయా 21:3

కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.

యెషయా 21:9

ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

 

యెషయా 37:27

కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

 

యిర్మియా 4:9

ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులును ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయ మొందుదురు.

యెహేజ్కేలు 27:35

నిన్ను బట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్న బోవును.

 

ఇక తొమ్మిదవ వచనంలో మరోసారి రెట్టిస్తున్నారు యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

 

చూడండి ఇక్కడ మరో కారణం చెబుతున్నారు యెహోవా దినము రావడానికి: దేవుడు పాపి అనేవాడు దేశంలో ఉండకుండా చేయడానికే యెహోవా దినము అనే దానిని ఏర్పాటుచేశారు!

 

 ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో- ఒకవేళ నీవు పాపివైతే దేవుడు నిన్ను దేశంలో ఉండకుండా చేసేస్తారట ఆ యెహోవా దినమందు!! ఆ యెహోవా దినమును నీవు తప్పించుకోవాలంటే తప్పకుండా నీ పాపములనుండి నీవు విడుదల పొందాలి! నీవు పాపివా అయితే మొదటగా యెహోవా దినము, రెండు ఘోర నరకమును తప్పించుకోలేవు అని తెలుసుకో!!!

 

యిర్మీయా గారు కూడా ఇదే అంటున్నారు:

యిర్మియా 25:18

నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగిం చితిని.

యిర్మియా 25:31

భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరు లందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టు లను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 25:33

ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.

 

అయితే ఏసయ్య అంటున్నారు నేను పాపులను పిలువ వచ్చితిని మత్తయి 9:13 - కాబట్టి ఇప్పుడు నీవు నీ పాపములనుండి  విడుదల పొందాలి అంటే క్రీస్తుయేసు రక్తములో కడుగబడాలి అప్పుడే నీవు పవిత్రుడవు కాగలవు!! అలా కడుగబడాలి అంటే నీవు నీ పాపాలు ఒప్పుకోవాలి! 1 యోహాను 1:7

1యోహాను 1:7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

ఇక పాపులను దేశములో ఉండకుండా చేయడానికి ఇంకా పాపాలను నశింప జేయడానికి క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది అనగా యెహోవా దినము వచ్చును అంటున్నారు! ఉగ్రత అనేమాట చూసుకుంటే బైబిల్ గ్రంధం మొత్తం పాపులమీదికి దుష్టులమీదికి దేవుని ఉగ్రత వస్తుంది రాబోతుంది అంటూ చెబుతూ ఉంది! ముఖ్యంగా యెషయా గ్రంధం, యిర్మీయా గ్రంధం, యోవేలు, యెహేజ్కేలు ఇంకా ప్రకటన గ్రంధం ఇవన్నీ దీనినే చెబుతున్నాయి!

 

మరి ఆయన ఉగ్రత మరియు ఆయన ప్రచండ కోపము తొందరలో కురువబోతుంది మరి నీవు దానిని తప్పించుకోడానికి సిద్దంగా ఉన్నావా? ఆయన రాకడలో ఎత్తబడతానికి సిద్ధపడి ఉన్నావా? లేకపోతే ఆ యెహోవా దినమును మరియు నరకమును తప్పించుకోలేవు సుమీ! నేడే మారుమనస్సు పొంది రక్షణ పొందుకో! రాబోయే దేవుని ఉగ్రతను తప్పించుకో!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*114వ భాగము*

 

యెషయా 13:9  10

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

 

     ప్రియా  దైవజనమా! మనము ఇంతవరకు యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!

 

                      (గతభాగం తరువాయి)

 

ఇంకా యెహోవాదినము కోసం ధ్యానం చేసుకుంటూ ముందుకుపోతే- ఈ 10 వ వచనంలో అంటున్నారు ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

 

చూడండి ఇదే మాట యేసుక్రీస్తుప్రభులవారు కూడా అన్నారు! అనగా యేసుక్రీస్తుప్రభులవారు ఈ ప్రవచనమును పునరుధ్ఘాటించకముందే 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా గారు ప్రవచించారు! యెషయా గారు ప్రవచించిన 700 సంవత్సరాలు తర్వాత మత్తయి 24 వ అధ్యాయంలో యేసయ్య మరలా చెప్పారు దీనిని!

 

మత్తయి 24:29, మార్కు 13:24, లూకా 21:25,

Matthew(మత్తయి సువార్త) 24:29,30

29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

 

Mark(మార్కు సువార్త) 13:24,25,26

24. ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,

25. ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

26. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.

 

Luke(లూకా సువార్త) 21:24,25,26,27

24. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును.

25. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.

26. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.

27. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.

 

మరలా యేసుక్రీస్తుప్రభులవారి పునరుత్థానం తర్వాత సుమారు 60 సంవత్సరాల తర్వాత అనగా క్రీ. శ. 93 ప్రాంతంలో మరలా ఇదే ప్రవచనం చెప్పబడింది! అనగా ఈ ప్రవచనములో చెప్పబడింది నూటికి నూరుపాళ్లు జరిగి తీరుతుంది అన్నమాట!

 

 ప్రకటన గ్రంథం 6:13-14, ప్రకటన గ్రంథం 8:12

Revelation(ప్రకటన గ్రంథము) 6:12,13,14

12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

 

 Revelation(ప్రకటన గ్రంథము) 8:12

12.నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.

 

అయితే ప్రకటన గ్రంధంలో చెప్పబడిన విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే  ముద్రలు విప్పేటప్పుడు. ముఖ్యంగా ఆరవ ముద్రను విప్పేటప్పుడు ఈ వచనంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరుతుంది అన్నమాట! ఆరవ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందున్న యోహాను గారి ఆత్మ నేత్రము ఒక్కసారి భూమ్యాకాశముల వైపు మళ్లుకొనినట్టు గ్రహించ గలము. ఆకాశములోని గ్రహములు గతి తప్పినట్లున్నవి. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది (రోమా 8:19) అను పౌలుగారి మాటలు మనకు స్మరణకు వచ్చున్నవి కదా.

 

యేసయ్య సైతము చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును (మత్త 24:29) అని చెప్పారు. క్రీస్తు సిలువ దృశ్యము చూడలేక నాడే సూర్యుడు అదృశ్యుడాయెను (లూకా 23:45). కొండలు ద్వీపములు స్థానములు తప్పుట అనగా మహా భూకంపము కలిగెను.

 

ఆదిలోనే ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది (ఆది 3:17) అన్నారు. మనుష్యుల పాపములు ఆకాశమునంటుచున్నవి (ప్రక 18:5). వారి పాపము బహు భారమైనది (ఆది 18:20).

 

అవును ప్రభువా, మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది (ఎజ్రా 9:6). కనికరించి కరుణ చూపుము ప్రభువా అని భక్తుడైన ఎజ్రాగారు ప్రార్ధించిన విధంగా ప్రార్ధన చేద్దాం.

 

అయితే మత్తయి 24:  చూసుకుంటే ఆ దినములలో శ్రమ ముగిసిన తర్వాత అనేమాటను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి: దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే మొదటగా ఈ సంభవము శ్రమల కాలము ముగిశాక జరుగుతాయి అని గ్రహించాలి! ఇక రెండవది అనగా మొదటి ఐదు ముద్రల కాలములోనే శ్రమల కాలము మరియు మహా శ్రమల కాలము ముగిసిపోతున్నాయి అని గ్రహించాలి! ఆ తర్వాతనే యేసుక్రీస్తుప్రభులవారి ప్రత్యక్ష రాకడ జరుగుతుంది అని గ్రహించాలి. అప్పుడు చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును (మత్త 24:29) అనేది నెరవేరుతుంది. కాబట్టి నేడే ఆయన రాకడకు సిద్దపడు! సిద్దపడకపోతే నీవు నరకవేదన మరియు యెహోవా దినమును తప్పించుకోలేవు! నేడే మార్పునొంది రక్షణ పొంది శిక్షను తప్పించుకో!!!

 

 ప్రభువు మన ఆత్మలకు తోడై యుండును గాక. ఆమెన్!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*115వ భాగము*

యెషయా 13:1114

11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12. బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.

13. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.

14. అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱెలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.  

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!  

 

     (గతభాగం తరువాయి)

 

ఇంకా 11 వ వచనంలో చూసుకుంటే లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను అంటున్నారు. నిజానికి ఈ మాట ఈ గ్రంధం మొదటనుండి  చెబుతున్నారు.

 

Isaiah(యెషయా గ్రంథము) 2:9,10,11,14,15,17,19,20

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

14. ఉన్నత పర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

 

నిజానికి ఈ మాటలు బాబిలోను సామ్రాజ్య పతనం కోసం చెప్పబడ్డాయి గాని ఇవి భూలోక దేశాల ప్రజలందరికీ వర్తిస్తాయి అని గ్రహించాలి. కారణం యెహోవా దినము అనేది కేవలం బబులోనూ వారికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి అని గుర్తుకు చేసుకోవాలి!

 

ఇక్కడ, మాదీయులు మరియు పర్షియన్ల చేతిలో బాబిలోన్ యొక్క వినాశకరమైన పతనాన్ని మనం చూస్తున్నాము. ఒకప్పుడు అహంకారంతో, గర్వంగా, భయంతో వర్ధిల్లుతున్న రోజుల్లో వాళ్లు ఇప్పుడు కష్టాల్లో పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. వారి ముఖాలు మంటలచే కాలిపోతాయి మరియు అన్ని సౌకర్యాలు మరియు ఆశలు మసకబారుతాయి. నక్షత్రాలు, సూర్యుడు వంటి ఖగోళ వస్తువులు తమ ప్రకాశాన్ని కోల్పోయి మరుగున పడతాయి. దేశాల తిరుగుబాటు మరియు పతనాన్ని వర్ణించడానికి ప్రవక్తలు ఈ రకమైన చిత్రాలను తరచుగా ఉపయోగిస్తారు. దేవుడు వారి దోషాలకు, ప్రత్యేకించి అహంకారపు పాపానికి, శక్తిమంతులను కూడా అణగదొక్కే విధంగా శిక్షిస్తున్నాడు. భయం యొక్క విస్తృత భావం ప్రబలంగా ఉంటుంది మరియు ప్రకటన గ్రంథం 18:4లో చెప్పబడినట్లుగా, బాబిలోన్‌తో తమను తాము కలుపుకునే వారు ఆమె తెగుళ్లలో పాలుపంచుకోవాలని ఎదురుచూడాలి. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఆస్తులన్నింటినీ ఇష్టపూర్వకంగా త్యాగం చేస్తారు, కానీ ఎవరి సంపద కూడా మరణం నుండి బయటపడదు. మానవుల క్రూరత్వం మరియు అమానవీయత గురించి ఆలోచించడానికి మరియు మానవ స్వభావం యొక్క లోతైన అవినీతిని గుర్తించడానికి కొంత సమయం కేటాయించండి. అమాయక శిశువులు కూడా బాధపడుతున్నారు, జీవితాన్ని దాని ప్రారంభం నుండి ఖండించే స్వాభావిక అపరాధం యొక్క ఉనికిని హైలైట్ చేస్తుంది. ప్రభువు దినం నిజానికి ఇక్కడ వివరించబడిన వాటన్నింటిని మించి తీవ్రమైన కోపం మరియు కోపంతో కూడిన ఒక భయంకరమైన సంఘటనగా ఉంటుంది. పాపులకు ఆశ్రయం లేదా తప్పించుకునే మార్గం ఉండదు, అయితే కొంతమంది మాత్రమే ఈ వాస్తవాలను నిజంగా విశ్వసిస్తున్నట్లు జీవిస్తున్నారు.

 

సరే, 11 వ వచనంలో ఎందుకు యెహోవా దినము అనేది అంత కఠినముగా ఉండబోతుంది అంటే లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను. ఇక్కడ మూడు విషయాలు చెబుతున్నారు దేవుడు. మొదటిది లోకుల  చెడుతనము. రెండు దుష్టుల యొక్క ధోషములు , మూడు అహంకారుల యొక్క అతిశయము!! ఈ మూడింటి వలన దేవుని మహా ఉగ్రత వారిమీదికి రాబోతుంది అని గ్రహించాలి. ప్రియ చదువరీ ఒకవేళ పై మూడింటిలో ఏదైనా నీలో ఉంటే నిన్ను కూడా దేవుడు శిక్షించగలరు కాబట్టి నీలో ఒకవేళ చెడుతనము గాని, అహంకారము గాని దోషము గాని ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి క్రీస్తుయేసు ప్రవిత్ర రక్తములో కడిగి వేసుకొని పవిత్రుడవు కమ్ము!

 

ఇక 12 వ వచనంలో అంటున్నారు బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను. చూడండి ఎంతటి ఘోరమైన మాటనో కదా!

 

నిజానికి ఈ ప్రవచనం గతంలో చెప్పినట్లు అనేకసార్లు జరిగినది బబులోనూ విషయములో! కేవలం బబులోనూ విషయంలో కాకుండా ఇశ్రాయేలు దేశం విషయంలో ఇంకా యూదా రాజ్యం విషయంలో కూడా మూడుసార్లు జరిగినది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు! మాటిచ్చి జరిగించే దేవుడు ! ఇప్పుడు యెహోవా దినము కోసం వాగ్ధానం చేసిన దేవుడు తప్పకుండా దానిని జరిగించ గలరు కాబట్టే భయము నొంది పాపమును విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడుము!

 

దైవాశీస్సులు!

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*116వ భాగము*

 

యెషయా 13:1114

11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12. బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.

13. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.

14. అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱెలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.  

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!  

 

                                 (గతభాగం తరువాయి)

 

           ప్రియులారా! ఇక 13 వ వచనం చూసుకుంటే సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకు ఇంకా ఆయన కోపాగ్ని దినమునకు ఆకాశము వణకి పోతుంది  భూమి తన స్థానము తప్పిపోతుంది అంటున్నారు.  ఎందుకంటే ఆయన ఉగ్రత అంత తీవ్రముగా ఉంటుంది. ఇదేమాట మనకు ప్రకటన గ్రంధంలో కూడా వ్రాయబడి ఉంది. గతభాగాలలో వివరించినట్లు మరలా ఆరవ ముద్ర విప్పిన వెంటనే ఆకాశము చుట్టబడిన గ్రంధం వలె తొలిగిపోతుంది ప్రతి కొండ ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పిపోయేను అంటున్నారు. 

ప్రకటన 6:1217 ..

12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

16. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

 

ఇక 14 వ వచనములో అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱెలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు అంటున్నారు  మరలా ప్రకటన ఆరవ అధ్యాయంలో కూడా దీనికోసం వ్రాయబడి ఉంది..

15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

16. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

 

ఇక 15-16 వచనాలు చూసుకుంటే 15. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును

16. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ గొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.

ఇది ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే 17 వ వచనం కూడా చూసుకోవాలి. 17. వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే దేవుడు బబులోనూ వారిని నశింపజేయడానికి మాదీయులను రేపి వారిద్వారా బబులోనూ అంతమును శాసించారు అన్నమాట! గతభాగాలలో చెప్పడం జరిగింది బబులోనూ అధికారమును మాదీయులు తాము స్వయముగా ఎదిరించలేకపోయి నందువలన వారు పారశీకులతో కలిశారు. అప్పుడు మాదీయ పారశీక అలయన్స్ గా ఏర్పడి బబులోనూ సామ్రాజ్యమును అంతము చేశారు.  మాదీయులు పారశీకులు ఇద్దరు ప్రస్తుతం ఇరాన్ దేశానికి చెందిన వారే అని గ్రహించాలి! వీరు ఇప్పుడు అలయన్స్ గా మారి బబులోనూ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు అని ముందుగానే చెబుతున్నారు! అందుకే కీర్తన 137 వ అధ్యాయంలో అంటున్నారు

 

8. పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు

9. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.

 

ఇక  ప్రకటన గ్రంథం 18:6లో ఇంకా యిర్మీయా గ్రంధంలో కూడా దీనికోసం వ్రాయబడి ఉంది.

ప్రకటన గ్రంథం 18:6

అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

 

కీర్తనలు 137:8

పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు

కీర్తనలు 137:9

నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.

 

యిర్మియా 50:14

ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి

యిర్మియా 50:15

చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.

యిర్మియా 50:29

బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి.

యిర్మియా 50:30

కావున ఆ దినమున దాని యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు.

 

ఇక 18,19 వచనాలలో అంటున్నారు 18. వారి విండ్లు ¸యౌవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు.

19. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.

 చూడండి బబులోను నగరం గురించిన దేవోక్తులు. అది అందమైన నగరం. దాన్ని పరిపాలించే గొప్ప రాజుకు అది గర్వకారణం. దానియేలు 4:28-30 చూడండి. బబులోను దక్షిణ ప్రాంతమే కల్దీయుల దేశం. బబులోను సొదొమ, గొమొర్రాలాగా అయింది. అయితే ఈ పోలిక వాటిని నాశనం చేసేందుకు దేవుడు అవలంబించిన విధానాన్ని బట్టి కాదు. వాటి అంతంలాగే బబులోను అంతం కూడా ఉందని భావం. యిర్మియా 51:29, యిర్మియా 51:37-43, యిర్మియా 51:62 చూడండి.

చూడండి గర్వించిన వారికి దేవుడు తీర్చిన తీర్పులు! ఒకవేళ నీకు కూడా ఇలాంటి గర్వము ఉంటే దేవుడు నిన్ను కూడా అలా చేయగలరు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*117వ భాగము*

 

యెషయా 13:

19. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.

20. అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ నియ్యరు

21. నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును

22. వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!   ముఖ్యంగా బబులోను దేశం మీద దేవుని తీర్పును ధ్యానం చేస్తున్నాము!

 

                                 (గతభాగం తరువాయి)

 

   ఇక 20 వ వచనం నుండి చివరి వరకు చూసుకుంటే అది అనగా బబులోను మరెన్నడు నివాస స్థలముగా ఉండదు తరతరములకు దానిలో ఎవడును కాపురం చేయడు అరబీయులలో ఒకడైన అక్కడ గుడారం వేయడు అంటున్నారు. గమనించాలి బైబిల్ గ్రంధంలో ఎక్కడైనా అరబీయుడు అనగా అరబ్ దేశాలలో నివశించే వారు అనే అర్ధమే కాకుండా వ్యాపారస్తులు అనే అర్ధం కూడా ఉంటుంది.  ఇంకా చూసుకుంటే నక్కలు ఆ దేశంలో పండుకుంటాయి గురుపోతులు వారి ఇళ్ళలో నివాసం చేస్తాయి ఇంకా వారి నగరులలో నక్కలు అడవి కుక్కలు ఉంటాయి. ఇదే ప్రవచనం ప్రకటన గ్రంధం 18 వ అధ్యాయం మొత్తంలో కనిపిస్తుంది. ఇంకా యెహేజ్కేలు గ్రంధంలో కూడా విస్తారంగా ఈ బబులోనూ దేశం మీద దేవుని తీర్పులు కనిపిస్తాయి. 

 

Revelation(ప్రకటన గ్రంథము) 18:2,3,5,6,7,8,16,17,18,22,23,24

2. అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను - మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.

3. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.

5. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.

6 .అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

7. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.

8. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు,(లేక దెబ్బలు) అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.

16. అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడై పోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచందురు.

17. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి

18. ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి

22. నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,

23. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.

24. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.

 

అవును ఈ ప్రవచనాలు నిజంగా అక్షరాలా జరిగాయి! ఎప్పుడు అంటే క్రీ. పూ 539 లో కోరేసు అనే రాజు బెల్షశర్ అనే రాజును హతమార్చి మాదీయ పారశీక సామ్రాజ్యాన్ని స్థాపించారు . అప్పుడు ఈ గ్రంధములోనూ యెహేజ్కేలు ప్రకటన గ్రంధాలలో వ్రాయబడిన అంశాలు అన్నీ నెరవేరాయి.  అయితే తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే ఇది మరోసారి నెరవేరబోతుంది ఎప్పుడు అంటే అంత్యకాలంలో!

 

దేవుడు చెప్పిన ప్రతీ అంశము నెరవేరబోతున్నాయి. మరినీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన మాటలకు విధేయత చూపిస్తున్నావా?

 

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*118వ భాగము*

 

యెషయా 14: 16

1. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు

2. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

3. తమ్మును బాధించినవారిని ఏలుదురు.

4. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

5. దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.

6. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!   ముఖ్యంగా బబులోనూ దేశం మీద దేవుని తీర్పును ధ్యానం చేస్తున్నాము!

 

                     (గతభాగం తరువాయి)

 

   ఇక 14 వ అధ్యాయంలో కూడా అదే బబులోనూ నాశనం కోసరమే చెబుతున్నారు! కాబట్టి ఈ 14 వ అధ్యాయం 23 వ వచనం వరకు బబులోనూ కోసమే వ్రాయబడి ఉంది అని గ్రహించాలి! మధ్యలో ఇశ్రాయేలు కోసమైన ఆదరణ వాక్యాలు, ఇంకా లూసీఫర్ పతనం కోసం కూడా ప్రవచన రూపంగా చెప్పబడింది!!!

 

సరే ఇక్కడ 16  వచనాలలో ఇశ్రాయేలు దేశం కోసమైన ఆదరణ వచనాలు దేవుని నుండి కనిపిస్తున్నాయి మనకు! 1. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు

2. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

3. తమ్మును బాధించినవారిని ఏలుదురు.

 

చూడండి దేవుడు యాకోబు మీద జాలిపడును అంటున్నారు! అనగా ఇది అనగా ఈ ప్రవచనం ఇశ్రాయేలు ప్రజలు మరియు యూదులు చెరలోనికి వెళ్లకముందే వ్రాయబడినవి అని గ్రహించాలి! ఇక్కడ దేవుడు యూదులను ఇశ్రాయేలు ప్రజలమీద  దేవుడు కరుణించి వారిని చెరలోనుండి తిరిగి రప్పిస్తారు అనే విషయం చెప్పబడింది!  ఇక జనములు అనగా ఏఏ ప్రాంతాలలోకి ఇశ్రాయేలు- యూదులు చెదిరిపోయారో అక్కడి జనులు ఇశ్రాయేలు ప్రజలను వారి స్వదేశమునకు తీసుకుని వస్తారు అంటున్నారు! అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే తమను బాధపెట్టారో వారిని తమాయొక్క దాసులుగాను పనికట్టెలు గాను చేస్తారు అంటున్నారు. ఎవరైతే తమ్మును బాధించారో వారిని ఇశ్రాయేలు ప్రజలు ఏలుతారు అంటున్నారు!

 

ధర్మశాస్త్రం పొల్లు పోకుండా నెరవేరవలసి ఉన్నట్టే ప్రవక్తల వచనాలన్నీ కూడా తు.చ. తప్పక నెరవేరాలి. ఈ వచనాలన్నీ (ముఖ్యంగా 2వ వచనం) యూదులు బబులోనునుండి స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు పూర్తిగా నెరవేరలేదన్నది స్పష్టమే. ఇస్రాయేల్ వారు తమను వధించిన వారిపై, చెరపట్టిన వారిపై ఇలాంటి అధికారాన్నీ, పరిపాలననూ చెలాయించినట్టు చరిత్ర ఆధారాలు ఈనాటికీ లేవు. కాబట్టి దీని సంపూర్ణమైన నెరవేర్పు రాబోయే కాలంలో ఉంటుందని భావించాలి. అయితే  1వ వచనంలో ‘దేవుడు మరో సారి ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును అనే మాటను గమనించండి అంటే కొంతకాలంపాటు వారిని వదిలేశారన్నమాట. ఒకసారి మత్తయి 21:43 చూసుకుంటే

43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. అలాగే జరిగింది కదా! అయితే దీనికోసం ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే

 

  మత్తయి 19:28; 28. యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.

 

అపో. కార్యములు 1:6-7లో శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తుప్రభులవారిని

 

6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన

7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.

 

కాబట్టి ఈ ప్రవచనం పూర్తిగా ఇంకా నెరవేరలేదు అయితే 1948 లో మే 14 వ తారీకున ఇశ్రాయేలు ప్రజలు యొక్క ఇండిపెండెన్స్ కలిగాక కూడా ఈ వచనాలు సంపూర్తిగా ఇంకా నెరవేరలేదు అని గ్రహించాలి! అవి యుగాంతములో నెరవేరబోతున్నాయి అని తెలుసుకోవాలి! అప్పుడే ఇశ్రాయేలు వారు తమను బాధించిన వారిని ఏలడం జరుగుతుంది.

 

నిజానికి మనకు రెండు బబులోనులు కనిపిస్తాయి మనకు బైబిల్ గ్రంధంలో! మొదటిది నిజమైన బబులోనూ ఇది దక్షిణ ఇరాక్ ప్రాంతానికి చెందినది! ఇది ఇంతవరకు చాలాసార్లు  నాశనం చేయబడింది. ఈ మధ్యనే అమెరికా వారిద్వారా సర్వనాశనం చేయబడింది. ఇక మరో బబులోనూ మనకు ప్రకటన 17 మరియు 18 అధ్యాయాలలో కనిపిస్తుంది. ఇది సాదృశ్య రూపకమైన బబులోనూ. ఇది పునరుత్తరించబడబోయే రోమా సామ్రాజ్యము మరియు రోమన్ కేథలిక్ సంఘాన్ని సూచిస్తుంది. దీని పతనం శ్రమల కాలంలో జరుగుతుంది.

 

ఇక ముందుకుపోతే మనకు చర్య విముక్తి కలిగాక తమను బాధించేవారిని వారు ఏలేటప్పుడు ఏమి జరుగబోతుందో 46 వచనాలు చెబుతున్నాయి.

4. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

5. దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.

6. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.

 

ఇక్కడ కఠిన దాస్యము మరియు దుష్టుల దుడ్డుకర్ర అనగా బాబిలోను వారి కఠిన అధికారం ఇశ్రాయేలు ప్రజలతో వారు చేయించుకున్న కఠిన దాస్యమును సూచిస్తుంది. యెషయా  10

5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

 

యెషయా  10

24. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును

 

అవును దేవుడు తన ప్రజలమీద నిత్యము కోపించే దేవుడు కానేకాదు! వారియెడల జాలిపడే దేవుడు!

 

నిత్యము కోపపడడు!

కీర్తనలు 7:11

న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

మీకా 7:18

తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

 

జాలిపడే దేవుడు..

కీర్తనలు 103:13

తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.

 

యెషయా 14:1

ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు

యెషయా 54:10

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*119వ భాగము*

యెషయా 14: 13

7. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని

8. నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును

9. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది

10. వారందరు నిన్ను చూచినీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు.

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!   ముఖ్యంగా బబులోనూ దేశం మీద దేవుని తీర్పును ధ్యానం చేస్తున్నాము!

 

                     (గతభాగం తరువాయి)

 

        ఇక ఏడవ వచనం నుండి చూసుకుంటే భూలోకమంతా నిమ్మలించి విశ్రమిస్తుంది జనములు పాటలు పాడుతున్నారు నీవు పండుకొనిన దగ్గరనుండి మమ్మల్ని చంపేవాడు నరికేవాడు ఎవడూ లేదు అని కేవలం మనుష్యులఎ కాకుండా చెట్లు అనగా తమాలవృక్షాలు లెబానోను వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి అంటున్నారు! ఇది బబులోనూ నాశనం అయ్యాక జరిగే సంఘటనలు అని గ్రహించాలి! గమనించాలి బబులోనూ నాశనం అయ్యాక మాదీయ పారశీక అలయన్స్ వారు పాలన చేపట్టాక ఈ సంతోషం ఎంతో కాలం నిలువలేదు! వృక్షాలు హర్షించడం అంటే పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు ముట్టడి దిబ్బ కట్టేవారు! ఆ పట్టణం వారు ఎవరూ తప్పించుకుని పారిపోకుండా కోట చుట్టూ చెట్లు నరికి చెట్లతో దడి కట్టేవారు.  మరి ఒక పట్టణం చుట్టూ దడి కట్టాలంటే కొన్ని లక్షల చెట్లు అవసరం. అందుకే ఇప్పుడు చెట్లు సంతోషిస్తున్నాయి!

 

ఇక 910 వచనాలు ఒక క్రొత్త విషయాన్ని చెబుతున్నాయి! బబులోనూ నాశనం అయ్యాక పాతాళ లోకంలో మిగిలిన దేశాల వారు నీవు కూడా మాలాంటి వాడవు అయిపోయావా అంటూ గేలి చేస్తున్నట్లు చూస్తున్నాము! ఇంకా పాతాళ లోకమే కలవరపడుచున్నట్లు చూస్తున్నాము. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది. దీనికోసమైన సంపూర్ణ అవగాహన నా దగ్గర లేదు. వీటికోసం నేను అంతగా చదువుకోలేదు తెలుసుకోలేదు. అయితే ఇలాంటి సంఘటన కోసం యెహేజ్కేలు గ్రంధంలో కూడా చెప్పబడింది. వీరు సజీవుల లోకంలో ఎంతో భయంకరులు అంటూ కొంతమంది కోసం చెప్పబడింది. వారైతే తమ ఆయుధాలను తాము మరణించే టప్పుడు తమతోపాటుగా పాతాలలోకమునకు తీసుకుని పోయినట్లు వ్రాయబడింది! ఇది మనకు 32 వ అధ్యాయంలో కనిపిస్తుంది.

 

18. నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జన ముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము.

19. సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు?దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము.

20. ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి.

21. వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అని యందురు; పాతాళ ములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు.

22. అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చి యున్నారు.

23. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, *వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి*.

24. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు *సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారు అవమానము నొందుదురు*.

25. హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు *సజీవులలోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును*.

26. అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి.

27. అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధము లను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.

28. నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు.

29. అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.

30. అక్కడ ఉత్తరదేశపు అధిపతులందురును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.

31. కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

32. సజీవుల లోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితో కూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

చూడండి వీరంతా పాతాళ లోకములోనికి దిగిపోయారు!

 

అయితే నా ఉద్దేశం ఏమిటంటే (అయ్యా ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే, దీనికోసరమైన సంపూర్ణ అవగాహన నాకు లేదు) బహుశా వీరు లేక ఇవి ఆయా జనులు యుద్ధాలు చేసి జనులు నాశనమై పోవడానికి ప్రేరేపించిన ఆత్మలు లేక లోకనాధులు. అంధకార శక్తులు కావచ్చు! అలాగే బబులోనూ రాజు అన్నీ దేశాలను ఆక్రమించి వారిని కఠిన మైన బాధలు పెట్టి అన్నిదేశాలు బాధలు అనుభవిస్తే చూసి సంతోషించే ఒకరకమైన శాడిస్ట్ ఆత్మ కావచ్చును అని నా ఉద్దేశం! ఇప్పుడు ఈ ఆత్మ అన్నీ దేశాలమీద బాధించి చివరకు ఇది కూడా అదే పాతాలమునకు వస్తే అక్కడ అది వరకు ఉన్న దురాత్మలు చేసే ఆక్రందనలు హేళనలు కావచ్చును!

 

    ఏదిఏమైనా బైబిల్ గ్రంధములో చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. నిన్నెవరు వంచిచక పోయిన వంచన చేస్తున్న నీవు, నిన్నెవరు మోసం చేయకపోయినా మోసం చేస్తున్న నీవు నీ మోసాలు వంచనలు ముగించాక నీవు మోసగించబడ బోతున్నావు. అవును ఈ బబులోనూ కూడా ఎవరూ ఆ దేశాన్ని మోసాగించక పోయినా నాశనం చేయకపోయినా అన్నీ దేశాలను నలుగుగొట్టింది  గనుక ఇప్పుడు నలుగగొట్టబడటం తనవంతు!

 

నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది అని మారిచిపోకూడదు! నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం కలుగుతుంది. కాబట్టి హెచ్చరిక నొంది పాపములు వదిలేయు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*120వ భాగము*

యెషయా 14: 1120

11. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

16. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు

17. భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా?

18. జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.

19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

20. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!   ముఖ్యంగా బబులోనూ దేశం మీద దేవుని తీర్పును ధ్యానం చేస్తున్నాము!

 

                           (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! ఇక ఈ వచనం నుండి సాతాను గాడి పరలోక బహిష్కరణ కోసం ఉంటుంది.  నిజానికి ఇది బబులోనూ కోసం చెప్పబడిన ఆధ్యాత్మికంగా అసలు సాతాను అసలు వాడు ఎవడు ఎక్కడి వాడు ఎందుచేత పరమునుండి తరుమబడ్డాడు అనే పూర్తి వివరాలు కనిపిస్తాయి! అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే కొంతమంది అతి తెలివైన వారు ఇది అనగా ఈ భాగము కేవలం బబులోనూ రాజు మరియు అతని సామ్రాజ్యం కోసం చెప్పబడింది గాని లూసీఫర్ కోసం కాదు అని వాదిస్తారు. క్రైస్తవ్య వ్యతిరేకులు కూడా అలాగే వాదిస్తారు! అయితే దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ సాతాను గాడు అనే లూసీఫర్ కోసమే వ్రాయబడింది అని అర్ధమవుతుంది. అయితే పూర్తిగా ఇక్కడే కాదు యెహేజ్కేలు గ్రంధంలో కూడా కొద్దిగా ఉంది. అందుకే ఇదే గ్రంధంలో దేవుని వాక్కు లేక వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట వస్తుంది. అచ్చటిది ఇచ్చటిది రెండు కలుపుకుంటేనే గాని ముచ్చటగా మనకు అర్ధమవదు అని చెబుతుంది బైబిల్!!!..

 

ఇక 11 వ వచనం నుండి ధ్యానం చేస్తే

11. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

చూడండి నీ మహాత్యము నీ స్వరమండలము స్వరము పాతాలములో పడవేయబడ్డాయి నీ క్రింద పురుగులు వ్యాపించాయి అంటున్నారు! దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఒకానొకప్పుడు  ఈ సాతాను గాడు దేవుని దగ్గర స్వరమండలము వాయిస్తూ ఉండేవాడు అని అర్ధమవుతుంది. ఇది ఇంకా అర్ధం కావాలంటే మనం యెహేజ్కేలు గ్రంధంలో 28 వ అధ్యాయంలో

 

13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

14. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.

17. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.

18. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.

19. జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.

 

చూడండి ఇక్కడ అభిషేకము నొందిన కెరూబుగా ఉన్నావు ఒక ఆశ్రయముగా ఉన్నావు. అందుకే నేను నిన్ను నియమించాను. దేవునికి ప్రతిష్టించిన పర్వతము మీద నీవున్నావు కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించే వాడివి అయితే నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడే వరకు నీ ప్రవర్తన విషయంలో యధార్ధవంతుడవే!!  గాని నీకు కలిగిన విస్తానమిన వర్తకము ధన గర్వము వలన నీవు గర్వించావు. ఏమని గర్వించావు అంటే

 12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

చూడండి దేవుని కంటే ఎత్తైన స్థలములో నేను కూర్చోవాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే దేవుడు ఒక్క తాపు తంతే పాతాలములో ఒక మూలకు పడ్డావు అంటున్నారు! అయితే కొందరు బైబిల్ పండితుల అభిప్రాయము ప్రకారం:  యేసుప్రభుల వారికన్నా ఎక్కువ స్థానంలో ఉండాలని ఆశించాడు. దీనికోసం ఇంకా చూడాలంటే “వేకువ చుక్కా” ఒకప్పుడు సైతాను పరలోకంలో ప్రకాశమానమైన కాంతులీనే జీవి. అలానే బబులోను రాజు భూరాజులందరిలోకీ దేదీప్యమానమైన “చుక్క” లాంటివాడు. అయితే ఒక్క క్రీస్తు మాత్రమే ప్రకాశమానమైన వేకువచుక్క (ప్రకటన గ్రంథం 22:16). ఇక్కడ ఈ మాటలు వాడినది సైతాను నుద్దేశించే అయితే బహుశా వాణ్ణి అలా ఎందుకు వర్ణించవలసి వచ్చిందంటే దేవుని కుమారుడి స్థానం తానుండాలని ఆశించినందుకేమో.

 

కాబట్టి ఒకానొకప్పుడు కెరూబుగా దేవుని సముఖములో దేవుని ఆరాధన చేసే ముఖ్య క్వయిర్ లీడర్ గా ఉన్న లూసీఫర్ గాడు దేవునికంటే ఎత్తైన స్థానంలో ఉండాలని కోరుకున్నాడు వెంటనే దేవుడు ఒక్క తాపు తంతే పాతాళంలో ఒక మూలాన పడ్డాడు! ఆ తర్వాత దేవునితో తిరిగి సమాధాన పడటానికి ప్రయత్నించాడు గాని దేవుడు ఒప్పుకోలేదు! అయితే హనోకు గ్రంధం మరియు బుక్ ఆఫ్ క్రానికల్స్ ప్రకారం ఈ త్రోసివేయబడిన దేవదూతలు హనోకు గారిని మచ్చిక చేసుకుని రాయభారం పంపుతారు. గాని దేవుడు త్రోసివేశారు ఆ అభ్యర్ధన!  అందుకు వారు దేవునిమీద తిరుగబడ్డారు. ఇంకా చాలా ఉంది గాని మీకు కొద్దిగా అర్ధం కావడానికి చెప్పడం జరిగింది. దేవుడు అందుకే నోవహు గారికాలంలో అప్పటి జీవరాశులను జలప్రళయం ద్వారా చంపడం జరిగింది!

 

(సశేషం)

*యెషయా ప్రవచన గ్రంధము*

*121వ భాగము*

 

యెషయా 14: 1120

11. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

16. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు

17. భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా?

18. జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.

19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

20. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!   ముఖ్యంగా బబులోనూ దేశం మీద దేవుని తీర్పును ధ్యానం చేస్తున్నాము!

 

                       (గతభాగం తరువాయి)

 

     ప్రియ దైవజనమా! మనము సాతాను గాడిని దేవుడు పరలోకం నుండి తరిమిన ఘటన కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 13 వ వచనంలో అంటున్నారు: 13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

 

సైతాను (లేక బబులోను రాజు) కాంక్షించిన దేమిటంటే అందరికంటే పైగా పేరుప్రతిష్ఠలు, అధికారం. తనకే కావాలి అనుకున్నాడు! 2 థెస్సలొనీకయులకు 2:3-4 చూడండి.

2 థెస్సలొనీకయులకు  2

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

 

. నాయకులను రెండు గుంపులుగా విభజించవచ్చు ఒకటి, సైతాను కోరికలు ఉన్నవారు, రెండు, క్రీస్తు కోరికలు ఉన్నవారు.

 

మీదన సాతాను గాడి గుణం మనకు కనిపిస్తుంది. అయితే క్రీస్తుయేసు గుణం చూసుకుంటే

 

ఫిలిప్పీయులకు 2:5-11 లో వెల్లడి అయిన క్రీస్తు గుణాన్ని పోల్చి చూడండి ఫిలిప్పీయులకు  2:

 

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను

 

 “సభాపర్వతం” ఇది పరలోక సంబంధమైన సీయోను పర్వతం అన్నారు కొందరు వ్యాఖ్యాతలు (హెబ్రీయులకు 12:22 లో ఉన్నట్టుగా).

 

హెబ్రీయులకు  12:

22. ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,

 

మరికొందరు ఇస్రాయేల్‌వారి పై దేవుడు తన ఆలయంలో ఉండి పరిపాలించిన ఇస్రాయేల్‌లోని సీయోను కొండ అని అభిప్రాయపడ్డారు (కీర్తనల గ్రంథము 48:1-2 కీర్తనల గ్రంథము  48

 

1. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు.

2. ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది;

 

కీర్తనల గ్రంథము  99

1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.). మరికొందరు మరొక రకంగా భావించారు.

 

మొదటి అభిప్రాయం సత్యం అయ్యేందుకు అవకాశం లేకపోలేదు.

 

ఇక 14,15 వచనాలు చూసుకుంటే

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

ఏసయ్య కపర్నెహూము కోసం కూడా ఇలాగే అన్నారు:

 

మత్తయి  11

23. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.

 

లూకా  10

15. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.

 

తమను తాము గొప్ప చేసుకునే వారి అంతం ఇదే. వారు మనుషుల నాయకులు కావచ్చు. లేక సైతాను, అతని మూకలు కావచ్చు.

 

   ఇక 1628 వచనాలు చూసుకుంటే 16. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు

17. భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?

18. జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.

 

ఈ వచనాలు బబులోను రాజును ఉద్దేశించి అంటున్న మాటలని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ మాటలు భూలోకానికి వర్తించేవి. 9-11 వచనాల్లో లాగా మృత్యులోకానికి కాదు. క్రీ.పూ. 605538 కాలంలో భూమిపై అత్యంత అధికారం గల రాజు బబులోను రాజే. మాదీయవారు తనను ఓడించేంతవరకు అతడు దేవుని ప్రజలను బందీలుగా ఉంచుకొన్నాడు. ఇక అతడు నాకు తిరుగులేదు, నన్ను ఓడించే వాడు ఎవడూ లేదు అని అనుకున్నాడు! అందుకే కదా డానియేలు గ్రంధంలో నెబుకద్నేజర్ గడ్డిమేసినప్పుడూ ముందుగా అలాగే అనుకున్నాడు. గడ్డి మేయక ముందు గడ్డిమేశాక మాటలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది..

దానియేలు 3:14

అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?

దానియేలు 3:15

బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు?

దానియేలు 3:26

అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

దానియేలు 3:28

నెబుకద్నెజరుషద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

దానియేలు 3:29

కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడు వారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

 

ఇక 1921 వచనాలు చూసుకుంటే

 19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

20. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం చుటకు దొడ్డి సిద్ధపరచుడి.

 

ఒక రాజుకు సవ్యమైన అంత్యక్రియలు జరగలేదంటే అది అతనికి చాలా అవమానకరం. అంతేకాదు చరిత్ర ప్రకారం బబులోనూ రాజు మరణించాక అతని కుమారునికి అల్లుడికి పడక, ఇంకా రెండవ భార్య కుమారునికి గొడవలు వచ్చి ఎందరో రాజులు మారారు. బబులోను రాజు కొడుకులిద్దరూ హతమౌతారు. అతని రాజ్యం, ప్రజలు నాశనమౌతారు.

 

కాబట్టి గర్వించిన వాడు ఎవడైనా పతనమవుతాడు అని గ్రహించాలి!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*122వ భాగము*

 

యెషయా 14: 2126

21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం చుటకు దొడ్డి సిద్ధపరచుడి.

22. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

23. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

24. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.

25. నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును.

26. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.

27. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం ధ్యానం చేస్తున్నాము!   ముఖ్యంగా బబులోనూ దేశం మీద దేవుని తీర్పును ధ్యానం చేస్తున్నాము!

 

                 (గతభాగం తరువాయి)

 

        ప్రియ దైవజనమా ఇక 21 వ వచనం నుండి చూసుకుంటే

21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం చుటకు దొడ్డి సిద్ధపరచుడి.

22. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

గతభాగంలో చెప్పినట్లు కుటుంబ కలహాల వలన నెబుకద్నేజర్ అతని కుమారులు మనుమలు కూడా కుటుంబస్తుల వలననే హతం చేయబడ్డారు. కొన్ని రోజుల తర్వాత కొడుకు తర్వాత అల్లుడు ఆ తర్వాత రెండవ భార్య కొడుకు ఇలా పరిపాలన చేశారు చివరకు అందరూ హతం చేయబడ్డారు! మొత్తానికి కొడుకులు మనుమలు అందరూ నశించిపోయారు!  దేవుడు చెప్పిన మాటలు తు. చ తప్పకుండా జరిగాయి!

 

ఇక 2326 వరకు అస్సూరు రాజు కోసం చెప్పబడుతుంది. అయితే గతంలో చెప్పబడినట్లు బైబిల్ గ్రంధంలో అనేకసార్లు అస్సూరు మరియు బబులోనూ కోసం కలిసే చెప్పబడింది!

 ఇక 23 వ వచనం నుండి చూసుకుంటే

 23. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

24. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.

 

చూడండి ఇక్కడ అస్సూరుని నాశనం అనే చీపురు కట్టతో తుడిచేస్తాను అంటున్నారు! దేవుడు సంకల్పించిన వాటన్నిటి విషయంలోనూ ఇది సత్యమే (వ 27). అయితే ఇక్కడ, ఆయన అష్షూరువారి నాశనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. తరువాతి వచనాన్నిబట్టి ఇది అర్థమౌతున్నది.

 

25. నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును.

 

“నా దేశంలో...నా కొండల మీద” ఇది క్రీ.పూ. 703లో కనీసం చాలావరకు  నెరవేరింది (యెషయా 37:36-37).

 

యెషయా  37

36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.

37. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

 

 “కాడి/దండము”కోసం చూసుకుంటే  యెషయా 9:4. అంటున్నారు

4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

 

ఇక ఇశ్రాయేలు ప్రజలమీద అస్సూరు వారి కాడిని విరిచేశాను అంటున్నారు!

 

ఇక 26 వ వచనం చూసుకుంటే 26. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.

27. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచ గలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?

 

13-24 అధ్యాయాల్లో దేవుడు యెషయా కాలంలో తెలిసిన దేశాల్లో కొన్నిటిని గురించి మాట్లాడుతున్నారు. ఆ దేశాలమీద దేవుడు అస్సూరు వారిని ఉపయోగించి దేశాలకు వారి పాపాలకు తీర్పుని ప్రకటించారు. ఇప్పుడు సర్వలోకము గూర్చి నేను చేసిన ఆలోచన మరియు ప్రజలకు వ్యతిరేఖముగా చాపబడిన దేవుని బాహువు ఇదే అనగా అస్సూ రు ద్వారా దేవుని తీర్పు! ఇప్పుడు దానిని దేవుడు విరిచేస్తున్నారు అన్నమాట!

 

ఈ రకంగా బబులోనూ మరియు అస్సిరియా వారికోసమైన దేవుని తీర్పులు కనిపిస్తున్నాయి.

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*123వ భాగము*

యెషయా 14: 2832

28. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి

29. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.

30. అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును.

31. గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.

32. జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.

 

         ప్రియా  దైవజనమా! మనము అన్య దేశాలమీద దేవుని  తీర్పుల కోసం ధ్యానం చేస్తూ  యెహోవా దినము కోసం మరియు బబులోనూ ఆశసూరు వారికోసం ధ్యానించాము!

ఇక 2832 వచనాలలో ఫిలిస్తీయుల కోసం చెప్పబడింది.  అయితే ఈ ప్రవచనం వచ్చిన సంవత్సరం స్పష్టముగా రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం లో వచ్చింది అని చెబుతున్నారు! రాజైన ఆహాజు క్రీ. పూ. 715 చనిపోయాడు అని చరిత్ర చెబుతుంది మనకు! అనగా క్రీ పూ 715 లో ఈ ఫిలిస్తీయుల కోసమైన ప్రవచనం కలిగింది అని గ్రహించాలి!

 

ఇక 29 వ వచనంలో ఫిలిస్తీయ నిన్ను కొట్టిన దండం తుత్తునీయులుగ విరుగగొట్ట బడింది అని సంభరపడవద్దు అంటున్నారు! దానికోసం ధ్యానం చేసేముందుగా ఇదే ఫిలిస్తీయుల కోసం బైబిల్ లో ఇంకా అనేక చోట్ల చెప్పబడింది.  యిర్మీయా 47 మొత్తం!

 

యెహెఙ్కేలు 25:15-17;

యెహెఙ్కేలు  25

15. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక

16. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.

17. క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

 

 ఆమోసు 1:6-8;

ఆమోసు  1

6. యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.

7. గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

8. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

 

జెఫన్యా 2:4-7

జెఫన్యా  2

4. గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.

5. సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.

6. సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

7. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.

 

సరే, ఇక మన భాగానికి వస్తే నిన్ను కొట్టిన దండము అనగా ఫిలిస్తీయులను నాశనం చేసినవారు అస్సూరు వారు. అనగా ఇప్పుడు ఫిలిస్తీయ నిన్ను కొట్టిన వారైన అస్సూరు వారు బబులోనూ వారిద్వారా నాశనమయ్యారు అని సంతోషపడవద్దు ఎందుకంటే దానితర్వాత నీవు కూడా అదే బబులోనూ వారిద్వారా నాశనం పొందబోతున్నావు అంటున్నారు దేవుడు! ఇది నిజంగా జరిగింది యెషయా  20

1. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను. అష్డోదు అనగా ఫిలిస్తీయుల పట్టణాలలో ఒక సర్ధారుల పట్టణం!  కాబట్టి ఈ పట్టణం అస్సూరు వారి ద్వారా నాశనం చేయబడింది ఒకమారు. అయితే అదే అస్సూరు ఇప్పుడు బబులోనూ వారిద్వారా నాశనం అయితే నీవు సంతోషిస్తున్నావు ఇప్పుడు! అందుకే అదే బబులోనూ వారిద్వారా నీవు కూడా హతం చేయబడతావు అంటున్నారు దేవుడు! ఆ తర్వాత

 

30. అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును.

31. గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.

 

ఉత్తర దిశ అనగా బబులోనూ వారు!!

 

32. జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.

అష్షూరువారు జెరుసలంను వశపరచుకోలేక పోయారు. ఈ విషయాన్ని గమనించాలి!  ఎందుకు స్వాధీనం చేసుకోలేక పోయాడు అంటే యెహోవా సీయోనుని స్థాపించారు కాబట్టి!

 

అందుకే బైబిల్ చెబుతుంది నీ శత్రువులు తూలిపడిపోతే మనం సంతోషించ కూడదు! ఫీలిస్తీయులు తమను కొట్టిన అస్సూరు వారు నాశనం అయిపోయారని సంతోషిస్తున్నారు అందుకే దేవుడు అంటున్నారు నీవు కూడా అదే బబులోనూ వారిద్వారా నాశనం కాబోతున్నారు అంటున్నారు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*124వ భాగము*

 

యెషయా 15:19

1. మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

2. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది

3. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.

4. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.

5. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.

6. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు

7. ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు.

8. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.

9. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పించెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.

 

     ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈరోజు మోయాబు దేశం కోసం దేవుని యొక్క తీర్పులు కోసం చూసుకుందాం! అయితే ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఐదు విషయాలు కనిపిస్తున్నాయి మనకు!

 

మోయాబీయులపై దైవిక తీర్పులు రానున్నాయి.

 

మూడు సంవత్సరాలలోపు ఈ ప్రవచన నెరవేర్పు ప్రవక్త యొక్క లక్ష్యాన్ని ధృవీకరిస్తుంది మరియు అతని అన్ని ఇతర అంచనాలపై నమ్మకాన్ని నిర్ధారిస్తుంది. మోయాబుకు సంబంధించి, ముందుగా చెప్పబడిన అనేక సంఘటనలు వివరించబడ్డాయి:

 

1. శత్రువులు వారి ప్రధాన నగరాలను వేగంగా స్వాధీనం చేసుకుంటారు. లోతైన మరియు వేగవంతమైన మార్పులు చాలా తక్కువ వ్యవధిలో సంభవిస్తాయి.

 

2. మోయాబీయులు సహాయం కోసం తమ విగ్రహాల వైపు తిరిగేవారు. దేవుణ్ణి అనుసరించని వారు కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా ఓదార్పును పొందలేరు మరియు వారు కష్ట సమయాల్లో నిజమైన పశ్చాత్తాపం మరియు విశ్వాసంతో ఆయన వైపు తిరగడం చాలా అరుదు.

 

3. దుఃఖపు కేకలతో భూమి ప్రతిధ్వనిస్తుంది. వారి బాధలు మరియు దుఃఖంలో చాలా మంది ఇతరులను కలిగి ఉండటం కొంచెం ఓదార్పునిస్తుంది.

 

4. వారి సైనికుల ధైర్యం సన్నగిల్లుతుంది. ఒక దేశానికి బలం మరియు రక్షణ యొక్క ప్రాథమిక వనరుల నుండి దేవుడు సులభంగా తొలగించగలడు.

 

5. ఈ విపత్తులు పొరుగు ప్రాంతాలకు కూడా దుఃఖాన్ని తెస్తాయి. వారు ఇజ్రాయెల్‌కు శత్రువులు అయినప్పటికీ, తోటి మానవులుగా వారి బాధలను చూడటం బాధగా ఉంటుంది.

6-9 వచనాలలో, ప్రవక్త అష్షూరు సైన్యానికి బలైపోయినప్పుడు మోయాబు దేశమంతటా ప్రతిధ్వనించే దుఃఖకరమైన విలాపాలను స్పష్టంగా చిత్రించారు . దేశం సర్వనాశనం అవుతుంది మరియు యుద్ధం యొక్క సాధారణ పరిణామమైన కరువు ప్రజలను బాధిస్తుంది. ప్రాపంచిక సంపదను పోగుచేసి, దానిని నిల్వచేసే వారు దానిని ఎంత త్వరగా తమ నుండి తీసివేయవచ్చో ఆలోచించాలని ఇది ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది.

 

విధ్వంసం నుండి ఆశ్రయం పొందమని మన శత్రువులను హెచ్చరిస్తున్నప్పుడు, వారు తమ పాపాలకు క్షమాపణను వెదకడానికి మరియు పొందేలా మనం కూడా వారి కోసం ప్రార్థిద్దాం.

 

ఇక ఈ అధ్యాయంలో వచనాలు క్లుప్తంగా చూసుకుంటే 1. మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

 1. The burden of Moab: Because in the night Ar of Moab is laid waste and brought to silence, because in the night Kir of Moab is laid waste and brought to silence,

 

ఇక్కడ ఆర్మోయాబు అనగా  హీబ్రూ బైబిల్‌లో అర్ చాలాసార్లు పురాతన మోయాబ్ నగరంగా పేర్కొనబడింది ( సంఖ్యాకాండము 21:15 ). ఖచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ, ఇది అర్నాన్ లోయ యొక్క దక్షిణ భాగంలో ఉండే అవకాశం ఉంది , ఇది జోర్డాన్‌లోని ప్రస్తుత వాడి ముజీబ్ గార్జ్. [1] ఈ నగరం మోయాబు దేశానికి చెందిన అత్యంత ప్రముఖమైన వాటిలో ఒకటి, మోయాబీయుల దేశాన్ని ఖండించడంలో ప్రవక్త యెషయాచే జాబితా చేయబడింది ( యెషయా 15:1 ). మాథ్యూ పూలే "నగరం నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో కూర్చబడింది" అని సూచించాడు. [2]

 

బైబిల్ Ar గురించి అమోరీ రాజు సీహోన్ చేత పట్టుకున్నట్లు మాట్లాడుతుంది ( సంఖ్యాకాండము 21:28 ).

 

ఆధునిక పండితులు "అర్" అనే పదానికి బహుశా "నగరం" అని అర్థం. [3]

 

 ఇక కీర్మోయాబు అనగా మోయాబ్ యొక్క కిర్ హీబ్రూ బైబిల్‌లో మోయాబ్ యొక్క రెండు ప్రధాన కోటలలో ఒకటిగా పేర్కొనబడింది , మరొకటి అర్ . ఇది బహుశా కిర్-హరేష్ (యెషయా 16:11, KJV ), కిర్-హరేసేత్ ( హీబ్రూ : ִיר-חֲרֶשֶׂת ; యెష 16:7 ), మరియు కిర్-హెరెస్ ( హీబ్రూ : ఐసా 16 ; ששָ6 11 ; Jer 48:31 , 48:36 ). [1] కిర్ అనే పదం గోడ లేదా కోటను సూచిస్తుంది. [2] 5వ శతాబ్దం BC నాటికి, నగరం పేరు మోయాబ్‌లో కరక్‌గా మారిన ఆ సమయంలోని సాధారణ భాష అయిన అరామిక్‌కి అనుగుణంగా మార్చబడింది మరియు తరువాత రోమన్ మరియు బైజాంటైన్ కాలాలు, చరచ్‌మోబా (HE మేయర్ pp. 119-120). [3] నేటి వరకు అరబిక్ పేరు అల్-కరక్ . [4]

 

ఇక ఈ రెండు పట్టణాలు నాశనమైపోతాయి అని ప్రవక్త చెబుతున్నారు!

 

(ఇంకాఉంది)

*యెషయా ప్రవచన గ్రంధము*

*125వ భాగము*

 

యెషయా 15:19

1. మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

2. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది

3. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.

4. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.

5. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.

6. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు

7. ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు.

8. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.

9. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పించెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.

 

     ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటు- మోయాబు దేశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

                           (గతభాగం తరువాయి)

 

    ఇక మోయాబు దేశం యొక్క తీర్పులు కోసం బైబిల్ లో అనేకచోట్ల చెప్పబడింది! మోయాబు గురించి ఇతర ప్రవచనాలకు యిర్మీయా 48వ అధ్యాయం; యెహెఙ్కేలు 25:8-11;

8. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక

9. తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;

10. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.

11. నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.

 

ఆమోసు 2:1-3;

1. యెహోవా సెలవిచ్చునదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.

2. మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును.

3. మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

 జెఫన్యా 2:8-11

8. మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.

9. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.

10. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.

11. జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.

 

ఇక ఈ అధ్యాయంలో మోయాబులో  చెప్పిన ఈ ఊళ్ళలో అనేకం  ప్రస్తుతం ఎక్కడున్నాయో మనకు తెలియదు.

 

2. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది.  ఇక్కడ వారికి కలిగిన నాశనం చూసి మోయాబు ప్రజలు ఇంతగా ఏడుస్తారు అన్నమాట! “బోడి...గొరిగించడం” విలాపానికి గుర్తు (వ 3,4; యిర్మియా 48:37). 37. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి.

 

ఇక 37 వచనాలు చూసుకుంటే 3. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.

4. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.

5. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.

6. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు

7. ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు.

8. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.

 

ఇంతగా దేవుని కోపము మోయాబు మీద క్రుమ్మరించబడుతుంది.

 

యెషయా గారు 16 వ అధ్యాయంలో ప్రవచిస్తున్నారు యెషయా  16

9. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు.

11. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి.

 

యిర్మీయా గారు అంటున్నారు యిర్మియా  48

31. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు

 

ఇక తొమ్మిదవ వచనం చూసుకుంటే 9. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పించెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.

 

ఇక్కడ సింహం కోసం చూసుకుంటే యెషయా  5

29. ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.

 

యిర్మియా  50

17. ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.

ఈరకంగా మోయాబు దేశం మీద తీర్పు తీర్చబడుతుంది!

(ఇంకాఉంది)

*యెషయా ప్రవచన గ్రంధము*

*126వ భాగము*

 

యెషయా 16:114

1. అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా సీయోను కుమార్తె పర్వతమునకు పంపుడి

2. గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు.

3. ఆలోచన చెప్పుము విమర్శచేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము. చెదరినవారిని దాచిపెట్టుము పారిపోయినవారిని పట్టియ్యకుము

4. నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా బీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని పోయెను. అణగద్రొక్కువారు దేశములో లేకుండ నశించిరి.

5. కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

6. మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నాము వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు విని యున్నాము. వారు వదరుట వ్యర్థము.

 

            ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈరోజుకూడా మోయాబు దేశం కోసం దేవుని యొక్క తీర్పులు కోసం చూసుకుంటున్నాము! ఈ అధ్యాయంలో కూడా మోయయబు దేశము మీదికి దేవుని తీర్పులు కనిపిస్తున్నాయి మనకు! కాబట్టి పైపైకి చూసుకుంటూ ముఖ్యమయిన కొన్ని వచనాలు మాత్రం ధ్యానం చేసుకుందాం!

 

   ఓవరాల్ గా చూసుకుంటే 15  వచనాలలో: మోయాబు విధేయత చూపమని ఉద్బోధించబడింది. (1-5)

 

దేవుడు పాపులతో కూడా మాట్లాడుతూ ఉంటారు, మోయాబుతో చేసినట్లే, వారి పతనాన్ని నివారించడానికి వారికి మార్గనిర్దేశం చేశారు. మోయాబుకు అతని సలహా సూటిగా ఉంది: అదేమనగా-- వారు గతంలో యూదాకు చెల్లించడానికి కట్టుబడి ఉన్న నివాళిని గౌరవించండి. ఈ సలహాను మంచి సలహాగా పరిగణించండి. ధర్మబద్ధమైన పనుల ద్వారా మీ పాపపు మార్గాలను నిలిపివేయండి, ఇది మరింత ప్రశాంతమైన ఉనికికి దారితీయవచ్చు. ఈ సలహా క్రీస్తుకు లొంగిపోయే ముఖ్యమైన సువార్త విధికి కూడా మనము అన్వయించుకోవచ్చు. సజీవ త్యాగాలుగా మిమ్మల్ని మీరు సమర్పించుకునే గొర్రెపిల్లలా మీ ఉత్తమమైన వాటిని ఆయనకు సమర్పించండి. మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, సర్వోన్నతమైన పాలకుడు, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల పేరుతో అలా చేయాలి అంటున్నారు.

 

క్రీస్తుకు లొంగిపోవడానికి నిరాకరించే వారు గూడు నుండి తప్పిపోయిన పక్షిలా ఉంటారు, సమీపంలోని వేటాడే పక్షి చేత లేక వేటగాని చేత బంధించబడతారు. దేవుని భయాన్ని ఎదిరించే వారు చివరికి అన్నిటికీ భయానికి లోనవుతారు. దేవుడు ఇశ్రాయేలు వారసుల పట్ల దయను ప్రోత్సహిస్తారు. తాము కష్టాల్లో ఉన్నపుడు ఆదరణ పొందాలని ఎదురుచూసే వారు తప్పనిసరిగా అవసరమైన వారికి దయను అందించాలి. హిజ్కియా సింహాసనం గురించి ఇక్కడ చెప్పబడినది యేసుక్రీస్తు రాజ్యానికి కూడా చాలా ఎక్కువ మేరకు వర్తిస్తుంది. ఆయనకు లొంగిపోవడం ప్రాపంచిక సంపదలకు లేదా గౌరవాలకు దారితీయకపోవచ్చు మరియు మనల్ని పేదరికం మరియు అవమానానికి గురిచేయవచ్చు, అది మనస్సాక్షికి శాంతిని మరియు శాశ్వత జీవితాన్ని తెస్తుంది.

 

  ఇక 614 వచనాలు చూసుకుంటే : మోయాబు యొక్క అహంకారం మరియు తీర్పులు. (6-14)

 

సలహాను అంగీకరించడానికి నిరాకరించే వారు తరచుగా తమను తాము సహాయం చేయలేరు. నిజానికి  ఇతర పాపముల  కంటే ఎక్కువగా  అనేక మంది ఆత్మల పతనానికి అహంకారం కారణమని గమనించాలి. అదనంగా, మితిమీరిన గర్వం ఉన్నవారు చాలా చిరాకుగా ఉంటారు. చాలా మంది తమ గర్వం మరియు కోపాన్ని తీర్చుకోవాలనే తపనతో అబద్ధాలను ఆశ్రయిస్తారు, కానీ వారి ప్రతిష్టాత్మక మరియు కోపంతో కూడిన పథకాలు విజయవంతం కావు. ఒకప్పుడు సారవంతమైన పొలాలకు మరియు ద్రాక్షతోటలకు ప్రసిద్ధి చెందిన మోయాబు, దండయాత్ర చేసే సైన్యంతో నాశనమైపోతుంది. దేవుడు త్వరగా నవ్వును దుఃఖంగానూ, ఆనందాన్ని దుఃఖంగానూ మార్చగలరు. మనం ఎల్లప్పుడూ దేవునిలో మన ఆనందాన్ని భక్తిపూర్వకమైన ఉల్లాసంతో మరియు భూసంబంధమైన విషయాలలో మన ఆనందాన్ని జాగ్రత్తగా గౌరవించుకోవాలి.

 

అంత అందమైన భూమిని నాశనం చేయడం వల్ల ప్రవక్త చాలా బాధపడ్డారు. మోయాబు యొక్క అబద్ధ దేవతలు సహాయం చేయలేక పోయారు, అయితే ఇజ్రాయెల్ దేవుడు, ఒకే నిజమైన దేవుడు, తన వాగ్దానాలను నెరవేర్చగలడు మరియు నెరవేరుస్తాడు. మోయాబు దాని నాశనము ఆసన్నమైందని గుర్తించి దానికి తగినట్లుగా సిద్ధపడాలి. దైవిక కోపం యొక్క అత్యంత భయంకరమైన ప్రకటనలు హెచ్చరికను పాటించేవారికి మోక్షానికి మార్గాన్ని వెల్లడిస్తాయి. దావీదు కుమారునికి అనగా యేసుక్రీస్తు ప్రభులవారికి విధేయత మరియు అతనికి పూర్తిగా అంకితం చేయడం ద్వారా తప్ప తప్పించుకోలేము. అంతిమంగా, నిర్ణీత సమయం వచ్చినప్పుడు, దుర్మార్గుల కీర్తి, శ్రేయస్సు మరియు సమూహము నశిస్తాయి.

 

ఇక ఈ అధ్యాయంలో మొదటి వచనంలో మోయాబీయులు గతంలో ఇశ్రాయేలు ప్రజలకు కప్పము కట్టేవారు- దానినే మరలా రాస్తున్నారు. 2 రాజులు 3:45

ఇక 5 వ వచనం ఎంతో ముఖ్యమైన వచనం: కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

 

 ఈ వచనంలో కృపవలన సింహాసనం స్థిర పరచబడుతుంది అంటున్నారు! దీనికి ఈ మధ్యనే జరిగిన ఎన్నికల ఫలితాలు వలన మనకు ఇంకా బాగా అర్ధమవుతుంది. కేవలం దేవుని కృప వలన మాత్రమే సింహాసనాలు లేక అధికారాలు నిలుస్తాయి. అందుకే దానియేలు గ్రంధంలో నెబుకద్నేజర్ రాజు అంటున్నాడు: మానవుల రాజ్యాలు దేవుని కృప మీదనే ఆధారపడి ఉన్నాయి. సర్వోన్నతుడైన దేవుడు దానిని ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తారో వారికే ఇస్తారని ఘంటాపదంగా చెబుతున్నారు రెండుసార్లు!

దానియేలు 4:32

తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

 

ఇక ఈ వచనంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే : సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.  చూడండి దావీదు సింహాసనం మీద ఆసీనుడు కావడానికి ఒకరు రాబోతున్నారు. ఆయనే శాశ్వత రాజ్యం స్థాపించి లోకంలో శాంతి సమాధానాలు స్థాపించబోతున్నారు! ఆయన యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఇక 9 వ వచనంలో మోయాబు కోసం నేను ఏడుస్తున్నాను అంటున్నారు. ఇక్కడే కాదు యిర్మీయా గ్రంధంలో కూడా ఇదే చెబుతున్నారు! యిర్మియా  48

31. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు.

32. సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరు సముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.

33. ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.

34. నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.

35. ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.

36. వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగు చున్నది.

ఈరకంగా ఈ రెండు అధ్యాయాలలో మోయాబు కోసమైన తీర్పులు మనము చూడగలము!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*127వ భాగము*

 

యెషయా 17:114

1. దమస్కును గూర్చిన దేవోక్తి

2. దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.

3. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.

4. ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించి పోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును

5. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

6. అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లుదానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.

8. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును         

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక ఈరోజు సిరియా దేశం కోసమైన దేవుని తీర్పులు చూసుకుందాం!!  అయితే ఈ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది సిరియా మరియు ఇశ్రాయేలు రాజ్యం అనగా పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం కోసం కలసి వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఈ ప్రవచనం చెప్పబోయే సరికి సిరియా మరియు ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యం కలిసి ఒక ట్రీటీ లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అప్పటికే ఈ రెండు దేశాలు యూదా రాజ్యం మీదికి దండెత్తి కొద్దిగా దేశాన్ని పాడుచేశారు! అందుకే దేవుని తీర్పులు రెండు దేశాలకు కలిసి చెబుతున్నారు!

 

సరే- ఇక 111 వచనాలు చూసుకుంటే: సిరియా మరియు ఇజ్రాయెల్ బెదిరించారు. (1-11)

 

పాపము దేశాన్ని మరియు  నగరాలను నాశనం చేస్తుంది. శక్తివంతమైన విజేతలు మానవాళికి విరోధులుగా గర్వపడటం అబ్బురపరిచేది. అయినప్పటికీ, దేవునికి మరియు పరిశుద్ధతకు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసేవారిని ఆశ్రయించడం కంటే మందలు అక్కడ విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. ఇశ్రాయేలు కోటలు, పది గోత్రాల రాజ్యాలు నాశనం చేయబడతాయి. పాపంలో నిమగ్నమైన వారు తమ స్వంత నాశనానికి న్యాయంగా పాలుపంచుకుంటారు. ప్రజలు, వారి అతిక్రమణల ద్వారా, తమను తాము నాశనం అంచుకు తెచ్చుకున్నారు. ఒక రైతు పొలం నుండి మొక్కజొన్నను సేకరించినట్లుగా, వారి కీర్తిని శత్రువులు వేగంగా లాక్కున్నారు. తీర్పు మధ్య, చాలా కొద్దిమంది మాత్రమే మోక్షానికి ఎంపిక చేయబడినప్పటికీ, శేషం కోసం దయ భద్రపరచబడుతుంది. అరుదైన కొద్దిమంది మాత్రమే వెనుకబడ్డారు. అయినప్పటికీ, వారు పవిత్రమైన శేషాన్ని ఏర్పరుస్తారు. రక్షింపబడిన వారు దేవుని వద్దకు తిరిగి రావడానికి మేల్కొన్నారు మరియు అన్ని సంఘటనలలో అతని చేతిని గుర్తించి, అతనికి అర్హమైన గౌరవాన్ని ఇస్తారు. ఇది మన సృష్టికర్తగా అతని ప్రొవిడెన్స్ లేక అధికారం లేక గుత్తాధిపత్యం యొక్క ఉద్దేశ్యం మరియు ఇజ్రాయెల్ యొక్క పవిత్ర వ్యక్తిగా ఆయన కృప యొక్క పని. వారు తమ విగ్రహాల నుండి, వారి స్వంత ఊహల నుండి దూరంగా ఉంటారు. మన పాపాల నుండి మనల్ని వేరుచేసే బాధలను ఆశీర్వాదాలుగా పరిగణించడానికి మనకు కారణం ఉంది. మన రక్షకుడైన దేవుడు మన బలానికి రాయి, మరియు ఆయనను మనం మరచిపోవడం మరియు నిర్లక్ష్యం చేయడం అన్ని పాపాలకు మూలం. "ఆహ్లాదకరమైన మొక్కలు" మరియు "విదేశీ నేల నుండి రెమ్మలు" అనేవి గ్రహాంతర మరియు విగ్రహారాధనతో సంబంధం ఉన్న దుర్భరమైన ఆచారాలను సూచిస్తాయి. ఈ విదేశీ విశ్వాసాలను పెంపొందించడానికి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ అవన్నీ ఫలించవు. మనము కూడా పాపం యొక్క చెడు మరియు ప్రమాదం మరియు దాని అనివార్య పరిణామాలకు సాక్ష్యమివ్వవలసి ఉంది.

 

ఇక 1214 వచనాలలో: ఇశ్రాయేలు శత్రువుల బాధ. (12-14)

అష్షూరీయుల ఉగ్రత మరియు పరాక్రమం సముద్రపు నీటికి సమానం. అయితే, ఇశ్రాయేలీయుల దేవుడు వారిని గద్దించాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు గాలికి కొట్టిన ఊటలాగా లేదా సుడిగాలి ముందు తిరిగే వస్తువులా చెదరగొట్టారు. సాయంత్రం, జెరూసలేం బలీయమైన ఆక్రమణదారుడి కారణంగా కష్టాల్లో కూరుకుపోయింది, కానీ ఉదయానికి, అతని సైన్యం దాదాపు నాశనం అవుతుంది. దేవుడిని తమ రక్షకుడిగా భావించి, ఆయన శక్తి మరియు దయపై నమ్మకం ఉంచే వారు అదృష్టవంతులు. విశ్వాసుల కష్టాలు మరియు వారి విరోధుల శ్రేయస్సు సమానంగా క్లుప్తంగా ఉంటాయి, అయితే పూర్వం యొక్క ఆనందం మరియు వారిని తృణీకరించి దోచుకునే వారి పతనం శాశ్వతంగా ఉంటుంది.

 

ఇక ఒక్కో వచనం చూసుకుంటే: మొదటి వచనంలో దమస్కు కోసం దేవోక్తి అని వ్రాయబడింది. దమస్కు లేదా డమాస్కస్ సిరియా దేశానికి రాజధాని! అయితే ఇప్పుడు దేవుడు దానిని పట్టణం అని పిలువడకుండా సర్వనాశనం చేస్తానని చెబుతున్నారు! ఎందుకు చెబుతున్నారు అంటే అనేకసార్లు ఈ సిరియా దేశం ఇశ్రాయేలు ప్రజలను కఠిన హింసలు పెట్టడం జరిగింది. ఇది మనకు  2 సమూయేలు 8:5; 1 రాజులు 20:1-3; 2 రాజులు 6:24 చదవడం ద్వారా తెలుస్తుంది.  అందుకే దేవుడు ఇప్పుడు ఈ దేశమును నాశనం చేస్తున్నారు.

 

ఇక మూడో వచనం ఎఫ్రాయీముకి దుర్ఘము లేకుండా పోతుంది అంటున్నారు. ఎందుకంటే అప్పటికీ సిరియా మరియు ఎఫ్రాయిం ఒక ఒడంబడిక లో ఉన్నాయి. ఎఫ్రాయీము అనగా ఇశ్రాయేలు పదిగోత్రాల సామ్రాజ్యం అని అర్ధం! ఈ ఒప్పందం కోసం గతంలో చెప్పుకోవడం జరిగింది యెషయా 7:12 వచనాలలో ఈ ఒప్పందం ఉంటుంది.  గాని ఏమి జరిగింది అంటే అష్షూరువారు వచ్చి ఇస్రాయేల్‌ను జయించి దాని ప్రజలను బందీలుగా తీసుకు పోయినప్పుడు ఇస్రాయేల్ ఘనత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

 

దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో కూటమి కట్టాలి గాని విగరాహారాధికులతో చేయకూడదు. ఈ ఎఫ్రాయిం సామ్రాజ్యం సిరియాతో కూటమి కట్టారు కాబట్టి సిరియా నాశనమయ్యింది దానితోపాటుగా పదిగోత్రాల ఇశ్రాయేలు సామ్రాజ్యం కూడా నాశనమయ్యింది!  కాబట్టి ప్రియ దేవుని బిడ్డా నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకో! అన్యులతో మరియు పోకిరీగాళ్లతో త్రాగుబోతులతో సాంగత్యం చేస్తే నీవు కూడా చెడిపోయి నాశనమునకు పోతావు అని గ్రహించు!

 

దైవశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*128వ భాగము*

 

యెషయా 17:114

1. దమస్కును గూర్చిన దేవోక్తి

2. దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.

3. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.

4. ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించి పోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును

5. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

6. అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.

8. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును         

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! సిరియా దేశం కోసమైన దేవుని తీర్పులు చూసుకుంటున్నాము !!

 

               (గతభాగం తరువాయి)

 

ఇక 4 వ వచనం నుండి చూసుకుంటే 5. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

6. అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లుదానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

రెఫయీము అనేది యేరుషలేము పట్టణానికి పశ్చిమంగా ఉన్న ఒక లోయ.  దీనిలోనే ఒకసారి దావీదు గారు మరియు అతని సహకారులు దాక్కున్నట్లు చూడగలము! 1 దినవృత్తాంతములు  11

15. ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.

 

ఇక ఆరేడు వచనాలు చూసుకుంటే సిరియాతో పాటుగా పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం కూడా నాశనమైపోతుంది గాని దానిలో కొద్దిమంది శేషం మాత్రం మిగిలుతారు అంటున్నారు!

 

ఇక 8 వ వచనంలో అంటున్నారు 8. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును          

 

మానవులు తమ్మును చేసిన దేవునివైపు చూస్తారు అంటున్నారు. ఎప్పుడు? శ్రమలు కలిగాక, ఇక్కట్లు కొలిమిలో దిక్కులేని స్థితిలో దేవుడా ఇప్పుడు నీవే మాకు దిక్కు అంటారు ఇశ్రాయేలు వారు! ఇది వారికి షరామామూలే!!!

 

ఇక తర్వాత వచనాలలో చివరివరకు చూసుకుంటే ఇశ్రాయేలు పదిగోత్రాలకు కలిగే దుస్తితి కోసమే వ్రాయబడింది.

 

9. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దేశము పాడగును

 

యెహోషువగారి  కాలంలో ఇస్రాయేల్‌వారు కనానువారిని వారి పట్టణాలనుంచి వెళ్ళగొట్టి తాము ఆక్రమించుకున్నారు. అయితే ఇస్రాయేల్‌వారంతా అష్షూరు దేశానికి ప్రవాసం వెళ్ళిపోతారు. గనుక వారు అలా ఆక్రమించుకున్న పట్టణాలే నిర్జనమౌతాయి.

 

అయితే పదో వచనంలో అలా జరగటానికి గల కారణం వ్రాస్తున్నారు: 10. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి

11. నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును.

12. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును. జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును

 

చూడండి. ఇశ్రాయేలు వారు వారి ఆశ్రయ దుర్ఘమైన దేవుణ్ణి మరిచిపోయి విగ్రహాల వెనుక తిరిగినందువలననే ఇలా జరిగింది అంటున్నారు! నీవు నేను కూడా మన కష్టాలలో రోగాలలో ఇబ్బందులలో మనలను కాచి కాపాడి మనలను ఇంతవరకు నడిపించి ఈ స్థాయిలోనికి తీసుకుని వచ్చిన దేవుని ప్రక్కన పెట్టి మన ఇష్టాలవెనుక పరిగెడితే మనకు కూడా ఇదే గతి పడుతుంది అని మరచిపోవద్దు!

 

యిర్మియా  13

24. కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.

25. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

యిర్మియా  18

15. అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.

16. వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.

 

ఇక 1213 వచనాలు అష్షూరు వారు ఇశ్రాయేలు వారిని ఏవిధముగా నాశనం చేస్తారో వివరించబడినది!

12. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును. జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును

13. జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.

 

ఇక 14 వ వచనం యూదులు అనగా యూదా సామ్రాజ్యం అంటున్న మాటలు అని గ్రహించాలి! 14. సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే. చూడండి యూదా వారి శత్రువులు ఉదయం కాకుండానే ఒక్క రాత్రిలోనే నాశనమైపోతారు అంటున్నారు! తన ప్రజలు తన పై నమ్మకం పెట్టుకుంటే దేవుడు వారి శత్రువులను కనురెప్పపాటులో మట్టుపెట్టగలడు!

 

నిజంగా ఇది జరిగింది కదా ఒక్క రాత్రిలోనే దేవుని దూత 185000 మందిని సంహరించి నట్లు చూడగలము!

2రాజులు 19:35

ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.

 

కాబట్టి మనకు ఏమని అర్ధమవుతుంది అంటే దేవుని ఆశ్రయించిన వారికి ఆశ్రయము కలుగుతుంది. దేవుణ్ణి విసర్జించిన వారు సర్వనాశనం అయిపోతారు!

 

కాబట్టి మన ఆశ నిరీక్షణ దేవునిమీదనే పెట్టుకుని ముందుకు సాగిపోదాం!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*129వ భాగము*

 

యెషయా 17:17

1. ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొను చున్న రెక్కలుగల దేశమా!

2. అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ లలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి.

3. పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

4. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.

5. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.

6. అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.

7. ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగల వారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! కూషు అనగా ఇతియోపియా  దేశం కోసమైన దేవుని తీర్పులు చూసుకుందాము !!

 

ఈ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే:

 

 తన ప్రజల పట్ల దేవుని శ్రద్ధ; మరియు సంఘ పెరుగుదల.

 

ఈ అధ్యాయం నిస్సందేహంగా చాలా సమస్యాత్మకమైనది, దాని అర్థం ఈనాటి మనకంటే దాని దేశస్తులకు స్పష్టంగా ఉండవచ్చు. ఇది దైవిక ప్రావిడెన్స్ లేక గుత్తాధిపత్యం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఒక దేశానికి నీటి ద్వారా పంపబడిన దూతల గురించి చెబుతుంది, ఇతియోపియా  ప్రతికూలతను ఎదుర్కొన్న మరియు అణగదొక్కబడిన  దేశం. దేవుని ప్రజలు అణచివేయబడినప్పటికీ, విడిచిపెట్టబడరు లేదా నిర్మూలించబడరు. విచారణ సమయాల్లో, భూమి యొక్క నివాసులందరూ అప్రమత్తంగా ఉండాలి, దైవిక ప్రావిడెన్స్ యొక్క పనితీరును గమనిస్తూ మరియు దేవుని చిత్తానికి లోబడి ఉండాలి.

 

దేవుడు తన ప్రవక్తకు అభయమిచ్చారు, అది తన ప్రజల కోసం అనగా ఇశ్రాయేలు ప్రజలకోసం ఉద్దేశించబడింది. సీయోను అతని శాశ్వతమైన విశ్రాంతి స్థలం, మరియు ఆయన  దానిని చూస్తూనే ఉంటారు . ఆయన తన ప్రజలకు అందించే సౌకర్యాలు మరియు జీవనోపాధిని వారి అవసరాలకు సరిపోయేలా చేస్తారు, ఆయన తన ప్రజలను మరియు ఆయన ప్రజలను వ్యతిరేకించేవారిని బాధ్యులుగా ఉంచుతారు , అతను తన ప్రజలను ఏడాది పొడవునా రక్షిస్తున్నట్లుగానే, వారి శత్రువులు అన్ని కాలాలలో బహిర్గతమవుతారు.

 

ఇవన్నీ దేవుని స్తుతించేలా మనల్ని ప్రేరేపించాలి. మనం దేవునికి ఏదైనా సమర్పించినప్పుడు, అది ఆయన నిర్దేశించిన మార్గం ప్రకారం సమర్పించబడాలి మరియు ఆయన తన ఉనికిని ప్రదర్శించడానికి ఎంచుకున్న చోట ఆయనను ఎదుర్కోవాలని మనం ఆశించవచ్చు. ఇది అంతిమంగా ప్రపంచ దేశాలు యెహోవా దేవుడని మరియు ఇజ్రాయెల్ ఆయన ప్రజలని గుర్తించేలా చేస్తుంది, తద్వారా ఆయన మహిమ కోసం ఆధ్యాత్మిక అర్పణలను సమర్పించడంలో వారిని చేరేలా చేస్తుంది.

 

ఇతరులకు వ్యతిరేకంగా తీర్పు నుండి పాఠాలను వినండి మరియు దేవునితో మరియు ఆయన ప్రజలతో తమను తాము సమం చేసుకోవడానికి తొందరపడేవారు నిజంగా అదృష్టవంతులు. దేవుడు తన సంఘమును  నిర్లక్ష్యం చేస్తాడని లేదా దుష్టులు తాత్కాలికంగా అభివృద్ధి చెందడానికి అనుమతించినందున మానవ వ్యవహారాలను విస్మరిస్తున్నాడని నిర్ధారించకూడదని ఈ భాగం మనకు బోధిస్తుంది. ఆయన అలా చేయడానికి తెలివైన మరియు అర్థం చేసుకోలేని కారణాలను కలిగి ఉన్నాడు, ఇది ఆయన అంతిమ తీర్పు రోజున ప్రతి దానికి జీతం ఇచ్చేటప్పుడు మాత్రమే స్పష్టమవుతుంది మరియు ప్రతి వ్యక్తికి వారి చర్యల ప్రకారం ప్రతిఫలం లభిస్తుంది.

 

ఇక అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే: మొదటి వచనంలో కూషు నదుల అవతల ఉన్న దేశమా అంటున్నారు హీబ్రూలో ఈ అధ్యాయంలోని భాషాశైలి స్పష్టంగా లేదు. కాబట్టి వివరణ కష్టం. “రెక్కలున్న” అసంఖ్యాకంగా కీటకాలు ఉన్న దేశం, అంటే బహుశా శత్రువుల పైకి దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్న సైన్యాలకు గుర్తు అయి ఉండవచ్చు (యెషయా 7:18-19). “కూషు” ఈజిప్ట్‌కు దక్షిణాన ఉన్న ప్రాంతం. అది నేటి ఇతియోఫియా దగ్గరలోనే ఉంది గాని క్రీ.పూ. 715 లో అంటే యెషయా కాలంలో ఒక కూషు దేశస్థుడి నాయకత్వంలో కూషు, ఈజిప్ట్ దేశాలు ఏకమయ్యాయి. 2వ వచనం దీన్ని సూచిస్తున్నదే. యెషయా కాలంలో ప్రపంచంలోని శక్తివంతమైన రాజ్యాలు రెండే. నైరుతి దిశన ఈజిప్ట్ (కూషుతో సహా), ఈశాన్య దిశన అష్షూరు.

 

ఇక మూడవ వచనం: 3. పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

 

జెండాలు, బూరలు ఇవన్నీ యుద్ధానికి సూచనలు (యెషయా 5:26-29; యెషయా 13:2-3; యెషయా 31:9; యెహోషువ 6:20; న్యాయాధిపతులు 3:27). ఈ వచనం మహా సేనాసమూహాలు ఇతియోపియా దేశం మీదికి తరలి రావడం సూచిస్తూవుంది.

 

ఇక నాల్గవ వచనం చూసుకుంటే: 4. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.

 

ఇక్కడ నివాస స్థలము అనగా “నివాసస్థలం” అంటే జెరుసలం (కీర్తనల గ్రంథము 48:1-3). దేవుడు అన్నికార్యాలను తన అదుపులో ఉంచుకుంటారు. జరుగుతున్న విషయాలను తొణుకు బెణుకు లేకుండా చూస్తూ ఉంటారు.

 

ఇక 57 వచనాలు చూసుకుంటే 5. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.

6. అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.

7. ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగల వారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.

 

ఇక్కడ సైన్యం హఠాత్తుగా నాశనమైపోతుంది అనడానికి గుర్తు. ఆష్షూరు వారు ఇతియోపియాను ఆక్రమించుకుని దానిని సర్వనాశనం చేస్తారు. చివరకు అక్కడున్న ప్రజలను పశువులును క్రూర పక్షులు పీక్కు తింటాయి. చివరకు కొన్ని రోజులకు వారు విడువబడి రక్షించబడి అంత్యకాలంలో వారంతా నిజమైన దేవుడైన యెహోవా దేవుని దగ్గరకు వస్తారు. వారే దేవునికి కానుకగా అర్పించుకుంటారు అని ముగిస్తున్నారు! ఇలా ఇతియోపియా దేశం నాశనము మరియు అంత్యకాలంలో రక్షణ పొందుటను ఈ అధ్యాయం చెబుతుంది.

 

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*130వ భాగము*

 

యెషయా 19:17

1. ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది

2. నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును

3. ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.

4. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

5. సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

7. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఐగుప్తు  దేశం కోసమైన దేవుని తీర్పులు చూసుకుందాము !!

 

ఈ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే: ఈజిప్టుపై తీర్పులు. (1-17)

 

దేవుడు తన తీర్పులతో ఈజిప్టులోకి ప్రవేశిస్తారు, లోపల నుండి వారి పతనానికి కారణాలను కొని  తెస్తారు. దుష్ట వ్యక్తులు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు, వారు సురక్షితంగా ఉన్నారని వారు తరచుగా అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, తప్పు చేయడం కనికరం లేకుండా పాపులను వెంబడిస్తుంది మరియు వారు పశ్చాత్తాపపడాలని నిర్ణయించుకోని పక్షంలో వారిని త్వరగా పట్టుకుంటారు దేవుడు. ఈజిప్షియన్లు త్వరలో నెరవేరబోతున్నట్లుగా, వారిని కఠినంగా పరిపాలించే పాలకుడి చేతుల్లోకి అప్పగించబడతారు. జ్ఞానం మరియు జ్ఞానం కోసం ఈజిప్షియన్ల ఖ్యాతి ఉన్నప్పటికీ, వారి స్థిరమైన సంఘర్షణల కారణంగా వారి భూమి అపహాస్యం మరియు సానుభూతి యొక్క వస్తువుగా మారే వరకు వారి స్వంత తప్పుదారి పట్టించే ప్రణాళికలను అనుసరించడానికి మరియు వివాదాలలో పాల్గొనడానికి ప్రభువు వారిని అనుమతిస్తారు . దేవుడు పాపులకు భయాన్ని కలుగజేస్తాడు, వారు ఒకప్పుడు చిన్నచూపు మరియు చెడుగా ప్రవర్తించిన వారి గురించి భయపడేలా చేస్తాడు. సేనల ప్రభువు దుర్మార్గులను తమకు మరియు ఒకరికొకరు భయపెట్టే మూలంగా మారుస్తాడు, తద్వారా వారి చుట్టూ ఉన్న ప్రతిదీ భయంకరమైనదిగా మారుతుంది.

 

దాని విమోచన, మరియు ప్రజల మార్పిడి. (18-25)

 

"ఆ రోజులలో" అనే పదబంధం ఎల్లప్పుడూ మునుపటి భాగాన్ని మాత్రమే సూచించదు. భవిష్యత్తులో, ఈజిప్షియన్లు పవిత్ర భాషలో, బైబిల్  భాషలో సంభాషిస్తారు. వారు దానిని గ్రహించడమే కాకుండా దానిని ఉపయోగించుకుంటారు. హృదయాన్ని మార్చే కృప యొక్క పరివర్తన శక్తి వారి భాషను కూడా మారుస్తుంది ఎందుకంటే మాట్లాడేది హృదయ సమృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఈజిప్టులోకి యూదుల ప్రవాహం ఉంటుంది, వారు వేగంగా ఐదు నగరాలను ఆక్రమిస్తారు. సూర్యారాధనకు మరియు విగ్రహారాధనకు అపఖ్యాతి పాలైన ప్రదేశాలలో కూడా విశేషమైన పునరుజ్జీవనం ఏర్పడుతుంది. క్రీస్తు, ప్రతి అర్పణను పవిత్రం చేసే అంతిమ బలిపీఠం, అంగీకరించబడుతుంది మరియు ప్రార్థన మరియు స్తుతి ఆరాధన  సువార్త త్యాగాలు అందించబడతాయి.

 

విరిగిన హృదయం మరియు బాధలో ఉన్నవారికి, ప్రభువు గాయపరిచి, తన వైపు తిరగమని మరియు అతని సహాయం కోరమని బోధించిన వారికి, ధైర్యం  ఆయన వారి ఆత్మలను బాగుచేసి, వారి దుఃఖకరమైన విన్నపాలను సంతోషకరమైన స్తుతులుగా మారుస్తాడు. అన్యజనులు సువార్త మడతలో అత్యున్నతమైన గొర్రెల కాపరి అయిన క్రీస్తు మార్గదర్శకత్వంలో కలిసిపోవడమే కాకుండా, వారు యూదు ప్రజలతో కూడా ఐక్యంగా ఉంటారు. వారందరూ కలిసి ఆయనచే గుర్తించబడతారు మరియు వారందరూ ఒకే ఆశీర్వాదాలలో పాలుపంచుకుంటారు. ఒకే దయతో కూడిన సింహాసనం వద్ద గుమికూడడం మరియు అదే విశ్వాసం కోసం ఒకరికొకరు సేవ చేయడం అన్ని విభేదాలను పరిష్కరించాలి మరియు పవిత్ర ప్రేమలో విశ్వాసుల హృదయాలను ఏకం చేయాలి.

 

ఈ అధ్యాయంలో మొదటి అర్ధభాగంలో దేవుని తీర్పులు ఐగుప్తు దేశం మీద కనిపిస్తే, రెండవ అర్ధభాగంలో అంత్యకాలంలో ఐగుప్తు వారు రక్షించబడతారు అనడమే కాకుండా ఐగుప్తు దేశముతో పాటుగా ఆష్షూరు వారు కూడా రక్షించబడతారు అనియు, ఐగుప్తు నుండి ఆష్షూరుకి అనగా ఉత్తర ఇరాక్ కి రోడ్డు మార్గం ఏర్పడుతుంది అనేది ప్రవచనం! ఈ ప్రవచనాలు అంత్యకాలంలో జరుగబోతున్నాయి! అనగా మొదటి అర్ధభాగం ఇప్పటికే నెరవేరినది ఇక రెండవ అర్ధభాగం లోని ప్రవచనాలు అంత్యకాలంలో నెరవేర బోతున్నాయి!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*131వ భాగము*

 

యెషయా 19:17

1. ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది

2. నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును

3. ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.

4. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

5. సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

7. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ఐగుప్తు  దేశం కోసమైన దేవుని తీర్పులు చూసుకుందాము !!

 

                  (గతభాగం తరువాయి)

 

    ఇక మొదటి వచనం చూసుకుంటే దేవుడు వేగము గల మేఘము ఎక్కి తొందరగా ఐగుప్తు కి వస్తున్నారు అంటున్నారు! అందుకనే అక్కడున్న విగ్రహాలు కలవర పడుతున్నాయి అంటున్నారు.  ఈజిప్ట్ గురించి ఇతర ప్రవచనాలకు యిర్మీయా 46, యెహె 2932 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఇక

 

“మేఘం” అంటే కీర్తనల గ్రంథము 18:9-10;

9. నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను.

10. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

 

మేఘము ఆయన వాహనము అని గ్రహించాలి. అదే మేఘముల మీద మనము కూడా ప్రభువుని ఎదుర్కోడానికి ఒకరోజు వెళ్తాము అని మర్చిపోకూడదు! క్రింది రిఫరెన్సులలో ఇంకా అనేక ఉదాహరణలు కనిపిస్తాయి!

 

కీర్తనల గ్రంథము 68:4; కీర్తనల గ్రంథము 104:3; మత్తయి 26:64; అపో. కార్యములు 1:9; ప్రకటన గ్రంథం 1:7.

 

“విగ్రహాలు” అనగా మోషే కాలంలో దేవుడు ఈజిప్ట్ విగ్రహాలకూ, ఈజిప్ట్ దేవుళ్ళకూ తీర్పు తీర్చాడు నిర్గమకాండము 12:12లో . తానొక్కడే నిజ దేవుడని చూపాడు. అయితే ఈజిప్ట్ వారింకా తమ విగ్రహాలనే అంటిపెట్టుకుని ఉన్నారు. మానవ హృదయంలోని భ్రష్టత్వం, మూర్ఖత్వం ఎంత ఘోరమైనవో దీనివలన తెలుసుకోండి.

 

రెండో వచనం: నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును

చూడండి ఆ దేశస్తులు వారికివారే గొడవులాడుకుని ఛస్తారు అనగా అంతర్యుద్దాలాలో ఛస్తారు అంటున్నారు దేవుడు! ఈజిప్ట్‌లో, దాని మిత్ర పక్షాల్లో అధికారం కొరకు జరిగే పెనుగులాటను ఇది సూచిస్తున్నది.

 

మూడో వచనంలో ఈజిప్టు వారి ధైర్యం  పోతుంది అంటున్నారు! జనాలు, దేశాలు వేసుకున్న పథకాలు విఫలమైతే అలా జరిగించినది దేవుడు అని రూఢిగా తెలుసుకోవాలి.

“కర్ణ పిశాచం” ద్వితీయోపదేశకాండము 18:9-14. సజీవుడైన నిజ దేవునిదగ్గర విచారణ చెయ్యడం తప్పించి మరింకేది చెయ్యడానికైనా, ఇతరులెవరి దగ్గరైనా విచారణ చేసేందుకైనా మనుషులు సిద్ధమే. ఈజిప్టు వారు ప్రతీ విషయాన్ని ఇలాంటి దయ్యాల దగ్గర విచారణ చేయడం వారికి అలవాటు!

 

ఇక నాలుగో వచనం: నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

బహుశా ఆ రాజు ఆష్షూరు రాజు కావచ్చు! కారణం ఆష్షూరు వారిద్వారా ఈజిప్టు ఒకసారి సర్వనాశనం కాబడింది! ఇక బబులోనూ రాజు కూడా అవుతాడు. కారణం రెండోసారి బబులోనూ రాజైన నెబుకద్నేజర్ ఆ దేశాన్ని పీల్చి పిప్పిచేశాడు!

 

5 వ వచనం: సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

 

గమనించాలి: ఈజిప్ట్ ఆర్థిక వ్యవస్థ అంతా నైలు నది మీదే ఆధారపడి ఉంది. నైలు నది ఎండిపోవడం భయంకరమైన విపత్తు. ఈ వచనాలు అక్షరాలా నెరవేరిన సంఘటన చరిత్రలో ఎక్కడా కనిపించదు. కాబట్టి ఇది భవిష్యత్తులో నెరవేరాలి. లేక కావ్య భాషలో అలంకారికంగా ఈజిప్ట్ పతనాన్ని సూచిస్తూ చెప్పినది కావచ్చు.

 

తర్వాత వచనాలు కూడా అదే చెబుతున్నాయి. 6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

7. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.

8. జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు

9. దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును

10. కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.

 

నైలునది ఈజిప్టు వరప్రసాదం అనే పేరు ఉంది. ఆ పేరు ఇపుడు పోతుంది!

 

11 వ వచనంలో 11. ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?

 

“సోయను” యూదులకు బాగా పరిచయమైన ఒక ముఖ్యమైన పట్టణం. ఈజిప్ట్‌లో ఉంది (సంఖ్యాకాండము 13:22; కీర్తనల గ్రంథము 78:12, కీర్తనల గ్రంథము 78:43). ఇది కొంతకాలం ఉత్తర ఈజిప్ట్‌కు రాజధాని. అయితే ఇప్పుడు అది పాడైపోగా సలహాలు ఇచ్చేవారు ఉండరు! “సలహా” వ 3. నిజ దేవుణ్ణెరుగని సలహాదారులు చెప్పే సలహా యోగ్యమైనదయ్యేందుకు అవకాశాలు తక్కువ.

 

ఇక 13 వ వచనంలో నోపు అనే మరో పట్టణం గురుంచి ఉంది. “నోపు” ఉత్తర ఈజిప్ట్‌కు ఒక కాలంలో రాజధానిగా ఉండేది. అంతకుముందూ అప్పుడు కూడా ముఖ్యమైన పట్టణం. “ప్రముఖులు” జాతిని ఒక్క త్రాటిపై నడిపించే నాయకులు, ప్రవక్తలు, యాజులు. వీరే మూర్ఖులూ, దుర్మార్గులూ అయితే ఆ జాతికి ఇక విముక్తి లేదు (యెషయా 9:15-16; యిర్మియా 2:8 మొ।।)

 

14 వ వచనంలో 14. యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి యున్నారు

 

ఈ వచనంలో ఒకరకమైన ఆత్మ కనిపిస్తుంది మనకు! ఇది మూర్ఖత గల ఆత్మ! బైబిల్ లో అనేకమైన ఆత్మలు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ మన అందరికీ కావాలి! అయితే ఆయనను పొందుకోలేని వారు దురాత్మ, గాఢ నిద్రాత్మ , ఇంకా అనేకమైన చెడ్డ ఆత్మలు పొందుకుంటారు. ఇక ఈజిప్టు వారైతే మూర్ఖత గల ఆత్మను పొందుకోబోతున్నారు!

ఇక తూలిపోవడం అనగా తారుమారు చేయడం అన్నమాట! “యెహోవా...తారుమారు” ఒక దుష్ట ప్రజను దేవుడు శిక్షించే విధానాల్లో ఒకటి వారిని వారి దుష్టత్వంలో వదిలేసి వారి పనికిమాలిన ఆలోచనలు, తప్పుడు పథకాల వల్ల వారే పతనమయ్యేలా చూడడం (యెషయా 6:9-13; యిర్మియా 25:15-26). “తూలిపోయేలా” కొన్నిసార్లు ప్రపంచదేశాలు త్రాగిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాయి.

 

ఒకవేళ నీలో నాలో ఇలాంటి స్తితి కనిపిస్తే దేవుడే మనకు బుద్ది చెప్పడానికి ఇలాంటివి పంపిస్తున్నారు అని గ్రహించాలి!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*132వ భాగము*

 

యెషయా 19:15 25

15. తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు

16. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.

17. యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.

18. ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.

19. ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.

20. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

21. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

22. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.

23. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.

24. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.

25. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ఐగుప్తు  దేశం కోసమైన దేవుని తీర్పులు చూసుకుంటున్నాము !!

 

      (గతభాగం తరువాయి)

 

ఇక 15 వ వచనంలో ఈజిప్టులో తలగాని తోక గాని లేకుండా చేస్తాను అంటున్నారు. అసలు తల ఎవరో తోక ఎవరో తొమ్మిదవ అధ్యాయంలో కనిపిస్తుంది మనకు! యెషయా  9

14. కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును.

15. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

 

ఇప్పుడు ఈజిప్టు విషయానికి వస్తే అధిపతులు రాజులు ఎవరూ లేకుండా చేసేస్తాను అని అర్ధము అన్నమాట!

 

16 వ వచనంలో ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.

 

ఇది అర్థం చేసుకొనేందుకు కష్టతరమైన అస్పష్టమైన భాగం. ఇందులోని వివరాలన్నిటినీ సంతృప్తికరంగా విప్పి చెప్పడం కష్టం. అయితే ఒకటి మాత్రం అర్ధమవుతుంది ఏమిటంటే ఈజిప్టు వారు ఆ తీర్పు దినాన యుద్ధం చేయడానికి కూడా ధైర్యము లేనివారిగా అయిపోతారు అన్నమాట!!  ఇది “ఆ రోజు” అనే పదంతో ఆరంభమౌతుంది. ఇదే మాట 18,19,23,24 వచనాలలో కనిపిస్తుంది. దీని అర్థం ఇదమిద్ధంగా చెప్పలేం గాని యెషయా ఇంతకుముందే చెప్పిన ప్రభువు దినాన్ని సూచించే పదం అయి ఉండవచ్చు (యెషయా 2:20; మొ।।.

“ఆ రోజున” అంటే అష్షూరు, బబులోను సైన్యాలు ప్రవక్తల కాలంలో దండెత్తి వచ్చే సమయం అనుకోవడానికి వీలులేదు. ఈ వచనాల్లో చెప్పబడినవన్నీ ఆ కాలంలో నెరవేరలేదన్నది నిస్సందేహం. ఇక్కడ ఉన్న భవిష్యద్వాక్కులు ఈజిప్ట్ అంతా దేవుని వైపు తిరుగుతుందనీ, ఇస్రాయేల్, ఈజిప్ట్, అష్షూరువారి మధ్య పూర్తి శాంతి, సహకారాలు ఉంటాయనీ తెలియజేస్తున్నాయి (23,24 అధ్యాయాలు). శతాబ్దాలుగా ఈ దేశాలు ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి. అయితే ఇది జరగక ముందు దేవుడు ఈజిప్ట్‌ను దెబ్బ తీస్తాడు (వ 16,22). దేవుడే ఇలా చేశాడని ఆ ప్రజలకు తెలుస్తుంది. ఆయనకూ, ఆయన ప్రజలకూ (యూదా 15,16 వచనాలు) వారు భయపడతారు. ఈజిప్ట్‌ను దేవుని వైపు తిప్పడానికి, దాన్ని భూమి పై దీవెన కారణంగా చెయ్యడానికి ఇది సాధనం (వ 24). 25 వ వచనంలో ఉన్న అద్భుతమైన మాటలను దేవుడు పలికేలా ఇది చేస్తుంది. క్రీస్తు రెండవ సారి వచ్చి భూమి పై ఆయన పరిపాలన సమయంలో విశ్వ శాంతిని నెలకొల్పే వరకూ ఇది నెరవేర్చడం ఎలా సాధ్యం? (యెషయా 2:2-4; యెషయా 9:7; యెషయా 11:1-16).

 

దానినే తర్వాత వచనాలు చెబుతున్నాయి. ఐగుప్తు ఆష్షూరు దేశాలు రక్షించబడి ఇశ్రాయేలు యూదులతో పాటుగా ఆశీర్వాదానికి పరలోకానికి పాత్రులుగా ఉంటారు!

 18. ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.

19. ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.

20. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

21. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

22. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.

23. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.

24. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.

25. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.

 

19 వ వచనంలో ఐగుప్తు లో దేవుని బలిపీఠం, 21 లో ఆ బలిపీఠం మీద మ్రొక్కుబడులు చెల్లిస్తారు. అయితే 22 వ వచనం చాలా ఆసక్తి కరమైన వచనం. యెహోవా ఈజిప్టు వారిని ఎందుకు కొట్టారు అంటే వారిని అనగా ఈజిప్టు వారిని స్వస్థపరచాలనే ఉద్దేశంతో!! దీనిని మనం అర్ధం చేసుకోవాలి- కొన్నిసార్లు దేవుడు మనలను కూడా కొడతారు ఎందుకంటే మనం దారితప్పి ఆయన నుండి దూరమై పోతున్నప్పుడెల్లా ఒక దెబ్బకొట్టి మనలను ఆయన దారిలోనికి తెచ్చుకుంటూ ఉంటారు! ఇది మనకు అర్ధం కావాలి! అందుకే గాయపరచు వాడు ఆయనే గాయం కట్టేవాడు కూడా ఆయనే అని వ్రాయబడింది!

యోబు 5:18

ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ పరచును.

 

ఇక 23 లో 23. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.

 

ఇది అంత్య దినాలలో జరుగబోతుంది!

 

ఇక చివరి వచనంలో దేవునికి వ్యతిరేఖమైన జనాంగమును దేవుడు ఎలా పిలుస్తున్నారో చూడండి సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును

 

ఇలా దేవుడు ఈజిప్టు వారిని ఉత్తర ఇరాక్ వారిని పిలిచి తనకొరకు ఏర్పరచుకుని వారిని యూదులతో పాటుగా హక్కుదారులుగా చేస్తారు! ఇది కూడా చివరి దినాలలో జరిగే సంభవమే! కాబట్టి దేవుని ఏర్పాటు మనకు ఆగమ్య గోచరం! ఇదే ఈజిప్టు వారు ఇదే అష్షూరీయులు దేవుని ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టారు గాని దేవుడు ఇప్పుడు వారిని కరుణించి తనకు స్వాస్థ్యముగా చేసుకుంటున్నారు! ఈరోజు నీవు దేవునికి దూరంగా ఉంటున్నావా ఆయనకు వ్యతిరేఖమైన పనులు చేస్తూ ఆయనను గాయపెడుతూ ఉంటే నేడే తప్పు తెలుసుకుని ఆయన పాదాలను పట్టుకుంటే దేవుడు నిన్నుకూడా తనకు స్వకీయ జనముగా చేసుకుంటారు!

 

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*133వ భాగము*

 

యెషయా 20:1 6

1. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.

2. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెనునీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుండగా

3. యెహోవానా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము

4. అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరు లనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.

5. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.

6. ఆ దినమున సముద్రతీర నివాసులు అష్షూరు రాజు చేతిలోనుండి విడిపింపబడ వలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ఐగుప్తు దేశం మరియు కూషు దేశాలకు కలిసి  దేవుని తీర్పులు చూసుకుందాము !!  నిజానికి దీనిలో ఫిలిస్తీయులు కోసం కూడా చెప్పబడింది.

 

ఈ అధ్యాయం లో ప్రవచనం ఎప్పుడు వచ్చింది అంటే మొదటి వచనం ప్రకారం 1. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.

 

ఇక్కడ అష్డోదు అనగా ఫిలిస్తీయుల దేశంలో ఒక పట్టణం. ఇది మనకు సమూయేలు గ్రంధంలో కనిపిస్తుంది.  కాబట్టి అష్షూరు రాజైన సర్గోను ఫీలిస్తీయుల దేశాన్ని దండెత్తి వచ్చినప్పుడు అదే సమయంలో దేవుని నుండి యెషయా గారికి ప్రవచనం వచ్చింది. ఏమని వచ్చింది అంటే యెషయా నీవు నీ నడుము మీది గోనె పట్ట విప్పేసి నీ పాదముల నుండి చెప్పులు తీసి మీద బట్ట, క్రింద జోళ్లు లేకుండా తిరగమని చెబుతారు! వెంటనే యెషయా గారు నడుము మీద బట్టలు కాళ్ళకు చెప్పులు తీసివేసి నడుస్తుంటారు. ఇలా జరుగుచున్నప్పుడు దేవుడు చెబుతారు నా సేవకుడు యెషయా నడుముకి బట్ట కాళ్ళకు చెప్పులు లేకుండా ఎలా మూడు సంవత్సరాలు తిరుగుచున్నాడో అలాగా కూషు దేశపు వారు ఆనగా ఇతియోపియా వారు ఈజిప్టు వారు కూడా దిగంబరులుగా తిరుగుతారు అంటున్నారు. ఎందుకంటే నాల్గవవచనం 4. అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.

 

అష్డోదు పట్టణం యూదా సరిహద్దుకు సమీపంగా ఫీలిస్తీయుల దేశంలో  ఉంది. యూదా, జెరుసలంకు అష్షూరు సైన్యాల వల్ల అపాయం వచ్చింది. యూదావారు కొందరు ఈజిప్ట్‌తో సంధి కుదుర్చుకొమ్మని తమ రాజు పై ఒత్తిడి తెచ్చారు (వ 5; యెషయా 30:1-2; యెషయా 31:1). అందుకు దేవుడు యెషయాను ప్రజల కోసంలేక సూచనగా  ఒక గుర్తుగా ఉంచుతున్నారు ఇక్కడ!. మిత్ర పక్షాలైన ఈజిప్ట్ కూషు దేశాలవారిపైకే అవమానం వస్తుంది. వారు చెరలోకి వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో విజయం సాధించిన సైన్యాలు తమ చేజిక్కిన శత్రువులను కొన్నిసార్లు నగ్నంగా చేసి తీసుకువెళ్ళేవారు.  ఇప్పుడు ఆరెండు దేశాలమీదికి అవమానం వస్తుంది. శత్రు రాజు ఆ రెండు దేశాల ప్రజలను బట్టలూడదీసి చెప్పులు లేకుండా వారిని అష్షూరు దేశం తీసుకుని పోతాడు. అప్పుడు ఆ రెండు దేశాలను నమ్ముకున్న యూదా నీ పరిస్తితి ఏమిటి అని దేవుడు అడుగుచున్నారు ఇక్కడ!

 

ఇక “గోనెపట్ట” ఇది విచారానికి గుర్తు (ఆదికాండము 37:34; ఎస్తేరు 4:1; కీర్తనల గ్రంథము 69:11). కొన్ని సార్లు ప్రవక్తలు దీన్ని తమ మామూలు వస్త్రంగా ధరించేవారు (2 రాజులు 1:8; జెకర్యా 13:4; మత్తయి 3:4; మత్తయి 11:8-9 చూడండి). గోనెపట్టను వెంట్రుకలతో తయారు చేశారు. “నగ్నంగా” బైబిల్లో ఎక్కడ చూచినా ఇది సిగ్గు, అవమానాలకు గుర్తు (వ 4; యెషయా 32:11; యెహెఙ్కేలు 16:39; యెహెఙ్కేలు 23:26; హోషేయ 2:3).

 

కాబట్టి దేవుని ప్రజలు దేవుని మీదనే ఆనుకోవాలి గాని శరీరులపై ఆధారపడితే ఎవరిమీద ఆధారపడతారో వారు పాడైపోతారు. ఆధారపడిన వారు కూడా నాశనమైపోతారు అని తెలుకుకుని కేవలం దేవుని మీదనే ఆనుకొమ్మని మనవిచ్చేస్తున్నారు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*134వ భాగము*

 

యెషయా 21:1 9

1. సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

2. కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

3. కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.

4. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.

5. వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను

6. నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.

7. జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును

8. సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

9. ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము!ఈ అధ్యాయంలో బబులోనూ, ఎదోము అనగా బబులోనూ మరియు అస్శూరు మరియు అరేబియా దేశాల కోసం  దేవుని తీర్పులు చూసుకుందాము !!

 

అయితే బబులోనూ కోసం విస్తారంగా మనం గతభాగంలో ధ్యానం చేసుకున్నాము గనుక లైట్ గా చూసుకుని ముందుకుపోదాం! ప్రపంచాన్ని గడగడలాడించిన బబులోనూ దేశం ఇప్పుడు వారి పరిస్తితి ఎలా ఉంటుందో మనకు 69 వచనాలు అద్దం పడతాయి!

6. నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.

7. జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును

8. సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

9. ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

 

అయితే ఈ ప్రవచనం గతంలో చెప్పినట్లు అనేకసార్లు జరిగింది. మరోసారి ప్రకటన గ్రంధం ప్రకారం అంత్య దినాలలో జరుగబోతుంది. బబులోనూ దేశం సర్వనాశనం కాబోతుంది. గమనించాలి బైబిల్ గ్రంధంలో ఏదైనా నిర్ధారణ చేసుకోవాలి అంటే రెండు లేదా ముగ్గురు సాక్షులు కావాలి. అలాగే ఒక లేఖనం యొక్క అర్ధము బాగా అర్ధం కావాలంటే దానికి సపోర్టింగ్ రిఫరెన్సులు ఒకటి రెండు ఉండాలి! అప్పుడే అది స్థిరమైన దర్శనం! స్థిరమైన అర్ధం! ఖచ్చితంగా జరుగుతుంది! అయితే ఇక్కడ బబులోనూ నాశనం కోసం ఇదే గ్రంధంలో మూడుసార్లు వ్రాయబడింది. కాబట్టి బబులోనూ నాశనం అనేది దేవుని యొక్క స్థిరమైన నిర్ణయం అని గ్రహించాలి!

 

సరే, ఈ అధ్యాయాన్ని పైపైకి చూసుకుందాం!

 

బాబిలోన్ స్వాధీనం. (1-10)

 

బాబిలోన్ ఒక చదునైన మరియు మంచి నీరు ఉన్న భూమి. దక్షిణ ఇరాక్ ప్రాంతము! యెషయా తరచుగా ప్రస్తావించిన బాబిలోన్ ప్రవచించబడిన విధ్వంసం, ప్రకటన గ్రంధంలో ముందే చెప్పబడినట్లుగా, కొత్త నిబంధన చర్చి యొక్క బలీయమైన విరోధి పతనానికి చిహ్నంగా పనిచేసింది. ఈ వార్త అణచివేతకు గురైన బందీలకు స్వాగతించే ఉపశమనాన్ని కలిగిస్తుంది కానీ దురహంకార అణచివేతదారులకు ఒక భయంకరమైన హెచ్చరిక. ఇది మన పనికిమాలిన ఉల్లాసాన్ని మరియు ఇంద్రియ సుఖాలను నిగ్రహించమని గుర్తుచేస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత వచ్చే దుఃఖాన్ని మనం ఊహించలేము.

 

బాబిలోన్‌ను సైరస్ ముట్టడించినప్పుడు మోగిన అలారం గురించి ఇక్కడ ఈ ఖాతా వివరిస్తుంది. మాదీయులు మరియు పర్షియన్లకు ప్రతీకగా గాడిద మరియు ఒంటె కనిపిస్తుంది. బాబిలోన్ విగ్రహాలు ఎటువంటి రక్షణను అందించవు; అవి పగిలిపోతాయి. నిజమైన విశ్వాసులు దేవుని గిడ్డంగిలోని విలువైన ధాన్యం వంటివారు, అయితే కపటులు కేవలం పొట్టు మరియు గడ్డి, మొదట్లో గోధుమలతో కలుపుతారు కానీ వేరు చేయబడతారు. దేవుని గిడ్డంగిలోని అమూల్యమైన ధాన్యం బాధలు మరియు హింసల ద్వారా నూర్పిడి ప్రక్రియకు లోనవుతుందని ఆశించాలి.

 

గతంలో, దేవుని ప్రజలు ఇశ్రాయేలు బాధలను అనుభవించారు, అయినప్పటికీ దేవుడు వాటిని తన సొంతమని చెప్పుకున్నాడు. చర్చికి సంబంధించిన అన్ని విషయాలలో, గతమైనా, వర్తమానమైనా లేదా భవిష్యత్తు అయినా, మన చూపు దేవునిపై స్థిరంగా ఉండాలి. అతను తన చర్చి కోసం ఏదైనా సాధించగల శక్తిని కలిగి ఉన్నాడు మరియు ప్రతిదీ చివరికి ఆమె శ్రేయస్సుకు ఉపయోగపడేలా చూసే దయ.

 

చివరికి బబులోనూ దేశం మాదీయ పారశీక అలయన్స్ దేశాల సైణుకులకు ఎంతగానో భయపడతారు అంటున్నారు దేవుడు!

 

ఇక ఈ వచనాలు చూసుకుంటే మొదటి వచనం: 1. సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

 

“సముద్ర తీరాన...ఎడారి” బబులోను (వ 9). ఈ నగరాన్ని, రాజ్యాన్ని మాదీయ పారసీక సైన్యాలు ఓడించాయి. (ఏలాం మాదీయ పారసీక సామ్రాజ్యంలో భాగం). బబులోను ప్రాంతంలో కొంత భాగం పర్షియా సింధూ శాఖలో ఉంటుంది. ఇదే 1 వ వచనంలో చెప్పిన సముద్రం. ఒకప్పుడు సారవంతంగా ఉన్నప్పటికీ అది ఎడారిగా మారుతుంది (యెషయా 13:19-21; యిర్మియా 50:10, యిర్మియా 50:12; యిర్మియా 51:41-43). బబులోను ఇతర ప్రజలను హింసించినందుకు ప్రతిగా ఏలాం, మాదీయ వచ్చి బబులోను పై దాడి చేయవలసిందిగా 2వ వచనంలో చూస్తున్నాం.

 

ఇక మరో ముఖ్యమైన వచనం ఐదో వచనం: 5. వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను

 

ఇది క్రీ. పూ. 540 లో మాదీయ పారశీక అలయన్స్ సైన్యం కోరేషు అనే పారశీక రాజు ఆద్వర్యంలో బబులోనూ కోటను దండెత్తినప్పుడు బబులోనూ సైనికులు ఆటపాటలతో మరియు త్రాగుడు తో జల్సాలు చేసే సంఘటనను దేవుడు ముందుగానే చెబుతున్నారు!  ఇక యెషయా 45:13 వచనాలు ఈ సందర్బమునే తెలియజేస్తుంది..

Isaiah(యెషయా గ్రంథము) 45:1,2,3,4

1.అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

2.నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

3.పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

4.నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

 

ఇక తొమ్మిదవ వచనంలో బబులోనూ కూలెను కూలెను- దీనికోసం బైబిల్ లో అనేకసార్లు వ్రాయబడింది. ప్రకటన గ్రంథం  14

8. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చిమోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.

ప్రకటన గ్రంథం 18:2

యెషయా 13:19; ప్రకటన గ్రంథం 14:8; ప్రకటన గ్రంథం 18:2.

 

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*135వ భాగము*

 

యెషయా 21:11  12

11. దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

12. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.

 

             ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము!ఈ అధ్యాయంలో బబులోనూ, ఎదోము అనగా బబులోనూ మరియు అస్శూరు మరియు అరేబియా దేశాల కోసం  దేవుని తీర్పులు చూసుకుందాము !!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక ఎదోము దేశం కోసం చూసుకుంటే ఎదోమీయుల. (11,12)

 

దేవుని ప్రవక్తలు మరియు దైవసేవకులు శాంతి సమయాల్లో నగరం లోపల అప్రమత్తంగా ఉండే సెంటినెల్స్‌గా వ్యవహరిస్తారు, దాని భద్రతకు భరోసా ఇస్తారు. వారు యుద్ధ సమయాల్లో శిబిరంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తారు, శత్రువుల కదలికల గురించి హెచ్చరిస్తారు. పాపం మరియు ఆత్మసంతృప్తిలో సుదీర్ఘమైన నిద్ర తర్వాత, మనల్ని మనం లేపడానికి మరియు మన ఆధ్యాత్మిక బద్ధకం నుండి మేల్కొలపడానికి ఇది చాలా అవసరం. చేయవలసిన పనిలో గణనీయమైన మొత్తం ఉంది, ఇది సుదీర్ఘ ప్రయాణం; ఇది చర్యలో మనల్ని మనం కదిలించుకునే సమయం. సుదీర్ఘమైన, చీకటి రాత్రి తర్వాత తెల్లవారుజామున ఏదైనా ఆశ ఉందా? రాత్రి ఏ వార్త? రాత్రి సమయంలో ఏమి జరుగుతుంది? మన రక్షణను మనం ఎప్పుడూ వదులుకోకూడదు. అయితే, చాలా మంది కావలివారిని క్లిష్టమైన ప్రశ్నలతో సంప్రదిస్తారు. వారు సంక్లిష్టమైన ప్రశ్నలను పరిష్కరించడానికి లేదా సవాలు చేసే ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు, అయినప్పటికీ వారు తమ స్వంత ఆత్మల స్థితిని పరిశీలించడాన్ని విస్మరిస్తారు, మోక్షానికి మార్గం మరియు వారి విధుల గురించి సమాధానాలు వెతుకుతారు.

 

కాపలాదారు భవిష్య సందేశంతో ప్రతిస్పందిస్తాడు. మొదట, కాంతి, శాంతి మరియు అవకాశం ఉన్న ఉదయం ఉంటుంది, కానీ చివరికి, ఇబ్బంది మరియు విపత్తుల రాత్రి వస్తుంది. యవ్వనం మరియు మంచి ఆరోగ్యంతో కూడిన ఉదయం ఉంటే, అనారోగ్యం మరియు వృద్ధాప్యం యొక్క రాత్రి అనివార్యంగా వస్తుంది. కుటుంబంలో లేదా సమాజంలో శ్రేయస్సు యొక్క ఉదయం ఉంటే, మనం ఇంకా మార్పులను ఊహించాలి. ప్రస్తుత ఉదయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం, అనివార్యంగా అనుసరించే రాత్రి కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడంలో మన జ్ఞానం ఉంది. మేము విచారించమని, తిరిగి రావాలని మరియు దేవుని వద్దకు రావాలని కోరాము. వాయిదా వేయడానికి సమయం లేదు కాబట్టి ఇది వెంటనే చేయాలి. దేవుని వద్దకు తిరిగి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చేవారు, తాము పూర్తి చేయడానికి గణనీయమైన పనిని కలిగి ఉన్నారని మరియు దానిని చేయడానికి పరిమిత సమయం ఉందని తెలుసుకుంటారు.

 

ఇక ఈ వచనాలు చూసుకుంటే: 11. దూమాను గూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

 

“దూమా” ఈ హీబ్రూ పదానికి అర్థం మౌనం. ఇష్మాయేల్ సంతానమైన ఒక తెగ పేరు కూడా ఇదే (ఆదికాండము 25:14; యెహోషువ 15:52; 1 దినవృత్తాంతములు 1:30). ఇక్కడ ఇది ఎదోం దేశంలోని ఒక స్థలం పేరు. శేయీరు కొండ ఎదోంలో ఉంది. ఎదోం గురించి ఇతర దేవోక్తుల కోసం యెషయా 34:5-15; యిర్మియా 49:7-22; యెహెఙ్కేలు 25:12-14; యెహెఙ్కేలు  25

12. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

13. ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

14. నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నా కోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

 

ఆమోసు 1:11-12;

11. యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.

12. తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును.

 

ఓబద్యా చూడండి.

రాత్రి ఎంత వేళైంది అని అడగడం ప్రమాదాన్ని పసికట్టి ఆందోళన చెందడానికి గుర్తు.

 

 

అరేబియా దేశం లేక అరబ్బుల కోసం . (13-17)

 

అరేబియన్లు సంచార జీవితాన్ని గడిపారు, గుడారాలలో నివసించేవారు మరియు వారి పశువులను పోషించేవారు. అయినప్పటికీ, ఒక బలీయమైన ఆక్రమణ శక్తి త్వరలో వారిపైకి దిగి, దాడికి గురయ్యే అవకాశం ఉంది. మన జీవితం ముగియకముందే మనకు ఎదురయ్యే కష్టాలను మనం ఊహించలేము. ప్రస్తుతం సమృద్ధిగా రొట్టెలను ఆస్వాదించే వారు ఏదో ఒక రోజు ఆకలి బాధను అనుభవించవచ్చు. నైపుణ్యం కలిగిన విలుకాడుల నైపుణ్యం లేదా గొప్ప యోధుల పరాక్రమం ఎవరినీ దేవుని తీర్పుల నుండి రక్షించలేవు. అటువంటి నశ్వరమైన కీర్తి స్వల్ప శాశ్వత విలువను అందిస్తుంది. ఇది ప్రభువు నాకు తెలియజేసిన సందేశం, ఆయన మాట నెరవేరకుండా ఉండదు. ఇజ్రాయెల్ యొక్క బలం ఆయన మాటకు కట్టుబడి ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. నిజమైన ఆనందం ఎవరి సంపద మరియు కీర్తి ఆక్రమణదారులకు చేరుకోలేని వారికి మాత్రమే చెందుతుంది; శ్రేయస్సు యొక్క అన్ని ఇతర రూపాలు త్వరలో కనుమరుగవుతాయి.

 

ఇక వచనాలు ధ్యానం చేస్తే 13. అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.

 

“అరేబియా” అరేబియా విషయం మరో ప్రవచనం యిర్మియా 49:28-33 చూడండి

 

“దేదానువారు” ఒక అరేబియా తెగవారు

 

ఇక 14 వ వచనంలో “తేమా” అరేబియా ఉత్తర ఎడారి ప్రాంతంలో నీరుండే చోటు. యోబు 6:19; యిర్మియా 25:23 లో దీని ప్రసక్తి ఉంది.

 

15. ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు

వేరు వేరు సమయాల్లో అష్షూరు, బబులోను కూడా అరేబియా పై దాడి చేశారు.

ఈ రకంగా అరేబియా దేశాలు అష్షూరు, బబులోను ద్వారా దాడిచేయబడి నాశనం చేయబడ్డాయి.

 

గమనించాలి! ఈ ప్రవచనాలు కొన్ని దశాబ్ధాలు వందల సంవత్సరాల ముందుగానే చెప్పబడ్డాయి. ఆ తర్వాత అవి 100% నెరవేరాయి. కాబట్టి దేవుని మాట వ్యర్ధం కాదని తప్పకుండా జరుగుతుంది అని గ్రహించి భయము నొంది పాపము మానేద్దాం! దేవుని మాటలకు దేవునికి భయపడదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*136వ భాగము*

 

యెషయా 22:1 7

1. దర్శనపులోయను గూర్చిన దేవోక్తి

2. ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు.

3. నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి

4. నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.

5. దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును.

6. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరుడాలు పై గవిసెన తీసెను

7. అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు.         

 

       ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! అయితే మధ్యలో యూదాకి జరుగబోయే నాశనం కోసం చెబుతున్నారు దేవుడు మరలా 23 వ అధ్యాయం నుండి ఇతర దేశాలకోసం చెబుతున్నారు!  ఈరోజు యూదులకు కలుగబోయే నాశనం కోసం చూసుకుందాం!

 

ఈ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు మూడు భాగాలుగా అర్ధమవుతాయి!

 

1---7 వచనాలు   జెరూసలేం ముట్టడి మరియు స్వాధీనం. (1-7)

 

814 వచనాలలో యెరూషలేము ప్రజల యొక్క దుష్ట స్వభావము కోసం ఉంది

 

ఇక 15 నుండి చివరివరకు షెబ్నా యొక్క స్థానభ్రంశం, మరియు ఎలియాకీమ్ యొక్క ప్రమోషన్, మెస్సీయకు వర్తిస్తాయి.

 

జెరూసలేం ముట్టడి మరియు స్వాధీనం. (1-7)

 

జెరూసలేం తీవ్ర దుఃఖానికి కారణం ఏమిటి? దాని మనుషులు ఖడ్గం వల్ల కాదు, కరువు వల్ల లేదా భయం వల్ల నశించారు, వారిని నిరుత్సాహపరిచారు. వారి పాలకులు కూడా పారిపోయారు కానీ తప్పించుకోలేకపోయారు. దేవుణ్ణి సేవిస్తూ, రాబోయే కష్టాల గురించి ప్రవచించే వారు రాబోయే వాటి గురించి తీవ్రంగా కలత చెందుతారు. అయినప్పటికీ, యుద్ధంలో జయించిన నగరం యొక్క భయానక సంఘటనలు రాబోయే దైవిక ఉగ్రత దినం యొక్క భయంకరమైన సంఘటనలను మాత్రమే పోలి ఉంటాయి.

 

మొదటి వచనంలో దర్శనపు లోయ కోసమైన దేవోక్తి అంటున్నారు: దర్శనపు లోయ ఏమిటి? జెరుసలం నగరం కొండలపై కట్టారు. దాని చుట్టూ కొండలు, వాటి మధ్య లోయలున్నాయి. దర్శనలోయ వీటిలో ఒకటి. ఏ లోయకు ఈ పేరు ఉన్నదో చెప్పలేము. ఈ దేవోక్తి జెరుసలం గురించి అని ఎలా తెలుసునంటే 8వ వచనంలో “అడవి నగరు” (దీన్ని సొలొమోనురాజు కట్టించాడు 1 రాజులు 7:26; 1 రాజులు 10:17, 1 రాజులు 10:21). 9వ వచనంలో జెరుసలం అని కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో శత్రువు వచ్చి జెరుసలంను ముట్టడించినట్టు యెషయా తన దర్శనంలో చూశాడు. అయితే శత్రువు ఎవరో తెలియజేసే మాట మాత్రం లేదు. జెరుసలం పై ముట్టడి చాలా సార్లు జరిగింది. ప్రవక్తల కాలంలో పెద్ద ఎత్తున జరిగినవి రెండు. ఒకటి, అష్షూరు వారి ముట్టడి (క్రీ. పూ 701 2 దినవృత్తాంతములు 32:1-2, 2 దినవృత్తాంతములు 32:9-10), రెండు, బబులోను ముట్టడి (క్రీ.పూ. 588586. 2 రాజులు 25:1-3) ఈ రోజుల తరువాత జరిగిన మూడవ ముట్టడి రోమ్‌వారిది (క్రీ. శ. 70). ఈ యుగాంతంలో జెరుసలంను మరోసారి ముట్టడించడం జరుగుతుంది (జెకర్యా 12:2-3; జెకర్యా 14:2). ఈ అధ్యాయం వెల్లడించిన ముట్టడి ఏదో ఇక్కడ స్పష్టంగా లేదు.

 

జెకర్యా  12

2. నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

3. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

 

జెకర్యా  14:2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవు చున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెర పట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

 

మూడవ వచనం 3. నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి

 

ఇది 2 రాజులు 25:4-6 లో నెరవేరింది. 2 రాజులు  25

4. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

5. అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.

6. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసి కొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.

 

నాల్గవ వచనంలో అందుకే నేను ఏడుస్తున్నాను అంటున్నారు ప్రవక్త!

 

ఇక ఆరవ వచనం 6. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరుడాలు పై గవిసెన తీసెను

 

“కీర్” 2 రాజులు 16:9; ఆమోసు 1:5 ఇది అష్షూరు ప్రాంతాల్లోని స్థలం. బహుశా ఏలాం సమీపంలో ఉంది (యెషయా 21:2 చూడండి). ఈ ప్రాంతానికి చెందిన సైనికులు  అష్షూరు, బబులోను ఈ రెండు రాజ్యాల సైన్యాల్లో కూడా ఉండి ఉండవచ్చు.

 

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*137వ భాగము*

 

యెషయా 22:7 14

 7. అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు.

8. అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి.

9. దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి.

10. యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి

11. పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి.

12. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా

13. రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు

14. సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడుమీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.  

 

       ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! అయితే మధ్యలో యూదాకి జరుగబోయే నాశనం కోసం చెబుతున్నారు దేవుడు మరలా 23 వ అధ్యాయం నుండి ఇతర దేశాలకోసం చెబుతున్నారు!  ఈరోజు యూదులకు కలుగబోయే నాశనం కోసం చూసుకుందాం!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక 714  వచనాలలో యూదులు మరియు యేరుషలేము పట్టణములో ఉన్న ప్రజలయొక్క దుష్టత్వం కనిపిస్తుంది మనకు!

 

ఈ సమయంలో యూదా యొక్క దుష్టత్వం మరింత స్పష్టంగా కనిపించింది. వారు తమ స్వంత మానవ బలంపై ఎక్కువగా ఆధారపడేవారు మరియు తప్పుడు భద్రతా భావాన్ని అనుభవించారు. వారి యుద్ద  సన్నాహాల్లో దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ, నగరానికి కోటలు మరియు నీటి భద్రతపై వారి నమ్మకం ఉంచబడింది. వారు తమ చర్యలలో ఆయన మహిమ పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదు మరియు వారి ప్రయత్నాలకు ఆయన ఆశీర్వాదం పొందడంలో విఫలమయ్యారు. సృష్టించబడిన ప్రతి వస్తువు దేవుడు ఉద్దేశించినంత మాత్రమే అర్థవంతంగా ఉంటుంది మరియు మనం ఇద్దరూ అతనిని గుర్తించాలి మరియు అతని ప్రయోజనాల కోసం దానిని ఉపయోగించాలి.

 

దేవుని ఉగ్రత మరియు న్యాయం పట్ల వారి నిర్లక్ష్యం ఒక ముఖ్యమైన అతిక్రమణ. వారిని లొంగదీసుకుని పశ్చాత్తాపానికి దారి తీయాలనేది దేవుని ఉద్దేశం, కానీ వారు అతని ప్రణాళికకు విరుద్ధంగా నడవాలని ఎంచుకున్నారు. వారి శరీర సంబంధమైన భద్రత మరియు ఇంద్రియ భోగాలకు మూలం మరణానంతర జీవితంలో వారి అసలు అవిశ్వాసంలో ఉంది. ఈ అపనమ్మకం మానవాళిలో గణనీయమైన భాగాన్ని పీడిస్తున్న పాపభరితమైన, అవమానకరమైన మరియు వినాశకరమైన ప్రవర్తనకు పునాది. ఈ వైఖరితో దేవుడు అసంతృప్తి చెందాడు, ఎందుకంటే ఇది పరిహారం యొక్క తిరస్కరణ, మరియు వారు ఎప్పుడైనా పశ్చాత్తాపం చెందే అవకాశం లేదు. ఈ అవిశ్వాసం ఊహకు దారితీసినా లేదా నిరాశకు దారితీసినా, అది చివరికి దేవుని పట్ల అదే నిర్లక్ష్యానికి దారి తీస్తుంది మరియు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నాశనానికి దారితీస్తుందనే సంకేతంగా పనిచేస్తుంది.

 

అందుకే దేవుడు వారి మీదికి శిక్షను పంపించగా వారు ఆయనకు లోబడకుండా ఏమి చేస్తున్నారో 1214 వచనాలలో ఉంటుంది

 

12. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా

13. రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు

14. సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడుమీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.

 

ఇక్కడ చూడండి జాతి అంతా గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న వేళ, దేవుడు అందరినీ తమ పాపాలకోసం పశ్చాత్తాపపడి శోకించాలని ఆజ్ఞాపిస్తుంటే, ఏమీ శ్రద్ధ లేకుండా సంబరాలు చేసుకొంటూ ఉండడం దేవుని దృష్టిలో గొప్ప చెడుతనం.

 

ఇక 15 వ వచనం నుండి చివరి వరకు చూసుకుంటే ఒక అధికారి ఉన్నాడు వాడి పేరు షెబ్నా . వాడు చేసిన ఆరాచకాలకు దేవుడు వాడిని డీమోషన్ చేయడమే కాకుండా వాడు తొలిపించుకున్న సమాధిలో కాకుండా ఎక్కడో ఒక మూలకు పారేయబోతున్నారు!

 

ఒకప్పుడు యూదా రాజు భవనంలో షెబ్నా అనేవాడు అందరికీ పైగా ఉన్న అధికారి. తన పదవిని ఇతడు తన స్వార్థం కోసం వాడుకున్నట్టున్నాడు. అతని గురించి 3 విషయాలు మాత్రం రాసి ఉన్నాయి. తన కోసం ఒక సమాధిని తొలిపించుకున్నాడు (వ 16; 2 దినవృత్తాంతములు 16:13-14; మత్తయి 27:57-60), ఘనమైన రథాలను సంపాదించుకొన్నాడు (ఇవి రెండూ ధనం పుష్కలంగా ఉండడానికి గుర్తు). అంతేకాక అతడు యూదా రాజుకు తలవంపులు తెచ్చి పెట్టేవాడు (వ 18). అంటే అతని జీవిత విధానం పూర్తిగా అభ్యంతరకరమైనదని ఇందువల్ల అనుకోవచ్చు. తమ పదవిని దుర్వినియోగం చేసేవారిలో షెబ్నా ఒకడు. ఇతడు రాజునూ ప్రజలనూ సేవించక తనను తాను సేవించుకొన్నాడు. అతనికి రెండు శిక్షలను దేవుడు సిద్ధం చేశాడు. అతని పదవి ఎల్యాకీముకు దక్కుతుంది (వ 19-21), తాను కట్టించుకున్న సమాధికి దూరంగా ఎక్కడో ప్రవాసంలో అతడు చనిపోతాడు (వ 18).

 

షెబ్నాకు ఈ సందేశం అతని మితిమీరిన గర్వం, అహంకారం మరియు తప్పుడు భద్రతా భావానికి మందలింపుగా ఉపయోగపడుతుంది. ఇది ప్రాపంచిక వైభవం యొక్క నశ్వరమైన స్వభావాన్ని హైలైట్ చేస్తుంది, ఇతాని  మరణం త్వరలో జరుగుతుంది.  మనం ఒక అద్భుతమైన సమాధిలో ఉంచబడినా లేదా పచ్చని భూమితో కప్పబడినా, మన భూసంబంధమైన వ్యత్యాసాలు అంతిమంగా తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అధికారం చెలాయించే వారు మరియు ఇతరులను తారుమారు చేయడానికి మరియు దుర్వినియోగం చేయడానికి ఉపయోగించే వారు చివరికి వారి చర్యల యొక్క పరిణామాలను ఎదుర్కొంటారు.

 

షెబ్నా స్థానంలో ఎలియాకీమ్ తన అధికార స్థానానికి ఎంపికయ్యాడు. విశ్వసనీయత మరియు ప్రభావవంతమైన స్థానాలను అప్పగించిన వారు తమ విధులను నమ్మకంగా నెరవేర్చడంలో సహాయపడటానికి దేవుని దయను హృదయపూర్వకంగా కోరుకుంటారు. ఎలియాకిమ్ ప్రమోషన్ వివరంగా వివరించబడింది. అదే విధంగా, మన ప్రభువైన యేసు తన స్వంత అధికారాన్ని మధ్యవర్తిగా సూచిస్తాడు, దానిని దావీదు యొక్క తాళపుచెవితో పోల్చాడు ప్రకటన గ్రంథం 3:7 పరలోక రాజ్యంపై అతని అధికారం మరియు దాని వ్యవహారాలన్నింటిపై అతని నియంత్రణ సంపూర్ణమైనది.

 

ప్రభావవంతమైన నాయకులు వారి సంరక్షణలో ఉన్నవారికి శ్రద్ధ వహించే సంరక్షకులుగా వ్యవహరించాలి మరియు వ్యక్తులు వారి భక్తి మరియు సేవ ద్వారా వారి కుటుంబాలకు తీసుకువచ్చే గౌరవం బిరుదులు లేదా వంశం నుండి పొందిన ప్రతిష్ట కంటే విలువైనది. ఈ ప్రపంచం యొక్క కీర్తి నిజమైన విలువను లేదా శ్రేష్ఠతను అందించదు; ఇది కేవలం ఒక అలంకారం మాత్రమే, అది చివరికి మసకబారుతుంది.

 

ఎలియాకిమ్‌ను గట్టిగా లంగరు వేసిన గోరుతో పోల్చారు, అతని కుటుంబం మొత్తం దానిపై ఆధారపడుతుంది. తూర్పు గృహాలలో, వివిధ వస్తువులు మరియు ఉపకరణాలకు మద్దతుగా గోడలలో ధృడమైన స్పైక్‌ల వరుసలు పొందుపరచబడ్డాయి. అదేవిధంగా, మన ప్రభువైన యేసు మన జీవితాల్లో ఒక తిరుగులేని యాంకర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పట్ల విశ్వాసం ఉంచిన ఏ ఆందోళన లేదా ఆత్మ నాశనం చేయబడదు మరియు ఆయన విశ్వాసులకు ఎవరూ మూయలేని ఒక తెరిచిన తలుపును అందజేస్తాడు, వారిని శాశ్వతమైన కీర్తికి నడిపిస్తాడు. దీనికి విరుద్ధంగా, ఈ గొప్ప మోక్షాన్ని విస్మరించిన వారు, అతను ఒక తలుపును మూసివేసినప్పుడు, దానిని ఎవరూ తెరవలేరని కనుగొంటారు,

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*138వ భాగము*

యెషయా 23:16

1 తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.

2 సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సర కులతో నిన్ను నింపిరి.

3 షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.

4 సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸°వనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.

5 ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.

6 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.

 

       ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక చివరగా తూరు దేశానికి కలుగబోయే నాశనం కోసం చూసుకుందాం!

 

ఇక తూరు దేశము అనగా గలలియ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పొరుగుదేశము!! తూరు సీదోనూ రెండు ప్రక్కప్రక్క రాజ్యాలు! ఆ కాలంలో తూరు చాలా ప్రఖ్యాతి చెందిన నగరం. మధ్యధరా సముద్ర తీరాన ప్రధానమైన ఓడరేవు.  నగరంలో కొంత భాగం సముద్ర తీరాన నిర్మించబడింది. క్రీ.పూ. 572లో బబులోను రాజు నెబుకద్నెజరు దీన్ని ధ్వంసం చేశాడు. నగరంలో మరి కొంత భాగం తీరం నుండి 800 మీటర్ల దూరాన ఉన్న రెండు లంకల పై కట్టారు. ఈ భాగాన్ని క్రీ.పూ. 332లో అలెగ్జాండరు ధ్వంసం చేశాడు.

 

ఇక తూరు కోసమైన ఇతర తీర్పులు మనకు  యెహె 26:128:19; ఆమోసు 1:9-10లో ఉన్నాయి.

 

ఇక ఇంకా దీనికోసం చూసుకుంటే తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. అంటున్నారు.

 

“తర్షీషు” ఇస్రాయేల్‌కు పశ్చిమాన చాలా దూరంలో ఉన్న నగరం. ఇప్పటి స్పెయిన్‌లో ఉన్న ప్రదేశం. సముద్రయానానికీ, ఓడలకూ, సముద్ర వర్తకులకూ ఇది ప్రసిద్ధి. బాగా అర్ధం కావాలంటే యోనా గారిని దేవుడు నీనేవే అనగా ఉత్తర ఇరాక్ వెల్లమంటే తర్షీస్ కి పారిపోదామనుకున్నారు కదా! ఆ తర్షీస్ స్పెయిన్ లోనే ఉంది. ఆ తర్షీస్ ఇదే! తర్షీషు ఓడలారా ఆంగలార్చండీ అంటున్నారు! ఎందుకంటే తూరు అనేది పెద్ద రేవు పట్టణము! అది మంచి వ్యాపార కూడలి! మీద చెప్పినట్లు యెహేజ్కేలు గ్రంధంలో దీనికోసమైన విలాపగీతాలున్నాయి .

 

అందుకే తూరుకు ఇల్లు లేదు, రేవు లేదు ఓడలు లేవు. ఏవీ లేవు సమస్తము నాశనమై పోయాయి అంటున్నారు!

 

రెండో వచనంలో సీదోను కోసం చెబుతున్నారు! 2 సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి.

3 షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.

 

ఇక “సీదోను” తూరుకు దాదాపు 40 కి.మీ. ఉత్తరాన ఉన్న మరొక ముఖ్యమైన ఓడరేవు. తూరు, సీదోను రెండు పట్టణాలూ ఫోనీషియన్ల ప్రాంతంలో ఉన్నాయి. ఈ రెండు పట్టణాలు బబులోనూ వారియొక్క ముట్టడి లో దెబ్బతిన్నాయి. అయితే దీనిని ముందుగానే దేవుడు చెబుతున్నారు యెషయా గారి ద్వారా!!

 

ఇక 46 వచనాలు చూసుకుంటే

4 సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸°వనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.

5 ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.

6 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.

 

4 వ వచనంలో “సముద్ర దుర్గం” అంటే తూరు. రాతి లంకలపై కట్టిన నగర భాగం చుట్టూ నీరు ఆవరించి ఉండడం చేత దాని నివాసులు శత్రువుల బారినుండి సురక్షితంగా ఉన్నామను కొన్నారు. తూరు పట్టణం తనవంటిది ప్రపంచంలో మరొకటి లేదనీ తనకు తానే సాటి అనీ అనుకొనేది. గాని క్రీ. పూ 572 లోనూ (బబులోనూ వారి ద్వారా) 332 లోనూ (అలగ్జాండర్) ద్వారా అతి ఘోరంగా నాశనం చేయబడ్డాది!

 

ఇక 5 వ వచనంలో ఈజిప్ట్ వారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే తూరుతో ఈజిప్ట్ కి ఎంతో ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి కాబట్టి ఇప్పుడు తూరు నాశనమైపోతే ఈజిప్ట్ కూడా దివాళా తీస్తుంది అందుకే ఏడుస్తుంది!

 

అయితే ఈ విలాపకీర్తన మరియు నాశనం  చివరివరకు ఉంది గాని దీనిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అధ్యాయంలో చివరలో తూరు దేశాన్ని కూడా దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నారు!

 

15 ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా

16 మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం చుము అనేక కీర్తనలు పాడుము.

17 డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.

18 వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.

 

ఇక్కడ చూడండి 15 వ వచనంలో- ఇశ్రాయేలు దేశానికి ఎలా 70 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలుగా విడువబడిందో అలాగే తూరు కూడా 70 సంవత్సరాలు విడువబడుతుంది అంటున్నారు! ఇక 70 సంవత్సరాలు జరిగిన తర్వాత వేశ్యల కీర్తనలో జరిగినట్లు జరుగుతుంది అంటున్నారు! మనకు తెలియదు గాని ఇశ్రాయేలు దేశంలో ఒక వేశ్య కీర్తన ఉంది దానిని ఉటంకించి రాస్తున్నారు: మరువబడిన వేశ్యా మరలా నీ సితార తీసుకుని వాయించి నీ విటకాండ్రను ఆకర్షించుకో మరలా అనేక రాజ్యాలతో వ్యభిచారం చేస్తాది అంటున్నారు!

 వేశ్య” బైబిల్లో ఈ పదాన్ని ఒక నగర ప్రజలు లేక ఒక జాతి విషయంలో రెండు వేరువేరు ఉద్దేశాలతో వాడారు. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవుళ్ళు, విగ్రహాల వైపు తిరిగిన ప్రజలను వేశ్య, లేక వ్యభిచారి అన్నారు దేవుడు (లేవీ 20:5). లేక తూరు లాంటి గొప్ప వాణిజ్య కేంద్రాన్ని కూడా వేశ్య అన్నారు. ఎందుకంటే దానిలోని ప్రజలు తమ స్వలాభం కొరకే జీవితం గడుపుతూ, లాభం రావాలని దేవుణ్ణే లెక్క చెయ్యని స్థితిలో ఉన్నారు (ప్రకటన 17:1, 5; 18:1-19).

 

అయితే 18 వ వచనం చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా వేశ్య జీతముగా అది సంపాదించిన సొమ్ము యెహోవాకు ప్రతిష్టితమౌతుంది అంటున్నారు! వేశ్య సంపాదించిన ధనం తనకు అర్పించరాదని యెహోవా దేవుడు ఆజ్ఞాపించారు (ద్వితీ 23:18). మరి ఇప్పుడు ఈ ధనము దేవుడుకి ఎలా ప్రతిష్ట పరచవచ్చు? అయితే నాశనానికి పాత్రమైన నగరంలోని సంపదను యెహోవా ధనాగారంలోకి తీసుకురావచ్చు (యెహో 6:17, 19).

ఇక్కడున్న వాగ్దానం ఏమంటే తూరు నగరంలోని సంపద దేవుని సేవకులకు ఉపయోగపడుతుంది. అయితే ఇది వారికెలా లభిస్తుందో ఇక్కడ రాసిలేదు . అయితే ఈ ధనము దేనికోసం ఉపయోగ పరుస్తున్నారు అంటే వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.

 

ఈ రకముగా మరలా ఆ తూరు దేశాన్ని రక్షించి వారిని దేవుని దగ్గరకు నడిపించడం జరుగుతుంది!

 

దైవాశీస్సులు!!!

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*139వ భాగము*

 

యెషయా 24:16

1 ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

2 ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు గును.

3 దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు

4 దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.

5 లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.

6 శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.

 

       ప్రియ దైవజనమా! మనము అన్యదేశాలకు దేవుని తీర్పులకోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇక చివరగా ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలకు సంభవించ బోయే నాశనం కోసం చూసుకుందాం! అయితే గమనించాలి- ఈ తీర్పులు ఇంతవరకు జరుగలేదు. ఇవి అంత్యదినాలలో అనగా రెండవరాకడ తర్వాత జరుగబోయే సంభవాలు అని గ్రహించాలి! అనగా యెహోవా దినమున జరుగబోయే నాశనం అని గ్రహించాలి!

 

గమనించాలి 13వ అధ్యాయం ఆరంభంనుండి ఇక్కడి వరకూ దేవుడు తాను ఆయా జాతులను ఎలా శిక్షిస్తాడో ఆయా దేశాలమీదికి  నాశనం ఎలా వస్తుందో చెప్పారు . ఇప్పుడు ఆ దేశాలన్నిటినీ ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా తాను జరిగించబోయే వినాశనాన్ని గురించి మాట్లాడుతున్నారు .

 ఈ అధ్యాయం ఈ యుగాంతం, “యెహోవా దినం”, దుర్మార్గతతో నిండిన ఈ భూమిపై తన కోపాన్ని ఒలకబోసే కాలం గురించి తెలియజేస్తుంది. 24:4, 6, 13, 16, 19, 20, 23; 25:6-8; 26:19-21  ఈ రిఫరెన్సులు బట్టి ఇలా భావించేందుకు ఆస్కారం కలిగిస్తూవుంది. క్రొత్త నిబంధన  గ్రంథంలో రాసి ఉన్న ప్రకారం ఈ యుగాంతంలోను, తరువాతి యుగం ఆరంభంలోనూ ఏయే సంగతులు జరగనున్నాయో వాటిని ఈ అధ్యాయం వివరిస్తున్నది. 2527 అధ్యాయాలు ఈ అధ్యాయంతో ముడిపడి ఉన్నాయి. అంటే ఒకే రకమైన విషయాల గురించి ఈ అధ్యాయాలన్నిటిలోనూ రాసి ఉంది.

“ఆ రోజున” అనే మాట కూడా ఈ అధ్యాయాలను కలుపుతున్నది 24:21; 25:9; 26:1; 27:1-2, 13. ఇక ఆరోజు అనగా దేవుని దినం లేక యెహోవా దినము అని గ్రహించాలి!

 

ఇక్క మొదటివచనంలో అంటున్నారు

1 ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

 

చూడండి దేవుడు దేశాన్ని వట్టిదిగా చేయబోతున్నారు ఈ భూమిని పాడుచేసి దానిని కల్లోల పరచబోతున్నారు అంటున్నారు ఇంకా భూమిమీద నున్న నివాసులను వారు ఏ దేశము వారైనా భూమిమీద ఇటుఅటు చెదరగొట్ట బోతున్నారు అని ఖరాఖండిగా చెబుతున్నారు!  ఎందుకు అలా చేయబోతున్నారు అంటే వారు దేవునిమాటను వినలేదు గనుక! ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును చెప్పి దానిని ఎందుకు చేయబోతున్నారో చెబుతున్నారు. దానికి కారణం చెబుతున్నారు! నిజానికి దేవునికి ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు గాని బైబిల్ లో చెప్పినట్లు దేవుడు తాను చేయనుద్దేశించినది అది చిన్నదే గాని పెద్దదే గాని మంచిదే గాని చెడ్డదే గాని తన ప్రవక్తలతో లేక భక్తులతో చెప్పకుండా చేయరు.. ఆమోసు 3:7

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

అందుకే ముందుగా చెప్పి చేస్తున్నారు ఎవరైనా మారుమనస్సు పొంది మార్పుపొందుతాడేమో అని దేవుడు తండ్రి హృదయముతో ముందుగా యోచించి చెబుతున్నారు!

 

సరే ముందుకు పోదాం!  దేవుడు భూమిని వట్టిదిగా చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ఇంకా అనేకచోట్ల చెప్పారు దేవుడు: యెషయా 34:1-4; 2 పేతురు 3:10-12; ప్రకటన 1516 అధ్యాయాలు.

 

ఇక 2,3 వచనాలు చూడండి- ప్రజలకు ఎలాగో యాజకులకు అలాగే జరుగుతుంది.

 

దాసులకు ఎలాగో యజమానులకు అలాగే, దాసీజనానికి ఎలాగో యజమానురాండ్రకు అలాగే, కొనేవాళ్ళకు ఎలాగో అమ్మేవాళ్ళకు అలాగే, అప్పు తీసుకొనేవాళ్ళకు ఎలాగో అప్పిచ్చేవాళ్ళకు అలాగే, వడ్డీకిచ్చేవాళ్ళకు ఎలాగో వడ్డీకి తీసుకొనేవాళ్ళకు అలాగే జరుగుతుంది.

 

3 భూమిని పూర్తిగా ఒలకబోయడం లేక వట్టిదిగా చేయడం జరుగుతుంది. అది పూర్తిగా చితికిపోతుంది. ఈ మాట చెప్పినది యెహోవా దేవుడే.

 

చూడండి లోకాన్ని దాని పాపాల నిమిత్తం దేవుడు శిక్షించే దినాన సాంఘిక అసమానతలను ఆయన లెక్కలోకి తీసుకోరు (ప్రకటన 6:15-17).

 

రాజుకి సామాన్యుడుకి ఇంకా యాజకుడికి సామాన్యుడికి దాసులకు యజమానులకు అందరికీ ఒకే విధంగా తీర్పు రాబోతుంది!  మూడో వచనంలో కూడా నేను భూమిని వట్టిదిగా చేయబోతున్నాను అంటూ రెట్టించారు. గతములో చెప్పాను- దేవుడు ఏదైనా రెండుసార్లు వ్రాయిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని. ఇక్కడ నేను భూమిని వట్టిదిగా చేస్తున్నాను అంటూ ఇదే అధ్యాయంలో రెండుసార్లు చెప్పారు!

 

ఇక 4వ వచనం చూసుకుంటే

4 దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.

5 లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.

6 శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.

 

ఇక్కడ నాలుగో వచనంలో దేశము వ్యాకులము చేత వాడిపోతుంది ఎందుకంటే కారణం 56 వచనాలలో చెప్పారు- లోక నివాసులు ధర్మ శాసనములను పాటించక అతిక్రమించి ఉన్నారు దేవుడు కట్టడలు మార్చి ఆయన చేసిన నిత్యనిబంధన ను మీరిపోయారు ఇంకా భూమి అంతా దాని నివాసుల చేత అనగా వారు చేసిన పాపపు పనుల వలన లేక కార్యాల వలన అపవిత్రమై పోయింది. అందుకే వారు శాపగ్రస్తులయ్యారు. ఆ శాపమే దేశాన్ని పాడుచేస్తుంది లేక నాశనం చేస్తుంది దాని నివాసులు శిక్షకు పాత్రులై పోయారు అంటున్నారు!

 

ఒకసారి ఆగి ఆలోచిద్దాం! ఈ శిక్ష యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు కలుగుతుంది అంటే వారు దేవుని కట్టడలను ధర్మశాస్త్రమును మీరినందుకు! మరి ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనము కూడా దేవుని వాక్యానికి చోటులేకుండా వాక్యాన్ని త్రోసివేసి ఎవడికిష్టమొచ్చినట్లు వాడు జీవిస్తున్నాడు! మరి వీరిమీదికి కూడా దేవుని న్యాయమైన తీర్పు ఉగ్రత రాదా? వీరు నరకపాత్రులు, ఉగ్రతపాత్రులు కారా?!!!!!

 

 ఇంకా దేశ నివాసులు అందరూ కాలిపోయారు అంటున్నారు! అనగా బహుశా ఏదో బాంబు ప్రేలుడు వలననో లేక మరో కారణం వలన వారంతా కాలిపోయారు . ఇక్కడినుండి కథనం భవిష్యత్ కాలం నుండి వర్తమాన కాలంలోకి మారి 21వ వచనం దాకా కొనసాగుతూవుంది. కాలంలో ముందుకు ప్రయాణించి జరగబోయేదాన్ని స్వయంగా చూచినట్టు రాస్తున్నారు ప్రవక్త. బహుశా స్వప్న దర్శనంలో అతడు ఇదంతా చూశారేమో.

 

భూమి క్రుంగి పోతుంది అనగా భయంకరమైన భూకంపం వలన గాని లేక మహా గొప్ప బాంబు లేదా అణుబాంబు వలన భూమి బ్రద్దలై పోయి క్రుంగి పోతుంది ఆట ఆరోజు!!! అప్పుడు అందరూ నీరసించి పోతున్నారు అంటున్నారు. బహుశా ఇది తప్పకుండా అణుబాంబు వలన జరిగే పరిణామాల వలననే ఇలా జరుగబోతుంది! జెకర్యా గ్రంధంలో 1214 వరకు చెప్పిన విధంగా మనుషుల నోటిలోని నాలుక నోట్లో ఉండగానే క్రుళ్లిపోతుంది. ఇలా అందరూ నీరసించిపోతారు అన్నమాట!

 

ఇక భూమిమీద నున్న నివాసులు చేత అది అపవిత్రమైనది అంటున్నారు. ఈ మాట జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడే ఆదికాలంలో ఆది కాండం 6 వ అధ్యాయంలో భూమిమీద నున్న మనుష్యులు చెడిపోయినందు వలన తన గోడు నోవహు గారితో చెప్పుకున్నారు. భూమి చెడిపోయినది అన్నారు అక్కడ, ఇక్కడ భూమి అపవిత్రమైనది అంటున్నారు! ఇంతకు ముందు వచనాల్లో వివరించిన నాశనానికి కారణం ఇక్కడ ఉంది. భూమి దేవుని పవిత్ర సృష్టిలో భాగం. మనుషులు దాన్ని భ్రష్టు పట్టించారు. మానవుల శ్రేయస్సు కొరకు దేవుడు శ్రేష్ఠమైన, పవిత్రమైన శాసనాలూ ఒడంబడికలూ ఇచ్చారు. మనుషులు వాటిని తృణీకరించి వాటిని మీరారు. దేవుని దృష్టిలో ప్రపంచ చరిత్ర ఇదే. ఆది 6:5, 12; కీర్తన 14:2; రోమ్ 1:18-32.

 

ఆరవ వచనంలో అంటున్నారు అందుచేత శాపం లోకాన్ని నాశనం చేస్తూ ఉంది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు.

 

కనుక వాళ్ళు కాలిపోయారు, కొద్దిమందే మిగిలి ఉన్నారు.

 

గతంలో ఏమిజరిగిందో దేవుడు ఏమి చెప్పారో క్రింది రిఫరెన్సులలో ఉంది.

 

ఆది 3:17; 4:11; 12:3; ద్వితీ 11:26; 27:15-26; సామెత 3:33; గలతీ 3:10, 13; ప్రకటన 22:3.

 

ఇక భూమి దాని నివాసులు “శిక్షకు పాత్రులయ్యారు” ఎందుకు అయ్యారు అంటే అంత ఘోరమైన నేరాలు చేశారు కాబట్టి.  ఒక ప్రజ, ఒక దేశం, లేక ప్రపంచం గనుక శిక్షకు తగిన నేరాలేవీ చెయ్యకపోతే దేవుడు ఏ మాత్రమూ దాన్ని శిక్షించడు. శిక్షిస్తే న్యాయానికి కట్టుబడి మొత్తం ప్రపంచ శ్రేయస్సుకోసమే అలా చేస్తారన్నమాట.

 

 కాబట్టి ఈ భూమి దాని నివాసులతో పాటుగా తొందరలో కాలిపోబోతుంది. పేతురు గ్రంధంలో పేతురు గారు అంటున్నారు..  

2పేతురు 3:7

అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

2పేతురు 3:10

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

2పేతురు 3:11

ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

2పేతురు 3:12

దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

మరి నీవు దానిని తప్పించుకోవాలంటే తప్పకుండా ఎత్తబడాలి! మరి నీవు ఎత్తబడతానికి సిద్దంగా ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా?

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధం*

*140వ భాగము*

 

యెషయా 1:14

1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

 

          ప్రియ దైవజనమా! ఇంతవరకు మనము యెషయా ప్రవచన గ్రంధములో యెషయా గారి కాలంలో ఉన్న 5 గురు రాజులు కోసం, అభిషక్తుని మొదటిరాకడ కోసం, యెహోవా దినము కోసం,  ఇంకా దేవుడు యెషయా భక్తునికి తెలిపిన ఇతర దేశాలమీదికి రాబోయే దేవుని ఉగ్రతకోసం ధ్యానం చేశాము! ఇక మిగిలింది ఇశ్రాయేలు దేశం మీదికి దేవుని ఉగ్రత- దానికి కారణాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క చెర విముక్తి, దేవుని శాశ్వత రాజ్య స్థాపన, యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడ , వేయేండ్ల పాలన కోసం మిగిలి ఉంది. అయితే ఈ చెప్పినవన్నీ కలిసి ఉన్నాయి గనుక వేరుగా కాకుండా ఇక మొదటి అధ్యాయం నుండి చివరివరకూ వరుసగా ధ్యానం చేసుకుంటూ పోదాము!

 

   ఇక మొదటి అధ్యాయానికి వస్తే ఈ అధ్యాయంలో 210  వరకు యూదుల యొక్క చెడుతనం లేక దుర్మార్గాలు ఎలా ఉన్నాయో,

 

 1117 వరకు దొంగ భక్తి లేక దొంగ మాట భక్తి కోసం దేవుడు చెబుతున్నారు.

 

1820 వచనాలలో ఇంతగా చెడిపోయినా గాని దేవుడు తండ్రి గనుక మరలా వారిని తన దగ్గరకు పిలవడం, వారికోసం దేవుడుఇచ్చిన ఆహ్వానం,  చేసిన వాగ్ధానం మరియు హెచ్చరిక కనిపిస్తుంది.

 

2131 వరకు యెరుషలేము పై దేవుని తీర్పు, ఒక క్రొత్త దినం- ఇంకా దేవుని వాగ్ధానం కనిపిస్తుంది

 

  ఇక వివరణకు వస్తే మొదటి వచనం కోసం మొదటి భాగాలలో విస్తారంగా ధ్యానము చేసుకున్నాం గనుక తిన్నగా రెండవ వచనానికి వెళ్లిపోదాం!

 

ఈ 23 వచనాలలో వారి తిరుగుబాటు వలన దేవుడు ఎంతగా విసికిపోయారో కనిపిస్తుంది. ఇంకా వివరణ మనకు 17వ వచనం వరకు కనిపిస్తుంది.  దేవుడు తన బాధను ఎవరికి చెప్పాలో అర్ధం కాక ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నారు. దూతలకు చెప్పుకుంటే బహుశా లోకువై పోతారేమో అని నా ఉద్దేశం అందుకే తన బాధను దూతలకి గాని, 24 గురు పెద్దలకు గాని, నాలుగు జీవులకు గాని ఎవరికీ చెప్పుకోకుండా ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నారు!

అయితే ఎందుకు దేవుడు కేవలం ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నారు అంటే ద్వితీ 30:19 లో దేవుడు మోషే గారిద్వారా ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టారు భూమిమీద నున్న మానవులు చేసే ప్రతీ పనిని చూస్తూ దేవునికి చెబుతూ ఉండాలి ఆకాశము మరియు భూమి ద్వితీ 30:19..

19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

 

ద్వితీయోపదేశకాండము  4

26. మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు

 

అందుకే  ఇక్కడ ఆకాశానికి భూమికి తన గోడు చెప్పుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మానవుడు చేసే ప్రతీ పాపము ఆకాశానికి క్రిందన మరియు భూమి మీదన మాత్రమే చేయగలరు. సముద్రం లోతులో చేసినా సముద్రము కూడా భూమిలో భాగమే కదా!  కాబట్టి మానవులు చేసే ప్రతీ పాపము మొదటగా దేవుడు చూస్తున్నారు. రెండు సాతాను గాడు చూస్తున్నాడు, ఇక మూడవదిగా ఆకాశము మరియు భూమి చూస్తున్నారు! ప్రియ స్నేహితుడా చెల్లీ ఈ రోజు నీవు అనుకుంటున్నావేమో నన్నెవడు చూడటం లేదు, ఎవరికీ తెలియకుండా బాగా మేనేజ్ చేసేస్తున్నాను అని అనుకుంటున్నావేమో , ఖభడ్ధార్ వీరంతా చూస్తున్నారు అని మరచిపోవద్దు! అంతేకాకుండా మానవుడు చేసే ప్రతీ పని అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒకరోజు దానికి దేవుని న్యాయ పీఠం వద్ద లెక్క అప్పగించాలి అని మరచిపోవద్దు!!!

2కోరింథీయులకు 5:10

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

 

సరే, ఇప్పుడు దేవుడు ఆకాశానికి భూమికి తనగోడు ఎలా చెప్పుకుంటున్నారో చూద్దాం:

 2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

 

చూడండి నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను అయితే ఇప్పుడు వారు నామీద తిరుగుబాటు చేశారు. ఇక్కడ పిల్లలు అనగా యూదులు/ ఇశ్రాయేలు ప్రజలు అని అప్పటి అర్ధం! నీవు నేను కూడా దేవుని పిల్లలమే ఇప్పటి అప్పటి అర్ధం! ఇది మనము మర్చిపోకూడదు!  దేవుడు బాధపడుతున్నారు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా పెద్దవారిగా చేస్తే ఇప్పుడు వారు నామీద తిరుగుబాటు చేశారు అంటున్నారు!

 

నేటి రోజులలో అనేకమంది పిల్లలు తమ తండ్రుల మీద తల్లుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులను కొడుతున్నారు కూడా! కొంతమంది ప్రయోజకులైనాక తమ తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు! ఇంకా వారికి వయసు మీరిపోకుండా ఆస్తిని వారి పేరు వ్రాయించుకుని తల్లిదండ్రులను భయటకు గెంటేస్తున్నారు. ఇలా ఎవరైనా బాధపడుతుంటే బాధపడవద్దు- దేవుడు కూడా ఒకానొకప్పుడు ఇలాగే బాధపడ్డారు! తల్లిదండ్రులను పట్టించుకోని వాడెవాడైనా సరే వాడు ఇహలోకంలో మొదటగా అనుభవిస్తాడు. ఇక వాడు చచ్చాక దేవుని తీర్పుకు లోనవుతాడు దానిని మరచిపోవద్దు!

 నీవు ఎలా నీ తల్లిదండ్రులతో వ్యవహరిస్తున్నావో అలాగే నీ పిల్లలు అదే నేర్చుకుని నిన్నే ఫాలో అవుతారు అని మరచిపోవద్దు!  దానికి మేమే సాక్షులము! మా తండ్రిగారు మా నాన్నమ్మని (ఆమె దేవుణ్ణి అంగీకరించక పోయినా గాని) ఎంతో ప్రేమగా చూసుకున్నారు మరణం వరకు! మేము కూడా మా తల్లిదండ్రులను వారి మరణం వరకు చిన్న బిడ్డలులా చూసుకున్నాము! ఒకవేళ నీవు ఈరోజు నీ తల్లిదండ్రులను ఆదరించక పోతే నీ ముసలి కాలంలో నిన్ను నీ పిల్లలు ఆదరిస్తారని ఏవిధమైన ఆశలు పెట్టుకోవద్దు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధం*

*141వ భాగము*

 

యెషయా 1:14

1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

 

          ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

ఇక్కడ దేవుడు ఆలకించండి అని చెప్పడం చూసుకుంటే ఇంకా బైబిల్ గ్రంధంలో ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి మనకు!

 

ద్వితీయోపదేశకాండము 4:26;

26. మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.

 

 ద్వితీయోపదేశకాండము 30:19;

19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

 

 ద్వితీయోపదేశకాండము 31:28; ద్వితీయోపదేశకాండము 32:1.

 

ఇక్కడ దేవుడు తనకు వెల్లడించినవి అతి ప్రాముఖ్యమైన సంగతులని యెషయా  భక్తుడు గట్టిగా నమ్ముతున్నారు . దేవుడు చెప్పినది భూమీ, సకల జగత్తూ వినాలని కోరుతున్నాడు. దేవుడు తన ప్రజలపై మోపుతున్న నేరాలకు సాక్షులుగా అవి ఉండాలని అడుగుతున్నాడు. ప్రపంచాలను సృష్టించినవాడు తన కోసమని ప్రత్యేకించుకున్న ప్రజలు ఆయననుండి తొలగిపోయి అజ్ఞానంలో దుర్మార్గతలో తమ స్వంత దారులు పట్టి వెళ్ళిపోయారన్నదే ఈ సందేశం. కీర్తనలు 95 వ అధ్యాయంలో ఇలాగే తన భాధను చెప్పుకుంటున్నారు దేవుడు!

8. అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొనినట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

9. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి

10. నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.

11. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.

 

యెషయా 53:6;

6. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

 

యిర్మియా 8:5-6 

5. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగిరామని యేల చెప్పుచున్నారు?

6. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు నేనేమి చేసితినని చెప్పితన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.

 

ఇక్కడ పిల్లలు అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి (నిర్గమకాండము 4:22; ద్వితీయోపదేశకాండము 32:6; 2 సమూయేలు 7:24; యెషయా 64:8; మొ।।).

 

ఇక మూడవ వచనంలో అంటున్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు! చూడండి ఎద్దులకు తమ యజమానుడు ఎవరో తెలుసు- సాయంత్రానికి తిన్నగా ఇంటికి వచ్చేస్తాయి. గాడిదకి తన స్వంత యజమాని యొక్క దొడ్డి లేక పాక తెలుసు! సాయంత్రానికి అది ఇంటికి వచ్చి పాకలో పడుకుంటుంది. గాని నా పిల్లలు పశువులు ఇంకా గాడిద కంటే హీనులు! వారికి తెలివి, మంచి, బుద్ధి లాంటివి ఏవీ లేవే అని బాధపడుతున్నారు దేవుడు!

తమనూ సమస్తాన్నీ సృష్టించిన దేవుని పై తిరుగుబాటు చేసిన మనుషులు తెలివిలేని పశువుల కన్న అవివేకంగా కనిపిస్తున్నారు ఇక్కడ!. యూదా, ఇస్రాయేల్ ప్రజలు ఈ విషయంలో అన్యులకంటే కంటే ఉత్తములు కాదు, తెలివైనవారు కాదు (ద్వితీయోపదేశకాండము 32:28; యిర్మియా 4:22; యిర్మియా 8:7). ఎద్దు, గాడిద, జంతువులన్నిటిలోకీ తెలివైనవేమీ కాదు. అయితే ఒక ముఖ్యమైన విషయంలో ఇస్రాయేల్ ప్రజలకంటే వాటికే ఎక్కువ జ్ఞానం ఉంది. ఆ ప్రజలకు యజమాని ఉన్నాడు. కానీ వారు ఆయన ప్రేమనూ, సంరక్షణనూ వదిలించుకుని దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నించారు. నిజమైన దేవుణ్ణి వదిలేసి మూగ బొమ్మలకు పూజలు చేస్తూ తమ పిల్లలను వాటికి బలి అర్పిస్తున్నారు! యిర్మీయా గ్రంధంలో దేవుడు అంటున్నారు నా ప్రజలు రెండు పాపములు చేశారు అంటున్నారు!

 

2: 12. ఆకాశమా, దీనిబట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.

13. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

 

చూడండి ఇక్కడ కూడా దేవుడు ఆకాశానికి భూమికి తన బాధను చెప్పుకుంటున్నారు! ఇంకా మీదికి ఇదే అధ్యాయం చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనుల కోసం దేవుని ఆక్రోశం కనిపిస్తుంది మనకు!

 

5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?

6. ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.

7. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.

8. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్‌ప్రయోజనమైనవాటిని అనుసరింతురు

9. కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.

10. కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

11. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.

 

ప్రియ చదువరీ! నీవు కూడా ఒకవేళ ఇదే స్తితిలో అనగా నిజమైన దేవుణ్ణి ఆయన నీకు ఉచితముగా ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి దేవునికి దూరంగా వెళ్లిపోయావా జాగ్రత్త- నాలుగో వచనంలో అంటున్నారు: పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ! మరి నీకు కూడా అదే శ్రమ వస్తుంది జాగ్రత్త! ఇంతాగొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలవు అంటున్నారు భక్తుడు..

హెబ్రీయులకు 2:3

ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,

 

మరి నీవుకూడా తప్పించుకోలేవు! అందుకే దేవుడు అంటున్నారు యిర్మీయా 4:1 లో ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా వద్దకే రావాలి! నీవు అటు ఇటు తిరగడం మానేయాలి, నీ తిరుగుబాటు మానేయాలి అంటున్నారు! మరి నీ తిరుగుబాటు మాని దేవుని వద్దకు వస్తావా? ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు! నేడే రక్షణ దినము! ఇదే అనుకూల సమయం! నేడే ఆయన సిలువయొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని నీ పాపములు కడిగి వేసుకుని పరిశుద్ధుడవు కమ్ము!

 

దైవాశీస్సులు!

 

 

*యెషయా ప్రవచన గ్రంధం*

*142వ భాగము*

 

యెషయా 1:14

1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

 

          ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

 

ఇక నాలుగో వచనం చూసుకుంటే పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. ఎందుకు శ్రమ అంటే వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. చూడండీ ఇక్కడ యెహోవాను విసర్జించడం మొదటి తప్పు అయితే, విసర్జించిన తరువాత నిజమైన దేవుడైన యెహోవా దేవుణ్ణి దూషిస్తున్నారు! ఇంకా ఆయన మార్గములను విడిచిపెట్టి దూరంగా తొలిగిపోయారు అనగా విగ్రహారాధనలోనూ వ్యభిచార క్రియలలోనూ మునిగిపోయారు! అందుకే దేవుడు ఇప్పుడు ఒక హెచ్చరిక మరియు తీర్పు చెబుతున్నారు- మీకు శ్రమ!!!

 

నీతి న్యాయాల విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో యూదా, జెరుసలం వారి ఘోర స్థితిని ఈ ఒక్క వచనం బయట పెడుతున్నది. వారి విషయంలో ఈ అంచనా కట్టినది దేవుడే, మనిషి కాదు. ఇది ఒక్క యూదా పరిస్థితి మాత్రమే కాదు. లోకమంతటి తీరూ ఇంతే

 

కీర్తనల గ్రంథములో దేవుడు అంటున్నారు: 14:2-3;

2. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను

3. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

 

దీనినే రోమా 3:9-18లో పౌలుగారు ఎత్తిరాస్తున్నారు

 9. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

కీర్తనల గ్రంథము 14:1-3, కీర్తనల గ్రంథము 53:1-3, ప్రసంగి 7:20

11. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

13. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

కీర్తనల గ్రంథము 5:9, కీర్తనల గ్రంథము 140:3

14. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

కీర్తనల గ్రంథము 10:7

15. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.

సామెతలు 1:16,

 

యెషయా 59:7-8

16. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

17. శాంతిమార్గము వారెరుగరు.

సామెతలు 1:16

18. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

కీర్తనల గ్రంథము 36:1

 

ఇక పరిశుద్ధ దేవుడు” అనేమాట యెషయా గ్రంథంలో 26 సార్లు, మిగతా పాత నిబంధన గ్రంథం మొత్తంలో 6 సార్లు కనిపిస్తుంది. యెషయా గ్రంథం దేవుని పవిత్రతకు పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. దేవుని పవిత్రత వెలుగులో మానవ స్వభావం అత్యంత పాప భూయిష్టంగా కనిపిస్తుంది.

 

సరే- ఇక దేవుడు ఎవరికి శ్రమ అంటున్నారో ఒకసారి వరుసగా చూసుకుందాం!

 

ఇక ఇదే యెషయా గ్రంధంలో 5:8 లో అన్యాయంగా పొలానికి పొలం కలుపుకునే వారికి శ్రమ..

యెషయా 5:8

స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.

 

యెహెజ్కేలు గ్రంధంలో 13:18 లో అన్యాయమైన సోది చెప్పే స్త్రీలకు శ్రమ అంటున్నారు..

యెహేజ్కేలు 13:18

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.

 

ఆమోసు గ్రంధంలో యెహోవా దినము అనేది మీకు శ్రమ అంటున్నారు 5:18....

ఆమోసు 5:18

యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.

 

జెఫన్యా గ్రంధంలో కేరెతీయులకు శ్రమ అంటున్నారు 2:5 లో ..

జెఫన్యా 2:5

సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగానీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.

 

ఇక యేసుక్రీస్తుప్రభులవారు హెచ్చరిస్తున్నారు మనుష్యులు ఒకవేళ మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ లూకా 6:26....

లూకా 6:26

మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

 

ఇక క్రీస్తుయేసులో ఉన్నవారికి శ్రమ అనగా మనకు ఎక్కువగా శ్రమలు వస్తాయి యోహాను 16:33 ..

యోహాను 16:33

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

 

2 తిమోతి క్రీస్తుయేసు నందు సదభక్తితో బ్రతుక నుద్దేశించు వారు హింస నొందుదురు..

2తిమోతికి 3:12

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

 

ఇక ఇప్పుడు మనలను శ్రమ పెట్టేవారికి ఒకరోజు శ్రమ కలుగుతుంది 2 థెస్స 1:8...

2థెస్సలొనికయులకు 1:8

మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

 

ఇక ఏసయ్య అంటున్నారు భూమికి ఆకశానికి శ్రమ ప్రకటన 12:12....

ప్రకటన గ్రంథం 12:12

అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది(అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.

 

ఒకవేళ ఈ గ్రూపులో ఏ గుంపులో నైనా ఉంటే మారుమనస్సు పొంది దేవుని పాదాలు పట్టుకో- అప్పుడు శ్రమలను తప్పించుకోగలవు!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధం*

*143వ భాగము*

 

యెషయా 1:59

5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

6. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

7. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.

8. ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.

9. సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.

 

        ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

 

  గత 4 వ వచనంలో పాపిష్టి జనమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అని చెప్పి ఎందుకు శ్రమ కలుగుతుందో చెప్పారు. దానిని ఈ 5 వ వచనంలో కూడా కొనసాగిస్తున్నారు,

 5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను

 

చూడండి దేవుడు ఏమని అంటున్నారో మీరు నిత్యమూ తిరుగుబాటు చేస్తున్నారు. గత భాగంలో చూసుకున్నాం కీర్తనల గ్రంధంలో దేవుడు అంటున్నారు మీరు కనాను యాత్రలో 40 సంవత్సరాలు మీమీ విగ్రహాలకు మ్రోక్కారు ఇంకా నన్ను అనేకసార్లు శోధించారు. ఇక్కడ అంటున్నారు మీరు అలా నిత్యము నామీద తిరుగుబాటు చేస్తున్నారు గనుకనే ప్రతివాడి నడినెత్తి మీద వ్యాధి ఉంది అంటున్నారు. అది ఏ వ్యాదో మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పడం లేదు గాని ప్రతివాడి నడినెత్తి మీదన జబ్బు ఉంది. ఇంకా ప్రతీవాని గుండె బలహీనమై పోయింది ఎందుకు బలహీనమై పోయింది అంటే వారికి జరిగిన అవమానం, దేశంలో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. తినడానికి తిండిలేదు. బబులోనూ వారు ముట్టడి దిబ్బ కట్టారు. ఒకరోజు రెండు రోజులు కాదు. రెండున్నర సంవత్సరాలు జరిగాయి. కరువు కాటకం, జబ్బు మరణం రాజ్యమేలుతుంది ఇది మనకు యిర్మీయా గ్రంధం చదివితే అర్ధమవుతుంది. అందుకే ప్రతీవాని గుండె బలహీనమై పోయింది.

 

ఇంకా ఆగలేదు. మనము ఇంకా క్రిందికి చదువుకుంటూ పోతే ఇవి కనిపిస్తాయి మనకు!

 

6. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

7. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.

8. ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.

9. సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.

 

అరకాలు మొదలు కొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా గాయాలే దెబ్బలే మానని పచ్చి పుండ్లు! అవి పిండబడలేదు గాయాలకు కట్లు లేవు వాటికి మందులేదు. ఇలా దేశమంతా పాడైపోయింది అంటున్నారు!

 

ఇవి దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన తిరుగుబాటు ఫలితాల్లో కొన్ని !

 

పాపం వల్ల కలిగే భయంకరమైన ప్రతి ఫలాలను బైబిలు పదేపదే ఏకరువు పెడుతూ ఉంది ఆదికాండము 2:17;

 

లేవీయకాండము 26:14-22;

14. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక

15. నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,

16. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

17. నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

18. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

19. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

20. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును.

21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.

22. మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

 సంఖ్యాకాండము 32:23;

23. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపముచేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.

యెహెఙ్కేలు 18:20;

రోమీయులకు 1:18;

రోమీయులకు 6:23;

23. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము

 

హెబ్రీయులకు 2:2

2. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా.

 

యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యూదా జాతిని అడుగుతున్నాడు “ఇంత బాధకరమైన ఫలితాలు ఎదురౌతున్నప్పటికీ మీరింకా పాపంలోనే కొనసాగాలని కోరుకుంటారెందుకు?” వ్యాధివల్ల కలిగే హానికరమైన ఫలితాలను శరీరం అనుభవించినట్టే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల కలిగే నాశనకరమైన ఫలితాలను జాతి మొత్తం అనుభవించింది. శత్రు సైన్యాల దండయాత్రల మూలంగా ఈ నాశనం వారి పైకి వచ్చింది. 2 దినవృత్తాంతములు 28:5-8; 2 దినవృత్తాంతములు 32:1-2, 2 దినవృత్తాంతములు 32:9 పోల్చి చూడండి. ఒక దేశం దుర్మార్గతను శిక్షించేందుకు దేవుడు మరొక దేశం సైన్యాలను ఉపయోగించుకుంటాడు (యెషయా 7:20; యెషయా 10:5-6; యిర్మియా 50:15, యిర్మియా 50:23; యిర్మియా 51:1, యిర్మియా 51:20-23; హబక్కూకు 1:6; ప్రకటన గ్రంథం 17:16-17 చూడండి).

 

దేవుడు ఇప్పుడు ఇదేమాట మనలను కూడా అడుగుచున్నారు- ఇంతగా మీకు శ్రమలు వస్తున్నా మీరు మారరా? ఇంకా ఎందుకు నాకు దూరంగా ఉన్నారు? ఎందుకు ఇంకా లోకంలో పాపములో పడి నశించిపోతారు అని అడుగుచున్నారు దేవుడు!!

ప్రియ స్నేహితుడా! నీవు కూడా అదే స్థితిలో ఉండి ఉంటే ఇప్పుడైనా ఆయన పిలుపుని అందుకుని మారుమనస్సు పొందుకుంటావా? నేడైనా నీ పాపాలను వదిలేస్తావా? లూకా సువార్తలో యేసుక్రీస్తుప్రభులవారు ఏడ్చి నిట్టూర్చి అంటున్నారు: 19:41 నుండి

41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

42. నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

43. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

44. నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.

 

మరి ఇశ్రాయేలు ప్రజలు ఆరోజు దేవునిమాటను తృణీకరించారు 1900 సంవత్సరాలు దేశాలంబడి తిరిగారు. ఈరోజు నీవు ఆయన మాటను వింటావా? ఆయన దగ్గర క్షమాపణ వేడుకుని ఆయన పాదాలు పట్టుకుంటావా? ఆయనతో సమాధాన పడతావా?

 

ఆయన నిన్ను చేర్చుకోడానికి ఇష్టపడుతున్నారు!

 

దైవాశీస్సులు!

 

 

 

*యెషయా ప్రవచన గ్రంధం*

*144వ భాగము*

 

యెషయా 1:911

9. సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.

10. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

 

        ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

 

     ప్రియులారా! ఇక్కడ 9,10 వచనాలు చూసుకుంటే దేవుడు బహు కొద్దిపాటి శేషాన్ని మనకు నిలుపక పోతే మనము కూడా సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము అంటున్నారు. అక్కడితో ఆగకుండా యూదా పెద్దలను మరియు ఇశ్రాయేలు ప్రజలను సొదోమా గోమొర్రాలతో పోలుస్తున్నారు!

 

మనకు సొదోమా గొమొర్రాల కధ మొత్తం తెలుసు! వారు భయంకరమైన వ్యభిచార క్రియలలో పురుషుడు-పురుషుడు పాపం చేయడం, ఆడది- ఆడది పాపం చేయడం, మనుష్యులు జంతువులతో పాపం చేయడం లాంటి ఘోరమైన క్రియలు చేస్తుంటే దేవుడు అగ్ని గంధకాలతో సొదోమా గొమొర్రా అద్మా  సెబాయీము అనే నాలుగు పట్టణాలనే కాకుండా చుట్టుప్రక్కల నున్న గ్రామాలను కూడా కాల్చివేశారు. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఉన్న మృత సముద్రం ఉంది అని మనకందరికీ తెలుసు! దీనికోసం విస్తారంగా వద్దు గాని ఒకసారి ఆ వచనాలు చదువుకుంటూ పోదాం! ఆదికాండం 19:

4. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి

5. లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

6. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి

7. అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;

8. ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.

9. ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.

10. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.

11. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

12. అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;

13. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారిని గూర్చిన మొర యె హోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా

14. లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.

15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.

16. అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి.

17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా

18. లోతు ప్రభువా ఆలాగు కాదు.

19. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో

20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు

21. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;

22. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.

23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.

24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొఱ్ఱా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

25. ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.

26. అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పు స్థంభమాయెను.

 

చూడండి పరిస్థితులు ఎంత ఘోరంగా అన్యాయంగా ఉన్నాయో, ఇంతటి పాప భూయిష్ఠమైన జనాంగముతో యూదులను ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పోలుస్తున్నారు ఇక్కడ! 

పౌలుగారు ఈమాటను ఎత్తి రాస్తున్నారు రోమా పత్రికలో 9:

29. మరియు యెషయా ముందు చెప్పినప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.

 

నాశనమైపోయిన ఆ నగరాలు వినాశనానికి ఎంత పాత్రమైనవో ఈనాడు యేరూసలం యూదాలు కూడా అంతే అవినీతి పూరితంగా నాశనానికి తగినవిగా ఎంచుతున్నాడు.

 

యిర్మియా,యెహేజ్కేలు, ఆమోసు, జెఫన్యా గ్రంధాలలో ఈ సొదొమ గొమర్రాలను ఎత్తి రాసేరంటే దేవునికి ఎంత కోపమొచ్చిందో మనం అర్థం చేసుకోవి. చివరికి యేసుక్రీస్తు ప్రభులవారు కూడా ఈ సొదొమ గొమొర్రాలను ఎత్తి చెబుతున్నారు. అయితే ఆయన ఏమని చెబుతున్నారు అంటే యేసయ్య కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకన్న సొదొమ గొమొర్రా ప్రజలు మంచివారు, వారికి సువార్త ప్రకటన చేసేవారు లేక మారుమనస్సు పొందలేదు. మీకు సువార్త ప్రకటించిన మారుమనస్సు పొందడం లేదు కాబట్టి మీగతి కంటే సొదొమ గొమొర్రా గతియే మంచిది అన్నారు మత్తయి, మార్కు, లూకా సువార్త లలో!

మరి ఆ కాలంలోనే అలాగుంటే ఇప్పుడు ఇంకా పేట్రేగిపోతున్నారు. లెస్బియన్-  గే వ్యవస్థ పెరిగిపోయింది. బయట వారికి తీర్పు తీర్చడం నాకేల?! క్రిస్టియన్ నైట్ క్లబ్ లా?! గే చర్చిలా?! లెస్బియన్ చర్చిలా?! బుధ్ది జ్ఞానం ఏమైనా ఉన్నాయా?! దేవుడంటే భయం భక్తి లేకుండా పోయాయి!

 

       ప్రియ చదువరీ! ఈరోజు నేడు నీ పరిస్తితి కూడా బహుశా ఇలా ఉంటే- పైకి నీతిమంతుడిలా ఫోజు కొడుతూ ఎవరూ చూడకుండా ఇలాంటి పనులు చేస్తుంటే నీవు కూడా తప్పించుకోలేవు జాగ్రత్త! దేవుడు ఆ పట్టణాలను సమూల నాశనం చేసేశారు. ఇక ఆ ప్రాంతంలో మనుష్యులనే కాకుండా పశువులను చివరకు మొక్కలు కూడా లేకుండా అగ్ని గంధకాలతో కాల్చివేశారు.

 

నేటి దినాలలో ప్రపంచంలో లెస్బియన్లు(స్త్రీలతో స్త్రీలు పాపం చేయడం) ఎక్కువై పోయారు. ఇంకా గేలు (పురుషులతో- పురుషులు పాపం చేయడం) కూడా ఎక్కువై పోయారు. దీనిని ప్రపంచంలో అనేక దేశాలు అంగీకరించాయి. చివరకు మన దేశం కూడా అంగీకరించింది. ఇది నాశనానికి అతి సామీప్యంగా ఉన్నామని తెలియజేస్తుంది. చివరకు  మనదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అక్రమ సంబంధాలు తప్పుకావు. పరస్పర అంగీకారమైతే తప్పులేదు అని తీర్పు ఇచ్చింది. రెండు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. ఇలాంటి భయంకరమైన పరిస్తితులలో సత్యవాక్యం దీనిని ఖండిస్తుంది. ఒకవేళ నీవు దేవుని విశ్వాసములో ఉన్న నీవు కూడా ఇలాంటివి బాగున్నాయి అని చేస్తున్నావా- కనీసం ఆలోచనలో నైనా ఇది బాగుంది అనుకున్నావా జాగ్రత్త- దేవుని ఉగ్రత నీమీదికి వస్తుంది జాగ్రత్త! భయము నొంది పాపమునకు దూరంగా పారిపో!

 

   అయితే గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంతటి భయంకరమైన వాతావరణం లో లోతు భక్తుడు ఉన్నా తన పవిత్రతను పరిశుద్ధతను కోల్పోకుండా నీతిగా బ్రతికారు. అందుకే పరిశుద్ధ గ్రంథము చెబుతుంది నీతిమంతుడైన లోతు! 2పేతురు 2:7

దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.

2పేతురు 2:8

ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా మరి ఈ పాపపు లోకంలో నీవుకూడా నీతిమంతుడైన లోతులా పాపరహితము గా బ్రతుకగలవా?!!!!

 

తర్వాత వచనంలో ఓ ఇశ్రాయేలు ప్రజలారా మీరు అర్పించే బలులు నాకు అసహ్యం అంటున్నారు- దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే పాపమునకు పాపం చేసేస్తున్నారు- మరలా అది పోవడానికి బలులు అర్పిస్తున్నారు! దేవుడు ఛీ అని ఛీ కొడుతున్నారు! నీవుకూడా పాపం చేసేస్తూ దేవుడా క్షమించే అని దొంగ ఏడ్పులు ఏడ్చేస్తే దేవుడు కరిగి పోయి క్షమించేస్తాడు కదా అని విర్రవీగుతున్నావు, మితిమీరి ఇలాంటి పాపములు తెలిసి చేశావా- సామెతలు 29 చెబుతుంది- 1. ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును. ఇక్కడ మరి తిరుగులేకుండా హటాత్తుగా అనేమాట జాగ్రత్తగా గ్రహించాలి, నేడే బ్రతుకు మార్చుకో- పాపమును వదిలే!

 

చివరగా లోకంలో నేటి పరిస్థితులు చూసుకుంటే పాపము పరిపక్వమైపోయింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని బైబిల్ సెలవిస్తుంది. (యాకోబు 1:15) అనగా లోకము మరణము అనగా ఆధ్యాత్మిక నిత్య మరణము లేక నరకానికి పోతుంది. అలాగే పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు మరియు చేయాలి కూడా. పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలని పౌలుగారు రాస్తున్నారు ఆత్మావేశుడై! ఎఫెసీ 4:13

మరినీవు ఏ గుంపులో ఉంటావు? ఎటువైపు నీ పయనం?!!!

 

ప్రకటన గ్రంథం 22:10

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;

ప్రకటన గ్రంథం 22:11

అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము,(లేక, చేయును) అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము,(లేక, యుండును) నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును)

ప్రకటన గ్రంథం 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

ప్రకటన గ్రంథం 22:17

ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

ప్రకటన గ్రంథం 22:20

ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధం*

*145వ భాగము*

 

యెషయా 1:1113

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

 

        ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

 

       ప్రియులారా! పాపిష్టి జనామా! సొదోమా మనుషులారా అని ఇశ్రాయేలు ప్రజలను అధిపతులను పిలుస్తూ ఇంకా అంటున్నారు విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

 

   గమనించండి మీ బలులు నాకేల అనడం లేదు- మీ విస్తారమైన బలులు నాకెందుకు అంటున్నారు! దీని అర్ధం ఏమిటంటే పాపానికి పాపం కలుపుకుని చేసేస్తూ, పాపం పోతాదని విస్తారమైన బలులు అర్పించేస్తున్నారు! పాపాలు మానడం లేదు- బలులు అర్పించడం మానలేదు! ఇవి నాకొద్దు. మీ దహన బలులు పొట్టేళ్ళు క్రోవ్విన దూడలు వాటి రక్తము వాటి క్రొవ్వు నాకొద్దు! అవంటే నాకు అసహ్యం అంటున్నారు.

 

 ఇక తర్వాత వచనంలో అసలు నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన వాడేవాడు? మీరు అర్పించే నైవేధ్యం అది వ్యర్ధం అదంటే నాకు అసహ్యం మీ దూపార్పణం తేవొద్దు మీ అమావాస్య కూటాలు ప్రత్యేక కూటాలు నేను ఓర్చలేను ఎందుకంటే అవి పాపుల గుంపుల కూటాలు అంటున్నారు! చూడండి దేవుడు వారిని ఎంతగా అసహ్యించు కుంటున్నారో!!! ఈ వచనాలలో దేవుడు తనకు ఆరాధన ఎలా చేయాలో ఎలా చేయకూడదో చెబుతున్నారు! ఇది  ఆరాధన గురించి చాలా ప్రాముఖ్యమైన భాగం. ఏది దేవునికి అంగీకారమో, ఏది కాదో ఈ భాగం తెలియజేస్తున్నది. ఒకసారి ఈ క్రింది రిఫరెన్సులు చూస్తే దేవునికి ఎలాంటి ఆరాధన లేక బలులు ఇష్టమో ఏవి ఇష్టం లేదో తెలుస్తుంది!

 

కీర్తనల గ్రంథము 50:1-23;

1. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.

7. నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

8. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9. నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10. అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

11. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14. దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు.

16. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?

17. దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.

18. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.

19. కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.

20. నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.

21. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

22. దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును

23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

 

యిర్మియా 7:1-11;

1. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.

3. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి

4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.

5. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.

6. పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

7. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.

8. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.

9. ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు

10. అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?

11. నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.

 

కీర్తనల గ్రంథము  40

6. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.

 

యిర్మియా  6

20. షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్ట మైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.

 

1 సమూయేలు 15:22.

అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.

23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా

 

అయితే దేవుడు ఎలాంటి ఆరాధనను కోరుకుంటున్నారు?

 

యోహాను 4:21-24;

21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;

22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.

23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.

24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

 

యాకోబు 1:26-27

26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

     గమనించాలి అణకువ, దేవునిపట్ల విధేయత లేకుంటే, నిష్కాపట్యం సదుద్దేశం, పవిత్ర హృదయం, ఆధ్యాత్మిక జీవనం లేకుంటే మన ఆరాధనకు ప్రయోజనం శూన్యం. దాన్ని దేవుడు అంగీకరించడు.

 

ప్రియ దైవజనమా! మన ఆరాధన ఎలా ఉంది? ఏదో ఆరాధనకు రావాలి కాబట్టి వస్తూ పెదాలమీద ఏదో స్తుతులు చెల్లించి మమః  అనిపించుకుని వెళ్లిపోతున్నాము కదా! ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తున్నామా? కన్నీటి ప్రార్ధన పశ్చాత్తాప ప్రార్ధన ఏకాంత ప్రార్ధన ఉందా? నిజమైన ఆరాధన ఉందా? అసలు దేవుని ప్రేమను మన కుటుంభంలో సంఘంలో ఇరుగుపొరుగు వారికి చూపిస్తున్నామా? ప్రేమ లేకపోతే మ్రోగెడు కంచును ఘణఘణలాడు తాళము పోలి ఉంటావని 1 కోరింథీ 13 వ అధ్యాయం సెలవిస్తుంది. మరి నీ ఆరాధన ఎలా ఉంది సహోదరుడా! సహోదరీ నీ చెల్లి/అక్కతో నీవు మాట్లాడుచున్నావా? నీ అత్తతో లేక నీ కోడలితో సమాధానంగా ఉన్నావా? నీ తోటికోడలితో సమాధానంగా ఉన్నావా? లేకపోతే నీ ప్రార్ధన వ్యర్ధం, నీ ఉపవాసాలు వ్యర్ధం! నీ కానుకలు వ్యర్ధం! మ్రోగేడు కంచు ఘణఘణలాడు తాళము మాత్రమే నీవు! జీవము లేని వ్యక్తివి! నరకానికి పోయే గుంపులో ఉన్నావు!!

 

ఒకవేళ నీవు అలా ఉంటే నేడే నీ బ్రతుకు మార్చుకుని ఆత్మతోనూ సత్యము తోను ఆరాధన చేయడం మొదలుపెట్టు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధం*

*146వ భాగము*

 

యెషయా 1:1420

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.      

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

 

    ఇక ఇంకా ముందుకుపోతే 14, 15 వచనాలలో

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

 

మీ కూటాలు నాకు అసహ్యం, మీరు చేతులు చాపి ప్రార్ధన చేసినప్పుడు నా కన్నులు మూసుకుంటాను మీరు బాహుగా ప్రార్ధన చేసినా నేను వినను గాక వినను! ఎందుకంటే మీ చేతులు రక్తముతో ఉన్నాయి. అందుకే మీరు మిమ్మల్ని అనగా మీ హృదయములను కడుకోండి. వాటిని శుద్ధి చేసుకోండి! కీడు చేయడం మానేసి మేలు చేయండి అంటున్నారు.

 

తన పై తిరగబడి పాపంలో జీవిస్తూ ఉన్నవారి ప్రార్థనలకు దేవుడు జవాబియ్యడు. ఇలాంటి ప్రజలకు ఆరాధన క్రమాలు ఉండవచ్చు. ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు. అయితే అలాంటి వాటినుంచి దేవుడు తన ముఖం తిప్పేసుకుంటారు

 కీర్తనల గ్రంథము 66:18;

18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.

 

ఆయన వినకపోడానికి మరో కారణం మనకు సామెతలు 1వ అధ్యాయంలో కనిపిస్తుంది!

24. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

25. నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

27. భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

28. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.

29. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.

30. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

 

చూడండి ఒక ఆవిటివాడు ఏమని సాక్ష్యం చెబుతున్నాడో: యోహాను 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును

 

యాకోబు గారు అంటున్నారు: 4:3

3. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.

మనం ఆయనను ప్రేమించకుండా, విధేయత చూపకుండా, ఆయనను సేవించకుండా ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడను కోకూడదు. కేవలం స్వార్థ ప్రయోజనాలను ఆశించి చేసే ప్రార్థనలకు జవాబిస్తాడని ఆశించకూడదు. 

 

      ఇక 15 వ వచనంలో అంటున్నారు మీచేతులు రక్తముతో ఉన్నాయి. “రక్తం” వారు రక్తపాతం జరిగించారు. నిస్సహాయులను చంపారు

 21. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

 

యెషయా 59:3;

3. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

 

కీర్తనల గ్రంథము 106:38;

38. నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను

 

యిర్మియా 2:34

34. మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.

 

చూడండి వారి నిజస్తితి ఎలా ఉందో  అయినా దేవుడు తమ ప్రార్థనలకు జవాబు ఇస్తాడని చూస్తున్నారు! మానవుడి అజ్ఞానంతో కూడిన భ్రష్ట స్వభావం ఇలాంటిదే. అందుకే దేవుడు మీ ప్రార్ధనలు నేను వినను, మీ బలులు నాకొద్దు అంటున్నారు!

 

ప్రియ సంఘమా! నీవు కూడా ఇలాంటి స్థితిలో ఉంటే నీ ప్రార్ధన కూడా దేవుడు వినడు అని తెలుసుకో! అయితే ఎలాంటి ప్రార్ధన ఎలాంటి జీవితం జీవించాలో- ఎలాంటి ప్రార్ధన తాను వింటారో మనకు తర్వాత వచనాలలో కనిపిస్తుంది!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధం*

*147వ భాగము*

 

యెషయా 1:1420

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.      

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము!

 

            ( గతభాగం తరువాయి)

 

ఇంతవరకు ఎలాంటి ప్రార్ధన వినరో ఎలాంటి ఆర్పణలు బలులు దేవునికి ఇష్టం లేవో చూసుకున్నాము! ఇప్పుడు దేవునికి ఎలాంటి ప్రార్ధన ఎలాంటి జీవితం జీవించాలో- ఎలాంటి ప్రార్ధన తాను వింటారో ధ్యానం చేసుకుందాము!!!

 

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

 

చూడండి కడుగుకోవాలి శుద్ధిచేసుకోవాలి దేనిని? శరీరాన్ని కాదు ఆత్మను హృదయమును అంతరంగమును! దావీదు గారు అంటున్నారు నీవు అంతరంగములో యధార్ధత కోరుతున్నావు, శుద్ధ హృదయము నీకు కావాలి! కీర్తనలు 51 వ అధ్యాయం! మనకు కూడా ఇలాంటి శుద్ధ హృదయమే కావాలి! దేవునికి కావలసింది అదే!!

 

నీతిన్యాయాల విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి స్థితి ఘోరంగా ఉన్నప్పటికీ వారు పశ్చాత్తాపపడితే పాపక్షమాపణ, దీవెనలు వారికి కలుగుతాయన్న ఆశాభావానికి లేక నిరీక్షణకు అవకాశం ఇంకా ఉంది. బైబిలంతటా ఈ ఆశాభావమే లేక నిరీక్షణ  వెల్లడి అవుతూ ఉంది

 

యెషయా 55:7;

7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును

 

2 దినవృత్తాంతములు 7:14;

14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

 

యెహెఙ్కేలు 18:27-28,

27. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.

28. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.

 

యెహెఙ్కేలు 18:32;

32. మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

ఇక‌ “కడుక్కోండి” కోసం చూసుకుంటే యాకోబు 4:8;

8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.

 

జెకర్యా  1

3. కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

 

మలాకీ  3

7. మీ పితరుల నాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా మేము దేనివిషయములో తిరుగుదుమని మీరందురు.

 

2 కోరింథీయులకు 7:1.

1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

 

దేవుడు తనను కడగాలని దావీదుగారు  ప్రార్థించారు  (కీర్తనల గ్రంథము 51:2).

2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆయన ఎంతగా ప్రార్ధన చేశారు అంటే కన్నీటితో తన పడక కొట్టుకుపోయేటంతగ ప్రార్ధన చేశారు!

 పశ్చాత్తాపపడి, పాపాలు ఒప్పుకొని, విశ్వాసంతో దేవుని వైపు తిరిగి తమ జీవితంలోని పాపాన్ని జయించేందుకు ఆయన శక్తిని ఆశ్రయించిన వారు తమ అపరిశుద్ధతను తామే కడిగివేసుకున్నట్టు ఉంటారు. ఇదంతా వారి హృదయాలలో దేవుడు జరిగించే చర్యే గనుక దేవుడే వారిని కడిగినట్టు వారిలోని అన్యాయమంతటినీ కడిగివేయడం ద్వారా దేవుడు దీన్ని పూర్తి చేస్తాడు

1 యోహాను 1:7

7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

1 యోహాను 1:9

9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

దుష్టత్వమంతటినీ మనలోనుండి కడిగివేసుకోవాలన్న అభిలాష మనలో లేకుండా దేవుడు మనల్ని కడుగుతాడని ఎదురుచూడకూడదు.

 

ఇక మీ పాపాలు దోషాలు చేయకుండా మానండి” ఈ ఆజ్ఞ చిన్నదే గానీ దీని ప్రకారం చేస్తే కలిగే ఫలితం గొప్పది. అయితే ఇలా జరిగేందుకు దేవుని పై మనం ఆధారపడకపోతే ఇది అసాధ్యం

 

యిర్మియా 13:23

23. కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.

 

కాబట్టి చెడుతనం మానివేయాలన్న ఆజ్ఞకు అర్థం మన బలాన్ని దేవునిలో వెతకాలి!! చెడుతనం మానివేశాక దేవుణ్ణి వేతకాలి అలా వేడికితే ఆయన దొరకడమే కాకుండా ఏమేమి ఫలితాలో చూసుకుందాం!

 

 యెషయా 40:31;

31. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

 

కీర్తనల గ్రంథము 29:11;

11. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.

 

కీర్తనల గ్రంథము 105:4;

4. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి

 

కీర్తనల గ్రంథము 138:3;

3. నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.

 

 కాబట్టి మొదటగా మన ప్రాణాత్మలను హృదయమును శుద్ధి చేసుకోవాలి! దేవుని రక్తములో మన పాపములను కడుగుకోవాలి! అప్పుడు దేవుణ్ణి వెదకాలి! అప్పుడు దేవుడు నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు దయచేస్తారు! ఈ ప్రాసెస్ చేయకుండా నన్ను దీవించేయ్ దీవించేయ్ అంటే దేవుడు నిన్ను దీవించరు నీ ప్రార్ధనకు జవాబియ్యరు సరికదా నీవు వేషధారివి అవుతావు అని మర్చిపోకు!!

 

చివరిగా ఒకమాట: యేసుక్రీస్తు ప్రభులవారు అపొస్తలుడైన పేతురుగారి పాదాలు కడుగుదామని నన్ను కడగొద్దు అంటే, నేను కడుగకపోతే నాలో నీకు పాలు లేదు అని చెబితే అయ్యా నా ఒళ్లుమొత్తమ కడిగేయండి అంటారు అప్పుడు యేసయ్య కాళ్లు చేతులు కడుగుకుంటే చాలు అన్నారు. అనగా స్నానం చేసిన వారు కూడా బయటకు వెళ్ళి వస్తే తప్పకుండా కాళ్లుచేతులు కడుగుకోవాలని యేసయ్య చెప్పారు. అలాగే నీవు నేను బాప్తిస్మము అనే స్నానము ద్వారా కడుగబడి క్రీస్తు రక్తం ద్వారా ఆయన పిల్లలుగా చేయబడి పరిశుద్దులుగా చేయబడ్డాము! మంచిది పాపలోకంలో ఉన్న మనం ప్రతీరోజూ మన ప్రాణాత్మలకు పాపము అంటుకుంటుంది కాబట్టి ప్రతీరోజూ ఆయన వాక్యముతో ఉదకస్నానము చేయాలని బైబిల్ చెబుతుంది ఎప్పుడూ? రక్షించబడ్డాక ప్రతీరోజూ జరగాల్సిన ప్రక్రియ ఇది! అనగా ప్రతీరోజూ నిన్ను నీవు శుద్ధీకరణ లేక శుద్ధీకరించుకోవాలి. ప్రతీరోజూ ఆయనాత్మతో సంధించబడాలి, నింపబడాలి.

మరినీవు అలా ప్రతీరోజూ శుద్ధీకరణ చేసుకుంటున్నావా? కడుగుకుంటున్నావా? లేకపోతే నేడే మొదలుపెట్టమని క్రీస్తు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధం*

*148వ భాగము*

 

యెషయా 1:1620

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.      

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము! దేవునికి ఎలాంటి ప్రార్ధన ఎలాంటి జీవితం జీవించాలో- ఎలాంటి ప్రార్ధన తాను వింటారో ధ్యానం చేసుకుంటున్నాము!!!

 

            ( గతభాగం తరువాయి)

 

ఇక 17 వ వచనంలో అంటున్నారు- కీడు చేయడం మానండి మేలు చేయడం నేర్చుకోండి న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. అనగా న్యాయము జరుగుతుందా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించి- మీ తీర్పులలో పాలనలో విచారించి అప్పుడు తీర్పులు చెప్పండి. హింసించబడే వానిని విడిపించుడీ తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి విధవరాలి పక్షంగా వాదించండి అంటున్నారు!

 

దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు లేక “మంచి” కోసం  కీర్తనల గ్రంధంలో అంటున్నాడు భక్తుడు: కీర్తనల గ్రంథము 34:14;

14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము

 

కీర్తనల గ్రంథము 37:27.

27. కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు

 

హెబ్రీ పత్రికాకారుడు అంటున్నారు: హెబ్రీయులకు  12

14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

 

నిజానికి చెడుతనం చేయడం మనుషులు వేరే నేర్చుకోనక్కరలేదు. ఊపిరి తీసుకున్నంత సహజంగా అది వారికి అబ్బుతుంది  ఇది మనకు క్రింది రిఫరెన్సులలో తెలుస్తుంది:

 

ఆదికాండము 6:5;

5. నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

 

ఆదికాండము 8:21;

21. అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.

 

అసలు ఇలా చేయడానికి కారణం చెబుతున్నారు కీర్తనాకారుడు

 

కీర్తనల గ్రంథము 51:5;

5. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.

 

కీర్తనల గ్రంథము 58:3;

3. తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

 

 యిర్మియా 17:9;

9. హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

 

 యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మత్తయి 15:19-20.

19. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

20. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

 

పౌలుగారు అంటున్నారు రోమీయులకు  7

18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు

సరే, కానీ నిజానికి మనము ఏమి నేర్చుకోవాలి అంటే  సరైనది చెయ్యడమే నేర్చుకోవలసి ఉంది. ఒక్కడే అయిన నిజ దేవుని వైపుకు మళ్ళడం ద్వారానూ, దేవుని వాక్యమును  పఠిస్తూ, దానికి లోబడుతూ ఉండడం ద్వారానూ దీన్ని సాధించవచ్చు. దేవుని వాక్కు లేకుంటే కొన్నిసార్లు మనుషులకు “మంచి” ఏమిటో చూచాయగానైనా తెలియదు (యెషయా 5:20 పోల్చి చూడండి). దేవుని వాక్యము  మనకెంత బాగా తెలిస్తే లేక ఎంతగా బాగా ఎక్కువగా వింటూ చదువుతూ అర్ధం చేసుకుంటామో అప్పుడు  మంచి ఏమిటో చెడ్డ ఏమిటో అనేది అంత బాగా బోధపడుతుంది. ఈ భూమిపై ఉన్నంత కాలం దేవుని ప్రజలు మంచి చేయడం నేర్చుకుంటూనే ఉండాలి.

 

ఇక “న్యాయాన్ని...వాదించండి” మంచి చేయడం నేర్చుకున్నందువల్ల కలిగే ఫలితం మనం న్యాయం పక్షాన నిలబడగలగడం, పేదలకు, దిక్కులేని వారికి సహాయం చెయ్యగలగడం

 

నిర్గమకాండము 22:22-24;

22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.

23. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.

24. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేనివారగుదురు.

 

ద్వితీయోపదేశకాండము 10:18;

18. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

 

ద్వితీయోపదేశకాండము 24:19-21;

19. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.

20. నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను.

21. నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారి కిని విధవరాండ్రకును ఉండవలెను.

 

ద్వితీయోపదేశకాండము 26:12-13; ద్వితీయోపదేశకాండము 27:19;

 

కీర్తనల గ్రంథము 68:5;

5. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు

 

కీర్తనల గ్రంథము 82:1-4;

1. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.

2. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు?(సెలా. )

3. పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.

4. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.

 

మీకా 6:8;

8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

 

 యాకోబు 1:27

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

ఇక ఈ భాగము ముగించే ముందు ఒక్కమాట చెప్పనీయండి- ఈ యెషయా గ్రంధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీదన 17వ వచనంలో ఉన్నవి చేస్తే ఉపవాస మున్నట్లే భక్తి చేస్తున్నట్లే! నిజానికి ఇదే ఉపవాసము అంటున్నారు! చూద్దామా ఎక్కడ రాశారో?!!!

యెషయా 58:

3. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు

4. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.

5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని

10. ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

 

   చూడండి దేవుడు ఏమంటున్నారో నీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి పెట్టడం, నీ రక్తసంబంధి ఆపదలో అవసరాల్లో ఉంటే అతనికి సహాయం చేయడం (ఉచితముగా), దుర్మార్గుల బంధకాలలో ఉన్నవారిని విడిపించడం, బాధించ బడినవారిని విడిపించడం, వస్త్రహీనుడు కనిపిస్తే వారికి నీకున్న బట్టలలో కొన్ని ఇచ్చి సహాయం చేయడం ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం అంటున్నారు! అలా చేస్తే నీవు తండ్రి అని పిలిచిన వెంటనే ఏమి నా కుమారుడా అని జవాబిస్తాను అంటున్నారు!

 

మరినీవు ఇలాంటి భక్తి చేస్తున్నావా? లేక పెదాలతో పప్పలు వండినట్లు ఏదో పెదాలమీద ప్రార్ధన చేస్తున్నావా? ఇలా ఆపదలో అవసరాలలో ఉన్నవారికి కొంతైనా సహాయం చేస్తున్నావా? గమనించాలి మనం అందరికీ సహాయం చేయలేము గాని నీ పొరుగువానికి నీ అక్కాచెల్లెళ్లకు నీ అన్నదమ్ములకు మీ గ్రామంలో ఉన్న బీదవారికి ఒకరిద్దరికి అయినా చేయగలవు కదా! నీకున్నదంతా అమ్మి ఇచ్చేయమని చెప్పడం లేదు నేను! నీకున్నదాంట్లో కొంచెం అవసరం ఉన్నవారికి ఉడత సహాయం అంటారు కదా అలాగైనా చేయగలవా?

 

అలాచేస్తేనే అది భక్తి అంటున్నారు దేవుడు!

 

నేడే అసలు సిసలైన భక్తిని మొదలుపెట్టు!

 

దైవాశీస్సులు!

 

 

*యెషయా ప్రవచన గ్రంధం*

*149వ భాగము*

 

యెషయా 1:1620

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.      

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధము మొదటి నుండి ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు మరియు దుర్మార్గాల కోసం ధ్యానిస్తున్నాము! దేవునికి ఎలాంటి ప్రార్ధన ఎలాంటి జీవితం జీవించాలో- ఎలాంటి ప్రార్ధన తాను వింటారో ధ్యానం చేసుకుంటున్నాము!!!

 

            ( గతభాగం తరువాయి)

 

ఇక మనము 18 వ వచనం చూసుకుంటే దేవుడు ఇలా అంటున్నారు: రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నా గాని నేను మిమ్మును కడిగి హిమము అనగా మంచు వలె తెల్లగా చేస్తాను. కెంపు వలె ఎర్రగా ఉన్నా గాని అవి తెల్లని గొర్రె బొచ్చులా చేస్తాను అంటున్నారు! మీకు తెలుసా? ఈ వచనాన్ని ప్రాచీన ఆఫ్రికా ప్రతులలో ఎలా తర్జుమా చేశారంటే మీ పాపములు రక్తములా ఎర్రగా ఉన్నా నేను కొబ్బరి కాయలోని గుంజులా తెల్లగా మారుస్తాను అని తర్జుమా చేశారు. ఎందుకంటే వారికి ఎప్పుడు హిమము అనగా మంచు కురువదు అది ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగాక టీవీలు వచ్చాక, ఇంకా ఐస్ ఫాక్టరీలు వచ్చాక మంచుని చూస్తున్నారు వారు!

 

సరే ఇక్కడ దేవుడు మన వివాదం తీర్చుకుందాం మీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా నేను వాటిని తీసివేసి తెల్లగా చేస్తాను అంటున్నారు! అయితే ఈ వచనం డైరెక్ట్ గా చదువుకున్నందు వలన ఏవిధమైన ఉపయోగం లేదు! ఇది మీద వచనాలతో కలిపి చదువుకుంటేనే దీని అర్ధం వర్తిస్తుంది.  అనగా మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, మీరు చేసే దోషాలు పాపాలు మానండి, మేలు చేయడం నేర్చుకోండి, కీడును విసర్జించి అందరితో సమాధానంగా ఉండండి. దిక్కులేని వారికి దీనులకు విధవరాళ్లకు అనాధలకు న్యాయం తీర్చడమే కాదు వారికి వారి అవసరాలలో ఆదుకోండి అప్పుడు నన్ను అడగండి అప్పుడు మీ పాపాలను నేను కడిగేస్తాను! మిమ్మును పరిశుద్దులుగా మార్చి నా పిల్లలుగా చేస్తాను అంటున్నారు దేవుడు! గతభాగాలలో చూసుకున్నాము! మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసురక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది అని! మొదటగా మనము ఒప్పుకోవాలి, తరువాత విడిచిపెట్టాలి. అప్పుడు నిన్ను పరిశుద్ధునిగా తీరుస్తారు చేస్తారు దేవుడు!

 

సామెతలు 18: 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

 

1 యోహాను  1

7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

8. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.

9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును

ఇదీ అసలైన విధానము!!

 

ఇక క్రింది వచనాలను చూసుకుంటే

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.      

 

చూడండి దేవుని మాట వింటే అత్యధికమైన మేలులు ఆశీర్వాదాలు! వినకపోతే దుంప నాశనమైపోతారు అంటున్నారు!

 

ఇంతకీ ఆ కట్టడలు ఏమిటి అంటే బైబిల్ లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో చాలా స్పష్టముగా చెప్పారు దేవుడు. వాటిని పాటిస్తే మీరు ఎలా ఉంటారో కూడా స్పష్టముగా చెప్పారు! ఈ వచనాల్లో కనిపించే తేడా బైబిల్లో అన్ని చోట్లా కనిపిస్తుంది దేవుని వాక్కుకు లోబడడం గొప్ప దీవెన తెస్తుంది. మానక తిరుగుబాటు చేస్తూ ఉంటే మరణం, నాశనం, శాశ్వత శిక్ష ప్రాప్తిస్తాయి

 

లేవీయకాండము 26:3-35;

3. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

4. మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,

5. మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.

6. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;

7. మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.

8. మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.

9. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.

10. మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.

11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.

12. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.

13. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

 

14. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక

15. నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,

16. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

17. నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

18. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

19. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

20. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును.

21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.

22. మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

23. శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

24. నేనుకూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.

25. మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.

26. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

27. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల

28. నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.

29. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

30. నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

31. నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.

32. నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

33. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.

34. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.

35. అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.

 

   చూడండి ఇక్కడ ఆయన మాటలు కట్టడలు వింటే ఏఏ మేలులు ప్రాప్తిస్తాయో, మాట వినకపోతే ఎలా శపించబడతారో చాలా స్పష్టముగా ఉంది. ఇక్కడ ఉన్నదానినే మోషేగారు విస్తరించి వివరంగా ద్వితీయోపదేశకాండము 28:1-68లో రాశారు. రెండూ ఒక్కటే! తర్వాత చదువుకోండి!

 

ఇంకా ద్వితీయోపదేశకాండము 30:15-20లో మోషేగారు చనిపోయే ముందు  అంటున్నారు:

 

15. చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను.

16. నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడ లను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించు చున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొను టకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.

17. అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన యెడల

18. మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దా నును దాటపోవుచున్న దేశములో మీరు అనేకదినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను.

19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

20. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.

 

ఈరోజు దేవుడు ఇదే మాట మనతో అంటున్నారు- జీవాన్ని మరణాన్ని మనముందు పెట్టారు! ఆయన మాటలు విన్నామా, విని పాటిస్తే మనకు దీవెనలు మెండుగా కలిగి చివరికి పరలోకంలో ఆయనతో నిత్యమూ ఉంటాము! వినకపోయామా నిత్య నిరకమే!!

 

యెషయా 66:24.

24. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.

 

మార్కు 9: 48. నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.

 

కాబట్టి ఏమిటి కావాలో ఏడే నిర్ణయం చేసుకో! జీవమా? మరణమా? పరలోకమా? పాతాలమా?

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*150వ భాగము*

 

యెషయా 1:2128

21. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

22. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.

23. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.

24. కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

26. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

28. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.     

 

          ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! ఇక మొదటి అధ్యాయంలో యూదుల యొక్క మరియు ఇశ్రాయేలు ప్రజల యొక్క దుర్మార్గాలు అవినీతి కోసం చూసుకున్నాము! ఇక 21 31 వరకు దేవుడు చేస్తున్న క్రొత్త వాగ్ధానము మరియు క్రొత్త దినం ఎలా ఉండబోతుందో దేవుడు చెబుతున్నారు! అయితే మరలా 2123 వచనాలు కూడా వారి అవినీతిని ఎండారగడుతున్నారు.

 

సరే, ఇక ముందుకు పోదాం! 21 వ వచనంలో అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అయిపోయిందే అంటూ బాధపడుతున్నారు దేవుడు! నమ్మకమైన నగరం ఏమిటి? యెరూషలేము ! ఇది ఇప్పుడు వేశ్య అయిపోయింది అంటున్నారు! గతభాగలలో చెప్పడం జరిగింది వేశ్య అనగా దేవుణ్ణి విడిచి అన్య విగ్రహాల వెనుక తిరుగుతుంది అని అర్ధం!! యెరూషలేము కోసం బైబిల్ లో నేను కోరుకొనిన పట్టణం అంటూ వ్రాయబడింది.

 

కీర్తన 116:9, 122:2, 122:3, 6, 137:5; 147:12; యెషయా 52:1,2, 62:6, 12

 

అదే యెరూషలేమా నీకు శ్రమ అని కూడా వ్రాయబడింది. యేసుక్రీస్తుప్రభులవారు యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను పట్టుకుని చంపేదానా అంటూ ఏడ్చారు!!! మత్తయి 23:37, లూకా 13:34;

 

పరిశుద్ధ పట్టణం అని, నేను కోరుకొను స్థానమని, నా పాద పీటముండే స్థానమని ఇలా ఎన్నెన్నో పేర్లు గల ఈ పట్టణం కోసం ఇప్పుడు దేవుడు అంటున్నారు- నమ్మకమైన నగరం ఇప్పుడు వేశ్య అయిపోయింది అంటున్నారు! ఇలా అనడానికి కారణం మనం చూసుకుంటే జెరుసలం దేవుని విషయంలో నమ్మకంగా ప్రవర్తించలేదు (వ 4). ఇతర దేవుళ్ళను పూజించింది (యెషయా 2:8). బైబిలు దీన్ని వేశ్య ప్రవర్తనతో లేక వ్యభిచారంతో పోలుస్తున్నది .

 

లేవీయకాండము 20:5; యిర్మియా 2:20; యిర్మియా 3:1, యిర్మియా 3:6, యిర్మియా 3:8-9; యిర్మియా 13:27; యెహెఙ్కేలు 16:17, యెహెఙ్కేలు 16:28; యెహెఙ్కేలు 23:5, యెహెఙ్కేలు 23:8, యెహెఙ్కేలు 23:19; హోషేయ 2:5; హోషేయ 4:15; హోషేయ 5:3-4

 

యిర్మియా  2

20. పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.

 

యిర్మియా  3

1. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

యిర్మియా  3

8. ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభి చారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.

9. రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.

 

హోషేయ  5

4. తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.

3. ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.

 

మీదన చెప్పిన అన్నీ రిఫరెన్సులు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన ద్వారా దేవుని దృష్టిలో వ్యభిచారం చేశారు అని రుజువు చేస్తుంది. వ్యభిచారం చేసే వారిని వ్యభిచారి లేక వేశ్య అంటారు! ప్రియ దైవజనమా! నీవు కూడా దేవుణ్ణి వదిలి ఇప్పుడు లోకంతో సహవాసం చేస్తే- అనగా ఇంతవరకు దేవుని వెలుగులో నడిచి- ఇప్పుడు శరీరాశ, నేత్రాశ జీవపుడంభము నిన్ను ఆకర్శిస్తే నీవు లోకంలో పడిపోయి లోకాశలు నెరవేరుస్తుంటే నీవు కూడా వ్యభిచారివే వేశ్యవే!! అక్షరానుసారమైన వేశ్యవు కావు గాని ఆధ్యాత్మిక వేశ్యవు అని అర్ధం! లేదా ఆధ్యాత్మిక వ్యభిచారివి! ఎవడేమి అనుకుంటే నాకు అనవసరం! ఉన్నదున్నట్లు చెప్పడం నాకు అలవాటు!! అందుకే కొన్ని వేలమంది స్నేహితులను పోగొట్టుకున్నాను! అయినా పరవాలేదు! ఏవిధముగా నైనా మిమ్మల్ని మండించి క్రీస్తుతో ఐక్య పరచాలనే నా ఆశ! అందుకోసం ఎన్ని హింసలు పొందడానికైనా ఎంతమందిని కోల్పోవడానికైనా నేను సిద్ధమే! కాబట్టి ప్రియ విశ్వాసి ఒకవేళ లోకం నీలో రాజ్యం చేస్తుంటే, నేడే నీలో ఉన్న లోకం యొక్క పీక నొక్కి క్రీస్తు కోసం క్రీస్తు బాట అనగా శ్రమల బాటలో సాగిపో!

 

ఈ వచనం ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే నమ్మకమైన నగరం ఇప్పుడు వేశ్య అయిపోయింది! ఇంకా ఒకానొకప్పుడు అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

 

చూడండి పాత రోజులలో అదే నగరంలో నీతి ఉండేది న్యాయము ఉండేది అయితే ఇప్పుడు నరహంతకులు ఈ పట్టణంలో కాపురమున్నారు అంటూ బాధపడుతున్నారు! అందుకే 15 వ వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి. నరహంతకులు పట్టణంలో తిరుగుతున్నారు కాబట్టి ఇంకా పసిపిల్లలను విగ్రహాలకు బొమ్మలకు అర్పించేస్తున్నారు నిరపరాధ రక్తాన్ని చిందిస్తున్నారు అందుకే దేవునికి కోపం వచ్చింది ఇప్పుడు అంటున్నారు 24 వ వచనంలో 24. కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

ప్రియ దేవుని బిడ్డా! స్వంత జనాంగము వాగ్ధాన ప్రజలనే దేవుడు వదలనప్పుడు నిన్ను కూడా దేవుడు వదలడు అని మర్చిపోకూ!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*151వ భాగము*

 

యెషయా 1:2128

21. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

22. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.

23. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.

24. కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

26. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

28. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.     

 

          ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

ఇక ముందుకు పోతే 22. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.

 

వెండి మష్టు అయిపోయింది అట, ద్రాక్షారసం నీళ్ళతో కలిసి చెడిపోయినది అంటున్నారు! ఆ ప్రజల హృదయాలు భ్రష్టమైపోయినందుచేత తక్కినవన్నీ భ్రష్టమైపోయాయి అంటున్నారు! మరలా 23 వ వచనంలో మరో కారణం చెబుతున్నారు: నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు. ఇక్కడే కాదు సార్ ఇంకా అనేకచోట్ల ఇలాగే వ్రాయబడింది.

 

యిర్మియా  2

8. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్‌ప్రయోజనమైనవాటిని అనుసరింతురు.

 

యెహెఙ్కేలు  34

1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.

3. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱె లను మేపరు,

4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.

5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.

6. నా గొఱ్ఱెలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.

 

ఇంకా ఎన్నో ఉన్నాయి గాని ఇవి చాలు!

 

ఇక  నిర్గమ 23:8 లో దేవుడు చెప్పారు లంచము తీసుకోకూడదు లంచము దృష్టిగలవారికి గ్రుడ్డి తనము కలిగిస్తుంది అని చెబితే సమూయేలు గారి కుమారులే లంచాలు పుచ్చుకున్నట్లు సమూయేలు గారే చెబుతున్నారు 1 సమూయేలు 8:3 లో

 

కీర్తనల గ్రంధంలో దావీదు గారు అంటున్నారు కొంతమంది అధికారులు దావీదుగారికి శత్రువులు లంచాలు పుచ్చుకున్నట్లు చెబుతున్నారు కీర్తన 26:10 లో..

కీర్తనలు 26:10

వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.

 

ఇదే యెషయా గ్రంధంలో 5:23 లో అంటున్నారు..

యెషయా 5:23

వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

 

యెహేజ్కేలు 22:12

నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

 

మీకా 3:11

జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదనియనుకొందురు.

 

మీకా 7:3

రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.

 

సరే, ఇలా లంచగొండులను దేవుడు శిక్షిస్తాను అంటున్నారు! యోబు గ్రంధములో అయితే వారి గుడారములను అగ్నితో కాల్చివేస్తాను అంటున్నారు!

యోబు 15:34

భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

 

ప్రియ సహోదరీ సహోదరుడా! క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని బాప్తిస్మము తీసుకున్న నీవు పొరపాటున ఏవిధమైన లంచం తీసుకున్నావా నీ గుడారాన్ని అగ్నితో కాల్చి వేస్తాను అంటున్నారు దేవుడు! జాగ్రత్త! భయము నొంది పాపమును వదిలే!! గమనించాలి- క్రీస్తు లేనప్పుడు జక్కయ్య గారు అన్యాయముగా లంచాలు తీసుకుంటూ అక్రమంగా ధనము సంపాదించారు. గాని ఎప్పుడైతే క్రీస్తు దివ్య ముఖారవిందమును చూశారో- వెంటనే బ్రతుకు మారిపోయింది హృదయం పరివర్తనం చెందింది. అయ్యా నేను అన్యాయముగా ఎవరివద్ద ధనము తీసుకున్నానో- వారికి నాలుగు పాళ్ళు చెల్లిస్తాను అని పలకడమే కాకుండా చేసి చూపించి క్రీస్తుని వెంబడించారు ఆ మహానుభావుడు! అందుకే ఇతడును అబ్రాహాము కుమారుడే అని దేవుడు చెప్పారు!!! ఎందుకు అంటే నేడు అనగా క్రీస్తుని హృదయంలో అంగీకరించారు కాబట్టి హృదయం పరివర్తనం చెంది లంచాలు అన్యాయాలు మానేశారు కాబట్టి ఆ రోజు ఆ జక్కయ్య గారి ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నీ గృహంలో రక్షణ ఇప్పటికే ఉన్నా గాని లంచాలు పుచ్చుకుంటే రక్షణ పోగొట్టుకుని నరకవాసివి అయిపోతున్నావు అని అర్ధం! కాబట్టి లంచం తీసుకోవడం అనే పాపమును నేడే వదిలివేయమని క్రీస్తు పేరిట బ్రతిమిలాడు తున్నాను!

 

అంతేకాదు ఈ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని బిడ్డ- నీ చేతిలో అధికారం ఉంటే నీవు చేయాల్సింది తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చాలి , విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించాలి. ఆ అధికారులు అలా చేయలేదు కాబట్టి వారిమీదికి దేవుడు ఉగ్రత పంపించారు అని గ్రహించాలి .

 

కాబట్టి నేడే నీ బ్రతుకును పరిశీలించుకుని సరిచేసుకోమని మనవి చేస్తున్నాను!

 

దైవాశీస్సులు!!!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*152వ భాగము*

 

యెషయా 1:2531

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

26. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

28. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.     

29. మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖములు ఎఱ్ఱబారును

30. మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

31. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

 

          ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

         ప్రియులారా! ఇక ముందుకు 2531 వచనాలు చూసుకుంటే ఇంతటి ఘోరమైన స్థితిలో ఉన్న యెరూషలేము యూదా ప్రజలతో ఒక ఆదరణకరమైన వాగ్ధానం చేస్తున్నారు! ఈ వాగ్ధానం లో ఆయన యొక్క తండ్రి హృదయం ప్రస్పుటముగా కనిపిస్తుంది మనకు!

 

చూద్దాం 25 నుండి నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

 

చూడండి నా చేతితో క్షీరము పెట్టి అనగా సబ్బు పెట్టి నిన్ను నాచేతితో రుద్దుతాను, అలా నిన్ను నేను నిర్మలం చేస్తాను అంటున్నారు. ఇంకా నీలో ఉన్న తగరము అంతా తీసివేస్తాను అంటున్నారు! మనకు తెలుసు వెండి నగలు బంగారు నగలు చేసేటప్పుడు ఆ ఆకారము వచ్చి స్థిరంగా అదే ఆకారంలో ఉండటానికి లేక గట్టిగా ఉండటానికి దానిలో తగరం లేదా లెడ్ (ప్లంబం) కలుపుతారు. ఇప్పుడు ఆ కలిపిన తగరం తీసేస్తే ఇప్పుడు నీవు మేలిమి బంగారంలా తయారవుతావు అంటున్నారు ! లోకస్తులతో తిరిగి మేలిమి బంగారమైన నీవు కల్తీ బంగారమై పోయావు ఇప్పుడు నేను ఆ కల్తీ లేక తగరం తీసేసి నిన్ను మేలిమి బంగారంలా చేస్తాను అంటున్నారు! ఈ వచనాలన్నీ జెరుసలం నగరాన్ని గురించి పలికినవే. దాని నివాసులంతా భ్రష్టులైపోయినప్పటికీ దేవునికింకా దానిపట్ల ఉన్నతమైన, పవిత్రమైన ఆశయాలు ఉన్నాయి. దాన్ని శుద్ధి చేసి దానికి నీతిన్యాయాలను తిరిగి కలిగించాలని ఆయన దృఢ నిర్ణయం. ఇది జరగాలంటే ఆ నగరానికి బాధలు, దాన్లో తిరుగుబాటు చేసినవారికి నాశనం తప్పనిసరి.

 

ఇక శుద్దిచేయడానికి లేదా “శుద్ది చేసి”  దేవుడు చేయబోయే శుద్ధిచేసే  కార్యం చూడండి యెషయా 4:4

4. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు;

 

 కీర్తనాకారుడు ఇలా అంటున్నారు కీర్తనల గ్రంథము 66:10-12;

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

మలాకీ 3:3లో ఆత్మావేషుడై అంటున్నారు:

3. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.

 

ఇక 26 వ వచనంలో అంటున్నారు మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

 

చూడండి ఇది ఇశ్రాయేలు మరియు యూదులు చెర విడుదల అయ్యాక తిరిగి వచ్చాక జరిగే కార్యం కోసం చెబుతున్నారు. ఇక మీకు రాజులను తీసేస్తున్నాను. ఎందుకంటే రాజులే మిమ్మల్ని దారి తప్పించారు. ఇక్కడ యరోబాముతో మొదలైంది రాజులే త్రోవ తప్పడం తప్పించడం, చివరికి వారి వలననే ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యము చెరలోనికి పోయారు! అందుకే ఇప్పుడు మరలా మిమ్మల్ని తీసుకుని వచ్చి మీకు మరలా న్యాయాధిపతులను ఇస్తాను. ఇక మీకు రాజులుండరు!  ఇంకా మీకు మంచి ఆలోచన కర్తలను ఇస్తాను. వారు మీకు మంచిమార్గము చూపించడమే కాకుండా ఆ బాటలో మిమ్మలని నడిపిస్తారు.

అంతేకాకుండా రెండు రాజ్యాలుగా ఉండకుండా ఒకే రాజ్యముగా చేస్తాను అని మరోచోట చెబుతున్నారు.

ఉదాహరణకు సమూయేలు గారిలాంటి న్యాయాధిపతిని ఆలోచన కర్తను మీకిస్తాను అంటున్నారు! ఇది జరిగాక మరలా నిన్ను నమ్మకమైన నగరంగా చేస్తాను అంటున్నారు! ఇప్పుడు నీవు వేశ్యవైపోయావు గాని నిన్ను కడిగి నిర్మలం చేసి నిన్ను మరలా నమ్మకమైన నగరంగా మారుస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు! మరలా అప్పుడు నీలో నీతి మరియు న్యాయం ఆ నగరంలో పాలన చేసేలా చేస్తాను అంటున్నారు!

  జెకర్యా  8

3. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును.

 

27 వ వచనంలో 27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

 

అనగా మనస్ఫూర్తిగా దేవునివైపుకు తిరిగేవారే ప్రాణాలతో బయటపడి సీయోనుకు దేవుడిచ్చే దీవెనల్లో పాలి భాగస్థులు అవుతారు అన్నమాట!

 

అయితే 28 వ వచనం కొంచెం వివాదంగా ఉంటుంది అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు..

 

మీదనే నేను మీ పాపాలను కడుగుతాను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను అని చెప్పారు ఇక్కడేమో మరలా అంటున్నారు అతిక్రమం చేయువారు పాపులు నిశ్శేషముగా నాశనమైపోతారు అంటున్నారు! దీని అర్ధం ఏమిటంటే మిమ్మల్ని విమోచించాక మీరు విడుదల పొంది మీ స్వంత ప్రాంతానికి వచ్చాక మరలా ఎవడైనా అతిక్రమం చేసినా పాపము చేసినా వారు నిశ్శేషముగా నాశనమై పోతారు యెహోవాను విసర్జించే వారు లయమై పోతారు అంటున్నారు!

 

అంతేకాదు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను యూదులను బాధపెట్టారో వారిని నాశనం చేస్తాను అనే మరో అర్ధం కూడా వస్తుంది ఇక్కడ!!!\

కీర్తనల గ్రంథము  9

5. నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు.

 

యిర్మియా  16

4. వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.

 

2 థెస్సలొనీకయులకు  1

8. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు..

 

ఈ రకంగా యూదులను హింసించిన వారికి ఎలా తీర్పు వచ్చింది ఈరోజు మనలను బాధిస్తున్న వారికి కూడా ఒకరోజు ఇలా తీర్పు ఉంటుంది అని గ్రహించి ఆదరణ పొందుకుందాం!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*153వ భాగము*

యెషయా 1:2531

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

26. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

28. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.    

29. మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖములు ఎఱ్ఱబారును

30. మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

31. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

 

          ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

         ప్రియులారా! ఇక ముందుకుపోతే 29 వ వచనం చూసుకుంటే మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును.

 

ఇక్కడ మస్తకి వృక్షాలు తోటలు అనగా ఇవి విగ్రహ పూజ మరియు  లైంగిక దుర్నీతి జరిగే స్థలాలు అన్నమాట!  ఇప్పుడు వాటి జ్నాపకం ఎంతో సిగ్గును కలిగిస్తుంది ! యెషయా  65

3. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు.

 

ఇంకా ముందుకుపోతే మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

 

ఇప్పుడు దేవుణ్ణి వదిలేస్తే మీకు తోటకూర కాడల్లా గోంగూర కాడలా వాడిపోతారు అంటున్నారు!

 

కీర్తనల గ్రంథము  1

3. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

 

యెషయా  5

7. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

 

పరమగీతము  4

12. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము

 

అయితే ఇప్పుడు ఈ తోటలో నీతియు న్యాయము కనబడక పోతే తోటకూర కాడలా వాడిపోతారు మీరు కత్తిరించి వేయబడతారు అన్నమాట! ఈ మాట వారికే కాదు, నేడు సంఘము దేవుని తోట అని బైబిల్ చెబుతుంది. ఆ తోటలో ఉన్న నీవు నేను దేవుని తోటలో ఉన్నాము! యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు. మీరు నాతో కలిసి ఉంటేనే గాని మీరు ఫలించరు అని దేవుడు ముందుగానే చెప్పేశారు. నీవు నేను ఆయనతో ఆయనలో ఉండాలి అప్పుడే ఫలిస్తాము. పరమునకు వెళ్తాము. మధ్యలో వేషాలు వేస్తే దేవుడు కత్తిరించేస్తారు.  రోమా పత్రికలో అంటున్నారు భక్తుడు: ఇశ్రాయేలు ప్రజలు స్వాభావికమైన ఒలీవ కొమ్మలు. వారి బ్రతుకు బాగోలేదు కాబట్టి వాటిని కత్తిరించి అడవి ఒలీవల కొమ్మలమైన మనలను దేవునితో అంటు కట్టారు! స్వాభావికమైన కొమ్మలనే విరిచేసిన దేవుడు మన బ్రతుకులు బాగోకపోతే మనల్ని కూడా కత్తిరించేస్తారు అని ముందుగానే చెప్పారు అపోస్టలుడైన పౌలుగారు ఆత్మావేషుడై!!   కాబట్టి భయం కలిగి ఆయన సన్నిధిలో నడుచుకుందాం!!!

 

ఇక చివరి వచనంలో 31. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

 

దీని అర్ధం ఒకానొక్కప్పుడు బలంగా ఉన్ననీవు క్రీస్తుని వదిలి లోకములో ఉన్నావు కాబట్టి నీవు ఇప్పుడు నారపీచు వలె అయిపోతావు! నీవు ఏం చేసినా అది ఆ పని అగ్నికి ఆహుతై పోతుంది దానిని ఆర్పేవారు ఎవరు ఉండరు అంటున్నారు!

 

యెషయా 9:8, యెషయా 9:19; యెషయా 10:17; యెషయా 24:6; యెషయా 26:11; యెషయా 30:27, యెషయా 30:33; యెషయా 66:15-16; మలాకీ 3:2; మలాకీ 4:1; మత్తయి 25:41; 2 థెస్సలొనీకయులకు 1:7; హెబ్రీయులకు 12:29; ప్రకటన గ్రంథం 21:8.

 

యెషయా  9

19. సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు.

 

యెషయా  10

17. ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.

 

యెషయా  24

6. శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.

 

యెషయా  30

33. పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

 

మలాకీ  4

1. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును;గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

మత్తయి  25

41. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

 

ప్రకటన గ్రంథం  21

8. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! దేవుణ్ణి తెలుసుకుని ఆయన మార్గములో నడుస్తున్న నీవు దారి తప్పిపోతే నీవు కూడా అగ్ని గుండములతో మందు గుండములో పడతావు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని మర్చిపోకు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*154వ భాగము*

 

యెషయా 2:13

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

                 ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక రెండో అధ్యాయం కోసం చూసుకుంటే దీనిని ప్రారంభించక ముందు కొన్ని విషయాలు చెప్పనీయండి. అప్పుడే ఇది మీకు అర్ధమవుతుంది. ఈ 24 అధ్యాయాలు అంత్యకాలంలో జరిగే సంభవాలు అన్నమాట!

 

ఈ భాగాన్నీ, యెషయా గ్రంథంలోని మరి కొన్ని భాగాలనూ (అంటే యెషయా 9:7; యెషయా 11:1-16; యెషయా 12:1-6; యెషయా 24:21-23; యెషయా 32:1-5; యెషయా 35:1-10; యెషయా 40:1-11; యెషయా 54:1-17; యెషయా 60:1-22; యెషయా 62:1-12; యెషయా 65:8-10, యెషయా 65:17-25; యెషయా 66:7-13, యెషయా 66:19-21) ఈ క్రింద చెప్పిన పద్ధతుల్లో ఒక పద్ధతిని అనుసరించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి

 

గమనించాలి ఇవి కొంతమంది బైబిల్ పండితులు ఏర్చి కూర్చి రాసిన పద్దతులు. ఒకసారి మనం వాటిని చూసుకుని ఏదికావాలంటే దానిని తీసుకుందాం!

 

 (1) ఇంతకుముందు గానీ ఇకమీదట గానీ ఇవి అనగా ఈ 24 అధ్యాయాలు నెరవేరడం జరగలేదు, జరగదు;

 

(2) ఇస్రాయేల్ గత చరిత్రలో ఇవి నెరవేరాయి కొన్ని మాత్రమే ;

 

(3) ప్రస్తుతం ఈ క్రైస్తవ సంఘ యుగంలో ఇవి కనీసం కొంతవరకైనా నెరవేరుతున్నాయి; వీటి నెరవేర్పు రాబోయే అనంత యుగాల్లో అనగా క్రీస్తు రాకడ అయ్యాక నిత్యత్వములో  పూర్తి అవుతుంది;

 

 (4) ఈ లోకాంతం తరువాత అనంత యుగాల్లోనే అనగా నిత్యత్వములోనే ఇవి నెరవేరుతాయి;

 

(5) భూమి పైన క్రీస్తు అక్షరాలా రాజ్య పరిపాలన సమయంలో ఇవి కనీసం కొంతవరకైనా నెరవేరుతాయి (వెయ్యేళ్ళ పరిపాలన ప్రకటన గ్రంథం 20:4-6 చూడండి);

 

 (6) ఆత్మ సంబంధంగా ఈ సంఘ యుగంలో కొంతవరకు ఇవి నెరవేరుతున్నాయి; అక్షరార్థంగా ఇవి వెయ్యేళ్ళ పరిపాలన సమయంలో నెరవేరుతాయి; ఆ తరువాత రాబోయే అనంత యుగాల్లో వీటి శాశ్వత నెరవేర్పు ఉంటుంది (యెషయా 60:1-22 నోట్ చూడండి).

 

సరే  యెషయా గారు దేవుని ఆత్మావేశంతో రాస్తున్నారు  కాబట్టి మొదటి పద్ధతి (1) పనికి రాదు. అవి కేవలం అంత్యకాలంలో జరుగుతుంది  ఎన్నడూ జరగబోని సంగతులు జరుగుతాయని దేవుడు చెప్పేవాడు కాడు, రాయించేవాడు కాడు మత్తయి 5:17-18; తీతుకు 1:2). రెండో పద్ధతి (2) చాలా సందేహాస్పదమైనది. దాన్ని నిలబెట్టాలంటే మాటల స్పష్టమైన అర్థాలను విడిచిపెట్టాలి. ఈ సంగతులు ఇస్రాయేల్ చరిత్రలో ఎన్నడూ నెరవేరలేదు. మూడో పద్ధతి (3) సరైనదని అనేకమంది పండితులు చెప్పారు, కానీ దాన్ని నిలబెట్టాలంటే ఈ భవిష్యత్ వాక్కుల్లోని కొన్ని వివరాలను చూచీ చూడనట్టుగా దాటిపోవాలి, కొన్ని స్పష్టమైన మాటలను విడిచిపెట్టాలి. నాలుగో పద్ధతిని (4) కూడా నిలబెట్టడం కష్టతరం. ఈ వాక్కుల్లోని కొన్ని సంగతులు అనంత యుగాల్లో ఉంటాయని అనుకోవడం వీలుపడదు. చివరి రెండు పద్ధతులు (5,6) సరైనవని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని నా అభిప్రాయం. ఈ వాక్కుల్లో కొన్ని సంగతులు అక్షరాలా వెయ్యేళ్ళ పరిపాలనలకు సరిపోతాయి గానీ మరే కాలానికీ యుగానికీ కాదని   గట్టి నమ్మకం.

 

సరే, మొదటి వచనం చూసుకుంటే 1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

 

   కాబట్టి ఈ వచనాలు యూదా దేశానికీ జెరుసలం నగరానికీ సంబంధించినవని గమనించండి. అలాగని  వీటిని అక్షరార్థంగా తీసుకోకూడదు అనే సూచన కూడా ఏమీ లేదు. నిజానికి ఇవి అక్షరార్ధంగా యెరూషలేము యూదాకు సంబంధించినవే అయినా వాటితో జరిగే సంబావాలు ప్రపంచ దేశాలు అన్నింటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇవి ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలకు చెందినవి అని గ్రహించాలి!!!

 

“చూచిన విషయం” యెషయా 1:1; యెషయా 6:1 లో లాగా ఈ సంగతులను దేవుడు యెషయాకు వెల్లడి చేశారు గనుక అతడు చూశాడు. ప్రవక్తల గ్రంథాల్లో తరచుగా దేవుడు కలలనూ దర్శనాలనూ చూపిస్తూ వివరాలను ఇవ్వడం కనిపిస్తున్నది (ఉదా।। యిర్మియా 1:11-16; యిర్మియా 24:1-10; యెహెఙ్కేలు 1:1; యెహెఙ్కేలు 10:1; దానియేలు 7:1; దానియేలు 8:1; జెకర్యా 1:8; జెకర్యా 3:1; జెకర్యా 5:1).

తరువాతి వచనాల్లో (2-4) కేవలం దేవుడిచ్చిన భవిష్యద్వాక్కులే అనగా ప్రవచనాలే  ఉన్నాయి. ఈ వచనాలు యెషయా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి చెప్తున్నాయి దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా స్థాపించడం. అనగా యేసుక్రీస్తుప్రభులవారు భూమిమీద ప్రత్యక్ష రాజ్యం స్థాపించ బోతున్నారు!  2-4 వచనాల్లో దాని స్థాపనం కనిపిస్తున్నది, 6-21 వచనాల్లో అందుకు దారి తీసిన పరిస్థితులను చూడవచ్చు.

ఇక రెండవ వచనంలో 2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.

 

దీనిని చాలా సింపుల్ గా అర్ధం చేసుకోవాలి అంటే ఈ ప్రవచనాన్ని మనం ఏ మాత్రం అక్షరార్థంగా తీసుకుంటే ఇది నెరవేరే రోజుల్లో జెరుసలం, ఇస్రాయేల్‌దేశం ప్రపంచంలో రాజకీయంగా లేక అధికార సంబంధంగా ఉన్నత స్థితిలో ఉంటుందని అర్థం చేసుకోవలసి ఉంది. లేదా దేవుడు స్థాపించే ప్రత్యక్ష రాజ్య పాలనలో అనగా శాశ్వతరాజ్యంలో దానికి అనగా ఆ రాజ్యానికి కేపిటల్ లేక ముఖ్య పట్టణంగా లేక కేంద్ర పట్టణముగా యెరూషలేము ఉండబోతుంది. ఆ రాజ్యానికి సెక్రటేరియట్ లేక సచివాలయం ఇశ్రాయేలు దేశంలో ఉండబోతుంది అని అర్ధం!

 

 ఇక  “అన్ని దేశాలు” అనగా ప్రపంచ దేశాలు అన్నీ వాటివాటి పనులు చేసుకోడానికి ఇశ్రాయేలు దేశం వెళ్ళాల్సిందే అన్నమాట!!!

 

వారంతా అక్కడికి అనగా దేవుని మందిర పర్వతానికి  వెళ్ళడానికి మరో  కారణం తరువాతి వచనంలో ఉంది. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

 

కీర్తనల గ్రంథము 102:15;

15. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు

 

యిర్మియా 3:17;

 17. ఆ కాలమున యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.

 

యిర్మియా 16:19;

19. యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చి, మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.

 

జెకర్యా 14:16;

16. మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

 

ఇక చివరి రోజులు” అనగా ఈ మాటలకు అర్థం  “ఎప్పుడో, రాబోయే భవిష్యత్తులో” అని దీనికి మామూలుగా అర్థం చెప్పుకోవచ్చు. బైబిల్లో ఒక్కోసారి ఈ మాటకు ఈ సంఘ యుగం అని అర్థం వస్తుంది ప్రస్తుతం మనం ఈ యుగంలోనే ఉన్నాము! (అపో. కార్యములు 2:17; హెబ్రీయులకు 1:2; 1 పేతురు 1:20; 1 యోహాను 2:18 పోల్చి చూడండి). ఈ మాటను ఈ విధంగా ఉపయోగించినప్పుడు వచ్చే అర్థమేమిటంటే యేసుప్రభువు పరలోకం నుండి తిరిగి రాకముందు సంఘ యుగమే ఆఖరుది. ఇక  క్రీస్తు తిరిగి రావడం, తద్వారా కలిగే ఫలితాలు ఇవన్నీ చివరి రోజుల్లో ఇమిడి ఉన్నాయని గుర్తించాలి! . చివరి రోజుల అంతంలో ఆయన రాకడ ఉంటుంది.

 

ఇక్కడ యెషయా గ్రంథంలోని ఈ మాటలను “దినాల అంతంలో” అని అనువదించవచ్చు.

 

ఇక  దేవుని మందిర పర్వతం అనగా అంటే సీయోను పర్వతం అని గ్రహించాలి!

 

(యెషయా 11:9; యెషయా 27:13; యెషయా 56:7; యెషయా 57:13; యెషయా 65:25; యెషయా 66:20).

 

కాబట్టి ఒకరోజు రాబోతుంది, ఆరోజు దేవుడు ఈ భూమిమీద శాశ్వత రాజ్యం స్థాపించబోతున్నారు దానికి కేంద్రంగా యెరూషలేము ఉంటుంది. అయితే ఆ నిత్యరాజ్యంలో వేయేండ్ల పాలనలో నీవు సాధారణ పౌరుడిగా ఉండవు. ఆరాజ్యంలో నీవు యేసుక్రీస్తుప్రభులవారి మాట ప్రకారం మత్తయి 25 వ అధ్యాయం, లూకా 15వ అధ్యాయం ప్రకారం నీవు నేను అధికారులుగా గవర్నర్ మంత్రి పదవులు లాంటి పదవులలో ఉంటాము! అలాగుండాలి అంటే నీవు సాక్షార్ధమయిన జీవితం ఆత్మానుసారమైన జీవితం పరిశుద్ధ జీవితం జీవిస్తే నిన్ను నీవు ఆయన రాకడకు ఆయత్త పరుచుకుని ఆయన రాకడలో ఎత్తబడితేనే ఇదంతా సాధ్యం!

 

మరి నీవు సిద్ధంగా ఉన్నావా?

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*155వ భాగము*

 

యెషయా 2:13

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

                 ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

రెండవ వచనంలో అంత్య దినాలలో యెహోవా మందిర పర్వతం అనగా యెరూషలేము పట్టణంలో ఉన్న సీయోను కొండ ఆ పర్వత శిఖరము అన్నీ పర్వతాల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. అప్పుడు వరద ప్రవాహము వచ్చినట్లుగా ప్రపంచం నలుదిక్కుల నుండి ప్రజలు సీయోను కొండ దగ్గరికీ వస్తారు అని ధ్యానం చేసుకున్నాము! ఎందుకు యెరూషలేముకి  ప్రజలు వస్తారంటే దేవుడు స్థాపిస్తున్న శాశ్వత రాజ్యమునకు యెరూషలేము కేపిటల్ గా ఉంటుందని- అధికారమంతా యెరూషలేమునుండే జరుగుతుంది అని ధ్యానం చేసుకున్నాము! అయితే రెండవ కారణం మనకు మూడవ వచనంలో కనిపిస్తుంది. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

   ఇక రెండవ కారణం ఎందుకు యెరూషలేముకి  ప్రజలు వస్తారంటే- దేవుణ్ణి పూజించటానికి. అప్పటికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మాత్రమే నిజమైన దేవుడని ప్రపంచ దేశాలన్నీటికీ అర్ధమైపోయింది కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి పూజించటానికి ప్రపంచం నలుదిశల నుండి ప్రజలు వస్తారు. గమనించాలి గతభాగంలో చెప్పినట్లు ఈ సంభవాలు రెండవరాకడ జరిగాక, శ్రమల కాలము, మహాశ్రమల కాలము గతించాక, ప్రత్యక్ష రాకడ జరిగాక, వేయేండ్ల పాలన సమయంలో జరిగే సంభవాలు! ఆ వేయేండ్ల పాలనలో పరిపాలన కేంద్రంగా యెరూషలేము ఉండబోతుంది. ఇక రెండవదిగా యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకుని ఆయనను పూజించడానికి వస్తారు!

 

చిట్టచివరికి ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయేల్‌వారి దేవుడే ఏకైక నిజ దేవుడని తెలుసుకుని ఆయన మార్గాలను నేర్చుకోగోరతారు. దేవుడు ఉపదేశకుడుగా ఈ రిఫరెన్సులు చూడండి: కీర్తన 25:4; 71:17; 94:10, 12; 119:102; యెషయా 54:13; మత్తయి 5:2; మార్కు 6:34; యోహాను 6:45; 14:26.

 

దీనికోసం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే జెకర్యా 8 వ అధ్యాయంలో వివరంగా ఉంది.

 2023 

20.సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.

21. ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి ఆలస్యముచేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు.

22. అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు.

23. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.

 

ఇక పదవ అధ్యాయంలో అంటున్నారు

6. నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.

7. ఎఫ్రాయిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు.

8. నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు.

9. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసికొందురు, వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు,

10. ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.

11. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

12. నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.

 

ఇక 14 వ అధ్యాయంలో 9. యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.

10. యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,

11. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు.

 

ప్రకటన గ్రంథం 22:3

12. మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచి యున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.

13. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.

14. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చబడును.

15. ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచర గాడిదల మీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళెములో ఉన్న పశువులన్నిటిమీదను తెగుళ్లుపడును.

16. మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

17. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరిమీద వర్షము కురువకుండును.

18. ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.

19. ఐగుప్తీయులకును, పర్ణశాలపండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికిని రాగల శిక్ష యిదే.

 

కాబట్టి ఈ జెకర్యా గ్రంధం ప్రకారం దేవుని మందిరాన్ని దర్శించడానికి, దేవుణ్ణి పూజించడానికి, దేవుని మార్గాలను పూర్తిగా తెలుసుకుని వారి దేశాలలో పాటించడానికి ఇంకా చివరగా పర్ణశాల పండుగ ఆచరించడానికి ప్రపంచ దేశాల ప్రజలంతా ఇశ్రాయేలు దేశం వస్తారు యెరూషలేముకి వస్తారు! అలా ఎవరైతే ఇలా పర్ణశాల పండుగకు రాకుండా ఆగిపోతారో ఆ దేశాలలో వర్షం పడదు అని దేవుడే చెప్పారు. కాబట్టి వర్షాల కోసమైన పర్ణశాల పండుగకోసం ప్రపంచ దేశాల ప్రజలు వరద ప్రవాహంలా యెరూషలేము వస్తారు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*156వ భాగము*

 

యెషయా 2:13

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

                 ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

సరే, ఇప్పుడు ఈ 2,3 వచనాలు కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం!  ఆధ్యాత్మిక లోతులకోసం వెదికేవారికోసం ఉపయోగపడేలా కొద్దిగా లోతుగా ధ్యానం చేసుకుందాం ! మీదన చూసుకున్నాము రెండవ వచనంలో అంత్య దినాలలో యెహోవా మందిర పర్వతం అనగా యెరూషలేము పట్టణంలో ఉన్న సీయోను కొండ ఆ పర్వత శిఖరము అన్నీ పర్వతాల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. అప్పుడు వరద ప్రవాహము వచ్చినట్లుగా ప్రపంచం నలుదిక్కుల నుండి ప్రజలు సీయోను కొండ దగ్గరికీ వస్తారు అని ధ్యానం చేసుకున్నాము! ఎందుకు యెరూషలేముకి  ప్రజలు వస్తారంటే దేవుడు స్థాపిస్తున్న శాశ్వత రాజ్యమునకు యెరూషలేము కేపిటల్ గా ఉంటుందని- అధికారమంతా యెరూషలేమునుండే జరుగుతుంది అని ధ్యానం చేసుకున్నాము! అయితే రెండవ కారణం మనకు మూడవ వచనంలో చూసుకున్నాము . ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

ఇక రెండవ కారణం ఎందుకు యెరూషలేముకి  ప్రజలు వస్తారంటే- దేవుణ్ణి పూజించటానికి. అప్పటికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మాత్రమే నిజమైన దేవుడని ప్రపంచ దేశాలన్నీటికీ అర్ధమైపోయింది కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి పూజించటానికి ప్రపంచం నలుదిశల నుండి ప్రజలు వస్తారు. ఇక జెకర్యా గ్రంధం ప్రకారం- దేవుణ్ణి పూజించటానికి ఆరాధించటానికి ఇంకా పర్ణశాల పండుగను ఆచరించటానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు యెరూలేము వస్తారని చూసుకున్నాము!

 

 అయితే ఈ మూడవ వచనం జాగ్రత్తగా ధ్యానిస్తే ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

చూడండి సీయోనులోనుండి ధర్మశాస్త్రము, ఇంకా యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును అంటున్నారు. ఇంకా ప్రజలు దేవుణ్ణి పూజించటానికి యాకోబు దేవుని మందిరానికి వస్తున్నారు ఇంకా యెహోవా పర్వతము అనగా సీయోను కొండకు వస్తున్నారు. ఎలా- ఇక మన జీవితకాలమంతా ఆయన మార్గములలో నడుద్దాం ఆయనే అనగా యెహోవా దేవుడే మనలను తన మార్గముల విషయమై మనకు బోధన చేస్తారు కనుక మనము ఆయన త్రోవలలో నడుద్దాం అని చెప్పుకుంటూ వస్తారు అంటున్నారు!!  ఈ వచనాలలో చాలా చాలా ఆత్మీయ మర్మాలున్నాయి గాని లైట్ గా కొన్ని చూసుకుందాం!!

 

సీయోనులోనుండి ధర్మశాస్త్రం యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరుతుంది అంటున్నారు. సీయోను కొండమీద ఏముంది? ఎవరున్నారు?

 

ఇది మనకు ప్రకటన 14 వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో కనిపిస్తుంది. ప్రకటన 14:15

1. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.

2. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.

3. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.

4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

5. వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.

 

ఇక్కడ సీయోను కొండమీద ఎవరున్నారు మొదటగా గొర్రెపిల్ల- అనగా వధించబడిన గొర్రెపిల్ల- అనగా యేసుక్రీస్తుప్రభులవారు లేక యూదాగోత్రపు కొదమ సింహము ఉన్నారు. ఆయనతో పాటుగా ముద్రించబడిన 144000 మంది ఉన్నారు! ఈ 144000 మంది ప్రకటన 6,7 అధ్యాయాలలో ముద్రించబడిన ఇశ్రాయేలు 144000 మంది మాత్రము కాదు! వీరు ప్రత్యేకమైన వారు!  అసలు సీయోను అనుభవము అంటే ఏమిటో మనము జెకర్యా, ప్రకటన గ్రంధ ధ్యానాలలో విస్తారంగా చూసుకున్నాము!

 

సీయోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలువబడి ఉన్నట్లుగా చూడగలము!

 

ఈ సీయోను పర్వతం అనేది అక్షరార్ధముగా ఇశ్రాయేలు దేశంలో యేరూషలేము పట్టణంలో ఉంది! 2సమూయేలు 5:69; కీర్తన 2:6; మత్తయి 23:3739

 

అదేవిధంగా పరలోకంలో కూడా సీయోను ఉంది. దానిని పరమసీయోను అంటారు! ఇది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్తితిని సూచిస్తుంది! జయించిన వారు-పరిపూర్ణత సాధించిన పరిశుద్ధుల ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది ఈ పరమ యేరూషలేము! ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు!!!

 

గలతీ 4:2526; హెబ్రీ 12:2224

 

ఇక అక్కడ గొర్రెపిల్లతో పాటుగా నూట నలుబది నాలుగువేల మంది తండ్రియైన దేవుని నామమును గొర్రెపిల్ల నామమును నొసల్లమీద వ్రాయబడిన వారు కనబడుతున్నారు!

వీరెవరు?

 

అయితే నాల్గవ వచనంలో వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రధమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు అంటున్నారు! దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తనకు స్వాస్త్యముగా ఉండటానికి ఏర్పరచుకున్నారు గాని కొనలేదు! కొన్నది- యేసుక్రీస్తుప్రభులవారు! దేనితోకొన్నారు?

 

తన రక్తమిచ్చి కొన్నారు!

 

అపో.కార్యములు 20: 28

దేవుడు  తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

 

ప్రకటన 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, (లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

 

1పేతురు 1: 18

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని

 

1పేతురు 1: 19

అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

హెబ్రీయులకు 9: 12

మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

 

ఎఫెసి 1:7

రోమా ౩:24

మత్తయి 20:28

 

సరే, ఇప్పుడు మన టాపిక్ సీయోను కొండమీద ఉన్న 144000 మంది ఎవరు అనేది కాదు కాబట్టి మన టాపిక్ కి వచ్చేద్దాం! సీయోను కొండమీద యేసుక్రీస్తుప్రభులవారు ఉన్నారు ఆయనతో పాటుగా దేవునికోసం ప్రత్యేకించబడిన ఆయన రక్తముతో కొనబడిన అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవ గల విశ్వాసులు 144000 మంది ఉన్నారు! మరి వీరు ఏమిచేస్తారు? ఈ అధ్యాయంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రం బయలుదేరుతుంది ఎప్పుడు? వేయేండ్ల పాలనలో! అయితే ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది అని క్రొత్త నిబంధన చెబుతుంది. మరి మరలా ధర్మశాస్త్రం బయలుదేరడం ఏమిటి?

ఏసయ్య అన్నారు నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు గాని నెరవేర్చడానికే వచ్చాను అన్నారు. మరి ఇప్పుడు దీని అర్ధం ఏమిటి? అసలు ఆయనతో ఉన్న 144000 మంది ధర్మశాస్త్రం లేక పాతనిబంధన భక్తులు కానేకాదు. ఎందుకంటే వీరు గొర్రెపిల్ల కోసం కొనబడ్డారు అని నాలుగో వచనం చెబుతుంది. మరి ధర్మశాస్త్రం ఏమిటి? అది కొట్టివేయబడింది కదా! అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది కనుకనే మెల్కీసేదేకు అనే మరో యాజక ధర్మం వచ్చింది దానికి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుప్రభులవారు అని హెబ్రీపత్రిక మొత్తం చెబుతుంది. మరి ధర్మశాస్త్రం ఎందుకొచ్చింది?

 

 దీనిని ఆ కోణంలో చూడకుండా 119 కీర్తన కోణంలో తీసుకోవాలి! ఈ 119 వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. ఈ అన్నీ వచనాలలో ధర్మశాస్త్రం అనే అర్ధం వచ్చే మాటలు 176 సార్లు వాడారు భక్తుడు! అదే ధర్మశాస్త్రమును నీ కట్టడలు అని, నీ ఆజ్నలు అనియు, నీ శాసనములు, మార్గములు, న్యాయ విధులు, వాక్యము అనియు వాడబడినది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము అనగా సీయోనులో నుండి దేవుని కట్టడలు ఆజ్ఞలు న్యాయవిధులు బయలుదేరుతాయి అన్నమాట! అయ్యా ఇక్కడ నాకు అర్ధమయ్యింది ఏమిటంటే వెయ్యేళ్ల పాలనలో దేవుడు తన ధర్మశాస్త్రము లేక న్యాయవిధులు కట్టడలు అన్నీ సీయోను నుండే విధిస్తారు లేక బయలుదేరుతుంది. దానికి దేవునికి సహాయంగా ఈ 144000 మంది ఆయనతో ఉండి ఆయనకు సహాయం చేస్తారు!!

 

ఇక తర్వాత యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు దేరుతుంది.  యెహోవా వాక్కు అనగా ఆయన శాసనములు! మీదన చెప్పుకున్నాము- వేయేండ్ల పాలనలో యెరూషలేము ప్రపంచ రాజధానిగా ఉండబోతుంది. అక్కడనుండి న్యాయపాలన జరుగుతుంది. కాబట్టి అదే యెహోవా వాక్కు అని అర్ధమవుతుంది నాకు!  ఇంకా చూసుకుంటే తర్వాత మాటలలో యెహోవా మందిరమును చూడాలని యెహోవా పర్వతాన్ని దర్శించు కోవాలని ప్రపంచ జనులు వస్తారు!  ప్రస్తుతం యెరూషలేములో యెహోవా మందిరం లేదు. అది కూల్చబడింది దాని స్థానం డోం రాక్ అనే మసీదు ఉంది. అయితే మనం ప్రవచన గ్రంధ ధ్యానములు ధ్యానం చేసుకునేటప్పుడు ఇశ్రాయేలు దేశంలో తప్పకుండా యెహోవా దేవుని మందిరం నిర్మాణం జరుగుతుంది. దాని నిర్మాణానికి బహుశా క్రీస్తు విరోధి కూడా జతకలుస్తాడు యూదులను నమ్మించడానికి అని చూసుకున్నాం! కాబట్టి దేవుని రెండో రాకడ సమయంలో ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దేవుని మందిరం కట్టబడుతుంది. దానిమీద కొన్ని సంవత్సరాలకు వాడు నాశనకరమైన హేయవస్తువు బహుశా పందిని అర్పిస్తాడు!

సరే ఇప్పుడు యెరూషలేము లో ఏమి ఉండబోతుంది? దేవుని మందిరం! ఇప్పుడు బైబిల్ చెబుతుంది దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు దైవముల మధ్యన ఆయన తీర్పుతీర్చు చున్నాడు! కాబట్టి ఇప్పుడు సీయోను నుండి దేవుని ఆజ్నలు కట్టడలు విధులు బయలుదేరితే యెరూషలేము నుండి ఆయన విధులు కట్టడలు దేవుని తీర్పులతో పాటుగా ఆయన సన్నిధి నుండి దేవుని మాటలు కూడా బయలు దేరుతుంది అన్నమాట!!!

 

అందుకే 2వ వచనంలో అంటున్నారు భక్తుడు అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

 

ఈవిధముగా సీయోను పర్వతం అన్నీ దేశాల కొండల కంటే ఎక్కువా ఎత్తైన స్థానములో ఉండబోతుంది. దాని పేరు ఎత్తైన స్థానంలో ఉంటుంది. అన్నీ పట్టణాల కంటే యెరూషలేము పేరు ఖ్యాతి గడిస్తుంది. ప్రియ దేవుని బిడ్డా! నీవు కూడా అలాంటి సీయోను లాంటి పరిశుద్ధ అనుభవం, అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిఉన్నావా?

 

మరో విషయం చెప్పనా-- ఆరోజుల్లో అన్యజనులు యెహోవా మందిరానికి వెళ్దామని ఎలా తొందరపడబోతున్నారో అలాగే ఇప్పుడు నీవు దేవుని మందిరానికి వెళ్లాలి, వాక్యం నేర్చుకోవాలి, అభిషేకం పొందుకోవాలి, సంపూర్ణత సాధించాలి అనే తపన నీలో లేకపోతే నీవు ఎత్తబడవు మరియు వెయ్యేళ్ల పాలనలో క్రీస్తుతో పాటుగా పాలించవు!!! కాబట్టి అట్టి ఆతృత దేవుడంటే ఆయన మందిరమంటే ఆయన వాక్యమంటే ప్రేమను పెంపొందించుకో!

 

దానికి ప్రయత్నిస్తున్నావా?

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*157వ భాగము*

 

యెషయా 2:13

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

                 ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

   జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి ఇంకా యెహోవా పర్వతమునకు వెల్లుదము రండి అని చెప్పుకుంటారు. యాకోబు దేవునికి మందిరం కట్టబడితేనే గాని ఈ ప్రవచనం నెరవేరదు కాబట్టి దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఇశ్రాయేలు దేశంలో గల యెరూషలేము లో దేవుని రాకడ సమయంలో మందిరం కట్టబడుతుంది. కొంతమంది అతి తెలివైన వారు అంటున్నారు- దేవుని గుడి నీవు నేనే నిజమైన మందిరం కట్టబడవలసిన అవసరం లేదు అంటున్నారు. ఓ అతి తెలివైన వారలారా మరి మందిరం కట్టబడక పోతే ఈ వాగ్ధానం లేక ప్రవచనం ఎలా నెరవేరుతుంది? మత్తయి 24 వ అధ్యాయంలో చేయబడిన ప్రవచనం ఎలా నెరవేర గలదు? మరియు నాశనకరమైన హేయవస్తువు అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడిన వెంటనే చదువు వారు గ్రహించుదురు గాక అంటూ సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారే మత్తయి లూకా సువార్తలలో చెప్పిన సంభవం ఎలా నెరవేరుతుంది?

 

కాబట్టి తప్పకుండా అంత్యదినాలలో తప్పకుండా ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో సీయోను కొండకు అడుగుభాగంలో మందిరం తప్పకుండా కట్టబడుతుంది! అలా కట్టబడితేనే గాని గుంపులు గుంపులుగా ప్రపంచ దేశాలనుండి ప్రజలు యెరూషలేముకి మరియు యెహోవా మందిరానికి మరియు పర్ణశాలల పండుగకు రాలేరు!!

 

ఇక దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే

కృపగలిగిన దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను తిరిగి తీసుకొని వస్తానని, వారిక రెండు రాజ్యములుగా నుండక, ఒకే రాజ్యముగా వుంటారని యెహేజ్కెలు 37: 20-24 ద్వారా తెలియజేశాడు.

 

దాని నెరవేర్పు 1948 May, 14th న జరిగింది. రెండు రాజ్యాల ప్రజలు కలసి ఒకే స్వతంత్ర దేశముగా ఏర్పడ్డారు.

 

అయితే, ఇశ్రాయేలీయులంతా పూర్తిగా స్వదేశం చేరుకోలేదు. ఒక్కొక్కరుగా చేరుకొంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికా పాత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, యెరూషలేమును ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించడం, టెల్ అవీవ్ లోనున్న అమెరికన్ ఎంబసీని, యెరూషలేముకు మార్చడం ద్వారా, ప్రపంచ దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలీయులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వారి స్వదేశం చేరుకోబోతున్నారు.

 

ఈ పరిణామాలను పరిశీలిస్తే, ఇక యుగసమాప్తి కనుచూపు మేరల్లోనే వుందని మనము గ్రహించగలగాలి.

 

*యెరూషలేములో దేవాలయము తిరిగి కట్టబడాలి: *

 

*దేవాలయ చరిత్ర: చూసుకుంటే

 

🍬 *మొదటి మందిరము:*

దావీదు స్థల్లాన్ని, సామాగ్రిని సిద్దపరిచాడు. కానీ, అతని చేతులు రక్తం ఒలికించడం వలన, మందిరం కట్టడానికి దేవుడు అంగీకరించలేదు.

 

మొదటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు. నిర్మాణం పూర్తికావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.

-             1 రాజులు 6:37

 

అయితే ఈ మందిరాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు కూల్చివేసాడు.

             2 రాజులు 25:

 

ప్రస్తుతము యెరూషలేములో దేవుని మందిరము లేదు. మందిరం వుండాల్సిన చోట డోమ్ రాక్ (మసీదు) వుంది.

 

*రెండవ మందిరం*:

  బబులోను చెర తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో హగ్గయి, జెకర్యా ప్రోత్సాహంతో, కోరెషు ఆర్ధిక సహాయంతో కట్టబడింది.  (ఎజ్రా 6వ అ.)

దీనిని సిరియా రాజైన అంతియొకస్ ఆఫీపైనాస్ అనేవాడు, పంది రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించి, మందిరాన్ని అపవిత్రపరచి, కొంత వరకు నాశనం చేసేసాడు.

అంతియొకస్ నాశనం చేసిన మందిరాన్ని, హేరోదు తిరిగి నిర్మించాడు.

 

* యేసు క్రీస్తుని బంధించిన దేవాలయము ఇదియే.

* రాయిమీద రాయిలేకుండా కూల్చివేయ బడుతుందని ప్రభువు ఈ మందిరం గూర్చియే ప్రవచించారు. (మత్తయి 24:1,2)

 

నెరవేర్పులో భాగంగా 40 సంవత్సరాల తర్వాత అనగా క్రీ.శ 70 వ లో రోమా చక్రవర్తియైన టైటస్ దీనిని కూల్చివేసాడు. రాళ్ళ మద్యలోనున్న బంగారం కోసం, ఏనుగులతో రాయిమీద రాయిలేకుండా పడగొట్టించాడు.

 

🍬 *మూడవ మందిరం*:

ప్రస్తుతము యెరూషలేములో దేవుని మందిరము లేదు. మందిరం వుండాల్సినచోట

డోమ్ రాక్ (మసీదు) వుంది.

మూడవ మందిర నిర్మాణం కొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తప్పకుండా మందిర నిర్మాణం జరిగితీరుతుంది. ఆ తర్వాత సంఘము ఎత్తబడుతుంది.

 

 *మందిరము కట్టబడడానికి, సంఘము ఎత్తబడానికి , దేవుని రాకదకు గల సంబంధమేమిటి? *

 

ఇశ్రాయేలీయులు క్రీస్తు విరోధితో సంధి చేసుకొని, అతనిని మెస్సయ్యగా అంగీకరిస్తారు. క్రీస్తు విరోధి నాయకత్వంలో ఇశ్రాయేలు దేశం పరిపాలించబడుతుంది.

 

నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు,  మరి యొకడు  తన  నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు.

           యోహాను 5:43

 

అనుదిన బలి నైవేద్యం దేవాలయంలో తిరిగి ప్రారంభమవుతుంది. బలి నైవేద్యం ప్రారంభము కావాలంటే? క్రీస్తు విరోధిని ఇశ్రాయేలీయులు మెస్సియగా అంగీకరించాలి. ఏడేండ్ల శ్రమకాలంలోని మొదటి మూడున్నర సంవత్సరాలు కొనసాగుతుంది.

 

బలి నైవేద్యం ప్రారంభం కావాలంటే మందిర నిర్మాణం, సంఘము ఎత్తబడక ముందే జరిగితీరాలి.

 

🔺 క్రీస్తు విరోధి ఏడేండ్ల శ్రమకాలంలో మొదటి మూడున్నర సంవత్సరముల తర్వాత దేవాలయములో బలిని నిలిపివేస్తాడు. హేయమైనది దేవాలయములో నిలుపుతాడు. (బహుశా అతని ప్రతిమనే నిలబెట్టవచ్చు.) మరియు అంతియొకస్ అఫిఫానిస్ అనేవాడు చేసినట్లు మరలా పందిరక్తమును బలిపీఠం మీద అర్పించవచ్చు!  దేవాలయంలో హేయమైనది నిలిపిన తర్వాతగానీ ఇశ్రాయేలీయులకు అర్ధంకాదు. అతడు మెస్సియ్య కాదని.

 

అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును  నాశనము  చేయువానికి  రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.

            దానియేలు 9:27

 

*దేవాలయము కట్టబడకుండా సంఘము ఎత్తబడదని లేఖనాలను బట్టి స్పష్టమవుతుంది. *

 

అయితే, ఒక్క విషయం! ఇప్పటికే మూడు దినాలలో మందిరం కట్టేలా ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. మందిరానికి కావలసిన సామాగ్రినంతా ఇశ్రాయేలీయులు సిద్దంచేసుకున్నారు. ఇక కొన్ని ఆటంకాలను అధిగమిస్తే చాలు. మందిర నిర్మాణం జరిగిపోతుంది. మందిర నిర్మాణం జరిగితే ఇక యుగ సమాప్తే.

 

🔺 దేవాలయము కట్టబడుటకుగల ముఖ్యమైన ఆటంకాలు: 3

🍬1. ప్రస్తుతము మందిరము కట్టాల్సిన స్థలములో డోమ్ రాక్ ( మసీదు) వుంది.

మసీదును తొలగిస్తే? మూడవ ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చు. అందుచే వున్న మసీదును కూల్చకుండా వున్నది వున్నట్లుగా లేపి, ప్రక్కన పెట్టి, ఆ స్థలంలో మందిర నిర్మాణం చెయ్యాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అట్లా అయితే, వ్యతిరేకత రాదనీ కాదు గాని, కొంత తగ్గించ వచ్చని. అది సాధ్యం కాకపోతే, యుద్దానికైనా సిద్దపడతారుగాని, మందిర నిర్మాణం ఆపడం ఎవ్వరి తరమూ కాదు.

 

🍬 2. *ఎర్రని పెయ్యి కనుగొనబడాలి: *

ఎందుకంటే?

ఎర్రని పెయ్యను దహించి, ఆ భస్మమునకు, నీటిని కలిపి, పాప పరిహారార్థ జలము సిద్ధపరచాలి.

 

🍬3. *కలాల్ పాత్రలు కనుగొనబడాలి. *

ఎర్రని పెయ్యిని వధించి, సిద్దపరిచే భస్మాన్ని హోమ భస్మం అంటారు. ఈ పవిత్ర భస్మాన్ని మట్టి పాత్రలలో భద్రపరుస్తారు. వాటినే హెబ్రీ భాషలో కలాల్ పాత్రలు అంటారు.

 

🔺 *ఇప్పుడు కలాల్ పాత్రల ఎక్కడ వున్నాయి? *

తెలియదు. టైటస్ చక్రవర్తి యెరూషలేము మందిరాన్ని నాశనం చేస్తున్నప్పుడు యాజకులు దేవుని మందసాన్ని, కలాల్ పాత్రలను ఎక్కడో దాచి పెట్టేసారు. మందసము అయితే, కనుగొనబడింది గాని, కలాల్ పాత్రల కోసం విస్తృతంగా అన్వేషణ చేస్తున్నారు.

 

🔺 *కలాల్ పాత్రల అవసరమేమిటి? *

ఇప్పుడు ఎర్రని పెయ్యను కనుగొని, దాని భస్మమును, కలాల్ పాత్రలలోనున్న పాత భస్మములో కలపాలి. అందుచే, తప్పక కలాల్ పాత్రలు కనుగొని తీరాలి.

 

వీటితో తయారు చేయబడిన పాపపరిహారార్థ జలమును వారి మీద జల్లుకొనుట ద్వారా, శుద్ధీకరించబడి, దేవాలయములోనికి ప్రవేశించడానికి అర్హులవుతారు. లేని పక్షంలో, దేవాలయంలో ప్రవేశించే అర్హత లేదు. ఇశ్రాయేలీయులు దేవాలయములో ప్రవేశించగానే సంఘము ఎత్తబడుతుంది.  ఈ మందిరంలో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు ఎత్తబడే సంఘములో వుండరు. (ఏడేండ్ల శ్రమ కాలంలో వీరి కొరకు ఇద్దరు సాక్షులు దేవునిచేత పంపబడి, రక్షణలోనికి నడిపిస్తారు.) రక్షించబడిన ఇశ్రాయేలీయులు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.

 

ఎర్రని పెయ్యి, కలాల్ పాత్రలు తప్పక కనుగొనబడతాయి, మందిరం నిర్మించబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘములో మనముంటామా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న?

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

 

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*158వ భాగము*

 

యెషయా 2:13

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.        

 

                 ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

   జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి ఇంకా యెహోవా పర్వతమునకు వెల్లుదము రండి అని చెప్పుకుంటారు. ఇక యెహోవా పర్వతము అనగా సీయోను పర్వతము అని అర్ధము అని చెప్పుకున్నాము! ఈ పర్వతం ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం గలవారు అనియు ఏవిధమైన పాపములు చేయని వారని ఇంకా ఊహాలద్వారా కూడా పాపము చేయని అత్యంత పరిశుద్ధ ప్రజలు అని ఈ సీయోను అనుభవం గల ప్రజలని అనేకసార్లు ధ్యానం చేసుకున్నాము! సరే ఇప్పుడు ఈ సీయోను పర్వతం దగ్గరకు అనగా యెహోవా పర్వతం దగ్గరకు ఎందుకు వస్తారు అంటే గతభాగాలులో చెప్పిన విధంగా మొదటగా దేవుని మాటలు వినడానికి, దేవుని కట్టడలు మరియు దేవుని ధర్మశాస్త్రము (ఇక్కడ నూతన నిబంధన అని గ్రహించాలి) సంపూర్తిగా అర్ధము చేసుకుని నేర్చుకుని వారి దేశాలలో బోధించి పాటించేందుకు వీలుగా దేవుని పర్వతానికి ప్రపంచదేశాల ప్రజలు వరద ప్రవాహంలా వస్తారు! ఇంకా ఆయనను పూజించడానికి వస్తారు. ఈ సమయంలో యేసుక్రీస్తుప్రభులవారితో ఉన్న 144000 మంది దేవునికి సహాయం చేయవచ్చు ఈ విషయంలో!

 

సరే, అన్యజనులు దేవుని పర్వతం దగ్గరకు తప్పకుండా వస్తారని ముందుగానే చెప్పబడింది!!!

 

యెషయా 11:9; యెషయా 27:13; యెషయా 56:7; యెషయా 57:13; యెషయా 65:25; యెషయా 66:20

 

యెషయా  11

9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

 

ఇది వేయేండ్ల పాలనలో జరిగేది!

 

యెషయా  27

13. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.

 

ఇది కూడా వేయేండ్ల పాలనలో జరిగేది!

యెషయా  56

7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.

 

చూడండి మందిరం లేకుండా ఆర్పణలు ఎలా అర్పించబడతాయి? కాబట్టి మందిరం నిర్మించబడుతుంది మరియు ఆర్పణలు అర్పించబడతాయి.

 

యెషయా  57

13. నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.

 

యెషయా  65

25. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

ఇది కూడా వేయేండ్ల పాలనలో జరిగేది!

 

చివరిగా తిరుగులేని వాగ్ధానం

యెషయా  66

20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

 

చూడండి దీనిలో సగభాగం జరిగింది. ఇంకా సగభాగం జరుగబోతుంది.

 

కాబట్టి దీనినిబట్టి ఏమని అర్ధమవుతుంది అంటే అంత్యదినాలలో దేవుని ఆలయం కట్టబడుతుంది. అప్పుడు జనులు నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రపంచ దేశాలనుండి ప్రజలు ప్రవాహం వలె యెరూషలేము వస్తారు. అప్పుడు వారు సీయోను పర్వతం దగ్గరకు వచ్చి ఆయన మాటలు కట్టడలు నేర్చుకుంటారు! అయితే ఆ సీయోను పర్వతం వరకు వీరు వస్తారు గాని దేవునితో ఇంకా 144000 మందితో కలసి సీయోను కొండమీద ఉండటానికి నివాసం చేయడానికి వారికి అవకాశం ఉండదు అని నా ఉద్దేశం! కారణం రాకడకు ముందుగా రక్షించబడి నిజదేవుణ్ణి కలుసుకోలేదు కాబట్టి!!! ఆ ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవం స్త్రీ సాంగత్యం లేనంతగా ఊహాలలో కూడా పాపము చేయలేనంత పరిశుద్ధ ఆనుభవం గలవారు ఆ 144000 మంది!

 

ప్రియ సహోదరి సహోదరుడా! ఆ కృపా కాలం సంఘ యుగం ఇంకా నడుస్తుంది. సమయముండగానే నీవు మార్పునొంది ఎత్తబడే గుంపులో ఉండగలవా? ఇంకా ఆ సీయోను కొండమీద దేవునితో ఉండగలిగే అనుభవము తెచ్చుకోగలవా!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*159వ భాగము*

 

యెషయా 2:4

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

 

                 ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

         ఇక 4 వ వచనం చూసుకుంటే ఆయన మధ్యవర్తిగా తీర్పు తీరుస్తారు అనేక జనములకు తీర్పు తీర్చును ఇక వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొట్టుకుని వాడుకుంటారు ఇంకా జనముమీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము యుద్ధాలు చేయడం మానేస్తారు. అసలు యుద్ధ విధ్యలే నేర్చుకోవడం మానేస్తారు అంటున్నారు!

 

గమనించాలి ఇది వేయేండ్ల పాలనలో జరిగే సంభవం. అనగా రహస్య రాకడ, మహాశ్రమల కాలం, ప్రత్యక్ష రాకడ అయిపోయాక, ఏడేండ్ల పెండ్లి విందు అయ్యాక, జరిగే సంభవం! వేయేండ్ల పాలనలో మరియు నిత్యత్వములో కూడా ఇలాగే జరుగుతుంది.

 

“న్యాయం తీరుస్తాడు” యెషయా 11:4;

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

 

కీర్తనలు 96:13

భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.

 

కీర్తనలు 98:9

భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

 

దేవుడు తానే ప్రపంచ దేశాలకు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు లోపరహితమైన న్యాయం నెలకొని ఉంటుంది. ఈ సంపూర్ణ న్యాయానికి ఫలితం ప్రపంచ శాంతి (32:17).

యెషయా 32:17

నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

 

గమనించాలి ఈ న్యాయం తీర్చడం- దవళ సింహాసనం తీర్పును సూచించదు! దేవుడు స్థాపించిన ప్రత్యక్ష రాజ్యంలో నిత్యరాజ్యంలో అన్నీ దేశాలకు సమంగా న్యాయం తీరుస్తారు. ఎక్కడా ఫేవరిటిజం ఉండనే ఉండదు! అందరికీ సమన్యాయం జరుగుతుంది.

 

దీనికోసం ఇంకా కీర్తన 7:11

కీర్తనలు 7:11

న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

 

కీర్తనలు 9:8

యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.

 

కీర్తనలు 72:2

నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.

 

మీకా 4:3

ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.

తీర్పుు 3:12,1416

12. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను

14. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.

15. సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను.

16. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.

 

గమనించాలి ఈ అధ్యాయంలో అనేకమైన వచనాలు మీకా 4 వ అధ్యాయములో ఉంటాయి.  మీకా గారు కాపీ పేస్ట్ చేశారేమో అని అనిపించవచ్చు గాని దేవుడు జరుగబోయే సంభవం నిశ్చయం కాబట్టి రెండుసార్లు ఒకే విషయాన్ని వ్రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు! 4:15

Micah(మీకా) 4:1,2,3,4,5

1. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.

2. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.

3. ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.

4. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.

5. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.

 

     చూడండి ఇక్కడ కూడా దేవుడు అదే వ్రాయించారు. ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయం తీర్చును అంటూ దూరమున నివశించు బలముగల అన్యజనులకు కూడా న్యాయం తీరుస్తారు.  తమ ఇక వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొట్టుకుని వాడుకుంటారు ఇంకా జనముమీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము యుద్ధాలు చేయడం మానేస్తారు. అసలు యుద్ధ విధ్యలే నేర్చుకోవడం మానేస్తారు అంటున్నారు!

 

ఇంకా ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రింద కూర్చుని నిర్భయంగా జీవిస్తాడు అంటున్నారు.  ఇక 5వ వచనంలో సకల జనములు తమతమ దేవతలను స్మరించుకుంటారు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుకుంటాము అంటున్నారు! ఇలా అనడానికి కారణం వేయేండ్ల పాలనలో దేవుడు తన ప్రత్యక్ష నిత్య రాజ్యము స్థాపిస్తారు. ఆ రాజ్యంలో ఆయనతో పాటుగా మనము ఏలుతాము మరియు పరిపాలిస్తాము! ఎవరిని? అన్య జనులను! సమస్త రాజ్యములను! అలాంటి స్థితిలో నిజమైన దేవుణ్ణి పూజించటానికి వారు ఏటేటా యెరూషలేము వస్తారు. పర్ణశాలల పండుగకు వస్తుంటారు. గాని ప్రజలలో అనేకమంది వారివారి దేవతలను పూజించుకుంటూ యెహోవా దేవుణ్ణి కూడా పూజిస్తారు అన్నమాట! అయ్యా నాకు అర్ధమయ్యింది మాత్రమే నేను రాస్తున్నాను!

సరే ఈ వచనంలో మరో ముఖ్యమైన మాట : మధ్యవర్తియీ న్యాయము తీరుస్తారు!  ఆ మధ్యవర్తి ఎవరు అంటే గలతీ 3:1920

19. ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

20.మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

 

హెబ్రీ 8:6

ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియ మింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

 

హెబ్రీయులకు 9:15

ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

 

1 తిమోతి 2:56

5. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

6. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

 

ఇక చివరిగా ఆ వేయేండ్ల పాలనలో ప్రజలు యుద్ధం మానేస్తారు. తమ ఖడ్గములను వ్యవసాయ పనులకోసం వాడుతారు!

 

ఈ సంఘ యుగం పోకడ అంతా ఇక్కడ రాసి ఉన్నదానికి భిన్నంగానే ఉంది. ఇంతకుముందూ, ఇప్పటికీ ప్రపంచమంతటా యుద్ధాలు ఉన్నాయి. ప్రపంచంలోని బ్రహ్మాండమైన ఆయుధ కర్మాగారాలు నాగళ్ళను ఉత్పత్తి చేయడం లేదు.

పూర్వకాలంలో ఖడ్గాలు నాగళ్లు వాడేవారు. ఇప్పుడు AK47, missiles ఇంకా మరో రకమైన యుద్ధాయుదాలు, ఇంకా ఇప్పుడు దున్నడానికి ట్రాక్టరు లు వచ్చేశాయి. కాబట్టి యుద్ధాయుదాలు  తెగగొట్టి వ్యవసాయ పనిముట్లు చేసుకుంటారు అన్నమాట.

 

 ఈ వచనం యోవేలు 3:10; మత్తయి 24:6-7 వ్యతిరేకంగా ఉంటుంది. ఈ విషయం ఇంకా జరగలేదు గనుక భవిష్యత్తులో జరుగుతుందని మనం ఎదురు చూడాలి.

 

యోవేలు 3:10

మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడునేను బలాఢ్యుడను అనుకొన వలెను.

 

మత్తయి 24:6

మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

మత్తయి 24:7

జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.

 

ఈ రకంగా ఆ వేయేండ్ల పాలనలో నీతి న్యాయము మరియు సమాధానము మాత్రమే కనిపిస్తుంది.

ఎందుకంటే మొదటగా పాలన చేసేది దేవాదిదేవుడే! పరిశుద్ధ దేవుడే! సత్యుడైన నిత్యదేవుడే!

 

రెండవ ముఖ్య కారణం ఏమిటంటే: వేయేండ్ల పాలనలో పనికిమాలిన సాతాను గాడు పాతాళములో బంధించబడ్డాడు కదా వెయ్యేళ్ల వరకు!

ఎప్పుడైతే సాతాను గాడు లేడో ఇప్పుడు అన్యాయం అవినీతి కలహాలు యుద్ధాలు మోసాలు వ్యభిచారం లైంగిక అవినీతి  ఉండనే ఉండవు. కేవలం నీతి న్యాయమే ఉంటాయి. ఎవరైనా తోక జాడిస్తే వారిని ఆయన ఇనుపదండంతో ఏలుతాడు అని మనకు ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి కేవలం నీతి న్యాయము మాత్రమే ఉంటాయి.

మరి ఆ వేయేండ్ల పాలనలో పరిపాలించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా?

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*160వ భాగము*

 

యెషయా 2:510

5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

8. వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. 

 

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

     ఇక 5 వ వచనం నుండి చూసుకుంటే

 5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

 

ఎందుకు ఆయన వెలుగులో నడుచుకుందాం అంటున్నారు అంటే వారు చీకటిలో ఉన్నారు కాబట్టి.  యోహాను గారు అంటున్నారు 1 యోహాను  1:

7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

గాని వీరికి ఈ అన్యోన్య సహవాసం లేదు ఎలా చెప్పగలవు అంటే తర్వాత వచనాలు అవే చెబుతున్నాయి కాబట్టి!

 

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

8. వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

 

“వెలుగు” కీర్తన 43:3; 89:15; 118:27; యోహాను 1:4, 9; 8:12; 12:35; ఎఫెసు 5:8; 1 యోహాను 1:5, 7; ప్రకటన 22:5. ఇంతకుముందు వెల్లడైన అద్భుత సత్యం పై ఆధారపడి యెషయా ఒక హెచ్చరిక చేస్తున్నారు. దేవుడంటే తెలియని ప్రజలు వచ్చి ప్రత్యేకంగా యాకోబు దేవుడైన ఈయన్ను గురించి నేర్చుకుంటారు. అలాగైతే మరి యాకోబు సంతతి తన తిరుగుబాటును మాని ఆయన వెలుగులో నడవాలి కదా.

 

చూడండి యాకోబు సంతతి వారైనా వీరికి అనగా ఇశ్రాయేలు జనాంగమైన వీరు ఇశ్రాయేలు ప్రజాలులా ధర్మశాస్త్రము అనుసరించి నడవడం లేదు గాని వీరు తూర్పున ఉన్న జనుల సంప్రదాయములతో నిండుకుని ఉన్నారు! ఇంకా ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు అంటున్నారు! అందుకే తొమ్మిదవ వచనం నుండి అంటున్నారు ఎవరిని వదలొద్దు అందరినీ తీర్పుకు గురిచేసి వారిని ఒక పట్టు పట్టమంటున్నారు!

వారేనా నేడు మనం ఎలా ఉన్నాము? అన్యజనుల ఆచారాలు చేయడం లేదా? పేరుకే క్రైస్తవులం గాని అన్యులు చేసినట్లే మనము కూడా చేయడం లేదా? అన్యాఛారాలు క్రైస్తవాచారాలు గా మారిపోలేదా?

 

ఎఫెసీ 4:

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

 

    కొలస్సీయులకు 2: 8

ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన (భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.

 

  ప్రియులారా! ఒకసారి దేవుణ్ణి తెలుసుకొన్న నీవు వెంబడించాల్సింది దేవున్నే గాని , ఆయనను వెంబడించకుండా ఎవడో చెప్పాడని, మనుష్యుల పారంపర్యాచారాలు అనగా ఈ లోక మూలపాఠాలు లేక లోక ఆచారాలు, ఈ లోకపు పోకడలను అనుసరించి నడుస్తారేమో అని జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు.

 

    ఇక ఈ లోకపు ఆచారాలు- పోకడలు చేయవద్దు అని చెబుతున్నారు పౌలుగారు. బైబిల్ గ్రంధం మొత్తం మనము లోకస్తులనుండి వేరై ప్రత్యేకముగా జీవించాలి అని చెబుతుంది.

 

యిర్మియా 10:2-3 లో

 యెహోవా సెలవిచ్చుచున్న దేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.  .ఎందుకంటే అవి వ్యర్ధములు!

 

అందుకే అపొస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే తన ప్రసంగంలో నుండి వెలువడిన ప్రత్యక్షత/ ఆజ్ఞ- -  ఏమిటంటే మీరు మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి!!! అపోస్తలులు 2:40; చూశారా ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఇక పాత అలవాట్లు, పాత ఆచారాలు చేయకూడదు! కారణం లోకాచారాలు- లోకపు పోకడలు ఆత్మ సంభందమైన మరణము నుండి పుట్టి, శాశ్వతమరణానికి దారితీస్తాయి!

 

2 కొరింథీ 6:14-16

మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

 

క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?  . .  మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి జీవముగల దేవుని పనులు చేయాలి గాని విగ్రహ సంభంధమైన పనులు ఏమీ చేయకూడదు!

 

ఉదాహరణ:

 

** వారు (అన్యులు) ముహూర్తాలు చూస్తారు- మీరు కూడా ముహూర్తాలు చూస్తే వారికి- మీకు తేడా ఏమిటి?

 

** వారు వాస్తు పాటిస్తారు- మీరుకూడా బైబిల్ కి వ్యతిరేఖమైన వాస్తు పాటిస్తే వారికి- మీకు తేడా ఏమిటి?

 

** అన్యులు తమ వివాహాలలో- తాళి కట్టడం, పసుపు రాయడం, అక్షింతలు వేయడం, గంధం పూయడం, పందిరి రాటవేయడం, మామిడాకులు కట్టడం లాంటివి చేస్తారు. క్రైస్తవుడని పేరు పెట్టుకుని నీవుకూడా అదే విగ్రహ సంభంధమైన అన్యాచారాలు చేస్తే వారికి- మనకు తేడా ఏమిటి? కేవలం బొట్టు ఒకటి పెట్టుకోవడం లేదు అంతే! అక్కడ బ్రాహ్మణ పురోహితుడు, ఇక్కడ క్రైస్తవ పూజారి అంటే తేడా! ఇదేనా క్రైస్తవ్యం??!!!

 

*** ఇక వారిలాగే mature function చేయడం! ఇది గొప్పగా అందరికీ డప్పు వేసుకుని చేసే కార్యక్రమమా? వారేదో చేస్తున్నారు. క్రైస్తవులారా ఇలా చేయవచ్చా! ఆలోచించారా?

 

*** ఎవరైనా చనిపోతే 11వ రోజున జ్ఞాపకార్ధ కూటము మరియు 11 నెలలో - జ్ఞాపకార్ధ కూటము అంటే అదే నెలలో, అదే తారీకున చేయాలి, ఇది అన్యాచారం కాదా!!!

 

** ఇంకా మరికొందరు ఎదుర్లు చూస్తారు, వీరు ఎదురు వస్తే మంచిది కాదు అంటారు, ఇంకా కొంతమంది జ్యోతిష్యం చెప్పించుకుంటారు, సోదెలు, శకునాలు చూస్తారు. ఇలాంటివారిని దేశం నుండి వెళ్ళగొట్టమని (లేవీ 19:31) బైబిల్ చెబితే వీరి వెనుకాల తిరగటానికి సిగ్గులేదా? సౌలురాజు ఏమయ్యాడు ఇవి చూసి?

 

** ఇక అన్యులు, సినిమా తారలు వేసుకునే వస్త్రధారణనే క్రైస్తవ సంఘం వేసుకుంటుంది. ఇది దేవుడు మెచ్చేదా? ఇంకా కొంతమంది స్త్రీలు స్త్రీ పురుషవేషం ధరించకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు అని చెబితే (ద్వితీ 22:5), స్త్రీలు జీన్స్ పేంట్, టీ-shirts వేసుకుని తిరుగుతున్నారు, మరీ ఘోరమేమిటంటే అవి వేసుకుని, ముసుగువేసుకోకుండా స్టేజిమీద పాటలు పాడుతున్నారు! ఇది పరిశుద్దాత్మునికి దుఃఖపరుస్తున్నారని తెలియదా??!!

 

** ఇక అన్యులు తమ పండుగలలో డేన్స్ వేస్తారు, ఇక క్రైస్తవులు కూడా అదే సినిమా స్టెప్పులతో డేన్స్ వేస్తే లోకానికి- సంఘానికి తేడా ఏమిటి?

 

  ప్రియ సహోదరుడా/ సహోదరి! అన్యులు త్రాగినట్లు నీవుకూడా త్రాగుబోతుగా ఉంటే, లంచగొండిగా, జూదగానిగా, అబద్ధకునిగా, వ్యభిచారిగా ఉంటే వారికి- నీకు తేడా ఏమిటి? అందుకే నీవు యేసయ్య కోసం చెప్పలేకపోతున్నావు- ఇక ఎప్పుడైనా చెబితే చాలు చాలులే ఇక ఆపు అంటున్నారు- నీ బ్రతుకు బాగులేక!!

 

 ఇందుకేనా యేసయ్య నీకోసం రక్తం కార్చినది? ఇన్ని శ్రమలు పడ్డాది?

 

మీరు వెండిబంగారాలు వంటి వెలగల వస్తువుల చేత రక్షించబడలేదు గాని అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడ్డారని మరచిపోయావా? 1పేతురు 1:18-19;

 

అందుకే 1 Peter(మొదటి పేతురు) 2:9,10,11

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,  . .అంటున్నారు.

 

చివరికి అన్యులతో వియ్యమొందరాదు అని చెబుతుంది బైబిల్ ద్వితీ 7:3-6;

 

 రోమీయులకు 12: 2

మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

ఒకవేళ నీవు లోకచారాలు చేస్తే, లోకాన్ని స్నేహిస్తే యాకోబుగారు అంటున్నారు

:4:4

వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

 

   కాబట్టి ప్రియదైవజనమా! ఈలోకాచారాలు, లోక మర్యాదలు చేసి దేవుని నుండి దూరమైపోవద్దు! మన భారతీయులం, భారత దేశ సాంప్రదాయం అనే బోధించే, అనుకూల బోధకుల బోధకు మోసపోవద్దు! అవి చేసేవారికి దేవుని శాపం వస్తుంది, చేయించే వారికి కూడా దేవుని ఉగ్రత వస్తుంది! అంతేకాకుండా యేసుప్రభులవారికి చోటులేని ఏ భోదను  మీ చెంతకు రానీయవద్దు! యేసుప్రభులవారు లేని ఏ ఆచారము/ వాక్యానుసారం కాని పని ఏవీ చేయొద్దు. ఈ రోజులలో కొన్ని సాంప్రదాయాల మీద, ప్రాచీన రచనలమీద, మానవ అభూత కల్పనల మీద ఆధారపడిఉన్న ఈ ఆచారాలు, ఆలోచనలు పాటించకూడదు కారణం వీటిలో నిజ దేవుని జ్ఞానం కొంచెమైనా లేదు! క్రీస్తుకు వాటిలో చోటులేదు!

 

మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని అనిపించగలిగారు! దానియేలు 3;

 

నీవు ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడుఅని అనిపించగలిగావా??!!

 

పౌలుగారు 2 కొరింథీ 6:17 లో అంటున్నారు

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . .

 

2) కారణం మనము దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారము: మొట్టమొదట దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డాము. గతములో హనోకు గారి జీవితమును ధ్యానం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టులుగా లేక ప్రియులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ధ్యానం చేసుకున్నాం. మొదటగా విశ్వాసం కలిగియుండాలని, దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి యుండాలని, మన మాటలు దేవున్ని సంతోషపెట్టే విధముగా ఉండాలని, ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల నమ్మకముగా, ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని,పరిశుద్దముగా జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వకముగా నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవునికి ఇష్టులుగా జీవించగలము!

 

కాబట్టి వాటిని పాటించవద్దు అని పరిశుద్ధాత్ముడు పౌలుగారి ద్వారా మనకు సెలవిస్తున్నాడు!

 

ఇశ్రాయేలు ప్రజలు యూదులు ఆవిచేసి దేవుని కోపమునకు గురి అయ్యారు. నీవు కూడా అదే అన్యాఛారాలు చేస్తే నీకు కూడా శిక్ష తప్పదు!!

 

మనం కూడా ఈ అన్యాచారాలు మానేద్దాం! క్రీస్తుని ఎదుర్కొందాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*161వ భాగము*

 

యెషయా 2:510

5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

8. వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడుదురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. 

 

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

  ఇక ఇదే వచనంలో మరో ముఖ్యమైన మాట ఏమిటంటే: ఈ ఇశ్రాయేలు ప్రజలు తూర్పున ఉండే ప్రజల యొక్క ఆచారాలు సాంప్రదాయాలు చేయడమే కాకుండా అనగా అన్యుల ఆచారాలు చేయడమే కాకుండా ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు ఇంకా అన్యులతో సహవాసం చేస్తున్నారు అందుకే నీవు వారిని విసర్జించి ఉన్నావు అంటున్నారు!

 

మొదటిది: అన్యుల సంప్రదాయలు చేయడం

 

రెండవది: మంత్ర ప్రయోగాలు చేయడం

 

మూడవది: అన్యులతో సహవాసం చేస్తున్నారు

 

గతభాగంలో అన్యుల ఆచారాలు చేయడం కోసం చూసుకున్నాము!

 

ఇక రెండవది: మంత్రప్రయోగాలు చేయడం: అనగా మంత్రాలతో దయ్యాలను ఆశ్రయించి ఇతరులకు నష్టం కలిగించడం. అనగా చెడుపులు చిల్లంగి చేయడం! అసలు ఇలాంటివి చేయకూడదని బైబిల్ చెబుతుంది. ఇలాంటి వారిని దేశంలో నుండి తగిలేయమని పాతనిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. ..

ద్వితియోపదేశకాండము 18:9

నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.

ద్వితియోపదేశకాండము 18:10

తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

ద్వితియోపదేశకాండము 18:11

కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

ద్వితియోపదేశకాండము 18:12

వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

ద్వితియోపదేశకాండము 18:14

నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

 

దీనికోసం గతంలో మనం చూసుకున్నాము! హిజ్కియా రాజు గారి కొడుకు మనస్షే అనేవాడు ఇలాంటి వారితో స్నేహం చేసి యూదా దేశాన్ని సర్వనాశనం చేశాడు. ఈ మంత్ర ప్రయోగాలు కోసం గత భాగాలులో విస్తారంగా చూసుకున్నాము కాబట్టి ముందుకు పోదాం!

 

ఇక మూడవది: అన్యులతో సహవాసం చేయడం

 

మరలా మనం మనస్షే దగ్గరకు రావాలి. ఈ రాజు దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా మంత్రగాళ్లతో నరహంతకులతో తప్పుడు గాళ్లతో సహవాసం చేసి మనస్సే హృదయాన్ని దేవుని నుండి దూరం చేశారు. ఇక ఇతని కోసం 53, 54 భాగాలులో విస్తారంగా చూసుకున్నాం! ..

 

అయితే బైబిల్ మొదటి నుండి ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదో చాలా స్పష్టంగా చెబుతుంది

 

యెహోషువా 23: 7. మీయొద్ద మిగిలియున్న యీ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక

8. మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను

 

మొదటి రాజులు గ్రంధంలో సొలోమోను చక్రవర్తి ఎలా పాడైపోయారో ఒకసారి గుర్తుకు చేసుకుందాం!

 

11: 1. మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి

2. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

3. అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉపపత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి.

4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.

5. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.

7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.

8. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.

9. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై

10. నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి

 

చూడండి అన్యులతో సహవాసం చేయకూడదు వారితో వియ్యమొందకూడదు అని చెబితే వారితో సహవాసం చేయడమే కాకుండా అనేకులైన అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని విగ్రహారాధికుడై పోయాడు. కామాతురత గలవాడై దేవుని నుండి దూరమై పోయాడు!

 

కీర్తన 106: 35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

36. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.

 

సామెతల గ్రంధంలో 13: 20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

 

15: 31. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.

 

22: 24. కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము

25. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.

 

24: 1. దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము

2. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.

 

28: 7. ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.

 

31: 3. నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ కుము

 

యోబు గ్రంధములో అంటున్నారు22: 21. ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.

22. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

 

1 కోరింథీ 1: 9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు.

 

7: 24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

 

2 కోరింథీ 13: 14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

 

చివరిగా 1 యోహాను 1:6 లో దేవుడు అంటున్నారు: 6. ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

 

చిన్నకుమారుడు తుంటరుల సహవాసం చేసి ఇల్లు తండ్రిని అందరినీ వదిలేసి దూరదేశం పోయాడు-ప్రైవసీ కోసం, అక్కడ ఉన్నదంతా కొద్దిరోజులలోనే ఊడగొట్టుకుని తినడానికి తిండి కూడా లేనంతగా అలమటించి చివరకు పందుల కాపరి దగ్గర పందులను మేపడానికి కుదుర్చుకున్నా గాని పందుల పొట్టు కూడా దొరకక అల్లాడిపోయాడు!

 

కాబట్టి మన సహవాసం వారితో ఉండాలో ఎవరితో ఉండకూడదో పరిశీలించుకుని దేవునితో సహవాసం ఏర్పరచుకుని ఆయనతో సాగిపోదాం!

 

దైవాశీస్సులు!

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*162వ భాగము*

 

యెషయా 2:510

5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

8. వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. 

 

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇక 7వ వచనానికి వస్తే అసలు వీరు దేవుణ్ణి వదిలి అన్యాచారాలు అన్యుల సాంప్రదాయాలు మంత్ర ప్రయోగాలు అన్యులతో సహవాసాలు ఎందుకు వచ్చాయి అంటే వారి దేశము దేవుడిచ్చిన సమృద్ధి వలన వెండి బంగారాలతో నిండి ఉండి వారి సంపాధ్యమునకు మితిలేకుండా ఉన్నందువలన ఇంకా వారి దేశం నిండా గుర్రాలు రధాలు ఉన్నందువలన, వారి కళ్ళు నెత్తి మీదికి వచ్చి గీరబలిసిపోయి దేవుడా నీవెవడవు అన్న స్థాయికి వచ్చినోళ్ళు, కొంతమంది ఏదో పెదాలతో ప్రార్ధన చేస్తూ మమః అనిపించుకున్న వారు కొంతమంది!  ఇలా ఎంతగా వారి వెండి బంగారాలు విస్తరించాయో ఎంతగా వారి సంపాదన పెరిగిందో, 8వ వచనం ప్రకారం అంతగా విగ్రహాలతో నిండిపోయింది వారి దేశం!!  తాము చేసుకున్న చేతిపనిని వారు పూజించడం మొదలుపెట్టారు!   ఇంకా క్రిందికి పోతే మనకు తెలుస్తుంది దేవుడు అంటున్నారు యూదా నీ వీధులు ఎన్నో నీ విగ్రహాలకు చెందిన గుళ్ళు కూడా అన్నే ఉన్నాయి అంటున్నారు. ఇంత ఘోరంగా విగ్రహారాధన పెరిగిపోయింది. నేటిరోజులలో మన దేశంలో కూడా విగ్రహారాధన పేట్రేగి పోతుంది. నెలకో రకమైన పూజ మరియు బట్టలు వచ్చేశాయి.  వీధికి రెండుమూడు గుడులు వచ్చేశాయి. రకరకాల పూజలు వచ్చేశాయి. దేవుడు తన ప్రజలతో ఎంతగా మిళితమై పోవాలి అని కోరుకుంటున్నారో అంతగా సాతాను ప్రజలను మోసగిస్తూ వారిని దేవుని దగ్గరకు రాకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు లేక మనో నేత్రాలకు గ్రుడ్డి తనము కలుగుజేస్తూ ప్రజలు నిజమైన దేవుని వెలుగు ఏమిటో గ్రహించకుండా చేస్తుంది. మరి క్రైస్తవుడవు అయిన నీవు ఇలాంటి వారికి నిజమైన సువార్త ప్రకటించి నిజమైన వెలుగుని ప్రకటించవలసిన బాధ్యత నీమీద నామీద ఉంది ! గమనించాలి పూర్వకాలంలో ప్రజలు వారి సంపాధన బంగారం పెరిగే కొలదీ విగ్రహారాధన గుడులు ఎక్కువై పోయాయి. అప్పుడు దేవుడు వారిని అస్సూరీయులకు బబులోనీయులకు అప్పగించేశారు! ఈరోజు మన ఇరుగుపొరుగు వారు మన ప్రాంతము ఇదే స్థితిలో ఉంది. మరి వీరు కూడా దేవుని ఉగ్రతకు పాత్రులుగా మారిపోయారు. మరి వీరి రక్షణ బాధ్యత మనమీద లేదా? తప్పకుండా ఉంది! వారికోసం ప్రార్ధించి వారికి సువార్త ప్రకటించవలసిన భాధ్యత మనదే!!

 

అందుకే 9 వ వచనంలో దేవునికి కోపం వచ్చి 9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము అంటున్నారు!

 

ఏకైక నిజ దేవునికి విగ్రహపూజ అసహ్యం. దీని మూలంగా మనుషులు హీనస్థితికి దిగజారి వారి పాపాలలో నశించిపోతారు (వ 20,21;

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

 

2 థెస్సలొనీకయులకు 1:9

యెషయా 13:11;

11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

 

యెషయా  45

16. విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.

 

లేవీయకాండము 26:30;

30. నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను

 

 యెహెఙ్కేలు 6:4;

4. మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.

 

1 కోరింథీయులకు 6:9;

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను

 

ప్రకటన గ్రంథం 21:8;

8. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ప్రకటన గ్రంథం 22:15

 15. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

ఇదీ విగ్రహారాధికులకు జరిగే తీర్పు!!!

 

ఇక 10 వ వచనంలో 10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము. 

 

ఈ వచనాలన్నీ 12వ వచనంలో చెప్పినట్టుగా ఒక “రోజు”కు సంబంధించినవి. ఈ “రోజు” అంటే యెహోవా నియమించిన ఒక కాలం. ఆ కాలంలో జరిగే సంఘటనల వర్ణనను బట్టి చూస్తే ఇది “ప్రభువు దినం” లేక “యెహోవా దినం” అని అర్థమౌతున్నది. ఈ దినం గురించి విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక అది యెహోవా దినము అని మాత్రమే చదువుకుని ముందుకుపోదాం!  యెషయా 13:6-13; యోవేలు 1:15; 1 థెస్సలొనీకయులకు 5:2; 2 పేతురు 3:10; ప్రకటన గ్రంథం 6:15-17 చూడండి.

 

చూడండి జరుగబోయే సంభవం ఇదే వచనంలో రెండుసార్లు వ్రాయబడింది అంటే ఇది చాలా ఖచ్చితంగా జరుగబోతుంది అని అర్ధం!!!

 

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

 

ప్రకటన గ్రంథం 6:15, ప్రకటన గ్రంథం 6:17.

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

16. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

 

 దేవుడు తన వైభవంతో లేచి ప్రపంచానికి తీర్పు తీర్చేటప్పుడు పాపాత్ములైన మనుషులకు ఏ దిక్కూ ఉండదు.ఇంతవరకు వారు పూజించిన ఏ విగ్రహం బొమ్మ వారికి సహాయం చేయలేదు.

 

ఈవిధంగా మనుష్యుల ధన గర్వం అహంకారం దేవుడు అణచివేస్తారు 11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

 

అహంకారం, లేదా ఇలాంటి అర్థాన్నే ఇచ్చే పదాలు ఈ వచనాల్లో 8 సార్లు కనిపిస్తున్నాయి. మనిషికుండే గర్వం దేవునికి అసహ్యకరం (సామెతలు 6:16-17; సామెతలు 21:4; కీర్తనల గ్రంథము 18:27; కీర్తనల గ్రంథము 101:5; యాకోబు 4:6). దాన్ని భూమిమీద లేకుండా తుడిచి పెట్టెయ్యాలని దేవుని దృఢ సంకల్పం. యెహోవా దినం ముఖ్యంగా గర్విష్ఠుల మదం అణిగిస్తుంది. వారు గర్వపడే వాటన్నిటినీ నాశనం చేసేస్తుంది.

 

కాబట్టి మనలో ఇలాంటి అహంకారం ధన గర్వం అతిశయం ఉంటే దూరం చేసుకో! లేకపోతే దేవుని తీర్పు గుమ్మం దగ్గరే ఉందని మర్చిపోకూ!!!!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*163వ భాగము*

 

యెషయా 2:1115

11. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14. ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

 

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

         ప్రియులారా! ఇంకా ఈ అధ్యాయములో ముందుకుపోతే 12 వ వచనం నుండి చూసుకుంటే

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

 

చూడండి అహంకారము అతిశయము ఔన్నత్యము గల ప్రతిదానిని విమర్శించడానికి దేవుడు ఒక దినము నిర్ణయించారు అంటున్నారు. ఆ దినము మరేది కాదు! అది యెహోవా దినము అని గ్రహించాలి!

 

ఇంకా దేనిదేనికి దేవుడు తీర్పుతీర్చ బోతున్నారు అంటే 14. ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

 

చూడండి పర్వతాలకు ఎత్తయిన మెట్లుకు.. ఇంకా ముందుకు వెళ్లకముందు ఒకమాట ఆలోచిద్దాం! ఇంతకీ దేవుడు ఉన్నతమైన పర్వతాలకి ఎత్తైన మెట్లుకు ఎందుకు తీర్పు తీర్చడం సార్? అవి జీవులు మనుషులు కాదు కదా! ఎందుకంటే బైబిల్ గ్రంధంలో మనం న్యాయాధిపతులు గ్రంధం నుండి మలాకీ వరకు చూసుకుంటే ప్రతీ పచ్చని చెట్టుకి ఉన్నత స్థలము అనగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న అనగా కొండమీద గాని ఏదైనా పర్వతం మీద గాని ఈ ప్రజలు బలిపీటములు గుళ్ళు కట్టేస్తూ, ప్రతీ గుడిలోనూ దూపము వేస్తూ ప్రతీ బలిపీఠం మీద దయ్యాలకు బొమ్మలకు ఆర్పణలు అర్పించారు వారు! అందుకే ఇప్పుడు ఆ గుడులకు మెట్లకు ఎత్తైన స్థలాలు అనగా ఉన్నత స్థలములకు ఉన్నతమైన పర్వతాలకు అన్నింటికీ దేవుడు తీర్పు తీరుస్తాను అంటున్నారు!!

 

ఇంకా దేనికి తీర్పు తీరుస్తారు అంటే 15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

 

ఇక తర్షీసు ఓడలకు విచిత్రమైన వస్తువులకు తీర్పు తీర్చడం ఏమండీ? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు యూదులు తర్షీసు అనగా స్పెయిన్ దేశము నుండి విచిత్రమైన వస్తువులను దిగుమతి చేసుకుంటూ వాటితో వ్యాపారం చేసుకుంటూ దేవున్నే మరిచిపోయారు కనుక! దేవునికంటే వారి వ్యాపారాన్ని రంగురంగుల విచిత్రమైన వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు వీటికి కూడా తీర్పు తీర్చబోతున్నారు! గమనించాలి- దేవునికంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే! విగ్రహారాధనే! అందుకే ఇప్పుడు వీటిమీద దేవుడు ఉగ్రతను తీర్పును ప్రకటిస్తున్నారు!

 

మరలా మనం 13 వ వచనానికి వద్దాం! ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని..

 

అయ్యా వృక్షాలు ఏమి చేశాయి? అవి అతిశయిస్తాయా అసలు?

 

ఒకసారి ఆలోచన చేద్దాం!

 

నిజంగా అతిశయిస్తాయి అని న్యాయాధిపతులు గ్రంధములో ఉంది! 9: 9. మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

10. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా

11. అంజూరపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.

12. అటుతరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి

13. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

14. అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొద యొద్ద మనవిచేయగా

15. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.

 

ఇలా ఒక్కో చెట్టు ఒక్కో విషయంలో అతిశయిస్తాయి. అయితే ఇక్కడున్న నిజమైన ఆధ్యాత్మిక అర్ధం ఏమిటంటే లెబానోను దేవదారు వృక్షాలు- ఇవి బలమునకు సాదృశ్యంగా ఉన్నాయి! ఇవి చాలా గట్టివి గనుక ఇంటి నిర్మాణంలో ఈ చెట్లును వాడుతారు!  అలాగే కొంతమంది వారికున్న ధనమును చూచి బలమును చూచి తమకున్న ఫామిలీ సపోర్ట్ లేక బేక్గ్రౌండ్ చూసి అతిశయిస్తూ ఉంటారు, ఇంకా ఫలాని MLA మావోడే, మాది పెద్ద జాతి, పెద్ద కులం! మాకు ఇన్ని ఓట్లున్నాయి ఇన్ని కోట్లున్నాయి ఇంతమంది బలము ఉన్నారు అంటూ రకరకాలుగా విర్రవీగుతుంటారు! ఇలాంటివారికి కూడా ఒకరోజు స్పాట్ పెట్టేసి ఉంచారంట దేవుడు!!!  లెబానోను లోకమునకు కూడా సాదృశ్యంగా ఉంది. ఒకవేళ నీకు లోకంలో గల సంపదలు తలాంతులు  అర్హతలు చూసి విర్రవీగిన నీగతి కూడా అంతే!!!

 

ఇక తర్వాత భాషాను సిందూర వృక్షాలు= నిజానికి ఇవి మందులు లేక ఔషదం కోసం వాడుతూ ఉంటారు! ఇప్పుడే వీటికే తీర్పు తీర్చుతాను అంటున్నారు అనగా ఈ మొక్కలు లేకుండా చేసేస్తాను అంటున్నారు! ఔషదం అనగా ఇక్కడ తెలివితేటలకు వైద్యమునకు గుర్తు! ఒకానొక రోజు నీకు ఎన్ని తెలివితేటలు డిగ్రీలు ఉన్నా ఏదీ నిన్ను రక్షించలేదు! ఆరోజు యెహోవా దినమున నీకున్న జ్ఞానము నిన్ను రక్షించలేదు నీ బలగము బలము నిన్ను రక్షించలేదు! నీ డిగ్రీలు రక్షించలేవు! తీర్పుకు లోబడవలసిందే! అంతేకాకుండా ఇక నీ బ్రతుకులో స్వస్థత కూడా లేకుండా పోతుంది.

 

ప్రియమైన దేవుని బిడ్డా! దేవుడు ప్రతీ ఒక్కరినీ పరిశీలన చేస్తున్నారు! ఒకవేళ నీకు కూడా ఇలాంటి అతిశయము గర్వం ఉంటే నీవుకూడా తప్పించుకోలేవు అని గ్రహించు! దేవుని తీర్పు దినమున నీ డిగ్రీలు నీ తెలివితేటలు నీ జనము బలము ధనము ఏదీ నిన్ను రక్షించలేదు! గనుక ఇప్పుడే మార్పునొంది మారుమనస్సు నొంది నీ పాపాలు కడుగుకుని సిలువను ఎత్తుకో! అప్పుడే నీకు రక్షణ!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*164వ భాగము*

 

యెషయా 2:1722

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

22. తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

        ప్రియులారా! ఇంకా క్రింది వచనాలు చూసుకుంటే అప్పుడు 17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

 

17 వ వచనంలో నరుల అహంకారం తగ్గించబడును అంటున్నారు. గతభాగాలలో అహంకారం కోసం చెప్పుకున్నాము! సొలోమోను భక్తుడు అంటున్నారు

సామెతలు 8:13

యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.

 

సామెతలు 11:2

అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

 

సామెతలు 17:7

అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

 

ప్రసంగి 7:8

కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు

 

ఇక 18వ వచనం నుండి చూసుకుంటే విగ్రహాలు బొత్తిగా నశించిపోతాయి. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావము మహాత్యము నుండి తప్పించుకోడానికి మనుష్యులు కొండల గుహాలలో నెల బొరియలలో దూరుతారు అంటున్నారు!

దీనిని మరలా క్రింద వచనాలలో రెట్టించారు దేవుడు! అనగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అర్ధం!!!

 

నిజ దేవుణ్ణి, ఆయన వాక్యమును మనిషి తన అహంకారం కొద్దీ ఎదిరించినందువల్లే విగ్రహాలు ఉనికిలోకి వచ్చాయి. మనిషిలోని గర్వం అణిగి, లేకుండా పోయినప్పుడు విగ్రహాలు ఉండవు.

 

ఈ యుగాంతంలో దేవుడు భూమినంతటినీ వణికిస్తాడు (యెషయా 24:19-20; హెబ్రీయులకు 12:26-29; ప్రకటన గ్రంథం 6:14; ప్రకటన గ్రంథం 16:17-20).

 

ఇదే విషయం మనకు మరలా 24 వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది

 

యెషయా  24

19. భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది

20. భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.

 

ఇది మహాశ్రమల కాలం అనంతరం యెహోవా దినము కాలంలో జరుగబోయే మహా గొప్ప భూకంపాన్ని సూచిస్తుంది. దీనికోసం ప్రకటన గ్రంధంలో కూడా ఉంది!

 

హెబ్రీయులకు  12

26. అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.

27. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది.

28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవకృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

29. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.

 

ప్రకటన గ్రంథం  6

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను

 

అయితే ఈ సంభవం ఎప్పుడు జరుగుతుంది అంటే ఏడవ దూత తన పాత్రను క్రుమ్మరించినప్పుడు జరుగుతుంది

 

ప్రకటన గ్రంథం  16

17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.

18. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.

19. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.

20. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.

 

యెషయా  34

4. ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.

 

     ఇలాంటి పెద్ద భూకంపాన్ని దేవుడు పంపించినప్పుడు ప్రజలు దేవుని ఉగ్రత నుండి తప్పించు కోడానికి కొండగుహలలో బొరియలలో దూరుతారు!

 

అంతేకాకుండా తమలను దేవుని ఉగ్రతనుండి తప్పించలేకపోతున్న విగ్రహాలను  ఎలుకలకు గబ్బిలాలకు పారవేస్తారు అని 20 వ వచనం చెబుతుంది.

 

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

 

    తమ విగ్రహాలెంత పనికిమాలినవో చిట్టచివరకు మనుషులు గ్రహిస్తారు. నిజ దేవుని విశ్వాసులకు అంతకు ముందునుంచీ తెలిసి ఉన్న సత్యాన్ని వారూ గుర్తిస్తారు. గర్విష్ఠులు, అహంభావులు దేవుణ్ణి ఎదిరించడం మానుకుని, ఆయన కోపానికి తాళలేక దాక్కొనే చోట్లు వెతుక్కుంటూ పరుగులెత్తే కాలం ఒకటి రాబోతుంది.

 

ఇక చివరిగా అంటున్నారు 22 వ వచనంలో

22. తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

 

పై సత్యాన్ని బట్టి ఆలోచిస్తే మనుషుల్లో అక్కడక్కడా నమ్మకమైన వ్యక్తులు ఉన్నప్పటికీ అసలు మనిషి అనేవాడిపై నమ్మకం పెట్టుకోవడం వెర్రితనం అని తెలుస్తున్నది (కీర్తనల గ్రంథము 118:8; కీర్తనల గ్రంథము 146:3; యిర్మియా 17:5). యెషయా 1వ అధ్యాయం; యెషయా 2:6-9 వచనాలు మానవజాతి ఎలాంటిదో తెలియజేస్తున్నాయి. యెషయా 2:10-21 లో మానవాళికి ఏ గతి పట్టనున్నదో తెలుస్తున్నది. అలాంటప్పుడు మనుషుల్ని నమ్ముకోవచ్చా? ముమ్మాటికీ అది తగదు.

 

అందుకే బైబిల్ చెబుతుంది మీకా గ్రంధంలో 7:5  స్నేహితుని నమ్మవద్దు ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు! చివరికి నీ భార్యను కూడా నమ్మి గుట్టు విప్పద్దు అంటునారు.

 

యిర్మీయా 9:4,5 లో అంటున్నారు: ..

మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరు నినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.

యిర్మియా 9:5

సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

 

కాబట్టి మొదటగా అహంకారులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. విగ్రహాలు బొత్తిగా నశించబోతున్నాయి. దేవుడు భూమిని వణికించబోతున్నారు   ఆరోజు ఏ విగ్రహము దేవుని ఉగ్రతనుండి తప్పించడానికి పనికిరాదు! చివరిగా నాసికారంద్రములో ఊపిరి ఉన్న ఏ మనిషిని నమ్మవద్దు! నమ్మదగిన వాడు కేవలం యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే! ఎందుకంటే నీకోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*165వ భాగము*

యెషయా 3:15

1. ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

2. శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను

3. సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.

4. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

5. ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! రెండవ అధ్యాయములో యుగాంతములో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక మూడవ అధ్యాయానికి వద్దాం! ఈ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది యుగాంతం లేక యెహోవా దినము కోసం లేదు కానీ కేవలం యెరూషలేము మరియు యూదులకు యెషయా గారి కాలంలో మరియు రాబోయే కాలంలో జరుగబోయే సంభవాలు ఆత్మావేషుడై ప్రవచిస్తున్నారు!

 

ఈ అధ్యాయంలో యెరూషలేము మరియు యూదులకు

మొదటగా కరవు రాబోతుంది అని చెబుతున్నారు!

 

రెండవదిగా ఓటమి కలుగబోతుంది అంటున్నారు!

 

మూడవదిగా నాశనం రాబోతుంది అని చెబుతున్నారు ఇక

 

నాల్గవదిగా నిరాశ నిస్పృహలు ఆవరించబోతున్నాయి అని చెబుతున్నారు!

 

సరే మనము అధ్యాయానికి వచ్చేద్దాం! 13 వచనాలులో దేవుడు జనులకు ముఖ్యాధారమైన  చాలా వాటిని తీసివేస్తాను అంటున్నారు- ప్రజలనుండి మరియు పట్టణం నుండి మరియు దేశము నుండి తీసేస్తాను అంటున్నారు!

 

వేటినో చూసుకుందాం!

 

1. ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

2. శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను

3. సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.

 

ముందుగా పోషణాన్ని తీసేస్తాను అంటున్నారు. అనగా ఇశ్రాయేలు దేశానికి ముఖ్యమైన పోషణాధారం వ్యవసాయం, చేపలు పట్టడం, ఇంకా ద్రాక్షారసం చేసి అమ్ముకోవడం! ఇప్పుడు వీటిని దేవుడు వారినుండి దూరం చేసేస్తాను అంటున్నారు!

 

ఇక తర్వాత ప్రజలు తినే అన్నమును ఇంకా త్రాగడానికి నీరుని లేకుండా తీసేస్తాను అంటున్నారు! చూడండి అన్నము లేదు త్రాగడానికి నీరుకూడ లేదు అంటే భయంకరమైన కరువు రాబోతుంది అంటున్నారు! ఈ కరువు వర్షాలు కురువక పోయినందు వలన కలిగే కరువు కావచ్చు లేదా శత్రుసైన్యాలు యూదాను యెరూషలేముని ముట్టడి వేయడం వలన గాని జరగవచ్చు!   నిజానికి యెషయా గారి కాలంలో ఆహాజు సమయంలో ఇది ఒకసారి జరిగింది, ఇంకా యిర్మీయా గారి కాలంలో బబులోనూ వారు అనగా నెబుకద్నేజర్ మరియు అతని సైన్యము ముట్టడి దిబ్బ కట్టినప్పుడు కూడా అనేకసంవత్సరాలు ఇలాగే కరువుతోనూ ఆకలితోనూ అల్లాడిపోయారు ప్రజలు!! అప్పుడు చెప్పారు- వెంటనే జరిగింది!

 

ఇంకా ఎవరిని తీసేస్తున్నారు అంటే దేశంలో శూరులు యోధులను తీసేస్తున్నారు! యోధులు శూరులు లేకపోతే యుద్ధాలు చేసేవారు ఎవరు? యుద్ధాలు చేసేవారు లేరు కాబట్టి ఇక దేశం నూటికి నూరుపాళ్లు ఓడిపోబోతుంది!

 

ఇక తర్వాత న్యాయాధిపతులను కూడా తీసేస్తున్నాను అంటున్నారు! యోధులు శూరులు లేరు కాబట్టి లా అండ్ ఆర్డర్ తప్పకుండా దెబ్బతింటుంది దేశంలో! ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ దెబ్బతిందో, అన్యాయాలు అక్రమాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులను కూడా తీసేస్తున్నారు దేవుడు! ఇప్పుడు  న్యాయాధిపతులు లేరు కాబట్టి ఇక దీనులు బీదలు అన్యాయమైపోతారు!  బలమున్నవాడిదే రాజ్యం అయిపోతుంది!

 

ఇక తర్వాత ప్రవక్తలను ఏరేస్తాను అంటున్నారు! ఏమయ్యా ప్రవక్తలు ఏమి చేసేరు అంటే అయ్యా యూదాలో మరియు యెరూషలేములో దొంగ లేక అబద్ద ప్రవక్తల వలనే కదా దేశం సర్వనాశనం అయ్యింది. బైబిల్ లో అనేకసార్లు దేవుడు చెప్పారు- ఈ ప్రవక్తలు నా పేరిట అబద్దాలు ప్రవచిస్తున్నారు నేను వారిని పంపక పోయినా ఇదే యెహోవా వాక్కు అని దొంగ ప్రవచనాలు చెప్పేస్తూ తమ పొట్టలు పోషించుకుంటున్నారు అని చెప్పారు దేవుడు! అందుకే ఇప్పుడు ప్రవక్తలను ఏరేస్తాను అంటున్నారు..

 

2 దిన 18:2022

20. అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడినేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవాదేనిచేతనని అతని నడిగెను.

21. అందుకు ఆ యాత్మనేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను.

22. యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించి యున్నాడని చెప్పెను.

 

యెషయా 9:15

పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

 

యిర్మీయా 5:13, 31

13. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.

14. కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

31. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?

 

Jeremiah(యిర్మీయా) 14:13,14,15,16

13. అందుకు నేను అయ్యో, ప్రభువైన యెహోవామీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా

14. యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

15. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గ మై నను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.

16. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయ బడెదరు; నేను వారి చెడుతనమును వారిమీదికి రప్పించె దను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడును లేక పోవును.

 

Jeremiah(యిర్మీయా) 23:11,13,14,15,16,17,25,26,30,31,32

11. ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.

13. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.

14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

15. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలనుగూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చు చున్నాను.

16. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తలమాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.

17. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.

25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.

26. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?

30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరోధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.

 

ఇంకా పాత నిబంధనలో అనేకమైన రిఫరెన్సులు ఉన్నాయి! సరే, అప్పుడేనా ఇప్పుడు అనగా ఈ రోజుల్లో దొంగ ప్రవక్తలు దొంగ అపోస్టలులు లేరా? ఎక్కడ ఉన్నారో లేదో గాని మన తెలుగు రాష్ట్రాలలో అనేకమంది ఉన్నారు! మన దేశ దొంగ ప్రవక్తలే కాదండీ హైదరాబాద్ మరియు ఇంకా అనేకచోట్లలో ఆఫ్రికా ఖండము నుండి అనేకమంది అబద్ద ప్రవక్తలు అబద్ద అపోస్టలులు మన తెలుగు రాష్ట్రాలలో ఉంటూ మన రాష్ట్రాలను పాడు చేస్తున్నారు! అనేకమంది మోసపోతున్నారు!  మరి వీరిమీదికి కూడా దేవుని తీర్పు రాబోతుంది!

 

ఇలాంటి వారందరికీ తీర్పుతీర్చి దేశంలో కరువు ఓటమి  నాశనం నిరాశ కలుగబోతుంది అని చెబుతున్నారు దేవుడు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*166వ భాగము*

 

యెషయా 3:15

1. ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

2. శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను

3. సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.

4. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

5. ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.

 

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేస్తున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా దేశంలో మరియు పట్టణంలో దేవుడు కొన్ని వర్గాల వారిని ముఖ్యమైన పోషణాధారాన్ని తీసేస్తాను అని చెబుతూ ఎవరెవరిని తీసేస్తాను అన్నారో దానిని చూసుకుంటున్నాము! ఇంతవరకు పోషణాధారమును, అన్నమును ఉదకము అనగా నీటిని, శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను తీసేస్తాను అనే దానికోసం చూసుకున్నాము!

ఇక మూడవ వచనంలో సోది చెప్పే వారిని లేపేస్తాను అంటున్నారు! అయ్యా ఈ సోది చెప్పేవారు ఏమి చేశారు అంటే మనము యెహేజ్కేలు గ్రంధం 13 వ అధ్యాయంలో వీరి బాగోతం ఉంది:

6 వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.

7 నేను సెలవియ్యకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శ నముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?

8 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుమీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

9 వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.

10 సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

11 ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.

 

ఇంకా అయిపోలేదు స్త్రీలు ఏమిచేస్తున్నారో చూద్దాం!

 

17 మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠిన దృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము

18 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.

19 అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రది కించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.

20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక

21 మనుష్యు లను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.

22 మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.

23 మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.

 

చూడండి ఎంత ఘోరంగా తయారయ్యారో వారు! అందుకే వారిని ఏరేస్తాను అంటున్నారు దేవుడు!

 

ఇంకా ఎవరిని దేశం లో ఉండకుండా తీసేస్తాను అంటున్నారు అంటే పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను!

 

అయ్యా ఇంతకీ సామాన్య జనులను త్రోవ తప్పించినదే పెద్దలు! అందుకే దేశంలో గ్రామ పెద్దలు, కుల పెద్దలు మత పెద్దలు దేశ పెద్దలు మంత్రులు ఘనత వహించిన వారు 50మందికి అధిపతులను లేకుండా తీసేస్తాను అంటున్నారు!

 

యెషయా 9:15

పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

 

విలాపవాక్యములు 2:10

సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు.

యెహేజ్కేలు 8:10,11 ,12

10. నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహ ములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.

11. మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.

12. అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా. ....

 

ఇప్పుడు వీరందిరినీ తీసేస్తాను అంటున్నారు దేవుడు!

 

ఇంకా క్రిందికి పోతే అంటున్నారు శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.

 

శిల్ప శాస్త్రము ఎరిగిన వారిని ఏరేస్తాను అంటున్నారు! వీరేమి చేశారు? అయ్యా వీరే కదా అన్య విగ్రహాలు చేసేవారు! అయితే వీరికి వీరుగా చేయకపోయినా తమ అధికారులు పెద్దలు రాజులు చెబితే ఆయా దేశాలు పట్టణాలు తిరిగి అన్యుల విగ్రహాలను చూసి అదే రూపము శిల్పాలను చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే వీరు ఈ విగ్రహాలను శిల్పాలను పూజించారు! అందుకే వీరిని కూడా ఏరేస్తాను అంటున్నారు దేవుడు!  ఆహాజు రాజు సిరియా దేశం వెళ్తే అక్కడ ఒక బలిపీఠం కనబడ్డాది. ఆ రాజు సిరియా దేశం నుండి యూదా రాకముందే అలాంటి విగ్రహం మరియు బలిపీటము చేయమంటే ఇదే శిల్పకారులు ఆ రాజు రాకముందే ఆ బొమ్మ పూజ బలిపీటము చేసి పెడితే వాడు తన దేశం లేక యెరూషలేము వచ్చిన వెంటనే దానికి మ్రొక్కాడు!!!

 

ఇక చివరిగా మాంత్రికులను ఏరేస్తాను అంటున్నారు- వీరు తమ మాంత్రిక విధ్యలతో నిరపరాధులను చంపి న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారు కాబట్టి ఇప్పుడు మాంత్రికులు కూడా దేశం లో ఉండరు!

 

    ఈకాలంలో కూడా అనేకమంది దేవుని బిడ్డలను దైవ సేవకులను పాడుచేద్దామని, వారిని చంపుదామని మన శత్రువులు చెడుపోల్లను మాంత్రికులను ఆశ్రయించి చెడుపులు చిల్లంగులు‌ పెడుతున్నారు. అయితే దేవుని ముందు ఏ చెడుపు చిల్లంగి పనిచేయదు. అయితే వచ్చిన శోధన తప్పించుకోవడానికి తప్పకుండా ఉపవాస ప్రార్థన కావాలి. కేవలం పాష్టర్ గారే కాదు సంఘమంతా ఉపవాస ప్రార్థన చేస్తేనే తప్ప అలాంటి చెడుపులను జయించడం కష్టం! కాబట్టి సంఘమంతా ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో నాకు తెలిసిన వాస్తవం బట్టి చెడుపు పెట్టిన తరువాత ఆ చెడుపువలన అవతలి వ్యక్తి చనిపోక పోతే అది రివర్స్ కొడుతుంది అప్పుడు ఆ చెడుపు పెట్టిన వ్యక్తిని గాని, పెట్టించిన వాడిని గాని పట్టుకుని చంపుతుంది. ఇలా అనేకమంది నాన్నగారికి చెడుపు పెట్టి వాళ్లే పోయారు. గాని దేవుడు మాత్రం ఇలాంటి చెడుపుగాళ్లను ఊరికే వదలరు. వీరిమీదికి శాపం రాబోతుంది.

 

ఇప్పుడు వీరంతా పోతే ఎవరు ఉంటారు? చూడండి ఎవరెవరు పోయారో ; శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను, సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులు! వీరంతా పోతే ఎవరున్నారు? కేవలం సామాన్య జనులు, పేదలు మాత్రమే ఉన్నారు!

 

దేవుడు అప్పుడు చెప్పారు- నిజంగానే కొన్ని సంవత్సరాలు గడిచాక యూదా రాజ్యం పట్టబడ్డాది. BC 587 యెరూషలేము పట్టబడి, 584లో కాల్చబడింది. అప్పుడు ఎవరు మిగిలారో చూసుకుందాం! యిర్మీయా 52:1516

15 మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.

16 అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజర దాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.

 

వీరు మాత్రమే మిగిలారు! మిగిలిన వాళ్ళంతా పిట్టల్లా రాలిపోయారు!

దేవుడు చెప్పారు! చేసి చూపించారు!

కాబట్టి దేవుడు చేసిన వాగ్ధానాలు దేవుడు చెప్పిన విషయాలు దేవుని వాక్యమును నమ్మి ముందుకు పో! సంశయించకు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*167వ భాగము*

యెషయా 3:49

4. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

5. ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.

6. ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును

7. అతడు ఆ దినమున కేకవేసినేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.

8. యెరూషలేము పాడైపోయెను యూదా నాశన మాయెను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయు నంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి.

9. వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ

 

              ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేస్తున్నాము!

 

                   (గతభాగం తరువాయి)

 

    దేవుడు యూదా వారి సౌలభ్యం మరియు సహాయం యొక్క అన్ని వనరులను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారు అని గతభాగాలలో చూసుకున్నాం!. ఇంతవరకు ఆహారాన్ని నీటిని యోధులను శూరులను  న్యాయాధిపతులను ప్రవక్తలను అధికారులను సైనికులను చెడుపు గాళ్లను మంత్రులను రాజులను అందరినీ ఏరేశారు దేవుడు! ఇప్పుడు కేవలం  సామాన్య జనులలో కొందరు మాత్రమే మిగిలారు దేశంలో! ఇక నగరం మరియు భూమి మొత్తం బంజరు భూములుగా మారాయి, వారి తిరుగుబాటు మాటలు మరియు ప్రభువుకు వ్యతిరేకంగా చేసిన పనుల పర్యవసానంగా, అతని పవిత్ర ఆలయంలో కూడా కాలిపోయింది!  ప్రజలు తమ గురి, లక్ష్యం  దేవునిపై ఆధారపడడంలో విఫలమైనప్పుడు, దేవుడు త్వరగా అన్ని ఇతర మద్దతులను తొలగిస్తారు , వారిని నిరాశకు గురిచేస్తాడు. ఆధ్యాత్మిక పోషణ మరియు జీవనోపాధికి మూలమైన క్రీస్తు జీవపు రొట్టె మరియు జీవ జలం వంటివాడు. మనము ఆయనను మన పునాదిగా చేసుకున్నట్లయితే, అది తీసివేయబడని అమూల్యమైన ఆస్తి అని మనము కనుగొంటాము యోహాను 6:27.

 

ఇక్కడ మూడు విషయాలు గమనించాలి!

 

1. పాపుల విచారకరమైన స్థితి నిజంగా భయంకరంగా ఉంది.

 

2. గాని నిజానికి పాపం వల్ల కలిగే నష్టాన్ని భరించేది ఆత్మ.

 

3. చివరికి పాపులు తమకు ఎదురయ్యే ఆపదలకు పూర్తి బాధ్యత వహిస్తారు.

 

ఇక మన పాఠానికి వస్తే 4వ వచనంలో

4. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

5. ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును

    గమనించాలి మీదన చెప్పిన విధంగా అప్పటికే అధికారులు గాని రాజులు గాని సైనికులు గాని న్యాయాధిపతులు గాని లేవు లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. ఇప్పుడు పిల్లలే బాలులే పాలించడం మొదలుపెట్టారు. వారిలో ఒకడు ఇలా అంటాడు మరొకడు అలా అంటాడు. చివరికి ఒకరికి ఒకరికి పొదగకుండా అస్తవ్యంగా ఉంటుంది దేశం! వారు బాల చేష్టలతో ప్రజలను పిచ్చెక్కిస్తూ ఉంటారు! ఒకసారి ఆగి ఆలోచిస్తే ప్రపంచంలో అనేకసార్లు ఇలా జరిగింది! అనేకదేశాలలో యుద్ధాలు అనంతరం కొన్ని ప్రాంతాలలో అధికారులు సైన్యం ఎవరూ లేనందువలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా కరోనా వచ్చి కొన్ని దేశాలలో అధికారులు సైనికులలో అనేకమంది చనిపోయినప్పుడు ఇలాంటి పరిస్తితులే ఏర్పడ్డాయి. అప్పుడు ఇలాంటి పిల్లలే కొంతవరకు ఏలారు! కొన్నిచోట్ల దోపుడు దొంగలు రాజ్యమేలారు! రౌడీలు రాజ్యమేలారు! ఇది అనేకదేశాలలో ఇప్పటికే జరిగింది. కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ఇప్పటికీ జరుగుతుంది. ఇశ్రాయేలు దేశంలో/ యూదా రాజ్యంలో ఆ రోజులలో జరిగింది. యిర్మీయా గ్రంధం చివరిలో మచ్చుకు జరిగిన స్టోరీ ఒకటి కనిపిస్తుంది మనకు! అయితే అది జరుగక ముందే యెషయా గారు కళ్ళకు కనబడినట్లు ముందుగానే చెప్పారు! దానికి కారణం కూడా క్రింద వచనాలలో కనిపిస్తాయి మనకు!

 

ఇంకా క్రింద వచనాలు చూసుకుంటే దేశం ఎంతటి దుర్భరమైన స్థితిలోకి వెళ్లిపోతుందో చెబుతున్నారు!

 

6. ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును

7. అతడు ఆ దినమున కేకవేసినేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.

 

చూడండి దేశము వట్టిపోయింది అధికారులు సైన్యము లేరు! సామాన్యప్రజలే మిగిలారు! మిగిలిన ప్రజలకు కూడా తినడానికి ఆహారం గాని త్రాగడానికి నీరు గాని లేదు! ఆ పరిస్థితి ఫలితంగా అరాచకం, అల్లకల్లోలం చెలరేగుతాయి. ఎవడికి వాడు ఎదుటివాణ్ణి అణచివేసేందుకు ప్రయత్నిస్తాడు. విచారకరమైన సంగతి ఏమంటే సహజంగా మనుషులు తమ సాటివారిపై పెత్తనం చెలాయించడానికే అస్తమానం చూస్తుంటారు. అయితే జెరుసలం నాశనమయ్యే రోజుల్లో ఆ బాధ్యతను ఎవరూ నెత్తిన వేసుకోరు  ఇలాంటి దుర్భరమైన పరిస్తితులలో ఒకడు తన సహోదరుడిని చూస్తాడు. అతనికి వేసుకోడానికి బట్టలు ఉన్నాయి. గాని వీరికి బట్టలు కూడా లేవు! అప్పుడు బట్టలు లేని వాడు బట్టలున్న తన సోదరుని చూసి బ్రదర్ నీకు వేసుకోడానికి బట్టలున్నాయి కాబట్టి నీవే ఇప్పుడు మనకు ఆధికారిగా ఉండవా అని బ్రతిమిలాడుతాడు! చూడండి ఎంత ఘోరమో!  అనగా వేసుకోడానికి బట్టలు కూడా లేనంత ఘోరంగా తయారయ్యింది దేశం! వెంటనే వాడు అనగా బట్టలున్న సహోదరుడు అయ్యబాబోయ్! నన్ను మాత్రం అధికారిగా పెట్టొద్దు! నాకు బట్టలున్నాయి గాని తినడానికి తిండే లేదు నాకు, బాబ్బాబు నన్ను అధికారిగా గాని జనముల అధిపతిగా గాని నన్ను పెట్టొద్దు అని బ్రతిమాలుకుంటాడు అన్న తమ్ముణ్ణి!! ఇంతటి భయాంకరమైన పరిస్తితులు రాబోతున్నాయి అని చెబుతున్నారు ఇక్కడ!

 

ఇక ఎనిమిదవ వచనం చూసుకుంటే  8. యెరూషలేము పాడైపోయెను యూదా నాశన మాయెను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయు నంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి.

 

తన ప్రజలను అంత కఠినంగా ఎందుకు శిక్షించవలసి వచ్చిందో దేవుడు వివరిస్తున్నాడు. వారు ఏ విత్తనాలను చల్లారో ఆ పంటనే కోసుకోవడం న్యాయసమ్మతమే (వ 9,11; కీర్తనల గ్రంథము 18:25-26; గలతియులకు 6:7-8). దేవునికి వ్యతిరేకంగా వారు తిరగబడినందువల్ల పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదంలో వారున్నారు.

 

కీర్తనల గ్రంథము  18

25. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

26. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

 

గలతియులకు  6

7. మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.

8. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును

గమనించాలి ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదు మనకు కూడా అనగా విశ్వాసులకు కూడా వర్తిస్తుంది అని గ్రహించాలి!

 

9 వ వచనం: 9. వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ

 

సిగ్గుపడవలసిన పనులనేకం చేశారు గానీ వాటివల్ల వారికేమీ సిగ్గు కలగలేదు. అందుకని దేవుడే వారిని సిగ్గుపరుచ బోతున్నారు అన్నమాట!

 

కాబట్టి మనం కూడా మనలను మనం పరిశీలించు కుందాం! దేవునికి ఆయాసకరమైనవి మనలో ఏమైనా ఉంటే వాటిని మానేసి లేక తీసేసి దేవునితో సమాధాన పడుదాం! పరలోక రాజ్యం చేరుదాం!

 

దైవాశీస్సులు!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*168వ భాగము*

 

యెషయా 3:1015

10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.

11. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.

12. నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు

13. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు

14. యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది

15. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేస్తున్నాము!

 

                   (గతభాగం తరువాయి)

 

    చూడండి ఇంతవరకు ఎంతటి దుర్భరమైన పరిస్తితులు యూదా రాజ్యము మీదికి రాబోతుందో చెప్పారు! అయితే 10 వ వచనంలో అంటున్నారు మీకు మేలు కలుగబోతుంది అని నీతిమంతులతో చెప్పండి. నీతిమంతులు తమ క్రియాల ఫలము అనుభవిస్తారు అంటున్నారు. అయితే 11వ వచనంలో దుష్ట కార్యాలు చేస్తున్న ఓ దుష్టులారా! మీకయితే శ్రమ కలుగబోతుంది. మీరు మీ క్రియల ఫలం పొందుకుంటారు అంటున్నారు! ఇక్కడ నీతిమంతులకు నీతిమంతుల ఫలము కలుగబోతుంది. దుష్టులకు దుష్టులకు తగిన ఫలము పొందబోతుంది అంటున్నారు!

 

ఈ విపత్తులను ప్రకటించే ప్రవచనాలన్నిటి మధ్య దేవుని నిజ సేవకులకు ఒక అద్భుతమైన ప్రోత్సాహం ఉంది. దుర్మార్గం మధ్య మనం ఉన్నప్పుడు దీన్ని మనసులో ధ్యానించుకుందాం. న్యాయసమ్మతమైన జీవితానికీ, దుష్ట జీవితానికీ కలిగే ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని బైబిల్లో అన్ని చోట్లా ఉంది. ఈ సత్యాన్ని 37వ కీర్తన చక్కగా విప్పి చెప్తున్నది.

 

అయితే దేవుడు చెబుతున్నారు ప్రతివానికి వానివాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు!

 

కీర్తన 62:12

ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.

 

రోమీయులకు 2:6

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

రోమీయులకు 2:7

సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

రోమీయులకు 2:8

అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

రోమీయులకు 2:9

దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.

రోమీయులకు 2:10

సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

 

2 కోరింథీ 5:10

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

 

2కోరింథీయులకు 11:15

గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

 

ప్రకటన 18:6

అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

 

ప్రకటన గ్రంథం 20:12

మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

ప్రకటన గ్రంథం 20:13

సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

 

     కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు నీక్రియలను పరిశీలన చేసుకో! నీవు చేసే ప్రతీ పనికి ఒకరోజు తీర్పు ఉంది చివరికీ నీవు మాట్లాడే ప్రతీ మాటకు కూడా విమర్శ దినమందు లెక్క చెప్పాలి అని దేవుడే చెబుతున్నారు.

మత్తయి 12:36

నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

 

ఇక దుష్టులకు శ్రమ అని బైబిల్ లో అనేకచోట్ల ఉంది

 

యెషయా 26:10

దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

 

యెషయా 48:22

దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

 

యెషయా 57:21

దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.

 

ఇక 12వ వచనంలో దర్శనంలో యెషయా గారు చాలా బాధపడుతున్నారు దర్శనంలో భవిష్యత్ చూస్తూ:

12. నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు

 

ప్రజలను నడిపించడమంటే అదొక భయం పుట్టించే బాధ్యత. నాయకులైన వారంతా తాము ప్రజలకు మార్గం చూపిన రీతిని గురించి దేవునికి సంజాయిషీ ఇచ్చుకోవాలి (వ 14,15).

 

14. యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది

15. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

అయితే విచారకరమైన విషయమేమిటంటే నాయకులే ప్రజలను త్రోవ తప్పిస్తున్నారు యెషయా  9

16. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మింగివేయబడు దురు.

 

యిర్మియా  50

6. నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.

 

అందుకే ఏసయ్య కనికరపడి తన శిష్యులను సువార్త కోసం పంపినప్పుడు అంటున్నారు

 

మత్తయి  10

6. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.

 

ఇశ్రాయేలు ప్రజలను నాయకులు అధిపతులు రాజులు చివరికి యాజకులు ప్రవక్తలు కూడా త్రోవ తప్పించినందుకు దేవుడే భూమిమీదికి వచ్చి అంటున్నారు నశించిన నా గొర్రెల యొద్దకు వెళ్ళండి అంటున్నారు!

 

ఇక 13 వ వచనంలో అంటున్నారు: పెద్దలు  అధిపతులు నాయకులు   నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. అందుకే మీ పక్షంగా  యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు అంటున్నారు! కీర్తనల గ్రంథము  82

1. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.

 

మనము యిర్మీయా గ్రంధములో ఇంకా యెహోజ్కేలు గ్రంధంలో దేవుడు తనప్రజల  పక్షంగా దొంగ ప్రవక్తలతోనూ అధికారులతోనూ వాదించడం మనం చూస్తున్నాం! గతభాగాలలో మనం వాటిని ధ్యానం చేసుకున్నాం! ..

 

ఇక 14, 15 వచనాలలో కూడా దేవుడు తన ప్రజల పక్షముగా వాదిస్తున్నారు 14. యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది

15. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

చూడండి మాదిరిగా ఉండాల్సిన మీరే ప్రజల యొక్క ద్రాక్ష తోటలను తినేశారు దరిద్రులను దోచుకున్నారు ఆ సొమ్ము ఇంకా మీ ఇండ్లలోనే ఉన్నది నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేస్తారు, బీదల ముఖాలను నూరినంతగా వారిని నూరి మీరేమి చేస్తారు అని యెహోవా అడుగుచున్నాడు!!!

 

ప్రజలను తప్పుదోవ పట్టించడమేగాక నాయకులు దేవుని పనిని కూడా భంగపరిచారు. పేదలను పీడించి కొల్లగొట్టారు. పేదల విషయంలో దేవునికి జాలి, సానుభూతి ఉన్నాయి. వారికేం జరగబోతున్నదో ఆయన చూస్తాడు. వారి విషయమై పగ తీర్చుకుంటాడు (

 

కీర్తనల గ్రంథము 12:5;

5. బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

కీర్తనల గ్రంథము 35:10;

10. అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.

 

 కీర్తనల గ్రంథము 37:14-15;

14. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి యున్నారు

15. వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.

 

కీర్తనల గ్రంథము 72:12-14

12. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.

13. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును

14. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.

 

కాబట్టి దేవుడు పేదల పక్షంగా దీనుల పక్షంగా దరిద్రులు దిక్కులేని వారు విధవరాళ్ళ పక్షంగా తప్పకుండా వాదిస్తారు.  ఈ విషయం మరచిపోవద్దు! దేవుడు దీనులు పేదల విదవరాళ్ళు దిక్కులేని వారి పక్షపాతి ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించమని ప్రభువు పేరిట ప్రేమతో హెచ్చరిస్తున్నాను!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*169వ భాగము*

యెషయా 3:1623

16. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

17. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.

18. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను

20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేస్తున్నాము!

 

                   (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా ఇంతవరకు- ఇశ్రాయేలు ప్రజలు అధికారులు రాజులు చేసిన దుష్టకార్యాలు కోసం చూసుకున్నాము! ఇక ఈ 16 వ వచనం నుండి చివరి వరకు స్త్రీలు ఎంత ఘోరంగా తయారయ్యారో దానికి దేవుని శాపం ఏమిటో చూసుకుందాం!

 

ఇక్కడ 16 వ వచనంలో అంటున్నారు సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

 

దీనిని మొట్టమొదటగా అక్షరాను సారమైన అర్థం చూసుకుందాం!

 

చూడండి స్త్రీలలో మొదటగా గర్వం ఉంది, రెండవది పనికిమాలిన షోకులు ఎక్సట్రాలు ఎక్కువై పోయి వారి ప్రవర్తనే మారిపోయింది. మెడచాచి నాడుస్తున్నారు, ఇటుఅటు ఓర చూపులు చూస్తున్నారు, ఇంకా కాళ్లకున్న గజ్జలు జల్లుజల్లుమణి గల్లుగల్లుమని మ్రోగించుకుంటూ ఆడంభరంగా నడుస్తూ వెళ్తున్నారు!

ప్రియులారా యెషయా 2:11-17 లో గర్వం, అహంకారం, తలబిరుసుతనం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో చూశాం. ఇక్కడ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఈ ప్రవర్తనకు లోనయ్యారని చూస్తున్నాం. వీరికి ఇంకా ఘోరంగా తయారయ్యారు. మెడచాచి నడవడం ఓర చూపులు చూడటం! కాళ్లకున్న గజ్జెలు  గల్లుగల్లుమని అనేలా వెళ్తున్నారు! అందుకే 17 వ వచనంలో సీయోను కుమార్తెల నడినెత్తి బోడిచేసేస్తాను అంటున్నారు!

 

ఎక్కడెక్కడ తలబిరుసుతనం ఉంటుందో అక్కడే దేవుడు దాన్ని అణచివేస్తాడు. తన స్వంతప్రజల్లో అది కనిపించడం దేవునికి మరింత అసహనాన్ని కలిగిస్తుంది. వారు విధేయత, మృదుత్వం, అణకువ కలిగి అందరికీ ఆదర్శంగా ఉండవలసిన వారు కదా. ఈ భాగాన్ని 1 తిమోతికి 2:9-10; 1 పేతురు 3:1-6 తో పోల్చి చూడండి.

 

మెడచాచి నడవడం అంటే గర్వం చూపడం. మెడచాచి నడిచేది జీబ్రా. అది ఎత్తుగా ఉన్న చెట్ల యొక్క కొమ్మలను ఆకులను తినాలనే ఆశ దానికి!  మరి ఈ స్త్రీలకు ఎందుకు మెడచాచి నడవడం? ఎందుకంటే ఎవరైనా నన్ను నా షోకును నా అందాన్ని చూస్తున్నారా లేదా అని పాడు బుద్ది! వీరిలో యెజెబేలు ఆత్మ పనిచేస్తుంది అని గత శీర్షికలలో చూసుకున్నాం! నీ అందరం సౌందర్యం నీ భర్త కోసమే కదా! పరపురుషుడు నిన్ను చూడాల్సిన అవసరం ఏముంది? అసలు పరపురుషులు నిన్ను చూసి ఆశించాలి నిన్ను చూసి కన్ను తిప్పుకోకుండా చూడాలి అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీలో యెజెబేలు కున్న వ్యభిచార ఆత్మ సాతాను గాడు నీలో పనిచేస్తున్నాడు కనుక !

 

ఇంకా ఓర చూపులు చూసేవారు! ఇది కూడా యెజెబేలు మరియు వ్యభిచార ఆత్మ ఉన్నవారిలో పనిచేసేదె ! గమనించాలి- దేవుడు చెప్పారు- నీ చూపు తిన్నగాను సూటిగాను ఉండాలి అన్నారు, గాని ఈ సీయోను కుమార్తెలు ఓర చూపులు చూస్తూ నడుస్తున్నారు, ఎందుకంటే ఎవడైనా నన్ను నా షోకును అందాన్ని చూస్తున్నారా లేదా అంటూ!! సామెతలు 4:25,26 ,27 ..

 25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

26. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.

27. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.

 

చూడండి దేవుడు చెప్పినది ఒకటి వీరు చేసేది ఒకటి!

 

అందుకే వీరి తలలు బోడి చేసేస్తాను అంటున్నారు! ఏమండీ తలలు బోడి చేయడం ఏమిటి? ఎందుకంటే స్త్రీలు తమ కున్న పొడవైన జుట్టుని చూసి గర్విస్తూంటారు ఇంకా కొంతమంది తమ జుట్టుని ఒకటి కాదు రెండు కాదు వందల వందల జాడలు వేసుకుంటూ ప్రజలు తమను చూసి ఆకర్షించుకుని అందరినీ ఆకట్టు కోవాలి అనుకుంటారు! ఇంకా ఆ జుట్టుమీద విగ్రహాలకు చెందిన అలంకారాలు ఆభరణాలు వేసుకోవాలని కొందరు! ఇలా విర్రవీగుతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఇప్పుడు ఈ సీయోను కుమార్తెల గర్వాన్ని అణిచి వారి తలలను బోడిచేసేస్తాను అంటున్నారు! మనకు తెలుసు- బోడిగుండు కొట్టించుకున్న పురుషులను చూడగలము గాని బోడిగుండు చేయించుకున్న స్త్రీని అసలు చూడలేము! అందుకే దేవుడు ఇలా డిసైడ్ చేశారు!

 

ఇక తర్వాత వారి మానమును బయలు పరుస్తాను అంటున్నారు! వారియొక్క దిసమొల అందరికీ కనబడేలా వారిమానమును కప్పే బట్టలు తీసేస్తాను అంటున్నారు! ఇది ఏ పరిస్తితులలో జరిగే అవకాశం ఉంది అంటే అయితే వారు భయంకరమైన త్రాగుబోతులుగా మరియు వంటిమీద బట్టలున్నాయో లేదో చూసుకోలేనంత ఘోరమైన మత్తులో ఏడుస్తారు, లేదా భయంకరమైన వ్యాధి పెట్టి వంటిమీద బట్టలున్నాయో లేదో చూసుకునే ఓపిక స్పృహ లేనంతగా దేవుడు వారిని  వ్యాధి గ్రస్తులుగా చేస్తారు. లేదా శత్రువులు వచ్చి వారిని అవమాన పరుస్తారు! ఏ మూడింటిలో ఏదో ఒకటి ఈ సీయోను కుమార్తెలకు జరుగబోతుంది. ఎందుకంటే సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

 

అందుకే ఈ శిక్ష!!!

 

ఇక ఆధ్యాత్మిక అర్ధం చూసుకుందాం!

మొదటగా  సీయోను కుమార్తె అనగా రక్షించబడిన సంఘము! ఇంకా సీయోను అనగా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం గల విశ్వాసి! అయితే ఇప్పుడు రక్షించబడిన సంఘములో, ఉన్నతమైన సీయోను అనుభవంలో ఉన్న ఈ విశ్వాసి సీనియారిటీ పెరిగాక గర్వము పెరిగిపోయి శరీరాస, నేత్రాస జీవపుడంభము కలిగి ఓరచూపులు- లోకము వైపు చూపులు, వ్యభిచారపు చూపులు ప్రవేశించాయి. ఇంకా తలంపులలో కూడా వ్యభిచారపు తలంపులు వచ్చేశాయి. లోకమును ఆశించి ఓరచూపులు చూడటం మొదలుపెట్టింది. తద్వారా భ్రష్టత్వము నెమ్మదిగా ప్రవేశించింది.

 

ఇక అందుకే సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేస్తాను అంటున్నారు దేవుడు. సీయోనులో దాఖలా చేయబడిన వారికి పరిశుద్ధులు అని పేరు పెట్టబడును అని బైబిల్ సెలవిస్తుంది.

 మరి ఈ పరిశుద్ధులు తమ తలమీద దేవుని అభిషేకం కలిగిఉన్నారు. దావీదు గారు ఆ అభిషేకం పొందుకున్నారు. మరణం వరకు నమ్మకంగా జీవించి కడవరకు కాపాడుకున్నారు. అయితే అదే అభిషేకం పొందుకున్న సమ్సోను గారు వ్యభిచారంలో పడి కళ్లు పీకించుకుని బోడిగుండు కొట్టించుకున్నారు, తద్వారా ఉన్న అభిషేకం మరియు దేవుడిచ్చిన బలం కోల్పోయారు. ఇప్పుడు సీయోను కుమార్తె లేక సీయోను అనుభవంలో ఉన్న విశ్వాసి ఓరచూపులు చూడటం వలన లోకము వైపు వ్యభిచారం వైపు, వ్యభిచార తలంపుల వైపు తిరిగితే నడినెత్తి బోడి అనగా తలమీద నున్న అభిషేకాన్ని తీసివేస్తారు జాగ్రత్త!!! అభిషేకం పోయిందా సీయోను లో ఉండకుండా పతనమైపోతావు జాగ్రత్త!!!

 

ప్రియ సహోదరీ! విశ్వాసి! నీవు కూడా ఇలాంటి స్తితిలో ఉంటే నీకు కూడా ఇదే గతి అని మర్చిపోకూ!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*170వ భాగము*

 

యెషయా 3:1623

16. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

17. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.

18. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకులను

20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేస్తున్నాము!

 

                   (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా 16 వ వచనం నుండి చివరి వరకు స్త్రీలు ఎంత ఘోరంగా తయారయ్యారో దానికి దేవుని శాపం ఏమిటో చూసుకుంటున్నాం !

 

అలా తయారయ్యారు కాబట్టి చూడండి ఇప్పుడు దేవుడు ఎలాంటి శాపం పెడుతున్నారో- గతభాగంలో తలబోడిచేసి, మానం కనబడేలా చేస్తాను అన్నారు! ఇక 18 నుండి చివరవరకు చూసుకుంటే వారినుండి చాలా దూరం చేస్తాను అంటున్నారు. ఇవన్నీ వారు చేసే షోకులలో భాగాలే!

 

మొదటగా అక్షరానుసారమైన అర్థం చూసుకుందాం!

 

మూడవది: గల్లుగల్లుమను వారి పాద భూషణములను:  పాద భూషణాలు అనగా పాదాలకు వేసుకునే కాళ్ళ పట్టీలు మరియు కాళ్ళ కడియాలు (పూర్వకాలంలో మా పల్లెటూరి స్త్రీలు వేసుకునే వారు, ఇప్పుడు కూడా కొన్ని జాతుల వారు వేసుకుంటున్నారు)

 

నాల్గవది: సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను- మరి నాకు వీరి భాష అంతగా తెలియదు- చంద్ర వంకలు సూర్య వంకలు పాపిడి బిళ్ళలు లాంటివి కావచ్చు! ఇంకా ఈజిప్ట్ వారు పాము బొమ్మలు తలలో అలంకరించు కుంటారు. ఇలాంటివి అన్నీ తీసేస్తాను అంటున్నారు!

 

ఐదవది: . కర్ణభూషణములను,  కర్ణము అనగా చెవి! చెవికి తగిలించు కునే నానా చెత్తాచెదారం! అనగా చెవి దిద్దులు, రింగులు, రకరకాలైన ఆభరణాలు!

 

ఆరవది: కడియములను- చేతికి గాని కాళ్ళకు గాని వేసుకునే ఏవిధమైన కడియాలు గాని తీసేస్తాను అంటున్నారు! బ్రాసలేట్ చైన్లు అన్నమాట!

 

ఏడవది : నాణమైన ముసుకులను- మన భారతదేశంలోనూ ఇంకా ఇతర దేశాలలోనూ రకరకాలైన ముసుకులు స్కార్ప్ లు, చున్నీలు, వెయిల్స్, (అయ్యా నాకు స్త్రీల షోకులు, వేసుకునే అలంకారాలు ఆభరణాలు కోసం అంతగా తెలియదు, తెలిసిన కొన్ని మాత్రమే రాస్తున్నాను)

 

ఎనిమిదవది : కుల్లాయీలను- ఒకరకమైన శేర్వానీ టైపు, ఇంగ్షీషు లో bonnets అంటారు.

 

9: కాళ్ల గొలుసులను- వివిధ రకాలైన కాళ్ళకు వేసుకునే ఆభరణాలు

 

10: ఒడ్డాణములను- మీకు తెలుసు- నడుముకి చుట్టూ వేసుకునే బంగారం గాని మరేదైనా ఆభరణాలు

 

11: పరిమళ ద్రవ్యపు బరిణలనుదీనికోసం నాకు అంతగా తెలియదు గాని బహుశా- టాయ్లెట్ కిట్  మరియు మేకప్ కిట్, ఈ షోకు చేసుకోడానికి అవసరమయ్యే ప్రతీ దానిని దాచుకునే చిన్న పెట్టెలు కావచ్చు

 

12: రక్షరేకులను- తాయెత్తులు తావీదులు

 

13: ఉంగరములను- ఏ విధమైన ఉంగరాలైనా తీసేస్తాను అంటున్నారు దేవుడు- అది పెళ్లి ఉంగరమా లేక మరో ఉంగరమా లేక వెండి బంగారమా అని కాదు, దేనినైనా సరే- తీసేస్తాను- వేసుకునే వారిని ఏరేస్తాను అంటున్నారు దేవుడు!

 

14: ముక్కు కమ్ములనుచూడండి మన దేశంలో కూడా చాలా విస్తారంగా వేసుకుంటారు, ముఖ్యంగా మహారాష్ట్ర వారు ఎక్కువగా వేసుకుంటారు! పూర్వకాలంలో ముసలివాళ్ళు ఎక్కువగా వేసుకునే వారు

 

15: ఉత్సవ వస్త్రములను- అచ్చమైన స్పష్టమైన భాషలో చెప్పాలంటే పార్టీ వియర్స్ పార్టీకి పెళ్లిళ్లకు వెళ్ళడానికి పనికొస్తాయని ఖరీదైన బట్టలు వివిధమైన షోకుల బట్టలు కొంటున్నావా- తీసేస్తాను అంటున్నారు దేవుడు- జాగ్రత్త!

 

16: ఉత్తరీయములను- బహుశా- బుజాల మీద వేసుకునే అందమైన బట్టలు- చున్నీ టైపు కావచ్చు!

 

17: పైటలను- మన భారతదేశంలో అనేక రకాలైన పైటలు వేసుకుంటున్నారు- సౌత్ ఇండియన్ స్టైల్, గుజరాతీ స్టైల్, మార్వాడీ స్టైల్, కుడి పైట, ఎడమ పైట  అమ్మో అమ్మో చెప్ప లేనన్ని స్టైల్ లు, ఇవన్నీ తీసేస్తాను అంటున్నారు! ఎప్పుడూ?---  నీలో గర్వము అహంకారము కలిగి నన్ను చూడు నా అందము చూడు నా షోకు చూడు అని వీటిని ధరిస్తే! నీ స్టేటస్ చూపించుకోడానికి ధరించేవి ఏదైనా సరే- తీసి పారేస్తాను అంటున్నారు దేవుడు!

 

18: సంచులను- అమ్మా- హ్యాండ్ బ్యాగ్ లు కూడా తీసేస్తాను అంటున్నారు దేవుడు

 

19: చేతి అద్దములను- అనగా షోకు చేసుకోడానికి ఎక్కడికైతే అక్కడికి తీసుకుని వెళ్తుంటారు కదా చిన్న చిన్న మిర్రర్ లు!

 

20: సన్నపునారతో చేసిన ముసుకులను- రకరకాలైన వెయిల్స్ అన్నమాట

 

21: పాగాలను శాలువులను తీసివేయును.

 

చూశారా వేటివేటిని తీసేస్తాను అంటున్నారో- మరి ఏమిస్తారు అట: 24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

 

నీవు వేసుకునే సెంట్ కి బదులుగా కుళ్ళి కాలువ లేక మున్సిపాలిటీ కాలువ లోని మురుగు నీరు నీ నెత్తిమీద వేస్తాను అంటున్నారు! వడ్డాణం కి బదులుగా లావైన తాడు, అల్లిన జడకు బదులుగా బోడి గుండు ప్రశస్తమైన వస్త్రాలకు బదులుగా గోనె బట్ట, అందమునకు బదులుగా వాతలు ఉంటాయి! ఇంతవరకు నన్ను చూడు నా అందం చూడు అని మురిసిపోయావు కదా- ఇప్పుడు బోడుగుండు చేసి నీకు ఒళ్ళంతా వాతలు పెట్టి పంపుతాను అంటున్నారు!  జాగ్రత్త!!

 

ప్రియ సహోదరీ! సహోదరుడా! నీ అందాన్ని షోకుని చూసి మురిసి పోతున్నావా? క్రైస్తవురాలవు అని మర్చిపోయి నగలు వేసుకుని సింగారించుకుని సెంటులు పూసుకుని అతి ఖరీదైన చీరలు బట్టలు వేసుకుని నీ స్టేటస్ చూపించుకుందాం అని అనుకున్నావా ఖబడ్దార్!!! సీయోను కుమార్తెలనే వదలలేదు నిన్ను కూడా వదలరు జాగ్రత్త!

 

ఇక ఆధ్యాత్మిక అర్థం చూసుకుందాం! గతభాగంలో చూసుకున్నాము - ఈ విశ్వాసి Already సీయోను కుమార్తె అనగా సీయోను అనుభవం అనగా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉంది, అనగా రక్షించబడి, ఆత్మాభిషేకం పొందుకుని, సంపూర్ణత సాధించిన ఈ విశ్వాసిలో ఇప్పుడు లోకము ప్రవేశించి లోకపుటాశలు లోకము వైపుకి లాగి ఓరచూపులు వచ్చేశాయి. ఇంకా ఇప్పుడు ఘళ్లుఘళ్లుమనే నడక వచ్చేసింది అనగా దేవుని దృష్టిలో విపరీతమైన నడక నేర్చుకుంది. నిజానికి దేవుడు ఈ విశ్వాసికి పట్టీలు అనగా ఎక్కడికి వెళ్లినా‌ దేవుని వాసన, సువార్త‌ సువాసన గల నడక, ఆత్మీయ‌నడక దేవుడిచ్చారు. ఆ విశ్వాసిని చూచిన వెంటనే ఆ వ్యక్తి దేవుని బిడ్డ అని అర్ధమవుతుంది. గాని ఇప్పుడు విపరీతమైన నడక అనగా విపరీతమైన ప్రవర్తన వచ్చేసింది ఈ విశ్వాసికి. దేవుడు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారో అక్కడికి వెళ్లడం, ఏమి చేయవద్దు అన్నారో దానిని ఏ కారణం వలననో తెలియదు లేక దురభిమాన పాపం వలననో తెలియదు కానీ ఆ కాని ప్రవర్తన కలిగి దేవుడు చెయ్యవద్దు అన్న పనులు చేయడం మొదలయ్యింది. అందుకే ఇప్పుడు ఆ పట్టీలు తీసివేస్తాను అంటున్నారు అనగా సువార్త ప్రకటించే అనుభవం, ఎక్కడైనా ఆ వ్యక్తిపై దేవుడిచ్చిన ప్రత్యేకమైన అభిషేకమును దేవుడు ఇప్పుడు తీసివేస్తున్నారు.

 

ఇక తర్వాత సూర్యభింభ భూషణాలు అనగా పాపిట బిల్లలు లాంటివి, అనగా తలపై నున్న అభిషేకం, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం తీసివేస్తాను అంటున్నారు. ఇంకా ప్రకటన గ్రంథం ప్రకారం దేవుడిచ్చిన ప్రత్యేకమైన పేరు కోల్పోబోతున్నారు ఈ విశ్వాసులు; దేవుడిచ్చిన ప్రత్యేకమైన వరాలు ఫలాలు అభిషేకం కోల్పోయినందువలన పోగొట్టుకుంటారు ఇప్పుడు.

 

ఇక చంద్రబింభ బూషణాలు దేవుని కృపను పోగొట్టుకోబోతున్నారు.

 

కర్ణ భూషణాలు అనగా దేవునిమాటను వినే అనుభవాన్ని కోల్పోబోతున్నారు.

 

ఇక చేతి కడియాలను అనగా దేవుని ఆధ్యాత్మిక బలమును పోగొట్టుకున్నారు. విశ్వాసికి ఉన్న దృఢమైన విశ్వాసాన్ని కోల్పోయారు.

 

ముసుకు-  క్రీస్తు కృప కింద ఉండే భాగ్యములను, దేవుని కాపుదల మరియు మరుగును, ఇంకా తగ్గింపు జీవితాన్ని పోగొట్టుకుంటారు.

 

కుళ్లాయి/ కవచం అనగా దేవుని రక్షణ వస్త్రమును పోగొట్టుకున్నారు.

 

ఒడ్డాణము పెళ్ళి కుమార్తె ధరిస్తుంది ఇప్పుడు అది పోతుంది అనగా గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొనే అర్హత కోల్పోతావు.

 

వివిధమైన భరిణె - పరిమళ ద్రవ్యం- సీయోను కుమార్తె సాక్ష్యం- పరిశుద్ధ జీవితం వలన పొందుకున్న సాక్ష్యమును కోల్పోయారు.

 

ఉంగరం- దేవుడిచ్చిన ఘనతను కోల్పోబోతున్నావు.

 

ఇక పైటలు ఉత్తరీయాలు- దేవుని రక్షణ వస్త్రము దేవుడిచ్చిన పెండ్లివిందుకైన వస్త్రాలు అనగా అవి పరిశుద్ధుల నీతి క్రియలను కోల్పోతావు.

 

 సంచులు - దేవుడు మనకు పరిశుద్ధాత్మను సంచకరువు అనగా డిపాజిట్ గా పెట్టారు ఈ వ్యక్తి నా వాడు అని. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే డిపాజిట్ ని కోల్పోతున్నావు.

 

ఇక అద్దము- దేవుని వాక్యము. వాక్యపు అనుభవాన్ని కోల్పోయారు.

 

ఇదంతా ఎప్పుడు జరిగింది లేక జరుగుతుంది?! విశ్వాసి నడక చూపులు ప్రవర్తన మారిపోయినప్పుడు! ప్రియ రక్షణ పొందిన సహోదరి సహోదరుడా! నీ నడక ప్రవర్తన చూపులు ఎలా ఉన్నాయి!!! బిలాము గారితో దేవునిదూత ఏమంటున్నాడు- నీ నడక దేవుని దృష్టిలో విపరీతంగా ఉంది అందుకే చంపడానికి వచ్చాను అని. ఇప్పుడు నీ నడక ప్రవర్తన సరిచూసుకొని సరిచేసుకుంటావా!!!

 

సరే- ఇంతకీ దేవుని బిడ్డలు స్త్రీలు ఎలా ఉండాలి? తర్వాత భాగంలో చూసుకుందాం!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*171వ భాగము*

 

యెషయా 3:1825

18. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను

20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

25. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు

26. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేస్తున్నాము!

 

                   (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా 16 వ వచనం నుండి చివరి వరకు స్త్రీలు ఎంత ఘోరంగా తయారయ్యారో దానికి దేవుని శాపం ఏమిటో చూసుకున్నాం ! ఇంతకీ దేవుని బిడ్డలు స్త్రీలు ఎలా ఉండాలి? అనేది చాలా క్లుప్తంగా ఈరోజు చూసుకుందాం!!

 

1తిమోతి 2:810

8. కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

9. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,

10. దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.

 

                           ఈరోజు స్త్రీలు ఎలా ఉండాలి అనేది చూసుకుని తద్వారా విశ్వాసి అయిన స్త్రీ మరియు దైవసేవకురాళ్ళు వారి పిల్లలు  ఎలా ఉండాలో ధ్యానం చేసుకుందాం! స్త్రీలు అణుకువయు, స్వస్తబుద్ధిగలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని ....మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకోగూడదు; ఇది మొదటిది. సాధారణంగా మన భారతదేశ స్త్రీలకు వెలగల చీరలు, రెండవదిగా బంగారునగలు అంటే చాలా ఇష్టం! దానికోసం ఎంతో ఆరాటపడుతూ భర్తను సాధిస్తూ ఉంటారు! అయితే బైబిల్ సెలవిస్తుంది వెలగల చీరలు ధరించనే కూడదు! ఎందుకు అనేది చివరలో చెబుతాను వాక్యాధారముగా! కాని దురదృష్టం ఏమిటంటే అనేకులు వెలగల వస్త్రముల వెనుక పరుగెత్తుచున్నారు, విచారం ఏమిటంటే దైవసేవకురాళ్ళు చాలా ఎక్కువగా వెలగల బట్టలు వేసుకుంటున్నారు. ఇది కేవలం స్త్రీలకోసమే చెప్పారా దేవుడు? పురుషులకు చెప్పలేదా అంటే పురుషులకు కూడా కలిపి చెప్పారు పరిశుద్ధాత్ముడు! అనేకమంది సేవకులు నేడు వారు వేసుకునే కోట్లు వేలు, లక్షలు కూడా ఖర్చుచేస్తున్నారు. అనేకమంది సేవకులు/ సేవకురాండ్రు నేడు టివీలో గాని, బహిరంగ సభలలో గాని ప్రసంగం చేసేముందు బ్యూటీ పార్లర్ కి వెళ్లి, సింగారించుకుని ప్రసంగాలు చేస్తున్నారు. నేనంటాను వీరిలో యెజెబెలు ఆత్మ పనిచేస్తుంది. ఈ ఆత్మ నాశనానికి దారితీస్తుంది. గమనించాలి! పౌలుగారు పెళ్లి చేసుకోలేదు అలాగే అంటారు, అనవచ్చు, మరి అదే పరిశుద్ధాత్ముడు పెళ్లి పిల్లలు గల పేతురు గారిద్వారా కూడా అదే వ్రాయించారు కదా!  ఏమీ తేడా లేదు! 1పేతురు ౩:౩--4..

3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. .

 

   కాబట్టి ప్రియ దైవసేవకులారా! దైవసేవకురాల్లారా! విశ్వాసులారా! దయచేసి దేవుడు/ బైబిల్ చెప్పినట్లు వెలగల వస్త్రములు వేసుకోవద్దు!

 

ఇక రెండవదిగా బంగారములతో గాని ముత్యములతో గాని అలంకరించుకోవద్దు! అనగా ఆభరణాలు పెట్టుకోవద్దు! గమనించాలి కొంతమంది ఆభరణములు ధరించుకోగూడదు అని బైబిల్ లో ఎక్కడుంది అని అడుగుతున్నారు. దయచేసి వాక్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ఇది అర్ధం అవుతుంది తప్ప నిర్గమ కాండంలో దేవుడిచ్చిన పదిఆజ్నల మాదిరిగా నీవు ఆభరణములు పెట్టుకోగూడదు అని డైరెక్టు ఆజ్నకోసం చూడకూడదు! మరికొంతమంది నన్ను అడిగారు, ముఖ్యంగా దైవసేవకుల కుమార్తెలు దేవుడు మన బయట అలంకారాలు పట్టించుకుంటాడా? మన ఆత్మ శుద్ధిని చూస్తాడు తప్ప అంటున్నారు! మరి యెషయా ౩:1623 లో ఎందుకు పట్టించుకున్నారు దేవుడు? మనం ధ్యానం చేసుకుంటున్న ఈ అంశంలో దేవుడు సీయోను కుమార్తెలు ఇలాంటి షోకులు ఆభరణాలు పెట్టుకుని గర్విస్తూ విర్రవీగారు గనుకనే వీటిని తీసేస్తాను అంటున్నారుIsaiah(యెషయా గ్రంథము) 3:16,17,18,19,20,21,22,23,24,25,26

16. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

17. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.

18. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను

20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

25. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు

26. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.

 

     అందుచేతనే దేవుడు పౌలుగారిని, పేతురుగారిని ఉపయోగించుకుని ఈ మాటలు రాసారు! విశ్వాసులైన స్త్రీపురుషులు సామాన్యమైన దుస్తులు ధరించి, మర్యాద పూర్వకంగా మెలగాలి అనేది దేవుని ఉద్దేశ్యం! అంతేతప్ప బిగుతైన బట్టలు ధరించి, తమ శరీర శౌష్టవం అందరికీ కనబడాలి అని తలంచి వస్త్రధారణ చేస్తే దేవుడు యెజెబెలును శిక్షించి నట్లు ఈ స్త్రీ-పురుషులను తప్పకుండా శిక్షిస్తారు! వెలగల బట్టలు వేసుకుని స్టేటస్ సింబల్ అంటే నీకు ఆ స్టేటస్ లేకుండా చేస్తారు దేవుడు జాగ్రత్త! మరొక సేవకుడంటాడు మనం రారాజు కొడుకులం కుమార్తెలం! రారాజుల్లాగా రాజకుమారుడులాగా అలంకరించుకోవాలి అంటున్నారు. దయచేసి దీనికి వాక్యాధారమేదైనా చూపించగలరా ఇలా చెప్పే ఏ దైవసేవకుడైనా? తగుమాత్రపు వస్త్రములే వేసుకోమన్నారు.  తిమోతికి చెబుతూ పౌలుగారు అన్నివిషయాలలోనూ మితంగా ఉండమన్నారు. అన్ని విషయాలు అనగా వస్త్రధారణ మరియు అలంకరణ కూడా వస్తుంది.

 

   *దైవభక్తిగల స్త్రీలు పురుషులు బంగారు  నగలు పెట్టుకోగూడదు, ఆభరణములు పెట్టుకోగూడదు! పురుషులు ఉంగరాలు కూడా ధరించకూడదు! వెలగల వస్త్రములు , వెలగల చీరలు, వెలగల సూట్లు, బూట్లు వేసుకోగూడదు. ఎందుకంటే లోకంలో అనేకమంది పేదవారు, మధ్యతరగతి వారు సరైన తిండిలేక, బట్టలు లేక భాధపడుతున్నారు కదా! వారికి వీటికి ఖర్చుపెట్టే సొమ్మును ఖర్చుచేసి వారికి అన్నవస్త్రాలు కలిగించాలి! ఇదే దేవుని ఉద్దేశ్యం! అందుకే ఈ వెలగల వస్త్రాలు, వెండిబంగారాల ఆభరణాలు ధరించడం మానేయడం! దానికి ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తుప్రభులవారు!* 2కొరింథీ 8:9 .... చూడండి

మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

 

 ఆయన అంత ధనవంతుడు ప్రకాశమానుడై ఉండి కూడా మనకోసం దరిద్రుడై పోయారు. పశువుల శాలలో జన్మించి, ఎన్నో కష్టాలు పడి, కాయకష్టం చేసి బ్రతికారు. నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని నాకు తలవాల్చుకొనుటకు స్థలం లేదు అన్నారు. మత్తయి 8:20; లూకా 9:58; చివరకు ఆయన చనిపోయినప్పుడు అద్దె సమాధిలో ఉన్నారు. ఆయనే అంత దరిద్రుడుగా, సింపుల్ గా జీవిస్తే మనం కూడా సింపుల్ గా జీవించాల్సిన అవసరం ఉందా లేదా? ఫిలిప్పీయులకు 2: 7

మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

 

 కాబట్టి యేసయ్య జీవించినట్లే మనం కూడా మనకోసం, మన స్టేటస్ చూపించుకోడానికి, మన శరీరాస, నేత్రాస, జీవపుఢంభం నెరవేర్చుకోడానికి కాకుండా దేవునికోసం సమస్తము వదలుకుని ఆయనకోసం బ్రతక బద్దులమై ఉన్నాము! మత్తయి 10:3839 ..

38. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

39. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. .;

 

లూకా 14:౩౩...

33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ..;

 

     కాబట్టి వెండిబంగారు ఆభరణాలు, వెలగల వస్త్రాలమీద పెట్టే ఖర్చు మొదటగా పేదలకు ఖర్చుపెట్టి, రెండవదిగా పేదలకు అన్యులకు సువార్త ప్రకటించడానికి ఖర్చుపెట్టడం ఎంతో శ్రేష్టం!

 

1తిమోతి 6:68...

6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది.

7. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.

8. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. .

 

భూమిమీద కాకుండా పరలోకంలో ధనం సంపాదించుకోడానికి విశ్వాసులంతా/ దైవజనులు కూడా ప్రయత్నించాలి

మత్తయి 6:1921

19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ;

 

  అయితే ఏమి ధరించుకోవాలి? అణకువ, స్వస్తబుద్ధి, ఇంకా దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకూ తగినట్లుగా సత్క్రియలు అనే ఆభరణములను ధరించుకోవాలి అని హితవు చెబుతున్నారు పౌలుగారు!

 

  చివరిగా నగలు పెట్టుకోవడం దేవునికి వ్యతిరేఖమా అని అడిగితే నా ఉద్దేశంలో అది దేవునికి వ్యతిరేఖమే! ఎలాగో చెప్పనీయండి! స్త్రీలు ఎప్పుడూ మరి రిబ్కాకు ముక్కు కమ్మి నగలు ఎందుకిచ్చారు అని అడుగుతారు తప్ప ఈ పౌలుగారు, పేతురు గారు వ్రాసినది గ్రహించరు, వీరిద్దరూ బంగారు ఆభరణాలు దరించకూడదు అని వ్రాసారు. ఇక ఆదికాండం .35:1--4.. ప్రకారం ఆభరణాలు పెట్టుకోవడం అనేది దేవుని దృష్టిలో అపవిత్రత! యాకోబుగారు మిమ్మును మీరు శుద్ధిచేసుకోండి అంటే వారు శుద్ధిచేసుకుని ఆభరణాలు తీసివేశారు. అంటే ఆభరణాలు ఉంటే అపవిత్రులు అనిఅర్ధం వస్తుంది కదా!

 

ఇక నిర్గమకాండం 33:4--6 లో దేవుడు చెబుతున్నారు మీ ఒంటిమీదున్న ఆభరణములు తీసివేయుడి! .

Exodus(నిర్గమకాండము) 33:4,5,6

4. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.

5. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.

6. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ....

 

మరి దేవునికి ఇష్టం లేనివి ఎందుకు వేసుకోవడం!

 

గమనించండి ఆభరణములు వేసుకుని మొదటగా మీ సోకు ప్రదర్శించకూడదు! మీ మాటలలో చేతలలో దేవున్నే ప్రతిబింభించాలి!

 

ఇక రెండవదిగా మన భారతదేశంలో పెట్టుకునే ప్రతీ ఆభరణం కూడా ఏదో ఒక అన్యదేవతారాధన బట్టి వచ్చింది. ప్రతీ ఆభరణం ఒక దేవతకు చెందినది. అందుకే వేసుకోకూడదు!

 

మూడవదిగా దేవుడు తన రూపులో మనిషిని చేసుకున్నారు. అయితే ఈ ఆభరణాలు అనేవి ప్రతీ విగ్రహానికి ఏదో ఒక ఆభరణం ఉంటుంది. దేవుడు నేను మనిషిని నా రూపులో చేసుకుంటే వీరు విగ్రహాల మీదనుండే నగలు / ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అని దేవుడే అక్కడ ఆభరణాలు తీసివేయమన్నారు. అవి వేసుకుంటే దేవుని రూపులో ఉండే మీరు కనబడకుండా మీమీదనున్న విగ్రహాలు కనిపిస్తాయి! అందుకే ఆభరణాలు పెట్టుకోగూడదు! గమనించాలి ఆభరణాలు విడచిపెట్టడం వ్యక్తిగత సమర్పణకు సాదృశ్యం కాదుగాని వ్యక్తిగత పరిశుద్ధతకు నిదర్శనం!

 

      కాబట్టి ప్రియ దైవసేవచేసే స్త్రీలారా! విశ్వాసులారా! ఇది మిమ్ములను బాధపెడుతుండవచ్చు గాని ఒకసారి సత్యమును గ్రహించాలని,  దయచేసి వెండిబంగారాలు పెట్టుకోవద్దనియు, తగుమాత్రపు వస్త్రములే ధరించుకోమని ప్రభువు పేరిట వినయపూర్వకంగా మనవి చేస్తున్నారు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*172వ భాగము*

 

యెషయా 4:16

1). ఆదినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.

2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4 తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5 సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6 మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

 

            ప్రియ దైవజనమా! మనము యెషయా ప్రవచన గ్రంధం మొదటి నుండి ధ్యానం చేసుకుంటున్నాము! మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు యెరూషలేము కి జరుగబోయే సంభవాలు ధ్యానం చేసుకున్నాము! ఇక 4 వ అధ్యాయం చూసుకుంటే ఈ అధ్యాయంలో మొదటి వచనం ఇశ్రాయేలు/యూదా రాజ్యం భయంకరమైన యుద్ధాల తర్వాత ఏ విధంగా తయారవుతుంది, పురుషులు లేనందువలన దేశంలో స్త్రీల పరిస్తితి ఎలా ఉంటుంది అనేది చెబుతుంది. ఇక మిగతా వచనాలు- ఇశ్రాయేలు ప్రజలు- యూదులు మరలా చెరనుండి విముక్తి కలిగి తిరిగి స్వదేశం వస్తారనియి, ఇంకా అభిశక్తుని రాకడ వలన దేశం ఫలభరితంగా ఉంటుంది అని, దేవుని ఆత్మ ప్రజలపై కుమ్మరించబడుట వలన మహిమ అనగా దేవుని మహిమ దేశమంతా వితానం చేస్తుంది అని చెబుతుంది ఈ అధ్యాయం!

 

ఈ ప్రవచనం అపొస్తలుల కాలంలో క్రీస్తు రాజ్యం స్థాపన గురించి మాట్లాడడమే కాకుండా, చెదరగొట్టబడిన యూదులను సంఘమునకు  చేర్చడం ద్వారా దాని విస్తరణను కూడా ముందే తెలియజేస్తుంది. క్రీస్తు "ప్రభువు యొక్క శాఖ" లేక యెహోవా చిగురు మహిమయు గా సూచించబడ్డాడు, ఇది అతని వాక్యము  నాటబడడం మరియు దేవుని మహిమ కోసం వర్ధిల్లడాన్ని సూచిస్తుంది. సువార్త కూడా ఈ దైవిక శాఖ యొక్క ఫలంతో పోల్చబడింది,

 

       క్రీస్తులో కనిపించే అందం మరియు పవిత్రతను మనం చూసినప్పుడు కేవలం ఇజ్రాయెల్ అని పిలువబడే వారి నుండి మన నిజమైన వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆశీర్వాద యుగానికి సూచనగా, యెరూషలేము మరోసారి ఒక శాఖలా వర్ధిల్లుతుంది మరియు భూమి యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తుంది. దేవుడు తన కొరకు పరిశుద్ధ శేషమును ఉంచుకొనును. సీయోను మరియు యెరూషలేములలో స్థానం మరియు ఖ్యాతిని కలిగి ఉన్న అనేకమంది అవిశ్వాసం కారణంగా దూరంగా ఉన్నప్పటికీ, కొందరు ఎల్లప్పుడూ మిగిలి ఉంటారు. ఇవి పవిత్రమైనవిగా ప్రత్యేకించబడినవి.

 

దేవుని ప్రావిడెన్షియల్ తీర్పు ద్వారా, పాపులు నాశనం చేయబడవచ్చు మరియు వినియోగించబడవచ్చు, కానీ అతని దయ యొక్క పని ద్వారా, వారు సంస్కరించబడవచ్చు మరియు మార్చబడవచ్చు. పరిశుద్ధాత్మ తీర్పు యొక్క ఆత్మగా పనిచేస్తుంది, మనస్సును ప్రకాశవంతం చేస్తుంది మరియు మనస్సాక్షిని నేరారోపణ చేస్తుంది, అలాగే దహనం, మండించడం మరియు ఆప్యాయతలను బలపరిచే ఆత్మగా, వ్యక్తులను ఉత్సాహంగా మంచి పనులకు అంకితం చేసేలా చేస్తుంది. క్రీస్తు పట్ల మరియు ఆత్మల పట్ల అమితమైన ప్రేమ, పాపానికి వ్యతిరేకంగా ఉన్న ఉత్సాహంతో, యాకోబు నుండి భక్తిహీనతను దూరం చేయడానికి చురుకుగా పనిచేయడానికి వ్యక్తులను శక్తివంతం చేస్తుంది.

 

ప్రతి పరీక్ష మరియు ప్రతిక్రియ విశ్వాసులకు కొలిమిగా ఉపయోగపడుతుంది, వారిని మలినాలనుండి శుద్ధి చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పించే, జ్ఞానోదయం మరియు శక్తివంతమైన ప్రభావం ద్వారా, కోరికలు క్రమంగా నిర్మూలించబడతాయి మరియు విశ్వాసులు పవిత్రతగా రూపాంతరం చెందుతారు, క్రీస్తు యొక్క పవిత్రతకు అనుగుణంగా ఉంటారు. దేవుడు తన సంఘమును  మరియు దాని సభ్యులందరినీ రక్షిస్తాడు. సువార్త సత్యాలు మరియు శాసనాలు సంఘము యొక్క కీర్తి, మరియు దానిలోని మహిమ దాని సభ్యుల ఆత్మలలో ఉన్న దయ. ఈ కృపను కలిగి ఉన్నవారు దేవుని శక్తి ద్వారా సురక్షితంగా ఉంచబడతారు.

 

అయితే, వారి అలసటను గుర్తించిన వారు మాత్రమే విశ్రాంతిని కోరుకుంటారు మరియు రాబోయే తుఫాను గురించి తెలిసిన వారు మాత్రమే ఆశ్రయం పొందుతారు. మన పాపాలు మనకు బహిర్గతం చేసే దైవిక అసంతృప్తిని మనం లోతుగా అనుభవించినప్పుడు, మనం వెంటనే యేసుక్రీస్తు వైపు తిరిగి, ఆయన అందించే ఆశ్రయాన్ని కృతజ్ఞతతో స్వీకరిద్దాం.

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*173వ భాగము*

 

యెషయా 4:16

1). ఆదినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.

2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4 తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5 సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6 మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

 

    ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రస్తుతం 4 వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

      సరే, మనం ఒక్కో వచనాన్ని ధ్యానం చేసుకుందాం!

1). ఆదినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.

 

ఆ దినమున అనగా యుద్ధకాలంలో యుద్ధం ముగిసిన తర్వాత జరిగే సంభవం అన్నమాట!  యుద్ధం వల్ల సంభవించిన వినాశనం  అన్నమాట ఇది  (1)

 

ప్రారంభ చరణం మూడవ అధ్యాయం నుండి. దేశంలో ప్రతికూల సమయాల్లో, యూదా  సమాజంలో అవివాహితంగా ఉండటం అవమానకరమని భావించినప్పుడు, ఈ స్త్రీలు కట్టుబాటుకు వ్యతిరేకంగా వెళ్లి చురుకుగా తమ కోసం భర్తలను కోరుకుంటారు. దేశంలో పురుషులు కనబడటమే చాలా చాలా అరుదుగా ఉంది. మరి ఇప్పుడు మిగిలిన స్త్రీలకు పెళ్లి చేసుకోడానికి పురుషుడు అనేవాడే లేడు! అందుకే ఒకవేళ యవ్వనంలో ఉన్న పురుషుడు కనబడితే ఏడుగురు స్త్రీలు ఆ పురుషునితో బ్రతిమిలాడుకుని ఏమంటారు అంటే మేము మా అన్నమే తింటాము, నీవు మాకు బట్టలు కూడా కొనాల్సిన అవసరం లేదు. గాని నీవు మమ్మల్ని పెళ్లి చేసుకుని నీ భార్యలము అని మాత్రం అనిపించుకోనీయ్ అని అడుగుతారు! ఇంతటి ఘోరమైన పరిస్తితులు ఏర్పడబోతున్నాయి అంటున్నారు! చూడండి గత అధ్యాయంలో 25 వ వచనం లో పురుషులనేకులు హతమౌతారు (యెషయా 3:25). అందువల్ల అనేకమంది స్త్రీలకు పెళ్ళిచేసుకునే అవకాశం ఉండదు. “నింద” వివాహం లేకుండా, పిల్లలను కనకుండా ఉండడం తమ పై ఒక నిందగా ఆ కాలంలో స్త్రీలు భావించుకునే వారన్నమాట (ఆదికాండము 30:23; యెషయా 54:4; లూకా 1:25).

 

3: 25. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు

 

ఆదికాండము  30

23. అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.

 

యెషయా  54

4. భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.

 

ఇక రెండో వచనం నుండి అంటున్నారు

2. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

 

చిగురు లేక “కొమ్మ” ఇది  అభిషిక్తుణ్ణి గురించిన భవిష్యద్వాక్కు.

 

యెషయా 11:1;

1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

యెషయా 53:2;

2. లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

 

 యిర్మియా 23:5;

5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

 

అయితే కొందరు పండితులు ఇక్కడ కొమ్మ అంటే దేవుని ప్రజలకు వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎలా చూచినా ఇది ఇస్రాయేల్, యూదాల్లో ఆధ్యాత్మిక జీవం మళ్ళీ కలుగుతుందని సూచిస్తున్నది.

 

ఇక మూడవ వచనంలో 3. సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

 

అనగా చెరనుండి మరలా వచ్చిన వారికి అని ఒక అర్ధం- మరొకటి లోకపు పాపపు చెరనుండి విడుదల పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అనుభవం కలిగి పరిశుద్ధ మైన జీవితం జీవించి ఆత్మానుసారమైన జీవితం కల్గిన భక్తులు సంపూర్ణత సాధించిన భక్తులకు, సీయోను అనుభవం పొందుకున్న భక్తులు పరిశుద్ధులు అని పేరు తెచ్చుకుంటారు లేక పరిశుద్ధులు అని పిలువబడతారు! మరి నీవు ఇలా పరిశుద్ధుడు అనే పిలువబడేలా నీ బ్రతుకు ఉందా ప్రియ సహోదరి సహోదరుడా!

 

4. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5. సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

 

గమనించాలి- గత అధ్యాయం చివరలో సీయోను కుమార్తెలు గర్విష్తులై మెడచాచి నడుస్తూ కులుకుతూ ఓర చూపులు చూస్తూ బ్రతుకుతున్నందున వారి తల బోడిచేస్తాను వారి మానమును బట్టబయలు చేస్తాను, వారికి గర్వకారణంగా ఉన్న అలంకారములు అన్నీ తీసేస్తాను అని చెప్పిన దేవుడు ఇక్కడ అదే కుమార్తెలపై జాలి చూపిస్తున్నారు. తిరిగి తన ప్రజలయిన ఇశ్రాయేలు యూదా జనాలపై కరుణ చూపించి వారికి కలిగిన అవమానం తీసేస్తాను అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వారి పాపాలను కడిగి వారి కల్మషాలను కడిగివేసిన తర్వాత వారిని శుద్ధి చేసిన తర్వాత ఇక సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద దాని సంఘాలలో పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశము ఉంటుంది అంటున్నారు!

 

యెషయా  1

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

 

యెషయా  48

10. నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని

11. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

 

   గమనించాలి పూర్వకాలంలో కనాను యాత్రలో నిర్గమకాండము 3:21-22; నిర్గమకాండము 40:38. ప్రకారం పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము దేవుడు 40 సంవత్సరాలు వారితో ఉండేలా చేశారు! ఇప్పుడు మరలా దేవుని మహిమ వారితో ఉండబోతుంది. మేఘ స్తంభములా అగ్ని స్తంభములా!

 

ఈ వచనాలు మరలా అక్షరాలా నెరవేరవలసి ఉంటే (అక్షరాలా నెరవేరేవి కాదని ఎవరు చెప్పగలరు?) ఇది బహుశా యెషయా 30:26 కు సంబంధించిన మాటై ఉండాలి. కొందరు వ్యాఖ్యాతలు ఇది కేవలం తన ప్రజలపై దేవుని కాపుదలను గురించి కావ్య రూపంగా చెప్పిన రీతి అని అభిప్రాయపడ్డారు. కావచ్చు. కానీ గతంలో దేవుడు అక్షరాలా ఇలాంటిదాన్నే చేసి ఉన్నాడు (నిర్గమకాండము 13:21-22) గనుక, ఈ వచనాలు రాబోయే కాలంలో అక్షరాలా నెరవేరవు అని ఖచ్చితంగా చెప్పడం వివేకం అనిపించుకోదు. బహుశా మరలా జరిగినా జరగవచ్చు లేదా జెకర్యా 814 అధ్యాయాలలో చెప్పబడినట్లు అంత్యకాలంలో దేవుడు తన ఆత్మను ఇశ్రాయేలు జనులపై కుమ్మరించేటప్పుడు ఇలా మహిమ వితానముండవచ్చు!

 

6. మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

 

దావీదు గారు అనేకసార్లు నీవే నా ఆశ్రయము అన్నారు! ఇక్కడ కూడా ఆయన ఆశ్రయముగా ఉంటారు అని చెబుతున్నారు!

 

కీర్తనలు 27:5

ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.

 

మరి దేవుణ్ణి నీవు నీ ఆశ్రయముగా చేసుకోడానికి సిద్ధంగా ఉన్నావా?

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*174వ భాగము*

 

యెషయా 4:16

1). ఆదినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.

2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4 తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5 సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6 మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

 

    ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రస్తుతం 4 వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా గత భాగంలో మనం అక్షరార్ధమైన అర్ధాన్ని చూసుకున్నాం ఈ  నాలుగవ అధ్యాయం నకు  ఈరోజు ఆధ్యాత్మికమైన అర్థం నూతన నిబంధన సంఘకోణంలోను, పరమ సీయోను అనుభవం యెరూషలేము అనుభవం కోణం లోను చూసుకుందాం!

 

      ప్రియులారా ఈ రెండవ వచనంలో మనం చూసుకున్నాము ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును ఇశ్రాయేలీయులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదములను శుభలక్షణముగాను ఉండును దీనికోసం ఆలోచిస్తే యెహోవా చిగురు మహిమయు భూషణము అగును అనగా ఏసుక్రీస్తు ప్రభువుల వారు అని మనకి అర్థమైంది. చిగురు యేసు క్రీస్తు ప్రభువు వారు అయితే ఈ చిగురు అనగా ఏసు క్రీస్తు ప్రభువుల వారు విశ్వాసుకి మహిమయు భూషణముగా ఉంటారు! ప్రియులారా ఒక విషయం గమనించండి ఇప్పుడు మనం చూసుకుంటుంది ఇక్కడ సీయోను అనుభవంలో ఉన్న సంఘం కోసం చూసుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ అధ్యాయము నూతన నిబంధన సంఘం కోసం చెబుతుంది అయితే ఈ నూతన నిబంధన సంఘం సీయోను అనుభవములోనూ యెరూషలేము అనుభవంలోనూ ఉంది ఇది మనం గుర్తుంచుకోవాలి. సీయోను అనుభవం మరియు యెరూషలేము అనుభవము ఈ రెండు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. సీయోను షాలేము లాగా అయితే నేను అంత డీప్ గా వెళ్లాలి అనుకోవటం లేదు! చిగురు  యేసు క్రీస్తు ప్రభువుల వారు అయితే ఆయన నూతన నిబంధన సంఘములో ఉన్న మనకు ప్రతి విశ్వాసికి మహిమ కరంగా ఉంటారు! మనము దేవునికి మహిమకరంగా జీవించడమే కాకుండా ప్రతి విశ్వాసికి దేవుడు మహిమ కరంగా మహిమగా ఉంటారన్నమాట! అంతేకాక ఆయన  మనందరికీ ఒక భూషణంగా, ఒక కిరీటం లాగా దేవుడు ఈ నూతన నిబంధన సంఘములో సంఘానికి ఉంటారన్నమాట! అలాగే మనం కూడా మన ప్రవర్తనలో దేవునికి మహిమ కరంగా ఉండాలి!

 

 ఇక తర్వాత ఈ వచనంలోనే తర్వాత మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు తప్పించుకొనినవారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును, నిజానికి ఈ అధ్యాయము ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి తిరిగి వచ్చిన వారి కోసం చెప్పబడ్డది అయితే ఆధ్యాత్మికముగా ఈ సంభవం మొత్తం మనకి రెండవ రాకడ జరిగిన అనంతరం వెయ్యేళ్ల పరిపాలన సమయంలో జరుగుతుందని మనం చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులలో తప్పించుకొనినవారు అనగా ఒక అర్థం చెర నుండి వచ్చిన వారు! ఇది అక్షరార్ధంగా చూసుకుంటే చెర నుండి వచ్చిన వారికి భూమిపంట సరిపోతుందని ఉంది గానీ నిజానికి ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే మనకి దానియేలు గ్రంధం 12:1 వెళ్లాలి. దానియేలు గ్రంథం 12 :1 ఏం చెప్తుంది? ఆ కాలమందు అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడినది కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును! ఆ ఆపద ఏమిటంటే గత భాగాలలో చూసుకున్నాము అదే మహాశ్రమల కాలం! ఇది రెండవ రాకడ సమయంలో జరుగుతుంది! ఇశ్రాయేలు  సంఘమునకు ఆపద కలుగుతుంది అయితే నీ జనులలో గ్రంథము నందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు! తప్పించుకున్న వారు ఎవరో మన దానియేలు గ్రంధం 12:1 చెప్తుంది! ఈ మహా శ్రమల కాలం నుంచి తప్పించుకున్న వాళ్ళు ! వీళ్ళు ఏర్పరచబడినవారు మత్తయి సువార్త 24 వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయం ప్రకారం! ఈ తప్పించుకున్న వారి కోసము ఏసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు ఆ దినములలో మహా శ్రమలు కలుగును అంటూ ఇంకా వివరాలు చెబుతూ చెబుతూ  ఏర్పరచబడిన వారి కోసము ఆ దినములు తక్కువ చేయబడును అని మత్తయి సువార్తలో 24 అధ్యాయంలో చెబితే, మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో ఏర్పరచబడిన వారి కోసం ఆ దినములు తక్కువ చేయబడెను అంటే ఆల్రెడీ ఆ దినములు తక్కువ చేయబడ్డాయి కాబట్టి ఈ దానియేలు 12వ అధ్యాయం ప్రకారము మరియు మత్తయి సువార్త మార్కు సువార్త ప్రకారము, ఇశ్రాయేలీయులలో తప్పించుకున్నవారు!  ఎక్కడి నుంచి తప్పించుకున్నారు అంటే మహాశ్రమల నుండి!  అయితే మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూసుకుంటే సూర్యుని ధరించిన స్త్రీ కోసం చూసుకుంటే అక్కడ ఆమె మూడున్నర సంవత్సరాలు దాచపడుతుంది అని వ్రాయబడి ఉంది మనకు తెలుసు ప్రకటన గ్రంథం ధ్యానాలు ధ్యానించినప్పుడు సూర్యుడు ధరించిన స్త్రీ ఎవరో కాదు ఆమె ఇశ్రాయేలు సంఘము ఇశ్రాయేలు జాతి అని మనం చూసుకున్నాము!  ఇద్దరు సాక్షుల సాక్ష్యము వలన ఇశ్రాయేలీయులు 1,44,000 మంది వారు రక్షించబడతారు! వారే ముద్రించబడిన వారు వారే మహాశ్రమల కాలంలో తప్పించబడతారు అని మనం ప్రత్యక్షత గ్రంథము ధ్యానంలో చూసుకున్నాము! ఇప్పుడు ఈ మహాశ్రమల కాలంలో తప్పించుకొనబడ్డ ఆ ఇశ్రాయేలు జాతి వారు ఇప్పుడు ఎలా ఉంటారంటే, మరలా మనం మరలా యెష్షయి  గ్రంధానికి వస్తే ఇశ్రాయేలు తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును ఇప్పుడు ఇలా తప్పించుకొనినవారికి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు శుభలక్షణముగాను అతిశయాస్పదముగాను ఉండబోతున్నారు ఇది ఇక్కడ ఆధ్యాత్మిక అర్థము.

 

 ఇంకా ముందుకు పోతే సీయోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును!  మరలా మనం ఇప్పుడు దానియేలు గ్రంధానికి ప్రకటన గ్రంథానికి వచ్చేయాలి ఇలాగా సీయోనులో దాఖలైన వారికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. శేషించినవారు ఇశ్రాయేలీయులు గాని ఇప్పుడు మన నూతన నిబంధన కోణంలో చూసుకున్న సీయోనులో శేషించిన వారు అనగా సీయోను అనుభవం కలిగిన విశ్వాసులందరికీ జీవము పొందుటకై ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును!  ప్రియులారా దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలీయుల్లో మహాశ్రమలు తప్పించుకున్న వారు పరిశుద్ధులు, ఎందుకు జీవం పొందుటకు యెరూషలేములో దాఖలు అయ్యారు? తప్పించుకోవడం కోసం? దేనినుండి? మహా శ్రమల నుండి తప్పించుకొని జీవము పొందడానికి దాఖలు అయ్యారు! వీళ్ళందరికీ పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుటకు!

 

 అయితే ఇది నూతన నిబంధన సంఘ కోణంలో కూడా చూసుకుంటే వీరంతా సీయోను అనుభవం కలిగిన వారు ఎవరైతే సీయోను అనుభవం కలిగి ఉన్నారో వీరందరికీ దేవుడు పరిశుద్ధుడు అని పేరు పెట్టారు పరిశుద్ధురాలు అని పేరు పెట్టారు. అయితే ఈ పరిశుద్ధుడు పరిశుద్ధురాలకి ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చు ఆత్మలను దహించు ఆత్మ వలన ప్రభువు సీయోను కుమార్తెలుకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసి దాని శుద్ధి వేయనప్పుడు, ఐదవ వచనం సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యోహోవా కలుగజేయును! దీనికోసం ఆలోచిస్తే ఈ పరిశుద్ధులని పిలువబడిన వారు సీయోను అనుభవం కలిగిన వారికి తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ప్రభువు సీయోను కుమార్తెలకు ఉన్న కల్మషాన్ని కడిగివేస్తారంట జాగ్రత్తగా గమనించాలి. సీయోను అనుభవము అనగా చాలా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన విశ్వాసులు అని మనం చూసుకున్నాం. మరి ఈ ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వారికి కల్మషం ఎలావచ్చింది? జాగ్రత్తగా ఆలోచిస్తే మనము పాప లోకంలో ఉన్నాం కాబట్టి ఈ పాప లోకంలో తిరుగుతున్నప్పుడు మనకి కూడా మన ఆత్మలకి తప్పకుండా కల్మషం అంటుకుంటుంది! మనము వీధిలోకి వెళ్తే మన శరీరానికి దుమ్ము ధూళి కల్మషం ఎలా అంటుకుంటుందో అలాగే మన ఆత్మలకు మన మనసులకు కూడా మనం బయట వెళ్లినప్పుడు ప్రజలు మాట్లాడే మాటలు వల్ల గాని పోస్టర్ల వల్ల గాని మనం చూసే చూపుల వల్ల గాని కల్మషము అనేది ఎంత విశ్వాసి అయినా ఆ విశ్వాసికి అంటుకుంటుంది కానీ ఇలా అంటుకున్న ఆ కల్మషాన్ని తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ప్రభువు సీయోను కుమార్తెలకు ఉన్న కల్మషానికి కడిగేస్తారు వెంటనే ఈ విశ్వాసుల మీద పరిశుద్ధాత్ముడు పనిచేసే వాక్యము పనిచేసి, వాక్యపు వెలుగులో వాక్యపు అగ్నిలోనే వారి మనసులో ఉన్న ప్రతి తలంపు గాని ఆలోచన గాని ఇలాంటివన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కాల్చి వేస్తారు, ఎలా అంటే, ప్రభువా చూడరాని దృశ్యాన్ని నేను చూశాను వినరాని మాటలు విన్నాను, విన్న తర్వాత నా మనసు దానికి సంతోషించింది దయచేసి నన్ను క్షమించు అని వెంటనే ఈ సీయోను అనుభవముగల ఈ విశ్వాసి వెంటనే తప్పులు ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవునితో సమాధాన పడిన వెంటనే దేవుడు మన కల్మషాన్ని తీసివేస్తారు కడుగుతారు! పరిశుద్ధాత్మ వలన వాక్యము వలన మనము ఒప్పుకొని విడిచి పెట్టినప్పుడు సీయోను కుమార్తెలకు అనగా సీయోను అనుభవం ఉన్న ప్రతి విశ్వాసిని దేవుడు వెంటనే అంటుకున్న కల్మషాన్ని కడిగి వేసినప్పుడు యెరూషలేములో నుండి రక్తాన్ని తగిలిన రక్తాన్ని దేవుడు కడిగి వేస్తారు ఇక్కడ సీయోను అనుభవంతో పాటు మరొక అనుభవం కూడా మనకు కనిపిస్తుంది అది యెరూషలేము అనుభవం అనగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయి అని చూసుకున్నాం! ఆ అనుభవము కంటే దానికన్నా కొంచెం తక్కువస్థాయి సీయోను అనుభవం కలిగి ఉన్నవారు! సీయోను అనుభవం ఎంత పరిశుద్ధులు అంటే తలంపులలో కూడా వారు పాపము చేయరు. తలంపులలో కూడా పాపం చేయడానికి ఇష్టపడినవారు కారు, ఇక్కడ యెరూషలేము అనగా కొంచెం తక్కువ ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారు వీరికి కూడా అంటుకున్న రక్తాన్ని దాన్ని కూడా దేవుడు కడిగి వేస్తాను అని చెబుతున్నారు ఇక్కడ ఇక ఐదో వచనంలో సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును ఇలాగా సీయోను అనుభవం కలిగిన వీరి మీద, యెరూషలేము అనుభవం కలిగిన ఈ విశ్వాసుల మీద దేవుడు పగలు మేఘ ధూమములు అనగా పరిశుద్ధాత్మ శక్తి రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును వాక్యపు వెలుగులో నడిపించే భాగ్యము దేవుడు వారికి కలుగజేస్తారు ప్రతినివాస స్థలము సీయోను కొండలను ప్రతి నివాస స్థలము మీదను ప్రతి సంఘము మీదను దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన ఉంచబోతున్నారు మహిమ అంతటి మీద విధానముండును!

 ఆరవ వచనం పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును! ఈ పరిశుద్ధాత్మ దేవుని మహిమ దేవుని మహిమ ప్రతి సీయోను అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి మీద ఉంటారు. అంతేకాదు పగలు ఎండకు నీడగా గాలివానకి ఆశ్రయముగా చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును! ఆ పర్ణశాల ఏదో కాదు మన అందరికీ ఆశ్రయ స్థానము ఆశ్రయము ఏసు క్రీస్తు ప్రభువుల వారు! ఏసుక్రీస్తు ప్రభువుల వారి నీడలో ప్రతి సీయోను అనుభవము గల విశ్వాసి ఆ నీడలో ఉండి నిత్యజీవము కలిగి దేవుని కోసం సాక్షులుగా జీవించబోతున్నారు ఇది దీని అర్థం!

 

అట్టి సీయోను అనుభవం యెరూషలేము అనుభవం కలిగిన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక!!!

 ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*175వ భాగము*

 

యెషయా 5:16

1). నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను

3 కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

5 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

6 అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.

7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 5వ అధ్యాయం ధ్యానం చేద్దాం!

 

       ప్రియులారా! ఈ అధ్యాయం కావ్య రూపంగా ఇశ్రాయేలు జాతి మొత్తం యొక్క అప్పటికాల పరిస్థితిని  వర్ణిస్తూ ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో- అందుకు దేవుడు చేసే తీర్పుని తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు- యూదులను దేవుడు మంచి నేలలో నాటబడిన ద్రాక్షతోటతో పోల్చారు దేవుడు! అయితే మంచి ద్రాక్షలు వస్తాయని ఎదురుచూస్తే కారు ద్రాక్షలు అనగా చేదు ద్రాక్షలు కాసాయి. ఇది దేవుడే తన బాధను చెప్పుకుంటూ ఉన్నట్లు ఉంటుంది ఈ అధ్యాయం! కీర్తన 80:8-19; యెషయా 3:14; 27:2; యిర్మీయా 2:21; 12:10; యెహె 17:6-8; 19:10-14; హోషేయ 10:1; 14:7; మీకా 7:1; మత్తయి 20:1-16; 21:33-44; యోహాను 15:1-5 పోల్చి చూడండి. ప్రవక్త దేవుణ్ణి గురించీ ఆయన ప్రజల గురించీ పలుకుతున్నాడు. ఇక్కడ పాడడం. అంటే కేవలం కావ్యరూపంగా పలకడం అని అర్థం “సారవంతమైన భూమి ఉన్న కొండ” అంటే ఇజ్రాయేల్ దేశం.

 

  ఇక మొదటి వచనం చూసుకుందాం! నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను.

 

నా ప్రియుడు అనగా దేవుడు లేక యేసుక్రీస్తుప్రభులవారు అని అర్ధం చేసుకోవాలి! పరమగీతము మొత్తం మీద నాప్రియుడు అనేమాట విస్తారంగా కనిపిస్తుంది. ఇక సంఘాన్ని నా ప్రియురాలా అని దేవుడు పిలుస్తూ ఉంటారు అక్కడ!

 

కాబట్టి ఇక్కడ కూడా నా ప్రియుడు అనగా దేవుడు- యేసుక్రీస్తుప్రభులవారు అని అర్ధం చేసుకోవాలి! ఇప్పుడు నా ప్రియుడైన దేవుని గూర్చి పాడుతాను వినండి అంటున్నారు! అతని ద్రాక్షతోటను బట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి అంటున్నారు!  అయితే మనం బుర్ర బద్ధలు చేసుకోకుండా ద్రాక్ష తోట ఏమిటో మనకు 7 వ వచనంలో ఉంది! 7. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

 

ఇశ్రాయేలు వంశమే ఆయన ద్రాక్షతోట! యూదా జనులే ఆయన యొక్క ఇష్టమైన ద్రాక్ష వనము అంటున్నారు!

 

సరే, మరి ఈ తోటకు ఏమి జరిగింది?

 

సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను.

 

తన ద్రాక్ష తోటను శ్రేష్ఠమైనదిగా సారవంతమైనదిగా కట్టుదిట్టంగా ఉండేందుకు చేయవలసినదంతా దేవుడు చేశాడు. అయితే తన కష్టానికి ఫలితం కారు ద్రాక్షలు మాత్రమే. 3వ వచనంలో యెషయా నోట దేవుడే పలుకుతున్నాడు. ఇంత జాగ్రత్త తీసుకుని సాగు చేస్తే చెడు ద్రాక్షలే కాయడానికి కారణమేమిటి? ఇది ద్రాక్ష తోట యజమాని తప్పా లేక ద్రాక్ష తోటగా ఉన్న ప్రజల తప్పా? దీనికి జవాబు అతి స్పష్టం. అందుకనే ద్రాక్ష తోట ప్రజలనే దేవుడు దీనికి జవాబు చెప్పమని అడుగుతున్నాడు.

 

3 “అందుచేత జెరుసలం కాపురస్తులారా, యూదా వారలారా, నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పండి.

4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే చేయగలిగినది ఇంకేమిటి?  ద్రాక్షపండ్లకోసం నేను ఎదురు చూస్తే అది ఎందుకు కారు ద్రాక్షలు కాసింది?

 

ఇలాంటి భాగము మనకు కీర్తనలు 80 లో కూడా కనిపిస్తుంది. అక్కడ 819 వచనాలలో నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చావు, అది బాగుగా ఫలించింది ఇప్పుడు  అది పాడై పోయేలా దాని కంచెను ఎందుకు పాడు చేశావు దేవుడా అని భక్తుడు బాధపడుతున్నాడు! ..

 

8. నీవు ఐగుప్తులో నుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి

9. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను

10. దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ రించెను.

11. దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను.

12. త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీ వేల పాడుచేసితివి?

13. అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.

14. సైన్యముల కధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.

15. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము.

16. అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు.

17. నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక.

18. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము

19. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.

 

అయితే దాని కంచెను ఎందుకు పాడుచేయాల్సి వచ్చిందో ఇక్కడ యెషయా గ్రంధంలో చాలా స్పష్టముగా చెబుతున్నారు! అది మంచి ద్రాక్షలు ఫలించాలి అని చూస్తే కారు ద్రాక్షలు అనగా చెడు ద్రాక్షలు కాసింది! అందుకే దేవునికి కోపము వచ్చింది!  మరలా 7 వ వచనం చూసుకుంటే ఇశ్రాయేలు దేవుని ద్రాక్ష తోట- యూదా ఆయన వనము! అయితే ఆ తోటలో లేక ఆ ప్రజలలో ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను. అందుకే అవి లేవు గనుక దాని కంచెను తీసివేశారు దేవుడు! కంచె అనగా దేవుని కాపుదల! దేవుని కాపుదల ఎప్పుడైతే లేదో సాతాను గాడు దాని మీదికి వచ్చాడు, దానిని పాడుచేశాడు! దేవుడు తన ద్రాక్షతోటను దాని మానాన దాన్ని వదిలేసి వెళ్ళిపోతాననడం లేదు. దాని నాశనానికి పూనుకుని పని చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ ద్రాక్షతోట శిక్షకు పాత్రమైన ఒక జాతి. దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. తన ఉద్దేశాలను సాధించడానికి దేవుడు శత్రు సైన్యాల దాడిని ఉపయోగించుకొన్నాడు.

 

  ఇది మనకు బాగా అర్ధం చేసుకోవాలంటే యోబు 1, 2 అధ్యాయాలలో యోబు గారిని మరియు ఆయన ఆస్తిని సాతాను గాడు పాడుచేయాలి అనుకున్నాడు గాని అక్కడ వాడు అంటున్నాడు- నీవు అతనికి కంచె వేశావు. ఆ కంచె తీసేస్తే నేను వెంటనే పాడుచేసేస్తాను అన్నాడు! దేవుడు తన కాపుదల తీసివేసిన వెంటనే సాతాను గాడు యోబు గారి ఆస్తిని పశువులను చివరికి పిల్లలను కూడా చంపేశాడు!

యోబు 1:10

నీవు అతనికిని అతని యింటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

యోబు 1:11

అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

 

 నీమీద నామీద సంఘము మీద దేవుని కాపుదల ఎంతగానో ఉంది. అందుకే సాతాను గాడు మనలను పాడుచేద్దామని చూస్తున్నా వాడు ఏమీ చేయలేక పోతున్నాడు! అయితే నీవు నేను కూడా ఈరోజు మనలో నీతి న్యాయము యధార్ధత పరిశుద్ధత నిజాయితీ లోపిస్తే దేవుడు నీమీద నామీద ఉన్న కాపుదలను తీసేస్తారు. అప్పుడు సాతానుగాడు మనల్ని నాశనం చేసేస్తాడు! అందుకే భయము కలిగి ఉండాలి!

 

అటువంటి భయము భక్తి కలిగి మనము ముందుకు సాగిపోదాం! లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు జరిగిన పరిస్తితులే మనకు కూడా సంభవించగలవు!!

 

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*176వ భాగము*

 

యెషయా 5:16

1). నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను

2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను

3 కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

5 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

6 అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.

7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధములో  5వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనం గత భాగం 174 ఈ మొదటి 7 వచనాలు ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకుందాం అయితే ఈరోజు నూతన నిబంధన సంఘ కోణంలోనూ సీయోను అనుభవం మరియు యెరుషలేము కోణంలోనూ ఒక్కసారి చూసుకుందాం

ప్రియులారా ఈ ఐదవ అధ్యాయము  చూసుకుంటే మొదటి వచనం నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి అంటూ చెప్పడం జరిగింది. ప్రియుడు అనగా ఏసుక్రీస్తు ప్రభువులవారు అనగా గత భాగంలో చెప్పిన విధంగా వెంటనే మనం పరమగీతములోకి వెళ్ళిపోతే అక్కడ నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి ఇలాగా సంఘము యేసు క్రీస్తు ప్రభువు వారి కోసము అనగా ప్రియుని కోసము పాడుతుంది, ఇక ఏసుక్రీస్తు ప్రభువుల వారు సంఘము కోసము పాడినట్లు చూడగలము. అలా పాడిన పాటే పరమగీతము అని మన అందరికీ తెలుసు.   ఇక్కడ నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి అనగా పరమగీతము అని ఆల్రెడీ చెప్పాను అయితే అతని ద్రాక్ష తోటను బట్టి అతని అనగా ఏసుక్రీస్తు ప్రభువుల వారే ప్రియుడు, ద్రాక్ష తోట  ఇశ్రాయేలు జాతి అనగా  అని మనం చూసుకున్నాము. అయితే మరల రోమా పత్రికకు వచ్చి ఇంకా పౌలు గారు రాసిన పత్రికలు చూసుకుంటే మనము అనగా అన్యజనుల నుండి రక్షించబడిన సార్వత్రిక సంఘము క్రీస్తుతో అంటుకట్టబడి ఉన్నది. నిక్కమైన ద్రాక్షవల్లి దేవుడు, ఇశ్రాయేలీయులు ద్రాక్షవల్లికి ఒరిజినల్  కొమ్మలు అని రోమా పత్రిక సెలవిస్తుంది. ఆ అచ్చమైన ద్రాక్షవల్లితో మనము అడవి ద్రాక్షావలిమైన మనము అంటు కట్టబడ్డాము అని రోమా పత్రిక సెలవిస్తోంది. ఇక కొలస్సీ పత్రిక, కొరింథీ పత్రికలు ఇవన్నీ చూసుకుంటే చూసుకుంటే ఒకానొకప్పుడు దేవుడు లేని మీరు ఒకప్పుడు నిబంధన కూడా లేని మీరు ఏసుక్రీస్తుని బట్టి ఇప్పుడు మాతో అనగా ఇశ్రాయేలు ప్రజలతో సమానంగా మారిపోయారు ఎందుకంటే మీరు కొలస్సి పత్రిక 2:12లో మీరు బాప్తీస్మం నందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి ఇంకా ముందుకు పోతే అపరాధం వల్ల సున్నతి పొందలేకపోవడం వలన మృతులై ఉండగా 14వ వచనం దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్ని క్షమించి ఆయనతో కూడా మిమ్మును అనగా అన్యజనులలో నుండి రక్షించబడిన సంఘమును జీవింపజేసెను ఇక ఇప్పుడు దేవుని నుండి దూరముగా ఉన్న మనము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలకు అర్హులుగా భాగస్వాములుగా దేవుడు మనల్ని అనగా రక్షించబడిన సంఘాన్ని చేశారు అనగా దీని అర్థము ఇశ్రాయేలు ప్రజలు నిజమైన స్వాస్త్యము ఇశ్రాయేలీయులు అయితే మనల్ని దేవుడు ఇశ్రాయేలు వారితో సమానంగా దత్త పుత్రులుగా మనలను దత్తత తీసుకున్న ఇస్లాయేలీయులుగా దేవుడు మనలను చేశారు అనగా మనము ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీయులము ఇప్పుడు మనము మనము కూడా దేవుని ఆధ్యాత్మిక ద్రాక్ష తోటగా ఉన్నాము

అయితే ఈ ద్రాక్ష తోట సత్తువ భూమి గల కొండమీద ఉన్నది ఈ సత్తువ భూమి గల కొండ అది కల్వరి కొండ మీద దేవుడు తన రక్తమిచ్చి ప్రారంభించిన తన సంఘము ఆధ్యాత్మిక సంఘము  

అయితే ఈ సంఘాన్ని కట్టడానికి ఆయన బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిన తొలిపించెను దీని అర్థం ఏంటంటే లోతైన పునాది వేసి, లోతుగా తవ్వించడం అనగా అది అపోస్తులుల బోధ అనే శ్రేష్టమైన బోధ మీద కట్టబడిన నూతన నిబంధన సంఘము కోసం శ్రేష్టమైన సంఘం చెబుతున్నారు.  శ్రేష్టమైన ఆ అపోస్తుల బోధను విని రక్షించబడిన మనము శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా దేవుడు నాటితే ఇప్పుడు ద్రాక్ష పండ్లు ఫలించాలని చూస్తే అది కారు ద్రాక్షలు కాచెను. సీయోను యెరుషలేము అనుభవము ఇలాంటి అత్యుత్తమమైన ఆధ్యాత్మిక అనుభవము ఉన్నత శ్రేష్టమైన అనుభవం గల విశ్వాసులుగా ఉండాలని దేవుడు తలస్తే ఇప్పుడు కారుద్రాక్షలు కాసెను. కారుద్రాక్షలు అనగా చెడు ద్రాక్ష పళ్ళు చేదైన ద్రాక్ష పళ్ళు కాచాయి అని దేవుడు అడుగుతున్నారు బాధపడుతున్నారు. నిజానికి ఇలా కారుద్రాక్షలు అనగా చెడు ద్రాక్షలు కాయకూడదు అనే దేవుడు దానిని బాగుగా తవ్వి రాళ్ళను తీసిపారేసాడు. మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న బుద్దులు అలవాట్లు తీసివేసి నూతన సృష్టిగా చేశారు, ఇంకా పనికిరాని సిద్ధాంతాలు తీసి పడేసి నూతన నిబంధన మనకు ఇచ్చాడు అదే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ఆయన రక్తము ద్వారా చేసి అపోస్తుల బోధ క్రింద మనలను ఉంచిన తరువాత ఇప్పుడు కారు ద్రాక్షలు కాచెను అనగా శ్రేష్టమైన విశ్వాసులుగా ఉండవలసిన ఈ నూతన నిబంధన సంఘము లోకముతో కలిసి దేవునికి దూరముగా ఉండే దేవుని సలహాలు ఫలించకుండా అనగా గలతీపత్రికలో ఐదవ అధ్యాయంలో వ్రాయబడిన ఆత్మఫలము ఫలించకుండా మీదన ఉన్న శరీర కార్యాలు చేయడం మొదలుపెట్టింది ఈ సంఘము ఈ ద్రాక్ష తోట అందుకే దేవుడు ఇక్కడ బాధపడుతున్నారు నాలుగో వచనంలో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకా ఏమి చేయగలను! దేవుడు కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా ఈరోజు అలాగే బాధపడుతున్నారు! ఇంకా నేను మీకోసం ఏం చేయాలి మీకోసం నా ప్రాణం పెట్టానే, పిడుగులు తిన్నానే, శిలువను మోసానే, రక్తం కార్చానే, మీకోసం పరిశుద్ధాత్మను కావలిగా ఉంచేనే, మీకు వరాలు ఫలాలు ఇచ్చేనే, మీతో గొప్ప గొప్ప కార్యాలు చేయించేనే, ఇంతగా చేశాను కానీ ప్రతిఫలంగా మీరు లోకాన్ని చూసి కారుద్రాక్షలు కాస్తున్నారా అని ఏసుక్రీస్తు ప్రభువుల వారు బాధపడుతున్నారు!!

 

ఇక అందుకే ఐదో వచనంలో చూసుకుంటే ఆలోచించుడి నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యాన్ని మీకు చెప్తాను మేసి వేయబడునట్లు దాని కంచెను నేను కొట్టేస్తాను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేస్తాను కంచే, గోడ ఈ రెండు దేవుని కాపుదల అని గత భాగంలో చూసుకున్నాం.

 ఇంకా అదే నూతన నిబంధన సంఘం కోణంలో గానే ఇంకా డీప్ గా చూసుకుంటే పరమగీతంలో మూయబడిన ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము అనే మాటలు మనం చూడగలం ఆ ఉద్యానవనానికి సంఘము అనే ఆ ఉద్యానవనానికి దేవుడు మూత వేయబడింది అనగా కంచి పెట్టాడు అంతేకాకుండా మూయబడిన జల కూపము ఆ జలకూపాన్ని ఒకసారి తెరిస్తే అది వెంటనే తిన్నగా అది ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతుంది. కీర్తనాకారుడు అంటున్నారు మా ఊటలు అన్నియు నీలోనే ఉన్నాయి. 87:7; ఆ ఊటలకు దేవుడు కంచి వేశారు ఇప్పుడు ఆ కంచెను దేవుడు తీసివేయాలని అనుకుంటున్నారు

జాగ్రత్తగా గమనిస్తే గోడను కంచెను ఎందుకు తీసివేయాలనుకుంటున్నారు మంచి ద్రాక్షలు కావాలని నిక్కమైన ద్రాక్షలు కావాలని దేవుడు ఆశిస్తే అది కారు ద్రాక్షలు కాని పళ్ళు కాసేయ్ కాబట్టి అనగా దేవుడు ఆశించినది విశ్వాసి నుండి ఫలించే అనుభవము. ఫలించే అనుభవము అనగా ఆత్మీయ వరాలు పొందుకొని దేవుని సేవలో పరిచర్యలో మన నిజ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి అదే ఫలించే అనుభవం ఫలించే అనుభవం దేవుడు మనకిచ్చిన ఆత్మ వరాలు ఆత్మఫలాలు ఇవన్నీ తీసుకొని అనేకులను క్రీస్తు కోసం రాబట్టాలి అందుకే  అలాగా రాబట్టుతున్నప్పుడు క్రమ క్రమంగా దేవుడు నిన్ను శ్రమలు అనే మార్గము ద్వారా సీయోను అనుభవంలోకి పరిపూర్ణతలోకి యెరూషలేములోకి పరమసీయోను యెరుషలేము లోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్లాలి అని ఆశిస్తే ఇప్పుడు కారు ద్రాక్షలు, ఫలములేని జీవితము దేవునికి పనికిరాని జీవితము ఫలించింది. ఫలములేని వృక్షాన్ని నరికివేయు మూడు సంవత్సరాలుగా ఇది వ్యర్థముగా ఉంటుంది దీన్ని నరికివేయు అని తోట కాపరికి దేవుడు చెబుతున్నట్లు మనం చూడగలము. దేవుడు అంటున్నాడు  యోహాను సువార్తలో నేను నిజమైన ద్రాక్షవల్లిని తీగెలు మీరు. మీరు నాలో ఉంటేనే గాని ఫలించెరు మీరు నాతో ఉంటూ నాలో ఉంటూ ఫలించాలి అలాగా ఫలించక పోతే మిమ్మల్ని కోసివేసి అగ్నిలో పారేస్తాను అంటున్నాడు దేవుడు.  ప్రియమైన సంఘమా దేవునితో అంటు కట్టబడిన సంఘమా, విశ్వాసి నీవు ఫలము ఫలిస్తున్నావా? అనేకులను క్రీస్తు దగ్గరికి రప్పిస్తున్నావా? దేవుని నుండి ఆధ్యాత్మిక వరాలు పొందుకున్నావా? ఆత్మాభిషేకం పొందుకొని ఎన్నెన్నో వరాలు పొందుకొని క్రీస్తు కోసం సాగుతున్నావా లేక కాని ఫలము శరీర కార్యాలు చేస్తున్నావా? అలాగైతే ఇక్కడ అంటున్నారు దేవుడు నేను దాని కంచెను దాని ప్రొటెక్షన్ తీసివేసి దానిని పాడు చేసేస్తాను అంటున్నాడు దేవుడు ఆరో వచనంలో. అది ఐదవ వచనంలో అది త్రొక్క బడినట్లు దాని గోడను పడగొట్టేస్తాను దానిని పాడు చేస్తాను, ఇక అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు శుద్ధి చేయబడదు. పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపాదులు బలురక్కసి చెట్లు బలుస్తాయి చివరికి దానిమీద వర్షం కూడా పడద్దని మేఘాలకి ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు. శుద్ధి చేయబడదు పారితో త్రవ్వబడదు అనగా దానిలో లేచిన గచ్చపొదలను బరురక్కసి చెట్లను ఈ పిచ్చి చెట్లను తీసివేసి దున్ని పారతో తవ్వి మరల దానికి ఎరువువేసి నీరు పెడితే అది మరలా బాగుపడుతుంది అయితే నేను అలాగ చెయ్యను అంటున్నాడు దేవుడు.

     ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులుగా ఉన్న ప్రియ సంఘమా నీ బ్రతుకుని చూసుకో కారు ద్రాక్షల కాస్తున్నావా? దేవునికి నిజమైన సాక్షిగా విశ్వాసిగా విశ్వాసిగా వీరుడుగా క్రీస్తు కోసము ఫలిస్తు జీవిస్తున్నావా లేక లోకములో కలిసిపోయి నామకార్థ క్రైస్తవునిగా దేవుని నోట నుండి ఉమ్మి వేయించుకొనే లవొదికయ సంఘముగా జీవిస్తున్నావా? ఇప్పుడే తేల్చుకో!

 ఏడవ వచనంలో ఆయన న్యాయం కావాలని చూస్తే బలత్కారము నీతి కావాలని చూస్తే రోదన కనిపిస్తుంది అందుకే నేను దానిని కంచి పాడు చేసే సంఘాన్ని పాడు చేస్తానంటున్నాడు. నీతి న్యాయములు విశ్వాసము యథార్థత సత్యము జాలి ప్రేమ ఇవన్నీ నీలో కనిపిస్తున్నాయా ఫలిస్తున్నాయా లేకపోతే నిన్ను కూడా దేవుడు నీ కంచి తీసివేసి నువ్వు పాడైపోయేలాగా నాశనమైపోయేలాగా అనగా ఇక నువ్వు మరలా తిరిగి ద్రాక్ష వనములో ఒక చెట్టు లాగా ద్రాక్షావలి లాగా ఉండకుండా నిన్ను తీసివేయాలనుకుంటున్నారు దేవుడు!

 కాబట్టి సరి చేసుకుందాం! దేవుని పాదాల దగ్గర అడుగుదాం! ప్రభువా నన్ను క్షమించు! నేను కాని ఫలాలు ఫలిస్తున్నాను! ఆత్మఫలమునకు బదులుగా శరీర కార్యాలు నాలో పని చేస్తున్నాయి! నన్ను క్షమించు! మరొక్కసారి క్షమించి నీ కల్వరి రక్తంతో నన్ను కడిగి శుద్ధిచేసి నీ బిడ్డగా చేర్చుకో అని అడుగుదాం!

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

 దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*177వ భాగము*

 

యెషయా 5:76

7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.

9 నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

10 పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 5 వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!!  దేవుడు ఇశ్రాయేలు జాతిని ద్రాక్షతోటతో పోల్చి న్యాయము నీతి కావాలని చూస్తే దానిలో బలాత్కారము రోధన కనిపిస్తుంది అంటున్నారు దేవుడు!

 

          (గతభాగం తరువాయి)

 

   ఇక 7 వ వచనం నుండి చూసుకుంటే ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

 

ఈ ఉదాహరణను వివరించి చెప్పడం ద్వారా దీని విషయమై సందేహానికి తావు లేకుండా చేస్తున్నారు యెషయా  ప్రవక్త. 2,4 వచనాల్లో కారు ద్రాక్షలు అనే దానికి అర్థాన్ని ఇక్కడి నుండి 25 వచనం వరకు వివరిస్తున్నారు. దేవుడు ఆశించిన మంచి ద్రాక్షలు ఏమిటో 7వ వచనంలోని ఒక మాట తెలియజేస్తున్నది నీతి మరియు న్యాయం. కారు ద్రాక్షలంటే అనేక అర్థాలున్నాయి. ఈ వచనంలో ఈ రెండు కనిపిస్తున్నాయి రక్తపాతం, రోదనానికి కారణమైన దౌర్జన్యం.

 

ఇంకా దీనిని బాగా అర్ధం చేసుకోవాలంటే ఇంకా ముందుకు చదువుకోవాలి!

 

8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ.

 

మీరు మాత్రమే దేశంలో ఉండాలని స్థలం మిగులకుండా  ఉండేవరకు ఇంటికి ఇల్లు కలుపుకొంటూ, పొలానికి పొలం చేర్చుకొంటూ ఉండేవారలారా, మీకు బాధ తప్పదు అంటున్నారు దేవుడు! ఇలాంటివారు ఇప్పుడు కూడా బోలెడు మంది ఉన్నారు కదా! అప్పుడు మొత్తం దేశమంతా అలానే ఉన్నారట!

 

ఈ 5:8-23ని జాగ్రత్తగా పరిశీలిస్తే  దేవుడు 9 సందర్భాల్లో వారి పాపాల విషయంలో వారికి బాధలు ప్రాప్తిస్తాయని ప్రకటిస్తున్నాడు (వ 8, 11, 18, 20, 21, 22).  అంటే దేవుడు వారిని నేరస్థులుగా ప్రకటించి శిక్షిస్తాడని అర్థం.

 

ఇక్కడ ప్రజలు ఎంతగా అత్యాశ పేరాశ కలిగి ఉన్నారో కనిపిస్తుంది మనకు! ఇక్కడి పాపం ఆస్తికోసం అత్యాశ. ఇది సర్వ సాధారణమైనది. ఇది దేవుడు అసహ్యించుకొని నిషేధించిన పాపం. అయినా ఇది సాధారణమైనదే. నిర్గమ 20:17; లూకా 12:15; 1 తిమోతి 6:6-10.  తీవ్రమైన శిక్షకు గురి అయిన (ఆస్తికోసం) పేరాశ 1 రాజులు 21:1-19లో చూడండి. ఈ దురాశాపరులను వారి పొలాలు వట్టిపోయేలా చేయడం ద్వారాను, వారి భవంతులనుండి వారిని తరిమివేయడం ద్వారానూ దేవుడు శిక్షించాడు.

 

ఇక 9--10 వచనాలు చూసుకుంటే

9 నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

10 పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.

 

గొప్ప ఇల్లు అనగా పెద్ద ఇల్లు పాడైపోతాయి ఎందుకంటేదానిలో ఉండటానికి శుభ్రపరచడానికి ప్రజలే ఉండరు! ఇంకా గొప్ప ఇళ్ళన్నీ శత్రువుల చేతిలో పడగొట్టబడ బోతున్నాయి!  ఇక 10 ఎకరాల ద్రాక్షతోట కేవలం ఒక కుంచెడు అనగా 4 కేజీలు లేక 4 లీటర్లు ద్రాక్షరసం ఇస్తుంది. ఎంత ఘోరమో కదా! ఇశ్రాయేలు దేశ ప్రజల వ్యాపారంలో ఇది ప్రధానమైనది. పది ఎకరాల ద్రాక్షతోట అనగా కొన్ని టన్నుల రసం రావాలి. గాని కేవలం 10 లీటర్లు మాత్రమే రసం వస్తాది అంటున్నారు! పడి అనగా 20 లీటర్లు!!!

 

ఈ విధంగా వారికి పోషణ మరియు వినోదము లేకుండా చేసేస్తారు దేవుడు! వారిని నాశనం చేసేస్తారు!

 

అయితే దీనిని నూతన నిబంధన సంఘ కోణంలో చూసుకుంటే ఇక్కడ గొప్ప ఇల్లు దివ్యమైన ఇల్లు మనుషులు లేకుండా పాడైపోతాయి దీని అర్థం ఏంటంటే బైబిల్ చెబుతుంది నీ దేహమే దేవుని ఆలయం అని నీకు తెలియదా? మన శరీరం దేవుడు నివసించే ఆలయము ఆయన ఆత్మ నివసించే ఆలయము అయితే నూతన నిబంధన సంఘములో ఉంటున్న ఈ రక్షణ పొందిన విశ్వాసి, ఆత్మ పొందుకున్న విశ్వాసి, దేవునిలో దృఢంగా సాగిన విశ్వాసి, ఇప్పుడు లోకము వైపు చూచాడు! కాబట్టి దేవుడు ఈ ఆలయాన్ని ఈ ఇల్లుని పాడైపోతుంది నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. ఇక ఈ గృహంలో పరిశుద్ధాత్ముడు ఉండడు. పాడు ఉంటుంది విడువబడుతుంది ఎందుకంటే దాంట్లో పరిశుద్ధాత్ముడు లేడు ప్రభువు లేడు దేవుని ఆత్మ కార్యాలు లేవు ఏమీ లేవు చచ్చుబడిపోయింది! అందుకే ఈ గృహము పాడైపోతుంది! ఒకానొకప్పుడు ఎంతో గొప్ప విశ్వాసి, భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పిన విశ్వాసి, అద్భుతాలు చేసిన వ్యక్తి, ఎంతో ఉన్నతమైన ఆత్మీయ స్తితి గల వ్యక్తి కానీ ఇప్పుడు పడిపోయాడు, ప్రార్ధన భాషలు ఆత్మ అభిషేకం ఏమీ లేని ఒక నామకార్థ క్రైస్తవుడిగా మారిపోయి చివరికి నరకానికి పోయే ఒక వ్యక్తిగా మారిపోతుంది అని దీని అర్థం నూతన నిబంధన సంఘ కోణంలో.  అందుకే ఇప్పుడు పది ఎకరాల ద్రాక్ష తోటకి కేవలం కుంచుడు మాత్రమే అనగా నాలుగు లీటర్లు ద్రాక్షారసం మాత్రమే వస్తుంది అనగా ఎన్నో గొప్ప వరాలు ఇచ్చిన నీకు ఇప్పుడు వరములు ఫాలములు లేక ఫలించే అనుభవం లేక కేవలం కొద్దిగా మాత్రమే ఫలాలు పాలిస్తున్నావు నీ జీవితం మూడు బారిపోతుంది ఇందుకేనా ఏసుక్రీస్తు ప్రభువుల వారు నీకోసం అంత త్యాగం చేశారు మీ కోసం సిలువ భరించారు అన్ని అవమానాలు సహించారు పిడుగులు తిన్నారు కొరడా దెబ్బలు తిన్నారు భరించారు దేవుని త్యాగాన్ని నీవు తృక్షమైన శరీర కోరికల కోసము ధనము కోసము మరి ఇహలోక ఆశల కోసమో దేవుడి నుండి దూరం అయిపోయి ఆయన్ని అవమాన పరుస్తూ ఫలములు లేని వ్యక్తిగా మారిపోయావు సంఘము జీవముగల దేవుని సంఘము దేవుని కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన మహోన్నతమైన సంఘములో ఇప్పుడు కార్యాలు లేవు లోకము కనిపిస్తుంది లోకాచారాలు కనిపిస్తున్నాయి ఆర్భాటాలే తప్ప దేవుని కార్యాలు ఏమీ లేవు సంఘమా ఆలోచించు విశ్వాసి ఆలోచించు సంఘ కాపరి దానికి కారణం నీవేమో ఆలోచించు నేడే సరిదిద్దుకో నేడే సరిచేయుని సంఘాన్నే విశ్వాసి నేడే నిన్ను నీవు సరి చేసుకో. మర్చిపోకు నీవు కృపద్వారా మాత్రమే రక్షించబడ్డావు అని మర్చిపోకు! తిరిగి అపొస్తలుల ఉపదేశ సారానికి, శ్రమల ద్వారా సంపూర్ణతకు తిరిగి రా!!!

 

 ఇక 10,11 వచనాలలో అంటున్నారు

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

 

ఇక్కడ రెండో కారణం కనిపిస్తుంది- మందు తాగుదామని వేకువనే లేచి రాత్రివరకు తాగుతూ తమకు మంట పుట్టించేవారకు అర్ధరాత్రి వరకు తాగుతున్నారట ఈ తాగుబోతు గాళ్ళు! ఇంకా ఏం చేస్తున్నారు అంటే సితారా స్వరమండళం తంబుర సన్నాయి లాంటి వాయిద్యాలు వాయిస్తూ త్రాగుతూ చిందులేస్తూ ఉన్నారు గాని యెహోవా పని కోసం ఆలోచన చేయరు, ఆయన చేసిన సృష్టిని చూసి ఆయనను స్తుతించరు అందుకే వారికి శ్రమ అంటున్నారు! ఈ త్రాగుబోతు గాళ్లను దేవుడు అతి ఘోరంగా శిక్షించబోతున్నారు!  ఎలా అంటే 13--14 వచనాలలో ఉంది

 

13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

 

ఇక్కడ చూస్తే మొదటగా దేవుడు వారిని చెరలోనికి పంపించేస్తాను అంటున్నారు! రెండవదిగా వారికి ఆహారం గాని నీరు గాని లేకుండా చేసేస్తాను అంటున్నారు! మూడవదిగా వారికి భయంకరమైన జ్వరములు పెట్టి పీడించేస్తాను అంటున్నారు!

 

ఈ అన్నింటి వలన భయంకరమైన మరణాలు కలుగుతాయి అక్కడ- అప్పుడు పాతాళము నోరు తెరిచి ఒక్కొక్కరిని మ్రింగేస్తుంది అంటున్నారు! ఇదీ వారికి కలుగబోయే శిక్షలు!

 

ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు కూడా దేవుణ్ణి వదిలేసి నీ కిష్టమైన మార్గాలులో తిరుగుతూ భయంకరమైన త్రాగుబోతుగా తిరుగుతున్నావా నీకు కూడా ఇదే గతి! నీ ఇంటికి మరో ఇంటిని అన్యాయముగా ఆక్రమించుకుని నీ ఆస్తిని పోగుచేసుకుంటున్నావా? నీ ఇంటిని ఐశ్వర్యమును పాడు చేస్తాను అంటున్నారు దేవుడు! కాబట్టి నేడే భయమునొంది పాపము వదిలేయ్! నీతి మరియు న్యాయమును అభ్యాసము చేయు!, ఇక త్రాగుబోతులకు కలిగేది ఏమిటి అనేది వచ్చేభాగంలో చూసుకుందాం!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*178వ భాగము*

 

యెషయా 5:76

7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.

9 నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.

10 పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 5వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!!  దేవుడు ఇశ్రాయేలు జాతిని ద్రాక్షతోటతో పోల్చి న్యాయము నీతి కావాలని చూస్తే దానిలో బలాత్కారము రోధన కనిపిస్తుంది అంటున్నారు దేవుడు!

 

          (గతభాగం తరువాయి)

 

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

 

ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా తాగుబోతులుగా తయారయ్యారో మనకు చూసుకుంటున్నాము!

 

ప్రస్తుతం నేటిరోజులలో  త్రాగుడు ఒక ఫ్యాషన్ అయ్యింది. అదొక స్టాటస్ సింబలయ్యింది. త్రాగి తందనాలాడేవాడు హీరో అవుతున్నాడు. త్రాగని వాడెమో జీరో అవుతున్నాడు. త్రాగిన వాడు ఏమి మాట్లాడతాడో తెలియదు? ఎందుకు నవ్వుతాడో తెలియదు? ఏమి చేస్తాడో తెలియదు? అడుగు ఎక్కడ వేస్తాడో తెలియదు? జేబులు ఖాళీ అయ్యేవరకూ త్రాగుతూ ఊగుతూ ఉంటాడు. ఏ భేదం లేదు. పిల్లలూ, యవ్వనులూ, వృద్ధులూ అందరూ త్రాగుతూనే వున్నారు. దాని ఒడిలో ఊగుతూనే వున్నారు? మత్తు పదార్ధాల మత్తులో జోగుతోంది లోకం.

 

అల్లర్లకు కారణం?

 

యాక్సిడెంట్లకు కారణం? కుటుంబాలు విచ్చిన్నానికి కారణం? రోగాలు, ఆర్ధిక, మానసిక ఒడిదుడుకులకు కారణం? ప్రశ్నలు ఎన్నైనా కావొచ్చు. సమాధానం మాత్రం ఒక్కటే. అదే "త్రాగుడు వ్యసనం".

 

యువత త్రాగుడుకి బలై పోతుంది. వారి వ్యసనం కోసం వ్యక్తిగత, కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. పెగ్గు కోసం సిగ్గులేకుండా చేతులు చాస్తున్నారు.

 

కనీసం బర్త్ డే పార్టీలు కూడా బీర్ లతో బార్ లో గడపడానికే సిద్దపడుతున్నారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే? పార్టీ అంటేనే మద్యం. మద్యం లేకపొతే అది పార్టీనే కాదు.

 

ఇప్పుడు ఈ పార్టీలు ఎక్కడివరకు వచ్చేసాయాంటే? దేవుని సేవకుల ఇంటివరకు వచ్చేసాయి. ఆంధ్ర ప్రదేశ్ లో గొప్ప వున్నత స్థానంలో నున్న సేవకుని కుమారుని వివాహాంలో మద్యం ఏరులై ప్రవహించింది. అయ్యో! అదేమిటి అంటే? వాళ్ళేమన్నా తింగరోళ్ళా? బైబిల్ కాలేజీల్లో తర్ఫీదు పొందిన రెవరెండ్స్. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. బయట నుండి లోనికి వెళ్ళినది ఏది మనలను అపవిత్ర పరచదట. మనము పరిశుద్ధముగా కాపాడుకోవలసినది శరీరంను కాదట. ఆత్మను. ఎందుకంటే? మట్టి నుండి తీయబడిన శరీరం మట్టిలోనే కలసిపోతుందట. ఆత్మ మాత్రమే దేవుని దగ్గరకు వెళ్తుంది. కాబట్టి, ఆత్మకు మాత్రం ఎట్లాంటి కళంకం అంటుకోకుండా చూచుకోవాలట. ఎంత బాగా చెప్పారు కదా?

 

అయితే, పౌలుగారు  ఇట్లా ఎందుకు వ్రాశారో ? శరీరం మలినమై పోయినప్పుడు, ఆత్మ ఎట్లా పరిశుద్ధంగా వుండగలుగుతుందో?

 

ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

        2 కొరింది 7:1

 

మరికొంత మంది ఇంకా తెలివిగా మాట్లాడతారు. పౌలు తిమోతికి వ్రాసాడు కదా? అని. ఏమని వ్రాసాడు?

 

ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 1తిమోతి 5:23

 

కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకోమని. అయితే, ఈ త్రాగే వాళ్లంతా కడుపు జబ్బుకోసమే త్రాగుతున్నారా? అయినా, ద్రాక్షారసము, మద్యము రెండూ ఒక్కటేనా? ద్రాక్షారసము పులియబెడితే మద్యం అవుతుంది.

 

కడుపు జబ్బుకు కొంచెం ద్రాక్షారసము త్రాగమని తిమోతికి సూచిస్తున్నారు పౌలుగారు. అంటే? తిమోతి కడుపు జబ్బుతో బాధ పడుతున్నాడు. అది అతడు త్రాగే నీరు సరైనది కాకపోవడం వలన కలిగినది. ఆ దినాలలో ఔషధాలు అందుబాటులో లేనికారణం చేత, ద్రాక్షారసంలో కొన్ని ఔషధ గుణాలు వుండడం చేత త్రాగే నీటిలో కొంచెం ద్రాక్షారసం కలుపుకొని త్రాగడం సర్వ సాధారణం. మన వాళ్లేమో మద్యంలో నీళ్లు కూడా కలపకుండా త్రాగుతూ దీనిని పౌలు మాటలకు జత కట్టేసారు.

 

ఒక్క విషయం గుర్తుంచుకో! విషం కలిగి యున్న సీసా మీదా 'విషం' అనే పేరు తీసేసి, 'అమృతం' అని వ్రాసినంత మాత్రాన అది అమృతముగా మారిపోదు కదా? 'పాపము' అనే దానిని 'పొరపాటు' అని పిలచుకున్నంత మాత్రాన అది పాపం కాకుండా పోదుగా.

 

నాకు తెలిసిన ఒకాయన గల్ఫ్ నుండి వచ్చి, కృతజ్ఞతా కూడిక పెట్టుకొని, సంఘ పెద్దలందరికీ పార్టీ ఇచ్చాడు. అయ్యగారు ఒక్కరే వున్నారని, ఒకాయన వెళ్లి, అయ్యగారూ మీరు కూడా ఒక పెగ్గు పుచ్చుకుంటారేంటి? అనడిగితే? ఆ అయ్యగారు ఫారిన్ ది అయితే, పర్వాలేదన్నాడట. ఇంకేముంది? ఆయ్యగారే పార్టీలో వుంటే? పెద్దలకెంత బలం? విశ్వాసులకు ఇంకెంత బలం?

 

కంచే చేను మేసేస్తుంటే? ఇక కాపాడేదెవరు? సంఘానికి మాదిరికరంగా వుంటూ, ఆధ్యాత్మిక విలువలు నేర్పాల్సిన నీవే గాఢాంధకారములో కొట్టుమిట్టాడుతుంటే? ఇక సామాన్యుల గతేమిటి?

 

మద్యం సేవించేవారు సంఘ పెద్దలుగా ఉండకూడదు.     1తిమో3:3

 

నీవంటావ్! ఆయన త్రాగడం లేదా? ఈయన త్రాగడం లేదా అని. ఆయన సంగతి, ఈయన సంగతి నీకెందుకు? నీవు చూడాల్సింది ఆయనను, ఈయనను కాదు. నీ పరిశుద్ధుడైన దేవునిని మాత్రమే. అనుసరించాల్సింది ఆయనను, ఈయనను కాదు. పరిశుద్ధ గ్రంధమును మాత్రమే.

 

మరి కొందరంటారు! పరిశుద్ధ గ్రంధంలో ఆయన త్రాగలేదా? ఈయన త్రాగలేదా అని. అవును! త్రాగారు. ప్రతిఫలాన్ని అనుభవించారు. నీ జీవితం అట్లా కాకూడదనే, వారి జీవితాలను దృష్టాంతాలుగా నీ ముందుంచాడు దేవుడు.

 

• మద్యం వలన నోవాహు వస్త్రహీనుడయ్యాడు.

 

నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు. ఆది 6:9

 

అట్లాంటి వ్యక్తిని ద్రాక్షారసము వస్త్రహీనుని చేసింది.

పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.  ఆది 9:21

 

నోట్: మొట్టమొదటగా ద్రాక్ష తోట వేసింది నోవహునే కాబట్టి,  అట్లా జరుగుతుందని అతనికి తెలుసో? లేదో? అందుచే, పూర్తిగా అతనిని తప్పు పట్టలేము.

 

• మద్యం వలన వరసలు తెలియవు:  ఆది 19:30-38

 

ఇది సృష్టిలోనే ఒక అసహ్యమైన కార్యము. దీనికి ప్రధాన పాత్ర పోషించింది మద్యమే. ఈ చర్య దేవునికి వ్యతిరేకమైన రెండు జనాంగములు భూమి మీదకు కారణమయ్యింది.

 

• మద్యం వలన అల్లరి పుట్టును.

ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును. సామెతలు 20:1

 

• మద్యం వలన జ్ఞానము లేనివారు అగును.

 

ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

      సామెతలు 20:1

 

• మద్యం వలన దరిద్రులు అగుదురు.

త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. సామె 23:21

 

• మద్యం వలన శ్రమలు, దుఃఖము, గాయములు కలుగును.

ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?

ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.

        సామెతలు 23:29,30

 

• మద్యం వలన ఆజ్ఞలు మరతురు.

ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు.

త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు

    సామెతలు 31:4,5

• మద్యం వలన పరలోకం వెళ్లలేరు.

దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

            1కొరింది 6:10

 

• దుర్వ్యాపారం నడుపుతురు.

మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.

           ఎఫెసి 5:18

 

• మతి చెడును.

వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి. హోషేయ 4:11

 

• జబ్బు పడుదురు.

మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి;

       హోషేయ 7:5

 

• తత్తర పడుదురు.

అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.

        యెషయా 28:7

 

• చెడు పాటలు పాడుదురు.

గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

     కీర్తనలు 69:12

 

• త్రాగుబోతులకు శ్రమ.

ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.  యెషయా 5:22

 

• నరకానికి వెళ్లెదరు.

మత్తయి 24:49-51, ప్రకటన 14:10

 

ఇటువంటి త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. (సామెతలు 23:20)

 

కాబట్టి నీకు ఏమి కావాలో తేల్చుకో! దేవుని రాజ్యము పరలోకం కావాలంటే ఈ మత్తు పదార్దాలు వదిలేసి క్రీస్తు ఆత్మ కలిగిన వాడవై ఆత్మ పూర్ణునిగా మారి పరిపూర్ణుడవు కమ్ము!

 

దైవాశీస్సులు!

 

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*179వ భాగము*

 

యెషయా 5:1523

15. అల్పులు అణగద్రొక్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును

16. సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.

17. అది మేతబీడుగా నుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

18. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు

19. ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము

20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.

22. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.

23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 5వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!!  దేవుడు ఇశ్రాయేలు జాతిని ద్రాక్షతోటతో పోల్చి న్యాయము నీతి కావాలని చూస్తే దానిలో బలాత్కారము రోధన కనిపిస్తుంది అంటున్నారు దేవుడు!

 

          (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా ఇంకా క్రిందికి ఈ అధ్యాయం ధ్యానం చేస్తే ఇంకా దేవుడు ఇశ్రాయేలు- యూదా వారి గర్వానికి ప్రతిఫలంగా వారిని ఏ ఏ విధాలుగా శిక్షించబోతున్నారో కనిపిస్తుంది.  వివరాలకు వెళ్లబోయే ముందుగా 8 23 వచనాల ప్రకారం ఏమని అర్ధమవుతుంది అంటే లోకంలోని సంపదలపై మనసు లేక ఆశ పెట్టుకునే వారికి దుఃఖం వస్తుంది. ఇప్పటికే ఒక ఇల్లు లేదా పొలాన్ని కలిగి ఉన్నవారికి మరొక ఇల్లు లేదా పొలం సంపాదించడం పాపం కాదు, కానీ సమస్య వారి తృప్తి చెందని కోరికలో ఉంది. అన్యాయమైన అక్రమమైన మార్గంలో ప్రక్కనున్న ఇళ్ళు పొలాలు కలుపుకోవడం తప్పు.  దురాశ అనేది విగ్రహారాధనతో సమానం, మరియు వర్ధిల్లుతున్న వారిపై చాలామంది అసూయపడవచ్చు, ప్రభువు వారిపై తీవ్రమైన బాధలను తీర్పులను  ప్రకటిస్తున్నారు! . ఈ సందేశం నేడు మనలో చాలా మందికి ప్రతిధ్వనిస్తుంది. అత్యంత రద్దీగా సందడిగా ఉండే నగరాలను కూడా తగ్గించడానికి దేవుడు వివిధ మార్గాలను కలిగి ఉన్నాడు. లోక ఆశలపై లోక సుఖాలపై తమ ప్రేమను ఏర్పరచుకునే వారు తమను తాము సరిగ్గా నిరాశపరుస్తారు.

 

ఈ లోకపు ఇంద్రియ సుఖాలలో అతిగా మునిగితేలుతున్న వారి పట్ల మరొక బాధ. సంగీతం యొక్క ఉపయోగం అనుమతించదగినది అయినప్పటికీ, అది దేవుని నుండి ఒకరి హృదయాన్ని మరల్చినప్పుడు, అది పాపం అవుతుంది. దేవుని తీర్పులు ఇప్పటికే వారిని పట్టుకున్నప్పటికీ, వారు ఆందోళన లేకుండా తమ ఆనందాలలో మునిగిపోతారు.

 

ఈ తీర్పులు ప్రకటించబడ్డాయి మరియు ఒక వ్యక్తి యొక్క స్థితి ఎంత ఉన్నతమైనప్పటికీ, మరణం వారిని అధోకరణం చేస్తుందని స్పష్టమవుతుంది. ఎంత నిరాడంబరంగా ఉన్నా, మృత్యువు వారిని మరింత అణచివేస్తుంది. ఈ తీర్పుల ఫలితం దేవుణ్ణి శక్తివంతమైన మరియు పవిత్రమైన దేవుడిగా మహిమపరచడం. అహంకారులకు  న్యాయమైన శిక్ష ద్వారా దేవుడు  గుర్తించబడతాడు మరియు ప్రకటించబడతాడు.

 

  పాపాన్ని ఉద్ధరించేవారు మరియు తమ నీచమైన కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించేవారు దయనీయులు. వారు ధైర్యంగా పాపపు ప్రవర్తనలో పాల్గొంటారు, వారి స్వంత కోరికలను అనుసరిస్తారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎగతాళి చేసే ధైర్యం కూడా చేస్తారు. వారు మంచి మరియు చెడుల మధ్య రేఖలను అస్పష్టం చేస్తారు, దైవిక  శాసనాల  కంటే వారి స్వంత తార్కికతను మరియు దేవుని సలహా మరియు ఆదేశాల కంటే వారి స్వంత పథకాలను ఎలివేట్ చేస్తారు. స్వీయ-నిరాకరణ విధులను విస్మరిస్తూ లాభదాయకమైన పాపాలలో కొనసాగడం తెలివైనది మరియు ప్రయోజనకరమైనదిగా వారు భావిస్తారు. అంతేకాదు, కొందరు తాగుబోతును ఎంత తేలిగ్గా పరిగణించినా, అది దేవుని ఆగ్రహానికి మరియు శాపాలకు గురిచేసే పాపం. వారి న్యాయమూర్తులు న్యాయాన్ని తారుమారు చేస్తారు, మరియు ప్రతి పాపం ఇతరులు దానిని కప్పిపుచ్చవలసి ఉంటుంది.

 

      సరే, ఇక మనం అధ్యాయానికి వచ్చేదాము 15. అల్పులు అణగద్రొక్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును

 

యెషయా 2:11-18 లో కూడా ఇదే విషయం చెప్పబడింది, మరలా దానిని రెట్టించారు! . మనిషికుండే గర్వం విషయం దేవుడు మళ్ళీ తన అసహ్యాన్ని తెలియజేస్తున్నాడు. అల్పులు అణగ ద్రొక్క బడతారు. ఘణులుగా ఎన్నికైన వారు కూడా తగ్గించబడతారు ఇంకా గర్విష్టులు యొక్క కనుదృష్టి తగ్గిపోతుంది అంటున్నారు!

 

ఇక 16 వ వచనంలో 16. సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.

 

ఈ వచనంలో సైన్యములకు అధిపతియైన యెహోవా తీర్పు తీరుస్తారు అని చెబుతున్నారు! యెహోవా తీర్పు తీర్చును అనే అంశాన్ని గతభాగాలులో ధ్యానం చేసుకున్నాము! ఇక పరిశుద్దుడైన దేవుడు నీతిని బట్టి తనను తాను పరిశుద్ద పరచుకొనును అంటున్నారు!  తాను పాపులను న్యాయంగా శిక్షించడం ద్వారానూ, వారి నాశనానికి దారి తీసే నీతిన్యాయాలను ప్రదర్శించడం ద్వారానూ దేవునికి మహిమ కలుగుతున్నదన్న సత్యం గమనించాలీ మనము!!

 

ప్రియులారా ఈ 15 16 వచనాలు నూతన నిబంధన సంఘ కోణంలో చూసుకుంటే అల్పులు అణగ ద్రొక్కబడుదురు అనగా పేదలు బీదలు కాదు. అల్పమైన బుద్ధి గలవారు ఇంకా అల్ప విశ్వాసులు వీరు ఇప్పుడు అణగ ద్రొక్కబడుదురు. ఇంకా ఘనులు అనగా నేను ఎంతో గొప్ప వాడిని నేను ఇంత నేను అంత, నేను ప్రార్థన చేస్తే ఇలాగ అయిపోద్ది, నేను వాక్యం చెప్తే ఎంతోమంది మారిపోతున్నారు, ఇలాగా గర్వం గర్విష్ఠమైన పనులు మాటలు మాట్లాడే వారు తగ్గించబడతారు!

 ఇక గర్విష్టుల చూపు తగ్గును ఇది కూడా అలాగే ఇలాగ గర్వముగా రెండు ప్రసంగాలు మూడు అద్భుతాలు చేసిన వెంటనే నా అంత మొనగాడు లేడు అని గర్వముగా తిరుగుతున్న ప్రతి ఒక్కడు ఆరోజు తగ్గించబడతాడు.

 

 ఇక 16వ వచనం సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చే మహిమ పరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకొనును. ఇలాగ తీర్పు తీర్చడం ద్వారా దేవుడు మహిమ పరచబడుతున్నాడు నిజానికి మహిమ ఘనత దేవునికి చెందాలి గాని వీళ్లు ఆ ఘనతను తమకు తాము ఆపాదించుకుంటున్నారు కాబట్టి వీరికి తీర్పు తీర్చి దేవుడు తాను మహిమ పొందబోతున్నారు అందుకే యెషయా ప్రవచన గ్రంధంలో ఒక మాట అంటారు నాకు చెందవలసిన ఘనత మహిమ ఎవరికి చెందనీయను కానీ నేటి బోధకులు మరికొంతమంది దేవునికి రావలసిన ఘనతను వీరు దొంగలిస్తున్నారు! వీరి మీదకి దేవుడు తీర్పు తీర్చబోతున్నారు తద్వారా దేవుడు మహిమ పరచబడబోతున్నారు.

 

17. అది మేతబీడుగా నుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

 

ఇక్కడ అది అనగా దేశము అని అర్ధము.

 

దేశం పాడుబడిపోయి శత్రువుల బారిన పడే సంగతిని ఇది సూచిస్తున్నది. మనుష్య సంచారం లేనందువలన దేశంలో ప్రతీదగ్గర చివరికి పట్టణాలలో కూడా గడ్డి మొలిచినందువలన అక్కడ గొర్రెలు మేకలు పశువులు గడ్డి మేస్తాయి!

 

ఇక 18వ వచనంలో చాలా విచిత్రంగా పొలుస్తున్నారు దేవుడు! 18. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు

 

తమ యొక్క దోషాలను భక్తిహీనత అనే తాడుతో లాగుకుంటున్నారు అట. ఇలాంటి వారికి శ్రమ అంటున్నారు దేవుడు! ఇంకా ఎడ్లబండి లేక గుర్రపు బండి యొక్క మోకులచేత తమ యొక్క పాపాలను లాక్కుంటూ పోయే వారికి శ్రమ అంటున్నారు.  మానవ పాపం మోసాలకు సంబంధించినది ఇతరులను మోసగించడం, తరచుగా తమ్మును తామే మోసగించుకోవడం, దేవుణ్ణీ మోసగించాలని చూడడం. తాళ్ళ మోకులు కాయ కష్టాన్ని సూచిస్తున్నాయి. వీరు తమ పాపాలు చేసేందుకు చెమటోడ్చి పని చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ!!!

 

ఇంకా వీరు ఏమని అనుకుంటున్నారు అంటే తర్వాత వచనం: 19. ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము

 

     చూడండి ఈ పాపాత్ములు వ్యంగ్యంగా ఈ మాటలు అంటున్నారు--  పంపుతానని దేవుడు హెచ్చరిస్తున్న తీర్పు తమమీదికి వస్తుందన్న విషయం వీరు నమ్మడం లేదు. చాలా మంది అంతే గదా. అందుకే సామెతలు 29వ అధ్యాయం ఎన్నిసార్లు గద్దించినా వినని వానిమీదికి ఇక తిరుగులేకుండా హటాత్తుగా నాశనమై పోతాడు! వీరిగతి కూడా ఇదే!!!

 

      ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు కూడా దేవుడు నన్ను ఎక్కడ పట్టించుకుంటున్నాడు నన్ను ఎక్కడ చూస్తున్నాడు అని విర్రవీగావా జాగ్రత్త నీవు కూడా తప్పించుకోలేవు గనుక భయమునొంది పాపమును వదిలేయ్!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*180వ భాగము*

యెషయా 5:1523

15. అల్పులు అణగద్రొక్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును

16. సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.

17. అది మేతబీడుగా నుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

18. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు

19. ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము

20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.

22. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.

23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 5వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!!  దేవుడు ఇశ్రాయేలు జాతిని ద్రాక్షతోటతో పోల్చి న్యాయము నీతి కావాలని చూస్తే దానిలో బలాత్కారము రోధన కనిపిస్తుంది అంటున్నారు దేవుడు!

 

          (గతభాగం తరువాయి)

 

     ఇక తర్వాత వచనాలు చూసుకుంటే ఇక్కడ మరలా కొంతమందికి శ్రమ అంటున్నారు. మీద బాగాలులో చూసుకున్నాము- ఈ అధ్యాయంలో 823 మధ్యలో 9 రకాలైన ప్రజలకు శ్రమ అంటూ! ఈ వచనాలలో కొందరున్నారు!

 

20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

 

కీడుని మేలుగాను మేలును కీడు గాను చెప్పుకుంటూ ఇంకా చీకటిని వెలుగు అని వెలుగుని చీకటి అంటు ఎంచుకుంటున్నారు వీరు! మరొకరు ఉన్నారు వారు చేదుని తీపి అంటూ తీపిని చేదు అంటూ ఎంచుకుంటున్నారు వీరు! ఇదెక్కడి మాయరోగమో వారికి తెలియదు! ఇలాంటి వారికి శ్రమ అంటున్నారు దేవుడు! వీరు ఎంత చెయ్యి దాటిపోయారో దీనివల్ల అర్థమౌతున్నది. భ్రష్టత్వం, హృదయ కాఠిన్యం మూలంగా వారు మంచికీ, చెడుకూ తేడా గ్రహించాలన్న కోరికనూ, బహుశా వివేచనా శక్తిని కూడా కోల్పోయారు. రోమీయులకు 1:21; ఎఫెసీయులకు 4:18-19; హెబ్రీయులకు 5:14 పోల్చి చూడండి.

 

ఈవచనాలలో పౌలుగారు అంటున్నారు:

 

రోమీయులకు  1

21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

 

ఎఫెసీయులకు  4

18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

 

హెబ్రీయులకు  5

14. వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.

 

ఇక తర్వాత వచనంలో మరో రకమైన వారున్నారు, వీరికి కూడా శ్రమ అంటున్నారు దేవుడు! 21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.

 

చూడండి తమ దృష్టికి తామే జ్ఞానము తెలివితేటలు గలవారమని అనుకునే వారికి కూడా శ్రమ అంటున్నారు!!!

 

తాను జ్ఞానవంతుణ్ణని విర్రవీగడమంటే దేవుని జ్ఞానంనుండి తనను తాను దూరం చేసుకోవడం, అహంకారమనే పాపంలో పడడం.

 

అందుకే సోలోమోను భక్తుడు అంటున్నారు: సామెతలు  3

7. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము

 

ఇంకా ఇదే సామెతల గ్రంధములో మూడుసార్లు వ్రాయబడి ఉంది- ఒకని ఎదుట సరియైనదిగా కనబడే మార్గం ఉంది గాని అది చివరికి మరణానికి నాశనానికి నడుపును అంటూ..

 

సామెత 14:12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

 

యెషయా  47

10. నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.

రోమీయులకు  12

16. ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

 

1 కోరింథీయులకు  3

18. ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.

19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;

20. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది

 

ఇక 22  వ వచనంలో మరొక గుంపు ఉంది-

22. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.

 

గతభాగంలో త్రాగుబోతుల కోసం ధ్యానం చేసుకున్నాము! అయితే వీరు త్రాగేవారే  కాకుండా మందు కలిపేవారు  కూడా ఉన్నారు. వీరి పేరు బార్ టెండర్లు . ఇంకా బాగా చెప్పాలంటే Mixologist. త్రాగుబోతుల బాషలో కాకటైల్ చేసేవాడు. వీరికి ప్రత్యేకమైన కోర్సులు డిగ్రీలు కూడా ఉన్నాయి విదేశాలలో! ఇలాంటివారికి శ్రమ అంటున్నారు దేవుడు!

 

23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

 

11,12 వచనాల్లో ప్రవక్త ఈ పాపాన్ని ఖండించారు. ఇక్కడ నాయకుల్లో న్యాయాధిపతుల్లో ఈ పాపాన్ని నిరసిస్తున్నారు. హీబ్రూ భాషలో ఈ రెండు వచనాలకూ స్పష్టమైన లింకు ఉంది. న్యాయాధిపతులు అంటే త్రాగి తందనాలాడ్డంలో సమర్థులే, వీరులే గానీ కార్య నిర్వాహణలో భ్రష్టులే. న్యాయంగా తీర్పు చెప్పడానికి అసమర్థులే. లంచం గురించి నిర్గమకాండము 23:8; 1 సమూయేలు 8:3; కీర్తనల గ్రంథము 26:10; సామెతలు 17:23; ఆమోసు 5:12 చూడండి.

 

నిర్గమకాండము  23

8. లంచము తీసి కొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.

 

1 సమూయేలు  8

3. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

 

కీర్తనల గ్రంథము  26

10. వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.

 

సామెతలు  17

23. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.

 

ఆమోసు  5

12. మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు

ఇలాంటి త్రాగుబోతులకు లంచగొండులకు శ్రమ అంటున్నారు దేవుడు!

ఒకవేళ నీవు ఈ గుంపులో ఉంటే సరిచేసుకో! లేకపోతే దేవుని ఉగ్రతకు పాలుకాగలవు!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*181వ భాగము*

 

యెషయా 5:2430

24 సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక రించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లి పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.

25 దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

26 ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.

27 వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.

28 వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

29 ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.

30 వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జనచేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటి యగును.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 5వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!!  దేవుడు ఇశ్రాయేలు జాతిని ద్రాక్షతోటతో పోల్చి న్యాయము నీతి కావాలని చూస్తే దానిలో బలాత్కారము రోధన కనిపిస్తుంది అంటున్నారు దేవుడు!

 

          (గతభాగం తరువాయి)

 

  ఇక 2430 వరకు చూసుకుంటే ఇంకా ఇశ్రాయేలు దేశము మీదికి రాబోయే ఉగ్రతలే కనిపిస్తాయి.   

 

24 సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లి పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.

 

ఇక్కడ యూదా జాతి ధర్మశాస్త్రాన్ని వదిలేశారు. దేవుని వాక్యాన్ని త్రోసివేశారు! అందుకే దేవుడు అగ్ని కర్రలను కాల్చే విధంగా ఇంకా ఎండిపోయిన గడ్డి మంటలో బూడిద అయిపోయే విధంగా యూదా ప్రజల యొక్క వేరు కుళ్ళి పోతుంది వారి పువ్వులు వాడిపోయి ఎగిరిపోతాయి అంటున్నారు!

 

ఇంతకు ముందు వచనాల్లో వర్ణించిన ఏ రకమైన పాపులు కూడా శిక్షను తప్పించుకోలేరు. వారి దుష్ట ప్రవర్తనకు మూల కారణం తమ జీవితాలను ఏలనీయకుండా దేవుని వాక్కును త్రోసి పుచ్చడమేనని గమనించండి.

 

ఇక 25 వ వచనంలో 25 దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

 

చూడండి దేవుని కోపం ప్రజల మీద మండుచున్నది అంటున్నారు! పర్వతాలు వణుకు చున్నాయి, వీదులలో వారి కళేబరములు పెంటలా పడియున్నవి అంటున్నారు. ఇంతగా జరిగిన దేవుని కోపం ఇంకా చల్లారలేదు వారిని నాశనం చేయడానికి దేవుడు చాపిన చేయి ఇంకా చాపి ఉంది అంటున్నారు! చూడండి దేవుడు ఎంతగా విసికిపోయారో ఈ ప్రజల వలన! జాగ్రత్తగా గమనిస్తే వీదులలో శవాలు పెంటలా పడియున్నాయి అంటున్నారు కదా- నిజానికి ఈ ప్రవచనం యిర్మీయా గారి కాలంలో నెరవేరింది.  బబులోనూ రాజైన నెబుకద్నేజర్ యెరూషలేము ని ముట్టడి వేసినప్పుడు ఇదే జరిగింది. శవాలు కుప్పలా ఉండేవి. బయట శత్రువులు- లోపల ఆకలి చావులు- ఎక్కడ చూసినా శవాలే! వాటిని పాతిపెట్టడానికి ఎవరికీ ఓపికలు లేక శవాలను అలాగే వదిలేసే వారు!!!

 

ఇదే మాటను లేక ప్రవచనాన్ని దేవుడు ఎన్నోసార్లు చెప్పారు

జెఫన్యా 1:17

జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును,వారి మాంసము పెంటవలె పారవేయబడును.

 

యిర్మియా 9:22

యెహోవా వాక్కు ఇదే నీవీమాట చెప్పుము చేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చ కుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.

 

యిర్మియా 15:3

యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.

 

విలాప 2:13

1. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.

2. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనముచేసి యున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర పరచియున్నాడు.

3. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగ మును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు.

 

       ప్రియులారా 24, 25 వచనాల్ని ఓవరాల్ గా చూసుకుంటే సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మ శాస్త్రాన్ని నిర్లక్ష్పెట్టారు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు అందుకే నాశనం అయిపోతారు దూళిలాగే ఎగిరిపోతారు అంటున్నారు దీని అర్థం ఏంటంటే ఓ విశ్వాసి నువ్వు కూడా యెహోవా యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుడిచ్చిన వాక్యాన్ని ఆయన కట్టడలను ఆయన విధులను నీవు కూడా నిర్లక్ష్యం చేస్తే వాక్య ప్రకారము జీవించకపోతే ఆయన నీ ఆత్మను కూడాను కాల్చుతాడు ఒకరోజు నరకంలో బాధపడతావు మొదటి కీర్తనలో రాయబడినట్టు దుష్టులు అలాగనుండక గాలికి ఎగరగొట్టు పొట్టువలె, ఆ సుడిగాలి అంత్య తీర్పు ఆ తీర్పులో పొట్టు లాగా రాలిపోయి ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతావు అంత్యతీర్పులో జాగ్రత్త! అందుకే 25వ వచనం యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండిపోతుంది అయిన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్య కళేబరాలు పెంట వలే పడియున్నవి ఇంతగా జరిగిన ఆయన కోపం చల్లారలేదు కాబట్టి ఆయన కోపము మిక్కిలి న్యాయముగా రేగింది ఎందుకు అంటే రక్షించబడిన నీవు వాక్య ప్రకారము జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది అలా చేయకపోతే నిత్య నరకానికి తప్పక పాలవుతావు గమనించమని మనవి చేస్తున్నాను.

 

ఇక తర్వాత వచనం చూసుకుంటే 26 ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.

27 వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.

28 వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

29 ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.

 

శత్రు సైన్యాలు వచ్చి దాడి చేస్తాయని ఈ వచనాలు చెప్తున్నాయి. వారి శిక్షకోసం తన స్వంత ప్రజల మీదనే వచ్చిపడాలని దేవుడు శత్రువులను పిలుస్తున్నాడు. క్రీ.పూ. 722 లో, 701 లో ఇస్రాయేల్ యూదా రాజ్యాలపై అష్షూరువాళ్ళు దాడి చేశారు. క్రీ.పూ. 605 మొదలు యూదాపై ఒకటికంటే ఎక్కువసార్లు బబులోను వాళ్ళు దండెత్తారు. 2 రాజులు 17:1-20; 24:1-20; యిర్మీయా 52వ అధ్యాయం. దీనికోసం వివరంగా ఉంది! ఈ విధంగా దేవుడు చెప్పిన విధంగా బబులోనూ వారు దండెత్తడం- యూదా జాతిలో నూటికి 80 శాతం కత్తివాత చంపబడటం- కొంతమందిని చెరలోనికి తీసుకుని పోవడం, యెరూషలేము దేవాలయముతో సహా కాల్చివేయబడటం జరిగింది!

 

దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరిగితీరుతుంది. కాబట్టి ఆయన చేసిన వాగ్ధానాలు నమ్మి ముందుకు సాగిపో! అదే సమయంలో ఆయన చేసిన హెచ్చరికలు ఆజ్ఞలను పాటిస్తూ భయం కలిగి జీవించాలి!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*182వ భాగము*

 

యెషయా 25:2430

1. యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి

2. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.

5. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.

6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు 15 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక 624 అధ్యాయాలు ఇంతకు ముందే ధ్యానం చేసుకున్నాము! మనము అభిశక్తుని మొదటి రాకడ మరియు అన్య దేశాలపై దేవుని తీర్పులు ఇంతవరకు ధ్యానం చేసుకున్నాము! అయితే ఈ అన్ని అధ్యాయాల మధ్యలో ఈ 25 వ అధ్యాయం ఒక స్తుతి కీర్తన! ఈ అధ్యాయంలో భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు!

 

అయితే మనము చూసుకోవాలసిన ఆధ్యాత్మిక అర్ధము కూడా దీనిలో ఉంది!  ఇది చెర  నుండి యూదుల విముక్తిని వర్ణించినప్పటికీ, మన ఆధ్యాత్మిక విరోధులపై క్రీస్తు విజయాలు మరియు విశ్వాసులందరికీ ఆయన అందించే ఓదార్పు కోసం దేవునికి అర్పించాల్సిన ప్రశంసలను గుర్తించడం కూడా అంతకు మించి కనిపిస్తుంది. నిజమైన విశ్వాసం అనేది దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తుంది మరియు ఆయన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన విశ్వసనీయతపై ఆధారపడుతుంది. దేవుడు గర్విష్ఠులను మరియు ఆర్ధికంగా శారీరకంగా బలమైన వారిని బలహీనపరచినట్లే, ఆయనపై ఆధారపడిన వారిని ఇంకా దేవుడంటే వినయము గలవారిని  బలపరుస్తారు . దేవుడు తన ప్రజలను అన్ని పరిస్థితులలో రక్షిస్తాడు. ప్రభువు తనపై నమ్మకం ఉంచేవారిని అణచివేతదారుల అహంకారం నుండి రక్షించాడు. వారి అహంకారం అపరిచితుల అరుపులా ఉంటుంది, మధ్యాహ్న సూర్యుడిలా ఉంటుంది, కానీ సూర్యుడు అస్తమించేటప్పుడు ఎక్కడికి వెళ్తాడు? కష్టాల్లో ఉన్న విశ్వాసులకు ప్రభువు ఎల్లప్పుడూ ఆశ్రయంగా ఉన్నాడు మరియు ఎప్పటికీ ఉంటాడు. వారికి ఆశ్రయం కల్పించిన తర్వాత, దానిని ఆశ్రయించమని వారికి ఆదేశిస్తాడు.

 

ఇక మొదటి వచనం చూసుకుంటే 1. యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి.

 

        కీర్తనాకారులు దేవుణ్ణి స్తుతించినట్లే ఈ అధ్యాయములో కూడా యెషయా గారు దేవుడు చేసిన అద్భుతాలను జ్నాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు! దేవుడు తన ఉద్దేశాలను నమ్మకంగా న్యాయంగా నెరవేర్చుకొంటూ, దుష్టులను దండిస్తూ విపత్కర పరిస్థితుల్లో తన ప్రజలను భద్రంగా కాపాడుకొంటూ ఉన్నందువల్ల వారు ఆయన్ను స్తుతించగలరు. మనము నిశితంగా పరిశీలిస్తే 1024 అధ్యాయాలలో ఇశ్రాయేలు- యూదులను కష్టపెట్టిన శ్రమ పెట్టిన దేశాలకు దేవుడిచ్చిన తీర్పులు కనిపిస్తాయి! ఇప్పుడు వారికి జరిగిన తీర్పులను ప్రవక్త జ్నాపకం చేసుకుంటూ ఈ స్తుతి కీర్తనలు 24, 25 అధ్యాయాలు రాసినట్లు మనకు అర్ధమవుతుంది. ఇక్కడ అద్భుతాలు అనగా కేవలం అన్య దేశాలకు తీర్పులే కాకుండా ఇంతవరకు దేవుడు ఇశ్రాయేలుయూదుల పట్ల చేసిన మొత్తము అద్భుతాలు అని అర్ధం చేసుకోవాలి! ఇక్కడ భక్తుడు అంటున్నారు యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను నీ నామమను స్తుతిస్తాను ఎందుకంటే నీవు అద్భుతాలు చేశావు అంటున్నారు!

 

మొదటగా నీవే నా దేవుడవు అని ఒప్పుకుంటున్నారు! ఈ లోకంలో అనేకమంది దేవుళ్ళు అనేవారు ఉన్నారు గాని ప్రియమైన దేవుడా నీ నా దేవుడవు అని యెషయా గారు పొగుడుతున్నారు ఇక్కడ! కీర్తనాకారుడు కూడా 118:28 లో అంటున్నారు..

కీర్తనలు 118:28

నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.

 

మరి నీవు ప్రియమైన దేవుడా! నీవే నా దేవుడవు,  నా ధనము అధికారమ లేక మరొకటి నా దేవుడు కాదు! ఈలోక అన్య దేవతలు నా దేవుడు కాదు! నీవే నా దేవుడివి అని చెప్పగలిగే స్తితిలో నీవున్నావా ప్రియ చదువరీ!!!!

 

ఇక తర్వాత నేను నిన్ను హెచ్చిస్తాను అంటున్నారు! ఏమండీ- మనం ఎవరమండి దేవుణ్ణి హెచ్చించడానికి?!!! ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది దేవునికే అవుతుంది? మరి ఇక్కడ భక్తుడు నిన్ను హెచ్చిస్తాను అంటున్నారు ఏమిటండీ?!! ఇక్కడ అర్ధం ఏమిటంటే ప్రియమైన దేవుడా! ఈ లోకంలో ఉన్నవారి అందరికంటే నిన్నే నేను గొప్పగా అనుకుని నీకు స్తుతియాగం చేస్తున్నాను అని అర్ధం! నిన్నే నేను గొప్ప చేస్తాను, ఎందుకంటే మీరు యోగ్యులు అంటున్నారు భక్తుడు!! ఇలా చెప్పిన భక్తులు ఇంకా ఉన్నారు!

 

2సమూయేలు 22:50

అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.

 

కీర్తనలు 18:49

అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను.

 

కీర్తనలు 69:30

కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

 

కీర్తనలు 118:28

నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.

 

కీర్తనలు 145:1

రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను

కీర్తనలు 145:2

అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.

 

ఇక తర్వాత అంటున్నారు ఈ వచనంలో నేను నీ నామమును స్తుతిస్తాను! కీర్తనల గ్రంధం మొత్తం ఇదే ఉంది! ఇదే స్తుతి కీర్తన చూడవచ్చు!

 

కీర్తన 9:1; 16:7; 22:22; 26:12; 30:12; 42:5,11; 43:5; 52:9; 63:6; 71:22; 109:30; 145:2; ..

 

ఇక తర్వాత నీవు అద్భుతాలు చేశావు అంటున్నారు! కీర్తనల గ్రంధంలో కూడా అయ్యా నీవు చేసిన అద్భుతాలకు నీకు వందనాలు అంటున్నారు! కొన్ని అధ్యాయాలు కేవలం అద్భుతాలను కొనియాడుతూ రాసినవే! ఉదాహరణకు 18, 44, 48, 66, 74, 78,83,89,99,104, 105, 106, 135, 136, ..

 

నిర్గమ 15:11

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

 

దానియేలు 4:3

ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.

 

ఇంతమంది భక్తులు దేవుడు నిజమైన వాడని అద్భుతాలు చేసేవాడని పొగుడుతున్నారు కదా! మరి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? ఆయన అద్భుతములు చేయకపోతే మనం ఇంతవరకు బ్రతికి ఉండగలిగే వారమా?!! ఈరోజు వరకు మనం సజీవముగా ఉన్నామంటే అది దేవుని కృప మరియు ఆయన చేసిన అద్భుతమే కదా!

 

అందుకే మనం , మన జీవితాంతం దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ ఆయనను స్తుతిస్తూ సాగిపోదాం!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*183వ భాగము*

 

యెషయా 25:15

1. యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి

2. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.

5. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.

6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 25వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!  ఇది స్తుతి కీర్తన- దేవుడు చేసిన అద్భుతాలు జనాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం రాస్తున్నట్లు మనం చూసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ఇక రెండో వచనంలో పట్టణాన్ని దిబ్బగాను ప్రాకారము గల పట్టణాన్ని పాడుగాను అన్యుల నగరిని మరలా పట్టణంగా ఉండకుండా అది మరలా కట్టబడకుండా చేయగలవు అంటున్నారు!

 

యెషయా  24

10. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది.

11. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.

12. పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.

 

యెషయా 13:22

వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.

 

యెషయా 14:23

నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడు గులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

ఉదాహరణకు

యెషయా 17:2

దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.

 

ఇక మూడవ వచనం చూసుకుంటే భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

 

చూడండి భీకరులు శత్రువులు వారి ఊపిరి అగ్ని పొగలా బుసలు కొడుతుంటే నీవైతే బీదలకు ఆశ్రయముగా శరణ్యముగా ఉన్నావు దరిద్రులకు కలిగే శ్రమలలో శోదనలలో వారి శరణ్యముగాను గాలివాన కూడా తగలకుండా ఆశ్రయముగా ఉన్నావు అంటున్నారు!

 

కీర్తనల గ్రంధం మొత్తం ముఖ్యంగా దావీదు గారు దైవమా నీవే నా శరణ్యం, ఆపత్కాలములో నా తల కాయువాడు నా కొండ కోట అంటూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు!

 

కీర్తనల గ్రంథము  72

5. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.

6. గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును.

7. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.

8. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.

9. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.

10. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.

11. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.

 

కీర్తనలు 28:7,8; 46:1; 48:3; 59:16; 61:3; 62:8; 71:5; 91:2,4,9; యెషయా 4:6

 

ఇక 4వ వచనం‌ చూసుకుంటే 4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు

 

విపత్కర పరిస్థితుల్లో దేవుడు తనవారిని కాపాడతాడు. కొన్నిసార్లు శారీరకంగా, కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా, మరికొన్ని సార్లు రెండు విధాలుగానూ కాపాడతాడు యెషయా 4:5-6. కీర్తనల గ్రంథము 7:1-2. ,

 

‘బీదలు’ అనే పదం కీర్తనల గ్రంథంలో దేవుడంటే భయభక్తులుగల న్యాయవంతులైన పేదల విషయం అని అర్ధం చేసుకోవాలి!

 

యెషయా 49:2326; కీర్తన 46:1011

10. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును

11. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.

 

Psalms(కీర్తనల గ్రంథము) 66:3

3. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు

 

Psalms(కీర్తనల గ్రంథము) 72:8,9,10,11,12,13,14

8. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును.

9. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.

10. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించె దరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.

11. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.

12. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.

13. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును

14. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.

 

ఇక ముందుకుపోతే 5. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.

 

ఇంకా ఏమని స్తుతిస్తున్నారు అంటే ఎండిన దేశములో ఎండ వేడిమి తగ్గిపోయేలా నీవు మామీద పడ్డ అన్యుల ఘోషను అణిచి వేశావు బలాత్కార ల జయకీర్తన కూడా అణిచేశావు అంటున్నారు!

 

యెషయా  13

11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

 

యిర్మియా  51

55. యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.

 

   కాబట్టి దేవుడు అన్యాయస్తులను శిక్షించ బోతున్నారు. తన బిడ్డలను ఆదరించి వారికి ఆశ్రయముగా రక్షణగా కోటగా ఉంటారు! కాబట్టి ఆయనను మాత్రమే ఆశ్రయించి పరమునకు చేరుదాం!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*184వ భాగము*

 

యెషయా 25:68

6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

7. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును

8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 25వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!  ఇది స్తుతి కీర్తన- దేవుడు చేసిన అద్భుతాలు జ్నాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం రాస్తున్నట్లు మనం చూసుకున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇక 68 లో స్తుతికీర్తన మధ్యలో ఆత్మావేషుడై పౌలుగారు అంత్యదినాలలో జరగబోయే మహా గొప్ప సంభవం మరియు మహా గొప్ప భాగ్యమును ఎత్తి రాస్తున్నారు యెషయా గారు! ఈ వచనాలలో సువార్త ఆశీర్వాదాల ప్రకటన కనిపిస్తుంది! 

 

పశ్చాత్తాపపడిన పాపులకు అందించబడిన సాదర స్వాగతం తరచుగా క్రొత్త నిబంధనలో విందుతో పోల్చబడుతుంది.  అన్యజనులు మరియు యూదులతో సహా ప్రజలందరికీ ఈ  ఆహ్వానం తెరిచి ఉంటుంది. సువార్తలో, హృదయాన్ని బలపరిచే మరియు ఉద్ధరించే ఏదో ఉంది, పాపం యొక్క బరువుతో మరియు లోతైన శోకంలో ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

 

ఒక తెర (పాపపు)  అన్ని దేశాలను కప్పివేసింది, వారిని చీకటిలోకి నెట్టివేసింది. అయినప్పటికీ, ప్రభువు తన సువార్త యొక్క ప్రకాశవంతమైన కాంతి ద్వారా ఈ ముసుగును తొలగిస్తారు, ఇది ప్రపంచమంతటా ప్రకాశిస్తుంది. తన ఆత్మ యొక్క శక్తి ద్వారా, అతను ఈ కాంతిని పొందేందుకు ప్రజల కళ్ళు తెరుస్తారు . వారి అతిక్రమాలు మరియు పాపాల కారణంగా చాలాకాలంగా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని ఆయన పునరుత్థానం చేస్తారు. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా మరణాన్ని జయిస్తారు. దుఃఖం బహిష్కరించబడుతుంది, దాని స్థానంలో పరిపూర్ణమైన మరియు శాశ్వతమైన ఆనందం వస్తుంది. తమ పాపాల కోసం దుఃఖించే వారికి ఓదార్పు లభిస్తుంది, క్రీస్తు కోసం బాధలను సహించే వారు ఓదార్పు పొందుతారు.

 

ఏది ఏమైనప్పటికీ, స్వర్గం యొక్క ఆనందాల వరకు మరియు వాటిని దాటి, ఈ వాగ్దానం పూర్తిగా గ్రహించబడదు:

 

"దేవుడు అన్ని కన్నీళ్లను తుడిచివేస్తారు." ఈ భవిష్యత్తు యొక్క నిరీక్షణ అధిక దుఃఖాన్ని మరియు ఈ ప్రపంచంలో మన ప్రయత్నాలను అడ్డుకునే అన్ని ఏడుపులను దూరం చేయాలి. కొన్నిసార్లు, ఈ భూసంబంధమైన జీవితంలో కూడా, దేవుడు మానవాళిలో తన ప్రజల నుండి నిందను తొలగిస్తాడు. అయినప్పటికీ, అది గొప్ప రోజున పూర్తిగా నెరవేరుతుంది. అందుచేత, ఈ రెండూ త్వరలోనే నిర్మూలించబడతాయని తెలుసుకుని, ప్రస్తుతానికి దుఃఖాన్ని, అవమానాన్ని ఓపికగా భరిద్దాం.   ఇదీ ఈ మూడు వచనాలలో ఉన్న అర్ధం!

ఇది అంత్యకాలంలో జరిగే సంభవం! ప్రకటన గ్రంథం 21:4

ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

 

ఆరవ వచనం చూసుకుంటే 6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

 

నిజానికి ఈ వచనం మాత్రమే చూసుకుంటే దీని అర్ధం- హార్మేగిద్దోను మరియు గోగుమాగోగు యుద్ధాల తర్వాత దేవుడు పక్షులను పిలిచి వాటికి చేయబోయే విందులా కనిపిస్తుంది. అనగా పక్షులను పిలిచి దేవుని యుద్ధం తర్వాత చనిపోయిన వారి శవాలతో పక్షులకు విందు చేయబోయే ఘట్టంలా కనిపిస్తుంది. ఇది మనకు యెహేజ్కేలు గ్రంధంలో మరియు ప్రకటన గ్రంధంలో కనిపిస్తుంది.  అయితే దీని నిజమైన అర్ధం మనకు క్రింది రెండు వచనాలు కలిపి చదువుకుంటే అసలు అర్ధం పరమార్ధం బయలుపడుతుంది!

 

ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా విందుచేయును అనగా ఈ పర్వతము అనగా యెరూషలేము కట్టబడిందే పర్వతాల మీద.  కాబట్టి “ఈ కొండమీద” అనగా జెరుసలంలోని కొండ, లేక జెరుసలం నగరం. జెరుసలంలో కల్వరి అనే కొండపై భావికాలంలో ప్రపంచంపైనా, దాని ప్రజలపైనా వర్షించబోయే ఆశీర్వాదాలన్నిటికీ తన కుమారుని మరణం మూలంగా దేవుడు పునాది వేశారు (53 అధ్యాయం).

 

దుర్మార్గతను నాశనం చేయడం కంటే భూమి విషయంలో దేవునికి మరింత ఉన్నతమైన ఉద్దేశమే ఉంది. ఆయన ప్రేమమూర్తి, కృపామయుడు. ఈ వచనాల్లో విముక్తులైన మానవులకోసం ఆయన సిద్ధపరచిన భాగ్యం ఎలాంటిదో వెల్లడౌతున్నది. ముఖ్య ఉద్దేశ్యం భూమిపై పాపమును అంతము చేయాలి తన ప్రజలను పాపమునుండి విమోచించి వారిని సాతాను బంధకములనుండి విడిపించి పరిశుద్ధులనుగా చేసి దేవునితో మరలా సమాధాన పరచాలి  ఇదీ ఆయన ముఖ్య ఉద్దేశం!!! ఆ కార్యానికి వేదికగా యెరూషలేము లో కల్వరి కొండ ఉండబోతుంది! దానినే భక్తుడు ప్రవచిస్తున్నారు!!!

 

“విందు” అనగా ఆనందోత్సాహాలకూ, దేవునితో సహవాసానికీ, ఆధ్యాత్మిక దీవెనలకూ గుర్తు (యెషయా 55:1-2;

 

యెషయా  55

1. దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.

2. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైన దానియందు సుఖింపనియ్యుడి.

 

మత్తయి  22

1. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.

2. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.

 

లూకా  14

15. ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా

16. ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.

 

ఈ వచనాల సందర్భం “గొర్రెపిల్ల వివాహోత్సవాన్ని” సూచిస్తున్నది (ప్రకటన గ్రంథం 19:6-7).

ప్రకటన గ్రంథం  19

6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు

7. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.

 జెకర్యా 14:9, నిర్గమకాండము 15:18, కీర్తనల గ్రంథము 22:28, కీర్తనల గ్రంథము 93:1, కీర్తనల గ్రంథము 99:1, యెహెఙ్కేలు 1:24, యెహెఙ్కేలు 43:2, దానియేలు 7:14, దానియేలు 10:6

 

కాబట్టి దేవుడు తన కుమారుడైన యృసుక్రీస్తు ప్రభులవారిని భూలోకమునకు పంపించి పరలోక రాజ్యము సమీప్యముగా ఉన్నది అంటూ  సువార్తను ప్రకటించి మారుమనస్సు ప్రకటించి మానవాళి పాపముకోసం కల్వరి కొండమీద  తన రక్తాన్ని చిందించి మరణించి బలియాగం చేసి మన పాపముల నుండి విమోచించి దేవునితో సమాధాన పరిచారు! కాబట్టి నేడే ఆయన మరణ పునరుత్థానము లను గ్రహించి ఆయనతో సహవాసం పెంచుకుని పరమునకు వెళ్దాము!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*185వ భాగము*

 

యెషయా 25:68

6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును nమూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

7. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును

8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 25వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!  ఇది స్తుతి కీర్తన- దేవుడు చేసిన అద్భుతాలు జ్నాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం రాస్తున్నట్లు మనం చూసుకున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక 7వ వచనం చూసుకుంటే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును అంటున్నారు! దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి! మొదటిది: అన్యజాతులమీద పరచివున్న ముసుకు  అంటే ఆధ్యాత్మిక అంధత్వాన్నీ మరణాన్నీ సూచిస్తాయి. దీనికోసం పౌలుగారు అంటున్నారు ఈ యుగసంబంధమైన దేవత ప్రజలకు గ్రుడ్డి తనము కలుగజేస్తుంది .. 2 కోరింథీ 4: 4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.

5. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

ఇదే ఆధ్యాత్మిక అంధత్వము! నిజమైన దేవుని వెలుగుని ప్రజల గ్రహించకుండా సాతాను గాడు వేసిన తెర లేక ముసుకు!!! యోహాను గారు అంటున్నారు:

 

1: 9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

11. ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

12. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

 

ఈ వెలుగు యేసుక్రీస్తుప్రభులవారు , ఆ వెలుగుని లోకమునకు అందకుండా ప్రయత్నం చేస్తుంది సాతాను గాడు!!!

 

అదే ఇశ్రాయేలు ప్రజల కోసం అయితే అది ధర్మశాస్త్రం అనే అడ్డు తెర!!! దేవుని దగ్గరకు డైరెక్టుగా  వెళ్ళకుండా అడ్డుగా ఉన్న అడ్డుతెర!

 

2 కోరింథీయులకు  3

14. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.

15. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని

16. వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.

 

అయితే ఈ తెర యేసుక్రీస్తుప్రభులవారు సిలువపై ఉన్నప్పుడు చిరిగి పోయింది!

 

మత్తయి 27: 50. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;

52. సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.

 

పౌలుగారు దీనిని ఇంకా వివరంగా చెబుతూ అంటున్నారు: కొలస్సీ 2: 13. మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా,

14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,

15. ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

 

దీనిని ఇంకా వివరంగా చెబుతున్నారు ఎఫెసీ పత్రికలో 2: 11. కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు

12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

 

ఇదీ ఆ కల్వరి కొండపైన జరిగినది! దీనినే విందుతో పోలుస్తున్నారు దేవుడు!

 

దేవునికి మానవునికి మధ్యలో ఉన్న తెర లేక ముసుకు తొలిగిపోయి ఇప్పుడు మనం దేవుని వద్దకు తిన్నగా ఏవిధమైన ఆటంకము లేకుండా చేరడానికి దేవుని పధకం- ఆ కల్వరి బలియాగం! మరి ఆ కల్వరి బలియాగమును సిలువను అంగీకరించిన నీవు నేను దానికి తగినట్లుగా జీవించాలి! ఇక మరలా మనం లోక కార్యాలు శరీర కార్యాలు చేసి ధర్మశాస్త్రం అనే దాస్యము క్రింద, పాపము మరియు సాతాను అనే చెర లోనికి మరలా వెళ్లకూడదు! ఒకానొకప్పుడు శరీరానుశారులుగా జీవిస్తూ శారీరిక క్రియలు చేసిన మనము ఇప్పుడైతే దేవుని పిల్లలుగాను మరియు పవిత్రులును గాను ఉండటానికి పిలువబడ్డాము కనుక దేవుని పిల్లలకు తగినట్లు గా జీవించవలసిన అవసరం ఉంది!!!  కాబట్టి పరిశుద్దులకు తగినట్లుగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిద్దాం!

 

అట్టి కృప ధన్యత ప్రభువు మనకు దయచేయును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*186వ భాగము*

 

యెషయా 25:68

6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

7. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును

8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

 

                      ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 25వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!  ఇది స్తుతి కీర్తన- దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం రాస్తున్నట్లు మనం చూసుకున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక ఈ వచనాలలో మరో ముఖ్యమైన విషయం ఎనిమిదవ వచనంలో కనిపిస్తుంది మనకు!

8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

 

ఇది రెండవ రాకడ తర్వాత జరిగే సంభవం! వేయేండ్ల పాలన తర్వాత జరిగే సంభవం! దీనికోసం వివరంగా పౌలుగారు చెబుతున్నారు

1 కోరింథీ 15:

20. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.

21. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

22. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.

25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

26. *కడపట నశింపజేయబడు శత్రువు మరణము*.

27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.. . . . . .

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

55. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?

(హోషేయ 13:14)

56. మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

 

ఈ విధముగా రెండవ రాకడ అనంతరం చిట్టచివరిగా మరణమును దేవుడు అంతము చేయబోతున్నారు! ఇంతవరకు ఆదాము గారి దగ్గరనుండి ఇంతవరకు పుట్టిన ప్రతి వారిని మరణం మ్రింగి వేస్తుంది. యేసయ్యను మింగాలని చూసినా దాని వల్ల కాకపోయింది! ఆయన మరణమునే జయించారు. గాని మనము మానవులం! అందుకే మనలను మ్రింగుతుంది. గాని వేయేండ్ల పాలన తర్వాత మరణం లేకుండా మరణాన్ని అంతం చేసి నిత్యత్వములో ఉండబోతున్నాము మనము!!!

 

దీనినే ప్రకటన గ్రంధం ఋజువుచేస్తుంది!

ప్రకటన గ్రంథం  20

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

 

ప్రకటన గ్రంథం  21

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

 

హెబ్రీ 2: 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,

15. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

 

ఇక ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. దీని కోసం చూసుకుంటే భూమి పై ఉండబోయే చివరి పరిస్థితుల్లో మరణాన్ని తెచ్చిపెట్టే పాపం (రోమీయులకు 6:23) ఉండదు కాబట్టి ఆ కాలంలో మరణానికి తావు అనేది ఉండదు,  దేవుడు ప్రేమామయుడైన తండ్రి. తన ప్రజల కన్నీటిని తన స్వహస్తాలతో తుడిచివేసి, దుఃఖకారణాలను వారి నుండి శాశ్వతంగా తొలగించి వేస్తాడు.

ప్రకటన గ్రంథం  7

17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

 

ప్రకటన గ్రంథం  21

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

 

ఈ విధంగా ఆయన ప్రతీ విశ్వాసి యొక్క కన్నీటి బిందువుని తుడిచి తన హక్కున తీసుకుని ఎత్తుకుని ముద్దాడుతారు ప్రభువు! తర్వాత మరణమును మృతుల లోకమును ఆయన నాశనం చేస్తారు! దీనికి కూడా ముఖ్య కేంద్రాధారం కల్వరి సిలువయాగమే! దీనికి పునాది నాంది ప్రస్తావనం కల్వరి కొండపైనే చేయబడింది! ఇదే నిజమైన విందు! మరి ఆ విందుకోసం తెలుసుకున్న నీవు, పిలువబడిన నీవు, గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొనడానికి సిద్ధపడ్డావా?

 

సరిచూసుకో!

 

సరిచేసుకో!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*187వ భాగము*

 

యెషయా 25:912

9. ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

10. యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు

11. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును.

12. మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 25వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!  ఇది స్తుతి కీర్తన- దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం రాస్తున్నట్లు మనం చూసుకున్నాము!

 

            (గతభాగం తరువాయి)

 

       ప్రియులారా!! ఈ చివరి వచనాలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమని అర్ధమవుతుంది అంటే  క్రీస్తు స్థాపించిన సంఘము  యొక్క శత్రువుల నాశనం. (9-12) ఈ వచనాలలో కనిపిస్తుంది.

 

విమోచకుని కోసం ఆసక్తిగా ఎదురుచూసిన వారు సంతోషకరమైన వార్తలను మరియు ప్రశంసలతో ఆనందాన్ని అందుకుంటారు. మహిమాన్వితులైన సాధువులు కూడా విజయగీతంతో తమ ప్రభువు ఆనందంలోకి ప్రవేశిస్తారు. అతని దయ చివరికి దిగి వస్తుంది, ఆలస్యానికి సమృద్ధిగా పరిహారం లభిస్తుంది.

 

మన మోక్షానికి మార్గం సుగమం చేయడానికి ఒకప్పుడు సిలువపై చాచిన అదే చేతులు చివరికి పశ్చాత్తాపం చెందని పాపులందరిపై తీర్పు తీసుకురావడానికి విస్తరించబడతాయి. ఇక్కడ "మోయాబు" అనే పదం దేవుని ప్రజలను వ్యతిరేకించే వారందరినీ సూచిస్తుంది మరియు వారందరూ తక్కువ చేసి ఓడిపోతారు. వరుస తీర్పుల ద్వారా దేవుడు తన విరోధుల గర్వాన్ని తగ్గిస్తారు. మోయాబు నాశనము క్రీస్తు విజయానికి మరియు సాతాను కోటలను కూల్చివేయడానికి సూచనగా పనిచేస్తుంది.

 

కావున, ప్రియ సహోదరులారా, దృఢంగా, అచంచలంగా, ఎల్లప్పుడూ ప్రభువు పనికి అంకితమై నిలబడండి. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని తెలుసుకోండి.

 

ఇక 9 వ వచనం చూసుకుంటే

 9. ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

 

ఏకైక నిజ దేవుడు తమకు దేవుడుగా కలిగి ఉండనివారు ఈ దీవెనల్లో భాగం పంచుకోరు.

 

ఆదికాండము 49:18

యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.

 

కీర్తనలు 20:5

యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

 

కీర్తనలు 27:14

ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

 

కీర్తనలు 40:16

నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.

 

కీర్తనలు 90:14

ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.

 

కీర్తనలు 118:24

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

 

మీకా 7:7

అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.

 

ఇలా ఉత్సాహ ధనులు చేస్తారు ప్రజలు చివరకు!

 

ఇక 10 వ వచనం చూసుకుంటే 10. యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు

 

ఇక్కడ   “మోయాబు” అనగా 24,25 అధ్యాయాల సందర్భంలో మోయాబు బహుశా దేవుని ప్రజలకు శత్రుత్వం వహించే జాతులన్నిటికీ ప్రతినిధిగా ఉంది. 30:31; 34:5 కూడా ఒకసారి చూద్దాం!. . . . . . . .

 

యెషయా  30

31. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

 

యెషయా  34

5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును

 

ఇక చివరి రెండు వచనాలలో అంటున్నారు 11. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును.

12. మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.

 

ఇదే గర్వం కోసం మనం రెండో అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాము

యెషయా  2

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14. ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

 

యెషయా  16

6. మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నాము వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు విని యున్నాము. వారు వదరుట వ్యర్థము.

 

యెషయా  24

10. నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది.

12. పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.

 

ఇలా గర్విష్టుల గర్వము దేవుడు అణిచి వేస్తారు!

 

ఇంకా దేవుని ప్రజలకు జయము ఆనందము కలుగ జేస్తారు!

 

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*188వ భాగము*

 

యెషయా 26:16

1. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

2. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.

3. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

4. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 25వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము! ఇక 26 వ అధ్యాయములో కూడా అదే  స్తుతి కీర్తన- కొనసాగిస్తున్నారు భక్తుడు ఆత్మావేషుడై!!!

 

మొదటి వచనంలో అంటున్నారు ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు

 

బలమైన పట్టణం- ఈ పట్టణం ఏమిటి? దానికి రక్షణ అనేదానిని ప్రాకారముగా మరియు బురుజులుగా నియమించారు దేవుడు అంటున్నారు!

నిజానికి ఈ పట్టణం రెండు అర్ధాలను మనకు తెలుపుతుంది. ఒకటి యెరూషలేము పట్టణం, ఏ యెరూషలేము పట్టణము అంటే చెర తర్వాత తిరిగి వచ్చాక పునర్నిర్మాణ మైన పట్టణం!

ఇక రెండవది: రాబోయే నూతన యెరూషలేము!! రెండు అర్ధాలు కూడా వర్తిస్తాయి. అయితే నాకు రెండవ అర్ధమే సూటిగా సరిపోతుంది అనిపిస్తుంది!

 

ఒక విధంగా చూస్తే మొత్తం మీద రెండు నగరాలు మాత్రం ఉన్నాయి మానవ నగరం, దేవుని నగరం. ఈ వచనంలోని నగరం యెషయా 24:10, యెషయా 24.12:1; యెషయా 25:2 లోని నగరానికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నది.

 

యెషయా  24

10. నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది

12. పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.

 

యెషయా  25

2. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

 

ఇది అన్యుల పట్టణం అయితే ఇప్పుడు చెబుతుంది యెరూషలేము పట్టణం అది తిరిగి కట్టబడుతుంది!!!

 

ఇక ఆ దినము అనగా యెషయా  25

9. ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

 

దేవుడు తనవారిని రక్షించిన దినమున పాడే పాటలు అన్నమాట ఈ కీర్తన!!!

 

ఇక ఈ పట్టణానికి ప్రాకారము అనగా ప్రహారీ గోడగా రక్షణ ఉంటుంది అంటున్నారు! దీనికోసం ఆలోచిస్తే యెషయా  60

18. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

 

జెకర్యా  2

5. నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.

 

ఇక రెండవ వచనం చూసుకుంటే 2. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.

 

దీనిని చూసిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది కీర్తనల గ్రంథము  118

19. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.

20. ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.

 

ఈ సన్నివేశం జరుగక ముందే కీర్తనాకారుడు ఆత్మావేషుడై ఈ ప్రవచనం రాశారు!!

 

ముందుగా కీర్తన గ్రంధంలో నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయండి ఆ గుమ్మములో నీతిమంతులు ప్రవేశిస్తారు గనుక ఇది యెహోవా గుమ్మము అని పిలువబడుతుంది అని చెబితే ఇక్కడ సత్యమును ఆచరించే నీతిగల జనము ప్రవేశించే లాగా ద్వారములు తీయండి అంటున్నారు!!

 

ప్రకటన గ్రంధంలో ఈ పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారో వ్రాయబడింది ప్రకటన గ్రంథం  21

27. గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

ప్రకటన గ్రంథం  22

14. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.

15. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

చూడండి ఎవరికి ప్రవేశం ఉంటుందో ఎవరికి ప్రవేశం ఉండదో!!! కేవలం జీవ గ్రంధమందు ఎవరి పేరు వ్రాయబడి ఉంటుందో వారే తప్ప ఇంకెవరూ ఈ పట్టణం లో అనగా నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించ లేరు!

 

ఒకసారి ఆగి ఈ జీవ గ్రంధములో ఎవరి పేరు వ్రాయబడుతుంది అని ఆలోచిస్తే

 

ఇక జీవగ్రంధము కోసం చూసుకుంటే బైబిల్ లో అనేకసార్లు జీవగ్రంధము అని వ్రాయబడింది! అనగా దేవునికోసం విశ్వాసవీరులుగా రక్షణను కాపాడుకొంటారో వారిపేర్లు వ్రాయబడిన గ్రంధము!

 

 రక్షించబడిన ప్రతీ విశ్వాసి పేరు కూడా ఈ జీవ గ్రంధమందు వ్రాయబడుతుంది. గాని ఇక్కడ అతనిపేరు ఎంతమాత్రము తుడుపుపెట్టక అంటున్నారు అంటే తుడుపుపెట్టే అవకాశం ఉంది అన్నమాట! ఎప్పుడు తుడుపుపెట్టబడుతుంది అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది గాని నీవు మృతుడవే అని దేవునిచేత అనిపించుకునే స్థితిలో ఉంటే, బ్రతుకు బాగోలేకపోతే నీ పేరు తప్పకుండా జీవ గ్రంధము నుండి తుడుపుపెట్టబడుతుంది అన్నమాట! పుట్టించిన దేవునికి- గిట్టించే అధికారం ఎలా ఉందో, జీవ గ్రంథంలో పేరు రాసిన దేవుడు, నీ బ్రతుకు బాగోలేకపోతే నీ పేరు తుడుపుపెట్టే అధికారం మరియు అవకాశం ఉంది కాబట్టి భయము నొంది పాపము చేయకు!

 

ఇక జీవగ్రంధము కోసం బైబిల్ లో ఎక్కడెక్కడ వ్రాయబడింది అంటే

 

ప్రకటన 13:8

భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.

 

ప్రకటన గ్రంథం 17: 8

నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.

 

ప్రకటన 20:12, 15

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

15. ఎవని పేరైనను (మూలభాషలో- ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

 

ప్రకటన గ్రంథం 21: 27

గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

ఫిలిప్పీ 4:౩

అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నాయితర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడ ప్రయాస పడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంధమందు వ్రాయబడియున్నవి.

 

ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే అసలు నీ పేరు జీవగ్రంధమందు వ్రాయబడి ఉందా? వ్రాయబడిన తర్వాత ఇంతవరకు ఆ పేరు జీవగ్రంధమందే ఉందా లేక తుడుపుపెట్టబడిందా?  ఎందుకంటే , రక్షించబడని వారి పేర్లు, రక్షించబడిన తర్వాత తిరిగి లోకంలోనికి వెళ్లిపోయిన వారి పేర్లు వేరొక గ్రంధములోనికి మార్చబడతాయి. ప్రతీవారికి ఒక్కొక్క గ్రంధము ఉండవచ్చు. వాని వాని క్రియలచొప్పున వానికి తీర్పు తీర్చబడును.

 

కాబట్టి ఇప్పుడు నీవు ఆ నూతన యెరూషలేము పట్టణములో ప్రవేశించాలి అంటే నీ పేరు జీవ గ్రంధములో ఉండాలి! ఇంకా ఆ పట్టణములో కేవలం పరిశుద్దులు మాత్రమే ప్రవేశిస్తారు కాబట్టి ఆత్మానుసారమైన జీవితం సాక్షానుసారమైన జీవితం వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి! అవి లేకపోతే నిత్య నరకమే! అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు!!

 

కాబట్టి నేడే పరీక్షించుకో! ఏది కావాలో తేల్చుకో!!!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*189వ భాగము*

 

యెషయా 26:16

1. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

2. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.

3. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

4. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! ఇక తర్వాత వచనాలలో అంటున్నారు:  ఎవని మనస్సు నీ మీద అనగా దేవుని మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గలవానిగా కాపాడతావు అంటున్నారు! ఎందుకంటే నీవు అతనిని కాపాడతావు ఎందుకంటే అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు! ఇదీ అసలు విషయం! విశ్వాసి దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసముంచుతున్నాడు కనుక- ఇంకా ఈ విశ్వాసి దేవునిమీద సంపూర్ణంగా ఆనుకున్నాడు కనుక దేవుడు ఇప్పుడు ఈ వ్యక్తిని కాపాడటమే కాకుండా పూర్ణశాంతి గలవానిగా కాపాడుతున్నారు దేవుడు! నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొనక సగం దేవునిమీద సగం లోకం మీద ఉంటే నీవు వర్ధిల్లవు ఇంకా దేవుడు నిన్ను కాపాడుతారు అనే నమ్మకం పెట్టుకోకూడదు! మనలో అనేకులు క్రీస్తులో సగం లోకంలో సగం! ఇలాంటివారి పరిస్తితి రెంటికీ చెడ్డ రేగడి అవుతుంది.  యోసేపు గారు సంపూర్ణంగా దేవునిమీద ఆనుకున్నారు- అనేక శ్రమలు వచ్చాయి గాని దేవునిపై ఉన్న నమ్మకాన్ని వదలలేదు చివరికి ఈజిప్ట్ దేశానికి పెద్ద మంత్రి అయ్యారు!  అబ్రాహాము గారు దేవునిమీద పూర్తిగా ఆనుకున్నారు! ఇస్సాకు గారు దేవునిమీద ఆనుకున్నారు! దావీదు గారు కష్టమొచ్చినా నష్టమొచ్చినా సంతోషమొచ్చినా దుఖమొచ్చినా ఎప్పుడూ దేవుని మీదనే ఆనుకున్నారు! ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారు! అందుకే దేవుడు పెద్ద చక్రవర్తిని చేయడమే కాకుండా చక్రవర్తిని ప్రవక్తనూ చేశారు- చివరకు యేసుక్రీస్తుప్రభులవారు ఈ లోకమునకు రావడానికి అదే వంశ వృక్షాన్ని ఎన్నుకున్నారు! దేవాదిదేవుడు రాజాదిరాజు పరందాముడైన దేవుడు గొప్ప దేవుడు- దావీదు కుమారుడు అని పిలిపించుకోడానికి ఇష్టపడ్డారు! పిలిపించుకున్నారు! ఇలా సంపూర్ణంగా దేవునిపై ఆనుకున్న వారు ఎంతో మంది ఉన్నారు! దానియేలు గారు సింహాల బోను ఎదురైనా ఆనుకున్నారు! షడ్రక్ మేషాకు అబేడ్నేగో అగ్ని గుండములో పడవేస్తాను అన్నా వారి విశ్వాసం చెక్కుచెదర లేదు!! అందుకే వారిని పూర్ణశాంతి గలవానిగా కాపాడారు దేవుడు!

 

ప్రతి యుగంలోనూ మనశ్శాంతికి ఇదే మార్గం

 

ఫిలిప్పీయులకు 4:6-7;

6. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

 

కీర్తనల గ్రంథము 37:3-8;

3. యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

4. యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

6. ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.

7. యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.

8. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము

 

కీర్తనల గ్రంథము 112:6-9.

6. అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.

7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.

8. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.

9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.

 

ఇక అందుకే 45 వచనాలలో అంటున్నారు

 4. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

 

యుగయుగములు యెహోవాను మాత్రమే నమ్ముకోండి అంటున్నారు!  చూడండి రాజైన యెహోషాపాతు ఏమంటున్నారో:

 

2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 20:20,22

20.అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడియూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.

22.వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.

 

కీర్తనాకారులు ఏమంతున్నారో చూద్దాం:

 

కీర్తనలు 4:5

నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి.

 

Psalms(కీర్తనల గ్రంథము) 115:9,10,11,12

9. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

10. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

11. యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవా యందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.

12. యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థుల నాశీర్వదించును

 

అలా నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు- యెహోషాపాతు రాజుమాత్రమే కాకుండా! దావీదు గారు నమ్ముకున్నారు! యెహోషువా గారు అంటున్నారు మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి- నేనునూ నా ఇంటివారును యెహోవాను సేవిస్తాను అంటున్నారు!..

యెహోషువ 24:15

యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

 

ఏలియా గారు నమ్ముకున్నారు విశ్వాసించారు

1రాజులు 18:24

తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరును-ఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.

 

కీర్తనలు 5:7

నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను.

 

కీర్తనలు 13:5

నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా

 

కీర్తనలు 52:8

నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను

 

కీర్తనలు 55:23

దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.

 

మరినీవు కూడా దేవునిమీద సంపూర్ణంగా ఆనుకోడానికి సిద్దంగా ఉన్నావా?  గమనించవలసిన విషయం ఏమిటంటే  ఒక వ్యక్తి నమ్మకం పెట్టుకునేవన్నీ తాత్కాలికం, త్వరలో కృశించి గతించిపోయే లక్షణం గలవే! గాని శాశ్వతంగా ఉండేది దేవుడు మాత్రమే! ఎవరు మారినా మారనివాడు ఎవరు విడిచినా విడువని వాడు యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే!!

 

మరి ఆయన మీద ఆనుకుంటున్నావా?

 

ఆయన మీద సంపూర్ణంగా ఆనుకుంటే ఆయన నిన్ను విడిచే దేవుడు కారు!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*190వ భాగము*

 

యెషయా 26:16

1. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

2. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.

3. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

4. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

 

           ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

     ఇక తర్వాత వచనాలలో అంటున్నారు: 5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

 

   చూడండి ఎత్తైన స్థితిలో లేక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని పడగొట్టే వాడు మరియు దీనులను పైకి లేవనెత్తే వాడు ఆయనే! మనకు తెలుసు- నెబుకద్నేజర్ రాజు గర్వించి గడ్డి మేశాడు.  గొప్ప చక్రవర్తి గాడిదలా ఏడు సంవత్సరాలు అడవులలో తిరిగాడు! తప్పు తెలుసుకున్నప్పుడు మరలా మానవ బుద్ధి కలిగింది! యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తన్నుతాను హెచ్చించుకొను వాడు తగ్గించబడును!!! మత్తయి 23:12, లూకా 14:11

కీర్తనలు 75:7

దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును

 

ఇంకా బైబిల్ దీనికోసం ఏమని చెబుతుందో చూద్దాం!

 

యెషయా  2

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14. ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

 

యెషయా  24

10. నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది.

 

యెషయా  24

12. పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.

 

యెషయా  25

2. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

 

ప్రకటన గ్రంథం  18

21. తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.

 

యోబు గారు అంటున్నారు 40:1113

11. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.

12. గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము.

13. కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.

 

యెషయా 13:11

లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

 

ఇక లూసీఫర్ కోసం భక్తుడు ప్రవచిస్తున్నారు

యెషయా 14:12

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

యెషయా 14:13

నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

యెషయా 14:14

మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

యెషయా 14:15

నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

Isaiah(యెషయా గ్రంథము) 25:11,12

11. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును.

12. మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.

 

యిర్మీయా గారు అంటున్నారు 50:3132

30. కావున ఆ దినమున దాని యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు.

31. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది

32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.

 

ఇక గర్విష్టులను పడగొట్టేవాడు కాకుండా బీదలను లేవనెత్తు వాడు కూడా

 

1సమూయేలు 2:8

దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప జేయుటకును వారిని మంటిలో నుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు.

 

లూకా 1:51

ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

లూకా 1:52

సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

లూకా 1:53

ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

 

కీర్తనలు 113:8

ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు

కీర్తనలు 113:9

ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

 

కీర్తనలు 132:15

దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను

 

ఇక తర్వాత వచనంలో అంటున్నారు 6. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

 

బీదల కాళ్ళు దేనిని త్రొక్కు చున్నాయి?  ఆ పట్టణమును!!! ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే నిర్దాక్షిణ్యంగా ప్రజలను  పీడించేవారు కలకాలం పైచేయిగా ఉండరు. ఈ రోజు అణగ ద్రొక్క బడుచున్న దీనులు ఒకరోజు పైకి లేస్తారు, వారు రాజ్యాలను పట్టణాలను ఆక్రమించుకుంటారు! ఫ్రెంచ్ ఉద్యమంలో అదే జరిగింది. ఇంకా చరిత్రలో జరిగిన విప్లవాలలో అదే జరిగింది.  యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు హృదయ శుద్ది గలవారు దేవుని చూచెదరు అంటూ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు కొందురు అంటున్నారు!!!  పూర్వకాలంలో మా ఇళ్ళల్లోకి మీరు రాకూడదు మీరు అంటరానివారు అంటూ త్రోసివేసిన అలనాటి గొప్ప గొప్ప జాతివారు ఇప్పుడు కులం తక్కువవారు అంటరాని వారు అని పిలువబడిన దీనుల దగ్గరకు వచ్చి ఈరోజు దండ కట్టుకుని సార్ సార్ అంటూ పిలుస్తూ తమ పనులు చేయించుకోవాల్సి వస్తుంది. ఒకరోజు ఒరేయ్ ఒరేయ్ అని పిలిచిన వారు ఈరోజు వారి సంతానాన్ని సార్ అని పిలవాల్సి వస్తుంది. ఇది మనుష్యుల వలన కలిగింది కాదు! దేవుడు ముందుగా చెప్పారు! అది ఇప్పుడు జరుగుతుంది.

 

కాబట్టి మనిషికి గర్వం ఉండకూడదు! గర్విష్టులు గడ్డి మేస్తారు అయితే దీనులు పట్టణాలను ఆక్రమించు కుంటారు! అదే సమయంలో ఈరోజు బాధలను శ్రమలను హేళనలను ఎదుర్కొంటున్న ఓ విశ్వాసి! భయపడకు- ఎల్లకాలము ఎలా ఉండిపోవు నీవు! ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చించ బోతున్నారు! అంతవరకు విశ్వాసి వలె శ్రమలు సహిస్తూ దీర్ఘ శాంతము కలిగి ఉండు! ఒకరోజు హెచ్చించ బడబోతున్నావు!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*191వ భాగము*

 

యెషయా 26:711

7. నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

8. మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది.

9. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.

10. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

11. యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.      

 

              ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

         ప్రియులారా నిజానికి ఈ 511 వచనాలు దేవుని తీర్పును దేవుడంటే గిట్టని వారికి తెలియజేస్తున్నాయి. నీతిమంతుల మార్గం స్థిరత్వంతో కూడుకున్నది, అచంచలమైన విధేయత మరియు పవిత్రతతో కూడిన జీవితం వారి జీవితాలలో చూడగలం!. దేవుడు వారి ప్రయాణాన్ని సూటిగా మరియు క్లిష్టంగా లేకుండా చేయడం వల్ల వారికి సంతోషం కలుగుతుంది. మన కర్తవ్యం మరియు ఓదార్పునిచ్చే మూలాధారం ఈ రెంటినీ దేవుని కోసం ఓపికగా ఎదురుచూడడం ఇంకా  ఆయన పట్ల మనకున్న తీవ్రమైన కోరికలను అస్పష్టమైన మరియు అత్యంత నిరుత్సాహపరిచే క్షణాల్లో కూడా కొనసాగిస్తూనే ఉండాలి. మన శ్రమలు  మనల్ని ఎప్పుడూ దేవుని నుండి దూరం చేయకూడదు. నిజానికి, కష్టాల యొక్క చీకటి మరియు సుదీర్ఘమైన రాత్రులలో, మన ఆత్మలు ఆయన కోసం ఎంతో ఆశగా ఉండాలి మరియు ఈ కోరిక మన ఎదురుచూపు మరియు ప్రార్థన ద్వారా వ్యక్తమవుతుంది.  నిజమైన భక్తి  మన బాహ్య వృత్తులతో సంబంధం లేకుండా దానిని హృదయానికి సంబంధించిన విషయంగా కున్నప్పుడు కనిపిస్తుంది.

 

       మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా, తొందరగా వచ్చినా, దేవుడు మనల్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. బాధల యొక్క ఉద్దేశ్యం మనకు ధర్మాన్ని బోధించడమే, మరియు దేవుడు ఈ పద్ధతిలో విద్యాభ్యాసం చేసే వ్యక్తి అదృష్టవంతుడు. అయినప్పటికీ, పాపులు ఆయన మార్గాలకు వ్యతిరేకంగా వెళ్ళడానికి పట్టుదలతో ఉంటారు. వారు తమ పాపపు మార్గాలలో కొనసాగుతారు, ఎందుకంటే వారు దేవుని యొక్క అద్భుతమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతారు, ఆయన  చట్టాలను వారు విస్మరిస్తూనే ఉన్నారు. అపహాస్యం చేసేవారు మరియు ఆత్మసంతృప్తి చెందేవారు వారు ప్రస్తుతం విశ్వసించడానికి నిరాకరిస్తున్న వాటిని త్వరలో అనుభవిస్తారు: సజీవుడైన దేవుని చేతిలో పడిపోవడం ఒక భయంకరమైన విధి. వారు తమ పాపాలలోని చెడును ప్రస్తుతం గ్రహించకపోవచ్చు, కానీ వారు కోరుకునే రోజు వస్తుంది. వారు తమ పాపాలను విడిచిపెట్టి, ప్రభువు వారిపై దయ చూపగలరని ఆశిద్దాం!

 

  ఇక మనం 7 వ వచనం చూసుకుంటే

7. నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

8. మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది.

 

దీనికోసం మొదటి కీర్తన ఎంతో వివరంగా చెబుతుంది.

4. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

5. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

 

ఇక్కడ నీతిమంతులు పోయే మార్గము సమముగా ఉంటాది అంటే మొదటి కీర్తనలో ఆ మార్గము యెహోవాకు తెలుసు అంటున్నారు!  యోబు గారు నీతిమంతులు తమ మార్గమును అనగా నీతి మార్గాన్ని విడువకుండా తిన్నగా వెళతారు అంటున్నారు 17:9 లో.

 

సామెతలు 4:18 లో ఆ మార్గము వెలుగు తేజరిల్లునట్లు అంతకంతకూ తేజరిల్లుతుంది అంటున్నారు!

 

అయితే హొషేయా గ్రంధంలో కేవలం బుద్ధిమంతులు మరియు నీతిమంతులు మాత్రమే యెహోవా మార్గము తెలుసుకుని ఆ నీతిమార్గములో ప్రయాణం చేస్తారు అంటున్నారు 14:9

 

ఇక ఈ వచనంలో దేవుడే నీతిమంతుల మార్గమును తిన్నగా సరాళంగా చేస్తారు అంటున్నారు!

యెషయా  42

16. వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును

 

కీర్తనల గ్రంథము  26

12. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను.

 

కీర్తనాకారుడు అందుకే అయ్యా ఆ మార్గాన్ని నాకు బోధించుము అంటున్నారు

కీర్తనల గ్రంథము  27

11. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.

 

కీర్తనల గ్రంథము  143

10. నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.

 

ఇక ఈ వచనంలో భక్తుడు అంటున్నారు యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది అంటున్నారు!

 

కీర్తన 27 లో అంటున్నారు 8. నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.

9. నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

10. నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.

11. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.

12. అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము

13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము

14. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

 

       ఇక్కడ ఈ భక్తుడు కూడా దేవుని కోసం కనిపెట్టుకుని యున్నారు!  అందుకే 37 వ అధ్యాయంలో అంటున్నారు 34. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.

 

కీర్తన 38: 15. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.

 

అయితే సామెతల గ్రంధంలో దేవుడు అంటున్నారు 8: 34. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.

35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.

36. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.

 

అందుకే యెషయా 25:9 లో అంటున్నారు ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

 

మనము కూడా ఈ భక్తులు దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లు మనము కూడా ఆయన కోసం కనిపెడదాం! ఆయన జవాబు ఇచ్చేవరకు ఎదురుచూద్దాం!  123 కీర్తనలో అంటున్నారు భక్తుడు

1. ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.

2. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

 

130 కీర్తనలో అంటున్నారు 5. యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

6. కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.

7. ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

మరి నీవు కూడా అలా దేవుని కోసం ఆయన కనికరం కోసం కృప కోసం కనిపెడితే మనకు కూడా దేవుని యొద్ద నుండి కృప కనికారం క్షమాపణ దొరుకుతాయి! మరినీవు కనిపెడతావా!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*192వ భాగము*

 

యెషయా 26:711

7. నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

8. మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది.

9. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.

10. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

11. యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.     

 

              ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

   ఇంకా 9 వ వచనం చూసుకుంటే రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. గమనించాలి ఈ వచనంలో భక్తుడు యెషయాగారు  తన గురించి చెప్పుకుంటున్నారు “రాత్రివేళ నాప్రాణం నిన్ను ఆశిస్తుంది అనేదాని కోసం చూసుకుంటే కీర్తనల గ్రంథము  42

1. దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

2. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?

3. నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను

8. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.

 

కీర్తనల గ్రంథము  63

1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును

6. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.

 

కీర్తనల గ్రంథము  77

2. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్న

 

కీర్తనల గ్రంథము  119

55. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను

62. న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

 

  ఇదీ దేవునికోసం కనిపెట్టడం కోసం-

ఇక 10 వ వచనం చూసుకుంటే దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

 

నిజానికి ఇది ఆదినుంచి అన్ని జాతుల విషయంలోనూ అనగా అన్నీ దేశాలలోనూ అన్నీ మతాల వారికి  ఇది నిజం!

రోమీయులకు  1

20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

22. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌.

 

      ఈ మాటలు పౌలుగారు అనుభవంతో చెబుతున్నారు! సామెతల గ్రంధంలో సోలోమోను భక్తుడు కూడా అనేకసార్లు చెప్పారు! ఇక  ఇస్రాయేల్ విషయంలో కూడా. దేవుడు తన కృప మనుషుల పట్ల అనేక విధాలుగా చూపాడు

 

Psalms(కీర్తనల గ్రంథము) 10:3,4,5,6

3. దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

5. వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.

6. మేము కదల్చబడము, తరతరములవరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు

 

చూడండి మరలా మన వచనాన్ని చూసుకుందాం! దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

 

దుష్టులు దేవుని ధర్మక్షేత్రంలో నివాసమున్నా గాని వారు దేవుని యొక్క అద్భుతాలు మహత్కార్యాలు ఆలోచన చేయకుండా అన్యాయం చేస్తారు అంటున్నారు భక్తుడు!  అందుకే 11 వ వచనంలో 11. యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.     

 

దుర్మార్గులు, జరుగుతున్న సంగతుల వెనుక ఉన్న దేవుని హస్తాన్ని చూచి గ్రహించేందుకు ఇష్టపడరు. కాబట్టి వారికి అది కనిపించదు.

 

చూడండి ఇదే గ్రంధంలో ఇలాంటి దుష్టులకు దేవుడంటే వ్యతిరేకుల కోసం దేవుని భాహువు ఎత్తబడి యున్నది అంటున్నారు! ఇక్కడ కూడా అందుకే ఆయన బాహువు వీరికి వ్యతిరేఖంగా ఎత్తబడి యుండి అటున్నారు!

 

యెషయా  9

12. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

17. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి ¸యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

21. మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

 

      ఇక్కడ దేవుని హస్తము ఎందుకు ఎత్తబడి యుందో మనకు అర్ధమవుతుంది. అది దేవుని యొక్క ఉగ్రతను తీసుకుని రావడానికి ఎత్తబడి యుందీ అయితే ఈ వచనంలో మరో మాట  జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. ఇక్కడ జనులకొరకైనా ఆసక్తి ఏమిటి?

 

ఇది మనకు రెండు రకాలుగా అర్ధమవుతుంది.  దేవుడు తన ప్రజలకు మంచి చేయడానికి ఆసక్తిగా కొన్ని పనులు చేస్తున్నారు!

 

యెషయా  9

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

యెషయా  37

32. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.

 

ఇక్కడ తన ప్రజలను చెరలోనుండి తీసుకుని రావడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు!

 

జెకర్యా  1

14. కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెను - నీవు ప్రకటన చేయ వలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాసక్తి కలిగియున్నాను;

 

యోహాను  2

17. ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.

 

ఇక శత్రువులను హతం చేయడానికి దుష్టులను నాశనం చేయడానికి కూడా దేవుడు ఆసక్తిని చూపిస్తున్నారు

 

యెషయా 42:13

యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

 

యెషయా 59:18

ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.

 

యెహేజ్కేలు 5:13

నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు

 

జెకర్యా 8:2

సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను.

 

        కాబట్టి దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఆసక్తి కలిగి యున్నారు ఇంకా ఆయన ప్రజల యొక్క విరోధులను నాశనం చేయడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు! మరి నీ ఆసక్తి ఏమిటి? దావీదు గారు దేవుని మందిరమంటే ఆయన ఆరాధన అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు! ఇంకా పాత నిబంధన భక్తులు దేవుడు అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు! నెహెమ్యా గారి కాలంలో యెరూషలేము గోడను ప్రజలు ఎంతో ఆసక్తిగా కట్టినట్లు చూడగలం! మరినీకు దేవుడన్నా దేవుని సేవ మరియు పరిచర్య అన్నా దేవుని వాక్యం మరియు పాటలు ఆరాధన అంటే ఆసక్తి ఉందా?!! ఆసక్తి ఉంటే ఆయన కోసం ఏమి చేస్తున్నావు?

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*193వ భాగము*

 

యెషయా 26:1219

12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.

13. యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము

14. చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.

15. యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.

16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి

17. యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.

18. మేము గర్భము ధరించి వేదనపడితివిు గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతివిు లోకములో నివాసులు పుట్టలేదు.

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

 

              ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

     ఇక 12 వ వచనం నుండి చూసుకుంటే నీవు మాకు సమాధానం స్థిర పరుస్తున్నావు నిజముగా మా పక్షంగా ఉండి మా పనులన్నీ సఫలం చేస్తున్నావు అంటున్నారు! ఇక్కడ మొదటి వచనంలో మొదలుపెట్టిన విషయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు చెర నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యెషయా గారు మాట్లాడుతున్నారు! ఇంకా మా పనులు సాఫల్య పరుస్తున్నావు అంటే దేవుని ప్రజలు తమకంటూ ఓ సంకల్పంలేని కీలుబొమ్మలు అని అర్థం కాదు. వారు దేవునితో కలిసి పని చేస్తారు. దేవుడు వారిలో వారితో పని చేస్తారు. అందుకే  కీర్తన 57:2 లో అంటున్నారు ..

2. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.

3. ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. (సెలా.

 

ఎఫెసీ 2:10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

కీర్తన 29: 11. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును..

 

ఇక 13 వ వచనంలో అంటున్నారు యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము

 

ఇక్కడ రెండు అర్ధాలున్నాయి. మొదటి అర్ధం మనకు 1సమూయేలు గ్రంధంలో కనిపిస్తుంది. సమూయేలు గారు వృద్ధులు అయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అంటున్నారు ఆయనతో

 

8:3. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

4. ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి

5. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.

6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.

7. *అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.*

8. *వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము*.

9. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

 

  చూడండి దేవుడు తన ప్రజలయిన ఇశ్రాయేలు ప్రజలను ఏలవలేనని కోరుకుంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు అందరి దేశాల వలె ప్రజలే మమ్మల్ని ఏలాలని కోరుకున్నారు! అది దేవునికి ఇష్టం లేక పోయినా వారు కోరుకున్నారు కాబట్టి మొదట సౌలు రాజుని తర్వాత దావీదుగారిని ఇలా ఎంతో మందిని ఇచ్చారు. వారిలో అనేకమంది దేవుని మార్గము నుండి వారిని త్రోవ తప్పించారు! అదే ఇక్కడ చెబుతున్నారు ప్రవక్త! అయ్యా నీవు కాక వేరొక ప్రభువులు మమ్మల్ని ఏలారు!

 

ఇక రెండవ అర్ధం కూడా చూసుకుందాం! వారి చరిత్రలో ఆయా కాలాల్లో పరాయి పాలకులు (బహుశా వారి దేవతల విగ్రహాలతో సహా) అని అర్థం.  ఇతర దేశాల వారు అనగా ఫిలిష్తీయులు సిరియా వారు, ఆష్షూరు వారు, బబులోనూ వారు ఇలా అనేకులైన పరాయి ప్రభువులు ఏలారు! ఇకముందు అలా జరగకూడదన్న నిశ్చయం ఇక్కడ కనిపిస్తున్నది

 

1 కోరింథీయులకు  8

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.

 

ఇక తర్వాత 14. చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.

 

దీని అర్ధం భూమిమీదనుండి, మానవ, మానవాతీత పరిపాలకులందరినీ దేవుడు తుడిచివేస్తారు. తన ప్రజలపై తానే పరిపాలిస్తారు.  ఇది వారిని ఏలిన ప్రజల కోసం చెప్పబడింది.

అయితే ఇశ్రాయేలు ప్రజలకోసం ఏమి చెబుతున్నారు?

15. యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.

16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి

 

చూడండి మాకైతే మా జనములను వృద్ధి చేశారు దేశము యొక్క సరిహద్దులను కూడా విశాల పరిచావు తద్వారా నిన్ను నీవు మహిమ పరచుకున్నావు అంటున్నారు!

 

యెషయా  9

3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

 

యెషయా  14

2. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

 

యెషయా  54

2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

3. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

 

 ఈ రకంగా ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు!! ఆ ఆశీర్వాదాలకు నీవు కూడా పాత్రుడవు కావాలంటే ఆయన బాటలో నడవాలి! మరి నీవు సిద్ధమా!!!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*194వ భాగము*

 

యెషయా 26:1219

12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.

13. యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము

14. చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.

15. యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.

16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి

17. యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.

18. మేము గర్భము ధరించి వేదనపడితివిు గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతివిు లోకములో నివాసులు పుట్టలేదు.

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

 

              ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

   ఇక 16 వ వచనం నుండి చూసుకుంటే . యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి

 

నిజానికి ఇది చాలా సార్లు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారి చరిత్రలో జరిగింది. మరలా మరోసారి మా శ్రమలలో నిన్ను తలంచు కొన్నందువలన మామీద పడిన శిక్ష నుండి తప్పించావు అంటున్నారు! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ వచనాలలో దైవజనుడు తమ బలహీనతనూ తప్పులనూ ఒప్పుకుంటున్నారు. ఇజ్రాయేల్ వారిని ఎప్పటికప్పుడు క్రమశిక్షణలో పెట్టడం అవసరం అయింది. వారి ప్రార్థనలు ఊరికే గుసగుసలాడడం వంటివి. తమ కృషి, ప్రయత్నాల వల్ల వారేదీ సాధించలేదు. దేవుడు వారికిచ్చిన అమోఘమైన బాధ్యత విషయంలోనే వారు విఫలులయ్యారు (వ 18). ఇజ్రాయేల్ ద్వారా ప్రపంచమంతటికీ దీవెన, పాపవిముక్తి రావాలని దేవుని ఉద్దేశం (యోహాను 4:22; రోమీయులకు 3:1-2; రోమీయులకు 9:4-5; రోమీయులకు 15:8-9). ఇజ్రాయేల్ వారు దేని విషయంలో విఫలులయ్యారో దానిని ఇజ్రాయేల్ వాడైన యేసుప్రభువు సాధించారు.

 

  అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఇలా తమ దోషములను తమ పితరుల దోషములను ఒప్పుకున్న వారు ఉన్నారు.

 దానియేలుగారు ఒప్పుకున్నారు..

3. అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.

4. నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసి యొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయు వాడా,

5. మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయ దేశజనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక

6. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.

7. ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.

8. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది.

9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితివిు; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.

10. ఆయన తన దాసులగు ప్రవక్తలద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతివిు.

11. ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మ శాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.

12. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను.

13. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.

14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను.

15. ప్రభువా మా దేవా, నీవు నీ బాహు బలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము.

16. ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.

17. ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.

18. *నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.*

19. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.

 

ఇంకా నెహెమ్యా గారు ఒప్పుకున్నారు..

1: 5. ఎట్లనగా - ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

6. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.

7. నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిు, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతివిు.

 

ఇక ఎజ్రా గారు ఒప్పుకున్నారు

9: 6. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.

7. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవారమైతివిు.

8. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.

9. నిజముగా మేము దాసులమైతివిు; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి.

10. మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివిు గదా.

 

ఇలా చాలామంది ఒప్పుకున్నారు! ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఆ భక్తులు తమ దోషములను తమ పితరుల దోషములను ఒప్పుకుని తమనుతాము తగ్గించుకుని అయ్యా మీరే న్యాయవంతులు, మేము నీ మార్గములను తప్పి తిరిగినందు వలననే మాకు ఈ కష్టాలు వచ్చాయి. దయచేసి మమ్మును క్షమించు, మమ్మును కనికరించు అని అడిగి తగ్గించుకుని దేవుణ్ణి బ్రతిమాలుకొని కార్యాలు సాధించుకున్నారు! నీవు కూడా కార్యాలు సాధించడానికి శ్రమలో దేవుని సహాయం వేడుకోవడానికి జయించడానికి ఇదే పద్దతి! వారు ఎలా దేవుణ్ణి బ్రతిమాలు కున్నారో నీవు నేను కూడా అలాగే దేవుణ్ణి బ్రతిమిలాడు కోవాలి! మరి ఈ పద్దతి నీవు నేర్చుకుంటావా?

 

అయితే ఇక్కడ అలా తగ్గించుకుని మొర్రపెట్టె టప్పుడు ఎలా మొర్రపెట్టాలా అనేది మనకు 1718 వచనాలు చెబుతున్నాయి

17. యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.

18. మేము గర్భము ధరించి వేదనపడితివిు గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతివిు లోకములో నివాసులు పుట్టలేదు.

 

మీకా గారు అంటున్నారు:

మీకా 4:9

నీవెందుకు కేకలువేయుచున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా?

మీకా 4:10

సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.

 

స్త్రీకి డెలివరీ అయ్యేటప్పుడు ఆ నొప్పుల బాధలు తట్టుకోలేక ఎలా అరుస్తుందో ఎంతగా వేదన పడి ఏడుస్తుందో అలా దేవుని సన్నిధిలో గోజాడి మొర్ర పెట్టాలి అట! అలా మొర్ర పెట్టినప్పుడు దేవుడు కనికరపడి జాలిపడి కరుణిస్తారు!

 

మరి అలా నీవు మొర్ర పెడతావా?!!!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*195వ భాగము*

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                   

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

   ఇక 19వ వచనం నుండి చూసుకుంటే

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

 

   ప్రియులారా ఈ 1921 వచనాలు రెండవ రాకడ సమయంలో జరిగే సంభవాలు!!! ఇది గొప్ప ప్రవచనం! చనిపోయినవారు సజీవంగా తిరిగి లేవడం గురించి పాత నిబంధన  గ్రంథంలో ఎక్కువ ఉపదేశం లేదు. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ వారికి దేవుడిస్తున్న స్పష్టమైన వాగ్దానం ఉంది.

కీర్తనల గ్రంథము 16:10  ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు

 

 దానియేలు 12:2

2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు

 

గాని  దీనికోసం యేసుక్రీస్తుప్రభులవారు మరియు పౌలుగారు కూడా ప్రవచిస్తున్నారు! ఒకరోజు మృతుల పునరుత్థానం కలుగబోతుంది ఆరోజు దేవుడు తన దూతలను పంపించి సమాధులలో ఉన్నవారిని లేపబోతున్నారు! మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకు కీడు చేసిన వారిని తీర్పు పునరుత్థానమునకు లేపబోతున్నారు.

 

కీర్తనాకారుడు అంటున్నారు 71:20

20. అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.

 

యెషయా 25: 8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

 

హొషేయా 6:2

2. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.

 

యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు

మత్తయి 24: 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

31. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

ఇక యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెబుతున్నారు

5: 21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

26. తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.

27. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.

28. *దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని*

29. *మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు*.

పౌలుగారు అంటున్నారు 1 కోరింథీ 15: 50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.

52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

 

1 థెస్స 4: 13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

 

    కాబట్టి ఒకరోజు చనిపోయిన వారందరూ లేస్తారు! ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే  భూమిమీద నున్న జయజీవితం గల విశ్వాసులు రహస్య రాకడలో ఎత్తబడతారు. అదే సమయంలో చనిపోయి పరదైసులో ఉన్న జయజీవితం గల ఆత్మలు యేసుక్రీస్తుప్రభులవారితో కూడా పరదైసు నుండి మధ్యాకాశంలోని తీసుకుని రాబడతాయి. ఇక రెండోసారి వేయేండ్ల పాలన తర్వాత మహా దవళ సింహాసనపు తీర్పు జరిగేటప్పుడు మొత్తం ప్రజలు అనగా ఆదాము గారి దగ్గరనుండి అప్పటివరకు భూమిమీద బ్రతికిన వారు చనిపోయిన వారు సమాధులన్నీ తెరువబడతాయి అప్పుడు శూన్యములో దవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. అప్పుడే  మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. అప్పుడే మత్తయి సువార్త 25 లో వ్రాయబడిన మేకలు గొర్రెలు తీర్పు జరుగుతుంది. ఈ విధంగా మొత్తం భూమిమీద పుట్టిన వారందరికీ తీర్పు కలుగబోతుంది ఇదే ప్రకటన గ్రంధం 21 లో చెబుతున్నారు :

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

 

ఈ జరుగబోయే సన్నివేశాన్ని యెషయా గారు ఆ కాలమండే దర్శన రూపంలో చూసి ఆత్మావేషుడై ప్రవచ్చిస్తున్నారు 19 వ వచనంలో మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

 

భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును ఎప్పుడంటే దవళ సింహాసనపు తీర్పులో!

మరి నీవు ఆత్మానుసారమైన జీవితం, సాక్షానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధ జీవితం జీవిస్తే నీకు తీర్పులేదు కారణం నీవు జీవ పునరుత్థానంలో ఉన్నావు! దవళ సింహాసనపు తీర్పులో గొర్రెల మధ్యలో నీవుంటావు! నీవు ఎత్తబడతావు! అలాంటి జీవితం లేకపోతే తీర్పు పునరుత్థానం పొందుకుని ఆరని అగ్ని మంటలలోని నరకంలోనికి పోతావు! మరినీవు ఏ పునరుత్థానం పొందుకోబోతున్నావో ఆలోచించుకుని జీవితాన్ని సరిదిద్దుకో!

 

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*196వ భాగము*

 

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

   ఇక 2021 వచనాలు చూసుకుంటే యెహోవా భూనివాసులను శిక్షించుటకు రాబోతున్నారు అంటున్నారు, దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే తన స్థలము నుండి రాబోయేది యేసుక్రీస్తుప్రభులవారే రెండో రాకడలో భూమిమీదికి రాబోతున్నారు! దుష్టులను శిక్షించడానికి వారితో పాటుగా సాతానుని వాడి సైన్యమునకు తీర్పు తీర్చడానికి భూమిమీద తన ప్రత్యక్ష శాశ్వత రాజ్యం స్థాపించడానికి వస్తున్నారు!

 

దీనికోసం మరింతగా వివరంగా ఆలోచిద్దాం! దీనికోసం అనేక శీర్షికలలో చూసుకున్నాము ప్రత్యక్షతల గ్రంధపు వివరణలో అతి విస్తారంగా చూసుకున్నాము గాని సమయం వచ్చింది కాబట్టి మరోసారి క్లుప్తంగా చూసుకుందాం!

 

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

*ఎందుకు రాబోవుచున్నారు*?

 

తన ప్రజలను తీసుకుని పోవడానికి! మరియు వాగ్దానం చేసినది నెరవేర్చడానికి!

 

యోహాను 14: 2

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

యోహాను 14: 3

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

 

ఇక్కడ బాగుంది కదా మరి అక్కడకు ఎందుకు తీసుకుని పోవడం?

 

కారణం ఈ భూమి- ఆకాశం మానవుల పాపముల కారణంగా అగ్నిచేత కాల్చబడబోతున్నాయి!

 

2పేతురు 3: 7

అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

 

2 Peter(రెండవ పేతురు) 3:10,11,12

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు (త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

 మరి భూమి ఆకాశం కాలిపోతే వాటితోపాటు తన బిడ్డలు కూడా కాలిపోతారు కాబట్టి తన బిడ్డలను తప్పించడానికే మనలను తీసుకుని పోబోతున్నారు!

 

 ఇక ప్రకటన 3:10 లో వాగ్దానం చేసిన విధముగా మానవుల పాపం వలన భూలోకమంతటి మీదికి రాబోయే ఉగ్రత లేక మహాశ్రమలు  నుండి తన పిల్లలను తప్పించడానికి పెండ్లి సంఘాన్ని మధ్యాకాశము లోనికి తీసుకుని పోబోతున్నారు!

 

రెండవరాకడ అనంతరము- మొదటగా మహాశ్రమలు రాబోవుచున్నాయి రెండవదిగా భూమి ఆకాశాలు కాలిపోబోతున్నాయి!!!...

 

అలాకాలిపోయేటప్పుడు తన ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే తీసుకుని పోతున్నారు!!!

 

*ఎప్పుడు రాబోవుచున్నారు*?

 

మొదటగా: రక్షించబడబోయే సంఖ్య పూర్తి అయినప్పుడు ....

 

రోమీయులకు 11: 25

సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

 

రోమీయులకు 11: 27

నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

 

గమనించాలి: అన్యజనులమైన మనం రక్షించబడే వారి సంఖ్య పూర్తయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళిక మొదలవుతుంది.

 

రెండవది:

రెండవరాకడలో! గమనించాలి ఈ ప్రవచనం యేసుక్రీస్తుప్రభులవారు రెండవరాకడ కోసం చెప్పబడింది! అనగా సంఘము ఎత్తబడ్డాక జరిగే సంభవం అన్నమాట!

*సంఘము ఎత్తబడుట మరియు రెండవరాకడ ఒక్కటేనా*?

 

కాదు కాదు కాదు!

 

రాకడ రెండు భాగములు!

 

ఒకటి రహస్యరాకడ;

రెండు బహిరంగరాకడ!

 

సంఘము ఎత్తబడుట అనగా ఇది దేవుని రహస్యరాకడ! రక్షించబడే వారి సంఖ్య పూర్తయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది!! రహస్య రాకడలో యేసుక్రీస్తుప్రభులవారు భూమిమీదకు రారు! మధ్యాకాశములోనికి వస్తారు!

 

సంఘము ఎత్తబడిన వెంటనే సంఘముతో పాటుగా పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు! వెంటనే క్ర్రీస్తు విరోధి అనేవాడు తననుతాను బయలుపరచుకొంటాడు! అప్పుడు ఏడేండ్లు విడువబడిన వారికి మరియు ఇశ్రాయేలు ప్రజలకు మహాశ్రమలు ! ఎత్తబడిన వారికి ఏడేండ్లు మధ్యాకాశంలో పెండ్లి విందు!

 

ఆ ఏడు సంవత్సరాలు గడిచాక  క్రీస్తు విరోధి మరియు మహాఘటసర్పము, అబద్దప్రవక్త మరియు వాడి సేనలు మరియు ప్రపంచ దేశాలు అన్నీ ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా హార్మెగిద్దోను అనే ఇశ్రాయేలు ప్రాంతంలో యేరూషలేమును నాశనం చేద్దామని కూడుకొంటారు! అప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆర్భాటముతో భూమిమీదకు వస్తారు. ఇది భూజనులందరూ చూస్తారు!

 

ఇదే  ప్రతి నేత్రము ఆయనను చూచును అంటే!!

 

*ఆయనను పొడిచిన వారును ఆయనను చూతురు* .. అంటున్నారు!

 

ఒకసారి ఆగుదాం! యేసుక్రీస్తుప్రభులవారిని బల్లెముతో పొడవడం చూసిన ప్రత్యక్ష సాక్షి యోహాను గారు!

 

ఎందుకు పొడిచారు అంటే ఆయన మీద వారికున్న ద్వేషం కసి అంత ఉంది అన్నమాట! తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికి ఆయనాత్మను దేవునికి అప్పగించి మరణించారు యేసయ్య! గాని సైనికులకు ఇంకా ఆయన ప్రాణం కొంత ఉందేమో అన్న అనుమానం వచ్చి సైనికులలో ఒకడు బల్లెముతో పొడిచాడు వెంటనే రక్తమును నీళ్ళును కారెను అని యోహాను గారు సాక్ష్యం చెబుతున్నారు యోహాను సువార్తలో....

 

యోహాను 19: 34

సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

 

కాబట్టి ఇప్పుడు ఆయన రావడం ఆయనను పొడిచిన వారు చూస్తారు! ఇప్పుడు మరో అనుమానం రావచ్చు- ఆయనను పొడిచిన వాడు ఎప్పుడో చనిపోయాడు కదా, మరికొన్ని రోజులు పోతే 2000 సంవత్సరాలు అయిపోతుంది. మరి చచ్చినోడు ఎలా చూస్తాడు అనే అనుమానం రావచ్చు! ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పొడిచిన వారు అనగా (గమనించాలి పొడిచిన వాడు అనలేదు- పొడిచిన వారు) యూదులు! పొడిపించిన వారు, పొడిచిన వారు యూదులు-ఇశ్రాయేలీయులు! కాబట్టి పొడిచిన యూదులు కూడా ఆయనను చూస్తారు! ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు అంటున్నారు!

 

*ఇది ఎప్పుడు జరుగుతుంది* అంటే మొదటగా యూదులు మూడున్నర సంవత్సరాలు అబద్దక్రీస్తు మాటలకు మోసపోయి వాడినే మెస్సయ్యగా అంగీకరిస్తారు! వెంటనే మూడున్నర సంవత్సరాలు కాలంలో అప్పటికే కట్టబడిన ఇశ్రాయేలు దేవాలయంలో బల్యర్పణలు ప్రారంభం అవుతాయి! (లేదా మూడున్నర సంవత్సరాల మొదట్లోనే ఇశ్రాయేలు ప్రజలు ఆలయం కట్టుకుని బల్యర్పణలు ప్రారంభిస్తారు). మూడున్నర సంవత్సరాల తర్వాత వాడు దేవాలయంలో తన విగ్రహాన్ని పెట్టి నేనే దేవుణ్ణి అంటాడు! దానియేలు గ్రంధంలో వ్రాయబడిన నాశనకరమైన హేయవస్తువును బలిపీఠం మీద అర్పిస్తాడు! అది బహుశా పందిని బలిగా అర్పించవచ్చు!  వెంటనే ఇశ్రాయేలు ప్రజలు వాడికి వ్యతిరేఖంగా మారిపోతారు! అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మూడున్నర ఏండ్లు మహా శ్రమల కాలం మొదలవుతుంది మత్తయి సువార్త 24:... దానియేలు 12: .. లో చెప్పబడింది దీనికోసమే!

 

మత్తయి 24: 20

అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

 

దానియేలు 12: 1

ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

 

వెంటనే జెకర్యా గ్రంధంలో వ్రాయబడినట్లు 12:1014 లో వ్రాయబడింది జరుగుతుంది .....

10. *దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా* వారు *తాము పొడిచిన నామీద (వాని) దృష్టియుంచి*, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11. మెగిద్దోను లోయలో హదదిమ్మోన దగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12. *దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు*, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

 

  చూశారా వారు *తాము పొడిచిన నన్ను కండ్లారా చూస్తారు* అంటున్నారు. కరుణనొందించు ఆత్మ  విజ్ఞాపణ చేయుఆత్మ వారిమీద పనిచేసి దేశానివాసులంతా ఏడుస్తారు! ఎలా?

 

 రొమ్ము కొట్టుకుంటూ విలపిస్తారు! మొదటగా మొత్తం ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత దావీదు వంశీయులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా లేవీయులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా ... అలా అందరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు! అప్పుడు మిగిలిన అన్యజనులు కూడా ఏడుస్తారు!

 

అప్పుడు హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను ఓడించడానికి యేసుక్రీస్తుప్రభులవారు మహామహిమతో దూతలతో కోట్లాది పరిశుద్ధులతో అనగా ఎత్తబడిన వారితో ఒలీవల కొండమీద కాలుపెడతారు! ఇది రెండవరాకడ!!! బహిరంగ రాకడ!

 

 *ఏం ఒలీవల కొండమీదనే ఎందుకు కాలు పెట్టాలి*?.....

 

ఒలీవల కొండమీదకే ఎందుకు వస్తారు అంటే తను ఆరోహణమైనప్పుడు దూతలు ఒలీవల కొండమీద ఏమని చెప్పారు? మీరెందుకు అలా చూస్తున్నారు? ఏవిధంగా మనుష్యకుమారుడు పరలోకానికి ఆరోహణ మయ్యారో అదేవిధంగా మరలా వస్తారు!

 

అపో.కార్యములు 1: 11

గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

 

కాబట్టి ఒలీవల కొండమీదనుండే ఆరోహణమయ్యారు కాబట్టి ఒలీవల కొండమీదకే అవరోహణమౌతారు! దిగివస్తారు! వెంటనే ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది! హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను హతం చేస్తారు! వారి రక్తం సుమారు 321 కి.మీ. దూరం పారుతుంది!

 

ఆ తర్వాత వెయ్యేండ్ల పాలన జరుగుతుంది! (ప్రకటన 20) అందుకే ఆయన పరలోకం నుండి దిగి వస్తున్నారు అని గమనించాలి!

 

ఈ రకంగా హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను జయించి సాతానును వాడి దూతలను పాతాళంలో వెయ్యేండ్లు బంధిస్తారు...

 

సరే, *రహస్య  రాకడకు, బహిరంగ రాకడకు మధ్య కాలం ఎంత?*

 

ఏడేండ్లు!

 

ప్రియ సహోదరి/ సహోదరుడా! ఆ రోజు చాలా సిద్దంగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?

 

లేకపోతే ఆ శ్రమలు నీవు పడలేవు గనుక మారుమనస్సు పొంది సిద్దపడు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*197వ భాగము*

*రాకడసమయం- గుర్తులు-1*

 

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో భూమిమీదికి రాబోతున్నారు అని చూసుకున్నాము! అయితే ఆ రాకడ సమయం యొక్క గుర్తులు ఇప్పుడు ధ్యానం చేసుకుందాం!

 

*రాకడసమయం- గుర్తులు-1*

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

ప్రియులారా ఇంతవరకు ఎప్పుడు ఎందుకు రాబోవుచున్నారు  అని చూసుకున్నాం! ఇక....

 

      (గతభాగం తరువాయి)

 

సరే, ఇంతకీ ఆయన మేఘారూడుడై రాబోతున్నారు, సంఘము ఎత్తబడుతుంది! మరి ఆయన రాకడకు- మన పోకడకు దానికి సూచనలు ఏమిటి?

 

మొదటగా పౌలుగారు చెప్పినది చూసుకుని యేసుక్రీస్తుప్రభులవారు ఏమి చెప్పారో చూసుకుందాము!

శిష్యులు యేసుక్రీస్తుప్రభులవారుని ఇదే ప్రశ్న అడిగితే మీరు అనుకొనని గడియలో సంభవిస్తుంది అన్నారు!

 

పౌలుగారు దొంగవలె వస్తుంది అన్నారు! దానికి వివరణ కూడా ఇచ్చారు!

 

1 థెస్సలోనిక 5:14

1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

  ఈ మొదటి వచనంలో సహోదరులారా! ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటున్నారు!  ఇక్కడ కాలములు సమయములు అనడానికి కారణం రహస్యరాకడ, బహిరంగ రాకడ ఒకేసారి జరుగదు అనే ఉద్దేశ్యంతో కావచ్చు! ఇక్కడ ఆ కాలములు అనగా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ మరియు మృతుల పునరుత్థానం మరియు సజీవుల పునరుత్థానం జరిగే కాలములు సమయములు అన్నమాట! ఆ కాలములు సమయములు గూర్చి మీకు వ్రాయనక్కరలేదు అనగా పౌలుగారి ఉద్దేశం వారికి అనగా థెస్సలోనికయుల సంఘానికి కాలములు సమయములు ఖచ్చితమైన తారీకులు తెలుసు అన్న అర్ధమా? కానేకాదు!

 

   దీనికి జవాబు కావాలంటే క్రింది రెండు రిఫరెన్సులు చూడాలి!

 

శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తుప్రభులవారిని నీ రాకడకు మరియు యుగాంతము ఎప్పుడు జరుగుతుంది అని!

 

మత్తయి 24:3, 36

3. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా

36. *అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు*.

 

మరోసారి ఆయన పునరుత్తానుడైన తర్వాత ఆరోహణమయ్యే సమయంలో మరోసారి అడుగుతారుఅయ్యా మీరు వచ్చిన పని అయిపోయింది కదా మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరలా రాజ్యమును అప్పగిస్తావా? దానికి ఆయన జవాబు:.....అపో 1:68

6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన

7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.

8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

కాబట్టి ఈ రెండు రిఫరెన్సులు మరియు ఈ వచనంలో చెప్పిన విధముగా మనకు అర్ధం అయ్యేదేమిటంటే రాకడ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది అనేది రోజులు గడియలు సంవత్సరాలు కాదు తెలుసుకోవలసినది! అది మన పని కాదు అని దేవుడు అంత స్పష్టముగా చెప్పినప్పుడు ఇంకా దానికోసం అడుగకూడదు! దాని అర్ధం రాకడ విషయం మరచిపోవాలా? కాదు సిద్ధముగా ఉండాలి ఎప్పుడొచ్చినా ఎత్తబడటానికి!

 

మరి ఏమి తెలుసుకోవాలి? ఏమి  పొందుకోవాలంటే *పైనుండి శక్తి*! అనగా పైనుండి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి!

 

ఆ శక్తి వస్తే లేక పొందుకొంటే ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్రంగా ఉంచుతాడు! నీవు ఎటువంటి పాపపు క్రియలవెంబడి మరలినా, పాపపు ఆలోచనలు వచ్చినా నీలో ఉన్న పరిశుద్దాత్ముడు నిన్ను గద్దించి సరిచేసి నిన్ను పశ్చాత్తాప పడేలా చేస్తాడు! తద్వారా నిన్ను దేవునితో సమాధాన పడేలా చేసి నీవు పరలోకం వెళ్ళేలా ఎత్తబడేలా చేస్తాడు!

1:8

8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

  దీనిద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే రాకడ ఎప్పుడొస్తుంది లాంటి విషయాలు కాకుండా ఆత్మీయ సంబంధమైన విషయాలు తెలుసుకుని పొందుకుని వాటికోసం తాపత్రయ పడాలి!

 

 ఇక రెండో వచనంలోను నాలుగో వచనంలోను ప్రభువు రాకడ దొంగవలె వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అంటున్నారు! అనగా దొంగ ఏవిధంగా ఎవరికీ చెప్పకుండా ఏవిధమైన ముందస్తు ప్రకటన లేకుండా వస్తాడో అలాగే యేసుక్రీస్తుప్రభులవారి రాకడ కూడా మనము ఊహించని రోజున, తలంచని విధంగా వస్తుంది!

 

      మరి మనం ఏం చెయ్యాలి? ఆ రోజు సమయం తెలుసుకోనక్కరలేదు అంటున్నారు దొంగవలె వస్తుంది అంటున్నారు! ఇంతకీ ఆయన వస్తారా లేదా? లేక ఇంకా చాలా సమయం పడుతుందా? అని అడిగితే:

ఆయన తప్పకుండా వస్తారు! దూతలు బూరలు ఊదుటకు సిద్ధంగా ఉన్నారు! మీకెలా తెలుసు? బూరలు ఊదుటకు సిద్దంగా ఉన్నారు అని చెబుతున్నారు? మీరు చూసొచ్చారా అని అడగవచ్చు!

 

ఎలా చెబుతున్నాము అంటే ఆయన రాకడ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి!

 

మత్తయి సువార్త 24లో ఆయన రాకడ సూచనలు యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెప్పారు! ఆ సూచనలు జరుగుతున్నాయి!

 

కాబట్టి సిద్ధపడి రాకడకొరకు ఎదురుచూస్తూ ఇంకా విశ్వాసంలో బలంగా ఉండాలి!

 

ప్రకటన గ్రంథం 16: 16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

 

   ప్రియ సహోదరి/ సహోదరుడా! ఆ రోజు చాలా సిద్దంగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?

 

లేకపోతే ఆ శ్రమలు నీవు పడలేవు గనుక మారుమనస్సు పొంది సిద్దపడు!

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*198వ భాగము*

*రాకడసమయం- గుర్తులు-2*

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో భూమిమీదికి రాబోతున్నారు అని చూసుకున్నాము! అయితే ఆ రాకడ సమయం యొక్క గుర్తులు ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము !

 

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

      (గతభాగం తరువాయి)

 

1 థెస్సలోనిక 5:14

1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

  ఈ మొదటి వచనంలో సహోదరులారా! ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటున్నారు! సరే ఈ రోజు యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన రాకడ గుర్తులు మత్తయి 24 నుండి చూసుకుందాము!

 

1 *మోసము విస్తరించుట*: (అబద్ద క్రీస్తులు వెలుగులోనికి వచ్చుట)

ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.         (మత్తయి 24:4,5)

 

ఇప్పటికే నేనే క్రీస్తును అంటూ  వరకూ ఈ లోకంలో ప్రకటించుకున్నారు చాలా మంది!  అట్లాంటి వారు కోకొల్లలుగా వస్తూనే వున్నారు. మనదేశంలో ఇద్దరు అలాగే  అల్లాను నేనే యేసుక్రీస్తును నేనే మరొకరిని నేనే అంటూ ఎంతోమందిని మోసం చేశారు! వారి మందిరాలు వారి ఆరాధనలు అన్నీ మనలాగే ఉంటాయి!  ఇంకా అనేకమంది వస్తారు. ఇది యుగసమాప్తికి సూచన అనే విషయం ఎంత మాత్రం మరచిపోకూడదు.

 

2 *యుద్ధములు, కరవులు, భూకంపములు:*

 

జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.      (మత్తయి 24:7,8)

 

ప్రపంచంలో శాంతి, సమాధానం లోపించింది. ఎక్కడ చూచినా *యుద్ధవాతావరణమే* తాండవమాడుతుంది. కొన్నిరోజుల క్రితం  ఇశ్రాయేలు- పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం జరిగింది! ఇక మన దేశానికి, ప్రక్కనున్న పాకిస్థాన్ కి ఎప్పుడూ ఇదే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఇంకనూ తీవ్రతరం కాబోతున్నాయి. ఇవన్నీ క్రీస్తు రెండవ రాకడకు సూచనలు.

 

సోమాలియా లాంటి  ఆఫ్రికా దేశాలలో *భయంకరమైన కరువు* పరిస్తితులలో తినడానికి లేక మట్టి తింటున్నారు ! ఇట్లాంటి పరిస్థితులే రాబోయే దినాల్లో ఇంకనూ ప్రపంచమంతటనూ రాజ్యమేలబోతున్నాయి.

ఇక *భూకంపాలు, సునామీలు* ఎన్నో వస్తున్నాయి!   వీటన్నిటిని చూచి ఆశర్య పోవలసిన పనిలేదు గాని, యుగసమాప్తికి సూచనలని గ్రహించగలగాలి.

 

3. *విశ్వాసులు సకల జనులచేత ద్వేషించబడుట: *

 

మీరు నా నామము నిమిత్తము  సకల జనములచేత ద్వేషింపబడుదురు        (మత్తయి 24:9)

 

 ఒక్క వేటుతో తల మొండెం వేరయిపోతుంది. సజీవ దహనాలు,  మానభంగాలు, వెలివేతలు ... ఇట్లా అనేకం. కారణం ఒక్కటే!  మన దేశంలో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి! బైబిల్లు కాల్చేస్తున్నారు! దేవాలయాలను పడగొట్టి కాల్చివేస్తున్నారు! దైవజనులను దైవసేవకురాళ్ళను హింసిస్తున్నారు! తల్లిదండ్రులు చూస్తుండగానే అమ్మాయిలను బలాత్కారం చేస్తున్నారు! భర్త ఎదుటనే భార్యను మానభంగము చేస్తున్నారు! కారణం వారు యేసునామం కలిగి ఉన్నారు! . ఇవన్నీ జరుగుతున్నాయి.   ఇంకా జరిగితీరుతాయి.

 

4. *అబద్ద బోధలు:*

 

అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;   (మత్తయి 24:11)

 

నేటి దినాల్లో దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.

 

* యెహోవా సాక్షులు

* మొర్మాన్స్

* బ్రెన్హమైట్స్

* జాంగిల్ జా

* సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.

* సున్నతి లేకుండా గమ్యం లేదు.

* శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.

* యేసుమాల.

* సిలువబొట్టు.

* ఏడు వారాలు గుడికి వస్తే చాలు.

* 40 రోజుల భక్తి!

ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.

 

 

5. *అనేకుల ప్రేమ చల్లారిపోతుంది:*

 

అక్రమము విస్తరించుటచేత అనేకుల  ప్రేమ చల్లారును.     (మత్తయి 24:12)

 

ప్రేమకే అర్ధాన్ని చెప్పిన క్రీస్తుప్రేమను మర్చిపోయి సమాజంలోనూ,  సంఘాలలోను అక్రమం విస్తరించడం వలన, ప్రేమ స్థానంలో ద్వేషం,  కక్షలు,  కార్పణ్యాలు వచ్చి చేరాయి. సంఘాలకు తాళాలు వేయబడి సంఘపెద్దలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు!

 

6.. *సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి*

 

రాజ్య సువార్త సకల సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.           (మత్తయి 24:14)

 

ప్రపంచ వ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. బహిరంగ సభలు, దండయాత్రలు, కర పత్రికలు, రేడియో, టీవి, ఫేస్ బుక్,  వాట్సాప్, ఇంటర్నెట్ ఇట్లా అనేక మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అనేకులు కొండలు, లోయలు వేటిని లెక్కచేయక, ప్రాణాలకు తెగించి, నరమాంస భక్షకులకు దగ్గరకు సహితం సువార్తను మోసుకుపోతున్నారు.

 

లెక్కలేనన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడుతుంది.

 

వినినా వినకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా గాని, వాక్యం మాత్రం ప్రపంచంలోని చివరి మనిషివరకూ చేరాలి.

 

ఈ వర్తమానాలు నీదగ్గరకు వస్తున్నాయంటే? మాకు పనీ పాటు లేక చేసే పనులుగా భావించొద్దు. సువార్త ద్వారాలు మూయబడే సమయం ఆసన్నమౌతుందని గుర్తుంచుకో!

 

*ప్రియ సహోదరి సహోదరుడా! ఆయన రాకడ దగ్గర పడుతుంది! ఆయన రాకడ సూచనలు నేరవేరతున్నాయి!*  * కృపాకాలం ముగించబడబోతుంది.  దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?*  సరిచేసుకుందాం! 

 

విడువబడితే ఆ బాధలు పడలేవు కాబట్టి సిద్దపడి ఆయన రాకడలో ఎత్తబడదాం!

 

మా పల్లెటూర్లలో ఒక నాటు సామెత ఉంది! అడిగిన పిల్ల, కడిగిన ముఖం దేనికైనా పనికొస్తుంది అట! ఉదయాన్నే బ్రష్ చేసుకుని ఉంటే ఎప్పుడైనా టీ కాఫీలు తాగొచ్చు! టిఫిన్ తినొచ్చు! అలాగే సంబంధం అడిగిన పిల్ల ఉంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు! పిల్లకోసం ఊరూరా తిరగాల్సిన అవసరం లేదు! అలాగే నీవు అయన రాకడ కోసం అన్ని విధాల సిద్ధంగా ఉంటే చాలు! ఆయన ఎప్పుడైనా రానీయ్! లేకపోతే ఇప్పుడే రానీయ్! ఎత్తబడతావ్!

 

నేను సిద్ధంగా ఉన్నాను! నీవు సిద్దమా?

 

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*199వ భాగము*

*రాకడసమయం- గుర్తులు-3*

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో భూమిమీదికి రాబోతున్నారు అని చూసుకున్నాము! అయితే ఆ రాకడ సమయం యొక్క గుర్తులు ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము !

 

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

      (గతభాగం తరువాయి)

 

1 థెస్సలోనిక 5:14

1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

  ఇక రెండవ వచనంలో రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము కూడా వస్తుంది అంటున్నారు! ఇక నాలుగో వచనంలో ఆ దినము దొంగ వలె మీమీదకు వచ్చుటకయ మీరు చీకటిలో ఉన్నవారు కారు, వెలుగు సంబంధులు కాబట్టి మీకు ఆనవాలు తెలిసిపోతుంది అంటున్నారు!

 

అనగా దీని అర్ధము ఏమిటంటే ప్రభువు దినము అనబడే దేవుని రాకడ (రహస్య రాకడ) దొంగ ఎలా చెప్పకుండా అనగా ఏవిధమైన ప్రకటన చేయకుండా వస్తాడో అలాగే మీరెరుగని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడు అంటున్నారు! దీనికోసం యేసుక్రీస్తుప్రభులవారు కూడా చెప్పారు!

 

మత్తయి 24: 44

మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

 

మత్తయి 24: 50

ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును.

 

లూకా 12: 40

మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

 

మత్తయి 24: 42

కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

 

ఇక దొంగ వచ్చినట్లు అనేమాట కోసం చూసుకుంటే

 

మత్తయి 24:4344

43. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.

44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

 

లూకా 12:3940

39. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.

40. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

సువార్తలలోనే కాదు ప్రకటన గ్రంధంలో కూడా రెండు సార్లు దేవుడు చెప్పారు ప్రకటన 3:3

నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

 

ప్రకటన గ్రంథం 16: 16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

 

ఇక పేతురు గారు కూడా రాస్తున్నారు

2పేతురు 3:10

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

 

కాబట్టి ఆయన ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు! ఆ సమయం కోసం మనం తెలుసుకోనక్కర లేదు అని మొదటి వచనంలో రాస్తున్నారు!

 

ఇక నాలుగో వచనంలో ఆ దినం దొంగవలె వచ్చుటకు మీరు వెలుగు సంబంధులు చీకటి సంబంధులు కారు అంటున్నారు! పౌలుగారు ఈ మాట పలకడానికి కారణం ఏమిటి?

 

ఆలోచిద్దాం! ఒకవేళ దొంగ ఈ రాత్రికి రాబోతున్నాడు అని ముందుగా తెలిసింది అనుకుందాం! లేక మీ వీధిలో ప్రతీరోజు ఏదో ఒక గృహంలో దొంగతనం జరుగుతుంది అనుకుందాం! అప్పుడు రాత్రులు మీరు పడుకుంటారా? ఏమాత్రం అశ్రద్ధ ఏమరుపాటు లేకుండా రాత్రంతా ఎవరో ఒకరు కాపలాకాస్తూ సిద్ధంగా ఉంటారు దొంగను ఎదుర్కోడానికి!

 

అలాగే విశ్వాసి కూడా చీకటిలో లేడు వెలుగులో ఉన్నాడు గాబట్టి పరలోకం నుండి దేవుడు వచ్చే సమయం కోసం విశ్వాసి కూడా ఏమరపాటు లేకుండా ఎంతో సిద్ధపాటుతో ఎంతో జాగ్రత్తగా ఎదురుచూస్తూ ఉండాలి!

 

బుద్ధిలేని కన్యకల ఉపమానం ప్రకారం సిద్ధపాటు లేకపోతే బుద్ధిలేని కన్యకలను దేవుడు వదిలి వెల్లిపోయినట్లు నిన్ను కూడా వదిలిపెట్టేస్తారు జాగ్రత్త!... ఆ తర్వాత నీ పేరిట నేను ప్రవచనాలు చెప్పలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా! నీకు కోటిరూపాయలు కానుక ఇవ్వలేదా అంటే అక్రమము చేసే వారలారా నా యొద్దనుండి తొలగిపొండి అంటారు జాగ్రత్త!

 

Matthew(మత్తయి సువార్త) 25:3,4,10,11,12,13

3. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొనిపోలేదు.

4. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.

10. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;

11. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా

12. అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

13. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

 

అందుకే తీతు పత్రికలో పౌలుగారు చెబుతున్నారు.. 2:13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

కాబట్టి సిద్దపడిన విశ్వాసులు ఈ ప్రభువు దినం జరిగేటప్పుడు ఏవిధంగాను ఆశ్చర్యపోరు! ఈ ఆయన రాకడ మరియు యుగాంతానికి గల గుర్తులు నెరవేరుతూ ఉంటే విశ్వాసులు మరింత సిద్ధపాటులో ఉండాలి! ఆయన చెప్పిన మరిన్ని గుర్తులు చూసుకుందాము!

 

 థెస్సలొనీకయులకు 2:3,4

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

 

అపో 2:20

ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

 

మత్తయి 24 మొత్తము

 

కాబట్టి ఆయన రాకడకు సిద్దపడదాము!

 

హెబ్రీయులకు 10: 25

ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము.

 

మన జీవితాలు సరిచేసుకుని ఆయనతో సమాధాన పడదాము!

ఆయనకు ఆయాసం కలిగించే పనులు మానేద్దాం!

ఆత్మపూర్ణుల మవుదాం!

ఎత్తబడదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*200వ భాగము*

*రాకడసమయం- గుర్తులు-4*

 

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో భూమిమీదికి రాబోతున్నారు అని చూసుకున్నాము! అయితే ఆ రాకడ సమయం యొక్క గుర్తులు ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము !

 

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

      (గతభాగం తరువాయి)

 

        ఇంతవరకు మనము అన్యజనులకు మరియు మొత్తం ప్రపంచంలో లేక సృష్టిలో జరుగబోయే రాకడ గుర్తులు ధ్యానం చేసుకున్నాము! అయితే లోకమంతటికి ఈ గుర్తులు సంభవిస్తాయి అయితే యూదులకు లేక ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని సంభవాలు లేక గుర్తులు జరగాలి. అప్పుడే సంఘము ఎత్తబడుట మరియు రెండవ రాకడ జరుగుతుంది. ముందు భాగాలలో సంఘము ఎత్తబడితేనే గాని యూదుల రక్షణ ప్రణాళిక ప్రారంభం కాదు అనేది చూసుకున్నాము! అదే సమయంలో ఈ క్రింది సంభవాలు జరగాలి! కారణం యెషయా ప్రవచన గ్రంధము, యిర్మియా, యోవేలు యేహెజ్కేలు, మలాకి గ్రంధము ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు క్రొత్త నిబంధనలో చెప్పిన సంభవాలు జరిగితేనే గాని రాకడ జరుగదు!

 

*చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, తిరిగి ఇశ్రాయేలు చేరుట: *

 

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి, వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయ క్రియలవలనగాని యే అతిక్రమ క్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్రపరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.

          యెహేజ్కేలు 37: 20-23

 

ఇశ్రాయేలు ప్రజలు మొదటగా ఐగుప్తుకి చెరలోకి పోయారు. మోషేగారి ఆధ్వర్యంలో మరలా తమ దేశానికి వచ్చారు. ఆ తర్వాత వారు చేసిన పాపాల వలన

 

ఇశ్రాయేలీయులను అష్షూరు వారు క్రీ. పూ. 721 లో చెరకు తీసుకొనిపోయారు. అప్పటినుండి వారికి రాజ్యం లేదు.

               2రాజులు  17:23

 

యూదా రాజ్యమును నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకొని పోయాడు. (2దిన 36:17-19) క్రీ.పూ. 586లో...  యూదులు 70 సంవత్సరాల చెర అనంతరం తిరిగి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. వీరిని స్వంత రాజ్యంలేదు. పారశీకులు, గ్రీకులు, రోమీయులు వీరిని పాలించారు.

 

రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేము మీద దండెత్తి, సుమారు పది లక్షల మందిని చంపేశాడు. ఒక లక్ష మందిని పట్టుకొని, మార్కెట్ లో పెట్టి ప్రపంచ దేశాలకు బానిసలుగా అమ్మేశాడు. మిగిలిన ప్రాణ రక్షణతో ప్రపంచములోని వివిధ దేశాలకు చెదరిపోయారు. క్రీ. శ. 70 తర్వాత ప్రపంచ పటంలో ఇశ్రాయేలుకు స్థానం లేకుండా పోయింది.

 

అయితే, కృపగలిగిన దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను తిరిగి తీసుకొని వస్తానని, వారిక రెండు రాజ్యములుగా నుండక, ఒకే రాజ్యముగా వుంటారని యెహేజ్కెలు 37: 20-24 ద్వారా తెలియజేశాడు.

 

దాని నెరవేర్పు 1948 May, 14th న జరిగింది. రెండు రాజ్యాల ప్రజలు కలసి ఒకే స్వతంత్ర దేశముగా ఏర్పడ్డారు.

 

అయితే, ఇశ్రాయేలీయులంతా పూర్తిగా స్వదేశం చేరుకోలేదు. ఒక్కొక్కరుగా చేరుకొంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికా పాత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, యెరూషలేమును ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించడం, టెల్ అవీవ్ లోనున్న అమెరికన్ ఎంబసీని, యెరూషలేముకు మార్చడం ద్వారా, ప్రపంచ దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలీయులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వారి స్వదేశం చేరుకోబోతున్నారు.

 

ఈ పరిణామాలను పరిశీలిస్తే, ఇక యుగసమాప్తి కనుచూపు మేరల్లోనే వుందని మనము గ్రహించగలగాలి.

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

 

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*201వ భాగము*

*రాకడసమయం- గుర్తులు-5*

 

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో భూమిమీదికి రాబోతున్నారు అని చూసుకున్నాము! అయితే ఆ రాకడ సమయం యొక్క గుర్తులు ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము !

 

మనం రాకడ సమయం యొక్క గుర్తులు కోసం ధ్యానం చేసుకుంటూ యూదులకు జరిగే సంభవాలు లేక గుర్తులు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

*యెరూషలేములో దేవాలయము తిరిగి కట్టబడాలి: *

 

*దేవాలయ చరిత్ర: చూసుకుంటే

 

🍬 *మొదటి మందిరము:*

దావీదు స్థల్లాన్ని, సామాగ్రిని సిద్దపరిచాడు. కానీ, అతని చేతులు రక్తం ఒలికించడం వలన, మందిరం కట్టడానికి దేవుడు అంగీకరించలేదు.

 

మొదటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు. నిర్మాణం పూర్తికావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.

-             1 రాజులు 6:37

 

అయితే ఈ మందిరాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు కూల్చివేసాడు.

             2 రాజులు 25:

 

ప్రస్తుతము యెరూషలేములో దేవుని మందిరము లేదు. మందిరం వుండాల్సిన చోట డోమ్ రాక్ (మసీదు) వుంది.

 

*రెండవ మందిరం*:

 

  బబులోను చెర తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో హగ్గయి, జెకర్యా ప్రోత్సాహంతో, కోరెషు ఆర్ధిక సహాయంతో కట్టబడింది.  (ఎజ్రా 6వ అ.)

 

దీనిని సిరియా రాజైన అంతియొకస్ ఆఫీపైనాస్ అనేవాడు, పంది రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించి, మందిరాన్ని అపవిత్రపరచి, కొంత వరకు నాశనం చేసేసాడు.

 

అంతియొకస్ నాశనం చేసిన మందిరాన్ని, హేరోదు తిరిగి నిర్మించాడు.

 

* యేసు క్రీస్తుని బంధించిన దేవాలయము ఇదియే.

 

* రాయిమీద రాయిలేకుండా కూల్చివేయ బడుతుందని ప్రభువు ఈ మందిరం గూర్చియే ప్రవచించారు. (మత్తయి 24:1,2)

 

నెరవేర్పులో భాగంగా 40 సంవత్సరాల తర్వాత అనగా క్రీ.శ 70 వ లో రోమా చక్రవర్తియైన టైటస్ దీనిని కూల్చివేసాడు. రాళ్ళ మద్యలోనున్న బంగారం కోసం, ఏనుగులతో రాయిమీద రాయిలేకుండా పడగొట్టించాడు.

 

🍬 *మూడవ మందిరం*:

 

ప్రస్తుతము యెరూషలేములో దేవుని మందిరము లేదు. మందిరం వుండాల్సినచోట

డోమ్ రాక్ (మసీదు) వుంది.

 

మూడవ మందిర నిర్మాణం కొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తప్పకుండా మందిర నిర్మాణం జరిగితీరుతుంది. ఆ తర్వాత సంఘము ఎత్తబడుతుంది.

 

 *మందిరము కట్టబడడానికి, సంఘము ఎత్తబడానికి గల సంబంధమేమిటి? *

 

ఇశ్రాయేలీయులు క్రీస్తు విరోధితో సంధి చేసుకొని, అతనిని మెస్సయ్యగా అంగీకరిస్తారు. క్రీస్తు విరోధి నాయకత్వంలో ఇశ్రాయేలు దేశం పరిపాలించబడుతుంది.

 

నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు,  మరి యొకడు  తన  నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు.

           యోహాను 5:43

 

అనుదిన బలి నైవేద్యం దేవాలయంలో తిరిగి ప్రారంభమవుతుంది. బలి నైవేద్యం ప్రారంభము కావాలంటే? క్రీస్తు విరోధిని ఇశ్రాయేలీయులు మెస్సియగా అంగీకరించాలి. ఏడేండ్ల శ్రమకాలంలోని మొదటి మూడున్నర సంవత్సరాలు కొనసాగుతుంది.

 

బలి నైవేద్యం ప్రారంభం కావాలంటే మందిర నిర్మాణం, సంఘము ఎత్తబడక ముందే జరిగితీరాలి.

 

🔺 క్రీస్తు విరోధి ఏడేండ్ల శ్రమకాలంలో మొదటి మూడున్నర సంవత్సరముల తర్వాత దేవాలయములో బలిని నిలిపివేస్తాడు. హేయమైనది దేవాలయములో నిలుపుతాడు. (బహుశా అతని ప్రతిమనే నిలబెట్టవచ్చు.) దేవాలయంలో హేయమైనది నిలిపిన తర్వాతగానీ ఇశ్రాయేలీయులకు అర్ధంకాదు. అతడు మెస్సియ్య కాదని.

 

అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును  నాశనము  చేయువానికి  రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.

            దానియేలు 9:27

 

*దేవాలయము కట్టబడకుండా సంఘము ఎత్తబడదని లేఖనాలను బట్టి స్పష్టమవుతుంది.*

 

అయితే, ఒక్క విషయం! ఇప్పటికే మూడు దినాలలో మందిరం కట్టేలా ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. మందిరానికి కావలసిన సామాగ్రినంతా ఇశ్రాయేలీయులు సిద్దంచేసుకున్నారు. ఇక కొన్ని ఆటంకాలను అధిగమిస్తే చాలు. మందిర నిర్మాణం జరిగిపోతుంది. మందిర నిర్మాణం జరిగితే ఇక యుగ సమాప్తే.

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

 

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*202వ భాగము*

*రాకడసమయం- గుర్తులు-6*

 

యెషయా 26:1921

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.                  

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! 26వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు త్వరలో భూమిమీదికి రాబోతున్నారు అని చూసుకున్నాము! అయితే ఆ రాకడ సమయం యొక్క గుర్తులు ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము !

 

మనం రాకడ సమయం యొక్క గుర్తులు కోసం ధ్యానం చేసుకుంటూ యూదులకు జరిగే సంభవాలు లేక గుర్తులు కోసం ధ్యానం చేస్తున్నాము!   

 

      (గతభాగం తరువాయి)

 

🔺 దేవాలయము కట్టబడుటకుగల ముఖ్యమైన ఆటంకాలు: 3

 

🍬1. ప్రస్తుతము మందిరము కట్టాల్సిన స్థలములో డోమ్ రాక్ ( మసీదు) వుంది.

 

మసీదును తొలగిస్తే? మూడవ ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చు. అందుచే వున్న మసీదును కూల్చకుండా వున్నది వున్నట్లుగా లేపి, ప్రక్కన పెట్టి, ఆ స్థలంలో మందిర నిర్మాణం చెయ్యాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అట్లా అయితే, వ్యతిరేకత రాదనీ కాదు గాని, కొంత తగ్గించ వచ్చని. అది సాధ్యం కాకపోతే, యుద్దానికైనా సిద్దపడతారుగాని, మందిర నిర్మాణం ఆపడం ఎవ్వరి తరమూ కాదు.

 

🍬 2. *ఎర్రని పెయ్యి కనుగొనబడాలి: *

ఎందుకంటే?

 

ఎర్రని పెయ్యను దహించి, ఆ భస్మమునకు, నీటిని కలిపి, పాప పరిహారార్థ జలము సిద్ధపరచాలి.

 

నేడు ఇశ్రాయేలీయు ఎర్రని పెయ్యి కోసం విస్తృతమైన అన్వేషణ చేస్తున్నారు. హైఫా ప్రాంతంలో ఒకటి కనుగొనబడినప్పటికీ, దానికి రెండు తెల్లని వెంట్రుకలు వుండడం వలన అది బలికి నిషిద్ధం. ఈ అంత్యకాలంలో తగినసమయమందు దేవుడు దానిని తప్పక పుట్టిస్తాడు.

 

🍬3. *కలాల్ పాత్రలు కనుగొనబడాలి. *

 

ఎర్రని పెయ్యిని వధించి, సిద్దపరిచే భస్మాన్ని హోమ భస్మం అంటారు. ఈ పవిత్ర భస్మాన్ని మట్టి పాత్రలలో భద్రపరుస్తారు. వాటినే హెబ్రీ భాషలో కలాల్ పాత్రలు అంటారు.

 

ఈ పవిత్ర భస్మంలో పారే నీళ్లు కలపడం ద్వారా పాప పరిహారార్థ జలము తయారగును. దానిని చల్లుకుంటే పవిత్రులవుతారు.

 

మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి

 

అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.

                 సంఖ్యా  19:9-17

 

🔺 *ఇప్పుడు కలాల్ పాత్రల ఎక్కడ వున్నాయి? *

 

తెలియదు. టైటస్ చక్రవర్తి యెరూషలేము మందిరాన్ని నాశనం చేస్తున్నప్పుడు యాజకులు దేవుని మందసాన్ని, కలాల్ పాత్రలను ఎక్కడో దాచి పెట్టేసారు. మందసము అయితే, కనుగొనబడింది గాని, కలాల్ పాత్రల కోసం విస్తృతంగా అన్వేషణ చేస్తున్నారు.

 

🔺 *కలాల్ పాత్రల అవసరమేమిటి? *

 

ఇప్పుడు ఎర్రని పెయ్యను కనుగొని, దాని భస్మమును, కలాల్ పాత్రలలోనున్న పాత భస్మములో కలపాలి. అందుచే, తప్పక కలాల్ పాత్రలు కనుగొని తీరాలి.

 

వీటితో తయారు చేయబడిన పాపపరిహారార్థ జలమును వారి మీద జల్లుకొనుట ద్వారా, శుద్ధీకరించబడి, దేవాలయములోనికి ప్రవేశించడానికి అర్హులవుతారు. లేని పక్షంలో, దేవాలయంలో ప్రవేశించే అర్హత లేదు. ఇశ్రాయేలీయులు దేవాలయములో ప్రవేశించగానే సంఘము ఎత్తబడుతుంది.  ఈ మందిరంలో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు ఎత్తబడే సంఘములో వుండరు. (ఏడేండ్ల శ్రమ కాలంలో వీరి కొరకు ఇద్దరు సాక్షులు దేవునిచేత పంపబడి, రక్షణలోనికి నడిపిస్తారు.) రక్షించబడిన ఇశ్రాయేలీయులు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.

 

ఎర్రని పెయ్యి, కలాల్ పాత్రలు తప్పక కనుగొనబడతాయి, మందిరం నిర్మించబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘములో మనముంటామా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న?

 

 

ఇక మన పాఠ్య భాగానికి వచ్చేద్దాం! చివరి వచనం యెషయా 26:21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

 

దీని అర్ధం ఏమిటి? “గదులలోకి...దాక్కోండి” ఎక్కడ? ఎలా? వారి గదులు అంటే దేవుడే. ఆయన ఒక్కరిలోనే భద్రత (యెషయా 27:5). కలపతో గాని, రాతితో గాని కట్టిన ఏ గదీ దేవుని కోపంనుండి కాపాడగలిగేది కాదు. 2426 అధ్యాయాల్లో ఉన్నదాన్లో చాలా భాగం గతంలో ఇస్రాయేల్‌వారి చరిత్రకు సంబంధించినదని కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయ పడుతున్నారన్నది నిజమే. అంటే అష్షూరు, బబులోను దాడుల సమయం గురించి ఈ మాటలు రాసివున్నాయని అభిప్రాయం. కానీ నిజానికి ఈ మాటలు ఈ యుగాంత సమయానికి వర్తించేవనీ, అష్షూరు, బబులోను దాడులు రాబోయే చివరి దాడికి అల్పమైన సాదృశ్యాలేననీ  గ్రహించాలి!

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే నిజమైన దేవుని విశ్వాసులు లేక జయజీవితం జీవిస్తున్న దేవుని బిడ్డలు దేవుని ఉగ్రతలో గాని మహా శ్రమల కాలంలో గాని ఉండరు అని నేను నమ్ము చున్నాను! దీనికి మరో వాక్యాధారం కూడా ఉంది! దానియేలు గ్రంధం 1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

(మత్తయి 24:21, మార్కు 13:19, ఫిలిప్పీయులకు 4:3, యూదా 1:9, ప్రకటన గ్రంథం 3:5, ప్రకటన గ్రంథం 7:14, ప్రకటన గ్రంథం 12:7, ప్రకటన గ్రంథం 13:8, ప్రకటన గ్రంథం 16:18, ప్రకటన గ్రంథం 17:8, ప్రకటన గ్రంథం 20:12-15, ప్రకటన గ్రంథం 21:27)

2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

 

యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు

మత్తయి 24: 20. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.

22. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.

 

ఇక్కడ ఆ దినములు ఏర్పరచబడిన వారికోసం తక్కువ చేయబడును అని చెబితే మార్కు 13లో అంటున్నారు తక్కువ చేయబడెను! దేవుడు ఆల్రెడీ తక్కువ చేసేశారు అంటున్నారు

 19. అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు.

20. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?  నీవు సిద్దంగా లేకపోతే ఆ మహాశ్రమల కాలంలో ఉంటావు, భయంకరమైన బాధలు అనుభవిస్తావు! కాబట్టి నేడే సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*203వ భాగము*

 

యెషయా 27:16

1. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.

2. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.

3. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.

4. నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

5. ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింప వలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన పడవలెను.

6. రాబోవు దినములలోయాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం 26వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక ఈరోజు నుంచి 27వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం!

 ప్రియులారా ఈ 27వ అధ్యాయము చూడటానికి ఇశ్రాయేలు ప్రజల కోసమే వ్రాయబడి ఉంది,  దేవుడు వారిని దీవించే విధానం ఇక్కడ రాయబడి ఉంది! ఇశ్రాయేలు జాతిని బాధిస్తున్న వారిని దేవుడు దండించి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించే విధానం అయితే ఉంది కానీ అలా చేయాలంటే వారు చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి దానికోసం వ్రాయబడింది! కానీ నూతన నిబంధన సంఘము కోణంలో చూసుకుంటే అది ఇశ్రాయేలు జాతికోసం మాత్రం కాదు అని మనకి  అర్థమవుతుంది అది అంత్య దినములలో జరగబోయే సంఘటన అని అర్థమవుతుంది.

 మొదటి వచనం మరియు  12 ,13 వచనాలు ప్రకారం ఇవి తప్పకుండా అంత్య దినముల యందు రెండవ రాకడ వెయ్యేండ్ల పరిపాలన జరిగిన తర్వాత జరిగే సంఘటనలాగా కనిపిస్తున్నాయి.

 

 సరే మనం మన 27వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం! 1వ వచనం: యెహోవా గట్టిదై బలమైన ఖడ్గము, తన ఖడ్గము పట్టుకుంటారు అని ఉంది. ఇక్కడ ఆ దినమున అనగా యెహోవా దినము అని అర్థం వస్తున్నా గాని నిజానికి అది యెహోవా దినం కాదు ఇశ్రాయేలు ప్రజలను దర్శించబోయే దినాన్న వారికి మేలు చేయు దినమున, వారికి మేలు చేయడానికి ఆయన యెహోవా తన ఖడ్గమును పట్టుకుంటారు అని అర్థము మనకు గోచరం అవుతుంది;

యెషయ 31: 8లో మనిషికి చెందని ఖడ్గం చేత అష్షూరు పతనమవుతుందని మనిషిది కానీ కత్తిపాలవుతుందని వ్రాయబడి ఉంది అనగా నేచురల్ కలామిటీ వలన అష్షూరువారు దండించబడతారు అని ఉంది

యెష్షయి 34: 6 యెహోవా ఖడ్గం రక్తమయం అవుతుంది అది కొవ్వుతో కప్పి ఉంది ఆ రక్తం గొర్రె పిల్లలది మేకలది కొవ్వు పుట్టడం మూత్రపిండాల కొవ్వు అని ఉంది ఎందుకంటే బొస్రా పట్టణంలో యెహోవా బలి జరిగిస్తారు యుద్ధంలో మహా సంహారం చేస్తారు అనగా ఎదోము అనగా ఇరాక్ దేశము, నార్త్ ఇరాక్ సౌతిరాక్ బబులోను మొత్తం నాశనం అవుతుంది. దానిని యెహోవా ఖడ్గము వీరిని నాశనం చేస్తుంది.

ఇక యెష్షయి 66 :16 లో దేవుడు అంత్య దినాలలో మంటలతోనూ ఖడ్గంతోను శరీరం ఉన్న వారందరికీ అనగా శరీరులందరికీ తీర్పు తీరుస్తారు. యెహోవా చేత అనేకులు హతమైపోతారు అని అంత్య తీర్పు కోసము వ్రాయబడి ఉంది. అంత్య దినాలలో జరగబోయే సంగతులు కోసం చూస్తే అప్పుడు దుర్మార్గులను హతమారుస్తాను అదేవిధంగా సన్మార్గులను కూడా హత మారుస్తాను ఎందుకంటే మీరు నా మాట వినలేదు నేను మీకు వ్యతిరేకని అంటున్నారు.

 ప్రకటన 19:15లో ఆయన నోటి నుంచి వాడి గల ఖడ్గం అది బయలు వెళ్తూ ఉంటుంది ప్రజల్ని నాశనం చేయడానికి!

 

 సరే ఈ విధముగా యెహోవా తన ఖడ్గం పట్టుకుంటారు! ఆ ఖడ్గం గట్టిది మరియు గొప్పది మరియు బహు బలమైనది అని రాయబడి ఉంది!

 

ఇంకా తీవ్రమైన తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించబోతున్నారు! కొన్ని కొన్ని ప్రతులలో చూసుకుంటే స్టడీ బైబిల్ లో చూసుకుంటే లివియటాన్ అని తర్జుమా చేయబడి ఉంది. దీనికోసం ఒక్కొక్క దగ్గర బైబిల్ లో ఒక్కోచోట  ఒక్కో  అర్థం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ లివియటాన్ అనగా దుర్మార్గముతో నిండిన ఒక సామ్రాజ్యం కావచ్చు, ప్రజలను బాధించే అధికారం ఉన్న ఒక సామ్రాజ్యము కావచ్చు. బైబిల్లో ఈ లివియటన్ అనే మాట ఉపయోగించినప్పుడు దానికి వేరువేరుగా అర్థం కనిపిస్తుంది. యోబు 3: 8 లో ఇది ఒక సముద్ర జంతువు లాగా ఉంటుంది

అదే యోబు 41:1 లో ఇది గొప్ప మొసలిగా చెప్పబడింది.

 అదే కీర్తన 74: 14 లో ఇది ఈజిప్ట్ సామ్రాజ్యం కోసం దేవుడు వాడిన పదం. కాబట్టి ఒక్కో దానికి ఒక భిన్నమైన అర్థం వస్తోంది ఈ లివియటాన్. నిజానికి బబులోను సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం ఈజిప్టు వంటి ఈ పురాతన రాజ్యాలు లివియటాన్ గా చెప్పారు ఎందుకంటే ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలనే కాదు అనేక ప్రజలను పీల్చి పిప్పి చేశాయి! ఇప్పుడు ఈ లివియటాన్ని దేవుడు నిన్ను దండిస్తాను అంటున్నాడు అనగా ఈ యుగాంతం లో ఈ దౌర్జన్యం చేసే శక్తి ఏదైనా ప్రజల మీద అక్రమంగా బాధపెడుతున్న ఆ శక్తిని దేవుడు నాశనం చేస్తారు!

 మరి అంత్య దినాల్లో కోసం చెప్పబడింది కాబట్టి ఈ శక్తి ఏమై ఉంటుంది కచ్చితంగా అది క్రీస్తు విరోధి మరియు అతని సామ్రాజ్యం కోసమే చెప్పబడింది అని మనం గ్రహించాలి! అది ప్రకటన 13:1 ప్రకారము అది సముద్రంలో నుండి బయటకు వస్తుంది అని వ్రాయబడింది. ఇక్కడ ఆ మృగాన్ని సర్ఫంగా అభివర్ణించలేదు కానీ అతడు సర్పం లాగా పాముకున్నంత తెలివితేటలు కలిగి ఉంటుంది. అంతేగాక అక్కడ రెక్కల సర్పం తన శక్తిని మృగానికి ఇచ్చేసింది 13 వ అధ్యాయంలో. క్రీస్తు విరోధి సింహాసనం వెనక ఉండి నిజానికి లోకాన్ని పరిపాలించేది ఆ ఘటసర్పమే కదా అనగా సైతానే కదా!  అంత్య దినములో దేవుడు ఈ ఘటసర్పాన్ని నాశనం చేయబోతున్నారు

 

Revelation(ప్రకటన గ్రంథము) 12:7,8,9,10

7. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా

8. ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

9. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

 

Revelation(ప్రకటన గ్రంథము) 13:1,2,3,4,5,6,11,12,13,14,15,16,17

1. మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

2. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.

3. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్య పడుచుండిరి.

4. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటియెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.

5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను(లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

11. మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను;

12. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.

13. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

14. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

15. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

16. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,

17. ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

 

 ఇది ఎప్పుడు జరుగుతుంది అనగా మొదటగా క్రీస్తు విరోధి బయలుపరచబడాలి యెరుషలేములో మందిరం కట్టబడాలి. సంఘం ఎత్తబడాలి. శ్రమల కాలం ప్రారంభం అవ్వాలి. శ్రమల కాలం ప్రారంభమయ్యాక ఈ క్రూర మృగము ఘటసర్పము ఈ మరొక మృగము వీరంతా బయటకు వస్తారు. అప్పుడు ప్రపంచమంతా ఈ చావు దెబ్బ తిన్న ఆ మృగానికి పూజించమని ఈ మరో మృగము అనగా ఈ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి కోసము ప్రచారం చేసి అద్భుతాలు చేసి ప్రజలను నమ్మిస్తాడు . ఇలా శ్రమల కాలము మహా శ్రమల కాలము గడిచిపోతుంది గడిచిపోయాక హార్మెగిద్దోన్ యుద్ధము జరుగుతుంది.

ప్రకటన 19వ అధ్యాయము 19 నుంచి 20 వరకు ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి . 16 వ అధ్యాయంలో ప్రారంభమై 19: 19 ముగుస్తుంది ఈ యుద్ధం! 20 వచనంలో అప్పడా మృగమును దాని ఎదుట సూచకక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఇంకా మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త అనగా ఈ మరో మృగము వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముల తోనే వేయబడ్డారు. ఎవరు? క్రూరమృగము  తర్వాత అబద్ధ ప్రవక్త వీరిద్దరూ అగ్నిగుండాలతో వేయబడతారు. మిగిలిన వారు దానిని అనుసరించిన వారు ఖడ్గంతో చంపబడతారు.

 ఇక 20 అధ్యాయం లో వెయ్యేళ్ల పరిపాలన కాలంలో వెయ్యి సంవత్సరాల వరకు ఘటసర్పాన్ని బంధిస్తారు.  దేవుడు 1000 సంవత్సరాల అయిపోయిన తర్వాత అది విడిచిపడతాది తర్వాత ఈ ఘటసరపం భూలోకంలో ఉన్న పరిశుద్ధులందరినీ నాశనం చేద్దామని భూలోకంలో ఉన్న ప్రజలందరికీ పోగుచేసి పరిశుద్ధుల శిబిరాన్ని పరలోకాన్ని ముట్టడివేయాలని చూస్తే దేవుని నుండి అగ్ని వచ్చి వారందరినీ అనగా ఈ గోగుమాగోగు యుద్ధానికి వచ్చిన వారందరినీ అగ్ని దహిస్తుంది. వారిని మోసపరిచిన అపవాదిని దేవుడు బంధించి అగ్నిగంధకముల గుండములో అనగా నరకంలోని ఈ సాతాను గాడిని పడవేయడం జరుగుతుంది. అప్పటికే అక్కడ అబద్ధ ప్రవక్త క్రూర మృగం కూడా అక్కడే ఉన్నారు. లాస్ట్ లో అంటే వెయ్యండ్ల పరిపాలన తర్వాత సాతాను గాడిని అక్కడ వేస్తారు అనగా లివియటాన్ అనే ఈ క్రూరమైన ఈ మకరము మొసలి ఘటసర్పము అనబడే ఈ సాతాను గాడు, వాడి రాజ్యము సంపూర్ణంగా వెయ్యేళ్ల పరిపాలన అనంతరము గోగుమా గోగు యుద్ధము అయిపోయిన వెంటనే అగ్నిగుండంలో పడి వేయడం జరుగుతది అప్పుడు ఈ ప్రవచనము నెరవేరుతుంది!

 

 ప్రియ సహోదరీ సహోదరుడా నీవు ఎవరి ఎవరితో సహవాసం చేస్తున్నావు?

 మీ సహవాసం దేవునితోనా పరిశుద్ధులతోనా లేక ఈ ఘటసర్పానికి సంబంధించిన అబద్ధ ప్రవక్తలకు సంబంధించిన సంఘములో ఉన్నావా? సరి చేసుకో సరిచూసుకో! ఒకవేళ దేవుని సంకల్పములో లేకపోతే నీవు కూడా నరకానికి పోతావని గమనించి సరిదిద్దుకో!!!

 దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*204వ భాగము*

 

యెషయా 27:16

1. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.

2. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.

3. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.

4. నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

5. ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింప వలెను నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన పడవలెను.

6. రాబోవు దినములలోయాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం 27వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

     ప్రియులారా ఇక రెండవ వచనం చూసుకుంటే ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనం ఉండును దానికోసం పాడండి అని తెలుగులో తర్జుమా చేయబడింది కానీ ప్రాచీన ప్రతులలో చూసుకున్నా, ఇంగ్లీష్ బైబిల్ చూసుకున్నా: ఆ రోజున ఫలవంతమైన ద్రాక్ష తోట విషయం పాట పాడండి అని ఉంది.

In that day sing ye unto her, A vineyard of red wine. ఒక మంచి ద్రాక్ష తోట ఉండును దాని గూర్చి పాడండి అని లేదు. నిజానికి తెలుగు బైబిలు గ్రీకు హెబ్రీ భాషల నుండి తర్జుమా చేయబడింది. కాబట్టి ఒక ఫలవంతమైన ద్రాక్ష తోటకోసం పాడండి అని ఇక్కడ ఉంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండవ వచనములో ఉన్న ఫలవంతమైన ద్రాక్ష తోట  5:1--7 వచనాలలో ఉన్న ద్రాక్షతోటకు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. 5:1--7లో నా ప్రియుని గూర్చి పాడతాను వినండి నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉంది అది సారవంతమైన భూమి సత్తువ గల కొండమీద నా ప్రియునికి ద్రాక్షతోట ఉంది. ఆయన దాన్ని బాగా తవ్వేరు రాళ్ళను తీసేశారు దాంట్లో మేలు రకమయిన ద్రాక్ష వళ్లి నాటించాడు తోట మధ్యలో ఒక బురుజు కట్టి గానుగ తొట్టి కట్టించారు.  ద్రాక్ష పండ్లు కావాలని ఎదురు చూస్తే అది కారు ద్రాక్షలు కాసింది. అందుకని ఓ యెరుషలేము వారలారా నేను దీనికంటే ఏం చేయాలి అని అక్కడ అడుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. దీనికోసం మనం రకరకాల కోణాల్లో మనం ధ్యానం చేసుకున్నాం.

 

 అయితే ఇక్కడ కేవలం ఇది ఇశ్రాయేలు జాతి కోసమే ఈ ద్రాక్ష తోట  వ్రాయబడింది అని తప్పకుండా గ్రహించాలి! ఇది ఈ ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు జాతి అని మనం యెషయా ప్రవచన గ్రంథం మొదటి నుంచి కూడా చూసుకుంటున్నాం. ఇక్కడ కూడా అర్థం మారడం లేదు. ఇది కూడా ఇశ్రాయేలు జాతి కోసమే!

 అయితే మొదటి వచనంలో చూసుకున్నాము ఇది 1000 పరిపాలన తర్వాత జరిగే సంఘటనని! అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఈ ఇశ్రాయేలు జనాంగానికి చాలా తేడా ఉంది. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి మెస్సియా కోసం ఎదురుచూస్తున్నారు. మెస్సియా వస్తాడు దావీదు గోత్రం నుండి, ఆయన ఆయన దావీదు సింహాసనాన్ని స్థాపిస్తారు యుగ యుగములు ఆయన రాజ్యము ఉంటుంది అని, మెస్సియ వచ్చి భూమి మీద శాశ్వత రాజ్యం స్థాపిస్తారు ఆ రాజ్యానికి అంతం ఉండదు అని. ఆ మెస్సయ వీరిని విమోచించి ఘనమైన రాజ్యం స్థాపిస్తారని ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వేల సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ద్రాక్ష తోట నిజముగా ఆ మెస్సియా స్థాపించిన ఇశ్రాయేలు జనమే‌. ఇది రెండవ రాకడ సందర్భంలో ఆయన ఇశ్రాయేలు పక్షముగా భూమిపైన ఒలివ కొండమీద అడుగుపెట్టి హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువుల హతము చేసి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నారు అదే ఈ ద్రాక్ష తోట! ఈ ద్రాక్ష తోట వెయ్యేళ్ళ పరిపాలన కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ యుగములో అంత్య దినములలోనూ మరియు రాబోయే నిత్య రాజ్యం ప్రారంభంలోనూ ఈ ద్రాక్ష ఈ ఇశ్రాయేలు జాతి అనే ద్రాక్షతోట పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఐదవ అధ్యాయంలో అది బ్రష్టమైన జాతిగా మారిపోయి కారు ద్రాక్షలు కాసినా,  ఈ ద్రాక్ష తోట ఎప్పుడూ ఎంతో ఫలభరితంగా ఉంటుంది.

 ఇది ఇశ్రాయేలు జాతి కోసమే అనే నొక్కి వక్కాణించి చెప్పడం ఎందుకు అంటే ఇంకా మనకు ముందుకు పోతే వాళ్లు నాతో సమాధానపడాలి యాకోబు వంశం వేరు పారుతుంది అంటున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఇది ఇశ్రాయేలు జాతి కోసమే చెప్పబడింది.

 

 సరే ఇలా స్థాపించబడిన ఇశ్రాయేలు సామ్రాజ్యము ఆ 1000 ఏండ్ల పరిపాలన సమయంలో యేసు క్రీస్తు ప్రభువుల వారు భూలోకం మీద తన సామ్రాజ్యం స్థాపించినప్పుడు దేవుడు తన కాపిటల్ ఇశ్రాయేలు దేశంలో యెరుషలేములో స్థాపించబోతున్నారు అది ప్రపంచానికి క్యాపిటల్గా ఉండబోతుంది అని మనం గత భాగాలలో చూసుకున్నాము. అది ఎంతో ఫలవంతమైనది అని ఇక్కడ చెప్తున్నారు.

 

ఇక మూడవ వచనములో యెహోవానైన నేనే ఆ ద్రాక్ష తోటను కాపాడుతూ ఉంటాను ప్రతి క్షణము దానికి నీళ్లు పోస్తూ ఉంటాను ఎవడైనా దానికి హాని చేయకుండా రాత్రింబగళ్లు నేను దానికి కావలి కాస్తు ఉంటాను అంటున్నారు.

 జాగ్రత్తగా గమనిస్తే ఐదవ అధ్యాయంలో అది కారుద్రాక్షలు కాసింది కాబట్టి నేను దానికి వర్షం పడకుండా చేస్తాను అంతేకాకుండా దాని కంచె తీసివేస్తాను అది పాడైపోయేలాగా దాన్ని అప్పగించేస్తాను అని చెప్పిన దేవుడే ఇక్కడ ఈ ద్రాక్ష తోట అనగా ఏసుక్రీస్తు ప్రభువుల వారు స్థాపించిన ఈ ఇశ్రాయేలు జాతితో కూడిన ఈ సామ్రాజ్యము దేవుడే దానికి కాపలా కాస్తూ ఉంటారు నేను కాపాడుతాను దానిని. అంతేకాకుండా ప్రతి దినము అనటం లేదు ప్రతి క్షణము నేను దానికి నీళ్లు పోస్తూ ఉంటాను ఇంకా ఎవడు దానికి హాని చేయకుండా రాత్రింబగళ్లు నేను దానిని కాపలా కాస్తుంటాను అంటున్నారు.

అనగా ఆ ఇశ్రాయేలు జాతిని దేవుడు ఇక శ్రమలకు కష్టాలకు పాలు చేయకుండా కంటికి రెప్పలా చూసుకోబోతున్నారు దేవుడు ఇశ్రాయేలీయులు ప్రజలను.

 

ఇక నాలుగో వచనం చూసుకుంటే నాకు ఏ విధమైన ద్వేషము లేదు అంటూ కోపం లేదు అంటూ ఒకవేళ గచ్చపొదలు ముండ్ల చెట్లు నాకు ఎదురుపడితే వాటి మీద యుద్ధం జరిగించి వాటిని కాల్చి వేస్తాను అంటున్నారు. ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయి ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఇంగ్లీష్ బైబిల్ లో చూసుకుంటే అర్థం మనకి బాగా అర్థం అవుతుంది.

యెషయా 27:4

నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

Fury is not in me: who would set the briers and thorns against me in battle? I would go through them, I would burn them together.

అక్కడ ఒకవేళ ఆ ద్రాక్ష తోటలో ఎవరైనా గచ్చపొదలు ముండ్ల చెట్లు నాటితే వారిద్దరినీ కాల్చేస్తాను అంటున్నారు. అనగా గచ్చపొదలను కాల్చేస్తాను అలాగ నాటిన వాడిని కూడా కాల్చి వేస్తాను అంటున్నారు ఇది సంగతి.

 అయితే ఇంతవరకు మనం ద్రాక్ష తోట ఇశ్రాయేలు జాతి అనుకున్నాం. మరి ఇశ్రాయేలు జాతిలో గచ్చపొదలు లాంటోళ్లు ముండ్ల పొదలు లాంటోళ్లు ఉంటే నేను కాల్చేస్తాను అంటున్నారు అందుకే నాకు ఎవరి మీద కోపం లేదు అంటున్నారు.

 మరి ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు మరి వెయ్యిఏండ్ల పరిపాలన కదా ఏసుక్రీస్తు ప్రభులవారు మెస్సియ పరిపాలనలో ఉంది కదా మరి ముండ్లపొదలు గచ్చపొదలు ఎలాగ వచ్చాయి ఎవరు నాటించారు? అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు లోకం వైపు చూసే వాళ్ళు ఉంటారు అలాంటి వాటిని వెంటనే దేవుడు కాల్చేస్తాడన్నమాట ఎలాగంటే యుద్ధ ప్రాతిపదికగా! ఆ ముండ్ల చెట్టును ఆ గచ్చపొదలాంటి మనుషులను. ఇక్కడ మనుషులు అనడం కన్నా గచ్చపొదలు లాంటి ముండ్ల పొదలు లాంటి ఆలోచనలు ఎవరికైనా ఆ వెయ్యి ఏండ్ల పరిపాలనలోనూ రాబోయే నిత్య రాజ్యములోనూ ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు అయినా వచ్చిన వెంటనే  వారి మనస్సులో నుండి  ఆ ఆలోచనలను తీసి పారేస్తాను అంటున్నారు దేవుడు అంతేకాదు ఒకవేళ ఆ ఆలోచనలు వచ్చి వారు పాడైపోయేలా ఉంటే వారినే చంపేస్తాను అంటున్నారు.

 

 ఇక ఐదో వచనంలో ఇలా జరగకూడదు అంటే వాళ్ళు నన్ను ఆశ్రయించాలి నాతో సమాధానపడాలి అంటున్నారు. ఏం జరగకూడదు? అంటే ఇలాగా గచ్చపొదలు లాంటి వ్యక్తులను దేవుడు కాల్చకుండా ఉండాలి అంటే వాళ్ళు దేవునితో సమాధానపడాలి అంటున్నారు!

 ఆధ్యాత్మికంగా దీన్ని ఆలోచిస్తే దేవుని తోటలో ఉన్న నీవు నేను మన ఆలోచనలు మన ప్రవర్తన మన చూపులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి ఎటువంటి పాపపు చూపులు లోకం వైపు చూపులు చూసినా విశ్వాస జీవితంలో బ్రష్టులైపోతాము. కాబట్టి అలా జరిగితే దేవుని నుంచి దూరమైపోతాము దేవుని కోపానికి గురవుతాము అలా గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ దేవునితో సమాధానంగా ఉండాలి. వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరైనా ఇలాంటి గచ్చపొదలు, ముండ్ల లాంటి ఆలోచనలు గాని లేదా ముండ్లపొదలా తయారైన దేవుడు వారిని కాల్చేస్తాను అంటున్నారు. వాళ్లనే కాల్చవేయగలను అని వార్నింగ్ ఇచ్చిన దేవుడు నీకు కూడా అదే హెచ్చరిక చేస్తున్నారు అని మర్చిపోవద్దు. వారిని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబడతాడు.

 వారిని శిక్షించే దేవుడు తప్పకుండా నిన్ను కూడా శిక్షిస్తారు. వారిని నరికివేసిన దేవుడు రోమా పత్రికలో చెప్పినట్లు నిన్ను కూడా ద్రాక్షావల్లితో ఉండకుండా నరికి పారి వేయగలరు. కాబట్టి మన ప్రవర్తనను మన మాటలను చూపులను అన్నింటిని మన స్వాధీనంలో ఉంచుకొని ప్రతిరోజు దేవునితో సమాధాన పడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 

ఇక ఆరోవచనం రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.

ఇక దీని అర్థం కూడా ఇందాక చెప్పినదే ఇశ్రాయేలు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అది ఎంతో ఫలభరితంగా ఉండబోతుంది ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారిపోబోతుంది అని చెప్తున్నారు ఆరో వచనంలో. నిజానికి గతంలో కూడా ఇది జరిగింది వారు చెర విముక్తి కలిగిన తర్వాత ఇప్పటికీ ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉన్నారు. నిజానికి వారు చేసిన ప్రయోగాల వలన వ్యవసాయంలో యుద్ధం విషయంలో ఇంకా టెక్నాలజీ విషయంలో ప్రపంచానికి వారు ఎంతో మేలు కరంగా ఉన్నారు. వారు చేసిన ఈ ఇన్వెన్షన్ వల్ల ప్రపంచానికి ఎంతో మేలు చేశారు.

 

 రోమా పత్రిక 11: 26 లో పౌలు గారు అంటున్నారు ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అందరికీ విముక్తి కలుగుతుంది ఎందుకంటే విమోచకుడు సీయోను నుంచి వచ్చి ఈ యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగిస్తారు. అలా తొలగించిన తర్వాత ఇశ్రాయేలు జాతి మొత్తం రక్షించబడి దేవుని ప్రొటెక్షన్ కింద ఉండి ఇంకెప్పుడూ దేవుని చేతిని వారు వదలకుండా దేవుని హస్తాలలో ఉంటూ దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, ఇప్పటికీ చెదిరిపోయిన ఇశ్రాయేలు జాతి యూదా జాతి తిరిగి వచ్చేక ఫలవంతమైన ఫలభరతమైన జాతిగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోబోతుంది.

 

 ప్రియ విశ్వాసి ఒకానొక రోజున ఎందుకు పనికిరాని నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నారు ఎందుకంటే నీ ద్వారా నా ద్వారా అన్ని జనులను రక్షించుకొని నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడనుకుంటున్నాడు. మరి నీవు దేవునికి తగినట్లు జీవిస్తున్నావా? ఆయనకు దూరంగా జీవిస్తున్నావా?

 ఒకసారి సరి చేసుకుని సరిదిద్దుకోమని ఏసుక్రీస్తు వారి పేరట మనవి చేస్తున్నాను!

 దైవాశీస్సులు!!

 

*యెషయా ప్రవచన గ్రంధము*

*205వ భాగము*

 

యెషయా 27:7--13

7. అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా?

8. నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి

9. కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.

10. ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.

11. దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.

12. ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.

13. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం 27వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

 

       (గతభాగం తరువాయి)

 

    ఇక ఏడవ వచనం చూసుకుంటే అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడెనా!!

 దీనికోసం జాగ్రత్తగా చూసుకుంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం ఇంకా ఎవరికోసమో చెప్పబడినట్లు మనకు కనిపిస్తుంది కానీ నిజానికి అలా కాదు ఇక్కడ అతని అనగా యాకోబు అని, కొట్టిన వారిని అనగా శత్రువులు ఇక్కడ దీని అర్థం.యాకోబుని హింస పెట్టిన వారిని ఆయన అనగా దేవుడు కొట్టినట్లు ఆయన వారిని శిక్షించినట్లు ఆయన అనగా దేవుడు అతని అనగా యాకోబుని శిక్షించెనా!! అనగా ఇశ్రాయేలు వారి పాపమును బట్టి దేవుడు ఇశ్రాయేలు వారిని శిక్షించారు. వారిని అనగా ఇశ్రాయేలు వారి శత్రువుల్ని దేవుడు ఎలా శిక్షించాడో అలాగే ఇశ్రాయేలు వారి పాపముల కోసం కూడా వారిని ఇశ్రాయేలు వారిని దేవుడు దండించాడు! ఇది మనకి చరిత్ర చూసుకుంటే బైబిల్ లో నిర్గమాకాండం దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు ఇదే మనకి కనిపిస్తుంది! దేవుడు అనేకసార్లు ఇశ్రాయేలు వారు చేసిన పాపముల కోసం వారిని దండిచారు. దేవుడు ఇక ఇశ్రాయేలువారిని బాధించిన  యెషయ ప్రవచన గ్రంథం 10: 5 లో అస్సూరీయులకు శ్రమ, వారిని శిక్షిస్తానని, ఇంకా న్యాయాధిపతులు గ్రంథంలో రెండో అధ్యాయం చూసుకుంటే ఇశ్రాయేలు మాటిమాటికి దేవుని కోపం రేపారు అన్య దేవతలు పూజించారు అందుకనే దేవుడు వారిని శత్రువులు చేతికి అప్పగించారని, ఇంకా రెండు రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో కూడా ఇదే విషయము చెబుతున్నారు. ఇక ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

 అయితే దేవుడు ఇశ్రాయేలు వారిని బాధించిన  కొన్ని జాతులను సర్వనాశనం చేసేసారు కానీ ఇశ్రాయేలు వారిని మాత్రం పూర్తిగా నాశనం చేయలేదు. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం ఉంది యూదులు కూడా ఉన్నారు. అయితే యూదులు చేసిన పాపాలకు తప్పులకు ఇశ్రాయేలు వారు చేసిన తప్పులకు శిక్ష ఇశ్రాయేలు వారే భరించాలి. అదే శిక్ష.

 అయితే ఈ కింద వచనం వరకు చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా దేవుని నుండి దూరమైపోయారంటే విగ్రహారాధన, తప్పుడు ఆరాధన చేసి.  ఈ రెండు చేసి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి శత్రువుల చేతిలో బందీలుగా చెరలోకి వెళ్లిపోయారు అనేకసార్లు. ఇప్పుడు దేవుడు వారిని విడిపించాక ఇలాంటి పాపము ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు అదే 7 నుంచి 13 వచనాల్లో చెప్తున్నారు.

ఈ ఏడవ వచనము వారిని కొట్టిన వారిని యెహోవా కొట్టిన విధంగా ఆయన వారిని కొట్టాడా ఇశ్రాయేలు వారిని చంపిన వారిని ఆయన చంపే విధంగా వారిని అనగా ఇజ్రాయిల్ వారిని చంపేడా అంటూ ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధముగా శిక్షించారో, ఎనిమిదవ వచనం నుంచి చెబుతున్నారు నీవు ఆ జనాన్ని అనగా ఇశ్రాయేలు జాతిని ఆ దేశం నుండి వెళ్లగొట్టడం వల్ల ఆదేశంతో ఆ జాతితో పోరాడేవు. తూర్పు గాలి వీచిన విధంగా తీవ్రమైన గాలి అనగా శ్రమల ద్వారా నీవు ఇశ్రాయేలీయులను యూదులను ఆ దేశం నుండి తొలగించేవు.

 తొమ్మిదో వచనం యాకోబు వంశం వారి అపరాధానికి ఈ విధంగా నువ్వు ఇప్పటికే ప్రాయశ్చిత్తం చేశావు. వారు చేసిన పాపానికి ఇదే వాళ్ళకి ఫలితంగా దక్కింది. సున్నపురాయి సున్నం చేసినట్లు వారిని చేస్తావు. అయితే ఇప్పుడు దేవుడు వారిని చెర నుండి తీసుకొచ్చిన తరువాత ఇక ఇశ్రాయేలు వారు వారి దేశంలో ఎటువంటి పరిస్థితుల్లోనే అన్యుల విగ్రహాలను గాని, బలి పీఠాలను గాని ఉంచరు. వాటిని సున్నం లాగా చూర్ణము అనగా పొడి చేసేస్తారు అషేరా దేవి స్తంభాలు ఇంకా ధూప వేదికలు ఏవి ఉండవు. అన్నిటినీ పూర్తిగా పొడి చేస్తారు.

 

ఇక వారి విరోధులు అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క విరోధులు ఉన్న పట్టణాలు ఇప్పుడు నిర్జనంగా అనగా ప్రజలు లేకుండా మనుషులు లేకుండా ఉంటాయి. విడిచి వేయబడిన పట్నాలు లాగా ఎడారి ప్రాంతం లాగా ఇశ్రాయేలు యొక్క శత్రువుల దేశాలు ప్రాంతాలు ఉంటాయి. అక్కడ దూడలు మేస్తూ పడుకుంటూ ఉంటాయి. దానిని చెట్టుకొమ్మలు తింటూ ఉంటాయి. దాని రెమ్మలు ఎండిపోయి విరిగిపోయాయి. స్త్రీలు వాటిని నిప్పుల్లో వేస్తారు అంటున్నారు.

 

 ఇప్పుడు మరలా 11వ వచనంలో  అంటున్నారు ఈ ప్రజలు లేదా ఇశ్రాయేలు ప్రజలు బుద్ధిగల జనులు కాదు వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు వారిని పుట్టించినవాడు వాడికి దయ చూపుడు అంటున్నారు.

 దేవుని వదిలి విగ్రహాల వెనకాల తిరిగిన వారిని దేవుడు వారి మీద ఎటువంటి పరిస్థితుల్లో జాలిపడడు. ధాన్యాన్ని తొక్కినట్లు ఇశ్రాయేలు ప్రజలను తొక్కుతాడు అయితే ఇజ్రాయేలీయు లారా 12వ వచనం ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తునది అనగా నైలు నది వరకు తన ధాన్యాన్ని తొక్కుతారు.

 

ఇంకా ఇశ్రాయేలు వారలారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడతారు అంటున్నారు. ఇది అంత్యకాలంలో జరగబోయే సంభవం. అనగా బహుశా శ్రమల కాలం మొదట్లో జరగబోయే సంభవము. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలంతా సమకూర్చబడతారు దీనికోసం మనకి రాబోయే అధ్యాయాలలో, ముఖ్యంగా 60 అధ్యాయం లో మీరు గాడిదల మీద గుర్రాలు మీద ఒంటెల మీద నీ సంతానం తెప్పించబడతారు. నేను గొడ్రాలనై ఉండగా వీరంతా నాకు కనిన వారు ఎవరు అంటూ నువ్వు ఆశ్చర్యపడతావు. రాణులు నీ పిల్లలను కాచే దాదులుగా, నీ పని వారిగా ఉంటారు అంటూ దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇదే యెషయ ప్రవచన గ్రంథంలో ఇక్కడ కూడా అదే వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలంతా కూర్చబడతారు. ఆ దినమున పెద్ద బూర ఊదబడుతుంది. అష్షూరు దేశంలో నశించ సిద్ధంగా ఉన్నవారు, ఐగుప్త దేశంలో వెలివేయబడిన వారు అంతా వస్తారు. వారు యెరుషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతము మీద యెహోవాకు నమస్కారం చేస్తారు.

 

 ప్రియులారా దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి ఒక్కటి అష్షూరు దేశానికి చెరగా తీసుకోబడిన వారు, ఇక్కడ అష్షూరు అనగా కేవలం ఇరాకే కాదు అన్య దేశాలకు చెరగా తీసుకొని పోబడిన వారు, దేశంలో వెలివేయబడినవారు అందరితోనూ హేళనగా ఎంతో వెలిచూపుతో చూడబడుతున్న ఇశ్రాయేలు జనాంగము, యూదాజనాంగము తిరిగి యెరుషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతం మీదకు వచ్చి వారు యెహోవాకు నమస్కారము చేస్తారు ఇది మొదటి అర్థం.

 

ఇక రెండవ అర్థం దేవుడు అష్షూరు వారికోసం ఐగుప్తీయుల కోసం ఒక మాట అంటున్నారు అంత్యకాలంలో వారు రక్షించబడతారు వారు కూడా ఇశ్రాయేలు ప్రజలతో సహ పౌరులుగా ఉంటారు దీనికోసం మనకు యెష్షయ ప్రవచన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఐగుప్తువారు రక్షించబడతారు, దేవుడు శిక్షించిన తర్వాత ఐగుప్తీయులను రక్షిస్తారు ఒక శూరుడిని పంపి వారిని విమోచిస్తారు అంటూ 19: 20 నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే ఐగుప్తువారు యెహోవాను తెలుసుకుంటారు. వారు యెహోవాను మ్రొక్కుతారు. తాము చేసుకొనిన మొక్కుబడులు చెల్లిస్తారు. యెహోవా వారిని కొట్టును స్వస్థ పరచాలని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును అంటూ, 23 ఆ దినమున ఈజిప్టు నుండి అస్సూరుకు రాజమార్గం ఏర్పడును. అస్సూరీయులు ఐగుప్తునకు ఐగుప్తీయులు అష్షూరుకు వచ్చుచుపోవుచు ఉంటారు.

 ముఖ్య విషయం ఏమిటంటే 24 ఆ దినమున ఐగుప్తు అష్షూరుతో కూడా ఇశ్రాయేలు మూడవజనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉండును.

 25 అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా! నా జనమైన ఐగుప్తీయులారా! నా చేతుల పని అయిన అష్షూరీయులారా! నా స్వాస్యమైన ఇశ్రాయేలీయులరా! మీరు ఆశీర్వదింప బడుదురని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించును! ఎవరిని? ఐగుప్తీయులను అష్షూరువారిని ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించును!

 ఇలా జరిగాక ఐగుప్తీయులు మరియు అష్షూరు వారు కలిసి యెరుషలేముకు వచ్చి, యెరుషలేము పర్వతం మీద దేవుని యెహోవాను ఆరాధించబోతున్నారు. ఇది కూడా వెయ్యేల పాలనలో జరిగే సంభవము‌. 1000 ఏండ్ల పాలనలో జరిగే సంభవంతో ఈ అధ్యాయం ప్రారంభించబడి మరలా వెయ్యేల్ల పరిపాలనలో జరిగే సంభవంతోనే ఇది ముగించడం జరిగింది.

 సరే దీని అర్థం మనం తీసుకోవాల్సింది ఏమిటంటే దేవునికి ఇష్టము కానిది విగ్రహారాధన లోకపు చూపులు. తన ప్రజలంతా తనను మాత్రమే ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే విశ్వాసులమైన మనము నిజ దేవుడిని వదిలి విగ్రహారాధన చేసినా, లేకపోతే దేవునికి బదులుగా మరొక దేనినైనా ఆరాధిస్తే అది విగ్రహముగా మారిపోతుంది. దేవునికి బదులుగా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు విగ్రహముగా మారిపోతుంది. అది నీ మొబైల్ కావచ్చు నీ పిల్లలు నీ భర్త నీ భార్య నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆస్తి వ్యభిచారం అధికారం అది ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావా దేవుడు యుద్ధ ప్రాతిపదికన నిన్ను శిక్షించబోతున్నారు.  అయితే దేవునితో ఉన్నావా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నారు.

 కాబట్టి ఏది కావాలో తేల్చుకో!!

 దైవాశీసులు!

 ఆమెన్!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*206వ భాగము*

 

యెషయా 28:1

1. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ మునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం 27వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక 28వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

 

    ప్రియులారా! 28 35 అధ్యాయాలలో యెషయా గారి కాలంలోను, తదనంతరం దేశంలోని స్థితిగతులు, సంభవాల గురించిన వర్ణనలు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు అధ్యాయంలో లాగానే (యెషయా గ్రంథం అంతా ఇదే విధంగా ఉంటుంది) అక్కడక్కడా ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే విషయాలు క్రీస్తు మొదటి రాక, రెండవ రాకడ సమయాల గురించి రాసి ఉన్నాయి.

 2833 అధ్యాయాల్లో ఆరు రకాలైన ప్రజలకు శ్రమ అని కనిపిస్తుంది

28:1- త్రాగుబోతు లైన ఎఫ్రామీయులు అనగా పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యము;

29:1. యూదా ప్రజలకు;

29:15; ఎవరూ చూడటం లేదని చాటుగా పాపము, అక్రమము చేసేవారికి

30:1; లోబడని పిల్లలకు

31:1; దేవుడు నేను సహాయం చేస్తానని చెప్పినా, యెహోవాని వదిలి ఐగుప్తు సహాయం కోసం కబురుపెట్టిన ఇశ్రాయేలు రాజుకి, అధికారులకు;

33:1 దౌర్జన్యం మీద దౌర్జన్యం, ద్రోహము మీద ద్రోహం, వంచన మీద వంచన చేస్తున్న వారిమీదికి

 

   ప్రియులారా ఇక మనం ఒకటో వచనానికి వచ్చేద్దాం. ఇక్కడ మొదటి గుంపు ఉంది. ఇక్కడ త్రాగుబోతులగు ఎఫ్రాయిము ప్రజల అతిశయ కిరీటానికి శ్రమ, వాడిపోవుచున్న పుష్పం వంటి వారికి శ్రమ, ఎందుకంటే వారు మద్యం వలన త్రాగుడు వలన తూలి పడిపోతున్న బలవంతమైన లోయ తల మీదనున్న కిరీటానికి శ్రమ అంటున్నారు.

 

ప్రియులారా! త్రాగుబోతులగు ఎఫ్రాయీమీయులు  అని ఈ వచనములోను, మూడో వచనంలో కూడా ఇదే మాట అంటున్నారు. అనగా ఎఫ్రాయీము గోత్రము తాగుబోతులు అని మీరు అనుకోవచ్చు. గమనించాలి ఇశ్రాయేలు దేశం రెండుగా విడిపోయిన తర్వాత పది గోత్రాల ఇశ్రాయేలు జాతిని ఆ రాజ్యాన్ని షోమ్రోను అని, సమరియ అనియు, ఎఫ్రాయిము రాజ్యం అని పిలిచేవారు!  ఇక్కడ ఎఫ్రాయిము అనగా కేవలం ఎఫ్రాయుము గోత్రము కాకుండా పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యము అని అర్థము‌ వీరంతా త్రాగుబోతులు అని బైబిల్ చెబుతుంది. వీరు త్రాగుబోతులు అని ఐదవ అధ్యాయంలో మనం చూసుకున్నాము 11 నుంచి 13 వరకు.  ‌వీరే కాకుండా రాజులు యాజకులు ప్రవక్తలు కూడా త్రాగుబోతులే అని అక్కడ చూసుకున్నాము!

మీరు అనుకోవచ్చు కేవలం ఇశ్రాయేలు పదిగోత్రాలు వారే త్రాగుబోతులు యూదా వారు కాదు అనుకుంటారేమో వారు కూడా త్రాగుబోతులే అని ఐదవ అధ్యాయం చెబుతుంది.

 

 ఇదక త్రాగుబోతుల కోసం వివరంగా గతభాగాలలో మనం ధ్యానం చేసాం కాబట్టి ముందుకు పోదాం!  ఇక్కడే కాకుండా ఆమోసులో కూడా

Amos(ఆమోసు) 6:4,5,6,7

4. దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.

5. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.

6. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.

7. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని

 

Amos(ఆమోసు) 4:1,2,3,6,7,8,9

1. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా

2. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు.

3. ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.

6. మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

7. మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురపించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.

8. రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

9. మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగిన వారు కారు; ఇదే యెహోవా వాక్కు.

 

అయితే అక్కడ ఘోరమైన విషయం ఏంటంటే పురుషులతో పాటుగా, పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలే త్రాగేవారని స్త్రీలే తెల్లారితే తమ భర్తను మద్యపానం తీసుకొస్తావా లేదా అని గొడవ పెట్టే వారిని ఆమోసు గారు ఆత్మావేసుడే రాస్తున్నారు. 4వ అధ్యాయంలో  దీనికోసం మద్యం దొరకకపోతే ఇంటిలో పని చేస్తున్న మనుషుల్ని అమ్మేస్తూ ఫారిన్ చెప్పులు కోసం మహా ఘోరమైన అన్యాక్రాంతాలు చేస్తూ మర్డర్లు చేస్తూ బ్రతికేవారు వీరు స్త్రీలు అని ఆమోసు గ్రంధం తెలియజేస్తుంది.

 

అందుకే మీ అందరికి శ్రమ అని ఈ అధ్యాయంలో చెప్తున్నారు ఇంకా మనం ఇదే అధ్యాయం 7 నుంచి 9వ వచనం వరకు చూసుకుంటే ఎంత ఘోరంగా త్రాగేసి తూలిపోయేవారు తాగి తందనలాడేవారో ఈ అధ్యాయంలో వివరంగా వ్రాయబడింది.

 

 అయితే మీరు ఇలాగ త్రాగుబోతులుగా మారడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇక్కడ ఫలవంతమైన లోయ దానికి ఉన్న కిరీటానికి శ్రమ అని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రాంతానికి రెండు ఫలవంతమైన లోయలు ఉన్నాయి. ఒకటి యెరికో లోయ మరొకటి యెజ్రెయేలు లోయ! ఈ రెండు లోయలలో ఎంతో ఫలవంతమైన పంటలు విస్తారంగా పండేవి. ఈ రెండు ప్రాంతాలు తిరిగే ఆనాడు వేగు చూడడానికి మోషే గారు పంపిన మనుషులు అక్కడున్న ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకొచ్చారు అలా కాకుండా అక్కడ ఉన్న పళ్ళు కూడా తీసుకొచ్చారు. అందుకే ఆ ప్రాంతానికి ఎష్కోలు అని ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశము అని పేరు పెట్టారు దేవుడు.

అయితే ఈ అభివృద్ధిని చూసి ఈ విస్తారంగా పండే పంటలు చూసి వీరు మనసున గర్వించి త్రాగుబోతులుగా మారిపోయారు ప్రజలు. అందుకే మీకు శ్రమ అని అంటున్నారు.

 

నిజానికి ఇలాగా గర్వించినవారు తమకు పండిన పంటను చూసి తమకు కలిగిన ఆధిక్యత ఆశీర్వాదాలు చూసి గర్వించిన వారు గడ్డిమేశారు అని బైబిల్ చెబుతుంది. రాజైన నెబుకద్నేజర్ అనుకున్నాడు ఈ సామ్రాజ్యాన్ని నేనే సాధించేను, ఈ పట్టణాన్ని నేనే కట్టాను అని గర్వించేడు. కాబట్టి గర్విష్టి గర్వానికి ప్రతిఫలంగా గడ్డిమేశాడు ఏడు సంవత్సరాలు.

 వాడి కొడుకు బల్షెసర్ తనకున్న సంపద ఐశ్వర్యం సామ్రాజ్యం చూసి దేవుని మందిర సంబంధమైన పాత్రలలో తిని త్రాగుతూ ఉంటే ఒక చేయి వచ్చి రాసింది మినే మినే టేకెల్ ఓఫర్సీన్! అనగా దేవుడు నిన్ను త్రూయగా నువ్వు త్రాసులో తక్కువగా తూయబడ్డావు కాబట్టి కాబట్టి నీ రాజ్యము మాదీయులకు పారశీకులకు అప్పగించబడును అని దేవుడు చెప్పాడు.

 గర్విష్టి తప్పకుండా గడ్డిమేస్తాడు దేవుని తీర్పును పొందుకుంటాడు!

 

 ఏసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానంలో ఇలాగే పంట బాగా పండింది లూకా సువార్త 12వ  అధ్యాయంలో వాడికి పండిన విస్తారమైన పంట చూసి: ఇప్పుడు నేనేం చేస్తాను! ఈ పంటకి ప్రస్తుతం నాకున్న కొట్లు చాలవు! కాబట్టి నా కొట్లన్నీ పడగొట్టేసి పెద్ద కొట్లు, కొత్తకోట్లు కట్టుకొని పంట కోసి కొట్లోకి నా ధాన్యము నా ఫలాలు అన్ని కొట్లో పెట్టి ,అప్పుడు నేను మందు పెట్టుకుని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఎందుకంటే అనేక సంవత్సరాలుకు కావలసినంత పంట నీకు పండింది అందుకే తినుము త్రాగుము సుఖించుము అని నేను అనుకుంటాను అని మనసులో అనుకున్నాడు! వెంటనే దేవుడు అంటున్నారు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను అప్పుడు నీవు సంపాదించినవన్నీ ఎవడి పాలు అవుతాయి అని చెప్పి ఆ రాత్రి వాడి సీటు చిరిపేసాడు దేవుడు! కాబట్టి గర్విష్టులు గడ్డిమేస్తారు! ఈ ఎఫ్రాయీమియులు అనగా ఇశ్రాయేలు జాతి వారు తమకు పండిన విస్తారమైన వచ్చుబడి పంటలు చూసి, దేవుని స్తుతించక దేవుని మరిచి, త్రాగుబోతులుగా మారిపోయారు! గత భాగాలలో చూసుకున్నాము: ఎవరికి శ్రమ ఎవరికి నెప్పి ఈ త్రాగుడు విస్తారంగా త్రాగేవారికి, ద్రాక్షరసం విస్తారంగా త్రాగి త్రాగి దేవుని మర్చిపోయేవారికి! అందుకే దేవుడు నీకు శ్రమ అని ఒక జాతి మీద తీర్పు ప్రకటిస్తున్నారు!

 

 ప్రియ దైవ జనమా! విశ్వాసి! సేవకుడా! నీవు కూడా నీకు కలిగిన ఆశీర్వాదములు బట్టి నీకు కలిగిన విస్తారమైన పంటను బట్టి, ఆశీర్వాదాల బట్టి, వరాలు ఫలాలు తలాంతులు బట్టి, నీవు కూడా గర్వించేవా? నీ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించేవా? నీ ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తున్నావా? నీకు వస్తున్న జీతం బట్టి అతిశయిస్తున్నావా? నీ రాబడి బట్టి గర్విస్తున్నావా? జాగ్రత్త నెబుకద్నెజరు గడ్డిమేశాడు. బెల్షసర్ ఆ రాత్రి పోయాడు! ధనవంతుడు ఆరాత్రే పోయాడు! నీవు ప్రాణాలతో ఉండాలని ఆధ్యాత్మికంగా జీవంగా ఉండాలంటే గర్వాన్ని వదిలి దీనత్వం అలవర్చుకొని, నీ కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయని గమనించి, ఆయనకు లొంగి ఆయనకు తగినట్లు జీవించు!

 దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*207వ భాగము*

 

యెషయా 28:2--6

2. ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు.

3. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.

4. ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూ రపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.

5. ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.

6. ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 28వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

 

             (గతభాగం తరువాయి)

 

 ప్రియులారా ఇక రెండవ వచనం చూసుకుంటే ఆలకించుడి బలపరాక్రమములు కలవాడు ఒకడు ప్రభువునకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లు ప్రచండమైన జల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు!

  ఇక్కడ బలపరాక్రమం గలవాడు ఒకడు ప్రభువుకు ఉన్నాడు అంటున్నారు. కొంతమంది ఇది ఏసుక్రీస్తు ప్రభువుల వారు అనుకుంటారు, కానీ కాదండి ఇది ఇశ్రాయేలు జాతి మీద అనగా 10 గోత్రాల ఇశ్రాయేల రాజ్యము కోసం, వారి యొక్క దోషములు పాపములు కారణంగా దేవుడిస్తున్న తీర్పు!! కాబట్టి ఈ బల పరాక్రమము గల ఒకడు ప్రభువుకు ఉన్నాడు  వాడు ఎవడు అంటే అష్షూరు రాజు! అతని సామ్రాజ్యం! అతను ఎలా వస్తున్నాడు? ప్రచండమైన వడగండ్లు ప్రచండమైన జల ప్రవాహములు ప్రచండమైన వరద ఒక ప్రాంతాన్ని తాకినప్పుడు ఎలాగ సర్వనాశనం అయిపోతుందో ఆ ప్రాంతము, అలాగే తన బలం చేత ఈ ఇశ్రాయేలు జాతిని పడద్రోస్తాను అంటున్నాడు!

 దీనికోసం ఇదే యెషయ ప్రవచన గ్రంథం 8వ అధ్యాయంలో 7,8 వచనాల్లో రాయబడి ఉంది. ప్రభువు అష్షూరురాజుని అతడే సర్వ సైన్యాన్ని సర్వ ప్రతాపము అనే బలమైన యూఫ్రటీస్ లోని విస్తారమైన నీళ్లను వారి మీదకు రప్పిస్తాను అవి కాలవల్లాగా అన్నిటి మీద పొంగి తన గట్లుమీద పడతాయి దాని ముంచి వేస్తుంది అని ఎనిమిదో అధ్యాయంలో వ్రాయబడి ఉంది.

 

 అదే ఈ అష్షూరురాజు క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో సమరయ అనగా షోమ్రోను అనగా ఎఫ్రాయిము, 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని పట్టుకొని ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి అష్షూరు దేశానికి అనగా నార్త్ ఇరాక్ కి చెర తీసుకొని పోయినట్లు మనకి రెండు రాజుల గ్రంథము మరియు యిర్మియా గ్రంథము తెలియజేస్తుంది. ఈ 722లో జరిగే సంభవాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెష్షయిగారు ప్రవచనం ఎత్తి చెబుతున్నారు. అష్షూరు రాజు ఎలాగ వీరి మీద దండెత్తుతాడు అంటే ప్రచండమైన వడగండ్లు ప్రచండమైన తుఫాను ప్రచండమైన వరదలు వచ్చి ఎలాగ దేశాన్ని నాశనం చేస్తాయో అలాగే నాశనం చేస్తాడు అన్నట్లు నిజంగా ఆ విధంగానే ఆ దేశాన్ని నాశనం చేశారు.

 

 ఇప్పుడు మూడో వచనం ప్రకారం జరుగుతుంది  అష్షూరు రాజు ఈ తాగుబోతులైన ఎఫ్రాయిము యొక్క అతిశయ కిరీటమును పాడుచేసాడు. ఈ తాగుబోతులైన ఎఫ్రాయిము యొక్క అతిశయ కిరీటము ఏమిటి? వాళ్ళకున్న ఆస్తి అంతస్తు సమృద్ధి పంటలు! ఇప్పుడు ఆస్తి లేదు అంతస్తులు లేదు వారికి పంటలు లేవు రాజ్యమే లేకుండా పోయింది షోమ్రోను లేదా సమరయకు లేక ఎఫ్రాయిము జాతికి!

 అందుకే నాలుగో వచనంలో వాడిపోతున్న పువ్వు లాంటి వారు అని చెప్పడం జరుగుతుంది ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోయే పుష్పము వంటి దాని సుందరభూషణము వసంత కాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలే అయిపోతుంది దాని కనుగొను వాడు దాన్ని చూడగానే అది వాడి చేతిలో పడిన వెంటనే మింగి వేయబడుతుంది. ఇంకా అర్థం అయ్యేలా చెప్పాలంటే వాడిపోతున్న పువ్వు లాంటి దాని అనగా ఎఫ్రాయిము సౌందర్య శోభ కోతకాలం రాకముందే అనగా కోతకాలం రాకముందు పండిన మొదటి అంజూరపు పండు లాగా ఉంటుంది దాన్ని చూసినవాడు దాన్నే చేతితో తీసుకోగానే మింగేస్తాడు. ఇక్కడ వాడి పోతున్న పువ్వు లాంటిది దాని శోభ అంటూ కోతకాలం రాకముందే పండిన మొదటి అంజూరపు పండు. మన భాషలో చెప్పుకోవాలంటే మనకు మామిడిపళ్లు కాలం ఏప్రిల్ నెలాకరు నుంచి జూన్ నెలాకరు వరకు ఉంటుంది. మార్చి నెల మధ్యలో ఎవరైనా పండిన మామిడిపండు చూసారనుకోండి ఇంకా ఏప్రిల్ వరకు మే వరకు ఆగకుండా వెంటనే ఎలా కోసుకొని తినేస్తాడో చెట్టు మీద నుండి, అలాగే వీరి బ్రతుకు కూడా అయిపోతుంది అనగా అక్కడ ఏమీ ఉండదు ఇశ్రాయేలు జాతి వారికి ఉన్న ధనము వారికున్న బలము పంటలు పాడి సస్యశ్యామలత అభివృద్ధి అంతా వాడిపోతున్న పువ్వు లాంటిది రా అని దేవుడు చెప్తున్నాడు!

 అవును కదా మనిషి జీవితమే వాడిపోతున్న పువ్వు లాంటిది! పిల్లవాడిగా పుట్టి యవ్వనుడిగా ఉంటాడు, మధ్య వయసు, ముసలితనము ఇతను ఒకరోజు  రాలిపోతుంది జీవితం! మనిషి అతిశయం కూడా మనసులో ఉన్న గొప్పతనం కూడా ఈరోజు ఉంది రేపు రాలిపోతుంది! అది కొద్దికాలం ఉండేది మాత్రమే! అందుకే యెషయా 40:6,7,8 వచనాల్లో దేవుడు చెబుతున్నారు! ప్రకటించు అంటున్నారు, నేనేమీ ప్రకటించాలని అతడు అడిగాడు,  దేవుడు అన్నారు: మానవులంతా గడ్డి లాంటోలని, వారి అందమంతా అడవి పువ్వులా ఉంటుంది, దేవుని శ్వాస దానిమీద ఊదగానే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది! ఈ ప్రజలు కూడా అలాంటి వారే అని 40వ అధ్యాయంలో రాయబడి ఉంది.

Isaiah(యెషయా గ్రంథము) 40:6,7,8

6. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

 ఇదే విషయాన్ని పేతురు గారు కూడా మొదట పేతురు 1:24 లో ఎత్తి రాస్తున్నారు! ఎందుకంటే సర్వశరీరులు గడ్డి లాంటి వారు మానవ వైభవం అంతా అడవి పువ్వు లాగా ఉంటుంది గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది అంటున్నారు!

1పేతురు 1:23

ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

1పేతురు 1:24

గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

 

 దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణకాలం ఉండేదే అశాశ్వతమైనదే కానీ శాశ్వతంగా ఉండేది దేవుని వాక్యం మాత్రమే! దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతము.

మత్తయి 24:35లో యేసయ్య అంటున్నారు ఆకాశం భూమి గతిస్తాయి గానీ నా మాట ఎప్పటికీ గతించిపోవు !

మొదటి యోహాను 2:17లో లోకము దాని ఆశలు గతించిపోతాయి గాని కేవలం దేవుని ఇష్టం నెరవేర్చే వాడే ఎల్లప్పుడూ జీవిస్తాడు అని చెప్పారు!

 

 కాబట్టి శాశ్వతంగా నిలిచే ఉండే వాటి కోసమే మనం కృషి చేయాలి కానీ అశాశ్వతమైన వాటి కోసం మనము పాటు పడకూడదు! ఎఫ్రాయిము లో అశాశ్వతమైన ఈ లోకాసలు, ధనము, పేరు వీటి కోసం పరిగెత్తారు! దేవుడు ఇప్పుడు వాటిని తీసి వేస్తున్నారు!

మత్తయి 6: 19-20 వచనాలు చూసుకుంటే భూమి మీద మీకోసం సంపద కూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మట తుప్పు తినేస్తాయి దొంగలు కన్నం వేసి దోచుకుంటారు అయితే మీ కొరకు పరలోకంలో మీరు ధనాన్ని కూడ పెట్టుకోండి అక్కడ చిమ్మట గాని తుప్పుగాని దొంగలు గాని ఉండరు అంటున్నాడు దేవుడు.

Matthew(మత్తయి సువార్త) 6:19,20,21

19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.

 

 అలాగే యోహాను సువార్త 6: 27లో ఈ చెడిపోయే పాడైపోయే ఆహారం కోసం కష్టపడద్దు గాని నిత్యజీవాన్ని ఇచ్చే ఆహారం కోసం అనగా ఎల్లప్పుడూ ఉండే ఆహారం కోసం కష్టపడండి అది మనిషి కుమారుడు మీకు ఇస్తారు అని చెప్తున్నారు. 

యోహాను 6:27

క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

 

     కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! ధనము కోసము, పేరు కోసము, ఆస్తి కోసము కీర్తి కోసం కాదు గాని నిత్యము ఉండే వాటి కోసమే ప్రయత్నం చేద్దాం! అలాగ మనం నిత్యరాజ్యం చేరుకోగలం.!

 

 ఇక ఐదో వచనానికి వస్తే ఆ రోజున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును సౌందర్యము గల మకుటముగా ఉండును అంటున్నారు. ఇక్కడ ఆ దినమున అనగా మనకు షోమ్రోను లేదా సమరయను శిక్షించే దినము అని అనుకోకూడదు ఇది తప్పకుండా ఆరవ వచనం ప్రకారం చూసుకుంటే రాబోయే రెండవ రాకడ కోసమే దేవుడు ఆ రోజున అంటున్నారని నాకు అర్థం అవుతుంది ఎందుకంటే 24 నుంచి ఈ రెండవ రాకడ మరియు జరిగే సంభవాలే చెప్తున్నారు! కాబట్టి ఇక్కడ కూడాను రెండవ రాకడ సమయం లోనే దేవుడు తీర్చే తీర్పులాగా కనిపిస్తుంది అయితే ఇది ఐదో వచనంలో నేను మిగిలిన శేషమును అనగా చెర నుంచి తిరిగి వచ్చిన ప్రజలకు, రక్షించబడిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తానే ఘనమైన కిరీటం లాగా అందమైన మకుటంలాగా ఉంటాను అంటున్నారు!

 ఈ రోజుల్లో మనుషులు తమ సొంత కిరీటాలు చేసుకుని తమ సొంత ఘనతను చూసి మురిసికోవచ్చు కానీ నిజంగా శాశ్వతంగా ఉండే కిరీటము, విశ్వాసులమైన మనకున్న ఏకైక నిజమైన దేవుడు మాత్రమే మనకి కిరీటముగా మనకు ఘనతగా ఉంటారు అని మనం గ్రహించాలి! నేను మీకు ఘనమైన కిరీటం లాగా అందమైన మకుటంలాగా ఉంటాను అని దేవుడు చెబుతున్నారు! ఈ మాట కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదు నీకు నాకు కూడా అని మనము గ్రహించాలి!

 

తర్వాత వచనం ఆయన న్యాయ పీఠం మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చడానికి ఆయన నేర్పించే ఆత్మ అవుతాడు, గుమ్మం దగ్గర యుద్ధం చేసే వారిని తరిమికొట్టే వారికి ఆయన బలం అవుతాడు! దీనికోసం చూసుకుంటే న్యాయ పీఠం మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చడానికి ఆయన నేర్పించే ఆత్మ అవుతారు మనకి ఈ తీర్పు కోసము యెషయా 11:2--4 వచనాల్లో మనం చదువుకున్నాం. దీనికోసం ధ్యానించుకున్నాం కూడా!  యెహోవా ఆత్మ ఆయన మీద నిలిచి ఉంటాడు అంటూనే ఆ ఆత్మ జ్ఞానముకి, వివేకాన్ని ఇచ్చే ఆత్మ, ఆలోచన బలం ఇచ్చే ఆత్మ, తెలివి యెహోవా పట్ల భయభక్తులు ఇచ్చే ఆత్మ,!  ఇంకా ముందుకు పోతే యెహోవా పట్ల భయభక్తులు అంటే ఎంతో ఆయనకు ఇష్టము! కంటికి కనిపించే దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు చెవులు వినేదాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకోవడు అంటూ కేవలం నీతి నిజాయితీతో పేదలకు న్యాయం చేస్తాడు! లోకంలో ఉన్న దీనులకు పక్షపాతం లేకుండా తీర్పులు తీరుస్తాడు! ఇలాంటివి అన్ని మనం చూసుకున్నాం. ఇదే ఆత్మతో ఆయన ఇప్పుడు న్యాయాధిపతులకు సరియైన తీర్పు తీర్చడానికి ఆయన నేర్పించే ఆత్మగా ఉంటారు! ఆరోజు ఇంటి గుమ్మం దగ్గర యుద్ధం చేసే వాళ్ళని తరిమికొట్టే వారికి బలం అవుతారు! గుమ్మం దగ్గర యుద్ధం చేసేవారు అంటే శత్రువులతో పోరాటానికి తగిన బలము ఆయనే ఇస్తాడు! ఆయన బలంగా ఉంటారు. అది బలమే తప్ప అది అపజయం అనేది రాకుండా దేవుడు చూసుకుంటారు ఆరోజు అనగా రెండవ రాకడ సమయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించే దినాన ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తాడు! ద్వారము దగ్గర గుమ్మం దగ్గర అనగా యెరుషలేము గుమ్మము దగ్గర యెరుషలేము పట్టణము చుట్టూ దండులు శత్రువుల దండులు, హార్మెగిద్దోను యుద్ధం కోసం యెరుషలేము చుట్టూ దండులు కట్టిన ఈ సైనికులను శత్రు సైనికులను తరిమికొట్టడానికి దేవుడే వారికి బలంగా ఉంటాడు అని ఈ వచనము తెలియజేస్తుంది!

 

 కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నీకున్న దానిమీద అతిశయించుకుండా నీ ఘనత మీద అతిశయించుకుండా ధనం ఆశ్రయించకుండా  దేవున్నే నీకు కిరీటముగా చేసుకో! ఆయన ఆత్మను ఆసరా చేసుకో!

 అప్పుడు ఆయనే నీకు బలంగా, కోటగా ఉంటారు! దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*208వ భాగము*

 

యెషయా 28:7--13

7. అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.

8. వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.

9. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

10. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు

13. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 28వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

 

             (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక ఏడవ వచనం చూసుకుంటే అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు, ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది, మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు. ప్రియులారా ఇక్కడ వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు అనగా గత వచనాలలో దేనికోసం చెప్తున్నారు. న్యాయం తీర్చే వారికి తీర్పు తీర్చే నేర్పు ఆత్మ గా ఉంటాను యుద్ధం చేసేవారికి యుద్ధం నేర్పు ఆత్మగా ఉంటాను అని చెప్పారు కదా అనగా ఆధిపతులు ఇంకా యుద్ధం నేర్పించే వారు కూడా ద్రాక్ష రసం వల్ల సొక్కి సోలిపోతున్నారు అంట. తాగేసి పడిపోతున్నారు మద్యం వలన తత్తర పడిపోతున్నారు!

 తర్వాత మాట యాజకులేమీ ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలిపోతున్నారు వారిని ద్రాక్షారసం మింగి వేస్తుంది, మధ్యం వల్ల తత్తర పడుతున్నారు! దర్శనం కలిగితే సోలిపోతున్నారు! ఇక వీరేకాదు యాజకులు ప్రవక్తలు కూడా ఈ మద్యం తాగుతూ తూలిపోతూ ఉన్నారు అని బైబిల్ సెలవిస్తుంది! ఇక ఎనిమిదో వచనంలో వాళ్ళు కూర్చునే బల్లలు కుర్చీలు వారు ఉండే ప్రాంతము వారి ఆఫీసులు అన్ని బల్లలు అన్నింటి మీద వాంతి కల్మషము ఉన్నాయి నీటుగా క్లీన్ గా ఉండే చోటు ఎక్కడా కనబడడం లేదు అని దేవుడు చెప్తున్నాడు; ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు!! యాజకులు ప్రవక్తలు అధిపతులు న్యాయాధిపతులు అందరూ త్రాగేసి తిరుగుతున్నారు. ఇంత ఘోరంగా ఉంది వారి పరిస్థితి.

 

ఇక దీని పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు 9, 10 వచనాల్లోనే ఈ త్రాగుబోతులైన యాజకులు ప్రవక్తలు యెషయా గారిని హేళన చేస్తున్నారు వెక్కిరింత పాలు చేస్తున్నారు; ఎలా చేస్తున్నారు: అతడు ఎవరికి విధ్య నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరికి తన ప్రవచనాలు వినిపిస్తున్నాడు? తల్లిపాలు విడిచిన పిల్లలకు లేకపోతే తల్లిపాలు తాగుతున్నారు కదా చిన్న పిల్లలకా? ఆజ్నవెంబడి ఆజ్న, సూత్రం వెంబడి సూత్రము  కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడు అని ఇక్కడ యెషయా గారిని హేళన చేస్తున్నారు. ఇలా వాళ్ళు దేవుని ప్రవచనాలని దేవుడు వాక్యాన్ని పట్టించుకోకుండా హేళన చేస్తున్నారు! ఆజ్ఞ వెంబడిఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట  కొంత ఇచ్చట ఏది పూర్తిగా చెప్పట్లేదు అంటూ యెషయా గారిని హేళన చేస్తున్నారు!

 

 అయితే ఇప్పుడు ఈ 11 ,12, 13 వచనాల్లో యెషయాగారు రిప్లై ఇస్తున్నారు !

నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేసి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు అయినను వారు వినడం లేదు. కావున వారు వెళ్లి వెనుకకు మగ్గి విరగబడి చిక్కుబడిపోయి చిక్కుబడి పట్టబడేలాగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని జవాబు చెబుతున్నారు!

 

 దీన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే దేవుడు అలసిన వానికి నెమ్మది కలుగజేసి, ఇదే  నెమ్మది ఇదే పద్ధతి ఇదే విశ్రాంతి  అని దేవుడు మీతో చెప్తే మీరు వినడం లేదు! నత్తి వారి పెదాలు చేత అన్యభాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినా వారి వినడం లేదు అందుకే దేవుడి కోపం వచ్చి వారు వెనక్కి పడిపోయేలాగా చిక్కుబడి పట్టబడేలాగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అంటున్నారు!

 

 దీనికి రెండు అర్థాలు ఉన్నాయి ఈ రెండు అర్థాలు మీకు చెప్తాను!

 

మొదట ఇశ్రాయేలీయుల కోణంలో చూసుకుందాం! ఒరేయ్ ఇశ్రాయేలు ప్రజలారా ఇదే మార్గము ఇదే మీకు నెమ్మది దీనివలన మీకు విశ్రాంతి అని మీకు మార్గము చెబితే పద్ధతి చెబితే మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు మీకు నత్తి వారి పెదాలు చేత అన్య భాషతో మాట్లాడే ప్రజలతో మీరు పట్టబడేలాగా విరిగిపోయేలాగా మీరు కూలబడేలాగా మీకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు కలుగుతుంది అంటున్నారు! ఇక్కడ నత్తి వారు ఎవరు అనగా వారు బబులోను వారని అష్షూరు వారని అర్థమవుతుంది! సొంత ప్రజలతో సొంత భాష మీ భాష అర్థమయ్యే వారితో నేను మీకు సందేశాలు తీసుకొచ్చాను, నిజమైన మార్గాన్ని చూపించాను బోధించాను అయినా మీరు వినలేదు కాబట్టి మీ యొక్క నాశనము విదేశీయుల ద్వారా నత్తి నత్తిగా మాట్లాడేవారు, మీ భాష వారికి వారి భాష మీకు అర్థం కాని అష్షూరు బబులోను వారి ద్వారా మీకు నాశనం కలుగుతుంది అని మొదటి అర్థం!!  గమనించండి ఆ రోజులలో ఈ నార్త్ ఇరాక్ అనగా అష్షూరు, సౌత్ ఇరాక్ అనగా కల్దీయులు అనబడే బబులోను వారు ఎక్కువగా పచ్చి మాంసం తినేవారు! ఆ పచ్చి మాంసం ద్వారా వారి నోరు మనలాగా సరళంగా తిరిగేది కాదు వారి మాటలు నత్తిగా ముద్దగా ఉండేవి! వారి భాష ఇస్రాయేలీయులకు, ఇశ్రాయేలు భాష వాళ్ళకి సరిగా అర్థమయ్యేది కాదు! అందుకే నత్తివారి నోట ఇంకా అన్య భాష అంటే మీకు తెలియని భాష మాట్లాడే వారి ద్వారా దేవుడు మీకు బుద్ధి చెప్పబోతున్నాడురా అని యెషయా గారు ఆత్మావేశుడే జవాబు చెబుతున్నారు! ఇశ్రాయేలు యాజకులకు ప్రవక్తలకు తనను గేలిచేసి అవహేళన చేసే పెద్దలకు జవాబు చెబుతున్నారు ఇది మొదటి అర్థం.

 

రెండవ అర్థము ఆధ్యాత్మికంగా ఏమిటి అంటే ఈ లోకంలో గొప్ప వారిని ఘనులు అనే ఎంచబడిన వారిని విద్యావంతులను జ్ఞానవంతులను అవమానపరచడానికి లోకంలో వెర్రి వారు ఎందుకు పనికిరాని వారు అని పిలువబడే మనలను దేవుడు ఎన్నుకున్నాడు!

1కోరింథీయులకు 1:27

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

1కోరింథీయులకు 1:28

జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

1కోరింథీయులకు 1:29

ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

 మీరు యాజకులు ప్రవక్తలు న్యాయము తీర్చేవారు అని పిలవబడుచున్న ఈ త్రాగుబోతులు సత్యాన్ని అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఏ విద్య లేని పామరులను ఇప్పుడు యేసయ్య తనకోసం ఏర్పాటు చేసుకొని విధ్య లేని వారిని లోకంలో ఎన్నిక లేని వారిని దేవుని కోసం సంపూర్ణ జ్ఞానం లేని వారిని దేవుడు ఏర్పరచుకొని, ఇప్పుడు జ్ఞానులు గొప్పవారు పండితులు అని పిలువబడే వారికి దేవుడు అవమానం చేస్తున్నారు! నత్తిగా మాట్లాడే వారి పెదవులతో విదేశీ భాష అన్యభాషలను దేవుడు ఉంచి దేవుని మర్మాలు ప్రజలకు బోధిస్తున్నారు! ఆ బోధించే విధానం కూడా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే మేము విద్యావంతులు దేవుని యొక్క సంపూర్ణజ్ఞానం మా దగ్గరే ఉంది అని గొప్పలు చెప్పుకునే వారికి అర్థం కాకుండా లోకంలో వెర్రివారిని బలహీనులను దేవుడు ఏర్పరచుకొని తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషేకించి వారితో వారి ద్వారా లోతైన ఆత్మీయ మర్మాలను బోధిస్తూ, భవిష్యత్తులో జరగబోయే గొప్ప కార్యాలను ముందుగానే దేవుడు చెబుతున్నారు ఇది రెండవ అర్థం!

 

 అయితే ఈ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట ఎందుకు చెబుతున్నారు అంటే పౌలు గారు రాస్తున్నారు ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మతోనే ఆత్మసంబంధమైన విషయాలతో పోల్చుకోవాలి!

1కోరింథీయులకు 2:13

మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

 అనగా ఒక బైబిల్ లేఖనము అర్థం చేసుకోవాలి అంటే నీకు అర్థం అయిన ఒక విషయము అది సరైన అర్థమా కాదా అని సరిపోల్చుకోవాలి అంటే వాక్యాన్ని వాక్యము తోనే పోల్చుకోవాలి! ఒక లేఖనము మరో లేఖనముతోనే పోల్చుకోవాలి! అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యము వస్తుంది అనగా ఒక లేఖనానికి సపోర్టింగ్ రిఫరెన్స్ బైబిల్ లో మరో దగ్గర తప్పకుండా ఉంటుంది! ఇప్పుడు అచ్చట ఉన్నదాన్ని ఇచ్చట ఉన్నదాన్ని కలుపుకుంటే అప్పుడు మనకు ముచ్చటగా అర్థమవుతుంది లేకపోతే మనం అర్థం చేసుకున్న ఆ భావము అది తప్పు అవుతుంది! దీనికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి గాని రెండు ఉదాహరణలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను!

 

 మొదటిది బిలాము గారి కోసం! సంఖ్యాకాండములో మనకు మోయాబు రాజైన బాలాకు బిలాము గారిని పిలచినప్పుడు బిలాము గారు మూడుసార్లు ఇశ్రాయేలు ప్రజలను శపించాలని వెళ్లడం దేవుడు ఆ శాపాన్ని దీవెనగా మార్చడం మాత్రమే కనిపిస్తుంది. 22--24 అధ్యాయాలు! సడన్‌గా ఆ తర్వాత అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసినట్టు వారి పిలుపుని అందుకుని బయల్పెరాజీము అనగా విగ్రహారాధన చేసి విగ్రహాలకు అర్పించిన వాటిని తినినట్లు చూస్తాం! అయితే నిజానికి ఏం జరిగింది అనేది మనకి తర్వాత అధ్యాయాలలో మరియు ద్వితీయోపదేశకాండములోనూ ఇంకా పాత నిబంధనలో కొన్ని చోట్ల ఇంకా క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం లోను (2:14) అసలు విషయం మనకు తెలుస్తుంది!

సంఖ్యాకాండము 31:14

అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.

సంఖ్యాకాండము 31:15

మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా?

సంఖ్యాకాండము 31:16

ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.

 

ప్రకటన గ్రంథం 2:14

అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.

 

 బిలాము గారి యొక్క తప్పుడు బోధల వలన ఈ మోయాబు రాజు అయిన బాలాకు మోయాబు దేశంలో అందమైన స్త్రీలను అమ్మాయిలను ఇశ్రాయేలు వారి దగ్గరకు పంపడం వారు వారి వేషధారణతో వారిని కవ్వించి ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలుతో వ్యభిచరించి వారి పండుగకు వెళ్లి వారి విగ్రహాలు అర్పిచింది తిని వీరు వ్యభిచారం చేసినట్టు మనం గమనించగలము! ఈ తప్పుడు బోధ మనకు సంఖ్యా కాండంలో అక్కడ కనబడలేదు కాబట్టి ఇది మనకు పూర్తిగా అర్థం కావాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఈ పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నవన్నీ కలుపుకొని చూసుకుంటేనే సంపూర్ణ అర్థం మనకు లభిస్తుంది అచ్చట ఇచ్చట కలుపుకుంటేనే ముచ్చటగా మనకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు!

 

 ఇక రెండవ విషయం అది లూసిఫర్ గాడి కోసం! ఆదికాండం మొదటి అధ్యాయములలో  సృష్టి ఎలా జరిగింది అనేది మనకు చెప్తుంది గాని ఆదిలో ఏం జరిగిందో మనకు వివరంగా లేదు; ఒకటో వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది గాని తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటున్నారు మొదటి వచనంలో భూమిని ఆకాశాన్ని సృజించినట్లయితే  భూమి నిరాకారముగాను శూన్యంగానే ఉండటం ఏంటి? అనగా ఒకటో వచనం కి రెండు వచనం కి మధ్యలో చాలా జరిగింది. ఏమి జరిగింది అంటే మనకి అర్ధం కావాలంటే దానిని మనం యెషయా ప్రవచన గ్రంథము యెహేజ్కేలు ప్రవచన గ్రంథంలో చూసుకుంటే ఈ పూర్తి స్టోరీ అర్థమవుతుంది! వాడు అనగా లూసీఫర్ ప్రధాన దూతగా అభిషేకింపబడిన కెరూబుగా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని కంటే తనను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తే, దేవుడు ఒక్క తాపు తంతే కింద పడ్డాడు, ఒక మూలకు పడ్డాడు, దానికి కోపంతో వాడు దేవుడు చేసిన సృష్టిని నాశనం చేశాడు. అప్పుడు దేవుడు రెండో సృష్టి చేశారు. ఆరు రోజుల్లో సృష్టి మొత్తం పూర్తి చేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది! ఇప్పుడు ఈ కథ మొత్తం మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండంలో ఏమీ లేకపోయినా ఈ యెషయా ప్రవచన గ్రంథము యెహేజ్కేలు ప్రవచన గ్రంథంలో చూసుకుంటేనే ఈ రెండు కలిపి చదువుకుంటేనే లూసిఫర్ గాడి కధ అర్థం అవుతుంది మనకి!

Isaiah(యెషయా గ్రంథము) 14:12,13,14,15,19

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్ప బడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివిబిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

 

Ezekiel(యెహెజ్కేలు) 28:12,13,14,15

12. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

14. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

15. నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

 

 కాబట్టి బైబిల్లో లేఖనానికి సపోర్టింగ్ గా మరో లేఖనం ఉంటుంది ఈ రెండు కలుపుకొని చదివితేనే సంపూర్ణ భావం మనకు అర్థమవుతుంది! అందుకే పౌలు గారు చనిపోయే ముందు తిమోతి గారికి చార్జ్ అప్పగిస్తూ లేఖనాన్ని సరిగా విభజించు వానిగా నువ్వు ఉండాలి అని చెబుతున్నారు సరిగా విభజించాలంటే ముందు తన సరిగా అర్థం చేసుకుని ఈ లేఖనానికి మరో లేఖనం కూడా సపోర్టింగ్ గా ఉన్న లేఖనాన్ని చూసుకొని సరిగా విభజిస్తూ సరిగా అర్థం చేసుకొని ప్రజలకు బోధించాలి ఇదే పద్ధతి!

2తిమోతికి 2:15

దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.

 

 సహోదరీ సహోదరుడా! దేవుడు తన యొక్క లేఖన మర్మాలు మనకి అర్థం కావడానికి కొంత మర్మం ఇక్కడ కొంత మర్మము అక్కడ దేవుడు పొందుపరిచారు! దానిని సరిగా అర్థం చేసుకుంటేనే, మోకాళ్ళ మీద ఉండి దానిని ధ్యానం చేస్తే, దేవుని పరిశుద్ధాత్మ తన వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు! కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమము నేర్చుకుందాం! కొంత ఇచ్చట కొంత అచ్చట చూసి ఆ రెండు కలిపి చదువుకొని అప్పుడు సరైన అర్ధాన్ని మనం గ్రహిద్దాం.!

 

 ఇక దేవుడు నత్తి వారి నోటితో ఎందుకు పనికిరాని వారిని ఉపయోగించుకొని వారి ద్వారా గొప్ప గొప్ప మర్మాలు ప్రజలకు బోధించే దేవుడై ఉన్నారు! ఒకసారి 2002లో నేను విశాఖపట్నం ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడికి అరకు ప్రాంతం నుంచి ఒక చదువు రాని గిరిజన విశ్వాసి రావడం జరిగింది. రెండు రోజులు ఆమె నాకు దగ్గరలోనే కూర్చుంది. ఆమెకు అస్సలు ఇంగ్లీషు రాదు తెలుగు కూడా చదవడం రాదు. అలాంటి స్త్రీ ఒకరోజు దైవజనుడు ప్రసంగం చేస్తూ ఉండగా సడన్‌గా ప్రసంగం ఆపేసి దేవుడు నన్ను అందర్నీ స్తుతించమని చెబుతున్నారు అని చెప్పి మమ్మల్ని స్తుతించమని చెబుతుండగా, ఈ గిరిజన స్త్రీ చదువు లేని స్త్రీ పరిశుద్ధాత్మ పూర్నురాలై ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో దేవుని స్తుతించడం నేను చూశాను! తన దగ్గరలోనే రెండు మీటర్ల దూరంలోనే నేను ఉన్నాను అందుకే పూర్తిగా విన్నాను ఆమె ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో దేవుని స్తుతిస్తూ ఇంగ్లీషులో ప్రవచనాలు చెప్పడం జరిగింది. స్టేజి మీద ఉన్న ఆ దైవజనుడు ఆ విదేశీ బోధకుడు సడన్‌గా మా దగ్గరికి వచ్చి ఆమె చెబుతున్న ఆమె మాట్లాడుతున్న మాటలు తను కూడా విని అప్పుడు ప్రజలందరికీ ఆమె చెబుతున్న అన్య భాషల్లోనూ ఇంగ్లీష్ లోనూ ఆమె చెబుతున్న విషయాలు అందరికీ చెప్పడం జరిగింది! ఇలాగా నత్తి వారి నోట, విధ్యలేనివారితో అన్య భాష, అర్థం కాని భాష, తెలియని మర్మాలు బోధించే దేవుడు మన దేవుడు!  లోకంలో ఎన్నికైన వారిని అవమానం చేయడానికి దేవుడు ఎన్నిక లేని నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు! కాబట్టి ఆయన చేతులకు మనము అప్పగించుకుందాం. ఆయన ద్వారా వాడబడదాం! మన నోరు దేవునికి ఇచ్చేద్దాం! మన నాలుక దేవునికి ప్రతిష్ట చేసేద్దాం!

ప్రియ సహోదరి సహోదరుడా! ఇలాంటి పరిస్థితి ఉందా! అప్పుడు దేవుడు మనలను వాడుకొని ప్రజలకు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు!

 దేవునికి మహిమ కలుగును గాక!

 ఆమెన్!

 దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*209వ భాగము*

 

యెషయా 28:14--19

14. కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి

15. మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.

16. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

17. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

18. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ బడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు వదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటు నప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు

19. వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 28వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

 

             (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక 14వ వచనం చూసుకుంటే కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి! చూడండి పరిహాసకులారా! యెహోవా మాట వినండి అంటున్నారు! ఏమని పరిహాసం చేశారో మనం గత భాగంలో చూసుకున్నాం కదా, చిన్న పిల్లలకి పాలు తాగే వాళ్ళకి ప్రవచనాలు చెప్తున్నాడు మాకు కాదు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట ఎవరికీ అర్థం కావు అంటూ ఫుల్లుగా తాగేసి అధికారులు ప్రవక్తలు యాజకులు ప్రవక్త అయిన యెషయా గారిని హేళన చేశారు కదా! అందుకు ఇప్పుడు దేవుడు వాళ్లతో అంటున్నారు మీరు అంటున్నారు కదా మేము మరణంతో నిబంధన చేసుకున్నాము పాతాళంతో కలిసిపోయాము ఉపద్రవం ప్రవాహం వలె వడిగా మా దగ్గరకు వస్తే, వచ్చినా అది మా వద్దకు రాదు ఎందుకంటే అబద్దాలనే మేము ఆశ్రయంగా చేసుకున్నాము మాయ క్రింద దాగున్నాము అని మీరు అంటున్నారు కదా!  అయితే ఇక్కడ గమనిస్తే వాళ్ళు నిజంగా అన్నారో లేదో మనకు తెలియదు కానీ వారి హృదయపూర్వక భావమును ఎరిగి ప్రవక్త ఇలాగా మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవాలి!  గమనించాలి బైబిల్ లో రాయబడిన ప్రతి లేఖనము ఆత్మావేషులే ప్రభు వలన ఆత్మవలన పలికేరు కాబట్టి వారి హృదయపూర్వక ఆలోచనలు పరిశుద్ధాత్ముడు ఎరిగినవాడై ఇక్కడ చెబుతున్నారు మేము చావుతో నిబంధన చేసుకున్నాము పాతాళ లోకంతో  ఒప్పందం చేసుకున్నాము విపత్తు ప్రవాహం లాగా వచ్చినప్పుడు అది మా మీదకు రాదు ఎందుకంటే అబద్దాన్ని ఆశ్రయంగా చేసుకున్నాము మోసం కింద దాక్కున్నాము అంటూ! ఈ మాటలు పలకడానికి మనం ఇదే యెషయా ప్రవచన గ్రంథం 8 :19 చూసుకుంటే అక్కడ మనుషులు మమ్మల్ని చూచి కర్ణపిశాచం కలవాలని కిచకిచ మంటూ గుసగుసలాడే మాంత్రికులను సంప్రదించండి అని అన్నప్పుడు వీళ్ళు సజీవుల కోసం చచ్చినోళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చేశారు ఎవరు? రాజులు అధికారులు ఇక మనష్షే అనే వాడు ఈ చిల్లంగి కాదు తోనే చెడుపోళ్లు మాంత్రికులతో  వీళ్ళతోనే సహవాసం చేసి దేశం మొత్తం ఈ చెడుపోలుతో చిల్లంగిగాల్లతో కర్ణపిశాచి మాంత్రికులతో నింపేసాడు కాబట్టి ఇప్పుడు మీరు నిజ దేవుని ఆశ్రయించకుండా కర్ణ పిశాచం గల వారిని మంత్రతంత్రాలపై నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మేము చావు తోటి పాతాళంతో నిబంధన చేసుకున్నాము ఏ ఆపద మా మీదకు రాదు అని మీరు మురిసిపోతున్నారు అంటున్నారు దేవుడు.

 

వారే కాదండి నేటి రోజుల్లో కూడా చాలామంది నిజదేవుని వదిలేసి ఎంతోమంది సైతాన్ అబద్ధాలు నమ్మి విగ్రహారాధన వైపు మంత్ర తంత్రాల వైపు జ్యోతిష్యాల వైపు వాస్తు వైపు మ్రగ్గి వాటిలోనే తమకు భద్రత ఉంది అని అనుకుంటున్నారు. *మాటతో అనేక అద్భుతాలు చేసిన దేవుడు, మాటతో గాలి తుఫాను అనిచిన దేవుడు, మాటతో సృష్టిని చేసిన దేవుడు, తమను రక్షించలేరు అనుకుని పోములు కట్టించుకుంటూ రక్షరేకులు తావీదులు కట్టించుకుంటూ తిరిగే పనికిమాలిన విశ్వాసులు కొందరు, ఇక వాస్తులంటూ జ్యోతిష్యులు అంటూ శకునాలు అంటూ తిరిగే పనికిమాలిన వాళ్ళు మరి కొంతమంది*! అన్యాయం ఏమిటి అంటే కొంతమంది పాస్టర్లు కూడా వీరి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. కొన్ని సంఘాలలో చర్చిలు కూడా వాస్తు ప్రకారం కట్టే ఈ పనికిమాలిన బోధకులు క్రైస్తవులు దేవుని ప్రభావాన్ని శక్తిని ఆశ్రయించడం మానేశారు!  వీరి మీదకి కూడా దేవుని ఉగ్రత కునికి నిద్రపోదు ప్రళయం లాగా వస్తుంది ఇదే దేవుడు చెబుతున్నారు! ఇలాగా అనే వారికి దేవుడు జవాబు 17 వ వచనం 18 వ వచనం 19వ వచనంలో ఇంకా కిందకి చూసుకుంటే దీనికి జవాబు ఉంది!

 వీరు ఇలాగ చావుతో మేము ఒడంబడిక చేసుకున్నాము పాతాలముతో నిబంధన చేసుకున్నాము అంటూ చావు మా దగ్గరికి రాదు ఉపద్రవం మా దగ్గరికి రాదు అంటూ చెప్పేవారికి దేవుడు చెప్తున్నాడు నేను న్యాయాన్ని కొలనూలుగా ధర్మాన్ని నిబంధనగా చేస్తాను మీరు అబద్ధాలను ఆశ్రయిస్తున్నారు కాబట్టి అదే అబద్ధం మిమ్మల్ని మింగేస్తుంది!  న్యాయమును కొలనూలుగా నీతిని మట్టపు గుండు గాను పెడతాను వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేస్తాయి, మీరు దాగి ఉన్న చోటు మీరు ఎక్కడైతే దాగున్నారో ఆ చోటు వరదలో నీళ్ల చేత కొట్టుకుపోతాది అంటే మీరు కూడా ఆ వరదలో కొట్టుకుపోతారు!  మీరు మరణంతో చేసుకున్న నిబంధన కూడా కొట్టి వేయబడుతుంది పాతాళంతో మీరు చేసుకున్న ఆ ఒడంబడిక కూడా నిలవదు!  ప్రవాహము ఉపద్రవం లాగా మీ మీదకు వస్తాది! మీరు ప్రవాహాన్ని దాటి పోదాము అనుకుంటే ఆ ప్రవాహంలోనే తొక్కబడి నశించిపోతారు అంటున్నారు!

 19వ వచనం చాలా విచిత్రంగా ఉంటుంది వచ్చినప్పుడు ఎలా అది మిమ్మును ఈడ్చుకొని పోవును అనగా ఒక్కసారే రాదు ఇది మాటిమాటికి వస్తా ఉంటది! ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి ఈ ప్రవాహము అనగా ఉగ్రత అనగా శత్రువుల నుంచి దాడులు మీ మీదికి వస్తాయి! ఇలాంటి ప్రకటన మీరు విన్న వెంటనే మీ అందరికీ మహా భయము పుడుతుంది అని దేవుడు చెబుతున్నారు!

 అయితే ఇది ఎలా జరుగుతుంది అంటే 16 వ వచనం యెహోవా ప్రభువు అంటున్నాడు నేను సీయోనులో మూలరాయిని పునాది రాతిని వేసిన వాటిని నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయినా మూలరాయి ఉన్నది దానిని విశ్వసించువాడు కలవరపడడు చూడండి ఇక్కడ పునాదిరాయి అయిన దేవుని ఏసు క్రీస్తు ప్రభువులవారిని విశ్వసించినవాడు కలవరపడడు గాని ఈ మాయను అబద్దాలను ఆశ్రయించి మంత్ర తంత్రాలను చెడుపు చిల్లంగులను ఆశ్రయించిన వారికి దేవుడు ఉగ్రత న్యాయమును కొలనూలుగా నీతిని మట్టపు గుండు గా పెడతాను మీరు మాయను నమ్ముకున్నారు కాబట్టి ఆ మాయ శరణ్యమును నేను కొట్టివేస్తాను! దాంట్లో మీరు ఎక్కడ దాక్కున్నారో దానిమీదకి ఈ ప్రవాహము అనగా శత్రువుల దాడి వస్తాది!  మీరు నాశనం అయిపోతారు! అప్పుడు మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది! పాతాళముతో చేసుకున్న నిబంధన అది నిలబడదు అని దేవుడు చెబుతున్నారు! అది ఒక్కసారి ఒక్కరోజు మాత్రమే వచ్చింది కాదు, అది వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఈడ్చుకొని పోతుంది ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది మీ మీదకు వస్తుంది అని దేవుడు చెబుతున్నారు!  యెషయా 11: 4 లో మనం చూసుకున్నాం. నీతి నిజాయితీతో ఆయన పేదలకు న్యాయం చేకూరుస్తాడు లోకంలో ఉన్న దీనులకు పక్షపాతం లేకుండా ఆయన నిర్ణయాలు చేస్తాడు తన పెదవుల ఊపిరి చేత దుర్మార్గులను చంపుతారు! ఈ విధముగా ఈ దుర్మార్గుల మీదన, అబద్దాలను ఆశ్రయించి త్రాగుడు తాగుతూ దేవుని ప్రజలను హేళన చేసే వీరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది!

(16వ వచనం తర్వాత భాగంలో ధ్యానం చేసుకుందాం)

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*210వ భాగము*

 

యెషయా 28:14--19

14. కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి

15. మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.

16. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

17. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

18. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ బడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు వదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటు నప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు

19. వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 28వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

 

             (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక 16వ వచనం చూసుకుంటే ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు అంటున్నారు! ఈ వచనాన్ని స్టడీ బైబిల్ లో చూసుకుంటే ఇలా వ్రాయబడి ఉంది అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నారు సీయోనులో పునాదిగా నేను రాయిని వేస్తాను అది పరీక్షకు నిలిచిన రాయి ప్రియమైన మూలరాయి సుస్థిరమైన పునాది రాయి దానిని నమ్మినవాడు తొందరపడడు!

 ఈ రాయి ఏమిటి అని గానీ మనం ఆలోచిస్తే ఈ రాయి ఏసుక్రీస్తు ప్రభువులవారు అని మనకు అర్థమవుతుంది!  అపోస్తులులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు! దానికి ఏసుక్రీస్తు ముఖ్యమైన మూల రాయి అని మనం చూసుకోగలం మొదటి కోరింది 3:11 లో

1కోరింథీయులకు 3:11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

 వేయబడిన ఈ పునాది ఏసుక్రీస్తు ఈ వేయబడింది గాక మరో పునాది లేదు అని పౌలు గారు చెప్తున్నారు

 

మొదటి పేతురు 2: 6లో ఇదిగో నేను సీయోనులో ముఖ్యమైన మూలరాయిని వేస్తున్నాను ఆయన మీద నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ కలవరపడడు ఆ రాయి ఏసుక్రీస్తు ప్రభువులవారే!

1పేతురు 2:6

ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

1పేతురు 2:7

విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

 అయితే ఈ 16 వ వచనం ప్రకారము దేవుడు సరికొత్తగా మరల ఒక నూతన నిర్మాణాన్ని ప్రారంభించి దానిని నేను కడతాను అని చెప్తున్నారు అంటే అది మరొక కట్టడమైనా కడుతున్నారు లేకపోతే ఉన్న కట్టడాన్ని తీసివేసి మరొక కట్టడాన్ని కడుతున్నారు! ఇది క్రొత్త నిబంధన సంఘము అని మనకు తెలుసు!

 ఈ క్రొత్త నిబంధన సంఘము ఏసుక్రీస్తు అనే మూలా రాయిపై వేయబడి కట్టబడుతుంది! ఎలాగా? అపోస్తులలు ప్రవక్తలు వేసి వేసిన పునాదిపై కట్టబడుతుంది! చాలా రిఫరెన్స్ లు ఉన్నాయి! అనగా ఒక పాత నిబంధన లేదా పాత కట్టడం ఒకటుంది దానిని దేవుడు తిరిగి కడుతున్నాడు! ఆ పాతది ధర్మశాస్త్రము అనే నిబంధన, ధర్మశాస్త్రము అనే నిబంధన ద్వారా తన ప్రజలను రక్షిద్దాము అని దేవుడు అనుకున్నారు. ఈ పద్ధతిలో బలులు అర్పించడం దూపం వేయడం ప్రత్యక్ష గుడారము ఇలాంటివి అన్నీ ఉన్నాయి! యాజకులు ఉన్నారు యాజక ధర్మం ఒకటి ఉంది! అయితే దీని ద్వారా సంపూర్ణత సాధిద్దాము అని దేవుడు అనుకుంటే అది అట్టర్ ప్లాఫ్ అయిపోయింది అందుకే దేవుడు మెల్కీసెదకు అనే క్రమము మరొకటి పెట్టి దానికి యాజకుడిగా ప్రధాన యాజకుడుగా ఏసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు చేశారు ఆయన ద్వారా ఆయన ముఖ్యమైన మూలరాయిగా ఉండగా క్రీస్తు అపోస్తులలు ప్రవక్తలు ద్వారా వారి వేసిన పునాది ద్వారా ఈ క్రొత్త నిబంధన సంఘము కట్టబడుతుంది అని మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం గత శీర్షికలలో!

కాబట్టి ఈ పునాది ఏసుక్రీస్తు! ఒక ఇంటిలో పునాది అనేది ముఖ్యమైన భాగం! అది ఎంత స్ట్రాంగ్ గా బలంగా ఉంటే ఆ కట్టడం నిర్మాణం అంత బలంగా ఉంటాది! పాత నిబంధన కన్నా ఈ క్రొత్త నిబంధన ఎంతో భిన్నమైనది! యిర్మియా ప్రవచన గ్రంథంలో దేవుడు నేను మీతో మరొక నిబంధన చేయబోతున్నాను అది సీనాయి పర్వతం మీద మీతో చేసిన నిబంధన వంటిది కాదు అని యిర్మియా గ్రంథంలో క్రొత్త నిబంధన చేస్తాను అని వాగ్దానం చేసి ఏసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా ఆయనను భూమి మీదకు పంపించి ఆయన రక్తము ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన బలియాగం ద్వారా క్రొత్త నిబంధనను చేసి స్థాపించి భూమిమీద క్రొత్త నిబంధన సంఘమును సార్వత్రిక సంఘమును దేవుడు స్థాపించారు!

యిర్మియా 31:31

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 31:32

అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

యిర్మియా 31:33

ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

యిర్మియా 31:34

నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

యిర్మియా 31:35

పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

యిర్మియా 31:36

ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.

 

ఇది మత్తయి 26:28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన(అనేక ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

మార్కు 14:24

అప్పుడాయన ఇది నిబంధన విషయమై(కొన్ని ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతరము) అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము.

లూకా 22:20

ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.

 

 అది అపోస్తులులు ప్రవక్తలు అనే పునాది మీద నేటి వరకు ప్రపంచ దేశాలు అన్నిటిలో కట్టబడుతుంది దీనికోసం ఈ పునాది కాక మరో పునాది లేదు అని మొదటి కోరింది 3:1 లో చెప్పారు పౌలు గారు!

1కోరింథీయులకు 3:11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.  క్రీస్తుని గురించి సత్యాన్ని ప్రకటించిన ద్వారా ఉపదేశించడం ద్వారా ప్రజలను దేవుని ఆత్మ మీద ఆధారపడడం క్రీస్తులో నమ్మకం ఉంచడం అనే విషయాల ద్వారా కొరింది సంఘంలో ఆయన పునాది వేశారు! ఆయన పునాది వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు! దానిని తిమోతి గారు ఇంకా అపొల్లో ఇక చాలామంది దాన్ని కట్టారు! ఇతరులు దానిమీద పనిచేసి దాన్ని కడుతున్నారు! అదే చెప్పారు అక్కడ

 

అలాగే ఎఫెసీ 2:20 లో

ఎఫెసీయులకు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

ఎఫెసీయులకు 2:21

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

ఎఫెసీయులకు 2:22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

అంటూ క్రీస్తు యొక్క విశ్వాసులు సార్వత్రిక సంఘము అనేది దేవుని ఇల్లు మరియు దేవుని ఆలయము అని చెబుతూ విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని ఈ ఎఫెసీ పత్రికలో రకరకాలుగా ఆయన చెప్పడం జరిగింది!

విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలిపేందుకు పౌలుగారు ఈ లేఖలో ఎన్ని రకాల మాటలను వాడుతున్నాడో చూడండి.

వారు దేవుని సంతానం 1:5;

దేవుని వారసత్వం 1:18;

దేవుని కుమారుని శరీరం 1:23;

దేవుడు చేసినవారు 2:10;

దేవుని ప్రజలు, దేవుని పరలోక పౌరులు, దేవుని ఇల్లు 2:19;

దేవుని ఆలయం.

ఆరాధన, దేవునికి అర్పణలు జరిగే స్థలం దేవాలయం. ఆయన ప్రజలతో కూడిన దేవుని సజీవ ఆలయం కూడా అంతే రోమ్ 12:1; హీబ్రూ 13:15-16.

 

మొదటి కోరింది 3:16లో మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా అని చెబితే,

 మొదటి పేతురు 2లో

1పేతురు 2:4

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

1పేతురు 2:5

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1పేతురు 2:6

ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

1పేతురు 2:7

విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

1పేతురు 2:10

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

 

 అందుకే రోమ 12:1లో కాబట్టి సహోదరులారా మీ శరీరాలను దేవునికి సమర్పించండి అని దేవున్ని బట్టి మీరు బ్రతిమాలుకుంటున్నాను ఈ అర్పణ సజీవమైనది పవిత్రమైనది దేవునికి ప్రీతికరమైనది ఇలా చేయడం ఎంతో యుక్తమైన సేవ అని చెబుతున్నారు!

 

ఈ నూతన నిబంధన అనేది అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది! అపొస్తలుల పునాది అనగా అపొస్తలుల బోధ మీద ఆధారపడి ఉన్నది

 

ఇంతకీ అపొస్తలుల భోధ అంటే ఏమిటి?

 

👉 అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో కోసం ఆత్మ అభిషేకం కోసం ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)

 

🔺 *దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:16-35).

 

🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుత్థానుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:22-24).

 

🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:31-36).

🔺  *యేసే; మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).

 

🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:36).

 

🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

 

🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

 

🔺 *పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

 

🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).

 

🔺. *పరిశుద్ధ జీవితం యొక్క ప్రాముఖ్యత కోసం చెప్పబడుతుంది.* అపొ 2:40; రోమా 1:2; 1కొరింథీ 1:2; 1 పేతురు 1:14; ఎఫెసీ 5:26,27

 

🔺 *శ్రమలను అనుభవించాలని తద్వారా పరిపూర్ణత కలుగుతుంది అని చెప్పబడుతుంది* అపొ 14:22; ఎఫెసీ 3:13; 1థెస్స 3:4; 1పేతురు 5:1; ఫిలిప్పీ 3:10--16; 1పేతురు 1:7;

 

🔺 *ప్రభురాకడ కొరకు సిద్దపాటు కోసం భోదించబడుతుంది* 1థెస్స 4:13-17; 2 థెస్స 2:1-8; 2పేతురు 3:4--13;

 

🔺 *శుధ్దీకరించబడవలసిన అవసరం కోసం చెప్పబడుతుంది* 1పేతురు 1:14; ఎఫెసీ 5:26,27

 

🔺 *పరిపూర్ణత సంపూర్ణత పొందుకోవాలని చెప్పబడుతుంది* హెబ్రీ 6:2; ఎఫెసీ 4:11-13; కొలస్సీ 3:14;

 

*ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41).

 

👉నా ప్రియ స్నేహితులారా....

ఇదే అపోస్తలుల బోధనాక్రమము.

 

   కాబట్టి ప్రియ దైవజనమా! ఇలాంటి బోధ క్రిందనాన్ని ఉన్నావా తప్పుడు బోధలు కింద ఉన్నావా ఇది నిజమైన పునాది మీద వేయబడిన సంఘము క్రీస్తు కొరకు అనేక పనులు చేసి దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయగలదు దేవుని కొరకు ఆసక్తి అనే మంట సువార్త ప్రకటన అనే మంట ఆత్మల రక్షణ అనే మంట పుట్టించి నిన్ను ఫలభరితంగా చేయగలరు

 

మరి ప్రియ చదువరీ నీకు ఆ మంట ఉందా? ఆ ఆత్మీయ మంటలు నీలో రేగటం లేదా? బహుశా నీవు ఆరిపోయిన దివిటీవేమో! సిద్దెలో నూనె లేదేమో!

ఒకసారి పరీక్షించుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*211వ భాగము*

 

యెషయా 28:19--29

19. వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

20. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.

21. నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్య మును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.

22. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని

23. చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి

24. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలముదున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?

25. అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?

26. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

27. సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా?

28. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా!

29. జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్ర హించువాడు ఆయనే

 

                     ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 28వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

 

             (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక 19వ వచనం నుండి చూసుకుంటే 19. వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

20. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.

చూడండి ఏది వచ్చినప్పుడు? గత భాగంలో చెప్పుకున్నట్టు ఆపద నాశనం ఉపద్రవం వచ్చినప్పుడల్లా అది మిమ్మల్ని ఈడ్చుకొని పోతుంది, అది ఒకసారి వచ్చి వెళ్లిపోవడం కాకుండా ప్రతి ఉదయము ప్రతి రాత్రి అది వస్తుంది, వెంటనే మీకు భయం పడుతుంది అని చూసుకున్నాం!

 ఇక ఎలాంటి భయం వస్తుందంటే పండుకోవడానికి మంచం యొక్క పొడుగు చాలదు, మీకు కప్పుకోవడానికి దుప్పటి వెడల్పు చాలదు అంటున్నారు! అవును కొన్ని కొన్ని సార్లు మన మంచం ఎంత పొడవుగా ఉన్నా అది మనకి పొడవు చాలదు, రగ్గులు కూడా మనకి కప్పుకోవడానికి వెడల్పు చాలదు! కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఏర్పడుతూ ఉంటుంది భయం అలా ఉంటుంది. ఎన్ని రగ్గులు కప్పుకున్న ఆ చలికి చలితీరదు! కాళ్లు చాపుకుందాం అంటే మంచం పొడవు చాలని పరిస్థితి అలా అనిపిస్తుంది మనకి! అంతటి ఘోర పరిస్థితిలోకి ఈ హేళన చేసే ఈ యాజకులు ప్రవక్తలు అధిపతులకు సంభవిస్తుంది అని దేవుడు చెబుతున్నారు!

 సిద్ధపాటు లేకపోవడం దేవుడంటే విశ్వాసము నమ్మకము లేకపోవడం వల్ల వారికి విశ్రాంతి కలిగే అవకాశం కోల్పోతున్నారు అని దేవుడు చెబుతున్నారు!

 

 ఇక 21 వ వచనం చూసుకుంటే నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము చేయడానికి ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోనులో ఆయన రేగినట్లు రేగును!!

 ఒకసారి ఆగి ఆలోచిస్తే ఆయన చేసే కార్యాన్ని మూడు సార్లు చెప్తున్నారు ఈ వచనంలో! మొదటగా నిజముగా తన కార్యమును, రెండవదిగా తన ఆశ్చర్యమైన కార్యమును, మూడవది తన అపూర్వమైన కార్యమును చేయడానికి ఆయన పెరాజీము కొండమీద లేచినట్లు లేచును అంటున్నారు అనగా తన కార్యము ఆశ్చర్యమైన వింతైన కార్యము అసాధారణమైన అద్భుతాలు చేయడానికి దేవుడు ఆయన వస్తున్నారు ఆయన లేస్తున్నారు అంటున్నారు!

 ఇంతకీ పెరాజీము కొండమీద లేచినట్టు లేచుట అంటే పెరాజీము కొండమీద ఏం జరిగింది! ఇది మనకి 2సమూయేలు 5:20 లో ఉంటుంది అక్కడ దావీదు గారు బయల్పెరాజీము అనే కొండమీదకి వెళ్లి శత్రువుల్ని ఊచకోత కోసినట్లు కోస్తారు వరదలు ప్రవాహంగా కొట్టు పోయే విధంగా నేను శత్రువులను యెహోవా నా శత్రువుల్ని నాశనం చేశాడని ఆ ప్రాంతానికి బయల్ పెరాజీము అని పేరు పెట్టారు దావీదు గారు! ఆ విధముగా ఊచకోత కోస్తారు అని ఇక్కడ మాట్లాడుతున్నారు!

 

ఇంకా గిబియోనులో జరిగినట్టు జరుగుతుంది అనగా యెహోషువ10లో అక్కడ అనేకమంది శత్రువులు ఇశ్రాయేలుకు విరోధముగా పోగై యెహోషువ గారి నాయకత్వంలో ఉన్న ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించడానికి వస్తే దేవుడు వారితో అన్నారు, నేను మీతో ఉన్నాను వారిని నేను అప్పగిస్తున్నాను మీరు వెళ్లి వారిని హతం చేయండి, అంటే యెహోషువ గారు సైన్యము వెళ్లి ఐదుగురు రాజుల్ని వారి సైన్యాలనే కాకుండా ఇంకా అనేకమంది రాజుల్ని అక్కడ హతము చేసినట్లు మనం చూడగలం! అక్కడ యెహోషువ గారు ఒక అసాధారణమైన ప్రార్థన చేస్తే దేవుడు అసాధారణమైన అద్భుతం చేశారు!  ఘోరంగా ఆయన నాశనం చేశారు ఎందుకంటే దేవుడు ఆ సైన్యాలని శత్రు సైన్యాలని కలవర పరిచినందువల్ల, దేవుడు ఆకాశము నుండి పెద్దపెద్ద వడగండ్ల కురిపించినందువల్ల శత్రువులు చనిపోయారు! ఇది చూసి సైనికులు శత్రు సైనికులు పారిపోవడం మొదలుపెట్టారు! అప్పటికే సాయంత్రం అయిపోతుంది, అది భయంకరమైన అడవి, ఇప్పుడే గాని వారు పారిపోతే ఇంకా శత్రువుల శేషాన్ని చంపడం, వారిని జయించడం అసంభవం! అందుకు తనకు వెలుతురు లైటింగ్ కావాలి! అందుకే అక్కడ యెహోషువ గారు ఒక అసాధారణమైన ప్రార్థన చేశారు! సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో! చంద్రుడా నీవు అయ్యాలోనూ లోయ దగ్గర ఆగిపో అని ప్రార్థిస్తే ఇంచుమించు ఒకనాడు సూర్యుడు అస్తమించలేదు అని బైబిల్ చెబుతుంది! దేవుడు ఒక మనిషి ప్రార్ధన ఆలకించి సూర్యుని యొక్క గమనము, భూమి యొక్క భూభ్రమణాన్ని ఆపేసి అక్కడ దేవుడు అసాధారణమైన అద్భుతము చేశారు! ఇది ఎక్కడ జరిగింది అంటే గిబియోను దగ్గర జరిగింది. ఇలా గిబియోనులో జరిగినట్లే దేవుడు ఆశ్చర్యమైన వింతైన కార్యాన్ని చేయబోతున్నారు! ఏమనంటే తన సొంత నగరాన్ని దేవుడు కోరుకున్న నగరాన్ని దేవుడు కోరుకున్న ఆలయాన్ని తన ప్రజలను నాశనం చేయడానికి శత్రువులు వస్తున్నారు! ఒరేయ్ హేళన చేసేవారు లారా! మీ మీదకి శత్రువు రాబోతున్నాడు, అప్పుడు 22వ వచనం చూసుకుంటే మీ బంధకాలు ఇంకా గట్టివి అయిపోతాయి కాబట్టి మీ బంధకాలు మరింత బిగించి పోకుండా  ఉండాలంటే పరిహాసకులై ఉండొద్దు! ఎందుకంటే భూమి మొత్తానికి నాశనము ఖండితముగా నియమించబడింది అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని యొక్క సమాచారాన్ని విన్నాను! కాబట్టి ఇప్పుడైనా మీరు చెవియొగ్గి నా మాట వినండి నేను చెప్పేది ఆలకిస్తే మీరు బ్రతుకుతారు అని 23 వచనంలో చెపుతున్నారు.

ఇక మీరు చేసే ఈ పరిహాసాలు హేళనలు మానేయండిరా! లేకపోతే మీ మీదకి ఘోరమైన అవమానము ఘోరమైన నాశనము వస్తుంది అని చెప్తున్నారు!

ఇక్కడ యెషయా గారు ఆత్మ వేషుడే 14 వ వచనంలో అంటున్నారు కదా కాబట్టి యెరుషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా! యెహోవా వాక్యము వినండి! అని అక్కడ అంటే, ఇక్కడ యెహోవా వల్ల మీకు నాశనము భూమి అంతటికి నాశనము నిర్ణయించబడింది కాబట్టి చెవియుగ్గి నా మాటలు ఆలకించండి రా ఓ హేళన చేసే పనికిమాలిన ప్రవక్త లారా యాజకులారా అని యెషయా గారు చెప్తున్నారు!

 దినవృత్తాంతాలలో 36: 15, 16 వచనాలు చూసుకుంటే అక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నారు

 

2దినవృత్తాంతములు 36:15

వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను

2దినవృత్తాంతములు 36:16

వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.

2దినవృత్తాంతములు 36:17

ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మంది రములోనే వారి యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను.

 

చూడండి ఇక్కడ కూడా దేవుడు వారి మీద జాలిపడి తన ప్రవక్తల చేత తన భక్తులు చేత వారికి వర్తమానం పంపిస్తూ వచ్చారు! తన యొక్క మాటలు వారికి పంపించి, వారందరినీ ప్రవక్తలను దేవుని సేవకులను హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ వారిని తిరస్కరిస్తూ కొంతమందిని చంపుతూ వచ్చారు! అందుకే ఘోరమైన నాశనము వారికి సంభవించినట్లు మనం చూసుకున్నాం!

 

అందుకే ఒరేయ్ చెవియొగ్గి నా మాటలు ఆలకించండి రా! ఆలకిస్తే మీరు బ్రతుకుతారు అని 23వ వచనము నుండి కొన్ని ఉదాహరణలు చూపించి చెబుతున్నారు!! ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి పంపుతున్న ఈ శిక్షలు వెనుక దేవునికి మంచి ఉద్దేశం ఉంది, శిక్షించి వారిని తిరిగి తన దారిలోకి తీసుకొచ్చి తన మార్గంలో బోధించి, సన్మార్గంలో నడిపించి, తన రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నారు! దానికి ఆయన చెప్పిన ఉదాహరణలు ఏంటంటే పొలంలో మంచి పంట ఎలా పండించాలో రైతుకు తెలుసు! పండిన తర్వాత ధాన్యాన్ని ఎలా దుల్లగొట్టాలో ఏ పరికరంతో దుల్లగట్టాలో రైతుకు తెలుసు! ఎంత సేపు దుల్లగొట్టాలో కూడా తెలుసు! పిండి చేయాలంటే ధాన్యాన్ని లేదా గోధుమల్ని పిండి చేయాలంటే ఏ యంత్రం ఏ పరికరం వాడాలో కూడా ఈ రైతులకు తెలుసు! అలాగే ఓ ఇశ్రాయేలు ప్రజలారా! దేవుడు సర్వ జ్ఞానానికి మూలమైన వాడు కాబట్టి తన ప్రజలను శిక్షించిన తర్వాత వారిని రక్షించి వారిని ఫలవంతం చేయాలి అంటే ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా దేవుడికి తెలుసు! అంతేకాకుండా ఆయన వారిని తన ప్రజలను ఎక్కువగా కఠినంగా శిక్షించును గాని ఎక్కువకాలం అదే పనిగా దేవుడు దున్నుతూ వారిని శిక్షిస్తూ వారిని దుల్లగొడుతూ ఉండడు! గానీ వారిని ఆయన పద్ధతిలో శిక్షించి ఆయన పద్ధతులలో రక్షించి తిరిగి తన రాజ్యానికి వారసులుగా చేస్తారు! తిరిగి తన దారిలోకి వారిని తీసుకొస్తారు అనేదే 23 నుంచి 29 వచ్చినాలలో చెబుతున్నారు!

 ఇక్కడ 24 వ వచనములో దున్నేవాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అనగా ఆస్తమాను సంవత్సరం పొడవునా దున్నుతా ఉంటాడా? పంట పండించడానికి అతడు దుక్కిన తర్వాత ఆ పెల్లలు బద్దలు కొడతా ఉంటాడు కదా ఆ పెల్లలు అనగా గట్టిగా ఉన్న ఈ మన్ను ముక్కలు నిత్యము బద్దలు కొట్టరు కదా! బద్దలు కొట్టిన దాన్ని వదిలేస్తాడు!

 25వ వచనంలో అసలు నేలను చదును చేసి తర్వాత నల్ల జీలకర్ర చల్లుతాడు తెల్లజీలకర్ర చల్లుతాడు గోధుమలు అయితే వరుస వరుసగా నాటుతాడు! యవలు అనగా బార్లీని తాను ఏర్పరిచిన చేనులో అనగా మడిలో వేస్తాడు! ఆ చివరన మిరప మొక్కలు వేస్తాడు కదా! ఇలా చేయడానికి దేవుడే ఈ రైతుకి తగిన క్రమము నేర్పి ఉన్నాడు! కాబట్టి ఆయనే వారికి బోధిస్తున్నాడు కాబట్టి ఈ రైతులను చేసిన దేవుడు నిన్ను నన్ను చేసిన దేవుడు నిత్యము నిన్ను నన్ను ఈ శ్రమలో ఆయన శిక్షిస్తూ ఉండరు! శిక్షించిన తర్వాత ఏ విధముగా నిన్ను రక్షించాలో ఏ విధముగా నిన్ను అభివృద్ధి చేసి తన మార్గంలోనికి తెచ్చుకోవాలో దేవునికి తెలుసు అని చెబుతున్నారు!

 ఇక పంట పండేక సేధ్యగాడు నల్ల జీలకర్రను పదును గల యంత్రము చేత నూర్చడు, నల్లజీలకర్ర  కర్రతోటి, నల్ల జీలకర్రనే దుల్లగొడతాడు! ఇంకా బండి చక్రములను జీలకర్ర మీద నడిపించడు కదా! బళ్ళు దానిమీద నడవనివ్వడు గాని కర్రతో కొడితే ఆ జీలకర్ర కిందకి రాలుతుంది. కింద చెప్తున్నారు ఆయన కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ అంటే ఇనుప ఊస లాంటి దానితో జీలకర్రను దుల్లగొట్టును కదా!

 28. మనుషులు గోధుమలను గాలించగా దానిని వెంటనే నలుచుదురా అనగా ఆడించేస్తారా పౌడర్ గాను అనగా గోధుమపిండి చేసేస్తారా? సేద్యగాడు కూడా ఎప్పుడు దాని నూరుస్తూ ఉండడు !ఎప్పుడు బండి చక్రం కింద గుర్రములతోనే దాన్ని నడిపించడు! దాని నలుపుడు! దాన్ని పౌడర్ చేయడం తగిన సమయంలో దాన్ని గాలించి తగిన సమయంలో దుల్లగొట్టి తగిన సమయంలో కొట్టుల్లో చేర్చి అవసరమైనప్పుడు ఎలా గోధుమల్ని ఆడిస్తూ ఉంటాడో అలాగే దేవుడు కూడా అలాగే మనల్ని చేస్తారు ఈ రైతు దేవుని నుండి ఎలాగ నేర్చుకుని ఇదంతా చేస్తున్నాడో అలాగే దేవుని వలన మనం నేర్చుకుంటాము!!

 ఎందుకంటే దేవునికి ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి ఉంది! దానిని మనుషులకు కూడా ఆయనే నేర్పిస్తారు అని యెషయా గారు చెబుతున్నారు ఇది ఒక అర్థం!!!

 

 ఇక రెండో అర్థము కూడా ఉంది అయ్యా నాకు అర్థమైంది మాత్రమే నేను చెప్తున్నాను! నాకు అర్థం అయినా మరొక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది! దేవుడు ఏ విధముగా అస్తమాను రైతుకి పొలం దున్నడం, పెల్లలు బద్దలు కొట్టడం, నేల చదును చేయడం ఇలాంటివన్నీ నేర్పించారో అలాగే దైవ సేవకుడు దేవుడి లాగే దైవ సేవకుడు కూడా నేర్చుకోవలసిన విషయం ఉంది! ఏంటంటే అస్తమాను మీ సంఘాన్ని ఒకే రకముగా కాకుండా అవసరాన్ని బట్టి సంఘమును పోషించాలి దేనితో? వాక్యముతో సందర్భానుసారముగా వాక్యముతో మీ సంఘాన్ని నీ మందను కాయాలి! అవసరమైనప్పుడు దండం తీయాలి! దండంతో వాక్యమనే దండంతో సరి చెయ్యాలి! అస్తమాను ఆశీర్వాదం ఆశీర్వాదం దేవుని కాపుదల ఓదార్పు మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు సంఘం దారి తప్పుతున్నప్పుడల్లా 2 తిమోతి మూడవ అధ్యాయము చివరి వచనము నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ప్రతి దైవ సేవకునికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి సరి చెయ్యాలి. ఎప్పుడు? దారితప్పునప్పుడల్లా!!! అంతేగాని అస్తమానం  ప్రజలను మెప్పించే బోధ కాకుండా సరి చేస్తూ ఉండాలి. అలాగని అస్తమాను నీ మీదకి శాపం వస్తుంది నువ్వు పాపం చేస్తున్నావు ఇది చేస్తున్నావు వ్యభిచారం చేస్తున్నావు, నీ మీదకి ఉగ్రత వస్తుంది అని చెప్పడమే కాకుండా మధ్యలో దేవుని రాకడకు ఆయత్త పరచాలి! అస్తమాను కానుకలు ఇచ్చేయ్, ఇది ఇచ్చేయ్ అని చెబుతుండడమే కాకుండా దేవుని రాకడకు ఆయత్త పరుస్తూ, సువార్త ప్రకటించేలాగా చేస్తూ ఉండాలి!  ప్రార్థనకు పురి కొలపాలి! ఎవరైతే శ్రమల్లో ఉంటున్నారో అప్పుడు ఆదరణ మాటలు, అవసరమైనప్పుడు ఓదార్పు మాటలు, దేవుని ఆశీర్వాదపు మాటలు, కృంగినప్పుడు దేవుడు ఏ విధముగా మనలను స్వస్థ పరుస్తారో ఆయన అద్భుతాలు ఇవన్నీ కలిపి చెబుతూ ఉండాలి సందర్భానుసారముగా! అవసరాన్ని బట్టి? ఎప్పుడూ ఒకే రకమైన బోధలు చేస్తూ నీ సంఘాన్ని బ్రష్టు పట్టించకూడదు! దేవుని బైబిల్ అది పరిపూర్ణమైనది కాబట్టి అన్ని మాటలు చెబుతూ దైవజనుల యొక్క ప్రవక్తల యొక్క ఆది అపోస్తుల యొక్క పాత నిబంధన భక్తులు యొక్క జీవిత అనుభవాలను బోధిస్తూ ప్రజలను ముందుకు నడిపించినట్లయితే, నీతో పాటు వారు కూడా పరలోక రాజ్య వారసులుగా మారుతారు!

 

 కాబట్టి ప్రియ దైవ సేవకుడా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో! వాక్యాన్ని సరిగా అర్థం చేసుకో! వాక్యాన్ని సరిగా విభజించి ప్రజలకు బోధించు! సరియైన సమయంలో సందర్భానుసారముగా సువార్త కోసం ఆశీర్వాద కోసం స్వస్థతల కోసం రాకడ కోసం అన్ని బోధిస్తూ నీకు అప్పగించబడిన మందను మేపుతూ దైవ రాజ్యము చేరుకోమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!!!

 దేవుడు మిమ్మును దీవించును గాక!!

ఆమెన్!!

(ఇంకాఉంది)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరీర కార్యములు

క్రిస్మస్

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పక్షిరాజు

విశ్వాసము

పాపము

సమరయ స్త్రీ

విగ్రహారాధన