యేసు క్రీస్తు రెండవ రాకడ
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( మొదటి భాగము)*ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను*
ప్రకటన 27:8
🔺 *ఎప్పుడు?*
మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి 24:44
🔺 *ఎందుకు?*
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
యోహాను 14:2,3
🔺 *భూమిమీద బానే వుంది కదా? అక్కడకి తీసుకుపోవడం ఎందుకు?*
నోవహు కాలంలో నీటితో లోకం నాశనం చేయబడింది. ఇప్పుడైతే భూమి అగ్నితో కాల్చివేయబడుతుంది.
2 పేతురు 3:6,7
🔺 *సంఘము ఎత్తబడుట* మరియు *క్రీస్తు రెండవ రాకడ ఒక్కటేనా?* కాదు.
సంఘము ఎత్తబడుట అనేది రెండవ రాకడలోని మొదటి మెట్టు. దీనినే *రహస్య రాకడ* అంటారు. రహస్య రాకడలో ప్రభువు మధ్యాకాశం లోనికి వస్తారు. భూమి మీదకి కాదు.
యేసు క్రీస్తు రెండవ రాకడలో, రెండవ మెట్టు *బహిరంగ రాకడ* అనగా ప్రభువు భూమిమీద ( ఒలీవల కొండమీద) పాదంమోపే సమయం.
🔺 రహస్య రాకడకు, బహిరంగ రాకడకుమధ్య వ్యవధి ఎంత?
ఏడు సంవత్సరములు
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
1 థెస్స 4:16,17
🔺 *మధ్యాకాశం ఎక్కడ వుంది?*
ఆకాశంలోనే మూడు భాగాలు.
1. మొదటి ఆకాశం: భూ ఉపరితలం నుండి పైభాగం. దీనిలో వాతావరణం, జీవులు, దివినుండి పడద్రోయబడిన దురాత్మల సమూహాలుంటాయి.
2. రెండవ ఆకాశం: మొదటి ఆకాశ పైభాగం. దీనిలోసూర్య చంద్ర నక్షత్రాలు మొదలగునవి ఉంటాయి. ఇదే మధ్యాకాశం.
3. మూడవ ఆకాశం: మధ్యాకాశ పైభాగం. దీనినే పరదైసు అని పిలుస్తారు.
క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
2 కొరింధీ 12:2,3
🔺 *మధ్యాకాశంలో దేవుని బూర ఊదినప్పుడు సంభవింప బోయే సంభవాలేమిటి?*
* పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు.
* ప్రభునందు మృతులైన మృతులు మొదట లేస్తారు.
* సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు.
(ఇదంతా కనురెప్ప పాటులో జరిగిపోతుంది.) 1కొరింధీ 15:52
🔺 ఎత్తబడిన సంఘము మధ్యాకాశంలో ఎంతకాలముంటుంది?
* ఏడు సంవత్సరాలు.
అంటే, ఎత్తబడిన సంఘానికి ఏడేండ్లు విందు. భూమి మీద విడువబడిన సంఘానికి ఏడేండ్లు శ్రమకాలం.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( రెండవ భాగము)💥 *యుగ సమాప్తికి (లేదా) సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు:* 💥
🔺 A. *మోసము*: (అబద్ద క్రీస్తులు వెలుగులోనికి వచ్చుట)
నేటిదినాల్లో మోసం ఎంత తారా స్థాయికి చేరిందంటే? డూప్లికేట్, ఒరిజినల్ ను మించి పోతుంది. అది ఏ రంగంలోనైనా కావొచ్చు, నిత్యావసర వస్తునుండి, కెరన్సీ నోట్ వరకూ. కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా సాగిపోతుంది. ఇక ఆధ్యాత్మికంగా అయితే, బైబిల్ పట్టుకున్నవాడిని బైబిలతోనే మోసం చెయ్యాలనే సాతాను కుయుక్తి విజయం సాధిస్తుందనే చెప్పాలి. అయితే, బెరయ సంఘస్థులవలే వాక్యాన్ని పరిశోధించి వాస్తవాలను గ్రహించగలగాలి.
ఇప్పటికే నేనే క్రీస్తును అంటూ వరకూ ఈ లోకంలో ప్రకటించుకున్నారు. వారి మరణాంతరం వారి జీవితాలేమిటో తేలిపోయింది. అట్లాంటి వారు కోకొల్లలుగా వస్తూనే వున్నారు. ఇంకా అనేకమంది వస్తారు. ఇది యుగసమాప్తికి సూచన అనే విషయం ఎంత మాత్రం మరచిపోకూడదు.
ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.
(మత్తయి 24:4,5)
🔺 B. *యుద్ధములు, కరవులు, భూకంపములు:*
ప్రపంచంలో శాంతి, సమాధానం లోపించింది. ఎక్కడ చూచినా యుద్ధవాతావరణమే తాండవమాడుతుంది. మన దేశానికి, ప్రక్కనున్న పాకిస్థాన్ కి ఎప్పుడూ ఇదేపరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఇంకనూ తీవ్రతరం కాబోతున్నాయి. ఇవన్నీ క్రీస్తు రెండవ రాకడకు సూచనలు.
సోమాలియా మరియు ఆఫ్రికాలో కరవుతో అల్లాడిపోతున్న దేశాలెన్నో. జీవితకాలంలో ఒక్కపూట కూడా కడుపునిండా ఆహారం తిననివాళ్ళు కోకొల్లలు. ఇట్లాంటి పరిస్థితులే రాబోయే దినాల్లో ఇంకనూ ప్రపంచమంతటనూ రాజ్యమేలబోతున్నాయి.
ఇక భూకంపాలు సగటున వారమునకు ఒకటి అన్నట్లు సంభవిస్తూనే వున్నాయి. వీటన్నిటిని చూచి ఆశర్య పోవలసినపనిలేదు గాని, యుగసమాప్తికి సూచనలని గ్రహించగలగాలి.
జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.
(మత్తయి 24:7,8)
🔺 C. *విశ్వాసులు సకల జనులచేత ద్వేషించబడుట: *
ఒక్క వేటుతో తల మొండెం వేరయిపోతుంది. సజీవ దహనాలు, మానభంగాలు, వెలివేతలు ... ఇట్లా అనేకం. కారణం ఒక్కటే! ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చెయ్యడం, పరిశుద్ధ జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకొని, మీరునూ ఆ పరిశుద్ధుని సేవించండని చెప్పినందుకు. ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగితీరుతాయి.
మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు
(మత్తయి 24:9)
🔺 D. *అబద్ద బోధలు:*
నేటి దినాల్లో దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.
* యెహోవా సాక్షులు
* మొర్మాన్స్
* బ్రెన్హ మైట్స్
* జాంగిల్ జా
* సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
* సున్నతి లేకుండా గమ్యం లేదు.
* శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)
🔺 E. *అనేకుల ప్రేమ చల్లారిపోతుంది: *
ప్రేమకే అర్ధాన్ని చెప్పిన ప్రియ రక్షకుని పిల్లలముగా ఆ ప్రేమను కోల్పోతున్నాము.
సమాజంలోనూ, సంఘాలలోను అక్రమం విస్తరించడం వలన, ప్రేమ స్థానంలో ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు వచ్చి చేరాయి.
అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. (మత్తయి 24:12)
🔺F. *సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి. *
ప్రపంచ వ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. బహిరంగ సభలు, దండయాత్రలు, కర పత్రికలు, రేడియో, టీవి, ఫేస్ బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ ఇట్లా అనేక మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అనేకులు కొండలు, లోయలు వేటిని లెక్కచేయక, ప్రాణాలకు తెగించి, నరమాంస భక్షకులకు దగ్గరకు సహితం సువార్తను మోసుకుపోతున్నారు.
లెక్కలేనన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడుతుంది.
వినినా వినకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా గాని, వాక్యం మాత్రం ప్రపంచంలోని చివరి మనిషివరకూ చేరాలి.
ఈ వర్తమానాలు నీదగ్గరకు వస్తున్నాయంటే? మాకు పనీ పాటు లేక చేసే పనులుగా భావించొద్దు. సువార్త ద్వారాలు మూయబడే సమయం ఆసన్నమౌతుందని గుర్తుంచుకో!
రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.
(మత్తయి 24:14)
*ప్రియ విశ్వాసి!* కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( మూడవ భాగము)💥 *యుగ సమాప్తికి (లేదా) సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు: *💥
🔺 G. *చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, తిరిగి ఇశ్రాయేలు చేరుట: *
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశ ములోనికి తోడుకొనివచ్చి, వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయ క్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.
యెహేజ్కేలు 37: 20-23
*ఇశ్రాయేలీయులు ఎవరు?*
* మూలపురుషుడు అబ్రాహాము.
* దేవుడు అబ్రాహామునకిచ్చిన వాగ్ధానం యాకోబులో స్థిరపరిచాడు.
* యాకోబు 12 మంది కుమారులే. ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూల పురుషులు.
* కరవు కాలంలో, యాకోబు ఐగుప్తుకు వెళ్లడం, ఆ రీతిగా మొత్తానికి 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించడం జరిగింది.
* మోషే, యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలీయులు తిరిగి వాగ్ధాన భూమికి చేరారు.
* ఒత్నియేలు మొదలుకొని సమూయేలు వరకు దాదాపు 15 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలించారు.
* సౌలు, దావీదు, సొలోమోను ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరి పరిపాలనా కాలంలో ఇశ్రాయేలీయులంతా ఒకే రాజ్యముగా వుండేది.
* సొలోమోను మరణాంతరం రాజ్యం రెండుగా విభజింప బడింది. యూదా, బెన్యామీను గోత్రాలు యూదా రాజ్యం గాను, మిగిలిన పది గోత్రాలు ఇశ్రాయేలీయులగాను విడిపోయారు. (1రాజులు 12:17,20)
* ఇశ్రాయేలీయులలో పది గోత్రములు, ఉత్తర రాజ్యముగా, షోమ్రోను ను రాజధానిగా చేసుకొని, రెహబాము మొదలుకొని యోషియా వరకు 19 మంది రాజులు పరిపాలించెను.
* ఇశ్రాయేలీయులలో యూదా, బెన్యామీను గోత్రములు, ఉత్తర రాజ్యముగా, యెరూషలేమును రాజధానిగా చేసుకొని, రెహబాము మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలించెను.
ఇశ్రాయేలీయులను అషూరు వారు క్రీ. పూ. 722 లో చెరకు తీసుకొనిపోయారు. అప్పటినుండి వారికి రాజ్యం లేదు.
2రాజులు 17:23
యూదా రాజ్యమును నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకొని పోయాడు. (2దిన 36:17-19) యూదులు 70 సంవత్సరాల చెర అనంతరం తిరిగి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. వీరిని స్వంత రాజ్యంలేదు. పారశీకులు, గ్రీకులు, రోమీయులు వీరిని పాలించారు.
రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేము మీద దండెత్తి, సుమారు పది లక్షల మందిని చంపేశాడు. ఒక లక్ష మందిని పట్టుకొని, మార్కెట్ లో పెట్టి ప్రపంచ దేశాలకు బానిసలుగా అమ్మేశాడు. మిగిలిన ప్రాణ రక్షణతో ప్రపంచములోని వివిధ దేశాలకు చెదరిపోయారు. క్రీ. శ. 70 తర్వాత ప్రపంచ పటంలో ఇశ్రాయేలుకు స్థానం లేకుండా పోయింది.
అయితే, కృపగలిగిన చెదిరిపోయిన ఇశ్రీయేలీయులను తిరిగి తీసుకొని వస్తానని, వారిక రెండు రాజ్యములుగా నుండక, ఒకే రాజ్యముగా వుంటారని యెహేజ్కెలు 37: 20-24 ద్వారా తెలియజేశాడు.
దాని నెరవేర్పు 1948 May, 14th న జరిగింది. రెండు రాజ్యాల ప్రజలు కలసి ఒకే స్వతంత్ర దేశముగా ఏర్పడ్డారు.
అయితే, ఇశ్రాయేలీయులంతా పూర్తిగా స్వదేశం చేరుకోలేదు. ఒక్కొక్కరుగా చేరుకొంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్, యెరూషలేమును ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించడం, టెల్ అవీవ్ లోనున్న అమెరికన్ ఎంబసీ ని, యెరూషలేముకు మార్చడం ద్వారా, ప్రపంచ దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలీయులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వారి స్వదేశం చేరుకోబోతున్నారు.
ఈ పరిణామాలను పరిశీలిస్తే, ఇక యుగసమాప్తి కనుచూపు మేరల్లోనే వుందని మనము గ్రహించగలగాలి.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( నాల్గవ భాగము)💥 యుగ సమాప్తికి (లేదా) సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు: 💥
🔺 H. *యెరూషలేములో దేవాలయము తిరిగి కట్టబడాలి: *
*దేవాలయ చరిత్ర: *
🍬 *మొదటి మందిరము:*
దావీదు స్థల్లాన్ని, సామాగ్రిని సిద్దపరిచాడు. కానీ, అతని చేతులు రక్తం ఒలికించడం వలన, మందిరం కట్టడానికి దేవుడు అంగీకరించలేదు.
మొదటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు. నిర్మాణం పూర్తికావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.
- 1 రాజులు 6:37
ఈ మందిరాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు కూల్చివేసాడు.
2 రాజులు 25:ప్రస్తుతము యెరూషలేములో దేవుని మందిరము లేదు. మందిరం వుండాల్సినచోట డోమ్ రాక్ (మసీదు) వుంది.
🍬 *రెండవ మందిరం*:
సం. బబులోను చెర తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో హగ్గయి, జెకర్యా ప్రోత్సాహంతో, కోరెషు ఆర్ధిక సహాయంతో కట్టబడింది. (ఎజ్రా 6వ అ.)
దీనిని సిరియా రాజైన అంతియొకస్ ఆఫీపైనాస్ అనేవాడు, పంది రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించి, మందిరాన్ని అపవిత్రపరచి, కొంత వరకు నాశనం చేసేసాడు.
అంతియొకస్ నాశనం చేసిన మందిరాన్ని, హేరోదు తిరిగి నిర్మించాడు.
* యేసు క్రీస్తుని బంధించిన దేవాలయము ఇదియే.
* రాయిమీద రాయిలేకుండా కూల్చివేయ బడుతుందని ప్రభువు ఈ మందిరం గూర్చియే ప్రవచించారు. (మత్తయి 24:1,2)
నెరవేర్పులో భాగంగా 40 సంవత్సరాల తర్వాత అనగా క్రీ.శ 70 వ లో రోమా చక్రవర్తియైన టైటస్ దీనిని కూల్చివేసాడు. రాళ్ళ మద్యలోనున్న బంగారం కోసం, ఏనుగులతో రాయిమీద రాయిలేకుండా పడగొట్టించాడు.
🍬 *మూడవ మందిరం*:
ప్రస్తుతము యెరూషలేములో దేవుని మందిరము లేదు. మందిరం వుండాల్సినచోట
డోమ్ రాక్ (మసీదు) వుంది.
మూడవ మందిర నిర్మాణం కొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తప్పకుండా మందిర నిర్మాణం జరిగితీరుతుంది. ఆ తర్వాత సంఘము ఎత్తబడుతుంది.
🔺 *మందిరము కట్టబడడానికి, సంఘము ఎత్తబడానికి గల సంబంధమేమిటి? *
ఇశ్రాయేలీయులు క్రీస్తు విరోధితో సంధి చేసుకొని, అతనిని మెస్సియ్య గా అంగీకరిస్తారు. క్రీస్తు విరోధి నాయకత్వంలో ఇశ్రాయేలు దేశం పరిపాలించబడుతుంది.
నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు.
యోహాను 5:43
అనుదిన బలి నైవేద్యం దేవాలయంలో తిరిగి ప్రారంభమవుతుంది. బలినైవేధ్యం ప్రారంభము కావాలంటే? క్రీస్తు విరోధిని ఇశ్రాయేలీయులు మెస్సియగా అంగీకరించాలి. ఏడేండ్ల శ్రమకాలంలోని మొదటి మూడున్నర సంవత్సరాలు కొనసాగుతుంది.
బలినైవేధ్యం ప్రారంభం కావాలంటే మందిర నిర్మాణం, సంఘము ఎత్తబడక ముందే జరిగితీరాలి.
🔺 క్రీస్తు విరోధి ఏడేండ్ల శ్రమకాలంలో మొదటి మూడున్నర సంవత్సరముల తర్వాత దేవాలయములో బలిని నిలిపివేస్తాడు. హేయమైనది దేవాలయములో నిలుపుతాడు. (బహుశా అతని ప్రతిమనే నిలబెట్టవచ్చు.) దేవాలయంలో హేయమైనది నిలిపిన తర్వాతగానీ ఇశ్రాయేలీయులకు అర్ధంకాదు. అతడు మెస్సియ్య కాదని.
అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్య మును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
దానియేలు 9:27
*దేవాలయము కట్టబడకుండా సంఘము ఎత్తబడదని లేఖనాలను బట్టి స్పష్టమవుతుంది. *
అయితే, ఒక్క విషయం! ఇప్పటికే మూడు దినాలలో మందిరం కట్టేలా ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. మందిరానికి కావలసిన సామాగ్రినంతా ఇశ్రాయేలీయులు సిద్దంచేసుకున్నారు. ఇక కొన్ని ఆటంకాలను అధిగమిస్తే చాలు. మందిర నిర్మాణం జరిగిపోతుంది. మందిర నిర్మాణం జరిగితే ఇక యుగ సమాప్తే.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( ఐదవ భాగము)💥 *యుగ సమాప్తికి (లేదా) సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు: *💥
🔺 దేవాలయము కట్టబడుటకుగల ముఖ్యమైన ఆటంకాలు: 3
🍬1. ప్రస్తుతము మందిరము కాట్టాల్సిన స్థలములో డోమ్ రాక్ ( మసీదు) వుంది.
మసీదును తొలగిస్తే? మూడవ ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చు. అందుచే వున్న మసీదును కూల్చకుండా వున్నది వున్నట్లుగా లేపి, ప్రక్కన పెట్టి, ఆ స్థలంలో మందిర నిర్మాణం చెయ్యాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అట్లా అయితే, వ్యతిరేకత రాదనీ కాదు గాని, కొంత తగ్గించ వచ్చని. అది సాధ్యం కాకపోతే, యుద్దానికైనా సిద్దపడతారుగాని, మందిర నిర్మాణం ఆపడం ఎవ్వరి తరమూ కాదు.
🔺 మసీదు వున్న స్థలంలోనే సొలోమోను కట్టిన దేవాలయం వుండేదని నిర్ధారణ ఎట్లా?
ఇటీవల కాలంలో ఇశ్రాయేల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యుహూ తో సహా, కొందరు మసీదును దర్శించి, స్కానింగ్ తీసినప్పుడు, భూమిలోపల కొన్ని అట్టలు కట్టిన ప్రాంతం కనుగొన్నారట. అదేమిటని పరిశీలించగా, సొలోమోను కట్టిన దేవాలయములో లక్షలాదిగా అర్పించబడిన బలుల రక్తమని నిర్ధారణకు వచ్చారు.
🍬 2. *ఎర్రని పెయ్యి కనొగనబడాలి: *
ఎందుకంటే?
ఎర్రని పెయ్యను దహించి, ఆ భస్మమునకు, నీటిని కలిపి, పాప పరిహారార్థ జలము సిద్ధపరచాలి.
యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెల విచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను; అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింప వలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజ కుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిర స్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాల మువరకు అపవిత్రుడై యుండును. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి. ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.
సంఖ్యా 19:1-10
నేడు ఇశ్రాయేలీయు ఎర్రని పెయ్యి కోసం విస్తృతమైన అన్వేషణ చేస్తున్నారు. హైఫా ప్రాంతంలో ఒకటి కనుగొనబడినప్పటికీ, దానికి రెండు తెల్లని వెంట్రుకలు వుండడం వలన అది బలికి నిషిద్ధం. ఈ అంత్యకాలంలో తగినసమయమందు దేవుడు దానిని తప్పక పుట్టిస్తాడు.
🍬3. *కలాల్ పాత్రలు కనుగొనబడాలి. *
ఎర్రని పెయ్యిని వధించి, సిద్దపరిచే భస్మాన్ని హోమ భస్మం అంటారు. ఈ పవిత్ర భస్మాన్ని మట్టి పాత్రలలో భద్రపరుస్తారు. వాటినే హిబ్రులో కాలాల్ పాత్రలు అంటారు.
ఈ పవిత్ర బస్మంలో పారు నీళ్లు కలపడం ద్వారా పాప పరిహారార్థ జలము తయారగును. దానిని చల్లుకుంటే పవిత్రులవుతారు.
మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి
అప విత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.
సంఖ్యా 19:9-17
🔺 *ఇప్పుడు కలాల్ పాత్రల ఎక్కడ వున్నాయి? *
తెలియదు. టైటస్ చక్రవర్తి యెరూషలేము మందిరాన్ని నాశనం చేస్తున్నప్పుడు యాజకులు దేవుని మందసాన్ని, కాలాల్ పాత్రలను ఎక్కడో దాచి పెట్టేసారు. మందసము అయితే, కనుగొన బడింది గాని, కాలాల్ పాత్రల కోసం విస్తృతంగా అన్వేషణ చేస్తున్నారు.
🔺 *కలాల్ పాత్రల అవసరమేమిటి? *
ఇప్పుడు ఎర్రని పెయ్యను కనుగొని, దాని భస్మమును, కాలాల్ పాత్రలలోనున్న పాత భస్మములో కలపాలి. అందుచే, తప్పక కాలాల్ పాత్రలు కనుగొని తీరాలి.
వీటితో తయారు చేయబడిన పాపపరిహారార్థ జలమును వారి మీద జల్లుకొనుట ద్వారా, శుద్ధీకరించబడి, దేవాలయములోనికి ప్రవేశించడానికి అర్హులవుతారు. లేని పక్షంలో, దేవాలయంలో ప్రవేశించే అర్హత లేదు. ఇశ్రాయేలీయులు దేవాలయములో ప్రవేశించగానే సంఘము ఎత్తబడుతుంది. ఈ మందిరంలో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు ఎత్తబడే సంఘములో వుండరు. (ఏడేండ్ల శ్రమ కాలంలో వీరి కొరకు ఇద్దరు సాక్షులు దేవునిచేత పంపబడి, రక్షణలోనికి నడిపిస్తారు.) రక్షించబడిన ఇశ్రాయేలీయులు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.
ఎర్రని పెయ్యి, కాలాల్ పాత్రలు తప్పక కనుగొనబడతాయి, మందిరం నిర్మించబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘములో మనముంటామా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( ఆరవ భాగము)💥 యుగ సమాప్తికి (లేదా) సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు: 💥
🔺 I. క్రీస్తు విరోధి రాజ్య స్థాపన (లేదా) అంత్యక్రీస్తు రాజ్య స్థాపన (part-1)
అంత్య క్రీస్తు అనగా?
క్రీస్తు పేరట తానే క్రీస్తునని చెప్పుకొనుచూ వచ్చే అబద్ధ ప్రవక్తలలో చివరివాడు.
అంత్య క్రీస్తుకు గల వివిధ పేర్లు:
* క్రీస్తు విరోధి (యోహాను 2:18)
* క్రూర మృగము (ప్రకటన 13)
* పాప పురుషుడు (2 థెస్స 2:3)
* నాశన పుత్రుడు, చిన్న కొమ్ము (దాని 8:9)
అంత్య క్రీస్తు ఎవరు?
ఎక్కడ నుండి వస్తాడు?
పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్ప మునకు నమస్కారముచేసిరి. మరియు వారుఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కా రముచేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పా టాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను. భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.
ప్రకటన 13: 1-10
క్రూర మృగము అంటే క్రూర మృగమువంటి స్వభావము గలవాడు.
* సముద్రములోనుండి పైకి వచ్చుచున్నాడు.
* క్రూర మృగమునకు 10 కొమ్ములు
* 10 కొమ్ముల మీద 10 కిరీటములు
* 7 తలలు
* 7 తలల మీద దూషణకరమైన పేర్లు
ఈ మృగము అంత్య క్రీస్తును అతని రాజ్యమును సూచించు చున్నది.
7 తలలు అనగా, ఏడు కొండలపై టైబర్ నది ఒడ్డున కట్టబడిన పట్టణము రోమ్. అంటే, అంత్య క్రీస్తు రోమ్ నుండి వచ్చునని అర్థంచేసుకోవచ్చు.
10 కొమ్ములు - 10 రాజ్యములు
10 కిరీటములు - 10 మంది రాజులు
అనగా,
* పది రాజ్యముల రాజులు, ఒకే కూటమిగా ఏర్పడి ఒక రాజును ఎన్నుకుంటారు. అతడే
అంత్య క్రీస్తు.
* ఈ పది రాజ్యములు ఒకే రాజ్యమునకు చెందినవి. అదే మధ్యధరా సముద్రము.
* మధ్యధరా సముద్రమునుండి బయటకి వచ్చు చున్న క్రూర మృగమే “యూరోపియన్ సమాజము”.
* ఇది 1956 లో ఆవిర్భవించింది. దీనిలో అనేక దేశాల వారు సభ్యులుగా చేరారు.
* చివరికి 10 రాజ్యములే మిగులుతాయి. అదే అంత్య క్రీస్తు రాజ్యముగా ప్రపంచమంతటిని పరిపాలిస్తుంది.
*అంత్య క్రీస్తు రాజ్య స్థాపన కనుచూపు మేరల్లోనే వుంది.*
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( ఏడవ భాగము)యుగ సమాప్తికి (లేదా) సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు:
క్రీస్తు విరోధి రాజ్య స్థాపన (లేదా)
అంత్యక్రీస్తు రాజ్య స్థాపన (part-2)
*అంత్య క్రీస్తు రాజ్య దశలు-4*
1. అంత్య క్రీస్తు రాజ్యస్థాపన
2. సంఘము ఎత్తబడిన తర్వాత మొదటి మూడున్నర సంవత్సరములలో వాని రాజ్యము స్థిరపరచబడుట.
3. చివరి మూడున్నర సంవత్సరాలలో అంత్య క్రీస్తు రాజ్య పాలన.
4. హార్ మెగిద్దోను యుద్దములో, అంత్య క్రీస్తు, అతనియొక్క రాజ్యము నాశనమగుట.
* అంత్య క్రీస్తు రాజ్యము భూలోకంలో స్థాపించబడిన వెంటనే సంఘము ఎత్త బడుతుంది.
* అతడు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని, ప్రపంచమంతటితో ఒప్పందం కుదుర్చుకొని, యెరూషలేమును రాజధానిగా చేసుకుంటాడు.
* యెరూషలేము దేవాలయములో బలినైవేద్యములు ప్రారంభించి, ఇశ్రాయేలీయుల ఎదుట ఒక మెస్సియా గా గుర్తింపు తెచ్చుకుంటాడు. (దానియేలు 9:2)
* అబద్ధ ప్రవక్త అనే రెండవ క్రూర మృగము, సంపూర్ణముగా అంత్య క్రీస్తుకు సహకరిస్తుంది.
* సాతాను వాని అధికారమును, శక్తిని అంత్య క్రీస్తునకు ఇస్తాడు.
* సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధప్రవక్త త్రిత్వమై పాలిస్తారు.
* అంత్య క్రీస్తు మొదటి మూడున్నర సంవత్సరాలలో తన రాజ్యమును స్థిరపరచుకొని, చివరి మూడున్నర సంవత్సరాలలో తానే దేవుడనని చెప్పి, అత్యంత నిరంకుశంగా పరిపాలిస్తాడు.
*భూలోకంలో అంత్యక్రీస్తు రాజ్య స్థాపనకు ఐదు సూత్రాలను ఉపయోగిస్తాడు. *
* ప్రపంచ శాంతి
* సర్వమత సమ్మేళనం
* యూరో కెరన్సీ
* ఇంటర్ నెట్ వ్యవస్థ
* 666 ముద్ర (ప్రకటన 13:17)
*అంత్య క్రీస్తు పరిపాలన:*
* పరిపాలనా కాలం: ఏడు సంవత్సరాలు
* మొదటి మూడున్నర సంవత్సరాలు: శాంతమూర్తి
* చివరి మూడున్నర సంవత్సరాలు: క్రూర మృగము
* మొదటి మూడున్నర సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఇతనితో వుంటారు.
* తర్వాత, అంత్య క్రీస్తు యెరూషలేము దేవాలయములో ప్రతిమను నిలబెట్టినప్పుడు, అతనిని అసహ్యించుకొని అరణ్యానికి పారిపోతారు.
* అంత్య క్రీస్తు మొదట తానే క్రీస్తునని, తర్వాత నేనే దేవుడనని చెప్పుకుంటాడు.
* దేవాలయంలో బలి, నైవేద్యం, పండుగలను ఆపివేస్తాడు.
* మోషే ధర్మ శాస్త్రమును వ్యతిరేకిస్తాడు.
* దేవాలయంలో విగ్రహారాధన ప్రారంభిస్తాడు.
* తానే దేవుడనని దేవాలయంలో వచ్చి కూర్చుంటాడు.
* తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యమునకు వెళ్లగొట్టి, ముద్ర వేయించుకోవలెనని బలవంతం చేస్తాడు.
* యూదులను రక్షించడానికి వచ్చిన ఇద్దరు సాక్ష్యులను చంపేస్తాడు.
*అంత్య క్రీస్తు పతనం:*
యేసు క్రీస్తు తన బహిరంగ రాకడలో ప్రత్యక్షమగునప్పుడు, అంత్య క్రీస్తును, అబద్ద ప్రవక్తను సజీవులుగా పట్టుకొని, అగ్నిగుండములో పడద్రోయును. (ప్రకటన 19:20) మొట్టమొదటిగా అగ్నిగుండంలో ప్రవేశించేది వీళ్ళిద్దరే.
అంత్య క్రీస్తు సైన్యమంతయూ హార్ మెగిద్దోను యుద్దములో దహించబడును. వారి మాంసమును పక్షులు కడుపారా భుజిస్తాయి. ( ప్రకటన 19:21)
ఇప్పటికే, హార్ మెగిద్దోనుకు సమీపంలో విచిత్రమైన పక్షులు వెలుగులోనికి వచ్చాయి. అవి టన్నులకొలదీ మాంసాన్ని జీర్ణం చేసుకోగలవట. మొదట్లో అవి సంవత్సరానికి రెండు గ్రుడ్లు మాత్రమే పెట్టేవట. కానీ ఇప్పుడైతే, సంవత్సరానికి పండ్రెండు గ్రుడ్లు పెడుతున్నాయట. అంటే, అవి హర్మెగిద్దోను కోసం సిద్ధపడుతున్నాయి. క్రీస్తు రాకడకై నీవు సిద్దపడుతున్నావా?
*అంత్య క్రీస్తు రాజ్య స్థాపన కనుచూపు మేరల్లోనే వుంది.*
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(ఎనిమిదవ భాగము)*ఇద్దరు సాక్ష్యులు:*
(Part-1)
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ముచేసి జయించి వారిని చంపును.
ప్రకటన 11:3-7
దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. దానిలో భాగంగా సంఘము ఎత్తబడిన తర్వాత ఇద్దరు సాక్ష్యులను పరలోకం నుండి భూమి మీదకు పంపించబోతున్నాడు.
ఇశ్రాయేలీయులపట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఎందుకు? పక్షపాతమా? కానే కాదు. మరెందుకు?
యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి ఏతెంచిన సమయంలో, యూదులు ఆయనను రాజుగా అంగీకరించకుండా వారి హృదయాలను కఠినం చేసింది దేవుడే. ఎందుకంటే? ఆయనను వారు రాజుగా అంగీకరించియుంటే? ఆయనను సిలువవేసే అధికారం మరెవ్వరికీ లేదు. ఆయన సిలువ వేయబడకుంటే? విమోచనా కార్యం జరుగదు. విమోచనాకార్యం జరగకపోతే? మనకు రక్షణ లేదు.
వారి హృదయ కాఠిన్యం వలన, క్రీస్తుకు పిలాతు తీర్పు తీర్చే సమయంలో “ఆ రక్తము మా మీద మాపిల్లలమీద వుండునుగాక” అని వారికి వారే శపించుకున్నారు. ఆ రక్తాపరాధాన్ని నేటికిని అనుభవిస్తూనే వున్నారు.
*క్రీస్తు రక్తాపరాధం వారిని అత్యంత దయనీయమైన స్థితికి చేర్చింది*
* మందిరం కూల్చబడింది
* రాజ్యాన్ని కోల్పోయారు
* యెరూషలేము పట్టణం సర్వనాశనం అయ్యింది.
* దేశం పాడు దిబ్బగా మారింది.
* ప్రపంచ పటములో ఇశ్రాయేల్ కు స్థానం లేకుండా పోయింది.
* అషూరీయులు, బబులోనీయులు, పారశీకులు, గ్రీకులు, రొమన్ల చేతిలో దాస్యత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది.
* ప్రపంచమంతా చెల్లాచెదురయ్యారు.
* టైటస్ పది లక్షల మంది యూదుల్ని చంపి, యెరూషలేము వీధులన్నీ, రక్తం పారించాడు.
* హిట్లర్ అరవై లక్షల మంది యూదులను ఊచకోత కోయించాడు.
ఇట్లా చెప్పుకొంటూపొతే లెక్కలేనన్ని.
అయితే, కృప గలిగిన దేవుడు వారి పట్ల తన ప్రణాళికను నెరవేర్చుతూనే వున్నాడు. దానిలో భాగంగానే సంఘము ఎత్తబడిన తర్వాత, ఏడేండ్ల శ్రమకాలంలో, వారి రక్షణార్థం ఇద్దరు సాక్ష్యులను పంపిస్తాడు.
ఇద్దరు సాక్ష్యులెందుకు? ఒక్కరు చాలరా?
నిబంధనలను స్థిరపరచు నిమిత్తము యూదులకు ఇద్దరు సాక్ష్యులు అవసరమై యున్నది. (ద్వితీ 17:6)
ఎవరీ ఇద్దరు సాక్ష్యులు?
పరిశుద్ధ గ్రంధము వారి పేర్లను ప్రస్తావించలేదు. పరిశుద్ధాత్ముడు మరుగుచేసిన వాటిని గురించి మనము మాట్లాడుకోవడం అది నిష్ప్రయోజనమే అవుతుంది. అయినా, వేద పండితులు కలిగియున్న రెండు అభిప్రాయాలను మాత్రమే మీ జ్ఞాపకములోనికి తీసుకొనివస్తాను.
ఆ ఇద్దరు సాక్ష్యులు ఏలీయా, మోషేలు అని కొందరి అభిప్రాయమైతే, ఏలీయా, హానోకు అనేది మరికొందరి అభిప్రాయము. మరి కొన్ని అభిప్రాయములున్నప్పటికీ ఈ రెండు ప్రాముఖ్యమైనవి.
ఏదిఏమైనప్పటికీ ఎక్కువ శాతం, ఆ ఇద్దరిలో ఏలీయా ఒకరు అనే విషయాన్ని మాత్రం తప్పక అంగీకరిస్తారు. దానికి గల కారణాలేంటి?
1. ఇద్దరు సాక్ష్యులకు తమ ప్రవచన కాలమందు వర్షము పడకుండా చేయుటకు వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)
* ఏలియా కూడా ఆలాగు చేసెను. (1రాజులు 17:1, యాకోబు 5:7)
2. తమకు కీడు చేయువారిని నోటనుండి వచ్చు అగ్ని చేత నశింపచేయగలరు. (ప్రకటన 11:5)
• ఏలియా ఆకాశము నుండి అగ్నిని దింపినాడు.
అందుకు ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
( 2రాజులు 1:10,12)
3. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. (మలాకీ 4:5)
4. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై *ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై* ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను. (లూకా 1:16,17)
దీని ఆత్మీయ అర్ధము యోహాను అయ్యున్నప్పటికీ, అక్షరార్ధముగా ఏలీయాయై యున్నది.
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. (యోహాను 1:19-21)
5. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; (ప్రకటన 11:12)
* ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను:
వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. (2రాజులు 2:11)
6. ప్రతి ఒక్కడు ఒకసారి మరణించవలెనని నిబంధన ప్రకారము ఏలీయా మరల వచ్చి, మరణించవలెను అనే అభిప్రాయం అనేకమందిలో వుంది.
(హెబ్రీ 9:27)
ఈ విషయాలన్నీ చదువుతుంటే, ఇట్లా జరుగుతుందంటావా? అనే సందేహంతో నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చెయ్యొద్దు. నోవహు కాలంలో కూడా అదే జరిగింది. ఫలితం ఏంటో తెలుసుకదా?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(తొమ్మిదవ భాగము)*ఇద్దరు సాక్ష్యులు:*
(Part-2)
ఇద్దరు సాక్ష్యులలో ఒకరు ఏలీయా అయితే, మరొకరో మోషే అనే అభ్కిప్రాయం కొందరిలో వుంది. దానికి గల కారణాలు:
1. ఇద్దరు సాక్ష్యులకు నీటిని రక్తముగా మార్చుటకు అధికారము గలదు. (ప్రకటన 11:6)
* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. (నిర్గమ 7:17,24; 8:11)
2. ప్రతీ విధమైన తెగుళ్లతో భూమిని శ్రమ పెట్టగలరు ( ప్రకటన 11:6)
* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.
(నిర్గమ 7, 8 అధ్యాయములు)
* మోషే, ఏలీయాలు రూపాంతరం కొండపైన ప్రభువు మరణ విషయములను గూర్చి మాటలాడిరి. (లూకా 9:30, మత్తయి 17:3)
* పునరుత్తానమును గూర్చి ప్రకటించింది వీరిని నమ్ము చున్నారు. ( లూకా24:4,7)
* ప్రభువు తిరిగి వచ్చునని ప్రకటించినవారు వీరి యుండాలి. (అపో 1:10,11)
* కనుక వీరు మహాశ్రమల కాలంలో వచ్చి, ప్రభువు రాకడను గురించి, వెయ్యేండ్ల పరిపాలనను గురించి ప్రకటించ వచ్చునని నమ్ముచున్నారు.
* మోషే ధర్మ శాస్త్రమును యిచ్చినాడు. , ఏలీయా ప్రవక్తలకు బారియై యున్నాడు. కావున, ఆ ఇద్దరు సాక్ష్యులు వీరి వుండవచ్చు అనే అభిప్రాయం కొందరిలో కలదు.
కొందరి అభిప్రాయం ఏలీయా, మోషేలు కాగా, మరికొందరు ఏలీయా, హానోకు అని తలంచు చున్నారు.
* హానోకు, ఏలియాలు మరణం లేకుండా కొనిపోబడ్డారు. కావున వారు మరలా వచ్చి మరణించవలెననేది వీరి వాదన.
* హానోకు, ఏలియాలు ఇద్దరూ ప్రవక్తలై యున్నారు. (యూదా 14-15)
* ఏలీయా ధర్మ శాస్త్ర యుగమునకు, హానోకు మనస్సాక్షి యుగమునకు సూచనగా యున్నారు.
Note: ప్రతీవారు చనిపోవాలన్నది దైవనియమమే. అట్లా అని, మరణించకపోతే పరలోకం లేదు అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. ఎందుకంటే? ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చి బూర ఊదినప్పుడు, సజీవులైన పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు. మరి వారు మరణించలేదు కదా? అందుచే ఏలీయా, హానోకు వచ్చి మరణించాలనే వాదన సమర్ధనీయం కాదు.
మరొకసారి ఈ విషయాన్ని మీ జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. ఆ ఇద్దరు సాక్ష్యులు ఎవరనేది మనకు ముఖ్యం కానేకాదు. దేవుడు ఎవరిని పంపిస్తే, వారు వస్తారు. వారికి అప్పగించిన భాధ్యతను నెరవేర్చి వెళ్తారు.
అయితే, మనకిప్పుడో సందేహం! ఎత్తబడిన సంఘంలో లేకపోయినా, రక్షించబడడానికి మరొక ఆప్షన్ వుంది కదా? ఇప్పుడెందుకు అంత తొందరపడటం? అయితే, ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆ దినం వరకు నేను బ్రతికే వుంటాననే గ్యారంటీ నీకుందా? ఒకవేళ, బ్రతికి యున్నామే అనుకుందాం. ఆ దినాల్లో రక్షించబడడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే? పరిశుద్ధాత్ముడు కూడా సంఘముతోనే ఎత్తబడతాడు కాబట్టి, ఇక మన మనస్సాక్షిని ఒప్పించేవారెవ్వరూ వుండరు.
అనుక్షణం నీ మనస్సాక్షి (పరిశుద్ధాత్ముడు) నీవు తప్పు చేస్తున్నావ్, నీవు తప్పు చేస్తున్నావ్ అంటూ గద్దిస్తుంటే? వాని పీక పట్టుకొని, నులిమి, చంపేసి, నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావ్. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేస్తున్నప్పుడే, మన జీవితాల్లో ఎట్లాంటి మార్పులేదే. ఇక ఆదినాలను గురించి ఆలోచించడం వెఱ్ఱితనమవుతుంది. ఇదే రక్షణ దినం. వాయిదా వెయ్యకు. వేస్తే, శిక్షనుండి తప్పించుకోలేవోమో? అది అత్యంత భయంకరం.
ఈ విషయాలన్నీ చదువుతుంటే, ఇట్లా జరుగుతుందంటావా? అనే సందేహంతో నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చెయ్యొద్దు. నోవహు కాలంలో కూడా అదే జరిగింది. ఫలితం ఏంటో తెలుసుకదా?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదియవ భాగము)*ఇద్దరు సాక్ష్యులు:*
(Part-3)
(ప్రకటన 11వ ఆధ్యా.)
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు ఎప్పుడు పంపబడతారు?*
* అంత్య క్రీస్తు రాజ్య స్థాపన అయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది.
* సంఘము ఎత్తబడిన తర్వాత, విడువబడిన సంఘానికి ఏడేండ్లు శ్రమకాలం.
* అబద్ధ ప్రవక్త అనేకమైన సూచక క్రియలను చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, అంత్య క్రీస్తే, మెస్సియా అని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
* అంత్య క్రీస్తు యూదులను, తానే మెస్సియానని నమ్మించడానికి దేవాలయములో ( సంఘము ఎత్తబడక ముందే మూడవ దేవాలయము నిర్మించబడుతుంది) బలులను, నైవేద్యములను ప్రవేశపెడతాడు.
* ఇశ్రాయేలీయులు అంత్య క్రీస్తును, మెస్సియా గా అంగీకరిస్తారు.
* ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు సంపూర్ణాధికారమిచ్చి ఇద్దరు సాక్ష్యులను భూమి మీదకి పంపిస్తాడు.
🔺 వీరెవరు?
వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు. (11:4)
* ఒలీవ చెట్లు “అభిషేకమునకు” (జెకర్యా4:3-14 ),
* దీప స్తంభములు “సాక్ష్యము చెప్పుటకు” (ప్రకటన 1:20) సాదృశ్యము.
* అనగా వీరు అభిషేకముగలిగి, శ్రమకాలములో క్రీస్తునిగురించి సాక్ష్య మిచ్చుటకు పంపబడినవారు.
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడానికి గల ముఖ్య ఉద్ధేశ్యమేమి?*
* అంత్య క్రీస్తుని ఎదిరించుటకు
* అతడు మెస్సియా కాదని, క్రీస్తు విరోధియని లోకానికి ప్రకటించుటకు.
🔺 *ఇద్దరు సాక్ష్యులకు గల అధికారాలేమిటి? *
* ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును. (ప్రక 11:5)
* తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. (ప్రక 11:6)
* వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును,
(ప్రక 11:6)
* నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. (ప్రక 11:6)
🔺 *వారెంతకాలము ప్రవచిస్తారు?*
* మొదటి మూడున్నర సంవత్సరాలు
🔺 *వీరు ఎప్పుడు చంపబడతారు?*
* మొదటి మూడున్నర సంవత్సరములు ప్రవచించడం ముగించిన తర్వాత.
🔺 *వీరు ఎవరిచేత చంపబడతారు?*
* అంత్య క్రీస్తు చేత.
వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. (11:7)
🔺 *వారెక్కడ సమాధి చేయబడ్డారు?*
* వారు సమాధి చేయబడలేదు. మూడున్నర దినములు వారి శవములు యెరూషలేము వీధుల్లో పడివుంటాయి. వాటిని ప్రపంచమంతా చూస్తూ ఆనందముతో ఒకనికొకరు బహుమానాలు పంపుకుంటారు.
అయితే, 100 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం నెరవేరడం అసాధ్యమని అనుకున్నారు. కారణం? యెరూషలేములో పడియున్న వీరి శవాలను ఇండియాలో నున్నవారు ఎట్లా చూడగలరు? సాధ్యం కానేకాదు.
కానీ, 1926 లో జాన్ లోగిచెయర్ ‘టెలివిజన్’ కనిపెట్టిన తర్వాత, అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందరికి ఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో వున్నాయి. ప్రపంచంలోని ఎక్కడి సమాచారమైనా కనురెప్పపాటులో మనకు చేరిపోతుంది. ఆ దృశ్యాలను అత్యంత స్పష్టముగా చూడగలుగుతున్నాము. పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడినది అక్షరాలా నెరవేరుతుంది. సందేహం లేనేలేదు.
🔺 *ఇద్దరు సాక్ష్యులు మరణిస్తే? ప్రజలకెందుకు ఆనందం?* (11:10)
వీరు అంత్య క్రీస్తు, మెస్సియా కాదని నిరూపించడం కొరకు వర్షాలు పడకుండా చేస్తారు. నీటిని రక్తముగా మారుస్తారు. అనేక తెగుళ్లను రప్పిస్తారు. ఇట్లా అనేకమైన సూచక క్రియలు చేస్తారు. దానితో ప్రజలంతా చాలా ఇబ్బంది పడతారు. ప్రజల దృష్టిలో వీరు దుర్మార్గులు. అంత్య క్రీస్తు అయితే, మొదటి మూడున్నర సంవత్సరాలు శాంత మూర్తిగా వ్యవహరిస్తాడు కాబట్టి. అంత్య క్రీస్తు పట్ల సద్భావము కలిగియుంటారు.
🔺 *వీధులలో పడియున్న, వీరి శవములు సంగతేమిటి?* ( 11:11-13)
* మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి;
* వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
* అప్పుడుఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి;
* వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
* ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను.
* ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి.
* మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
🔺 *యేసు క్రీస్తుకు, ఇద్దరు సాక్ష్యులకు మధ్య గల సారూప్యము:*
* యేసు క్రీస్తు పరిచర్య కాలము మూడున్నర సంవత్సరాలు.
* అనేక అద్భుతాలు చేశారు.
* యెరూషలేములో మరణించారు.
* మూడవ రోజు పునరుద్ధానం.
* ప్రభు లేచినప్పుడు గొప్ప భూకంపం.
* ఆరోహణము
* యేసు క్రీస్తు పునరుత్తానము తర్వాత అనేకులు రక్షించబడుట.
ఈ సంభవాలన్నీ ఇద్దరు సాక్ష్యులు విషయంలో కూడా నెరవేరుతాయి. (ప్రకటన 11వ అధ్యా)
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడం వలన కలిగిన ప్రయోజనమేంటి?*
* 144000 మంది ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. (ప్రక 7:4)
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదకొండవ భాగము)*ఇరువది నలుగురు పెద్దలు* :
సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
ప్రకటన 4:4
“ఇరువది నలుగురు పెద్దలు” ఎవరు అనేది, పరిశుద్ధగ్రంధములో స్పష్టమైన ఆధారాలేమీ లేవు. పరిశుద్దాత్ముడు వీరిని మరుగుచేసాడు. అయితే, వేద పండితులలో కొన్ని అభిప్రాయములున్నాయి. వారితో మనము ఏకీభవించాల్సిన అవసరం లేదు. వారెవరో తెలుసుకొనే ప్రయత్నం చెయ్యకపోయినా కలిగే నష్టం కూడా ఏమిలేదు. ఒక్కటి మాత్రం వాస్తవం పరలోకంలో ఇరువది నలుగురు పెద్దలున్నారు. దానిని విశ్వసిస్తే చాలు.
*వేదపండితుల అభిప్రాయములలో కొన్ని: *
🔺 1. *ఇరువది నలుగురు యాజకులు:*
రాజైన దావీదు, తన ఏలుబడిలో యాజక ధర్మం నిర్వహించుటకుగాను ఇరవై నాలుగు తరగతులుగా విభజించారు. ఆ ఇరవై నాలుగు మంది యాజకులే, ఈ ఇరవై నలుగురు పెద్దలు. ఇదే వాస్తవమైతే, నూతన నిబంధన పరిశుద్ధులెవరికీ వీరిలో స్థానం లేనట్లే కదా? ఈ వివరణ అంత ఆమోదయోగ్యము కాదు.
🔺 2. *పండ్రెండు మంది ఇశ్రాయేలీయుల గోత్రికులు, పండ్రెండు మంది అపొస్తలులు: * (12+12=24)
ఈ అభిప్రాయముతో అనేకులు ఏకీభస్తున్నప్పటికీ, అనేక భిన్నాభిప్రాయములు కూడా వున్నాయి.
* అప్పటికి ఇంకా సంఘము ఎత్తబడలేదని, కేవలం జరుగబోవు వాటిని మాత్రమే యోహాను గారు చూస్తున్నారని, సంఘము ఎత్తబడకుండా ఈ ఇరువది నలుగురు పరలోకానికి ఎట్లా వెళ్లారని, ప్రశ్నించేవారు అనేకులు.
* పండ్రెండు మంది అపొస్తలులు అక్కడ వుండి వుంటే? ఈ పరలోక దర్శనం చూస్తున్న యోహాను గారు కూడా అపొస్తలుడే కదా! అయితే, అతని స్థానమెక్కడ అంటూ ప్రశ్నించే వారు కూడా అనేకులు
🔺 3 *నూతన నిబంధన కాలమునకు చెందినవారు:*
కొందరి అభిప్రాయమేటంటే, వారంతా నూతన నిబంధనా కాలమునకు చెందినవారేనని. దానికి గల వారికున్న ఆధారము. “ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.” ( ప్రకటన 2:10)
అంటే, వీరికి కిరీటాలున్నాయి కాబట్టి, అప్పటికే క్రీస్తు న్యాయపీఠ సింహాసనము తీర్పు జరిగిపోయింది. అనేది కొందరి అభిప్రాయముగా వుంది. ఇదే వాస్తవమైతే? పాతనిబంధనా భక్తులకు చోటెక్కడిది?
🔺 4 *దేవదూతలు:*
కొందరు ఆ ఇరువది నలుగురు పెద్దలు దేవదూతలే అనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, ఎక్కువమంది వీరితో విభేదిస్తారు.
*కారణములు:*
ఈ ఇరువది నలుగురు పెద్దలు, ఇరువది నాలుగు సంహాసనములై ఆసీనులైయున్నారు. (కూర్చొని యున్నారు).
* కానీ, పరిశుద్ధ గ్రంధములో దూతలు “కూర్చున్న సందర్భం” ఎక్కడా కనిపించదు.
* సింహాసనంపై కూర్చునే అధికారం దేవదూతలకు దేవుడు ఇవ్వలేదు. సింహాసం కోసం ప్రాకులాడిన లూసిఫర్ పడద్రోయబడిన విషయం మనకు తెలిసిందే. (సింహాసనము మీద కూర్చొని, దేవదూతలు సహితం తీర్పు తీర్చే అధికారం మనుష్యులకే ఇవ్వబడింది.)
* దేవదూతలలో ప్రధాన దూతలు, పరిశుద్ధ దూతలు, దూతలు ఇట్లా కొన్ని విభాగాలున్నాయి గాని, “పెద్దలు అనబడే దూతలు” ఎవ్వరూ లేరు.
🔺 5. *ప్రత్యేకమైన పరలోక జీవులు:*
మెల్కీసెదకు ఎట్లా ఆది, అంతము లేనివాడై , ప్రత్యేకమైన వాడుగా వున్నాడో, అట్లానే, పరలోకంలో వుండుట కొరకు వీరిని దేవుడు ప్రత్యేకముగా సృష్టించాడు. అనే అభిప్రాయం కొందరిది. అయితే, న్యాయ తీర్పు సమయమందు పరలోకములో ఏ జీవి అయిననూ సింహాసనములో కూర్చోబెట్టుట వేదవాక్యమందు లేదనేది మరికొందరి వాదన.
వీటిలో ఏ ఒక్క అభిప్రాయాన్ని కూడా పరిశుద్ధ గ్రంధం నిర్ధారించలేదు. గనుక, పరిశుద్ధాత్ముడు మరుగు చేయబడిన విషయాలను విడచి, తేటతెల్లం చేసిన విషయాలను మన జీవితానికి అన్వయించుకొని, ఆ న్యాయ తీర్పు నుండి తప్పించబడం మనజీవితాలకు ధన్యకరం.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పండ్రెండవ భాగము)*నాలుగు జీవులు * :
మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసన మునకు మధ్యను సింహా సనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
ప్రకటన 4:6-8
* పరలోకంలో నాలుగుకు రెక్కలు, లోపటను, బయటకు కన్నులు కలవు (వాటి బుద్ధి, శక్తియు, త్రికాల సంభవాలను గ్రహించే దివ్యశక్తికి సూచనయై వున్నది). (ప్రక 4:6,8)
* ఈ నాలుగు జీవులు నిరంతరము దేవునిని ఆరాధించుచున్నారు. (ప్రక 4:8; 5:8; 9:14, 7:11,12, 19:4)
* దేవుని ఉగ్రత భూమి క్రుమ్మరించుటకు, గుఱ్ఱముల మీద ఆశీనులైన వారిని పిలచుచున్నారు. (ప్రక 6:1,3,5,7)
* పరలోకములో ఒక జీవి దేవుని ఉగ్రత పాత్రను ఒక దూతకు ఇచ్చుచున్నాడు. (ప్రక 15:7)
🔺 *నాలుగు జీవులు ఎవరనగా?*
దైవ సింహాసనముయొక్క కావలి వారును, పరిచర్య చేయువారునై యున్నారు.
* పరిశుద్ధ గ్రంధము నందు ప్రప్రధమముగా కనిపించే కెరూబులే (ఆది 3:24) ఆ నాలుగు జీవులు అని నమ్మబడుచున్నది. అంటే? ఆ నాలుగు జీవులు “కెరూబులు”
* యెహెఙ్కేలు దర్శనములో ఈ నాలుగు జీవులను చూచెను. (యెహెఙ్కేలు 1:5-68)
* యెషయా ప్రవక్త, దేవాలయమునందు సెరాపులను, పరలోక జీవులను దర్శించెను. (యెషయా 6:1,4)
🔺 *నాలుగు జీవుల ఆకారము:*
* మొదటి జీవి సింహమువంటిది;
* రెండవ జీవి దూడవంటిది;
* మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది;
* నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది
🔺 ఈ నాలుగు జీవుల ఆకారములను అనేకులు అనేకమైన విధానాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
కొందరి అభిప్రాయము:
* సింహము: క్రూర మృగాలకు
* దూడ: సాధు జంతువులకు
* మనుష్యుని ముఖము: మనుష్యులకు
* పక్షిరాజు: పక్షులకు
సాదృశ్యముగా ఉన్నాయని. అట్లా అయితే? జలచరముల సంగతేమిటి?
🔺 కొందరి అభిప్రాయం ప్రకారం ఈ నాలుగు జీవులు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
* సింహ ముఖము : ప్రభువు రాజై యున్నాడు (మత్తయి సువార్త)
* ఎద్దు: సేవకత్వము, క్రీస్తు దాసుడు (మార్కు సువార్త)
* మనుష్యుని ముఖము: మానవత్వము, క్రీస్తు మనుష్యుడు ( లూకా సువార్త)
* పక్షిరాజు: ఔన్నత్యము, క్రీస్తు దేవుడు ( యోహాను సువార్త)
1. ఈ జీవులు కూర్చుండుట లేదు. వీరు దైవ సింహాసనమును ఆశ్రయించి నిలుచుచున్నారు. ఇది మన జీవితాలకు మంచి మాదిరి.
2. వీరు విశ్రమించుట లేదు. వీరు నిత్యమూ పరిచర్య చేయుచున్నారు. వారికి ఈ విషయంలో సంతృప్తి కలదు. ఏ విధమైన అలసట లేదు. ఇట్లాంటి అనుభవాలు మనమునూ కలిగియుండాలి.
3. అవి భూత వర్తమాన, భవిష్యత్ కాలములలో వుండు సర్వాధికారియు, దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక చెప్పుచున్నారు. తమ్మును తాముమరచిపోయి దేవునిని ఘనపరచు చున్నారు. ఇట్లా ఆయనను ఆరాధించే అనుభవాలు మనమునూ కలిగియుండాలి.
ఆ రీతిగా మనలను మనము సిద్ధపరచుకొందాము.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదమూడవ భాగము)*ఏడు ముద్రలు-1*
👉 ఏడు ముద్రలు విప్పడానికి యోగ్యత కలిగినవారెవరు?
* గొర్రెపిల్ల ( ప్రభువైన యేసు క్రీస్తు)
👉 ఆయన ఒక్కరు మాత్రమే అట్లాంటి యోగ్యతను ఎందుకు కలిగియున్నారు?
* మృత్యువును జయించడం ద్వారా
👉 ఏడు ముద్రల గ్రంధములో ఏముంది?
* ఏడేండ్ల శ్రమ కాలములో సంభవింపబోవు తీర్పుల సమాచారముంది.
💥 *మొదటి ముద్ర*:💥
ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
ప్రకటన 6:1,2
గొర్రెపిల్ల మొదటి ముద్రను విప్పగా, నాలుగు జీవులలో ఒక జీవి, రమ్ము అంటూ, ఉరుము వంటి స్వరముతో పిలిచెను. అది యోహానును కాదు. గుఱ్ఱము మీద కూర్చున్న వానిని. గనుక, మహా శ్రమ ప్రభువు అనుమతితోనే అనే విషయం గ్రహించాలి. ఈ కృపాయుగాన్ని సద్వినియోగం చేసుకొననివారు. ఆయన న్యాయ తీర్పుకు గురికావలసిందే.
పరిశుద్దాత్ముడు సంఘముతో పాటు, ఎత్తబడెను కాబట్టి, ధర్మ విరోధి (అంత్య క్రీస్తు లేదా క్రీస్తు విరోధి) ప్రత్యక్ష మగును.
2థెస్స 2:6,7
ఇతడు తెల్లని గుఱ్ఱము మీద వస్తున్నాడు. తెలుపు సమాధానమునకు చిహ్నము కాబట్టి, ఆయన క్రీస్తు అని తలంచకూడదు. ఏడేండ్ల శ్రమ కాలంలో మొదటి మూడున్నర సంవత్సరములు క్రీస్తు విరోధి శాంతికాముకుడుగానే నటిస్తాడు.
🔺 *ఆయన క్రీస్తుకాదని చెప్పడానికి కారణములు?*
* ఆయన రెండవ ముద్ర విప్పడానికి వేరొకచోట నిలచియున్నాడు.
* ప్రభువు శిరస్సు మీద ఒక్క కిరీటం కాదు. అనేక రాజకిరీటములు కలిగియున్నవి.
* క్రీస్తు జయముపొందిన వాడుగా వున్నాడు. ఇక ఆయుధములు అక్కరలేదు.
* ముద్రలు విప్పునప్పుడు ఆయన విల్లు పట్టుకొని వస్తున్నాడంటే? ఈ సందర్భానికి ప్రతికూలం.
🔺 *క్రీస్తు విరోధి: *
* తెల్లని గుఱ్ఱము మీద వస్తున్నాగాని, అతని శాంతి ప్రణాళిక అత్యంత స్వల్ప కాలం.
* మొదట్లో అతనికి కిరీటం లేదు. తర్వాత ఇవ్వబడింది. అంటే? అంత్య క్రీస్తు సమాధాన కర్తగా ఇశ్రాయేలీయుల దగ్గర నటించి, రాజ్యాధికారాన్ని పొందగలుగుతాడు. అదే అతనికివ్వబడిన కిరీటం.
* అతడు విల్లు కలిగియున్నాడు గాని, సంధించడానికి బాణములు లేవు. అంటే? ప్రారంభములో రక్తం చిందకుండా, కుట్ర ద్వారా జయముపొందుటకు ఎత్తుగడ. వాని ఎత్తుగడ ఫలించి, ఇశ్రాయేలీయులు అతనిని మెస్సియగా అంగీకరిస్తారు.
* అతడు జయించుచు పోతున్నాడుగాని, అతని విజయం సంపూర్ణమైనది కాదు.
నేటి దినాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే చూస్తున్నాము. ఇప్పటికే “నేనే క్రీస్తును” అంటూ వందలాది మంది వచ్చిపోయారు. అసలైన వాడు (క్రీస్తు విరోధి) యుగాంతములో రాబోతున్నాడు. వాడిని ఎదుర్కోకుండా వుండాలంటే? కృపాయుగంలో రక్షించబడడం ఒక్కటే మార్గం. ప్రభువు రాకడెప్పుడో తెలియదు. మన ప్రాణం పోకడెప్పుడో తెలియదు. రక్షించబడకపోతే, ఈ రెండింటిలో ఏది జరిగినా? అది అత్యంత భయంకరం.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదునాలుగవ భాగము)*ఏడు ముద్రలు-2*
💥 *రెండవ ముద్ర:*💥
ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను.
ప్రకటన 6:3-4
గుఱ్ఱము యుద్ధమును, ఎరుపు రక్తపాతాన్ని సూచిస్తోంది. అంటే, మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుఱ్ఱము మీదవచ్చి, శాంతిని స్థాపిస్తానన్న ఆ శాంతి రాజ్యంలో, అతి స్వల్ప కాలంలోనే, అశాంతి నెలకొన్నది. యుద్దాలు, తద్వారా రక్తపాతం, మరణాలు. ఇట్లాంటి భీపత్స్యాన్ని సృష్టించే అధికారం ఈ ఎర్రని గుఱ్ఱము మీద వచ్చువానికియ్యబడినది.
💥 *మూడవ ముద్ర:*💥
ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
ప్రకటన 6: 5-6
నల్లటి గుఱ్ఱము కోపము, ఉగ్రత, అసమాధానము, కరవుకు మొదలగు వాటికి సూచన. యుద్దానంతరము కరవు సహజము. త్రాసు పట్టుకొనియుండుట మహా కరవుకు సాదృశ్యము.
*యెహెఙ్కేలు ప్రవచనమందు కొలత ప్రకారం ఆహారం భుజించుట చూడగలము.*
నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను.
అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.
యెహెఙ్కేలు 4: 10,17
*ఒక దేనారము ఒకరోజు కూలియై యున్నది.*
దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
మత్తయి 20:2
*నూనె, ద్రాక్షారసము పాడు చేయకూడదు:*
యుద్ధమునకు నూనె, ద్రాక్షారసము అవసరము. ద్రాక్షారసము గాయము కట్టుటకు వాడబడును ( లూకా 10:34)
💥 *నాలుగవ ముద్ర :*💥
ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణము వలనను, భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వారికియ్యబడెను.
ప్రకటన 6:7,8
పాండుర వర్ణముగల గుఱ్ఱము మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. ప్రభువు రాకడ సమీపించేకొలది, మరణం అధికమవుచున్నది. కరవులు, అంటువ్యాధులద్వారా ప్రజలు మరణిస్తారు. భూలోకంలోని నాలుగు వంతులలో, ఒక వంతు నాశనం చేయుటకు అతనికి అధికారం కలదు. ఎయిడ్స్, ఎబోలా, నిఫా వైరస్ ఇవన్నీ వాటిలో భాగమే. పాతాళ లోకము నోరు తెరచి యున్నది. ఖడ్గము వలనను, క్రూర మృగముల వలనను గొప్ప నాశనము సంభవించును. కరవును బట్టి, అక్రమములు జరుగును. ఆహారం, త్రాగు నీరు కోసం హత్యలు జరుగును. ఆహారం కొరకు పెంపుడు జంతువులను భక్షించిన తర్వాత, అడవి జంతువులను భక్షించే ప్రయత్నంలో అనేకమంది వాటికే ఆహారంగా మారుతారు. చివరకు మనుష్యులను చంపుకొనితినే పరిస్థితులు కూడా సంభవించవచ్చేమో? ఇవన్నీ మహా శ్రమలకు సూచనలు.
ముద్రలు విప్పబడుతున్నప్పుడు సంభవించాల్సిన సంభవాలు ఇప్పటికే సంభవిస్తున్నాయి. ఏడేండ్ల శ్రమకాలంలో తీవ్రఉగ్ర రూపం దాల్చబోతున్నాయి. వాటి నుండి తప్పించేవారు ఎవ్వరూ లేరు. సమయముండగానే, కృపా కాలం గతించిపోకముందే, క్రీస్తు రాకడో, మన ప్రాణం పోకడో ఎదో ఒకటి జరగకముందే మన జీవితాలను ఆయనకు సమర్పించగలగాలి.
సమర్పణ అంటే? *చనిపోవడం కోసం బ్రతకడం*. ఆ సమర్పణ క్రీస్తుకోసమే అయ్యుండాలి.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదిహేనవ భాగము)*ఏడు ముద్రలు-3*
💥 *అయిదవ ముద్ర*:💥
ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు--వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
ప్రకటన 6:9-11
ముందు నాలుగు ముద్రలు విప్పినప్పుడు, నాలుగు జీవులు పిలవడం జరిగింది. ఐదవ ముద్ర నుండి జీవులు పిలవడం లేదు. గుర్రాలు బయలుదేరడం లేదు. గనుక దేవుడే ఆజ్ఞనిచ్చుచున్నాడని గ్రహించవలయును. ప్రారంభములో నాలుగు ముద్రలు విప్పినప్పుడు లోకసంబంధమైన విషయాలు జరిగాయి. అయితే, ఐదవ ముద్రను విప్పగా సార్వత్రిక మతములు ఎట్లా ఉండునో అనే సూచనలు కలవు.
*బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఎవరివి?*
*దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.* వీరు క్రీస్తు సాక్ష్యులు. ఏడేండ్ల కాలంలో శ్రమలను సహించి, క్రీస్తుకొరకు హతసాక్ష్యులుగా నిలచినవారు.
వీరు సంఘము కాదు. సంఘము శ్రమలకు ముందుగానే ఎత్తబడింది.
*బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఎక్కడఉన్నాయి?*
పరలోకంలో. ఇప్పుడైతే, మరణించిన పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి. తీర్పు అనంతరం పరలోకంలో ప్రవేశిస్తారు. కానీ, శ్రమకాలంలో రక్షించబడిన వారి ఆత్మలు నేరుగా పరలోకం చేరతాయి అని గ్రహించగలము. ఎందుకంటే? అప్పటికే పరదైసు ఖాళి చేయబడింది. సంఘము ఎత్తబడింది.
*అంత్య క్రీస్తు దేవాలయములో బలిని, నైవేద్యములను నిలిపివేసేదెప్పుడు?*
అంత్య క్రీస్తు మొదటి మూడున్నర సంవత్సరాలలో దేవాలయములో బలిని, నైవేద్యమును ప్రారంభించి, కొనసాగిస్తాడు. అందుచే ఇశ్రాయేలీయులు అతనిని మెస్సియా గా అంగీకరిస్తారు. అయితే, మొదటి మూడున్నర సంవత్సరాలు గడిచాక బలిని, నైవేద్య మును నిలిపివేసి, నేనే దేవుడనని దేవాలయంలో కూర్చుంటాడు.
అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్య మును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
దానియేలు 9:27
అట్లాంటి పరిస్థితులలో శ్రమకాలంలో క్రీస్తుకొరకు సమర్పించుకున్నవారు బలి అర్పించడానికి వెళ్తే, వారందరిని అంత్య క్రీస్తు హతమార్చుతాడు. వారంతా తమ శరీరాలనే దేవుని కొరకు బలిగా అర్పించినవారని మనము గ్రహించాలి.
*హతసాక్ష్యుల ప్రార్ధన, వారు పొందుకున్న సమాధానం!*
నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
మరియు--వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
అంటే, ఇంకా హతసాక్ష్యుల లెక్క పూర్తికాలేదన్నమాట. ఇంకా క్రీస్తు కోసం హతసాక్ష్యులుగా మారాల్సిన వారున్నారు. హతసాక్ష్యుల లెక్క పూర్తయిన వెంటనే, భూనివాసులకు తీర్పు తీర్చబడును.
*హతసాక్ష్యులకు ఇవ్వబడిన తెల్లని వస్త్రములు:*
* శ్రమలలో వారి పరిశుద్ధతను కాపాడుకొనుటకు గుర్తు.
* తెల్లని వస్త్రాలు జయకరమైన జీవితానికి సూచన
జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
ప్రకటన 3:5
జయించినవారే, వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో రాజులుగాను, యాజకులుగాను వుంటారు. శరీరముతో జీవించునప్పుడు క్రీస్తు కొరకు శ్రమలనుభవించినవారు, శరీరాన్ని విడచినతర్వాత నిత్య విశ్రాంతిని అనుభవిస్తారు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదహారవ భాగము)*ఏడు ముద్రలు-4*
💥 *ఆరవ ముద్ర*:💥
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.
మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథమువలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
ప్రకటన 6:12-17
*ఆరవ ముద్ర విప్పబడినప్పుడు కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగెను.*
* భూకంపము కలిగెను.
* సూర్యుడు కంబళివలె నలుపాయెను,
* చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
* ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.
* ఆకాశమండలము చుట్టబడిన గ్రంథమువలెనై తొలగిపోయెను.
* ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
* భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొనెను
* వీరంతాకలసి తమను రక్షించమని పర్వతములను, కొండలను బ్రతిమాలుతున్నారు.
*సూర్యుడు కంబళివలె నలుపాయెను*:
మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
నిర్గమ 10:22
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. మత్తయి 27:45
1750 మే 19వ తారీఖున ఇంగ్లాండు దేశమందు ఒక చీకటి దినము కలదని చరిత్ర చెబుతుంది.
యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
యెషయా 13:9,10
ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.
యోవేలు 2:30,31
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును. మత్తయి 24:29
పైన చెప్పబడిన సంగతులు జరుగుట ఎట్లా సాధ్యమని మనకు అనిపించవచ్చు. అయితే, అంత్య దినములలో జ్ఞానము అధికమగును (దానియేలు 12 : 4 ) ప్రస్తుతము మనము న్యూక్లియర్ కాలంలోనున్నాము. అమెరికా ప్రయోగించిన అణుబాంబు హిరోషిమాను సర్వనాశనం చేసింది. సంవత్సరాలు గతించినా నేటికిని అది పూర్వ స్థితికి చేరుకోలేదు. అయితే, అట్లాంటి అణు బాంబులకంటే, పదహారు రెట్లు శక్తివంతమైనవి నేడు అమెరికా దేశం దగ్గర నున్నవి. అందుచే ఆరవ ముద్రను విప్పినప్పుడు భూమి, ఆకాశంలో సంభవింపబోయే వాటిని గురించి ఆశ్చర్య పోనవసరం లేదు.
*ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను*:
ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. నక్షత్రములు భూమికంటే ఎన్నోరెట్లు పెద్దవి. అయితే, ఇవి చిన్న నక్షత్రములై యుండవచ్చు. లేదా క్షీణించిన నక్షత్రములై యుండవచ్చు (ఆకాశ సైన్యములు క్షీణించును), 1883 సెప్టెంబర్ 13 వ తేదీన ఒక గొప్ప నక్షత్ర వర్షమే అట్లాంటిక్ సముద్ర మధ్య భాగము నుండి, ఫసిఫిక్ మహా సముద్రము వరకు కనబడెను.
*ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.*
ఇటీవల కాలంలో సంభవించిన సునామి వలన, అనేకమైన కొండలు స్థానం తప్పాయి. మరికొన్ని లేకుండా పోయాయి. కొన్ని ద్వీపాలు చెల్లాచెదురయ్యాయి. సునామి అనంతరం ప్రపంచపటంలో మార్పులు చెయ్యాల్సి వచ్చింది. రాబోయే దినాల్లో కూడా ఇట్లాంటివి సంభవించడం అత్యంత సహజం.
*తమను రక్షించమని పర్వతములను, కొండలను బ్రతిమాలుతున్నారు. *
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని వీరంతాకలసి తమను రక్షించమని పర్వతములను, కొండలను బ్రతిమాలుతున్నారు.
అంటే? ఆదినాలలో వారు అనుభవించే శ్రమ ఎంతటి ఘోరమైనదో అర్ధం చేసుకోవచ్చు. మరణాన్ని కోరుకుంటారుగాని, ఆత్మ హత్య చేసుకోవడానికి భయపడతారు. అట్లాంటి భయంకరమైన సంఘర్షణలో వారి జీవితాలుంటాయి.
ముద్రలు విప్పబడుతున్నప్పుడు సంభవించాల్సిన సంభవాలు ఇప్పటికే సంభవిస్తున్నాయి.,ఏడేండ్ల శ్రమకాలంలో ఉగ్రరూపం దాల్చబోతున్నాయి. వాటి నుండి తప్పించేవారు ఎవ్వరూ లేరు. సమయముండగానే, కృపా కాలం గతించిపోకముందే, క్రీస్తు రాకడో, మన ప్రాణం పోకడో ఎదో ఒకటి జరగకముందే మన జీవితాలను ఆయనకు సమర్పించగలగాలి.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పదిహేడవ భాగము)*ఏడు ముద్రలు-5*
💥 *ఏడవ ముద్ర*:💥
ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.
అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహా సనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
ప్రకటన 8:1-6
👉 యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను. కారణం?
* బూరధ్వని ఉగ్రత పాత్ర వలన, భూలోకమందు జరుగుచున్న అతి ఘోరమైన సంఘటనలకు సూచనగా పరలోకమందు మౌనము కనిపించు చున్నది.
👉 అర్ధగంట యని, గంటయని ఇట్లా పరలోకంలో కూడా సమయం ఉంటుందా?
* భూలోకమందు జరిగే సంభవాలను యోహానుగారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు కాబట్టి, అట్లా చెప్పారు.
👉 “నిలిచియున్న ఏడుగురు దూతలు” అంటే, వీరు వారికప్పగింపబడిన పని చెయ్యడానికి సిద్ధంగా వున్నారు.
సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
కీర్తనలు 141:2
దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?
లూకా 18:7
నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి
కీర్తనలు 56:8
ఏడవ ముద్రను విప్పినప్పుడు, పరిశుద్ధుల ప్రార్ధనలన్నియు, ప్రభువు సన్నిధికి చేరి, భూలోకమునకు తీర్పు తీర్చునట్లుగా మనము చూస్తున్నాము. అంటే, మనము చేసే ప్రార్ధనలు ఎన్నటికీ వృధాకాదు. పరిశుద్ధుల ప్రార్ధనల ఫలితమే తర్వాత ఏడు బూరలు ఊదినప్పుడు సంభవించే న్యాయ తీర్పులుగా గ్రహించగలము.
నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
యిర్మియా 9:1
అవును! మన ప్రార్ధనలు అద్భుతమైన కార్యాలు చేయగలవు. ప్రార్ధించే జీవితాన్ని కలిగియుండి, ప్రభు రాకడకై మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పద్దెనిమిదవ భాగము)*మొదటి బూర*:
మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
ప్రకటన 8:7
దేవుడు మానవ పాపములను బట్టి, తీర్పు తీర్చడం ప్రారంభమయ్యెను. గతంలో కూడా ఇట్లాంటి శిక్షలు జరిగినట్లు లేఖనముల ఆధారంగా తెలుసుకోగలం.
యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును. .....
అయితే ఐగుప్తీ యులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.
నిర్గమ 7:17,24
యెహోవానీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను. .......
అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.
నిర్గమ 9:22,26
*సొదోమీయుల మీద అగ్ని గంధకములు కురిసెను.*
యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.
ఆది 19:24,25
*మహా శ్రమలకాలంలో కూడా ఇట్లానే జరుగబోతోంది.*
ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను.
యోవేలు 2:30
పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
అపో. కా 2:19
*భూలోకము అందులోని సమస్తమూ అగ్నిద్వారా కాలిపోవును.*
అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును.
ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
2 పేతురు 3:10,11
గతంలో జరిగిన సంభవాలే, భవిష్యత్ లోనూ జరుగబోతున్నాయి. ఆ సమయంలో భూమి మూడవ భాగం కాలిపోవుచున్నది. చెట్లలో మూడవ భాగం కాలిపోవుటవలన, తినడానికి పండ్ల కొరత కలుగును. ఆక్సిజన్ తగినంత లేకపోవడం వలన, మనము విడిచిన గాలి మనమే పీల్చుకోవడం వలన, అనేక వ్యాధులకు గురికావలసి వస్తుంది. చెట్లు కాలిపోవడం వలన, సకాలంలో వర్షాలు పడవు. వర్షాలు లేకపోవడం వలన పంటలు పండవు. ఆహారపు కొరతవలన ఆకలి చావులు సంభవిస్తాయి.
పచ్చగడ్డి కాలిపోవుట వలన, పశువులకు తగినంత ఆహారంలేక, మరణిస్తాయి. పశువులనుండి లభించే ఉత్పత్తులు లేకపోవడం వలన, వాటిని ఉపయోగించేవారు చాలా ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. వాటిపై ఆధారపడి జీవించే కుటుంబాలు అస్తవ్యస్తమవుతాయి. ఈ రీతిగా మొదటి బూర ఊదినప్పుడు అనేక నష్టాలు, కష్టాలు సంభవిస్తాయి.
ఆ దినాలు అత్యంత భయంకరం. ఇవన్నీ వాస్తవాలేనా? అని సందేహించే ప్రయత్నం చెయ్యొద్దు. నోవహుకాలంలో అట్లానే చేశారు. అడ్రస్ లేకుండా పోయారు. దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకుందాం. సమయముండగానే ప్రభువును వేడుకుందాం!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(పంతొమ్మిదవ భాగము)*రెండవ బూర*:
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
ప్రకటన 8:8,9
మొదటి బూర ఊదినప్పుడు *భూమి* మీద శ్రమ సంభవించింది.
రెండవ బూర ఊదినప్పుడు *సముద్రము* మీద శ్రమ సంభవించింది.
*అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను.*
* ఒక పెద్ద నక్షత్ర గోళము మధ్యధరా సముద్రములో పడునని ఖగోళ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుచున్నారు.
*నీరు రక్తముగా మారుట:*
యెహోవా మోషేతో ఇట్లనెనునీవు అహరోనుతోనీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను....... అయితే ఐగుప్తీ యులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.
నిర్గమ 7:19,24
*భయంకరమైన కొండవంటిది సముద్రములో పడుటవలన విస్తారమైన అలల తాకిడికి ఓడలు మునిగిపోవును.*
* చేపలు, జలచరములన్ని చచ్చును.
* తద్వారా అనేకమైన ఆరోగ్య సమస్యలు.
* ఆహార సమస్య పెరుగును
* సముద్ర వ్యాపారానికి తీవ్ర నష్టము సంభవించును.
* సముద్రముపై ఆధారపడి జీవనం చేసేవారి కుటుంబాలు అస్తవ్యస్తమవుతాయి.
*మూడవ బూర*:
మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గల మీదను పడెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
ప్రకటన 8: 10,11
* మొదటి బూర ఊదినప్పుడు *భూమి* మీద శ్రమ సంభవించింది.
* రెండవ బూర ఊదినప్పుడు *సముద్రము* మీద శ్రమ సంభవించింది.
* మూడవ బూర ఊదినప్పుడు *నదులు, నీటి బుగ్గల* మీద శ్రమ సంభవించింది.
ఈ కాలంలో నదులను దేవతలుగా ఆరాధించువారు కలరు. ఈ దేవతలు దేవుని తీర్పు ఎదుట శక్తి హీనులగుదురు.
సైన్యములకధి పతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.
యిర్మియా 9:15
సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లను గూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చు చున్నాను.
యిర్మియా 23:15
నక్షత్రము కాలిపోవుచున్నందున కలుగు విషవాయువు వలన నీళ్లు చేదగును.
* దేవుడు ఐగుప్తుపై కోపించినప్పుడు, నీటిని రక్తముగా మార్చి, వాటిని త్రాగించెను.
* దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపించినప్పుడు చేదు కూరలు తినిపించి, చేదు నీళ్లు త్రాగించెను.
* భవిష్యత్ లో రక్షించబడని వారిచేత చేదు నీరు త్రాగిస్తాడు. దాని ఫలితం? మరణము.
“చేదు” దేవుని ఉగ్రతను సూచిస్తుంది. ఆయన ఉగ్రతను భరించడం సాధ్యంకానేకాదు. ఉగ్రతనుండి తప్పించబడాలంటే? నేడే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలగాలి. వాయిదాలు వద్దు. ఇంతవరకు వేసినవి చాలు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(ఇరువదియవ భాగము)*నాలుగవ బూర*:
నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
ప్రకటన 8:12
* మొదటి బూర ఊదినప్పుడు *భూమి* మీద శ్రమ సంభవించింది.
* రెండవ బూర ఊదినప్పుడు *సముద్రము* మీద శ్రమ సంభవించింది.
* మూడవ బూర ఊదినప్పుడు *నదులు, నీటి బుగ్గల* మీద శ్రమ సంభవించింది.
* నాలుగవ బూర ఊదినప్పుడు, సూర్య చంద్ర, నక్షత్రముల ద్వారా శ్రమ సంభవించెను.
*నాలుగవ దూత బూర ఊదినప్పుడు:*
* సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మును.
* పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండును.
* రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండును.
ఇవి మన ఊహకు అందని విధంగా నున్నప్పటికీ, ఇవన్నీ ఇంతకు ముందు సంభవించినవే.
* ఐగుప్తులో మూడు దినాలు చిమ్మ చీకటి కలిగెను.
* యేసు క్రీస్తు సిలువలోనున్నపుడు దేశమంతటా మూడు గంటలు చీకటి కమ్మెను.
* శ్రమకాలంలో కూడా ఇదే జరగబోతుంది. ఇంతకు ముందు జరిగినవే మరలా జరగబోతున్నాయి. లేదంటే ఈసారి తీవ్ర ఉగ్ర రూపాన్ని దాల్చబోతున్నాయి. వాటికి తాళగలిగినవాడు ఎవ్వరూలేరు.
*ప్రభువు చెప్పకుండా ఏమీ చెయ్యడు. చెప్పినదానిని చెయ్యకుండా వుండడు.* ఇట్లాంటి సంభవాలు జరుగునని పరిశుద్ధ లేఖనాలు ముందుగానే తెలియజేశాయి.
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.
ప్రకటన 6:12,13
ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
యెషయా 13:10
ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
యోవేలు 2:2
యెహోవా దినము రావలెనని ఆశపెట్టు కొనియున్న వారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.
ఆమోసు 5:18
యెహోవా దినమంటే?
అది వెలుగు కాదు. అంధకారం.
అయితే, కృపాకాలంలో నీవు రక్షించబడితే, ఆ దినము మహానందమే. అట్లా కాకుండా, ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తే? అది ఘోరమైన గాఢాంధకారము.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( 21వ భాగము)*ఐదవ బూర*: (part-1)
అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి, స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
ప్రకటన 9: 1-11
A. *ఆకాశమునుండి భూమిమీద రాలిన నక్షత్రము*:
ఈ నక్షత్రము వాస్తవమైనది కాదని, ఒక వ్యక్తిని సూచించేదిగా వుందని గ్రహించగలము. కారణం? ఆ నక్షత్రమును తర్వాత వచనాలలో “అతడు” అని సంబోధించడం జరిగింది. ఒకవేళ వాస్తవికమైన నక్షత్రమైతే? “అది” అని సంబోధించబడాలి.
ఎవరీ నక్షత్రం?
కొందరి అభిప్రాయం ప్రకారం “యేసు క్రీస్తు” అని, మరి కొందరి అభిప్రాయం ప్రకారం “సాతాను లేదా సాతాను సంబంధియని.” వ్రాయబడి వున్న మాటలుబట్టి “సాతాను లేదా సాతాను సంబంధియని” గ్రహించగలము.
తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
యెషయా 14:12
యేసు ప్రభువు కూడా సాతాను మెరుపువలే క్రిందపడినట్లు చూచితినని చెప్పెను.
“ఆయన సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని.”
లూకా 10:18
B. *అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.*
అగాధము అంటే?
అడుగులేని గోతులు
అగాధము ఎక్కడ వుంది?
మృతులలోకంలో
మృతులలోకం ఎక్కడ :
భూమి క్రింద అడుగుభాగంలో వుంది.
ప్రాముఖ్యముగా ఐదు భాగాలు.
1. *పరదైసు* (చెర, అబ్రాహాము రొమ్ము )
(లూకా 16:26)
పాతనిబంధనా పరిశుద్ధుల ఆత్మలు వుండే స్థలము. ప్రస్తుతము ఈ పరదైసు మృతులలోకంలో లేదు. యేసు ప్రభువు పునరుత్తానం చెందినప్పుడు చెరను, చెరగా తీసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం మూడవ ఆకాశములో పరదైసు వున్నట్లుగా లేఖనాలనుండి గ్రహించగలము.
( 2కొరింథీ 12:1-4)
2. *పాతాళం:*
పాపాత్ముల ఆత్మలు యాతన పొందే స్థలం.
3. *అగాధం:*
పరదైసుకు, పాతాళానికి మధ్యలో వుండే స్థలం. వెయ్యేండ్ల పరిపాలనకు ముందు వెయ్యి సంవత్సరాలు సాతాను ఈ అగాధంలోనే బంధించబడతాడు. వెయ్యేండ్లు గడిచాక మరికొద్దికాలం విడచిపెట్టబడతాడు.
4. *కఠిక చీకటి బిలము:*
దేవుని చేత నెట్టివేయబడిన దూతలు తీర్పుకోసం భద్రపరచబడిన స్థలం.
(2 పేతురు 2:4, యూదా 6వ)
5. *నరకం:*
పాపులు, మహా ధవళ సింహాసనపు తీర్పు అనంతరం నిత్యమూ యాతనపడే అగ్నిగుండము.
అగాధముయొక్క తాళపుచెవి భూమి మీద రాలిపడిన నక్షత్రానికి ఇవ్వబడ్డాయి. వాస్తవానికి అగాధము యొక్క తాళపు చెవులు ప్రభువు ఆధీనంలో వున్నాయి.
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
ప్రకటన 1:18
అయితే,ఈ ప్రత్యేకమైన సందర్భములో దూతకు ఇవ్వబడ్డాయి. అంటే, శ్రమను దేవుడే అనుమతిస్తున్నాడనే విషయం గ్రహించగలము. ఆయనే అనుమతిస్తే? ఇక మనలను రక్షించేదెవరు?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( 22వ భాగము)*ఐదవ బూర*: (part-2)
అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి, స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
ప్రకటన 9: 1-11
C. *పొగ*:
*పాతాళం నుండి వచ్చిన పొగచేత సూర్యుడు, ఆకాశం చీకటి కమ్మెను.*
దీనికి రెండు అభిప్రాయములున్నవి.
1. వాస్తవికమైన పొగ
2. శ్రమ కాలంలో సాతాను చేయు దుర్భోధ. ఆ కాలంలో క్రీస్తు విరోధియే దేవుడు అనే బోధ అంతటా వ్యాపిస్తుంది. ఇదే పొగ కావచ్చు అనే అభిప్రాయం కొందరిది.
అయితే, ఇట్లాంటి సంభవాలు యుగాంతములో సంభవిస్తాయని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోవేలు ప్రవక్త ప్రవచించెను.
ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది
మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను.
యోవేలు 2:2,10,30
పరిశుద్ధ గ్రంథములోని వ్రాయబడిన విషయాల నెరవేర్పు నీ ఊహలకు సహితం అందకపోవచ్చు. కానీ, అవి సున్నైననూ, పొల్లయిననూ తప్పిపోవు. ఇప్పటికే జరిగిపోయినవి అనేకం. జరగాల్సినవి కొన్ని మాత్రమే. కానీ అవి అత్యంత భయంకరం. వాటినుండి తప్పించబడాలి అంటే? ప్రభు పాదాల చెంత చేరడమే మన ముందున్న మార్గము.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
( 23వ భాగము)*ఐదవ బూర*: (part-3)
అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి, స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
ప్రకటన 9: 1-11
D. *మిడతలు*:
ఇవి వాస్తవికమైన మిడతలు అనేది కొందరి అభిప్రాయమైతే? కాదు, అగాధమునుండి వచ్చే దురాత్మల సమూహం అనేది మరికొందరి అభిప్రాయం.
1. *పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను:*
మిడతలు అగాధములోనుండి వచ్చినట్లు వ్రాయబడలేదు. అగాధంలోనుండి పొగ వచ్చింది. ఆ పొగలోనుండి మిడతలు పుట్టాయని గ్రహించగలము.
2. *భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.*
నాశనము చేయు ఆయుధముగా ఈ మిడతలు వున్నాయి. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.(కీర్తనలు 78:46)
3. *నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకు మాత్రమే హాని చేసే అధికారం:*
మిడతలు సస్యములను మాత్రమే పాడు చేస్తాయి. కానీ ఈ మిడతలు గడ్డి, మొక్కలు, వృక్షాల వంటి సస్యముల జోలికి వెళ్లనే వెళ్లవు. ఇవి ఎవరైతే శ్రమకాలంలో దేవుని దూతచేత ముద్రింపబడలేదో వారికి మాత్రమే హాని చేస్తాయి.
4. *మిడతలకు మనుష్యులను చంపే అధికారం లేదు.*
ఎవరైతే, శ్రమకాలంలో తమ నొసళ్లయందు దేవుని చేత ముదిరింపబడలేదో, వారిని మాత్రమే ఐదు నెలలపాటు తీవ్రంగా బాధించే అధికారం కలిగివున్నాయి. వారి ప్రాణములపై వీటికి ఎట్లాంటి అధికారమియ్యబడలేదు. ఇవి కుట్టినప్పుడు, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. వాటి బాధను భరించలేక, చనిపోవాలనే తలంపు పుట్టి, మరణాన్ని వెదకినప్పటికీ, మరణం వారి నుండి పారిపోతుంది. అంటే, చనిపోవాలని సింహం నోట్లో వ్రేలుపెట్టినా, అది వీరినేమీ చెయ్యదు. వీరిని చూచి అదే పారిపోతుంది.
5. *మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి.*
యుద్దానికి సిద్దమైన గుర్రాలు ఏరీతిగా వీరవిహంగం చేయడానికి సిద్ధంగా వుంటాయో, అట్టి రీతిగానే దేవుని చేత ముద్రింపబడని వారికి, ఐదు నెలలపాటు తీవ్రమైన హానిచెయ్యడానికి సిద్ధంగా వున్నాయి.
6. *బంగారమువలె మెరయు కిరీటముల వంటివి వాటి తలలమీద ఉండెను*
“కిరీటములు” వాటికివ్వబడిన అధికారాన్ని సూచిస్తుంది. దేవుని చేత ముద్రింపబడని వారికి, ఐదు నెలలపాటు తీవ్రమైన హానిచెయ్యడానికి అధికారం కలిగివున్నాయి.
7. *ముఖములు మనుష్య ముఖముల వంటివి:*
ఎవరు ముద్రించబడిరో, ఎవరు ముద్రించబడలేదో గ్రహించడానికి మనుష్యునికి ఇవ్వబడిన జ్ఞానము వంటి జ్ఞానము వాటికి ఇవ్వబడెను.
8. *స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను.*
ఆకర్షించే శక్తి వాటికుంది. ఆకర్షణీయంగా ఉన్నాయని ముద్రింపబడని వారు వాటివైపు చూస్తే, హఠాత్తుగా దాడి చేస్తాయి.
9. *వాటి పండ్లు సింహపు కోరలవంటివి:*
సింహపు కోరల్లో పడిన వ్యక్తి ఏ రీతిగా తప్పించుకోలేడో, అట్లానే అంతటి పటిష్టమైన కోరలు వాటికున్నాయి.
10. *ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను.*
ఇనుప కవచములను పోలిన కవచాలు వాటికున్నాయి. వాటికి ఐదు నెలల వరకూ ఎవ్వరూ ఎట్లాంటి హాని తలపెట్టలేరు.
11. *వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను*
వాటి రెక్కలనుండి వచ్చే శబ్దం, యుద్దాలలో గుర్రం పరుగెడుతున్నప్పుడు వచ్చే శబ్దంలా ఉంటుంది. అంటే, ఆ మిడతలు దాడిచెయ్యడానికి ఎంత వేగంగా దూసుకుపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
12. *అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.*
ఐదు నెలల పాటు అవి భూమి మీద విధ్వంసం సృష్టిస్తాయి. ఈ కాలంలో వాటి చేత బాధించబడడమే తప్ప, ఎవ్వరూ వాటికి హాని చెయ్యలేరు.
13. *పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు:*
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.
సామెతలు 30:27
కానీ, ఏడేండ్ల శ్రమకాలంలో వచ్చే మిడతలు రాజు వున్నాడు. హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
ఒక్క మిడతలు సృష్టించే విధ్వంసమే అట్లా వుంటే, ఆ దినాలలో ఎదుర్కోవలసిన బాధలు వర్ణనాతీతం. ఇదొక కట్టు కథలా తీసిపారేస్తే, నిత్యమూ రోధనే. అగ్ని ఆరదు. పురుగు చావదు. ఏడ్పు, పండ్లుకొరుకుట అదొక్కటే పని. అది మన ఊహలకు కూడా అందదు. వద్దు! సమయముండగానే ప్రభువు పాదాల చెంత చేరుదాం!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(24వ భాగము)*ఆరవ బూర*:
ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని. మను ష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి. గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱ ములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.. ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధక ములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను, ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.
ప్రకటన 9: 13-20
🔺 *సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి స్వరము* :
కొమ్ములు మాట్లాడతాయా?
దానికేమి ఆశ్చర్యపోనవసరం లేదు. సెల్ ఫోన్ లు, రేడియో, టీవీ లు జీవంలేకపోయినా అవిమాట్లాడుతున్నాయి కదా? కొమ్ములే కాదు, పాద దూళి, రాళ్లు, రప్పలు, దూలములు కూడా మాట్లాడతాయి.
ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.
మార్కు 6:11
గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యు త్తర మిచ్చుచున్నవి.
హబక్కూకు 2:11
🔺 *యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుము.*
యూఫ్రటీసు నది టర్కీ, సిరియా, ఇరాక్ ల గుండా పారుతూ పర్షియన్ సముద్ర శాఖలో అంతమవుతుంది.
“బంధింప బడియున్న నలుగురు దూతలు” వారు దేవుని అనుమతి లేకుండా వారేమి చర్యతీసుకోలేరని స్పష్టమవుతుంది. అయితే, న్యాయతీర్పుకు వారి పనిని కొనసాగించడానికి విడచిపెట్టబడుతున్నారు. (అనుమతించబడుతున్నారు)
🔺 *అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.*
ప్రతీదానికి దేవుడు ఒకసమయాన్ని నిర్ణయించాడు.
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు;
అపో. కా. 1:7
🔺 మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెను.
ప్రస్తుతమున్న ప్రపంచ జనాభారీత్యా , మూడవ వంతు అంటే? రెండు వందల కోట్లకు పైగానే. ఇంత మందిని సంహరించాలంటే? శక్తివంతమైన ఆయుధాలు అవసరం. అయితే, ఇప్పటికే ప్రపంచదేశాల అంబులపొదిలో శక్తివంతమైన న్యూక్లియర్ అణ్వస్త్రాలు సిద్ధంగా వున్నాయి.
🔺 *గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు:*
ఆరవ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీసు నది వద్ద నుండి విడచిపెట్టబడిన దూతలు ఇరవై కోట్లమంది గుర్రపు రౌతులను సమకూర్చగా, యుద్ధము జరుగును. ఆ యుద్దములో మనుష్యులలో మూడవ భాగము నశించిపోతారు.
🔺 *గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి:*
“సింహపు తలలు” అంటే? జరుగబోవు యుద్దములో పాల్గొనే యుద్ధ ట్యాంక్ లకు సాదృశ్యము అనే అభిప్రాయం వుంది.
🔺 *వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను*
“అగ్ని, ధూమ గంధకములు” జరుగబోవు యుద్దములో ప్రయోగింపబడే న్యూక్లియర్ బాంబులు సాదృశ్యములుగా నున్నవని అనేకులా అభిప్రాయం. ఇట్లాంటి బాంబులు ప్రయోగిస్తే, మూడు నెలల వరకూ పొగ నిలిచి వుంటుందట. ఒక్కసారి ఊహించండి. జీవితం ఎంత దుర్భరంగా వుండబోతుందో?
🔺 *వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.*
“తలలు కలిగిన తోకలు” మెషిన్ గన్స్ కు సాదృశ్యమనేది అనేకుల అభిప్రాయం. ఏది ఏమైనా వీటన్నిటి లక్ష్యం మనుష్యులలో మూడవ భాగాన్ని నశింపజేయడమే.
ఆ దినాలలో ఎదుర్కోవలసిన బాధలు వర్ణనాతీతం. ఇదొక కట్టు కథలా తీసిపారేస్తే, నిత్యమూ రోధనే. అగ్ని ఆరదు. పురుగు చావదు. ఏడ్పు, పండ్లుకొరుకుట అదొక్కటే పని. అది మన ఊహలకు కూడా అందదు. వద్దు! సమయముండగానే ప్రభువు పాదాల చెంత చేరుదాం!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(25 వ భాగము)*ఏడవ బూర*:
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
ప్రకటన 11: 15-19
పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఇవి పరలోక జీవుల యొక్క శబ్దమై యుండవచ్చు.
*ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.*
పరిశుద్ధ గ్రంథమందలి ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చూస్తున్నాము. ఈ లోక అధికారం దేవునిదైయున్నది. అధికారము అనగా పరిపాలించుటకు గల అధికారము దేవుడు మానవులకు అనుగ్రహించెను. పాపము వలన సాతాను మనుష్యులలోనుండి దానిని స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతము దేవుడు ఈ లోకమును క్రీస్తు ద్వారా విమోచించెను. దానికోసం దేవుడు క్రీస్తును అభిషేకించెను. అయిననూ సాతాను దానిని అంగీకరించలేదు.
ఏడవ బూర మ్రోగగానే దుష్టుని స్వాధీనమందున్న లోకము విమోచింపబడుచున్నది. అప్పుడు పరలోకమందు ఘోషము జరిగెను. సింహాసనమందు ఆసీనులైయున్న పెద్దలు వారితో కలసి ఆరాధించుచున్నట్లు చూస్తున్నాము.
*ఏడవ బూర ఊదినప్పుడు సంభవించే సంభవములు:*
1. *రాజ్యము ప్రభువునకు చెందును.* ఇవి వెయ్యేండ్ల పరిపాలన కాలములోను, నూతన భూలోకమందును నెరవేరును.
2. *ఆయన యుగయుగములు ఏలును*. నూతన భూలోకమందు నెరవేరగలదు.
రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
ప్రకటన 22:5
3. *ప్రజలు కోపించెను*
హెర్మ గిద్దోను యుద్దములోను గోగు, మాగోగు యుద్దమందును ఇవి నెరవేరును.
4. *దేవునికి కోపము వచ్చును:*
మహా శ్రమల కాలములో దేవుని కోపము కుమ్మరించుట చూచుచున్నాము.
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
ప్రకటన 19:15
5. *మృతులు తీర్పు*:
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రకటన 20:11-15
6. *దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును ప్రతిఫలమిచ్చును*:
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
ప్రకటన 20:12
*పరిశుద్ధులు వెయ్యేండ్ల పాలనలో ప్రతిఫలాన్ని పొందుతారు.*
అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
లూకా 19:17
7. *పరలోకమందు దేవుని నిబంధనమందసము*
యెరూషలేము దేవాలయములో నున్న మందసము ఏమాయెనో తెలియదు. దానిని యిర్మీయా దాచిపెట్టెనని, అంత్యదినాలలో దొరుకుతుందని యూదులు నమ్ముతారు.
మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 3:16
అయితే, ఇటీవల కాలంలో మందసము కనుగొనబడింది. పరలోకంలో కట్టబడి మందిరానికి గాని, మందసమునకు గాని నాశనము లేదు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(26 వ భాగము)*బలిష్ఠుడైన దూత:*
(Part-1)
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
ప్రకటన 10:1
*ఎవరీ బలిష్ఠుడైన దూత?*
వేదం పండితుల మధ్యగల రెండు అభిప్రాయములు:
* యేసు క్రీస్తు
* బలవంతుడైన దేవదూత
1. *యేసు క్రీస్తు అని బలపరిచే వర్ణన:*
*మేఘము ధరించుట* దేవుని సన్నిధికి సూచన:
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా
వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
నిర్గమ 16:10
నేను కరుణాపీఠము మీద మేఘములో
కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.
లేవి 16:2
జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
కీర్తనలు 104:3
2. *తలపైన ఇంద్ర ధనస్సు* దేవుని నిబంధనలకు సూచన:
భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.
ఆది 9:14,15
దేవుని సింహాసనము చుట్టూ ఈ ఇంద్ర ధనస్సును చూచినాడు.
వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
యెహేజ్కేలు 1:28
Note: ఇంద్ర ధనుస్సు అంటే? పురాణాల్లోనున్న ఇంద్రునికి, దీనికి ఎట్లాంటి సంబంధమూ లేదు. బైబిల్ తర్జుమాకి బ్రాహ్మణ పండితుల సహాయం తీసుకోవడం వలన ఇట్లాంటి పదాలు దొర్లాయి.
3. *ముఖము సూర్యునివలే కనబడెను.*
* రూపాంతర కొండమీద ప్రభువు ముఖము సూర్యునివలే ప్రకాశించెను.
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
మత్తయి 17:2
* యోహాను, ప్రభువు ముఖము సూర్యునివలే ప్రకాశించుట చూచెను:
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
ప్రకటన 1:16
4. *పాదములు అగ్ని స్తంభములు:*
అరణ్యములో ఇశ్రాయేలీయులను నడిపించినదానికి ఇవి సాదృశ్యముగా వున్నవి.
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను.
...... అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
నిర్గమ 14: 19,24,25
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(27వ భాగము)*బలిష్ఠుడైన దూత:*
(Part-2)
1. *యేసు క్రీస్తు కాదు. దేవదూత అని చెప్పడానికి గల కారణములు:*
* యేసు క్రీస్తును దూతయని క్రొత్తనిబంధన గ్రంథమందు ప్రస్తావించబడలేదు.
* ఈయన బలవంతుడైన మరియొక దూత అని వ్రాయబడియున్నది.
* శక్తియు అధికారముగల దేవదూతలు కలరు:
మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని.
ప్రకటన 5:2
అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.
ప్రకటన 18:1
* ఇవి ఆకాశములు సృజించినవాని మీద ఒట్టు పెట్టుకొనుట కలదు. అయితే, తనకన్నా గొప్పవానితోనే ప్రమాణము చేయును గనుక, ప్రభువు కాదని స్పష్టమవుతుంది.
మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.
హెబ్రీ 6:16
*ప్రభువు సమస్తమునకును సృష్టికర్తయై యున్నాడు.*
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
యోహాను 1:2,3
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
కొలస్సి 1:15-17
ఒకవేళ ఈ బలిష్ఠుడైన దూత, మిఖాయేలు దూత కావొచ్చేమోగాని, యేసు క్రీస్తు కాదని, లేఖనముల ఆధారముగా అర్ధము చేసుకోగలం.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(28వ భాగము)*తెరువబడియున్న చిన్న పుస్తకము*:
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను...... అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచునీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసి కొనుమని చెప్పుట వింటిని.
నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
ప్రకటన 10:1,2,3,8-10
*చిన్న పుస్తకముకము అంటే?*
ఏడు ముద్రలతో ముద్రించబడిన పుస్తకముకంటే ఇది చిన్నది.
*ఇది విప్పబడియున్న గ్రంధము:*
ఏడు ముద్రలతో ముద్రించబడిన గ్రంధమును గొర్రెపిల్లయైన యేసు క్రీస్తు ఆ ముద్రలను విప్పెను. కానీ ఇదైతే, విప్పబడియున్న చిన్న పుస్తకము.
*ఈ చిన్న పుస్తకము ఏమైయుండవచ్చు?*
దానియేలు దర్శనములో అంత్యకాలము వరకూ మరుగైయుండునట్లు ముద్రింప బడిన గ్రంథమైయుండవచ్చు.
అతడుఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను.
దానియేలు 12:9
*ఈ చిన్న పుస్తకము ఇప్పుడెందుకు తెరువండింది?*
అంత్యకాలంలో జరిగే సంభవాలు తెలియజేయాలి గనుక.
మరియు అతడు నాతో ఈలాగు చెప్పెనుఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;
ప్రకటన 22:10
*ఈ చిన్న పుస్తకమందు ఏమి వ్రాయబడియున్నవి?*
అనేక వంశములను గూర్చి, భాషలను గూర్చి, జాతులను గూర్చిన ప్రవచనాలు. ( రాబోవు శ్రమలను గూర్చి ).
అప్పుడు వారునీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
ప్రకటన 10:11
*ఆ చిన్న పుస్తకము తినిన యోహానుగారికి కలిగిన అనుభూతులేమిటి?*
* నోటికి మధురము
* కడుపునకు చేదు.
అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను.
ప్రకటన 10:10
ఇట్లాంటి అనుభవం యెహెఙ్కేలుగారికి కూడా వుంది.
నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.
యెహెఙ్కేలు 3:3
అవును! ఆయన మాటలు జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
కీర్తనలు 19:9,10
అయితే,
ఆ చిన్న పుస్తకము తినిన యోహానుగారి నోటికి మధురము, కడుపునకు చేదుకు గల కారణమేమిటి?
దేవుని వాక్యము ఎల్లప్పుడూ తేనెకంటే తీపిగానే యుండును. యూదావాడైన యోహాను ఈ సంగతులు యూదులకు కలుగబోవు శ్రమలని గుర్తించుట చేదైన అనుభవం.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(29వ భాగము)*సూర్యుని ధరించుకొనిన స్త్రీ:*
(Part-1)
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
ప్రకటన 12:1-6
*సూర్యుని ధరించుకొనిన స్త్రీ ఎవరు?*
దీనిపై అనేక వ్యాఖ్యానములున్నాయి.
1. ఆ స్త్రీ మరియ అనియు, ఆమె కనిన మగ శిశువు యేసు క్రీస్తు అనేది ఒక వ్యాఖ్యానముగా వుంది.
అయితే, ప్రకటన గ్రంధము ప్రవచన గ్రంధం. జరుగబోయే విషయాలను తెలియజేస్తుంది గాని, జరిగిపోయిన విషయాలను కాదు. యోహాను గారు ఈ దర్శనాన్ని పొందకముందే ప్రభువు జన్మించడం జరిగిపోయింది. ఈ ప్రకటన గ్రంధాన్ని యోహానుగారికి తెలియజేసింది ప్రభువే. అదేసమయంలో, ఈ భాగంలో వ్రాయబడిన మాటలు చాలా వరకు ప్రభువుతో సరిపోల్చలేము.
ఉదాహరణకు:
1. శిశువును కన్నది స్త్రీ
* కానీ, క్రీస్తుకు జన్మనిచ్చింది కన్య.
2. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
* కానీ, యేసు ప్రభువు జన్మించినవెంటనే హేరోదు ఆయనను చంపించే ప్రయత్నం చెయ్యలేదు. హేరోదు మరియ దగ్గరకు రానూ లేదు.
3. మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
* కానీ, క్రీస్తు పుట్టినవెంటనే పరలోకమునకు ఎత్తబడలేదు. ముప్పై మూడున్నర సంవత్సరాల అనంతరం ఆయన ఎత్తబడడం కాదుగాని, ఆరోహణమయ్యెను.
4. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను.
* కానీ, మరియ ఒక్కరే ఐగుప్తుకు వెళ్ళలేదు. యోసేపు, శిశువు కూడా వెళ్లారు.
ఈ రీతిగా సరిపోల్చగలిగితే? ఆ స్త్రీ మరియకాదని, మగ శిశువు యేసు క్రీస్తుకాదని స్పష్టమగుచున్నది.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(30వ భాగము)*సూర్యుని ధరించుకొనిన స్త్రీ:*
(Part-2)
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
ప్రకటన 12:1-6
*సూర్యుని ధరించుకొనిన స్త్రీ ఎవరు?*
దీనిపై అనేక వ్యాఖ్యానములున్నాయి.
1. ఆ స్త్రీ మరియ అనియు, ఆమె కనిన మగ శిశువు యేసు క్రీస్తు అనేది ఒక వ్యాఖ్యానముగా వుంది. అయితే, లేఖనాల ఆధారముగా ఈ వ్యాఖ్యానాన్ని సరిపోల్చలేము.
2. సూర్యుని ధరించుకొనిన స్త్రీ “సంఘమే”. అనేది మరొక వ్యాఖ్యానం.
* సంఘమును స్త్రీ తో పోల్చుట సరియైన విధానము కాదు.
వాస్తవానికి సంఘము కన్యక లేదా పెండ్లి కుమార్తెతో పోల్చబడింది. ఇప్పుడు వివాహ నిశ్చయం చేయబడింది.
దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని
2కొరింధీ 11:2
క్రీస్తు సంఘమునకు శిరస్సుగాను, పెండ్లి కుమారుడుగాను వున్నాడు. అయితే, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుని ప్రసవించునా? శరీరము, శిరస్సును ప్రసవించునా? అట్లా జరుగదు కాబట్టి, సంఘమును స్త్రీ తో పోల్చే అభిప్రాయాన్ని సమర్ధించలేము.
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. .....ఈ మర్మము గొప్పది; అయితే *నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు* చెప్పుచున్నాను.
ఎఫెసి 5:25-27,32
* స్త్రీ, సంఘము అయితే, ఆమె కనిన మగ శిశువు ఎవరు? దానికి సమాధానముగా “సంఘము నుండి జయము పొందిన విశ్వాసులే ఆ మగ శిశువు అనేది వారి అభిప్రాయం.
అయితే, సాధారణ భాషలో “విశ్వాసుల సమూహమే సంఘము” సంఘమును స్త్రీ లింగముతో పోల్చుతాము. కానీ మగ శిశువుతో పోల్చడం సరియైన విధానం కాదు.
పెండ్లి కుమార్తెను “మగ శిశువుతో” పోల్చడం సమంజసం కాదు.
* ఆ స్త్రీ మూడున్నర సంవత్సరాలు (వెయ్యిన్ని రెండువందల అరువది దినములు) అరణ్యమునకు పారిపోయెను.
కానీ, లేఖనాల పరిశీలనలో సంఘము అరణ్యములో ఉన్నట్లు ఎట్లాంటి ఆధారములు లేవు.
ఈ రీతిగా సరిపోల్చగలిగితే? ఆ స్త్రీ సంఘముకాదని స్పష్టమగుచున్నది.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(31వ భాగము)*సూర్యుని ధరించుకొనిన స్త్రీ:*
(Part-3)
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
ప్రకటన 12:1-6
*సూర్యుని ధరించుకొనిన స్త్రీ ఎవరు?*
*స్త్రీ ఇశ్రాయేలు జాతికి సాదృశ్యముగా వున్నది.*
ఇశ్రాయేలు జాతి “స్త్రీ” గా పిలువబడింది.
నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. (యెషయా 54:5)
గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. (యెషయా 54:1)
*ఆమె పాదములక్రిందనున్న చంద్రుడు.*
a) చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. నక్షత్రాల వెలుగుతో ప్రకాశిస్తాడు. అట్లానే, క్రీస్తు విరోధికి, అతనికంటూ అధికారమేమి లేదు. దేవుడిచ్చిన అధికారంతోనే ఆ మూడున్నర సంవత్సరాలు వెలుగొందుతాడు.చంద్రుడు క్రీస్తు విరోధికి సాదృశ్యం. శ్రమకాలంలో ఇశ్రాయేలుజాతి ఇతని పాలనలోనే ఉంటుంది.
b) కొందరు ఆ చంద్రుడు దేవుని కృపకు సాదృశ్యమని తలంచుచున్నారు.
c) మరికొందరు ఆ “స్త్రీ “ ఇశ్రాయేలు జాతికి సాదృశ్యముగా, సూర్యుడు, వారి పితరులకు సాదృశ్యముగా, చంద్రుడు, శారా, రిబ్కా, లేయా, రాహేలు వంటి వారికి సాదృశ్యముగా చెప్పుచున్నారు.
*పండ్రెండు నక్షత్రములు, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములకు సూచన:*
a) *యాకోబు యొక్క పదకొండవ కుమారుడైన యోసేపు చూచిన దర్శనములో యాకోబు కుటుంబమును గూర్చి, బయలుపరచుటకు సూర్యుడు, చంద్రుడు, పండ్రెండు నక్షత్రముల వివరణ కలదు.*
అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసిఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. (ఆది 37:9)
b) అయితే, స్త్రీని సంఘముగా భావించేవారు. ఆ పండ్రెండు నక్షత్రాలు, పండ్రెండుగురు అపొస్తలులు అని భావిస్తారు.
*ఆ స్త్రీ ధరించిన సూర్యుడు, ప్రభువైన క్రీస్తు:*
క్రీస్తు నీతి సూర్యుడుగా ఇశ్రాయేలీయులకు బయలుపరచును.
అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. (మలాకి 4:2)
*ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.*
ఆమె గర్భిణిగా ఉంది. అంటే, ఆ స్త్రీ సంఘము కాదని అర్ధము చేసుకోవచ్చు.
సంఘము కన్యక, ప్రధానము చేయబడిన పెండ్లి కుమార్తె.
ఆమె అనగా, ఇశ్రాయేలు జాతి ఏడేండ్ల శ్రమ కాలంలో అనుభవించే శ్రమలు, ప్రసవ వేదన, నొప్పులతో పోల్చబడ్డాయి.
*యుగాంతములో ఆమె గొప్ప హింసకు గురి అవుతుంది.*
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
ప్రకటన 6:13-16
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.
దానియేలు 12:1
అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు. సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దిన మున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.
యిర్మియా 30:7-9
*ఆమె కనిన మగ శిశువు:*
a) ఇశ్రాయేలు జాతిలోనుండి వచ్చిన ప్రభువైన క్రీస్తు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
యెషయా 9:6,7
వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
రోమా 9:4,5
b) ఆమెకు మరొకసంతానం కూడా వున్నది. వారే శ్రమకాలంలో పండ్రెండు గోత్రాలనుండి ముద్రింపబడిన ఒక లక్షా నలభై నాలుగువేల మంది.
అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలెను.
ప్రకటన 12:17
*సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువు:* ప్రభువైన యేసు క్రీస్తు
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
ప్రకటన 19:15,16
యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును. ( జెకర్యా 14:9)
*ఆ స్త్రీ అరణ్యములో దాగియుండుట:*
నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.
యెషయా 26 :20,21
Note: నేను ఆ “స్త్రీ” ఇశ్రాయేలు జాతికి సూచనగా వుందని నమ్ముచున్నాను. అట్లా అని నా అభిప్రాయాలను మీరు అంగీకరించాలని కాదు. ప్రతీ వ్యాఖ్యానములోను ఏకీభవించేవి, విభేదించే విషయాలు రెండూ వున్నాయి. మర్మమైయున్న వాక్యంను ఒకవేళ అర్ధం చేసుకొనే జ్ఞానం మనకు లేకపోయినప్పటికీ, లేఖనంలో వ్రాయబడిన విషయాలన్నీ, తగిన కాలంలో తప్పక నెరవేరితీరుతాయి. సందేహం లేనే లేదు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(32వ భాగము)*క్రూరమృగము*:
(Part: 1)
మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ప్రకటన 13:1,2
*ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు
*అంత్య క్రీస్తుకు గల పేర్లు:*
* క్రీస్తు విరోధి (1యోహాను 2:18)
* బాబేలు రాజు (యెషయా 14:4)
* తేజో నక్షత్రము, వేకువ చుక్క (యెషయా 14:12)
* చిన్న కొమ్ము ( దానియేలు 7:8,9)
* నాశన పాత్రుడు ( 2థెస్స 2:3)
* మృగము( ప్రకటన 13:1)
* క్రూర ముఖముగల రాజు (దానియేలు 8:23)
* నాశన పుత్రుడు (2థెస్స 2:2,8)
* ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజు (దానియేలు 11:36)
క్రూర మృగమును గూర్చిన సంపూర్ణ అవగాహన కొరకు దానియేలు గ్రంథములోని, నెబుకద్నెజరు మరియు దానియేలుకు కలిగిన దర్శనములను తప్పక ధ్యానించాలి.
రాజైన నెబుకద్నెజరు తన రాజ్యములోని జ్ఞానులందరిని పిలిపించి, నేను ఒక కల కని, మరచిపోయాను. ఆ కల, దాని భావం చెప్పాలి. లేకపోతే, బబులోను రాజ్యంలోనున్న జ్ఞానులందరు తుత్తునీయులుగా చేయబడతారనే కఠినమైన ఆజ్ఞ జారీ చేసాడు. అట్లాంటి పరిస్థితుల్లో, దానియేలు తన ముగ్గురు స్నేహితులతో కలసి ప్రార్ధించి, దేవుని ద్వారా ఆ కలను, దాని భావాన్ని తెలుసుకోగలుగుతాడు.
*రాజు కనిన కలను, దాని భావమును తెలియజేసిన దానియేలు.*
అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను.ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకన బడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,
దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను. మరియు చేతిసహా యము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
దానియేలు 2:28-35
*కల భావము:*
రాజా, పరలోక మందున్న దేవుడు రాజ్య మును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మను ష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్ని టిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరు వాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును. పాద ములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్య ములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును. పాదముల వ్రేళ్లు కొంతమట్టు నకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయ ములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
దానియేలు 2:37-44
ప్రతిమలో గలిగిన నాలుగు భాగములు, నాలుగు రాజ్యములు లేదా రాజులు. ( ప్రాచీనకాలంలో రాజ్యము, రాజు ఒకే అర్ధముతో వాడబడేవి)
ప్రతిమ:
*శిరస్సు*
బంగారము
*బబులోను సామ్రాజ్యము*
*రొమ్ము, భుజములు*
వెండి
*మాదీయ, పారసీక సామ్రాజ్యము*
*ఉదరము, తొడలు*
ఇత్తడి
*గ్రీకు సామ్రాజ్యము*
*మోకాళ్ళు*
ఇనుము
*రోమా సామ్రాజ్యము*
*పాదములు*
ఇనుము, మట్టి
*పదిమంది రాజులు*
*చేతి సహాయంలేక తీయబడిన రాయి:*
“ప్రభువైన యేసు క్రీస్తు.” అన్య రాజ్యములన్నీ నశించిపోతాయి. ప్రభు యేసు క్రీస్తు రాజ్యమే శాశ్వతంగా నిలుస్తుంది.
ఈ దర్శనాన్ని దేవుడు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే రాజైన నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఆయన తెలియజేసినట్లుగానే, ప్రపంచ చరిత్ర గమనాన్ని చూడవచ్చు. మనము ధ్యానము చేయబోయే *క్రూర మృగము* రోమా రాజ్యమునుండియే రాబోతుంది.
ఇక ఆదినము మరెంతో దూరంలో లేదు. పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడిన ప్రవచనాలు 70 శాతానికిపైగా నెరవేరిపోయాయి. ఇక జరుగ వలసినవి త్వరితముగా జరుగుతున్నాయి.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(33వ భాగము)*క్రూరమృగము*:
(Part: 2)
మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ప్రకటన 13:1,2
*ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు
Note:
అంత్య క్రీస్తు అనగా? యుగాంతంలో “నేనే క్రీస్తునని చెప్పుకొనే వారిలో చివరివాడు” అని అర్ధం. బైబిల్ లో ఈ పదము లేదు కదా! అని ప్రశ్నించాలని మీరు అనుకుంటే? అట్లా పిలవడం మీకు ఇబ్బంది అనిపిస్తే, వానికి అనేకమైన పేర్లు పరిశుద్ధ గ్రంధములో ఇవ్వబడ్డాయి. వాటిలో మీకు నచ్చినట్లుగా పిలవొచ్చు. సమస్యేమిలేదు. వాని పేరు కంటే, వాని వ్యక్తిత్వం, మూర్తిమత్వం మనకు అత్యంత ప్రాధాన్యం.
అంత్య క్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన కోసం, నెబుకద్నెజరు కనిన కలతోపాటు, దానియేలు గారికి కలిగిన దర్శనం కూడా ధ్యానించడం అత్యంత ప్రాముఖ్యం.
నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను. మొదటిది సింహ మును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7:3-7
దానియేలు గారు చూచిన నాలుగు జంతువులు దేనికి సాదృశ్యం?
ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.
దానియేలు 7:17
( ప్రాచీనకాలంలో రాజ్యము, రాజు ఒకే అర్ధముతో వాడబడేవి)
ఈ నాలుగు జంతువులు ఎక్కడనుండి వస్తున్నాయి?
* సముద్రములోనుండి.
ప్రకటన 7:3
సముద్రము అంటే?
భక్తిహీనుల సమూహం
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
యెషయా 57:20
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
ప్రకటన 17:15
అంటే? ఈ నాలుగు రాజ్యాలు భక్తిహీనుల సమూహంలోనుండి పుట్టుకొస్తున్నాయి. ఇవి అన్య రాజ్యాలు.
రాజైన నెబుకద్నెజరు తాను కనిన కలలో చూచిన ప్రతిమ యొక్క వివరణ, దానియేలుగారు చూచిన దర్శనములోని నాలుగు జంతువులకు సరిగ్గా సరిపోతుంది.
1. మొదటి జంతువు
(బబులోను సామ్రాజ్యానికి సూచన)
మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.
దానియేలు 7:4
సింహాన్ని పోలివుంది. కానీ, జంతువు కాదు. రెక్కలున్నాయి. కానీ, పక్షి కాదు. మనిషివలె నిలబడింది, మానవ మనస్సుంది. కానీ మనిషికాదు. ఇదే బబులోను సామ్రాజ్య పరిస్థితి.
* ప్రాచీన బబులోను జాతీయ చిహ్నము “ రెక్కలుగలిగిన సింహము గా ఉండేది.
* మరింత ఆసక్తికరమైన విషయమేమిటంటే? బబులోనును పరిపాలించిన కల్దీయుల రాజైన నెబుకద్నెజరు సింహముగాను, పక్షిరాజుగాను పరిశుద్ధగ్రంధములో చెప్పబడుట గమనార్హము.
ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.
యిర్మియా 50:17
నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను....తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుముఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండు టకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.
యెహెఙ్కేలు 17:3,12
బబులోను రాజైన నెబుకద్నెజరు, సింహము వంటి బలము, ధైర్యముతో, పక్షి వంటి వేగముతో ఇతర రాజ్యాలను జయిస్తూ పోతున్న సమయంలో, దాని రెక్కలు తీసివేయబడ్డాయి. రాజ్యములపై దండెత్తడం మాని, నెమ్మది కలిగి, భూమి మీద కాలుమోపింది. మానవ మనస్సు వంటి మనసు దానికివ్వబడడం ద్వారా ప్రజలను మానవతా దృక్పధంతో పరిపాలన చెయ్యడం జరిగెను.
2. రెండవ జంతువు:
(మాదీయ, పారసీక సామ్రాజ్యము)
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.
దానియేలు 7:5
ఎలుగుబంటి పరిమాణంలో సింహముకంటె పెద్దదిగాను, వేగంలో సింహము కంటే తక్కువగాను ఉంటుంది. అట్లానే ఈ రాజ్యాలు, బబులోను కంటే, విస్తీర్ణంలో పెద్దవిగాను, వేగములో తక్కువగాను ఉంటాయి.
అది ఒక పార్శ్వముమీద పండుకున్నది. అంటే, ఈ రెండు రాజ్యాలు కలసివున్నప్పటికీ, వాటి ఆధిపత్యం కోసం పోరాటం కొనసాగేది. పార్శ్వము మీద పండుకున్నది అంటే, ఏ క్షణంలోనైనా ఎటువైపు అయినా తిరగవచ్చు.
తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. ఆ మూడు ప్రక్కటెముకలు తర్వాత దినాల్లో అవి జయించిన, లిబియా, ఐగుప్తు, బబులోను రాజ్యాలను సూచించవచ్చు.
కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. మాదీయ పారశీక రాజ్యాలు, విపరీతమైన రాజ్య కాంక్షను కలిగియుండడం వలన, లేచి, రాజ్యాలను జయించు అంటూ వాటిని పురిగొల్పుతున్నారు.
ఈ దర్శనాన్ని దేవుడు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దానియేలు గారికి తెలియజేసారు. ఆయన తెలియజేసినట్లుగానే, ప్రపంచ చరిత్ర గమనాన్ని చూడవచ్చు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(34వ భాగము)*క్రూరమృగము*:
(Part: 3)
మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ప్రకటన 13:1,2
*ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు
అంత్య క్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన కోసం, నెబుకద్నెజరు కనిన కలతోపాటు, దానియేలు గారికి కలిగిన దర్శనం కూడా ధ్యానించడం అత్యంత ప్రాముఖ్యం.
నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను. మొదటిది సింహ మును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7:3-7
మొదటి జంతువు బబులోను సామ్రాజ్యానికి, రెండవ జంతువు మాదీయ, పారశీక సామ్రాజ్యాలకు సాదృశ్యముగా వుందని అర్ధము చేసుకోగలిగాము.
3. *మూడవ జంతువు:*
( గ్రీకు సామ్రాజ్యము)
అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను.
దానియేలు 7:6
చిరుతపులి బలమైనది, వేగంగా పరుగెత్తగలిగేది. దాని వీపున పక్షిరాజు వంటి నాలుగు రెక్కలున్నాయి. పక్షి రెండు రెక్కలతోనే అత్యంత వేగంగా దూసుకుపోగలదు. అయితే, దీనికి నాలుగు రెక్కలున్నాయంటే, ఇక సుడిగాలి వేగముతో దూసుకుపోగలదు.
ఈ వర్ణన ప్రపంచాన్ని జయించిన, గ్రీకు వీరుడైన “అలెగ్జాండర్ ది గ్రేట్” కు చక్కగా సరిపోతుంది. కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో సుడిగాలి వేగముతో, గ్రీసు మొదలుకొని, భారత దేశం వరకు అంటే, సుమారు పదకొండువేల మైళ్ళ విస్తీర్ణం గలిగిన భూభాగాన్ని జయించగలిగాడు. యుద్దరచన చేయడంలో ఆయనకు సాటిలేరెవ్వరు.
ఆ చిరుతపులికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్యబడెను. అనగా? అలెగ్జాన్డర్ తన ముప్పదిరెండవ ఏటను
క్రీ. పూ. 323 జూన్ 13 న మరణించగా, అతని మరణానంతరము అతని సామ్రాజ్యమును అతని యొక్క నలుగురు సైన్యాధిపతులు పంచుకున్నారు. అందువలన ఆ చిరుతపులి యొక్క నాలుగు తలలు అలెగ్జాన్డరు యొక్క నలుగురు సైన్యాధిపతులకు సూచనగా దర్శనములో చూపబడినది.
4. *నాలుగవ జంతువు:*
(రోమా సామ్రాజ్యము)
నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7:7
మొదటి జంతువు సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి. కానీ, నాలుగవ జంతువును పోల్చడానికి ఈ భూమి మీద ఏ జంతువూ సరిపోలేదు. అంటే, అది అంతటి భయంకరమైనది.
*అది ఎట్లాంటిదంటే?*
* ఘోరమైనది
* భయంకరమైనది
* యితర జంతువులకు భిన్నమైనది
* మహాబలము గలది
* మహాత్త్యములు గలది
* పెద్ద ఇనుప దంతములున్నాయి.
* పది కొమ్ములున్నాయి
* అది విధ్వంసం సృష్టించేది.
ఇదే మనము ధ్యానము చేస్తున్న “క్రూర మృగము”. ఈ క్రూర మృగము రోమా సామ్రాజ్యంలోనుండే రాబోతుంది. ఆ క్రూరమృగమే “అంత్య క్రీస్తు లేదా క్రీస్తు విరోధి.”
ఇప్పుడు మీకో సందేహం రావొచ్చు! గ్రీకు సామ్రాజ్యం గతించిపోయింది కదా? ఆ సామ్రాజ్యంలోనుండి క్రూరమృగము (అంత్య క్రీస్తు) ఎట్లా వస్తుంది?
*నెబుకద్నెజరు కనిన కలలోని ప్రతిమ*:
శిరస్సు - బంగారం
బబులోను
రొమ్ము, భుజాలు - వెండి
మాదీయ, పారశీక
ఉదరము, తొడలు- ఇత్తడి.
గ్రీకు
కానీ,
కాళ్ళు మాత్రం?
మోకాళ్ళ వరకు - సంపూర్ణముగా ఇనుము.
పాదములు - ఇనుము, మట్టి
రోమా సామ్రాజ్యం.
ఇక్కడ మనము ఆలోచన చేయగలిగినట్లయితే? రోమా సామ్రాజ్యాన్ని సూచించే ప్రతిమ భాగంలో రెండు పదార్ధాలున్నాయి. (ఇనుము, మట్టి)
అంటే? ఈ సామ్రాజ్యము రెండు సార్లు రాజ్యాధికారాన్ని కలిగివుంటుందని గ్రహించగలము. ప్రతిమలోని మోకాళ్ళు పూర్తిగా ఇనుము. అంటే, అది గతించిన కాలంలో ఒకసారి ఏకఛత్రాధిపత్యంతో ఏలుబడి చేసింది. ఇప్పుడు యుగాంతములో, పాదములకున్న పది వ్రేళ్ళు, పదిమంది రాజులను సూచిస్తోండగా, పదిమంది రాజుల కూటమితో, తిరిగి రోమా సామ్రాజ్యం భూలోకాన్ని పరిపాలించబోతుంది. దానిలోనుండే క్రూరమృగము పుట్టుకొస్తుంది.
*ప్రియా నేస్తమా!*
ప్రపంచ చరిత్ర కళ్లకుకట్టినట్లు మనముందుండగా, ప్రభురాకడను గూర్చి నీకింకా సంశయమా?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(35వ భాగము)*క్రూరమృగము*:
(Part: 4)
నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7:7
అది ఎట్లాంటిదంటే?
* ఘోరమైనది
* భయంకరమైనది
* యితర జంతువులకు భిన్నమైనది
* మహాబలము గలది
* మహాత్త్యములు గలది
* పెద్ద ఇనుప దంతములున్నాయి.
* పది కొమ్ములున్నాయి
* అది విధ్వంసం సృష్టించేది.
మొదటి జంతువు సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి. కానీ, నాలుగవ జంతువును పోల్చడానికి ఈ భూమి మీద ఏ జంతువూ సరిపోలేదు. అంటే, అది అంతటి భయంకరమైనది.
అయితే, ప్రకటన గ్రంధములో ఈ క్రూరమృగమును గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకోగలం.
మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ప్రకటన 13:1,2
* పది కొమ్ములు
* ఏడు తలలు
* దాని కొమ్ములమీద పది కిరీటములు
* దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లు
* ఆ మృగము చిరుతపులిని పోలియుండెను.
* దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి
* దాని నోరు సింహపునోరు వంటిది
* దానికి ఆ ఘటసర్పము (సాతాను), తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఆ మృగమునకు (అంత్య క్రీస్తుకు) ఇచ్చెను.
* డంబపు మాటలు మాట్లాడుతాడు.
* దేవ దూషణ చేస్తాడు.
* పరిశుద్ధులతో యుద్ధం చేసి జయిస్తాడు.
* ప్రతీ జనము మీద మూడున్నర సంవత్సరాలు సంపూర్ణ అధికారం కలిగివుంటాడు.
ప్రకటన 13:1-7
*ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు ( క్రూరమృగము వంటి స్వభావము కలిగిన వాడు)
*పది కొమ్ములు*
ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి;
దానియేలు 7:24
( ఆ రాజ్యము నుండి అనగా? దానియేలుగారికి అనుగ్రహించబడిన దర్శనము ప్రకారము, “రోమా సామ్రాజ్యము నుండి”)
నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. (ప్రకటన 17:12)
*ఏడు తలలు:*
a) *ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;* (ప్రకటన 17:9)
రోమ్ పట్టణము టైబర్ నది ఒడ్డున గల “ “యేడు కొండలపైన” కట్టబడివున్నది.
b) *ఆ యేడు తలలు ఏడుగురు రాజులు*
మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.
ప్రకటన 17:10
ఆయా కాలములలో రోమ్ ని పాలించిన ఏడుగురు రాజులకు సూచన. ఐదుగురు గతించిపోయారు. వున్నవాడు ఆరవవాడు, అతడు డొమిషియన్, ఇక ఏడవవాడు యుగాంతమందు వచ్చును అనే అభిప్రాయము కలదు.
*క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట:*
a) సముద్రము అంటే?
భక్తిహీనుల సమూహం
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
యెషయా 57:20
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
ప్రకటన 17:15
అంటే? క్రూర మృగము భక్తిహీనుల సమూహంలోనుండి పుట్టుకొస్తుంది
b) మధ్యధరా సముద్ర తీరాన గలిగిన దేశాలు, యూరోపియన్ సమాజ కూటిమి నుండి, క్రూరమృగము వస్తుందనేది మరికొందరి అభిప్రాయముగా వుంది.
*దాని కొమ్ములమీద పది కిరీటములు ఉండెను:*
“పది కిరీటములు” పది రాజ్యాలకుండే అధికారాన్ని సూచిస్తుంది.
*దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను:*
దేవునిని నిందించుట ఈ క్రూరమృగము యొక్క ముఖ్యపనియై యుండెను.
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
2 థెస్స 2:4
ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
దానియేలు 7:25
ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధ ముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్య బడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.
దానియేలు 8:11,12
అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్య మును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
దానియేలు 9:27
*ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది*:
దానియేలుగారు చూచిన దర్శనములో
* చిరుతపులి - గ్రీకు సామ్రాజ్యానికి,
(అలెగ్జాన్డర్ ఏకఛత్రాధిపత్యానికి)
* ఎలుగుబంటి - మాదీయ, పారసీక
( అవినీతి )
* సింహము - బబులోనుకు
(నెబుకద్నెజరు గర్వము)
నకు సూచనగా వున్నాయి. అయితే, ఈ క్రూరమృగానికి ( రోమా సామ్రాజ్యం నుండి పుట్టుకొస్తున్న అంత్య క్రీస్తుకు) వీటన్నిటితోపాటు మరికొన్ని, అదనపు, భయంకరమైన లక్షణాలు కలిగివుంది.
*దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను:*
దానికి అనగా, క్రూరమృగానికి (అంత్య క్రీస్తుకు), ఆ ఘట సర్పము (సాతాను)
* తన బలమును
* తన సింహాసనమును
* గొప్ప అధికారమును ఇచ్చెను
వీటన్నిటితో మూడున్నర సంవత్సరాలు, అత్యంత నిరంకుశంగా అతని ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(36వ భాగము)*రెండవ క్రూరమృగము*:
(అబద్ధ ప్రవక్త )
(Part-1)
మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ప్రకటన 13: 11-18
*దుష్ట త్రయం:*
1. సాతాను ( ఘటసర్పం, లూసిఫర్)
2. మొదటి క్రూర మృగము
(అంత్య క్రీస్తు)
3. రెండవ క్రూర మృగము
(అబద్ధ ప్రవక్త)
మొదటి క్రూర మృగము
* అనగా అంత్య క్రీస్తు.
* రాజకీయ నాయకుడు
* సముద్రములోనుండి వచ్చును.
* Anti Christ
రెండవ క్రూర మృగము
* అనగా అబద్ధ ప్రవక్త
* మత నాయకుడు
* భూమిలోనుండి వచ్చును
* Anti Spirit
అంత్య క్రీస్తు సముద్రములోనుండి వస్తున్నాడు. సముద్రము అనగా? భక్తి హీనుల సమూహము. అబద్ధ ప్రవక్త భూమిలోనుండి వస్తున్నాడు. భూమి అనగా? ఒక దేశం కావచ్చు. ప్రజలను మరింత సులభముగా మోసం చెయ్యడానికి, ఇశ్రాయేల్ దేశమునుండే ఈ అబద్ధ ప్రవక్త రావచ్చు అనేది కొందరి అభిప్రాయం.
భూమిలోనుండి వస్తున్నాడు అంటే? అతడు పునరుద్ధానము చెందిన వ్యక్తి కావొచ్చు అనేది మరికొందరి అభిప్రాయము.
అబద్ధ ప్రవక్త రూపం మాత్రం గొర్రెపిల్ల. స్వభావం మాత్రం క్రూరమృగం.
*అబద్ద ప్రవక్తలను గూర్చి ప్రభువు ముందుగానే హెచ్చరించారు:*
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7:15
ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
మత్తయి 24:23,24
*వారు కలిగియుండే ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ:*
యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
1 యోహాను 4 : 3
*గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను*:
అబద్ద ప్రవక్తకు రాజ్యాధికారం వున్నదని “కొమ్ములు” సూచిస్తున్నాయి.గొర్రెపిల్ల ప్రభువైన యేసు క్రీస్తుయై వున్నాడు. ఆయనకు భూలోకమందును, పరలోకమందును గల నిదర్శనంగా, ఏడు కొమ్ములను గూర్చి చెప్పబడింది. (ప్రకటన 5:6)
రెండు అనే సంఖ్య సాక్ష్యమునకు సూచన. క్రీస్తు, దేవునికి సాక్షిగా వున్నవిధంగా, అబద్ధ ప్రవక్త అంత్య క్రీస్తుకు సాక్షిగా ఉండును.
*అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను:*
సర్పము మాట్లాడినది మొదటిగా ఏదోను తోటలోనే. ఒక వ్యక్తికోసం మాట్లాడువారు ప్రవక్తలు. దేవుని కోసం మాట్లాడువారు దేవుని ప్రవక్తలు. అబద్ధ ప్రవక్త సాతాను నోరై యున్నాడు. సాతాను ఆత్మ ఆయన ద్వారా మాట్లాడును.
అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
1 రాజులు 22:22
*ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.*
ఆ మొదటి మృగమునకు అనగా అంత్య క్రీస్తుకు, భూజనులందరూ నమస్కారము చేయునట్లు బలవంతము చేసేవాడు అబద్ధ ప్రవక్త. ఇతడు తన సర్వాధికారము ఉపయోగించి అంత్యక్రీస్తును గొప్పచేసి గౌరవపరచును.
*పరిశుద్ధాత్ముడు ప్రభువును ఘనపరచును:* ఆయనను Holy Spirit అంటాము.
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.
యోహాను 16:13,14
*అబద్ధ ప్రవక్త, అంత్య క్రీస్తును ఘనపరచును.* అందుచే అబద్ధ ప్రవక్తను Anti Spirit అనడంలో తప్పులేదు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(37వ భాగము)*రెండవ క్రూరమృగము*:
(అబద్ధ ప్రవక్త )
(Part-2)
మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ప్రకటన 13: 11-18
*రెండవ క్రూర మృగము*
* అనగా అబద్ధ ప్రవక్త
* మత నాయకుడు
* భూమిలోనుండి వచ్చును
* Anti Spirit
*అది (రెండవ క్రూర మృగము) ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.*
ప్రవక్తయైన ఏలియా గారు, రెండు సందర్భములలో ఆకాశమునుండి అగ్ని భూమి మీదకి దింపెను.
అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
1 రాజులు 18:38
అందుకు ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
2 రాజులు 1:10
*ఈ అబద్ధ ప్రవక్త కూడా, తానే నిజమైన ప్రవక్తనని రుజువు చేసుకోవడానికి ఇట్లాంటి సూచక క్రియలు చేస్తాడు.సూచక క్రియలంటే మనుష్యులకు ఎంతో ఇష్టం. అందుచే అబద్ధ ప్రవక్త వారిని ఈ విధంగా మోసం చేస్తాడు.*
ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
2 థెస్స 2:11,12
*ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.*
అబద్ధ ప్రవక్త, ప్రజలను బలవంతము చేసి, క్రూరమృగము యొక్క ప్రతిమను తయారు చేయిస్తాడు. అంతేకాదు, ఆ ప్రతిమకు ప్రాణంపోసి, అది మాట్లాడేలా చేస్తాడు. ఇది లోకమంతటికి అమోఘమైన, మానవాతీతమైన శక్తి ప్రదర్శన. దీనితో అనేకమంది ఆ ప్రతిమను మ్రొక్కడానికి సిద్ధపడతారు.
*ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, అబద్ద ప్రవక్తకు అధికారము ఇయ్యబడెను.*
ఏడేండ్ల శ్రమకాలంలో చంపబడిన వారు అబద్ద ప్రవక్తచే చంపబడినవారే కావొచ్చు.
అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల యెదుటను నిలువబడి సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్;
యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
ప్రకటన 7:9-14
కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(38వ భాగము)*రెండవ క్రూరమృగము*:
(అబద్ధ ప్రవక్త )
(Part-3)
మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ప్రకటన 13: 11-18
*అబద్ధ ప్రవక్త, లోక ప్రజలంతా “క్రీస్తు విరోధిని” పూజించడానికి, పక్కా వ్యూహాన్ని అమలు చేస్తాడు.*
* మొట్టమొదట రాజకీయ అధికారం, సైనిక బలం ప్రజలమీద ప్రభావం చూపుతాయి.
* మోసగించే అద్భుతాలు ( ఆకాశము నుండి అగ్నిని దింపడం ద్వారా, తానే ప్రవక్తనని, ప్రతిమకు ప్రాణం పోయడం ద్వారా తానే దేవుడనని)
* క్రయ విక్రయాల విషయంలో రాజ్య తంత్రం ( ముద్ర వుంటేనే గాని, ఏ వస్తువైనా కొనడానికి గాని, అమ్మడానికిగాని వీలుండదు.)
*ఇక రెండే రెండు మార్గాలు:*
* అబద్ధ ప్రవక్త ప్రకటించే అంత్య క్రీస్తును పూజించాలి. (లేదా)
* ఆకలితో అలమటించి చావాలి. లేదా అబద్ధ ప్రవక్తచేత చంపబడాలి.
ఈ రెండు మార్గాలలో దేనిని ఎన్నుకోవాలో ప్రజలకు అత్యంత క్లిష్టమైన పరీక్షగా వుండబోతుంది.
*అంత్య క్రీస్తును పూజించకపోతే?*
* మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేసే అధికారం అబద్ధ ప్రవక్త కలిగియున్నాడు.
ప్రకటన 13:15
*అంత్య క్రీస్తును పూజిస్తే?*
* మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
ప్రకటన 14: 9-11
*666:*
మానవుని సంఖ్య: 6
( ఆరవ దినమున సృష్టించ బడ్డాడు)
ఆ మానవుడు పాపములోపడి పతనమైపోతే, అతనిని రక్షించడానికి మరొక “6 “ అనే దైవ నరుడు, మనుష్య కుమారుడు (యేసు క్రీస్తు) వచ్చాడు.
ఇప్పుడు ఆ సంఖ్య :66
ఆ క్రీస్తును నేనే అంటూ ఏడేండ్ల శ్రమకాలంలో మరొక “ 6 “ అనే మనుష్యుడు (అంత్య క్రీస్తు) రాబోతున్నాడు.
ఇప్పుడు ఆ సంఖ్య: 666
*ఈ అంత్య క్రీస్తు అనే మనుష్యుడు ఎప్పటికి క్రీస్తు కాదు.*
దేవుని సంఖ్య : 7 (పరిపూర్ణమైనది)
మానవుని సంఖ్య : 6
6 ఎప్పటికీ 7 కాలేదు.
అంటే? మానవుడు ఎప్పటికి దేవుడు కాలేడు.
ఒక 6 ప్రక్కన మరొక 6 వున్నా, (అంటే 66 ) అది 7 కాలేదు.
66 ప్రక్కన మరొక 6 వున్నా,
(అంటే 666 ) అది 7 కాలేదు.
అంటే? మానవుడు ఎప్పటికి దేవుడు కాలేడు.
*666 ముద్రను ఎక్కడ ముద్రిస్తారు?*
*666 ముద్రను కుడి చేతిమీదగాని, నొసటియందుగాని ముద్రించుకోవాలని అతడు బలవంతం చేస్తాడు.*
కుడిచేతిమీద ముద్రించుకోవడం వలన, (అంత్యక్రీస్తుకు రైట్ హ్యాండ్) అతనికి “కుడి భుజంగా” వుంటారు. అంటే? అతడు చెప్పినట్లే చేస్తారు.
నొసటియందు ముద్రించడం వలన, వారి తలంపులలో కూడా అంత్య క్రీస్తుకు లోబడివుంటారు అనేది అతని ఉదేశ్యం కావొచ్చు.
అంత్య క్రీస్తు, ప్రజలను ముద్రించడానికి ఉపయోగిస్తాడు అనుకొంటున్న RFDI చిప్ కూడా, కుడి చేయి, నొసటి భాగాలలో మాత్రమే, అది పనిచేయడానికి తగిన ఉష్ణోగ్రత కలిగివున్నాయని పరిశీలకులు తెలియజేస్తున్నారు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(39వ భాగము)*ముద్రింపబడినవారి సంఖ్య: 1,44,000*
ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
* *యూదా గోత్రము* లో పండ్రెండువేలమంది.
* *రూబేను గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *గాదు గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *ఆషేరు గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *నఫ్తాలి గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *మనష్షే గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *షిమ్యోను గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *లేవి గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *ఇశ్శాఖారు గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *జెబూలూను గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *యోసేపు గోత్రము* లో పండ్రెండు వేలమంది,
* *బెన్యామీను గోత్రము* లో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
ప్రకటన 7:4-8
ముద్రింపబడిన పండ్రెండు గోత్రములలో *దాను, ఎఫ్రాయిము గోత్రము* లవారికి స్థానము లేదు. వారి స్థానములో *లేవి, యోసేపు గోత్రము* లవారు ముద్రించబడ్డారు.
కారణమేమిటి?
1. *దేవుని మార్పులేని విధానాలకు ఇవి సూచన. యరొబాము రెండు దూడలను చేసి, ఒకటి దానులోను, ఒకటి ఎఫ్రాయిములోను స్థాపించెను. ఎఫ్రాయిము సరిహద్దులలో బేతేలులోను, దాను, దాన్ గోత్రమందు స్థానమిచ్చి, విగ్రహారాధనకు చోటు కల్పించెను గనుక, అది పాపమునకు కారణమాయెను.*
యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని యరొ బాము తన హృదయమందు తలంచి ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
1 రాజులు 12:25-30
దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధము లను కట్టుకొని, గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందల మంది మను ష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా యింటికిపోయి చెక్క బడిన ప్రతిమను ఏఫో దును గృహదేవతలను పోతవి గ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడుమీరేమి చేయుచున్నారని వారి నడుగగా వారునీవు ఊర కుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజ కుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్ర మునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను.
న్యాయాధి 18:16-20
2. *అంత్య క్రీస్తు “దాను గోత్రమునుండి” వచ్చునని వేద పండితులు నమ్ముతున్నారు.*
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
ఆది 49:17
మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు. వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా. ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబం ధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
ద్వితి 29:16-19
ఇట్లాంటి కారణములచేత, దాను, ఎఫ్రాయిము గోత్రాలు శ్రమలకు అప్పగింపబడతాయి.
ప్రియనేస్తమా!
నీ జీవితంలో పాతుకుపోయిన విగ్రహాలేమిటో? కూకటి వ్రేళ్ళతో సహా తొలగించు. లేకుంటే, ఆయన కృపనుండి తొలగిపోతావ్.
ముద్రింపబడినవారు : 1,44,000 మంది. వారు ఇశ్రాయేలీయులు. వారు శ్రమకాలంలో ముద్రించబడ్డారు.
*వీరికిగల ప్రత్యేకతలు:*
* ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడి ఉంటుంది.
* వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు;
* భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
* వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. (ఇక్కడ “స్త్రీ అనగా లోకము”)
* గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు.
* వీరు దేవుని కొరకును గొఱ్ఱ పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
* వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
ప్రకటన 14:1-5
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(40వ భాగము)*పైరుకోత* మరియు
*ద్రాక్షపండ్ల కోత:*
కోత అనగా న్యాయ తీర్పు
అందుకాయన ఇట్లనెనుమంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు? గురుగులు దుష్టుని సంబంధులు? వాటిని విత్తిన శత్రువు అపవాది? *కోత యుగసమాప్తి;* కోతకోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమా రుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
మత్తయి 13:38-42
*పైరు కోత*:
మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్నవానితో చెప్పెను.
మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
ప్రకటన 14:14-16
మనుష్య కుమారుడు అనే పదము ప్రభువైన యేసు క్రీస్తుకు మాత్రమే సాదృశ్యముగా వుంది. నూతన నిబంధనా గ్రంధములో, ఈ పదము 68 సార్లు ప్రస్తావించబడింది. ఈ వాక్య భాగములో చివరిసారిగా వాడబడింది. మేఘము దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఆయన శిరస్సు మీదగల బంగారు కిరీటం, ఆయన రాజ్యాధికారాన్ని సూచిస్తుంది. చేతిలో కొడవలి వుంది అంటే? కోతకాలం సమీపమయినట్లే. ఇక కోతకోయడమే ఆలస్యం.
మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
*ఆ పైరు ఎవరు?*
శ్రమకాలంలో అంత్యక్రీస్తుకు దాసోహం అయిన, “అన్యజనులు”.
* వీరు అంత్యక్రీస్తుకు లోబడినవారు.
* ప్రతిమను పూజించినవారు.
* 666 ముద్రను వేయించుకున్నవారు.
*ద్రాక్ష పండ్ల కోత*:
ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను. మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. నూరు కోసులదూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.
ప్రకటన 14:17-20
*ఎవరీ ద్రాక్ష పండ్లు?*
ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట
యెషయా 5:7
ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోటతో పోల్చబడింది. అంటే? ఆ ద్రాక్ష పండ్లు ఇశ్రాయేలీయులేనని మనము అర్ధం చేసుకోగలం.
అయితే, ఇవి శ్రేష్టమైన ద్రాక్షలు కాదు.
శ్రమకాలంలో అంత్యక్రీస్తుకు దాసోహం అయిన, “ఇశ్రాయేలీయులు”.
* వీరు అంత్యక్రీస్తుకు లోబడినవారు.
* ప్రతిమను పూజించినవారు.
* 666 ముద్రను వేయించుకున్నవారు.
*ద్రాక్షల పెద్ద తొట్టె:*
ఇది దేవుని కోపమై యున్నది.
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
ప్రకటన 19:15
*ప్రభువే ఆ ద్రాక్ష తొట్టె త్రొక్కును:*
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు చున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట లన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.
యెషయా 63:1-6
*ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. నూరు కోసులదూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.*
ఎదోము, బొస్రా వరకు దాదాపు నూరుకోసుల దూరము (కోసు అనగా రెండు మైళ్ళు, నూరుకోసులు అనగా, 200 మైళ్ళ దూరము) గుఱ్ఱముకళ్లెము వరకు ఎత్తుగా రక్త ప్రవాహము జరుగును.
ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది. అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమును గూర్చిన ప్రతికార సంవత్సరము.
యెషయా 34:7,8
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(41వ భాగము)*క్రోధపాత్రల క్రుమ్మరింపు-1:*
క్రోధపాత్రలు క్రుమ్మరింపుతో కలిగే తెగుళ్లతో, శిక్షలు సమాప్తమవుతాయి. ఇవి తాత్కాలికమైన కావు. వీటిలో కొన్ని ఐగుప్తులో జరిగిన శిక్షలవంటివి. మరికొన్ని క్రొత్తవిగా నున్నవి.
విచిత్రమైన విషయమేమిటంటే? శిక్షలు ఎంత ఘోరంగా వుంటే, అంత ఎక్కువగా దేవుని దూషిస్తారు తప్ప, పశ్చాత్తాపపడరు. మార్పు నొందరు.
మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
ప్రకటన 16:1
*మొదటి పాత్ర క్రుమ్మరింపు:*
అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారముచేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను.
ప్రకటన 16:2
భూమి మీద మొదటి పాత్రను క్రుమ్మరింపగా,
* అంత్యక్రీస్తుకు లోబడినవారికి
* ప్రతిమను పూజించినవారికి
* 666 ముద్రను వేయించుకున్నవారికి
*బాధాకరమైన చెడ్డపుండ్లు* పుట్టి, ఆ బాధతో వారికి నెమ్మది లేకుండా చేస్తాయి.
ఇది ప్రవచన నెరవేర్పుగా వుండబోతుంది.
వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
ప్రకటన 14:11
ఇటువంటి తెగుళ్లు ఐగుప్తులో కలిగాయి. మరలా శ్రమకాలంలో కలుగబోతున్నాయి.
*రెండవ పాత్ర క్రుమ్మరింపు:*
రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందు వలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నియు చచ్చెను.
ప్రకటన 16:3
రెండవ పాత్ర సముద్రములో క్రుమ్మరింపబడగా, నీరంతా పీనుగు రక్తంలా మారుతుంది. దానితో సముద్ర జలచరములన్ని చచ్చును! ఇది మధ్యధరా సముద్రము కావొచ్చు.
*మూడవ పాత్ర క్రుమ్మరింపు:*
మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి; దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.
ప్రకటన 16:4-7
మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. త్రాగడానికి నీరు దొరకక, రక్తము త్రాగవలసి వచ్చును. ప్రవక్తలను చంపి, వారి రక్తాన్ని చిందించిన ఫలితంగా ఇట్లాటి ఫలితాలు అనుభవించవలసి వచ్చును. ఇట్లాటి తీర్పులను చూచి జలముల దేవత నీవు న్యాయవంతుడవే అని చెప్పడం గమనించగలము.
* గాలి యొక్క దేవతలు: వీరు విసరజేయుటకు, బంధించుటకు అధికారం గలిగి యున్నారు.
( ప్రకటన 7:1)
* అగ్ని అధికారం గలిగిన దూత: అగ్నిని పంపుటకు, ఆర్పుటకు అధికారం గలిగిన దూతలు. ( ప్రకటన 14:8)
* అట్లానే, ఈ జలముల దేవదూతలు, జలములపై అధికారాన్ని కలిగివుంటారు.
అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని. పరిశుద్ధ గ్రంధములో బలి పీఠము మాట్లాడిన సందర్భము ఇక్కడనే చూడగలము. అది సాధ్యమే. దానియేలు చూచిన దర్శనములో “కొమ్ము” మాట్లాడిన సందర్భాన్ని చూడగలము.
*నాలుగవ పాత్ర క్రుమ్మరింపు:*
నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.
ప్రకటన 16:8,9
నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. 50 నుండి 55 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే మనిషి తట్టుకోలేడు. అయితే, సూర్యుడు కలిగియుండే ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్. ఇక శ్రమకాల దినాలలో ఓజోన్ పొర, పూర్తిగా డేమేజ్ అయ్యి, నేరుగా సూర్యకిరణాలు భూమిని తాకుతాయి. ఆ వేడికి మనుష్యులు కాలిపోతారు. నేటి దినాల్లో వున్నా, ఉష్ణోగ్రతకే, ఎగ్ ని, ఆమ్లెట్ వేసుకోవచ్చంటుంటారు. మనుష్యులు మాడిపోయే ఉష్ణోగ్రతను ఊహించగలమా?అది మన ఊహలకు అందకపోయినాగాని, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతీ ప్రవచనం నెరవేరితీరుతుంది.
ప్రభువు చెప్పకుండా ఏది చెయ్యడు. చెప్పిన దానికి ఏది చెయ్యకుండా మానడు. మనము పుట్టకముందే, ఏమి జరగబోతుందో ఆయన వ్రాయించి పెట్టాడు. ఇప్పుడు తేల్చుకోవలసినది మనమే.
ఇదెప్పుడంటే?
మన ప్రాణం పోకముందు, ప్రభువు రాకముందు. అంటే? ఈ కృపాయుగంలోనే. నేడే. ఈ క్షణమందే.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(42వ భాగము)*క్రోధపాత్రల క్రుమ్మరింపు-2:*
ప్రారంభంలో నాలుగు పాత్రల క్రుమ్మరింపు భూమి, సముద్రము, నదులు, నీటి ఊటలు, సూర్యుడు ఇట్లా ప్రకృతి సంబంధముగా వుంది.
మిగిలిన మూడు పాత్రలు రాజకీయ సంభంధమైనవిగా వుండి, కీడు చేయు అధికారులపైన పనిచేస్తాయి.
*అయిదవ పాత్ర క్రుమ్మరింపు:*
అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి
తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.
ప్రకటన 16:10,11
ఐదవ పాత్ర మృగముయొక్క సింహాసనముల మీద పోసెను. అప్పుడు ఆయన అధికార సరిహద్దువరకు చీకటి కమ్మెను.
*గత కాలంలో ఐగుప్తులో ఇట్లాంటి పరిస్థితులు సంభవించెను:*
అందుకు యెహోవా మోషేతోఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను. ..... మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రా యేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
ప్రకటన 10:21,23
*ఇట్లాంటివి సంభవిస్తాయని యోవేలు ప్రవక్త కూడా ప్రవచించెను:*
సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
యోవేలు 2:1,2
*ప్రభువు కూడా వీటిని గురించి ప్రవచించారు:*
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.
మత్తయి 24:29
ఇట్లాంటి సంభవాలు జరిగినాగాని, ప్రజలలో మారుమనస్సు లేకుండా, దేవునిని నిందించేవారుగా వుంటారు.
*ఆరవ పాత్ర క్రుమ్మరింపు:*
(Part-1)
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
ప్రకటన 16:12-16
ఆరవదూత యూఫ్రటీసు నదిమీద తన పాత్ర క్రుమ్మరించి, నీళ్లు ఎండిపోజేసెను. యూఫ్రటీసు నదికి తూర్పుననున్న దేశాలైన జపాన్, చైనా, ఇండియా వంటి దేశాలు హర్మెగిద్దోను యుద్దానికి తరలిరావాలంటే? ఇశ్రాయేల్ కు, తూర్పు దేశాలకు యూఫ్రటీసు నది అడ్డుగా వుంది. అందుచే ఈ దూత, యూఫ్రటీసు నీళ్లను ఎండిపోజేసి, యుద్దానికి సిద్ధంచేస్తోంది.
గతంలో కూడా, ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం, యొర్దాను నది మార్గం సరాళము చేసిన విషయం విదితమే.
మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నిర్గమ 14:21
పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.
జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిర ముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.
యెహోషువ 3:16,17
*తూర్పునుండి వచ్చువారికి మార్గమిచ్చు నిమిత్తము ఈ యొక్క లేఖనము నెరవేరవలసి యున్నది.*
మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
యెషయా 11:15,16
*ఇందునుబట్టి నానా జనులు యెహోషాపాతు లోయలో సమకూడవలసి యున్నది.*
అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధు లందరు సిద్ధపడి రావలెను.మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గ ములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడునేను బలాఢ్యుడను అనుకొన వలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
యోవేలు 3:9-12
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(43వ భాగము)*క్రోధపాత్రల క్రుమ్మరింపు-3*
*ఆరవ పాత్ర క్రుమ్మరింపు:*
(Part-2)
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
ప్రకటన 16:12-16
ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.
కప్పలువంటి 3 అపవిత్రాత్మలను యోహాను చూస్తున్నారు. ఐగుప్తులో సంభవించిన తెగుళ్లలో ఒకటి కప్పలై యున్నవి.
ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;
నిర్గమ 8:3
ఈ లోకమందుగల, రాజులను, సైన్యములను, హర్మెగిద్దోను యుద్ధమునకు సమకూర్చడమే ఈ కప్పలవంటి అపవిత్రాత్మల పని. ఘటసర్పము (సాతాను), క్రూరమృగము ( అంత్య క్రీస్తు), అబద్ద ప్రవక్త అనే సాతాను త్రిత్వమునుండి ఈ మూడు కప్పలు, లేదా అపవిత్రాత్మలు బయలు వెడలుచున్నవి.
ఇవి నిజమైన కప్పలు కాదు. అద్భుతాలు చేసే శక్తి వీటికి వుంది.
*అబద్ధమాడు ఆత్మ:*
ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక..... అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
1 రాజులు 22:6,21,22
*అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు ఆత్మ:*
ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
2 థెస్స 2:11,12
*వేషధారణవలన మోసపరచు ఆత్మ*
అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును, దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
1 తిమోతికి 4:1,2
కప్పలు అపవిత్రమైన జీవులు. (లేవి 11:10) కప్పలు అర్థరహితంగా అరుస్తావుంటాయి. అట్లానే, సాతాను దుష్ట త్రయం నోటనుండి అపవిత్రాత్మలు బయలు వెడలుతున్నాయంటే? వారి నోటనుండి, అపవిత్రమైన, క్రూరమైన, అర్థరహితమైన మాటలు వెలువడునని భావించవచ్చు
*హార్ మెగిద్దోను:*
మెగితో అను స్థలము ప్రపంచమందలి సర్వసైన్యములకు అనుకూలమైన యుద్దభూమియై యున్నది. ఈ స్థలము 20 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పు, విస్తీర్ణం కలిగియుందని అభిప్రాయము.
* గిద్యోను, మిద్యానీయులను ఇక్కడనే ఓడించెను. (న్యాయాధి 7)
* బారాకు, కనానీయులను ఓడించెను.
(2 రాజులు 9:27)
* యోషీయా రాజు ఇక్కడే హతమాయెను (2 రాజులు 23:29,30; 2దిన 35:22)
ఇట్లా అనేకం.
*ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను.*
కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
మత్తయి 24:42,43
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
1థెస్స 5:2
ఆదినములలో ఇశ్రాయేలీయులకు గల దైవ వర్తమానమిది. అయితే, ఇది నేటి సంఘానికి కూడా హెచ్చరికగా వుంది. గనుక మనము మెలకువగా నుండవలెను.
నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.
ప్రకటన 3:3
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(44వ భాగము)*క్రోధపాత్రల క్రుమ్మరింపు-4:*
*ఏడవ పాత్ర క్రుమ్మరింపు:*
ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగాసమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
ప్రకటన 16:17-21
ఏడవ దూత తన పాత్ర ఆకాశంలో పోసెను. ఆకాశము అనేది, వాయుమండలము, నక్షత్ర మండలము కలసినదై యుండును. అప్పుడు సమాప్తమైనదని ఒక గొప్ప స్వరము గర్భాలయములోనున్న సింహాసనము నుండి వచ్చెను. హార్మగిద్దోను యుద్ధము, తదుపరి సంభవాలు మానవ దృష్టిలో భవిష్యత్ విషయము. కానీ, దేవుని దృష్టిలో గతించినదని అర్ధము.
*ఈ సమయమందు జరుగు నాలుగు కార్యములు:*
* మెరుపులు
* ధ్వనులు
* ఉరుములు
* పెద్ద భూకంపములు
ఏడవ పాత్రను క్రుమ్మరించినప్పుడు జరిగిన సంభవాలే, ఏడవ ముద్రను విప్పినప్పుడు, ఏడవ బూరను ఊదినప్పుడుకూడా సంభవించాయి.
*ఏడవ ముద్రను విప్పినప్పుడు:*
ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
ప్రకటన 8:5
*ఏడవ బూరను ఊదినప్పుడు:*
మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
ప్రకటన 11:19
మనుష్యులు భూమిమీద పుట్టిన తర్వాత అట్టి మహాభూకంపము ఎప్పుడునూ కలుగలేదు. ఏడవ దూత తన క్రోధ పాత్రను క్రుమ్మరించినది మొదలుకొని, ప్రభువు రెండవసారి వచ్చి తన పాదము ఒలీవల కొండ మీద మోపువరకు, అనగా ఈమధ్య కాలమంతయూ దేవుని ఉగ్రత కలుగుచుండెను.
* యేసు ప్రభువు రారాజుగా వచ్చి, ఒలీవల కొండమీద ఆయన పాదం మోపినప్పుడు భయంకరమైన భూకంపం కలుగును.
* ఒలీవల కొండ రెండుగా చీలిపోవును.
* పాలస్తీనాలోగల ఉన్నత పర్వతములన్ని భూమట్టమౌతాయి.
* ద్వీపములు సముద్రములో కలిసిపోతాయి.
* అన్యజనుల మహా పట్టణమైన బాబెలు నాశనమవుతుంది.
జరుగనైయున్న హార్మగిద్దోను యుద్ధసమయంలో సాతాను సైన్యముమీద ఈ వడగండ్ల వర్షము పడవచ్చు. వడగండ్లు ఒక్కొక్కటి వంద కేజీల బరువుండును.
*ఐగుప్తులో ఇట్లాంటి వడగండ్ల వర్షము కురిసెను.*
ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
....... మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమం దంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.
లేవి 9:18-24
1995 మార్చి, 4వ తేదీన కోయంబత్తూర్ లో కూడా ఇట్లాంటి వర్షం పడినట్లు వార్తల ద్వారా తెలుసుకోగలిగాము.
*ప్రభువైన యేసు, అంత్యక్రీస్తు పైన తన ప్రచండమైన ఊపిరిని ఊదును:*
అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
2థెస్స 2:8
*ఒక్క దినములో అంత్య క్రీస్తు సైన్యము నాశనమవుతుంది.*
ఇదిగో యెహోవా దినమువచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింప బడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవు చున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెర పట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము నకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవు దురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.
ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలు గును. ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాల మందును ఆలాగుననే జరుగును. యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును,హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపిం చును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును, పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచి యున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలు కలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.
జెకర్యా 14:1-14
ఇశ్రాయేలీయుల సైన్యముతప్ప, మిగిలిన సైన్యమంతటిని నాశనం చేసి, ప్రభువువారు రారాజుగాను, ఇశ్రాయేలీయులు తన ప్రజలుగాను పరిపాలన చేయును.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(45వ భాగము)*హార్ మెగిద్దోను యుద్ధం*
మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మందు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
ప్రకటన 19:17-21
హార్ మెగిద్దోను అనేది హెబ్రీ పదము.
* హార్ : అనగా కొండ
* మెగిద్దోను: కనాను దేశాన్ని, యెహోషువా స్వాధీన పరచుకున్న తర్వాత, ఇస్సాకార్ సరిహద్దు వద్ద గల, మనస్సే గోత్రముయొక్క భూభాగమునకు చెందిన ఒక ప్రాంతమే మెగిద్దోను.
*హార్ మెగిద్దోను ఎక్కడవుంది?*
* కర్మెలు, గిల్బోవా పర్వతాలకు మధ్య.
*హార్ మెగిద్దోను గత చరిత్ర*:
* గిద్యోను, మిద్యానీయులను ఇక్కడనే ఓడించెను. (న్యాయాధి 6,7 అధ్యాయములు)
* ఈజిప్ట్ రాజైన ఫరోనెకో, యోషీయా రాజును ఇక్కడనే హతమార్చెను.
(2 రాజులు 23:29)
*చివరి హార్ మెగిద్దోను యుద్దము ఎవరిమధ్య జరుగబోతోంది?*
* క్రీస్తుకు, క్రీస్తు విరోధి సైన్యాలకు మధ్య
*ఎప్పుడు జరుగబోతోంది?*
* ఏడేండ్ల శ్రమలకు, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు మధ్య కాలములో ఈ యుద్ధము జరుగబోతోంది.
సాతాను దుష్టత్రయం (సాతాను, అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త) నోటనుండి వెలువడిన కప్పలువంటి అపవిత్రాత్మలు, సర్వలోక సైన్యాలను క్రీస్తుకు విరోధంగా పోగుజేస్తాయి.
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.
ప్రకటన 16:12-15
అప్పుడు క్రీస్తుకును, క్రీస్తు విరోధి సైన్యాలకును మధ్య ఈ యుద్ధము జరుగబోతోంది.
*హార్మెగిద్దోను యుద్ధమునకుగల కారణములు:*
1. దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించుటకు, వారి పక్షముగా యుద్ధము చేయును.
నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింప బడుదురు.
రోమీయులకు 11:27
2. సంఘము ఎత్తబడిన తర్వాత, అంత్య క్రీస్తు ఏడేండ్ల పరిపాలన తర్వాత, అతని పాలనను అంతమొందించి, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించుటకు.
3. దేవుడు తన్నుతాను, సృష్టి కర్తగా, సర్వాధికారిగా, సర్వ శక్తిమంతునిగా రుజువు పరచుకొనుటకు.
4. ఇశ్రాయేలీయులను, సంఘమును హింసించిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకొనుటకు.
5. భూరాజులందరిని జయించి, ప్రపంచమంతా ఒకే రాజ్యము నెలకొల్పడానికి,
ఇశ్రాయేలీయులను నాశనము చేయుటకు అంత్య క్రీస్తు నాయకత్వములో భూరాజులును, సైన్యమును సమకూర్చును. వారు మెగిద్దోను లోయలో యుద్ధమునకు దిగగా ఇశ్రాయేలీయులు దిక్కులేని స్థితిలో, రక్షణ కొరకు దేవునిని ప్రార్ధిస్తారు. అప్పుడు ప్రభువు వారిని రక్షించుటకు బహిరంగ రాకడలో ప్రత్యక్షమగును.
యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
ద్వితీ 33:26
అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము నకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవు దురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
జెకర్యా 14:3-5
యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. ఇది యెహోషాపాతు లోయ.
అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యె మాడుదును.....
తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను.యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
యోవేలు 3:2,14-16
ప్రభువు ఒలీవల కొండమీద నుండి మెగిద్దోను లోయలోనున్న శత్రువులతో యుద్ధము చేయును. ఆయన నోటినుండి వాడిగల ఖడ్గం బయలువెళ్లి శత్రువులను వధించును.
అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
2 థెస్స 2:8
*క్రీస్తు విరోధి సైన్యముల మాంసము ఆకాశ పక్షులు కడుపారా భుజించును.*
*పక్షులకు విందు:*
మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
ప్రకటన 19:17,18
అమెరికా దేశంలో విమానం పరిమాణంలో నున్న, పక్షులు వెలుగులోనికి వచ్చాయట. అవి ఎగురుతుంటే, బిల్డింగులు సహితం కంపిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
అంతే కాకుండా, హార్ మెగిద్దోనుకు సమీపంలో బయార్డ్ అనే విచిత్రమైన పక్షులు కనుగొన్నట్లు తెలుస్తుంది. అవి టన్నులకొద్దీ మాంసాన్ని జీర్ణం చేసుకొనే శక్తిని కలిగివున్నాయట. ప్రారంభములో సంవత్సరానికి అవి రెండు గుడ్లు పెట్టేవని, ఇప్పుడైతే, సంవత్సరానికి పండ్రెండు గుడ్లు పెట్టుచూ వాటి సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ హార్ మెగిద్దోను యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నట్లు గ్రహించగలము.
హార్ మెగిద్దోను యుద్దములో క్రీస్తుకు విజయం, భూరాజులు నేలమట్టం.
అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త ప్రాణంతోనే అగ్నిగుండములో వేయబడతారు. మొట్టమొదట అగ్ని గుండములోనికి ప్రవేశించేది వీరిద్దరే.
*హార్ మెగిద్దోను యుద్ధము తర్వాత సాతాను అగాధములో వెయ్యి సంవత్సరాలు బంధించబడును.*
మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.
ప్రకటన 20:1-3
హార్మగిద్దోను యుద్ధము అనంతరము, ప్రపంచమంతా ప్రభువు స్వాధీనము చేసుకొని, వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించును.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(46వ భాగము)*క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన*
(Part:1)
వెయ్యేండ్ల పరిపాలనను గూర్చి, అనేకులు లేఖనాలను వక్రీకరిస్తున్నారేమో అనిపిస్తుంది. కొందరు అసలు వెయ్యేండ్ల పాలనే లేదని. మరికొందరు వెయ్యేండ్లు అంటే, అక్షరాలా వెయ్యేండ్లు కాదని, వేల సంవత్సరాల తరబడి ఈ పాలన కొనసాగుతుందని, ప్రస్తుతము మనము వెయ్యేండ్ల పాలనలోనేనున్నామని రకరకాల వ్యాఖ్యానాలు వింటున్నాము.
మనుష్యుల అభిప్రాయాలను ప్రక్కనబెట్టి, లేఖనాల పరిశీలనలో వెయ్యేండ్ల పరిపాలనకు ముందు సంభవించవలసిన సంభవాలేమిటో తెలుసుకొని, ఒక నిర్ధారణకు వచ్చే ప్రయత్నం చేద్దాం!
మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయ ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
ప్రకటన 20:1-6
ఈ ప్రవచన వాక్యం ప్రకారం, వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కావాలంటే? మూడు విషయాలు జరిగితీరాలి.
1. సాతాను బంధింపబడి ముద్ర వేయబడాలి.
2. పునరుద్ధానం జరిగిపోవాలి.
3. క్రీస్తు ప్రత్యక్షంగా రాజ్య పాలన చెయ్యాలి.
ఈ మూడింటిలో ఒక్కటి కూడా జరుగలేదు. కాబట్టి, వెయ్యేండ్ల పాలన ప్రారంభం కాలేదు. మనమున్నది వెయ్యేండ్ల పాలనలో కానేకాదు. క్రీస్తు బహిరంగ రాకడ తర్వాతనే, క్రీస్తు వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది. అది అక్షరాలా, వెయ్యి సంవత్సరాలుంటుంది. వెయ్యేండ్ల పాలన భూమిమీదే జరుగుతుంది.
*క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో ఎవరెవరు వుంటారు?*
* ప్రభువైన యేసు క్రీస్తు రారాజుగా ఉంటారు.
* ఎత్తబడిన సంఘం
* శ్రమ కాలంలో హతసాక్ష్యులైన పరిశుద్ధులు
* శ్రమకాలంలో శేషించిన ఇశ్రాయేలీయులు
* హార్మగిద్దోను యుద్ధము తర్వాత మిగిలియున్న పాపులు.
* శ్రమ కాలంలో ఇశ్రాయేలీయులకు సహాయం చేసిన అన్యజనులు.
ఏడేండ్ల శ్రమకాలంలో, రెండవ అర్ధవారంలో, అనగా రెండవ మూడున్నర సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యమునకు పారిపోతారు. అక్కడ, వీరికి అనేక మంది అన్యజనులు వారికి ఆహారమిచ్చి, ఇశ్రాయేలీయులను పోషిస్తారు. వారంతా వెయ్యేండ్ల పాలనలో ప్రవేశిస్తారు. వీరి ద్వారానే, అత్యంత వేగంగా భూమి అంతా ప్రజలతో నిండించబడుతుంది.
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొ నియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.
అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.
అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు.
మత్తయి 25: 31-46
Note: ఇక్కడ ప్రస్తావించబడిన గొర్రెలు, శ్రమకాలంలో, అల్పులైన ఇశ్రాయేలీయులకు సహాయం చేసినవారు. మేకలు, క్రీస్తు విరోధితో చేతులుకలిపి ఇశ్రాయేలీయులకు సహాయం చేసినవారు కాదు.
అయితే, పరిపాలించేదెవరు?
బహిరంగ రాకడలో, ప్రభువుతో పాటు దిగివచ్చిన సంఘము. వీరంతా రక్తమాంసములను కలిగియుండక, మహిమ శరీరాలను కలిగియుండి, రాజ్య పాలన చేస్తారు.
సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. (2 తిమోతికి 2:12)
*వెయ్యేండ్ల పాలనలో మన అధికార హోదా ఎట్లా వుండబోతోంది?*
ఇప్పుడు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ, నీకివ్వబడిన తలాంతులతో ఆత్మల రక్షణకై పాటుపడితే, నీవు ఒక స్టేట్ కి సి.ఎం కావొచ్చు. లేకపోతే, ఒక వార్డ్ మెంబర్ గా సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో? సంఘాలలో రాజకీయం చేసే, ఈ రాజకీయ నాయకులంతా, పదవులకోసం కొట్టుకుచచ్చే ఈ పెద్దలంతా, వెయ్యేండ్ల పరిపాలనలో సి.ఎం పోస్ట్ కి ట్రై చేస్తే, ఎంత బాగుండేది?
పరలోకరాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్ప గించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చిఅయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించి తివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను.అతని యజమానుడుభళా, నమ్మక మైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చిఅయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.
తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి -- అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను.
అందుకు అతని యజమానుడు వానిని చూచిసోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
మత్తయి 25:14-30
హార్మగిద్దోను యుద్ధము తర్వాత మిగిలియున్న పాపులు కూడా వెయ్యేండ్ల పాలనలోఉంటారు కాబట్టి, ఎట్లా జీవించినా సరే, వచ్చిన సమస్య ఏమిటి? అని నీకు నీవు సర్ది చెప్పుకోవలసిన అవసర్లేదు. చివర్లో అసలైన మరొక యుద్ధం వుంది. అది “గోగు మాగోగు యుద్ధం” దానితో సర్వ పాపులు భూమిమీదలేకుండా నశించిపోతారు. సాతాను కూడా నరకంలో వేయబడతాడు. పరిశుద్ధులే నిత్యత్వంలో ప్రవేశిస్తారు.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(47వ భాగము)⛔ క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన⛔
(Part:2)
👉 వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ రాజధాని ?
* యెరూషలేము
ఆ కాలమున యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు.
యిర్మియా 3:17
👉 వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ రాజాధిరాజు?
* ప్రభువైన యేసు క్రీస్తు
దూత- మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగ ములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
లూకా 1:30-33
రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.
దానియేలు 7:13,14
👉 పరలోకమే ఆయన వెయ్యేండ్ల పాలనను గూర్చి ప్రకటించు చున్నది.
ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
దానియేలు 2:44
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
లూకా 1:32
👉 వెయ్యేండ్ల పాలనలో శపించబడిన భూమి, శాప విమోచనాన్ని పొందుతుంది.
*ఏదెను వనములో:*
ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
ఆదికాండము 3:17
*వెయ్యేండ్లపాలనలో శాపవిమోచన:*
ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.
యెషయా 55:13
అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
యెషయా 35:1,2
👉 వెయ్యేండ్లపాలనలో మానవులు సుదీర్ఘమైన ఆయుష్షును కలిగియుంటారు.
* బాలుని వయస్సు నూరు సంవత్సరాలుంటుంది.
* వృక్షాయస్సు అనగా, వృక్షాల వలే కొన్ని తరాలవరకు జీవిస్తారు.
అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.....వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
యెషయా 65:20,22
*బాలుని వయస్సే నూరు సంవత్సరాలంటే? ఇక వృద్ధుల వయస్సు, వందల సంవత్సరాలుంటుంది.*
సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చునదే మనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధు లలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.
జెకర్యా 8:4,5
👉 వెయ్యేండ్ల పాలనలో జంతులోకంలో విపరీతమైన మార్పులుంటాయి.
తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
యెషయా 11:6-9
👉 *పాలస్తీనా దేశములో పెను మార్పులు:
యెహోషువా నాయకత్వంలో పాలస్తీనాను స్వాధీనం చేసుకున్నప్పుడు, అది పాలు, తేనెలు ప్రవహించు దేశమై యుండెను. కానీ,వారు పాపం చెయ్యడం ద్వారా, ఆకాశమును మూసివేయునని హెచ్చరించెను. (ద్వితీ 11:3-17)
అయితే, ఈ కాలమందు వర్షము తన కాలమందు కురియును. మంచి ఫలములు వారు పొందుదురు.
వెయ్యేండ్ల పాలనలో వర్షములద్వారా మాత్రమే కాదు. పరిశుద్ధ స్థలమునుండి ప్రవహించుచున్న దాని ఉపనదులవలన రాజ్యము ఫల సమృద్ధియగును.
ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదు లన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.
యోవేలు 3:18
రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వత ములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండ లన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.
ఆమోసు 9:13
కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరుపురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.
యోవేలు 2:24-26
👉 ఏడురెట్లు ప్రకాశమానము:
యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.
యెషయా 30:26
నూతన భూమియందు దాని సంపూర్ణ నెరవేర్పు జరుగును.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
ప్రకటన 21:23,24
ఆ రాజ్యములో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(48వ భాగము)⛔ *క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన*⛔
(Part: 3)
*వెయ్యేండ్లకాలమందలి ప్రత్యేకతలు:*
(Part-1)
🔺 *సమాధానము:*
*యుద్ధములుండవు. ఈటెలు, ఖడ్గాలతో పనిలేదు.*
ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
యెషయా 2:4
*యెరూషలేములో గుఱ్ఱములు, యుద్దపు విల్లులుండవు.*
ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజను లకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.
జెకర్యా 9:10
(మీకా 4:2,3; యెషయా 9:4-7; 11:6-9; 32:17,18)
🔺 *సంతోషం:*
సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
జెఫన్యా 3:14-17
(జెకర్యా 8:18,19; 10:6,7; యెషయా 9:3,4; 12:3-6; 14:7,8; 25:8,9)
🔺 *పరిశుద్ధత:*
సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.
యెషయా 4:3-5
(యెషయా 35:8,9; 52:1; యోవేలు 3:21; జెఫన్యా 3:11,13)
🔺 *నీతి:*
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
యెషయా 9 :7
( యెషయా 11:5; 32:16; 42:1-4; 65:21-23; యిర్మీయా 23:5; 31:23)
🔺 *పరిపూర్ణ జ్ఞానం:*
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు *లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.*
యెషయా 11:1,2,9
(యెషయా 54:3; హబక్కూకు 2:14)
🔺 *శాపము లేదు:*
అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
యెషయా 35:9
తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
యెషయా 11:6,9
🔺 *రోగము లేదు:*
నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.
యెషయా 33:24
అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
యిర్మియా 30:17
తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును;
యెహేజ్కేలు 34:16
🔺 *రోగ స్వస్థత:*
ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.
యెషయా 29:18,19
(యెషయా 35:3-6; 61:1,2; యిర్మీయా 31:8; మీకా 4:6,7; జెఫన్యా 3:1,9)
*ఇట్లాంటి ధన్యకరమైన రాజ్యంలో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!*
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(49వ భాగము)⛔ క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన⛔
(Part: 4)
*వెయ్యేండ్లకాలమందలి ప్రత్యేకతలు:*
(Part-2)
🔺 *బాధలుండవు:*
తమ్మును బాధించినవారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.
యెషయా 14:3-5
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.
యెషయా 49:8
🔺 *భద్రత:*
నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
యెషయా 41:8-14
యెషయా 62:8,9; యిర్మీయా 32:37; యెహెఙ్కేలు 34:27; యోవేలు 3:16,17
🔺 *పనులుంటాయి:*
ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును. ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.
యెహేజ్కేలు 48:18,19
🔺 *ఆర్థికాభివృద్ధి:*
యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు.
యెషయా 62:8,9
జెకర్యా 8:11,12; 9:16,17; యోవేలు 2:21-27; ఆమోసు 9:13,14. మీకా 4:4; యెహెఙ్కేలు 34:26.
🔺 *దేవునితో సాన్నిహిత్యం:*
ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
ప్రకటన 21:3
ఇట్లాంటి అనేకమైన ప్రత్యేకతలు ఆ ధన్యకరమైన రాజ్యములో ఉంటాయి. ఆ రాజ్యంలో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(50వ భాగము)*గోగు మాగోగు యుద్ధము:*
వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.
ప్రకటన 20:7-10
*ఎవరీ గోగు మాగోగు?*
గోగును గూర్చిన వంశావళి (1దిన 5:4) లో చూడవచ్చు. మాగోగును గూర్చి అతడు యాపేతు కుమారుడుగా చెప్పబడింది. (ఆది. 10:2; 1దిన 1:5) వీరు సిథియన్స్ గా పిలువబడ్డారు. రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వలస వెళ్లి స్థిరపడినవారు. అంటే? రష్యానే ప్రధాన పాత్ర పోషించవచ్చు.
*గోగు మాగోగు యుద్ధము ప్రత్యేకత:*
* సృష్టిలో చిట్ట చివరియుద్ధం.
* సర్వపాపులు సమూల నాశనం.
* రక్తపాతం లేదు.
* అగ్ని గంధకాలలో బూడిదవుతారు.
* సొదొమ గొమొఱ్ఱా పట్టణాలమీద “ఆకాశం నుండి” అగ్ని గంధకాలు కురిశాయి. ఇప్పుడైతే, “పరలోకమునుండి” అగ్ని గంధకాలు కురుస్తాయి.
* నావొహు కాలంలో జల ప్రళయమైతే, ఇప్పుడు అది అగ్ని ప్రళయమవుతుంది.
* సాతాను అగ్నిగుండములో పడవేయబడును.
*గోగు మాగోగు యుద్ధము ఎప్పుడు జరుగబోతోంది :*
* క్రీస్తు వెయ్యేండ్ల పాలన తర్వాత.
వెయ్యి సంవత్సరాలు అగాధంలో బంధించబడిన సాతాను, వెయ్యి సంవత్సరాలు గడచిన తర్వాత, మరలా కొంతకాలం విడచిపెట్టబడతాడు. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరి, యుద్ధమునకు వారిని ప్రేరేపిస్తాడు. వాని మాటలకు మోసపోయిన వారు పరిశుద్ధుల శిబిరమైన యెరూషలేమును ముట్టడిస్తారు. ప్రభువు పరలోకమునుండి అగ్ని గంధకాలను కురిపించి వారందరితో పాటు, మీదనున్న సర్వ మానవాళిని నాశనం చేస్తాడు. అంటే? వెయ్యేండ్ల పాలనలో కూడా పాపులైన ఆ ప్రజలు మార్పు చెందినవారు కాదు.
*అగ్ని గుండము ఎవరికొరకు సిద్ధం చేయబడింది?*
* సాతాను మరియు వాని దూతలకొరకు.
శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
మత్తయి 25:41
*అగ్నిగుండంలో ప్రవేశించిన దుష్ట త్రయం:*
హార్ మెగిద్దోను యుద్దానంతరం అంత్య క్రీస్తు, అబద్ద ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడగా, గోగు మాగోగు యుద్దానంతరం సాతాను అగ్నిగుండంలో వేయబడతాడు.
అగ్ని గుండాన్ని దేవుడు మనకోసం సిద్ధపరచలేదు. మనమెప్పుడూ ఆయన పిల్లలుగానే, అనునిత్యం ఆయనతోనే వుండాలని ఆయన ఆశపడ్డాడు. అందుకోసమే చివరి రక్తపు బొట్టువరకు మనకోసం చిందించి, మనలను పాపమునుండి పరిశుద్ధ పరచి, తిరిగి ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. ఆయన ఇంతచేసినా, సాతాను అనుచరులముగా గానే మేము జీవిస్తామంటే? సాతానుకు, వాని దూతలకోసం సిద్ధపరచబడిన అగ్నిగుండములోనికి విసిరెయ్యడం తప్ప, ఆయన ఇంకేమి చెయ్యలేడు.
అగ్నిగుండం ఊహలకే భయంకరం. అనుభవించాల్సి వస్తే, ఆ బాధ వర్ణనాతీతం. అగ్నిగుండం, కట్టెలు కాలిస్తే వచ్చే మంటల్లా ఉండదట. అది ఒక ద్రవ పదార్థంలా మరుగుతూ వుంటుందట. మరుగుతున్న తారు డబ్బాలో ఒక్క వ్రేలు పెడితే, ఆ బాధను ఊహించగలమా? అట్లా కాకుండా, ఇక దానిలోనే ఈతకొట్టాల్సి వస్తే? దానిని వర్ణించడానికి ఈ ప్రపంచములోనున్న ఏ భాష కూడా చాలదు.
అయితే, నీవనుకోవచ్చు. పరలోకం, నరకముందని ఎవరికి తెలుసని? నీవు పుట్టకముందు భూలోకం అంటూ ఒకటుందని నీకు తెలియదుకదా? పుట్టాకే తెలిసింది. నరకమో అంతే? నీ ఈ భూలోకాన్నైనా విడవాలి, ఆయన రాకడైనా రావాలి. అప్పుడుగాని, అర్ధంకాదు. పరలోకం, నరకం ఉన్నాయని. అప్పుడర్ధమయినా, ఫలితం శూన్యం. నీవు ఈలోకంలో జీవించిన సమయంలోనే నీకర్ధం కావాలి. అట్లా అని, బలముంది కదా? వయస్సుంది కదా అని వాయిదాలేస్తే? ఏ క్షణాన వాడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో? ఎవరికి తెలుసు? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(51వ భాగము)*అంత్య న్యాయ తీర్పు* (లేదా)
*మహా ధవళ సింహాసనపు తీర్పు*
(Part-1)
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రకటన 20:11-15
ఇది అత్యంత ఘోరమైనతీర్పు. ఈ తీర్పులో కృపకు స్థానం లేనేలేదు. న్యాయాధిపతిగా ప్రభువు, మహా ధవళమైన సింహాసనము మీద కూర్చుండబోవుతున్నాడు. న్యాయమే ఆ తీర్పులో రాజ్యమేలుతుంది. మొదటి రాకడలో గొర్రెపిల్లలా కనిపించిన ప్రభువు, ఈ తీర్పులో గర్జించు కొదమ సింహంలా కనిపిస్తారు.
*మహా ధవళ సింహాసనపు తీర్పు ఎప్పుడు జరుగబోతోంది?*
* వెయ్యేండ్ల పాలన అనంతరం, సాతాను నరకంలో పడవేయబడిన తర్వాత. పాపులైన మృతులు అక్షయమైన శరీరాలతో లేస్తారు. అప్పుడు వారికి తీర్పు జరుగబోతోంది. ( పరిశుద్ధులైన మృతులు, మధ్యాకాశములో ప్రభువు బూర ఊదినప్పుడు ఎత్తబడినారు)
*మహా ధవళ సింహాసనపు తీర్పు ఎక్కడ జరుగబోతోంది?*
* శూన్యములో (ఆకాశంలో)
(తీర్పు కొరకు, అక్షయమైన శరీరాలతో పునరుద్ధానం చెందినవారు గనుక, శూన్యములో కూడా వారు నిలువబడగలరు. భూమి వంటి పదార్ధ సంబంధమైనదేది అవసరంలేదు.)
*శూన్యంలోనే ఎందుకు జరగాలి?*
బహుశా ఈ పాపులందరూ పునరుద్ధానం చెందేసరికి, వారు నిలువబడడానికి ఈ భూమి చాలదు.
*ధవళ సింహాసనం దేనికి సూచన?*
ధవళము అంటే? తెలుపు (పరిశుద్ధత). దానియందు ఆసీనుడైయున్నవాని, పవిత్రతకు, న్యాయతీర్పు యొక్క ప్రత్యేకతకు సూచన.
*ధవళ సింహాసనమందు ఆసీనుడైయున్న వారెవరు?*
* దేవుని కుమారుడైన, ప్రభువైన యేసు క్రీస్తు.
తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని *తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు*; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
యోహాను 5:22,23
ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
అపొ. కార్యములు 17:31
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
2 తిమోతికి 4:1
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొ నియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు.
మత్తయి 25: 31-46
*ఈ తీర్పులో నిలువబడడం అత్యంత భయానకం.*
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(52వ భాగము)*అంత్య న్యాయ తీర్పు* (లేదా)
*మహా ధవళ సింహాసనపు తీర్పు*
(Part-2)
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రకటన 20:11-15
ఇది అత్యంత ఘోరమైనతీర్పు. ఈ తీర్పులో కృపకు స్థానం లేనేలేదు. న్యాయాధిపతిగా ప్రభువు, మహా ధవళమైన సింహాసనము మీద కూర్చుండబోవుతున్నాడు. న్యాయమే ఆ తీర్పులో రాజ్యమేలుతుంది. మొదటి రాకడలో గొర్రెపిల్లలా కనిపించిన ప్రభువు, ఈ తీర్పులో గర్జించు కొదమ సింహంలా కనిపిస్తారు.
🔹 *భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.*
సాక్ష్యము చెప్పు నిమిత్తము భూమిని, ఆకాశాన్ని పిలచుచున్నట్లు వ్రాయబడియున్నది. కనుక, సాక్ష్యము చెప్పు నిమిత్తము అవి పారిపోయి, వాటి కొరకు ప్రత్యేకించబడిన స్థలములో అవి నిలచియున్నాయని తలంచవచ్చు.
గోడలకు చెవులుంటాయి అంటారు. అదియేమోగాని, భూమికి, ఆకాశానికి మాత్రం, చెవులతోపాటు నోరు కూడా వుంది.
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
యెషయా 1:2
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
కీర్తనలు 102:25-27
ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.
యెషయా 51:6
ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.
మార్కు 13:31
మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
ప్రకటన 6:14
కావున, మహా ధవళ సింహాసనము శూన్యములో వేయబడును. పునరుద్ధాన శరీరములకు శూన్యములో నిలువబడుటకు వీలగును.
🔹 *గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని.*
ఈ లోకంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాధించినా, దేశాలను యేలిన చక్రవర్తులైనా, బానిసలైనా, వారెవరైనా సరే, రక్షించబడనివారైతే ఆ సింహాసనము ముందు నిలువబడాల్సిందే. వారు జీవించిన జీవితాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. అబద్ధమాడుటకు అవకాశం లేదు. సాక్ష్యమిచ్చుటకు భూమి, ఆకాశం సిద్ధంగా ఉంటాయక్కడ.
🔹 *అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.*
👉 Note:
జీవ గ్రంధములో ఎవరి పేర్లుంటాయి?
సృష్టి ఆరంభమునుండి భూమి మీద జీవించిన ప్రతీ మనిషి పేరు ఉంటుంది. ఆ మనిషి తన జీవితకాలంలో రక్షించబడకుండా వుంటే? వారు మరణించిన వెంటనే, వారి పేరు జీవగ్రంధమునుండి తీసివేయబడి, వేరొక గ్రంధములో వ్రాయబడుతుంది. రక్షించబడిన వారి పేరు జీవ గ్రంధములోనే నిలిచివుంటుంది. ఈ గ్రంధంలో పేరు వ్రాయగలిగేవాడు, తుడిచివేయగలిగే వాడు దానిని తయారు చేసిన దేవుడు ఒక్కడే. మన పేర్లు ఆ గ్రంధములో నిలిచి ఉండుటకు ఎట్లాంటి రికమండేషన్స్ పనిచేయవు. నీవు ప్రభువు కొరకు జీవించిన జీవితమే ఆ గ్రంధములో నీ పేరు నిలిచేటట్లు చెయ్యగలదు. నిత్య మరణానికైనా, నిత్య జీవానికైనా నీవు జీవించిన జీవితమే ప్రమాణం.
దేవుని జీవముపొందిన ప్రతీవాని పేరు ఈ గ్రంథమందు కలదు. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడి అని ప్రభువు చెప్పుచున్నారు.
(లూకా 10:20)
పరలోకంలో పలు గ్రంధములు కలవు. భూమి మీద జీవించిన ప్రతీవాని పేరు ఒక గ్రంధములో వ్రాయబడును. అదే “జీవ గ్రంధము.”
జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
కీర్తనలు 69:28
అయితే, మరణం తర్వాత, రక్షించబడని వారి పేర్లు, రక్షించబడిన తర్వాత తిరిగిలోకంలోనికి వెళ్లిపోయిన వారి పేర్లు వేరొక గ్రంధములోనికి మార్చబడతాయి. ప్రతీవారికి ఒక్కొక్క గ్రంధము ఉండవచ్చు. వాని వాని క్రియలచొప్పున వానికి తీర్పు తీర్చబడును.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి కారము చేసెదను. (యెషయా 65:6)
అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. (మలాకీ 3:16)
🔹 *సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.*
(ప్రకటన 20:13)
సముద్రము అనగా, సమస్త జలాశయములు. నీటిలో పడి మరణించిన వారిని సముద్రము అప్పగించును. సముద్రములో పడిపోయినను, దుష్టమృగములు చీల్చి, తినివేసినను, మంటల్లోకాలి బూడిదైననూ, ఈ శరీరము పంచ భూతములలో కలసిపోయినను, అవి తిరిగి ఏకమై తిరిగి లేచును.
🔹 *మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను.*
ప్రకటన 20:14,15
ఈ అగ్ని గుండము రెండవ మరణము. మరణములేని నూతన యుగము ప్రారంభించు చుండగా, దానికి ముందుగా మరణమును అగ్నిగుండములో పడవేయును.
పాపమునకు కారణమైన సాతానును అగ్నిగుండములో పడవేసెను. కనుక, పాపశిక్ష అయిన మరణమునకు ఇక స్థానము లేదు.
అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను పడియున్న అగ్నిగుండములో మరణము, పాతాళము వేయబడును.
👉 Note:
పాతాళము అనేది?
మరణమునకు, న్యాయతీర్పుకు మధ్యలో రక్షణ పొందని వారి ఆత్మలు నివసించు స్థలమైయున్నది. అంత్య న్యాయతీర్పు తర్వాత, పాతాళము యొక్క అవసరత లేదు. గనుక పాతాళము అగ్నిగుండములో వేయబడును.
🔹 *ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.*
ప్రకటన 20:15
జీవ గ్రంధములో నీ పేరు కనబడకపోతే? నీవు అగ్ని గుండములో కనబడతావు. జీవ గ్రంధములో నీ పేరు వుంటే? అగ్ని గుండములో నీవుండవు.
ఈ లోకంలో ఎన్ని ఆధిక్యతలున్ననూ, జీవగ్రంధంలో నీ పేరులేకపోతే?
ఇక్కడ, కృప, దయ, జాలి అట్లాంటివాటికి స్థానం లేదు. రక్షించబడకపోతే? నిత్య మరణమే శరణ్యం.
అయితే, నీవనుకోవచ్చు. పరలోకం, నరకముందని ఎవరికి తెలుసని? నీవు పుట్టకముందు భూలోకం అంటూ ఒకటుందని నీకు తెలియదుకదా? పుట్టాకే తెలిసింది. నరకమో అంతే? నీ ఈ భూలోకాన్నైనా విడవాలి, ఆయన రాకడైనా రావాలి. అప్పుడుగాని, అర్ధంకాదు. పరలోకం, నరకం ఉన్నాయని. అప్పుడర్ధమయినా, ఫలితం శూన్యం. నీవు ఈలోకంలో జీవించిన సమయంలోనే నీకర్ధం కావాలి. అట్లా అని, బలముంది కదా? వయస్సుంది కదా అని వాయిదాలేస్తే? ఏ క్షణాన వాడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో? ఎవరికి తెలుసు? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(53వ భాగము)💮 న్యాయ తీర్పులు 💮
🔅1. క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు
🔅2. మహిమగల సింహాసనపు తీర్పు
🔅3. మహా ధవళ సింహాసనపు తీర్పు
💢 క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు:💢
🔅 ఈ తీర్పు ఎక్కడ?
* మధ్యాకాశంలో
🔅ఎవరికి?
* ఎత్తబడిన సంఘానికి
🔅తీర్పు తీర్చేదెవరు?
* ప్రభువైన యేసు క్రీస్తు
ప్రభువు మధ్యాకాశములోనికి వచ్చి బూర ఊదినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన సంఘానికి తీర్పు తీర్చబడుతుంది.
🔅తీర్పు అంటే?
ఇక్కడ శిక్ష అని అర్ధం కాదు. ఈ తీర్పును గ్రీకు భాషలో “భీమా” అంటారు. దీని అర్ధమేమిటంటే? జీవితం చివర్లో పొందు ప్రతిఫలం అని అర్ధం. క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో ఎవ్వరికీ శిక్షలు వుండవు. అందరికీ బహుమానాలే, కిరీటాలే. ఎందుకంటే? ఎత్తబడినవారంతా ప్రభువుకొరకు నమ్మకంగా జీవించినవారే. భూమి మీద జీవించినప్పుడు ఎవరు ఎక్కువ దేవుని కొరకు కష్టపడితే, అన్ని కిరీటాలు పొందుకుంటారు. ఒకరు ఒకటే కిరీటం పొందుకోవచ్చు. మరికొందరికి ఒకటికంటే ఎక్కువ పొందుకోవచ్చు. దీనికంతటికి వారు భూమిమీద జీవించిన జీవితమే ప్రమాణం.
ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. (2 కొరింథీ 5:10) ఈ వాక్య భాగములో పౌలు గారు “మనమందరము” అనే మాట ద్వారా, తనను కూడా కలుపుకొంటున్నారు. అంటే? ఇది ఎత్తబడిన సంఘానికి జరిగే తీర్పు అనే విషయం నిస్సందేహం. పౌలు గారు ఎత్తబడే సంఘములో వుండరు అని వాదించే క్రైస్తవుడు ఉంటాడని నేననుకోవడంలేదు.
💢తీర్పులో దేవుడిచ్చే ప్రతిఫలాలు:💢
💮 మెప్పు:
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
(1 పేతురు 1:7)
సంఘములో గల వందమంది సభ్యులమధ్యలో ఎవరైనా మనలను మెచ్చుకొంటేనే, మన ఆనందానికి అవధులుండవు. అట్లాంటిది కోట్లాది మంది సంఘము ఎదుట, యేసు ప్రభువే మనలను మెచ్చుకొంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించగలమా?
💮 కిరీటములు
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
ప్రకటన 22:12
ప్రభువు యిచ్చే జీతము:
🔸జీవ కిరీటము:
శోధనలు జయించినవానికి, శ్రమలు సహించినవానికి ( యాకోబు1:12; ప్రకటన2:10)
🔸 మహిమ కిరీటం:
మందను నమ్మకంగా కాయువారికి (సంఘ కాపరులకు) 1పేతురు 5:2-4
🔸 అతిశయ కిరీటం:
ఆత్మలను రక్షించువానికి (సువార్తికులకు)
1 థెస్స 2:19
🔸 నీతి కిరీటం:
తన పరిశుద్ధతను కాపాడుకొనుచు, తనకు అప్పగించు పనిని పూర్తిచేయు వానికి.
2తిమోతి 4:8
🔸 అక్షయ కిరీటం:
భక్తిలో విజయం సాధించేవారికి
1కొరింధీ 9:25-27
💮 పదవులు:
ఏడేండ్ల శ్రమకాలం గతించిన తర్వాత, ప్రభువు వెయ్యేండ్ల పాలన భూమి మీద ప్రారంభిస్తారు. ఆ పాలనలోఎవరు ఏ పదవులలో వుంటారో ఇక్కడే నిర్ణయింపబడుతుంది. భూమి మీద నీవు జీవించియున్నప్పుడు ప్రభువుకోసం ఎంత కష్టపడితే, వెయ్యేండ్ల పాలనలో అంత ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటావు. అక్కడ సి.ఎం కావాలన్నా, వార్డ్ మెంబెర్ గా మిగిలిపోవాలన్నా, ఇక్కడ జీవించిన జీవితమే ప్రమాణం.
💢ఆ ధన్యకరమైన రాజ్యంలో మనముండాలంటే?
మనలను మనము పరిశీలన చేసుకోవాలి.
👉 ప్రభువిచ్చిన శరీరాలను ఎట్లా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నాము?
👉 ప్రభువిచ్చిన సమయాన్ని ఎట్లా వినియోగిస్తున్నాము?
👉 ప్రభువిచ్చిన ఆస్తి పాస్తులను ప్రభు పరిచర్యకొరకు ఎట్లా ఖర్చు చేయగలుగుతున్నాము?
👉 ప్రభువిచ్చిన తలాంతులు ఎట్లా వాడగలుగుతున్నాము?
👉 ప్రభువు మనకిచ్చిన బిడ్డలను ఎవరికొరకు, ఏ రీతిగా పెంచగలుగుతున్నాము?
👉 ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన ఏ రీతిగా వుంది?
👉 ప్రభువు మనకిచ్చిన సామర్ధ్యాలను ఎంతవరకు ప్రభువు పనిలో ఖర్చు చేయగలుగుతున్నాము?
పరిశీలన చేసుకొని, సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్ధపడి ఆయనిచ్చే మెప్పు, ఘనతను పొందుకుందాం! ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(54వ భాగము)💮 న్యాయ తీర్పులు 💮
💢 మహిమగల సింహాసనపు తీర్పు💢 .....(Part-1)
🔹ఈ తీర్పు ఎవరికి?
a) అన్యజనులకు
b) ఇశ్రాయేలీయులకు
🔹ఎక్కడ?
భూమి మీద, యెహోషాపాతు లోయలో, మహిమగల సింహాసనము ఎదుట.
👉యెహోషాపాతు లోయలో:
యెహోషాపాతు యూదా రాజులలో ఒక మంచి రాజు. యెహోషాపాతు అను పేరుకు “యెహోవా న్యాయము తీర్చును” అని అర్ధము. ఈ తీర్పులో ప్రభువైన యేసు క్రీస్తు కూర్చునే సింహాసనము పేరు “మహిమగల సింహాసనము”.
ఆ దినములలో, అనగా యూదావారిని యెరూష లేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును .......
నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను..... తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
యోవేలు 3:1-2,12,14
👉మహిమగల సింహాసనము ఎదుట:
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
మత్తయి 25:31
🔹ఎప్పుడు?
యేసు క్రీస్తు రెండవ రాకడలో, ఏడేండ్ల మహా శ్రమల తర్వాత, వెయ్యేండ్ల పరిపాలనకు ముందు.
🔹తీర్పు తీర్చేదెవరు?
ప్రభువైన యేసు క్రీస్తు
🔹 తీర్పు అంశం:
ఇశ్రాయేలీయులకు చేసిన దానిని బట్టి.
మత్తయి 25:31-46
🔹 తీర్పు ఫలితం?
నిత్య జీవము లేక నిత్య శిక్షకు వేరుచేయబడుట.
మత్తయి 25:46
💮 a) అన్యజనుల తీర్పు:💮
అన్యజనులంటే ఎవరు?
యూదులు లేక ఇశ్రాయేలీయులు కానివారు.
ఏడేండ్ల శ్రమకాలము అయినతరువాత సజీవులుగానున్న అన్యజనులకు ఈ తీర్పు జరుగనుంది.
🔹 తీర్పు:
🔻a) కుడిప్రక్క గొర్రెలను పోలినవారు. (రక్షించబడినవారు)
గొర్రెలు అని చెప్పబడిన అన్యజనులు, ఇశ్రాయేలీయులకు చేసినది:
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొ నియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
మత్తయి 25 :34-40
🔻b) ఎడమ ప్రక్క మేకలను పోలిన వారు (రక్షణలేని వారు)
మేకలు అని చెప్పబడిన అన్యజనులు, ఇశ్రాయేలీయులకు చేయనిది:
అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.
మత్తయి 25 :41-45
🔻c) సహోదరులు: (క్రీస్తుని అంగీకరించిన ఇశ్రాయేలీయులు
🔹ఇప్పుడు జీవించు చున్న మనము రక్షణ కొరకు మత్తయి 25:35-39 లో వ్రాయబడినట్లు, మనమునూ అట్లా చేయవలెనా?
అట్లా చెయ్యడం ద్వారా రక్షణ కలుగదు. ధర్మ కార్యాలు, సత్క్రియలవలన రక్షణ రాదు.
🔸రక్షణ ఎట్లా సాధ్యం?
కృపచేతనే మీరు రక్షించబడియున్నారు.
ఎఫెసి 2:5
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.
ఎఫెసి 2:8,9
మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.
2 తిమోతికి 1:9,10
మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
తీతుకు 3:5
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
రోమా 6:23
👉 అయినను, రక్షణకు రుజువుగా సత్క్రియలు చేయవలెను. రక్షణ ముందు, దాని వెనుక సత్క్రియలు.
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము
ఎఫెసీ 2:10
ప్రియులారా! రక్షణలేనివారు నమ్మి రక్షించబడాలి. రక్షించబడినవారు, జీతము, బహుమానము, కిరీటము, మెప్పు, ఘనత కొరకు సత్క్రియలు చెయ్యాలి. రక్షణ లేకుండా సత్క్రియలు నిన్ను నిత్యరాజ్యానికి చేర్చలేవని గుర్తించి, నీ హృదయాన్ని ప్రభుపాదాల చెంత క్రుమ్మరించు! ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(55వ భాగము)💮 న్యాయ తీర్పులు 💮
💢 మహిమగల సింహాసనపు తీర్పు 💢 .....(Part-2)
🔹b) ఇశ్రాయేలీయులకు (యూదులు) జరిగే తీర్పు:
మరియు నేను రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశము లలోనుండియు జనులలోనుండియు నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయులదేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యెమాడినట్టు మీతోను వ్యాజ్యె మాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపురమున్న దేశములోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.
యెహేజ్కేలు 20:34-38,41
వ్యాజ్యెము అనేమాట ఇంగ్లిష్ లో judgement అని తర్జుమా చేయబడింది. అంటే తీర్పు. ఇది అన్ని కాలాలలో నున్న యూదులకు కాదుగాని, అప్పటికి సజీవులుగానున్న యూదులకు మాత్రమే.
యూదులు అంటే ఎవరు?
యాకోబు (ఇశ్రాయేలు) యొక్క పండ్రెండుగురు కుమారులు, వీరి సంతానము “ఇశ్రాయేలీయులుగా” పిలువబడ్డారు. బబులోను చెర తర్వాత, మరియు క్రొత్తనిబంధనలోను “యూదులని” పిలువబడ్డారు.
🔹ఇశ్రాయేలీయులకు (యూదులు)
జరిగే తీర్పు ఎప్పుడు?
ఏడేండ్ల శ్రమకాలం ముగిసిన తర్వాత, ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చి, అన్యజనులకు తీర్పు తీర్చును.
(మత్తయి 25:31-46) ఆ తరువాత వెయ్యేండ్ల పాలనకు ముందు తన ప్రజలైన యూదులను సమకూర్చి తీర్పు చేయును.
దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.) నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల కించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి. నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా? కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
కీర్తనలు 50:1-15
🔹తీర్పు తీర్చే స్థలమెక్కడ?
అరణ్యములో, అనగా దేవుడు ధర్మ శాస్త్రమును ఇచ్చిన సీనాయి కొండవద్ద.
యెహేజ్కేలు 20:35,36
🔹తీర్పు:
చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.
యెహేజ్కేలు 20:37
అనగా ఈ తీర్పు వ్యక్తిగతమైనది. టోల్ గేట్ దగ్గర ఒక్కొక్క వాహనమునకు పన్ను కట్టించుకొని వదిలినట్లు. ఇశ్రాయేలీయుల గొర్రెలకాపరులు కూడా మందను లెక్కించుటకు వీలుగా, దొడ్డెలోనికి ప్రవేశించే ద్వారము ఒక్కొక్క గొర్రె మాత్రమే ప్రవేశించుటకు వీలగునట్లు అమర్చుతారు.
గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే
యోహాను 10:8
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహో వాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
మలాకీ 3:1-6
ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గు లందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మలాకీ 4:1
🔹ఎక్కువమంది యూదులు ఈ తీర్పులో తీర్పు తీర్చబడి వెయ్యేండ్ల పాలనలో ప్రవేశిస్తారు:
సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా 59:20,21
సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
రోమా 11:25,26
🔹కొంతమంది యూదులు శిక్షకు పాత్రులగుదురు:
మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపుర మున్న దేశములోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు.
యెహేజ్కేలు 20:38
💢 మహా ధవళ సింహాసనపు తీర్పు 💢 (51 & 52 భాగములు చదువగలరు.)
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(56వ భాగము)💥 *ప్రభువు నిత్యత్వము* 💥
🌖 *నూతన ఆకాశము*
🌏 *నూతన భూమి*
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
ప్రకటన 21:1-4
పరిశుద్ధ గ్రంధములో మూడు పర్యాయములు భూమి, ఆకాశములను సృష్టించబడినట్లుగా చూడగలము.
🔹 *మొదటి సృష్టి:*
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. (ఆది. కా. 1:1) ఇది మొదటి సృష్టి. లూసిఫర్ పడద్రోయబడిన తర్వాత ఈ సృష్టి నాశనమై నిరాకారముగా మారింది. అనగా పనికిరాకుండా పోయింది అని అర్ధం.
🔹 *రెండవ సృష్టి:*
ఆరు దినములలో రెండవ సృష్టిని చేసిన దేవుడు, ఏడవదినాన్న విశ్రమించెను. (ఆది. కా. 2:2) ఇప్పుడు ఆ రెండవ సృష్టిలోనే మనము జీవిస్తున్నాము. త్వరలో ఈ భూమి, ఆకాశములు కూడా గతించిపోనున్నాయి.
🔹 *మూడవ సృష్టి:*
మూడవ సృష్టియైన నూతన భూమి, నూతన ఆకాశం కొరకు మనము ఎదురుచూచుచున్నాము.
మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును. (2 పేతురు 3:13)
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.
యెషయా 65:17
నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.
యెషయా 66:22
🌏 *నూతనమైన భూమిని గురించి రెండు అభిప్రాయములు కలవు:*
🔻 *మొదటి అభిప్రాయం:*
వెయ్యేండ్ల పాలన అనంతరం భూమి అగ్నివలన కాలిపోయి, శుద్ధీకరణం పొంది, నూతన భూమి ఆవిర్భవించును. అయితే, తాను భూమిని నిత్యముగా స్థాపించెను.
(కీర్తనలు 78:69). గనుక, భూలోకం నాశనం పొందదు. అది కాలి, కాలి, నూతన భూమిగా రూపాంతరం చెందుతుంది. అనేది కొందరి అభిప్రాయం.
🔻 *రెండవ అభిప్రాయం:*
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
కీర్తనలు 102:25,26
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.
ప్రకటన 21:1
దీనిని బట్టి, భూమిగా నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందనేది మరికొందరి అభిప్రాయము.
👉Note: *ఈ పాపభూయిష్టమైన భూమి నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందని అందరూ అంగీకరిస్తారు.*
🌏 *నూతన భూమి, ఆకాశము యొక్క ప్రత్యేకతలు:*
▪సముద్రము ఉండదు.
▪నూతన యెరూషలేము పట్టణము పరలోకమునుండి నూతన భూమి మీదికి దిగివస్తుంది.
▪నూతన భూమి మీద మనుష్యులు, దేవునితో ప్రత్యక్ష సహవాసం కలిగి నివసిస్తారు.
▪దేవుడు తన ప్రజల కన్నులనుండి ప్రతీ భాష్ప బిందువును తుడిచివేస్తాడు.
▪పాపం లేదు
▪మరణం లేదు
▪దుఃఖం లేదు
▪ఏడ్పు లేదు
▪వేదన లేదు
▪సూర్యుడు లేడు.
▪చంద్రుడు లేడు
▪రాత్రి లేదు
ఇట్లా అనేకమైన ప్రత్యేకతలు కలిగివుంటాయి. ఇది ప్రభువు నిత్యత్వం. ఇక దీనికి అంతములేదు.
ఈ నిత్యత్వంలో నీవుండాలంటే? ఈ లోకంలో నీవు జీవించిన జీవితమే ప్రమాణం. అట్లా అని, నీ సత్క్రియలు నిన్ను ప్రభువు నిత్యత్వంలో చేర్చలేవుగాని, రక్షించబడి, కొనసాగింపుగా సత్క్రియలు చేస్తూ, ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపడాలి.
అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(57వ భాగము)🌏ప్రభువు నిత్యత్వము🌏
⭕ నూతన యెరూషలేము⭕
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
ప్రకటన 21: 2
పాత యెరూషలేము భూలోకమందు కట్టబడియున్నది. దానికి యెరూషలేము అని పేరు. “యెరూషలేము” అనగా “సమాధానము” అని అర్ధం. అయితే, ఆ పట్టణ చరిత్ర పుటల్లోనికి మనము వెళ్లగలిగితే, సమాధానం ఎచ్చటనూ కానరాదు.
587BC లో నెబుకద్నెజరుతో ప్రారంభమైన ఆక్రమణ, ఒక్కొక్కరుగా దానిమీద దాడి చేస్తూ వస్తూనే వున్నారు, నేటికిని, యెరూషలేము పట్టణం యూదులకూ, క్రైస్తవులకూ, ముస్లింలకూ కూడా ప్రాముఖ్యమైన కేంద్రముగా విరాజిల్లడం వలన, సమాధాన స్థితి కనిపించదు. ఈ ప్రపంచములో మూడు మతాలకు కేంద్రంగానున్న పట్టణం ఏదైనా వుంది అంటే? అది “యెరూషలేము”. సమాధాన ప్రభువైన యేసు క్రీస్తు వచ్చి రాజ్య స్థాపన చేసాకగాని, ఇక్కడ సమాధానం కలుగదు.
Note: క్రైస్తవ్యం అనేది మతం కానేకాదు. నిత్యరాజ్యానికి నడిపించగలిగే ఏకైక మార్గం.
పాత యెరూషలేము, పరలోక యెరూషలేము యొక్క ఛాయయై(నీడ) యున్నది. నీడ వున్నది అంటే? తప్పక అసలైనది వున్నది అనే విషయం సుస్పష్టం. పాత యెరూషలేము పలుమార్లు ధ్వంసం చేయబడి, కట్టబడింది. అయితే, నూతన యెరూషలేము ఎప్పటికీ నశించదు. ప్రభువే ఆ పట్టణాన్ని సిద్ధపరచును.
ప్రభువు మనకోసం సిద్ధపరచుటకు వెళ్ళియున్న పట్టణమే, “నూతన యెరూషలేము”.
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
యోహాను 14:2
ఈ పట్టణం పరలోకమందు సిద్ధపరచి, నూతన భూమి మీదకు తీసుకు వచ్చెను.
ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండల మునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.
ఆమోసు 9:6
పరలోకమందు అనేక నివాసములున్ననూ, తన పెండ్లికుమార్తె కొరకు ప్రత్యేకముగా కట్టుచున్నారు. ఆ సుందరమైన పట్టణ నిర్మాణము గత రెండువేల సంవత్సరాలనుండి జరుగుతూనే వుంది. త్వరలో పూర్తికాబోతుంది. ఒక మనిషి కట్టిన కట్టడాన్ని చూడ్డానికే రెండు కళ్ళూ చాలట్లేదు. ఇక, నిర్మాణకుడు దేవుడే అయితే, ఆ సుందర పట్టణాన్ని ఊహించగలమా?
అందుకే అబ్రాహాముగారు కూడా, అత్యంత సుందరమైన ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురుచూస్తున్నారు.
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
హెబ్రీ 11:10
*నూతన యెరూషలేము ఏ రీతిగా వుండబోతోంది?*
🔺యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
🔺దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
🔺ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను.ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి,
🔺ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
🔺తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
🔺ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
🔺 దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
Note:
750 కోసులు అనగా 1500మైళ్ళు. అనగా సుమారు 2500 కిలో మీటర్లు.
* పొడవు : 2500 కిలో మీటర్లు.
* వెడల్పు : 2500 కిలో మీటర్లు.
* ఎత్తు : 2500 కిలో మీటర్లు.
అయితే, మనము కట్టే భవనాల లెక్కల్లో చూస్తే? ఒక అంతస్థు 8 అడుగులు లేదా 2.5 మీటర్లు ఉంటుంది. అట్లా అయితే, ఒక కిలో మీటరు ఎత్తుకు 400 అంతస్తులు ఉండును. 2500 కిలో మీటర్ల ఎత్తుకు పదిలక్షల అంతస్థులుండును. (దేవుని లెక్కలు మనకు తెలియదుగాని, మనము కడితే, ఆ ఎత్తుకు పదిలక్షల అంతస్తులు వచ్చును. ఒక్కసారి ఊహించండి? ఆ నూతన యెరూషలేము ఎట్లా వుండబోతుందో? )
🔺ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను;
🔺పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
🔺ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.
* మొదటి పునాది సూర్యకాంతపురాయి,
* రెండవది నీలము,
* మూడవది యమునారాయి,
* నాలుగవది పచ్చ,
* అయిదవది వైడూర్యము,
* ఆరవది కెంపు,
* ఏడవది సువర్ణరత్నము,
* ఎనిమిదవది గోమేధికము,
* తొమ్మిదవది పుష్యరాగము,
* పదియవది సువర్ణల శునీయము,
* పదకొండవది పద్మరాగము,
* పండ్రెండవది సుగంధము
🔺దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు;
🔺ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది.
🔺పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
🔺దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
🔺ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.
🔺అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. (ప్రకటన 21:10-25)
*ఈ నూతన యెరూషలేములో ఎవరు ప్రవేశిస్తారు?*
గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
ఆ నూతన యెరూషలేము, పరలోకంలో పెండ్లికుమార్తెవలే అలంకరింపబడి, నూతన ఆకాశాన్ని దాటి, నీవుండే నూతన భూమి మీదకు, నీ కోసం దిగిరాబోతుంది. అయితే, దానిలోనిత్య నివాసం చేసే ధన్యత, అట్లాంటి పరిశుద్ధ జీవితం మనకుందా? ఆ నూతన యెరూషలేములో నేనుండాలనే ఆశ నీకుంటే, నీవు నూతనముగా తిరిగి జన్మించి, నూతనంగా ప్రభువు కొరకు జీవించాలి. దానికి నీవు సిద్దమేనా? అయితే, నీవు తప్పక ఆ నిత్యరాజ్యంలో నీవుంటావు.
ఇంతవరకూ, అశాశ్వతమైన వాటిగురించి పోరాటం చేస్తూ, అక్షయమైన, శాశ్వతమైన ఆ నూతన యెరూషలేమును గురించిన తలంపుగాని, దానిలో నేనుండాలనే ఆశగాని, లేకుండా జీవిస్తున్నామేమో?
నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(58వ భాగము)⭕ *నూతన యెరూషలేము* ⭕
(Part:2)
*నూతన యెరూషలేము యొక్క అలంకరణ:*
ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమి్మదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
ప్రకటన 21:18-20
నూతన యెరూషలేము పట్టణము, సంఘమునకు. సంఘమందున్న విశ్వాసుల సమూహమునకును సాదృశ్యము. అందుచే, నూతన యెరూషలేము అలంకరింపబడినట్లుగా, మన జీవితాలు అలంకరింపబడి యుండాలి.
*పట్టణ ప్రాకారము సూర్యకాంతి:*
సూర్య కాంతి “పరిశుద్ధతకు” సాదృశ్యం.
ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; ( ప్రకటన 4:3) ఆయన సూర్యకాంతమును పోలినవాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుని తేజస్సు ఆ పట్టణములో ప్రతిబింబించు చున్నది.
*పట్టణము శుద్ధ సువర్ణము:*
బంగారము “దైవత్వమునకు” సాదృశ్యం. ఆయన శరీరధారిగా దిగివచ్చిన దైవ కుమారుడు. అందుకే, జ్ఞానులు బంగారాన్ని సమర్పించారు.
*పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.*
* మొదటి పునాది సూర్యకాంతపురాయి,
* రెండవది నీలము,
* మూడవది యమునారాయి,
* నాలుగవది పచ్చ,
* అయిదవది వైడూర్యము,
* ఆరవది కెంపు,
* ఏడవది సువర్ణరత్నము,
* ఎనిమిదవది గోమేధికము,
* తొమ్మిదవది పుష్యరాగము,
* పదియవది సువర్ణల శునీయము,
* పదకొండవది పద్మరాగము,
* పండ్రెండవది సుగంధము
1. *సూర్యకాంతపురాయి:*
సూర్య కాంతి, మనము స్వచ్ఛతను, పరిశుద్దతను కలిగియుండాలని తెలియజేస్తుంది.
2. *నీలము:*
నీలము ఆకాశమునకు, పరలోకమునకు సాదృశ్యము. అనగా మనము పైనున్నవాటియందు లక్ష్యముంచి, పరలోక సంబంధులుగా జీవించగలగాలి. మనము లోకములో నున్నప్పటికీ, లోకం మనలో లేకుండా జాగ్రత్తపడాలి.
3. *యమునారాయి:*
ఇది బూడిద లేదా తెలుపురంగులో ఉంటుంది. వస్తువు కాలిపోయాక మిగిలేది బూడిద. మనము కూడా దేవుని వెలుగు బిడ్డలుగా కాలిపోవు జ్యోతులుగా ఉండాలి.
4. *పచ్చ:*
జీవము, సమాధానమునకు సాదృశ్యము. మనము సమాధానము కలిగి, మృతతుల్యమైన జీవితం కాకుండా, జీవము గలిగి, ప్రభువుకొరకు జీవించాలి.
5. *వైడూర్యము:*
ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు. మండు చున్న దీపము ఎరుపురంగు కలిగియుండును. మంట తీవ్రత ఎక్కువైనప్పుడు పైభాగమందు ఆకుపచ్చ రంగు కనిపించును. మనమునూ, వెలగడమే కాకుండా, ప్రభువుకొరకు ప్రజ్వలించాలి. ఆత్మలో తీవ్రత కలిగియుండాలి.
6. *కెంపు:*
ఎరుపు. యేసు క్రీస్తు రక్తమునకు, ఆయన శ్రమలకు సాదృశ్యము. ఆయన రక్తములో కడుగబడిన మనము, ఆయనకొరకు శ్రమలను అనుభవించడానికి కూడా సిద్దపడగలగాలి.
7. *సువర్ణరత్నము:*
దైవత్వము, విశ్వాసము, వాక్యమునకు సాదృశ్యము. విశ్వాసముతో, వాక్యమును ప్రేమిస్తూ, అనగా వాక్యానుసారమైన జీవితం జీవించగలగాలి.
8. *గోమేధికము:*
పచ్చ, నీలము కలసిన రంగు. పచ్చ జీవానికి, నీలము పరలోకసంబంధమైన వాటికి సాదృశ్యం. సజీవులముగా పరలోక పౌరసత్వం గలవారమని గుర్తెరిగి, పైనున్నవాటి యందే మనస్సుంచగలగాలి.
9. *పుష్యరాగము:*
పసుపు, ఆకుపచ్చ కలసిన రంగు.
పసుపు జ్ఞానమునకు, ఆకుపచ్చ జీవమునకు సాదృశ్యం. మనము సజీవులుగా జ్ఞానము కలిగియుండుటను సూచిస్తుంది.
10. *సువర్ణల శునీయము:*
తెల్లరాతిపై బంగారు చుక్కలు గలది. పరిశుద్ధత, దైవత్వం కలిగి జీవించుటకు తెలియజేస్తుంది.
11. *పద్మరాగము:*
ఊదా, నీలిరంగు మిశ్రమం.
ఊదారంగు రాజరికం, నీలిరంగు పరలోకసంబంధమైన జీవితంనకు సాదృశ్యం. మనము పరలోకసంబంధులముగాను, రాజులైన యాజకులముగా జీవించగలగాలి.
12. *సుగంధము:*
ఊదా, ఎరుపురంగుల మిశ్రమం.
ఊదా రంగు రాజరికమునకు, ఎరుపు క్రీస్తు శ్రమలకు సాదృశ్యం. మనము రాజులైన యాజక సమూహముగా, సిలువ శ్రమలను సహిస్తూ జీవించగలగాలని నేర్చుకొందము.
ప్రియ నేస్తమా! నూతన యెరూషలేములో నిత్యమూ జీవించాలంటే? ఆ నూతన యెరూషలేముయొక్క ఆత్మీయ అలంకరణ నీ జీవితంలో వుండి తీరాలి. సరి చూచుకుందాం! సరిచేసుకుందాం! నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
\
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(59వ భాగము)⭕ *నూతన యెరూషలేము* ⭕
(Part:3)
*నూతన యెరూషలేము వివరణ:*
1. నగరం యొక్క గోడలు, గేటు
(ప్రకటన 21:12-14)
2. నగరం యొక్క కొలతలు
(ప్రకటన 21:15-17)
3. నగరం యొక్క సౌందర్యం
(ప్రకటన 21:18-21)
4. నగరంనందు గల దేవాలయం
(ప్రకటన 21:22)
5. నగరం యొక్క వెలుగు
(ప్రకటన 21:23,24)
6. నగర ప్రవేశనము
(ప్రకటన 21:25-27)
*నూతన యెరూషలేములో నివసించేదెవరు?*
* గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తె.
(ప్రకటన 21:9)
* ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములు
(ప్రకటన 21:12)
* రక్షణ పొందిన అన్య జనులు
(ప్రకటన 21:24)
*నూతన యెరూషలేములో ప్రవేశములేనిదెవరికి?*
* పిరికివారును,
* అవిశ్వాసులును,
* అసహ్యులును,
* నరహంతకులును,
* వ్యభిచారులును,
* మాంత్రి కులును,
* విగ్రహారాధకులును,
* అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8
1. *పిరికివారు*:
రక్షణ పొందిన తర్వాత, ఇతరులు గేళి చేస్తారేమోనని భయపడి, బహిరంగ సాక్ష్యులుగా వుండలేకపోవుట పిరికితనం.అయితే, పిరికితనమునుగల ఆత్మను దేవుడు మనకియ్యలేదు.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.
2 తిమోతికి 1:7
2. *అవిశ్వాసులు*:
యేసు క్రీస్తును నమ్మని వారు.
ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
యోహాను 3:18
3. *అసహ్యులు*:
మనుష్యుల మధ్యలో గొప్పలు చెప్పుట, దేవుని సన్నిధిలో అసహ్యమైనది.
ఆయన మీరు మను ష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.
లూకా 16:15
దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.
తీతుకు 1:16
4. *నరహంతకులు*:
ధర్మ శాస్త్రమును తృణీకరించువారు.
ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని, నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.
1 తిమోతికి 1:9-11
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.
1 యోహాను 3:15
5. *వ్యభిచారులు*:
బాబేలువారి వారి పాపములో పాలివారు.
ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురుదేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;... దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెనుమర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
ప్రకటన 17:1,5
జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
ప్రకటన 22:14,15
6. *మాంత్రికులు*:
మంత్రము చేయువారు.
తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
ద్వితీ 18:10-12
మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వ ములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.
ప్రకటన 9:21
7. *విగ్రహారాధకులు*:
దేవుని కంటే, శరీర క్రియలకు ప్రాధాన్యత నిచ్చేవారు.
విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
గలతీ 5:20,21
8. *అబద్ధికులు:*
అబద్దం చెప్పువారు. ప్రభువును క్రీస్తుకాదని నిరాకరించువారు.
యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు?
1 యోహాను 2:22
వీరెవ్వరికి నూతన యెరూషలేములో ప్రవేశం లేదు.వీరి గమ్యం నిత్య నరకం. అది అత్యంత భయంకరం.
ప్రియ నేస్తమా! సరిచేసుకుందాం! నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(60వ భాగము)🔵 *జీవజలముల నది*🔵
🌳 *జీవ వృక్షము* 🌳
*జీవజలముల నది:*
మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహా సనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.
ప్రకటన 22:1,2
*జీవజల నది ఎక్కడనుండి బయలుదేరుతుంది?*
గొర్రెపిల్ల యొక్క సింహాసనము నుండి.
*జీవజల నది ఎక్కడ కలుస్తుంది?*
ప్రతీ నది సముద్రంలో కలుస్తుంది. అయితే, నూతన యెరూషలేములో సముద్రము లేదు. కాబట్టి, భూమిలో కలసిపోవచ్చు.
*స్పటిక సమానమైన భవనంలో, స్పటిక సమానమైన గోడలున్న దాని మధ్యలో, స్పటికమును పోలిన నది ప్రవహించు చున్నది. జీవజలనది జీవమును అనుగ్రహించేది.*
*ప్రభువు తన మందను నడిపించేది ఈ జీవజలముల నది యొద్దకే.*
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
ప్రకటన 7:17
*ప్రభువు తన మందకు ఉచితంగానే ఆ జీవజాలాలను అనుగ్రహించు చున్నాడు.*
మరియు ఆయన నాతో ఇట్లనెనుసమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
ప్రకటన 21:6
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
*ఆత్మ యొక్క క్రుమ్మరింపు నాలుగు భాగములుగా కనబడుచున్నది.*
ఇవి జీవజల నదులకు సూచనలై యున్నవి.
1. ఏదెనులో ప్రవహించు నది.
ఆదికాండము 2:10
2. వెయ్యేండ్ల పాలనలోని నది:
యెహేజ్కెలు 47:1-12
3. ప్రత్యక్ష గుడారము నందలి ఇత్తడి గంగాళములు:
నిర్గమ 30:17-21
4. దేవాలయమందలి ఇత్తడి సముద్రము:
రాజులు 7:23-26
ఈ నదులను గూర్చిన దర్శనము ఇశ్రాయేలీయులలోని ముగ్గురు ప్రవక్తలు కలిగియుండెను.
* యోవేలుకు “చెరకుముందు”
(యోవేలు 3:18 )
* యెహేజ్కెలుకు “చెరకాలంలో”
(యెహేజ్కెలు 47:1-9)
* జెకర్యాకు “చెరకాలంలో”
(జెకర్యా 14:8)
ఈ నది దాని ఒడ్డున గల వృక్షమునకు జీవము ఇచ్చుట మాత్రము కాదు. అవి ప్రవహించుచూ వెళ్ళు ప్రతీ చోటను జీవము కలుగును.
🌳 జీవ వృక్షము🌳
వెయ్యేండ్ల పాలన కాలంలో జీవనదికి ఇరుప్రక్కల అనేక రకములైన వృక్షాలుండెను. (యెహేజ్కెలు 47:12)
కానీ, నూతన యెరూషలేములో ఒకే రకమైన జీవ వృక్షములు వున్నాయి. ఇవి నెల నెలకూ ఫలించుచూ, పండ్రెండు కాపులు కాస్తాయి.
అంటే? ఒక్కొక్కనెలకు ఒక్కొక్క కాపు:
ఉదా:
* జనవరిలో.. ఆపిల్ (🍎)
* ఫిబ్రవరిలో.. మామిడి
* మార్చ్ ... బత్తాయి
ఇట్లా.... పండ్రెండు నెలలు, పండ్రెండు రకాల కాపులు.
*జీవ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.*
*నూతన యెరూషలేములో వ్యాధులుంటాయా?*
వ్యాధులు, కన్నీరు, మరణము ఇట్లాంటివేమీ వుండవు.
అయితే, స్వస్థతను గురించిన మాటలు ఇక్కడెందుకు ప్రస్తావించబడ్డాయి?
ఏదెను తోట యందలి జీవ వృక్షం యొక్క అవసరతయై యున్నది. ఆదాముకు ఒకవేళ అస్వస్థత కలిగినటైతే, స్వస్థత కొరకు జీవ వృక్షపు ఆకులుండేవి. అయితే, ఆదాముకు జీవ వృక్షము నిషేధించబడింది. అయితే, నిత్యత్వములో మానవుడు వాటి ఫలాలను భుజించడానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు.
నూతన యెరూషలేములో వ్యాధులు లేవుగాని, స్వస్థపరచుట అనగా, ఆరోగ్యవంతులుగా చేయును అనే భావమై యున్నది.
*జీవ వృక్షము ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యం.*
🔺 *జీవ వృక్షము జీవాన్నిస్తుంది.*
గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను 10:10
🔻 *దాని (జ్ఞానము) నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.*
సామెతలు 3:18
జ్ఞానము అనగా వాక్యము.
వాక్యము అనగా దేవుడే.
🔻 *ఎవరికి వాగ్ధానం చేయబడింది?*
జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
ప్రకటన 2:7
ప్రియ నేస్తమా! ఆ సుందరమైన పట్టణంలో నీవుండి, జీవ వృక్ష ఫలాలను భుజించే ధన్యతను నీవు పొందాలంటే? నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(61వ భాగము)ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
ప్రకటన 22:3-5
*ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు:*
నూతన లోకంలో జనులకు ఏవిధమైన శాపం లేదు. యెహేజ్కెలు తన ప్రవచన ముగింపులో, “యెహోవా యుండు స్థలమని ఆ పట్టణమునకు పేరు” ( యెహేజ్కెలు 48:35) అను మాటతో ముగించెను. దేవుడు, గొర్రెపిల్లయు పరిపాలన చేయు స్థలమందు ఏ విధమైన శాపము వుండదు.
*దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.*
ఇక్కడ రెండు సింహాసనములు లేవు. “సింహాసనం ఒక్కటే”. అంటే? దేవుడు (తండ్రి), గొర్రెపిల్ల (కుమారుడు) ఇద్దరూ ఒకే సింహాసనము మీద ఆసీనులవుతారు.
తండ్రి కుమారుడు ఏకమైయున్న స్థితినుండి, కుమారుడు శరీరధారిగా ఈలోకానికి ఏతెంచెను. అప్పటి నుండి తండ్రియు, కుమారుడును విమోచన కార్యము నెరవేర్చెను. కుమారుడు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండెను. అయితే, దానికి ముగింపు కలదు.
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. (కీర్తనలు 110:1)
అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన యెప్పుడైనను చెప్పెనా? (హెబ్రీ 1:13)
ధవళ సింహాసన తీర్పు అనంతరం సమస్త శత్రువులు నశించును. సమస్త కార్యములు సమాప్తమై రాజ్యము తండ్రికి అప్పగించును.
అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
1 కొరింథీ 15:24,25
తదుపరి కుమారుడు, తండ్రితో ఏకమవును. అప్పుడు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చూచుచుందురు అను మాటలు నెరవేరును. ఇక్కడ మనం ఆయనను సేవించి ఆరాధిస్తున్నట్లుగానే, నిత్యత్వంలో కూడా ఆయన ముఖ దర్శనము చూచి ఆయనను ఆరాధించును. అక్కడ గొర్రెపిల్ల గ్రంథమందు పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే ఆరాధించెదరు. ప్రత్యేకింపబడిన యాజకులు అక్కడ వుండరు.
ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు. మోషే దేవుని ముఖ దర్శనము కోరెను గాని సాధ్యము కాలేదు. (నిర్గమ 33:20,23) అయితే, నూతన యెరూషలేమునందు నివసించువారందరూ ఆయన ముఖదర్శనం చూచిరి.
ఆయన నామము వారి నొసళ్లయందు ఉండెను. యెహోవా పరిశుద్ధుడు. అని వ్రాసిన ప్రధాన యాజకునికి యివి సూచనయై యున్నది. (నిర్గమ 28: 36-38)
యిక్కడ ప్రజలందరూ యాజక ఆరాధన సమర్పించును. పరలోకమందు నిత్యమూ ఆరాధన జరుగుచుండును. నామములు కాదు నామము అని ఏకవచనము గమనించవలయును. యెహోవా అను నామము (యెషయా 42:8)
*రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.*
దేవుడే వెలుగైయున్న చోట మరియొక దీపము అక్కరలేదు. మనము నిత్యత్వములో అంతా రాజులైయుందుము. కుమారుడైన యేసు ప్రభువు రాజ్యము తండ్రికి అప్పగించినప్పుడు కాలములు సమాప్తములగును. అప్పటునుండి నిత్యత్వము లేదా నిత్యయుగము ప్రారంభమగును.
ప్రియ నేస్తమా! నిత్యత్వంలో మనముండాలంటే? నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(62వ భాగము)మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు.యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.
ప్రకటన 22:6-9
*ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి;*
ప్రకటన గ్రంథములోని విషయాలను ధ్యానం చేస్తున్నపుడు, నిజంగా ఇట్లా జరుగబోతుందా? అనే సందేహం కలుగకమానదు. ఎందుకంటే, మన ఊహలకు కూడా అందని విషయాలు అనేకములున్నాయి. నోవహు కాలంలో కూడా ఇట్లానే, నోవహు ప్రకటించిన విషయాలు వారి ఊహలకు కూడా అందలేదు. ఎన్నడూ వర్షపు చినుకును చూడని వారు, ఆకాశం నుండి జలము ప్రళయముగా రాబోతుంది అనే విషయాన్ని నమ్మలేకపోయారు. దేవుని మాటలను నిర్లక్ష్యం చేశారు. ఫలితమేమిటో తెలుసుకదా? దేవుని మాట చొప్పుననే, ఆ ఓడలో ప్రవేశించిన వారు తప్ప, మిగిలిన సర్వ సృష్టి జల సమాధి అయ్యింది. తర్వాత ఇంకెప్పుడూ సర్వ సృష్టిని నీటితో నాశనం చెయ్యనని దేవుడు నిబంధన చేశారు. అయితే, ఆగి తో నాశనం చేస్తానని తేల్చి చెప్పారు. నీవు నమ్మినా, నమ్మకపోయినా జరుగవలసినది, జరిగితీరుతుంది. ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవని ప్రభువు మరొకసారి తెలియజేస్తున్నారు. (ప్రకటన 3:14; 19:11)
*ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు:*
ప్రవక్తలు దేవునితో ప్రత్యేకమైన బంధాన్ని కలిగియుంటారు. అటువంటి ప్రవక్తల ఆత్మలకు దేవుడనని చెప్పుకోవడానికి, దేవుడు సిగ్గుపడడం లేదు.
*ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను:*
ఇదే విషయము మూడు సార్లు ఈ గ్రంథమందు చెప్పబడింది. (ప్రకటన 21:7,12,20) త్వరగా అనగా “హఠాత్తుగా” (అనుకొనని గడియలో) అని అర్ధము. ప్రభువు తానే తిరిగి వచ్చుచున్నానని ఖండితముగా చెప్పుచున్నారు.
*ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.*
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
ప్రకటన 1:3
ప్రకటన గ్రంధం మొదటి అధ్యాయములో ధన్యత వినేవారికి, చదివేవారికి, గైకొనేవారికి (ముగ్గురికి) ఆపాధించబడింది. కానీ, చివరి అధ్యాయంలో(22:7) గైకొనేవారికి మాత్రమే ధన్యత ఆపాధించబడింది.
అందుచే ఈ గ్రంధము నుండి జరుగబోవు విషయాలను తెలుసుకోవడమే కాదు గాని, గైకొనే జీవితాలు మనము కలిగియుండాలని గ్రహించగలము. ఈ గ్రంథమునుండి తీసివేయడానికి గాని, కలపడానికిగాని ఏదియో లేదు. అట్లా చేసినట్లయితే, ఈ గ్రంథమందు వ్రాయబడిన తెగుళ్లన్నియు వానికి వచ్చును.
*ప్రభువు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు:*
యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.
ప్రకటన 22:8,9
మనుష్యులు గాని, దేవదూతలుగాని ఆరాధనకు పాత్రులుకారు. దేవునిని మాత్రమే ఆరాధించాలని అరణ్యములో ప్రభువు, సాతానుతో చెప్పారు. (మత్తయి 4:10) “ మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకు దేవదూతలు ఆజ్ఞ యిచ్చియున్నారు” (కీర్తన 103:22)
అవును! ప్రభువు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఏమైయున్నాడో ఎరిగి, ఆయనను గొప్ప చేయడమే ఆరాధన. నీ హృదయమంతా దేవునితో నిండిపోయినప్పుడు నీ నోటి నుండి వచ్చే మూలుగు కూడా ఆరాధనే. నిత్యత్వంలో నీవు చేసే పని ఏదైనా వున్నది అంటే? అది ఆరాధనే. ఎంతకాలము? ఇక కాలములు లేవు. దానికి అంతము లేదు.
ప్రియ నేస్తమా! నిత్యత్వంలో మనముండాలంటే? నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(63వ భాగము)మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది; అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడు గానే యుండనిమ్ము . అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
ప్రకటన 22:10-13
*ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు:*
దానియేలు ప్రవచనమందు అంతిమ భాగంలో ఈ గ్రంథమందు వాక్యములను అంత్యకాలము వరకు ముద్రవేయుమనే ఆజ్ఞ కలదు.
దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథ మును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
దానియేలు 12:4
పూర్వకాలమందు వాటిని గ్రహించుట కష్టతరంగా ఉండెను. అయితే, “ప్రకటన” అనబడే ఈ ప్రవచన గ్రంధానికి ముద్రవేయవలదు. ఇది తెరువబడిన గ్రంధం. కారణం ఏమిటంటే? ఇది అంత్యకాలం. యుగసమాప్తి జరిగే సమయం. “కాలము సమీపించియున్నది” ప్రభువు రాకడ ఏసమయమందైనా జరుగవచ్చు.
*అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.*
ఎవరికీ నచ్చినట్లుగా వారు ప్రవర్తించవచ్చనేది దీని భావం కానేకాదు. ఎన్ని అవకాశాలివ్వబడినా, మార్పులేని జీవితాన్ని జీవిస్తున్నవారికి ఇదొక హెచ్చరిక. ప్రతివాని క్రియల చొప్పున, వానికి ప్రతిఫలమియ్యబడును గనుక, తన జీవితాన్ని సరిచేసుకోవలయును.
అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయి వినువాడు వినును గాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.
యెహేజ్కేలు 3:27
అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.
దానియేలు 12:10
*దుష్టుడు తన జీవితాన్ని, తాను బ్రతికియుండగానే, క్రమపరచుకోవాలి. మరణాంతరం సాధ్యం కానేకాదు.*
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము.
ప్రసంగి 11:9
*ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.*
ప్రభువు తానే త్వరగా వచ్చి, మనము జీవించిన జీవితానికి లెక్కలడుగును. ప్రతీవాని జీతము ఆయనయొద్దనున్నది. ఎవరి ఎంత జీతమియ్యవలయునో ఆయన నిర్ణయించును. చెడ్డవాటికి శిక్ష, మంచివాటికి ప్రతిఫలము కలుగును.
ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
2 కొరింథీ 5:10
*నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.*
ఈ మూడు ప్రస్తావనలు ఒకే భావమై యున్నది. అవును! ఆయన నిత్యుడు.
అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. (ప్రకటన 1:8) గ్రీకు అక్షరమాలలోని మొదటి అక్షరము “అల్ఫా”.
చివరి అక్షరము “ఓమెగ”.
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను.
( ప్రకటన 1:18)
స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా (ప్రకటన 2:8)
మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. (ప్రకటన 21:6)
ఆ నిత్యత్వంలో నిత్యుడైన దేవునితో, సదాకాలము జీవించే ధన్యతను నీవు పొందాలంటే? ఈ కృపాకాలంలోనే, సమయముండగానే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఆ రీతిగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో!
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
♻యేసు క్రీస్తు రెండవ రాకడ♻
(64వ భాగము)కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
ప్రకటన 22:15
🐕 *కుక్కలు దుష్టత్వం జరిగించే మనుష్యులకు సూచనయై యున్నది.*
కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
కీర్తనలు 22:16
ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
కీర్తనలు 22:20
కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ఫిలిప్పీ 3:2
🐶 *కుక్క స్వభావం:*
దేనినైతే, కక్కుతుందో? తిరిగి మరలా దానినే తింటుంది.
కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
2 పేతురు 2:22
🐩 *కుక్క హేయైనది:*
పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.
ద్వితీ 23:18
*మాంత్రికులు:*
మాంత్రికులు మంత్ర తంత్రములు చేయుదురు. వీరు తిరుగుబాటు చేయువారితో సమానము.
తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; (1 సమూయేలు 15:23). తప్పును తప్పుగా ఖండిస్తే, వీరు ఇష్టపడరు. అట్లా చెప్పేవారిని శత్రువులుగా భావిస్తారు. వీరు మాత్రికులకు సమానులై యున్నారు.
*విగ్రహారాధికులు:*
దేవుని స్థానములో ప్రతిష్టింపబడి యున్నదంతయూ విగ్రహారాధనయై యున్నది. మన హృదయంలో దేవుని కంటే, దేనికైతే ప్రధమ స్థానం వుందో అది మన జీవితంలో విగ్రహమే. అది వస్తువైనా కావొచ్చు. ఒక వ్యక్తి అయినా కావొచ్చు విశ్వాసులు విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. (ద్వితి 4:16,19; 5:8 లేవీ 26:1)
*అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు:*
వాక్యప్రకారముగల ఉపదేశమే సత్యమైయున్నది. దేవుని వాక్యమే సత్యము (యోహాను 17:17). సత్య విరుద్ధమైన బోధలు అబద్ధములు.
*అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతీవారును వెలుపల అనగా నరకములో నుందురు.*
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, *అబద్ధికులందరును* అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8
*హెచ్చరిక:*
ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
ప్రకటన 22:18,19
*ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.*
ప్రకటన 22:21
పాత నిబంధనా గ్రంధము శాపపు మాటలతో ముగియుచున్నది (మలాకి 4:6 ). అయితే, క్రొత్తనిబంధనా గ్రంధము “కృపతో” ముగియబడుచున్నది.
ఆమెన్ అనగా? *“అట్లా జరుగునుగాక!”* అని అర్ధం. నిరీక్షణతో ఆయన రాకడ కొరకు ఓపికతో కనిపెట్టి, పరిశుద్ధులుగా జీవించెదము. మనమందరమూ ఏక స్వరముతో *“ ప్రభువైన యేసూ త్వరగా రమ్ము! ఆమెన్!”* అని పలుకుదాం! ఎందుకంటే? ఆయన రాజ్యంలోనే మన జీవితాలకు భద్రత, క్షేమం, సమాధానం, నిత్యమైన ఆనందం.
అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*మై డియర్ బ్రదర్స్ & సిస్టర్స్!*
గత రెండు నెలలుగా,
*“క్రీస్తు రెండవ రాకడ”* ను గురించిన *“కొన్ని ప్రాధమిక తలంపులను”* (ఇది వ్యాఖ్యానం కాదు) మీతో పంచుకోవడానికి ప్రభువు కృపచూపారు. అందులను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ, ప్రార్ధించిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ప్రభువుకొరకు నమ్మకంగా జీవించులాగున, మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోగలరు. మీ గురించి నేనునూ ప్రార్ధించు చున్నాను. *దేవుని ప్రేమలో మనమంతా ఒక కుటుంబముగా కలసి కొనసాగుతూ, ప్రభువు రాకడకై సిద్దపడదాము! ఆ నిత్య రాజ్యంలో, అనునిత్యమూ ప్రభువుతో కలసి జీవిద్దాం! ఆమెన్ *
ప్రేమతో
..... మీ సహోదరుడు.
సుధాకర్ బాబు
*దేవుని కృప మనకు తోడై యుండును గాక! ఆమెన్.*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి