దేవుని మందిరానికి వెళ్తున్న నీవు
దేవుని మందిరానికి వెళ్తున్న నీవు?
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము.
ప్రసంగి 5:1
అంటే దీని అర్ధం? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రమే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. మిగిలిన సమయంలో నీకు నచ్చినట్లు జీవించు అని మాత్రం కాదు. దేవుని మందిరానికి వెళ్లే నీవు, వెళ్ళినప్పుడు మాత్రమే కాదుగాని. అన్ని సందర్భాలలోనూ నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి.
ప్రసంగి 5:1
అంటే దీని అర్ధం? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రమే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. మిగిలిన సమయంలో నీకు నచ్చినట్లు జీవించు అని మాత్రం కాదు. దేవుని మందిరానికి వెళ్లే నీవు, వెళ్ళినప్పుడు మాత్రమే కాదుగాని. అన్ని సందర్భాలలోనూ నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి.
ఎందుకంటే? దేవుని మందిరానికి వెళ్లేవారిపట్ల, క్రీస్తుని అంగీకరించని వారు సహితం ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి వుంటారు. క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఈ రీతిగా ఉంటుందని. అట్లాంటి ప్రవర్తననే మననుండి వారు ఆశిస్తారు. అట్లాకాకుండా దానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన వుంటే, వారు మనలను ప్రశ్నిస్తారు. తద్వారా మన దేవుని ఘనమైన నామమునకు అవమానం. అంతేకదా? వారమంతా నచ్చినట్లు జీవించి, ఆదివారం మాత్రం దేవుని మందిరానికి వెళ్తుంటే, ఆయనను ఎట్లా ఆరాధించగలం? కనీసం, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడైనా మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది?
నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము (1 తిమోతికి 4:12)
డియర్ బ్రదర్ ————
🔸షూస్ , లేదా చెప్పులతో మందిరంలో ప్రవేశించొద్దు.
🔸షేడ్ మరియు చిరిగిపోయిన, పీలికలవంటి జీన్స్ వద్దు
🔸కాలర్ లేని టి షర్ట్స్ వద్దు.
🔸విచిత్రమైన హెయిర్ కటింగ్ & మల్టీ కలరింగ్ వద్దు.
🔸అమ్మాయిలవలె జుట్టుపెంచుకోవద్దు.
🔸బైబిల్ లేకుండా వద్దు.
🔸మొబైల్ జోలికి పోవద్దు.
🔸 చూపులు అమ్మాయిలవైపు వద్దు.
🔸చూయింగ్ గమ్స్ నమలొద్దు.
🔸పాటలు అయిన వెంటనే బయటకిపోవొద్దు.
🔸నీవు డిస్టర్బ్ కావొద్దు. ప్రక్కవారిని డిస్టర్బ్ చెయ్యొద్దు.
డియర్ సిస్టర్ ———
🔸షూస్ , లేదా చెప్పులతో మందిరంలో ప్రవేశించొద్దు
🔸జీన్స్ & టి షర్ట్స్ వద్దు
🔸మేకప్ వద్దు
🔸కాళ్లకు గజ్జెలు ( మువ్వల పట్టీలు) అసలేవద్దు.
🔸జుట్టు విరగబోసుకోవద్దు. అట్లా అని విస్తారమైన జడలొద్దు.
🔸మొబైల్ వద్దు.
🔸బైబిల్ ఒక్కటే ముద్దు.
🔸అబ్బాయిలవైపు చూడొద్దు.
🔸వారిని ఆకర్షించే ప్రయత్నం ఏది వద్దు.
🔸నీ ప్రత్యేకతను చాటడానికి ప్రయాసపడొద్దు. ( దేవుని విషయంలో తప్ప)
🔸స్పెషల్ సాంగ్ ఇవ్వలేదని, చర్చికెళ్ళడం మానెయ్యొద్దు.
🔸నీవు డిస్టర్బ్ కావొద్దు. ప్రక్కవారిని డిస్టర్బ్ చెయ్యొద్దు.
పేరెంట్స్ ————
🔸షూస్ , లేదా చెప్పులతో మందిరంలో ప్రవేశించద్దు.
🔸చిన్ని బిడ్డలను తప్పక సండే స్కూల్ కి పంపించండి.
🔸మీ చిన్ని బిడ్డలను తప్పక మందిరానికి తీసుకెళ్ళాలి. వారు అల్లరి చేస్తుంటే, వారిని నియంత్రించే బాధ్యత పూర్తిగా మీరే తీసుకోవాలి.
🔸మీరు ఎట్లాగూ పెట్టుకోరు కాబట్టి, చిన్ని బిడ్డలకు కూడా మువ్వలపట్టీలు పెట్టి, మందిరాలకు తీసుకొని వెళ్లొద్దు. అది వాక్యం చెప్పేవారికిగాని, వినేవారికి గాని చాలా యిబ్బందికరం.
🔸ఏదో ఫ్యాషన్ షో కి వెళ్తున్నామన్నట్లుగా రెడి కానవసరం లేదు. మీ డ్రెస్సింగ్ చూచినవారికెవరికైనా దేవుని పిల్లలు ఇట్లా వుంటారన్నమాట అనిపించేలా ఉండాలి. అంతేగాని ఆమ్మో! వీళ్లా!! అనేటట్లుగా కాదు.
🔸మేకప్ లకు కాదుగాని, హృదయాన్ని అలంకరించుకొని, ఆత్మతో, సత్యముతో ప్రభువును ఆరాధించుటకు సిద్దపడండి.
🔸ముసుగు తప్పక ధరించాలి.
🔸మొబైల్ ఫోన్ లను తప్పక స్విచ్ ఆఫ్ చెయ్యండి. బైబిల్ లేకుండా వెళ్లొద్దు.
🔸మందిరానికి వెళ్లేముందు *ప్రభువా ఈ దినాన్ని నీవు నాతో మాట్లాడండి*. అని ప్రార్ధించి, కృతజ్ఞతతో, చెప్పలేనంత ఆనందంతో వెళ్ళండి.
🔸సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ప్రాముఖ్యమైన విషయాలను నోట్ చేసుకొనండి.
🔸ఆదివారపు ఆరాధనకు ముందుగా మీరే వెళ్ళాలి. ఆశీర్వాద ప్రార్ధన అయ్యేవరకు బయటకు రావొద్దు.
🔸ఆరాధన అనంతరం, చిరునవ్వుతో, హృదయపూర్వకంగా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని, సమాధానంతో గృహాలను చేరండి. దేవుని కృప మీకు తోడైయుండి నడిపించును గాక! ఆమెన్!
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము.
ప్రసంగి 5:1
▪️దేవుని మందిరానికి వెళ్లకపోతే, ఏదైనా కీడు జరుగుతుందేమోననే సెంటిమెంట్ తో వెళ్లొద్దు. పాస్టర్ గారి పోరు, ఇంట్లోబాధ భరించలేక దేవునిమందిరానికి వెళ్లొద్దు దేవుని మందిరానికి వెళ్ళేది మనుష్యులకు కోసం కాదు. దేవుని కోసము కాదు. నీ కోసమే అనే విషయం గ్రహించు.
▪️సేవకుడు వాక్యాన్ని ప్రకటించడానికి లేచిన వెంటనే, ఆమ్మో! ఈయనా!! ఈయనకసలు వాక్యమే తెలియదు అంటూ మొదటి నిమిషంలోనే ఒక నిర్ణయానికి వచ్చెయ్యొద్దు. ఆయన దేవుని పక్షముగా నిలబడుతున్నారు కాబట్టి, దేవుడే మాట్లాడతారు అని విశ్వసించు.
▪️వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తిని గురించి, మొదట ఈయన బ్రతుకుమార్చుకొని మాకుచెబితే బాగుండు. అనే తలంపు రానీయ్యొద్దు. వాక్య విరుద్ధమైన జీవితం ఆయన జీవిస్తుంటే, ప్రార్ధించి, ప్రభువుకు అప్పగించు. తీర్పుతీర్చే పనిచెయ్యొద్దు. ఎవరి జీవితాలకు వారే ఉత్తరవాదులు.
▪️సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం మీద మాత్రమే దృష్టించు. అంతేగాని,
నీవు బైబిల్ చదువుకొంటూ, సెల్ ఫోన్ తో ఆడుకొంటూ సమయాన్ని గడపొద్దు. బైబిల్ చదువుకోవడానికి, సెల్ ఫోన్ తో ఆడుకోవడానికి దేవుని మందిరానికే వెళ్లనవసరం లేదు. ఆపని ఇంట్లోనే చెయ్యొచ్చు.
▪️ఎవరైనా ప్రార్ధిస్తున్నప్పుడు మనసుతో ఏకీభవించు. పాటలు పాడుతున్నప్పుడు, కలసి ప్రభువును స్తుతించు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు నీతో ఏమి మాట్లాడబోతున్నారో అత్యాసక్తితో ఆలకించు. చివరిగా ఒక్కమాట! టైం పాస్ కి మందిరానికి వెళ్లి, టైం పాస్ చేసి రావడంకంటే, దుప్పట ముసుగేసుకుని ఇంట్లో పండుకోవడం శ్రేయస్కరం!
ప్రసంగి 5:1
▪️దేవుని మందిరానికి వెళ్లకపోతే, ఏదైనా కీడు జరుగుతుందేమోననే సెంటిమెంట్ తో వెళ్లొద్దు. పాస్టర్ గారి పోరు, ఇంట్లోబాధ భరించలేక దేవునిమందిరానికి వెళ్లొద్దు దేవుని మందిరానికి వెళ్ళేది మనుష్యులకు కోసం కాదు. దేవుని కోసము కాదు. నీ కోసమే అనే విషయం గ్రహించు.
▪️సేవకుడు వాక్యాన్ని ప్రకటించడానికి లేచిన వెంటనే, ఆమ్మో! ఈయనా!! ఈయనకసలు వాక్యమే తెలియదు అంటూ మొదటి నిమిషంలోనే ఒక నిర్ణయానికి వచ్చెయ్యొద్దు. ఆయన దేవుని పక్షముగా నిలబడుతున్నారు కాబట్టి, దేవుడే మాట్లాడతారు అని విశ్వసించు.
▪️వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తిని గురించి, మొదట ఈయన బ్రతుకుమార్చుకొని మాకుచెబితే బాగుండు. అనే తలంపు రానీయ్యొద్దు. వాక్య విరుద్ధమైన జీవితం ఆయన జీవిస్తుంటే, ప్రార్ధించి, ప్రభువుకు అప్పగించు. తీర్పుతీర్చే పనిచెయ్యొద్దు. ఎవరి జీవితాలకు వారే ఉత్తరవాదులు.
▪️సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం మీద మాత్రమే దృష్టించు. అంతేగాని,
నీవు బైబిల్ చదువుకొంటూ, సెల్ ఫోన్ తో ఆడుకొంటూ సమయాన్ని గడపొద్దు. బైబిల్ చదువుకోవడానికి, సెల్ ఫోన్ తో ఆడుకోవడానికి దేవుని మందిరానికే వెళ్లనవసరం లేదు. ఆపని ఇంట్లోనే చెయ్యొచ్చు.
▪️ఎవరైనా ప్రార్ధిస్తున్నప్పుడు మనసుతో ఏకీభవించు. పాటలు పాడుతున్నప్పుడు, కలసి ప్రభువును స్తుతించు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు నీతో ఏమి మాట్లాడబోతున్నారో అత్యాసక్తితో ఆలకించు. చివరిగా ఒక్కమాట! టైం పాస్ కి మందిరానికి వెళ్లి, టైం పాస్ చేసి రావడంకంటే, దుప్పట ముసుగేసుకుని ఇంట్లో పండుకోవడం శ్రేయస్కరం!
దేవునికిచ్చుటలో నీ వైఖరి ఏమిటి?
▪️నేను కానుకలు సమర్పించకపోతే, సంఘము నడవదని, సేవకుడు పోషింపబడలేడని, సంఘమంతా నాపైనే ఆధారపడివుందని నీవు అతిశయిస్తూ ఉన్నట్లయితే, నీయంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలో కొనసాగుతున్న వ్యక్తి మరొకరు నీ సంఘములో లేరని గుర్తించు.
▪️“యేసు స్వామీ .... నీకు నేను నా సమస్త మిత్తును” అంటూ సాగడదీసుకొంటూ పాడి, ‘టంగ్ మంటూ’ ముష్టివానికేసినట్లు ఒక రూపాయి బిళ్ళ చందా సంచిలో పడేస్తున్నావా? నిజంగా నీదగ్గర లేకపోతే, రెండుకాసులు వేసి, ప్రభువు మెప్పును పొందిన విధవరాలివలే నీవునూ అట్టి మెప్పును పొందగలవు. అట్లా కాకుండా, నోట్స్ అన్ని బీరువాలో దాచి, కాయిన్స్ మాత్రం ప్రభువుకు సమర్పించావంటే, నీవు పొందుకొనే ఆశీర్వాదాలు కూడా అట్లానే ఉంటాయి. నీవు ప్రేమించే నోట్స్ మాత్రం హాస్పిటల్ వైపు పరుగులు తీస్తానంటాయి.
▪️షాప్స్ అన్ని తిరిగేసి, ఇంకెక్కడా మారదని చెప్పిన నోట్ తీసుకొచ్చి, సీక్రెట్ గా చందా సంచిలోవేసేయ్యకు. కొంతమంది విదేశీ కాయిన్స్ కూడా పట్టుకొచ్చి దానిలో పడేస్తుంటారు. వారికి టంగ్ మంటే చాలు. అది చెల్లుతుందా, చెల్లదా అనేది వారికి అనవసరం. దేవునికి సమర్పించేదేదైనా శ్రేష్ఠమైనదే సమర్పించు.
▪️కానుకలు సమర్పించే సమయంలో మెల్లగా లేచి బయటకు వెళ్లిపోవద్దు. నిజంగా సమర్పించడానికి నీ దగ్గరలేకపోతే ఆ విషయం ప్రభువుకు తెలుసు. కానుక వెయ్యడానికి డబ్బులు లేవు, వెయ్యకపోతే ప్రక్కవారు ఎదో అనుకుంటారని, మందిరానికి వెళ్లడం మానెయ్యొద్దు.
▪️తప్పదు అన్నట్లు, ఇష్టం లేకుండా కష్టంగా ఏది దేవునికి సమర్పించొద్దు. దేవునికి యిస్తే నాకు రెట్టింపు యిస్తారనే తలంపే రానీయ్యొద్దు.
▪️ఒకాయన మందిరానికి ఫ్యాన్ బహూకరించి, స్పీడ్ గా తిరగడానికి వీల్లేదన్నాడట. ఫ్యాన్ రెక్కల మీద వ్రాయబడిన తనపేరు కనబడదని. కుర్చీ వెనుక పేరు, బెంచీ వెనుకపేరు, చేతితో పట్టుకున్న మౌత్ మీద పేరు, ఏది యిస్తే దాని మీద పేరు. మనుష్యుల ఘనతను కోరుకొనే నీవు, దేవునినుండి పొందేదేమీలేదని గ్రహించు. చివరిగా ఒక్కమాట! నీ హృదయాన్ని దేవునికి సమర్పించకుండా, లక్షలు చెల్లించినాగాని అవి దేవునిచేత అంగీకరించబడవు అనే విషయం మాత్రం మరచిపోవద్దు.
నీవు చేసేది ఆరాధనా?
లేక విగ్రహారాధనా?
పరలోకంలోనున్న దూతలు సహితం దేవుని పరిశుద్ధతను చూడలేక వాటి రెక్కలతో, ముఖాన్ని, శరీరాన్ని కప్పుకుంటుంటే? పరిశుద్ధుడైన దేవునిని ఆరాధించడానికి వెళ్తున్న నీవు, ఎదో ఫాషన్ షో కి వెళ్తున్నట్లుగా సిద్దపడుతున్నావ్!*. దేవుని మందిరానికి వెళ్లడమే దానికోసం అన్నట్లు వ్యవహరిస్తున్నావ్!
ఆరాధన ఒక అర్ధగంటకో, లేక ఆదివారానికో మాత్రమే పరిమితమైనది కాదు. పాటలన్ని కలిపి పాడేస్తే ఆరాధన కాదు. చెవులు దద్దరిల్లే సౌండ్ సిస్టం దానికవసర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పనిలేదు. కొన్ని పాటలు కూర్చొని పాడి, ఒకపాట నిలబడి పాడితే అది మాత్రమే ఆరాధన కాదు. చేతులు పైకెత్తి పెద్దస్వరంతో చేసేది మాత్రమే ఆరాధన కాదు. ఆయన ఏమైయున్నాడో నీకు అర్ధమైనప్పుడు, నీ హృదయమంతా ఆయనతో నిండిపోయినప్పుడు, నిశ్శబ్దంగా, తలవంచి కూడా ప్రభువును ఆరాధించవచ్చు.
నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు, నీ శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకు సమర్పించినప్పుడు, నీ నోటినుండి వచ్చే చిన్న మూలుగుకూడా ఆరాధనే. ఆయన ఏమైయున్నాడో నీకు అర్ధమైతే? ఆరాధించే హృదయం నీకుంటే? సమయం, సందర్భంతో పనిలేకుండా అనునిత్యం ఆయనను ఆరాధిస్తావు. ఆరాధనీయుడైన దేవునిస్థానంలో దేనినైతే ప్రతిష్టించామో అదే ఒక “విగ్రహం”. ఆరాధనీయుడైన దేవుని స్థానంలో దేనిని ఆరాధిస్తున్నామో అదే “విగ్రహారాధన”.
ఇంతకీ, నీవు చేసేది ఆరాధనా? లేక విగ్రహారాధనా? అయితే నీవంటావ్ విగ్రహారాధన కానేకాదని.
ఆరాధనకు వెళ్లడం కోసం ఏమి డ్రెస్ వేసుకోవాలో ముందుగానే సిద్దపడతావు. కానీ, ప్రభువా! ఈరోజు నీవు నాతో మాట్లాడు అని చిన్న ప్రార్ధన చెయ్యలేవు. అట్లాంటి నీవు ఆయనను ఎట్లా ఆరాధించగలవు?
దేవుని సన్నిధిలోనున్న నీవు ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నావంటే, దేవుని కంటే, ఆ ఫోన్ చేసిన వ్యక్తే నీకు ప్రధానమన్నమాట. అంటే, నీ జీవితంలో ఆవ్యక్తే ఒక విగ్రహం కాదా? నీవొక విగ్రహారాధికుడవు కాదా?
స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడ, సత్క్రియలు అనే అలంకరణ కాకుండా, కేవలం ఆభరణాలు, విలువైన వస్త్రాలు, హెయిర్ స్టైల్స్ ఇవే నీ అలంకరణ అయితే, అవే నీ జీవితంలో విగ్రహాలు కాదా? వాటికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే నీవు విగ్రహారాధికురాలవు కాదా? (1 తిమోతికి 2: 10,11)
ఆత్మతోను సత్యముతోనూ ప్రభువును ఆరాధించవలసి ఉంటుండగా (యోహాను 4:24) , రక్షణ, బాప్తీస్మ అనుభవంలేకుండా, పరిశుద్ధాత్మ వరాన్ని పొందిన అనుభవం లేకుండా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం లేకుండా, ఇంకేమి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయగలము?
నీవొక సింగర్ అని, ఒక మ్యూజీషియన్ అని, ప్రసంగాలు బాగా చేయగలనని, ఆ తలాంతులిచ్చిన దేవునినిబట్టి కాకుండా, నీ తలాంతులనుబట్టి నీవు అతిశయిస్తుంటే, అవే నీ జీవితంలో విగ్రహాలు కావా? నీవు విగ్రహారాధికుడవు లేదా విగ్రహారాధికురాలవు కావా?
మౌత్ నీ చేతిలో పెడితేనే, మొదటి వరసలో నిన్ను నిలబెడితేనే గొంతుచించుకొని పాడతావు. మైక్ నీ చేతికివ్వకపోయినా, వెనుక వరుసలో నిలబెట్టినా పెదవులు మాత్రమే కదుపుతావు. ఇప్పుడు చెప్పు, నీవు చేసేది వేషధారణా? ఆరాధనా?
దేవుడు నీకు సంఘములో బాధ్యతలను అప్పగిస్తే, పరిచర్య కాకుండా పెత్తనం చేయాలనుకొనే నీకు, ఆ అధికారం ఒక విగ్రహం కాదా? నీవొక విగ్రహారాధికుడవు కాదా?
సూటిగా ఒక్క ప్రశ్న అడగనివ్వు! ఆరాధనకు వెళ్తున్ననీవు, ఆరాధించిన అనుభూతిని పొందగలుగుతున్నావా? లేదంటే, ఆరాధనను అడ్డుకొనే విగ్రహమేదో నీలోవుందేమో? సందేహంలేనేలేదు. అయితే, నీవెందుకు సరిచేసుకొనే ప్రయత్నం చెయ్యకూడదు? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించి, ఆత్మీయ ఆనందాన్ని, నిత్యమైన ఆశీర్వాదాలను నీవెందుకు స్వంతం చేసుకోకూడదు? ఒక్క క్షణం, ఆగి ఆలోచించండి!!
వ్యర్ధమైన సాక్ష్యాలతో దేవుని సమయాన్ని వృధా చేస్తున్నావా?
ఒక సహోదరి సాక్ష్యం ప్రారంభించింది, తన బాబుకు తలనొప్పి, హాస్పిటల్ కు వెళ్లి మందులువాడాక తగ్గింది. దేవునికే మహిమ. అని చిన్నగా సాక్ష్యంచెప్పి కూర్చుంది. ఈ లోపు పాస్టరుగారు! ఏవమ్మోయ్! సాక్ష్యం చెప్పావ్! కానీ, దానిలో పడాల్సిన మాట పడిందా? అంటూ కేకలు. ఈమె కాస్త తేరుకొని, మరలా ప్రారంభించింది. క్షమించండి. మందులు వాడినప్పటికీ, అయ్యగారు ప్రార్ధనవల్లనే మా బాబుకు తలనొప్పి తగ్గింది. అయ్యగారికి వందనాలు. ఇప్పుడు కాస్త అయ్యగారు కుదుటపడి. కూరలో పడాల్సినవి పడకపోతే, కూర రుచించదు. సాక్ష్యం కూడా అంతే. పడాల్సిన మాటలు పడకపోతే అది సాక్ష్యంలా ఉండదు. ఇది సాక్ష్యమంటే అంటూ సంతృప్తిని వెళ్లబుచ్చారు.
ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిద్దాం!
🔹తలనొప్పికి సాక్ష్యం
🔹ఆ తలనొప్పి దేవునిపై ఆధారపడినప్పుడు తగ్గిందా? లేదు. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు
🔹దీనిలో దేవునిని చెందే మహిమ ఏదైనా ఉందా? లేదు.
🔹ఏదో మాటవరసకు దేవునికే మహిమ అని ఆమె చెప్పినా, పాస్టర్ గారికి సంతృప్తి ఉందా? లేదు.
దీని ఫలితం
🔹విశ్వాసుల్లో విసుగు,
🔹సేవకుడంటే చులకన భావం,
🔹దేవుని సమయం వృధా.
మరికొందరు సాక్ష్యానికి లేస్తున్నారంటే పాస్టర్ గారితోపాటు, విశ్వాసులకూ భయమే. ఏమి చెప్తారో తెలియదు. ఎంతసేపు చెప్తారో తెలియదు. ఒకవేళ వారిని ఏదైనా అంటే, తర్వాత వారం సాక్ష్యం రెట్టింపు అవుతుంది. పాస్టర్ గారు వాక్య సమయాన్ని కుదించుకోవడం తప్ప, వేరొక మార్గం లేదు.
నీ దృష్టిలో సాక్ష్యమంటే ఏమిటి?
నీ సాక్ష్యం పాస్టర్ గారిని సంతోషపరిచేదిగానే వుందా? లేక, నిన్ను నీవు ప్రార్ధనా పరునిగా కనుపరచే విధంగా ఉందా? విశ్వాసులకు విసుగు పుట్టించేదిగా ఉందా? దేవుని సమయాన్ని పాడుచేసేదిగా ఉందా? లేక, దేవునికి మహిమ తెచ్చేదిగా వుందా? ఎట్లా వుంది?
▪️జలుబుకూ సాక్ష్యమే
▪️ఇంట్లో గేదెకు బాలేకపోయినా సాక్ష్యమే
▪️పిల్లల చదువులు
▪️పెళ్లిళ్లు
▪️వారికి పిల్లలు
▪️ఉద్యోగాలు
▪️పాస్ పోర్ట్ లు, వీసాలు
▪️ఆరోగ్య సమస్యలు
▪️ఆర్ధిక సమస్యలు
▪️కుటుంబ సమస్యలు
▪️చివరికి కోర్టు కేసులు కూడా
▪️అక్కడ పడ్డాను, ఇక్కడ లేచాను
ఇవే మన సాక్ష్యాలు. చెప్పాల్సినదంతా చెప్పేసి, చివర్లో దేవునికే మహిమ!
కొంతమంది సేవకులు వాక్యాన్ని సరిగా సిద్దపడక ఇట్లాంటి వాటితో కాలక్షాపం చేసి దేవుని సమయాన్ని వృధా చేస్తుంటే, ఎక్కువమంది సేవకులు వాక్యానికి సమయం చాలక, ఏమి చెయ్యలేక, భారంతో పరిచర్యను కొనసాగిస్తున్నవారెందరో. వారి భారానికి దేవుడు మెచ్చని నీ అర్థరహితమైన సాక్ష్యం తోడుకాకూడదు.
విషయానికొచ్చేద్దాం! ప్రభువు మహిమ పరచబడే సాక్ష్యం ఏదైనా వుందంటే? అది “రక్షణ సాక్ష్యం మాత్రమే”. నీ బ్రతుకు మారితేనే, పరలోకంలో దూతగణం స్తుతిగానాలు ఆలపిస్తాయి. నిన్ను బట్టి ప్రభువు ఆనందిస్తారు. నీ బ్రతుకు మారకుండా నీవు చెప్పే సాక్ష్యం, ఆయన దరిదాపుల్లోనికి కూడా చేరదు. నీ భౌతికమైన విషయాల కోసం, దానికి తోడు, హిస్పిటల్స్ అన్ని తిరిగీసి, అవసరమైతే తాయెత్తులు కూడా కట్టించేసి, నీ ప్రయత్నాలన్నీ నీవు చేసేసి, దేవునికే మహిమ అంటూ నీవు చెప్పే సాక్ష్యంను బట్టి ఆయన సంతోషించడానికి, ఆయనను నీవు ఎట్లా అర్ధం చేసుకున్నావు?
ఒకవేళ దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లనుబట్టి సాక్ష్యం చెప్పాలి అనుకుంటే, నా జీవితంలో దేవుడు ఈ మేలు చేశారు. ఈ రోజునుండి, నా పాప జీవితాన్ని విడచి, ప్రభువుకొరకు జీవిస్తాను అని చెప్పి, అట్టి రీతిగా జీవించు. దానినిబట్టి ఆయనకు సంతోషం. నీ జీవితానికి ఆశీర్వాదం. అంతేగాని వ్యర్ధమైన మాటలతో దేవుని సమయాన్ని వృధా చెయ్యొద్దు. నీ సాక్ష్యానికి సమయమెంతో చూడవుగాని, వాక్య సమయం 5 నిమిషాలు ఎక్కువయ్యిందంటే సహించలేవు. అది నీకు క్షేమకరము కాదు.
నీ సాక్ష్యం, ప్రభువు నీయందు ఆనందించేదిగా వుంటే, ఆలస్యం చెయ్యకుండా, ప్రభువుకు మహిమార్థమై నీవు నిలబడు. లేకపోతే నీవు నిశ్శబ్దముగా కూర్చుంటే, వాక్యం పరిపూర్ణముగా ప్రకటించబడుతుంది. ఆ వాక్యం నీతోపాటు, అనేకుల జీవితాలను నిస్సందేహముగా మార్చగలదు. నిన్ను నీవే పరిశీలన చేసుకొని, దేవుని సమయాన్ని వృధా చెయ్యొద్దు.
మై డియర్ టీన్స్!
ఒక్క క్షణం ఆగి, ఆలోచించండి !!
మనిషి యొక్క జీవితంలో “టీనేజ్” అనేది ఒక అందమైన దశ. అదేసమయంలో ప్రమాదకరమైనది కూడా.
🔸యవ్వన ప్రాయం
🔸భాధ్యతలుండవు
🔸సమయమంతా స్నేహితులతో
🔸తలిదండ్రులు, పెద్దవారు చెప్పే విషయాలు ఇబ్బంది కరంగా ఉంటాయి.
🔸సంపూర్ణ పరిపక్వత లేని కారణముచే కొన్ని సార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు.
🔸జీవితంలో ఉన్నత మైన స్థితిలో వుండాలన్నా, పతనం కావాలన్నా ఈ దశలో తీసుకొనే నిర్ణయాలే దిశానిర్దేశ్యం చేస్తాయి.
పరస్పర ఆకర్షణ:
అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు ఆకర్షించాలనే ప్రయత్నంలో వారి తలంపులు ఇక్కడే చెడిపోవడం ప్రారంభమవుతాయి. తద్వారా ఆధ్యాత్మిక పతనం ఆరంభం. చదువుమీద మనస్సు నిలపలేక వారి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి. ఈ దశలో నిన్ను నీవు నియంత్రించుకోగలిగితే, నీ జీవితమంతా సంతోషమే. అయితే, నిన్ను నీవు నియంత్రించుకోవడం నీకు సాధ్యం కాదుగాని, నీ యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు ఆయనే నీ చెయ్యిపట్టుకొని నడిపిస్తారు.
నీకో ఫార్ములా చెప్తున్నాను విను. *3:3:3*
అంటే?
🔸ముగ్గురు వున్నప్పుడే మాట్లాడు
🔸మూడు అడుగుల దూరంలో వుండు
🔸మూడు నిమిషాలకు మించి మాట్లాడకు.
( టైం చూసుకొని ఇట్లానే చెయ్యమని కాదుగాని, పరిధులు దాటిపోవద్దు)
స్మార్ట్ ఫోన్
సాతాను నీచేతికి స్మార్ట్ ఫోన్ యిచ్చి, వాడు చాలా స్మార్ట్ గా, నిన్ను పిచ్చోడిని చేస్తున్నాడనే విషయం మరచిపోవద్దు.
🔸గంటల తరబడి చాటింగ్ (సోది) వద్దు
🔸నెట్ బ్రౌసింగ్ లిస్ట్ క్లియర్ చేస్తున్నావంటే,
ఓపెన్ చెయ్యకూడనివి చేస్తున్నావన్నమాట.
🔸ఒంటరిగా, అటూ ఇటూ చూచుకొంటూ, బ్రౌసింగ్ చేస్తున్నావంటే, సమ్ థింగ్ రాంగ్.
అశ్లీలత (Pornography) అనగా ..?
జారత్వపు బొమ్మలు, దిగంబర దృశ్యాలు ఈ కోవలోనివే. కామప్రకోపనాలను రగిల్చే వాఙ్మయము, సినిమాలు మొదలగు వాటిలోని లైంగిక ఘటనల నిలువెత్తు రూపమే అశ్లీలం.
ఈ వ్యాసం చదువుతున్నా మీకు మనస్సు ఏమైనా గద్ధిస్తుందా ?
దీనికి మిరేమన్నా అడిక్ట్ అయ్యారా ?
తప్పు అని తెలిసిన కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తున్నారా ?
వద్దు అని అనుకొని Google లో కొన్ని Search చేస్తున్నావా ? చాల జాగ్రత్త! నీవు నీకు తెలియకుండానే పెద్ద అగాధములోకి వెళ్ళిపోతున్నావ్.
అశ్లీలం గూర్చి బైబిల్ ఏమి చెప్తోంది?
అశ్లీలం గూర్చి బైబిల్ లో యధాతధముగా లేదు కాని అశ్లీలం ఓ పెద్ద జాడ్యం అనిచెప్పే లేఖనాలు చాలా ఉన్నాయి.
🔹భార్యాభర్తల మధ్య కడదాకా ఉండవలసిన 'ఏకశరీరం' అశ్లీలం వల్ల ఉండదు
(ఆది2:24-25, మత్తయి19:4-6)
🔹నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనే నియమం అశ్లీలం వల్ల కుదరదు (1పేతురు 1:14-16)
🔹మొహపుచూపు వ్యభిచారమే. అది అశ్లీలతే కదా (మత్తయి 5:28,29)
🔹శరీరేచ్ఛ అశ్లీలమే. (రోమా 13:14)
🔹అశ్లీలత వలన దేవుని రాజ్య వారసులం కాలేము.
🔹పాన్పు నిష్కల్మష మైనదిగా ఉండాలి ( హెబ్రీ 13:4)
🔹అశ్లీలత వలన ఉగ్రత వారిమిధకి వస్తుంది (కొలస్సి 3:5)
మరి మనం ఏమి చేయాలి?
🔸 అశ్లీలం చూడను అని యోబు వలే కన్నులతో నిబంధన చేసుకో (యోబు 31:1, 9-11)
🔸యోసేపు వలే పారిపో (యాకోబు 4:7, ఆది39:12)
🔸అశ్లీలతకు దూరముగా పారిపో (1కోరింథి 6:18, 9-11)
🔸అశ్లీల సంబంధ ఆలోచనలు చేయకుడదు (రోమా 13:14)
దేవుడు దిశమొలను కప్పుకోమన్నాడు. దేవుడే పనిగట్టుకొని చర్మపు చొక్కాయలు చేయించి, తొడిగించాడు. అందుకే ఫాషన్ షోలకు మనం వ్యతిరేకం. ఈ లోకం బొత్తిగా చెడిపోయింది. అగ్గిపుల్ల నుండి బజారులో దొరికే ప్రతిదానికి అశ్లీల దృశ్య చిత్రాలే. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే నోవాహు కాలం గుర్తు వస్తోంది. (ఆది 3:7, 21, 6:11-13, లేవి 16:4) అశ్లీలత నీలో ప్రస్తుతం ఉంటె, అశ్లీల చిత్రాలు చూసే అలవాటు, అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంటె ఇప్పుడే వదిలేయాలి లేకపోతే ఉగ్రతపాలు అవుతావు, దేవుని రాజ్య వారసులు కాలేరు కనుక వాటిని విడిచిపెట్టాలి .
కాలేజీకి డుమ్మా:
ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని, బాయ్ ఫ్రెండ్ బైక్ మీద, బీచ్ లో చక్కర్లు కొడుతున్నావా? అయితే, మీ తలిదండ్రులను మోసం చేస్తున్నారు. వారికంటే ముందుగా మిమ్మల్ని మీరే మోసం చేసుకొంటున్నారు. పెంచి పోషించిన తలిదండ్రులకు అవమానం. మీ జీవితం పతనం.
సిగరెట్స్ - బీర్స్
ఇదొక ఫాషన్ అయ్యింది. ఇదేదో స్టేటస్ సింబల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. యువత త్రాగుడుకి బలై పోతుంది. వారి వ్యసనం కోసం వ్యక్తిగత, కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. పెగ్గు కోసం సిగ్గులేకుండా చేతులు చాస్తున్నారు. కనీసం బర్త్ డే పార్టీలు కూడా బీర్ లతో బార్ లో గడపడానికే సిద్దపడుతున్నారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే? పార్టీ అంటేనే మద్యం. మద్యం లేకపొతే అది పార్టీనే కాదు. వీరిలో నీవున్నావంటే పతనపు అంచుల్లో ఉన్నావని గుర్తించు.
స్నేహితులు
స్నేహితులు లేని జీవితాన్ని ఊహించుకోలేము. స్నేహితులు లేని జీవితం నీళ్ళు లేని సెలయేరులా, పుష్పాలు లేని ఉధ్యానవనంలా వుంటుంది. స్నేహితులు మన జీవితంలో అంతర్భాగం.
అయితే, ఎవరితో నీ స్నేహం? నీ స్నేహం నిన్నెక్కడికి నడిపిస్తుంది? ఎందుకంటే? నీ స్నేహితులెవరో చెప్తే, నీవేంటో చెప్పవచ్చు. నీవు చాలా మంచివాడవు, చాలా మంచిదానవు. నేను కాదనను. కానీ, దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. (1 కొరింది 15:33) "ఆరు నెలలు సహవాసం చేస్తే? వారే వీరవుతారట."
చెడు సాంగత్యం చేసి నీవుసాధించే మంచి అంటూ ఏదీలేదు గాని, ఆ సాంగత్యం నీ మంచి నడవడిని పాడు చేస్తుంది అనే విషయం మాత్రం మరచిపోవద్దు. సంతోషములో మాత్రమే నీతో గడిపేవాడు, ఆపదలో అంతులేకుండా పోయేవాడు. నిన్ను వక్రమార్గం లోనికి నడిపించేవాడు నీ స్నేహితుడు కాదని గుర్తించు.
ఇదే స్నేహం అనుకొని 'నీ నిజమైన స్నేహితునికి' దూరం కావొద్దు. ఈ లోకాన్ని స్నేహిస్తే? ఆయనతో స్నేహం సాద్యం కానే కాదు. 'ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు'. తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. (యోహాను 15:13)
అవును! నిత్యమరణం అనే ఆపదలో నీవున్నప్పుడు నీ కోసం తన ప్రాణమునిచ్చి విడువక నిను ప్రేమించే నీ నిజమైన స్నేహితుడు "నీ ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు". నీ నుండి దేనినీ ఆయన ఆశించడు. నీ హృదయాన్ని తప్ప. నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, నీ భవిష్యత్ కు బంగారుబాట వేసుకో. ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా?
నీ యవ్వనంలో నీవు బైబిల్ మోస్తే? అది నీ వృద్ధాప్యమందు నిన్ను మోస్తుంది. కానీ, నేటిదినాలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైబిల్ స్థానాన్ని చాలా వరకు మొబైల్ తీసుకుందనే చెప్పాలి. దేవుని మందిరాలకు సహితం, బైబిల్ లేకుండా మొబైల్ తోనే వెళ్లేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.
అదేంటి అంటే? మొబైల్ లో పరిశుద్ధ గ్రంధం యాప్ వుంది కదా? అంటూ వాదించేవారు కోకొల్లలు. అవును వున్న మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంధముతో పాటు, అపరిశుద్ధమైన అశ్లీల చిత్రాలు కూడా వున్నాయి. నీవు వద్దనుకున్నా యాడ్స్ రూపంలో అవి దర్శనమిస్తూనే ఉంటాయి.
మొబైల్ ని ఒక స్టేటస్ గా చూడొద్దు. బైబిల్ ను మోయడానికి సిగ్గుపడొద్దు. మొబైల్ నీచేతిలో ఉన్నంత మాత్రాన అది గర్వించదగిన విషయం కాదుగాని, పరిశుద్ధ గ్రంధం నీ చేతిలో వుంటే మాత్రం అది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే.
మొబైల్ లో బైబిల్ చదివితే ఏమవుతుంది?
🔹అది పరిశుద్ధ గ్రంధము అనే అనుభూతి గాని, భయము గాని కలుగదు.
🔹తద్వారా దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించలేము.
🔹 ఉపయోగించే విధానం కూడా యాంత్రికంగానే ఉంటుంది. ఏ గ్రంధం తర్వాత ఏ గ్రంధం ఉంటుందో కూడా తెలుసుకోలేనంతటి అజ్ఞానానికి దారితీస్తుంది.
🔹మొబైల్ యాప్ లో కొన్ని పదాలు, కొన్ని వచనాలు కూడా మిస్ అవుతుంటాయి. తద్వారా ఆ లేఖనభాగము యొక్క అర్ధమే మారిపోతుంది.
🔹 మధ్యలో వచ్చే యాడ్స్ మన దృష్టిని, మనసును దేవునినుండి మళ్లించవచ్చు.
🔹మన హృదయానికి హత్తుకొనే విషయాలు అండర్ లైన్ చేసుకోవడానికి గాని, ప్రక్కన వ్రాసుకోవడానికి గాని అనుకూలం కాదు.
🔹ఒకవేళ అట్లాంటి సౌకర్యాలున్నప్పటికీ, ఆ మొబైల్ గాని, ఆ యాప్ గాని మన జీవితాంతం సవ్యంగా పనిచేయదు.
🔹ఒక్కమాటలో చెప్పాలంటే, మొబైల్ పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి అనుకూలం కాదు.
మొబైల్ యాప్ ను ఎప్పుడు ఉపయోగించవచ్చు?
🔸ప్రయాణము చేస్తున్నప్పుడు
🔸ఏదైనా పనిమీద వెళ్ళినప్పుడు, అక్కడ కొంత ఖాళీ సమయం దొరికినప్పుడు.
🔸పరిశుద్ధ గ్రంధం దగ్గర లేనప్పుడు, వున్నా, ఓపెన్ చెయ్యడానికి పరిస్థితుల్లో అనుకూలంగా లేనప్పుడు.
🔸లేఖన భాగాలను ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు.
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానం చేస్తే?
🔹పరిశుద్ధ గ్రంధాన్ని చూస్తే భయం పుడుతుంది.
🔹ఆ భయము పశ్చాత్తాపములోనికి నడిపిస్తుంది.
🔹తద్వారా దేవునిపట్ల ఆరాధనా భావం కలుగుతుంది.
🔹బైబిల్ ను చదివేటప్పుడు మన హృదయానికి హత్తుకొనే విషయాలను అండర్ లైన్ చేసుకోవచ్చు.
🔹అవసరమైతే, దేవుడు మనతో మాట్లాడినట్లు అనిపించే విషయాలు అక్కడే వ్రాసుకోవచ్చు.
🔹మనకు కావలసిన వాక్యభాగాల కొరకు వెదకేటప్పుడు, మనకు తెలియకుండానే, మన కన్నులు వాటిమీదకి వెళ్లిపోతాయి. ( కారణం? మన బ్రెయిన్ లో ముద్రపడిపోతుంది. ఆ వాక్యభాగం క్రింద ఉందా, పైన ఉందా, ఎడమ వైపున ఉందా, కుడి వైపున ఉందా, మధ్యలో ఉందా అనేది మనకు అర్ధమవుతుంది.)
🔹మనము తలవని తలంపుగా బైబిల్ ఓపెన్ చేసినప్పటికీ, ఇట్లాంటివన్నీ మనకు కనబడి, గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తాయి.
🔹ఒక్కమాటలో చెప్పాలంటే, పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి పరిశుద్ధ గ్రంధమే మిక్కిలి అనుకూలం. మొబైల్ కానేకాదు.
ప్రియ నేస్తమా! బైబిల్ గ్రంధము బహిరంగముగా పట్టుకొని తిరగడానికి వీలులేని దినాలు అత్యంత సమీపముగానే వున్నాయి. ఆ దినాలలో మొబైల్ యాప్స్ కూడా బ్యాన్ చెయ్యొచ్చు. ఆ పరిస్థితులు రాకముందే పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, ప్రభువు రాకడకై సిద్ధపడు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ప్రియ నేస్తమా! సువార్త భారం నీకుందా?
అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ .(1కొరింథీ 9:16)
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. (రోమా 1:16)
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి. (యెషయా 52:7)
నశించిపోతున్న ఆత్మలపట్ల భారము కలిగి ప్రార్ధించకపోవడం, ప్రకటించకపోవడం. గొప్ప ఆధ్యాత్మిక నేరం
దున్నబడని భూములన్నీ దున్నబడాలి! ఆధ్యాత్మిక లోయలన్నీ పూడ్చబడాలి! వక్రమార్గాలన్నీ సక్రమవ్వాలి! కరకు మార్గాలన్నీ నునుపవ్వాలి!
అయితే, ఆ పని చేసేదెవరు? యేసు అనే పేరు తెలియని ప్రజలు ఎందరో వున్నారు! ఆ ప్రేమను ప్రకటించేవారు మాత్రం కొందరే వున్నారు! కోత విస్తారం. కోసేవారు మాత్రం కొదువుగా నున్నారు! కోయగలవా? కోసేవారిని ప్రోత్సహించగలవా?
ముల్లును ముల్లుతోనే తీయాలని, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని, బైబిల్ పట్టుకున్నవారిని బైబిల్ తోనే మోసం చెయ్యాలని, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాల్సిన దేవుని పిల్లలనే సువార్తకు అడ్డుబండలుగా మార్చాలనే సాతానుగాడి ప్లాన్ బాగా సక్సస్ అయ్యింది.
నేటిదినాల్లో సువార్త పరిచర్యకు ప్రోత్సహించాల్సిన సేవకులే నీకు పిలుపు ఉందా? సువార్త కొరకు దేవుడు నిన్ను పిలిచాడా? లేకుంటే నీవు సువార్త చేయడానికి వీల్లేదంటూ, ప్రోత్సహించాల్సినవారే అడ్డుబండలగా మారే పరిస్థితి. కానీ అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే? మేము పిలువబడ్డాము అనే చెప్పుకొనే ఆ సేవకులు, దేవుని పిలుపుకు లోబడలేక, వారికి నచ్చినట్లుగా జీవిస్తూ, సాక్ష్యాన్ని కోల్పోయి, ఎవరైనా ఆత్మల పట్ల భారం కలిగి సువార్తపనిచేస్తుంటే వారి కాళ్లకు గుదిబండలువేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన పిల్లలే, మేమెందుకు సువార్త ప్రకటించాలి? అది పాస్టర్ల పని అంటూ తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెరిపినట్లు, కొందరు యవ్వనబిడ్డలు ప్రభువు కోసం జీవించలేక, వారు భ్రష్టులై, తన తోటివారిని వారివలే చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ యౌవనుడా! నీ కోసమే ఈ మాటలు వ్రాయడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నారు. నీవు సువార్తను గురించి సిగ్గుపడేవాడవైతే, సిగ్గుతో తలదించుకుని వుండు. అయితే, తీర్పు దినమునుండి తప్పించుకోలేవనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.
నేనెందుకు సువార్తను ప్రకటించాలి అని ప్రశ్నించే స్థితికి నీవు చేరుకున్నావంటే? దానికి కారణం?
నీకు యెహోవా ఉత్తముడు అని రుచిచూచిన అనుభవం లేదేమో? (కీర్తనలు 34:8)
నీకు ప్రభువు దయాళుడు అని రుచిచూచిన అనుభవం లేదేమో? (1పేతురు 2:1)
రక్షణ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదేమో? (2 తిమోతి 2:4)
నీకు సమర్పణ జీవితం లేదేమో? (రోమా 12:1) సమర్పణ అంటే ఏమిటో తెలుసా? శరీరేచ్ఛలను చంపుకొని, ప్రభువు కొరకు జీవించడం.
ఇట్టి అనుభవాలు నీ జీవితంలో వుంటే, ఆయన గురించి మాట్లాడకుండా వుండడం నీవల్ల కానేకాదు. నేనెందుకు సువార్త ప్రకటించాలి అని ప్రశ్నిస్తున్నావంటే, నీవు ఒప్పుకున్నా, ఒప్పకపోయినా ఇట్లాంటి అనుభవాలు నీ జీవితంలో లేవన్నమాట. సందేహం లేనేలేదు.
ప్రియ స్నేహితా! ప్రేమతో చివరిగా నీకొక్కసారి మనవి చేస్తున్నాను. సువార్తను గురించి ప్రశ్నించే స్థితిలో నీవున్నావంటే, అది నీవు క్రైస్తవుడవై నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సినపని. వెలిగింపబడిన క్రొవ్వొత్తి అనేకమందికి వెలుగివ్వాలి. అట్లానే, క్రీస్తు ప్రేమతో వెలిగింపబడిన నీవు, అనేకులకు సువార్త వెలుగును పంచాలి. ప్రకటించే కృపావరమును ప్రభువు నీకివ్వకపోతే, ప్రార్ధించే కృపావరముతో నశించిపోతున్న ఆత్మలపట్ల భారముకలిగి ప్రార్ధించు. అన్నింటికంటే మించి, నీ జీవితాన్నే ఒక సువార్తగా నీ స్నేహితుల ముందుంచు. అంతేగాని, సువార్తను గురించి ప్రశ్నించడమంటే మునికోలకు ఎదురు తన్నడమే అవుతుంది జాగ్రత. అది నీ జీవితానికి ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు. సువార్తను అడ్డగించినవారెందరో కాలగర్భంలో కలసిపోయారు. కానీ, సువార్త ప్రజ్వరిల్లుతూనే వుంది. నీవునూ వారిలో ఒకడివి కాకూడదు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. అనేకులను ప్రభువు చెంతకు నడిపించు! ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
క్రైస్తవులు సినిమాలు చూడకూడదు. మరి సీరియల్స్ ?
సినిమాలు చూడకూడదని బైబిల్ లో ఎక్కడుందని వాదించేవారు కొందరున్నప్పటికీ, ఎక్కువమంది క్రైస్తవులు మాత్రం సినిమాలు చూడకూడదని అంగీకరిస్తారు. కానీ, సీరియల్స్ చూడకూడదంటే మాత్రం సిస్టర్స్ అస్సలు అంగీకరించరు. అంటే, సాతాను వారిని అట్లా ట్యూన్ చేసాడన్నమాట.
సినిమాలకు, సీరియల్స్ కు పెద్దగా తేడా ఏముంది? సినిమాలను పట్టుకొని గట్టిగా సాగదీస్తే సీరియల్స్ గా మారతాయి. అంతేకదా? ఇక్కడ మరొక విషయం చెప్పాలి. సినిమా అయితే, మూడు గంటల్లో అయిపోతుంది. కానీ, సీరియల్ మాత్రం మూడు సంవత్సరాలైనా దానికి సమాప్తం లేదు. సిస్టర్స్ ఒప్పుకున్నా ఒప్పుకొనక పోయినా, సీరియల్స్ అనేవి, సినిమాలకు ఎట్టిపరిస్థితులలోనూ తీసిపోవు. అత్యంత ప్రమాదకరం కూడా.
ఒకదినాన్న ఒక సిస్టర్ ఒక మొగలిరేకులు అనే సీరియల్ చూస్తున్నారు. వాళ్ళ బాబు బెడ్ రూమ్ లో పండుకున్నాడు. ఈ లోపు వానిని ఎదో కరచినట్లనిపించి, మమ్మీ అని గట్టిగా అరిచాడు. ఈమె టీవీ దగ్గరనుండి కదలకుండా మరొక్కసారి పిలిచావంటే, పీకనులుమి చంపేస్తా అన్నది. ఇక పిల్లవాడు మిన్నకుండిపోయాడు. ఆమె సీరియల్ ముగించుకొని బెడ్ రూమ్ కి వచ్చింది. బిడ్డ నోటనుండి నుగుర్లు. ప్రక్కనున్న కిటికీ ఊచలుకు కట్లపాము చుట్టుకొని వుంది. రోధించడం మొదలుపెట్టింది. చుట్టూవున్నవారంతా వచ్చి, హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంటే, హాస్పిటల్ కి చేరకముందే ఆబిడ్డ ప్రాణం కోల్పోయాడు. ఇప్పుడంటుంది ఆమె. నాబిడ్డ మరణానికి కారణం? కట్లపాము కాటు కానేకాదు. నాకున్న సీరియల్స్ పిచ్చి.
నాకొక అక్క తెలుసు. తాను అంటుంది తమ్ముడూ నేనెప్పుడూ కన్నీటి ప్రార్ధనే. చూడు నాకళ్ళు చుట్టూ నల్లగా అయిపోయిందంటుంది. వాళ్ళ కుటుంబస్తులేమో ఆమెగురించి ఇచ్చే సాక్ష్యమేమిటంటే, “ఏ బేధం లేదు అన్నట్లుగా” ఏ ఛానెల్ గాని, ఏ సీరియల్ గాని మిస్ అవ్వదట. సీరియల్ చూచేటప్పుడు మధ్యలో యాడ్ వస్తే, ఆ టైం వేస్ట్ కాకుండా ఛానల్ మార్చి వేరొక సీరియల్ కవర్ చేసేస్తుందట ( అబ్బో! ఈ టాలెంట్ మీకు కూడా ఉంటుంది లెండి) అయితే ఇంకెక్కడి కన్నీటి ప్రార్ధన? ఇక ఆ సీరియల్ లో సీన్స్ గుర్తొచ్చి ఏడుపు రావాలి. అవునూ ఇంతకీ, ఏ సీరియల్ చూచినాగాని ఏడుపుగొట్టు సీన్లే ఉంటాయట కదండీ? అత్త కోడల్ని టార్చర్ పెట్టడం, కోడలు అత్తను టార్చర్ పెట్టడం ఇవే ఉంటాయట కదా? మీరేమో చాలా మంచోళ్ళు ఆ సాడిస్ట్ సీరియల్స్ చూచి, మీరు పొందే ఆనందమేంటండి? ఏంటో నాకు తెలియదుగాని, ఆధ్యాత్మిక ఆవేదనను మాత్రం ఎదుర్కోవలసి వస్తుంది.
ఒక స్తుతికూడికకు వెళ్లాను. అక్కడ ఎవ్వరూ రాలేదు. 8:30 తర్వాత మొత్తం నిండిపోతుందని చెప్పారు పాస్టర్ గారు. అదేంటో నాకర్ధం కాలేదు. ఆయన అన్నట్లే జరిగింది. చాలా ఆశ్చర్యం! అసలు రహస్యం మీటింగ్ అయ్యాక చెప్పారు. సీరియల్ అయితేగాని వాళ్ళు రారట. మీ ఆధ్యాత్మిక పతనానికి సీరియల్స్ ఎట్లా కారణమవుతున్నాయో ఇంతకంటే రుజువులు కావాలా?
సినిమాలు, సీరియల్స్ చూడకూడదని బైబిల్ లో ఎక్కడుందని అడ్డంగా వాదించేవారున్నారు. బైబిల్ వ్రాయబడి సమయానికి ఇట్లాంటివేమీ లేవు కాబట్టి, వ్రాయవలసి అవసరం రాలేదేమో? ఒక్కటి మాత్రం వాస్తవం! ప్రత్యక్షంగా లేకున్నా, పరోక్షంగా అనేక విషయాలు వ్రాయబడి వున్నాయి.
సినిమాలు, సీరియల్స్ ఎందుకు చూడకూడదు?
- సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. నటులను మొదట్లో వేషగాళ్లు అనేవారు. దేవునికి నటన అనగా వేషధారణ అంటే ఇష్టం ఉండదు. దేవునికిష్టం లేనిది పాపము. వేషధారణ, నటనతో నిండి ఉన్న సినిమా పాపము. ఈ లోకపు నటన గతించుచున్నది (1 కొరింథి 7:31)
2. సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా ఆ రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది. ఎంతోమంది చిన్న బిడ్డలు, యవ్వనస్థులు, పెండ్లి అయినవారు, కొంతమంది వృద్ధులు కూడా సినిమాలలోని శృంగార సన్నివేశాలను చూసి కామతప్తులుగా, జారత్వకులుగా, వ్యభిచారులుగా నాశనమయిపోతున్నారు. ఈ రహస్య ప్రక్రియను బహిరంగముగా చూపడం, అనేకమంది వ్యభిచారులుగా తయారవ్వడం దేవునికిష్టం లేనిది. శృంగార సన్నివేశాలను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చూపించే సినిమా పాపము
3. సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు. మనుష్యులు ఫలించాలని, విస్తరించాలని, ప్రేమ కలిగి జీవించాలని దేవుని సంకల్పం. కానీ సినిమాల ప్రభావంతో అనేకమంది రౌడీలుగా, గూండాలుగా, ఇతరులను హింసించేవారిగా, నరహంతకులుగా మారుతున్నారు. హింసించిన వారిని క్షమించే యేసయ్యకు హింసను ప్రేరేపించేవి, వాటి వలన మనుష్యులు ప్రేమలేనివారుగా తయారుకావడం ఇష్టం లేదు. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే సన్నివేశాలున్న సినిమా పాపము
4. సినిమాలో యవ్వనస్తుల ప్రేమ సన్నివేశాలుంటాయి. యవ్వనస్తుల మధ్య ఉండే ప్రేమ తప్పు కాదని, ఆ ప్రేమ దైవమని, వారు ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చని సినిమా బోధిస్తుంది. కానీ ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు (విలాప 3:27) అని వాక్యం సెలవిస్తుంది. యవ్వనస్తులు దేవుని కాడి మోయాలని, దుష్టుని జయించాలని, పాపానికి దూరంగా పారిపోవాలని, పెండ్లికి ముందు పాపము చేయకూడదని దేవుని కోరికయై యున్నది. కానీ సినిమాలు చూస్తున్న యవ్వన బిడ్డలు ప్రేమ తప్పు కాదని, ప్రేమే దైవమని ప్రేమలో పడి పెండ్లికి ముందు దేవుని కిష్టం లేని పాపం చేస్తూ దుష్టునికి లొంగిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ శాపపు కాడిని మోస్తున్నారు. భవిష్యత్తులు పాడు చేసుకుంటున్నారు. దేవుని కాడి మోయకుండా శాపపు కాడిని మోయిస్తున్న ప్రేమ సన్నివేశాలు చూపడం దేవుని కిష్టం లేదు. దేవుని కోరికకు వ్యతిరేకంగా యవ్వనస్తుల మధ్య ఉండే కామపు ప్రేమను చూపించే సినిమా పాపము.
5. సినిమాలలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపించే సన్నివేశాలుంటాయి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును (మత్తయి 5:28) అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే స్త్రీని చెడ్డగా చూస్తారో వారు వ్యభిచారం చేసినట్టేనని ఈ మాటలలోని ఆంతర్యం. సినిమా చూస్తున్న పురుషులు ఆ సినిమాలో అర్ధనగ్నంగా కనబడుతున్న స్త్రీలను చూడకుండా ఉండగలరా? సినిమా చూస్తున్న పురుషుడు ఆ స్త్రీలను చెడ్డగా చూసి వాక్య ప్రకారం ఎన్ని వ్యభిచారాలు చేస్తున్నారో లెక్కపెట్టలేము. అర్ధనగ్నంగా చూపించే స్త్రీల సన్నివేశాలు వాటిని చూసి వ్యభిచార నిలయాలుగా మారిపోతున్న హృదయాలు దేవునికి బాధ కలిగించేవి. దేవునికి బాధ కలిగించేవి పాపాలు కాదా? అనేకమంది హృదయాలను సాతాను నిలయాలుగా మార్చుటకు కారణమైన అర్ధనగ్న స్త్రీల సన్నివేశాలు చూపించే సినిమా పాపము కాదా?
ప్రియ నేస్తమా! చివరిగా ఒక్క మాట! ఇప్పటికే సినిమాలకు, సీరియల్స్ కు బంధీగా మారావేమో? నేడైనా సరిచేసుకొని, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
- మీ సహోదరుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి