ప్రత్యక్షతల గ్రంధము --2

 


(ప్రత్యక్షతల గ్రంధము-1 తర్వాత)

*ఏడు ముద్రలు-8-- ఏడవ ముద్ర*

 

ప్రకటన 8:12

1. ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.

2. అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.

 

    ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  మనము ఆరవ అధ్యాయంలో ఉన్న ఏడు ముద్రలలో ఆరుముద్రల కోసం చెప్పి ,ఏడవ ముద్రకుముందు దేవుడు ఒక విరామం ఇచ్ఛి . ఇంతవరకు జరిగిన సంఘటనలలో రెండు సంఘటన ల కోసం  రెండు గుంపుల కోసం వివరించారు అని చూసుకున్నాము!

 

 ఇక ఎనిమిదో అధ్యాయం నుండి మరలా జరుగబోయే సంభవాలు కోసం యోహాను భక్తునికి చూపిస్తున్నారు దేవుడు!

ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు విరామం లేకుండా సాగిపోతాయి. 

 

గొర్రెపిల్ల అనబడే యేసుక్రీస్తుప్రభులవారు పరలోకంలో ఏడవ ముద్ర విప్పిన వెంటనే పరలోకం  సుమారు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంటున్నారు. ఇక తర్వాత వచనంలో ఆ ముద్ర విప్పిన తర్వాత అరగంట తర్వాత ఏడుగురు దేవదూతలు కనబడ్డారు వారిచేతులలో ఏడు బూరలు ఉన్నాయి. అనగా ఏడవ ముద్ర విప్పిన తర్వాతనే బూరలు ఊదుతున్నారు అన్నమాట!

 

మొదటగా: ఏడవ ముద్ర విప్పిన వెంటనే పరలోకంలో ఇంచుమించు అరగంట నిశ్శబ్దం ఆవరించింది.  జాగ్రత్తగా గమనిస్తే పరలోకంలో ఎల్లప్పుడూ స్తుతులు ఘోష వినబడుతూ ఉంటుంది. మనము యెషయా 6వ అధ్యాయం చూసుకున్నా, ఈ ప్రకటన గ్రంధంలో ఇంతవరకు చూసుకున్న విషయాలు చూసుకున్నా ఎక్కడచూసినా దేవుణ్ణి స్తుతిస్తూ- ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ దూతలు, కెరూబులు సెరాపులు 24గురు పెద్దలు, నాలుగు జీవులు అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు.

 ప్రకటన 4:811; 5:914; 7:1012

అలాంటిది ఇప్పుడు పరలోకమంతా నిశ్శబ్దం అయిపోయింది సుమారుగా అరగంట వరకు!!! ఎందుకు? బహుశా తుఫాను ముందు ప్రశాంతత లాగ! ఈ నిశ్శబ్దానికి ఏదో అర్ధం ఉంది అన్నమాట! ముఖ్యమైనది ఏదో జరుగబోతుంది కాబట్టే వీరందరూ మౌనముగా ఉన్నారు. దేవుడు మానవులను గాని దేవదూతలను గాని చేసుకున్నది ఆయనను స్తుతించడానికే! అలాంటిది వారు స్తుతించడం మానేశారు ఇక్కడ! దీనికోసం జెఫన్యా గారు ముందుగానే రాశారు 1:7...

ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.

 

కాబట్టి వీరంతా ఎందుకు నిశ్శబ్ధమై పోయారు అంటే ప్రభువుదినము లేదా యెహోవాదినము అనబడే ఉగ్రతాదినము ప్రారంభమవుతుంది కాబట్టే అందరూ నిశ్శబ్ధమై పోయారు. దీనికోసం సృష్టి పరిశుద్ధులు ఆత్మలు అందరూ ఎదురుచూస్తున్నారు. ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఘట్టం రానేవచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుని ఉగ్రత భూమిపై కుమ్మరించబడబోతుంది కాబట్టే ఇది తుఫాను ముందు ప్రశాంతత అన్నమాట! ఆ ఉగ్రతను  ఆయన బూరల ద్వారా చాటి చెబుతున్నారు! మీమీదికి మహా ఉగ్రతా కాలం వచ్చేస్తుంది అని!

 

ఇక రెండవ వచనంలో అరగంట నిశ్శబ్దం తరువాత ఏడుగురు దూతలు కనబడ్డారు! వారిచేతులలో ఏడు బూరలు ఉన్నాయి! గమనించాలి- బూరలు ఎందుకంటే ఏమైనా ప్రకటన చేయడానికి ఉపయోగిస్తారు. మనకు పాత నిబంధనలో దేవుడు బూరలు చెయ్యమని మోషే గారికి చెప్పారు. ఆ బూరలలో గల వ్యత్యాసం అనగా బూరలు ఊదే విధానంలో వ్యత్యాసం బట్టి పరిస్తితి మనకు అర్ధమవుతుంది అన్నమాట! ఎవరైనా శత్రువులు వస్తే ఒకలాంటి స్వరము చేయాలి! సమాజమంతటిని సమాజమందిరానికి లేక ప్రత్యక్ష గుడార ద్వారము దగ్గరకు పిలవాలంటే ఒకరకమైన స్వరము! ఇక పండుగ జరిగేటప్పుడు ఉత్సవాల సమయంలో మరొక స్వరము వినిపిస్తూ ఉంటారు. దీనికోసం పాత నిబంధనలో విస్తారంగా వ్రాయబడింది. నిర్గమ 19:16; లేవీ 23:2325; సంఖ్యా 10:110; యిర్మియా 4:19; 1రాజులు 1:4, 39; 2రాజులు 9:13; యెహోషువా 6:1316

 

కాబట్టి పై రిఫరెన్సులు పరిశీలిస్తే రెండు విషయాలు అర్ధమవుతాయి!

మొదటిది: దేవుడు తీర్చే తీర్పులు- ఆయన పంపించే ఉగ్రత!!

 

రెండవది: యేసుక్రీస్తుప్రభులవారు రారాజుగా- ప్రభువుల ప్రభువుగా ఈ భూమిమీదకు రాబోతున్నారు కాబట్టి ఆర్భాటమైన ధ్వనులు!

ఈ రెండు సందర్బాలను పురష్కరించుకుని ఈ బూరలు ఊదుతున్నారు అన్నమాట!

 

ప్రియ దైవజనమా! ఆయన రారాజుగా అతి తొందరలో రాబోతున్నారు. అంతకు ముందు ఈ భూమిపైకి ఆయన ఉగ్రతను కురిపించబోతున్నారు! అప్పుడు దుష్టులు క్రీస్తు విరోధి అనుచరులు ఘోరమైన శిక్షను అనుభవించబోతున్నారు! మరినీవు శిక్షను తప్పించుకుంటావా? లేక శిక్షకు పాత్రమౌతావా నేడే తేల్చుకో!

నీ బ్రతుకును ఈరోజే సరిచేసుకో!

ఆయన రాకడకు ఎత్తబడు!

*ఏడు ముద్రలు-9-- ఏడవ ముద్ర*

ప్రకటన 8:5

3. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై (మూలభాషలో- ఇచ్చుటకై) అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.

4. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

5. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.

 

  ఇక ఆ తర్వాత యోహాను గారు ఏమి చూశారు అంటే మూడవ వచనంలో సువర్ణ దూపార్తి పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చాడు. గమనించాలి- ఈ దూత ఆ ఏడుగురి దేవదూతలలో ఒకడు కాడు! ఈ దూత సువర్ణ దూపార్తిని పట్టుకుని సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము ఎదుట నిలబడ్డాడు! ఇక్కడ మనకు పరలోకంలో దేవాలయం ఉంది అని చూసుకున్నాము! ఆ దేవాలయంలో బలిపీఠం ఉంది అని చూసుకున్నాము గాని దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఆ అతి పరిశుద్ధ స్థలము లోనే దేవుని సింహాసనం కూడా ఉంది. ఆ సింహాసనం ఎదుటనే ఈ బంగారు బలిపీఠం ఉంది అన్నమాట!  నిర్గమ ౩౦:16

హెబ్రీ 8:5; 9:4

 

సరే, అయితే ఈ దూత కేవలం సువర్ణ దూపార్తిని పట్టుకుని వచ్చి బంగారు బలిపీఠం ముందు నిలబడ్డాడు, వెంటనే ఈ సువర్ణ బలిపీఠం మీద పరిశుద్ధుల ప్రార్ధనలతో కలుపుటకై అతనికి బహు దూపద్రవ్యములు ఈయబడ్డాయి అంటున్నారు.

 

ఒకసారి ఆగి ఆలోచిస్తే పరిశుద్ధుల ప్రార్ధనలు అన్నీ దేవుని సన్నిధికి తప్పకుండా చేరుతున్నాయి. అవి దేవుని బలిపీఠం మీద దూపముగా అర్పించబడుతున్నాయి అన్నమాట! అందుకే నా ప్రార్ధన దూపముగాను నేను చేతులెత్తుట నైవేద్యము గాను నీకు అంగీకారములగును గాక అంటున్నాడు భక్తుడు!

కీర్తనలు 141: 2

నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

 అందుకే కదా దేవదూత భక్తుడైన కొర్నేలీ గారితో నీ ప్రార్ధనయు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి అంటున్నారు!

అపో.కార్యములు 10: 4

అతడు దూతవైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

 

దీనిని బట్టి ఏమని అర్ధం చేసుకోవాలంటే నీవు చేస్తున్న ప్రార్ధన వ్యర్ధముగా పోవడం లేదు! ఆ ప్రార్ధనలు అన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరుతున్నాయి. అయితే వాటికీ జవాబిచ్చే రోజు ఒకరోజు ఉంది. అంతవరకు నీవు ఓపిక పట్టవలసి యుంది. అలా కాకుండా ఈరోజు ప్రార్ధించి దేవుడు నాకు జవాబివ్వడం లేదు, నన్ను మరిచిపోయాడు, నన్ను వదిలేశాడు లాంటి మాటలు అనవద్దు! ప్రతీ ప్రార్ధనకు జవాబు ఇచ్చే రోజు ఒకరోజు వస్తుంది.. ఈ పరిశుద్దులు ఎన్ని సంవత్సరాలు నుండి ఎదురుచూశారో ఇన్ని సంవత్సరాలు తర్వాత వారి ప్రార్ధనకు జవాబుగా వారి ప్రార్ధనలు మరియు బలిపీఠం మీద నున్న దూపద్రవ్యములు అన్ని కలిసి పొగ రూపంలో దేవుని సన్నిధికి చేరాయి!!

ఇక నాలుగో వచనంలో అప్పుడా దూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్ధనలతో కలిసి దూత చేతిలోనుండి తీసుకోబడి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాయి అంటున్నారు! అలాగే నీ ప్రార్ధన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే ఒకమాట- అలా ప్రార్ధనలు దేవుని సన్నిధికి చేరాలంటే మనలో ఉన్న దోషములు పాపములు ముందు తీసివేయాలి! ఎందుకంటే యెషయా 59 లో అంటున్నారు రక్షింపనేరక యుండునట్లు ఆయన కన్నులు మందము కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు గాని మీ దోషములు మీకును ఆయనకు మద్య అడ్డుగా వస్తున్నాయి!...

Isaiah(యెషయా గ్రంథము) 59:1,2,3

 

1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

3. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

 

 కాబట్టి నీ దోషములు పాపములు అతిక్రమమములు ఏమైనా ఉంటే మొదటగా వాటిని తీసివేసి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుని వాటిని విడిచిపెట్టి అప్పుడు ప్రార్ధన చేయు! వెంటనే కొర్నేలీ గారి ప్రార్ధనలు ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినట్లు నీ ప్రార్ధనలు కూడా దేవుని సన్నిదానమునకు జ్ఞాపకార్ధముగా చేరుతాయి!

 

ఇక ఐదో వచనములో ఆ దూత దూపార్తిని తీసుకుని బలి పీఠము మీద నున్న నిప్పులతో దానిని నింపి భూమిమీద పడవేశాడు! వెంటనే భూమిమీద ఉరుములు మెరుపులు ధ్వనులు కలిగాయి. ఇంకా భూకంపం కలిగింది!

అనగా ఎప్పుడైతే ఆ దూత పరిశుద్ధుల ప్రార్ధనలతో బలిపీఠం మీద నిప్పులతో  ఆ దూపద్రవ్యములను కలిపారో వెంటనే దానిని భూమిమీద పడవేశారు! అనగా ఇప్పడు భూమికి భూమిపై దుష్టులు దేవునికి అవిధేయులు చేసిన అతిక్రమములకు దేవుని తీర్పులు ఆరంభం అయ్యాయి అన్నమాట! భయంకరమైన విపత్తులను సూచిస్తున్నాయి ఆ ఉరుములు మెరుపులు భూకంపం!

 

ప్రియ దైవజనమా! ఆయన రారాజుగా అతి తొందరలో రాబోతున్నారు. అంతకు ముందు ఈ భూమిపైకి ఆయన ఉగ్రతను కురిపించబోతున్నారు! అప్పుడు దుష్టులు క్రీస్తు విరోధి అనుచరులు ఘోరమైన శిక్షను అనుభవించబోతున్నారు! మరినీవు శిక్షను తప్పించు కుంటావా? లేక శిక్షకు పాత్రమౌతావా నేడే తేల్చుకో!

నీ బ్రతుకును ఈరోజే సరిచేసుకో!

ఆయన రాకడకు ఎత్తబడు!

దైవాశీస్సులు!

*ఏడు బూరలు-ఏడు  పాత్రలు-మొదటి బూర/పాత్ర*

 

ప్రకటన 8:67

6. అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.

7. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.

 

16:12

1. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయ ములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.

2. అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండుపుట్టెను.

 

     ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ఎనిమిదో అధ్యాయం నుండి మరలా జరుగబోయే సంభవాలు కోసం యోహాను భక్తునికి చూపిస్తున్నారు దేవుడు! ఇక్కడనుండి మనము ఏడు బూరలు చూడవచ్చు!

 

అయితే గతంలో చెప్పిన విధముగా ఏడు బూరలు- ఏడు పాత్రలు ఒకే వాటికోసం చెప్పబడ్డాయి అయితే ఏడు బూరలు యూదుల కోణంలో దేవుని ఉగ్రత ఎలా సంభవిస్తుందో యూదుడైన యోహాను గారికి చూపించారు. ఏడు పాత్రలు అదే దేవుని ఉగ్రతను సంఘపు కోణంలో సార్వత్రిక సంఘములో తనవంతు పెద్ద పాత్ర పోషించిన మరియు అపొస్తలుడైన యోహాను గారికి చూపించారు. రెండు ఒకే వర్తమానాన్ని రెండు కోణాలలో యోహాను గారికి వివరించినట్లు చెప్పుకున్నాము! గనుక బూరలు- పాత్రలు రెండుసార్లు కాకుండా ఒకేసారి వివరించుకుంటూ వెళ్తాను. దయచేసి అర్ధముచేసుకోమని మనవిచేస్తున్నాను!

దయచేసి మీదన ఫోటోలో గల సమాచారమును  ఒకసారి చదవమని మనవిచేస్తున్నాను!

 

 అంతేకాకుండా బూరలకు పాత్రలకు మధ్యలో విరామం కనిపిస్తుంది మరియు ఏడు బూరల మధ్య విరామం కనిపిస్తుంది. అయితే మీకు అర్ధం కావడానికి బూరలు- పాత్రలు పూర్తిచేసి అప్పుడు మరలా వివరణ కోసమైన అధ్యాయాలు ధ్యానం చేసుకుందాం!

 

ఈరోజు మొదటి బూరను అనగా యూదుల కోణమైన మొదటి బూరను, సంఘపు కోణమైన మొదటి పాత్రను చూసుకుందాం!

 

16:12 లో మీరు పోయి దేవుని కోపముతో నిండియున్న ఆ ఏడు పాత్రలను భూమిమీద క్రుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం జరిగింది.

 

ఇక్కడ ఒకమాట చెప్పనీయండి- మరి ఏడు బూరలు- ఏడు పాత్రలు ఒకే వర్తమానం అంటున్నారు- ఇంతకీ ఏడు బూరలు ఊదారా లేక ఏడు పాత్రలు కుమ్మరించారా అని అడగవచ్చు! అయ్యా! ఏడు బూరలు ఊదారు ఏడు పాత్రలు కుమ్మరించారు. నా ఉద్దేశం ఏమిటంటే మొదటి బూరను ఊదినవెంటనే మొదటి పాత్ర కుమ్మరించబడింది!

 

సరే, ఇక్కడ బూరలు- పాత్రలు ఇవి రెండు దేవుని ఉగ్రతను భూమిమీద కురిపించడానికి వాడారు అని అర్ధం చేసుకోవాలి! ఏడు బూరలు- ఏడు పాత్రలు దేవుని ఉగ్రతాదినమైన ప్రభువు దినము నాడు జరిగే తీర్పులను తీసుకుని వస్తున్నాయి. మరొకసారి చెబుతున్నాను మహాశ్రమలు- దేవుని ఉగ్రతా దినమైన ప్రభువుదినము లేక యెహోవాదినము ఒకటి కాదు! రెండు వేరువేరు! అంతేకాకుండా మహాశ్రమలకాలం పూర్తికాబడిన వెంటనే  దేవుని ఉగ్రతాదినం ప్రారంభమవుతుంది. ప్రభువుదినము లేక యెహోవాదినము ఒక్కరోజుతో పూర్తి కావడం లేదు! 45/75 రోజులు గాని పట్టవచ్చు  లేదా కొందరు బావించినట్లు మహాశ్రమల చివరి అర్ధభాగంలో కుదించవచ్చు అని నా ఉద్దేశం మాత్రమే! అటు తర్వాత ఆయన బహిరంగ రాకడ జరుగుతుంది.

 

సరే, మొదటి బూర ఊదిన వెంటనే రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని రెండు కలిపి భూమిమీద ఉమ్మరించడం జరిగింది.

ఇక్కడ మొదటి పాత్ర భూమిమీద కుమ్మరించగా క్రూరమృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టింది.

 

మొదటి బూర వలన భూమి మరియు సస్య సంపద దెబ్బతింది. అయితే సంఘపు కోణంలో ఇంకా బాగా చెబుతున్నారు- భూమి మరియు సస్య సంపదయే కాదు- ఆ క్రూరమృగం యొక్క ముద్ర అయిన 666 వేసుకున్న వారికి ఇంకా వాడి ప్రతిమకు నమస్కారం చేసిన వారికి బాధ కరమైన చెడ్డపుండు పుట్టింది!

 

దీనిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకసారి ఐగుప్టు దేశంలో కూడా ఇలాంటి తీర్పు జరిగింది తండ్రియైన యెహోవా దేవుని ద్వారా! తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి బయటకు పంపమంటే విననందున దేవుడు అప్పుడు వారికి ఇలాంటి వడగండ్లు ద్వారా తీర్పు తీర్చారు.  నిర్గమ 9:2226..

 

22. యెహోవా నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.

23. మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.

24. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.

25. ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యుల నేమి జంతువుల నేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.

 

అప్పుడైతే వడగండ్లు ద్వారా తీర్పు తీర్చి ఆ దేశపు పంటను మరియు పశువులను హతం చేశారు కాని ఇప్పుడైతే వాటితో పాటు అగ్ని మరియు రక్తము కూడా కురువబోతుంది! ఎవరి మీద? క్రూరమృగం యొక్క ముద్ర గలవారికి అనగా క్రూర మృగం యొక్క అనుచరుల మీదికి!

యెహెజ్కేలు గ్రంధంలో కూడా దీనికోసం చెబుతున్నారు దేవుడు 38:22

తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.

 

యోవేలు 2: 30

మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

 

అపో.కార్యములు 2: 19

పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

 

ఇంకా చెడ్డపుండ్లు కోసం చూసుకుంటే నిర్గమ 9:911 లో కూడా ఇదే తీర్పులు కలిగాయి....

 

9. అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను.

10. కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.

11. ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను.

 

   ఈరకంగా అప్పుడు ఐగుప్తు దేశము మీద ఏవిధంగా తీర్పు తీర్చారో ఇప్పుడు దేవుడు అదేవిధముగా అంత్య కాలములో దుష్టులకు తీర్పు తీర్చబోతున్నారు!

 

   ప్రియ దైవజనమా! ఆ దూతలు బూరలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఊదటానికి! మరి వాటిని తప్పించుకోడానికి నీవు సిద్దంగా ఉన్నావా? దేవుడు భూమిమీద సస్యము మీద, ఇంకా క్రీస్తు విరోధి ముద్ర గలవారిమీద తీర్పు తీర్చబోతున్నారు! నేడే బ్రతుకును సరిచేసుకుని దేవుని రాకడకు సిద్దంగా ఉండమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

*ఏడు బూరలు-రెండవ బూర/పాత్ర*

 

ప్రకటన 8:89

8. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.

9. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశనమాయెను.

 

ప్రకటన గ్రంథం 16: 3

రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.

 

      ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ప్రియులారా మనము ఏడు బూరలు యూదుల కోణంలో- ఏడు పాత్రలు సంఘపు కోణంలో ధ్యానం చేస్తున్నాము!

 

    ఇక మనము రెండవ బూరను- రెండవ పాత్రను చూసుకుందాం!

ఇక్కడ రెండవ బూరను దూత ఊదాడు వెంటనే అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ లాంటిది సుముద్రంలో పడవేయ బడింది. వెంటనే సముద్రంలో నీరు రక్తమయ్యింది. ఆ కారణాన సముద్రంలో గల జీవులలో అనగా చేపలలో రొయ్య పీత లాంటి జీవులలో మూడో భాగం చనిపోయెను! ఇంకా ఓడలలో మూడో భాగం నాశనం అయిపోయాయి! 

 

 అక్కడ రెండవ పాత్రను సముద్రము మీద కుమ్మరించాడు దూత! వెంటనే సముద్రము పీనుగ రక్తము వంటిది అయ్యింది అందువలన సముద్రములో గల జీవ జంతువులూ చచ్చాయి అంటున్నారు!

 

చూశారా- బూర ఊదినప్పుడు సముద్రానికే నష్టం కలిగింది. పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రానికే నష్టం కలిగింది. అందుకే రెండూ ఒకటే- రెండు కోణాలలో దేవుడు వివరించారు అని చెబుతున్నది!

 

ఈ తీర్పు కోసం చూసుకున్నా ఇది కూడా ఐగుప్తుదేశం మీద దేవుడు తీర్చిన తీర్పు లాగే ఉంటుంది, గతంలో మోషే గారి సమయంలో దేవుడు ఇలాంటి తీర్పునే తీర్చారు ఐగుప్తీయుల మీద!

నిర్గమ 7:19-21....

 

19. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.

20. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.

21. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.

 

  అప్పుడు దేవుడు ఎందుకు నీటిమీద తీర్పు తీర్చారు అని ఆలోచిస్తే వారు ఆరోజులలో నైలునదిని పవిత్రమైనదిగా అనుకుని దానిచేసిన దేవుని పూజించకుండా నైలునదిని దేవతగా పూజించే వారు! ఇంకా ప్రతీ విగ్రహాన్ని ఆ నీటితో కడిగేవారు! అందుకే దేవుడు ఆ విగ్రహాలకు తీర్పు తీర్చారు! ఇప్పుడు ప్రజలు క్రీస్తు విరోధి క్రూర మృగము యొక్క ముద్రకలిగి వాడి ప్రతిమకు పూజిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు అదేవిధమైన శిక్షను వేశారు!

 

సరే, ఇప్పుడు రెండూ కలిపి చదువుకుంటే 16వ అధ్యాయంలో పాత్రను కుమ్మరించినప్పుడు సముద్రం పీనుగ రకము వంటిదయ్యింది అందువలన సముద్రంలో జీవులు చచ్చాయి అని వ్రాయబడినా ఇక్కడ 8:89 వచనాలలో వివరంగా వివరిస్తున్నారు- ఆకాశము నుండి అగ్నిచేత మండుచున్న  ఒక పెద్ద కొండలాంటిది  సముద్రం మీద పడినందువలన సముద్రం రక్తంలా మారింది అక్కడ 16వ అధ్యాయం ప్రకారం పీనుగ రక్తంలాగ మారింది. వెంటనే సముద్రంలో గల జీవులు మూడో వంతు చనిపోయాయి! ఆ కొండ పడిన ప్రాంతంలో గల ఓడలు అన్ని నాశనమైపోయాయి!

 

ప్రియులారా! ఈ విషయాలు అతి తొందరలో సంభవించ బోతున్నాయి. మరి వాటిని తప్పించుకోడానికి నీవంతు ప్రయత్నం చేస్తునావా?

అసలు ఇవి జరుగబోతున్నాయి అని తెలుసా నీకు!

నేడే మార్పునొంది రక్షణ పొందుకుని వీటిని తప్పించుకో!

*ఏడు బూరలు-మూడవ బూర/పాత్ర*

 

ప్రకటన 8:1011

10. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గల మీదను పడెను.

11. ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.

 

16:47

4. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.

5. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;

6. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.

7. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.

 

ఇక మనము మూడవ బూరను-మూడవ పాత్రను చూసుకుందాం!

 

  8:10 లో మూడవ దూత బూర ఊదాడు, వెంటనే దివిటీవలే మండుచున్న పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము పైన నీటి బుగ్గల మీద పడింది. ఆ నక్షత్రము పేరు మాచిపత్రి అనగా చేదు. నీరు చేదై పోయినందువలన ఆ నీరు త్రాగి మనుష్యులలో అనేకులు చచ్చిరి అని వ్రాయబడింది.

 

ఇక అక్కడ 16:4 లో మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారల లోను కుమ్మరించగా అవి రక్తమాయెను అని వ్రాయబడింది.

 

ఇక్కడ రెండు చోట్ల దేవుని ఉగ్రత నదులమీద జలధారలు అనగా నీటిబుగ్గలు లాంటి వాటిమీద కుమ్మరించగా నీరు రక్తమయ్యింది. బూర ఊదినప్పుడు ఇంకా వివరంగా చెబుతున్నారు: దివిటీ లాగ మండుచున్న ఒక నక్షత్రం ఆకాశం నుండి రాలింది. దాని పేరు మాచిపత్రి అని! బహుశా అది ఒక  ఉల్క గాని చిన్న నక్షత్రం కావచ్చు! లేదా ఏదైనా బయోకెమికల్ వెపన్ కావచ్చు! అది నదులలో కుమ్మరించగా నీరు మొత్తం చేదు అయిపోతుంది. అంతేకాకుండా నీరు రక్తమయ్యింది అంటున్నారు కాబట్టి నీటియొక్క రంగు కూడా ఎర్రగా రక్తములా మారిపోతుంది అన్నమాట! అందువలన ఆ చేదునీరు త్రాగడం వలన ప్రజలు అనేకులు చనిపోతారు అని చెబుతున్నారు.

 

అయితే కొంతమంది వేదపండితులు ఏమంటారు అంటే నక్షత్రం అనేది దూతలను సూచిస్తుంది ప్రకటన 9:1 ప్రకారం, కాబట్టి అది నక్షత్రము కాదు నదులను నీటిబుగ్గలను పాడుచేయడానికి దేవుడు పంపిన దూత అంటారు! ఏదైతేనేమి మొత్తానికి నీరు చేదుగా మారి దానిని త్రాగిన వారు అనేకులు చనిపోతారు! ఆ నక్షత్రానికి మాచిపత్రి అనగా చేదు అని పేరు అంటున్నారు.

 

   ఇది ఎలా జరిగిందో లేక జరుగుతుందో వివరణ ఇక్కడ ఉంది. అయితే తర్వాత ఏమి జరిగింది అనగా నీరు మాచిపత్రి అయి- ప్రజలు చనిపోయిన తర్వాత పరలోకంలో ఏమి జరిగిందో మనకు 16:57 వచనాలు చెబుతున్నాయి.

 మొట్టమొదటగా మనకు జలముల మీద ఉండే దేవదూత పలుకుతున్నాడు ఇక్కడ! అనగా ప్రతీ జలముల మీద ఒక దేవదూత ఉన్నాడు అన్నమాట! ఈ దేవదూతలకు ఆజ్ఞలిచ్చి యేసుక్రీస్తుప్రభులవారు తన సమస్త కార్యములను నిర్వహిస్తున్నారు అని అర్ధమవుతుంది. 

 

ఇక్కడ ఈ జలముల మీద గల దేవదూత ఏమంటున్నాడు అంటే: వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండు పవిత్రుడా వారు అనగా క్రీస్తు విరోధి అనుచరులు మరియు దుష్టులు-- పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును చిందించారు కాబట్టి నీవు ఇప్పుడు వారికి రక్తమును త్రాగిస్తున్నావు అంటున్నారు.  ఇంకా ఆరవ వచనంలో అదే దూత అంటున్నాడు- అయ్యా వారు దీనికి పాత్రులు, నీవు ఈలాగు న్యాయము తీర్చి నీవు న్యాయవంతుడవు అయ్యావు అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు!

వెంటనే బలిపీటం నుండి స్వరము వస్తుంది అనగా బలిపీఠం పలుకుతుంది ఏమని అంటే: అవును ప్రభువా! దేవా సర్వాధికారి! నీ తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవి!! ఆమెన్! నిజము కదా! దేవుని తీర్పులు సత్యము న్యాయములు! వారు ఇంతవరకు ఎంతమంది పరిశుద్ధులను ప్రవక్తలను చంపారో- ఆ తీర్పు వారికి తీర్చి అదే రక్తాన్ని వారితో త్రాగిస్తున్నారు దేవుడు! ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు! దేవుడు పేతురుతో అంటున్నారు: పేతురు కత్తిచేత పట్టువాడు కత్తిచేతనే హతమవుతాడు! మత్తయి 26:52: ఎవరు పన్నిన వలలో వారే పడతారు! మరొక చోట అంటున్నారు: ఎవడును నిన్ను మోసగించగించక పోయినను మోసగిస్తున్న నీకు శ్రమ! ఎవడును దోచుకొనకపోయినను ఇప్పుడు దోచుకుంటున్న నీకు శ్రమ! నీవు దోచుకొనుట ముగించిన తర్వాత నీవు దోచబడుడువు! యెషయా 33: 1

దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ! నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ! నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు.!

 

అవును- వారు రక్తము చిందించుట ముగించాక దేవుడు ఇప్పుడు వారికి అదే రక్తాన్ని త్రాగిస్తున్నారు!

 

గమనించాలి- దుర్మార్గుల మీద దేవుడు తన కోపాన్ని కుమ్మరిస్తారు అనేది బైబిల్ లో చాలాసార్లు చెప్పబడింది. 2 థెస్స 1:58

 

5.  దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

 

    ఒకరోజు తప్పకుండా దేవుడు వీరిమీద తీర్పు తీర్చుతారు! కాబట్టి ప్రియ దైవజనమా! ఇప్పుడు నీవు బాధపడుతున్నావా- బాధపడకు- ఒకరోజు వారికి వస్తుంది- వారు నిన్ను ఎలా బాధించారో అలాగే వారుకూడా బాధించబడతారు అంతకంటే ఎక్కువగా దండించబడతారు! అయితే క్రొత్త నిబంధన విశ్వాసులుగా వారి చావును- నాశనమును మనము కోరకూడదు! ప్రార్దించకూడదు! అయితే క్షమించమని చెబుతుంది బైబిల్! ఇంకా ఏమంటున్నారు అంటే: నీ శత్రువు ఆకలిగొంటే అన్నము పెట్టు దాహముగొంటే పాలు ఇవ్వు! ఇలాచేస్తే నీవు ఆ శత్రువు నెత్తిమీద నిప్పులు కుప్పగా పోస్తున్నట్లు లెక్క అంటున్నారు! రోమీయులకు 12: 20

కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

 కాబట్టి మనమైతే అలా చేద్దాం! గాని దేవుడు అంటున్నారు- పగతీర్చుట నా పని! కాబట్టి దేవుని పనిని దేవున్నే చేయనిద్దాం!

 

అయితే పరలోకంలో ఉన్నవారి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి! అవి దేవుని తీర్పులకు అనుగుణంగా ఉంటాయి! దుర్మార్గులకు తీర్పు తీర్చబడాలని  దండన చేయబడాలని కోరుకొనేది మనము కాదు! పరలోక నివాసులు మరియు పరలోకానికి చేరిన ఆత్మలు!

 

*ఏడు బూరలు-నాల్గవ బూర/పాత్ర*

 

ప్రకటన 8:1213

12. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.

13. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.

16:89

8. నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.

9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.

 

8:1213 లో నాల్గవ దూత బూర ఊదాడు! సూర్యచంద్రుల నక్షత్రములలో మూడగ భాగము చీకటి కమ్మింది. అనగా ప్రపంచములో మూడొంతుల ప్రాంతానికి సూర్యుని వెలుగు చంద్రుని వెలుగు, నక్షత్రముల వెలుగు ప్రకాశించడు అన్నమాట! పగటిలో మూడవ భాగము సూర్యుడు కనబడడు అనగా కొద్దిగా వచ్చి చిన్న ప్రకాశం వచ్చి వెంటనే చీకటి పడిపోతుంది. రాత్రుళ్ళు కూడా మూడవ భాగము చంద్రుని యొక్క ప్రకాశము నక్షత్రముల యొక్క ప్రకాశము కనబడదు!

అక్కడ 16:89 లో నాల్గవ పాత్ర సూర్యునిమీద కుమ్మరించబడింది. అందువలన ఓజోన్ పొర దెబ్బతిని అనేకులను తీవ్రమైన వేడిమితో కాల్చడానికి అధికారం పొంది వేడిమితో ప్రజలను ఇబ్బంది పెడ్తుంది. దీనికోసం ఆరవ ముద్రను ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాం!

....

గమనించాలి ఆ దినముల శ్రమ అనగా మహాశ్రమల కాలం ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలించబడును అంటున్నారు.  ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి- శ్రమలు ముగిసాక అని చెబుతున్నారు- ఎవరు చెబుతున్నారు? సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారు! 35వ వచనంలో ఆకాశము భూమి గతించును గాని నామాటలు గతించవు- తప్పకుండా జరుగుతాయి అని చెప్పారు!! కాబట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే మొదటి ముద్రనుండి- అయిదు ముద్రలు పూర్తికాబడి ఆరవ ముద్రను విప్పే సమయానికి ఏడు సంవత్సరాలు మహాశ్రమలు పూర్తి అయిపోతాయి అని నాకు అర్ధమయ్యింది.

 

కారణం 12వ వచనం ప్రకారం సూర్యుడు నలుపయ్యాడు, చంద్రుడు ఎరుపయ్యాడు, 13వ వచనం ప్రకారం ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతున్నాయి, 14వ వచనం ప్రకారం ఆకాశం చుట్టబడి- అనగా ఆకాశమందలి శక్తులు కదిలించ బడుతున్నాయి అనగా మహాశ్రమలు ముగిసిపోయినట్లే కదా యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినట్లు!!!

 

ఇక్కడ అనగా ఆరవ ముద్ర సమయంలో సూర్యుడు నలుపాయెను చంద్రుడు రక్తవర్ణమాయెను అనగా ఎరుపాయెను అని వ్రాయబడి ఉంది, అదేవిధంగా నాల్గవ భూర ఊదినప్పుడు, అలాగే నాల్గవ పాత్ర క్రుమ్మరించినప్పుడు కూడా సూర్య చంద్రులు దెబ్బ తిని తమ వెలుగును ఇవ్వడం లేదు కదా- మరి దీని సంగతి ఏమిటి అని అడగవచ్చు!

దీని అర్ధము ఏమిటంటే మహాశ్రమల కాలం అయిపోయాక ఆరవ ముద్రతో దేవుని ఉగ్రతాకాలం ప్రారంభమయ్యింది-  ఆ క్రమంలోనే సూర్యునికి ఈ ప్రక్రియలు అన్ని సంభవిస్తున్నాయి అని నా ఉద్దేశం! అయితే కొందరు ఏమని అభిప్రాయపడతారు అంటే దేవుని ఉగ్రతాకాలం అనేది మహా శ్రమలకాలంలో రెండవ అర్ధభాగంలో మొదలవుతాయి అంటారు! ఏమో తెలియదు. నా ఉద్దేశం మహా శ్రమల తర్వాతనే ఉగ్రతాకాలం మొదలవుతుంది.

 

 సరే ఆ క్రమంలోనే సూర్యుడు ఎలా నలుపయ్యాడో, చంద్రుడు ఎలా ఎరుపయ్యాడో ఇక్కడ అనగా యూదుల కోణం అయిన ఏడు బూరలలో నాల్గవ బూరగా వివరిస్తున్నారు ప్రకటన 8:12 లో, అలాగే సంఘపు కోణంలో దేవుని ఉగ్రత అయిన పాత్రలలో నాల్గవ పాత్ర ప్రకటన 16:89 లో అక్కడ వివరిస్తున్నారు.

 

   కాబట్టి దేవుడు సూర్యచంద్రుల మీద తన ఉగ్రతను కురిపిస్తారు. అప్పుడు సూర్యుడు కాంతిని ఇయ్యడు చంద్రుడు ఎర్రగా మారి తన కాంతిని ఇయ్యడు. మరో కారణం కూడా ఉంది అనిపిస్తుంది- ఏమిటంటే అప్పటికే భూమిమీద శాంతి సమాధానాలు లేకుండా రెండవ ముద్ర విప్పిన వెంటనే ఒకడు చేశాడు. యుద్ధాలు కలిగాయి. వాటిలో కొంతమంది అణుబాంబులు కూడా వాడటం జరుగుతుంది. దానివలన భయంకరమైన పొగ విడుదల కాబడుతుంది. తద్వారా వెలువడిన కాలుష్యం వలన మరియు రేడియేషన్ వలన సూర్యుని కాంతి మరియు చంద్రుని కాంతి భూమిమీదకు రాదు అనిపిస్తుంది నాకు! మొదటగా దేవుని ఉగ్రత, రెండవది ప్రజలు వాడిన బాంబుల వలన కలిగే కాలుష్యం వలన కలిగే చీకటి! ఈ రెండు కలిపి సూర్యచంద్రులకు మబ్బు కలిగి కాంతి భూమిమీదకు రాకుండా పోతుంది అని గ్రహించాలి!

 

అయితే అదే సమయంలో మరో అనుమానం రావచ్చు మీకు-- నాల్గవ బూరద్వారా సూర్యుడు చంద్రుడు దెబ్బతిని ప్రకాశించడం మానేశారు అని వ్రాయబడింది, మరి నాల్గవ పాత్రద్వారా భయంకరమైన వేడిమి ప్రజలను వేదిస్తుంది అని వ్రాయబడింది. రెండూ ఒకటే అంటున్నావు- ఎలా అని అడగవచ్చు- ఎక్కడైతే  రేడియేషన్ వలన భయంకరమైన కాలుష్యం పెరిగిపోతుందో అక్కడ చీకటి-  రేడియేషన్ ప్రభావం వలన అనేకచోట్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది- అక్కడ భయంకరమైన వేడిమి కల్గుతుంది కారణం ఓజోన్ పొర దెబ్బతిని అతినీల లోహిత కిరణాలు (ultra violet rays) తిన్నగా భూమిపైకి వచ్చి వేడిమితో మనుష్యులను కాల్చుకు తింటాడు సూర్యుడు!!!

 

ఇవీ ఆరవ ముద్ర విప్పినప్పుడు నాల్గవబూర మరియు నాల్గవ పాత్ర వలన కలిగే సంభవాలు!

 

ఇక చివరగా 8:13 లో ఒక పక్షిరాజు ఎగురుచూ భూనివాసులకు అయ్యో-అయ్యో-అయ్యో అని మూడుసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే మూడు భయంకరమైన శ్రమలు రాబోవుచున్నాయని మూడు సార్లు అయ్యో అయ్యో అయ్యో అని చెప్పడం జరిగింది. ఈ శ్రమలను కోసం చూసుకుంటే

ప్రకటన 9:112 వరకు- మొదటి శ్రమ;

ప్రకటన 9:1311:14 వరకు రెండవ శ్రమ;

ప్రకటన 13వ అధ్యాయంలో వివరించిన శ్రమను సూచిస్తూ మూడవ అయ్యో అనగా మూడవ శ్రమ!

 

ప్రియులారా ఈ శ్రమలు అతి త్వరగా రాబోవుచున్నాయి మరి నీవు తప్పించు కొనడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ విడువబడితే ఆ భాధలు నీవు పడలేవు సుమీ!

ప్రియ సహోదరి సహోదరుడా! ఇవి జరుగక మునుపే బ్రతుకు మార్చుకుని రాకడకు సిద్దపడమని ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను!

*ఏడు బూరలు-ఐదవ బూర/పాత్ర*

 

ప్రకటన 9:112

1. అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.

2. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.

3. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.

4. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.

5. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.

6. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.

7. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,

8. స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.

9. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.

10. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.

11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను. (అనగా- నాశనము చేయువాడు)

12. మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.

 

16:1011

10. అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి;

11. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.

 

   ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ప్రియులారా మనము ఏడు బూరలు యూదుల కోణంలో- ఏడు పాత్రలు సంఘపు కోణంలో ధ్యానం చేస్తున్నాము!

ఇక మనము ఐదవ బూరను-ఐదవ పాత్రను చూసుకుందాం!

 

ఈ భాగములలో మనకు 9:112 ఆకాశం నుండి రాలిన నక్షత్రం లేక దూత అగాధపు తాళపుచెవి గలవాడు- అగాధం తెరుస్తాడు- మిడతలు వస్తాయి- 5 నెలలు దేవుని ముద్రలేని వారిని- 666 ముద్రగలవారిని బాధిస్తాయి.

మొదటి శ్రమ అయిపోయింది.

 

అక్కడ 16:1011లో దూత తన పాత్ర  క్రూరమృగం సింహాసనం మీద కుమ్మరించెను. వాడి రాజ్యం చీకటి అయిపోయింది. క్రూరమృగం అనుచరులకు హానికలిగింది.

రెండుచోట్ల చీకటి క్రమ్మింది.

 

ఐదవ పాత్ర కోసం చూసుకుంటే ఆకాశము నుండి రాలిన నక్షత్రము అంటున్నారు. మరలా అదే వచనంలో అతనికి అగాదము యొక్క తాళపుచెవి ఇవ్వబడింది అంటున్నారు! అనగా దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఆకాశము నుండి రాలినది ఏమంటే దూత! నక్షత్రము ఇక్కడ దూతను సూచిస్తుంది ఈ భాగం ప్రకారం!

ఈ దూతకు అగాదపు తాళపుచెవి ఇవ్వబడింది. గమనించాలి- పూర్వము చెప్పడం జరిగింది- భూమిక్రింద మూడు భాగాలున్నాయి!

 

 మొదటిది: పాతాళం- హేడేస్; ఇది ఎవరైతే పాపము చేస్తారో- దేవుని ఆజ్ఞలను విడిచి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వారిని దండించే స్థలము. భూమిమీద వారి సమయం అయిపోయిన వెంటనే తిన్నగా అక్కడకే వెళ్తారు! ఇది మనకు లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు ఉపమానంలో దేవుడు చెప్పడం జరిగింది.

 

రెండవది: పరదైసు! పరిశుద్ధులకు- జీవితాలు దేవునికోసం జాగ్రత్తగా చూసుకున్నవారు లేక తమ ఘటములకు ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకున్నవారికి దేవుడు రాకడ వరకు- తీర్పువరకు ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ లేక రెస్ట్ హౌస్! ఇక్కడే లాజరు గారు ఉన్నారు! అయితే యేసుక్రీస్తుప్రభులవారి మరణపునరుత్థాన సమయంలో దేవుడు దీని అడ్రస్ మార్చి కేరాఫ్ మూడో ఆకాశం చేశారు!

 

ఇక ఈ పాతాళము మరియు పరదైసు కి మధ్యలో అగాధం ఉంది అని చెబుతున్నారు అదే ఉపమానంలో! దీనిని అబైస్ అంటారు!

 

ఇప్పుడు ఈ దూతకు దీని తాళపుచెవి ఇస్తే ఆయన దాని తలుపు తీసాడు! వెంటనే పెద్ద కొలిమిలో నుండి లేచే పొగ లాగ గొప్ప పొగ క్రమ్మింది. దానివలన సూర్యునికి వాయుమండలమునకు చీకటి క్రమ్మింది.

ఇక ఈ పొగలోనుండి మిడతలు భూమిమీదకు వచ్చాయి. బహుశా అగాధము నుండే వచ్చి ఉంటాయి. వీటికి భూమిలో ఉండే తేళ్ళకి ఎలా బలముంటుందో అలాగే వీటికి కూడా బలమియ్యబడింది. ఇవి అందరిని కుట్టవు! తమ నొసల్లమీద దేవుని ముద్ర లేనివారికి మాత్రమే కుడతాయి! ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇవి నిజానికి మొక్కలను తింటాయి చెట్లను తింటాయి! అయితే వీటికి ఏమని ఆజ్న ఇవ్వబడింది అంటే మొక్కలకైనా చెట్లకైనా హాని చెయ్యవద్దు గాని కేవలం దేవుని ముద్ర లేని వారికి అనగా క్రీస్తు విరోధి ముద్ర అయిన 666 ముద్ర వేసుకున్నవారికి మాత్రం కుట్టి అయిదు నెలలు భాదించమని సెలవు ఇచ్చారు! అయితే మనుష్యులను చంపడానికి వీటికి  అధికారం లేదు!

వీటికోసం గతంలో యోవేలు గ్రంధం ధ్యానం చేసుకున్నప్పుడు చూసుకున్నాము!

ఇక మిడతల ఆకారాలు వర్ణించడం జరిగింది. అక్కడ గుర్రాలు వేగాన్ని సూచిస్తున్నాయి. అనగా ఇవి చాలా తొందరగా ప్రయాణించగలవు అని అర్ధం! వీటికి కిరీటాలు ఇవ్వబడ్డాయి అనగా అధికారం ఉంది వీటికి- దేనిమీద అధికారం ఉంది అంటే మనుష్యులను అయిదు నెలలు బాధించడానికి! మనుష్యులకు ఉండే ముఖాలున్నాయి అంటే వీటికి తెలివితేటలూ వ్యక్తిత్వము ఉన్నాయి అని అర్ధం! మనుష్యుల కంటే గొప్పగా ఆలోచించగలవు అని అర్ధం చేసుకోవాలి!

అయతే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి పొగలోనుండి వచ్చాయి. పొగ ఎక్కడనుండి వచ్చింది అగాధం నుండి వచ్చింది. అనగా ఒకవేళ ఇవి నిజంగా అగాధం నుండి వస్తే ఇవి ఖచ్చితంగా దురాత్మలు, దయ్యాలు అని అర్ధం చేసుకోవాలి!

ఎందుకంటే వీటికి రాజు ఉన్నాడు వాడి పేరు అపోల్యోను లేక అబద్దోను . దీనితో మొదటి శ్రమ గతించి పోయింది.

 

అయితే ఐదో పాత్ర కూడా దీనినే వివరిస్తుంది. క్రూర మృగము యొక్క సింహాసనం మీద పాత్ర కుమ్మరించగా వాడి రాజ్యమునకు చీకటి కమ్మింది మనుష్యులకు వేదనలు కలిగాయి ఎంతగా అంటే తమ నాలుకలు కరుచుకొనేటంతగా గొప్ప వేదనలు కలిగాయి. అయితే అవి ఎలా కలిగాయో మనకు ఐదో బూరలో తెలుస్తుంది.

 

ఇక మిడతల కోసం ఆలోచిస్తే వాటి పళ్ళు సింహపు కోరలవంటివి అంటున్నారు. గమనించాలి పులి సింహపు కోరలు చాలా సూదిగా బలంగా ఉంటాయి! ఎలాంటి బలమైన జంతువునైనా ఈ కోరలతో పట్టుకుంటే లోతుగా గుచ్చుకుంటాయి.  ఇక అవి పొడిస్తే ఆడు సింహపు కాటులా ఉంటుంది అట!

 

    గమనించాలి- ఈ మిడతల ద్వారా దేవుని శిక్ష అనేది- ఐగుప్తు దేశం మీద ఒకసారి జరిగింది.  మరలా అంత్యదినాలలో దేవుని రాకడ దినాలలో కూడా జరగబోతుంది అని ప్రకటన తొమ్మిదో అధ్యాయం ద్వారా అర్ధం చేసుకోవచ్చు! అంతేకాకుండా 2019 నుండి  2020 మే నెల వరకు మన దేశంలోను ఇంకా అనేక దేశాలలో ఈ మిడతల దండ్లు వచ్చి పచ్చని చెట్లను తినేసి, పంటలను నాకేసినట్లు చూడగలము! వీటి పరిమాణం ఒక ఇంచి నుండి నాలుగు ఇంచీల వరకు ఉన్నాయి! అవి మన ఉత్తర భారతదేశాన్ని కకావికలం చేసేసాయి! ఇలాంటివే యుగాంతములో మరలా వస్తాయి.

 

      అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మన భారతదేశంలో ఉండే మిడతల సైజు కంటే చాలా పెద్దగా ఉంటాయి అంటున్నారు.  కొందరైతే ఒక అడుగుకంటే ఎక్కువ పెద్దగా ఉంటాయి అంటున్నారు.  ఏదైతేనేమి ఇవి కేవలం మనుష్యులను శిక్షించడానికి మాత్రమే రాబోతున్నాయి. *యోవేలు గ్రంధం ప్రకారం మనుష్యుల జీవనాధారమైన పంటలను నాశనం చెయ్యడానికి వస్తున్నాయి. ప్రకటన గ్రంధం ప్రకార్రం దేవుని ముద్ర లేనివారిని శిక్షించడానికి రాబోతున్నాయి*!

 

ఇక్కడ ఒకసారి ఆగుదాం! ఇవి దేవుని ముద్ర లేని వారిని శిక్షించబోతున్నాయి! దేవుని ముద్ర అంటే? దీనికోసం ప్రకటన 7వ అధ్యాయంలో కనిపిస్తుంది.....

Revelation(ప్రకటన గ్రంథము) 7:3,4,9,10

3. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.

4. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.

9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెెపిల్లయెదుటను నిలువబడి.

10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

 

మొదటగా అక్కడ 144000 మంది ఇశ్రాయేలు వారు ముద్రించబడినట్లు, ఆ తర్వాత 7:9 ప్రకారం ఎవడును లెక్కించలేనంతమంది ముద్రించబడినట్లు చూస్తున్నాము! *అనగా బాప్తిస్మం తీసుకున్నవారు అని మీరనుకుంటే పొరపాటు*!  వారు తెల్లని వస్త్రములు కలిగి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభువుని స్తుతిస్తున్నారు అనగా *ఖచ్చితంగా వారు జయించిన వారు!

దేనిని జయించారు అంటే శ్రమలను శోధన లను తట్టుకుని, మహా శ్రమలనుండి వచ్చిన వారు.

ఇంకా తెల్లని వస్త్రములు అనగా పరిశుద్ధమైన జీవితం కలిగి, వాక్యానుసారంగా జీవిస్తూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆత్మానుసారంగా జీవిస్తున్న వారు మాత్రమే అని గమనించాలి! అంతేకాదు వీరు ఈ మహా శ్రమలలో కూడా దేవుణ్ణి ప్రతీ పరిస్తితిలో కూడా స్తుతించే అనుభవం కలిగిన వారు*! పౌలు సీలలను ఫిలిప్పీ చెరసాలలో వేసిన వారు పాటలతో ప్రభువును స్తుతించినట్లు వీరుకూడా ప్రతీ పరిస్తితిలో కూడా దేవుణ్ణి స్తుతించే వారు అన్నమాట!  ఇదీ దేవుని ముద్ర!

 

 గమనించాలి! దేవుని ముద్రగా అనగా దేవుని బిడ్డగా దేవుడు నిన్ను ప్రతిష్టత చేసినప్పుడు డిపాజిట్ గా పరిశుద్ధాత్మను ఇచ్చారు దేవుడు! కాని వీరు మొదట తమ అశ్రద్ద వలన ఎత్తబడే అనుభవం కోల్పోయినా, బుద్ధి తెచ్చుకుని  శ్రమల అలలలో ప్రయాణించి, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. నీవు కూడా నీ జీవితాన్ని కట్టుకోలేకపోతే విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే విడువబడి ఆ డిపాజిట్ ని కోల్పోతే ఎలక్షన్ లో డిపాజిట్ కోల్పోయినట్లుగా అడ్రస్ లేకుండా నరకానికి పోతావు జాగ్రత్త!  అందుకే దేవుడు తుయతైరా సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని హెచ్చరిస్తున్నారు.

 

    ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు ఆ ముద్రను కలిగి ఉన్నావా? ఆ ముద్రలేకపోతే, విడువబడితే సాతానుగాడి సైన్యము మిడతలు వచ్చి దండించబోతున్నాయి! ఒక్కసారి కుడితే అయిదు నెలలు బాధపడతావు జాగ్రత్త! మరి నీవు వీటిని తప్పించుకోడానికి ఎత్తబడే అనుభవం ఉందా? లేకపోతే నేడే పొందుకో!

*ఏడు బూరలు-ఆరవ బూర/పాత్ర*

 

ప్రకటన 9:1321

13. ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు

14. అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.

15. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి.

16. గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.

17. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.

18. ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధక ములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,

19. ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హానిచేయును.

20. ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్య ములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.

21. మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.

 

16:1216

12. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.

13. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.

14. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,

15. హెబ్రీభాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.

16. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

 

    ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ప్రియులారా మనము ఏడు బూరలు యూదుల కోణంలో- ఏడు పాత్రలు సంఘపు కోణంలో ధ్యానం చేస్తున్నాము!

 

ఇక మనము ఆరవ బూరను-ఆరవ పాత్రను చూసుకుందాం!

 

   ప్రియులారా! ఇక మనకు ప్రకటన 9:121 వరకు చూసుకుంటే ఆరవ బూర ఊదాడు. వెంటనే సువర్ణ బలిపీఠం కొమ్ముల యొద్ద నుండి ఒక స్వరము వినబడింది. మనకు గత భాగంలోనూ బలిపీఠం పలికినట్లు చూశాము. ఇక్కడ కూడా మరోసారి బలిపీఠం పలుకుతుంది ఏమని అంటే యూఫ్రటీస్ అనే మహానది యొద్ద బంధించబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని ఆ ఆరవ దూతతో బలిపీఠం పలికింది. వెంటనే ఈ దూత ఆ యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన నలుగురు దూతలను వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే మనుష్యులలో మూడవ భాగము సంహరించబడాలని అదే దినమున అదే సంవత్సరమున అదే నెలలో అదే గంటకు జరగాలి అని ముందుగానే నిర్ణయించబడింది. ఆ నిర్ణయం చొప్పున అదే దినము అదే గంటకు మనుష్యులలో మూడవ భాగం చంపబడ్డారు!

మిగిలినది తర్వాత చూసుకుందాం!

 

ఇక 16వ అధ్యాయంలో ఆరవ పాత్రను దూత యూఫ్రటీస్ అనే నదిమీద కుమ్మరించాడు. గమనించాలి- అక్కడ ఇక్కడ యూఫ్రటీస్ అనే నదిమీద దేవుని ఉగ్రత కుమ్మరించినట్లు చూడగలం!

ఒకసారి ఈ యూఫ్రటీస్ నదికోసం చూసుకుంటే ఇది చాలా పెద్దనది! పొడవైన నది! టర్కీ లో బయలుదేరి సిరియా మరియు ఇరాక్ దేశాల మీదుగా ప్రవహించి పర్షియన్ గల్ఫ్ అని పిలువబడే సముద్రంలో కలుస్తుంది.  ఈ నదికి తూర్పున ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్ పాకిస్తాన్ మరియు ఇండియా దేశాలున్నాయి. మరో ప్రక్కన సౌదీ అరేబియా బెహ్రైన్ లాంటి దేశాలున్నాయి. ఇశ్రాయేలు దేశం కూడా ఉంది. అనగా ఈ నది మొత్తం గల్ఫ్ దేశాలకు మధ్యలో ఉన్నట్లు చూడగలము! ఎందుకు ఇలా దేవుడు ఈ యూఫ్రటీస్ నదిమీద ఉగ్రత కుమ్మరించారో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ నదిమీద పాత్రను కుమ్మరించినప్పుడు వెంటనే ఈ మహానది ఎండిపోయింది. అది తూర్పునున్న రాజులకు మార్గం సిద్దపరచడానికి అలా చేయబడింది అని వ్రాయబడింది. దేనికి మార్గము అని చూసుకుంటే 16:16 లో హార్మేగిద్దోను అనే ప్రాంతంలో యుద్ధానికి తూర్పు రాజులకు అనగా తూర్పు ఆసియా ఖండంలో గల దేశాలకు పశ్చిమాసియాకు అనగా ఇశ్రాయేలు దేశానికి రావడానికి మార్గం సిద్ధం చేసింది అన్నమాట!

ఇప్పుడు మరో అనుమానం వస్తుంది- ఏమండి- ఈ కాలంలో రోడ్డు మార్గంలో లేక భూమిమీద ప్రజలు ఒక దేశం నుండి మరో దేశం ఎందుకు వెళ్తారు? ఆకాశ మార్గంలో విమానయానం చేసుకుంటూ వెళ్ళవచ్చు కదా! నా ఉద్దేశం ఏమిటంటే మహాశ్రమల కాలంలోనూ ఉగ్రతకాలంలోను జరిగిన హింసలకు- దేవుడు తీర్చిన తీర్పులకు, ఇంకా మొదటి పాత్ర, రెండవ పాత్ర మూడవ పాత్ర వలన కలిగిన నష్టాల వలన, యుద్ధాల వలన బహుశా విమానాశ్రయాలు దెబ్బతిని ఉంటాయి. అంతేకాకుండా దట్టమైన పొగ ఆవరించినట్లు గతభాగంలో చూసుకున్నాము! అంతేకాకుండా అణుబాంబులు వలన కలిగిన రేడియేషన్ మరియు పొగ వలన విమానాలు తిరిగే అవకాశం లేకపోయి ఉండవచ్చు! అంతేకాకుండా రన్వే పాడైపోయి ఉండవచ్చు! అందుకే మొత్తం తూర్పుదేశాలన్ని ఈ హార్మెగిద్దోను యుద్ధానికి రోడ్డుమార్గంలో వస్తున్నారు. అదికూడా ఎండిపోయిన యూఫ్రటీస్ నది లోనుండి వస్తున్నారు. బహుశా యుద్ధ టాంకుల మీద కావచ్చు!

 

ఇక్కడ 13వ వచనంలో ఆ ఘటసర్పము నోటనుండియు అబద్దప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయటికి వచ్చాయి అట! ఇవి సూచనలు చేసే దయ్యాల ఆత్మలు అని వ్రాయబడింది.  ఈ దయ్యాల ఆత్మలు హార్మెగిద్దోను యుద్ధానికి రాజులను పోగుచేస్తున్నాయి. అయ్యా- ఈ దురాత్మల మాటలు ఎవరు వింటారు అంటే అప్పటికే అబద్దప్రవక్త ఫార్మ్ లో ఉన్నాడు. వాడు ప్రజలకు ఇచ్చకపు మాటలు చెప్పి అందరు ఈ క్రూరమృగాన్ని పూజించేటట్లు, వాడికి మందిరం విగ్రహం చేసేటట్లు ప్రజలను మోసగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది జరుగబోయే సమయానికి మొత్తం ప్రపంచ ఆధిపత్యం ఈ క్రూరమృగం చేతిలోనే ఉంటుంది. అందుకే వీడు పిలిచిన వెంటనే ప్రపంచం నలుమూలల నుండి ముఖ్యంగా తూర్పు ఆసియా నుండి ప్రజలు రాజులు పశ్చిమాసియాకు బయలుదేరుతున్నారు అన్నమాట!

 

ఇక కొద్దిగా హార్మెగిద్దోను కోసం చూసుకుందాం!

"హర్మెగిద్దోన్ హీబ్రూ భాషలో హర్ అంటే కొండ, పర్వతం. మెగిద్దో ఇస్రాయేల్ దేశంలో ఒక విశాలమైన మైదాన ప్రాంతం. అది నజరేతు గ్రామానికీ గలలియ కొండలకూ దక్షిణాన, కర్మెల్ పర్వత పంక్తికీ తూర్పుగా ఉన్న ప్రాంతం (2 దిన 35:22; జెకర్యా 12:11). దీన్ని ఎస్ద్రెలోన్ మైదానం, యెజ్రీయేల్ లోయ అనికూడా అంటారు. మెగిద్దో అనే పురాతనమైన పట్టణం ఈ మైదానం దక్షిణ సరిహద్దులో ఉంది (న్యాయాధి 1:27; 1 రాజులు 9:15)

 

   ఇక 9:15 లో మనుష్యులలో మూడవ భాగం చంపబడేటట్లు వీటికి అధికారం ఉంది అంటున్నారు. గమనించాలి ఇప్పటికే ముద్రల వలన- బూరలవలన పాత్రల వలన ప్రపంచంలో నాలుగో వంతు చనిపోయారు! అనగా సుమారుగా 155 కోట్ల మంది చనిపోయారు. ఇక సుమారుగా 450 కోట్లమంది మిగిలారు. ఆ మిగిలిన వారిలోనూ మూడవ భాగం చనిపోతారు అట! అనగా మరో 15౦ కోట్ల మంది చనిపోతారు! ఎలా చనిపోతారో క్రిందన వివరించడం జరిగింది. అక్కడ గుర్రపు రౌతులు కనిపిస్తున్నారు. వాటిసంఖ్య 20 కోట్లు!!  ఆ గుర్రముల మీద కొందరు కూర్చున్నారు. వారికి నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము గంధక వర్ణములు గల హెల్మెట్ లు ఉన్నాయట! అనగా మూడు రకాలైన యోధులు అన్నమాట! ఆ గుఱ్ఱముల తలలు సింహాల వంటివి! వాటి నోల్లనుండి అగ్ని ధూమ గంధకములు వస్తున్నాయి అంటున్నారు. వీటిద్వారా ప్రజలను సంహరిస్తున్నారు అన్నమాట! మూడు దెబ్బలతో ప్రజలు చనిపోతున్నారు. మూడు దెబ్బలు అనగా వాటి నోల్లనుండి బయలు వెడలుచున్న అగ్ని వలన ధూమము వలన గంధకముల వలన మనుష్యులు చనిపోతున్నారు.

 

ఇక్కడ కొద్దిగా ఆగి ఆలోచిద్దాం! కొందరు ఈ సైన్యం- మీదన చెప్పిన మిడతలు అంటారు. మరికొందరు హార్మెగిద్దోను యుద్ధానికి బయలుదేరిన సైన్యము అంటారు! ఆ గుఱ్ఱములు అనగా యుద్ధటాంకులు అంటారు! అయితే కొందరు కాదు కాదు- ఇవి దయ్యాల మూకలు! ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో గల దేశాల మొత్తము సైన్యాన్ని కలిపినా 20కోట్లు కావు అలాంటిది ఇరవై కోట్లు అంటే ఖచ్చితంగా ఇవి దయ్యాల సమూహాలు అంటారు! ఏమో తెలియదు గాని మిడతలు కావచ్చు లేక యుద్ధటాంకులమీద బయలుదేరిన సైన్యాలు కావచ్చు!

 

సరే, అక్కడ ఇక్కడ చచ్చిన మూడో వంతు ప్రజలు ఎలాగు పోయారు గాని బ్రతికిన వారు దేవుణ్ణి దూషించారు గాని దేవుని దగ్గరకు రాలేదు అని వ్రాయబడింది.

చివరగా 16:16లో యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: ఇదిగో నేను దొంగవలె వస్తున్నారు తాను దిగంబరుడుగా సంచరించు వాడు జనులు తమ దిసమొలను చూస్తారేమో అని మెలుకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని సెలవిస్తున్నారు! నేను దొంగలా వస్తాను అని మనము ప్రకటన గ్రంధం లోను మత్తయి 24:4244; 1థెస్స 5:2; 2పేతురు ౩:10 లోను వ్రాయబడింది.

ఇక దిగంబరుడుగా అంటున్నారు- దీనికోసం మనం లవొదొకయ సంఘానికి దేవుడు నీవు దిగంబరివి అని చెప్పిన సందర్బము జ్ఞాపకం చేసుకుంటే రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుని రక్షణను పవిత్రతను పోగొట్టుకుని గుడ్డివాడిలా జీవిసున్న విశ్వాసులకు అంటున్నారు- నీ దిసమొల ను ఎవడైనా చూస్తారు జాగ్రత్త! ఎందుకు అలా అంటున్నారు అంటే నీవు మెలుకువగా లేవు! అనగా బహుశా నిద్రపోయి ఉండవచ్చు లేక మత్తుపదార్ధాలు త్రాగి మత్తులో జోగుతున్నావు ఎంతలా త్రాగావు అంటే నీ ఒంటిమీద గుడ్డలు ఉన్నాయో లేదే కూడా నీకు తెలియనంతగా తాగి తందనాలాడుతున్నావు అందుకే ఒరేయ్- నీ వస్త్రాలు కాపాడుకో నీ బ్రతుకును కాపాడుకో అంటున్నారు! మెలుకువగా ఉండమని దేవుడు హితవు పలుకుతున్నారు!

మరినీవు నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా?

మెలుకువగా ఉంటున్నావా?

ఆయన రాకడ సిద్ధంగా ఉంది. ఆయన దొంగవలె చెప్పకుండా రాబోతున్నారు!

మరినీవు సిద్ధంగా ఉన్నావా?

 

*ఏడు బూరలు-ఏడవ బూర/పాత్ర*

 

ప్రకటన 11:1519

15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

16. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారముచేసి

17. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

18. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

 

16:1721

17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండివచ్చెను.

18. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.

19. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.

20. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.(మూలభాషలో-అదృశ్యములాయెను)

21. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.

 

 

ఇక మనము ఏడవ బూరను-ఏడవ పాత్రను చూసుకుందాం!

అయితే తొమ్మిదివ అధ్యాయం తరువాత పదవ అధ్యాయంలో ప్రారంభము కావలసిన ఏడవ బూర 11వ అధ్యాయం లో ప్రారంభమయ్యింది కారణం పదవ అధ్యాయం మొదటి నుండి పదకొండవ అధ్యాయం 16వ వచనం వరకు వివరణ కోసమైన అధ్యాయాలు.

 

  ప్రియులారా! ఇక మనకు ప్రకటన 11:1519 వరకు చూసుకుంటే దూత ఏడవ బూర ఊదాడు. ఇదే చివరి బూర! ఉగ్రతలలో చివరి బూర! వెంటనే పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములు ఏమని పలికాయి అంటే ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యమునాయెను! అనగా ఈ లోక రాజ్యములన్నీ మన దేవుని రాజ్యము మరియు యేసుక్రీస్తుప్రభులవారి రాజ్యము అయ్యింది. ఆయన అనగా యేసుక్రీస్తుప్రభులవారు యుగయుగములు ఏలును అనెను! దీనికోసం మనం చివరలో చూసుకుందాం!

 

ఏడవ పాత్రను చూసుకుందాం! 16:1721 లో ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించాడు. వెంటనే సమాప్తమయ్యింది అనే స్వరము వచ్చింది. ఎక్కడ నుండి అంటే గర్భాలయము నుండి. మరలా మనం ఏడవ దూత బూర దగ్గరకు వెళ్తే అక్కడ బూర ఊదిన వెంటనే పరలోకంలో నుండి శబ్దములు వచ్చాయి- అప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యము అయ్యింది అని స్వరము వచ్చింది కదా- ఇక సంఘపు కోణంలో అదే స్వరము ఎక్కడ నుండి వచ్చింది అంటే పరలోకంలో ఉన్న గర్భాలయము లోనుండి వచ్చింది- వాటితో పాటు మరోమాట కూడా ఇక్కడ వినబడుతుంది ఏమని అంటే సమాప్తమైనది! ఏమి సమాప్తమయ్యింది అని చూసుకుంటే దేవుని ఉగ్రతాకాలం సమాప్తమయ్యింది. ఆయన తీర్పులు సమాప్తమయ్యాయి అని అర్ధమవుతుంది. ఇక యేసుక్రీస్తుప్రభులవారు భూలోకానికి రావడం- అనగా ఇశ్రాయేలు దేశంలో యేరూషలేము పట్టణములోని ఒలీవల కొండమీద కాలుపెట్టడం మాత్రం మిగిలిఉంది. హార్మెగిద్దోను యుద్ధం మిగిలి ఉంది. మిగతావి అనగా ఉగ్రతలు తీర్పులు అన్నీ పూర్తి అయిపోయాయి అంటున్నారు!

 

ఇక 18వ వచనంలో అప్పుడు మెరుపు ధ్వనులు ఉరుములు పుట్టాయి. పెద్ద భూకంపం కలిగింది. మనుష్యులు భూమిమీద పుట్టింది మొదలుకొని అనగా ఆదాము గారి కాలమునుండి ఇంతవరకు అట్టి గొప్ప మహా భూకంపం కలుగలేదు అంటున్నారు. ఇంతవరకు వచ్చిన భూకంపాలలో 9.8 రిక్టర్ స్కేలు చూపించాయి నాకు తెలిసినంత వరకు. అనగా ఇప్పుడు రిక్టర్ స్కేలు మీద పది దాటి ఏ  పన్నెండో చూపించవచ్చు అనుకుంటాను! ఇది నా ఉద్దేశం మాత్రమే సుమా! అంతటి భయంకరమైన భూకంపం కలుగబోతుంది. దీనికోసం గతంలో చూసుకున్నాము! ఈ ప్రకటన గ్రంధంలో ఏడు సార్లు భూకంపం కనిపిస్తుంది.  చరిత్రలో ఈ భూకంపం అన్నికంటే గొప్పది! ఘోరమైనదిగా ఉండబోతుంది.

 

ఇక ఏడవ దూత బూరలోను గొప్ప శబ్దములు ధ్వనులు ఉరుములు కలిగాయి. ఇక్కడ కూడా కలిగాయి!

 

ఇక 19వ వచనంలో ప్రసిద్ధమైన పట్టణం మూడు భాగాలయ్యింది ఆ భూకంపం వలన అంటున్నారు. ఇక్కడ మహా గొప్ప పట్టణం లేక ప్రసిద్ధి గల పట్టణం అనగా దేవుడు బహుశా మహా బబులోను కోసం మాట్లాడుచున్నారు! మహా బబులోను అనగా రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. రోమ్ పట్టణం అని కూడా సూచిస్తుంది. రోమ్ పట్టణంలో స్తిరపడి ఉన్న గొప్ప మత సంస్థ అనికూడా సూచిస్తుంది. అనగా బహుశా రోమ్ పట్టణం మూడు ముక్కలు అవుతుంది ఆ భూకంపం వలన! వాటితోపాటు అన్యజనుల పట్టణాలు అనగా ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలలో కూడా గొప్పగొప్ప పట్టణాలు కూలిపోయాయి అంటున్నారు. అంతేకాకుండా దేవుడు తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యముగల పాత్రను మహా బబులోనుకు ఇయ్యాలని దేవుని సముఖమునందు జ్ఞాపకం చేసిరి అంటున్నారు. అనగా ఇక్కడ దేవుని ఉగ్రతలు ఎలా జరగాలో ముందుగానే నిర్ణయించడం జరిగింది. బహుశా దానికోసం గ్రంధం కూడా ఉంది ఉంటుంది. దానిని పరలోకంలో ఉన్న సమూహము గుర్తుచేశారు మహా బబులోను కోసం ఉన్న తీర్పులు ఇప్పుడు మొదలుపెట్టాలి అని! మహా బబులోను కోసం తీర్పులు వివరణ కోసరమైన అధ్యాయాలలో ధ్యానం చేద్దాం!

 ఇది 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది.

 

వెంటనే ప్రతీ ద్వీపము పారిపోయింది పర్వతములు కనబడక పోయెను అంటున్నారు. దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము! యెషయా గ్రంధం రెండో అధ్యాయంలో ఎప్పుడో ఇలా జరగుతుంది అని దేవుడు బయలుపరిచారు! అదే ఇప్పుడు జరగబోతుంది.  ఎందుకు పారిపోతున్నారు అంటే దేవుని ఉగ్రతాదినం లేక ప్రభువుదినము లేక యెహోవా దినం వచ్చింది. అందుకే భూరాజులు ధనికులు సామాన్యులు అందరూ పారిపోతున్నారు. ఇంకా ఐదేసి మణుగులు బరువైన పెద్ద వడగండ్లు మనుష్యుల మీద పడ్డాయి. సుమారు 40 నుండి 45 కేజీల బరువుండే వడగండ్లు మనుష్యుల మీద పడితే మనుష్యులు బ్రతుకుతారా??? ఇది ఆరవముద్ర తర్వాత జరిగేది అని చూసుకున్నాము!

 

ఇప్పుడు మనం ఏడవ బూర దగ్గరకు వచ్చేద్దాం! తర్వాత భాగంలో బూరలు- ప్రత్యేకతలు కోసం చూసుకుందాం! ముందుగా వీటిని పూర్తిచేద్దాం!

 

ఇక అక్కడ ఈ లోక రాజ్యాలు మన దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యము అయ్యింది అని పలికారు! అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ బూర మ్రోగిన వెంటనే జరుగలేదు! హార్మెగిద్దోను యుద్ధం తర్వాత వెయ్యేండ్ల పాలనతో ప్రారంభం అవుతుంది అన్నమాట! అయితే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇదే చివరి ముద్ర మరియు పాత్ర- ఇదే చివరి ఉగ్రత- చివరి శ్రమ అని అర్ధం అని నాఉద్దేశం!

ఇక ఆయన శాశ్వతంగా పాలిస్తాడు లేక యుగయుగాలు పాలిస్తారు అంటున్నారు కదా దీనికోసం మనకు యెషయా 9:7 లో ఇంకా దానియేలు 7:14, 27 లో ఇంకా లూకా 1:33 లో వ్రాయబడింది.....

 

యెషయా 9: 7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

 

దానియేలు 7: 14

సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.

దానియేలు 7: 27

ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.

 

గమనించారా- ఇక్కడ కూడా సమాప్తమగును అంటున్నారు అందుకే అక్కడ సమాప్తమయ్యింది అని గర్భాలయం నుండి స్వరము వినబడుతుంది.

 

లూకా 1: 33

ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

 

అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తుప్రభులవారి పాలన రెండు భాగాలుగా ఉండబోతుంది.

మొదటిది: వెయ్యేండ్ల పాలన! అది మనము  ప్రకటన 20:4, 6 లో చూడగలము . ఇది అనగా వెయ్యేండ్ల పాలన నిత్యత్వానికి లేక శాశ్వత పరిపాలన కు ప్రారంభం మాత్రమే!

 

దాని తర్వాత 1కొరింథీ 15:2425 ప్రకారం మరియు ప్రకటన 22:5 ప్రకారం శాశ్వత పరిపాలన ప్రారంభం అవుతుంది. దీనినే నిత్యత్వము అంటారు.  ఇది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చిన తర్వాత, పరలోక యేరూషలేము దిగిన తర్వాత జరిగే సంభవం!

 

ఇక 1619 వచనాల వరకు 24గురు పెద్దలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు.

ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే మృతులు తీర్పు పొందుటకు నీ దాసులగు ప్రవక్తలకు తగిన ఫలములు ఇచ్చుటకు సమయం వచ్చింది అంటున్నారు!

అయితే జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే నా ఉద్దేశంలో మృతులైన పరిశుద్దులకు మరియు సజీవులై ఎత్తబడిన పరిశుద్దులకు బహుమానాలివ్వడం జరుగుతుంది అని అర్ధమవుతుంది.

 

ఈ విషయంలో కొన్ని అభిప్రాయ బేధాలున్నాయి! కొందరు ఈ బహుమానాలు ఇవ్వడం మధ్యాకాశంలో కలుగుతుంది అంటారు. మరికొందరు కాదు కాదు- వెయ్యేండ్ల పాలన మొదట్లో భూమిమీదనే కలుగుతుంది అంటారు. దానికి నిదర్శనంగా రిఫరెన్సులు కూడా ఉన్నాయి ఏమిటంటే:

ప్రకటన 22:12 లో నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ ఇచ్చే జీతం నా దగ్గర ఉంది. అనగా భూమిమీదకి వచ్చాక ఇస్తాను అంటున్నారు...

 

మత్తయి 16: 27

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

 

మత్తయి 25:1921 లో గల ఉపమానం ప్రకారం....

లూకా 19:1517 లో గల ఉపమానం ప్రకారం ఆయన భూమిమీదకు వచ్చాకనే బహుమానాల మహోత్సవం ఉండవచ్చు!

Luke(లూకా సువార్త) 19:15,16,17

 

15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.

16. మొదటి వాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా

17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.

 

 అయ్యా ఇక్కడ ఇవన్నీ మధ్యాకాశంలో ఇవ్వనీ! భూమి మీద ఇవ్వనీ! నాకు కావలసింది బహుమానం! కాబట్టి మనం సిద్ధంగా ఉందాం!

 

దీనితో బూరలు పాత్రలు సమాప్తమయ్యాయి!

*దేవుని బూర-ఏడవ బూర-కడబూర*

 

ప్రకటన గ్రంథం 11: 15

ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

 

1థెస్సలొనికయులకు 4: 16

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 

1కోరింథీయులకు 15: 51

ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.

 

మత్తయి 24: 31

మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

   ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ప్రియులారా మనము ఏడు బూరలు యూదుల కోణంలో- ఏడు పాత్రలు సంఘపు కోణంలో ధ్యానం చేసుకున్నాము!

 

అయితే చాలామందికి దేవుని బూర- ఏడవ బూర- కడబూర ఒకటే అని అనుకుంటారు! అయితే మూడు ఒకటి కాదు! వేరువేరు అని చెప్పాలని అనుకుంటున్నాను.

 దీనికోసం గతంలో థెస్సలోనికయలు పత్రికలు ధ్యానం చేసుకున్నప్పుడు చెప్పడం జరిగింది. మరోసారి గుర్తుకు చేస్తున్నాను!

 

ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే! నాకు అర్ధమైనది మాత్రమే చెబుతున్నాను! మీరు ఏకీభవిస్తే ఏకీభవించండి లేకపోతే వదిలెయ్యండి! *దేవునిబూర, కడబూర, ప్రకటన గ్రంధంలో గల ఏడవ బూర ఒకటి కాదు! దేవునిబూర కడబూర కాదు! దేవునిబూర ఏడవబూర కాదు! అలాగే ఏడవబూర కడబూర కాదు!ఈ మూడు బూరలు వేరు వేరు! ఆ బూరలు ఊదిన కాలాలు వేరు! ఊదిన ఉద్దేశాలు కూడా వేరు వేరు!* ముందుగా మనము ఈ బూరలు సంగతి అర్ధము చేసుకుంటే దేవుని రాకడను బాగా అర్ధము చేసుకోవచ్చు!

 

*దేవునిబూర*:

*ఇది ఎప్పుడు మ్రోగుతుంది* అంటే యేసుక్రీస్తుప్రభులవారి రహస్యరాకడ సమయంలో! 1థెస్స 4:16; మరియు మహాశ్రమల కాలమునకు ముందుగా!

 

*ఎందుకు మ్రోగుతుంది*?

మొదటగా ప్రభువునందు లేక క్రీస్తునందుండి మృతులైన వారిని లేపడానికి మరియు సజీవులమైన పరిశుద్దులను పిలవడానికి!

 

*ఎప్పుడు*?  

రహస్యరాకడ సమయంలో!

 

*ఎక్కడనుండి మ్రోగుతుంది లేక ఊదడం జరుగుతుంది?*

 మధ్యాకాశం నుండి!

 

*ఎవరు ఊదుతారు?*

 ప్రధాన దూతయైన మిఖాయేలు కావచ్చు!

 

*దేవునిబూర మ్రోగిన వెంటనే లేక ఊదిన వెంటనే ఏమి జరుగుతుంది?*

*పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు!

* క్రీస్తునందుండి మృతులైన పరిశుద్ధులు మొదట లేస్తారు!

*ఎక్కడనుండి లేస్తారు*? పరదైసునుండి!

 *లేవడం ఏమిటి*? ఎందుకంటే వారు ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్నారు కాబట్టి!

 

* ఆ తర్వాత సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు! అనగా సంఘం ఎత్తబడుతుంది!!!

ఈ అన్ని ప్రక్రియలు కనురెప్ప పాటులో జరిగిపోతాయి!

 

*ఇంకా ఏమి జరుగుతాయి*?

*క్రీస్తు విరోధి బయలు పరచబడతాడు!

* ప్రకటన 6వ అధ్యాయం ప్రకారం ఏడు ముద్రలు విప్పబడటం ప్రారంభమవుతాయి!

* పరిశుద్ధాత్ముడు సంఘము ఎత్తబడ్డారు కాబట్టి వాక్యము భూమిమీద నుండి తీసివేయబడుతుంది!

* ప్రకటన 6ప్రకారం మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది!

*ప్రకటన 11 ప్రకారం ఇద్దరు సాక్షులు భూమిమీదకు వస్తారు!

* ఇశ్రాయేలు ప్రజల రక్షణ కార్యము ప్రారంభమవుతుంది!

* చివరగా అనేకమైన బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దానియేలు గ్రంధములో చెప్పబడిన 70 వారాలలో చివరిదైన  70వ వారం ప్రారంభమవుతుంది!

 

*బూర ముఖ్య ఉద్దేశం*: *సంఘము ఎత్తబడుట!!!*

 *పునరుత్థానం*: మృతులు, సజీవులు (పరిశుద్ధులు మాత్రమే)

 

 

*ఏడవబూర*:

*ఎప్పుడు మ్రోగుతుంది*?  

ప్రకటన గ్రంధం 11:15 ప్రకారం రెండు శ్రమలు గతించిన పిమ్మట! అనగా మహాశ్రమలకాలం అయ్యాక, దేవుని ఉగ్రతాకాలంలో!

 

అయితే కొందరు మహాశ్రమల కాలంలో సగం అయ్యాక అనగా మధ్యలో, మూడున్నర సంవత్సరాలు గడిచాక ఊదబడుతుంది అంటారు. గతంలో నేను థెస్సలోనికయలు పత్రికలు ధ్యానంలో ఇలాగే వ్రాయడం జరిగింది గాని దీనికోసం బాగా అధ్యయనం చేసాక, ప్రభువు పాదాల దగ్గర కనిపెట్టాక, నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఇది మహా శ్రమల తర్వాతనే ఉగ్రతా కాలం చివరిలో ఏడవ బూర ఊదటం జరుగుతుంది అయితే కడబూర- ఏడవ బూర ఒకటి కాదు! ఈ బూర ఉద్దేశం వేరు! కడబూర ఉద్దేశం వేరు!

 

*ఏడవ బూర ఎందుకు మ్రోగుతుంది*?

ఈ ఏడవ బూర ఉద్దేశం ఏమిటంటే చివరి శ్రమ వస్తుంది. రెండు శ్రమలు గడిచాయి! ఇక మూడవ శ్రమ గడిచిన వెంటనే ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యము కాబోతుంది. యేసుక్రీస్తుప్రభులవారు తన ప్రత్యక్షరాజ్యము ఇక్కడ స్తాపించబోతున్నారు అని చెప్పడానికే! అయితే కడబూర పరిశుద్ధులను పోగు చెయ్యడానికి ఊదుతారు! దానిని ఊదేవారు మరో దూతలు!

 

*ఎవరు ఊదుతారు*?

ఏడవ దూత! (ప్రకటన 11:15)

*ఏడవ దూత బూర ఊదిన తర్వాత ఏమి జరుతుంది?*

 

*చివరి ఉగ్రత మరియు చివరి పాత్ర కుమ్మరించబడతాయి. పెద్ద భూకంపం కలిగి మహా బబులోను మీద ఉగ్రత కలుగుతుంది. రోమ్ నగరం మూడు ముక్కలవుతుంది. ఇంకా అనేక పట్టణాలు ప్రపంచంలో కూలిపోతాయి! 5 మణుగులు అనగా 4045 కేజీల వడగండ్లు మనుష్యుల మీద పడతాయి! ద్వీపాలు పారిపోతాయి. కొండలు పారిపోతాయి!

 

*ముఖ్య ఉద్దేశం:  దేవుని ఉగ్రత భూమిపై క్రుమ్మరించబడుట!!!*

 *పునరుత్థానం: జరుగదు!*

 

*కడబూర:*

*ఎందుకు మ్రోగుతుంది:* మత్తయి 24:౩౦31 ప్రకారం , యెషయా 27:12,13; 11:1112 ప్రకారం భూమి నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచు కొనిన వారిని పోగుచేయుటకు!

 

ఏర్పరచుకొనిన వారు అనగామొదటగా ఇశ్రాయేలు ప్రజలను, ఇంకా మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు కాకుండా ఇంకా మిగిలిన పరిశుద్ధులు (అన్యజనుల నుండి రక్షించబడిన విడువబడిన పరిశుద్దులు) , మహాశ్రమల కాలంలో మరణించిన పరిశుద్దుల ఆత్మలు  ప్రకటన 16:4 ప్రకారం తిరిగి లేపబడతారు వెయ్యేండ్ల పాలనకు ప్రారంభంలో! వారు కూడా ఇక్కడ పోగు చెయ్యబడతారు పునరుత్తానులై అని నా అభిప్రాయం! మరొక అభిప్రాయం చెబుతారు కొందరు వేదపండితులు- ఇశ్రాయేలు ప్రజలలో ముద్రించబడిన వారు మహాశ్రమల కాలంలో ఉంటారు గాని ఉగ్రతా కాలంలో దాచబడతారు, వారు ఎక్కడో దాచబడతారు, వారు ఈ బూర మ్రోగిన వెంటనే యెరూషలేముకు దేవదూతలతో ప్రోగు చేయబడతారు అంటారు! నాకైతే మహాశ్రమల కాలంలో దాచబడతారు, చివరికి ఈ బూర మ్రోగేసరికి ఇక్కడకు ప్రోగు చెయ్యబడతారు అని నా ఉద్దేశం!

 

*ఎప్పుడు మ్రోగుతుంది*: యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడ సమయంలో! ఆ సమయానికి యేసుక్రీస్తుప్రభులవారు భూమిపైన ఒలీవల కొండపైన కాలుపెట్టారు తనప్రజల పక్ష్యంగా హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను సంహరించడానికి!  కాబట్టి పరిశుద్ధులు ఎదుర్కోడానికి వెళ్ళరు, కేవలం పోగుచెయ్యడమే లక్ష్యం!

 

*ఎప్పుడు జరుగబోతుంది*?

మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత, హార్మెగిద్దోను యుద్ధము కోసం సర్వదేశాల ప్రజలు ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టినప్పుడు!

 

*ఎవరు ఊదుతారు?*

 ఒకదూత కావచ్చు లేక నలుగురు దేవదూతలు భూమి నాలుగు దిక్కులనుండి ఒకేసారి ఊదవచ్చు!

 

*ముఖ్య ఉద్దేశం: యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ సందర్భంగా తన భక్తులను నలుదిక్కులనుండి పోగుచెయ్యడానికి!*

 

*పునరుత్థానం: మృతుల పునరుత్థానం జరుగుతుంది (మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు కాకుండా ఇంకా మిగిలిన పరిశుద్ధులు (అన్యజనుల నుండి రక్షించబడిన విడువబడిన పరిశుద్దులు) , మహాశ్రమల కాలంలో మరణించిన పరిశుద్దుల పునరుత్థానం, ఇంకా ఇశ్రాయేలు ప్రజల శాశ్వత విడుదల!)

 

(పైన చెప్పినది నా అభిప్రాయం మాత్రమే! అలాగైనా జరగవచ్చు, లేదా కొంతమంది భావించినట్లు కడబూర మ్రోగిన తర్వాత పాతనిబంధన భక్తులు అనగా ఆదాము నుండి యేసయ్య సిలువమరణం వరకు గల భక్తులు అక్షయులై లేపబడవచ్చు! ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము కారణం అది తండ్రి చిత్తము! కొన్ని విషయాలు మరుగుగా ఉండాలని దేవుడు నిర్ణయించారు కాబట్టి ఇంతకంటే లోతుగా వెళ్ళవద్దు! అయితే మనం మాత్రం సిద్ధంగా ఉందాము!)

 

*కడబూర మోగిన తర్వాత ఏమి జరుగబోతుంది?*

*మృతులు అక్షయులుగా లేపబడతారు, (1కొరింథీ 15:52,53)

*హార్మెగిద్దోను యుద్ధంలో శత్రుసైన్యాలు సంహరించబడి వారి రక్తం సుమారు 321 కి.మీ వరకు ప్రవహిస్తుంది!

*క్రూరమృగము అబద్ద ప్రవక్త ప్రాణములతో అగ్ని గుండములో వేయబడతారు (ప్రకటన 19:2021)

*ఆది సర్పము మరియు అపవాది అనే సాతాను అగాధములో బంధించడం జరుగుతుంది! (ప్రకటన 20:13)

*క్రీస్తు న్యాయపీటపు తీర్పు –  బహుమానాల తీర్పు లేక ప్రతి పరిశుద్దునికి వాని క్రియల చొప్పున దేవుడిచ్చే ప్రతిఫలం లేక ఫలములు! 20:4

*వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది , మొదటి పునరుత్థానం జరుగుతుంది (ప్రకటన 20:57)

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! కడబూర దేవుని బూర ఏడవ బూర అన్నీ ఒకటే అనుకోవద్దు అని మనవిచేస్తున్నాను!

 

ఆయన రాకడ మరియు ఆయన ఉగ్రత అతి సమీపంలో ఉంది!

ప్రియ దైవజనమా! సిద్ధంగా ఉన్నారా?

మెలకువగా ఉన్నారా?

దివిటీలలో నూనెతో నింపబడి ఉన్నారా?

సిద్ధంగా ఉన్నవారిని ఆయన తీసుకుని పోవడానికి వస్తున్నారు! నీవు సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు!

విడువబడితే ఆ శ్రమలు ఉగ్రతలు నీవు పడలేవు!

కాబట్టి నేడే సిద్దపడు!

*బలిష్టుడైన వేరొక దూత-1*

 

ప్రకటన 10:1—4

1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.

2. ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

3. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

4. యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.

 

ఇక మనము వివరణ కోసరమైన అధ్యాయాలు మొత్తం ఒకదానివెంట ఒకటి ధ్యానం చేసుకుందాం!

ఈ రోజు బలిష్టుడైన వేరొక దూత కోసం ప్రకటన పదవ అధ్యాయంలో చెప్పబడింది. అయితే ఈ బలిష్టుడైన దూత ఎవరు అనే దానికోసం బిన్నాభిప్రాయాలున్నాయి! మనము రెండు చూసుకుందాం! రెండు వాదనలకు బలమైన రుజువులు కూడా ఉన్నాయి!

 

మొదటిది: బలిష్టుడైన దూత వేరెవరో కాదు: యేసుక్రీస్తుప్రభులవారు!

దీనిని బలపరిచేవి ఏమిటంటే: మొదటగా మేఘము ధరించుకుని ఉన్నాడు! మేఘము దేవుని సన్నిధిని సూచిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధి గలవాడు యేసుక్రీస్తుప్రభులవారు! మనము నిర్గమకాండము 16వ అధ్యాయంలో యెహోవా మహిమ మేఘము నిలిచింది అని చూడవచ్చు! అది దేవుని సన్నిధి!

నిర్గమకాండము 16: 10

అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.

 

ఇక తలమీద ఇంద్రధనస్సు:  ఇంద్రధనస్సు అనేది దేవుడు నోవాహు  గారి సమయంలో మనుష్యులతో  చేసిన నిబందన! ఆదికాండం  9:1315

13. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.

14. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.

15. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.

 

అంతేకాకుండా మనము పరలోకంలో దేవుని సన్నిధిని వివరించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనస్సు ఆవరించినట్లు గతభాగాలలో చూసుకున్నాము!

ప్రకటన గ్రంథం 4: 3

ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.

 

అదేవిధంగా యెహెజ్కేలు గారు కూడా ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనస్సుని చూశారు!  1:28

వర్ష కాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.

 

తర్వాత ముఖము సూర్యబింభము: రూపాంతర కొండమీద యేసుక్రీస్తుప్రభులవారి ముఖము సూర్యునిలా ప్రకాశించినట్లు చూడగలము! మత్తయి 17:2

ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.

 

ఇక ప్రకటన 1:16 లో  కూడా యోహాను గారు యేసయ్య ముఖమును సూర్యునివలే ప్రకాశించడం చూశారు!

 

ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.

 

ఇక పాదములు: అగ్ని స్తంభములు :  ప్రకటన 1:15 లో యోహాను గారు అయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుస్తున్న అపరంజితో సమానంగా ఉన్నాయి. అగ్నిలా ఉన్నాయి అంటున్నారు!

అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తునుండి కనాను దేశమునకు నడిపించి నప్పుడు ఆయన పగలు మేఘ స్థంభము గాను, రాత్రి అగ్ని స్థంభముగాను నడిపించినట్లు చూడగలం! నిర్గమ 14వ అధ్యాయంలో!

Exodus(నిర్గమకాండము) 14:19,20

 

19. అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను

20. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులసేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు.

Exodus(నిర్గమకాండము) 13:21,22

21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.

22. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.

 

ఇక కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమిమీదను మోపి ఉన్నాడు: ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీటము అని చెప్పిన గొప్ప దేవుడు ఇప్పుడు ఒక పాదము భూమిమీదను ఒక పాదము సముద్రము మీదను మోపాడు! ఎందుకు అంటే వాటిని స్వాధీనం చేసుకోడానికి! ద్వితీ 11:24 లో యెహోషువా 1:౩ లో నీవు అడుగుపెట్టు ప్రతీ స్థలము నీకిస్తాను అని వాగ్దానం చేశారు దేవుడు కాబట్టి ఇప్పుడు జయశాలిగా భూమి మరియు సముద్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండింటి మీద పాదాలు మోపారు....

ద్వితియోపదేశకాండము 11: 24

మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.

 

యెహోషువ 1: 3

నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.

 

భూమిని సముద్రమును స్వాధీనం చేసుకోడానికి ఆయనకు అధికారం ఉంది!

 

ఇక మూడవ వచనంలో ఆయన ఆర్భటిస్తే సింహము గర్జించునట్లు ఉంది. ఇంకా ఉరుములు వాటి శభ్దాలు పలికాయి!

ఇది యూదా గోత్రపు సింహమును గుర్తుకు చేస్తుంది.

ప్రకటన గ్రంథం 5: 5

ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన (లేక, వేరైన) యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.

 

  దేవదూత ఎక్కడ కూడా బైబిల్ గ్రంధంలో ఇలా సింహములా గర్జించినట్లు కనబడదు!

కాబట్టి పైన చూపిన రిఫరెన్సులు బట్టి ఆయన అనగా ఈ బలిష్టుడైన దేవదూత యేసుక్రీస్తుప్రభులవారు అని అనిపిస్తుంది!

 అయితే ఈ గ్రంధములో 22వ అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారిని దేవదూత  చెప్పడం జరిగింది! ఆదికాండం 16వ అధ్యాయంలో మరియు జెకర్యా గ్రంధంలో కనబడు దర్శనాలను చూసుకుంటే యేసుక్రీస్తుప్రభులవారిని దేవదూతగా చెప్పారు!

 

ప్రియ దైవజనమా! ఆయన బలిష్టుడు! తగినకాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు! ఆయన త్వరగా రాబోతున్నారు! కృపాకాలం తొందరలో ముగిసి రాకడ రాబోతుంది! మరినీవు ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా?

*బలిష్టుడైన వేరొక దూత-2*

 

రెండవ అభిప్రాయం: ఈయన బలవంతమైన వేరొక దూత! బహుశా మిఖాయేలు కావచ్చు అనేది!

 

దీనికి చూపించే నిదర్శనాలు:

ప్రకటన 5:2 లో ...

మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.

 

ప్రకటన 18:1...

అటు తరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.

 

ఇక మూడవ రుజువు ఏమిటంటే: పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించేవానితోడు అంటూ ఒట్టుపెట్టుకుంటున్నాడు! దేవుడు నా జీవముతోడు అంటూ ఒట్టుపెట్టుకున్నారు గాని ఇక్కడ దేవదూత కాబట్టే ఒట్టుపెట్టుకున్నాడు- కారణం హెబ్రీ 6:16 ప్రకారం మనుష్యులు తమ కన్నా గొప్పవారి తోడు అని ఒట్టుపెట్టుకుంటారు అని వ్రాయబడింది కాబట్టి దూత కాబట్టి తనకన్నా గొప్పవాడైన దేవుని తోడు లేక సృష్టికర్త తోడు అని ఒట్టుపెట్టుకున్నాడు అంటారు! ....

సంఖ్యాకాండము 14: 21

అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.

 

సంఖ్యాకాండము 14: 28

నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.

 

హెబ్రీయులకు 6: 16

మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.

 

 యేసుక్రీస్తుప్రభులవారు అయితే తాను సృష్టికర్తను అని చెప్పారు కదా-సృజించిన వాని తోడు అని ఎందుకు ఒట్టుపెట్టుకోవడం అనేది మరొకటి:

John(యోహాను సువార్త) 1:3,4,10,14

3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

 

కొలస్సీ 1:1517

15. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

17. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

 

   కాబట్టి మీదన చూపించిన విషయాలు చూపించి ఆయన యేసుక్రీస్తుప్రభులవారు కాదు- ఒక బలిష్టమైన దేవదూత అంటారు!

 

 నాకైతే యేసుక్రీస్తుప్రభులవారు అనిపిస్తుంది.

ఏదైతేనేమి వివాదాలు వదిలేద్దాం! ఎవరైతేనేమి- గాని ఇక్కడ అసలు విషయం ఏమిటి అనేది చూసుకుందాం!

 

ఈ బలిష్టుడైన దేవదూత ఏ సందేశం తీసుకుని వచ్చాడో చూసుకుందాం!

*బలిష్టుడైన వేరొక దూత-*

ప్రకటన 10:1--11

1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.

2. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

3. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

4. యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.

7. యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.

8. అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచునీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న దూత చేతిలో విప్పబడియున్న చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.

9. నేను దూత యొద్దకు వెళ్లి చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతోచెప్పెను.

10. అంతట నేను చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను

11. అప్పుడు వారు నీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, యా భాషలు మాటలాడువారిని గూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.

ప్రియులారా! ఈ దూత ఎవరైతేనేమి ఏదైతేనేమి వివాదాలు వదిలేద్దాం! ఎవరైతేనేమి- గాని ఇక్కడ అసలు విషయం ఏమిటి అనేది చూసుకుందాం!

 

ఈ బలిష్టుడైన దేవదూత ఏ సందేశం తీసుకుని వచ్చాడో చూసుకుందాం!

 

మొదటగా ఈ బలిష్టుడైన దేవదూత ఆర్భటించగా ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు కలిగాయి! పలికాయి! అయితే ఆ ఏడు ఉరుములు ఏమిటో యోహాను గారికి అర్ధం అయ్యాయి! వెంటనే ఆయన వ్రాయబోవుచుండగా వీటికోసం వ్రాయవద్దు అని పరలోకం నుండి ఒక స్వరము వినబడింది. అందువలన ఆయన వాటికోసం రాయలేదు! గాని అవి ఏమిటో అనేది ఆయనకు తెలుసు! ఇప్పటికీ అవి ఏమిటో ఏ మనుష్యునికి తెలియదు! తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయవద్దు! ఊహాగానాలు కూడా వద్దు! దేవుడు వాటిని మరుగుగా ఉంచారు కాబట్టి అలానే ఉండనీ! ద్వితీ 29:29...

రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు.

 

ఇక ఈ భూమిమీద ఒక పాదం- సముద్రం మీద రెండో పాదం మోపిన వాడు సృష్టికర్తయైన దేవుని మీద ఒట్టుపెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని ఏడో దూత బూర ఊదబోయే రోజులలో దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పాడు!

 

దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి! ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి!

మొదటిది: ఏడవ దూత బూర ఊదబోయే రోజులలో.... ఇక్కడ ఏడవ దూత బూర ఊదిన వెంటనే అనడం లేదు! ఊదబోయే రోజులలోఅందుకే మహాశ్రమల కాలం తర్వాత ఉగ్రతాకాలం మొదలవుతుంది లేదా రెండవ అర్ధభాగం జరిగే సమయంలో ఉగ్రతాకాలం మొదలవుతుంది  అని చెప్పేది!

 

మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఈ పదవ అధ్యాయం ఐదు ముద్రలు ముగిసాక ఆరవ ముద్ర ప్రారంభంలో పలికి ఉండవచ్చు! లేక మహాశ్రమల కాలంలో చివరలో లేక మధ్యలో జరిగిన సన్నివేశం అని అర్ధమవుతుంది! ఇంకా బూరలు బహుశా  కొన్ని జరిగి ఉంటాయి! అయితే ఇక్కడ దర్శనాన్ని ఆపి వాటికోసం యోహాను గారికి వీటిని వివరిస్తున్నారు దేవుడు!

 

తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: దేవుని మర్మము సమాప్తమగును!

 

ఇంతకీ ఏ మర్మము సమాప్తమవుతుంది? బహుశా సువార్త మర్మము సమాప్తమవుతుంది! మనకు బైబిల్లో  క్రొత్త నిబంధనలో పౌలుగారు చాలా మర్మాలు చెప్పారు. వీటిని ఒకసారి చూసుకుందాం! ముందుగా యేసయ్య ఏమని చెప్పారో చూసుకుందాం!

 

మత్తయి 13: 11

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.

 

ఇక పౌలుగారు చెప్పిన మర్మాలు

 

Romans(రోమీయులకు) 11:25,26,27

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

 

Ephesians(ఎఫెసీయులకు) 3:3,5,6,8,9,10,11,12

3. ఎట్లనగా క్రీస్తుమర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు.

6. ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నారను నదియే.

8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

9. పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,

10. శోధింపశక్యము కాని (మూలభాషలో- అడుగుజాడలు పట్ల శక్యముకాని) క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును,

11. సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక,గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

12. ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి.

 

Ephesians(ఎఫెసీయులకు) 1:8,9,10

 

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.

10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

 

1తిమోతికి 3: 16

నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

 

1కొరింథీ 15:5154

51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.

52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 2:7,8

7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.

8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

 

నా ఉద్దేశం ఏమిటంటే మీదన చెప్పిన మర్మాలు చాలావరకు జరిగిపోయాయి. కొన్ని జరగాలి.

 

ఇక ఏడవ బూర ఊదిన వెంటనే పరలోకంలో గొప్ప స్వరాలు పలికాయి ఏమని అంటే ఈలోక రాజ్యాలన్నీ మన దేవుని రాజ్యము అయ్యింది.  అంతేకాకుండా ఇంకా అనేకమైన వాగ్దానాలున్నాయి దుష్టులకు తీర్చడం కోసం వారిని శిక్షించడం కోసం! ఈ ఏడవ బూర ఊదిన తర్వాత అవన్నీ నెరవేరుతున్నాయి అన్నమాట! అంతేకాకుండా హార్మెగిద్దోను యుద్ధం సమయంలో యేసుక్రీస్తుప్రభులవారు భూమిమీద రెండోసారి కాలుపెట్టబోతున్నారు! తనభక్తులకు బహుమతులు ఇవ్వబోతున్నారు!

 

ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: నీవు వెళ్లి ఆ దేవదూత చేతిలో ఉన్న విప్పబడిన ఆ చిన్న పుస్తకము తీసుకో అని చెబితే యోహాను గారు వెళ్లి తీసుకున్నారు. ఆ పుస్తకాన్ని తినమని చెబితే ఆయన తినేశారు! తినిన తర్వాత తినినప్పుడు తీపిగా ఉంది గాని ఆ తర్వాత కడుపుకు చేదు అయిపోయింది. ఇలాంటి అనుభవం యేహెజ్కేలు గారికి కూడా కలిగింది. యేహెజ్కేలు ౩:13 ;

 

1. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.

2. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి

3. నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధుర ముగా నుండెను.

 

 తినినప్పుడు తీపి ఎందుకంటే దేవునిమాటలు మధురము! చేదు ఎందుకు అయ్యింది దానివలన కలిగే ఫలితము- తీర్పులు భయంకరముగా ఉంటాయి కాబట్టి తన ప్రజలు ఎన్నో భాధలను అనుభవించాలి కాబట్టి దైవజనులకు భారము పెరిగిపోయి తట్టుకోలేక ఏడుస్తుంటారు. అదే చేదు!

 

సరే, తర్వాత దేవదూత ఏమని చెప్పాడు అంటే నీవు మరోసారి లేక మరలా ప్రజలను గూర్చి, జనముల గూర్చి,ఆయా భాషలు మాట్లాడువారి గూర్చి అనేకమంది రాజుల గూర్చి మరలా ప్రవచించాలి అన్నారు!

ఇక్కడ మరలా ప్రవచించాలి అనేమాట గుర్తు పెట్టుకోవాలి! ఎందుకు మరలా ప్రవచించాలి  అన్నారు అంటే ఒకసారి దీనికోసం 611 అధ్యాయాల సారం ప్రవచించడం వ్రాయడం జరిగింది యూదుల కోణంలో! అంతేకాకుండా ఆ చిన్న పుస్తకం విప్పబడి యుంది. దీనిని కూడా గమనించాలి! అనగా ఒకసారి దీనికోసం చెప్పడం జరిగింది- మరోసారి మరో కోణంలో ప్రవచించాలి అంటున్నారు! బహుశా కొంతమంది వేదపండితులు అనుకుంటున్నట్లు ఒకవేళ ఈ బలిష్టుడైన దేవదూత మిఖాయేలు అయితే- మిఖాయేలు ఇశ్రాయేలు ప్రజల తరుపున దేవుని యుద్దాలు చేసేవాడు కాబట్టి, లేక ఇశ్రాయేలు ప్రజలరక్షణ కొరకు దేవునిచేత ఏర్పాటుచేయబడ్డ దేవదూత కాబట్టి- ఇప్పుడు యూదుల కోణంలో చెప్పావు మరోసారి అందరికీ అర్ధమయ్యేలా అన్యజనుల కోణంలో లేక సంఘ కోణంలో మరోసారి ప్రవచించమని చెప్పి ఉండవచ్చు!

అందుకే 611 అధ్యాయాలు యూదుల కోణంలో- 1218 అధ్యాయాలు సంఘపు కోణంలో చెప్పబడింది. రెండూ ఒకే వర్తమానం కలిగి ఉన్నాయి అనిచెప్పడం!

 

చివరగా ఇంతకీ ఆ చిన్న పుస్తకం ఏమిటి?

అది విప్పబడి ఉంది కాబట్టి ఈ ప్రవచన గ్రంధమైన ప్రకటన గ్రంధమే ఆ చిన్న పుస్తకం. ఎందుకు విప్పబడి ఉంది అంటే మనకు గ్రంథంలో కొన్ని భాగాలు ఇదివరకే చెప్పబడ్డాయి కాబట్టి మిగిలిన అధ్యాయాలు అనగా 12 నుండి 18 వరకు గాని, 12 నుండి  చివరి వరకు గల అధ్యాయాలు చివరి వరకు గల అధ్యాయాలు అయి ఉండవచ్చు.

 

కాబట్టి ఈ దేవదూత ఎవరు అనేది మనకు అనవసరం గాని ఆయన చెప్పిన వర్తమానం మాత్రం తప్పకుండా తీసుకోవాలి!

 

మొదటిది ఏడవ బూత ఊదే రోజులలో దేవునిమర్మము పూర్తి అవుతుంది.

రెండు మరలా ఎందుకు ప్రవచించారు అంటే సంఘపు కోణంలో బూరలు పాత్రలు బాగా అర్ధం చేసుకోవడానికి మరియు అసలు క్రీసు విరోధి ఎవడు? సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు? హార్మెగిద్దోను యుద్ధం, మహా బబులోనుకు కలిగే తీర్పులు అన్నీ ఈ రెండవ భాగములోనే చెప్పబడ్డాయి కాబట్టి వాటిని మరలా అర్ధం చేసుకోండి అని వర్తమానం ఈ దేవదూత మనకు చెబుతున్నాడు!

 

మరి నీవు ఆ వర్తమానం విని సిద్ధపడి ఆయన రాకడకు ఆయత్త పడతావా?

*యెరూషలేము దేవాలయం*

ప్రకటన 11:1—2

1. మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్క పెట్టుము.(మూలభాషలో-దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయుము)

2. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.

 

ఇక మనం మరో ప్రాముఖ్యమైన విషయం యేరూషలేము దేవాలయము కోసరమైన వివరణ అధ్యాయం చూసుకుందాం!

 

ఈ పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో యోహాను గారికి ఒక వ్యక్తి వచ్చి కొలకర్ర ఇచ్చి (స్కేలు) నీవు లేచి దేవుని ఆలయమును బలిపీటమును ఆలయంలో పూజించువారిని లెక్కపెట్టు అని చెప్పినట్లు చూస్తున్నాం! అయితే ఇంకా రెండో వచనంలో ఆలయమునకు వెలుపటి ఆవరణమును మాత్రము లెక్క పెట్టవద్దు! అది అన్యులకు ఇవ్వబడింది. వారు 42నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుతారు అంటున్నారు!

 

ప్రియులారా! ఈ భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు అర్ధమవుతాయి!

 

మొదటిది: ఈ దేవాలయం అనగా ఈ అధ్యాయంలో గల దేవుని ఆలయము పరలోకంలో ఉన్న దేవుని ఆలయము కాదు అని అర్ధం చేసుకోవాలి! ఇది భూమిమీద ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము నగరంలో ఒకనాడు ఉన్నటువంటి దేవాలయము గూర్చి మాట్లాడుచున్నారు అని గ్రహించాలి! గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రత్యక్షతల గ్రంధం రాయబోయేసరికి యెరూషలేము పట్టణంలో దేవాలయం లేదు! యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినట్లు రాతిమీద రాయి లేకుండా పడగొట్టబడింది క్రీ.. 70 లో. అంతేకాదు ఇశ్రాయేలీయులు ఎవరూ ఇశ్రాయేలు దేశంలో కూడా లేరు! ఇక ఈరోజు ఇశ్రాయేలు అనేది దేశంగా ఉన్నా ఈరోజుకి కూడా ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో దేవాలయం లేదు!  మత్తయు 24:2;

అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

 

లూకా 19: 44

నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని చెప్పెను.

 

రెండవ విషయం ఏమిటంటే: బహుశా ఈ అధ్యాయంలో గల అంశాలు మహాశ్రమల కాలం మొదట్లో జరిగే అంశాలు! కేవలం మొదటి ముద్రను మాత్రమే విప్పి ఉండాలి! ఎందుకంటే మొదటి ముద్రను విప్పిన తర్వాతనే తెల్లని గుఱ్ఱము వేసుకుని వచ్చి క్రీస్తు విరోధి శాంతి శాంతి అంటూ ప్రపంచ ప్రజలను మోసగిస్తాడు! ఇశ్రాయేలు ప్రజలను మోసగిస్తాడు! అంతేకాకుండా సంఘము ఎత్తబడింది. క్రీస్తు విరోధి బయలు పరచబడ్డాడు అని అర్ధం చేసుకోవాలి!

 

ఈ రెండవ వచనం మాత్రము మహాశ్రమల రెండవ అర్ధభాగంలో జరుగుతుంది గాని ఇద్దరు సాక్షుల సంభవం మహాశ్రమల మొదట్లో జరుగుతుంది అని నా ఉద్దేశం! అయ్యా ఇది నా అభిప్రాయం మాత్రమే! ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షుల సాక్షము వలననే 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి ముద్రించబడతారు అనేది నా అభిప్రాయం! అనగా మొదటి అర్ధభాగంలో వీరు సాక్ష్యం చెబుతారు. ఇశ్రాయేలు ప్రజలలో ఎన్నికైన వారు ముద్రించబడతారు! వారే రెండో అర్ధభాగంలో తప్పించబడతారు దాచబడతారు అనేది నా ఉద్దేశం!

అయితే చాలామంది ఇద్దరు సాక్షులు రెండవ అర్ధభాగం లో వస్తారు. అర్ధభాగం చివరలో ఎనిమిదవ నియంత అగాధం నుండి వచ్చే క్రూరమృగం చేతిలో హతమవుతారు అంటారు. దానికి బలమైన ఆధారాలు చూపిస్తారు. దానిని కాదనలేము. అయితే మనకు ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారు అనేది ప్రాముఖ్యం కాదు గాని ఎందుకు వస్తారు, ఏం చేస్తారు అనేది ప్రాముఖ్యం. వారు ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షుల సాక్షము వలననే 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి ముద్రించబడతారు అనేది నా అభిప్రాయం! అనగా మొదటి అర్ధభాగంలో వీరు సాక్ష్యం చెబుతారు. ఇశ్రాయేలు ప్రజలలో ఎన్నికైన వారు ముద్రించబడతారు! వారే రెండో అర్ధభాగంలో తప్పించబడతారు దాచబడతారు అనేది నా ఉద్దేశం! దీని ఆధారంగానే అంటున్నాను తప్ప వారిని విభేధించాలని కాదు.

 

ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: యేరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఎందుకంటే దేవాలయం లేకుండా బలిపీఠం, ఆవరణము మూడవ ఎలా ఉంటాయి? ఇంతవరకు అక్కడ దేవాలయం కట్టబడలేదు కదా!! అది కట్టబడిన తర్వాతనే కదా అది మూడున్నర సంవత్సరాలు లేక నలబై రెండు నెలలు లేక 1260 రోజులు అన్యుల వశంలో అనగా క్రీస్తు విరోధి మరియు వాడి అనుచరుల చేతిలో ఉండాలి!

 

కొంతమంది అంటున్నారు ఈ రోజులలో- యెరూషలేము దేవాలయం కట్టబడదు! మనిషి దేహమే దేవుని దేవాలయం! ఇంకా మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అని పౌలుగారు అంటున్నారు కాబట్టి దేవాలయం యేరూషలేము లో కట్టబడదు అంటున్నారు! అయ్యా! మరి దానియేలు గారు కూడా ఇదే ప్రవచనాన్ని ప్రవచించారు లేక దర్శనాన్ని చూశారు కదా! అక్కడ కూడా ఈ దేవాలయం మూడున్నర సంవత్సరాలు అన్యుల చేతిలో ఉంటాది అని చెప్పారు కదా!

 

దానియేలు 7: 25

ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

 

దానియేలు 9: 27

అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.

 

ఇక్కడీ భాగం చూసుకుంటే వారము వరకు నిబంధనను స్థిరపరుస్తాడు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అంటూ  హేయమైనది నిలుచువరకు నాశనం చేయువాడు వచ్చును ఇలా నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును అంటున్నారు కదా! మరి మొదటగా అక్కడ దేవాలయం కట్టబడి బలియు అర్పణలు నైవేద్యాలు దూపములు ప్రారంభమవ్వాలి కదా మొదట! మరి అలా మొదలవ్వాలి అంటే దేవాలయం కట్టబడాలి! కట్టబడుతుంది అని అర్ధమవుతుంది. దానికి ఈ క్రీస్తు విరోధి బహుశా సహాయం చెయ్యవచ్చు! అందుకే వాడిని మెస్సయ్యగా వారు మొదటి అర్ధవారం అనగా 42నెలలు నమ్ముతారు! రెండవ అర్ధభాగం లో దానియేలు 12:11 ప్రకారం 1290 రోజులు అనగా మూడున్నర సంవత్సరాల కాలం అనుదిన బలిని  నిలిపివేస్తాడు, వెంటనే ఇశ్రాయేలు ప్రజలు వాడికి వ్యతిరేఖంగా మారుతారు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలకు మహాశ్రమల కాలం మొదలవుతుంది. ఆ తర్వాత హేయమైనది లేక నాశనకరమైన హేయవస్తువు అర్పించిన తర్వాత హార్మెగిద్దోను యుద్ధ సన్నివేశం, బహిరంగ రాకడ ఉంటాయి.  ఈ దానియేలు గారి దర్శనాన్ని సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారు మనకు జ్ఞాపకము నకు తెచ్చి  అప్పుడు నాశనకరమైన హేయవస్తువు అర్పించిన వెంటనే అంటూ శ్రమలు కోసం చెప్పడం జరిగింది. అది ఇశ్రాయేలు ప్రజలకు సంభవించు శ్రమలు అని గుర్తుకు చేసుకోవాలి!

 

దానియేలు 12: 7

నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను.

 

మత్తయి 24: 15

కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక....

 

గమనించాలి- అన్యులకు ఇయ్యబడును అనగా యూదులు కాని అన్యజనులకు ఇయ్యబడుతుంది. వారు ఆలయం కట్టిన తర్వాత త్రొక్కుతారు. ప్రస్తుతం ఆ ఆలయం కట్టే స్థలంలో డోమ్ ఆర్క్ అనే మసీదు ఉంది అని గతభాగాలలో చూసుకున్నాము! ఇశ్రాయేలు ప్రజలు దానిని పడగొట్టి దేవాలయం కడితే మూడవ ప్రపంచ యుద్ధము రావచ్చు! అయినా వారు దానిని పడగొట్టి మూడురోజులలో ఆలయం నిర్మాణం చేసి బలి అర్పించడానికి తగిన టెక్నాలజీ అప్పుడే తయారుచేసి ఉంచారు అని విన్నాము! అయితే వారి దగ్గర ఏడు దేశాలతో ఒకేసారి యుద్ధం చెయ్యడానికి సరిపోయే టెక్నాలజీ ఉంది గాని ఈ సారి సుమారుగా అన్ని ముస్లిం దేశాలు యుద్ధానికి రావచ్చు కాబట్టి సుమారు నలబై వరకు దేశాలతో ఒకేసారి యుద్ధానికి సరిపోయే టెక్నాలజీ తయారు చేస్తున్నట్లు వింటున్నాము!

 

కాబట్టి తప్పకుండా అదే స్థలములో దేవాలయం కట్టబడుతుంది. దానిమీద బలులు అర్పణలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మహాశ్రమల అర్ధభాగం చివరలో నాశన కరమైన హేయవస్తువు అర్పించబడుతుంది...

ఆ ఆ తర్వాత యెరూషలేము మరియు ఇశ్రాయేలు దేశం బహుశా మళ్ళీ పట్టబడుతుంది. ఒకసారి జెకర్యా 14:2 చూసుకుంటే ఇది అర్ధమవుతుంది.

జెకర్యా 14: 2

ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చ బోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

 

42 నెలలు లేక మూడున్నర సంవత్సరాలు ఇలా అన్యుల ఆద్వర్యంలో ఈ యెరూషలేము దేవాలయం ఉంటుంది.

చివరికి యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడలో ఆయన అడుగుపెట్టి యెరూషలేములో హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను హతమారుస్తారు!

జెకర్యా 14: 3

అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

జెకర్యా 14: 4

ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

 

ప్రియ దైవజనమా! ఆయన రాకడ అతి సమీపముగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?

 

ఒకవేళ సిద్దపడకపోతే ఆ వేదనలు బాధలు నీవు పడలేవు గనుక ఇప్పుడే మార్పునొంది బ్రతుకు సరిచేసుకుని దేవునితో సమాధాన పడు!

*ఇద్దరు సాక్షులు-1*

ప్రకటన 11:—13

3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.

5.ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల ఆలాగున వాడు చంపబడవలెను.

6. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.

7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.

8. వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా (లేక- ఆత్మరూపకముగా) సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.

9. మరియు ప్రజలకును, వంశములకును, ఆయా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.

10. యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.

11. అయితే మూడు దినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.

12. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి

13. గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.

 

       ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ప్రియులారా వివరణ కోసరమైన అధ్యాయాలు ధ్యానం చేస్తున్నాము!

గమనించాలి- ఈ ఇద్దరు సాక్షులు- మహాశ్రమల కాలం మొదట్లో యెరూషలేము పట్టణమునకు దేవునిచేత పంపబడతారు అనేది నా అభిప్రాయం! కొందరు అంటారు మహాశ్రమల రెండవ అర్ధభాగంలో వస్తారు అంటారు. నాకైతే మొదటి అర్ధభాగంలోనే వచ్చి సువార్త ప్రకటిస్తారు! కారణం- సంఘము పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నంతవరకు ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రణాళిక ప్రారంభం కాదు రోమా 11 ప్రకారం! ఇప్పుడు సంఘము ఎత్తబడింది. పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడు కాబట్టి క్రీస్తు విరోధిని ఇంతవరకు అడ్డగించిన పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి క్రీస్తు విరోధి వస్తాడు. ఇచ్చకపు మాటలతో ప్రజలను లోపరచుకుని అధికారం పొందుకుంటాడు!  ఇశ్రాయేలు వారు కూడా మోసపోయి వాడినే మెస్సయ్యగా అంగీకరిస్తారు! అదే సమయంలో ఈ ఇద్దరు సాక్షులు దేవుని దగ్గరనుండి పంపబడతారు! వీరు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు సువార్త చెప్పడానికి వస్తారు! వాడు మెస్సయ్య కాదు అని చెబుతారు! ఎన్ని రోజులు చెబుతారు అంటే మూడున్నర సంవత్సరాలు లేక 42 నెలలు లేక 1260 రోజులు!

 

వీరు గోనెపట్ట కట్టుకుని కన్నీటితో ప్రవచిస్తూ ఉంటారు! మరియు ప్రజలకు సాక్ష్యం చెప్పి వాక్యం చెబుతూ యేసే క్రీస్తని ప్రకటిస్తూ ఉండవచ్చు! చివరికి వీరి బోధల వలన లక్ష నలబై వేలమంది ఇశ్రాయేలు ప్రజల రక్షించబడతారు!

 

అయితే చాలామంది ఇద్దరు సాక్షులు రెండవ అర్ధభాగం లో వస్తారు. అర్ధభాగం చివరలో ఎనిమిదవ నియంత అగాధం నుండి వచ్చే క్రూరమృగం చేతిలో హతమవుతారు అంటారు. దానికి బలమైన ఆధారాలు చూపిస్తారు. దానిని కాదనలేము. అయితే మనకు ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారు అనేది ప్రాముఖ్యం కాదు గాని ఎందుకు వస్తారు, ఏం చేస్తారు అనేది ప్రాముఖ్యం. వారు ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షుల సాక్షము వలననే 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి ముద్రించబడతారు అనేది నా అభిప్రాయం! అనగా మొదటి అర్ధభాగంలో వీరు సాక్ష్యం చెబుతారు. ఇశ్రాయేలు ప్రజలలో ఎన్నికైన వారు ముద్రించబడతారు! వారే రెండో అర్ధభాగంలో తప్పించబడతారు దాచబడతారు అనేది నా ఉద్దేశం! దీని ఆధారంగానే అంటున్నాను తప్ప వారిని విభేధించాలని కాదు.

 

 ఇక ఇద్దరు సాక్షులు ఎవరో అనేదానికోసం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి!

 

మొదటగా వీరు ఏమి చేస్తారు అనేది చూసుకుని తర్వాత భాగంలో వీరు ఎవరో భిన్నాభిప్రాయాలు తెలుసుకుందాం!

 

🔺 వీరెవరు?

వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు. (11:4)

 

* ఒలీవ చెట్లుఅభిషేకమునకు” (జెకర్యా4:3-14 ),

* దీప స్తంభములుసాక్ష్యము చెప్పుటకు  (ప్రకటన 1:20) సాదృశ్యము.

* అనగా వీరు అభిషేకముగలిగి, శ్రమకాలములో క్రీస్తుని గురించి సాక్ష్య మిచ్చుటకు పంపబడినవారు.

 

🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడానికి గల ముఖ్య ఉద్ధేశ్యమేమి?*

* క్రీస్తు విరోధిని ఎదిరించుటకు

* అతడు మెస్సియా కాదని, క్రీస్తు విరోధియని లోకానికి ప్రకటించుటకు.

 

🔺 *ఇద్దరు సాక్ష్యులకు గల అధికారాలేమిటి? *

 

* ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును. (ప్రక 11:5)

* తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు.  (ప్రక 11:6)

* వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును,

(ప్రక 11:6)

* నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. (ప్రక 11:6)

 

🔺 *వారెంతకాలము ప్రవచిస్తారు?*

* మొదటి మూడున్నర సంవత్సరాలు

 

🔺 *వీరు ఎప్పుడు చంపబడతారు?*

* మొదటి మూడున్నర సంవత్సరములు ప్రవచించడం ముగించిన తర్వాత.

 

🔺 *వీరు ఎవరిచేత చంపబడతారు?*

* క్రీస్తు విరోధి చేత.

వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. (11:7)

 

🔺 *వారెక్కడ సమాధి చేయబడ్డారు?*

* వారు సమాధి చేయబడలేదు. మూడున్నర దినములు వారి శవములు యెరూషలేము వీధుల్లో పడివుంటాయి. వాటిని ప్రపంచమంతా చూస్తూ ఆనందముతో ఒకనికొకరు బహుమానాలు పంపుకుంటారు.

 

అయితే, 100 సంవత్సరాల క్రితం  ఈ ప్రవచనం నెరవేరడం అసాధ్యమని అనుకున్నారు. కారణం? యెరూషలేములో పడియున్న వీరి శవాలను ఇండియాలో నున్నవారు ఎట్లా చూడగలరు? సాధ్యం కానేకాదు.

 

కానీ, 1926 లో జాన్ లోగిచెయర్టెలివిజన్కనిపెట్టిన తర్వాత, అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందరికి ఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో వున్నాయి. ప్రపంచంలోని ఎక్కడి సమాచారమైనా కనురెప్పపాటులో మనకు చేరిపోతుంది. ఆ దృశ్యాలను అత్యంత స్పష్టముగా చూడగలుగుతున్నాము. పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడినది అక్షరాలా నెరవేరుతుంది. సందేహం లేనేలేదు.

 

🔺 *ఇద్దరు సాక్ష్యులు మరణిస్తే? ప్రజలకెందుకు ఆనందం?*  (11:10)

వీరు క్రీస్తు విరోధిని, మెస్సియా కాదని నిరూపించడం కొరకు  వర్షాలు పడకుండా చేస్తారు. నీటిని రక్తముగా మారుస్తారు. అనేక తెగుళ్లను రప్పిస్తారు. ఇట్లా అనేకమైన సూచక క్రియలు చేస్తారు. దానితో ప్రజలంతా చాలా ఇబ్బంది పడతారు. ప్రజల దృష్టిలో వీరు దుర్మార్గులు. క్రీస్తువిరోధి అయితే, మొదటి మూడున్నర సంవత్సరాలు శాంత మూర్తిగా వ్యవహరిస్తాడు కాబట్టి వాని పట్ల సద్భావము కలిగియుంటారు.

 

🔺 *వీధులలో పడియున్న, వీరి శవములు సంగతేమిటి?*  ( 11:11-13)

* మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి;

* వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.

* అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి;

* వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి

* ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను.

* ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి.

* మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.

🔺 *యేసు క్రీస్తుకు, ఇద్దరు సాక్ష్యులకు మధ్య గల సారూప్యము:*

* యేసు క్రీస్తు పరిచర్య కాలము మూడున్నర సంవత్సరాలు.

* అనేక అద్భుతాలు చేశారు.

* యెరూషలేములో మరణించారు.

* మూడవ రోజు పునరుద్ధానం.

* ప్రభు లేచినప్పుడు గొప్ప భూకంపం.

* ఆరోహణము

* యేసు క్రీస్తు పునరుత్తానము తర్వాత అనేకులు రక్షించబడుట.

 

ఈ సంభవాలన్నీ ఇద్దరు సాక్ష్యులు విషయంలో కూడా నెరవేరుతాయి.          (ప్రకటన 11  అధ్యా)

 

🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడం వలన కలిగిన ప్రయోజనమేంటి?*

* 144000 మంది ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. (ప్రక 7:4)

* 2*

 

కృప గలిగిన దేవుడు ఇశ్రాయేలు వారి పట్ల తన ప్రణాళికను నెరవేర్చుతూనే వున్నాడు. దానిలో భాగంగానే సంఘము ఎత్తబడిన తర్వాత, ఏడేండ్ల శ్రమకాలంలో, వారి రక్షణార్థం ఇద్దరు సాక్ష్యులను పంపిస్తారు.

 

ఇద్దరు సాక్ష్యులెందుకు?  ఒక్కరు చాలరా?

నిబంధనలను స్థిరపరచు నిమిత్తము యూదులకు ఇద్దరు సాక్ష్యులు అవసరమై యున్నది.  (ద్వితీ 17:6)

 

ఎవరీ ఇద్దరు సాక్ష్యులు?

పరిశుద్ధ గ్రంధము వారి పేర్లను ప్రస్తావించలేదు. పరిశుద్ధాత్ముడు మరుగుచేసిన వాటిని గురించి మనము మాట్లాడుకోవడం అది నిష్ప్రయోజనమే అవుతుంది. అయినా, వేద పండితులు కలిగియున్న రెండు అభిప్రాయాలను మాత్రమే మీ జ్ఞాపకములోనికి తీసుకొనివస్తాను.

 

ఆ ఇద్దరు సాక్ష్యులు ఏలీయా, మోషేలు అని కొందరి అభిప్రాయమైతే, ఏలీయా, హానోకు అనేది మరికొందరి అభిప్రాయము. మరి కొన్ని అభిప్రాయములున్నప్పటికీ ఈ రెండు ప్రాముఖ్యమైనవి.

 

ఏది ఏమైనప్పటికీ ఎక్కువ శాతం, ఆ ఇద్దరిలో ఏలీయా ఒకరు అనే విషయాన్ని మాత్రం తప్పక అంగీకరిస్తారు. దానికి గల కారణాలేంటి?

 

1. ఇద్దరు సాక్ష్యులకు తమ ప్రవచన కాలమందు వర్షము పడకుండా చేయుటకు వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)

* ఏలియా కూడా ఆలాగు చేసెను. (1రాజులు 17:1, యాకోబు 5:7)

 

2. తమకు కీడు చేయువారిని నోటనుండి వచ్చు అగ్ని చేత నశింపచేయగలరు. (ప్రకటన 11:5)

     ఏలియా గారు ఆకాశము నుండి అగ్నిని దింపారు!

 

అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.

          ( 2రాజులు 1:10,12)

 

3. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.  (మలాకీ 4:5)

 

4. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై *ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై* ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను. (లూకా 1:16,17)

 

దీని ఆత్మీయ అర్ధము యోహాను అయ్యున్నప్పటికీ, అక్షరార్ధముగా ఏలీయాయై యున్నది.

 

నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. (యోహాను 1:19-21)

 

5. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; (ప్రకటన 11:12)

 

* ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను:

వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. (2రాజులు 2:11)

 

6. ప్రతి ఒక్కడు ఒకసారి మరణించవలెనని నిబంధన ప్రకారము ఏలీయా మరల వచ్చి, మరణించవలెను అనే అభిప్రాయం అనేకమందిలో వుంది.

       (హెబ్రీ 9:27)

 

ఈ విషయాలన్నీ చదువుతుంటే, ఇట్లా జరుగుతుందంటావా? అనే సందేహంతో నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చెయ్యొద్దు. నోవహు కాలంలో కూడా అదే జరిగింది. ఫలితం ఏంటో తెలుసుకదా?

**

 

  ఇద్దరు సాక్ష్యులలో ఒకరు ఏలీయా అయితే, మరొకరో మోషే అనే అభిప్రాయం కొందరిలో వుంది. దానికి గల కారణాలు:

 

1. ఇద్దరు సాక్ష్యులకు నీటిని రక్తముగా మార్చుటకు అధికారము గలదు. (ప్రకటన 11:6)

* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.      (నిర్గమ 7:17,24; 8:11)

2. ప్రతీ విధమైన తెగుళ్లతో భూమిని శ్రమ పెట్టగలరు ( ప్రకటన 11:6)

* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.

   (నిర్గమ 7, 8 అధ్యాయములు)

 

* మోషే, ఏలీయాలు రూపాంతరం కొండపైన ప్రభువు మరణ విషయములను గూర్చి మాటలాడిరి. (లూకా 9:30, మత్తయి 17:3)

* పునరుత్తానమును గూర్చి ప్రకటించింది వీరిని నమ్ము చున్నారు. ( లూకా24:4,7)

* ప్రభువు తిరిగి వచ్చునని ప్రకటించినవారు వీరి యుండాలి. (అపో 1:10,11)

* కనుక వీరు మహాశ్రమల కాలంలో వచ్చి, ప్రభువు రాకడను గురించి, వెయ్యేండ్ల పరిపాలనను గురించి ప్రకటించ వచ్చునని నమ్ముచున్నారు.

* మోషే ధర్మ శాస్త్రమును యిచ్చినాడు. , ఏలీయా ప్రవక్తలకు సూచనగా యున్నాడు. కావున, ఆ ఇద్దరు సాక్ష్యులు వీరి వుండవచ్చు అనే అభిప్రాయం కొందరిలో కలదు.

 

కొందరి అభిప్రాయం ఏలీయా, మోషేలు కాగా, మరికొందరు ఏలీయా, హానోకు అని తలంచు చున్నారు.

 

* హానోకు,  ఏలియాలు మరణం లేకుండా కొనిపోబడ్డారు. కావున వారు మరలా వచ్చి మరణించవలెననేది వీరి వాదన.

* హానోకు, ఏలియాలు ఇద్దరూ ప్రవక్తలై యున్నారు. (యూదా 14-15)

* ఏలీయా ధర్మ శాస్త్ర యుగమునకు, హానోకు మనస్సాక్షి యుగమునకు సూచనగా యున్నారు.

Note:  ప్రతీవారు చనిపోవాలన్నది దైవనియమమే. అట్లా అని, మరణించకపోతే పరలోకం లేదు అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. ఎందుకంటే? ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చి బూర ఊదినప్పుడు, సజీవులైన పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు. మరి వారు మరణించలేదు కదా? అందుచే ఏలీయా, హానోకు వచ్చి మరణించాలనే వాదన సమర్ధనీయం కాదు.

 

*మరొకసారి ఈ విషయాన్ని మీ జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. ఆ ఇద్దరు సాక్ష్యులు ఎవరనేది మనకు ముఖ్యం కానేకాదు. దేవుడు ఎవరిని పంపిస్తే, వారు వస్తారు. వారికి అప్పగించిన భాధ్యతను నెరవేర్చి వెళ్తారు*.

 

అయితే, మనకిప్పుడో సందేహం! ఎత్తబడిన సంఘంలో లేకపోయినా, రక్షించబడడానికి మరొక ఆప్షన్ వుంది కదా? ఇప్పుడెందుకు అంత తొందరపడటం? అయితే, ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆ దినం వరకు నేను బ్రతికే వుంటాననే గ్యారంటీ నీకుందా? ఒకవేళ, బ్రతికి యున్నామే అనుకుందాం. ఆ దినాల్లో రక్షించబడడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే? పరిశుద్ధాత్ముడు కూడా సంఘముతోనే ఎత్తబడతాడు కాబట్టి, ఇక మన మనస్సాక్షిని ఒప్పించేవారెవ్వరూ వుండరు.

 

అనుక్షణం నీ మనస్సాక్షి (పరిశుద్ధాత్ముడు) నీవు తప్పు చేస్తున్నావ్, నీవు తప్పు చేస్తున్నావ్ అంటూ గద్దిస్తుంటే? ఆయన పీక పట్టుకొని, నులిమి, చంపేసి, నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావ్. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేస్తున్నప్పుడే, మన జీవితాల్లో ఎట్లాంటి మార్పులేదే. ఇక ఆదినాలను గురించి ఆలోచించడం వెఱ్ఱితనమవుతుంది.  ఇదే రక్షణ దినం. వాయిదా వెయ్యకు. వేస్తే, శిక్షనుండి తప్పించుకోలేవోమో? అది అత్యంత భయంకరం.

 

ఈ విషయాలన్నీ చదువుతుంటే, ఇట్లా జరుగుతుందంటావా? అనే సందేహంతో నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చెయ్యొద్దు. నోవహు కాలంలో కూడా అదే జరిగింది. ఫలితం ఏంటో తెలుసుకదా?

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

*పరలోకంలో యుద్ధము*

ప్రకటన 12:1,2,7—12

1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రిందచంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

2. ఆమె గర్భిణియై ప్రసవవేదన పడుచు నొప్పులకు కేకలు వేయుచుండెను.

7. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా

8. ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

9. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

11. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

12. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది (అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.

 

ఇక మనము 12 వ అధ్యాయం చూసుకుందాం! ఈ అధ్యాయం కూడా వివరణ కోసమైనా అధ్యాయమే!

ఇక ఇక్కడనుండి 14వ అధ్యాయం 20వ వచనం వరకు వివరణ కోసమైన అధ్యాయాలే అని గమనించాలి!

 

  ఈఅధ్యాయంలో మనకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి! మొదటిది: సూర్యుని ధరించిన స్త్రీ!

రెండు: పరలోకంలో జరిగిన యుద్ధము- సాతానుగాడు శాశ్వతంగా పరమునుండి  త్రోసివేయబడుట

 

ప్రియులారా! మనకు సూర్యుని ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ప్రసవవేదన పడుతూ ఒక  సమస్త జనులను ఏలే  శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువును మ్రింగివేయాలని ఒక మహా ఘటసర్పం చూస్తుంది. అయితే ఆ శిశువు పరమునకు దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడెను! ఆ స్త్రీ అరణ్యానికి పారిపోతుంది. అక్కడ ఆమె మూడున్నర సంవత్సరాలు దాచబడి పోషించబడుతుంది.  అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ దాచబడిందో ఈ ఘటసర్పము పరలోకమునకు యుద్ధానికి వెళ్లారు వాడు- వాడి సైన్యము! గాని మిఖాయేలు దేవదూత ఒక్క తాపు తంతే భూమిమీద పడింది- వాడు వాడి సైన్యము! ఇక పరమునకు పోయే అనుమతి శాశ్వతంగా పోగొట్టుకుంది ఘటసర్పము అనబడే సాతాను గాడు! ఎప్పుడైతే పరమునుండి త్రోయబడిందో ఉక్రోషం పట్టలేక- ఆ స్త్రీని హింసించడం మొదలుపెట్టింది. వెంటనే ఆమెకు దేవునిచేత రెక్కలు ఈయబడ్డాయి. ఆమె దాచబడింది. ఘటసర్పము తననోటనుండి నీరు ప్రవహాముగా పంపి ఆ స్త్రీని చంపాలని చూస్తే భూమి ఆమెకు సహకారిగా మారి ఆ నీటిని మ్రింగి వేస్తుంది.  వాడు ఆగ్రహం పట్టలేక ఆ స్త్రీకి ఉన్న మిగిలిన సంతానంతో యుద్ధానికి బయలుదేరారు! ఇదీ ఈ అధ్యాయంలో గల విశేషాలు!

 

అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంకా ఏడవబూర ఊదకముందే జరిగిన సంగతులు అని గ్రహించాలి! బూరలు తర్వాత జరిగినవి కావు!

అయితే మనము ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె కన్న మగ శిశువు ఎవరు? అనేది వివరంగా చూసుకుందాం! అయితే అంతకంటే ముందుగా పరలోకంలో గల యుద్ధాన్ని చూసుకుని తర్వాత ఆ సూర్యుని ధరించిన స్త్రీ కోసం అంతరాయం లేకుండా ధ్యానం చేసుకుందాం!

 

ప్రియులారా! ఏడవ వచనంలో అంతట పరలోకంలో యుద్ధము జరిగెను అంటూ మిఖాయేలు అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేశారు అంటున్నారు. అసలు ఘటసర్పము ఏమిటి  పరలోకం వెల్లడమేమిటి? అక్కడ యుద్ధము చేయడమేమిటి అనే అనుమానం రావచ్చు! అసలు పరలోకానికి వారిని రానిచ్చింది ఎవరు అనే అనుమానం రావచ్చు! కారణం అపవిత్రమైనదేదీ అందులో ప్రవేశించలేదు కదా పరలోకంలో!

కంగారుపడవద్దు! వాడికి ప్రవేశం ఉంది! వాడు పరమునుండి త్రోయబడిన దేవదూత! లూసీఫర్!  దేవుడు ఒకసారి ఏమైనా ఇస్తే వాటిని తిరిగి తీసుకునే వాడు కాదు! సాతానుగాడికి వాడి సైన్యానికి ఇప్పటికీ పరలోక అనుమతి ఉంది! అది మనం యోబు గ్రంధం 1,2 అధ్యాయాలలో చూడవచ్చు! రెండుసార్లు అక్కడ దేవుని సన్నిధికి పరలోకం వెళ్ళాడు వాడు! ... యోబు 1:67

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

7. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

 

కాబట్టి ఇప్పుడు కూడా వాడి సైన్యంతో వెళ్ళాడు యుద్ధానికి! వాడి అనుమతి ఎప్పుడు ముగిసిపోతుంది అంటే పరలోకంలో మిఖాయేలు అతని సైన్యంతో యుద్ధం తర్వాత సాతాను గాడు ఇక పరలోక ప్రవేశం శాశ్వతంగా కోల్పోతాడు!

ఇక మిఖాయేలు దేవదూత ఈ మహా ఘటసర్పముతో యుద్ధము చేసినట్లు చూస్తున్నాము! గతభాగంలో చెప్పుకున్నట్లు మిఖాయెల్ దేవదూత ఇశ్రాయేలు తరుపున యుద్ధాలు చేసే దేవదూత! ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుని చేత ఏర్పాటుచేయబడ్డ దూత!

దానియేలు 10:13, 21;

13. పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

21. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలుగాక యీ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.

 

దానియేలు 11:1

1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు... మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.

 

దానియేలు 12:1

1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

 

యూదా 1: 9

అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో (అనగా-సాతానుతో) వాదించుచు మోషేయొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను.

 

ఇక ఆయుద్ధంలో మహా ఘటసర్పము వాడి పార్టీ గెలవలేక పోయారు! దేవుని సైన్యంతో సాతాను గాడి సైన్యం యుద్ధం చేసి గెలవడం అసాధ్యం! కేవలం దేవుడు అనుమతి ఇస్తే తప్ప వాడు గెలువలేడు!ఇంతకూ ముందే దేవుడు వాడిని త్రోసి ఉండేవారు గాని అలా చేయాలని ఆయన అనుకోలేదు! ఎందుకో మనకు తెలియదు!

ఇక వాడికి అక్కడ అనగా పరలోకంలో చోటు లేకుండా పోయింది అని వ్రాయబడింది. ఆ యుద్ధం తర్వాత వాడికి అనుమతి కోల్పోవడం జరుగుతుంది. ఇక రాబోయే యుగంలో సాతాను గాడికి పరలోకంలో ప్రవేశం అనేది లేనేలేదు అని గ్రహించాలి!

 

ఇక తర్వాత వచనంలో చూసుకుంటే వాడు సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను ఇంకా అది భూమిమీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని వ్రాయబడింది.

ఈ వచనము జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటగా సర్వలోకాన్ని మోసగించేవాడు! రెండవది వాడి పేరు సాతాను మరియు అపవాది! అసలు అది ఏమిటంటే ఆది మహా ఘటసర్పము అంటున్నారు!

ఇదే ఘటసర్పము హవ్వమ్మ గారిని అవునా ఇది నిజమా అంటూ మోసగించి మనకు ఇన్ని ఇబ్బందులు తీసుకుని వచ్చింది! చివరికి యేసుక్రీస్తుప్రభులవారు సిలువను ఎక్కడానికి కారణమైంది!...

ఆదికాండం ౩:15

1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతోఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడి గెను.

 

2కోరింథీయులకు 11: 3

సర్పము తనకు యుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.

 

ఇక వాడిని పడద్రోసాక మరలా పరలోకంలో నుండి గొప్ప స్వరము పలుకుతుంది

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

11. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

12. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది (అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.

 

ఇక్కడ పదో వచనంలో ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను అంటున్నారు- ఇప్పుడు అనగా వెంటనే అని కాదు- హార్మెగిద్దోను యుద్ధం తర్వాత వెయ్యేండ్ల పాలన నుండి ప్రారంభం అవుతుంది అని గ్రహించాలి!

 

ఇక 12వ వచనంలో అపవాది వాడికి కొంచెము సమయమే ఇవ్వబడింది అని తెలిసికొని క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చి యున్నాడు అని పరలోకం చెబుతున్నట్లు చూస్తున్నాము! అనగా ఇక్కడ వాడు పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత వాడు భూమిమీద దేవుని ప్రజలను  బాధపెట్ట గలిగిన సమయం కేవలం మూడున్నర సంవత్సరాలు అని వాడికి ముందుగానే తెలుసు అన్నమాట! కారణం గతభాగాలలో చెప్పినట్లు ఇలా జరుగుతుంది అని వ్రాయబడిన గ్రంధము ఒకటి ఉంది! ఆ గ్రంధమును వీడు కూడా చదివి ఉంటాడు ఎందుకంటే వీడికి పరలోక ప్రవేశం ఉండేది కదా అప్పుడు!

 

కాబట్టి వాడు రెచ్చిపోయి దేవుని ప్రజలమీదకి వస్తున్నాడు! అందుకే పేతురు గారు అంటున్నారు నిబ్బరం కలిగి దైర్యంగా ఉండండి మీ అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలే ఎవరిని మ్రింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు అంటున్నారు....

1 పేతురు 5:9

 

ప్రియ దైవజనమా! వాడు పరమునుండి త్రోయబడ్డాడు! త్రోయబడతాడు మరోసారి! అందుకే దేవుని పిల్లలమైన మనలను శోధించడానికి మోసగించడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు! కాబట్టి మనం మెలుకువ కలిగి దేవుడిచ్చిన ఆయుధాలు ధరించి వాడితో పోరాడి విజయం సాధిద్దాం! ఆ పరలోకం సాధిద్దాం!

*సూర్యుని ధరించిన స్త్రీ-1*

ప్రకటన 12:1—6

1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

2. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు నొప్పులకు కేకలు వేయుచుండెను.

3. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.

4. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.

5. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.

6. స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

       ప్రియ దైవజనమా!  మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము!  ప్రియులారా వివరణ కోసరమైన అధ్యాయాలు ధ్యానం చేస్తున్నాము!

 

మనము 12 వ ధ్యానం చేసుకుంటున్నాము! ఇక సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు? ఆ శిశువు ఎవరు? ఆమెకున్న మిగిలిన సంతానం ఎవరు అనే దాని కోసం చూసుకుందాం!

 

ప్రియులారా దీనికోసం కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి! ఆమె యేసు తల్లియైన మరియా అనియు- ఆ శిశువు యేసుక్రీస్తుప్రభులవారు అనియు లాంటి అభిప్రాయాలు ఉన్నాయి! అయితే వీటిని అనేకమంది ఒప్పుకోరు! అది నిజం కాదు కాబట్టి!

 

అయితే రెండు ముఖ్యమైన అభిప్రాయాలున్నాయి వాటికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి! వాటినే మనం చూసుకుందాం!

 

మొదటిది: సూర్యుని ధరించిన స్త్రీసార్వత్రిక సంఘము!!! ఆ కుమారుడు ఎత్తబడే సంఘము!

 

అయ్యా! దీనిని చెప్పేవారు మామూలు వారు కాదు! మహా ఆత్మ పూర్ణులు! శ్రేష్ఠులు! వివాహాన్నే త్యజించి దేవునిసేవ కోసం పానార్పముగా పోయబడుతున్నవారు! ఇంకా మా పెంతుకొస్తు సంఘాలు అనేకులు!

 

వీరు చెప్పే విషయాలు ఏమిటి అంటే:

1. సూర్యునిధరించిన స్త్రీ-  నీతి సూర్యున్ని ధరించిన పెండ్లిసంఘము! మలాకి 4:2

 

2. ఆమె పాదముల క్రింద చంద్రుడు: అనగా కృపచేత స్థిరముగా నిలుచున్న సంఘము అంటారు!

 

. ఆమె శిరస్సుమీద 12 నక్షత్రాలు: సంఘమునకు దూతలు అని ప్రకటన గ్రంధంలో పిలువబడి అపోస్తలుల బోధమీద కట్టబడి జయజీవితం కలిగిన సంఘము- 12 నక్షత్రాలు 12 గురు అపోస్తులలు అంటారు!

 

4.  ఆమె ప్రసవ వేదన పడుచు నొప్పులతో కేకలు వేయుచున్నది: వేదనతో ప్రార్ధన చేస్తూ ఆత్మయొక్క ప్రధమ ఫలములను పొందుచు దేహము యొక్క విమోచనము కొరకు మూలుగుచూ ప్రార్ధిస్తూ సంపూర్ణులుగా మార్చబడే సంఘమును సూచిస్తుంది!

 

కాబట్టి ఈ సూర్యుని ధరించిన స్త్రీ క్రొత్త నిబంధన సంఘము లేక సార్వత్రిక సంఘము అని చెబుతారు!

 

ఇక ఘటసర్పము- వాడి తలలు- ఏడు కొమ్ములు: ఏడు సంపూర్ణ సంఖ్య అని చెబుతూ- పాపము యొక్క సంపూర్ణత!

 

ఏడు తలలు: ఏడు గొప్ప సామ్రాజ్యాలు! 1. ఐగుప్టు, 1. అస్శూరు, . బబులోను, 4. మాదీయ పారశీక రాజ్యం, 5. గ్రీకు, 6. రోమా, 7. రాబోయే క్రీస్తువిరోది సామ్రాజ్యం!

 

పది కొమ్ములు: అధికారాన్ని సూచిస్తుంది. బహుశా ఐక్యరాజ్య సమితి అంటారు!

 

తలమీద ఏడు కిరీటాలు: మీద చెప్పిన ఏడు రాజ్యాల రాజులు, మరియు వాయుమండల సంబంధమైన అధిపతులు!

 

తోకతో ఆకాశ నక్షత్రాలు ఈడ్చివేయుట: నక్షత్రములు అనగా దేవుని సేవకులు- ప్రస్తుతం జ్యోతులులా ప్రకాశిస్తున్న దైవసేవకులను చెరిపి అబద్ద బోధలు నమ్మేలా చేస్తూ, పాపము పట్ల ఆకర్షిస్తుంది.

 

ఆమె కనిన మగశిశువు: జయము పొందిన సంఘము మరియు ఎత్తబడే సంఘము!

 

సరే, ఇంతవరకు బాగుంది గాని దీనిలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి!

వాస్తవానికి సంఘమును పరిశుద్ధ గ్రంధములో కన్యకతో పోల్చారు ఇంకా పెండ్లి కుమార్తెతో పోల్చారు గాని స్త్రీతో కాదు! 2కొరింథీ 11:2..

దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,

 

క్రీస్తు సంఘానికి  శిరస్సు గాని పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ప్రసవించదు కదా!

ఇక సంఘాన్ని పెండ్లి కుమార్తెతో మరియు కన్యకతో పోల్చారు గాని మగశిశువుగా ఎక్కడా బైబిలో చెప్పబడలేదు!

 

ఇక ఆ స్త్రీ మూడున్నర సంవత్సరాలు అరణ్యానికి పారిపోయినట్లు, తర్వాత మూడున్నర సంవత్సరాలు దాచబడినట్లు చెప్పబడింది. సంఘము ఎత్తబడుతుంది గాని దాచబడదు ఇంకా శ్రమలకు ముందుగానే ఎత్తబడుతుంది తప్ప పోషించబడదు! దాచబడదు!

దీనిని బట్టి మీద చెప్పిన సూర్యుని ధరించిన స్త్రీ సంఘము అని చెప్పే వివరణ సరియైనది కాదు అనిపిస్తుంది!

ప్రియ సంఘమా! ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా?

*సూర్యుని ధరించిన స్త్రీ-2*

 

రెండవ అభిప్రాయం: సూర్యుని ధరించిన స్త్రీ ఇశ్రాయేలు జాతి!

 

ఇశ్రాయేలు జాతి స్త్రీ గా పిలువబడింది.

యెషయా 54:5

నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

 

యెషయా 54: 1

గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

అంతేకాకుండా: ఇశ్రాయేలు జాతిని దేవుడు తన భార్యగా కూడా ప్రస్తావించారు! ఆమె వ్యభిచారం చేసింది అనియు దేవుని విడిచి అన్యుల దేవతల వెనుక తిరిగింది అంటూ!.....

యెహేజ్కేలు 16: 31

నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజ వీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్యచేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి

యెహేజ్కేలు 16: 32

అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు గదా?

 

ఆమె పాదాల క్రింద చంద్రుడు: చంద్రుడు స్వయంప్రకాశం గలవాడు కాదు! సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి ప్రకాశిస్తాడు! మరియు సూర్యుని వెలుగు భూమిమీద నుండి రిఫ్లెక్ట్ చేయబడి కూడా చంద్రుడు ప్రకాశిస్తాడు!  కాబట్టి ఇది క్రీస్తు విరోధి పాలనకు గుర్తుగా ఉంది. క్రీస్తు విరోధి కూడా శాంతి శాంతి అంటూ ప్రజలను మోసగిస్తాడు-నిజానికి వాడి ఎజెండా శాంతి కానేకాదు! క్రీస్తులా ఉండాలని నటిస్తాడు!  కాబట్టి ఆమె పాదాల క్రింద చంద్రుడు అనేది ఇశ్రాయేలు జాతి క్రీస్తు విరోధి పాలనలో ఉండే మూడున్నర సంవత్సరాలు కాలం సూచిస్తుంది అంటారు!

 

మరో అభిప్రాయం కూడా ఉంది: పాదాల క్రింద ఉన్నది చంద్రుడు- చంద్రుడు అనగా ధర్మశాస్త్రము! నిజమైన వెలుగును గుర్తించక ధర్మశాస్త్రము క్రిందనే ఇప్పటికీ ఉన్న ఇశ్రాయేలు జాతి అనేది మరో అభిప్రాయం!

 

12 నక్షత్రాలు: ఇశ్రాయేలు పడ్రెండు గోత్రములు!

 

ఆ స్త్రీ ధరించిన సూర్యుడు: నీతిసూర్యుడైన యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది: ఇది 2000 సంవత్సరాలు క్రితం జరిగిన సంగతి: అది మరియమ్మ గారు గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభులవారిని కన్నది! కనిన వెంటనే చంపాలని చూశాడు హేరోదు రాజు! గాని దేవుడు తప్పించారు. కాబట్టి ఆమె కనిన మగ శిశువు యేసుక్రీస్తు ప్రభులవారు!

 

అయితే మరో అభిప్రాయముంది. ఏమిటంటే ఆమె ప్రసవ వేదన పడుతుంది అనగా మహాశ్రమల కాలంలో ఆమె అనుభవించబోయే శ్రమలు!!!

 

దానియేలు 12: 1

ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

 

యిర్మియా ౩౦:79

7. అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.

8. సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడ నుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించు కొనరు గాని

9. వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.

 

Matthew(మత్తయి సువార్త) 24:20,21

20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.

 

మగశిశువు: ఇశ్రాయేలు జాతి నుండి యూదా గోత్రములో పుట్టిన యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఆమెకు ఉన్న మరో సంతానం: వీరు మహా శ్రమల కాలంలో ముద్రించబడిన 1,44,000 మంది! వీరే ఆ తర్వాత పోషించబడతారు!

 

ఆ స్త్రీ అరణ్యములో దాగి ఉండటం: మహా శ్రమల కాలంలో అరణ్యమునకు పారిపోవడం!

 

మహా ఘట సర్పం: సాతాను గాడు!

 

పదికొమ్ములు, ఏడు తలలు: గతభాగంలో చెప్పినవి : ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజలను బాధపెట్టిన మహా గొప్ప ఏడు సామ్రాజ్యాలు! పదికొమ్ములు యూరోపియన్ యూనియన్ లేక ఐక్యరాజ్యసమితి ని సూచిస్తుంది.

 

ఆస్త్రీ మూడున్నర సంవత్సరాలు  పారిపోతుంది.: ఇది ఇశ్రాయేలు జాతి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమల కాలంలో అర్ధభాగం లో పారిపోవడం సూచిస్తుంది. ఆ తర్వాత పోషించబడే స్త్రీ కూడా ఇశ్రాయేలు జాతియే! దీనికోసం అనేక భాగాలున్నాయి ఆమె హింసించబడుతుంది అని!

 

దానియేలు 7: 25

ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

 

దానియేలు 12: 7

నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను.

 

 ప్రకటన 13:5,

డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను (లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

 

  కాబట్టి పైన చెప్పిన అన్ని వివరాలు బట్టి ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఇశ్రాయేలు జాతిని సూచిస్తుంది! ఇది చాలా మంది వేదపండితులు అంగీకరిస్తున్నారు! నేను కూడా ఈ అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను! అదే సమయంలో సంఘముగా భావించేవారిని నేను తప్పు పట్టడం లేదు! ఇది కేవలం నా అభిప్రాయమును వ్యక్తం చేస్త్తున్నాను! మీరు దీనితో ఏకీభవిస్తే ఏకీభవించండి లేకపోతే వదిలెయ్యండి!

 

    ప్రియులారా! 12 వ అధ్యాయం వివరణ కోసమైన అధ్యాయం వలన ఏమి నేర్చుకున్నామంటే కడవరి కాలంలో మహా శ్రమల కాలంలో చివరి అర్ధభాగంలో ఇశ్రాయేలు జాతికి భయంకరమైన శ్రమలు కలుగుతాయి మీదన చెప్పిన దానియేలు 12:1 , యిర్మియా 30:7--9, మత్తయి 24:20--21 ప్రకారం. గమనించాలి- ఇశ్రాయేలు జాతికి ఇంతవరకూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అనేకసార్లు చెరలోకి పోయారు. అనేకసార్లు బానిసలుగా బ్రతికారు. అంతియొకస్ ఎపిఫానిస్ అనేవాడు ఊచకోత కోసి విశ్రాంతి దినాన కొన్ని లక్షలమందిని చంపాడు. టైటస్ అనేవాడు కొన్ని లక్షలమందిని చంపాడు. హిట్లర్ కొన్ని లక్షలమంది యూదులను చంపాడు. వీటన్నిటినీ మించిన ఆపద రాబోతుంది ఈ యుగాంతంలో ఇశ్రాయేలు ప్రకలకు! అయితే ముద్రించబడిన వారు తప్పించ బడతారు. అయితే మీదన యిర్మియా గ్రంథంలో ప్రవచనం ప్రకారం నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నారు కాబట్టి ఆశ్చర్య కరమైన సహాయం వారికి కలుగుతుంది.

     ఇక 17వ వచనం జాగ్రత్తగా గమనిస్తే

ప్రకటన గ్రంథం 12: 17

అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.

 

యేసుని గూర్చిన సాక్ష్యం ఆ స్త్రీ సంతానంలో మిగిలినవారు యేసుక్రీస్తు ప్రభులవారిని నమ్ముకొని క్రైస్తవ ప్రవర్తనగల క్రైస్తవులని చెప్పడానికి ఇది బలమైన రుజువున్నట్టుంది. ఈ యుగాంతంలో మహా బాధ కాలంలో సైతాను వారిని కూడా నాశనం చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాడు. వీరంతా రక్షణ పొందిన ఇశ్రాయేలు ప్రజలు అని గమనించాలి.

 

   ప్రియ సంఘమా! మన రక్షకుడైన క్రీస్తుయేసు అతి తొందరలో మేఘారూడుడై రాబోవుచున్నారు! మరి నీవు ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? ఈ కృపాకాలం అతి తొందరలో ముగిసిపోబోతుంది. మరినీవు దేవునితో సమాధానంగా ఉన్నావా? లేకపోతే విడువబడతావు! విడువబడితే ఆ భాధలు నీవు పడలేవు సుమీ!

నేడే మార్పునొంది రక్షణ పొందుకుని రాకడలో ఎత్తబడు!

*క్రూరమృగము-1*

ప్రకటన 13:16

1. మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

2. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.

3. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్య పడుచుండిరి.

4. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారుఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.

5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను (లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

 

ఇక 13 మరియు 17వ అధ్యాయాలలో మనకు క్రూరమృగము, అబద్దప్రవక్త మరియు జలముల మీద కూర్చున్న మహావేశ్య- మహా బబులోను కోసరమైన వివరణ దొరుకుతుంది.  

 

   ఇక ఈ అధ్యాయంలో మనకు క్రూరమృగము ఎవరు? ఎక్కడనుండి వస్తుంది? ఎవరిని సూచిస్తుంది.. లాంటివి ధ్యానం చేసుకుందాం! మరోసారి మీకు తెలియజేసేదేమిటంటే ఇలాంటి సున్నితమైన విషయాలు నాకు అర్ధమైంది నేను నేర్చుకున్నది మాత్రమే రాస్తున్నాను! ఇదే సత్యము అని నేను బల్లగుద్ది చెప్పడం లేదు! కాబట్టి వాక్యానికి దగ్గరగా ఉంటే తీసుకోండి! లేకపోతే వదిలెయ్యండి!

 

  ప్రియులారా! మొదటి వచనంలో పదికొమ్ములు ఏడు తలలు గల ఒక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని అంటున్నారు యోహాను గారు! దాని కొమ్ముల మీద పది కిరీటములు దాని తలల మీద దేవదూషణ కరమైన పేళ్ళు ఉన్నాయి అంటున్నారు! మనము 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్ష్యులు సాక్ష్యం చెబుతుండగా క్రూరమృగము వచ్చి వారిద్దరిని చంపినట్లు చూశాము! 11:7 లో! ఈ క్రూరమృగము అనే పేరు ప్రకటన గ్రంధంలో సుమారుగా 40 సార్లు వాడబడింది.

అయితే ప్రకటన గ్రంధంలో చాలా విషయాలు మనకు దానియేలు గ్రంధము మరియు యెషయా గ్రంధము, జెకర్యా గ్రంధముతో పోల్చుకోక పోతే సరిగా అర్ధం కావు! అందుకే కొంచెము ఇక్కడ కొంచెము అక్కడ వాక్యము ప్రత్యక్షమవుతుంది అని యెషయా గ్రంధంలో వ్రాయబడింది, అక్కడ ఇక్కడ రెండు కలిపి చూసుకుంటేనే గాని మనకు సరియైన అర్ధము గోచరించదు!

 

దానియేలు గ్రంధములో మనకు కొన్ని మృగాలు కనిపిస్తాయి 7, 8 అధ్యాయాలలో! అవి వేటిని సూచిస్తాయి అంటే అదే వచనాలలో గొప్ప రాజ్యాలను సూచిస్త్తాయి! మనకు ఈ ప్రకటన గ్రంధములో కూడా క్రూరమృగము అనేది గొప్పరాజ్యమునే సూచిస్తుంది.  అందుకే 17:913 వచనాలలో ఇందుకు జ్ఞానం గల మనసు అవసరం అంటూ చెప్పారు. అదే సమయంలో ఈ మృగము గత 12వ అధ్యాయంలో మహా ఘటసర్పమును కూడా పోలి ఉంది అని గ్రహించాలి! కారణం మహా ఘటసర్పం తలమీద కూడా ఏడు కిరీటాలున్నాయి! ఈ మృగం తలమీద పది కిరీటాలున్నాయి! అయితే కిరీటము అనగా అధికారం అని చూసుకున్నాము గతభాగాలలో! అయితే ఆ అధికారం పదిరాజ్యాలు కలిసి దీనికి ఇచ్చినట్లు మనం 17వ అధ్యాయంలో చూడగలం...

17:1213

12. నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు.

13. వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

 

ఇక దీనికి కొమ్ములున్నాయి- కొమ్ములమీద పది కిరీటాలున్నాయి- కొమ్ములు కూడా అధికారాన్నే సూచిస్తుంది అని గతభాగాలలో చూసుకున్నాం! ఇది బాగా అర్ధం చేసుకోవాలంటే మనము దానియేలు గ్రంధం 7వ అధ్యాయంలో ఉన్న దర్శనాన్ని బాగా అర్ధం చేసుకోవాలి!

దానియేలు 7: 7

పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.

 

7:7 లో చూసుకుంటే నాలుగో మృగం కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది. మహా బలం గలది. దానికి పెద్ద ఇనుప పళ్ళు ఉన్నాయి. దానిని ఎదురుపడ్డ వాటన్నింటినీ అది ముక్కలుచేసి మ్రింగివేసింది  మిగిలిన దాన్ని కాళ్ళక్రింద త్రొక్కివేసింది. అది గత మృగాలు కంటే ఈ మృగం భిన్నమైనది దానికి పదికొమ్ములున్నాయి అని దర్శనాన్ని దానియేలు గారు వివరిస్తున్నారు!

 

ఈ దర్శనాన్ని పూర్తిగా వివరించను గాని అక్కడ మనకు నాలుగు మృగాలు కనిపిస్తాయి. ఒక్కో మృగము ఒక్కో రాజ్యాన్ని సూచిస్తుంది.

మొదటి మృగము సింహము- బబులోను సామ్రాజ్యాన్ని,

రెండవ మృగము- ఎలుగుబంటి-- మాదీయ-పారశీక రాజ్యాన్ని,

మూడవ మృగము- చిరుతపులి-- గ్రీకు సామ్రాజ్యాన్ని, 

నాలుగవ మృగము అనగా ఈ మృగము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది! దీనిని దేనితోను పోల్చలేదు- అది భయంకరముగా ఉంది! ఘోరమైనది, ఇతర జంతువులకు భిన్నమైనది మహా బలము గలది, మహాత్యాలు చేసేది, పెద్ద ఇనుప దంతాలున్నాయి, పది కొమ్ములున్నాయి ఇంకా విధ్వంసం చేస్తుంది.

 

కాబట్టి దానియేలు గ్రంధము ప్రకారం ఈ మృగము రోమా సామ్రాజ్యము. గనుక ఏమని అర్ధమవుతుంది అంటే ఈ క్రూరమృగము యొక్క ఈ పోలికలు అన్ని ఉజ్జీవించబడబోయే రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. అనగా యుగాంతములో అంతరించిపోయిన రోమా సామ్రాజ్యము మరలా లేస్తుంది. పుంజుకుంటుంది. అదే క్రీస్తు విరోధి రాజ్యము. ఇదే ఏడవ నియంత! దాని అధికారి లేక నాయకుడు- పాలకుడు- ఎనిమిదవ నియంత అయిన క్రీస్తు విరోధి!

ఏడు తలలు- ఇంతవరకు గతించిపోయిన ఆరు గొప్ప సామ్రాజ్యాలు, పదికొమ్ములు యూరోపియన్ యూనియన్ ను సూచించవచ్చు!

 

ఇక ఆ క్రూర మృగము సముద్రము లోనుండి వస్తుంది. సముద్రమునకు రెండు అర్ధాలున్నాయి: మొదటిది: లోకము; రెండు: భక్తిహీనుల సమూహము! 17:15 లో దీనికి వివరణ ఉంది....

ప్రకటన గ్రంథం 17: 15

మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడువారిని సూచించును.

 

ఇక్కడ మనకు సముద్రములో నుండి వచ్చినట్లు చూస్తున్నాము గాని 17:8లో అగాధజలములలోనుండి వస్తున్నట్లు చూడగలము! ప్రకటన గ్రంథం 17: 8

నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.

 

అనగా క్రీస్తు విరోధిని రేపే ఆ ఆత్మ అగాధమునుండి వస్తుంది. ఇంకా చెప్పాలంటే- ఇశ్రాయేలు ప్రజలను ఆనాడు బాధించమని హింసించమని ఫరోను ప్రేరేపించిన ఆత్మ; ప్రపంచ దేశాలమీద పెత్తనం చెలాయించాలని వారిని అణచాలని నెబుకద్నెజర్ లాంటి బబులోను రాజులను ప్రేరేపించిన ఆత్మ, మాదీయ పారశీక రాజులను ప్రేరేపించిన ఆత్మ, దేశాల మీద అధికారం సంపాదించాలని అలగ్జాండర్ ను ప్రేరేపించిన ఆత్మ, ఇనుప పాదంతో త్రొక్కి సమస్త దేశాలను బానిసలుగా చేసుకోవాలని రోమా రాజులను ప్రేరేపించిన అదే దురాత్మ- ఇప్పుడు అగాధము నుండి వచ్చి- ఈ క్రీస్తువిరోధి సామ్రాజ్యమునకు పెద్దగా చెలాయిస్తున్న క్రీస్తువిరోధిని ప్రేరేపిస్తుంది అన్నమాట! ఇది తొందరగా నాశనమునకు పోవును అని ఎందుకు అంటున్నారు అంటే క్రిందన వ్రాయబడిన వచనాలు చూసుకుంటే వాడికివ్వబడిన సమయం కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే! అందుకే ఆ మూడున్నర సంవత్సరాలు తర్వాత వాడు నాశనమునకు పోతాడు!

*క్రూరమృగము-2*

 

ప్రకటన 13:1

మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

 

ప్రకటన 17:7—13

7. దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.

8. నీవు చూచిన మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.

9. ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. యేడు తలలు స్త్రీ కూర్చున్న యేడు కొండలు;

10. మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.

11. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము యేడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.

12. నీవు చూచిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు.

13. వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును మృగమునకు అప్పగింతురు.

 

   ఇక మనకు ఏడు తలలు- పదికొమ్ములు కోసం ఇంకా బాగా అర్ధము చేసుకోవాలి అంటే తప్పకుండా 17వ అధ్యాయంతో కలిసి చూసుకుంటే వీడికోసం ఇంకా బాగా అర్ధమవుతుంది. 

 

 గతభాగంలో ఎనిమిదవ వచనంలో వాడు అగాధ జలముల నుండి వస్తాడు అని చూసుకున్నాము! అయితే ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అని ఈ వచనంలో రెండుసార్లు వ్రాయబడి ఉంది! దీని అర్ధము ఏమిటంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? ముద్రలు విప్పడం మొదలుపెట్టిన తర్వాత- మరియు బూరలు ఊదకమునుపు! గతంలో చూసుకున్నాము- క్రీస్తు విరోధి మొదటి ముద్రను విప్పిన వెంటనే తెల్లని గుఱ్ఱము మీద వస్తాడు. అనగా శాంతి శాంతి అంటూ లోకాన్ని ప్రలోభపెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాడు అని! పరిశుద్ధాత్ముడు సంఘము ఉన్నంతవరకు వాడు రాలేడు! ఇప్పుడు సంఘము ఎత్తబడింది పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడు గనుక వీడు వచ్చాడు! కాబట్టి ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, గాని ముందుకు అనగా ముందు రోజులలో వచ్చును అంటున్నారు.

దీనికోసం కొంచెం ఆలోచిస్తే- ఈ మృగము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది అని గతంలో చెప్పుకున్నాము! రోమా సామ్రాజ్యం కోసం ఆలోచిస్తే క్రీస్తు పూర్వంలో ప్రారంభమైన రోమా సామ్రాజ్యం క్రీ.. 180 నుండి దాని శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. క్రీ.. 395 లో రోమా సామ్రాజ్యం రెండుగా విడిపోయింది. పాశ్చాత్య సామ్రాజ్యము లేక పడమర సామ్రాజ్యం, తూర్పు సామ్రాజ్యముగా విడిపోయింది. పాశ్చాత్య సామ్రాజ్యము క్రీ.. 476 లో అంతమైపోయింది.  తూర్పు సామ్రాజ్యం క్రీ.. 1453 లో అంతమైపోయింది. అనగా ఇప్పుడు ముద్రలు విప్పకముందు రోమా సామ్రాజ్యం లేనేలేదు అన్నమాట! అందుకే ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అంతి రెండు మార్లు చెప్పడం జరిగింది.

 

    అయితే ముందు రోజులలో మరలా ఈ సామ్రాజ్యం ఆశ్చర్యకరంగా పుంజుకుంటుంది అని గమనించాలి! అదే ఏడవ నియంత!  గతభాగంలో చెప్పినట్లు ఈ గొప్ప సామ్రాజ్యాలను ప్రేరేపించిన ఆత్మ- ఒక నాయకునిలో పనిచేస్తాది. వాడే క్రీస్తు విరోధి మరియు ఎనిమిదవ నియంత!

 

ఇదే మనకు 17:11 లో చెప్పడం జరుగుతుంది...

ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.

 

సరే, ఇప్పుడు మనము 10వ వచనం చూసుకుందాం! మరియు ఏడుగురు రాజులు కలరు! అయిదుగురు కూలిపోయిరి. ఒకడున్నాడు. కడమవాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు కొంతకాలం ఉండాలి అంటున్నారు.

ఏడుగురు రాజులు కలరు- వారిలో అయిదుగురు కూలిపోయారు! ఏడుగురు రాజులు- మృగము యొక్క ఏడు తలలను సూచిస్తుంది (13:1)

అయిదుగురు కూలిపోయారు-

ఇంతవరకు ఐదు గొప్ప సామ్రాజ్యాలు నాశనమైపోయాయి!

1.ఐగుప్తు

2. అస్సూరు

. బబులోను

4. మాదీయ-పారశీకము

5. గ్రీకు సామ్రాజ్యము

 

ఇప్పుడు ఒకడున్నాడు: ఈ దర్శనం జరిగే రోజులలో రోమా సామ్రాజ్యానికి అనగా క్రీ.. 90లో రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా డొమీషియస్ ఉన్నాడు! అనగా ఇప్పుడున్న వాడు డొమిషియస్ అని కాదు గాని రోమా సామ్రాజ్యం ఉంది.

కడమ వాడు ఉంకా రాలేదుకడమ వాడు అనగా ఉజ్జీవించబడబోయే లేక అంత్యకాలంలో రాబోయే రోమా సామ్రాజ్యం అన్నమాట! వాడు వచ్చినప్పుడు కొంతకాలం ఉండాలి! దీని అర్ధం ఏమిటంటే ఈ రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.

 

 అయితే ఇక్కడ ఈ సామ్రాజ్యానికి రెండు రకాలైన అధికారాలుంటాయి. అవి బహుశా ఒకటి రాజ్య సంబంధమైన అధికారం, రెండవది: మత సంబంధమైన అధికారం!  మత సంబంధమైన అధికారం అనగా రోమన్ సంఘములు అని పిలవబడే కతోలిక సంఘాలు ఇప్పుడు అనేక దేశాల సంఘాలతో కలిసి ఒక సమాఖ్యను తయారుచేసారు. దానిపేరు సర్వ ప్రపంచపు సమాఖ్య! The World Council Of Churches! దీనికి పోప్ అధికారంలో అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని సంఘాలను ఒకే తాటిమీదికి తేవాలని! అదే సమయంలో క్రిస్లాం అనే ప్రత్యేకమైన మతాన్ని తీసుకుని వచ్చి- దానిలో ముస్లిం లను, క్రైస్తవులను, అన్ని మతాలను ఏకం చేసి ప్రపంచమంతా ఒకే మతం! ఒకే అధికారం! ఒకే సార్వబౌమత్వం! ఒకే ఓటు! ఒకే గుర్తింపు కార్డు! one world రూల్! ఒకరోజు తప్పకుండా ఇది సాధిస్తారు వారు!

 

గమనించాలి క్రీస్తు విరోధి పూర్తి అధికారం మాత్రం మూడున్నర సంవత్సరాలు మాత్రమే! మొదటి మూడున్నర సంవత్సరాలులో అధికారం ఉండదు గాని ప్రపంచాన్ని మోసం చేస్తుంది. వీడే కత్తిదెబ్బ తిని బాగయిన క్రూరమృగము! అనగా ఒకనాడు గతించిపోయిన రోమా సామ్రాజ్యం ఇప్పుడు తిరిగి పుంజుకుంది. అదే దురాత్మ, అదే సామ్రాజ్యం నుండి  ఇప్పుడు ఈ క్రీస్తు విరోధిగా వస్తుంది! ఈ క్రీస్తువిరోధి ఈ ఏడుగురితో పాటుగా కొన్ని రోజులు అనగా మూడున్నర సంవత్సరాలు పాలిస్తాడు!

 

ఇక 12వ వచనం చూసుకుంటే: నీవు చూసిన ఆ పదికొమ్ములు పదిమంది రాజులు! వారిదివరకు రాజ్యం పొందుకోలేదు! గాని ఒక గడియ క్రూరమృగముతో కూడా అధికారం పొందుతారు!

ఈ పదిమంది రాజుల కోసం చూసుకుంటే తప్పకుండా యూరోపియన్ యూనియన్ అని అనిపిస్తుంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో సుమారుగా పదిహేడు రాజ్యాలున్నాయి గాని తొందరలో అవి పది కాబోతున్నాయి. కలిసికట్టుగా గాని లేక విడిపోయి గాని! అనగా ఉదాహరణకు UK అనగా కేవలం ఒక దేశం కాదు! ఆ రాజ్యంలో నాలుగు దేశాలు కలిసి ఒక రాజ్యంగా ఉన్నాయి. ఇంగ్లాండ్, నార్తరన్  ఐర్లండ్, స్కాంట్లాండ్, వేల్స్  కలిసి! అలాగే ఈ సంభవం సంభవించే సరికి యూరోపియన్ యూనియన్లో కేవలం పది రాజ్యాలుంటాయి అనిపిస్తుంది.

 

13, 14 వచనాలలో వీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారాన్ని ఈ మృగమునకు అప్పగిస్తారు. ఎందుకు అంటే గొర్రెపిల్లతో యుద్ధము చేయడానికి! అప్పటికే 13:2 ప్రకారం ఘటసర్పము అనబడే సాతాను ఈ మృగానికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఈ పదిమంది రాజులు అధికారం మృగానికి అనగా క్రీస్తు విరోధికి ఇచ్చారు ఏకాభిప్రాయంతో!

 

గొర్రెపిల్లతో యుద్ధము అనగా ఇది హార్మెగిద్దోను యుద్ధము కోసం అని గ్రహించాలి! అయితే ఈ యుద్ధంలో క్రీస్తువిరోధి మరియు వాడి పార్టీ ఓడిపోతారు! ఎందుకంటే గొర్రెపిల్ల అనబడే యేసుక్రీస్తుప్రభులవారు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, అంతేకాకుండా ఆయనతో ఉన్నవారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు మరీముఖ్యంగా నమ్మకమైన వారు!

 

ప్రియ సహోదరి/సహోదరుడా! నీవు కూడా పిలువబడ్డావు కదా- మరి నీవు నమ్మకముగా ఉన్నావా?

పరిశీలించుకో!

*క్రూరమృగము-*

 

ప్రియులారా!  మనం మరలా 13వ అధ్యాయానికి వచ్చేద్దాం! ఇక రెండవ వచనంలో నేను చూచిన ఆ మృగము చిరుతపులి పోలియుండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను అంటున్నారు!

 

ముందు ఈ క్రూరమృగము కోసం ఆలోచిస్తే- చూపుకు చిరుతపులిలా ఉంది, పాదములు ఎలుగుబంటి పాదములు, నోరు సింహపు నోరు! దానికి ఘటసర్పము దాని బలమును అధికారాన్ని సింహాసనాన్ని కూడా ఇచ్చేసింది. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు దానియేలు గ్రంధము 7:28 లో వివరించిన మృగాల లక్షణాలు అన్ని ఈ క్రూరమృగము లో కనిపిస్తున్నాయి! అనగా క్రొత్తగా ఏర్పడబోయే రోమా సామ్రాజ్యం నాలుగు సామ్రాజ్యాల లక్షణాలను కలిగియుంటుంది అన్నమాట! అనగా చూడడానికి చిరుతపులి! చిరుతపులి- మనకు ఆ దర్శనంలో గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. అలగ్జాండర్ ద గ్రేట్ అని పిలువబడిన ఆ వ్యక్తి కేవలం ఎనిమిది సంవత్సరాలు కాలంలో ప్రపంచాన్ని జయించాడు! కేవలం 32 సంవత్సరాలు వయస్సులో మలేరియా దోమ కుట్టి చనిపోయాడు! చిరుతపులి అనేది అలంగ్జాండర్ లో గల వేగానికి- గ్రీకు సామ్రాజ్యంలో ఏక చత్రాదిపత్యమునకు సూచనగా ఉంది!

 

ఇక పాదములు- ఎలుగుబంటి-

ఎలుగుబంటి  మనకు మాదీయ-పారశీక అలయన్స్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది అని తెలుసుకున్నాం! ఎలుగుబంటి- అవినీతిని సూచిస్తుంది. అనగా ఈ ఉజ్జీవించబడబోయే ఈ రోమా సామ్రాజ్యం వేగము- ఏకచత్రాధిపత్యం కలిగి ఉండటమే కాకుడా అవినీతిమయముగా ఉంటుంది అన్నమాట!

 

ఇక దానినోరు- సింహము వంటింది! సింహం అధికారాన్ని సూచిస్తుంది- ఇంకా గర్వాన్ని సూచిస్తుంది. అనగా ఈ సామ్రాజ్యం- నెబుకద్నేజర్ లాంటి అధికారమును సూచిండమే కాకుండా- నా చేతిలోనుండి మిమ్ములను తప్పించే దేవుడెవడైనా ఉన్నాడా అని పలికిన నెబుకద్నేజర్ గర్వపు మాటలను సూచిస్తుంది! చివరకు గడ్డిమేశాడు ఆ రాజు! ఈ రాబోయే రోమా సామ్రాజ్యం కూడా అధికారం కలిగినందువలన గర్వముగా మాట్లాడుతుంది.

దీనినే మొదటి వచనంలో దానితలమీద దేవదూషణ కరమైన పేళ్ళు కలిగి ఉంది అని చెబుతున్నారు!

 

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే: ఈ మృగానికి ఘటసర్పం- తన అధికారాన్ని తన బలాన్ని తన సింహాసనమును కూడా ఇచ్చేస్తుంది. అనగా ఈ రోమా సామ్రాజ్యమునకు సాతానుడి పూర్తి సపోర్ట్ ఉంటుంది అని అర్ధమవుతుంది!

 

ఒకసారి ఆగి పరిశీలన చేస్తే సాతానుగాడికి పూర్వకాలంలో నుండి అధికారం చెలాయించాలని వాడి ఆశ! అందరితోను పూజించబడాలని కూడా వాడి ఆశ! అందుకే సైతాను యేసుక్రీస్తుప్రభులవారికి ఈ లోక రాజ్యాలన్నీ ఇవ్వజూపి వాడికి కేవలం ఒక నమస్కారం చెయ్యమని చెప్పాడు! గాన యేసయ్య వాడి మాట వినకుండా పొమ్మని ఆజ్ఞాపిస్తే వాడు పోయాడు! అయితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ యుగాంతములో అధికారం కావాలనుకొన్న ఒకడు సైతాను గాడికి దొరుకుతాడు! వాడిని ఉపయోగించుకుని సాతానుగాడు తనను ప్రజలతో పూజించుకొంటాడు! అందుకే ముందుగా ఆ మృగానికి తన బలమును, తన అధికారం తన సింహాసనం కూడా ఇచ్చేశాడు ఘటసర్పం!

 ఘటసర్పం బలం కోసం ఆలోచిస్తే మనము 12వ అధ్యాయంలో తన తోకతో ఆకాశంలోని నక్షత్రాలనే క్రింద పడవేసేటంత శక్తి ఘటసర్పమునకు ఉంది. అనగా సాతాను యొక్క అధికారం- సూచనలు చేసే శక్తిని అన్నింటిని ఘటసర్పము అనబడే సాతాను ఈ క్రూరమృగమునకు  ఇస్తాడు!

 

ఇక మూడవ వచనంలో దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్లుంది . అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెల్లుచూ ఆశ్చర్యపడుతున్నారు అంటున్నారు.

 

చావుదెబ్బ కోసం రెండు అభిప్రాయాలున్నాయి! మొదటిది- చావుదెబ్బ అనగా అంతరించిపోయిన సామ్రాజ్యం చనిపోయి తిరిగిలేచినట్లయింది అనగా ఎప్పుడో క్రీ. 1453 లో అంతరించిపోయిన రోమా సామ్రాజ్యం ఆశ్చర్యకరంగా పుంజుకోవడం! అదే చావు దెబ్బ మానిపోవడం!

 

మరొక అభిప్రాయం ఏమిటంటే- ఈ రోమా సామ్రాజ్య పాలకులలో ఒకడు చస్తాడు! దానివలన ఈ రోమా సామ్రాజ్యం కొద్దిగా దెబ్బతింటుంది. గాని వాడు బ్రతికి మరలా వస్తాడు అంటారు!

 

ఇక ఆ తర్వాత 4వ వచనంలో ఈ మృగానికి అధికారమిచ్చిన ఘటసర్పాన్ని ప్రజలు పూజించారు అంటున్నారు. అనగా చివరిరోజుల్లో ప్రజలు సృష్టికర్తను విడిచి ఈ విగ్రహాలను ముఖ్యంగా సాతాను గాడిని పూజిస్తారు! వాడికి కావలసింది కూడా అదే! ప్రజలతో పూజించబడటం! చివరికి వాడు సాధిస్తాడు! సుమారు మూడున్నర సంవత్సరాలు  పూజించబడతాడు!

 

ఆ తర్వాత ఆ మృగానికి సాటి ఎవడు? అంటూ ఆ మృగాన్ని కూడా పూజిస్తారు! అంతేకాకుండా వాడికున్న అధికారాల వలన- ఘటసర్పము ఇచ్చిన అధికారం మరియు కొన్ని శక్తుల వలన ఇంతటి బలశాలి అయిన ఈ మృగంతో ఎవడు యుద్ధం చేయగలరు అని ప్రజలు అనుకోవడం మొదలుపెడతారు!

 

ప్రియ సంఘమా! ఈ సంగతులు త్వరలోనే సంభవించ బోతున్నాయి! మరినీవు వీటిని తప్పించుకోడానికి ప్రయత్నం చేస్తున్నావా? రాకడకు సిద్ధంగా ఉన్నావా?

*క్రూరమృగము-4*

 

ప్రకటన 13:5--10 

5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను (లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

7. మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.

8. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, మృగమునకు నమస్కారము చేయుదురు.

9. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;

10. ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.

 

     ప్రియులారా! ఇక 13:5 లో ఢంబపు మాటలు దేవదూషణలు పలుకు నోరు దానికి ఇవ్వబడింది. మరియు 42 నెలలు తన కార్యము జరపడానికి దానికి అధికారం ఇవ్వబడింది అంటున్నారు. తననుతాను హెచ్చించుకుని ప్రజలను  మోసగించడానికి ఆ మృగము ఎన్నో డంబాలు పలుకుతుంది. దీనికోసం మనం దానియేలు 7:8 మరియు 11:36 లో చూడగలం....

దానియేలు 7: 8

నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.

దానియేలు 11: 36

ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాదిదేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణ యించినది జరుగును.

 

ఇక దీనికి 42 నెలలు అనగా మూడున్నర సంవత్సరాలు అలా అధికారంలో ఉండటానికి అధికారం ఇవ్వబడింది. ఇదే దానియేలు 11:36 లో కూడా చెప్పడం జరిగింది.ఇక్కడ  కోపకాలం లేక ఉగ్రతా కాలం పూర్తి అయ్యేవరకు ఇలా వర్దిల్లుతాడు అని చెబుతున్నారు. అనగా వాడి అధికారం మహాశ్రమల కాలంలోనే ఉంటుంది. దేవుని ఉగ్రతాదినం లేక ప్రభువుదినము మొదలైన తర్వాత ఇక వాడి నాశనం మొదలవుతుంది. దేవుని తీర్పులు మొదలవుతాయి అని గ్రహించాలి! 

మరో విషయం ఏమిటంటే ఈ క్రీస్తు విరోధి కన్నా తక్కువ బలం గల నియంతలు చాలామంది పరిపాలించారు. వారు చాలా కాలం రాజ్యం చేశారు. గాని వీడికి ఇంతబలము ఉన్నా గాని కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే రాజ్యం చేయగలడు!

 

ఇక ఆరో వచనంలో వాడికి దేవుణ్ణి దూషించడానికి ఆయన పేరును ఆయన గుడారాన్ని పరలోక నివాసులను దూషించడానికి వాడు నోరు తెరిచాడు అంటున్నారు. దూషించడానికి అనేమాట మూడుసార్లు వ్రాయబడింది ఈ వచనంలో! ఈ క్రూరమృగంలో గల లక్షణం ఇది! ఇక ఎందుకు దూషిస్తున్నాడు అంటే అక్కడకు వెళ్తే మిఖాయెల్ దేవదూత ఒక తాపు తంతే భూమిమీదికి వచ్చి పడ్డాడు మరియు వాడికి పరలోక ప్రవేశం ఇక నిరాకరించబడింది కాబట్టి ఉక్రోషం పట్టలేక దేవుణ్ణి పరలోకాన్ని పరలోకంలో ఉన్నవారిని దూషిస్తున్నాడు అన్నమాట!

 

ఇక ఏడవ వచనం చూసుకుంటే వాడు పరిశుద్దులతో యుద్ధం చేసి జయించడానికి వాడికి అధికారం ఇవ్వబడింది అంటున్నారు! దానియేలు 7:21,25 లో కూడా ఇదే చెప్పబడింది ..

 

21. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయెను.

25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

 

ఇక్కడ పరిశుద్ధులు అనగా ఎవరు అంటే మొదటగా: రహస్య రాకడలో విడువబడిన వారు, మరియు సత్యము తెలుసుకుని పశ్చాత్తాపం కలిగి క్రూరమృగం ముద్రను వేయించుకోలేని వారు. వారు దేవుని వాక్యము కొరకు సాక్షులుగా జీవిస్తున్న వారు! వీరే హతస్సాక్షులుగా మారుతారు! వీరిని జయించడానికి వీడికి అధికారం ఇవ్వబడింది.

 

ఇక రెండవ గుంపు: ఇశ్రాయేలు ప్రజలలో సంఘం ఎత్తబడ్డాక యేసుక్రీస్తు ప్రభులవారిని అంగీకరించిన వారు మరియు ఇశ్రాయేలు ప్రజలమీద యుద్ధం చేసి గెలుస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పారిపోతారు మరొకసారి!

 

ఎనిమిదవ వచనం: చివరికి భూమిమీద ఉన్నవారంతా వాడిని పూజిస్తారు! క్రీస్తు విరోధి ముద్రను వేయించుకుంటారు, వాడిని పూజిస్తారు ప్రపంచంలో ఉన్నవారంతా! ఎవరైతే ఆ ముద్రను వేయించుకోలేదో వారిని వాడు హతమారుస్తాడు!

 

దానిక్రింద ఏమని వ్రాయబడింది అంటే గొర్రెపిల్ల జీవగ్రంధమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారంతా ఈ క్రూరమృగాన్ని పూజిస్తారు!

 

తొమ్మిదో వచనంలో చెవిగలవాడు వినును గాక అంటూ ఎవరైతే చెర పట్టాలని వ్రాయబడిందో వారు చెరలోకి పోతారు. కత్తిచేత హతమవ్వాలని అనగా హతస్సాక్షి కావాలని వ్రాయబడిందో ఆ జీవ గ్రంధంలో వారు కత్తిచేత హతము చేయబడి హతస్సాక్షి అవుతారు. ఇందులో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది అంటున్నారు. పరిశుద్ధులు అనగా మీదన వివరించిన వారు!

 

ప్రియ దేవుని బిడ్డా! ఈ సంగతులు త్వరలోనే సంభవించబోవుచున్నవి. దేవుని రాకడ సమీపంగా ఉంది!

మరినీవు సిద్ధంగా ఉన్నావా?

 క్రీస్తు విరోధి అనబడే క్రూరమృగము కూడా త్వరగా రావడానికి సిద్ధపడుతున్నాడు! వాడు వచ్చాడా ఇక నీకు భాధలు తప్పవు! నేడే మార్పునొంది ఆయన రాకడకు సిద్దపడు!

*రెండవ క్రూరమృగము/అబద్దప్రవక్త-1*

 

ప్రకటన 13:11—18

11. మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను;

12. అది మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.

13. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

14. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

15. మరియు మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, మృగముయొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

16. కాగా కొద్దివారు గాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,

17. ముద్ర, అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

18. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; సంఖ్య ఆరువందల అరువది యారు (కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆర్నూట పదునారు, అని పాఠాంతరము); ఇందులో జ్ఞానము కలదు.

 

  ప్రియులారా! ఇక మనకు 11వ వచనం నుండి మరో క్రూరమృగం కనిపిస్తుంది. అయితే క్ర్రూరమృగం భూమిలోనుండి వస్తుంది. గమనించాలి- క్రీస్తువిరోధి అనబడే క్రూరమృగం సముద్రం లోనుండి వచ్చాడు. వీడు దురాత్మగలవాడు! అగాధములోనుండి ఆత్మ వచ్చి వాడిని ప్రేరేపించింది. సముద్రము అనగా ప్రజలలో నుండి లేక భక్తిహీనుల సమూహము లోనుండి వచ్చుటను సూచిస్తుంది అని నేర్చుకున్నాము!

 

ఇక వీడైతే భూమిలోనుండి వస్తున్నాడు! అనగా ఏదో ఒక దేశం నుండి వచ్చి ముఖ్యంగా యూదులను మోసగిస్తూ తర్వాత సర్వప్రపంచాన్ని మోసగిస్తాడు.

కొంతమంది సిరియా నుండి అంటారు కొంతమంది ఇజ్రాయిల్ నుండి అంటారు.

 వీడి ముఖ్య ఉద్దేశం సమస్త ప్రజలు ఆ మొదటి క్రూరమృగాన్ని పూజించడం వాడికి భయపడేటట్లు చేయడం!

వీడికి గొర్రెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు ఉన్నాయి. గొర్రెపిల్ల వంటివి- అనగా వీడు యేసుక్రీస్తుప్రభులవారి వలే ఉండటానికి నటన చేస్తాడు! గాని నిజానికి వీడు సర్పం లాంటి కుయుక్తి గలవాడు! వీడినే అబద్దప్రవక్త లేక కపట ప్రవక్త అంటారు!

 

అంత్యదినాలలో దుష్టత్రయం లేక దుష్ట త్రిత్వం పనిచేస్తుంది.

క్రీస్తు విరోధి అనబడే క్రూరమృగం,

ఘటసర్పం అనబడే సర్పం,

అబద్దప్రవక్త అనబడే రెండో క్రూరమృగం!

ఈ ముగ్గురు ప్రపంచాన్ని మోసం చేస్తారు!

 

పరిశుద్ధాత్ముడు ఎలాగు తండ్రియైన దేవునికి- కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారి కోసం పనిచేస్తున్నాడో ఈ అబద్ద ప్రవక్త క్రీస్తు విరోధి కోసం పనిచేస్తాడు! వీడిలో పనిచేసేది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ!

 

గొర్రెపిల్ల వంటి కొమ్ములున్నాయి అంటే వీడికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి అని అర్ధం!

ఇంకా వీడు ఘటసర్పం వలే మాట్లాడుతాడు! అనగా సైతాను ఎలా మాట్లాడుతాడో అలాగే మాట్లాడుతాడు! అద్భుతాలు చేస్తాడు!

 

12వ వచనంలో ఇంకా ఏమి చేస్తున్నాడు అంటే ఆ మొదటి మృగానికున్న అధికారపు చేష్టలన్నీ వీడు కూడా వాడి తరుపున అనగా మొదటి క్రూరమృగం అయిన క్రీస్తు విరోధి తరుపున అబద్ద ప్రవక్త చేస్తాడు! ఇంకా చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమిలో నివసించు వారంతా నమస్కారం చేసేలా బలవంతం చేస్తాడు! అందుకు గాను ఎన్ని అద్భుతాలైనా చేస్తాడు! ఎవరినైనా చంపుతాడు!

 

ఇక 13వ వచనంలో ఆకాశం నుండి భూమిమీదికి అగ్ని వచ్చేలా చేసే మనుష్యుల ఎదుట అద్భుతాలు చేసి ప్రజలను తనవైపు, క్రీస్తు విరోధి వైపు త్రిప్పుకుంటాడు! వీడు క్రూరమృగము యొక్క ప్రతినిధిగా ఉంటాడు!

 

ఇదంతా చూస్తుంటే తప్పకుండా వీడు ఒక మతనాయకుడు అయి ఉంటాడు! బహుశా వీడు one world rule వచ్చాక ఒకే మతానికి నాయకుడుగా ఉంటాడు! అప్పుడు ప్రపంచమంతా ఒకే మతం ఉంటుంది. ఒకే మతం, ఒకే అధికారం, ఒకే నాయకుడు, ఒకే గుర్తింపు కార్డు! ఒకే కరెన్సీ! దీనికి ఒప్పుకుంటే బ్రతుకుతాడు! ఎవడైనా వినకపోతే నిర్దాక్షిణ్యంగా చంపుతారు వీరు! వీడు ఏమిచేస్తాడు అంటే నిజదేవున్ని వదిలి ఈక్రూరమృగమే నిజమైన దేవుడు, వీడినే పూజించమని అందరిని బలవంతం చేస్తాడు! అందుకోసం ఆకాశం నుండి ఏలియా గారు అగ్ని రప్పించినట్లు వీడు కూడా అగ్ని రప్పించి మనుష్యులను ఒప్పిస్తూ ఉంటాడు!

 

ఇంకా 14వ వచనంలో ఆ మొదటి క్రూరమృగానికి ఒక ప్రతిమ లేక విగ్రహం చేసి దానిని పూజించండి అని భూనివాసులతో చెబుతూ ఆ మృగము ఎదుట దానికి చేయడానికి ఇవ్వబడిన అద్భుతాలు మహత్కార్యాలు అన్ని చేస్తాడు అన్నమాట!

 

 దీనికోసం ఆలోచిస్తే తండ్రియైన దేవుడు ఒక ఖండితమైన ఆజ్ఞ ఇచ్చారు. నీవు ఏ రూపంలోనూ విగ్రహాన్ని చేయకూడదు....

నిర్గమకాండము 20: 4

పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

 

వీడు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేఖంగా ఈ క్రూరమృగానికి విగ్రహం చేయండి అని బలవంతం చేస్తుంది. అనగా దేవుని ఆజ్ఞలను పూర్తిగా దిక్కరించమని ప్రజలను పురికొల్పుతుంది!

 

ఇక 15వ వచనంలో ....

మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

దీనిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మృగము యొక్క ప్రతిమ ఎలా మాట్లాడుతుంది అంటే వీడికి గల అద్భుతాల వలన చేయవచ్చు గాని నేటి టెక్నాలజీని పరిశీలిస్తే బహుశా ఒక రోబోట్ ని చేయవచ్చు, మృగపు రూపంలో! దానినిండా సెన్సార్లు పెట్టి ఎవరు ఏమి మాట్లాడుతున్నారో దానికి అనుగుణంగా జవాబు ఇచ్చేలా ప్రోగాం చేయవచ్చు! దానికి స్వయంగా నిర్ణయాలు తీసుకునే లాగ ప్రోగ్రామ్ చేసి స్వయంగా అద్భుతాలు కూడా చేసే విధంగా, మాట్లాడే విధంగా చేస్తారు! ఇప్పుడు ఆ విగ్రహానికి ఎవరైతే మ్రొక్కరో వారిని చంపమని చెబుతూ అవసరమైతే ఆ విగ్రహమే లేక ప్రతిమయే దానికి మ్రొక్కని వారిని చంపే అధికారం మరియు కావలసిన అస్త్రాయుధాలు అన్ని దానిలో ఉంటాయి అన్నమాట! అంతటి అధికారం ఈ ప్రతిమకు వారు ఇస్తారు!

పూర్వకాలంలో నెబుకద్నెజర్ కూడా ఇలాంటిది చేశాడు. దేవుని ప్రజలైన షడ్రక్ మేషక్ అబెద్నేగో లను హింసించాడు గాని వారు గెలిచారు!

 

*రెండవ క్రూరమృగము/అబద్దప్రవక్త-2*

*666 ముద్ర*

 

ప్రకటన 13:16—18

  16. కాగా కొద్దివారు గాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,

17. ముద్ర, అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

18. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; సంఖ్య ఆరువందల అరువది యారు (కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆర్నూట పదునారు, అని పాఠాంతరము); ఇందులో జ్ఞానము కలదు

 

   ప్రియులారా మనము రెండవ మృగమైన అబద్దప్రవక్త కోసం చూసుకుంటున్నాము! ఇక 16వ వచనం నుండి 18వ వచనం వరకు 666 ముద్ర కోసం వ్రాయబడింది. అయితే ఈ 666 ముద్ర వేసుకోమని ఈ అబద్దప్రవక్త సర్వలోకాన్ని బలవంతం చేస్తుంది. కొద్దివారు గాని అనగా బడుగుజీవులు గొప్పవారు గాని, ధనవంతులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని బానిసలు గాని గమనించాలి ఆ కాలంలో బానిస వ్యవస్థ ఉండేది గాబట్టి దాసులు గాని అంటున్నారుఇలా ఎవరైనా సరే అందరును తమ కుడిచేతిమీదను గాని తమ నొసటి యందు గాని ఆ ముద్రను వేసుకునే లాగ అందరిని బలవంతం చేస్తుంది. ఇంకా ఆ ముద్ర లేకపోతే  మృగము పేరుగాని లేక వాడి సంఖ్య గాని లేకపోతే ఏ విధమైన క్రయవిక్రయాలు చేయడానికి అర్హత లేకుండా ఆర్డినెన్స్ తీసుకుని వస్తుంది ఈ రెండో క్రూరమృగం అనబడే అబద్దప్రవక్త!

 

గమనించాలి- మరి ఈ ముద్రను వేసుకునే లాగా ఎలా బలవంతం చేసి ఒప్పిస్తుంది అంటే వాడి దగ్గర ఇప్పుడు సైనికబలం ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది కాబట్టి ప్రపంచమంతా ఈ దుష్టత్రయంనకు లోబడి ఉంటారు. వీరిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి వీరు చెప్పినవెంటనే ముద్రను వేసుకోవడం మొదలుపెడతారు!

 

ఇప్పుడు విడువబడిన ప్రజలకు రెండే రెండు మార్గాలున్నాయి. అయితే ముద్రను వేసుకోవాలి లేకపోతే వీరి చేతులలో చనిపోయి తిన్నగా పరలోకంలో గల బలిపీటం క్రిందన చేరడం ! ఏదో ఒకటే చెయ్యాలి!

 

దీనికోసం గతంలో చెప్పడం జరిగింది. ఇది మహాశ్రమల కాలం మొదటి అర్ధభాగంలో జరిగే సంభవం!

 

అయితే నేటిరోజులలో ఇది ఏ రకంగా జరుగుతుంది అంటే RFID అనే చిప్ తయారుచేయడం జరిగింది. దీనికి శిల్పి నిర్మాణకుడు బిల్ గేట్స్! ఈయన సైతాను ఎజెంట్ లాగ పనిచేస్తున్నాడు! ఈ చిప్ పనిచేయడానికి శరీర ఉష్ణోగ్రత సరిపోతుంది. దీనిలో నీ డేటా మొత్తం ఈ చిప్ లో భద్రం చేయబడుతుంది. నీ జన్మదినం నుండి నీ బ్యాంకు నంబర్ పాస్పోర్ట్ నంబర్, ఆధార్ నంబర్ అన్ని దీనిలో సేవ చేయబడుతుంది. కొంతమంది మన ఆధార్ కార్డ్ నంబరే 666 నంబర్ అంటున్నారు. అయితే అది ప్రస్తుతం కాదు! ఎంతవరకు కాదు అంటే అదే ఆధార్ నంబర్ చిప్ రూపంలో మన చేతిమీద గాని నుదిటిమీద గాని వేయడం జరిగితే అప్పుడు అది 666 అవుతుంది.

 

నీవు కూలి పని చేసినా ఉద్యోగం చేసినా నీ జీతం/కూలి డబ్బులు తిన్నగా నీ అకౌంట్ కి వెళ్ళిపోతాయి. నీవు ఏదైనా షాప్ కి వెళ్లి సరుకులు కొనాలంటే డబ్బులుగాని atm కార్డు గాని అవసరం లేదు. అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. దాని దగ్గర నీ కుడిచెయ్యి గాని నుదురు గాని చూపితే ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లోనుండి డబ్బులు ఆ షాపుకి బదిలీ చేయబడతాయి. ఇంకా నీవు ఏ విధమైన గుర్తింపు కార్డులు తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. మరో దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ వీసా అవసరం లేదు! నీ RFID నీలో ఉంటే చాలు! one world rule వలన- ఏ దేశమైనా వెళ్ళవచ్చు!

 

విడువబడే వారలారా! జాగ్రత్త! 666 ముద్ర రాబోతుంది! ఆ ముద్ర వేసుకుంటే నీకు పరలోక ప్రవేశం ఇక ఎప్పటికీ లేనట్లే! వేయించుకోకపోతే ఏమవుతుందో కొన్ని ఉదాహరణలు చెబుతాను! ముద్ర వేయించుకుంటావా రేషన్ కార్డు తీసేయ్యమంటావా అంటారు! ముద్ర వేసుకుంటావా లేకపోతే నీ ఉద్యోగం తీసేయ్యనా అంటారు! రిజర్వేషన్ కావాలా దేవుడు కావాలా అంటారు! రిజర్వేషన్ కావాలి అంటే ముద్ర వేసుకోవాలికాదు నా హక్కుల కోసం పోరాడుతాను అంటే ఆ రోజులలో అది కుదరదు! అంతా క్రీస్తు విరోధి పాలనలో ప్రపంచం మొత్తం ఉంటుంది! ముద్ర వేసుకోకపోతే: ATM కి వెళ్తావు. అక్కడ నీకు డబ్బులు రావు. కారణం నీలో RFID చిప్ నీలో లేదు కాబట్టి నీ ATM కార్డు పనిచేయదు! ముద్ర ఉంటే ATM కార్డుతో పనిలేదు! ఇప్పుడు నీవు కిరాణా షాపుకి వెళ్తావు. ముద్ర చూపించు అప్పుడు రేషన్ ఇస్తాను అంటాడు వాడు! నీకు ముద్రలేదు! నీ డబ్బులు వాడు తీసుకోడు! ముద్ర ఉన్నవారికే రేషన్ ఇస్తాడు! ఇప్పుడు నీకు నీ పిల్లలకు తినడానికి ఏమీ ఉండదు! నీ అకౌంట్ లో లక్షరూపాయలు ఉన్నాయి. గాని వాటిని నీవు తీసుకోలేవు, ఖర్చు పెట్టుకోలేవు! నీవు ముద్ర వేసుకోలేని కారణంగా నీ ఉద్యోగం పోయింది. నీ డబ్బు పోయింది ఇప్పుడు! ఆకలితో అలమటించవలసినదే!

ఈలోగా ముద్ర లేనివారికి బహిరంగ మరణశిక్ష విధించడం జరుగుతుంది! ఇప్పుడు అయితే నీవు ముద్ర వేసుకోవాలి! లేకపోతే ఎక్కడికో పారిపోవాలి! నీ దగ్గర డబ్బులు లేవు, సరకులు లేవు! ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులెత్తాలి! ముద్రలేని వారిని పట్టిచ్చిన వారికీ గిఫ్టులు కూడా ఇస్తాడు వాడు! ఆ గిఫ్టులు కోసం నీ సొంతవారే నీ స్నేహితులే నిన్ను అప్పగిస్తారు! నీవు చూస్తుండగానే నీ పెద్ద కుమారున్ని కర్రకు కట్టి AK47 గురిపెడతారు. దేవుణ్ణి వదిలేస్తావా, ముద్ర వేయించుకుంటావా లేకపోతే నీ కొడుకుని చంపెయ్యమంటావా అంటారు! నీ కొడుకు డాడీ అంటూ ఏడుస్తున్నాడు! ఏమి చేస్తావు నీవు! రక్షణను కాపాడుకొంటావా లేక నీ కొడుకుని కాపాడుకుంటావా? నీ కొడుకు చనిపోయాక ఆ ప్లేస్ లో నీ భార్యను లేక నీ కుమార్తెను నిలబెడతారు! మరలా అదే మాట! దేవుడు కావాలా ముద్ర కావాలా ? లేక నీ భార్య/ నీ కూతురు కావాలా?

 

   అయ్యా నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఇది చెప్పడం లేదు! భవిష్యత్ లో జరుగబోయేది ఇదే!

 

నీకు పరలోకం కావాలంటే ముద్ర వేసుకోకూడదు! ముద్రవేసుకుంటే పరలోక అవకాశం కోల్పోతావు! నీకు పరలోకానికి ఒకేఒక అవకాశంఅది ఏమిటంటే వారి చేతులలో చనిపోయి- పరలోకంలో ఉన్న బలిపీఠం క్రిందకు డైరెక్టుగా వెళ్ళిపోవడం తప్ప మరో చాన్సు లేదు!

 

ఇక 18వ వచనంలో ఇందులో జ్ఞానం ఉంది. బుద్ధిగలవాడు ఆ మృగపు సంఖ్యను లెక్క పెట్టనీయు! అది ఒక మనిషి సంఖ్య అంటున్నారు.

7 పరిపూర్ణత మరియు దేవుని సంఖ్య అయితే 6 మానవుని సంఖ్య! అయితే మూడు ఆర్లు కలిస్తే అది అపవాది మరియు క్రీస్తు విరోధి సంఖ్య!!! మనిషి దేవుని స్థానాన్ని ఆక్రమించుకుందాం అనుకుంటాడు గాని ఇది సాధ్యం కాదు! 6 ఎప్పటికీ 7 కాలేదుఈ ఆరువందల అరవైయారు పడిపోయిన ఆత్మల యొక్క ప్రతినిధియగు ఘటసర్పంక్రూరమృగం లేక క్రీస్తు విరోధి, మరియు మృగము యొక్క ఆత్మ అబద్దప్రవక్తల యొక్క సంఖ్యను సూచిస్తుంది.

 

నేటిరోజులలో అనేక బాంకులు సంస్థలు ఈ 666 ముద్రను కోడ్ నంబర్ గా వాడు తున్నారుప్రపంచ బ్యాంక్ కోడ్ నంబర్ కూడా 666! ఆస్ట్రేలియా దేశం యొక్క జాతీయ బ్యాంకు రసీదుల మీద 666 ముద్ర ఉంది. అమెరికా దేశంలో అనేకమైన రుణపత్రాలమీద ఈ 666 ముద్ర ఉంది. చివరికి మనం ఉపయోగించే అనేకమైన బార్ కోడ్ల మీద మొదటి నంబర్ చివరి నంబర్ మధ్య నంబర్ 6. ఈ మూడు ఆర్లు లేకపోతే బార్కోడ్ మెషీన్ చదవలేదు ఆ నంబర్ ను!

 

అయ్యా! మీదన రాసిన శ్రమలన్నీ విడువబడిన వారికి మాత్రమే! జయించిన వారికి ఈ బాధలేదు! ఎందుకంటే దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేశారు!

మరినీకు అలాంటి అనుభవం ఉందా?

ఎత్తబడే గుంపులో ఉంటున్నావా?

నీ బ్రతుకు దేవునితో సమాధానం కలిగిఉందా?

ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధ పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా? అయితే నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావు!

లేదా? అయితే మీదన వ్రాయబడిన శ్రమలకు సిద్దంగా ఉండు!

బ్రతుకు మార్చుకో!

శ్రమలను తప్పించుకో!

ఎత్తబడు!

*జలముల మీద వేశ్య- మహా బబులోను-1*

 

ప్రకటన 17:1—7

1. యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;

2. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.

3. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, (లేక, దేవదూషణతో నుండుకొనిన నామములు (గలదై)) యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని

4. స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.

5. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను- మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహాబబులోను.

6. మరియు స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా

7. దూత నాతో ఇట్లనెను నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.

 

  ప్రియులారా! మనం ఇంతవరకు క్రూర మృగం, అబద్ద ప్రవక్త, ఘట సర్పం కోసం చూసుకున్నాము! ఇక ఇదే కోవలో మనకు కనిపించేది 17వ అధ్యాయంలో జలముల మీద కూర్చున్న వేశ్య! ఈమె ఎవరు? దేనిని సూచిస్తుంది అనే దానికోసం చూసుకుందాం!

 

ఈ అధ్యాయంలో మనకు ఇద్దరు స్త్రీలు కనబడతారు! ఒకరు విస్తారమైన జలముల మీద కూర్చుని! మరొకరు అరణ్యంలో ఏడు తలలు పదికొమ్ములు కలిగిన ఎఱ్ఱని మృగము మీద కూర్చుని ఒకరు ఉన్నారు!

విస్తార జలముల మీద కూర్చుని ఉన్న స్త్రీ కోసం, మరియు అరణ్యంలో మృగము మీద కూర్చుని ఉన్న స్త్రీకోసం ఏడు పాత్రలు భూమిమీద కుమ్మరించిన దూతలలో ఒకరు వచ్చి యోహాను గారికి ఆ స్త్రీలు ఎవరు అనేది వివరిస్తున్నారు. అనగా ఈ అధ్యాయం కూడా వివరణ కోసమైన అధ్యాయమే అని గ్రహించాలి!

 

ఆ దూత యోహాను గారిని పిలిచి నీవిక్కడికి రా, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరుస్తాను అన్నారు! ఇంకా భూరాజులు ఆమెతో వ్యభిచరించారు, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మునిగిపోయి మత్తులైపోయారు అని చెబుతున్నారు!

 

మొదటగా జలముల మీద అనగా ప్రజలలో అనియు భక్తిహీనుల సమూహములో అనియు అర్ధము అని గతభాగాలలో చూసుకున్నాం! అయితే ఇదే అధ్యాయం 15వ వచనంలో ఇంకా విస్తారంగా వివరము చెబుతున్నారు జలములు అనగా ఏమిటి? ....

నీవు చూచినా జలములు- ప్రజలను, జన సమూహములను ఆయా భాషలను మాట్లాడువారిని సూచిస్తుందిఅనగా ప్ర్రపంచంలో గల అనేక దేశాలలో గల ప్రజలను సూచిస్తుంది. అనగా ఈ స్త్రీ ప్రపంచంలో ఉన్న అనేకదేశాల మీద పెత్తనం చేస్తున్న ఒక మత సంస్థను సూచిస్తుంది అనుకోవచ్చు!

 

    ఇంకా వివరాలు కావాలంటే తొమ్మిదో వచనంలో ఇందులో జ్ఞానం గల మనస్సు అవసరం అంటూ ఆ మృగము యొక్క ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంటున్నారుమనకు ఏడు కొండలు అనగా గుర్తుకు వచ్చేది- ఏడు కొండలమీద నిర్మించబడిన రోమ్ నగరం అని! అవును ఈ దేవదూత కూడా అదే చెబుతున్నాడు! నీవు చూస్తున్న ఆ మృగము యొక్క ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు! రోమ్ నగరం కోసం చూసుకుంటే రోమ్ నగరం- రోమన్ కతోలిక్ సంఘాల ముఖ్య నగరం! అది ఏడు కొండలమీద నిర్మించబడి ప్రపంచంలో ఉన్న రోమన్ కేథలిక్ సంఘాలను- అనేక దేశాలను శాసిస్తుంది. ఆ ఏడు కొండలు ఏమిటంటే:

క్యాపిటోలిన్; క్యురినల్; విమినల్; ఎస్క్యులిన్; కెలియన్; అవెంటైన్; పాలటిన్;

 

ఇక తర్వాత మాటలలో ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు అనేదానికోసం గతంలో చూసుకున్నాము- ఆ దర్శనం కలిగే రోజులలో రోమా పాలకుడు డొమిషియస్ పరిపాలిస్తున్నాడు అని చూసుకున్నాం! అనగా ఒకడున్నాడు అనగా రోమా సామ్రాజ్యం అన్నమాట! అనగా ఈ వేశ్య- రోమ్ నగరంలో పాతుకు పోయిన మత సంస్థ అని తెలుస్తుంది!

 

ఇక 18వ వచనంలో నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను పరిపాలిస్తున్న ఆ మహా నగరమే! అనగా రోమా పట్టణమే! ఈ నగరం నమ్మకద్రోహం చేసిన భ్రష్ట క్రైస్తవ గుంపుకు సాదృష్యంగా ఉంది. అప్పుడు ప్రజలు తెలుసుకోలేక పోయినా ఇప్పుడు తెలుసుకుంటున్నారు!

 

మరి 15వ వచనంలో జలముల మీద అనగా అనేక దేశాల మీద ఎలా కూర్చుని ఉంది? ఒకప్రక్క ఏడు తలలు ఏడు కొండలు అంటున్నారు-అంటే రోమ్ అనేది ఆ మత సంస్థ ఇల్లు! దాని ముఖ్య కేంద్రం! అయితే ఆ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా సంఘాలున్నాయి. ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని అర్ధం!

సరే, మొదటికి వద్దాం!

 

ఇక రెండవ విషయం ఏమిటంటే మొదటి వచనంలో: ఆ స్త్రీని వేశ్య అంటూ సంభోదిస్తున్నారు ఇక్కడ! ఎందుకని?

బైబిల్ లో ఎవరైతే నమ్మక ద్రోహులో అనగా నిజదేవుణ్ణి వదిలి విగ్రహాల వెంట ఇతర దేవుళ్ళ వెంట  వెళ్తారో వారిని వేశ్య అంటూ సంభోదించడం జరిగింది.

యెషయా 1: 21

అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

 

యిర్మియా 2: 20

పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.

 

యేహెజ్కేలు 16:154

 

కాబట్టి ఎక్కడైతే వేశ్య అనేమాట బైబిల్ లో అలంకారంగా వాడబడిందో అక్కడ దేవుణ్ణి వదిలి ఇతర దేవుళ్ళ వెంట విగ్రహాల వెంట వెళ్ళిన వారిని సూచిస్తుంది! ఇదే మాట అలంకారంగా ఒకసారి తూరు నగరంకోసం వాడబడింది యెషయా 23:1517 లో!

ఇదే మాట ఒకసారి నీనెవే నగరం కోసం వాడబడింది నహూము ౩:4 లో!

ఈ రెండు నగరాలు మొదటగా వ్యాపార కేంద్రాలు, రెండవదిగా విగ్రహారాధన చేసే నగరాలు! విగ్రహపూజతో నిండిపోయిన నగరాలు! అందుకే ఈ రెండు నగరాలను వేశ్యతో పోల్చారు దేవుడు!

అనగా ఎవరైతే ఏ ప్రజలైతే నిజదేవున్ని లెక్కచేయకుండా ఇహలోక సంపదల వెంట అధికారం కోసం మరో దానికోసం పరుగులిడుతూ నిజ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుని దృష్టికి వేశ్య!!!!  ఆ ప్రజలు దేవుని దృష్టికి వేశ్య!

ఇది చదువుతున్న నీవు కూడా ఒకవేళ దేవుడంటే లెక్కచెయ్యకుండా కేవలం ధన సంపాదన కోసం- నీ ఇష్టాలకోసం తిరుగుతూ ఉన్నావంటే నీవు కూడా దేవుని దృష్టిలో ఆత్మీయ వేశ్యవు! ఆత్మీయ వ్యభిచారివి! నీకు కోపం వస్తే రానీయ్! కాని దేవుని దృష్టిలో నీవు వ్యభిచారివి! ఆత్మీయ వ్యభిచారివి!

బ్రతుకును మార్చుకున్నావా దేవునితో సమాధాన పడి సరిదిద్దుకున్నావా నీబ్రతుకు- ధన్యుడవు/ధన్యురాలవు! అలాకాకుండా నీ ఇష్టాలకు అనుగుణంగా బ్రతుకును కొనసాగించావా నరకానికి పోతావు! అగ్ని గంధకాలతో మండుతావు జాగ్రత్త!

*జలముల మీద వేశ్య- మహా బబులోను-2*

 

ఇక 17:2 లో అంటున్నారు: ఆ వేశ్యతో భూరాజులు వ్యభిచరించారు. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులయ్యారు.

గతభాగంలో దేవుని దృష్టిలో వ్యభిచారం ఏమిటి అనేది చూసుకున్నాం! దేవుణ్ణి వదిలి ఇతర దేవుళ్ళ వెనుక- విగ్రహాల వెనుక పరుగెత్తడం వ్యభిచారంగా చూసుకున్నాం! యిర్మియా 31:89; యేహెజ్కేలు 23:37, 43; హోషేయ 1:2, 2:45;

 

పాత నిబంధన గ్రంధంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వదిలి విగ్రహాలు వెంట పడినప్పుడు అస్తమాను నీవు వ్యభిచరించావు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజదేవున్ని వదిలి సత్యాన్ని వదిలి బ్రష్టమైన ఈ క్రైస్తవ మత సంస్థను దేవుడు వేశ్యతో పోల్చి- భూరాజులు కూడా ఆమెతో వ్యభిచారం చేశారు అంటున్నారు దేవుడు! 2తిమోతి ౩:15 లో చెప్పబడిన విధంగా దేవుని మాటలను తమకు అనుకూలంగా మలుచుకుని అనుకూలమైన బోధలు తయారుచేసుకుని సత్యాన్ని తారుమారు చేసి ప్రజలను త్రోవ తప్పించారు ఈ మతపెద్దలు! బైబిల్ చెప్పనివి-బైబిల్ లో లేనివి ఆచారాలు- పద్దతులు- పదవులు అన్నీ వచ్చేశాయి! ఇంకా ఆ ఇటలీ ప్రాంతంలో గల కొన్ని విగ్రహాల పూజలు- పండుగల పేర్లు మార్చుకుని క్రైస్తవ సంఘాలలోనికి ప్రవేశించాయి!

 

భూలోకమంతా ఈ అబద్ద క్రైస్తవ్యం ఇదే నిజమని వీరివెంట వెళ్ళింది. ఇదే ఆమె మద్యములో మత్తులై పోవడం! దేవుని కోసం కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసం, సుఖభోగాల కోసం ప్రజలు ఈ మతసంస్తతో పొందుపెట్టుకున్నారు. భూరాజులు ఈమెతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు! చివరకు రాజకీయ పదవులు ఎలా ఉంటాయో- అదే రకమైన పదవులు ఈ మత సంస్థలో వచ్చాయి. బిషప్ కి ఒక రాజకీయ నాయకుడు- గవర్నర్ కి ఉన్న అధికారాలు కట్టబెట్టారు!

 

 దేవుని బిరుదులను వీరు కొట్టేశారు! రెవరెండ్ అనగా భయంకరుడు అనే పదాన్ని వారికి అనుకూలంగా మార్చుకుని- చివరికి ఆక్సఫర్డ్ డిక్షనరీలో కూడా దాని అర్ధాన్ని మార్పించుకున్నారు- పూజ్యనీయుడు అంటూ! నిజానికి భయంకరుడు మరియు పూజ్యనీయుడు దేవుడే గాని మతపెద్దలు కానేకాదు! మతపెద్దలను బైబిల్ లో దాసులు అన్నారు గాని పూజ్యనీయులు భయంకరులు అని పిలువలేదు! పౌలుగారు ఇంత ఘనమైన సేవ చేశారు గాని ఎక్కడా నేను అంతటివాడను ఇంతటి వాడను అని చెప్పుకోకుండా నేను దేవుని దాసుడను బానిసను అనిచెప్పుకున్నారు!

ఈ రకంగా వీరు ప్రజలమధ్య తమనుతాము హెచ్చించుకుని దేవుని బిరుదులను కొట్టేసి తమకు తగిలించుకున్నారు! ఈదుర్మార్గత లో ప్రజలను కూడా భాగస్వాములుగా చేశారు! తప్పుడుబోధలతో తప్పుడు మార్గంలో నడిపించారు!

రాజులను శాసించారు! అదే నిజమైన మార్గమని నమ్మించారు! వినని వారిని చంపించారు!

 

ఏ రూపంలో కూడా విగ్రహాలు చెయ్యకూడదు, మ్రొక్కకూడదు అని బైబిల్ చెబితే మరియమ్మ యేసుబాబు, సిలువ  విగ్రహాలుచేసి పూజిస్తూ విగ్రహారాదికులుగా ప్రజలను చేశారు! చివరికి చనిపోయిన ఆ దైవభక్తులు అపోస్తలుల విగ్రహాలు చేసి వారిని కూడా మ్రొక్కేలా చేశారు! వారికి దైవత్వాన్ని అంటగట్టి చనిపోయిన భక్తులను పూజించేలా చేశారు! ఇంకా మర్మమైన పూజా పద్దతులు అబద్దదేవతలను పూజిస్తూ- గారడీలను కూడా సపోర్ట్ చేస్తూ వారు బ్రష్టులైపోయినదే కాకుండా ప్రజలను నాయకులను తప్పుడు త్రోవను నడిపించారు!

అంతేనా- తిమోతి పత్రికలో పౌలుగారు నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకో అని చెబితే- దానిని వక్రీకరించి- వైన్ త్రాగినా పరవాలేదు పౌలుగారు త్రాగమన్నారు అని చెబుతూ వారు త్రాగుబోతులుగా మారడమే కాకుండా ప్రజలను త్రాగుబోతులుగా మార్చేశారు!

నిజానికి పౌలుగారు త్రాగమన్నది- ద్రాక్షారసం! ఈస్ట్ కలిపి- పుల్లబెట్టి- దానిని కొన్నిరోజులు కప్పిపెట్టి- తర్వాత వాడే వైన్ కానేకాదు! ద్రాక్షారసం కొన్ని జబ్బులను నయం చేస్తుంది. అంతేకాకుండా డెట్టాయిల్ అయోడిన్ లేని రోజులలో గాయాలను కడగటానికి ద్రాక్షారసాన్ని వాడేవారు! అయితే దానిని తారుమారుచేసి తమకు అనుకూలంగా వాక్యాన్ని మార్చేసుకుని వైన్ త్రాగుతూ అందరినీ వైన్ త్రాగేలా చేశారు!

 

ఇంకా ప్రజలమీద అధికారం చెలాయించాలని వారిమీద నాయకులుగా ప్రకటించుకున్నారు! పోప్ దేవుని అవతారం అని ప్రచారం చేయించుకున్నారు. చివరికి తెగించి పోప్ మనిషి రూపంలో వచ్చిన యేసుప్రభువు అనికూడా చెప్పించుకున్నారు!

ఇంకా ధన వ్యామోహంతో పాపపరిహార పత్రాలు అమ్మడం మొదలుపెట్టారు! ఎవరైనా పాపం చేస్తే ఆ పాప పరిహార పత్రాన్ని డబ్బులు ఇచ్చి కొని చదివితే వారి పాపాలు పోయినట్లే అని చెప్పారు!

దేవుని ఎదుట నీపాపాలు ఒప్పుకోమంటే ప్రీస్ట్ దగ్గరకు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటే దేవుడు వెంటనే క్షమిస్తాడు అంటూ బోధిస్తూ, అలా ఒప్పుకున్నా కొందరిని లొంగదీసుకుని వ్యభిచారం చేయడం కూడా మొదలుపెట్టారు! ఇదే భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులవ్వడం!

 

   ఇక మూడవ వచనంలో మరో స్త్రీ కనిపిస్తుంది.ఈమె అరణ్యంలో ఎఱ్ఱని మృగము మీద కూర్చుని ఉంది! ఆ ఎఱ్ఱని మృగం- క్రూరమృగాన్ని సూచిస్తుందిఆ మృగం మీద దేవదూషణ కరమైన పేరులు ఉన్నాయి. కాబట్టి ఈ అరణ్యంలో మృగం మీద  కూర్చున్న స్త్రీ మరో స్త్రీ కానేకాదు గాని జలాల మీద కూర్చున్న స్త్రీ మొదటినుండి ప్రస్తుత కాలము వరకు ఉన్న రోమన్ కథోలిక సంఘము. అయితే ఈ అరణ్యంలో కూర్చున్న స్త్రీ అంత్యదినాలలో క్రూరమృగం అనబడే క్రీస్తువిరోధిని బలపరచి వాడితో కలిసి చేతులు కలిపే రోమా సామ్రాజ్యాన్ని మరియు రోమన్ కథోలికసంఘాన్ని సూచిస్తుందిఆమె అరణ్యంలో ఎందుకుంది అంటే ఆమె దేవుని నుండి దూరమై పోయి- దేవుని జీవజలములను వదిలి నీరులేని నీరు నిలవని తొట్లను తనకోసం తొలిపించుకుని ఆధ్యాత్మికతను పోగొట్టుకుని ఆధ్యాత్మిక అరణ్యంలో జీవిస్తుంది అని అర్ధము! అనగా అరణ్యమనెడి లోకంలో ఉంటూ లోకపుటాచారాలలో మునిగి పోయింది అన్నమాట!

*జలముల మీద వేశ్య- మహా బబులోను-*

 

    ఇక నాల్గవ వచనంలో ఆమె దూమ్ర రక్తవర్ణములు గల వస్త్రాలను ధరించుకుంది. ఇంకా బంగారముతోను ముత్యములతోను అలంకరించుకుంది.

దీనికోసం ఆలోచిస్తే ఈ ఊదా రంగు వస్త్రాలు ఎఱ్ఱని వస్త్రాలు ఆ మతసంస్థలో గల విలాసాలను భోగాలను సూచిస్తుంది. ఇంకా వారు వేసుకునే రంగురంగుల బట్టలను సూచిస్తుంది. ఇంకా ముత్యాలు బంగారం కోసం చూసుకుంటే వారు ధరించే కిరీటాలు మరియు ఆభరణాలు సూచిస్తుంది. విలువైన రాళ్ళూ- వారు సంపాదించిన విస్తారమైన ధనం, వారికున్న ప్రపంచంలో గల ఆస్తిపాస్తులను సూచిస్తుంది.

 

ఇక ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది గాని అది అసహ్యమైన వాటితో ఆమె వ్యభిచార సంబంధమైన మలినముతో నిండి ఉందిదీనికోసం ఆలోచిస్తే ఆ బంగారుపాత్ర బయటకు ఎంతో బాగా పవిత్రంగా కనిపిస్తున్న సంఘ నాయకత్వాన్ని సూచిస్తుంది! గాని వారి మధ్యలో జరిగే భయంకరమైన వ్యభిచార సంబంధమైన క్రియలతో వారి అంతరంగాలు నిండి ఉన్నాయి! అందుకే యేసయ్య అంటున్నారు మత్తయి 23:2526...

 

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

 

ఇక ఐదవ వచనంలో ఆమె నొసట మీద దానిపేరు ఇలా వ్రాయబడింది- మర్మము- వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహా బబులోను!!!!

ఈ స్త్రీ ఏమిటో- ఖచ్చితంగా ఈ పేరు మనకు తెలియజేస్తుంది. అది జ్ఞానం గలవారికే ఇది అర్ధమవుతుంది.

 

ఇక్కడ మహా బబులోను అనగా అక్షరార్ధమైన బబులోను సామ్రాజ్యం కాదు గాని ఆత్మీయమైన లేక ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్న మత సంబంధమైన బబులోను అని పిలువబడే రోమ్ నగరం మరియు రోమ్ నగరంలో పాతుకుపోయిన మతసంస్థ!!!

 

ఆ బబులోను కూడా అబద్దమతానికి కేంద్రం లాంటిదే! అది విగ్రహాలతో నిండినది యిర్మియా 50:38 ప్రకారంఇప్పుడు ఈ బబులోను అనబడే అబద్ద మతకేంద్రం కూడా విగ్రహారాధనకు నిలయమైపోయింది. ప్రపంచానికే కేంద్రమయ్యింది. దాని ప్రధాన పూజారి బిరుదు- పొంతిఫెక్స్ మాక్షిమమ్ ! పోనుపోను ఈ బిరుదు రోమా చక్రవర్తుల తీసుకున్నారు. తర్వాత రోమ్ లోని క్రైస్తవ నాయకులు, పోప్ లు తీసుకున్నారు! పోప్ కోసం ఈ రోజులలో ఉపయోగించే మాట పొంతిఫ్! అనగా వంతెనగా ఉండేవాడు- అనగా పరలోకానికి మానవులకు వంతెనగా ఉండేవాడు!

అరే- నిజమైన వంతెన- నిజమైన మార్గం యేసుక్రీస్తుప్రభులవారు- నేనే అని చెబితే ఈ పోప్ ఎవరండి????

 

ఆమె ఏహ్యమైన వాటికి తల్లి అని చెప్పబడింది అనగా ఏకైక నిజమైన దేవుని ఉపదేశాలు సత్యాలను వదిలి, వాటిని మార్చి అబద్దమైన మార్గాలు జరిగిస్తున్న ఈ సంఘ కార్యకలాపాలు అన్నమాట!

 

ఇక తర్వాత వచనంలో ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను యేసు యొక్క హతస్సాక్షుల రక్తముచేతను మత్తిల్లి యుండుట చూచితిని చూచి ఆశ్చర్యపడితిని అంటున్నారు యోహాను గారు!

 

పరిశుద్ధుల రక్తము- అనగా యేసుక్రీస్తుప్రభులవారి శిష్యులను సంఘాన్ని- ఇంకా హతస్సాక్షులైన వారి రక్తము! పరిశుద్దులు గతభాగంలో చెప్పిన పరిశుద్దులే కాదు ఇక్కడ మొదటినుండి అనగా పెంతుకొస్తు దినాన ఏర్పడిన సంఘము మొదలుకొని ఇంతవరకు లేక క్రీస్తు విరోధి రాకవరకు గల సంఘములోని పరిశుద్ధులు! ఇక యేసు యొక్క హతస్సాక్షుల రక్తము అంటున్నారు!

 

 గమనించాలి- క్రీ.. ౩౦౦ వరకు సంఘము అన్యుల చేత హింసించబడింది. రాళ్ళతో కొట్టబడ్డారు. రంపములతో కోయబడ్డారు. కత్తిచేత చంపబడ్డారు! సింహములకు ఆహారమయ్యారు. ఇలా ఎన్నో రీతులలో అన్యజనులతో చంపబడ్డారు! అయితే క్రీ.. ౩౦౦ తర్వాత కాలం నుండి క్రీ.. 1900 వరకు కొన్ని కోట్లమందిని ఈ రోమన్ కేథలిక్ సంఘము మరియు పెద్దలు చంపారు! ఒక భక్తుడు కట్టిన లెక్క ప్రకారం సుమారుగా ఐదు కోట్లమందిని వీరు చంపారు! వీరు ఎంతో శాంతి కాముకులుగా పైకి కనబడినా ఆ రోజులలో వీరిలో ఒక పైశాచికత్వం పనిచేసి ఇన్ని కోట్లమందిని నిర్దాక్షిణ్యంగా చంపారు! బ్రతికుండగానే కాల్చారు ప్రొటస్టెంట్ క్రైస్తవులను! ఇదే పరిశుద్ధుల రక్తముచేత మత్తిల్లి ఉండటం!

ఇంకా చివరిరోజుల్లో మరోసారి ముద్ర వేయించుకొని వారిని చంపడంలో ఈ సంఘము ముందుగా ఉంటుంది ఎందుకంటే మొదట్లో ఈ మతపెద్దలతో కలిసి క్రీస్తు విరోధి పనిచేస్తాడు!

 

ఇక చివరి వచనాలు చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి! 16వ వచనం చూసుకుంటే నీవు పదికొమ్ములు గల ఆ మృగమును చూచితివే- వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేనిదిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి దానిని అగ్నిచేత కాల్చివేతురు!

 

ఇది చివరి పాత్రము కుమ్మరింపు ముందుగా జరిగేవి! ఈ మహా బబులోను వేశ్యకు ముందుగా నాశనం క్రీస్తు విరోధి ద్వారా కలుగుతుంది. తర్వాత దేవుని ఉగ్రత పాత్ర ద్వారా కల్గుతుంది .

 

పదికొమ్ములు పది రాజ్యాలు అని గతభాగాలలో చూసుకున్నాము! అనగా క్రీస్తువిరోధితో పాటుగా ఉన్న పదిమంది రాజులు ఈమెను ఒకరోజు ద్వేషిస్తారు. ఎప్పుడు ద్వేషిస్తారు అంటే దేవునిమాటలు నెరవేరేవరకు. అంతవరకూ ఆమె అనగా ఈ మతపెద్దలు క్రీస్తు విరోధి తోనూ ఈ రాజులుతోను ఎంతో కలిసిమెలిసి ఉంటారుఒకరోజు దేవునిమాటలు నెరవేరుతాయి అనగా మహా బబులోను కోసమైన ఉగ్రతకోసం చెప్పబడిన మాటలు నెరవేరేరోజు వస్తుంది. అప్పుడు ఈ రాజులూ క్రీస్తు విరోధితో పాటుగా ఆమెను అనగా ఈ మత సంస్థను ద్వేషించి ఆమెను నాశనం చేస్తారు. బహుశా ఇంతవరకు ఈ రాజులమీద కూర్చుని ఆమె అధికారం చేసి ఉండవచ్చు! అందుకే అవకాశం చిక్కినప్పుడు ఆమెపైపడి ఆమెను పీక్కు తింటారు!

 

  ఇక దిక్కులేనిదిగాను దిగంబరిగాను చేస్తారు అనగా ఆమెకున్న ఆస్తుపాస్తులు అన్ని లాగుకుంటారు! ఇంకా ఆమె మాంసము తింటారు అనగా ఆమెకున్న సర్వసంపదలు అనగా స్కూళ్ళు చర్చిలు భవనాలు అన్ని వీరు స్వాధీనం చేసుకుంటారు. ఆ సంఘాన్ని అనాధగా వదిలేస్తారు!

ఇంకా  అగ్నిచేత ఆమెను బొత్తిగా కాల్చివేస్తారు అనగా- ఆమెకున్న ఆస్తులను లాగుకుని బహుశా ఆ రోమన్ కేథలిక్ సంఘాలను అనగా చర్చిలను ఆస్తులను నిప్పుతో కాల్చేస్తారు!

అయితే కొందరు వేదపండితులు ఏమని అభిప్రాయ పడతారుంటే ఒకరోజున అనగా ఆమెను ద్వేషించిన రోజున ఆమె ఆస్తిపాస్తులు లాక్కుని వాటికన్ సిటీని రోమ్ నగరాన్ని ఈ క్రీస్తు విరోధి మనుషులు మరియు ఈ పదిమంది రాజులు కలిసి కాల్చివేస్తారు! కేవలం దానిని ఒక మతసంస్థగానే పరిగణించి ఇలా ద్వంసం చేసి కాల్చివేస్తారు!

 

ఈ విధంగా మొదటగా క్రీస్తు విరోధి మనుష్యులు మహా బబులోను అనబడే వేశ్యకు తీర్పు తీర్చుతారు! ఆ తర్వాతనే దేవుడు తీర్చేతీర్పు వస్తుంది. మొత్తానికి రోమ్ నగరం- ఆ మతసంస్థ సంపూర్తిగా నాశనం అయిపోతుంది!

 

ప్రియసంఘమా! నీవు ఎలా ఉన్నావు? నిజంగా దేవుణ్ణి ఆరాదిస్తున్నావా? లేక లోక పద్దతులను అనుసరిస్తూ కేవలం పెదాలతో ఆరాదిస్తున్నావా? నిజమైన మార్పులేకపోతే విడువబడతావు జాగ్రత్త!

ఆ సంఘము మరియు మతపెద్దలు అలా నులివెచ్చని జీవితం జీవించి సర్వనాశనం కాబోతున్నారువారు అంటున్నట్లు భారతీయులకు భారత దేశ పాత్రలో దేవుణ్ణి పరిచయం చేయాలి అంటూ విగ్రహారాధన, కొబ్బరికాయలు కొట్టడం, అగరుబత్తులు వెలిగించడం లాంటి కార్యాలు నీవుకూడా చేశావా- నీవు కూడా నరకానికి పోతావు! ఆ సంఘాన్ని దేవుడు వ్యభిచారి వేశ్య అంటున్నారు! ఇంకా వారు పైకి మాత్రం క్రైస్తవులు గాని విగ్రహారాధన, బొట్టు, హైందవ ఆచారాలు అన్ని మామాలే!

కేవలం ఆదివారం చర్చికి వెల్తారు అంతే! నీవు కూడా అదేరకంగా జీవించాలి అనుకుంటే నీకు నరకం తప్పదు!

నేడే నీ బ్రతుకు మార్చుకుని వాక్యానుసారంగా జీవించు!

*మహా బబులోను-4*

 

ప్రకటన 18:18

1. అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.

2. అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను - మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.

3. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.

4. మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటినినా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.

5. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.

6. అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

7. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.

8. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, (లేక దెబ్బలు) అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.

 

ప్రియులారా! 17వ అధ్యాయంలో కనబడిన బబులోను 18వ అధ్యాయంలో కనబడే బబులోను- రెండు బబులోనులు కావు. రెండూ ఒకే బబులోను కోసం చెబుతున్నాయి. అయితే పూర్వము చెప్పినట్లు 611 అధ్యాయాలు యూదుల కోణంలో, 1218 అధ్యాయాలు సంఘపు కోణంలో ఒకే విషయాన్ని ఎలా చెబుతున్నాయో అలాగే 17వ అధ్యాయంలో ఉన్నది క్రీస్తు విరోధి అనుచరుల ద్వారా మహా బబులోను తీర్పు జరుగుతుంది. 18వ అధ్యాయంలో ఉన్నది దేవుని ఉగ్రతాదినం ద్వారా దేవుని ఉగ్రత పాత్రల ద్వారా దేవుని నుండి తీర్పు!

అందుకే 18:1 లో వేరొక దూత వచ్చి ఈ సమాచారం ప్రకటిస్తూ ఉన్నాడు!

 

రెండో వచనంలో అతడు గొప్ప స్వరముతో అంటున్నాడు- మహా బబులోను కూలి పోయెను- కూలిపోయెను! అది దయ్యాల కొంప! ప్రతీ అపవిత్రాత్మకు ఉనికిపట్టు ఇంకా అసహ్యమైన ప్రతీ పక్షికి ఉనికిపట్టు అంటున్నారు.

 

ఇదేమాట మనకు ప్రకటన 14:8 లో కూడా కనిపిస్తుంది- మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అంటూ!

 

మొదటగా మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని రెండుసార్లు ఎందుకు చెప్పారు అంటే మొదటగా క్రీస్తు విరోధి చేతను, రెండవదిగా దేవునిచేతను అది తీర్పుపొందుతుంది కాబట్టి! అనగా రెండు దశలలో అది కూలిపోబోతుంది.

 

రెండవది: అది అక్షరార్ధముగాను ఆత్మీయముగాను బ్రష్టురాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు దానికి రెండు విధాలుగా రెండింతలుగా  తీర్పులు జరుగబోతున్నాయి!!

 

ఇక మూడవదిగా అది: మతసంబంధముగాను, రాజకీయముగాను అది కూలిపోబోతుంది!!  ఇంకా మతసంబంధముగా వర్తకము సంబంధము గాను కూలిపోబోతుంది!

 

కాబట్టి ఈ దూత రెండుసార్లు మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అంటూ చెబుతున్నాడు!

 

సరే, ఈ సంభవం ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచన చేస్తే ఏడవ దూత తన పాత్రను కుమ్మరించిన తర్వాత జరుగబోయే సంభవముగా కనిపిస్తుందికారణం 16వ అధ్యాయంలో ఏడవ దూత పాత్రను కుమ్మరించిన తర్వాత మెరుపులు ఉరుములు భూకంపం కలుగుతుంది. అది మహా గొప్ప భూకంపందానికి ఈ రోమ్ నగరం మూడు ముక్కలు అవుతుంది. అదే మహా బబులోనుఅంతేకాకుండా అదే 19వ వచనంలో తన తీక్షణమైన ఉగ్రత అను మధ్యము గల పాత్రను మహా బబులోనునకు ఇవ్వాలి అని దేవుని సముఖమున వారు జ్ఞాపకం చేశారు!

ప్రకటన 16:1719 లో ఈ విషయాలు కనిపిస్తాయి మనకు!

 

17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండివచ్చెను.

18. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.

19.  ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.

 

ఇక ఇలా జరుగుతుంది అని యెషయా గారు ముందుగానే చెప్పారు 21:9 లో....

 

ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

 

ఇది అనగా ఈ ప్రవచనం నిజమైన బబులోనునకు మరియు అబద్ద బబులోనునకు రెండింటికి చెందుతుంది.

 

ఇక దీనిని దయ్యముల కొంప లేక అపవిత్రాత్మలకు ఉనికిపట్టు అని ఎందుకు అన్నారు అంటే ఆ సంఘపు 

ఆధ్యాత్మికమైన పతనానికి నిదర్శనంగా దయ్యముల కొంప అన్నారు! అది చేసిన భయంకరమైన విగ్రహారాధన!

మొదటగా నిజమైన విగ్రహాలు చేసింది, రెండవదిగా దేవునికి ఇవ్వవలసిన మర్యాద వారి ప్రీస్ట్ లకు, బిషప్ లకు పోప్ అర్చి బిషప్ లకు ఇచ్చి- దేవునికంటే ఎక్కువగా వారిని గౌరవించి పూజించారు కాబట్టి దయ్యములకు ఉనికిపట్టు అంటున్నారు!

 అంతేకాకుండా అక్కడ జరుగుతున్న భయంకరమైన వ్యభిచారం మరియు వర్తక వ్యాపారాలను బట్టి దయ్యాలకొంప గా దేవుడు అభివర్ణించారు!  నిజమైన బబులోను తీర్పు, నాశనం తర్వాత ఎడారి జంతువులుకు నక్కలకు ఎలాగు ఉనికిపట్టు అయ్యిందో అలాగే వేశ్యలకు తల్లి అయిన మహా బబులోను కూడా వాటికంటే భయంకరమైన ప్రాణులతో నిండి ఉంటుంది!

యెషయా 13:1922; యిర్మియా 50:39; 51:37;

 

అసహ్యమైన పక్షులు కూడా దురాత్మల యొక్క సమూహమునే సూచిస్తుంది,

 

మూడో వచనంలో ఎందుకంటే జనాలన్నీ దాని వ్యభిచార మద్యాన్ని ఆగ్రహ మద్యాన్ని త్రాగారు, భూరాజులు ఆమెతో వ్యభిచరించారు, భూమి మీద వర్తకులు దాని అధిక సుఖబోగాల మూలంగా ధనవంతులయ్యారు అనేదానికోసం గత భాగంలో చెప్పుకున్నాము!

 

ఇప్పుడు పరలోకంలోనుండి నాల్గవ వచనంలో ఒక స్వరము వినిపిస్తుంది- గమనించండి ఈ స్వరం- నా ప్రజలారా అంటుంది! అనగా ఇది ఏ దేవదూతగాని బలిపీఠం గాని చెప్పడం లేదు గాని దేవుడే స్వయముగా మానవులపై ప్రేమతో చెబుతున్నట్లు అనిపిస్తుంది- నా ప్రజలారా! మీరు దాని పాపాలలో పాలివారు కావద్దు దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించుకుండునట్లు  దానిని విడిచిరండి అంటున్నారు... ఇక్కడ అనుమానం రావచ్చు- అప్పుడు కృపాకాలం అయిపోయింది సంఘము ఎత్తబడింది, భూమిమీద ఉన్న హతస్సాక్షులు బలిపీఠం దగ్గర ఉన్నారు మరి ఇది ఎవరిని ఉద్దేశించిన స్వరము?

నా ఉద్దేశం ఏమిటంటే ఈ మాట ప్రస్తుతం మనకు దేవుడు చెబుతున్న మాటలా అనిపిస్తుంది. దానికి అనగా ఆ మహా బబులోను అనబడే రోమా సంఘమునకు ఇలా తీర్పులు జరుగబోతున్నాయి కాబట్టి దానిని విడిచి రండి! అనగా ఆ రోమన్ కేథలిక సంఘములను విడిచిరండి! లేకపోతే మీకు కూడా కటినమైన శిక్షలు తప్పవు! అయితే కొంతమంది ఏమని అభిప్రాయ పడుతున్నారు అంటే అక్కడ కొంతమంది నిజ విశ్వాసులు బహుశా ఉండి ఉంటారు వారినే దేవుడు బయటకు రమ్మని పిలుస్తున్నారు అంటారు! ఏమో మరి నాకైతే తెలియదు! దేవుని మాటలు తీర్పులు అగమ్యగోచరంగా ఆశ్చర్యంగా ఉంటాయి!

 

అయితే ఇది కూడా ప్రవచన నేరవేర్పుకే ఇలా పిలవడం జరుగుతుంది. కారణం మరలా యెషయా 52:11, యిర్మియా 51:45 లో ఇదే మాట చెబుతున్నారు ఆ నిజమైన బబులోను కోసం! మరలా ఈ అబద్ద బబులోను అయిన మహా బబులోను కోసం అదేమాట దేవుడు చెబుతున్నారు....

యెషయా 52: 11

పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి

 

యిర్మియా 51: 45

నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి

 

అందుకే పౌలుగారు చెబుతున్నారు 2కొరింథీ 6:17 లో వారిలోనుండి ప్రత్యేకముగా ఉండండి! అపవిత్రమైన వాటిని ముట్టకుడి...

 

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

 

  ప్రియ దైవజనమా! మనము రోమన్ కేథలిక్ వారివలె చెయ్యకూడదు మరియు అన్యుల ఆచారాలు ఏమియు చేయకూడదు! మనము ప్రత్యేకించబడిన వారము! పవిత్ర పరచబడిన వారము కాబట్టి మనము ప్రత్యేకముగా ఉండాలి గాని వారి ఆచారాలు చేసి మనము అపవిత్రలము కాకూడదు! వారు అలా చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు!

 

ఇంకా 5వ వచనంలో దానిని పాపాలు ఆకాశం వరకు అంటాయి అంటున్నారు- గతభాగాలలో వయు ఏ రకమైన పాపాలు చేశారో చెప్పుకున్నాము- విగ్రహారాధన, చనిపోయిన భక్తులకు దైవత్వము అంటగట్టి వారిని పూజించడం, వ్యక్తులను పూజించటం, వారి పోప్ ను మరియు కొంతమందిని పూజించడం, దేవునికి చెందవలసిన బిరుదులూ రెవరెండ్ మరియు పొంతిఫ్ వారు పెట్టుకోవడం!ఇవన్నీ వారి పాపాలే! దానికి ఒప్పుకొనని నిజ క్రైస్తవులను సుమారుగా ఐదు కోట్లమందిని నిర్దాక్షిణ్యంగా చంపడం, పాప పరిహార పత్రాలు, అమ్మి ధనాన్ని సంపాదించడం ఇవన్నీ వారి పాపాలే! అందుకే వారి పాపాలు ఆకాశాన్ని అంటాయి అంటున్నారు!

 

ఇప్పుడు అది మీకు చేసినట్లే మీరు దానికి చెయ్యండి అంటున్నారు! దానికి రెండింతలు చెయ్యండి అంటున్నారు!

దీనికోసం కొంతమంది వేదపండితులు ఏమని చెబుతారు అంటే: ఆ ఉగ్రత రోజున పాత్ర కుమ్మరించక ముందు క్రీస్తు విరోధి మనుషులు తీర్పు చేసేటప్పుడు- వీరు ఎలా క్రైస్తవులను ఇతర మతస్తులను వారి మతము పుచ్చుకోలేదని ఎలా చంపారో అలాగే చంపుతారు! ప్రతీ కేథలిక్ మందిరము, స్కూల్, ఆఫీస్, మతసంబంధమైన గృహము, బిల్డింగ్ పడగొట్ట బడుతుంది. ప్రీస్ట్ లు, నన్స్ అనబడే మఠకన్యలు చంపబడతారు, అగ్నిచేత కాల్చబడతారు! వారికున్న ఆస్తులన్నీ అగ్నిచేత కాల్చబడతాయి! వారు చేసిన దానికి రెట్టింపు శిక్షను పొందబోతున్నారు!!!

 

ఇక మిగిలిన వచనాలలో వారు ఎంతగానో సుఖబోగాలను అనుభవించారు. నాకెప్పుడు దుఖం ఉండదు నేను రాణిలా ఉంటాను అని అనుకుంది... ఇది వారు ప్రస్తుతం అనుభవిస్తున్న ఆస్తి ఐశ్వర్యాలను సూచిస్తుంది. నేనెప్పుడు రాణిలా ఉంటాను అనే దానికోసం చూసుకుంటే సంఘము దేవుని పెండ్లి కుమార్తెగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అయితే ఈసంఘము దేవుణ్ణి వదిలి సుఖబోగాలు ఆశించి క్రీస్తు విరోధి పెండ్లి కుమార్తెగా మారింది. అందుకే ఈ శిక్ష! నేనెప్పుడు రాణిలా ఉంటాను. తర్వాత రోజులలో కూడా మాకున్న అధికారం భక్తుశ్రద్ధలు అలాగే ఉంటాయి. ప్రజలు మమ్మల్ని పూజిస్తారు అని అనుకుంటారు గాని ఒకరోజు దిక్కులేనిదానిగా దిగంబరిగా వదిలేస్తారు వారిని!

 

ప్రియులారా ఇలా చివరి వరకు దానికోసం తీర్పులే కనిపిస్తాయి మనకు!

చివరి వచనంలో ఆ నగరంలో ప్రవక్తల రక్తం పరిశుద్దుల రక్తం భూమిమీద హతమైన వారి రక్తము కనిపించింది అంటున్నారు యోహాను గారు! దానికోసం గతభాగాలలో చూసుకున్నాము! ఎందఱో ప్రవక్తలను దేవుని బిడ్డలను చంపారు! సుమారుగా ఐదుకోట్ల మందిని క్రీ.శ ౩౦౦ నుండి 1900 వరకు చంపారు! ఇంకా మహాశ్రమల కాలంలో కూడా చంపుతారు! చివరికి దేవుని తీర్పులు అనుభవిస్తారు!

 

ప్రియసంఘమా! కాబట్టి దేవుడు చెబుతున్న మాటా నా ప్రజలారా ! దానినుండి బయటకి రండి! దాని పాపములలో మీరు పాలివారు భాగస్తులు కాకండి! వారు చేస్తున్న విగ్రహారాధ,న వారుచేసున్న లోకాచారాలు మీరు చేయవద్దు! అలా చేస్తే మీకు కూడా ఈ ప్రతిదండన తప్పదు!

కాబట్టి ఆయన స్వరము విందాము! ఆయన రాకడకు ఎత్తబడదాము!

*సీయోను పర్వతం మీద 1,44,000 మంది*

 

ప్రకటన 14:1—5

1. మరియు నేను చూడగా, ఇదిగో, గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.

2. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.

3. వారు సింహాసనము ఎదుటను, నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును కీర్తన నేర్చుకొనజాలరు.

4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

5. వీరినోట అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.

 

ఈ అధ్యాయం లోని సంభవాలు కొన్ని చివరి పాత్ర కుమ్మరించబడక ముందు జరిగినవి!

 

ఇక 14వ అధ్యాయం ధ్యానం చేసుకుంటే ఈ అధ్యాయంలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

 

మొదటిది: సీయోను పర్వతం- దానిమీద 1,44,000 మంది,

రెండు: సర్వలోకానికి చివరిగా  సువార్త ప్రకటన!

మూడు: మహా బబులోను తీర్పు,

నాలుగు: పైరు కోత,

ఐదు: ద్రాక్షల కోత మరియు ద్రాక్షల తొట్టి!

 

ఈరోజు మనం మొట్టమొదటి అంశం సీయోను పర్వతం మీద ఉన్న 144౦౦౦ మంది ఎవరు అనేదానికోసం ధ్యానం చేసుకుందాం! దీనికోసం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి! కొంతమంది వారు ఇశ్రాయేలుప్రజలలో ముద్రించబడిన 144౦౦౦ మంది అంటారు! కొందరు కాదు- వీరు ప్రత్యేకమైన వారు! మరికొంతమంది భక్తులు-మేమే ఆ 144౦౦౦ మంది- కారణం మేము పెళ్లి చేసుకోకుండా స్త్రీ సాంగత్యమున అపవిత్రత పొందకుండా క్రీస్తుకొరకు సాక్షులుగా బ్రతుకుతూ పానార్పముగా పోయబడుచున్నాము కనుక మేమే అంటారు! అయితే దీనిని వాక్యపు వెలుగులో ధ్యానం పరిశీలిద్దాం!

 

మొదటి వచనంలో మరియు నేను చూడగా  ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడి యుండెను! ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖించబడిన నూట నలుబది నాలుగువేలమంది ఆయనతో కూడా ఉన్నారు!

 

ఇక్కడ మొదటగా గొర్రెపిల్ల కనబడుతుంది! అనగా  వీరు క్రీస్తువారు అని అర్ధమవుతుంది!

 

రెండవది: సీయోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలువబడి ఉన్నట్లుగా చూడగలము!

ఈ సీయోను పర్వతం అనేది అక్షరార్ధముగా ఇశ్రాయేలు దేశంలో యేరూషలేము పట్టణంలో ఉంది! 2సమూయేలు 5:69; కీర్తన 2:6; మత్తయి 23:3739

 

అదేవిధంగా పరలోకంలో కూడా సీయోను ఉంది. దానిని పరమసీయోను అంటారు! ఇది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్తితిని సూచిస్తుంది! జయించిన వారు-పరిపూర్ణత సాధించిన పరిశుద్ధుల ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది ఈ పరమ యేరూషలేము! ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు!!!

గలతీ 4:2526; హెబ్రీ 12:2224

 

ఒకవేళ ఈ సీయోను పర్వతం భూమిమీద ఉన్న సీయోను పర్వతమును సూచిస్తే ఖచ్చితంగా ఇది వెయ్యేండ్ల పాలనలో జరిగే సంభవాన్ని సూచించాలి. గాని ఇక్కడ ఇంకా దేవుని తీర్పులు పూర్తి కాలేదు కాబట్టి ఇది నాకయితే భూమిమీద ఉన్న సీయోను పర్వతం కాదు అనిపిస్తుంది.

 

ఇక అక్కడ గొర్రెపిల్లతో పాటుగా నూట నలుబది నాలుగువేల మంది తండ్రియైన దేవుని నామమును గొర్రెపిల్ల నామమును నొసల్లమీద వ్రాయబడిన వారు కనబడుతున్నారు!

 

వీరెవరు?

 

కొందరు అంటారు ఏడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలలో ముద్రించబడిన వారు! అలా అయితే ఇక్కడ ** నూట నలుబది నాలుగువేలమంది అనాలి గాని నూట నలుబది నాలుగువేల మంది అంటున్నారు! అనగా వీరు ఆ ముద్రించబడిన వారు కాదు అని అర్ధమవుతుంది. 

అయితే నాల్గవ వచనంలో వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రధమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు అంటున్నారు! దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తనకు స్వాస్త్యముగా ఉండటానికి ఏర్పరచుకున్నారు గాని కొనలేదు! కొన్నది- యేసుక్రీస్తుప్రభులవారు! దేనితోకొన్నారు?

తన రక్తమిచ్చి కొన్నారు!

అపో.కార్యములు 20: 28

దేవుడు  తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

 

ప్రకటన 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

 

1పేతురు 1: 18

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని

1పేతురు 1: 19

అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

హెబ్రీయులకు 9: 12

మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

 

ఎఫెసి 1:7

రోమా ౩:24

మత్తయి 20:28

 

ఇక ప్రధమ ఫలము కోసం చూసుకుంటే యేసుక్రీస్తుప్రభులవారు రాకముందు ఇశ్రాయేలీ ప్రజలను పంటకోతలో మొదటి భాగం అన్నారు! ప్రతిష్టజనము మరియు రాబడికి ప్రధమ ఫలము అన్నారు! యిర్మియా 2:౩ ప్రకారం! అయితే క్రీస్తు వచ్చాక రక్షణ పొందిన వారిని యాకోబు గారు అంటున్నారు 1:18 లో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రధమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మనలను కనెను అంటున్నారు! అనగా ఆధ్యాత్మికంగా నూతన జన్మ పొందిన వారు మరియు మెల్కీసెదేకు క్రమముచొప్పున నూతన జన్మ పొంది ఆయన బాటలో ఉన్నవారు ప్రధమఫలము! అనగా నూతన నిబంధన సంఘము!

ఇంకా రోమా పత్రికలో పౌలుగారు మనము ఆత్మయొక్క ప్రధమ ఫలములను పొందుకుని దత్త పుత్రత్వము కలిగి ఉన్నాము అంటున్నారు. రోమా 8:23

వీటన్నిని బట్టి ఆ లక్ష నలుబది నాలుగు వేలమంది ఇశ్రాయేలు ప్రజలు కాదు! నూతన నిబంధన సంఘములో అత్యుత్తమమైన ఆధ్యాత్మిక స్థితి కలిగిన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న పరిశుద్దులు అని అర్ధమవుతుంది!!!

 

ఇక రెండవ వచనంలో మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని నేను వినిన స్వరము వీణలు వాయించుచున్న వాద్యకారుల స్వరాన్ని పోలినది అంటున్నారు!

మూడో వచనంలో ఇలా వాద్య స్వరాలతో వారు అనగా ఈ 144000 మంది సింహాసనం ఎదుట నాలుగు జీవుల ఎదుట, 24 గురు పెద్దల ఎదుట ఒక క్రొత్త పాట పాడుచున్నారు. ఆ పాట ఆ 144000 మందికి తప్ప మరొకరు నేర్చుకోలేరు అంటున్నారు. పరలోకంలో అనేకమైన తంతివాధ్యాలు ఉన్నట్లు వాటిని వాయిస్తునట్లు గతంలో చూసుకున్నాము! ఇప్పుడు దూతలు ఈ 144000 మంది కలిసి పాట పాడుతున్నారు. దూతలు వాయిద్యాలు వాయిస్తే ఈ గుంపు పాట పాడుచున్నారు! అది క్రొత్త పాట! అయితే ఆ పాటను ఎవరు వారికి నేర్పించారో ఎలా నేర్చుకున్నారో తెలియదు గాని అందరూ కలిసి ఒకేసారి పాడుతున్నారు!

ఒకసారి ఊహించండి: కేవలం పదిమంది లేక ఇరవైమంది కలిసి ఒకే పాట రక్తిగా పాడుతుంటే ఎంతో సుమధురంగా ఉంటుంది! అలాంటిది 144000 మంది పాడుతుంటే కోటివేలమంది వాయిద్యాలు వాయిస్తుంటే ఇంకెంత సుమధురంగా ఉంటుంది!!!! 

 

ఈ క్రొత్త పాట కోసం మనకు ప్రకటన 5:9 లో కూడా కనిపిస్తుంది! ఆటే ఈ పాట ఆ పాట ఒకటేనా లేక వేరువేరా అనేది తెలియదు! గాని ఒకటే అనిపిస్తుంది నాకు!

*సీయోను పర్వతం మీద 1,44,000 మంది-2*

 

ఇక నాల్గవ వచనం నుండి ఈ 144౦౦౦ మంది ఎవరో వివరాలు ఇవ్వడం జరిగింది!

 

మొదటిది: వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు మరియు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉన్నారు! దీనికోసం ఆలోచిస్తే కొంతమంది పరిశుద్ధుల గుంపు వారు వివాహాన్ని త్యజించి దేవుని సేవ చేస్తున్నారు. ప్రజలు వివాహం చేసుకోడాన్ని అడ్డగించడం లేదు గాని వారు మాత్రం వివాహం మానేసి- క్రీస్తుకోసం సాక్షులుగా ఉంటున్నారు! వారు అంటున్నారు మేమే ఆ లక్ష నలబై నాలుగువేల మంది!

అయితే వాక్యపు వెలుగులో స్త్రీ సాంగత్యము చేస్తే అపవిత్రులు అవుతారా అనేది చూసుకుందాం!

 

దేవుడు వివాహ వ్యవస్థ అనేది పెట్టారు! పౌలుగారు ప్రతీ స్త్రీకి సొంత భర్త ఉండాలి అలాగే పురుషునికి సొంత భార్య ఉండాలి! పెళ్లి చేసుకుంటే తప్పులేదు! చేసుకోక పోతే మరి మంచిది అంటూ 1కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో వివరంగా రాశారు! ఇంకా హెబ్రీ 13:4 లో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు అనగా బార్యాభర్తల మధ్య సంబంధము నిష్కల్మషమైనదిగా ఉండాలి అన్నారు!

యేసుక్రీస్తుప్రభులవారు ఏమన్నారు అంటే మత్తయి 19:46 లో దేవుడు వారిని స్త్రీ పురుషులుగా చేశారు కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును  వారిద్దరూ ఏక శరీరమై యుందురు! ఇంకా దేవుడు వేరుచేసిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు అంటున్నారు! ఇక్కడ దేవుడు కూడా వివాహాన్ని అపరిశుద్ధంగా చెప్పలేదు! పాపంగా చెప్పలేదు!

వివాహం తరువాత లైంగిక కార్యము చేయడానికి దేవుడు లైసెన్స్ ఇచ్చారు! అయితే నీ లైసెన్స్ తో కాకుండా పరాయి స్త్రీతో గాని పరాయి పురుషునితో గాని లైంగిక కార్యము చేస్తే అది వ్యభిచారం! తప్పు! పాపం! వీరు తప్పకుండా నరకం పోతారు!

వివాహం కాకుండా మరొక స్త్రీతో గాని పురుషునితో గాని లైంగిక కార్యము లేక సెక్స్ చేస్తే అదికూడా వ్యభిచారం! వీరు కూడా నరకానికి పోతారు! ఇదీ బైబిల్ బోధించేది!

దీనినే యోహాను గారు మరణకరము కాని పాపము కలదు అంటున్నారు!

మా విశాఖపట్నంలో ఒక దొంగ నాయకుడు, వారి శిష్యులు ఏమని బోధిస్తున్నారు అంటే వివాహం తరువాత పిల్లలు పుట్టే వరకు భార్యతో లైంగిక కార్యం చేస్తే పాపము లేదు గాని పిల్లలు పుట్టాక భార్యతో లైంగిక కార్యముచేస్తే అది పాపమంటున్నారు! దానికి వారు బైబిల్ నుండి రుజువులు చూపలేరు!

 

కాబట్టి పైన చెప్పిన  అన్నిటి ప్రకారం- వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనగా పెళ్లి చేసుకొనని వారు అని అర్ధముగా నాకు అనిపించడం లేదు గాని ఏవిధమైన లైంగిక అవినీతికి పాల్పడని వారు! ఎప్పుడు తప్పు చేయని వారు! ఇంకా దేవుని విషయంలో ఎప్పుడు నమ్మక ద్రోహం చేయని వారు! అనగా మాటయందు గాని, చూపు యందు గాని, ప్రవర్తన యందు గాని చివరికి తలంపులలో కూడా పాపము చేయని వారు అని అర్ధము అనిపిస్తుంది. అనగా లోకాశలను త్యజించి వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవిస్తూ లోకాశలను శరీరకార్యాలను వదిలి చప్పిడి పత్యముగా చేస్తున్నవారు! పరిశుద్ధులు!

 

అయితే మీదన చెప్పిన పరిశుద్ధులు అనగా వివాహం మానేసి క్రీస్తుకోసం పానార్పనముగా పోయబడుచున్న పరిశుద్ధులు కూడా ఇదే చేస్తున్నారు! వీరు ఇంకా వివాహాన్ని కూడా మానేసి చప్పిడి పత్యం చేస్తున్నారు. ఇది అందరికీ అనుగ్రహించ బడదు అని యేసుక్రీస్తుప్రభులవారు స్వయముగా చెప్పారు! అయితే వీరు చెప్పుకున్నట్లుగా మేమే ఆ 144000 మంది అంటే నమ్మకముగా లేదు!

 

వివాహాన్ని చేసుకుని కూడా పవిత్రముగా జీవిస్తున్న వారు కూడా దీనికి అర్హులు అని నా ఉద్దేశం! ఉదాహరణ: హనోకు గారికోసం ఆలోచిస్తే హనోకు దేవునితో ౩౦౦ ఏళ్ళు నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అని వ్రాయబడింది! ఆదికాండం 5:21--24;  ఇంకా ఏమని చెబుతుంది అంటే వాక్యం: దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను! అనగా వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తూ పిల్లలను కంటూనే హనోకు గారు దేవునితో ఎంతో అత్యుత్తమమైన సన్నిహిత సంబంధాన్ని కొనసాగించారు! చివరికి దేవుడే ఉండలేక- అతనితో స్నేహం చేస్తూ- ఉండలేక- కొడుకా- నేను నిన్ను విడిచి ఉండలేక పోతున్నాను వచ్చెయ్యరా అని తనతోపాటుగా తీసుకుని పోయారు! అంతటి గొప్ప పరిశుద్ధ జీవితం వివాహ వ్యవస్తలో ఉంటూ కూడా గడపగలిగారు హనోకు గారు! కాబట్టి వివాహం అనేది అపవిత్రత కాదు గాని ఇక్కడ స్త్రీ అనగా పాపము మరియు లోకముతో స్నేహం చెయ్యకుండా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తున్న పరిశుద్దులే ఈ 144౦౦౦ మంది!!!

 

తరవాత గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన వెంట వెళ్తున్నవారు! అనగా క్రీస్తు అడుగుజాడలలో నడుస్తున్న వారు! ఆయన మార్గమునుండి కుడికి గాని ఎడమకుగాని తిరుగకుండా సత్యమునకు సాక్షులై నిలుస్తూ శ్రమలను సహిస్తున్న వారు అని అర్ధము! ఆయన వాక్యము చొప్పున జీవిస్తూ వాక్యానుసారమైన జీవితం గలవారు అని అర్ధం! యోహాను 10:27

ఇక వీరు విమోచించ బడిన వారు అని మీదన చూసుకున్నాము! దేవునికి ప్రధమ ఫలము అనగా నూతన నిబంధన సంఘమునకు చెందిన వారు అనికూడా చూసుకున్నాము!

 

వీరినోట ఏవిధమైన అబద్దము కనబడటం లేదు. వీరు అనింధ్యులు అనగా నింద లేని వారు! నిందమోపడానికి అవకాశమే లేనివారు! చూశారా ఎంతటి గొప్ప పరిశుద్ధమైన ఆధ్యాత్మిక మైన జీవితం జీవిస్తున్న వారో ఈ 144౦౦౦ మంది!

 

ప్రియ దైవజనమా! వారు మనలాంటి వారే, గాని తమ కోరికలను ఆలోచనలను అన్నింటిని స్వాధీనంలో ఉంచుకుని దేవునికి సాక్షులుగా నమ్మకముగా జీవిస్తున్న వారు! నీవు కూడా వారిలో ఒకరిగా ఉండగలవు! ప్రయత్నం చేస్తావా? ఇట్టి స్థితి గలవారు ధన్యులు! గమనించాలి- అబద్దమును ప్రేమించి దానిని జరిగించు వారు వెలుపల ఉందురు అంటూ ప్రకటన గ్రంధం చెబుతుంది. ఈ లక్ష నలబై నాలుగు వేలమందిలో ఏవిధమైన అబద్దము గాని అవిశ్వాసము గాని పాపము గాని లేదు! ఒకవేళ నీలో ఉంటే నేడే కడిగి వేసుకో!

*సకల జనులకు చివరి సువార్త*

 

ప్రకటన 14:6—10

6. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశ మునకును యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.

7. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.

8. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చిమోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.

9. మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ముద్ర వేయించుకొనిన యెడల

10. ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

 

 

ప్రియులారా! పై వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సంబవం 666 ముద్ర జరిగే రోజుల్లో జరిగినట్లు కనిపిస్తుంది నాకు! ఎందుకంటే మరొక దూత వచ్చి ఆ మృగము ముద్రను వేసుకోవద్దు వేసుకొంటే దేవుని ఉగ్రత అనేది ఏమియు కలుపకుండా మొత్తం మీమీద కుమ్మరించబడుతుంది అని చెబుతున్నాడు గనుక క్రీస్తు విరోధి బయలు పడిన వెంటనే దేవుడు ప్రజలకు మరొక అవకాశం ఇస్తున్నట్లు కనిపిస్తుంది!

 

ఆరవ వచనంలో... ప్రతి జనమునకు ప్రతి జాతికి ఆయా భాషలు మాట్లాడువారికి నిత్యసువార్తను తీసుకుని పోతూ ప్రకటిస్తున్న ఒక దూత కనిపిస్తున్నాడు! మొదటిది: దూత ఎందుకు ప్రకటిస్తున్నాడు? యేసయ్య రావడానికి ముందు దూతల ద్వారా వర్తమానం మరియు సువార్త చెప్పబడింది గాని యేసయ్య జనన మరణ పునరుత్థానం తర్వాత అది అనగా ఆజ్ఞ మనుషులకు ఇవ్వబడింది. దూతలకు లేనట్టి పరిచర్య మనకు అనుగ్రహించ బడింది. మరి ఇప్పుడు దూత ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు అంటే మానవులు చెప్పినా మార్పుచెందించడానికి ఒప్పించడానికి పరిశుద్ధాత్ముడు లేడు ఇప్పుడు! సంఘము ఎత్తబడింది! పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడు! కాబట్టి దూత ద్వారా చివరి ప్రకటన చేయబడుతుంది. ఎందుకు చేయబడుతుంది అంటే మత్తయి సువార్త 24:14 లో చెప్పబడిన విధంగా ఈ సువార్త సకల జనాలకు లోకమంతా ప్రకటించబడాలి! సంఘము ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నా గాని మరొక అవకాశం దేవుడు ఇస్తున్నారు అనిపిస్తుంది. అప్పటికే విడువబడిన వారున్నారు- వారు పశ్చాత్తాప పడుతున్నారు- వీరుకూడా వాక్యమందు స్థిరంగా ఉండాలని దేవుని ప్రణాళిక అయి ఉండవచ్చు!

 

రెండవది: సకల జనులకు ఎందుకు చెబుతున్నారు? అంటే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని దేవుని కోరిక! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే: ఇది జరుగుతున్నప్పుడు యేరూషలేములో ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలు ప్రజలకు సాక్ష్యం చెబుతున్నారు! ప్రవచిస్తున్నారు! అప్పటికే క్రీస్తు విరోధి కార్యం చేస్తున్నాడు! మరి మిగిలిన దేశాల వారో? అందుకే దేవుడు తన దూతను పంపించి సకల జనులకు చిట్ట చివరిగా సువార్త ప్రకటిస్తున్నారు!

 

సువార్త ఫలితం: ఎవరైనా క్రొత్త వారు రక్షణ పొందకపోయి ఉండవచ్చు! ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి! ఇది నా ఉద్దేశం మాత్రమే! అయితే 9,10 వచనాలలో చెప్పిన వర్తమానం విని విడువబడిన వారు మరింత పశ్చాత్తాపం కలిగి చనిపోవడానికి సిద్ధపడతారు గాని ఆ క్రీస్తు విరోధి యొక్క ముద్రను వేసుకోకూడదు అనే స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు అనిపిస్తుంది. అందుకే ఎత్తబడిన వారి సంఖ్య కంటే హతస్సాక్షుల సంఖ్య బలిపీఠం క్రింద లెక్కించలేనంతగా ఉన్నారు!

 

సంఘమా! ఏడో వచనంలో ఆరోజు దూత చెబుతున్న మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాను  మీరు దేవునికి భయపడండి! ఆయనను మాత్రమే మహిమపరచండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చేసింది. లేక అతి సమీపంగా ఉంది. కాబట్టి ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలను చేసిన దేవాదిదేవునికే నమస్కారం చెయ్యండి గాని లోకము మీదను లోకాశలను విడవండి! దేవుణ్ణి హత్తుకోండి!

దైవాశీస్సులు!

*భూమి పైరుకోత*

 

ప్రకటన 14:14—16

14. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.

15. అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, (మూలభాషలో- యెండిపోయియున్నది) కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.

16. మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.

 

ప్రియులారా! ఇక 14 నుండి 16వచనాల వరకు మనకు భూమిమీద పైరుకోత కోయబడటం కోసం వ్రాయబడింది.

 

అక్కడ తెల్లని మేఘము కనబడింది. గతంలో చెప్పడం జరిగింది- మేఘము అనేది-దేవుని సన్నిధిని సూచిస్తుంది. అంతేకాదు మేఘానికి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా సంబంధం ఉంది! ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మేఘములోనే ఆరోహణమయ్యారు!

అపొ 1:9,11

9. ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.

11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

అలాగే ఆయన రెండవసారి వచ్చేది కూడా మేఘముల మీదనే!

1థెస్స 4:1617 ,

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

 

 మత్తయి 24: 30

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

 

మత్తయి 26: 64

ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా

 

కాబట్టి ఇక్కడ మేఘము అని వచ్చింది కాబట్టి తప్పకుండా ఇది యేసుక్రీస్తుప్రభులవారి సన్నిధిని సూచిస్తుంది!

 

ఇక్కడ మేఘము మీద మనుష్యకుమారుని పోలిన ఒకరు ఆసీనులై యున్నారు అంటున్నారు! ఇంకా ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటము, చేతిలో వాడిగల కిరీటము ఉంది! కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఆయన రెండవ రాకడ సంభావంలా కనిపిస్తుంది. మేఘం మీద మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు కూర్చున్నారు! ఆయన మేఘారూడుడై రాబోతున్నారు అని చదువుకున్నాము!

 

ఇక తలమీద బంగారు కిరీటం పెట్టుకుని ఉన్నారు అనగా ఇప్పుడు రాజులరాజుగా రాబోతున్నారు, అధికారంతో రాబోతున్నారు అని అర్ధం!

 

గమనించాలి- ఏ దేవదూతకు కిరీటం లేదు. గనుక ఈ వ్యక్తి దేవదూత కానేకాదు! యేసుక్రీస్తుప్రభులవారు!

 

అయితే ఇక్కడ ఆయన చేతిలో ఒక కొడవలి కనిపిస్తుంది! అనగా ఆయన పండిన పంటను కోసుకోవడానికి వస్తున్నారు! ఇప్పుడు వచ్చేది పరిపాలించడానికి కాదు! ఇది చూస్తే నాకు ఇది రహస్యరాకడ సంభవం లా కనిపిస్తుంది!

 

దీనివిషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి- నాకైతే ఇది రహస్యరాకడను గూర్చి చెబుతున్నట్లు ఉంది!

 

తర్వాత వచనం గమనిస్తే మరో దేవదూత కనిపిస్తున్నాడు! యితడు దేవాలయంలోనుండి వస్తున్నాడు-వచ్చి మేఘం మీద కూర్చున్న వ్యక్తితో భిగ్గరగా అంటున్నాడు: భూమి పండింది, గనుక నీ కొడవలి పెట్టి కోసుకో!!!

 

ఇక్కడ ఒక అనుమానం రావచ్చు! ఒకవేళ మేఘం మీద కూర్చుని ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుప్రభులవారు అయితే మరి ఈ దూత వచ్చి యేసుక్రీస్తుప్రభులవారికి ఏమి చెయ్యాలో చెప్పడం ఎందుకు? మరొకరి నుండి ఆజ్ఞను తీసుకోవడం ఏమిటి?

 

దీనికి జవాబు: మొదటిది: యేసుక్రీస్తుప్రభులవారు ఎప్పుడూ తండ్రికి లోబడి ఉండేవారు! తండ్రి నాకు ఏమి చెబితే అదే చేస్తున్నాను అని చెప్పారు ఎన్నోసార్లు యేసయ్య! కాబట్టి ఇప్పుడు కూడా దేవుని నుండి ఆదేశాలు పొందుకున్నారు! యోహాను 5:19; 6:38; 14:31

 

మరొక కారణం ఏమిటంటే: ఆ దినమైనను ఆ గడియైనను  తండ్రికి తప్ప కుమారునికి కూడా తెలియదు  ఎవరికీ తెలియదు అని యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు కాబట్టి ఇప్పుడు తండ్రి నుండి సమాచారం వచ్చింది- భూమి పైరు పండింది, పంట కోసే సమయం వచ్చింది. నీ కొడవలి పెట్టి కోయమని దేవుని నుండి ఆదేశాన్ని ఈ మరొక దూత దేవాలయం నుండి వచ్చి చెబుతున్నాడు! దేవాలయం అనగా దేవుని సన్నిధి అనగా తండ్రినుండి కుమారుడైన యేసయ్య కు వర్తమానం అందిస్తున్నాడు!

 

ఇక పంట పండింది, కోతకాలం వచ్చింది అంటున్నారు: దీనికోసం బాప్తిస్మమిచ్చు యోహాను గారు ముందుగానే చెప్పారు

మత్తయి 3: 12

ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

 

అయితే ఈ పంటను కోసేటప్పుడు యేసయ్య తనదూతలను వినియోగిస్తారు!

మత్తయి 13: 39

వాటిని విత్తిన శత్రువు అపవాది (అనగా, సాతాను); కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.

 

తర్వాత వచనంలో వెంటనే మనుష్యకుమారుడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడింది! నా ఉద్దేశంలో సంఘము ఎత్తబడింది!  ఈ పైరు కోత ఏమిటో ఇక్కడ చెప్పబడలేదు గాని ఇది మాత్రం 1720 వచనాలలో ఉన్న ద్రాక్షపండ్ల కోతకు భిన్నంగా ఉంది. పంటకోసే విధానం లోను అన్నింటిలోను తేడా కనిపిస్తుంది. కాబట్టి క్రింద ఉన్న పంట- ఈ భూమిపైరు కోత రెండు ఒకటి కాదని నా అభిప్రాయం!

 

1416 వచనాలు క్రీస్తు యొక్క వధువు సంఘము క్రీస్తును దర్శించుటకు ఎత్తబడుటను సూచిస్తుంది అనేది నా అభిప్రాయం! 1720 దుష్టులకు తీర్పు అనేది నా అభిప్రాయం!

 

అయితే కొందరు అంటారు: ఇది మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు ఎత్తబడుటను సూచిస్తుంది అంటారు! ఎందుకంటే- పైరుకోత అనగా అసలు పంటను కోశాక మిగిలినది కోసేది కాబట్టి సంఘము ఎత్తబడిన తర్వాత మిగిలిన పైరు- అనగా హతస్సాక్షులు అంటారు!

 

 మరికొందరు-  రెండు కోతలు దుష్టులకు దేవుడు తీర్చే తీర్పు అంటారు!

పైరుకోత అనగా విడువబడి- క్రీస్తు విరోధికి లోబడి- వాడి గుర్తు వేసుకొనిన వారు ఈ పైరుకోత! మొదటగా వారిని కోశారు దేవుడు- ఆ తర్వాత ఉగ్రతా తొట్టిలో వేసి త్రొక్కారు అంటారు!

 

అయ్యా! నాకు అర్ధమయ్యింది మాత్రం నేను చెబుతున్నాను! ఎవరిని తప్పు పట్టడం లేదు! వారికున్నంత జ్ఞానం, అభిషేకం నాకు లేదు! నాకు అర్ధమయ్యింది మాత్రము నేను రాస్తున్నాను! ఇలాగే జరుగుతుంది అని బల్లగుద్ది చెప్పడం లేదు. వాక్యానుసారంగా ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలెయ్యండి!

 మరి అడగవచ్చు- మరి ఈ 14వ అధ్యాయంలో దీనికోసం చెప్పడం ఎందుకు? మొదట ఏ నాలుగో అధ్యాయంలోనే చెప్పి ఉండాలి కదా ఈ భాగం రహస్యరాకడ కోసం అయితే అని

మొదటనుండి చెప్పడం జరిగింది- ఇవి వివరణ కోసమైన అధ్యాయాలు! ఈ మొదటి కోత రహస్యరాకడ! ఇది మహా శ్రమలకు ముందు జరుగుతుంది! 

 రెండవకోత దుష్టులకు తీర్పు! మహాశ్రమల అనంతరం జరుగుతుంది!

 

ప్రియ స్నేహితుడా! ఆయన రాకడ అతి సమీపముగా దగ్గరలో ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా? మంచి ఫలములు ఫలిస్తున్నావా? క్రీస్తులో ఉన్నావా లేక క్రీస్తును విడిచి తిరుగుతున్నావా? నాలో నిలిచి ఫలించని ప్రతీ తీగెను కత్తిరించి అగ్నిలో వేస్తాను అంటున్నారు దేవుడు! మరి సమయం ఉండగానే దేవునితో సమాధాన పడతావా?

ఆయన రాకడకు ఎత్తబడతావా?

*ద్రాక్షల కోత మరియు ద్రాక్షల తొట్టి*

 

ప్రకటన 14:17—20

17. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.

18. మరియొక దూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.

19. కాగా దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను

20. ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

 

ప్రియులారా! 1720 వచనాలలో మరో ఇద్దరు  దూతలు కనిపిస్తున్నారు! ఇద్దరు  కూడా పరలోకంలో నుండే వచ్చారు! ఇద్దరు  దేవాలయం లోనుండే వచ్చారు! అనగా యితడు కూడా దేవుని దగ్గరనుండి సందేశం తీసుకుని వచ్చాడు! ఇతని చేతిలో కూడా వాడిగల కొడవలి ఉంది!

 

ఇక మరియొక దూత బలిపీఠం దగ్గరనుండి వస్తున్నాడు! ఇతనికి అగ్నిమీద అధికారం ఉంది. ఈ రెండవ దూత మొదటి దూతతో అంటున్నాడు: నీ వాడిగల కొడవలి భూమిమీద వేసి ద్రాక్షగెలలు కోసేయ్! కారణం ద్రాక్షపండ్లు ముగ్గిపోయి ఉన్నాయి అన్నాడు! వెంటనే ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి ఆ ద్రాక్షపండ్లు కోసినట్లు చూడగలం!

 

ఇక్కడ జాగ్రత్తగా కనిపిస్తే మరొక దూత అని మొదలుపెట్టారు కాబట్టి మునుపటి పైరుకోత దూత కాదని అర్ధమవుతుంది. ఆ దూత వచ్చిన సందర్బం వేరు! ఈ దూత సందర్బం వేరుకాబట్టి ఇది దుర్మార్గులైన మనుష్యుల మీదికి దేవుని నుండి రాబోయే ఉగ్రతను సూచిస్తుంది!

 

ఇక్కడ ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి వచ్చిన వారే! ఐతే రెండవ వానికి అగ్నిమీద అధికారం ఉంది! అనగా బహుశా 8:5 లో కనిపించే దేవదూత కావచ్చు!

 

ఇప్పుడు చెబుతున్నాడు భిగ్గరగా: భూమిమీద ద్రాక్షపండ్లు పరిపక్వమై ఉన్నాయి వాడియైన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుము!!!

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భూమిమీద లేక భూమి ద్రాక్షపండ్లు- దేవుని ద్రాక్షపండ్లు కానేకాదు! దీనికోసం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి!

 

కొంతమంది ఈ ద్రాక్షపండ్లు ఇశ్రాయేలు ప్రజలు అంటారు! ఎందుకు అంటే యెషయా 5:7 లో ఇశ్రాయేలు వంశం సైన్యములకధిపతియగు యెహోవా యొక్క ద్రాక్షతోట అని వ్రాయబడింది కాబట్టి ఈ ద్రాక్షతోట- పండ్లు- ఇశ్రాయేలు ప్రజలు! అయితే ఈ తోట మంచి ఫలములు ఫలించాలని చూస్తే వారు కారు ద్రాక్షలు కాశారు అని అదే భాగంలో చెప్పబడింది కాబట్టి వీరు ఇశ్రాయేలు ప్రజలలో క్రీస్తు విరోధికి లోబడి వాడి గుర్తును వేసుకున్న వారు! వారికి జరిగే తీర్పునే ఇక్కడ రాయడం జరిగింది అంటారుద్రాక్షల తొట్టి అనగా దేవుని ఉగ్రతాదినమున జరిగే తీర్పు! ప్రకటన 19:15..

ఇంకా అంటారు యేసుప్రభువే ఆ ద్రాక్ష తొట్టి త్రొక్కుతారు అని చెబుతూ యెషయా 6:16 చూపిస్తారు!

 

1. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

4. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5. నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

6. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

 

నేను కూడా దీనిని ఒప్పుకుంటాను అదే సందర్భము గాని ఇక్కడ ఈ భాగము బాగా అర్ధము చేసుకుంటే ప్రభువు రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎక్కడనుండి వస్తున్నారు అంటే ఎదోము నుండి వస్తున్నారు! ఇంకా శోభిత వస్త్రాలు వేసుకుని గంభీరముగా అనగా సీరియస్ గా నడుచుకుంటూ ఎక్కడ నుండి వస్తున్నారు అంటే బొస్రా నుండి. అనగా అప్పటి ఇరాక్ కేపిటల్ పట్టణం!

 

కాబట్టి ఈ భాగంలో చెప్పబడిన ఇరాక్ లేదా ఎదోము అన్యజనుల పట్టణాలను లేక దేవుని ప్రజలను బాధించిన పట్టణాలను రాజ్యాలను అలంకారముగా చెప్పబడింది అని నా ఉద్దేశం! ఇది ఇశ్రాయేలు ప్రజల గురుంచి చెప్పబడలేదు అనేది నా అభిప్రాయం! ఇక్కడ వారినే దేవుడు ఒంటరిగా గానుగ త్రొక్కారు కారణం అప్పటికి ఏమి జరిగింది అంటే అన్యజనులు 1260 రోజులు యేరూషలేమును ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మరోసారి చెరపట్టబడ్డారు!

జెకర్యా 14:1౩ లో చెప్పిన సంబవం జరిగింది.....

1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.

2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

కాబట్టి ఇది హార్మెగిద్దోను యుద్ధం తోను, దుష్టులను దేవుడు శిక్షించే ఉగ్రతతోను సంబంధం కలిగిన విషయం!

వీరు వచ్చారు- హార్మెగిద్దోను అనే ప్రాంతంలో ఉన్నారు! యెరూషలేమును దోచుకున్నారు. స్త్రీలను రేప్ చేశారు! నగరంలో సగం మందిని బందీలుగా మరోదేశానికి తీసుకుని పోయారు! మిగిలిన వారు ఏడుస్తున్నారు- అప్పుడు దేవుడు వచ్చి వీరిమీద తీర్పు తీరుస్తున్నారు! అందుకే అంటున్నాడు దూత- భూమిమీద ద్రాక్షపండ్లు ముగ్గిపోయాయి! అనగా భూమిమీద దుష్టుల యొక్క పాపం పండిపోయింది. వారికి తీర్పు తీర్చే సమయం వచ్చేసింది. ఇంకా క్రూరమృగపు పాలనలో నీతిన్యాయాలు పూర్తిగా అడుగంటి పోయాయి, అన్యాయం రాజ్యమేలుతుంది. అందుకే దేవుడు రౌద్రుడై ఈ గానుగ తొట్టిని అనగా ద్రాక్షలతొట్టిని త్రొక్కుతున్నారు!

 

సరే. ఇక్కడ ఆ దూత కొడవలివేసి భూమిమీద ఉన్న ద్రాక్షగెలలను కోసి తిన్నగా గానుగ తొట్టిలో లేక ద్రాక్షల తొట్టిలో వేసాడు!

దేవుని ద్రాక్షల తొట్టి అనగా దేవుని ఉగ్రతాదినము అని మీదన చెప్పడం జరిగింది.

యెషయా 6:4

యోవేలు ౩:13

పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.

 

ఈ ద్రాక్షల తొట్టి నగరం బయట త్రొక్కడం జరిగింది. ఎందుకు నగరం బయట అని చూసుకుంటే: వారు నగరం బయట హార్మెగిద్దోను దగ్గర కూడి ఉన్నారు కాబట్టి! ఇంకా యేసుక్రీస్తుప్రభులవారిని నగరం బయట సిలువవేశారు కాబట్టి! ఇంకా యేరూషలేము చుట్టూ దండ్లు కాపు కాచాయి యెరూషలేమును నాశనం చెయ్యడానికి!

సింపుల్ గా చెప్పాలంటే అన్యులకు జరిగే తీర్పు హార్మెగిద్దోను యుద్ధ సమయంలో!!!

 

అప్పుడు ప్రకటన 19:15 లో సంభవం జరుగుతుంది.....

ప్రకటన గ్రంథం 19: 15

జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

 

ఆ ద్రాక్షలతొట్టి నుండి రక్తము సుమారు 200 మైళ్ళు అనగా 321 కి.మీ.దూరం వ్యాపించింది! అనగా అంతమందిని అక్కడ హతమార్చడం జరిగింది. గమనించాలి ఒకవేళ వీరు ఇశ్రాయేలు ప్రజలు అయితే వారి రక్తం అంతదూతం వెళ్ళే అవకాశం లేనేలేదు! వీరు హార్మెగిద్దోను యుద్ధానికి వచ్చిన సేనలు మరియు క్రీస్తు విరోధి మనుష్యులు కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వారు కాబట్టి చాల ఎక్కువ మంది, బహుశా కొన్ని కోట్లమంది- వారి రక్తం ఇప్పుడు 321 కి.మీ దూరం పారింది. ఈ విధంగా దేవుడు దుష్టుల మీద తీర్పు తీర్చబోతున్నారు!

 

ప్రియ సంఘమా! ఈ సంభవాలు అతి తొందరలో జరుగబోతున్నాయి! నీవు సిద్ధంగా ఉన్నావా?

రక్షణ పొందుకున్నావా?

రక్షణ కాపాడుకుంటున్నావా? ఆత్మను పొందుకుని ఆత్మచేత నడిపించబడి ఆత్మలో ఆత్మద్వారా నడుస్తున్నావా?

వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావా?

అలాగయితేనే ఎత్తబడగలవు!

లేదా విడువబడతావు జాగ్రత్త!

* గొర్రెపిల్ల వివాహమహోత్సవం*

 

ప్రకటన 19:19

1. అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటినిప్రభువును స్తుతించుడి,(మూలభాషలో- అల్లెలూయా) రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;

2. ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి.

3. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.

4. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి- ఆమేన్‌, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.

5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్దనుండి వచ్చెను.

6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు;

7. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.

8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.

9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.

ఇక 19:111 వరకు కూడా వివరణ కోసమైన ధ్యానమే

 

అయితే అది మహా బబులోను మరియు వేశ్యకు జరిగిన తీర్పుకు సంబంధించి పరలోకంలో జరుగుతున్న వేడుకలు లేక సెలబ్రేషన్ కోసం చెప్పబడ్డాయి! ఈ వచనాలలో ఎక్కువగా హల్లెలూయ అనే మాట వినిపిస్తుంది. హల్లెల్ అనగా హెబ్రీలో స్తుతి, యా అనగా యెహోవా లేక దేవుడు! మొత్తం చూసుకుంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్ధము!

 

గమనించాలి ఈ హల్లెలూయ ధ్వనులు పరలోకంలో ఎవరు చెబుతున్నారు అంటే బహుజనులు అనగా పరలోకంలో ఉన్న జనులు- బహుశా వీరు బలిపీఠం దగ్గర ఉన్న ఆత్మలు కావచ్చు! కారణం ఎత్తబడిన వారు ఇంకా పరలోకం వెళ్ళలేదు- క్రీస్తుయేసుతో మధ్యాకాశంలో ఉన్నారు! కేవలం శ్రమలకాలపు హత్తసాక్షులు మాత్రము ఉన్నారు! వారు స్తుతులు చేసిన వెంటనే అక్కడ 24గురు పెద్దలు కూడా స్తుతించడం మొదలుపెట్టారు! సాగిలపడి ఆరాధిస్తున్నారు!

 

అప్పుడు సింహాసనం నుండి స్వరము వినిపించింది దేవుని దాసులారా ఆయనకు భయపడే వారలారా అందరూ కలసి స్తుతించమని చెబుతున్నారు! ఎందుకంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చేసిందిగమనించాలి మహావేశ్యకు తీర్పు జరిగాకనే గొర్రె పిల్ల వివాహమహోత్సవం జరుగుతుంది. ఎందుకంటే వేశ్య నాశనానికి పోయింది. పవిత్రమైన వధువు పెండ్లికి సిద్ధంగా కనిపిస్తుంది!

 

ఇక్కడ ఆయన భార్య తనను తాను సిద్ధం చేసుకుంది లేకసిద్ధ పరచుకుంది అంటున్నారు. అందుకే సంతోషించి ఆనందించండి అని పరలోకం చెబుతుంది. గమనించాలి- ఇంతవరకు విశ్వసులందరూ దేనికోసం ఎదురుచూపు చూశారో అది నిజమయ్యే ఘడియ వచ్చింది అన్నమాట! దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నారో అది కళ్ళముందు కనబడే సమయం వచ్చేసింది. ఇప్పుడు ప్రతీ నిజ విశ్వాసి దేవునితో ఐక్యమవడం జరుగుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను దేవుని భార్యగా అభివర్ణించడం జరిగింది యెషయా 54:57, యిర్మియా ౩:14; 20; 31:32, హోశేయ 2:16, 19,20 లో! అయితే క్రొత్త నిబంధనలో ఇక్కడే మొదటిసారి సంఘాన్ని భార్యగా చెప్పడం జరిగింది.

పౌలుగారు సంఘము క్రీస్తుతో ఐక్యమై ఉంది. ఆయన శరీరమై ఉంది అన్నారు!

రోమా 12:45

4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,

5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

 

1కోరింథీయులకు 12: 12

ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

 

ఎఫెసీయులకు 1: 23

ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

ఎఫెసీయులకు 5: 23

క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

 

కొలస్సీ 1:18; రోమా 6:; 7:4;  2కొరింథీ11:2; ఎఫెసి 5:2232

 

అయితే ఈ గడియ కోసం యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెప్పారు తన ఉపమానాలలో మత్తయి 22:214 లో అనేకులు పిలువబడ్డారు గాని వారు సాకులు చెప్పారు. అయితే వారు నిరాకరించారు. ఇక్కడ వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు- అప్పుడు మనందరికీ అనగా అన్యులైన మనకు కూడా అవకాశం కలిగింది అని వివరించడం జరిగింది. అదే సమయంలో పెండ్లి వస్త్రము యొక్క అవసరతను సిద్ధపాటును కూడా కలిగి ఉండమని ఆ ఉపమానం చెబుతుంది మనకు!

 

బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆయన పెండ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడను అని చెప్పుకున్నారు! యోహాను ౩:29

 పరమగీతము గ్రంధం పూర్తిగా ఈ గడియ కోసమే చెప్పబడింది. ఇక కీర్తన 45:817 కూడా ఇదే సమయం కోసం చెప్పబడింది!

 

ఇక వధువు సంఘం కోసం ఆలోచిస్తే ఆమెకు  ప్రకాశమానమైన వస్త్రాలు నిర్మలమైన సన్నపునారబట్టలు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతిక్రియలు అంటూ చెప్పడం జరిగింది. విశ్వాస సమూహము నీతిని న్యాయమును ధర్మకార్యములు చేయడం ఎంతో అవసరం! అయితే మనకు మనంగా అలా నీతిగా బ్రతకడం కష్టం! దేవుడే మనలను నీతిమంతులుగా తీర్చారు! మనము నీతిమంతులం కాదు! ఆయన రక్తము ద్వారా కడుగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము అదే నీతిని కొనసాగిస్తూ పెండ్లికుమారుని ఎదుర్కోవాలి! 2కొరింథీ 5:21; ఫిలిప్పీ ౩:9

 

మత్తయి 25:440 లో గొర్రెలు మేకలు ఉపమానం లో అదే చెప్పారు!

రోమా 2:610 లో పౌలుగారు ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నారు గనుక నీతిక్రియలు చేయమని హితవు పలుకుతున్నారు.

యాకోబు 2:1426 లో కూడా యాకోబు గారు అదే చెప్పారు! కాబట్టి నీతిక్రియలు మరియు ధర్మకార్యాలు కలిగిన వారు- ఇలాంటి నిర్మలమైన ప్రకాశమానములైన వస్త్రములను క్రీస్తుయేసు పెండ్లివిందులో కలిగి ఉంటారు! గమనించాలి ఇలాంటి క్రియలు చేసిన వారు మాత్రమే క్రీస్తుయేసును కలుసుకోగలరు! ఇవిలేని వారు కలుసుకోలేరు!

 

ఆయన పెండ్లికుమారుడుగా అతి తొందరలో రానైయున్నాడు! సంఘమా! ప్రియ విశ్వాసులారా! మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్దెలలో నూనె సిద్ధపరచి ఉన్నారా?

విడువబడుట బహుఘోరమని మరచిపోవద్దు!

*హార్మేగిద్దోను యుద్ధం-1*

 

ప్రకటన 19:11—16

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

13. రక్త ములో ముంచబడిన (కొన్ని ప్రాచీన ప్రతులలో- చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.  

 

       ప్రియ దైవజనమామనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాముప్రియులారా ఇంతవరకు మనము వివరణ కోసరమైన అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక మనము మరలా దర్శనం లోనికి వచ్చేస్తున్నాము!

 

ఇక్కడ మనకు హార్మెగిద్దోను యుద్ధం కనిపిస్తుంది. ఆ యుద్ధానికి యేసుక్రీస్తుప్రభులవారు ఎలా వస్తున్నారో 1116 వరకు చెప్పబడింది!

 

వీటికోసం అనేకసార్లు ఈ గ్రంధములో చూసుకున్నాము గనుక క్లుప్తంగాచూసుకుని ముందుకు పోదాం!

 

11వ వచనంలో తెల్లని గుఱ్ఱము కనిపించింది. పరలోకం తెరువబడింది. అనగా పరలోకం నుండి దేవుడు భూమిమీదికి వస్తున్నారు. ఇది దేవుని రెండవరాకడ లేక బహిరంగ రాకడ సన్నివేశము అన్నమాట!

 

గమనించాలి- మహా వేశ్యకు తీర్పు జరిగింది. ఇప్పుడు లోకంలో పేరుకుపోయిన దుష్టత్వానికి దుష్టత్రయానికి అనగా దుష్ట త్రిత్వముగా పిలువబడుతున్న ఘట సర్పం, క్రూరమృగం, మరియు అబద్ద ప్రవక్తకు తీర్పు తీర్చే సమయం వచ్చింది.

 

 ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రకటన 6:2 లో ఒక తెల్లగుర్రం కనిపిస్తుంది. ఆ గుఱ్ఱము మీద కూర్చున్న వాడు- ఈయన ఒకటి కాదు! 6:2 లో కూర్చున్నవాడు క్రీస్తు విరోధి! ఈయన మన రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు!

ఈ గుఱ్ఱం మీద కూర్చున్న వానిపేరు నమ్మకమైన వాడు సత్యవంతుడు ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తారు! అంతేకాకుండా నీతిని బట్టి యుద్ధం జరిగించడానికి వస్తున్నారు! ప్రకటన 17:14; నిర్గమ 15:; యెహోషువా 10:42; కీర్తన 45:7; యెషయా 11:4

 

ఇప్పుడు క్రీస్తుయేసు తన ప్రజల పక్షమున యుద్ధం చేయబోవుచున్నారు! ఈ యుద్ధంలో తప్పకుండా ఆయనే గెలుస్తారు!

ఆయన నేత్రములు అగ్నిజ్వాలవంటివి  1:14; ఆయ శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి! కిరీటాలు ఎందుకంటే ఆయన ఇప్పుడు పరిపాలించబోతున్నారు!

 

రాసి ఉన్న పేరు ఒకటి ఉంది అది ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు!

 

ఇక 13వ వచనంలో ఆయన వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రము అని ఉంది! ఇది మొదటగా పాపులను రక్షించడానికి ఆయన చిందిన రక్తమును సూచిస్తుంది! మత్తయి 26:28; రోమా ౩:2425; ఎఫెసీ 1:7

 

మరొకటి: ఆయన యోధుడుగా వచ్చి శత్రువుల మీద తీర్చుకునే ఉగ్రతలో భాగంగా ఆయన వస్త్రాలు ఎర్రగా మారిపోబోతున్నాయి!

 

ఇక ఆయన జనాలను కొట్టడానికి నోట నుండి వడిగల ఖడ్గం బయలువెళ్ళింది ఆయన వారిని ఇనుపదండంతో పరిపాలించబోతున్నారు! 2థెస్స 2:8

యెషయా 11:4

ప్రకటన 2:27, కీర్తన 2:9

 

ఇక ఆయన వారిని ద్రాక్ష తొట్టిలో త్రొక్కబోతున్నారు! దీనికోసం మనం ద్రాక్షల తొట్టి కోసం ధ్యానించి నప్పుడు చూసుకున్నాము! హార్మెగిద్దోను యుద్ధంలో ఆయన వారిని త్రోక్కబోతున్నారు!

 

ప్రకటన గ్రంథం 14: 19

కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను

ప్రకటన గ్రంథం 14: 20

ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

 

యెషయా 6:14

2. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

4. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

 

ఇక 16వ వచనంలో ఆయన వస్త్రం మీద ఆయన తొడలమీద రాజుల రాజు ప్రభువుల ప్రభువు అని రాసి ఉంది! ఈలోకంలో రాజులు ప్రభువులు చక్రవర్తుల అని పిలువబడిన వారికే ఇప్పుడు రాజుగా ప్రభువుగా రాబోతున్నారు! వారి అందరిని మించిన వాడు మన ప్రభువు! మొదట గొర్రెపిల్లగా వచ్చినా ఇప్పుడు రాజుగా ప్రభువుగా వచ్చారు! మొదట రాకడలో కేవలం సంఘాన్ని స్థాపించడానికి దేవునిరాజ్యమును మనుష్యుల హృదయాలలో నెలకొల్పడానికి వచ్చిన ప్రభువు ఇప్పుడు బహిరంగ పాలన చేయడానికి వస్తున్నారు! ద్వితీ 10:17 , కీర్తన 136:2

 

1తిమోతికి 6: 15

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు.

 

కీర్తనలు 47: 2

యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.

కీర్తనలు 47: 3

ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.

కీర్తనలు 47: 5

దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.

కీర్తనలు 47: 7

దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

 

ప్రియ దైవ జనమా! ఆయన త్వరగా రాబోవు చున్నారు. మరినీవు సిద్దమా?

*హార్మేగిద్దోను యుద్ధం-2*

 

ప్రకటన 19:18—21

18. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించిరండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

19. మరియు గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

21. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను

 

సరే, ఇప్పుడు ఆయన భూమిమీద అడుగుపెట్టబోతున్నారు  రెండవసారి! దానికి ముందుగా అనేక పక్షులను రమ్మని పిలుస్తున్నారు విందుకు! పక్షులకు గొప్ప విందు జరుగబోతుంది అని! 18.....అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించిరండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

 

సరే, ఈ హార్మెగిద్దోను యుద్ధం జరుగబోయే సరికి భూమిమీద పరిస్తితులు ఏమిటి అనేది మరోసారి గుర్తుకు చేసుకుందాం!

 

*సంఘం ఎత్తబడింది.

*క్రీస్తు విరోధి బయలుపరచబడి పాలిస్తున్నాడు!

*ముద్రలు విప్పబడ్డాయి!

*బూరలు ఊదబడ్డాయి!

*పాత్రలు కుమ్మరించబడ్డాయి!

*పరలోకంలో యుద్ధం జరిగింది. సాతాను గాడు పరలోకంలోనుండి త్రోయబడ్డాడు!

*మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు చంపబడ్డారు!

*666 ముద్ర చలామణిలో ఉంది!

*ఇశ్రాయేలు ప్రజలు నిజం తెలుసుకుని క్రీస్తు విరోధిని ద్వేషించారు! ఇశ్రాయేలు ప్రజలకు మహా భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు!

 

*జెకర్యా 14:1౩ లో చెప్పబడినట్లు యేరూషలేము పట్టబడింది. అన్యులు ఆక్రమించు కున్నారు! స్త్రీలను చెరిపారు!

 

ప్రకటన 16:12 లో చెప్పబడినట్లు యూఫ్రటీస్ నదిమీద పాత్ర కుమ్మరించిన వెంటనే యూఫ్రటీస్ నది ఎండిపోయింది. తూర్పు ఆసియా నుండి పశ్చిమాసియా కు సైన్యాలు తరలివెళ్లాయి ఈ యూఫ్రటీస్ నది ద్వారా!

* లూకా 19:43. ప్రకారం యేరూషలేము చుట్టూ దండ్లు మొహరించి ఉన్నాయి!

లూకా 21: 20

యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.

 

ప్రకటన 16:15 ప్రకారం హార్మెగిద్దోను అనే ప్రాంతంలో క్రీస్తు విరోధి, అబద్ద ప్రవక్త వారి సైన్యాలు అన్నీ ఇశ్రాయేలు దేశాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూస్తున్నాయి!

 

హార్మెగిద్దోను .... హీబ్రూ భాషలో హర్ అంటే కొండ, పర్వతం. మెగిద్దో ఇస్రాయేల్ దేశంలో ఒక విశాలమైన మైదాన ప్రాంతం. అది నజరేతు గ్రామానికీ గలలియ కొండలకూ దక్షిణాన, కర్మెల్ పర్వత పంక్తికీ తూర్పుగా ఉన్న ప్రాంతం (2 దిన 35:22; జెకర్యా 12:11). దీన్ని ఎస్ద్రెలోన్ మైదానం, యెజ్రీయేల్ లోయ కూడా అంటారు. మెగిద్దో అనే పురాతనమైన పట్టణం ఈ మైదానం దక్షిణ సరిహద్దులో ఉంది

 

జెకర్యా 12:10--14 ప్రకారం ఇశ్రాయేలీయు లందరూ ఏడుస్తున్నారు- అయ్యా మీరే దిక్కు! మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు అంటూ....

 

వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు భూలోకానికి ప్రయాణం అయ్యారు!

ఎలా వస్తున్నారు?

మత్తయి 24: 30

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

మత్తయి 24: 31

మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

1థెస్సలొనికయులకు 4: 16

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 

గమనించాలి: ఇప్పుడు కడబూర ఊదడం జరుగుతుంది. ఆయన తనవారిని పరిశుద్ధులను పోగుచెయ్యడం జరుగుతుంది.

 

ఆయనతో పాటు ఎవరు వస్తున్నారు?

14వ వచనంలో ఉంది ..

పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

 

ఆయన వెంట పరలోక సైన్యం ఉంది! అనగా కోట్లమంది దేవదూతలు ఉన్నారు!

మత్తయి 16: 27

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

 

మత్తయి 25: 31

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

 

2థెస్సలొనికయులకు 1: 6

ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

 

ఇంకా ఎవరు ఉన్నారు?

 

ఇంకా జయించిన విశ్వాసులు అనగా ఎత్తబడిన వారు మరియు క్రీస్తునందు మృతులు పునరుత్తానులైన మృతులు

 

 ప్రకటన 17:14;

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

 

1థెస్సలొనికయులకు 4: 14

యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

 

యూదా 1: 15

భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

 

కొలస్సీ ౩:4

మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

 

అప్పుడు యేసుక్రీస్తుప్రభుల వారు భూమి మీద యేరూషలేము పట్టణంలో ఒలీవల కొండమీద తన కాలు పెట్టబోతున్నారు!

 ఒలీవల కొండమీదనే ఎందుకంటే అక్కడనుండే ఆయన ఆరోహణ మయ్యారు కాబట్టి...

అపో.కార్యములు 1: 9

ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.

అపో.కార్యములు 1: 11

గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

అపో.కార్యములు 1: 12

అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,

 

వెంటనే ఏమి జరుగుతుంది?

ఒలీవల కొండ రెండుగా విడిపోతుంది...

Zechariah(జెకర్యా) 14:4--15

4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

5. కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.

6. యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.

7. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలుకాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలుగును.

8. ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.

9. యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.

10. యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును,హనన్యేలు గుమ్మమునుండి రాజుగానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,

11. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.

12. మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.

13. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరికొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.

14. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.

15. ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచర గాడిదల మీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళెములో ఉన్న పశువులన్నిటిమీదను తెగుళ్లుపడును.

 

జెకర్యా 12:79

7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.

8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

 

యెషయా 11: 4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

 

2థెస్సలొనికయులకు 2: 8

అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

 

ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా ఆయన ఉగ్రత కుమ్మరించబోతున్నారు, అప్పుడు వారందరూ ఒకేసారి చనిపోతారు!

ప్రకటన 14: 20లో జరిగినట్లు వారి రక్తము 321 కి.మూ దూరం ప్రవహిస్తుంది.

 

ఒకసారి జెకర్యా 14వ అధ్యాయం చూసుకుంటే వేదపండితులు ఏమని అభిప్రాయపడతారు అంటే అక్కడకు క్రీస్తు విరోధి సైన్యం అణుబాంబులు కూడా తీసుకుని వస్తారు! అయితే వాటితోనే వారు హతమవుతారు, కారణం వారి నాలుకలు లోపల ఉండగానే కుల్లిపోతాయి. అక్కడదేవుడు భయంకరమైన తెగుళ్ళు పుట్టిస్తాను అంటున్నారు. నిలుచున్న పాటున వారి దేహాలు కుళ్ళిపోతాయి. కళ్ళు కను తొర్రలలో ఉండగానే కుళ్ళిపోవును. ఇవన్నీ చూసుకుంటే మొదటిది అణుబాంబులు, రెండవది బయోకెమికల్ బాంబులతో వారు చనిపోతారు!

వెంటనే పక్షులు వారిని పీక్కు తింటాయి! అందుకే ఇంకా యుద్ధం జరుగక ముందే ఆ పక్షులను పిలవడం జరిగింది. ఈ పక్షులు కోసం ఆలోచిస్తే ఇప్పుడు ఇశ్రాయేలు దేశం చుట్టుప్రక్కల కొన్ని పక్షులు పెరుగుతున్నాయట! పూర్వకాలంలో అవి సంవత్సరానికి ఒక గుడ్డు పెట్టేవట, ఇప్పుడు సంవత్సరానికి ఆరుగుడ్లు పెట్టడం జరుగుతుంది. బహుశా దేవుడు దీనికోసమే వాటిని తయారుచేస్తున్నారు! ఇవి రోజుకు నాలుగు టన్నులు ఆహరం తినగలవట! మరి 321 కి.మీ పొడవున ఉన్న శవాలు తినాలంటే ఎన్ని రోజులు పడుతుంది! అందుకే గొప్ప విందు అందరిని రమ్మని దూత కేకవేసి పిలుస్తున్నాడు ఈ ఒక రకమైన రాబంధులను!!!

 

ఇక 19వ వచనంలో ఈ తెల్లనిగుర్రం మీద కూర్చున్న వానితో ఈ మృగము వాని సైన్యము భూరాజులు యుద్ధం చేశారు! గమనించాలి- 16వ అధ్యాయంలో సైన్యం కూర్చబడ్డా, 19వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. అనగా అక్కడ వివరణ ఇచ్చారు. ఇక్కడ జరిగిన యుద్ధాన్ని చెప్పారు అన్నమాట!

 

ఇంకా వారితో పాటు అద్భుతాలు చేసిన అబద్దప్రవక్త కూడా ఉన్నారు! వీరంతా ప్రాణాలతో పట్టుబడ్డారు! ఈ క్రూరమృగం అబద్దప్రవక్త ఇద్దరు అగ్ని గుండములో త్రోయబడ్డారు అనగా నరకంలో త్రోయబడ్డారుదీనిని మరోసారి 20:10 లో చెప్పడం జరిగింది.....

ప్రకటన గ్రంథం 20: 10

వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

 

వారు అక్కడ యుగయుగాలు ఉండాల్సిందే! గమనించాలి-ఇదే స్థలములో మరికొందరు కూడా ఉంటారు ప్రకటన 21:8....

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ప్రియ స్నేహితుడా ఒకవేళ నీవు ఈగుంపులో ఉన్నావా?

 నీవు కూడా అక్కడే త్రోయబడతావు అని మర్చిపోవద్దు!

 

ఇక మిగిలిన వారు ఆయన నోట నుండి వచ్చిన ఖడ్గముతో చంపబడ్డారు! వారి మాంసం పక్షులు కడుపార తిన్నాయి అంటున్నారు!

 

ప్రియదైవజనమా! ఆయన రాకడ అతి సమీపంగా ఉంది! దుర్మార్గులను దుష్టులను ఆయన సంహరించబోతున్నారు!

నీవు సిద్ధంగా ఉన్నావా?

దేవునితో సమాధానంగా ఉన్నావా?

విడువబడితే ఈ భాధలు పడలేవు!ఒకవేళ ఆ క్రీస్తు విరోధి ముద్రను వేసుకుంటే నీకు పరలోకం అనేది లేదు! నిత్యనరకం మాత్రమే!

నేడే నీ గమ్యాన్ని నిర్ణయించుకో!

పరలోకమా? నరకమా?

దేవుడా? లోకమా?

*వెయ్యేండ్ల పాలన-1*

 

ప్రకటన 20:1—6

1. మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.

2. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,

3. వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.

4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

5. వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

6. మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు

 

ఇక్కడ మొదటి వచనంలో పెద్ద సంకెళ్ళను చేతపట్టుకుని అగాధపు తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట యోహాను గారు చూశారు! గమనించాలి- ఇప్పటికే మహావేశ్యకు తీర్పు జరిగిపోయింది. క్రూరమృగం,అబద్దప్రవక్త ప్రాణాలతో నరకంలో త్రోయబడటం జరిగిపోయింది. ఇక మిగిలినది ఎవరు అంటే సాతాను గాడు అనబడే ఘటసర్పంవాడిని బంధించడానికి, శిక్షించడానికి ఈ దేవదూత వస్తున్నాడు! 12వ అధ్యాయంలో మనం చూసుకున్నాము- ఈ ఘటసర్పం పరలోకం వెళ్తే అక్కడ యుద్ధం జరిగింది- భూమిమీద త్రోయబడింది. అప్పుడు ఈ ఘటసర్పం దాని అధికారం సింహాసనం బలము అన్నీ క్రూరమృగానికి ఇవ్వడం జరిగింది. దుష్టత్రయం మరియు దుష్టత్ర్రిత్వం భూమిమీద ఎన్నో ఘోరమైన క్రియలు చేశారు! ఇప్పుడు ఘటసర్పానికి దేవుడు తీర్పు తీరుస్తున్నారు!

 

ఇక రెండో వచనంలో ఒక దేవదూత ఈ ఘటసర్పాన్ని బంధించి అగాదములో పడవేశాడు! ఇక వాడు అక్కడ వెయ్యి సంవత్సరాలు అగాధములో ఉండాలని నిర్ణయించబడింది. ఇక అక్కడున్న కాలము వాడు జనములను మోసపరచకుండునట్లు వాడు బయటకు రాకుండా ఉండాలని, వాడి స్వరము/ మెసేజ్ బయటకు రాకూడదని అగాధమున మూసి దానికి ముద్ర వేశారు అనగా సీల్ చేసేశారు! ఎందుకు ఇలా సీల్ చేశారు అంటే భూమిమీద దేవుని వెయ్యేండ్ల పాలన ప్రారంభమౌతుంది కాబట్టి ఇక అక్కడ అన్యాయానికి గానికి నేరాలకు గాని అబద్దాలకు గాని తావుండదు! వీడుంటే మరలా ప్రారంభమవుతాయి. అందుకే ఇక వాడిని మూసి అగాదానికి సీల్ చేసేశారు!

ఇక భూమిమీద దేవుని వెయ్యేండ్ల పాలన ప్రారంభమయ్యింది!

 

వెయ్యేండ్ల పాలన ప్రారంభం కావాలంటే

*మొదటగా హార్మెగిద్దోను యుద్ధం జరగాలి

*క్రూరమృగం, అబద్దప్రవక్త నరకంలో త్రోయబడాలి!

*ఘటసర్పం అనబడే సాతాను గాడు చెరసాలలో అనగా అగాధంలో త్రోయబడాలి!

*ఇక 4వ వచనం ప్రకారం మహాశ్రమల కాలపు హతస్సాక్షులు పునరుత్థానులు కావాలి.

 

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

అప్పుడు వెయ్యేండ్ల పాలన మొదలవుతుంది. ......

 

గతంలో చెప్పుకున్నాము- మొదటి పునరుత్థానం ఏమిటి రెండవ మరణం ఏమిటి అనేది వివరంగా!

ఇప్పుడు మొదటి పునరుత్థానం జరిగి మహాశ్రమలకాలపు మృతులు అనగా హతస్సాక్షులు లేచారు!!

 

ఇక్కడ 5వ వచనంలో ఆ వెయ్యేండ్లు గడచువరకు కడమ మృతులు బ్రతుకలేదు అంటున్నారు. ఇంతకీ ఆ కడమ మృతులు ఎవరు?

యేసుక్రీస్తుప్రభులవారిని నమ్మనివారు, భూమిమీద పుట్టి మరణించిన ఆదాము నుండి ఇప్పటి వరకు గల పాపులు అన్నమాట!!!!

 

ఇక ఈ మొదటి పునరుత్థానం లో ఉన్నవారు ధన్యులు మరియు పరిశుద్దులునై యున్నారు అంటున్నారు! అవును కదా, వీరు పరిశుద్ధంగా జీవించి క్రూరమృగపు సైనికులతో హత్యచేయబడ్డారు దేవుని గూర్చిన సాక్ష్యము నిమిత్తం! వీరికి రెండవ మరణం లేదు! వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో పాటుగా వెయ్యేండ్లు రాజ్య పాలన చేస్తారు! హల్లెలూయ!

 

అయితే ఇక్కడ రాజ్యపాలన కేవలం వీరే అనగా మహాశ్రమల కాలపు హతస్సాక్సులైన బ్రతికిన వారు మాత్రమే చేస్తారా?

 కాదండి వీరితో పాటుగా ఇప్పుడు వెయ్యేండ్ల పాలనలో ఎవరున్నారు?

 

*రాజుల రాజుగా యేసుక్రీస్తుప్రభులవారు!

*క్రీస్తునందు మరణించిన వారు, *పాతనిబంధన విశ్వాసులు- అనగా పరదైసునుండి వచ్చిన వారు!

*ఎత్తబడిన సంఘము!

*మహాశ్రమల కాలపు హతస్సాక్షులు!

*రక్షణ పొందిన ఇశ్రాయేలు ప్రజలు!

*ఇంకా హార్మెగిద్దోను యుద్ధంలో చనిపోకుండా బ్రతికి ఉన్న పాపులు!

*మహాశ్రమల కాలంలో యూదులకు సహాయం చేసిన అన్యజనులు!

 

 వేదపండితులు అభిప్రాయం ప్రకారం మత్తయి 25 :31-46 లో చెప్పబడిన గొర్రెలు వీరే!

గొర్రెలు-ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన వారు!

మేకలు వీరికి సహాయం చెయ్యనివారు, క్రీస్తువిరోధితో పొత్తు పెట్టుకున్నవారు!

....

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమిదిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు   రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి  శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర    సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.

అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు.

 

అయితే, పరిపాలించేదెవరు?

*క్రీస్తునందు మరణించిన వారు,

*పాతనిబంధన విశ్వాసులు- అనగా పరదైసునుండి వచ్చిన వారు!

*ఎత్తబడిన సంఘము!

*మహాశ్రమల కాలపు హతస్సాక్షులు!

*బహిరంగ రాకడలో, ప్రభువుతో పాటు దిగివచ్చిన సంఘము. వీరంతా రక్తమాంసములను కలిగియుండక, మహిమ శరీరాలను కలిగియుండి, రాజ్య పాలన చేస్తారు.

 

సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము.  (2 తిమోతికి 2:12)

 

*వెయ్యేండ్ల పాలనలో మన అధికార హోదా ఎట్లా వుండబోతోంది?*

 

ఇప్పుడు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ, నీకివ్వబడిన తలాంతులతో ఆత్మల రక్షణకై పాటుపడితే, నీవు ఒక స్టేట్ కి సి.ఎం కావొచ్చు. కలెక్టర్ వి కావచ్చు, కమీషనర్ వి కావచ్చు, లేకపోతే, ఒక వార్డ్ మెంబర్ గా సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో?

 

అప్పుడు మత్తయి 25:14-30 సంభవం జరుగుతుంది...

 

పరలోకరాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము   చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో  వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి అయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మక మైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు   వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.

తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును      వచ్చి -- అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునై కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితినిఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను.

అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి  వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

 

హార్మెగిద్దోను యుద్ధము తర్వాత మిగిలియున్న పాపులు కూడా వెయ్యేండ్ల పాలనలో ఉంటారు కాబట్టి, ఎట్లా జీవించినా సరే, వచ్చిన సమస్య ఏమిటి? అని నీకు నీవు సర్ది చెప్పుకోవలసిన అవసర్లేదు. చివర్లో అసలైన మరొక యుద్ధం వుంది. అదిగోగు మాగోగు యుద్ధందానితో సర్వ పాపులు భూమిమీదలేకుండా నశించిపోతారు. సాతాను కూడా నరకంలో వేయబడతాడు. పరిశుద్ధులే నిత్యత్వంలో ప్రవేశిస్తారు.

ఆ నిత్య రాజ్యంలో- క్రీస్తుతో పాటు వెయ్యేండ్ల పాలనలో ఉండాలని ఉందా? అయితే నీ బ్రతుకును సరిచేసుకో!

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

*వెయ్యేండ్ల పాలన-2*

 

 వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ రాజధాని ?

* యెరూషలేము

 

ఆ కాలమున యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు.

             యిర్మియా 3:17

 

👉 వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ రాజాధిరాజు?

* ప్రభువైన యేసు క్రీస్తు

 

దూత- మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని  ఆమెతో చెప్పెను.

               లూకా 1:30-33

 

రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.

            దానియేలు 7:13,14

 

👉 పరలోకమే ఆయన వెయ్యేండ్ల పాలనను గూర్చి ప్రకటించు చున్నది.

 

ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

               దానియేలు 2:44

 

ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

               లూకా 1:32

 

👉 వెయ్యేండ్ల పాలనలో శపించబడిన భూమి, శాప విమోచనాన్ని పొందుతుంది.

 

*ఏదెను వనములో:*

 

ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నదిప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

              ఆదికాండము 3:17

 

*వెయ్యేండ్లపాలనలో శాపవిమోచన:*

 

ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

            యెషయా 55:13

 

అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

              యెషయా 35:1,2

 

👉 వెయ్యేండ్లపాలనలో మానవులు సుదీర్ఘమైన ఆయుష్షును కలిగియుంటారు.

 

* బాలుని వయస్సు నూరు సంవత్సరాలుంటుంది.

* వృక్షాయస్సు అనగా, వృక్షాల వలే కొన్ని తరాలవరకు జీవిస్తారు.

 

అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు, కాలమునిండని ముసలివారుండరు, బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని  పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.....

వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు

            యెషయా 65:20,22

 

*బాలుని వయస్సే నూరు సంవత్సరాలంటే? ఇక వృద్ధుల వయస్సు, వందల సంవత్సరాలుంటుంది.*

 

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.

             జెకర్యా 8:4,5

 

👉  వెయ్యేండ్ల పాలనలో జంతులోకంలో విపరీతమైన మార్పులుంటాయి.

 

తోడేలు గొఱ్ఱపిల్ల యొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని  చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

              యెషయా 11:6-9

 

👉 *పాలస్తీనా దేశములో పెను మార్పులు:

యెహోషువా నాయకత్వంలో పాలస్తీనాను స్వాధీనం చేసుకున్నప్పుడు, అది పాలు, తేనెలు ప్రవహించు దేశమై యుండెను. కానీ,వారు పాపం చెయ్యడం ద్వారా, ఆకాశమును మూసివేయునని హెచ్చరించెను. (ద్వితీ 11:3-17)

 

అయితే, ఈ కాలమందు వర్షము తన కాలమందు కురియును. మంచి ఫలములు వారు పొందుదురు.

వెయ్యేండ్ల పాలనలో వర్షములద్వారా మాత్రమే కాదు. పరిశుద్ధ స్థలమునుండి ప్రవహించుచున్న దాని ఉపనదులవలన రాజ్యము ఫల సమృద్ధియగును.

 

ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.

            యోవేలు 3:18

 

రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వత ములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించునుకొండలన్ని  రసధారలగునుఇదే యెహోవా వాక్కు.

                 ఆమోసు 9:13

 

కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును  క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరుపురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.

               యోవేలు 2:24-26

 

👉 ఏడురెట్లు ప్రకాశమానము:

 

యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను  బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును  సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

                 యెషయా 30:26

 

నూతన భూమియందు దాని సంపూర్ణ నెరవేర్పు జరుగును.

 

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.

            ప్రకటన 21:23,24

 

ఆ రాజ్యములో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

ఆమెన్!

*వెయ్యేండ్ల పాలన-*

 

*వెయ్యేండ్లకాలమందలి ప్రత్యేకతలు:*

 

🔺 *సమాధానము:*

*యుద్ధములుండవు. ఈటెలు, ఖడ్గాలతో పనిలేదు.*

 

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

        యెషయా 2:4

 

*యెరూషలేములో గుఱ్ఱములు, యుద్దపు విల్లులుండవు.*

 

ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

               జెకర్యా 9:10

(మీకా 4:2,3; యెషయా 9:4-7; 11:6-9; 32:17,18)

 

🔺 *సంతోషం:*

 

సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని  చేయుడిఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

            జెఫన్యా 3:14-17

(జెకర్యా 8:18,19; 10:6,7; యెషయా 9:3,4; 12:3-6; 14:7,8; 25:8,9)

 

🔺 *పరిశుద్ధత:*

 

సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు  సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి  తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని  ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

              యెషయా 4:3-5

(యెషయా 35:8,9; 52:1; యోవేలు 3:21; జెఫన్యా 3:11,13)

 

🔺 *నీతి:*

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును  నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని  నెరవేర్చును.

           యెషయా 9 :7

( యెషయా 11:5; 32:16; 42:1-4; 65:21-23; యిర్మీయా 23:5; 31:23)

 

 

🔺 *పరిపూర్ణ జ్ఞానం:*

 

యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని  చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు *లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.*

            యెషయా 11:1,2,9

(యెషయా 54:3; హబక్కూకు 2:14)

 

🔺 *శాపము లేదు:*

 

అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి  సీయోనునకు వచ్చెదరు

             యెషయా 35:9

 

తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు  కూడుకొనగా బాలుడు వాటిని తోలును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని  చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

            యెషయా 11:6,9

 

🔺 *రోగము లేదు:*

 

నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

            యెషయా 33:24

 

అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

              యిర్మియా 30:17

 

తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును;

              యెహేజ్కేలు 34:16

 

🔺 *రోగ స్వస్థత:*

 

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను  గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక  మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

            యెషయా 29:18,19

 

(యెషయా 35:3-6; 61:1,2; యిర్మీయా 31:8; మీకా 4:6,7; జెఫన్యా 3:1,9)

 

🔺 *బాధలుండవు:*

తమ్మును బాధించినవారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను  విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును  గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున  పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.

                 యెషయా 14:3-5

 

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరనాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

                  యెషయా 49:8

 

🔺 *భద్రత:*

నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు  నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

              యెషయా 41:8-14

యెషయా 62:8,9; యిర్మీయా 32:37;  యెహెఙ్కేలు 34:27; యోవేలు 3:16,17

 

🔺 *పనులుంటాయి:*

ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము  పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును. ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.

              యెహేజ్కేలు 48:18,19

 

🔺 *ఆర్థికాభివృద్ధి:*

యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు  ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయ మంటపములలో  దాని త్రాగుదురు.

              యెషయా 62:8,9

జెకర్యా 8:11,12; 9:16,17; యోవేలు 2:21-27; ఆమోసు 9:13,14. మీకా 4:4; యెహెఙ్కేలు 34:26.

 

🔺 *దేవునితో సాన్నిహిత్యం:*

ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

             ప్రకటన 21:3

 

ఇట్లాంటి అనేకమైన ప్రత్యేకతలు ఆ ధన్యకరమైన రాజ్యములో ఉంటాయి. ఆ రాజ్యంలో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

*గోగుమాగోగు యుద్ధం*

 

ప్రకటన 20:7—10

7. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి (కొన్ని ప్రాచీన ప్రతులలో దేవుని యొద్దనుండి, అని కూర్చబడియున్నది) అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

 

       ప్రియ దైవజనమామనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము! మనము వెయ్యేండ్ల పాలన కోసం ధ్యానం చేసుకున్నాము!

 

    వెయ్యేండ్ల పాలన అనంతరము జరిగే సంభవాలు ధ్యానం చేసుకుందాం!

 

ఏడవ వచనంలో ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సైతాను తన చెరలోనుండి విడిపించబడతాడు అనగా అగాధమునుండి విడుదల చేయబడతాడు! అనగా అప్పుడు సీల్ ఓపెన్ చేస్తారు, అగాధం తెరుస్తారు. వీడి సంకెళ్ళు విడిపిస్తారు!

వెంటనే వాడు బుద్ధి మార్చుకుని తిన్నగా బ్రతకాలి, వెంటనే వాడు మరల ప్రజలను మోసగించడం జరుగుతుందివాడు భూమి నలుదిశలయందు ఉన్న ప్రజలను అనగా వెయ్యేండ్ల పాలనలో పాలించబడిన పాపులను పోగుచేసి మరలా యుద్ధానికి కాలుదువ్వుతాడు! అదే గోగుమాగోగు యుద్ధం!

 

 దీనికోసం యేహెజ్కేలు గ్రంధంలో ముందుగానే చెప్పబడింది.....

యెహెజ్కేలు38:2,3

2. నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవానితట్టు అభిముఖుడవై అతనిగూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.

 

    ప్రియ దైవజనమా! యెహెజ్కేలు 38,39 అధ్యాయాలలో ఒకే విషయం గురించి వ్రాయబడింది. అదేమిటంటే శక్తివంతమైన ఉత్తరరాజ్యాలు- ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడం! అయితే చాలాసార్లు ఇశ్రాయేలుదేశం మీద దాడి జరిగినా, ఈ అధ్యాయంలో చెప్పబడిన దేశాలు మాత్రం ఇంతవరకు ఆ దేశం మీద దాడి చెయ్యలేదు!

 

 

     38:2 నరపుత్రుడా! మాగోగు దేశపు వాడైన గోగు. . .అనగా మాగోగు దేశానికి గోగు అనేవాడు అధిపతిగా ఉన్నాడు! ఈ మాగోగు ఆదికాండం 10:2 లో కనిపిస్తుంది. యాపేతు కుమారులలో మనకు మాగోగు, మెషెకు, తుబాలు కనిపిస్తారు. వీరు అన్నదమ్ములు! వీరు కనాను దేశానికి ఉత్తరాన స్తిరపడ్డారు! 2000 ల సం.ల క్రితం చరిత్రకారుడు జోషేఫెస్ ఇలా రాసాడు- మాగోగు అంటే నల్ల సముద్రం (black sea) అవతల ఉత్తరంగా నివసించే ఒక సిథియ జాతికి చెందిన అనాగరికమైన ఒక జాతి అన్నాడు

నరపుత్రుడా! నీవు మాగోగు వైపు, ఇంకా రోషుకు, తుబాలు, మెషెకుకి అధిపతియైన గోగువైపు ముఖం త్రిప్పి . . అంటున్నారు. రోషు అనగా రష్యా! అదికూడా నల్లసముద్రానికి ఉత్తరంగా ఉందిఇక మెషెకు, తుబాలు దాని ప్రక్కపక్కనే ఉండే దేశాలు కావచ్చు!. ప్రస్తుతం మెషెకు- తుబాలు అనగా టర్కీ దేశానికి తూర్పున నివసించే కొన్ని జాతులు అంటారు. అయితే 2వ వచనం ప్రకారం వీరందరికీ గోగు అధిపతి అవుతాడు. అనగా వీరంతా కలసి ఒక కూటమిగా ఏర్పడి గోగుని ప్రతినిధిగా నియమించి అతనికి అధికారం ఇస్తారు! ప్రకటన 20:8 లోనూ ఇదే విషయం వ్రాయబడింది.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. . . . 

 

దీని భావం ఏమిటంటే గోగుమాగోగులు తిరుగుబాటు చేసిన ప్రపంచదేశాలకు ప్రతినిధులుగా ఉన్నారు. బహుశా వీరు ముస్లిం దేశాలతో కలవవచ్చు! ఏం జరుగబోతుందో మనకు తెలియదు గాని ప్రపంచమంతా ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేఖంగా మారుతుంది అని మాత్రం అర్ధం అవుతుంది. 3వ వచనంలో నేను మీకు విరోధిని అని వ్రాయబడింది- ఎందుకంటే వారు దేవునికి భయపడక, ఆయనమీద, ఆయన స్వాస్త్యము మీద తిరుగుబాటు చేస్తున్నారు! ఎంతమంది కలసినా దేవుని సార్వభౌమత్వాన్ని, సర్వాధిపత్యాన్ని ఎదిరించలేరు! అందుకే దేవుడు నీ దవడకు గాలంవేసి నిన్ను నీ సైన్యాన్ని బయటకి రప్పిస్తాను, నీతోపాటు, నీ గుర్రాలు, సైన్యం, రధాలు (అనగా కూటమి), అందరిని మహా సైన్యంగా కూరుస్తాను! ఇంకా నీతోపాటు అనేకజనాలు వస్తాయి. అవి ఏమిటంటే పారశీకులు (అనగా పర్షియా, అనగా నేటి ఇరాన్), కూషు, పూత్ లు.

బైబిల్లో రెండు కూషులు, రెండు పూతులు ఉన్నాయి. మోషేగారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈ కూషుదేశం నేటి ఇథియోపియా! అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్నది కూషు ప్రాంతం! ప్రస్తుతం ఇరాక్ లో ఉన్న పురాతన కూషు! ఇక పూత్: ఒకటి లిబియాలో ఉంది. అదికాదు ఇక్కడ ప్రస్తావించినది. ఆసియాలో ఉన్న ఇరాక్ లోని కూషు ప్రాంతానికి ప్రక్కన ఉన్న పురాతన పూత్ ప్రాంతం! వీరంతా యుద్ధసన్నద్ధులై వస్తారు. ఇక 6వ వచనంలో గోమెరు దేశ సైన్యాలు, తోగార్మా సైన్యాలు వస్తాయి అని వ్రాయబడింది. గోమెరు అనగా ఆదికాండం 10:3 లో గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా. వీరుకూడా నల్ల సముద్రానికి ఉత్తరంగా అనగా రష్యా దేశంలో ఒక భాగం లేదా ప్రక్కన ఉన్న దేశాలు కావచ్చు!

 

    7వ వచనం ప్రకారం ఉత్తరాన గల దేశాలు బ్రహ్మాండమైన కూటమిగా ఏర్పడతాయి, దానికి నాయకుడు గోగు ఉంటాడు!

 

*ఎప్పుడు జరుగుతుంది?*

 

ఇక 8వ వచనంలో అనుమానాలు దూరం చేస్తూ ఈ యుద్ధం చాలాదినములైన తర్వాత ఇది జరుగుతుంది అంటున్నారు, ఎన్నిరోజులో చెప్పలేదు. అయితే 16వ వచనంలో దినముల అంతములో జరుగుతుంది అని చెప్పారు. గాని కాలములు, దినములు దేవుని స్వాధీనములో ఉన్నాయి! ఒక్కమాట నిజం- 3-6 వచనాలలో ఉదహరింపబడిన దేశాలు ఇంతవరకు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చెయ్యలేదు!

 

ఇది యుగాంతమందు జరుగుతాది  కాబట్టి ప్రకటన 20:8 ప్రకారం గోగుమాగోగు యుద్ధం వెయ్యేళ్ళపాలన తర్వాత జరుగుతుంది అని అర్ధం అవుతుంది.

9వ వచనం అప్పడు వీరంతా (మహా కూటమి) కలసి మేఘంలాగా ఇశ్రాయేలు దేశం మీదకు వస్తారు. 10. అప్పుడు నీమనస్సులో ఒక అభిప్రాయం పుడుతుంది. ఆ అభిప్రాయం 11-14 వచనాలలో ఉంది. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి.

 

1). భూమి నట్టనడుమ నివశించు దేశాన్ని ఆక్రమించుకోవాలి! తద్వారా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని సాతానుగాడి ఆలోచన! భూమి నట్టనడుమ ఉన్నది ఇశ్రాయేలు దేశం మాత్రమే! అందుకే సాతాను గాడు దీనిని ఆక్రమించు కోవాలని అనుకొంటున్నాడు! తద్వారా ప్రపంచ అధినేత కావాలని కోరుకుంటున్నాడు!

 

2) 13వ వచనం ప్రకారం దోపుడు సొమ్ము పంచుకుందాము అని అనుకొన్నాడు! మరి ఇప్పడు పరిస్తితులు చూసుకుంటే ఇశ్రాయేలు దేశం ధనికదేశమా? కాదు! వజ్రవైడూర్యాలు, బంగారం ఉన్న దేశమా? కాదు! మరి దోపుడుసొమ్ము ఎలా పంచుకొంటాడు? ఇశ్రాయేలు దేశానికి ఉన్న ఏకైక సంపద: Dead Sea (మృత సముద్రం! దేవుడు సొదొమ గోమోర్రాలను నాశనం చేయడం ద్వారా ఏర్పడినది). అక్కడ దొరికినంత సల్ఫర్ (గంధకం) ఎక్కడా దొరకదు! కొన్ని వందల సం.ల నుండి వారు ఇతర దేశాలకు దానిని సరఫరా చేస్తున్నా తరగటం లేదు! అంతేకాకుండా దాని చుట్టుపట్ల బోలెడు చమురునిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఆక్రమించుకొంటే ఆ చమురునిల్వలను స్వాధీనం చేసుకోవచ్చును అనే దురభిప్రాయం వారికి! అందుకే ఈ తగాదాలు! యుద్దాలు!

 

     అయితే వీరి ఆక్రమణను ప్రశ్నించే దేశాలు కూడా ఉన్నాయి. పై వచనాలలో ప్రశ్నించినట్లు చదువుకోవచ్చు! (11-15) ఆ దేశాలు షెబ, దదాను, తర్శీసు. (13). షెబ, దదాను అరేబియా ప్రాంతానికి చెందిన దేశాలు. తర్శీసు స్పెయిన్ దేశంలో దక్షిణాన గల ప్రాంతం అంటారు! బహుశా పశ్చిమ దేశాలవారు అనగా (యూరోప్, అమెరికా కావచ్చు) ఆ దాడిని ప్రశ్నిస్తాయి అని చెప్పడానికి తర్శీసు అని అనిఉండవచ్చు!

 

    ఇక వీరంతా అనగా ఈ కూటమి 16వ వచనం ప్రకారం అంత్యదినములలో దండెత్తి వస్తారు! అయితే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను రక్షిస్తాను అంటున్నారు దేవుడు! 18. అలా దండెత్తి వచ్చినప్పుడు దేవుడు పెద్ద భూకంపము పంపిస్తారు. ఆ దెబ్బకు సముద్రంలో చేపలు, ఆకాశంలో పక్షులు, భూమిపై మనుష్యులు అంతా వణకిపోతారు! పర్వతాలు కూలిపోతాయి. గోడలు నేలమట్టం అవుతాయి. నా పర్వతాలమీదకు యుద్దానికి వచ్చారు కాబట్టి అక్కడే గొప్ప వధ జరుగుతుంది. .. 22:- అప్పుడు గోగుమాగోగు సైన్యం మీద ప్రళయం లాగా వడగండ్లు, అగ్ని గంధకాలు, కురిపిస్తాను అంటున్నారు దేవుడు!

 

ఇక మహాకూటమి యొక్క యుద్దాయుధాలు ఇశ్రాయేలు వారికి ఏడు సం.లు వంట చెరకుగా పనికొస్తుంది అని వ్రాయబడింది.

 

   ఇది అంత్యకాలంలో జరుగబోయే భయంకరమైన యుద్ధం! దానిని దేవుడు ముందుగానే తన భక్తుడైన యెహెజ్కేలుగారి ద్వారా మనకు చెప్పారు దేవుడు, ఎందుకంటే భయము నొంది పాపం చేయకుండా! కీర్తనలు 4:4;

అది నిశ్చయముగా జరుగుతుంది అని చెప్పడానికి అదే విషయాన్ని తన భక్తుడైన యోహాను గారి ద్వారా కూడా మరోసారి సెలవిచ్చారు! ఇది నిశ్చయం!

చివరికి సాతాను కూడా అగ్ని గుండములో త్రోయబడతాడు!

 

ఇంకా పేతురు గారి ప్రవచనం నెరవేరుతుంది ఇక్కడ

 2పేతురు ౩:1011

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

 

*అగ్ని గుండము ఎవరికొరకు సిద్ధం చేయబడింది?*

* సాతాను మరియు వాని దూతలకొరకు.

 

శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

             మత్తయి 25:41

 

అగ్ని గుండాన్ని దేవుడు మనకోసం సిద్ధపరచలేదు. మనమెప్పుడూ ఆయన పిల్లలుగానే, అనునిత్యం ఆయనతోనే వుండాలని ఆయన ఆశపడ్డాడు. అందుకోసమే చివరి రక్తపు బొట్టువరకు మనకోసం చిందించి, మనలను పాపమునుండి పరిశుద్ధ పరచి, తిరిగి ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. ఆయన ఇంతచేసినా, సాతాను అనుచరులముగా గానే మేము జీవిస్తామంటే? సాతానుకు, వాని దూతలకోసం సిద్ధపరచబడిన అగ్నిగుండములోనికి విసిరెయ్యడం తప్ప, ఆయన ఇంకేమి చెయ్యలేడు.

 

అగ్నిగుండం ఊహలకే భయంకరం. అనుభవించాల్సి వస్తే, ఆ బాధ వర్ణనాతీతం. అగ్నిగుండం, కట్టెలు కాలిస్తే వచ్చే మంటల్లా ఉండదట. అది ఒక ద్రవ పదార్థంలా మరుగుతూ వుంటుందట. మరుగుతున్న తారు డబ్బాలో ఒక్క వ్రేలు పెడితే, ఆ బాధను ఊహించగలమా? అట్లా కాకుండా, ఇక దానిలోనే ఈతకొట్టాల్సి వస్తే? దానిని వర్ణించడానికి ఈ ప్రపంచములోనున్న ఏ భాష కూడా చాలదు.

 

మరి నీవు ఏ గుంపులో ఉన్నావు?

ఎత్తబడే గుంపులోనా?

666 ముద్ర వేసుకొనే గుంపులోనా?

 విడువబడే గుంపులోనా?

ఆ ముద్ర వేసుకుంటే వాడితోపాటు నీవు కూడా ప్రాణాల తోనే అగ్నిగుండములో త్రోయబడతావని గ్రహించు!

విడువబడుట బహు భయంకరం!

ఆ శ్రమలు భరించలేవు!!

కావున నేడే పశ్చాత్తాపం నొంది తండ్రి దగ్గరకు తొందరగా రా!

ఆయన రాకడకు సిద్ధముగా నుండు!

దైవాశీస్సులు!

*ధవళ సింహాసనపు తీర్పు*

 

ప్రకటన 20:11-15

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

 

ఇక ఈ అధ్యాయంలో మరో ప్రాముఖ్యమైన ఘట్టము: ధవళ సింహసనపు తీర్పు!

 

పదకొండో వచనంలో ధవళ సింహాసనం కనిపిస్తుంది అనగా తెల్లని సింహాసనం. దానిమీద ఒకరు కూర్చున్నారు తీర్పు తీర్చడానికి. ఆయన సముఖము నుండి భూమి ఆకాశం పారిపోయింది. మరి ఈ వ్యక్తి ఎవరు?

 

* దేవుని కుమారుడైన, ప్రభువైన యేసు క్రీస్తు.

 

తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని *తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు*; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

                యోహాను 5:22,23

 

ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

         అపొ. కార్యములు 17:31

 

దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

             2 తిమోతికి 4:1

 

మత్తయి సువార్త 25:31--46

31. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

32. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

33. తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

34.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

36. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును

37. అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

38. ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?

39. ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

41. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని (అనగా-సాతానుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి.

42. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు;

43. పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.

44. అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.

45. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.

46.వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.

 

ఇది అత్యంత ఘోరమైనతీర్పు. ఈ తీర్పులో కృపకు స్థానం లేనేలేదు. న్యాయాధిపతిగా ప్రభువుమహా ధవళమైన సింహాసనము మీద కూర్చుండబోవుతున్నాడు. న్యాయమే ఆ తీర్పులో రాజ్యమేలుతుంది. మొదటి రాకడలో గొర్రెపిల్లలా కనిపించిన ప్రభువు, ఈ తీర్పులో గర్జించు కొదమ సింహంలా కనిపిస్తారు.

 

*మహా ధవళ సింహాసనపు తీర్పు ఎప్పుడు  జరుగబోతోంది?*

 

* వెయ్యేండ్ల పాలన అనంతరం, సాతాను నరకంలో పడవేయబడిన తర్వాత. పాపులైన మృతులు అక్షయమైన శరీరాలతో లేస్తారు. అప్పుడు వారికి తీర్పు జరుగబోతోంది. ( పరిశుద్ధులైన మృతులు, మధ్యాకాశములో ప్రభువు బూర ఊదినప్పుడు ఎత్తబడినారు)

 

*మహా ధవళ సింహాసనపు తీర్పు ఎక్కడ  జరుగబోతోంది?*

 

* శూన్యములో (ఆకాశంలో) ఎందుకు శూన్యము అని చెప్పడం జరిగింది అంటే

 

1. భూమి మరియు ఆకాశం పారిపోయింది కదా! మరి ఎక్కడ జరుగుతుంది? అందుకే శూన్యములో జరుగుతుంది!

 

2. ఆకాశములు కాలిపోయాయి. పంచభూతములు లయమై పోయాయి, భూమిమీద ఉన్నవి అన్నియు కాలిపోయాయి 2పేతురు ౩:1011 ప్రకారం! అందుకే శూన్యములో తీర్పుజరుగుతుంది.

(తీర్పు కొరకు, అక్షయమైన శరీరాలతో పునరుద్ధానం చెందినవారు గనుక, శూన్యములో కూడా వారు నిలువబడగలరు. భూమి వంటి పదార్ధ సంబంధమైనదేది అవసరంలేదు.)

 

*ధవళ సింహాసనం దేనికి సూచన?*

 

ధవళము అంటే? తెలుపు (పరిశుద్ధత). దానియందు ఆసీనుడైయున్నవాని, పవిత్రతకు, న్యాయతీర్పు యొక్క ప్రత్యేకతకు సూచన.

 

🔹 *భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.*

సాక్ష్యము చెప్పు నిమిత్తము భూమిని, ఆకాశాన్ని పిలచుచున్నట్లు వ్రాయబడియున్నది. కనుక, సాక్ష్యము చెప్పు నిమిత్తము అవి పారిపోయి, వాటి కొరకు ప్రత్యేకించబడిన స్థలములో అవి నిలచియున్నాయని తలంచవచ్చు.

 

యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

            యెషయా 1:2

 

ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.

              కీర్తనలు 102:25-27

 

ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.

            యెషయా 51:6

 

ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.

                మార్కు 13:31

 

మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

                 ప్రకటన 6:14

 

🔹 *గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని.*

 

ఈ లోకంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాధించినా, దేశాలను యేలిన చక్రవర్తులైనా, బానిసలైనా, వారెవరైనా సరే, రక్షించబడనివారైతే ఆ సింహాసనము ముందు నిలువబడాల్సిందే. వారు జీవించిన జీవితాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. అబద్ధమాడుటకు అవకాశం లేదు. సాక్ష్యమిచ్చుటకు భూమి, ఆకాశం సిద్ధంగా ఉంటాయక్కడ.

 

🔹 *అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.*

 

జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము

                    కీర్తనలు 69:28

 

అయితే, రక్షించబడని వారి పేర్లు, రక్షించబడిన తర్వాత తిరిగి లోకంలోనికి వెళ్లిపోయిన వారి పేర్లు వేరొక గ్రంధములోనికి మార్చబడతాయి. ప్రతీవారికి ఒక్కొక్క గ్రంధము ఉండవచ్చు. వాని వాని క్రియలచొప్పున వానికి తీర్పు తీర్చబడును.

 

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారము చేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి  కారము చేసెదను.  (యెషయా 65:6)

 

 

🔹 *సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.*

(ప్రకటన 20:13)

 

సముద్రము అనగా, సమస్త జలాశయములు. నీటిలో పడి మరణించిన వారిని సముద్రము అప్పగించును. సముద్రములో పడిపోయినను, దుష్టమృగములు చీల్చి, తినివేసినను, మంటల్లోకాలి బూడిదైననూ, ఈ శరీరము పంచ భూతములలో కలసిపోయినను, అవి తిరిగి ఏకమై తిరిగి లేచును. ఇంకా ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఇప్పుడు తీర్పులో నిలబడతారు.

 

🔹 *మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను.*

                ప్రకటన 20:14,15

 

ఈ అగ్ని గుండము రెండవ మరణము. మరణములేని నూతన యుగము ప్రారంభించుచుండగా, దానికి ముందుగా మరణమును అగ్నిగుండములో పడవేయును.

పాపమునకు కారణమైన సాతానును అగ్నిగుండములో పడవేసెను. కనుక, పాపశిక్ష అయిన మరణమునకు ఇక స్థానము లేదు.

అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను పడియున్న అగ్నిగుండములో మరణము, పాతాళము వేయబడును.

 

👉 Note:

పాతాళము అనేది?

మరణమునకు, న్యాయతీర్పుకు మధ్యలో రక్షణ పొందని వారి ఆత్మలు నివసించు స్థలమైయున్నది. అంత్య న్యాయతీర్పు తర్వాత, పాతాళము యొక్క అవసరత లేదు. గనుక పాతాళము అగ్నిగుండములో వేయబడును.

 

🔹 *ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.*

                  ప్రకటన 20:15

 

జీవ గ్రంధములో నీ పేరు కనబడకపోతే? నీవు అగ్ని గుండములో కనబడతావు. జీవ గ్రంధములో నీ పేరు వుంటే? అగ్ని గుండములో నీవుండవు.

 

ఈ లోకంలో ఎన్ని ఆధిక్యతలున్ననూ, జీవగ్రంధంలో నీ పేరులేకపోతే?

ఇక్కడ, కృప, దయ, జాలి అట్లాంటివాటికి స్థానం లేదు. రక్షించబడకపోతే? నిత్య మరణమే శరణ్యం.

 

అయితే, నీవనుకోవచ్చు. పరలోకం, నరకముందని ఎవరికి తెలుసని? నీవు పుట్టకముందు భూలోకం అంటూ ఒకటుందని నీకు తెలియదు కదా? పుట్టాకే తెలిసింది. నరకమో అంతే? నీ ఈ భూలోకాన్నైనా విడవాలి, ఆయన రాకడైనా రావాలి. అప్పుడుగాని, అర్ధంకాదు. పరలోకం, నరకం ఉన్నాయని. అప్పుడర్ధమయినా, ఫలితం శూన్యం. నీవు ఈలోకంలో జీవించిన సమయంలోనే నీకర్ధం కావాలి. అట్లా అని, బలముంది కదా? వయస్సుంది  కదా అని వాయిదాలేస్తే? ఏ క్షణాన వాడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో? ఎవరికి తెలుసు? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!

 

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

*క్రొత్త ఆకాశము- క్రొత్త భూమి- నూతన యేరూషలేము*

 

ప్రకటన 21:1—4

1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

 

       ప్రియ దైవజనమామనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాముఈ అధ్యాయంలో  క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన యేరూషలేము కోసం ధ్యానం చేసుకుందాం!

 

ఇంతకీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎందుకు?

పాత భూమి పాత ఆకాశము నశించిపోయాయి కాబట్టి!

1. భూమి మరియు ఆకాశం పారిపోయింది కదా! ...

ప్రకటన గ్రంథం 20: 11

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

 

2. ఆకాశములు కాలిపోయాయి. పంచభూతములు లయమై పోయాయి, భూమిమీద ఉన్నవి అన్నియు కాలిపోయాయి 2పేతురు:1011 ప్రకారం!

అందుకే ఇప్పుడు దేవుడు మరో ఆకాశము మరో భూమిని సృష్టిస్తున్నారు

 

మరి ఇప్పుడు మరో అనుమానం రావచ్చుమరి వెయ్యేండ్ల పాలనలో ఉన్న మనము అనగా పరిశుద్దులు ఎలా ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీదికి వెళ్తారు లేక రవాణా చేయబడతారు?

 

అయ్యా! మనకు మేఘములను వాహనములుగా చేశారు దేవుడు! అప్పుడు ప్రజలందరూ మహిమ గలవారై ఉంటారు. కాబట్టి బహుశా మేఘముల మీద రవాణా చేయబడతారు ఈ భూమి కాలిపోక ముందు! లేదా దేవుడు మరో రవాణా సౌకర్యంచున్నామ చేయవచ్చు!

 

సరే, పరిశుద్ధ గ్రంధములో మూడు పర్యాయములు భూమి, ఆకాశములను సృష్టించబడినట్లుగా చూడగలము.

 

🔹 *మొదటి సృష్టి:*

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. (ఆది. కా. 1:1) ఇది మొదటి సృష్టి. లూసిఫర్ పడద్రోయబడిన తర్వాత ఈ సృష్టి నాశనమై నిరాకారముగా మారింది. అనగా పనికిరాకుండా పోయింది అని అర్ధం.

 

🔹 *రెండవ సృష్టి:*

ఆరు దినములలో రెండవ సృష్టిని చేసిన దేవుడు, ఏడవదినాన్న విశ్రమించెను.  (ఆది. కా. 2:2) ఇప్పుడు ఆ రెండవ సృష్టిలోనే మనము జీవిస్తున్నాము. త్వరలో ఈ భూమి, ఆకాశములు కూడా గతించిపోనున్నాయి.

 

🔹 *మూడవ సృష్టి:*

మూడవ సృష్టియైన నూతన భూమి, నూతన ఆకాశం కొరకు మనము ఎదురుచూచుచున్నాము.

 

మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.  (2 పేతురు 3:13)

 

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

             యెషయా 65:17

 

నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.

            యెషయా 66:22

 

🌏 *నూతనమైన భూమిని గురించి రెండు అభిప్రాయములు కలవు:*

 

🔻 *మొదటి అభిప్రాయం:*

వెయ్యేండ్ల పాలన అనంతరం భూమి అగ్నివలన కాలిపోయి, శుద్ధీకరణం పొంది, నూతన భూమి ఆవిర్భవించును. అయితే, తాను భూమిని నిత్యముగా స్థాపించెను.

(కీర్తనలు 78:69). గనుక, భూలోకం నాశనం పొందదు. అది కాలి, కాలి, నూతన భూమిగా రూపాంతరం చెందుతుంది. అనేది కొందరి అభిప్రాయం.

 

🔻 *రెండవ అభిప్రాయం:*

ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.

           కీర్తనలు 102:25,26

 

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.

           ప్రకటన 21:1

 

దీనిని బట్టి, భూమిగా నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందనేది మరికొందరి అభిప్రాయము.

👉Note: *ఈ పాపభూయిష్టమైన భూమి నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందని అందరూ అంగీకరిస్తారు.*

 

అయితే మరొక అభిప్రాయం కూడా ఉంది: వెయ్యేండ్ల పాలన నూతన ఆకాశము నూతన భూమిమీదనే జరుగుతుంది గాని ఈ పాప భూమిమీద జరుగదు అంతేకాకుండా అణుబాంబులు వలన కలిగే రేడియేషన్ వలన భూమి నివాసయోగ్యముగా ఉండదు. అందుకే వెయ్యేండ్ల పాలన క్రొత్త భూమి క్రొత్త భూమిపై జరుగుతుంది. గాని బైబిల్ ప్రకారం క్రొత్త భూమి క్రొత్త ఆకాశము గోగుమాగోగు యుద్ధం తర్వాత భూమి ఆకాశం కాలిపోయిన తర్వాతనే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వస్తున్నట్లు చూడగలం!

 

🌏 *నూతన భూమి, ఆకాశము యొక్క ప్రత్యేకతలు:*

 

సముద్రము ఉండదు.

నూతన యెరూషలేము పట్టణము పరలోకమునుండి నూతన భూమి మీదికి దిగివస్తుంది.

నూతన భూమి మీద మనుష్యులు, దేవునితో ప్రత్యక్ష సహవాసం కలిగి నివసిస్తారు.

దేవుడు తన ప్రజల కన్నులనుండి ప్రతీ భాష్ప బిందువును తుడిచివేస్తాడు.

పాపం లేదు

మరణం లేదు

దుఃఖం లేదు

ఏడ్పు లేదు

వేదన లేదు

సూర్యుడు లేడు.

చంద్రుడు లేడు

రాత్రి లేదు

*క్రొత్త ఆకాశము- క్రొత్త భూమి- నూతన యేరూషలేము-2*

 

ఇక రెండవ వచనంలో నూతనమైన యేరూషలేము ఆ ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలే పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట చూచితిని! అప్పుడు దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది అంటున్నారు!

 

కొంతమంది నూతన యెరూషలేము అనేది భూమిమీదికి రాదు అంటున్నారు! ఇక్కడైతే స్పష్టంగా పరలోకం నుండి దిగింది అనగా పరలోకం నుండి క్రొత్త భూమి మీదికి దిగింది.

 

 క్రొత్త భూమి మీద ఎవరున్నారు?

పరిశుద్ధులు! అనగా ఎత్తబడిన వారు, మహాశ్రమల పునరుత్తానులు, మృతులైన పరిశుద్ధులు, రక్షించబడిన ఇశ్రాయేలు జనాంగము,

 

అయితే ఈవిషయంలో కొందరు భిన్నమైన భోదలు చేస్తున్నారు. క్రొత్త భూమిపైన నూతన నిబంధన విశ్వాసులు! నూతన ఆకాశము మీద పాత నిబంధన విశ్వాసులు! వారందరికీ పైగా 144౦౦౦ మంది నూతన నిబంధన పరిశుద్దులు అనబడే సీయోను పర్వతం మీద నున్న పరిశుద్దులు ఉంటారు అంటారు! మరి వీరు చెప్పిన వాటికి స్థిరమైన వాక్య రిఫరెన్సులు కనబడటం లేదు!

 

దీనికోసం మనం అంతగా ఆలోచించవలసిన పనిలేదు! ఇలాంటి వివాదాస్పదమైన విషయాలలో దయచేసి తలదూర్చవద్దు! మనకు కావలసింది నిత్యత్వములో చోటు! క్రొత్త ఆకాశములో ఉంటే ఏమిటి? క్రొత్త భూమి మీద ఉంటే ఏమిటి? క్రీస్తుతోపాటుగా ఆ శ్రేష్ఠుల సంఘములో పరిశుద్దుల సమూహములో ఉంటే చాలు! నాకైతే ఆ నిత్యత్వములో ఆ గేట్ ప్రక్కన చిన్న చోటు ఇస్తే చాలు!!!

 

సరే, ఇక్కడ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలే పరలోకం నుండి దేవుని యొద్ద నుండి క్రిందికి దిగింది!

 

పాత యెరూషలేము, పరలోక యెరూషలేము యొక్క ఛాయయై(నీడ) యున్నది. నీడ వున్నది అంటే? తప్పక అసలైనది వున్నది అనే విషయం సుస్పష్టం. పాత యెరూషలేము పలుమార్లు ధ్వంసం చేయబడి, కట్టబడింది. అయితే, నూతన యెరూషలేము ఎప్పటికీ నశించదు. ప్రభువే ఆ పట్టణాన్ని సిద్ధపరచును.

 

ప్రభువు మనకోసం సిద్ధపరచుటకు వెళ్ళియున్న పట్టణమే, “నూతన యెరూషలేము”.

 

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

                యోహాను 14:2

 

ఈ పట్టణం పరలోకమందు సిద్ధపరచి, నూతన భూమి మీదకు తీసుకు వచ్చెను.

 

ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండల మునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.

                    ఆమోసు 9:6

 

పరలోకమందు అనేక నివాసములున్ననూ, తన పెండ్లికుమార్తె కొరకు ప్రత్యేకముగా కట్టుచున్నారు. ఆ సుందరమైన పట్టణ నిర్మాణము గత రెండువేల సంవత్సరాలనుండి జరుగుతూనే వుంది. త్వరలో పూర్తికాబోతుంది. ఒక మనిషి కట్టిన కట్టడాన్ని చూడ్డానికే రెండు కళ్ళూ చాలట్లేదు. ఇక, నిర్మాణకుడు దేవుడే అయితే, ఆ సుందర పట్టణాన్ని ఊహించగలమా?

 

అందుకే అబ్రాహాముగారు  కూడా, అత్యంత సుందరమైన ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురుచూస్తున్నారు.

 

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ  పట్టణముకొరకు  అబ్రాహాము  ఎదురుచూచుచుండెను.

               హెబ్రీ 11:10

 

*నూతన యెరూషలేము ఏ రీతిగా వుండబోతోంది?*

 

🔺యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.

🔺దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.

🔺ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను.ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి,

🔺ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.

🔺తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.

🔺ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

🔺 దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.

 

Note:

750 కోసులు అనగా 1500మైళ్ళు. అనగా సుమారు 2500 కిలో మీటర్లు.

* పొడవు : 2500 కిలో మీటర్లు.

* వెడల్పు : 2500 కిలో మీటర్లు.

* ఎత్తు : 2500 కిలో మీటర్లు.

 

అయితే, మనము కట్టే భవనాల లెక్కల్లో చూస్తే? ఒక అంతస్థు 8 అడుగులు లేదా 2.5 మీటర్లు ఉంటుంది. అట్లా అయితే, ఒక కిలో మీటరు ఎత్తుకు 400 అంతస్తులు ఉండును. 2500 కిలో మీటర్ల ఎత్తుకు పదిలక్షల అంతస్థులుండును. (దేవుని లెక్కలు మనకు తెలియదుగాని, మనము కడితే, ఆ ఎత్తుకు పదిలక్షల అంతస్తులు వచ్చును. ఒక్కసారి ఊహించండి? ఆ నూతన యెరూషలేము ఎట్లా వుండబోతుందో? )

 

🔺ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను;

🔺పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

 

🔺ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.

* మొదటి పునాది సూర్యకాంతపురాయి,

* రెండవది నీలము,

* మూడవది యమునారాయి,

* నాలుగవది పచ్చ,

* అయిదవది వైడూర్యము,

* ఆరవది కెంపు,

* ఏడవది సువర్ణరత్నము,

* ఎనిమిదవది గోమేధికము,

* తొమ్మిదవది పుష్యరాగము,

* పదియవది సువర్ణల శునీయము,

* పదకొండవది పద్మరాగము,

* పండ్రెండవది సుగంధము

 

🔺దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు;

🔺ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది.

🔺పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

🔺దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

🔺ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.

🔺అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.  (ప్రకటన 21:10-25)

 

 

*ఈ నూతన యెరూషలేములో ఎవరు ప్రవేశిస్తారు?*

 

గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

ఆ నూతన యెరూషలేము, పరలోకంలో పెండ్లికుమార్తెవలే అలంకరింపబడి, నూతన ఆకాశాన్ని దాటి, నీవుండే నూతన భూమి మీదకునీ కోసం దిగిరాబోతుంది. అయితే, దానిలో నిత్య నివాసం చేసే ధన్యత, అట్లాంటి పరిశుద్ధ జీవితం మనకుందా? ఆ నూతన యెరూషలేములో నేనుండాలనే ఆశ నీకుంటే, నీవు నూతనముగా తిరిగి జన్మించి, నూతనంగా ప్రభువు కొరకు జీవించాలి. దానికి నీవు సిద్దమేనా? అయితే, నీవు తప్పక ఆ నిత్యరాజ్యంలో నీవుంటావు.

 

ఇంతవరకూ, అశాశ్వతమైన వాటిగురించి పోరాటం చేస్తూ, అక్షయమైన, శాశ్వతమైన ఆ నూతన యెరూషలేమును గురించిన తలంపుగాని, దానిలో నేనుండాలనే ఆశగాని, లేకుండా జీవిస్తున్నామేమో?

 

నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!

*క్రొత్త ఆకాశము- క్రొత్త భూమి- నూతన యేరూషలేము-*

 

 ప్రకటన 21:18-20

18. పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

19. పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,

20. అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.

 

*నూతన యెరూషలేము యొక్క అలంకరణ:*

 

ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమి్మదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.

 

నూతన యెరూషలేము పట్టణము, సంఘమునకు. సంఘమందున్న విశ్వాసుల సమూహమునకును సాదృశ్యము. అందుచే, నూతన యెరూషలేము అలంకరింపబడినట్లుగా, మన జీవితాలు అలంకరింపబడి యుండాలి.

 

*పట్టణ ప్రాకారము సూర్యకాంతి:*

సూర్య కాంతిపరిశుద్ధతకుసాదృశ్యం.

 

ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; ( ప్రకటన 4:3) ఆయన సూర్యకాంతమును పోలినవాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుని తేజస్సు ఆ పట్టణములో ప్రతిబింబించు చున్నది.

 

*పట్టణము శుద్ధ సువర్ణము:*

బంగారముదైవత్వమునకుసాదృశ్యం. ఆయన శరీరధారిగా దిగివచ్చిన దైవ కుమారుడు. అందుకే, జ్ఞానులు బంగారాన్ని సమర్పించారు.

 

*పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.*

 

* మొదటి పునాది సూర్యకాంతపురాయి,

* రెండవది నీలము,

* మూడవది యమునారాయి,

* నాలుగవది పచ్చ,

* అయిదవది వైడూర్యము,

* ఆరవది కెంపు,

* ఏడవది సువర్ణరత్నము,

* ఎనిమిదవది గోమేధికము,

* తొమ్మిదవది పుష్యరాగము,

* పదియవది సువర్ణల శునీయము,

* పదకొండవది పద్మరాగము,

* పండ్రెండవది సుగంధము

 

1. *సూర్యకాంతపురాయి:*

సూర్య కాంతి, మనము స్వచ్ఛతను, పరిశుద్దతను కలిగియుండాలని తెలియజేస్తుంది.

 

2. *నీలము:*

నీలము ఆకాశమునకు, పరలోకమునకు సాదృశ్యము. అనగా మనము పైనున్నవాటియందు లక్ష్యముంచి, పరలోక సంబంధులుగా జీవించగలగాలి. మనము లోకములో నున్నప్పటికీ, లోకం మనలో లేకుండా జాగ్రత్తపడాలి.

 

3. *యమునారాయి:*

ఇది బూడిద లేదా తెలుపురంగులో ఉంటుంది. వస్తువు కాలిపోయాక మిగిలేది బూడిద. మనము కూడా దేవుని వెలుగు బిడ్డలుగా కాలిపోవు జ్యోతులుగా ఉండాలి.

 

4. *పచ్చ:*

జీవము, సమాధానమునకు సాదృశ్యము. మనము సమాధానము కలిగి, మృతతుల్యమైన జీవితం కాకుండా, జీవము గలిగి, ప్రభువుకొరకు జీవించాలి.

 

5. *వైడూర్యము:*

ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు. మండు చున్న దీపము ఎరుపురంగు కలిగియుండును. మంట తీవ్రత ఎక్కువైనప్పుడు పైభాగమందు ఆకుపచ్చ రంగు కనిపించును. మనమునూ, వెలగడమే కాకుండా, ప్రభువుకొరకు ప్రజ్వలించాలి. ఆత్మలో తీవ్రత కలిగియుండాలి.

 

6. *కెంపు:*

ఎరుపు. యేసు క్రీస్తు రక్తమునకు, ఆయన శ్రమలకు సాదృశ్యము. ఆయన రక్తములో కడుగబడిన మనము, ఆయనకొరకు శ్రమలను అనుభవించడానికి కూడా సిద్దపడగలగాలి.

 

7. *సువర్ణరత్నము:*

దైవత్వము, విశ్వాసము, వాక్యమునకు సాదృశ్యము. విశ్వాసముతో, వాక్యమును ప్రేమిస్తూ, అనగా వాక్యానుసారమైన జీవితం జీవించగలగాలి.

 

8. *గోమేధికము:*

పచ్చ, నీలము కలసిన రంగు. పచ్చ జీవానికి, నీలము పరలోకసంబంధమైన వాటికి సాదృశ్యం. సజీవులముగా పరలోక పౌరసత్వం గలవారమని గుర్తెరిగి, పైనున్నవాటి యందే మనస్సుంచగలగాలి.

 

9. *పుష్యరాగము:*

పసుపు, ఆకుపచ్చ కలసిన రంగు.

పసుపు జ్ఞానమునకు, ఆకుపచ్చ జీవమునకు సాదృశ్యం. మనము సజీవులుగా జ్ఞానము కలిగియుండుటను సూచిస్తుంది.

 

10. *సువర్ణల శునీయము:*

తెల్లరాతిపై బంగారు చుక్కలు గలది. పరిశుద్ధత, దైవత్వం కలిగి జీవించుటకు తెలియజేస్తుంది.

 

11. *పద్మరాగము:*

ఊదా, నీలిరంగు మిశ్రమం.

ఊదారంగు రాజరికం, నీలిరంగు పరలోకసంబంధమైన జీవితంనకు సాదృశ్యం. మనము పరలోకసంబంధులముగాను, రాజులైన యాజకులముగా జీవించగలగాలి.

 

12. *సుగంధము:*

ఊదా, ఎరుపురంగుల మిశ్రమం.

ఊదా రంగు రాజరికమునకు, ఎరుపు క్రీస్తు శ్రమలకు సాదృశ్యం. మనము రాజులైన యాజక సమూహముగా, సిలువ శ్రమలను సహిస్తూ జీవించ గలగాలని నేర్చుకొందము.

 

*నూతన యెరూషలేములో నివసించేదెవరు?*

 

* గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తె.

                    (ప్రకటన 21:9)

* ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములు

                    (ప్రకటన 21:12)

* రక్షణ పొందిన అన్య జనులు

                    (ప్రకటన 21:24)

 

*నూతన యెరూషలేములో ప్రవేశములేనిదెవరికి?*

 

* పిరికివారును,

* అవిశ్వాసులును,

* అసహ్యులును,

* నరహంతకులును,

* వ్యభిచారులును,

* మాంత్రి కులును,

* విగ్రహారాధకులును

* అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

                ప్రకటన 21:8

 

 

1. *పిరికివారు*:

 

రక్షణ పొందిన తర్వాత, ఇతరులు గేళి చేస్తారేమోనని భయపడి, బహిరంగ సాక్ష్యులుగా వుండలేకపోవుట పిరికితనం.అయితే, పిరికితనమునుగల ఆత్మను దేవుడు మనకియ్యలేదు.

 

దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.

                   2 తిమోతికి 1:7

 

2. *అవిశ్వాసులు*:

యేసు క్రీస్తును నమ్మని వారు.

 

ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

                  యోహాను 3:18

 

3. *అసహ్యులు*:

మనుష్యుల మధ్యలో గొప్పలు చెప్పుట, దేవుని సన్నిధిలో అసహ్యమైనది.

 

ఆయన మీరు మను ష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.

                   లూకా 16:15

 

దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.

                   తీతుకు 1:16

 

4. *నరహంతకులు*:

హత్య చేసేవారు!

 

తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

                  1 యోహాను 3:15

 

5. *వ్యభిచారులు*:

అన్ని రకాలైన వ్యభిచారములుపరస్త్రీ తో పర పురుషులతో లైంగిక కార్యములు చేసేవారు! పెళ్ళి కాకుండా సెక్స్ చేసేవారు. లెస్బియన్ గేలు అందరూ!

 

జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

               ప్రకటన 22:14,15

 

6. *మాంత్రికులు*:

మంత్రము చేయువారు.

 

తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

              ద్వితీ 18:10-12

 

మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వ ములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.

               ప్రకటన 9:21

 

7. *విగ్రహారాధికులు*:

దేవుని కంటే, శరీర క్రియలకు ప్రాధాన్యత నిచ్చేవారు.

 

విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

                గలతీ 5:20,21

 

8. *అబద్ధికులు:*

అబద్దం చెప్పువారు. ప్రభువును క్రీస్తుకాదని నిరాకరించువారు.

 

యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు?

               1 యోహాను 2:22

 

వీరెవ్వరికి నూతన యెరూషలేములో ప్రవేశం లేదు.వీరి గమ్యం నిత్య నరకం. అది అత్యంత భయంకరం.

 

ప్రియ నేస్తమా! సరిచేసుకుందాం! నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!

 

అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

*జీవజలనది- జీవవృక్షం*

 

   ప్రకటన 22:13

1. మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి

2. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట (లేక, బయలువెడలుట) ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.

3. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.

 

       ప్రియ దైవజనమామనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాముప్రియులారా మనము చివరకు వచ్చేశాం! ఈ చివరి అధ్యాయంలో మనం జీవ జలనది, జీవ వృక్షం మరియు చివరి మాటలు- హెచ్చరికలు కనిపిస్తాయి!

 

మొదటి వచనంలో స్పటికము లాంటి మెరిసే జీవజలముల నది కనిపిస్తుంది! అనగా గాజులాంటి మెరిసే జీవజలముల నది కనిపిస్తుంది! 21:6 లో జీవ జలముల బుగ్గలోని జలమును ఉచితముగా ఇస్తాను అన్న దేవుడు- ఇప్పుడు బుగ్గ కాస్తా నదిలా ప్రవహిస్తుంది! దీనికోసం కీర్తనాకారుడు ముందుగానే చెప్పడం జరిగింది. ఒక నదికలదు  దాని శాఖలు  దేవుని నగరాన్ని సంతోషింపజేస్తాయి అంటూ 46:4

కీర్తనలు 46: 4

ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.

కీర్తనలు 46: 5

దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.

 

ఇప్పుడు ఈ నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్దనుండి పారడం మొదలుపెట్టింది- అది పట్టణంలో అన్ని వీదులలోను ప్రవహిస్తుంది. ఇక ఈ జీవ జలములు పరిశుద్దులు అనుదినము అనుభవిస్తూ ఉండవచ్చు శాశ్వతంగా!!! అందుకే ఆయన అన్నారు- ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలి!..

 

ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే: ఇక్కడ సింహాసనములు కనబడలేదు! దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము!! అనగా ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు తండ్రితో ఐక్యమైపోయారుకుమారుడు మరియు తండ్రి ఒకే సింహాసనము మీద కూర్చున్నారు అన్నమాట! కుమారుడు శరీరదారుడుగా ఈభూలోకానికి వచ్చి రక్షణ కార్యము నెరవేర్చి సాతానుని జయించి దేవునికి ఒక రాజ్యము ఏర్పాటుచేశారు కాబట్టి ఇప్పుడు కుమారునికి కూడా సింహాసనం ఉంది. అయితే అది తండ్రితోపాటుగా కూర్చుంటున్నారు! కీర్తన 110:1 లో చెప్పిన కార్యము ఇప్పుడు నెరవేరిపోయింది....

కీర్తనలు 110: 1

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

 

1కొరింథీ 15:2425...

24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.

25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

ఇది కూడా నేరవేరిపోయింది ఇప్పుడు!

ధవళసింహాసనం తీర్పు అనంతరం సమస్త కార్యములు నెరవేరిపోయాయి! శత్రువులందరూ నశించిపోయారు! మానవాళి తిరిగి తండ్రితో సమాధాన పడి ఆయనతో కలిసి జీవించడం మొదలుపెట్టారు! కాబట్టి ఇప్పుడు కుమారుడు తండ్రితో ఐక్యమైపోయారు! దేవుని నివాసము మనుషుల నివాసములతో పాటుగా ఉంది ఇప్పుడు!ప్రకటన గ్రంథం 21: 3

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

 

 తండ్రియైన దేవునితో పాటుగా కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికి కూడా ఇప్పుడు అధికారం ఉంది ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీద! దీనిమీద నుండే ఆయన ఈ విశ్వాన్ని పాలిస్తూ ఉంటారు!

 

ఇక ఇక్కడ ప్రజలు ఆ జీవ జలములు త్రాగుతూ ఆ జీవ వృక్షముల ఫలములు తింటూ నిత్యత్వములో ఆనందిస్తూ ఉంటారు!

 

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ నదియొక్క ఇటుప్రక్క అటుప్రక్క జీవవృక్షముండెను! జీవవృక్షములు కాదు- జీవ వృక్షము! అనగా వేరు ఒకటే దాని శాఖలు పరలోకము లేక క్రొత్త భూమి అంతటా వ్యాపించిఉన్నాయి! ఈ జీవ వృక్షము నెలకు పన్నెండు కాపులు కాస్తుందిదీనికోసం రెండు అభిప్రాయాలున్నాయి!

 

మొదటిది:ప్రతీనెలా కాపు కాస్తుంది. సంవత్సరంలో 12 కాపులు అన్నమాట!

 

రెండవది: పన్నెండు నెలలు పన్నెండు రకాలైన కాపులు కాస్తుంది! ఏమో మనకు తెలియదు గాని ఇక ఈ నిత్యత్వములో పాలుపొందినవారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జీవ వృక్షముల ఫలములు తినవచ్చు అన్నమాటఆదాము హవ్వలు ఈ జీవవృక్షఫలములు ఏదెనులో ఉన్నప్పడు తినలేదు! వెళ్ళగొట్టబడినప్పుడు తినాలని ఆశించినా తినలేకపోయారు! ఆ భాగ్యం రక్షించబడిన మృతులైన పరిశుద్దులకు పరదైసులో ఇచ్చారు.... ప్రకటన 2:7

చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.

 

ఇప్పుడు నిత్యత్వములో శాశ్వతంగా తినడానికి అవకాశం ఇచ్చారు!

ఇక ఆ ఆకులు జనములను స్వస్తపరచును అంటున్నారు. ఇంతకీ ఆకలి బాధ వేదన లాంటివి లేని రాజ్యములో స్వస్తత అవసరమా? బహుశా సంపూర్ణ ఆరోగ్యం దయచేయడానికి ఈ ఆకులు పనికొస్తాయి అన్నమాట!

 

ప్రియమైన దైవజనమా! ఆ ఫలములు నీకు కావాలంటే నీలో పాపం అనేది ఉండకూడదు! ఆ జీవజలములు ఆ జీవ వృక్ష ఫలములు అందరూ అనుభవించాలనే పాపం లేని ఆయన మనకోసం భూలోకానికి వచ్చి తన రక్తాన్ని మనకోసం చిందించి మనలను పాప విముక్తులను చేసి విమోచన కలుగజేశారు! కడుగబడిన నీవు మరలా పాపం చేస్తే నీవు ఇక ఎప్పటికీ ఈ జీవ జలములను జీవ వృక్ష ఫలములను అనుభవించలేవు సరికదా నీవు నిత్యాగ్నిగుండములో వేదన పడక తప్పదు యుగయుగాలు!

కాబట్టి నేడే మారుమనస్సు పొంది దేవుని జీవ జలములను జీవ వృక్ష ఫలములను పొందుకో!

2

 

  ప్రకటన 22:5

3. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.

4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.

5. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

 

ఇక తర్వాత వచనాలలో ఈ క్రొత్త ఆకాశము భూమి ఎలా ఉండబోతుందో ఆ నిత్యత్వము దేవునితో పాటుగా ఎలా ఉండబోతుందో వివరిస్తున్నారు!

 

ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదీ దానిలో ఉండదు ఎందుకంటే దేవునియొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉన్నది కాబట్టి! ఇదేమాటను మరొకసారి చెప్పడం జరిగింది. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఉంది. కాబట్టి అక్కడ శాపం గాని శాపగ్రస్తమైనది గాని ఉండదు! కారణం దానిలో ప్రవేశించిన వారు ఎవరు? ప్రకటన 21:27 ప్రకారం పరిశుద్దులు మరియు గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయబడిన వారు మాత్రమే! నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్దాన్ని ప్రేమిచి జరిగించువారు అందరూ నరకానికి పోయారు! అందుకే ఇప్పుడు శాపం అనేది శాపగ్రస్తమైనది ఏదీ అక్కడ ఉండదు అన్నమాట!

 

అంతేకాదు గతభాగాలలో వివరించినట్లు ఆదాము ద్వారా వచ్చిన శాపం (ఆదికాండం ౩:17), ఇప్పుడు సంపూర్ణంగా విమోచించబడి ఈ ఆనందంలో పాలుపంచుకోవడం జరుగుతుంది.

 

యెషయా 24:6

శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.

 

అంతేకాదు ఇంతవరకు ధర్మశాస్త్రం క్రిందన శాపంలో ఉన్నవారు కూడా విమోచించబడి విముక్తులయ్యారు. పరిశుద్దులయ్యారుగలతీ ౩:10

ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

 

ఇప్పుడు అన్ని శాపాలనుండి విమోచించబడి ఈ పరలోక భాగ్యానికి హక్కుదారులు అయ్యారు!

గలతీ ౩:13

ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో- శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

 

ఇక నాలుగో వచనంలో ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తారు! ఇక్కడ రెండు విషయాలు అర్దమవుతున్నాయి!

మొదటిది అక్కడ కూడా దేవుని దాసులు ఆయనను అనగా దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు! గాని ఇక్కడికి అక్కడికి తేడా ఏమిటంటే ఇక్కడ అనేకమైన శోధనలు భాధలు శ్రమలు అనుభవిస్తూ దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు! అక్కడైతే శోధన బాధలు రోదన వేదనలు ఏమీ లేకుడా అనుదినము ఆయన ముఖదర్శనం చేస్తూ పరవశించిపోతూ ఆయన సేవ చేస్తారు అన్నమాట! ఇప్పుడు వారికి ఏ అలసట ఉండదు!ఎందుకంటే దేవుడే వారి కన్నుల నుండి వారి కన్నీటి బిందువులను తుడిచివేశారు!

 

మరొక విషయం ఏమిటంటే: అనుదినము ఆయన ముఖ దర్శనం చేస్తారు! మోషేగారు ఆయన ముఖాన్ని చూడాలని ఎంతగానో ఆశించారు గాని చూడలేక వీపు వెనుక బాగాన్ని మాత్రం చూడగలిగారు!

నిర్గమ ౩౩:20, 23

అయితే ఇక్కడ ఆయన దాసులు నిరంతరమూ చూస్తూ ఉంటారు!

మత్తయి 5:8

హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

 

1కొరింథీ 13:12

ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

 

యెషయా ౩౩:17

అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును.

 

ఇక వారి నొసల్లమీద దేవునిపేరు ఉంటుంది. దీనికోసం గతంలో చెప్పడం జరిగింది. పూర్వకాలంలో బానిస వ్యవస్థ పనిచేసేటప్పుడు తమ సొంత బానిసలకు దాసుల మీద యజమాని యొక్క పేరు రాసేవారు! అనగా ఈ దాసుడు ఫలాని యజమాని యొక్క సొత్తు అని! అప్పుడు ఈ దాసుడు మరలా ఆ సొంత యజమాని దగ్గరకు వెళ్ళవలసిందే! ఇప్పుడు దేవుని ప్రజలందరూ దేవుని దాసులు! కాబట్టి మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలము కాబట్టి ఆయన స్వాస్త్యమునకు ఆయన పేరు రాసిపెట్టుకున్నారు అన్నమాట! ఈ వ్యక్తి నావాడు! నా స్వాస్త్యము అని!

 

ఇంకా సీయోను కొండమీద ఉన్న 144౦౦౦ మందికి కూడా ఇలాగే నొసల్లమీద పేరు రాసి ఉంది!

 

ఇక 5వ వచనంలో రాత్రి అనేది ఏమీ ఉండదు కారణం ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు లేక వారిమీద ప్రకాశిస్తారు! కాబట్టి వారికి దీపకాంతి అక్కరలేదు! సూర్యుని కాంతి అక్కరలేదు! అయ్యా అక్కడ మనకు కరెంట్ బిల్లు ఉండదు! కారణం లైట్లు ఫాన్స్, ACలు అక్కరలేదుదీనినే 21:2325 లో కూడా చెప్పడం జరిగింది.

Revelation(ప్రకటన గ్రంథము) 21:23,24,25

 

23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

24. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొని వత్తురు.

25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.

 

ఇక వారు యుగయుగాలు శాశ్వతంగా రాజ్యపాలన చేస్తారు! ఇది వారి సేవలో పరిచర్యలో ఒక భాగం అన్నమాట! అనగా వెయ్యేండ్ల పాలనతో ఇక్కడ వారి పరిపాలన ముగియడం లేదు! క్రీస్తుతో పాటుగా మొదటగా వెయ్యేండ్ల పాలన మరియు రెండవదిగా యుగయుగాలు పరిపాలన చేస్తారు! ఇప్పుడు వారు రాజులే గాని యాజకులు అని రాసి లేదు ఇక్కడ!

 

ఇక్కడ అనుమానం రావచ్చు- ఇంతకీ ఈ పరిశుద్ధులు నిత్యత్వములో ఎవరిని పరిపాలిస్తారు?

అయ్యా దీనికోసం ఎక్కువగా ఆలోచించవద్దు! BETTER TO STOP WHERE BIBLE STOPS! బైబిల్ దీనికోసం చెప్పడం లేదు కాబట్టి మనము కూడా ఎక్కువగా ఆలోచించవద్దు! పరిపాలన అంటే ఎవరినో కొందరిని పాలించాలి కాబట్టి పాలిస్తాము! బహుశా దేవుడు మరోభూమిని చేసి మానవసృష్టిని కూడా చేయవచ్చు ఏమో! మనకు తెలియదు గాని దేవునితో పాటుగా యుగయుగాలు మాత్రము పరిపాలన చేస్తాము!

 

ప్రియమైన స్నేహితుడా! నీవుకూడా అలా పరిపాలించాలి అంటే పరిశుద్ధమైన జీవితం కావాలి! మరినీవు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నావా?

జయజీవితం కలిగి ఉన్నావా?

*3*

 

 ప్రకటన 22:612

6. మరియు దూత యీలాగు నాతో చెప్పెను మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.

7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

8. యోహానను నేను సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,

9. అతడు వద్దు సుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

10. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెనుఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;

11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, (లేక, చేయును) అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, (లేక, యుండును) నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును)

12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

ప్రియులారా! ఇక ఆరవ వచనం చూసుకుంటే ఆ దూత యోహాను గారితో చెబుతున్నాడు: ఈ మాటలు నమ్మకములును సత్యములునై ఉన్నాయి! ప్రవక్తల ఆత్మలకు దేవుడు త్వరలో సంభవించేవి తన దాసులకు చూపించడానికి తన దూతను పంపెను! అవును దేవుడు తన ఉద్దేశములు చెప్పడానికి జరుగబోయేవి చెప్పడానికి తన దూతలను పంపిస్తూ ఉంటారు! దానియేలు గ్రంధములో అనేకసార్లు జరుగబోయేవి చెప్పడానికి గబ్రియేలు దేవదూతను పంపించారు దానియేలు గారి దగ్గరకు! అలాగే అబ్రాహాము గారి దగ్గరకు, లోతు గారి దగ్గరకు, సంసోను తల్లిదండ్రుల దగ్గరికి, గిద్యోను దగ్గరికి ఇలా ఎంతోమంది దగ్గరకు అయన దూతలు వెళ్లి వర్తమానం చెప్పడం జరిగింది. అందుకే అంటున్నారు దేవుడైన యెహోవా తన భక్తులను చెప్పకుండా ఏ కార్యము చెయ్యరు! ఆమోసు 3: 7

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

 

తన దాసులతో ముందు చెప్పి తర్వాత చేస్తారు! అందుకే ఈ మాటలు సత్యములు నమ్మదగినవి కాబట్టి ఇది చదువుతున్న ప్రియ దేవుని బిడ్డా! ఇది నిజమని నమ్మి విశ్వసించి నీ బ్రతుకును దేవునితో సమాధానపరచుకో!! ప్రకటన 19:9; 21:5

 

ఇక ఏడవ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అంటున్నారు! గైకొనడం అనగా విని/చదివి దాని ప్రకారం నడచుకోవడం! కేవలం చదివి వదిలేస్తే ఉపయోగం లేదు! దాని ప్రకారం జీవిస్తేనే లాభము! గమనించాలి- మొదటి అధ్యాయం 1:౩ లో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, విని , దాని ప్రకారం గైకొనువాడును ధన్యులు అన్నారు!

అయితే ఇక్కడ ఈ చివరకు వచ్చేసరికి- చదువు వాడు, వినువాడు ఎగిరిపోయారు- వారు లేరు, ఎవరైతే చదివి/విని దాని ప్రకారం జీవిస్తారో లేక గైకొంటారో వారు మాత్రమే ధన్యులు!

ప్రియ స్నేహితుడా! నీవు కేవలం వినువాడు వాడవు మాత్రమేనా లేక గైకొనువాడవు కూడానా? ఒకసారి పరిశీలించుకో!

ఈ మాటలు స్వయంగా దేవుడే పలుకుచున్నారు!!

 

ఇక ఇదిగో నేను త్వరగా రాబోవుచున్నాను అంటూ ఈ అధ్యాయంలో రెండుసార్లు దేవుడు చెబుతున్నారు! కాబట్టి ప్రియ దైవజనమా సిద్దంగా ఉండండి! ఆయన రాకడ అతి సమీపముగా ఉంది!

 

ఇక ఈ సంగతులు చెప్పిన తర్వాత యోహాను గారు ఇంతవరకు తనకు విషయాలు బోధించి వివరించిన దూత పాదాలకు సాష్టాంగనమస్కారం చేశారు వెంటనే ఆ దూత అంటున్నాడు: వద్దు సుమీ నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఇంకా ఈ గ్రంధమందున్న వాక్యములను ఎవరైతే గైకొంటారో వారితోనూ సహదాసుడను! నీవు మ్రొక్కాల్సింది ఆరాధించాల్సింది దేవునికే అంటున్నారు!

 

ఇక్కడ రెండు విషయాలు అర్దమవుతున్నాయి మనకు!

 

మొదటిది: ఇంత వృద్ధుడైన యోహాను గారు ఒక పరిశుద్దునికి సాష్టాంగనమస్కారం చేశారు. అలాగే మనం కూడా దేవునికి సాష్టాంగనమస్కారం చెయ్యాలి! మనకు కొంచెం వయస్సు పెరిగితే చాలు ఉపవాసాలు, మోకాళ్ళ ప్రార్ధన మానేసి, నా ముడుకులు సహకరిచడం లేదు, నా వయస్సు సహకరించడం లేదు అంటూ సాకులు చెబుతున్నాము! గాని యోహాను దేవుడు నిజంగా ఎవరో ఆయనను తెలుసుకున్నారు కాబట్టి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో అలాగే ఆయనకు చెందవలసిన ఆరాధన భయభక్తులు ఆయనకు చెల్లిస్తున్నారు. కాబట్టి మనము కూడా యోహాను గారిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలి!

 

రెండవది: ఒక దూతయై ఉండి కూడా తనకు మెప్పు గాని గౌరవం గాని నమస్కారాలు గాని కోరుకోవడం లేదు! నేడు అనేకమంది దైవసేవకులు తమ పేర్లు ముందు రెవరెండ్లు ఇరవైరెండ్లు పెట్టుకుని దేవునికి చెందవలసిన బిరుదులు దొంగిలిస్తున్నారు. ఇంకా ప్రత్యేకమైన మర్యాదలు AC రూమ్లు లేకపోతే అలిగి వెళ్ళిపోతున్నారు! ఇది దేవుని సేవకులకు తగదు! తననుతాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇక్కడ తనను తను హెచ్చించుకున్నవాడు ఇక్కడ తగ్గించబడతాడో ఏమో గాని అక్కడ మాత్రం తగ్గించబడతాడు!! అక్కడ నీ దగ్గర నీ మందిరంలో టాయిలెట్లు కడిగిన విశ్వాసి వెయ్యేండ్ల పాలనలో ఏ మంత్రి పదవిలోనో ఉంటుంది నీవైతే ఏ సిపాయిగానో ఉంటావు జాగ్రత్త!

 

కాబట్టి దేవునికి చెందాల్సిన మహిమ ఘనతలు దేవునికే ఇద్దాం!

 

ఇంకా అ దూత అంటున్నాడు ఈగ్రంధమందు వ్రాసిన ప్రవచన వాక్యాలకు ముద్ర వేయవద్దు! అనగా దేనినీ దాచి ఉంచకు! అందరూ తెలుసుకోనీయ్! తెలుసుకొని మార్పు చెందనీయమని బహుశా దూత ఉద్దేశ్యం! అందుకే యోహాను వ్రాసి ఉంచారు ఈ గ్రంధాన్ని! అప్పటినుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఈ గ్రంధాన్ని చదివి భయపడి దేవునికి వణికి రాకడకు సిద్ధపడుతున్నారు! ఇది చదువుచున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవునికి భయపడి ఆయన రాకడకు సిద్దపడు!

 

ఇక 11వ వచనంలో అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగా ఉండనీయు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము! పరిశుద్ధుడు ఇంకా పరిశుద్దుడుగా ఉండనిమ్ము! ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాని క్రియలు చొప్పున అనగా అపవిత్రునికి వాని అపవిత్రత కొద్ది, అన్యాయస్తునికి వానికి అన్యాయఫలం, నీతిమంతునికి వాని నీతిమంతుని ఫలము, పరిశుద్దునికి తగిన పరిశుద్ధఫలములను నేను తీసుకుని వస్తున్నాను అంటున్నారు!

 

కాబట్టి నేడు ఇదే హెచ్చరిక దేవుడు మనకు కూడా చేస్తున్నారు! ఒకవేళ అన్యాయం చేస్తున్నావా? చేయు, అపవిత్రంగా జీవిస్తున్నావా? జీవించు! చెప్పడం మన భాద్యత! వినకపోతే వారి ఖర్మ అంతే!

 ప్రసంగి 11:9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము;

 

 అప్పటినుండి ఇప్పటివరకు దీనిని చదివిన వారు మార్పుచెందారు! లక్షలమంది చదివినా మార్పు చెందకుండా నరకానికి పోతున్నారు! ఈ విషయం మందిరాలలో సువార్త సభలలో అనేకచోట్ల భోదించుచున్నారు! ఈ రోజు నాలాంటి సేవకులు కూడా వాట్సప్ ఫేస్బుక్ లాంటి మాధ్యమాల ద్వారా చెబుతూ రాస్తూ ఉన్నారు! వింటే బాగుపడతారు! లేకపోతే నాశనానికి పోతారు! ఎవరి నాశనమునకు వారే భాధ్యులు! మా భాద్యతను మేము నిర్వర్తిస్తున్నాము! వింటే దీవెనలు మరియు పరలోకరాజ్యము! వినకపోతే నరకము మరియు నిత్యాగ్ని గుండము!

ఏదికావాలో నిర్ణయించుకో!

దైవాశీస్సులు!

*4*

 

 ప్రకటన 22:1—21

13. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.

14. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకు కొనువారు ధన్యులు.

15. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

16. సంఘములకోసము (మూలభాషలో సంఘములమీద) సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.

17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

18. గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

19. ఎవడైనను ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

20. సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

21. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు (కొన్ని ప్రాచీన ప్రతులలో, పరిశుద్ధులకందరికి అని పాఠాంతరము) తోడై యుండును గాక. ఆమేన్‌.

 

ఇక 13వ వచనంలో నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అంటున్నారు!

 

దీనికోసం మొదటిబాగాలలో చెప్పడం జరిగింది. ఆల్ఫా అనగా గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా! అర్దము మొదటివాడను చివరి వాడను! ఇదే చెబుతున్నారు! మొదటివాడు అనగా సృష్టికర్త మరియు కడపటి వాడు అనగా లయకర్త! కాబట్టి దేవునికి భయపడి ఉండాలి!

 

ఇంకా జీవ వృక్షమునకు హక్కుగలవారై గుమ్మాలగుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు అంటున్నారు!

జాగ్రత్తగా గమనిస్తే గుమ్మాలగుండా అనగా దేవుడు చెప్పిన శ్రమలమార్గంలోనే పరలోకం వెళ్తాము తప్ప మరోదారి మరో షార్ట్ కట్ లేదు. కేవలం యేసుప్రభుని నమ్ముకుంటే చాలదు. సాక్షార్ధమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధ జీవితం జీవిస్తూ శ్రమలను అనుభవిస్తూ సాగిపోతేనే పరలోకం!

 అనగా ఎవరైతే తమ ఘటములకు ఇహలోక మాలిన్యము అంటకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారో వారు మొదటగా జీవ వృక్ష ఫలములకు హక్కుదారులు అవుతారు. రెండవదిగా ఆ పరిశుద్ధ పట్టణములో అనగా ఆ నూతన యేరూషలేము పట్టణములో ఆ పరిశుద్దుల మధ్యలో తిరుగుతూ ఆ జీవజలనది నీరు త్రాగుతూ నిత్యమూ దూతల మధ్య దేవునిని స్తుతిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు! అలా జీవించాలి అంటే నీ వస్త్రములు ఉదుకు కోవాలి!

దేనితో ఉదుకుకోవాలి? ఆయన రక్తము అనగా గొర్రెపిల్ల రక్తములో నీ వస్త్రములు ఉదుకుకుని నీ పాపములను కడుగుకుని పరిశుద్ధంగా జీవించాలి!

1యోహాను 1: 7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

ప్రకటన 7:14

అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.

 

కేవలం క్రీస్తురక్తము ద్వారానే జీవ వ్రక్షానికి మరియు జీవజలమునకు, నూతన యెరూషలేముకు చేరగలము! మరినీవు కడుగుకుని నీవస్త్రాన్ని ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకుంటున్నావా?

 

ఇక 15వ వచనంలో ఒక గుంపు ఉంది వీరు పరలోకానికి వెళ్ళరు! వీరు ఎవరంటే కుక్కలు- అనగా నిజమైన కుక్కలు కాదండి. పరలోకం చేసింది జంతువులూ కోసం కాదు! మానవుల కోసం! జంతువులు మానవులకోసం చేశారు దేవుడు! దీనిఅర్ధం ఏమిటంటే కుక్కలాంటి స్వభావం గలవారు!

2పేతురు 2: 22

కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

 

మాటిమాటికి తప్పిపోయేవారు అని అర్ధం!

 

మాంత్రికులు మంత్రం విద్య చేసేవారు, చెడుపులు చిల్లంగులు పెట్టేవారు సోదే చెప్పేవారు, ఇలాంటి వారు ఎవరు పరలోకం వెళ్ళరు! వారిని ఆశ్రయించేవారు కూడా పరలోకం చేరరు!

 

వ్యభిచారులు: వీరికోసం మొదటినుండి చెప్పడం జరుగుతుంది- ఏ రకమైన వ్యభిచారులు కూడా పరలోకం చేరరు!

 

నరహంతకులు: మనుష్యులను హత్య చేసేవారు! యోహాను గారు అంటున్నారు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు...

1యోహాను 3: 15

తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

 

విగ్రహారాదికులు: ఏ రకమైన విగ్రహారాధన చేసినా నీవు నరకం పోతావు! చివరకు నీ మెడలో సిలువ ఉన్నా , నీ ఉంగరంలో సిలువ గుర్తు ఉన్నా నరకానికి పోతావుఇంకా దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా, దేవునికి ప్రధమ స్థానం ఇవ్వకుండా మరోదానికి నీ ప్రధమ స్థానం ఇస్తే నరకం పోతావు!

 

అబద్దాని ప్రేమించి జరిగించినా నరకానికి పోతావు!

 

16వ వచనంలో దేవుడు అంటున్నారు- సంఘాలను ప్రేమించి ఈ సంగతులు ముందుగానే మీకు చెప్పడానికి నా కుమారుడు మరియు యేసు అనే నా సేవకుని పంపించి ముందుగా తెలిపిఉన్నాను! నేను దావీదుకు వేరు మరియు చిగురు మరియు అతని సంతానమునై ఉన్నాను. ఇంకా ప్రకాశమానమైన చుక్క లేక నక్షత్రమునై ఉన్నాను అంటునారు! దీనికోసం విస్తారంగా మాట్లాడుకున్నాము గనుక ముందుకు పోదాం! ప్రకటన 5:5; మత్తయి 1:1; రోమా 1:; యెషయా 11:10; కీర్తన 110:1;

 

ఇక 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమారుడు రమ్ము అని చెబుతున్నారు! వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను అంటున్నారు! దీనికోసం గతంలో వివరించడం జరిగింది.

ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని ఎందుకు చెబుతున్నారు అంటే: ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు దినమునుండి ఇంతవరకు భూమిమీదనే ఉండిపోయారు! మొదటగా ఆదరణ కర్తగా, దేవుని విషయాలు మనము సంపూర్ణంగా అర్ధం చేసుకోడానికి, మనలను కొన్ని విషయాలలో ఒప్పిస్తూ మన తరుపున ప్రార్ధిస్తూ, క్రీస్తు విరోధిని రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు! ఎప్పుడైతే యేసయ్య తన రాకడలో వస్తారో సంఘముతో పాటుగా పరిశుద్దాత్ముడు కూడా ఎత్తబడతాడు! అందుకే పరిశుద్ధాత్ముడు రమ్ము అని చెబుతున్నాడు!

 

సంఘము శ్రమల అలలలో కన్నీటి తావులలో ప్రయాణం చేస్తూ ఆయన రాకడకోసం ఎదురు చూస్తూ ఉంది! ఒక్కసారి ఆయన వస్తే ఈ భాధలు శ్రమలు శోధనలు ఉండవు అందుకే పెండ్లి కుమార్తె అనబడే సంఘము రమ్ము అని చెబుతుంది ఇది చదువుతున్న నీవు కూడా రమ్ము అని చెప్పాలి! రమ్ము అని చెప్పే స్థితిలో ఎత్తబడే స్థితిలో నీవున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో!

 

ఇక తర్వాత వచనంలో యోహాను గారు ఒక హెచ్చరిక చేస్తున్నారు: ఈ గ్రంధమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములకు ఏమైనా కలిపితే ఈ గ్రంధములో వ్రాయబడిన తెగుళ్ళు అన్ని వానికి వస్తాయి! ఏదైనా తీసివేస్తే వానికి జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణమైన నూతన యేరూషలేము లోను వానికి పాలుపొందులు లేకుండా దేవుడు చేస్తారు అని హెచ్చరిస్తున్నారు!

 

ఇది నిజంగా చాలా కఠినమైన హెచ్చరిక!మరియు ప్రధాన మైన హెచ్చరిక! కారణం ఈ బైబిల్ గ్రంధము అంతటిలోను ఈ గ్రంధము ఎంతో ప్రాముఖ్యమైన గ్రంధం ప్రధానమైన గ్రంధము! దీనిలో ఉన్నది ఉన్నట్లు తీసుకోవాలి గాని మనకు అనుకూలంగా మార్చుకోగూడదు! ఈ సత్యాన్ని గ్రహించి మార్పునొందాలి అందుకే ఇంత నొక్కివక్కానించి చెబుతున్నారు యోహాను గారు! అలాగే ముద్రిస్తున్న వారు కూడా ఈ ప్రవచన వాక్య అర్ధములు మార్చకూడదు! తెలుగులో కొన్ని వచనాల అర్ధములు మార్చి చేశారు. ముఖ్యంగా రాజులుగాను యాజకులు గాను చేసారు అంటే రాజ్యము గాను యాజకులు గాను చేశావు అని అనువదించారు! ఇలాంటి వారికి శాపం అంటున్నారు! మనము కూడా ఈ ప్రవచన వాక్యములకు ఏమీ కలుపకూడదు ఏమీ తీసివేయకూడదు!

 

ఇక తర్వాత వెంటనే దేవుడు అంటున్నారు: ఈ సంగతులు గూర్చి సాక్ష్యమిచ్చువాడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: అవును నేను త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నారు! ఆమెన్! వెంటనే యోహాను గారు అన్నారు: ఆమెన్!

ఆమెన్ ప్రభువైన యేసయ్యా తొందరగా రండి! అన్నారు! మనము కూడా ఇలాగే చెప్పే స్తితిలో ఉండాలి!

 

అవును యేసుక్రీస్తుప్రభులవారు అతి త్వరగా రాబోవుచున్నారు! మరి నీవు సిద్ధంగా ఉన్నావా ప్రియసహోదరి సహోదరుడా! నీ బ్రతుకు దేవుని ఎదుట సరిగా ఉందా? స్ముర్ణ ఫిలడెల్ఫియ సంఘము వలే సెహబాస్ అనిపించుకునే స్థితిలో ఉన్నావా లేక లవొదొకయ సంఘమువలె ఉమ్మివేయించుకునే స్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్నునీవు పరిశీలించుకోమని చేతులెత్తి మనవిచేస్తున్నాను!

దేవుడు అతి త్వరగా రాబోవుచున్నారు! దానికోసమే ఆయన నీకోసం తన ప్రాణం పెట్టి, ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ఏర్పరచుకుని తవ వారిగా చేసుకున్నారు! మరినీవు దానికి తగిన జీవితం జీవిస్తున్నావా? నీ బ్రతుకును నీ ఘటమును ఇహలోక మాలిన్యము అనగా పాపము అంటకుండా చూసుకుంటున్నావా? గమనించాలి నిశిద్ధమైనది అబద్దమైనది అపవిత్రమైనవి ఆ రాజ్యములో ప్రవేశించవు!! నీలో ఏమాత్రము పాపమున్నా నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటావు!

అనుదినము ఆయన వాక్యముతో కడుగబడుతున్నావా? ఆయన ఆత్మతో నింపబడి పరిశుద్ధ పరచబడుతున్నావా? లేకపోతే నేడే, ఇప్పుడే పశ్చాత్తాప పడి ఆయన దగ్గర క్షమాపణ వేడుకుని ఆత్మను పొందుకుని ఆయనతో సమాధాన పడు! ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించు!

 

ప్రియులారా! ఈ ప్రత్యక్షతల గ్రంధ శీర్షికలో నేను ఉపయోగించిన భాష కొంతమందిని నొప్పించి ఉంటుంది, గాని మిమ్మల్ని నొప్పించాలని నా ఉద్దేశం కానేకాదు! మీరంతా నాతోపాటుగా పరలోకం చేరాలని నా తాపత్రయం. నిజానికి నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను! మీరు కూడా పవిత్రమైన జీవితం జీవించి ఆ పవిత్రుడైన యేసయ్యను ఎదుర్కోడానికి ఆ పరిశుద్దుల విందులో, ఆ శ్రేష్ఠుల సమూహములో పాల్గోడానికి రావాలని నా ఆశ! ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనమందరం ఆయన రాకడలో ఎత్తబడుడుము గాక! అక్కడ పాత నిబంధన భక్తులను క్రొత్త నిబంధన భక్తులను ముఖ్యంగా మన ప్రాణ నాధుడైన ప్రియ రక్షకుడైన యేసయ్యను, కోట్లాదిమంది  దూతలను, కెరూబులను సెరాపులను చూసే భాగ్యం ఇది చదువుతున్న ప్రతీ ఒక్కరికి దేవుడు దయచేయును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

ప్రభువైన యేసూ రమ్ము!!!

దైవాశీస్సులు!

(సమాప్తం)

 

మరోసారి చెబుతున్నాను: ఇలాగే జరుగుతుంది అని నేను చెప్పడం లేదు. నాకు అర్ధమయ్యింది, నేను నేర్చుకున్నది మాత్రమే రాయడం జరిగింది. ఇది వాక్యానుసారంగా ఉంటే తీసుకోండి లేకపోతే వదిలెయ్యండి!

*****************************************

ప్రియదైవజనమా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు! ఈ ప్రకటన గ్రంధము లేక ప్రవచన గ్రంధము కోసం ధ్యానం రాయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు! కారణం నాకు అంతటి అభిషేకం లేదు, నేను వేదాంత పండితుడను కానేకాదు! అయితే ఏడు సంఘములు కోసం రాద్దామని అనుకుంటూ ఉండగా ప్రభువు నన్ను ప్రేరేపించగా  ఇది వ్రాయడం జరిగిందిఒక విషయం చెప్పనీయండి! దీని రాద్దామని అనుకుంటూ ఉండగా మొదలుపెట్టిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్ధం కాలేదు! అయితే ఎవరినైనా అడుగుదాం అంటే నేను ప్రస్తుతం ఉన్న ఈ షిప్ యొక్క  ప్రోగ్రాము ఎలాంటిది అంటే సముద్రంలోనికి వచ్చాక సుమారు 90రోజుల వరకు ఇక ఏ ఓడరేవు దర్శించకుండా సముద్రంలోనే గడపాలి. అలా నేను ఈ జైలులాంటి షిప్ లో బంధించబడ్డాను. 90రోజులు ఎవరితోనూ సంభాషించే అవకాశం లేదు! నాకు అర్ధం కానివి ఎవరితోనైనా డిస్కస్ చెయ్యాలి అంటే అవకాశం లేదు! నాకు అర్ధం కానివాటికోసం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు! నాదగ్గర ఉన్నవి నా బైబిల్ మరియు రిఫరెన్సు బైబిల్! ఇలా కొన్ని రోజులు ఆగిపోయాను. ముఖ్యంగా ఏడు సంఘాల వర్తమానాలు రాసిన తర్వాత!అప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కాక దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్ధించాను! ఏడ్చాను! ప్రభువా నాకు దయచేసి వీటి అర్ధం భోదించమని! అప్పుడు కొన్ని రోజుల తర్వాత దేవుడు నా హృదయాన్ని తెరిచారు! గ్రహించే శక్తి ఇచ్చారు! దాని తర్వాతనే ఇది సంపూర్తిగా రాయడం జరిగింది. దయచేసి నా బాషను నన్ను క్షమించండి. ఆ బాష ఉపయోగించక పోతే ఈ గ్రంథములోని అర్ధము మీకు సంపూర్తిగా చేరాడు అర్ధం కాదని భావించి కొంచెం పరుషముగా రాయడం జరిగింది.

దయచేసి నాకోసం ప్రార్ధన చెయ్యండి! ఈ మధ్య దేవుడు నాకు 5000 మంది ఆత్మలను ఇస్తాను అని వాగ్ధానం చేసారు. అయితే దానికి ముందుగా నిన్ను శ్రమల అలలలో గుండా తీసుకుని వెళ్తాను అని చెప్పి నన్ను ఆ శ్రమల గుండా తీసుకుని పోతున్నారు! కాబట్టి నాకోసం, ఉద్యోగం కోసం, మా పరిచర్యల కోసం, మా సంఘాల కోసం ప్రార్ధన చెయ్యండి! మరో వర్తమానంతో మళ్ళీ కలుస్కుందాం!

దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి తన రాజ్యవారసులుగా చేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

ఇట్లు

ప్రభువు ప్రేమతో

మీ ఆత్మీయ సహోదరుడు

రాజకుమార్.దోనె!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పక్షిరాజు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు