ప్రత్యక్షతల గ్రంధము --1
ముందుమాట
దేవుని నామమునకు మహిమ కలుగును గాక!
ప్రియదైవజనమా ! ఈ ప్రత్యక్షతల గ్రంధము యొక్క వ్యాఖ్యానము వ్రాద్దామని నేను
అనుకోలేదు! ఎందుకంటే ప్రకటన గ్రంధము కోసం వ్రాయడం అంటే ఆషామసి కాదు! అందుకే భయమేసి
ఇంతకాలం ప్రకటన గ్రంధం యొక్క జోలికి పోలేదు! అంతేకాకుండా నేను బైబిల్ పండితుడను
కానేకాదు! అయితే ఏడు సంఘాలకోసం వ్రాద్దామని అనుకుంటే పరిశుద్ధాత్ముడు మొత్తం
ప్రకటన గ్రంధం కోసం వ్రాయమని ప్రేరేపించగా తెగించి వ్రాయడం జరిగింది.
గమనించవలసిన విషయం ఏమిటంటే: నేను రాసినదే
సత్యము అని నేను చెప్ప్డడం లేదు. నేను
చెప్పినట్లే జరుగుతుంది అని కూడా చెప్పడం లేదు! అలా చెప్పినవారు అబద్ధికులు
అవుతారు! బైబిల్ గ్రంధము నుండి నాకు అర్ధమయినది- పరిశుద్ధాత్ముడు నాకు
నేర్పించినది మాత్రమే నేను రాశాను! అవి వాక్యానికి సత్యానికి దగ్గరగా ఉంటే
తీసుకోండి. లేకపోతే మానెయ్యండి!
ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని ప్రార్ధనా
పూర్వకముగా ధ్యానించమని మనవిచేస్తున్నాను!
ప్రత్యక్షతల గ్రంధమును బాగా అర్ధం చేసుకోవాలంటే.........
ప్రియదైవజనమా! ఈ గ్రంధమును అర్ధం
చేసుకోడానికి నాకు చాలా రోజులు పట్టింది.
మీరుకూడా ఈ గ్రంధాన్ని సులువుగా బాగుగా అర్ధం చేసుకోడానికి నేను వాడిన
విషయాలు మీకు రాస్తున్నాను.
1.
మహాశ్రమల
కాలమును- దేవుని ఉగ్రతా కాలమును కలుపవద్దు! మహాశ్రమల కాలం అయిపోయిన
వెంటనే దేవునితీర్పు కాలం అనబడే ప్రభువుదినము మొదలవుతుంది. మహాశ్రమల కాలంలో మొదటి అర్ధభాగం
అన్యజనులలోనుండి వచ్చిన విశ్వాసులకు శ్రమలు కలుగుతాయి! ఇశ్రాయేలు
ప్రజలు క్రీస్తు విరోధితో ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి శ్రమలు కలుగవు!
*మహాశ్రమల కాలము అనగా దేవునిబిడ్దల
మీద సాతానుడు- క్రీస్తు విరోధి మరియు వాడి అనుచరులు కలిగించే
బాధలు*! *ప్రభువుదినము లేక యెహోవాదినము అనేది దేవుడు యెషయా గ్రంధంలో,
యిర్మియా యెహెజ్కేలు జెఫన్యా మలాకి తదితర గ్రంధాలలో, పౌలుగారు రాసిన పత్రికలలో చెప్పబడిన దుష్టుల మీద మరియు క్రీస్తువిరోధి వాడి
అనుచరుల మీద దేవుడు కుమ్మరించే ఉగ్రత*! ఇది జరిగాకనే దేవుని
రాకడ జరుగుతుంది.
2. యోహాను గారికి ఈ ప్రకటన గ్రంధం యొక్క దర్శనము ఒకేసారి కలుగలేదు!
ముక్కలుముక్కలుగా లేక పార్టులు పార్టులుగా కలిగాయి!
మొదటి
అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు మొదటి దర్శనం!
4 మరియు 5 మరో దర్శనం!
6—11 వరకు మరో దర్శనం— యూదుల కోణం నుండి,
12—19 వరకు మరో దర్శనం— సంఘపుకోణం నుండి
20—22 మరో దర్శనం .
౩. ఆరవ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు జరిగే సంఘటనలు లేక సంభవాలు
అన్నీ వరుస క్రమంలో లేవు అని గ్రహించాలి! ఒకవేళ ఒకే వరుసలో ఉన్నాయి
అని తలస్తే ఈ మర్మముల గ్రంధమైన ప్రత్యక్ష్యతల గ్రంధమును అర్ధం చేసుకోలేము! యోహాను గారికి దేవుడు కొన్ని అధ్యాయాలు
చూపించి- తర్వాత అది బాగా అర్ధం చేసుకోవడానికి మధ్యలో వివరణ ఇస్తూ
ఉండేవారు.
6—11 అధ్యాయాలు మనకు యూదుల కోణంలో అంత్యదినాలలో జరిగే
సంభవాలు.
12—18 అధ్యాయాలు సంఘపు కోణంలో జరిగే సంభవాలు!
రెండూ ఒక్కటే- గాని వివిధమైన కోణాలలో వివరించడం
జరిగింది! అనగా
బూరలు పాత్రలు రెండు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి!
ఉదాహరణ: ఆరవ
అధ్యాయంలో జరిగిన సంభవాలు తరువాత వెంటనే ఏడవ అధ్యాయంలో సంభవాలు జరుగవు! ఆరవ అధ్యాయంలో జరిగిన సంభవాలు ఎలా సంభవిస్తున్నాయో దర్శనాన్ని ఆపి-
ఏడవ అధ్యాయంలో వివరిస్తున్నారు దేవుడు! ఎందుకు
అంటే దర్శనాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి! ఇలా పరుమార్లు పలు
అధ్యాయాలలో మనకు కనిపిస్తుంది. దర్శనం ఆగిపోయి- దర్శనాన్ని వివరించడం జరుగుతుంది.
ఇలాంటి వివరణ కోసం ఇచ్చిన దర్శనాలు ఈ ప్రకటన
గ్రంధంలో ఇంకా ఉన్నాయి!
మొదటిది ఏడవ అధ్యాయం మొత్తము!
రెండు: పదవ అధ్యాయం
మొదటినుండి పదకొండో అధ్యాయం 14వ వచనం వరకు!
మూడు: పన్నెండో అధ్యాయం
మొదటినుండి పద్నాలుగో అధ్యాయం 20వ వచనం వరకు;
నాలుగు: పదిహేడో అధ్యాయం
మొదటినుండి పంతొమ్మిదో అధ్యాయం 11వ వచనం వరకు!
4. పైన చెప్పిన
విధముగా బూరలు పాత్రలు రెండు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి!!! బూరలు యూదుడైన యోహాను గారికి యూదుల కోణంలో
చూపించారు! పాత్రలు సార్వత్రిక సంఘములో ముఖ్యమైన అంగమైన యోహాను గారికి సంఘపు
కోణంలో అన్యజనుల కోణంలో ఏమి జరుగుతాయో అపోస్తలుడైన యోహాను గారికి చూపించారు!
రెండింటి భావము ఒక్కటే! వేరువేరు అనుకుంటే ఈ గ్రంధాన్ని అర్ధం చేసుకోలేరు
ప్రియులారా!
1.)
ఉపోద్ఘాతము
2.)
గ్రంధ వివరణ
3.)
మొదటి అధ్యాయము- యోహానుగారి దర్శనం
4.)
రాకడ సమయం- గుర్తులు
5.)
ఏడు సంఘములు
a.
ఎఫెసీ సంఘము
b.
స్ముర్ణ సంఘము
c.
పెర్గమ సంఘము
d.
తుయతైరా సంఘము
e.
సార్దీస్ సంఘము
f.
ఫిలడెల్ఫియ సంఘము
g.
లవోదోకయ సంఘము
6.)
౩—4 అధ్యాయాల మధ్య జరిగే సంభవాలు
7.)
పరలోకంలో జరిగే సంభవాలు
a.
ఇరవై నలుగులు పెద్దలు
b.
సింహాసనం- గాజు సముద్రం
c.
నాలుగు జీవులు
d.
ఏడు ముద్రలు- వధింపబడిన గొర్రెపిల్ల
8.)
ఏడు ముద్రలు
9.)
1,44,౦౦౦ మంది ఇశ్రాయేలీయులు
10.) మహాశ్రమల కాలపు హతస్సాక్షులు
11.) ఏడు బూరలు- ఏడు పాత్రలు
12.) దేవుని బూర- ఏడవ బూర- కడబూర
13)
బలిష్టుడైన దేవదూత
14)
యేరూషలేము దేవాలయము
15) ఇద్దరు
సాక్షులు
16)
పరలోకంలో యుద్ధము
17) సూర్యుని
ధరించిన స్త్రీ
18)
క్రూరమృగము
19) రెండవ
క్రూరమృగము/అబద్ద ప్రవక్త -666 ముద్ర
20) జలముల మీద
వేశ్య- మహా బబులోను
21) సీయోను
పర్వతం మీద 144౦౦౦ మంది
22) సకల
జనులకు చివరి సువార్త
23) భూమి – పైరు కోత
24) ద్రాక్షల
కోత- ద్రాక్ష తొట్టె
25)
గొర్రెపిల్ల వివాహ మహోత్సవం
26)
హార్మెగిద్దోను యుద్ధము
27)
వెయ్యేండ్ల పాలన
28) ధవళ
సింహాసనపు తీర్పు
29) క్రొత్త
ఆకాశము- క్రొత్త భూమి- నూతన యేరూషలేము
30) జీవ
వృక్షము- జీవ జలనది
*ప్రత్యక్షతల గ్రంధము*
*ఉపోద్ఘాతము*
ఒక పెద్దాయన
వాక్యము చెబుతున్నారు! ఇది కిట్టని కొంతమంది ఆయనను పట్టుకుని
ఈడ్చుకుపోయారు! ఎన్నో హింసలు పెట్టారు! అయినా ఆయన చనిపోలేదు! ఇలా కాదని (చరిత్ర ప్రకారం) ఆయనను రోమా నగరం తీసుకుని పోయి చక్రవర్తి
కళ్ళముందు మరుగుతున్న నూనెలో వేశాసారు! ఆ పెద్దాయన ఆ మరుగుతున్న నూనెలో చేతులు జోడించి
ప్రార్ధన చేస్తున్నారు! అందరు చూస్తున్నారు- గాని ఆయనకు ఏమీ కాలేదు! ఆయన కాలిపోలేదు-చనిపోలేదు! చక్రవర్తికి ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు!
సువార్త చెప్పొద్దు అని కొట్టి బెదిరించినా దెబ్బలనైనా ఓర్చుకుంటున్నాడు
గాని సువార్త చెప్పడం మానలేదు! చంపేద్దామని అనుకుంటే ఏ రకంగాను
ఆయనను చంపడం చేతకాలేదు! ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు
రాజు! ఆ రోజులలో భయంకరమైన యుద్ధఖైదీలను రాజకీయ ఖైదీలను మధ్యధరా
సముద్రంలో (ఏగియాస్ సముద్రం)- ఎఫెసు పట్టణానికి
దగ్గరలో సుమారు 371 కి.మీ. దూరంలో ఉన్న ఒక దీవిలో పడేసేవారు- మన అండమాన్ జైలు లాగ!
ఆ దీవి పేరు పత్మస్!!
దానిలో తీసుకెళ్ళి ఈ పెద్దాయనను పడేశారు!
అది క్రీ.శ. 82 వ సంవత్సరం!
ఆ పెద్దాయన పేరు: యోహాను గారు! ఆ రాజు పేరు డొమీషియస్! (క్రీ.శ.
81—96)
ఆయనను పట్టుకున్నది- పరిచర్య చేస్తున్నది
టర్కీ దేశంలో గల ఎఫెసు పట్టణము! ప్రస్తుత పేరు సెల్కుస్. అప్పటికి ఆయన వయస్సు సుమారు:
76 సంవత్సరాలు!
సరే, యోహాను గారు జైలులో ఉన్నారు- తనప్రక్కన ఎవరు లేరు- ఆ జైలులో చాలామంది ఉన్నారు గాని
ఆయనతో మాట్లాడకుండా ఉండటానికి ఆ జైలులోనే ఒక గుహలో పడవేశారు! దాని ద్వారాన్ని మూసేసి ఒకటి రెండు రోజులకు భోజనాన్ని గుహమీదన ఒక ఒక అడుగు
వ్యాసంలో ఒక కన్నం పెట్టి ఆ కన్నమునుండి పంపించేవారు! ఎందుకు
ఇలా చేశారు అంటే ఆయన ఎవరితోనైనా మాట్లాడితే వారు క్రైస్తవులు అవుతారని ఆ రాజు భావన!
యోహాను
గారికి చాలా భాద వేసింది! ఏమిటి ప్రభువా! నేను నిన్ను కాపాడుతాను అన్నారు కదా! మరి ఎందుకు నేను సువార్త ప్రకటించకుండా
నిర్భందించబడ్డాను! పేతురు గారిని చెరసాల నుండి తప్పించారు కదా,
మరి నన్ను కూడా అలాగే తప్పిస్తే నేను కూడా వెళ్లి ఎఫెసులో గాని మరో ప్రాంతంలో
సువార్త ప్రకటించి నీ రాజ్యవార్తను ప్రకటిస్తాను కదా.... అంటూ
ప్రార్ధనచెయ్యడం మొదలుపెట్టారు!
అకస్మాత్తుగా
వెలుగు ప్రకాశించింది ఆ గుహలో/ జైలులో! ఆయనకు యేసుక్రీస్తుప్రభులవారు తన
మహిమతో ప్రత్యక్షమయ్యారు! పులకరించిపోయారు ఆయన!
ప్రభువా నన్ను తీసుకుని వెళ్ళిపో లేక వీరితో
సువార్త ప్రకటించే అవకాశం ఇవ్వు! గాని నన్ను ఒంటరిగా వదిలెయ్యవద్దు!
ఎందుకు ఇలా చేశావు అని అడిగారు ఆయన!
యేసయ్య జవాబు: నేను కావాలనే చేశాను!
ఏమిటి ప్రభువా- మీరు
కావాలనే చేశారా?
ప్రభువు చెప్పారు- అవ్వును నేను కావాలనే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను!
ఎందుకు ప్రభువా?—
ఎప్పుడు చూసినా నీవు- నా ఎఫెసు సంఘము, నా సంఘస్తులు , నా స్ముర్ణ సంఘము, నా ఫిలదెల్ఫియ సంఘము అంటూ సువార్త
సువార్త అంటూ వారికోసమే ప్రాకులాడావు గాని నాతో మాట్లాడి, నాతో
సమయం గడిపి ఎంతకాలమయ్యింది చెప్పు! నేను భూమిమీద ఉన్నప్పుడు ఎప్పుడూ
నన్ను విడవకుండా నా రొమ్మున లేక చంకన కూర్చొంటూ మాట్లాడుతూ ఉండేవాడవు కదా! మరి ఎందుకు నాతో మాట్లాడటం మానేశావు? అన్నారు ప్రభువు!!
అయ్యా మీకు తెలుసు కదా, సేవ- పరిచర్య- సంఘము- మరి వీరిని చూసుకోవాలి కదా!
ప్రభువు అన్నారు- నాకు తెలుసు- గాని నాకు కూడా నీతో మాట్లాడాలని ఉంది-
అందుకే అక్కడుంటే నీవు సువార్త చెప్పకుండా, సంఘస్తులను
బలపరచకుండా ఉండలేవని తెలిసి- కేవలం నీవు నాతోనే మాట్లాడాలని ఇక్కడికి
తీసుకుని వచ్చేశాను అన్నారు!
అలాగా-
సరే ప్రభువా! నన్ను క్షమించు అన్నారు యోహాను గారు!
మరి నేను ఏమి చెప్పాలి ఇక్కడ?
నేను నీకు అంత్యకాలంలో జరుగబోయేవి నీకు ప్రత్యక్షపరుస్తాను! వాటిని ఉన్నది ఉన్నట్లుగా నీవు రాయాలి! ప్రజలకి తెలపాలి
అన్నారు!
సరే ప్రభువా,
మరి నేను ఎవరితోనూ మాట్లాడకుండా నిర్భందించబడ్డాను కదా! మరి ఎలా అని అడిగారు ఆయన!
అది నేను చూసుకుంటాను అన్నారు!
రోజులు
గడిచాయి- ఒకరోజు తనకు భోజనం వచ్చి వెళ్ళిన కొంతసేపటికి మరలా భోజనం
వచ్చే కన్నం తెరుచుకుంది-
గురువుగారు అనే మాట వినబడింది- తనకు తెలుసు అది
తన శిష్యుడు ప్రస్తుతం లవొదొకయ సంఘాన్ని చూసుకుంటున్న ఇరేనియాస్ స్వరము అది!
మీదన చూస్తే ఖైదీల బట్టలతో ఇరేనియాస్ కనబడ్డాడు! ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు పంపించారు నిన్ను?
అప్పుడు చెప్పాడు ఇరేనియాస్-- పోలికార్పుగారు పంపించారు
నన్ను! మీరు ఈ జైలులో ఉన్నంతవరకు నేనుకూడా ఇలాగే ఖైదీలా ఇదే జైలులో
ఉంటాను! దేవుడు అలా చెయ్యమని ప్రేరేపించారు అట! (యోహాను గారికి మంచి శిష్యులు ఉన్నారు: పోలికార్పు, ఇరేనియాస్, ఇగ్నేషియస్, దేమేత్రి,
థియోఫిలస్, అంతిపయస్) పోలికార్పు
స్ముర్ణ పట్టణంలో యోహాను గారి కంటే ముందుగా హతస్సాక్షి అయ్యారు. ఇగ్నేషియస్ పేతురు గారి ద్వారా అంతియొకయ సంఘానికి బిషప్ గా ఏర్పాటుచేయబడ్డారు)
అలా వచ్చినవే మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక మరియు ప్రకటన
గ్రంధము! అయితే అవి ఎవరు రాశారో, యోహాను
గారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు కేవలం పోలికార్పు గారికి, ఇరేనియస్ గారికి, ఆయన చెల్లికి (ఇరాని) (ఆమెను పెళ్లి చేసుకుందామని ఒక ఉన్నత సైనికాధికారి
(వేలరీస్) అనుకున్నాడు, ఆయన
ద్వారానే ఇరేనియాస్ ఆ జైలులో ఉండేందుకు ఆమె చెల్లెలు అప్పుడప్పుడు ఆయనను కలుసుకునేందుకు
ఏర్పాటులు జరిగాయి. గాని యోహాను గారు రాసిన ఉత్తరాలు ఆమె ద్వారా ప్రజలకు చేరుతున్నాయని
ఈ అధికారికి తెలియదు).
ఈ రకంగా
సుమారు 14 సంవత్సరాలు జరిగిపోయాయి! ఇరేనియస్ చెల్లెలు వలన ఆ సైనికాధికారి
కూడా రక్షించబడ్డాడు! ఆ వృద్ధుడిని అక్కడ ఉంచడం మంచిది కాదు ఎలాగైనా
తప్పించాలి అని వీరిద్దరూ వెళ్లి ప్రయత్నించారు. చివరికి ఆ జైలులో
విప్లవం సంభవించి బయటకు రావడానికి ప్రయత్నించారు- అయితే వారిలో
చాలామంది ఖైదీలను సైనికులు చంపేశారు! ఈలోగా మరొక గవర్నర్ అక్కడికి
అనగా పత్మస్ దీవికి చేరడం ఆ ఖైదీలను విడిపించడం జరిగింది. కారణం
డొమీషియస్ చక్రవర్తి చంపబడ్డాడు! క్రొత్త రాజు వీరిని విడుదల
చేశాడు! ఆ రకంగా యోహాను గారు, ఇరేనియస్
గారు, ఆయన చెల్లి, ఆ సైనికాధికారి అంతా
కలిసి మరలా ఎఫెసు పట్టణానికి వచ్చారు! యోహాను గారు వీరిద్దరికీ
పెళ్లి చేశారు!
మరలా సుమారు రెండు సంవత్సరాలు ఎఫెసు పట్టణంలో
సువార్త పరిచర్య చేశారు. చివరికి వాక్యం చెప్పడానికి
నిలబడటానికి ఆయనకు ఓపిక లేకపోతే మంచం మీద మందిరానికి తీసుకుని వస్తే ఆ మంచం మీదనుండే
వాక్యం చెప్పేవారు అని చరిత్ర చెబుతుంది.
చివరికి
టర్కీ దేశంలో ఎఫెసు పట్టణంలో నిండు వృద్ధాప్యంలో 96 సంవత్సరాల
వయస్సులో చనిపోయారు! (గమనిక: పై చెప్పినవన్నీ
తెర్తిల్లు అనే ఒక చరిత్ర కారుడు, రెండవ శతాబ్దంలో వ్రాసిన విషయాలు)
ఇంత ఘనమైన పరిచర్య, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది కొట్టినా, తిండి ఉన్నాలేకున్నా మంచి పరిచర్య
చేసిన ఈ భక్తుడు మనందరికీ మార్గదర్శి! అటువంటి తెగింపు పట్టుదల
సువార్త భారము, ప్రార్ధనానుభవము మనకు కూడా కలగాలని ప్రార్ధన చేద్దాము!
వివరణ
ప్రియులారా! ప్రత్యక్షతల గ్రంధమైన ప్రకటన గ్రంధమును ధ్యానించే ముందుగా క్లుప్తంగా యోహాను
గారి కోసం చూసుకుందాం! కారణం దేవుడు ఈ గ్రంధాన్ని రాయడానికి ప్రత్యేకంగా
యోహాను గారినే ఎందుకు ఎంచుకున్నారు? యేసుక్రీస్తుప్రభులవారితో
ఆయనకున్న సంబంధము, అవినాభావ సంభందము ఏమిటి? బంధుత్వము ఏమైనా ఉందా? యేసుక్రీస్తుప్రభులవారు వారితో
ఎలా గడిపారు ఈయన- ఆయనతో ఈయనకున్న అనుభవాలు ఏమిటి అనేది తెలుసుకుంటే
ఈ గ్రంధం రాయడానికి ఆయననే ఎందుకు ఎన్నుకున్నారు- యోహాను గారి
ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి అనేది అర్ధమవుతుంది!!!
పేరు:
యోహాను
తండ్రి:
జెబదయి
తల్లి:
సలోమి
ఊరు:
బేత్సయిదా (ఒక చేపలు పట్టే చిన్న గ్రామము)
వృత్తి:
తండ్రితో పాటు చేపలు పట్టడం
అన్నయ్య:
పెద్ద యాకోబు గారు (చిన్న యాకోబు అంటే యేసయ్య తమ్ముడు)
పుట్టింది:
క్రీ.శ. 6(అనగా యేసుక్రీస్తుప్రభులవారు
కంటే పది సంవత్సరాలు చిన్నవాడు)
దేవుడు సేవకు పిలిచినప్పుడు ఆయన వయస్సు సుమారు 19 సంవత్సరాలు.
శిష్యులందరిలో చిన్నవాడు! చరిత్ర ప్రకారం అందరికంటే
చిన్నవాడు కాబట్టి అందరిపనులను చురుకుగా చేసేవారట! శిష్యులతో
ఎంత చనువు అంటే ఒరే యోహాను అని పిలిచేటంత చనువు ఉంది అందరికి! అందరికీ చాలా ఇష్టం యోహాను గారంటే!! యేసుక్రీస్తుప్రభులవారు
చనిపోయేసరికి ఈయన వయస్సు కేవలం ఇరవైమూడున్నర సంవత్సరాలు!
*యేసయ్యతో ఏమైనా బంధుత్వం ఉందా*???
చరిత్ర ఉంది అని చెబుతుంది!!
బైబిలో గల ఇద్దరు
యోహాను గార్లు యేసుక్రీస్తుప్రభులవారికి బందువులే! లూకా సువార్త 1:36 ప్రకారం బాప్తిస్మమిచ్చు
యోహాను గారు యేసయ్య తల్లిగారైన దైవజనురాలు మరియమ్మకు బంధువు!( మేనత్త అంటారు)
ఇక
మన అపోస్తలుడైన యోహాను గారు కూడా బంధువే! యోహానుగారి తల్లియైన సలోమి గారు- చరిత్ర ప్రకారం మరియమ్మ గారికి సొంత పెద్ద అక్క!
మరి ఇప్పుడు
కొన్ని అనుమానాలు రావచ్చు-
యోసేపు గారు కంసాలి లేక వడ్రంగి, జెబదయి గారు చేపలు పట్టేవారు. మరి ఎలా బంధువులు?
జవాబు
సింపుల్: సలోమి
గారికి మరియమ్మ గారికి పెళ్లి చేసింది వారి తల్లిదండ్రులు కాదు! మరియమ్మ గారి చిన్నతనంలోనే వారిద్దరూ చనిపోయారు! వారిద్దరికీ పెళ్లి చేసింది యాజకులే!
గమనించాలి ఆకాలంలో ఆ దేశంలో పదమూడు పన్నెండు సంవత్సరాలకే ప్రధానం చేసి
పదిహేను సంవత్సరాలు వయస్సులో పెండ్లి జరిగిపోయేది ఆడపిల్లలకు!!! అలాగే వీరికి కూడా జరిగింది!
సలోమి గారికి జెబదయి గారికిచ్చి చేశారు! మరియమ్మను చరిత్ర ప్రకారం
(Asian times and times of India) వయస్సులో పెద్దవాడు
, ప్రజలందరిలో నీతిమంతుడైన యోసేపుగారికి ఇచ్చి చేశారు! (ఇది ఆయనకు రెండో పెళ్లి! ఆయన మొదటి భార్య చనిపోతే ఆయన
నీతిమంతుడు మంచివాడు అని తెలిసి- మరియమ్మగారు చిన్నదైనా ఆమె భవిష్యత్
బాగుంటుంది అని తెలిసి పెళ్ళిచేశారు యాజకులు)
మరి మరో అనుమానం
రావచ్చు! మరి ఎక్కడా
వీరు బంధువులు అని బైబిల్ లో వ్రాయబడలేదు మరియు యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఎప్పుడు
అలా పిలువలేదు- మరి సలోమికి- మరియమ్మకు
సంభంధాలు లేవా?
అంటే
లేవు!
ఎందుకు
లేవు అంటే కావాలనే తెంచేసుకున్నారు యోసేపు గారు, మరియమ్మ గారు!
కారణం: *యేసుక్రీస్తుప్రభులవారు*!
ఏం? ఏమయ్యింది?
జ్ఞానులు
మోసం చేశారని తెలిసిన హేరోదు రాజు రెండేళ్ళు నిండని పసివారిని చంపుతుంటే దేవదూత ద్వారా
ఆజ్ఞాపించబడి ఈజిప్టుకు పోయినట్లు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడగలం!
అయితే చరిత్ర ప్రకారం- హేరోదు రాజు వీరిని పిచ్చికుక్కను
తరిమినట్లు తరిమాడట! వీరికోసం గాలించని ప్రాంతం లేదు!
అందుకే బాలుడైన యేసయ్యను, మరియమ్మను తీసుకుని దేశాలు
తిరిగారు వీరు! చివరికి ఐగుప్టు కూడా రోమా పాలనలో ఉంది కాబట్టి
అక్కడ కూడా ఎక్కడా ఒక చోట ఉండకుండా ఇటూ అటూ తిరిగేవారు నిలవరమైన స్థానం లేకుండా! చివరికి హేరోదు రాజు చనిపోయాక వారి
సొంతూరు వద్దామనుకుంటే వాడికొడుకు పాలిస్తున్నాడు అని తెలిసికొని యూదయనే వదిలేసి గలలియ
లోని నజరేతులో ఉండిపోయారు! ఇక యోసేపు బంధువుల యొద్దకు గాని,
తన చిరాస్తి దగ్గరకు గాని , మరియమ్మ బంధువుల యొద్దకు
గాని వెళ్తే ఎక్కడ యేసుక్రీస్తుప్రభులవారు ప్రాణానికి ప్రమాదం వస్తాదో అని బంధువులను
కట్ చేసేసుకుని ఎవరూ లేనట్లు బ్రతికారు! అలాగే పిల్లలకు వారికి
బంధువులు ఉన్నట్లుగా చెప్పలేదు! అందుకే యోహానుగారు బంధువుడే అయినా
బంధుత్వము ఎక్కడా కనిపించదు! అంతేకాదు యోహాను గారు కూడా ఎప్పుడు
ఆయన రొమ్మున ఆనుకుంటూ ఉన్న గాని ఎప్పుడు ప్రభువా అని గాని, బోధకుడా
అని గాని పిలిచేవారు. ఇంకా చెప్పాలంటే గురువుగారు అని పిలిచేవారు!
మరి
యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయేటప్పుడు మరియమ్మ గారిని ఇందుకేనా యోహాను గారికి అప్పగించింది
అనుకుంటే- అదికూడా
ఒక కారణమైనా అసలు విషయం- యేసయ్యకు నమ్మినబంటు యోహాను గారు!
అంతేకాకుండా రాబోయేరోజులలో వారు అనుభవించబోయే శ్రమలు తెలుసు కాబట్టి
తన తల్లిని శ్రమలనుండి కాపాడాలి అనుకుని ముందుగానే యోహాను గారికి అప్పగించారు!
ఆయన -ఆమె చనిపోయే వరకు తనతోపాటుగా మరియమ్మ గారిని
ఎఫెసులో పెట్టుకుని పోషించారు!
కాబట్టి
మొదటగా బంధుత్వం ఉంది వీరికి!
అంతకంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుప్రభులవారితో మరిచిపోలేని అనుభవాలున్నాయి
యోహాను గారికి యేసయ్యతో!
ప్రియ దైవజనమా! ఇప్పుడు యోహాను గారు బైబిల్ గ్రంధంలో ఎక్కడెక్కడ కనబడుతున్నారు- యేసయ్యతో ఆయనకున్న అనుబంధము చూసుకుందాము!
లూకా 5:10 లో యోహాను గారు, తన అన్నయ్య పెద్ద యాకోబుగారు పరిచర్యకై యేసుప్రభులవారితో పిలువబడ్డారు!
గమనించాలి: శిష్యులలో మొట్టమొదటి హతస్సాక్షి మరియు
చనిపోయిన వారు పెద్దయాకోబు గారు. చివరగా చనిపోయింది- సామాన్య మరణం పొందింది యోహాను గారు!
ఇక మార్కు 1:20 ప్రకారం కొంచెం ధనవంతులు. కారణం తనే కాకుండా తనక్రింద పనిచేసే సేవకులు కూడా ఉన్నారు వీరికి!
యోహాను 1:35—40 ప్రకారం
పేతురు గారి తమ్ముడు అంద్రేయ మరియు యోహాను గారు స్నేహితులు! వీరందరిదీ
ఒక్కటే వృత్తి కదా! అందుకే పరిచయస్తులు!
అదే వచనాల ప్రకారం
వీరిద్దరూ మొదట బాప్తిస్మమిచ్చు యోహాను గారి శిష్యులు గాని యేసయ్య సేవకు పిలిచాక యేసుక్రీస్తుప్రభులవారు
శిష్యులు అయ్యారు.
*యోహాను గారు, యాకోబు గారు పేతురు గారు ఎక్కువగా ముఖ్యమైన
అద్భుతాలలో సాక్షులు*!
యాయీరు
కుమార్తెను బ్రతికించినప్పుడు సాక్షులు: మార్కు 5:37
రూపాంతరం
కొండ మీద సాక్షులు: మత్తయి 17:1
యేసుక్రీస్తుప్రభులవారు
వేదనతో గెత్సమనే కొండమీద ప్రార్ధించి నప్పుడు ముగ్గురు ఉన్నారు, వీరిని ప్రార్దించమని చెప్పారు
:మత్తయి 26:36—46
ఇక
పేతురు గారు యోహాను గారు కలిసి యేసయ్యతో ఉన్న ప్రత్యేక సందర్బాలు ఉన్నాయి:
ఆయన
గాడిదమీద ఊరేగింపబడటానికి వీరిద్దరినే గాడిద పిల్ల కోసం పంపించారు:లూకా 19:28—35
పస్కా
పండుగకు గది సిద్దపరచడానికి వీరిద్దరినే పంపించారు: లూకా
22:8—13
ఆయనను
గెత్సమనేలో బంధించినప్పుడు వీరిద్దరే ఆయన వెనుక దొంగచాటుగా వెళ్లారు: యోహాను 18:15
ఆయన
తిరిగి లేచాక కాళీ సమాధిని చూశామని స్త్రీలు చెప్పినప్పుడు వీరిద్దరే పరుగెత్తుకుని
పోయి కాళీ సమాధిని చూశారు:
యోహాను 20:2—8
*ఇక యోహాను గారిలో మూడుసార్లు మానవనైజము కనబడి యేసయ్యతో సరిచేయబడ్డారు*.
మార్కు 9:38—41లో
యేసయ్యను వెంబడించని ఒక వ్యక్తి యేసునామంలో దయ్యాలను వెల్లగోడుతూ ఉంటే ఆటంకపరిచారు.
మార్కు 10:35—37లో
సమరయులు యేసయ్యను- ఆయన శిష్యులను చేర్చుకోకపోతే యోహాను గారు మరియు
యాకోబుగారు ఆ సమరయులను ఏలియాగారు చేసినట్లు అగ్నిని రప్పించి వారిని కాల్చేయ్యమని చెప్పనా
అని అడిగారు! అంత విశ్వాస వీరులు! మరియు
యేసయ్య అంటే అంత ఇష్టం వారికి! అందుకే వీరికి బోయనేర్గేసు అని
పేరు పెట్టారు! అంటే ఉరిమెడి వారు! అచ్చమైన
మన భాషలో ఫైర్ బ్రాండ్ లు వీరు!
మత్తయి 20:23 నుండి చూసుకుంటే ఈ సహోదరులు
ఇద్దరు నిత్యత్వములో ఆయనకు ఇరుప్రక్కలా వీరే కూర్చోనేలా ఆయనను అడిగారు, అందుకు గాను వారి తల్లిని అనగా యేసయ్య పెద్దమ్మతో రికమండేషన్ చేయించారు!
మార్కు 13:1—4 ప్రకారం
యేసుక్రీస్తుప్రభులవారు యేరూషలేము మరియు అంతము కోసం చెప్పిన రెండు ప్రవచనాలు పలకడానికి
కారణం యోహాను చెప్పిన మాటలే!
యోహాను 13:21—26 లో
మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని యేసయ్య అంటే అడగటానికి ఎవరికీ ధైర్యము చాలక అడగమని
శిష్యులు సైగ చేసింది యోహాను గారినే!
ఆయనను పట్టుకుని, హింసలు
పెట్టినప్పుడు, తీర్పు జరిగినప్పుడు చివరికి సిలువ దగ్గర కూడా తెగించి దైర్యముగా
నిలిచినది శిశ్యులందరిలో కేవలం యోహాను గారే!
అందుకే యోహాను గారిని చూసి కుమారుడా ఈమె నీ తల్లి! మరియు తల్లిని చూసి ఇతడే నీ కుమారుడు అని బాధ్యతను అప్పగించారు! యోహాను 19:26—27.చరిత్ర ప్రకారం మరియమ్మ గారు చనిపోయే వరకు కుమారునిలా తనతోపాటుగా ఉంచుకుని ఆమెను పోషించారు. ఆమె చనిపోతే ఎఫెసు పట్టణంలో ఆయనే సమాధి చేశారు!
ఇక పునరుత్థానము తర్వాత కూడా యోహాను 20వ
అధ్యాయంలో యోహాను గారు యేసయ్యతో మాట్లాడుతారు!
ఆయన ఆరోహణం తర్వాత పెంతుకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మను
పొందుకున్న వారిలో యోహాను గారు ఉన్నారు! అపోస్త 2
అపో మూడవ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకనిని
బాగుచేసి నప్పుడు పేతురుగారితో పాటు ఉన్నది యోహాను గారే! ఇంకా
చెప్పాలంటే పేతురుగారు యోహాను గారు కలిసి ఈ అద్భుతం చేశారు!
అపో 4:13—22 ప్రకారం
అధికారులతో ఎంతో ధైర్యముగా వాదించారు.
అపో 8:14—15 లో
సమరయ వారు వాక్యాన్ని అంగీకరించారు అని తెలిసినప్పుడు సంఘము పెద్దలుగా వీరినే పంపించి
వారిని బలపరిచారు!
గలతీ 2:9 ప్రకారం సంఘానికి స్తంభాలు అని పిలువబడిన
వారు పేతురు గారు, చిన్న యాకోబు గారు (యేసయ్య
తమ్ముడు) మరియు యోహాను గారు!!!
కాబట్టి వీటి అంతటి ప్రకారం యోహాను గారు యేసయ్య దగ్గర సమస్తము
నేర్చుకున్నారు! ఉరిమెడి వారు అని పేరు తెచుకున్న యోహాను
గారు యేసయ్యను చూసి ప్రేమమూర్తిగా మారిపోయారు! అందుకే తన సువార్తలో
గాని, పత్రికలలో గాని కేవలం ప్రేమనే ప్రాముఖ్యంగా చూపించి రాశారు!
యేసయ్య ప్రేమను నిజంగా అర్ధం చేసుకున్నవారు ఇద్దరే అనిపిస్తుంది!
మొదటి వ్యక్తి యోహాను గారు! రెండవది పౌలుగారు! యోహాను గారు యేసయ్య *పాదాలవద్ద* నేర్చుకుంటే- పౌలుగారు
యేసయ్య వద్ద- మూడు సంవత్సరాలు అరేబియా దేశంలో *పాదాలమీద*(ప్రార్ధనలో) నేర్చుకున్నారు!
ఇక ఆయన పరిచర్యకు, రూపాంతరతకు
మరణ పునరుత్తానికి, పరిశుద్ధాత్మ అభిషేకానికి సాక్షి కాబట్టి
యేసుక్రీస్తుప్రభులవారు యోహాను గారినే ఈ ప్రత్యక్షతల గ్రంధాన్ని వ్రాయడానికి ఎంచుకున్నారు!
*గ్రంధ వివరణ*
పేరు:
మొదట్లో ప్రచురించబడిన తెలుగు బైబిల్లో ఈ పుస్తకాన్ని “ప్రత్యక్షము”
అని రాశారు. ఇది మొదటి వచనమైన “ఇది యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షం” అనేదానితో
ఏకీభవిస్తూ చాలా మంచి పేరై ఉంది. కానీ ఏదో వింత కారణం వల్ల పాత
బైబిలును మార్పు చేసి “పరిశుద్ధ గ్రంథము”గా ప్రచురించినవాళ్ళు “ప్రకటన గ్రంథము” అని వాడారు. కానీ అది ఈ పుస్తకానికి “ప్రకటన” అంత సరియైన పేరు కాదు.
వ్రాసిన
కాలం:
క్రీ.శ. దాదాపు
93--96లో యోహాను గారు పత్మస్ చెరలో రాశారు.
ముఖ్యాంశం:
యోహాను రాసినది యేసు
క్రీస్తు బయలుపరచిన సంగతులే (1:1).
ఈ గ్రంథంలో యేసుక్రీస్తు
మహిమలో కనిపిస్తున్నారు.
ఆయన భూరాజులను పరిపాలించేవాడు (1:5),
సంఘాలకు తీర్పు తీర్చేవాడు (2,3 అధ్యాయాలు),
యూదా గోత్ర సింహం (5:5),
మహిమోన్నత స్థితి పొందిన గొర్రెపిల్ల
(5:6),
ప్రభువులకు ప్రభువు (19:16),
దేవుని రాజ్యమేలబోయే
రాజు (19:15),
‘అల్ఫా’ ‘ఓమెగ’
అయి ఉన్నవాడు, ఆది అంతం అయి ఉన్నవాడు
(22:13).
ఈ గ్రంథంలో భవిష్యత్తు
విషయాలు రాసి ఉన్నాయి (1:1).
దీని విశేషాంశం యేసు
క్రీస్తు రెండో రాకడ, దానికి
ముందూ, దాని తరువాత జరగబోయే సంఘటనలు – భూమిమీదా పరలోకంలోనూ జరగబోయే సంఘటనలు.
ఈ గ్రంథం అలంకారిక
భాషతో, గూఢమైన విధానంలో రాసిన సూచనలతో
నిండి ఉంది. అయినా చాలా మట్టుకు ముఖ్యాంశాలు స్పష్టముగా అర్ధమవుతాయి.
– ఈ యుగ సమాప్తిలో దుర్మార్గం అధికంగా పెరిగిపోతుంది; క్రీస్తువిరోధి
లోకమంతటిమీదా ప్రభుత్వం చేసి దేవుని ప్రజలను క్రూరంగా హింసిస్తాడు; వాణ్ణి అనుసరించినవారిని దేవుడు శిక్షిస్తాడు, లోకాన్ని
భయంకరమైన విపత్తులకు గురి చేస్తాడు; చివరికి యేసు క్రీస్తు దేవుని
రాజ్యమేలడానికి గొప్ప మహిమతో వైభవంతో వస్తారు. ఈ సంఘటనల వివరణతో
పాటు ప్రభు విశ్వాసులకు అనేక మంచి వాగ్దానాలూ, ప్రోత్సాహకరమైన
మాటలూ, ఆదరణకరమైన విషయాలూ, పరలోక సంబంధమైన
మహిమగల దృశ్యాలూ ఈ గ్రంథంలో ఉన్నాయి.
బైబిలంతటిలో కనబడే కొన్ని ఆధ్యాత్మిక
నియమాలూ పాఠాలూ ఈ పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ 6:1 నుంచి 22:5 వరకు రాసిన సంఘటనలు ఇంకా జరగలేదు!
ఒక్కమాట: ఈ గ్రంథం లో విషయాలు క్రమబద్ధంగా
లేవు అని కొందరు, క్రమంగా ఉన్నాయని కొందరు భావిస్తారు!
యోహాను గారు 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు యూదుల కోణంలోను, 12 నుండి 19 వరకు సంఘము కోణంలోను దర్శనాన్ని చూశారు అని చాలామంది వేదపండితులు నమ్ముతారు.
నేనుకూడా దీనినే నమ్ముతాను.
విషయసూచిక సంక్షిప్తంగా:
అధ్యాయం 1: పరిచయం, యోహాను
గారి పరలోక దర్శనం
అధ్యాయాలు 2--3: ఏడు సంఘాలకు ఇవ్వబడిన వర్తమానాలు
అధ్యాయాలు 4--5: పరలోకములో పరిశుద్ధుల స్థితిగతులు
అధ్యాయాలు 6--11: అంత్యకాలంలో జరగబోయే సంభవాలు యూదుల
కోణంలో
అధ్యాయాలు 12--19: అంత్యకాలంలో జరగబోయే సంభవాలు సంఘం
కోణంలో
అధ్యాయాలు 20--22: వెయ్యేళ్ల పాలన, గోగుమాగోగు యుద్ధం, దవళ సింహాసనం తీర్పు, నిత్యత్వము
విషయసూచిక
వివరంగా:
ఈ పుస్తకం దేని గురించి 1:1-2
దీన్ని పాటించిన వారికి
ధన్యత 1:3
క్రీస్తు సంఘాలకు
త్రిత్వంనుంచి కృప, శాంతి
1:4-5
విశ్వాసుల కోసం క్రీస్తు
ప్రేమ, ఆయన చేసినది
1:5-6
క్రీస్తు రెండో రాకడ 1:7
క్రీస్తు దర్శనం 1:9-16
యోహాను చేసినది, క్రీస్తు అన్నది 1:17-20
ఏడు సంఘాలు 2:1—3:22
ఎఫెసు 2:1-7
స్ముర్న 2:8-11
పెర్గము 2:12-17
తుయతైర 2:18-29
సార్దీస్ 3:1-6
ఫిలదెల్ఫియా 3:7-13
లవొదికయ 3:14-22
పరలోకానికి సంబంధించిన
దృశ్యం 4:1-11
గొర్రెపిల్ల, చుట్టబడిన గ్రంధము 5:1-7
పరలోక నివాసులందరూ
గొర్రెపిల్లను స్తుతిస్తూ పాడడం 5:8-14
గొర్రెపిల్ల మొదటి
ఆరు ముద్రలు విప్పడం 6:1-16
క్రీస్తు విరోధి బయలు
దేరడం 6:1-2
యుద్ధం 6:3-4
కరవు 6:5-6
మరణం, నాశనం 6:7-8
మహా శ్రమలకాలంలో చనిపోయినవారు 6:9-11
ప్రభువు దినం సూచనలు 6:12-17
144,000 మంది
7:1-8
విముక్తి పొందిన గొప్ప
జన సమూహం 7:9-17
వారేమి అన్నారు 7:10
దేవదూతలు ఏమన్నారు 7:11-12
ఒక పెద్ద ఏమన్నాడు 7:13-17
గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పడం 8:1-5
మొదటి ఆరు బూరలు 8:6—9:21
మొదటి బూర – వడగండ్లు, నిప్పు, రక్తం
8:7
రెండో బూర – ఇంకా రక్తం 8:8-9
మూడో బూర – చేదు నక్షత్రం 8:10-11
నాలుగో బూర – మూడో భాగం చీకటి 8:12-13
ఐదో బూర – అగాధం 9:1-12
ఆరో బూర – నలుగురు దేవదూతలు 9:13-19
పశ్చాత్తాపం లేదు 9:20-21
దేవదూత, చుట్టబడిన మరో గ్రంథం 10:1-11
ఆలయాన్ని కొలవడం 11:1-2
దేవుని కోసం ఇద్దరు
సాక్షులు 11:3-14
ఏడో బూర 11:15-19
స్త్రీ, ఆమె సంతానం, రెక్కలున్న
మహా సర్పం 12:1-17
రెండు మృగాలు 13:1-18
సముద్రంనుంచి వచ్చిన
మృగం 13:2-10
భూమిమీదనుంచి వచ్చిన
మృగం 13:11-17
మొదటి మృగం సంఖ్య 13:18
గొర్రెపిల్ల, 144,000 మంది 14:1-5
ముగ్గురు దేవదూతలు, వారి సందేశం 14:6-12
పరలోకంనుంచి స్వరం 14:13
రెండు పంటలు 14:14-20
భూమి పంట 14:1-16
ద్రాక్ష పండ్ల పంట 14:17-20
ఏడు తెగుళ్ళు 15:1-8
మోషే పాట, గొర్రెపిల్ల పాట 15:2-4
ఏడుగురు దేవదూతలు 15:5-8
ఏడు కోప పాత్రలు 16:1-21
మొదటి పాత్ర – కురుపులు 16:2
రెండో పాత్ర – రక్తం 16:3
మూడో పాత్ర – ఇంకా రక్తం 16:4
దేవుని తీర్పులో న్యాయం 16:5-7
నాలుగో పాత్ర – తీవ్రమైన వేడి 16:8-9
అయిదో పాత్ర – చీకటి 16:10-11
ఆరో పాత్ర – మూడు దయ్యాలు, వాటి పని 16:12-16
ఏడో పాత్ర – గొప్ప భూకంపం, బ్రహ్మాండమైన వడగండ్లు
16:17-21
వేశ్య, మృగం 17:1-18
బబులోను పతనం 18:1-24
పరలోకంలో ఆనందం, దానికి కారణం 19:1-8
యోహాను, దేవదూత 19:9-10
బలప్రభావాలతోను, మహిమతోను యేసుక్రీస్తు భూమిమీదికి రావడం
19:11-16
పక్షుల కోసం గొప్ప
విందు 19:17-21
మృగం, అబద్ద ప్రవక్త దండన 19:20
సైతానుకు వెయ్యేళ్ళ
చెర 20:1-3
క్రీస్తు, ఆయన ప్రజలు, 1000 ఏళ్ళ పాలన 20:4-6
సైతాను విడుదల తర్వాత
ఏమి జరుగుతుంది 20:7-10
తెల్లని మహా సింహాసనం
తీర్పు 20:11-15
క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త
యెరూసలం 21:1—22:6
దేవుడు మనుషులతో ఉంటాడు 21:3-4
దేవుని వాగ్దానం 21:5,7
పశ్చాత్తాపపడని పాపుల
దండన 21:8
దేవుని నగరం 21:9-26
నగరంలోకి ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు 21:27
జీవజల నది 22:1-2
మహిమాన్వితమైన భవిష్యత్తు 22:3-5
బైబిలులోని చివరి
సందేశం 22:6-21
యేసు వస్తున్నాడు 22:7,12,20
రెండు రకాల మనుషులు, వారి భవిష్యత్తు 22:14-15
చివరి ఆహ్వానం 22:17
చివరి హెచ్చరిక 22:18-19
చివరి ప్రార్థన 22:20
చివరి మాట 22:21
*మొదటి అధ్యాయం- యోహాను గారి దర్శనం*
ప్రకటన
గ్రంథం 1: 1
యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు
అభిషిక్తుడని అర్ధము) తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన
ప్రత్యక్షత. (లేక, ప్రకటన). ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా
వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
ప్రియ దైవజనమా! ఇక మనము ఈ పత్యక్షతల గ్రంధాన్ని ప్రార్ధనా పూర్వకముగా ధ్యానం చేసుకుందాము!
ఈ మొదటి వచనంలో
యోహాను గారు యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత
అంటూ మొదలుపెట్టారు! ఇంకా ఏమంటున్నారు అంటే ఈ సంగతులు త్వరలో సంభవింపనై యున్నవి అంటూ ఆయన తన దూత
ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అంటున్నారు!
దీనిని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది అంటే ఈ ప్రకటన గ్రంధము
అనే ప్రత్యక్షతల గ్రంధము మనుష్యులు కనిపించిన కల్పిత కధలు, ఇతిహాసాలు కానేకాదు! దేవుడే
తన దూతను పంపించి యోహాను గారికి ఇవి చూపించారు. ఇంకా తొమ్మిదో
వచనం ప్రకారం ఆయన ప్రభువు
దినమందు పత్మసు ద్వీపమున పరవశుడనై యుండగా.. అంటున్నారు
,తరువాత వచనంలో ఆత్మ వశుడనై యుండగా అంటున్నారు అనగా ఆయన ప్రార్ధన చేసుకుంటూ
ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవుడు తన దూతను పంపించి భూరధ్వని వంటి స్వరముతో నీవు చూసేవన్నీ
అనగా ఇప్పుడు నేను నీకు చూపించేవి అన్నీ వ్రాసి ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు పంపించమని
చెప్పారు! అనగా జరుగబోయే సంభవాలు ముందుగానే తన భక్తుడైన యోహాను
గారికి చూపించి వ్రాయించారు అన్నమాట! కాబట్టి ఇవి కధలు కట్టుకధలు
కానేకాదు! కల్పిత కధ అంతకంటే కాదు! ఫాంటసీ
స్టోరీ, హర్రర్ మూవీ అంతకంటే కాదు! జరుగబోయేది
దేవుడు ముందుగానే చూపించారు తన భక్తుడైన యోహానుకి!
*ఎందుకు
చూపించారు*?
*మొదటగా*: ఆమోసు ౩:7 ప్రకారం దేవుడు
తన దాసులైన ప్రవక్తలకు చెప్పకుండా ఆయన ఏమీచెయ్యరు అందుకే జరుగబోయేది ముందుగా తన భక్తులకు
చూపించి అప్పుడు చేస్తారు అన్నమాట!
*రెండవది*: ఈ సృష్టి పాపముతో నిండిపోయినందున దీనిని అంతము
చేసే సమయం ఆసన్నమయింది! అయితే ఆయన సర్వాధికారి ఎప్పుడైనా దీనిని అంతము చేయడానికి ఆయనకు అధికారం ఉంది! ముందుగా నోటిస్ ఇవ్వకుండా ఆయన చెయ్యగలరు!
గాని ఆయన ప్రేమామయుడు! ఈ సృష్టిని మానవుల కోసమే
చేసారు! వారు సుఖశాంతులతో ఉండాలని ఆయన తలంచి ముందు సృష్టిని చేసి
సంపూర్ణమయ్యాకనే మనిషిని చేశారు! మరి అలాంటిది సృష్టిని లయం చేస్తుండగా
మరి భూమిమీద నున్న మనుష్యులకు నోటిస్ ఇవ్వకుండా లయము చేయరు కదా!
ఇంకా ఎందుకంటే అందరూ
రక్షించబడాలని తన రాజ్యము చేరుకోవాలని ఆయన ఆశ!
2పేతురు 3: 9
కొందరు
ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని
యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
అపో.కార్యములు 17: 30
ఆ
అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును
మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
అందుకే ఒరేయ్ నా
ప్రియ కుమార-కుమార్తెలారా!
నేను ఈ భూమిని ఈ విధముగా ఈ సంభవాలు జరిగిన మీదట లయం చేయబోతున్నాను కాబట్టి
బ్రతుకుని మార్చుకుని నా దారిలో ఉంటే మీకు పరలోకము, నిత్యత్వము!
అలా కాకుండా మీ శరీరాసలను అనుసరించి జీవిస్తే మీకు నిత్య నాశనము కలుగుతుంది
అని ముందుగానే ప్రజలకు తెలుపడానికి ఈ ప్రత్యక్షతల గ్రంధాన్ని దేవుడు తనదాసుడైన యోహాను
గారికి జరుగబోయేవి చూపించి వ్రాయించుకున్నారు అన్నమాట!
*మూడవది మరియు ముఖ్యమైనది*:
*ప్రకటన
గ్రంధము- బైబిల్ లో ఇతర గ్రంధాలు*
బైబిల్
గ్రంధంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంధం వరకు ఎన్నెన్నో ప్రవచనాలు ఉన్నాయి! అయితే అంతము అనగా యుగాంతము
గురించి గాని, ఇశ్రాయేలు ప్రజల యొక్క చివరి రోజులు మరియు వారి
రక్షణ గురించి అనేక గ్రంధాలలో ఎన్నెన్నో ప్రవచనాలున్నాయి! అయితే
వాటిలో 60% ఇంకా నెరవేరలేదు! త్వరలో నెరవేరుతాయి!
అయితే అవి అర్ధం కావాలంటే తప్పకుండా ప్రకటన గ్రంధముతో పోల్చుకుంటేనే
గాని సరిగా వాటిని అర్ధం చేసుకోలేము! ఉదాహరణకు యెషయా గ్రంధంలో
ఇశ్రాయేలు ప్రజలకోసం, యుగాంతం కోసం, రాకడకోసం
వ్రాయబడిన ప్రవచనాలు 50% నెరవేరలేదు! అలాగే
యిర్మియా గ్రంధంలో వ్రాయబడిన ప్రవచనాలు, యేహెజ్కేలు గ్రంధంలో
వ్రాయబడిన ప్రవచనాలు, యోవేలు గ్రంధంలో వ్రాయబడినవి, జెఫన్యా గ్రంధంలో వ్రాయబడినవి మలాకి గ్రంధంలో వ్రాయబడినవి ఇవన్నీ ఇంకా అనేకమైనవి
నెరవేరలేదు! పాత నిబంధన మాత్రమే కాదు క్రొత్త నిబంధనలోను మత్తయి
మార్కు లూకా సువార్తలలో చెప్పబడినవి ఇంకా రోమా, కొరింథీ,
థెస్సలోనికయులు పేతురు పత్రికలలో చెప్పబడినవి కూడా అర్ధం కావాలంటే ప్రకటన
గ్రంధముతో పోల్చి చూడాల్సిందే! వాటిని సంపూర్ణంగా అర్ధము చేసుకోవాలంటే తప్పకుండా ఈప్రకటన గ్రంధముతో పోల్చుకోవలసినదే!
థియాలజి ని బాగా అర్ధం చేసుకోవాలి
అంటే ఇంకా చెప్పాలంటే బైబిల్ ను బాగా అర్ధం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పారు
అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వాటితో పోల్చుకోవాలి! 1కొరింథీ 2:13; అనగా బైబిల్ లో గల ఒక లేఖనం సరిగా అర్ధము
చేసుకోవాలి అంటే- నీవు ఒక లేఖనం ఒకరకంగా అర్ధం చేసుకొన్నావు అనుకో-
అది సరియైన వివరణా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక లేఖనమునకు సపోర్టింగ్
వచనము మరో గ్రంధంలో గాని మరో వచనంలో గాని సరిపోవాలి! ఒక వచనానికి
సపోర్టింగ్ వచనం మరొక దగ్గర ఉండాలి, ఆ అర్ధముతో నీ వివరణ లేక
అర్ధము సరిగా ఉంటే నీవు అర్ధము చేసుకున్నది సరియైనది లేక నీ భావము సరియైనది అని అర్ధము!
లేక నీ బోధ సరియైనది అని అర్ధము! అలాగే ఎన్నెన్నో
ప్రవచనాలు దేవుడు వ్రాయించారు వాటిని సంపూర్ణముగా ప్రజలకు అర్ధం అవ్వడానికి చివరలో
దేవుడు ఈ ప్రకటన గ్రంధమును వ్రాయించారు అన్నమాట! కాబట్టి దీనిని
అర్ధము చేసుకుని బ్రతుకుని మార్చుకుని సిద్ధపడితే అనగా వాక్యానుసారమైన జీవితం,
పవిత్రమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం,
ఆత్మానుసారమైన జీవితం కలిగి సిద్దపడితే రాకడలో ఎత్తబడ గలవు! పరలోకం చేరగలవు! ఎత్తబడితే పొందే లాభాలు, మేలులు అన్నీ వివరంగా ఈ గ్రంధంలో ఉన్నాయి! ఒకవేళ నిర్లక్షంగా
ఉంటే విడవబడతావు! విడవబడితే నీ గతి ఏమవుతుందో ఎన్ని ఇబ్బందులు
పడతావో అదికూడా వివరంగా ఉంది! కాబట్టి మంచి చెడ్డలు దేవుడు రెండు
చెప్పి నీ ముందు పెట్టి ఏమి కోరుకుంటావో నీ ఇష్టమే అంటూ నీ చాయిస్ కి వదిలేశారు!
ఇప్పుడు తేల్చుకోవలసింది నీవే!!
ఏమి కోరుకుంటావు?
జీవమా? మరణమా?
పరలోకమా? నరకమా?
లోకమా? దేవుడా? తేల్చుకో!
-2-
ప్రకటన
గ్రంథం 1: 1
యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు
అభిషిక్తుడని అర్ధము) తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన
ప్రత్యక్షత. (లేక, ప్రకటన). ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా
వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
ప్రియ దైవజనమా! మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ
ఇవి కట్టుకధలు కాదు- దేవుడు తన భక్తుడైన యోహానుకి ఒక దూతను పంపించి
జరుగబోయేవి అన్నీ చూపించారు అంటూ ధ్యానం చేసుకుంటున్నాం!
అలాగే దీనికి మూలాధారం
దేవుడే గాని మనిషి- మనిషి యొక్క
తెలివితేటలూ కానేకాదు అని గ్రహించాలి! ఈ గ్రంధంలో వ్రాయబడిన సూచనలు
సంకేతాలు అన్నీ ఆయన స్వయముగా చూసినవే తప్ప మరే ఇతర గ్రంథాల నుండి గ్రహించినవి కాదు,
చూచుకాపీ కొట్టి వ్రాయలేదు అని గ్రహించాలి! యేసుక్రీస్తుప్రభులవారు
తానే తన దూతను పంపి స్వయముగా వెల్లడించినవి!
ఇక ఈ వచనంలో *త్వరగా* జరుగబోతున్నాయి అని రాశారు! త్వరగా అనగా యోహాను గారు ఈ ఉత్తరం
సుమారు 92—96 మధ్యలో వ్రాశారు. అనగా యోహాను గారి కాలము, తర్వాత వెంటనే జరిగిపోతాయి అని
కాదు! ఇవి నెరవేరిపోయాయి అని కూడా కాదు! కారణం 22:7, 12, 20 ప్రకారం త్వరలో సంభవించబోతున్నాయి
అంటున్నారు.
ఇక్కడ మూడుసార్లు
త్వరగా అనే మాటను ఉపయోగించారు అనగా యోహానుగారి కాలంలో గాని అది జరిగిన వెంటనే అని కాదు!
*త్వరగా*
అనే మాటకు వేదాంత పండితులు వేరువేరుగా అర్ధాలు చెప్పారు!
ఒక అర్ధము; దేవుని దృష్టిలో త్వరగా అనగా 2పేతురు ౩:8 ప్రకారం ఆయన దృష్టికి ఒక దినము మనకు వెయ్యి
సంవత్సరాలు అని అర్ధము! అలా చూసుకుంటే ఇప్పటికి దేవుని లెక్క
ప్రకారం ఆయన ప్రవచించి
లేక చూసి రెండు దినాలు అయ్యింది అన్నమాట!
మరో అర్ధము: త్వరగా అనగా హటాత్తుగా అని! ఈ అర్ధాన్ని మనము చూసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం! అనగా ఈ విషయాలు జరగడం ప్రారంభం అయినప్పుడు ఇవన్నీ హటాత్తుగా జరుగుతాయి అని
అర్ధము!
1థెస్సలొనికయులకు 5: 2
రాత్రివేళ
దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు
యోహాను గారిని యుగాంతములోనికి అనగా భవిష్యత్ లోనికి తీసుకుని పోయి – భవిష్యత్ లో జరిగే సంభవాలు అన్నీ చూపించారు కాబట్టే ఈ విషయాలు
త్వరలో జరుగబోతున్నాయి అంటున్నారు! ఆ భవిష్యత్ లో ఆ విషయాలు వెంటవెంటనే
జరగిపోయాయి అన్నమాట.
మరో అర్ధము ఏమిటంటే
ఈ గ్రంథములోని విషయాలు నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి, అవి ఏ క్షణము లోనైన వీటి నెరవేర్పు ప్రారంభం
కావచ్చు అని అర్ధము! కాబట్టి విశ్వాసులు సిద్ధంగా ఉంటూ సిద్ధపడి,
మెలుకువ కలిగి, పవిత్రతను పరిశుద్ధాత్మను కలిగి
జీవించాలి అన్నమాట! అలా సిద్ధపడి ఉండమని సూచించడానికే త్వరగా
అనే మాటను యోహాను గారి ద్వారా దేవుడు వ్రాయించారు!!
మత్తయి 24:36 , 42—44
36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను
పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.
42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
43. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి
తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
అయితే కొందరు
అతి తెలివైన వారు త్వరగా అనగా యోహాను గారి కాలములోను ఆయన కాలము గడిచిన వెంటనే జరిగిన
సంభవాలు కాబట్టి ఈ గ్రంధములో గల విషయాలు జరిగిపోయాయి అని వాదిస్తున్నారు! మరికొందరు యోహాను గారి కాలమునుండి
ఇంతవరకు క్రమక్రమంగా ఈ గ్రంథములోని విషయాలు జరుగుతూ వస్తున్నాయి అంటున్నారు!
మరికొందరు ఈ యుగమంతటిలో కనిపించే ఆధ్యాత్మిక సూత్రాలుగా పరిగణిస్తారు!
*అయితే ఒక్కటి మాత్రము నిజము: ఈ గ్రంథములోని 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు రాసిన విషయాలు ఇంతవరకు
జరుగలేదు! ఇవి కేవలం అంత్యదినాలలో జరుగబోతున్నాయి! ఇది నేను నమ్ముతున్నాను*!!! నేనే కాదు అనేకులన దైవజనులు
వేదాంత పండితులు నమ్మేది ఇదే!
ఇక దేవుడు తన దాసులకు జరుగబోయేవి ముందుగా తన దాసులకు ఎందుకు చూపించారో
గత భాగంలో చూసుకున్నాము!
ఇక మరోమాట జరుగబోయేవి చూపించడానికి
తన దూతను పంపించి చూపించారు అని వ్రాయబడింది! దేవుడు అనేకసార్లు
తన దూతలను పంపించి జరుగబోయేవి తనదాసులకు చెప్పినట్లు మనం బైబిల్ గ్రంధంలో చూడగలం! అబ్రాహము గారి దగ్గరకు, లోతు గారి దగ్గరికి దేవుడు తన దూతలను పంపించారు- ఇలా
చూసుకుంటే పోతే సంసోను గారి తల్లిదండ్రులు యొద్దకు, గిద్యోను
వద్దకు, దానియేలు గారి దగ్గరకు ఇలా అనేకమంది దగ్గరకు దేవుడు తన
వర్తమానాలు చెప్పడానికి తన దూతలను పంపించారు! దూత లేక దూతలు అనేమాట
ఈ గ్రంధంలో 80సార్లు వాడబడింది! బైబిల్
గ్రంధంలో సుమారు ౩౦౦ సార్లు వాడబడింది! కాబట్టి దూతలు మానవులకు
వార్తవహులు అని గ్రహించాలి!
ఇక రెండో వచనంలో అతడు అనగా యోహాను గారు దేవుని వాక్యమును
గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చియు తానూ చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను అంటున్నారు!
యోహాను గారు దేవుని వాక్యమును గూర్చి తన సువార్తలో గాని, పత్రికలలో గాని వ్రాసి సాక్ష్యమివ్వడం కాకుండా యేరూషలేము లోను చిన్నాసియా లోని
అనేక సంఘాలలో అనగా ఎఫెసు, స్ముర్ణ, లవోదొకయ
లాంటి ప్రాంతాలలో సువార్తను ప్రకటించి యేసుక్రీస్తుప్రభులవారు కోసం సాక్ష్యమిచ్చారు!
ఇక తర్వాత పాదంలో తాను చూచినంత మట్టుకు లేక తాను చూచినది
అంతా రాసి సాక్ష్యమిచ్చారు అని అర్ధం! అయితే మరో అనుమానం రావచ్చు! అంత పెద్ద దర్శనం యోహాను గారు ఎలా గుర్తు పెట్టుకున్నారు?
మొదటగా: ఈ గ్రంధమంతా ఒకేసారి దర్శనముగా కనబడలేదు
అని చరిత్ర చెబుతుంది. మరియు వేదాంత పండితులు చెబుతున్నారు!
కొంచెం కొంచెంగా చూపించారు. వచ్చిన దర్శనం వెంటనే
రాసే వారు!
రెండవది: బైబిల్ గ్రంధాన్ని 40మంది విభిన్న వ్యక్తులు వివిధమైన కాలాలలో వ్రాసినా వ్రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు
కాబట్టి దర్శనం చూపించడమే కాకుండా దగ్గరుండి జ్ఞాపకం వచ్చేలా చేసి, వ్రాయించినది కూడా పరిశుద్ధాత్ముడు అని గ్రహించాలి!
కాబట్టి వచ్చిన దర్శనాలు అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా రాసి
పొందుపరిచారు అని అర్ధం చేసుకోవాలి!
యోహాను గారు దేవుని కోసం సాక్ష్యమిచ్చారు మరి నీవు దేవుని
గూర్చి సాక్ష్యం చెబుతున్నావా ప్రియ సహోదరీ సహోదరుడా! లేకపోతే
దేవుడు నిన్ను లెక్క అడుగుతారు అని మర్చిపోవద్దు!
*౩*
ప్రకటన
గ్రంథం 1: 3
సమయము
సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన
సంగతులను గైకొనువారును ధన్యులు.
ఇక మూడో వచనం: సమయం సమీపించింది కనుక అంటూ మొదలుపెట్టారు!
గమనించాలి మొదటి వచనంలో *త్వరగా* అనేమాటను వాడితే ఈ వచనంలో *సమయం సమీపించింది*
అంటున్నారు!
అనగా రెండు అర్ధాలు
ఒక్కటే అని గ్రహించాలి! వచ్చువాడు
ఆలస్యము చెయ్యక వచ్చును అని బైబిల్ చెబుతుంది.
కాబట్టి త్వరగా అన్నా, సమయం సమీపించింది అన్నా ఈ గ్రంధములో వ్రాయబడిన
విషయాలు ఇంకా నెరవేరలేదు గాని నెరవేరడానికి సిద్దగా ఉన్నాయి అని గ్రహించాలి!
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు
అంటున్నారు
మత్తయి 24: 33
ఆ
ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని
తెలిసికొనుడి.
ప్రకటన
గ్రంథం 22: 10
మరియు
అతడు నాతో ఈలాగు చెప్పెనుఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;
రోమీయులకు 13: 11
మరియు
మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి.
మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు
మరి సమీపముగా ఉన్నది.
1పేతురు 4: 7
అయితే
అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
యోవేలు 1: 15
ఆహా, యెహోవా దినము వచ్చెనే అది
ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి
వచ్చును.
కాబట్టి సమయం చాల
దగ్గరలో ఉంది అని గ్రహించి సిద్ధపడమని అర్ధము! మరి నీవు సిద్ధముగా ఉన్నావా?
ఇక్కడ రెండు ధన్యకరమైన గుంపులు ఈ వచనంలో కనిపిస్తున్నాయి!
మొదటిది
ఈ గ్రంధములో వ్రాయబడిన ప్రవచన వాక్యములు చదువు వాడు ధన్యుడు!
రెండవది
విని –సంగతులు
గైకొనువారు అనగా అలా చేసేవారు ధన్యులు!
మొదటి గుంపు కంటే
రెండో గుంపు మరీ శ్రేష్టమైన గుంపు అని నా ఉద్దేశము!
మొదటి గుంపు: ప్రవచన వాక్యములు చదువు వారు
ధన్యులు!!!
ప్రియ చదువరీ! పూర్వకాలంలో ప్రజలు నిరక్షరాస్యులు!
వారు చదువుకుంటే ఎక్కడ తమమీద తిరుగబడతారో అని పూర్వకాలంలో కొందరు
(కొన్ని కులాల వారు) మన పూర్వీకులను చదవకుండా చేశారు!
అయితే దేవుని మహా కృప వలన నీవు నేను ఇప్పుడు చదువగలుగు తున్నాము!
వ్రాయగలుగుతున్నాము కదా! రక్షించబడ్డాము కదా!
ఆయన పరిశుద్ధ గ్రంధాన్ని మన ఇంట్లో కలిగి యున్నాము కదా! పూర్వకాలంలో బైబిల్ ప్రతులు లేక ఎంతో
విలవిలలాడిపోయారు! బైబిల్ చదవడానికి కొంతమంది వందలమైల్లు నడిచి
కూడా వెళ్ళారు! అయితే అన్ని ఇబ్బందులు లేకుండా మన భాషలోనే మనకు
ఇప్పుడు బైబిల్ లభ్యమయ్యింది కదా! ప్రియ సహోదరుడా! ఈ గ్రంధమును దినదినము పటిస్తున్నావా?!! నిజం చెప్పు!
కాళీ ఉండటం లేదు
అని సాకులు చెబుతున్నావు! సెల్ ఫోన్లో పనికిమాలిన చెత్త చూడటానికి,
చాటింగ్ చెయ్యడానికి బూతు బొమ్మలు చూడటానికి సమయం ఉంది! మరేవో విషయాలు చూడటానికి నీకు సమయం ఉంది! గంటలు గంటలు
ఎవరితోనో మాట్లాడటానికి సమయం ఉంది , పనికిమాలిన సీరియల్లు చూడటానికి
కూడా నీకు సమయం ఉంది గాని పవితమైన పరిశుద్ధ గ్రంధము, జీవము గల
గ్రంధాన్ని చదవడానికి నీకు సమయం లేదు కదా!
గమనించాలి- ఒకరోజు అతి తొందరలో రాబోతుంది-
ఆరోజు వాక్యం చదువుదామన్నా నీకు బైబిల్ దొరకదు! టీవీలో వాక్యం విందామన్నా రాదు ఎందుకంటే టీవీలన్నీ క్రీస్తు విరోధి స్వాధీనంలో
ఉంటాయి! నీవు చెరసాలలోనో ఏ గుహలోనో ఉంటావు. అప్పుడు వాక్యం చదువుదామన్నా వాక్యం విందామన్నా నీకు దొరకదు! అందుకే సమయముండగానే నేడే వాక్యమును చదివి- ఆ విషయాలు
హృదయంలో దాచుకో! అలా చెయ్యడం వలన మరో లాభముంది! ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో ఉంటుంది కీర్తనల గ్రంధము 119:11 ప్రకారం నీ ఎదుట పాపము చేయకుండునట్లు
నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అని వ్రాయబడిన విధంగా వాక్యము నిన్ను పాపం చెయ్యకుండా
ఆపుతుంది!
ప్రియ చదువరీ ఆయన వాక్యమును చదువుతున్నావా? అయితే
ఇక్కడ ఈ ప్రవచన వాక్యములు చదువు వాడు అంటున్నారు అనగా బైబిల్ గ్రంధము మాత్రమే కాదు
ఈ ప్రకటన గ్రంధము చదువు వాడు ధన్యుడు అంటున్నారు! కారణం ప్రకటన
గ్రంధము చదవాలన్నా దీనికోసం ధ్యానం చెయ్యాలన్నా చెయ్యకుండా సాతాను గాడు ఎన్నెన్నో ఆటంకాలు
చేస్తూ ఉంటాడు! నాకు కూడా ఇది వ్రాయకుండా సాతాను గాడు ఎన్నెన్నో
ఆటంకాలు చేశాడు గాని వాటిని జయించి, శ్రమలకు సిద్ధపడి ఇది రాస్తున్నాను! కాబట్టి దయచేసి ఈ ప్రవచన వాక్యాలు
చదవండి!
ఇక
రెండవ గుంపు: వీటిని చదవడమే కాకుండా విని- వాక్యము చెప్పినట్లు గ్రహించి
గైకోవాలి అనగా చెప్పినట్లు చెయ్యాలి! ఆదివారం నాడు చర్చికి వెళ్ళిన
వారు సుమారు రెండు వందలమంది అనుకుందాము! అందులో వాక్యమును నిజంగా
చదివి వినిన వారు 15౦ మంది అనుకుందాము! గాని దాని ప్రకారం జీవించాలని ప్రయత్నం చేసేవారు కనీసం పదిహేను మంది అయినా
ఉంటారా? ప్రియ దేవుని బిడ్డా! ఆ గ్రహించే
గుంపులో నీవున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? చదివి గ్రహించావా? అలా చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నావా?
అలా అయితే వాక్యానుసరంగా జీవిస్తున్నావా?
అలా
గైకొనువారు ధన్యులు అని చెబుతున్నాడు భక్తుడు ఆత్మావేశుడై!!!
గమనించాలి
చదవడం వలన దీవెన కలిగినా మన జీవితంలో ఆ దీవెన నిలవాలి అంటే దాని ప్రకారం జీవించాలి!
ఆదికాండం 12:1—౩ లో దేవుడు అబ్రాహము గారికి ఒక వాగ్దానం దీవెన ఇచ్చారు!..
సంఖ్యా
కాండం 6:22 రాబోయేసరికి
ఈ విషయాలు నీవే కాదు నీ పిల్లలు కూడా అనుసరించాలి అన్నారు.
కీర్తన 1:1—3
రాబోయేసరికి ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా దివారాత్రము ధ్యానించాలి అన్నారు.
మత్తయి 5:3—10
లో ఇంకా వివరంగా చెప్పారు. ఇక్కడ ఇలా వాక్యాన్ని
గైకొనాలి అన్నారు.
చివరికి
లూకా 11:28లో
కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.... వినేవారు కంటే గైకొనువారు
ధన్యులు అని!
వాక్యాన్ని
చదవడమే కాదు దానిని గైకొని వాక్యానుసరంగా జీవిస్తున్నామా? దయచేసి ఒకసారి మనలను మనం
పరీక్షించుకుని వాక్యానుసారమైన జీవితం జీవించి అట్టి ధన్యులుగా జీవించుదాం!
ఆయన రాకడ సిద్దంగా తొందరగా రాబోతుంది కాబట్టి సిద్దపడుదాం!!!
*4*
ప్రకటన 1:4—5
4. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు, ఆయన
సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన
వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
ఇక నాలుగో వచనంలో
యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అంటూ మొదలుపెట్టారు!! దీనిని చదివి ఈ ప్రవచన గ్రంధము కేవలం
ఆసియాలో ఉన్న ఏడు సంఘాల కోసం మాత్రమే రాశారని అనుకోవద్దు! మన
ఆసియాలో ఉన్న వారికోసమేనని మనము కూడా
సంభరపడకూడదు! ఈ గ్రంధంలో ఆసియ అనగా చిన్న
ఆసియా అని అర్ధం! Asia Minor అంటారు! టర్కీ
లో కొంత దాని ప్రక్కనున్న దేశాలలో వ్యాపించింది! అంతేకాదు చిన్న
ఆసియాలో కేవలం ఏడు సంఘాలు మాత్రమే లేవు! ఇంకా బోలెడు సంఘాలున్నాయి!
ఉదాహరణకు కొలస్సీ సంఘము కూడా చిన్నాసియాలోనే ఉంది. ఎఫెసీ- లవొదొకయకు మధ్యలో ఉంది. కాబట్టి ఏడు సంఘాలు అంటే కేవలం ఆ ఏడు సంఘాలు అని కాదు! ఏడు అనేమాట సంపూర్ణ సంఖ్య!
ఇదే ప్రకటన మొదటి
అధ్యాయంలో మనకు ఏడు సంఘాలు, ఏడు ఆత్మలు,
ఏడు దీప స్తంభాలు, ఏడు నక్షత్రాలు, కనిపిస్తాయి. ఇంకా ముందుకు పోతే ముందు అధ్యాయాలలో ఏడుగురు
దూతలు, ఏడు బూరలు, ఏడు ముద్రలు ఇలా కనిపిస్తాయి!
కాబట్టి ఏడు అనేమాట సంపూర్ణ సంఖ్య!
అనగా లోకమంతటిలో
ఉన్న సార్వత్రిక సంఘమంతటికోసం రాస్తున్నారు అని గ్రహించాలి!
గమనించాలి ఏడు సంఘాలకు ఏడుగురు
ప్రతినిధులు ఉన్నారు. అలాగే సార్వత్రిక సంఘంలో అనేక సంఘాలలో అనేకులైన
ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు తమకు అప్పగించబడిన సంఘముకోసం
దేవునికి లెక్క అప్పగించాలి! అందుకే పౌలుగారు దేవుడు తన స్వరక్తమిచ్చి
సంపాదించిన తన సంఘమును కాయుటకు మిమ్మును అధ్యక్షులుగా చేశారు కాబట్టి ఆ యావత్తు మందను గూర్చియు మీరు జాగ్రత్తగా
ఉండమని అపోస్తలులు 20:28 లో చెబుతున్నారు! ఇలాంటి వారందరికోసం
ఈ గ్రంధము వ్రాయబడింది అని గ్రహించాలి!
అసలు సంఘము అంటే ఏమిటో మొదటగా
క్లుప్తంగా చూసుకుందాము! యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి
16:18లో పేతురుతో ఈ బండమీద నా సంఘాన్ని కడతాను అన్నారు! అనగా
పేతురుగారిమీద కట్టడం కాదు! పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ అనుభవం
తర్వాత పేతురుగారి మొదటి ప్రసంగంతో సంఘ నిర్మాణం ప్రారంభం అయ్యింది! సంఘానికి పేతురు గారు పునాది, మూలరాయి కాదు!
1కొరింథీ ౩:11 ప్రకారం సంఘానికి పునాది క్రీస్తు!...
వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు;
ఈ పునాది యేసుక్రీస్తే.
ఎఫెసీ 2:20—22 ప్రకారం సంఘం అపోస్తలులు ప్రవక్తలు వేసిన
పునాది అనగా అపోస్తలుల బోధలతో క్రీస్తుయేసు అనే ముఖ్యమైన మూలరాయిగా సంఘము కట్టబడింది.....
20. క్రీస్తుయేసే
ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21. ప్రతి కట్టడమును
ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు
వృద్ధిపొందుచున్నది.
22. ఆయనలో మీరు
కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.
కాబట్టి సార్వత్రిక
సంఘంలో అపోస్తలులు, ప్రవక్తలు,
దైవ సేవకులు, కాపరులు, విశ్వాసులు
అంతాకలిసే సంఘముగా ఉంది! సంఘము అనేమాట క్రొత్త నిబంధనలోనే ప్రారంభం
అయ్యింది! సంఘము అనేమాట గ్రీకు భాష నుండి వచ్చింది! గ్రీకు భాషలో సంఘమును ఎక్లేసియా అంటారు!
అనగా *బయటకు పిలువబడిన* లేక
*బయటకు ప్రత్యేకముగా పిలువబడిన* అని అర్ధము!
అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు గారు మీరు మూర్కులైన ఈ తరమువారికి
వేరై రక్షణ పొందుడి అన్నారు!
అపొస్తలులు 2:40
కాబట్టి
సంఘము ప్రత్యేకించబడినది—కానీ నేటికాలంలో ప్రత్యేకంగా ఉండకుండా
లోకాచారాలు సంఘాచారాలుగా మారిపోయాయి! మీరు అన్యుల ఆచారాలు చేయకూడదు అని బైబిల్ ఖరాఖండిగా చెబుతుంటే
ఏం పర్వాలేదు- మనం భారతదేశంలో ఉన్నాము కాబట్టి ఈ ఆచారాలు పాటించాలి
అని చెబుతున్న దొంగబోధకులు మాటలు విని నేటి సంఘము మూర్ఖులైన ఈ తరము వారు చేసే అలవాట్లు
అనగా తాళి కట్టడం, వాస్తు చూడటం, మామిడాకులు
కట్టడం, ముహూర్తాలు చూడటం, బంగారునగలు ధరించడం
లాంటి అన్యుల ఆచారాలు చేస్తున్నారు! వారు చేస్తున్నారు కాబట్టి
వీరు కూడా చేస్తున్నారు! అప్పుడు దానిని సంఘము అనరు! కలగూరగంప అంటారు! అందుకే ఏలీయా గారు యెహోవా దేవుడైతే
ఆయనను సేవించండి. బయలు దేవుడైతే బయలును సేవించండి అన్నారు!
ప్రియ స్నేహితులారా! చదువరులారా! యేసుక్రీస్తుప్రభులవారు నిజగా దేవుడని మీరు విశ్వసిస్తే, ఆ అపోస్తలులు భోధలకు గౌరవమిస్తే ఈ పనికిమాలిన ఆచారాలు వదిలెయ్యండి!
మానెయ్యండి! కాదు యేసుక్రీస్తు కావాలి,
లోకము కావాలి అంటే లోకాచారాలు పాటించండి! గాని
అలాంటప్పుడు మీరు సార్వత్రిక సంఘంలో పాలివారు కాలేరు అని గ్రహించండి! ఇది నా ఉద్దేశము!!!
గమనించాలి
మనము ప్రత్యేకముగా ఉండటానికే పిలువబడ్డాము!
1పేతురు 2: 9
అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురముచేయు నిమిత్తము,
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
1పేతురు 2: 10
ఒకప్పుడు
ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
1పేతురు 2: 11
ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు
గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,....
2కొరింథీ 6:16—17
16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల
దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును
వారు నా ప్రజలైయుందురు.
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
రోమా
8:29,30
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము
గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని
నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.
సరే, ఏడు సంఘాలకు అనగా సార్వత్రిక సంఘము యొక్క
ప్రతినిధులకు మరియు సభ్యులకు అనగా మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ప్రత్యేకముగా ఉండటానికి పిలువబడిన
ప్రతీ విశ్వాసి కోసం ఈ గ్రంధము వ్రాయబడింది అని గ్రహించాలి!!
మరి నీవు పిలువబడ్డావు
కదా!! ప్రత్యేకముగా ఉంటున్నావా?
*5*
ప్రకటన 1:4—5
4. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు, ఆయన
సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన
వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
ఈ వచనంలో
తర్వాత మాట: వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు..... అంటున్నారు! అనగా భూత కాలం అనగా జరిగిపోయిన కాలములో ఉన్నవాడు,
వర్తమాన కాలం అనగా ప్రస్తుత కాలంలో ఉన్నవాడు, భవిష్యత్
కాలంలో కూడా ఉండేవాని నుండియు అంటున్నారు!
అందుకే
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది. హెబ్రీయులకు 13:
8
యేసుక్రీస్తు
నిన్న, నేడు,
ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా
ఉండును.
ఆయన
పూర్వకాలంలో ఉన్నారు, ఇప్పుడు మనతో ఉన్నారు, రాబోయే కాలంలో ఉంటారు!
ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటూ వాక్యమే దేవుడై
ఉండెను .. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మనమధ్య వశించెను-
ఆయన యేసుక్రీస్తుప్రభులవారు! యోహాను 1వ అధ్యాయం. ఆయనాత్మ జలముల మధ్య అల్లాడుచుండెను అంటూ ఆదికాండము
మొదటి వచనం మొదటి వచనాలలో వ్రాయబడి ఉంది! అందుకే యేసయ్య అబ్రాహాము
కంటే ముందుగా నేనున్నాను అన్నారు! సామెతలు 8వ అధ్యాయం ప్రకారం భూమికి పునాది వేసినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు! అందుకే ఈ గ్రంధంలో ఆల్ఫా ఒమేగా నేనే అంటున్నారు! ఆదియు
అంతమును నేనే అంటున్నారు! కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలగలేదు!
ఆయనే సృష్టికర్త ఆయనే లయకర్త అని గ్రహించాలి!
అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు గార్లతో
ఉన్న దేవుడు, పాత నిబంధన భక్తులతో క్రొత్త నిబంధన భక్తులతో ఉన్న
దేవుడు- ఇప్పుడు మనతోను ఉన్నారు! రాబోయే
కాలంలో ఉంటారు! ఒకవేళ
రాకడ ఆలస్యము అయితే మన పిల్లలు మనవల కాలంలో కూడా ఉంటారు! ఇదీ
దీని అర్ధం!
అయితే
ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండియు అంటూ ఇంకా ముందుకు పోతున్నారు!
తర్వాత
మాట: ఆయన సింహాసనము
ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు.... అంటున్నారు! ఇక్కడ యోహాను గారు దేవుని సింహాసనము చూశారన్న మాట! ఆ
సింహాసనము ఎదుట ఏడు ఆత్మలు ఉన్నాయి అంటున్నారు.
ఇదే ఏడు ఆత్మల కోసం
ఈ గ్రంధంలో వ్రాయబడ్డాయి
ప్రకటన
గ్రంథం 3: 1
సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు
వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను
నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న
పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే
ప్రకటన
గ్రంథం 4: 5
ఆ
సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట
ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.
ప్రకటన
గ్రంథం 5: 6
మరియు
సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల
నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు
నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
కాబట్టి ఏడు ఆత్మల
నుండి మీకు శాంతి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు యోహాను గారు! అయితే ఏడు ఆత్మలు దేనికి సాదృశ్యము??
పరిశుద్దాత్మలు ఏడుగురా? కానేకాదు! ఆత్మలు
ఏడా? అనేకమైన ఆత్మలున్నాయి గాని అనగా దురాత్మ, గాఢనిద్రాత్మ అపవిత్రాత్మ లాంటి ఆత్మలున్నాయి గాని ఇక్కడ సింహాసనము ఎదుట నున్న
ఏడు ఆత్మలు అంటున్నారు కాబట్టి ఇవి పరిశుద్ధమైన ఆత్మలు!
ఇంతకీ ఆ ఏడు ఆత్మలు
ఏమిటి అని చూసుకుంటే యెషయా గ్రంధంలో మనకు జవాబు దొరుకుతుంది! 11:2...
యెహోవా ఆత్మ
1.జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ
2. వివేకమునకు ఆధారమగు ఆత్మ
౩. ఆలోచనకు ఆధారమగు ఆత్మ
4. బలమునకు ఆధారమగు ఆత్మ
5. తెలివిని పుట్టించు ఆత్మ
6. భయమును పుట్టించు ఆత్మ
7. భక్తిని పుట్టించు ఆత్మ!
*నిజం చెప్పాలంటే ఆత్మలు ఏడు కాదు గాని ఆత్మ ఒక్కడే-
ఆయనే పరిశుద్ధాత్ముడు! గాని ఆత్మ జరిగించే ఏడు
కార్యాలు అని లేక స్వభావాలు అని అర్ధము చేసుకోవాలి*!
గతభాగంలో చూసుకున్నాము- ఏడు అనేది సంపూర్ణ సంఖ్య! కాబట్టి ఏడు ఆత్మలు అనగా సంపూర్ణుడు పరిపూర్ణుడు అయిన పరిశుద్ధాత్ముడు కోసమే
ఇక్కడ యోహాను గారు చెబుతున్నారు అని గ్రహించాలి! అనగా సింహాసనము
ఎదుట నున్న ఏడు ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ నుండి కూడా మీకు... అంటున్నారు.,
ఇక 5వ వచనంలో చివరిలో యేసుక్రీస్తునుండియు కృపా సమాధానాలు కలుగును గాక అంటున్నారు!
సులువైన మాటలలో చెప్పాలంటే తండ్రియైన దేవుని
నుండియు, కుమారుడైన యేసుక్రీస్తు నుండియు, పరిశుద్ధాత్మ నుండియు కృపయు సమాధానం మీకు కలుగును గాక అంటున్నారు. గాని ఎందుకు ఇలా ఈ రకమైన పదజాలాలు ఉపయోగించారు అంటే ఎప్పుడైతే యోహాను గారు పరలోక దర్శనము
చూసి తండ్రియైన దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారుని పరిశుద్ధాత్మను చూశారా
ఆత్మావేశం తట్టుకోలేక వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు అంటూ మొదలుపెట్టారు-
అనగా తండ్రియైన దేవుడు అని అర్ధము, ఆయన సింహాసనము
ఎదుట ఏడు ఆత్మల నుండియు అనగా సంపూర్నుడైన పరిశుద్దాత్ముని నుండియు అని అర్ధం, తర్వాత 5వ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు తన కళ్ల ఎదుట
చనిపోవడం చూశారు ఆయన, యేసుక్రీస్తుప్రభులవారు తిరిగిలేవడం కూడా
చూశారు, అయితే అక్కడ భూపతులకు అధిపతిగా కనబడిన వెంటనే ఆయనలో పరిశుద్ధాత్మ
పూర్ణుడై వర్ణిస్తూ కవిత్వం పొంగుకొస్తుంది అన్నమాట! ఆయనను చూసిన
వెంటనే మాటలు పొంగుకుంటూ వస్తున్నాయి!
ఇక్కడ యోహాను గారు త్రిత్వమై యున్న దేవుణ్ణి
పరిచయం చేస్తున్నారు! ఆయన మొదటి పత్రికలో
... సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అంటూ చెప్పారు...
1 John 5: 7
For there are three that bear record in heaven, the
Father, the Word, and the Holy Ghost: and these three are one.
గమనించాలి: తెలుగులో తప్పుగా ఈ వచనాన్ని తర్జుమా చేశారు.
సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, తండ్రి, వాక్యము మరియు పరిశుద్దాత్మ. ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.. ఇదీ అసలు అర్థం.
ఇక్కడ ఆయన పరలోకంలో చూసినది చెబుతున్నారు- మన దేవుడు త్రిత్వమై యున్న దేవుడు! మనస్సాక్షి కాలం నుండి
యేసుక్రీస్తుప్రభులవారు కాలం వరకు తండ్రిగా పరిచయమై, బలియాగం
అర్పించి మానవుల పాప పరిహారం చెయ్యడానికి కుమారుడిగా కనబడ్డారు! ఆయన ఆరోహణమయ్యాక సర్వసత్యము లోనికి మనలను నడిపించడానికి ఆయన ఆత్మ అనగా పరిశుద్దాత్మగా
నేడు మనమధ్య కృపాసత్య సంపూర్ణునిగా నివసిస్తున్నారు!
అదే ఇక్కడ రాస్తున్నారు యోహాను గారు!
ఇక 5వ వచనంలో నమ్మకమైన సాక్షి అంటున్నారు!
అనగా నమ్మకం గల వ్యక్తి! ఇంకా ఒక విషయం చూశాక,
అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు నమ్మకమైన సాక్షి అంటారు! కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారుకి పరలోకం తెలుసు, తండ్రి
తెలుసు, అదేవిధంగా నరకం పాతాళము తెలుసు! అందుకే ఆయనే మానవునిగా మనమధ్యకు వచ్చి ఉన్నది ఉన్నట్లుగా పరలోకము కోసం పరలోకరాజ్యము
కోసం, పాతాళము నరకము కోసం వివరించి చెప్పారు! అందుకే ఆయన నమ్మకమైన సాక్షి అని అర్దము చేసుకోవాలి!
ఇక మృతులలో నుండి
ఆది సంభూతినిగా లేచిన వాడు అంటున్నారు! ఆయన మృతులలో నుండి లేచారు అనడానికి సజీవసాక్షి యోహాను గారే కాబట్టి ధైర్యంగా
మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచారు అంటున్నారు! పౌలుగారు కూడా
దీనిని రాశారు! పునరుత్థాన వరుసలో మొట్టమొదట లేచింది యేసుక్రీస్తుప్రభులవారు
అంటున్నారు!
1కోరింథీయులకు 15: 23
ప్రతివాడును
తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత
క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.
మత్తయి 28: 6
ఆయన
ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన
స్థలము చూచి
1కొరింథీ 15:1—8
ఇక
భూపతులకు అధిపతియు అంటున్నారు!
మనకు
ప్రకటన 19:16 ఇది కనిపిస్తుంది...
రాజులకు
రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
ఇంకా దానియేలు గ్రంధంలో 4:౩4—35లలో ఇంకా 5:21 లో ఇద్దరు రాజులు ఒప్పుకుంటున్నారు ఆయనే
రాజు, భూమిమీద చక్రం త్రిప్పేవాడు దేవుడే! రాజులకు కూడా రాజు అధికారి దేవుడే అంటున్నారు...
దానియేలు 4: 35
భూనివాసులందరు
ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున
జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో
చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
దానియేలు 4: 37
ఈలాగు
నెబు కద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై
యున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు,
ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
కాబట్టి భూలోకమంతా
యేసుక్రీస్తుప్రభులవారు స్వాధీనంలో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి!
అందుకే ఇవి పరమున
చూసి పరవశించిపోయి యోహాను గారు రాస్తున్నారు ఇలా!
*6*
ప్రకటన
గ్రంథం 1: 6
మనలను
ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో-
కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును
యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను
తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
ఇక ఆరవ వచనంలో అంటున్నారు:
మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించిన వానికి
మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అంటున్నారు...
ఆయన ప్రేమ కోసం చూసుకుంటే బైబిల్ గ్రంధం
మొత్తం మీద ఆయన ప్రేమ కనిపిస్తుంది మనకు! ఇక క్రొత్త నిబంధనలో
మనకు అర్ధమవుతుంది మరణము వరకు మనలను ప్రేమించెను అనియు అంతమువరకూ మనలను ప్రేమించెను
అని చెప్పబడింది! మనందరికోసం ఆయన తన రక్తము కార్చి తన ప్రాణమును
అర్పించి మన పాపములనుండి మనలను విడిపించెను!! ఆయన ప్రేమకోసం అనేక
వచనాలు మనం చూసుకోవచ్చు! మచ్చుకు కొన్ని చూసుకుందాము!
రోమీయులకు 5: 8
అయితే
దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై
యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
రోమీయులకు 5: 9
కాబట్టి
ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఉగ్రతనుండి రక్షింపబడుదుము.
రోమీయులకు 8: 37
అయినను
మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
ఎఫెసి 3:18—19
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు
లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు
ప్రార్థించుచున్నాను.
ఎఫెసీయులకు 5: 2
క్రీస్తు
మిమ్మును ప్రేమించి,
పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను
అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
ఇంతగా
క్రీస్తు మనలను ప్రేమించారు కాబట్టి ఆయనకోసం నేను జీవిస్తాను అంటున్నారు పౌలుగారు
గలతియులకు 2: 20
నేను
క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన
దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
అలాగే మనము కూడా దేవుణ్ణి
ప్రేమిస్తూ ఆయనకోసమే జీవించవలసిన అవసరం ఉంది!
ఇక తన రక్తమువలన మనపాపముల నుండి
మనలను విడిపించిన వానికి...
యేసుక్రీస్తుప్రభులవారు
తను ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఎందుకోసం రక్తం చిందిస్తున్నారో ముందుగానే చెప్పారు
మత్తయి 20: 28
ఆలాగే
మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును *అనేకులకు ప్రతిగా విమోచన
క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను*.
మత్తయి 26: 28
ఇది
నా రక్తము, అనగా
పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక
ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.
రోమీయులకు 3: 26
క్రీస్తుయేసు
రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన
నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని
నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
హెబ్రీయులకు 9: 11
అయితే
క్రీస్తు రాబోవుచున్న (అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము)
మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన
విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా
ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా,
హెబ్రీయులకు 9: 12
మేకలయొక్కయు
కోడెలయొక్కయు రక్తముతో కాక,
తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
హెబ్రీయులకు 10: 19
సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన
మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు,
ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
హెబ్రీయులకు 10: 20
ఆయన
రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,
అందుకే
యోహాను గారు అంటున్నారు క్రీస్తు రక్తము మన పాపముల నుండి మనలను విమోచించెను.....
1యోహాను 1: 7
అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము;
*అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా
చేయును.*
ఇక
దేనినుండి ఆయన మనలను విడిపిస్తారు అంటే పాపమునుంది శాపము నుండి సాతాను బంధకాల నుండి
భయంకరమైన పాపపు అలవాట్లు నుండి మనలను విడిపిస్తారు దేవుడు!
లూకా 4:18,19
18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.
చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును,
(కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.
యోహాను 8:౩4—36
34. అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు; కుమారు డెల్లప్పుడును
నివాసముచేయును.
36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.
రోమీయులకు 6: 18
పాపమునుండి
విమోచింపబడి నీతికి దాసులైతిరి;
ఇందుకు దేవునికి స్తోత్రము.
గలతీ 1:4
మన
తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి (దుష్ట యుగము నుండి)
విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను.
కాబట్టి ఇలాంటి
మంచి దేవునికి ప్రేమ గల దేవునికి ఘనమైన ప్రభావము గల దేవునికి మహిమ ఘనత ప్రభావము యుగయుగములు
కలుగును గాక అని కోరుకుంటున్నారు!!!
స్తుతిస్తున్నారు!! అవును ఆమెన్!!!
ఇక తర్వాత పాదములో ఆయన మనలను తండ్రియగు
దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అంటున్నారు! ముందుభాగాలలో
చెప్పినట్లు ఒక వచనానికి మరో వచనం సపోర్టింగ్ గా ఉంటేనే మన అర్ధము సరియైనది!!
ఇక్కడ తండ్రియైన దేవునికి రాజ్యముగాను యాజకులను గాను చేసెను అంటే ఇంకా
వివరంగా పేతురు గారు చెబుతున్నారు రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను చేశారు!
1పేతురు 2:5,9
5. యేసుక్రీస్తు ద్వారా *దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన
బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు*, మీరును సజీవమైన
రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,
*రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును*,
దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
మొదటగా రాజులుగా చేశారు: ఇదే ప్రకటన గ్రంధంలో అనేకసార్లు జయించిన వానికి జనముల మీద అధికారం ఇస్తాను,
వాడు ప్రజలను ఏలుతాడు, వాడు నా సింహాసనం మీద నాతో
కూర్చుంటాడు, వారు వెయ్యి సంవత్సరాలు ఏలుతారు అంటూ ఉన్నాయి....
ప్రకటన 2:26—27
26. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు
నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి (లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.
27. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె
పగులగొట్టబడుదురు;
ప్రకటన
గ్రంథం 3: 21
నేను
జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ
నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
ప్రకటన గ్రంథం 20: 4
అంతట
సింహాసనములను చూచితిని;
వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.
మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని,
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము
శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై,
వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.
గమనించాలి ఈ వచనం
వెయ్యండ్ల పాలనలో నెరవేరుతుంది!!! అనగా జయించిన వాడు మొదటగా రహస్యరాకడలో ఎత్తబడతాడు, ఏడేండ్ల
పెండ్లివిందులో పాల్గొంటాడు! రెండో రాకడలో క్రీస్తుతో పాటుగా
భూమిమీదికి వచ్చి వెయ్యేండ్ల పాలనలో క్రీస్తుతో పాటు వెయ్యేండ్లు ఏలుతాడు! మరి ఇప్పుడు రాజులే కదా ఏలేది!
2తిమోతి 2:12
సహించిన
వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
మత్తయి 19:28—29
28. యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు (లేక, పునఃస్థితి
స్థాపనమందు) మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు
నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి
తీర్పుతీర్చుదురు.
29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి
నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును;
ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.
ఇక యాజకులుగా కూడా
చేశారు:
ప్రకటన 5:10 ఇక్కడ కూడా అదేమాట అంటున్నారు!
మా
దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని
క్రొత్తపాట పాడుదురు.
ప్రకటన
గ్రంథం 7: 15
అందువలన
వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే
తన గుడారము వారిమీద కప్పును;
ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు
సేవ చేసేది ఎవరు? యాజకులే కదా!...
ఇక మీదన వివరించిన 1పేతురు 2:5,9లో కూడా
అదే అంటున్నారు!
ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను! కొంతమంది
అంటుంటారు: దేవుడు అందరిని రాజులుగాను యాజకులు గాను చెయ్యలేదు!
కేవలం పాస్టర్లు, అపోస్తలులు, సేవకులు అనగా వీరందరిలో జయించిన అనుభవము గల వారు మాత్రమే యాజకులు ఈలోకంలోనూ
పరలోకం లోను, విశ్వాసులు మాత్రమే రాజులుగా ఉంటారు అంటారు!
ఈ భావము ఈ కాన్సెప్ట్ తప్పు అని నా ఉద్దేశ్యము! దేవుడు అందరినీ రాజులైన యాజక సమూహముగా పిలిచారు ఏర్పాటుచేసుకున్నారు!
దీనికి మనము మరో భాషలో అనువాదాలు భావాలు చెప్పుకోకూడదు! జయించిన వారంతా అది విశ్వాసులైనా గాని సేవకులు పాష్టర్లు అయినా గాని రాజులు
మరియు యాజకులే అని గ్రహించాలి!
కాబట్టి ఇట్టి దేవునికి
మహిమ ఘనత కలుగును గాక అంటున్నారు!
ప్రియ సంఘమా! నీ పిలుపు ఏర్పాటు ఎంత గొప్పదో గ్రహించావా?
ఆయన మనలను రాజులుగాను యాజకులుగాను పిలుచుకుని ఏర్పాటు చేసుకుంటే ఇంకా
ఎందుకు బురద పనులు పాపపు పనులు చేస్తావు?
నేడే సరిదిద్దుకో!
*7*
ప్రకటన
గ్రంథం 1: 7
ఇదిగో
ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
ఇక ఏడవ వచనంలో అంటున్నారు:
ఇదిగో ఆయన మేఘారూడుడై వచ్చుచున్నాడు. ప్రతినేత్రము
ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు! భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు
.అవును ఆమెన్! అంటున్నారు!
గమనించాలి: *బైబిల్ గ్రంధమును సరిగా అర్ధము చేసుకోవాలి
అంటే మొదటగా దానిని రాసినది ఎవరు? రాయడానికి నేపధ్యము ఏమిటి?
ఆ మాట ఎవరు ఎవరితో అంటున్నారు? దీనివలన మనం నేర్చుకోగలిగినది
లేక దీనిద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నారు అనేది గ్రహిస్తే బైబిల్ ను బాగా అర్ధము
చేసుకోవచ్చు*!
దీని
ప్రకారం ఈ గ్రంధాన్ని ఇంతవరకు యోహానుగారు చెరసాలలో పత్మస్ దీవిలో ఉండగా పరవశుడై ఆత్మావేశుడై
పరలోక దర్శనాన్ని చూసినట్లు ఇంతవరకు మనం చూసుకున్నాము! అయితే ఇప్పుడు ఈ ఏడవ వచనం
ఎవరు ఎవరితో అంటున్నారు అని చూసుకుంటే ఈ మాట దేవుడు పలకడం లేదు! దేవదూత కూడా పలకడం లేదు! మొదటి వచనంలో దేవదూత అన్నారు
గాని మనకు పదకొండో వచనం నుండి చూసుకుంటే అది ఎవరో కాదు మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తుప్రభులవారు!
మరి
ఎవరు అంటున్నారు అంటే ఈ మాట:
ఎప్పుడైతే యోహాను గారు ఈ పరమ దర్శనాన్ని చూశారో, ఆ మహిమను- తండ్రిని -దేవదూతలను
అన్నీ చూసిన తర్వాత ఆయనకు యేసుక్రీస్తుప్రభులవారు మహిమరూపుడై కనిపిస్తున్నారు—వెంటనే ఆత్మావేశుడై యోహాను గారు ప్రవచిస్తున్నారు: ఇదిగో ఆయన మేఘారూడుడై వచ్చుచున్నాడు!
ప్రతినేత్రము ఆయనను చూచును అంటున్నారు!
గమనించాలి ఇక్కడ ఆయన మేఘారూడుడై వచ్చుచున్నాడు అని ఎందుకు
అంటున్నారు అంటే బహుశా ఇక్కడ మేఘారూడుడై సిద్ధంగా ఉన్న యేసుక్రీస్తుప్రభులవారిని చూసి
ఉండవచ్చు! లేక పరిశుదాత్ముడే చెప్పి ఉండవచ్చు లేక బయలుపరచి ఉండవచ్చు!
అంతేకాదు ఆయన ఆత్మావేశుడై ఉన్నారు కాబట్టి జరుగబోయేది ప్రవచించి ఉండవచ్చు:
ఒక్కటి మాత్రం ఖాయం: ఏమిటంటే ఆయన అనగా యేసుక్రీస్తుప్రభులవారు
మేఘారూడుడై తొందరలో రాబోవుచున్నారు!!!
ఇక మేఘారూడుడై
ఎందుకు రావాలి? 1థెస్సలొనికయులకు
4: 17
ఆ
మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు
మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా
మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
ఏం మేఘముల మీదనే ఎందుకు
వెళ్ళాలి? ఏలియా గారిలాగా అగ్ని
గుర్రాలు అగ్ని రధముల మీద వెళ్ళవచ్చు కదా! అంటే కానేకాదు!
యేసుక్రీస్తుప్రభులవారి రెండోరాకడలో ఆయన మేఘముల మీదనే రాబోతున్నారు.
మత్తయి 24: 30
అప్పుడు
మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను
ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము
కొట్టుకొందురు.
మత్తయి 26:64..
ఇది
మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు
మీరు చూతురని చెప్పగా...
ప్రకటన 1:7
ఇదిగో
ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
దానియేలు 7: 13
రాత్రి
కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి,
ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన
సముఖమునకు తేబడెను.
కాబట్టి పైన
చెప్పిన అన్ని రిఫరెన్సులు ప్రకారం యేసుక్రీస్తుప్రభులవారు మేఘముల మీదనే రాబోతున్నారు! ఆయనతో పాటుగా ఆయనతో సమానంగా మనలను చేసిన మనము కూడా
ఆయనలాగానే మేఘముల మీదనే వెళ్తాము తప్ప అగ్ని రధాల మీదనో లేక మరో మోడ్ లో వెళ్ళము!
ఏలియా గారు బ్రతికి ఉండగానే తిన్నగా పరలోకం వెళ్ళారు (పరదైసుకు కాదు) కాబట్టి అగ్ని రధాల మీద అగ్ని గుర్రాలతో
వెళ్లారు! మనము వెంటనే వెళ్ళేది పరలోకము కాదు మరియు మనము ప్రాణాలతో
కూడా వెళ్ళడం లేదు! అంతేకాదు మనము వెళ్ళేది మహిమ దేహములు అనగా అక్షయమైన శరీరంతో వెళ్తాము కాబట్టి
మేఘముల మీదనే ప్రభువును ఎదుర్కోడానికి వెళ్తాము!
ఎందుకు ఎదుర్కోడానికి అంటున్నారు అంటే
ప్రభువు పరలోకము నుండి క్రిందకు వస్తున్నారు మూడో ఆకాశం నుండి పరిశుద్ధులను తీసుకుని,
మనము భూలోకము నుండి మధ్యాకాశం లోనికి వెళ్తున్నాము అందుకే ఆయనను ఎదుర్కోడానికి
కొనిపోబడతాము అంటున్నారు!
ప్రియ సహోదరి/ సహోదరుడా! ఆ రోజు చాలా సిద్దంగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?
లేకపోతే ఆ శ్రమలు నీవు పడలేవు గనుక మారుమనస్సు పొంది సిద్దపడు!
*8*
ప్రకటన
గ్రంథం 1: 7
ఇదిగో
ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
*ఎందుకు రాబోవుచున్నారు*?
తన ప్రజలను తీసుకుని
పోవడానికి! మరియు వాగ్దానం
చేసినది నెరవేర్చడానికి!
యోహాను 14: 2
నా
తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు
స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
యోహాను 14: 3
నేను
వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద
నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
ఇక్కడ
బాగుంది కదా మరి అక్కడకు ఎందుకు తీసుకుని పోవడం?
కారణం ఈ భూమి- ఆకాశం మానవుల పాపముల కారణంగా అగ్నిచేత
కాల్చబడబోతున్నాయి!
2పేతురు 3: 7
అయితే
ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు
నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
2
Peter(రెండవ పేతురు) 3:10,11,12
10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున
ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో
లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.
11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని
లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,
12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు
(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను
భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
మరి భూమి ఆకాశం కాలిపోతే వాటితోపాటు
తన బిడ్డలు కూడా కాలిపోతారు కాబట్టి తన బిడ్డలను తప్పించడానికే మనలను తీసుకుని పోబోతున్నారు!
ఇక ప్రకటన 3:10 లో వాగ్దానం చేసిన విధముగా మానవుల పాపం వలన
భూలోకమంతటి మీదికి రాబోయే ఉగ్రత లేక మహాశ్రమలు నుండి తన పిల్లలను తప్పించడానికి పెండ్లి సంఘాన్ని
మధ్యాకాశము లోనికి తీసుకుని పోబోతున్నారు!
రెండవరాకడ
అనంతరము- మొదటగా
మహాశ్రమలు రాబోవుచున్నాయి రెండవదిగా భూమి ఆకాశాలు కాలిపోబోతున్నాయి!!!...
అలాకాలిపోయేటప్పుడు
తన ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే తీసుకుని పోతున్నారు!!!
*ఎప్పుడు రాబోవుచున్నారు*?
మొదటగా: రక్షించబడబోయే సంఖ్య పూర్తి అయినప్పుడు
....
రోమీయులకు 11: 25
సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని
అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా,
అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు
కలిగెను.
రోమీయులకు 11: 27
నేను
వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు
ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
గమనించాలి: అన్యజనులమైన మనం రక్షించబడే వారి సంఖ్య
పూర్తయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల
రక్షణ ప్రణాళిక మొదలవుతుంది.
రెండవది:
రెండవరాకడలో! గమనించాలి ఈ ప్రవచనం యేసుక్రీస్తుప్రభులవారు
రెండవరాకడ కోసం చెప్పబడింది! అనగా సంఘము ఎత్తబడ్డాక జరిగే సంభవం
అన్నమాట!
*సంఘము ఎత్తబడుట మరియు రెండవరాకడ ఒక్కటేనా*?
కాదు కాదు కాదు!
రాకడ
రెండు భాగములు!
ఒకటి
రహస్యరాకడ;
రెండు
బహిరంగరాకడ!
సంఘము ఎత్తబడుట అనగా
ఇది దేవుని రహస్యరాకడ! రక్షించబడే
వారి సంఖ్య పూర్తయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది!! రహస్య రాకడలో
యేసుక్రీస్తుప్రభులవారు భూమిమీదకు రారు! మధ్యాకాశములోనికి వస్తారు!
సంఘము ఎత్తబడిన వెంటనే
సంఘముతో పాటుగా పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు!
వెంటనే క్ర్రీస్తు విరోధి అనేవాడు తననుతాను బయలుపరచుకొంటాడు!
అప్పుడు ఏడేండ్లు విడువబడిన వారికి మరియు ఇశ్రాయేలు ప్రజలకు మహాశ్రమలు
! ఎత్తబడిన వారికి ఏడేండ్లు మధ్యాకాశంలో పెండ్లి విందు!
ఆ ఏడు సంవత్సరాలు
గడిచాక క్రీస్తు విరోధి మరియు మహాఘటసర్పము,
అబద్దప్రవక్త మరియు వాడి సేనలు మరియు ప్రపంచ దేశాలు అన్నీ ఇశ్రాయేలు
ప్రజలకు విరోధంగా హార్మెగిద్దోను అనే ఇశ్రాయేలు ప్రాంతంలో యేరూషలేమును నాశనం చేద్దామని
కూడుకొంటారు! అప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆర్భాటముతో భూమిమీదకు
వస్తారు. ఇది భూజనులందరూ చూస్తారు!
ఇదే ప్రతి నేత్రము ఆయనను చూచును అంటే!!
*ఆయనను పొడిచిన
వారును ఆయనను చూతురు* .. అంటున్నారు!
ఒకసారి
ఆగుదాం! యేసుక్రీస్తుప్రభులవారిని
బల్లెముతో పొడవడం చూసిన ప్రత్యక్ష సాక్షి యోహాను గారు!
ఎందుకు
పొడిచారు అంటే ఆయన మీద వారికున్న ద్వేషం కసి అంత ఉంది అన్నమాట! తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పగించుచున్నాను అని పలికి ఆయనాత్మను దేవునికి అప్పగించి మరణించారు యేసయ్య!
గాని సైనికులకు ఇంకా ఆయన ప్రాణం కొంత ఉందేమో అన్న అనుమానం వచ్చి సైనికులలో
ఒకడు బల్లెముతో పొడిచాడు వెంటనే రక్తమును నీళ్ళును కారెను అని యోహాను గారు సాక్ష్యం
చెబుతున్నారు యోహాను సువార్తలో....
యోహాను 19: 34
సైనికులలో
ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
కాబట్టి ఇప్పుడు
ఆయన రావడం ఆయనను పొడిచిన వారు చూస్తారు! ఇప్పుడు మరో అనుమానం రావచ్చు- ఆయనను
పొడిచిన వాడు ఎప్పుడో చనిపోయాడు కదా, మరికొన్ని రోజులు పోతే
2000 సంవత్సరాలు అయిపోతుంది. మరి చచ్చినోడు ఎలా
చూస్తాడు అనే అనుమానం రావచ్చు! ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పొడిచిన
వారు అనగా (గమనించాలి పొడిచిన వాడు అనలేదు- పొడిచిన వారు) యూదులు! పొడిపించిన
వారు, పొడిచిన వారు యూదులు-ఇశ్రాయేలీయులు!
కాబట్టి పొడిచిన యూదులు కూడా ఆయనను చూస్తారు! ఆయనను
చూసి రొమ్ము కొట్టుకుందురు అంటున్నారు!
*ఇది ఎప్పుడు జరుగుతుంది* అంటే మొదటగా యూదులు మూడున్నర సంవత్సరాలు
అబద్దక్రీస్తు మాటలకు మోసపోయి వాడినే మెస్సయ్యగా అంగీకరిస్తారు! వెంటనే మూడున్నర సంవత్సరాలు కాలంలో అప్పటికే కట్టబడిన ఇశ్రాయేలు దేవాలయంలో
బల్యర్పణలు ప్రారంభం అవుతాయి! (లేదా మూడున్నర సంవత్సరాల మొదట్లోనే
ఇశ్రాయేలు ప్రజలు ఆలయం కట్టుకుని బల్యర్పణలు ప్రారంభిస్తారు). మూడున్నర సంవత్సరాల తర్వాత వాడు దేవాలయంలో తన విగ్రహాన్ని పెట్టి నేనే దేవుణ్ణి
అంటాడు! దానియేలు గ్రంధంలో వ్రాయబడిన నాశనకరమైన హేయవస్తువును
బలిపీఠం మీద అర్పిస్తాడు! అది బహుశా పందిని బలిగా అర్పించవచ్చు! వెంటనే ఇశ్రాయేలు ప్రజలు వాడికి వ్యతిరేఖంగా
మారిపోతారు! అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మూడున్నర ఏండ్లు మహా శ్రమల
కాలం మొదలవుతుంది మత్తయి సువార్త 24:... దానియేలు 12:
.. లో చెప్పబడింది దీనికోసమే!
మత్తయి 24: 20
అప్పుడు
మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని
ప్రార్థించుడి.
దానియేలు 12: 1
ఆ
కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా
కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.
వెంటనే జెకర్యా గ్రంధంలో
వ్రాయబడినట్లు 12:10—14 లో వ్రాయబడింది జరుగుతుంది .....
10. *దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు
ఆత్మను నేను కుమ్మరింపగా* వారు *తాము పొడిచిన
నామీద (వాని) దృష్టియుంచి*, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని
విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో
బహుగా ప్రలాపము జరుగును.
12. *దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు*, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు
ప్రత్యేకముగాను,
13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు
ప్రత్యేకముగాను,
14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి
భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.
చూశారా వారు *తాము పొడిచిన నన్ను కండ్లారా చూస్తారు*
అంటున్నారు. కరుణనొందించు ఆత్మ విజ్ఞాపణ చేయుఆత్మ వారిమీద పనిచేసి
దేశానివాసులంతా ఏడుస్తారు! ఎలా?
రొమ్ము కొట్టుకుంటూ
విలపిస్తారు! మొదటగా మొత్తం ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత దావీదు వంశీయులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా లేవీయులు ప్రత్యేకంగా
వారి భార్యలు ప్రత్యేకంగా ... అలా అందరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు!
అప్పుడు మిగిలిన అన్యజనులు కూడా ఏడుస్తారు!
అప్పుడు హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను ఓడించడానికి
యేసుక్రీస్తుప్రభులవారు మహామహిమతో దూతలతో కోట్లాది పరిశుద్ధులతో అనగా ఎత్తబడిన వారితో
ఒలీవల కొండమీద కాలుపెడతారు! ఇది రెండవరాకడ!!! బహిరంగ రాకడ!
*ఏం ఒలీవల కొండమీదనే ఎందుకు కాలు పెట్టాలి*?.....
ఒలీవల కొండమీదకే ఎందుకు
వస్తారు అంటే తను ఆరోహణమైనప్పుడు దూతలు ఒలీవల కొండమీద ఏమని చెప్పారు? మీరెందుకు అలా చూస్తున్నారు? ఏవిధంగా మనుష్యకుమారుడు పరలోకానికి ఆరోహణ మయ్యారో అదేవిధంగా మరలా వస్తారు!
అపో.కార్యములు 1: 11
గలిలయ
మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి
పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట
మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
కాబట్టి ఒలీవల కొండమీదనుండే ఆరోహణమయ్యారు కాబట్టి ఒలీవల
కొండమీదకే అవరోహణమౌతారు! దిగివస్తారు! వెంటనే
ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది! హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను
హతం చేస్తారు! వారి రక్తం సుమారు 321 కి.మీ. దూరం పారుతుంది!
ఆ తర్వాత వెయ్యేండ్ల పాలన జరుగుతుంది! (ప్రకటన
20) అందుకే ఆయన పరలోకం నుండి దిగి వస్తున్నారు అని గమనించాలి!
ఈ రకంగా హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను జయించి సాతానును
వాడి దూతలను పాతాళంలో వెయ్యేండ్లు బంధిస్తారు...
సరే, *రహస్య రాకడకు, బహిరంగ
రాకడకు మధ్య కాలం ఎంత?*
ఏడేండ్లు!
ప్రియ సహోదరి/ సహోదరుడా! ఆ రోజు చాలా సిద్దంగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?
*9*
*రాకడసమయం- గుర్తులు-1*
ప్రకటన
గ్రంథం 1: 7
ఇదిగో
ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
సరే, ఇంతకీ ఆయన మేఘారూడుడై రాబోతున్నారు, సంఘము ఎత్తబడుతుంది! మరి ఆయన రాకడకు- మన పోకడకు దానికి సూచనలు ఏమిటి?
మొదటగా పౌలుగారు చెప్పినది చూసుకుని యేసుక్రీస్తుప్రభులవారు
ఏమి చెప్పారో చూసుకుందాము!
శిష్యులు యేసుక్రీస్తుప్రభులవారుని ఇదే ప్రశ్న అడిగితే
మీరు అనుకొనని గడియలో సంభవిస్తుంది అన్నారు!
పౌలుగారు దొంగవలె
వస్తుంది అన్నారు! దానికి వివరణ
కూడా ఇచ్చారు!
1 థెస్సలోనిక 5:1—4
1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు
మీకు వ్రాయనక్కరలేదు.
2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా,
గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును
గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు
చీకటిలో ఉన్నవారుకారు.
ఈ మొదటి వచనంలో సహోదరులారా! ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చియు
మీకు వ్రాయనక్కరలేదు అంటున్నారు! ఇక్కడ కాలములు సమయములు అనడానికి కారణం రహస్యరాకడ, బహిరంగ రాకడ ఒకేసారి జరుగదు అనే ఉద్దేశ్యంతో
కావచ్చు! ఇక్కడ ఆ కాలములు అనగా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ
మరియు మృతుల పునరుత్థానం మరియు సజీవుల పునరుత్థానం జరిగే కాలములు సమయములు అన్నమాట!
ఆ కాలములు సమయములు గూర్చి మీకు వ్రాయనక్కరలేదు అనగా పౌలుగారి ఉద్దేశం
వారికి అనగా థెస్సలోనికయుల సంఘానికి కాలములు సమయములు ఖచ్చితమైన తారీకులు తెలుసు అన్న
అర్ధమా? కానేకాదు!
దీనికి జవాబు కావాలంటే క్రింది రెండు రిఫరెన్సులు
చూడాలి!
శిష్యులు అడుగుతారు
యేసుక్రీస్తుప్రభులవారిని నీ రాకడకు మరియు యుగాంతము ఎప్పుడు జరుగుతుంది అని!
మత్తయి 24:3, 36
3. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి
ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?
మాతో చెప్పుమనగా
36. *అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను
పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు*.
మరోసారి ఆయన పునరుత్తానుడైన
తర్వాత ఆరోహణమయ్యే సమయంలో మరోసారి అడుగుతారు—అయ్యా మీరు వచ్చిన పని అయిపోయింది కదా మరి ఇప్పుడు
ఇశ్రాయేలు ప్రజలకు మరలా రాజ్యమును అప్పగిస్తావా? దానికి ఆయన జవాబు:.....అపో
1:6—8
6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు
రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన
7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు
యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును,
నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
కాబట్టి ఈ రెండు రిఫరెన్సులు మరియు ఈ వచనంలో
చెప్పిన విధముగా మనకు అర్ధం అయ్యేదేమిటంటే రాకడ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది అనేది రోజులు గడియలు సంవత్సరాలు కాదు తెలుసుకోవలసినది!
అది మన పని కాదు అని దేవుడు అంత స్పష్టముగా చెప్పినప్పుడు ఇంకా దానికోసం
అడుగకూడదు! దాని అర్ధం రాకడ విషయం మరచిపోవాలా? కాదు సిద్ధముగా ఉండాలి ఎప్పుడొచ్చినా ఎత్తబడటానికి!
మరి
ఏమి తెలుసుకోవాలి? ఏమి పొందుకోవాలంటే *పైనుండి శక్తి*!
అనగా పైనుండి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి!
ఆ
శక్తి వస్తే లేక పొందుకొంటే ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్రంగా ఉంచుతాడు! నీవు ఎటువంటి పాపపు క్రియలవెంబడి
మరలినా, పాపపు ఆలోచనలు వచ్చినా నీలో ఉన్న పరిశుద్దాత్ముడు నిన్ను
గద్దించి సరిచేసి నిన్ను పశ్చాత్తాప పడేలా చేస్తాడు! తద్వారా
నిన్ను దేవునితో సమాధాన పడేలా చేసి నీవు పరలోకం వెళ్ళేలా ఎత్తబడేలా చేస్తాడు! 1:8
8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు
యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును,
నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
దీనిద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే రాకడ
ఎప్పుడొస్తుంది లాంటి విషయాలు కాకుండా ఆత్మీయ సంబంధమైన విషయాలు తెలుసుకుని పొందుకుని
వాటికోసం తాపత్రయ పడాలి!
ఇక రెండో వచనంలోను నాలుగో వచనంలోను
ప్రభువు రాకడ దొంగవలె వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అంటున్నారు! అనగా దొంగ ఏవిధంగా ఎవరికీ చెప్పకుండా ఏవిధమైన ముందస్తు ప్రకటన లేకుండా వస్తాడో
అలాగే యేసుక్రీస్తుప్రభులవారి రాకడ కూడా మనము ఊహించని రోజున, తలంచని విధంగా వస్తుంది!
మరి మనం ఏం చెయ్యాలి? ఆ రోజు సమయం తెలుసుకోనక్కరలేదు అంటున్నారు దొంగవలె వస్తుంది అంటున్నారు!
ఇంతకీ ఆయన వస్తారా లేదా? లేక ఇంకా చాలా సమయం పడుతుందా?
అని అడిగితే:
ఆయన తప్పకుండా వస్తారు! దూతలు బూరలు ఊదుటకు సిద్ధంగా
ఉన్నారు! మీకెలా తెలుసు? బూరలు ఊదుటకు సిద్దంగా
ఉన్నారు అని చెబుతున్నారు? మీరు చూసొచ్చారా అని అడగవచ్చు!
ఎలా చెబుతున్నాము అంటే ఆయన రాకడ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి!
మత్తయి సువార్త 24లో ఆయన రాకడ సూచనలు యేసుక్రీస్తుప్రభులవారు
ముందుగానే చెప్పారు! ఆ సూచనలు జరుగుతున్నాయి!
కాబట్టి సిద్ధపడి
రాకడకొరకు ఎదురుచూస్తూ ఇంకా విశ్వాసంలో బలంగా ఉండాలి!
ప్రకటన
గ్రంథం 16: 16
ఇదిగో
నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను
చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
*10*
*రాకడసమయం- గుర్తులు-2*
యేసుక్రీస్తుప్రభులవారు
చెప్పిన రాకడ గుర్తులు మత్తయి 24 నుండి చూసుకుందాము!
1 *మోసము విస్తరించుట*: (అబద్ద క్రీస్తులు వెలుగులోనికి
వచ్చుట)
ఎవడును
మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని
చెప్పి పలువురిని మోస పరచెదరు. (మత్తయి 24:4,5)
ఇప్పటికే నేనే క్రీస్తును అంటూ వరకూ ఈ లోకంలో
ప్రకటించుకున్నారు చాలా మంది! అట్లాంటి వారు కోకొల్లలుగా వస్తూనే వున్నారు. మనదేశంలో ఇద్దరు
అలాగే అల్లాను
నేనే యేసుక్రీస్తును నేనే మరొకరిని నేనే అంటూ ఎంతోమందిని మోసం చేశారు! వారి మందిరాలు వారి ఆరాధనలు అన్నీ మనలాగే ఉంటాయి! ఇంకా అనేకమంది
వస్తారు. ఇది యుగసమాప్తికి
సూచన అనే విషయం ఎంత మాత్రం మరచిపోకూడదు.
2 *యుద్ధములు, కరవులు, భూకంపములు:*
జనముమీదికి
జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును
కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము. (మత్తయి 24:7,8)
ప్రపంచంలో శాంతి, సమాధానం లోపించింది. ఎక్కడ చూచినా *యుద్ధవాతావరణమే*
తాండవమాడుతుంది. కొన్నిరోజుల క్రితం ఇశ్రాయేలు- పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం జరిగింది! ఇక
మన దేశానికి, ప్రక్కనున్న పాకిస్థాన్ కి ఎప్పుడూ ఇదే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు
ఇంకనూ తీవ్రతరం కాబోతున్నాయి. ఇవన్నీ క్రీస్తు రెండవ రాకడకు సూచనలు.
సోమాలియా లాంటి ఆఫ్రికా దేశాలలో *భయంకరమైన
కరువు* పరిస్తితులలో తినడానికి లేక మట్టి తింటున్నారు
! ఇట్లాంటి పరిస్థితులే రాబోయే దినాల్లో ఇంకనూ ప్రపంచమంతటనూ రాజ్యమేలబోతున్నాయి.
ఇక *భూకంపాలు, సునామీలు*
ఎన్నో వస్తున్నాయి! వీటన్నిటిని
చూచి ఆశర్య పోవలసిన పనిలేదు గాని, యుగసమాప్తికి సూచనలని గ్రహించగలగాలి.
3. *విశ్వాసులు సకల జనులచేత ద్వేషించబడుట: *
మీరు
నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు (మత్తయి 24:9)
ఒక్క వేటుతో
తల మొండెం వేరయిపోతుంది. సజీవ దహనాలు, మానభంగాలు, వెలివేతలు ... ఇట్లా అనేకం. కారణం ఒక్కటే! మన దేశంలో కూడా
ఇలాంటివే జరుగుతున్నాయి! బైబిల్లు కాల్చేస్తున్నారు! దేవాలయాలను పడగొట్టి కాల్చివేస్తున్నారు! దైవజనులను దైవసేవకురాళ్ళను
హింసిస్తున్నారు! తల్లిదండ్రులు చూస్తుండగానే అమ్మాయిలను బలాత్కారం
చేస్తున్నారు! భర్త ఎదుటనే భార్యను మానభంగము చేస్తున్నారు!
కారణం వారు యేసునామం కలిగి ఉన్నారు! . ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా
జరిగితీరుతాయి.
4. *అబద్ద బోధలు:*
అనేకులైన
అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)
నేటి దినాల్లో దుర్భోధ
దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.
* యెహోవా సాక్షులు
* మొర్మాన్స్
* బ్రెన్హమైట్స్
* జాంగిల్ జా
* సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
* సున్నతి లేకుండా గమ్యం లేదు.
* శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా
కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.
5. *అనేకుల ప్రేమ చల్లారిపోతుంది:*
అక్రమము
విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. (మత్తయి 24:12)
ప్రేమకే అర్ధాన్ని
చెప్పిన క్రీస్తుప్రేమను మర్చిపోయి సమాజంలోనూ, సంఘాలలోను అక్రమం విస్తరించడం వలన, ప్రేమ స్థానంలో ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు వచ్చి చేరాయి. సంఘాలకు తాళాలు వేయబడి సంఘపెద్దలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు!
6.. *సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి*
రాజ్య
సువార్త సకల సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. (మత్తయి 24:14)
ప్రపంచ వ్యాప్తంగా
సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. బహిరంగ సభలు, దండయాత్రలు, కర పత్రికలు, రేడియో, టీవి, ఫేస్ బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ ఇట్లా అనేక మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అనేకులు కొండలు, లోయలు వేటిని లెక్కచేయక, ప్రాణాలకు తెగించి, నరమాంస భక్షకులకు దగ్గరకు సహితం సువార్తను మోసుకుపోతున్నారు.
లెక్కలేనన్ని భాషల్లోకి
బైబిల్ తర్జుమా చేయబడుతుంది.
వినినా వినకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా గాని, వాక్యం మాత్రం ప్రపంచంలోని చివరి మనిషివరకూ చేరాలి.
ఈ వర్తమానాలు నీదగ్గరకు
వస్తున్నాయంటే? మాకు పనీ పాటు లేక చేసే పనులుగా భావించొద్దు. సువార్త ద్వారాలు మూయబడే సమయం ఆసన్నమౌతుందని గుర్తుంచుకో!
*ప్రియ సహోదరి
సహోదరుడా! ఆయన రాకడ దగ్గర పడుతుంది! ఆయన రాకడ సూచనలు నేరవేరతున్నాయి!*
* కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?* సరిచేసుకుందాం!
విడువబడితే ఆ బాధలు
పడలేవు కాబట్టి సిద్దపడి ఆయన రాకడలో ఎత్తబడదాం!
మా పల్లెటూర్లలో ఒక
నాటు సామెత ఉంది! అడిగిన పిల్ల,
కడిగిన ముఖం దేనికైనా పనికొస్తుంది అట! ఉదయాన్నే
బ్రష్ చేసుకుని ఉంటే ఎప్పుడైనా టీ కాఫీలు తాగొచ్చు! టిఫిన్ తినొచ్చు!
అలాగే సంబంధం అడిగిన పిల్ల ఉంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు!
పిల్లకోసం ఊరూరా తిరగాల్సిన అవసరం లేదు! అలాగే
నీవు అయన రాకడ కోసం అన్ని విధాల సిద్ధంగా ఉంటే చాలు! ఆయన ఎప్పుడైనా
రానీయ్! లేకపోతే ఇప్పుడే రానీయ్! ఎత్తబడతావ్!
నేను సిద్ధంగా ఉన్నాను! నీవు సిద్దమా?
*11*
*రాకడసమయం- గుర్తులు-3*
1 థెస్సలోనిక 5:1—4
1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు
మీకు వ్రాయనక్కరలేదు.
2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా,
గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును
గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు
చీకటిలో ఉన్నవారుకారు.
ఇక రెండవ వచనంలో రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో
అలాగే ప్రభువు దినము కూడా వస్తుంది అంటున్నారు! ఇక నాలుగో వచనంలో
ఆ దినము దొంగ వలె మీమీదకు వచ్చుటకయ మీరు చీకటిలో ఉన్నవారు కారు, వెలుగు సంబంధులు కాబట్టి మీకు ఆనవాలు తెలిసిపోతుంది అంటున్నారు!
అనగా దీని అర్ధము
ఏమిటంటే ప్రభువు దినము అనబడే దేవుని రాకడ
(రహస్య రాకడ) దొంగ ఎలా చెప్పకుండా అనగా ఏవిధమైన
ప్రకటన చేయకుండా వస్తాడో అలాగే మీరెరుగని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడు అంటున్నారు!
దీనికోసం యేసుక్రీస్తుప్రభులవారు కూడా చెప్పారు!
మత్తయి 24: 44
మీరనుకొనని
గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
మత్తయి 24: 50
ఆ
దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో
కూడ వానికి పాలు నియ మించును.
లూకా 12: 40
మీరు
అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
మత్తయి 24: 42
కావున
ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
ఇక
దొంగ వచ్చినట్లు అనేమాట కోసం చూసుకుంటే
మత్తయి 24:43—44
43. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి
తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
లూకా 12:39—40
39. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి,
తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
40. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని
చెప్పెను.
సువార్తలలోనే
కాదు ప్రకటన గ్రంధంలో కూడా రెండు సార్లు దేవుడు చెప్పారు ప్రకటన 3:3
నీవేలాగు
ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల
నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే
తెలియదు.
ప్రకటన
గ్రంథం 16: 16
ఇదిగో
నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను
చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
ఇక పేతురు గారు కూడా
రాస్తున్నారు 2పేతురు
3:10
అయితే
ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును,
పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు
దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.
కాబట్టి ఆయన ఎప్పుడొస్తారో
ఎవరికీ తెలియదు! ఆ సమయం కోసం
మనం తెలుసుకోనక్కర లేదు అని మొదటి వచనంలో రాస్తున్నారు!
ఇక నాలుగో వచనంలో ఆ దినం దొంగవలె వచ్చుటకు మీరు వెలుగు
సంబంధులు చీకటి సంబంధులు కారు అంటున్నారు! పౌలుగారు ఈ మాట పలకడానికి
కారణం ఏమిటి?
ఆలోచిద్దాం! ఒకవేళ దొంగ ఈ రాత్రికి రాబోతున్నాడు అని
ముందుగా తెలిసింది అనుకుందాం! లేక మీ వీధిలో ప్రతీరోజు ఏదో ఒక
గృహంలో దొంగతనం జరుగుతుంది అనుకుందాం! అప్పుడు రాత్రులు మీరు
పడుకుంటారా? ఏమాత్రం అశ్రద్ధ ఏమరుపాటు లేకుండా రాత్రంతా ఎవరో
ఒకరు కాపలాకాస్తూ సిద్ధంగా ఉంటారు దొంగను ఎదుర్కోడానికి!
అలాగే విశ్వాసి కూడా చీకటిలో లేడు వెలుగులో ఉన్నాడు గాబట్టి
పరలోకం నుండి దేవుడు వచ్చే సమయం కోసం విశ్వాసి కూడా ఏమరపాటు లేకుండా ఎంతో సిద్ధపాటుతో
ఎంతో జాగ్రత్తగా ఎదురుచూస్తూ ఉండాలి!
బుద్ధిలేని కన్యకల ఉపమానం ప్రకారం సిద్ధపాటు లేకపోతే బుద్ధిలేని
కన్యకలను దేవుడు వదిలి వెల్లిపోయినట్లు నిన్ను కూడా వదిలిపెట్టేస్తారు జాగ్రత్త!... ఆ తర్వాత నీ పేరిట నేను ప్రవచనాలు చెప్పలేదా? దయ్యాలను
వెళ్ళగొట్టలేదా! నీకు కోటిరూపాయలు కానుక ఇవ్వలేదా అంటే అక్రమము
చేసే వారలారా నా యొద్దనుండి తొలగిపొండి అంటారు జాగ్రత్త!
Matthew(మత్తయి
సువార్త) 25:3,4,10,11,12,13
3. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొనిపోలేదు.
4. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.
10. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు
సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
11. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి
అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
12. అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
13. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
అందుకే
తీతు పత్రికలో పౌలుగారు చెబుతున్నారు.. 2:13
అనగా
మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను
నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
కాబట్టి సిద్దపడిన
విశ్వాసులు ఈ ప్రభువు దినం జరిగేటప్పుడు ఏవిధంగాను ఆశ్చర్యపోరు! ఈ ఆయన రాకడ మరియు యుగాంతానికి గల గుర్తులు
నెరవేరుతూ ఉంటే విశ్వాసులు మరింత సిద్ధపాటులో ఉండాలి! ఆయన చెప్పిన
మరిన్ని గుర్తులు చూసుకుందాము!
థెస్సలొనీకయులకు 2:3,4
3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు)
పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే
హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు,
దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ
నియ్యకుడి.
అపో 2:20
ప్రభువు
ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
మత్తయి 24 మొత్తము
కాబట్టి ఆయన రాకడకు
సిద్దపడదాము!
హెబ్రీయులకు 10: 25
ఆ
దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు
చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము.
మన జీవితాలు సరిచేసుకుని
ఆయనతో సమాధాన పడదాము!
ఆయనకు ఆయాసం కలిగించే
పనులు మానేద్దాం!
ఆత్మపూర్ణుల మవుదాం!
ఎత్తబడదాం!
*12*
*రాకడసమయం- గుర్తులు-4*
ప్రకటన
గ్రంథం 1: 7
ఇదిగో
ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
ఇంతవరకు మనము అన్యజనులకు
మరియు మొత్తం ప్రపంచంలో లేక సృష్టిలో జరుగబోయే రాకడ గుర్తులు ధ్యానం చేసుకున్నాము! అయితే లోకమంతటికి ఈ గుర్తులు సంభవిస్తాయి
అయితే యూదులకు లేక ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని సంభవాలు లేక గుర్తులు జరగాలి. అప్పుడే సంఘము ఎత్తబడుట మరియు రెండవ రాకడ జరుగుతుంది. ముందు భాగాలలో సంఘము ఎత్తబడితేనే గాని యూదుల రక్షణ ప్రణాళిక ప్రారంభం కాదు
అనేది చూసుకున్నాము! అదే సమయంలో ఈ క్రింది సంభవాలు జరగాలి!
కారణం యెషయా ప్రవచన గ్రంధము, యిర్మియా,
యోవేలు యేహెజ్కేలు, మలాకి గ్రంధము ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు
క్రొత్త నిబంధనలో చెప్పిన సంభవాలు జరిగితేనే గాని రాకడ జరుగదు!
*చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, తిరిగి ఇశ్రాయేలు చేరుట: *
ప్రభువైన
యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి
వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి,
వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు
ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి
ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న
హేయ క్రియలవలనగాని యే అతిక్రమ క్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్రపరచుకొనరు;
తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి
వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.
యెహేజ్కేలు 37:
20-23
ఇశ్రాయేలు
ప్రజలు మొదటగా ఐగుప్తుకి చెరలోకి పోయారు. మోషేగారి ఆధ్వర్యంలో మరలా తమ దేశానికి వచ్చారు.
ఆ తర్వాత వారు చేసిన పాపాల వలన
ఇశ్రాయేలీయులను
అష్షూరు వారు క్రీ.
పూ. 721 లో చెరకు తీసుకొనిపోయారు. అప్పటినుండి వారికి రాజ్యం లేదు.
2రాజులు 17:23
యూదా రాజ్యమును నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకొని పోయాడు. (2దిన
36:17-19) క్రీ.పూ. 586లో... యూదులు 70 సంవత్సరాల
చెర అనంతరం తిరిగి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. వీరిని
స్వంత రాజ్యంలేదు. పారశీకులు, గ్రీకులు,
రోమీయులు వీరిని పాలించారు.
రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేము మీద దండెత్తి, సుమారు
పది లక్షల మందిని చంపేశాడు. ఒక లక్ష మందిని పట్టుకొని,
మార్కెట్ లో పెట్టి ప్రపంచ దేశాలకు బానిసలుగా అమ్మేశాడు. మిగిలిన ప్రాణ రక్షణతో ప్రపంచములోని వివిధ దేశాలకు చెదరిపోయారు. క్రీ. శ. 70 తర్వాత ప్రపంచ పటంలో
ఇశ్రాయేలుకు స్థానం లేకుండా పోయింది.
అయితే, కృపగలిగిన దేవుడు చెదిరిపోయిన
ఇశ్రాయేలీయులను తిరిగి తీసుకొని వస్తానని, వారిక రెండు రాజ్యములుగా
నుండక, ఒకే రాజ్యముగా వుంటారని యెహేజ్కెలు 37: 20-24 ద్వారా తెలియజేశాడు.
దాని నెరవేర్పు 1948 May, 14th న జరిగింది.
రెండు రాజ్యాల ప్రజలు కలసి ఒకే స్వతంత్ర దేశముగా ఏర్పడ్డారు.
అయితే, ఇశ్రాయేలీయులంతా పూర్తిగా
స్వదేశం చేరుకోలేదు. ఒక్కొక్కరుగా చేరుకొంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికా పాత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, యెరూషలేమును ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించడం, టెల్ అవీవ్
లోనున్న అమెరికన్ ఎంబసీని, యెరూషలేముకు మార్చడం ద్వారా,
ప్రపంచ దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలీయులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి
వారి స్వదేశం చేరుకోబోతున్నారు.
ఈ పరిణామాలను పరిశీలిస్తే, ఇక
యుగసమాప్తి కనుచూపు మేరల్లోనే వుందని మనము గ్రహించగలగాలి.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?
సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!
*యెరూషలేములో దేవాలయము తిరిగి కట్టబడాలి:
*
*దేవాలయ చరిత్ర:
చూసుకుంటే
🍬 *మొదటి మందిరము:*
దావీదు స్థల్లాన్ని, సామాగ్రిని సిద్దపరిచాడు. కానీ, అతని చేతులు రక్తం ఒలికించడం వలన, మందిరం కట్టడానికి దేవుడు అంగీకరించలేదు.
మొదటి మందిరాన్ని
సొలొమోను కట్టించాడు. నిర్మాణం
పూర్తికావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.
- 1 రాజులు 6:37
అయితే ఈ మందిరాన్ని
బబులోను రాజైన నెబుకద్నెజరు కూల్చివేసాడు.
2 రాజులు 25:
ప్రస్తుతము యెరూషలేములో
దేవుని మందిరము లేదు. మందిరం
వుండాల్సిన చోట డోమ్ రాక్ (మసీదు) వుంది.
*రెండవ మందిరం*:
బబులోను చెర తర్వాత జెరుబ్బాబెలు
నాయకత్వంలో హగ్గయి, జెకర్యా ప్రోత్సాహంతో, కోరెషు ఆర్ధిక సహాయంతో కట్టబడింది. (ఎజ్రా 6వ అ.)
దీనిని సిరియా రాజైన
అంతియొకస్ ఆఫీపైనాస్ అనేవాడు, పంది రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించి, మందిరాన్ని
అపవిత్రపరచి, కొంత వరకు నాశనం చేసేసాడు.
అంతియొకస్ నాశనం చేసిన
మందిరాన్ని, హేరోదు తిరిగి
నిర్మించాడు.
* యేసు క్రీస్తుని
బంధించిన దేవాలయము ఇదియే.
* రాయిమీద రాయిలేకుండా
కూల్చివేయ బడుతుందని ప్రభువు ఈ మందిరం గూర్చియే ప్రవచించారు. (మత్తయి 24:1,2)
నెరవేర్పులో భాగంగా 40 సంవత్సరాల తర్వాత అనగా క్రీ.శ 70 వ లో రోమా చక్రవర్తియైన టైటస్ దీనిని కూల్చివేసాడు.
రాళ్ళ మద్యలోనున్న బంగారం కోసం, ఏనుగులతో రాయిమీద
రాయిలేకుండా పడగొట్టించాడు.
🍬 *మూడవ మందిరం*:
ప్రస్తుతము యెరూషలేములో
దేవుని మందిరము లేదు. మందిరం
వుండాల్సినచోట
డోమ్ రాక్ (మసీదు) వుంది.
మూడవ మందిర నిర్మాణం
కొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తప్పకుండా మందిర నిర్మాణం జరిగితీరుతుంది. ఆ తర్వాత
సంఘము ఎత్తబడుతుంది.
*మందిరము కట్టబడడానికి,
సంఘము ఎత్తబడానికి గల సంబంధమేమిటి? *
ఇశ్రాయేలీయులు
క్రీస్తు విరోధితో సంధి చేసుకొని, అతనిని మెస్సయ్యగా అంగీకరిస్తారు. క్రీస్తు విరోధి నాయకత్వంలో ఇశ్రాయేలు దేశం పరిపాలించబడుతుంది.
నేను నా
తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు.
యోహాను 5:43
అనుదిన
బలి నైవేద్యం దేవాలయంలో తిరిగి ప్రారంభమవుతుంది. బలి నైవేద్యం ప్రారంభము కావాలంటే? క్రీస్తు విరోధిని ఇశ్రాయేలీయులు మెస్సియగా అంగీకరించాలి. ఏడేండ్ల శ్రమకాలంలోని మొదటి మూడున్నర సంవత్సరాలు కొనసాగుతుంది.
బలి నైవేద్యం
ప్రారంభం కావాలంటే మందిర నిర్మాణం, సంఘము ఎత్తబడక ముందే జరిగితీరాలి.
🔺 క్రీస్తు విరోధి ఏడేండ్ల శ్రమకాలంలో మొదటి మూడున్నర సంవత్సరముల తర్వాత దేవాలయములో
బలిని నిలిపివేస్తాడు. హేయమైనది దేవాలయములో నిలుపుతాడు.
(బహుశా అతని ప్రతిమనే నిలబెట్టవచ్చు.) దేవాలయంలో
హేయమైనది నిలిపిన తర్వాతగానీ ఇశ్రాయేలీయులకు అర్ధంకాదు. అతడు
మెస్సియ్య కాదని.
అతడు ఒక
వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది
నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును
నాశనము చేయువానికి రావలెనని
నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
దానియేలు 9:27
*దేవాలయము కట్టబడకుండా సంఘము ఎత్తబడదని లేఖనాలను బట్టి స్పష్టమవుతుంది.
*
అయితే, ఒక్క విషయం! ఇప్పటికే మూడు దినాలలో మందిరం కట్టేలా ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు.
మందిరానికి కావలసిన సామాగ్రినంతా ఇశ్రాయేలీయులు సిద్దంచేసుకున్నారు.
ఇక కొన్ని ఆటంకాలను అధిగమిస్తే చాలు. మందిర నిర్మాణం
జరిగిపోతుంది. మందిర నిర్మాణం జరిగితే ఇక యుగ సమాప్తే.
🔺 దేవాలయము కట్టబడుటకుగల ముఖ్యమైన ఆటంకాలు:
3
🍬1.
ప్రస్తుతము మందిరము కట్టాల్సిన స్థలములో డోమ్ రాక్ ( మసీదు) వుంది.
మసీదును తొలగిస్తే? మూడవ ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చు.
అందుచే వున్న మసీదును కూల్చకుండా వున్నది వున్నట్లుగా లేపి, ప్రక్కన పెట్టి, ఆ స్థలంలో మందిర నిర్మాణం చెయ్యాలనే
ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అట్లా అయితే, వ్యతిరేకత రాదనీ కాదు గాని, కొంత తగ్గించ వచ్చని.
అది సాధ్యం కాకపోతే, యుద్దానికైనా సిద్దపడతారుగాని,
మందిర నిర్మాణం ఆపడం ఎవ్వరి తరమూ కాదు.
🍬
2. *ఎర్రని పెయ్యి కనుగొనబడాలి: *
ఎందుకంటే?
ఎర్రని పెయ్యను దహించి, ఆ భస్మమునకు, నీటిని
కలిపి, పాప పరిహారార్థ జలము సిద్ధపరచాలి.
నేడు ఇశ్రాయేలీయు
ఎర్రని పెయ్యి కోసం విస్తృతమైన అన్వేషణ చేస్తున్నారు. హైఫా ప్రాంతంలో ఒకటి కనుగొనబడినప్పటికీ,
దానికి రెండు తెల్లని వెంట్రుకలు వుండడం వలన అది బలికి నిషిద్ధం.
ఈ అంత్యకాలంలో తగినసమయమందు దేవుడు దానిని తప్పక పుట్టిస్తాడు.
🍬3.
*కలాల్ పాత్రలు కనుగొనబడాలి. *
ఎర్రని పెయ్యిని వధించి, సిద్దపరిచే భస్మాన్ని హోమ భస్మం అంటారు.
ఈ పవిత్ర భస్మాన్ని మట్టి పాత్రలలో భద్రపరుస్తారు. వాటినే హెబ్రీ భాషలో కలాల్ పాత్రలు అంటారు.
ఈ పవిత్ర భస్మంలో
పారే నీళ్లు కలపడం ద్వారా పాప పరిహారార్థ జలము తయారగును. దానిని చల్లుకుంటే పవిత్రులవుతారు.
మరియు పవిత్రుడైన
యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు
దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి
అపవిత్రుని కొరకు
వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు
నీళ్లు పోయవలెను.
సంఖ్యా 19:9-17
🔺 *ఇప్పుడు కలాల్ పాత్రల ఎక్కడ వున్నాయి? *
తెలియదు. టైటస్ చక్రవర్తి యెరూషలేము మందిరాన్ని
నాశనం చేస్తున్నప్పుడు యాజకులు దేవుని మందసాన్ని, కలాల్ పాత్రలను
ఎక్కడో దాచి పెట్టేసారు. మందసము అయితే, కనుగొనబడింది గాని, కలాల్ పాత్రల కోసం విస్తృతంగా అన్వేషణ
చేస్తున్నారు.
🔺 *కలాల్ పాత్రల అవసరమేమిటి? *
ఇప్పుడు ఎర్రని పెయ్యను
కనుగొని, దాని భస్మమును,
కలాల్ పాత్రలలోనున్న పాత భస్మములో కలపాలి. అందుచే,
తప్పక కలాల్ పాత్రలు కనుగొని తీరాలి.
వీటితో తయారు చేయబడిన
పాపపరిహారార్థ జలమును వారి మీద జల్లుకొనుట ద్వారా, శుద్ధీకరించబడి, దేవాలయములోనికి ప్రవేశించడానికి
అర్హులవుతారు. లేని పక్షంలో, దేవాలయంలో
ప్రవేశించే అర్హత లేదు. ఇశ్రాయేలీయులు దేవాలయములో ప్రవేశించగానే
సంఘము ఎత్తబడుతుంది. ఈ మందిరంలో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు ఎత్తబడే సంఘములో వుండరు. (ఏడేండ్ల శ్రమ కాలంలో వీరి కొరకు ఇద్దరు సాక్షులు దేవునిచేత పంపబడి,
రక్షణలోనికి నడిపిస్తారు.) రక్షించబడిన ఇశ్రాయేలీయులు
మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.
ఎర్రని పెయ్యి, కలాల్ పాత్రలు తప్పక కనుగొనబడతాయి,
మందిరం నిర్మించబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది.
ఆ ఎత్తబడే సంఘములో మనముంటామా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?
సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!
ఆమెన్!
*13*
ప్రకటన
గ్రంథం 1: 8
అల్ఫాయు
ఓమెగయు నేనే (అనగా- ఆదియు అంతము నేనే). వర్తమాన
భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ప్రియులారా ఇంతవరకు
మనం రాకడ సమయం యొక్క గుర్తులు కోసం ధ్యానం చేసుకుంటూ ప్రపంచ దేశాల ప్రజలకు మరియు యూదులకు
జరిగే సంభవాలు లేక గుర్తులు కోసం ధ్యానం చేసుకున్నాము!
ఇక ఎనిమిదో వచనంలో
అంటున్నారు : అల్ఫాయు ఒమేగయు
నేనే- వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాదికారియు
దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు...
ఈ మాట
ఎవరు పలుకుచున్నారు? యోహాను గారా? కానేకాదు! యేసుక్రీస్తుప్రభులవారు
చెప్పిన మాట ఇది! యోహాను గారు 4వ వచనంలో
ఏమన్నారో దానినే పునరుద్ఘాటిస్తున్నారు ఇక్కడ దేవుడు!
వర్తమాన భూత భవిష్యత్కాలములలో
ఉండువాడను నేనే! అనగా పూర్వకాలంలో
ఉన్నాను! ప్రస్తుతం మీతో ఉన్నాను! ఇక రాబోయే
రోజులలో కూడా ఉంటాను! యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఏకరీతిగా
ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది.....హెబ్రీయులకు 13: 8
యేసుక్రీస్తు
నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును
యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.
గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా! చివరి అక్షరం ఒమేగా! అనగా ఆదిని నేనే అంతమును నేనే అని
అర్ధము! ఈ సందర్భంగా యేసుక్రీస్తుప్రభులవారు నేనే దేవుణ్ణి అని
చెబుతున్నారు అన్నమాట! తండ్రి నేను ఏకమై యున్నాము అని చెప్పిన
యూదులకు అర్ధము కాలేదు ఆ రోజులలో! అనగా త్రిత్వమై యున్న త్రియేక
దేవుడు అన్నమాట! ఒకే దేవునికి మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి!
మూడు కాలాలలో మూడు వ్యక్తిత్వాల ద్వారా ప్రజలతో మమేకమై యున్నారు అని
అర్ధం!
మరి కొంతమంది అతి తెలివిగాళ్ళు, బైబిల్ ను పూర్తిగా చదివి అర్ధము చేసుకోలేని పనికిమాలిన విమర్శకులు యేసు నేను
దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు? ఆయన దూత మరియు కుమారుడే గాని దేవుడు
కాదు అని వాదించే పనికిమాలిన వారు దీనిని తప్పకుండా చదవాలి! ఆల్ఫా
మరియు ఒమేగా ను నేనే అని ఇక్కడ అన్నారు- ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్కాలములలో
ఉండు సర్వాదికారియునైన దేవుడు అని ఉంది. ఇదే ప్రకటన
22:13 లో యేసుక్రీస్తుప్రభులవారు తానే స్వయముగా నేనే అల్ఫాయు నేనే ఒమేగయు
నేనే ఆదియును అంతమునై ఉన్నాను మొదటి వాన్ని నేనే కడపటి వాడను నేనే అని ఇంత స్పష్టముగా
చెబితే వీరికి అర్ధం కాదా? మొదటి వాడను అనగా సృష్టికర్తను,
కడపటి వాడను అనగా లయకర్తను! దీనిని బట్టి యేసుక్రీస్తుప్రభులవారికి
తను దేవుడనని తనకు తెలుసు కాని నేనే దేవుణ్ణి అని ఎందుకు చెప్పుకోలేదు అంటే ఆయనకు అందరిలా
డప్పు కొట్టుకోవడం ఇష్టం ఉండదు! ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేకులను
స్వస్తపరచి తననుగూర్చి ఎవరికీ ప్రసిద్ధి చేయవద్దు అని అనేకసార్లు చెప్పారు!
అనగా యేసుక్రీస్తుప్రభులవారికి పభ్లిషిటి అంటే ఇష్టం లేదు! కొంతమంది తాము దేవుళ్ళు కాకపోయినా నేనే దేవుణ్ణి! నేను
గొప్ప ప్రవక్తను! నేను అపోస్తలుడును అని డప్పు కొట్టుకోవడం అలవాటు!
నా దేవునికి ఆ అలవాటు లేదు అంతే! అంతమాత్రాన దేవుడు
కాకపోడు!
ఇదే మాట తండ్రియైన యెహోవాదేవుడు యెషయా
44:6 లో అంటున్నారు....
ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను
తప్ప ఏ దేవుడును లేడు.
ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు
కూడా అన్నారు!
అందుకే పౌలుగారు అంటున్నారు
రోమా 11:36 లో ...
ఆయన మూలమునను ఆయన
ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
యోహాను గారు అంటున్నారు—కలిగియున్న
దేదియు ఆయన లేకుండా కలుగలేదు అంటున్నారు....
ఇంకా ఆదియందు వాక్యముండెను అంటూ వాక్యమే దేవుడై యుండెను అంటూ ఆ వాక్యము
కృపాసత్య సంపూర్ణునిగా మనమధ్య నివసించెను అంటున్నారు. యోహాను
1:1--14;
మనమధ్య నివాసం చేసినది ఎవరు? యేసుక్రీస్తుప్రభులవారు కాదా ఓ అతి
తెలివైన వారలారా!!!
యేసుక్రీస్తుప్రభులవారు
దేవత్వం కోసం గతంలో కొలస్సీ పత్రిక ధ్యానాల ద్వారా విస్తారంగా చెప్పడం జరిగింది. వివరాలకు దయచేసి మా వెబ్సైట్ ని సంప్రదించండి.
కొన్ని మాత్రం చెబుతాను:
ఫిలిప్పీయులకు 2: 6
ఆయన
దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
యెంచుకొనలేదు గాని
లూకా 2: 11
దావీదు
పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)
యెషయా 9: 6
ఏలయనగా
మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమా ధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఆయన
కుమారుడు మరియు నిత్యుడగు తండ్రి!
అపో.కార్యములు 20: 28
దేవుడు
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా
ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
స్వరక్తమిచ్చి
సంపాదించింది ఎవరు?
యేసుక్రీస్తుప్రభులవారు కారా?
తీతు 2:13
మహా దేవుడును మన రక్షకుడైన... యేసుక్రీస్తుప్రభులవారు
దేవుడు మాత్రమే కాదు – ఆయన మహా దేవుడు మరియు మన
రక్షకుడు!!
ఇక
ఇదే వచనంలో సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు అంటున్నారు!అనగా ఆయన సర్వాధికారి,
మరియు దేవుడు మరియు ప్రభువు!
అందుకే
రోమా 9:5 లో
పౌలుగారు అంటున్నారు: ......
శరీరమును
బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అనగా యేసుక్రీస్తుప్రభులవారు సర్వాదికారియైన దేవుడైయుండి
నిరంతరమూ స్తోత్రార్హుడై ఉన్నాడు! ఆమెన్ అంటున్నారు! గమనించాలి మొదటినుండి మీకు చెబుతున్నారు: బైబిల్ ను సరిగా
అర్ధం చేసుకోవాలి అంటే ఒక లేఖనమునకు మరో సపోర్టింగ్ లేఖనము ఉండాలి! అక్కడ అనగా ప్రకటన 2:8 లో ఏమన్నారో అంతకంటే ముందుగానే
పౌలుగారు ఆత్మావేశుడై పలుకుచున్నారు ఈయన సర్వాదికారియైన దేవుడైయుండి నిరంతరమూ స్తోత్రార్హుడు!!!
కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు అనే మాట నూటికి నూరుపాళ్ళు సరియైనది!!!
ఇక
ప్రకటన 16:14లో హార్మెగిద్దోను యుద్ధము కోసం చెపుకుంటూ దయ్యాల ఆత్మలు అన్నీ కలిసి సర్వాధికారి
యైన దేవుని మహా దినమున జరిగే యుద్దానికి లోకమంతటా ఉన్న రాజులను పోగుచేస్తున్నాయి అని
వ్రాయబడింది! 19వ అధ్యాయంలో హార్మెగిద్దోను యుద్ధం జరిగింది!
యుద్ధం చేసినది ఎవరు? యేసుక్రీస్తుప్రభులవారు!
మరి సర్వాధికారి యైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తుప్రభులవారు!
మన
దేవుడు ఆల్ఫా! అనగా ఆది! మరియు ఒమేగా అనగా అంతము అయి ఉన్నవాడు!
మొదటివాడు మరియు కడపటి వాడు! సృష్టికర్త మరియు
లయకర్త! మరియు సర్వాధికారియు మరియు దేవుడు! యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు! కాబట్టి ఇట్టి ఘనమైన
పరిశుద్ధ దేవుణ్ణి కలిగి యున్నందుకు సంతోషిస్తూ అదే సమయంలో ఆయన లయకర్త కూడా కాబట్టి
ఆయనకు భయపడుతూ ఆయన సన్నిధిలో యదార్ధంగా ప్రవిత్రంగా సాగిపోదాం!
*14*
ప్రకటన
గ్రంథం 1: 9
మీ
సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను
దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున
పరవాసినైతిని.
ఇక తొమ్మిదో వచనంలో మనతో యోహాను గారు మరలా తన సాక్ష్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు.
మొదట్లో ఒకసారి సాక్ష్యం మొదలుపెట్టారు. మధ్యలో
దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచనాలు చెప్పి మరలా తన సాక్ష్యాన్ని మొదలుపెట్టారు ఈ తొమ్మిదో
వచనంలో! నేను కూడా మనిషినే! మీకు సహోదరుడినే!
అయితే నేను పత్మాసు ద్వీపంలో పరవాసినైనప్పుడు నాకు ఈ దర్శనాలు కలిగాయి
అంటున్నారు! దానికంటే ముఖ్యంగా ధ్యానించాల్సిన అంశాలు ఏమిటంటే
నేను మీతో పాలివాడను అంటున్నారు! దేనిలోనూ? యేసును బట్టి కలిగే శ్రమలలోను, ఆయన రాజ్యమును గూర్చి
ప్రకటించినప్పుడు కలిగే శ్రమలలో చూపించే సహనములోను, మరియు ఆయన
గూర్చి సువార్త సత్యము గూర్చి ప్రకటించుటలోను మీతో పాలివాడను అంటున్నారు!
దీనిని
బట్టి ఏమి అర్ధమవుతుంది అంటే ఎవరైనా నిజమైన భక్తి కలిగి మరియు సాక్షిగా జీవించాలి అంటే
తప్పకుండా మూడు విషయాలలో పాలివారై ఉండాలి! అప్పుడే భూమిమీద యేసుక్రీస్తుప్రభులవారు స్థాపించిన పరలోకరాజ్యము
అనబడే సంఘములో- సార్వత్రిక సంఘములో పాలివారై ఉంటారు!
మొదటిది: యేసుక్రీస్తును బట్టి కలిగే
బాధలలో పాలుపొందాలి!
రెండు: అలా ఆయన నామమును బట్టి కలిగే
శ్రమలలో సహనం చూపించాలి తప్ప కోర్టులకు ఫైటింగ్ లకు వెళ్ళకూడదు!
మూడు: ఇలా సహిస్తూనే సువార్త ప్రకటిస్తూ
ఆయన రాజ్య వ్యాప్తి చెయ్యాలి!
సార్వత్రిక సంఘంలో పాలుపొంపులు పొందాలి అంటే ఈ మార్గము
తప్ప మరో మార్గము లేదు! షార్ట్ కట్ లేనే లేదు!
గమనించాలి: మా ఆధ్యాత్మిక సందేశాలు మొదటి శీర్శికనుండి
ఇంతవరకు ఈ తొమ్మిది భాగాలలోనూ ప్రతీసారి నొక్కివక్కానించి చెప్పేది ఏమిటంటే మనము శ్రమలు
అనే మార్గములో ప్రయాణించి మాత్రమే పరలోకం చేరగలము! సంపూర్ణులే
పరమును వశము చేసుకోగలరు! సంపూర్ణులు కావాలి అంటే శ్రమల మార్గమే!
అది తప్ప మరో దారి లేదు! అయితే చాలామంది యేసుబాబుని
నమ్ముకుంటే శ్రమలు రావు కష్టాలురావు అన్నీ సుఖాలే కలుగుతాయి అని అనుకుంటారు!
అది మీ తప్పు కాదు- కానుకలు ఆశించి మరియు పబ్లిషిటీ
ఆశించి ఎల్లప్పుడూ ఆశీర్వాదమే-దీవెన- మేలులు
కోసమే చెప్పే మాలాంటి బోధకులు, కాపరులు, టీవీ ప్రసంగీకుల వలననే ఇలా ప్రజలు అనుకుంటున్నారు! గాని
ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేదు!
అసలు యేసుక్రీస్తుప్రభులవారు ఏమని చెప్పారు—నా నిమిత్తము
జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాట లెల్ల పలుకునప్పుడు మీరు
ధన్యులు అంటూ శ్రమల మార్గములోనే ప్రయాణం చెయ్యాలి అని చెప్పారు! ఇంకా
లోకంలో మీకు శ్రమలు కలుగును అంటూ కూడా చెప్పారు!
యోహాను 16: 33
నాయందు
మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును;
అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి
యున్నాననెను.
అపో 14:22 లో ఆయన శిష్యులు కూడా
అదే చెప్పారు లోకంలో అనేక కష్టాలు శ్రమలు అనుభవించి మాత్రమే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి
అని ముందుగానే చెప్పారు!
రోమా 8:17 లో మనము వారసులం కాబట్టి
హక్కులతో పాటు విధులు కూడా ఉంటాయి అలాగే మహిమతో పాటుగా శ్రమలు హింసలు ఉంటాయి అంటున్నారు!
పేతురు
గారు కూడా ఇదే చెబుతున్నారు
1పేతురు 4: 1
క్రీస్తు
శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
చివరికి హెబ్రీ పత్రికలో
కూడా ఇదే చెప్పారు...
యేసుప్రభులవారు శ్రమల
మార్గంలో ప్రయాణం చేసి సంపూర్ణులు అయినట్లు మనం కూడా అదే మార్గంలో ప్రయాణించి సంపూర్ణత
సాధించాలి అని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది.
యేసుక్రీస్తుప్రభులవారు తాను శ్రమ పడేటప్పుడు అమ్మలారా నాకోసం ఏడవకండి
మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి అంటూ వీరు పచ్చిమానుకే ఇలా చేస్తున్నారు ఎందు మానుకు ఎలా
చేస్తారో అన్నారు! లూకా 23:28--31; పచ్చిమాను
యేసుక్రీస్తుప్రభులవారు ఎండుమ్రానులము మనము! ముందుగానే శ్రమల
ద్వారా పరలోకం చేరాలి అని యేసయ్య చెప్పారు!
కాబట్టి శ్రమలు లేకుండా
పరలోకం చేరము!!!
ఈ విషయం పౌలుగారు
కూడా థెస్సలోనికయులకు ముందుగానే చెప్పాను అని గుర్తుచేస్తున్నారు!
1థెస్స 3:1—5
1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,
2. యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును
క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
3. *మనము శ్రమను అనుభవింపవలసి యున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును*;
4. *అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు*.
మరీ ఘోరమైన మాట ఏమిటంటే అట్టి శ్రమలను
అనుభవించడానికే మనము నియమించబడ్డాము! అవును క్రీస్తుయేసునందు
సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు శ్రమలు కలుగును అని వాక్యం ముందుగానే చెప్పింది!
2తిమోతికి 3: 12
క్రీస్తుయేసునందు
సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.
అయితే ఇక్కడ
ఒక మెలిక ఉంది! ఎవరైతే సద్భక్తితో బ్రతకాలి
అనుకుంటున్నారో వారికి మాత్రమే శ్రమలు! నలుగురితో
........ కులంతో ........ అన్న వారికి ఏమీ కష్టాలు
రావు! ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది, మా సంఘంలో హెలీనమ్మ అనే విశ్వాసి ఉంది! ఆమె క్రొత్తగా
రక్షించబడిన విశ్వాసులకు చెబుతూ ఉంటుంది దేవుణ్ణి ప్రేమించి ప్రేమించనట్లు ఉండాలి!
దేవునితో అంటీ అంటనట్లు ఉండాలి! అప్పుడు ఏ కష్టాలు
కలగవు! అయితే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే మనకు ఎన్నెన్నో కష్టాలు
వచ్చేస్తాయి! నన్ను చూడండి నాకు ఇంతవరకు ఒక శోధన కష్టాలు రాలేదు!
నేను ఎప్పుడో రెండు నెలలకు చర్చికి వస్తాను ఎప్పుడో ఒకప్పుడు ప్రార్ధన
చేస్తాను! నాకు అన్నీ సుఖాలే అంటుంది! ఇది
పనికిమాలిన భక్తి! నరకానికి పోయే గుంపు! ఎవరైతే మంచిగా భక్తిలో దేవునిలో సాగుతారో వారికే శ్రమలు కలుగుతాయి!
ఇంకా చెప్పాలంటే పరలోకం పోయే గుంపులో ఉన్నవారికి ఎన్నెన్నో శోధనలు కలుగుతాయి!
ఎవరికైతే శ్రమలు శోధనలు కలగడం లేదో వారు నరకం బాచ్ అన్నమాట!
ఇది
చదువుతున్న ప్రియ స్నేహితుడా!
నీకు శ్రమలు శోధనలు కలుగుతున్నాయా చింతపడకు! నీవు
పరలోకం పోయే గుంపులో ఉన్నావు కాబట్టి నీకు ఇవి కలుగుతాయి! ఇవి
కొన్ని రోజులు మాత్రమే అని మరచిపోకు!
పేతురు గారు కూడా
రాస్తున్నారు 1 Peter(మొదటి
పేతురు) 4:1,2,12,13,14
1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు
శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి
మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
13. క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము,
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.
14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ,
అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు
ధన్యులు.
చూశారా యేసుక్రీస్తుప్రభులవారు
శ్రమలు అనుభవించారు కాబట్టి మనము కూడా ఆయనలాగే శ్రమలు అనుభవిద్దాము అంటున్నారు! ఇంకా మీకేదో విపరీతం జరుగుతుంది అనుకోవద్దు
అంటున్నారు! ఇది కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే అని
తెలుసుకుకోండి అంటున్నారు! థెస్సలోనికయులకు ముందుగానే చెప్పారు
పౌలుగారు! 2:14 లో అంటున్నారు మీకు ముందుగా ఉన్న సంఘాలలో ముఖ్యంగా
యూదయలో ఉన్న సంఘాలకు అలాగే జరిగింది! మీరు కూడా ఆ సంఘాలను పోలి
శ్రమల బాటలో నడుస్తున్నారు అది మంచిదే అంటున్నారు!
కాబట్టి ప్రియ విశ్వాసి/ దైవజనుడా! శ్రమలలో సంతోషించు!
శ్రమల ద్వారానే మనము సంపూర్ణులుగా మారతాము! క్రీస్తు
రూపంలో కి మారాలి అంటే కేవలం శ్రమల మార్గమే ఉంది! మరో షార్ట్
కట్ లేనేలేదు! విశ్వాసులారా! భయపడకండి! శ్రమలను సహిస్తూ ఆయనకు తగినట్లుగా ఆయన బాటలో
సాగిపోదాము! ఈ శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడ్డాము నియమించబడ్డాము
కాబట్టి ఆ మార్గములోనే సాగిపోయి మన గమ్యస్తానమైన పరలోకం చేరుదాం!
ఆమెన్!
*15*
ప్రకటన
గ్రంథం 1: 9
మీ
సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమ లోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను
దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున
పరవాసినైతిని.
మొదటిది: యేసుక్రీస్తును బట్టి కలిగే
బాధలలో పాలుపొందాలి!
రెండు: అలా ఆయన నామమును బట్టి కలిగే
శ్రమలలో సహనం చూపించాలి తప్ప కోర్టులకు ఫైటింగ్ లకు వెళ్ళకూడదు!
మూడు: ఇలా సహిస్తూనే సువార్త ప్రకటిస్తూ
ఆయన రాజ్య వ్యాప్తి చెయ్యాలి!
ఇక ఈరోజు ఆ భాధలలో
శ్రమలలో శోధనలలో కష్టాలలో ఎలాసహనం లేక ఓర్పు చూపించాలి అనేది ధ్యానం చేసుకుందాం!
గమనించాలి: సహనమునే మనం ఓర్పు అని కూడా అనవచ్చు!
సహనమునకు నానార్ధాలు ఓర్పు, దీర్ఘశాంతం!
కాబట్టి క్రైస్తవుడు లేక విశ్వాసికి తప్పకుండా సహనము, ఓర్పు, దీర్ఘశాంతం ఉండాలి! దేని
విషయంలో ఈ మూడు ఉండాలి అంటే యేసుక్రీస్తు నామమును ధరించినందున కలిగే భాధలలో శ్రమలలో
శోధనలలో సహనము, ఓర్పు మరియు దీర్ఘశాంతం కలిగిఉండాలి! యోహాను గారు అవి కలిగి ఉండబట్టి మీతో పాలివాడను అన్నారు! అదే మార్గంలో యేసుక్రీస్తుప్రభులవారు కూడా పయనించారు! ఆయన సేవాపరిచర్య ప్రారంభించిన మొదటి దినము నుండి కూడా ఆయన అనేకమైన విమర్శలను,
నిందలను బాధలను అనుభవించారు! అనేకసార్లు రాళ్ళతో
కొట్టాలని చూశారు! అనేకసార్లు నీవు దయ్యం పట్టినవాడవు,
పిచ్చోడివి అంటూ హేళన చేశారు! గాని ఎప్పుడు ఆయన
గీత దాటలేదు ఎవరిని శపించలేదు! అన్నింటిని సహించారు! అన్నింటిని భరించారు! ఆయన నిజమైన ప్రేమమూర్తి!
అందుకే పౌలుగారు అంటున్నారు: ప్రేమ అన్నింటిని
సహించును అన్నింటిని ఓర్చుకొనును అన్నింటిని తాళును...
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:4,7
4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమమత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;
అది ఉప్పొంగదు;
7. అన్ని టికి తాళుకొనును (లేక, అన్నిటిని
కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని
నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
ఇదే మార్గంలో అనేకులైన
పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు పయనించి గమ్యస్థానం చేరుకున్నారు! మనకు మాదిరిగా నిలబడ్డారు!
వారిని గూర్చి ధ్యానం
చేసేముందు ఇదే ప్రకటన గ్రంధంలో సహనం కోసం ఏమన్నారో చూసుకుందాం!
ప్రకటన
గ్రంథం 2: 2
నీ
క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు,
అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు
అబద్ధికులని నీవు కనుగొంటి వనియు,...
ఇది
ఎఫెసి సంఘం కోసం చెబుతున్నారు.
ప్రకటన
గ్రంథం 2: 19
నీ
క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ
పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ
మొదటి క్రియలకన్నా నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
ఇది
తుయతైర సంఘం కోసం దేవుడిస్తున్న సాక్ష్యం!
ప్రకటన
గ్రంథం 3: 10
నీవు
నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి
రాబోవు శోధన కాలములో
(మూలభాషలో- శోధనగడియలో) నేనును
నిన్ను కాపాడెదను.
ఇది ఫిలడెల్ఫియా సంఘం
కోసం దేవుడిస్తున్న సాక్ష్యం!
గమనించారా సహించిన
వారిని శ్రమలనుండి తప్పిస్తాను అంటున్నారు.
కాబట్టి సార్వత్రిక
సంఘంలో పాలివాడవు కావాలంటే తప్పకుండా శ్రమలలో సహనం చూపించాలి!
ప్రకటన
గ్రంథం 13: 10
ఎవడైనను
చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల
వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును
కనబడును.
ప్రకటన
గ్రంథం 14: 12
దేవుని
ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
వీరంతా సహనం ఓర్పు
చూపించారు కాబట్టి గమ్యం చేరుకున్నారు!
ఇప్పుడు భక్తుల కోసం చూసుకుందాం!
పెద్దలసామెత : ఓర్చుకుంటే కోడిగుడ్డు దాకడు మాంసం అవుతుంది. కోడిగుడ్డు దాకడు అనగా పాత్రనిండా మాంసం అవుతుంది మరి ఎలా అవుతుంది?
ఆ కోడి గుడ్డును పట్టుపెట్టి, పిల్లలను చేయించి, వాటిని ఒక ఆరునెలలు పెంచితే ఆ కోడిగుడ్డు ఇంటిల్లిపాదికీ సరిపోయినంత మాంసం
అవుతుంది. అలాగే దైవసేవకునికి/విశ్వాసికి
కూడా ఓర్పు సహనం కావాలి అంటున్నారు పౌలుగారు. ఏం? దైవసేవకునికి ఓర్పు ఎందుకు అవసరం? కారణం: దైవసేవకునికి/ దైవజనుడికి ఎన్నోరకాలైన ఆటంకాలు,
అవమానాలు కలుగుతాయి. వాటిని తప్పకుండా ఓర్పుతో
ఎదుర్కోవాలి. అవి సంఘంనుండి కావచ్చు! అన్యులనుండి
కావచ్చు! తోటిదైవసేవకుల నుండి కావచ్చు! తన కుటుంబంనుండే కావచ్చు! చివరకి సాతానునుండి కావచ్చు!
అవి ఎవరినుండి వచ్చినా ఓర్చుకోవాలి! అప్పుడే సేవ
అభివృద్ధి పొందుతుంది!
కొందరు భక్తులు
ఎలా ఓర్చుకున్నారో తద్వారా వారి సేవా-పరిచర్య ఎలా వృద్ధిచెందిందో క్లుప్తంగా చూద్దాం!
దేవుని ప్రణాళిక – మోషేగారి ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్టు చెరవిముక్తి చెయ్యాలి. అందుకు గాను మొదట 40 సంవత్సరాలు రాజ విద్యలు,
రాజకీయ పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చారు దేవుడు! అది
గడిచాక దానికి పూర్తిగా వ్యతిరేఖమైన శిక్షణ- పశువులు కాసుకోవడం!
ఈ ట్రైనింగ్లో పశువులను ఎలా కాయాలి, ప్రక్కనున్న
వాటిని కొమ్ములతో పొడిచే పశువులను ఎలా ట్రీట్ చెయ్యాలి, పాలిచ్చేవాటిని
ఎలా మేపాలి, చిన్న పిల్లలను ఎలా మేపాలి? పశువులు సామాన్యంగా బుద్ధిజ్ఞానాలు లేకుండా ప్రవర్తిస్తాయి కాబట్టి ఎలా ఓర్చుకోవాలి,
ఎలా నడిపించాలి అనే శిక్షణ ఇచ్చారు దేవుడు! అన్నీ
ఓర్చుకున్నారు మోషేగారు. అప్పుడు అనగా 80 సంవత్సరాల ట్రైనింగ్ అనంతరం నాయకుడిగా, ప్రవక్తగా దేవుడు
వాడుకొన్నారు. ఇశ్రాయేలు వారికి తిరుగులేని నాయకుడిగా,
ధర్మశాస్త్రం దేవునినుండి తెచ్చి ఇచ్చిన గొప్ప దైవజనుడిగా మారిపోయారు.
ఈస్తితికి రాడానికి 80 సంవత్సరాల కఠోరమైన శిక్షణ-
ఓర్పు ఉంది ఆయనకు!
యోసేపుగారి బాల్యంలో దేవుడు దర్శనరీతిగా మాట్లాడారు—నిన్ను
గొప్ప వ్యక్తిగా, అధికారిగా దేశాన్ని పాలించేవానిగా
చేస్తాను అని! బాల్యంలోనే అమ్మబడ్డాడు బానిసగా! బానిసగా బ్రతికారు ఆయన! చివరకు చేయని నేరానికి జైలుకు
కూడా వెళ్లారు! అన్ని భాధలు ఓర్చుకున్నారు, దేవా ఇంతన్నావ్, అంతన్నావ్! ఇప్పుడు
నన్ను చేయని నేరానికి జైలుపాలు చేశావు అని దేవుణ్ణి నిందించలేదు! అన్ని బాధలు, శ్రమలు సహించారు. ఓర్చుకున్నారు! చివరకు ఐగుప్టు దేశానికి గవర్నర్ కాగలిగారు
ఆయన!
బాల్యంలోనే రాజుగా
అభిషేకించబడ్డారు దావీదుగారు! మొదట
గొర్రెల కాపరి! తర్వాత వాయిద్యాలు వాయించే ఉద్యోగం, రాజుగారి ఆయుధాలు మోసేవాడిగా, సైన్యాధిపతిగా,
రాజుకి అల్లుడిగా, కట్టకడకు రాజుగా చక్రవర్తిగా
మారారు దావీదుగారు. తనకు ఎన్నో- ఎన్నెన్నో
ఇరుకులు ఇబ్బందులు, ప్రాణాలు పోయే పరిస్థితులు ఎన్నోసార్లు కలిగాయి
ఆయనకు. అన్ని తట్టుకొన్నారు, ఓర్చుకున్నారు.
దేవుణ్ణి స్తుతించారు. అందుకే చక్రవర్తి కాగలిగారు
ఆయన! ప్రవక్తగా మారారు!
ఎస్తేరు గారు తల్లిదండ్రులను పోగొట్టుకుని పరాయిదేశంలో బానిసగా
మరిపోవలసి వచ్చింది. అన్ని తట్టుకున్నరామే
ఆమె! చివరకు ఆశ్చర్యరీతిగా ఆ దేశానికే కాకుండా 117 దేశాలకు రాణి- పట్టపురాణి కాగలిగారు ఆమె!
ఇలా ఎంతోమంది విశ్వాస వీరులు ఓర్చుకుని
ఘనమైన కార్యాలు చేశారు. ప్రియ దైవజనుడా! నీలో ఓర్పు ఉందా? నిరీక్షణ కలదా? దీర్ఘశాంతము ఉందా? లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి
వస్తుంది నీకు! ఓర్పుకోసం బైబిల్ లో చాలాసార్లు వ్రాయబడింది.
ప్రసంగి 10:4 ఓర్పు
గొప్ప ద్రోహకార్యాలు జరుగకుండా చేస్తుంది.
రోమా 5:౩ .. శ్రమ ఓర్పు,
ఓర్పు పరీక్షను, ... కలిగిస్తుంది.
రోమా 12:12...నిరీక్షణ గలవారై సంతోషించుచూ,
శ్రమలయందు ఓర్పు గలవారై, ....
ఓర్పునే దీర్ఘశాంతము
అనికూడా అంటారని చూసుకున్నాం!
కీర్తన 40:1.
యెహోవాకొరకు
నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
అంతేకాదు
సామెతలు 15:18
కోపోద్రేకియగువాడు
కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
ఈ ఓర్పుగలవారిని యేసుప్రభులవారు
మంచినేల మీద పడిన విత్తనాలతో పోలుస్తున్నారు. లూకా 8:15 లో
మంచి
నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో
వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.
కాబట్టి
నీవు మంచినేలమీద పడితే ఓర్చుకుంటావు. ఫలిస్తావు.
లూకా 21:19 ప్రకారం అంత్యకాలములో
మీ ఓర్పుచేత ప్రాణములు రక్షించుకొంటావు.
ఎఫెసీయులకు 4: 2
మీరు
పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను
నడుచుకొనవలెనని,. .
కొలస్సీ 1:11
ఆయనకు
తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు
ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, . . .
1థెస్సలొనికయులకు 5: 14
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా
అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని
దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల
దీర్ఘ శాంతముగలవారై యుండుడి.. .
2 తిమోతీ 3:10 .
అయితే
నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను
నా ఓర్పును. .
హెబ్రీ 10:36 .
మీరు
దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
యాకోబుగారు
కూడా అంటున్నారు
5:7-8 .
సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి;
చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును
సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా
కాబట్టి అటువంటి దీర్ఘశాంతము,
ఓర్పు మనందరమూ కలిగియుందుము గాక!
యాకోబు 1:4 మీరు
సంపూర్ణులు కావాలి అంటే ఓర్పు తన క్రియను జరిగింపనియ్యుడి! నీవు
సంపూర్ణుడిగా ఆత్మీయుడిగా ఉండాలి అంటే ఓర్పు కావాలి!
చివరిగా 2తిమోతికి 2: 12
సహించిన
వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
గమనించాలి: వెయ్యేళ్ల పాలనలో పాలించాలి
అంటే ఇప్పుడు తప్పకుండా ఈ శ్రమలలో ఓర్చుకోవాలి. సహించాలి!!!
ప్రియ విశ్వాసి! అటువంటి ఓర్పు నీకుందా? తనను ఎన్ని భాదలు పెడుతున్నా, అపహసిస్తున్నా తండ్రీ వీరేమి
చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అడిగిన ఓర్పు క్షమాపణ నీకుందా?
ఒకవేళ లేకపోతే నేడే ఆయన పాదాలు శరణువేడి ఓర్పును పొందుకో!
*16*
ప్రకటన 1:10,11
10. ప్రభువు దినమందు ఆత్మ వశుడనైయుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
11. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర,
సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ
అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
ఇక పదో వచనంలో అంటున్నారు: నేను ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా.......
ప్రభువు
దినము అనగా ఏమిటి?
ఆదివారము అని అర్ధము
అంటారు! యేసుక్రీస్తుప్రభులవారు
ఆదివారం నాడు పునరుత్తానుడైనందున ఆదివారమును యోహాను గారు మరియు కొంతమంది ఆది అపోస్తలులు
ప్రభువు దినము అనడం ప్రారంభించారు అందుకే కాలక్రమేణా విశ్రాంతిదినము అనగా శనివారం నాడు
జరిగే ఆరాధన ఆదివారం నాడు జరపడం ప్రారంభించారు ఆదిమ క్రైస్తవులు అంటారు!
కాబట్టి ప్రభువుదినము
అనగా ఆదివారం అని అర్ధం చేసుకోవాలి!
సరే, ఇప్పుడు మరలా ఒకసారి తొమ్మిదో వచనంతో కలిపి
చదువుకుంటే ఏమని అర్ధమవుతుంది అంటే ఒక ఆదివారం నాడు పత్మాసు దీవిలో నేను ధ్యానం చేస్తూ
ఉండగా పరవశుడనయ్యాను అప్పుడు నేను ఆత్మతో నింపబడి యుండగా వెనుకనుండి భూరధ్వని వంటి
స్వరము నాకు వినబడి నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఏడు సంఘాలకు పంపమని చెప్పడం
విన్నాను అంటున్నారు!!
ఇప్పుడు
మనం ఆత్మవశుడనైతిని అనేమాట కోసం ఆలోచిస్తే ఆదిమకాలంలో అనగా మనస్సాక్షి కాలంలో అబ్రాహము
గారి కాలం వరకు దేవుడు తన సందేశాలు తాను గాని, తన దూతలను గాని పంపించి చెప్పడం జరిగేది!
ధర్మశాస్త్రకాలంలో ఎక్కువగా దర్శనాల రూపంలో దైవజనులు ఆత్మపూర్ణులై ఉండగా
దైవ సందేశాలు చెప్పడం జరిగేది! దేవుని దూతలు కనిపించడం మనకు న్యాయాధిపతుల
కాలం వరకు జరిగింది గాని తర్వాత ఎక్కువగా తన ప్రవక్తలను ఉపయోగించుకుని వారితో దేవుడు
మాట్లాడటం జరిగేది! అలా ఎప్పుడు దేవుడు మాట్లాడే వారు అంటే వారు
ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు! ఇది దేవుని ప్రత్యక్షతలలో మరో రకం!
మొదటి
రకం తానే వచ్చి మాట్లాడటం!!
ఇది ఆదాము గారు, హనోకు గారు, అబ్రాహాము గారు, నోవా గారి వరకు జరిగింది!
తర్వాత
దేవదూతల ద్వారా ప్రత్యక్షతలు జరిగేవి!
తర్వాత
ప్రవక్తలను ఉపయోగించుకుని మాట్లాడేవారు!
ఇక
మరో రకమైన ప్రత్యక్షత – దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడేవారు:
దానియేలు గారికి, యేహెజ్కేలు గారికి, మలాకి గారు ఇంకా పాత నిబంధన భక్తులలో అనేకులకు క్రొత్త నిబంధన భక్తులకు కూడా
ఇలా జరిగింది. ఇప్పుడు కూడా దర్శనాల ద్వారా మాట్లాడుచున్నారు!
అయితే
బైబిల్ లో కొందరికి విశిష్టమైన ప్రత్యక్షతలు జరిగాయి! వారిలో ముఖ్యులు ఎవరు అనగా
యేహెజ్కేలు గారు మరియు యోహాను గారు! వీరిని దేవుడు ముట్టినప్పుడు
వీరు ఆత్మావశులై ఉండగా దేవుడు వీరిని ఎక్కడెక్కడికో తీసుకుని పోతూ ఉండేవారు!
ఆత్మవశుడైన
మనుష్యుడు ఇక పూర్తిగా పరిశుద్ధాత్ముని హస్తాలలోనికి వచ్చి ఆత్మ ద్వారా నడిపించబడుతూ
అసాధారణమైన కార్యాలు చెయ్యగలరు!
యేహెజ్కేలు
గారు బబులోను చెరలో ఉంటే ఆత్మ ఆవరించినప్పుడు ఆత్మ ఆయనను ఎత్తుకుని కొన్నిసార్లు బబులోను
నుండి ఇశ్రాయేలు దేశానికి తీసుకునిపోయాడు! యోహాను గారిని అయితే నేరుగా పరలోకానికే తీసుకుని పోయి
అక్కడ పరమ దర్శనాలను చూపించి భవిష్యత్కాలములో ఇవన్నియు జరుగబోతున్నాయి కాబట్టి వ్రాయమని
చెప్పారు!
సరే, ఈ ప్రకటన
గ్రంధంలో అనేకసార్లు యోహాను గారు నేను ఆత్మవశుడైతిని అప్పుడు దేవుడు నన్ను ఇక్కడికి
తీసుకుని వెళ్లి ఇది చూపించారు అంటూ చెప్పడం జరిగింది.
ప్రకటన
గ్రంథం 4: 2
వెంటనే
నేను ఆత్మవశుడనైతిని.
అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడైయుండెను,
ప్రకటన
గ్రంథం 17: 3
అప్పుడతడు
ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, (లేక, దేవదూషణతో నుండుకొనిన నామములు (గలదై)) యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద
కూర్చుండిన యొక స్త్రీని చూచితిని
ప్రకటన
గ్రంథం 21: 10
ఆత్మవశుడనైయున్న
నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ
పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
యెహెజ్కేలు
గారు కూడా ఇలా జరిగింది.....
యెహేజ్కేలు 11: 1
పిమ్మట
ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్నుదింపగా గుమ్మపు
వాకిట ఇరు వదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు
యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.
యెహేజ్కేలు 11: 24
తరువాత
ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయుల
దేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన
దర్శనము కనబడకుండ పైకెక్కెను.
యెహేజ్కేలు 37: 1
యెహోవా
హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి
యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను
ఇటు అటు నడిపించుచుండగా
దర్శనాలు
ద్వారా చూసుకుంటే దానియేలు
దానియేలు 7: 1
బబులోను
రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక
కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.
దానియేలు 8: 1
రాజగు
బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సర మందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక
దర్శనము కలిగెను.
దానియేలు 8: 2
నేను
దర్శనము చూచుచుంటిని.
చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో
ఉండగా దర్శనము నాకు కలిగెను.
క్రొత్త
నిబంధన భక్తులలో మచ్చుకు ఒకరిని చూద్దాం
అపో.కార్యములు 9: 10
దమస్కులో
అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని
అతనిని పిలువగా
అపో.కార్యములు 10: 3
పగలు
ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చికొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా
అతనికి కనబడెను.
అపో.కార్యములు 10: 10
అతడు
మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై
అపో.కార్యములు 10: 11
ఆకాశము
తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి
దిగివచ్చుటయు చూచెను.
ఒకసారి
ఆగితే- ఇలా దేవునితో
మాట్లాడే అనుభవం ఉన్న వీరంతా మనలాగే మనుష్యులే- సామాన్యులే!
గాని దేవునికోసం తమనుతాము అప్పగించుకుని ప్రభువా నన్ను వాడుకో!
నీ పనిలో వాడబడటానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుని చేతిలో తమ జీవితాన్ని
పెట్టేశారు! అలా పెట్టినప్పుడు ఈ భక్తులందరికీ ఏమి సంభవించాయి
అంటే కష్టాలు శోధనలు అన్నీ మిక్షీలో ఆడించినట్టు అనేకమైన శ్రమలు శోధనలు ఎదురైనా తట్టుకున్న్నారు-
అప్పుడు దేవుడు వీరిని ఉపయోగించుకుని అసాధారమైన కార్యాలు వీరిద్వారా
జరిగించారు!
ప్రియ
నేస్తమా! ప్రియ
చదువరీ! దేవుడు నీతోను నీద్వారా కూడా మాట్లాడటానికి సిద్ధంగా
ఉన్నారు! నిన్నుకూడా వాడుకోడానికి ఆయన ఇష్టపడుచున్నారు!
మరి నీవు వారు సిద్ధపడి జీవితాన్ని దేవునిచేతులకు అప్పగించినట్లు శ్రమలకు
సిద్దపడినట్లు సిద్ధపడగలవా? అయితే నేడే ప్రార్దించు! దేవుడు నిన్నుకూడా వాడుకుంటారు! అయితే ఈ విషయంలో నాదో
మనవి!
దేవుడికి నిన్ను ఎలా వాడుకోవాలో సలహాలు ఇవ్వద్దు! ప్రభువా నన్ను వాడుకో! గాని నన్ను ప్రసంగీకుడిగా వాడుకో! నన్ను పాటగాడిగా వాడుకో! నన్ను వాయిధ్యకారుడిగా వాడుకో లాంటి పనికిమాలిన సలహాలు దేవునికి ఇవ్వవద్దు! కారణం నిన్ను నన్ను చేసినవాడు దేవుడు! ఏ పాత్రను ఎలా వాడుకోవాలో ఎలా మలచాలో కుమ్మరికి ఎలా తెలుసో దేవదేవునికి కూడా నిన్ను నన్ను చేసిన వాడైన దేవునికి నిన్ను ఎలా వాడుకోవాలో తెలుసు! ప్రభువా నన్ను వాడుకో ప్రభు! మీరు ఏ పని ఇచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను! అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు! చివరికి నీ మందిరంలో బాత్రూంలు కడగటానికి కూడా నేను సిద్ధమే! గాని నన్ను వాడుకో! ఇలాంటి తగ్గింపు మరియు సంపూర్ణమైన సమర్పణ కలిగి చేసే ప్రార్ధన దేవుడు వెంటనే విని నిన్ను వాడుకోవడం మొదలుపెడతారు! మరి ఇలాంటి ప్రార్ధన చేయగలవా?
*17*
ఇక పదో వచనంలో అంటున్నారు: నేను ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా
బూరధ్వని వంటి గొప్ప స్వరము పలుకుతుంది....
ఇక తర్వాత ముఖ్యమైన
విషయం ఏమిటంటే ఇక్కడ ఆయనతో మాట్లాడుచున్నది
12—20
ప్రకారం యేసుక్రీస్తుప్రభులవారు అని అర్ధమవుతుంది కాబట్టి ఎందుకు ఆయన
స్వరము బూరధ్వని వంటి గొప్ప స్వరముగా ఉంది అనేది ఆలోచించాలి! అదే యేసుక్రీస్తుప్రభులవారు కోసం ఆయన స్వరము వీధులలో వినబడదు ..
Isaiah(యెషయా
గ్రంథము) 42:2,3
2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు
3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము
ననుసరించి న్యాయము కనుపరచును.
Matthew(మత్తయి సువార్త) 12:17,18,19,20,21
17. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు
జరిగెను) అదేమనగా
18. ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన
నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
19. ఈయన జగడమాడడు, కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని
వినబడదు
20. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న
అవిసెనారను ఆర్పడు
21. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే.
.. ఆయన సాత్వికుడు అని కూడా చెప్పబడింది!
మరి ఎందుకు
ఇక్కడ ఆయన స్వరము బూరధ్వనిలాగ గంభీరముగా ఉంది?
అంటే
జవాబు సింపుల్!
ఈ దర్శనములో
యోహాను గారు ఎక్కడ ఉన్నారు?
పరలోకంలో ఉన్నారు! యేసుక్రీస్తుప్రభులవారు ఎలా
ఉన్నారు? మహా మహిమలో/తో ఉన్నారు!
మరి
మీద చెప్పబడిన వచనములు దేనికోసం చెప్పబడ్డవి? యేసుక్రీస్తుప్రభులవారు ఈ భూమిమీద శరీరముతో ఉండగా ఎలాంటి
స్వభావము స్వరము కలిగి ఉంటారో దానికోసం చెప్పబడ్డవి! అప్పుడు
ఆయన వధకు సిద్ధమైన గొర్రెపిల్ల! ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఇప్పుడు
ఉగ్రుడై యూదా గోత్రపు సింహమై మహా మహిమతో రాజులకు రాజుగా వస్తున్నారు కాబట్టి ఆర్భాటముతోను
శబ్ధముతోను ఆయన వస్తున్నారు! అందుకే ఆయన స్వరము బూరధ్వని వంటి
స్వరముగా వినిపిస్తుంది యోహాను గారికి!పూర్వము దేవుని మహిమ మరలా
ఆయనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన స్వరము గంభీరమే కాదు కీర్తనల గ్రంధము
29 :౩—9 చెప్పినట్లు వినిపిస్తుంది
యేసుక్రీస్తుప్రభులవారి స్వరము!!!......
3. యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు.
మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
4. యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
5. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను
ముక్కలుగా విరచును.
6. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె
గంతులు వేయునట్లు ఆయన చేయును.
7. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
8. యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
9. యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి.
సరే, పదకొండో
వచనములో నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్ణ,
పెర్గము, తుయతైర, సార్దీస్,
ఫిలడెల్ఫియా, లవొదొకయ అనే ఏడు సంఘాలకు పంపమని ఆ
స్వరము చెప్పడం విన్నారు యోహాను గారు! 8వ భాగంలో ఈ ఏడుసంఘాలు
ఏమిటి? కేవలం ఏడు సంఘాలేనా ఉన్నాయి ఆసియాలో అనేది చూసుకున్నాము!
ఏడు
అనేది సంపూర్ణ సంఖ్య కాబట్టి లోకంలో ఉన్న సార్వత్రిక సంఘము అంతటి కోసం చెప్పబడింది
అని చూసుకున్నాము!..
ఈ గ్రంధంలో
ఆసియ అనగా చిన్న ఆసియా అని అర్ధం! Asia Minor అంటారు! టర్కీ లో
కొంత దాని ప్రక్కనున్న దేశాలలో వ్యాపించింది! అంతేకాదు చిన్న
ఆసియాలో కేవలం ఏడు సంఘాలు మాత్రమే లేవు! ఇంకా బోలెడు సంఘాలున్నాయి!
ఉదాహరణకు కొలస్సీ సంఘము కూడా చిన్నాసియాలోనే ఉంది. ఎఫెసీ- లవొదొకయకు మధ్యలో ఉంది. కాబట్టి ఏడు సంఘాలు అంటే కేవలం ఆ ఏడు సంఘాలు అని కాదు! ఏడు అనేమాట సంపూర్ణ సంఖ్య!
ఏడు
సంఘాలకే కాదు, ఏడు సంఘాలకు ఏడుగురు ప్రతినిధులు ఉన్నారు. అలాగే సార్వత్రిక
సంఘంలో అనేక సంఘాలలో అనేకులైన ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు
తమకు అప్పగించబడిన సంఘముకోసం దేవునికి లెక్క అప్పగించాలి! అందుకే
పౌలుగారు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మిమ్మును అధ్యక్షులుగా చేశారు కాబట్టి
ఆ యావత్తు మందను గూర్చియు మీరు జాగ్రత్తగా ఉండమని అపోస్తలులు 20:28 లో చెబుతున్నారు! ఇలాంటి వారందరికోసం ఈ గ్రంధము వ్రాయబడింది
అని గ్రహించాలి!
కాబట్టి
ఆ సంఘములో నీవు నేను ఉన్నాము.
కాబట్టి ఇప్పుడు చెప్పబోయే లేక ఈ గ్రంధములో వ్రాయబడినవి అన్నీ మనకోసమే
వ్రాయబడ్డాయి అని గ్రహించాలి! కేవలం చిన్న ఆసియాలో వారికే కాదు,
లేక కేవలం ఇశ్రాయేలు యూదులకే కాదు- అందరికోసం ఇవి
వ్రాయబడినవి అని గ్రహించి మనలను మనం సరిచేసుకుని ఆయన రాకడకు సిద్దపడుదాం!
*18*
ప్రకటన 1:12—16
12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను
మనుష్యకుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు
దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను.
ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను;
ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన
నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
ఇక పన్నెండు పదమూడు వచనాలలో అంటున్నారు: నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని
చూడ తిరిగితిని, అప్పుడు ఏడు సువర్ణ దీపస్తంభాలు ఆ దీపస్తంభాల
మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచాను అంటున్నారు!
ప్రియులారా! మొదటగా ఏడు బంగారు దీపస్తంభాలు
ఏమిటో చూసుకుందాము! మొదటగా ఏడు అనగా సంపూర్ణసంఖ్య అని అర్ధంచేసుకోవాలి!
నిర్గమ కాండం 25:31—40 లో మోషేగారికి తండ్రియైన
దేవుడు ప్రత్యక్షగుడారములో ఉంచవలసిన సామానులు కోసం చెబుతూ 31వ వచనంలో నీవు మేలిమి
బంగారంతో దీప వృక్షము చెయ్యాలి దానికి శాఖలుండాలి. అలా ఆరు కొమ్మలుండాలి అంటూ
37వ వచనం రాబోయేసరికి
ఏడు దీపములు ఆ దీప వృక్షమునకు ఉండాలి! అవన్నీ
ఏకాండముగా చెయ్యాలి అంటూ 40వ వచనంలో కొండమీద నీకు కనుపరచబడిన
వారి రూపము చొప్పున చేయుటకు జాగ్రత్త పడుము అంటున్నారు దేవుడు!
ఏకాండముగా
చేయబడటం అనగా క్రీస్తు రక్తంలో కడుగబడిన మనము దేవునితో ఐక్యమయ్యాము, సార్వత్రిక సంఘంలో ఏకత్వం
కలిగి సంపూర్ణమైన పరిశుద్ధాత్ముని కలిగి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుతో ఏకాండముగా
లేక క్రీస్తుతో ఐక్యమయ్యారు.
చూశారా—దీపవృక్షము అనేదానికి అనేక కొమ్మలు, వాటికి ఏడు దీపములు,
దీపములు పెట్టడానికి దీప స్తంభాలు గాని అవన్నీ ఏకాండమైన పనిగా ఉండాలి
అని చెబుతూ కొండమీద నీకు చూపించిన రూపముతో చేయడానికి జాగ్రత్తపడుము అంటున్నారు!
ఇక్కడ మనకు పరలోకంలో ఏడు దీపస్తంభాలు కనిపిస్తున్నాయి ఆ దీప స్తంభాలు మధ్యలో సంచరిస్తున్న
మనుష్యకుమారుడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు కనిపిస్తున్నారు! అందుకే హెబ్రీపత్రికలో ధర్మశాస్త్రము రాబోయేవాటి ఛాయ మాత్రమే గాని నిజం అంతా
యేసుక్రీస్తుప్రభులవారిలో ఉంది అంటున్నారు. హెబ్రీ 10:1—14; ఇంకా అదే హెబ్రీపత్రికలో
ప్రత్యక్షగుడారము కోసం చెబుతూ అసలైన ప్రత్యక్ష గుడారము మరియు బలిపీఠం మందసము దేవాలయము
పరలోకంలో ఉన్నాయి అని మనకు చూపిస్తున్నారు. కొలస్సీ
2:17 లో కూడా అదే చెబుతున్నారు.....
ఇవి
రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము (మూలభాషలో-శరీరము) క్రీస్తులో ఉన్నది
కాబట్టి ప్రత్యక్షగుడారములో
ఉండే దీపస్తంభాలు పరలోకంలో కూడా ఉన్నాయి, వాటిమధ్య మనుష్యకుమారుడు సంచరిస్తున్నారు అని అర్ధం అవుతుంది.
ఇంతకీ ఆ ఏడు దీపస్తంభాలు వేటిని సూచిస్తున్నాయి అనేవి ముందుభాగాలలో ధ్యానం
చేద్దాం! చివరి వచనం ప్రకారం ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు అని
చెప్పబడ్డాయి గనుక ఏడు సంఘాల మధ్య సంచరించే యేసుక్రీస్తుప్రభులవారు అని అర్ధం చేసుకోవాలి!
గమనించాలి సంఘాలు ఏడు అనగా సంపూర్ణ సంఖ్య! గాని
నిర్గమ కాండం ప్రకారం దీప వృక్షము ఏకాండముగా చెయ్యబడింది! అనగా
సంఘములు ఎన్నెన్నో ఉన్నా సార్వత్రిక సంఘము ఒక్కటే! కట్టుచున్న
వాడు ఒక్కడే! పునాది ఒక్కటే! ఆ పునాది యేసుక్రీస్తుప్రభులవారు!
మరిన్ని వివరాలు
ఈఅధ్యాయం చివరలో చూసుకుందాం!
ఇక ఇక్కడ మనుష్యకుమారుని
పోలిన వ్యక్తి కనిపించారు అంటున్నారు గాని మనుష్యకుమారుడు అని చెప్పడం లేదు! ఒకసారి దానియేలు గ్రంధము 7:13 లో చూసుకుంటే అక్కడకూడా మనుష్యకుమారుని పోలిన ఒకవ్యక్తి నాకు కనిపించి ఆ మహా
వృద్దుడగువాని సన్నిధిని ప్రవేశించాడు అంటున్నారు...
దానియేలు 7: 13
రాత్రి
కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశ మేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు
వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
ఎందుకు వీరిద్దరూ మనుష్యకుమారుడు అని గట్టిగా చెప్పడం లేదు
అంటే ఇద్దరు ఈ మనుష్యకుమారుని మహిమలో చూస్తున్నారు! ఆ మహిమవలన యేసుక్రీస్తుప్రభులవారిని
సరిగా గుర్తుపట్టలేకపోయారు. గాని రెండు సందర్బాలలోను తర్వాత వ్రాయబడిన
వివరాలు ప్రకారం చూసుకుంటే అది మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు తప్ప మరొకరు
కారు అని అర్ధమవుతుంది! దానియేలు గ్రంధంలో మనుష్యకుమారుని పోలిన
వ్యక్తి మహావృద్దుడగు వాని సన్నిధిలో ప్రవేశించి అనగా- మహావృద్ధుడు
అనగా తండ్రియైన దేవుడు. ఆయన సన్నిధిలో ప్రవేశించేది ప్రవేశించగలిగిన
వాడు కేవలం యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే! ఆయనకు మాత్రమే మనుష్యకుమారుడు
అనే పేరు ఉంది! యేసుక్రీస్తుప్రభులవారు కూడా అనేకసార్లు తానూ
మనుష్యకుమారుడు అంటూ తనకోసం చెప్పుకున్నారు. ఉదా మత్తయి
8:20 లో నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి గని మనుష్యకుమారునికి
తలవాల్చు కొనుటకు స్తలము లేదు అన్నారు. ఈ భూమిమీద ఆయనకు తలవాల్చు
కొనే స్థలము కేవలం సిలువ మీదన మాత్రమే దొరికింది! అయితే పరలోకమంతా
ఆయనదే!
ఇక ఇక్కడ కూడా 13వచనం నుండి 16వ
వచనం వరకు ఇవ్వబడిన వివరణ చూసుకుంటే అది యేసుక్రీస్తుప్రభులవారు అని అర్ధమవుతుంది!
ఇక
తర్వాత మాటలలో ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి
కట్టుకుని ఉండెను అంటున్నారు!
ఇక్కడ యోహాను గారు తాను పరలోకంలో యేసుక్రీస్తుప్రభులవారి ముఖదర్శనము
చూసి, ఉన్నది ఉన్నట్లు రాస్తున్నారు అని గ్రహించాలి. అంటే తప్ప ఏదో కవి వర్ణించడం లేదు అని తెలుసుకోవాలి!
ఇక్కడ
ఆయన పాదముల మట్టుకు ధరించుకొన్న వస్త్రము కనిపిస్తుంది. రెండు రొమ్మునకు బంగారు
దట్టి కనిపిస్తుంది. దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వస్త్రధారణ
ధర్మశాస్త్రంలో ఒక ప్రధానయాజకునికి ఉండవలసిన వస్త్రధారణగా మనకు నిర్గమ
కాండంలో
చూడగలం! నిర్గమ
28:4 లో దేవుడు మోషేగారికి ప్రధాన యాజకునికి ఇలాంటి వస్త్రాలు కుట్టి
రొమ్ముకు దట్టి లేక న్యాయవిధాన పతకము చేసి ప్రధాన యాజకుని రొమ్మున వ్రేలాడదీయాలి.
ప్రదానయాజకుడు పరిశుద్ధస్తలములోనికి ప్రవేశించే ప్రతీసారి తప్పకుండా
ఈ న్యాయవిధాన పతకము లేక దట్టి ఆయన రొమ్మున ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించారు!
అదే రొమ్మున బంగారుదట్టి మనకు మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారి
రొమ్మున వ్రేలాడటం చూస్తున్నారు యోహాను గారు! అనగా ఇక్కడ ఒక ప్రధాన
యాజకునిగా మనకు పరిచయం అవుతున్నారు అని అర్ధం చేసుకోవాలి!
మొదటగా
ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే ఆత్మ స్వరూపునిగా,
రెండవదిగా
మహిమగల మను ష్యకుమారునిగా,
మూడవదిగా
ఇక్కడ ప్రధాన యాజకునిగా కనిపిస్తున్నారు!
మరి
హెబ్రీపత్రిక మొత్తం మీద పౌలుగారు అదే కదా చెబుతున్నారు! ఆహారోను యాజకధర్మం సంపూర్ణత
సాధించలేక మానవునికి సంపూర్ణ విమోచన కలిగించలేక అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది. అందుకే దేవుడు మెల్కీసెదెకు యాజకక్రమము చొప్పున యేసుక్రీస్తుప్రభులవారి రూపంలో
మరో యాజకధర్మం మొదలుపెట్టి ఆ ప్రధానయాజకునిగా యేసుక్రీస్తుప్రభులవారు స్వయాన వచ్చి
ఆయనే తనకుతానుగా ఈ భూలోకంలో తన సొంత రక్తాన్ని అర్పించి తన సొంత రక్తాన్ని తీసుకుని
పరలోకమందున్న దేవాలయంలో గల బలిపీఠం మీదన ఆ అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించి శాశ్వత పరిష్కారం
కలిగించారు అని మనకు వివరించారు! ఒకసారి హెబ్రీపత్రిక మొత్తం
చదవమని మనవి! కాబట్టి ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి మనుష్యకుమారుడైన
వధింపబడిన గొర్రెపిల్ల మరియు మెల్కీసెదెకు క్రమముచొప్పున ప్రధానయాజకుడైన యేసుక్రీస్తుప్రభులవారు
అని గ్రహించాలి!
ఒకసారి
ఆగుదాం! ఓ అయ్యా! అమ్మా! దైవసేవకుడా! కాపరి!
విశ్వాసి! యేసుక్రీస్తుప్రభులవారే సాక్షాత్తుగా
పాదములు వరకు ఉండే బట్టలు కట్టుకుంటే మరి నీవెందుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నావు?
నీవు ఆయన మాదిరిగా జీవించలేవా? ఆయన బిడ్డవైతే ఆయన
లాంటి వస్త్రధారణ చెయ్యాలి కదా! మరి ఎందుకు పొట్టి టీ షర్ట్లు? ఎందుకు పొట్టి బట్టలు?
దైవజనుడా! తప్పకుండా నీ వస్త్రధారణ
నీ ఒళ్ళంతా కప్పుకునేది కావాలి!
విశ్వాసి! నీ వస్త్రధారణ నీ శరీరం
మొత్తం కప్పుకోవాలి! అలా కాకుండా నీదేహాన్ని చూపిస్తుంటే నీలో
వ్యభిచార ఆత్మ మరియు యెజెబెలు ఆత్మ పనిచేస్తుంది. అది నిన్ను
నరకానికి దారితీస్తుంది అని గ్రహించాలి! దైవసేవకులారా!
దైవసేవకుల భార్యలారా! దైవసేవకుల పిల్లలారా!
మీరు మాదిరిగా ఉండాలి గాని సంఘాన్ని మీ వస్త్రధారణతో కలిపి చెరపవద్దు!!
మీరు విమర్శలో నిలుస్తారు అని మర్చిపోవద్దు! సంఘంలో
గాని, బయట గాని విశ్వాసులకు దేవుని పిల్లలకు స్లీవ్ లెస్ లు పనికిరావు.
మీ చిన్నపిల్లలకు కూడా వారు చిన్న పిల్లలే కదా అని వాటిని అలవాటు చెయ్యవద్దని
మనవి చేస్తున్నాను! కన్నీటితో వ్రాసేది ఏమిటంటే అనేకులైన విశ్వాసులైన
స్త్రీలు కూడా వారు వేసుకునే జాకెట్లు వీపు అంతా కనిపించేలా వేసుకుంటున్నారు నేటి రోజులలో!
ఏమంటే ప్రజెంట్ ట్రెండ్ అదే అంటున్నారు! అమ్మా!
ఆ ట్రెండ్ నిన్ను 100% నరకానికి తీసుకుని పోతుంది!
యెజెబెలు ఆత్మ వ్యభిచార ఆత్మ మీలో పనిచేస్తుంది! తొందరగా సరిదిద్దుకున్నారా- సరి, లేకపోతే నరకానికి అతి దగ్గరలో ఉన్నారు అని గ్రహించండి! స్త్రీలు మీరు బాధపడినా ఉన్నది ఉన్నట్లు చెప్పడం నాకు అలవాటు! మీరు బాధపడితే నన్ను క్షమించండి గాని తప్పకుండా మీలో ఆ పనికిమాలిన ఆత్మ పనిచేస్తుంది
కాబట్టి వెంటనే సరిదిద్దుకోండి మరియు మీ చిన్న పిల్లలకు కూడా వాటిని అలవాటు చెయ్యకండి!
పురుషులారా పొట్టిపొట్టి బట్టలు మనకు తగవు! విశ్వాసికి
మాదిరిగా దైవభక్తిగల స్త్రీ పురుషులకు మాదిరిగా మనం జీవించాలి అని మరచిపోవద్దు!
*19*
ఇక 14వ వచనం
లో కూడా ఆయనను చూసిన విధానం వర్ణిస్తున్నారు యోహాను గారు! ఆయన
తలయు తలవెండ్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి హిమమంతా దవళముగా ఉండెను అంటున్నారు!
ఒకసారి ఆగుదాం! యేసుక్రీస్తుప్రభులవారి తలయు తలవెండ్రుకలు
తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయని చూసి చెబుతున్నారు యోహాను గారు! దానియేలు గ్రంధంలో రెండు సార్లు దానియేలు గారు ఇలాంటి దర్శనం చూశారు!
దానియేలు 7:9 లో మహావృద్దుడగువాడు
ఆసీనుడైనట్లు, ఆయన సన్నిధిలో మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు
ప్రవేశించినట్లు కనిపిస్తుంది! ఆ మహా వృద్ధుడగు తండ్రియైన దేవుని
తల వెండ్రుకలు కూడా అలాగే ఉన్నాయి......
దానియేలు 7: 9
ఇంక
సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు
శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె
మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను.
అనగా ఇక్కడ తండ్రి
తలవెండ్రుకలు కుమారుని తలవెండ్రుకలు ఒకలాగే ఉన్నాయి అని
అర్ధం చేసుకోవాలి!
ఇక పదో అధ్యాయంలో
కూడా అలాగే కనిపిస్తుంది. అయితే ఒక అనుమానం రావచ్చు—మరి పరమగీతంలో
షూలమ్మితి యేసుక్రీస్తుప్రభులవారిని వివరిస్తూ అతని తల కృష్ణ వర్ణము వలే కాకపక్షముగా
ఉంది అంటుంది! దీనినే
కొన్ని ప్ర్రతులలో మరియు స్టడీ బైబిల్ లో ఇలా తర్జుమా చేయబడింది: అతని తల మేలిమి బంగారం లాంటిది. అతని తలవెండ్రుకలు బొంతకాకిలాగ
నల్లగా ఉండి నొక్కులు నొక్కులుగా ఉన్నాయి! దీని ప్రకారం పరమగీతం
ప్రకారం ఆయన తల వెండ్రుకలు నల్లగా ఉన్నాయి! మరి దానియేలు గ్రంధం
ప్రకారం మరియు ప్రకటన గ్రంధం ప్రకారం తెల్లగా ఉన్నాయి ఆయన తలవెండ్రుకలు! మరి ఇద్దరు ఒకరు కాదా లేక యేసుక్రీస్తుప్రభులవారి తల వెండ్రుకలు రాకడ సమయానికి
తెల్లబడిపోయాయా?
అయ్యా ఇద్దరు కానేకాదు! ఆయన తలవెండ్రుకలు తెల్లబడిపోలేదు!
పరమగీతంలో వర్ణించబడింది—రానున్న పెండ్లికుమారుడు అది కూడా భూమిమీద ఆయన చేయబోయే రక్షణ కార్యము కోసం
వ్రాయబడింది ఐదో అధ్యాయం లో! గాని ఇక్కడ దానియేలు గ్రంధంలోనూ ప్రకటన గ్రంధంలోనూ వధింపబడిన గొర్రెపిల్లగా
కాకుండా రానున్న యూదాగోత్రపు సింహములా తీర్పుతీర్చబోయే రాజులరాజు ప్రభువుల ప్రభువుగా
వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన తలవెండ్రుకలు తెల్లగా ఉన్నాయి! అంతేకాదు ప్రకాశమానమైన వెలుగు మన తలవెండ్రుకలు మీద పడితే మన తల వెండ్రుకలు
కూడా తెల్లగా మెరుస్తాయి! ఆయన మహిమలో ఉన్నారు కాబట్టి పరలోకంలో
ఆయన తలవెండ్రుకలు తెల్లగా ఉన్నాయి! అంతేకాదు తెలుపు పరిశుద్దతకు
గుర్తు. కాబట్టి ఆయన తలనుండి పాదముల వరకు పరిశుద్దతను సూచిస్తుంది.
ఇక అయన నేత్రములు అగ్నిజ్వాలవలె
ఉండెను అంటున్నారు. ఇదే ప్రకటన 2:18 లో
ను, మరియ 19:12 లో కూడా ఆయన కళ్ళు కోసం
అలాగే చెప్పబడింది....
ప్రకటన
గ్రంథం 2: 18
తుయతైరలో
ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల
దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా
ప్రకటన
గ్రంథం 19: 12
ఆయన
నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని
తెలియదు;
చూశారా అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని
పోలిన పాదములు గలవాడు!
దానియేలు గ్రంధం 10 వ అధ్యాయంలో కూడా మనకు యేసుక్రీస్తుప్రభులవారు
కనిపిస్తారు. అక్కడ దానియేలు గారికి కూడా ఆయన కన్నులు ఇలాగే కనబడ్డాయి
ఆరవ వచనంలో!....
దానియేలు 10: 6
అతని
శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును
తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె
ఉండెను
ఒక వ్యక్తి కండ్లు
అ వ్యక్తియొక్క గుణగణాలు చెబుతాయి!
మంచోడా దొంగోడా కొంటెగాడా అల్లరోడా లాంటివి కళ్ళు చెబుతాయి! ఇక్కడ అగ్నిజ్వాలవంటి కన్నులు అనగా ఆయన స్వభావము అపవిత్రమైనవి సహించని గుణము
చూపిస్తుంది! అంతేకాదు తీర్పు తీర్చడానికి ఉగ్రుడై వస్తునట్లు
కూడా చూపిస్తుంది! అంతేకాదు మనుష్యుల రహస్య విషయాలు తెలుసుకుని
వాటి ప్రకారం తీర్పు తీర్చడానికి సమర్ధుడు అని కూడా తెలియజేస్తుంది! ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నందుకు ఆయన ఉగ్రుడై వస్తున్నాడు అని యెషయా
గ్రంధంలో చెప్పబడింది!
ఇంతవరకు ఆయన
మొదటగా ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే ఆత్మ స్వరూపునిగా,
రెండవదిగా మహిమగల మనుష్యకుమారునిగా
మూడవదిగా ప్రధానయాజకునిగా
ఇక్కడ నాల్గవది తీర్పు తీర్చబోయే వ్యక్తిగా కనిపిస్తున్నారు!
ప్రియ నేస్తమా! ఆయన త్వరలో తీర్పు తీర్చడానికి ఈభూమిమీదికి
రాబోతున్నారు! అప్పుడు ప్రతివాని జీతం నాయొద్ద ఉన్నది అంటున్నారు!
ప్రకటన 22:12; మనుష్యులు జరిగించు ప్రతికార్యము
అవి మంచివైనను చెడ్డవైనను విమర్శదినమందు లెక్క అప్పగించాలి అని బైబిల్ సెలవిస్తుంది!
2కొరింథీ 5:20;
ఈరోజు ఆయన వస్తే నీవు ఆయన సముఖములో
యధార్ధముగా నమ్మకముగా పవిత్రముగా ఉన్నావా? ఆయన హృదయమును అంతరంగమును
పరిశీలించు నీతిగలదేవుడు అని మర్చిపోవద్దు! నీ హృదయం,
నీ తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకో!
*20*
ప్రకటన 1:12—16
12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను
మనుష్యకుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు
దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను.
ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను;
ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన
నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
ఇక 15వ వచనం
లో కూడా ఆయనను చూసిన విధానం వర్ణిస్తున్నారు యోహాను గారు! అయన
పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను!!!
పాదములు కొలిమిలో
పుటము వేయబడి మెరయుచున్న అపరంజి అనగా కంచులా ఉన్నాయి అంటున్నారు! దానియేలు 10:6 లో కనబడిన ఆ వ్యక్తికి కూడా అలాగే ఉన్నాయి.....
దానియేలు 10: 6
అతని
శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును
తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె
ఉండెను
కొలిమిలో
ఎందుకు పుటము వేయబడ్డాయి? కొలిమి అనేది శ్రమలకు శోధనలకు సూచనగా ఉంది! అనగా యేసుక్రీస్తుప్రభులవారు
ఇప్పుడు పొందుకున్న మహిమ ఇట్టే రాలేదు! దానికి విలువ చెల్లించారు!
ఆ సంపూర్ణత ఆ మహిమ తెచ్చుకోడానికి ఎన్నో శ్రమలను హింసలను ఓర్చుకుని,
దేవుడైనా సరే, మనకోసం మరణించి ఆయన తన సొంత రక్తాన్ని
కార్చి, 39 కొరడా దెబ్బలు, అనేకమైన నిందలు
హింసలు అవమానాలు భరించి, మనకు విమోచన, ఆయన
సంపూర్ణత సాధించారు! అందుకే ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడ్డాయి
అనగా శ్రమలు శోధనలు అనే కష్టాల కొలిమిలో పుటము వేయబడ్డాయి! అలాగే
సంపూర్ణత సాధించాలని తపనపడే విశ్వాసి/సేవకుడు ఎవరైనా ఈ కొలిమిలో
పుటమి వేయబడవలసినదే! ఇది మొదటి కారణం! రెండో
కారణం ఎందుకు కొలిమిలో పుటమి వేయబడ్డాయో చివరలో చెబుతాను!
ఇక తర్వాత ఆయన స్వరము విస్తార జల
ప్రవాహముల ధ్వనివలె ఉంది అంటున్నారు! మనకు అర్ధం కావాలంటే ఏదైనా
డాం దగ్గరకువెళ్తే అక్కడ డాం నుండి నీరు విడుదల చేసేటప్పుడు నీటివలన శబ్దము ఎలా వస్తుందో
అలా ఆయన స్వరము వినిపిస్తుంది అంటున్నారు యోహాను గారు! భక్తుడైన
యేహెజ్కేలు గారికి కూడా దేవుని స్వరము అలాగే వినిపించింది...
యెహేజ్కేలు 43: 2
ఇశ్రాయేలీయుల
దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె
వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను.
కాబట్టి
ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారి స్వరము దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో సీనాయి కొండమీద
మాట్లాడినప్పుడు వచ్చినప్పటి స్వరమును మనకు గుర్తుచేస్తుంది...
నిర్గమకాండము 19: 16
మూడవనాడు
ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా
పాళెములోని ప్రజలందరు వణకిరి.
నిర్గమకాండము 19: 19
ఆ
బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
అందుకే కీర్తన 29:౩—9 వరకు ఆయన స్వరము కోసమే చెప్పబడింది... అది అధికబలము గలది
తిరుగులేని శక్తిగలది!
ఇక 16వ వచనం లో ఆయన కుడిచేతిలో
ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను అంటున్నారు! 13వ వచనంలో ఏడు సువర్ణ దీపస్తంభముల
మధ్య సంచరిస్తున్న మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు కనబడ్డారు! ఇప్పుడు ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకుని కనిపిస్తున్నారు!
ఇప్పుడు
అసలు విషయానికి వద్దాం! ఒకసారి ఈ నక్షత్రాలు ఏమిటి దీపస్థంభాలు ఏమిటి అని ఆలోచిస్తే అది మర్మము అని
చెబుతూ ఈ మర్మము కోసం నేను చూపించేవి పుస్తకంలో వ్రాయు అంటూ యేసుక్రీస్తుప్రభులవారు
యోహానుతో చెప్పారు! ఆ మర్మము మనకు 20వ వచనంలో
ఉంది.... నీవు నా కుడిచేతిలో
చూసిన ఏడు నక్షత్రాలు గూర్చిన మర్మము ఏమిటంటే ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు దూతలు! ఆ ఏడు దీపస్థంభాలు
ఏడు సంఘాలు!! దేవుడే ఈ మర్మము చెప్పేశారు! (గమనించాలి: కొన్ని తెలుగు బైబిల్లలో అచ్చు తప్పు పడింది.
కొన్నింటిలో బాగా ఉన్నాయి. కొన్ని బైబిల్లలో ఏడు
దీప స్తంభాలు ఏడు సంఘాల దూతలు, ఆ ఏడు దీప స్తంభాలు ఏడు సంఘాలు
అని పడింది. రెండు సార్లు దీపస్థంభాలు అని అచ్చుతప్పు పడింది.
ఒకవేళ మీ బైబిల్ లో అలా ఉంటే దయచేసి సరిచేసుకోండి)
సరే, ఇప్పుడు మనుష్యకుమారుడైన
యేసుక్రీస్తుప్రభులవారు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నారు? ఏడు దీపస్తంభాల
మధ్య! దీపస్థంభాలు అనగా ఏమిటి? ఏడు సంఘాలు!
అనగా సార్వత్రిక సంఘము అనబడే దేవుని సంఘము, ప్రపంచంలో
గల సంఘాల మధ్య యేసుక్రీస్తుప్రభులవారు సంచారం చేస్తున్నారు!!!
ఆయన
కుడిచేతిలో ఏమున్నాయి? ఏడు నక్షత్రాలు! ఏడు నక్షత్రాలు ఏమిటి? సంఘాల యొక్క దూతలు! అనగా సంఘాన్ని కాస్తున్న కాపరులు/పెద్దలు/ సేవకులు/లేదా దేవుడు ఆ
సంఘాన్ని ఎవరి చేతులకు అప్పగించారో ఆ వ్యక్తి ఆ సంఘానికి దూత అని అర్ధం చేసుకోవాలి!
కొంతమంది దుర్భోధకులు బోధిస్తున్నట్లు
సంఘదూతలు అంటూ ఏడు సంఘాలకు ఎవరూ లేరు! విలియం మారియన్ బ్రెన్హాం
అనేవ్యక్తి ఈ కాలపు సంఘదూత కానేకాదు! ఈ ఏడు సంఘాలు ఏడు సంఘకాలాలు
అసలు కానేకావు! సంఘకాలాలు అనేదే తప్పుడు కాన్సెప్ట్! దానిని విలియం బ్రెన్హాం గారికంటే ముందుగా *నిజానికి
అతడు 1919లో క్లేరెన్స్ లార్కిన్ విడుదల చేసిన 'ది బుక్ ఆఫ్ రెవలేషన్' మరియు చార్లెస్ రస్సెల్ రాసిన 'సంఘకాలములు' అనే పుస్తకాల ఆధారంగా ఈ విషయాలను వ్రాసాడు*.! దానిని కాపీకొట్టి తానే రాసినట్లు
ఈ బ్రెన్హాం గారు చెప్పుకున్నారు! సంఘకాలాలు అంటూ ఉంటే ఒకే కాలం
ఉండాలి. గాని ఈ లవొదొకయ అనేది 19౦6
లో మొదలయ్యింది అట ఇంతవరకు పూర్తికాలేదు! ఇది తప్పు!
ఏడు సంఘాలు
ఏడు రకాలయిన విశ్వాసులు- అలవాట్లు గల వ్యక్తులు గల సంఘాలు అని నా ఉద్దేశ్యం! వారు
లోకంతో కలిసిపోయి కొందరు, లోకమును వెలివేసి కొందరు, దేవుణ్ణి ముందుపెట్టి కొందరు, దేవుణ్ణి త్రోసివేసి కొందరు,
శ్రమలను సహించేది కొందరు, శ్రమలు చూసి పారిపోయే
కొందరు ... ఇలా రకరకాలైన విశ్వాసాలు గల సంఘాలు వస్తాయి అని దేవుడు
ముందుగానే ఏడు రకాలైన సంఘాలు కోసం చెప్పారు గాని ఏడు సంఘకాలాలు కానేకాదు!
కాబట్టి ఇప్పుడు ఏడు సంఘాల మధ్య
సంచరిస్తూ, ఆ సంఘకాపరులను తల కుడిచేతితో పట్టుకున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!
ఏం? ఆయన కుడిచేతిలో ఎందుకు పట్టుకున్నారు?
కారణం
ఈ సంఘాన్ని నాశనం చేద్దామని రోమా సైనికులు పాలకులు ప్రయత్నించారు! పేతురు గారితో మొదలుపెట్టారు!
పెద్దయాకోబును చంపేశారు! ఇలా ఎందరినో చంపారు!
నీరో నాశనం చెయ్యాలను కున్నాడు సంఘాన్ని! కాని
ఏమీ చెయ్యలేకపోయాడు! టైటస్ అనేవాడు క్రీ.శ. 70లో అనేకులైన క్రైస్తవులను చంపేశాడు! యెరూషలేమును నాశనం చేశాడు! ఇంకా అనేకులైన రాజులు వ్యక్తులు
అధికారులు ఈ సంఘాన్ని నాశనం చేద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నారు రెండువేల సంవత్సరాల నుండి!
కాని ఏమీ చెయ్యలేకపోయారు! ఏమీ పీకలేరు కూడా!
ఏమంటే: ఈ సంఘము, మరియు సంఘదూతలుగా
పిలువబడే నాయకులు అఖండ విశ్వాన్ని చేసి పాలిస్తున్న రాజులరాజు ప్రభువుల ప్రభువు సృష్టికర్త
మరియు లయకర్త అదియు మరియు అంతమునై ఉన్న
యేసుక్రీస్తుప్రభులవారి చేతిలో ఉన్నారు! అందుకే ఏమీ చెయ్యలేరు! ఇప్పుడు మన భారతదేశంలో సంఘశక్తులు
ఇంకా అనేక మంది క్రైస్తవ్యాన్ని భారతదేశం నుండి తీసేయ్యాలి అని పెట్రేగిపోయి విర్రవీగుతున్నారు
కాని ఏమీ చెయ్యలేరు! సంఘాన్ని విశ్వాసులను వీరు శ్రమ పెట్టగలరు
గాని అంతము చెయ్యడం వీళ్ళ వల్లకాదు! వీల్లబ్బ వల్లకూడా కాదు!
సరే
మరి ఎందుకు ఈయన పాదములు పుటములో వేయబడిన కంచును పోలి ఉన్నాయి అంటే సంఘముల మధ్య సంచారం
చేస్తున్న యేసుక్రీస్తుప్రభులవారు ఈ శత్రువులు చేసే ప్రయత్నాల నుండి సంఘాన్ని తన ప్రజలను
కాస్తున్నారు కాబట్టి ఆ కొలిమిలో తన పాదాలే కాలుతున్నాయి గాని సంఘాన్ని తాకడం లేదు! మరి సంఘాలు అనుభవించే శ్రమలు???
అవి కేవలం కాక లేక సెగ మాత్రమే! నిజమైన అగ్ని అంతా
ఆయనే భరిస్తున్నారు! ఇది అర్ధం కావాలంటే నేనొక దర్శనం చదివాను!
ఒక విశ్వాసికి దర్శనం కలిగింది అట! దేవుడు విశ్వాసి
మాట్లాడుతూ వెళ్తున్నారు! అప్పుడు వెనుక తిరిగి చూస్తే రెండు
జతల పాదాల గుర్తులు కనిపించాయట! కొంతదూరం వెళ్ళిన తర్వాత విస్తారమైన
గాలి ఎదురయ్యైంది! అప్పుడు వెనుక తిరిగి చూస్తే కేవలం ఒకజత పాదాల
గుర్తులు మాత్రమే కనిపించాయి! వెంటనే ఏ విశ్వాసి దేవునికి కంపైంట్
చేసాడు! అయ్యా నన్నెందుకు చేయి విడిచేశావ్? ఎన్ని కష్టాలు వచ్చాయో నాకు అన్నాడు! దేవుడు అన్నారు-
నేనెప్పుడు వదిలేశాను నిన్ను? మరి అక్కడ ఒక్క జత
పాదాలే కనిపిస్తున్నాయి కదా, అవి నావే కదా అంటే—లేదులేదు- అవి నావి! నేను నిన్ను
ఎత్తుకుని ఇంతవరకు నడిపించాను అన్నారు! ఆ కష్టాలు నీకు కేవలం
సెగ మాత్రమే అన్నారు! కాబట్టి సంఘముతో పాటు తాను కూడా సంచారం
చేస్తూ వాటిని ఆయనే భరిస్తున్నారు అని నా ఉద్దేశం! అందుకే ఆయన
ఆయన పాదాలు కష్టాల కొలిమిలో పుటము వేయబడినట్లు ఇంకా కనిపిస్తున్నాయి!
మరి
ఆయన కన్నులు ఎందుకు ఎర్రగా కనిపిస్తున్నాయి అంటే మొదటగా శత్రువులు సంఘాన్ని పెట్టే
శ్రమలను చూసి!
రెండవది: సంఘములలో నేటిరోజులలో పెరిగిపోయే
పాపాన్ని చూస్తూ ఆయన కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి! భక్తుడు అంటున్నారు:
నీవు దుష్టత్వాన్ని చూసి తాలలేవు.....కీర్తనలు 5:4:
హబక్కూకు 1: 13
నీ
కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు
దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
సంఘమా! క్రైస్తవుడా!
విశ్వాసి! సేవకుడా! కాపరీ!
ఆయన నిన్ను ఎత్తి పట్టుకుని నడిపిస్తూ ఉండగా నీవు ఆయనకు తగినట్లు నడుస్తున్నావా?
ఆయన సన్నిధిలో నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ వస్త్రధారణ
ఎలా ఉంది? సంఘములో దేవుడు సంచరిస్తున్నారు అని విశ్వాసులకు నాయకులకు
కాపరులకు తెలిసి కూడా సంఘాన్ని సరిచేయడం లేదు! వారి వస్త్రధారణ
గాని వాని ప్రవర్తన గాని మారడం లేదు! కీర్తనలు 82: 1
దేవుని
సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
దేవుడు
నీతో మీ మధ్య ఉన్నారు అని తెలిసి- సంఘములో ఆయనకు భయపడుతున్నావా? భయపడితే
అనాలోచనగా కాళ్ళు చాపుకుని సంఘంలో కూర్చోగలవా? పాదరక్షలతో దేవుని
మందిరములో ప్రవేశించగలవా? భయము లేదు నీకు భక్తికూడా లేదు నీకు!
కేవలం పెదాలతో భక్తి చేస్తున్నావు గాని నీ హృదయం అంతరంగము దేవునికి దూరంగా
ఉంది! అందుకే ఆయన కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి! ఆయన తొందరలో తీర్పు తీర్చబోతున్నారు! అప్పుడు నీవు త్రాసులో
తూయబడితే తూగుతావా లేక ఎగిరిపోతావా? తేలిపోతావా? జాగ్రత్త! నేడు అనే సమయముండగానే ఇప్పుడే ఈ రోజే నీ బ్రతుకు
మార్చుకుని ఆయనకు తగినట్లుగా జీవించు!
*21*
ప్రియులారా మనం ఇంతవరకు ఈ వచనాల ద్వారా ఆయన
మొదటగా
ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే ఆత్మ స్వరూపునిగా,
రెండవదిగా
మహిమగల మనుష్యకుమారునిగా
మూడవదిగా
ప్రధానయాజకునిగా
నాల్గవది
తీర్పు తీర్చబోయే వ్యక్తిగా కనిపించారు.!
ఐదవది: ఇక గతభాగంలో సంఘము కోసం
సంఘపక్షముగా యుద్ధము చేసేవానిగాను, సంఘాన్ని రక్షించే వానిగాను
కనిపించారు!
ఆరవది: అదే విధంగా సంఘములో జరిగే
అన్యాయాలు సహించని వానిగాను మనకు కనిపిస్తున్నారు!
ఇక అదే 16వ వచనంలో ముందుకుపోతే ఆయన నోటినుండి రెండంచులు
గల వాడియైన ఖడ్గము బయలు వెడలుచుండెను అని చూసి చెబుతున్నారు!
ఇదే వాడిగల రెండంచులు
గల ఖడ్గము అంటూ తననుతాను పెర్గమ సంఘానికి పరిచయం చేసుకున్నారు దేవుడు!
.ప్రకటన గ్రంథం 2: 12
పెర్గములోఉన్న
సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా
.
ఇక మరో సంఘానికి 16వ వచనంలో వెంటనే మారుమనస్సు పొందు లేదా
నేను నీ దగ్గరికి వచ్చి నానోటినుండి వచ్చే ఖడ్గముతో వారితో యుద్ధం చేస్తాను అంటున్నారు...ప్రకటన గ్రంథం
2: 16
కావున
మారుమనస్సు పొందుము;
లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండివచ్చు ఖడ్గముచేత వీరితో
యుద్ధముచేసెదను.
ఇక
ప్రకటన 19:15 మరియు 21 వ వచనాలు చూసుకుంటే.....
ప్రకటన
గ్రంథం 19: 15
జనములను
కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన ఇనుప దండముతో వారిని
ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి
త్రొక్కును.
ప్రకటన
గ్రంథం 19: 21
కడమ
వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు
కడుపార తినెను.
ఇక్కడ పై రిఫరెన్సులు
ప్రకారం మొదటగా ఖడ్గము దేవుని వాక్యమును సూచిస్తుంది! హెబ్రీ 4:12 లో ఎందుకనగా
దేవుని వాక్యము బలముగలదై వాడిగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలది అంటున్నారు......హెబ్రీయులకు 4:
12
ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను
విభజించునంత మట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీయులకు 4: 13
మరియు
ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని
కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
ఇక ఎఫెసి 6:17 లో ఈ వాక్యఖడ్గము అనేది దేవుని సర్వాంగకవచములో
ఒక భాగముగా కనిపిస్తుంది...
ఎఫెసీయులకు 6: 17
మరియు
రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
ఇక రెండవది: ఆయన యుద్ధము చేయడానికి పాలించడానికి జయించడానికి బయలుదేరినట్లు కనిపిస్తుంది!
ఇక్కడ మనకు ఆయనలో మరో కోణం (ఏడవ కోణం) కనిపిస్తుంది ఏమిటంటే యుద్ధశూరునిగా
కనిపిస్తున్నారు! ఇంతకీ ఆయన దేనిమీద యుద్ధం చేస్తున్నారు అని
గమనిస్తే పాపముతోను దుర్మార్గత తోనూ దేవుడు పోరాటం చేస్తున్నారు! విశ్వాసి కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు! ఎల్లప్పుడూ పాపముతోను
సైతానుతోను ఆలోచనలతోను శోధన శ్రమలతోను పోరాడుచున్నాడు తన ఆత్మీయపోరాటంలో! ఈ ఆత్మీయపోరాటంలో తనకు అవసరమైనది దేవుని సర్వాంగకవచము. దీనిలో ఆత్మఖడ్గముతో మాత్రమే సాతాను గాడిని గాయపరచగలము వాడిని ఓడించగలము.
విశ్వాసికి కూడా ఈ వాక్యఖడ్గము ఎంతో అవసరం!
అదే
సమయంలో గమనించాలి: యేసుక్రీస్తుప్రభులవారు రెండంచుల గల ఖడ్గముతో సంఘముల మధ్య సంచారం చేస్తున్నారు
అనే విషయం మర్చిపోకూడదు! మన మాటలోనూ ప్రవర్తనలోనూ చేతలలోను పరిశుద్ధతయే
కనిపించాలి గాని అపవిత్రమైనది ఏదైనా వస్తే మొదటగా ఆ రెండంచుల గల వాడిగల ఖడ్గము మనమీద
పడుతుంది అని మర్చిపోవద్దు! నీ ప్రవర్తన వస్త్రధారణ నీ ఆలోచనలు
చూపులు అన్నీ మన కంట్రోల్ లో పెట్టుకుని దేవుని సన్నిధిలో భయముతో మెలగాలి అని మర్చిపోవద్దు!
ఇక తర్వాత ఆయన
ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉండెను అంటున్నారు! మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారి రూపాంతరత కోసం వ్రాయబడింది. అక్కడ రూపాంతర కొండమీద ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించింది అని వ్రాయబడింది.
ఆయన వస్త్రములు కూడా వెలుగువలె తెల్లనివి అయ్యాయి! ఆయన మహిమను ధరించినప్పుడు ఆయన ముఖము సూర్యునివలే కాంతిగా మారిపోతుంది అని గ్రహించాలి!
కాబట్టి ఇక్కడ ఎనిమిదవ కోణంలో ఆయన మహిమా స్వరూపిగా కనిపిస్తున్నారు!!!
అందుకే హేభ్రీ పత్రిక 1:౩ లో అంటున్నారు పౌలుగారు.....
ఆయన
దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును)
ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల
మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము
తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె
అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక......
2కోరింథీయులకు 4: 4
దేవుని
స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి
మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
ఇదే వెలుగును చూడలేక
పౌలుగారు సౌలుగా ఉన్నప్పుడు గుర్రం మీదనుండి క్రిందపడి గ్రుడ్డివాడు అయిపోయారు! అపో 9:౩—8;
22:11
ఆయనలో అంత ప్రకాశం
ఉంది! ఆయన వెలుగును ప్రకాశమును
తాళలేక కెరూబులు సెరాపులు రెండు రెక్కలతో తమ దేహమును రెండు రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నట్లు
మనం చూడగలము!
యెషయా 6: 2
ఆయనకు
పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో
ఎగురు చుండెను.
అంతటి మహిమా స్వరూపుడు
ప్రకాశమానమైన వాడు తండ్రి మరియు కుమారుడు!
ఆ వెలుగును ఆపాలని దిక్కరించాలని చూసినవాడు మాడిమసైపోయాడు! కాబట్టి సంఘమా! ఆ వెలుగుకు వ్యక్తిరేఖంగా వెళ్ళకుండా
ఆ వెలుగులో ఆయన ముఖకాంతిలో మన రహస్యపాపములు కనబడినప్పుడు ఒప్పుకుని విడిచిపెట్టి కనికరమును
పొందుదాము!
*22*
ప్రకటన 1:17—20
17. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను-భయపడకుము;
18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని
గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు
పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
19. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
20. అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును,
ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ
యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ ఏడు దీపస్థంభములు ఏడు
సంఘములు.
ఇంతవరకు యోహాను గారు
తాను చూచిన యేసుక్రీస్తుప్రభులవారి దివ్యరూప మహిమను గూర్చిన దర్శనాన్ని గురించి చెప్పారు! ఇక తర్వాత మాటలలో అది చూచినందువలన తనకు
ఏమయ్యిందో ఇప్పుడు చెబుతున్నారు యోహాను గారు!
17వ వచనంలో
నేను ఆయనను చూడగానే చచ్చిన వానివలె ఆయన పాదముల యొద్దపడితిని అంటున్నారు!
గమనించాలి: దీనికోసం రెండు అర్ధాలు చెబుతారు:
మొదటిది: దానియేలు గారికి కూడా ఇలాంటి
అనుభవాలు రెండుసార్లు కలిగినప్పుడు ఆయన బలము తొలిగిపోయి చచ్చినవాని వలే ఆయన పాదముల
యెద్ద పడిపోయారు దానియేలు గారు 8వ అధ్యాయంలో ఒకసారి, దానియేలు పదో అధ్యాయంలో రెండు సార్లు! అలాగే యోహాను గారు
కూడా బలములేక యేసుక్రీస్తుప్రభులవారి పాదాల మీద పడిపోయారు అంటారు!
ఇక
రెండవ అభిప్రాయం ఏమిటంటే: యేసుక్రీస్తుప్రభులవారు భూమిమీద ఉన్నప్పుడు ఆయన ప్రభువని తెలిసినా తనను ఎక్కువగా
ప్రేమించేవారు కాబట్టి ఎప్పుడూ ఆయన భుజమును ఆనుకుని ఉండేవారు యోహాను గారు! యోహాను గారికి యేసుక్రీస్తుప్రభులవారు అన్నయ్య అవుతారు అని కూడా చెప్పడం జరిగింది!
ఆయన దేవుడని, రక్షకుడని ప్రభువని మరలా రాబోతున్నారని
తెలుసు గాని ఇంతటి దివ్యమహిమను చూసి తట్టుకోలేక మహాప్రభో ఇంతటి మహిమ గల దేవుడా మీరు
అంటూ ఆయన పాదాల మీద పడిపోయారు సాష్టాంగపడ్డారు అంటారు! ఇదికూడా
నిజమే అనిపిస్తుంది కదా!
ఆయన నిజంగా ఎవరో ఏమైయున్నారో తన కన్నులతో
చూచిన యోహాను గారు తాను మొదటగా చేయవలసింది సాష్టాంగనమస్కారం! అదే చేశారు యోహాను గారు! నేడు మనం కూడా ఉండాల్సింది చెయ్యాల్సింది
అదే, అక్కడే ఉండాలి! గాని నేటిరోజులలో ప్రజలు
ఆయన నిజంగా ఎవరో గ్రహించలేక గర్వముతో కళ్ళుమూసుకుని పోయి కొందరు, హా మన దేవుడే కదా, క్షమించు అంటే కరిగిపోయి క్షమించేస్తాడు
కదా కరుణామయుడు కదా అంటూ ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఆయనకు ఇవ్వకుండా పెదాలమీద భక్తి
చేస్తున్నారు! ఒకరోజు తప్పకుండా అనుభవిస్తారు! అయితే నిజం తెలిసిన జనులు తప్పకుండా ఆయనకు సాష్టాంగనమస్కారం చేస్తున్నారు!
ఈ మధ్య
నేను దైవజనులు బెన్ హిన్న్ గారి వీడియోలు చూస్తున్నప్పుడు ఎక్కువగా ప్రార్ధనలో సాష్టాంగనమస్కారం
చేస్తున్నారు! అది ఎప్పటినుండో తెలుసా? ఆయనకు దేవుడు రెండో అవకాశం ఇచ్చానని
చెప్పి, పరలోక ద్వారం వరకు వెళ్లి ప్రవేశాన్ని కోల్పోయినప్పటి
నుండి ఆయన ప్రార్ధనా విధానం భక్తి మొత్తం మారిపోయింది! తాను సాష్టాంగనమస్కారం
చేస్తూ అందరిని సాష్టాంగనమస్కారం చేయిస్తున్నారు! దానిని ఇంగ్లీస్
లో రివరేన్స్ అంటారు! దేవునిని ఆయన నిజంగా ఎవరో గ్రహించి ఆయనకు
ఇవ్వాల్సిన మహిమను ఘనతను ఆయనకు ఆపాదించి నమస్కరించడం! ప్రియ చదువరీ!
ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాద భక్తి ఆయనకు ఇస్తున్నావా?
అయితే ఇప్పుడు గమనించాల్సింది
ఏమిటంటే ముగ్గురికి ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు ముగ్గురు ఒకేపని చేస్తే దానికి ప్రతిఫలంగా
అక్కడనుండి వచ్చిన మాట: భయపడకు! చూశారా,
మిగిలిన వారైతే బాగా మ్రొక్కు! ఇలాగే మ్రొక్కాలి
అంటారు. గాని ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు తన కుడిచేతిని యోహాను
గారి తలమీద ఉంచి భయపడకు అంటున్నారు! ప్రేమతో మాట్లాడుచున్నారు!
ఇంతటి గొప్పదేవుడైనా మానవులు అంటే ఎంతో ప్రేమ దేవునికి!
ఇక దానియేలు గారికి
కనిపించిన వాడు దేవదూత! ఆయన కూడా భయపడకు, నీవు బహుప్రియుడవు అంటూ గబ్రియేలు ఎంతో
బలపరిచాడు దానియేలు గారిని!..
దానియేలు 10: 12
అప్పుడతడు
దానియేలూ, భయ పడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి,
దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పినమాటలు
వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని
యేహెజ్కేలు గారికి
కూడా ఇదే అనుభవం!
మన దేవుడు ప్రేమామయుడు! దయామయుడు! మనకు సేవ
చేయడానికి మానవులకు మేలు చేయడానికి వచ్చారు గాని వివిధ రకాలైన సేవలు చేయించుకోడానికి
ఆయన రాలేదు! మన బలులు
కాదు ఆయన కోరేది- విరిగినలిగిన హృదయాన్ని కోరుతున్నారు దేవుడు.....
Psalms(కీర్తనల
గ్రంథము) 51:16,17
16. నీవు బలిని కోరువాడవు కావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది
కాదు.
17. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన
హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
మరి అలాంటి హృదయంతో
వినయంతో తగ్గింపు స్వభావంతో ఆయన దగ్గరకు రాగలవా? విరిగినలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కానేకాదు!
నేడే ఆయన దగ్గరకు
వద్దాం!
*23*
ప్రకటన 1:17—20
17. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను- భయపడకుము;
18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని
గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు
పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
19. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
20. అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును,
ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ
యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ ఏడు దీపస్థంభములు ఏడు
సంఘములు.
భయపడకు అని చెప్పి ఇంకా అంటున్నారు:
నేను మొదటివాడను కడపటి వాడను జీవించువాడను; మృతుడనైతిని
గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను! మరియు మరణము యొక్కయు
పాతాళము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటూ ఇంకా చెబుతున్నారు.....
ఒకసారి ఆగుదాం! ఈ మాట
అనగా ఈ వచనంలో గల మాటలు అన్నీ యోహానుగారికి యేసుక్రీస్తుప్రభులవారు ఎందుకు చెప్పారు
లేక చెప్పాల్సి వచ్చింది అని ఆలోచిస్తే- నా అభిప్రాయం చెప్పనీయండి:
శిష్యులందరి
కంటే ఎక్కువగా సన్నిహిత్యం యేసుక్రీస్తుప్రభులవారితో యోహాను గారికి ఉంది. అందుకే తాను ప్రేమించిన
శిష్యుడు అనే పేరు వచ్చింది యోహాను గారికి! అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తుప్రభులవారిని
గెత్సమనే అనే చోట ఒలీవల కొండమీద బంధించారో శిష్యులందరు పారిపోయారు గాని యోహాను గారు ఒక్కరే ఏమైతే అదే
అయ్యింది అని తెగించి ఆయనను వెంబడించారు. పేతురు గారు కొంతదూరం
వెంబడించినా పిలాతు తీర్పు తర్వాత దుఃఖమును పశ్చాత్తాపమును ఆపుకోలేక తట్టుకోలేక ఇంటికిపోయి
ఏడుస్తూ ఉన్నారు గాని యోహాను గారైతే అక్కడ సభ, తీర్పులోను ఉన్నారు,
సైనికులు అవమానించి నప్పుడు ఉన్నారు, కొట్టినప్పుడు
ఉన్నారు, కొరడాలతో కొట్టినప్పుడు ఉన్నారు, గొల్గొతా అనే కల్వరి గిరికి సిలువను మోసుకుని పోయేటప్పుడు ఉన్నారు.
ఆయన చేతులకు మేకులు కొట్టినప్పుడు, సిలువ వేసినప్పుడు
చూసిన మరియు మరణమునకు ప్రత్యక్ష సాక్షి! ఆయన ప్రక్కలో బల్లెముతో
పొడిచినప్పుడు కూడా అక్కడే ఉన్నారు! ఆయన పడిన పాట్లు అవమానాలు
శిక్షలకు యోహాను గారే ప్రత్యక్ష సాక్షి! అందుకే చరిత్ర చెబుతుంది ఆయన చనిపోయి తిరిగి
లేచినప్పటి వరకు ఆయన కంట నుండి కన్నీరు కారటం ఆగలేదట! ఆయన లేచిన
తర్వాత కూడా ఆయన పునరుత్తానికి సాక్షి యోహాను గారు!
అయితే
చరిత్ర చెబుతుంది ఆయన సుమారు
7౩ సంవత్సరాల కాలం సువార్తను ప్రకటించారు! ఇరవైమూడన్నర
సంవత్సరాల వయస్సులో యేసుక్రీస్తుప్రభులవారి మరణాన్ని చూశారు! సుమారు 25సంవత్సరాల వయస్సులో తన సొంత అన్నయైన పెద్ద యాకోబుగారిని
హేరోదు చంపేశాడు! ఇలా తనని ఎంతో ప్రేమించే తన ఇద్దరు అన్నయ్యలను
తొందరగా పోగొట్టుకున్నారు యోహాను గారు! ఆయన సుమారు 96
నుండి 98 సంవత్సరాలు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఈ
7౩ సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తుప్రభులవారి మరణాన్ని తలంచుకొన్నప్పుడు
ప్రతీసారి ఆయన కళ్ళంట నీరులేని సంఘటన ఒకటి కూడా లేదట! ఎప్పుడైనా
ఎవరైనా ఆయన మరణం కోసం అడిగితే దుఃఖాన్ని అణచుకోలేక వెక్కివెక్కి ఏడ్చేవారట యోహాను గారు!
కారణం ఎన్ని సంవత్సరాలు గడిచినా యేసుక్రీస్తుప్రభులవారి మరణం ఇంకా ఆయన
కన్నుల ముందు చాలా ఫ్రెష్ గా కనిపించేదట! ఎన్నో చావులు శిక్షలు
తన జీవితంలో చూచినా గాని, ఇంతటి క్రూరమైన శిక్ష తన జీవితంలో మరెప్పుడు
చూడలేదు! నేను అక్కడే
ఉన్నా ఏమీ చెయ్యలేక పోయాను! మరణాన్ని ఆపలేక పోయాను అని ఏడ్చేవారట!
మరికొన్ని సార్లు అయ్యా నీకు బదులు నేను చనిపోతే బాగుణ్ణు కదా అంటూ ఏడ్చేవారట!
సంఘము ముందు ఎన్నెన్నో సార్లు ఆయన మరణం కోసం చెప్పినప్పుడు గాని,
ప్రభుసంస్కారం ఇచ్చినప్పుడు గాని ఆయన ఏడవని రోజు లేనేలేదట! ఇంతగా యేసుక్రీస్తుప్రభులవారిని ప్రేమించారు యోహాను గారు!
అందుకే
నా ఉద్దేశంలో మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు
ఆయనకు కనబడిన వెంటనే భయపడకు- భాధపడకు అంటూ ఒక చిన్న తమ్ముడికి
తన పెద్దన్నయ్య ఓదారుస్తున్నట్లు ఏడవకు-నేను మొదటివాడను,
కడపటి వాడను అనగా చివరి వాడను! ఇప్పుడు చూస్తున్నావు
కదా జీవిస్తున్నాను లేక జీవించువాడను, చనిపోయాను గాని చూడు యుగయుగములు
సజీవుడనై ఉన్నాను! ఇంకోమాట చెప్పనా అప్పుడు అలా మరణించాను కాబట్టే
మరణాన్ని జయించి ఆ పాతాళలోకము అనే అదృశ్యలోకము యొక్క అధిపతిని జయించి మరణం యొక్కయు
పాతాళముయొక్కయు తాళపు చెవులను నా చేతిలో పెట్టుకున్నాను! ఇక భాధపడకు
గాని ఇప్పుడు నేను చూపించేవి వ్రాయు! అని ప్రేమతో చెప్పారు ఓదార్చారు
అని నా ఉద్దేశ్యం! అందుకే ఈ మాట చెప్పవలసి వచ్చింది యోహాను గారితో!
దేవుడు
ప్రేమామయుడు! కరుణామయుడు! దైవజనులైన ఆరార్కే మూర్తిగారు ఒకమాట చెబుతూ
ఉండేవారు: తడిచిన పాదాలను దాటుకుని యేసయ్య ఒక్క అడుగుకూడా వెళ్ళలేరు
అట! ఎవరైనా నిజంగా ఏడుస్తుంటే తప్పకుండా వారిని ఓదార్చకుండా ఆయన
ఉండలేరు! వారికి సహాయం చెయ్యకుండా ఆయన ఉండలేరు! అందుకే ముందుగా ఓదార్చి ఆ తర్వాత ఏమి చెయ్యాలో చెబుతున్నారు!
నన్ను ఒక్క ప్రశ్న అడగనివ్వండి:
ఎప్పుడైనా ఆయన సిలువమరణం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ చదువరులారా మీలో
ఎప్పుడైనా ఒక కన్నీటిచుక్క మీ కన్నుల నుండి వచ్చిందా? అయ్యా నాకోసమే
కదా నేను చేసిన పాపాల కోసమే కదా ఇంత శిక్షను భరించావు అని!!!! ఆ వేదన భాధ యోహాను గారు అనుభవించారు కాబట్టే దైవదర్శనం ఆయనకు కలిగింది!
*24*
మొదటగా భయపడకండి అని
చెప్పడం ఆయనకు అలవాటు. మత్తయి
సువార్తలో రెండుసార్లు భయపడకండి అని చెప్పారు
మత్తయి 17: 7
యేసు
వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను.
మత్తయి 14: 27
వెంటనే
యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా
ఒకమాట చెప్పనా? బైబిల్ లో 365 సార్లు
భయపడకుడి అని వ్రాసి ఉంది. అనగా సంవత్సరమంతా ఆయన భరోసా ఇస్తున్నారు
భయపడకండి మీతో నేనున్నాను! గనుక ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు
భయము??!!!
ఇక నేను మొదటివాడను
కడపటి వాడను: అనగా ఆల్ఫా
ఒమేగాను నేనే ఆదియు అంతమును నేనే అంటున్నారు! జాగ్రత్తగా గమనిస్తే
ఒకే ఒకసారి యోహాను గారు వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవానికి అంటూ సంభోదిస్తే ఇదే
అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారు రెండుసార్లు ఆల్ఫా ఒమేగాను నేనే అనగా ఆదియును అంతమును
నేనే అనే అర్ధమిచ్చు మాటలను చెప్పారు! అనగా సృష్టికర్తను లయకర్తను
నేనే అంటూ చెబుతూ నేను దేవుణ్ణి అని మనకు చెబుతున్నారు. యెషయా
గ్రంధములో తండ్రి ఉపయోగించిన పదాలే ఇక్కడ యేసయ్య కూడా ఉపయోగిస్తున్నారు అని గ్రహించాలి!
యెషయా 44: 6
ఇశ్రాయేలీయుల
రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను
మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
యెషయా
గ్రంథము 48:12,13
12. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను
కడపటివాడను
13. నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను
నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
ఇక ఆయన చనిపోయినట్లు
మనకు నాలుగు సువార్తలలో కనిపిస్తుంది:
మత్తయి 27:50;
మార్కు 15:44—45...
లూకా 23:46
యోహాను 19:30,33
1కోరింథీయులకు 15: 3
నాకియ్యబడిన
ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు
మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,
1కోరింథీయులకు 15: 4
లేఖనముల
ప్రకారము మూడవ దినమున లేపబడెను.
ఇక నేను జీవించువాడను
అనేమాట చూసుకుంటే: కీర్తనాకారుడు
ఆయన యుగయుగములు జీవించు వాడు అని ముందుగానే తెలుసుకుని అంటున్నారు నా ఆత్మ సజీవుడైన
దేవునికోసం తపన చెందుతుంది
కీర్తనలు 42: 2
నా
ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని
సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
యిర్మియా గారు అంటున్నారు
యెహోవాయే నిజమైన దేవుడు ఆయన జీవము గలవాడు...
యిర్మియా 10: 10
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు,
సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును,
జనములు ఆయన కోపమును సహింపలేవు.
పేతురు
గారు ఒకసారి ఆత్మతో ప్రవచిస్తున్నారు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు ..
మత్తయి 16: 16
అందుకు
సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని (క్రీస్తు అను శబ్దమునకు-
అభిషిక్తుడని అర్థము) చెప్పెను.
పౌలుగారు అంటున్నారు
మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు..దేవుడు జీవము గలవాడు
2కోరింథీయులకు 6: 16
దేవుని
ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి
సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
1థెస్స 1:19 లో ఒకనాడు మీరు విగ్రహాలను ఆరాధించినా ఇప్పడు
జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు...
మీయొద్ద
మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు.
మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును
సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,....
ఇక
యుగయుగాలు జీవించువాడను ప్రకటన 4:9
ఆ
సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును
కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా
రోమా 6:8—10
8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన
క్రీస్తు ఇకను చనిపోడనియు,
9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ
జీవించుదుమని నమ్ముచున్నాము.
10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని
విషయమై జీవించుచున్నాడు
ఇక మరణము యొక్కయు
పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన దగ్గరే పెట్టుకోడానికి కారణం సాతానుడు మరణము ఇద్దరు
ఎంతో విర్రవీగారు- ఇప్పుడు
దేవుడే చనిపోయాడు- ఆ దేవుణ్ణి నా గుప్పెట్లో పెట్టుకుంటాను ఎందరినో
మ్రింగేశాను దేవుణ్ణి కూడా మ్రింగేశాను అనుకుంటే వాడినే జయించి రెండు తాపులు తన్ని
ఆ తాళపుచెవులను తీసుకుని వాడి బందిఖానా నుండి ప్రజలను అనగా మనస్సాక్షి కాలము నాటి విశ్వాసులను,
ధర్మశాస్త్ర కాలము నాటి విశ్వాసులను తీసుకుని చెరను చెరగా తీసుకుని పోయారు.
పరదైసు కేరాఫ్ అడ్రస్ భూమిక్రింద పాతాళమునుండి మూడో ఆకాశమునకు మార్చేసారు!
అందుకే ఇప్పుడు వీటి తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి! మరణం మీద ఆయనకు అధికారం ఉంది!
ఇక 19వ వచనంలో నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటివెనుక కలుగబోవు వాటిని వ్రాయమంటున్నారు.
యోహాను గారు వ్రాసిన
ఈ ప్రత్యక్షతల గ్రంధాన్ని మనము మూడు భాగాలుగా విభజించవచ్చు!!
చూసినవి
ఏమిటి?
ఈ గ్రంధంలో
ఆయన చూసిన యేసుక్రీస్తుప్రభులవారి మహిమ మరియు ఆయన కుడిచేతిలో చూసిన ఏడు నక్షత్రాలు
మరియు ఏడు దీపస్థంభాలు కోసం;
చూస్తున్నవి
ఏమిటి? లేక ఉన్నవాటిని అనగా
ఏడు సంఘాలలో ఉన్న పరిస్తితులు ప్రకటన 2,3 అధ్యాయాలు.
ఇవి మొత్తము అన్ని దేశాలలోను,
అన్ని కాలములలోను ఇలాంటి వారు ఉంటారు. ఇలాంటి పరిస్తితులు
అన్నికాలాల్లో కనిపిస్తాయి!
వీటివెనుక
కలుగబోయేవి ఏమిటి?
నాలుగో
అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు జరిగే సంభవాలు అన్నమాట! వీటికోసం వ్రాయు
అంటున్నారు దేవుడు!
ఇక చివరగా నా కుడిచేతిలో నీవు చూసిన నక్షత్రాల
మర్మమును అనగా ఏడు సువర్ణ దీపస్థంభాలు కోసం ఆ మర్మము వ్రాయు, మర్మమేమిటంటే ఆ ఏడు నక్షత్త్రాలు
ఏడు సంఘాలకు ఉన్న దూతలు అనగా దేవుడు ఎవరిని ఆ సంఘానికి నాయకునిగా
కాపరిగా, బిషప్ గా నియమించారో వారు అన్నమాట! ఆ ఏడు దీపస్థంభాలు ఏడు సంఘాలు అని చెప్పారు!
ఈ సంఘాల
కోసం దూతల కోసం గతంలో వివరించడం జరిగింది. ఆ ఏడు సంఘాలు చరిత్ర ప్రకారం యోహాను గారి కాలంలో ఉన్న
సంఘాలు! ఈ సంఘాలలో కొన్నింటిలో యోహాను గారు పరిచర్యచేశారు.
కొన్ని సంఘాలలో యోహాను గారి శిష్యులు పరిచర్య చేశారు! ఉదాహరణకు స్ముర్ణ సంఘానికి యోహాను గారి ప్రధాన శిష్యుడైన పోలికార్పు గారు బిషప్!
ఇక ఈ ఏడు సంఘాలకు యోహాను గారు తన పత్రికల ద్వారా పరిచయమే! 2,
౩ అధ్యాయాలలో ఉన్న సందేశం ఆ ఏడు సంఘాల కోసం చెప్పడం జరిగింది.
అయితే కేవలం ఆ ఏడు సంఘాల కోసం మాత్రమే చెప్పడం జరిగింది అంటే అది పొరపాటు
అని గ్రహించాలి! యోహాను గారి కాలంలో అదే చిన్నాసియా లో మరిన్ని
సంఘాలున్నాయి! నిజం చెప్పాలంటే ఆ ఏడు సంఘాలు ఆ కాలంలో ప్రభువుకి
చెందిన అన్ని క్రీస్తు సంఘాలు అన్నమాట! క్రీస్తు సంఘము అనగా ఆ
పేరుగల సంస్థ గల సంఘములు అని కానేకాదు! యేసుక్రీస్తుప్రభులవారి
నామమును ధరించిన అన్ని సంఘాలు అన్నమాట! ఆ ఏడు సంఘాలు కేవలం అప్పటి
కాలమే కాదు ఈ కృపాకాలంలో గల అన్ని సంఘాలకు ప్రతినిధులుగా మనకు కనిపిస్తున్నాయి!
ఆ సంఘాల దూతలు లేదా నాయకులు ప్రస్తుత కాలంలోనూ అప్పటి రోజుల్లోనూ గల
సంఘ నాయకులకు, కాపరులకు ప్రతినిధులుగా ఉన్నారు అని గ్రహించాలి!
ఏడు అనేది సంపూర్ణ సంఖ్య మరియు అర్ధవంతమైన సంఖ్య! అలాగే ఏడు ఆత్మలు ఏవిధంగా ఒకే ఒక పరిశుద్ధాత్మను సూచిస్తున్నాయో అలాగే ఈ ఏడు
సంఘాలు కూడా ప్రపంచంలో గల సార్వత్రిక సంఘాన్ని ప్రతిబింభిస్తున్నాయి అన్నమాట!
అంతేకాదు ఆ ఏడు నక్షత్రాలను చేత పట్టుకుని అనగా అన్ని సంఘాల నాయకులను
తానే నడిపిస్తున్న దేవుడు, నాయకుడిగా సంఘాల మధ్య సంచరిస్తున్నారు
అని గ్రహించాలి! కాబట్టి క్రీస్తు సంరక్షణలో కేవలం ఆ ఏడు సంఘాలు
మాత్రమే ఉన్నాయి అనుకోవడం పొరపాటు! నేటి రోజులలో కూడా ఇలాంటి
పరిస్తితులు గల లేక ఈ ఏడు రకాలైన సంఘాలను చూడగలము మనము!
అయితే కొందరు ఊహిస్తున్నట్లు ఏడు సంఘాలు
ఏడు సంఘకాలాలు అనడం నాకు సమంజసంగా అనిపించడం లేదు! ముఖ్యంగా వారు
రాసిన సంఘకాలముల యొక్క వ్యవధులు అభ్యంతరంగా ఉన్నాయి నాకు! వారు
ఏమంటారు అంటే మొట్టమొదట ఎఫెసు సంఘ పరిస్తితులు గల సంఘమున్నది ఆదిమ కాలంలో! ఆ తర్వాత స్ముర్ణ లాంటి సంఘము తయారయ్యింది, తర్వాత పెర్గమ
లాంటి సంఘముగా ఉంది సార్వత్రిక సంఘము అంటారు! ప్రస్తుతం మనం లవొదొకయ
లాంటి పరిస్తితుల సంఘంలో ఉన్నాము అంటారు! అక్కడితో ఆగితే బాగుణ్ణు!
ఈ కాలపు సంఘానికి దూతగా విలియం బ్రెన్హాం గారిని దేవుడు పంపించాడు!
కాబట్టి ఆయనను ప్రవక్తగా అంగీకరించకపోతే నీవు పరలోకం పోవు అంటారు ఇది
తప్పుడుబోధ! మరికొందరు తెగించి ఆ కాలంలో మెస్సీయ యేసుక్రీస్తుప్రభులవారు
ఈ కాలంలో మెస్సీయ బ్రెన్హాం అంటారు! ఇది మరీ తప్పుడుబోధ!
కాబట్టి
దయచేసి వీటికి దూరంగా ఉండండి!
ఒకటి మాత్రం ముఖ్యం: ఆ కాలంలో సంఘాలకు ఈ కాలంలో ఉన్న సంఘాలకు
దేవుడు రాసి పంపిన బోధలు మనతో ఇప్పుడు కూడా వ్యక్తిగతంగాను సంఘపరంగాను అందరితోను మాట్లాడుచున్నాయి!
దానిని గ్రహించి మన బ్రతుకులు మార్చుకుని పరలోకం చేరాలి అంతే తప్ప ఈ
కాలంలో సంఘాలకు కాదు! అది నాకు చెందదు అనుకోగూడదు! కాబట్టి ఈ ఏడు సంఘముల వర్తమానాలు మనం మొదలుపెట్టుచుండగా ఈ మాటలు నాకోసమే,
ఈ వర్తమానం నాకోసమే వ్రాయబడింది అనుకోవాలి , అలా
మన బ్రతుకులు సరిచేసుకోవాలి తప్ప ఇది తప్పకుండా వాడికోసమే, దానికోసమే
వ్రాయబడింది. పరిశుద్ధాత్ముడు మా బాగా చెప్పాడు అనుకోగూడదు!
కాబట్టి అట్టివిధంగా
మనలను సరిచేసుకుంటూ ఆ సంఘవర్తమానాలతో మనలను మనం సరిచేసుకుంటూ రాకడకు సిద్ధపడుదాం!
ఆమెన్!
*ఎఫెసీ సంఘము-1*
ప్రకటన 2:1
ఎఫెసులో
ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య
సంచరించువాడు చెప్పు సంగతులేవనగా....
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
ఇంతవరకు మనం మొదటి అధ్యాయం నుండి యేసుక్రీస్తుప్రభులవారి ప్రభావమహిమను
గూర్చిన దర్శనము ఇంకా ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు- ఏడు దీప స్తంభాల
మధ్య సంచరిస్తున్నట్లు దాని అర్ధములు చూసుకున్నాము!
ఇక రెండో అధ్యాయం నుండి మూడో అధ్యాయం
చివరి వరకు చిన్నాసియాలో ఉన్న ఏడు సంఘాలను చూపించి వాటి స్తితిగతులను ఎత్తిచూపుతూ వారికి
ఉత్తరాలు వ్రాయమన్నారు! ఆ ఉత్తరాల కోసం ఇప్పుడు ధ్యానం చేద్దాం!
మొదటి
సంఘము: *ఎఫెసీ సంఘము!*
ఎఫెసు:
సంపూర్ణ ఉద్దేశం కలది అని అర్థం.
ప్రస్తుత
నామం: సెల్కుస్, టర్కీ దేశంలో
ఉంది.
ఎఫెసీ సంఘముకోసం
ధ్యానించే ముందుగా దీని చరిత్ర చూసుకుంటే ఈ ఉత్తరం రాయడానికి గల కారణాలు మనకు ఇంకా
బాగా అర్ధమవుతుంది!
ఎఫెసీ సంఘమును
స్తాపించింది పౌలుగారు అని మనకు అపోస్తలుల కార్యముల ప్రకారం అర్ధమవుతుంది.
అపో.కార్యములు 18: 19
వారు
ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో
ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
ఇక్కడ
పౌలుగారు సువార్త ప్రకటించి కొన్ని దినముల తర్వాత మరో ప్రాంతము వెళ్ళిపోయారు అయితే
అక్కడ అకుల అనే విశ్వాసిని అతని భార్యయైన ప్రిస్కిల్లను ఇద్దరినీ ఆ సంఘాన్ని బలపరచడానికి
వదలివెళ్లారు. కొంతకాలానికి అక్కడకు అలెగ్జాండ్రియా పట్టణానికి చెందిన అపోల్లో అనే దైవజనుడు
వచ్చి వాక్యమును బోధిస్తున్నప్పుడు అతనిని ఈ భార్యాభర్తలు చేర్చుకుని యేసుక్రీస్తుప్రభులవారి
మార్గాన్ని పూర్తిగా వివరించినప్పుడు ఇంకా బలంగా ఈ ఎఫెసీ సంఘం కట్టబడింది. ఆ తర్వాత 19వ అధ్యాయంలో చూసుకుంటే పౌలుగారు మరలా ఎఫెసీ
పట్టణానికి రావడం, సువార్త చెప్పడం, రక్షించబడిన
విశ్వాసులకు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం, అప్పుడు ప్రార్దించినప్పుడు
వారందరూ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నట్లు చూడగలం! ఇలా అక్కడ
తురన్ను అనే పాటశాలను అద్దెకు తీసుకుని రెండు సంవత్సరాల కాలం పౌలుగారు అక్కడ పరిచర్య
జరిగించారు. మరలా అక్కడ అల్లర్లు కలిగితే తర్వాత మరో ప్రాంతానికి
వెళ్లారు! ఇదీ అపొస్తలుల కార్యములు 18,19 అధ్యాయాలలో ఈ సంఘము కోసం మనకు దొరికే వివరాలు!
అయితే ఈసంఘము కోసం పౌలుగారు ఒక
అమూల్యమైన పత్రిక కూడా రాశారు! ఆ పత్రిక ఎందువలన వ్రాయడం జరిగిందో
కొంచెం తెలుసుకుంటే ఇంకా మనకు అక్కడ పరిస్తితులు అర్ధమవుతాయి. ఎఫెసీ అనే పట్టణం చిన్నాసియా లో పెద్ద పట్టణం! దీనికి
ఆసియా వెలుగు అనే పేరుకూడా ఉంది. రోమా పరిపాలనలో చిన్నాసియాకు
ముఖ్యమైన రోమన్ కేంద్రాలయం ఇక్కడ ఉంది!
అక్కడ అర్తేమీ దేవి అనే ఒక దేవత గుడి ఉంది! అది ఎఫెసి, కొరింథీ, మాసిదోనియా
ప్రాంతాలు అనగా ఇప్పటి టర్కీ దేశము మరియు దాని చుట్టుపక్కల దేశాలలో చాలా ప్రసిద్ధి
కలిగిన గుడి మరియు చాలా ఆదాయం గల దేవత గుడి అన్నమాట! ప్రస్తుతం
మన తిరుపతి ఎలాగో అలాంటి ప్రసిద్ధి చెందిన దేవత గుడి అన్నమాట! అయితే అంత ప్రసిద్ధి చెందడానికి కారణం
ఏమిటంటే అక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది ఎవరైతే విదేశీ/పరజాతి
పురుషుల వలన గర్భము ధరించి పిల్లలను కంటారో వారికి దేవత నుండి ప్రత్యేకమైన వరాలు అభిషేకం
కలుగుతుంది. వారికి మోక్షంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనే
ఒక పుకారు వ్యాపించింది. అందుకే ఆ గుడి క్రింద భాగాన వెయ్యి గదులు
ఉండేవి. దేవతను పూజించి ఆ క్రిందన ఉన్న గదిలో విదేశీ స్త్రీ పురుషులతో భయంకరమైన వ్యభిచారం చేసేవారు!
అందుకే విదేశీయులు ముఖ్యంగా పురుషులు ఈ గుడిని దర్శించుకోడానికి విస్తారంగా
వచ్చేవారు! ఆ ఎఫెసీ స్త్రీలకూ కూడా ఇది ఎంతో బాగుండేది.
ఇంకా అక్కడ 25000 మంది కూర్చోడానికి పెద్ద స్టేడియం
కూడా ఉంది! అంతేకాకుండా ఈ పట్టణం ఆ ప్రాంతంలో ఉన్న మాంత్రికులకు
ముఖ్యమైన స్థావరం గా ఉండేది!
ఇలా
ఆ పట్టణము ప్రసిద్ధి చెందటమే కాకుండా మంచి ధనవంతమైన పట్టణంగా మారిపోయింది!
పౌలుగారు ఈ పట్టణంలో సంఘం స్థాపిస్తే
ఇక్కడనుండి సువార్త అన్ని దేశాలలోనికి వ్యాపిస్తుంది అని భావించి అక్కడ రెండు సంవత్సరాలలో
ఘనమైన పరిచర్య చేసి సంఘానికి తిమోతి గారిని బిషప్ గా పెట్టి వెళ్ళిపోయారు! ఆ తర్వాత ఏమయ్యింది అంటే విశ్వాసులు- వాటి పట్టణస్తులతో
సంభంధాలు కట్ చేసేసారు! మేము మీరుచేసే పాపపు పనులలో బాగస్తులము
కాలేము అని చెప్పేశారు! కొంతకాలానికి అన్యులు ఏమన్నారు అంటే – మనందరం ఒక ఒప్పందానికి వద్దాం! మీరు మీ దేవుణ్ణి పూజించుకోండి! మేము మా దేవతను పూజించుకుంటాము!
అయితే మీ పండుగలకు పెళ్లిళ్లకు ప్రార్ధనలకు మేము వస్తాము! మా ఇంట్లో కధాకార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు రండి, మేము
మీ ఇంటికి వస్తాము. మీరు మా ఇంట్లో భోజనం చెయ్యండి మేము మీ ఇంట్లో
భోజనం చేస్తాము. అయితే మా పండుగలలో కూడా మీరు వస్తూ ఉండండి కాని
పూజ చెయ్యవద్దు. ఎంతైనా మీరు మేము బంధువులము కదా అన్నారు!
ఇదేదో బాగుంది అనుకుని సంఘము లోకముతో కలిసిపోయింది! కొన్నిరోజులకు లోకమే సంఘములోనికి వచ్చేసింది! అన్యాచారాలు
సంఘములోనికి వచ్చేసాయి! దేవుడూ కావాలి లోకమూ కావాలి అన్నట్లు
మారిపోయింది! నేటి రోజులలో మన భారతదేశంలో అన్యాచారాలు సంఘాచారాలుగా
ఎలా మారిపోయాయో, భారతదేశంలో ఉన్నాము కాబట్టి ఈ కట్టుబాట్లు ఉండాలి
అంటూ తాళి కట్టడం, వాస్తులు చూడటం, పందిర
వెయ్యడం, పసుపు వ్రాయడం, బొందులు వెయ్యడం
శ్రీమంతం చెయ్యడం లాంటి అన్యుల ఆచారాలు సంఘములోనికి వచ్చి అన్యాచారము దేవుని ప్రార్ధనతో
కలిసుకుని దానికి పాదిరిగారు సమక్షంలో ఎలా జరుగుతుందో అప్పుడు కూడా అక్కడ అలాగే జరగటం
మొదలుపెట్టింది! తిమోతి గారు ఏదో వింత చూస్తున్నట్లు ఉన్నారు
గాని ఖండించలేదు దీనిని! అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే కొరడా
పట్టుకుని చీల్చినట్లు ఈ ఎఫెసీ పత్రిక రాసి, సంఘాన్ని గాడిలో
పెట్టడం జరిగింది!
అయితే యోహాను గారు కూడా సువార్త విషయంలో
అప్పుడప్పుడు ఈ ఎఫెసీ సంఘానికి వస్తూ పరిచర్య చేస్తూ ఉండేవారు. కారణం తిమోతి గారు ఎక్కువగా పౌలుగారితో కలసి మిషనరీ పరిచర్యలో పాల్గొనే వారు! ఈ పరిస్తితులలో యేరూషలేము పట్టణంలో
యూదులకు ముఖ్యంగా క్రైస్తవులకు భయంకరమైన శ్రమలు చెలరేగాయి! పౌలుగారు
ఎఫెసు సంఘానికి వస్తూ బలపరచమని ఎప్పుడు యోహాను గారిని అడిగేవారు! అందుకే తనతోపాటుగా యేసుక్రీస్తుప్రభులవారి తల్లియైన మరియమ్మ గారు తనతోపాటుగా
ఉండేవారు కాబట్టి, యేసయ్య చివరి క్షణాలలో తన తల్లి భాద్యత తనకు
అప్పగించారు కాబట్టి, ఆమెను ఈ శ్రమలు శోధనలో పాలు పొందకుండా ఆమెను
వెంటబెట్టుకుని ఎఫెసీ పట్టణానికి వచ్చేశారు యోహాను గారు! యోహాను
గారు వచ్చాక సంఘము మరింతగా అభివృద్ధి చెంది ఈ సంఘానికి బ్రాంచి సంఘాలు వ్యాపించాయి!
ఆ సంఘాలే ఇప్పుడు మనము ధ్యానం చేయబోయే ఏడు సంఘాలు! అలాగని ఏడు బ్రాంచి సంఘాలే అనుకోవద్దు! ఇదే ఎఫెసీ పట్టణంలో
అదే పనికిమాలిన పనికోసం వచ్చిన ఎఫఫ్రా అనే వ్యక్తి పౌలుగారి సమయంలో తురన్ను పాటశాలకు
వెళ్లి రక్షించబడి తన సొంత ప్రాంతానికి వెళ్లి కొలస్సీ సంఘాన్ని స్తాపించారు!
ఆ సంఘానికి తదనంతరం బిషప్ అయ్యారు! ఇలా చిన్నాసియా
మొత్తం ఎంతగానో రక్షించబడటానికి కారణం ఈ ఎఫెసీ సంఘము అని గ్రహించాలి!
అయితే ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘపు
దూతకు ఈలాగు వ్రాయుము అంటున్నారు. మరి ఇప్పుడు సంఘపు దూత ఎవరు?
యోహాను గారే కదా!! అయితే ఇప్పుడు ఆయన పత్మాసు దీవిలో
బంధీగా ఉన్నారు కాబట్టి కొంతకాలం పోలికార్పు గారు సంఘాన్ని చూసుకున్నారు. ఆ తర్వాత మరో పెద్ద చూసుకున్నారు. కాబట్టి ఈ సంఘపు దూత
అయితే పోలికార్పు గారు కావచ్చు, లేదా మరోపెద్దకావచ్చు!
వారికే ఈ లేఖ!
(ఇంకాఉంది)
*ఎఫెసీ సంఘము-2*
ఇక
ఈ సంఘానికి యేసుక్రీస్తుప్రభులవారు తననుతాను ఏమని పరిచయం చేసుకుంటున్నారు అంటే ఏడు
నక్షత్రములు తన కుడిచేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా.... అంటూ తనను తాను పరిచయం
చేసుకుంటున్నారు ప్రభువు!
గమనించాలి
ఈ ఏడు లేఖలలోను దేవుడు తననుతాను ఏడు రకాలుగా పరిచయం చేసుకున్నారు అయితే గమనించవలసిన
విషయం ఏమిటంటే ఈ ఏడు సంఘాల పరిచయము- మొదటగా మొదటి అధ్యాయంలో చెప్పబడిన విషయాలు లేక యోహాను
గారు చూసిన సంగతులతోనే యేసుక్రీస్తుప్రభులవారు తననుతాను పరిచయం చేసుకున్నారు!
మొదటి అధ్యాయంలో యోహానుగారు ఏడు దీపస్తంభాల మధ్య మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు
సంచారం చేస్తున్నట్లు, ఇంకా ఏడు నక్షత్రాలు తన కుడిచేత పట్టుకునట్లు
మనం చూసుకున్నాము మొదటి అధ్యాయంలో!
అయితే
దీని అర్ధం ఏమిటి? మనము గతభాగాలలో చూసుకున్నాము- మొదటి అధ్యాయం చివరి వచనంలో
దేవుడు మర్మము చెప్పారు ఏమిటంటే ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలలో ఉన్న దూతలు అనగా దేవుడు ఎవరినైతే అక్కడ పెద్దగా,
కాపరిగా, బిషప్ గా పెట్టారో వారు! ఏడు దీపస్థంభాలు ఏడు సంఘాలు అని చెప్పారు! ఇప్పుడు ఆయన
కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి అనగా దేవుని సేవకులు ప్రవక్తలు కాపరులు అపోస్తలులు
అందరూ ఆయన చేతులలో ఉన్నారు! ఆయన చెప్పినట్లు చేస్తారు వారు!
అయన చెప్పనివి బోధించేవారు అబద్దబోధకులు! అలాగే
ఈ సంఘాలమధ్య యేసుక్రీస్తుప్రభులవారు ఆత్మరూపిగా సంచారం చేస్తూ ఆ సంఘ స్తితిగతులను ఎప్పటికప్పుడు
చూస్తూ ఉన్నారు! ఇక ఏడు సంఘాలు అనగా కేవలం ఏడు సంఘాలే కాదు – భూలోకంలో ఉన్న సార్వత్రిక సంఘమును ఈ ఏడు సంఘాలు
ప్రతినిధులుగా ఉన్నట్లు చూసుకున్నాము!
మరి
ఇంతకీ ఏడు నక్షత్రాలు తన కుడిచేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు
సంగతులేవనగా అంటూ ఈ సంఘంతో ఎందుకు పరిచయం చేసుకుంటున్నారు అంటే మనకు అది 4, 5 వచనాలలో దాని జవాబు
దొరుకుతుంది! మొదట వీరు ఎంతటి విశ్వాస వీరులో చూసుకుని ఇంతటి
విశ్వాసవీరులు కూడా ఎక్కడ తప్పిపోయారో పడిపోయారో చూసుకుందాం!
*ఎఫెసీ సంఘములో గల మంచి లక్షణాలు*:
2—౩
వచనాలు...
నీ
క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును! నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్దికులని
కనుగొన్నావు! సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలసిపోలేదు!
ఒకసారి లక్షణాలు చూద్దాం:
• క్రియలు గలవారు
• కష్టాలు పడ్డారు క్రీస్తునామము కోసం
• శ్రమలలో సహనము గలవారు
• దుష్టులను సహించలేదు
• దొంగ అపోస్తలులను పరీక్షించి వారు దొంగబోధకులు
అని కనుగొని బయటకు పొమ్మన్నారు
• దేవుని నామముకోసం సహనం కలిగి భారం భరించారు
• అలసిపోలేదు
చూశారా ఈ సంఘానికి ఎన్ని మంచి లక్షణాలున్నాయో!! ఏడు మంచి లక్షణాలు గల సంఘము ఎఫెసీ సంఘము!
మొదటి లక్షణం: *క్రియలు గల సంఘము*! అనగా మంచి పనులు దానధర్మాలు చేసే సంఘమే
కాకుండా, ప్రభువుకోసం ఇచ్చేసంఘము, పరిశుద్ధులకు
సహాయం చేసే సంఘము! వాక్యానుసారమైన క్రియలు చేసే సంఘము! శ్రమలను ఓర్చుకునే సంఘము!
యాకోబుగారు చెబుతున్నారు—క్రియలు
లేని విశ్వాసి ఆయన విశ్వాసం కూడా మృతము!
...యాకోబు 2: 17
ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే
అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
అయితే ఈ క్రియలు మంచి
క్రియలు ఉన్నాయి చెడ్డక్రియలు ఉన్నాయి! మంచి క్రియలు అనగా సామాన్యంగా ధర్మకార్యాలు అనియు, మరియు
మనము చేసే పనులలో మంచివి అని అర్ధం వస్తుంది! చెడ్డ క్రియలు అనగా
చెడ్డపనులు. ఒక్కమాటలో చెప్పాలంటే గలతీపత్రిక 5వ అధ్యాయంలో వివరించిన శరీరకార్యాలు అన్నియు చెడ్డక్రియలు అన్నమాట!
దేవుడు అంటున్నారు
మనుష్యులు జరిగించు ప్రతికార్యము ప్రతి మాట అవి మంచివైనా చెడ్డవైనా ఒకరోజు విమర్శలోనికి
తీసుకుని వస్తారు అంటున్నారు!
పౌలుగారు చెబుతున్నారు:
రోమా 2:6
ఆయన ప్రతివానికి వాని
వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
*మనుష్యులు
చేసే క్రియలను బట్టి దేవుని తీర్పు ఉంటుంది. వానివాని క్రియలను
బట్టి తీర్పు ఉంటుంది*
ప్రియులారా! ఇది పౌలుగారు చెప్పిన ఈ మాట ఆయన సొంతమాట ఎంతమాత్రమూ
కాదు. అనేక సార్లు మీకు గుర్తుచేయడం
జరిగింది. పౌలుగారు Sanhedrin సభలో సభ్యుడు!
అనగా మన దేశ పార్లమెంటరీ వ్యవస్థ ఎలాగో, ఆ దేశంలో
ఈ వ్యవస్థ అలాంటిది. దానిలో సభ్యత్వం పొందాలి అంటే ధర్మశాస్త్ర
పండితుడై ఉండాలి. కాబట్టి పౌలుగారికి ధర్మశాస్త్రం మీద,
లేఖనాల మీద సంపూర్ణ పట్టు ఉంది. దానితోనే ఆయన ఈమాట
అంత ధైర్యంగా వ్రాస్తున్నారు. ఆయన ప్రతీవానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును! ఇదే విషయాన్ని బైబిల్ ముందే చెప్పింది:
మొట్టమొదటగా కీర్తనలు
62:12 లో ఈ మాట వ్రాయబడింది.
ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున
నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
సామెతలు 24:12
ఈ
సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని
నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
ముందుగా చెప్పినవిధంగా బైబిల్ గ్రంధంలో గల లేఖనాలు గాని ఏ విధమైన వచనాలు గాని పరిశీలించవలసిన విధానం
ఏమిటంటే ఒక వచనాన్ని మరో వచనం సపోర్ట్ చెయ్యాలి. అప్పుడే అది
నిజమైన స్తిరమైన వచనం. బైబిల్ లో అన్ని అలాగే ఉంటాయి.
కీర్తనలు 62:12 కి ఈ వచనము సపోర్టింగ్ వచనం అన్నమాట!
అందుకే ఈ రెండు వచనాలు దృష్టిలో పెట్టుకునే పౌలుగారు కొన్నిసార్లు ఇదేమాట
వ్రాసారు ఈ 6వ వచనంలోనే కాకుండా ఇంకా చాలాచోట్ల ప్రస్తావించారు.
గలతీ 6:7—8
7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
8.ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును. . .;
పరిశుద్ధాత్ముడు కూడా
ఇదే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నారు
ప్రకటన 22:12
12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని
కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. ..
కాబట్టి ప్రియ స్నేహితుడా! నీవు ఏం చేస్తున్నావో, దానికి దేవుడు ప్రతిఫలమిస్తారు జాగ్రత్త! ఇదే విషయాన్ని మరిన్ని కోణాలలో బైబిల్ సెలవిస్తుంది. ఉదా: మనుష్యులు జరిగించే
ప్రతీవిషయంలో కూడా దేవుని విమర్శ దినమందు లెక్క అప్పగించాలి.
2 కొరింథీ 5:10
10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను
సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును
పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
మరోదగ్గర మనుష్యులు పలుకు వ్యర్ధమైన ప్రతీమాటకు
విమర్శ దినమందు లెక్క అప్పగించవలెను. మత్తయి 12:36; అనగా చేసే ప్రతీపనికి, పలికే ప్రతీమాటకు కూడా ప్రతిఫలం ఉంటుంది అన్నమాట!
ఒకసారి రూతు గ్రంధంలో చూసుకుంటే బోయజు గారు రూతుతో
మాట్లాడినప్పుడు అంటున్నారు: నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిచ్చును! 2:12
యెహోవా
నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా
నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని
ఆమెకుత్తర మిచ్చెను. . . .
ఇలా చాలా కోణాల్లో
దేవుడు మాట్లాడుచున్నారు. కాబట్టి
నీవు ఎలా చేస్తావో నీకుకూడా అలాగే చేయబడుతుంది. దీనికి బిన్నంగా
ఒక అమూల్యమైన మాట ఉంది బైబిల్ లో! నాకు నచ్చిన వచనం:
సామెతలు 25:21—22 .
21. నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
22. అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. . . ..
ఒకవేళ నీవు అలా చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడమే
కాదు, శత్రువులను మిత్రులుగా
మార్చుకోగలవు! అనగా నీవు బ్రతికి ఉన్నప్పుడే మనశ్శాంతితో బ్రతకగలవు
కారణం శత్రువుల వలన వచ్చు శోధనలు తగ్గిపోతాయి. ఇరుగుపొరుగు వారితో
శాంతి సమాదానములతో ఉండటం నిజంగా పెద్ద బ్లెస్సింగ్ అది. అది నీకే
ఆశీర్వాదం కాదు, నీవు అలా ఉంటే పొరుగువారికే నీవు ఆశీర్వాదకరంగా
ఉంటావు. ఇంకా
సామెతలు 12:14
ఒకడు
తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.
యెషయా 3:10,11
10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
11. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
. . .
యిర్మియా 17:10
ఒకని
ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ
మును పరిశోధించువాడను,
అంతరింద్రియములను పరీక్షించువాడను.
21:14
మీ
క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్నిరగుల బెట్టెదను,
అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
ప్రకటన 2:23 అందువలన అంతరింద్రియములను
హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
18:6
అది
యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి;
అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.;
20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి
వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున
తీర్పుపొందెను.
కాబట్టి ప్రియ స్నేహితుడా! నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒకసారి సరిచూసుకో! లవొదొకయ సంఘంతో దేవుడు చెబుతున్నారు
నీక్రియలు నాయెదుట సరిగాలేవు అందుకే నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించు చున్నాను అంటున్నారు.
ప్రకటన 3:15--20; నీవుకూడా అలా ఉమ్మివేయించుకునే
స్తితిలో ఉన్నావా లేక భళా నమ్మకమైన మంచిదాసుడా అనిపించు కొనే స్తితిలో ఉన్నావా?
రాజైన నెబుకద్నేజర్
కొడుకు బెల్శషర్ తో దేవుడు చెబుతున్నారు మినె మినె టేకేల్ ఒఫార్శిన్. అనగా దేవుడు నీ విషయమై లెక్క చూసి ముగించారు. ఆయన దృష్టిలో నీ నడతలు విపరీతంగా ఉన్నాయి. దానియేలు 5;
ప్రియ స్నేహితుడా! దేవుడు నీవిషయంలో కూడా లెక్కలు చూస్తున్నారు.
పొరపాటున దానిని ముగించారా ఖభడ్ధార్! అంతే నీ గతి!
బెల్శషర్ కి లెక్క
చూసి ముగిస్తే ఉదయానికి చచ్చాడు! మరి నీవు వాడికన్నా గొప్పవాడివా? జాగ్రత్త!
చివరగా
ప్రసంగీ 11:9,10
9. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ
కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;
10. లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును
తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.
అయితే ఈ సంఘము మంచిపనులలో
మంచి క్రియల్లో ఎంతో పేరుతెచ్చుకుంది. ప్రియ చదువరీ నీవు మంచి క్రియలు చేస్తున్నావా?
ప్రియ స్నేహితుడా ఇప్పుడు నీ ఇష్టం ! నీ ఇష్టమొచ్చినట్లు చేయు! కాని దేవుడు ఒకరోజు నిన్ను దానికి లెక్క అడుగుతారు అని గుర్తుకు తెచ్చుకో!
అప్పుడు నీ నడతలు విపరీతంగా ఉంటే నరకాన్ని తప్పించుకోలేవు! ఒకవేళ ఇప్పుడు నీ మనస్సాక్షి నీమీద తప్పుమోపుతుంటే ఇప్పుడే ఉన్నపాటుననే మోకరించు!
కన్నీటితో దేవునికి ప్రార్ధించు! ఈ చిన్న ప్రార్ధన
చేయు!
*ప్రభువా నేను పాపిని! తెలిసినా
సరే, నేను నీ దృష్టికి ఆయాసకరమైన తప్పులు ఎన్నో చేశాను.
దయచేసి ఈ సారికి నన్ను క్షమించు! ఇకను పాపము,
తప్పులు చేయను ప్రభువా! ప్రియ పరిశుద్దాత్ముడా!
నా నడకలను కావలిగా ఉంటూ నన్ను నడిపించవా!! యేసు
నామమున అడుగుచున్నాము తండ్రి! ఆమెన్*!
ఈ చిన్న ప్రార్ధన నాతోపాటు చేసి ఉంటే నీవు ధన్యుడవు! దేవుడు నిన్ను క్షమించడానికి సిద్దంగా
ఉన్నారు.
ఆమెన్!
*ఎఫెసీ సంఘము-3*
ప్రకటన 2:1—3
1. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని
యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా
2. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు
దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని
చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి వనియు,
3. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.
ఎఫెసీ సంఘము యొక్క
తర్వాత లక్షణం: *క్రీస్తునామం కోసం శ్రమలను అనుభవించుట*! ఆదిమసంఘం మొత్తము శ్రమలను అనుభవించింది!
పౌలుగారు గారు గాని ఆది అపోస్తలులు గాని అనేక శ్రమలను అనుభవించి మనం
పరలోకరాజ్యం ప్రవేశిస్తాము అని ముందుగానే ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సంఘం కూడా శ్రమలను కష్టాలను అనుభవించింది. యేసుక్రీస్తుప్రభులవారు
కూడా లోకంలో మీకు శ్రమ కలుగును అంటూ శిష్యులకు హెచ్చరించారు! వారు సంఘాన్ని హెచ్చరించారు! దాదాపు అన్ని సంఘాలు ఈ క్రీస్తునామం
కోసం కష్టాలు అనుభవించారు...
పౌలుగారు తెగించి
మనము శ్రమలను అనుభవించడానికే పిలువబడ్డాము అని చెబుతున్నారు థెస్సలోనికయ
సంఘానికి.
1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 3:3,4
3. మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;
4. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.
అసలు యేసుక్రీస్తుప్రభులవారు
ఏమని చెప్పారు—నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి
హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాట లెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు అంటూ శ్రమల మార్గములోనే
ప్రయాణం చెయ్యాలి అని చెప్పారు! ఇంకా లోకంలో మీకు శ్రమలు కలుగును అంటూ కూడా చెప్పారు!
యోహాను 16: 33
నాయందు
మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును;
అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి
యున్నాననెను.
అపో 14:22 లో ఆయన శిష్యులు కూడా
అదే చెప్పారు లోకంలో అనేక కష్టాలు శ్రమలు అనుభవించి మాత్రమే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి
అని ముందుగానే చెప్పారు!
రోమా 8:17 లో మనము వారసులం కాబట్టి
హక్కులతో పాటు విధులు కూడా ఉంటాయి అలాగే మహిమతో పాటుగా శ్రమలు హింసలు ఉంటాయి అంటున్నారు!
పేతురు
గారు కూడా ఇదే చెబుతున్నారు
1పేతురు 4: 1
క్రీస్తు
శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
చివరికి
హెబ్రీ పత్రికలో కూడా ఇదే చెప్పారు...
యేసుప్రభులవారు
శ్రమల మార్గంలో ప్రయాణం చేసి సంపూర్ణులు అయినట్లు మనం కూడా అదే మార్గంలో ప్రయాణించి
సంపూర్ణత సాధించాలి అని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. యేసుక్రీస్తుప్రభులవారు
తాను శ్రమ పడేటప్పుడు అమ్మలారా నాకోసం ఏడవకండి మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి అంటూ వీరు
పచ్చిమానుకే ఇలా చేస్తున్నారు ఎందు మానుకు ఎలా చేస్తారో అన్నారు! లూకా 23:28--31; పచ్చిమాను యేసుక్రీస్తుప్రభులవారు ఎండుమ్రానులము
మనము! ముందుగానే శ్రమల ద్వారా పరలోకం చేరాలి అని యేసయ్య చెప్పారు!
కాబట్టి
శ్రమలు లేకుండా పరలోకం చేరము!!!
దీనికోసం మనం ముందుగా
యోహాను గారి శ్రమలకోసం ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాము గనుక ముందుకు పోదాం! ఒక్కటైతే నిజము ఏమిటంటే ఏ సంఘమైతే/విశ్వాసి వాక్యానుసారంగా
భక్తిగా యదార్ధంగా క్రీస్తులో సాగుతుందో/సాగుతారో వారు తప్పకుండా
ఈ కష్టాలను శ్రమలను శోధనలను అనుభవిస్తారు. తద్వారా దేవునితో సన్నహిత
సంభంధాలు కలిగి వరములు ఫలములు కలిగి దేవునికి ఇష్టమైన వారుగా మారుతారు!
తిమోతిగారికి పౌలుగారు ఉత్తరం రాస్తూ
ఇదే చెబుతున్నారు: క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువానికి
శ్రమలు కలుగును. 1తిమోతి 3:12;
*నీవు నిజంగా నీతిగా న్యాయంగా ప్రభువు
చెప్పినట్లు నడుద్దాము అనుకుంటే తప్పకుండా శ్రమలు వస్తాయు. అలాకాదు
నలుగురితో.... కులంతో
.... అని నడిస్తే కష్టాలు రానేరావు! నీవు పరలోకం
పోనేపోవు*!!! సరే ఈ సంఘము
కష్టములు అనుభవించింది ప్రభువు నామం కొరకు, ప్రభువు పరిచర్యకొరకు!
ఇక తర్వాత లక్షణం: *శ్రమలలో
సహనం గలవారు*: దీనికోసం
కూడా మనము గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము, బహుశా 21వ భాగంలో! యోహాను గారు శ్రమలలో సహనం కలిగిన వారని,
విశ్వాసులందరికి సహనము, ఓర్పు మరియు ధీర్ఘశాంతము
కలిగి యుండాలి అని ధ్యానం చేసుకున్నాము!
కాబట్టి ముందుకు పోదాం! ప్రతీ విశ్వాసికి
సంఘానికి ఈ సహనము ఓర్పు దీర్ఘశాంతం తప్పకుండా కావాలి. అప్పుడే
పరలోకరాజ్యమును స్వతంత్రించుకోగలము
గమనించాలి పౌలుగారు
తిమోతి గారికి ఉత్తరం రాస్తూ అంటున్నారు:
సహించావా జయించి ఒకరోజు క్రీస్తుతో పాటు ఏలుతావు అంటున్నారు.....
2తిమోతికి 2: 12
సహించిన
వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
అలాకాకుండా
శ్రమదినమందు నీవు కృంగిన యెడల నీవు చేతకానివాడవు అంటూ సామెతల గ్రంధకర్త రాస్తున్నారు!....
సామెతలు 24: 10
శ్రమదినమున
నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.
కాబట్టి శ్రమలలో శోధనలలో
సహనము కలిగి భరిద్ధాము!
ఇక తర్వాత లక్షణం: *దుష్టులను
సహించలేదు*! దుష్టులకు దేవుడే తీర్పు తీర్చుతారు అని వదిలెయ్యకుండా
వారిని సంఘము నుండి వెలివేశారు! దుష్టత్వాన్ని చూసి ఓర్చుకోలేదు.
ఖండించారు వీరు! దేవుడు కూడా నీవు దుష్టత్వాన్ని
చూసి ఓర్వలేవు కదా అంటూ
కీర్తనాకారుడు అంటున్నారు....
ఒకవేళ సంఘములో ఏదైనా
దుష్టత్వము కనిపిస్తే వెంటనే దానిని సరిచెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి! పౌలుగారు అంటున్నారు క్రీస్తుకు బెలియాలుతో
ఏమి సంబంధము? జీవము గల దేవుని ఆలయము మనము కాబట్టి వీటిని సహించకూడదు.....
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:14,15,16,17
14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో
ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి
పాలెక్కడిది?
16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల
దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.
నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును
వారు నా ప్రజలైయుందురు.
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
కీర్తనాకారుడు అంటున్నారు
దుష్టులు నాకు అసహ్యులు! భూమిమీద నున్న భక్తులే నాకు
ఇష్టులు అంటున్నారు....
కీర్తనలు 5: 6
అబద్ధమాడువారిని
నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
Psalms(కీర్తనల గ్రంథము) 101:3,4,5,6,7
3. నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు
నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను
4. మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను.
5. తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని
గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
6. నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను
నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు.
7. మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.
పౌలుగారు
కూడా కొరింథీ సంఘానికి ఒకనిని వెలివేయమని చెప్పారు
1కోరింథీయులకు 5: 13
మీరు
లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.
ఎఫెసీ 5:5—7
5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని
యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి (మూలభాషలో- అవిధేయత కుమారుల మీదికి) వచ్చును
7. గనుక మీరు అట్టివారితో పాలివారైయుండకుడి.
ఇలా పౌలుగారు ఇచ్చిన
ఆనాటి సందేశాన్ని ఈ ఎఫెసీయులు అనుసరించి దుర్మార్గులతో రాజీపడకుండా వారిని నిరాకరించారు!
సంఘము దుష్టత్వాన్ని సహించక వెలివేసింది. మనము కూడా జాగ్రత్తపడదాము!
*ఎఫెసీ సంఘము-4*
ఇక తర్వాత లక్షణం: *దొంగ అపోస్తలులు ఎవరో పరీక్షించి వారిని బయటకు పొమ్మన్నారు*: చూడండి ఇంతవరకు మనం బెరయ సంఘస్తుల కోసమే
గొప్పగా చెబుతాము! ఏమంటే బెరయ సంఘస్తులు ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు,
చివరికి పౌలుగారి త్రయమైన పౌలుగారు సీలగారు, తిమోతి
గారు వాక్యం చెప్పినప్పుడు ఆ లేఖనాలు అలా ఉన్నాయా లేదా అని పరీక్షించి అప్పుడు నమ్మేవారు!....
అపో.కార్యములు 17: 11
వీరు
థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన
సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
ఇలాంటి యోగ్యత ఈ ఎఫెసీ సంఘానికి కూడా
ఉంది! వీరు ఏమి చేశారు అంటే మేము అపోస్తలులము అంటూ కొంతమంది దొంగ
అపోస్తలులు వచ్చారు ఆ ఎఫెసీ సంఘానికి! వెంటనే వారు దొంగ అపోస్తలులు
అని వారు కనిపెట్టేశారు!
ఇది ఎలా అని తెలుసుకోవాలంటే
అసలు అపోస్తలులు ఎవరు? ఎలా
కనుక్కోవాలి అనేది చూసుకుందాము!
దానికి ముందుగా యోహాను
గారు చెప్పేది విందాము:
1యోహాను 4: 1
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా
ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
పౌలుగారు
చెబుతున్నారు
1థెస్సలొనికయులకు 5: 21
సమస్తమును
పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
2 కొరింథీ 11:13—15
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి,
దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు.
వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
పేతురు
గారు అంటున్నారు
2పేతురు 2: 1
మరియు
అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ద బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే
శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను
రహస్యముగా బోధించుదురు.
అపో 20:28—31
28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును
దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు
మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును;
వారు మందను కనికరింపరు.
30. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే
బయలుదేరుదురు.
31. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి
మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.
యేసుక్రీస్తుప్రభులవారు
చెబుతున్నారు మత్తయి
7:15—20
15. అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల
చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
16. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో
ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
17. ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన
చెట్టు, కానిఫలములు ఫలించును.
18. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు
మంచి ఫలములు ఫలింపనేరదు.
19. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
20. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
ఈ రోజులలో కూడా ఇలా
చెయ్యాల్సిన అవసరం ఉంది!
అపోస్తలుడు అంటే ఎవరు? పిలువబడిన
వాడు లేక దేవుని పనికోసం ప్రత్యేకించబడిన వాడు అని అర్ధం .....
అయితే అపోస్తలుడు
అని ఎలా తెలుస్తుంది అంటే పౌలుగారు చెప్పారు నాలో అపోస్తలుల లక్షణాలు నాలో కనబడ్డాయి
కదా, భోదించడం విషయం లోను అద్భుతకార్యాలు
చెయ్యడం లోను అంటూ చెప్పారు.....
2కోరింథీయులకు 12: 12
సూచక
క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు
పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.
మనకు రెండు విధాలైన
పరిచర్య క్రమం కనిపిస్తుంది పత్రికలలో!
1. Fivefold Ministry- ఐదు మడతల/ఐదు మెట్ల సేవ,
2. Tenfold Ministry- పదిమెట్ల / పది మడతల సేవ .
Fivefold ministry is a
part of Tenfold Ministry.
ఈ Fivefold ministry లో సేవ చేసేవారు చాలా
వరకు fulltime ministry (సంపూర్ణ సేవ) చేస్తారు.
మిగతా ఐదు భాగాల వారు, తమ తమ పనులు చేసుకొంటూనే part
time ministry చేస్తారు.
ఇప్పుడు Fivefold
ministry కోసం ఏమిటో చూసుకుందాం!
వీరు 1. అపోస్తులులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు,
5. సువార్తికులు/ఉపదేశకులు,
మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు,
8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య చేసేవారు,
10. ప్రభుత్వాలు చేసేవారు.
రక్షించబడిన ప్రతీ
విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి
తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!
ఈ Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు,
బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు.
సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.
తర్వాత *కాపరులు*: ఈ Fivefold
ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే
సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.
తర్వాత *బోధకులు*: సంఘకాపరిగా
చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం
వీరి పని.
తర్వాత *ప్రవక్తలు*: వీరు
పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ,
దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ
సంఘాన్ని సరిదిద్దే వారు.
పై నాలుగు వరాలు కలవారు
లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తులులు
అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ,
సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని
కలిగి, ప్రవచన వరం కలిగి సంఘ కాపరిగా సంఘాన్ని ముందుకు నడిపించేవారే
అపోస్తులులు.
ఇది అత్యంత గొప్పవిషయం!
నూతన నిబంధన సంఘము ఈ అపొస్తలుల భోధ
అనే పునాది పైనే కట్టబడుతుంది.
ఈ Fivefold ministry లో అపోస్తలులు,
ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20
20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద
మీరు కట్టబడియున్నారు_.
సరే, మరి ఇప్పుడు వీరు
దొంగ అపోస్తలులా లేక దొంగబోధకులు లేక నిజమైన బోధకులు ఎలా తెలుస్తుంది?
మొదటగా
వారి బోధ వాక్యానుసారంగా ఉందా లేక ధనాశతో నింపబడి ప్రలోభ బోధ ఉందా అని గ్రహించాలి! మిమ్మును ప్రలోభ పెట్టేవాడు
ఎప్పుడు మీకు మేలులు దీవెనలు ఆశీర్వాదాలు అద్బుతాలు అంటూ చెబుతాడు గాని రాకడకు సిద్దపరచడు
మిమ్మును ఖండించడు గద్దించడు బుద్ధిచెప్పడు!
రెండవది: వాని క్రియలు వాని లక్షణం
చెబుతుంది అని యేసయ్య చెప్పారు!
20. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
ఇంకా
పాత నిబంధన లోను క్రొత్త నిబంధనలోను ఈ అబద్దబోధకులకు వారి కడుపే వారి దేవుడు! మంచి మంచి బోధలు చేసి చివర్లో
ఇది కడుతున్నాము అది కడుతున్నాము అంటూ డబ్బులు గుంజుకుంటారు నిజం చెప్పాలంటే మీ సొంత
సంఘాలకు సంఘకాపరులకు చెందవలసిన ధశమభాగాలు అర్పణలు దొంగిలించే భోధకులు లేక టీవీ భోధకులు
ఎందఱో ఈ కోవలోకి వస్తారు! నేటి దినాలలో ప్రతీ ఒక్కరు అపోస్తలుడు
అనే బిరుదు ముందు పెట్టుకుని రెండు ప్రవచనాలు నాలుగు అద్భుతాలు చేసి అపోస్తలుడును అంటున్నారు
సంఘమా జాగ్రత్త! వారిలో కొంతమంది గొర్రె వేషం వేసుకున్న క్రూరమైన
తోడేళ్ళు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడకపోతే మిమ్మును ఆర్ధికంగా
మొదటగా నష్టపరచి, చివరికి విశ్వాస బ్రష్టులను చేస్తారు!
కాబట్టి
వారి భోదను గమనిస్తూ వారు నిజమైన అపోస్తలులా అని గ్రహించి, కాకపోతే వారిని దూరంగా పెట్టాలి
ఈ ఎఫెసీ సంఘము లాగ!
అలాగే ప్రియ దైవసేవకుడా! నీవు సువార్తికుడివా? కాపరిగా మారుటకు ప్రయత్నం చేయు.
కాపరివా- ప్రవచనవరం కోసం, అద్భుతాలు చేసే వరం కోసం ప్రయత్నం చేయు.
ప్రవక్తగా, అపోస్తులుడిగా మారడానికి ప్రయత్నం చేయమని
ప్రభుప్రేమతో ప్రోత్సాహపరుస్తున్నాను.
అయితే దానికోసం గొప్ప
ప్రార్ధనా శక్తి అవుసరం. పరిశుద్దాత్ముని
అభిషేకం పొందుకొని అద్భుతాలు చేసే శక్తిని వాడుతూఉండాలి.(operate చెయ్యాలి) అప్పుడు దేవుడు నీసేవను ఆశీర్వదిస్తారు.
నిన్ను ఒక లైట్ హౌస్ లా వాడుకొంటారు!
*ఎఫెసీ సంఘము-5*
ఇక తర్వాత లక్షణము: *దేవుని నామము కొరకు సహనం కలిగి భారము భరించారు*!
సహనం కలిగి భారము
భరించారు అనగా ముందుభాగాలలో చెప్పినట్లు శ్రమలను శోధనలను భాధలను సహించడమే కాకుడా భారము భరించారు అనగా దేవుని పనికి తమకు చేతనైనంత కంటే బహుశా
ఎక్కువగా ఇచ్చిఉంటారు! అందుకే భారము భరించారు అంటున్నారు!
కొన్నిసంఘాలలో నేను చూశాను- దేవుని పనికోసం సువార్తకోసం
ముఖ్యంగా మందిర నిర్మాణం కోసం మొదట ఒకసారి కానుకలు ఇచ్చారు, పని
పూర్తికాకపోతే మరలా రెండవసారి మూడవసారి కూడా ఇచ్చిన సంఘములను నేను చూశాను! అలాచేసి విస్తారమైన దీవెనలు పొందారు! (తమసొంత సంఘము కోసం
మరియు తమసొంత పరిచర్య కోసమే సుమా- టీవీ పరిచర్యల కోసం కాదు).
దీనినే భారం భరించుట అంటారు! ఇలా చేయడం వలన వారు
అనేకమైన ఆర్ధిక ఇబ్బందులు బహుశా పస్తులున్నారేమో గాని సహనం కలిగి భరించారు అన్నమాట!
మాసిదోనియా సంఘములు
కూడా ఇలాగే ఇచ్చారు అంటూ పౌలుగారు సాక్ష్యం చెబుతున్నారు
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 8:2,3,4
2. ఏలాగనగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి
దాతృత్వము బహుగా విస్తరించెను.
3. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు
విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
4. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని
మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
అంతేకాదు భారము భరించుట
అనగా భారము కలిగి ప్రార్ధన చెయ్యడం కూడా!
దేవునికి ఇయ్యడమే కాకుండా భారము కలిగి ప్రార్ధించిన సంఘము ఈ ఎఫెసీ సంఘము!
చివరగా వారు *ఇలాంటి పరిచర్యలో అలయలేదు* అట: భారము భరించారు గాని ఇవ్వడంలో గాని
శ్రమ పడటంలో గాని ప్రార్ధించుటలో గాని అలసిపోలేదు అట! ఎంత గొప్ప
సంఘమండి ఇది! ఎంతచేసినా అలసిపోలేదు అట! నేడు అనేకమంది మిషనరీలను సేవకులను సువార్తకులను/సువార్తికురాల్లను
విశ్వాసులను చూస్తుంటే నిజంగా చాలామంది అలసిపోకుండా భయపడకుండా కొండలలో వీధులలో మారుమూల
గ్రామాలలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ భాధలు అవమానాలు సహిస్తూ అలయకుండా సేవ చేస్తున్నారు!
వీరికి ప్రతిఫలం దేవుడు అక్కడ ఇయ్యబోతున్నారు! ప్రియ సహోదరి సహోదరుడా! నీకు అటువంటి తెగింపు,
భారము, తలంపు ఉందా? ఉంటే
నీవు ధన్యుడవు!
పౌలుగారు చెబుతున్నారు
గలతియులకు 6: 9
మనము
మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.
యెషయా 40:౩౦—31
30. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు
31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు
చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
మరొకసారి ఈ సంఘము
ఎన్ని మంచి లక్షణాలను కలిగి ఉందో చూసుకుందాం:
• క్రియలు గలవారు
• కష్టాలు పడ్డారు క్రీస్తునామము కోసం
• శ్రమలలో సహనము గలవారు
• దుష్టులను సహించలేదు
• దొంగ అపోస్తలులను పరీక్షించి వారు దొంగబోధకులు అని కనుగొని బయటకు పొమ్మన్నారు
• దేవుని నామముకోసం సహనం కలిగి భారం భరించారు
• అలసిపోలేదు
కాబట్టి ఈ మూడు వచనాల
ద్వారా ఏమని గ్రహించవచ్చు అంటే దేవుడు ప్రతీ సంఘమును ప్రతీ విశ్వాసిని గమనిస్తున్నారు! వారి శ్రమ వారి తెగింపు వారి విశ్వాసాన్ని
దేవుడు కనిపెడుతున్నారు అని గ్రహించాలి! అందుకే నీ ప్రయాసను కష్టమును
నేనెరుగుదును అంటున్నారు దేవుడు!
కీర్తనాకారుడు
అంటున్నారు ౩౩:13—15
13. యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.
14. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.
15. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు
వారిని దర్శించువాడు.
Psalms(కీర్తనల గ్రంథము) 139:1,2,3,4
1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా
మనస్సు గ్రహించుచున్నావు.
3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని
నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా
తెలిసియున్నది.
సామెతలు 5: 21
నరుని
మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
యిర్మియా 16: 17
ఏలయనగా
వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు
కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.
యిర్మియా 23: 24
యెహోవా
సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట
నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
హెబ్రీయులకు 4: 13
మరియు
ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని
కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
కాబట్టి వ్యక్తులుగా సంఘాలుగా ఉన్న మనము ఏమై యున్నామో ఏమి
చేస్తున్నామో అంతా దేవుడు గమనిస్తున్నారు! సైతానుడు కూడా గమనిస్తున్నాడు!
ఇద్దరు కూడా వారికున్న పెద్దపెద్ద CCTV లతో గమనిస్తున్నారు
అని మరచిపోవద్దు! తప్పుడు పనులు చేస్తున్నావా ఖబడ్దార్ ఆయన చూస్తున్నారు
అని మరచిపోవద్దు! క్రీస్తుకోసం శ్రమలను అనుభవిస్తున్నావా?
భాధపడకు! సంతోషించు! నా నామము
నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలు పలుకునప్పుడు
మీరు ధన్యులు సంతోషించి ఆనందించమని కొండమీద ప్రసంగంలో ముందుగానే చెప్పారు!
.. ఒకరోజు ఆయన నీ దగ్గరకు వచ్చి మీ ప్రతీ భాష్పబిందువును తుడిచేరోజు
దగ్గరలో ఉంది అని మరచిపోవద్దు!
ఆయన అన్నీ చూస్తున్నారు. దీవెన
గాని లేక శిక్షను గాని ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారని మరచిపోవద్దు!
*ఎఫెసీ సంఘము-6*
ప్రకటన 2:4—5
4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.
5. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి
క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి;
లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
ప్రియ దైవజనమా! ఎఫెసీ సంఘము యొక్క మంచి లక్షణాలను
ధ్యానం చేసుకున్నాము! ఇక ఇంత మంచి సంఘముకోసం కూడా ప్రభువు అనగా
ఏడు నక్షత్రాలను చేతపట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న ప్రభువు, ఆ సంఘ స్తితి గతులను కనిపెడుతున్న ప్రభువు అంటున్నారు తర్వాత వచనాలలో...
అయినను మొదట నీకుండిన ప్రేమను
నీవు వదిలేశావు అనే తప్పు నీమీద ఒకటి మోపవలసి ఉన్నది...
గమనించాలి: ప్రభువు కోసం కష్టపడిన సంఘములో,
ప్రభువుకోసం శ్రమలు, శోధనలు కలిగినా, సహనం కలిగి భారము భరించిన సంఘములో కూడా దేవుడు తప్పు ఒకటి మోపుతున్నారు!
ఈ తప్పుకోసం చూసుకుంటే నీవు దొంగవు, వ్యభిచారివి,
త్రాగుబోతువు లాంటి మాటలు అనడం లేదు! అనగా క్రీస్తుకోసం
మంచి విశ్వాసాన్నే కలిగి
ఉంది గాని దేవుడు మోపిన నేరం ఏమిటంటే: మొదట నీకుండిన ప్రేమను
నీవు వదలివేశావు! అనగా దృఢమైన విశ్వాసం తగ్గిపోయింది అన్నమాట!
ఈరోజు ఇదే
నేరాన్ని ప్రభువు నీమీద నామీద మన సంఘముల మీద మోపుతున్నారు దేవుడు ఈ పత్రిక ద్వారా! అవును కదా- బాప్తిస్మము పొందుకున్న మొదటి రోజులలో తమ్ముడా: అస్తమాను
ప్రార్ధనా అన్నావు, ఉపవాసం అన్నావు, ఏకాంత
ప్రార్ధన అన్నావు కదా, పరిశుద్ధాత్మ కూటాలు అన్నావు, భాషలు ప్రవచనాలు అబ్బో ఎన్నెన్నో ఉండేవి కదా నీకు! మోకరించిన
వెంటనే చెల్లమ్మా! నీ కళ్ళనిండా కన్నీరే కదా వచ్చేవి!
మరి ఇప్పుడు ఆ ప్రార్ధన, ఆ కన్నీరు, ఆ ఏకాంత ప్రార్ధన, ఆ ఉపవాసం, ఆ
పరిశుద్ధాత్మ, భాషలు, ప్రవచనాలు ఏవి?
ఏవి? ఏవి? లేవు కదా!!
సీనియారిటి పెరిగిన వెంటనే సిన్సియారిటీ తగ్గిపోయింది కదా ప్రియమైన సహోదరి
సహోదరుడా నీకు!!!! నీవు వ్యభిచారివి అనడం లేదు ఇప్పుడు కూడా దేవుడు
నిన్ను, నీవు లోభివి అనడం లేదు, నా ధనం
దొంగతనం చేశావు అనడం లేదు—మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన ప్రార్ధన,
మొదట నీకుండిన ఉపవాసం, మొదట నీకుండిన విశ్వాసం
తెగింపు భారము ఎక్కడికి పోయాయి? ఇప్పుడు లేవు కదా.. అంటున్నారు ప్రభువు!!!
ప్రియమైన దేవుని సంఘమా!ఒకసారి మనలను మనం పరీక్షించు కుందాం!
ఇక ఈసంఘానికి నిజమైన ప్రేమ కూడా
సన్నగిల్లినట్లు కనిపిస్తుంది. అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయంలో
ఈ సంఘం తప్పిపోయింది. అదే ప్రేమ! సహోదర
ప్రేమ! విశ్వాసుల మధ్య ఉండవలసిన ప్రేమ! దేవుని మీదప్రేమ! ఆరాధనా అంటే ప్రేమ! అవి తగ్గిపోయాయి సంఘంలో!
పౌలుగారు 1కొరింథీ 13వ అధ్యాయంలో
ప్రేమ యొక్క విశిష్టత ప్రాముఖ్యత చెప్పారు!
1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను,
కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు
(అనేక ప్రాచీన ప్రతులలో- అతిశయించు నిమిత్తము అని
పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ
లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;
అది ఉప్పొంగదు;
5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు;
త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
7. అన్ని టికి తాళుకొనును (లేక,అన్నిటిని
కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని
నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును;
భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
..
గాని చివరి వచనంలో
అంటున్నారు విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచియుంటాయి అంటున్నారు. కొన్ని ప్రతులలో విశ్వాసము నిరీక్షణ దైవికప్రేమ
ఈ మూడు నిలిచిఉంటాయి అని వ్రాయబడ్డాయి! అయితే ఈ మూడింటిలో ఉత్తమమైనది ప్రేమ లేక దైవిక ప్రేమయే
అంటున్నారు పౌలుగారు!
యేసుక్రీస్తుప్రభులవారు
ప్రేమకోసం ఏమంటున్నారు మత్తయి 22:37—40
37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన
ప్రభువును ప్రేమింపవలెననునదియే.
38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
39. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
40. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో
చెప్పెను. ...
మరి ఇంతటి విశిష్టమైన ప్రేమను దైవిక
ప్రేమను, ఈ ఘనమైన ఎంతో త్యాగభరితమైన ఎఫెసీ సంఘం ప్రక్కన పెట్టింది.
ప్రార్ధన విశ్వాసం, దేవునికోసం కష్టపడటం అన్నీ
ఉన్నాయి గాని ప్రేమను ప్రక్కన పెట్టింది.
అయితే బొత్తిగా
ప్రేమను వదిలేశావు అనడం లేదు- ప్రేమను అశ్రద్ధ చేశారు . ఏమంటున్నారు అంటే వారు సంఘముగా
ఏర్పడిన మొదట్లో లేక వారు రక్షించబడిన మొదటిరోజులలో కనబడిన ప్రేమ ఇప్పుడు కనబడటం లేదు. ఎఫెసి పత్రిక పౌలుగారు వీరికోసం రాశారు
అందులో ఈ ప్రేమకోసం మరింత స్పష్టముగా రాశారు. ప్రేమలో వేరుపారమన్నారు.
క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు లోతు తెలుసుకోవాలి అంటే దానిని పూర్తిగా
పాటించలేదు....... ఎఫెసీ ౩:15—19
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారి, స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో
కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు
ప్రార్థించుచున్నాను.
అందుకే దేవుడు అంటున్నారు తర్వాత వచనంలో: నీవు ఏ స్తితిలో పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారుమనస్సు పొంది ఆ మొదటి
క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి;
లేనియెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దానిచోటనుండి తీసివేతును
అంటున్నారు. చూశారా ఎంత ఘోరమైన మాట అంటున్నారో! మీరు ఏ స్తితిలో పడిపోయారో జ్ఞాపకం చేసుకుని మారుమనస్సు పొందండి. లేకపోతే మీ దీపస్థంభమును దానిచోట నుండి తీసివేతును అంటున్నారు!
ప్రియమైన సహోదరి సహోదరుడా! ఈమాట దేవుడు నీతోను నాతోను ప్రతి సంఘముతోను చెబుతున్నారు: మీరు / నీవు ఏ స్తితిలో పడిపోయావో లేక ఏ విషయంలో జారిపోయావో,
పడిపోయావో నేడే గుర్తుకు తెచ్చుకుని మారుమనస్సు నొంది తిరిగి ఆ మొదటి
క్రియలను చేయమంటున్నారు!
ఇక్కడ ఆ సంఘమునకు ఇక నీకు నిరీక్షణ అవకాశం
లేదు అనడం లేదు! అలాగే మనకు కూడా నిరీక్షణ లేక అవకాశం లేదు అనడం
లేదు- మరో చాన్సు ఇస్తున్నారు దేవుడు- ఇప్పుడైనా
మీరు ఉపవాసం ఉండి మనఃపూర్వకముగా నా దగ్గరకు రండి అని యోవేలు గ్రంధంలో చెబుతున్నారు
దేవుడు.
యోవేలు 2: 12
ఇప్పుడైనను
మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు
యోవేలు 2: 13
మీ
దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై యుండి,
తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను
కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
ఇప్పుడైనా మరుమనస్సు పొంది ఎక్కడ పడిపోయావో గుర్తుకు తెచ్చుకుని
మరలా దేవునితో సమాధాన పడతావా!!! ప్రార్ధనలో పడిపోయావా? ఉపవాసం ఉండటంలో పడిపోయావా?
దేవునికి ఇవ్వడంలో పడిపోయావా? వ్యభిచారం చేస్తున్నావా?
దేవునిలో నీకున్న విశ్వాసంలో పడిపోయావా? పరిశుద్ధాత్మ
వరాన్ని నీకున్న చెడు
అలవాట్లు వలన పోగొట్టుకున్నావా? నీ రక్షణనే పోగొట్టుకున్నావా?
దేవుడు నీకు మరో అవకాశం ఇస్తున్నారు! బహుశా ఇది
నీకు చివరి అవకాశం ఏమో! అంటే రేపునీవు చచ్చిపోతావు అనడం లేదు-
ఇక మారుమనస్సు పొందే అవకాశం నీకు మరలా రాదేమో అంటున్నాను! బహుశా ఇదే నీకు చివరి అవకాశం అయితే ఇప్పుడే మారుమనస్సు పొందవా? దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా పాపిని! ఫలానా విషయం
పడిపోయాను! నా మొదటి ప్రేమను, మొదటి ప్రార్ధనను,
మొదటి విశ్వాసమును, మొదటి తెగింపు భారమును వదిలేశాను
నన్ను క్షమించు! ఇక నేను మరలా నీ సేవలో, నీ ప్రార్ధనలో విశ్వాసంలో కొనసాగుతాను అని ప్రార్దిస్తావా? అయితే దేవుడు నిన్ను చేర్చుకోడానికి నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు!
నిన్ను చేర్చుకోడానికి ఆయన ఇష్టపడుచున్నారు! మరి వస్తావా?
గమనించండి దేవుడు ఈ సంఘానికి, ఈ సంఘానికే కాదు ప్రతీ సంఘానికి ప్రతీ విశ్వాసికి మరో అవకాశం ఇస్తున్నారు!
ఎందుకు ఇస్తున్నారో మనకు ౩:19 లో కనిపిస్తుంది.
దేవుడు తాను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించి మరలా తన దారిలోనికి
ఎలా తీసుకుని వచ్చినట్లుగా ఇలా గద్దించి బాగుపడమని మారుమనస్సు పొందమని తద్వారా పరలోకకం
చేరాలని తండ్రి కోరిక!....
అలా చెయ్యకపోతే నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును
దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నారు! గతభాగాలలో చెప్పుకున్నాము!
దీపస్తంభము అనగా ఎవరు? సంఘము !! అనగా నిన్ను సంఘముగా ఉండకుండా తీసేస్తాను అంటున్నారు!
చరిత్ర
చెప్పనీయండి! ఈ ఏడు పత్రికలు చదివిన సంఘాలు అన్నీ
భోరున దొర్లి దొర్లి ఏడ్చాయట! ఎఫెసీ ఉత్తరం, లవొదికయ సంఘం వారు చదివారు, వారి ఉత్తరం వీరు చదివారు.
ఇలా అందరు చదివి సంఘాలు ఉజ్జీవించబడి ఘనమైన కార్యాలు చేశారు! యోహాను గారు,
ఇక ఆయన శిష్యులు చనిపోయారు. RCM పాలన వచ్చింది.
దేవుడు చెప్పిన ప్రేమ అన్నీ పోయాయి! నేడు మీరు
టర్కీ దేశంలో ఒకనాటి ఎఫెసీ పట్టణంలో అనగా సెల్కుస్ పట్టణంలో నేడు సంఘము అనేదే లేదు! అంత పెద్ద పట్టణంలో క్రైస్తవుడు అనేవాడు లేనేలేడు! తీసి
పారేశాడు దేవుడు! కారణం దేవుడు చేసిన హెచ్చరికను పెడచెవిని పెట్టడం!
నాయకులు మతాధికారులు దేవుణ్ణి కాకుండా వారి సొంత ఆచారాలు పెట్టడం వలన
సంఘాన్ని దేవుడు తీసిపారేశాడు! ముఖ్యంగా శత్రువులను కూడా ప్రేమించమని
దేవుడు చెబితే మా మతంలోకి వస్తారా చంపాలా అని యుధ్దాలకు దారితీసి, క్రీస్తు ప్రేమను పంచలేనందున, క్రీస్తు అంటే అసహ్యపడి
నేడు అక్కడ సంఘం లేకుండా, క్రైస్తవులు లేకుండా పోయారు.
ఇంత ఘనమైన
చరిత్ర గల సంఘాన్నే లేకుండా తీసిపారేసిన దేవుడు నిన్ను కూడా పీకి పారేయ్యగలరు! కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా!
నేడే ఏ విషయంలో పడిపోయావో గ్రహించి దేవుని క్షమాపణ వేడుకో ! ఆయన రాకడకు సిద్దపడు!
*ఎఫెసీ సంఘము-7*
ప్రకటన 2:6—7
6. అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు
ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.
7. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
ఇక తర్వాత
వచనంలో అయితే నీలో మరో మంచి లక్షణం ఉంది ఏమిటంటే
నీకొలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా దీనిని
ద్వేషిస్తున్నాను అంటున్నారు!
ఈ నీకొలాయితుల
కోసం పరిశుద్ధ గ్రంధం ఏమి చెప్పడం లేదు. వీరు ఏమి నమ్ముతున్నారో ఏమి నేరిస్తున్నారో దానికోసం చెప్పడం
లేదు కారణం వారు నేర్పించేది దేవునికి అసహ్యం, ఆయన వాక్యానికి
విరుద్ధమని మాత్రం తెలుసుకోవాలి!
మనం కూడా మరింత డీప్ గా తెలుసుకోవడం అనవసరం! అయితే
కొద్దిగా మాత్రం చెబుతాను!
నీకొలాయితులు
అనే పదం గ్రీకు భాషలో రెండు పదముల కలయిక!
నీకో- లోబరుచుట
లావోస్- ప్రజలు లేక సంఘము
అనగా ప్రజలను
లోపరచుకుని వారిని విభజించి పాలించడం అన్నమాట! వీరు ఏమి చేశారంటే ప్రజలను యాజకులు, ప్రజలు లేక విశ్వాసులు అంటూ రెండు గుంపులుగా చేశారు! యాజకులు దేవుని పరిచారకులు కాబట్టి యాజకులు చెప్పినట్లే సంఘము లేక విశ్వాసులు
చెయ్యాలి అనే సిద్ధాంతము తీసుకుని వచ్చి సంఘాన్ని పాలించడం మొదలుపెట్టారు! దీనికి ఆద్యుడు అపోస్తలుల కార్యంలో భోజనం పంచిపెట్టడానికి అపోస్తలులతో ఏర్పాటుచేయబడ్డ
ఏడుగురిలో ఒకడైన నికొలాసు అంటారు!
అయ్యా! ఈ బోధ మన దేశంలో కూడా ఉంది!
ఆ సంఘము యొక్క పేరు చెప్పను కాని వారు అంటున్నారు: దేవుడు యాజకులకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు! పరమ సీయోను
చేరే అవకాశం అనగా సీయోను కొండమీద ఉండే 144000 మంది యాజకులే!
ఆ సంఘస్తులే లేక ఆ సంస్థలోని యాజకులే! బైబిల్ దేవుడు
మనలను రాజులైన యాజకులుగా చేశారు అంటే విశ్వాసులను దేవుడు రాజులుగా చేస్తున్నారు-
సేవకు పిలువబడిన సమర్పించుకున్న దైవజనులను అనగా వారి పాష్టర్లను యాజకులుగా
చేశారు అంటున్నారు. వాక్యాన్ని వారికి అనుకూలంగా చెబుతున్నారు!
అంతేకాదు వెయ్యేండ్ల పాలనలో వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నారు!
చివరికి నిత్యత్వములో అనగా వెయ్యేండ్ల పాలన తర్వాత క్రొత్త భూమి క్రొత్త
ఆకాశంలో వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంది అట! నూతన నిబంధన సంఘ
విశ్వాసులు క్రొత్త భూమిమీద, పాత నిబంధన సంఘ పరిశుద్ధులు క్రొత్త
ఆకాశము మీద, వీరైతే అంతకంటే హెచ్చయిన స్థాయిలో పరమసీయోనులో ఉంటారు
అంటూ చెప్పుకుంటున్నారు. వారిని వారు హెచ్చించుకుంటున్నారు!
నిజం దేవునికి తెలుస్తుంది.
అయితే
నా ఉద్దేశం ఏమిటంటే దేవునికి ఇటువంటి తారతమ్యాలు లేవు! దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే!
అయితే వారు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా జీవించి, జయజీవితం కలిగి జీవిస్తే వారిని దేవుడు మంచి స్థాయిలో ఉంచుతారు అంతేతప్ప వారు
చెప్పినట్లు జరుగదు! అందరూ దేవునికి ఒక్కటే అని నా ఉద్దేశము!
అయితే పరిపూర్ణత సాధించడంలోనే ఉంది. విశ్వాసిగాని
దైవసేవకుడుగాని పరిపూర్ణత
సాధించ గలిగితే అందరూ సమానమే దేవునికి!
సంఘము
మీద అధికారం ఎవరికీ లేదు!సంఘంలో దేవుడు పెద్దలను సేవకులను కాపరులను అపోస్తలులను పరిచర్య చేయడానికే పిలిచారు
తప్ప పెత్తనం చెయ్యడానికి అధికారం చెయ్యడానికి పిలువలేదు! రక్షించబడిన వారంతా రాజులే యాజకులే! 1పేతురు 2:4,9
4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు
అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,
5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ
యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన
మందిరముగా కట్టబడుచున్నారు.
1పేతురు 2: 9
అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురముచేయు నిమిత్తము,
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
ప్రకటన
గ్రంథం 1: 6
మనలను
ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో-
కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును
యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను
తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
ప్రకటన
గ్రంథం 5: 10
మా
దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని
క్రొత్తపాట పాడుదురు.
గమనించాలి: పై రెండు వచనాలలోను రాజ్యముగాను యాజకులు
గాను అని తెలుగులో తర్జుమాను చేశారు గాని ఇంగ్లీషు లోను మరియు తెలుగు ప్రాచీన ప్రతులలో
రాజులు గాను యాజకులు గాను చేసితివి అని ఉంది.
గమనించాలి రక్షించబడిన
వారే సంఘము తప్ప, రక్షించబడని
వారు కాదు! నేటిదినాలలో అనేకులు రక్షణానుభవము లేకుండా సంఘ కమిటీలో
సభ్యులుగా ఉండి సంఘము మీద పెత్తనం చేస్తున్నారు! ఇది దేవునికి
అసహ్యమైన క్రియ!
సరే, ఇలాంటి విభజించి పాలించే నీకొలాయితుల భోధలను
దేవుడు అసహ్యపడుతున్నారు!
దేవునికి అందరూ సమానమని
గ్రహించండి! దయచేసి సంఘపెద్దలారా!
కాపరులారా! దయచేసి సంఘాన్ని ప్రేమించండి పరిచర్య
చేయండి గాని పాలించవద్దు!
1పేతురు 5:1—4
1. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని,
బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
2. *బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని
మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి*.
3. *మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి*;
4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
*ఎఫెసీ సంఘము-7*
చివరగా
అంటున్నారు చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక అంటున్నారు.
సంఘాలకు
దేవుని ఆత్మ చెప్పేది చెవి గలవాడు వింటాడు అంటున్నారు దేవుడు! చెవి ఉంటే వింటారు కదా!
దీని
అర్ధము అది కాదు యేసుక్రీస్తుప్రభులవారు ఆత్మమూలంగా యోహానుతో మాట్లాడారు. ఇప్పుడు యోహాను గారు దేవుని
ఆత్మతో నింపబడి ఈ మాటలు రాస్తున్నారు. కాబట్టి ఈ మాట ద్వారా దేవుని
పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు అని గ్రహించి ఆత్మ చెప్పినట్లు నడుచుకోమని దీని
అర్ధము! అనగా ఆత్మ చెబుతున్న మాటలు విని గ్రహించి దానిప్రకారం
చెయ్యమని దీని అర్ధం!
ఇదేమి కొత్త పదము
కాదు! యేసుక్రీస్తుప్రభులవారు
కూడా ఉపమానం చెప్పి చివర్లో చెవి గలవాడు వినును గాక అనేవారు! మత్తయి 11:15; 13:9; 43
అక్కడే
కాదు ప్రభువు ఈ మాట ఈ ఏడు సంఘాలకు చెప్పారు! అదేమాట ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు సార్వత్రిక సంఘానికి అనగా ప్రతీ
విశ్వాసికి నీకు నాకు చెబుతున్నారు—చెవి గలవాడు వినును గాక! అనగా బుద్ధి ఉన్నవాడు దీనిని
గ్రహించి దీని ప్రకారం చెయ్యును గాక అని అర్ధము!
ఇంకా
ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి ఆత్మీయ చెవులు తెరవబడిన వారు గ్రహించి దాని ప్రకారం చేయుదురు
గాక అని అర్థం!
ఇక తర్వాత పాదంలో
అంటున్నారు జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్షఫలాలు భుజింపనిత్తును అంటున్నారు!
ఇక్కడ
రెండు అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.
మొదటిది: జయించేవాడు పొందుకునేవి.
గమనించాలి జయించే వాడే పొందుకుంటాడు
రెండు: దేవుని పరదైసులో ఉన్న జీవ
వృక్ష ఫలాలు
మొదటిది: *జయించు వాడు పొందుకునే
భాగ్యాలు*!
గమనించాలి: ఈ ఏడు ఉత్తరాలలో ఏడు రకాలైన
భాగ్యాలు ఈ జయించువారు పొందుకుంటారు అంటున్నారు దేవుడు!
విశ్వాసి- ఆత్మీయ పోరాటాలు అనే శీర్షికలో
మీకు చెప్పడం జరిగింది—రక్షించబడిన ప్రతీ విశ్వాసి ఆత్మీయ
పోరాటంలో ఉన్నాడు! ఆ యుద్ధం విశ్వాసి ఒక్కడే చెయ్యాలి! దానికి దేవుడు ఎఫెసీ
పత్రిక 6:10—18 వరకు చూసుకుంటే సాతాను
గాడితో జయించడానికి సర్వాంగకవచము- ఆయుధాలు ఇచ్చారు! ఇప్పుడు నీవు వాటిని వాడి సాతానుని చిత్తుచేసి నీ గమ్యమైన పరమునకు చేరాలి!
మరో దారి లేదు! నాగటిమీద చెయ్యి వేసి వెనుకకు చూస్తే
నా వాడు కాదు అన్నారు దేవుడు!
లూకా 9: 62
యేసు
నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని
వానితో చెప్పెను.
యుద్దంలో ముందుకు
యుద్ధం చేసుకుంటూ సాగిపోవాలి! ఆగావా
వెనుకకు చూశావా—ఈలోగా శత్రువు నీ గుండెలో తూటాలు
పేల్చేస్తాడు! వెనుకకు వస్తే దేవుడు నిన్ను తోసేస్తాను అంటున్నారు! కాబట్టి విశ్వాసి జయజీవితం జీవించాలి! దైర్యముతో పోరాడాలి!
ప్రార్ధనా అనే ఆయుధం ప్రతీ నిమిషంలో ప్రతీ విషయంలో వాడాలి! పరిశుద్దాత్ముని సహాయం, వాక్య ఖడ్గం సహాయం తీసుకుని దైర్యముగా
పోరాడాలి!
ప్రకటన 21:7 ప్రకారం జయించిన వాడే ఈ భాగ్యాలకు వారసుడు అవుతాడు అంటున్నారు దేవుడు...
ప్రకటన
గ్రంథం 21: 7
జయించువాడు
వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
మొదట ఈజయజీవితం
కోసం పేతురు గారితో మొదలుపెట్టారు దేవుడు! పేతురు ఈ బండమీద నా సంఘాన్ని కడతాను ధైర్యంగా ఉండు అంటే ధైర్యంగా
నిలబడ్డారు పేతురు గారు! సంఘము కట్టడం ప్రారంభమైంది పెంతుకోస్తు
పండుగ దినం నుండి! మత్తయి 16:18
ఆ తర్వాత అదే అధికారం
మరిన్ని అధికారాలు లూకా 10:19 లో ఇచ్చారు దేవుడు....
అందులో నున్న రోగులను
స్వస్థపరచుడిదేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.
ఇంకా మార్కు 16:17—18 లో ఇంకా ఇచ్చారు...
17. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును (మూలభాషలో-
నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా,
నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త
భాషలు మాటలాడుదురు,
18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను
అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత
నొందుదురని వారితో చెప్పెను.
యోహాను
సువార్తలో నేను లోకాన్ని జయించాను మీరు కూడా ధైర్యముగా ఉండి జయించమన్నారు
యోహాను 16: 33
నాయందు
మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును;
అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి
యున్నాననెను.
రోమా 8:37 లో ... అంటున్నారు...
అయినను
మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
యోహాను
గారు చెబుతున్నారు
1యోహాను 2:13—14
13. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు
గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
14. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు
వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి
యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా,
మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది;
మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
1యోహాను 4: 4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు;
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
1 John(మొదటి యోహాను) 5:4,5
4. దేవుని మూలముగా పుట్టిన వారందరును (పుట్టినదంతయు లోకమును
జయించును) లోకమును జయించుదురు; లోకమును
జయించిన విజయము మన విశ్వాసమే
5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
క్రొత్త నిబంధనలో
జయించడం అనగా క్రీస్తు నామం కోసం, ఆయన విశ్వాసంలో భక్తిలో నిలబడినప్పుడు ఎదురయ్యే కష్టాలు శ్రమలు శోధనలు విషమ
పరీక్షలు , ఇంకా పాపము ద్వారా, సాతాను ద్వారా
లోకం ద్వారా కలిగే ఆటంకాలు అన్నీ ఎదుర్కొని దేవునిమీద విశ్వాసముంచుతూ వాటన్నిటినీ జయించుకుంటూ
సహించుకుంటూ ఆత్మీయ జీవితాన్ని భద్రంగా కాపాడుకోవడమే జయజీవితం లేక జయించడం అని అర్ధం!
జయించువాడు
పొందుకునేవి ఒకసారి చూద్దామా?
ప్రకటన 2:7, 11; 17;26,27;
7. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
11. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియు చెందడు.
17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు
అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును;
పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
26. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు
నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి (లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.
Revelation(ప్రకటన గ్రంథము) 3:5,12,21
5. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు
నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును
వాని మీద వ్రాసెదను.
21. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని
నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
ప్రకటన
గ్రంథం 21: 7
జయించువాడు
వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
ప్రియ సంఘమా! జయించిన వారికి మాత్రమే మేలులు,
ఆత్మీయ వరాలు ఫలాలు! మరినీకు అలాంటి జయజీవితం ఉందా?
అలాంటి జయజీవితం పొందుకుందాం! జయించి వీటన్నిటిని పొందుకుందాం!
*ఎఫెసీ సంఘము-9*
ప్రకటన 2:7
చెవిగలవాడు
ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు
భుజింప నిత్తును.
ఇక్కడ
రెండు ప్రాముఖ్యమైన విషయాలున్నాయి.
మొదటిది: *జీవవృక్షఫలములు*
రెండు: *దేవుని పరదైసు*!
మొదటగా జీవ వృక్షఫలముల
కోసం చూసుకుందాం!
ఆదికాండం 2:9 వచనంలో దేవుడు ఏదేను
తోటలో అన్ని రకాల ఫలములిచ్చు చెట్లు చేసి చివరలో జీవవృక్షపు ఫలములిచ్చు చెట్టును మంచిచెడ్డల
తెలివినిచ్చు చెట్టును మొలిపించి మీరు అన్ని ఫలాలు తినండి గాని వీటిని తినవద్దని ఖండితంగా
ఆజ్ఞాపిస్తే సాతాను గాడు లేక పాము ప్రేరేపణతో హవ్వమ్మ, హవ్వమ్మ
ప్రేరేపణతో ఆదాము గారు మంచిచెడ్డల తెలివినిచ్చు ఫలమును తిన్నారు! వెంటనే వారు దిగంభరులు అని తెలుసుకుని సిగ్గుతో చెట్లచాటున దాగుకోవడం,
దేవుని శాపానికి గురికావడం మనకు తెలుసు!
అయితే
ఆషారు గ్రంధం ప్రకారం ఎప్పుడైతే వారు దేవుని శాపానికి గురయ్యి ఏదేను తోట నుండి తరుమబడుచున్నారో
ఆదాము గారు తెలివి పనిచేసి జీవ వృక్షఫలములు తినడానికి పరుగెత్తినట్లు దేవుడు వెంటనే
అగ్నిజ్వాలలతో బయటికి తరిమినట్లు వ్రాయబడింది.
ఆదికాండం
౩:22—24 లో దేవుడు అంటున్నారు వీరుకూడా మనలాగే మంచిచెడ్డలు
తెలుసుకునే వారయ్యారు కాబట్టి జీవవృక్ష ఫలములు తిని శాశ్వతంగా జీవిస్తాడేమో అని ఏ నేలనుండి
మానవుణ్ణి తీసారో దేవుడు ఆ నేలమీదకి పంపించి వేసినట్లు కనిపిస్తుంది.....
Genesis(ఆదికాండము)
3:22,23,24
22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన
చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
23. దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి
అతని పంపివేసెను.
24. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను,
జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను
నిలువబెట్టెను.
చూశారా జీవవృక్ష ఫలముల
చెట్టువైపునకు పోకుండా మార్గాన్ని కాయడానికి తూర్పు దిక్కున కెరూబులను, మరో ప్రక్కన ఖడ్గమును జ్వాలలను పెట్టారు!
ఒకసారి
ఆగి ఆలోచిద్దాం! ఇంతకీ దేవుడు జీవ వృక్షఫలముల చెట్టుని ఏదేనుతోటలో ఎందుకు చేశారు? గమనించాలి – తర్వాత మాటలో దేవుని పరదైసులో కూడా జీవవృక్షముంది
అని అర్ధమౌతుంది! అసలు ఏదేనులో దేవుడు ఎందుకు పెట్టారు ఆ ఫలాన్ని? బైబిల్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే
దేవుడు ఆదాము గారితో హవ్వమ్మతో మీరు ఈ ఫలాలన్నీ తినవచ్చు గాని మంచి చెడ్డలు తెలివినిచ్చు
ఫలాలను తినవద్దు అన్నారు! జాగ్రత్తగా గమనిస్తే జీవవృక్షఫలాలను
తినవద్దు అని దేవుడు అనలేదు! గాని వారు తినలేదు! ఎందుకంటే రెండు చెట్లు ప్రకప్రక్కన ఉన్నాయి కాబట్టి రెంటిని తినలేదు!
గాని సాతాను గాడు మంచిచెడ్డలు తెలివినిచ్చు ఫలాన్ని తినేలాగా చేసాడు
గాని జీవవృక్షము కోసం ఏమీ చెప్పలేదు!
సరే, ఏమని అర్ధమవుతుంది అంటే
దేవుడు జీవవృక్షఫలాన్ని కూడా ఆదామవ్వలకోసమే చేసినట్లు తెలుస్తుంది! మరో విషయం చెప్పనా—మొదట ఆదామవ్వలకి ఏమేమి అవసరమౌతాయో
వాటిని అనగా సృష్టిని, చెట్లను, జంతువులను అన్నిటిని చేసేసి- చివర్లో మానవుణ్ణి చేశారు దేవుడు! మానవులు అంటే అంత ఇష్టం
దేవుడికి! మరి ఇంత ప్రేమగల దేవుడు జీవవృక్షఫలాన్ని తినకుండా ఎందుకు
చేశారు? ఎందుకు ఖడ్గజ్వాలలను కాపలాగా పెట్టారు అంటే మానవుడు చేసిన తిరుగుబాటు
వలన! ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది!
1యోహాను 3: 4
పాపము
చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
వీరు ఫలాన్ని
తిననంతవరకు పరిశుద్దులే! గాని ఎప్పుడైతే
ఆజ్ఞను మీరారో పాపులయ్యారు! పాపులకు జీవవృక్షఫలాలను తినే అధికారం
లేదు! ఆదామవ్వలు ఆ అధికారం కోల్పోయారు! అందుకే దేవుడు ఖడ్గజ్వాలలను కాపలా పెట్టి ఏదేను తోటలో నుండి గెంటేశారు!
మరి అంతటితో స్టోరీ అయిపోయిందా?
లేదు కదా! మరలా ఆ జీవవృక్షాలు తినే అర్హత మానవునికి
దయచేయాలని దేవుడు ఎన్నెన్నో మార్గాలు వాడారు! గాని మానవుడు మరింత
పాపిగా మారాడు! చివరికి ధర్మశాస్త్రము ఇచ్చి- ఆహారోను యాజకక్రమంలో బలియాగాల ద్వారా పరిశుద్ధుడై పరిపూర్ణుడై ఆ జీవవృక్ష ఫలాలను
తినేలా చేద్దామనుకున్నారు! జీవవృక్ష ఫలాలను తింటే ఏమవుతుంది?
అమరులవుతారు! మన భారతీయ గ్రంధాలు ప్రకారం అమృతం
త్రాగితే ఎలా మరణం లేకుండా ఉంటారో అలాగే జీవవృక్షఫలాలు తింటే ఎల్లప్పుడూ సజీవులుగా
నిత్యత్వములో ఉంటారు! మరి ధర్మశాస్త్రము- ఆహరోను యాజకధర్మము అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది పరిపూర్ణత సాధించలేదు అని హెబ్రీ
పత్రికలో ఖరాఖండిగా చెబుతున్నారు! అందుకే మరో యాజకధర్మం తీసుకుని
వచ్చారు దేవుడు! అదే మెల్కీసేదేకు యాజకధర్మము! దానికి ప్రధానయాజకునిగా యేసుక్రీస్తుప్రభులవారు వచ్చి ఆదాము చేసిన పాపములకు
దోష నివృత్తికి తానే బలైపోయారు! పరిహారం చెల్లించారు ఆ మ్రానుమీద!
అపో.కార్యములు 5: 30
మీరు
మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.
గలతియులకు 3: 13
ఆత్మను
గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము
క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై
(మూలభాషలో- శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;
గలతియులకు 3: 14
ఇందును
గూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
1పేతురు 2: 24
మనము
పాపముల విషయమై చనిపోయి,
నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు
స్వస్థత నొందితిరి.
ఈ పరమకార్యం తర్వాత
మానవుడు దేనిని కోల్పోయాడో పాపము చేసి, అనగా మొదటి ఆదాము పాపము చేసి జీవవృక్ష ఫలాన్ని తినే అర్హతను
ఎలా కోల్పోయాడో, ఇప్పుడు కడపటి ఆదామయిన యేసుక్రీస్తుప్రభులవారి
పుణ్యదాన బలియాగం ద్వారా మరలా మానవుడు ఆ జీవవృక్షఫలాలను తినే యోగం లభించింది! మన శిక్షను తానే భరించారు యేసుక్రీస్తుప్రభులవారు!
కాబట్టి ఈ జీవవృక్ష
ఫలముల కోసం కేవలం క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడుగబడి ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం పరిశుద్ధమైన జీవితం
జీవిస్తే అప్పుడు మానవుడు శ్రమల ద్వారా సంపూర్ణుడై ఎత్తబడి ఆ జీవవృక్షఫలములను తినగలడు!
లేదా అలాంటి పరిశుద్ధజీవితం జీవించి ప్రభువునందు మృతిచెందితే దేవుని
పరదైసుకి ఎత్తబడి ఆ పరదైసులో ఈ జీవవృక్షము తింటాడు!
అయితే నిత్యత్వములో
తినాలన్నా, పరదైసులో
చనిపోయాక తినాలన్నా తప్పకుండా చేయాల్సింది కావాల్సింది జయ జీవితం! జయించినవానికే ఇవి తినిపిస్తాను అంటున్నారు దేవుడు! కాబట్టి
తప్పకుండా జయజీవితం కావాలి!
ప్రియ దైవజనమా! జయజీవితం నీకుందా??!!!!
*ఎఫెసీ సంఘము-10*
ఇక
రెండవ ప్రాముఖ్యమైన అంశం: దేవుని పరదైసు!!!
దేవుని
పరదైసు అంటే ఏమిటి? అదెక్కడుంది? ఎక్కడ ఉండేది? అందులో
గల ఏర్పాట్లు అనగా ఫెసిలిటీస్ ఏమిటి?
ఒకసారి మరలా మనం లేఖనాలకు పోవాలి!
పరదైసు
అనగా పరిశుద్ధులైన చనిపోయిన ఆత్మల యొక్క గెస్ట్ హౌస్ లేదా రెస్ట్ హౌస్ !
ప్రస్తుతం
పాత నిబంధన భక్తుల ఆత్మలు,
క్రీస్తునందు నిద్రించిన ఆత్మలు ఎక్కడ ఉన్నాయి?
పరదైసులో!
పరదైసు
ఇప్పుడు ఎక్కడ ఉంది?
పౌలుగారి దర్శనం ప్రకారం 2కొరింథీ 12 ప్రకారము మూడో ఆకాశంలో ఉంది!
2
Corinthians(రెండవ కొరింథీయులకు) 12:2,3,4
2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట
*మూడవ ఆకాశమునకు కొనిపోబడెను*; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు *పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను*; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక
కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
దీనిని కాదు అనగలిగిన
వాడు ఎవడూ లేడు! మొదట
ఈ పరదైసు ఎక్కడ ఉండేది! భూమిక్రింద! భూమిక్రింద
మొదట భాగము పాతాళము దీనినే హెడేస్ అంటారు!
ఎవరి కోసం ఇది? చనిపోయిన ఆత్మలు, అనగా పాపాత్ములై చనిపోయిన ఆత్మలు ఉండేది, తీర్పు వరకు!
యోబు 24: 19
అనావృష్టిచేతను
ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసిన వారిని పట్టుకొనును.
దానిక్రింద అగాధము! ఇది ఎవరి కోసం సాతాను గాడి సైన్యం కోసం!
దేవునిమీద తిరుగబడ్డ దూతలు కోసం అగాధం ఉంది!
ప్రకటన గ్రంథం 9 మరియు, 20:3ప్రకారం!
దానిక్రింద పరదైసు
ఉండేది! లాజరు-
ధనవంతుడు ఉపమానం ప్రకారం! లూకా 16; లాజరు అబ్రాహాము రొమ్ము అనబడే పరదైసులోను, ధనవంతుడు పాతాళములోను ఉన్నాడు.
అందుకే తండ్రియైన
అబ్రాహాము గారు మాకును మీకును మధ్యన మహా అగాధం ఉంచబడింది అన్నారు! ఇది దేవునియందు భయభక్తులు కలిగి భక్తి
కలిగిన విశ్వాసుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేయబడింది!
సరే, ఎప్పుడైతే యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయారో
ఆ మూడురోజులలో మరణాన్ని సాతానుని జయించి
చెరను చెరగా పట్టుకుని పోయారు అని వ్రాయబడింది! .ఎఫెసీయులకు 4: 8
అందుచేత
ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను
అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
.. అనగా ఈ పరదైసునే దాని అడ్రస్ మార్చివేశారు
యేసయ్య! భూమిక్రింద
మూడో భాగంలో ఉన్న పరదైసును దానిలో ఉన్న ఆత్మలతో అనగా పాతనిబంధన భక్తుల ఆత్మలతో పాటుగా
మూడో ఆకాశంలోనికి తీసుకుని పోయారు!
మొదటి
ఆకాశం అంతరిక్షం! రెండో ఆకాశంలో అంధకార సంబంధమైన లోకనాధులు, సాతాను శక్తులు ఉన్నారు! యేసుక్రీస్తుప్రభులవారి
రెండో రాకడలో మొదటి ప్రస్తానమైన రహస్యరాకడ లో వచ్చేది ఈ మధ్యాకాశమునకే! ఆయనరాకడతో ఈ అంధకార సంబంధమైన లోకనాధులు సైతాను సమూహం క్రిందకు త్రోయబడతారు!
అప్పుడు పరిశుద్ధులకు ఏడేండ్లు మధ్యాకాశంలో విందు! భూమిమీద ఏడేండ్లు మహాశ్రమలు!
సరే
ఆ పైన ఉన్న ఆకాశములోనే ఇప్పుడు పరదైసు ఉంది అని 2కొరింథీ 12వ అధ్యాయం చెబుతుంది!
సరే, ఇప్పుడు ఈ వచనంలో దేవుని
పరదైసులో ఉన్న జీవవృక్షఫలములను తిన నిత్తును అంటున్నారు అనగా ఇప్పుడు మృతులైన పరిశుద్ధులందరూ
పరదైసులో జీవవృక్షఫలాలు తింటున్నారు! అక్కడ వారు విశ్రాంతిని
తీసుకుంటున్నారు! మూడో ఆకాశంలో ఒక భాగమే పరలోకం అని బైబిల్ పండితులు
అభిప్రాయపడతారు! అనగా దేవదూతలతో కలిసి గాన ప్రతిగానాలు చెయ్యడం
తప్పించి, దేవదూతలకు ఉన్న మిగతా ఫెసిలిటీస్ అన్నీ వీరు కూడా
అనుభవిస్తున్నారు అన్నమాట! మధ్యమధ్యలో బహుశా దేవుని స్వరాన్ని
కూడా వింటున్నారేమో!! ఆకలి లేదు, దప్పిక
లేదు, కష్టాలు నష్టాలు రోగాలు భాధలు లేవు! హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు వారు! మధ్యలో టేస్ట్
కోసం ఈ జీవవృక్ష ఫలాలు తింటున్నారు!
గమనించాలి
ఇవి కూడా జయించిన వారికి మాత్రమే!
ప్రియ సహోదరుడా! నీకు ఒకరోజు నీ ప్రియ
రక్షకుడైన క్రీస్తుయేసు ప్రభులవారిని కలుసుకుంటాను అనే నిరీక్షణ విశ్వాసం ఉందా? అసలు అలా ఎత్తబడటానికి ఎత్తబడే గుంపులో ఉండేటంత అర్హత సిద్ధపాటు నీకుందా? జయజీవితం నీకుందా? లేకపోతే నేడే నీ బ్రతుకును మార్చుకుని
ఆయన రాకడకు సిద్దపడు! లేకపోతే విడువబడుట బహుఘోరమని మర్చిపోవద్దు!
నేడే సిద్దపడదాం! ఎత్తబడదాం!
దైవాశీస్సులు!
*స్ముర్ణ సంఘము-1*
ప్రకటన 2:8
స్ముర్నలోఉన్న
సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు
చెప్పు సంగతులేవనగా
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ఎఫెసీ సంఘము కోసం ధ్యానం
చేసుకున్నాము! ఇక మనం తర్వాత సంఘము స్ముర్ణ సంఘం కోసం ధ్యానం
చేసుకుందాం!
*స్ముర్ణ* అనగా *బోళము, చేదు
, శ్రమల వాసన* అనే అర్ధాలు ఉన్నాయి!
స్ముర్ణ అనే పట్టణం
కూడా టర్కీ దేశములోనే ఉంది. ఇది ఎఫెసీ పట్టణానికి సుమారు 60 కి.మీ. ఉత్తరంగా ఈ పట్టణం ఉంది.
ప్రస్తుత
నామం: *ఇజ్మీర్*
*ప్రత్యేకతలు*: మహా సుందరమైన అందమైన నగరం! చిన్నాసియా లేక ఆసియా మైనర్
లోనే మహా అందమైన నగరం! రోమా సామ్రాజ్యపు వారు కట్టించారు!
వారియొక్క మొదటి పుణ్యక్షేత్రం ఇది! మహాకవి అయిన హోమర్ ఇక్కడే జన్మించాడు!
*చరిత్ర*: పౌలుగారి మొదటి మిషనరీ
యాత్రలో ఇక్కడ సంఘం ప్రారంభించి ఉండవచ్చు అంటారు అపో 19:10 ప్రకారం! అయితే యోహాను
గారు తాను ఎఫెసీ పట్టణానికి స్థిరనివాసం వచ్చాక ఇక్కడ సంఘాన్ని బలపరచి, స్ముర్ణ సంఘాన్ని మరింత బలోపేతం చేశారు! ఆ సంఘానికి యోహాను
గారి శిష్యుడైన పోలికార్పు గారిని బిషప్ గా చేశారు! ఆయన విశ్వాస
వీరుడు యోధుడు! సంఘాన్ని స్వచ్చమైన అచ్చమైన నిఖార్సైన విశ్వాస
యోధులుగా సంఘాన్ని తీర్చిదిద్దారు! మహా శ్రమలను అనుభవించిన సంఘము!
చరిత్ర ప్రకారం ఈయన ప్రభువుకోసం హతస్సాక్షి అయినట్లు అనగా సజీవ దహనం కావించబడ్డారు అని చరిత్ర
చెబుతుంది! అయినా సంఘము విశ్వాస విషయంలో బెదరలేదు చెదరలేదు!
కారణం ముందునుండే పోలికార్పు గారు సంఘానికి చెప్పి ఉంచారు. ఏ క్షణమైనా నీ ప్రాణాన్ని ప్రభువుకోసం అర్పించడానికి సిద్దంగా ఉండండి అని.
అందుకే వారు హతస్సాక్షులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు! అంతటి బలమైన దృఢమైన విశ్వాసం గల సంఘము స్ముర్ణ సంఘము!
*ప్రభువు మోపిన తప్పు*: అసలు ప్రభువు తప్పు
మోపని సంఘము- తప్పు మోపడానికి కూడా
మచ్చలేని సంఘము!
*సంఘానికి ప్రభువు తననుతాను చేసుకునే పరిచయం*:
ముందుగా చెప్పినట్లు
ఏడు సంఘాలకి ప్రభువు ఏడు రకాలుగా తననుతాను పరిచయం
చేసుకున్నారు! ఈ సంఘానికి మొదటివాడును కడపటి వాడును మృతుడై మరల
బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా.....
మొదటివాడును కడపటి
వాడును మృతుడై మరల బ్రతికిన వాడును అంటూ పరిచయం చేసుకున్నారు!
ముందుగా చెప్పినట్లుగా
మొదటి అధ్యాయంలో యోహాను గారు ఏమి విన్నారో ఆ సంగతులతోనే ఇక్కడ కూడా పరిచయం చేసుకున్నారు
దేవుడు! మొదటివాడును,
కడపటివాడును అంటూ!
ఎందుకు
అలా చేసుకోవలసి వచ్చింది?
కారణం
స్ముర్ణ సంఘము భయంకరమైన శ్రమలలో బాధలలో కటిక పేదరికంలో ఉన్నారు! తొమ్మిదో వచనంలో నీ శ్రమను
దరిద్రతను నేనెరుగుదును అంటున్నారు! దరిద్రత అనే దానికోసం చూసుకుంటే
నిజంగా స్ముర్ణ సంఘస్తులు పేదవారు కానేకాదు! పేదవారుగా మారిపోవలసి
వచ్చింది! ఇది తెలియాలంటే కొద్దిగా అప్పుడు జరిగిన సంగతులను జ్ఞాపకం
చేసుకోవాలి!
చరిత్ర
ప్రకారం ఆదిమకాలములో అన్ని సంఘాలలో శ్రమలు రేగినట్లే అంతియొకయ నికోన్యా లుస్త్ర సంఘాలకు
శ్రమలు కలిగినప్పుడే ఈ స్ముర్ణ సంఘానికి కూడా మహా భయంకరమైన శ్రమలు అన్యుల నుండి తమ
సొంత జాతి వారినుండియే కాక,
యూదుల నుండి శ్రమలు కలిగాయి ఈ సంఘాలన్నిటికి! అయితే
యూదులు అప్పటికే చెదిరిపోయి చాలా తక్కువ జనాబాతో ఈ పట్టణంలో ఉన్నప్పుడు కూడా యూదులు
వీరిని అనగా స్ముర్ణ సంఘానికి ఎలా భాధపెట్టగలిగారు అంటే యూదులు తెలివైన వారు కదా,
ఈ స్ముర్ణ పట్టణంలో వ్యాపారం చేసి ధనవంతులయ్యారు! అయితే నాయకులను మచ్చిక చేసుకోడానికి పట్టణాభివృద్ధి పేరిట వీరు సంవత్సరానికి
పదివేల వెండి నాణెములు కానుకగా ఇస్తూ ఉండేవారు! ఆ కాలంలో అది
చాలా పెద్ద కానుక! ఇలా మచ్చిక చేసుకుని నాయకులను చెప్పుచేతల్లో
ఉంచుకుని యూదులు వారికిష్టమొచ్చినట్లు క్రైస్తవులను హింసిస్తూ ఉండేవారు!
క్రైస్తవుల
మీద నరమాంస భక్షకులు అనే నేరం మోపి భయంకరమైన హింసలకు బలిచేశారు! *క్రైస్తవులు ఏమిటి నరమాంస
భక్షకులు ఏమిటి అని ఆశ్చర్య పడుతున్నారా? మనము తీసుకునే సంస్కారంలో
రొట్టెను ఏమంటాము—యేసుక్రీస్తుప్రభులవారి శరీరము అంటాము
కదా, ద్రాక్షారసమును
ఏమంటాము—క్రీస్తురక్తము అంటాము కదా! దీనినే వారు క్రీస్తు అనబడే
ఒక వ్యక్తిని చంపి ఆయన రక్తాన్ని త్రాగుతూ ఆయన మాంసాన్ని తినే నరమాంస భక్షకులు క్రైస్తవులు
అని నాయకులకు ప్రజలకు చెప్పి అనేకమైన భాధలకు గురిచేసి అనేకులను పట్టణ బహిష్కరణ చేశారు*!
వారి ఆస్తులను దోచుకున్నారు! ఇక ఈ హింసలు పడలేక
పట్టాణాని వదిలి వచ్చిన వారు అనేకులు! ఇలా సంఘము ఒకనాడు ధనవంతులైనా
క్రీస్తుశ్రమల కోసం/వలన దరిద్రులైపోయారు! అందుకే ఈ సంఘాన్ని శ్రమల సంఘము అంటారు!
*అయితే ఈ శ్రమలనుండే అచ్చమైన క్రీస్తు
సైనికులు తయారయ్యారు! శ్రమలు పెరిగే కొలది విశ్వాసంలో రాటుదేలిపోయారు!
శ్రమలలోనుండి స్తిరమైన సంఘం పుట్టుకొచ్చింది! శ్రమలు
ఈ సంఘాన్ని సంపూర్ణతలోకి నడిపించాయి! లోపం లేని సంఘముగా మారింది!
దేవుడు ఏ విధమైన నేరము ఈ సంఘము మీద మోపడం లేదు*!
సరే, ఎందుకు దేవుడు ఈ సంఘాన్ని మొదటివాడను కడపటి
వాడను మృతుడనయ్యాను గాని ఇప్పుడు జీవించు చున్నాను అని పరిచయం చేసుకుంటున్నారు అంటే
ఓ నా ప్రియమైన స్ముర్ణ సంఘస్తులారా! మిమ్మును నేను పరిశీలిస్తున్నాను
మీతోనే ఉంటున్నాను! పూర్వము భక్తులతో ఉన్నాను! మీ తర్వాత కూడా ఉంటాను! ఇప్పుడు మీతోకూడా నేను తోడుగా
ఉంటున్నాను అని ధైర్యము చెప్పడానికి అంటున్నారు నేను మొదటి వాడను కడపటి వాడను!
మిమ్మును చేయివిడిచిపెట్టలేదు! మీతోనే ఉంటున్నాను
అంటున్నారు!
పేతురు గారు అంటున్నారు : ఇప్పుడు కష్టాల పడుచున్న మీరు వేచియుండండి
ఆయన తగినకాలమందు మిమ్మును హెచ్చించబోతున్నారు అంటూ ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నారు
గనుక మీ చింతయావత్తు ఆయన మీదనే వేయండి అంటున్నారు. 1పేతురు
5:6—10
6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై
యుండుడి.
7. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు (లక్ష్యము చేయుచున్నాడు)
గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన
అపవాది (సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని
మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు.
9. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి,
విశ్వాసమందు స్థిరులై, వానిని ఎదిరించుడి.
10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు,
కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును
పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.
కాబట్టి ఈ సంఘము శ్రమలను
తట్టుకుని స్థిరమైన సంఘముగా రూపాంతరం చెందింది. ప్రియ సహోదరి సహోదరుడా! ఒకవేళ నేడు నీవు
శ్రమలను, నిందలను, భాధలను అనుభవిస్తున్నావా?
నన్ను పట్టించుకునే వారు, నాకు తోడుగా నిలిచే వారు
ఎవరూ లేరే అని భాదపడుతున్నావా? స్ముర్ణ సంఘానికి చెప్పిన మాట
దేవుడు నీతోను నాతోను, ఎవరైతే శ్రమలను అనుభవిస్తున్నారో వారందరికీ
చెబుతున్నారు: నేను మొదటివాడను కడపటి వాడను! మీ అందరిని చూస్తున్నాను అందరితోను ఉన్నాను! దైర్యముగా
ఉండండి అంటున్నారు! కాబట్టి ఆయననే తోడుగా ఉంచుకుని ఈ భయంకరమైన
శోధనలను చిరునవ్వుతో ఎదుర్కుంటూ గమ్యం చేరుదాం!
*స్ముర్ణ సంఘము-2*
ప్రకటన 2:9—10
9. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే;
తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక,
సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.
10. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది (అనగా-సాతాను) మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు;
పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు (లేక- ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా
ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
ఇక తొమ్మిదో వచనంలో నీ శ్రమను
దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అంటున్నారు దేవుడు!
గతభాగంలో ఈ స్ముర్ణ సంఘము ఏ విధంగా దరిద్రతలోనికి నెట్టబడినదో చూసుకున్నాము!
అయితే మరొక అభిప్రాయం కూడా చెబుతారు! ఏమిటంటే అక్కడున్న
పేదలే మొదటగా సువార్తను నమ్మి అంగీకరించి ఉండవచ్చు! అందుకే అలా
అన్నారు దేవుడు అంటారు! మరికొందరు దేవునికోసం ఇష్టపూర్వకంగా తమ
ఆస్తులను వదిలి వచ్చేశారు అంటారు! అయితే ఏదిఏమైనా ఈ ఉత్తరం చేరబోయేసరికి
స్ముర్ణ సంఘం కటిక పేదరికంలో ఉంది—గాని ఆత్మీయంగా మహా పటిష్టమైన స్తితిలో ఉంది!
యాకోబు గారు అంటున్నారు
యాకోబు 2: 5
నా
ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు
భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన
రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచు కొనలేదా?
లూకా 6:20—23
20. అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది.
21. ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు.
ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
22. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి
మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు.
23. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము
పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా
చేసిరి.
ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు
ప్రపంచంలో ఉన్న పేదలందరూ దేవునిరాజ్యమునకు వారసులు అని చెప్పడం లేదు గాని ఎవరైతే ఆయన
మాట విని సువార్తకు లోబడుతారో వారందరి కోసం చెబుతున్నారు- పేదలైన వారలారా పరలోక రాజ్యము మీదే అంటున్నారు!
ధనవంతులు తమకు కలిగిన ఐశ్వర్యంతో దేవుడు ఎవడు అనే స్థితిలోనికి వచ్చారు
కాబట్టి పేదలైన వారిని ప్రేమించి తన రాజ్యమునకు వారసులుగా చేస్తున్నారు దేవుడు!
ఈ సంఘము ప్రభువుకోసం
పేదలుగాను దీనులు గాను మారిపోయారు. అలాగే మనము కూడా ఆత్మలో దీనులుగా ఉంటూ దీనత్వం కలిగి జీవించాలి.
అయితే మన జీవితాలు
ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం! స్ముర్ణ సంఘస్తులు దేవునికోసం పేదలుగా మారిపోయారు! శ్రమలను
దరిద్రతను సహించారు సంతోషంతో అనుభవించారు! మనకైతే దేవుడు మంచి
ఉద్యోగం లేక చేయడానికి పనిపాటులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి దీవిస్తే,
ఆయన సన్నిధికి రావడానికి కాళీ ఉండటం లేదండి అంటున్నాము కదా! ఆదివారం నాడు బందువుల ఇంటికి షికార్లకు వెళ్ళడానికి సమయం ఉంది గాని ఆదివారం
మందిరానికి వెళ్ళడానికి కాళీ ఉండటం లేదు! అయ్యా నాకు బ్రతకడానికి
ఏదైనా పనివ్వండి బాబు అని ఏడ్చినప్పుడు దేవుడు పనిపాటులు కలిగిస్తే ఇప్పుడు కాళీ లేదు
అంటున్నావా? మరికొంతమంది ఐశ్వర్యం కలిగిన తర్వాత మంచి ఇల్లు దేవుడు
ఇచ్చాక ప్రార్ధన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఉపవాస ఆరాధన లేదు ఏదీ లేదు! మరికొంతమంది ధన సంపాదన కోసం
దేవుడు చెప్పిన మాటలన్నీ మరచి అన్యాయమైన రీతిలో ధనాన్ని సంపాదించుకుంటున్నారు!
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డబ్బులు సంపాదిస్తావు అంటున్నారు!
అంతేకాకుండా తమభర్తలను తప్పుడు మార్గాలలో ధనము సంపాదించమని ప్రోత్సహిస్తున్నారు!
సంఘమా! జాగ్రత్త! దేవునికి
ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ధనము దేవునికి ఇవ్వకపోతే
ఆయన మీనుండి ఎలాగైనా రాబట్టుకుంటారు! మిమ్మల్ని హాస్పటల్ బెడ్
మీదకు ఎక్కించి మరీ ప్రార్ధన చేయించుకుంటారు! కష్టపడి సంపాదించిన
డబ్బు, దేవునికి ఇవ్వకుండా నీవు దాచిన డబ్బు అంతా డాక్టర్లకు
మందులకు పోయాల్సి వస్తుంది జాగ్రత్త! అంతకంటే నీవు దేవుని దృష్టిలో
దోషిగా నిలబడతావు అని మర్చిపోవద్దు!
దుర్దినములు రాకముందే
ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదు అని చెప్పే గడియ రాకముందే వాన కురిసి మరలా మేఘము
పట్టకముందే నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నారు దేవుడు!
హాస్పటల్ ఆపరేషన్
లాబ్ లో నీ పొట్టమీద కత్తి పెట్టకముందే బ్రతుకో మార్చుకో అంటున్నాను నేను!
Ecclesiastes(ప్రసంగి) 12:1,2
1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు
రాకముందే,
2. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే
నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
మరికొంతమంది
ఘనమైన చర్చిలు కట్టడం లోను,
చర్చిని అందంగా డెకరేషన్ చేయడంలోనూ మునుగుతున్నారు కాని వారి ఆత్మీయ
జీవితం కోసమాలోచించడం లేదు! ఆరాధనకు వస్తున్నారు, సంఘ కార్యక్రమాలలో పాలుపొందుతున్నారు. నేను దేవుని సేవ
చేస్తున్నాను అనుకుంటున్నారు గాని వారి జీవితంలో ప్రార్ధన అనుభవం, మోకాళ్ళ అనుభవం, ఆత్మాభిషేకం లేదు! పెదాలతో దేవుని సేవ చేస్తూ హృదయం దేవునికి దూరంగా ఉంది!
ప్రియ
దేవుని బిడ్డా! నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకో! బ్రతుకు మార్చుకో!
సరే, దేవుడు
అంటున్నారు ఇక్కడ సంఘముతో నీ శ్రమలను దరిద్రతను నేను ఎరుగుదును. అయితే నీవు ధనవంతుడవే అంటున్నారు! గమనించాలి ఈ సంఘము
ఆర్ధిక పరంగా దరిద్రులు గాని ఆధ్యాత్మికంగా ధనవంతులై భాగ్యవంతులై ఉన్నారు కాబట్టి నీవు
ధనవంతుడవు అంటున్నారు దేవుడు!
మొదటగా
వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి వారు ధనవంతులు! ఈ భూమి ఆకాశం వెండి బంగారం భూమిమీద నున్న జంతువులూ
అన్ని నావే కదా అంటున్నారు దేవుడు! అట్టి దేవుణ్ణి తండ్రిగా నాయకుడిగా
దేవునిగా కలిగియున్న నీవు, ఆయనకు కలిగినవి నీవే కదా! అందుకే వీరు ధనవంతులు!
పౌలుగారు చెబుతున్నారు:
1కొరింథీ ౩:21—23
21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును
మీవి.
22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను,
ప్రస్తుతమందున్నవి యైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.
2కొరింథీ 8:9
మీరు
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు
తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
ఎఫెసీ 1:౩
మన
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక
విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
అంతేకాకుండా యేసుక్రీస్తుప్రభులవారు
ఈ భూమిమీద ఉన్నప్పుడు చెప్పారు మీరు భూమిమీద ధనాన్ని సంపాదించుకోవద్దు గాని పరలోకంలో సంపాదించుకొండి అన్నారు! ఎలా సంపాదించుకోవాలో
కూడా చెప్పారు! భూమిమీదనున్న మిక్కిలి అక్కరలో ఉన్నవారికి
, పేదలకు, దిక్కులేని వారికి సహాయం చేసి పరలోకంలో
ధనం సంపాదించుకోమన్నారు. వీరు సంపాదించుకున్నారు. మత్తయి 25:31--46;
ప్రియమైన సహోదరి/సహోదరుడా! నీవు ధనాన్ని
ఎక్కడ సంపాదించుకుంటున్నావు భూమిమీదనా లేక పరలోకమందా? ఇక్కడైతే
దొంగయు దోచుకును వాడు ఉంటాడు జాగ్రత్త!
ఆధ్యాత్మిక విషయాలలో
ధనవంతులవుదాం! స్ముర్ణ సంఘస్తులు
వలే ఆయనతో సెహబాస్ అనిపించుకుని మచ్చలేని జీవితం జీవిద్దాం!
*స్ముర్ణ సంఘము-3*
ప్రకటన 2:9—10
9. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే;
తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక,
సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.
10. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది (అనగా-సాతాను) మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు;
పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు (లేక- ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా
ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
ఇక తొమ్మిదో వచనంలో నీ శ్రమను
దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అంటూ— తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ
నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అంటున్నారు!
యూదులమని చెప్పుకొనుచు
యూదులు కానివారి వలన నీకు కలుగు దూషణ నాకు తెలుసును అంటున్నారు దేవుడు! ముందటి భాగాలలో చెప్పుకున్నాము మనము యూదుల
వలన స్ముర్ణ సంఘము ఎటువంటి శ్రమలను శోధనలను అనుభవించిందో ... ఈ శోధనలు, దూషణలు నాకు తెలుసు అంటున్నారు దేవుడు!
వీరికి సాతాను సమాజము అని పేరుకూడా దేవుడే పెట్టారు! ఎందుకు దేవుడు వీరిని సాతాను సమాజం వారు అన్నారో చూసుకుందాం!
౩:9 లో కూడా వీరిని సాతాను
సమాజం వారు అంటున్నారు దేవుడు! వీరు అనగా ఈ యూదులు జాతిప్రకారం
యూదులే- యూదా జాతే! అయితే దేవుని దృష్టిలో
వారు యూదులు కాదు అన్నమాట! దీనికోసం పౌలుగారు విస్తారంగా రోమా
పత్రికలో వ్రాశారు!
రోమా 2:26—29
26. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి
లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
27. మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును
సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?
28. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన
సున్నతి సున్నతికాదు.
29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి
హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.
శరీరమందు యూదుడైన
వాడు యూదుడు కాదు అంతరంగమందు సున్నతి పొందిన మనమే అసలైన యూదులము అంటున్నారు పౌలుగారు! ఈ సున్నతి ఆత్మ సంబంధమైనది! శారీరకమైనది కాదు! ఆ యూదులు కేవలం శారీరక సంబంధమైన సున్నతిని
మాత్రము పొంది, అంతరంగమందు సున్నతి లేకుండా ప్రేమ లేకుండా సాటి
యూదులు, మనుష్యులు అని చూడకుండా వీరిని అతి ఘోరంగా హింసిస్తున్నారు!
ఊరు అందమైనదే, పట్టణం సౌందర్యమైనదే గాని వారి మనస్సులే
మహా వికారమైనవి! ప్రజలను హింసిస్తూ అవమానిస్తూ ఆనందం పొందుతున్నారు!
అందుకే పౌలుగారు ఫిలిప్పీ
౩:2—3 లో అంటున్నారు.....
2. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి
విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించువారి విషయమై జాగ్రత్తగా
ఉండుడి.
3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు,
క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
శరీరం మీద నమ్మకం
ఉంచేవారం మనము కాదు, వారు.
మనమైతే ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ యేసుక్రీస్తుప్రభులవారిలోనే అతిశయపడుతున్నాము
అంటున్నారు!
వారు యూదులము దేవుని
బిడ్డలము అని చెప్పుకుంటూ దేవునికి భయపడటం లేదు గాని వారు విధేయత చూపించేది సైతానుకే! అందుకే వారిని దేవుడు సైతాను సమాజం వారు
అంటున్నారు!
యిర్మియా గారు అంటున్నారు 17:9
హృదయము
అన్నిటికంటె మోసకరమైనది,
అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు
వారి కోసం అన్నారు యోహాను 8:44
మీరు
మీ తండ్రియగు అపవాది
( అనగా,సాతాను) సంబంధులు;
మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి
వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు;
వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక,అబద్దకునికి జనకుడునై) యున్నాడు.
చివరికి ఈ యూదులు ఏమి చేశారో తెలుసా? యూదులము – సబ్బాతును/విశ్రాంతిదినమును ఆచరించేవారము అని చెప్పుకునే వీరు ఆ పట్టణస్తులను మచ్చికచేసుకుని వీరి నాయకుడు
లేదా బిషప్ గారైన పోలికార్పుని బ్రతికుండగానే కాల్చివేశారు! ఏరోజు?
విశ్రాంతిదినమున! ఆ రోజు తీర్పు వెలువడింది కాబట్టి
రేపు ఈ తీర్పు మారిపోతుంది ఏమో అని, విశ్రాంతిదినమున ఏ పని చేయకూడదని
ధర్మశాస్త్రము చెబితే వారు సబ్బాతు దినముననే వారు బయటికి వెళ్లి, కట్టెలు తెచ్చి- పేర్చి- పోలికార్పు
గారిని సజీవదహనం చేశారు! ఇదీ వారి పాశవికత! పైశాచికత్వం! అందుకే వీరిని దేవుడు సాతాను సమాజం వారు
అన్నారు!
ప్రియులారా మనం అలా ఉండకూడదు! ప్రేమకలిగి
ఉండాలి ప్రతీ ఒక్కరితో!
ప్రియ సహోదరి సహోదరుడా! హృదయ సంబంధమైన సున్నతిని నీవు
పొందావా? నీ హృదయం కోయబడిందా? పాపపు ఆలోచనలు
తలంపులు హృదయములోనుండి తొలగించుకొన్నావా? అయితే నీవు ధన్యుడవు!
అది లేకపోతే నేడే పొందుకో!
అయితే దేవుడు అంటున్నారు ఇప్పటికే నీవు శ్రమ పొందుతున్నావు
ఇంకా నీకు కలుగబోయే శ్రమలకు రాబోయే కష్టాలకు భయపడకు అంటున్నారు!
యోహాను సువార్తలో దేవుడు అంటున్నారు లోకంలో మీకు శ్రమకలుగును
అయినా మీరు భయపడవద్దు అన్నారు!..
యోహాను 16: 33
నాయందు
మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును;
అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి
యున్నాననెను.
యోహాను 14:27 లో నా శాంతినే మీకిస్తున్నాను.
మీ హృదయాలను కంగారుపడనివ్వకండి అంటున్నారు!...
శాంతి (లేక, సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే (లేక, సమాధానము)
మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను
మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
మత్తయి 10:26—28, 31
26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు,
రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
27. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.
28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
31. గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
లూకా 12:32
చిన్న
మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది
హెబ్రీ 13:5—6
5. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను
అని ఆయనయే చెప్పెను గదా.
6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై
యున్నాము.
రోమీయులకు 8: 28
దేవుని
ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
కాబట్టి భయపడవద్దు
అని దేవుడు చెబుతున్నారు! ఈరోజు
నీవు శ్రమలలో భాధలలో ఉంటే, నీకు కూడా దేవుడు చెబుతున్నారు నా
బిడ్డా! నీ భాధలను నేను చూస్తున్నాను! నీకోసం
నేను చింతిస్తున్నాను! నీవు భయపడవద్దు! నీ చింత యావత్తు నామీద వేసుకుని నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు!
యుద్ధము చేసే వాడిని నేనే! నేనే నీ పక్ష్యంగా యుద్ధం
చేస్తాను! నమ్మికమాత్రము ఉంచు అంటున్నారు దేవుడు! కనుక ధైర్యంగా ఉందాము!
*స్ముర్ణ సంఘము-4*
ప్రకటన 2:10
ఇదిగో
మీరు శోధింపబడునట్లు అపవాది (అనగా-సాతాను) మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు; పది దినములు
శ్రమ కలుగును; మరణమువరకు (లేక-ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
ఇక పదో వచనంలో ఇదిగో
సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది దినములు శ్రమ కలుగును. అయితే మరణము
వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను అంటున్నారు!
గమనించాలి: ఈ సంఘము శ్రమల సంఘము,
శ్రమల వాసన గల సంఘము అని ముందుగా చెప్పుకున్నాము! ఈ శ్రమలద్వారానే వారు సంపూర్ణత సాధించి లోపములేని సంఘముగా తీర్చబడ్డారు!
దేవుడు అంటున్నారు- ఈ శ్రమలే కాదు మీలో కొందరిని
సాతాను గాడు చెరలో అనగా జైలులో పెట్టబోతున్నాడు! చివరికి నీకు
మరణం కూడా సంభవించబోతుంది కొందరికి! పది దినములు శ్రమ కలుగును-
అయితే ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో వారికి జీవకిరీటం ఇస్తాను అంటున్నారు!
గమనించాలి: సాతాను గాడి ఉద్దేశ్యం ఏమిటంటే
వీరిని శ్రమల పాలు చేస్తే వీరు విశ్వాస బ్రష్టులైపోతారు. అప్పుడు
తిరిగి వారి పాత విశ్వాసానికి వెళ్ళిపోతారు! మరికొందరు నాయకులు ఏమని తలంచారు అంటే: ఇలాంటి శ్రమల పాలు చేస్తే ఇంకెవరు క్రైస్తవులుగా మారడానికి ధైర్యము చెయ్యరు
అందుకే ఇలాంటి కటినమైన శ్రమలకు గురిచేద్దాం అనుకున్నారు!
చరిత్ర
చూసుకుంటే పోలికార్పు గారి మరణం తర్వాత మరింత శ్రమలు కలిగాయి, గాని ఆ తర్వాత పట్టణం మొత్తం
మారిపోయింది. ప్రస్తుతం అది ముస్లిం దేశమనుకోండి. దానికి కారణం RCM మతపాలకులు! అది
వేరేవిషయం! అయితే మొదట్లో ఆ పట్టణం మొత్తం మారిపోయింది!
క్రీస్తుయేసుకి తగ్గ శిష్యుడు యోహాను గారైతే, గురువుగారికి
తగ్గ శిష్యుడు పోలికార్పు గారు! ఆ గురువుగారికి తగ్గ విశ్వాసులు
స్ముర్ణ సంఘస్తులు! చావుకైనా తెగించారు కాని క్రీస్తుని మాత్రం
వదలలేదు!
ప్రియమైన
దైవజనుడా! నిన్ను నీ విశ్వాసులు గమనిస్తున్నారు అని మర్చిపోవద్దు! నీవు సంఘానికి మాదిరిగా ఉండాలి! పేతురు గారు అదే చెప్పారు!
మాదిరిగా ఉండండి గాని వారిని పాలించవద్దు! నీవు
ప్రార్ధనా పరుడివి, మోకాళ్ళ అనుభవం, కన్నీటి
ప్రార్ధన అనుభవం, ఆత్మాభిషేకం కలవాడివి అయితే నీ సంఘస్తులు కూడా
మోకాళ్ళ అనుభవం కలిగి, కన్నీటి ప్రార్ధన అనుభవం కలిగి,
ఆత్మాభిషేకం కలవారు అవుతారు! నీలో సరుకు లేకపోతే
వారుకూడా నామకార్ధ క్రైస్తవులే అవుతారు! కాబట్టి ప్రియ దైవజనుడా!
పోలికార్పు గారివలె మండుచున్న అగ్నిలా మారి సంఘాన్ని వెలిగించు!
అయితే ఈ శ్రమలు మనకు
ఒక పరీక్ష అని మర్చిపోకూడదు!
కీర్తన 66:10—12
10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.
12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి
అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.
1పేతురు 1:6—7
6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన
శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
2పేతురు 2: 9
భక్తులను
శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా
నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,
యాకోబు 1:2—౩
2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును
పుట్టించునని యెరిగి,
3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని
యెంచుకొనుడి.
ఇక తరువాత విషయం: పది దినములు శ్రమ కలుగును అంటున్నారు. మరి పది దినములేనా
వీరికి శ్రమలు కలిగాయి? ఏమో తెలియదు గాని శ్రమలు మాత్రం విస్తారంగా
పొందుకున్నారు వీరు!
దీనికోసం
భిన్నమైన అభిప్రాయాలున్నాయి:
నీరో చక్రవర్తి నుండి డయోక్లేషియస్ వరకు వీరి పరిపాలనా కాలంలో సంఘము
పది రకాలైన శ్రమలను అనుభవించింది. అదే పది దినముల శ్రమలు అని
కొందరు అభిప్రాయపడతారు! మరికొందరు డయోక్లేషియస్ రాజుగా ఉన్నప్పుడు
పది సంవత్సరాలు వీరిని భయంకరముగా హింసలకు గురిచేశాడు! మరి అసలు
ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు గాని పది రోజులలో వారి శ్రమలు మాత్రం ముగియలేదు!
ఇక
తర్వాత మరణం వరకు నమ్మకముగా ఉండుము అప్పుడు నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నారు దేవుడు! మరణం వచ్చినా గాని దేవుని పట్ల గల నమ్మకం విశ్వాసం విడువకపోతే
దేవుడు జీవకిరీటం ఇస్తాను అంటున్నారు! మరి నీవు నమ్మకముగా ఉండగలవా?
మరణం వచ్చినా శ్రమలు వచ్చినా నీ నమ్మకం విడువకుండా ఉంటావా? నీ కోటా (రేషన్) కార్డు తీసేస్తాము
, నీకున్న రిజర్వేషన్ తీసేస్తాము అంటే ఏమంటావు? రక్షణను, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటావా లేక నీ రేషన్
కార్డు, నీ రిజర్వేషన్ నిలబెట్టుకుంటావా? ఒకరోజు వస్తుంది- ఆరోజు నీవు రిజర్వేషన్ ల కోసం,
నీ హక్కుల కోసం పోరాటం చేయలేవు! అయితే
666 ముద్ర వేసుకుని వాడికి జై అనాలి! లేకపోతే హతస్సాక్షి
కావాలి! మరి నీవు సిద్దమా?
సరే, క్రొత్త నిబంధనలో మనకు కొన్ని కిరీటాలు
కనిపిస్తాయి. వాటిని క్లుప్తంగా చూసుకుందాం!
*జీవ కిరీటం*:
శోధనలు శ్రమలను సహించిన
వారికి, చివరి వరకు నమ్మకముగా
జీవించిన వారికి: యాకోబు 1:12; ప్రకటన
2:10
*మహిమ కిరీటం*:
సంఘమును లేక తమకు
అప్పగించిన మందను నమ్మకముగా కాయువారికి అనగా సంఘకాపరులకు; 1పేతురు 5:2—4
*అతిశయ కిరీటం*:
ఆత్మలను రక్షించువారికి; 1థెస్స 2:19
*నీతి కిరీటం*:
మంచి పోరాటం పోరాడి
పరిశుద్ధతను కాపాడుకొని, తమకు
అప్పగించిన పనిని నమ్మకముగా పూర్తిచేసే వారికి; 2తిమోతి
4:8
*అక్షయ కిరీటం*:
భక్తిలో విజయం సాధించేవారికి
లేక మితముగా జీవించి విజయం సాధించిన వారికి;
1కొరింథీ 9:25—27
*సువర్ణకిరీటం*:
ఇరవై నలుగురు పెద్దలకు.
ప్రకటన 4:4
ప్రియ దైవజనమా! ఇన్ని కిరీటాలు మనకోసం సిద్ధంగా ఉన్నాయి!
ఈ సంఘానికి జీవకిరీటం దొరికింది! మరినీవు ఏ కిరీటం
పొందుకుంటావు? అవి కావాలి అంటే ముఖ్యంగా శ్రమలను సహించాలి,
మరణము వరకు నమ్మకముగా ఉండాలి! మరి నీవు ఉండగలవా?
*స్ముర్ణ సంఘము-5*
ప్రకటన 2:11
సంఘములతో
ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
ఇక పదకొండో వచనంలో
ఈ సంఘం కోసం చెప్పిన చివరిపలుకులు మనకు కనిపిస్తాయి! సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక!
దీనికోసం ఎఫెసీ సంఘ చివరి పలుకులలో చెప్పుకున్నాము!
ఇక
జయించేవాడు పొందుకునే భాగ్యములో : జయించువాడు రెండవ మరణము వలన ఏహానియు చెందడు అంటున్నారు!
అనగా ఇక్కడ రెండు
విషయాలు మనకు అర్దమవుతున్నాయి!
మొదటిది: మొదటి మరణం రెండవ మరణము అంటూ రెండు మరణాలు
ఉన్నాయి!
రెండవది: రెండవ మరణం వలన హాని ఉన్నది అని కూడా అర్ధమవుతుంది!
మొదటగా: *మొదట మరణం అనగా ఏమిటి*?
సామాన్య లేక సహజమరణం! అనగా ఈ లోకంలో బ్రతికినంత కాలం బ్రతికి
ఈ లోకంలో ఏదో కారణం వలన చనిపోవడాన్ని మొదటి మరణం అంటాము!
ఇక రెండవ మరణం కోసం చెప్పుకునే ముందు రెండవ మరణం అంటూ ఉంది
అనగా మొదటి మరణం తర్వాత మానవ జీవితం అంతమవడం లేదు అని గ్రహించాలి! అలాగని
మన పురాణాలలో చెప్పుకునేటట్లు మరుజన్మ లేనే లేదు! ఏమిటండి మరుజన్మ
లేదు అంటున్నారు- మొదటి మరణం తర్వాత జీవితం ఉంది అంటున్నారు అని
అడగవచ్చు: అవును మొదటి మరణం తర్వాత జీవితం ఉంది గాని మరుజన్మ
లో కుక్కగానో నక్కగానో పుట్టడం అంటూ లేదు! ఇదిబైబిల్ ఒప్పుకోదు!
అయితే ఈ మానవ జీవితంలో బ్రతికే కాలం, మనిషి నాటకములో
తన పాత్ర పోషించి ముగించి వెళ్ళిపోవడం లాంటిది! తన పాత్ర బాగా
పోషిస్తే అనగా మంచి జీవితం జీవించి అందరికీ మేలు చేసి పదిమందితో మంచి వాడు అని చెప్పుకునే
లాగ జీవిస్తే మరుజన్మ లో మానవుడుగా పుడతాడు అని వారు ఎలా చెబుతున్నారో- వాటితో పాటుగా క్రీస్తుయేసుప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి,
ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం,
పరిశుద్ధమైన ప్రార్ధనా జీవితం గలవారు పరలోకానికి వెళ్తారు; మరలా మానవునిగా పుట్టరు!
బ్రతుకుని పాడుచేసుకున్నవారు,
రక్షణను పొందుకొనని వారు, పొందుకుని పోగొట్టుకున్నవారు,
యేసుని రక్షకునిగా అంగీకరించని వారు మండే అగ్ని గుండములో అనగా నరకంలోనికి
పోతారు! ఇది రెండోజీవితం అన్నమాట!
మొదటి జీవితం భూమిమీద! దీని కాలం తక్కువ.
మహా అయితే 70 లేదా 80 సంవత్సరాలు! రెండో జీవితం అయితే పరలోకంలో లేదా
నరకంలో లేక పాతాళంలో! దీని కాల వ్యవధి: అనంతము! యుగయుగములు అక్కడే జీవించాలి!
నరకము /పాతాళము దేవుడు మనుష్యుల కోసం చెయ్యలేదు- సాతానుడు వాడి
దూతల కోసం చేయబడింది అని బైబిల్ చెబుతుంది!
మత్తయి 25: 41
అప్పుడాయన
యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని
(అనగా-సాతానుకును) వాని దూతలకును
సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి.
అయితే
పరలోకం అనేది మనుష్యుల కోసం చెయ్యబడింది!
మత్తయి 25: 34
అప్పుడు
రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో
ముందుగానే నిర్ణయం తీసుకుని దానికి పునాది ఇక్కడే వెయ్యాలి! ఇక్కడ
ఈ భూమిమీద జీవించిన విధానం బట్టే నీ గమ్యం నిర్ణయింపబడుతుంది! అందుకే కదా యేసునందు విశ్వాసముంచి ఆ మార్గములో నడవమని చెప్పేది మనము!
కాబట్టి ఏ మార్గం కావాలో తేల్చుకో నేడే!
సరే, ఇప్పుడు బైబిల్ చెబుతున్న రెండవ
మరణం ఏమిటి? దానివలన కలిగే హాని ఏమిటి అనేది చూసుకుందాం!
రెండు
మరణాలు ఎలాగున్నాయో అలాగే పునరుత్థానాలు కూడా ఉన్నాయి! దీనికోసం కొంతమంది పండితులు
ఏడు పునరుత్థానాలు అంటారు, కొందరు మూడు పునరుత్థానాలు అంటారు.
కొందరు ఐదు పునరుత్థానాలు అంటారు! నాకైతే తెలియదు!
నేను బైబిల్ పండితుడిని కాను! బైబిల్ ఏమి భోదిస్తుందో
అది మాత్రమే నేను చెబుతాను!
నాకు
తెలిసిన పునరుత్తానాలు: మొదటిది 1థెస్స 4:13--17 ప్రకారం
దేవుని బూర (కడబూర కాదు) మ్రోగిన వెంటనే
క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. ఇది ఒక పునరుత్థానం!
వారు లేచిన వెంటనే బ్రతికిఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు!
దాని తర్వాత మనకు
ఇద్దరు హతసాక్షులు బ్రతుకుతారు బైబిల్ చెబుతుంది ప్రకటన
11వ అధ్యాయం! అయితే అది ఇద్దరికోసమే చెప్పబడుతుంది
కాబట్టి దానిని ముఖ్యమైన పునరుత్థానం అనరు అనిపిస్తుంది నాకు!
అయితే
మనకు ప్రకటన గ్రంధం 20వ అధ్యాయంలో మొదటి పునరుత్థానం, రెండో మరణం ,
రెండో పునరుత్థానం కనిపిస్తుంది! ఒకసారి
20వ అధ్యాయాన్ని క్లుప్తంగా చూసుకుందాం!
హార్మేగిద్దోను యుద్ధం
తర్వాత సైతానుగాడు వెయ్యేండ్లు అగాధంలో పడవేయబడతాడు! ఆ తర్వాత వెయ్యేండ్ల పాలన భూమిమీద ప్రారంభమవుతుంది.
దానిలో పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన
పరిశుద్ధులు అనగా ఎత్తబడిన వారు యేసుక్రీస్తుప్రభులవారితో పాటుగా రాజ్యం చేస్తారు!
అయితే 4వ వచనం ప్రకారం ఏడేండ్ల మహాశ్రమల కాలంలో
అనగా విడువబడినవారిలో మార్పునొంది క్రీస్తుకోసం హతస్సాక్షులుగా మరణించిన వారి ఆత్మలు
కనిపిస్తున్నాయి. వారు మహాశ్రమల కాలంలో ఆ మృగం యొక్క ముద్ర
666 వేయించుకోలేదు! వారు పునరుత్థానులై బ్రతికినట్లు
కనిపిస్తుంది మనకు....
ప్రకటన
గ్రంథం 20: 4
అంతట
సింహాసనములను చూచితిని;
వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.
మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని,
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము
శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై,
వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.
ఇలా హతస్సాక్షుల యొక్క
పునరుత్థానమును బైబిల్ మొదటి పునరుత్థానము అని చెబుతుంది 5వ వచనంలో! ఇది మొదటి
పునరుత్థానం!
ఇక వెయ్యేండ్ల
పాలన ముగిసాక సాతాను గాడు విడిపించబడితే వాడు మరలా గోగుమాగోగు యుద్ధానికి కాలుదువ్వుతాడు! అప్పుడు పరము నుండి అగ్ని వచ్చి వారందరినీ దహించివేస్తుంది. సాతాను గాడు ఇక పర్మినెంట్ గా నరకంలో ఉంటాడు!
అది జరిగాక
దవళ సింహాసనం తీర్పు జరుగుతుంది. అప్పుడు ఆ దవళ
సింహాసనం తీర్పుకోసం భూమి చేసినది మొదలుకొని ఇంతవరకు పుట్టి, బ్రతికి చనిపోయిన ప్రతివాడు అక్కడ తీర్పుకి పునరుత్థానులౌతారు . సమాధులు
అన్ని తెరువబడతాయి! ఇది చివరి పునరుత్థానం! దీనిని తీర్పు పునరుత్థానం అని పిలుస్తారు! ఇలా బ్రతికిన
వారు తీర్పుకి తేబడతారు!
అయితే అక్కడ గ్రంధాలు విప్పబడతాయి! అప్పుడు గ్రంధములలో
వ్రాయబడిన దానిని బట్టి వానివాని క్రియలను బట్టి తీర్పు పొందుతాడు! ఎవరి పేరైనను జీవ గ్రంధమునందు వ్రాయబడినట్లు
కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయ బడతాడు! ఈఅగ్ని గుండములో
పడవేయబడటమే రెండవ మరణము అని 14వ వచనంలో వ్రాయబడింది!
సరే, మన భాగానికి వద్దాం-
ఇక్కడ జయించిన వాడు ఈ రెండో మరణం వలన ఏ హాని చెందడు అని అంటే అనగా నరకములో
త్రోయబడడు, పరలోకమునకు వెళ్తాడు అని అర్ధం! మరి రెండో మరణం వలన హాని ఉందా అంటే ఉంది కదా—నరకానికి లేక అగ్నిగుండములో త్రోయబడుతున్నారు
కదా!
ప్రియ దైవజనమా! ఏ మార్గం కావాలి నీకు! జీవ మార్గమా? లేక నరక మార్గమా? జాగ్రత్త-రెండవ
మరణాన్ని కొని తెచ్చుకోకు! ఆ మండే అగ్ని గుండములో యుగయుగాలు బాధపడకు!
అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని చెబుతున్నారు దేవుడు! కాబట్టి నేడే మార్పునొంది రాకడకు సిద్దపడి ఎత్తబడు!
దైవాశీస్షులు!
*పెర్గమ సంఘము-1*
ప్రకటన 2:12
పెర్గములోఉన్న
సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా...
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం శ్రమల సంఘమైన స్ముర్ణ
సంఘము కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక మనం తర్వాత సంఘము పెర్గమ
సంఘం కోసం ధ్యానం చేసుకుందాం!
*పెర్గమ* అనగా:
గోపురము, దుర్గము అని అర్ధం!
ప్రస్తుత
పేరు: *బర్గము*!
ఈ సంఘము
కోసం పట్టణం కోసం చూసుకుంటే:
ఇది కూడా ప్రస్తుత టర్కీ దేశంలోనే ఉంది! ఎఫెసీ
పట్టణానికి ఉత్తరంగా 160 కి.మీ దూరంలో అనగా
స్ముర్ణ పట్టణానికి మరింత ఉత్తరంగా 100 కి.మీ దూరంలో కైకస్ అనే నది ప్రక్కన గల కొండమీద ఈ పట్టణం కట్టబడి ఉంది! రోమా రాజులు చాలా అందంగా కట్టించారు
ఈ పట్టణాన్ని! మొదటగా ఇక్కడ ఒక ఎష్కపోలియోస్ అనే దేవతా
మందిరం ఉంది- దీనినే పెర్గమో దేవుడు అనికూడా అంటారు! ఇది రోమా రాజుల యొక్క మొట్టమొదటి పూజా కేంద్రం! ఈ దేవతా
విగ్రహం పాము ఆకారంలో ఉంటుంది! దానికి 40 అడుగుల ఎత్తుగల ఒక పెద్ద బలిపీఠం కట్టించారు. దానిమీద
రోజంతా బలిధూమం వస్తూ ఉంటుంది! ఎష్కపోలియోస్ అనగా రక్షకుడు అని అర్ధము! అయితే క్రైస్తవులు
యేసే రక్షకుడు అని చెబుతుంటే మా దేవుడే రక్షకుడు- అలాంటిది మీ
దేవుడు రక్షకుడు అంటారా అంటూ క్రైస్తవులను హింసించడం జరిగింది! చివరికి మా దేవతనే రక్షకునిగా అంగీకరిస్తారా లేక మరణశిక్ష అనగా ఖడ్గముతో చంపమంటారా
అని అడగటం మొదలుపెట్టారు! అంతిపయస్ అనే విశ్వాసి- మీ దేవుడు విగ్రహం- మా దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని గట్టిగా చెబితే అక్కడే
ఖడ్గముతో చంపారు! దీనినే దేవుడు ఎత్తి చెబుతున్నారు! ఇక అంతిపయస్ ని చంపాక మిమ్మల్ని కూడా చంపాలా లేక ఎష్కపోలియోస్ ని రక్షకునిగా
అంగీకరిస్తారా అని అడిగారు నాయకులు! మేము కూడా చనిపోడానికే సిద్ధంగా
ఉన్నాము గాని మీ పాము బొమ్మను మ్రొక్కము, వాడు రక్షకుడు కాడు
అని గట్టిగా చెప్పారు ఈ సంఘస్తులు! అప్పుడు కఠినమైన హింస చెలరేగి
అనేకులైన విశ్వాసులు చనిపోయినా సంఘము చెక్కుచెదరలేదు!
*ఈ సంఘముతో దేవుడు తననుతాను ఏమని పరిచయం చేసుకుంటున్నారు*?
వాడియైన రెండంచుల
గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా.....
అయ్యా! ఇంత ఘనమైన సంఘమునకు వాడియైన
రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటూ ఇలా మొదలుపెట్టారేమి?
దానికి
రెండు కారణాలున్నాయి!
మొదటిది: 14,15 వచనాలలో సంఘములో తప్పుడు
బోధలు జరుగుతున్నాయి! సంఘము విశ్వాసమందు పటిష్టంగా ఉన్నా ఈ తప్పుడుబోధలను
ఖండించక అలాగే వదిలేశారు! అందుకే దేవుడు వాడిగల రెండంచుల గల ఖడ్గము
గలవాడు అంటూ పరిచయం చేసుకున్నారు! విగ్రహాలకు బలిచ్చిన వాటిని
తినినా ఏమీకాదు అంటూ మొదలుపెట్టారు కొందరు!
మానవుడు
పాపం చేస్తే అది శరీరానికే అంటుతుంది తప్ప ఆత్మకు అంటదు! కాబట్టి వ్యభిచారం చేసినా,
జారత్వం చేసినా పర్వాలేదు అని భోధించే గుంపు మరొకటి మొదలైంది!
గమనించాలి- సంఘము ఈ రెండు చెయ్యడం లేదు గాని అలా
భోధించేవారిని ఏమీ అనలేదు! తప్పుడు బోధలను ఖండించడం లేదు!
అందుకే దేవునికి కోపం వచ్చి వాడిగల రెండంచుల గల ఖడ్గము గలవాడు అంటున్నారు!
నేడు సంఘములలో
అనేకమైన తప్పుడు బోధలు దావానంలా వ్యాపిస్తుంటే సంఘమా- సంఘపెద్దలారా, కాపరులారా! మౌనముగా ఉన్నారా జాగ్రత్త వాడిగల రెండంచుల
గల ఖడ్గము గలవాడు తీర్పుతీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని మర్చిపోవద్దు!
ఆ ఖడ్గము
మరేది కాదు వాక్యఖడ్గము అని గమనించాలి!
హెబ్రీయులకు 4: 12
ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను
విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను
శోధించుచున్నది.
ప్రాణము ఆత్మ రెండు
కలిసే ఉంటాయి. విడిపోయాయి
అంటే ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్ధము! అయితే నిత్యత్వము లోనికి
చేరాలంటే ఈ ప్రాణాన్ని ఆత్మను విడదీస్తూ దేవుని వాక్యము ఈ రెండింటిని సరిచేస్తూ ఈ రెంటి
మధ్య స్థిరనివాసం చెయ్యాలి! అప్పుడే ప్రాణము ఆత్మ దేవునిలో భద్రముగా
ఉంటాయి!
ఈ ఖడ్గము ప్రాణాత్మలను
రెండింటిని కూడా చీల్చుతుంది!
ప్రాణము అనగా బ్రతికి
ఉన్నప్పుడు స్తితి! ఇది కొంతకాలం! మనిషి మరణించాక మనిషి ఆత్మ మాత్రమే బ్రతికి
ఉంటుంది. దీని వ్యవధి- అనంతము! కాబట్టి మరణించాక ఆత్మ సుఖముగా పరమునందు ఉండాలి అంటే ఇప్పుడే నీ ఆత్మను శరీరాన్ని
జాగ్రత్తగా ఉంచుకోవాలి!
కారణం శరీరానికి
ఆత్మకు ఎల్లప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాణాన్ని ఆత్మను సరియైన దారిలో పెడుతూ సరిచేసేది దేవుని
వాక్యమైన వాక్యఖడ్గము అని గుర్తుపెట్టుకోవాలి! ఈ వాక్యముతో ప్రతీరోజు
ఉదకస్నానం చెయ్యాలి! అప్పుడు నీలోనున్న డాగు, మచ్చ, కళంకము అన్నీ పోయి నీవు శుద్ధుడవై పరమునకు చేరగలవు!
ఇక రెండంచులు
గల ఖడ్గము అనడానికి రెండో కారణం:
ఆ కాలంలో
ఈ పెర్గమ పట్టణంలో రెండు అధికారాలు గల మనుష్యులు లేక అధికారులు ఉండేవారు!
మొదటి
రకం: ఖడ్గము
యొక్క అధికారం గలవారు! వీరు అవసరమైతే అనగా చక్రవర్తిని ఆ దేవతను
పూజించని వారిని నిర్దాక్షిణ్యంగా చంపే అధికారం గల అధికారులు!
రెండవది: ఖడ్గము అధికారం లేనివారు!
అయితే దేవుడు అంటున్నారు: ఒరేయ్
మీకంటే నాదగ్గర మరింత పదునుగల రెండంచుల గల ఖడ్గము ఉంది. మీ దగ్గర
కత్తికి ఒక అంచే ఉంటుంది గాని నా దగ్గర గల ఖడ్గము రెండంచుల గలది అంటూ పట్టణస్తులకు
చెబుతూ- నా ప్రియమైన సంఘమా—వారికంటే పదునైన
రెండంచుల గల ఖడ్గము గల వాడిని నేను! కాబట్టి వారికి భయపడవద్దు
అని దేవుడు వీరితో చెబుతున్నారు అన్నమాట! ఇలా సంఘాన్ని ధైర్యపరుస్తున్నారు
దేవుడు!
ప్రియ దైవజనమా! పెర్గమ సంఘస్తులు మరణాన్ని ఎదిరించారు!
ఎదుర్కున్నారు! ప్రభువుకోసం భరించారు మరి నీ పరిస్తితి
ఏమిటి? ప్రభువుకోసం అవసరమైతే చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నావా?
వాడిగల ఆత్మ ఖడ్గముతో నీ ప్రాణము ఆత్మ సరిచేయబడుతుందా?
వాక్యాన్ని ప్రతీరోజు
ధ్యానం చేద్దాం! హృదయంలో ఎల్లప్పుడూ
నెమరువేద్దాం! మనలను మనం సరిచేసుకుందాం! గమ్యం చేరుదాం!
*పెర్గమ సంఘము-2*
ప్రకటన 2:13
సాతాను
సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న
ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు
మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని
నేనెరుగుదును.
ఇక పదమూడో వచనంలో
సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా
యందు విశ్వాసియై యుండి నన్ను గూర్చి సాక్షి యైన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో
మీరు నాయందలి విశ్వాసమును విసర్జించలేదని కూడా నేనెరుగుదును అంటున్నారు!
ఇక్కడ
జాగ్రత్తగా పరిశీలిస్తే:
మొదటగా సాతానుకి సింహాసనం ఉంది! అది ఆ రోజులలో
పెర్గమలో ఉండేది
రెండు: సాతాను గాడు అక్కడ నివాసం లేక
కాపురం ఉండేవాడట!
సరే, మొదటి విషయాన్ని
కొంచెం చూసుకుందాం: సాతాను గాడికి సింహాసనం ఉందా అంటే ఇక్కడ వ్రాయబడిన
ప్రకారం ఉంది! ఎక్కడ ఉంది అంటే నరకంలో లేదు, పాతాళంలో లేదు, పరలోకంలో ఉండే అవకాశమే లేదు! ఎక్కడ ఉంది అంటే భూమిమీదనే ఉంది! ఆ రోజులలో అది పెర్గమలో ఉంది! మరి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు! కారణం అప్పుడున్న ప్రాభవాన్ని
పెర్గమ నేడు కోల్పోయింది! దీనికోసం గతభాగంలో మనం చూసుకున్నాము.
అక్కడ ఎష్కపోలియోస్ అనే పాము దేవతను వారు పూజించేవారని- దానికి రక్షకుడు అనే అర్ధమని చూసుకున్నాం! అంతేకాకుండా
అక్కడ మరో గుడి కూడా ఉండేది- దానిలో చక్రవర్తి విగ్రహం ఉండేది
దానిని ప్రతీ ఒక్కరు పూజించాల్సిందే! దేవునికి ప్రతిగా చక్రవర్తిని
పూజించాలి! ఇక అక్కడకు ఎక్కువమంది ఎందుకు వచ్చేవారంటే-
రోగాల స్వస్తతకోసం వచ్చేవారు! అనేకులకు ఆ పెర్గమో
దేవతకు రోగాలను నయం చేసే శక్తి వుంది అని వారి నమ్మకం! అంతేకాకుండా
ఆ రోజులలో మాసిదోనియా గలతియ కప్పదొకియ ప్రాంతాలలో మంత్రశక్తులను ఎక్కువగా ప్రయోగించేవారు.
ఇలాంటి మంత్రగాళ్ళకు కూడా ఇది ఒక ముఖ్యమైన కేంద్రం ఎఫెసీ వలే!
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు సాతాను
గాడి కోసం:
యోహాను 12: 31
ఇప్పుడు
ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
యోహాను 14: 30
ఇకను
మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.
2కొరింథీ 4:4
దేవుని
స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి
మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
ఎఫెసీ 6:12
ఏలయనగా
మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో- రక్తమాంసములతో)
కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
2తిమోతికి 2: 25
అందువలన
సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో
అని,
1పేతురు 5: 8
నిబ్బరమైన
బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది (సాతాను)
గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
1యోహాను 5: 18
మనము
దేవుని సంబంధులమనియు,
లోకమంతయు దుష్టునియందున్నదనియు (దుష్టునియందు పడియున్నదనియు)
ఎరుగుదుము.
కాబట్టి సాతాను గాడు
ప్రతీ స్థలము లోను ఇప్పుడు పనిచేస్తున్నాడు అని గ్రహించి మనము జాగ్రత్త పడాలి!
కాబట్టి ఇన్ని రకాలుగా
సాతాను శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు నీవు
సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావని నాకు తెలుసు!
అంతేకాకుండా
మరోమాట అంటున్నారు: సాతాను కాపురమున్న స్థలంలో నీవున్నావు అంటున్నారు! ఇక్కడ
సాతాను సింహాసనమే కాకుండా వాడికి ఇల్లుకూడా ఉంది అన్నమాట! అనగా
సాతానుకి ఈ పెర్గమ ప్రజలు ఎంతగా ప్రాధాన్యత ఇచ్చి వాడికి లొంగిపోయారో గమనించవచ్చు!
ఈ పెర్గమ ప్రజలు వాడికి అక్కడ సింహాసనం వేయడమే కాకుండా వాడిని సాదరంగా
వారి హృదయాలలోనికి ఆహ్వానం ఇచ్చారని మనకు తెలుస్తుంది!
ఒకమాట చెప్పనా: వారి హృదయాలలోనే కాదు,
వారి గృహాలలోనే కాదు, విశ్వాసుల గృహాల లోను,
విశ్వాసుల హృదయాలలోనూ కూడా సాతానుడు స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటూ ఉంటాడు!
దానికోసం యేసుక్రీస్తుప్రభులవారు ఒక ఉదాహరణ చెప్పారు......
Matthew(మత్తయి సువార్త) 12:43,44,45
43. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని
చోట్ల తిరుగుచుండును.
44. విశ్రాంతి దొరకనందున నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి,
ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును;
అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును.
45. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.
దీని ప్రకారం
యేసయ్యని రక్షకునిగా స్వీకరించాక ఆ గృహంలో ఆ హృదయంలో యేసయ్యతోను , ఆయన వాక్యముతోను పరిశుద్ధాత్ముని
తోనూ నిండి ఉండాలి. అలా కాకుండా కాళీగా ఉంటే, లేక దేవునికి స్థానమివ్వకుండా లోకానికి స్థానం వేస్తే, జబర్ధస్ట్ లకు, సినిమాలకు పాడు సాహిత్యానికి స్థానం ఇస్తే,
సాతాను గాడు వాడికంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను ఏడు భయంకరమైన దురలవాట్లను
తీసుకుని వచ్చి పర్మినెంట్ గా అక్కడే ఉంటాడు!
ప్రియ విశ్వాసి! నీ హృదయంలో నీ గృహంలో ఎవరున్నారు?
యేసుక్రీస్తు ఈ గ్రహాధిపతి అని బోర్డు పెడితే నిజంగా ఆ గృహానికి యేసయ్య
అధిపతి అయిపోతారా? నీవు మనసా వాచా కుటుంబమంతా ఆయనకు లోబడి,
ఆయనను ఆహ్వానించి, పాడు వస్తువులు అన్నీ తీసివేసి,
ప్రభువా ఈ గృహము నాదికాదు! నీవే ఇచ్చావు కాబట్టి
మీరే ఈ గృహానికి అధిపతిగా ఉండండి! ఈ గృహానికి నేను ఒక శుభ్రం
చేసే వ్యక్తిని మాత్రమే అని ఆయనకు సంపూర్ణ అధికారం ఇచ్చేస్తే, ఆయన గృహానికి వచ్చి నివాసం చేస్తారు! అలాంటి పరిస్తితిలో
సాతాను గాడు ఆ గృహాన్ని కన్నెత్తి కూడా చూడలేడు! ఎందుకంటే అక్కడ
రెండంచుల గల వాడియైన ఖడ్గము పట్టుకుని ఖడ్గ జ్వాలలతో యేసుక్రీస్తుప్రభులవారు కనిపిస్తారు
కాబట్టి పారిపోతాడు! అలాకాకుండా పెదాలతో పప్పలు వండినట్లు అనే
సామెత చెప్పినట్లు ప్రభువా మీరే ఉండండి అని నీవు నీ పాడు పనులతో నీ గృహాన్ని నింపితే,
సినిమాలతో, జబర్ధస్ట్ లతో, మరో వాటితో, సినిమా వాల్ పోస్టర్ లతో నీ గృహాన్ని నింపితే
దేవుడు ఆ గృహాన్ని అసహ్యించుకుంటారు!
కాబట్టి
ప్రియ చదువరీ! నీ
గృహానికి యేసుక్రీస్తుప్రభులవారు నిజంగా అధిపతిగా ఉన్నారా? నీ
హృదయంలో యేసుక్రీస్తుప్రభులవారు నివాసం చేస్తున్నారా?
సరే, మన పాఠ్య భాగానికి వచ్చేద్దాం!
ఇలాంటి పరిస్తితుల గల పట్టణంలో ఈ పెర్గమ వారు ప్రభువు నామమును గట్టిగా
పట్టుకుని శ్రమలను సహిస్తూ గమ్యానికి సాగిపోతున్నారు అని గ్రహించాలి! మనదేశంలోనూ మన రాష్ట్రంలోను నేను గమనించాను- అన్యుల పుణ్యక్షేత్రాలు
అని చెప్పబడే పట్టణాలలో దైవజనులు అనేక కష్టాలు పడి మందిరాలను నడిపిస్తున్నారు!
సంఘాలను స్థాపిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నారు.
అవమానాలు పొందుతూ జైలు శిక్షలు అనుభవిస్తూ సేవను ఆపకుండా సాగిపోతున్నారు!
దేవుడు ఆ బిడ్డలను బహుగా దీవించును గాక!
*నా హృదయ పూర్వకమైన విన్నపము ఏమిటంటే ఇది చదువుతున్న ప్రియ సహోదరి సహోదరులారా!
కనీసం వారానికి ఒక్కసారైనా ఇలాంటి సేవకుల కోసం పనివారికోసం కనీసం రెండు
నిమిషాలు మీ ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుని వారికి ప్రార్ధనా సహకారం చెయ్యమని చేతులు
జోడించి విన్నవించు కుంటున్నాను*. వారు చావుకి తెగించి క్రీస్తు
పరిచర్య చేస్తున్నారు అని గ్రహించాలి మనము!
ఒకవేళ
అటువంటి ప్రాంతంలో నివాసం చేస్తూ ప్రభునామాన్ని అంగీకరించి విశ్వాసంలో సాగిపోతున్న
ప్రియ విశ్వాసి/సేవకుడా! పెర్గమ ప్రజలతో దేవుడు చెప్పినట్లు నీతోను ఈరోజు
చెబుతున్నారు- నేనెరుగుదును. నీవు ఎక్కడ
ఉంటున్నావో, ఎలా నానామాన్ని పట్టుకుని ధైర్యంగా సాగిపోతున్నవో
నాకు తెలుసు! నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెబుతున్నారు!
ఈ పెర్గమ ప్రజలు అంతిపయ
అనే విశ్వాసిని చంపేసినా వీరు కూడా చావడానికి సిద్దపడ్డారు గాని ప్రభునామాన్ని వదలలేదు! మీరుకూడా అటువంటి స్థిరమైన విశ్వాసం పట్టుదల
కలిగి ఉండాలని ప్రభువు పేరిట కోరుకుంటున్నాను!
*పెర్గమ సంఘము-3*
ప్రకటన 2:14—15
14. అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును,
జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని
బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
15. అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.
ఇక పద్నాలుగో వచనంలో
అయినను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసి యున్నది అంటున్నారు! చూడండి ఇంతవరకు మనం
పెర్గమ సంఘము దేవునికోసం శ్రమలను అనుభవించింది చావడానికైనా సిద్ధమయ్యారు గాని దేవుణ్ణి
వదలలేదు! సాతాను సింహాసనమున్న స్థలంలో
ప్రభువుకోసం ధైర్యంగా నిలబడ్డారు అని చదువుకున్నాము! అయితే ఇలాంటి
గొప్ప విశ్వాస స్థైర్యము గల సంఘానికి కూడా లోపాలున్నాయి అంటున్నారు దేవుడు!
అవి ఏమిటో చూసుకుందాము!
మొదటిది: విగ్రహములకు బలియిచ్చిన వాటిని
తినునట్లును,
రెండవది: జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు
ఉరి యొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు!
మూడవది : నీకొలాయితుల బోధను అనుసరించువారు
కూడా నీలో ఉన్నారు అంటున్నారు!
గమనించాలి
మొదటి రెండు తప్పులలోను మహా ప్రవక్తయైన బిలామును ఎత్తి చెబుతున్నారు ప్రభువు! మనకు సంఖ్యాకాండం
22వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు బిలాముకోసం
వ్రాయబడింది. అతడో ప్రవక్త అని, అతడు ఎవనిని
దీవిస్తే వారు దీవించబడతారు, ఎవనిని శపిస్తే వారు శపించబడతారు
అని ఉంది! అంతటి మహా ప్రవక్త కూడా డబ్బుకోసం బుద్ధి మందగించి
గాడిదచేత బుద్ధి చెప్పించుకుని, శపిద్దామన్నా ఇశ్రాయేలు ప్రజలను
దీవించి, వెళ్లిపోతుంటే రాజుకి ఇద్దరికీ తగాదా జరిగినట్లు మాత్రమే
మనకు కనిపిస్తుంది! గాని క్రొత్త నిబంధనలో ఆయనకోసం పరిశుద్ధాత్ముడు
ఇంకా వివరంగా రాశారు! అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోయాబీ స్త్రీలతో
పాపం చేసినట్లు కనిపిస్తుంది, గాని ఈ క్రొత్త నిబంధనలో మనకు దానికి
సలహా ఇచ్చినవాడు బిలాము అని పరిశుదాత్ముడు చెబుతున్నాడు! ఏమి
జరిగింది అంటే రాజు బిలాముకి ఇద్దామన్న డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే, బిలాము కూడా దేవునిమాటను విని తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు! అప్పుడు నాయకులు రాజుతో మాట్లాడి దీనికి మరో పరిష్కారం ఏదైనా ఉంటే బిలామునే
అడగాలి అని రాజుని ఒప్పించి నాయకులు బిలాము గారి దగ్గరకు వస్తే – దేవునికి వారిని అనగా ఇశ్రాయేలు ప్రజలను శపించడం
ఇష్టం లేదు అని తెలిసినా ధనాశతో- దేవునికి ఏది ఇష్టం ఉండదో,
దానిని ఇశ్రాయేలు ప్రజలు చేస్తే అప్పుడు దేవుడే ఇశ్రాయేలు ప్రజలను నాశనం
చేస్తారు అనే ఆలోచన చెప్పాడు ఆ ప్రవక్త! మరి దానికి ఏమి చెయ్యాలి
అంటే దేవునికి అన్యస్త్రీలతో వ్యభిచారం, విగ్రహారాధన ఇష్టం ఉండదు
కాబట్టి మీలో అందమైన స్త్రీలను, అమ్మాయిలను ఇశ్రాయేలు గుడారాలకు
పంపించి, విగ్రహాలకు ఒక పండుగ జరిపించి, దానికి వారిని ఆహ్వానించి, ఆ విగ్రహారాధనలో వారు పాలుపొందుకునేలా,
విగ్రహాలకు అర్పించినవి వారు తినేలా చెయ్యమని ఒక దేవుని ప్రవక్త – పనికిమాలిన సలహా ఇచ్చాడు! అందుకే భయంకరమైన చావు చచ్చాడు!
ఇదే
విషయాన్ని ఈ 14వ వచనమే కాకుండా, 2పేతురు 2:15; యూదా 11వ వచనం కూడా చెబుతుంది.....
అలాగే
ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం, దేవుని శాపం రగులు కోవడం,
ఫీనేహాసు గారు లేచి పరిహారం చెయ్యడం, ఉగ్రత ఆగడం
మనకు కనిపిస్తుంది!
అయితే
అలాంటి బోధనే ఇక్కడ బోధించేవారు భోదను అనుసరించేవారు ఈ సంఘములో ఉన్నారు అని సంఘముల
మధ్య సంచరించే దేవుడు చెబుతున్నారు! చూడండి సంఘమంతా వ్యభిచారులు, విగ్రహాలకు
అర్పించిన వాటిని తింటున్నారు అనడం లేదు! ఆ భోధను అనుసరించు వారు
మీలో ఉన్నారు అంటున్నారు! బిలామును ఎత్తి చూపిస్తునారు!
ఆ బిలాము బోధ వలన అనేకమంది చనిపోయినట్లు తెలుసు! ఇంకా నీకొలాయితుల బోధను అనుసరించు వారు కూడా నీలో ఉన్నారు అంటున్నారు!
నీకొలాయితుల బోధ అంటే ఏమిటో ఎఫెసీ సంఘముకోసం ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాము!
విభజించి పాలించి సంఘమును వారి కబంధహస్తాలలో ఉంచుకునే వారు ఈ నీకొలాయితులు!
వ్యభిచారిణులారా ఈ
లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అంటున్నారు యాకోబుగారు!
యాకోబు 4: 4
వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో
వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో
వాడు దేవునికి శత్రువగును.
ఈ సంఘము
లోకముతో స్నేహం చేసి దేవునికి శత్రువు అయ్యింది. ఏ విశ్వాసి లోకముతో స్నేహం చేస్తాడో ఆ వ్యక్తి దేవునికి
శత్రువుగా మారిపోతాడని గ్రహించాలి!
గమనించాలి: పాత నిబంధన మొత్తం విగ్రహారాధనను
వ్యభిచారం గా చెప్పడం జరిగింది. ఆ వ్యభిచారంతో పాటుగా లోకస్తులకోసం లోకంతో స్నేహం చేయడం మరో వ్యభిచారం పైన పేర్కొన్న యాకోబు పత్రిక ప్రకారం!
ఇక్కడ సంఘములో
కొంతమంది విగ్రహాలకు బలిచ్చిన వాటి కధా కార్యక్రమాలలో పాల్గొంటే తప్పులేదు- మనం చెయ్యడం లేదు కదా,
బంధువులు కదా అంటూ వెళ్తున్నారు! దీనినే దురభిమానపాపము
మరియు సులువుగా చిక్కులుపెట్టు సైతాను అంటారు! అయ్యా!
మన బంధువులు కదా వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని వెళ్తున్నారు కదా—జాగ్రత్త!!! ఈ సంఘము, ఇంతటి మహా గొప్ప
సంఘమును దేవుడు అంటున్నారు మారుమనస్సు పొందకపోతే నా నోట నుండి వచ్చే వాడిగల రెండంచుల
గల ఖడ్గముతో యుద్ధము చేసి హతము చేస్తాను అంటున్నారు! గమనించాలి
అందరినీ హతము చేస్తాను అనడం లేదు- ఎవరైతే ఈ బోధను అనుసరిస్తున్నారో
వారితోనే యుద్ధం చేస్తాను అంటున్నారు! గాని సంఘానికంతటికీ ఈ తప్పును
ఆపాదిస్తున్నారు!
ఆకాలంలో
అనేకప్రాంతాలలో కొంతమంది దుర్భోధకులు పొట్ట పోషించుకోడానికి తప్పుడు బోధలను చేసేవారు, ఈ రోజులలో చేసినట్లే:
వాటిలో రెంటిని వీరుకూడా బాగుంది అనుకున్నారు.
మొదటిది
విగ్రహాలకు మనం బలి ఇవ్వడం తప్పు! ఎవరైనా బలి ఇస్తే తినడంలో తప్పులేదు! ఎందుకంటే ప్రార్ధన చేసుకుని తింటే అన్ని పవిత్రమైపోతాయని పౌలుగారు చెప్పారు
కదా అనడం మొదలుపెట్టారు! అదే సమయంలో కొందరు పౌలుగారు తిమోతి గారికి
నీ కడుపు జబ్బు నిమిత్తం వైన్ తాగమని చెప్పారు కదా అనడం మొదలుపెట్టారు! ఈ బోధలను కలిపి చెరిపి నేడు ఒక పెద్ద సంఘ సంస్థ ప్రపంచం మొత్తం కోట్లమందిని
త్రాగుబోతులుగా చేసింది! పౌలుగారు విగ్రహములో ఏదీ లేదు అన్నారు
గాని విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినినా పర్వాలేదు అనలేదు! వాటిని
తినవద్దు అని ఖండితంగా చెప్పారు!
1కోరింథీయులకు 8: 10
ఏలయనగా
జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు
విగ్రహములకు బలియియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
మరొకటి
ఏమిటంటే మానవుడుచేసే పాపం ఆత్మకు అంటదు! శరీరానికి అంటుతుంది. కాబట్టి చిన్నచిన్న
పాపాలు వ్యభిచారం చేసినా అది ఆత్మకు అంటదు గాని దేహానికే అంటుతుంది. కాబట్టి వ్యభిచారం పాపం కాదు అంటూ బోధించడం మొదలుపెట్టారు! దీనికోసం తత్వశాస్త్రం బోధలు కూడా మొదలుపెట్టారు! వీటిని
దేవుడు మరియు పౌలుగారు ఇంకా అనేకమంది అపోస్తలులు ఖండించడం జరిగింది!
నేడు అలా
అనుకునే వారు మనలో కూడా చాలామంది ఉన్నారు కదా!
బంధువులు
పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏమనుకుంటారో, మన ఇంట్లో కధాకార్యక్రమాలకి వారు వస్తారో రారో!!!
ఇలాంటి దురభిమాన పాపములో పడిపోయి నరకానికి పోతున్నారు అని మరచిపోవద్దు!
వాటిలో మనం పాలుపంపులు పొందకూడదు అని బైబిల్ చెబుతుంది.
వారు రాకపోతే
పోనీయ్! నీకు కనీసం
పరలోకం దక్కుతుంది కదా!
1పేతురు
4: 3
మనము
పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో
కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని
విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు
గతించిన కాలమే చాలును,
అని పేతురు గారు చెబుతున్నారు. మరి విందామా?!
*పెర్గమ సంఘము-4*
సరే, ఎందుకు సంఘమంతటికీ ఈ తప్పును
దేవుడు ఆపాదిస్తున్నారు అంటే: అది తప్పు అని తెలిసినా ఎవరూ దానిని
ఖండించలేదు! ఎవడి పాపానికి వాడు పోతాడు అని వదిలేశారు!
అందుకే దేవుడు వాడిగల ఖడ్గము తీసుకుని అంటున్నారు మారుమనస్సు పొందావా
సరి, లేకపోతే ఒక్క వేటు వేసేస్తాను అంటున్నారు! వీరు ఇంతా పడిన కష్టాలు గంగలో పారేసినట్లు అయిపోయింది ఇక్కడ!
మనలో
కూడా అనేకమంది ఎవరు ఎలా పోతే మనకేంటి? వారితో మనకు తగవులెందుకు అనుకుంటూ సంఘస్తులు ఎవరైనా
పాపం చేస్తుంటే, వ్యభిచారం చేస్తుంటే, త్రాగుబోతు
అయితే, లంచగాడు అయితే, జూదగాడు అయితే వానిని
సరిచెయ్యకుండా వదిలేస్తున్నారు! సంఘకాపరులు కానుకలకు ఆశించి,
తమ నెల జీతమునకు ఆశించి ఖండించి గద్దించి బుద్ధిచెప్పడం లేదు!
తద్వారా మరొకరు అలాగే తయారవుతున్నారు!
గమనించండి: ఇలాంటి తప్పు ఒకటి కొరింథీ
సంఘములో జరిగితే ఎక్కడో ఉన్న పౌలుగారికి ఈ విషయం తెలిసింది- వెంటనే
కొరడాతో చెళ్ళుమని కొట్టినట్టు ఒక ఉత్తరం రాసి ఆ దుర్మార్గున్ని వెలి వేసేయ్యండి అంటున్నారు!
పౌలుగారు అసలు ఇలాంటివి ఓర్చలేదు! వెంటనే సరిచేస్తున్నారు!
మరో
విషయం చెప్పనా: గతభాగంలో ఫీనేహాసు గారు పరిహారం చేస్తే తెగులు ఆగింది అని చదువుకున్నాము కదా!
ఫీనేహాసు గారు పరిహారం ఏమి చేశారు? ఒక మోయాబు నాయకుని
కూతురుని ఒక ఇశ్రాయేలు నాయకుడి కొడుకు వ్యభిచారం చెయ్యడానికి తన గుడారానికి వయ్యారంగా
తీసుకుని పోతుంటే ఈయన అనగా ఫీనేహాసు గారు ఆత్మలో రగిలిపోయి- ఒక
బల్లెము తీసుకుని, వారు పాపం చేస్తుంటే ఇద్దరికీ గుచ్చుకుని ఇద్దరు
చచ్చేలా ఒక్కపోటు పొడిస్తే ఇద్దరు చచ్చారు. తెగులు ఆగింది!
అయితే దేవుడు మోషేగారితో ఏమన్నారు అంటే నేను ఓర్వలేనిదానిని ఫీనేహాసు
కూడా ఓర్వలేదు కాబట్టి నా ఉగ్రతను ఆతను ఆపగలిగాడు అంటున్నారు!
Numbers(సంఖ్యాకాండము)
25:7,8,9,10,11,12,13
7. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమా రుడునైన ఫీనెహాసు అది చూచి,
8. సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ
ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని
ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి
తెగులు నిలిచి పోయెను.
9. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు
చేత చనిపోయిరి.
10. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు
ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన
అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,
11. వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని
తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు
ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.
12. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.
13. అది నిత్యమైన యాజక నిబంధనగా
అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని
విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
అనగా
ఇక్కడ ఫీనేహాసు గారు దేవుని హృదయాన్ని దేవుని మనస్సుని అర్ధం చేసుకుని దేవుని హృదయాన్ని
తన హృదయముగా చేసుకుని ఓర్వలేక పోటు పొడిచారు, తెగులు ఆగింది! ఫీనేహాసు గారితో
శాశ్వత నిబంధన చేశారు దేవుడు! అలాగే ఇక్కడ పౌలుగారు కూడా దేవుని
మనస్సుని దేవుని హృదయాన్ని కలిగి ఉన్నారు కాబట్టే ఓర్వలేక ఆ వ్యభిచారిని ఆ దుర్మార్గుని
వెలివేసేమన్నారు. కారణం వాడు తన తండ్రి మరణిస్తే తండ్రియొక్క
రెండవ భార్యతో అనగా తన సొంత పిన్నితో వ్యభిచారం చేస్తున్నాడు!
మనలో
అనేకమంది ఇలాంటి పాపములు చెయ్యకపోయినా వీటిని ఖండించడం లేదు! ఎందుకంటే భయము కొందరికి,
ఏమనుకుంటారో అని కొంతమంది, వాడి పాపానికి వాడే
పోతాడులే అని కొంతమంది! రెండో తిమోతి పత్రికలో దేవుడు ప్రతీ దైవసేవకునికి,
కాపరికి, పెద్దకు అధికారం ఇచ్చారు: ఖండించుము గద్ధించుము బుద్ధి చెప్పుము అని చెబుతుంటే ఎందుకు వీటిని ఖండించడం
లేదు? తప్పును ఖండించకపోవడం కూడా నేరంగా ఈసంఘముమీద తప్పు మోపుతున్నారు
దేవుడు! మరి సంఘమా! మీ సంఘములో జరుగుతున్న
తప్పులను మీరు సరిచేస్తున్నారా? జాగ్రత్త ఈ గొప్ప సంఘమునే వదిలిపెట్టని
దేవుడు మిమ్మును వదిలిపెడతారా?
మా
సంఘములో ఈ మధ్య ఒక విషయం జరిగింది. అన్యులలో ఒకరు- వారి తండ్రి సంవత్సరీకమునకు
బట్టలు పెట్టే ఫంక్షన్ చేసుకున్నాడు. మాది పల్లెటూరు గనుక ఆ కోలనీలో
ఉన్న అందరినీ బోజనాలకు పిలిచాడు! అందరూ వెళ్లారు! సంఘములో దేవుని నమ్ముకున్న వారికోసం ఆ వ్యక్తి కేటరింగ్ కి ఇచ్చి, మిగిలిన అన్యుల కోసం మరొకరితో వండించుకున్నాడు! ఆ కోలనీలో
ఉన్న మా సంఘస్తులు సగం మంది వెళ్లి భోజనం చేశారు! అయ్యా,
ఇది తగునా, బట్టలు పెట్టడం అంటే ఏమిటి?
ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పెట్టి, దానికి దండవేసి
ఒక మ్రొక్కు మ్రొక్కి, చనిపోయి పెద్దోడివి అయిపోయి దేవతలలో ఒక
దేవతవు అయిపోయావు అని చెప్పడమే కదా! మరి అది విగ్రహారాధన కాదా?
ఎందుకు వెళ్ళారు అని మా సంఘములో గట్టిగా ఖండించడం జరిగింది! ఇలాంటివి బోధిస్తానని మా సంఘములో అనేకమందికి నేనంటే ఒల్లుమంట! ఎవరికి ఒళ్లుమండితే నాకెందుకు? దేవుడు నా కిచ్చిన అధికారాన్ని
నేను ఉపయోగిస్తాను! కారణం ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాల్సింది
మేము కాబట్టి! అందుకే ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము అనే
ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను నేను! సంఘములో ఖండించి గద్దించి
బుద్ధి చెప్పి బోధిస్తుంటాను! కొంతమందికి నా బోధ ఇష్టం ఉంటుంది
కొంతమందికి ఉండదు! నేను మనుష్యులను సంతోషపెట్టే వాడిని అయితే
నేను దేవుని సేవకున్ని కాను అంటున్నారు పౌలుగారు....
గలతియులకు 1: 10
ఇప్పుడు
నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా?
నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
నేను
కూడా మనుష్యులను కాదు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ, సంఘములో తప్పులు సరిచేస్తూ,
నాతోపాటు నా సంఘాన్ని కూడా పరలోకం తీసుకుని పోవాలి అనేది నా ఉద్దేశం!
దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని సేవకునిగా ఉండాలని నా ఆశ! అందుకే నా బోధలలో
గాని, రాతలలో గాని ఇలా ఖండిస్తూ ఉంటాను! దీనివలన వలన కొన్ని వందలమంది స్నేహితులను కోల్పోయాను! కొన్నివేలమందిని సంపాదించుకున్నాను!కొన్ని లక్షలమంది
చదువుతున్నారు. ఆ లక్షలమందిలో పదిమంది మార్పునొంది తమ బ్రతులులు
సరిచేసుకుని పరలోకం చేరితే నాకు చాలు!
ఈ మధ్య
దేవుడు నన్ను నాలుగు సంవత్సరాలు శ్రమల కొలిమిలో కాల్చి- చివరలో ఈ సంవత్సరంలో ఒక
దైవసేవకుని ద్వారా మాట్లాడారు దేవుడు: బ్రదర్ దేవుడు మీతో ఒక
విషయం చెప్పమన్నారు! చెప్పండి అన్నాను: మీ తండ్రిగారి పొందుకున్న అభిషేకం, మీ తండ్రిగారు పొందుకున్న వరములు, మీ తండ్రిగారు పొందుకున్న ఆత్మ, మీ తండ్రిగారిలో రగిలిన
ఆత్మల పంట , మంట దేవుడు ఈ రోజునుండి మీకు ఇస్తున్నాను అని చెప్పమన్నారు
అని చెప్పారు ఆ దైవసేవకుడు! ఆ రోజునుండి నాలో మంట పెరిగిపోయింది!
సంఘములో జరుగుచున్న తప్పులు ఏమైనా ఉంటే ఖండించకుండా సరిదిద్దకుండా ఉండలేకపోతున్నాను!
నా ఆలోచనా విధానం, నా రాసే పద్దతిలో కూడా మార్పు
జరుగుతుంది. అందుకే చెబుతున్నాను: అందుకే
వ్యభిచారాలను గాని, సంఘములో దురాచారాలను గాని ఖండించకుండా ఉండలేకపోతున్నాను!
సంఘములో తాళి కట్టడం, ముహూర్తాలు చూడటం,
మామిడాకులు కట్టడం, నగలు ధరించడం లాంటి దురాచారాలు
సంఘచారాలుగా మారిపోయి క్రైస్తవులు నరకానికి దారితీస్తుంటే ప్రియ సేవకుడా ఖండించకుండా
ఎలా ఉండగలుగు చున్నావు? దేవుడు నీలో ఆ మంట పుట్టించడం లేదా?
నీవెందుకు దేవుని ఆజ్ఞ శిరసావహించడం లేదు?!
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! మీసంఘములో ఎవరైనా దారితప్పి తిరిగితే
తప్పకుండా వెళ్లి మాట్లాడండి. వారి ఆస్తి అంతస్తు స్థోమత నీకనవసరం!
చెప్పాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి ఉంది. ముఖ్యంగా
సంఘపెద్దలకు నాయకులకు దైవసేవకులకు ఉంది. అలాగే విశ్వాసులకు కూడా
ఉంది.
విన్నారా మంచిది! నీకెవడు ఇచ్చాడు అధికారం అంటే దేవునికి
లెక్క అప్పగించుకో, చెప్పడం నా బాధ్యత అని చెప్పండి!
అయ్యా ఈమాట నేను చెప్ప్పడం లేదండి
యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు.
Matthew(మత్తయి సువార్త) 18:15,16,17
15. మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.
16. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట
స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.
17. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.
మరి నీవు అలా చెయ్యగలవా? ఈ సంఘాన్ని తప్పుదిద్దుకోమంటున్నారు!
దేవునికోసం పడిన పాట్లు అన్ని వ్యర్ధమైపోతాయి ఒకవేళ నీవు సరిదిద్దకపోతే!
ఇంకా నేటిరోజులలో
అనేకమైన దుర్భోదలు వస్తున్నాయి!
వాటిని ఖండిస్తున్నావా?
🔹 యెహోవా
సాక్షులు
🔹 మొర్మాన్స్
🔹 బ్రెన్హ
మైట్స్
🔹 జాంగిల్
జా
🔹 సబ్బాత్
ఆచరించకపోతే పరలోకం లేదు.
🔹 సున్నతి
లేకుండా గమ్యం లేదు.
🔹 శరీరంతో
పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని
దుర్భోధలు.
యేసుక్రీస్తు – సాయిబాబా అన్నదమ్ములు అంటూ కొందరు,
ఏడువారాలు ఆరాధన అంటూ
ఒకడు,
యేసుమాల అంటూ మరొకడు
తయారయ్యాడు!
అల్లానే దేవుడు, యేసు దేవుడు కాదు అంటూ వారు బయలుదేరారు
మరి వీటిని ఖండించి
సంఘమును సరిచేసి, సంఘాన్ని
కాపాడుకోవా?
అనేకులైన అబద్ధ ప్రవక్తలు
వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)
నేడే మనము మనలను సరిదిద్దుకుని
దుర్భోధలను, దురాచారాలను,
తప్పుడు క్రియలను ఖండిద్దాము! సరిచేద్దాం!
దేవునితో సెహబాస్
అనిపించుకుందాం!
*పెర్గమ సంఘము-5*
ప్రకటన 2:16—17
ఇక
పద్నాలుగో వచనంలో అయినను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసి యున్నది అని చెప్పి పదిహేనో
వచనంలో కావున మారుమనస్సు పొందుము!
లేనియెడల నేను నీ యొద్దకు వచ్చి నా నోటనుండి వచ్చే ఖడ్గము చేత వీరితో
యుద్ధము చేసెదను అంటున్నారు!
దేవుడు
ఈ సంఘముతో వాడిగల రెండంచుల గల ఖడ్గము గలవాడు అని ఎందుకు పరిచయం మొదలుపెట్టారో ఇప్పుడు
మనకు స్పష్టముగా అర్ధమవుతుంది!
నీలో అబద్దబోధలకు లోబడిన వారు ఉన్నారు! వారికి
బుద్ధిచెప్పు! లేదా నేను త్వరగా వచ్చి వారితో నా రెండంచుల ఖడ్గముతో
యుద్ధం చేస్తాను అంటున్నారు!
ఇక్కడ
వీరికి కూడా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నారు-
ఎఫెసీ సంఘమునకు ఇచ్చినట్లే! దేవుడు దయామయుడు!
కరుణామయుడు! తన ప్రజలను చంపుకోవడం దేవునికి ఇష్టం
లేదు! అందుకే వారికి మరో అవకాశం ఇస్తున్నారు! తొందరగా మారుమనస్సు పొందు అంటున్నారు!
ఇదే
విషయం దేవుడు మనతోను అంటున్నారు: త్వరగా మారుమనస్సు పొందండి- ఆ
దుర్భోధలనుండి బయటకు రండి! తప్పుడుబోధలను ఖండించండి! గద్ధిచండి బుద్ధిచెప్పండి అంటున్నారు! లేకపోతే యుద్ధం
చేస్తాను అంటున్నారు! అలాంటి సర్వాధిపతి సర్వశక్తిమంతుడైన దేవాదిదేవునితో
యుద్ధము చేసి జయించగలవా?
లోకములో
నుండి ప్రత్యేకించబడిన సంఘము లోకముతో కలవకుండా ప్రత్యేకముగా ఉండాలి గాని కాలక్రమేణా
లోకములో కలిసిపోకూడదు! ఇదే దేవుడు కోరుకుంటున్నారు! మీరు మూర్ఖులైన ఈ తరమువారికి
వేరై రక్షణ పొందుడి అని చెబుతున్నారు! వారు చేసే పనులు ఆచారాలు
చెయ్యొద్దు అని దేవుడు చెబుతున్నారు...
ద్వితియోపదేశకాండము 28: 14
అన్యుల
దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని
నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల,
యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
ఇప్పుడు
దేనికోసం మారుమనస్సు పొందమని చెబుతున్నారు అంటే:
విగ్రహాలకు
బలిచ్చిన వాటిని తినవద్దు!
వ్యభిచారం
జారత్వం చెయ్యొద్దు!
నీకొలాయితుల
బోధను అనుసరించవద్దు! లేకపోతే యుద్ధం చేస్తాను అంటున్నారు! దుర్భోదలు విస్తరిస్తూ
ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకోకుండా భారం కలిగి భాధ్యత కలిగి వాటిని ఖండిస్తూ సంఘాన్ని
సరిచేస్తూ ఉండాలి మనము! లేకపోతే దేవుని కోపానికి గురి అవుతాము
అని మర్చిపోవద్దు!
లోతైన మారుమనస్సు
ఉంటేనే ఇది సాధ్యం!
చూడండి:
ఈరోజు
దేవుడు నీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా?
దావీదుగారికి
దేవుడు మరో అవకాశం ఇచ్చారు-
బత్షెబతో పాపం చేసినప్పుడు! ఇక ఆ అవకాశం జారవిడువలేదు దావీదుగారు!
జీవితాంతం సాక్షిగా ప్రవక్తగా అభిషక్తుడిగా మిగిలిపోయారు! లోతైన మారుమనస్సు!
తోమా
గారికి అవకాశం ఇచ్చారు దేవుడు-
అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు అని! మన భారతదేశంలో
చెన్నై పట్టణంలో చనిపోయేవరకు విశ్వాసాన్ని వదలలేదు! లోతైన మారుమనస్సు!
పేతురు
గారు ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్దమాడారు! దేవుడు మరో అవకాశం ఇచ్చారు, పేతురు గారు చనిపోయే వరకు తన విశ్వాసాన్ని
వదలలేదు! లోతైన మారుమనస్సు!
ఈరోజు
దేవుడు నీకు మరో అవకాశం ఇస్తున్నారు. నీవు కూడా అలాంటి నిజమైన మారుమనస్సు లోతైన మారుమనస్సు
కలిగి ఉంటావా? అంతటా అందరు మారుమనస్సు పొందాలని తండ్రియైన దేవుని
ఆశ! మరినీవు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా?
*పెర్గమ సంఘము-6*
ప్రకటన 2:17
సంఘములతో
ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును.
మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన
యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని
తెలియదు.
ఇక పదిహేడో వచనంలో సంఘములకు ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినును గాక అంటున్నారు!
అనగా బుద్ధి ఉన్నవాడు వింటాడు అంటూ..
జయించువాడు
పొందుకునే భాగ్యములు రాస్తున్నారు!
మొదటిది
మరుగైన మన్నాను ఇస్తాను
రెండవది: తెల్లని రాతిని ఇస్తాను
మూడవది: ఆ రాతిమీద చెక్కబడిన ఒక
క్రొత్త పేరు ఉంటుంది. అది పొందిన వారికి తప్ప మరెవరికి తెలియదు
అంటున్నారు!
మొదటిది: మరుగైన మన్నా! గమనించాలి:
మన్నానిత్తును అనడం లేదు, మరుగైన మన్నానిత్తును
అంటున్నారు! అనగా ఇప్పుడు ఆ మన్నా మరుగైయుంది అని అర్ధము!
మన్నా కోసం చూసుకుంటే
మనకు నిర్గమకాండము 16వ అధ్యాయంలో
ఇశ్రాయేలు ప్రజలకు తినడానికి ఏమీ లేకపోతే మన్నాను ఇచ్చారు దేవుడు! నిర్గమ 16:14—16;
31;
అది ఏమిటి అని మనం
పరిశీలన చేస్తే అది దేవదూతల ఆహారం అని బైబిల్ చెబుతుంది. దేవదూతలు ఆహారం తింటారా అంటే తింటారు అది
మన్నాను తింటారు అని ఈ వాక్యభాగం చెబ్తుంది....
కీర్తనలు 78: 25
దేవదూతల
ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
మరి అది మరుగైపోయింది
అంటున్నారు ఏమిటి అని ఆలోచిస్తే దేవుడు మన్నా ను తీసి బంగారు పాత్రలో ఉంచి అతిపరిశుద్ధ
స్థలంలో గల మందసంలో దాయమని చెప్పారు మోషేగారికి!
నిర్గమకాండము 16: 33
కాబట్టి
మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.
నిర్గమకాండము 16: 34
యెహోవా
మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
ఆయన భద్రపరిచారు! అయితే అది దేవాలయంలో జాగ్రత్తగా ఉంచడం జరిగింది. దానిని
బబులోను వారు దేవాలయమును నాశనం చేసేటప్పుడు ఈ బలిపీటమును ఎక్కడో దాచేశారు యిర్మియా
గారు అంటారు! ఇప్పుడు బలిపీఠము, ఆ బలిపీఠములో
మరుగైఉన్న మన్నా ఎక్కడ ఉన్నాయో తెలియదు!
అయితే ఆ మరుగైఉన్న మన్నా ఏదో కాదు! జీవాహారము
నేనే! దీనిని తినువాడు మరలా ఆకలి గొనడు చనిపోడు అంటూ యేసుక్రీస్తుప్రభులవారు
చెప్పడం జరిగింది యోహాను 6:35; 48—51
35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు
వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.
49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
50. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.
51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను
ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు
ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఈయన జీవాహారం అని
లోకము తెలుసుకోలేక పోతుంది! అయితే తెలుసుకున్న వారికి, జయించిన వారికి ఆ మరుగైయున్న
మన్నా అయిన దేవుడు దానిని తిననిస్తాను అంటున్నారు! మరి నీవు జయించు
అనుభవం పొందుకోగలవా?
ఇక రెండవది: తెల్లని రాతినిత్తును అంటున్నారు:
పూర్వకాలంలో గొప్పవారు తమ విందులకు లేక తాము చేసే మహోత్సవాలకు
రమ్మని ఆహ్వానపత్రికను తెల్లని రాతిమీద వారి పేరు చెక్కి వ్రాసి వారికి ఆహ్వానం పలుకుతూ
ఉండేవారు! ఇది ఆ రోజులలో గొప్పవారి పద్దతి!
ఇప్పుడు దేవుడు కూడా పరలోకంలో జరిగే ఏదో బ్రహ్మాండమైన విందుకు
లేక మహోత్సవానికి జయించిన వానికి ఆహ్వాన పత్రికగా ఈ రాతిని ఇస్తున్నారు అన్నమాట! మరి
పరలోకంలో జరిగే మహోత్సవం ఏమిటి అని మనం ఆలోచిస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి రమ్మని
జయించిన విశ్వాస సమూహానికి దేవుడు ఈ తెల్లని రాతిని ఆహ్వానపత్రికగా పంపుతున్నారు అన్నమాట!
ప్రకటన గ్రంథం 19: 9
మరియు
అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన
మాటలని నాతో చెప్పెను.
గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి,
ఆ జ్యేష్టుల సమూహానికి నిన్ను రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే ప్రియ సహోదరి
సహోదరుడా! జయజీవితాన్ని నీవు కలిగి యున్నావా? జయించిన వారికే ఈ విందు తప్ప, ఓడిపోయినా వారికి కానేకాదు
అని గ్రహించాలి!
ఇక
మూడవది: ఆ రాతిమీద
వ్రాయబడిన క్రొత్తపేరు: నీవు బాప్తిస్మం పొందకముందు బహుశా నీ పేరు అప్పారావు
కావచ్చు! దానిని బాప్తిస్మమిచ్చి
మీ కాపరి దానిని అబ్రాహాముగా మార్చేశారు! అయితే జయజీవితం గలవారికి
దేవుడు మరోసారి పేరు మార్చబోతున్నారు! అది ఏమిటో పొందుకున్న వారికే
తెలుసు గాని మిగిలిన వారికి తెలియదు అంటున్నారు!
ఈరోజు దేవుడు మనలను
అనేకులను పిలుస్తున్నారు ప్రయాసపడి భారము మోసుకుని పోవు సమస్తజనులారా నాయొద్దకు రండి
నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ! మరినీవు వస్తావా? అలా వచ్చిన వారికి నా పిల్లలు లేక నాప్రజలు
కానివారిని నా ప్రజలు అని పిలుస్తాను అంటున్నారు దేవుడు! ఎక్కడ
మీరు నా పిల్లలు నా ప్రజలు కాదు అన్నానో అక్కడే వీరు నా పిల్లలు అని పిలుస్తాను అంటున్నారు!
మరి నీవు అలా పిలువబడతావా? ఆయన వివాహ మహోత్సవానికి
వస్తావా?
అయితే జయజీవితం జీవించడం
ఇప్పటినుండే ప్రారంభించు!
దైవాశీస్సులు!
*తుయతైర సంఘము-1*
ప్రకటన 2:18,19
18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన
పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా
19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును,
నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును;
నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
మనం పెర్గమ
సంఘం కోసం ధ్యానం చేసుకున్నాము! ఇంతవరకు మూడు సంఘాలకోసం ధ్యానం
చేసుకున్నాము!
ఇక నాల్గవ సంఘము తుయతైర
సంఘము!
*తుయతైర*: లోకముతో
ఐక్యమవుట! అనగా లోకంతో కలిసిపోవుట అని అర్ధం!
*ఎక్కడుంది*?
ఇదికూడా ప్రస్తుతం
టర్కీదేశంలో ఉంది. పెర్గమ పట్టణానికి
సుమారు 70 కి.మీ. ఆగ్నేయంగా ఉంది ఈ తుయతైర ప్రాంతం!
ప్రస్తుత
పేరు: *ఆకిస్సార్*!
*చరిత్ర*: మనకు తెలుసు- బబులోను
సామ్రాజ్యాన్ని మాదీయ-పారశీక అలయన్స్ సామ్రాజ్యము అంతము చేసింది.
మాదీయ-పారశీక అలయన్స్ సామ్రాజ్యాన్ని గ్రీకు వీరుడైన
అలంగ్జాండర్ ద గ్రేట్ అని పిలువబడే చక్రవర్తి అంతము చేశాడు. ఆ
రాజ్యాన్ని- రోమా సామ్రాజ్యము అంతము చేసింది.
ఈ క్రమంలో అలంగ్జాండర్ మాసిదోనియా కాలనీగా ఈ పట్టణాన్ని
కట్టించాడు! ఈపట్టణం వ్యాపార కేంద్రము! ఏఏ వ్యాపారాలు జరిగేవి అంటే మొదటగా తెల్లని నారబట్టలు, ఉన్నితో చేయబడిన వస్త్రాలు ఇంకా బట్టలకు అద్దకము చేయడం అనగా బట్టలకు అందమైన
రంగులు వేయడం లాంటి వ్యాపారానికి పేరుపొందింది! ఇంకా తోలుతో చేసిన
బట్టలు వస్తువులకు కూడా ఇది ప్రసిద్ధి! రకరకాలైన మట్టితో చేసిన
పాత్రలు, బొమ్మలు, తెల్లని పెంకులు అనగా
పైకప్పులు, ఇంకా ఊదారంగు వస్త్రాలు కూడా ఇక్కడనుండి రవాణా జరిగేవి!
బైబిల్ లో చెప్పబడిన ఫిలిప్పీ పట్టణంలో లూదియ అనే స్త్రీ
ఈ తుయతైర పట్టణానికి చెందినదే! ఆమె తుయతైర నుండి ఊదారంగు పొడి తెచ్చి
అమ్మేది, మరియు ఊదారంగు వస్త్రాలను మిగిలిన దేశాలకు సరఫరా చేసేది
అని చరిత్ర చెబుతుంది. అపో 16వ అధ్యాయం!
అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఈమె తన భర్త చనిపోయిన తర్వాత ఇక ఫిలిప్పీ
పట్టణంలోనే సెటిల్ అయిపోయింది. భయంకరమైన విగ్రహారాధికురాలు!
పౌలుగారి త్రయము అక్కడ అనగా ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు
రక్షించబడి- అయ్యలారా నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని అని
మీరు ఎంచితే నా గ్రహం లోనికి రండి అంటూ ఈ త్రయాన్ని మరియు లూకాగారిని ఆహ్వానించింది!
16:15; అలా ఫిలిప్పీ లో సంఘము మొదలయింది! ఈమె ద్వారా
తుయతైర పట్టణానికి సువార్త వ్యాపించి సంఘము ఏర్పడింది! అయితే
మరికొంతమంది అభిప్రాయం ఏమిటంటే పౌలుగారు కూడా ఈ ప్రాంతమలో పరిచర్య చేశారు, అప్పుడే ఈ సంఘము స్థాపించబడింది అంటారు! ఏదిఏమైనా లూదియ
అనే స్త్రీ, ఎపఫ్రొదితు, తిమోతి గారు మరియు
పౌలుగారు ఈ సంఘములో పరిచర్య చేశారు!
*తుయతైర పట్టణానికి ప్రభువు తననుతాను చేసుకునే పరిచయం*:
“అగ్నిజ్వాలలవంటి
కన్నులు గలవాడును అపరంజి అనగా కంచులాంటి పాదములు గల దేవుని కుమారుడు”
దీనికోసం
మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు ధ్యానం చేసుకున్నాము! అగ్నిజ్వాలల వంటి కన్నులు
ఎందుకున్నాయి అంటే దేవుడు ప్రతీ విషయాన్ని చూస్తున్నారు, పట్టించుకుంటున్నారు.
సంఘములలో సంఘముల మధ్య జరిగే కార్యముల కోసం ఆయనకు కోపం వచ్చింది అనియు,
ఇంకా సంఘమును హింసించే వారి పట్ల కూడా ఆయన కోపించి ఉన్నారని అందుకే ఆయన
కన్నులు అగ్నిజ్వాలల వలే ఉన్నాయని చూసుకున్నాము!
ఇక
కంచులాంటి పాదములు ఎందుకు ఉన్నాయంటే ఆయన శ్రమలకొలిమిలో తన పరిపూర్ణత సాధించారు! అందుకే ఆయన పాదములు కంచులా
మారిపోయాయి అనియు, ఇంకా ఏడు నక్షత్రాలు ఆయన చేతిలో మోస్తున్నారు
కాబట్టి సంఘాలు ఆయన చేతిలో ఉన్నాయి, సంఘము పడ్డ శ్రమలలో ఆయన కూడా
పాలిబాగస్తుడు అందుకే ఆయన పాదములు కంచులాగా ఉన్నాయి అని ధ్యానం చేసుకున్నాము!
ఇక
ఈ సంఘముతో ఎందుకు అలా పరిచయం చేసుకుంటున్నారు అంటే మొదటగా ఈ సంఘము కూడా శ్రమలలో ఉంది!
రెండవది: ఈ సంఘము కాలక్రమేణా లోకముతో
కలిసిపోయింది కాబట్టి ఆయన కోపించి ఉన్నారు అని అర్ధము చేసుకోవాలి!
ప్రియ
సంఘమా! అదే దేవుడు
నిన్ను నన్ను పరిశీలిస్తున్నారు అని గ్రహించి మనలను మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి!
దేవునికి తగినట్లుగా జీవించాల్సిన అవసరముంది అని గ్రహించాలి!
ఇక
ఈ సంఘము యొక్క మంచి లక్షణాలు:
*క్రియలు గలది
*విశ్వాసము గలది
*ప్రేమ గలది
*పరిచర్య చేసేది
*సహనము గలది
*మొదటి క్రియలు కన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువగా ఆసక్తిగా చేస్తున్నది!
ఓహో! ఎన్ని మంచి లక్షణాలు గలదో చూశారా!!!
ఎవరికైనా సీనియారిటీ పెరిగిపోతే సిన్సియారిటీ తగ్గిపోతుంది. గాని ఈ సంఘమునకు మొదటి క్రియలకన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువయ్యాయని దేవుడే
సర్టిఫికెట్ ఇస్తున్నారు!
ప్రియ చదువరీ! నీలో ఈ మంచి లక్షణాలున్నాయా?
నీలో క్రియలు పనిచేస్తున్నాయా?
విశ్వాసం ఉందా?
ప్రేమ ఉందా?
పరిచర్య చేస్తున్నావా?
సహనము కలిగి ఉంటున్నావా?
మొదటి క్రియలు కన్నా
కడపటి క్రియలు ఎక్కువగా చేస్తున్నావా?
ఈ సంఘము ఎంతో ధన్యమైన
సంఘము! అలాంటి ధన్యతలు మనము
కూడా పొందుకుందాము!
*తుయతైర సంఘము-2*
ప్రకటన 2:19
నీ
క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ
పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ
మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
ఈ సంఘములో అనేకమైన
మంచి లక్షణాలు ఉన్నట్లు గతభాగంలో చెప్పుకున్నాము!
*క్రియలు గలది
*విశ్వాసము
గలది
*ప్రేమ గలది
*పరిచర్య చేసేది
*సహనము గలది
*మొదటి క్రియలు
కన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువగా ఆసక్తిగా చేస్తున్నది!
అయితే క్రియలు కోసము, సహనము కోసం ఎఫెసీ సంఘమును ధ్యానం చేసుకునేటప్పుడు
చూసుకున్నాము కాబట్టి సంఘానికి ఉండవలసిన మిగిలిన లక్షణాలు మనం చూసుకుందాము!
ఈరోజు ప్రేమకోసం చూసుకుందాం!
యేసయ్య భోదలలో ఎక్కువగా ప్రేమతత్వము
నిండిఉంటాయి! నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనే ధర్మశాస్త్ర
ఆజ్ఞను (లేవీ 19:6, మత్తయి
19:19; 22:39) మరలా యేసుక్రీస్తు ప్రభులవారు కొట్టివేయక అలా ఆ ఆజ్ఞను
పాటిస్తే ఆజ్ఞలలో 6 ఆజ్ఞలను పాటించినట్లే కాబట్టి పొరుగువారిని
ప్రేమించమని, ఇంకా నీ శత్రువుని కూడా ప్రేమించి క్షమించమని చెప్పిన
ప్రేమమూర్తి మన యేసయ్య! చివరికి ఆ కల్వరి గిరిలో ఆ సిలువలో ఎన్నెన్నో
హింసలు పెట్టిన వారిపై జాలిపడి, క్షమించి, దేవుణ్ణి కూడా తండ్రీ! వీరేమిచేయుచున్నారో వీరెరుగరు
గనుక వీరిని క్షమించుము అని క్షమాభిక్ష పెట్టిన ప్రేమామయుడు, కరుణామయుడు ఆయన! అదే ప్రేమతత్వాన్ని అలవరచుకొని పౌలుగారు
మనకు రాస్తున్నారు ఇక్కడ ప్రేమను వెంటాడు! అనగా ఈలోక ప్రేమను
వెంటాడు అనడం లేదు! ఈ లోక ప్రేమలో lust అనగా కామాభిలాష, కామకోరికలు ఉంటాయి! గాని నిజమైన ప్రేమలో క్షమాపణ, ఆదరణ, సమాధానం, అనురాగం అన్నీ ఉంటాయి! అలాంటి ప్రేమను ప్రతీ దైవజనుడు పొందుకుని హత్తుకోవాలి అంటున్నారు పౌలుగారు!
కొలస్సీయులకు 3: 14
వీటన్నిటిపైన
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
ప్రియులారా!
ఈ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కారణం పౌలుగారు రాసిన పత్రికలు మామూలుగా చదువుకుంటూ పోతే – ఏమీ
అర్ధం కాదు మనకు. దానిని జాగ్రత్తగా ప్రార్ధనా పూర్వకముగా చదివితే
అర్ధం అవుతాయి మనకు పౌలుగారిని వాడుకొని పరిశుద్ధాత్ముడు ఎన్ని మంచి సందేశాలు మనకోసం
వ్రాయించారో అర్ధం అవుతుంది. ఈ వచనంలో అంటున్నారు పౌలుగారు—పరిపూర్ణతకు
అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ ఆయన వీటన్నికన్నా ప్రేమను ధరించుకొనుడి
అనడం లేదు గాని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటున్నారు. దీని
అర్ధం చాలా ఉంది గాని సింపుల్ గా చెప్పాలంటే—ప్రేమకు—పరిపూర్ణతకు
సంబందం ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే – పరిచర్య
చేయాలి అది fivefold ministry గాని, tenfold ministry
అయినా సరే! కాబట్టి ఈ పరిచర్య చేసే
దైవజనులు సంపూర్ణులు పరిపూర్ణులు కావాలి అంటే—ప్రేమను ధరించుకోవాలి!!! ఒక
వ్యక్తికి ఎన్ని ఫలాలు, శక్తులు, టాలెంట్లు
ఉన్నా ప్రేమలేకపోతే పరిపూర్ణుడు కాలేడు! పౌలుగారు అంటున్నారు 1 కొరింథీ
13:1-3 లో
1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను,
కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు
(అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నిమిత్తము అని
పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ
లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు. . .. *కాబట్టి ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు –వేస్ట్ ఫెల్లో!*
ప్రేమకు ప్రతిరూపం యేసుప్రభులవారు!
అందుకే ఆయన మనలను రక్షించడానికి మానవరూపం దాల్చి, పరమును విడచి, భువికి వచ్చారు. ఫిలిప్పీ 2:5,6,7,8
5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా
ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత
చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. . . .. . ఆయన మనకోసం ఎన్ని బాధలు పడ్డారో
కదా!
ఇక ప్రేమకోసం
బైబిల్ ఎక్కువగా రాసినవారు మొదటగా పౌలుగారు, రెండవదిగా యోహానుగారు!
ప్రేమకోసం రాయడానికి కారణం దైవజనులు ఇంకా విశ్వాసుల మధ్య
ప్రేమ ఒక్కటే వారి మధ్య పరిపూర్ణ ఐక్యతను నెలకొల్పగలదు! ప్రేమలేకపోతే
మనుష్యులు మధ్య స్వార్ధంతో కూడిన ఆశలు, తగాదాలు, కొట్లాటలు, చీలికలు ఉంటాయి. అందుకే సామెతలు 10:12 లో ప్రేమ అనేక దోషములను కప్పును అంటున్నారు. ప్రసంగీ
8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది , ఈర్ష్య పాతాలమంత
కఠోరమైనది అంటున్నారు.
దేవుడు మనపట్ల చూపేది ఆగాపే ప్రేమ! అది
అమరమైనది! అమోఘమైనది! అందుకే ఆయన యిర్మియా 31:3 లో అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక
నీ ఎడల కృపచూపు చున్నాను. ఎంత ప్రేమామయుడో మన స్వామి యేసు!!!
అదే ప్రేమను మనము కూడా కలిగియుండాలి అనేది దేవుని ఆశ! అయితే
ఈ ప్రేమ చల్లారిపోతుంది మనుష్యులలో! ఎలా? అక్రమము
విస్తరించినందువలన అనేకుల ప్రేమ చల్లారును! మత్తయి
24:12;
యోహాను 17:26 జాగ్రత్తగా
పరిశీలన చేస్తే తండ్రియైన దేవుడు యేసుప్రభులవారియందు ఏ విధమైన ప్రేమను ఉంచారో- అదేప్రేమ యేసుప్రభులవారు మనయందు
ఉండేలా తండ్రిని వేడుకున్నారు. పౌలుగారు చెప్పిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి:
రోమా 5:5
ఎందుకనగా ఈ నిరీక్షణ
మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
. . . దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎలా? పరిశుద్ధాత్మ
ద్వారా! కాబట్టి ఆ ప్రేమను కోల్పోవద్దు!
మరి
ఈ ప్రేమ మనలో ఎలా ఉండాలి?
*** నిష్కపటమైనదిగా ఉండాలి. రోమా 12:9;
*** చెడును అసహ్యించుకొనాలి. రోమా 12:9;
*** అనురాగం కలిగినదై యుండాలి. రోమా 12:10;
*** పొరుగువారికి కీడు చేయనిది రోమా 13:10;
*** క్షేమాభివృద్ధి కలుగజేసేది. 1 కొరింథీ 8:1;
ఇంకా రోమా 13:8,9,10
8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు.
పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు,
మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను
వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
* ప్రేమ దీర్ఘకాలము సహించును,
* దయ చూపించును.
* ప్రేమ మత్సరపడదు;
* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;
* అది ఉప్పొంగదు;
* అమర్యాదగా నడువదు;
* స్వప్రయో జనమును విచారించుకొనదు;
* త్వరగా కోపపడదు;
* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
* దుర్నీతివిషయమై సంతోషపడక
* సత్యమునందు సంతోషించును.
* అన్ని టికి తాళుకొనును,
* అన్నిటిని నమ్మును;
* అన్నిటిని నిరీక్షించును;
* అన్నిటిని ఓర్చును.
* ప్రేమ శాశ్వతకాలముండును.
👉
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
1కొరింది
13:4-8,13
అందుకే 1 కొరింథీ 14:1 లో
ప్రేమ
కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో-ప్రేమను వెంటాడుడి)
. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.
. .
గలతీ 5:6 ప్రకారం విశ్వాస కార్యసాధకం
కావాలి అంటే ప్రేమ తప్పకుండా కావాలి!
గలతీ 5:22
అయితే
ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశానిగ్రహము.
ఫిలిప్పీ 1:9
మీరు
శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి
పొందవలెననియు,
అందుకే
హెబ్రీ 10:25 లో
ఆ
దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు
చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము అంటున్నారు.
పేతురుగారు
ప్రేమ కోసం ఏమ్మన్నారు ఈ వచనాలలో ఉన్నాయి 1పేతురు 1: 21
మీరు
క్షయ బీజమునుండి కాక,
శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు
గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,
ఇంకా
రిఫరెన్సులు 3:8,
4:8;
యోహాను
గారు చెప్పినది చూద్దాం.
1 యోహాను 2:5
ఆయన
వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
మరిన్ని రిఫరెన్సులు 3:16; 3:17; 4:7, 12, 18; 2 యోహాను
1:6
తోటి దైవజనుడిని తోటి
సేవకుడిని ప్రేమించలేక పోతున్నాము. ఇక మనలో ప్రేమ ఎలా ఉంటుంది? అలా ప్రేమించలేక పోతే నీవు
నరహంతకుడవు అని యోహానుగారు చెబుతున్నారు. కనబడే సహోదరుడు,
కనబడే తోటి సేవకున్ని ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు
అని అడుగుతున్నారు యోహాను గారు!
ఈ సంఘములో ప్రేమ పుష్కలంగా
ఉంది. మరి మనలో ఉందా అలాంటి
ప్రేమ!?
కాబట్టి ఒకసారి మనల్ని
మనం పరిశీలన చేసుకుందాం. అట్టి
మహోన్నత ప్రేమ మనలో ఉన్నదా? మన ప్రేమ కేవలం మాటలలోనా,
చేతలలో కూడా ఉందా? ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి
ప్రయత్నం చేద్దాం!
అట్టి ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!
ఆమెన్!
*తుయతైర సంఘము-౩*
ఈ సంఘములో అనేకమైన
మంచి లక్షణాలు ధ్యానం చేసుకుంటున్నాము!
*క్రియలు గలది
*విశ్వాసము
గలది
*ప్రేమ గలది
*పరిచర్య చేసేది
*సహనము గలది
*మొదటి క్రియలు
కన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువగా ఆసక్తిగా చేస్తున్నది
ఇక తర్వాత మంచి లక్షణము:
విశ్వాసము గలది.
విశ్వాసము కోసం చూసుకుంటే:
విశ్వాసము అంటే మొదటగా మనకు గుర్తుకు
వచ్చేది అబ్రాహాము గారు! విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డారు!
ఎందుకు పిలువబడ్డారు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి
నిలిచారు కాబట్టి, దేవుణ్ణి మనస్పూర్తిగా నమ్మారు కాబట్టి విశ్వాసులకు
తండ్రిగా పిలువబడి అలా దేవుణ్ణి నమ్మడం ఆయనకు నీతిగా ఎంచబడి విశ్వాసువీరుల పట్టీలో
టాప్ గా నిలిచారు.
ఒక సామాన్య మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? అబ్రాహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే
ఆధిక్యతకు కారణాలు కనిపిస్తాయి:
1. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడచి,
నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెబితే (ఆది 12, హెబ్రీ 11:8)- ఎక్కడికి
వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను
ఎందుకు నమ్మాలి? అక్కడ ఏముంటాయి? ఇలాంటివి
ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశం నుండి సుమారు
300 మైళ్ళు నడచి హారాను వెళ్ళిపోయారు. మరలా అక్కడనుండి
ఐగుప్తు, కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన తన జీవితమంతా!
ధనవంతుడైన అబ్రాహాముగారు గుడారాలలో జీవిస్తూ, అరణ్యాలలో,
ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తు గడిపారు. గాని ఎప్పుడూ దేవున్ని ప్రశ్నించలేదు. ఇది చేస్తాను అది
చేస్తాను అన్నావు. ఏదీ? అనలేదు.
అదే అతనికి నీతిగా ఎంచబడింది, “అబ్రాహాము దేవుని
నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను” ఆదికాండము
15:6, రోమా 4:3. ఈ అనుకూల ప్రవర్తనే అబ్రాహాము
గారిని విశ్వాసులకు తండ్రిగా మార్చింది.
2. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-23. ఎందుకంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె
చేస్తాను అని వాగ్దానం చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్డుడని విశ్వసించి బలముపొందెను.
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
3. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెబితే, ఏ అడ్డంకము
చెప్పకుండా బలి అర్పించడానికి సిద్దమయ్యారు, మృతులను సహితము ఆయన
లేపడానికి శక్తిమంతుడని ప్రగాఢ విశ్వాసం కలియుండెను. అందుకే అది
అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయారు
అబ్రాహాము గారు!
కాబట్టి
అబ్రాహాము గారికున్న అదే విశ్వాసమును ప్రతీదైవజనుడు/ విశ్వాసి పొందుకుని వెంటాడాలి!
ఇంతకీ విశ్వాసము అనగా ఏమిటి? విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క
నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1
*విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది.
1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న
చూస్తాను అనే నమ్మకము.
2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.
విశ్వాసం
అంటే?
• చీకటిలోనికి దూకడం కాదు.
• గాలిలో మేడలు కట్టడం కాదు.
• దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.
• నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.
• దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.
• పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.
*నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు.
•నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం.
•నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి.
ప్రియ దైవజనుడా! నీకు
ఎలాంటి విశ్వాసము ఉంది? అబ్రాహాము గారిలాంటి విశ్వాసముందా లేక
ఎలాంటి విశ్వాసముంది? ఒకసారి హెబ్రీ 11వ
అధ్యాయం చూస్తే అక్కడ అనేకమంది విశ్వాసవీరులు కనిపిస్తారు. హేబెలు,
హనోకు, అబ్రాహాముగారు, మోషేగారు,
దావీదుగారు, .. ఇలా ఎందఱో ఉన్నారు అందరూ విశ్వాసముంచారు.
హెబ్రీయులకు 11: 13
వీరందరు
ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఇంకా 6వ వచనంలో ......
విశ్వాసములేకుండ
దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
10వ వచనంలో
ఏలయనగా
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు
అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
ఇంకా
ప్రియ దైవజనుడా! నీ పరిచర్య ఘనముగా జరగాలా? నీవు గంభీరమైన సేవ చేయాలి
అంటే నీకుండవలసినది విశ్వాసం!
ఒకసారి
౩౩—35 చదువుకుందాం...
33. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను
జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల
నోళ్లను మూసిరి;
34. అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి;
బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి;
అన్యుల సేనలను పారదోలిరి.
35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
అయితే
అదే విశ్వాసము శ్రమలను కూడా తీసుకుని వచ్చింది గాని వారు సోలిపోలేదు వాలిపోలేదు పారిపోలేదు! విశ్వాస బ్రష్టులు కాలేదు.
36—40 ..
36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను
ఖైదును అనుభవించిరి.
37. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి
శ్రమపడి హింసపొందుచు,
38. అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి.
అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
39. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,
40. దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము
అనుభవింపలేదు.
కాబట్టి దైవజనుడా నీవుకూడా అదే
విశ్వాసము కలిగియుండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగిఉంటావో అప్పుడు
శ్రమలు శోధనలు వస్తాయి. అప్పుడు అంత్యము వరకు నమ్మకముగా ధైర్యముగా
ఉంటే దేవుడు నీకు జీవకిరీటం, మహిమ కిరీటం అన్ని ఇస్తారు!
భళానమ్మకమైన మంచి దాసుదా; అనే బిరుదు కూడా ఇస్తారు.
చివరగా 12:1—2 లో ... చూడండి
1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
2. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును
విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-
సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు
చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.
ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి,
సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున
ఆసీనుడైయున్నాడు.
ఇక్కడ పౌలుగారు మనము కూడా ఆ విశ్వాసవీరులను
అనుసరిద్దాము అనడం లేదు, ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే
యేసుక్రీస్తు ప్రభులవారిని అనుసరించాలి అంటున్నారు పౌలుగారు! ప్రియ దైవజనుడా! నీ విశ్వాస ఆత్మీయ యాత్రలో నీకు తోడుగా
కావలసినది యేసుక్రీస్తు ప్రభులవారు, పరిశుద్ధాత్ముడు!
ఆయనను తోడుగా ఉండమని అడుగు! ఆయన ఎన్ని కష్టనష్టాలు
వచ్చినా ఎన్ని ఇరుకుఇబ్బందులు వచ్చినా నీతోనే నీలోనే ఉంటారు.
కాబట్టి ఆయనమీద విశ్వాసముంచి
ఆయనను నమ్ముకుని నీ యాత్రను కొనసాగించు!
జయము నీదే! భయము లేదు!
*తుయతైర సంఘము-4*
ఇక తర్వాత మంచి లక్షణము:
పరిచర్య చేసేది:
పరిచర్య అనగా కేవలం
సువార్త ప్రకటించేది మాత్రమే కాదు. అసలు పరిచర్యలో రకాలు కోసం చూసుకుందాం.
1
Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11
4. _కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే_.
5. _మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే_.
6. _నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే_.
7. _అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది_.
8. _ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును,
మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును_,
9. _మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క
ఆత్మవలననే స్వస్థపరచు వరములను_
10. _మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి
ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము
చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి_.
11. _అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా
పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు_.
1
Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30
28. _మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను,
అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు
చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను_.
29. _అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?
30. _అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?
సంఘం అభివృద్ధి చెందడానికి దేవుడు
, సంఘంలో ప్రతీ ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం ప్రకారం,
కొన్ని వరాలు-ఫలాలు ఇస్తారు!
కొందరిని ప్రత్యేకమైన
సేవకోసం ఎన్నుకొంటారు!
వారు అనేక రకాలుగా
ఉన్నారు.
వీరిని రెండు వర్గాలు
చేసారు.
1. Fivefold Ministry- ఐదు మడతల/ఐదు మెట్ల సేవ,
2. Tenfold Ministry- పదిమెట్ల / పది మడతల సేవ .
Fivefold ministry is a
part of Tenfold Ministry.
ఈ Fivefold ministry లో సేవ చేసేవారు చాలా
వరకు fulltime ministry(సంపూర్ణ సేవ) చేస్తారు.
మిగతా ఐదు భాగాల వారు, తమ తమ పనులు చేసుకొంటూనే part
time ministry చేస్తారు.
Fivefold ministry లో ఉన్నవారి
కోసం గతంలో ధ్యానం చేసుకున్నాము!
వీరు 1. అపోస్తలులు,
2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5. సువార్తికులు/ఉపదేశకులు,
మిగతా
ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు,
9. పరిచర్య చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.
రక్షించబడిన
ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి
నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!
ఈ fivefold Ministry కోసం గతంలో
చెప్పుకున్నాము గనుక ఇక మిగిలిన పరిచర్య విధానాలు చూసుకుందాం! గమనించాలి: ఈ పదిరకాల సేవలు కూడా పరిచర్య క్రిందనే వస్తాయి!
అందరూ
ప్రవక్తలు, అపోస్తలులు,
అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని
నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు
ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపా వరములు ఎన్నో ఉన్నాయిగాని,
ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు
ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు!
మనమంతా
ఆ సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం
కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి
విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!
గొప్ప ఇంటిలో వెండిపాత్రలు,
బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు,
అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ
ఉంటాయి. అయితే వాటిని వాడేవిధానం, వాడబడే
విధానం వేరు. వేరువేరుపనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము.
అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో
విధానంలో వాడుకొంటారు.దేవుడు మన CEO. ఆయన
ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.
*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*
Fivefold
ministry తర్వాత విభాగం వారు *అద్భుతాలు చేసేవారు*.
అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది.
దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు
విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును. అన్న యేసయ్య
మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.
తర్వాత విభాగం *భాషలు మాట్లాడువారు-అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని
ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ
భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని
కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు
దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన
మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే
మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు
లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.
తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్
సెలవిస్తుంది. యాకోబు 1:27; యెషయా
58
తర్వాత విభాగం *పరిచర్య చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది.
దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక) ఉండాలి.
ఈ సంఘానికి
ఇది ఉంది.
ఈరోజుల్లో
కుర్చీల్లో కూర్చోడానికి చూస్తున్నారు గాని కుర్చీలు, చాపలు ఎత్తడానికి ఇష్టపడటం
లేదు. ఆలయాన్ని తుడవటానికి, కడగటానికి ఎవరు
సిద్దపడటం లేదు.
కారణం
ప్రిస్టేజ్, ఇగో, అయితే వీటిని పక్కన పెట్టి ఎవరైతే ఈ పరిచర్యలు చేస్తారో
దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తారు.
దానికి
ఉదాహరణ నేనే! నా చిన్నతనములో ప్రతీరోజు ఆలయం తుడిచేవాడిని, ఆరాధనకు
చాపలు వేయడం, తీయడం, ఎంగిలాకులు ఎత్తడం,
నీరు మోయడం ఇవన్నీ చేసేవాడిని. ఇప్పుడు కూడా చేస్తాను.
ఫలితం- ఆశ్చర్యంగా దేవుడు నన్ను ఆత్మీయంగా,
ఆర్దికముగా దీవించారు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే
ఇలాంటివి చెయ్యాలి.
చివరగా *ప్రభుత్వాలు
చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు.
నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం
పనిచేసే వారు తక్కువ. ఓ సంఘపెద్ద! నీవు
అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటు పడమని ప్రభువు పేరిట
మనవి చేస్తున్నారు.
చివరగా రక్షింపబడిన విశ్వాసి అది
ఎవరైనా సరే ఈ tenfold ministry లో ఏదో ఒక పని చెయ్యాలి.
దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఒకటే కాకుండా నాలుగైదు విభాగాలలో భాగస్తులై
ఉండాలి. అయితే వీటిలో ఏదీ చెయ్యడం లేదా, అలా అయితే నీవు నులివెచ్చగా ఉన్నావన్నమాట!!! అందుకే యేసయ్య
నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు కాబట్టి నానోట నుండి నిన్ను
ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అంటున్నారు. (ప్రకటన
3:15-16)
ఒకవేళ
నీకు సువార్త ప్రకటించడం వీలు కాదా- అయితే వెళ్ళేవారిని పంపండి. మీ ప్రవర్తన ద్వారా సువార్త చెయ్యండి.
మరీ ముఖ్యముగా భారముతో కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి. అట్లు జరిగించిన నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా తనసేవలో వాడుకొంటారు.
లేదంటే విడువబడే గుంపులో ఉంటావు.
దయచేసి ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకో/సరిదిద్దుకో!
అయితే ఇప్పటికే కొన్ని వరాలు-ఫలాలు ఉన్నాయా? అయితే మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం
చేయు.
సరే, ఈ సంఘము పరిచర్యలో బాగస్తులై ఉన్నారు!
అనగా ఏ రకమైన పరిచర్య చేశారో తెలియదు గాని దేవుడే చెబుతున్నారు:
నీపరిచర్య నాకు తెలుసు! మీద చెప్పిన పరిచర్యలో
గాని లేదా దైవసేవకులకు/ పరిశుద్ధులకు కూడా పరిచర్య చేసి ఉండవచ్చు!
గాని దేవుని నుండి సెహబాస్ అనే సర్టిఫికెట్ పొందుకున్నారు! ప్రియ దేవుని బిడ్డా! సంఘములో సభ్యుడివి అయినంత మాత్రమే
కాకుండా సంఘములో సంఘకార్యక్రమాలలో పాలుపొందుతున్నావా? నాకెందుకు
పాష్టర్ గారు చూసుకుంటారు, లేక పాష్టరేట్ కమిటి చూసుకుంటుంది
అని వదిలేస్తున్నావా? పరిచర్యలో పాలుపొందితే దైవాశీర్వాదలకు వారసుడవు
అవుతావు!
*తుయతైర సంఘము-5*
ప్రకటన 2:19—20
19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును,
నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును;
నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరి యెక్కువైనవని యెరుగుదును.
20. అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా,
తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు.
జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని
తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ఇక
తర్వాత మంచి లక్షణము:
మొదటి
క్రియలు కన్నా కడపటి క్రియలు అధికముగా చేసేది:
నిజం
చెప్పాలంటే సీనియారిటి పెరిగిపోయే కొలదీ సిన్సియారిటీ తగ్గిపోతుంది- అది వ్యక్తులకైనా సంస్థలకైనా,
చివరికి సంఘానికైనా!
అవును
కదా మనకు కూడా బాప్తిస్మము పొందుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రార్ధన పట్ల ఆసక్తి, ఉపవాసం పట్ల ఆసక్తి,
పరిచర్య సువార్తమీద నున్న ఆసక్తి ఇప్పుడు కనబడటం లేదు కదా! మోకాళ్ళు వేస్తే చాలు కళ్ళంబడి నీరు వచ్చేసేది, బాషలు,
ప్రార్ధన అనర్ఘళంగా వచ్చేసేవి కదా, మరి ఇప్పుడు
అవి ఏవి? ఏమైనా అంటే కాళీ ఉండటం లేదండి అంటావు! నీలో ఆ మొదటి ఆసక్తి, మొదటి క్రియలు కనబడటం లేదు!
అలాగే
కొన్ని సంఘాలు మొదట్లో నెలకి ఒకసారైనా రెండు సార్లైనా సువార్తకు వెళ్లి వీది సువార్తలు
ప్రకటించేవి. రెండు నెలలకు ఒకసారైనా ఉపవాస కూటాలు జరిగేవి! మరి ఇప్పుడు
అవి ఏవి? పేరుకు మాత్రం ప్రతీ సంవత్సరం సభలు పెట్టేస్తారు గాని
ఉపవాస కూటాలు మాత్రం జరుగవు! ఎందుకంటే సీనియారిటి పెరిగిపోయి
దేవునిమీద, సేవమీద సిన్సియారిటీ తగ్గిపోయింది. గాని ఈ సంఘానికి ఇంకా ఎక్కువ అయినట్లు దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నారు!
ఎంత ఘనమైన సంఘమో కదా ఇది!
ఈ సంఘాన్ని
చూసి ప్రతీ సంఘము, ప్రతీ విశ్వాసి, ప్రతీ సేవకుడు నేర్చుకోవాలి!
ప్రియ స్నేహితుడా! ఒకసారి నిన్నునీవు పరిశీలన చేసుకో!
నీ మొదటి క్రియలు కన్నా ప్రస్తుత క్రియలు పెరిగాయా లేక తగ్గిపోయాయా?
లేకపోతే ఎఫెసు సంఘానికి చెప్పినట్లు నీకు కూడా చెప్పగలరు కాబట్టి ఏ విషయంలో
తప్పిపోయావో ఆ మొదటి క్రియలను చేయుటకు మరలా మొదలుపెట్టు!
సరే, ఇంతటి ఘనమైన సంఘము మీద కూడా
దేవుడు కొన్ని తప్పిదములు మోపుతున్నారు! చూడండి ఈ సంఘము క్రియలు
గలది, ప్రేమగలది, విశ్వాసం గలది,
సహనం కలది, మొదటి క్రియలు కన్నా కడపటి క్రియలు
మరీ విస్తారంగా చేస్తూ దేవునిలో దూసుకునో పోతుంది కదా, మరి దేవుడు
తప్పులు మోపడం ఏమిటి?
సరే, ఏమి తప్పులో చూద్దాం!
20వ వచనంలో ఒకే ఒక తప్పు మోపుతున్నారు దేవుడు! తప్పులు
కాదు- తప్పు! ఏమిటంటే తాను ప్రవక్తిని అని
చెప్పుకుంటున్న యెజెబెలు అనే స్త్రీని నీవు సంఘములో ఉండనిస్తున్నావు! అదే తప్పు! ఆమె ఉండటం తప్పు ఏమిటి అంటే: అది జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని
తినినా పర్వాలేదు అని చెప్పి దాసులను మోసగిస్తుంది! అదే తప్పు!
అలాంటిదానిని సంఘమునుండి బయటకు వెళ్ళగొట్టడం మానేసి దానిని సంఘములో ఉంచుకున్నారు!
ఆమె బోధలు వింటున్నారు! పెర్గమ సంఘానికి దేవుడు
చెప్పినట్లే ఈ సంఘమునకు కూడా దేవుడు చెబుతున్నారు!
బాగా గమనిస్తే
ఈ తుయతైర సంఘము కూడా వ్యభిచారం చెయ్యడం లేదు, విగ్రాహారాధన చెయ్యడం లేదు, విగ్రహాలకు
బలి ఇచ్చిన వాటిని తినడం లేదు! గాని ఈ యెజెబెలు స్త్రీ బోధలను
నమ్మి మోసగిస్తుంది! అసలు ఆమెను ఆ బోధలు ఆమె చెప్పకుండా చెయ్యాలి
కదా, ఆమెను సంఘములో ఎందుకు ఉండనిస్తున్నారు ఇదీ దేవుని ప్రశ్న!
ఇదే దేవుడు మోపిన తప్పు మరియు నేరం!!!
ఒకసారి
మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంత ఘనమైన సంఘము, ఆధ్యాత్మికముగా స్థిరంగా ఉన్న సంఘము కూడా ఈమె బోధలకు
మోసపోయారు అని బైబిల్ చెబుతున్నది అంటే నా ఉద్దేశం ఏమిటంటే—ఆమె యెజెబెలు అని చెప్పినా, జారత్వము చేసినా తప్పులేదు
అని ఆమె చెబుతున్నా ఆమె మాటలకు విలువ ఇస్తున్నారు అంటే ఆమె అందానికి ఈ సంఘము మోసపోయింది
అని నేను అనుకోవడం లేదు! ఆమె బోధలకు కూడా ఈ సంఘము మోసపోయింది
అని నేను అనుకోవడం లేదు! అయితే ఏదో తప్పకుండా జిమ్మిక్కులు చేసి
ఉండాలి, అందుకే ఈ సంఘము మోసపోయింది అని నా ఉద్దేశ్యము!
ఆ జిమ్మిక్కులు
తప్పకుండా ఫేక్ ప్రవచనాలు,
అద్భుతాలు అయి ఉండాలి! ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు-
సాతాను తానే వెలుగుదూత వేషంలో వస్తున్నాడు అని వ్రాయబడి ఉంది!
2కోరింథీయులకు 11: 14
ఇది
ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు
ఇలాంటిది ఏదో చేసింది! అందుకే ఆ ఆద్భుతాలు చూసి మోసపోయి ఉంటుంది ఇంత ఘనమైన
ఆధ్యాత్మికత గల సంఘం కూడా!
ఈరోజులలో
విశ్వాసులు కూడా జిమ్మిక్కులకు మోసపోయి పడిపోతున్నారు! సంఘానికి చెందవలసిన కానుకలు
అర్పణలు మరొకరికి వెళ్ళిపోతున్నాయి! ఆ జిమ్మిక్కులు ఏవీ కావు-
అద్భుతాలు! వాటిలో చాలా అద్భుతాలు నిజమైన అద్భుతాలు
కాదు, ఫేక్ అద్భుతాలు!
అయ్యా! యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం
ఏకరీతిగా ఉన్నాడు! అవును ఆమెన్! దీనిని
నేను నమ్ముతున్నాను- ఈ రోజులలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి-
జరుగుతాయి అని నేను నమ్ముతున్నాను, బోదిస్తున్నాను!
మరి అయితే ఫేక్ అద్భుతాలు అని ఎందుకు చెబుతున్నావు అంటే: అవును ఈరోజులలో చాలా సాక్ష్యాలు డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు.
మా అయ్యగారు ప్రార్ధన చేస్తే ఇలా జరిగింది అలా జరిగింది అంటూ!
మరికొందరు గొప్ప ప్రసంగీకులు, అద్భుతాలు చేసేవారు
అనే వారిలో కూడా చాలామంది సాక్ష్యాలు మీటింగులు జరుగకముందే రడీ అయిపోతున్నాయి.
అవునండి- సభలు జరుగక ముందే వారికి రిహాల్సస్ కూడా
జరిగిపోతున్నాయి! మరి ఇలాంటి జిమ్మిక్కులు ప్రజలు చూసి నిజమని
వారివెంట వేలం వెర్రిగా వెంటబడి పోతున్నారు! మరికొందరు అపోస్తలులు
కాకపోయినా వారికి సంఘము లేకపోయినా, కాపరి కాకపోయినా, అబద్దప్రవచనాలు చెప్పి, రెండు భాషలు మూడు ప్రవచనాలు చెప్పి, పేరుకు ముందు అపోస్తలుడు అని తగిలించుకుంటున్నారు, ముఖ్యంగా కొంతమంది ఆఫ్రికా దేశాల
నుండి మనదేశం వచ్చి మన తెలుగురాష్ట్రాలలోనే స్థిరపడి ఇలా అపోస్తలులుగా స్థిరపడి పోతున్న
ఫేక్ అపోస్తలులు కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు!
సంఘమా! ఇటువంటి వారిని కనిపెట్టండి!
మీ సొంత సంఘమును సొంత కాపరిని నమ్మండి! అద్భుతాలు,
తీపి మరియు ఉద్రేకభరితమైన ప్రసంగాలు విని మోసపోవద్దు అని మనవిచేస్తున్నాను!
ఈ సంఘానికి ఆ సంఘానికి, ఈ సేవకుని దగ్గరకు ఆ సేవకుని
దగ్గరకు పరుగులు పెట్టవద్దు! మీ సంఘమును వదలవద్దు!
ఒకవేళ మీ
సంఘము సంపూర్ణ సువార్త ప్రకటించకుండా, రాకడకు ప్రజలను సిద్దపరచకుండా, నిజమైన
ఖండితమైన బోధను చెప్పకుండా, వాక్యానుసారమైన బోధలేకుండా ఉంటే-
మొదటగా మీ సంఘకాపరితో మాట్లాడండి! మరేమీ పర్వాలేదు!
ఆయన మీపీక తీసేయ్యడు! అయ్యా వాక్యం ఇలా చెబుతుంది
కదా, మీరెందుకు అలా చెబుతున్నారు, అలా చేస్తున్నారు
అని అడగండి! తప్పకుండా సరిచేయబడతాయి సంఘాలు! ఎవరూ అడగకపోతే అలాగే ఉండిపోతాయి! ఒకవేళ అడిగినా సరిచేయబడకపోతే,
నిజమైన వాక్యం, నిజమైన బోధ, వాక్యానుసారమైన బోధ లేకపోతే అప్పుడు మీసంఘముతో చెప్పి మరో సంఘానికి వెళ్ళండి
గాని, ఇటూ అటూ పరుగులెత్తవద్దు! జిమ్మిక్కులుకు
మోసపోయి సంఘముల వెంట తిరుగవద్దు! ఈ తీపి, ఉద్రేక బోధకులకు మీ కానుకలు పంపించవద్దని మనవిచేస్తున్నాను!
ఈ తుయతైర సంఘము అలాంటి జిమ్మిక్కులకు
మోసపోయి, యెజెబెలు చెప్పేది తప్పని తెలిసినా ఆమెను ఖండించకుండా
ఆమెను సంఘ బహిష్కరణ చెయ్యకుండా ఉన్నారు కాబట్టి దేవునిచేత నేరం మోపబడ్డారు!
మరి నీవు అలా ఉంటావా?
ప్రియమైన
దైవజనమా! మనలో ఉన్న
యెజెబెలుని, యెజెబెలు ఆత్మను బయటకు పంపుదామా? యెజెబెలు లక్షణాలను తరుముదామా?
నేడే సరిదిద్దుకుంటావా ?
*తుయతైర సంఘము-6*
ప్రకటన 2:20
అయినను
నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని
చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము
చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు
బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ఇక ఈ వచనంలో యెజెబెలు
అనే స్త్రీ కోసం దేవుడు చెబుతున్నారు!
అసలు యెజెబెలు
ఎవరు అని చూసుకుంటే:
బైబిలో
లో గల అత్యంత చెడ్డ స్త్రీలలో మొదటి నంబర్ ఎవరికీ ఇవ్వాలంటే ఈ యెజెబెలుకే ఇవ్వాలి!
ఈమె ఇశ్రాయేలు
రాజైన ఆహాబు భార్య! సీదోను రాజు అయిన ఎత్బయలు కూతురు! ఈమె కోసం 1రాజులు 16—21 అధ్యాయలలోను, మరలా 2రాజులు 9వ అధ్యాయం లోను వ్రాయబడింది!
ఈమెకున్న
గుణగణాలు చూసుకుందాము!
మొదటిది: ఈమె దేవతలా ప్రవక్తలను పోషించేది: 1రాజులు 18:19...
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని
చెప్పెను.
రెండవది: పగ తీర్చుకునే స్వభావం
గలది: 1రాజులు 19:2
యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను- రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు
గొప్ప అపాయము కలుగజేయునుగాక.
మూడవది: హంతకురాలు:
1రాజులు 21:7; 13
7. అందు కతని భార్యయైన యెజెబెలు- ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి
భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన
నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
13. అప్పుడు పనికిమాలిన
యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండి-నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా
వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
నాలుగు: జారత్వము,
చిల్లంగితనము చేసేది: 2రాజులు 9:22
అంతట యెహోరాము యెహూను చూచి - యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ- నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా
సమాధాన మెక్కడ నుండి వచ్చుననెను.
రాజైన ఆహాబు దేవునితీర్పు వలన చనిపోతే పట్టపురాణియై
ఉండగానే జారత్వము చేసింది కోరికలు తీర్చుకోడానికి. ఇది పై వచనమే చెబుతుంది.
అనగా జారిణి మరియు చెడుపులు పెట్టేది!
చివరగా: భర్తను కీడు చెయ్యమని
ప్రేరేపించేది: 1రాజులు 21:25
తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి
కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.
ఇలా చూసుకుంటే జీవితమంతా అవలక్షణాలే ఈ
స్త్రీకి!
ఈమె పేరుకు రెండు
అర్ధాలున్నాయి! మొదటిది:
శీలవతి! పేరుకు శీలవతే గానే భర్త చనిపోయాక శీలాన్ని
పోగొట్టుకుంది.
రెండవది: పేడగుట్ట అనగా పెంట, ఇంకా చెప్పాలంటే పెంటమ్మ!!! ఈ పేరు సరిగా సూటి అవుతుంది
ఈ స్త్రీకి!
ఎప్పుడూ
మొకానికి రంగు, మూతికి
రంగు వేసుకుని భయంకరమైన
బట్టలు వేసుకుంటూ ఒక ఇశ్రాయేలు రాజ్యానికి రాణి అని మర్చిపోయి అన్యదేవతలను అనగా బయలును,
అషేరా దేవిని పూజిస్తూ వాటికి బలులు అర్పిస్తూ వాటి ప్రవక్తలను పోషించింది.
ప్రవక్తయైన ఏలీయా గారిని చంపాలని చూసింది!
అంతేకాకుండా
భక్తుడైన పేదవాడైన నాబోతు గారిని ఏ నేరం లేకుండా అబద్ద సాక్షులతో చంపించింది! భర్తను ఇలాంటి హత్యానేరాలకు
పాలుపాడమని సలహాలు ఇచ్చింది!
నేటి
దినాలలో ఈమె క్వాలిటీస్ ఉన్న విశ్వాసులు మనకు సంఘాలలో కనిపిస్తున్నారు! మొగానికి మూతికి రంగులు
వేసుకుంటూ, భయంకరమైన వస్త్రధారణ చేయడమే కాకుండా, భర్తలను అక్రమ మార్గాలలో నడవమని సలహాలు ఇచ్చే వారున్నారు! అయ్యా బయట వ్యక్తుల కోసం నేను చెప్పడం లేదు! సంఘాలలోనే
ఉన్నారు! అలాంటి వారు నాకు తెలుసు! ఇప్పుడు
కాకపోతే మరెప్పుడు సంపాదిస్తావు అని భర్తను శోధిస్తూ అక్రమమైన ధనమును సంపాదించమని అడుగుతున్నారు!
మరికొందరు తెగించి ధనముకై అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు!
సంఘమా! ప్రతీ సంఘములో కూడా ఇలాంటి యెజెబెలులు తయారవుచుండగా
వారిని ఖండించావా? బుద్ధి చెప్పావా? వారిని
వెలివేశావా? వారిని బహిష్కరించకపోతే ఈ తుయతైర సంఘాన్ని ప్రశ్నించిన
దేవుడు నిన్ను కూడా ప్రశ్నించి, నీతోకూడా యుద్ధము చెయ్యడానికి
సిద్దంగా ఉన్నారు! దేవునితో యుద్ధం చేసి బ్రతకగలవా?
నేడే
ఇటువంటి వారిని బయటికి తోలెయ్యండి! లేదా మారుమనస్సు పొందడానికి ఒక అవకాశం ఇచ్చి,
వినకపోతే సంఘాలనుండి బయటకు త్రోసివేయ్యండి! లేకపోతే
దేవునిచేత మీరే బయటకు త్రోసివేయబడతారు అని గ్రహించండి!
ఈ సంఘము
ఇంతటి అవలక్షణాలున్న స్త్రీని కూడా ఇంకా సంఘములో ఉంచుకున్నారు! ఆమె బోధలను వింటున్నారు!
ఆమె ప్రవచనాలు వింటున్నారు! ఆమె జారత్వము చేసినా
తప్పులేదు, అది మన దేహానికే అంటుకుంటుంది గాని ఆత్మకు అంటదు అని
చెప్పినప్పుడు , విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినినా పర్వాలేదు
అని చెప్పినప్పుడు, అయ్యగారు
అనగా వారి గురువుగారు ఆత్మావేశుడై ఇలా చెప్పారు, బైబిల్ ఇలా చెబుతుంది, నీవు అలా చేబుతావేమి అని ప్రశ్నించలేదు! అదే నేరంగా దేవుడు
పరిగణించారు!
పౌలుగారు
అంటున్నారు
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:14,15,16,17
14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో
ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి
పాలెక్కడిది?
16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల
దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును
వారు నా ప్రజలైయుందురు.
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
మరి విశ్వాసికి జారత్వానికి, విగ్రహాలకు పాలెక్కడ?
విశ్వాసికి- లోకాచారాలతో సంభందము ఏమిటి? ఎందుకు లోకాచారాలు చేస్తున్నారు?
లోకమునుండి ప్రత్యేకించబడిన
నీవు, ప్ర్రత్యేకంగా జీవించాలి
గాని లోకముతో కలిసి లోకాచారాలు చేస్తూ జీవించకూడదు! వ్యభిచారిణులారా
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అని యాకోబుగారు ప్రశ్నిస్తున్నారు!!! యాకోబు 4:4;
కాబట్టి లోకంతో వేరుగా
ఉందాము!
ఇలాంటి తప్పుడు బోధలను
ఖండిద్దాం!
మనలోనుండి తీసేవేద్ధాము!
*తుయతైర సంఘము-7*
ప్రకటన 2:21—22
21. మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి
మారుమనస్సు పొందనొల్లదు.
22. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని
(అనేక ప్రాచీన ప్రతులలో- తమ అని పాఠాంతరము)
క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,
ఈ సంఘములో గల యెజెబెలు
అనే స్త్రీ కోసం చూసుకుంటున్నాము!
ఇంకా
ఈ స్త్రీ కోసం ఏమని చెప్పబడింది అంటే మారుమనస్సు పొందడానికి నేను దానికి సమయమిచ్చాను
గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు అనగా దానికి మారుమనస్సు
పొందడానికి జారత్వము విడిచిపెట్టడానికి అసలు ఇష్టం లేదు అంటున్నారు దేవుడు!
చూశారా, దేవుడు
ఇంత భయంకరమైన స్త్రీకి కూడా మారుమనస్సు పొందడానికి మరో అవకాశం ఇచ్చినా తన సుఖబోగాలను
జారత్వమును విడిచిపెట్టడానికి దానికి అసలు ఇష్టం లేనేలేదు అని హృదయాలను అంతరంగాలను
పరిశీలించే నీతిగల దేవుడు చెబుతున్నారు!
ఈరోజు
అనేకమందికి దేవుడు పశ్చాత్తాప పడటానికి సమయం ఇస్తున్నా దానిని సద్వినియోగం చేసుకోకుండా
ఈ యెజెబెలు వలే లోకాశలలో ధనాశలో పడిపోయి దేవుని స్వరాన్ని, వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నారు!
ఒక రోజు తప్పకుండా అనుభవిస్తారు!
అందుకే
రోమా 2:4,5 లో
పౌలుగారు చెబుతున్నారు: నీవు పశ్చాతాప పడటానికి దేవుడు నీకు సమయం
ఇస్తే దేవుని దయను నీవు చిన్నచూపు చూస్తున్నావా అని అడుగుతున్నారు.....
రోమీయులకు 2: 4
లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు
పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును
సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
రోమీయులకు 2: 5
నీ
కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు,
అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను
సమకూర్చుకొనుచున్నావు.
పేతురు
గారు మాట్లాడుతూ అంటున్నారు
2పేతురు 3: 9
కొందరు
ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని
యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
నీవు కూడా అలా చేస్తున్నావా?
నేడే దేవుని రాకడ
అయితే నీవు ఎత్తబడే గుంపులో ఉంటావా?
ఈరోజే దేవుని రాకడ
వస్తే నీ గతి ఏమిటి?
ఈ రోజే నీ చావు సంభవిస్తే నీ పరిస్తితి
ఏమిటి?
పరలోకం వెళ్ళగలవా?
దేవునితో సమాధానం
కలిగి ఉన్నావా?
నీ బ్రతుకు దేవుని దృష్టిలో బాగా ఉందా?
ఒకసారి పరిశీలించుకోమని మనవిచేస్తున్నాను!
ఈ స్త్రీకి సమయమిచ్చినా, అవకాశమిచ్చినా అది మార్పు చెందలేదు!
అందుకే దానిని మంచం పట్టించి దారిలోకి తెస్తాను అనడం లేదు, మంచం పట్టించి దాని అంతుచూస్తాను అంటున్నారు!
గమనించాలి: ప్రకటన గ్రంధం ప్రకారం- రాకడ ముందు వరకు పశ్చాతాప పడటానికి అవకాశం ఉంది! కారణం
మనం కృపాకాలంలో ఉన్నాము! ఒక్కసారి రాకడ జరిగిపోయిందా,
పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడా ఇక పశ్చాత్తాపమునకు తావులేదు!
ప్రకటన
గ్రంథం 9: 20
ఈ
దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్య ములను, చూడను వినను నడువను
శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన
విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.
ప్రకటన
గ్రంథం 16: 9
కాగా
మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి
గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.
ప్రకటన
గ్రంథం 16: 11
తమకు
కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను
మాని మారు మనస్సు పొందినవారు కారు.
పై
రిఫరెన్స్ ల ప్రకారం ఎవరు ఆ తర్వాత మారుమనస్సు పొందలేదు! పొందరు కూడా! కాబట్టి నేడు అనే దినము ఉండగానే మార్పునొందు ! ఇదిగో
ఇదే రక్షణ దినము నేడే అనుకూలసమయం....
2కోరింథీయులకు 6: 2
అనుకూల
సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు
గదా!
2కోరింథీయులకు 6: 3
ఇదిగో
ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
మరి ఆ దినము ఇదే! మరి దేవుని దగ్గరకు వస్తావా?
ఇక 22వ వచనంలో
అంటున్నారు: ఇదిగో దానిని మంచం పట్టించేస్తాను అంటున్నారు!
ఎందుకు? దానికి మారుమనస్సు పొందటానికి దేవుడు సమయం
అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు కాబట్టి ఇక దేవుని శిక్ష ఆ స్త్రీ మీదికి తిన్నగా
వస్తుంది. మంచం పట్టించి చంపబోతున్నారు దేవుడు!
అవును
దేవునిమాటను వినకపోతే తప్పకుండా నిన్ను మంచం పట్టిస్తారు దేవుడు!
చాలామంది
దేవుని మాటలు వినక హాస్పటల్ పాలవుతున్నారు! చాలామంది దేవుని డబ్బులు దేవునికి ఇవ్వక హాస్పటల్ లో
బిల్ పే చేస్తున్నారు! తనకు రావలసినవి ఆయన ఏదో రకంగా రాబట్టుకుంటారు!
గమనించాలి దేవునికివ్వాల్సినవి దేవునికి ఇవ్వకపోతే మనం అంతకంటే ఎక్కువగా
నష్టపోతాము! కాబట్టి బుద్ధి తెచ్చుకుని బోధకు లోబడు!
పంది ఎప్పుడూ మీదికి చూడదు!
ఎల్లప్పుడూ పనికిమాలిన వాటిని తినడానికి దాని చూపులు క్రిందనే ఉంటాయి!
ఒకరోజు కొందరు వచ్చి దానిని పట్టుకుని కావిడ కర్రకు కట్టి, తీసుకుని పోతుంటే జీవితంలో మొట్టమొదట సారి ఆకాశం వైపు కన్నులెత్తి అయ్యో ఆకాశం
అనేది కూడా ఉంటాదా అని అనుకుంటుంది! వారు దానిని తీసుకుని వెళ్లి
అదే కావిడ కర్రతో చచ్చేవరకు బాదుతుంటే అయ్యో దేవుడా , నీవు ఉన్నావా
అంటాది! నీదికూడా సేమ్, అదే బుద్ది!
ఆ పంది అప్పుడు అరిచినా దాని మొర వినేవారు ఎవరు ఉండరు! నీవుకూడా సమయం అయిపోయాక ఏడ్చినా ఉపయోగం లేదు జాగ్రత్త!
ఇక తర్వాత
మాట చూస్తే: దానితో
వ్యభిచరించిన వారు కూడా వారు చేసిన క్రియల విషయమై అనగా ఆమెతో కలిసి వారు చేసిన క్రియల
విషయమై మారుమనస్సు పొందితేనే సరి, లేకపోతే వారిని బహుశ్రమల పాలు
చేస్తాను అంటున్నారు! అనగా భయంకరమైన ఇక్కట్లు పాలుచేస్తాను!
ఎంత మజా అనుభవించారో, అంత భయంకరమైన ఇక్కట్లు బ్రతికుండగానే
చావును అనుభవించేటట్లు చేస్తాను అంటున్నారు దేవుడు! మరి ఇవి మనకు అవసరమా? అలాంటివి వద్దు అనుకుంటే ఇలాంటి పనికిమాలిన విషయాలు వదిలి దేవునితో సమాధాన
పడదాం!
ఇక తర్వాత
వచనంలో దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అంటున్నారు! అనగా ఆ పిల్లలు వ్యభిచార సంతానం
కాబట్టి నిశ్చయంగా చంపుతాను అంటున్నారు! ఇక్కడ దాని పిల్లలు అనగా
ఆ స్త్రీ బోధలను అనుసరించు వారు అని అర్ధం చేసుకోవాలి! అనగా ఎందరైతే
భలేబాగుంది అనుకుంటూ తప్పుడుబోధలయినా పర్వాలేదు- జారత్వం చేసుకోవచ్చు.
లోకస్తులతో మజా అనుభవించవచ్చు! విగ్రహార్పితమైనవి
తినవచ్చు అంటూ ఉబలాట పడ్డారో వారినందరినీ చంపేస్తాను అంటున్నారు దేవుడు! ఎప్పుడు దాని మాటలువింటే! మారుమనస్సు పొందితే కనికరిస్తారు
అన్నమాట!
మరి నీ
సంగతి ఏమిటి? దేవునిచేత
తీర్పుపొందుకుని మరణిస్తావా లేక కనికరం పొందుకుని ఆయన బిడ్డగా జీవిస్తావా? సామెతల గ్రంధకర్త అంటున్నారు: అతిక్రమములను చేయువాడు
వర్దిల్లడు గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును!
సామెతలు 28: 13
అతిక్రమములను
దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
మరి నీవు విడిచిపెడతావా ? ఆస్త్రీని కూడా దేవుడు విడిచిపెడతావా అని అడిగితే ఇది బాగుంది అని నేను విడిచిపెట్టను
అన్నాది!
మంచం ఎక్కించి చంపారు
దేవుడు! మరి నీవు ఏమంటావు?
తేల్చుకో!
*తుయతైరా సంఘము-8*
ప్రకటన 2:23-24
23. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను
హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
24. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక
సాతానుయొక్క గూఢమైన సంగతులను (మూలభాషలో- సాతానుయొక్క లోతైన వాటిని) ఎరుగమని చెప్పుకొనువారందరితో
నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను.
ఇక ఈ వచనంలో తర్వాత పాదములో అందువలన
అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును.
అంటూ మరియు మీలో ప్రతీవానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను
అంటున్నారు!
ఇక్కడ యెజెబెలును
ఏ విధంగా శిక్షిస్తానో అని చెప్పిన తర్వాత దాని పిల్లలను అనగా దాని అనుచరులను తప్పకుండా
చంపుతాను అనిచెప్పి ఇలా చెయ్యడం ద్వారా అన్ని సంఘములకు అంతరంగములను హృదయములను పరీక్షించువాడను
నేనే అనియు, ప్రతీ ఒక్కరిని
కనిపెడుతున్నాను, పరీక్షిస్తున్నాను అంతేకాకుండా వానివాని క్రియల
చొప్పున ప్రతీవానికి ప్రతిఫలం ఇస్తాను అని సంఘములన్నియు తెలిసికొంటాయి అంటున్నారు దేవుడు!
సంఘములో గల కొంతమంది
దుర్మార్గులను శిక్షించడం ద్వారా మొత్తం సంఘములన్నియు అలాంటి పనులు చెయ్యడం ద్వారా
దేవుని ఉగ్రత వస్తుంది అని భయపడతారు అని దేవుని ఉద్దేశ్యం!
గతంలో ఒకసారి
చెప్పాను- నాకు తెలిసిన ఒక పాష్టర్
గారి భార్యతో, నాకు తెలిసిన పెళ్ళికాని యవ్వనస్తుడు అక్రమ సంబంధం
పెట్టుకుని ఇద్దరూ లేచిపోయారు! ఇక ఆ సంఘకాపరి ముఖం ఎత్తుకోలేక,
మా ప్రాంతంలో సేవ చేయలేక తెలంగాణా పోయి సేవ చేసుకుంటున్నారు!
అయితే ఆ పాష్ట్రమ్మకి ఏం జరిగిందో నాకు తెలియదు గాని, ఆ యవ్వనస్తునికి చిన్న మేకు గుచ్చుకుని సెప్టిక్ అయ్యి, ఇప్పుడు తొడ వరకు కాలు తీసెయ్యడం జరిగింది! దేవుని సేవకు
ఆటంకం కలిగించేవారికి ఇలాంటి శిక్ష దేవుడు వేస్తాడు! ఇప్పుడు
అలాంటి పనులు చెయ్యడానికి మా వైపు యవ్వనస్తులు భయపడుతున్నారు!
కాబట్టి
దీని ఉద్దేశం ఏమిటంటే దేవుడు ప్రతీ విషయాన్ని గమనిస్తున్నారు అని గ్రహించాలి! దేవుడు చూశాడా ఏమిటి?
ఆయనకంత తీరికా? ఇంతపెద్ద సృష్టిలో, ఇంతమందిలో నేను సముద్రంలో కాకిరెట్టలాంటి వాడను అంటున్నారు చాలామంది—అయ్యా దేవుడు ప్రతీ ఒక్కరిని చూస్తున్నారు. ఇంకా సాతాను గాడి దగ్గర
కూడా దేవునికున్న CCTV కెమెరాలు ఉన్నాయి! ఇద్దరూ గమనిస్తున్నారు. దేవుడు ప్రతీ ఒక్కరిని ప్రతిఫలం
ఇవ్వడానికి గమనిస్తూ ఉంటే, సాతానుగాడు నీకోసం నాకోసం దేవునికి
కంప్లైంట్ ఇవ్వడానికి గమనిస్తూనే ఉన్నాడు! కాబట్టి దేవుడు చూడటం
లేదు అని అనుకోవద్దు! ఇంకా దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా
కూడా పెట్టారు! కారణం మనిషి చేసే ప్రతీ పాపం ఆకాశం క్రిందను,
భూమిమీదను చేస్తాడు కాబట్టి ఇద్దరినీ సాక్షులుగా పెట్టి వారిని కూడా
చూడమన్నారు దేవుడు! ఇప్పుడు ఆయన కళ్ళు కప్పి నీవు ఏం చెయ్యగలవు
చెప్పు!
ఓ స్త్రీ! భర్త ఇంట్లో లేడు కదా,
ఇంట్లో ఎవరు లేరు కదా అని నీవు ఏమేమి చేస్తున్నావో, అన్నీ దేవుడు, సాతాను, ఆకాశం భూమి గమనిస్తున్నారు! ఎవరూ లేరని నీ సెల్ ఫోన్లో ఏవిధమైన భయంకరమైన బూతు బొమ్మలు బూతు వీడియోలు చూస్తున్నావో,
ఎవరెవరితో ఎలాంటి చాటింగ్ చేస్తున్నావో అనీ గమనిస్తున్నారు అని మర్చిపోవద్దు
ప్రియ యవ్వన సహోదరి సహోదరుడా! నీ ప్రతీ కదలిక ఆయన
CCTV కెమెరా రికార్డ్ చేస్తుంది అని మరిచిపోకు! నీ త్రాగుబోతుతనం, నీ లంచగొండు తనం, నీ వ్యభిచారాలు, నీ పాడుపనులు, నీ బూతుమాటలు, నీ పోకిరిమాటలు, నీ సరసాలు, నీ దానధర్మాలు నీ మంచిపనులు అన్నీ కూడా రికార్డ్
అవుతున్నాయి!
అదే సమయంలో నీవు కార్చుతున్న కన్నీరు,
నీవు చేస్తున్న పరిచర్య, ఆర్తనాదాలు అన్నీ దేవుని
CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి! నీకు దేవుడు ప్రతిఫలం
ఇవ్వబోతున్నారు అని గమనించు!
దీనికోసం బైబిల్ లో
చాలా వివరంగా వ్రాయబడింది!
1సమూయేలు 16: 7
అయితే
యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను-అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము,
మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు
గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
1రాజులు 8:39
ప్రతి
మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తనను
బట్టి వారికి ప్రతిఫలమిచ్చి
కీర్తన 139:1—5
1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా
మనస్సు గ్రహించుచున్నావు.
3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని
నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా
తెలిసియున్నది.
5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు.
సామెతలు 24:12
ఈ
సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని
నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
యిర్మియా 17: 10
ఒకని
ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ
మును పరిశోధించువాడను,
అంతరింద్రియములను పరీక్షించువాడను.
హెబ్రీ 4:12,13
12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను
వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు
దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క
యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
ఇక
దేవుడు ప్రతిఫలం ఇవ్వడం కోసం చూసుకుంటే:
మత్తయి 16: 27
మనుష్యకుమారుడు
తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున
వానికి ఫలమిచ్చును.
రోమీయులకు 2: 6
ఆయన
ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
రోమీయులకు 2: 7
సత్ క్రియను ఓపికగా చేయుచు,
మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.
రోమీయులకు 2: 8
అయితే
భేదములు పుట్టించి,
సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును
వచ్చును.
ప్రకటన
గ్రంథం 20: 12
మరియు
గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను;
మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు
పొందిరి.
ప్రకటన
గ్రంథం 20: 13
సముద్రము
తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను;
వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
ప్రకటన
గ్రంథం 22: 12
ఇదిగో
త్వరగా వచ్చుచున్నాను.
వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద
ఉన్నది.
కాబట్టి ప్రియ సహోదరి
సహోదరుడా! దేవుడు నిన్ను గమనిస్తున్నారు
అని తెలిసి జాగ్రత్తపడు! నీ పనులు, నీ చూపులు,
నీ ఆలోచనలు, నీ మాటలు అన్నీ దేవునికి ఇష్టముగా
మార్చుకో! నిన్ను నీవు సరిదిద్దుకో!
అలాగే కన్నీరు కార్చుతున్న
ప్రియ దేవుని బిడ్డా! ఆయన నీ
కన్నీరు తుడిచే రోజు దగ్గరలో ఉంది! నీకు అతి త్వరలోనే ప్రతిఫలం
ఇవ్వబోతున్నారు అని గ్రహించు!
*తుయతైర సంఘము-9*
ప్రకటన 2:24—25
24. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక
సాతానుయొక్క గూఢమైన సంగతులను (మూలభాషలో- సాతానుయొక్క లోతైన వాటిని) ఎరుగమని చెప్పుకొనువారందరితో
నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను.
25. నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.
ఇంతవరకు ఈ సంఘములో
గల మంచి లక్షణాలు, దేవుడు మోపిన
నేరము, యెజెబెలు అనే స్త్రీ కోసం ఆమె అనుచరుల కోసం, బోధల కోసం చూసుకున్నాము! ఇక సంఘములో యెజెబెలు బోధలను
ఖాతరు చెయ్యకుండా కేవలం దేవుని వాక్యము మీదను, ఆయన ఆత్మాభిషేకం
మీదను మనస్సు పెట్టుకుని ఇతరత్రా వాటిమీదను దృష్టిపెట్టని విశ్వాస వీరులకోసం దేవుడు
24—25
లో ఆదరణకరమైన మాటలు చెబుతున్నారు!
నా
బిడ్డలారా! ఇంతవరకు
మీరు ఎన్నో శ్రమలను సహించారు! అయినా క్రియలను విడిచిపెట్టలేదు,
ప్రేమను విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు,
పరిచర్య మానలేదు! సహనం కోల్పోలేదు! మొదటిక్రియలు కన్నా ఇప్పుడు మరీ గొప్పగా ఉన్నారు! ఇక
మీమీద నేను ఏ భారం మోపను! అయితే మీరు కలిగి ఉన్నదానిని గట్టిగా
పట్టుకోండి అంటున్నారు!
అనగా
ఇప్పుడు మీరు ఎలా సాగిపోతున్నారో అలాగే ముందుకు సాగిపొండి! పనికిమాలిన యెజెబెలు మాటలను
ఎలాగు లెక్కచేయ్యడం లేదు, ఇకను లెక్క చెయ్యకండి, ఇంకా అలాంటి బోధలు వస్తే ఖాతరు చెయ్యకండి అంటున్నారు! చూశారా దేవుడు అందరికీ వార్నింగ్
ఇవ్వలేదు ఇక్కడ, చెడు చేసిన వారికి, చెడుమార్గంలో
నడుస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి, సన్మార్గంలో,
దేవుని మార్గంలో స్థిరంగా నిలిచిన వారికి సెహబాస్ అంటూ నా బిడ్డలారా
ఇదే మార్గంలో ఇలానే సాగిపొండి అంటూ ఆదరిస్తున్నారు దేవుడు!
పౌలుగారు
కూడా అలాగే చెబుతున్నారు! గలతీ సంఘంలో ఒకసారి కొంతమంది సున్నతి గ్రూప్ వారు వచ్చి, సున్నతికూడా పొందాలి అంటూ బోధించడం జరిగింది! వీరినే
దేవుడు యూదులు కాకయే యూదులమని చెప్పుకునే సాతాను సమాజం వారు అన్నారు ప్రకటన గ్రంధంలో!
అందుకు గాను పౌలుగారు చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఒకమాట అంటున్నారు:
మీరు మొదట మానుండి వినిన సువార్తయే సరియైన సువార్త! ఇక దానికి బిన్నంగా ఎవడైనా లేకపోతే మేమైనా సరే బోధిస్తే నమ్మొద్దు!
మీరు విన్నదే సరియైన సువార్త అంటున్నారు........
Galatians(గలతీయులకు) 1:8,9
8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన
యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు
శాపగ్రస్తుడవును గాక.
మనము
దేవుని నుండి పొందుకున్న బైబిల్ వర్తమానాలలో స్థిరంగా నిలిచి ఉంటే చాలు: అబద్దబోధకుల నుండి వారి
బోధలనుండి దూరంగా ఉంటే చాలు!
యోహాను 8:31—32
31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు
నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
32.అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
1కొరింథీ 15:2
మీరు
దానిని అంగీకరించితిరి,
దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే
గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును
మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
2థెస్సలొనికయులకు 2: 15
కాబట్టి
సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను
(పారంపర్యములను) చేపట్టుడి.
హెబ్రీ 4:14
ఆకాశమండలముగుండ
వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని
గట్టిగా చేపట్టుదము.
ఇదే విషయం దేవుడు అన్ని సంఘాలకు చెబుతున్నారు- యేసుక్రీస్తుప్రభులవారు రక్షకుడు, దేవుడు , ఆయ ద్వారానే పరలోకం వెళ్తాము అని చెప్పే భోదనే నమ్మాలి గాని మరో విధమైన బోధను
అనుసరించవద్దు! దేవుడు పంపే మరో ప్రవక్త లేడు, రాడు, ఆయన ద్వారానే తప్ప మనం మరో మార్గంలో పరలోకం చేరలేము!
ఆయన ఆత్మను పొందుకుని ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన
జీవితం, పవిత్రమైన జీవితం కలిగి జీవిస్తే, కష్టాలకు శ్రమలను సహించి మాత్రమే పరలోకం చేరగలము! మరో
షార్ట్ కట్ లేదు! ఇదే నిజమైన బోధ! దీనికి
బిన్నంగా ఎవరైనా అద్భుతాలు బోధ, ప్రోస్పెర్టీ గోస్పెల్ చెప్పి
తమ ప్రోపెర్టీని పెంచుకునే సువార్తల వెనుక పరుగెత్తవద్దు!
దేవుడు కూడా మనమీద
తుయతైర మంచి విశ్వాసులకు ఏ రకమైన భారాలు మోపడం లేదో మనమీద కూడా భారం మోపడం లేదు! అయితే మనం కలిగి ఉన్నదానిని గట్టిగా పట్టుకోండి
అంటున్నారు కారణం మన విరోధియైన సాతాను గాడు ఎవరిని మ్రింగుదునా అని గర్జించు సింహము
వలే వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరి విశ్వాసాన్ని బ్రష్టము చెయ్యాలా
అని వాడి ఆలోచన!
సరే, ఇంతకీ మనం కలిగి ఉన్నది
ఏమిటి?
మొదటగా: రక్షణభాగ్యము! నీ రక్షణను జాగ్రత్తగా పట్టుకో/ కాపాడుకో! కేవలం చిన్న సిగరెట్ కోసం, నీ కోపం కోసం, నీ శరీర అలవాట్లు దురాశల కోసం దానిని పోగొట్టుకోవద్దు!
రెండు: నీవు పొందుకున్న పరిశుద్ధాత్మను
జాగ్రత్తగా కాపాడుకో! నీవు అపరిశుద్ధమైన జాగాలకు వెళ్తే నీతోపాటు
పరిశుద్ధాత్ముడు వస్తాడా? కాబట్టి నీ పలుకులు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన
పరిశుద్దాత్మునికి అనుకూలంగా మలుచుకో! నిన్ను నీవు పరిశుద్దాత్ముని
చేతులలో పెట్టేసుకో! అప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధమైన ఆణిముత్యంగా
తీర్చిదిద్దుతారు!
మూడు: నీవు పొందుకున్న వరాలు,
భాషలు, ఫలాలు (ఆత్మఫలము)
అన్నీ జాగ్రత్తగా కాపాడుకో!
నాలుగు: నీ విశ్వాసము కాపాడుకో!
పౌలుగారు అంటున్నారు: మంచి పోరాటం పోరాడితిని,
నా పరుగు తుదముట్టించితిని. విశ్వాసమును కాపాడుకొంటిని.
ఇక నాకు మహిమకిరీటం ఉంచబడింది! పౌలుగారు గారు విశ్వాసమును
కాపాడుకున్నట్లు విశ్వాసాన్ని కాపాడుకో!
ఐదు: నీ ప్రార్ధనా జీవితాన్ని
కాపాడుకో!
ఆరు: పరిశుద్ధతను కాపాడుకోవాలి.
కారణం పరిశుద్దత లేకుండా ప్రభువుని చూడలేరు, సమీపించలేరు!
ఏడు: దైవిక ప్రేమ! దీనిని కోల్పోతే గణగణలాడు తాళము!
చివరగా: *నీ సాక్ష్యాన్ని కాపాడుకో!
సాక్ష్యము కోల్పోయిన విశ్వాసి- ప్రధానం జరిగిన
కన్యక- పరపురుషునితో తన శీలాన్ని పోగొట్టుకోవడంతో సమానం!
కాబట్టి పరపురుషుడు అనే సాతాను గాడిని, లోకాన్ని
నీకు దేవునికి మధ్యలోనికి తీసుకుని వచ్చి దేవునికి నీకు గల సత్సంబంధం పోగొట్టుకోవద్దు*!
ఇక ముగించేముందు
ఒకమాట చెప్పి ముగిస్తాను: ఇక్కడ కడమ వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులు
మేము ఎరుగము అని చెప్పుకునే మీతో అంటున్నారు దేవుడు! అసలు సాతాను
యొక్క గూఢమైన సంగతులు ఏమిటి అని క్లుప్తంగా చూసుకుందాము! దీనికోసం
కొలస్సీ పత్రిక ధ్యానాలు ధ్యానం చేసినప్పుడు మనం చూసుకున్నాము గనుక రెండు మాటలలో చెబుతాను:
ఆ కాలంలో కొంతమంది పరలోకం చేరాలంటే కేవలం ఈ బైబిల్ మాటలే చాలవు.
ఈ రక్షణ మాత్రమే చాలదు! తత్వశాస్త్రము,
వేదాంతము కూడా తెలుసుకోవాలి అప్పుడే మనము ఇంకా దేవునిలో బలంగా సాగగలము
అంటూ ప్రజలను తికమక పెట్టి, తత్వశాస్త్రము, వేదాంత శాస్త్రము లాంటి సైన్స్ చెప్పి ప్రజలను అయోమయంలో పడేశారు. చదువుకున్న వారికి పర్వాలేదు! చదువురాని వారి పరిస్తితి
ఏమిటి? అయ్యబాబోయ్ పరలోకం చేరాలంటే ఇవన్నీ కావాలా? ఇప్పుడు ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి అనే గందరగోళం
ఏర్పడిన తర్వాత పౌలుగారు కొరడా తీసుకుని చీల్చినట్లు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు
గుప్తమై ఉన్నాయి, ఈ మాటలు చాలు పనికిమాలిన తత్వశాస్త్రము వేదాంతము
అవసరం లేదు అని కొలస్సీ పత్రికలో వివరంగా వివరించారు! అదే క్రమంలో
కొంతమంది సాతాను గాడి టెక్నిక్ లు పూర్తిగా తెలుసుకోవాలి అంటే సాతానుని అనుసరించినట్లు
యాక్షన్ చేసి, వాడి గుట్టులన్నీ తెలుసుకోవాలి అంటూ సాతానీయులతో
మంత్రగాళ్ళతో కలిసి
పోయారు! ఇలా సంఘము సాతానుతో పొత్తు పెట్టుకుంది,
చివరికి ఏమి సాధించారు అంటే వట్టి పెద్ద గుండు సున్నా సాధించారు,
చివరికి విశ్వాస బ్రష్టులు అయ్యారు! దీనినే వారు సాతాను యొక్క లోతైన సత్యాలు
లేక గూఢమైన సంగతులు లేక మర్మాలు అంటూ బోధిస్తూ తమ పొట్ట పోషించుకునే వారు! యెజెబెలు కూడా సాతాను యొక్క మర్మాలు గూఢమైన సంగతులు అంటూ పనికిమాలిన బోధ తీసుకుని
వస్తే చాలామంది దాని వెనుక పోయి దేవునిచే మొట్టికాయ వేయించుకున్నారు!
ప్రియ సంఘమా! మీరు కూడా మర్మాలు అంటూ బోధించే వారి వెనుక
పరుగెత్తకండి! గమనించాలి సైతానుకి లొంగిపోవడం ద్వారా సైతానుని
ఓడించలేవు సరికదా, సైతానికి బానిసవు అయిపోయావు నీవు! అలాగే లోకాన్ని పూర్తిగా అర్ధము చేసుకోవడానికి లోకములో కలిసిపోతే నీవు బ్రష్టుడవు
అయిపోతావు తప్ప, విశ్వాసిగా ఉండలేవు! *ఒక
త్రాగుబోతుని రక్షించాలని నీవుకూడా రెండు పెగ్గులు వేసుకుని సువార్త బోధిస్తే వాడు
మారతాడో లేదో నాకు తెలియదు గాని నీవు మాత్రం వాడికంటే భయంకరమైన త్రాగుబోతువి అవ్వడం
గ్యారంటీ*! కాబట్టి దేవునిలో ఉంటూ లోకాన్ని సాతానుని అర్ధం చేసుకోవాలి
గాని ఇలాంటి పనికిమాలిన సిద్దాంతాల వలన ఎంతమాత్రమూ కాదని గ్రహిద్దాం!
*తుయతైర సంఘము-10*
ప్రకటన 2:26—29
26. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు
నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి (లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.
27. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె
పగులగొట్టబడుదురు;
28. మరియు అతనికి వేకువచుక్కను ఇచ్చెదను.
29. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ప్రియులారా! ఇక 26—28 వరకు జయించువాడు పొందుకునే భాగ్యములు కోసం చెబుతున్నారు దేవుడు! అయితే ఈ వచనంలో జయించువాడు పొందుకునేవి అని స్పష్టముగా వ్రాయకపోయినా మిగిలిన
తర్జుమాలలో మరియు ఇంగ్లీష్ బైబిల్ లో జయించుచు ఇంకా జయమును కొనసాగించు వానికి అంటూ
వ్రాశారు! అంతేకాకుండా నేను ఎలా జయించి నా తండ్రి వలన అధికారం
పొందానో మీరు కూడా జయించి అంతము వరకు ఇప్పుడు జరిగిస్తున్న నా క్రియలను జాగ్రత్తగా
చేస్తే లేక గైకొంటే :
మొదటగా: జనుల మీద అధికారం ఇస్తాను అంటున్నారు!
రెండు: అతడు ఇనుప దండముతో జనులను ఏలుతాడు!
అప్పుడు జనులు కుమ్మరవాని పాత్రల వలే పగలగొట్ట బడతారు!
మూడు: అతనికి వేకువచుక్కను ఇస్తాను అంటున్నారు!
మొదటగా జనులమీద అధికారం ఇస్తాను అంటున్నారు! ఈ విషయం
మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశీలిస్తే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని పరిశీలిస్తే
ఇది వెయ్యేండ్ల పాలనలో నెరవేరుతుంది! సంఘము ఎత్తబడి, మహాశ్రమల కాలం తర్వాత అనగా ఏడేండ్ల పెండ్లివిందు, ఏడేండ్లు
శ్రమలు గతించాక, రెండవరాకడ జరిగినప్పుడు దేవుడు వేలాది దూతలను,
పాత నిబంధన పరిశుద్ధులను క్రొత్త నిబంధన పరిశుద్ధులను వెంటబెట్టుకుని
వస్తారు భూమిమీదకు! అప్పుడు దేవుని ప్రత్యక్ష రాజ్యము మొదలవుతుంది
భూమిమీద! అదే సమయంలో ఏడేండ్లు శ్రమలకాలంలో హతస్సాక్షులయిన వారు
కూడా పునరుత్థానులవుతారు! వారుకూడా వెయ్యేండ్ల పాలనలో ఏలుతారు!
అప్పుడు దేవుడు జనులమీద అధికారం అనగా పాలన చేసే అధికారం ఇస్తారు జయించిన
వారికీ! దీనినే చెబుతున్నారు ఇక్కడ దేవుడు!
ప్రకటన
గ్రంథం 20: 4
అంతట
సింహాసనములను చూచితిని;
వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.
మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని,
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము
శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై,
వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.
ఎలా
అధికారం ఇస్తారు? ఎన్ని పట్టణాల మీద లేక ఎంతమంది మీద అధికారం ఇస్తారు అనేది తెలియాలంటే మనం లేఖనాన్ని
లేఖనముతోనే పరిశీలించాలి కాబట్టి; యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన
ఉపమానం లోకి పోదాము!
లూకా 19:12—27....
12. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై
13. తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల (మినా
యించుమించు 50రూపాయిలు కావచ్చును) నిచ్చి
నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
14. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టములేదని అతని
వెనుక రాయబారము పంపిరి.
15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును
వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు
పిలువుమని ఆజ్ఞాపించెను.
16. మొదటి వాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు
లభించెనని చెప్పగా
17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ
కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
18. అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు
లభించెననగా
19. అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
20. అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
21. నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని
కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి
ఉంచితినని చెప్పెను.
22. అందుకతడు చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు
తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
23. నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు
చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి
24. వీనియొద్ద నుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో
చెప్పెను.
25. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
26. అందుకతడు కలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి
వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
27. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నాశత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి
నాయెదుట సంహరించుడని చెప్పెను.
ఇక్కడ ఈ ఉపమానంలో
రాజకుమారుడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు, రాజ్యము అనగా మనలను, మరియు భూమి ఆకాశాలను
అందులో ఉన్న ప్రజలను రక్షించి విడిపించడం; దాసులు అనగా కేవలం
దేవుని సేవకులు అనికాదు , రక్షించబడిన ప్రతీ విశ్వాసికి దేవుడు
తన పరిచర్యలో పాలుపంపులు పొందమని అవకాశం ఇచ్చారు! అంతేకాకుండా
మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించమని దేవుని చివరి ఆజ్ఞ ఇచ్చారు!
అంతేకాకుండా వారివారి కెపాసిటీ ప్రకారం వరాలు,ఫలాలు
ఇచ్చారు! ఇప్పుడు రక్షించబడిన ప్రతీ విశ్వాసి తాను సవాలుకరమైన
జీవితం జీవిస్తూనే, దేవుని పనిని ఎంత ఘనముగా చేశాడు, ఎంతమందిని క్రీస్తులోనికి నడిపించగలిగాడు అనేది అంతములో చూస్తారు దేవుడు!
అప్పుడు వానివాని పనితనమును బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చి పట్టణాల
మీద అధికారం ఇస్తారు. ఇక్కడ మొదటివాడు 10 మినాలతో పనిచేసి మరో 10 మినాలు సంపాదించగలిగాడు!
అందుకు దేవుడు భళా నమ్మకమైన మంచిదాసుడా! నీవు ఈ
కొంచెములో ఎంతో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను జయించిన రాజ్యములో పది పట్టణాలమీద అధికారిగా
అనగా బహుశా కమీషనర్, కమాండర్, లేక గవర్నర్
లాంటి ఏదో ఒక అధికారం ఇస్తారు అన్నమాట! నీ మాటకు అప్పుడు తిరుగులేకుండా
ఉంటుంది. ఎవడైనా నీమీద తోకజాడిస్తే వాడిని కుమ్మరి కుండను బద్దలు
గొట్టినట్లు వాడి పళ్ళు రాలగొడతావు అన్నమాట!
ఇలా ఎవని సామర్ధ్యము
బట్టిదేవుడు వారికి పట్టణాల మీద అధికారం ఇస్తారు వెయ్యేండ్ల పాలనలో! అయితే ఒక పనికిమాలిన దాసుడు నీవు కఠినుడవు
విత్తనిచోట కోసేవాడవు, పెట్టని దానిని ఎత్తికొనే వాడవు అని నీకు
భయపడి దీనిని అనగా దేవుడిచ్చిన తలాంతులను వాడక రుమాలును కట్టి ఉంచాడు అట! ఆ పనికిమాలిన వాడిని అగ్నిగుండములో పడేయ్యమన్నారు దేవుడు! అయ్యా దేవుడు నీకు కూడా ఏదైనా తలాంతులు ఇస్తే అది దేవుని కొరకు వాడి అనేకులను
దేవునికై సంపాదించు! నీవు పాటగాడివా? నీ
గాత్రము ప్రభుకై ఉపయోగించి, తద్వారా అనేకులకు సువార్త చెప్పి
అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించు! ఇలా నీ దగ్గర ఏ రకమైన తలాంతులు
ఉన్నా దానిని ప్రభువుకై వాడి అనేకులను సంపాదించు! చిట్టచివర-
నీవు దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు అయ్యా! ఫలాని వ్యక్తిని నీ కొరకు సంపాదించగలిగాను. ఆ అక్కకు
వాక్యం చెప్పి ప్రభువులోకి నడిపించాను! ఆ అన్నయ్యను నడిపించాను!
ఆ చెల్లిని ఆ వదినను ప్రభువులోనికి నడిపించగలిగాను అని నీవు చెప్పగలిగావా
అప్పుడు దేవుడు నిన్ను కూడా భళా నమ్మకమైన మంచి దాసుడా/దాసురాలా!
నీవు ఈ కొద్ది విషయంలో ఎంతో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నా సంతోషంలో పాలుపొందు
అంతేకాకుండా ఈ పట్టణానికి లేక ఆ గ్రామానికి నిన్ను ప్రెసిడెంట్ ని చేస్తున్నాను,
నిన్ను MLA ని చేస్తున్నాను! నిన్ను గవర్నర్ ని చేస్తున్నాను అంటారు! అలా కాకుండా
ఆ పనికిమాలిన దాసుడు చెప్పినట్లే చెబితే నిన్నుకూడా కాలుచేతులు కట్టేసి అగ్ని గుండములో
పడవేయమని చెబుతారు జాగ్రత్త!
కాబట్టి ప్రభువు
నీకిచ్చిన తలాంతులు ప్రభువు కొరకై వాడు!
అనేకులను దేవుని
దగ్గరకు నడిపించు!
వెల్లగలిగేతే నీవు
వెళ్లి సేవచేయు! వెళ్ళలేక
పోతే వెళ్ళేవారిని పంపించు! వారికి ధన సహకారం ప్రార్ధన సహకారం
చెయ్యు! గాని నీ పొరుగువారికి నీ బంధువులకు సువార్త ప్రకటించవలసిన
బాధ్యత భారం నీదే! వారికోసం నిన్ను దేవుడు తప్పకుండా లెక్క అడుగుతారు
అని మరచిపోవద్దు!
అయితే ఇది ఎప్పుడు
జరుగుతుంది అంటే నీవు జయించినప్పుడే, జయజీవితం కలిగి ఉన్నప్పుడే! మరియు అంతము వరకు సహించినప్పుడే
మాత్రమే ఇది జరుగుతుంది!
*తుయతైర సంఘము-11*
ప్రకటన 2:28—29
28. మరియు అతనికి వేకువచుక్కను ఇచ్చెదను.
29. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ప్రియులారా!
జయించువాడు పొందుకునే భాగ్యములు కోసం చూసుకుంటున్నాము!
నేను
నా తండ్రివలన ఎలా జయించి అధికారం పొందానో అలాగే జయించువానికి నేను కూడా జనులమీద/ పట్టణముల మీద అధికారం ఇస్తాను
అంటున్నారు! యేసుక్రీస్తుప్రభులవారు జయించడానికి ఎన్నో శ్రమలను
హింసలను పొందారు! తద్వారా మరణాన్ని, సాతానుని
పాపాన్ని ఓడించారు! చివరకు సంపూర్ణత సాధించారు! అలాగే విశ్వాసి కూడా శ్రమలను సహిస్తూ, ఆయన పరిచర్యలో
కొనసాగుతూ, ప్రేమకలిగి విశ్వాసము కలిగి, సహనం కలిగి సేవలోముందుకు సాగిపోతూ సాతానుని మీద, పాపం
మీద జయం పొందితే,
సంపూర్ణత సాధించి ఎత్తబడి, వెయ్యేండ్ల పాలనలో అధికారం
పొందగలరు! అయితే అతడు/ఆమె తన విశ్వాసాన్ని
అంతమువరకూ అనగా తన మరణం వరకు కొనసాగించాల్సిన అవసరం ఉంది!
కొలస్సీ 1:23 లో మీరు విశ్వాసంలో దృఢముగా స్థిరముగా ఉండాలి, ఈ నిరీక్షణ
నుండి తొలిగిపోకూడదు అంటున్నారు పౌలుగారు....
పునాదిమీద
కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద
ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక,
విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
హెబ్రీ
౩:14
పాపమువలన
కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచ బడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు
బుద్ధిచెప్పుకొనుడి.
మత్తయి 24:13
అంతమువరకు
సహించినవాడెవడో వాడే రక్షింపబడును.
అలా
చేసినప్పుడు అనగా జయించినప్పుడు విశ్వాసి- పరిశుద్ధుడు కాబట్టి జయజీవితం ఉంది కాబట్టి
క్రీస్తుతో ఐక్యమై సంపూర్ణత సాధిస్తాడు! అప్పుడు ఆయన చేసిన వాగ్దానాలకు
వారసుడై క్రీస్తుతోపాటు పాలన చేస్తాడు! ఈ వాగ్దానం తండ్రియైన
దేవుడు కూడా చేశారు. కీర్తన 2:8—9
8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని
దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
9. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క
చెక్కలుగా పగులగొట్టెదవు.
అదేవిధంగా
యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇక్కడ చెబుతున్నారు:
ఇంకా
ప్రకటన
గ్రంథం 3: 21
నేను
జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ
నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
ప్రకటన 20:4,6
4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి
విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని
ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని
దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము
నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.
వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ
రాజ్యము చేసిరి.
6. ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.
ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు
దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
2తిమోతికి 2: 12
సహించిన
వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
మత్తయి 19: 28
యేసు
వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు (లేక,
పునఃస్థితి స్థాపనమందు) మనుష్యకుమారుడు తన మహిమగల
సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద
ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.
ప్రకటన 5:10
మా
దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని
క్రొత్తపాట పాడుదురు.
ప్రకటన 22:5
రాత్రి
యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన
ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
మరోసారి చెబుతున్నాను: ఈ అధికారం/ ధన్యత
కేవలం జయించిన వారికి మాత్రమే! క్రీస్తుకోసం శ్రమలను అనుభవించి
సహించిన వారికి మాత్రమే! గాని క్రీస్తువలన కలిగే సుఖాలు మాత్రమే
లేక మేలులు మాత్రమే అనుభవించి, శ్రమలు కష్టాలు అనుభవించడం ఇష్టం
లేనివారికి, అనుభవించని వారికి దీనిలో పాలులేదు అని గ్రహించాలి!
యేసుక్రీస్తుప్రభులవారు
ఎలా ఇంత అధికారంతో చెబుతున్నారు అంటే మత్తయి
28:18 లో అంటున్నారు పరలోకమందును భూమియందును నాకు సర్వాదికారం ఇవ్వబడింది.
కాబట్టి మీరు సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. నమ్మినవారికి నేను కూడా అధికారం ఇస్తాను అంటున్నారు.....
మత్తయి 28: 18
అయితే
యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.
యోహాను
౩:35
తండ్రి
కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.
ఇక
జయించిన వాడు పొందుకునే భాగ్యము మరొకటి ఉంది: నేను అతనికి వేకువచుక్కను ఇచ్చెదను!
వేకువచుక్క
అనగా Morning Star, దీనినే మేము అనగా సముద్రంలో ప్రయాణించువారు పోల్ స్టార్ అంటాము!ఇది భూమికి దగ్గరగా ఉండి, మా నేవిగేషన్ పరికరాలు పనిచెయ్యకపోతే
దీనిని ఉపయోగించి మేము గమ్యం చేరడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మాకు! వేకువచుక్క నిన్ను గమ్యం చేరుస్తుంది. జయించిన వానికి
ఈ వేకువచుక్కను ఇస్తాను అంటున్నారు దేవుడు!
ఇంతకీ
బైబిల్ ప్రకారం నిజమైన వేకువచుక్క ఎవరు?
ప్రకటన 22:16 లో అంటున్నారు యేసుక్రీస్తుప్రభులవారు
: సంఘముల కోసం ఈ సంగతులు గూర్చి బోధించడానికి మీకు సాక్ష్యమివ్వడానికి
యేసు అను నా దూతను పంపించాను. నేను దావీదుకి వేరును మరియు చిగురును,
సంతానమును అయి ఉన్నాను మరియు ప్రకాశమానమైన వేకువచుక్కయై ఉన్నాను అంటున్నారు!
ఈయన దావీదుకి వేరు అనగా మూలము, చిగురు అనగా సంతానము
. ఇంకా వేకువచుక్క ఎలాంటి వేకువచుక్క ప్రకాశమానమైన వేకువచుక్క!
ఈ వేకువచుక్క యేసుక్రీస్తుప్రభులవారు! అనగా ఇప్పుడు
జయించువాడు యేసుక్రీస్తుప్రభులవారినే స్వాస్త్యముగా పొందబోతున్నాడు అన్నమాట!
దేవుడే నీ స్వాస్థ్యం అయితే ఆయనకు గల ప్రతీది నీదే కదా!
కాబట్టి
జయించువాడు ఆయనకు గల సమస్త ఈవులకు హక్కుదారుడు అవుతాడు అని గ్రహించాలి!
మరినీకు
అలాంటి వేకువచుక్క కావాలా?
అధికారం కావాలా? అయితే శ్రమలను సహించు!
ప్రేమను కలిగియుండు! విశ్వాసం వదలొద్దు!
సహనం వదలవద్దు! ఆయన సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా
ముందుకు సాగిపో!
అప్పుడు
అన్నీ నీకును ప్రాప్తిస్తాయి!
అట్టి కృప ధన్యత మనందరికీ
దేవుడు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*సార్దీస్ సంఘము-1*
ప్రకటన 3:1
సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు
వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను
నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న
పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
మనం నాల్గవ
సంఘమైన తుయతైర సంఘం కోసం
ధ్యానం చేసుకున్నాము!
ఇక ఐదవ సంఘమైన సార్దీస్
సంఘముకోసం ధ్యానం చేసుకుందాం!
*సార్దీస్* అనగా
మూడు అర్ధాలున్నాయి.
ఉజ్జీవము లేక ఉజ్జీవము
గలది, ఎర్రనిది, చివరగా రహస్యముగా పారిపోయినది లేక మన అచ్చ తెలుగులో చెప్పాలంటే లేచిపోయినది.
ఈ సంఘము పేరుకే ఉజ్జీవం
గాని మొదటి వచనం నుండే దేవుడు ఛీ అనడం మొదలుపెట్టారు! అనగా ఈ సంఘం పైన పటారం, లోన లొటారం అన్నమాట! ముందు పర్సనాలిటీ, వెనుక మున్సిపాలిటీ! వేషదారణ సంఘము!
*ఎక్కడుంది*?
తుయతైర పట్టణానికి
దక్షిణంగా 50కి.మీ దూరంలో ఉంది.
*చరిత్ర*: ఈ పట్టణం అత్యంత ధనిక నగరం! ఎలా ధనిక నగరమయ్యింది అంటే పట్టణం మధ్యనుండి పాక్టోస్ అనే నది ప్రవహిస్తుంది.
ఇలా నది ప్రవహించేటప్పుడు
ఆ నది ఒక బంగారపు గనిని తాకుతూ ఈ నగరమునకు చేరుతుంది.
అందువలన నది ఒడ్డున ఇసుకలో బంగారపు రజని (బంగారపు పొడి) దొరికేది. ఆ బంగారపు రజనితో కాసులు మొదలైనవి చేసి అంత్యంత
ధనికముగా మారారు! అంతేకాకుండా కంబళ్ళు, ఉన్ని బట్టలకు రంగులు వేయడం కూడా ఇక్కడే ప్రారంభమయ్యింది. వెండి బంగారాల నాణెములు తయారుచెయ్యడం కూడా ఇక్కడనుండే ప్రారంభం అయ్యింది. ఈ రకంగా అతి విస్తారమైన సంపదను కలిగి
దేవుడంటే భయం భక్తి లేకుండా పోయింది! ఎవరైనా చనిపోతే ఆ శవం చుట్టూ
సమాధిలో కొన్ని వందల, వేల బంగారపు కాసులు వేసేవారు. నేటికీ అక్కడ సమాధులలో అ పూర్వకాలపు బంగారపు కాసులు దొరుకుతున్నాయి!
పౌలుగారు గారు గాని, యోహాను గారు గాని ఈ సంఘములో పరిచర్య చేసినట్లు
చరిత్రలో కనబడటం లేదు గాని, యోహాను గారి శిష్యులలో ఒకరు వెళ్లి
సంఘాన్ని స్థాపించారు అంటారు! మొదట్లో సంఘము బాగుంది గాని తర్వాత
వారికున్న ధనము వలన దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకాశలతో లోకాచారాలతో మునిగిపోయారు!
తద్వారా బ్రష్ట సంఘము అయింది.
దేవుడు
గాని పనికిమాలిన సంఘాలకు ర్యాంకులు ఇస్తే—దీనికి రెండో ర్యాంకు ఇవ్వవచ్చు!
*ఈ సంఘానికి దేవుడు ఏమని పరిచయం చేసుకుంటున్నారు*?
ఏడు నక్షత్రములను
దేవుడు ఏడాత్మలును గలవాడు చెప్పు సంగతులు ఏవనగా....
ఇది కూడా మొదటి అధ్యాయంలో
యోహాను గారు చూసిన దర్శనము నుండే తననుతాను పరిచయం చేసుకున్నారు!
ఏడు నక్షత్రములు అనగా
మొదటి అధ్యాయం చివరి వచనం ప్రకారం ఏడు సంఘాల యొక్క దూతలు!
ఏడు
ఆత్మలు అనగా మొదటి అధ్యాయం ప్రకారం చూసుకున్నాము- ఏడు అనగా సంపూర్ణ సంఖ్య!
సంపూర్నుడైన పరిశుద్ధాత్ముడు! పరిశుద్ధాత్ముడు
చేసే ఏడు రకాలైన కార్యములు అని గతంలో చూసుకున్నాము!
1.జ్ఞానమునకు ఆధారమైన ఆత్మ
2. వివేకమునకు ఆధారమైన ఆత్మ
౩. ఆలోచనకు ఆధారమైన ఆత్మ’
4. బలమునకు ఆధారమైన ఆత్మ
5. తెలివిని పుట్టించే ఆత్మ
6. భయమును పుట్టించే ఆత్మ
7. భక్తిని పుట్టించే ఆత్మ
యెషయా 11:2
యెహోవా
ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల
భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
ఈ ఆత్మ దేవునిలో నుండి
వచ్చి క్రీస్తుయేసులో పనిచేసి , కృపాసత్య సంపూర్ణునిగా మనమద్య నివశించి ఇప్పుడు మనమధ్య సంచారం చేస్తున్నాడు
మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి!
దేవుడు ఎందుకు ఇలా
ఈ సంఘముతో పరిచయం చేసుకుంటున్నారు అంటే: నిజమైన జ్ఞానం, ఆలోచన బలము, తెలివి భయము భక్తి అనేది నాలో ఉన్నాయి గాని
మీరు మీ ధనము వలన నన్ను ఆశ్రయించకుండా లోకాన్ని, మీ బలమును ఆశ్రయించారు. చివరకు అనుభవించబోతున్నారు అని చెప్పడానికి దేవుడు ఇలా ఈ సంఘముతో పరిచయం చేసుకుంటున్నారు!
మనము కూడా మన కష్టాలలో
శ్రమలలో మొదటగా దేవుణ్ణి ఆశ్రయించకుండా మనకున్న ధనము వలన, మనకున్న పలుకుబడి వలన నాయకులను, అధికారులను ఆశ్రయిస్తూ ఉంటాము గాని ఫలితం రాదు! ఇక చిట్టచివరగా
అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత దేవుడా! నీవే దిక్కు!
నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు అని లబోదిబో అంటాము! అదే దేవుని యొక్క నడిపింపు కోసం కనిపెట్టి- దేవుడు ఎవరి
దగ్గరికి వెళ్లమంటారో వారి దగ్గరకు, లేదా శ్రమను శోధనను ఓర్పుతో
సహించమంటే ఓర్చుకుంటే- నీకు లేక మనకు ఇన్ని తిప్పలుండవు!
కాబట్టి సార్దీస్
సంఘమువలె ధనమును, ఇంకా మన అర్ధబలము,
జనబలమును ఆశ్రయించకుండా దేవున్నే ఆశ్రయిద్దాం!
*సార్దీస్ సంఘము-2*
ప్రకటన 3:1—2
1. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును
దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు
మృతుడవే
2. నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై,
చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. (లేక,
స్థిరపరచుము)
ప్రియులారా! గత భాగంలో దేవుడు గనుక పనికిమాలిన
సంఘాలకు ర్యాంకులు ఇస్తే ఈ సంఘానికి రెండో రాంకు వస్తుంది అని
చెప్పడం జరిగింది. అది ఎందుకో ఇప్పుడు మనము చూసుకుందాం!
మిగిలిన అన్ని సంఘాలకు నీవు క్రియలు చేశావు, నీవు
సహనం గల దానివి, నీకు ప్రేమ ఉంది గాని నీమీద కొన్ని తప్పులు మోపుతున్నాను
అని చెప్పారు దేవుడు! గాని ఈ సంఘానికి మొదటి వచనంలోనే ఛీ అనడం
మొదలుపెట్టి, డైరెక్ట్ ఎటాక్ మొదలు పెడుతున్నారు దేవుడు!
ఎందుకు నీ బ్రతుకు అన్నట్లు మాట్లాడుతున్నారు!
ఒక నిమిషం ఆగి ఒకసారి
మొదటి వచనం మరలా జాగ్రత్తగా గమనిస్తే: సార్దీస్ లో ఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము.... అంటూ
మొదలుపెట్టారు!
ఈ ఉత్తరం, ఈ ఉత్తరమే కాదు ఏడు ఉత్తరాలు
కూడా మొదటగా సంఘపు దూత అనగా సంఘ నాయకుడు/ దైవసేవకుడు/
పెద్ద/ కాపరి/భిషప్ కి అడ్రస్
చేయబడింది. రెండవదిగా సంఘానికి కూడా చెప్పారు! కాబట్టి ఈ ఉత్తరం మొదటగా ఆ సంఘాన్ని కాస్తున్న కాపరి/ బిషప్/ నాయకుడుకి చెందుతుంది ఈ ఉత్తరపు అర్ధం!
ఒరేయ్! నీవు జీవుంచుచున్నావన్న
పేరు మాత్రం ఉంది గాని నీవు చచ్చినోడివిరా! తూ... అంటున్నారు దేవుడు! బ్రతికున్న శవానివి రా నీవు!
నీవు నీ బ్రతుకు అంటున్నట్లు ఉంది ఇక్కడ! పేరుకు
మాత్రం బ్రతికి ఉన్నావు గాని నా దృష్టిలో చచ్చినోడివి అనగా భౌతికంగా బ్రతికి ఉన్నావు
గాని ఆధ్యాత్మికంగా సచ్చినోడివిరా
అంటున్నారు దేవుడు!
ఎందుకు
అలా అంటున్నారు అంటే రెండో వచనంలో: నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు!
అనగా
క్రియలు చేస్తున్నావు గాని ఏదో మ్రొక్కుబడిగా చేస్తున్నావు, ప్రార్ధన చేస్తున్నావు గాని
ఏదో చెయ్యాలి గాబట్టి చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు/
చెబుతున్నావు గాని ఏదో చెప్పాలి, చదవాలి కాబట్టి
రెండు మాటలు ఎవరిని నొప్పించకుండా చెప్పి మమః (ఆమెన్)
అనిపిస్తున్నావు. గాని నీ హృదయం, నీ మనస్సు దేవునికి దూరంగా ఉంది అంటున్నారు దేవుడు! అందుకే
నీవు సచ్చినోడివిరా అంటున్నారు దేవుడు!
ఎందుకు అలా ఈ నాయకుడు తయారయ్యాడు అని ఆలోచిస్తే: నేటికాలంలో దైవజనులు కానుకలు ఆశించి, నెల జీతమునకు ఆశించి
ఖండించి గద్దించి బుద్ధి చెప్పడం లేదో అలాగే ఆ నాయకుడు కూడా బహుశా వీరు ధనవంతులు కాబట్టి
వీరిని నొప్పించే బోధలు చెబితే ఎక్కడ మనకు లక్షలు లక్షలు కానుకలు ఇవ్వరో, గట్టిగా బోధిస్తే ఈ సంఘము మానేసి మరో సంఘానికి వెల్లిపోతారో అని బహుశా ఆ నాయకుడు
కూడా మనుష్యులను మెప్పించే బోధలు చేశాడు కాని ఖండించి గద్దించి బుద్ధిచెప్పలేదు!
లేదా వీరు డబ్బులున్న వారు, గట్టిగా చెబితే ఎక్కడ
కొడతారో అని భయపడి చెప్పి ఉండడు! ఈ రోజులలో కూడా ఖండించి గద్దించి
వాక్యముచేబితే సంఘపెద్దలు సంఘకాపరిని కొడుతున్నారు. అలాంటి సంఘాలు
నాకు తెలుసు!
గతంలో చెప్పాను, మాకు దగ్గరలో ఉన్న పట్టణంలో గల పాదిరి గారి దగ్గరకు నేను అన్నయ్య కలిసి వెళ్ళాము,
ఆ పాదిరిగారు లేటుగా వచ్చారు- ఏమి అన్నయ్యా లేటుగా
వచ్చారు అని అడిగితే- ఒక సంగతి చెప్పారు- ఈ మధ్యనే మూడువారాలు అయ్యింది అట ఒక సంఘానికి ఒక క్రొత్త సంఘకాపరి వచ్చి.
ఆ అన్నయ్య వస్తుంటే ఆ సంఘకాపరి మరియు భార్య వారి సామానులు పట్టుకుని
రోడ్డుమీద నిలబడి ఉన్నారు. ఏమయ్యా అయ్యగారు- మొన్ననే గదా వచ్చారు, మూడువారాలకే ఎక్కడకు వెళ్ళిపోతున్నారు
అంటే- అయ్యా- ఈ సంఘములో రాకడకోసం గాని,
తీర్పు కోసం గాని, దిద్దుబాటు కోసం గాని చెప్పకూడదు
అట! అలా చెప్పినందుకు ఈరోజు ఉదయమే కట్టుబట్టలతో బయటకు పొమ్మన్నారు
అని చెప్పారు. మరి అన్నయ్య అడిగారు- ఎక్కడికి
వెళ్తున్నారు? అని అడిగితే- ఏమో తెలియదు-
మమ్మల్ని సేవకు పిలిచింది వీరుకాదు, దేవుడు కదా,
అందుకే దేవుని నడిపింపుకోసం చూస్తున్నాము అన్నారు. వెంటనే ఆ అన్నయ్య జేబులో ఉన్న పదివేల రూపాయలు ఇచ్చి, వారికున్న మరో సంఘములో కొన్ని రోజులు తలదాచుకుని దేవుడు ఎక్కడకు నడిపిస్తారో
అక్కడికి వెళ్ళమని చెప్పి, మా దగ్గరకు వచ్చారు! అయ్యా! ప్రస్తుతం ఇలా ఉన్నాయి కొన్ని సంఘాలలో పరిస్తితులు!
గట్టిగా చెబితో బయటకు పొమ్మంటున్నారు! వారికి అనుకూలమైన
బోధలు చెయ్యమంటున్నారు! అలా చేసినవారికి గొప్పగొప్ప కానుకలు ఇస్తున్నారు!
ఖండించి గద్దించి వాక్యం చెబితే బయటకు పొమ్మంటున్నారు ఇంకా కొడుతున్నారు!
బహుశా
ఈ నాయకుడు కూడా అలా చేశాడు. అందుకే దేవుడు అంటున్నారు:
ఒరేయ్ నీవు సచ్చినోడివిరా! నీవు పైకి మాత్రం బ్రతికి
ఉన్నావు, నాదృష్టిలో నీవు శవానివి! బ్రతికున్న
శవానివి!
దైవజనులారా! కాపరులారా! సేవకులారా! పెద్దలారా!
దేవుడు ఇప్పుడు మీతోను మాట్లాడుతున్నారు—నీవు
సజీవంగా ఉన్నావా లేక దేవుని దృష్టిలో శవానివా? ఆ సార్దీస్
సంఘ నాయకుణ్ణి అడిగిన ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నారు!! ఒకసారి
నిన్ను నీవు పరిశీలించుకో! ఎవరికి భయపడుతున్నావు? ఎవరిని మెప్పించాలి అని చూస్తున్నావు???
పౌలుగారు గలతీయులకు
ఉత్తరం రాస్తూ అంటున్నారు- ఒకవేల ఇప్పుడు నేను మనుష్యులను సంతోషపెట్టాలని చూస్తే నేను దేవుని సేవకున్ని
కాకయేపోదును...
గలతియులకు 1: 10
ఇప్పుడు
నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన
జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా?
నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
ఈరోజు నీవు కూడా నీ సంఘాన్ని సంఘపెద్దలను
కానుకలు ఇచ్చేవారిని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తూ, ఖండించక
గద్ధించక సరిచెయ్యకుండా ఉంటే నీవు దేవుని సేవకుడివి కావు! మనుష్యుల
సేవకుడివి! వారి బానిసవు!!!! ఇది నేను చెప్పడం
లేదు గలతీ పత్రికలో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు!
దైవసేవకులారా! మనము మాదిరిగా ఉండి సంఘాన్ని ముందుకు నడిపించమని
పేతురు గారు మరియు పౌలుగారు చెబుతున్నారు...
పేతురు గారు చెప్పినవి
చూద్దాం....
1
Peter(మొదటి పేతురు) 5:1,2,3,4
1.తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని,
బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
2. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని
మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
3. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;
4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
పౌలుగారు
తిమోతికి మరియు తీతుగారికి చెబుతున్నారు...
1తిమోతికి 4: 12
నీ
యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను,
పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
తీతుకు 2:7
పరపక్షమందుండువాడు
మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల
విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.
2థెస్సలొనికయులకు 3: 9
మీరు
మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి
గాని, మాకు అధికారములేదనిచేయలేదు.
యేసుక్రీస్తుప్రభులవారు
తాను ముందుగా శిష్యుల పాదములు కడిగి నేను మీకు మాదిరిగా ఇలాగు చేసితిని అన్నారు.
యోహాను 13: 15
నేను
మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.
ప్రియ సేవకులారా! మనముకూడా మందకు మాదిరిగా ఉందాము!
పౌలుగారు నేను క్రీస్తును పోలి నడచుకున్న ప్రకారం మీరును నన్నుపోలి అనగా
నేను క్రీస్తును పోలి నడచినట్లు మీరును క్రీస్తును పోలి నడచుకోండి అంటున్నారు!
మరి అలా మాదిరిగా జీవిద్దామా? అలా చేస్తే ఒకరోజు
దేవుడు భళా నమ్మకమైన మంచిదాసుడా అని నిన్ను, నన్ను పిలుస్తారు!
అట్టి మాదిరిగల జీవితం
ప్రతీ సేవకునికి దేవుడు దయచేయును గాక!
ఆమెన్!
*సార్దీస్ సంఘము-౩*
గతభాగంలో ఈ ఉత్తరం మొదటగా సేవకులకు
లేక సంఘదూత అనగా సంఘ కాపరికి/నాయకులకు చెందుతుంది అని చూసుకున్నాము!
ఇక
రెండవదిగా ఈ ఉత్తరంలోని భావము విశ్వాసులకు కూడా చెందుతుంది!
మనలో
అనేకమందికి ఒకప్పుడు తినడానికి కష్టాలు పడేవారు, ఉద్యోగము, పనిపాటులు లేక
ఎన్నెన్నో కష్టాలు పడినవారు అనేకులు! నేడు దేవుడు మనలను దీవించి
మనకు చేయడానికి పని లేక వ్యాపారం, పనిచెయ్యడానికి ఆరోగ్యం,
మంచి ఇల్లు, కుటుంబం, పలుకుబడి,
పేరు అన్ని దయచేసిన తర్వాత దేవున్నే మరచిపోతున్నాము! పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నాము గాని అన్నీ అన్యులకంటే ఘోరంగా
జీవిస్తున్నాము! లోకాచారాలు వచ్చాయి, సంఘంలో
స్టేటస్ మెయింటేన్ చెయ్యాలంటే తప్పదండి అంటున్నారు!
మరి
ఒకరోజు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నిన్ను ఈ స్తేటస్ గాళ్ళు ఎవరైనా ఖాతరు చేశారా? నీవు రోగివై పడియుండినప్పుడు
ఈ స్టేటస్ గాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించారా? ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ తిరుగుతూ నీవు లేకపోతే ఎలా?
నీవు లేకపోతే ఆ ఫంక్షనే లేదు అంటే ఉబ్బితబ్బిబ్బు అయిపోయి ఆరాధన,
సంఘము, సహవాసము అన్నీ మర్చిపోయి లోకంలో కలిసిపోయావు
కదా! ఏదో ఆదివారం రాకపోతే పాష్టర్ గారు ఏమనుకుంటారో అని కొందరు,
ఆ రోజు కేంపులు ఫంక్షన్ లు పెట్టుకునే వారు కొందరు, బట్టలు ఉదికే ప్రోగ్రాం పెట్టుకునే వారు కొందరు! మేము
ఎంప్లాయిస్ మండి, ఆదివారమే కాళీ ఉంటుంది అనేవారు కొందరు!
ఒకరోజు ఎంప్లాయ్ మెంట్ లేకుండా రోడ్డుమీద తిరుగుతున్నప్పుడు నీ ఆ ఉద్యోగం
ఇచ్చింది దేవుడు అని మర్చిపోతున్నావు! చివరికి ఆరాధనకు వచ్చినా
పెదాలమీద స్తుతి మాత్రమే! నీ బ్రతుకు దేవునికి దూరంగా ఉంది!
నీవుకూడా
శారీరకంగా బ్రతికి ఉన్నావు గాని సార్దీస్ సంఘంలా చచ్చిన స్తితి కదా నీది!
పైకి
పరిశుద్ధ పరిశుద్ధ అని పాటలు పాడుతూ పరిశుద్దుడిలా ఫోజులు కొట్టి, ఆత్మ నడిపింపు లేని స్థితి!
కంపు కొట్టే స్థితి నీది!
విశ్వాసిని
అంటూ పిశాచి పనులు చేస్తున్నావు!
పైకి
భక్తిగలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని జన్మ నీది!
పైకి
దేవున్ని మహిమ పరుస్తున్నానంటూ నీ మహిమకై , నిన్ను పోగిడించు కోడానికి ప్రాకులాడుతున్నావు కదా!
భక్తిపరుడుగా
యాక్షన్ చేసి దేవుని వాక్యానికి నిజంగా లోబడని స్తితి కదా నీది!
పేరుకు
మాత్రం బ్రతికిన వాడివి గాని నిజానికి సచ్చినోడివి/చచ్చిన దానివి/ జీవచ్చవం!!!
నీ
బ్రతుకంతా వేషదారణ!!!
పైకి
ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటావు, గాని ఆమె అంటే నీకు భయంకరమైన ద్వేషం మనస్సులో!
ప్రేమ లేకపోయినా యాక్షన్ హీరో/హీరోయిన్ లాగ నటిస్తావు!
ప్రైజ్ ద లార్డ్ అనేమాట పెదాల మీదనుండి వచ్చిందే గాని హృదయం నుండి రాలేదు!
ప్రేమ లేదు, విశ్వాసం లేదు! ప్రార్ధన లేదు! నటన మాత్రం ఉంది నీలో! సార్దీస్ సంఘాన్ని దేవుడు చచ్చిన సంఘము అన్నారు! ఈ రోజు
నిన్ను కూడా చచ్చినవాడివి/దానవు అంటున్నారు!
మార్కు 7: 6
అందుకాయన
వారితో ఈలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరముగా
ఉన్నది.
సామెతలు 26: 23
చెడు
హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
యేహెజ్కేలు
గ్రంధంలో దేవుడు అంటున్నారు:
Ezekiel(యెహెజ్కేలు) 33:31,32
31. నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా
నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది.
32. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు,
వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.
పౌలుగారు
అంటున్నారు తిమోతితో
2తిమోతి ౩:5
పైకి
భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.
1తిమోతికి 5: 6
సుఖభోగములయందు
ప్రవర్తించునది బ్రదుకుచుండియు చచ్చినదైయుండును.
ప్రియమైన సంఘమా! విశ్వాసులారా! ఒకసారి పరిశీలన
చేసుకోండి! సార్ మా తాతగారు ఇలా సేవచేశారు, మా నాన్న గారు ఇలా సేవచేశారు అంటూ మీ పితరులు కోసం చెప్పడం కాదు, మీరు ఏమి చేశారు/ చేస్తున్నారు దేవునికి ఇప్పుడు!
అది చెప్పండి! మేము అప్పుడు ఇలా చేశాము,
మా సంఘము తరుపున ఇలా చేశాము అలా చేశాము అనడం మానేసి ప్రస్తుతం ఇప్పుడు
ఏమి చేస్తున్నారు అది చెప్పండి! అవును ఒకరోజు మీరు ఘనమైన సువార్తను
ప్రకటించారు! ఎన్నెన్నో క్రియలు చేశారు దేవునికి! సెహబాస్! బాగుంది! ఇప్పుడు ఎందుకు
చెయ్యడం లేదు? సీనియారిటీ పెరిగిపోయి సిన్సియారిటీ తగ్గిపోయిందా?
మా తాతలు నేతులు త్రాగారు, మా మూతులు వాసన చూడండి
అన్నాడట ఒకడు అలాగే ఉంది ఇప్పుడు కూడా!
ఇశ్రాయేలీయులు తండ్రులు ద్రాక్షపళ్ళు తింటే పిల్లల పళ్ళు పులుసి
పోయాయట! దేవుడు ఇదే చెప్పి వెక్కిరించారు వారిని!
కాబట్టి ఇప్పుడు మీరు
దేవునితో ఎలా ఉన్నారు? దేవునితో
సత్సంబంధం కలిగి ఉన్నారా? ఆ మొదట ప్రేమ విశ్వాసము నిరీక్షణ ప్రార్ధన
బాషలు ఆత్మ ఉందా?
ఒకవేళ లేకపోతే నేడే
మనలను దిద్దుకుని ఆయనతో సమాధాన పడదాం!
*సార్దీస్ సంఘము-4*
ప్రకటన 3:2
నీ
క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని
బలపరచుము. (లేక, స్థిరపరచుము)
ప్రియులారా! ఇక ఈ రెండో వచనంలో చివరిపాదంలో అంటున్నారు: గనుక జాగరూకుడవై
చావనైయున్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నారు:
గతభాగంలో నీ క్రియలు
నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అని చెప్పి ఇప్పుడు గనుక జాగరూకుడవై చావనైయున్న
మిగిలిన వాటిని బలపరచుము అంటున్నారు!
మొదటగా
జాగరూకుడవై ఉండమంటున్నారు అనగా ఇంతవరకు నిద్రపోతున్నావు అన్నమాట!
మరలా ఈ
పాదం ప్రత్యేకంగా కాపరులకు/నాయకులకు/ బిషప్ లకు/ సేవకులకు
చెబుతున్నారు అని గ్రహించాలి! ఇంతవరకు నీవు మందను పట్టించుకోవడం
మానేశావు! నీ పొట్టకోసం చూసుకున్నావు గాని మంద ఎలా ఉందో,
బ్రతికి ఉన్నదో లేక జబ్బుతో ఉందో, చనిపోతున్నాయో
పట్టించుకోలేదు ఇంతవరకు! ఇప్పుడైనా నీవు మొదటగా నిద్రనుండి లేచి
అప్పుడు మందను చూడు, మందలో అనేకమైన గొర్రెలు చావడానికి సిద్దగా
ఉన్నాయి! నీ నిద్రవలన అజాగ్రత్త వలన అనేకమైన గొర్రెలు ఆధ్యాత్మికంగా
చనిపోయాయి! తోడేళ్ళు వచ్చి అనేకమైన గొర్రెలను భక్షించాయి గాని
అది నీకు తెలియదు! నీకు తెలిసింది నీకు ఆకలేస్తే మందలో బలిసిన
పొట్టేళ్లను కోసుకు తినడమే తెలుసు గాని మందను పట్టించుకోవడం మానేశావు! ఇప్పుడైనా మందను పట్టించుకో అంటున్నారు దేవుడు!
ప్రియ సేవకులారా! కాపరులారా! దేవుడు ఇదే ప్రశ్న మరలా అడుగుతున్నారు ప్రతీ కాపరిని/ సేవకున్ని/ నాయకుణ్ణి!!! మందను
ఇప్పుడైనా పట్టించు కుంటారా? అనేకులైన దుర్భోదలు దుర్భోధకులు
వచ్చి మందను తమ తప్పుడు బోధలతో కకావికికాలం చేసి పాడుచేస్తుంటే మీరు మాత్రం తాపీగా
ఉన్నారు! మందలో అనేకమంది దారిత్రప్పి వ్యభిచారం లోను,
త్రాగుడు లోను, లోకం లోను లోకాశలతోను లోకాచారాల
తోనూ నాశనానికి జోగుతుంటే ఇప్పుడైనా సంఘాన్ని పట్టించుకుంటావా అని అడుగుతున్నారు!
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి మిమ్మును అధ్యక్షులుగా
ఉంచారో ఆ యావత్తు మందను గూర్చి పట్టించు కుంటున్నారా అని పౌలుగారు అడుగుతున్నారు!!!
అపొ 20:28
వారికి ఏ సమాధానం చెబుతావు నీవు???!!!
ఇక్కడ సంఘ
పతిస్తితి చూస్తే కొంతమంది బ్రష్టులై పోయినా మిగిలిన వారు ఇంకా విశ్వాశాన్ని కాపాడుకుని
బట్టలు అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవిస్తున్నారు! సంఘకాపరి మాత్రం చచ్చినస్థితిలో
ఉన్నాడు గాని విశ్వాసులలో కొందరు విశ్వాసాన్ని కాపాడుకుని పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు!
కాబట్టి చావనైయున్న మిగిలిలిన వారిని బలపరచు! వారికి
సరియైన ఆత్మీయ ఆహారం పంచడం లేదు నీవు! సరియైన ఆహారం లేక బక్క
చిక్కి పోయాయి! సరియైన వాక్యం లేదు! ప్రార్ధన
ఉపవాసం ఆత్మ నడిపింపు లేదు! ఇప్పుడు మొదటగా నీవు మేల్కొని చావనైయున్న
మిగిలిన వాటిని బలపరచు!
కనుక నిద్రించుచున్న
నీవు మృతులలో నుండి మేల్కొనుము అంటున్నారు పౌలుగారు..
ఎఫెసీయులకు 5: 14
అందుచేత
నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని
ఆయన చెప్పుచున్నాడు.
ఆ
కాలంలో గల సేవకులను గూర్చి యాజకులను గూర్చి, నాయకులను గూర్చి దేవుడు ఏమంటున్నారు అంటే:
Isaiah(యెషయా గ్రంథము) 56:10,11
10. వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు
కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.
11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు.
ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున
పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.
యిర్మియా 10: 21
కాపరులు
పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.
Ezekiel(యెహెజ్కేలు) 34:2,3,4,5,6,7,8,9,10,11,12,14,15,16,17
2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము,
ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా తమ కడుపు నింపుకొను
ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.
3. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని
గొఱ్ఱెలను మేపరు,
4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు,
గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని
మరల తోలుకొనిరారు, తప్పిపోయిన వాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల
అడవి మృగములకు ఆహారమాయెను.
6. నా గొఱ్ఱెలు పర్వతములన్నిటి మీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి,
నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును
లేడు, వెదకువా డొకడును లేడు.
7. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
8. కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహారమాయెను;
కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే
నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
10. *ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని,
నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు
గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన
జాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి
వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు*.
11. ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని
కనుగొందును.
12. తమ గొఱ్ఱెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను
వెదకి, చీకటిగల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో
అక్కడనుండి నేను వాటిని తప్పించి
14. నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద
వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును,
ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
15. నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు
యెహోవా వాక్కు.
16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని
మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును,
దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని
బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.
17. నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱెకును గొఱ్ఱెకును
మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.
ఇదీ మందను మేపే పద్దతి! ప్రియ కాపరి/ నాయకుడా!
సంఘాన్ని పట్టించుకో! వారి కానుకలే కాదు వారి ఆత్మీయ
జీవితం కోసం వారి శ్రేయస్సు కోసం ఆలోచించు! తప్పుడు భోదలనుండి,
సిద్ధాంతాల నుండి, లోకాచారాల నుండి సంఘమును బయటకు
తీసుకుని వచ్చి సంఘమును కాపాడుకో!
కాబట్టి ఇప్పుడైనా
మేలుకొని చావనైయున్న మిగిలిన సంఘమును బలపరుద్దాం!
కారణం యేసుక్రీస్తుప్రభులవారి
రాకడ అతి సమీపముగా ఉంది కాబట్టి మనము సిద్ధపడి మన సంఘాన్ని రాకడకై సిద్దపరుద్ధాము!
*సార్దీస్ సంఘము-5*
ప్రకటన
గ్రంథం 3: 3
నీవేలాగు
ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల
నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే
తెలియదు.
ప్రియులారా! ఇక మూడవ వచనంలో అంటున్నారు:నీవేలాగు ఉపదేశం పొందావో,
ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుము! మారుమనస్సు పొందుము అంటున్నారు! ఒకవేళ నీవు జాగరూకుడవై
ఉండని యెడల నేను దొంగవలె వచ్చెదను! ఏ గడియను నీ మీదికి వచ్చెదనో
నీకు తెలియనే తెలియదు అంటున్నారు!
ఈ వచనంలో గల భావము
కూడా దైవసేవకులకు/ కాపరులకు
చెందుతుంది! అలాగే విశ్వాసులకు కూడా ఆపాదించవచ్చు గాని ముఖ్యంగా
ఇది దైవసేవకుల కోసం చెప్పబడింది అని నా ఉద్దేశం!
ఆ సంఘదూతకు
దేవుడు చెబుతున్నారు: కాబట్టి నీవేలాగు నా ద్వారా ఉపదేశం పొందావో, నానుండి
ఏమి నేర్చుకున్నావో నా నుండి నీవు ఏవి విన్నావో, వాటిని మొదటగా
జ్ఞాపకం చేసుకో, తర్వాత గైకొని తర్వాత మారుమనస్సు పొందు అంటున్నారు
దేవుడు ఈ సంఘకాపరిని! లేకపోతే నేను దొంగలా నీ దగ్గరకు వస్తాను.
ఎప్పుడొస్తానో నీకు తెలియదు. వచ్చి నీ అంతుచూస్తాను
అంటున్నారు దేవుడు!!
ఇలాగే
పౌలుగారు కూడా తన ఆత్మీయకుమారుడైన తిమోతి గారికి రాస్తున్నారు! సంఘమును ఏవిధముగా క్రమశిక్షణలో
పెట్టాలి, సంఘపెద్దలను ఎలా నియమించాలి, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి లాంటివి
చెప్పి, సంఘములో యవ్వనస్త్రీలతో నీవు ఎలా మెలగాలి, వృద్ధులతో ఎలా మెలగాలి, స్త్రీలతో ఎలా మెలగాలి లాంటివి
బోధించి అంటున్నారు: నీవు నా మిషనరీ యాత్రలలో నాతోపాటు ఉన్నావు
కాబట్టి నేను బోధించే విధానమును, ఇతరులతో నేను ప్రవర్తించిన విధానమును,
నీవు విన్నవి, చూసినవి జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా
నీ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపొమ్మని మరియు ధైర్యముగా శ్రమలను సహించమని రాస్తునారు
పౌలుగారు తిమోతికి!
2తిమోతి ౩,
4 అధ్యాయాలలో!
2 Timothy(రెండవ
తిమోతికి) 3:10,11,12,14,15,16,17
10. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును
నా ప్రేమను నా ఓర్పును,
11. అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను,
తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను
సహించితిని గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను.
12. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.
14 .క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు
శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక,
15. నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని,
వాటియందు నిలుకడగా ఉండుము.
16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము
వలన కలిగిన ప్రతిలేఖనము (ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)
ఉపదేశించుటకును,
17. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.
2
Timothy(రెండవ తిమోతికి) 4:1,2,3,4,5
1. దేవుని యెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను,
ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి
చెప్పునదేమనగా
2. వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము;
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.
3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన
బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము,
సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా
జరిగించుము.
ఇక ఈ వచనంలో నేను
దొంగవలె వస్తాను అంటున్నారు! దొంగలా వస్తాను అనగా దొంగ ఎలాగు చెప్పకుండా వస్తాడో, ముందు వర్తమానం చెప్పకుండా హటాత్తుగా పడి ఎలా దోచుకుంటాడో అలాగే నేను కూడా
చెప్పకుండా వస్తాను. అప్పుడు నీ స్తితి బాగోలేకపొతే నిన్ను శిక్షిస్తాను
అంటున్నారు!
దీనికోసం ప్రభువు
ఉపమానం కూడా చెప్పారు- ఒక యజమానుడు
తాను పర్యటనకోసం వెళ్తూ తన ఇంటిని ఆస్తిని ఒక దాసునికి అప్పగిస్తే- ఆ దాసుడు- మా యజమాని ఇంత త్వరగా రాడు అని తలంచి తోటి
దాసులను కొట్టి, తిని త్రాగుచూ ఉంటే వాడు అనుకొనని గడియలో వచ్చి
వానికి తీర్పు తీర్చుతాడు అంటున్నారు.....
Luke(లూకా సువార్త)
12:36,37,38,39,40,42,43,44,45,46,47,48
36. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు
వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.
37. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు;
అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
38. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
39. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి,
తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
40. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని
చెప్పెను.
42. ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
43. ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో
ఆ దాసుడు ధన్యుడు.
44. అతడు తనకు కలిగిన దానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.
45. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని,
దాసులను దాసీలను కొట్టి, తిని త్రాగిమత్తుగా ఉండసాగితే
46. వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి,
అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును.
47. తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున
జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును.
ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.
దీనిలో దాసుడు- దైవసేవకుడు! అతడు
తనకు అప్పగించిన సంఘముపట్ల భాద్యతగా ఉండి, సంఘమును ముందుకు నడిపించాలి
గాని సంఘము ద్వారా పోషించబడుతూ సంఘ ఆత్మీయపోషణము చేయకపోతే, సంఘమును
వాక్యపువెలుగులో పెంచకపోతే దేవుడు తప్పకుండా ఆ కాపరిపై చర్య తీసుకుంటారు.
దైవసేవకుడు తప్పకుండా
సంఘాన్ని అపొస్తలుల భోదలో పెంచాల్సిన అవసరం ఉంది. అపొస్తలుల బోధ ద్వారా సంఘాన్ని పరిపూర్ణత లోనికి నడిపించాలి.
సంఘమును ఆత్మీయత లోనికి, సంపూర్ణ సత్యము బోధించి
పరిపూర్ణులు చేసే భాధ్యత సంఘకాపరిదే!!!
ఇక దొంగవలె వస్తాను
అని చెప్పిన వాక్యాలు: మత్తయి
సువార్తలో కూడా దొంగవలె వస్తాను అని చెప్పారు
24:42—44
42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
43. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి
తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
1
Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 5:2,3,4,5,6
2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా,
గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును
గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు
చీకటిలో ఉన్నవారుకారు.
5. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునైయున్నారు (వెలుగు కుమారులును పగలు కుమారులునై యున్నాను); మనము రాత్రివారము
కాము, చీకటివారము కాము.
6. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
2పేతురు 3: 10
అయితే
ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును,
పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు
దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.
కాబట్టి దేవుని రాకడ
దొంగవలె ముందు సమాచారం లేకుండా వస్తుంది.
కాబట్టి మొదటగా మనము సిద్దపడదాం! తర్వాత సంఘాన్ని
కూడా రాకడకు సిద్దపరుద్దాం! మనలో దేవునికి అయోగ్యమైనవి ఉంటే ఇప్పుడే
తొలగించుకుందాం!
అంతేకాకుండా మనము కూడా దేవుని నుండి బైబిల్ నుండి ఏమి నేర్చుకున్నామో, ఏమి విన్నామో, దేవుడు మనతో ఏమని మాట్లాడారో దాని ప్రకారం
చేస్తూ సంఘమును ఉజ్జీవపరుస్తూ పరలోకవాసులమవుదాం!
*సార్దీస్ సంఘము-6*
ప్రకటన 3:4—6
4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు
సార్దీస్లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు
గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.
5. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును;
జీవగ్రంథము లోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
6. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు
వినునుగాక.
ప్రియులారా! ఇక నాల్గవ వచనంలో అంటున్నారు: అయితే తమ వస్త్రములు అపవిత్ర
పరచుకొనని కొందరు సార్దీస్ లో ఉన్నారు, వారు అర్హులు కాబట్టి
తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో సంచారం చేస్తారు అంటున్నారు.
ఒకసారి
ఆగి ఆలోచిస్తే మొదటగా: ఇంతటి భ్రష్టమైన సంఘములో కూడా తమ వస్త్రములు అపవిత్రపరచుకోలేని కొందరు ఉన్నారు
అట! చూశారా ఎంత ధన్యులో కదా! వీరు సంఘము
బ్రష్టులై పోయారు, మా పాదిరి చచ్చిన స్థితిలో ఉన్నాడు అని మరో
చర్చికి వెళ్ళిపోలేదు! ఆ సంఘములోనే ఉండి తమనుతాము శుద్దులుగా
మలచుకొన్నారు! అపవిత్రమైనవి ఏవీ తమ దరికిరాకుండా, అపవిత్రత అనేది తమ వస్త్రములకు అంటుకోకుండా కాపాడుకొన్నారు! వస్త్రము- అనగా దేవుడు మనకు ఇచ్చిన రక్షణ అని అర్ధము!
అనగా లోకములో ఉంటున్నా, తమ రక్షణవస్త్రానికి పాపమనే
మలినము, అపవిత్రత అంటకుండా కాపాడుకుని పరిశుద్దులుగా నిలిచిపోయిన
ఘనులైన సంఘస్తులు ఇంత పనికిమాలిన సంఘములో కూడా ఉన్నారు!
దీనిని
బట్టి ఏమి అర్ధం అవుతుంది అంటే సంఘమును బట్టి సంఘస్తులను అంచనా వెయ్యకూడదు! ఇంత బ్రష్ట సంఘములో కూడా
అంత శ్రేష్ఠులు ఉన్నారు అంటే సంఘము ఎలాంటి సంఘమయినా అక్కడ కూడా కొద్దిమంది నిజమైన విశ్వాసులు
ఉండవచ్చు. కాబట్టి ఆ సంస్థ పేరుబట్టి సంఘమును అంచనా వేసి తక్కువ
చూపు చూడకూడదు!
చివరగా
యాకోబు గారు అంటున్నారు నిజమైన భక్తి ఏమిటంటే అని చెబుతూ- విధవరాల్లను దిక్కులేని
వారిని ఆదరించాలి అంటూ- నిజమైన భక్తి అంటే ఇహలోకమాలిన్యము అనేది
మన ఘటములకు అంటుకోకుండా పవిత్రంగా మనలను చూచుకోవడమే నిజమైన భక్తి!
యాకోబు 1: 27
తండ్రియైన
దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను
వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
ప్రియ దైవజనమా! మీలో ఎంతమంది మీ ఘటములను పవిత్రముగా ఉంచుకుంటున్నారు!
మీ హృదయాన్ని పవిత్రముగా ఉంచుకొంటున్నారు? అలా
ఉంచుకుంటేనే మీరు నిజమైన భక్తి చేస్తున్నట్లు ఈ వాక్యభాగము ప్రకారం!
ఇక
ఈ వచనంలో ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే వారు అర్హులు గనుక తెల్లని బట్టలు వేసుకుని నాతోకూడా
సంచరిస్తారు అంటున్నారు! తెల్లని బట్టలు పరిశుద్ధమైన జీవితానికి, పరిశుద్దతకు
పవిత్రతకు సూచనగా ఉన్నాయి! వీరు భూలోకంలో పరిశుద్దులుగా జీవించారు
కాబట్టి పరలోకంలో దేవునితో సంచారం చేస్తారు అంటున్నారు! అయితే
ఎందుకు అర్హులు అయ్యారు అంటే మొదటగా ఇహలోక మాలిన్యము తమ ఘటములకు అనగా ఆత్మకు,
హృదయానికి అంటనీయలేదు .
రెండు: గొర్రె పిల్లను/
యేసుక్రీస్తు ప్రభులవారిని కష్టమైన నష్టమైన వెంబడించిన వారు!
మూడు: పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం
జీవిస్తూ, అలా జీవించినందువలన కలిగిన శ్రమలను ఓర్చుకున్నారు కాబట్టే
అర్హులు!
కాబట్టి
మనము కూడా అలాగే అర్హతను సాధించాల్సిన అవసరం ఉంది!
ఒకసారి
మనం ప్రకటన గ్రంధం గమనిస్తే పరలోకంలో ఉన్న పరిశుద్ధులు గాని మరెవరైనా వాని తెల్లని
బట్టలు వేసుకున్నట్లు గమనించవచ్చు!
ప్రకటన
గ్రంథం 4: 4
సింహాసనముచుట్టు
ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు
ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
ప్రకటన
గ్రంథం 6: 11
తెల్లని
వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియువారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు
సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
Revelation(ప్రకటన గ్రంథము) 7:9,13
9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని
యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై,
ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెెపిల్ల యెదుటను
నిలువబడి.
13. పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
ప్రకటన
గ్రంథం 19: 14
పరలోకమందున్న
సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
ఇక 5వ వచనంలో జయించువాడు పొందుకొనే
భాగ్యములలో మొదటగా ఇలా తెల్లనిబట్టలు వేసుకుంటారు అంటున్నారు! అనగా ఒకరకంగా చెప్పాలంటే తెల్లనిబట్టలు వేసుకుని పరలోకంలో దేవునితో సంచరిస్తారుఅని
అర్ధం!
ఇక మరో ప్రాముఖ్యమైన
విషయాలు
ఏమిటంటే మొదటగా: జీవ గ్రంథంలో నుండి అతని
పేరు ఎంతమాత్రము తుడుపుపెట్టక,
రెండు: నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు
ఒప్పుకుందును అంటున్నారు.
సువార్తలలో కూడా యేసుక్రీస్తుప్రభులవారు
ఎవడైతే నా పేరుకోసం సిగ్గుపడతాడో వాడిని నేను దేవునిఎదుట దూతల ఎదుట కాదు అంటాను, నాకోసం సిగ్గుపడకుండా ఒప్పుకుంటాడో అతనికోసం
దూతల ఎదుట ఒప్పుకుంటాను అంటున్నారు మత్తయి 10:32,33.
32. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును
వానిని ఒప్పుకొందును.
33. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును
ఎరుగనందును.
మరి ఆయన నామమును ధైర్యముగా
ఒప్పుకుంటావా? ఆయనే నిజమైన
రక్షకుడు, నిన్ను మార్చిన వాడు అని చెప్పావా? ఒప్పుకుంటున్నావా? వీరు ఒప్పుకున్నారు కాబట్టే వీరు అర్హులు
అయ్యారు! ఇప్పుడు దేవుడు వారిని నా వారు అని ఒప్పుకుంటున్నారు!
*సార్దీస్ సంఘము-7*
ఇక
జీవగ్రంధము కోసం చూసుకుంటే బైబిల్ లో అనేకసార్లు జీవగ్రంధము అని వ్రాయబడింది! అనగా దేవునికోసం విశ్వసవీరులుగా
రక్షణను కాపాడుకొంటారో వారిపేర్లు వ్రాయబడిన గ్రంధము!
రక్షించబడిన ప్రతీ విశ్వాసి పేరు కూడా
ఈ జీవ గ్రంధమందు వ్రాయబడుతుంది. గాని ఇక్కడ అతనిపేరు ఎంతమాత్రము
తుడుపుపెట్టక అంటున్నారు అంటే తుడుపుపెట్టే అవకాశం ఉంది అన్నమాట! ఎప్పుడు తుడుపుపెట్టబడుతుంది అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది గాని
నీవు మృతుడవే అని దేవునిచేత అనిపించుకునే స్థితిలో ఉంటే, బ్రతుకు
బాగోలేకపోతే నీ పేరు తప్పకుండా జీవ గ్రంధము నుండి తుడుపుపెట్టబడుతుంది అన్నమాట!
పుట్టించిన దేవునికి- గిట్టించే అధికారం ఎలా ఉందో,
జీవ గ్రంథంలో పేరు రాసిన దేవుడు, నీ బ్రతుకు బాగోలేకపోతే
నీ పేరు తుడుపుపెట్టే అధికారం మరియు అవకాశం ఉంది కాబట్టి భయము నొంది పాపము చేయకు!
ఈ వచనం చదివుతున్నప్పుడు ఎప్పుడు
నాకు భయం వేస్తుంది! ఎందుకో చెప్పనీయండి! —నేను భూమిమీద నిజంగా ఏమీ సంపాదించలేదు!
గాని నేను సంపాదించింది ఒకటుంది! అదేమిటంటే
2012 లో ఒకసారి, 2016లో మరోసారి, 2020 లో మరోసారి మూడుసార్లు దేవుడు నా పేరు జీవగ్రంధమునందు వ్రాయబడింది అని నాకు
చెప్పారు, చూపించారు. ఇక ఈ 2021లో ఇప్పుడు నేను ప్రార్ధన చేస్తున్నట్లుగా నా పేరు ఎత్తబడే గుంపులో ఉన్నట్లు
చూపించారు (ఈ ప్రార్ధన నాకు మా తండ్రిగారు నేర్పించారు). నాకంటూ భూమిమీద ఆస్తిపాస్తులు లేవు
గాని జీవ గ్రంథంలో నా పేరు వ్రాయబడి ఉంది. ఎత్తబడే గుంపులో నేనున్నాను.
ఇది నాకు చాలు!
సరే, ఎందుకు భయపడతాను అంటే-
జీవగ్రంధములో పేరు తుడుపుపెట్టే అవకాశం ఉంది! పౌలుగారు
అంటున్నారు: ఇతరులకు బోధించాక నేను భ్రష్టుడనై పోతానేమో అని నన్ను
నేనే నలుగగొట్టుకుంటున్నాను అంటున్నారు.
అలాగే
నేనుకూడా ఇన్ని భోదలు నీతులు చెబుతున్న నేను- నా బ్రతుకును, సాక్ష్యాన్ని,
పరిశుద్ధతను కాపాడుకోలేక పోతే ఎక్కడ నా పేరు జీవగ్రంధమునుండి తుడుపుపెట్టుకు
పోతాడో అని భయపడుతూ ఉంటాను!
1కోరింథీయులకు 9: 27
గాలిని
కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై
పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.
ఇక
జీవగ్రంధము కోసం బైబిల్ లో ఎక్కడెక్కడ వ్రాయబడింది అంటే
ప్రకటన 13:8
భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని
వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు,
ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.
ప్రకటన
గ్రంథం 17: 8
నీవు
చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును
నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి
మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను
గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.
ప్రకటన 20:12, 15
12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట
చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు
వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
15. ఎవని పేరైనను (మూలభాషలో- ఎవడైనను)
జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రకటన
గ్రంథం 21: 27
గొఱ్ఱెపిల్లయొక్క
జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని
జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
ఫిలిప్పీ 4:౩
అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు
క్లెమెంతుతోను నాయితర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడ ప్రయాస పడినవారు గనుక వారికి
సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంధమందు
వ్రాయబడియున్నవి.
నిర్గమ 32:32
అయ్యో
నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా
పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నాననెను.
కీర్తన 69:28
జీవగ్రంథములో
నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
దానియేలు 12:1
ఆ
కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా
కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.
అయితే
కొంతమంది జీవగ్రంధమువేరు- గొర్రెపిల్ల జీవగ్రంధము వేరు అంటూ వాదిస్తారు! ఏమో నాకు
తెలియదు! నాకైతే రెండూ ఒకటే అని నా ఉదేశ్యం!
ప్రకటన
గ్రంధంలో గొర్రెపిల్ల జీవగ్రంధము అని రెండుసార్లు వ్రాయబడింది. 13:8, 21:27 . వారు ఏమంటారు
అంటే ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో కడుగబడతారో అనగా యేసుక్రీస్తునామంలో బాప్తిస్మం పొంది
పరిశుద్దాత్మ అనుభం కలిగి జయిస్తారో వారిపేర్లు మాత్రమే గొర్రెపిల్ల జీవగ్రంధములో ఉంటాయి.
పాత నిబంధన పరిశుద్దులు మామూలు పరిశుద్ధుల పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంధములో
ఉండవు! మామూలుజీవగ్రంధములో ఉంటాయి అంటారు! ఇది ఎందుకో నాకు సరియైనది అనిపించదు!
ఎందుకో
చెప్పనీయండి: రెండు రిఫరెన్సులు చెబుతాను. ఫిలిప్పీ 4:౩ లో ఆ సహకారుల పేరులు జీవగ్రందమందు వ్రాసి ఉన్నాయి అంటున్నారు. మరి అప్పుడు పౌలుగారు ఆ సహకారుల పేరులు గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయబడ్డాయి
అని చెప్పొచ్చు కదా- నిజంగా రెండు జీవగ్రంధములు ఉంటే!
రెండు: పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారో
చెబుతూ 21:27లో
గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయబడిన వారే దానిలో అనగా పరలోకంలో
ప్రవేశిస్తారు గాని నిషిద్దమైనది అసహ్యమైనది అబద్దమైనది దానిని జరిగించు వాడు ప్రవేశింపనే
ప్రవేశించడు అని వ్రాయబడింది! మరి ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు
కూడా అదే పరలోకంలో ప్రవేశిస్తారు కదా! వారికోసం దేవుడు పాత నిబంధన
పరలోకం అనేది చెయ్యలేదు కదా! కాబట్టి పరిశుద్ధులైన వారి పేర్లు
జీవగ్రంధములో ఉంటాయి గాని జీవగ్రంధము- గొర్రెపిల్ల జీవగ్రంధము
వేరు వేరు కాదు రెండు ఒక్కటే అని నా ఉద్దేశ్యం!!!
ప్రియమైన
దేవుని బిడ్డా! నీ పేరు జీవగ్రంధములో వ్రాయబడిందా లేదా? ఒక్కసారి దేవుని
అడిగి నిశ్చయం చేసుకో!
లేకపోతే
వ్రాయమని అడుగు! నీ బ్రతుకు మార్చుకుని దేవునితో సమాధాన పడు!
తద్వారా
పరలోకం చేరు!
అంతేకాకుండా ఇహలోక
మాలిన్యము అంటుకోకుండా నీ ఘటమును కాపాడుకో!
సాక్ష్యాన్ని కాపాడుకో! విశ్వాసం కాపాడుకో!
ఈ సార్దీస్ సంఘములో
కొంతమంది ఇంత భయంకరమైన పరిస్తితిలో కూడా తమ వస్త్రములు కాపాడుకున్నారు. మనం కూడా కాపాడుకుందాము!
దైవాశీస్సులు!
*ఫిలడెల్ఫియ సంఘము-1*
ప్రకటన 3:7
ఫిలదెల్ఫియలో
ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును,
ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు
లేవనగా
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
మనం ఐదవ
సంఘమైన సార్దీస్ సంఘముకోసం ధ్యానం చేసుకున్నాము! ఇక ఆరవ సంఘమైన
ఫిలడెల్ఫియ సంఘం కోసం ధ్యానం చేసుకుందాము!
ఫిలడెల్ఫియా
అనగా: సహోదర ప్రేమ! పేరుకు
తగ్గట్టుగా సహోదర ప్రేమకలిగి విశ్వాసవీరులుగా నిలిచారు!
ప్రస్తుత
నామం: షహర్ అనగా దేవుని పట్టణం!
ఎక్కడుంది? సార్దీస్ పట్టణానికి ఆగ్నేయంగా
50 కి.మీ దూరంలో ఉంది!
చరిత్ర:
ఇది కొండలమీద నిర్మించబడింది. దీనిని పెర్గోమోస్
లోని అట్లాస్ రాజులలో రెండవ వాడైన ఫిలడెల్ఫాస్ అనే అతను కట్టించాడు కాబట్టి ఈ పట్టణానికి
ఫిలడెల్ఫియా అనే పేరు వచ్చింది. ఇక్కడ ద్రాక్షారసం విస్తారంగా దొరుకుతుంది. కారణం ద్రాక్షలపంట
ముఖ్య పంట ఇక్కడ! అయితే క్రీ.శ.
సుమారు 1000 ప్రాంతంలో ఇక్కడ మహా గొప్ప భూకంపం
వస్తే పట్టణమంతా కూలిపోయింది. అప్పుడు మరలా నిర్మించి ఈ పట్టణానికి
షహర్ అనే పేరు పెట్టారు!
ఇక సంఘమును ఎవరు స్తాపించారో
అంతగా తెలియదు గాని యోహానుగారు కూడా ఇక్కడకు వెళ్లి పరిచర్య చేసినట్లు చెబుతారు!
మోపబడిన
తప్పు: తప్పులేని
సంఘములలో ఇది రెండవది! స్ముర్ణ సంఘానికి దేవుడు ఎలా తప్పుమోపలేదో-
ఈ సంఘమునకు కూడా తప్పుమోపలేదు అంతేకాకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అని ఈ సంఘముతో ప్రత్యేకముగా చెబుతున్నారు! దేవునిచేతనే
I Love You అనిపించుకున్న శ్రేష్టమైన
సంఘము!
ఈ సంఘముతో
ప్రభువు చేసుకునే పరిచయం:
దావీదు తాళపుచెవి
కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా....
ఈ అన్ని ఉత్తరాలలో
మొదటి అధ్యాయంలో యోహాను గారు చూసిన విషయాలతో పరిచయం చేసుకున్నారు. అయితే ఈ ఉత్తరంలో కొంచెం ప్రత్యేకంగా తననుతాను
పరిచయం చేసుకుంటున్నారు ప్రభువు! అక్కడ అనగా మొదటి అధ్యాయంలో
మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెబితే ఇక్కడ
దావీదు తాళపుచెవి అని చెబుతున్నారు!
తాళపుచెవి అధికారాన్ని
సూచిస్తుంది. అనగా దావీదు
యొక్క తాళపు చెవి అనగా దావీదు రాజు యొక్క అధికారం! యేసుక్రీస్తుప్రభులవారు
దావీదు కుమారునిగా లోకానికి పరిచయం! దావీదు రాజుగారికి కలిగిన
అధికారం ఏమిటంటే ఆయన చక్రవర్తి –రాజు! అనగా రాజ్యాధికారం దావీదుగారికి ఉంది!
అయితే గబ్రియేలు
దేవదూత మరియమ్మ గారితో ఏమన్నాడు: ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును. లూకా 1: 31
యెషయా 9:6 లో ఆయన భుజము మీద రాజ్యభారముండును......
అంటున్నారు.
ప్రకటన మొదటి అధ్యాయంలో
మీదన చెప్పుకున్నట్లు మృతుడనైతిని గాని సదాకాలము జీవిస్తున్నాను. మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపుచెవులు
నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నారు!
అనగా ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారికి
రాజ్యముల మీద అధికారమే కాకుండా మరణం మీద కూడా అధికారం ఉంది.
మత్తయి 28: లో అంటున్నారు మరియు నాకు పరలోకమందును
భూమియందును సర్వాధికారం ఇయ్యబడెను అంటున్నారు..
.
యెషయా 22:22 లో నేను దావీదు రాజవంశం యొక్క తాళపుచెవిని
అతని భుజం మీద ఉంచుతాను. అతడు తెరిస్తే ఎవరూ మూయలేరు.
అతడు మూస్తే ఎవరూ తీయలేరు.
ఆ మోపింది ఎవరిమీదన
అంటే యేసుక్రీస్తుప్రభులవారిమీద! అందుకే ఇక్కడ అంటున్నారు దావీదుతాళపు చెవి నా చేతిలోనే ఉంది.
కాబట్టి ఆయన రాజులరాజు! ప్రభులకు ప్రభువు! మరణం మీద, పాతాళం మీద, పరలోకంలోనూ
కూడా అధికారం గలవాడు! ఇలా చెప్పడానికే ఈ సంఘానికి ఇలా పరిచయం
చేసుకుంటున్నారు!
ఇక
రెండవది: సత్యస్వరూపి:
యోహానుసువార్తలో కృపాసత్య
సంపూర్ణునిగా మనమధ్య వశించెను అంటున్నారు...
యోహాను 1:14
ఇంకా అదే అధ్యాయంలో
ముందుకు పోతే ధర్మశాస్త్రం మోషేగారి ద్వారా కలిగినా గాని కృపయు సత్యము మాత్రము యేసుక్రీస్తు
ద్వారానే కలిగెను అంటున్నారు 17వ వచనంలో!
యేసయ్య అంటున్నారు: నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును
అయి ఉన్నాను. నాద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అంటున్నారు
యోహాను 14:6 లో.
ఇక పిలాతుతో అంటున్నారు
సత్యము గూర్చి సాక్ష్యమివ్వడానికే ఈ లోకానికి వచ్చాను అంటున్నారు. 18:37
కాబట్టి ఆయన సత్యస్వరూపి! ఈ సత్యము లోనికి వచ్చిన నీవుకూడా అదే సత్యములో
నిలిచియుండాలి. అప్పుడు ఆ సత్యము మనలను నడిపించి, ఇంకా సర్వసత్యములోనికి నడిపిస్తుంది!
ప్రకటన 6:10
వారు
నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక
తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన
చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
ప్రకటన
గ్రంథం 15: 3
వారు
ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు
ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు
(అనేక ప్రాచీన ప్రతులలో- జనములకు అని పాఠాంతరము)
రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;
ప్రకటన
గ్రంథం 15: 4
ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు,
నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు?
నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని
నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల
కీర్తనయు పాడుచున్నారు.
ఇక
చివరగా: పరిశుద్ధుడు!
ఇది
దేవుని యొక్క లక్షణాలలో ప్రధమమైనది:
యెషయా
గారి దర్శనం 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ దూతలు కెరూబులు
సెరాపులు గానప్రతిగానములు చేస్తున్నారు.
లేవీ 11:44—45
44. నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు
పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.
45. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను;
నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
యెషయా 43: 15
యెహోవానగు
నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.
ఇక
ఆయన సవాలు చేస్తున్నారు:
నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించగలడు? యోహాను
8:46
పేతురు
గారు అంటున్నారు 1పేతురు 2:22
ఆయన
పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
పౌలుగారు
అంటున్నారు:
హెబ్రీ 7:26
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును.
ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు
సరిపోయినవాడు. (లేక, తగినవాడు)
2కొరింథీ 5:21
ఎందుకనగా
మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
కాబట్టి ఆయన పరిశుద్ధుడు
కనుక మనము కూడా పరిశుద్దులుగా బ్రతుక బద్దులమై యున్నాము!
*ఫిలడెల్ఫియ సంఘము-2*
ప్రకటన 3:8—9
8. నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను
నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట
తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు.
9. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను;
వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
ఇక ఎనిమిదో వచనంలో
నీ క్రియలను నేనెరుగుదును అంటున్నారు! అనగా ఈ సంఘము కూడా క్రియలు గల సంఘము!
ఈ సంఘము
యొక్క మంచి లక్షణాలు చూసుకుంటే:
మొదటగా: క్రియలు గలది
రెండు: శక్తి కొంచెమైనా వాక్యాన్ని
గైకొని క్రీస్తుకోసం ధైర్యంగా నిలబడింది!
మూడు: పదో వచనం ప్రకారం నా ఓర్పు
విషయమైన వాక్యమును గైకోన్నావు! అనగా వాక్యాన్ని వినడమే కాదు,
దాని ప్రకారం జీవిస్తున్నావు!!
ఎంత
ఘనమైన లక్షణాలున్నాయో కదా ఈ సంఘానికి!
క్రియలు కోసం గతంలో
చూసుకున్నాము గనుక రెండవ లక్షణానికి పోదాం!
శక్తి
కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొని నానామము కోసం స్థిరంగా నిలబడ్డావు!
దీనిని
జాగ్రత్తగా పరిశీలిస్తే క్రీస్తుని అనుసరించడానికి ఆయన వాక్కును గైకొని ఆచరణంలో పెట్టడానికి
కొద్దిపాటి బలము, కొద్దిపాటి విశ్వాసము చాలు! గాని ఆ విశ్వాసంలో అనుమానాలు
ఉండకూడదు! నీకు ధనము లేకపోయినా, బలములేకపోయినా,
జన బలము లేకపోయినా పర్వాలేదు గాని ఆయనయందు గల విశ్వాసంలో ఇటు అటు జారకుండా
విన్న వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఎన్ని ఆటంకాలు కలిగినా క్రీస్తుకోసమే జీవించాలి!
అదిచాలు! ఆత్మలో బలంగా ఉండాలి. ఆత్మపూర్ణులుగా ఉండాలి. అలా కాకుండా నాకు చదువులేదు,
బలములేదు, ధనము లేదు లాంటివి చెబుతున్నాడు అంటే
ఆ విశ్వాసి సాకులు చెబుతున్నాడు అని అర్ధము! నిజమైన ఆధ్యాత్మిక
జీవము కొంచెమైనా ఉంటే ఆ కొద్దిపాటి బలముతో పరలోకం చేరగలవు అని గ్రహించాలి!
ఈ సంఘానికి
ధనము లేదు, బలము
లేదు, జన బలము లేదు. ఏవిధమైన సపోర్ట్ లేదు!
అయినా దేవుని కోసం స్థిరంగా నిలబడింది! ప్రియ సంఘమా!
నీవు దేవునికోసం స్థిరంగా నిలబడగలుగుతున్నావా?
ఇక తర్వాత మాటలో
ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను దానిని ఎవడును వేయనేరడు అంటున్నారు!
ఈ సంఘానికి పరిచయంలో
దేవుడు చెప్పారు—దావీదు తాళపుచెవిని కలిగి ఎవడును తీయలేకుండా వేయువాడును
వేయలేకుండా తీయువాడును అంటూ పరిచయం చేసుకున్నారు కదా- ఇప్పుడు అంటున్నారు- నీ ఎదుట నేను తలుపు తీసిఉంచాను. దానిని ఎవడును వేయలేడు!
ఇంతకీ ఆ ద్వారం
ఏది అంటే: నా ఉద్దేశం
పరలోక మార్గము! యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై
ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని
చెప్పిన విధముగా పరలోక మార్గము యేసే! ఆ తలుపు యేసుక్రీస్తుప్రభులవారు
మాత్రమే! ఆ తలుపు పరలోక ద్వారం! ఇంత స్థిరంగా
విశ్వాసంలో నిలిచి ఉన్నావు కాబట్టి నీకోసం పరలోక ద్వారాలు తెరిచాను. దానిని ఎవడూ మూయలేడు! వెళ్లి స్వతంత్రించుకో అన్నట్లుగా
ఉంది ఇది!
పౌలుగారికి మరోద్వారం
తెరచి ఉంది అని చెప్పారు! అది
సువార్తప్రకటన కు గల అవకాశం!
అపో 14:27
వారు
వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు,
అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.
1కొరింథీ 16:9
కార్యాను
కూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది (మూలభాషలో- గొప్ప ద్వారము
నాకు తెరువబడియున్నది) ; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక
పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.
అయితే ఒక్కటి: ఒకవేళ దేవుడు గాని ద్వారం
తెరిస్తే దానిని మూసే శక్తి ఎవడికీ లేదు! దేవుడుగాని నిన్ను ఆశీర్వదిస్తే
దానిని ఆపే శక్తి ఎవడికీ లేదు! దేవుడు గనుక నిన్ను స్వస్తపరిస్తే
దానిని అడ్డుకునే శక్తి ఎవడికీ లేదు! కాబట్టి నీవు సంపూర్తిగా
దేవునిమీద ఆనుకోవాలి!
ఇక తర్వాత
వచనంలో ఇదిగో యూదులు కాకపోయినా తాము యూదులము అని అబద్దమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల యెదుట
పడి నీకు నమస్కారం చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుసుకొనే
లాగ చేస్తాను అంటున్నారు!
ఇక్కడ మొదటగా
సాతాను సమాజపువారు వచ్చి ఈసంఘము యొక్క పాదముల మీద పడతారు అని చెబుతున్నారు!
రెండవది: వారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అని తెలిసుకుంటారు అంటున్నారు!
ఈ సాతాను
సమాజపు వారికోసం గతంలో చూసుకున్నాము! తాము యూదులు కాకపోయినా అనగా శారీరకంగా యూదులే గాని ఆత్మీయంగా
యూదులు కాక సాతాను సమాజం వారు, బాప్తిస్మం పొందితే చాలదు సున్నతి
కూడా పొందాలని చెప్పే బేచ్! వీరు తాము చెప్పినవి తప్పుడు బోధలు
అని తెలిసికొని చివరికి నీ పాదముల మీద పడి నమస్కారం చేస్తారు అని చెబుతున్నారు దేవుడు!
ఈ వాగ్దానం ఇంతకుముందు
తండ్రియైన దేవుడు కూడా చేశారు: యెషయా గ్రంధంలో! 45:14
యెహోవా
ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును, దీర్ఘదేహులైన సెబాయీయులును
నీయొద్దకు వచ్చి నీవారగుదురు, వారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు
కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును
లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు.
యెషయా 49: 23
రాజులు
నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమిమీద సాగిలపడి నీకు
నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు
తెలిసికొందువు.
యెషయా 60: 14
నిన్ను
బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు
వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు
నీకు పేరు పెట్టెదరు.
ఇక మరో అమూల్యమైన
మాట ఏమిటంటే: ఆలాచేస్తే నేను
నిన్ను ప్రేమిస్తున్నాను అని వారు తెలుసుకొంటారు అంటున్నారు!
అనగా పరోక్షంగా దేవుడు
వీరితో చెబుతున్నారు: నా ప్రియమైన
ఫిలడెల్ఫియా సంఘమా! విశ్వాసులారా! నేను
మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను! కారణం మీ బలం శక్తి కొంచెమైనా
నా నామం కోసం శ్రమలను అనుభవించి ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను కాదనలేదు కాబట్టి మీరంటే
నాకు ఎంతో ఇష్టం!
ఇప్పుడు ఇలాంటి స్థితిలో
ఎవరైనా ఉంటే వారికి కూడా దేవుడు చెబుతున్నారు: నా బిడ్డా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను!
యిర్మియా గారు అంటున్నారు, తనభాధలో ఉన్నప్పుడు
దేవుడు కనబడి 31:3
చాలాకాలము
క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: శాశ్వతమైన ప్రేమతో నిన్ను
ప్రేమిస్తున్నాను. గనుకనే విడువక నీ యెడల కృపచూపుతున్నాను అంటున్నారు!
ఈరోజు నీతోను నాతోను అంటున్నారు: నా బిడ్డా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!
మరి నీతో అలా చెప్పాలంటే
నీవు ఆయనను మనస్పూర్తిగా అనుసరించాలి! ఆయన వాక్యమును గైకొనాలి!
మరినీవు సిద్దమా?
*ఫిలడెల్ఫియ సంఘము-3*
ఇక ఎనిమిదో వచనంలో
నీ క్రియలను నేనెరుగుదును అంటున్నారు!
ఈ సంఘము యొక్క మంచి లక్షణాలు ధ్యానం
చేసుకుంటున్నాము!
మొదటగా: క్రియలు గలది
రెండు: శక్తి కొంచెమైనా వాక్యాన్ని గైకొని క్రీస్తుకోసం
ధైర్యంగా నిలబడింది!
మూడు: పది వచనం ప్రకారం నా ఓర్పు విషయమైన వాక్యమును
గైకొన్నావు! అనగా వాక్యాన్ని వినడమే కాదు, దాని ప్రకారం జీవిస్తున్నావు!!
ఎంత ఘనమైన లక్షణాలున్నాయో
కదా ఈ సంఘానికి!
ఇక
చివరగా నా ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నావు! ఈ సంఘము వాక్యమును వినడమే మాత్రమే కాదు!
వాక్యాన్ని గైకొన్నావు అని రెండుసార్లు చెబుతున్నారు ఈ ఉత్తరంలో దేవుడు!
ఒకసారి
మనం ప్రకటన మొదటి అధ్యాయం మూడో వచనం చూసుకుంటే సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు
చదువువాడును, వినువాడును, దానిని గైకొనువాడును ధన్యులు అన్నారు!
అదే చివరి అధ్యాయం ఏడో వచనంలో చూసుకుంటే గైకొనువాడు ధన్యుడు అంటున్నారు!
చదువువాడు, వినువాడు లేరు ఇక్కడ! అనగా కేవలం చదువువాడు వినువాడు మాత్రమై ఉండక, చదివిన
దానిని, వినిన దాన్ని ఒంట పట్టించుకుని వాక్యానుసారంగా జీవించువాడై
ఉండాలి! దానినే గైకొనువాడు అంటున్నారు, అనగా వాక్య ప్రకారం నడుచుకొనేవాడు!
మరి
ప్రియ సహోదరి సహోదరుడా! నీవు కేవలం చదువు వాడవు మాత్రమేనా, వినువాడు మాత్రమేనా
లేక గైకొనువాడవు కూడానా?
మనము
కేవలం వినువారు మాత్రమై ఉంటున్నాము తప్ప గైకొనువారు కావడం లేదు! దేవుడు రెండు చెవులు ఎందుకిచ్చాడు
అంటే ఒక చెవితో విని రెండో చెవితో విడిచిపెట్టడానికి అన్నాడట ఒకడు! అలాగే ఉంది మన బ్రతుకు! ప్రతీ ఆదివారం నాడు ఎంతో గంభీరమైన
వర్తమానాలు వింటున్నాము గాని మన బ్రతుకులు ఎందుకు మారడం లేదు అంటే మనం కేవలం వినువారు
మాత్రము, లేక చదువు వారు మాత్రమై ఉన్నాము. గైకొనువారు కాలేకపోతున్నాము! ఈ సంఘము గైకొనువారై ఉన్నారు.
అందుకే ఈ సంఘముమీద దేవుడు ఏ తప్పు మోపడం లేదు సరికదా—నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు! మరినీకు అలాంటి అనుభవం ఉందా!!!??
ఇక
ఈ మాట జాగ్రత్తగా గమనిస్తే నా ఓర్పు విషయమైన వాక్యమును అంటున్నారు అనగా వీరు శ్రమలలో
సోలిపోకుండా దేవుడు చేప్పినది చేశారు తప్ప వారు తమ సొంత ప్రయత్నాలు చెయ్యలేదు. నిరాశ పడలేదు! దేవునిమీద సణగలేదు. విశ్వాసంతో దేవునిమీద భారం వేసి – తాము శ్రమలు అనుభవించడానికే పిలువబడ్డాము అని
పౌలుగారు పేతురుగారు చెప్పినమాటలు విని సంతోషంతో శ్రమలను సహించారు. అందుకే నా ఓర్పు విషమైన వాక్యమును గైకొన్నావు అంటున్నారు దేవుడు!
అందుకు
గాను పదో వచనంలో దేవుడు ఒక అమూల్యమైన వాగ్దానం చేస్తున్నారు: నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును
గైకొన్నావు గనుక భూనివాసులను శోదించుటకు లోకమంతటికి రాబోవు శోధనకాలంలో నేనును నిన్ను
తప్పించెదను అంటున్నారు!
ఎంత
అమూల్యమైన వాగ్దానమో కదా!
ఇది
బాగా అర్ధం కావాలంటే ప్రకటన గ్రంధము 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం
వరకు మహాశ్రమల కాలంలో సంభవించే శ్రమలు కోసం వ్రాయబడింది! అయితే
ఈ 6—19అధ్యాయాల మధ్యలో సంఘము ఎక్కడా
కనబడదు! దీని అర్ధము ఏమిటంటే అనేకులు భావించినట్లు సంఘము శ్రమలకు
ముందుగానే ఎత్తబడుతుంది ఈ వచనం లేక ఈ వాగ్దానం ప్రకారం! ఎవరైతే
జయించిన అనుభవం కలిగి, తమ సాక్ష్యాన్ని, తమ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, కళంకం లేకుండా కాపాడుకుని, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నారో
వారిని దేవుడు రహస్యరాకడలో తీసుకునిపోతారు! వారు ఎత్తబడతారు!
వారితో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా ఎత్తబడతాడు!
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడో,
ఇక తనకు అడ్డులేదని తెలిసుకొనిన క్రీస్తువిరోది తననుతాను బయలుపరచుకొంటాడు!
ఇంతవరకు వాడిని పరిశుద్ధాత్ముడే అడ్డుకొంటున్నాడు రక్షించబోయే వారి సంఖ్య
పూర్తికావడం కోసరం! ఆ తర్వాతనే మహా శ్రమల కాలం మొదలవుతుంది!
అదే
సమయంలో ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళిక మొదలవుతుంది!
అయితే
ఇక్కడ దేవుడు లోకమంతటి మీదికి రాబోయే శ్రమల కాలంలో లేక శ్రమల గడియలో నేనును నిన్ను
తప్పిస్తాను అంటున్నారు! అనగా మహా శ్రమలు అనుభవించకుండా దేవుడు సంఘమును తప్పిస్తారు! ఇది కేవలం జయించిన అనుభవం గలవారికి మాత్రమే ఈ సౌలభ్యం! నామకార్ధక్రైస్తవులకు, దేవుడు అంటే సీరియస్ గా తీసుకోని
వారికి, అజాగ్రత్తగా ఉన్న పరిశుద్దులకు ఇది భయంకరమైన వార్త!
ఎందుకంటే లోకమంతటి మీదికి మహా శ్రమల కాలం రాబోతుంది! అది ఒక్కరోజు రెండు రోజులు ఒక్క నెల రెండు నెలలు కాదు! ఏడు సుదీర్ఘమైన సంవత్సరాలు బాధపడతారు! ఏమేమి భాధలు పడతారో
6—19 అధ్యాయాలలో వివరంగా వ్రాయబడింది-
ఒకటి యూదుల కోణంలో! మరొకటి సంఘము కోణంలో!
(గమనించాలి: విడువబడిన వారికి ఏడు సంవత్సరాల మహాశ్రమలు,
అయితే యూదులకు మాత్రం మూడున్నర సంవత్సరాలు మాత్రమే, ఎందుకంటే మొదటి మూడున్నర సంవత్సరాలు యూదులు క్రీస్తు విరోధితో ఉంటారు.
క్రీస్తు విరోధి- వాడి టెక్నాలజీ అభివృద్ధి చెందించడానికి
బహుశా యూదులనే వాడుకుంటాడు).
అయితే
జయించిన వారు శ్రమలలో ఉండరు ఈ భాగం ప్రకారం! అనగా జయజీవితం జీవించినవారు ఎత్తబడతారు! ఇది నా ఉద్దేశము! (ఒకవేళ ఇలా వ్రాయడం తప్పు అయితే నా భావము
తప్పు అయితే ప్రభువు నన్ను క్షమించును గాక! నాకు అర్ధమయ్యింది
నేను రాస్తున్నాను!) ఒకవేల ఇలా జరుగక పోతే అనగా శ్రమలకు ముందుగా
సంఘము ఎత్తబడకపోతే (ఎత్తబడుతుంది అని నా నమ్మకం), ఆ మహాశ్రమల కాలంలో జయజీవితం గల పరిశుద్దులు శ్రమలనుండి తప్పించబడతారు ఈ వచనం
ప్రకారం! ఏవిధంగా తప్పించబడతారు అంటే అది దేవుని చిత్తం.
ఆయన సర్వాధికారి కాబట్టి జయజీవితం జీవించిన పరిశుద్దులు మాత్రము మహాశ్రమల
కాలంలో ఈ శ్రమలను అనుభవించరు!!! అదంతే! ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, మరియు దానిని
చేయడానికి సమర్ధుడు కాబట్టి తప్పకుండా శ్రమలనుండి తన భక్తులను కాపాడుతారు దేవుడు!
ప్రియ
సహోదరి/సహోదరుడా!
ఎత్తబడే అనుభవంలో ఉన్నావా? విడువబడే గుంపులో ఉన్నావా?
నేనైతే ఎత్తబడే గుంపులో ఉన్నాను అని నా దేవుడు నాకు చూపించారు!
జీవ గ్రంధములో నాపేరు వ్రాయబడింది అని నాకు చూపించారు కాబట్టి నేను ఎత్తబడతాను
మరియు మహాశ్రమల కాలంలో నేను తప్పించబడతాను అని నా నమ్మకం! కారణం
ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటున్నాను! మరి నీకు అటువంటి నమ్మకం
అటువంటి అనుభవం ఉందా?
ఒకవేళ విడువబడితే- ప్రియమైన వారలారా! ఆ శ్రమలను అనుభవించలేరు కాబట్టి ముందుగానే
సిద్దపడమని ప్రభువుప్రేమను బట్టి మనవిచేస్తున్నాను!
హా ! ఎప్పుడో జరిగేదాని
కోసం ఇప్పుడెందుకు అనుకుంటున్నావా? లేక మా భారతదేశంలో అలాంటి
శ్రమలు లేవు రావు అనుకుంటున్నావా? శ్రమలు అనగా క్రీస్తునామము
కోసరమైన శ్రమలు ప్రపంచంలో ఆరంభమయ్యాయి! తలనుండి మొండెం ఒక్కవేటుతో
వేరుచేయబడుతుంది! బ్రతికుండగానే క్రైస్తవ విశ్వాసులను కాల్చివేస్తున్నారు
అనగా సజీవ దహనం చేస్తున్నారు! తుపాకితో కాల్చుతున్నారు!
నైజీరియా దాని ప్రక్కల దేశాలలో ఐసిస్ తీవ్రవాదులతో అక్కడున్న మతచాందసవాదులు
కలిసి తల్లిదండ్రులు చూస్తుండగానే తమ కుమార్తెలను బలత్కారము అనగా రేప్ చేసేస్తున్నారు!
భర్త ఎదురుగానే భార్యను బలాత్కారం చేస్తున్నారు, తల్లిదండ్రుల ఎదురుగానే పిల్లలను చంపుతున్నారు. క్రీస్తునామమును
వదులుతావా నీ పిల్లలను చంపమంటావా అని అడుగుతున్నారు! చర్చిలు
దహనమైపోతున్నాయి! అనేకులు భయంకరమైన హింసలు ప్రభువు నామము కోసం
అనుభవిస్తున్నారు! మన భారతదేశంలో కూడా విస్తారంగా జరుగుతున్నాయి.
మతచాందసవాదులు పోలీసుల సమక్షంలోనే చేస్తున్నారు ఇలాంటి పనులు మనదేశంలో!
అక్కడున్న ప్రభుత్వాలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు! ఇవన్నీ హింసలకు శ్రమలకు ఆరంభం మాత్రమే! ఇలాంటివి ఇంకా
జరుగబోతున్నాయి! జరుగుతాయి! ప్రియ దేవుని
బిడ్డా! క్రీస్తు నామముకోసం శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా
ఉన్నావా? నైనైతే హతస్సాక్షి కావడానికి సిద్ధంగా ఉన్నాను!
విడువబడే వారలారా! జాగ్రత్త! 666 ముద్ర రాబోతుంది! ఆ ముద్ర వేసుకుంటే నీకు పరలోక ప్రవేశం ఇక ఎప్పటికీ లేనట్లే! వేయించుకోకపోతే ఏమవుతుందో కొన్ని ఉదాహరణలు చెబుతాను! ముద్ర వేయించుకుంటావా రేషన్ కార్డు తీసేయ్యమంటావా అంటారు! ముద్ర వేసుకుంటావా లేకపోతే నీ ఉద్యోగం తీసేయ్యనా అంటారు! రిజర్వేషన్ కావాలా దేవుడు కావాలా అంటారు! రిజర్వేషన్
కావాలి అంటే ముద్ర వేసుకోవాలి! కాదు నా హక్కుల కోసం పోరాడుతాను అంటే ఆ రోజులలో అది కుదరదు! అంతా క్రీస్తువిరోది పాలనలో ప్రపంచం మొత్తం ఉంటుంది! ముద్ర వేసుకోకపోతే: ATM కి వెళ్తావు. అక్కడ నీకు డబ్బులు రావు. కారణం నీలో RFID చిప్ నీలో లేదు కాబట్టి నీ ATM కార్డు పనిచేయదు!
ముద్ర ఉంటే ATM కార్డుతో పనిలేదు! ఇప్పుడు నీవు కిరాణా షాపుకి వెళ్తావు. ముద్ర చూపించు
అప్పుడు రేషన్ ఇస్తాను అంటాడు వాడు! నీకు ముద్రలేదు! నీ డబ్బులు వాడు తీసుకోడు! ముద్ర ఉన్నవారికే రేషన్ ఇస్తాడు!
ఇప్పుడు నీకు నీ పిల్లలకు తినడానికి ఏమీ ఉండదు! నీ అకౌంట్ లో లక్షరూపాయలు ఉన్నాయి. గాని వాటిని నీవు
తీసుకోలేవు, ఖర్చు పెట్టుకోలేవు! నీవు ముద్ర
వేసుకోలేని కారణంగా నీ ఉద్యోగం పోయింది. నీ డబ్బు పోయింది ఇప్పుడు!
ఆకలితో అలమటించవలసినదే!
ఈలోగా ముద్ర లేనివారికి బహిరంగ మరణశిక్ష విధించడం
జరుగుతుంది! ఇప్పుడు అయితే నీవు ముద్ర వేసుకోవాలి! లేకపోతే ఎక్కడికో పారిపోవాలి! నీ దగ్గర డబ్బులు లేవు,
సరకులు లేవు! ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం
పరుగులెత్తాలి! ముద్రలేని వారిని పట్టిచ్చిన వారికీ గిఫ్టులు
కూడా ఇస్తాడు వాడు! ఆ గిఫ్టులు కోసం నీ సొంతవారే నీ స్నేహితులే
నిన్ను అప్పగిస్తారు! నీవు చూస్తుండగానే నీ పెద్ద కుమారున్ని
కర్రకు కట్టి AK47 గురిపెడతారు. దేవుణ్ణి
వదిలేస్తావా, ముద్ర వేయించుకుంటావా లేకపోతే నీ కొడుకుని చంపెయ్యమంటావా
అంటారు! నీ కొడుకు డాడీ అంటూ ఏడుస్తున్నాడు! ఏమి చేస్తావు నీవు! రక్షణను కాపాడుకొంటావా లేక నీ కొడుకుని
కాపాడుకుంటావా? నీ కొడుకు చనిపోయాక ఆ ప్లేస్ లో నీ భార్యను లేక
నీ కుమార్తెను నిలబెడతారు! మరలా అదే మాట! దేవుడు కావాలా ముద్ర కావాలా ? లేక నీ భార్య/ నీ కూతురు కావాలా?
అయ్యా నేను
మిమ్మల్ని భయపెట్టడానికి ఇది చెప్పడం లేదు! భవిష్యత్ లో జరుగబోయేది
ఇదే!
నీకు పరలోకం కావాలంటే ముద్ర వేసుకోకూడదు! ముద్రవేసుకుంటే పరలోక అవకాశం కోల్పోతావు! నీకు పరలోకానికి
ఒకేఒక అవకాశం—అది ఏమిటంటే వారి చేతులలో
చనిపోయి- పరలోకంలో ఉన్న బలిపీఠం క్రిందకు డైరెక్టుగా వెళ్ళిపోవడం
తప్ప మరో చాన్సు లేదు!
నాకైతే ఈ అనుభవం రాదు
అని నేను అనుకుంటాను! కారణం
నేను ఎత్తబడతాను అనే నమ్మకం నాకుంది! ఈ వాగ్ధానం అనగా ఈ
10వ వచనంలో లోకమంతటిమీదికి రాబోయే శ్రమలకాలం లో నేను నిన్ను తప్పించెదను
అనే వాగ్ధానం నా కోసమని నమ్ముతున్నాను! వాగ్దానాన్ని స్వతంత్రించుకొంటున్నాను!
అయ్యా! మీదన రాసిన శ్రమలన్నీ విడువబడిన వారికి
మాత్రమే! జయించిన వారికి ఈ బాధలేదు! ఎందుకంటే
దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేశారు!
మరినీకు అలాంటి అనుభవం
ఉందా?
ఎత్తబడే గుంపులో ఉంటున్నావా?
నీ బ్రతుకు దేవునితో
సమాధానం కలిగిఉందా?
ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధ పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా?
అయితే నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావు!
లేదా? అయితే మీదన వ్రాయబడిన శ్రమలకు సిద్దంగా
ఉండు!
బ్రతుకు మార్చుకో!
శ్రమలను తప్పించుకో!
ఎత్తబడు!
*ఫిలడెల్ఫియ సంఘము-4*
ప్రకటన 3:11—13
11. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు
నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు
నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును
వాని మీద వ్రాసెదను.
13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ఇక
పదకొండో వచనంలో ఒక హెచ్చరిక చేస్తున్నారు- అది ప్రేమతో చెబుతున్న హెచ్చరిక మాత్రమే- కోపంతో కాదు! ఇదిగో నేను త్వరగా వస్తున్నాను.
ఎవడును నీ కిరీటం అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటున్నారు!
మొదటిది: త్వరగా వస్తున్నాను.
రెండు: నీకు ఇప్పటికే కిరీటాలు
పొందుకున్నావు!
మూడు: దానిని దొంగిలించకుండా జాగ్రత్తగా
చూసుకో అంటున్నారు!
నేను
త్వరగా వస్తున్నాను అనే మాట ప్రకటన గ్రంధంలో చాలాసార్లు ఉంది. దీనికోసం గతంలో చూసుకున్నాము!
త్వరగా వస్తున్నాను అంటే రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్ధము!
ప్రకటన 1:1,౩
22:7,12,
20
మరిఆయన
రావడానికి సిద్ధంగా ఉన్నారు,
మరినీవు ఎత్తబడటానికి సిద్ధంగా, తయారుగా ఉన్నావా?
ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే ద్వారం మూయబడుతుంది. అప్పుడు నీవు బుద్ధిలేని పెండ్లికుమార్తెల వలే ఎన్నిసార్లు తలుపు తట్టినా నీకు
తలుపు తీయబడదు! సరికదా అక్రమము చేయువారలారా! నాయొద్ద నుండి తొలిగి పొండి అంటారు! అప్పుడు నీవు ఇప్పుడు
చెప్పినట్లే నీ నామమున ప్రవచించాను కదా, దయ్యాలు వెల్లగొట్టాను
కదా, క్రొత్త భాషలు మాట్లాడాను కదా, మందిరం
కట్టడానికి లక్షరూపాయలు ఇచ్చాను కదా అంటే నీవెవడవో నాకు తెలియదు బయటకు పో అంటారు దేవుడు!
ఇది సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారు నోట నుండి వచ్చిన ఉపమానమే.....
Matthew(మత్తయి
సువార్త) 25:1,2,3,4,5,6,7,8,9,10,11,12,13
1. పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని
ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.
2. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
3. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొనిపోలేదు.
4. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.
5. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి.
6. అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన
రండి అను కేక వినబడెను.
7. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని
8. బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని
బుద్ధిగలవారినడిగిరి.
9. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
10. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు
సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
11. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా,
అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
12. అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
13. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
కాబట్టి
సమయముండగానే పశ్చాత్తాప పడి సిద్దపడు!
ఇక రెండవది: ఎవడును నీ కిరీటమును అపహరించ కుండా అంటున్నారు.
అనగా ఈ సంఘానికి దేవుడు ఇప్పటికే వారి పరిపూర్ణత చూసి కిరీటాలు ఇచ్చేశారు
అన్నమాట! గతంలో క్రొత్త నిబంధన గ్రంధంలో దేవుడు ఏఏ కిరీటాలు ఇచ్చారో
చూసుకున్నాము!
ప్రకటన 2:10 లో మరియు యాకోబు 1:12 లో జీవ కిరీటం
1కొరింథీ
9:24—27 లో అక్షయ కిరీటం
2తిమోతి
4:8 లో నీతి కిరీటం
1పేతురు
5:4 లో వాడబారని మహిమ కిరీటం ఇలా ఎన్నో కిరీటాలు దేవుడు మనకోసం
సిద్దం చేశారు! వీటిలో ఏదో ఒక కిరీటం నమ్మకమైన విశ్వాసి ఇప్పటికే
పొందుకుని ఉంటాడు!
ఆ కిరీటమును మూడవదిగా
ఎవడును అపహరించకుండా జాగ్రత్తగా చూసుకో అంటున్నారు దేవుడు!
మరి ఈ కిరీటం ఎలాంటి
పరిస్తితులలో అపహరణకు గురి అవుతుంది అంటే: అజాగ్రత్తగా ఉంటే సాతాను గాడు దొంగదెబ్బ కొట్టేస్తాడు.
నిర్లక్ష్యంగా
ఉన్నా కొట్టుకుపోతాడు!
ఏదైనా చిన్న చిన్న
పొరపాట్లకు తావిస్తే నీమీద కంప్లైంట్ చేసి వాడు నీ కిరీటం నీకు కాకుండా చేస్తాడు!
ఇక లోకాశలు లేక
దురభిమాన పాపము, సుళువుగా
చిక్కులుపెట్టు పాపమును ప్రలోభపెట్టి నీ కిరీటం కొట్టుకుపోతాడు! కాబట్టి ప్రతీ విశ్వాసి జాగ్రత్తగా ఉంటూ అనుక్షణం తన కిరీటమును, తన రక్షణను, తన సాక్ష్యమును, పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకుపోవాలి!
*ఫిలడెల్ఫియ సంఘము-5*
ప్రకటన 3:12—13
12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు
నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును
వాని మీద వ్రాసెదను.
13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
ఇక 12వ వచనంలో జయించువాడు పొందుకునే భాగ్యములు
వ్రాయబడ్డాయి! గమనించాలి: పదో వచనంలో చెప్పబడినది
అనగా మహాశ్రమల కాలంలో నిన్ను తప్పిస్తాను అన్నది కూడా జయించువాడు పొందుకునే భాగ్యమే!
అయితే అది అనగా పదో వచనంలో ఉన్నది బోనస్! ఇది ఈ
సంఘానికి ఇచ్చే అసలైన బహుమతి అన్నమాట!
మొదటిది: జయించువానిని నా దేవుని
ఆలయములో ఒక స్తంభముగా చేసెదను! అందులోనుండి వాడు ఎప్పటికి వెలుపలికి
పోడు!
రెండు: నా దేవుని పేరును,
పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగిరాబోయే నూతన యేరూషలేము అను నా దేవుని
పట్టణం పేరును, నా క్రొత్తపేరును వానిమీద వ్రాసెదను అంటున్నారు!
అనగా మూడు పేరులు జయించువాని మీద వ్రాస్తాను అంటున్నారు!
మొదటది: జయించువానిని నా దేవుని
ఆలయములో ఒక స్తంభముగా చేసెదను అంటున్నారు. అందులోనుండి వాడు ఇక
ఎప్పటికీ వెలుపలికి పోడు అంటున్నారు!
దేవుని
ఆలయము ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంధం ప్రకారం పరలోకంలో ఉంది! ఆ పరలోకంలో గల
దేవాలయములో ఒక స్తంభముగా చేస్తాను అంటున్నారు! ఎంత ధన్యతో కధా!
అనగా పరలోక వాసులుగా చేస్తాను అనడమే కదా! ఇప్పుడు
దేవాలయమే పరలోకంలో ఉంటే, అందులో జయించువాడు స్తంభముగా ఉంటాడు
అంటే మరి విశ్వాసి పరలోకంలో ఉన్నట్లే కదా!
గమనించాలి: దేవుడు ఒక ఆధ్యాత్మిక ఆలయం
నిర్మిస్తున్నారు. దానిలో సార్వత్రిక సంఘములో గల ప్రతి నిజమైన
విశ్వాసి కూడా ఒక భాగంగా ఉన్నాడు.
ఎఫెసీ 2:19—22 , 1కొరింథీ ౩:17; 6:19 ప్రకారం....
Ephesians(ఎఫెసీయులకు)
2:19,20,21,22
19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో
ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.
20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద
మీరు కట్టబడియున్నారు.
21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
1కోరింథీయులకు 3: 17
ఎవడైనను
దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది;
మీరు ఆ ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .
1కోరింథీయులకు 6: 19
మీ
దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?
మీరు మీ సొత్తు కారు,
మరి ఇంతటి శ్రేష్టమైన ఆలయములో ఒక స్తంభముగా ఉండటం అనగా
ఈ ఆలయంలో ఒక స్థిరమైన నిత్యమైన స్థానంలో దేవుడు ఈ జయించిన వ్యక్తిని ఉంచుతాను అంటున్నారు! మన
దేహమే దేవుని దేవాలయం! ఎవడైతే ఈ దేవాలయమును పాడుచేయునో దేవుడు
వానిని పాడుచేయును అని పౌలుగారు చెబుతున్నారు! అయితే ఇక్కడ ఎవడైతే
ఈ దేవాలయమును బాగుగా చూసుకుంటాడో జయిస్తాడో వాడో పరలోకంలో గల నిజ దేవాలయములో ఒక ముఖ్యమైన
స్థానం కలిగి ఉంటాడు అన్నమాట! ఇప్పుడు ఈ దేహమనే దేవాలయమును బాగుగా
చూసుకుంటావో పాడుచేసుకుంటావో నీ ఇష్టం! దానిని చూసుకునే విధానం
బట్టి నీ గమ్యం ఆధారపడి ఉంది అని మరచిపోవద్దు!
ఒక్కసారి స్తంభముగా చేయబడితే ఇక వాడు అక్కడనుండి ఎప్పటికీ
తొలిగిపోడు అని వాగ్దానం కూడా చేస్తున్నారు ప్రభవు ఇక్కడ!
మరో విషయం నన్ను చెప్పనీయండి! బైబిల్
గ్రంధంలో స్త్రీలకూ ప్రత్యేకమైన పాత్ర ఉంది! ఎలాగో చెప్పనీయండి!
మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలే ఉన్నారు. అదే మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంభముల వలే ఉన్నారు! కీర్తన 144:12; పురుషులు మొక్కలు మాత్రమే! ఆ మొక్కలనుండి వచ్చిన మ్రానులతో
చెక్కిన మూల కంభములుగా అనగా మూల స్థంభములుగా దేవుడు చేశారు స్త్రీలను!
వివరంగా
చెబుతాను : సంఘములో స్త్రీల పాత్ర
ఎంతో విలువైనది ప్రశస్తమైనది! సంఘము బలపడాలి అన్నా స్త్రీలే!
సంఘము విడిపోవాలి అన్నా స్త్రీలే! సంఘము ఆధ్యాత్మికంగా
నిలబడాలన్నా స్త్రీలే ముఖ్యపాత్రను పోషిస్తారు! మన భారతదేశములో
గాని ఇతర దేశాలలో గాని మందిరాలకు గాని ఇతర దేవాలయాలకు వెళ్ళేవారు, భక్తిగలవారు స్త్రీలు మాత్రమే! సంఘముల లో స్త్రీలు పురుషులు హాజరు శాతం 80:20 ఉంటుంది నేటిదినాలలో!
అయితే సంఘములో స్త్రీలు భక్తిగలవారై, విశ్వాసము
గలవారై ప్రార్ధనాపరులు అయితే ఆ సంఘాలు ఎంతో బలపడుతూ ఆధ్యాత్మికంగా ముందుకు దూసుకుపోతున్నాయి! అదే సంఘములో స్త్రీలు కేవలం తమ బట్టలమీద, షోకుల మీద ఆసక్తిని
పెంచుకుంటూ, లోకము మీద లోకాశల మీద ఉంటే ఆ సంఘములు నామకార్ధ సంఘములుగా
కనిపిస్తున్నాయి! స్త్రీలారా! దేవుడు సార్వత్రిక
సంఘములో మిమ్మును ఒక మూల కంభముల వలే చేశారు! ఇప్పుడు సంఘమును
మీ ప్రార్ధనల ద్వారా, విశ్వాసము ద్వారా బలపరచవలసిన అవసరం ఎంతైనా
ఉంది!
స్త్రీలు
చేయవలసిన చేయగలిగిన ముఖ్యమైన భాద్యత మరొకటి ఉంది! అది మీ పిల్లలను భక్తిలో,
ప్రార్ధనలో, వాక్యములో పెంచడం!!! నేను చదివిన శ్రేష్టమైన మరియు భక్తుల జీవిత చరిత్రలు అన్నింటిలోను అందరి తల్లులు
ఎంతో భక్తిపరులు మరియు ప్రార్ధనాపరులు! మహా తల్లి దైవజనురాలైన
శ్రీమతి సూసన్న వెస్లీ గారు ఎప్పుడూ మోకాళ్లమీదనే ఉండేవారట! తమ
పిల్లలందరినీ దైవసేవకులుగా చేశారు ఆమె! దైవజనులైన జాన్ వెస్లీ
గారు, చార్లెస్ వెస్లీ గారు ఆమె పిల్లలే! ఇలా పేరుపొందిన మిషనరీలు గాని, దైవజనులు గాని వారి తల్లి
ప్రార్ధనాఫలము ద్వారా రక్షించబడిన వారే మరియు వారి తల్లుల దగ్గర వాక్యమును నేర్చుకుని,
గైకొని చివరికి దేవుని కొరకు ఘనులైన సైనికులుగా మారి దైవసేవకులుగా వెలుగొందారు!
దీనికోసం వారి తల్లులు తమ నిద్రను వదులుకుని, పిల్లలు
పడుకున్న తర్వాత వారి తలల దగ్గర కన్నీటితో ప్రార్ధన చేసేవారు! నేడు నీ పిల్లలు దైవసేవకులు కాకపోయినా విశ్వాసవీరులు, భక్తిపరులు మరియు దేశం కోసం భాద్యత గల వ్యక్తులుగా ఉండాలి అంటే ప్రియమైన తల్లులారా!
మీ పిల్లలను మొదటగా భక్తిలో పెంచండి! రెండు ప్రార్ధన
నేర్పండి! వాక్యం నేర్పండి! బైబిల్ చెబుతుంది
బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు
దాని నుండి తొలిగిపోడు! సామెతలు 22:6;
ఒకవేళ స్నేహితుల వలన తొలిగిపోయినా
ఒకరోజు విన్న వాక్యము తప్పకుండా పట్టుకుంటుంది. కారణం ఆయన వాక్యము
బలముగలదై సజీవమై రెండంచుల గల ఎటువంటి ఖడ్గముకంటే బలము కలది కాబట్టి ఒకరోజు పట్టుకుని
దేవుని సన్నిధికి తీసుకుని వస్తుంది! కాబట్టి నీవు నీ పిల్లలను
భక్తిలో పెంచితే వారు ఒకరోజు సంఘములో మూలస్తంభాలుగా ఉంటారు! ఒకరోజు
నీ పిల్లలు దైవసేవకులుగా, యూత్ లీడర్ గా, క్వయిర్ లీడర్ గా, సంఘపెద్దగా ఉంటారు! నీవు ఇప్పుడు అశ్రద్ద చేస్తే కొన్ని రోజుల తర్వాత వాడు త్రాగుబోతుగా,
నీ కూతురు తిరుగుబోతుగా, శీలాన్ని కోల్పోయిన వారుగా
, మరికొందరు హంతకులుగా మారిపోతారు! నీవే టీవీ సీరియల్లు
పిచ్చిలో పడి ప్రార్ధనను, వాక్యమును, విశ్వాసమును
వదిలేస్తే వారు మరీ బలాదూర్ గా బ్రతుకుతారు!
మరియమ్మ
గారు యేసుక్రీస్తు ప్రభులవారికి చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం నేర్పించారు. బాలుడైన సమూయేలుకి హన్నా
గారు వాక్యం నేర్పించారు. తిమోతి గారికి ఆయన తల్లి మరియు అమ్మమ్మ
వాక్యం నేర్పించి భక్తిలో పెంచారు. వారు పెద్దవారై ఎలా జీవించారో
బైబిల్ చెబుతుంది మనకు!
స్త్రీలారా! మీరు మూలకంభములు కాబట్టి
మీరు సంఘములో స్థంభములుగా నిలబడండి! సంఘాన్ని కట్టండి!
ఇంకా మీ పిల్లలను భక్తిలో పెంచి వారిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా
తయారు చెయ్యండి!
ఇక
రెండవది: జయించువానికి
మూడు పేర్లు రాస్తాను అంటున్నారు దేవుడు వానిమీద!
వానిమీద
పేర్లు వ్రాయడం ఏమిటి?
గమనించాలి: పూర్వకాలంలో తమ సేవకుల మీద,
బానిసల మీద తమ యజమానులు యజమాని యొక్క పేరు వ్రాసేవారు. సిరాతో కాదు, పర్మినెంట్ గా ఉండేలా చేసేవారు!
అప్పుడు ఈ వ్యక్తి తప్పిపోయినా, పారిపోయినా వారు
యజమాని యొక్క స్వాస్థ్యము గనుక తిరిగి తెచ్చుకోడానికి సౌలభ్యముగా ఇలా చేసేవారు!
ఇప్పుడు దేవుడు జయించువానిమీద నా మూడుపేరులు రాస్తాను అంటున్నారు!
అనగా ఇక ఈ వ్యక్తి ఎప్పటికీ పరలోక నివాసి అని సర్టిఫై చేస్తున్నట్లు
అన్నమాట!
మొదటి
పేరు: నా దేవుని
పేరు అనగా తండ్రియైన దేవుని పేరు!
ప్రకటన
గ్రంథం 14: 1
మరియు
నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను.
ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది
నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.
రెండవది: పరలోకం నుండి దిగివచ్చే
పరమ యెరూషలేము పేరు! దీనికోసం మనకు ప్రకటన 21వ అధ్యాయంలో విస్తారంగా వ్రాయబడింది. ఇందులో పరిశుద్దులే
మరియు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడ్డ వారు మాత్రమే ప్రవేశిస్తారు! ఆ పరమ యెరూషలేము పేరు వీనిమీద వ్రాస్తాను అంటున్నారు అనగా పరమ యెరూషలేములో
ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉంటాడు అని అర్ధం!
మూడు: నా క్రొత్తపేరు అనగా యేసుక్రీస్తుప్రభులవారి
క్రొత్తపేరు! అయితే ఆ పేరు ఏమిటో మనకు తెలియదు! ఇప్పడు మనకు తెలియని ఆశ్చర్యకరమైన లక్షణాలు కలిగి ఉండవచు బహుశా! ప్రకటన 19:12
ఆయన
నేత్రములు అగ్నిజ్వాల వంటివి,
ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక
నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
అయితే జయించువారు శాశ్వతంగా ఆయనకే చెందుతారు అన్నమాట!
మరియు ఆయనలాగే ఉంటారు అన్నమాట!
1యోహాను 3: 2
ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము.
మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
రోమా 8:29
ఎందుకనగా
తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
చివరగా
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు అనగా బుద్ధి ఉన్నవాడు వినును గాక!
ప్రియ సంఘమా! దేవుడు చెబుతున్న మాట వినగలుగుతున్నావా?
సిద్దపడే అనుభవం ఉందా? జయించు అనుభవం ఉందా?
మీదన చెప్పిన మేలులన్నీ జయించిన వారికీ మాత్రమే!
అట్టి కృప ధన్యత దేవుడు
మనకు మెండుగా దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*లవొదొకయ సంఘము-1*
ప్రకటన 3:14
లవొదికయలో
ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి
ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
మనం ఆరవ
సంఘమైన ఫిలడెల్ఫియ సంఘం కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక చివరిది
ఏడవ సంఘమైన లవొదొకయ సంఘము కోసం ధ్యానం చేసుకుందాం!
లవొదొకయ
అనగా: నులివెచ్చనిది. అనగా
చల్లగా నైన వెచ్చగానైన లేకుండా మధ్యస్తంగా ఉన్నది!
ప్రస్తుత
పేరు: ఎస్కిహిస్సార్
ఎక్కడుంది?
టర్కీ- సిరియా బోర్డర్ లో ఉంది. సిరియాకు చెందుతుంది.
ఎఫెసి పట్టణానికి
తూర్పుగా 150 కి.మీ దూరంలో, ఫిలడెల్ఫియ పట్టణానికి 80 కి.మీ ఆగ్నేయంగా ఉంది. ఈ ఎఫెసీ-
లవొదొకయ సంఘాల/పట్టణాలు మధ్యలో కొలస్సీ ఉంది!
చరిత్ర: సిరియాలోని
అంతియొక్కాస్ రాజులలో రెండో వాడు తన భార్యయైన లెవోడీస్ పేరుతొ ఈ పట్టణాన్ని కట్టించాడు.
ఈ పట్టణం చాలా ధనసమృద్ధి గలది. ఎలా ధనవంతమైనది
అంటే: మొదటగా ప్రపంచంలో బాంకింగ్ రంగము ఇక్కడనుండే బాగా అభివృద్ధి
చెందింది. కారణం ఆ కాలంలో అంతర్యుద్ధాలు వలన ప్రపంచమంతా అల్లకల్లోలంగా
ఉండేది. ఆ దేశాన్ని వీరు, ఈ దేశాన్ని వారు
యుద్ధం చేసి కొల్లగొట్టుకొనేవారు! ఇక దీనినుండి తమ ఆస్తులను భద్రం
చేసుకోడానికి ఇలాంటి పట్టణాలు కట్టి, కోట గోడలు కట్టి,
దానికి కాపలా ఉంచి, బ్యాంకులు మధ్యలో ఉంచేవారు!
అప్పుడు వారి ధనము భద్రముగా ఉండేది! అలాంటివాటిలో
ఈ లవొదొకయ ఎంతో పేరుగాంచింది. ఇక ఇక్కడ లభించే గొర్రె బొచ్చుతో
ఎరుపు నలుపు రంగులు గల అందమైన కంబళ్ళు తయారుచేసేవారు. ఈ రకంగా
వస్త్ర ఉత్పత్తిలో ముందుండేది ఈ పట్టణము! ఈ పట్టణంలో త్రిమిడ
అనే ప్రత్యేకమైన వస్త్రం తయారుచేసి అమ్మేవారు. పూర్వకాలంలో చైనా
జపాను రాజులు వాడే పట్టువస్త్రము లాంటిది అన్నమాట! ఎప్పుడు స్త్రీపురుషులు
రంగురంగుల బట్టలు వేసుకుంటూ ఉండేవారు ఈ పట్టణంలో!
ఇంకాఉంది: ఈ పట్టణము మెడికల్ గా ప్రసిద్ది చెందింది. ఇక్కడ కంట్లోను
చెవిలోను వేసే తైలము ఎంతో ప్రసిద్ది! అనగా ఈరోజులలో మన సుందరయ్యగారు
వేసే పసరుమందులాంటిది అన్నమాట! ఈ తైలముతో ఎటువంటి కంటి సమస్య
వచ్చినా ఈ తైలము వేసుకుంటే స్వస్తత కలిగేది! కాబట్టి విదేశీయులు
ఎక్కువగా వచ్చేవారు! ముఖ్యంగా సైనికులు కంటి గాయము లతో ఇక్కడికి
వచ్చి- అక్కడున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని బాగుపడి
వెళ్ళేవారు! ఈ రకంగా అన్నిరంగాలలో ముందంజ వేసి ధనవంతమైంది!
ఈ సంఘమును
ఎవరు స్థాపించారో సరిగా తెలియదు గాని పౌలుగారు ఎఫెసీ పట్టణంలో తురన్ను అనే పాటశాలలో
రెండున్నర సంవత్సారాలు ఉన్నప్పుడు అనేకులు పాటశాలకు వచ్చి రక్షణ పొంది వెళ్లారు. అలా వచ్చి రక్షణ పొందిన
ఎఫఫ్రా అనే వ్యక్తి తమ సొంత పట్టణమైన కొలస్సీ లో సంఘమును స్థాపించారు. దాదాపు అదే సమయములో కొందరు ఎఫెసీ తురన్ను పాటశాలలో రక్షణ పొంది లవొదొకయకు తిరిగివెళ్ళి
సంఘమును స్తాపించారు అంటారు! అయితే ఈ సంఘముతో పౌలుగారికి మరియు
యోహాను గారికి ఎంతో సంబంధం ఉంది! పౌలుగారు కొలస్సీ పత్రిక ను
వ్రాసిన సమయంలోనే లవొదొకయకు కూడా పత్రిక రాశారు. దానిని చదివించుకోండి
కొలస్సీలో కూడా, అలాగే కొలస్సీకి వ్రాసిన పత్రికను లవొదొకయలో
చదివించుకోండి అని కొలస్సీ పత్రికలో 4:16 లో కనిపిస్తుంది.
గాని దురదృష్టవశాత్తూ లవొదొకయకు వ్రాసిన పత్రిక మనకు దొరకలేదు!
చరిత్ర
ప్రకారం కొలస్సీ సంఘములో కలకలం రేగటానికి ఈ లవొదొకయ సంఘము కూడా ఒక కారణం! ఎందుకంటే ఈ లవొదొకయ సంఘము
వారు ధనవంతులు కదా, వీరు కొలస్సీకి వెళ్లి (కొలస్సీ కేవలం సుమారు 40 కి.మీ
దూరంలో ఉంది) మనిషి అన్నాక కళాపోషణ ఉండాలి! దేవుడు దేవుడే- మన ఎంటర్టైన్మెంట్ మనదే! కేవలం ఆరాధన సమయంలో భక్తిగా ఉంటే చాలు, మిగిలిన రోజులలో
మన ఆటపాటలు, నాటకాలు, గుర్రపుపందాలు లాంటివి
చేసుకోవచ్చు అంటూ వీరిని మోసగించారు!
సరే, దేవుడు గనుక పనికిమాలిన
సంఘాలకు ర్యాంకులు ఇస్తే సార్దీస్ సంఘానికి రెండో ర్యాంకు వస్తుంది అని గతంలో చెప్పుకున్నాము
కదా! మరి మొదటి ర్యాంకు ఎవరికి వస్తుంది అనే అనుమానం వస్తుంది
కదా! ఆ సంఘము మరేది కాదు! ఈ లవొదొకయ సంఘమే!
ధనముతో విర్రవీగి దేవుని దృష్టిలో గుడ్డివాడు గాను, దిగంబరి గాను పోల్చుకోబడి దేవునిచే థూ అని ఉమ్మివేయించుకున్న ఏకైక సంఘము!
అదే సమయంలో ఒరేయ్, నీ బ్రతుకు మార్చుకోరా,
మార్చుకుంటే నేను నీ ఇంటికి వచ్చి నీతో భోజనం చెయ్యాలని ఉందిరా అని దేవునిచే
బ్రతిమాలించుకున్న సంఘము కూడా ఇదే! ఈ సంఘాన్ని దేవుడు తిట్టినట్లుగా
మరి ఏ సంఘమును తిట్టలేదు! పేరుకు మాత్రము క్రైస్తవులు గాని బ్రతుకు
అన్యులకంటే హీనమైన స్థితిలో ఉన్న సంఘము లవొదొకయ!
ప్రియ దేవుని బిడ్డా! నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుడు ప్రతీ సంఘాన్ని ఎలా పరిశీలిస్తున్నారో అలాగే ప్రతీ విశ్వాసిని కూడా
పరిశీలిస్తున్నారు. నీ బ్రతుకు దేవుని ఎదుట బాగుందా? ఒక్కసారి పరిశీలన చేసుకో! బాగోలేకపోతే నీవు కూడా దేవునిచే
థూ అని ఉమ్మివేయించుకుంటావు జాగ్రత్త!
ఇప్పుడే మారుమనస్సు
పొందు!
దేవునితో సమాధాన పడు!
*లవొదొకయ సంఘము-2*
ఇక
ఈ సంఘముతో ప్రభువు తననుతాను చేసుకునే పరిచయం చూసుకుందాం:
*ఆమెన్ అనువాడును
*నమ్మకమైన
సత్యసాక్షియు
*దేవుని
సృష్టికి ఆదియు నైనవాడు
మొదటగా ఆమెన్
అనువాడును....
ఆమెన్
అనగా అలాగున జరుగును గాక లేక తధాస్తు అని అర్ధం! ఈ సంఘముతో ఆమెన్ అనువాడును అని తననుతాను పరిచయం
చేసుకుంటున్నారు అంటే నా కుమారుడా నీవు చేసే పనులన్నిటికీ నేను ఆమెన్ అంటున్నాను అని
కానేకాదు! ఆమెన్ అనే పదానికి నిజమైన అర్ధం విశ్వసనీయత,
సత్యము, నమ్మకత్వము! మరియు
చేసే నిశ్చయం! ఈ సంఘానికి దేవుడు ఆమెన్ అనువాడును అని పరిచయం
చేసుకోవడానికి దేవుడు తాను చెప్పినవి తప్పకుండా చేసేవాడినని కాబట్టి జాగ్రత్తపడమని
అర్ధం! అనగా తాను వాగ్దానం చేసినవి తప్పకుండా చేస్తాను అని చెప్పడమే
కాకుండా క్రింద చెప్పబోయే
విషయాలు తప్పకుండా చేస్తాను అనికూడా అర్ధము!
ప్రకటన 1:7 లో కూడా ఆమెన్ అను పదం వాడబడింది!
ప్రకటన
గ్రంథం 1: 7
ఇదిగో
ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
యెషయా 65:16 లో ఆమెన్ అనుమాటకు మనకు అసలు అర్ధం
కనిపిస్తుంది! ....
దేశములో
తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు
నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు
నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును.
ఇంకా పాత నిబంధనలో
దిన వృత్తా 16:36; నెహెమ్యా
8:6 లో కూడా వాడారు. ఇంకా ప్రకటన గ్రంధంలో పరలోకంలో
కూడా ఈ పదాన్ని వాడారు!
5:14; 7:12; 19:4; 22:21
ఇక్కడ ఆమెన్ అనువాడును
అనగా మన తెలుగులో నమ్మదగిన దేవుడు చెప్పే సంగతులు అని అర్ధంచేసుకోవచ్చు! హెబ్రీ లో ఆమెన్ అయి ఉన్న దేవుడు—అనగా దేవుడు తాను చెప్పినట్లు తప్పకుండా చేసేవాడు అని అర్ధం!
అంతేకాదు యేసుక్రీస్తుప్రభులవారు
మనమాటలు కూడా ఆమెన్ అనేలాగా ఉండాలని చెప్పారు...
మత్తయి 5: 37
మీ
మాట అవునంటే అవును,
కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి
(లేక-కీడునుండి) పుట్టునది.
యాకోబు 5: 12
నా
సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని గాని భూమి తోడని
గాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు
అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.
పౌలుగారు కూడా అలాగే చెప్పారు!
2కోరింథీయులకు 1: 18
దేవుడు
నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.
కాబట్టి మనము బొంకకుండా
నిజము చెబుతూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిన అవసరం ఉంది! నీమాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి
అని చెప్పారు!
నమ్మకమైన
సత్యసాక్షియు:
ప్రకటన
మొదటి అధ్యాయంలో దీనికోసం ధ్యానం చేసుకున్నాము! ఆయన నమ్మకమైన సాక్షి- అబద్దమాడే
దేవుడు కాదు! 1:5
తనకు తెలిసిన
చూసిన సంగతులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు మన దేవుడు! పరలోకంలో ఏది చూశారో,
ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో అన్ని చూసి చెబుతున్నారు
ఆయన! కారణం ఆయన మొదటివాడు కడపటివాడు! గతకాలంలో
ఉన్నారు, రాబోయే కాలంలో జరగబోయేవి ముందుగా చూసి చెప్పేవారు ఆయన!
ఇక ఆయన
నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెబుతున్నారు! ఆల్ఫా ఒమేగాను కూడా నేనే అని
ప్రకటన గ్రంధం మొదటినుండి చూస్తున్నాము!
ఇక
చివరిగా దేవుని సృష్టికి ఆదియునైనవాడు:
దీనిని
జాగ్రత్తగా పరిశీలించాలి! యేసు దేవుడు కాదు, దూత అనియు, ఆయన
కుమారుడు మాత్రమే అని చెప్పే దొంగలు అబద్ధికులు ఇది తప్పకుండా చదవాలి! దేవుని సృష్టికి ఆదియునైనవాడు!
దీని అర్ధము ప్రారంభంలో సృష్టింపబడిన వాడు కాదు! సమస్తమును తానే సృష్టించిన వాడు అనగా సృష్టికర్త అని అర్ధము! దేవుడు మాత్రమే సృష్టికర్త గాని మరెవరూ కాదు! యోహాను
సువార్త 1:2,3 వచనాలలో కలిగియున్న దేదియు ఆయనలేకుండా కలుగలేదు
అంటున్నారు...
John(యోహాను
సువార్త) 1:1,2,3,14
1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై యుండెను.
2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా
కలిగెను,
3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య
నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని (లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము
ఆయన మహిమను కనుగొంటిమి
ఇక కొలస్సీ పత్రికలో
మరింత వివరంగా రాస్తున్నారు ఎందుకంటే ఆయన వల్లనే ఈ సృష్టిలోని సమస్తము ఉనికిలోనికి
వచ్చాయి. ఆకాశములో ఉన్నవి గాని,
భూమిమీద ఉన్నవి గాని, మనకు కనబడేవి గాని,
మనకు కనబడనివి గాని అనగా అంతరిక్షములో గలవి, మనము
చూడలేని రహస్యలోకములు ఉదాహరణకు మృతుల లోకము లాంటివి, అంతేకాకుండా
రాబోయే సమస్తము, మరియు సింహాసనాలు అనగా రాజులు రాజ్యములు అధికారములు,
ప్రభుత్వాలు ఏవైనా, ప్రధానులైనా, అధికారులైనా సమస్తాన్ని దేవుడు ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా, ఆయనకోసం అనగా యేసుక్రీస్తుప్రభులవారికోసం సృజించడం జరిగింది అని స్పష్టముగా
చెబుతున్నారు! ఇంకా ముందుకుపోతే ఆయనే అన్నిటికీ పూర్వము ఉన్నవాడు,
అనగా అన్నిటికి ముందున్నవాడు, ఆయనలోనే సమస్తము
ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తున్నాయి! అనగా ఈ సృష్టి
మొత్తం ఇంత స్థిరంగా ఉంది అంటే ఆయన వలన ఆయనలోనే స్థిరగా నిలుస్తుంది అంటున్నారు!
Colossians(కొలొస్సయులకు) 1:14,15,16,17,18
14. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
15. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని,
అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను
ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను,
సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
17. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము
కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
ఇక హెబ్రీ పత్రికలో
ఇంకా చెబుతున్నారు ఆయన తన బల ప్రభావాలు గల వాక్కుచేత అన్నిటిని వహిస్తూ అన్నిటిని నిర్వహిస్తూ
ఉన్నారు....
హెబ్రీయులకు 1: 3
ఆయన
దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును)
ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యుండి, తన మహత్తుగల
మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము
తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె
అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
ఒక్క క్షణం ఆయన కళ్ళుమూసుకుంటే
ఈ సృష్టి అల్లకల్లలోము అయిపోతుంది. అలాకాకుండా నిర్వహిస్తున్నవాడు యేసుక్రీస్తుప్రభులవారు! సృష్టిలో ప్రతీది వాటివాటి క్రమము చొప్పున వాటి కార్యాలు నిర్వహించేలా చేస్తున్నది
యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే!
ఇదీ ఆయన గొప్పతనము! ఆయనే సృష్టికర్త! ఆయనే దేవుడు!
మరి ఇంత గొప్పదేవున్ని
అయిన నేను మీ మధ్యనుండగా లోకాశలతో మునిగిపోయేవు ఎందుకురా అని ప్రశ్నించడానికే దేవుడు
ఇలా తననుతాను పరిచయం చేసుకుంటున్నారు!
ఈరోజు మనలను కూడా
అడుగుతున్నారు—ఇంతటి గొప్పదేవున్ని కలిగిన నీవు ఆయనకు ఇవ్వాల్సిన
గౌరవం, ఆయనకు ఇవ్వాల్సిన భయము
ఆయనకు చెందవలసిన భక్తి ప్రార్ధన ఆరాధనలు ఆయనకు ఇస్తున్నావా?
కాబట్టి ఆయన నిజంగా
ఎవరో గుర్తెరిగి ఆయను పూజిద్దాం!
*లవొదొకయ సంఘము-3*
ప్రకటన 3:15—18
15. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను
లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు
గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
17. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై
యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను,
నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
18. నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను,
నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి
చెప్పుచున్నాను.
ఇక 15వ వచనం నుండి దేవుడ్ డైరెక్ట్
ఎటాక్ మొదలుపెడుతున్నారు. నీ క్రియలు నాకు తెలుసు! నీవు చల్లగానైనను వెచ్చగా నైనను లేవు! నీవు చల్లగానైనా
వెచ్చగానైనా ఉండాలి, గాని నీవు రెండింటికీ చెందక నులివెచ్చనగా
ఉన్నావురా! అందుకే నా నోటనుండి నిన్ను ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను...
ఛీ థూ .. అంటున్నారు ఈ సంఘపుదూతతో!
గమనించాలి: ఈ భాగపు భావము మొదటగా సంఘకాపరికి/పెద్దకు చెందుతుంది. తర్వాత ప్రతీ విశ్వాసికి కూడా చెందుతుంది!
సంఘకాపరితో అంటున్నారు దేవుడు ఒరేయ్
నీవు చల్లగానైనా లేవు, వెచ్చగా నైనా లేవు, నీవు చల్లగా గాని వెచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే నీవు చల్లగాకాకుండా
వెచ్చగా కాకుండా అటుఇటూ కాకుండా మధ్యస్తంగా ఉన్నావు రా! అదంటే
నాకు పడదు! అందుకే నానోటనుండి నిన్ను ఉమ్మేవేయనుద్దేశిస్తున్నాను
అంటున్నారు! ఎంత భయంకరమైన స్తితిలో ఉన్నదో ఈ సంఘము గమనించారా!!!
సంఘకాపరి అలాగే ఉన్నాడు! సంఘస్తులు అలాగే ఉన్నారు!
దొందూదొందూ ఏక్ హై! యధారాజ తదాప్రజః!!!
చల్లగానైనా
అంటే ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితి మరియు సువార్తకు లోబడని స్థితి! ఇంకా బహిరంగంగా ఆయన సువార్తను
ఆయనను వ్యతిరేఖించడం అన్నమాట చల్లగా ఉండటం అంటే!
వెచ్చగా
ఉండటం అంటే ఆయన సువార్తను నమ్మి అంగీకరించి ఆధ్యాత్మికంగా బలపడి శోధన వేదన రోదనలో భయపడకుండా
క్రీస్తుకోసం సాగిపోవడం! అందరికీ క్రీస్తే రక్షకుడు నిజమైన దేవుడు అని చాటిచెప్పే స్థితి! ఇంకా ఆత్మలో తీవ్రతకలిగి ఆత్మల పంటలో సాగడం, ఆత్మీయ ఫలాలు
ఫలించడం, ఆత్మపూర్ణుడు కావడం.
నులివెచ్చనగా
ఉండటం అంటే: క్రీస్తు
రక్షకుడు అని తెలుసు! ఆయనను పూజించాలి అని తెలుసు గాని లోకము
ఎంతో అందంగా లోకాశలు ఎంతో కమ్మగా ఇంపుగా సొంపుగా ఉన్నాయి! వ్యభిచారం
మానలేవు, త్రాగుడు మానలేవు, దొంగతనం అబద్దాలు
చెడు మానలేవు, చూడకుండా ఉండలేవు, టీవీ సీరియల్లు
సినిమాలు బూతు కధలు బూతుబొమ్మలు డబుల్ మీనింగ్ డైలాగులు వినకుండా ఉండలేని స్థితి!
అవి తప్పు అని తెలుసు గాని మానలేవు! ఇదే నులివెచ్చని
స్థితి!
ఇలాంటి
స్తితి అంటే నా దేవునికి పరమ అసహ్యం!
అందుకే
పౌలుగారు అంటున్నారు 2తిమోతి ౩:5 లో పైకి భక్తిగలవానివలె ఉంటారు గాని దాని
శక్తిని అనగా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించనివారు అంటున్నారు!
ఈ సంఘము
పైకి భక్తిపరులు! క్రైస్తవులు! గాని వారి బ్రతుకు అన్యులకంటే హీనమైన స్థితి
లో ఉన్నారు!
అయితే దేవుడు ఆశించే
భక్తి ఇది కాదు!
రోమా 12:11
ఆసక్తి
విషయములో మాంద్యులు కాక,
ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
1కొరింథీ 15:58
కాగా
నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు
కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.
యేసుక్రీస్తుప్రభులవారు
అంటున్నారు: దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి......
యోహాను 4: 23
అయితే
యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది;
అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు
అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; (మూలభాషలో- వెదుకుచున్నాడు).
యోహాను 4: 24
దేవుడు
ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
ఇంకా
మత్తయి 22:37—38..
37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన
ప్రభువును ప్రేమింపవలెననునదియే.
38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
ఇలాంటి భక్తిని దేవుడు
కోరుకుంటున్నారు గాని నులివెచ్చని భక్తిని దేవుడు కోరుకోవడం లేదు!
ఈరోజు మన
క్రైస్తవ సంఘాలు ఇదే స్థితిలో ఉన్నాయి! పేరుకు క్రైస్తవులు గాని బ్రతుకు దేవునికి దూరంగా ఉన్నాయి!
సినిమాలు మానడం లేదు, టీవీ సీరియల్లు మానడం లేదు!
మనిషి అన్నాక కళాపోషణ ఉండాలి కదా అంటున్నారు సిగ్గులేకుండా! అందుకే కదా పౌలుగారు కళాపోషణ అనేది సంగీతములతోను ఆత్మ సంభంధమైన కీర్తనలతోను
ఎల్లప్పుడూ దేవుని గూర్చి పాడుతూ ఉండమంటున్నారు!
కొలస్సీయులకు 3: 16
సంగీతములతోను
కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా
మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
ఈ డబుల్ మీనింగ్ కధలలోనే నీకు సంతోషమా??!! హృదయం నిండిన దానిని బట్టి పెదవులు మాట్లాడుతాయి!
నీ హృదయం నిండా చెడు, పాపము, లోకము లోకాశలు, కామ వికార చేష్టలు నిండిపోయాయి కాబట్టి
అలాంటి వాటిని చేస్తే దేవుడు తంతాడు కాబట్టి అలాంటివి చూసి ఆనందించాలి అనుకుంటున్నావు!
నీవు ఇంకా పూర్తిగా చావలేదు! సరిగా బాప్తిస్మం
పొందలేదు! నిజమైన మారుమనస్సు, నిజమైన పశ్చాత్తాపం
పొందలేదు! నీ బ్రతుకు మారలేదు! అందుకే క్రీస్తులో
సగం, మరివేరు గాను సగము! నీ జీవితమంతా సగముసగము
చెరి సగము! క్రీస్తులో సగము- లోకంలో/సైతానులో సగం!
అన్యాచారాలు మానడం లేదు, అన్యుల వలే మాట్లాడటం, అన్యుల వలే తినడం త్రాగడం మానడం
లేదు! కేవలం నీకు బొట్టు లేదు! విగ్రహారాధన
చెయ్యడం లేదు! గాని మిగతావి అన్ని అలాగే చేస్తున్నావు!
అన్యులవలె మెడలో తాళి, కాళ్ళకు మెట్టులు,
చేతిలో గాజులు, చెవికి ముక్కుకి నగలు! వారికీ నీకు తేడా ఏమిటి? శివునికి పార్వతికి నిదర్శనమైన తాళిబొట్టుని గుండెలమీద పెట్టుకుని ప్రభువా
ప్రభువా పరిశుద్ధుడా స్తోత్రములు తండ్రి అంటే నీ స్తుతులు దేవుడు అంగీకరిస్తారా?
హైందవ విగ్రహారాధన నుండి వచ్చిన నీ మెడలో నగలు, చెవిలో నగలు, ఉంగరం, కాళ్ళకు మెట్టులు
వేసుకుంటూ నేను విగ్రహారాధన చెయ్యడం లేదు అంటున్నావు, మరి నీ
శరీరం మొత్తం విగ్రహాలు నిండిపోయాయి కదా! అన్యులు వారు దేవుణ్ణి
ఎరుగని వారు గనుక బయట విగ్ర్రహాలు, ఒంటిమీద విగ్రహాలు పెట్టుకుంటారు.
మరి నీవు ఎందుకు వేసుకుంటున్నావు? అన్యులు సినిమాలు
సీరియల్లు చూస్తున్నారు నీవు చూస్తున్నావు! వారికి నీకు తేడా
ఏమిటి? వారుకూడా భయంకరమైన వస్త్రధారణ చేస్తున్నారు. మీరు కూడా అలాంటి వస్త్రధారణ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే
అన్యులకంటే హీనంగా భయంకరంగా వస్త్రధారణ చేస్తున్నారు. టైట్ బట్టలు
వేసుకుని శరీర సౌష్టవం మొత్తం కనిపించే విధంగా, ఇంకా కొందరు వీపు
అంతా కనిపించే జాకెట్లు వేసుకుని అన్యులకంటే ఎక్కువగా భయంకరమైన షోకులు చేస్తున్నారు!
వారికీ మీకు తేడా ఏమిటి?
మీరు మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి అంటే రక్షణ పొందారు
గాని మూర్ఖులైన ఈ తరమువారు చేసే పనులు మాత్రము మానడం లేదు! వారినుండి
మీరు ప్రత్యేకముగా ఉండండి అని బైబిల్ చెబితే ఎందుకు ప్రత్యేకముగా ఉండలేక పోతున్నావు!
ఇది నులివెచ్చని స్థితి కాదా!
దేనికీ చెందని వాడవు నీవు! అందుకే దేవుడు థూ నీ బ్రతుకు, ఎందుకురా నీ జన్మ అంటున్నారు!
ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అనగా ఇక వారు పశ్చాతాప
పడకపోతే వారితో దేవునికి మరి ఏవిధమైన సంబంధం ఉండదు అన్నమాట! వారు ఎన్ని సభలు పెట్టుకున్నా, ఎన్ని రకాలైన ఆరాధన క్రమములు
పాటించినా, ఆచారాలు జరిగించినా క్రీస్తుయేసు దృష్టిలో వారు సంఘము
కానేకాదు! క్రీస్తులేని సంఘముగా ఆ సంఘము ఉంటుంది అన్నమాట!
మరి నీకు ఎవరు కావాలి? క్రీస్తు కావాలా? లోకము కావాలా? క్రీస్తు కావాలంటే ఇవన్నీ వదిలేయ్! లోకము కావాలంటే అన్నీ
చేసేయ్! వాటి ఫలితం మాత్రం అగ్ని ఆరదు, పురుగు చావదు అటువంటి చోటను దేవుడు నిన్ను పెట్టబోతున్నారు!
నేడే నిర్ణయం తీసుకో! క్రీస్తు కావాలంటే నీ త్రాగుడు మానేయ్! నీ అబద్దాలు మానేయ్!
నీ బ్రతుకు మార్చుకో! నీ సినిమాలు సీరియల్లు మానేయ్!
నీ మెడలో ఉన్న తాళి అనగా శివపార్వతుల ప్రతిబింబాలైనా తాళి /విగ్రహం ఇప్పుడే తీసిపారెయ్! నీమీద ఉన్న అన్యవిగ్రహారాధన
నుండి వచ్చిన విగ్రహాలైన నగలు అన్నీ తీసిపారెయ్! నీ మనస్సులో
ఉన్న పాప కోరికలు, కామవికార చేష్టలు కోరికలు, మనస్సులో కోపము సంశయము, అతిశయము, గర్వము, గలతీ పత్రిక 5లో చెప్పిన
శరీర ఆశలు తీసిపారెయ్! ఇటువంటివి చేసేవారిమీద దేవుని ఉగ్రత వస్తుంది
మరియు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు అని అక్కడే వ్రాయబడింది!
దానిక్రిందనే వ్రాయబడిన ఆత్మఫలము పొందుకో! ప్రేమ సంతోషం విశ్వాసము ఆశానిగ్రహము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము సమాధానము
పొందుకో! అవి నిన్ను పరలోకం తీసుకొని పోతాయి!
అయ్యా అమ్మా! దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డలా ఉండు!
అన్యుల వలే ఉండకు! అన్యాచారాలు చెయ్యకు!
వాటికి భారతీయ సాంప్రదాయము అనే పేరుపెట్టి నిన్ను నీవు మోసగించుకోకు!
దేవునికోసం జీవించు! నీ చూపులు మార్చుకో!
నీ తలంపులు మార్చుకో! నీ బ్రతుకు మార్చుకో!
లేకపోతే దేవుడు నిన్ను ఉమ్మివేస్తాను అంటున్నారు!
ఇలా వ్రాయడం మీలో
అనేకులకు ఇబ్బంది కష్టము కలిగించి ఉంటుంది.
నామీద కోపం కూడా వచ్చి ఉంటుంది. మీకు కష్టము కలిగించి
ఉంటే క్షమించండి గాని నిజాలు ఇలాగే నిష్టూరంగానే ఉంటాయి! నేను
ఇలానే రాస్తాను! కారణం దేవుడు ఖండించి గద్దించి బుద్ధిచెప్పమన్నారు
కాబట్టి నేను ఇలాగే రాస్తాను, ఇలాగే బోధిస్తాను! మీరంతా మార్పునొంది పరలోకం పోవాలని నాకోరిక! దేవుని ఎదుట
శుద్ధమైన సువర్ణము వలే మీరు కనబడాలి! మీలో మచ్చగాని కళంకం గాని
లేకుండా, మీ ఘటములకు ఇహలోక మాలిన్యము అంటకుండా పరిశుద్దులుగా
నిలబెట్టాలి అనే కోరికతో ఇలా రాస్తున్నాను గాని మీరు నిజంగా వ్యభిచారులు దొంగలు అనడం
లేదు!
కాబట్టి మన బ్రతుకులు
మార్చుకొందాం!
దేవుని కోసం జీవిద్దాం!
పరలోకం చేరుకొందాం!
*లవొదొకయ సంఘము-4*
ఇక 17వ వచనంలో మరొక రకమైన గడ్డిపెడుతున్నారు
దేవుడు: నీవంటున్నావు: నేను ధనవంతుడను,
ధనవృద్ధి చేసుకొన్నాను, నాకేమియు కొదువలేదు అంటున్నావు
గాని ఒరేయ్ నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, ఇంకా దరిద్రుడవురా, గ్రుడ్డివాడవురా ఇంకా దిగంబరివిరా
పనికిమాలినవాడా అంటున్నారు!
ఈ లవొదొకయ
పట్టణస్తులు, సంఘము మరియు సంఘకాపరి మాకు బోలెడు డబ్బు ఉంది! మా సంఘ
నిధిలో ఇన్ని కోట్లు ఉన్నాయి! మా సంఘం ధనవంతమైన సంఘము!
మా సంఘములో సెంట్రలైజ్డ్ AC ఉంది. మా సంఘములో అందరూ AC కార్లులోనే వస్తారు. అందుకే మా సంఘానికి పెద్ద కారు పార్కింగ్ ఉంది! ఇలాంటి
ఢంభాలు కొట్టుకుంటున్నారు ఈ సంఘము నేటిరోజుల వలే! గాని దేవుడు
అంటున్నారు ఒరేయ్- మీరు దౌర్భాగ్యులురా, దిక్కులేని వారు- దిక్కుమాలిన వారు, దరిద్రులు గ్రుడ్డివారు, దిగంబరులు అనగా మీ ఒంటిమీద నూలుపోగు
లేదురా పనికిమాలిన వారలారా అంటున్నారు! ఎందుకు ఇలా అంటున్నారు
అంటే మొదటగా వారు ధనముతో కళ్ళుమూసుకుపోయి- దేవుడు నిజంగా ఎవరో
గుర్తించకుండా ఆత్మతోను సత్యముతోను ఆరాధన చెయ్యకుండా వారికి అనుకూలమైన రీతులలో ఆరాధన
చేసుకుంటూ, అనుకూలమైన బోధలు వింటూ దేవుణ్ణి దూరంగా పెట్టారు కాబట్టి
మొదటగా వారు తమ యొక్క రక్షణను కోల్పోయారు. రక్షణ అనే వస్త్రమును
కోల్పోయి బట్టలులేకుండా దిగంబరులుగా తిరిగుతున్నారు! ఇలా బట్టలులేని
స్థితిలో లోకానికి ప్రధానులకు అధికారులుకు దేవదూతలకు వేడుకగా ఉన్నారు. Only
Wisemen can see, Fools cannot see it అనే కధలో చెప్పినట్లు ఉంది వీరి పరిస్థితి! రక్షణను ఎప్పుడో
కోల్పోయారు! ఈ సంఘ పరిచయం చెప్పినప్పుడు వీరు ఎంతో ధనవంతులనియు ఇక్కడ రంగురంగుల
బట్టలు దొరుకుతాయి. వాటిని అమ్మేవారు అని చెప్పుకున్నాము!
వీరు బయటకు రంగురంగుల బట్టలు వేసుకున్నా ఆత్మీయంగా వీరి వస్త్రాలను కోల్పోయారు!
ఇంకా
వీరి దృష్టి అంతా లోకము మీద లోకాశలమీద ఉంది కాబట్టి ఆత్మీయ నేత్రాలు కోల్పోయారు! నేటిరోజులలో కూడా అనేకులు
దృష్టి వాక్యము మీద దేవుని సంబంధమైన విషయాల మీద కాకుండా లోకము మీద, సినిమాలు సీరియల్లు, జబర్ధస్తులు డబుల్ మీనింగ్ డైలాగుల
మీద, ఫేస్బుక్ వాట్సప్ లో వచ్చే పనికిమాలిన విషయాల మీదనే ఉంది
కాబట్టి వీరి ఆత్మీయనేత్రాలు కోల్పోయారు! అందుకే మీరు గ్రుడ్డివారు
అంటున్నారు దేవుడు!
మీ
ధనము మీద ఆధారపడుతున్నారు గాని దేవునిమీద ఆధారపడటం లేదు. ఒకనాడు ఎఫ్రాయిము వారు కూడా
అలాగే తమ ధనము మీద ఆదారపడి ఒకరోజు దాస్యములోనికి పోయారు. హోషేయ
12:8.
లూకా 18:11—12
లో కూడా ధనవంతుడైన పరిసయ్యుడు అలాగే ప్రార్ధించాడు. వేషధారిగా మిగిలిపోయాడు! సుంకరి గుండెలు బాదుకుంటూ ప్రభువా
నేను పాపిని, నన్ను క్షమించు అంటూ నిజాన్ని ఒప్పుకుని పాపవిముక్తి
పొందుకుని పోయాడు! ఈరోజు
నీ ధనము మీద కాదు ఆధారపడవలసినది! దేవునిమీద!
నేటిరోజులలో
సంఘాలు వారికున్న చర్చి బిల్డింగ్ లు, కారులు మేడలు చూసి సంతోషపడుతున్నారు గాని సంఘము నిజమైన
ఆధ్యాతిక స్థితి కలిగి అధ్యాత్మికంగా ధనవంతులుగా ఉన్నారా? వరాలు
ఫలాలు కలిగి ఉన్నారా అనేవి ఆలోచించడం లేదు! అన్యులకు ఈయుగపుదేవత
గ్రుడ్డితనము కలుగజేసిన విధముగా సంఘాలను కూడా ఈ యుగసంభందమైన దేవత గ్రుడ్డితనము కలుగజేసి
సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడకుండా చేస్తూ లోకము చూసినట్లు లోకము ఆలోచించినట్లు ఆలోచింపచేస్తుంది!
సంఘమా! జాగ్రత్త!
ఈరోజు
సంఘకాపరి ఖరీదైన సూటుబూటు వేసుకోడానికి తన డాబు దర్పము చూపించడానికి సిద్దపడుతున్నారు
గాని తన యొక్క నిజమైన ఆధ్యాత్మిక ధననిధి నుండి పరిపూర్ణమైన వాక్యాన్ని ఆత్మపూర్వకంగా
చెప్పడానికి సిద్ధపడటం లేదు!
సంఘము కూడా ఖరీదైన బట్టలు, ఖరీదైన కారులు కోసం
ప్రాకులాడుతున్నారు గాని పరలోకంలో వారికోసం ధనము కూర్చుకోడానికి సిద్దపడటం లేదు!
వెలగల వస్త్రాలు, బంగారు నగలు పెట్టుకోవద్దు అంటే
సంఘకాపరి మీరు రాజులరాజు ప్రభువుల ప్రభువు యొక్క కుమారకుమార్తెలు కాబట్టి వెలగల వస్త్రాలు
ధరించుకోవాలి అని చెబుతున్నారు. ఇది వాక్య విరుద్ధం కాదా!
అన్నింటిలో తగ్గించుకుని మాదిరిగా ఉండమని చెబితే నాయకులు ఆడంభారానికి
పోయి, సంఘమును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు! ఇది మంచిది కాదు!
సరే, దేవుడు ఏమంటున్నారో
18వ వచనంలో చూసుకుందాం! నీవు ధనవంతుడివి కావాలంటే
మొదటగా పుటము వేయబడిన బంగారం నా దగ్గర కొనుక్కో! నిజంగా నీవు
ధనము సంపాదించుకోవలసినది ఇక్కడ కాదురా! అక్కడ అనగా పరలోకంలో!
అక్కడ ధనము సంపాదించుకోవాలంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారము – అనగా శ్రమలు శోధనలు అనే పరీక్షలలో నిలిచి తగ్గింపు
స్వభావము, విశ్వాసము నిరీక్షణ లాంటివి సంపాదించుకో అంటున్నారు.
2కొరింథీ 8:9 లో అంటున్నారు ఆయన ధనవంతుడై ఉండి,
మనకోసం దరిద్రుడు అయ్యాడు. తద్వారా మనలను ధనవంతులుగా
చేశారు. నీవు ఆధ్యాత్మికంగా ధనవంతుడవు కావాలి తప్ప భూలోకంలో ధనవంతుడవు
అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు అంటున్నారు!
బైబిల్
లో బంగారం-నిజమైన
ఆధ్యాత్మిక ధనానికి సూచనగా ఉంది!
ఇక
నీ దిసమొల కనిపించకుండా తెల్లని దుస్తులు నా దగ్గర కొనుక్కో అంటున్నారు! ఈ తెల్లని దుస్తులు పరలోకమంతా
కనిపిస్తాయి! అవి ఏమిటో కాదు- పరిశుద్దుల
నీతిక్రియలు అని చెబుతుంది....
ప్రకటన
గ్రంథం 19: 8
మరియు
ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
తెల్లనిబట్టలు
నీతి మరియు న్యాయమునకు సూచన! పరిశుద్ధమైన జీవితమునకు సూచన!
యెషయా 61: 10
శృంగారమైనపాగా
ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను
ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు
కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
ఇక నీకు కళ్ళు
బాగా కనిపించేలా కళ్ళకు కాటుక నా దగ్గర కొనుక్కో అంటున్నారు! తెలుగులో కాటుక అని తర్జుమా చేసినా నిజంగా
దాని అర్ధం ఏమిటంటే నీ కళ్ళు బాగా కనబడేలా నా దగ్గర కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో!
నీవు కళ్ళకు తైలము అమ్మి డబ్బులు సంపాదిస్తున్నావు కదా! అయితే నీవు ఆధ్యాత్మికంగా కళ్ళు లేని వాడవు కాబట్టి నా దగ్గర నుండి కళ్ళకు
మందు కొనుక్కో అంటున్నారు. అనగా ఆత్మను సంపాదించి ఆత్మానుసారంగా
నడుచుకో! తద్వారా నీవు ఇక భూలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా
ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టి పరలోకం చేరగలవు అంటున్నారు! ఆధ్యాత్మిక విషయాలు అనగా ఆత్మఫలము మరియు ఆత్మసంబంధమైన వరాలు ఫలాలు అన్నమాట!
ఈరోజు ఈమాట దేవుడు
నీతోను నాతోను అంటున్నారు- మీరు ఈలోక సంబంధమైన విషయాలు మీద కాదు పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టిపెట్టండి!
పోగుట్టుకున్న ఆధ్యాత్మిక దృష్టి మరలా సంపాదించుకొండి అంటున్నారు!
మరి సంపాదించుకుందామా?
దేవునితో ఛీ అనిపించుకుందామా?
లేక దేవునితో భళానమ్మకమైన
మంచిదాసుడా అని పించుకుందామా?
ఆలోచించుకోండి!
*లవొదొకయ సంఘము-5*
ప్రకటన 3:19—20
19. నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి
మారుమనస్సు పొందుము.
20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను
నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో
నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
ఇక 19వ వచనం నుండి దేవుని ప్రేమ పొంగి పొరలుతుంది.
చూద్దాం!
నేను
ప్రేమించువారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మరుమనస్సు
పొందుము అంటున్నారు!
ఇంతవరకు నీవు దౌర్భాగ్యుడవురా దిక్కుమాలిన వాడవురా, నీవు దిగంబరివిరా గ్రుడ్దోడివిరా,
నా నోటనుండి నిన్ను ఉమ్మివేస్తానురా అని చీవాట్లు పెట్టిన దేవుడు
ఇప్పుడు ఎంతో కరుణ చూపిస్తున్నారు! ఇంతవరకు ఈ భాష ఎందుకు వాడారో
అసలు విషయం చెబుతున్నారు ఇక్కడ! నేను ప్రేమించిన వారినందరినీ
గద్ధిస్తున్నాను, ఎందుకు గద్దిస్తున్నారు అంటే వారు దారి తప్పినప్పుడు
మరలా సరియైన దారిలోనికి తీసుకుని రావడానికి గద్దించి అవసరమైతే శిక్షిస్తున్నాను.
అందుకే నిన్ను గద్దించాను! కాబట్టి నీవు మారుమనస్సు
పొందురా అంటున్నారు దేవుడు!
ఇంతా నా నోటనుండి నిన్ను ఉమ్మివేస్తాను
అన్న దేవుడు అంటున్నారు: ఒరేయ్ నీవంటే నాకు పిచ్చి ప్రేమరా!
నీ ఇంటికి వచ్చి నీతో కలసి భోజనం చెయ్యాలని ఉందిరా నాకు! అలా చెయ్యాలంటే నీవు మారుమనస్సు పొందాలి!
కారణం పాపుల దగ్గర నేనుండలేనురా! నేను పరిశుద్దుడ్ని!
నీవు దయచేసి మారుమనస్సు పొందరా అంటూ దేవుడు కన్నతండ్రి- ప్రేమించిన ముద్దుల కొడుకుని తండ్రి బ్రతిమాలినట్లు బ్రతిమిలాడుతున్నారు దేవుడు!
చూశారా
దేవునికి నీవంటే ఎంత ప్రేమో! ఇంత పనికిమాలిన స్తితిలో, భయంకరమైన,
పాపపు బ్రతుకులో ఉన్నా మారుమనస్సు పొందడానికి మరో అవకాశం ఇచ్చి బ్రతిమిలాడుతున్నారు
దేవుడు! దేవునికి మానవులంటే పిచ్చిప్రేమ!! ఎంతగా ప్రేమించారు అంటే ఆదాము చేసిన పాపమువలన మనిషి చనిపోవాలి! దేవునితో ఉండే సాన్నిహిత్యం కోల్పోయాడు మనిషి! గాని దేవుడు
మనిషిని ప్రేమిస్తూ మారుమనస్సు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు! ధర్మశాస్త్రం, బలులు లాంటివి ఏర్పాటుచేశారు. గాని మనిషి మారలేదు! చివరకు పాపముల కోసం మనిషి చనిపోవలసి
వచ్చింది! ఇక దేవుడు ఉండలేక మనిషి చనిపోవలసిన స్థానంలో తానే బలికావడానికి,
తన ఏకైక కుమారున్ని లోకానికి పంపించి మన బదులు తానే చనిపోయారు!
సిలువమరణం పొందునంతగా తననుతాను రిక్తునిగా చేసుకుని ఘోరమైన బలియాగం అయ్యారు
దేవుడు! అంత ప్రేమ మనిషి మీద దేవుడుకి!
చల్లనిపూట ప్రతీరోజు దేవుడు ఏదేను
తోటకు వచ్చి ఆదాము హవ్వలతో బహుశా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారేమో!
గాని తినవద్దన్న ఫలము తిని ఆ అవకాశం కోల్పోయాడు మానవుడు! మరలా అదే విధంగా ఉండాలని రక్షణ ప్రణాళిక సిద్ధము చేసి నిన్ను రక్షిస్తే ఎందుకు
పాపపు పనులవైపు లోకమువైపు సాతాను వైపు మరలుతున్నావు! నిన్ను రక్షించడానికి
ఆయన వెల చెల్లించారు! ఆ వెల ఆయన ప్రాణము! వెండిబంగారువంటి వెలగల వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తముతో
మీరు విడిపించబడ్డారు అని మర్చిపోవద్దు అంటున్నారు పేతురు గారు! ఈ విషయం మనము కూడా ఎప్పుడో మర్చిపోకూడదు!
అందుకే
తిరిగి తనదారిలోనికి తీసుకుని రావడానికి దేవుడు నిన్ను శిక్షిస్తున్నారు! తండ్రి తన కుమారున్ని శిక్షించి
మంచిదారిలో నడిపిస్తారో, మంచి బుద్ధులు నేర్పించి ప్రయోజకున్ని
చేస్తాడో అలాగే పరమతండ్రి కూడా మనము దారితప్పినప్పుడు ఒకదెబ్బ కొట్టి, శిక్షించి మరలా దారిలోనికి నడిపిస్తున్నారు! ఎందుకు అంటే
ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు!
గమనించ
వలసిన విషయం ఏమిటంటే:
ఈ సంఘపు నులివెచ్చని స్థితి దేవునికి అసహ్యం కలిగించినా వీరంటే దేవునికి
అసహ్యము లేదు, ఆయన బాధపడి ఆయన ప్రేమగల హృదయంతో ఆలోచించి బాగుపడటానికి
మారుమనస్సు పొందటానికి మరో అవకాశం ఇస్తున్నారు ఇక్కడ!
దీనికోసం
హెబ్రీ పత్రికలో వివరంగా రాస్తున్నారు పౌలుగారు!
12:5—11
5. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము
ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
6. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును
అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
7. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా
మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
8. కుమాళ్లయిన వారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు
పొందని యెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు
తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
10. వారు కొన్ని దినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము
తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.
11. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు.
అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
ఎందుకు
దేవుడు ఇలా శిక్షిస్తున్నారు అంటే 1కొరింథీ 11:32 లో అంటున్నారు
ఆ విమర్శ దినమందు నీకు శిక్షావిధి కలుగకుండా చేయడానికి మనలను దేవుడు శిక్షించి సరిదిద్దుతున్నారు....
1కోరింథీయులకు 11: 32
మనము
తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.
సామెతలు
౩:11—12 ..
11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు
విసుకవద్దు.
12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని
గద్దించును.
మరి దేవుడు నిన్ను
ఇంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి నేడే నీ పాపపు జీవితాన్ని వదిలి పశ్చాత్తాపపడి ఆయన
దగ్గరకు వస్తావా? మారుమనస్సు
పొందుతావా??!!
ఇక 20వ వచనంలో అంటున్నారు ఇదిగో
నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను
లోపలి వచ్చి ఆ వ్యక్తితో కలిసి నేను భోజనం చేస్తాను అంటున్నారు.
ఇలా
అనడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి!
మొదటిది: దేవుడు జెంటిల్ మేన్!
ఆయన మర్యాదస్తుడు! ఎవరింటిలోకి ఎప్పుడు పడితే అప్పుడు
ఎలా పడితే అలా వెళ్ళిపోరు, అందుకే తలుపు తడుతున్నారు!
మే ఐ కమిన్? లోపలి రావచ్చా అని అడుగుతున్నారు.
మరి
ఆయనకు తలుపు తీస్తావా? తీస్తే నీ ఇంట్లోకి వచ్చి నీతో సంభాషణ చేస్తూ నీతో కలిసి భోజనం చేస్తాను అంటున్నారు!
మరి ఈ ఆఫర్ తీసుకుంటావా లేక తిరస్కరిస్తావా?
రెండవకారణం
ఏమిటంటే: ఈ సంఘము
దేవుణ్ణి ఎప్పుడో చర్చి నుండి బయటకు వెల్లగొట్టింది అన్నమాట!
ఒరేయ్ నేను
లోపలి రావాలి అనుకుంటున్నాను. నేను మీ మధ్య లేనురా! బయట ఉన్నాను! మీరంతా మీ సొంత డబ్బాల గోలతో ఉన్నారు గాని నా స్వరము వినడం లేదు! నా స్వరమును వినండి రా, తలుపు తీయండి. మీ హృదయమనే తలుపులు తీయండి. నేను లోపలి వస్తాను అంటున్నారు
దేవుడు!
చివరికి నిన్ను నన్ను చేసిన దేవుడు
నీ హృదయం లోనికి రావడానికి నీ తలుపు తట్టవలసి వచ్చింది! నిన్ను
పర్మిషన్ అడగవలసి వచ్చింది! ఇంత దౌర్భాగ్యమైన అవిశ్వాస స్తితిలో
ఈ సంఘము ఉంది!
అందుకే 2కొరింథీ
13:5 లో పౌలుగారు అంటున్నారు: మీరు విశ్వాసము గలవారై
ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి....
మరి నీవు పరీక్షించు
కుంటావా?
చిన్నప్ప్దుడు
ఒక కధ చదివాను. ఒక
వ్యక్తి దేవునిపట్ల ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వెళ్లాలని అనుకున్నాడట!
అక్కడ కనబడిన పెద్ద మందిరానికి వెళ్లి ఆ కాపరితో అయ్యా దేవుడంటే నాకు
ఇష్టము. నేను మీ మందిరానికి రావచ్చా అని అడిగాడట! ఆ సంఘము డబ్బున్న సంఘము! AC కార్లు, సెంట్రలైజ్డ్ AC సంఘము! వీడేమో
పేదవాడు! అందుకు ఆ కాపరి- బాబు దేవుడు మాట్లాడే
దేవుడు! నీవు ప్రార్ధించు- ప్రభువా ఏ మందిరానికి
వెళ్ళాలో చూపించు అని అడుగు! దేవుడు తప్పకుండా మాట్లాడతారు అన్నారట
ఆ కాపరి! రెండు నెలలు తర్వాత సంతలో ఈ విశ్వాసి కనబడ్డాడట ఆ కాపరికి!
ఏమయ్యా కనబడటం మానేసావు! దేవుణ్ణి అడిగావా?
ఆయన జవాబు ఇచ్చాడా అని అడిగితే: ఆ రాత్రే దేవుడు
నాకు జవాబు ఇచ్చారు అన్నాడు! ఏమని చెప్పాడు దేవుడు అంటే:
ఓరి వెఱ్రిబాగులోడా! ఆ మందిరానికి వెళ్తావా?
దేవుణ్ణి అయిన నాకే ఆ మందిరంలో ప్రవేశం లేదు! నన్ను
బయటకు గెంటేసి 150 సంవత్సారాలు అయ్యింది. అప్పటినుండి నన్ను లోపలి రానిస్తారేమో అని నేనే ఎదురుచూస్తున్నాను.
నిన్ను రానిస్తారా? అదిగో వీది చివర నున్న ఆ కమ్మలపాక
మందిరానికి వెళ్ళు! అక్కడ నేను కూడా ఉంటాను అన్నారట! నేటిరోజులలో అనేక సంఘాలు దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి వారి సొంత ఆరాధనలు సొంత
బోధలతో నిండిపోయాయి గాని నిజమైన ఆరాధన- ఆత్మతో సత్యముతో ఆరాధనలు
కనబడటంలేదు. ఆలాంటి వారికోసం దేవుడు వెతుకుతున్నారు!
నేడు నిన్ను కూడా
తలుపు తట్టుతున్నారు దేవుడు!
మరి ఆయనకు తలుపు తీస్తావా?
అలా చేస్తే నీతో కలసి
సంభాషించాలని, నీతో కలసి భోజనం
చెయ్యాలని నీతో సమయం గడపాలని దేవుడు ఆశిస్తున్నారు. మరి నీవు
తలుపు తీస్తావా?
*లవొదొకయ సంఘము-6*
ప్రకటన 3:21—22
21. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని
నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
22. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
ప్రియులారా! ఇక 21వ వచనంలో జయించువాడు పొందుకునే భాగ్యము కోసం రాస్తున్నారు:
నేను
జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చునియున్నానో అలాగే జయించువాడు నాతోకూడా
నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అంటున్నారు!
ఎంత
ధన్యతో కదా! దేవునితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే అవకాశం- జయించువానికి
దేవుడు ఇవ్వబోతున్నారు! చూశారా ఇంత పనికిమాలిన సంఘానికి కూడా
దేవుడు మరో అవకాశం ఇచ్చి, ఎవడైనా మారుమనస్సు పొంది, తిరిగి దేవునితో సమాధానపడి
పాపమును శోధనను సాతానుని జయిస్తే వానికి దేవుడు ఎంత భాగ్యమునిస్తున్నారో!!!
ఈ సంఘానికే
దేవుడు చెప్పారు- నీతో నేను భోజనం చేస్తాను. మరోసారి మరో ఆఫర్ ఇస్తున్నారు:
ఎవడైతే జయిస్తాడో వాడు –
నేను ఇప్పుడు ఎలా నా తండ్రితోపాటు ఆయన సింహాసనం మీద కలిసి కూర్చున్నానో
అలాగే జయించువాడు నా సింహాసనం మీద నాతోపాటు కూర్చుంటాడు అంటున్నారు!
ఒక్కసారి
ఆగి పరిశీలన చేస్తే ఇప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో- తండ్రితో కూడా ఉన్నారు!
ఎలా
ఉన్నారు అంటే రెండు కోణములు మనకు కనిపిస్తాయి:
ఈ వచనంలో
తండ్రితోపాటుగా ఆయన సింహాసనం మీద కూర్చున్నారు!
పౌలుగారు
రాస్తున్నారు: మనకొరకు విజ్ఞాపనం చేస్తున్నారు....
రోమీయులకు 8: 34
శిక్ష
విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము
కూడ చేయువాడును ఆయనే
అనగా ఈ రెండు కలిసి చూసుకుంటే—బహుశా
తండ్రిప్రక్కన కూర్చుని- తండ్రి భుజము మీద తలవాల్చుకుని-
మనలో ఎవరైనా ఒకవేళ కొంచెం దారితప్పితే తండ్రీ ప్లీజ్ ఒక్క చాన్సు ఇవ్వు.
వాడు చాలా మంచోడు, ఎందుకో గాని ఈ తప్పుచేశాడు.
నేను వాక్యం ద్వారా గాని, మరో రూపంలో వాడికి నచ్చజెపుతాను
వాడు తప్పకుండా వింటాడు మార్పుచెందుతాడు. మరో అవకాశం ఇవ్వండి
అంటూ తండ్రిని మారాము చేస్తూ మన పక్షంగా తండ్రిదగ్గర విజ్ఞాపనం చేస్తున్నారు కుమారుడైన
యేసుక్రీస్తుప్రభులవారు!!
అందుకే మనం తప్పులు చేసినా వెంటనే శిక్ష
రాకుండా- చిన్న బుద్ధిచెప్పి సరిచేస్తున్నారు తప్ప- మనలను రక్షణనుండి దూరం చెయ్యడం లేదు! నరకమునకు మరణమునకు
సాతానుకు అప్పగించడం లేదు!
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే: ఈ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు ఏ సింహాసనం మీద కూర్చున్నారు? తండ్రితోపాటుగా తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు గాని ఆయనయొక్క అనగా కుమారుని
యొక్క సింహాసనం మీద ఇంకా కూర్చుండలేదు! కుమారునికి కూడా సింహాసనం
ఉంది! గాని ఇంకా కూర్చుండలేదు!
ఎప్పుడు
కూర్చుంటారు అంటే: సాతానుని జయించాక రెండవరాకడ అనంతరం- ఈ లోకమును ఈ లోకరాజ్యము
మన ప్రభువు రాజ్యము నాయెను – ఇది జరగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే గోగుమాగోగు యుద్ధం తర్వాత- వెయ్యేండ్లపాలనలో! అప్పుడు ఆయనకు ప్రత్యేకముగా ఒక సింహాసనం
ఉంటుంది. ఆ సింహాసనం ప్రక్కన మరిన్ని సింహాసనాలు ఉంటాయి!
అప్పుడు జయించిన వారందరి కొరకు ఒక్కొక్క సింహాసనం ఉంటుంది ప్రకటన
20:4 ప్రకారం!
ప్రకటన
గ్రంథం 20: 4
అంతట
సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని,
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము
శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై,
వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.
వారితోపాటుగా
పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు మరియు మహాశ్రమల కాలంలో హతస్సాక్షులైన వారు కూడా
పునరుత్థానం చెంది వారితోపాటుగా సింహాసనముల మీద కూర్చుంటారు!
ఇదే
ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు వాగ్దానం చేస్తున్నారు!
అయితే
ఆయన ముందుగా తాను జయించారు.
సేవను ప్రారంభించకముందే సాతాను శోధన జయించారు! మత్తయి
4వ అధ్యాయం!
సిలువలో- మరియు మరణించిన తర్వాత మరణమును,
పాపమును సాతానుని జయించారు.
హెబ్రీ 2:17
కావున
ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల
ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు
కావలసివచ్చెను.
హెబ్రీయులకు 4: 15
మన
ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే
శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
హెబ్రీయులకు 12: 2
మనముకూడ
ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు
కర్తయు (మూలభాషలో- సేనాధిపతియు)
దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన
యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన
ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి,
దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
ప్రకటన 5:5
ఆ
పెద్దలలో ఒకడు ఏడువకుము;
ఇదిగో దావీదుకు చిగురైన (లేక, వేరైన) యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును
విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
మనము కూడా ఆయనలాగే
జయజీవితం జీవించాలి- సాతానుని,
లోకమును, లోకాశలను అన్నిటిని జయించాలి!
అప్పుడే ఈ సింహాసనం మీద కూర్చోడానికి ఆయనతో పాటు పరిపాలించడానికి తీర్పు
తీర్చడానికి అర్హత సాధించగలవు!
దేవుడు
మనలను రాజులైన యాజకులుగా చేశారు!..
1పేతురు 2: 9
అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురముచేయు నిమిత్తము,
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
ప్రకటన 5:10
మా
దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని
క్రొత్తపాట పాడుదురు.
(గతంలో చెప్పిన విధంగా ఇంగ్లీష్ లోను, మరిన్ని ప్రతులలో
మా దేవునికి రాజులుగాను యాజకులు గాను చేసితివి అని ఉంది)
2తిమోతి 2:12
సహించిన
వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
ప్రకటన 2:27
అతడు
ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;
మత్తయి 19: 28
యేసు
వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు (లేక,
పునఃస్థితిస్థాపనమందు) మనుష్యకుమారుడు తన మహిమగల
సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద
ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.
మత్తయి 25: 31
తన
మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద
ఆసీనుడై యుండును.
కాబట్టి ఆయన సింహాసనం
కావాలంటే జయజీవితం కావాలి! పరిశుద్ధ జీవితం కావాలి!
మరి అలా జీవిస్తావా ?!!
ఒకసారి
ఈ 2,3 అధ్యాయాలలో
తప్పులున్న ఐదు సంఘాలకు దేవుడు ఏమని హెచ్చరిస్తున్నారో జ్ఞాపకం చేసుకుందాం!
ఎఫెసి
సంఘానికి అంటున్నారు: నీవు ఏ స్థితిలో పడిపోతివో జ్ఞాపకం చేసుకుని మారుమనస్సు పొందు!
పెర్గమ
సంఘానికి అంటున్నారు: మారుమనస్సు పొందు లేకపోతే నేను నీతో యుద్ధం చేస్తాను!
తుయతైర
సంఘానికి అంటున్నారు: మారుమనస్సు పొందితేనే గాని మిమ్మల్ని బహుశ్రమలపాలు చేస్తాను!
సార్దీస్
సంఘముతో: నీవేలాగు
ఉపదేశం పొందావో, ఎలాగు విన్నావో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొను!
ఇంకా జాగరూకుడవై ఉండు, చావనైయున్న మిగిలిన వాటిని
బలపరచు! ఏ గడియను వస్తానో నీకు తెలియనే తెలియదు!
ఈ లవొదొకయ
సంఘముతో అంటున్నారు: నీవు ధనవృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా దగ్గర కొనుక్కో,
నీ దిసమొల కనబడకుండునట్లు తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో!
నీ ఆత్మనేత్రాలు వెలిగించబడి దృష్టి కలగాలంటే నా దగ్గర కళ్లమందు కొనుక్కో
అని బుద్ధిచెబుతున్నారు!
ఈ మాటలు
అన్ని సంఘాలకు చెందుతాయి! ప్రతీ విశ్వాసికి, ప్రతీ సంఘకాపరికి/ నాయకునికి/సేవకునికి చెందుతాయి!
మరి
ఆత్మ సంఘములతో చెబుతున్న మాట ప్రియ సహోదరి సహోదరుడా! వింటావా? ఆత్మ సంఘములతో
చెబుతున్న మాట ప్రియ సంఘములారా! వింటారా?!!
అయితే
మీరు దేవునితో కూడా రాజ్యము చేయగలరు!
లేదా
అగ్ని ఆరదు పురుగు చావదు పండ్లు పటపట కొరుకుచుందురు!!!
ఎక్కడ? నరకంలో!
సమయముండగానే
పశ్చాత్తాప పడి ఆయనతో సమాధాన పడదాం!
రాకడకు
సిద్దపడుదాం!
ఎత్తబడదాం!
ఆయనతో
పాటు ఏలుదాం!!
ఆమెన్!
ఆమెన్!
ఆమెన్!
దైవాశీస్సులు!
*3—4 అధ్యాయాల మధ్య జరిగే సంభవాలు-1*
ప్రకటన 4:1
ఈ
సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను.
మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని.
ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని
నీకు కనుపరచెదననెను.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!
ఇంతవరకు మనము యోహాను గారి దర్శనము మరియు ఏడు సంఘాలకు యేసుక్రీస్తుప్రభులవారు
పంపిన లేఖలు కోసం ధ్యానం చేసుకున్నాము!
ప్రియులారా! 4:1 లో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా
పరలోకమందు ఒక తలుపు తెరువబడింది. నీవు ఇక్కడికి ఎక్కిరా ఇకమీదట
జరుగబోయేవి నీకు చూపిస్తాను అనే స్వరాన్ని విన్నారు యోహాను గారు!
ఇక్కడ తలుపు అనగా
ఇది మర్మాలను తెలియజేస్తుంది. అనగా ఇంతవరకు మర్మముగా మరుగుగా ఉన్నాయి. ఇప్పుడు దానిని
దేవుడు ప్రత్యక్షపరుస్తున్నారు అన్నమాట!
సరే, దీనికోసం ఆలోచించే ముందుగా మనము తెలుసుకోవలసిన
విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి!
మొదటిది: గతంలో చెప్పిన విధంగా యోహాను
గారికి ఈ ప్రకటన గ్రంధం యొక్క దర్శనము ఒకేసారి కలుగలేదు! ముక్కలుముక్కలుగా లేక పార్టులు పార్టులుగా
కలిగాయి!
మొదటి
అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు మొదటి దర్శనం!
4 మరియు 5 మరో దర్శనం!
6—11 వరకు మరో దర్శనం—ఏడేండ్ల శ్రమలకాలం యూదుల కోణం నుండి,
12—19 వరకు మరో దర్శనం—ఏడేండ్ల శ్రమల కాలం సంఘపుకోణం నుండి
20—22 మరో దర్శనం .
ఇలా
కలిగాయి అంటారు! దీనితో నేను ఏకీభవిస్తున్నాను! కాబట్టి ఇంతవరకు మొదటి
దర్శనం కోసం ధ్యానం చేశాము!
ఇక రెండవది: మూడో అధ్యాయానికి- నాలుగో అధ్యాయానికి మధ్య చాలా సంగతులు లేక సంభవాలు జరుగుతాయి/ జరగాలి! అప్పుడే మనకు నాలుగో అధ్యాయం నుండి చివరి వరకు
జరుగబోయే సంభవాలు జరుగుతాయి! ఈ క్రింద చెప్పిన సంఘటనలు జరుగకుండా
నాలుగో అధ్యాయం నుండి జరుగబోయే సంభవాలు జరుగవు! ఇది తప్పకుండ
ప్రతీ ఒక్కరు గమనించాలి!
మరోమాట: ఇప్పటినుండి మీరు చదివే
ప్రతీ విషయం – నేను బైబిల్ నుండి నేర్చుకున్నవి-
నాకు అర్ధమైనవి మాత్రమే నేను రాస్తున్నాను! ఇలాగే
జరుగుతాయి అని నేను చెప్పడం లేదు! ఒకవేళ ఇలాగే జరుగుతుంది అని
ఎవరైనా బల్లగుద్ది చెప్పితే నా ఉద్దేశం ప్రకారం ఆ వ్యక్తి అబద్ధికుడు! కాబట్టి నాఉద్దేశ్యం మాత్రమే నేను రాస్తున్నాను- వీటితో
మీరు ఏకీభవిస్తే ఏకీభవించవచ్చు- లేకపోతే మానెయ్యవచ్చు!
జరుగబోయే సంభవాలు:
మొదటగా
సంఘము ఎత్తబడాలి: అయితే సంఘము ఎత్తబడాలి లేదా ఆయన రహస్య రాకడ జరగాలి అంటే ఏమేమి సంభవించాలో గతంలో
రాకడగుర్తులు లో చెప్పడం జరిగింది.
1. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1—28 వ వచనం వరకు యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినవి
రాకడగుర్తులు మొత్తం
నెరవేరాలి!
అబద్దక్రీస్తులు
వస్తున్నారు, వస్తారు, యుద్దములు కరువులు కలుగుతున్నాయి, కలుగుతాయి,
క్రైస్తవ
విశ్వాసులు ప్రజలందరితో ద్వేషించబడి శోధన పాలు అవుతున్నారు- అవుతారు.
అనేకమైన
అబద్దబోదలు వచ్చాయి- వస్తాయి,
అనేకుల
ప్రేమ చల్లారిపోతుంది; సర్వలోకంలో సువార్త ప్రకటించ బడుతుంది, ప్రకటించ బడాలి!
2. ఇక ఇశ్రాయేలు ప్రజలకు జరుగబోయే సంభవాలు కూడా జరగాలి! అనగా చెదిరిపోయిన యూదులు మొత్తం మరలా ఇశ్రాయేలు దేశం రావాలి! ఆ ప్రక్రియ ఎప్పుడో మొదలయ్యింది గాని ఇంకా పూర్తికాలేదు! యెరూషలేములో దేవాలయం కట్టబడాలి!
కట్టబడకుండా ఎన్నో ఆటంకాలున్నాయి. ప్రస్తుతం యేరూషలేము
దేవాలయం కట్టవలసిన స్థలంలో డోమ్ రాక్ అనే మసీదు ఉంది. దానిని
తీసివేసి యెహోవా దేవుని ఆలయం కట్టబడాలి! అలాచేస్తే మూడవ ప్రపంచయుద్ధం
వస్తుంది! ఇంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు ఏడు దేశాలతో ఒకేసారి యుద్ధము
చేసి గెలిచారు! ఈసారి కనీసం సుమారుగా 45 దేశాలయినా ఈ యుద్ధంలో పాల్గొనవచ్చు అని అంచనా! కాబట్టి
ఈ అన్ని దేశాలతోను ఒకేసారి యుద్ధము చేసే టెక్నాలజీ వారు అభివృద్ధి చేస్తున్నారు.
బహుశా సిద్దమై ఉండవచ్చు!
అంతేకాకుండా మూడురోజులలో మందిర నిర్మాణం
పూర్తి చెయ్యడానికి టెక్నాలజీ సిద్ధం చేసి ఉంచారు అని విన్నాను! కాబట్టి మందిరం నిర్మాణం జరగాలి. అక్కడ బల్యరణ జరగాలి!
బల్యర్పణ జరగాలి అంటే మొదటగా ఎర్రని పెయ్యి దొరకాలి. ఒకసారి దొరికినా దానిమీద కొన్ని తెల్లని వెంట్రుకలు ఉన్నందున నిరాకరించబడింది.
ఇక కలాల్ పాత్రలు దొరకాలి. పాత బెసలేలు నిర్మించిన
బలిపీఠం మందసం దొరకాలి! ఇవి దొరికాయి అంటున్నారు కొందరు!
యేసుక్రీస్తుప్రభులవారు కార్చిన రక్తం, ఆయన చనిపోయాక భూకంపం వలన గొల్గొతా కొండకు పగులు
ఏర్పడి ఈ రక్తము బెసలేలు గారు చేసిన బలిపీఠం మీద పడింది అనిచెబుతారు. అనగా గొల్గొతా కొండ గుహలో ఇది దొరికింది అంటున్నారు.
*3—4 అధ్యాయాల మధ్య జరిగే సంభవాలు-2*
౩. ఇవన్నీ జరిగాక క్రీస్తు
విరోధి బయలుపరచ బడాలి!- వాడు బయలు పరచ బడాలి అంటే
మొదటగా
సంఘం ఎత్తబడాలి!
రెండవదిగా
పరిశుద్దాత్ముడు ఎత్తబడాలి!
ఎందుకు పరిశుద్ధాత్ముడు ఎత్తబడటానికి క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి
లింకు ఏమిటి అనే అనుమానం వస్తే: ఒకసారి మనం 2థెస్స 2:3—8 వరకు చదివితే అర్ధమవుతుంది
మనకు!
3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు)
పాపపురుషుడు (ధర్మవిరుద్ధ పురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే
హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు,
దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ
నియ్యకుడి.
5. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
6. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.
7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.
8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత
వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
౩వ వచనంలో
మొదట బ్రష్టత్వం కలగాలి! అనగా లోకములోను మరియు క్రైస్తవ సంఘంలో బ్రష్టత్వం కలగాలి! వాడు ఏది దేవుడనబడునో ఏది పూజించబడుతుందో దానిని ఎదిరిస్తాడు. ఇది రహస్యరాకడ తర్వాత జరుగుతుంది. 6వ వచనంలో వాడు తనకాలమందు
బయలుపరచబడతాడు అని చెబుతూ—వానిని అడ్డగించునది ఏదో మీకు తెలుసు
అంటున్నారు! వానిని
అనగా క్రీస్తువిరోధిని- నాశనపుత్రున్ని అడ్డగించేది పరిశుద్దాత్ముడు
అని మనం థెస్సలోనికయుల పత్రికలు ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాము! 7వ వచనంలో వాడు ఇప్పటికే వచ్చి క్రియచేస్తున్నాడు,
ఇంకా బయలుపరచపడాలని తెగ ఉబలాటపడుతున్నాడు గాని అడ్డగించుచున్నవాడు తీసివేయబడువరకు
వాడు రాడు అని చెప్పబడింది!
కాబట్టి
ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమిమీద ఉండి వాడిని ఎదిరిస్తున్నారు! ఎందుకంటే రక్షణ పొందవలసిన వారి
సంఖ్య ఇంకా పూర్తికాలేదు! ఆ సంఖ్య పూర్తికాబడిన వెంటనే సంఘము
ఎత్తబడుతుంది మరియు పరిశుద్దాత్ముడు ఎత్తబడతాడు! అందుకే ప్రకటన
22:17 లో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు అని వ్రాయబడింది.
పరిశుద్దాత్ముడు ఎప్పుడు సంఘము ఎత్తబడుతుందా ఎప్పుడు నేను తిరిగి పరలోకం
పోవాలా అని ఎదురుచూస్తున్నాడు! యేసుక్రీస్తు ప్రభులవారి మరణ పునరుత్థాన
అనంతరం పెంతుకోస్తు పండగ నాడు భూమిమీదికి వచ్చిన పరిశుద్దాత్ముడు ఇంకా మనమధ్యనే సంచారం
చేస్తున్నారు! తన కార్యం చేస్తున్నారు. అదే సమయంలో క్రీస్తువిరోధిని రాకుండా అడ్డగిస్తున్నారు!
ఎప్పుడైతే
సంఘము మరియు పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడో వెంటనే క్రీస్తు విరోధి బయలుపరచబడి వాడు రంగంలోకి
దిగి వాడి కార్యము మొదలుపెడతాడు!
గమనించాలి: వాడి రాకడకు అనగా క్రీస్తువిరోది
రాకడకు పనులు ఎప్పుడో మొదలుపెట్టాడు! న్యూ వరల్డ్ ఆర్డర్ అంటూ
పనులు మొదలవుతున్నాయి. ఒకే ప్రపంచం- ఒకే
మతం- ఒకే గుర్తింపు కార్డు! పనులు మొదలయ్యాయి!
ఒకే మతానికి నాంది ఎప్పుడో మొదలయ్యింది. నైజీరియాలో
1980లో మొదలయిన క్రిస్లాం మతం ఆగిపోయి, మరలా ఇప్పుడు
పుంజుకుంటుంది. క్రిస్లాం అనగా క్రిస్తియన్లు మరియు ఇస్లామీ మతస్తులు!
మొత్తం అంతా ఒక్కటే! శాంతి శాంతి అంటూ అందరూ ఒకేమతం
లో ఉండి ఒకే దేవుడ్ని పూజించాలి అంటున్నారు! దీనికి పోప్ ఎంతో
ప్రయత్నం చేస్తున్నాడు! దేవుడొక్కడే అంటూ! మరికొందరు పోయిన సంవత్సరం అనగా 2021 లో అబ్రహామీ అనే
మరో మతాన్ని తీసుకుని వచ్చారు! అబ్రహామీ అనగా అబ్రాహాము సంతానం!
యూదులు అంటున్నారు- మేము అబ్రాహాము సంతానం!
ముస్లిం లు అంటున్నారు మేము అబ్రాహాము సంతానం! క్రైస్తవులు అంటున్నారు మేము కూడా అబ్రాహాము సంతానం! అందుకే ఈ ముగ్గురు అబ్రాహాము సంతానం అంటున్నారు కాబట్టి అబ్రాహామీ అనే మతం
మొదలుపెట్టారు! ఇదంతా
క్రీస్తు విరోధి స్కెచ్! మన మోడీ గారు ఒకే దేశం- ఒకే కార్డు, అంటున్నారు. న్యూ వరల్డ్
ఆర్డర్ అంటున్నారు. తొందరలో ఒకే దేశం ఒకే మతం అంటారు!
దీనికి అనగా సాతాను గాడి స్కెచ్ కి ఎందఱో ఏజెంట్లు ఉన్నారు. బిల్ గేట్స్ కూడా సాతాను లేక క్రీస్తు విరోధి ఏజెంట్ అంటున్నారు! ఇది నమ్మాల్సివస్తుంది. కొన్నివేల కోట్లు ఖర్చుపెట్టి
RFID చిప్ డవలప్ చేయించాడు! అందుకోసం ఇంకా ఎన్నెన్నో
చేస్తున్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ అతనిలో ఎప్పటినుండో పనిచేస్తుంది.
ఈ RFID కొన్ని దేశాలలో మొదలైపోయింది. ఇది నుదిటిమీద గాని చేతిమీద గాని వేయించుకోవాలి! సరే, ఇవన్నీ
జరుగుతాయి సంఘము ఎత్తబడిన తర్వాత!
అయితే సంఘము ఎత్తబడినప్పుడు జరిగే కార్యక్రమాలు
ఇంకా ఉన్నాయి!
సంఘము ఎత్తబడక మునుపు 1థెస్స 4:16—17 ప్రకారం:
దేవుని బూర మ్రోగాలి. ఎవరు ఊదుతారు అంటే బహుశా మిఖాయెల్ దేవదూత ఈ బూర ఊదుతాడు! అప్పుడు
మొదటగా: వెంటనే క్రీస్తునందు
ఉండి మృతులైన వారు లేస్తారు! అనగా మృతుల యొక్క పునరుత్థానం జరుగుతుంది. కొందరు కేవలం క్రీస్తును నమ్ముకున్న
పరిశుద్దులే లేపబడతారు, పాత నిబంధన పరిశుద్ధులు లేపబడరు అంటారు.
నాకైతే వారు కూడా లేపబడతారు! ఎలాగో తర్వాత భాగంలో చెబుతాను. అయ్యా
ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే!
రెండు: వెంటనే పరదైసు
కాళీ అయిపోతుంది. వారు అంటారు పరదైసు రెండవరాకడ జరిగాక కాళీ అవుతుంది
అంటారు! నాకైతే పరదైసు కాళీ అవుతుంది అనిపిస్తుంది. ఎలాగో తర్వాత భాగంలో చెబుతాను!
మూడు: బ్రతికి ఉన్న
పరిశుద్ధులు ఎత్తబడతారు—దీనినే మనం సంఘం ఎత్తబడుట
అంటాము!!!
నాలుగు: యేసుక్రీస్తుప్రభులవారు
పాత నిబంధన పరిశుద్దులను క్రొత్త నిబంధన పరిశుద్ధులను పరదైసుని కాళీ చేసి మధ్యాకాశంలోకి
తీసుకుని వస్తారు. అప్పుడు బ్రతికి ఉన్న పరిశుద్ధులు మహిమ దేహములతో
క్రీస్తుని కలిసికొని మొత్తమందరూ మధ్యాకాశంలో పెండ్లివిందులో పాలుపొందుతారు!
ఐదు: అదే సమయంలో
భూమి మీద ఏడేండ్లు మహా శ్రమల కాలం ప్రారంభం అవుతుంది!
ఆరు: ప్రకటన
6:1 ప్రకారం ముద్రలు విప్పబడటం మొదలవుతుంది.
ఏడు: ఆమోసు
8:11—12 ప్రకారం, దానియేలు 9:26 ప్రకారం,
1పేతురు 10—13 ప్రకారం వాక్యము
పూర్తిగా భూమిమీద నుండి తీసివేయబడుతుంది.
ఎనిమిది: ఇశ్రాయేలు రక్షణ
ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అందుకు గాను ప్రకటన 11వ అధ్యాయం ప్రకారం ఇద్దరు సాక్షులు భూమిమీదకు పంపబడతారు!
తొమ్మిది: దానియేలు గ్రంధంలో 9వ అధ్యాయంలో వివరించబడిన దానియేలు
గారి డెబ్బై వారాలలో చివరి వారం అనగా డెబ్బైవ వారం మొదలవుతుంది.
*3—4 అధ్యాయాల మధ్య జరిగే సంభవాలు-3*
ప్రియులారా! మృతుల పునరుత్థాన విషయంలో నా ఉద్దేశం ఈ భాగంలో చెబుతాను! కొందరు మృతుల పునరుత్థాన విషయంలో వరుసల ప్రకారం పునరుత్థానం జరుగుతుంది అంటారు!
నేను కూడా నమ్ముతాను! కారణం పౌలుగారు ప్రతీవాడు
తమ వరుసలోనే పునరుత్థానం చెందుతారు అని వ్రాశారు.
1కోరింథీయులకు 15: 23
ప్రతివాడును
తన తన వరుసలోనే బ్రదికింపబడును;
ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు
ఆయనవారు బ్రదికింపబడుదురు.
మొదటి
పునరుత్థానం లో అయిదు వరుసలు ఉన్నాయి అంటారు!
మొదట
వరుసలో అనగా ప్రధమ ఫలం క్రీస్తే!
రెండవదిగా
దేవుని బూర మ్రోగిన వెంటనే క్రీస్తునందు ఉండి మృతులైన వారు లేస్తారు!
ఈవిషయంలో వారు అంటారు- కేవలం యేసుక్రీస్తు రక్తములో కడుగబడి బాప్తిస్మం పొందుకున్న వారు మాత్రమే లేస్తారు.
పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన హతస్సాక్షులు
మరియు సామాన్య హతస్సాక్షులు బహిరంగ రాకడలో వెయ్యేండ్ల పాలనకుముందు లేస్తారు అంటారు!
ఇది నాకు అభ్యంతరము గా ఉంది. నేను అంటాను వీరుకూడా
క్రీస్తులోకి వచ్చేశారు అంటాను. ఎలాగో క్రిందన వివరిస్తాను! కాబట్టి మృతుల పునరుత్థానం జరిగినప్పుడు
వీరు కూడా అనగా పాత నిబంధన పరిశుద్ధులు కూడా లేస్తారు అని నా ఉద్దేశ్యం!
ఒక్క
విషయమ చెప్పనీయండి: ఇది చెప్పడం ద్వారా వారిని తప్పుపట్టడం అనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇది రాసిన ఆ దైవజనులు ఎంతో ఆత్మపూర్ణులు, గొప్ప
అభిషక్తులు. వివాహాన్ని కూడా వదిలేసి దేవునికోసం జీవిస్తున్నవారు!
వారిని తప్పు పట్టేటంత ఆత్మాభిషేకం స్థాయి నాకులేదు! వారితో నేను ఎందుకు పనిచేయను! గాని ఈ విషయం వ్రాయడంలో
నా ఉద్దేశం ఏమిటంటే నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇలా అర్ధమయ్యింది. నా భావములు మాత్రమే నేను రాస్తున్నాను గాని వారిని తప్పుపట్టడం-నేను చెప్పింది నిజము అనడం అనేది నా ఉద్దేశం కానేకాదు!
సరే,
అదే రెండో వరుసలోనే జయించిన సంఘము ఎత్తబడుతుంది. మంచిది నేను కూడా నమ్ముతాను!
మూడవది: మహాశ్రమల కాలంలోని హతస్సాక్షులు!
మంచిది.
నాల్గవ వరుస: ఇద్దరు హతస్సాక్షులు. నేను
కూడా నమ్ముతాను!
ఐదవది: పాతనిబంధన పరిశుద్ధులు మరియు
పాత నిబంధన హతస్సాక్షులు మరియు క్రొత్త నిబంధన సామాన్య హతస్సాక్షులు బహిరంగ రాకడలో
లేపబడతారు అంటారు!
ఇది
నాకు అభ్యంతరం! మృతులు అంతా దేవుని బూర మ్రోగిన వెంటనే లేపబడతారు అని నా ఉద్దేశ్యం!
హతస్సాక్షులు గాని మృతులు గాని అందరూ ప్రస్తుతం మృతులు కాబట్టి ఒకసారే
లేపబడతారు. అంతేకాని ఓ పాత నిబంధన భక్తులారా! మీ వరుస చివరలో ఉంది, మీరు తర్వాత రండి అనరు అంటాను!
కారణం దేవునికి పాత నిబంధన పరిశుద్దులు, క్రొత్త
నిబంధన పరిశుద్ధులు సమానమే! యేసుక్రీస్తుప్రభులవారు మీరు నా నామంలో
బాప్తిస్మం పొందలేదు కాబట్టి మీరు చివరలో పునరుత్తానమవ్వండి అని అనరు అని నా ఉద్దేశం!
ఇలా
అనడానికి వారు చూపించే కారణాలు:
పాత నిబంధన భక్తులు యేసునామంలో బాప్తిస్మం పొందలేదు! వారు యెహోవాను పూజించారు! వారు గొర్రెపిల్ల రక్తంలో కడుగబడలేదు
కాబట్టి వారు క్ర్రీస్తునందు లేరు అంటారు! నేను అంటాను వారు కూడా
క్రీస్తులోనికి వచ్చేశారు అంటాను. ఎలాగో చివర్లో వివరిస్తాను!
ఇక
వారు గొర్రెపిల్ల జీవగ్రంధమందు వారి పేర్లు లేవు. జీవ గ్రంథంలో ఉన్నాయి అంటారు. దీనికి వివరణ గతభాగంలో ఇచ్చాను. రెండు జీవ గ్రంథాలు లేవు
అని నా ఉద్దేశం!
ఇక
పాత నిబంధన భక్తులకు జయజీవితం లేదు- పరమ సీయోను అనుభవం లేదు మరియు పరిశుద్ధాత్మ అనుభవం
లేదు అంటారు!
జయజీవితం
ఉంది, పరిశుద్ధాత్మ
అనుభవం ఉంది, వారు కూడా ఆత్మపూర్ణులే అంటాను నేను. ఎలాగో చివర్లో చెబుతాను!
క్రొత్త
నిబంధన సంఘము ఆత్మయొక్క ప్రధమఫలము! దీనిలో వారికి భాగం లేదు అంటారు!
ఇక
దానియేలు 12:13 ప్రకారం అంత్యములో వారికీ పునరుత్థానం అంటారు! అనగా బహిరంగ
రాకడలోనే వారు లేస్తారు అంటారు!
ఇక
పాతనిబంధన హతస్సాక్షులు ఎందుకు వెయ్యేండ్ల పాలనకు ముందు లేపబడతారు అంటే వారుచేప్పేది- ప్రకటన ఆరవ ఆధ్యాయంలో 9--11 వరకు: నాధా ఎందాక మా రక్తముకోసం వారికి తీర్పు తీర్చవు
అంటే – మీ సహదాసుల యొక్కయు,
సహోదరుల యొక్కయు సంఖ్య పూర్తి అయ్యేవరకు అంటున్నారు. ఎందాక- అనగా వారు చనిపోయి చాలా వందల సంవత్సరాలు మాత్రమే
కాదు రెండువేల సంవత్సరాలుకంటే ఎక్కువగా అయ్యింది కాబట్టి ఎందాక అనేమాట వాడారు అంటారు!
ఇదీ
వారి ఉద్దేశం! అయితే ఇలాంటి వాటికోసం ఎక్కువ సమయం ఉపయోగించ వద్దుగాని నా ఉద్దేశంలో అయితే
మృతులు అందరూ అనగా పాత నిబంధన పరిశుద్ధులు మరియు హతస్సాక్షులు, క్రొత్త నిబంధన మృతులు మరియు హతస్సాక్షులు దేవుని బూర ఊదిన వెంటనే లేపబడతారు
అని నా ఉద్దేశం! వెంటనే పరదైసు కాళీ అయిపోతుంది. అసలు మహాశ్రమల హతస్సాక్షులు ఆత్మలు బలిపీఠం క్రిందకు డైరెక్టుగా ఎందుకు వెళ్ళిపోయాయి
అంటే పరదైసు కాళీ అయిపోయింది కాబట్టే అని నా ఉద్దేశం! పరదైసూ
అనే గెస్ట్ హౌస్ / విడిది గది/ రెస్ట్ రూమ్
ఎందుకు అంటే దేవుని రాకడ మరియు తీర్పు వరకు పరిశుద్ధులు ఉండే గెస్ట్ /రెస్ట్ హౌస్! కాబట్టి దేవుడు ఇప్పుడు వారినందరినీ మధ్యాకాశములోనికి
తీసుకుని వచ్చేశారు కాబట్టి అక్కడ ఎవరూ లేరు, ఎటెండర్లతో సహా
మధ్యకాలంలోకి వచ్చేశారు కాబట్టే ఈ మహాశ్రమల హతస్సాక్షులు తిన్నగా పరలోకంలో ఉన్న బలిపీఠం
క్రిందకు వెళ్ళిపోయారు! కాబట్టి పరదైసు అనేది కాళీ అయిపోతుంది
అని నా ఉద్దేశం!
ఇప్పుడు-పాత నిబంధన పరిశుద్ధులు కూడా క్రీస్తు రక్తము
క్రిందకు వచ్చేసారు అని నేను అంటున్నాను కదా! ఎలాగో చెబుతాను!
ఇది మీకు అర్ధం కావాలంటే అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో కొన్ని డెఫినిషన్లు
తెలియాలి. నేను ఇంటర్నేషనల్ మారిటైమ్ లా చదువుకున్నాను కాబట్టి
కేవలం నాలుగు డెఫినిషన్లు చెబుతాను! ఇందులో నేను నా జ్ఞానమును
చెప్పడానికి ఇలా చేస్తున్నాను అనుకోవద్దు! నేను మరో కోణంలో మీకు
అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే!
మొదటిది: ట్రీటీ: అనగా రెండు లేదా మూడు దేశాల మధ్య
ఒకే ప్రయోజనం ఆశించి ఇద్దరికీ మేలుకలిగేలా చేసుకునే అంతర్జాతీయ ఒప్పందం! దీనిని ట్రీటీ అంటారు! అయితే ఈ ఒప్పందం కేవలం మాటలతో
సరిపోదు! దీనికి చట్టబద్దత కల్పించాలి. అనగా పార్లమెంటులో చట్టంచేసి ఆమోదించాలి! అప్పుడే ట్రీటీ
అధికారంలోకి వస్తుంది.
రెండవది: కన్వెన్షన్: ట్రీటీ చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. మేము కూడా దీనిలో బాగస్తులమవుతాము అని ప్రపంచంలో అనేక దేశాలు వీరితో కలిసి
అగ్రిమెంట్ చేసుకుంటే దానిని కన్వెన్షన్ అంటారు! మిగిలిన దేశాలలోను
దీనికి చట్టబద్ధత కల్పించాలి మరియు కనీసం 60% దేశాలు ఆమోదించి
చట్టబద్దత చేయాలి. అప్పుడే కన్వెన్షణ్ అధికారం లోకి వస్తుంది.
మూడు: అమెండమెంట్: కన్వెన్షన్ లో ఏదైనా పేరా గాని రెండు మూడు లైన్లు గాని రెండు మూడు పదాలు గాని
లేక అర్ధము గాని మారిస్తే దానిని అమెండ్మెంట్ అంటారు!
నాలగవది: ప్రోటోకాల్ : కన్వెన్షన్ చాలా పాతది అయిపోయినా- దాని విధివిధానాలు
చాలా పాతవి అయిపోయినా, లేక దానివలన కావాలనుకున్న ఉద్దేశం-
ప్రయోజనం నెరవేరక పోయినా –
కన్వెన్షన్ యొక్క ఉద్దేశము మరియు ప్రయోజనం మారకుండా – మొత్తం కన్వెన్షన్ ని మార్చి వ్రాయడం అనేది ప్రోటోకాల్
అంటారు! దీనిలో ఉద్దేశం మరియు ప్రయోజనం మారదు గాని మొత్తం కన్వెన్షన్
దాని టెక్నికాలిటీస్ – విధివిధానాలు మొత్తం మారిపోతాయి!
అయిపోయింది
నా లా సబ్జెక్ట్!
దేవుడు- మానవునితో సహవాసం చెయ్యాలని
దేవుడు కోరుకున్నారు! గాని మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు!
దేవుడు ప్రవక్తలను పంపించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వారితో
ఒప్పందం చేసుకున్నారు! ఇది ట్రీటీ!
దానిని
బలపరచడానికి ధర్మశాస్త్రము ఇచ్చి- ఆహారోను యాజకత్వములో బలులు అర్పణలు ద్వారా నీతిమంతులుగాను
పరిశుద్దులుగాను మారి పరలోకం చేరాలి. ఇదీ కన్వెన్షన్!
అయితే
ఈ ధర్మశాస్త్రము- మరియు ఆహారోను యాజకధర్మము అనే కన్వెన్షన్ అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అని మనము
హెబ్రీపత్రిక ప్రకారం చూడవచ్చు! ఇక దేవుడు ఆలోచించి దానివలన ప్రయోజనం
లేదు అని- కన్వెన్షన్ మొత్తం మార్చేసి- యేసుక్రీస్తుప్రభులవారి ద్వారా మెల్కీసెదకు యాజకక్రమము తీసుకుని వచ్చారు.
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు- నేనే మార్గమును
నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును
తండ్రియొద్దకు చేరలేడు—ఇదీ ప్రోటోకాల్! పాతనిబంధన పరిశుద్దుడైనా
క్రొత్త నిబంధన పరిశుద్దుడైనా ఎవరైనా సరే ఈ క్రీస్తుయేసు – యేసు రక్తములో కడుగబడి పరిశుద్దుడిగా మార్చబడి
పరలోకం చేరాలి అనే ప్రోటోకాల్ ద్వారానే పరలోకం వెళ్తారు!
ఇంతవరకు
బాగుంది! క్రొత్త
నిబంధన వ్యక్తులకు, ప్రస్తుతము ఉన్న వారికి పర్వాలేదు!
మరియు పాత నిబంధన భక్తుల సంగతి ఏమిటి? వారు చనిపోయారు.
పరదైసులో ఉన్నారు. మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు
ఎలా తీసుకుని రావాలి?? మరి దేవుడు చేసిన రూల్ ని దేవుడే వ్యతిరేఖించి
చేయలేరు కదా! మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా తీసుకుని రావాలి?
రండి
ఎఫెసీ 4:8 లో
చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులు అనుగ్రహించెను అంటున్నారు.
రెండవది: 1పేతురు 3:20 లో అవిదేయులైన ఆత్మలయొద్దకు వెళ్లి, ఆయన ఆత్మరూపిగానే
వెళ్లి వారికి ప్రకటించెను అంటున్నారు. తర్వాత ఆయన ఆ తర్వాత పరలోకమునకు
వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని కుడిపార్శవమున
కూర్చెండెను అంటున్నారు.
ఈ రెండు
వచనాలు కలిపి చదువుకుంటే- చెరను చెరగా పట్టుకుపోవడం అనగా మన అందరికీ తెలుసు చెర అనగా పరదైసు!
ఎక్కడికి పట్టుకుని పోయారు అంటే సాతాను ఆధ్వర్యంలో భూమిక్రిందన గల పరదైసుని
యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయిన వెంటనే ఆ రెండు రోజులలో సాతానుని మరణమును జయించి పరదైసుని
మధ్యాకాశం లోనికి తీసుకుని పోయారు. పరదైసు యొక్క అడ్రస్ మారిపోయింది.
అయితే ఈ క్రమంలోనే ఈ వచనాలు ప్రకారం చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మస్వరూపి
గానే వారికి ప్రకటించెను అనగా ఆత్మస్వరూపిగా పరదైసుకి వెళ్లి పాత నిబంధన భక్తులకు సువార్త ప్రకటించి
ప్రోటోకాల్ క్రిందకు తీసుకుని వచ్చారు అని నాకు అర్ధమవుతుంది. కాబట్టి వెంటనే వారు నమ్మారు! అంగీకరించారు! వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు పరదైసుని మూడో ఆకాశములోనికి తీసుకుని వచ్చారు!
కాబట్టి ఇప్పుడు పాత నిబంధన భక్తులు కూడా క్రీస్తు రక్తములోనికి వచ్చారు
కదా! వారుకూడా యేసుక్రీస్తు ద్వారానే పరలోకం అనే ప్రోటోకాల్ క్రిందకు
వచ్చారు! మరి అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారి లెక్కలోకి
వస్తారు కదా! మరి బాప్తిస్మం పొందలేదు అంటారేమో- అదే 1పేతురు ౩:20 మరియు
1కొరింథీ 10:2. ప్రకారం వారు కూడా బాప్తిస్మం పొందారు.
మన దృష్టిలో మన లెక్కలో కాకుండా అది దేవుని దృష్టిలో వారుకూడా బాప్తిస్మం
క్రిందకు వచ్చేశారు అని నా ఉద్దేశం!
సరే, వారు అనగా పాత నిబంధన భక్తులు
పరిశుద్ధాత్మ పూర్ణులు కాదు గనుక జయించే అనుభవం లేరు అంటారు:
నేను
వారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు అంటాను!
ఒకసారి
యూదా పత్రిక 1:14 లో ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనోకు
ఇలాగు ప్రవచించెను అంటున్నారు...
గమనించాలి: ప్రవచించెను అనగా ఆత్మపూర్ణులు
అయితేనే ప్రవచనాలు చెబుతారు గాని మామూలుగా చెప్పలేరు కదా! పేతురు
పత్రికలో వ్రాయబడింది .. లేఖనం మనుష్యుల ఊహల బట్టి కాక మనుష్యులు
ఆత్మపూర్ణులై చెప్పారు అంటున్నారు....
2పేతురు 1: 20
ఒకడు
తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
2పేతురు 1: 21
ఏలయనగా
ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన
ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
మరి
దీని ప్రకారం వారు ఆత్మను పొందుకుని ఆత్మపూర్ణత కలిగిన వారే కదా!
అబ్రాహాము
గారి గురుంచి దేవుడే ఆయన ప్రవక్త అని చెప్పారు! ఆదికాండము 20:7 లో!
అయ్యా ఆత్మను పొందకుండా దేవునితో మాట్లాడే అనుభవం మరియు ప్రవచించు అనుభవం
ఉంటుందా???
మోషే
గారు ఆత్మను పొందుకోలేదా? యెహోషువా గారు ఆత్మను పొందుకోలేదా?
సంసోను
గారు అంతమందిని ఒక్కచేతితో చంపగలిగారు అంటే అది మానవ బలము కానేకాదు, ఆత్మబలమే కదా
ఇక
సమూయేలు గారు, దావీదు గారు వీరంతా ఆత్మపూర్ణులు కాదా?
ఏలియా
గారు ఎలీషా గారు, యెషయా గారు, యిర్మియా గారు యేహెజ్కేలు గారు ఇలాంటి ప్రవక్తలంతా
ఆత్మపూర్ణత లేకుండా ఇన్ని ఘనమైన కార్యాలు ఎలా చేశారు? అన్ని గ్రంధాలు
ఎలా వ్రాసారు సార్! కాబట్టి పాత నిబంధన పరిశుద్ధులు అందరూ ఆత్మను
పొందుకున్న వారే అని నా ఉద్దేశము! అయితే పాత నిబంధన కాలంలో మనలాగా
పరిశుద్దాత్ముడు ఇప్పటి వలే భూలోకంలో మనతో ఉన్నట్లుగా భూమిమీద నివాసం చేయలేదు!
వచ్చి వెళ్ళిపోతూ వారితో మాట్లాడి వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే మనతో నివాసం చేస్తున్నారు అంతే!
ఇంకా
వారికి అనగా పాత నిబందన భక్తులకు నానాభాషలు, అన్యభాషలు లాంటివి లేకపోయి ఉంటాయి గాని వారికి ఆత్మ
కలిగినప్పుడు మరో రూపంలో పొందుకునే వారేమో!
కాబట్టి పాత నిబంధన
భక్తులు- క్రొత్త నిబంధన భక్తులు
దేవుని దృష్టికి సమానమే! వారుకూడా దేవుని బూర ఊదినప్పుడు లేపబడతారు
అనేది నా ఉద్దేశం! అయ్యా ఇది ఎవరిని విమర్శించాలని కాదు!
కేవలం నా ఉద్దేశం మాత్రం రాస్తున్నాను!
*3—4 అధ్యాయాల మధ్య జరిగే సంభవాలు-4*
*క్రీస్తు విరోధి పాలన*
ఇక మరో
ముఖ్యమైన అంశము ఏమిటంటే క్రీస్తు విరోధి పాలన భూమిమీద ప్రారంభం అవుతుంది. వానియొక్క రాజ్యము లేక పాలన
ఎలా ఆరంభమవుతుందో ఇప్పుడు చూసుకుందాం!
గమనించాలి- క్రీస్తు విరోధినే చాలామంది
అంత్యక్రీస్తు అంటారు! నిజంగా అంత్యక్రీస్తు అనే మాట బైబిల్ లో
ఎక్కడ మనకు కనబడదు! నాశనపుత్రుడు అని కనిపిస్తుంది. అంత్యక్రీస్తు అనగా నేనే క్రీస్తుని అని చెప్పుకునే వారిలో చివరివాడు ఈ క్రీస్తు
విరోధి! అందుకే వాడిని అంత్యక్రీస్తు అని చాలామంది పిలుస్తారు!
మన దేశంలో కూడా నేనే క్రీస్తుని అంటూ చాలామంది బయలుదేరారు. వారిలో మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు, మహారాష్ట్రలో ఒకరు,
తమిళనాడులో ఒకరు బయలుదేరారు. ప్రస్తుతం అందరూ చనిపోయారనుకోండి.
వారి ఆరాధనలు ప్రార్ధనలు పూజలు మన ఆరాధనలు లాగే ఉంటాయి. ఇలా నేనే క్రీస్తుని అని చెప్పుకునే వారిలో ప్రపంచంలో చివరి వాడే ఈ అంత్యక్రీస్తు
అనబడే క్రీస్తు విరోధి అని గమనించాలి!
అంత్య క్రీస్తుకు
గల వివిధ పేర్లు:
* క్రీస్తు
విరోధి (యోహాను 2:18)
* క్రూర మృగము
(ప్రకటన 13)
* పాప పురుషుడు (2 థెస్స 2:3)
* నాశన పుత్రుడు,
చిన్న కొమ్ము (దాని 8:9)
క్రీస్తు విరోధి ఎవరు?
ఎక్కడ నుండి
వస్తాడు?
ప్రకటన 13వ అధ్యాయం ప్రకారం అక్కడ చూపిస్తున్న
పట్టణం మరియు ఆనవాలు ప్రకారం రోమ్ పట్టణం నుండి వస్తాడు అని బైబిల్ పండితులు చెబుతారు!
కొంతమంది రోమ్ నుండి కాకుండా సిరియా నుండి వస్తాడు అంటారు. మరికొంతమంది రోమ్ లేక సిరియాకు చెందిన ఒక యూదుడు అయి ఉంటాడు. లేకపోతే అనగా వాడు యూదుడు కాకపోతే యూదులు మెస్సయ్యగా అంగీకరించరు గాని వారు
మూడున్నర సంవత్సరాలు వాడినే మెస్సయ్యగా అంగీకరిస్తారు కాబట్టి వాడో యూదుడు అంటారు! కొంతమంది నేటి రోజులలో వాడు మనుష్యుడు
కాదు, ఒక వ్యవస్థ అనియు, మరికొందరు వ్యవస్థ
కాదు, మనుష్యుడు కాదు- వాడు సముద్రము నుండి మరియు
19వ అధ్యాయం ప్రకారం అగాధం నుండి వస్తున్నాడు కనుక వాడు ఒక దురాత్మ అంటారు!
దీనికోసం మనము అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదిఏమైనా వాడు మనిషిలా మాట్లాడుతాడు.
అద్భుతాలు కూడా చేస్తాడు! సర్వలోకాన్ని తన ఆధీనము
లోనికి తీసుకుంటాడు! వాడి నంబర్ 666! అది
ఒక మనుష్యుని సంఖ్యయే అని బైబిల్ చెబుతుంది!
*క్రీస్తు
విరోధి రాజ్య స్థాపన*
*క్రీస్తు విరోధి రాజ్య దశలు-4*
1. క్రీస్తు విరోధి రాజ్యస్థాపన
2. సంఘము ఎత్తబడిన తర్వాత మొదటి మూడున్నర సంవత్సరములలో వాని
రాజ్యము స్థిరపరచబడుట.
3. చివరి మూడున్నర సంవత్సరాలలో క్రీస్తు విరోధి రాజ్య పాలన.
4. హార్ మెగిద్దోను యుద్దములో, అంత్య క్రీస్తు,
అతనియొక్క రాజ్యము నాశనమగుట.
* అతడు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని, ప్రపంచమంతటితో ఒప్పందం
కుదుర్చుకొని, యెరూషలేమును రాజధానిగా చేసుకుంటాడు.
* యెరూషలేము దేవాలయములో బలినైవేద్యములు ప్రారంభించి, ఇశ్రాయేలీయుల
ఎదుట ఒక మెస్సియ గా గుర్తింపు తెచ్చుకుంటాడు. (దానియేలు
9:2)
* అబద్ధ ప్రవక్త అనే రెండవ క్రూర మృగము, సంపూర్ణముగా క్రీస్తు
విరోధికి సహకరిస్తుంది.
* సాతాను వాని అధికారమును, శక్తిని క్రీస్తు విరోధికి ఇస్తాడు.
* సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధప్రవక్త
త్రిత్వమై పాలిస్తారు.
*భూలోకంలో క్రీస్తువిరోధి
రాజ్య స్థాపనకు ఐదు సూత్రాలను ఉపయోగిస్తాడు. *
* ప్రపంచ శాంతి
* సర్వమత సమ్మేళనం
* యూరో కెరన్సీ లేదా ప్రపంచమంతా ఏదో ఒకే ఒక్క కరెన్సీ
* ఇంటర్ నెట్ వ్యవస్థ
* 666 ముద్ర (ప్రకటన 13:17)
*క్రీస్తువిరోధి పరిపాలన:*
* పరిపాలనా కాలం: ఏడు సంవత్సరాలు
* మొదటి మూడున్నర సంవత్సరాలు: శాంతమూర్తి
* చివరి మూడున్నర సంవత్సరాలు: క్రూర మృగము
* మొదటి మూడున్నర సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఇతనితో వుంటారు.
* తర్వాత, క్రీస్తు విరోధి యెరూషలేము దేవాలయములో ప్రతిమను
నిలబెట్టినప్పుడు, అతనిని అసహ్యించుకొని అరణ్యానికి పారిపోతారు.
* అంత్య క్రీస్తు మొదట తానే క్రీస్తునని, తర్వాత నేనే దేవుడనని
చెప్పుకుంటాడు.
* దేవాలయంలో బలి, నైవేద్యం, పండుగలను
ఆపివేస్తాడు.
* మోషే ధర్మ శాస్త్రమును వ్యతిరేకిస్తాడు.
* దేవాలయంలో విగ్రహారాధన ప్రారంభిస్తాడు.
* తానే దేవుడనని దేవాలయంలో వచ్చి కూర్చుంటాడు.
* తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యమునకు వెళ్లగొట్టి, ముద్ర వేయించుకోవలెనని బలవంతం చేస్తాడు.
* యూదులను రక్షించడానికి వచ్చిన ఇద్దరు సాక్ష్యులను చంపేస్తాడు.
2థెస్స
2:3—8
3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు)
పాపపురుషుడు (ధర్మవిరుద్ధ పురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే
హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు,
దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ
నియ్యకుడి.
5. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
6. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.
7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసివేయబడు వరకే అడ్డగించును.
8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత
వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
*క్రీస్తు విరోధి పతనం:*
యేసు క్రీస్తు తన
బహిరంగ రాకడలో ప్రత్యక్షమగునప్పుడు, క్రీస్తువిరోధిని, అబద్ద ప్రవక్తను సజీవులుగా పట్టుకొని,
అగ్నిగుండములో పడద్రోయును. (ప్రకటన
19:20) మొట్టమొదటిగా అగ్నిగుండంలో ప్రవేశించేది వీళ్ళిద్దరే.
క్రీస్తు విరోధి సైన్యమంతయూ హార్ మెగిద్దోను
యుద్దములో దహించబడును. వారి మాంసమును పక్షులు కడుపారా భుజిస్తాయి.
( ప్రకటన 19:21)
ఇప్పటికే, హార్ మెగిద్దోనుకు సమీపంలో విచిత్రమైన
పక్షులు వెలుగులోనికి వచ్చాయి. అవి టన్నులకొలదీ మాంసాన్ని జీర్ణం
చేసుకోగలవట. మొదట్లో అవి సంవత్సరానికి రెండు గ్రుడ్లు మాత్రమే
పెట్టేవట. కానీ ఇప్పుడైతే, సంవత్సరానికి
పండ్రెండు గ్రుడ్లు పెడుతున్నాయట. అంటే, అవి హర్మెగిద్దోను కోసం సిద్ధపడుతున్నాయి. క్రీస్తు రాకడకై
నీవు సిద్దపడుతున్నావా?
* క్రీస్తు
విరోధి రాజ్య స్థాపన
కనుచూపు మేరల్లోనే వుంది.*
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?
సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!
*పరలోకంలో
జరిగే సంభవాలు-1*
ప్రకటన 4:1—3
1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా,
అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు
నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ
మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరగవలసిన వాటిని నీకు
కనుపరచెదననెను
2. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు
ఒకడు ఆసీసుడైయుండెను,
3. ఆసీనుడైనవాడు, దృష్టికి
సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు
సింహాసనమును ఆవరించియుండెను.
ఇక పరలోకంలో జరిగే
సంగతులు లేక సంభవాలు కోసం ధ్యానం చేసుకుందాం! ఈ 4 మరియు 5 అధ్యాయాలు
వీటికోసమే వ్రాయబడినవి!
మొదటి వచనంలో ఈ
సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు తలుపు తెరువబడింది . మొదట అధ్యాయంలో నాకు వినబడిన స్వరము మరలా
బూరద్వని వలే నాతో మాట్లాడటం జరిగింది. ఆ స్వరము ఇక్కడికి ఎక్కిరా
అని చెప్పి- ఇక మీద జరుగబోయేవాటిని నీకు చూపిస్తాను అని స్వరము
వినబడింది.
ఈ వచనంలో మనకు
కనబడే ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే:
మొదటగా: యోహాను గారు పరలోకంలో ఒక తలుపు తెరువబడినట్లు
చూశారు! తలుపు రహస్యాలను సూచిస్తుంది. అంతేకాదు
లోపలికి వెళ్ళడానికి అనుమతిని కూడా సూచిస్తుంది. తలుపు తెరువబడింది
అనగా లోపలికి రమ్మని ఆహ్వానమును సూచిస్తుంది. అనగా మొదటగా యోహాను
గారికి పరలోకంలోనికి ఆహ్వానం దొరికింది.
రెండు: పరలోకంలో జరుగబోయే కొన్ని సంగతుల యొక్క
మర్మములను లేక రహస్యాలు దేవుడు యోహాను గారికి ఒక మంచి ఉద్దేశ్యముతో చూపించ బోతున్నారు
అని మనకు ఈ వచనం ద్వారా తెలుస్తుంది. అవును బైబిల్ లో వ్రాయబడింది-
దేవుడు తన భక్తులైన సేవకులకు బయలుపరచకుండా ఏ పనియు చేయడు!
ఆమోసు 3: 7
తన
సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
కాబట్టి ఆయన ముందుగా తన సేవకులకు చూపించి
లేక చెప్పి ఏదైనా చేస్తారు. ఎందుకంటే మనుష్యులు దానిద్వారా బ్రతుకులు
మార్చుకుని గుణపడి తన రాజ్యమునకు వస్తారని ఆయన ఆశ!
ఇక
రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: ఇక్కడికి ఎక్కిరా అనే స్వరము! అనగా పరలోకంలోనికి నీకు అనుమతి లభించింది. లోపలికి రమ్మనే
ఆహ్వానం దొరికింది. అయితే ఈ వచనమును ఆధారము చేసుకుని చాలామంది
దైవజనులు మరియు బైబిల్ పండితులు ఈ వచనం ద్వారా సిద్ధపడిన సంఘమును దేవుడు పరలోకమునకు ఆహ్వానిస్తున్నారు.
ఇది జరిగినప్పుడే సంఘము ఎత్తబడుతుంది అంటున్నారు! అయితే నాకు ఎందుకో ఈ వచనం ఈ సంధర్బానికి సరిపోతుంది అనుకోవడం లేదు!
శ్రమలకు ముందుగా సంఘము ఎత్తబడుతుంది అని నేను నమ్ముతున్నాను గాని ఈ వచనం
దానికి రిఫరెన్స్ అంటే నాకు సరికాదు అనిపిస్తుంది. ఇది నా ఉద్దేశం
మాత్రమే! ఇది కేవలం దేవుడు యోహాను గారికి కొన్ని రహస్యాలు వెల్లడి
చేయడానికి పరలోకానికి పిలుస్తున్నట్లు నాకు అనిపిస్తుంది గాని సంఘమును రమ్మని ఆహ్వానించినట్లు
కాదు అనిపిస్తుంది. ఆయన సంఘమును రమ్మని చెప్పేదానికి మనకు
1 థెస్స 4:16—17 లో వ్రాయబడిన సంభవాలు జరుగుతాయి అని
గ్రహించాలి!
ఇక మూడో విషయం ఏమిటంటే: మనకు మొదటి అధ్యాయంలో వినబడిన బూరద్వని
వంటి స్వరమే ఇక్కడ కూడా పలుకుతున్నది . అది దేవుని స్వరము అని
గ్రహించాలి.1:10,12—14
ఇక
రెండో వచనంలో వెంటనే నేను ఆత్మవశుడనైతిని అంటున్నారు. పరలోకంలో పరిశుద్ధులకు ఆత్మపూర్ణులకు
మాత్రమే ప్రవేశం ఉంది. అందుకే వెంటనే యోహాను గారు ఆత్మవశుడు అయ్యారు.
పరలోకం లోనికి ఆ తలుపు ద్వారా ప్రవేశించారు! వెంటనే
అక్కడ అనగా పరలోకంలో ఒక సింహాసనం చూశారు. ఆ సింహాసనం మీద ఒకరు
కూర్చొని ఉన్నారు అంటున్నారు.
ఇక
తర్వాత వచనంలో ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్న వ్యక్తిని వర్ణించడం మొదలుపెడుతున్నారు.
అయితే
సింహాసనం గురుంచి ఆలోచిస్తే ఈ ప్రకటన గ్రంధంలో సింహాసనం అనే మాట 40 సార్లు ఉంది. ఈ ప్రకటన గ్రంధానికి సింహాసనం అనేదే కేంద్రవిషయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న సింహాసనం తండ్రియైన
దేవునిది! ఆయన విశ్వమంతటిని అక్కడనుండే పాలిస్తున్నారు.
మొత్తం ప్రపంచము- సర్వసృష్టి ఆయన అదుపులో ఉన్నాయి.
అంతేకాకుండా ఇప్పుడు జరుగుచున్నవి- ఇక తర్వాత జరుగబోయేవి
అనగా ఈ గ్రంధములో ఇక ముందుకు జరుగబోయేవి కూడా ఆయన అదుపులో ఉన్నాయి అని గ్రహించాలి!
ఎవరు ఎన్నెన్ని తలంచినా చివరికి ఆయన ఉద్దేశాలు మాత్రమే నెరవేరుతాయి!
ఇలా
సింహాసనమును చూచిన వారున్నారు
1రాజులు 22:19 లో ప్రవక్తయైన మీకాయా గారు చూశారు....
మీకాయా
యిట్లనెను - యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై
యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని
కీర్తనల గ్రంధంలో
అనేకసార్లు నీ సింహాసనం అనియు ఆయన గొప్ప రాజు అనియు చెప్పబడింది. 123:1..
కీర్తనలు 123: 1
ఆకాశమందు
ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
ఇక ప్రకటన 19:6 లో కూడా ఈ సింహాసనమును చూడగలము!
కాబట్టి సర్వసృష్టి
ఆయన ఆధీనంలో ఉంది అని మనము గ్రహించాలి!
ఇక మూడవ వచనంలో
సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి చూడటానికి సూర్యకాంతం వలే మరియు పద్మరాగం అనగా కెంపులాగ ఉన్నాడు అంటున్నారు. అయితే బైబిల్ చెబుతుంది
ఏ మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు. యోహాను 1:18
ఎవడును ఎప్పుడైనను
దేవుని చూడలేదు; తండ్రి
రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే (లేక, జనితైక
కుమారుడే అనేక ప్రాచీనప్రతులలో- అద్వితీయ దేవుడే అని పాఠాంతరము)
ఆయనను బయలు పరచెను.
కారణం మనకు 1తిమోతి 6:16 లో కనిపిస్తుంది.
ఎవ్వరూ సమీపించలేని తేజస్సు కలిగి ఆ మహిమలో నివసించే దేవుడు మనదేవుడు!
ఎవరైనా చూశారు అంటే అది ఆయన మహిమా ప్రభావాలను మాత్రమే చూశారు.
1తిమోతికి
6: 16
సమీపింపరాని
తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను
చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు
శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
మోషే గారు కూడా ఆయన మహిమను వెనుకనుండి
చూశారు...
Exodus(నిర్గమకాండము) 33:18,19,20,21,22,23
18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా
19. ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను
నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను,
ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.
20. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను
చూచి బ్రదుకడనెను.
21. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు
ఆ బండమీద నిలువవలెను.
22. నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;
23. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు
కనబడదని మోషేతో చెప్పెను.
అలాగే ఇక్కడ యోహాను
గారు కూడా ఆయన యొక్క మహిమాప్రభావాలనే చూశారు!
అమూల్యమైన రత్నాలైన ఈ సూర్యకాంతం, కెంపు అనబడే
పద్మరాగం ఆయన యొక్క మహిమ యొక్క ప్రతిబింభాలు మాత్రమే! ఇక సూర్యకాంతము
అని తెలుగులో వ్రాయబడిన గ్రీకు పదము మాత్రం వజ్రం లాంటి స్వచ్చమైన రత్నము అని చెప్పడం
జరిగింది. ప్రకటన 21:11
దానియందలి
వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
ఇక సింహాసనం చుట్టూ
ఇంద్రధనస్సు ఉంది. అది మరకతం
వలే ప్రకాశిస్తుంది అంటున్నారు. మరకతం అంటే పచ్చని రాయి అని అర్ధము!
గమనించాలి అక్కడ కనిపించే ఇంద్రధనస్సుకి ఇంద్రుడికి ఏ సంబంధం లేదు!
ఇంద్రధనస్సు అనేది ఆదికాండం ప్రకారం దేవుడు మనుష్యులతో చేసిన వాగ్ధానమును
మరియు నిబంధనను సూచిస్తుంది. ఇంకా దేవుని మహిమను ఆయన యొక్క విశ్వసనీయతను సూచిస్తుంది.
ఆది 9:11—16
11. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ
జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము
కలుగదని పలికెను.
12. మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు
ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
13. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని
మధ్య నిబంధనకు గురుతుగా నుండును.
14. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
15. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము
చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.
16. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని
భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము
చేసికొందుననెను.
యేహెజ్కేలు
గారు కూడా ఇదే చూశారు.
యెహేజ్కేలు 1: 28
వర్ష
కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప
దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు
వినబడెను.
ఆయన మహిమ గలవాడు! ప్రభావము గలవాడు! సర్వసృష్టిని పాలిస్తున్న వాడు! కాబట్టి దేవుడు ఎవడు?
ఎక్కడున్నాడు? నాకు కనబడమను అని పలికే దుష్టులు
ఒక్కసారి ఆయన ప్రభావాన్ని చూస్తే మాడిమసై పోతారు! కాబట్టి ఆయన
ఎవరో నిజంగా గ్రహించి ఆయనకు ఇవ్వవలసిన మర్యాద, భయభక్తులు ఆయనకు
ఇద్దాము!
*పరలోకంలో
జరిగే సంభవాలు-2*
*ఇరవై నలుగురు పెద్దలు*
ప్రకటన 4:4
సింహాసనముచుట్టు
ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు
ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
ఇక
నాలుగవ వచనంలో 24 సింహాసనాలు వాటిమీద
24 గురు పెద్దలు కనిపిస్తున్నారు. వారికి తెల్లని
వస్త్రములు ఉన్నాయి. తలలమీద బంగారు కిరీటాలు పెట్టుకుని ఉన్నారు!
దీనిని బట్టి చూస్తే వారికి ప్రతీ ఒక్కరికి సింహాసనం ఉంది అంటే వారు
చాలా ప్రత్యేకమైన వారుగా కనిపిస్తున్నారు. తెల్లని వస్త్రాలు
ఉన్నాయి అంటే పరిశుద్ధులు అని తెలుస్తుంది. ఇక తలలమీద సువర్ణ
కిరీటములు ఉన్నాయి అంటే జయజీవితం గలవారు అని అర్ధం వస్తుంది!
మరి
ఈ 24 పెద్దలు
ఎవరూ అనేదాని కోసం విభిన్న అభిప్రాయాలున్నాయి!
ఒకటైతే
నిజం వీరు మామూలు దేవదూతలకు దేవుని ప్రజలకు భిన్నంగా ఉన్నారు. దేవదూతలు అంటారు కొంతమంది!
గాని బైబిల్ గ్రంధంలో ఎక్కడా దేవదూతలకు కూర్చోడానికి సింహాసనం లేనేలేదు!
వారు నిలబడే ఉంటారు దేవుని సన్నిధిలో! కాబట్టి
వీరు ప్రత్యేకమైన దేవదూతలు కాదు, ప్రత్యేకమైన దూతలు కానేకాదు!
మరికొందరు పన్నెండుగురు అపోస్తలులు
మరియు ఇశ్రాయేలు జాతిలో పండ్రెండు గోత్రములనుండి పరిశుద్ధులైన వారు అంటారు. మరి
యోహాను గారు కూడా అపోస్తలుడే కదా! మరి ఆయన ఆ 24 సింహాసనాలలో ఒకదానిమీద కూర్చుని ఉండాలి కదా! మరి ఆయన
ఆ సింహాసనం మీద లేరు కదా! కాబట్టి ఇది కూడా వాక్యాధారమైన అభిప్రాయం
కాదు! ఇది కూడా తప్పు వివరనే! అంతేకాదు-
సంఘము ఎత్తబడ్డాకనే కదా దేవుడు కిరీటాలు సింహాసనాలు ఇచ్చేది!
మరి సంఘము ఇంకా ఎత్తబడలేదు ఆ దర్శనం చూడబోయే సరికి!
మరికొంతమంది: నూతన నిబంధన సంఘములో అత్యుత్తములైన
భక్తులు అంటారు. మరి నూతన నిబంధన సంఘానికి చెందిన వారు అంత గొప్ప
స్థానంలో ఉంటే, మరి పాత నిబంధన పరిశుద్ధులకు దేవుడు మంచి స్థానములు
ఇవ్వరా? ఇది కేవలం అసత్యం!
మరి
ఇంతకీ ఎవరు?
బహుశా
పరలోకంలో ప్రత్యేకమైన జీవులు లేక ఆత్మరూపులు!
దేవుడు మెల్కీసెదెకు
గారిని ఎలా ఆది అంతము లేకుండా ఎన్నుకున్నారో అలాగే వీరిని కూడా చేశారేమో! అది బైబిల్ లో దాచబడింది. కాబట్టి మనము మన సొంత అభిప్రాయాలు చెప్పుకోవద్దు!
అయితే ఒక్కటి ఈ 24 గురు పెద్దలు ప్రకటన గ్రంధం మొత్తం కనిపిస్తూ
ఉంటారు!
4:9—11;
5:5; 8—10; 7:11—14;
11:16; 14:3; 19:4
ఈ అన్ని రిఫరెన్సులు
పరిశీలిస్తే వీరు దేవునిని పొగడడం స్తుతించడం చూడవచ్చు! వీరు నిత్యమూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ
ఉండటమే వీరిపని!
ఇక యోహాను గారికి
ఈ దర్శనాలు యొక్క వివరాలను ఈ పెద్దలలో ఒకరు వివరిస్తున్నారు. అనగా బహుశా దేవుడు వీరిలో ఒకరికి ఈపని
అప్పగించి ఉంటారు. అంతేకాదు వీరు దేవుని హృదయాన్ని అర్ధము చేసుకొనిన
వారు!అందుకే యోహాను గారికి అన్నియు వివరిస్తున్నారు!
ప్రకటన
గ్రంథం 5: 5
ఆ
పెద్దలలో ఒకడు ఏడువకుము;
ఇదిగో దావీదుకు చిగురైన(లేక, వేరైన)యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును
విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
ప్రకటన
గ్రంథం 7: 13
పెద్దలలో
ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను
అడిగెను.
ప్రకటన
గ్రంథం 7: 14
అందుకు
నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను. వీరు మహాశ్రమలనుండి
వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని
వాటిని తెలుపుచేసికొనిరి.
దీనిని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది
అంటే ఈ పెద్దలు ఎవరు అనేది ప్రక్కన పెడితే వీరు దేవుణ్ణి స్తుతించటానికి ఆయనను ఆరాధించడానికి
దేవుని సన్నిధిలో అనునిత్యము కనిపెడుతున్న ప్రత్యేకమైన జీవులు లేక ఆత్మస్వరూపులు!
అంతేకాకుండా వీరు దేవుని హృదయాన్ని అర్ధము చేసుకుని అందుకు అనుగుణంగా
నడచుకొనే వారుగా కనిపిస్తున్నారు!
ప్రియమైన దైవజనమా! నీకు అలా దేవుని హృదయాన్ని అర్ధము చేసుకునే
మనస్సు ఉందా? మోషేగారు దేవుని హృదయాన్ని అర్ధం చేసుకున్నారు!
ఫీనేహాసు గారు దేవుని హృదయాన్ని అర్ధము చేసుకున్నారు! దావీదు గారు అర్ధము చేసుకున్నారు! అందుకే ఘనమైన కార్యాలు
చేసారు! మరినీవు అలా చేయగలవా?? అయితే దేవుడు
నిన్నుకూడా వాడుకుంటారు!
*పరలోకంలో
జరిగే సంభవాలు-3*
*సింహాసనము- గాజు సముద్రం*
ప్రకటన 4:5—6
5. ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి.
మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.
6. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను.
ఆ సింహాసన మునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు
వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.
ప్రియులారా ఇక ఐదవ వచనంలో మరలా దేవుని
ప్రభావాన్ని వివరిస్తున్నారు. సింహాసనంలో నుండి మెరుపులు ధ్వనులు
ఉరుములు బయలుదేరుచున్నవి అంటున్నారు! కీర్తనల గ్రంధములోను యెషయా
గ్రంధములోను ఆయన ముందర
అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది అంటూ చెప్పారు గాని ఇక్కడ
ఆయన సింహాసనం నుండి కూడా మెరుపులు ఉరుములు ద్వనులు వస్తున్నాయి అంటున్నారు.
.....
కీర్తనలు 50: 3
మన
దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టు ప్రచండ
వాయువు విసరుచున్నది.
అయితే ఒకసారి యెహెజ్కేలు
గ్రంధము మొదటి అధ్యాయం మరియు పదవ అధ్యాయం చూసుకుంటే అక్కడ కూడా భక్తుడు దేవుని సింహాసనము
మరియు మహిమను చూస్తున్నారు
యేహెజ్కేలు 1:26—28...
26. వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను;
మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.
27. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను.
నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా
నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.
28. వర్షకాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు
కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
Ezekiel(యెహెజ్కేలు) 10:1,4
1. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి
దొకటి అగుపడెను.
4. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు
మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండిన
దాయెను.
కాబట్టి మెరుపులు
ధ్వనులు దేవుని న్యాయమైన తీర్పును సూచిస్తుంది.
ఇక తర్వాత సింహాసనము
ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అని చెప్పి అవి దేవుని ఏడు ఆత్మలు అంటున్నారు! మొదటి భాగాలలో వివరించడం జరిగింది-
ఏడు ఆత్మలు అనగా సంపూర్నుడైన పరిశుద్ధాత్ముడే! ఆయన ఏడు రకాలైన కార్యాలు చేస్తున్నారు. ......
ఏడు
ఆత్మలు అనగా మొదటి అధ్యాయం ప్రకారం చూసుకున్నాము- ఏడు అనగా సంపూర్ణ సంఖ్య!
సంపూర్నుడైన పరిశుద్ధాత్ముడు! పరిశుద్ధాత్ముడు
చేసే ఏడు రకాలైన కార్యములు అని గతంలో చూసుకున్నాము!
1. జ్ఞానమునకు ఆధారమైన ఆత్మ
2. వివేకమునకు ఆధారమైన ఆత్మ
౩. ఆలోచనకు ఆధారమైన ఆత్మ’
4. బలమునకు ఆధారమైన ఆత్మ
5. తెలివిని పుట్టించే ఆత్మ
6. భయమును పుట్టించే ఆత్మ
7. భక్తిని పుట్టించే ఆత్మ
యెషయా 11:2
యెహోవా
ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల
భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
ఈ ఆత్మ దేవునిలో నుండి
వచ్చి క్రీస్తుయేసులో పనిచేసి , కృపాసత్య సంపూర్ణునిగా మనమద్య నివశించి ఇప్పుడు మనమధ్య సంచారం చేస్తున్నాడు
మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి!
కాబట్టి
ఆయన సింహాసనం ఎదుట వెలిగే దీపములు పరిశుద్ధాత్ముడే!
అలాగే ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ జీవితం వెలుగుతూ అందరికీ వెలుగునిస్తూ
అందరిని వెలిగిస్తుంది. అందుకే ఎవడును దీపము వెలిగించి కుంచము
క్రింద గాని మంచము క్రింద గాని పెట్టడు గాని అందరికీ వెలుగునిచ్చే విధముగా దీపస్తంభము
మీద పెడతాడు అంటూ మీ దీపమును వెలగనీయండి. మీరు లోకమునకు వెలుగైయున్నారు
అంటున్నారు.
మత్తయి 5:14--16.
ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో
పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఆయన ఆత్మకార్యములు ఆయన ఆత్మఫలము మనలో ఫలిస్తుంటే ప్రేమ సంతోషము
సమాధానము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము దయాలత్వము పనిచేస్తుంటే మన వెలుగును మన ప్రవర్తనను
చూసి అందరూ ఆకర్శించబడతారు! అప్పుడు నీలో ఉన్న వెలుగు పనిచేస్తున్నట్లుగా
అవుతుంది. నీవు అందరికీ వెలుగుగా ఉండగలవు!
మరినీవు
ఆవిధముగా నడువగలవా?!! అసలు నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడవు అయ్యావా!!! ఒకసారి
పరిశీలించుకో!
ఇక ఆరవ వచనంలో సింహాసనం ఎదుట గాజువంటి
సముద్రము ఉంది అంటున్నారు. అనగా స్పటికము లాంటి గాజు సముద్రము
ఉంది అట! గమనించాలి మోషే గారు చేసిన ప్రత్యక్ష గుడారములో కూడా
మనకు గంగాళం కనిపిస్తుంది. సోలోమోను నిర్మించిన దేవాలయము ముందు సముద్రము కనిపిస్తుంది. అందుకే పాత నిబంధన మరియు ధర్మశాస్త్రము రాబోవుచున్న వాటి ఛాయ మాత్రమే గాని
నిజమైనది అసలైనది క్రీస్తులో ఉంది అంటున్నారు పౌలుగారు హెబ్రీ పత్రికలో!
హెబ్రీయులకు 10: 1
ధర్మశాస్త్రము
రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు
ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి
కలుగజేయ నేరవు.
ఇక్కడ యోహాను గారు చూస్తున్నది పరలోకంలో
గల నిజమైన సముద్రము. అది గాజులాగ స్పటికములా ఉంది .
ఇది మనకు ప్రకటన 15:2 లో కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ జయించిన వారు ఈ గాజు సముద్రం మీద నిలబడతారు.
ప్రకటన గ్రంథం 15: 2
మరియు
అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని
ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగల వారై,(మూలభాషలో- దేవుని సేవార్థమైన వీణెలుగలవారై) ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.
2దిన
4:2,4,10 లో మనము సొలోమోను గారు చేయించిన సముద్రము చూడవచ్చు!
అక్కడ ఈ గాజు సముద్రం ఉంది.
ఈ సముద్రంలో యాజకులు మందిరములోనికి వెళ్లేముందు కాళ్లుచేతులు కడుగుకుంటారు.
అలాగే పరలోకంలో కూడా
ఒక దేవాలయం ఉంది. 7:15; 11:19; 14:15,17
అయితే పరలోకంలో ఉన్న ఈ గాజు సముద్రంలో
ఎవరూ ఏమీ కడుగుకోరు! కడుగుకోవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడకు
చేరిన ప్రజలు లేక సంఘము ఎప్పుడో తమ పాపములను కల్మషములను యేసురక్తములో కడుగుకుని శుద్ధిచేయబడిన
వారు మరియు పవిత్రులు పరిశుద్ధులు కాబట్టి మరోసారి కడుగుకోవలసిన అవసరం లేదు!
1యోహాను
1: 9
మన
పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను
క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
అందుకే పరలోకంలో ఉన్న
ఈ సముద్రం ద్రవముగా కాకుండా ఘనపదార్ధముగా ఉంది!
మీద చెప్పిన విధముగా 15:2 లో ఈ గాజు సముద్రము మీద జయించిన వారు
నిలబడతారు!
మరి నీవు జయజీవితం
జీవిస్తున్నావా? అలాగయితే నీవు
అక్కడ నిలబడగలవు!
*పరలోకంలో
జరిగే సంభవాలు-4*
*నాలుగు జీవులు*
ప్రకటన 4:6—8
6. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను.
ఆ సింహాసన మునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు
వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.
7. మొదటిజీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి
యెగురుచున్న పక్షిరాజువంటిది.
8. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి
చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవిభూతవర్తమాన
భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని
మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
ఇక మనకు ఆరోవచనం నుండి ఎనిమిదో వచనం
వరకు నాలుగు జీవులు కనిపిస్తున్నారు! వీరు సింహాసనమునకు చుట్టూ
ఉన్నారు. వీరికి ముందు వెనుక కూడా కన్నులు కలిగి ఉన్నారు. మొదట జీవి సింహము వంటిది.
రెండవ జీవి దూడ వంటిది. మూడో జీవి మనుష్యుని వంటి
ముఖముగలది! నాల్గవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అంటున్నారు.
ఇక ఎనిమిదో వచనంలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలున్నాయి, ఆ రెక్కలలో కూడా కన్నులున్నాయి. అవి దేవుణ్ణి అనుదినము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నాయి అంటున్నారు!
ఇదే నాలుగు జీవులను
యెహెజ్కేలు గారు దేవుని స్వరూప ప్రభావ దర్శనములో చూశారు మొదటి అధ్యాయంలో! యెషయా గారు కూడా ఆరవ అధ్యాయంలో చూశారు.
6:2,3
2. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి
రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన
కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచుండిరి.
అయితే ఈ
నాలుగు జీవులు ఎవరు? ఏమిటి అనే దానికోసం అనేక రకాలైన వాదనలు అభిప్రాయాలున్నాయి.
కొందరు ఈ నాలుగు జీవులు నూతన నిబంధన
సంఘానికి క్రీస్తు సంఘానికి సూచనగా ఉన్నాయి అంటారు! అది తప్పు!
మరికొందరు
ఈ నాలుగు జీవులు మనస్సాక్షి కాలంలో గల నలుగురు పరిశుద్ధులు అంటారు! అది కూడా తప్పే!
మరికొందరు
నూతన నిబంధన సంఘానికి చెందిన నలుగురు గొప్ప పరిశుద్ధులు అంటారు! దేవుడు వారికి అంతటి ఆధిక్యత
ఇచ్చారు అంటారు! ఇదికూడా తప్పుడు అభిప్రాయం అని నా ఉద్దేశం!
ఎందుకంటే యెహెజ్కేలు గారు మొదటి అధ్యాయంలో
అవి నాలుగు జీవులు అంటూ వాటిని వివరించిన భక్తుడు, పదో అధ్యాయం రాబోయేసరికి అవి కెరూబులు అని గుర్తుపట్టితిని అని చాలా స్పష్టముగా
చెప్పారు కాబట్టి ఇక మరొక వాదనకి తావు ఇయ్యకుండా అవి కెరూబులు గాని సెరూపులు గాని అనుకోవాలి
మనము! ముందు చెప్పడం జరిగింది- లేఖనమును
లేఖనముతోనే పోల్చుకోవాలి! ఇక్కడ అనగా ప్రకటన 4వ అధ్యాయంలో ఈ మూడు వచనాలలో ఏమేమి వివరణ ఇవ్వడం జరిగిందో అదే వివరణ ఇంకా చాలా
స్పష్టముగా మనకు యెహెజ్కేలు గ్రంధంలోనూ యెషయా గ్రంధంలోనూ ఇవ్వడం జరిగింది కాబట్టి అవి
కెరూబులు గాని సెరాపులు గాని అని నిర్దారణకు రావడం జరిగింది.
ఇక
వాటికి ఉన్న నాలుగు రూపాలు మనకు నాలుగు రకాలైన వ్యక్తిత్వాలను సూచిస్తున్నాయి. అయితే నిజం చెప్పాలంటే అవి
యేసుక్రీస్తుప్రభులవారిలో ఉన్న నాలుగు రకాలైన స్వభావాలను సూచిస్తున్నాయి. వీటికోసం గతంలో దర్శనపు ప్రవక్త అనే శీర్షికలో యేహెజ్కేలు గ్రంధము వివరించి
నప్పుడు చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక సందేశాలు-5 లో. వాటిని మరోసారి గుర్తుకు చేస్తున్నాను!
ప్రియులారా! ఇప్పుడు మనం ఆ దర్శనంలో
గల నాలుగు జీవులకోసం ధ్యానం చేద్దాం! యెహోవా ప్రభావ స్వరూప దర్శనంలో
యేహెజ్కేలుగారికి నాలుగు జీవులు కనబడ్డాయి. యోహానుగారికి కూడా
దేవుని సింహాసనం, ప్రభావముతో పాటు నాలుగుజీవులు కనబడ్డాయి.
ప్రకటన 4 అధ్యాయం. ఒక్కొక్క
జీవికి నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం – మానవ ముఖం, వాటి కుడిప్రక్కన ముఖరూపం-
సింహపుముఖం, ఎడమ ప్రక్కన ఉన్న ముఖరూపం-
ఎద్దుముఖం, వెనుక ప్రక్క ఉన్న ముఖరూపం-
పక్షి ముఖం. ఇక యోహానుగారు కూడా తన దర్శనంలో
ఇవే రూపాలు చూసినట్లు చూస్తాం.
ఇద్దరూ రెక్కలలో కళ్ళు ఉన్నట్లు, ఇవే కాక బోలెడు
కళ్ళు ఉన్నట్లు చూస్తాం. దేవుడు ఇద్దరికీ ఒకే దర్శనాలు చూపించారు.
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఒకే రీతిగా ఉన్నారు. హెబ్రీ 13:8; అయితే ఇద్దరి దర్శనాలలో ఒకే ఒక తేడా ఉంది. యేహెజ్కేలుగారు ఆ జీవులకు నాలుగు రెక్కలున్నాయి
అన్నారు, యోహానుగారు
వాటికి ఆరు రెక్కలున్నాయి అన్నారు. మరి ఎందుకు ఇలా తేడాగా రాసారు
అంటే బహుశా యెషయా 6 వ అధ్యాయంలో సెరూపులుకు వలే వీటికి కూడా ఆరు
రెక్కలు ఉండవచ్చు. వీటిలో రెండేసి రెక్కలతో తమ కాళ్ళను
కప్పుకొంటున్నాయి. ఎందుకంటే బహుశా 1) దేవుని ప్రభావము, దహించు అగ్నిని తాళలేక; లేక
2) తమ దిశమొలను కప్పుకోడానికి; లేక
3) జీవులకు ఒకదానితో ఒకదానికి కనెక్షన్/ లింక్ ఉందని చదువుకొన్నాం
కదా- బహుశా రెండు రెక్కలతో ఒకదానితో ఒకటి పట్టుకొని- లింక్ ఏర్పరచి ఉండొచ్చు. అందుకే రెండు రెక్కలను బహుశా
యేహెజ్కేలు గారు గుర్తించక నాలుగు రెక్కలు అని ఉండొచ్చు.
అయితే 10వ అధ్యాయంలో రెండుసార్లు
ఈ జీవులు కెరూబులు అంటున్నారు యేహెజ్కేలుగారు. 10:15, 20. . 10:20 లో అవి కెరూబులే అని గుర్తించితిని అని రాసారు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు.
ఆయన మొదట్లో జీవులు అన్నారు ఇప్పుడు కెరూబులు అని ఎందుకంటున్నారు?
ముందు ఎందుకు గుర్తించలేదు?
సింపుల్
ఆన్సర్: ఒక వ్యక్తి
దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిలో, పరలోకంలో ఉన్నప్పుడు వివేచన అనే
వరం పనిచేస్తుంది. దానితో ఆటోమేటిక్ గా మనం ఇతరులను గుర్తించగలం.
ఉదా: పౌలుగారు 2 కొరింథీ
12వ అధ్యాయంలో పరదైసుకి వెళ్ళి అనేకమంది భక్తులను చూసివచ్చారు.
వారే కాదు అనేకమంది భక్తులకు దేవుడు పలోకం చూపించి తిరిగి భూమిమీదకు
పంపినట్లు సాక్ష్యాలు విన్నాం. మరి ఆ పూర్వ భక్తులు జీవించిన
కాలం వేరు, వీరు జీవించిన కాలం వేరు! మరి
వారిని వీరు ఎలా గుర్తుపట్టగలిగారు? అంటే పరలోకంలో దేవుని పరిశుద్ద
సన్నిధిలో ఈ వివేచనా వరాలు పనిచేస్తాయి కాబట్టి వారు చాలా సులువుగా గుర్తుపట్టగలిగారు.
అంతేకాదు మనం కూడా ఒకరోజు ఆ విశ్వాస వీరులను, ఆ
పరిశుద్ధుల సంఘమును కలుసుకొంటాము. కలిసికొని దావీదు గారిని చూస్తాం!
పౌలుగారికి పరిశుద్ధమైన ముద్దు పెట్టుకొంటాం! యోబుగారికి
షేక్హ్యాండ్ ఇస్తాం! యోనాగారు మీరు చేప కడుపులో మూడు దినాలు ఎలా
ఉండగలిగారు అని అడుగవచ్చు! దానియేలుగారు మీరు సింహాల నోళ్లను
ఎలా మూయించగలిగారు అని అడుగుదాం! ఎప్పుడూ? మనం కూడా వారిలా జీవించినప్పుడే!!! మరి అప్పుడు వారు
దానియేలు, పేతురు, యోహాను, అబ్రహాముగారు అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ వివేచన ద్వారానే!
ఆత్మలో వివేచించి అవతలివారి బయోడేటా మొత్తం మనకు తెలిసిపోతుంది.
వారితో ముచ్చటించగలం! దీనినే శుభప్రదమైన నిరీక్షణ
అంటారు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు!!! రోమా 5:5; ఆ నిరీక్షణ నాకుంది! మరి ఆ నిరీక్షణ నీకుందా???
సరే,
ఇప్పుడు జీవుల ముఖాలకోసం ధ్యానం చేద్దాం!
1). మొదటి ముఖం- మానవ రూపం: ఇది మంచి చెడ్డలను, తెలివితేటలు, అర్ధం చేసుకొనే శక్తిని సూచిస్తుంది. ఈ సృష్టిలోనూ అన్ని
జీవులలో మానవుడు తెలివైనవాడు. అయితే మానవునికి తెలివి నిచ్చిన
ఆ దేవుడు మరీ తెలివైనవాడు. అందుకే మానవులను ఉద్ధరించడానికి,
రక్షించడానికి దేవుడే మానవ రూపములో వచ్చారు భూమిమీదకు! ఇది యేసుప్రభులవారు దైవమానవుడు అని తెలియజేస్తుంది.
2). రెండవ ముఖం: సింహం రూపం: సింహం అడవికి రాజు. అన్ని మృగాలుకి రాజు.
అది చాలా ధైర్యమైనది. సింహం దేవుడు సర్వాదికారియని,
సార్వభౌముడని ఈ జగానికి ఒకే రాజు అని సూచిస్తుంది. సింహం ముందు అన్ని మృగములు, జంతువులూ తలవంచి భయపడి పారిపోతాయో,
అలానే రాజులరాజైన యేసయ్యకి అన్నింటికన్నా పై నామము కలిగి, భూలోక రాజ్యాలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించ వలసినదే అని సూచిస్తుంది.
3). మూడవ ముఖం: ఎద్దు రూపం: ఎద్దు- సేవకుడు/ పరిచారకునికి
సాదృశ్యం. ఎద్దులు అవి కష్టపడి యజమానికి లాభం చేకూరిస్తాయి.
కష్టపడే గుణం. అలాగే యేసుప్రభుల వారు దేవుడై యుండి
కూడా అది విడచిపెట్టకూడని భాగ్యం అని తలంచక దాసుడై పుట్టి తనను తాను తగ్గించుకొన్నారు.
ఎంతగా తగ్గించుకొన్నారంటే సిలువమరణం పొందునంతగా! ఫిలిప్పీ 2:8; అన్ని భాదలు భరించి, తన రక్తాన్ని చిందించి మన పాపములకు పరిహారం చేసిన దేవుడు- దాసుడు అని సూచిస్తుంది.
4). నాల్గవ ముఖం- పక్షిరాజు రూపం:
పక్షిరాజు- బలమునకు సాదృశ్యం, ఇంకా అధికారమునకు, దైవత్వానికి సాదృశ్యం.
ఈ దర్శనం చూస్తున్నప్పుడు యేహెజ్కేలుగారికి
అర్ధం కాలేదు గాని దేవుడు చూపించారు అని రాసారు ఆయన. అయితే మరుగై
ఉన్నవి తన భక్తులకు బయలుపరిచేవాడు మన దేవుడు. ఆయన మరుగైయున్న
మర్మాలు బయలు పరచేవాడు. ఈ నాలుగు జీవులు- వాటి ముఖాలు దేవుని గుణగణాలను సూచిస్తున్నాయి. ఆయన దైవమానవుడు, సర్వాదికారి, సర్వోన్నతుడు, సార్వభౌముడు, రాజులరాజు, ప్రభావము, బలము కలవాడు
గాని దాసునిరూపం దాల్చి నీకోసం నాకోసం మరణించినవాడు అని తెలియజేసే దర్శనం ఇది.
ఇంతగొప్ప దేవుణ్ణి
నీవు కలిగియున్నావు ప్రియ దేవునిబిడ్డా! ఈ దేవుడు మనకు సరిపోయినవాడు. ఆయనను దేనితో సమానం చేస్తావు.
ఆయనను దేనికోసం తాకట్టు పెట్టేసున్నావు? త్రాగుడుకా?
జూదానికా? వ్యభిచారానికా? మరి దేనికి? అంతే కాదు ఆయన మానవుడు. ఆయనకు నీభాధ తెలుసు. కాబట్టి ఓలిపోకు, సోలిపోకు! తగినకాలమందు ఆయన నీ మనవి ఆలకించబోతున్నారు.
ఇటువంటి దర్శనాలు
నీవు పొందుకోవాలని ఉందా? అయితే
ఆయనను నీ గృహానికి, నీ హృదయానికి రారాజుని చేయు! సంపూర్ణ అధికారం ఇవ్వు!
*పరలోకంలో
జరిగే సంభవాలు-5*
*నాలుగు జీవులు-2*
ప్రియులారా! ఇక 8—11 వచనాలు చూసుకుంటే మొదటగా నాలుగు జీవులు
తర్వాత ఇరవైనలుగురు పెద్దలు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు చూడగలము!
ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో
నాలుగు జీవులు భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్దుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ మానక చెప్పుచున్నారు అంటున్నారు.
ఇదే దర్శనాన్ని యెషయా గారు కూడా 6:2—౩
లో ఇదేవిధమైన దర్శనము చూశారు అని గతభాగంలో చెప్పుకున్నాము....
2. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి
రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో
తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచుండిరి.
కాబట్టి ఆయన పరిశుద్ధుడు
కాబట్టి మనము కూడా పరిశుద్దులుగా జీవిస్తూ నిత్యమూ ఆయనను స్తుతించబద్ధులమై యున్నాము!
ఇక తొమ్మిదో వచనంలో ఆ సింహాసనమందు ఆసీనుడైయుండు యుగయుగములుజీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగును గాక అంటూ మరింతగా స్తుతులు చెప్పుచున్నారు! ఇక్కడ వారు అంటున్నారు- దేవుడు యుగయుగములు జీవించువాడు! మన దేవుడు శాశ్వతుడు! నిన్ననేడు నిరంతరమూ జీవించే వాడు! ఆల్ఫా మరియు ఒమేగా, ఆదియు మరియు అంతమునై ఉన్నవాడు! ఆయన సజీవుడు! కన్నులుండి చూసేవాడు! నోరుండి మాట్లాడేవాడు! చెవులుకలిగి వినేవాడు- జవాబిచ్చేవాడు! ఆయన సృజించబడిన వాడు కాదు- ఆయనే ఈ సృష్టిని సృజించిన వాడు- సృష్టికర్త!
ఇక వీరు ఇలా కీర్తిస్తూ
స్తుతిస్తూ ఉండగా పదో వచనంలో ఇరవై నలుగురు పెద్దలు కూడా సింహాసనమందు ఆసీనుడై ఉండువాని
ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు... ఇంకా స్తుతిస్తున్నారు!
దీనిని జాగ్రత్తగా
పరిశీలిస్తే అక్కడ దూతలు, కెరూబులు, సెరాపులు, ఇరవైనలుగురు
పెద్దలు, నాలుగు జీవులు, కోట్ల కొలది దూతలు
అందరూ ఆయనను అనగా ఘనమైన దేవుణ్ణి ప్రభావము గల దేవుణ్ణి స్తుతిస్తున్నారు! ఆయన చేతితో రూపించబడ్డ నీవు నేను అలాంటి స్తుతులను దేవునికి చెల్లిస్తున్నామా?
నిజం చెప్పాలంటే
దేవుడు మానవులను ఆయనను స్తుతించడానికే చేసుకున్నారు! కాబట్టి నిజంగా మనిషి/ లేక విశ్వాసి కూడా ప్రతీరోజు చేయాల్సింది
ఇదే! ఆయనను స్తుతించడమే!
చూడండి ఆయనను ఎలా
స్తుతిస్తున్నారో...
ప్రకటన 1:6
మనలను
ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము)
మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్.
ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
5:12—14
12. వారు వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును
బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
13. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము,
అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును
స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.
14. ఆ నాలుగు జీవులు - ఆమేన్ అని చెప్పగా
ఆ పెద్దలు సాగిలపడి నమస్కారముచేసిరి.
రోమీయులకు 11: 36
ఆయన
మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ
కలుగును గాక. ఆమేన్.
రోమీయులకు 16: 27
అద్వితీయ
జ్ఞాన వంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము
మహిమ కలుగునుగాక. ఆమేన్.
పౌలుగారు
అంటున్నారు
1కొరింథీ 6:19,20
19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు
ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
1కోరింథీయులకు 10: 31
కాబట్టి
మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.
ఎఫెసీయులకు 5: 20
మన
ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచు,
ఎఫెసీయులకు 5: 21
క్రీస్తునందలి
భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
1థెస్సలొనికయులకు 5: 18
ప్రతి
విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని
చిత్తము.
1తిమోతికి 1: 17
సకల
యుగములలో రాజైయుండి,
అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు
కలుగును గాక. ఆమేన్.
1తిమోతికి 6: 16
సమీపింపరాని
తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను
చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు
శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
హెబ్రీ 13:15
కాబట్టి
ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు,
జిహ్వాఫలము అర్పించుదము.
ఇక 11వ వచనంలో
24గురు పెద్దలు తమ కిరీటాలు సింహాసనం ముందు వేసి లేక పడవేసి స్తుతిస్తున్నట్లు
చూడగలము! పదో వచనంలో సాష్టాంగనమస్కారం చేస్తే పదకొండో వచనంలో
తమ కిరీటాలు దేవుని సింహాసనం ముందు పడవేసారు. అనగా దేవునికి సంపూర్ణ
విధేయత చూపించి ఆయనకు భయపడి ఆయనను పూజిస్తూ ఆయనకు మ్రొక్కుతున్నారు! ఇదీ ఆయనను పూజించవలసిన విధానము! దీనిని తప్పకుండా ఈ
24గురు పెద్దలనుండి నేర్చుకోవాలి! దేవునికి భయపడాలి!
గౌరవించాలి! పూజించాలి! మ్రొక్కాలి!
ఇంకా చివరి వచనంలో
వీరంతా అనగా 24గురు పెద్దలు
మరియు నాలుగు జీవులు ఆయనను సృష్టికర్తగా స్తుతిస్తున్నారు. కారణం
ఆయన నిజంగా సృష్టికర్త కాబట్టి. మనము కూడా అదేరకంగా పూజించవలసిన
మ్రొక్కవలసిన అవసరం ఉంది!
ప్రకటన 10:6; ఆదికాండం 1:1; యోబు 38:4—7; కీర్తన 19:1; యెషయా
40:25—26;
అపో 14:15; 17:24—28; రోమా 11:36
కాబట్టి ఇటువంటి సృష్టికర్త
మరియు యుగయుగాలుండే దేవుణ్ణి మనము కూడా కలిగి యున్నాము కాబట్టి ఆయనకు నిజంగా భయపడి
ఆయనను గౌరవస్తూ బ్రతుకు దినములన్నియు ఆయనను స్తుతిద్దాము!
*పరలోకంలో
జరిగే సంభవాలు-6*
*ఏడు ముద్రలు- వధింపబడిన గొర్రెపిల్ల-1*
ప్రకటన 5:1—5
1. మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా
వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
2. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన
యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
3. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను
ఎవనికిని శక్తి లేకపోయెను.
4. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
5. ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన
(లేక, వేరైన) యూదా గోత్రపు
సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
ప్రియులారా! ఇక ఐదవ అధ్యాయంలో మనకు ఏడు ముద్రలు గల గ్రంధము ఒకటి కనిపిస్తుంది. అయితే దానిని విప్పడానికి పరలోకంలో గాని, భూలోకంలో గాని
భూమిక్రింద గాని ఎవరూ సరిపోయినవారు లేరు అన్నట్లు చూస్తాము!
మొదటి
వచనంలో లోపటను వెలుపటను రాతకలిగి అనగా రాసియున్న ఒక గ్రంధము ఉంది. అయితే దానికి ఏడు ముద్రలు
గట్టిగా వేయబడిఉన్నాయి. ఆ గ్రంధము సింహాసనం మీద ఆసీనుడైయున్న
వాని కుడిచేతిలో ఉంది అంటున్నారు. సింహాసనం మీద ఆసీనుడైన వాడు
అనగా తండ్రియైన యెహోవా దేవుడు అని గ్రహించాలి! ఇక్కడ గట్టిగా
ముద్రలుగల గ్రంధము అని వ్రాయబడినా, అనేక ప్రాచీన ప్రతులలో చుట్టబడి-
ముద్రలు గల గ్రంధము అని వ్రాయబడి ఉంది. అచ్చమైన
తెలుగులో చెప్పాలంటే పుస్తకపు చుట్ట-లేక చుట్టబడి ఉన్న గ్రంధము
అని అర్ధము! గమనించాలి- పూర్వ కాలములో పుస్తకములు
ఉండేవి కావు! గ్రంధములు తోలు కాగితాలు మీద వ్రాసి వాటిని చుట్టి
ఉంచేవారు. వీటినే పుస్తకపు చుట్ట అనేవారు!
ఇలాంటి పుస్తకపు చుట్టనే మన యోహాను
భక్తుడు పరలోకంలో తండ్రియైన దేవుని చేతిలో చూశారు! అయితే ఆ పుస్తకపు
చుట్ట గట్టిగా ముద్రించబడి ఉంది. ఇక్కడ ముద్ర అనగా ప్రింట్ చేయడం
అని గాని ముద్ర వేయడం కాదు! ముద్ర వేయడం అనగా సీల్ చెయ్యడం!
అనగా బ్యాంకు లోన్ కట్టకపోతే బాంక్ వారు, కోర్టు
వారు వచ్చి తాళము వేసి దానికి సీల్ వేసి- ముద్ర వేస్తారు కదా-
అలాంటి ముద్రలు ఏడు ముద్రలు వేసి ఉన్నాయి ఆ పుస్తకపు చుట్టమీద!
ఎందుకు
అన్ని ముద్రలు అనగా అది రహస్యం!
మర్మం కాబట్టి అన్ని ముద్రలు వేయబడి ఉన్నాయి!
ఇక
రెండవ వచనంలో ఇక బలిష్టుడైన దేవదూత వచ్చి ఈ ముద్రలు తీసి అనగా ముద్రలు విప్పుటకు యోగ్యుడు
ఎవడు అని బిగ్గరగా ప్రచురం చేసాడు అనగా బిగ్గరగా కేక వేశాడు ఈ బలిష్టుడైన దేవదూత! ఇక్కడ బలిష్టుడైన దేవదూత
ఎవరూ అనేది మనకు అనవసరం! దానికోసమైన చర్చ మనకు వద్దు!
బహుశా మిఖాయేలు కావచ్చు! ఎందుకంటే దేవుని పక్ష్యంగా
యుద్ధాలు జరిగించేది అతడే!
సరే, ఈ గ్రంధంలో మనకు దేవదూత
లేక దూతలు 80సార్లు కనిపిస్తారు!
ఎప్పుడైతే
ఇలా ఈ గ్రంధము యొక్క ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు అని కేకవేశాడో ఎవరూ రావడం లేదు!
గమనించాలి- ఈ ముద్రలు విప్పడానికి బలము
కాదు, అధికారం కూడా కాదు- కావలసినది-
యోగ్యత!!!
మూడో
వచనంలో పరలోకంలో గాని, భూలోకంలో గాని భూమిక్రింద అనగా పాతాళము లో గాని ఎక్కడా ఆ యోగ్యత గలవారు ఎవరూ
లేరు!
గమనించవలసిన
విషయం ఏమిటంటే: దేవునిచేత నా స్నేహితుడు అని పిలిపించుకున్న అబ్రాహాము గారు గాని, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని పిలువబడిన మరియు ధర్మశాస్త్రము దేవుని దగ్గరనుండి
ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్పవాడైన మోషేగారు గాని,
నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలువబడిన దావీదు గారు గాని,
దేవునిచేతనే యధార్ధవంతుడు- నీతిమంతుడు అని పిలువబడిన
నోవాహు గారు, యోబు గారు, దానియేలు గారు
ఇలాంటి వారు ఎవరు కూడా, చివరికి ప్రవక్తలు కూడా ఆ గ్రంధాన్ని
విప్పడానికి రావడం లేదు. కారణం ఆ యోగ్యత వారికి లేదు!
చివరికి దేవుని సింహాసనం ప్రక్కనున్న నాలుగు జీవులకు గాని,
24గురు పెద్దలకు గాని ఆ అర్హత యోగ్యత లేకపోయింది! చివరికి మీద చెప్పబడిన వారంతా అయ్యా ఆ యోగ్యత మాకు లేదు అని ఒప్పుకోవలసి వచ్చింది.
ఆ గ్రంధాన్ని కనీసం తీసుకోవడానికి కూడా ఎవరూ ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి
తెగించలేకపోయారు!
ఇక
నాలుగో వచనంలో ఎప్పుడైతే భూలోకంలో గాని పరలోకంలో గాని భూమిక్రింద గాని యోగ్యుడు అనగా
ఆ పుస్తకపుచుట్ట తీసుకుని విప్పడానికి యోగ్యుడు కనబడలేదో మన యోహాను గారు కన్నీరు మున్నీరుగా
విలపిస్తున్నారు. అయ్యో- ఈ పుస్తకాన్ని విప్పడానికి ఎవరూ లేరా,
ఎవరూ లేరే అంటూ!!! దీనిని బట్టి చూస్తే మిగిలిన వారికి పుస్తకంలో ఏముందో అని ఆలోచించే కెపాసిటి
లేదు గాని కనీసం యోహాను గారు ఆ పుస్తకపు చుట్ట యొక్క ప్రాముఖ్యత అర్ధం చేసుకుని దానిలో
ఏమి వ్రాయబడి ఉందో తెలుసుకోవాలనే ఆత్రుత ఆయనలో కనిపిస్తుంది. అందుకే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు!
ప్రియ దైవజనమా! ఇలాంటి ఆశ జిజ్ఞాశ ఉందా నీకు? బైబిల్ గ్రంధములో దేవుడు అనేకమైన విషయాలు-జ్ఞానపరమైనవి-
ఆధ్యాత్మికమైనవి- ఆత్మీయ మైనవి- పరలోక సంబంధమైనవి ఎన్నెన్నో వ్రాసి ఉంచారు. మరి దానిని
చదవడానికి మరియు చదివి అర్ధం చేసుకోవాలని ఆశ నీకుందా? ఆశ గల ప్రాణాన్ని
దేవుడు తృప్తి పరుస్తారు! యోహాను గారికి ఆ ఆశ ఉంది. అందుకే భయంకరముగా ఏడుస్తున్నారు!
ఐదో
వచనంలో ఎప్పుడైతే ఇలా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారో-
24గురు పెద్దలలో ఒకరు అంటున్నారు- ఏడువకుము!
ఇదిగో దావీదుకు చిగురు అయిన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలు విప్పడానికి
జయము పొంది వస్తున్నాడు అని చెప్పారు!
గమనించాలి- యోహాను గారి కన్నీరుకి ప్రతిఫలం
కలిగింది! ఆ విధంగానే మనము కూడా కన్నీటి ప్రార్ధన ద్వారా దేవుని
నుండి కార్యాలు సాధించగలము! యోహాను గారు పరలోకంలో- ఎక్కడైతే కన్నీరు అనే మాట వినబడదో అక్కడ భయంకరముగా దేవుని హృదయం కరిగిపోయే
విధంగా ఏడ్చి కార్యాన్ని సాధించారు! మనము కూడా అటువంటి ప్రార్ధన-
ముఖ్యముగా కన్నీటి ప్రార్ధనతో కార్యాలు సాదిద్ధాము!
*పరలోకంలో
జరిగే సంభవాలు-7*
*ఏడు ముద్రలు- వధింపబడిన గొర్రెపిల్ల-2*
ప్రకటన 5:5
ఆ
పెద్దలలో ఒకడు ఏడువకుము;
ఇదిగో దావీదుకు చిగురైన (లేక, వేరైన) యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును
విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
ప్రియులారా! ఐదో వచనంలో పెద్దలలో ఒకరుచెప్పిన మాట జాగ్రత్తగా పరిశీలన చేస్తే- ఏడువకుము- ఇదిగో
దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంధమును విప్పుటకు జయము
పొందెను అని నాతొ చెప్పెను అంటున్నారు.
ఈ వచనంలో
ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటగా దావీదుకు చిగురు లేక వేరు;
రెండు: యూదా గోత్రపు సింహము;
దావీదుకు
చిగురు లేక వేరు- దీనికోసము మనము గతభాగాలలో నేర్చుకున్నాము! యేసుక్రీస్తుప్రభులవారికి
దావీదు కుమారుడు అనే పేరుంది. అందుకే సువార్తలలో కొందరు-
దావీదుకుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు..
మత్తయి 15:22; 20:31,32
ఇక
లూకా 1:26—౩౦ లో గబ్రియేలు దేవదూత అంటున్నాడు: ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన
దేవుని కుమారుడనబడును! ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు
సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములును
ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును అంటున్నారు.
ఇక్కడ కూడా ఆయన తండ్రియైన దావీదు సింహాసనము అంటున్నారు.
ఇక
యెషయా 11:10 లో ఆ కాలంలో తన ప్రజలకు ద్వజముగా నిలుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు
విచారణ చేయును అని వ్రాయబడింది.
దావీదు
గారి తండ్రి గారి పేరు యెష్షయి
దీనినే
పౌలుగారు ఎత్తి రాస్తున్నారు రోమా 15:12 లో .....
మరియు
యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలో నుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు
వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
కాబట్టి
యెష్షయి వేరు- చిగురు కూడా యేసుక్రీస్తుప్రభులవారు!
ఇక
యూదా గోత్రపు సింహము అంటున్నారు— ఇది యేసుక్రీస్తుప్రభులవారి
బిరుదులలో ఇది ఒకటి! ఒకసారి భక్తుడైన పితరుడైన యాకోబు గారు తన
అవసాన కాలంలో యూదాను గూర్చి ఏమని ప్రవచిస్తున్నారో చూద్దాం! ఆది
49:8—10
8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ
శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
9. యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని
వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను
అతని లేపువాడెవడు?
10. షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము
తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
షిలోహుకు
వచ్చువరకు యూదా దగ్గరనుండి రాజదండము తొలిగిపోదు! షిలోహు అనే పదానికి అర్ధము ఇప్పటికీ ఎవరికీ
తెలియదు! బహుశా నెమ్మది లేక విశ్రాంతి అంటారు. రాజదండము యూదా నుండే వస్తుంది అన్నారు. యూదా గోత్రములోనే
దావీదు గారు పుట్టారు. వారి సంతానం అనేక సంవత్సరాలు ఇశ్రాయేలు
ప్రజలను పాలించారు. యూదా రాజదండము అనగా యేసుక్రీస్తుప్రభులవారిని
సూచిస్తుంది.
కాబట్టి
మీదన చెప్పిన అన్ని రిఫరెన్సుల ప్రకారం దావీదు సింహాసనమునకు హక్కుదారుడు యేసుక్రీస్తుప్రభులవారు
అని గ్రహించాలి!
మరి
వధింప బడిన గొర్రె పిల్ల అంటారు- వధకు తేబడిన గొర్రెపిల్ల అంటారు మరి ఇక్కడ యూదా గోత్రపు
సింహము అని ఎందుకు అంటున్నారు?
చివరికి
బాప్తిస్మమిచ్చు యోహాను గారు కూడా లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు!
కారణం: అప్పుడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు
ఈ భూలోకమునకు వచ్చినప్పుడు కేవలం మానవులను విమోచించడానికి, రక్షణ
ప్రణాలిక నెరవేర్చి మన బదులుగా ఆయన చనిపోవడానికి వచ్చారు కాబట్టి వధకు తేబడిన గొర్రెపిల్లగా
వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు. ఇప్పుడైతే రక్షణ ప్రణాళిక నెరవేర్చి
సాతానుని జయించి సంపూర్ణత సాధించి ప్రజలను విమోచించారు కాబట్టి ఇప్పుడు యూదా గోత్రపు
సింహముగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా
రాబోతున్నారు. అప్పుడు బాధించబడినను నోరు తెరువలేదు గాని ఇప్పుడు
బాధించే వారిని ఇనుప దండముతో ఏలడానికి ఇనుప దండముతో నలుగగొట్టడానికి రాబోతున్నారు.
అప్పుడైతే సౌమ్యుడు- ఇప్పుడైతే ఉగ్రుడు!
అప్పుడు ప్రభావాన్ని మహిమను వదలి వచ్చారు- ఇప్పుడు
ప్రభావముతోను మహా మహిమతోను రాబోతున్నారు! అప్పుడైతే కేవలం మానవులలో
పరలోక రాజ్యమును అనగా మానవ హృదయాలలో దేవుని రాజ్యమును స్థాపించి భూమిమీద తన సంఘమును
స్థాపించడానికి వచ్చారు- గాని ఇప్పుడైతే తన ప్రత్యక్ష రాజ్యము
స్థాపించి ప్రజలను ప్రత్యక్షముగా ఏలడానికి వస్తున్నారు! అందుకే
ఇప్పుడు ఆయన యూదాగోత్రపు సింహము!!!!
ఇక
చివరగా అంటున్నారు: ఆయన జయించాడు: ఏమి జయించారు? మరణాన్ని-
పాపాన్ని-శాపాన్ని లోకాన్ని జయించి మృత్యుంజయుడై విజయోత్సవముతో
వస్తున్నారు మన యేసుక్రీస్తుప్రభులవారు! అందుకే పెద్దలలో ఒకరు
అంటున్నారు- యోహాను ఏడువకుము- ఇదిగో దావీదుకి
చిగురులేక వేరైన యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పడానికి జయము పొందారు.
ఆయన విప్పబోతున్నారు.
గమనించాలి
ప్రకటన ౩:21 లో ఆయన అంటున్నారు:నేను జయించి నా తండ్రితో పాటు ఆయన
సింహాసనము మీద ఎలా కూర్చోన్నానో.... ఇక్కడ చూస్తే నేను జయించాను.
మీరును జయించ మంటున్నారు!
ప్రియ
దేవుని బిడ్డా! నీకు జయజీవితం ఉందా? శోధనలలో జయిస్తున్నావా? మోకాళ్లమీద జయిస్తున్నావా? పాపమును జయిస్తున్నావా?
సాతాను మీద విజయం సాధిస్తున్నావా?!! జయించిన వారికే మేలులు కిరీటాలు దేవుడు
దాచిన బహుమతులు! శ్రమ దినమందు నీవు కృంగిన యెడల చేతకాని వాడి
వౌదువు అంటున్నారు సామెతల గ్రంధకర్త! మరినీకు జయజీవితం ఉందా?
లేకపోతే
నేడే జయించడం నేర్చుకో!
*పరలోకంలో
జరిగే సంభవాలు-8*
*ఏడు ముద్రలు- వధింపబడిన గొర్రెపిల్ల-3*
ప్రకటన 5:6—8
6. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
7. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.
8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను,
ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు
పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! 4 & 5 అధ్యాయాల నుండి పరలోకంలో
జరిగే సంగతులు లేక సంభవాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక ఆరవ వచనంలో సింహాసనమునకు ఆ నాలుగు
జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి యుండుట చూచితిని.
ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులును ఉండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అంటున్నారు.
ఈ వచనంలో
పెద్దలలో ఒకపెద్ద యోహాను గారికి ఏడువకుము దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము జయించి
విప్పడానికి వస్తున్నాడు ఆ ముద్రలు విప్పడానికి అని చెబితే యోహాను గారు చుట్టూ చూడగా
సింహాసనమునకు, 24గురు పెద్దలకు, నాలుగు జీవులకు మధ్యలో వధింపబడినట్లుండిన
గొర్రెపిల్ల కనబడెను అంటూ దానిని వివరించడం జరిగింది.
ఒకసారి
ఆగుదాం! పెద్దలలో
ఒకరు ఏమన్నారు? యూదా గోత్రపు సింహము ముద్రలు విప్పడానికి జయము
పొందాడు అంటే ఇక్కడ కనబడినది ఏమిటి? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల!
సింహము గొర్రెపిల్ల పిల్ల ఎలా అవుతుంది? గొర్రెపిల్ల
సింహము ఎలా అవుతుంది?
గతభాగంలో
చెప్పిన విధముగా ఆయన బలికార్యము ప్రాయశ్చిత్తము చేయడానికి గొర్రెపిల్లగా వచ్చారు మొదటి
రాకడలో! అందుకే
యోహాను 1:29, 36 లో బాప్తిస్మమిచ్చు యోహాను భక్తుడు రెండుసార్లు
ఇదిగో లోకపాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు...
ఆయన
వచ్చినపని అయిపోయింది. దేవకార్యము అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్య స్థాపన అనగా దేవుడే బహిరంగముగా
భూలోకము మీద రాజ్యాన్ని స్థాపించడానికి, దుష్టులకు ప్రతిదండన
చేయడానికి, భక్తులకు ప్రతిఫలము ఈయడానికి రెండో రాకడలో యూదాగోత్రపు
సింహముగా వస్తున్నారు. కాబట్టి ఆయన మొదట గొర్రెపిల్ల-
ఇప్పుడు యూదా గోత్రపు సింహము!!!
ఇక వధింపబడినట్లుండిన
అంటున్నారు—అది ఆయన శ్రమలను ఆయన సిలువ మరణమును సూచిస్తుంది.
యెషయా 5౩:7—8; మత్తయి 27:35; 50; యోహాను 20:25—27; అపో 2:23; ౩:15
లో ఆయన మరణమును దృవీకరించడము జరిగింది, ఇక యోహాను
20:25—27
లో ఆయన గాయాలకోసం చెప్పడం జరిగింది. అందుకే ఆయన
పొందిన గాయాల వలన మనము స్వస్థత పొందితిమి అని చెబుతున్నారు....
1పేతురు 2: 24
మనము
పాపముల విషయమై చనిపోయి,
నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు
స్వస్థత నొందితిరి.
ఇక గొర్రె పిల్లకు
ఏడు కొమ్ములు ఉన్నట్లు చూస్తున్నాము! గమనించాలి: బైబిల్ గ్రంధములో ఎక్కడైనా కొమ్ములు అని చెబితే
అధికారాన్ని బలాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఏడు కొమ్ములు అనగా ఏడు
రకాలైన అధికారములు ఆయనకు ఉన్నాయి అని అర్ధము! దేవుని ఏడు ఆత్మలు
ఎలాగో అలాగే దేవునిలో గల ఏడు విశిష్టమైన అధికరాలుకు ఈ కొమ్ములు సూచిస్తున్నాయి!
కీర్తన 89:17
వారి
బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
జెకర్యా 1:18—19
అప్పుడు
నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.
ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్న
దూతనడుగగా అతడు ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.
ఇక
ఏడు కళ్ళు కూడా ఉన్నాయి.
అవి భూమి అన్ని దిక్కులకు పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అని చెబుతున్నారు.
ఈ ఏడు ఆత్మలు కోసం ఈ గ్రంథంలో ఇప్పటికే అనేకసార్లు చెప్పుకున్నాము. ఏడు ఆత్మలు అనగా పరిపూర్ణుడైన పరిశుద్దాత్ముడిని
సూచిస్తున్నాయి.
కళ్ళు
కోసం చూసుకుంటే జెకర్యా గ్రంధంలో కూడా మనకు కళ్ళు కనిపిస్తాయి. 4:10 లో! అవి లోకమంతటా కలయ చూస్తున్న దేవుని కళ్ళు అని!..
కార్యములు
అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు
జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును.
సరే, ఏడవ వచనంలో వధించబడినట్లుండిన
గొర్రెపిల్ల అన్నమాట ఈ ఏడవ వచనంలో ఆయన వచ్చి సింహాసనమందు కూర్చున్న వాని కుడిచేతిలో
నుండి ఆ గ్రంధమును తీసుకొనెను అంటున్నారు! కాబట్టి ఇక్కడ ఆయన
అనగా యేసుక్రీస్తుప్రభులవారు!!!
ఆయనవచ్చి
తిన్నగా వెళ్లి సింహాసనము మీద కూర్చుని యున్న తండ్రియైన దేవుని కుడిచేతిలో ఉన్న ముద్రించబడిన
ఆ పుస్తకపు చుట్టను తీసుకున్నారు!.
బైబిల్
గ్రంధములో చెప్పబడిన/ వ్రాయబడిన విశిష్టమైన సందర్బాలలో ఇది ఒకటి! గమనించాలి-
ఈ సంధర్బంలో యోహాను గారు కన్నీరు మున్నీరుగా పరలోకంలో విలపిస్తున్నారు-
ఆ పుస్తకపు చుట్టను విప్పడానికి ఎవరూ లేరే అంటూ. పరలోకం నిశ్శబ్దం అయిపోయింది. ప్రపంచము, సృష్టి, పరలోకము ఏమి జరుగుతుందో అని ఆందోళనలో ఉన్నప్పుడు
ఒక సాదుశీలమైన గొర్రెపిల్ల వచ్చి సంపూర్ణమైన అధికారంతో, ధైర్యంతో
ఆ సింహాసనం సమీపించి, అంత దేదీప్యమైన మహా ప్రభావము గలవానిని సమీపించి
ఆయనచేతిలో నుండి ఈపుస్తకాన్ని తీసుకున్నారు ఈ యూదాగోత్రపు సింహము!
వెంటనే పరలోకం అంతటా
స్తుతులు కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి! అదే ఈ 8, 9 వచనాలు చెబుతున్నాయి. ..
8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను,
ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు
పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
9. ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక,
రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
...
24గురు పెద్దలు,
నాలుగుజీవులు సాగిల పడ్డారు! తర్వాత వారి దగ్గర ఉన్న తంతివాయిధ్యాలతో అనగా గిటార్ సితార లాంటి తీగెలు గల
వాయిద్యాలతో పాటలు పాడుతున్నారు. 24గురు పెద్దల దగ్గర ధూప ద్రవ్యములతో
నిండిన సువర్ణ పాత్రలున్నాయి. వారంతా యేసుక్రీస్తుప్రభులవారిని స్తుతించడం మొదలుపెట్టారు!
ఆ గొర్రెపిల్ల ఎదుట
అందరూ సాగిలపడ్డారు!
మరి అంతటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న
నీవు అయన ఎదుట సాగిలపడుతున్నావా? ఆయనకు నమస్కరిస్తున్నావా?
ఆయనకు చెందాల్సిన గౌరవం ఆయనకు ఇస్తున్నావా?
*పరలోకంలో
జరిగే సంభవాలు-9*
*ఏడు ముద్రలు- వధింపబడిన గొర్రెపిల్ల-4*
ప్రకటన 5:8—14
8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను,
ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు
పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
9. ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక,
రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
10. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి
యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.
12. వారు వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును
బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
13. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము,
అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును
స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని.
14. ఆ నాలుగు జీవులు - ఆమేన్ అని చెప్పగా
ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! 4 & 5 అధ్యాయాల నుండి పరలోకంలో
జరిగే సంగతులు లేక సంభవాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
ఎనిమిదో వచనంలో గొర్రెపిల్ల ఎదుట
సాగిలపడిరి అంటున్నారు! అనగా గొర్రెపిల్లను ఆరాధించారు అన్నమాట!
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పరలోకంలో తండ్రియైన దేవుని ఎదుట గొర్రెపిల్ల
అయిన యేసుక్రీస్తుప్రభులవారిని 24గురు పెద్దలు, నాలుగు జీవులు అందరూ ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తుప్రభులవారు
దేవుడు కాకపోతే ఇక్కడ వారు ఎందుకు ఆయనను పూజిస్తారు? అందుకే హెబ్రీ
1:6 లో దేవదూతలందరూ ఆయనను ఆరాధించాలి అంటున్నారు...
తండ్రియైన దేవుడు
యెషయా గ్రంధంలో నాకు చెందవలసిన ఆరాధన మరెవరికీ చెందనివ్వను! యెషయా 42: 8
యెహోవాను
నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును
విగ్రహములకు చెంద నియ్యను.
దేవుణ్ణి నేనే మరి
ఏ దేవుడు లేరు అన్నారు కదా... నిర్గమ 20:3—5
మరి
ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారిని ఈ 24గురు పెద్దలు, నాలుగు జీవులు
అందరూ పూజిస్తుంటే వారించాలి కదా! దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది
అంటే యేసుక్రీస్తుప్రభులవారు త్రిత్వములో ఐక్యమై ఉన్నారు! అంతేకాకుండా
ఈ భూలోకంలో అనేకమందికి తెలియని విషయం పరలోకంలో ఉన్నవారందరికీ తెలుసు! అది ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు!
అందుకే
యోహాను 5:23 లో అంటున్నారు...
తండ్రిని
ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి
అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
ఫిలిప్పీ 2:6
ఆయన
దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
యెంచుకొనలేదు గాని....
ఇక ఈ వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయం
ఏమిటంటే 24గురు పెద్దల చేతులలో బంగారపు దూప పాత్రలున్నాయి.
ఇంకా ఆ దూపము ఏదో కాదు- పరిశుద్ధుల ప్రార్ధనలు
అంటున్నారు. నిర్గమ ౩౦:1, 7; ౩4—38 వచనాలలో దూపము కోసం, ధూప
ద్రవ్యములు ఎలా అర్పించాలి ఎలా తయారుచెయ్యాలి అనేది రాసిఉంది. గాని కీర్తనాకారుడు ఆత్మావేశుడై అంటున్నారు
141:2 లో నా ప్రార్ధన నీకు ధూపము గాను, నేను చేతులెత్తుట
నైవేద్యంలా నీకు అంగీకారమగును గాక అంటున్నారు. అనగా ఇక్కడ ప్రార్ధన
అనేది ధూపము అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు! దానినే
ఇక్కడ యోహాను గారు చెబుతున్నారు ఆత్మావేశుడై అవి పరిశుద్ధుల ప్రార్ధనలు! గమనించాలి- భూలోకంలో ప్రార్ధనలు దేవునికి చాలా ఇంపైనవి!
అవి పరిశుద్ధుల ప్రార్ధనలైతే అవి దేవునికి నైవేద్యం- ధూపములా ఉంటాయి. అవి దేవునికి ఇష్టం! అందుకే మానక ప్రార్ధన చెయ్యండి అంటున్నారు. ఎడతెగక ప్రార్ధనలు
చెయ్యండి అంటున్నారు.
మరి నీవు చేస్తున్నావా ప్రార్ధన!
హృదయ పూర్వకమైన
ప్రార్ధన చేస్తున్నావా! కన్నీటి ప్రార్ధన చేస్తున్నావా? నిజమైన ప్రార్ధన చేస్తున్నావా?
లేక ఏదో చెయ్యాలి కాబట్టి రెండు ముక్కలు చేసి ఆమెన్ అంటున్నావా?
గమనించాలి- ఈ ప్రార్ధనలు అనగా పెద్దల చేతిలో ఉన్న
ఆ ప్రార్ధనలకు ఏమి జరిగిందో మనకు 8:౩ లో తెలుస్తుంది.
ఆ పరిశుద్ధుల ప్రార్ధనలతో బలిపీఠం మీద నున్న నిప్పులు కలిసి దేవుని సింహాసనం
ఎదుట ఉన్న బంగారు దూపవేదిక మీద అర్పించబడతాయి. అనగా దేవుని ఎదుట
ఈ ప్రార్ధనలు చేరతాయి. సమయం వచ్చినప్పుడు ఈ ప్రార్ధనలతో బలిపీఠం
మీదనున్న నిప్పులు రెండు కలిసి భూమిమీద ఉగ్రతగా క్రుమ్మరించబడతాయి! ప్రార్ధనకు అంత బలము ఉంది!
యాకోబు 5: 16
మీ
పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి.
నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.
అయితే అసలు ముద్రలు
విప్పడానికి ఆ ప్రార్ధనలకు అనగా ధూపపాత్రలకు సంబంధం ఏమిటి అనగా ఆ ముద్రలు విప్పడానికి
పరిశుద్ధుల ప్రార్ధనలు కూడా కొంత ప్రాముఖ్యత చూపించినట్లు తెలుస్తుంది.
ఇక తొమ్మిదో వచనం
నుండి 14వ వచనం వరకు ఆ గొర్రెపిల్లను
అనగా యేసుక్రీస్తుప్రభులవారిని స్తుతిస్తూ ఆరాదిస్తున్నట్లు చూడగలం!
తొమ్మిదో
వచనంలో క్రొత్త పాత పాడుతున్నారు ఏమని అంటే: నీవు గ్రంధమును తీసుకొని దాని ముద్రలను విప్పడానికి
యోగ్యుడవు, ఎందుకంటే నీవు వదించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతీ
వంశములోను ఆయా భాషలు
మాట్లాడువారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా
దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులు గాను చేశావు. వారు భూలోకమందు
ఏలుతారు అంటున్నారు. మరికొన్ని ప్రతులలో మా దేవునికి వారిని రాజులుగాను
యాజకులు గాను చేశావు కాబట్టి వారు భూలోకమును ఏలుతారు అని వ్రాయబడింది! ఇదీ వారి క్రొత్త పాట!
ఆ ముద్రలు
విప్పడానికి నీవే యోగ్యుడవు ఎందుకంటే నీవు ఆ యోగ్యత సంపాదించడానికి నీ ప్రాణమును అర్పించావు, నీవు ప్రతి జనము నుండి ప్రతి
ప్రజ నుండి ఆయా భాషలు మాట్లాడువారి నుండి దేవునికి ప్రజలను కొన్నావు! దేనితో కొన్నావు అంటే నీ సొంత రక్తముతో కొన్నావు! అందుకే
అపోస్తలుల కార్యములలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నారు.
20:28
మత్తయి 28:19 లో, ఇంకా మార్కు 16:15లో మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి
అని ఆజ్ఞాపిస్తే శిష్యులు ఆజ్ఞను పాటించి సువార్త ప్రకటిస్తే ఇప్పుడు వారు ఆ సువార్తను
అంగీకరించారు. వారందరినీ యేసయ్య తన రక్తముచేత కొన్నారు!
పేతురు గారు అంటున్నారు: వెండి బంగారువంటి వెలగల వస్తువుల
చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తముచేత విమోచించబడ్డారు...1పేతురు 1:18—19
1కొరింథీ 6:20
విలువపెట్టి
కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు నేను వెలపెట్టి కొనబడిన వారము!
దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నారు! వెండి బంగారులాంటి
వస్తువులతో కాదు- ఆయన యొక్క అమూల్యమైన రక్తముచేత కొన్నారు!
కాబట్టి నీ దేహము దేవుణ్ణి ఆరాధించడానికే గాని నీ లోకాశలు శరీరాశలు తీర్చుకోడానికి
కానేకాదు! అందుకే నీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచాలి!
సరే, ఇక వారు అంటున్నారు:
నీవు విమోచించిన వారు మా దేవునికి ఒక రాజ్యముగాను ఇంకా రాజులుగాను యాజకులుగాను
ఉన్నారు. ఇలా
విమోచించబడిన వారు భూమిమీద ఏలుతారు. ఇలా
పరిపాలించడం కోసం గతంలో అనేకసార్లు మనము ధ్యానం చేసుకున్నాము!
ప్రకటన
౩:21; 20:4,6;
2తిమోతి 2:12; మత్తయి 19:28; లూకా
22:29,౩౦.
అయితే
ఈ పరిపాలించడం వెయ్యేండ్ల పాలనలో జరుగుతుంది.!
ఇక
పదకొండో వచనంలో మనకు మరొకటి కనిపిస్తుంది. ఏమిటంటే సింహాసనం, నాలుగు జీవులు,
24గురు పెద్దలు కాకుండా వేలాది కోట్ల సంఖ్య గల దేవదూతలు వీరందరి చుట్టూ ఉండి వారు కూడా గళమెత్తి
స్తుతిస్తున్నారు : వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును
జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందడానికి అర్హుడు అని అంటున్నారు!
గమనించాలి:24గురు పెద్దలు, నాలుగు జీవులు నీవు యోగ్యుడవు అంటే- ఈ కోటానుకోట్ల దూతలు
అయ్యా- నీవు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు
ఘనతయు పొందటానికి అర్హుడవు! అవును ఆయన అర్హుడు! అందుకే ఆయనను స్తుతించాలి!
ఎందుకు
ఇలా స్తుతిస్తున్నారో మనకు ప్రకటన 4:11 లో చెబుతున్నారు...
ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి
యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు
పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.
ఈ మాట
చెప్పిన దూతలు చెప్పిన తర్వాత 13వ
వచనంలో పరలోకంలోనూ భూలోకంలోను భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతీ జీవి అనగా వాటిలో
ఉన్న సర్వమును సమస్తమును సింహాసనాసీనుడైన వానికిని మరియు గొర్రె పిల్లకు స్తోత్రమును
ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెబుతున్నారు!
ఇప్పుడు
పరలోకంతో పాటుగా భూమి, ఆకాశాలు, భూమి క్రింద ఉన్నవి భూమిమీద ఉన్నవి సముద్రంలో
ఉన్నవి అందరూ స్తుతించడం మొదలుపెట్టారు! అయ్యా సింహాసనం మీద ఉన్నవాడా
అనగా తండ్రియైన దేవా, గొర్రెపిల్ల అనగా కుమారుడైనా దేవా మీకు
స్తోత్రమును, ఘనతయు, మహిమయు ప్రభావమును
యుగయుగములును కలుగును గాక అంటున్నారు! అవును ఆమెన్!
వెంటనే
చివరి వచనంలో ఆ నాలుగు జీవులు కూడా అవును ఆమెన్ అంటున్నారు అలా అనడమే కాకుండా సాగిలపడి
నమస్కారం చేశారు!
ఈ లోకంలో
ఉన్న అందరూ ఆయనను స్తుతించే గడియ దగ్గరలో ఉంది! నీవు కూడా ఆరోజు అలా స్తుతించాలి అంటే నీ బ్రతుకు
దేవునికి అంగీకారముగా ఉండాలి! ఆయన రాకడ సిద్దముగా ఉంది!
మరి నీవు అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఎలా జీవిస్తున్నావు?
ఆయనను
మనస్పూర్తిగా స్తుతిస్తున్నావా?
ఆయన ఎదుట నీ ప్రవర్తన మాటలు ఆలోచనలు
అన్నీ సరిగా ఉన్నాయా?
లేకపోతే విడువబడతావు జాగ్రత్త!
నేడే మార్పునొంది
ఆయనతో సమాధాన పడు!
*ఏడు ముద్రలు-1*
ప్రకటన 6:1—2
1. ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు
జీవులలో ఒకటిరమ్ము అని (కొన్ని ప్రాచీన ప్రతులలో- వచ్చిచూడుము అని పాఠాంతరము) ఉరుమువంటి స్వరముతో చెప్పుట
వింటిని.
2. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను;
దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.(లేక, జయశాలిగా)
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! ఇంతవరకు 4 & 5 అధ్యాయాల నుండి పరలోకంలో జరిగే సంగతులు లేక సంభవాలు కోసం ధ్యానం చేసుకున్నాము!
ఇక మనము ఆరవ అధ్యాయంలో ఉన్న ఏడు ముద్రలు కోసం ధ్యానం చేసుకుందాం!
ఏడు ముద్రలు మొదలుపెట్టేముందు
అసలు ఈ ముద్రలు ఎందుకు అని ఆలోచిస్తే-
ఒక తండ్రి తన ఆస్తి మొత్తం ఎవరికీ చెందాలో విల్లు రాసి భద్రపరచినట్లు
ఉంటుంది. ఒక్కో ముద్ర
విప్పినప్పుడు ఒక్కో విషయం బయలుపడుతుంది అన్నమాట! అసలు ఈ విల్లులో
ఏమి వ్రాయబడి ఉందో అని మన యోహాను గారు ఎంతో బాధపడి చివరికి ఏడ్చారు! ఇప్పుడు పరలోకంలో గొప్ప స్తుతులకు ఆనందానికి కారణమైన ఈ పుస్తకపు చుట్ట మన ఎదుట
విప్పబడి ఉంది.
దీనికోసం
ఒక స్టడీ బైబిల్ లో ఆ భక్తుడు ఇలా వివరిస్తున్నాడు: యూదులలో ఆస్తిహక్కు లను స్థిరపరచడానికి తమ దస్తావేజులను
ఇదే విధంగా ముద్రలువేసి ఉంచేవారు. ఉదాహరణకు యిర్మియా గారు చెరసాలలో
ఉన్నప్పుడు తన పినతండ్రి కుమారుని ఆస్తి కొని దస్తావేజులను దాచిఉంచినట్లు యిర్మియా
32:9—14 ప్రకారం!! ఈ ఏడు ముద్రలు వేసిన పుస్తకపు చుట్ట కూడా బహుశా భూలోకంపై యేసుక్రీస్తుప్రభులవారి
హక్కు మరియు అధికారణం స్థిరపరిచే దస్తావేజు కావచ్చు! దీనికోసం
తన ప్రాణాన్నే అర్పించాడు ఆయన భూలోకంలో! ఇప్పుడు హక్కుదారుడు
అయ్యాడు! తన హక్కును స్వతంత్రించు కోబోతున్నాడు! నిజానికి భూలోకాన్ని
స్వంతం చేసుకుని పరిపాలించే హక్కు ఆయనకు ఉంది! కారణం రూతుగ్రంధంలో
మనకు కనబడుతున్న సమీపబంధువుడు (kinsman Redeemer) ఆయనే!
అందుకే యిర్మియా 32:11 లో ఎలా ఒప్పందం గల దస్తావేజు,
షరతులు గల దస్తావేజు ముద్రగలది ముద్రలేనిది అన్ని పత్రాలు ఇప్పుడు ఈయన
చేతికి వచ్చాయి.
తానేకాదు- మత్తయి
28:18--20, మార్కు 16:15—18
వరకు చెప్పబడిన ప్రకారం ఎవరైతే తనమాట విని రక్షణ పొంది తనవారుగా మార్చబడ్డారో
వారందరూ తనతోపాటుగా తనకు వచ్చిన తన ఆస్తిని వారసత్వంగా స్వంతం చేసుకుంటారు.
మరియు పాలిస్తారు!
మత్తయి 21:38 లో ఎవరికీ చెందకూడదు
ఈ అస్తి అనుకున్నారో- వారికే చెందుతుంది ఇప్పుడు....
మత్తయి 21: 38
అయినను
ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము
చెప్పుకొని
మత్తయి 21: 39
అతని
పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
అందుకే
హెబ్ర్రీ 1:2, 13 లో అంటున్నారు....
2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన
ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను
(మూలభాషలో- యుగములను) నిర్మించెను.
13. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున
కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?
హెబ్రీయులకు 10: 13
అప్పటినుండి
తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున
ఆసీనుడాయెను.
అంతేకాదు ప్రజలను
కూడా భాగస్తులను చేస్తాడు రోమా 8:17 ప్రకారం...
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి
వారసులము.
ఇది మనకు ప్రకటన 19—21 అధ్యాయాలలో నిజమవుతుంది.
సరే, 6—19
అధ్యాయాలలో గల విషయాలు ఈ యుగాంతానికి కొన్ని రోజులు ముందు జరుగుతాయి
అని గ్రహించాలి. అయితే ఒక విషయం ముద్రలు గాని, బూరలు గాని, పాత్రలు గాని అవన్నీ రాబోయే విపత్తులే అయినా
గాని అవన్నీ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తుప్రభులవారి వశంలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి!
ఇక
మొదటి వచనంలో గొర్రెపిల్ల ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా.... అని మొదలు పెడుతున్నారు.
ఇక్కడ జాగ్రత్తగా గమనించ వలసిన విషయం ఏమిటంటే: యూదా గోత్రపు సింహము ఈ ముద్రలు గల పుస్తకపు చుట్టను వశం చేసుకోలేదు గాని గొర్రెపిల్ల
స్వాధీనంచేసుకుని విప్పుతున్నట్లు చూస్తున్నాం! ఏం గొర్రెపిల్లఎ
ఎందుకు విప్పాలి అంటే: కారణం గొర్రెపిల్లయే కదా, హింసలు పడింది, శ్రమలను అవమానాలను ఓర్చినది. చివరికి లోకపాపములు మోసుకొని పోవు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఆ కలువరి
సిలువలో వధించబడి మృత్యుంజయుడై లేచినది! భూలోకమందును పరలోకమందును
నాకు సర్వాధికారమీయబడెను అని ధైర్యంగా చెప్పినది కూడా గొర్రెపిల్ల కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల
ముద్రలను విప్పుతున్నట్లు గమనించాలి!
ఇక
ఎప్పుడైతే మొదటి ముద్రను గొర్రెపిల్ల విప్పెనో- నాలుగు జీవులలో ఒకరు ఉరుమువంటి స్వరముతో ఇక్కడికి
ఎక్కి రా లేక వచ్చి చూడుము అంటున్నారు. గత అధ్యాయంలో యోహాను గారికి
సహాయం చేసినది- 24గురు పెద్దలలో ఒకరైతే ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకు
నాలుగు జీవులు సహాయం చేస్తున్నాయి.
వచ్చి చూడు- అని అనుమతినిస్తున్నారు పరలోకంలోనికి
యోహాను గారికి! వీరికి కూడా దేవుని హృదయం తెలుసు కాబట్టి-
దేవుని హృదయాన్ని అర్ధం చేసుకుని యోహాను గారికి దేవుని పక్ష్యంగా ఆహ్వానం
పలుకుతున్నారు. రాబోయే సంఘటనలు అన్నీ పరలోకంలో అనుమతి ప్రకారం, పరలోకం అదుపులో జరుగుతాయి అన్నమాట!
ఈ సర్వసృష్టి
ఆయన ఆధీనంలో ఉంది. భూమి ఆకాశం, సముద్రం, పక్షులు జంతువులూ
అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి! ఆయన చేతితో తయారుచేయబడిన
నీవు- ఆయన ఊపిరిని నీ ఊపిరిగా బ్రతుకుతున్న నీవు నేను-
ఆయన స్వాధీనంలో ఉన్నామా? మనలో ఎంతమంది ఆయనంటే లెక్కలేకుండా
తిరుగుతున్నారు బ్రతుకుతున్నారు??!! ఒకరోజు నీవు దేవుని తీర్పు
సింహాసనం ముందు నిలబడతావు అని మర్చిపోతున్నావు! దయచేసి ఇప్పుడైనా
బ్రతుకు మార్చుకుని ఆయనకు ఇష్టంగా నీ బ్రతుకును ప్రవర్తనను చూపులను ఆలోచనలను మార్చుకోమని
ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
*ఏడు ముద్రలు-2-- మొదటి ముద్ర*
ప్రకటన 6:1—2
1. ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు
జీవులలో ఒకటిరమ్ము అని (కొన్ని ప్రాచీన ప్రతులలో- వచ్చిచూడుము అని పాఠాంతరము) ఉరుమువంటి స్వరముతో చెప్పుట
వింటిని.
2. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను;
దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను. (లేక, జయశాలిగా)
ఇక రెండో
వచనంలో మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను. దానిమీద కూర్చున్న వాడు విల్లు
పట్టుకుని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడింది. అతడు జయించుచు ఇంకా జయించుటకు బయలుదేరెను అంటున్నారు.
ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన
అవసరం ఉంది! తెలుపు శాంతికి చిహ్నం! ఇక్కడ
ఈయబడిన వివరణ చూసి చాలామంది- తెల్లగుర్రం దానిమీద కిరీటం గలవాడు
అంటున్నారు కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు అని భ్రమ పడతారు! 19వ అధ్యాయంలో కూడా మనకు తెల్లని గుఱ్ఱం కనిపిస్తుంది. దానిమీద కూర్చున్న వారు- యేసుక్రీస్తుప్రభులవారు.
అయ్యా గమనించాలి- ఇది జరుగుతున్నప్పుడు ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు
అనే గొర్రెపిల్ల ముద్రలు విప్పుతున్నారు పరలోకంలో! ఇక్కడ కూర్చున్నది
మాత్రం శాంతి శాంతి అంటూ వచ్చి అందరిని మోసగించబోయే క్రీస్తువిరోధి అని గ్రహించాలి!
సాతానుడు తానే వెలుగుదూత వలే వచ్చి మోసగిస్తున్నాడు అంటూ వ్రాయబడింది.
అలాగే వీడు కూడా సర్వమత సమ్మేళనం, ప్రపంచ శాంతి-
భూమిమీద యుద్ధాలు జరుగకూడదు- శాంతి శాంతి అంటూనే
శాంతి జపం చేస్తూ ఇచ్చకపు మాటలతో సమస్త దేశాలను తనకు అనుకూల పరచుకుని తన వశం చేసుకుంటాడు! చివరికి దానిలో విజయం సాధిస్తాడు!
రెండవ థెస్సలొనీకయులకు 2:3,4,5,6,7,8
3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు)
పాపపురుషుడు (ధర్మవిరుద్ధ పురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే
హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు,
దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ
నియ్యకుడి.
5. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
6. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.
7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.
8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత
వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
1యోహాను 2: 18
చిన్న
పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా
ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది
కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
కాబట్టి వీడు క్రీస్తు
విరోధి అని గ్రహించాలి!
అయితే మిగతా ముద్రలలోనికి
వెళ్లేముందు రెండు విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను!
మొదటిది: ఇక్కడనుండి అనగా ఆరవ అధ్యాయం
నుండి 19వ అధ్యాయం వరకు జరిగే సంఘటనలు లేక సంభవాలు అన్నీ వరుస
క్రమంలో లేవు అని గ్రహించాలి! ఒకవేళ ఒకే వరుసలో ఉన్నాయి అని తలస్తే
ఈ మర్మముల గ్రంధమైన ప్రత్యక్ష్యతల గ్రంధమును అర్ధం చేసుకోలేము! యోహాను గారికి దేవుడు కొన్ని అధ్యాయాలు
చూపించి- తర్వాత అది బాగా అర్ధం చేసుకోవడానికి మధ్యలో వివరణ ఇస్తూ
ఉండేవారు.
ఉదాహరణకు మొదటగా: ఈ క్రీస్తువిరోది మనకు ఎక్కడ కనిపిస్తున్నాడు?
ప్రకటన 13వ అధ్యాయంలో కనిపిస్తాడు! గాని మొదటి ముద్ర విప్పిన వెంటనే వాడు విడుదల అయినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముందుభాగాలలో చెప్పిన విధముగా
6—11 అధ్యాయాలు మనకు యూదుల కోణంలో
అంత్యదినాలలో జరిగే సంభవాలు. 12—18 అధ్యాయాలు సంఘపు కోణంలో జరిగే
సంభవాలు! రెండూ ఒక్కటే- గాని వివిధమైన కోణాలలో
వివరించడం జరిగింది! ఇక్కడ 6:2 లో చెప్పిన
వివరణ 13వ అధ్యాయంలో సంఘపు కోణంలో వాడు ఎలా వస్తాడు- క్రీస్తు స్థానాన్ని మారువేషం వేసుకుని ఎలా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి
సఫలం అవుతాడో వివరించబడింది.
ఇక
రెండవ ఉదాహరణ: ఆరవ అధ్యాయంలో జరిగిన సంభవాలు తరువాత వెంటనే ఏడవ అధ్యాయంలో సంభవాలు జరుగవు!
ఆరవ అధ్యాయంలో జరిగిన సంభవాలు ఎలా సంభవిస్తున్నాయో దర్శనాన్ని ఆపి-
ఏడవ అధ్యాయంలో వివరిస్తున్నారు దేవుడు! ఎందుకు
అంటే దర్శనాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి! ఇలా పరుమార్లు పలు
అధ్యాయాలలో మనకు కనిపిస్తుంది. దర్శనం ఆగిపోయి- దర్శనాన్ని వివరించడం జరుగుతుంది.
ఇక మరో
ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: ఈ ఆరవ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి ఐదు ముద్రలు పూర్తి కాబడి ఆరవ
ముద్ర విప్పకముందే మహాశ్రమల కాలం పూర్తి అయిపోతుంది.
మహాశ్రమల
కాలం అయిపోయిన వెంటనే రాకడ రావడం లేదు! దేవునితీర్పు కాలం అనబడే ప్రభువుదినము మొదలవుతుంది.
మహాశ్రమల కాలంలో మొదటి అర్ధభాగం అన్యజనులలోనుండి వచ్చిన విశ్వాసులకు
శ్రమలు కలుగుతాయి! ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు విరోధితో ఉంటారు
కాబట్టి వారికి ఎటువంటి శ్రమలు కలుగవు!
*మహాశ్రమల కాలము అనగా దేవునిబిడ్దల
మీద సాతానుడు- క్రీస్తు విరోధి మరియు వాడి అనుచరులు కలిగించే
బాధలు*! *ప్రభువుదినము లేక యెహోవాదినము అనేది దేవుడు యెషయా గ్రంధంలో,
యిర్మియా యెహెజ్కేలు జెఫన్యా మలాకి తదితర గ్రంధాలలో, పౌలుగారు రాసిన పత్రికలలో చెప్పబడిన దుష్టుల మీద మరియు క్రీస్తువిరోధి వాడి
అనుచరుల మీద దేవుడు కుమ్మరించే ఉగ్రత*!
మహాశ్రమల
అర్ధభాగంలోనే ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళికలో భాగంగా ఇద్దరు సాక్షులు వస్తారు! వారి ప్రవచన పరిచర్య మూలంగానే
ఇశ్రాయేలు ప్రజలలో ముద్రించబడే 144౦౦౦ మంది రక్షించబడతారు!
వారే రెండవ అర్ధభాగంలో మహాశ్రమలనుండి తప్పించబడి ఎక్కడో పోషించబడతారు!
రెండవ
అర్ధభాగంలో వాడు దేవుడు అనబడే ప్రతీవాటిమీద తననుతాను హెచ్చించుకుని దేవాలయంలో నాశనకరమైన
హేయవస్తువు నిలబెట్టిన తర్వాత యూదులు వాడిని తిరస్కరిస్తారు! కొందరు చెబుతున్నట్లు వాడిని
అనగా ఏడవ నియంత అయిన క్రీస్తువిరోధిని బహుశా చంపుతారు. వాడే అగాధం నుండి చావుదెబ్బ తిని
బాగుపడిన మృగంగా – మరియు ఎనిమిదవ నియంతగా వచ్చి-
ఇశ్రాయేలు ప్రజలకు శోధనలు శ్రమలు కలిగిస్తాడు. దానియేలు గ్రంధము ప్రకారము మరియు ప్రకటన గ్రంధం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు కాలము
కాలములు అర్ధకాలము లేక నలుబది రెండు నెలలు లేక 1260 వాడిచేతులలో హింసించ బడతారు.
మహా
శ్రమలకాలం అయిపోయింది. అయితే ప్రకటన గ్రంధం 6వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే
అయిదు ముద్రలకాలంలో మహాశ్రమలకాలం పూర్తి అయిపోతుంది. అనగా ఐదుముద్రలతో
మహాశ్రమలకాలం పూర్తి అయిపోతుంది. ఎందుకంటే ఆరవ ముద్ర విప్పినప్పుడు
సూర్యుడు కాంతి తగ్గిపోతుంది చంద్రుడు ఎర్రగా మారిపోతాడు! ఇది
జాగ్రత్తగా పరిశీలిస్తే మత్తయి 24:29 లో సంభవించబోయే సంభవం!
అక్కడ చాలా స్పష్టముగా శ్రమలు ముగిసిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును
చంద్రుడు కాంతిని ఈయడు అని వ్రాసి ఉంది, చెప్పింది యేసుక్రీస్తుప్రభులవారు,
35వ వచనం ప్రకారం ఆకాశం భూమి గతించినా నామాటలు గతించవు అని చెప్పారు
కాబట్టి ఆరవ ముద్ర సమయానికి మహాశ్రమలు పూర్తి అయిపోతాయి అన్నమాట!
ఇక
ఏడవ ముద్రతో దేవుని తీర్పులు అనబడే ప్రభువుదినము లేక యెహోవా దినము ప్రారంభమవుతుంది.. అయితే ప్రభువుదినము అనేది
ఒక్కరోజులో లేక రెండు రోజులలో అయిపోవడం లేదు! యూదుల కోణంలో దేవుని
తీర్పులు అనబడే ఏడుబూరలు , సంఘపు కోణంలో దేవుని తీర్పులు అనబడే
ఏడు పాత్రలు జరుగుతాయి. ఇవి పూర్తి కావడానికి అయిదు నెలలు గాని
లేక 45/75రోజులు గాని పడుతుంది. అయిదునెలల
కాలము ఎందుకంటే తొమ్మిదో అధ్యాయంలో ఐదో బూర ఊదిన తర్వాత మిడతలు వస్తాయి. వాటికి నరులను బాధించడానికి అయిదునెలలు పర్మిషన్ ఉంది. ఇక 45 రోజులు ఎందుకంటే- దానియేలు
12వ అధ్యాయం ప్రకారం 1290 రోజులు అనగా
43 నెలలు పరిశుద్ధ స్థలం త్రొక్కబడుతుంది. ఇశ్రాయేలు
ప్రజల బలం కొట్టివేయబడుతుంది. అనగా మూడున్నర సంవత్సరాలు.
గాని 12వ వచనంలో 1335 రోజులు
తాళుకొనువాడు ధన్యుడు అంటున్నారు. అంటే మహాశ్రమలు ముగిసాక మరో
45/75 రోజుల వరకు దేవుని ఉగ్రతా కాలం ఉంటుంది. ఈ 45/75 రోజులలో
దాచబడిన ఇశ్రాయేలు ప్రజలు మరియు అదివరకే హింసలు పొందుచున్న బ్రతికి ఉన్న ఇశ్రాయేలు
ప్రజలు ఇశ్రాయేలు దేశంలో ఉంటారు. అక్కడ తాళుకొనువాడు ధన్యుడు
అంటున్నారు అంటే బహుశా ఈ 45/75 రోజులు కూడా వాడు వీరిని హింసించడానికి
ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు! అంతేకాదు ఏర్పరచబడిన వారికోసం ఆ దినములు
తక్కువ చేయబడతాయి అని వ్రాయబడిన ప్రకారం
ఏ దినములు- శ్రమలకాలం తక్కువ చేయబడుతుంది బహుశా ఈ 5 నెలల కాలం గాని 45 రోజులు కాలం గాని మహా శ్రమల కాలంలో
కుదింపు చేయబడవచ్చు! లేదా మూడున్నర సంవత్సరాల కాలం కుదించబడవచ్చు! ఇదే 45/75 రోజులలో
అక్కడ ఉజ్జీవం కలుగుతుంది. అప్పుడు జెకర్యా గ్రంధం 12వ అధ్యాయంలో చెప్పబడిన విధముగా విలపిస్తారు. అప్పుడు
144౦౦౦ మంది ముద్రించబడిన వారు మరియు విలపించి పశ్చాత్తాప పడిన ఇశ్రాయేలు
ప్రజలు మొత్తం అందరూ రక్షించబడతారు రోమా 11:27 ప్రకారం!
వెంటనే దేవుడు వారి పక్షముగా యుద్ధము చేయడానికి వస్తారు ఒలీవల కొండమీదికి!
అదే రెండవరాకడ!
అయ్యా! నాకు ఇదీ నాకు అర్ధమయ్యింది నేను గ్రహించింది
మాత్రమే నేను రాస్తున్నాను! దీనితో మీరు ఏకీభవిస్తే ఏకీభవించవచ్చు
లేకపోతే వదిలెయ్య వచ్చు! అయితే ఇలానే జరుగుతుంది అని చెప్పకూడదు!
ఇది మీకు రాబోయే సంఘటనలు
బాగా అర్ధం చేసుకోవాలని ముందుగానే వివరిస్తున్నాను!
ఆ క్రీస్తు విరోధి
రాకడ అతి దగ్గరలో ఉంది. మరి
ఆయన రహస్య రాకడ అంతకంటే ముందుగానే వస్తుంది. మరి నీవు ఎత్తబడటానికి
సిద్దంగా ఉన్నావా?
*ఏడు ముద్రలు-3-- రెండవ ముద్ర*
ప్రకటన 6:౩—4
3. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
4. అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు
ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి
అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.
ఇక మూడు నాలుగు వచనాలలో రెండవ ముద్ర
కోసం వ్రాయబడింది. రెండవ ముద్రను విప్పిన వెంటనే నాలుగు జీవులలో
రెండవ జీవి రమ్ము అని చెబితే యోహానుగారు వెళ్లి చూశారు! అప్పుడు
ఎఱ్ఱనిదైన ఒక గుఱ్ఱము బయలు దేరింది. దానిమీద ఒకడు కూర్చున్నాడు.
వాడు మనుష్యులు ఒకని కొకడు చంపుకునేటట్లు భూలోకంలో సమాధానం శాంతి లేకుండా
చెయ్యడానికి వీనికి అధికారం ఇయ్యబడింది. ఇంకా వాడి చేతికి ఒక
ఖడ్గము కూడా ఇవ్వబడింది.
ఎరుపు- యుద్ధాలకు చిహ్నం! మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లనిగుర్రము – దానిమీద ఒకడు కూర్చున్నాడు- వాడు క్రీస్తు విరోధి అని చెప్పడం జరిగింది. వాడు మొదట
సమాధానం సమాధానం శాంతి అంటూ మొదలుపెట్టినా తర్వాత జరిగేది- ఎక్కడా
నెమ్మది లేకుండా యుద్ధాలు, మనుష్యులలో ఒకరంటే ఒకరికి పడక నెమ్మది
లేక యుద్ధాలు కలహాలతో ప్రపంచం నిండిపోతుంది.
గమనించాలి
గతభాగంలో చెప్పినది మరోసారి గుర్తుకు చేస్తున్నాను. మహాశ్రమల కాలము అనగా క్రీస్తు విరోధి మరియు సాతానుగాడు
దేవునిబిడ్దల మీద తీర్చుకునే ప్రతీకారము! ఎందుకంటే దేవుడు వాడిని
ఒక తన్ను తంతే పరలోకంలో కాళీ లేక తన ప్రజలను హింసిస్తున్నాడు. అంతేకాకుండా భూమిమీద వాడి అధికారానికి అందరిని ఒప్పించడానికి బలప్రయోగం చేస్తున్నాడు!
పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఎత్తబడ్డాడో ఇక వీడికి అడ్డులేదు కాబట్టి
దేవుని ప్రజలమీద పగ తీర్చుకుంటున్నాడు. దేవునిమీద తీర్చుకోలేడు
కాబట్టి ఆయన బిడ్డలమీద పడ్డాడు!
ఇక యుద్దముల
కోసం ముందుగానే యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి 24:6—8 లో చెప్పారు. మీరు యుధ్దాలు కోసం యుద్ధ సమాచారాలు కోసం వింటారు. అయితే
ఇవన్నీ శ్రమలకు ఆరంభం మాత్రమే అంటున్నారు. అనగా ముందు ఇంకా ఘోరమైన
సంభవాలు జరుగబోతున్నాయి అన్నమాట! .....
6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు;
మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి
గాని అంతము వెంటనే రాదు.
7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు
ప్రారంభము.
ఈ యుగం సమాప్తం అయ్యే
రోజులలో అనేకమైన యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నా యుద్దాలుకంటే భయంకరమైన యుద్ధాలు జరుగబోతున్నాయి.
అవసరమైతే అణుబాంబులు ప్రయోగించడానికి కూడా వెనుకాడరు!!!
గమనించాలి
అక్కడ యేసయ్య ఏమంటున్నారో: మీరు యుద్ధాలు యుద్ధ సమాచారాలు విన్నప్పుడు కంగారు పడవద్దు! ఇవన్నీ తప్పకుండా జరగాలి అంటూ ఇన్ని జరిగినా అంతము వెంటనే రాదు. జనం మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచి కుక్కల్లా
తన్నుకు చస్తారు! ఇంకా కరువులు ఆకలిబాధలు పెరిగిపోతాయి!
అవును కదా- నేటిదినాలలో ఎక్కడా చూసినా తగవులు తగాదాలు-
ఈ దేశానికి ఆ దేశమంటే పడదు. ఆ దేశానికి ఈ దేశమంటే
పడటం లేదు! ఎక్కడా చూసినా భూకంపాలు, యుద్ధాలు,
తుఫానులు. ఎప్పుడూ విననంతగా భయంకరమైన ఈదురుగాలులు
వీచి ఇల్లు, కారులు, పశువులు కూడా గాలికి
ఎగిరిపోతున్నాయి. ఇవి ఆరంభం మాత్రమే! ఇంకా
ముందుకు ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది.
ఇక వీడు
ఎఱ్ఱనిగుఱ్ఱం మీద వచ్చి వాటిని ఇంకా ఎక్కువగా చేస్తాడు!
ప్రియ సహోదరి సహోదరుడా! ఆ గడియ అతి తొందరలో ఉంది. కాబట్టి నీవు సిద్ధముగా ఉన్నావా? ఎత్తబడే అర్హత నీకుందా?!
ఒకవేళ విడువబడితే ఈ మహాశ్రమల కాలంలో ఇక్కట్లు పడక తప్పదు కాబట్టి నేడే
బ్రతుకును సరిదిద్దుకుని ఆయనతో సమాధాన పడి రాకడలో ఎత్తబడు!
*ఏడు ముద్రలు-4-- మూడవ ముద్ర*
ప్రకటన 6:5—6
5. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని.
నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను;
దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
6. మరియు దేనారమునకు (ఇది ఇంచుమించు అర్ధరూపాయి కావచ్చు)
ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు,
నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు
జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! మనము ఆరవ అధ్యాయంలో ఉన్న ఏడు ముద్రలు
కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక 5, 6 వచనాలలో మూడవ ముద్ర కోసం వ్రాయబడింది.
మూడవ
ముద్రను గొర్రెపిల్ల విప్పినప్పుడు మూడవ జీవి రమ్ము అని పిలిస్తే వెళ్లి చూశారు యోహాను
గారు. అప్పుడు
ఆయనకు ఒక నల్లని గుఱ్ఱము కనబడింది. దానిమీద ఒకడు త్రాసు పట్టుకుని
కూర్చున్నాడు అంటున్నారు: మరియు దేనారానికి ఒక ఒక సేరు గోదుమలు,
దేనారమునకు మూడు సేర్ల యవలు అనగా బార్లీ అనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దు అని నాలుగు జీవుల మధ్య ఒక స్వరము వినబడింది.
గమనించాలి: నల్లనిగుర్రము – కరవు కాటకాలకు సూచనగా ఉంది! ఇక ఆ గుఱ్ఱము మీద కూర్చున్న వాడు త్రాసు పట్టుకుని కూర్చున్నాడు అంటే సామాన్యప్రజలు
తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడే రోజులు రాబోతున్నాయి అన్నమాట! ఇక్కడ మనకు దేనారము అని వ్రాయబడింది గాని కొన్ని ప్రాచీన ప్రతులలో రోజు కూలికి
ఒక కేజీ గోదుమలు అనియు, రోజు కూలికి మూడు కేజీల బార్లీ అనియు
నూనె ద్రాక్షారసము పాడుచేయవద్దని వ్రాయబడింది. గమనించాలి-
క్రొత్త నిబంధన గ్రంధము వ్రాయబడే రోజులలో ఇశ్రాయేలు దేశము మరియు చుట్టుప్రక్కల
దేశాలలో రోజుకూలి దేనారము! అప్పట్లో మన కరెన్సీ అర్ధ రూపాయి.
ఇప్పుడు మనకంటే ఎక్కువ అనుకోండి!!!!
దీనిప్రకారం
చూసుకుంటే రాబోయే రోజులలో ఈ మూడవ ముద్రను విప్పగానే భయంకరమైన కరవుకాటకాలు కలుగుతాయి
అన్నమాట! అది
వర్షాభావం వలన కావచ్చు లేక గతభాగంలో చూసుకున్నాము ఎక్కడ చూసినా యుద్ధాలు, శాంతి సమాధానాలు లేనందువలన రవాణా స్తంభించి సరకుల రవాణా ఆగిపోవచ్చు!
చివరకు సామాన్య ప్రజలకు ఆహారం కొదువ అయిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా వలన కూలివారికి పని దొరకక ఎలా ఇబ్బందులు పడుతున్నారో
అలాగే ఆ రోజులలో కొన్ని పరిస్తితులు ఏర్పడతాయి- దానివలన ప్రపంచమంతా
కరువు, ఆహార పదార్ధాలకు కరువు కలుగుతుంది. ఎంత ఘోరమైన కరవు అంటే ఒక రోజు కూలికి కేవలం ఒక కేజీ గోదుమలు దొరుకుతాయి.
మన దక్షిణ భారత దేశ భాషలో చెప్పాలంటే ఒకరోజు కూలికి ఒక కేజీ బియ్యము
దొరుకుతుంది అన్నమాట! ఈ రోజులలో కూలీ రేట్లు బాగా పెరిగాయి-
కొన్ని ప్రాంతాలలో మగ వారి కూలి 700 నుండి
1000 వరకు దొరుకుతుంది. ఆడవారికి ౩౦౦ నుండి
500 వరకు దొరుకుతుంది.
ఇప్పుడు ఒక కేజీ బియ్యము మనకు 45రూ.
నుండి 100 రూ. వరకు ఉన్నాయి
వాటివాటి జాతుల కొలదీ! అనగా ఇప్పుడు ఒక సామాన్యుడు రోజు కూలీ
చేస్తే వచ్చిన 700 రూపాయలతో కేవలం ఒక కేజీ బియ్యం మాత్రమే లభ్యమయ్యే
క్లిష్టమైన రోజులు రాబోతున్నాయి. ఇంకా నూనె మరియు ద్రాక్షారసము లభించని రోజులు రాబోతున్నాయి.
గమనించాలి మొదటినుండి సామాన్యులకు మాత్రమే కరువు కలుగుతుంది అని ఎందుకు
చెబుతున్నాను అంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ పరిస్తితులు కలిగినా ఇబ్బంది పడేది
సామాన్య ప్రజానీకమే! ధనవంతులకు ఏదోవిధంగా అన్ని సామాన్లు దొరికిపోతాయి!
సామాన్యులకు మాత్రమే ఈ ఇబ్బందులు!
యేసుక్రీస్తుప్రభులవారు
మత్తయి 24:7—8 లో ఈ విషయాలు ముందుగానే చెప్పారు. ఎక్కడ చూసినా యుద్ధములు కోసము యుద్ధ సమాచారాలు కోసము వింటారు అంటూ అక్కడక్కడ
కరువులు కలుగును అంటున్నారు....
7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు
ప్రారంభము.
అవును కదా
ఈ రోజులలో కొన్ని ఆఫ్రికా దేశాలలో ఆహారము లేక పిల్లలు
పెద్దలు మన్ను రొట్టెలుగా చేసుకుని నేల మట్టిని తింటున్నారు. మరికొంతమంది ఆకలివలన బక్కచిక్కిపోయి చచ్చిన శవాలవలే జీవచ్చవములుగా బ్రతుకుతున్నారు.
ఇవన్నీ మనము వార్తలలో చూస్తున్నాము! ప్రపంచ ఆహార
సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఐక్యరాజ్యసమితి వారికి ఆహారం పంపిస్తున్నారు
గాని అవి వారికి చేరడం లేదు- ఎందుకంటే ఇలా పంపించిన ఆహార పదార్ధాలు
ఆ దేశాలలో ఉన్న రెండు మాఫియా ముఠాలు ఎత్తుకుని పోతున్నాయి. ఐక్యరాజ్యసమితి
కూడా ఏమీ చెయ్యలేని స్తితిలో ఉంది ఇప్పుడు! అయ్యా! ఇవన్నీ యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినట్లు ఇవి ప్రారంభం మాత్రమే! ఇంకా దీనికంటే భయంకరమైన పరిస్తితులు రాబోతున్నాయి!
సరే, ఇప్పుడు
ఒకసారి జెకర్యా గ్రంథం ఆరో అధ్యాయానికి వద్దాము.
Zechariah(జెకర్యా)
6:2,3,5,6,8
2. మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు,
రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,
3. మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.
5. అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు
ఆకాశపు చతుర్వాయువులు.
6. నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు
చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.
8. అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము; అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను.
మొత్తం ఈ రెండు భాగాలు అనగా ప్రకటన ఆరు, జెకర్యా
ఆరు కలిపి చూసుకుంటే నల్లని గుర్రాలు కరవు కాటకాలు కు గుర్తు. అదే సమయంలో ఇవి ఉత్తర దేశానికి పోతున్నాయి. ఉత్తర దేశాలు
అనగా ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఉన్నవి. అనగా టర్కీ,
సిరియా, ఒకప్పటి USSR దేశాలు
అనగా రష్యా యుక్రెయిన్ దాని ప్రక్కన దేశాలు. ముఖ్యంగా కమ్యూనిస్టు
దేశాలు. ఇవి బహుశా అంతర్యుద్దాల వలన గాని, పొరుగు దేశాల యుద్దాల వలన గాని, కరవు వలన గాని ఆకలికి
అలమటించే రోజులు రాబోతున్నాయి.
ప్రియ సహోదరి/ సహోదరుడా! ఇవన్నీ
విడువబడిన వారికి మాత్రమే! మరి నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావా?
నీ బ్రతుకు దేవునితో సమాధాన స్థితిలో ఉందా?
లేకపోతే ఇప్పుడే ఈ
క్షణమే మారుమనస్సు పొంది పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని నీ పాపములు కడిగివేసుకుని
ఆయనతో సమాధాన పడు! నిజమైన మారుమనస్సు
కలిగి బ్రతుకు మార్చుకుని వాక్యానుసారమైన జీవితం జీవించి ఆయన రాకడలో ఎత్తబడు!
*ఏడు ముద్రలు-5-- నాల్గవ ముద్ర*
ప్రకటన 6:7—8
7. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని (కొన్ని
ప్రాచీన ప్రతులలో- వచ్చిచూడుము అని పాఠాంతరము) నాలుగవ జీవి చెప్పుట వింటిని.
8. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము
కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను
మరణమువలనను (లేక, తెగులువలనను) భూమిలోనుండి క్రూరమృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన
అధికారము వారికియ్యబడెను.
ఇక 7,8
వచనాలలో నాల్గవ ముద్ర కోసం వ్రాయబడింది.
గొర్రెపిల్ల
నాల్గవ ముద్రను విప్పిన వెంటనే నాల్గవ జీవి రమ్ము అని పిలిస్తే యోహాను గారు వెళ్లి
చూశారు. అప్పుడు
ఆయనకు పాండుర వర్ణము అనగా బూడిద రంగు గల ఒక గుఱ్ఱము కనబడింది. దానిమీద ఒకడు కూర్చున్నాడు. వాడిపేరు మృత్యువు.
అనగా చావు- చంపేవాడు! వాడివెనుక
పాతాళ లోకమే వెంబడించింది అట! వీడికి ఉన్న అధికారాలు ఏమిటంటే ఖడ్గము వలన, కరవు వలన
మరణము వలన లేక తెగుళ్ళు వలన ఇంకా భూమిమీద ఉన్న క్రూర మృగాల వలన భూనివాసులను చంపడానికి
అధికారం ఇవ్వబడింది.
దీనివలన అప్పట్లో భూమిమీద ఎంత జనాబా
ఉంటారో ఆ జనాబాలో నాలుగో వంతు అనగా పావు వంతు ప్రజలు చనిపోతారు. ఉదా : ఇప్పుడు ప్రపంచ జనాబా సుమారుగా 630 కోట్లు- అనగా ఈ నాల్గవ ముద్ర విప్పిన తర్వాత కలిగే పరిస్తితుల
వలన సుమారుగా 155 కోట్ల మంది చనిపోతారు అన్నమాట!
వాడిపేరే
మృత్యువు! బూడిదరంగు -గుఱ్ఱము- మృత్యువును సూచిస్తుంది.
నాలుగు
విధాలుగా ప్రజలు చనిపోతారు-
మొదటిది: ఖడ్గము- రెండవ ముద్ర విప్పిన వెంటనే యుద్ధాలు మొదలయ్యాయి కదా దానివలన ఎక్కువమంది చనిపోతారు
ఎందుకంటే అలాంటి మారణాయుధాలు సిద్ధము చేశారు కాబట్టి వాటిని వాడి ఒకరినొకరు చంపుకుంటారు.
రెండవది: కరవువలన! మూడవ ముద్ర విప్పినప్పుడు కరవు కలిగింది కదా- దానివలన
మహా భయంకరముగా ప్రజలు చనిపోతారు. గతంలో చెప్పిన విధంగా ఒకసారి
యిర్మియా గారు చెరసాల నుండి విడిపించ బడతారు ఇశ్రాయేలు దేశంలో! ఆ చెరసాల నాయకుడు అక్కడున్న చివరి రొట్టెను యిర్మియా గారికి ఇవ్వడం జరుగుతుంది.
దానిని తింటూ మన యిర్మియా గారు బయటకు వస్తే గేటు దగ్గర కొన్ని వందలమంది
ఆకలికి అలమటిస్తూ ఉంటారు, ఎప్పుడైతే ఈ రొట్టెను చూశారో అందరూ
వచ్చి ఆయనమీద పడి ఆ రొట్టెను ఎత్తుకుని పోతారు! బయటకు వస్తే శవాలు
ఎక్కడపడితే అక్కడ పడి ఉన్నాయి. వాటిని పాతిపెట్టడానికి కూడా ఎవరికీ
మొదటగా ఓపిక లేదు! రెండవది భయటకు వెళ్లి పాతిపెట్టాలంటే శత్రువులు
కోట వెనుక ఉన్నారు. అప్పుడే నా జనులలో హతమైన వారికోసం నా కన్ను
కన్నీటి ఊటగాను నా తల జలమయం గాను ఉండును గాక అంటూ విలాప వాక్యముల గ్రంధము రాశారు.
అలాంటి
పరిస్తితులే ఇప్పుడు కూడా ఏర్పడతాయి. ఎక్కడ చూసినా కరవుతో ప్రజలు చనిపోతూ ఉంటారు.
మూడవది: తెగుళ్ళు లేక మరణము వలన!
దీనికోసం ఏమి చెప్పాలి- ఇప్పుడు మనకు ఎదురైన భయంకరమైన
విపత్తు- కరోనా- గత సంవత్సరం ఈ కరోనా వలన
సుమారుగా ప్రపంచంలో పదికోట్లమంది చనిపోయారు. ఇలాంటి మహామ్మారులు
ఎన్నెన్నో వస్తాయి ఆరోజులలో! అవి ప్రజలను హరించి వేస్తాయి.
హాస్పటల్ వెళ్దామంటే హాస్పటల్ కాళీ! ఎందుకంటే బయటకు
వస్తే ప్రాణం పోతుంది అనే భయం! ఎక్కడ చూసినా మరణాలే సంభవిస్తాయి!
నాల్గవది: క్రూర మృగాలు వచ్చి ప్రజలను
చంపి తింటాయి! ఏం? అవి ఎందుకు వస్తాయి అంటే
ఎక్కడ చూసినా మారణాయుధాలు- వాటికి తినడానికి తిరగడానికి ఎక్కడా
కాళీ లేక- మనుష్యులలో సంచరించి మనుష్యులను పట్టుకుని చంపి తింటాయి.
అవును దీనికోసం
యెహెజ్కేలు గ్రంధంలో ఎప్పుడో చెప్పబడింది. 14:21...
ప్రభువగు
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను
క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పుతీర్చినయెడల
అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు
కాబట్టి ఇవన్నీ అతి
తొందరలో జరుగబోతున్నాయి.
ఎక్కడ చూసినా శవాలు
కుప్పల్లా ఉండబోతున్నాయి. మనము
చూసుకున్నాము-గత సంవత్సరంలో కరోనా వలన అనేక దేశాలలో శవాలు కుప్పలా
పారవేస్తే వాటిని పూడ్చటానికి ఎవరూ లేక
ప్రొక్లైనర్ లతో పూడ్చిపెట్టారు మంటిలో! అలాంటి పరిస్తితులే మరలా రాబోతున్నాయి. గమనించండి పాతాళ
లోకమే ఈ మృత్యువు గాడిని వెంబడిస్తుంది అట!
మరలా చెబుతున్నాను- ఇవి విడువబడిన వారికి మాత్రమే!
ఎత్తబడిన వారు మధ్యాకాశంలో దేవునితో పెండ్లి విందులో ఎంజాయ్ చేస్తున్నారు.
విడువబడిన వారికి ఈ పాట్లు తప్పవు! అందుకే మరోసారి
ప్రభువు పేరిట చేతులు జోడించి మనవిచేస్తున్నాను- నీ బ్రతుకుని
సరిచేసుకో!
వాక్యాసారమైన జీవితం, సాక్షానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం పవిత్రమైన పరిశుద్ధజీవితం జీవించి ఎత్తబడు! జయజీవితం కలిగి ఉండు!
ఎత్తబడే గుంపులో స్థానం
సంపాదించుకో! జీవ గ్రంథంలో
పేరును భద్రపరచుకో!
*ఏడు ముద్రలు-6-- ఐదవ ముద్ర*
ప్రకటన 6:9—11
9. ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును,
తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద
చూచితిని.
10. వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా,
యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు
ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
11. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియువారివలెనే
చంపబడబోవువారి సహ దాసుల యొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము
విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
ఇక 9--11 వచనాలలో ఐదవ ముద్ర కోసం వ్రాయబడింది.
ఈ ఐదవ ముద్రను విప్పినప్పుడు విపత్తు
ఏమీ సంభవించలేదు అని గ్రహించాలి! ఇక అక్కడ ఉన్నది నాలుగు జీవులు
కాబట్టి నలుగురు రమ్మని చెప్పారు. అందుకే ఐదవ ముద్రను విప్పినప్పుడు
రమ్మని శబ్దము మరియు కబురు రాలేదు!
ఇక
ఐదవ ముద్రను విప్పినప్పుడు పరలోకంలో యోహాను గారు ఏమి చూశారు అంటే దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును
వధించబడిన ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని అంటున్నారు. అనగా
వీరు హతస్సాక్షులు అన్నమాట! ఎంత భాగ్యమండి- తిన్నగా వీరు పరలోకంలో ఉన్న దేవాలయంలో గల బలిపీఠం క్రిందకు వెళ్ళిపోయారు!
తర్వాత
వచనంలో వారు అంటున్నారు- నాధా సత్యస్వరూపి పరిశుద్ధుడా! అని స్తుతించి ఎందాక తీర్పు
తీర్చకుండా మా రక్తముము నిమిత్తము భూనివాసులను ప్రతి దండన చేయకుండా ఉంటావు అని బిగ్గరగా
కేకలు వేస్తున్నారు.
ఈ వచనాలు జాగ్రత్తగా
పరిశీలన చేస్తే వీరు మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి వలన చంపబడిన వారు అని అర్ధమవుతుంది. మత్తయి 24:20-22 లో దేవుడు చెప్పింది ఈ రోజుల
కోసమే!....
20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను
సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి.
21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక
ఎప్పుడును కలుగబోదు.
22. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
వీరు
అన్ని భయంకరమైన శ్రమలనుండి వచ్చారు అందుకే ఇప్పుడు దేవుడు వారి కన్నుల నుండి ప్రతీ
భాష్పబిందువును తుడుస్తున్నారు ప్రకటన 7:17..
ఏలయనగా
సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు
వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును
తుడిచి వేయును.
అయితే
కొందరు కాదు కాదు- వీరు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన హతస్సాక్షులు- మహా శ్రమల కాలం హతస్సాక్షులు తర్వాత కనిపిస్తారు అంటారు. నాకైతే గతం లో చెప్పిన విధముగా పాత
నిబంధన హతస్సాక్షులు క్రొత్త నిబంధన హతస్సాక్షులు మృతుల పునరుత్తాన సమయంలో ఎత్తబడ్డారు
అని పిస్తుంది. ఇక్కడ ఎందాక అనే మాటను పట్టుకుని వీరు చనిపోయి
2000 సంవత్సరాలు కంటే ఎక్కువయ్యింది అంటారు గాని అది నాకు సరిగా అనిపించడంలేదు!
వీరు మహాశ్రమల కాలంలో చనిపోయిన వారే, అనగా రహస్యరాకడలో
విడువబడి- 666 ముద్ర వచ్చాక నిజం తెలుసుకుని- చావుకైనా సిద్దపడ్డారు గాని ఆ ముద్రను వేసుకోకుండా యేసుక్రీస్తే నిజమైన దేవుడని-
వారు వాక్యము కొరకు సాక్షులుగా నిలబడ్డారు. ఇంకా
తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించ బడ్డారు! గాని ఇప్పుడు
వారు వెళ్ళడానికి పరదైసు కాళీ అయిపోయింది గాబట్టి దేవుడు వారికి నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు
నివాసం దొరుకుతుంది అంటున్నారు కాబట్టి ఆయన బలిపీఠం క్రిందను ఈ హతమైన పిచ్చుకలకు నివాసం
దొరికింది. కారణం పరదైసు దాని ఎటెండర్ లతో పాటుగా కాలీ అయిపోయింది.
అందుకే ఇక్కడ వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు అని నా ఉద్దేశం!
వీరికోసం పౌలుగారు
అంటున్నారు పానార్పణముగా పోయబడితిరి
ఫిలిప్పీ 2:17
మరియు
మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితో
కూడ సంతోషింతును.
2తిమోతికి 4: 6
నేనిప్పుడే
పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
సరే, ఇక పదో వచనంలో వీరు అడుగుతున్నారు-
నాధా సత్యస్వరూపి ఇంకా ఎంతకాలం మా రక్తము నిమిత్తము భూనివాసుల మీద ప్రతీకారం
తీర్చకుండా ఉంటావు అంటున్నారు. దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది
అంటే మనము భూమిమీద ఉన్నంతవరకు ప్రతీకారం అనే మాట ఎత్తకూడదు! విశ్వాసి
నోట ఆమాట రాకూడదు!
ఏమంటే ఇన్ని శ్రమలను పెట్టినా యేసుక్రీస్తుప్రభులవారు
ఏమన్నారు? తండ్రీ ఈ నేరం వారిమీద మోపకు- వారు ఏమిచేస్తున్నారో వారెరుగరు గనుక వారిని క్షమించుము. ఇదీ క్షమాభిక్ష! ఇలాంటిదే మనము కూడా పొందాలని ఆయన ఆశ!
భక్తుడైన స్తెఫను గారు కూడా ఇదే అడుగుజాడలలో పయనించి ప్రజలు దారుణంగా
ఆయనని రాళ్ళతో కొట్టి చంపుతున్నా యేసుప్రభువా! ఈ నేరం వారిమీద
మోపకు అని చెప్పి మరణించారు. కాబట్టి క్రైస్తవుడు క్షమాభిక్ష
పెట్టాలి గాని నాశనం కోరకూడదు!
అయితే
ప్రతీకారం జరిగించేది దేవుడు!
ఎప్పుడు చేస్తారు అంటే యుగాంతంలో! 2థెస్స
2:6—9; కీర్తన 94:1—౩; ద్వితీ 32:35 ప్రకారం!
అయితే
చనిపోయిన ఆత్మలు మాత్రం వారి ప్రార్ధనలు దేవుని న్యాయమైన ఉద్దేశాలకు అనుగుణంగా ఉంటాయి. వారు ప్రతీకారం కోసం ప్రార్ధన
చేస్తారు అని గ్రహించాలి!
వెంటనే
వారి ప్రార్ధనకు జవాబు దొరికింది- ఏమని అంటే వారిలాగ చంపబడవలసిన వారి లెక్క పూర్తి అవ్వాలి-
ఎవరు అంటే సహోదరులు మరియు సహదాసులు అంటున్నారు.
దీనిని
జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ముద్రను విప్పినప్పటికి భూమిమీద మహాశ్రమల కాలం జరుగుతుంది
అన్నమాట! గాని
ఇంకా దేవుని ప్రతీకార కాలము అనగా దేవుని ఉగ్రతాదినమైన ప్రభువు దినము లేక యెహోవా దినము
ఇంకా రాలేదు! అది రావడానికి సమయం ఉంది అని అర్ధమవుతుంది.
అందుకే గతభాగాలలో మహాశ్రమల కాలం అయిపోయిన వెంటనే రెండో రాకడ అనే ప్రభువు
దినము రాదు అని చెప్పడం జరిగింది. 45/75 రోజులు గాని,
5నెలలు గాని పడుతుంది అని చెప్పడం జరిగింది.
ఇక్కడ
మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: వారిలాగే చంపబడవలసిన సహోదరులు మరియు సహదాసులు అంటున్నారు!
సహోదరులు ఎవరు?
సహదాసులు ఎవరు?
సహోదరులు
అనగా ఇంకా చంపబడవలసిన క్రైస్తవులు- వారు దేవుణ్ణి అంగీకరించిన అన్యులుగాని యూదులు గాని!
సహదాసులు
ఎవరు? చంపబడవలసిన
యూదులు అన్నమాట! వారి సంఖ్య పూర్తి అయిన వెంటనే దేవుని ప్రతీకార
కాలము ప్రారంభమవుతుంది అని అర్ధం చేసుకోవాలి!
ఈ సందర్భంలో
ఒకమాట చెప్పనీయండి.
ఒకసారి
ఏడవ అధ్యాయం చూసుకుంటే మనకు అక్కడ మొదట ఇశ్రాయేలు జాతిలో ముద్రించబడిన 1,44,000 మంది కనిపిస్తారు.
ఆ తర్వాత ప్రతి జాతినుండి ఆయా దేశాలనుండి రక్షించబడిన హతస్సాక్షులు కనిపిస్తారు.
ప్రకటన 7:9--17...
ఇక్కడ మొదట మహా శ్రమల
కాలం నుండి వచ్చిన వారు!
గతభాగం లో చెప్పినట్లు
ఆరవ అధ్యాయం లో జరిగిన దర్శనం ఆపి, ఏడవ అధ్యాయం లో యోహాను గారికి దేవుడు ఆ ఆరవ అధ్యాయంలో దర్శనాన్ని వివరిస్తున్నారు
అని గ్రహించాలి.
దీనిని బట్టి మనకు
ఏమని అర్ధమవుతుంది అంటే రహస్య రాకడలో ఎత్తబడే వారు చాలా కొద్దిమంది మాత్రమే! అయితే విడువబడిన వారు అనేకులు.
ఈ అనేకులైన విడువబడిన వారు క్రీస్తు విరోధి ని గుర్తించి వాక్య కోసం
తమ ప్రాణాలు కోల్పోయారు. 666 ముద్ర వేసుకోలేదు. వీరి సంఖ్య లెక్కకు మించి ఉంది. ఇదే గ్రంథంలో సైనికులు
సంఖ్య 20 కోట్లు అని లెక్క పెట్టారు గాని వీరిని లెక్క పెట్టలేక
పోయారు అంటే చాలా కోట్లమంది యుగాంతంలో హతస్సాక్షులై పరమునకు చేరుతారు.
గనుక నీవు ఏ గుంపులో
ఉంటావో ఇప్పుడే నిర్ణయించుకో! ఎత్తబడే గుంపులో ఉంటావా? లేక విడువబడి హతస్సాక్షులుగా
మారే గుంపులో ఉంటావా? లేక క్రీస్తు విరోధి కి బానిసగా చెంచాగా
ఉండి నరకంలోకి పోతావా?
నేడే నిర్ణయించుకో!!
*ఏడు ముద్రలు-7-- ఆరవ ముద్ర*
ప్రకటన 6:12—17
12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు
భూమిమీదరాలెను.
14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును,
ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
16. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు
ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలిన వాడెవడు?
17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి
అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
ఈ ఆరవ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబళి వలే నలుపాయెను చంద్రుడు రక్తవర్ణమాయెను అని రాయబడింది.
ఇంకా అయిపోలేదు- నక్షత్రాలు కూడా రాలిపోయాయి ఆకాశం
చుట్టబడిన గ్రంధము వలే అయిపోయింది ప్రతికొండ ప్రతి ద్వీపం వాటివాటి స్థానాలు తప్పాయి
అని చెబుతున్నారు!
ఈ వచనాలు
జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ఆరవ ముద్ర విప్పబోయే సమయానికి మహాశ్రమల కాలం పూర్తి అయిపోయినట్లు
కనిపిస్తుంది. ఎందుకు
అలా అంటున్నావు-అని అడగవచ్చు- ఒకసారి దీనిని
మత్తయి 24:29 తో పోల్చుకుని చూస్తే మనకు తెలుస్తుంది.
...
ఆ దినముల
శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి
నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
గమనించాలి
ఆ దినముల శ్రమ అనగా మహాశ్రమల కాలం ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు
కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలించబడును
అంటున్నారు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు చీకటి కమ్మును-
చంద్రుడు కాంతిని ఈయడు- ఆకాశమునుండి నక్షత్రాలు
రాలును- ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి- శ్రమలు ముగిసాక అని చెబుతున్నారు- ఎవరు చెబుతున్నారు?
సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారు! 35వ వచనంలో
ఆకాశము భూమి గతించును గాని నామాటలు గతించవు- తప్పకుండా జరుగుతాయి
అని చెప్పారు!! కాబట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే మొదటి ముద్రనుండి-
అయిదు ముద్రలు పూర్తికాబడి ఆరవ ముద్రను విప్పే సమయానికి ఏడు సంవత్సారాలు
మహాశ్రమలు పూర్తి అయిపోతాయి అని నాకు అర్ధమయ్యింది.
కారణం 12వ వచనం ప్రకారం సూర్యుడు
నలుపయ్యాడు, చంద్రుడు ఎరుపయ్యాడు, 13వ వచనం
ప్రకారం ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతున్నాయి, 14వ వచన ప్రకారం
ఆకాశం చుట్టబడి- అనగా ఆకాశమందలి శక్తులు కదిలించ బడుతున్నాయి
అనగా మహాశ్రమలు ముగిసిపోయినట్లే కదా యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినట్లు!!!
అయ్యా! ఇది మీకు అనుకూలమైతే గ్రహించవచ్చు-
లేదా వదిలెయ్యవచ్చు- కేవలం నాకు అర్ధమయ్యింది మాత్రమే
నేను రాస్తున్నాను- ఇలాగే జరుగుతుంది అని నేను చెప్పకూడదు-
అలా చెబితే నేను అబద్దికుడను అవుతాను! నాకు అర్ధమయ్యింది
మాత్రము నేను రాస్తున్నాను! వాక్యానుసారంగా ఉంటే తీసుకోండి లేకపోతే
వదిలెయ్యండి!
సరే, మహాశ్రమల
కాలం ముగించబడి అనగా క్రీస్తు విరోధి మరియు వాడి అనుచరులు దేవుని బిడ్డలమీద తీర్చుకునే
ప్రతీకార కాలం అయిపోయింది, ఇక ఇప్పుడు యెహోవాదినం లేక ప్రభువు
దినము అనబడే దేవుని ఉగ్రతా కాలం మొదలయ్యింది అన్నమాట! ఈ ఉగ్రతా
దినాలు కూడా పూర్తి అయ్యాకనే యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడ జరుగుతుంది అన్నమాట!
దీనికోసం
పేతురు భక్తుడు పెంతుకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే తన మొదటి ప్రసంగంలో
వివరిస్తున్నారు అపో 2:19—20...
19. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని
పొగ ఆవిరిని కలుగజేసెదను.
20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను
మారుదురు.
మరలా చెబుతున్నాను: మహాశ్రమల కాలము- దేవుని ఉగ్రతాకాలము ఒకటి కాదు! మహాశ్రమల కాలం జరిగాక
దేవుని ఉగ్రతాకాలము అనబడే యెహోవాదినము లేక ప్రభువు దినము మొదలవుతుంది. అది ఒకరోజులో అయిపోయేది కాదు- నా ఉద్దేశంలో
45/75 రోజులు గాని అయిదు నెలలు గాని ఉంటుంది.
ఇక మనకు 12వ వచనంలో పెద్ద భూకంపం కలిగింది అని వ్రాయబడింది.
దీనికోసం మనకు ప్రకటన 16:18 లో వివరించడం జరిగింది.
ఇప్పుడు ఆరవ ముద్రను చెప్పి దీనికోసం 16వ అధ్యాయంలో
సంఘపు కోణంలో దేవుని ఉగ్రతను వివరిస్తూ అక్కడ వివరంగా రాశారు అన్నమాట...
ప్రకటన గ్రంథం 16: 18
అప్పుడు మెరుపులును
ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది
మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
దీనికోసం యెషయా 24:18—20 హెబ్రీ 12:26—26 లో కూడా వ్రాయబడింది.....
Isaiah(యెషయా
గ్రంథము) 24:18,19,20
18. తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి
19. భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా
దద్దరిల్లుచున్నది
20. భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము
దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము
విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.
Hebrews(హెబ్రీయులకు) 12:26,27
26. అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమేకాక
ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.
27. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు
చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్ధమిచ్చుచున్నది.
ఇంకా క్రిందికి
వెళ్లేముందుగా ఒక విషయం చెప్పనీయండి:
ఇక్కడ అనగా ఆరవ ముద్ర సమయంలో సూర్యుడు నలుపాయెను చంద్రుడు రక్తవర్ణమాయెను
అనగా ఎరుపాయెను అని వ్రాయబడి ఉంది, అదేవిధంగా నాల్గవ భూర ఊదినప్పుడు,
అలాగే నాల్గవ పాత్ర క్రుమ్మరించినప్పుడు కూడా సూర్య చంద్రులు దెబ్బ తిని
తమ వెలుగును ఇవ్వడం లేదు కదా- మరి దీని సంగతి ఏమిటి అని అడగవచ్చు!
దీని అర్ధము ఏమిటంటే
మహాశ్రమల కాలం అయిపోయాక ఆరవ ముద్రతో దేవుని ఉగ్రతాకాలం ప్రారంభమయ్యింది- ఆ క్రమంలోనే సూర్యునికి ఈ ప్రక్రియలు అన్ని సంభవిస్తున్నాయి. సూర్యుడు ఎలా నలుపయ్యాడో, చంద్రుడు ఎలా ఎరుపయ్యాడో ఇక్కడ
అనగా యూదుల కోణం అయిన ఏడు బూరలలో నాల్గవ బూరగా వివరిస్తున్నారు ప్రకటన 8:12
లో, అలాగే సంఘపు కోణంలో దేవుని ఉగ్రత అయిన పాత్రలలో
నాల్గవ పాత్ర ప్రకటన 16:8—9 లో అక్కడ వివరిస్తున్నారు.
ఒకసారి రెండు కలిపి
చూసుకుందాము!
ప్రకటన గ్రంథం 8: 12
నాలుగవ
దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు
ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు
ప్రకాశింప కుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
Revelation(ప్రకటన గ్రంథము) 16:8,9
8. నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు
సూర్యునికి అధికారము ఇయ్యబడెను.
9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద
అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు
వారు మారుమనస్సు పొందినవారుకారు.
కాబట్టి దేవుడు
సూర్యచంద్రుల మీద తన ఉగ్రతను కురిపిస్తారు. అప్పుడు సూర్యుడు కాంతిని ఇయ్యడు చంద్రుడు ఎర్రగా మారి తన కాంతిని ఇయ్యడు.
మరో కారణం కూడా ఉంది అనిపిస్తుంది- ఏమిటంటే అప్పటికే
భూమిమీద శాంతి సమాధానాలు లేకుండా రెండవ ముద్ర విప్పిన వెంటనే ఒకడు చేశాడు. యుద్ధాలు కలిగాయి. వాటిలో కొంతమంది అణుబాంబులు కూడా వాడటం
జరుగుతుంది. దానివలన భయంకరమైన పొగ విడుదల కాబడుతుంది.
తద్వారా వెలువడిన కాలుష్యం వలన మరియు రేడియేషన్ వలన సూర్యుని కాంతి మరియు
చంద్రుని కాంతి భూమిమీదకు రాదు అనిపిస్తుంది నాకు! నార్వే దానిమీద
దేశాలు అనగా అలస్కా, గ్రీన్లాండ్, రష్యా
ఉత్తర ప్రాంతంలో ఆరునెలలు పగలు ఆరునెలలు రాత్రి కలగడం వలన కలిగే చీకటి లాంటి చీకటి
కాదు ఇది, మొదటగా దేవుని ఉగ్రత, రెండవది
ప్రజలు వాడిన బాంబుల వలన కలిగే కాలుష్యం వలన కలిగే చీకటి! ఈ రెండు
కలిపి సూర్యచంద్రులకు మబ్బు కలిగి కాంతి భూమిమీదకు రాకుండా పోతుంది అని గ్రహించాలి!
అయితే
అదే సమయంలో మరో అనుమానం రావచ్చు మీకు నాల్గవ బూరద్వారా సూర్యుడు చంద్రుడు దెబ్బతిని
ప్రకాశించడం మానేశారు అని వ్రాయబడింది, మరి నాల్గవ పాత్రద్వారా భయంకరమైన వేడిమి ప్రజలను వేదిస్తుంది
అని వ్రాయబడింది. రెండూ ఒకటే అంటున్నావు- ఎలా అని అడగవచ్చు- ఎక్కడైతే రేడియేషన్ వలన భయంకరమైన కాలుష్యం
పెరిగిపోతుందో అక్కడ చీకటి- రేడియేషన్ ప్రభావం వలన అనేకచోట్ల ఓజోన్ పోర దెబ్బతింటుంది- అక్కడ భయంకరమైన వేడిమి కల్గుతుంది కారణం ఓజోన్ పొర దెబ్బతిని అతినీల లోహిత
కిరణాలు (ultra violet rays) తిన్నగా భూమిపైకి వచ్చి వేడిమితో
మనుష్యులను కాల్చుకు తింటాడు సూర్యుడు!!!
ఇవీ ఆరవ ముద్ర విప్పినప్పుడు
నాల్గవబూర మరియు నాల్గవ పాత్ర వలన కలిగే సంభవాలు!
*ఏడు ముద్రలు-8-- ఆరవ ముద్ర-2*
ఇక 13వ వచనంలో పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు
చెట్టు నుండి ఆకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి అంటున్నారు.
ఇది అయిదవ బూర ఊదినప్పుడు జరుగు సంభవం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రకటన 9వ అధ్యాయంలో ఆకాశం నుండి నక్షత్రం రాలినట్టు
కనిపిస్తుంది. అయితే
కొందరు ఏమని అభిప్రాయ పడతారు అంటే దూతలు కొందరు రాలిపోతారు అంటారు. మరి నాకు దీనికోసం అంతగా తెలియదు!
ఇక 14—17 వచనాలు జాగ్రత్తగా గమనించమని మనవిచేస్తున్నాను.....
14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును,
ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
16. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు
ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి
అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
అకాశమండలం గ్రంధము
వలే చుట్ట బడుతుంది. ప్రతీ
కొండ ప్రతీ ద్వీపం పారిపోతుంది. భూరాజులు ఘనులు సహస్రాధిపతులు
ధనికులు బలిష్టులు దాసుడు అందరు పరిగెడుతున్నారు కొండ గుహలలోనికి బండ సందుల లోనికి
కారణం గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహా దినము వచ్చింది దానికి తాళజాలు వాడెవడు అంటూ పారిపోతున్నారు.
దీనికోసం ప్రవక్తయైన
యెషయా గారు ఎప్పుడో ప్రవచించారు 2:9—21....
9. అల్పులు అణగద్రొక్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము.
10. యెహోవా భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు బండ బీటలోనికి దూరుము
మంటిలో దాగి యుండుము.
11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున
యెహోవా మాత్రమే ఘనత వహించును.
12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి
సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర
వృక్షములకన్నిటికిని
14. ఉన్నత పర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని
15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును
16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.
17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున
యెహోవామాత్రమే ఘనత వహించును.
18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.
19.యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ
మాహాత్మ్యము నుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన
ప్రభావ మహాత్మ్యము నుండియు కొండల గుహలలోను బండబీటలలోను
21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ
విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
చూశారా- యుగాంతములో జరిగేవి భక్తుడు ముందుగానే
ప్రవచించారు.
సరే, ఇప్పుడు మనము ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే
ఈ సంభవాలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఏడవ పాత్ర క్రుమ్మరించినప్పుడు అని ప్రకటన
16:17—21
లో తెలుస్తుంది.
17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక
గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండివచ్చెను.
18. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద
భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి
మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
19. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు
కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు
ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.
20. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.(మూలభాషలో- అదృశ్యములాయెను)
21. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను;
ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని
దూషించిరి.
గమనించండి- ఆరవ
పాత్ర ద్వారా హార్మెగిద్దోను యుద్ధానికి దారి ఏర్పడి క్రీస్తు విరోధి సైన్యం అన్ని
దేశాలనుండి బయలుదేరుతుంది. ఏడవ పాత్రను కుమ్మరించినప్పుడు మహా
గొప్ప భూకంపం కలిగింది. అప్పుడు మహా బబులోను అనబడే రోమా సామ్రాజ్యము
అలియాస్ రోమ్ పట్టణంలో నాటుకున్న పెద్ద మత సంస్థమీద దేవుని ఉగ్రత కలుగుతుంది.
అప్పుడే ప్రతీ ద్వీపము పారిపోతుంది. పర్వతములు
కనబడక పోయాయి ఎందుకంటే వాటివాటి స్థానాలు తప్పాయి. 5మణుగులు అనగా
సుమారు 40 కేజీల పెద్ద వడగండ్లు మనుష్యుల మీద పడతాయి.
అందుకే ఏడవ బూర ఊదినప్పుడు ప్రకటన 11:19 లో ఉరుములు
భూకంపం కలిగింది..
దీనిని
బట్టి ఏమి అర్ధమవుతుంది అంటే ఆరవ ముద్ర విప్పినప్పుడు జరిగే సంభవాలు- మొదటగా దేవుని ఉగ్రతా దినము
ప్రారంభం అవుతుంది. ఆరు
ఏడు ముద్రలలో దేవుని తీర్పు అనబడే ఉగ్రతాదినము పూర్తి అవుతుంది. అయితే ఆరు ఏడు ముద్రలలో జరిగే సంభవాలు అక్కడ క్లుప్తంగా చెప్పి తర్వాత బూరలను
పాత్రలను వివరిస్తూ ఎలా దేవుని ఉగ్రత మనుష్యుల మీద మరియు భూరాజుల మీద, క్రీస్తు విరోధి మరియు వాడి అనుచరుల మీద చివరికి సాతాను మీద క్రుమ్మరించబడుతుందో
వివరిస్తున్నారు అన్నమాట! ఈ విషయం అర్ధం చేసుకుంటే ప్రకటన గ్రంధం
బాగా వివరంగా మనకు అర్ధమవుతుంది ప్రియులారా!
ఈ సంభవాలన్నీ
తొందరలో జరుగబోతున్నాయి! అయితే భయపడవలసినది ఎవరు అంటే రాకడకు సిద్దపడని వారు! ఆయన రాకడ మరియు రహస్య రాకడ సిద్ధంగా మరియు అతి సమీపముగా ఉంది. మరి నీవుసిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీవు సిద్ధంగా ఉంటే
రేపు రానీయ్, ఎల్లుండి రానీయ్ లేకపోతే ఈ క్షణమే రానీయ్ నీకు భయము
లేదు! ఎత్తబడతావు! ఒకవేళ నీవు సిద్ధంగా
లేకపోతే ఈ శ్రమలు అగచాట్లు తప్పవు అని మరచిపోవద్దు!
నేడే బ్రతుకు
మార్చుకో!
నేడే రక్షణ దినము!
ఇదే అనుకూలసమయం!
ఆమెన్!
*1,44,000 మంది ఇశ్రాయేలీయులు*
ప్రకటన 7:1—8
1. అటు తరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి,
భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు
భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.
2. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని.
భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో
3. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను
చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
4. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల
గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
5. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను
గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,
6. ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో
పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,
7. షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో
పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,
8. జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో
పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! మనము ఆరవ అధ్యాయంలో ఉన్న ఏడు ముద్రలలో
ఆరుముద్రల కోసం ధ్యానం చేసుకున్నాము!
అయితే ఏడవ ముద్రకుముందు దేవుడు ఒక విరామం ఇచ్చారు. ఆరు ముద్రల కోసం విరామం లేకుండా చూపించి- ఏడవ ముద్రకు
ముందుగా విరామం చూపించి- ఇంతవరకు జరిగిన సంఘటనలలో రెండు సంఘటనల
కోసం వివరిస్తున్నారు.
ఈ ఏడవ ముద్రను విప్పకముందు యోహాను గారు ఈ
ముద్రల కోసం బాగా అర్దము చేసుకుకోవాలనే ఉద్దేశముతో బహుశా దేవుడు ఇలా వివరిస్తున్నారు. ఇలాంటి వివరణ కోసం ఇచ్చిన దర్శనాలు
ఈ ప్రకటన గ్రంధంలో ఇంకా ఉన్నాయి!
మొదటిది ఈ ఏడవ అధ్యాయం మొత్తము!
రెండు: పదవ అధ్యాయం
మొదటినుండి పదకొండో అధ్యాయం 14వ వచనం వరకు!
మూడు: పన్నెండో అధ్యాయం
మొదటినుండి పద్నాలుగో అధ్యాయం 20వ వచనం వరకు;
నాలుగు: పదిహేడో అధ్యాయం
మొదటినుండి పంతొమ్మిదో అధ్యాయం 11వ వచనం వరకు!
ఇవన్నీ వివరణ కోసమైనా
దర్శనాలు అని గ్రహించాలి. అలా
కాకుండా అన్నీ ఒకేవరుస క్రమంలో ఉన్నాయి అని భావిస్తే ఈ ప్రవచన గ్రంధమును అర్ధము చేసుకోలేము
ప్రియులారా! ఈ విషయం అర్ధం చేసుకుంటే ముద్రలు, బూరలు, పాత్రలు అన్నీ చివరివరకు మనకు అంతరాయం కలుగకుండా
అర్ధము చేసుకోవచ్చు!
అయితే ఈ వివరణ కోసరమైన
దర్శనాలు కొన్ని ముందు చూపించిన విషయాలు అర్ధం చేసుకోవడానికి, మరికొన్ని తర్వాత జరిగే సంభావాలు అర్ధం
చేసుకోడానికి ఇలా వివరణ కోసమైనా దర్శనాలు దేవుడు చూపించారు అని గ్రహించాలి!
ఇక
ఈ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యంగా రెండు గుంపులు కనిపిస్తున్నాయి. మొదటి గుంపు భూమిమీద ఉంది.
రెండవ గుంపు పరలోకంలో ఉంది!
మొదటి
గుంపు ఇశ్రాయేలు జాతిలో ముద్రించబడే వారు. ఇది మహాశ్రమల కాలం మధ్యలో జరుగుతుంది అని నా ఉద్దేశం!
అయితే కొందరు మహాశ్రమల కాలం తర్వాత జరుగుతుంది అంటారు! నాకైతే మహాశ్రమల కాలం మధ్యలో జరుగుతుంది అనగా మొదటి ముద్రనుండి అయిదు ముద్రల
మధ్యకాలంలో జరుగుతుంది అని నా ఉద్దేశం!
ఎలాగు
అంటే- ప్రస్తుతం
ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళిక మొదలవ్వలేదు, ప్ర్రారంభం కాదు
కూడా!! ఎంతవరకు అంటే అన్యజనుల నుండి రక్షణపొందుకుంటున్న మనలాంటి
వారి సంఖ్య పూర్తి అయ్యేవరకు రోమా 11:25-27 ప్రకారం! మరి అన్యజనుల నుండి రక్షణపొందే వారి సంఖ్య పూర్తి కాబడిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది
మరియు పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు! వాక్యము లేకుండా పోతుంది!
అప్పుడు ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళిక ప్రారంభం అవుతుంది. ఎలాగు అంటే ఆయన తన ఇద్దరు సాక్షులను లేక ప్రవక్తలను పంపిస్తారు. వారు మహాశ్రమల కాలం మొదటి అర్ధ భాగంలో అనగా మూడున్నర సంవత్సరాలు యెరూషలేము
లో ఉండి వారికి సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్తను అంగీకరించి
యేసుక్రీస్తుప్రభులవారు నిజమైన మెస్సీయ అని వారు గ్రహిస్తారు. వారుకూడా యేసు ద్వారానే రక్షణ మరియు తండ్రి యొద్దకు మార్గం అనే ప్రోటోకాల్
క్రిందకు వస్తారు.
ఆ సువార్త
మూలంగా రక్షించబడిన వారే ఈ
1,44,000 మంది అని నా ఉద్దేశం ప్రియులారా! వీరే
రెండవ అర్ధభాగంలో క్రీస్తు విరోధి చేతిలోనుండి తప్పించబడతారు మరియు దేవుని ఉగ్రతాకాలంలో
అనేక భాగం నుండి రక్షించబడతారు.
ఇక
రెండవ గుంపు- మొదటి అయిదు ముద్రల కాలంలో అనగా మహాశ్రమల కాలంలో హతస్సాక్షులైన వారు అని నా
ఉద్దేశం ప్రియులారా!
ఆరవ
అధ్యాయంలో ఐదో ముద్రను విప్పినప్పుడు కనబడిన గుంపు కోసం ఎలా రక్షించబడ్డారో ఇక్కడ ఈ
రెండవ గుంపుగా వివరిస్తున్నారు అని గ్రహించాలి!
మొదటి
గుంపు కేవలం 1,44,000 మంది మాత్రమే! గాని రెండవ గుంపును లెక్కించలేని జనముగా
చెప్పబడింది.
సరే, ఇక్కడ ఇశ్రాయేలు గోత్రములలో
ముద్రించబడిన వారు 1,44,000 మందిగా కనబడుతుంది మనకు 4—8 వచనాలలో!
అయితే ప్రియులారా! రెండు విషయాలు జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి!
మొదటిది
లక్ష నలబై నాలుగువేలమంది మాత్రమే రక్షించ బడతారు అంటున్నారు చాలామంది. అయితే కొంతమంది ఈ సంఖ్య పరిపూర్ణ
సంఖ్య- మొత్తం ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడతారు- ఎవరైతే ముద్రను వేసుకోకుండా ఉంటారో వారు అందరూ రక్షించబడతారు అంటారు!
ఇది నిజమని అనిపిస్తున్నా- నా ఉద్దేశం ఏమిటంటే
ముద్రించబడిన వారు మాత్రము 1,44,000 మంది మాత్రమే! అయితే దేనికోసం ముద్రించబడ్డారు అంటే మిగిలిన మహాశ్రమల నుండి తప్పించబడటానికి
అని నా ఉద్దేశం! ఎవరైతే ముద్రను వేసుకోకుండా ఇద్దరు సాక్షుల సువార్తను
అంగీకరించారో వారిని దేవుడు తప్పించి పోషిస్తారు మూడున్నర సంవత్సరాలు! వీరే దానియేలు గ్రంథంలో దాఖలైన వారు.
దానియేలు 12: 1
ఆ
కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా
కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.
అయితే పరలోకం వెళ్ళేవారు కేవళం ఇశ్రాయేలీయులలో
1,44,000 మంది మాత్రమే అని కొందరు బోధిస్తున్నారు! ఇది మాత్రం తప్పు అని నా ఉద్దేశం! ఎందుకంటే మీదన చెప్పిన
రోమా ప్రకారం 11:25--27 ఇశ్రాయేలు ప్రజలు మొత్తము అనగా మొదటగా
క్రీస్తు విరోధి ముద్రను వేసుకొనని ఇశ్రాయేలు ప్రజలు మొత్తం రక్షించబడతారు!
ఎలాగు అంటే మహాశ్రమల కాలం తర్వాత దేవుని ఉగ్రతాకాలంలో జెకర్యా
12వ అధ్యాయం ప్రకారం- దేవుడు వారిమీదికి ఒప్పించే
ఆత్మను కురిపిస్తారు.
జెకర్యా 12: 10
దావీదు
సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను
కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద (వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని
విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
అప్పడు వారందరూ ఏక కుమారుని కోసం విలపించినట్లు
ఏక కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారి కోసం తమ బ్రతుకులు మార్చమని ఏడుస్తారు!
అప్పుడు అలా విలపించిన ప్రతీ ఒక్క ఇశ్రాయేలీయుడు తప్పకుండా రక్షణ పొంది
వెయ్యేండ్ల పాలనకు సజీవంగా వెళ్తారు! కాబట్టి కేవలం
1,44,000 మంది మాత్రమే ఇశ్రాయేలు ప్రజలలో రక్షణ పొందుతారు అనే భావన తీసివేయమని
మనవిచేస్తున్నాను!
ఇక ఇలాముద్రించిన
వారిలో దాను గోత్రము లేదు! ఎందుకు లేదు? వారు ఏమి చేశారు అంటే స్టోరీలు మనకు అనవసరం!
Better To Stop
Where The B ible Stops! దాను గోత్రం వారు మాత్రము ముద్రించబడరు అంతే!
అది పరమకుమ్మరి అయిన తండ్రి యొక్క నిర్ణయం!!!
*మహాశ్రమల కాలపు హతస్సాక్షులు*
ప్రకటన 7:9—17.
9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని
యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై,
ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెెపిల్ల యెదుటను
నిలువబడి.
10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో
ఎలుగెత్తి చెప్పిరి.
11. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి.
వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్-
12. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు
ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
14. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో
చెప్పెను -వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
15. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను
సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద
కప్పును;
16. వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను
ఏ వడగాలియైనను వారికి తగులదు,
17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి
కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
ప్రియ దైవజనమా! మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! మనము ఆరవ అధ్యాయంలో ఉన్న ఏడు ముద్రలలో
ఆరుముద్రల కోసం ధ్యానం చేసుకున్నాము!
అయితే ఏడవ ముద్రకుముందు దేవుడు ఒక విరామం ఇచ్ఛి . ఇంతవరకు జరిగిన సంఘటనలలో రెండు సంఘటన ల కోసం రెండు గుంపుల కోసం వివరిస్తున్నారు
అని చూసుకున్నాము!
ఇక రెండవ గుంపు కోసం చూసుకునే ముందుగా
మొదటి మూడు వచనాలలో కొన్ని విషయాలు జరిగాయి. అక్కడ భూమియొక్క
నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియున్నారు! వారు భూమిమీద
నైనను సముద్రము మీదనైనను గాలివీచకుండా గాలిని పట్టుకుని ఆపేశారు. అనగా కొన్ని గంటలు లేక కొన్ని రోజులు భూమిమీద గాలి మొత్తం స్తంభించబోతుంది
అని అర్ధం చేసుకోవాలి! గాలి అధిక పీడన ప్రాంతము నుండి ఎల్లప్పుడూ
అల్పపీడన ప్రాంతానికి వీస్తూ ఉంటుంది. మొత్తం గాలి స్తంభించింది
అంటే ప్రపంచం మొత్తం అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. దాని తర్వాత
ప్రళయమే వస్తుంది.
అయితే
రెండో వచనం జాగ్రత్తగా గమినిస్తే భూమికి సూర్యునికి హాని కలుగజేయుటకే ఇలా వీరు నాలుగు
దిక్కులా గాలిని పట్టుకుని ఆపేశారు. గతభాగాలలో ఆరవ ముద్ర ద్వారా సూర్యునికి నష్టం కలుగుతుంది-
నాల్గవ బూర ద్వారా, నాల్గవ పాత్ర ద్వారా అని ధ్యానం
చేసుకున్నాము కదా, వాటిలో ఇది కూడా ఒక కారణం అని గ్రహించాలి!
అయితే రెండో వచనంలో మరో దూత కనిపిస్తున్నాడు-
వానికి దేవుని ముద్ర ఉంది. తూర్పు దిక్కునుండి
వచ్చాడు ఈ దేవదూత! అతడు ఈ భూమికి సూర్యునికి రెండింటికి హాని
తలపెట్టడానికి గాలిని ఆపివేసిన ఆ నాలుగు దేవదూతలతో అంటున్నాడు: మేము మా దేవుని దాసులను వారి నొసల్లమీద ముద్రించే వరకు భూమికైనా సముద్రానికైనా హాని
చేయవద్దు అని బిగ్గరగా చెప్పాడు! ఇలా ఎందుకు చెప్పాడు అనేది మనకు
ముందు తెలుస్తుంది. ఇక్కడ
మేము అంటున్నాడు అనగా ఇంకా తనతోపాటుగా అనేకమంది దూతలు తనతో ఉన్నారు అని అర్ధము చేసుకోవాలి!
వారు మొదటగా ఇశ్రాయేలు జాతిలో
1,44,000 వేలమందిని ముద్రించారు. తర్వాత ముద్రించబడిన
వారు లెక్కలేనంత మంది అన్యజనులు కనిపించారు.
మరో
విషయం- ఇలా ఎందుకు
ముద్రించారు అనగా తొమ్మిదో అధ్యాయం 1—12 వచనాలు చూసుకుంటే అక్కడ
అయిదోదూత తన బూరను ఊదినప్పుడు అగాధం తెరువబడి అగాధము నుండి పొగలేస్తుంది. అప్పుడు భయంకరమైన మిడతలు వస్తాయి. అవి దేవుని ముద్రలేని
వారిని మాత్రము కుడతాయి. దేవుని ముద్ర అనగా ఇక్కడ 1—౩ వచనాలలో వివరించిన ముద్ర అని అర్ధము చేసుకోవాలి! ఆ ముద్ర లేనివారిని
, క్రీస్తు విరోధి ముద్ర 666 ముద్ర వేసుకొన్న వారిని
మాత్రమే ఆ మిడతలు కుడతాయి గ్రహించాలి!
ఇక
రెండవ గుంపయకోసం చూసుకుంటే గతభాగాలలో చూసుకున్నాము! వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. అయిదోముద్ర విప్పబడినప్పుడు మనకు దేవుని వాక్యము నిమిత్తము ఆయన సాక్ష్యము నిమిత్తము
వధించబడిన ఆత్మలు పరలోకంలో బలిపీఠం క్రింద చూసినట్లు చూశాము! వారినే ఇక్కడ ఈ అధ్యాయంలో ఎలా వధించబడ్డారో ఎప్పుడు వధించబడ్డారో దేవుడు వివరిస్తున్నారు
అని గ్రహించాలి! వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు.
గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుకున్నారు అని వ్రాయబడింది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే సింహాసం
ముందు మరియు గొర్రెపిల్ల
ముందు దేవునిని స్తుతిస్తున్నారు.
గతంలో
చెప్పిన విధంగా రహస్య రాకడలో ఎత్తబడే వారు చాలా కొద్దిమంది
మాత్రమే! అయితే విడువబడిన వారు అనేకులు. ఈ అనేకులైన విడువబడిన వారు క్రీస్తు విరోధి ని గుర్తించి వాక్య కోసం తమ ప్రాణాలు
కోల్పోయారు. 666 ముద్ర వేసుకోలేదు. వీరి
సంఖ్య లెక్కకు మించి ఉంది. ఇదే గ్రంథంలో సైనికులు సంఖ్య
20 కోట్లు అని లెక్క పెట్టారు గాని వీరిని లెక్క పెట్టలేక పోయారు అంటే
చాలా కోట్లమంది యుగాంతంలో హతస్సాక్షులై పరమునకు చేరుతారు.
అయితే
ఇప్పుడు ఒక అనుమానం రావచ్చును.
వీరు మహాశ్రమల హతస్సాక్షులు అయితే తిన్నగా పరలోకంలో గల బలిపీఠం దగ్గరకు
వెళ్ళిపోయే పరిస్థితి గలవారు కదా మరి ముద్రించవలసిన అవసరం ఏముంది?
ఎందుకంటే
వీరు మొదట రక్షించబడినా వారి అజాగ్రత్త వలన విడువబడ్డారు కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు
భూమి మీద లేడు కాబట్టి మరోసారి ముద్రించడం జరుగుతుంది అని నా ఉద్దేశం!!! ఇప్పుడు వారు
వెళ్ళేది ప్రత్యేకమైన మరియు ప్రశస్తమైన స్థలము. అక్కడ అందరికీ అనుమతి లేదు!
కాబట్టి ఈ హతస్సాక్షులకు ఒక గుర్తింపు కార్డు లాగ వారికి ముద్రవేసి పంపుతున్నారు
అని నా ఉద్దేశం!
ఇక
పెద్దలలో ఒకరు యోహనుగారిని అడిగారు- ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు ఎవరు అని-
ఆయన జవాబు చెప్పారు అయ్యా నాకు నిజంగా తెలియదు నీకే తెలుసు కాబట్టి నీవే
చెప్పు అన్నారు. వెంటనే జవాబు చెబుతున్నారు- వీరు మహాశ్రమల నుండి వచ్చారు అని!
ఇక
వీరికి ఆకలి దాహము లాంటివి ఉండవు. ఇంకా వేడి చలి లాంటివి ఉండవు. ఎందుకంటే గొర్రెపిల్ల వారికి కాపరియై ఉండి పోషిస్తుంది అంటున్నారు.
ఇంకా దేవుడే వారి ప్రతీ భాష్పబిందువును తుడుస్తారు అంటున్నారు.
అందుకే
కాబోలు దావీదు గారు యేసుక్రీస్తుప్రభులవారిని ముందుగా ఆత్మద్వారా వివేచించి- యెహోవా నాకాపరి నాకు లేమి
కలుగదు అన్నారు! కీర్తనలు
23:1;
అవును
దేవుడు మనకు కాపరి! ఒకరోజు నీ రక్షకుడు నీ కాపరి కాబోతున్నారు. ఇప్పుడు కాచి కాపాడుతున్నారు. పోషిస్తున్నారు. నిత్యత్వములో కూడా నీకు కాపరిగా ఉండబోతున్నారు.
ఆరోజు దేవుడు నీ కన్నుల నుండి కార్చిన ప్రతీ భాష్పబిందువును తన ఒడిలో
కూర్చోబెట్టుకుని తుడువబోతున్నారు! అయితే దానికి నీ రక్షణను విశ్వాసమును
నిరీక్షణను కాపాడుకోవలసిన అవసరం ఉంది! దేవుని ముద్రను పొందుకోవలసి
ఉంది. మరినీవు ఆ ముద్రను పొందుకున్నావా? ఆయన రాకడకు సిద్దంగా ఉన్నావా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి