మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన


 

*పౌలుగారి ప్రార్ధన-1*

    కొలస్సీయులకు 1: 9

అందుచేత సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,

 

    ప్రియులారా!  పౌలుగారు తన పత్రికలలో చాలా విశిష్టమైన ప్రార్థనలు చేశారు. అవి ఈ లోక సంబంధమైన వాటికోసం ఆరోగ్యం కోసం కాకుండా పరలోకానికి సంబంధించిన విషయాలు కోసం ఆధ్యాత్మిక విషయాల కోసమే ప్రార్థన చేసి అందరికీ మాదిరిగా నిలిచారు. కాబట్టి మన ప్రార్థన కూడా ఎలా ఉండాలో గ్రహిద్దాము. అందుకే నేను వ్రాసిన శీర్షికలు ఆధ్యాత్మిక సందేశాలు 1-7 నుండి కొన్ని పౌలుగారి ప్రార్థనలను మరలా ఒకసారి మీ ముందుకు తెస్తున్నాను.

 

      కొలస్సీ 1:9-12 వరకు పౌలుగారి ప్రార్ధన ఉంది. ఇది సామాన్యమైన ప్రార్ధన కాదు! పౌలుగారి పత్రికలలో సాధారణంగా ఆయన ప్రార్ధన కనిపిస్తూ ఉంటుంది! ఉదా: ఎఫెసీ 1:17-19; 3:16-19; ఫిలిప్పే 1:9;   ఈ ప్రార్ధనలలో ఎక్కడా ఈ భౌతిక సంభంధమైన విషయాలకోసం ప్రార్ధించినట్లు కనపడదు! అనగా ఆస్తులు, వస్తువులు, ఆరోగ్యం ఇలాంటివాటికోసం ఆయన ప్రార్ధన చేయలేదు గాని అతిశ్రేష్టమైన వాటికోసం, పరలోక ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక మేలులు కోసం ఆయన ప్రార్ధించారు! ఆయన దేనికోసం ప్రార్ధన చేసారంటే: జ్ఞానము, గ్రహింపు శక్తి, బల ప్రభావాలు, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం . . . వీటిని ప్రతీవారు (సంఘం) కలిగియుండాలని ప్రార్ధించేవారు!

 

    నేటి మన ప్రార్ధన ఎలా ఉంది? ఎప్పుడూ భౌతికమైన వాటికోసమే కదా! కొడుకు ఉద్యోగం, భర్త పదోన్నతి, సొంతిల్లు, పిల్లల పెళ్ళిళ్ళు!. .. వీటికోసం ప్రార్ధన చేయకూడదు అని నా ఉద్దేశ్యము కాదు, పౌలుగారి ఉద్దేశ్యం ఎంతమాత్రము కాదు. నీవు ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం ప్రాకులాడితే, భౌతికమైన ఆశీర్వాదాలు వాటికవే వస్తాయి! అందుకే యేసుప్రభులవారు మొదట ఆయన రాజ్యమును, నీటిని వెదకుము, అప్పుడు నీకు కావలసినవి అనుగ్రహింపబడును అంటున్నారు. మత్తయి 6:33; తన్ను అడుగువారికి ఆయన తప్పకుండా దయచేయును అంటున్నారు. మత్తయి 7; కాబట్టి భౌతిక వస్తువులు, అవసరాలు కోసం కాకుండా, పరిశుద్ధాత్మ నింపుదల, శక్తి, ప్రేమ, విశ్వాసం లాంటి శ్రేష్టమైన పరలోక దీవెనలు కోసం ప్రార్ధన చేయాలి!

 

   పౌలుగారు ఈ విషయం- అనగా మీరు దేవునియందు విశ్వాసము, నిరీక్షణ కలిగియున్నారని వినిన నాటనుండి ప్రార్ధనచేయుట మానక . . అంటున్నారు. యేసుప్రభులవారు కూడా మీరు విసుకక ప్రార్ధన చేయాలి అనిచెప్పారు. దానికోసం ఒక పేద విధవరాలు ఎవరికీ భయపడని అధికారి ఉపమానం వివరించి మాటిమాటికి దేవుణ్ణి అడగాలి అంటున్నారు. లూకా 18:1-5; ఇంకా ఒకని ఇంటికి అర్ధరాత్రివేళ తనస్నేహితుడు వచ్చి, తన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడని, కొన్ని రొట్టెలు బదులివ్వమని, మాటిమాటికి, సిగ్గులేకుండా అడిగిన ఉపమానం చెప్పారు! లూకా 11:5-11; కాబట్టి ఆత్మీయవరాల కోసం మాటిమాటికి దేవుణ్ణి అడగాలి. అంతేకాకుండా కేవలం మన అవసరాల కోసమే కాకుండా, ప్రభుత్వం కోసం, అధికారుల కోసం, నీ తోటివిశ్వాసుల ఆధ్యాత్మిక- భౌతిక అవసరాలకోసం అనుదినం మానక ప్రార్ధనచేయాలి! పౌలుగారు కూడా మానక ప్రార్ధన చేసారు.

 

    ఇక్కడ విచిత్రం ఏమిటంటే- పౌలుగారే కాదు, దావీదు గారు కూడా మానక ప్రార్ధనచేస్తున్నాను అని అంటే (కీర్తనలు 109:4), దేవుదంటున్నారు అతని పెదవులనుండి వచ్చిన ప్రార్ధనలు మానక అంగీకరిస్తున్నాను అంటున్నారు!! కీర్తనలు 21:2; ఎంతగొప్ప దేవుడో కదా మన దేవుడు!! ఇంకా సమూయేలు గారి దగ్గరకు ఇశ్రాయేలీయులు వచ్చి, మేము పాపము చేశామని ఒప్పుకుంటున్నాము గాని, దయచేసి మాకోసం ప్రార్ధన చేయడం మానొద్దు అని బ్రతిమిలాడితే, సమూయేలుగారు నేను ఇతరులకోసం  ప్రార్ధన చేయడం మానను! మానేస్తే అది నాకు పాపమగును అంటున్నారు! 1 సమూయేలు 12; కాబట్టి అనుదినం మానక ఇతరులకోసం కూడా ప్రార్ధన చేద్దాం!

 

    ఇక పౌలుగారు చేసిన ప్రార్ధనలో మొదటి అంశం: మీరు సంపూర్ణజ్ఞానము గలవారు కావలెనని. . .అంటున్నారు. ఇక్కడ సంపూర్ణజ్ఞానము కోసం ప్రార్ధించటానికి ముఖ్యకారణం ఏమిటంటే- మొదటి భాగాలలో వివరించినట్లు కొంతమంది వచ్చి, తామే జ్ఞానులమన్నట్లు పరమాత్ముని చేరాలంటే జ్ఞానం అవసరం, అది తత్వశాస్త్రం, వేదాంతం పటిస్తే వస్తుంది అంటూ కొలస్సీయులకు సిలువనుగూర్చిన వార్తను చెప్పకుండా, వ్యర్ధమైన తత్వశాస్త్రం, తర్కజ్ఞానం, వేదాంతం బోధించడం మొదలుపెట్టారు! ఈజ్ఞానం పొందుకోలేని వారు దేవుణ్ణి చేరలేరు అనడం మొదలుపెట్టారు! అందుకే మొదటగా కొలస్సీయుల మనసుతృప్తి కోసం వారు సంపూర్ణజ్ఞానం కలవారు కావాలని ప్రార్ధించి తర్వాత వచనాలలో అంటున్నారు బుద్ధి, జ్ఞానము సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై యున్నవి. కాబట్టి యేసుక్రీస్తును గలవారు జ్ఞానం కలవారు అని నొక్కివక్కానించారు.  ఇక 3:16లో సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తువాక్యము మీలో సమృద్ధిగా ఉన్నాయి. అనగా దేవునివాక్యములోనే సమస్త విధములైన జ్ఞానము ఉంది అంటున్నారు. అయితే ఈ జ్ఞానము కేవలము వాక్యము బైబిల్ చదివినందువలన మాత్రమే పూర్తిగా రాదుగాని, దేవుణ్ణి వేడుకున్నందువలన ఈ జ్ఞానం సంపూర్ణంగా వస్తుంది. ఉదా: సోలోమోనుని దేవుడు నీకేమి కావాలో కోరుకో అని వరమిస్తే ప్రజలను పరిపాలించడానికి అవసరమైన జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అందుకు దేవుడు మెచ్చి- జ్ఞానము + ఐశ్వర్యము ఇచ్చారు! సామెతలు 2: 1-6 దేవునివాక్యాన్ని జాగ్రత్తగా చదివి, వెండిని వెదకినట్లు దానిలో భావాలను వెదికితే, తెలివితేటలుకోసం ప్రార్ధన చేస్తే, మొదటగా యెహోవాయందు భయభక్తులు అంటే ఏమిటో తెలుసుకుంటావు, కారణం యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అని వ్రాయబడింది. కాబట్టి నీకు జ్ఞానం/ తెలివితేటలు తక్కువగా ఉన్నాయా? దేవుణ్ణి అడుగు! (యాకోబు 1:5)  ఆయన ధర్మశాస్త్రం ధ్యానించు! విధ్యార్దులారా! మీరు తప్పకుండా చేయవలసిన పని ఇదే!!

 

     ఇక ఈలోక జ్ఞానులకోసం అంటున్నారు: ఈ లోకజ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసియున్నారు. 1 కొరింథీ 1:20;  ఈలోక జ్ఞానులు వారి తెలివితేటలు పెరిగిపోయి దేవుడెవడు? ఎక్కడున్నాడు? దేవుడు లేడు అంటున్నారు- అలాంటివారికి దేవుడు అంటున్నారు: దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు, వాడు చెడిపోయిన వారు అంటున్నారు. కీర్తనలు 14 & 53; ఇక జ్ఞానులు మనల్ని వెర్రివారు అనుకుంటున్నారు కదా 1 కొరింథీ 1:25 లో దేవుని వెర్రితనము మనుష్యజ్ఞానముకంటే గొప్పది అంటూ మీరు జ్ఞానులు, ఘనులు అని ఏ శరీరియు ఆనుకొనకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెఱ్రివారిని దేవుడు ఏర్పరచుకున్నారు. 1 కొరింథీ 1:25-29. కాబట్టి ఎన్నికలేని నిన్ను, నన్ను దేవుడే ఏర్పరచుకొని- ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇది కేవలం ఆయన కృప, ప్రణాళిక!! కాబట్టి మన జీవితాంతము ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలి!  అంతేకాకుండా దేవుడు మనల్ని ఆయన జ్ఞానముతో నింపినందువలన ఎవడో ఏదో తీపిమాటలు చెబితే వివేచించకుండా వారివెనుక పారిపోవడం మానేసి వాక్యములో ఎదగాలి. వారు చెప్పేది వాక్యానుసారమా? దైవజ్ఞానమా? మనుష్యజ్ఞానమా అని వివేచించాలి! ఇంకా చూసుకుంటే 1 కొరింథీ 2వ అధ్యాయం ప్రకారం: దేవుడు తన ఆత్మద్వారా మనుష్యులకు జ్ఞానసంభంధమైన విషయాలు వెల్లడి పరుస్తారు, కాబట్టి ఆయన జ్ఞానం సంపూర్ణజ్ఞానం! అది కావాలంటే ఆయననే అడుగు! ఇంకా ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానించు! అప్పుడు దేవుడు నిన్ను పూర్ణజ్ఞానిగా చేస్తారు!

 

  అట్టి జ్ఞానము మనందరం పొందుకుందుము గాక! ఆమెన్!

 

దైవాశీస్సులు!

 

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(రెండవ భాగము)

2 కొలస్సీయులకు 1: 9

*అందుచేత సంగతి వినిన నాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,. .*

 

*ఆత్మసంభంధమైన వివేకమును గలవారును. . . .*

 

👉 ఆత్మసంభంధమైన వివేకము గలవారు కావాలని కొలస్సీయులకోసం పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు!

 

🔹 *ఆత్మసంభంధమైన వివేకము కంటే ముందుగా "వివేచన" అంటే ఏమిటో కొద్దిగా చూసుకుందాం!*

 

👉 *వివేచన అంటే ఏది మంచో, ఏది చెడో గ్రహించగలిగే విచక్షణాజ్ఞానం అని అర్ధం.*

🔹 కేవలం ఆ విచక్షణ ఉంటేనే కాదు దాని ప్రకారం మాట్లాడేవారు, నడచుకోగల వారు వివేకవంతులు!!

*ఈ వివేచన- జ్ఞానంతో ముడిపడి ఉంది!*

👉 రెండింటికీ చాలా దగ్గర సంబంధం ఉంది!

 

🔺 జ్ఞానం ఉంటేనే వివేచన ఉంటుంది.

 

పౌలుగారి ప్రార్ధనలు అన్నీ అలాగే ఉంటాయి!

*నిరీక్షణ- విశ్వాసం, జ్ఞానము- వివేచన అంటారు!*

 

🔺 బైబిల్ గ్రంధంలో , ముఖ్యంగా యోబు గ్రంధం, సామెతలు, పౌలుగారి పత్రికలలో వీటికోసం చాలాచోట్ల కనిపిస్తుంది. యోబు 12:12-13; 28:12,20; కీర్తనలు 119:66; సామెతలు 1:4, 2:2, 6, 11; 3:13, 8:1; ఓబద్యా 1:8; ఎఫెసీ 1:9; *వీటన్నింటి దగ్గర జ్ఞానము అనేపదం తర్వాత వివేచన అనేపదం కనిపిస్తుంది.*

 

👉 చివరికి సామెతలు 2:6 లో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, వివేచన ఆయన నోటినుండి వస్తుంది అంటున్నారు!

 

👉 యోబుగారంటారు వయస్సు పెరిగేకొలదీ వివేచన పెరుగుతుందని! 12:12; చివరికి ఆయనే ఒక మర్మము చెబుతున్నారు: 

 

32:8 నరులలో ఒక ఆత్మ ఉంది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి (మానవులకు) వివేచన కలుగజేయును! దేవుని ఊపిరి వలన మనషి ఎలా జీవాత్మ అయ్యాడో, అలాగే ఆయన ఊపిరివలన వానికి వివేచన కలుగుతుంది!

 

*కాబట్టి వివేచన- జ్ఞానము రెండూ ముడిపడి యున్నాయి.*

 

🔹 జ్ఞానము గలవాడు తప్పకుండా వివేచించాలి!

*నేటి దినములలో చాలామంది యవ్వనస్తులకు జ్ఞానము ఉంటుంది గాని వివేచన ఉండటం లేదు!*

 

👉 ముఖ్యంగా జ్ఞానంతో గొప్పగొప్ప డిగ్రీలు సంపాదిస్తున్నారు! గాని మంచి-చెడుల వ్యత్యాసం , *విచక్షణ లేకుండా అనగా వివేకము లేకుండా ఘోరమైన పనులు చేస్తున్నారు.* మానభంగాలు చేస్తున్నారు, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి మత్తు పదార్దాలకు బానిసలైపోతున్నారు! ఉదా: సిగరెట్టు పెట్టెమీద  Danger: Smoking is Injurious to Health అని రాయబడి ఉంటుంది. దానిని చదువుతారు, త్రాగితే తమ ఆరోగ్యం, ప్రక్కనున్న వారి ఆరోగ్యం, పాడవుతుంది, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది అని తెలిసినా డబ్బుతో కొని- అగ్గితో కాల్చేస్తున్నారు!

 

*దీనిని ఏమంటారు? జ్ఞానమంటారా? అవివేకమంటారా?*

 

👉 ఘోరంగా త్రాగి తందనాలాడి, తర్వాత వారెవరో మరచిపోతున్నారు! మతితప్పి ప్రవర్తిస్తున్నారు! వీరికి నిజంగా వివేచన లేదు! మరికొంతమంది యవ్వనస్తులకు ఏ కంపెనీ షేర్లు కొంటే లాభమో, ఏది కొంటే నష్టమో మార్కెట్ ని స్టడీ చేసి ముందుగానే చెప్పగల జ్ఞానం, వివేచనా ఉంటుంది. ఏ కంపెనీ మొబైల్ లో మంచి ఫీచర్స్ ఉన్నాయో చెప్పగల సత్తా ఉంటుంది

*గాని నిజమైన దేవుడెవరు? నేను ఎంచుకున్నమార్గం మంచిదా కాదా? ఆ మార్గంలో ప్రయాణిస్తే పరలోకం వెళ్తానా/ నరకం వెళ్తానా అని ఆలోచించే వివేచన లేకుండా పోతుంది!*

👉 ఇది ఆత్మసంభంధమైన వివేచన!

 

👉 విచారించవలసిన సంగతి ఏమిటంటే: చాలామంది క్రైస్తవ యవ్వనస్తులకు కూడా ఈ వివేచనలేక, పశుప్రాయులై అన్యులువేసే వేషాలన్నీ వేస్తున్నారు. వారి వేషదారణ, వస్త్రధారణ, నడవడిక, మాటతీరు అన్నీ లోకస్తులు లాగేనే ఉంటున్నాయి. ఏమైనా అంటే ఫాషన్, present trend అంటున్నారు!

*ప్రియ తమ్ముడా! చెల్లీ! నీ ఫాషన్ నిన్ను దేవుని నుండి దూరంగా తీసుకుని వెళ్తుంది అని మరచిపోకు!*

 

  ఈ విషయంలో  ఈ లోకంలో ఉండే సినీతారలు నీకు రోల్ మోడల్ గా ఉండకూడదు గాని

*నీకు రోల్ మోడల్ కావాలంటే కొందరు యవ్వనస్తులను చూపిస్తాను. వారు రోల్ మోడల్, వివేచన గలవారు వారు.*

వారిలో మొదటగా చెప్పదగిన వారు

*దానియేలు,*

*షడ్రక్, మేషాక్, అబెద్నేగో.*

👉వీరు నలుగురు లోకస్తులు వేసే వేషాలు వెయ్యకుండా, వారు తినేవి/ త్రాగేవి త్రాగకుండా దేవునికోసం సాక్షులై నిలిచారు.

 

దానియేలు గ్రంధం 1-6 అధ్యాయాలు చూసుకుంటే వీరు ఎంతటి వివేచన గలవారో, ఎన్ని గొప్ప కార్యాలు చేసారో చూడగలం!

మరో యవ్వనస్తుడు యోసేపు.

*బానిసగా అమ్మబడినా, దేవుని దర్శనముతో కూడిన వాగ్ధానం నమ్మి, తన పవిత్రతను కాపాడుకొని, శ్రమలు పడినా సరే, చివరికి ఐగుప్తు దేశానికి గవర్నర్ కాగలిగాడు!*

 

👉 వీరందరూ వివేచన, దేవుని ఆత్మజ్ఞానం కలిగి, రాజులు మరచిపోయిన కలలను తిరిగి చెప్పగలిగారు.  కలలకు సరియైన అర్ధం చెప్పగలిగారు.

 

*ఇప్పుడు మనం ఆత్మసంభంధమైన వివేచనకోసం ధ్యానం చేద్దాం!*

 

  మనం పాతనిభందన మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తే యెహోవా ఆత్మ అతనిమీదకు బలముగా వచ్చెను లేదా ఆత్మ ప్రేరేపించగా లేక ఆత్మవసుడై . . . అంటూ,

*ఆ తర్వాత ఆ ఆత్మ వారికి వివేచనాశక్తి దయచేసి,* ఆ ఆత్మానుసారంగా బలమైన కార్యములు చేసినట్లు చూస్తాం!

 

 ఉదా: గిద్యోను, సంసోను, యొఫ్తా, దావీదుగారు, . .  కాబట్టి మనిషి ఆత్మవసుడైనప్పుడు ఆత్మసంభంధమైన వివేచన కలిగి, ప్రవర్తిస్తూ ఉంటాడు!

 

 *నేటిదినాల్లో విశ్వాసులకు  ఆత్మసంభంధమైన వివేకము తక్కువగా కనిపిస్తుంది. కారణం వారు ఆత్మతో నింపబడటం లేదు. దేవుని ఆత్మచే నడిపించబడటం లేదు!!*

 

 పౌలుగారంటారు మనిషి దేవుని ఆత్మపూర్ణుడైనప్పుడు ఆ ఆత్మ అతని ability (సామర్ధ్యం) బట్టి, ఆత్మీయవరాలు పొందుకుంటాడు!

 

కొందరికి బుద్ధి వాక్యం, జ్ఞానము, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరం మొదలైనవి దయచేస్తారు.

*ఆ ఆత్మవలననే ఆత్మల వివేచన వరం కలుగుతుంది.*

 1 కొరింథీ 12;

 

👉దానిద్వారా దేవునిఆత్మ ఏదో, దురాత్మ ఏదో, ఇతడు చెప్పేది సరియైనదా కాదా , సొంతమాటలా/ దేవుని మాటలా అనే వివేచనా వరం ఆత్మవలన కలుగుతుంది. ఇంకా కొంచెం వివరాలలోకి వెళితే

*ఆత్మసంభంధమైన వివేకము: ఆత్మసంభంధమైన సంగతులు- ఆత్మసంభంధమైన సంగతులద్వారా సరిచూసుకొని, ఆత్మనేర్పు మాటలద్వారానే కలుగుతుంది గాని మనుష్య జ్ఞానం వలన ఎంతమాత్రము కాదు!*

 1 కొరింథీ 2:13; 2వ అధ్యాయం మొత్తం ఆత్మ సంభంధమైన వివేకము కోసమే వ్రాయబడింది. ముఖ్యంగా 9-15 వచనాలు. కాబట్టి ప్రియదైవజనమా! మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆత్మపూర్ణులైతే - ఆత్మసంభంధమైన వివేకము కలిగి ఏ ఆత్మ ఎలాంటిదో పరిశీలించగలరు! ఇంకా అదే ఆత్మసంభంధమైన వివేచనతో సరియైన నిర్ణయాలు తీసుకోగలరు!

ఉదా: ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే, లేదా ఏదైనా పనిమొదలు పెట్టినప్పుడు ముందుగా యేసయ్య పాదాల దాగ్గరకు వచ్చి, అయ్యా ఇప్పుడు ఈ పని చేయాలని అనుకుంటున్నాను, నీ చిత్తము చెప్పు, లేదా ఈ సమస్య వచ్చింది నాకు- నేను ఏం చెయ్యాలో చెప్పండి, అని ముందుగా ఆయనకు చెప్పేసెయ్!

 

👉తర్వాత కొంచెం సేపు దేవుని సన్నిధిలో కనిపెట్టు- ఆయన జవాబిచ్చేవరకు! ఆయన మెల్లని చల్లని స్వరము నీకు వినిపిస్తుంది లేదా దేవుడు నీకు సమయోచితమైన మంచి ఆలోచన నీ హృదయంలో పెడతారు దేవుడు!

*ఇది ఆత్మ సంభంధమైన వివేచన!*

👉 దాని ప్రకారం నీ కార్యం చేయు! ఈ సమయంలో నీ మైండ్ మొత్తం దేవునిమీద పెట్టాలి.

 

*అలాకాకుండా నేను జ్ఞానిని కదా అని నీవనుకుని,* (సామెతలు 3:5-7) నీ సొంతనిర్ణయం తీసుకుని, దేవుని దగ్గరకు రాకుండా, friends దగ్గరకు, అధికారులు దగ్గరకు, కోర్టుల దగ్గరకు వెళితే నీవు మంచి ఫలితం పొందలేవు!  కాబట్టి ఆత్మసంభంధమైన వివేచనకోసం ప్రభుసన్నిధిలో కనిపెట్టి పొందుకో! మంచి ఫలితాలు సాధించు!

 

   పౌలుగారు చెప్పిన విధంగా అట్టి ఆత్మ సంభంధమైన వివేచన కోసం ప్రార్థన చేసి పొందుకుందుము  గాక!

 

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

➖➖➖➖➖➖➖➖➖➖

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(మూడవ భాగము)

 కొలస్సీయులకు 1: 10

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,.

 

👉 *పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము*

 

3⃣ *ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. . .*

 

   ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలుగారు- కొలస్సీయులకు ఏ రకంగా బ్రతకాలో- వారి జీవితాల్లో పౌలుగారు చూడగోరిన ఇతర విషయాలు ఈ 9,10 వచనాలలో ఉన్నాయి. అందుకే వీటిని వారు పరిపూర్ణంగా పొందుకోవాలని ఆశిస్తూ, ప్రార్ధిస్తున్నారు!

 

🔹మొదటగా జ్ఞానం కావాలి,

🔹 దేవుని ఆత్మసంభంధమైన వివేచన,

🔹తర్వాత ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించినవారై యుండి,

 

👉10వ వచనం: అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్లుగా నడచుకోవాలి అని కొలస్సీయుల యెడల పౌలుగారి ఆకాంక్ష!!

 

👉 అవును దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోలేకపోతే మనం ఆయనను సంతోషపెట్టలేము!! ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము! అందుకే పౌలుగారు ఏరికోరి ప్రార్ధిస్తున్నారు! వారు అట్లాంటివారు కావాలని కోరుకుంటున్నారు!

 

   అందుకోసం రోమా 12:1-2 లో చూసుకుంటే: *పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు . . మీ మనస్సుమారి రూపాంతరం పొందుడి అంటున్నారు.*

 ఈ వచనాలలో చాలా లోతైన విషయాలున్నాయి.

*ఈలోక మర్యాద బట్టి కాక,*

మొదట ఉత్తమమును,

రెండవది అనుకూలమును,

మూడవది సంపూర్ణమునైయున్న దేవుని చిత్తము తెలుసుకోవాలి!

 

 *దేవుని చిత్తము ఉత్తమమైనది, అనుకూలమైనది కాబట్టి ఆయన చిత్తమును మనం తెలుసుకోవాలి.*

👉 ఎప్పుడైతే దేవుని చిత్తమును తెలుసుకుంటామో ఆయన చిత్తానుసారముగా మనం నడువగలం!

 

ఇప్పుడు మనం రోడ్డుమీద స్పీడ్ గా వెళ్తున్నామనుకోండి మనదగ్గర రోడ్ మేప్ ఉంటే కన్ప్యూజన్ లేకుండా, ప్రమాదాలు లేకుండా హాయిగా వెల్లగళము. అలాగే దేవుని చిత్తము తెలుసుకుంటే ఆయనను సంతోషపెట్టగలము!

 

🔺 *ఆయన చిత్తముకోసం ఆలోచిస్తే*

🔸 *దావీదు* నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడే certify చేస్తున్నారు!

🔸కారణం దావీదు గారు రాజు కాకముందు, రాజైన తర్వాత కూడా ఎప్పుడూ దేవునికోసమే పరితపించేవారు. ఆయన ఆలయం, సేవా విధానం, ఆయనను స్తుతించడానికి పాటలు రాయడం లాంటివి చేసేవారు. *ఇంతటి బిజీ వ్యక్తీ కూడా దేవునికే ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు.*

 

👉 దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి దావీదు గారు!

 

👉 అదే *సంసోను* విషయం చూసుకుంటే, తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక తన కనులకు నచ్చిన పిలిష్తీయుల అమ్మాయిని పెళ్ళిచేసుకొని ఎంతగా నష్టపోయాడో మనందరికీ తెలుసు! నేటిరోజుల్లో యువత బాగా చదువుకుని, తమకున్న పరిమిత జ్ఞానంతో తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారు, ప్రేమ గుడ్డిదంటారు కదా ఆ ప్రేమ మైకంలో ఆ వ్యక్తి ఎలాంటివ్యక్తో తెలుసుకోకుండా, ముఖ్యంగా దేవుని చిత్తమును తెలుసుకోకుండా, తల్లిదండ్రులను కూడా ఎదిరించి, వివాహము చేసుకుని, మోసపోయి, తర్వాత జీవితాంతము బాధపడుచున్నారు!

 

ప్రియ యవ్వనస్తుడా/ యవ్వనస్తురాలా!

*నీవు నీ జీవిత భాగస్వామిను ఎన్నిక చేసుకోవడంలో సంసోనుగారిని ఆదర్శంగా తీసుకోకుండా, ఇస్సాకుగారిని ఆదర్శంగా తీసుకో!*

 

👉 ఎలియాజరు ఇస్సాకుకోసం సంబంధం కోసం వెళితే- ఇస్సాకుగారు కలలు కనకుండా, ప్రార్ధనలో కనిపెట్టారు, రిబ్కాలాంటి మంచి భార్యను పొందుకున్నారు! ఆదికాండం 24:63; మీరుకూడా *దేవునిచిత్తం కోసం కనిపెట్టి, ఆయన సన్నిధిలో ప్రార్ధించండి! నేనుకూడా అలా కనిపెట్టి, ప్రార్ధించి మంచిభార్యను పొందుకున్నాను! మీరుకూడా కనిపెట్టి ప్రార్ధించండి! దేవుడు మీకుకూడా మంచి జీవిత భాగస్వామిని దయచేస్తారు!*

 

 🔸ఇంకా *సొలోమోనుగారంటారు*  నీ స్వబుద్ధిని ఆధారం చేసికొనక నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము!! సామెతలు 3:5-7; అలా చేస్తే నీ జీవితంలో దేవుని కాపుదల ఉంటుంది. దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏమిటి అని ప్రార్ధించి తెలుసుకో! ఆయన నీపట్ల తనకున్న చిత్తాన్ని తెలియజేస్తారు.

 

 *సమూయేలుగారు* చిన్నతనములోనే దేవునివాక్కు దర్శించినా అది ఏమిటో తెలియనప్పుడు, దైవజనుడు, యాజకుడైన ఏలీగారు క్రమము నేర్పించారు: చిత్తము ప్రభూ, నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము అని; 1 సమూయేలు 3; అప్పటినుండి ప్రారంభమైన ప్రస్థానం సమూయేలుగారు చనిపోయేవరకు దేవుని చిత్తమేదో ఎరిగి ప్రవర్తించారు, అంతేకాకుండా ఇశ్రాయేలీయులు వారిపట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోడానికి, ఇంకా జరగబోయేవి తెలుసుకోడానికి ఆయన దగ్గరకే వచ్చేవారు, దీర్ఘదర్శి అయ్యారు!!

 

*దావీదుగారు దేవా నీ చిత్తమును నెరవేర్చుటయే నాకు సంతోషము అంటున్నారు.*

 కీర్తన 40:3; ఇంకా అంటున్నారు

*ఈ సర్వసృష్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చుతున్నాయి.* 103:21;

 

   ఇక *యేసుప్రభులవారు* కూడా మనకు నేర్పిన పరలోక ప్రార్ధన రెండో పాదములో

*నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమిమీదను నెరవేరును గాక* అని నేర్పించారు! మత్తయి 6:10;

 

👉 యేసుప్రభులవారే మనకు ఆదర్శం! యోహాను సువార్తలో చూసుకుంటే పదేపదే ఆయన చెప్పేవారు :

*నాతండ్రి చిత్తమును నెరవేర్చుటకె నేను వచ్చాను/ నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకె వచ్చితిని* యోహాను 4:34, 6:39, 6:41; ఆయన భూలోకానికి వచ్చి సిలువ మరణం పొంది, మన పాపపరిహారం కోసం యాగమై, బలియాగమైపోవడం తండ్రి చిత్తము. యేసుప్రభులవారు అదే చేసారు. మరి మనం ఆయన చిత్తాన్ని చేస్తున్నామా?

 

♻ *ఇంతకీ మనపట్ల ఆయన చిత్తమేమిటో తెలుసుకొంటున్నామా?*

 

బైబిల్ లో మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమేదో వ్రాయబడియుంది వాటిలో కొన్నింటిని చూద్దాం! 

 

1). 1 థెస్సలోనిక 4:3

*మీరు పరిశుద్దులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము!*

 జాగ్రత్త ప్రియ దైవజనమా! ఊరకనే నోటిమాటికి ప్రభువా! నీ చిత్తాన్ని బయలుపరచు అని ప్రార్ధనచేస్తూ, జారచోర క్రియలు చేసారా ఖభడ్దార్, దేవుడు ముందే చెప్పారు తన చిత్తమేమిటో! కాబట్టి జారత్వం నుండి దూరముగా ఉందాము!

 

2). 1 థెస్సలోనిక 4:5 

*తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము!*

👉 పాపానికి దూరంగా నీ తనువూ, మనస్సు, ఆత్మను కాపాడుకోవడం, ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడమే దేవుని చిత్తము!

 

3). *ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవునిచిత్తము!*

  కష్టమైనా, సుఖమైన ఏదైనా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి మనం. అదే దేవుని చిత్తం! 1 థెస్సలోనిక 5:18;

 

4). *దేవునిమాటలు వక్రీకరించి, భోదించేవారి నోరు మూయించడమే దేవునిచిత్తము!*

 1 పేతురు 2:15; చాలామంది నేడు social media లో దేవునిమీద బురదచల్లుతుంటే చాలామంది జవాబిస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం! ఇది దేవుని చిత్తం!

 

  *కాబట్టి ప్రియబిడ్డా! నీ పట్ల దేవుని చిత్తమేదో అడిగి తెలిసికొని అలా జీవించు!*

👉 అలాగే మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమును గ్రహించి ఆ రకంగా నడచుకో!

 

చివరిగా యేసుప్రభులవారే తననుతాను తగ్గించుకొని: *ఇదిగో పుస్తకము చుట్టలో వ్రాయబడినట్లు నేను వచ్చాను, నీ చిత్తము జరిగించు అన్నారు.*

 హెబ్రీ 10:7,9; 

 

👉 కాబట్టి నీవు కూడా అలాగే *తండ్రి! నీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ చిత్తము నాకు చెప్పు, చేస్తాను అని ప్రార్ధించి, అలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించు! దేవుడు నిన్ను అత్యధికముగా వాడుకోబోతున్నారు!*

ఆమెన్!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(4వ భాగము)

 

కొలస్సీయులకు 1: 10

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, . .*

 

*పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశం* 

 

4⃣  *ప్రతీ సత్కార్యములోను సఫలులగుచూ. . .*

  పౌలుగారు గాని, యాకోబుగారు గాని, యోహానుగారు గాని ఈ సత్కార్యములు విషయమై చాలా స్పష్టముగా చెబుతున్నారు!

 

*కేవలం దేవునిలో భక్తిగా ఉండటమే కాదు, వరాలు పొందుకోవడమే కాదు, వాటితోపాటు సత్కార్యములు చేయాలి!!*

👉 అలా చేయలేకపోతే నీవు ఎంత గొప్పవిశ్వాసివి అయినా నీ విశ్వాసము మృతము అంటున్నారు యాకోబుగారు! 2:6;

 

♻ *ఇక నిజమైన భక్తి ఏది అంటే* యాకోబు 1:27

 

*తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.*

 

👉కాబట్టి విధవరాల్లకు, దిక్కులేనివారికి సహాయం చేయడం మరచిపోకు! వారి అవసరాలన్నీ తీర్చమని చెప్పడం లేదుగాని *నీ చేతనైనంతమట్టుకు వారికి సహాయం చేయాలి!*

 

   యోహానుగారంటారు:

*నీవు ఈలోకపు జీవనోపాధి కలిగియుండియు, నీ సహోదరుడు అవసరాలలో సహాయం చేయలేకపోతే నీలో దేవునిప్రేమ లేదు.*

 1 యోహాను 3:17;

 

*కనబడే నీ సహోదరున్ని ప్రేమించలేని వాడివి, కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్దం అంటున్నారు!*

  4:20;

 

ఇక పౌలుగారు

*అందరితోను ప్రేమతో/ సఖ్యంగా ఉండండి! ఆతిధ్యం చేయ మరవకుడి*

 రోమా 12:13; హెబ్రీ 13:2; అంటూ *బీదలను ఆదరిస్తూ, సత్కార్యములు చేయడం మరచిపోవద్దు అంటున్నారు!*

 

  పౌలుగారు

*పరిశుద్దుల మీద ప్రేమ కోసం చెబుతూ- విధవరాలు చేయవలసిన పనిలో సత్కార్యములు ఎలా చేయాలో చెప్పారు. ఇవి కేవలం విధవరాలికే అనుకోకూడదు!*

 1 తిమోతీ 5:10 .  *పరదేశులకు ఆతిధ్యమివ్వాలి, పరిశుద్దుల పాదములు కడగాలి, శ్రమపడువారికి సహాయం చేయాలి, ఇంకా ప్రతీ సత్కార్యములు అనగా ప్రతీ మంచిపని చెయ్యాలి అంటున్నారు.*

 

 ఇక పౌలుగారు తీతుకు :

*మీ సంఘానికి చెప్పు- ప్రతీ సత్కార్యము చేయడానికి సిద్ధంగా ఉండాలని, మనుష్యులందరి యెడల సాత్వికముతో ఉండాలి.* తీతుకు 3:2;

👉 *ఇదే విషయం కొలస్సీయులకు కూడా తన ప్రార్ధనలో ప్రస్తావిస్తున్నారు!*

 

   *ఇక కయీనును దేవుడు హెచ్చరించినప్పుడు: నీవు సత్క్రియ చేసినయెడల నీ తలనెత్తుకొనవా?*  అంటున్నారు.

ఆది 4;7;  *అనగా సత్క్రియ చేస్తే తలెత్తుకొని తిరుగుతావు! దుర్మాగాలు చేస్తే తలదించుకోవాల్సి వస్తుంది.*

తీతుకు 1:16 లో

 

*చాలామంది దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నారు గాని వారు అసహ్యులు, అవిధేయులు , ఎందుకంటే వారు ప్రతీ సత్కార్యము చేయని భ్రష్టులు అంటున్నారు!*

👉 అంటే సత్కార్యము చేయనివారు బ్రష్టులన్న మాట!

 

   ప్రియ సహోదరీ! సహోదరుడా!

👉 *నీవు సత్క్రియ చేస్తున్నావా?*

👉 *ఒకవేళ చేయకపోతే వాక్యం సెలవిస్తుంది నీవు బ్రష్టుడవు!*

 

👉 కాబట్టి నీచేతనైనంతమట్టుకు ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!

 

   *మంచి సమరయుని ఉపమానంలో* యాజకుడు, లేవీయుడు గాయపడిన వ్యక్తికి సహాయం చేయనందువలన వేషదారులని, అన్యాయస్తులని తీర్పుతీర్చబడ్డారు!

👉 *సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేసి దేవునికి ఇష్టుడిగా తయారయ్యాడు!*

 లూకా 10; కాబట్టి నీవే ఆలోచించుకో!

 

కాబట్టి పౌలుగారి ప్రార్థనలో చెప్పినట్లు సత్కారాలు చేసే మనస్సు ధృడసంకల్పం కలిగేలా మనము కూడా ప్రార్థన చేద్దాం!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(5వ భాగము)

  ఇక పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము.

 5⃣ *దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందటం*

👉 ఈలోకంలో ఎన్నో రకాల జ్ఞానములున్నాయి! ఒకరకమైన జ్ఞానం తత్వశాస్త్రం, మరొకటి వేదాంతం, మరొకటి సైన్సు , దీనిలో బోలెడన్ని శాఖలున్నాయి!

*ఇలా ఈ జ్ఞానము ఏవి నిన్ను పరలోకం చేర్చలేవు!!!*

 

👉 కాబట్టి దేవుని విషయమైన *జ్ఞానం పొందుకొని దానిలో అభివృద్ధి పొందాలని ప్రార్ధిస్తున్నారు,* ప్రోత్సాహిస్తున్నారు!

 

🔹ఈ జ్ఞానం కావాలంటే మొదటగా వినయం, విధేయత, తగ్గింపు, సంపూర్ణంగా లోబడటం చేయాలి!

 

*యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము అంటున్నారు సొలోమోనుగారు!*

 సామెతలు 1:7; ద్వితీ 4:6 లో

 *ఈ కట్టడలు మీరు గైకొని, అనుసరించినయెడల, వాటిని విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అంటున్నారు.*

👉 కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, దాని ప్రకారం చేయడం వలననే ఈలోక భౌతిక జ్ఞానము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము లభిస్తాయి!

 

*అయితే ఈ జ్ఞానాన్ని ఎవరైతే వద్దు అని అనుకొంటారో వారు బుద్ధిహీనులు అని యోబు గారంటున్నారు*

 21:6-14; ఇంకా

*మేము ఆయనను సేవిస్తే మాకేటి లాభం అంటున్నారు.* .

21:15

*అందుకే వారి దీపం (భక్తిశూన్యుల దీపము) ఆర్పివేయబడుతుంది అంటున్నారు.*

 

👉 దేవుడు చేసిన సృష్టి ప్రకృతి చూస్తే దేవుని జ్ఞానం మీకు కలుగుతుంది అని అంటున్నారు.

 

కీర్తన 19.  ఇక చాలామంది దేవుడులేడు అంటున్నారు, వారు బుద్ధిహీనులు, చెడిపోయినవారు అంటున్నారు కీర్తనలు 14, 53 అధ్యాయాలలో. ఇక ఇలాంటి బుద్ధిహీనులకు కూడా బుద్ధి కలుగుతుంది దేవునివాక్యాన్ని ధ్యానిస్తే అంటున్నారు . కీర్తన 19:7;

 

   కాబట్టి ప్రియ దేవునిబిడ్డా!

*ఈలోకజ్ఞాన సముపార్జనలలో/ భౌతిక జ్ఞాన సంపాదనలో నీ జీవితాన్ని వృధాచేసుకోకు!*

 

*ఈలోక జ్ఞానము భూసంభందమైనది, ప్రకృతి సంభందమైనది, దయ్యములజ్ఞానము*

 యాకోబు 3:15; 

 

*అయితే దేవుని జ్ఞానము పరలోక సంభంధమైనది*

యాకోబు 3: 17

 

*అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.*

 

👉 చివరకు అది బుద్ధిహీనులకు కూడా జ్ఞానం ఇవ్వగలదు.

అట్టి దేవుని విషయమైన జ్ఞానం కోసం ప్రార్ధించి సంపాదించుకొందాం!

 

*అట్టి జ్ఞానం దేవుడు మనకు దయచేయును గాక!*

 

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

➖➖➖➖➖➖➖➖➖➖

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(6వ భాగము)

 కొలస్సీయులకు 1: 10,11

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు...

 

  ప్రియులారా!

*పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశములు*

6⃣  *అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టడం,*

 

7⃣ *ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను*

ఈ విషయాలు క్లుప్తంగా ధ్యానించేసుకుందాం!

 

   పౌలుగారు అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటున్నారు. ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం!

👉 *మనం అన్నివిషయాలలో ప్రభువును నిజంగా సంతోషపెడుతున్నామా?*

 నిజం చెప్పాలంటే లేదు!!

🔹 మనలో చాలామంది 85% దేవుణ్ణి సంతోషపెడుతున్నారు,

🔹 మరికొంతమంది 90-95% సంతోషపెడుతున్నారు.

🔹మరి మిగతా 5-15% సంగతి ఏమిటి?

 

👉 *అన్నివిషయాలలో సంతోషపెట్టాలని సెలవిస్తుంది కదా గ్రంధము!*

 

👉 మరి ఎందుకు చేయలేకపోతున్నాం? 

*కారణం మనం దేవునికంటే, మన egos ని సంతృప్తి పరచాలని చూస్తున్నాం.*

 

👉 *దేవుని ఇష్టం కంటే మన ఇష్టాన్ని చేయాలని మన తనువూ, మనస్సు ప్రయత్నిస్తుంది!*

ఇక మిగిలిన శాతం: అన్ని విషయాలలో దేవునికి లోబడి, కోపాన్ని అణచుకోలేకపోతున్నాం!

 

 మరికొంతమందికి బూతులేకపోతే ఆ వచనం (sentence) పూర్తికాదు! నోరుతెరిస్తే బూతులు!

 

మీరు కోపమును, సణుగుడు, సరసోక్తులు, బూతులు లాంటివి మానెయ్యాలి అని పౌలుగారు తన పత్రికలలో రాసారు. ఎఫెసీ 4:31; కొలస్సీ 3:8; ఈ పత్రికలో కూడా అదే హెచ్కరించారు!

 

🔹 కొంతమంది ప్రార్ధనలో తప్పిపోతున్నారు!

🔹 మరికొంతమంది దశమభాగంలో!

🔹 ఇంకొంతమంది భార్య own property కాబట్టి కోపమొచ్చినప్పుడెల్లా భార్యను కొడుతుంటారు, ఇది కూడదు అని బైబిల్ సెలవిస్తుంది!

🔹 మరికొంతమంది దేవునికి అన్ని విషయాలలో తగినట్లుగా జీవిస్తారు గాని తమ పిల్లల పెళ్లి విషయంలో మాత్రం తమ కులపు వ్యక్తులనే చేయాలని చూస్తారు.

 

👉 *ప్రభువా! నీవు చెప్పిన మాటలన్నీ వింటాను గాని ఇది మాత్రం నేను వినలేను. నన్ను క్షమించేయ్ అని ప్రార్ధన చేస్తారు! ఇది కూడా తప్పు!*

 

👉 *ఇక యవ్వనస్తులు దేవా నీవు చెప్పినట్లే చేస్తాను అన్నీ, గాని నా పెళ్లివిషయంలో నీవు నేను చెప్పినట్లే చెయ్యు, నేను ఈ అబ్బాయినే/ అమ్మాయినే చేసుకుంటాను అంటారు!*

 

*నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని వ్రాయబడింది.*

 సామెతలు 3:5-7;

 

👉 కాబట్టి అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నం చేద్దాం!

 

👉లేఖనం ఏమి సెలవిస్తుంది? *ఆజ్ఞలన్ని పాటించి, ఒక్క ఆజ్ఞను పాటించక పోతే ధర్మశాస్త్రం మొత్తాన్ని ఉల్లంగించినట్లే అంటుంది*

 యాకోబు 2:10;

కాబట్టి మనల్ని మనం సరిచేసుకుందాం!

 

     *దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం చూసుకుంటే*

మనం చేసే పనులు దేవుణ్ణి సంతోషపెడుతున్నాయా లేక దుఃఖపెడుతున్నాయా?

దైవరాజ్య వ్యాప్తికి వాడబడుతున్నామా? లేక

ఆయన సేవకు అభ్యంతరకరంగా ఉన్నామా?

ఆయన గాయాన్ని రేపేవిధంగా ఉన్నామా?

 

👉 *ఒకసారి పరిశీలన చేసుకోమని మనవి చేస్తున్నాను!*

 

 ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు భూమిమీద నరులను చేసినందుకు సంతాపపడెను అని వ్రాయబడింది!

*అంతగా నరుల చెడుతనం ప్రభలిపోయింది, అందుకే దేవుడు జలప్రళయం పంపించి అందరినీ నాశనం చేశాడు.*

👉 నీవునేను వారికంటే గొప్పవారమేమి కాదు!

*కేవలం తన శాశ్వత కృప చూపించి*

 (యిర్మియా 31:3), మారుతారు కదా అని దయతలచి, అంతటా అందరూ మారుమనస్సు పొందాలని, ఇంకా తన వాత్శల్యం చూపిస్తున్నారు!

 (2 పేతురు 3:9)

*ఆయన దీర్ఘశాంతాన్ని, వాత్సల్యమును చేతకానితనముగా అనుకోవద్దు!*

 

దావీదు గారి లాగ అడుగుదాము దేవున్ని ప్రార్ధిద్దాము

కీర్తనలు 40: 8

నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

 

కాబట్టి అన్ని విషయాలలో దేవున్నిసంతోషపెట్టే విధంగా నడచుకొనేలాగ ప్రార్ధించి అలా సాగిపోదాము!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(7వ భాగము)

 

కొలస్సీయులకు 1: 10,11

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు...

 

7⃣ *ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను*

 

 ♻ *పౌలుగారు తన పత్రికలలో నేను అన్ని విషయాలలో దేవుని మెప్పు పొందటానికి చూస్తున్నాను అంటున్నారు!*

 

 యుద్దరంగమందు పోరాడువాడు బహుమానం కొరకు పోరాడుతాడు, *తన యజమానిని సంతోషపెట్టాలని పోరాడుతాడు!*

 ఒక ఉద్యోగి తన యజమానిని సంతోషపెట్టడానికి కష్టపడి పనిచేస్తాడు!

 

👉 అలాగే *నీకు నాకు యజమాని దేవుడు!* తోటయజమాని ఉపమానం ప్రకారం దేవుడు నిన్ను నన్ను తన తోటలో పనికోసం పెట్టుకున్నారు! మత్తయి 20; *కాబట్టి మన యజమానిని సంతోషపెట్టాలని కష్టపడి పని దేవునితో లేక*

 

👉 యజమాని సంతోషించే పనులు మాత్రమే చేద్దాం! అనగా ఆత్మఫలము ఫలిద్దాం! యజమానికి ఇష్టం లేనిపనులు/ దుఃఖపెట్టే పనులు అనగా శారీరక క్రియలు/ ఫలాలు ఫలిస్తుంటే మానేద్దాం!

 

   *పౌలుగారు నేను దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాను గాని మనుష్యులను సంతోషపెట్టాలని చూస్తే నేను క్రీస్తు దాసుడను కాకపోవుదును అంటున్నారు!*

 గలతీ 1:10;

ఇంకా రాస్తూ అంటున్నారు:

*మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి, ఇప్పుడు శరీరానుసరంగా పరిపూర్ణులు కాగలరా?*

 గలతీ 3:3;

 

ఇంతవరకు ఆత్మానుసారంగా నడచుకొని, అత్మఫలము ఫలించి, ఇప్పుడు శరీరానుసారంగా అనగా శారీరక క్రియలు చేస్తే మీరు పరిపూర్ణులు కాలేరు అంటున్నారు!

*కాబట్టి అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపెట్టి, ఆయనకు తగినట్లుగా అనగా క్రైస్తవ పేరుకు తగినట్లుగా నడచుకొందాం!*

 

మనల్ని మనం సంతోషపెట్టడానికి జీవిస్తే ఏవిధంగానూ దేవుణ్ణి సంతోషపెట్టలేము!

 2 కొరింథీ 5:9 

*మేము ఏ స్తితిలో ఉన్నా, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టడమే మా లక్ష్యం అంటున్నారు!*

 1 థెస్సలోనిక 2:4 దేవుడు మాకు ఈపని అప్పగించాడు కాబట్టి మనుష్యులను సంతోషపెట్టడానికి కాకుండా, దేవుణ్ణి సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు.

 

 ఆయనను సంతోషపెట్టాలి అంటే ఆయనకున్న మనస్సే మనం కూడా కలిగియుండాలి! ఫిలిప్పీ 2:5 

*క్రీస్తుయేసు కి కలిగియున్న ఈ మనస్సు మీరును కలిగియుండుడి!* యేసుప్రభులవారు కూడా యోహాను 8:29 లో నన్ను పంపినవానికి ఇష్టమైనవే నేనెప్పుడూ చేస్తాను అంటున్నారు! కాబట్టి మనం కూడా ఆయనకిష్టమైనవే చేస్తూ, ఆయనకు తగినట్లుగా జీవించాలి!

*హనోకుగారు* దేవునికి ఇష్టమైనట్లుగా నడచుకొన్నారు. దేవునితో నడిచారు! చివరికి దేవుడే ఉండలేక, నా కుమారుడా! నిన్ను విడచి నేనుండలేను, వచ్చేయ్యరా అని చెప్పి, తనతో ఉండటానికి తీసుకుని పోయారు. దేవునితో నడవటం అంటే ఇదే! ఆదికాండం 5:22,24;

 

*దావీదుగారు* అలాగే దేవునికి ఇష్టానుసారంగా జీవించారు!

యేసయ్య నడిచారు!

పౌలుగారు యేసయ్యను పోలి నడిచారు! మనం కూడా యేసయ్యని పోలి నడుద్దాం! ఆయనకిష్టమైనట్టు జీవిద్దాం! *నామాకార్ధజీవితం వదిలేద్దాం! దేవునికి తగినట్లుగా నదచుకొందాం!*

 

   దావీదు గారి లాగ అడుగుదాము దేవున్ని ప్రార్ధిద్దాము

కీర్తనలు 40: 8

నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

 

కాబట్టి అన్ని విషయాలలో దేవున్నిసంతోషపెట్టే విధంగా నడచుకొనేలాగ ప్రార్ధించి అలా సాగిపోదాము!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(8వ భాగము)

 

కొలస్సీయులకు 1: 11

*ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, . .*

 

  పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశములు:

 

 8⃣ *ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును;*

 9⃣ *దీర్ఘశాంతము కనపరచునట్లు. . .*

 

👉 పౌలుగారి మాటలలో మరొకటి; ఓర్పు- దీర్ఘశాంతము. గతంలో నిరీక్షణ- విశ్వాసము, జ్ఞానము- వివేకము; ఇప్పుడు ఓర్పు- దీర్ఘశాంతము. ఓర్పులేకపోతే దీర్ఘశాంతమే లేదు! పెద్దలంటారు : ఓర్చుకుంటే కోడిగుడ్డు దాకడు (పాత్రనిండా) మాంసం అవుతుంది! ఎలా? ఓర్చుకుని, ఆ గుడ్డును పిల్లచేసి, దానిని పెంచి పెద్దచేస్తే, ఒకరోజు అది కుటుంబమంతటికి ఒకరోజు మాంసం అవుతుంది! 

 

*అలాగే సమస్య వచ్చినప్పుడు- తొందరపడితే, ఆ తొందరలో, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే-*

1. నీ సమస్య పరిష్కారం కాదు,

2. శత్రుత్వం పెరుగుతుంది,

 3. నీవో హంతకుడవుగానో, నేరస్తుడవుగానో పరిగణింపబడి, నీతోపాటు నీ కుటుంబం బాధలు పడతారు. *అదే ఓర్చుకుని, సమస్యను దేవునిపాదాల దగ్గరుంచితే, దేవుని పని- దేవుని సమయంలో దేవుడు చేస్తాడు!*

అప్పుడు సమస్య శాశ్వతపరిష్కారం అవుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు!

 

ఓర్పుకోసం బైబిల్ లో ఏం వ్రాయబడిందో చూద్దాం! *ఓర్పు= సహనం!!*

👉 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమనుగురుంచి చెబుతూ- ప్రేమ అన్నింటిని సహించును, ఓర్చుకొనును అంటున్నారు!

*కాబట్టి ఓర్పులో ప్రేముంది. ప్రేమ ఉంటే ఓర్పు ఉంటుంది!*

 

ఎఫెసీ 4:2 లో పౌలుగారు: *పూర్ణవినయముతో, సాత్వికముతో, ఓర్పుతో, దీర్ఘశాంతముతో ఒకరియెడల ఒకరు ఉండాలి .*

 

1 థెస్సలోనిక 5:14 లో *అందరిపట్ల ఓర్పుచూపమంటున్నారు.*

 

హెబ్రీ 6:12 ప్రకారం: *ఓర్పుద్వారా దేవుని వాగ్దానాలకు వారసులైనవారిని అనుసరించాలి అంటున్నారు!*

 ఇంకా ఆయన వాగ్దానం చేసింది మీకు లభించాలి అంటే మీకు ఓర్పు అవుసరం అంటున్నారు!

10:36;

హెబ్రీ 12:1

*ఇంతగొప్ప సాక్షిసమూహము మనకు ఉంది గాబట్టి, వారు అనగా సాక్షి సమూహము ఓర్చుకున్నారు గాబట్టి మనం కూడా ఓర్చుకుని- మన ముందున్న పందెమందు ఓపికతో పరుగెత్తుదాం!!*

 

 యాకోబు 5:10   *కీడునకు గురైతే ఓపికతో సహించాలి అంటున్నారు!*

 

ఇక్క జాగ్రత్తగా గమనిస్తే పౌలుగారు:

*ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు అంటున్నారు!* కారణం నీవెప్పుడైతే దేవునియందు విశ్వాస- ప్రేమ- నిరీక్షణలు కలిగియుంటావో, దేవునియందు ముందుకు సాగుతావో, అప్పుడు నీకు శ్రమలు కలుగుతాయి. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారికి శ్రమలు కలుగుతాయి.

 2 తిమోతి 3:12;

*కాబట్టి ఈ శ్రమలలో ఓర్పుకావాలి విశ్వాసికి!*

 ఆ ఓర్పుకూడా మామూలు ఓర్పు కాదు- ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు కావాలి!

 

 ప్రభువా! ఏం చెయ్యమంటావ్ చెప్పు, నీవు ఓర్చుకోమన్నావు, ఓర్చుకుంటున్నాను, ఏం చేస్తాను,  ఓర్చుకో అనే మాట అనకపోయి ఉంటేనా, ఈ పాటికి నా సత్తా చూపించుదును!

*ఇలాంటి ఉక్రోషంతో కూడిన ఓర్పు, ఏడ్పుగొట్టు ఓర్పు కాదు దేవునికి కావాలి!!*

 

👉 *దేవునికి కావలసింది ఆనందముతో కూడిన ఓర్పు!*

 

అగ్నిగుండము ఎదురుగా ఉన్నా సంతోషంగా దేవునికోసం నిలచిన *షడ్రక్, మేషాక్, అబెద్నేగోల* కున్న ఓర్పు,

 

సింహంబోను తనకోసం వేచియుంది అని తెలిసినా ఓర్చుకున్న *దానియేలు* ఓర్పు,

 

ఎన్ని సం.లు చేయని నేరానికి అన్యాయంగా జైలుశిక్ష అనుభవించినా దేవునికోసం ఓర్చుకున్న *యోసేపు* ఓర్పు,

 

యేసయ్యకోసం ఎన్ని శ్రమలు పడటానికైనా సంతోషంగా సిద్దపడిన *పౌలుగారి* లాంటి ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దేవుడు మనయొద్దనుండి ఆశిస్తున్నారు!

 

👉 పౌలుగారు రాస్తున్నారు: శ్రమ ఓర్పును, ఆ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను (కొన్ని ప్రతులలో నిరీక్షణకు బదులుగా శీలం/ క్యారెక్టర్ అని తర్జుమా చేయబడింది) కలుగజేయును.

రోమా 5:3;

*ఈ శ్రమలు ఓర్పుకు, తద్వారా పరీక్షకు, తద్వారా నిరీక్షణకు దారితీస్తాయి.* కాబట్టి మనకు ఓర్పు ఎంతో అవసరం!

రోమా 12:12 

 

*నిరీక్షణగలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పుగలవారై యుండాలి అంటున్నారు!*

యాకోబు 1:4 

 

*ఎన్ని కష్టాలు వచ్చినా సంపూర్ణులు కావాలి అంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నారు!*

👉 అలా చేసినప్పుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు సెహబాస్ అంటున్నారు ప్రకటన 3:10;

 

👉 కాబట్టి ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును కలిగియుందాము!

అట్టి ప్రార్థనా జీవితం కలిగి జీవిద్దాము!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(9వ భాగము)

కొలస్సీయులకు 1: 10,11

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు...

 

  పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము

 

 9⃣ *దీర్ఘశాంతము కనపరచునట్లు. . .*

   *దీర్ఘశాంతము కనపరచునట్లు. . .*

 

👉 ఇది ఓర్పునుండి వస్తుంది అని చెప్పుకున్నాము!

*దేవుడు మోషేగారికి తన మహిమను చూపించినప్పుడు ఆయన గుణగణాలు (characteristics) వెల్లడౌతాయి. దానిలో ఒకటి దీర్ఘశాంతము!*

 నిర్గమ 34:6;

 

కాబట్టి దేవునికున్న లక్షణాలు అనగా కనికరం, దయ, దీర్ఘశాంతము లాంటివి మనకు కూడా ఉండాలి!

సామెతలు 19:11

ప్రకారం- *ఎవరికైతే సుభుద్ది ఉంటుందో వారికి దీర్ఘశాంతం ఉంటుంది.*

 

 నీకు దీర్ఘశాంతం లేదు అంటే నీకు సుభుద్ది లేదు, దుర్బుద్ధి, సుండిగుణం ఉన్నాయి.

 

*ఇక ఆత్మఫలములో ఒకటి దీర్ఘశాంతం* గలతీ 5:22;  కాబట్టి దేవునికున్న ఈ మంచి లక్షణాలనే మనం కూడా కలిగియుండాలని దేవుడు కూడా ఆశిస్తున్నారు!

 

 👉 *బహుశా మన దీర్ఘశాంతం మన శత్రువులకు చేతకానితనముగా అనుకోవచ్చు!*

 పర్వాలేదు! కాని అదే దీర్ఘశాంతం ద్వారా మనం పరలోకం వెళ్తాము.

 

శత్రువులను మిత్రువులుగా చేసుకోవచ్చు! మనం ఎన్ని తప్పులు చేస్తున్నా, దేవుడు మనయెడల దీర్ఘశాంతం చూపిస్తున్నారు లూకా 18:8; 1 పేతురు 3:20;

 

అలాగే మనం కూడా దీర్ఘశాంతం చూపించాలి!

అయితే ఈవిధమైన దేవుని దీర్ఘశాంతం రక్షణార్ధమైనది!

2 పేతురు 3:15;

*అది మనకు రక్షణనిచ్చింది! అదే దీర్ఘశాంతం నీకు నీ సమస్యను పరిష్కరిస్తుంది!*

 

 అంతేకాకుండా నీద్వారా నీ ఇరుగుపొరుగు వారికి, నీ శత్రువులకు కూడా దేవుని రక్షణ అందిస్తుంది!

 

యోసేపు గారు తన కష్టాలలో జైలు జీవితం లో దీర్ఘశాంతం చూపించారుదేవుని మీద అలగలేదు. అందుకే ఐగుప్తుదేశానికే గవర్నర్ అయ్యారు.

 

యేసుక్రీస్తు ప్రభులవారు ఎన్ని శ్రమలు పెట్టినా దీర్ఘ శాంతం చూపించి మనందరికీ రక్షణ తెచ్చారు.

 

కాబట్టి ఆనందముతో కూడిన ఆ పూర్ణమైన ఓర్పును, రక్షణార్ధమైన దీర్ఘశాంతమును కలిగియుందాము!

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

➖➖➖➖➖➖➖➖➖➖

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(10  భాగము)

 

 కొలస్సీయులకు 1: 11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

 

 ♻ *పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశములు*

 

1⃣0⃣ *ఆయన మహిమ శక్తిని బట్టి అనగా ఆయన మహిమయొక్క శక్తినిబట్టి సంపూర్ణబలముతో బలపరచబడ వలెనని. .*

అంటూ ప్రార్ధన చేస్తున్నారు.

 

👉 కొలస్సీయులకోసం!

🔹 దేవుని మహిమలో శక్తి ఉంది,

🔹ఆ శక్తిని కొలస్సీయులు గ్రహించి,

🔹ఆ శక్తిద్వారా సంపూర్ణబలముతో బలపరచబడాలని

*ఎక్కడ ఆత్మలోనూ/ ప్రార్ధనలోనూ/ విశ్వాసంలోనూ కూడా బలపరచబడాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు!*

 

  *కొంచెం ఆగి ధ్యానం చేద్దాం!*

👉 పౌలుగారు ఎఫెసీయులకు, కొలస్సీయులకు, లవొదొకయకు, ఫిలేమానుగారికి ఒకేసారి లేఖలు వ్రాసి, వాటిని ఒనేసీము, తుకికులతో పంపించినట్లు మొదటిభాగంలో చూసుకున్నాం!

 

👉ఇక్కడ కొలస్సీపత్రికలో వాడిన పదములు, అదే అర్ధాలు- ఎఫెసీ పత్రికలోనూ మనం చూడొచ్చు! 

*ఇక్కడ మహిమ శక్తి కోసం చూసుకుంటే*-

ఎఫెసీ 3:15-19 జాగ్రత్తగా పరిశీలిస్తే- అదేమాటలు కొంచెం వివరంగా చెప్పారు. *బలపరచబడవలసింది ఏమిటి- అంతరంగపురుషుడు, శక్తికలిగి యుండాలని (15),*

 

👉 యేసయ్య మన విశ్వాసం ద్వారా మన హృదయాలలో నివాసం చేయాలని, తన మహిమైశ్వర్యం చొప్పున దేవుని సంపూర్ణతలో పూర్ణులుగా కావాలని,  అందుకుగాను దేవుని ప్రేమయందు వేరుపారి ఉండాలని అంటున్నారు! 

 

👉 *ఇక మహిమ/ శక్తి అన్నీ దేవునివే! ఇవన్నీ దేవుడే మనకు దయచేస్తారు! వాటిద్వారా విశ్వాసులకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తారు దేవుడు!*

 

♻ *మరి ఈ బల ప్రభావాలు/ మహిమ శక్తి కొలస్సీయులు ఎందుకు పొందుకోవాలని పౌలుగారు కోరుకుంటున్నారు?*

◼ *వారు అద్భుతాలు చేయాలనా?*

◼ *గొప్ప ప్రసంగీకులు కావాలనా?*

 

👉 వాటికంటే ప్రాముఖ్యంగా *ఎప్పుడైతే వారు దేవునిలో బలంగా ముందుకు సాగుతారో, పరీక్షలు/ శ్రమలు/ శోదనలు ఎదుర్కోవాలి! వాటికోసమే ఈ మహిమ శక్తి, బల ప్రభావాలు.*

 

👉 ఆ పరీక్షలు ఎదుర్కొని, తట్టుకొని నిలవాలని, సహనం, ఆనందం, సంతోషంగా ఉండాలని, వాటితో అనగా తమకివ్వబడిన తలాంతులతో వారున్న చిన్న గ్రామంలో కూడా, తాము చేయగలిగినంత సేవ చేయాలని, మేలు చేయాలని, తద్వారా దేవునికే మహిమ తేవాలని ఆకాంక్షించి ఇక్కడ కొలస్సీయుల కోసం, అక్కడ ఎఫెసీయులకోసం పౌలుగారు ప్రార్ధనలు చేస్తున్నారు!

 

👉 *ఇలా శోదనలు తట్టుకున్నప్పుడు, ఆత్మీయంగా బలపడి (Spiritually Strengthened) దేవునికోసం గొప్పకార్యాలు చేయగలరు! వారేకాదు మనం కూడా వీటిని పొందుకోవాలని యేసుప్రభులవారు, ఇంకా పౌలుగారు కోరుకుంటున్నారు!*

 

దేవుని మహిమవలన శక్తి కలుగుతుంది అని చూసుకున్నాం కదా!

*మొదటగా దేవుడు చాలా మహిమ గలవాడు! శక్తివంతుడు!*

 

 ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము అంటున్నారు!

యెషయా 66:1;

 

 ఆయనముందు అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండవాయువు విసరుచున్నది! కీర్తనలు 50;

 

 అంతటి గొప్పదేవుడు! ఆయన మాట తాకిడికి నిర్గమ కాండం, 1 రాజుల గ్రంధం ప్రకారం కొండలు బ్రద్ధలయ్యాయి. అంతటి మహిమ గలదేవున్ని మనం పూజిస్తున్నాం!

 

 *మోషేగారు కేవలం దేవునితో 40 రోజులు ఉన్నందుకే ఆయన ముఖ చర్మం ప్రకాశించి నందువలన, ఇశ్రాయేలీయులు ఆయన ముఖం చూడలేక ముఖం మీద ముసుకు వేసుకోమన్నారు మోషేగారిని!* నిర్గమ 34;  అంతటి మహిమగల దేవుడు మన దేవుడు!

 

  ♻ *మరి అంతటి మహిమగల దేవుణ్ణి మనం ఎలా మహిమ పరచగలం?!!!*

 

  నిర్గమ 14:4, 17, 18 ప్రకారం *ఐగుప్తును ద్వంసం చేసి దేవుడు తనకుతానే మహిమ తెచ్చుకొన్నారు!*

👉 అందుకే మిర్యాము, మోషే అహారోనులు ఆయన మహిమను స్తుతించారు!

 

 నిర్గమ కాండం నుండి ద్వితీయోపదేశాకాండం వరకు దేవుని మహిమ మాటిమాటికి మేఘంలో వారికి కనిపిస్తూ ఉంటుంది! నిర్గమ 16:10, 24:16,17; ప్రత్యక్షగుడారం మీదను కనబడింది: లేవీ 9:6, 23; సంఖ్యాకాండము 14:20; 16:19; 20:6.

 

👉 దేవుడు మనిషికి కూడా తన మహిమను ఇచ్చారు. అందుకే దావీదు గారు నీ రక్షణ వలన మనిషికి గొప్ప మహిమ కలిగింది అంటున్నారు. కీర్తనలు 21:5;

 

పౌలుగారు భూసంభందమైన వస్తువుల మహిమ వేరు, ఆకాశ వస్తురూపముల మహిమ వేరు అంటున్నారు.

1 కొరింథీ 15:40-41;

 

👉అలాగే నీకు నాకు దేవుడు మహిమ నిచ్చారు! ఇక పెండ్లి కుమార్తె సంఘానికి కూడా దేవుడు మహిమను ఇచ్చారు! అంతఃపురంలో ఉన్న పెండ్లి కుమార్తె కేవలం మహిమగలది అంటున్నారు! కీర్తనలు 45:13;

 

👉 సంఘం దేవుని ధరించిన కన్యక! ఈ సార్వత్రిక సంఘం అనుదినము కట్టబడుతూ, పెండ్లికుమారుడైన యేసయ్య కోసం వధువుగా సిద్దపడుతుంది, కాబట్టి ఆ మహిమను నీవు నేను పొందుకోవాలి!

 

👉 *ఇప్పడు దేవుణ్ణి మనం ఎలా మహిమ పరచగలం?*

 

1⃣ *స్తుతియాగము* అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు! కీర్తనలు 50:23;

 

 2⃣ *ఆయనకు భయపడితే దేశములో మహిమ నివసిస్తుంది.*

 కాబట్టి మనం ఆయనకు భయపడాలి! కీర్తనలు 85:9;

 

3⃣ *యెహోవాకు తగిన మహిమ, అనగా స్తుతియాగం, నైవేద్యము చెల్లించాలి .*

 కీర్తనలు96:8

 

4⃣ యెషయా 58:8  ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, మంచి సత్కార్యాలు చేయడం ద్వారా దేవునికి మహిమ, అది మనలను కాస్తుంది!

 

5⃣ యేసుప్రభులవారు తనక్రియలద్వారా దేవునికి మహిమ పరిచారు. మనం కూడా దేవునికి మహిమ తీసుకుని రావాలి. మత్తయి సువార్తనుండి యోహాను సువార్తవరకు!

 

6⃣ మనం దేవుణ్ణి నమ్మితే ఆయన మహిమను చూస్తాం! యోహాను 11:40;

 

7⃣ మనం బహుగా ఫలించుట వలన దేవుడు మహిమ పరచబడతారు! యోహాను 15:8;

 

8⃣ యేసుప్రభులవారు దేవుడు తనకిచ్చిన పని పూర్తిచేసి దేవుణ్ణి మహిమ పరిచారు అలాగే దేవుడు మనకిచ్చిన పని చేసి దేవుణ్ణి మహిమ పరచాలి! యోహాను 17:4

 

9⃣ క్రీస్తుతోకూడా శ్రమ పడినయెడల క్రీస్తుతో కూడా మహిమ పరచబడతాం! రోమా 8:17;

 

🔟 రోమా 15:5-6   అందరూ ఒకేభావంతో అనగా ఏక మనస్సుతో ఉండి క్రీస్తు చిత్తప్రకారం చేస్తే దేవునికి మహిమ;

 

1⃣1⃣ ఒకరిని ఒకరు చేర్చుకోవాలి. ఆదుకోవాలి, అప్పుడు దేవునికి మహిమ. 15:7;

 

1⃣2⃣ దేవునికి ధారాళంగా ఇవ్వడం వలన దేవునికి మహిమ 2 కొరింథీ 9:13;

 

1⃣3⃣ దేవుని వాక్యం శీఘ్రముగా ప్రబలినప్పుడు/ వ్యాపించుచున్నప్పుడు దేవునికి మహిమ 2 థెస్స 3:1.

 

    కాబట్టి అంతటి మహిమగల దేవుణ్ణి మనం కూడా మహిమ పరుద్దాం!

 

👉విలువలేని మనకు విలువనిచ్చి, తన మహిమనిచ్చిన దేవునికి వ్యతిరేఖంగా బురదపనులు చేస్తూ, అపవిత్రమైన శారీరక క్రియలు చేశామా, దేవునికి మహిమ తెచ్చిన వారము కాదు అవమానం తెచ్చిన వారము.

 

*నేటి దినాల్లో అనేకమంది దేవునికి మహిమను తేకుండా తమ స్వల్పమైన/ తుచ్చమైన కోరికలు కోసం దేవుణ్ణి అవమానపరుస్తున్నారు.*

 

👉 ప్రియ నేస్తమా! ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో! ఆయనకు మహిమ తీసుకుని వస్తే, ఆత్మలో సంపూర్ణంగా బలపడి, ఎన్ని కష్టాలైన తట్టుకుని, మెట్టునుండి పైమెట్టుకు , పూర్ణతనుండి సంపూర్ణతకు తీసుకొనిపోతారు దేవుడు!

 

 యూదా 1: 24,25

*తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.*

 

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

➖➖➖➖➖➖➖➖➖➖

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(11వ భాగము)

  కొలస్సీయులకు 1: 12

*తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను(అనేక ప్రాచీన ప్రతులలో-మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.*

 

*ప్రియులారా! గతకొద్దిరోజులుగా మనం పౌలుగారి ప్రార్ధనకోసం ధ్యానం చేస్తున్నాం!*

 

 *పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశం*

1⃣1⃣ *తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్థ్యము!*

 

  👉 పౌలుగారి మాటలలో ప్రతీపదములోను అనేక అర్దాలుంటాయి!

 

*ఇక్కడ తేజోవాసులైన పరిశుద్దులస్వాస్థ్యములో మనం పాలివారమగుటకు మనల్ని పిలిచిన. . .* అంటున్నారు! అవును కదా

 మంటివారమగు మనల్ని, అపవిత్రులము, పాపులము, కల్మషం గలవారమైన మనల్ని దేవుడు తన అమూల్యమైన రక్తములో కడిగి, పవిత్ర పరచి, తేజోవాసులు అనగా ప్రకాశమానమైన  (స్వయం ప్రకాశం గలవారు- ఈ ప్రకాశం దేవుని నుండి వచ్చింది. ప్రకటన 21:23) గలవారికి కలిగే ప్రకాశం, మహిమ,   భాగ్యము మనకు కూడా ఇచ్చారు! అందుకు దేవునికి మనం ఋణపడిఉన్నాం!

 

  ♻ *మొదటగా తేజోవాసుల కోసం చూసుకుందాం!*

 

👉దేవుడు వెలుగైయున్నారు! యేసుప్రభులవారి కోసం యోహానుగారు వ్రాస్తూ యోహాను 1:4-9 లో *ఆయనలో జీవం ఉంది,ఆ జీవం మనుష్యులకు వెలుగిస్తుంది. అయితే మనుష్యులు చీకటి మనుష్యులు, చీకటి పనులు చేస్తున్నారు, గనుక ఆ వెలుగును గ్రహించడం లేదు* అంటున్నారు!

 

👉ఇక యేసుప్రభులవారు నేను లోకమునకు వెలుగును అంటున్నారు యోహాను 8:12; *నన్ను అనుసరించువారు చీకటిలో నడువక జీవకాంతి గలవారు అంటున్నారు.* 12:46;

 

👉 *కావున దేవుడు మనల్ని తన వెలుగు వారసులముగా చేసారు కాబట్టి మనం కూడా వెలుగు పనులు చేయాలి*

 అనగా ఆత్మఫలము ఫలించాలి గాని చీకటి పనులు, బురదపనులు అనగా శారీరక క్రియలు చేయకూడదు!

 

🔹 యేహెజ్కేలుగారి దేవుని ప్రభావ స్వరూప దర్శనములో చూస్తే, ఆయన తేజోమహిమ ఎంతగొప్పదో తెలుస్తుంది.

 

🔹అదే మహిమ సొలోమోనుగారు మందిరప్రతిష్ట సమయంలో దిగినందువలన ఆ మేఘమున్న చోటులో యాజకులు నిలువలేకపోయిరి. 2 దిన వృత్తాంతం 5:14;

 

    *ఇంతటి మహిమను మంటివారమగు మనకు దేవుడిచ్చారు.*

 

 ప్రకటన 4వ అధ్యాయంలో దేవుని మహిమ ఎంతగొప్పదో మనం చూసుకోవచ్చు!

👉21:23 లో అక్కడ *సూర్యుడైననూ, చంద్రుడైననూ లేరు, దేవుని మహిమ దానిలో ప్రకాశిస్తుంది.*

 

👉 గొర్రెపిల్లయే దానికి దీపం అంటున్నారు!

 

*ఇంతటి మహిమగల దేవుని దగ్గర ఎవరు నిలువగలరు అంటే మంటి రూపం, మంటి దేహం విడచి, మహిమ దేహాలు-రూపాలు కలిగిన ఆత్మలు నిలుస్తాయి!*

 

 ప్రకటన 7వ అధ్యాయంలో *తెల్లని వస్త్రములు ధరించిన ఎవడునూ లెక్కించలేనంత గొప్ప సైన్యము కనబడుతుంది మనకు. వారు ఎవరు అని అడిగితే- వారు మహాశ్రమలు నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకొన్నవారు! వీరే తేజోవాసులు! దేవుని దూతలతో సరియైన ప్రకాశం గలవారు!*

 

👉 మనం కూడా అలా శ్రమలు తట్టుకొని, యేసయ్య కోసం సాక్షిగా, సిలువసాక్షిగా జీవిస్తే, ఒకరోజు అనగా మన శుభప్రదమైన నిరీక్షణ ఫలించిన రోజు, కడభూర ద్వని వినిపించిన రోజు మనం కూడా మంటి దేహాలు వదలి, మహిమరూపం ధరించి- ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్త్యములో ప్రవేశిస్తాము! హల్లెలూయ!

 

  ఇక్కడ *అది స్వాస్త్యము* అని వ్రాయబడింది.

 

👉 *అది ఏ రకమైన స్వాస్థ్యము?* ఆ స్వాస్థ్యము ఏమిటో  ప్రకటన 7:15-17 లో ఉంది

*అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;*

*వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,*

*ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.*

 

👉 *ఇంతగొప్ప స్వాస్త్యము నీకు కావాలా?*

 

 కీర్తనాకారుడైన దావీదు గారు 16:6 లో

*మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను* అంటున్నారు.

అది ఇదే!!

 కీర్తన 61:5 లో కూడా దీనికోసమే వ్రాయబడింది. ఎఫేసి 1:12 లో మరింత స్పష్టముగా రాస్తున్నారు

*దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను(లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.*

 

  హెబ్రీ 1:14 *ఆయన రక్షణ మనకు స్వాస్థ్యము!*

 

🔹 పేతురుగారు ఆ స్వాస్థ్యము మనకు పరలోకంలో ఉంది అంటున్నారు 1 పేతురు 1:5;

కాబట్టి పౌలుగారు ఎఫెసీ 1:17లో

మరియు

*మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో. . . . తెలిసికొని జాగ్రత్తగా ఉండాలి* అంటున్నారు.

 

👉 *అంతేకాకుండా తేజోవాసులైన స్వాస్థ్యము కావాలంటే పరిశుద్ధముగా ఉండాలి!*

 

👉 కారణం ఆ స్వాస్థ్యము తేజోవాసులదే కాదు పరిశుద్దులది కూడా! దేవుడు పరిశుద్దుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆశ!

 

👉ఈ పరిశుద్దతకోసమే కొన్ని కోట్లమంది ఆదిమకాలం నుండి ఇప్పటివరకు చిత్రహింసలు పడినా, పరిశుద్ధంగా జీవించి, తమ మానప్రాణాలు దేవునికి అర్పించారు!

 

అందుకే దానియేలు 7:22 లో *పరిశుద్దుల విషయం తీర్పుతీర్చబడుతుంది అని* వ్రాయబడింది.

👉ప్రకటన గ్రంధంలో కూడా *పరిశుద్దులకోసం, వారి ప్రార్ధనలు, రక్తం కోసం లోకానికి తీర్పుతీర్చబడుతుంది అని వ్రాయబడింది.*

 5:8; 8:4; 16:4; 20:9;

 

👉 అంతేకాకుండా *పరిశుద్దులు శ్రమపడతారు, ఓర్చుకోవాలి అని వ్రాయబడివుంది*

 13:10; 14:12; 17:6;

 

👉అనగా దేవుని సంఘం/ సార్వత్ర్రిక సంఘం శ్రమలగుండా పయనించి, ఓర్పును ప్రదర్శిస్తే- అది సంఘానికి మహిమ వస్త్రముగా తయారవుతాయి. 19:8;

 

*ఎవరైతే ఇలా పరిశుద్దముగా ఉంటారో వారిని దేవుడు మహిమరూపులుగా మార్చి, ఆ తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్థ్యములో పాలివారయ్యేలా చేస్తారు! అంతేకాదు ఆయన రాకడ సమయంలో ఈ వేవేల పరిశుద్దుల పరివారముతో తిరిగి రాబోతున్నారు!*

 

   మరి ఇంతగొప్ప రక్షణ, స్వాస్థ్యము నీకు నాకు ఇచ్చియుండగా....

 

*ప్రియసంఘమా! మనం పరిశుద్దమైన పనులుచేస్తున్నామా? బురదపనులు చేస్తున్నామా? ఎందుకూ పనికిరాని మనకు ఇంతగొప్ప భాగ్యమిచ్చారు కదా! మరి మనం ఆయనకు తగినట్టుగా జీవించాల్సిన భాద్యత లేదా?!! కాబట్టి ఈ బురదపనులు/ శారీరక క్రియలు మానేద్దాం!*

 

👉 ఆ తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్థ్యములో పాలిభాగస్తులమవుదాం!

 

*మన ప్రాణప్రియుడైన యేసయ్యను, హెబ్రీ 11వ అధ్యాయములో వ్రాయబడిన సాక్షి సమూహాన్ని, మన ప్రియులను కలసుకొందాం!!!*

 

👉పరిశుద్దుల సహవాసంలో సందడి జరుగుతుండగా ఆ ప్రాణప్రియుని ప్రేమలో పరవశమౌదాం!

 

*వీణవాయిద్యాలతో నూతన కీర్తన పాడుచూ, సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధన చేద్దాం!*

 

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

➖➖➖➖➖➖➖➖➖➖

*మాదిరి కరమైనపౌలుగారి ప్రార్థన*

(12వ భాగం)

  కొలస్సీయులకు 2: 1-2

మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును,

నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

 

   ప్రియులారా! ఇంతవరకు మనం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో గల ప్రార్ధన, ఆత్మీయభావాలు, దీవెనలు కోసం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ అధ్యాయం గల ప్రార్ధన  కోసం ధ్యానం చేద్దాం!

 

    మీకొరకును, లవొదొకయ వారికొరకును, వీరికోసమే కాకుండా శరీరరీతిగా నా ముఖమును చూడని వారికొరకును ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను అంటున్నారు పౌలుగారు. మొదటిభాగంలో చెప్పిన విధముగా పౌలుగారు మరోసారి రాస్తున్నారు, కొలస్సీ వారినిగాని, లవోదొకయ వారిని గాని పౌలుగారు ఎప్పుడూ చూడలేదు. వారుకూడా పౌలుగారిని చూడలేదు! మొదటిభాగములో చెప్పిన విధముగా లవోదొకయ కొలస్సీ పట్టణానికి 16.5 కి.మీ.ల దూరంలో ఉంది! చాలా ధనిక పట్టణం! పేరుకు దేవుని అంగీకరించినా సరే, నామకార్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు గాని నిజమైన భక్తి- ఆరాధన లేదు. కారణం వారికున్న ధనవృద్ధి! అందుకే ప్రకటన 3:14-22 వరకు దేవుడు వారిని ఛీ! అంటూ పరువు తీసేశారు. ఇదో పనికిమాలిన సంఘానికి ప్రతీక! నేటి మనసంఘాలు లవోదొకయ సంఘానికి మించిపోయి, నామకార్ధ జీవితంలోను, లోకాచారాలలోను మునిగిపోయి ఉన్నారు!

 

   సరే! ఇలా పౌలుగారి ముఖం చూడని వారికోసం పౌలుగారు చాలా పోరాడుచున్నాను అంటున్నారు, ఇక్కడ పోరాటం అంటే నిజమైన పోరాటం/ ఫైటింగ్ కాదు. ఆత్మీయ పోరాటం, మోకాళ్ళపై , ప్రార్ధనలో పోరాటం! దేనికోసం? ఎవరికోసం? వారంతా కలసిమెలసి ఉండి, ప్రేమయందు అతుకబడి ఉండాలని! ఇది పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము. వారంతా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని ఆయన ప్రార్ధించారు!

 

    ఈ పోరాటం కోసం మొదటి అధ్యాయం చివర్లో మొదలుపెట్టి, ఈ రెండవ అధ్యాయంలో కొనసాగిస్తున్నారు. కొలస్సీయులకు 1: 29

అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.

  ఇక్కడ ఆయన ప్రార్ధనలో ఎంతో పోరాడుచూ, ప్రయాసపడుచున్నాను అంటున్నారు.  విశ్వాసులను పౌలుగారు ముఖాముఖిగా కలుసుకున్నా, కలుసుకోలేకపోయినా, వారికోసం ప్రార్ధనలో పెనుగులాడుచున్నారు పౌలుగారు! కారణం, క్రీస్తుయేసు దృష్టిలో ప్రతీవ్యక్తి, ప్రతీ విశ్వాసి విలువైన వారే! వీరంతా లోకం ఎదుట క్రీస్తుయేసు నామమును ధరించి, నిలబడుతున్నారు కాబట్టి! దీనివలన సాతాను గాడి ద్వారా, బందు మిత్రుల ద్వారా, ఇరుగుపొరుగు వారి ద్వారా శోధనలు కలుగుతున్నాయి! కాబట్టి ఆ శోధనలలో తట్టుకునే శక్తి వారికి కలగాలని, వారికోసం పౌలుగారు తన ప్రార్ధనలలో పెనుగులాడుతున్నారు ప్రభువు ఎదుట! దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నారు!

ఇలాంటి ప్రార్ధనాభారం ప్రతీ విశ్వాసికి, సేవకునికి ఎంతైనా అవుసరం!

ప్రియ దేవుని బిడ్డా!

ఇలాంటి అనుభవం నీకుందా!?

నీ పొరుగువారి రక్షణకోసం ఎప్పుడైనా ప్రార్ధన చేసావా?

నీతోటి విశ్వావి శోధనలలో చిక్కుకొని సతమతమవుతుండగా, లేక అనారోగ్యంతో భాద పడుతుంటే, ఆ విశ్వాసికోసం కన్నీటితో, భారంతో ప్రార్దిస్తున్నావా?

 

 ఇక మనదేశంలోనూ, ఇతరదేశాల్లోనూ యేసయ్య నామంకోసం ఎన్నో భాధలు, చిత్రహింసలు, పడుచున్న సేవకుల కోసం, విశ్వాస సమూహం కోసం భారంతో ప్రార్ధన చేస్తున్నావా? నాకెందుకు ఈ భాద! మాకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి భాధలు లేవు కదా అని మౌనంగా ఉంటున్నావా? గతభాగాలలో వివరించినట్లు ఆ వ్యక్తి, ఏ దేశపువాడైనా, ఏ తెగ వాడైనా,పశ్చాత్తాపం పొంది, భాప్తిస్మము తీసుకుంటే, సార్వత్రిక సంఘములో అనగా సంఘము అనే ఆయన శరీరములో ఒక అవయవము అని మరచిపోవద్దు. మరి వారికోసం భారముతో ప్రార్ధించాల్సిన అవుసరం మనకుంది అని మరచిపోవద్దు!

*ఇక మారుమూల గ్రామాల్లో, కొండలలో, అడవులలో సేవచేస్తూ, ఎన్నో ఇక్కట్లు పడుచున్న సేవకులు మిషనరీలు ఉన్నారు. వారు ఎండలో ఎండుతూ, సరియైన త్రాగునీరు లేక, సరియైన తిండిలేక, స్నానం చేయడానికి సరియైన మరుగులేక, విశ్రాంతి తీసుకోడానికి సరియైన సౌకర్యము లేక, ప్రార్థన చేసుకోడానికి సరియైన మందిరము లేక, చలిలో, వర్షంలో ఇక్కట్లు పడుచున్న రారాజు సేవకులు, మిషనరీలు కోసం ఎప్పుడైనా కన్నీటితో, ఉపవాసం, భారంతో ప్రార్ధన చేశావా ప్రియ చదువరీ*!!!!??? వారికి ఎప్పుడైనా సహాయం చేశావా ప్రియ స్నేహితుడా!? లేకపోతే ఇప్పుడే , నేడే మొదలుపెట్టు!

 

  పౌలుగారికి ఆ భారం ఉంది! అందుకే కన్నీటితో పెనుగులాడుచున్నారు! వాక్యం విని, మారుమనస్సు పొంది, దేవుణ్ణి అంగీకరించినవారు, తిరిగి సోలిపోకుండా, వాలిపోకుండా, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, ముఖ్యంగా ప్రేమలో అతుకబడి ఉండాలని! అలాగే నీవు, నేను మన సంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరూ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారికోసం ప్రార్ధించాల్సిన భారం, భాద్యత, అవుసరం మనకుంది. యేసుప్రభులవారు తన నిర్ఘమమునకు ముందుగా అలాగే ప్రార్ధన చేశారు. ఆయన శిష్యుడు పౌలుగారు అలాగే ప్రార్ధన చేశారు. అందుకే  1కోరింథీయులకు 11: 1

నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

  మనము కూడా అలాగే కన్నీటితో ప్రార్ధనలో, మన తోటివిశ్వాసుల కోసం, కుటుంబం కోసం పెనుగులాడుదాం! సేవకుల కోసం, కష్టాలు పడుతున్న తోటి విశ్వాస సమూహం కోసం ప్రత్యేకంగా ప్రార్ధన చేద్దాం!

దైవాశీస్సులు!

ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

(13వ భాగం)

    కొలస్సీయులకు 2: 2

నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

 

    ఈ వచనంలో పౌలుగారి ప్రార్ధన కొనసాగుతుంది. గతంలో మనం కొలస్సీ పత్రిక 1:10-12 వరకు గల  పౌలుగారి ప్రార్ధనకోసం విపులంగా ధ్యానం చేసుకున్నాం. పౌలుగారి ప్రార్ధన ఎప్పుడూ material Blessings కోసం ఉండదు!  ఆధ్యాత్మిక మేలులు- ఆత్మలో ఎదగడం, పరిశుద్ధాత్మ శక్తికోసం ఉంటుంది.

 

పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: ప్రేమయందు అతుకబడి. . .

కొలస్సీ లో ఉన్న విశ్వాసులు ప్రేమయందు అతుకబడాలి అని ఆయన ప్రార్ధన చేస్తున్నారు. ఇక్కడ ప్రేమయందు అతుకబడాలి అని ప్రార్ధన చేయడానికి కారణం కొలస్సీ సంఘంలో విభేదాలున్నాయి అని ఎంతమాత్రము కాదు. ఈ సంఘంలో విభేదాలు లేవు. కొరింథీ సంఘంలో ఉన్నాయి, ఫిలిప్పీ సంఘంలో ఉన్నాయి విభేదాలు. మరి అలాంటప్పుడు ప్రేమలో అతుకబడి ఉండాలని ఎందుకు ప్రార్ధన చేస్తున్నారు?!! దానికి కారణం: కీర్తనలు 133 వ అధ్యాయం.  కీర్తనల గ్రంథము 133:1,3

1.సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

3.సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.   కారణం ఏమిటంటే: వీరికి దేవుని ఆశీర్వాదం, శాశ్వత జీవం వీరిలో ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశ్యముతోనే పౌలుగారు వారు ప్రేమయందు అతుకబడి ఉండాలని ప్రార్ధించారు! అంతేకాకుండా ప్రేమవలన, ఐక్యత వలన ఆ సంఘము సర్వతోముఖాభివృద్ధి పొందుతుంది! ఒక సమస్య వస్తే, సంఘమంతా సమిష్టిగా ప్రార్ధించి, ఆ సమస్యను ఎదుర్కోగలరు! అందుకే వారు ప్రేమయందు అతుకబడి ఉండాలని ప్రార్ధన చేసారు. ఇక్కడ అతుకబడి అనగా ప్రేమకలిగి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని అర్ధం! అదే ఆయన ఆకాంక్ష! పౌలుగారు ఇదే విషయాన్ని చాలా సంఘాలకు రాశారు.  రోమీయులకు 12: 10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

  కొన్ని ప్రతులలో గౌరవించడంలో ఒకరికొకరు మించిపొండి అని తర్జుమా చేయబడింది! 

 

ఎఫెసీయులకు 4:1,2,3

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

3. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.   ఇక్కడ దేవుడు కలిగించే సమైక్యతా అందరిలోనూ ఉండాలని ఆయన ఆశ!

ఫిలిప్పీయులకు 2: 2

మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

  కాబట్టి అందరూ ప్రేమలో ఐక్యంగా ఉండాలని పౌలుగారి ఆకాంక్ష!

 

    ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే: ఎందుకు ప్రేమయందు ఐక్యంగా ఉండాలని పౌలుగారి పదేపదే అందరికీ చెబుతున్నారు? దానికి మరో కారణం ఉంది. దానికి జవాబు 1 కొరింథీ 13 వ అధ్యాయంలో దొరుకుతుంది! కారణం సహోదరుల మధ్య ప్రేమలేకపోతే వారు వ్యర్ధులు! ఎన్ని వరాలున్నా, ఎన్ని ఫలాలున్నా, తలాంతులున్నా, ప్రేమలేని వ్యక్తీ Waste Fellow!! నేనుకాదు బైబిల్ చెబుతుంది 13:2;

అయితే ప్రేమ ఉంటే అది దీర్ఘకాలం సహిస్తుంది, దయచూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా మాట్లాడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు,4-8 వచనాలు చదవండి.  మరి ఇన్ని గొప్ప మంచి లక్షణాలు ప్రేమలో ఉన్నప్పుడు, ఆ ప్రేమను సంఘమంతా కలిగి ఉంటే, సంఘములో ఎంత శాంతి సమాధానాలు ఉంటాయో కదా!! దేవుని ఆశీర్వాదం, దేవుని సన్నిధి అక్కడ నివాసం చేస్తుంది! అందుకే ప్రేమయందు అతుకబడాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు.

    మరి నేటిరోజుల్లో మన సంఘాలు ఎలా ఉన్నాయి? ఎక్కడా ప్రేమ కానరావడం లేదు! అధికారం కోసం పోటీలు, ఒకరిమధ్య ఒకరికి ఈర్ష్యలు, అమర్యాద! ఇవన్నీ ప్రేమలేకపోవడం బట్టి, సాతానుగాడి లక్షణాలు వచ్చేశాయి సంఘంలో! దేవుడు ప్రేమయై ఉన్నాడు అని వ్రాయబడింది. ఇప్పుడు ప్రేమలేక సంఘంలో సాతానుగాడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి వీటిని విసర్జించి, ప్రేమ లక్షణాలు సంఘము కలిగి ఉండాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు. కాబట్టి ప్రియ సంఘపెద్దా! విశ్వాసి! సేవకుడా! ఒకవేళ నీకు సాతానుగాడి లక్షణాలుంటే ఇప్పుడే దేవుని యెద్ద క్షమాపణ అడిగి, పశ్చాత్తాపపడి నీ పాపాలు కడిగివేసుకో! నీకు కలిగిన అధికారం అది దేవుని వలన కలిగింది కాబట్టి, ఆ అధికారం దైవరాజ్య వ్యాప్తికోసం, సంఘ క్షేమాభివృద్ది కోసం, సంఘ శ్రేయస్సు కోసం  ఉపయోగించాలే తప్ప, నీ పేరు ప్రతిష్టల కోసం ఎంతమాత్రము కాదని గ్రహించు! కాబట్టి ప్రేమ కలిగి సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధికోసం పాటుపడు!

వారు ఏ కులస్తులైనా, వారి ఆర్ధిక స్తితి ఎటువంటిదైనా సరే, అందరితోనూ ఒకే రకంగా వ్యవహరించు!

అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు!

 

చదువుతున్న ప్రతీ ఒక్కరూ, అట్టి ప్రేమయందు అతుకబడియుందురు గాక!

ఆమెన్!

*మాదికరమైన పౌలుగారి ప్రార్ధన*

(14వ భాగం)

  కొలస్సీయులకు 2: 2

నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

 

   ప్రియులారా! పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశములు:

1. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై,

2. దేవుని మర్మమైయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోన్నవారై,

3. తమ హృదయములలో ఆదరణ పొందవలెనని. . .

 

1). సంపూర్ణగ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. . .:  ఇక్కడ పౌలుగారు సంపూర్ణగ్రహింపు అంటున్నారు. అనగా కొద్దికొద్దిగా కాకుండా సంపూర్తిగా దేవుని జ్ఞానమును కొలస్సీయులు తెలుసుకోవాలని పౌలుగారి ఆకాంక్ష! ప్రార్ధన!

 

   ఇక్కడ మీకో విషయం గుర్తుచేయాలని అనుకొంటున్నాను. ఈ వచనంలో పౌలుగారు 1. సంపూర్ణ గ్రహింపు, 2. సకలైశ్వర్యము, 3. దేవునిమర్మము, 4. స్పష్టముగా తెలుసుకోన్నవారై, 5. ఆదరణ పొందాలి . .  ఈమాటలు అనడానికి కారణం, మొదటిభాగాలలో వివరించినట్లు కొలస్సీ ప్రాంతంలో ప్రబలిన అబద్దభోధలు, తప్పుడు భోధకుల వలన కొలస్సీ సంఘ విశ్వాసులు పూర్తిగా కన్ఫ్యూజన్ లో / అయోమయంలో ఉన్నారు. ఒకడు యేసు దేవుడు కాదు అంటాడు. మరొకడు- దేవుడేగాని, ఆయనతో పాటు లోకనాధులను, ఆత్మలను పూజించాలి, గ్రహాల అనుగ్రహాల కోసం వాటిని పూజించాలి అంటాడు. మరికొందరు ఈ జ్ఞానం చాలదు, పరమాత్ముని ధర్శించాలంటే వేదాంతము, తత్వజ్ఞానము కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రతీ ఒక్కరూ పొందుకోవాలి లేకపోతే మోక్షం లేదు అంటాడు. మరొకడు మీ యేసయ్యను పూజించు, గాని మీ పాత ఆచారాలు పాటించినా ఏమీకాదు అంటాడు. ఇంకొకడు నీవు చేసే పాపాలు శరీరానికే తప్ప ఆత్మకు అంటవు, కాబట్టి చిన్న చిన్న పాపాలు, వ్యభిచారంచేసినా తప్పులేదు అంటూ ఇలాగు ప్రజలను కలవరపెడుతున్నారు! వాటికి విరుగుడుగా పౌలుగారు ఈ పత్రికను రాసినట్లు చెప్పుకున్నాం! అందుకే జవాబుగా పౌలుగారు పై మాటలను వాడారు!

 

  మొదటగా నీవు యేసుక్రీస్తు ఎవరు? ఆయనలో గల దైవత్వం ఏమిటి? నిజదేవుడు ఎవరు? ఇలాంటివి సంపూర్తిగా గ్రహించాలి. అయితే వీటిని మానవుడు తనకుతానుగా గ్రహించలేడు. కారణం 2 కొరింథీ 4:4-6 ప్రకారం : దానిని గ్రహించకుండా ఈ యుగ సంభంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగజేసింది. ఎందుకంటే దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమయొక్క వెలుగును/ తేజస్సును వారిమీద ప్రకాశించకుండా, వాడు అడ్డుకొంటున్నాడు, అందుకే వారికి గుడ్డితనం కలుగజేశాడు! గాని ఈ వెలుగును అందరికి చూపించండి, భోదించండి, ప్రకాశింపనియ్యుడి అని యేసయ్య చెబుతున్నారు. మత్తయి 5:16;  వారుకూడా ఈ వెలుగును పొందుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మనం వారికి ప్రకటించకుండా ఈ వెలుగు వారి మీదకు రాదు! అందుకే సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు యేసయ్య! మార్కు 16:15; కాబట్టి ఇప్పుడు చెప్పడం మనవంతు. అయితే దానిని వారు గ్రహిస్తున్నారా లేదా అనేది మనవంతు కాదు. కారణం దేవుడు వారికి యేసు- ప్రభువు అని వెల్లడి చేస్తేనే గాని ఎవరూ ఆయన దేవుడు అని తెలుసుకోలేరు మత్తయి 11:27, 16:17 ప్రకారం. .

 

    కాబట్టి ఈలోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యం, ఆస్తులు కలిసినా, దేవుడు- క్రీస్తుని గురించిన జ్ఞానముకు సాటిరావు! అందుకే ఈ విషయాన్ని సంపూర్తిగా గ్రహించిన పౌలుగారు ఫిలిప్పీ 3:7-11 ప్రకారం : ఏవైతే నాకు లాభకరంగా ఉన్నాయో, వాటిని క్రీస్తు కొరకు నష్టముగా, పెంటగా ఎంచుకున్నాను అంటున్నారు. అదీ సకలైశ్వర్యం! అదే ఐశ్వర్యాన్ని అందరూ పొందుకోవాలని పౌలుగారి ప్రార్ధన, ఆకాంక్ష!

 

2) దేవుని మర్మమైయున్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకోవాలి: మీద చెప్పిన విధముగా క్రీస్తుని గురుంచిన జ్ఞానము, యేసయ్య ఎవరో, ఆయన దైవత్వమేమిటో స్పష్టముగా ఈ కొలస్సీయులు గ్రహించాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు. దేవుని మర్మమైయున్న క్రీస్తు అంటున్నారు. ఈ మర్మము కోసం గతభాగాలలో వివరంగా చూసుకున్నాం! దేవుని మర్మమే క్రీస్తు! ఆయన దైవత్వం, ఆయన శక్తి, ఆయన సృష్టిని చేసిన విధానం, ఆయన చేసిన రక్షణ కార్యం, పాపవిమోచన చేసిన విధానము, ఆయన రక్షణ భాగ్యాన్ని సంపూర్తిగా, స్పష్టముగా గ్రహించాలి అంటున్నారు.

 

3) తమ హృదయములలో ఆదరణ పొందాలి. కారణం తప్పుడుభోదలు వలన, తప్పుడుభోధకులు వారిని కలవరపెట్టారు, కాబట్టి నిజాన్ని స్పష్టముగా తెలుసుకొని, అనుమానాలన్నీ పారద్రోలి, వారు పొందుకున్న రక్షణభాగ్యము, విన్న రక్షణ సువార్త సరియైనదని, వారిలో ఉన్న క్రీస్తు యేసు నందు విశ్వాసం సరియైనదే అని వారు స్పష్టముగా గ్రహించి, వారు సరియైన దారిలోనే ఉన్నారని ఆదరణ పొందుకోవాలని పౌలుగారు ప్రార్ధిస్తున్నారు!

 

   నేడు ఈ భాగాన్ని చదువుతున్న ప్రియ చదువరీ! నీవుకూడా నీవు పొందుకున్న రక్షణభాగ్యం యొక్క విలువను గుర్తించు! యేసయ్య యొక్క దైవత్వాన్ని స్పష్టముగా తెలుసుకొని ఆధరణ పొందుకో!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(15వ భాగం)

రోమీయులకు 1:8,9,10

8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

9. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,

10. మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.

 

      ప్రియ దైవజనమా! గతంలో కొలస్సీపత్రిక ధ్యానం చేసేటప్పుడు వివరించడం జరిగింది

1)పౌలుగారు ఎవరికి ఉత్తరం రాసిన వారికోసం ప్రార్థన చేస్తుంటారు. అంతేకాకుండా దేనికోసం ప్రార్థన చేస్తున్నారో చెబుతారు.

ఎఫెసీయుల కోసం ప్రార్థన చేశారు. 1:16; 3:16;

 ఫిలిప్పీయుల కోసం ప్రార్థన చేశారు 1:4,9; కొలస్సీ 1:3; 9; 2:1;

థెస్సలోనికయ వారికోసం చేశారు 1 థెస్సలోనికయ 1:2; 3:10; 5:23; 2 తిమోతి 1:3; ఇలా అందరికోసం అత్యాశక్తితో, పట్టుదలతో, కన్నీటితో ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు!

 

2) ఇంతకీ దేనికోసం చేసేవారు ప్రార్థన? మనలా Material Blessings కోసం, భూలోక సంభంధమైన వాటికోసం ఎప్పుడూ ప్రార్ధన చేయలేదు గాని ఆత్మ సంభంధమైన విషయాలు కోసమే ప్రార్థన చేసేవారు! ఆత్మలో బలపడాలని, ఆత్మపూర్ణులుగా ఉండాలని, సకల ప్రేమ, విశ్వాసం, ఓర్పు లాంటి ఆత్మఫలముతో దీవించబడాలని ప్రార్థన చేసేవారు.

 

   సరే, ఇప్పుడు ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నారో ధ్యానం చేసుకుందాం. *ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు*, . . .

  చూశారా ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నారో! ఏవిధమైన ఆటంకాలు లేకుండా రోమా పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది ఆయన ఆశ! దీనికోసం మొదటి భాగంలో చూసుకున్నాం!

 

 రోమా 15:25--28 ప్రకారం కొన్ని సంఘాల వారు యేరూషలేములో ఉన్న పరిశుద్ధులకు కానుక/ చందా వసూలు చేసి, పౌలుగారికి ఇస్తారు. దానిని యేరూషలేములో అప్పగించి, స్పెయిను దేశానికి నాలుగవ మిషనరీ ప్రయాణంగా వెళ్దామని పౌలుగారి ఆకాంక్ష. ఆ యాత్ర మార్గమధ్యంలో రోమా పట్టణం మీదుగా వెళ్తుంది కావున రోమా పట్టణం లో సువార్త ప్రకటించాలి అనుకున్నారు పౌలుగారు. ఆ యాత్రకు ముందుగా తననుతాను పరిచయం చేసుకుంటూ వ్రాసిన పత్రిక ఇది. ఇదే విషయాన్ని రోమా 15 లో చాలా వివరంగా రాశారు. Romans(రోమీయులకు) 15:19,20,21,22,23,24,25,26

19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.

20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచార మెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు,

21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.

22. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.

23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరముల నుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,

24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి.

   ఇదీ ఆయన ఉద్దేశం. అందుకే ముందుగా ఉత్తరం రాసి పంపుతున్నారు. ఉత్తరం రాయడమే కాకుండా పట్టుదలతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు.

 

      ప్రియ సేవకుడా! విశ్వాసి! మీ సేవలో ఆటంకాలు వస్తున్నాయి కదా! అది సర్వసాధారణం! అది సాతాను చేసేది. అయితే వాటిని జయించాలి అంటే పౌలుగారు ప్రార్థన చేసినట్లు ఆటంకాలు పోవాలని నీవుకూడా కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేయ్! ఆటంకాలన్నీ మబ్బు తొలగిపోయినట్లు వీడిపోతాయి!

 

   ఇక ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే- రోమా సంఘం పౌలుగారు స్థాపించిన సంఘం కాదు. ఎవరో స్థాపించారు. అయినా వారికోసం, వారు బలపడాలని కొన్ని వందల కి.మీ.ల దూరంలో ఉండి కూడా వారికోసం, అక్కడ సేవకోసం ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు పౌలుగారు. ఎలా చేస్తున్నారు?  ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, . .మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.  చూశారా ఎలాంటి ప్రార్ధనో, ఎలాంటి ఆసక్తో కదా!

 ప్రియ సేవకా! విశ్వాసి! నీ/ మీ సేవకోసమే కాకుండా ఇతర సంఘాల వారికోసం ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం లో సంపూర్ణసత్యం ప్రకటిస్తూ ఉండవచ్చు గాని ఇతర సంఘాలలో నామకార్ధ జీవితం గలవారు ఉన్నారు. వారి రక్షణ కోసం, మారుమనస్సు కోసం, వారు సత్యాన్ని గ్రహించి, వాక్యానుసారమైన జీవితం జీవించాలని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? పౌలుగారు చేస్తున్నారు. మాదిరిగా జీవించారు. ప్రియ సేవకుడా! నీవుకూడా అదే మాదిరి కలిగి ఉండమని యేసుక్రీస్తు నామంలో బ్రతిమిలాడుతున్నాను. ప్రియ దైవజనమా! కనీసం మీ సంఘం వారికోసం, నామకార్ధ బ్రతుకులు మార్పుకోసం ఈదినము నుండైనా ప్రార్ధించడం మొదలుపెట్టు!

అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(16వ భాగం)

రోమీయులకు 1:11,12

11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని

12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.

 

     ప్రియులారా! ఈ వచనంలో పౌలుగారి ప్రార్థన ఇంకా స్పష్టంగా అర్ధమవుతుంది మనకు. పౌలుగారు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు?! వారు స్థిరపడాలని. దేనిలో స్థిరపడాలి? విశ్వాసంలో! దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము గాని సందర్భోచితంగా మరోసారి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం.

 

ఇదే విషయాన్ని కొలస్సీ పత్రిక లో విస్తారంగా రాశారు పౌలుగారు.

కొలస్సీయులకు 1: 23

పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

 

  ప్రియులారా! ఈవచనంలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి.

1). పునాదిమీద కట్టబడిన వారు;

2) స్థిరముగా ఉండాలి(విశ్వాసంలో)

3) విన్న సువార్తవలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు!

పై విషయాలు కోసం క్లుప్తంగా ధ్యానం చేసుకందాం!

 

1). పునాదిమీద కట్టబడిన వారై:  ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే: ఒక ఇల్లు కట్టాలంటే దానికి మొదటగా పునాదివేయాలి!  పునాది ఎంత బలంగా కట్టాలో ఆ ఇంటిని బట్టి ఆధారపడుతుంది. ఎంత పెద్ద ఇల్లు అయితే అంత పెద్ద, బలమైన, లోతైన పునాది వేయాల్సిఉంటుంది. అంతేకాకుండా, ఆ పునాది దేనిమీద లేదా ఎక్కడ వేయబడింది అనేది కూడా అవుసరమే! అందుకే పెద్దబిల్దింగ్ కట్టేటప్పుడు soil టెస్ట్ చేస్తుంటారు.

 

  ఇక్కడ పునాది అనేది సుస్థిరత, భద్రత, ధృఢత్వమునకు సూచనగా ఉంది. అలాగే క్రీస్తుయేసునందు మన విశ్వాసము కూడా ఓలిపోకుండా, సోలిపోకుండా సుస్థిరంగా, ధృడంగా ఉండాలి! ఎన్ని ఆటుపోటులు, ఎన్ని కష్టసుఖాలు, కలిమిలేములు వచ్చినా మన విశ్వాసమును కోల్పోకుండా దృడంగా ఉండాలని పౌలుగారి కోరిక! ఇదే పరిశుద్దాత్ముని కోరిక!

పౌలుగారు తను చనిపోయే ముందు, తిమోతికి లేఖ రాస్తూ గొప్ప అమోఘమైన మాట (remarkable statement) అంటున్నారు: మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని! ఇక నాకు నీతికిరీటము ఉంచబడినది! 2 తిమోతి 4:7-8; చూశారా ఆయన విశ్వాసం! దేనియందు సంతోషిస్తున్నారు? తన విశ్వాసాన్ని కాపాడుకొన్నందుకే ఆయన సంతోషం, ధైర్యం! కారణం ఆయనకోసం నీతికిరీటం, మహిమకిరీటం- తేజోవాసుల స్వాస్థ్యము అన్నీ ఎదురుచూస్తున్నాయి. ఆ విశ్వాసం నీకుందా?!!!

 

     నిజమైన విశ్వాసం విశ్వాసులను సుస్థిరంగా, ధృడంగా చేస్తుంది.1కోరింథీయులకు 3: 11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

 ఈ పునాది క్రీస్తే!! మరి నీ పునాది విశ్వాసం దేనిమీద?! క్రీస్తుమీదనా? లోకాశల మీదనా? కేవలం material blessings కోసమా? అన్నింటికన్నా మిన్నగా పొందబోయే తేజోవాసుల స్వాస్థ్యము మీదనా? ఇంకా ఎఫెసీయులకు 2: 20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 ఈ మూలరాయి క్రీస్తు! ఇంతకుమునుపు పునాది క్రీస్తు అన్నారు. ఇప్పుడు మూలరాయి క్రీస్తే!  అయితే ఆ మూలరాయియైన క్రీస్తును ఆధారం చేసుకొని, అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. దానిమీద మీరు అనగా సంఘం కట్టబడి ఉన్నది! అనగా యేసయ్యనే ఆధారం చేసుకొని సంఘం ఉండాలి. లోకవిషయాలు గాని, సైన్సుగాని, మీ పాండిత్యం గాని, పిట్టకధలు గాని, మరేదైనా యేసయ్యను substitute చేయకూడదు! అన్నింటికీ యేసయ్యే ప్రధముడై ఉండాలి. ఇక ఆభోధ అపోస్తలుల భోదయై ఉండాలి! గతబాగాలలో అపోస్తలుల బోధకోసం మనము ధ్యానం చేసుకున్నాం!

 

అపోస్తలుల భోధ.

👉 అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)

🔺 *దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:16-35).

🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:22-24).

🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:31-36).

  *యేసే-మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).

🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:36).

🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

 

🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

🔺 *పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).

 

♻ *ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41)

 

   ఇంకా పునాదికోసం ధ్యానం చేస్తే, మన పునాది దేనిమీద వేయబడిందో మనం పరిశీలించుకోవాలి! మత్తయి సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయములో మనకు యేసుప్రభులవారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది. అక్కడ మనకు రెండు ఇల్లు కనిపిస్తాయి. ఒకటి ఇసుకమీద కట్టబడింది. దానికంత పునాది లేదు! మరో ఇల్లు బండమీద పునాదితీసి కట్టడం జరిగింది. ఈ రెండు ఇల్లుల మీద గాలి, తుఫాను, వరదలు కొట్టడం జరిగింది. అయితే ఇసుకమీద కట్టిన ఇల్లు, పునాది లేనందువల్ల వరదకు, గాలివానకు తిరుగబడిపోయింది. బండమీద కట్టబడిన ఇల్లు దాని పునాది సుస్థిరంగా, దృడంగా ఉన్నందువలన ఇంకా అది బండమీద కట్టబడినందువలన గాలి,తుఫాను, వరదలు ఏమీ చెయ్యలేకపోయాయి!! ఇక్కడ ఇల్లు నీ విశ్వాసము! గాలి, తుఫాను, వరదలు శ్రమలు, శోధనలు, కష్టాలు. నీ విశ్వాసం దేవునిపై దృడంగా ఉంటే, ఈశ్రమలు, శోధనలు ఏమీ చెయ్యలేవు నిన్ను!

నీవు కేవలం material blessings కోసమే వస్తే, నీ విశ్వాసపు ఇల్లు కూలిపోకతప్పదు!!!  అయితే నీ విశ్వాసం నిత్యజీవం కోసం, తేజోవాసులస్వాస్థ్యము కోసం అయితే, ఈలోక శోదనలు, శ్రమలు నిన్ను ఏమీ చెయ్యలేవు.

1తిమోతీ 6:18 ప్రకారం ఈ పునాది ఇప్పటికోసం కాదు, రాబోయేకాలంలో మనం పొందబోయే పరలోకం, తేజోవాసులస్వాస్థ్యము కోసం మన పునాది దృఢపరచుకొంటూ ఉండాలి. అనగా మన విశ్వాసం స్థిరంగా కాపాడుకొంటూ ఉండాలి! షడ్రక్, మేషాక్, అబెద్నెగోలవలే ఎన్ని కష్టాలు ఎదురైనా, చివరికి మరణమే ఎదురైనా విశ్వాసం లో స్థిరంగా నిలబడాలి. పౌలుగారివలే ఎన్ని శ్రమలైనా, హింసలైనా, చెరసాలయైనా తట్టుకోవాలి. అప్పుడే నీకు జీవ కిరీటం, నీతికిరీటం!  1తిమొతీ 2:19 ప్రకారం ఈ పునాదిమీద నిలబడాలి అంటే దుర్నీతినుండి తొలగిపోవాలి! దుర్నీతి, పాపముచేసే వాడు ఎవడూకూడా ఈ పునాదిమీద నిలబడి ఉండలేడు! ఇక 1కొరింథీ 3:12-15 వరకుఈ పునాదిమీద ఎవడైనా వెండి, బంగారం, కొయ్య, కర్ర . . లాంటి వస్తువులతో కడితే, ఆ కట్టబడింది అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షలో నిలబడి తట్టుకొని నిలిస్తే, కట్టినవానికి, తట్టుకొన్నవాడికి ఫలము కలుగుతుంది. ఇక్కడ బంగారం, వెండి .. లాంటి వస్తువులు అనగా మీ బోధ అపోస్తలుల బోధయై యుండాలి గాని మీ సొంతమాటలు, సైన్సు, పిట్టకధలు, వేదాంతము కాదు. అవి ప్రజలను ఆకర్షించవచ్చు గాని,వారిని పరలోకం చేర్చలేవు! మీ బోధలు వారిని కష్టాలు తట్టుకొని, ప్రభుకొరకు నిలబడేలా చేయాలి తప్ప ,ఎప్పుడూ material blessings కోసమో, ప్రభువును నమ్ముకొంటే మీకు కష్టాలు రానేరావు అనే తప్పుడుభోదలు కాకూడదు!! అలాంటి బోధలు విన్నవారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే విశ్వాస బ్రష్టులైపోతారు. అప్పుడు నీ పని ఇసుకమీద ఇల్లు కట్టినట్టే! నీవు కట్టిన వెండి, బంగారం లాంటి వస్తువులు శోధన అనే అగ్నిని తట్టుకోలేక , కరిగిపోతే, కనబడటం లేదు కాబట్టిసోమరివైన చెడ్డదాసుడా! అని పిలువబడతావు!

 కాబట్టి ప్రియ సేవకులారా! సంఘాన్ని అపోస్తలుల బోధపై కట్టండి.

విశ్వాసులారా! మీ విశ్వాసాన్ని కాపాడుకోండి పౌలుగారిలా!

అప్పుడే మీకోసం నీతికిరీటం రడీగా ఉంటుంది.

లేదా ఇసుకమీద కట్టిన ఇంటిలా మీ విశ్వాసం పేకమేడలా కూలిపోయి, రెంటికీ చెడ్డ రేగడి అయిపోతుంది.

 కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో!

 

దైవాశీస్సులు!

ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(17వ భాగం)

రోమీయులకు 1:11,12

11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని

12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.

 

      ప్రియ దైవజనమా! 12వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం కనబడుతుంది. పౌలుగారు రోమా పట్టణం ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? సువార్త ప్రకటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని గాని, తద్వారా ధనము సంపాదించుకోవాలని ఎంతమాత్రమూ కాదని ఈ వచనంలో అర్ధమవుతుంది.

 

 *ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను*

 

చూశారా ఆత్మ సంబంధమైన కృపావరమేదైనా మీకివ్వాలని ఉంది. అందుకే రావాలని కోరుకుంటున్నాను అంటున్నారు. ఎంత మంచి మనస్సో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇదే వచనాలు కొన్ని ప్రతులలో ఇలా వ్రాయబడింది:

*మీరు స్థిరపడేందుకు ఆధ్యాత్మిక కృపావరం ఏదైనా మీకు కలిగించడానికి మిమ్ములను చూడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను*.

 

ఆధ్యాత్మిక కృపావరం లేదా ఆత్మ సంబంధమైన కృపావరం ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నారు? వారు బలపడాలని, స్థిరపడాలని! అదీ ఆయన ఆశ!

 

     ఈ రోజుల్లో కొద్దిగా వాక్యం చెప్పడం, కొన్ని కృపావరాలు ఫలాలు ఉంటే, దైవ రాజ్య వ్యాప్తికి కాకుండా, వారి సామ్రాజ్యం, వారి ఆస్తులను, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం చూస్తున్నారు. మరికొందరు అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పించు కొంటూ, స్వఘనత కోసం ప్రాకులాడుతున్నారు తప్ప, దేవునికి రావలసిన ఘనతను అపహరిస్తున్నారు అని మరచిపోతున్నారు.

 

   ప్రియ దైవజనమా! ఈ విషయంలో మనకు పౌలుగారిని ఆదర్శంగా తీసుకోవాలి. కారణం ఈ వచనంలో నేను మీకొరకు ఆత్మ సంబంధమైన కృపావరం తీసుకుని రావాలి అనుకుంటున్నాను అంటున్నారు! కారణం ఆయన ఉద్దేశం చాలాసార్లు మిగతా పత్రికలలో చెప్పారు ఏమని? పిల్లలు తల్లిదండ్రులకు కాదుగాని తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి సంపాదించి ఇవ్వాలి.

2కోరింథీయులకు 12: 14

ఇదిగో, యీ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను(మూలభాషలో-వెదుకుచున్నాను) . పిల్లలు తలిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా!

 అందుకే సకలమైన కృపావరాలు ఆయన పొందుకుని, వాటిని ఎలా పొందుకోవాలో ఎలా అభ్యాసం చెయ్యాలో నేర్పిస్తూ, తద్వారా వారిని ఆధ్యాత్మికంగా ధనవంతులను చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయన సంఘం మీద వచ్చిన కానుకలను కూడా ఆశించకుండా, తనకోసం తనతోపాటు ఉన్నవారి ఆహారం ఖర్చుల కోసం ఆయన స్వయంగా తన చేతులతో తన వృత్తి అయిన డేరాలు కుట్టుకుంటూ, ప్రతీ సాయంత్రం, ప్రతీ విశ్రాంతి దినం నాడు బోధిస్తూ ఉండేవారు. దీనిని బైబిల్ ఋజువు చేస్తుంది.

 

అపొస్తలుల కార్యములు 20:33,34,35

33. ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;

34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

 ఇక్కడ నా ఉద్దేశం సంఘ కాపరి, సేవకుడు సంఘం మీద ఆధారపడి ఉండకూడదు, తన ఖర్చులకోసం కానుకలు తీసుకోకూడదు అని ఎంతమాత్రమూ కాదు. ఇదే పౌలుగారు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు అని చెబుతూ, కాపరి/ సేవకుడు సంఘం మీద బ్రతుకుతాడు అని చెప్పారు.

 

1కొరింథీయులకు 9:7,9,10,11,13,15

7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?

9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు(నూర్చెడి యెద్దు) మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా?

13. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో(బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారైయున్నారనియు మీరెరుగరా?

15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.

 

ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పౌలుగారు ఇలా చేస్తూ, సంఘం మీద ఆధారపడకుండా, మాదిరిగా ఉండి, ప్రతీ ఒక్కరు పనిచేయాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి ప్రియ సేవకుడా! కాపరీ! వర్తమానికుడా! నీవు ఎవరినైనా సరే, నీకు వస్తున్న రాబడితో కేవలం నీకోసం, నీ కుటుంబం కోసం, నీ ఆస్తుల కోసం మాత్రమే ఉపయోగించు కోకుండా సంఘం కోసం కూడా ఉపయోగించు! ఎంతో మంది విశ్వాసులు కటిక పేదరికంలో రెండు పూటలా తినకుండా పస్తులుంటున్నారు కదా మీ సంఘంలో! అలాంటి వారికి కనీసం ఒకపూట భోజనం పెట్టగలవు కదా! నీ తోటి కాపరి/ సేవకుడు పస్తులుంటూ, కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతుంటే నీకు చేతనైన సహాయం చేయలేవా? నీ సంఘ సభ్యులు అనేక మంది వైద్యానికి డబ్బులు లేక వ్యాధితో మంచం మీద బాధపడుతుంటే నీకు చేతనైన సహాయం చేయలేవా? పైవారికి చేయలేవు గాని నీ సంఘ సభ్యులకు, నీ రక్త సంబందులకు చేయగలవు కదా! మరి నీవు ఎందుకు చేయడం లేదు?! అలా చేయలేని వారికోసం యాకోబు గారు తన పత్రికలో రాశారు.

యాకోబు 2:15,16,17

15. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేకయున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. .

 

యోహాను గారు అంటున్నారు నీవు ఈలోకపు జీవనోపాధి కలిగి ఉండికూడా నీ సహోదరునికి సహాయం చేయలేకపోతే నీవు వ్యర్ధుడవు, ప్రేమలేనివాడివి,

1యోహాను 3:17

ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

1 యోహాను 4:20,21

20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు(ఎట్లు ప్రేమింప గలడు?)

21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.

 

కాబట్టి నేడే నీవు కాస్తున్న సంఘాన్ని ఆదుకో! వారి కానుకలతో నీవు ధనవంతుడవు కావడం కాకుండా సంఘాన్ని ఆధ్యాత్మికముగా ధనవంతులను చేయు! మాదిరిగా జీవించు! అవసరమైన వారికి నీవంతు సహాయం చేయు! సంఘం నుండి ఆశించడమే కాకుండా సంఘానికి ఇవ్వడం నేర్చుకో!

పౌలుగారు చేశారు. ఎన్నో సంఘాలు కట్టారు. ఏవిధమైన ఆస్తులు లేకుండా, తను మరచిపోయిన బట్టలను తీసుకుని రా అంటున్నారు తన శిష్యునితో! 2 తిమోతి 4:12,13; సంఘాన్ని కానుకలు అడిగి రోజుకో సూటు బూటు మార్చవచ్చు. గాని ఆయన అలా చేయలేదు. మాదిరిగా ఉన్నారు.

నీవుకూడా అలా మాదిరిగా జీవించి పౌలుగారిలా అనేక ఆత్మలను సంపాదించు!

 

అట్టి కృప, ధన్యత సేవకులకు, కాపరులకు, పరిచారకులకు, సంఘ పెద్దలకు దేవుడు దయచేయును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(18వ భాగం)

1థెస్స 3:12—13

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ఈ చివరి వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

 

     మొదటిది యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను ఈ అధ్యాయంలో ఎత్తిరాయడం, అనగా ఆయన తన పరిశుద్దులందరితో కలిసి తొందరలో రాబోతున్నారు, రెండవది: పౌలుగారి ప్రార్ధన!

 

             (గతభాగం తరువాయి)

 

  ఇక తర్వాత విషయం: పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదం! గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పౌలుగారి ప్రార్ధనలో భూలోక సంబంధమైన విషయాల కోసం ఆశీర్వాదాల కోసం ఎప్పుడు ఉండవు! ఆధ్యాత్మిక విషయాలకోసమే ఎప్పుడూ ప్రార్ధిస్తూ ఉంటారు! ఆ ప్రార్ధనలో కూడా ఎంతో గొప్ప రైమింగ్/ ప్రాస చాలా బాగుంటుంది! ఉదాహరణకు కొలస్సీ పత్రికలో పౌలుగారి మహత్తర మైన ప్రార్ధన కనిపిస్తుంది మనకు.

 

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలుగారి మిగతా పత్రికలలో గల ప్రార్ధనలకు ఈ పత్రికలో గల ప్రార్ధనలకు చాలా తేడా ఉంటుంది! మిగతా సంఘాలకు వారు ఇంకా విశ్వాసంలో భక్తిలో ఎదగాలని ప్రార్ధన చేస్తే ఈ పత్రికలో రెండవ రాకడకు సంబంధించిన ప్రార్ధన కనిపిస్తుంది మనకు! కారణం గతంలో చెప్పిన విధంగా వారు అప్పటికే విశ్వాసంలో భక్తిలో స్థిరులై పరిపూర్ణతకు దగ్గరగా ఉంటూ కేవలం యేసుక్రీస్తుప్రభులవారి రాకడకొరకు ఆసక్తితో కనిపెడుతున్నారు కాబట్టి ఈ పత్రికలో కనబడిన ప్రార్ధన కూడా రాకడకు సంబంధించిన ప్రార్ధన లాంటి ఆశీర్వాదంగా మనం తలంచవచ్చు!

 

 చూడండి ప్రార్ధన!...

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై...

 

12వ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు పరిశుద్ధులతో వచ్చేటప్పుడు తండ్రియైన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయంలో అనింద్యముగా అయన స్థిరపరచాలి! ఇది మొదటిది!!!

ఇక 13వ వచనంలో మరో రకమైన ప్రార్ధన కనిపిస్తుంది

 

మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్దులందరితో వచ్చినప్పుడు తండ్రియైన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో  అనింద్యముగా ఉండాలి అని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నారు! ఇది బాగా అర్ధం కాలేదు కదా! పౌలుగారు వారి ఆధాత్మిక స్థాయిని అంచనా వేసాకనే ఈ మాట అంటున్నారు! ప్రభువైన యేసు తొందరగా రావాలని మీరు ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు కదా అప్పుడు మీ హృదయాలు దేవుని ఎదుట అనింద్యముగా అనగా నిందమోపలేనంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు పౌలుగారు! ఇది నిజంగా ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన స్టేజ్! ఎందుకు పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండాలని కోరుకుంటున్నారు?

 

జవాబు చాలా సింపుల్! *పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు* కాబట్టి! వీరు ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభులవారు ఎప్పుడొస్తారు... అంటూ అడుగుతుండే వారు.! ఇప్పుడు ఆయనను చూడాలంటే పరిశుద్ధత కావాలి!

 అందుకే మొదటగా పరిశుద్దత విషయంలో ఎవడు నిన్ను వేలెత్తి చూపడమే కాకుండా దేవుని ఎదుట కూడా మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండాలి! నిజం చెప్పాలి అంటే మన క్రియలు దేవుని యెదుట మురికి గుడ్డలా ఉంది అని బైబిల్ సెలవిస్తుంది! మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండలేడు అనికూడా చెబుతుంది బైబిల్!

 యోబు 15: 14

శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

Job(యోబు గ్రంథము) 25:4,6

 

4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

6. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

 

అయితే మరి దేవుని ఎదుట ఇప్పుడు ఒక మనిషి నిందారహితుడుగా అదికూడా పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఎలా ఉండగలడు? అబ్రాహాము గారిలాంటి వ్యక్తినే దేవుడు నా ఎదుట నిందారహితుడుగా ఉండమని హెచ్చరించారు దేవుడు! ఆది 17:1;  ఇది సాధ్యమా? అంటే అవును సాధ్యమే! సాధ్యం కాని విషయాలు దేవుడు ఎప్పుడు చెప్పరు! మానవునికి ఇది సాధ్యం కానేకాదు! అయితే ఒకవ్యక్తి క్రీస్తుయేసు రక్తంలో కడుగబడి పరిశుద్దాత్మతో నింపబడితే ఆత్మద్వారా నడిపించబడితే ఆత్మలో ముందుకు సాగిపోతే ఇది సాధ్యమే! ....

Galatians(గలతీయులకు) 5:16,18

16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.

 

కీర్తనలు 119: 11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

 

అనగా పౌలుగారు మీరు దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే వారు ఆత్మానుసారులై ఉండమని చెబుతున్నట్లు లెక్క! ఎందుకంటే ఆత్మానుసారులై ఉండండి అప్పుడు మీరు శరీరకార్యాలు చెయ్యలేరు అంటున్నారు పౌలుగారు!

ఇంకా వాక్యాన్ని మన హృదయం లో ఉంచుకుంటే, మన హృదయం నిండా వాక్యముతో నిండిపోతే నీవు పాపము చేయనే చేయవు!  అప్పుడు నీవు నిందారహితుడుగా ఉండగలవు!

 

  ఇదే విషయాన్ని పౌలుగారు 5:23 లో కూడా చెబుతున్నారు....1థెస్సలొనికయులకు 5: 23

సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. *మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు* కాపాడబడును గాక.

 

ఇంకా 1కొరింథీ 1:8 చూసుకుంటే

మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

 

ఎఫెసి 5:26—27

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

 

2పేతురు 3: 14

ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, *ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు* జాగ్రత్తపడుడి.

 

ఈరోజు పౌలుగారు మనకు కూడా చెబుతున్నారుమనం కూడా ప్రభువైన యేసు తన పరిశుద్దులందరితో పాటు వచ్చేటప్పుడు మన హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితముగా ఉండాలి! నీవు ఎవరిని మోసగించినా దేవుణ్ణి మోసగించడం నీ చేతకాదు! అలా మోసగిద్దాము అనుకున్నారు అననీయ సప్పీరలు! మందిరంలోనే పడి చచ్చారు! నీవుకూడా గొప్పోడివి కాదు! అలా ఘోరమైన తీర్పు పొందకముందే ఇప్పుడే మారుమనస్సు నొంది దేవునితో సమాధాన పడు! కారణం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు అంటున్నారు.

యిర్మియా 17: 9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

 

 ఏ వ్యాధి అంటే పాపరోగం! ఆ పాపరోగానికి మందు యేసు రక్తము!

 

  కాబట్టి ఆయన రక్తముతో కడగబడి ఆయనాత్మతో నింపబడదాము ఆత్మద్వారానే నడిపింపబడదాము! దేవునిఎదుట నిందారహితముగా ఉందాము!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

 

 

 

 

 

 

              *మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(19వ భాగం)

1థెస్స 3:12—13

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ఈ చివరి వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

 

     మొదటిది యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను ఈ అధ్యాయంలో ఎత్తిరాయడం, అనగా ఆయన తన పరిశుద్దులందరితో కలిసి తొందరలో రాబోతున్నారు, రెండవది: పౌలుగారి ప్రార్ధన!

 

             (గతభాగం తరువాయి)

 

  ఇక తర్వాత   పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదం ఏమిటంటే: మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును మొదటగా ఒకనిఎడల ఒకడును, రెండవది మనుష్యులందరి యెడలను ప్రేమలో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రేమలో వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక!  చూడండి ఎంతచక్కని ప్రార్ధన మరియు ఆశీర్వాదం!!

 

   పౌలుగారి ప్రార్ధనలలో గాని ఆయన రాతలలో గాని ఆయన ప్రసంగాలలో గాని ప్రేమను కలుపకుండా ఉండలేరు! నిజం చెప్పాలంటే పౌలు మహాశయునిలా యేసుక్రీస్తుప్రభులవారి ప్రేమతత్వాన్ని ఈ భూలోకంలో ఎవరూ అర్ధం చేసుకోలేదు అని నా అభిప్రాయం! ఆయనతో పాటుగా తిరిగినా అది అపోస్తలులకి కూడా ఈ ప్రేమతత్వం ఇలా పూర్తిగా అర్ధం కాలేదేమో అని నా ఉద్దేశ్యం! ఇక పౌలుగారి తర్వాత ప్రేమతత్వం కోసం ఎక్కువగా రాసింది అర్ధం చేసుకున్నది దైవజనుడైన అపోస్తలుడైన యోహాను గారు మాత్రమే! యోహాను గారు ప్రేమకోసం రాస్తూ రాస్తూ ఇంకా ఆత్మావేశుడై ఏమి చెప్పాలో అర్ధం కాక ఒకేఒక్క మాటలో తేల్చాల్సివచ్చింది ఆయనకు! దేవుడు ప్రేమయై ఉన్నాడు! దేవుడే ప్రేమ, ఆగాపే ప్రేమే దేవుడు!

1యోహాను 4: 8

దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

 

   సరే ఇప్పుడు పౌలుగారి ప్రార్ధన కోసం చూసుకుందాము! మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యెడల ఒకడును , రెండవది మనుష్యులందరి యెడలను అభివృద్ధి పొందాలి వర్ధిల్లాలి!

 

ఒకసారి ఆగుదాం! పౌలుగారు వీరిని ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లమని ప్రార్ధిస్తూ ఆశీర్వాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? వీరిమధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా? వీరు ఆత్మీయంగా పరిపక్వ స్థితిలో ఉన్నారని చెప్పారు కదా అని అనొచ్చు మీరు! అయితే వీరిమధ్య ఏవిధమైన తగాదాలు లేనేలేవు! మరి ఎందుకు అలా రాశారు అంటే రెండు కారణాలు ఉండి ఉండవచ్చు!

 

మొదటగా: 4:9 ప్రకారం: సహోదర ప్రేమ కోసం మీకు రాయడం అవసరం లేదు ఎందుకంటే మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పబడితిరి అనగా బహుశా వీరు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారని మొదటి భాగాలలో చూసుకున్నాము మనం! కాబట్టి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరికి సహోదరులను ఎలా ప్రేమించాలో ఆయనే నేర్పించాడు వీరికి! ఆవిధంగా వీరు ఎంతో ప్రేమను కనపరిచారు కాబట్టి ఇంకా ప్రేమలో నిలిచి ఉండటమే కాకుండా అభివృద్ధి చెందమని, అభివృద్ధి చెందటమే కాకుండా వర్ధిల్లమని పౌలుగార్రి ప్రార్ధన మరియు ఆశీర్వాదం! వర్ధిల్లడం అనగా మానవ రీతిలో చెప్పాలంటే ఒకరు ఒక ఇల్లు కట్టుకుంటే- అది దేవుని ఆశీర్వాదంగా చెప్పుకోవచ్చు! అదే వ్యక్తి అలాంటి ఇల్లు మరో పది కట్టి ఎన్నో రంగాలలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందటాన్ని వర్ధిల్లడం అంటారు! మరి ప్రేమలో వర్ధిల్లడం అనగా ఆత్మీయంగా అవతలి వ్యక్తి మనలను ప్రేమించినా లేకపోయినా నీవు మాత్రం ప్రేమిస్తూ అవతలి వ్యక్తి నిన్ను కసురుకున్నా ప్రేమలో సాగిపోతూ అవతల వ్యక్తిని ద్వేషించకుండా నీ ప్రవర్తనతో అవతలి వ్యక్తిలో మార్పు తేవడం ప్రేమలో వర్ధిల్లడం అని నా భావం! అంతేకాకుండా ప్రేమగల వ్యక్తికి ఉదాహరణగా నిన్ను చెప్పుకోవడమే ప్రేమలో వర్ధిల్లడం!

 

   ఇప్పుడు పౌలుగారు వీరిని కూడా అలాగే ప్రేమలో అభివృద్ధి పొందడమే కాకుండా ప్రేమలో వర్ధిల్లమని వీరికోసం ప్రార్ధన చేస్తూ ఆశీర్వదిస్తున్నారు!  ప్రియమైన సంఘమా! నీవు నేను కూడా ఇదేవిధంగా ప్రేమలో నడవడమే కాకుండా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు!

 

   ఇక రెండవ కారణం ఏమై ఉండవచ్చు అనగా: మొదటి భాగాలలో చెప్పిన విధముగా పౌలుగారు యేసుక్రీస్తుప్రభులవారు అతి తొందరలో మరలా రెండో రాకడలో రాబోతున్నారు అని చెప్పారు కాబట్టి ఈ మాసిదోనియా ఎఫెసి ప్రాంతాల వారికి ఎల్లప్పుడూ పనిచేయకుండా ఏదైనా క్రొత్త విషయాలు తెలుసుకోవడంలోనే ఆసక్తి తప్ప పనిపాటులు మీద శ్రద్ధ ఉండేది కాదు! అయితే పౌలుగారు తాను అక్కడ సువార్త ప్రకటించినప్పుడు రాకడ వచ్చేవరకు మీ సొంతకార్యములను జరుపుకొంటూ మీ చేతులతో పనిచేసి డబ్బులు సంపాదించుకుని వాటితోనే భోజనం చెయ్యమని ఖండితముగా చెప్పారు! దీనిని అందరు పాటించడం జరిగింది! అయితే పౌలుగారు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది బేచ్ తయారయ్యారు! యేసుప్రభువు తొందరలో వచ్చేస్తున్నప్పుడు ఈ పనిపాటులు కష్టపడటం ఎందుకు? నిరంతరం ఆయన ప్రార్ధనా విజ్ఞాపనలలో వాక్య ధ్యానంలో ఉంటే చాలు, అని బోధించడమే కాకుండా అనేకులను పనిచెయ్యకుండా మానిపించేసారు. సంఘపెద్దలు అలాకాదు పౌలుగారు చెప్పినట్లు చెయ్యండి అంటే బహుశా వీరు కొద్దిగా వీరిమీద అలిగారు! దీనిని 4:12 లోను. 2థెస్స 2 లోను దీనికోసం వ్రాశారు! కాబట్టి ఈ రకంగా ఫీల్ అయినవారు కొద్దిమంది ఉన్నారు కాబట్టి అలాంటివి మీ మధ్యలో పెట్టుకోవద్దు! ప్రేమలో ఒకనికొకడు వర్దిల్లడమే కాకుండా ప్రజలందరి యెడల కూడా ప్రేమతో వ్యవహించమని చెబుతున్నారు పౌలుగారు

 

  సరే ఇంకా పౌలుగారు ప్రేమ కోసం ఏమి చెప్పారో చూసుకుందాం

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:9,10

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు,

 

2థెస్సలొనికయులకు 1: 3

సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

 

యోహాను 13: 34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

రోమా 12:9—10

9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:1,2,3,4,5,6,7,8,13

 

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్ని టికి తాళుకొనును (లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

 

1 John(మొదటి యోహాను) 2:5,9,10,11

5.  ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.

10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.

11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.

 

 1 John(మొదటి యోహాను) 3:10,11,14,15,16,17,18,19

 

10. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా

14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమలేని వాడు మరణమందు నిలిచియున్నాడు.

15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

16. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

17. ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

18. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

19. ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.

 

   కాబట్టి ఈ భక్తులు చెప్పిన ప్రేమ మార్గంలో నడుస్తూ ప్రేమలో అభివృద్ధి పొందుచూ ప్రేమలో వర్దిల్లుదాము! ఈ ప్రేమ లేకనే కయీను హేబెలును చంపాడు! యాకోబు గారి కుమారులు తమ్ముడైన యోసేపును కొట్టడమే కాకుండా గోతిలో త్రోయడమే కాకుండా తమ్మున్ని ఒక బానిసగా అమ్మేశారు!

అదే ప్రేమగల యోసేపు ఇన్ని చేసినా క్షమించి వారిని పోషించారు! ఇదీ దేవుని ప్రేమ! సహోదర ప్రేమ! అందుకే అంత గొప్ప భక్తుడయ్యారు యోసేపు గారు! అందుకే ఆయనకు అ పేరు పెట్టారు దేవుడు- ఫలించెడి కొమ్మ! నీవుకూడా అలా ప్రేమలో ఫలించే కొమ్మలా ఉంటావా?

 

ఆమెన్!

 

దైవాశీస్సులు! 

 

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(20వ భాగం)

2 థెస్స 1:11—12

11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.   

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము రెండవ పత్రికనుండి థెస్సలోనికయ సంఘానికి పౌలుగారి ఆదరణ మరియు ప్రోత్సాహకపు మాటలు  ధ్యానము చేసుకున్నాము! ఇక ఈ అధ్యాయం చివరలో పౌలు గారి ప్రార్ధన కనిపిస్తుంది! దానిని ధ్యానం చేసుకుందాము!

 

పౌలుగారు ప్రతీ పత్రికలోను ప్రత్యేకమైన ప్రార్ధనలు చేశారు. అవి ఈ భూలోక సంబంధమైన విషయాలు కోసం కాదు గాని ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కోసం ప్రార్ధన చేసినట్లు అనేకసార్లు ధ్యానం చేసుకున్నాము! ఇక ఈ పత్రికలో పౌలుగారు దేనికోసం ప్రార్ధన చేశారో ఈ థెస్సలోనికయ సంఘం కోసం ధ్యానం చేసుకుందాము!

 

 పదకొండవ వచనం: అందువలన మన దేవునియొక్కయు  ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసునామనును , ఆయన యందు మీరును మహిమ పొందునట్లు......

ఇక్కడ చూశారా ఈ వచనంలో ఆయన ప్రార్ధన:

మొదటగా: దేవుని కృప చొప్పున ప్రభువైన క్రీస్తుకృప చొప్పున మీ యందు అనగా మనయందు లేక థెస్సలోనికయ సంఘంలో ప్రభువైన యేసునామము మహిమ పరచబడాలి;

రెండవది: ఆయన యందు మీరు కూడా మహిమ పరచబడాలి అనేది ఆయన మొదటి ప్రార్ధన ఈ అధ్యాయంలో!

ఈ లోక సంబంధమైన ఏదో విషయంలో మీకు మంచిపేరు గొప్ప కలగాలని కోరుకోవడం లేదు గాని మీ బ్రతుకుల ద్వారా మనయందు దేవుని నామము మహిమ పరచబడాలి అనేది పౌలుగారి ప్రార్ధన!

ఇక రెండవది ఆయనద్వారా మనము కూడా మహిమపొందాలి అనేది పౌలుగారి ప్రార్ధన!

 

  ఒక్కసారి ఆలోచిద్దాము! *మనయందు లేక మనద్వారా ఏరకంగా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది?*

గతభాగంలో చెప్పుకున్నాము-- ?

*ఎప్పుడు ఆయన నామం మనవలన ప్రశంసించబడుతుంది లేక మహిమ పరచబడుతుంది  అంటే మన బ్రతుకులు బాగున్నపుడు ! మనం క్రీస్తుకోసం సాక్షులుగా జీవించినప్పుడు! ఇతరులు మనలో యేసుక్రీస్తుప్రభులవారిని గుర్తించినప్పుడు! ఎప్పుడు మనలో ఆయనను చూడగలరు? ఆయనలా జీవించినప్పుడు ఆయనలా మాట్లాడినప్పుడు! ఆయనలా క్రీస్తుప్రేమను పంచినప్పుడు! ఆయనలా క్షమించగలిగినప్పుడు!  ఆయనలా ఆత్మపూర్ణులుగా బ్రతుకుతూ శరీరక్రియలు విడిచి పరిశుద్ధంగా జీవించినప్పుడు- మన బ్రతుకే ఒక క్రీస్తు కరపత్రంగా మారిపోయి అనేకులను క్రీస్తువైపు నడుపగలదు!*

 

  మరి ఇది సాధ్యమా? అంటే సాధ్యమే! నోవాహు గారు అతి భయంకరమైన చెడ్డతరంలో జీవించినా గాని నోవాహు ఈ తరంలో నీవే నీతిమంతుడుగా కనబడ్డావు అని దేవునిచేతనే పిలువబడ్డారు అంటే అంట నీతిమంతుడుగా జీవించి ఆయన ద్వారా తన చిత్త ప్రకారం ఓడ కట్టుకుని జలప్రళయం ద్వారా తనకు మహిమను తెచ్చుకున్నారు దేవుడు! ఆయన ద్వారా అనగా  నోవాహు గారి ద్వారా దేవుడు మహిమ పరచబడ్డారు ఇక దేవుని ద్వారా నోవాహు గారికి ఘనత కలిగింది! అనగా ఇక్కడ నోవాహు గారి నీతి ఘనతను మహిమను తెచ్చిపెట్టింది!

 

యోసేపు గారు అవకాశం కలిగినా దేవునికి, కుటుంబానికి, తన ఘటముకు కళంకం కలుగుకుండా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయారు! తద్వారా అనేక సం.లు జైలులో చేయని నేరానికి శిక్ష భరించారు! చివరకు ఒకరోజు ఆ భక్తి, యధార్ధత ద్వారా మొదటగా దేవునికి మహిమ కలిగింది నిగూఢమైన కలలకు భావం చెప్పడం ద్వారా! ఇక దేవుని ద్వారా యోసేపు గారికి కూడా ఘనత కలిగింది! ఇక్కడ యోసేపు గారి పవిత్రమైన జీవితం మహిమను ఘనతను తెచ్చిపెట్టింది!

 

     అబ్రాహాము గారిని దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే నాకేమిటి అనే ప్రశ్నలు అడగకుండా సంపూర్ణ విధేయతతో పరిపూర్ణ విశ్వాసంతో అడ్రస్ తెలియని దేశానికి తరలిపోయారు! అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది! కుమారున్ని సంపాదించుకున్నారు! వాగ్ధానములకు వారసుడయ్యారు! విశ్వాసులకు తండ్రిగా దీవించారు దేవుడు! ఇక్కడ ఆయన విశ్వాసం మహిమను ఘనతను తెచ్చిపెట్టింది!

 

  మోషేగారిని నా బిడ్డలను దాస్యం నుండి విడిపించమంటే మొదటగా సాకులు చెప్పినా ఒకసారి మైదానంలో అడుగుపెట్టిన తర్వాత వెనుక తీయకుండా ఒకప్రక్క ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంతో తలపడి, మరోవైపు తనసొంత జనులే సూటిపోటు మాటలు అన్నా సహించి సహనము కల్గి ఉన్నారు! మోషేగారిని ఉపయోగించుకుని దేవుడు ఎర్రసముద్రాన్ని పాయలు చేశారు! బండనుండి నీళ్ళు రప్పించారు! పగలు మేఘ స్తంభము లోను రాత్రి అగ్ని స్తంభంలోను ఉంటూ తన ప్రజలను నడిపించారు! ఇక్కడ దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపించి అనేకమైన అసాధారమైన అద్భుతాలు జరిగేలా చేయగలిగారు!

 

   ఇక ఆయన శిష్యుడు యెహోషువా గారు గురువుగారి అడుగుజాడలలో నడుస్తూ సమయం దొరికితే దేవుని ప్రత్యక్ష గుడారంలో గడుపుతూ గురువు గారి పాదాల దగ్గర భక్తి, విధేయత, లోబడుట నేర్చుకుని దేవుని ద్వారా మరియు గురువుగారి ద్వారా అదే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా చేయబడి శత్రువులే లేని నాయకుడుగా పరిడవిల్లి 23 రాజులను నేలనాకించిన గొప్ప నాయకుడు కాగలిగారు! యోర్దాను నదిని పాయలు చేయగలిగారు! సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ఒక మనిషి సూర్యచంద్రులను శాసిస్తే ఒక్క దినమెల్లా ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి తొందరపడలేదు అట!

యెహోషువ 10: 12

యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.

యెహోషువ 10: 13

సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.

యెహోషువ 10: 14

యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.

 ఎంత ఆధిక్యత అండి అది! ఈ రకంగా దేవునికి మహిమ తెచ్చారు యెహోషువా గారు! అలాగే దేవునికి లోబడి పరిపూర్ణ విధేయత చూపించడం వలన యెహోషువ గారు మహిమను ఘనతను పొందుకున్నారు!

 

  ఇక అనేకమంది భక్తులు తమ జీవితాల ద్వారా దేవునికి లోబడుట ద్వారా దేవునికి మహిమను తెచ్చారు! దావీదుగారు ఆయన గురువుగారు సమూయేలు గారు దేవునికి ఎంత ఘనతను మహిమను తెచ్చారు మనకు తెలుసు! దానియేలు గారు షడ్రాక్ మేషాక్, అబెద్నేగో గార్లు తన ఘటమును కాపాడుకుంటూ అపవిత్రమైనవి తమకు అంటకుండా చూసుకుంటూ ఎంతటి ఆసాధారమైన అద్భుతాలు చేసి దేవునికి మహిమను తెచ్చిపెట్టారో మనకు తెలుసు! సింహాల్ల నోర్లు మూశారు! అగ్ని బలమును చల్లార్చారు! ఇంకా పాతనిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు తమ జీవితాలు దేవునికి సమర్పించుకుని దేవునికోసం నిలబడి అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా సిద్దపడ్డారు! తద్వారా దేవుని ఎంతటి మహిమను ఘనతను తెచ్చిపెట్టారో చూడగలము! అంతేకాకుండా ఆ భక్తులు దేవునికోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు కూడా వారికి మహిమను ఘనతను ఇచ్చారు!

 

   అదేవిధంగా ఇప్పుడు పౌలుగారు కూడా అంటున్నారు మీరు కూడా అదేవిధంగా ఆ భక్తుల వలె జీవిస్తూ మొదటగా మీయందు మన ప్రభువైన యేసునామము మహిమ పరచబడాలి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు మీరు కూడా మహిమ పరచబడాలి అంటున్నారు!

       గతభాగంలో ఆయనకు ఎలా మహిమ వస్తుందో కొన్ని రిఫరెన్సులు చూసుకున్నాము!

కీర్తనలు 21: 5

నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి యున్నావు.

 

కీర్తనలు 50: 23

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

 

కీర్తనలు 85: 9

మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

 

యోహాను 11:40 నమ్మితే దేవుని మహిమను చూస్తావు!

 

మనము బహుగా ఫలిస్తే ఆయన నామము మహిమ పరచబడుతుంది! యోహాను 15:8

 

యేసుక్రీస్తు ప్రభులవారు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి దేవుని మహిమ పరచారు! యోహాను 17:4

 

దేవునితో పాటు శ్రమలను అనుభవిస్తే ఆయన మహిమలో వారసులు అవుతాము రోమా 8:17

 

దేవునికి యోగ్యముగా పరిచర్య చేస్తే దేవుణ్ణి మహిమపరస్తున్నారు

2 కొరింథీ 9:13

 

కాబట్టి మన బ్రతుకుల యందు ఆయనకు మహిమను తెచ్చిపెడదాము!

ఆయనను మహిమ పరుద్ధాము!

ఆయనకు సాక్షులుగా సాగిపోదాము!

(ఇంకాఉంది)

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(21వ భాగం)

 

   2 థెస్స 1:11—12    

11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.   

 

         దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! మనము పౌలుగారి ప్రార్ధన కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

  ఇక పన్నెండో వచనంలో మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతీ కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుచున్నాను అంటున్నారు!

 

   ప్రియులారా! ఈ చివరి వచనంలో పౌలుగారు మూడు విషయాల కోసం ప్రార్ధన చేస్తున్నారు!

 

మొదటిది: మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతీ ఆలోచన సఫలం అవ్వాలని,

రెండవది: విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలని;

మూడవది: మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి!!!

 

మొదటిది: *మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతీ ఆలోచన సఫలం కావాలి!*

చూడండి ప్రియులారా! పౌలుగారు ఎలాంటి ప్రార్ధన చేస్తున్నారో! గమనించాలి! వీరికి అనగా ఈ సంఘానికి మేలు చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టే ఆ ఆలోచన సఫలం కావాలని పౌలుగారు నిండుమనస్సుతో దేవునికి వారి పక్ష్యంగా ప్రార్ధన చేస్తున్నారు! అసలు అలాంటి ఆలోచన వారికి లేకపోతే పౌలుగారు ఎలా ప్రార్ధన చెయ్యగలరు?

 ప్రియ సంఘమా! మీలో ఇతరులకు మేలుచేయాలనే కోరిక ఉందా? అవసరాలలో ఉన్నవారికి, దిక్కులేని వారికి, నిరాశ్రయులకు, విధవరాల్లకు మేలు చేయాలనే ఆశ-- జిజ్ఞాశ మీలో ఎవరికైనా ఉందా? ఈ సంఘమంతటికీ ఇలాంటి ఆశ ఉంది! అందుకే దీనిని చూసి వారి కాపరి పొంగిపోతూ దేవునికి ఇంకా పట్టుదలతో ప్రార్ధన చేస్తున్నారు!

మనము మొదటి పత్రిక నుండి చూసుకుంటే వీరు కేవలం వారికోసమే కాకుండా ఇతరులకోసం కూడా ప్రార్ధన చెయ్యడమే కాకుండా ఇతరులకు సహాయం చెయ్యడం మొదలుపెట్టారు! దానికోసం పౌలుగారు అంటున్నారు: అది మీరు మాదగ్గరనుండి నేర్చుకోలేదు గాని దేవుని నుండే మీరు నేర్చుకున్నారు అంటున్నారు....

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:9,10,11

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు,

11. సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,

 ఇంకా అది మీనుండి మాసిదోనియా అంటా మ్రోగింది అంటున్నారు....

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 1:7,8

7. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

8. అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.

 

ఇక తర్వాత పౌలుగారు మీరు ఒకనిఎడల ఒకడు ప్రేమ చూపిస్తూ అది విస్తరించాలి- లేక ప్రేమయందు విస్తరించాలి అని పత్రిక రాస్తే దానిని తు.. తప్పకుండా పాటించారు అంటున్నారు మీదన మూడో వచనంలో!....

1థెస్స 3:13

13.మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:3

3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

 

   కాబట్టి ఈ మంచి పనులు అన్నిటిలోనూ వీరు ఎంతో మాదిరిగా జీవిస్తున్నారు కాబట్టి వారు చేసే మంచి ఆలోచనలు లేక మేలు చేయవలెనని వారు చేసే ప్రతీ మంచి ఆలోచన సఫలం కావాలని దేవునికి ప్రత్యేకంగా ప్రార్ధన చేస్తున్నారు పౌలుగారు!

 

 ప్రియ సంఘమా! నీకు ఇలాంటి మంచి ఆలోచనలు, మేలు చేయాలనే తాపత్రయం ఉందా?  క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై! 2:20;

 కాబట్టి ఏదో పెదాలతో పప్పలు వండినట్లు కాకుండా మనసా వాచాః కర్మేనా ఆయన మాటలను అనుసరిస్తూ మేలు చేయడానికి ఇతరులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉందాము! లేకపోతె మ్రోగెడు కంచును గణగణలాడు తాళం అని మర్చిపోవద్దు!

 

రెండవది: *విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలని*;

చూశారా ఇక్కడ! విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము కూడా మీరు బలముతో సంపూర్ణంగా చెయ్యాలని ప్రార్ధన చేస్తున్నారు! లోక సంబంధమైన కార్యములు కాదు, విశ్వాస యుక్తమైన కార్యములు మీరు బలముతో అది పూర్తి అయ్యేవరకు చేస్తుండాలి అంటున్నారు!

 

అసలు అలాంటి ఉద్దేశాలు పుట్టించేది దేవుడే!

ఫిలిప్పీ 2:13

ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

 

ఎఫెసీ 2:10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

అయితే ఈ దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగేది స్తిరపరచేవాడు దేవుడు మాత్రమే!

 

అయితే  నేటి దినాలలో అనేకసంఘాలలో దేవునికి మహిమను తెచ్చే క్రియలు తగ్గిపోయి, తమకు పేరు తెచ్చే క్రియలు ప్రోగ్రాం లు చేస్తున్నారు! అవి సువార్త వ్యాప్తికి గాని అన్యులను రక్షించడానికి గాని పనిచేయవు! కేవలం వారి గొప్ప కోసం! అనగా పాష్టరేట్ కమిటీ గొప్పకోసం!

 

 ఉదాహరణకు: క్రిస్మస్ పండుగ సందర్భంగా  కొన్ని లక్షలు ఖర్చుపెట్టి చర్చికి లైటింగ్ లు పెడుతూ, డెకరేషన్ చేస్తున్నారు! దీనివలన దేవునికి మహిమ వస్తుందా? లేదు కదా! కేవలం ఆ సంఘం క్రిస్మస్ ఇంత గొప్పగా చేసుకున్నారు, లేదా అన్ని సంఘాలకంటే మనమే క్రిస్మస్ గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాము అని బుజాలు ఎగరేయడానికి! దాని బదులు దిక్కులేని వారికి, దీనులకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు పంచి క్రీస్తుప్రేమను పరిచయం చేస్తే ఒకరైనా రక్షించబడవచ్చు! ఇవన్నీ వేస్ట్ లేదా వ్యర్ధమైన ఖర్చులు! దేవుని డబ్బులు పనికిమాలని విషయాల కోసం ఖర్చు పెడుతున్నారు!

 

మరొకటి: క్రిస్మస్ సందర్బంగా సినిమా స్టైల్ లో డేన్స్లు, నాటికలు! మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తలులు వీరికి హెచ్చరిస్తే, (అపో.కార్యములు 2: 40

ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చిమీరు మూర్ఖులగు (మూలభాషలో-వంకరైన) ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.)

 అదే మూర్ఖులైన ఈ తరము వారిని రప్పించుకుని వారితో డేన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చెయ్యించుకుని అన్యులు కూడా వెయ్యలేనంత సినీ స్టెప్పులు, అన్యులు కూడా చేయలేనంత భయంకరమైన వస్త్రధారణ చేస్తూ దేవుని నామమునకు మహిమను తేకుండా దేవుని నామమునకు అవమానం తెస్తున్నారు! అందుకే కదా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు: మీ నిమిత్తమే కదా అన్యజనుల ఎదుట నా నామము అవమానం కలుగుతుంది.....

యెషయా 52: 5

నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

 

రోమీయులకు 2: 24

వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?

 

 కాబట్టి ప్రియ సంఘమా! ఇలాంటి పనికి మాలిన పనులు కాకుండా దేవునికి మహిమను తెచ్చే విశ్వాస యుక్తమైన కార్యములు తలపెట్టి వాటిని సంపూర్తి చెయ్యమని పౌలుగారు మనకు హితవు పలుకుతున్నారు! అక్కడ ఆ థెస్సలోనికయ సంఘముకోసం వారు చేసే విశ్వాస యుక్తమైన కార్యాలు బలముతో అవి సంపూర్ణం అయ్యేలాగ వారు చేసేలా  ఎంతో పెనుగులాడుతూ ప్రార్ధిస్తున్నారు పౌలుగారు!

 

కాబట్టి ప్రియ సంఘమా! పౌలుగారు కోరుకున్నట్లు, థెస్సలోనికయలు చేసినట్లు విశ్వాస యుక్తమైన కార్యాలు చేద్దాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్థన*

(22వ భాగం)

   2 థెస్స 1:11—12  

 11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.   

  

          ప్రియ దైవజనమా!   మనము పౌలుగారి ప్రార్ధన కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

  ఇక పన్నెండో వచనంలో మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతీ కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకోరకు ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుచున్నాను అంటున్నారు!

 

   ప్రియులారా! ఈ చివరి వచనంలో పౌలుగారు మూడు విషయాల కోసం ప్రార్ధన చేస్తున్నారు!

 

మొదటిది: మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతీ ఆలోచన సఫలం అవ్వాలని,

రెండవది: విశ్వాస యుక్తమైన ప్రతీకార్యము మీరు బలముతో సంపూర్ణంగా చేయాలని;

మూడవది: మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి!!!

 

     (గతభాగం తరువాయి)

 

     మూడవది: *మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి!*

మీరు యోగ్యులుగా జీవించాలి అనడం లేదు! మీరు చేసే పనులు వలన దేవుడే మిమ్మును యోగ్యులుగా ఎంచాలి అంటున్నారు! ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుడు తాను భూమిమీద నరులను చేసినందుకు ఎంతో సంతాపపడ్డారట! అంత భయంకరమైన పాపభూయిష్టమైన జీవితం వారు జీవించారు నోవాహు తాత గారి కాలంలో! (ఆది 6:5,6)

 

యెషయా ప్రవక్తగారి కాలంలో ఆకాశమా ఆలకించు! భూమి చెవియొగ్గు! నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను గాని వారు నామీద తిరగబడ్డారు అని బాధపడుతూ దూతలతో చెప్పుకుంటే పరువుపోతుంది అని తన బాధను ఎవరికీ చెప్పాలో అర్ధం కాక భూమికి ఆకాశమునకు చెప్పుకుంటున్నారు! అంత భయంకరమైన పాపభూయిష్టమైన స్తితిలో యెషయా గారి సమయంలో ప్రజలు ఉన్నారు! (1:2--4)

  ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటును దేవుడు తట్టుకోలేక ఒక్క నిమిషం నీవు ప్రక్కకు రా! వీరందరినీ మాడిమసి చేసేస్తాను అన్నారు మోషే గారితో దేవుడు! అందుకే మోషేగారు మోకరించి కన్నీటితో అయ్యా అలా చేయకు! అంటూ... బ్రతిమిలాడుకొని చివరకు అంటున్నారు మోషేగారు నీ నిర్ణయం కోసం సంతాపపడు అంటున్నారు! ఇంతగా దేవునికి చిరాకు తెప్పించారు! మాటిమాటికి దేవునికి కోపం తెప్పించేవారు ఇశ్రాయేలు ప్రజలు!

 

చివరకు వారు చెరలోనికి పోయే ముందు కేవలం ఇశ్రాయేలు ప్రజలే కాదు, వారి నాయకులు, రాజులు, వారి యాజకులు, ప్రవక్తలు అందరూ దేవునికి దూరమైపోయి దేవుని న్యాయమైన తీర్పును ఎక్కువ చేశారు!  ఇశ్రాయేలు ప్రజలను తనకు స్వకీయమైన జనముగా తన సొత్తుగా చేసుకున్నాను! నాకోసం పిలుచుకున్నాను అని ఎంతో గొప్పగా చెప్పుకున్న దేవుడు ఇప్పుడు తనే వీరిని చెరలు పాలు చేసి వారిని సర్వనాశనం చేసేటంత కోపం ఎందుకు తెచ్చుకున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలు వారిని దేవుడు  పిలుచుకున్న పిలుపుకు తగ్గట్టుగా బ్రతుకక, అన్య దేశస్తుల వలె జీవిస్తూ, అన్యుల కంటే ఘోరంగా దేవునికి వ్యతిరేఖంగా జీవించారు! దేవుని న్యాయమైన కోపాన్ని రేపారు! చివరకు అనుభవించారు!

 

అదేవిధంగా ప్రియ దేవుని జనాంగమా! నీవు పిలిచిన పిలుపుకు తగ్గట్లుగా జీవిస్తున్నావా?

 

పౌలుగారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నారు

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

ఇక రోమా 1:7లో అంటున్నారు ....

మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.

 

రోమీయులకు 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

ఫిలిప్పీ 1:27 లో అంటున్నారు ....

నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

 

కొలస్సీయులకు 1: 10

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

కొలస్సీయులకు 1: 11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

కొలస్సీయులకు 1: 12

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో-మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

 

  అసలు అలా అనడానికి కారణం పేతురు గారు రాస్తున్నారు: మీరు వెండి బంగారం లాంటి వెలగల వస్తువుల ద్వారా విమోచించ బడలేదు గాని అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడ్డారు అంటున్నారు....

1 Peter(మొదటి పేతురు) 1:18,19

18.పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19.అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

అందుకే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అంటున్నారు....

2పేతురు 1: 10

అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

 

   ఇంకా అంటున్నారు మీరు సామాన్యులు కాదు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని మిమ్మల్ని దేవుడు ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా చేసుకుని ఆ పరలోక ఆశీర్వాదాలకు పాత్రులుగా చేశారు కాబట్టి మీ పాతజీవితాన్ని వదలి క్రీస్తుకోసం జీవించండి అంటున్నారు....

1 Peter(మొదటి పేతురు) 2:9,10,11,12

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

11 .ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

   పౌలుగారు ఇంకా విస్తారంగా రాస్తూ ఒకనాడు మీరు ప్రజకాదు, ఇప్పుడైతే ఆయన మిమ్మును పిలుచుకుని ఏర్పాటు చేసుకుని  ఇశ్రాయేలు ప్రజలతో సమానమైన వారసులుగా చేశారు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేఖంగా జీవిస్తే కత్తిరించి పారేశారు, వారు స్వాభావికమైన కొమ్మలు, మీరైతే అంటుకట్టబడిన వారు, వారిని పీకేసిన దేవుడు మిమ్మును కూడా పీకి పారేయ్యగలరు కాబట్టి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఆయన మిమ్మును పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించమంటున్నారు!

 

Romans(రోమీయులకు) 11:17,18,19,20,21,22,23,24,25,26,27,30,31,32

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికి వేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవచెట్టున అంటు కట్టబడరా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.

31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

32. అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.

 

కాబట్టి ప్రియ సంఘమా! నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నావా? సంసోను గారు తాను పిలువబడిన పిలుపు నాజీరు చేయబడి దేవునికోసం ప్రత్యేకంగా జీవించాలి! గాని స్త్రీ లోలుడై , దేవుడు చెప్పిన ఆజ్నలను మరచిపోగా కళ్ళు పీకించుకుని భయంకరమైన చావు తెచ్చుకున్నారు! తన ఉత్తమమైన పిలుపును మరచిపోయారు కాబట్టే ఆయనకు ఇంత ఘోరమైన తీర్పు! యోసేపు గారికి తాను ఎవరు? ఎలా జీవించాలి అనేది ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ పిలుపుకు తగిన జీవితం జీవించి ఫలించే కొమ్మ అయ్యారు!

 సోలోమోను గారు తాను పిలువబడిన పిలుపును మరచిపోయి కామాతురత గలవాడై ఉంచుకుంటూ వచ్చి, బ్రష్టుడైపోయి దేవుని రక్షణను కోల్పోయారు!

గేహాజీ తానూ పిలువబడిన పిలుపును తృణీకరించి ఏదైనా సంపాదించుకుంటాను అని ధనముకై పరుగెత్తి కుష్టు రోగము సంపాదించుకున్నాడు! ఇలా అనేకమైన ఉదాహరణలు కనిపిస్తాయి మనకు బైబిల్ లో!

 

కాబట్టి ఆయన పిలుపుకు మనము యోగ్యులుగా మారాలి! ఎలా మారగలము? యోగ్యమైన జీవితం, పౌరుషం గల జీవితం క్రీస్తుకై జీవించినప్పుడే మనము దేవుని దృష్టికి యోగ్యులుగా మారగలము ! ఇదే పౌలుగారు ఈ సంఘము కోసం ప్రార్ధన చేస్తున్నారు! మనము కూడా అదేరకమైన జీవితం పౌరుషమైన జీవితం జీవించి యోగ్యులుగా మారి దేవునికి ప్రియమైన కుమారకుమార్తెలుగా మారిపోదాం!

ఆయన రాజ్యానికి వారసులమవుదాం!

ఆమెన్!

ఆమెన్!

ఆమెన్!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*23 భాగం*

ఎఫెసీ 1:15—19

15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును (అనేక ప్రాచీన ప్రతులలో- ప్రేమను అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి

16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకున్నాము! గతంలో చెప్పుకున్నట్లు ఆయన ప్రార్ధనలు లోక సంబంధమైన విషయాల కోసం, మెటీరియల్ థింగ్స్ కోసం కాకుండా పరలోక విషయాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసమే ఆయన ప్రార్ధన చేశారు! ఇక మనం ఎఫెసీ పత్రికలో పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేద్దాం!

 

  వచనాలలో పౌలుగారు చెబుతున్నారు: ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్దులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినిన దగ్గరనుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నారు!

ఈ మాటల ద్వారా మనము నేర్చుకోదగిన అంశాలు ఏమిటంటే :

 

మొదటగా: ఎఫెసీ సంఘము ప్రభువైన యేసునందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు. గతంలో చెప్పడం జరిగింది- మొదట్లో వీరు లోకముతో కలిసిపోయినా గాని పౌలుగారు రాసిన ఉత్తరాల ద్వారా స్థిరపడి లోకాన్ని సంఘమునుండి వెలివేసి- మూర్ఖులైన తరమువారికి వేరై ప్రత్యేకముగా జీవిస్తూ కష్టాలు ఎదురైనా దేవునికోసం స్థిరముగా నిలిచిన సంఘము ఎఫెసీ సంఘము!!

మనము కూడా దేవునితో సమాధానముగా ఐక్యముగా విశ్వాసంలో స్థిరముగా ఉండాలి అంటే మొదటగా లోకాన్ని లోకాశలను లోకాచారాలను దూరంగా పెట్టి అన్యులు చేసినట్లు మనము చేయకుండా ప్రత్యేకముగా జీవిస్తే ఆయన యందలి విశ్వసములోను ప్రేమలోనూ ఆత్మలోనూ అభివృద్ధి పొందగలము!

ప్రియ చదువరీ! లోకమునుండి ప్రత్యేకముగా ఉంటున్నావా లేక లోకముతో కలిసిపోయి ఉంటున్నావా? విశ్వాస వీరునిగా ఉంటున్నావా? లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావా ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

 

 ఇక రెండవదిగా: సంఘము పరిశుద్దులందరి యెడల విశ్వాసమును (కొన్ని ప్రతులలో ప్రేమను అని తర్జుమా చేయబడింది):పరిశుద్దులందరి యెడల వీరు ప్రేమ చూపిస్తున్నారు! ప్రేమ చూపించడం అంటే పెదాలతో ప్రేమ చూపించి వారికి మొండిచెయ్యి చూపడం కాదుపరిశుద్ధుల అవసరాలను తీర్చడం, వారిని ఆదరించడం, వారికి సపర్యలు చేయడం లాంటివి చేస్తున్నారు! వారికోసం ప్రార్ధన చేస్తున్నారు! పరిశుద్ధులను తమసొంత వారిగా భావించి, వారిని దేవుని దూతలుగా భావిస్తూ వారికి సపర్యలు చేస్తున్నారు! ప్రియ చదువరీ/స్నేహితుడా! పరిశుద్దుల పట్ల నీవు అలా మెలగ గలుగుతున్నావా?  బైబిల్ చెబుతుంది- వారిలో కొందరు తెలియకనే ఆతిధ్యం చేసి దేవుని నుండి గొప్ప మేలులు పొందుకున్నారు అంటున్నారు....

హెబ్రీయులకు 13: 2

ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.

 

ఇంకా మత్తయి 25 లో దీనులైన ఈ సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అని యేసుక్రీస్తుప్రభులవారు తానే స్వయముగా చెప్పారు! మరి నీవు చేస్తున్నావా?

మత్తయి 25: 40

అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

 

ఇక మూడో విషయం: ఎప్పుడైతే సంఘములో ఉన్న దేవుని పట్ల విశ్వాస ప్రేమలు, పరిశుద్ధుల పట్ల వీరికున్న ప్రేమానురాగాలు చూసారోవారికోసం పౌలుగారు మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు! హా మాబాగా సపర్యలు చేస్తున్నారు అని పొంగిపోలేదు గాని వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మానకుండా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు పౌలుగారు!

ప్రియ దైవ సేవకుడా! నీ విశ్వాసుల పట్ల నీవు ఇటువంటి మనస్సు కలిగి వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్ధన చేస్తున్నావా?

 

పౌలుగారు కేవలం ఎఫెసీయుల కోసమే ప్రార్ధన చేయలేదు, తన ద్వారా స్థాపించిన సంఘాల కోసమే కాకుండా, అక్కడ దేవుని విశ్వాసులు ఉన్నారు అంటే వారు ఎవరో ఆయనకు తెలియక పోయినా వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్ధనలు చేసేవారు , ఉదాహరణ కొలస్సీ సంఘము కోసం కూడా ప్రార్ధనలు చేసి ఉత్తరం రాసి పంపించారు! కొలస్సీ ప్రాంతాన్ని ఆయన ఎప్పుడు దర్శించలేదు, గాని వారికోసం ప్రార్ధించి- అక్కడ తప్పుడుబోదలు ప్రజలను గందరగోళంలో పడేశాయి అని తెలిసి ప్రార్ధించి ఉపవశించి ఉత్తరం రాశారు! కాబట్టి మనము కూడా అందరికోసం ప్రార్ధన చెయ్యాలి! తెలిసిన వారికోసం, తెలియని వారికోసం, ఇరుగుపొరుగు వారికోసం, శత్రువుల కోసం వారి రక్షణ కోసం బంధువుల రక్షణ కోసం ప్రార్ధనలు చెయ్యాలి!

రోమా 1:9

ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,

రోమీయులకు 1: 10

మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.

 

1థెస్సలొనికయులకు 1: 2

విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

1థెస్సలొనికయులకు 1: 3

మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

 

2తిమోతికి 1: 3

నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,

 

పౌలుగారి ప్రార్ధనలలో మనము నేర్చుకోవలసిన మరో విషయం ఏమిటంటే కేవలం ప్రార్ధన మాత్రమే చెయ్యరు ఆయన- దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తారు! ప్రార్ధన అంటే అప్లికేషన్! కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుణ్ణి స్తుతించడం పొగడటం, కొనియాడటంమనకు కేవలం అడగటం మాత్రమే వచ్చు గాని దేవుణ్ణి స్తుతించాలి అంటే నోరు రాదు! ఒక నిమిషం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పలేము! గాని పౌలుగారి నుండి మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే ఆయన కష్టాలలోను స్తుతించారు. మేలులందు స్తుతించారు! ఫిలిప్పీ పట్టణంలో గుండగా తన్నేసి చెరశాలలో పెట్టేసినా స్తుతించారు! అందుకే కదా పరలోకాన్ని కదిలించి, దూతనే తమ వద్దకు రప్పించి, భూకంపాన్ని రప్పించి, తమ బంధ కాల నుండి విడుదల పొందుకోగలిగారు! ప్రియ విశ్వాసి సేవకుడా! నీకు ఇలాంటి అనుభవం ఉందా? ప్రతీ విషయము లోను దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా?

రోమా 1:8

మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

1కొరింథీ 1:4

క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

ఫిలిప్పీయులకు 1: 6

నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

2థెస్సలొనికయులకు 1: 3

సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

 

పౌలుగారు అన్నిటికంటే ముఖ్యంగా కోరుకున్నది విశ్వాసులు తమ దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి, విశ్వాస ప్రేమల ద్వారా దేవునికి మహిమ తేవడంఅందుకే వారి ఆధ్యాత్మిక మేలులు కోసం ఎక్కువగా ప్రార్ధన చేసేవారు! అంతేకాకుండా తనకు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా వీరికోసం ప్రార్ధించడం మానలేదు! కష్టాలలో కూడా దేవుణ్ణి స్తుతించడం మానలేదు!

మరి మనం అలాంటి మాదిరికరమైన ప్రార్ధన నేర్చుకుందామా?

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*24 భాగం*

ఎఫెసీ 1:17

మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 17 వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచినా పిలుపువల్లనైన నిరీక్షణ ఎట్టిదో .........

 

ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎఫెసీ సంఘస్తులు ఎందుకు ఇంత స్థిరముగా ఉన్నారు అంటే మొదటగా వీరి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి!!! అలా వెలిగించ బడ్డాయి కనుకనే ఆయన వారిని పిలిచిన పిలుపు ఏమిటో, పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఏమిటో, పరిశుద్దులలో ఆయన స్వాస్త్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో , దేవుడు క్రీస్తునందు వినియోగ పరచిన బలాతిశయం ఏమిటో, మనయందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమైన మహాత్యము ఎట్టిదో కొద్దిగా తెలిసుకొన్నారు. ఇంకా సంపూర్తిగా తెలిసి కోవాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు! దీనికి కారణం మొదటగా వీరి మనోనేత్రాలు లేక ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి!

 

గమనించాలి- అన్యులకు- దేవుడు అంటే పడని వారి మనోనేత్రాలు యుగ సంబంధమైన దేవతవారికి మబ్బు- చీకటి కలిగించి వారు సత్యము తెలుసుకోకుండా చేస్తుంది.

2కోరింథీయులకు 4: 4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

 

 కాబట్టి మనము ప్రార్ధించి మొదటగా మనము మన నేత్రాలు / మనోనేత్రాలు/ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి అందరికి సత్యమును వివరించి చెప్పాలి! అప్పుడే వారు కూడా తమ మనోనేత్రాలను తెరుచుకుని సత్యమును తెలుసుకొంటారు!

 

ఒకసారి ఆగి ఆలోచన చేస్తే మనోనేత్రము వెలిగించబడటం వలన ఏమి జరుగుతుంది అనేది తెలుస్తుంది!

 

*బిలాము గారు* మనస్సాక్షి కాలంలో దేవుని ప్రవక్తలు లేనప్పుడు ఉన్న గొప్ప దైవజనుడు, ప్రవక్త! గాని ధనము మీద ఉన్న ఆశ- బిలాము గారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి దేవుడు వద్దని చెప్పినా వినకుడా వెళ్లి నోరులేని గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నారు...... సంఖ్యా 22:22-34

సంఖ్యా 22-24 అధ్యాయాలు

 

చూశారా- గాడిదకు దేవునిదూత కనబడ్డాడు గాని దైవసేవకునికి దేవుని దూత కనబడలేదు కారణం ధనము మీద వ్యామోహంతో బిలాము గారి కళ్ళు మూసుకునిపోయాయి. తద్వారా మనోనేత్రాలు కూడా మూసుకుపోయాయి!

 

మరొక దైవజనుడు ఉన్నారు! ఆయన కొండమీద నివాసం చేస్తారు! ఆయనకు ఒక పనివాడు ఉన్నాడు! పనివాడు ఉదయాన్నే లేచిన వెంటనే కొండచుట్టు శత్రు సైనికులు మొహరించి ఉండటం చూసి గగ్గోలు పెడుతున్నాడు! అయ్యో! గురువుగారు మన చుట్టూ శత్రు సైనికులు ఆవరించి ఉన్నారు అంటున్నాడు. బహుశా వీడి బాధ గురువుగారిని పట్టుకుని పోతారు అని కాదు- గురువు గారితో పాటుగా తనను కూడా వారు చంపేస్తారు అనుకుని ఉండవచ్చు. గురువుగారు తాపీగా అంటున్నారు- కంగారు పడవద్దు, వారికంటే మన దగ్గర ఇంకా ఎక్కువమంది సైన్యం ఉన్నారు! అయ్యా మనము ఇద్దరమే ఉన్నాము, వారు బోలెడు మంది సైన్యము అంటున్నాడుగురువుగారు ప్రార్ధన చేశారు- ప్రభువా వీడి కన్నులు తెరువు! వీడి ఆత్మీయ నేత్రాలు- మనో నేత్రాలు తెరువమని! వెంటనే దేవుడు వాడి కన్నులు తెరిచారు- చూస్తే   పర్వతం చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రధాలు కాపలా కాస్తున్నాయి! అప్పుడు అంటున్నాడు అయ్యా వారికంటే మన దగ్గరే ఎక్కువ సైన్యం ఉంది!.......

2రాజులు 6: 17

యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.

 

ఈరోజు మనం కూడా పనివాడు లా చిన్న సమస్యను బూతద్దంలో చూస్తూ గగ్గోలు పెడుతున్నాము! అదే మన నేత్రాలు వెలిగించ బడితే మనతో ఎవరున్నారో తెలుసుకుంటే అరచి గగ్గోలు పెట్టము!తాపీగా దేవునిమీద ఆనుకుంటాము! అదే ఇశ్రాయేలు ప్రజలకు- దైవజనుడైన దావీదు గారికి తేడా! గొల్యాతును ఫిలిష్తీయుల సైన్యాన్ని తమతో పోల్చుకుని పారిపోయారు ఇశ్రాయేలు- సౌలు రాజు సైన్యం! అదే గొల్యాతును తన దేవునితో పోల్చుకున్నారు దావీదు గారు! ఆకాశము దేవుని సింహాసనం భూమి ఆయన పాద పీఠం! వీడెంత? సముద్రంలో కాకి రెట్టంత! వెళ్ళాడు- ఒక్క దెబ్బతో కొట్టి చంపేశారు దావీదు గారు! మనం కూడా మన మనోనేత్రాలు- ఆధ్యాత్మిక నేత్రాలు వెలిగించ బడితే ఇలాంటి క్రియలు చేయగలము!

 

బిలాము గారికి కళ్ళు మూసుకుని పోయాయి- గాడిదతో బుద్ధి చెప్పించుకున్నారు! దావీదు గారి కన్నులు తెరిచి ఉన్నాయి- ఒక్క దెబ్బతో గొల్యాతును చంప గలిగాడు!

 

ఈరోజు మనలో అనేకమంది ఆత్మీయ నేత్రాలు- మనోనేతాలు మూసుకుని పోయి ఉన్నాయి. అందుకే దేవుడు నిజంగా ఎవరో గ్రహించకుండా అజాగ్రత్తగా ఉన్నాము! మన నేత్రాలు తెరిచి ఉంటే తప్పకుండా ఆయన ఎవరో నిజము గ్రహించి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకు చూపించాల్సిన భయము భక్తులు ఆయనకు ఇద్దుము! అది తెలియకనే మందిరంలో కాళ్ళు చాపుకుని తీపీగా పక్కన ఉన్నవాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నాము!

సంసోను గారికి కామంతో ఆత్మీయనేత్రాలు/ మనోనేత్రాలు మూసుకుని పోయి- అన్యస్త్రీని మోహించి, వేశ్య దగ్గరకు వెళ్ళారు-చివరకి కల్లుపీకించు కున్నారు! అదే యోసేపు గారికి ధర్మశాస్త్రం లేకపోయినా/ తెలియక పోయినా తండ్రిగారు నేర్పించిన భక్తితో తన మనస్సాక్షి ధర్మశాస్త్రంలా పనిచేసి- యజమాని భార్యను తల్లిలా భావించి పాపమునుండి పారిపోయారు! చివరికి ఐగుప్టు దేశానికి గవర్నర్ కాగలిగారు!

బిలాము, దేమా, అననీయ సప్పీరాలు ధనముమీద ఆశతో కళ్ళు మూసుకుని పోయి కుక్కచావు చచ్చారు!

దానియేలు షడ్రక్ మేషాక్ అబెద్నేగోలు ధనము మీద గాని, అధికారం మీద గాని, తిని త్రాగడం మీద గాని లక్ష్యముంచక దేవునిమీదనే లక్ష్యముంచి ఆత్మీయ నేత్రాలు వెలిగించుకున్నారు! గొప్ప అధికారులు కావడం మాత్రమే కాకుండా అనేక దేశాలలో దేవునికి పేరును మహిమను తీసుకుని వచ్చారు!

 

ఈరోజు నీనోట అబద్దాలు, బూతుమాటలు, పోకిరిమాటలు వస్తున్నాయి అంటే నీ మనోనేత్రాలు వెలిగించ బడక దేవుడు ఎవరో తెలియక మాటలు వస్తున్నాయి! ఈరోజు నీవు వ్యభిచారం చేస్తున్నావు అంటే నీ కళ్ళు యుగసంబంధమైన దేవత మూసివేసిందిఈరోజు నీవు కూడా అన్యులు చేస్తున్న ఆచారాలు అన్యులు చేస్తున్న పనులు, అన్యజనులు లాగేనే సినిమాలు చూడటం సీరియల్లు చూడటం, నగలు ధరించడం, తాళి కట్టడం, వాస్తులు చూడటం లాంటి అన్యాచారాలు చేస్తున్నావు అంటే నీ మనోనేత్రాలు మూసుకుని పోయాయి! వాటిని మూసివేసింది యుగసంబంధమైన దేవత! నీవు దేవుని బిడ్డవు అయితే దేవుని మాట వింటావు! గాని నీకు దేవుడు కావాలి- లోకము కావాలి! అందుకే దేవత నీ కల్లు మూసివేసింది!

 

కళ్ళు తెరువబడాలని పౌలుగారు ప్రార్ధన చెయ్యడం లేదు ఇక్కడ! సంఘానికి మనోనేత్రాలు తెరువబడే ఉన్నాయి! తద్వారా ఆధ్యాత్మిక మైన సంగతులు గ్రహించాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు!

 

చివరిగా మనో నేత్రాలు వెలిగించబడితేనే/ తెరువబడితేనే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలము! శిష్యులకు దేవుడు పునరుత్థానం జరిగాక అదే చేశారు.

లూకా 24: 45

అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి....

మనస్సు తెరచి అనగా ఆత్మీయ మనోనేత్రాలు తెరిచారు. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరువబడితే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలవు!!!

 

ప్రియ సంఘమా! నీ నేత్రాలు వెలిగించబడ్డాయా? అయితే నీ ఆశలు చూపులు ఉద్దేశాలు కోరికలు దేనిమీద ఉన్నాయి? భూసంబంధమైన వాటిమీదనా లేక పర సంబంధమైన ఆధ్యాత్మిక విషయాల మీదనా?

మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలో గల నిజమైన విషయాలు గ్రహిద్దాము!

ఆధ్యాత్మిక మేలులు పొందుకుందాము!

దైవాశీస్సులు!

 

 

 

 

 

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*25 భాగం*

ఎఫెసీ 1:17

మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,...

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ ఎట్టిదో .........

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ ఎట్టిదో....

 

పౌలుగారి ప్రార్ధనలలో మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉండవు అని చూసుకున్నాము. అన్నీ ఆధ్యాత్మిక విషయాల కోసమే ఆయన ప్రార్ధన చేసేవారు- ఇక్కడ ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్ల కలిగిన నిరీక్షణ ఎట్టిదో మీరు గ్రహించి దాని శక్తిని పొందుకోవాలని ప్రార్ధన చేస్తున్నారు! గమనించాలి- ఎవరి మనోనేత్రాలు వెలిగించబడవో, మూసుకుని పోయాయో వారు దేవుని పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎట్టిదో, దాని మహిమ ఎట్టిదో, దాని ఘనత ఎట్టిదో, దాని వలన పొందుకోబోయే ఆధ్యాత్మిక మేలులు ఏమిటో గ్రహించలేరు! గాని ఎఫెసీ సంఘము వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనుక ఇప్పుడు పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు- ఆయన ఎఫెసీయులను పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ ఏమిటో- వారు సంపూర్ణంగా తెలుసుకోవాలి అని పౌలుగారి ఉద్దేశ్యం మరియు ప్రార్ధన!!!

చాలామందికి వారు దేనికోసం పరుగు తీస్తున్నారో తెలియదు! మన నిరీక్షణ దేనిమీదనో ప్రతీ విశ్వాసికి తెలియాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒకడు గాలికి ప్రయత్నించి నట్లు ఉంటుంది.

 

మన అందరికి ఒక నిరీక్షణ ఉంది. అది శుభప్రదమైన నిరీక్షణ- ఒకరోజు మనము శ్రమలను శోధనలను జయించిన తర్వాత, మన ప్రియుడును రక్షకుడైన యేసయ్యను కలుసుకోబోతున్నాము! దానికి గాను మేఘముల మీద ఎత్తబడబోతున్నాము! ఇంకా వేవేల పరిశుద్ధులను, కోటివేల దూతలను జ్యేష్టుల సమూహమును కలుసుకొన బోతున్నాము! ఆయనతో పెండ్లివిందులో పాలుపొందుకోబోతున్నాము చివరికి ఆయనతో కూడా పరిపాలన చేయబోతున్నాము! ఆయనతో నిత్యమూ నివశించబోతున్నాము! దీనినే శుభప్రదమైన నిరీక్షణ అంటారు!

 

అయితే నిరీక్షణ ఎట్టిదో సంపూర్ణంగా గ్రహించాలి అని పౌలుగారి ఉద్దేశం! గమనించాలి దేవుడు మనలను కోరుతున్నది ఏమిటంటే ఆయనను ఎరగడం మాత్రమే కాకుండా ఆయన మనకోసం ఏవి సిద్ధం చేశారో, వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి!

 

తీతు 2:12,13

12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

దానికి నిరీక్షణ కావాలి మొదటగా!

నిరీక్షణ కోసం ఆలోచిస్తే: దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి ఉండాలి. తద్వారా ఆయన మహిమను మనము కూడా పొందుకోవచ్చు

రోమా 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

 

నిరీక్షణ వలననే మనము ఒకరోజు మన పాప దేహం నుండి విమోచన పొంది మహిమ దేహం ధరించి యేసుక్రీస్తుప్రభులవారిని కలవబోతున్నాము.

 

రోమా 8:23—25

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.

 

అయితే గ్రహించాల్సిన విషయమ ఏమిటంటే నిరీక్షణ కలిగి చివరికి మనము క్రీస్తు పోలికలోనికి మారిపోవాలి! అప్పుడే ఆయనతో కూడా శాశ్వత కాలము జీవించగలము!

 

రోమీయులకు 8: 29

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

రోమీయులకు 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

2కోరింథీయులకు 3: 18

మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత (లేక,ఆత్మయగు ప్రభువుచేత) ఆ పోలికగానే మార్చబడుచున్నాము.

 

1యోహాను :2

2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

3. ఆయనయందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.

 

 

ఇక నిరీక్షణ కోసం ఆలోచిస్తే- నిరీక్షణ ఎట్టిదో చూసుకుందాము!

యోబు గారు నా నిరీక్షణకు ఆధారం ఏది అని అడిగితే యోబు:17:15,  దావీదు గారు నా నిరీక్షణకు/నీతికి ఆధారమగు దేవా అని ప్రత్యుత్తరం చెప్పారు...

కీర్తనలు 4: 1

నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టు నప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

 

పౌలుగారు అంటున్నారు అబ్రాహాము గారి గురుంచి ఆయన విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యారు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసముంచి నమ్మి విశ్వాసులకు తండ్రి అయ్యారు. రోమా 4:18

ఇక రోమా 5:5 లో ఒక మేలిమి బంగారం లాంటి మాట చెప్పారు: నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ...

ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

అనేకులు మనలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు- కారణం వారు చేసే పనులు మనము చేయటం లేదు- చప్పిడి పత్యం చేస్తున్నాము. అయితే నిరీక్షణ మనలను సిగ్గుపరచదు గాని మనలను పరలోకం చేర్చుతుంది తండ్రితో మరియు కుమారునితో ఐక్యం చేస్తుంది.

 

అందుకే దావీదు గారు అంటున్నారు నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు? దేవునియందు నిరీక్షణ యుంచు....

కీర్తనలు 42:5, 11

5. నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.

11. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.

 

అందుకే పౌలుగారు చెబుతున్నారు రోమా 8:24

ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

 

రోమా 15:4

ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.

 

ఇంకా అంటున్నారు: పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇంకా నిరీక్షణ గలవారు అవుతారు

రోమా 15:13

కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

 

కొరింథీ పత్రికలో అంటున్నారు చివరికి నిలిచేవి మూడు:

 విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ !! 1కొరింథీ 13:13

అయితే నిరీక్షణ కలిగినప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలలో ఇంకా నిరీక్షణ విశ్వాసము కలిగి ఉండాలి!

2కొరింథీ 1:10

ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థనచేయుట వలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమైయున్నాము.

 

గలతీ 5:5

ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.

 

ఎఫెసీ పత్రికలో మనము ఎందుకు పిలువబడ్డామో చెబుతున్నారు:

ఎఫెసీ 4:4

శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

 

Hebrews(హెబ్రీయులకు) 6:12,18,19

12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.

18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.

19. నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.

 

హెబ్రీయులకు 10: 23

వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

 

1పేతురు 1:4, 13

4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

 

చివరగా అబ్రాహాము గారు ఇదే నిరీక్షణ కలిగి పునాదులు గల పట్టణము కోసము ఎదురుచూసి మాదిరిగా నిలిచిపోయారు. హెబ్రీ 11:10...

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

 

అదేవిధంగా హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో గల విశ్వాసవీరులు కూడా పునాదులు గల పట్టణమును స్వాధీనము చేసుకోలేక పోయినా నిరీక్షణ కలిగి  దూరము నుండి పునాదులు గల పట్టణమును చూసి వందనం చేసి విశ్వాసముగలవారై చనిపోయారు.

హెబ్రీయులకు 11: 13

వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

 

మనము కూడా  అదే నిరీక్షణ కలిగి పునాదులు గల పట్టణము కోసం ఎదురుచూస్తూ నిరీక్షణలో గల అధ్యాత్మికమేలులు పొందుకుందాము!!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*26 భాగం*

ఎఫెసీ 1:17

మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,...

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ ఎట్టిదో .........

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్త్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో....

 

తెలుగు బైబిల్ లో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని తర్జుమా చేయబడినా మిగిలిన ప్రతులలో ఇలా చెప్పబడింది , పరిశుద్ధులలో ఆయనకున్న మహిమగల వారసత్వము ఎంత ఐశ్వర్యవంతమైనదో .....

 

గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసులందరికీ క్రీస్తులో క్రీస్తుద్వారా వారసత్వం లభించింది. 14 వచనం ఇదే చెబుతుంది. విశ్వాసులందరికీ క్రీస్తుద్వారా దేవుని నుండి మనకు లభించే ప్రతీ ఈవిలోను ఆత్మీయ ఫలములోను పరలోక స్వాస్త్యములోను వారసత్వం ఉంది. ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందిన మనకు క్రీస్తుద్వారా ఆయనకున్న మహిమలోను ఈవులలోను వారసత్వము లభించింది. అందుకు గాను ఋజువుగా పరిశుద్ధాత్మను సంచకరువుగా అనగా డిపాజిట్ గా పెట్టారు .వీటిని విశ్వాసము ద్వారా స్వాధీనం చేసుకోవాలి విశ్వాసి!!! చివరికి చెప్పాలంటే లేవీయులకు దేవుడు నేనే వారికి స్వాస్త్యము అని ఎలా చెప్పారో అలాగే విశ్వాసులందరికీ దేవుడే వారి స్వాస్త్యము! అలాగే దేవుడే వారి ఆస్తి మరియు పెన్నిది! అలాగే విశ్వాసులందరూ అనగా నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపం కలిగి క్రీస్తుకోసం సాక్షులుగా నిలిచిన ప్రతీ విశ్వాసి- దేవుని అపురూపమైన ఆస్తి. అందుకు గాను ఆయన తన సొంత ఏకైక కుమారుని భూలోకానికి పంపించి కుమారుని ప్రాణంతో రక్తంతో ప్రజలను కొని విమోచించి తనకు స్వాస్త్యముగా చేసుకున్నారు! అలా చేసి తన భాగములో వారికి వాటా స్వాస్త్యముగా ఇచ్చారు! వారు కూడా అలాగే తన బిడ్డలుగా ప్రాణమున్నంత వరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు!

విషయాన్ని ప్రతీ విశ్వాసి గ్రహించి ఆయన మనకొరకు దాచియుంచిన మేలులు స్వాస్త్యమును పొందుకోవాలి! ఇదే పౌలుగారి ప్రార్ధన!

 

ఒకసారి యోహాను గారు చెప్పేది చూద్దాము!

యోహాను 1:12

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

 

ఇక పౌలుగారు అంటున్నారు- కుమారులైతే వారసులు అంటున్నారు: రోమా 8:16—17

16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.

17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి- ఆయన స్వాస్త్యమును వారసత్వముగా ఎప్పుడు పొందుకుంటాము అంటే ఆయనతో పాటుగా శ్రమ పడితేనే ఆయన మహిమను మరియు ఆయనకు గల సమస్తములో వారసులము అవుతాము! నాకు మేలులే కావాలి- శ్రమలు శోధనలు వద్దు అంటే నీకు స్వాస్త్యములో పాలుపంపులు లేవు!

ఇంకా అంటున్నారు పౌలుగారు అదే అధ్యాయంలో 23—24 వచనాలు.

Romans(రోమీయులకు) 8:23,24

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

 

ఇదే విషయాన్ని వివరంగా ఎఫెసీ మొదటి అధ్యాయంలో రాస్తున్నారు:1:—14...

3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.

10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

అదే పేతురు గారు అంటున్నారు ఆయన మనలను రాజులైన యాజక సమూహముగాను తన సొత్తైన ప్రజగా చేసుకున్నారు!....

1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

అయితే గలతీ పత్రికలో మరో విషయాని చెబుతున్నారు పౌలుగారు- మరి ఇప్పుడు నీవు దేవుని బిడ్డగా ఆయన కుమార/కుమార్తెగా మారావు కాబట్టి ఇక లోకమును అనుసరించి- లోకము యొక్క ఆశల ప్రకారం నడువకుండా దేవుని బిడ్డగా ఆయన పిల్లగానే జీవించాలి. అప్పుడే నీవు వారసుడవు! గలతీ 4:5—9

5. మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

6. మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.

7. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు.

8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని

9. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

 

కాబట్టి ఆయన ద్వారా ఆయనలో మనకు స్వాస్త్యమునకు వారసత్వము లభించింది దానిని మనము నిలబెట్టుకోవాలి! స్వాస్త్యము కరిగిపోయేది వాడిపోయేది కాదు. అది వాడబారనిది- నిత్యమైనది- మహిమగలది! దానిని స్వాధీనం చేసుకోడానికి ఆయనతో పాటుగా శ్రమలను అనుభవించాలి. అప్పుడే ఆయన వాగ్దానాలకు ఆయన స్వాస్త్యముకు వారసుడవు అవుతావు! దీనినే గ్రహించాలని పౌలుగారు ఎఫెసీయుల పక్షముగా ప్రార్ధిస్తున్నారు! అట్టి స్వాస్త్యమును మనము కూడా పొందుకుందుము గాక!

ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*27 భాగం*

ఎఫెసీ 1:18

ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 18వ వచనంలో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో .........

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: పరిశుద్ధులలో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో....

 

వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది: ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము...

రెండవది : బలాతిశయమును విశ్వసించడం వలన మనయందు దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో గ్రహించాలి.

 

మొదటగా మనము ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము గూర్చి కొద్దిగా ఆలోచిన చేద్దాం! ఆయన క్రీస్తునందు బలాతిశయమును వినియోగించారా???

అవును కదా! మహా గొప్ప బలాతిశయము వినియోగించారు దేవుడు!

 

కన్యక గర్భములో పుట్టడం బలాతిశయము కాదా?! యెషయా 7:14; లూకా 1:27;

 

గుడ్డివారికి చూపునివ్వడం బలాతిశయం కాదా!! లూకా 7:21; 18:43; యోహాను 9:7

 

రోగులను బాగుచెయ్యడం బలాతిశయం కాదా!! లూకా 7:21,22

 

ఊచకాలుచేతులు గలవాని బాగుచెయ్యడం బలాతిశయం కాదా?

యోహాను 5

 

నీటిమీద నడవడం బలాతిశయం కాదా?

మత్తయి 14:25;

 

గాలి-తుఫాను ఆగిపో అని గద్దించిన వెంటనే గాలి తుఫాను ఆగిపోవడం బలాతిశయం కాదా? మార్కు 4:39, లూకా 8:24;

 

చచ్చినవారిని లేపడం బలాతిశయం కాదా?!!  యోహాను 11:44; లూకా 7:15;

 

దయ్యాలను అధికారంతో పొమ్మని చెబితే దయ్యాలు పారిపోవడం బలాతిశయం కాదా? మార్కు 5:8-13; లూకా 4:41;

 

చివరికి తానే మన పాపముల కోసం రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి మృత్యుంజయుడై లేచుట బలాతిశయం కాదా? మత్తయి 28:6; లూకా 24:5-7; అపొ 2:24,32, 3:15; 5:30;13:30; 1కొరింథీ 6:14;

 

చెరను చెరగా తీసుకుని పోవడం బలాతిశయం కాదా?

ఎఫెసీ 4:8;

 

సాతాను చెరలో ఉన్న ఆత్మలను విడిపించి మూడో ఆకాశమునకు ఎత్తుకునిపోవడం అత్యధిక బలాతిశయం కాదా?!!

 

దానిని నమ్ముచున్న మనలను కూడా సాతాను చెరలోనుండి విడిపించడం, నాశనానికి గురయ్యే మనలను  పరముకు హక్కుదారులుగా చెయ్యడం బలాతిశయం కాదా!!!

రోమా 6:17-18;

 

ఇంత ఆశ్చర్యకరుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికి అత్యధిక బలాతిశయమును అనుగ్రహించి మనలను తనకు సొత్తుగా చేసుకున్నారు! ఒకరోజు సాతాను బిడ్డలుగా సాతానుకి దాసులుగా పాపానికి బానిసలుగా ఉన్న మనలను నేడు ఆయన సొత్తుగా చేసుకొన్నారు అదే బలాతిశయమును వినియోగించి!!

 

ఇంతటి ఘనమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి పౌలుగారు చెబుతున్నారు దేవుడు తన కుమారుని ఏమి చేశారో

ఎఫెసీ 1:20-23....

20. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమే

21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు.

22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.

23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

అదే బలాతిశయమును బలప్రభావాలను ఉపయోగించి నేడు తన బిడ్డలమైన మనలనందరినీ ఆయన కాపాడుచున్నారు! గెద్దరెక్కల మీద ఎత్తుకుని సాతాను చిక్కులనుండి ఎన్నెన్నో ఆపాయాలు ఇరుకులు ఇక్కట్లు నుండి మనలను రక్షిస్తున్నారు! ఆయన బలప్రభావాలు భూమిమీద నున్న దేనితోను సాటిరావు!

 

ఇక్కడ పౌలుగారు ఏమని ప్రార్ధిస్తున్నారు అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును మనము కూడా గ్రహించాలి. దాని శక్తిని గ్రహించాలి. అదే బలప్రభావాలు మనము కూడా ఆయనను విశ్వసించి పొందుకోవాలి!!! ఇదే పౌలుగారి ప్రార్ధన!

 

ప్రియదైవజనమా! ఆయన బలాతిశయమును గ్రహిస్తున్నావా? లేక అందరిలో ఒకదేవుడు అని వదిలేస్తున్నావా? ఆయన బలాతిశయమును నిజంగా గ్రహిస్తే నీవు అజాగ్రత్తగా ఉండవు! దేవునియందు భయమును భక్తిని కలిగిఉంటావు! ఆశ్రద్ద చేసి నిర్లక్షముగా ఉంటే విడువబడి నాశనముకు పోయే గుంపులో ఉంటావు. ముఖ్యంగా ఆయన బలాతిశయమును గ్రహించలేక పోతే నీవు సాతానుతో యుద్ధం చెయ్యలేవు. నీ గమ్యాన్ని చేరలేవు!

ఆయన బలాతిశయమును గ్రహించి- ఆయన బలప్రభావాలును పొందుకొని ఆయన రాజ్యాన్ని చేరుకుందాము!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*28 భాగం*

ఎఫెసీ 1:18

ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 18వ వచనంలో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో .........

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: పరిశుద్ధులలో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో....

వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది: ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము...

రెండవది : బలాతిశయమును విశ్వసించడం వలన మనయందు దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో గ్రహించాలి.

 

        (గతభాగం తరువాయి)

 

   ఇక రెండవ విషయం ఏమిటంటే: బలాతిశయమును విశ్వసించడం వలన మనయందు దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో గ్రహించాలి.

 

ఇంత గొప్ప బలప్రభావాలు బలాతిశయము గల దేవుణ్ణి ఆయన బలాతిశయమును విశ్వసించినందున దేవుడు మనయందు తనయొక్క అపరిమితమైన మహాత్యమును చూపిస్తున్నారు మన జీవితాలలో! దానిని మనము గ్రహించాలి అని పౌలుగారి ప్రార్ధన!

 

ఇక్కడ బలాతిశయము అనగా మన జీవితంలో ఆయనను విశ్వసించినందున ఆయన చూపుతున్న బలాతిశయముఅది కేవలం మనము విశ్వసించి ప్రార్ధన చేయడం ద్వారా మనకు కలిగే స్వస్తతలు, మనము ఇతరులకు ప్రార్ధించడం ద్వారా ఇతరులు పొందుకునే స్వస్తతలు, ఇతరులు సాతాను శక్తులనుండి విడుదల పొందడానికే పరిమితమవ్వలేదు!

అవును ఈరోజు విశ్వసించి ప్రార్ధన చేయడం వలన ఎన్నెన్నో అధ్బుతాలు మహాత్కార్యాలు జరుగుచున్నాయి. కారణం నాయందు విశ్వాసముంచువాడు అంతకంటే ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన వాగ్దానాన్ని నమ్మడం వలన ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. యోహాను 14: 12

నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

అసాధారణ అద్భుతాలు కూడా జరుగుచున్నాయి నేటి దినాలలో!

 

అయితే బలాతిశయము అద్భుతకార్యాలు స్వస్తతలకు ఆశీర్వాదాలకు పరిమితం కాదు అంటున్నాను! ఇది బాగా అర్ధం కావాలంటే దేవుడు మనలను ఎలా ఎన్నుకున్నారో- ఎలాంటివారిని ఎలా చేశారో ఇదే ఎఫెసీ పత్రిక ఇదే అధ్యాయము మూడో వచనం నుండి 14 వచనం వరకు జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఆయన నిజమైన బలాతిశయము ఆయన నిజమైన బలప్రభావాలు, మానలవులను రక్షించడానికి  ఆయన యొక్క మహోన్నతమనిన ప్రణాళిక అర్ధం అవుతుంది......

 

3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, కృపను మనయెడల విస్తరింపజేసెను.

10. సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

మూడో వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు.

తర్వాత వచనాలలో తన కుమారుని యందు మనకు ఉచితముగా రక్షణ అనుగ్రహించి తన కృపచేత రక్షించారు. ఆయన ద్వారా మనలను కుమారులను లేక వారసులుగా చేసుకోడానికి ముందుగా మనలను నిర్ణయించు కొన్నారు, అందుకోసం జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తుద్వారా మనలను ఏర్పరచుకున్నారు తనకోసం!!! ఎందుకు? తన ఎదుట మనలను పరిశుద్దులము, నిర్దోషులుగా ఉండటానికి!! ఏం పరిశుద్దులుగా నిర్దోషులుగా ఎందుకు ఉండాలి? మామూలుగా ఉండొచ్చు కదా?

ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను కూడా పరిశుద్దులుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఉండేది పరలోకం అందులో నిషిద్ధమైనది అపవిత్రమైనది ప్రవిశించ లేవు! అందుకే తనతోపాటుగా మనము ఉండాలని మనలను నిర్దోషులుగా పరిశుద్దులుగా ఉండాలని క్రీస్తుద్వారా మనలను ఆయనకోసం ఏర్పరచుకున్నారు! ఇందుకు గాను ఆయన మహా గొప్ప వెల చెల్లించారు! ఆయన రక్తమువలనే మనకు విమోచనము- అపరాధాలకు క్షమాపణ కలిగిందిచివరకు పదో వచనం ప్రకారం పరలోకంలో ఉన్నవే గాని భూమిమీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు దేవునితో ఏకముగా ఉండాలని క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, దేవుడు తన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్త్యముగా చేసుకున్నారు! సత్యవాక్యాన్ని సువార్తను నమ్మి విశ్వసించి మనము వాగ్దానం చొప్పున తన ఆత్మచేత ముద్రించబడ్డాము!! దానికి గాను తన సొత్తైన ప్రజగా మనము  ఉండటానికి తన ఆత్మను సంచకరువుగా అనగా డిపాజిట్ గా పెట్టారు!

ఇది నిజమైన బలప్రభావము! దేవుని ప్రణాళిక!!! ఇదే మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యము! దీనిని మనం తెలుసుకోవాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు!

 

యోహాను గారు అంటున్నారు :16,17;36

16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా ( లేక, జనితైక కుమారుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.

36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

 

యోహాను 6: 41

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

 

రోమా 5:10

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

 

1కొరింథీ 1:9

మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

ఎఫెసీయులకు 4: 11

మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,

ఎఫెసీయులకు 4: 12

అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

 

కొలస్సీ 1:13

పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,

 

హెబ్రీ 1:2,3,4

2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో- యుగములను) నిర్మించెను.

3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేకప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

4. మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.

 

కాబట్టి ఆయన యొక్క శక్తిని అర్ధము చేసుకుందాము! శక్తి యొక్క అపరితమైన మహాత్యాన్ని అర్ధం చేసుకుని ఆయన పొందుకున్న బలప్రభావాలను మనము కూడా పొందుకుని ఆయన రాజ్యాన్ని పొందుకుందాము!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*29 భాగం*

ఎఫెసీ 1:19

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 19 వచనంలో తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్ధనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను!!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించునట్లు...

 

ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి:

 

మొదటిది: తనను తెలుసుకోడానికి మనకు జ్ఞానము కావాలి.

రెండవది:ప్రత్యక్షత గల మనస్సు కావాలి! లేకపోతే ఆయన నిజంగా ఎవరో మనం గ్రహించలేము! రోజులలో అనేకమంది విశ్వాసులు ఎందుకు అజాగ్రత్తగాఏదో మ్రొక్కుబడి భక్తి ఎందుకు చేస్తున్నారు అంటే రెండు లేకనే! వారికి నిజంగా దేవుడు ఎవరో , ఆయన శక్తి, మహిమ బలప్రభావాలు ఏమిటో గ్రహించే జ్ఞానము లేదు, ప్రత్యక్షత గల మనస్సు లేదు! రెండు కావాలని, ఎఫెసీ సంఘ సభ్యులు పొందుకోవాలని పౌలుగారు ప్రార్ధన చెయ్యడం లేదు- విజ్ఞాపన చేస్తున్నారు అనగా కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు! ప్రియ సేవకుడా/కాపరి! నీవుకూడా నా మంద ఇలాంటి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు పొందుకోవాలి- దేవుణ్ణి నిజంగా ఎరిగి ఆయనను సేవించాలని నీ సంఘము కోసం ప్రార్ధన చేస్తున్నావా?

 

   బైబిల్ గందంలో కొంతమందికి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చారు! యోహాను గారికి అంత్యదినాలలో ఏమి జరుగబోతున్నాయో ప్రత్యక్షత ఇచ్చి- ప్రకటన గ్రంధము వ్రాయించుకున్నారు దేవుడు!

ప్రకటన గ్రంథం 1: 1

యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. (లేక, ప్రకటన) ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.

 

యోసేపు గారికి, దానియేలు గారికి కలలకు అర్ధము చెప్పడం, లోతైన మర్మాలు గ్రహించడం లాంటి ప్రత్యక్షత గల మనస్సు ఇచ్చారు! ......

ఆదికాండము 41: 15

ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు

ఆదికాండము 41: 39

మరియు ఫరో : దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.

 

దానియేలు 1: 17

నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.

 

దానియేలు 2: 47

మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.

 

దానియేలు 5: 11

నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను.

దానియేలు 5: 12

దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.

 

దానియేలు 9: 22

అతడు నాతో మాటలాడి సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని.

 

 అగబు అనే ప్రవక్తకు పౌలుగారికి ఏమేమి సంభవించబోతున్నాయో యేరూషలేము పట్టణంలో వివేచించే మనస్సు ఇచ్చారు.

అపో.కార్యములు 11: 28

వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.

అపో.కార్యములు 21: 11

అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.

 

 ఇలా ఒక్కొక్కరికి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తారు వారి సామర్ధ్యము మరియు వారి నమ్మకత్వము

బట్టి! అయితే ఇలాంటి ప్రత్యక్షతలు సంఘము పొందుకోవాలి గాని ఇవి పొందుకోలేక పోయినా గాని నిజంగా దేవుడు ఎవరో ఆయన బలప్రభావాలు శక్తి- ఆయన క్రీస్తునందు వినియోగ పరిచిన మహిమ తెలుసుకొనే జ్ఞానము- ప్రత్యక్షత గల మనస్సు పొందుకోలేక పోతే ఆయనను అర్ధము చేసుకోలేక ఏదో మ్రొక్కుబడి భక్తినే చేస్తారు!

 

ఈరోజులలో అనేకమందికి లాప్టాప్ లో ఫీచర్స్ ఉన్నాయో, మొబైల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో, కంపెనీ షేర్లు కొంటే లాభం వస్తుందో, ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు కొనాలో, ప్రాపర్టీ కొంటే లాభపడతారో ఇలాంటి వాటిలో మంచి జ్ఞానము వివేచన ప్రత్యక్షత కలిగి ఉన్నారు గాని మార్గము అవలంభిస్తే పరలోకం చేరుతామో, దేవుణ్ణి అనుసరిస్తే నిత్యనరకం తప్పించుకొని నిత్యరాజ్యం చేరుతామో లాంటి ఆలోచన జ్ఞానం కొంచెమైనా లేదు! అది లేకుండా లోక దేవత వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిందిఅన్యులను వదిలెయ్యండి- దేవుని బిడ్డలు రక్షణ పొందుకున్నవారు కూడా ఈలోక ఆశలలోపైన చెప్పిన వాటిమీద- శరీర ఆశలమీద లక్ష్యముంచుతున్నారు గాని ఆధ్యాత్మిక ఫలములు దేవుని వరములు మీద దృష్టి పెట్టడం లేదు! ఏదో భక్తిచేస్తున్నారు! ఆదివారం చర్చికి వస్తున్నామా, హాజరు వేయించుకుంటున్నామా లేదా ఆరాధనాక్రమంలో పాల్గొంటున్నామా అంతే! మరికొందరు అయితే వారి సంఘంలో చదువుకొనే సంఘ క్రమమే ఆరాధన- భక్తి అనుకుంటున్నారు గాని ఆయన రాకడకు సిద్దపడటం గాని, సంపూర్ణత సాధించడం కోసం గాని వారి భక్తిలేదు! ఆలోచన లేదు! కారణం వారికి దేవుణ్ణి తెలుసుకొనే జ్ఞానము లేదు! ప్రత్యక్షత గల మనస్సు లేదు!

ఇవే కావాలని పౌలుగారు ఎఫెసీ సంఘము కోసం కన్నీటితో ప్రార్ధన విజ్ఞాపనలు చేసున్నారు! ప్రియ సంఘమా! నేడు నీవుకూడా వీటిని పొందుకోవాలి!!!

 

ఇక జ్ఞానము ఎందుకు అవసరమో ఒకసారి చూసుకుందాము!

1కొరింథీ 2:6—7 లో దేవుని జ్ఞానము మర్మమైనది, మరుగై ఉన్నాది అయితే అది ఇప్పుడు దేవుడు బయలుపరిచారు అంటున్నారు...

6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక (మూలభాషలో- ఈ యుగ) జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని

7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

 

జ్ఞానము క్రీస్తు సువాసన అంటున్నారు...

2కోరింథీయులకు 2: 14

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

 

అది యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేశారు 2కొరింథీ 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

వీటికోసం అతిశ్రేష్టమైన జ్ఞానం కోసం నాకు కలిగిన ప్రతిదానిని పెంటగా ఎంచుకుని వదిలేశాను అంటున్నారు పౌలుగారు

ఫిలిప్పీయులకు 3: 8

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.

 

మీరు కూడా వదిలేస్తే మీకు జ్ఞానము కలుగుతుంది అంటున్నారు- తద్వారా దేవుని పోలికలోనికి మారగాలము నవీన స్వభావం పొండుకుంటాము అంటున్నారు కొలస్సీయులకు 3: 10

మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.

 

అందుకే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి

కొలస్సీయులకు 4: 5

సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.

 

అయితే  పౌలుగారు తిమోతికి లేఖ రాస్తూ జ్ఞానమును పరిశుద్ధ గ్రంధము లేఖనములు చదవడం ద్వారా పొందుకోవచ్చు అంటున్నారు

2తిమోతి ౩:14

క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక,

 

యాకోబు గారు అంటున్నారు జ్ఞానము పైనుండి అనగా పరమునుండి దేవుని నుండి కలిగింది అంటున్నారు. లోక జ్ఞానము ప్రకృతి సంబంధమైనది దయ్యాలకు చెందింది. :17, 15

యాకోబు 3: 17

అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

 

యాకోబు 3: 15

జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.

 

యోబు గారు అంటున్నారు- సంగతులు వారు ఎందుకు గ్రహించడం లేదు అంటే నీవు వారి హృదయాలకు జ్ఞానము మరుగుచేశావు 17:4

 

కారణం నీమార్గము నీ జ్ఞానము మాకక్కరలేదు అంటున్నారు వారు 21:14;

చివరికి అంటున్నారు జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వివేచనా ఎక్కడ దొరుకుతుంది? 28:12

 

జవాబు: యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము!

సామెతలు 9: 10

యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.

 

కీర్తనలు 19: 7

యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

 

కాబట్టి ప్రియ సంఘమా! ఆయనను గూర్చిన జ్ఞానము మరియు ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలని భారముగా ప్రార్ధించి పొందుకుందాము!!!

దైవాశీస్సులు!

 

 

 

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*30 భాగం*

ఎఫెసీ   :14—19

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఎఫెసీ  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

గమనించాలి మూడో అధ్యాయంలో పౌలుగారు చేసిన ప్రార్ధన- ఆయన చేసిన ప్రార్ధనల అన్నిటిలో తలమానికమైన ప్రార్ధన అని నా ఉద్దేశం!!!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: పరలోకమందును భూమియందును ఉన్న ప్రతీ కుటుంబం తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో తండ్రి ఎదుట మోకాల్లూని ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారుప్రార్ధనను పరిశీలించి ధ్యానం చేసేముందు అసలు పౌలుగారు ఈసంఘాల కోసం ఎందుకు అంత గట్టిగా ప్రార్ధనా విజ్ఞాపనలు చేస్తున్నారో వచనంలో మనకు బాగా అర్ధమవుతుంది. రోమా మరియు కొలస్సీ సంఘాలకు ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు, దర్శించలేదు. అయినా వారికోసం కన్నీటితో ప్రార్ధన చేసి ఉత్తరాలు రాశారు! ఎందుకు అని మనం ఆలోచిస్తే దానికి జవాబు వచనంలో కనిపిస్తుంది

 

వచనం హేతువుచేత అని మొదలయింది. ఇక అధ్యాయమే ఈహేతువు చేత అని మొదలయ్యింది. అసలు హేతువుచేత?? హేతువు ఏమిటి? పౌలుగారు దేనికోసం చెబుతున్నారు? అధ్యాయం మొదటి వచనంలోనే హేతువుచేత అంటున్నారుఅనగా రెండవ అధ్యాయంలో మొదలుపెట్టిన అంశాన్ని మూడో అధ్యాయంలో కొనసాగిస్తున్నారు అన్నమాట! ఎఫెసీ 2:11 నుండి ఎంతో ప్రాముఖ్యమైన విషయం కోసం చెబుతున్నారు. ఇది ప్రతి అన్యజనాంగం నుండి రక్షించబడిన విశ్వాసి తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశము:...

 

11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు

12. కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువ వలన ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

మీరు శరీరంలో సున్నతి పొందకపోయినా ఇశ్రాయేలు జాతియైన మాతో మీరు సహపౌరులుగా అయ్యారు ఎలా అంటే క్రీస్తుయేసునందు క్రీస్తురక్తము వలన మీరు సమీపస్తులయ్యారుఆయన సిలువలో మీకు మాకు మధ్య ఉన్న ద్వేషము అనగా ధర్మశాస్త్రమును తన శరీరంమందు కొట్టివేశారు అనగా సిలువలో దానిని మేకులు కొట్టి మధ్యగోడను త్రోసివేసి మన ఉభయులను అనగా అన్యజనులలో రక్షించబడిన మిమ్మును, ఇశ్రాయేలు జాతియైన మమ్మును ఏకము చేశారు, ఇప్పుడు మీరు మేము క్రీస్తుయందు నూతన పురుషునిగా సృష్టించి తన సిలువవలన ద్వేషమును సంహరించి ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరిచారు. కాబట్టి ఇప్పుడు మిమ్మును మమ్మును ఆయన ద్వారా- పరిశుద్ధాత్మద్వారా తండ్రి సన్నిధికి చేరే మార్గము ఏర్పరచి తండ్రితో ఏకం చేశారు. 19 వచనం కాబట్టి ఇప్పుడు ఇకమీదట మీరు పరజనులు పరదేశులై ఉండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు గా దేవుని ఇంటివారుగా ఉన్నారు.

సరే, అయితే ఏమిటంట????

కాబట్టి ఇప్పుడు మీరుగాని అనగా అన్యజనులలో రక్షించబడిన విశ్వాసులైన మీరు గాని, మేమైనా గాని, 20—22 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై ఉండగా అపోస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద కట్టబడి యున్నారుఇప్పుడు ప్రతికట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయముగా వృద్ధిపొందుతుంది. ఆయనలో మీరు కూడా అదే ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారుఇక మూడో అధ్యాయంలో అంటున్నారు ఇదే ఆరణం చేత మీకు సువార్త ప్రకటిస్తూ శ్రమలను అనుభవిస్తున్నానుఅంటున్నారు.

కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు అంతకష్టపడి అన్యజనులనుఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ద్వేషాన్ని సంహరించడానికి బలియాగమై దేవునితో సమాధాన పరిచారు కాబట్టి ఇప్పుడు అన్యజనులనుండి రక్షించబడిన ఎఫెసీయుల కోసం గాని కొలస్సీయులు కోసం గాని రోమా వారి కోసం గాని ఎంతో కన్నీటితో దేవునికి విజ్ఞాపనం చేస్తున్నారు ఏమని అంటే ఆత్మలో బలపడాలి- అపొస్తలుల భోదయందు స్థిరముగా నిలబడాలిఆధ్యాత్మిక విషయాలలో ముందంజ వేసి పరిపూర్ణత సాధించాలి!కారణం  ఒకప్పుడు ఎవరో గాని ఇప్పుడు సంఘాలు అన్ని ఒకే దేవుని చేత- ఒకే తండ్రిచేత ఒకే కుటుంబంగా కట్టబడి ఒకే దేవాలయంగా కట్టబడుతుంది . కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే కుటుంబమంతా బాధపడతారు. కుటుంబంలో ఎవరైనా దొంగగా వ్యభిచారిగా క్రిమినల్ గా మారితే ఇది దొంగల కుటుంబం లేక హంతకుల కుటుంబం లేక వాళ్ళంతా గూండాలు రా అంటారు! అదే కుటుంబమంతా పరిశుద్ధులు పవిత్రులు మాదిరి కరమైన జీవితం గలవారు అయితే వారు పరిశుద్ధులు- దేవుని బిడ్డలు అంటారు కాబట్టి ఇప్పుడు పౌలుగారు  భూమిమీద ఉన్న సార్వత్రిక సంఘములో పాలిబాగస్తులైన అన్ని సంఘాలకోసం, మరియు పరలోకంలో ఉన్న కుటుంబం అయిన పరిశుద్ధులు దేవదూతలు తేజోవాసులుఅందరికి తండ్రియైన ఒకే దేవుని ముందు తండ్రిముందు మోకాళ్ళూని ప్రార్ధన చేస్తున్నారు. కుర్చీలో కూర్చుని, మంచం మీద కూర్చుని లేక మరో భంగిమలో కాకుండా నేలమీద మోకాళ్ళూని ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారు.

 

ప్రియ సంఘమా, విశ్వాసి, సేవకుడా ఇలాంటి ప్రార్ధనా భారం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి! నీకు అలాంటి ప్రార్ధనా భారం ఉందా?

 

నీ కుటుంభంలో ఇంకా ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? నీ ఇరుగుపొరుగు వారు ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? నీ గ్రామస్తులు ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? వారికోసం వారి రక్షణ కోసం ప్రార్ధన చేస్తున్నావా? నీకోసం నీకుటుంబం కోసం పనిచేస్తున్న నీ కాపరి కోసం ప్రార్ధన చేస్తున్నావానీ గ్రామస్తుల రక్షణ కోసం ప్రార్ధన చేస్తున్నావా? నీ గవర్నమెంట్ కోసం, సరిహద్దులలో మనకోసం పహారా కాస్తున్న సైనికుల కోసం ప్రార్దన చేస్తున్నావా?

నేడే అలాంటి ప్రార్ధన భారం పొందుకుని పౌలుగారిలా ప్రార్ధించడం మొదలుపెట్టు!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*31 భాగం*

ఎఫెసీ   :14—19

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఎఫెసీ  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

గమనించాలి మూడో అధ్యాయంలో పౌలుగారు చేసిన ప్రార్ధన- ఆయన చేసిన ప్రార్ధనల అన్నిటిలో తలమానికమైన ప్రార్ధన అని నా ఉద్దేశం!!!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మవలన బలపరచబడాలి....

 

చూశారా ఆయన ప్రార్ధన ఎంతటి శ్రేష్టమైనదో!!! మీరు అత్యధిక ధనవంతులుగా మారిపోవాలి- కార్లు బిల్డింగ్లు ఉన్నవారు కావాలని ఆయన ప్రార్ధన చెయ్యడం లేదు! మీరు అత్యధిక బలవంతులు కావాలని కూడా ప్రార్ధన చెయ్యడం లేదు! మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆత్మవలన బలపరచ బడాలి అంటున్నారు.

వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అంతరంగ పురుషుడు అనేవాడు ఉన్నాడు! వాడు మనకు కనపడడు! బాహ్యపరుషుడు ఉన్నాడు- వాడే మనకు కనిపిస్తున్నాడు! భాహ్యపురుషునికే భోజనం, బిరియాని, హార్లిక్స్, బూస్ట్ ఇంకా బాదం పప్పు, పిస్తా కాజూ ఇలాంటివి ఎన్నో పెట్టి మేపుతున్నాం!!! ఇంకా కొంతమంది జిమ్ కి వెల్లి వ్యాయామం చేసి  సిక్స్ పేక్ కండలు సంపాదిస్తున్నారు. అలా చేయనివారు డబుల్ పేక్ పొట్టలు సంపాదిస్తున్నారు. బాగానే ఉంది!

మరి వచనంలో అంతరంగ పురుషుడు అనేవాడు ఉన్నాడు- అంతరంగ పురుషుని యందు బలపడాలి అంటున్నారు! ఎలా బలపడతాడు అంటే ఆత్మద్వారా బలపడతాడు అని కూడా చెబుతున్నారు! మరి ఆత్మద్వారా అంతరంగ పురుషుని బలం కోసం ఏమేమి వాడాలి? ఏమి చెయ్యాలి?

 

1కొరింథీ 14 అధ్యాయం ప్రకారం అన్యభాషలతో ప్రార్ధన చెయ్యాలి! ప్రవచించాలి! అప్పుడు తన అంతరంగ పురుషుడు క్షేమాభివృద్ధి చెందుతాడు.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:4,12,14,15

 

4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

14. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.

15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

ఇక తర్వాత: ఉపవాస ప్రార్ధనలో గడపాలి! ఉపవాసం అనగా దేవునితో సహవాసం!!! దేవునితో సహవాసం చేస్తూ- ఉపవాసం ఉంటే నీ అంతరంగ పురుషుడు బలపడతాడు!

లూకా సువార్త 4:1 లో యేసు ప్రరిశుద్దాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగివచ్చి... అంటూ రాస్తున్నారు. యోర్దానులో బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణత సాధించారు యేసయ్య! గాని పరిశుద్ధాత్మ బలము ఎప్పుడు వచ్చింది అంటే 40 రోజులు ఆయన ఉపవాసం చేసిన తర్వాత మాత్రమే!  40 రోజులు ఉపవాసం ఎప్పుడు చేశారో- వెంటనే సాతాను గాడు శోధించాడు- ఆశోధన జయించిన తర్వాత 4:14 లో అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని చెప్పడం జరిగింది! ఆత్మలో బలపడాలి, అంతరంగ పురుషునియందు శక్తిని బలమును సాధించాలి అంటే ఉపవాస ప్రార్ధన తప్పకుండా చెయ్యాలి!

 

ఇక 2కొరింథీ 4 అధ్యాయం ప్రకారం:

మొదటగా సువార్తను ప్రకటించాలి; రెండవదిగా క్రీస్తుతో పాటుగా క్రీస్తు మరణానుభావమును కలిగి ఉండి, శ్రమలను సహించాలి. అప్పుడు బాహ్యపురుషుడు కృశించిపోతాడు గాని అంతరంగ పురుషుడు ఎంతో బలపడతాడు! 4:6,10—11,16

 

6. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

10. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.

11. ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.

16. కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.

 

ఇంకా  దృశ్యమైన వాటియందు లక్ష్యముంచక అదృశ్యమైన వాటిమీద లక్ష్యం ఉంచాలి, అనగా పరలోక సంబంధమైన వాటియందు ధ్యానం ఉంచి వాటికోసం పరుగులెడితే అంతరంగపురుషుడు బలపడతాడు ఆత్మద్వారా! 17 వచనం.

 

తరువాత వాక్య పఠనం చేస్తూ వాక్యమందు బలపడితే విశ్వాసమందు స్థిరపడతాము.

దీనికోసం అనేక వచనాలు ఉన్నాయి

అయితే కేవలం రెండు చూద్దాం

కీర్తనలు 119: 50

నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

మార్కు 4: 20

మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.

 

 చివరగా ఇది స్త్రీలకోసం చెప్పబడినా పురుషులకు కూడా వర్తిస్తుంది: సాదువైనట్టియు మృదువైనట్టియు స్వభావం కలిగి ఉండాలి 1పేతురు :4

1పేతురు 3: 4

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

 

లోకపు ఆశలయందు కోరికల యందు కాక సాదువైనట్టి మృదువైనట్టి మనస్సు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి.

 

కాబట్టి ఆయన ఆత్మను కలిగి ఆయన ఆత్మలో బలపడుతూ ఉపవాస మందును సహవాసమందును అన్యభాషలు మాట్లాడుట యందును అభ్యాసం కలిగి ఉంటే ఆప్పుడు అంతరంగ పురుషుడు అత్మద్వారా బలపడతాడు! ఇదే పౌలుగారి ప్రార్ధన!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*32 భాగం*

ఎఫెసీ   :14—19

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఎఫెసీ  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివశించునట్లు గాను....

 

పౌలుగారి ప్రార్ధనలలో మరో ప్రాముఖ్యమైన విషయం ఇది. క్రీస్తు మీ హృదయములలో నివశించాలి- అయితే ఇది ఎలా సాధ్యం అంటే అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనిషి  హృదయం సాతాను మరమ్మత్తు శాల/వర్క్ షాప్ అన్నాడు ఒక కవి! బైబిల్ చెబుతుంది- మనిషి హృదయంలో అనేక ఆలోచనలు పుడుతుంటాయి. వాటిలో అనగా ఆలోచనలలో చాలా కొన్ని మాత్రమే  దేవుని కోసం ఉంటాయి. బహుశా 2%. అయితే మనిషి హృదయంలో దేవుడు నివశించాలని దేవుని కోరిక! నీ హృదయం మరియు దేహము ఆయన దేవాలయముగా ఉండాలని దేవుని కోరిక!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:16,17

 

16. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆలయమైయున్నారు (లేక-మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

 ఎఫెసీ 2 అధ్యాయంలో ప్రతీ విశ్వాసి దేవునికి ఆత్మ సంబంధమైన కట్టడముగా కట్టబడుచున్నాడు అని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు 2: 22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

అయితే నీ హృదయము దగ్గరకు వచ్చి అయన తట్టుచున్నాడు- తలుపు తీయమని!!... తలుపు తీసి ఆయనను లోపలికి ఆహ్వానిస్తే ఆయన నీతో కలిసి భోజనం కూడా చేస్తాను అంటున్నారు.

ప్రకటన గ్రంథం 3: 20

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

 

నీతో గడపాలని-నీవు చెప్పేవి అన్ని వినాలని- ఆయన చెప్పేవి అన్నీ నీవు వినాలని- నీతో సహవాసం చెయ్యాలని దేవుని తపన! అయితే నీవు దేవుణ్ణి హృదయములోనికి రానియ్యడం లేదు!ఆయన నీ తలుపు తడుతున్నారు!

పరమ గీతంలో శూలమ్మితిని కూడా దేవుడు తలుపు తీయమని తలుపు తట్టితే ఆమె తీయలేదు! చూసి చూసి-తట్టి తట్టి ఆయన వెళ్ళిపోయినా తర్వాత ఆమెకు జాలికలిగి తలుపు తీసేసరికి ఆయన వెళ్లిపోయినట్లు చూడగలము! తర్వాత ఆమె పట్టణమంతా గాలించినట్లు పట్టాన కావలివారు ఆమెను కొట్టి ఆమె వస్త్రములు లాక్కునట్లు చూడగలము!...

Song of Solomon(పరమగీతము) 5:2,3,4,5,6,7

 

2. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.

3. నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?

4. తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.

5. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను

6. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు.

7. పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.

 

ప్రియుడు తలుపు తట్టినప్పుడు తలుపు తీస్తే ఆమెకు పాట్లు ఉండేవి కావు కదా! నీవు కూడా ఆయన సమీపముగా నీ హృదయము బయట నీ తలుపు దగ్గర ఉంది తట్టుచున్నారు- మరి నీవు తీస్తావా??? యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడే వేడుకొనుడి అంటున్నారు....

యెషయా 55: 6

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

 

మరి నీవు ఇప్పుడు అడుగుతావా ఆయనను ఆహ్వానిస్తావా నీ హృదయము లోనికి!

ఆహ్వానించిన తర్వాత ఆయన నీ హృదయములో నివసించాలి అంటే అది కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. క్రైస్తవ జీవితం మొదలయ్యేది విశ్వాసంతో! అంతమయ్యేది విశ్వాసముతోనే! ఆదినుండి అంతము వరకు విశ్వాసము ద్వారానే క్రైస్తవ జీవితం సాగుతుంది. అందుకే ఎఫెసీ 2:8 లో అంటున్నారు....

ఎఫెసీయులకు 2: 8

మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

 

అసలు విశ్వాసం ద్వారానే దేవుని మీద నీకు నమ్మకం కలుగుతుంది రోమా 1:17

 

ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

 

కొలస్సీ 2:6,7

6. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

7. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.

 

కాబట్టి అలా పొందుకున్న విశ్వాసాన్ని- దేవుని మీద నమ్మకాన్ని దృడంగా కొనసాగిస్తే దేవుడు మన హృదయాన్ని తనకు ఇల్లుగా ఎంచి మన ఇల్లంతటిలో కాపురం ఉంటాడు! ఏదో పెదాల మీద పప్పలు వండినట్లు దేవా నాహృదయంలో మీరు ఉండండి! గృహానికి మీరే అధిపతిగా ఉండండి అంటూ నీ తప్పుడు ఆలోచనలతోసినిమాలు- సీరియల్లు- లోకపు తలంపులతో నీవుంటే ఆయన నీ హృదయంలో ఉండలేరు! నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారం నకు ఒప్పుకొనుము అంటున్నారు...

సామెతలు 3: 6

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

 

ఏదో కొంతకాదు సంపూర్తిగా ఒప్పుకోవాలి ! అంతేకాకుండా నీ ఇంటి మొత్తంమీద ఆయను అధికారం ఇవ్వాలి! ప్రభువా! నీవు ప్రార్ధనా గదిలోనే ఉండండి- మా బెడ్ రూమ్ లోనికి రావద్దు అనకూడదు! దేవా ఇల్లంతటికి అధిపతిగా మీరే ఉండండి. నీవున్న గృహంలో నన్ను కూడా ఉండనీయండి అని గృహం మీద అధికారం ఆయనకు ఇచ్చేస్తే అప్పుడు నీ హృదయాన్ని ఆయన పాలిస్తారు! అప్పుడు నీ హృదయంలో ఎటువంటి పాపపు/తప్పుడు తలంపులు కలిగినా పారద్రోలుతారు! నీ గృహాన్ని ఆక్రమిద్దామని వస్తున్న ప్రతీ దురాత్మను దేవుని అగ్ని కొరడాతో తరుముతారుఅలా ఆయనకు పూర్తిగా అధికారం ఇవ్వడమే ఆయనకు ఇష్టము!!!

 

అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే క్రీస్తు మీ హృదయాలలో కేవలం ఆత్మద్వారానే మరియు విశ్వాసం ద్వారానే నివశించ గలరు

Romans(రోమీయులకు) 8:9,10,11,13,14

 

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.

11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.

13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

కాబట్టి ఆయన ఆత్మతో మనం నింపబడి నప్పుడు దేవుడు మనలో నివశిస్తారు! అప్పుడు పుష్కలమైన విశ్వాసం మన హృదయంలో నిండి ఉంటుంది.

అందుకే పౌలుగారు  2కొరింథీ 13:5 లో అంటున్నారు మీరు విశ్వాసం గలవారో లేదో మిమ్మును మీరే పరీక్షించు కొండి!!!...

కారణం మీరు దేవుని పోలిక లో ఉన్నారు ....కొలస్సీ :10

మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.

 

యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు కనుక ఇది సాధ్యపడుతుంది. అందుకే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివశించేలాగున ప్రార్ధన చేస్తున్నారు. విశ్వాసి హృదయాలలో క్రీస్తు మరింత పరిపూర్ణంగా జీవిస్తూ ఉండాలని పౌలుగారి కోరిక! ఆయన అంటున్నారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను కాబట్టి ఇప్పుడు జీవించేది నేను కాదు- క్రీస్తే నాలో జీవిస్తున్నాడు!....

అది విశ్వాసం వలెనే సాధ్యమవుతుంది అంటున్నారు.

 

గలతియులకు 2: 20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

 

యోహాను 14: 23

యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.

 

అయితే విచారం ఏమిటంటే క్రీస్తు మనలో ఉన్నా నేటిదినాలలో ఆయనకు సంపూర్ణ అధికారం ఇవ్వకుండా ఏదో ఒక చిన్నగదికి /కొన్నింటికి మాత్రమే పరిమితం చేస్తున్నాము! *ఆయనను గృహానికి అధిపతిగా చెయ్యాల్సింది పోయి- గృహానికి అతిధిలా ఉంచుతున్నాము*. అందుకే మనం జయజీవితం సాధించలేక పోతున్నాము! అందుకే సంపూర్ణత సాధించలేక పోతున్నాము! అందుకే సైతాను చేతిలో ఓడిపోతున్నాము! మన తలంపులు పాపపు కోరికలు మనలను ఏలుతున్నాయి. తద్వారా పరోక్షంగా సాతాను గాడు మనలను ఏలుతున్నాడు!

అయితే దేవుడు మన ఇల్లంతటినీ మన అంతరంగంలో ప్రతీ భాగాన్ని స్వాధీనం చేసుకోవడం దేవునికి ఇష్టం! మన ఇంటికి మనమే యజమానిగా ఉండే ప్రయత్నం చేయకూడదు! మన హృదయానికి  మనజీవితనికి ఆయనే రారాజుగా ఉండాలి! ఇది కేవలం నీవు ఆత్మ పొందుకుని ఆత్మానుసారంగా జీవిస్తేనే సాధ్యము తప్ప- నీకు నీవుగా ఇలా ఉండలేవు!!!

అలా చేయాలంటే నీవు దేవుని పట్ల ఎంతో విధేయతగా వినయంగా ప్రేమపూర్వకంగా ఉండాలి. నిన్నునీవు ఆయన చేతులలోనికి అప్పగించుకోవాలి! నాదంటూ ఏమీ లేదు-ఏదైనా ఉంటే నీవిచ్చినదే! నీకు నచ్చినట్లు నన్ను మలుచుకో! నీకు నచ్చినట్లు నన్ను వాడుకో! నీవు ఎవరినైనా వాడుకోవాలంటే ఎవరో- నేనే కావాలి ప్రభువా! నన్ను కూడా వాడుకో- అని దేవునికి అణిగిమణిగి ఉండి ఆయనకు నిన్నునీవు అప్పగించుకుంటే అప్పుడే దేవుడు నీ హృదయంలో స్థిర నివాసం చేస్తారు!

 

మరినీవు  నీ హృదయాన్ని ప్రభువుకు ఇస్తావా?

ఆయనను నిన్ను ఏలడానికి ఇష్టపడతావా?

ఆయన నీ తలుపు దగ్గర తట్టుచున్నారు! మరి నీ తలుపు తీస్తావా?

అయితే నేడే క్షణంలోనే నీలోనికి వచ్చి నీతో సహవాసం చేస్తూ నిన్ను ఏలడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు!

దైవాశీస్సులు!        

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*33 భాగం*

ఎఫెసీ   :14—19

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఎఫెసీ  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని....

 

తన మహిమైశ్వర్యము చొప్పున ఏమి దయచేయాలి???

 

మొదటగా: ఆయన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను దయచేయువాడు.......

లూకా 11: 13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి?

1).నిన్ను సర్వసత్యము లోనికి నడిపించడానికి...

యోహాను 16: 13

అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

 

2. నీకు ఎలా ప్రార్ధన చెయ్యాలో నీకు తెలియదు కనుక నీకు ప్రార్ధన నేర్పించడానికి- నీకు బదులుగా ప్రార్ధన చెయ్యడానికి ...

రోమీయులకు 8: 26

అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

 

. ఆయనాత్మ లేనివాడు ఆయన వాడు కాదుఆయన వాడు కాదు అంటే సాతాను గాడి గ్రూపు- కాబట్టి ఆయన వారిగా ఉంటూ ఆయన స్వాస్త్యానికి వారసులుగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి....

Romans(రోమీయులకు) 8:9,10,11,13,14

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.

11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.

13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

రెండు: అడుగుడి మీకివ్వబడును- తట్టుడి మీకు తీయబడును- వెదకుడి మీకు దొరకును అని వాగ్దానం చేశారుకాబట్టి మనకు ఏఏ అవసరాలు ఉన్నాయో ఆయా అవసరాలుతన మహిమైశ్వర్యం చొప్పున దేవుడు దయచేయాలని.....

మత్తయి 7: 7

అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

మత్తయి 7: 8

అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.

మత్తయి 7: 11

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.

 

ఫిలిప్పీయులకు 4: 19

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

 

ఎఫెసీ 1:18 లో ఆయన ప్రార్ధనలో అంటున్నారు ఆయన మహిమగల వారసత్వము ఎంత ఐశ్వర్యవంతమైనదో- ఎరిగి దానిని పొందుకోవాలి

 

యోహాను గారు అంటున్నారు ప్రియుడా నీవు అన్ని విషయాలలోనూ వర్ధిల్లాలి ...

3యోహాను 1: 2

ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

అనగా ఆత్మీయముగాను, ఆధ్యాత్మికముగాను మరియు అర్దికముగాను, ఆరోగ్యముగాను  అన్ని విషయాలలో వర్ధిల్లాలి!

 

అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ప్రజలకు కేవలం ఆశీర్వాదాలు కావాలి విధులు అవసరం లేదు! ప్రజలకు సంపూర్ణత సాధించాలి అనే ఉద్దేశం ఎంతో ఉంది గాని సంపూర్ణత సాధించాలి అంటే శ్రమల ద్వారానే సంపూర్ణత సాధించాలిప్రజలకు శ్రమలు లేకుండా సంపూర్ణత సాధించలేరు!

 

అర్ధమయ్యేలా చెబుతాను! దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన అవసరాలు తీర్చడానికి మనలను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే నీవు చెయ్యాల్సింది కూడా ఉంది!

ప్రజలకు హక్కులతో పాటుగా విధులు ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా మొదట దేవుడు చెప్పినవి చేస్తేనే దేవుడు వాగ్దానం చేసినవి మనకు ఇస్తారు!

 

ఉదాహరణ: 1. ప్రతీ కుమారునికి తండ్రి ఆస్తిమీద ఎలా హక్కు ఉందో- అలాగే తండ్రి అప్పుచేసి చనిపోతే తీర్చే విధి కూడా ఉంది!

 

2. ప్రతీ భారతీయ పౌరునికి రాజ్యాంగం ద్వారా వాక్ స్వాతంత్ర్యం హక్కు, స్వేచ్చహక్కు, ఆస్తిహక్కు, ఓటుహక్కు , మత స్వాతంత్ర్యం హక్కు ఎలా ఉన్నాయో అలాగే ప్రభుత్వ ఆస్తులు కాపాడటం, శాంతి భద్రతలకు సహకరించడం, ఓటుహక్కు వినియోగించుకోవడం లాంటి విధులు కూడా ఉన్నాయి!

 

అలాగే దేవుడు తన మహిమైశ్వర్వ్యం చొప్పున మన ప్రతీ అవసరాలను తీర్చడానికి, అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు!!! *ఎప్పుడు అంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని నీవు వెదకాలి*!

మత్తయి 6: 33

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

అందుకోసం ప్రయత్నం చేయాలి! ఆయన యందు నమ్మకముంచి నమ్మకముగా కనిపెట్టాలి! ఆయనకు ఇవ్వాల్సినవి అనగా ఆయనకు ఇవ్వాల్సిన సమయం, ఆయనకు ఇవ్వాల్సిన ధనము అన్ని ఆయనకు ఇవ్వాలి! ఆయన రాజ్యవ్యాప్తికి ప్రయత్నం చెయ్యాలి! అప్పుడు నీకు ఏమి కావాలో అడుగు- అన్నీ నీకు అనుగ్రహించ బడతాయి!

 

మనకు ఏమి కావాలి అనేది మన పరమ తండ్రికి బాగా తెలుసు!

కాబట్టి ఆయననుండి ఆశిస్తున్న నీవు ఆయన రాజ్యమును ఆయనన నీతిని వెదికి వాటిని వెంటాడు! అప్పుడు నీకు కావలసినవి అన్నీ దేవుడు ఇస్తారు!

ఇదే పౌలుగారి ప్రార్ధన!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*34 భాగం*

ఎఫెసీ   :14—19

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఎఫెసీ  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ......

 

మాట చాలా జాగ్రత్తగా గమనించాలి- సంపూర్ణత యందు పూర్ణులు కావాలి అని ప్రార్ధన చేస్తున్నారు పౌలుగారు! సంపూర్ణత కోసం గతంలో మా ఆధ్యాత్మిక సందేశాలు అన్ని సిరీస్ లో చెప్పడం జరిగిండ్. విశ్వాసి- జయజీవితం జీవించి క్రీస్తుయేసుకు వలే సంపూర్ణత సాధించాలి. అప్పుడే ఎత్తబడే గుంపులో ప్రత్యేకమైన గుంపులో ఉంటావు! అయితే సంపూర్ణత అనేది కేవలం శ్రమలద్వారానే సాధించగలము! శ్రమలను సహించి జయించిన తర్వాతనే సంపూర్ణత సాధించగలము!

 

2థెస్సలొనికయులకు 1: 5

దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

 

యాకోబు 2:5

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

 

అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే *తన మహిమకు మనలను పిలుచుకున్నారు గాని ఒక మెలిక (ట్విస్ట్ ఉంది)!*

మెలిక అర్ధం చేసుకోవాలి అంటే రోమా 8:17 చూసుకోవాలి! ...

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

    ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం సంతానమైతే   వారసులం అంటూ వారసులం అయితే క్రీస్తుతో పాటుగా మహిమను అనుభవించడానికి  శ్రమలను అనుభవించాలి అన్నమాట! మర్మాన్ని గ్రహించాలి! కేవలం ఆశీర్వాదాలు, దీవెనలు, మహిమ మాత్రమే కావాలి గాని ఆయన శ్రమలు వద్దు అంటే కుదరదు! శ్రమలను అనుభవిస్తేనే నీకు మహిమ దీవెనలు అన్నీ చెందుతాయి! ఇప్పుడు వారసుడు అంటే తండ్రి ఆస్తి మాత్రమే కాకుండా తండ్రికున్న అప్పులు కూడా పంచుకోవాలి లేక అప్పులు కూడా వారసత్వంగా వస్తాయి! అప్పులే కాదు కొన్ని భాద్యతలు కూడా ఉంటాయి! కేవలం హక్కులు మాత్రమే కావాలి భాద్యతలు వద్దు అంటే కోర్టు బయటకు పొమ్మంటాది ఇది కూడా అంతే!

 

సరే, *ఇంతకీ మహిమలోకి వెళ్ళడానికి శోధనలు శ్రమలు ఎందుకు అవసరం?* జవాబు సింపుల్!

హెబ్రీ 2:10 ప్రకారం శ్రమ ద్వారానే సంపూర్ణతలోనికి ప్రవేశించగలము..

 

     అనగా మహిమలోనికి రావాలి అంటే మొదటగా శ్రమలను అనుభవించాలి, శ్రమలు నిన్ను సంపూర్ణులుగా చేస్తుంది! సంపూర్ణత నిన్ను మహిమలోనికి రప్పిస్తుంది అన్నమాట!

ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే ఈ హెబ్రీ 2:10,11 లో అంటున్నారు

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ...

 

 యేసుక్రీస్తుప్రభులవారు మనలను విమోచించడానికి మొదటగా తాను సంపూర్ణత సాధించారు! అలా సంపూర్ణత సాధించడానికి మొదటగా ఆయన శ్రమల ద్వారానే సంపూర్ణత సాధించారు! కాబట్టి 11 వచనం ప్రకారం పరిశుద్ధ పరచేవారికి అనగా యేసుక్రీస్తుప్రభులవారికి,  పరిశుద్ద పరచబడే వారికి అనగా మనకు కూడా ఒక్కటే సిద్దాంతం అంటున్నారు! ఇప్పుడు మరలా మనం పదో వచనం చూసుకుంటే అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశారు దేవుడు అన్నారు! దీనిని బట్టి సంపూర్ణత సాధించడానికి యేసుక్రీస్తుప్రభులవారు ఎలా శ్రమల మార్గమున వెళ్ళారో అలాగే మనము కూడా సంపూర్ణత సాధించడానికి శ్రమల మార్గము లోనే వెళ్ళాలి! మరో షార్ట్ కట్ లేనేలేదు! శ్రమల ద్వారా సంపూర్ణత సాధించి సంపూర్ణత ద్వారానే మనము మహిమ పొందగలము అన్నమాట! ఇదంతా దేవుని రక్షణ ప్రణాళికలో భాగము అని మర్చిపోవద్దు! దీవెనలు ఆశీర్వాదాలతో పాటుగా శ్రమలు కూడా రక్షణ ప్రణాళికలో భాగమే అని గుర్తించాలి!

 

  పౌలుగారు మసిపూసి మారేడు కాయ చేసి ఎవరికి సువార్త ప్రకటించడం లేదు! ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి వారిని క్రైస్తవులుగా చేయలేదు పౌలుగారు! మనము శ్రమలు అనుభవించవలసి యున్నది అని మీకు ముందుగానే చెప్పాము కదా! అలాగే జరుగుతుంది అంటున్నారు థెస్సలోనికయ పత్రికలో...!

1థెస్సలొనికయులకు 3: 3

మనము శ్రమను అనుభవింపవలసి యున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

1థెస్సలొనికయులకు 3: 4

అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

 

 అనగా పౌలుగారి త్రయం వారికి ముందుగానే చెప్పారుయేసయ్యను నమ్ముకోవడం, ఆయనను అనుసరించడం ఆషామాషీ కాదు! ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించి మనం పరలోకం వెళ్ళాలి అని ముందుగానే చెప్పారు! నేడు చాలామంది యేసుక్రీస్తుప్రభులవారిని నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి! అనీ సుఖాలే! మీకు ఇల్లు కార్లు బంగళాలు అన్నీ వచ్చేస్తాయి! ఒకనాడు నాకు ఏమీ ఉండేది కాదు ఇప్పుడు అన్నీ ఇచ్చారు దేవుడు అనిచెప్పి  వారిని మోసం చేస్తున్నారు! ఇది తప్పు! యేసయ్య ను నమ్ముకుంటే కష్టాలు ఇంకా పెరిగిపోతాయి! అవును ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి తనను నమ్మినవారిని ఆశీర్వదించే దేవుడు కాబట్టి భౌగోళిక ఆశీర్వాదాలు ఇస్తారు గాని దానికన్నా ముందుగా లోకంలో శ్రమలు పడక తప్పదు! యేసుక్రీస్తు ప్రభులవారే శ్రమలను అనుభవించినప్పుడు మనము కూడా శ్రమలను అనుభవించవలసినదే!

 

   యేసుక్రీస్తుప్రభులవారు తన శిష్యులను మోసం చెయ్యలేదు! యోహాను 16:౩౩లో ముందుగానే చెప్పారు నా శాంతినే మీకు ఇస్తున్నాను లోకంలో మీకు శ్రమలు కలుగును అయినా ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను అన్నారు! అలాగే ఆయనకు శ్రమలు కలిగాయి శిష్యులకు కూడా శ్రమలు విస్తరించాయి!

 

             ఇక శిష్యులు కూడా ఆదిమ సంఘాన్ని మోసం చెయ్యలేదు! అపో 14:22 లో చెబుతున్నారు శిష్యులను స్థిరపరచి విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉండమని చెపి అనేకమైన శ్రమలు భాధలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ముందుగానే చెప్పారు!

 

విషయం పౌలుగారు కూడా థెస్సలోనికయులకు ముందుగానే చెప్పాను అని గుర్తుచేస్తున్నారు! మరీ ఘోరమైన మాట ఏమిటంటే అట్టి శ్రమలను అనుభవించడానికే మనము నియమిచబడ్డాము! అవును క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారికి  శ్రమలు కలుగును అని వాక్యం ముందుగానే చెప్పింది! 2తిమోతికి 3: 12

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

 

 అయితే ఇక్కడ  ఒక మెలిక ఉంది! ఎవరైతే సద్భక్తితో బ్రతకాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే శ్రమలు! నలుగురితో ........ కులంతో ........ అన్న వారికి ఏమీ కష్టాలు రావు! ఎవరైతే మంచిగా భక్తిలో దేవునిలో సాగుతారో వారికే శ్రమలు కలుగుతాయి! ఇంకా చెప్పాలంటే పరలోకం పోయే గుంపులో ఉన్నవారికి ఎన్నెన్నో శోధనలు కలుగుతాయి! ఎవరికైతే శ్రమలు శోధనలు కలగడం లేదో వారికీ నరకం బాచ్ అన్నమాట!

 

ఇది చదువుతున్న ప్రియ స్నేహితుడా! నీకు శ్రమలు శోధనలు కలుగుతున్నాయా చింతపడకు! నీవు పరలోకం పోయే గుంపులో ఉన్నావు కాబట్టి నీకు ఇవి కలుగుతాయి! ఇవి కొన్ని రోజులు మాత్రమే అని మరచిపోకు!

 

పేతురు గారు కూడా రాస్తున్నారు 1 Peter(మొదటి పేతురు) 4:1,2,12,13,14

 

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

 

చూశారా యేసుక్రీస్తుప్రభులవారు శ్రమలు అనుభవించారు కాబట్టి మనము కూడా ఆయనలాగే శ్రమలు అనుభవిద్దాము అంటున్నారు! ఇంకా మీకేదో విపరీతం జరుగుతుంది అనుకోవద్దు అంటున్నారు! ఇది కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే అని తెలుసుకోండి అంటున్నారు! థెస్సలోనికయులకు ముందుగానే చెప్పారు పౌలుగారు! 2:14 లో అంటున్నారు మీకు ముందుగా ఉన్న సంఘాలలో ముఖ్యంగా యూదయలో ఉన్న సంఘాలకు అలాగే జరిగింది! మీరు కూడా సంఘాలను పోలి శ్రమల బాటలో నడుస్తున్నారు అది మంచిదే అంటున్నారు!

 

   కాబట్టి ప్రియ విశ్వాసి/ దైవజనుడా! శ్రమలలో సంతోషించు! శ్రమల ద్వారానే మనము సంపూర్ణులుగా మారతాము! క్రీస్తు రూపంలో కి మారాలి అంటే కేవలం శ్రమల మార్గమే ఉంది! మరో షార్ట్ కట్ లేనేలేదు!  విశ్వాసులారా! భయపడకండి! శ్రమలను సహిస్తూ ఆయనకు తగినట్లుగా ఆయన బాటలో సాగిపోదాము! శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడ్డాము నియమించబడ్డాము కాబట్టి మార్గములోనే సాగిపోయి మన గమ్యస్తానమైన పరలోకం చేరుదాం!

 

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*35 భాగం*

ఎఫెసీ   :14—19

14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఎఫెసీ  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్ధన చేయుచున్నాను...

 

చూశారా ఎంత మహత్తర మైన ప్రార్ధనా అంశమో!!!! గతభాగంలో దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అంటూ మొదలుపెట్టారుసంపూర్ణత సాధించాలి అంటే మొదటి మెట్టు క్రీస్తుతో పాటుగా శ్రమలను సహించి జయించాలి అని నేర్చుకున్నాము! ఇక మరో మెట్టు సంపూర్ణతకు ప్రేమయందు వేరు పారాలి! అంతేనా దానితో పాటుగా సమస్తపరిశుద్ధులతో కూడా దాని లోతు వెడల్పు ఎత్తు పొడవు గ్రహించాలి అంటున్నారు!!!

ఏమండి ప్రేమకు లోతు ఎత్తు పొడవు వెడల్పు ఉంటాయా? దానిని కొలబద్ద లేక మేజరింగ్ టేప్ తో కొలవగలమా? అంటే బైబిల్ ప్రకారం వచనం ప్రకారం కొలవగలము! ఎలా అనేది భాగంలో నేర్చుకుందాం! ప్రార్ధన ఇంతటితో అయిపోలేదు- జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు తగిన శక్తి గలవారు కావాలి అని ప్రార్ధన చేస్తున్నారు!

 

మొదటగా మీరు ప్రేమయందు వేరు పారాలని కోరుకుంటున్నారు. వేరు పారడం అనగా ప్రేమలో పాతుకుని స్థిరపడి ఉండాలని! అంటే డీప్ లవ్ లో అనగా గాఢమైన ప్రేమలో ఉండాలి- ఎవరితో? మొదట క్రీస్తుయేసుతో!

రెండవదిగా సమస్త పరిశుద్ధులతో!!!

 

అది ఎలా సాధ్యం?

యేసుక్రీస్తుప్రభులవారికి- విశ్వాసికి గల సంబంధం ప్రేమ! ఆయన మనలను ఎంతో ప్రేమించారు! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతీవాడును నశించక నిత్యజీవము పొందునట్లుగా ఆయనను అనగా క్రీస్తును లోకమునకు అనగా మనకు అనుగ్రహించెను. యోహాను :16

 

పౌలుగారు ఇంకా లోతుగా చెబుతున్నారు: ఆయన దేవుడై ఉండి కూడా పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్ట కూడని భాగ్యం అని ఎంచకుండా మనలను ప్రేమించి మనకోసం వచ్చారు. ఎంతగా ప్రేమించారు అంటే సిలువమరణం పొందునంతగా మనలను ప్రేమించి తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మనకోసం బలియాగం అయ్యారు....

Philippians(ఫిలిప్పీయులకు) 2:6,7,8

 

6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

 

ఇదీ నిజమైన గాఢమైన ప్రేమ! డీప్ లవ్ అంటే ఇదీ!

 

యేసయ్య లోకంలో ఉన్నప్పుడు అంటున్నారు- తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టువాడికంటే గొప్పవాడు లేడు. నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను అన్నారు- ప్రాణం పెట్టారు! రక్తం కార్చారు! మనలను విమోచించారు!....

John(యోహాను సువార్త) 15:12,13,14

12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ

13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.

14. నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.

 

సరే, ఆయన దేవుడు- మనలను ప్రేమించారు- మనకోసం బలిగా అర్పించబడి మనలను విమోచించారు. బాగుంది! మరి మనము ఆయనను ఎలా ప్రేమించగలము? మనము కూడా ఆయన కోసం ప్రాణం పెట్టాలా? అవసరమైతే పెట్టాలి గాని క్రీస్తు కోరుకొనినదిఅంతవరకూ కాదు! చాలా సులువు ఆయనను ప్రేమించడం అంటే! అది ఎలాగో ఆయనే చెప్పారు యోహాను సువార్త 14:23—24 లో ..

John(యోహాను సువార్త) 14:21,23,24

21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచు కొందునని చెప్పెను.

23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.

24. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.

 

అంటే ఆయనను ప్రేమించడం అంటే ఆయన చెప్పినట్లు చేయడం అంతే!!! నిజం చెప్పాలంటే దేవుడంటే మనలో ప్రతీవారికి చచ్చేటంత ప్రేమ ఉంది! గాని ఆయన చెప్పినవి చెయ్యాలంటేనే ప్రాణం పోతుంది! చప్పిడి పత్యం చెయ్యడం అంటే- లోకానుసారముగా జీవించకూడదు అంటే ఏదో ఏదేదో అయిపోతుంటుంది మనకు! కుడుతులో పడిన ఎలకలా మారిపోతుంది మన జీవితం/ మన హృదయం! గాని దేవుడు కోరుకునేది మన ఆస్తిపాస్తులు మన ప్రాణాలు కాదు! ఆయన చెప్పినట్లు చేసిమనిషి- మనిషికి ప్రేమను పంచాలి! అంతే! సాటిమనిషిని ప్రేమించాలి! ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించాలి! అంతే! ఇదే చెబుతున్నారు దేవుడు.

ద్వితీ 10:12—13..

12.​ కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,

13. నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?

 

మీకా 6:8....

మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

 

ఇంతకంటే ఎక్కువ ఆయన నీనుండి కోరడం లేదు! ఇవి చేస్తె ఆయనను ప్రేమించినట్లే! ఆయన ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు పొడవు తెలుసుకొన్నట్లే! మరి నీవు తెలుసుకున్నావా ప్రియ స్నేహితుడా!!!

 

పౌలుగారు కొరింథీ పత్రికలో శ్రేష్టమైనవి ఏమిటో చెబుతూ అంటున్నారు విశ్వాసము, నిరీక్షణ ప్రేమ నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నారు 1కొరింథీ 13:13..

మన తెలుగు బైబిల్ లో ప్రేమ అని తర్జుమా చేయబడినా అనిక ప్రతులలో దైవిక ప్రేమ అని వ్రాయబడింది! దైవిక ప్రేమ చివరివరకు నిలుస్తుంది! మనలను ప్రేమించి మనకొరకు ప్రాణం పెట్టునంతగా మనలను ప్రేమించింది. అలాగే అదే ప్రేమ మనము కూడా పొందుకుని దేవుణ్ణి ప్రేమించడమే కాదు సాటి మనిషిని కూడా ప్రేమించాలి! క్రైస్తవ జీవితానికి విశ్వాసము, ప్రేమ నిరీక్షణ ఎంతో ముఖ్యమైనవి. విశ్వాసము మనలను దేవుని మీద నమ్మకముంచేలా చేస్తుంది. నిరీక్షణ దేవుడు ఉన్నాడు ఆయన మనలను ఆదుకుంటాడు/ ఒకరోజు ఆయనతో కలిసి ఉంటామనే ధైర్యం పుట్టిస్తుంది. అయితే ప్రేమ దేవునికోసం ఏదైనా ఇవ్వమని ప్రేరేపిస్తుంది. అవసరమైతే దేవుని కోసం చనిపోమని చెబుతుంది. సాటిమనిషిని దేవుణ్ణి ప్రేమించినట్లే ప్రేమించమంటుంది. అవతలి వ్యక్తి మనకు హాని చేసినా క్షమించమని బలవంతం చేస్తుంది. తద్వారా మనుషుల మధ్యలో ఉన్న కక్షలను ద్వేషాన్ని తీసివేసి ప్రేమను పంచి దేవుని సన్నిధిని తీసుకుని వస్తుంది! అందుకే ప్రేమయేదైవిక ప్రేమయే శ్రేష్టమైనది! దేవుడు మనపై చూపినది ఆగాపే ప్రేమ! అది స్వార్ధం లేని ప్రేమ!

1యోహాను 4:7

ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

 

రోమా 5:5

ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

ప్రేమ దేవుని నుండి వస్తుంది. ప్రేమకు లొంగి విశ్వాసులు దానిని ఆచరణలో పెట్టాలి! అదే ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడవు వెడల్పు తెలుసుకోవడం!

దీనిలో విశ్వాసులు వేరు తన్ని పాతుకుని ఎదగాలి అంటున్నారు మంచినేల మీద పడిన విత్తనాల వలే! బలమైన పునాది మీద కట్టబడాలి ప్రేమలో బండమీద కట్టబడిన ఇంటివలె! అప్పుడే ఆయన ప్రేమ యొక్క లోతు ఎత్తు తెలుసుకోవడం!!

 

క్రీస్తు ప్రేమను ఎరగడం విశ్వాసులలో ప్రేమను పుట్టిస్తుంది.

1యోహాను ౩:16

ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

 

1 John(మొదటి యోహాను) 4:8,9,10,11,12,18,19,20

8. దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

9. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ (ఒక్కడే,కుమారుడుగా) కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.

11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.

12. మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.

18. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.

19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.

20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (ఎట్లు ప్రేమింప గలడు?)

 

అందువలన ఆయన ప్రేమలో పాతుకుని స్థిరపడేలా చేసి- ఆయన ప్రేమ ఎంత గొప్పదో కొంతవరకైనా గ్రహించగలము!

క్రీస్తు ప్రేమ భూమికంటే వెడల్పైనది! దానికి కొలవలేము! ఆయన ప్రేమ మనం చేతులతో లేక మరో సాధనంతో కొలిచి- మన కన్నులతో చూడగలిగన దానికంటే పొడవైనది! అది ఆకాశాల కంటే ఎత్తైనది! అది సముద్రం మరియు అగాధం కంటే లోతైనది!

 

అందుకే అంతటి మహత్తరమైన ప్రేమను చూపించినజ్ఞానానికి మించిన క్రీస్తుప్రేమను తెలుసుకునే శక్తి గలవారు కావాలని ప్రార్ధన చేస్తున్నారు పౌలుగారు! జ్ఞానానికి మిచిన దాన్ని తెలుసుకోవడం ఎలా? అంతం లేని దానిని ఇముడ్చుకోవడం ఎలా? దేవుని ఆత్మ దాని గురించిన జ్ఞానాన్ని అనుభవాన్ని మన అంతరాత్మకు ఇవ్వగలడు! ఎలాగంటే: సముద్రం కోసం మనం ఎన్నెన్నో పుస్తకాలు చదివాము!  అంతమాత్రాన సముద్రాన్ని అర్ధం చేసుకోలేము! దానిమీద ప్రయాణం చేస్తేనే అర్ధమవుతుంది- దానిలోతు ఏమిటో, వడి లేక కరెంట్, పోటుపాటుల ప్రభావం ఏమిటో- గాలి వస్తే దాని విశ్వరూపం ఏమిటో! 25సంవత్సరాలు నుండి సముద్రం మీద ప్రయాణం చేస్తున్న నాకే ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు! గాని కొంతవరకు అర్ధమయ్యింది! అలాగే దేవుడు కూడా అపరిమితమైన వాడు, మన జ్ఞానానికి  అందనివాడు శాశ్వతుడు! అయినా విశ్వాసులకు ఆయన తెలుసు! ఎలా అంటే ఆయన ప్రేమలో పడిపోవడం ద్వారా! ఆయన సన్నిధిని రుచి చూడటం ద్వారా! ఆయన వాక్యాన్ని చదివి అర్ధం చేసుకుని ఆయన వాక్యమర్మాలను జుర్రుకోవడం ద్వారా! పరిశుద్దాత్మ నింపుదల కలిగి అనుదినం ఆయనతో బోధ పొందుకోవడం ద్వారా!

ఇంకా మత్తయి 11:27

సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.

 

క్రీస్తు ప్రేమ విషయంలో కూడా అంతే! కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకుందాం! ఆయన ప్రేమను పంచుదాం! ఆయన ప్రేమలో మునిగిపోదాం! ఎలా అంటే ఆయన చెప్పినవి చేద్దాం! ఆయన వద్దు అన్నవి మానేద్దాం! తద్వారా ఆయనకు ఇష్టులైన వారిగా మరి- ఆయన ప్రేమలో తరిద్దాం!

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*36 భాగం*

ఫిలిప్పీ 1:9--11

9. మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,

10. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండికొనిన

11. వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

    ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనము కొలస్సీ పత్రికనుండి, రోమా పత్రిక నుండి, థెస్సలోనికయుల పత్రికనుండి, ఎఫెసీ పత్రికనుండి పౌలుగారు చేసిన ప్రార్ధనలను ధ్యానం చేసుకున్నాము! ఇక ఫిలిప్పీ పత్రికనుండి మరొక ప్రార్ధనను ధ్యానం చేద్దాం!

 

  వచనాలలో అంటున్నారు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ, సకలవిధములైన అనుభవజ్ఞానము తోనూ కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెనని తద్వారా దేవునికి మహిమయు స్తోత్రము కలగాలని ప్రార్ధన చేస్తున్నారు!

ఈ వచనాలలో చాలా గూడమైన సంగతులు దాగి ఉన్నాయి! అయితే వీటికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకు పోదాం!

 

మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించగలవారు కావాలి అంటున్నారు. అనగా ఏది మంచిది ఏది చెడ్డది అని వివేచించడమే కాకుండా కార్యాలు చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం బాగుపడుతుంది బలపడుతుంది, మాటలు మాట్లాడితే ఆత్మ మరియు మన అంతరంగ పురుషుడు బలపడతాడు అనేది గ్రహించాలి! ఇంకా ఆత్మీయ వరాలు ఫలాలు పొందుకుని, దైవరాజ్య వ్యాప్తికి మరియు మన ఆధ్యాత్మిక జీవితపు ఎదుగులకు తోడ్పడుతాయో గ్రహించాలి. తద్వారా వీటిని  ఆశించి పొందుకుని సంపూర్ణత సాధించడానికి ప్రయత్నించాలి. ఇక   మనం చేసే పని అది దేవుని చిత్తానుసారమైనదా కాదా, అది వాక్యానుసారమైనదా కాదా, మన వస్త్రధారణ మన ప్రవర్తన వాక్యానుసారమైనదా, లోకాన్ని లోకాశలను పెంచుతున్నాయా అని వివేచించడమే శ్రేష్టమైన కార్యములను వివేచించడం అంటే! ఎందుకు ఇలా ఆలోచించాలి అంటే తద్వారా దేవునికి మహిమను తీసుకుని వస్తుందా మన ప్రవర్తన, మన పలుకులు, మన ఆలోచనలు మన పనులు అని ఆలోచించి చెయ్యాలి! తద్వారా దేవునికి మొదటగా మహిమను తేవాలి రెండవదిగా దేవునికి స్తోత్రములు తెచ్చి పెట్టాలి! అనగా మన ప్రవర్తనను చూసి ప్రజలు అనుకోవాలి దేవుని బిడ్డ అంటే వీడురా, వీరిదేవుడు గొప్పోడు అని అనుకుని తమ మనస్సులో దేవునికి వందనములు స్తుతులు చెల్లించాలి! అందుకే పౌలుగారు ఏమని ప్రార్ధన చేస్తున్నారు అంటే ఫిలిప్పీయులు శ్రేష్టమైన కార్యాలు వివేచించగలవారు కావాలి!

 

అయితే అలా శ్రేష్టమైన కార్యాలు ఎలా వివేచించ గలరు అంటే మూడు మెట్లు సూచించారు పౌలుగారు!

మొదటగా మీ ప్రేమ: తెలివితో ఉండాలి.

రెండవదిగా మీ ప్రేమ  సకలవిధములైన ఆనుభవ జ్ఞానముతో ఉండాలి;

మూడవదిగా: మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలి!

 

మొదటగా: మీ ప్రేమ తెలివితో ఉండాలి! ఇది ఎఫెసీ పత్రికలో వివరించినట్లుగా మనకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు కావాలి, అప్పుడే ఇలా శ్రేష్టమైన కార్యాలు ఏమిటో గ్రహించి చెయ్యగలముఏది మంచి ఏది చెడ్డదో వివేచించి గ్రహించి వాక్యానుసారంగా అనగా మనం చేసేది అది వాక్యవిరుద్ధంగా ఉండకుండా కార్యమును చెయ్యాలి! మాట పలకాలిఇంకా ఏవి శ్రేష్టమైనవో గ్రహించి చెయ్యాలి! అందుకోసం పౌలుగారు పత్రికలో శ్రేష్టమైనవి కొన్ని రాస్తున్నారు!

2:1—5

1. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల

2. మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

3. కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

4. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

 

2:14, 15

14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు,

15. సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

 

4:89

8. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.

9. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

వీటికోసం నీచూపు దేనివైపు అనే శీర్షికలో వివరించడం జరిగింది.

కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన వాటిని ఆపేక్షించి వాటిని చెయ్యాలి!

 

ఇక ఇక్కడ మీ ప్రేమ అంటే అది దేవుని పట్ల, తోటి విశ్వాసుల పట్ల, ఇరుగుపొరుగు వారిపట్ల మానవాళి పట్ల విశ్వాసులు ప్రేమకలిగి ప్రేమను సరియైన పద్దతిలో వినియోగించాలి! అంతేకాకుండా ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి! లోకంలో ఎన్నో రకాలైన ప్రేమలు ఉన్నా నిజమైన ప్రేమ ఏమిటో, ప్రేమ ఎవరిదగ్గర దొరుకుతుందో మన ప్రవర్తన ద్వారా అందరికి చెప్పాలి! ప్రేమ క్రీస్తుని గూర్చినదై ఉండాలి! అందుకే ఎఫెసీ పత్రికలో అంటే మీరు ప్రేమలో పాతుకుని ఉండాలి అంటున్నారు!

Ephesians(ఎఫెసీయులకు) 3:15,16,17,18,19

15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి, స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

 

ఇక రెండవది: మీ ప్రేమ సకలవిధములైన అనుభవజ్ఞానముతో ఉండాలి! అనగా మన అనుభవాల ద్వారా నేర్చుకున్న మంచి పాటాలు అందరికి వివరించి , దానికి యేసుక్రీస్తుప్రభులవారి గూర్చిన అనుభవ జ్ఞానము వివరించి అనేకులను క్రీస్తులోనికి నడిపించాలి!

 

ఇక మూడవదిగా: మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలి! ప్రకటన గ్రంధంలో ఎఫెసీ సంఘము చాలా మంచిది ఆత్మపూర్ణత గలది గాని 2:4 లో అంటున్నారు దేవుడు: నీవు నాకోసం ఎంతో కష్టపడ్డావు  గాని మొదట నీకుండిన ప్రేమను మరచిపోయావు వదిలేశావు! బాప్తిస్మము తీసుకున్న మొదట్లో ఉన్న ప్రేమ విశ్వాసం ప్రార్ధన అన్నీ వదిలేశావు! నామ కార్ధపు జీవితం జీవిస్తున్నావు! ప్రేమ లేదు అనడం లేదు గాని మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు. సహోదర ప్రేమ మరియు దేవుని ప్రేమ తగ్గిపోయింది.

కాబట్టి 5 వచనంలో అంటున్నారు....ప్రకటన గ్రంథం 2: 5

నీవు స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.

 

కాబట్టి మనము కూడా స్తితిలో పడిపోయామో తెలుసుకుని ఒప్పుకుని సరిచేసుకుని ఆయనకు మన మాటలద్వారా మన ప్రవర్తన ద్వారా అన్ని విషయాలలో మహిమను స్తోత్రమును తెద్దాము

దైవాశీస్సులు!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*38 భాగం*

ఫిలేమాను  1:5—6

5. నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,

6. క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ఫిలేమాను  పత్రికనుండి మరో ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: క్రీస్తును బట్టి మీయందున్న ప్రతీ శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనేది కార్యకారి కావలనని వేడుకుంటున్నాను....

 

  ప్రార్ధనను ధ్యానం చేసేముందు అసలు ఫిలేమాను ఎవరు, ఉత్తరం ఎందుకు రాశారు అనేది చూసుకుందాం! ఫిలేమాను ఈయన మంచి విశ్వాసి- దైవజనుడు. ఆయన ఇంటిలో ఒక సంఘము నడుపబడుతుంది. ఇంకా పెద్ద భూస్వామి! ఒనేసీము అనే ఒక బానిస/సేవకుడు ఫిలేమాను గారి దగ్గర పనిచేస్తూ పారిపోతాడు. పౌలుగారు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు రక్షించబడి ఆయనకు ఎంతో పరిచర్య చేసి ఆయన పాదాలదగ్గర నేర్చుకుని ఒనేసీము అనే ఆయన గొప్ప దైవజనుడు సేవకుడు అవుతారు. అప్పుడు ఒనేసీము గారిని మరలా ఫిలేమాను గారి దగ్గరకు ఆయన సంఘానికి రాయబారిగా పంపుతూ ఆయనను చేర్చుకోమని తన స్నేహితుడైన ఫిలేమాను గారికి సిఫారసు ఉత్తరం రాస్తూ తన ప్రార్ధన ఏమిటో వివరిస్తున్నారు. ఏడవ వచనంలో సహోదరుడా అక్కడున్న పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందాయి, ఆదరణ కలిగింది అంటున్నారు ఎందుకంటే పరిశుద్ధులకు ఎంతో పరిచర్య చేసిన వ్యక్తి, వారి అవసరాలను తీర్చిన వ్యక్తి ఫిలేమాను గారు!

 

ఆయన కోసం చెబుతూ సహోదరుడా నేను నీకోసం ఏమని ప్రార్ధన చేస్తున్నాను అంటే: మీ యందున్న ప్రతీ శ్రేష్టమైన వరము విషయమై నీవు వరమును అనుభవపూర్వకముగా తెలిసికుని , నీ వరముల మూలముగా ఇతరులు నీ విశ్వామందు పాలివారు అవ్వాలనే దేవుని ఉద్దేశం కార్యకారి అనగా సఫలము కావాలని ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారుఅనగా నీవు పొందుకున్న వరములు, నీవు పొందుకున్న ఆత్మఫలమును, నీ ప్రవర్తనను చూసి అనేకులు నీ విశ్వాసములో పాలివారు కావాలి. అనగా నీ ప్రవర్తన, నీ వరములు అనేకులను నీ విశ్వాసము అనగా- నీవు విధమగా యేసుక్రీస్తుప్రభులవారు నిజమైన రక్షకుడని, దేవుడని, త్వరగా రానైయున్నాడు అని ఎలా నమ్ముతున్నావో, అదేవిధంగా నీవు పొందుకున్న వరముల ద్వారా నీవు ప్రవర్తిస్తున్న నీ జీవిత విధానము ద్వారా అనేకులు నిన్ను చూసి ఆకర్షించబడి నీవు పొందుకున్న క్రీస్తుయేసు విశ్వాసములోనికి వారు కూడా రావాలనే దేవుని సంకల్పము సఫలము కావాలి అని నీ కోసం ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారు! చూశారా పౌలుగారి కోరిక మరియు ప్రార్ధన ఎంత ఉన్నతమైనదో!!!

 

  ఇక్కడ ప్రతీ శ్రేష్టమైన వరము అంటున్నారు. క్రొత్త నిబంధన గ్రంధంలో వరము అనేది వేటికోసం ఉపయోగించ బడింది అంటే:

మొదటగా అపోస్తలుల కార్యములో పరిశుద్ధాత్మ అనేది వరము అన్నారు.

అపో.కార్యములు 2: 38

పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

 

అపో.కార్యములు 8: 20

అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.

 

అపో.కార్యములు 10: 45

సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.

 

రోమా 5:15 ప్రకారము మనము పొందుకున్న రక్షణ అనేది దేవుని కృపావరము!!!..

 

అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ పచేతనైన దానమును,అనేకులకు విస్తరించెను.

 

1కొరింథీ 14:1 లో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటున్నారు.....

1కోరింథీయులకు 14: 1

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 

ఇంకా అవి ఏమిటో కొద్దిగా అధ్యాయములో వివరించినా 12 అధ్యాయములో చాలా వివరముగా చెబుతున్నారు. 14 అధ్యాయం ప్రకారం- పరిశుద్ధాత్మ వరములో భాగంగా- భాషలు , దానికి అర్ధం చెప్పేవరము , ప్రవచన వరము వివేచనా వరము

ఇక 12 అధ్యాయం ప్రకారం వరములు వివరాలు ఉన్నాయి,

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,8,9,10

 

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

 

అయితే పౌలుగారి ప్రార్ధన ఏమిటంటే వరాలన్నీ ఉపయోగించడం ద్వారా, ఇంకా నీవు పొందుకున్న ఆత్మఫలము ద్వారా అనేకులను క్రీస్తుకొరకు ఆకర్షించాలి. పౌలుగారు కోరింథీయుల కోసం చెబుతూ మీ హృదయాలలో వ్రాయబడిన మా పత్రికలు మీరు కారా అంటున్నారు. 2 కొరింథీ 3:3; అనగా విశ్వాసుల ప్రవర్తన మరియు వారి జీవితాలు క్రీస్తు యొక్క సువార్త కరపత్రికలుగా మారిపోవాలిఅలా మారి ఆకర్షించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇద్దరికోసం గతంలో చెప్పడం జరిగింది.

మొదటి వ్యక్తి-దైవజనురాలైన శ్రీ మధర్ థెరీసా గారు. ఆమె ఎప్పుడు ఎక్కడా సువార్త ప్రకటించలేదు. యేసయ్యని నమ్ముకోమని వీధి సువార్త చెయ్యలేదు. ప్రసంగాలు చెయ్యలేదు గాని అనేకులను క్రీస్తుకోసం ఆకర్శించింది ఆమె ప్రవర్తన మరియు ఆమె పరిచర్య! ఆమెను చంపడానికి వెళ్ళిన వ్యక్తులు చంపకుండా ఇచ్చిన స్టేట్మెంట్ ఆమెలా ఎవరూ చెయ్యలేరు. ఆమె మనిషి కాదు- ఆమెలో ఉన్న దేవుడు అని చెప్పారుఅటువంటి గొప్ప పరిచర్య చేసి అనేకులను క్రీస్తువైపు నడిపించారు ఆవిడ!

 

మరోవ్యక్తి- దైవజనుడైన డేవిడ్ లివింగ్స్టన్. ఈయన నరమాంస భక్షుకుల మధ్య ఆఫ్రికా ఖండంలో సేవచేసి ఆఫ్రికా ఖండాన్ని క్రీస్తువైపు నడిపించారు. ఆయన స్నేహితుడు నాస్తికుడు ఒకాయన ఆయన అబద్దికుడు, మందు రాసి మారుస్తున్నాడు అని నేను నిరూపిస్తాను అని చాలెంజ్ చేసి వెళ్లివచ్చి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు. పదిరోజుల తర్వాత ప్రజలు పట్టుకుని గట్టిగా అడిగితే చెప్పాడు- నీవు దైవజనునితో ఏమి మాట్లాడావు అంటే ఏమి మాట్లాడలేదు. మరి ఎందుకు వచ్చేశావు అంటే- ఆయన చెప్పిన మాట: అక్కడ తొమ్మిది రోజులున్నాను- ఏమి మాట్లాడలేదు, మరోరోజు ఉంటే నేనుకూడా క్రైస్తవుడను అయిపోతాను అని భయమేసి వచ్చేశాను అన్నాడు. ఏమి? ఏమి చూశావు అంటే ఆయన చేస్తున్న పరిచర్య సామాన్య మానవుడు చెయ్యలేడు. అతనిలో ఏదో ఉంది.

అదే దేవుని కృపావరము! కృపావరము ఉపయోగించి- పరిచర్య చేసి లక్షలమందిని క్రీస్తువైపు నడిపించారు ఆయన!

 

ప్రియ దైవజనమా నీ ప్రవర్తననీవు పొందుకున్న వరములు- అనేకులను ఆకర్శిస్తున్నాయా లేక వీడా- వీడి బ్రతుకు మనకు తెలియదా అని దేవునికి అవమానం తెచ్చేలా ఉన్నావా? నీవే ఫుల్లుగా తాగి పందిలా దొర్లితే ఏమంటారు? దేవుడి బిడ్డ అట- పందిలా దొర్లుతున్నాడు అంటారు. నీవే లంచగొండిగా, అబద్దికుడిగా దొంగగా, వ్యభిచారిగా బ్రతికితే ఇక దేవునికి ప్రజలను నీ విశ్వాసములోనికి ఎలా నడిపించగలవు??!!!

 

భక్తులు నడిపించారు క్రీస్తువైపుకి! మరి నీవు నడిపించగలవా?

ఇదే పౌలుగారి ప్రార్ధన! అటువంటి మంచి ప్రవర్తన శ్రేష్టమైనవరములు కలిగి అనేకులను క్రీస్తువైపుకి నడిపిద్దాం!

ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*39 భాగం*

హెబ్రీ    1:20—21

20. గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,

21. యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో (అనేక ప్రాచీన ప్రతులలో- మీలో అని పాఠాంతరము) జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! హెబ్రీ  పత్రికనుండి చివరి  ప్రార్ధన ధ్యానం చేసుకుందాము! పత్రిక పౌలుగారు రాశారో బర్నబా గారు రాశారో మనకు స్పష్టంగా తెలియదు గాని పౌలుగారు హెబ్రీ పత్రిక రాశారని అనేకులు నమ్ముతారు గనుక ప్రార్ధన కూడా పౌలుగారి చేసిన ప్రార్ధనగానే పరిగణిద్ధాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతీ మంచి విషయములో తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక!

 

ఇది ఆశీర్వాదముతో కూడిన ప్రార్ధన!!

యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనగా దేవుని దృష్టికి విశ్వాసులంతా అనుకూలమైనది జరిగించాలి అని పౌలుగారు కోరుకుంటున్నారు! మనలో అనేకమంది మనకు అనుకూలమైనది మనకు నచ్చినది చేస్తున్నాము గాని దేవునికి ఇష్టమైనది చేయలేకపోతున్నాము! కనీసం ఒక కార్యం చేసేముందు ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించడం లేదు! ఒక పని ప్రారంభించే ముందు ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని ప్రార్ధించడం లేదు! ఆయన పాదాల దగ్గర ఆయన మాట కోసం ఆయన చిత్తం కోసం కనిపెట్టడం లేదు! అందుకే మన బ్రతుకులో అడుగడుగునా దెబ్బ తింటున్నాము! అయినా బుద్ధి రావడంలేదు మనకు! ఒకసారి బైబిల్ గ్రంధంలో పరిశీలిస్తే దావీదు గారు రాజైన తర్వాతా రాజు కాకముందు కూడా ఇది నీ చిత్తమా కాదా అంటూ దేవుణ్ణి అడిగి దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవారు!

2సమూయేలు 5: 19

దావీదు-నేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్ద విచారించినప్పుడు-పొమ్ము,నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.

 

అందుకే అంత ఘన విజయం సాధించారు! విజయవంతమైన జీవితం-సవాలుకరమైన జీవితం జీవించారు దావీదు గారు! అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవునితో పిలిపించుకున్నారు! నేడు మనం దేవునికి ఇష్టమైన అనుకూలమైన పనులు చేస్తున్నామా లేదా ఆలోచించుకుని ముందుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!!

 

ఇక తర్వాత మాట ప్రతీ మంచి విషయములోను తన చిత్తప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక! ఆయన చిత్తప్రకారం మనము చేసేలాగా మనలను దేవుడు సిద్ధపరచాలి అని ప్రార్ధన చేస్తున్నారు! జాగ్రత్తగా ఆలోచిస్తే/ పరిశీలిస్తే ప్రతీ విశ్వాసి కోసము దేవుడు ఇలా చేయగలరు! ఎప్పుడంటే దేవునికి విధేయత చూపించినప్పుడు! విశ్వాసి తనకుతానుగా దేవునికి ఇష్టమైన వాటిని దేవుని చిత్తాన్ని జరిగించలేడు! దానికి ప్రభువు తోడ్పాటు తప్పకుండా ఉండాలి! దేవుడు మనలను సంసిద్దులుగా చేయకపోతే, ఆయన మనలో కార్యము చేయకపోతే మనము చేసే కార్యకలాపాలన్నీ దేవుణ్ణి సంతోషపెట్టలేవు!

2కొరింథీ ౩:5

మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

 

ఫిలిప్పీ 2:13

ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

 

కొలస్సీ 1:29

అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.

 

అయితే దేవుని ఇష్టం లేదా సంకల్పం ఏమిటి? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అంటే యేసుక్రీస్తు ప్రభులవారు చేసినట్లు చేస్తే!! అనగా యేసుక్రీస్తు ప్రభులవారి లక్ష్యము లాంటి లక్ష్యము మనము కలిగిఉండాలి! ఆయన లక్ష్యము ఏమిటి? తండ్రి చిత్తప్రకారం చేయడం!!

మత్తయి 26:39

కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

 

యోహాను 4:34

యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.

 

యోహాను 6: 39

నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

 

యోహాను 8: 29

నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.

దేవుని సంకల్పం నెరవేర్చడం మాత్రమే చెయ్యాలి మనము! అంతే, మన ఇష్టప్రకారం చేయకూడదు! అది దేవుని పని అయినా సరే, దేవుని చిత్తప్రకారం చెయ్యాలి తప్ప- మనకు నచ్చిన విధములో దేవుని పని చేసినా అది దేవుణ్ణి సంతోషపెట్టదు!

 

  కాబట్టి ప్రియబిడ్డా! నీ పట్ల దేవుని చిత్తమేదో అడిగి తెలిసికొని అలా జీవించు! అలాగే మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమును గ్రహించి రకంగా నడచుకో! 

చివరిగా యేసుప్రభులవారే తననుతాను తగ్గించుకొనిఇదిగో పుస్తకము చుట్టలో వ్రాయబడినట్లు నేను వచ్చానునీ చిత్తము జరిగించు అన్నారుహెబ్రీ 10:7,9;  

కాబట్టి నీవు కూడా అలాగే తండ్రినీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానునీ చిత్తము నాకు చెప్పుచేస్తాను అని ప్రార్ధించిఅలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించు!

దేవుడు నిన్ను అత్యధికముగా వాడుకోబోతున్నారు!

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

(ఇంకాఉంది)

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*40 భాగం*

హెబ్రీ  1:20—21

20. గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,

21. యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో (అనేక ప్రాచీన ప్రతులలో- మీలో అని పాఠాంతరము) జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! హెబ్రీ  పత్రికనుండి చివరి  ప్రార్ధన ధ్యానం చేసుకుందాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతీ మంచి విషయములో తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక!

 

            (గతభాగం తరువాయి)

 

ఇంతకీ దేవునికి ఇష్టమైనది- ఆయన చిత్తము- ఆయన సంకల్పము ఏమిటి? దీనికోసం థెస్సలోనికయుల పత్ర్రికలలో రాశారు పౌలుగారు!

1థెస్స 4:—5

3. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

4. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

5. పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.

 

మొట్టమొదటి దేవుని చిత్తము ఏమిటంటే: *మీరు (మనము) పరిశుద్దులగుటయే దేవుని చిత్తము* అంటున్నారు! గమనించాలి పరిశుద్దులగుట అంటే ఏమిటో కూడా మనం బుర్రలు పాడుచేసుకోకుండా దేవుని దృష్టిలో పరిశుద్దులగుట ఏమిటో చెప్పేశారు- పరిశుద్దులగుట అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అంటున్నారు!

రెండవ దేవుని చిత్తము ఏమిటంటే:  *పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము!*

 

మనము దేవుని చిత్తముకోసం ఆలోచిస్తే పౌలుగారు కొలస్సీ పత్రికలో  తన ప్రార్ధనలో ఇలా అంటున్నారు కొలస్సీయులకు 1: 10

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునైప్రతి సత్కార్యములో సఫలులగుచుదేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచుఅన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు*,. .

 

అయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారై ఉండాలి!

అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లుఆయనకు తగినట్లుగా నడచుకోవాలి అని కొలస్సీయుల యెడల పౌలుగారి ఆకాంక్ష!! అవును దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోలేకపోతే మనం ఆయనను సంతోషపెట్టలేము!! ఆయన చిత్తాన్ని నెరవేర్చలేముఅందుకే పౌలుగారు ఏరికోరి ప్రార్ధిస్తున్నారువారు అట్లాంటివారు కావాలని కోరుకుంటున్నారు!

 

   అందుకోసం రోమా 12:1-2 లో చూసుకుంటే: *పరిశుద్ధమునుదేవునికి అనుకూలమునుసంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు* . . *మీ మనస్సుమారి రూపాంతరం పొందుడి అంటున్నారు*. ఈ వచనాలలో చాలా లోతైన విషయాలున్నాయిఈలోక మర్యాద బట్టి కాకమొదట ఉత్తమమునురెండవది అనుకూలమునుమూడవది సంపూర్ణమునైయున్న దేవుని చిత్తము తెలుసుకోవాలిదేవుని చిత్తము ఉత్తమమైనదిఅనుకూలమైనది కాబట్టి ఆయన చిత్తమును మనం తెలుసుకోవాలిఎప్పుడైతే దేవుని చిత్తమును తెలుసుకుంటామో ఆయన చిత్తానుసారముగా మనం నడువగలంఇప్పుడు మనం రోడ్డుమీద స్పీడ్ గా వెళ్తున్నామనుకోండి మనదగ్గర రోడ్ మేప్ ఉంటే కన్ప్యూజన్ లేకుండాప్రమాదాలు లేకుండా హాయిగా వెల్లగలముఅలాగే దేవుని చిత్తము తెలుసుకుంటే ఆయనను సంతోషపెట్టగలము!

 

    

బైబిల్ లో మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమేదో వ్రాయబడియుంది వాటిలో కొన్నింటిని చూద్దాం

1) 1 థెస్సలోనిక 4:3:  మీరు పరిశుద్దులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తముజాగ్రత్త ప్రియ దైవజనమాఊరకనే నోటిమాటికి ప్రభువానీ చిత్తాన్ని బయలుపరచు అని ప్రార్ధనచేస్తూజారచోర క్రియలు చేసారా ఖభడ్దార్దేవుడు ముందే చెప్పారు తన చిత్తమేమిటోకాబట్టి జారత్వం నుండి దూరముగా ఉందాము!

 

2) 1 థెస్సలోనిక 4:5  తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తముపాపానికి దూరంగా నీ తనువూమనస్సుఆత్మను కాపాడుకోవడంఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడమే దేవుని చిత్తము!

 

3) ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవునిచిత్తము!  కష్టమైనాసుఖమైన ఏదైనా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి మనంఅదే దేవుని చిత్తం! 1 థెస్సలోనిక 5:18;

 

4) దేవునిమాటలు వక్రీకరించిభోదించేవారి నోరు మూయించడమే దేవునిచిత్తము! 1 పేతురు 2:15; చాలామంది నేడు social media లో దేవునిమీద బురదచల్లుతుంటే చాలామంది జవాబిస్తున్నారుఅందుకు దేవునికి స్తోత్రంఇది దేవుని చిత్తం!

 

  కాబట్టి ప్రియబిడ్డానీ పట్ల దేవుని చిత్తమేదో అడిగి తెలిసికొని అలా జీవించుఅలాగే మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమును గ్రహించి ఆ రకంగా నడచుకోచివరిగా యేసుప్రభులవారే తననుతాను తగ్గించుకొనిఇదిగో పుస్తకము చుట్టలో వ్రాయబడినట్లు నేను వచ్చానునీ చిత్తము జరిగించు అన్నారుహెబ్రీ 10:7,9;  కాబట్టి నీవు కూడా అలాగే తండ్రినీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానునీ చిత్తము నాకు చెప్పుచేస్తాను అని ప్రార్ధించిఅలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించు!

దేవుడు నిన్ను అత్యధికముగా వాడుకోబోతున్నారు!

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

*మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన*

*41 భాగం*

హెబ్రీ    1:20—21

20. గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,

21. యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో (అనేక ప్రాచీన ప్రతులలో- మీలో అని పాఠాంతరము) జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.

 

             ప్రియమైన దైవజనమా! మనము మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! హెబ్రీ  పత్రికనుండి చివరి  ప్రార్ధన ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతీ మంచి విషయములో తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక!

 

రెండవ దేవుని చిత్తము ఏమిటంటే:  *పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము!*

 

               ( గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇంతవరకు మనం దేవుని చిత్తమేమిటో తెలుసుకుని ఆయన చిత్తప్రకారం చెయ్యాలి అనేది నేర్చుకున్నాము! అయితే ఇక్కడ రెండు దేవుని చిత్తముల కోసం ఒకసారి చూసుకుందాము!

 

మొదటిది: *పరిశుద్దులుగా ఉండటమే దేవుని చిత్తము*! అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తము! ఎందుకు జారత్వమునకు దూరంగా ఉండమంటున్నారు అంటే బైబిల్ చెబుతుంది మానవులు చేసే పాపములు ఒకడే చేస్తాడు అయితే జారత్వం అనేది ఇద్దరు కలిసి చేస్తారు! అంతేకాకుండా దేహము దేవునివలన మనకు అనుగ్రహించబడింది. దేహము దేవుని దేవాలయం కాబట్టి దేహముతో దేవున్ని మహిమ పరచండి అని చెబుతుంది బైబిల్ఇంకా ఎవడు దేవుని ఆలయమును పాడుచేస్తాడో వాణ్ని దేవుడు పాడుచేయును అని కూడా చెబుతుంది!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:13,15,16,17,18,19,20

13. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

15. మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.

16. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమైయున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

17. అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.

18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

 కాబట్టి ఎవడైతే జారత్వము, వ్యభిచారము చేస్తాడో /చేస్తాదో వాణ్ని/ స్త్రీని దేవుడు పాడుచేయ్యడమే కాకుండా పాపం చేసేవాడు పాపానికి సాతానుకి దాసులు కాబట్టి వారికి పరలోకంలో ఎటువంటి పాలుపంపులు ఉండవు!

ఇక నాలుగు అయిదు వచనాలలో మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలే సమయం దొరికితే కామాభిలాషయందు కాకుండా పరిశుద్దత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తము అంటున్నారు. ఇది రెండో దేవుని చిత్తము!!!

 

చూడండి అన్యజనుల వలే నీవు కూడా కామ సంబంధమైన విషయాలలో ఆసక్తిని చూపించక అనగా కేవలం సంభోగం చెయ్యడమే కాకుండా అటువంటి విషయాలను చూడటం, కావాలనుకోవడం, వాటికి సంబంధించిన విషయాలు చదవడం చూడటం, అనగా మీడియాలో టీవీలో అలాంటి సినిమాలు చూడటం, ఫోన్లో అలాంటి బొమ్మలు చూడటం వీడియోలు చూడటం కూడా తప్పే కాబట్టి వాటిని విసర్జించి పరిశుద్దత విషయంలో నీ ఘటమును అనగా శీలాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము అంటున్నారు! లోకస్తులు ప్రవర్తించినట్లు నీవు చేయక, దేవునికి ఇష్టమైన విధానముగా పరిశుద్ధంగా ఉండమంటున్నారు! ఎందుకు? పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము కాబట్టి!

 

ప్రియులారా! ఇక మూడవ దేవుని చిత్తము ఏమిటంటే ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము!

ప్రతీ విషయములో అంటే

 సుఖాలు కలిగినా

కష్టాలు కలిగినా

ప్రమోషన్ వచ్చినా

ఉన్న ఉద్యోగం పోయినా

రోగం వచ్చినా

రోగం పోయినా

భర్త తిట్టినా

భార్య అలిగి పుట్టింటికి పోయినా

యాబై మంది బాప్తిస్మము పొందినా

సువార్త ప్రకటిస్తుంటే గుండగా తన్నేసినా

ముఖం మీద ఉమ్మి వేసినా

ఎందుకు పనికిరాని వాడవని నిన్ను తిట్టినాపట్టలేని ఆనందం కలిగినా

ఎనలేని వేదనలు కలిగి ఆపుకోలేనంత దుఖం కలిగినా

ఏ సమయమందైనా ఏ స్తితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అంటున్నారు!

 

కేవలం కష్టము నందు స్తుతింతు నష్టము నందు తలంతూ అంటూ పాటలు పాడడమే కాదు, నిజంగా చేసి చూపించాలి స్తుతించాలి!

 

మీరు అనొచ్చు, రాయడం చెప్పడం సులువేగాని అనుభవిస్తే తెలుస్తుంది అంటారేమో! పౌలుగారు ఊరికినే అలా చెప్పలేదుఅనుభవించి- అలా కష్ట నష్టాలలో స్తుతించడం వలన కలిగే అనుభూతులు ఆశీర్వాదాలు పొందుకుని అప్పుడు రాస్తున్నారు ఈమాట!

   ఇంకా గుర్తుకు రాలేదా? అపొ 16 ప్రకారం ఇదే మాసిదోనియా ప్రాంతంలో రోమా కోలనీ అయిన ఫిలిప్పీ పట్టణం లో సువార్త ప్రకటిస్తుండగా పుతోను అనే దయ్యం పట్టి సోదె చెబుతున్న ఒక యవ్వనస్తురాలు కనిపిస్తే ఈ త్రయానికి జాలికలిగి యేసునామంలో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమెను స్వస్తపరుస్తారు! ఆమె యజమానులకు లాభం పోయింది కాబట్టి పౌలుగారిని సీలగారిని పట్టుకుని గుండగా తన్నేసి చెరసాలలో వేసేస్తారు! అయితే గతభాగాలలో చెప్పినట్లు పౌలుగారు ఎందుకిలా జరిగింది, దేవుని సేవ కదా చేస్తున్నాము, దేవుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు, అనుకుంటూ విచారపడలేదు! మమ్మల్ని ఇన్ని భాధలు పెడతారా అంటూ వారికి శాపనార్ధాలు కూడా పెట్టలేదు, సరికదాఅప్పటినుండి అర్ధరాత్రి వరకు పాటలు పాడుతూ వారికి అనగా మిగతా ఖైదీలకు  సువార్త ప్రకటిస్తూ ఉంటే పరలోక దూతలు కదలివచ్చారు వారి విశ్వాసాన్ని చూసి! ఏమి విశ్వాస వీరులో కదా అంటూ పరలోకం మొత్తం మురిసిపోయారు! దెబ్బకు గొప్ప భూకంపం కలిగి వారి సంకెళ్ళు ఊడిపడ్డాయి! ఇదీ విశ్వాసం! ఇదీ తెగింపు! ఏం జరిగినా గాని దేవుణ్ణి స్తుతించడం మానను! ఆయన సువార్త ప్రకటన మానను అనే తెగింపు! ఇన్ని భాధలు కలిగినా దేవుణ్ణి స్తుతించారు తప్ప ఏం మాయదారి దేవుడువయ్యా నీవు అని అనలేదు! అందుకే ప్రతీ విషయములో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము అని చెబుతున్నారు! ఇలాంటి విశ్వాసము, ఆత్మీయ స్తితి నీకుందా ప్రియ చదువరీ??!!!

 

       మరో వ్యక్తి ఉన్నారు బైబిల్ లో! ఈయనను దేవుడు పిచ్చోడు అనొచ్చు! భార్యా, పిల్లలు, సామ్రాజ్యము ఏదీ వద్దు! దేవుడుఅయన భజనలు చెయ్యడం! పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం! ఇదే పని! అందుకే గొర్రెలు మధ్య నివసించే ఈయనను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశారు! జీవితంలో ఎన్నెన్నో కష్టాలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు కలిగాయి గాని ఎప్పుడూ దేవుణ్ణి నిందించలేదు! శ్రమలో సంతోషం అంటున్నారు! భక్తుడు జీవితమంతా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు! అభిషేకించి నప్పుడు పాట రాసి పాడారు! మామ తరిమినప్పుడు పాటలు రాశారు! దోయేగు తనమీద చాడీలు చెప్పినప్పుడు స్తుతించారు! తనసొంత కొడుకు తనమీద తిరుగబడినప్పుడు స్తుతించారు! మందసాన్ని తనకు దగ్గరకు రప్పించుకుని ఇలా పాటలు పాడండి అంటూ పాటలు రాసి ఇచ్చారు! ఒకవిధంగా చెప్పాలంటే నవరసాల్లలో ఒకరి రెండు వదిలేసి అన్ని రసాలలో, అనుభవించి దానిద్వారా పాటలు పాడారు ఆయన! అందుకే దేవునికి ఇష్టానుసారుడు అయిపోయారు దావీదు గారు! కష్టాలలో స్తుతిస్తూ ఇరుకులో స్తుతిస్తూ అపనిందలు కలిగినా స్తుతిస్తూ అన్నింటిని సహించి అన్నింటిలో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు అందుకే ఒక స్తుతి పాటలు పాడే వ్యక్తి సైన్యానికి నాయకుడు అయ్యారు! నాయకుడు రాజు అయ్యారు! రాజు చక్రవర్తి అయ్యారు! చక్రవర్తి ప్రవక్త అయ్యారు! ప్రవక్త దైవజనుడు అయ్యారు! చూశారో దేవుడు ఎన్ని రకాలుగా వ్యక్తిని వాడుకున్నారో దేవుడు! పౌలుగారు దేవుని చిత్తమెరిగి ప్రవర్తించారు! దావీదు గారు దేవుని చిత్తమెరిగి ప్రవర్తించారు! నీ చిత్తము చేయడమే నాకిష్టము అంటున్నారు! పౌలుగారు ఇంకా ఏమని చెప్పారో చూద్దాం!

 

  కాబట్టి ప్రియబిడ్డా! నీ పట్ల దేవుని చిత్తమేదో అడిగి తెలిసికొని అలా జీవించు! అలాగే మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమును గ్రహించి రకంగా నడచుకో! చివరిగా యేసుప్రభులవారే తననుతాను తగ్గించుకొని: ఇదిగో పుస్తకము చుట్టలో వ్రాయబడినట్లు నేను వచ్చాను, నీ చిత్తము జరిగించు అన్నారు. హెబ్రీ 10:7,9;  కాబట్టి నీవు కూడా అలాగే తండ్రి! నీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ చిత్తము నాకు చెప్పు, చేస్తాను అని ప్రార్ధించి, అలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించు!

దేవుడు నిన్ను అత్యధికముగా వాడుకోబోతున్నారు!

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

 

ప్రియమైన  దైవజనమా! ఈ మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన ద్వారా దేవుడు మీతో మాట్లాడారని గ్రహిస్తున్నాను! అటువంటి ప్రార్ధన దేవుడు మన అందరికి దయచేయును గాక! దయచేసి మాకోసం మా పరిచర్య కోసం ప్రార్ధన చెయ్యండి! మరో శీర్షికతో మరలా కలుసుకుందాం! దైవాశీస్సులు!

ఇట్లు

ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు

                    రాజ కుమార్ దోనే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పాపము

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

పొట్టి జక్కయ్య

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు