యధార్ధవంతుడైన యోబు పార్ట్-2 (91-154)
*యధార్ధవంతుడైన యోబు*
*91వ భాగం*
యోబు 24:1— 7
1 సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు...
ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి
మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
3 తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును
తాకట్టుగా తీసికొందురు
4 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించి వేయుదురు
దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
5 అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద
బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
6 పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో
పరిగ ఏరుదురు.
7 బట్టలులేక రాత్రి అంతయు పండుకొని యుందురు చలిలో వస్త్రహీనులై
పడియుందురు.
ప్రియులారా! ఇక ఈ 24వ అధ్యాయంలో కూడా యోబుగారు మాట్లాడుచున్నారు. అయితే ఈ అధ్యాయంలో పేదలకు దిక్కులేనివారికి
జరుగుతున్న అన్యాయాలు ఏకరువు పెడుతూ వారిని కూడా పుట్టించింది మీరే కదా ఇది ఎందుకు
జరుగుతుంది అంటూ బాధ పడుతున్నారు! ఇంకా కొన్ని కొన్ని గుంపులు
చూపించి జరుగుతున్న అన్యాయాలు ఏకరువు పెడుతున్నారు!
మొదట
వచనంలో 1
సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు... ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను
ఎందుచేత చూడకున్నారు? అని అడుగుచున్నారు!
దీని
అర్ధం భూమిమీద కనిపించే న్యాయాన్నీ అన్యాయాన్నీ సవరించేందుకు ఒక ఖచ్చితమైన సమయాన్నీ, న్యాయవంతులను విడిపించి
దుర్మార్గులను శిక్షించేందుకు ఒక కాలాన్నీ దేవుడు ఎందువల్ల నిర్ణయించి నియమించడం లేదో యోబుగారికి అర్థం కాలేదు.
ఇక
తర్వాత వచనాలలో లోకంలో జరిగే కొన్ని అక్రమాల కోసం చెబుతున్నారు
2 సరిహద్దు రాళ్లను
తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
3 తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును
తాకట్టుగా తీసికొందురు
4 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించి వేయుదురు
దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
గమనించాలి
మీద వివరించినవన్నీ తీర్పుకు పాత్రమైనవే! గాని దేవుడు పట్టించుకోవడం లేదు అంటున్నారు!
నిజానికి ఈ నేరాలు అన్నీ ధర్మశాస్త్రమునకు వాక్యమునకు విరుద్ధమైనవే!
ద్వితీ 19:14, 17:17; సామెతలు 23: ఈ రిఫరెన్సులు ప్రకారం సరిహద్దు రాళ్ళను
మార్చకూడదు అలా చేస్తే శిక్షార్హులు!
ఇక
అనాదలకోసం ద్వితీ 24:6,
10—13, 17—21 ప్రకారం అనాదలకు అన్యాయం చేస్తే శిక్షార్హులు!
దేశములోని
బీదలను ఆదుకోవాలి- అలా చేస్తే మీ దేశంలో బీదలే లేకుండా చేస్తాను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబితే
బీదల ఆస్తిని ఆహారాన్ని లాక్కుంటున్నారు ఇది కూడా నేరమే! ధర్మశాస్త్రమునకు
విరుద్ధమే కదా! మరి దేవుడు ఎందుకు పట్టించుకోవడం లేదు అని యోబుగారి
ఆవేదన!
ఇక
తర్వాత వచనంలో పేదలు బీదవారు అనుభవిస్తున్న కష్టాలు కడగల్లు కోసం చెబుతున్నారు
5 అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు
ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
6 పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు
దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.
7 బట్టలులేక రాత్రి అంతయు పండుకొని యుందురు
చలిలో వస్త్రహీనులై పడియుందురు. ఇంత కఠినమైన దుర్భరమైన జీవితం
పేదలు జీవిస్తున్నారు అంటున్నారు
8 పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున
బండను కౌగలించుకొందురు.
9 తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు
కలరు వారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
10 దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు
ఆకలిగొని పనలను మోయుదురు.
11 వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగ
లను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై యుందురు.
12 జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచ బడినవారు
మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
చూడండి తాను చూస్తున్న అన్యాయాలు ఎంతగా వర్ణిస్తున్నారో. నిజానికి
అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది.
దుష్టుల కాలి మడిమ క్రింద దిక్కులేనివారు నలిగిపోతారు. అయినప్పటికీ
దీని విషయం దేవుడేమీ పట్టించుకోడని యోబుగారి అభిప్రాయం (12 వ). దుష్టులను న్యాయస్థానం ఎదుటికి తెచ్చేందుకు ఆయన ఒక
సమయాన్ని నియమించలేదు. వారు హింస, దౌర్జన్యం
చేస్తూ సాగిపోయేందుకు వారిని స్వేచ్ఛగా వదిలేశాడు. అమాయకులైన
పేద ప్రజలను బాధలు పడుతూ మూలుగుతూ ఉండనిస్తున్నాడు. ఇవి వాస్తవిక
విషయాలు. వాటిని తన స్నేహితులు కాదనగలరా? అయితే దేవుడు ప్రతీకారం చేసే విధానం
గురించి వారి సిద్ధాంతానికి ఇది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దీన్ని గ్రహించకుండా వారు
కళ్ళు మూసుకుంటున్నారు (మన సిద్ధాంతాలకూ, జరుగుతున్న సత్యాలకూ పొసగకపోతే మన సిద్ధాంతాలను మార్చుకునే సమయం వచ్చిందన్నమాట).
యోబుగారైతే “న్యాయమెక్కడుంది? ఈ లోకంలో న్యాయం కోసం వెదకడం వ్యర్థం”
అని ఆక్రోశిస్తున్నాడు.
మరణం తరువాత రాబోయే లోకంలో న్యాయం తీర్చడం జరుగుతుందని యోబు గ్రహించలేదు.
అయితే దేవుడు అన్యాయం చేయరు- దేవుని
ప్రణాళికలు మనకు అర్ధం కావు! అయితే నేటి రోజులలో కూడా ఇదే అన్యాయం
జరుగుతున్నా గాని ఇప్పుడైతే మనకు ఒక ఆశాకిరణం దేవుడు! ఆయనను ఆశ్రయిస్తే-
ఆయనను శరణు వేడితే ఆయన రెక్కల నీడకు వస్తే తప్పకుండా మనకు విజయము ఆశీర్వాదం
కలుగుతుంది!
అన్యురాలైన రూతుగారితో భక్తుడైన బోయజు గారు అంటున్నారు రూతు
గ్రంధంలో 2: 11 నీవు నీ తల్లి దండ్రులను నీ జన్మభూమిని
విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.
12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును;
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు
వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమె కుత్తరమిచ్చెను.
ఒకసారి
మొదటి కోరింథీ పత్రిక చూసుకుంటే పౌలుగారు ఆత్మావేశంతో రాస్తున్నారు
1: 26 సహోదరులారా,
మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని
జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను
అనేకులు పిలువబడలేదు గాని
27 ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
28 జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని
దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో
బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
29 ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని,
తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు
ఏర్పరచుకొని యున్నాడు.
30 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది
నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
కాబట్టి
ఇప్పుడైతే దేవుడు దిక్కులేని వారిని వెర్రివారిని అనాదలను పేదలను బలహీనమైనవారిని తృణీకరించబడిన
మనలను ఎన్నికలేని మనలను దేవుడు ఏర్పరచుకున్నారు- తనకొరకు పిలుచు కున్నారు- నీవు ఆయన వద్దకు వచ్చి ఆయన శరణు వేడుకుంటే నిన్ను తన కుమారునిగా కుమార్తెగా
చేసుకోడానికి ఆయన ఇష్టపడుతున్నారు!
మరినీవు
సిద్దమా?
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*92వ భాగం*
యోబు 24:13—17
13 వెలుగుమీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను
గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు.
14 తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను
లేమిగలవారిని చంపును రాత్రియందు వాడు దొంగతనము చేయును.
15 వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు
ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.
16 చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు
వెలుగు చూడనొల్లరు
17 వారందరు ఉదయమును మరణాంధకారముగాఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి
తెలిసియున్నది.
ప్రియులారా! ఇక ఈ 24వ అధ్యాయంలో కూడా యోబుగారు మాట్లాడుచున్నారు. అయితే ఈ అధ్యాయంలో పేదలకు దిక్కులేనివారికి
జరుగుతున్న అన్యాయాలు ఏకరువు పెడుతూ వారిని కూడా పుట్టించింది మీరే కదా ఇది ఎందుకు
జరుగుతుంది అంటూ బాధ పడుతున్నారు! ఇంకా కొన్ని కొన్ని గుంపులు
చూపించి జరుగుతున్న అన్యాయాలు ఏకరువు పెడుతున్నారు!
ఈ వచనాలలో ఒక బ్యాచ్ ఉంది. వెలుగుమీద తిరుగబడిన వారు అంటున్నారు
యోబుగారు! వీరికి వెలుగు అంటే భయము అని కూడా చెబుతున్నారు!
వీరు ఎవరు అంటే మొదటగా నరహంతకులు- అనగా మనుష్యులను
నిర్ధాక్షిణ్యంగా చంపేవారు. వీరు రాత్రి పూటే ఎక్కువగా చేస్తారు!
రెండవది: రాత్రిపూట ఇంటికి కన్నము వేసే దొంగలు!
వీరికి కూడా రాత్రిపూట అందరూ
నిద్రపోయాక దొంగతనము చేయడానికి యిష్టము! ఇక రాత్రిపూట ఆ ఇంటిలో
ఎవరూ లేకపోతే వారికి పండుగే!
మూడవదిగా: రాత్రిపూట వ్యభిచారి- భాష జాగ్రత్తగా గమనించాలి- రాత్రిపూట డబ్బులు కోసం ఒళ్ళు
అమ్ముకుని జీవనం సాగించే వేశ్యలకోసం ఇక్కడ భక్తుడు మాట్లాడటం లేదు అని నా ఉద్దేశం!
ఎందుకంటే స్టడీ బైబిల్ చూసుకున్నా, ఇంగ్లీష్ బైబిల్
చూసుకున్నా- వారికోసం చెప్పబడలేదు. మన తెలుగు బైబిల్ లో పురుషుడో స్త్రీయో
చెప్పబడలేదు గాని, ఇంగ్లీష్ బైబిల్ లో మరియు స్టడీ బైబిల్ లో
వ్యభిచారి మసక చీకట్లు ఎప్పుడు వస్తాయి అని వ్యభిచారి ఎదురుచూస్తాడు అని ఉంది.
అనగా పురుషుడు- ఈ పనికిమాలిన వాడికి అందమైన భార్య
ఇంట్లో ఉన్నా గాని బయట ఎవర్తనో చూశాడు, ఆ పనికిమాలిన స్త్రీకి
కూడా బహుశా పెళ్లి అయిపోయే ఉంటుంది. గాని వీడు తన భార్యతో సంసారం
చేయకుండా ఆ పనికిమాలినది మూతికి రంగు ముక్కుకి రంగు సగం సగం బట్టలు వేసుకుని వీడిని
ఆకర్షించింది అని రాత్రిపూట సందె చీకటి అయ్యాక ఆ స్త్రీ దగ్గరకు వెళతాడు. వీడికి చీకటీయే కావాలి!
ఇక సామెతలు 7 వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది.
6 నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను
7 యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
8 సందెవేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
9 వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను
దాని యింటిమార్గమున నడుచుచుండెను.
10 అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని
ఎదుర్కొన వచ్చెను.
11 అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా
తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
12 ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును.
ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
13 అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన
ముఖము పెట్టుకొని యిట్లనెను
14 సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు
చెల్లించియున్నాను
15 కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని
బయలుదేరగా నీవేకనబడితివి
16 నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల
నారదుప్పట్లను నేను పరచియున్నాను.
17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
18 ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత
చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
19 పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
20 అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
21 అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను
పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
22 వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి
పోవునట్లును
23 తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును
వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
ఇక్కడ
ఈ భాగంలో ఈ బుద్దిలేని పడచువాడు వేశ్య దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని పాడుచేసుకున్నాడు! అయితే వాడికి అర్ధం కానిది
ఏమిటంటే
26 అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
27 దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
Sex without license also called as
adultery. అనగా అనుమతి లేని సెక్స్ వ్యభిచారమే! నీకు పెళ్లి కాకుండా అమ్మాయితో గాని స్త్రీతో గాని కలిస్తే అది వ్యభిచారమే-
నీ భర్త/భార్యతో కాకుండా మరొక స్త్రీ/పురుషునితో కలిస్తే అది వ్యభిచారం! దీనిని దేవుడు అంగీకరించడు.
వీరు తమ చేతులతో తామే పాతాళమునకు పోతున్నారు! ఎందుకంటే
1 కోరింథీ 6:18 లో అంటున్నారు పౌలుగారు
16 వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా?
వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు
ఆయనతో ఏకాత్మయై యున్నాడు.
18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి.
మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము
చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
అయితే
పౌలుగారు వీరంతా వెలుగుకి విరోధులు అంటున్నారు! దుర్మార్గులను “చీకటి జనం”
అని వర్ణిస్తున్నాడు యోబు
యోహాను 3:19-21, ; 19 ఆ తీర్పు ఇదే;
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు
వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును,
తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు
రాడు.
21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని
ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును
ఎఫెసీయులకు 5:8-12,
8 మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
9 వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు,
వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి
11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.
12 ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు
పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
కాబట్టి
ఇలాంటి చీకటి పనులు చేసేవారు శిక్షార్హులు అని యోబుగారు అంటున్నారు/ అయితే వీరు ఇలాంటి పనులు
చేస్తున్నా దేవుడు ఎందుకు చూచి చూడనట్లు వదిలేస్తున్నారు అని యోబుగారు బాధపడుతున్నారు.
అయితే సామెతలు 29:1 లో ఎన్నిమారులు గద్ధించినా
విననివాడు మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమైపోతాడు అని సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడే నీ జారత్వము, దొంగతనము దుష్టత్వము తొలగించుకో!
దేవుని
శిక్ష తప్పించుకో!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*93వ భాగం*
యోబు 24:18—25
18 జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు వారి స్వాస్థ్యము
భూమిమీద శాపగ్రస్తము ద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.
19 అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు
పాతాళము పాపము చేసినవారిని పట్టుకొనును.
20 కన్నగర్భము వారిని మరచును, పురుగు
వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడును జ్ఞాపకము లోనికిరారు వృక్షము విరిగి పడిపోవునట్లు
దుర్మార్గులు పడిపోవుదురు
21 వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు
మేలుచేయరు.
22 ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు
ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు
ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
24 వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు వారు హీనస్థితిలో చొచ్చి
ఇతరులందరివలె త్రోయబడుదురు,
పండిన వెన్నులవలె కోయబడుదురు.
25 ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
ప్రియులారా! ఇక ఈ 24వ అధ్యాయంలో కూడా యోబుగారు మాట్లాడుచున్నారు. ఇంకా దుష్టులు దీనులను మోసగించే విధానము
ఇంకా చూడగలము తర్వాత వచనాలలో!
18 జలములమీద
వారు తేలికగా కొట్టుకొని పోవుదురు వారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తము ద్రాక్షతోటల
మార్గమున వారు ఇకను నడువరు.
19 అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు
పాతాళము పాపము చేసినవారిని పట్టుకొనును.
20 కన్నగర్భము వారిని మరచును, పురుగు
వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడును జ్ఞాపకము లోనికిరారు వృక్షము విరిగి పడిపోవునట్లు
దుర్మార్గులు పడిపోవుదురు
21 వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు
మేలుచేయరు.
ఇక్కడ
ఈ వచనాల భావము ఏమిటంటే కాలక్రమేణా దుర్మార్గులు నాశనమౌతారని ఒప్పు కుంటున్నారు యోబుగారు. ఈ ప్రపంచంలో అప్పుడప్పుడూ
దేవుని ప్రతిక్రియ అమలులోకి రావడం కనిపిస్తూ ఉంటుందని కూడా ఒప్పు కుంటున్నారు.
ఇక
తర్వాత వచనాలలో
22 ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడు
కొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల
మీద తన దృష్టి నుంచును
24 వారు హెచ్చింపబడినను కొంతసేపటికి
లేకపోవుదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
ఇక్కడ 22 వ వచనంలో అభిప్రాయ
పడేదేమిటంటే - చాలా సార్లు దేవుడు విపత్కర పరిస్థితుల నుంచి దుష్టులను
కాపాడుతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు యోబు. వారి మరణం కూడా
అందరి మరణంగానే సహజమైన పరిస్థితుల్లో జరుగుతుంది. పక్వమైన ధాన్యాన్ని
ఇచ్చే పంటచేను లాగా వారు సంపూర్ణమైన ఆయువు పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. పౌలుగారి అభిప్రాయమేమిటంటే ఇలాంటి దుష్టులు ఘోరమైన కుక్క చావు చావాలి-
అలాంటప్పుడు మిగిలిన వారికి భయము కలిగి ఇలాంటి ధుష్ట క్రియలు చేయకుండా
భయపడతారు అని అర్ధం! గాని దేవుడు అలా చేయడం లేదు, అందుకే దుర్మార్గులు ఇంకా రెచ్చిపోతున్నారు అని అభిప్రాయ పడుతున్నారు!
ఇక
చివరి వచనంలో అంటున్నారు
25 ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
ఇవి
యథార్థాలని యోబు చెపుతున్నారు. దుర్మార్గులు తమ జీవితాల్లో ఎప్పుడూ శిక్షకు గురౌతుంటారనీ,
న్యాయవంతులకు ప్రతిఫలం కలుగుతూ ఉంటుందనీ యోబు స్నేహితులు చెప్తున్నది
పొరపాటు అని ఇందుమూలంగా యోబు తెలియజేస్తున్నాడు. ఇంకా దుర్మార్గులు
వెంటనే దేవుని శిక్షను అనుభవిస్తారు అనేది కూడా తప్పే, మనిషి
పొందే కష్టాలు- వారి చేసిన దుష్ట పనుల వలననే వారు చేసిన అపరాధాల
వలననే వస్తాయి అని మీరు చెబుతున్న సిద్ధాంతము తప్పు అని మరోసారి చెబుతున్నారు!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*94వ భాగం*
యోబు 24:1—6
1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2 అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నతస్థలములలో
సమాధానము కలుగ జేయును.
3 ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?
4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?
స్త్రీ కి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు
పవిత్రమైనవి కావు.
6 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు
ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
ప్రియులారా! ఇక ఈ 25వ అధ్యాయంలో యోబుగారు మాట్లాడిన మాటలకు మరో స్నేహితుడు
షూహీయుడైన బిల్దదు జవాబిస్తున్నాడు! ఇది ఈ గ్రంధంలో చాలా చిన్న
అధ్యాయము! ఈ అధ్యాయంలో ఇవి బిల్దదు మూడో సారీ ఆఖరు సారీ పలికిన
మాటలు. చెప్పినది చాలా తక్కువ. క్రొత్త విషయమేమీ లేదు. యోబు చెప్పిన సత్యాలను పూర్తిగా విస్మరించాడు. చెప్పడానికి
బిల్దదుకు రెండు విషయాలున్నాయి. దేవుడు గొప్పవాడు. దేవుని పవిత్రతతో పోల్చుకుంటే తగిన నీతిన్యాయాలు, పరిశుద్ధత
ఉన్నది సృష్టిలో ఏదీ లేదు. మనిషికి ఇది అసలే లేదు. ఇదంతా వాస్తవమే గాని యోబు చెప్పిన విషయానికి ఈ మాటలతో పొత్తు లేదు.
బిల్దదు చివరి మాటలు యోబు తాను న్యాయవంతుణ్ణి అంటూ పలికిన మాటలకు వ్యతిరేకంగా
చెప్పినవి (యోబు 23:10-12, ). యోబు ముగ్గురు
స్నేహితులు పలికిన మాటలు ఇక్కడితో ఆఖరు. వాళ్ళు మాట్లాడడం చాలించినది
తాము పొరపాటు మాట్లాడుతున్నామని నమ్మకం కుదిరినందువల్ల కాదు. తాము చెప్పే మాటలను యోబు అంగీకరించడని వాళ్ళకు తెలిసిపోయింది గనుక విరమించుకున్నారు.
2—5 వచనాలలో దేవుడు ఎంత గొప్పవాడో ఆయన మహాతిశయాన్ని వర్ణించి మరి దేవుడు అంత గొప్పవాడు
కదా పురుగులాంటి మనిషివి నీవు మరి నీవు ఆయన దృష్టికి నీవు ఏ విధంగా పవిత్రుడవు కాగలవు?
నీవు కూడా అపవిత్రుడవే అంటూ ముగించాడు!
సరే, షూహీయుడైన బిల్దదు దేవుని
మహాతిశయాన్ని ఏవిధంగా వర్ణించాడో చూసుకుందాం!
అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నతస్థలములలో
సమాధానము కలుగ జేయును..
1 దిన 29లో దావీదు గారు దేవుణ్ణి కీర్తిస్తూ అంటున్నారు
11 యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము;
మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి;
యెహోవా, రాజ్యము నీది, నీవు
అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
12 ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు,
హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.
13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.
కీర్తనలు 99: యెహోవా రాజ్యము చేయుచున్నాడు
జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
2 సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.
3 భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు.
యెహోవా పరిశుద్ధుడు.
50: 1 దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు
మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
2 పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు
3 మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు.
ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
ఇక
ఆయన ప్రభావ స్వరూప దర్శనాన్ని చూసిన యెహేజ్కేలు గారు మొదటి అధ్యాయంలోనూ పదవ అధ్యాయంలోనూ
వర్తిస్తున్నారు.
ప్రకటన
మొదటి అధ్యాయంలోనూ ఇంకా మరిన్ని అధ్యాయాలలో దేవుని మహిమను
ప్రభావాన్ని చూసిన యోహాను గారు ఎంతో చక్కగా వివరిస్తున్నారు!
అయితే ఇంతటి ప్రభావం గల దేవుడు కూడా మనుషులతో ఉండటానికి ఇష్టపడుతున్నాను
అంటున్నారు యెషయా గ్రంధంలో
57: 15 మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు
ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి
ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను
దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
ఇక
తర్వాత వచనంలో ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?
ఇక్కడ
ఆయన సేనలను లెక్కించగలమా అంటే కీర్తన 68 లో దానికి జవాబు ఉంది.
17 దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో
నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
ఇవి
కేవలం రధముల మీద వచ్చేవారు,
మరి మేఘముల మీద వచ్చేవారు, నడచి వచ్చేవారు లేక్కయే
లేదు!
ఇక
ఆయన వెలుగు ఎవరిమీద నైనా ఉదయించకుండా ఉంటుందా అంటే లేదు అందరిమీద ఉదయిస్తుంది. యేసుక్రీస్తుప్రభులవారే
అంటున్నారు మత్తయి 5 లో 44
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ
తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును
హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి,
నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
ఇక
చివరిగా 4
నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీ కి పుట్టినవాడు ఆయన దృష్టికి
ఎట్లు శుద్ధుడుకాగలడు?
5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు
పవిత్రమైనవి కావు.
6 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు
ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
దీనికోసం
గత భాగాలలో విస్తారంగా చూసుకున్నాము! ఇది మనుష్యులకు సాధ్యము కాదు గాని క్రీస్తుయేసు
రక్తము నందు కడుగబడి వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం
జీవించేవారికి సాధ్యమే! ఎందుకంటే దేవుడే వారిని పరిశుద్దులుగా
మార్చి వారిని పరిశుద్ధంగా కాపాడుతారు అంతేకాకుండా ఎవరైతే ఆత్మతో నడిపించ బడతారో వారు
పాపము చేయలేరు- శరీర కార్యాలు చేయలేరు కాబట్టి ఆత్మానుసారంగా
జీవిస్తున్న వ్యక్తి పరిశుద్దుడిగా జీవించగలరు!
మరి
నీవు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావా?
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*95వ భాగం*
యోబు 26:1—4
1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2 శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?
3 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
4 నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
ప్రియులారా! ఇక ఈ 26వ అధ్యాయంలో యోబుగారు బిల్దదు మాట్లాడిన మాటలకు
సమాధానం చెబుతున్నారు అయితే అది మూడు వచనాలే! ఇక దాని తర్వాత
తనకున్న ఆధ్యాత్మిక జ్నానము దేవుడు బయలుపరచిన జ్నానము చెబుతున్నారు. మర్మాలను మాట్లాడుచున్నారు! ప్రియులారా కేవలం ఈ అధ్యాయమే
కాకుండా వరుసగా 8 అధ్యాయాలు యోబుగారె మాట్లాడుతున్నారు!
ఎత్తిపొడుస్తున్న రీతిలో యోబు బిల్దదు మాటలను నిరసిస్తున్నాడు.
బిల్దదు ఏ విధంగానూ దేవుని మార్గాలను తనకు బోధపరచడానికి సమర్థుడు కాడని
అతనికి తేటతెల్లమైంది. మనం ఎక్కువగా మాట్లాడితే మనం ఎలాంటివారమో
ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు.
సూక్తులు
చెప్పడానికే గాని పాటించడానికి కాదు అన్న చందంలో బిల్దదు బ్రతుకు ఉంది, కాబట్టి ఒరేయ్ నాన్న
ఇంత శ్రీరంగ నీతులు చెబుతున్నావు గాని నీవు ఎంతమంది శక్తిలేని వారికి సహాయం చేశావు?
బలములేని వారికి నీ చేయి అందించి సహాయం చేసి రక్షించావు అంటున్నారు/
ఇక జ్నానము కొదువగా ఉన్నవారికి నీవెంత జ్నానము ఆలోచన చెప్పావు?
నీవు ఎవని ఎదుట మాటలు చెప్పావు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే తర్వాత అధ్యాయాలలో తాను చేసిన కార్యాలు కూడా చెబుతున్నారు!
ఇక 5 వ వచనం నుండి దేవుని కార్యాలయ పట్ల తనకున్న
జ్నానపు మాటలు చెబుతున్నారు!
5 జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు.
6 ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా
నున్నది.
దేవుని
ఆధిక్యాన్నీ గొప్పతనాన్నీ గురించి యోబుకేమీ తెలియదన్నట్టు బిల్దదు ఆ అంశాన్ని గురించి
మాట్లాడాడు. దేవుని బలప్రభావాల గురించి పలుకుతూ యోబు ఇదే అంశాన్ని తీసుకొని, బిల్దదు కంటే (మిగిలిన ఇద్దరు మిత్రుల కంటే కూడా)
మరింత వాగ్ధాటితో ఎక్కువగా వివరించారు. బిల్దదు
పరలోకంలో దేవుని సర్వాధిపత్యం గురించి చెప్పాడు. దేవుని సర్వాధిపత్యం
ఈ విశ్వంలో అట్టడుగు వరకూ, అంటే మృత్యులోకానికీ, నాశనకరమైన అగాధంవరకూ వ్యాపించి ఉన్నట్టు తనకు తెలుసునని యోబు అంటున్నారు
(యెషయా 14:9-15).
ఇక్కడ యోబుగారు రెండు సత్యాలు లేక మర్మములు చెబుతున్నారు!
మొదటిది పాతాళము అనేది లేక ప్రేతలు ఉండే పాతాళము అనేది భూమి క్రింద ఉంది అది
కూడా జలముల క్రింద ఉంది అంటున్నారు!
యోబుగారే కాదు సోలోమోను గారు కూడా అంటున్నారు క్రిందనే ఉంది అంటూ సామెతలు 15:24 లో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని
బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును.
రెండవది: ఇక ప్రేతలు అనగా చనిపోయిన ఆత్మలు ఇంకా చెప్పాలంటే మంచి
మార్గము నడువక చెడుమార్గము నడిచి పాతాళము లోనికి వెళ్ళిపోయిన ఆత్మలు ఆ పాతాళములో విలవిల
లాడుతారు! ఎందుకనేది మనకు ధనవంతుడు- లాజరు
ఉపమానంలో యేసుక్రీస్తుప్రభులవారు చెబుతున్నారు- అక్కడ భయంకరమైన
వేడి- నాలుక ఎండిపోయి నీరు తాగుదామని అనుకున్నా కనీసం నాలుక తడుపుకోడానికి
కూడా నీరు దొరకనంత ఘోరమైన అగ్ని!
లూకా 16:24
తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి,
తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు
లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి..
ఇక
అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని కూడా వ్రాయబడి ఉంది!
యెషయా 66: 24 వారు పోయి నామీద తిరుగుబాటు
చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త
శరీరులకు హేయముగా ఉండును..
మార్కు 9: 48 నరకమున వారి పురుగు చావదు;
అగ్ని ఆరదు.
అందుకే ఆ భయంకరమైన పాతాళము లోనికి నరకము లోనికి పోకుండా నేడే రక్షణ పొంది ఆ
రక్షణను కాపాడుకుంటూ బ్రతకాలి! రక్షణ పొందటం చాలా చాలా సులువే! గాని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం! అది కేవలం ఒక్కరోజే
కాదు- జీవితాంతం లేక ప్రతీరోజు దానిని కాపాడుకుంటూ ఉండాలి-
లేకపోతే నరకానికి పోతావు అని మర్చిపోకూ! అందుకే
నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నారు దేవుడు. నీకు కలిగినది
దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పరిశుద్దాత్మ- దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జీవితం!
ప్రకటన
2: 25 నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.
3: 11 నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము..
కాబట్టి నీవు నేను ఆ పాతాళము నకు వెళ్ళకుండా జాగ్రత్త పడదాం!
బైబిల్ కోసం పూర్తిగా అవగాహన లేని విశ్వాసులకు ఒక విషయం చెప్పనీయండి! నీవు రక్షణ
పొందాక నీ రక్షణ కాపాడుకుని ఆత్మానుసారమైన జీవితం, వాక్యానుసారమైన
జీవితం జీవిస్తూ నీ సాక్ష్యమును శీలమును కాపాడుకుని పరిశుద్దమైన జీవితం జీవిస్తే ఒకవేళ
నీవు మరణిస్తే తిన్నగా పరదైసుకి వెళ్తావు. పరదైసు అనేది మంచి
విశ్వాస జీవితం జీవించిన విశ్వాసులు
రెస్టు తీసుకనే గెస్ట్ హౌస్! అదే నీవు రక్షణ
పోగొట్టుకుని లోకస్తులతో కలిసి లోక కార్యాలు శరీర కార్యాలు చేస్తే పాతాళము నకు పోతావు,
అక్కడ నీవు తీర్పు వరకు ఉంటావు. అక్కడ కూడా యాతనలు
తప్పవు- దవళ సింహాసనం తీర్పు తర్వాత నీవు నరకంలోకి వెళ్తావు అక్కడ
కూడా నీవు అగ్నిలో పెనం మీద కాలుచున్న చేపలా వేగుతుంటూ ఉంటావు!
నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షించబడును రక్షించబడని వాడు లేక నమ్మనివాడు
శిక్షించబడును అనగా పాతాళములో మొదటగా తర్వాత నరకంలో శిక్షించ బడతారు!
కాబట్టి
నీవు బుద్ధిమంతుడవు అయితే క్రింద నున్న పాతాళము తప్పించు కోడానికి జీవ మార్గము అనగా
యేసుక్రీస్తుప్రభులవారు చూపిన ఈ జీవ మార్గములో నడువు! నీ సిలువనే కాడిని ఎత్తుకుని
క్రీస్తు శ్రమల మార్గములో నీ రక్షణను కాపాడుకుంటూ సాగిపో! లేకపోతే
నీకు అగ్ని ఆరదు పురుగు చావదు అని గ్రహించు! గమనించు అందుకే ఆరవ
వచనంలో ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది అంటున్నారు.
అనగా పాతాళము యొక్క ద్వారములు ఎల్లప్పుడూ తెరువబడే ఉన్నాయట! అంతేకాదు రక్షణ పొందడానికి కూడా ద్వారములు ఎల్లప్పుడూ తెరువబడే ఉన్నాయి!
నీకు ఏ దారి కావాలో నేడే తేల్చుకో!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*96వ భాగం*
యోబు 26:7—11
7 శూన్యమండలముపైని ఉత్తరదిక్కున నున్న ఆకాశ విశాలమును
ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
8 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను
బంధించెను.
9 దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని
మరుగుపరచెను.
10 వెలుగు చీకటుల సరిహద్దులవరకు ఆయన జలములకు హద్దు నియమించెను.
11 ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదరును
ప్రియులారా! ఇక ఈ 26వ అధ్యాయంలో యోబుగారు ఇంకా మరిన్ని ఆత్మీయ మర్మములు మాట్లాడుచున్నారు!
ఈ 7 వ వచనంలో అంటున్నారు శూన్యమండలముపైని ఉత్తర
దిక్కున నున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను అంటున్నారు!
ఇది యోబుగారికి బయలుపరచిన మరో మర్మము! చూడండి శూన్య
మండలం ఉంది అట, దానికి ఉత్తరంగా ఆకాశ విశాలము దేవుడే ఏర్పరిచారు.
ఆ శూన్యము అనగా స్పేస్ లో లేదా అంతరిక్షంలో దేవుడు భూమిని వ్రేలాడ దీశారు.
ఈ ఖగోళ శాస్త్రజనులు కనుక్కోక ముందే క్రీ. పూ.
1100 సంవత్సరం లోనే దేవుడు యోబుగారికి బయలుపరిచితే దానిని మోషే గారు
గ్రంధస్తము చేశారు!
ఆధారం లేకుండా భూగోళం శూన్యంలో వ్రేలాడుతున్న దృశ్యాన్ని యోబు వివరిస్తున్నారు. ఇది యోబు నివసించిన ప్రదేశంలో
ఆ కాలంలో చదువుకున్న వారందరూ సాధారణంగా అంగీకరించే విషయం కావచ్చు. లేక దేవుడు మనుషులకు ఒక సమయంలో ఈ విషయాన్ని వెల్లడి చేశాడనడానికి రుజువు కావచ్చు
(ఇలా వెల్లడించిన సంగతి బైబిల్లో ఎక్కడా కనిపించదు). లేక యోబుకు దేవుడు ప్రత్యక్షంగా వెల్లడి చేసిన సత్యం కావచ్చు.
అయితే
భూమి ఏవిధంగా ఇలా శూన్యములో వ్రేలాడుతుంది? ఎందుకంటే బైబిల్ చెబుతుంది కదలకుండునట్లు భూమి
స్థిర పరచబడి ఉంది!
కీర్తన 93: 1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు
ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు
కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
96: 10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది
న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో
ప్రకటించుడి
ఇంకా అంటున్నారు 24: 2 ఆయన సముద్రములమీద దానికి పునాది
వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.
భూమికి
పునాది వేసినవాడు దేవుడు! ఎక్కడ? సముద్రముల
మీద! ఆ పునాదులు మానవుల కన్నులకు కనబడవు!
సరే, అర్ధమయ్యే విధంగా చూసుకుందాం!
ఆయన శూన్యములో ఎలా వ్రేలాడ దీశారు. అది ఎలా స్థిర
పరచబడి ఉంది అంటే ఖగోళ శాస్త్రము చెబుతుంది భూమి తిరుగుతుంది (భూభ్రమణం), సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది (భూపరిభ్రమణం). ఇలా తిరగడం వలన భూమికి ఆకర్షణ శక్తి వచ్చింది
(గురుత్వాకర్షణ), సూర్యునికి ఆకర్షణ శక్తి వచ్చింది (గ్రావిటీ).
అయితే ఈ భూభ్రమణం వలన, భూపరిభ్రమణం వలన కలిగిన
ఆకర్షణ- సూర్యుని ఆకర్షణ శక్తిని వికర్షిస్తుంది. కాబట్టి ఈ ఆకర్షణ –వికర్షణ వలన వాటి వాటి ఆకర్షణ శక్తులు
ఒకదానికి ఒకటి నిరోధించ బడి భూమి తన స్థానం తప్పకుండా తన కక్ష్యలోనే తిరుగుతుంది.
అనగా స్థిరంగా ఉంది! మరి యోబుగారు చెప్పేది,
కీర్తనలు గ్రంధంలో చెప్పబడింది నిజమే కదా! అయితే
హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ప్రకారం ఇలా స్థిరంగా ఉంది స్పేస్ లో ప్రతీ గ్రహము నక్షత్రము
వాటివాటి కక్షలు తప్పకుండా నిర్వహించేది యేసుక్రీశ్తుప్రభులవారే అని చెబుతుంది!
1: 2 ఈ దినముల
అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి,
తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల
విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన
నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
4 మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
చూడండి కేవలం తన మహత్తుగల మాటచేత ఈ సర్వసృష్టిని
నిర్వహిస్తున్నారు!
అందుకే భూమి కదలకుండా స్థిరపరచబడి ఉంది, అది శూన్యములో కదలకుండా వ్రేలాడుతుంది!
ఇక ఒక విషయం చెప్పనీయండి: మండలము
అనగా 12 రోజులు అనే అర్ధమే కాకుండా గుండ్రముగా ఉండేది అని అర్ధం
కూడా వస్తుంది. అనగా శూన్యమండలం అనబడే స్పేస్ గుండ్రముగా ఉంది.
ఈ సంధర్భంగా ఒక మాట చెప్పనీయండి. మన రాష్టంలో ఒక
పనికిమాలిన బుద్దిలేని పశువు బైబిల్ ను ఎగతాళి చేస్తూ అంటున్నాడు- బైబిల్ భూమి బల్లపరుపుగా పరచబడి ఉంది అని వ్రాయబడి ఉంది గాని అది గుండ్రముగా
ఉందని శాస్త్రము చెబుతుంది అంటూ ప్రేలుతున్నాడు బుద్ధిలేని పశువు! ఇక్కడ ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను అన్నారు
గాని భూమి పరిచేను అనలేదు చూడరా!
ఇక భూమి గుండ్రముగా ఉంది అని బైబిల్ లో ఎప్పుడో వ్రాయబడి ఉంది
సామెతల గ్రంధం ఒకసారి చూద్దామా?
8: 27 ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద
మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు
పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. . . . .
ఇంకా
వివరంగా కావాలంటే యెషయా 40 లో ఉంది
భూమి మండలము అంటూ అనగా భూమి గుండ్రముగా ఉంది అంటూ
22 ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె
కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము
వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.
కాబట్టి
భూమి గుండ్రముగా ఉందని బైబిల్ ముందుగానే చెప్పినది. ఈ పనికిమాలిన వాడికి బైబిల్ తెలియక ఏదో
ప్రేలుతున్నాడు అని గమనించాలి!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*97వ భాగం*
యోబు 26:7—11
7 శూన్యమండలముపైని ఉత్తరదిక్కున నున్న ఆకాశ విశాలమును
ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
8 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను
బంధించెను.
9 దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని
మరుగుపరచెను.
10 వెలుగు చీకటుల సరిహద్దులవరకు ఆయన జలములకు హద్దు నియమించెను.
11 ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదరును
ప్రియులారా! ఇక ఈ 26వ అధ్యాయంలో యోబుగారు ఇంకా మరిన్ని ఆత్మీయ మర్మములు మాట్లాడుచున్నారు!
ఇంకా చూసుకుంటే వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో
నీళ్ళను బంధించెను! వాటిక్రింద
అంటే 7వ వచనంలో చెప్పారు కదా శూన్య మండలమునకు ఉత్తర దిక్కునున్న
ఆకాశ విశాలము- ఆ శూన్యమునకు మీదుగా భూమిని వ్రేలాడ దీశారు అంటూ
ఇప్పుడు ఆ శూన్యము లేక స్పేస్ లేదా అంతరిక్షము లేక ఆకాశము క్రింద మేఘములు చినిగిపోకుండా
మేఘములలో నీళ్ళను బంధించారు అంటున్నారు! ఏమండీ ఇప్పుడైతే అవపాతము
లేక precipitation ఎలా జరుగుతుందో వాతావరణ శాస్త్రం వచ్చాక తెలిసింది
గాని పూర్వకాలంలోనే మేఘములలో దేవుడు నీళ్ళను బంధించినట్లు యోబుగారు చెప్పారు.
నిజానికి అన్ని మేఘాలలోనూ నీళ్ళు ఉండవు, అన్నీ
మేఘాలు వర్షాన్ని మంచును వడగళ్లను తీసుకుని రావు. మా మెరైన్ మెటియోరాలజీ
ప్రకారం ముఖ్యంగా పది రకాలైన మేఘాలున్నాయి!
దానిలో అయిదు రకాలైన మేఘాలు వర్షించవు, మంచు కూడా
పడదు ఎందుకంటే వాటిలో తేమ ఉండదు అనగా నీళ్ళు ఉండవు. మన భూమిమీద
వర్షాలు పడటానికి కేవలం 5 రకాలైన మేఘాలు మాత్రమే కారణం!
అయితే నేటి రోజులలో ఎక్కువగా క్యుములోనింబస్ మేఘాల వలన ఎక్కడ మేఘాలుంటే
అక్కడే వర్షం పడి దాని ప్రక్క ఊరులో వర్షాలు పడటం లేదు! అయితే
యోబుగారికి దేవుడు ఆ రోజులలోనే బయలు పరిచారు నేను మేఘాలలో నా నీళ్ళు బంధించాను అంటూ!
సామెతల
గ్రంధంలో భక్తుడు మరింత వివరంగా రాస్తున్నారు 30: 4 ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన
వాడెవడు? ఆయన పేరేమో
ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
ఈ వచనం ప్రకారం ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడు యేసుక్రీస్తుప్రభులవారు! తన పిడికిళ్లతో గాలిని
పట్టుకున్న వాడు బట్టలో నీళ్ళు మూట కట్టినవాడు కూడా యేసుక్రీస్తుప్రభులవారే!
ఇక్కడ బట్ట అనగా మేఘము అని అర్ధం! భూమి యొక్క దిక్కులను
స్థాపించిన వాడు, కూడా ఆయనే- ఎందుకంటే ఆయన
కుమారుని పేరు ఏమిటి అని అడిగారు- ఆయన యేసుక్రీస్తుప్రభులవారు!
యిర్మీయా గ్రంధంలో మరింత వివరంగా ఉంది. 10:
13 ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము
కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి
గాలిని రావించును.
ఇక్కడ చాలా వివరంగా ఆకాశ మండలంలో ఉన్న జలరాశులు అవపాతం చెంది లేదా వర్షించి, ఆ తర్వాత ఆ నీరు ఆవిరిగా
రూపాంతరం చెంది ఆ నీరు మేఘములుగా మారతాయి.
దీనిని జలచక్రము లేక hydrological సైకిల్
అంటారు అప్పుడే దేవుడు
దీనిని యిర్మీయా గారిద్వారా బయలుపరిచారు!
ఇక తర్వాత దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని
మరుగుపరచెను. అనగా దేవుని సింహాసనం ఆ మేఘములకు పైగా ఉన్నట్లు మనకు
అర్ధమవుతుంది. ఆకాశము మహాకాశములకు మీదుగా పరలోకం ఉంది అని అర్ధమవుతుంది.
పౌలుగారు మూడో ఆకాశమునకు వెళ్ళి మానవుడు వర్ణించలేని మాటలు వినినట్లు
చూడగలం! దీనినే దావీదుగారు ప్రవచించారు 18వ కీర్తనలో
10 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
11 గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును
ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను.
ఇక
తర్వాత వెలుగు చీకటుల సరిహద్దులవరకు ఆయన జలములకు హద్దు నియమించెను అంటున్నారు! జలములకు హద్దు దేవుడు
నియమించారు అంటున్నారు! దీనిని ఇదే గ్రంధంలో దేవుడే ప్రశ్నిస్తున్నారు
యోబుగారితో 38:8—11 లో
8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని
మూసినవాడెవడు?
9 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి
పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను
పెట్టించినప్పుడు
11 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే
నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
యిర్మీయా
గ్రంధంలో దేవుడు అంటున్నారు సముద్రానికి ఇసుకను హద్దుగా పెట్టాను
5:22 సముద్రము
దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు,
ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి
ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని
వణకరా? ఇదే యెహోవా వాక్కు.
ఇక
తర్వాత వచనంలో అంటున్నారు ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదరును. అనగా దేవుడు గద్ధిస్తే
భూకంపాలు కలుగుతాయి అంటున్నారు!
1 సమూయేలు 2: 8 దరిద్రులను అధికారులతో
కూర్చుండ బెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి
యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తు వాడు ఆయనే. *భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన
నిలిపియున్నాడు*
కీర్తన 18: 7 అప్పుడు భూమి కంపించి అదిరెను
పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.
హెబ్రీ 12: 26 అప్పుడాయన శబ్దము భూమిని
చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును
అని మాట యిచ్చియున్నాడు.
27 ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము
అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది.
ఇక తర్వాత వచనం 12 తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును
పగులగొట్టును.
సముద్రమును రేపును అనగా తుఫాను సమయంలో సముద్రము అల్లకల్లోలం కావడమును సూచిస్తుంది. అంతేకాకుండా
tidal waves వచ్చి, లేదా సునామీలు వచ్చి ప్రజలను
ముంచివేయడం సూచిస్తుంది!
ఇక తర్వాత మాట రహబు! దీనికోసం గతభాగాలలో చూసుకున్నాము! రాహాబు అనేమాట హీబ్రూ బైబిల్లో ఆరుసార్లు కన్పిస్తుంది. ఈ మాటకు మూలార్థం “గర్వం”. కొన్ని సార్లు ఈ మాటను ఈజిప్ట్కు సూచనగా వాడడం జరిగింది (కీర్తనల గ్రంథము
87:4, ). ఇక్కడ యోబు ఈజిప్ట్ను గురించే మాట్లాడుతూవుండి
ఉండవచ్చు. అలా కాని పక్షంలో దీని అర్థమేమిటో అంత స్పష్టంగా లేదు.
కొందరు పండితులు ఊహించినట్టుగా ఇక్కడ సముద్రం ఒక గర్విష్ఠి అయిన సముద్ర
జంతువులాగా చెలరేగడం గురించి యోబు మాట్లాడుతున్నాడేమో. అయితే
ఈ మాటకూ యెహోషువ గ్రంథంలో కనిపించే వేశ్య రాహాబు పేరుకూ ఏ సంబంధమూ లేదు. హీబ్రూలో ఆమె పేరు ఉచ్చారణ వేరుగా ఉంటుంది. దాదాపు
“రాఖాబ్” అని ఉచ్చరిస్తారు.
ఇక తర్వాత వచనంలో కూడా దీనికోసమే చెబుతున్నారు ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు
అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను. ఇక్కడ పారిపోవు
మహా సర్పము అనగా యెషయా 27:1 లో చెప్పబడిన లివియటాన్
1 ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన
మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
ఇక
చివరి వచనంలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన
గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప
గలవాడెవడు?
చూడండి
ఇక్కడ బిల్దడు ఇంకా వారి స్నేహితులకంటే దేవుని మహత్తు కోసం ఇంకా వివరంగా యోబుగారెర
చెబుతున్నారు!
దేవుని
చేతి పనులే ఆయన్ను గురించి వివరిస్తున్నాయి అని యోబు అంటున్నాడు (కీర్తనల గ్రంథము
19:1-4). అయితే మనుషులు వినేది కేవలం గుసగుసలే. మనకు తెలిసిన ఆయన చేతి పనులు, అవి ఎంత ఆశ్చర్యకరమైనా
అవి దేవుని బలప్రభావాల్లో ఒక అల్ప భాగాన్ని మాత్రమే మనకు చూపించగలవు. దేవుని బలప్రభావాలు అంత గొప్పవి. ఆయన సర్వశక్తితో వీసమెత్తు
అయినా ఎవరికీ అర్థం కాదు. యోబుకు దేవుని గొప్పతనం గురించి చాలా
ఉన్నత అభిప్రాయాలు ఉన్నాయి.
కాబట్టి
దేవుని గొప్పతనం తెలుసుకుని ఆయనకు లోబడుదాం! మన మాటలు కొద్దిగా ఉండాలి! ఆయన హెచ్చాలి మనం తగ్గాలి! అప్పుడే తననుతాను తగ్గించుకునే
వాడు హెచ్చించబడును!
అట్టి
కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*98వ భాగం*
యోబు 27:1—6
1 యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను
2 నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని
ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు
3 నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును
వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
4 నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక
మోసము నుచ్చరించుటలేదు.
5 మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొనను
మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
6 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన
అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
ప్రియులారా! ఇక ఈ 27వ అధ్యాయంలో
కూడా యోబుగారు మాట్లాడుచున్నారు! అయితే ఈ మాటలు తన స్నేహితులను ఊదేశించి మాట్లాడుచున్నారు!
1 యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను, అంటే జోఫరు తన
వంతు ప్రకారం ఇక్కడేదన్నా చెపుతాడేమోనని యోబుగారు ఆగి ఉండవచ్చు. జోఫరు ఏమీ అనలేదు. కాబట్టి యోబు కొనసాగించారు.
తర్వాత
వచనంలో అంటున్నారు
2 నా ఊపిరి యింకను
నాలో పూర్ణముగా ఉండుటనుబట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు
3. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును
వ్యాకులపరచిన సర్వశక్తునితోడు.. అంటున్నారు
యోబుగారు
ఒట్టు చేసి చెప్పడం ఈ గ్రంథంలో ఇదే మొదటి సారి, చివరి సారి. దేవుడు తనకు న్యాయం తీర్చకుండా తనను బాధలపాలు
చేశారని యోబుగారి నమ్మకం.
అయితే జాగ్రత్తగా గమనించి చూస్తే యోబుగారు దేవుణ్ణి నిరాకరించలేదు, ఆయనలో నమ్మకాన్ని వదిలివేయలేదు. నా న్యాయమును పోగొట్టిన
దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు.. అంటున్నారు
తాను
అపరాధిని కాదు, తాను బాధపడటానికి తన పాపములు కారణం కాదు అని చెప్పడానికి ఇంకా నొక్కివక్కాణించి
పలుకుతున్నారు.
తర్వాత
వచనంలో నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు
పరిస్థితులు
ఎలా ఉన్నాయని నమ్ముతున్నాడో అదే రీతిగా వాటిని బయటికి చెప్పాలని యోబుగారు
నిర్ణయించుకున్నాడు. వాదంలో గెలవాలని తన
స్నేహితులను మోసం చేయడు. తాను ఏ ఘోర పాపమూ చేయలేదని తనకు తెలిసినప్పుడు
అలాంటిది చేశానని ఒప్పుకోడు. అది నిజం కాకపోయినా అలా ఒప్పుకుంటే
స్నేహితుల మెప్పునూ దేవుని దయనూ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చెయ్యడు.
తర్వాత వచనంలో 5 మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును
ఒప్పు కొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
6 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన
అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
తాను నిజాయితీ, రుజువర్తన, నీతిన్యాయాలతో జీవించానని
అతనికి తెలుసు. అదే దారిన పోవాలని అతని దృఢ సంకల్పం. యోబు తన ఆస్తినీ కుటుంబాన్నీ ఆరోగ్యాన్నీ దేవుని సహవాసాన్నీ కోల్పోయాడు.
ఇలాంటి విపత్తులన్నిటి మధ్య ఒక్క విషయాన్ని మాత్రం పోగొట్టుకోకూడదని
నిశ్చయించుకున్నాడు – తన నీతి నిజాయితీలు, తన చిత్తశుద్ధి. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, చెడ్డగా ప్రవర్తించడం మొదలు పెట్టడు.
అతడు ఇలా చెపుతున్నట్టున్నాడు: “అంతా పోయినా,
దేవుడు నన్ను ముక్కచెక్కలు చేసినా, మనుషులు నన్ను
తృణీకరించినా నా యథార్థతను మాత్రం వదలుకోను. నేను ఒంటరివాడినై
పోయినా, పేదరికం పాలైనా, దుర్భరమైన రోగం
పీడించినా, ప్రపంచం నన్ను ఎగతాళి చేసినా, స్నేహితులు నన్ను అపార్థం చేసుకొన్నా, పరలోకం నన్ను చూచి
ముఖం చిట్లించినా నేను మాత్రం నిజాయితీగా యథార్థవంతుడుగా కొనసాగుతాను. కనీసం నా నీతి నిజాయితీలనైనా పోగొట్టుకోకుండా నిలుపుకోవాలని నా కృత నిశ్చయత!”
ఈ రోజుల్లో కూడా దేవుడు ఇలాంటి విశ్వాసులను మనకు దయచేయును గాక
– తమ నిజాయితీ వదులుకోవడం కంటే తమ ప్రాణాలను వదలడం మేలని భావించే మనుషులు.
యోబు 2:3, లో దేవుడు యోబును గురించి అలా మాట్లాడాడంటే
ఆశ్చర్యమేముంది?
ప్రియ
సహోదరి సహోదరుడా! నీకు ఇలాంటి స్థిరమైన చిత్తము ఉందా? కష్టాలు వచ్చినా
శోధనలు వచ్చినా నేను మాత్రము నా యధార్ధతను నా భక్తిని నా విశ్వాసమును వదలను!
ఎట్టి పరిస్తితులలో దేవుణ్ణి నిందించను అనే గుణము ఉందా?
అలాంటి
స్థిరమైన చిత్తము గలవాడు కనుకనే దేవుడు యోబుగారిని రెండింతల ఆశీర్వాదముల దీవించారు!
మనము
కూడా యోబుగారి లాంటి విశ్వాసము యధార్ధత నీటి కలిగి ముందుకు సాగిపోవుదము గాక!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*99వ భాగం*
యోబు 27:7—13
7 నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా
కనబడుదురు గాక.
8 దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు
భక్తిహీనునికి ఆధారమేది?
9 వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?
10 వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన
చేయునా?
11 దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు
చేయు క్రియలను నేను దాచిపెట్టను.
12 మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము
వ్యర్థమైనవాటిని భావించు చుందురు?
13 దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు
స్వాస్థ్యము
ప్రియులారా! ఇక ఈ 27వ అధ్యాయంలో
కూడా యోబుగారు మాట్లాడుచున్నారు! అయితే ఈ మాటలు తన స్నేహితులను ఊదేశించి మాట్లాడుచున్నారు!
ఇక
తర్వాత వచనాలు చూసుకుంటే 7 నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా
కనబడుదురు గాక.
8 దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు
భక్తిహీనునికి ఆధారమేది? అంటున్నారు!
దేవుడంటే
భయభక్తులు లేనివారి గురించి జోఫరు, బిల్దదు కూడా ఇలాంటి మాటలే ఉపయోగించి మాట్లాడారు
(యోబు 8:13, ; యోబు 20:5, ). వారితో తాను ఈ విషయంలో ఏకీభవిస్తున్నట్టు యోబుగారు చెప్తున్నారు.
తర్వాత
వచనాలలో అంటున్నారు 9 వానికి
బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?
10 వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన
చేయునా?
11 దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు
చేయు క్రియలను నేను దాచిపెట్టను.
ఇప్పటివరకు
దుర్మార్గులు తరచుగా పండు వృద్ధాప్యంవరకూ జీవిస్తారనీ, ఈ లోకంలో దేవుని తీర్పు
వారి పైకి రాదనీ యోబుగారు చెప్పాడు (యోబు 21:7-13, యోబు
21:30-33, ; యోబు 24:2-12, ). అయితే తన స్నేహితులు
తన మాటలను సరిగా అర్థం చేసుకోలేదన్న విషయం గ్రహించి కొంత ఆందోళన పడుతున్నట్టున్నాడు.
తాను దుర్మార్గులను వెనకేసుకు వస్తున్నట్టు వారు అర్థం చేసుకున్నారా? దుర్మార్గత లాభదాయకమనీ, కాబట్టి నీతిన్యాయాలతో బ్రతకడం కంటే దుర్మార్గంగా ప్రవర్తించడమే మేలనీ తాను
బోధిస్తున్నట్టు వాళ్ళకు అనిపించిందా? యోబు 15:4, లో ఎలీఫజు ఆరోపణ చూడండి. ఈ అధ్యాయంలో యోబు వివరణ చెప్తూ
ఒకవేళ తాను తన స్నేహితుల మనస్సులో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించానేమో అన్న సందేహంతో
దాన్ని సరిచేయ చూచుకున్నాడు. బహుశా తాను ఈ చర్చలో ఒక వైపునే మరీ
గట్టిగా వాదించానని గ్రహించాడేమో. మనుషులు వాదనలో పడి ఉద్రేకాలు
పెరిగితే తరచుగా జరిగేది ఇదే. ఇప్పుడు 13-23 వచనాల్లో దుష్టులు లోకంలో శిక్షకు గురి కావచ్చని పూర్తిగా ఒప్పుకుంటున్నాడు.
దుర్మార్గులకు సంభవించేదాన్ని గురించి యోబు స్నేహితులు మాట్లాడిన ధోరణే
దాదాపుగా ఇక్కడ యోబు మాటల్లో కనిపిస్తున్నది. వారి వాదనను యోబు
చేపట్టినట్టుగా ఇక్కడ అనిపిస్తూవుంది. అయితే యోబు అలా ఎంత మాత్రమూ
చేయడం లేదు. స్నేహితుల సిద్ధాంతం ఇది – ఈ లోకంలో దేవుడు ఎప్పుడూ న్యాయవంతులకు ప్రతిఫలమిచ్చి దుష్టులను దండిస్తాడు.
నిర్దోషుల మీదికి విపత్తులేవీ రానియ్యడు, దుర్మార్గులను
తప్పించుకు పోనియ్యడు. వాదనకు అనుకూలంగా యోబు పైనున్న వాదంలో
రెండో భాగానికి అంగీకరించేందుకు సిద్ధమే గాని మొదటి దాని విషయం మట్టుకు కాదు.
దుర్మార్గుల మీదికి విపత్తులు వస్తాయని ఒప్పుకుంటాడు గాని న్యాయవంతుల
మీదికి రావన్నది మాత్రం అంగీకరించడు. దుర్మార్గులకు సంభవించేదాని
విషయంలో తన స్నేహితుల వాదానికి అంగీకరించడం వల్ల యోబు వాదానికి నిలకడ లేకుండా పోయిందని
చెప్పవచ్చు. యోబు మాటలు చదివేవారికి అతను తన స్నేహితుల వాదంతో
ఎక్కువగా ఏకీభవిస్తున్నాడని అనిపించవచ్చు. (చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది.
యోబు ఏ విషయాన్నీ నాన్చి చెప్పడు. అతను చెప్పదలుచుకున్న
దేదైనా సరే బల్ల గుద్ది చెప్తాడు.) ఏది ఏమైనా అతని మాటలవల్ల ఒక
ఫలితం మాత్రం తప్పకుండా చేకూరింది – అతను దుర్మార్గులను సమర్థిస్తున్నాడని
గానీ ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా తేడా ఏమీ లేదని వాదిస్తున్నాడని గానీ అతని స్నేహితులు
ఇక తప్పు పట్టడానికి వీలు లేకుండా పోయింది.
అయితే యోబుగారు ఒక్క విషయాన్ని అర్ధం
చేసుకోలేక పోయారు- ఆ రోజులలో బైబిల్ పూర్తిగా
వ్రాయబడలేదు కాబట్టి అర్ధం చేసుకోకపోయినా ఆశ్చర్యం ఏమీ అనిపించదు! ధర్మశాస్త్రం కూడా అప్పుడు లేదు-
యోబుగారు మనస్సాక్షి కాలంలో ఉన్నారు- తన మనస్సాక్షియే
వారి ధర్మశాస్త్రం! సరే ఏమి అర్ధం చేసుకోలేక పోయారు అంటే దేవుడు
మంచివారికి చెడ్డవారికి శ్రమలు శోధనలు కలిగిస్తారు. అయితే నీతిమంతులు
యధార్ధవంతులకు విశ్వాసులకు ఆ పరీక్షలో ఒక పాఠము నేర్పి అధ్యాత్మికముగా ఒక మెట్టు ఒక
మెట్టు పైకి ఎక్కిస్తారు! తద్వారా శ్రమలద్వారా సంపూర్ణత లోనికి
నడిపిస్తారు! ఇది దేవుని మోడస్ ఆపరాండి !
సరే
ఇంకా ముందుకు పోతే తర్వాత వచనాలన్నీ భక్తిహీనులకు దుర్మార్గులకు దేవుడంటే భయములేని
వారు ఎలా ఉంటారు, వారికి కలిగే తీర్పులు కనిపిస్తాయి. వీటికోసం మనం గతభాగాలలో
విస్తారంగా చూసుకున్నాము గనుక చదువుకుని ముందుకు పోదాం!
12 మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు
చుందురు?
13 దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన
పొందు స్వాస్థ్యము
14 వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.
15 వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము
చేయకుండిరి.
16 ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను
సిద్ధ పరచుకొనినను
17 వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు
ఆ వెండిని పంచుకొనెదరు.
18 పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి
యిండ్లు వారు కట్టుకొందురు.
19 వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
20 భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టుకొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
21 తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవుదురు అది వారి స్థలములోనుండి వారిని
ఊడ్చివేయును
22 ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి
ఇటు అటు పారిపోవుదురు.
23 మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి
తోలివేయుదురు.
ఇక్కడ
చివరకు ఏమని తేల్చారు అంటే వారు ఎంత ధనము సంపాదించుకున్నా దానిని పూర్తిగా అనుభవించరు! ధనము గలవారై పడుకుని
ఆ నిద్రలోనే చనిపోతారు. వారి సంపాదించింది ఎవరి పాలు అవుతుంది? అలాంటి దుష్టులు చనిపోతే లోకం సంతోషిస్తుంది
అంటున్నారు!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*100వ భాగం*
యోబు 28:1—8
1 వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.
2 ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి
తీయుదురు.
3 మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను
మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.
4 జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము
త్రవ్వుదురు వారు పైసంచరించు వారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి
ఇటు అటు అల్లాడుచుందురు.
5 భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
6 దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన
రాళ్లున్నవి.
7 ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని
చూడలేదు
8 గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు.
సింహము ఆ మార్గమున నడవలేదు
ప్రియులారా! ఇక ఈ 28వ అధ్యాయంలో
కూడా యోబుగారు మాట్లాడుచున్నారు! గమనించాలి- 26వ అధ్యాయంలో ఖగోళ శాస్త్రము (astronomy) మరియు వాతావరణ శాస్త్రము
(Meteorology) కోసం చెబితే ఈ అధ్యాయంలో లోహ శాస్త్రము
(Metallurgy), ఖనిజ శాస్త్రము (Geology), భూగర్భములో
కలిగే వాటికోసం (Oceanography, Geological Science) చెబుతున్నారు! అంతేకాకుండా రాగల దినములలో మనుషుల
జ్నానము పెరిగి టెక్నాలజీ ఎంతగా విస్తరిస్తుందో అప్పుడే ప్రవచిస్తున్నారు!!!
చూద్దాం!
మొదటి
రెండు వచనాలలో అంటున్నారు
1 వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.
2 ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి
తీయుదురు.
ఇక్కడ
సామాన్యంగా చూసుకుంటే వెండి గని నుండి పుడుతుంది అలాగే బంగారము కూడా ఒక గని నుండి లేక
భూమి నుండే దొరుకుతుంది,
ఇనుము కూడా మంటిలో నుండి తీస్తారు రాగిని రాళ్ళను కరిగించి తీస్తారు
అంటున్నారు! అయితే ఇక్కడ అసలైన ఆత్మీయ అర్ధం ఏమిటంటే మనిషి వెలగల లోహాలు, రత్నాలకోసం శ్రమించి ప్రయత్నాలు చేస్తాడు. ఎడారి నేలల్లో,
కఠినమైన ప్రదేశాల్లో వాటికోసం వెతుకుతాడు. కానీ
యోబు మాట్లాడుతున్నది జ్ఞానం గురించి. అది వెండి బంగారాల కంటే,
ఆభరణాల కంటే ఎంతో విలువైనది. అది ఎక్కడ దొరుకుతుంది?
ఎవరికైనా అది కంటబడితే దాన్ని గుర్తించడం ఎలా? ఈ అధ్యాయంలో యోబు మాట్లాడిన అంశం ఇదే.
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు 3 మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను
మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.
4 జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము
త్రవ్వుదురు వారు పైసంచరించు వారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి
ఇటు అటు అల్లాడుచుందురు.
ఈ వచనాలు గాని కార్మికుల కోసం, గనులలో పనిచేసే వారికోసం చెబుతున్నారు!
చీకటికి అంతము అనగా నేటి రోజులలో టెక్నాలజీ పెరిగి ఎంత కాంతివంతమైన లైట్లు
ఉపయోగించి రాత్రుళ్లు కూడా పగటివలే మార్చేస్తున్నారు. చివరకు
గని కార్మికులు కూడా భయంకరమైన చీకటి సొరంగాలలో తమతోపాటుగా లైట్లు పట్టుకుని వెళ్ళి
చిమ్మచీకటిని వెలుగుగా మార్చేస్తున్నారు, దీనిని ఆత్మలో ధ్యానించి
అప్పుడే చెప్పారు యోబుగారు!
మనుష్యులు గాఢాంధకారము అనగా చీకటి సొరంగాలలో రత్నముల కోసము గనులు తవ్వడానికి
తిరుగుతారు మనుష్యులు తిరుగు చోటు అనగా మీద కనబడే నేల కంటే చాలా దిగువగా మనుష్యులు
సొరంగము త్రవ్వి పైన నేలమీద ఉండే మనుష్యుల చేత మరువబడతారు అక్కడ అల్లాడుతారు అంటున్నారు.
అల్లాడటం అనగా గని సొరంగంలోకి తాళ్ళ సహాయంతో ఇలా ఊగులాడుతూ దిగుతారు
కదా దానినే అంటున్నారు!
నేటిరోజులలో టెక్నాలజీ పెరిగి అక్కడ గని
ఉందా లేదా అనేది , లేదా అక్కడ ఖనిజం లేక
ఆయిల్ గెస్ లాంటివి ఉన్నాయా లేదా అనేది కేవలం సోనార్ వేవ్స్ పంపించి మీద నుండే తెలుసుకుంటున్నారు.
ఉంది అంటే ఎలా ఉందో ఎంత ఎక్కువగా ఉందో అని తెల్సుకోడానికి చిన్న కన్నము
చేసి మరిన్ని పరికరాలు పంపించి నిర్ధారణ చేసుకుంటున్నారు! దీనిని
ముందుగానే ఆత్మలో ధ్యానించి చెప్పారు యోబుగారు!
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు
5 భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
6 దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన
రాళ్లున్నవి.
ఇక్కడ భూమిమీద పంటలు పండుతాయి గాని అదే భూమి క్రింద చాలా చోట్ల
అగ్ని పర్వతాలు ఉన్నాయి! వాటినుంది లావా బయటకు వస్తుంది అంటున్నారు!
అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే యోబుగారి కాలంలో ఊజు దేశంలో గాని చుట్టూ
ప్రక్క దేశాలలో గాని అగ్ని పర్వతాలు ఉన్నాయో లేదో తెలియదు గాని ఆ అగ్ని పర్వతాలు పేలిన
దాకళాలు చరిత్రలో లేవు. గాని దీనిని ముందుగానే ఆత్మలో ధ్యానించి
చెబుతున్నారు యోబుగారు! ఇంకా 6 వ వచనంలో
దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము అని కూడా అంటున్నారు! అనగా వజ్రాలు రత్నాలు కూడా
అదే రాళ్ళనుండి వస్తాయి అంటున్నారు. నేటి రోజులలో మన ఆంధ్ర రాష్ట్రంలో
కొండలలో ముఖ్యంగా హుకుంపేట లంబసింగి కోనాం ప్రాంతంలో కనబడే రంగు రాళ్ళు కూడా అదే రాళ్ళనుండి
వస్తున్నాయి!
ఇక
తర్వాత వచనాలలో నిజానికి అవి దొరికే స్థలము ఈ డేగకు గాని క్రూర పక్షికి గాని తెలియదు
అంటున్నారు 7 ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని
చూడలేదు
8 గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు.
సింహము ఆ మార్గమున నడవలేదు
చూడండి
మనిషి- వేటాడే
పక్షులు, క్రూరమృగాలు కూడా వెళ్ళని చోటుల్లో మనిషి నిధి నిక్షేపాలకోసం
వెతుకుతాడు. చివరకి ఇలాంటి విలువ గలవాటిని భూమిలో వెదుకుతూ మనిషి
భూగర్భంలో అగ్నివల్ల కలిగే నాశనంలాంటి నాశనాన్ని కలిగిస్తాడు అంటున్నారు!
ఇలాంటి
గొప్పవాటిని దేవుని ధ్యానంలో ఉండగా తప్పకుండా దేవుడే ఈ జ్నానమును యోబుగారికి కలిగించి
ఉంటారు! నీవు
నేను కూడా దేవుని ధ్యానములో గడపగలిగితే దేవుడు నీకు నాకు కూడా ఇలాంటి జ్నానము భవిష్యత్
విషయాలు బయలుపరచ గలరు!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*101వ భాగం*
యోబు 28:9—20
9 మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను
వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
10 బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన
ప్రతి వస్తువును చూచును.
11 నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు
మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు
12 అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
13 నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది
దొరకదు.
14 అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును.
15 సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి
తూచరాదు.
16 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను
నీలమునకైనను కొనబడునది కాదు.
17 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన
బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.
18 పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు.
జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
19 కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
20 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
ప్రియులారా! ఇంకా యోబుగారు తనకున్న జ్నానము కోసం మాట్లాడుతూ ఈ భాగములో ఇంతకీ జ్నానము ఎక్కడ
దొరుకుతుంది అని ప్రశ్నిస్తున్నారు!
ఇక 9—11 వచనాలలో మనుష్యులకు
రాబోయే రోజులలో కలుగబోయే జ్నానము కోసం క్రీ. పూ. 1100
లోనే వివేచించి చెబుతున్నారు!
9 మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను
వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
అనగా
స్పటికము అనగా గట్టిగా ఉండే వజ్రము లాంటి రాళ్ళను బండలలో కనుగొంటారు అని ముందుగానే
చెబుతున్నారు. ఈరోజు వజ్రాలు లాంటి రాళ్ళు ఎన్నో కనుగొంటున్నారు. ఇక
పర్వతాళ్లను కుదుళ్ళతోనే బోర్లగా పడగొడతారు- అవును కదా నేటి రోజులలో
కొండలను పెకిలించి రోడ్లు బిల్డింగులు వేస్తున్నారు.
నహూము
గ్రంధంలో భక్తుడు కూడా ప్రవచించారు
1: 4 ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన
యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము
వాడిపోవును.
5 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును,
లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
6 ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె
పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
ఇక తర్వాత 10 బండలలో వారు బాటలు కొట్టుదురు
వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును అంటున్నారు. దీనికోసం
ఆలోచిస్తే మీద చెప్పడం జరిగింది- కొండల మధ్యలో సొరంగాలు త్రవ్వి
రైలు మార్గములు, రోడ్డు మార్గములు వేస్తున్నారు. మనము ముంబై ట్రైన్లో వెళ్తే , లేక విశాఖ పట్నం నుండి
అరుకు అద్దాల రైలు లో ప్రయాణం చేస్తే సుమారుగా 58 సొరంగాలు ద్వారా
వెళ్తాము. పూణే ముంబైల మధ్య 25 పెద్ద సొరంగాలు
ఉన్నాయి. ముంబై గోవా
కోంకణ్ రైలు మార్గములో సుమారుగా 92 అతిపెద్ద సొరంగాలు ఉన్నాయి.
ముంబైలోనే భూగర్భములో కొండలను చీల్చి 5.3kms భూగర్భ సొరంగము ఉంది. ఇలా ఎన్నెన్నో బండలను బద్దలు చేసి ఎన్నెన్నో రోడ్డు రైలు మార్గాలు తయారు చేశారు.
ఇక సముద్ర ప్రయాణం కోసం చూస్తే హిందూ మహా సముద్రమును అట్లాంటిక్ మహా
సముద్రాన్ని కలపడానికి 193 కి. మీ.
పొడవు, 300 మీ వెడల్పు, 20 మీ లోతుగా ఉండేలా సూయజ్ కెనాల్ త్రవ్వి సముద్ర మార్గము వేశారు 155 సంవత్సరాల క్రితమే. ఇక అట్లాంటిక్ మహా సముద్రాన్ని పసిఫిక్
మహా సముద్రాన్ని కలపడానికి 52 కి. మీ పనామా
కెనాల్ వేశారు. ఇవి కూడా బండలను భూమిని చీల్చి వేశారు.
కోరింథీ కెనాల్ భయంకరమైన కొండల కాదు పర్వతాలను చీల్చి తయారుచేశారు.
చైనా- పాకిస్తాన్ కలిపే రోడ్డు భయంకరమైన పర్వతాలు
అగాధములు మీదుగా వేశారు. ఇదంతా దేవుడు మనిషికిచ్చిన జ్నానము వలననే
సాధ్యమయ్యింది.
వారికన్ను అమూల్యమైన ప్రతీ విషయాన్ని చూచును అనగా సోనార్, మరియు
seismic రూపాలలో భూమి లోతులలో ఉన్నవాటిని సముద్రములోపల ఉన్న అమూల్యమైన
ఖనిజాలను ఆయిల్ గాస్ లు కనుగొంటున్నారు!
తర్వాత
వచనం 11
నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు మరుగైయున్న వస్తువును
వారు వెలుగులోనికి తెప్పించుదురు
మరుగై ఉన్న వస్తువులను వెలుగులోనికి తెచ్చుట కోసం పై వచనంలో
ధ్యానం చేశాము. అయితే నీళ్ళు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు
అనగా నదుల మీద డామ్ లు కట్టి, నీరు పారకుండా చేసి- అవసరమైనప్పుడు వాటిని పంట పొలాలకు తరలిస్తూ అదే సమయంలో ఆ నీటి ద్వారా కూడా
జల విధ్యుత్ తయారు చేస్తూ, ఆ నీటిని పంట పొలాలకు పంపడం కోసమే
చెబుతున్నారు. క్రీ. పూ. 1100 లో అసలు డామ్ అనేదే వారికి తెలియదు గాని దేవుడే ఇంత జ్నానము యోబుగారికి ఇచ్చారు.
ఈ వచనాలు ధ్యానం చేసి శాస్త్రవేత్తలు వీటిని తయారు చేశారు అని గ్రహించాలి.
కాబట్టి దేవుడు అనంత జ్నాని, ఈ జ్నానము దేవుడు
మనుషులకు కూడా ఇచ్చారు! నీవు నేను ఇదే జీవ గ్రంధమును ధ్యానం చేస్తే
ఎన్నెన్నో విషయాలు బయలుపరచగలరు దేవుడు!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*102వ భాగం*
యోబు 28:12—20
12 అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
13 నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది
దొరకదు.
14 అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును.
15 సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి
తూచరాదు.
16 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను
నీలమునకైనను కొనబడునది కాదు.
17 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన
బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.
18 పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు.
జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
19 కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు.
20 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
ప్రియులారా! ఇంకా యోబుగారు తనకున్న జ్నానము కోసం మాట్లాడుతూ ఈ భాగములో ఇంతకీ జ్నానము ఎక్కడ
దొరుకుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఈ అధ్యాయం చివరి వరకు!
12 అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ
నున్నది? అంటున్నారు! .
తర్వాత వచనాలలో 13 నరులు దాని విలువను ఎరుగరు.
ప్రాణులున్న దేశములో అది దొరకదు.
14 అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును
అంటున్నారు!
మనిషికి జ్ఞానం విలువ ఎలాంటిదో గనుక తెలిస్తే వజ్రాలు, బంగారం వెదికేందుకు అతడు
కనపరిచే పట్టుదల, నిశ్చయంతోనే జ్ఞానం కోసం కూడా వెదుకుతాడు.
వెదకాలి అప్పుడే జ్నానము దొరుకుతుంది.
ఇదేమాట 20 వచనంలో కూడా చెబుతున్నారు.
20 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును?
వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
దీనికోసం
ఆలోచిస్తే నరులకు దాని విలువ తెలియదు అంటూ ప్రాణులున్న దేశములో అది దొరకదు, ఆగాధమును అడిగితే అది
నాలో లేదు అన్నదట, సముద్రాన్ని అడిగితే నా దగ్గర కూడా లేదు అంది
అట! బంగారము కూడా ఈ జ్నానముతో సాటి
రాదు అంటున్నారు.
16 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను
నీలమునకైనను కొనబడునది కాదు.
17 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన
బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.
18 పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు.
జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
19 కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు.
20 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
మరి
దీనికోసం ఆలోచిస్తే యాకోబు
1:5 లో భక్తుడు అంటున్నారు 5
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను,
అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని
గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు అంటున్నారు,
అసలు
జ్నానము అంటే ఏమిటి అనేది ఇదే అధ్యాయంలో చివరలో చెబుతున్నారు
28 మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన
నరులకు సెలవిచ్చెను. ఇదీ అసలు సంగతి! దేవుని యందలి భయభక్తులే జ్నానము అని చెబుతున్నారు.
చెడుతనము దుష్టత్వము విడిచిపెట్టడమే వివేకము అని కూడా చెబుతున్నారు!
సామెతల
గ్రంధంలో భక్తుడు అంటున్నారు
2: 2 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన
నభ్యసించినయెడల
3 తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల
4 వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును
వెదకినట్లు దాని వెదకినయెడల
5 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు
దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి
వచ్చును.
ఎందుకంటే
3: 13
జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
14 వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి
సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
15 పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు
దానితో సమానములు కావు.
16 దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును
ఉన్నవి.
17 దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
18 దాని నవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు
ధన్యులు.
19 జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
20 ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి.
మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
21 నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును
వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగి పోనియ్యకుము
22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ
పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
24 పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా
నిద్రించెదవు.
25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము
వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
26 యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు
ఆయన నిన్ను కాపాడును. అంటున్నారు!
కీర్తన 111: 10 యెహోవాయందలి భయము జ్ఞానమునకు
మూలము ఆయన శాసనముల ననుసరించు వారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు
నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
సామెతలు 3:13-14
13 జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు
ధన్యుడు.
14 వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి
సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
సామెతలు 8:10-11
10 వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు
నాశింపక తెలివినొందుడి.
11 జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు
దానితో సాటికావు.
19 మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము
మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
సామెతలు 16:16
16 అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో
శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
ఇక మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు దేవుని ఆజ్నలను పాటించడమే
జ్నానము మరియు వివేకము అంటున్నారు.
ద్వితీ 4: 5 నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు
మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
6 ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను.
వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము
జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.
అందుకే
సోలోమోను తనకు ప్రత్యక్షమైన దేవునికి తనకు ఆస్తి ఐశ్వర్యము ధీర్ఘాయువు లాంటివి కోరకుండా
కేవలం ఈ ప్రజలను పాలించడానికి తగిన జ్నానము మాత్రమే ఇమ్ము అని వివేకంతో ప్రార్ధిస్తే
దేవుడు అదీ ఇదీ కూడా ఇచ్చారు! 2 దిన వృత్త 1:11—12
కాబట్టి
దేవునియందలి భయభక్తులు నీకున్నాయా?
యవ్వనస్తులారా
ఇప్పుడు మీరు పరీక్షలు రాస్తున్నారు. మీకు జ్నానము కొదువగా ఉంటే వివేకము కావాలంటే మీకు
తప్పకుండా మొదటగా దేవుడు అంటే భయము తర్వాత భక్తి కలిగి ఉండాలి- ఆ రెండు వస్తే కొద్దికొద్దిగా జ్నానము వస్తుంది. అదే
భయము భక్తిని కొనసాగిస్తే దేవుడు నీకు అందరికంటే మిన్నగా జ్నానము ఇస్తారు!
అట్టి
కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*103వ భాగం*
యోబు 28:21—28
21 అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు
మరుగుచేయబడి యున్నది.
22 మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును
మరణమును అనును.
23 దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే
తెలియును.
24 ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి
జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
26 వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు
మార్గము ఏర్పరచి నప్పుడు
27 ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని
పరిశోధించెను.
28 మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము
విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
ప్రియులారా! ఇంకా యోబుగారు తనకున్న జ్నానము కోసం మాట్లాడుతూ ఈ భాగములో ఇంతకీ జ్నానము ఎక్కడ
దొరుకుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఈ అధ్యాయం చివరి వరకు! అయితే
ఈ భాగములో దేవుని జ్నానము వలన ఏమేమి చేశారో గత అధ్యాయాలలో వివరించినది మరలా మరో వివరణతో
చెబుతున్నారు!
ఇక 22 వ వచనంలో అంటున్నారు
22 మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును
అనును.
చూడండి మరణమునకు ఇంకా నాశనమునకు మాత్రము జ్నానము కోసం బాగా తెలుసట!
ఇక 23 వ వచనంలో అంటున్నారు దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
సామెతలు
గ్రంధం 8 వ అధ్యాయంలో భక్తుడు అంటున్నారు 22
పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా
నన్ను కలుగజేసెను.
23 అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన
కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
24 ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు
నేను పుట్టితిని.
25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
26 భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని
రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
27 ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును
నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు
పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
30 నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు
నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
31 ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను
చూచి ఆనందించుచునుంటిని.
32 కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి
నా మార్గముల ననుసరించువారు ధన్యులు
అయితే
ఈ మాటలు జ్నానము కోసం ఏవిధంగా వ్రాయబడ్డాయో అలాగే యేసుక్రీస్తుప్రభులవారి కోసం వ్రాయబడ్డాయి!
అందుకే
రోమా పత్రికలో పౌలుగారు అంటున్నారు ఈ జ్నానము కోసం 11: 33 ఆహా,
దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో
అగమ్యములు.
అయితే
ఈ జ్నానము ఎలా వస్తుంది అనేది గత భాగం ప్రకారం యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉండటం వలన
లభిస్తే మరో విధానం చెబుతున్నారు కీర్తన 19:7 లో
7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును
తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
అనగా
ఇక్కడ ఏమని అర్ధమవుతుంది అంటే దేవుని శాసనములు ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యములు
ధ్యానం చేయడం వలన కూడా బుద్ధిహీనులకు కూడా జ్నానము కలుగుతుంది!!!
ఇక
దేవుని జ్ఞానాన్ని కోసం చెబుతూ తర్వాత వచనంలో
24 ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు
చూడండి
అన్నిటిని చూడగలిగినవాడు, చెయ్యగలిగినవాడూ
దేవుడొక్కడే కాబట్టి నిజంగా జ్ఞానం తెలిసినవాడు ఆయనొక్కడే అని నిర్ధారించి చెబుతున్నారు
యోబుగారు!
ఇక
తర్వాత వచనాలలో మరో విధంగా దేవుని జనానము కోసం చెబుతున్నారు! 25
గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు
ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
26 వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు
మార్గము ఏర్పరచి నప్పుడు
27 ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని
పరిశోధించెను.
చూడండి దేవుడు జ్నానమును చేసి దానిని
టెస్ట్ చేశారు అట, లేదా టెస్ట్ డ్రైవ్ చేశారట!
ఎప్పుడు ఎలా అంటే గాలికి ఇంత బరువు ఉండాలని నియమించారట ఇదే జ్నానముతో,
తర్వాత జలములకు కూడా ఇంత కొలత అని వాటిని కొలిచారట, వర్షానికి కట్టడ నియమించారట! ఊరుముతో కూడిన మెరుపునకు
మార్గము ఏర్పరిచారట! అప్పుడు జ్నానమును బయలుపరచి స్తాపించారు
అంటున్నారు! అందుకే కీర్తన 135:7 లో అంటున్నారు 6 ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి
యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
7 భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
యెషయా 40: 12 తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు?
జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను
కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు?
తూనికచేత కొండలను తూచినవాడెవడు?
ఇంకా
మెరుపు కోసం ఉరుము కోసం-
యోబు
37: 2 ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.
3 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యంతములవరకు
తన మెరుపును కనబడజేయును.
4 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన
స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు
5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని
గొప్పకార్యములను ఆయన చేయును.
6 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను
ఆయన ఆజ్ఞ ఇచ్చు చున్నాడు.
38: 25 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను
వర్షము కురిపించుటకును
26 పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును
వరద నీటికి కాలువలను
27 ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30 జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉరుము వేరు
మెరుపు వేరు అని అనుకునే వారు- గాని తర్వాత అర్ధమయ్యింది
ప్రజలకు- మేఘములు గుద్దుకొనడం వలన- ఆ మేఘాలకు
ఒకే రకమైన విధ్యుత్ ఆకర్షణ వలన అవి గుద్దుకునే క్రమంలో వికర్షించుకుని – ఆ రాపిడికి గుద్దుకోవడం వలన కలిగే శబ్ధం ఉరుము అని, అప్పుడు
ఉత్పత్తి అయ్యే కరెంట్ మెరుపు అనీయు, రెండూ ఒకసారి వచ్చినా ధ్వని
వేగం కంటే కాంతి వేగం ఎక్కువ అవ్వడం వలన ముందుగా మెరుపు వచ్చి ఆ తర్వాత ఉరుము స్వరము
వస్తుంది అని చెప్పారు శాస్త్రజ్నులు .
అందుకే
కీర్తన 19:1 లో అంటున్నారు 1 ఆకాశములు
దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
2 పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
సరే, చివరి వచనంలో అంటున్నారు
మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరు లకు
సెలవిచ్చెను.
ఇక్కడ
ఏమని ముగిస్తున్నారు అంటే జ్ఞానం గురించిన సత్యాన్ని మనిషి ఎంత అన్వేషించినా కనిపెట్టలేడు. అయితే దేవుడే దాన్ని
బయలుపరిచాడు. జ్ఞానం అంటే సమాచారాన్ని నిలవ చేసుకోవడం,
విశేషాలను పోగు చెయ్యడం కాదు. జ్ఞానం అంటే విద్య
కాదు. విద్యావంతులైన మూర్ఖులెందరో ఈ లోకంలో ఉన్నారు. అన్నిటి సహజ ధర్మాలనూ తెలుసుకోవడం జ్ఞానం అనిపించుకోదు. దేవుణ్ణి గురించీ మనిషిని గురించీ సరైన సిద్ధాంతాలను తెలుసుకోవడం కూడా జ్ఞానం
క్రిందకి రాదు. నిజమైన జ్ఞానం దేవుని పట్ల ఉండవలసిన మానసిక స్థితి.
ఇది నీతికీ ధర్మానికి సంబంధించినది. ఇది దేవుని
పట్ల ప్రేమ, ఆయన్ను నొప్పిస్తామేమోనన్న భయం. దుర్మార్గంనుంచి తొలగిపోవడమే జ్ఞానం (కీర్తనల గ్రంథము
111:10, ; సామెతలు 1:7, ; సామెతలు
9:10, ; ప్రసంగి 12:13, ). ఈ పుస్తకం మొదటి అధ్యాయం
నుండి యోబుకు ఈ జ్ఞానం ఉన్న విషయం మనకు తెలుసు (యోబు
1:1, యోబు 1:8, ). అతని స్నేహితులకు ఈ జ్ఞానం ఉందని
ఎక్కడా కనిపించదు. అయితే వారు తామే జ్ఞానులమనీ, యోబుకు జ్ఞానం లేదనీ అనుకున్నారు (యోబు 11:6,
; యోబు 15:2-4, ; యోబు 18:2-3, ; యోబు 20:3, ). అందువల్ల వారు తమ అజ్ఞానాన్ని వెల్లడించారు.
మరినీవు
దీనిని గ్రహించి దేవునియందలి భయమును భక్తిని కలిగి దుష్టత్వమును విడుస్తావా?!!!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*104వ భాగం*
యోబు 29:1—6
1 యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను
2 పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు
నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు
3 అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన
నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
4 నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు
అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.
5 సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా
చుట్టునుండిరి
6 నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము
నూనె ప్రవాహముగా పారెను.
ప్రియులారా! ఇక 29 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుచున్నారు!
ఈ అధ్యాయంలో తన పూర్వ స్థితి ఎంత బాగుండేది ఇప్పుడు మొత్తం దానికి భిన్నంగా
ఉంది అని బాధపడుతూ చెబుతున్నారు!
ఇప్పుడు
యోబుగారు విలాపం ఆరంభించారు. ఇది 29,30 అధ్యాయాల్లో కొనసాగుతుంది
(యోబు 30:31, ). వీటిలో తన గత జీవితానికి
(29అధ్యాయం) ప్రస్తుతం ఉన్న దీనదశకూ
(30 అధ్యాయం) తేడా గురించి ఆలోచిస్తూ వాపోయారు.
రెండవ వచనం చూసుకుంటే పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో
మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు అంటున్నారు!
ఇంకా 3 అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా
ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
యోబుగారు అంటున్నారు – తన మీదికి ఆపదలు వచ్చి పడిన సమయంలో
తానేమీ పాప జీవితంలో లేడు. దేవుని సహవాసానికి దూరంగా లేడు.
నిజానికి అందుకు వ్యతిరేకమైన స్థితిలో ఉన్నాడు. దేవుని వెలుగు, ఆయన సన్నిధి, చిరునవ్వు,
దేవుని ఆశీర్వాదాలు యోబుగారి మీద ఉన్నాయి అంటున్నారు!
ఇంకా
అంటున్నారు తర్వాత వచనాలలో 4 నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల
ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.
5 సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా
చుట్టునుండిరి
6 నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము
నూనె ప్రవాహముగా పారెను.
చూడండి
ఏమంటున్నారో నా పరిపక్వ దినములలో నేను ఉండినప్పుడు నేను ఉండినట్లు ఇప్పుడు ఉంటే ఎంత
బాగుండునో – అప్పుడు నేను దేవుని రహస్యము నా గుడారము మీద ఉండెను అంటున్నారు! ఎందుకు ఇలా అంటున్నారు అంటే కీర్తనలు
25:14 లో అంటున్నారు 14 యెహోవా
మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
27: 5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు
మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
ఇక్కడ
ఈ రెండు వచనాలలో మనకు ఏమని అర్ధమవుతుంది అంటే యోబుగారు దేవునితో ఎంతగా దగ్గర సంబంధము
కలిగి ఉండేవారో ఎంత సన్నిహితముగా ఉండేవారో తెలుస్తుంది. ఇంకా సర్వశక్తుడు ఇంకనూ
నాకు తోడై యుండెను అప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు అంటున్నారు!
ఇక్కడ ఈ
5 వ వచనంలో దేవుడు నాకు తోడై ఉండేవారు తర్వాత నా పిల్లలు కూడా నా చుట్టూ
ఉండేవారు అంటున్నారు. ఇప్పుడైతే నా పిల్లలు నాతో లేరు-
దేవుడు కూడా నాకు దూరంగా ఉన్నారు అని బాధపడుతున్నారు! ముఖ్యంగా ఇప్పుడు నా పిల్లలు దూరమై పోయారు అనేది ఎంతగా దుఖపెడుతుందో అంతకంటే
ఎక్కువగా దేవుడు తనతో మాట్లాడటం లేదు అని ఎంతగానో బాధపడుతున్నారు!
ఇంకా
నేను వేసిన అడుగు నేతిలో పడేది అంటున్నారు అనగా నేను ఏమి చేసినా అది ఫలించేది అనే అర్ధముతో
మాట్లాడుతున్నారు!
ఇది
ఒకరకమైన పరిపక్వ స్థితి అయితే తర్వాత వచనం నుండి వీధిలో బజారులో తన యొక్క గౌరవ మర్యాదలు
ఎలా ఉండేవో చెబుతూ వాపోతున్నారు!
7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా
పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
8 యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
9 అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
10 ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి
అంటుకొనెను అంటున్నారు!
ఇక్కడ
యోబుగారు ఇతరుల యొక్క మన్నన, గౌరవం
పొందినవాడు. అంటే అతను దుర్మార్గుడు కాదని అందరికీ తెలుసు.
అందుకే ఆయన బయటకు వెళ్తే ఆయన రాజవీధిలో పీఠము సిద్దపరచుకొనే వారు అంటున్నారు
అనగా ఆయన ఊరికి ఒక పెద్దగా ఉండేవారు అన్నమాట!
ఆయనను
చూచి యవ్వనస్తులు దాగుకునే వారట, చివరికి ముసలివారు కూడా యోబుగారిని చూసి లేచి నిలబడే వారు!
ఆయన ముందు దేశపు అధికారులు మాటలాడుట మాని నోటిమీద చేయి వేసుకొనే వారట!
అనగా ఇప్పుడు మంత్రులు వస్తే అధికారులు ఎలా దండకట్టుకుని నిలబడతారో అలా
యోబుగారు వస్తే అధికారులు కూడా నోటిమీద చేయి వేసుకుని మౌనముగా ఆయన తీర్పులు కోసం ఎదురు
చూసేవారు! గ్రామ ప్రధానులు పెద్దలు కూడా ఆయన ముందు మౌనముగా ఉండేవారు!
ఇక
తర్వాత వచనంలో అంటున్నారు నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు
నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను అంటున్నారు! దీనికోసం ఆలోచిస్తే
ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే ఆ వ్యక్తి దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంచెలంచెలుగా
ఆ వ్యక్తిని దీవిస్తూ ఎన్నో ఉన్నత శిఖరాలను ఎక్కిస్తారు అని ఇక్కడ యోబుగారు చెప్పిన
వివరణ ప్రకారం అర్ధమౌతుంది! అందుకే అంటున్నారు 8:7లో అంటున్నారు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను తుదకు నీవు మహాభివృద్ది పొందుదువు
అంటున్నారు!
మరి
నీవు నమ్మకముగా ఉంటావా?!!!
అయితే
దేవుడు నిన్నుకూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*105వ భాగం*
యోబు 29:11—17
11 నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా
ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
12 ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని
నేను విడిపించితిని.
13 నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను
విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది
నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
15 గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.
16 దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును
నేను శ్రద్ధగా విచారించితిని.
17 దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.
ప్రియులారా! ఇక 29 వ అధ్యాయములో
కూడా యోబుగారు మాట్లాడుచున్నారు! ఈ అధ్యాయంలో తన పూర్వ స్థితి
ఎంత బాగుండేది ఇప్పుడు మొత్తం దానికి భిన్నంగా ఉంది అని బాధపడుతూ చెబుతున్నారు!
11 వ వచనంలో నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను
అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను అంటున్నారు. ఎందుకంటే మొర్రపెట్టిన దీనులను తండ్రిలేని వారిని సహాయము లేనివారిని నేను విడిపించాను
అంటున్నారు. ఈ
భాగములో తాను దిక్కులేని దీనులకు అనాదలకు ఏవిధంగా సహాయం చేశారో చెబుతున్నారు!
మొదటి గుంపు మొర్రపెట్టిన
దీనులకు తండ్రిలేని వారికి సహాయం చేసేవారు, ఎవరూ లేని నిస్సహాయులకు సహాయం చేశారట!
రెండవ గుంపు నశించుటకు
సిద్ధమై ఉన్నవారిని ఆదుకున్నారు, ఇంకా విధవరాళ్లకు
సహాయం చేసి వారి హృదయాన్ని సంతోషపెట్టారు!
ఇక 15,16 వచనాలలో గుడ్డివారికి కన్నులుగా ఉన్నారట,
కుంటివారికి పాదములుగా ఉన్నారట! దరిద్రులకు తానే
తండ్రిగా ఉండి వారి బాగోగులు చూసుకున్నారట! వారి తగాదాలు జాగ్రత్తగా
విచారించి దుర్మార్గుల దవడ పళ్ళు విరగగొట్టి వారి పళ్ళలోనుండి దోపుడు సొమ్ము లాగివేశాను
అంటున్నారు! ఇక్కడ చూసుకుంటే అతని క్రియలవల్ల అతడు గౌరవం పొందదగిన
వాడయ్యాడు. దీనిని ఎలీఫజు యోబు 22:5-11, లో చేసిన తప్పుడు ఆరోపణతో పోల్చిచూడండి.
అసలు యోబుగారు ఎందుకు ఇలా
చేశారంటే సామెతలు 21:13 దరిద్రుల
మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు. ఇదీ అసలు విషయం. అందుకే దీనులకు దిక్కులేనివారికి యోబుగారు
సహాయం చేసేవారు!
కీర్తనాకారుడు
అంటున్నారు కీర్తనలు 72: 12 దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను
నిరాధారులను అతడు విడిపించును.
13 నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల
ప్రాణములను అతడు రక్షించును
14 కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును.
వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
నిర్గమకాండంలో
దేవుడు అంటున్నారు 22: 22 విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట
కూడదు.
23 వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల
నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
24 నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను,
మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు
లేనివారగుదురు.
ఇక కీర్తన 82 లో దేవుడు చెబుతున్నారు
2 ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు?
ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా.)
3 పేదలకును తలిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి
శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
4 దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి
వారిని తప్పించుడి.
అందుకే ఇక్కడ యోబుగారు దీనులకు దిక్కులేనివారికి సహాయం చేశారు!
ఇక 14 వచనాలలో అంటున్నారు 14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన
నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
నిజానికి
నీతిని వస్త్రముగా ధరించుకోవలసిన వారు ఎవరు అని ఆలోచిస్తే కీర్తనలు 132:9 లో అంటున్నారు 9 నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురు
గాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
అనగా
యాజకుడు చేయవలసిన కార్యములలో ఒకటి ఇక్కడ యోబుగారు చేస్తున్నారు. ఇంకా తనయొక్క న్యాయ ప్రవర్తన
యోబుగారికి వస్త్రము మరియు పాగా అయ్యింది అంటున్నారు!
నిజానికి
దేవుడు కూడా ఇలాగే ఉన్నారు యెషయా 59: 16 సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను.
కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
17 నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా
ధరించుకొనెను
18 ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా
ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును
తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.
ఇక
గత 27వ అధ్యాయంలో
కూడా చెప్పారు కదా 5 మీరు చెప్పినది
న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
6 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన
అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు.
ఇక
దీనినే క్రొత్త నిబంధన లో పౌలుగారు చెబుతున్నారు ఎఫెసీ 6: 14 ఏలాగనగా
మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
15 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు
తొడుగుకొని నిలువ బడుడి.
మరి
నీవు ఇలాంటి స్థిరమైన దృఢమైన నమ్మకము కలిగి పేదలను ఆదరిస్తూ దిక్కులేని వారికి సహాయం
చేస్తూ దేవుని మార్గములలో నడవగలవా?
అప్పుడే
దేవుడు నీ మార్గములను సరాళం చేస్తూ నీకు వెలుగుగా ఉంటారు!
దేవుని
నీతి దేవుని ఆశీర్వాదం నీ తలకు పైగా ఉంటుంది!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*106వ భాగం*
యోబు 29:11—17
18 అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు
గలవాడనవుదును.
19 నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద
నిలుచును.
20 నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని
బలముగా నుండును.
21 మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా
ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
22 నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి.
గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.
23 వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి
కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
24 వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు
నవ్వితిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.
25 నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను
ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
ప్రియులారా! ఇక 29 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుచున్నారు!
ఈ అధ్యాయంలో తన పూర్వ స్థితి ఎంత బాగుండేది ఇప్పుడు మొత్తం దానికి భిన్నంగా
ఉంది అని బాధపడుతూ చెబుతున్నారు!
ఇక 18 వ వచనంలో తన జీవితం
సాఫీగా సాగిపోయేటప్పుడు అనుకున్నారట: 18 అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు
గలవాడనవుదును.
19 నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద
నిలుచును.
20 నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని
బలముగా నుండును.
చూడండి
తనకు ఆపదలు వాటిల్లుతాయని అతనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అవి తనకు రావలసిన అవసరం,
కారణం ఏమీ అతనికి తట్టలేదు. అతను నిర్ధోషిగా జీవించారు
కాబట్టి ఆపదలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు అంతేకాకుండా సామెతలు 12:21 లో నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అని వ్రాయబడింది. తన
భక్తి తనకు ఆశ నిరీక్షణ పుట్టించింది కనుక ఆపదకు భయపడటం అనేది లేదు ఆపదలు వస్తాయనే
ఆలోచనే ఆయనకు లేదు!
కీర్తనాకారుడు 138:7 లో అంటున్నారు నేను
ఆపదలో చిక్కుబడి ఉన్నా గాని నీవు నన్ను బ్రతికించెదవు! మరో కీర్తనాకారుడు
అంటున్నారు ఈ అపదలు తొలిగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అంటున్నారు
57:1!
సరే, ఇక్కడ నేను హంసవలే చిరకాలము
నివాసం చేస్తూ నా గూటివద్దనే నేను చస్తాను దీర్ఘాయువుతో ఉంటాను అని అనుకున్నాను అని
వ్రాయబడింది గాని మిగిలిన ప్రతులన్నీటిలో నేను సముద్రపు ఇసుకలా విస్తరిస్తూ ధీర్ఘాయువుతో
ఉంటాను అని అనుకున్నాను అని తర్జుమా చేయబడింది ఈ వచనం! తెలుగులో
ఎందుకో నేను హంసలా ఎక్కువ కాలం బ్రతుకుతూ నా గూటివద్దనే చస్తాను అని తర్జుమా చేశారు.
నిజానికి మనలాంటి దేశాలలో ఒక హంస 30 సంవత్సరాలు
బ్రతుకుతుంది. కాలుష్యం చాలా తక్కువ ఉన్న దేశాలలో, పక్షులను చంపని దేశాలలో హంస 50 సంవత్సరాల వరకు బ్రతుకు
తుంది. ఇక్కడ యోబుగారి ఉద్దేశం నా ఇంటివద్దనే నేను నా కుటుంబం
వద్ద ధీర్ఘాయువుతో జీవిస్తాను అని అనుకున్నాను అని భావము!!
ఇక
ఒక చెట్టుతో తననుతాను పోల్చుకున్నారు- నా వేళ్ళ చుట్టూ నీళ్ళు వ్యాపిస్తూ ఉంటాయి నా
కొమ్మలమీద ఆకాశ మంచు నిలిచి ఉంటుంది తద్వారా నేను నీటి లేమితో బాధపడకుండా నిరంతరము
ఫలిస్తూ ఉంటాను అనుకున్నాను అంటున్నారు! కీర్తనాకారుడు కూడా దేవుని
ధర్మశాస్త్రమును నిరంతరము ధ్యానిస్తూ దాని ప్రకారం చేసేవాడు- ఆకువాడక తన ఫలమిచ్చు చెట్టులా ఉండును అని అన్నారు కీర్తన మొదటి అధ్యాయములో!
ఇక
తర్వాత వచనంలో అందువలన నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా
ఉంటుంది అని అనుకున్నాను అని వాపోతున్నారు!
ఇక 21—25 వరకు మరలా తాను
ప్రజలకు నాయకునిగా ఉండే రోజులలో ప్రజలు తనకోసం ఎలా ఎదురుచూసేవారో మరలా చెబుతున్నారు!
21 మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా
ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
22 నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి.
గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.
23 వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి
కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
24 వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు
నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.
25 నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను
ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
తాను
ఒక నాయకుణ్ణనీ ఇతరులకు సలహా చెప్పేవాణ్ణనీ తన స్థానాన్ని అక్రమంగా ఉపయోగించుకోలేదని
యోబుకు తెలుసు.
అందుకే
మీద 9—10 వచనాలలో అధికారులు కూడా తాను వస్తే నోటిమీద చేయి వేసుకున్నారు అంటున్నారు
7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా
పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
8 యవనులు నన్ను
చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.
9 అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
10 ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి
అంటుకొనెను.
ఇక
తర్వాత వచనాలలో నేను మాట్లాడిన తరువాత వారు మాట్లాడలేక పోయారు గుత్తులు గుత్తులుగా
నా మాటలు వారిమీద పడ్డాయి,
వర్షము కొరకు కనిపెట్టునట్లు నా కొరకు కనిపెట్టుకున్నారు అంటున్నారు
అనగా ఇక్కడ ఆయన మాటలు ఎంతో దయగలవై న్యాయమైనవై ఉండేవన్న మాట!
అందుకే
ద్వితీ 32:2 లో అంటున్నారు 2 నా ఉపదేశము
వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు
వర్షమువలెను ఉండును.
మనము
కూడా మన మాటలు ఎంతో దయగాను ప్రజలకు ఆదరణ కలుగజేసే విధంగానూ ఉండాలి!
మన
మాటలు ఇల్లు కాపురాలు కట్టేవిధంగా ఉండాలి గాని కాపురాలు కూల్చే విధంగా ఉండకూడదు!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*107వ భాగం*
యోబు 30:1—7
1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి
చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని
నేను తలంచియుంటిని.
2 వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది.
3 దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో
చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
4 వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు
వారికి ఆహారమైయున్నవి.
5 వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు
కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన
లోయలలోను
6 నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి
వచ్చెను.
7 తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు
కూడియుందురు.
ప్రియులారా! గత రెండు అధ్యాయములలో తన పూర్వ స్థితి ఎలా ఉండేదో చెప్పి బాధపడితే ఈ
30 వ అధ్యాయంలో ఇంతటి ఘనమైన స్థితిలో ఉండే నన్ను ఇప్పుడు నా ఆస్తి అంతస్తు
ఆరోగ్యం పోయాక తనతో ప్రజలు
ఎలా మెలుగుతున్నారో చెబుతూ బాధపడుతున్నారు!
1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు
నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో
నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
ఒకప్పుడు
యోబుగారు గౌరవప్రతిష్ఠలు గల స్థానంలో ఉన్నారు.
ఇప్పుడతనికి పనికిరాని నీచుల హేళన, ప్రతిఘటన ఎదురయ్యాయి.
తమ మధ్య ఉండేందుకు తగరని భావించి వారి తండ్రులను అక్కడి ప్రజలు వెళ్ళగొట్టేశారు
(5,8 వ). ఇప్పుడైతే ఆ పోకిరి కుర్రవాళ్ళు యోబు
ముఖంమీద ఉమ్మి వేసి తమకు చేతనైనంత ఇబ్బంది అతనికి కలిగిద్దామని చూస్తున్నారు
(యోబు 16:10-11, .
చూడండి
ఇప్పుడు ఎగతాళి చేసేవారి యొక్క తండ్రులు తన మందలో ఉండే కుక్కలతో కూడా ఉండటానికి తగని
వారు, కానీ
వారు ఇప్పుడు తనను ఎగతాళి చేస్తున్నారు అంటున్నారు!
ఇంకా అంటున్నారు ఇప్పుడు వారి చేతుల బలము వలన నాకేమీ ప్రయోజనము? వారి పౌరుషం పోయింది,
దారిద్ర్యము క్షామము చేత వారు ఆరోగ్యం పాడైపోయి చాలాకాలం నుండి ఆహారం
లేక ఎడారిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో తిరుగులాడేవారు, ఇంకా
తుప్పలలోని తుత్తి చెట్లు పెరికేవారు ఇంకా తంగేడు వేళ్ళు వారు తినేవారు. నరులమధ్య నుండి వారు తరిమి వేయబడిన వారు భయంకరమైన లోయలలోనూ నేల సందులలోనూ బండ
సందుల లోనూ వారు జీవించేవారు.
ఇలాంటివారు ఇప్పుడు తనను వేధిస్తున్నారు
బాధిస్తున్నారు అంటున్నారు!
ఇంకా
ఏమంటున్నారు అంటే 8 వారు మోటువారికిని పేరు
ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.
9 అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు
పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
10 వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద
నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు.
చూడండి
మోటువారికి పేరు ప్రతిష్ట లేని వారికి పుట్టిన వారు దేశములో నుండి తరిమివేయ బడిన వారు
అనగా ఎటువంటి గౌరవం, పేరులేని పోకిరి వాళ్ళకు పుట్టిన వారు కూడా ఇప్పుడు తనను అవమానిస్తున్నారు
అని అర్ధం! అలాంటి వారు ఇప్పుడు తనకోసం సామెతలు పాటలు పాడుతూ
తనను గేలి చేస్తున్నారు తాను కనపడిన వెంటనే ఉమ్మి వేస్తున్నారు అట!
గత 29 వ అధ్యాయంలో ఇలాంటివారు
ఎంత దూరంగా పారిపోయేవారో ఇప్పుడు తనను చూస్తూ అంతగా అసహ్యించు కుని ఉమ్మి వేస్తున్నారు
అంటున్నారు .
ఇక
తర్వాత వచనాలలో
11 ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను
కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
12 నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు
ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.
13 వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము
కలుగ జేయుదురు
14 గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
15 భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు
మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
16 నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి
ఇక్కడ
మరలా దేవునిమీద బాధపడుతున్నారు దేవుడు నా డేరా త్రాడు విప్పేసి నన్ను భాదిస్తున్నారు
ఇప్పుడు ఎవరూ కూడా నామాట వినడం లేదు. అల్లరి మూకలు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు,
అందుకే నా ఆత్మ నాలో కరిగిపోయింది ఆపద దినములు నన్ను పట్టుకున్నాయి అంటున్నారు!
యోబు 3:24, ; యోబు 6:10, ; యోబు 7:4-5, ; యోబు 13:28, ; యోబు
16:8, యోబు 16:17, ; యోబు 17:1, ; యోబు 19:20
ఒకవేళ
నీవు కూడా ఇలా బాధపడుతూ ఉంటే బెదరకు జడియకు- యోబుగారికి శ్రమల ఆనంతరము రెట్టింపు ఆశీర్వాదం
ఇచ్చిన దేవుడు- నీ దుఖ దినములు కూడా సమాప్తి చేసి నీకు మంచి స్థితిని
తప్పకుండా అనుగ్రహించ గలరు!
ఆయననే
నమ్ముకుని ఆయన మీద ఆనుకుని ముందుకు సాగిపో!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*108వ భాగం*
యోబు 30:17—23
17 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి
నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
18 మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు
నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
19 ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
20 నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర
మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
21 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత
నన్ను హింసించుచున్నావు
22 గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని
పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు
23 మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు
నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.
ప్రియులారా! గత రెండు అధ్యాయములలో తన పూర్వ స్థితి ఎలా ఉండేదో చెప్పి బాధపడితే ఈ
30 వ అధ్యాయంలో ఇంతటి ఘనమైన స్థితిలో ఉండే నన్ను ఇప్పుడు నా ఆస్తి అంతస్తు
ఆరోగ్యం పోయాక తనతో ప్రజలు
ఎలా మెలుగుతున్నారో చెబుతూ బాధపడుతున్నారు!
ప్రియులారా! ఇక ఈ భాగంలో మరలా దేవునివైపు
తిరిగి తన బాధ చెప్పుకుంటూ ఎందుకయ్యా ఇలా చేశావు అంటూ దేవునితో మాట్లాడుతున్నారు యోబుగారు!
17 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి
నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
18 మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు
నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
చూడండి
ఇక్కడ రాత్రి అయితే తన ఎముకలు నాలో విరిగిపోయినంత బాధ నొప్పి కలిగిస్తున్నాయి అంటున్నారు! అవును రాత్రిపూట ఒంటరిగా
ఉన్నప్పుడు నొప్పులు బాధలు అలాగే ఉంటాయి. పగటివేళ ప్రజలు సంచరిస్తూ
మాట్లాడుతూ ఉంటే నొప్పులు తగ్గినట్లు అనిపించినా ఎవరూ లేనప్పుడు నొప్పి పెడుతూ ఉంటాయి.
అదే చలికాలమైతే ఎప్పటి నొప్పులో బయటకు వచ్చి బాధిస్తూ ఉంటాయి.
ఇంకా
అంటున్నారు మహా రోగముచేత నా వస్త్రము రూపము తప్పిపోయింది అంటున్నారు! అనగా బహుశా తన కలిగిన
కుష్టు రోగము లాంటి జబ్బు వలన తన కురుపులు గాయాలు చీము రసి కారుతూ ఉండటం వలన తన వస్త్రానికి
ఆ చీము రక్తము అంటుకుపోయి వస్త్రము వస్త్రము వలె కాకుండా మరో విధంగా కనిపిస్తుంది అన్నమాట!
అంతేకాకుండా ఆ కురుపులు గాయాల వలన తన శరీరము ఉబ్బిపోయి బహుశా వస్త్రము
చాలక పోయి ఉండవచ్చు! అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అని నా
ఉద్దేశం! ఈ వచనాలు ఇలా ఆలోచిస్తే 33 వ అధ్యాయములో
ఏలీహు దేవుడు మనిషికి బుద్ది చెప్పేటప్పుడు ఏ విధమైన చర్యలకు గురిచేస్తారో వివరించి
చెప్పిన మాటలకు చాలా దగ్గరగా ఉన్నట్లు అని పిస్తుంది.
14 దేవుడు ఒక్కమారే
పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు
15 మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో
రాత్రి కలుగు స్వప్నములలో
16 నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము
వారు మానుకొనచేయునట్లు
17 గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ
వారి ప్రాణమును తప్పించునట్లు
18 ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
19 వ్యాధిచేత మంచమెక్కుట వలనను ఒకని యెముకలలో ఎడతెగని
నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
20 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి
కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును
22 వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు
సమీపించును.
దావీదుగారు
కూడా ఇలాగే మొరపెట్టినట్లు మనము కీర్తన 6వ అధ్యాయములో చూడగలము!
2 యెహోవా, నేను కృశించియున్నాను,
నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి,
నన్నుబాగుచేయుము
3 నా ప్రాణము బహుగా అదరుచున్నది.యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4 యెహోవా, తిరిగి రమ్ము,
నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
5 మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో
ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?
6 నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు
విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని
పోవు చున్నది.
7 విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ
కలిగించువారిచేత అవి చివికియున్నవి.
ఒకవేళ
నీవు కూడా ఇలాగే మొరపెడుతూ ఉంటే దేవుడు కరుణాసంపన్నుడు అని గుర్తుకు తెచ్చుకుని దేవునికి
ఆయాసం కలిగించేవి మనలో నుండి తీసివేసుకుని ఆయన పాదాలు నేడే పట్టుకో!
ఆయన తప్పకుండా నిన్ను ఆదరించి రక్షించ
గలరు!
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు:
19 ఆయన నన్ను బురదలోనికి త్రోసెను
నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
20 నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు
ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
21 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ
బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు
మరో
సారి యోబు దేవునివైపుకు తిరిగి ఫిర్యాదు చేస్తున్నాడు. గత అధ్యాయాలలో ఆయన ఇలాగే
మొరపెట్టారు!
యోబు 7:7-21, ; యోబు
10:2-22, ; యోబు 13:20, ; యోబు 14:22,
; యోబు 16:7-8, ; యోబు 17:3-4 చూడండి
ఇంకా
అయ్యా నన్ను బురద లోనికి తోసేశావు అంటున్నారు! నేను మొరపెట్టినా నాకు జవాబు ఇవ్వడం లేదు,
నీవు నావైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. నీవు
ఇప్పుడు మారిపోయావు నా పట్ల చాలా కఠినుడవు అయిపోయావు అంటున్నారు!
యోబు 6:4, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి
విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు
తీరుచున్నవి.
యోబు
13:24, నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల
నీకు పగవానిగా ఎంచుచున్నావు?
యోబు
16:9, . ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
ఇక
తర్వాత మాటలలో 22 గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు
తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు అంటున్నారు!
తర్వాత
వచనంలో అయ్యా నేను కొద్ది రోజులలో మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు
నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును అంటున్నారు! అనగా కొద్దిరోజుల తర్వాత నన్ను మరణమునకు
నీవు రప్పిస్తావు అని నాకు తెలుసు అంటున్నారు! దీనికి ఆయన పెట్టిన
మరో పేరు సర్వ జీవులకు నియమించ బడిన సంకేత సమాజ మందిరము!!! ఎంతమంచి
పేరు పెట్టారో కదా! చూడండి జీవులందరికీ నియమించ బడిన స్థలానికి
నీవు నన్ను రప్పిస్తావు అని నాకు తెలుసు అంటున్నారు!
యోబు 10: 20 నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి
రాజాలని దేశమునకు
21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు
22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార
దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు
నన్ను విడిచి నా జోలికి రాకుండుము.
అయితే
ఇక్కడ దేవుని మీద నిష్టూరాలు పలుకుతున్నారు యోబుగారు!
గతంలో
కూడా అన్నారు ఇలాగే యోబు
9:22, ఏమి చేసినను ఒక్కటే కావున - యథార్థవంతులనేమి
దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.
యోబు 10:8, . నీ హస్తములు నాకు
అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు.
ప్రియ
సహోదరుడా నీవు కూడా ఇలా దేవుని మీద నిష్టూరాలు వేస్తూ ఉంటే దయచేసి ఆపమని మనవి చేస్తున్నాను. దేవుడు ఎవరికీ స్వాభావికముగా
మనస్పూర్తిగా బాధలు హింసలు శ్రమలు శోధనలు కలుగజేయరు! బహుశా అది
మన క్రియలకు ఫలితమైనా కావచ్చు- లేదా దేవుని ప్రణాళికా అయినా కావచ్చు
కాబట్టి దేవుని మీద నిందలు వేయడం మానమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*109వ భాగం*
యోబు 30:24—31
24 ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?
25 బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?
26 నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను
వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
27 నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను.
28 సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను
సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
29 నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
30 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన
నా యెముకలు కాగిపోయెను.
31 నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి
రోదనశబ్దము ఎత్తుచున్నది.
ప్రియులారా! ఇక ఈ భాగంలో కూడా దేవునితోనే మాట్లాడుతున్నారు యోబుగారు!
24 ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?
25 బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?
ఇక్కడ
బాగా అధ్యయనం చేస్తే మరణానికి దగ్గర కావడం గురించి యోబుకు ఏమీ భయం లేకపోయినా (అసలు భయం లేదు),
సహాయం కోసం మొరపెట్టారు ఆయన!
యోబు 6:8-9
8 ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని
దేవుడు నెరవేర్చును గాక
9 దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి
ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక
యోబు 7:15, కావున నేను ఉరితీయబడవలెనని
కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
అయితే
నిజానికి తన బాధ ఏమిటంటే నేను బాధలో ఉన్నవారి నిమిత్తం ఏడ్చి ప్రార్ధించినప్పుడు స్వస్థత
ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నాకే బాధ ఇబ్బంది రోగము కలిగితే నీవెందుకు నన్ను ఆదరించడం లేదు
అనేదే! మొదటినుంచీ అతని ఫిర్యాదు ఇదే తన కార్యాలకు అనుగుణంగా
తనకు ప్రతిఫలం దక్కలేదు, దేవుడు తనకు అన్యాయం చేశాడు,
తాను ఇతరులను చూచిన విధంగా దేవుడు తనను చూడలేదు అని బాధ పడుతున్నారు!
ఇక
తర్వాత అంటున్నారు 26 నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము
నేను కనిపెట్టగా చీకటి కలిగెను
భక్తుడైన
యిర్మీయా కూడా ఇలాగే మొరపెట్టారు
8: 15 మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదా యెను;
క్షేమముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.
14: 19 నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా?
మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
యోబు
3: 24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె
ప్రవహించుచున్నవి.
25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే
నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి
లేదు శ్రమయే సంభవించుచున్నది.
ఇంకా అంటున్నారు నా పేగులు మానక మండుచున్నవి
అపాయదినములు నన్నెదుర్కొనెను.
3: నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి
లేదు శ్రమయే సంభవించుచున్నది.
తర్వాత
వచనాలలో అంటున్నారు 28 సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను
సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
29 నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని
ఈ
జంతువులు మూలుగుతున్నట్టు కీచుగొంతుతో చేసే శబ్దాలను గురించి ఇలా అని ఉండవచ్చు. తాను కూడా వాటిలాగే ఒంటరి
వాడైపోయానని యోబు భావం.
ఇక
చివరి వచనాలలో అంటున్నారు
30 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన
నా యెముకలు కాగిపోయెను.
31 నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి
రోదనశబ్దము ఎత్తుచున్నది.
చూడండి
చివరికి ఆ కురుపులు కూడా ఎండిపోయి చర్మము రాలిపోతుంది అంటున్నారు. అంతేకాకుండా వేడి వలన
ఎముకలు అన్నీ వేడిగా కాగిపోయాయి అంటున్నారు. నా స్వర మండలము దుఖస్వరము
ఇస్తుంది నా పిల్లన గ్రోవి అనగా తన గొంతు రోధన ధ్వని ఇస్తుంది అంటున్నారు!
యోబుగారు
తన ఆఖరి విలాపాన్ని కొన్ని రకాల వాయిద్యాలు చేసే ధ్వనితో పోలుస్తున్నాడు. వాటి శబ్దాలు బిగ్గరగా,
నెమ్మదిగా, అంతరించిపోతూ శోకం కురిపిస్తాయి.
ఈరోజు
నీవు కూడా యోబుగారిలా రోధిస్తున్నావా? నాకు ఎవరూ లేరు! ఆదరించే
వారు, నా మొర వినేవారు నన్ను పట్టించుకునే వారు లేరు అని బాధపడుతున్నావా?
అయితే దేవుడు 366 సార్లు చెబుతున్నారు భయపడకుము
దిగులు పడకుము! నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నారు!
కాబట్టి ఆయన బట్టియే ధైర్యము తెచ్చుకో! విశ్వాసముతో
ముందుకు సాగిపో!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*110వ భాగం*
యోబు 31:1—4
1 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు
చూచుదును?
2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?
ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
3 దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి
దురవస్థ ప్రాప్తించుటయే గదా.
4 ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని
లెక్కించును గదా
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
అయితే యోబుగారి మిత్రులు తనపై చేసిన నేరారోపణలకు యోబుగారి ప్రత్యుత్తరం
ఈ అధ్యాయంతో ముగుస్తున్నది. దీనిలో అతడు తన న్యాయ సమ్మతమైన ప్రవర్తనను
వారిముందు ఉంచుతున్నారు. అయితే ఈ అధ్యాయములో యోబుగారి జవాబులు
డంబాలు కొట్టేందుకు కాదు. స్నేహితుల కారణంగా యోబు ఇలా చెప్పుకోవలసిన
అవసరం కలిగింది. ఆనాడు కపట బోధకుల ఆరోపణలకు జవాబుగా 2
కొరింతులో పౌలుగారు తనను తాను సమర్థించుకొన్న పరిస్థితులు కూడా ఇలాంటివే (2 దినవృత్తాంతములు
11:21-29, ; 2 దినవృత్తాంతములు 12:1-3, ). 1 సమూయేలు
12:1-3, ; 1 సమూయేలు 24:8-15, ; 1 సమూయేలు
26:17-24, ; కీర్తనల గ్రంథము 17:1-5, చూడండి.
పతన స్థితిలో ఉన్న మానవజాతిలో తానూ కూడా ఒక భాగమేనని యోబుగారికి తెలుసు (యోబు
13:26, ; యోబు 14:4, యోబు 14:16-17, ; యోబు 31:33, ). ఒకవేళ మానవ స్వభావం ఎంత పాపభూయిష్టమైనదో
అన్న విషయం ఇతర పాత నిబంధన భక్తులు
కొందరికి తెలిసినంత వివరంగా యోబుకు ఇంకా తెలియకపోవచ్చు.
ఏది ఎలా ఉన్నా తాను మాత్రం కల్మషానికి దూరంగా, దేవుడంటే భయభక్తులతో నీతి న్యాయాలకు కట్టుబడి యథార్థ హృదయంతో జీవించానని మాత్రం
అతనికి బాగా తెలుసు. కాబట్టి యోబు అభిప్రాయం ప్రకారమైతే వచ్చిన
ఆపదలు తనకు రావలసినవి కావు, దేవుని ప్రతీకారం గురించి అతని స్నేహితులు
ప్రతిపాదించిన సిద్ధాంతం మాత్రం తప్పుడు తడకలే. యోబు తనకున్న
సుగుణాలలో దీనికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నారు. వ్యభిచారానికి
అతను దూరంగా ఉండడమే కాక చెడ్డ తలంపులు కూడా తన మనస్సులోకి రాకుండా చూసుకున్నారు.
ఒక అమ్మాయి వైపు తాను చూచే విధానంలో యోబు చాలా జాగ్రత్త వహించారు.
దీనిలో యోబుగారు కొండమీద యేసు క్రీస్తు ప్రభులవారు
చేసిన ప్రసంగానికి అనుగుణమైన ప్రవర్తనను కనపరచారన్న మాట
(మత్తయి 5:27-28, ). నీతి, శీలం, పవిత్రత అనేవి కేవలం బయటి క్రియలకే పరిమితమైనవి
కావనీ అంతరంగంలోని కోరికలకూ ఆలోచనలకూ సంబంధించినవనీ యోబు అర్థం చేసుకున్నారు.
చూసుకుందాము! 1 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?
ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
చూడండి
కన్నులతో నిబంధన చేసుకున్నారు అట! ఎలాగూ? కన్యకను ఎలా చూడాలి! మిగతా స్త్రీలను ఎలా చూడాలి అని!!
మత్తయి 5: 27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన
మాట మీరు విన్నారుగదా;
28 నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో
చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
అవును
ఇదే మోహపు చూపువలన దావీదుగారు ఓడిపోయారు జారిపోయారు 2 సమూయేలు 11 లో
1 వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును
అతనివారిని ఇశ్రా యేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును
ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను.
2 ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి
లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.
3 ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము
తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు
హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా
4 దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన
అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.
5 ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము
పంపగా..
కీర్తనలు 119: 37 వ్యర్థమైనవాటిని చూడకుండ
నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
అందుకే సామెతల గ్రంధములో భక్తుడు అంటున్నారు 4: 25 నీ
కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
26 నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు
స్థిరములగును.
27 నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును
కీడునకు దూరముగా తొలగించు కొనుము.
1 యోహాను
2: 15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీ
రాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి
లోకసంబంధమైనవే.
అందుకే
ఇక్కడ భక్తుడు నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును అంటున్నారు! ఒకసారి పౌలుగారు తిమోతి
గారితో చనిపోయే ముందు చెబుతున్నారు 1 తిమోతి 5: 1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని
హెచ్చరించుము.
2 అన్నదమ్ములని యవనులను, తల్లులని
వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యవనస్త్రీలను
హెచ్చరించుము.
యవనస్తులను
అన్నా తమ్ముడు అని పిలవమంటున్నారు! అక్కా చెల్లి అంటూ యవన స్త్రీలను పిలవమని హెచ్చరిస్తున్నారు.
వయసులో పెద్దవారిని అమ్మా తల్లీ అంటూ పిలువమని హితవు పలుకుతున్నారు!
మరి నీవు నేను సంఘములో పవిత్రముగా వ్యవహరించాలంటే ఇదొక్కటే బైబిల్ నేర్పించే
మాదిరి మరియు క్రమము!
అందుకే
మన కన్నులు మన చూపులు జాగ్రత్తగా ఉంచుకుందాము!
ఇక
తర్వాత వచనంలో అంటున్నారు 4 ఆయన నా ప్రవర్తన నెరుగును గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును
గదా
యోబుగారిలో
కనిపించే ఈ నీతిగల ప్రవర్తనకు కారణం అతనికి దేవుని గురించిన గ్రహింపు ఉండడమే. అతని ఆలోచనల్లో దేవునికి
ఎప్పుడూ స్థానం ఉండేది (వ 2,4,14,15,23,28). అతడు దేవుడంటే భయభక్తులున్నవాడు, దేవుణ్ణి సంతోష పెట్టగోరేవాడు,
తన జీవితం అన్ని రంగాల్లో దేవునికి ఆధిక్యత ఇచ్చేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు.
2 దిన 16: 9 తనయెడల యథార్థ హృదయముగలవారిని
బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ
విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.
యోబు 34: 21 ఆయన దృష్టి నరుల మార్గములమీద
నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.
సామెతలు 5: 21 నరుని మార్గములను యెహోవా యెరుగును
వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
15: 3 యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని
మంచివారిని అవి చూచుచుండును.
యిర్మీయా 32: 19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు,
క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి
ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల
మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.
16: 17 ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని,
ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును
నాకు మరుగైయుండదు.
కాబట్టి
దేవుడు మన ప్రవర్తనను కనిపెడుతున్నారు! మనమీద ఆయన కన్నులు 24 x 7 చూస్తూనే ఉన్నాయి! గనుక మన చూపులు భద్రం! మన కన్నులు భద్రంగా ఉండాలి! మన ప్రవర్తన భద్రంగా ఉండాలి!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*111వ భాగం*
యోబు 31:5—12
5 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా
కాలు త్వరపడినయెడల
6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల
మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది
పెరికివేయబడును గాక.
9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
తర్వాత వచనాలలో కూడా తన నీతి యధార్ధత కోసమే చెబుతున్నారు! చూడండి ఏమంటున్నారో
5 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా
కాలు త్వరపడినయెడల
6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక.
చూడండి ఒకవేళ నేను అబద్ధికుడనై తిరుగులాడితే మోసము చేయుటకు నా కాలు తిరిగితే, నేను యధార్ధవంతుడను అని
తెలుసుకోడానికి దేవుడే తన న్యాయమైన త్రాసులో నన్ను తూచును గాక అంటున్నారు! ఈ మాట అంత ధైర్యముగా చెప్పగలుగుతున్నారు అంటే యోబు యథార్థతతో, నిజాయితీతో కూడిన పవిత్ర జీవితాన్ని గడిపారు. దేవుని
పవిత్రమైన, నీతిబద్ధమైన మార్గాలనే ఎప్పుడూ అనుసరించారు.
దేవునికి అబద్ధాలు, మోసం అంటే అసహ్యమని యోబుకు
బాగా తెలుసు. నేటి రోజులలో క్రైస్తవులు అని పేరు చెప్పుకుని ఎంతగా
మోసాలు చేస్తున్నారో ఎన్ని తప్పుడు రాతలు రాసి, పైనుండి డబ్బులు
తెప్పించుకుంటూ ఎందరిని మోసగిస్తున్నారో కదా! అంతేకాకుండా మేము
ఈ సేవ చేస్తున్నాము ఆ సేవ చేస్తున్నాము, మాకు సహాయం చేయండి అంటూ
ఫోన్ పే నంబర్లు గూగుల్ పే నంబర్లు ఇచ్చి ధనమును సంపాదించుకుని తమ ఆస్తులు బంగాళాలు
సంపాదించు కుంటున్నారు తప్ప దేవుని సేవ కోసం ఖర్చు పెట్టేది చాలా తక్కువ! నేను ఈ మధ్య ఒరిస్సా పర్యటనకు వెళ్ళాను, మా ప్రాంతం వారు
చాలా బీదలు- మాకు ఇంతమంది సంఘము ఉంది అని చెబితే నేను నా భార్య
వెళ్ళాము ఇద్దరు విశ్వాసులను కూడా తీసుకుని వెళ్ళాను. సహాయం కోసం
చాలా తీసుకుని వెళ్ళాము. గాని నిజానికి సేవ ఉంది గాని ఆయన చెప్పినవి
సగం కంటే ఎక్కువ అబద్దాలు! మరి ఇలాంటి వారిమీదికి దేవుని ఉగ్రత
రాదా? దేవుని న్యాయమైన తీర్పులో వీరు తేలిపోరా?!!!
ప్రియ సహోదరి సహోదరుడా!! నీ జీవితంలో కూడా ఇలాంటి అబద్దాలు అబద్ద జీవితం
ఉంటే నీవు కూడా దేవుని న్యాయమైన తీర్పు న్యాయమైన త్రాసుకు భయపడు! ఆయనకు మొగమాటం, బంధుప్రీతి లాంటివి లేవు!
ఒకసారి అపోస్తులుల కార్యములు కు వెళ్తే అక్కడ అననీయ సప్పీరా కనిపిస్తారు! వారు పేతురుగారి ఎదుట
పరిశుద్ధాత్ముని ఎదుట అబద్దమాడి దేవుని మందిరంలోనే చనిపోయారు జాగ్రత్త!!!
ఇక
తర్వాత విషయం
7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల
మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది
పెరికివేయబడును గాక.
చూడండి
నా పాదాలు త్రోవ తప్పి తప్పటడుగు వేస్తే నా మనసు నా కళ్ళు చెప్పిన అపవిత్ర మార్గమును
కోరుకుంటే నా చేతులకు అపవిత్రత ఏదైనా అంటుకుని ఉంటే అనగా చేతులకు సిగరెట్లు మధ్యపానం, మాదక ద్రవ్యాలు,
పరస్త్రీ రొమ్ము ఇలాంటివి ఏవైనా తగిలితే నేను నాటిన విత్తనం యొక్క పంటను
వేరొకడు బుజించును గాక అంటున్నారు! ఇంకా నేను నాటిన మొక్కలను
దేవుడే పీకి వేయును గాక అంటున్నారు! చూడండి ఎంత యధార్థత!!!
ఇక
తర్వాత విషయం: 9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ఈ
వచనాలలో పరస్త్రీతో పాపం చేసిన ఎడల అనడం లేదు- మనస్సులోనైనా నేను పరస్త్రీ ని ఆశించి మోహిస్తే
అంటున్నారు! గతభాగంలో చెప్పడం జరిగింది యేసుక్రీస్తుప్రభులవారు
మత్తయి 5:28 లో చెప్పారు నేను
మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతీవాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో
వ్యభిచారము చేసిన వాడగును!!!
ఈరోజు
అనేకమంది వ్యభిచారం చేయడం లేదు గాని పరస్త్రీని ఊహించుకుంటున్నారు. మరికొంతమంది తెగించి
పరస్త్రీని ఊహించుకుని హస్తప్రయోగం (Masturbation) చేసుకుంటున్నారు!
మరి ఇది కూడా మనస్సులో పరస్త్రీని ఊహించుకునే చేస్తారు అది స్త్రీ కానీ
పురుషుడు కానీ! ఇది కూడా తప్పే! దీనివలన
కూడా దేవుని న్యాయమైన త్రాసులోనికి వెళ్ళే అవకాశం ఉంది అని మరచిపోవద్దు!!!
ఇక తర్వాత పొరుగువాని భార్య కోసం పొరుగువాని
తలుపు దగ్గర ఉంటే నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక! ఇతరులు
ఆమెను ఆనుభవించుదురు గాక అంటున్నారు! చూడండి ఎంతటి పవిత్రత కనిపిస్తుందో
ఇక్కడ!
తన
భార్య విషయంలో అతనెప్పుడూ నమ్మకంగా ఉండేవాడు. పరాయి స్త్రీతో ఎప్పుడూ పోలేదు. వ్యభిచారాన్ని చాలా భయంకరమైన పాపంగా ఎంచారు. నిజంగానే
అది అతి హీనమైనదే
నిర్గమకాండము 20:14, వ్యభిచరింపకూడదు.;
లేవీయకాండము 20:10, పరుని భార్యతో వ్యభిచరించిన
వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ
వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. ;
హెబ్రీయులకు 13:4, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను,
పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును
వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
మరి
ప్రియ సహోదరుడా! నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రియ సహోదరీ! నీ సంగతి ఏమిటి? దేవునికి స్త్రీ పురుషుడు అనే తేడా లేదు
ఎవరు పాపం చేసినా సహించరు! ఎవరు వ్యభిచారం చేసినా సహించరు జాగ్రత్త!
యోబుగారు
అంటున్నారు అలా చేస్తే
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.
ఇప్పుడు
నీవే తేల్చుకో! ఎవరూ ఇంట్లో లేరని నీవేమీ చేస్తున్నావో? ఎవరితో చాటింగ్
చేస్తున్నావో? ఎవరూ నీతో ఇప్పుడు లేరు, నన్ను గుర్తు పట్టేవారు అడిగేవారు ఇక్కడ ఎవరూ లేరని ప్రియ సహోదరి సహోదరుడా
యవ్వనస్తులారా ఏం చేస్తున్నారు? జాగ్రత్త! దేవుని కళ్ళకు కనబడనిది ఏమీ లేదు జాగ్రత్త!
జాగ్రత్తగా
ఉందాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*112వ భాగం*
యోబు 31:9—12
9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
తర్వాత వచనాలలో కూడా తన నీతి యధార్ధత కోసమే చెబుతున్నారు! గతభాగంలో పరస్త్రీని మోహించడం ఎంత నేరమో, పరస్త్రీతో
వ్యభిచారం ఎంతనేరంగా యోబుగారు ఎంచుతున్నారో మనం చూసుకున్నాము! ఈ రోజు సమయం వచ్చింది గనుక వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో ఎంతనేరమో ఒకసారి
జ్నాపకం చేసుకుందాము! దీనికోసం అనేకసార్లు నా శీర్షికలలో వ్రాసాను
అయినా మరొకసారి జ్నాపకం చేసి మీ హృదయాలు రేపి- వ్యభిచారమునకు
దూరంగా ఉంచాలనేదే నా ప్రయాస!
(గతభాగం తరువాయి)
*జారత్వము- వ్యభిచారము*
మీరు పరిశుధ్దులగుటయే
అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;
మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు
కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2. 1 ధెస్సలో 4: 3,4
ప్రియ సహోదరి/సహోదరులారా! - దేవుని చిత్తమును జరిగించుటకే
మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు, పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం ఈ జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే
భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని ఈ జారత్వం అనేది ఇద్దరు
వ్యక్తులు, రెండు శరీరాలు, రెండు మనస్సులు,
రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం. 1 కొరింథీ
6:16.
ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టుపట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు
దానముగా దయచేయబడింది.
19 వచనం. అది విలువపెట్టి కొనబడింది(20),
విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని
దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ
20:28) . ఇప్పుడు నీ దేహము నీదికాదు. దేవునిది.
దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ
3:16,17; 6:19-20 వచనాలు) మీరు దేవుని ఆలయము. దేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని
మీకు తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు
వానిని పాడుచేయును. ఖభడ్దార్. దేవునిలో
వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు,అనగా పవిత్రమైన క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు -దేవునిఅలయముగా మలచబడిన మీ దేహాలు
వేశ్యలతో లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?
1 కొరింథీ 6:13-16 , నీ దేహము జారత్వముకొరకు కాదుగాని ప్రభువు
నిమిత్తమే, మీ దేహములు క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో కలుపుతావా?
చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని
ఉగ్రతయను పెనుగాలి రాబోతుంది.
1 కొరింథీ
6:8,9 మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం.
రెండు నరకం- నిత్య నరకాగ్నిగుండము,అగ్ని ఆరదు పురుగు చావదు.
ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని
రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.
ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.
22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.
చూశారా లేఖనం ఏమిసెలవిస్తుంది? వ్యభిచారం, జారత్వం దేవునికి
అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం
చేసుకొందాం.
1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే
ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో,
అన్నల పాశవిక కక్ష క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు
ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని భక్తి విశ్వాసాలు
వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య ఈ యవ్వనస్తుని
మోహించి కామించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నా యజమానునికి
మోసం చేయలేను అనడం లేదు ,దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను
అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు
శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం నుండి పారిపోగలవా?
2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు
చెరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు దేవుని ప్రవక్త, సోదెగాడైన బిలామును పిలిచి శపించమని
చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో
ఆ ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు. ఇశ్రాయేలీయులు
మోయాబు స్త్రీలతో జారత్వం చేస్తారు దేవుని ఉగ్రతమండి తెగులు ప్రారంభమవుతుంది.
ఇంతలో ఇశ్రాయేలీయుల ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తెతో
పాపం చేయడాన్ని చూసిన ఒక యవ్వనస్తుడు ఫీనెహాసు అది చూసి ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో
పొడుస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా
25:10,11లో) నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకుండుట
చూచి.............
దేవుడు ఓర్వలేనిది ఏమైనా
ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు చేయగలవా?
3. ఇక మరో వ్యక్తి దేవునిచే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని
పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు యుధ్దం చేసేకాలంలో యుద్దానికి
పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం చేస్తున్న సైనికుని
భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని
వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ
గర్భవతి కాగా, దానిని తనభర్త పై నెట్టడానికి ప్రయత్నం చేశాడు
అయితే ఆ స్త్రీ భర్త
నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె
ఆ సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి ఆ వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని చంపించారు.
వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2
సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా జరిగింది
...ఆ విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు
గారు రౌద్రుడై "ఆ మనుష్యడు ఎవడు, యెహోవా
జీవంతోడు నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు" అని చెప్పగా
ప్రవక్త గారు ఏమన్నారు "ఆ హంతకుడు, ఆ వ్యభిచారివి నీవే" దేవునికి దేవుని ప్రవక్తలకు
తన మన తారతమ్యం లేదు! దావీదుగారు చక్రవర్తి యైనా సరే దేవుని వాక్కు
సెలవిస్తుంది ఆ మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవునాకే
చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు
ఉన్నచోటనే సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే
కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు
పరిహరించారు.
ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది?
వ్యభిచారం /జారత్వం దగ్గర ఆగిపోతున్నావా?
జారత్వంలో పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి
దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం లో పడిపోతున్నావా? ఫీనెహాసులాగ పాపాన్ని అంతం చేయగలవా? నీ బ్రతుకు ఇప్పటికైనా
మార్చుకో!
*యధార్ధవంతుడైన యోబు*
*113వ భాగం*
యోబు 31:9—12
9 నేను హృదయమున పరస్త్రీని మోహరించిన యెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
(గతభాగం తరువాయి)
*అక్రమ సంబంధాలు*
ఈరోజు దేవుని సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఇది ఒకటి. ఇది సులువుగా
చిక్కులు పెట్టు సాతానుగాడి టెక్నిక్. శరీరాశ, నేత్రాశ, జీవపుడంభము వీటినుపయోగించి దేవుని బిడ్డలపై
ఎటాక్ చేస్తున్నాడు. నేడు గొప్ప దైవసేవకులు, సంఘ పెద్దలు మరియు విశ్వాసులు కూడా పడిపోతున్నారు.
దేవుడైన యెహోవా మొదటగా పురుషుని చేసి సాటియైన సహాయంగా స్త్రీని చేశారు. వివాహ వ్యవస్థ ఏర్పాటుచేశారు.
వివాహం ద్వారా స్త్రీ పురుషులు ఏక శరీరంగా మారి కాపురం చేసుకోడానికి
దేవుడే లైసెన్సు ఇచ్చారు. వివాహం కాకుండా మరో స్త్రీ
/కన్యకతో శారీరక సంబంధం పెట్టుకోవడం బైబిలు అంగీకరించదు. అది వ్యభిచారం. వివాహం ద్వారా జతపరచబడిన వారు జీవితాంతం
కలసిమెలసి ఉండాలి. తన భాగస్వామి బ్రతికి యున్నంతవరకూ మరొకరితో
శారీరక సంబంధం కలిగియుండుట వ్యభిచారమే.
మరికొందరు భార్య ఉండగానే మరో స్త్రీని పెళ్ళి చేసుకొంటున్నారు, ఉంచుకొంటున్నారు.
(విచారం ఏమిటంటే దైవసేవకులు కూడా). అలాంటి వాళ్ళను
సంఘంలోనుంచి వెళివేసేమని పౌలుగారు వ్రాస్తున్నారు. 1 కొరి
5వ అధ్యాయంలో. కాని నేటి సేవకులు వారిచ్చే కానుకలుకి
ఆశపడి నోరుమూసుకొని కూర్చొంటున్నారు. "ఖండించుము,
గధ్దించుము, బుద్ది చెప్పుము" ( 1తిమోతి 3:16-17; 4:
1-3) అని చెబితే ఖండించడం లేదు బుద్ధి చెప్పడం లేదు. సంఘంలో వ్యభిచారం జారత్వంకోసం మాట్లాడటం లేదు. మరికొందరు
సేవకులు కూడ అదే తప్పు చేయడం వలన ఏమీ మాట్లాడటం లేదు. ఎలా చెప్పగలరు?
దైవసేవకుడే తప్పు చేస్తే విశ్వాసి చేయడా? సంఘపెద్దే
అక్రమ సంబంధం కలిగి ఉంటే విశ్వాసులు చేయరా? ఓ స్త్రీ నీవు ఒకరితో
అక్రమ సంబంధం పెట్టుకొంటే నీ పిల్లలు పదిమందితో అక్రమ సంబంధం పెట్టుకోరా? ఒక తండ్రి తాను మధ్యం త్రాగుతూ, సిగరెట్లు త్రాగుతూ కొడుక్కి
తాగొద్దురా అని చెప్పగలడా? చెబితే ఏమంటాడు కొడుకు, ముందు నీవు మాను, తర్వాత చెప్పు అంటాడు. ప్రియ సహోదరి / సహోదరుడా! నిన్ను బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది.
యేసయ్యని పదే పదే సిలువ వేస్తున్నావు. ఆయన గాయాన్ని
రేపుతున్నావు.
ఓసారి మనము ఏదెను తోటలోకి వెళ్దాం.
అక్కడ దేవుడు నరునికి సాటియైన సహాయం చేయడం కోసం ఆదాముకి గాఢనిద్ర కలుగజేసి
ప్రక్కటెముకలలో ఒకదానిని (ఒకటి మాత్రమే) స్త్రీనిగా చేశారు. (ఆదికాండము 2:21). ఒకవేళ దేవుడు నరునికు ఇద్దరు లేక ముగ్గురు భార్యలుండాలని తలస్తే రెండో మూడో
ఎముకలు తీసియుండును. దానర్ధం ఒక పురుషుడికి ఒక భార్య మాత్రమే
ఉండాలి. ఒక భార్య ఉండగా మరో స్త్రీతొ అక్రమసంభందం గాని సక్రమ
సంబంధం గాని ఉంటే అది వ్యభిచారమే. వివాహము కాకుండా మరో స్త్రీని
కూడటం కూడా వ్యభిచారమే.
దేవుడు వేశ్యనైనా క్షమించారు గాని వ్యభిచారాన్ని క్షమించలేదు. వేశ్య
అనగా పొట్టకూటికోసం తన శరీరాన్ని పురుషులకి పంచేది. నీకుమార్తెలలో
ఎవరూ కూడా వేశ్యలగా ఉండకూడదు అని దేవుని ఆజ్ఞ.
వ్యభిచారి అనగా భర్త ఉండగా తన కామకోరికలు తీర్చుకోవడం కోసం భరితెగించి
మరొకరితో శారీరక సంబంధం పెట్టకొనేది వ్యభిచారి. ఇంట్లో
భార్య ఉండగా కామతప్తుడై కళ్ళు మూసుకుపోయి మరో స్త్రీతో సంబంధం పెట్టుకొన్నవాడు వ్యభిచారి.
అదెవరైనా సరే, విశ్వాసి, పెద్ద, సేవకుడు అనితేడా లేదు. వ్యభిచారులు
మాత్రమే. ఎవరూ చూడటం
లేదు అనుకొంటున్నావు. కాని దేవుడు చూస్తున్నారు జాగ్రత్త.
దావీదుగారు వ్యభిచారం చేసిన వెంటనే దేవుడు ఖండించి బుద్ధి చెప్పారు.
మీకుతెలుసా?ప్రపంచంలో జరిగే హత్యలకు నూటికి
80% మూలకారణం అక్రమ సంభందాలే.
యేసయ్య దగ్గరకు ఒకసారి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని (మాత్రమే, పురుషుడుని
వదిలేశారు) తీసుకొస్తారు. బోదకుడా!
మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. నీవేమంటావ్? అన్నారు. అందుకు యేసయ్య మీలో పాపం లేనివాడు
మొదట ఆమెపై రాయివేయండి అన్నారు. చివరకు యేసయ్య కూడ ఆమెను శిక్షించలేదు.
గాని కనికరముతో కూడిన ఒక ఆజ్ఞ ఇచ్చారు " ఇకను
పాపము చేయకుము". అన్నారు. ఆయన వేశ్యనైనా
క్షమించారు కాని వ్యభిచారిని క్షమించలేదు. అందుకే పత్రికలలో,
ప్రకటన గ్రంథంలో పదే పదే చెప్పబడింది వ్యభిచారులెవరూ పరలోకానికి హక్కుదారులు
కాదు అని. యాకోబు పత్రికలో 4:4 లో వ్యభిచారిణిలారా!
ఈలోక స్నేహం దేవునితో వైరమని తెలియదా? ఎవరు ఈలోకమును
స్నేహించునో వాడు దేవునికి శత్రువువగును. దేవునితో వైరమాడి నీవు
బ్రతుకగలవా? ఎలా ఉంది నీ బ్రతుకు? 2 కొరొంథీ
5:10. మనుష్యులు జరిగించు
ప్రతీ క్రియకు మంచిదైనా చెడ్డవైన సరే దేహముతో చేసిన ప్రతీక్రియకు విమర్శ
దినమున లెక్క అప్పగించాల్సిన అవుసరము ఉంది.
దేవుని చిత్తాన్ని చేశ్తావా అంటే
జారత్వానికి దూరంగా పారిపోతావా లేక దేవునితో వైరమాడుతావా? ఒకవేళ
నీకు ఏమైనా అక్రమ సంబంధం ఉంటే దానిని తెంపేసుకో. ఒక వేళ నీవు
పెళ్ళి కాకుండానే మరొకరితో అక్రమసంభందం ఉందా, నీ భర్త/భార్య చనిపోయిన తరువాత ఏదైనా అక్రమ సంబంధం ఉందా? దానిని
సక్రమ సంబంధం చేసుకొనే వీలుంటే వెంటనే చేసుకో, ఒకవేళ నీ భాగ్యస్వామికి
భార్య/భర్త ఉన్నాడా. ఆ సంబంధం వెంటనే తెంపేసుకో.
దావీదుగారు
కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ఇప్పుడే ప్రభుపాదాల దగ్గర కన్నీటితో కుమ్మరించు.
దేవునితో
నేడే సమాధానపడు. ఆయన ఉగ్రతకు గురికాకు. ఒప్పుకొన్న తరువాత ఆ పాపపు స్త్రీకి
ఇచ్చిన ఆజ్ఞయే నీకు కూడా "ఇకను పాపం చేయకు"
అట్టి
కృప దేవుడు మీకు దయచేయును గాక!
ఆమెన్.
దైవాశీస్సులు.
*యధార్ధవంతుడైన యోబు*
*114వ భాగం*
యోబు 31:9—12
9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
(గతభాగం
తరువాయి)
*మోహపుచూపు*
వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన
మాట విన్నారు కదా! నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో
చూచు ప్రతీ వాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మత్తయి 5:27,28. యేసు ప్రభులవారు ఇచ్చిన ఆజ్ఞలలో కెల్లా
భయంకరమైన కఠినమైన ఆజ్ఞ ఇది. ఒక వ్యక్తి శరీరముతో వ్యభిచారం చేయడమే
నేరం కాదు, కనీసం మోహపుచూపుతో, వ్యభిచారపు
తలంపుతో ఓ స్త్రీ వైపు చూస్తే అప్పుడే ఆ క్షణంలోనే ఆ వ్యక్తి హృదయంలొ ఆ స్త్రీ తో వ్యభిచారం
చేసిన వాడగును.
ఇప్పుడు
ఆలోచించండి. మనలో ఎంతమంది ఓ అందమైన స్త్రీని చూసి గాని,
అమ్మాయిని చూసి గాని, బిగుతైన బట్టలు వేసుకుని
కోరికలు రేపేటట్లు వస్త్రధారణ చేసుకొన్న స్త్రీలను చూసి వ్యామోహ పడ్డారు , రోడ్డు మీద ఓ స్త్రీ నడుస్తూ వెళ్తే మామూలుగా చూడటం అందరికీ కామన్.
మనకి తెలియకుండానే మన కళ్ళు చూస్తా ఉంటాయి. దానిలో
తప్పులేదు గాని ఆ స్త్రీని చూసి మనస్సులో కావాలని కోరుకోవడం తప్పు. ఒకసారి చూసిన తరువాత ఆ స్త్రీనే పట్టి
పట్టి చూడటం తప్పు. నీ కళ్ళు తోనే ఆమె శరీరపు కొలతలు కొలవడం తప్పు.
యేసయ్య ఆజ్ఞ ప్రకారం అది వ్యభిచారం. శారీరకంగా
వ్యభిచారం చేయకపోయినా అది ఆత్మీయ వ్యభిచారం అని స్వయంగా యేసు ప్రభులవారే చెప్పారు. ఓ కండలుగల యవ్వనస్తుడు టైట్ టీ షర్ట్
వేసుకుని వెళ్తూఉంటే ఓ స్త్రీ నీవు ఆ యవ్వనస్తుని చూసి వ్యామోహ చూపు చూస్తే అది కూడ వ్యభిచారమే!
మరి నీవంటావు, ఆ స్త్రీ అలా వస్త్రధారణ చేసుకొని వెళ్తే
కోరికలు కలుగవా అని. ఓసారి చూశావు. పదే
పదే చూడమని ఎవరన్నారు? నన్ను మనస్సులో ఊహించుకొని కోరికలు తీర్చుకో
అని నీకు చెప్పిందా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు దేవుడిచ్చారు
అని పవిత్ర గ్రంథం సెలవిస్తుంది. 2 తిమోతి 1:7; ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేదా? ఇంకా యేసయ్య ఏమన్నారు
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దానిని పెరికి పారవేయుము. రెండు కళ్ళు కలిగి అగ్నిలో మండే కన్నా ఒకే కంటితో పరలోకం చేరడమే మంచిది అని.
మత్తయి 5:29,30. దేవుని బిడ్డా! నీవు ఎన్ని సార్లు ఈ ఆత్మీయ వ్యభిచారం చేశావో గుర్తు తెచ్చుకో. సరిచేసుకో. వ్యభిచారిణులారా! ఈలోక
స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా?(యాకోబు 4:4). ఇక్కడ వ్యభిచారిణి అంటే స్త్రీ అనే కాదు పురుషులు కూడా.
ఇక
ప్రియమైన చెల్లెల్లారా, అక్కల్లారా!
దేవుడు మీకు అందం ఇచ్చారు. దేహం ఇచ్చారు.
మీ దేహముతో దేవుని మహిమ పరచడానికే, గాని మీ వస్త్రధారణతో
మీ ప్రవర్తనతో ఇతరులను అభ్యంతర పరచడానికి కాదు.(1 కొరింథీ
6:19,20). స్త్రీలు అణుకువయు స్వస్త బుద్ధి గలవారునూ, తగుమాత్రపు వస్త్రాలు వేసుకోవాలి . . . . దైవభక్తి గలవారమను
చెప్పుకొని తిరిగే స్త్రీలకు తగినట్లుగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. (1 తిమోతి 2: 9,10.) పరిశుధ్దాత్ముడు పేతురుగారి ద్వారా
సెలవిచ్చేది - సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారాలే గాని
ఈ లోకపు అలంకారములు వద్దు. (1 పేతురు 3: 3-5). ప్రియమైన చెల్లీ! నీ ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా
ఉండాలి గాని ఆయనకు అవమానం తెచ్చేదిగా మరియు ఇతరులను అభ్యంతరం కలిగించేదిగా ఉండకూడదు.
ఎస్తేరుగారిని చూద్దాం, హేగే ఇచ్చిన వస్తువులే
తప్ప మరి యే ఇతర అలంకారములు ఆమె వేసుకోలేదు. తన మృదు స్వభావాన్ని,
వినయాన్ని అలంకరణగా ప్రదర్శించినది ఆమె. తద్వారా
127 సంస్థానాలకు మహారాణి
కాగలిగారు. దయచేసి ఆలోచించు.
ఒకవేళ దేవుడు ఓ యవ్వనస్తున్ని తీర్పులో నిలబెడితే ఆ యవ్వనస్తుడు
ఈ మోహపుచూపు అనే నేరస్తాపన చేయబడితే- తప్పు నాది కాదు ఆ స్త్రీ
దే అంటాడు. దేవుడు నీవు మోహపు చూపు చూడకూడదని బైబిల్ నొక్కివక్కానించినా
నీవు చూసేవు కాబట్టి నరకానికి పో అంటారు.
అప్పుడు ఓ స్త్రీ!
నిన్ను పిలచి ఆ యవ్వనస్తున్ని, నీ వస్త్రధారణ
ద్వారా ప్రేరేపించి తన మనస్సులో నీతో వ్యభిచారం చేయడానికి కారణమయ్యావు కాబట్టి నరకానికి
పో! అంటే నీ గతి ఏమిటి?
నేను అతనితో వ్యభిచారం
చేయలేదు అంటావేమో, ఆ యవ్వనస్తునికి
ఇచ్చిన జవాబే నీకు కూడా ఇస్తారేమో. జాగ్రత్త! యెషయా 3వ అధ్యాయంలో సీయోను కుమార్తెలు గర్విష్టురాండ్రై
. . . . .కుళుకుచూ నడచుచూ, ఓరచూపులు చూచుచూ
. . . . నటిస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నారు బోడిగుండు చేస్తానంటున్నారు.
దయచేసి గమనించమని మనవి చేస్తున్నాను.
ప్రియమైన క్రైస్తవ చెల్లీ! నీకు చేతులు జోడించి బ్రతిమాలి
చెబుతున్నాను, బిగుతైన బట్టలు వేసుకొని పురుషులని ఆకర్షించడం,
పురుషులు లాగ మీరు కూడ వస్త్రధారణ చేయడం పాపం శాపం ( ద్వితీయుప 22:5) స్త్రీ పురుష వేషం వేయరాదు పురుషుడు
స్త్రీ వేషం వేయరాదు. అట్టి వస్త్రధారణ మనకు తగదు. దైవభక్తి గల స్త్రీ ల వలె ప్రవర్తించమని మనవి చేస్తున్నాను.
మరికొంతమందికి ధనం మీద మోహపు చూపు ఉంటుంది. అదికూడా పాపమే.
బిలాము ప్రవక్త దేవుడు వద్దు అని చెప్పిన ధనాశనాశించి వెళ్తాడు,
గాడిద చేత కూడా బుద్ధి చెప్పించాడు. చివరకు నీతిమంతుల
మరణం వంటి మరణం కావాలని కోరుకొన్నాడు. దొరికిందా? ధనము దొరకలేదు సరికదా ఇశ్రాయేలీయులు అతనిని ప్రవక్త అని తెలిసినా కత్తి చేత
చంపారు.(సంఖ్యా 31:8). దేమా ఇహలోకాన్ని
ఆశించి పౌలుగారిని వదలిపోయాడు. మరో దేమా వెండి గనిని ఆశించి పరలోకమార్గం
వదలి వెళ్ళిన వెంటనే లోయలో పడి చనిపోయినట్లు యాత్రికునిప్రయాణం పుస్తకంలో చదువుతాము.
ఈ మోహపుచూపు కూడా వద్దు సహోదరుడా!
కాబట్టి ప్రియసహోదరీ సహోదరుడా!
ఇప్పుడే నీ చూపు సరిచేసుకో. నీ కన్ను నిన్ను అభ్యంతర
పరచనీయకు. దానిని నీ స్వాధీనంలో ఉంచుకో. పరలోకాన్ని ఆశ్వాదించు. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయును
గాక! ఆమెన్!
*యధార్ధవంతుడైన యోబు*
*115వ భాగం*
యోబు 31:9—12
9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
(గతభాగం
తరువాయి)
*హస్త ప్రయోగం-
అశ్లీల దృశ్యాలు*
ప్రశ్న : అన్నా! హస్త ప్రయోగం చేయడం తప్పా? నేను ఎవరితోనూ వ్యభిచారం చేయడం
లేదు కదా!
ప్రశ్న : అన్నా! నేను అన్ని విషయాలలోను perfect గా ఉంటున్నాను.
హస్త ప్రయోగం మాత్రం మానలేక పోతున్నాను. ఆ ఒక్కటీ
మానేస్తే సాతానుగాడు నన్ను point out చేయడానికి ఏమీ ఉండదు!
పై ప్రశ్నలకు
జవాబులు వాక్యపు వెలుగులో చూసుకొందాం.
హస్త ప్రయోగం అంటే ఓ వ్యక్తి, ఒక స్త్రీని గాని /అమ్మాయిని గాని మనస్సులో ఊహించుకొని
, తనతో శయనించినట్లు ఊహించుకొంటూ భావప్రాప్తి పొందడం. ఒక స్త్రీ, తనకి నచ్చిన హీరో లేదా బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకొని ఆవ్యక్తితో శయనించినట్లు
అనుకొంటూ భావప్రాప్తి పొందడాన్ని స్వయంతృప్తి లేదా హస్తప్రయోగం అంటారు.
అయితే మీరంటారు మేము శారీరకంగా వ్యభిచారం చేయలేదు కదా అని. యేసు ప్రభులవారు
ఏమన్నారు వ్యభిచారం
చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా! నేను మీతో చెప్పునదేమనగా
ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతీ వాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన
వాడగును. మత్తయి 5:27,28. ఓ స్త్రీని మోహపుచూస్తేనే వ్యభిచారం
అయితే ఆమెను ఊహించుకొని , ఆమెతో శయనించినట్లు పాపపు ఊహలతో,
కామపు కోర్కెలతో ఉండడం, భావప్రాప్తి పొందడం వ్యభిచారం
కాదా? ఆత్మీయ వ్యభిచారం.
ఈ కాలంలో
యవ్వనస్తులు సినిమాలు సీరియల్స్ చూస్తూ, ఆ హీరోయిన్లు చూపిస్తున్న
అంగాంగ ప్రదర్శనలు చూసి, వ్యామోహపడి పాడైపోతున్నారు. ఈనాడు ఇంటర్నెట్ లో విరివిగా అశ్లీల దృశ్యాలను, అశ్లీల
వీడియోలు దొరకుతున్నాయి. ప్రతీ ఒక్కరి చేతిలో అండ్రాయిడ్ ఫోన్లు,
వాటితో అశ్లీలం కోసం సెర్చింగ్ లు. ఫోన్లు కలిగియుండుట
తప్పుకాదు. వాటితో అశ్లీలతకోసం సెర్చి చేసి చూడటం, బూతు కధలు చదివి హస్త ప్రయోగం చేసుకోవడం తప్పు- వ్యభిచారం.
ఇది సాతాని గాడి మాస్టర్ ప్లాన్. చాలా వరకు సక్సెస్
అయ్యాడు. "నీవు శారీరకంగా వ్యభిచారం చేయడం లేదు,
తప్పులేదు ఇంకా ఎవరూ చూడటం లేదు" అని వాడు
చెప్తున్నాడు. ఈ కాలంలో
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తనకి నచ్చిన వ్యక్తిని ఊహించుకొని స్వయంతృప్తి పొందుతున్నారు
మరీ భయంకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పట్టణాలలో లెస్బియన్స్(స్త్రీ -స్త్రీ) పాపం పెరిగి పోతుంది.
బైబిలు దీనిని ఖండిస్తుంది.
మరి దీనిని ఎలా మానుకోవడం? నీ యెదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో
నీ వాక్యం ఉంచుకొని యున్నాను. (కీర్తన 119:11). వాక్యము నీ హృదయంలో ఉంటే పాపం చేయలేవు, వాక్యం నిన్ను
నడిపిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది,
సరిచేస్తుంది. నీ హృదయం దేవునితో అనుసంధానం
(synchronise) కావాలి.
అప్పుడు ప్రతీ క్షణం నీవు ప్రభువు కోసమే అలోచిస్తావు.
పాపంకోసం కాదు. ఉదాహరణకు ఒకబ్బాయి ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాడు
అనుకొందాం. ఆ అబ్బాయి ప్రతీ క్షణం ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తాడు,
తను భోజనం చేస్తుంటే ఆ అమ్మాయి తిన్నాదా లేదా అని ఆలోచిస్తాడు,
కాలేజీ లోనూ ఇంట్లోనూ అస్తమానూ ఆమె ధ్యాసే. ఎందుకు? తన హృదయం నిండా ఆ అమ్మాయే.
అదేవిధంగా నీవు యేసయ్యని ప్రేమిస్తే, నీ హృదయం
యేసయ్యతో అనుసంధానం చేస్తే- నీ నోటినిండా, హృదయం నిండా, దేవుని స్తుతియే ఉంటుంది. నిలబడినా స్తుతి, కూర్చొన్నా స్తుతి, బియ్యం ఏరుతున్నా స్తుతి, ఏం చేస్తున్నా దైవస్తుతి చేస్తూ
ఉంటావు. ప్రార్థన నీకిష్టమైన క్రియగా మారుతుంది. నీ జీవన విధానమే మారిపోతుంది. అవకాశం దొరికితే అశ్లీలం
కోసం సెర్చ్ చేసే నీవు అవకాశం దొరికితే యేసయ్య ప్రేమను చాటుతావు. లేదా నశియించే ఆత్మలకోసం ప్రార్థన చేస్తావు. ఎప్పుడూ?
నీహృదయం నిండా ప్రభువు నిండియున్నప్పుడు. ఆయనవాక్యంతో
నీ హృదయం నిండిపోయినప్పుడు. దావీదుగారు అస్తమానూ దేవుని ధర్మశాస్త్రం
ధ్యానించడానికే ఆశ పడేవారంట అందుకే దేవునికిష్టానుసారుడైన మనుష్యుడు గా మారిపోయారు.
దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని
......(2 తిమోతి 1:7) అట్లా చేయకపోతే నీకు మరో
ఆజ్ఞ : 2 పేతురు 2:14-15. వ్యభిచారిని చూసి ఆశించుచూ పాపము
మానలేని కన్నులు గలవారును, అస్థిరమైన మనస్సు గలవారును,.....
శాపగ్రస్తులై ఉన్నారు. జాగ్రత్త! శాపం కావాలా? దీవెన కావాలా?
అందుకే
మీద వచనాలలో యోబుగారు అంటున్నారు యోబు 31:9—12
9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని
ద్వారమున నేను పొంచియున్న యెడల
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను
కూడుదురు గాక.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన
నేరము
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు
నిర్మూలము చేయును.
ప్రియ సహోదరి/సహోదరుడా! వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు
విమోచింపబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింప బడ్డారని గుర్తు చేసుకో
(1 పేతురు 18,19). చీకటినుండి వెలుగులోనికి మిమ్మును
పిలచినవాని గుణాతిశయములు ప్రచురము చేయడానికి ఆయన మిమ్మల్ని ఏర్పరచబడిన వంశముగాను,
రాజులైన యాజక సమూహము గాను, పరిశుద్ధ జనముగా చేసుకొన్నారు
(2 పేతురు 2: 9).
దయచేసి
నీ చూపును, నీ హృదయాన్ని భద్రం చేసుకో! హస్తప్రయోగం, ఆత్మీయ వ్యభిచారం మానేసి ఆత్మీయభావాలు పెంచుకో!
అట్టి
కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*116వ భాగం*
యోబు 31:13—21
13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా
నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల
14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?
15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప
లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు
క్షీణింపజేసినయెడలను
17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక
నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను
18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము
లేకపోవుట నేను చూడగను
19 వారి దేహములు నన్ను దీవింపకపోయిన యెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత
వేడిమి పొందకపోయిన యెడలను
20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని
నేను అన్యాయము చేసినయెడలను
21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు
ఎముకలోనికి విరుగును గాక.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు! ప్రియులారా ఈ భాగములో ధర్మశాస్త్రము
లేనప్పుడు తన మనస్సాక్షి తనకు ధర్మశాస్త్రమై యోబుగారు చేసిన మంచిపనులు పుణ్యకార్యాలు
చూడగలము!!
ఈ
భాగంలో మొదటగా తన పనివారి పట్ల తాను ఎలా ప్రవర్తించారో చెబుతున్నారు!
13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా
నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల
14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?
15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప
లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
తన
పనివాళ్ళ పట్ల న్యాయంగా వ్యవహరించారు. దేవుని దృష్టిలో మనుషులు మనుషులే, పేద గొప్ప అనే తారతమ్యం లేదని యోబుగారికి పాత నిబంధన కాలములోనే తెలుసు!!
ఎఫెసీయులకు 6:9, యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోక మందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట
మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
కొలొస్సయులకు
4:1 యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని
యెరిగి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి.
లేవీ 25: 43 నీ దేవునికి భయపడి అట్టివానిని
కఠినముగా చూడకుము.
యాకోబు గారు అంటున్నారు 2: 13 కనికరము
చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి
అతిశయ పడును.
యోబు గ్రంధం 34:19 లో ఏలీహు అంటున్నాడు దేవునికి
పక్షపాతం లేనేలేదు! ఆయనకు అధికారులంటే పక్షపాతం లేదు బీదలకంటే
ధన్యవంతులను ఎక్కువ ఆప్యాయంగా చూడారు! వీరంతా దేవుడు సృష్టించైనా వారే
అంటున్నారు!
ఇంకా
సోలోమోను గారు సామెతల గ్రంధం 14:31 లో అంటున్నారు దరిద్రుని
బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
22: 2 ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని
కలుగజేసినవాడు యెహోవాయే.
నిజమైన
ఉపవాసం ఏది అని చెబుతూ దేవుడు యెషయా గ్రంధం 58 లో అంటున్నారు
7 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి
ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు
ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు
వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును
యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
9 అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా
ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు
చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
10 ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని
తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.
సరిగ్గా
యోబుగారు ఇదే చేశారు! చేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు! ప్రియ చదువరీ!
మరి నీ స్థితి ఎలా ఉంది?
ఇక
తర్వాత పేదలు తల్లిదండ్రులు లేని అనాదలు విధవరాళ్ళ కోసం చెబుతున్నారు
16 బీదలు ఇచ్ఛయించిన దానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు
క్షీణింపజేసినయెడలను
17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక
నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను....
చూడండి
పేదలను దయతో, జాలితో ఎలా చూశారో – ఈ సుగుణాన్ని దేవుడు చాలా విలువైనదిగా ఎంచుతారు
నిర్గమకాండము 22:22-27,
22 విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.
23 వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల
నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
24 నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను,
మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేనివారగుదురు.
25 నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల
వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.
26 నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా
తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్పగించుము.
27 వాడు కప్పుకొనునది అదే. అది
వాని దేహమునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును?
నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను
విందును.
ద్వితీయోపదేశకాండము
24:17, పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు.
విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.
కీర్తనల గ్రంథము 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు,
తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు,
కీర్తనల గ్రంథము 82:1-4,
1 దేవుని సమాజములో
దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
2 ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు?
ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు? (సెలా. )
3 పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి
శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
4 దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి
వారిని తప్పించుడి.
సామెతలు
23:10-11,
10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు
లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు
11 వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
ఇక తర్వాత 18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు
వస్త్రము లేకపోవుట నేను చూడగను
19 వారి దేహములు నన్ను దీవింపకపోయిన యెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత
వేడిమి పొందకపోయిన యెడలను
20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని
నేను అన్యాయము చేసినయెడలను
21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు
ఎముకలోనికి విరుగును గాక.
చూడండి
వస్త్రహీనుడు కనబడితే వానికి వస్త్రము ఇవ్వకపోతే, గుమ్మములో సహాయం కోసం వచ్చిన వారికి నేను
అన్యాయం చేస్తే నా భుజ శల్యము దాని గూటినుండి ఊడి పడిపోవును గాక అంటున్నారు!
చూడండి
యాకోబు గారు ఏమంటున్నారు అంటే
1: 27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన
భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు,
ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
2: 13 కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును;
కనికరము తీర్పును మించి అతిశయ పడును.
14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు
ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి
విశ్వాసమతని రక్షింపగలదా?
15 సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక
యున్నప్పుడు.
16 మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా
వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని
చెప్పినయెడల ఏమి ప్రయోజనము?
17 ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి
మృతమైనదగును.
ఇక
చివరిగా యేసుక్రీస్తుప్రభులవారు గొర్రెలు మేకలు ఉపమానంలో ఏమి చెబుతున్నారు? పేదలకు అక్కరలో ఉన్నవారికి
విధవరాళ్లకు సహాయం చేస్తే దేవునికి చేసినట్లే!
మత్తయి 25: 31 తన మహిమతో మనుష్యకుమారుడును
ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
32 అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు;
గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి
33 తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.
34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత
ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది
మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
35 నేను ఆకలిగొంటిని, మీరు నాకు
భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు
దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
36 దిగంబరినై యుంటిని, నాకు బట్ట
లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి;
చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును
37 అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు?
38 ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి?
దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు?
39 ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు
వచ్చితిమని ఆయనను అడిగెదరు.
40 అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి
మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
41 అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా,
నన్ను విడిచి అపవాదికిని
వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
42 నేను ఆకలిగొంటిని, మీరు నాకు
భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు
నాకు దాహమియ్యలేదు;
43 పరదేశినై యుంటిని, మీరు నన్ను
చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు
నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.
44 అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు
నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను,
రోగివై యుండుట యైనను చెరసాలలో ఉండతాయైనను చూచి నీకు ఉపకారము చేయకపోతిమి
అని ఆయనను అడిగెదరు
45 అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు
ఈలాగు చేయలేదు గనుక నాకు
చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.
46 వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.
కాబట్టి
పేదలకు అక్కరలో ఉన్నవారికి విధవరాళ్లకు సహాయం చేస్తే దేవునికి చేసినట్లే! వారికి చేయకపోతే దేవునికి
కూడా చేయనట్లే! కాబట్టి అక్కరలో అవసరాల్లో ఉన్న పేదలకు దిక్కులేనివారికి
విధవరాళ్లకు సహాయం చేద్దాం! దేవునికి అప్పు ఇద్దాం! వడ్డీతో సహాయ దేవుని నుండి పొందుకుందాం!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*117వ భాగం*
యోబు 31:22—28
22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము
మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
23 దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను
నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
24 సువర్ణము నాకు ఆధారమనుకొనిన యెడలను నా ఆశ్రయము నీవేయని
మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
25 నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు
దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు
మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
27 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి
నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
28 అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు! ప్రియులారా ఈ భాగములో కూడా
యోబుగారు ఎంత యధార్ధముగా ఉన్నారో చెబుతున్నారు!
22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము
మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
నేను
అలాగు చేయలేదు అనగా పేదల పట్ల దిక్కులేని వారి పట్ల అనాదల పట్ల, పరస్త్రీల పట్ల తాను
ఎంతో గౌరవంగా నడుచుకున్నాను అంటున్నారు!
ఇంకా
అంటున్నారు , నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో
నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి
దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
ఇంకా
అంటున్నారు 24 సువర్ణము నాకు ఆధారమనుకొనిన యెడలను నా ఆశ్రయము నీవేయని
మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
25 నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు
దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు
మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
27 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి
నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
ఇక్కడ
ధనాన్ని ఆరాధించడం నుంచీ సృష్టికర్తను గాక సృష్టిని పూజించడం నుంచీ తనను తాను దూరంగా
ఉంచుకున్నాడు. దేవుణ్ణి కాక మరి దేన్నైనా పూజిస్తూ దేవునిపట్ల కూడా యథార్థతతో మెలగడం అసాధ్యమని
అతనికి తెలుసు
చూడండి ధర్మశాస్త్రం లేకముందే తన నిర్ణయము
ఏమిటంటే సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించను!!
నిర్గమకాండము 20:3-6, 3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద
నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
5 ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను;
నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు
కరుణించు వాడనైయున్నాను.;
ద్వితీయోపదేశకాండము 4:19, సూర్య చంద్ర నక్షత్రములైన
ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము
క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును
మీరు బహు జాగ్రత్త పడుడి.
ద్వితీయోపదేశకాండము 17:2-5, 2 నీ దేవుడైన యెహోవా
నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు
విరోధముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ
నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన
యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు
3 అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ
చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ
ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల
4 ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునిగాని స్త్రీనిగాని నీ
గ్రామముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను.
5 ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష
విధింపవలెను
రోమీయులకు
1:25, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల
వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.
చూడండి
ఇలా ధనము మీద వ్యామోహంతో ధనమును పూజించినా హెచ్చించినా, ఇంకా సృష్టికర్తను కాకుండా
సృష్టిని పూజించినా దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. అదియు
న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరమగును అంటున్నారు!
ప్రియ
సహోదరి సహోదరుడా!! ఒకవేళ నీవు కూడా ఇదే స్థితిలో ఉంటే తప్పకుండా నీవు కూడా దేవుని దృష్టిలో మొదటగా
వేషదారివి అవుతావు! రెండవదిగా న్యాయాధిపతి యైన దేవుని చేత శిక్ష
పొందతగిన నేరమని మరచిపోవద్దు!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*118వ భాగం*
యోబు 31:29—34
29 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను
సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును
నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
31 అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి
పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని
గదా.
33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
34 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు
నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న
దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు! ప్రియులారా ఈ భాగములో కూడా
యోబుగారు ఎంత యధార్ధముగా ఉన్నారో చెబుతున్నారు!
ఇక
తర్వాత వచనాలలో మరొక విధంగా చెబుతున్నారు 29 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి
నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును
నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
ఇక్కడ
యోబుగారు పొరుగు వాడి కీడును గాని, స్నేహితులు బంధువులు కీడును గాని కోరుకోలేదు.
అంతేకాకుండా చివరికి తనను ద్వేషించేవారు లేక శత్రువుల కీడు కూడా కోరుకోలేదు.
ఒకవేళ తనను ద్వేషించేవారికి కీడు జరిగితే మహాబాగా జరిగింది అని కూడా
అనుకోలేదు అంటున్నారు! పగ సాధించే ఆశ తనను వశపరచుకోకుండా జాగ్రత్తపడ్డారు
యోబుగారు ఎందుకంటే:
సామెతలు
20:22, కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము
ఆయన నిన్ను రక్షించును. ;
సామెతలు 24:29, వాడు నాకు చేసినట్లు వానికి
చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదనను కొనకుము
సామెతలు 25:21, నీ పగవాడు ఆకలిగొనినయెడల
వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
ఇదే విషయాన్ని పౌలుగారు జ్నాపకం చేస్తున్నారు
రోమీయులకు 12:19-2119 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట
నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని
వ్రాయబడి యున్నది.
20 కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే
అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
21 కీడువలన జయింపబడక, మేలు చేత
కీడును జయించుము.
ఇక తర్వాత వచనాలలో అంటున్నారు
31 అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి
పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని యెడలను
32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని
గదా.
ఇక్కడ
ఆతిథ్యము చేసే గుణము కోసం చెబుతున్నారు. పేదలకు పొరుగువారికే కాదు పరదేశికి కూడా ఇక్కడ
కడుపునిండా ఆహారం పెట్టారు!
విదేశీయులకు
ఆతిథ్యమివ్వడం అలవర్చుకున్నారు ద్వితీయోపదేశకాండము 10:17-19,
17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై
యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు.
ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
18 ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము
తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
19 మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని
జాలి తలచుడి;
హెబ్రీయులకు 13:2, ఆతిథ్యము చేయ మరవకుడి;
దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
ఇక తర్వాత అంటున్నారు
33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
34 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు
నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న
దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును అంటున్నారు!
ఏమండీ
యోబుగారు తన బాధ తాను చూసుకోక మధ్యలో ఆదాము గారిని ఎందుకు తీసుకుని వచ్చారు?
ఆదాము గారు ఏమి చేశారు? మొదటగా దోషమును దాచిపెట్టారు! తినవద్దని చెప్పిన ఫలము తిన్నారు! తినిన తర్వాత దేవుడు
అడిగినప్పుడు తప్పు అయిపోయింది తండ్రి, నన్ను క్షమించు-
భార్య ఇచ్చేసింది ప్రేమలో మోజులో పడి తినేశాను మన్నించండి మహాప్రభో అని
అడిగితే బాగుణ్ణు! నాకేమీ పాపం పుణ్యం తెలియదు- నీవిచ్చావు కదా – హవ్వను- ఆమె ఇచ్చింది
పండు నేను తినేశాను అన్నారు ఆయన! అంతే మానవాళి మొత్తానికి పాపము
మూటకట్టుకోవడానికి కారణమయ్యారు!
దీనికోసమే
యోబు గారు అంటారు ఆదాము చేసినట్టు రొమ్ములో నా పాపాన్ని ఉంచుకొని ద్వారము దాటి బయటికి వెళ్లి ఆ పాపాన్ని
ఒప్పుకోకుండా దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పకుండా ఉంటే అది పాపము అంటున్నారు కాబట్టి
మన పాపాలు కప్పుకోకుండా ఒప్పుకోవాలి దేవుని వెదకాలి !
మొదటిది చేసిన పాపము ఒప్పుకోలేదు!
రెండవది: మహా సమూహమునకు భయపడియు కుటుంబముల
తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును
కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
అనగా దేవుడు చేసిన మేళ్లను ప్రజలముందు చెప్పకపోయినా నేరమే! మనం చేసిన
అపరాదాలు దేవుని సన్నిధిలో సంఘము మధ్య ఒప్పుకుని విడిచిపెట్టక పోవడం కూడా నేరమే!
ఎవరు ఏం అనుకుంటారో, పుట్టెడు కుటుంబం మాది,
ఇంతమంది ముందు నేను యేసుబాబు బిడ్డను అని చెబితే ఎవరు ఏమనుకుంటారో,
నీవు కూడా దిగిపోయావా అంటారు కదా అనుకుంటారు అని అనుకుంటున్నావా?
నీవు రోగంతో దుఖముతో ఇబ్బందులతో అవమానాలతో ఉన్నప్పుడు ఆ పుట్టెడు కుటుంబం
ఎవరైనా ఏమైనా సహాయం చేశారా? నీ ముఖాన్ని కూడా చూశారా?
ఈ రోజు దేవుడు నీకు ఆరోగ్యం, ఉద్యోగం, ఐశ్వర్యం, గౌరవం ఇస్తే, అవన్నీ
ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి కుటుంబాలు ఏమను కుంటారో అని దురభిమాన పాపములో పడ్డావా ఖబడ్దార్!!
దేవునికి స్వస్థ పరచడం వచ్చు- పోయిన రోగాన్ని తిరిగి
పెట్టడం కూడా వచ్చు! జాగ్రత్త!
గాని
యోబుగారు అలా చేయలేదు- తన జీవితంలో గాని తన హృదయంలో గాని పాపమును ఉంచుకోలేదు! దేవుని ముందు నిందారహితమైన జీవితం జీవించారు!
పాపం
చేసినప్పుడు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయక, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. తాను పాపం చెయ్యలేదని యోబుగారు అనలేదు. ఇతరులు గమనించి
చూస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యకుండా మానుతున్నాడు
అనే దానిపై నిజమైన సౌశీల్యం, నీతి ఆధారపడి లేవని అతడు గ్రహించారు.
దేవుడు మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి ప్రవర్తన ఎలా వుంది అన్నదాని
పైనే అవి ఆధారపడి ఉన్నాయి అని తెలుసుకొన్నారు
(కీర్తన 90:8; 139:23-24; మత్తయి 6:6, 18; యోహాను 3:20-21; ఎఫెసు 5:8-14; హీబ్రూ 4:13 చూడండి).
మరి
నీవు కూడా ఆయన మాదిరిలో నడుస్తావా?!!!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*119వ భాగం*
యోబు 31:35—40
35 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను;
ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది
వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.
36 నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును
నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.
37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయన యొద్దకు వెళ్లెదను.
38 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై
యేడ్చినయెడల
39 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు
ప్రాణహాని కలుగజేసిన యెడలను
40 గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును
మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
ప్రియులారా! ఇక ఈ 31 వ అధ్యాయములో కూడా యోబుగారు మాట్లాడుతున్నారు!
ప్రియులారా ఈ భాగములో కూడా యోబుగారు
మాట్లాడుతున్నారు- ఈ భాగములో రెండు విషయాలు మాట్లాడుతున్నారు!
మొదటిది తన యధార్థ జీవితం కోసం, రెండవది తాను చేసిన పిర్యాదును
ముగించి సంతకం పెట్టి దేవుడే నాకు జవాబు ఇవ్వాలి అని బల్ల గుద్ది చెబుతున్నారు!
మనము
మొదటగా తన యధార్థ జీవితం కోసం చూసుకుని పిర్యాదు సంతకం కోసం తర్వాత చూసుకుందాం!
38 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై
యేడ్చినయెడల
39 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు
ప్రాణహాని కలుగజేసిన యెడలను
40 గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును
మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
ఇక్కడ భూమికి వ్యతిరేఖంగా గాని లేక తన భూమిలో పనివారు గాని తనకు ప్రతిగా నిలబడిన
దాఖలాలు కూడా లేవని దీని అర్ధం!
ఇదంతా చెప్పి మళ్ళీ కొద్దిగా వెనక్కు వెళ్ళారు యోబు. తన నీతియుక్తమైన ప్రవర్తనలో
ఒక భాగాన్ని తాను చెప్పడం మరిచాడు – తన భూములనూ వాటిలో పనిచేసే
పనివాళ్ళనూ అతను చూచుకున్న రీతి. తాను వారిపట్ల గనుక అన్యాయంగా
ప్రవర్తించి ఉంటే తన భూముల మీదికి శాపం వస్తుంది గాక అంటున్నారు (8,10,22 వచనాలు కూడా చూడండి). ఇక చెప్పడానికి ఏమీ లేదు.
ముద్దాయి తరుఫు న్యాయవాది తన వాదనను ముగించాడని మనం అనవచ్చు.
ఒక మనిషి తానెంత మంచివాడో న్యాయవంతుడో చెప్పుకోవడం సాధారణంగా మనకు ఇష్టం
ఉండదు. కొంతమంది తాము చేసిన మంచి కార్యాలను ఇతరులకు చెప్పడానికీ,
దేవునికి తెలియజేయడానికీ చాలా తాపత్రయం కనపరుస్తారు (మత్తయి 6:2, ; లూకా 18:9-12, ). కాబట్టి ఎవరైనా తన న్యాయ సమ్మతమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూవుంటే తన గురించి
తనకు సరిగా తెలియదనో, లేక అతను ఏదో పాపాన్ని దాచి పెట్టడానికి
ప్రయత్నిస్తున్నాడనో అనుమానిస్తాం. అయితే యోబుగారి విషయంలో ఇది
నిజం కాదు. యోబు, అతని స్నేహితులు ఒక ముఖ్యమైన
సిద్ధాంతానికి సంబంధించిన వాదనలో ఉన్నారు. సత్యం కోసమని యోబు
తన జీవితాన్ని ఉన్నదున్నట్టుగా వర్ణించవలసివచ్చింది. పరిస్థితుల
బలవంతం వల్ల తాను నీతి న్యాయాలు గలవాడినని విపులంగా చెప్పుకోవలసి వచ్చింది.
అతను అబద్ధాలతో గోడకట్టలేదని మనకు తెలుసు. తన సుగుణాలను
మరింత గొప్ప చేసి చెప్పుకోలేదని తెలుసు. సాక్షాత్తూ దేవుడే అతను
భూమిమీద అతని తరంలో అందరికంటే ఉత్తముడని చెప్పాడు (యోబు
2:3, ). అందువల్ల యోబు జీవితం మనందరికీ అందమైన ఓ ఆదర్శం. మనకు కూడా దేవుని మెప్పు, ఆమోదం కావాలంటే యోబులాగా విశ్వాసులమైన
మనం ప్రవర్తించాలి.
ఇక రెండవ విషయం: తన పిర్యాదు- దానిమీద సంతకం మీద పెట్టి చేతి వేలిముద్ర వేసి మరీ పిర్యాదు దేవునికి ఇస్తున్నారు!
35 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను;
ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది
వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.
36 నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును
నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.
37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయన యొద్దకు వెళ్లెదను.
ఇక నొక్కివక్కాణించి బల్లగుద్ది మరీ చెబుతున్నారు-
ఒకవేళ దేవుడు నా పిర్యాదు తీసుకోడానికి దగ్గరికి వస్తే నేను రాజు వలె దేవుని
దగ్గరకి ఒక రాజులా హుందాగా వెళ్ళి మరీ ఇస్తాను అంటున్నారు! అంటే
తన మనస్సాక్షి తనమీద ఏమీ నేరారోపన చేయడం లేదు కాబట్టి ధైర్యంగా వెళ్తాను ఇస్తాను నా
పిర్యాదు అంటున్నారు!
దేవుని న్యాయపీఠం ఎదుట తన వాదన వినిపించాలని
యోబు తహతహలాడుతున్నారు (యోబు 13:3, యోబు 13:15, యోబు 13:18, ; యోబు
16:19, ; యోబు 23:3-5, ; యోబు 24:1, ).
తన ప్రతివాదాన్ని యోబుగారు సిద్ధం చేసుకున్నారు. దేవుని ఎదుట మనుషుల ఎదుటా తాను గడిపిన న్యాయ సమ్మతమైన జీవితాన్ని ప్రకటించాడు.
తనకు వ్యతిరేకంగా దేవునికున్న ఫిర్యాదేమిటో తెలుసుకోవాలని గంగవెర్రులెత్తి
పోతున్నారు. దేవుడు గనుక ఆ ఫిర్యాదులన్నిటినీ రాసి పెడితే అందరూ
చూచేలా దాన్ని కిరీటంలా ధరిస్తానంటున్నాడు. అంటే తనకు విరోధంగా
దేవుని దగ్గర మోపదగిన ఆరోపణలేవీ లేవని అతని గట్టి నమ్మకం. దేవునికైనా
సరే తన జీవితాన్ని గురించి చక్కగా లెక్క చెప్పగలను అనుకుంటున్నాడు. రాజులాగా ఠీవిగా దేవుణ్ణి సమీపించ గలనంటున్నాడు. యోబుకు
తన నిజాయితీని గురించి అంత నమ్మకం ఉంది.
ఇంతటి
యధార్ధ జీవితం, నీతివంతమైన జీవితం లోపములేని జీవితం సవాలుకరమైన జీవితం నీకుందా! యోబుగారికి ఉంది కాబట్టే దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చారు!
యోబు
లాంటి యధార్ధ జీవితం లోపములేని జీవితం మనస్సాక్షి నేరము మోపలేని జీవితం దేవుడు మనకు
దయచేయును గాక!
ఆమెన్!
*యధార్ధవంతుడైన యోబు*
*120వ భాగం*
యోబు 32:1—1
1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు
మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
2 అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు
ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి
ఆతనిమీద బహుగా కోపగించెను.
3 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు
చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
4 వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో
మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
5 అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు
ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.
6 కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను
నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము
మీకు తెలుపుటకు తెగింపలేదు.
ప్రియులారా! ఇక ఈ 32 వ అధ్యాయములో యోబుగారు మాట్లాడిన మాటలకు సమాధానంగా యోబుగారి
దూరపు చుట్టము ఏలీహు మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయముతో పాటు మొత్తం
వరుసగా ఆరు అధ్యాయాలు ఏలీహు ఒక్కడే మాట్లాడినట్లు చూడగలము!
1 యోబు తన
దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము
చెప్పుట చాలించిరి.
యోబు స్వనీతిపరుడు, తన దృష్టిలో తాను నిర్దోషి అని నిర్ణయించుకుని ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఇక చెప్పవలసినదేమీ లేదని మాట్లాడ్డం మానుకున్నారు.
ఇక జవాబు ఇవ్వలేదు. అప్పుడు ఎలీహుకు కోపం వచ్చింది.
దానికి కారణాలు కూడా తానే చెబుతున్నాడు తర్వాత వచనాలలో!
2 అప్పుడు రాము
వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె
తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.
ఈ
చర్చ జరిగే సమయమంతా ఎలీహు అక్కడే ఉన్నట్టున్నాడు. చెప్పాలంటే వీరే కాక మరి కొందరు అక్కడ
ఉండి ఉండవచ్చు. పెద్ద గుంపు కూడా అక్కడ పోగై ఉండవచ్చు.
ఎలీహు అనేపేరు అంత అసాధారణమైనదేమీ కాదు. బైబిల్లో
మరి కొందరు ఎలీహులు ఉన్నారు (1 సమూయేలు 1:1, ; 1 దినవృత్తాంతములు 12:20, ). అయితే ఈ ఎలీహు కనిపించేది
ఇక్కడ ఒక్క చోటే. ఇక్కడ కనిపిస్తున్న బరకీయేల్, రాముల గురించి మనకేమీ తెలియదు. ఎలీహు బూజు గోత్రంవాడు
అని ఉంది. అబ్రాహాము తోబుట్టువైన నాహోరుకు బూజు అనే కొడుకు ఒకడు
ఉన్నాడు (ఆదికాండము 22:21, ). ఎలీహు ఈ బూజు
సంతతివాడే అయితే హీబ్రూవారి పూర్వీకులకు ఇతను చాలా దగ్గరవాడన్నమాట. అంతేకాకుండా ఆ విధంగా యోబుగారికి కూడా దగ్గరవాడు అయి ఉండవచ్చు! యోబుగారు దేవుణ్ణి కాక తనను తానే సమర్థించుకోవడం
చూచి ఎలీహు కోపం అతని మీద రగులుకుంది. (యోబు 40:8, లో దేవుడు యోబును వేసిన ప్రశ్న కూడా చూడండి.) యోబు తన
వాదం న్యాయమైనదనీ (యోబు 10:7, ; యోబు
25:5-6, ; యోబు 31:35-37, ), దేవుడు తనకు అన్యాయం
చేశాడనీ (యోబు 19:6, ; యోబు
27:2, ; యోబు 30:25-26, ) స్పష్టంగా చెప్పారు.
దేవుడు స్వతహాగా అన్యాయస్థుడని యోబుగారు నిజంగా నమ్మి కాదు ఇలా అన్నది.
తన బాధలో అయోమయంలో అంధకారంలో ఆ పరిస్థితులకు మరి ఏ సంజాయిషీ సరిపోయినట్టు
లేదు. యోబుగారు పలికిన మరికొన్ని మాటల్లో దేవుని న్యాయం మీద అతనికి
నమ్మకం ఉన్నట్టు కూడా అర్థమౌతున్నది (యోబు 16:19, ; యోబు 19:23-27, ; యోబు 23:3-7, . దేవుడు న్యాయవంతుడని యోబుకు గట్టి నమ్మకం కుదరకపోతే దేవుని సముఖంలో తీర్పు
కోసం నిలబడాలని ఎందుకు కోరుకుంటాడు?). మనం ఇంతకుముందే చూచినట్టుగా
యోబు మనస్సును చాలా బాధకరమైన, సంఘర్షణాపూర్వకమైన, పరస్పర విరుద్ధమైన భావాలు ఆక్రమించుకున్నాయి (యోబు
16:19,).
3 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు
చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
ఇక
ఇది రెండవ కారణం ఏలీహు కోపగించుకోవడానికి! యోబుగారి స్నేహితులు యోబు మీద దోషాలు మోపారు-
దానికి ఆయన సమాధానం చెబితే వారి దగ్గర సమాధానాలు లేవు, అందుకే మరింత కోపగించాడు ఇక్కడ! ఎలీహుకు న్యాయమంటే ఎంతో
ఇష్టం. దేవుణ్ణి గురించి యోబు అన్యాయంగా మాట్లాడితే అతని కోపం
రగులుకుంటుంది.
4 వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో
మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
5 అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు
ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.
ముగ్గురు
మిత్రులు యోబును గురించి అన్యాయంగా మాట్లాడితే అతని కోపం రగులుకుంటుంది. ముగ్గురు మిత్రులు చేసిన
పొరపాటును ఎలీహు స్పష్టంగా చూడగలిగాడు. యోబు వాదనలకు సరియైన జవాబివ్వకుండానే
వాళ్ళు యోబును నేరస్తుడిగా తీర్చారు (12 వ).
ఇక్కడ
నాలుగో వచనం ప్రకారం యోబుగారి కన్నా- అతని ముగ్గురి స్నేహితులు కన్నా ఏలీహు వయస్సులో
చాలా చిన్నవాడు అని తానే ఒప్పుకుంటున్నాడు!
ఇక
తర్వాత వచనం నుండి మాట్లాడటం మొదలుపెట్టాడు 6 కావున
బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు
బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.
ఇక్కడ
ఈ వచనం చూసుకుంటే నేను చిన్న వయసు గలవాడను మీరు వృద్ధులు అందుకే నేను భయపడి నా తాత్పర్యము
మీకు చెప్పడానికి భయపడ్డాను అంటున్నారు! అంటే ఈ వచనం ప్రకారం ఏలీహు పెద్దలకు భయపడే వాడు
అంతకంటే దేవునికి భయపడేవాడు అని అర్ధమవుతుంది! ప్రియ సహోదరీ సహోదరుడా
నీవు కూడా పెద్దలకు భయపడుతున్నావా? లేక ముసలోడా నీకేం తెలుసు,
మీరు పాతవారు మీకేమి తెలియదు అంటున్నారా!! జాగ్రత్త!
1 తిమోతి 5: 1 వృద్ధుని గద్దింపక
తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
లేవీ 19: 32 తల నెరసినవాని యెదుట లేచి
ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.
కాబట్టి
పెద్దలను వయసులో పెద్దవారిని ఇంకా ముసలివారిని తప్పకుండా సన్మానించాలి, లేచి నిలబడాలి గౌరవంగా!
చివరిగా
రోమా 13:7 లో కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో
వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల
భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి,
అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*121వ భాగం*
యోబు 32:7—13
7 వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము
బోధింపతగునని నేననుకొంటిని;
8 అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని
ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
9 వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు
ఒకప్పుడు న్యాయము తెలి సినవారుకారు.
10 కావున నేను నా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను.
నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
11 ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు
కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
12 మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని
అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
13 కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు
అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.
ప్రియులారా! ఇక ఈ 32 వ అధ్యాయములో యోబుగారు మాట్లాడిన మాటలకు సమాధానంగా ఏలీహు
మాట్లాడుతున్నాడు.
ఇక
ఏలీహు ఇంకా వృద్దుల కోసము పెద్దల కోసము మాట్లాడుచున్నాడు!
7 వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము
బోధింపతగునని నేననుకొంటిని;
గతభాగంలో
చూసుకున్నాము! ఏలీహు పెద్దలకు వృద్దులకు భయపడేవాడు అనియు, వారిని గౌరవించు
వాడు అనియు! అందుకే వృద్దాప్యము మాటలాడదగును ఎందుకంటే వారు తమ
వయస్సులో ఇంతవరకు ఎన్నెన్నో చూశారు! వారి వయసు వారికి అనుభవము
జ్నానము నేర్పించింది! అందుకే యోబుగారి స్నేహితులు వృద్దులు కనుక
వారి దగ్గర ఎంతో జ్నానముంది అనుకున్నాడు. అయితే వారు కేవలం యోబుగారి
మీద దోషారోపణ చేయడానికే చూశారు, గాని యోబుగారిని ఆదరించలేదు-
సరిచేయలేదు! అందుకే ఇప్పుడు స్నేహితుల మీద కోపగిస్తున్నాడు
ఏలీహు!
8 అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని
ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
9 వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు
ఒకప్పుడు న్యాయము తెలి సినవారుకారు.
చూడండి
ఇక్కడ తెలివి అన్నది కేవలం వయస్సు మూలంగానో, అనుభవం, చదువు మూలంగానో
రాదు. దేవుని ఆత్మవల్ల వచ్చే దేవుని బహుమతి అది. అందువల్ల వృద్ధులతో బాటు యువకులకూ చిన్న వారికీ కూడా తెలివి ఉండవచ్చు అంటున్నాడు
ఎలీహు. అందుకే పౌలుగారు అంటున్నారు 1 కోరింథీ పత్రికలో 2: 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని
మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని
ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.
12 దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము
లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.
సోలోమోను
గారు అంటున్నారు సామెతలు 2: 6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు
ఆయన నోటనుండి వచ్చును.
కాబట్టి
జ్నానము వివేకము అనుభవం వలన వయస్సు పెరిగే
కొద్ది వస్తుంది అన్నది నిజమే గాని మరింత జ్ఞానము వివేకము కావాలంటే కేవలం వృద్దాప్యం
వలన కాదు అది దేవుడే దయచేయాలి అప్పుడు ఆ వ్యక్తి వృద్దుడు కాకపోయినా యవ్వనం లోనే జ్నానవంతుడు
కాగలడు! దానికి ఉదాహరణ సోలోమోను గారే! యవ్వనంలోనే
దేవుణ్ణి ఆస్తి అంతస్తులు కాకుండా నాకు జ్ఞానము కావాలి అని దేవుణ్ణి అడిగి పొందుకుని
ప్రపంచ జ్నానవంతులలో అందరికంటే మేటియైనవాడు అని పేరుపొందారు!
ఇంకా
అంటున్నారు కేవలం వృద్దులే కాదు జ్నానవంతులు బహువయస్సు అనగా వయసులో పెద్దవారు మాత్రమే
తెలివైన వారు కాదు ఒక్కోసారి అంటున్నారు!
తర్వాత
వచనంలో 10. కావున నేను నా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును అంటున్నారు!
ఇక్కడ
ఈ వచనంలో కూడా మీకు ఏమి తెలియదు, మీరు తప్పుడు మాటలు మాట్లాడారు అంటూ ఆ పెద్దలను తూలనాడలేదు
గాని దయచేసి న మాటను అంగీకరించుడీ అని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను అంటున్నాడు!
నిజంగా పెద్దలను చాలా గౌరవిస్తున్నాడు ఇక్కడ- వారు
మాట్లాడిన మాటలు న్యాయమునకు విరుద్దంగా ఉన్నా గాని వారి వయసుకి గౌరవం ఇస్తున్నాడు ఇక్కడ!
ఇది తప్పకుండా మనము నేర్చుకోవాలి! మన ఇంటిలో పెద్దవారు
ఒకవేళ మనల్ని ఏమైనా అంటే ఒకవేళ మనది న్యాయము వారు చెప్పేది పూర్తిగా వినకుండా ఏదో అనేస్తుంటే
ఓర్చుకుని వారి మీద కోపపడకుండా తాతయ్యా అలా కాదు, అమ్మమ్మా నాన్నమ్మా
అలా కాదు, నేను ఇలా అంటున్నాను వారితో ప్రేమగా మాట్లాడాలి.
అప్పుడు వారి తొందరపాటు మారిపోయి అది ప్రేమగా మారిపోయి మనస్పూర్తిగా
మిమ్మల్ని దీవిస్తారు! కాబట్టి తప్పకుండా ఏలీహుని చూసి మనము నేర్చుకోవాలి!
ఇక
తర్వాత 11.
ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని
మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
12. మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే
మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు. అంటున్నారు
వాదనలో
యోబును అతని స్నేహితులు ఓడించలేకపోయారు. అలాగని అందరూ విఫలం కావలసినదే అని వారు అనుకోకూడదు
అంటున్నాడు ఎలీహు. తాను యోబుతో మాట్లాడి గెలవగలనని అతని ఉద్దేశం.
15 వ వచనం నుంచి అతడు యోబు స్నేహితులతో మాట్లాడడం చాలించి వారిని గూర్చి
మాట్లాడసాగాడు.
ఏది
ఏమైనా మనము ఏలీహుని చూసి పెద్దవారిని గౌరవించడం నేర్చుకుందాం!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*122వ భాగం*
యోబు 32:14—22
14 అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి
ప్రత్యుత్తర మియ్యను.
15 వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు
వారికి మాటయొకటియు లేదు.
16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు
మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
17 నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును
నా తాత్పర్యము తెలిపెదను.
18 నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ
నన్ను బలవంతము చేయు చున్నది.
19 నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది
క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.
20 నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి
నేను ప్రత్యుత్తరమిచ్చెదను.
21 మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను.
నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
22 ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను
సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.
ప్రియులారా! ఇక ఈ 32 వ అధ్యాయములో యోబుగారు మాట్లాడిన మాటలకు సమాధానంగా ఏలీహు
మాట్లాడుతున్నాడు.
ఇక
తర్వాత వచనాలలో యోబుగారిని- అతని స్నేహితులను
ఉద్దేశించి మాట్లాడుచున్నాడు.
14 అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి
ప్రత్యుత్తర మియ్యను.
15 వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యక యున్నారు పలుకుటకు
వారికి మాటయొకటియు లేదు.
16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు
మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
17 నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును
నా తాత్పర్యము తెలిపెదను
ఇక్కడ
యోబుగారి స్నేహితులను ఉద్దేశించి అంటున్నాడు దేవుడే గాని యోబుగారితో మరెవరూ వాదించలేరు
అని మీరు చెప్పకూడదు ఎందుకంటే యోబు నాతో వాదమాడలేదు నాతో సంభాషణ చేయలేదు అంటున్నాడు!
అయితే
ఈ విషయాలు ప్రక్కన పెడితే,
నేను అమిత తెలివితేటలు గలవాడను అనుకునే వారికోసం బైబిల్ ఏమి చెబుతుంది అంటే యిర్మీయా
గ్రంధంలో 9: 23 యెహోవా ఈలాగు
సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు,
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
24 అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా,
భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని
గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇక
తామే తెలివైన వారమని భావించే వెర్రిబాగుల వారికోసం యెషయా గ్రంధంలో ఏమని వ్రాయబడింది
అంటే 5:
1 తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు
కొనువారికి శ్రమ.
పౌలుగారు అంటున్నారు 1 కోరింథీ 1: 19 ఇందు విషయమైజ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును
శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి
యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని
ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని
రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
ఎవడు
తనకు గల జ్ఞానము తెలివితేటలు చూసి విర్రవీగ కూడదు!
ఇక 15—17 వరకు అంటున్నాడు
ఏలీహు వారు ఏమీ జవాబు చెప్పలేక పోతున్నారు వారు మాట్లాడలేక పోతే నేను తప్పకుండా మాట్లాడుతాను
ఎందుకంటే 18 నా మనస్సునిండ
మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.
19 నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె
నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.
20 నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా
పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను అంటున్నాడు!
ఇక్కడ
ఎలీహు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మాట్లాడేందుకు
ఉవ్విళ్ళూరుతున్నాడు. యోబు స్నేహితులు మాట్లాడుతున్న సమయంలో ఎలీహు
తాను మాట్లాడగోరే విషయాలను మననం చేసుకుంటూ ఉన్నాడు. అతని నోట
నుండి వెలువడేందుకు సిద్ధంగా వున్న మాటలను బిగబట్టుకోవడం కష్టంగా ఉంది. వాదోపవాదాలు జరిగే చోట ఎవరికైనా ఇలానే ఉండవచ్చు గదా.
తర్వాత
వచనాలలో 21
మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
22 ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను
సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.
చూడండి
ఈ రెండు వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు ఏలీహు! మొదటిది ముఖస్తుతి చేయడం,
రెండవది పక్షపాతంగా వ్యవహరించడం! ఈ రెండు చేస్తే
దేవుడు ఏం చేస్తాడు అంటే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును గాక!
ఆహా ఎంతటి కఠోరమైన మాట!!!
ఎలీహుకు
దేవుడంటే కొంతవరకు భయభక్తులున్నాయి. అందుకని యోబు పక్షం గానీ అతని స్నేహితుల పక్షం
గానీ వహించేందుకు నిరాకరిస్తున్నాడు. ఎలాంటి మొహమాటం లేకుండా
మాట్లాడేందుకు నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే
లేవీ 19: 15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు,
బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము
చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
యోబుగారు కూడా ఇదే మాట అన్నారు 13 వ అధ్యాయంలో
10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
ఏలీహు అంటున్నాడు: 34: 19 రాజులయెడల పక్షపాతము
చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా?
వారందరు ఆయన నిర్మించినవారు కారా?
ఇక
ముఖస్తుతి చేసేవారికోసం సామెతల గ్రంధంలో అంటున్నారు 29:
5 తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.
దీని
అర్ధం ఒక వ్యక్తి మరొకణ్ణి పొగుడుతూ ఉంటే అతనిలో ఏదో దురుద్దేశం ఉంది అని అర్ధం!
26:28 అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును
ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
కీర్తనాకారుడు
అంటున్నారు 55: 21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా
నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె
నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
కాబట్టి
ముఖస్తుతి చేయకూడదు! ఒకవేళ ముఖస్తుతి చేస్తే నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును
అంటున్నాడు ఏలీహు! నీవుకూడా ఇదేవిధంగా ఎవరికైనా ముఖస్తుతి చేసినా
ఇచ్చకములు పలికినా దేవుడు నిన్నుకూడా శీఘ్రముగా నిర్మూలము చేస్తారని మర్చిపోకూ!!!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*123వ భాగం*
యోబు 33:1—10
1 యోబూ, దయచేసి నా వాదము నాలకించుము
నా మాటలన్నియు చెవిని బెట్టుము.
2 ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
3 నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు
జ్ఞానమును యథార్థముగా పలుకును.
4 దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము
నాకు జీవమిచ్చెను
5 నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము
వ్యాజ్యె మాడుము.
6 దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే
7 నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా
నుండదు.
8 నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని
నాకు వినబడెను.
9 ఏమనగా నేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
10 ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు
నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
ప్రియులారా! ఇక ఈ 33వ అధ్యాయములో కూడా యోబుగారు ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ అధ్యాయంలో నేరుగా యోబుగారితోనే మాట్లాడుతున్నాడు! అయితే ముఖస్తుతి లేకుండా దేవుని పక్షంగా మాట్లాడుచున్నాడు ప్రియులారా!!
1 యోబూ, దయచేసి నా వాదము నాలకించుము
నా మాటలన్నియు చెవిని బెట్టుము.
2 ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
ఇక్కడ
తానేదో చాలా ప్రాముఖ్యమైనది చెప్పబోతున్నాడని ఎలీహు ఉద్దేశం. యోబుగారి బాధల విషయంలో వచ్చిన సమస్యను తాను
పరిష్కరించగలను అనుకుంటున్నాడు. ఈ యువకుడికి తాను జ్ఞానిననీ నీతినిజాయితీలు
గలవాడిననీ ఏ సందేహమూ లేదు (యోబు 33:3, ; యోబు 36:3-4, ). అయితే ఇతనిలో వినయం లేదని ఇప్పటికే అర్థమైపోతూ
ఉంది.
ఇంకా
అంటున్నాడు 3 నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు
జ్ఞానమును యథార్థముగా పలుకును అంటున్నాడు!
నిజానికి
మనమాటలు యధార్ధముగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అయితే సోలోమోను గారు అంటున్నారు జ్నానము
కోసం చెబుతూ సామెతలు 8: 7 నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
8 నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను
లేదు
ఇక
తర్వాత వచనంలో అంటున్నారు
5 నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట
నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
6 దేవునియెడల నేనును నీవంటివాడను నేనును
జిగటమంటితో చేయబడినవాడనే
7 నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి
నీమీద బరువుగా నుండదు.
ఇక్కడ
నీ చేతనైతే నాకు జవాబు ఇమ్ము అనడం సభ్యత కాదు! అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే యోబు
9:32-35, లో యోబు మధ్యవర్తిగా ఎవరన్నా కావాలన్నాడు. దేవుని ఎదుట తన వాదనను వినిపించాలని అతనికి ఉంది గాని తాను పడుతున్న బాధ,
తనకు వచ్చిన ఆపదలవల్ల అతనిలో గొప్ప భయం చోటు చేసుకుంది (యోబు 13:20-22, ). ఇక్కడ ఎలీహు తానే ఆ మధ్యవర్తిగా ఉంటానని
చెప్తున్నట్టు ఉంది. యోబు భయం లేకుండా తన వాదనను అతనికి వినిపించవచ్చు
అని అతని అభిప్రాయం కావచ్చు!
8 నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు
వినబడెను.
9 ఏమనగా నేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
10 ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను
తనకు పగవానిగా భావించుచున్నాడు అంటున్నావు. ఇది తప్పు అంటున్నాడు ఏలీహు! అవును అది నిజమే!!!
యోబు
చెప్పిన విషయాల్లో కొన్ని పొరపాట్లు అని ఎలీహుకు అనిపించింది. వాటిని ఇప్పుడు ఒక్కొక్క
దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. 10 వ వచనం చివరి భాగంలోనూ,
11 వ వచనంలోనూ యోబు అన్న మాటలనే తిరిగి వినిపిస్తున్నాడు (యోబు 13:24, యోబు 13:27, ). 9వ
వచనంలో యోబు పలికిన కొన్ని మాటలకు తన ఉద్దేశం ప్రకారం ఎలాంటి అర్థం వస్తుందో చెప్తున్నాడు
(యోబు 9:21, ; యోబు 10:7, ; యోబు 16:16, ; యోబు 23:10, ; యోబు
27:5, ). అయితే యోబు తాను పవిత్రుడిననీ నిష్కళంకుడిననీ ఎప్పుడూ చెప్పలేదు.
తాను అలాంటివాడిని కానని అతనికి బాగా తెలుసు (యోబు
13:26, ; యోబు 14:4, యోబు 14:16, యోబు 14:17, ; యోబు 31:33, ). యోబు
మాటలకు యోబు ఉద్దేశించని మరేదో అర్థాన్ని ఇవ్వడంలో ఎలీహు యోబుకు సరైన జవాబు చెప్పలేడన్న
విషయం తెలుస్తూ వుంది. అయితే యోబు తన స్నేహితులతో చేసిన వివాదంలో
యోబులో కనిపించిన అతి పెద్ద పొరపాటును తేటగా ఎత్తి చూపించాడు ఎలీహు. అదేమంటే దేవుడు అకారణంగా తనపై శత్రుత్వం పెట్టుకున్నాడనీ తనను బంధించి పీడిస్తున్నాడనీ
యోబు అన్నాడు.
ఇక
తర్వాత వచనాలు 11 ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
12 ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము
చెప్పెదను అంటున్నాడు! ఇంకా 13 తన క్రియలలో
దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నదుల శక్తికి మించిన వాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?
అవును
ఏలీహు మాట్లాడుతుంది ఇప్పుడు నిజము! మీద వచనాలలో అతని అభిప్రాయం తప్పు గాని ఈ రెండు
వచనాలలో ఏలీహు అభిప్రాయం నిజమే! ఈ విషయంలో ఎలీహు మాట సరైనదే.
దేవుడు మనుషులందరి కంటే గొప్పవాడు, ఆయన పనులన్నిటిలోను
న్యాయవంతుడు. తన ప్రవర్తన గురించి మనుషులకు సంజాయిషీ ఇవ్వవలసిన
అవసరం దేవునికి లేదు.
మనము
కూడా ఎన్నో సార్లు మన శక్తికి మించి మన తాహతుకి మించి దేవుణ్ణి ఎన్నెన్నో మాటలు అంటూ
ఉంటాము! దేవునికి
ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉంటాము! అయితే ఏలీహు అంటున్నాడు నిజానికి దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు
దేవుడు నరులశక్తికి మించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు అని యోబుగారితో
డైరెక్టుగా చెబుతున్నాడు! తన ప్రవర్తన గురించి మనుషులకు సంజాయిషీ
ఇవ్వవలసిన అవసరం దేవునికి లేదు అంటున్నాడు!
ప్రియ
సహోదరీ సహోదరుడా! ఇదే సమాధానము నీకు నాకు! కాబట్టి మాయదారి దేవుడా!
ఎక్కడున్నావు? నేనే దొరికానా? ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితులలో కూడా పలుకకూడదు! దేవునికి
నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు! అయితే ఏదైనా చేయాలి అనుకుంటే
దేవుడు తన ప్రవక్తలకు చెప్పి చేస్తారు! గాని నీకు చెప్పాల్సిన
అవసరం లేదు అని గ్రహించి మన స్థితిని మనం గుర్తెరిగి మాట్లాడదాం!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*124వ భాగం*
యోబు 33:14—22
14 దేవుడు ఒక్కమారే
పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు
15 మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో
రాత్రి కలుగు స్వప్నములలో
16 నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము
వారు మానుకొనచేయునట్లు
17 గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ
వారి ప్రాణమును తప్పించునట్లు
18 ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
19 వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని
నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
20 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి
కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును
22 వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు
సమీపించును.
ప్రియులారా! ఇక ఈ 33వ అధ్యాయములో కూడా యోబుగారు ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ అధ్యాయంలో నేరుగా యోబుగారితోనే మాట్లాడుతున్నాడు! అయితే ముఖస్తుతి లేకుండా దేవుని పక్షంగా మాట్లాడుచున్నాడు ప్రియులారా!!
ప్రియులారా! ఈ భాగంలో అత్యంత ముఖ్యమైన
విషయాలు చెబుతున్నాడు ఏలీహు!
దేవుడు
మానవులతో ఎలా మాట్లాడతారు!
ఎందుకు మాట్లాడతారు అనేది ఈ వచనాలలో చూడగలము మనము!
14 దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే
మనుష్యులు అది కనిపెట్టరు
15 మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో
రాత్రి కలుగు స్వప్నములలో
16 నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము
వారు మానుకొనచేయునట్లు
17 గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ
వారి ప్రాణమును తప్పించునట్లు
18 ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును
ఇదీ అసలు విషయం! దేవుడు మాట్లాడే విధానం! అయితే మనుషులు దీనిని కనిపెట్టరు
అంటున్నాడు! దేవుడు ఎలా మాట్లాడతారు అంటే కొన్ని విధాలు ఇక్కడ
చెబుతున్నాడు ఏలీహు!
మొదటిది: మంచం మీద కునుకు తీసే సమయంలో కలల
రూపంలో దేవుడు మాట్లాడతారు! అవును దేవుడు ఎన్నోసార్లు భక్తులతో
కలలో మాట్లాడారు. ఉదా: యోసేపుతో
- పాత నిబంధన యోసేపు, క్రొత్త నిబంధన యోసేపుతో
కూడా మాట్లాడారు! ఫరోతో, నెబుకదనేజర్ తో!!
ఈ విధానంలో ఎందుకు మాట్లాడుతారు అంటే అతడు చెప్పేది
a) నరులు గర్విష్టులు కాకుండా చేయాలని,
b) తాము చేసే పనిలో అపాయం ఉంది కాబట్టి అలా చేయవద్దు
అని చెప్పడానికి
c) వారు నిర్ణయం చేసుకున్న మార్గము గోతిలోకి చావుకి దారితీస్తుంది
జాగ్రత్తరా కొడుకా అని చెప్పడానికి
d) నరులకు ఉపదేశం చేయడానికి!
రెండు: 19 వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని
నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
20 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన
యెముకలు పైకి పొడుచు కొని వచ్చును
22 వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు
సమీపించును.
చూడండి రెండో విధానం: మనిషికి వ్యాధి పెట్టి హాస్పటల్ బెడ్ మీద బోధ చేస్తారు!
ఎందుకంటే వాడు ఆరోగ్యంతో ఉంటే దేవుని మాట వినడు, మనుష్యుల మాట వినడు. అందుకే రోగము పెట్టి చావు పడకమీద
మాట్లాడుతారు దేవుడు. అప్పుడైనా వాడు వినాలి! చూడండి చాలామంది – త్రాగుడు మానరా లేకపోతే నీ ఆరోగ్యం
పాడైపోతుంది నీ ధనము ఆస్తి పాడైపోతుంది అంటే వినరు! అదే డాక్టర్-
ఇక నీవు త్రాగితే చస్తావు అని చెబితే నోరుమూసుకుని వింటారు! అలాగే దేవుడు కూడా! అయితే చాలామంది కొన్నిరోజులు వింటారు-
తర్వాత మామూలే! వీరిలో నాకు అత్యంత ఆప్తులయిన స్నేహితులు
కూడా అలాగే చనిపోయారు, మా బంధువులు కూడా వినకుండా త్రాగి చనిపోయారు!
అయితే
ఈ చావు పడకమీద మాట్లాడే విధానమును చాలా చక్కగా వివరించాడు ఏలీహు ఇక్కడ! ఎలాగూ చెబుతున్నాడు అంటే
మొదటగా అతని ఎముకలలో నొప్పులు వస్తాయి- దానివలన వాడు శిక్షణ పొందుకుంటాడు!
తర్వాత వాడికి ఏమి తిన్నా వాడికి పడదు- రుచిగా
ఉండదు; తర్వాత వాణి శరీర మాంసము క్షీణించిపోయి వికారమై పోతుంది.
ఇంకా ఎముకలన్నీ పైకి పొడుచుకుని వచ్చేస్తాయి
ఇవీ
దేవుడు మనుష్యులతో మాట్లాడే విధానము అని ఏలీహు చెబుతున్నాడు!
అయితే
ఈ క్రొత్త నిబంధన కాలములో పై వాటితో పాటుగా దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతారు,
అనగా వాక్యము చదివేటప్పుడు మాట్లాడుతారు, వాక్యము వినేటప్పుడు మాట్లాడతారు. ఇంకా ప్రవచనాల ద్వారా
మాట్లాడతారు దేవుడు!
సరే, ఈ అన్నీ వచనాలు చూసుకుంటే యోబుగారి బాధల విషయంలో వచ్చిన సమస్యకు ఎలీహు
చూపిస్తున్న పరిష్కారం ఈ వచనాల్లో కనిపిస్తూ వుంది. దేవుడు తన
పనుల గురించి మనుషులకు సంజాయిషీ ఇవ్వనప్పటికీ ఆయన మనుషులతో మాట్లాడకుండా మాత్రం ఉండడు
అంటున్నాడు!
ఆయన
కలల్లోనూ, ముఖ్యంగా భయం గొలిపే కలల్లోనూ మాట్లాడతాడు (15,16 వ.
సంఖ్యాకాండము 12:6).
దేవుడు
శిక్షల ద్వారా, బాధలను పంపడం ద్వారా కూడా మాట్లాడుతాడు (19-22 వ).
అయితే
ఎలీఫజు కూడా మొదటి సారి మాట్లాడినప్పుడు వీటిని ప్రస్తావించాడు (యోబు
4:12-16, ; యోబు 5:17-18, ). కానీ ఎలీహు ఈ విషయాల
గురించి ఎలీఫజు కంటే మరింత స్పష్టంగా, సవిస్తరంగా చెప్పాడు.
యోబు తాను కంటున్న పీడ కలల గురించి, దర్శనాల గురించి
(యోబు 7:13-14, ), నివారణ లేని బాధ గురించీ
(యోబు 30:16-17, ), ఆకలి లేకపోవడం గురించి
(యోబు 3:24, ), కృశించిపోయిన తన దేహస్థితి గురించి
(యోబు 16:8, ; యోబు 19:20, ) చెప్పాడు. ఎలీహు కూడా స్వప్నాలు, బాధల గురించి అదే ధోరణిలో చెప్తున్నాడు. అంటే తాను చెప్తున్నదంతా
యోబు స్వీకరించవలసిందని చెప్తున్నాడన్నమాట. అలాంటి వాటిని దేవుడు
పంపిన ఉద్దేశం ఏమిటో యోబుకు చెప్తున్నాడు. భయం గొలిపే కలలూ దుర్భరమైన
బాధలూ దేవుని దూతల్లాంటివి. దేవుడు ఆలాంటివాటిని ఏవో మంచి కారణాలను
ఆశించే పంపుతుంటాడు. దేవుడు మనుషులను దుర్మార్గంనుండి వారిని
తప్పించాలనీ వారి అహంభావాన్ని విరగ్గొట్టాలనీ నాశనం నుంచి వారిని తప్పించాలనీ చూస్తున్నాడు
(17,18,29,30 వచనాలు). అయితే జాగ్రత్తగా ఆలోచిస్తే
దీని అర్థం యోబు దుష్టత్వాన్నీ చేశాడనీ గర్వంతో ఉన్నాడనీ అతణ్ణి నాశనం నుంచి తప్పించడం
అవసరమనీ ఎలీహు అభిప్రాయం అన్నమాట!. అంటే ఎలీహు కూడా కొంతవరకు
ముగ్గురు స్నేహితులతో ఏకీభవిస్తున్నట్టే. చెప్పాలంటే ఇక్కడ ఎలీహు
చెప్తున్నది చక్కగా ఉంది, చాలామంది విషయంలో అతికినట్టు సరిపోతుంది.
కానీ యోబు విషయంలో ఇది ఎంత మాత్రం సరిపోలేదు, సరి
గదా యోబు బాధల సమస్యకు పరిష్కారం కాలేదు.
ఏదైతేనేమి
ఈ భాగంలో దేవుడు మనుషులతో మాట్లాడే విధానమును పరిశుద్దాత్ముడు మనకోసం వ్రాయించాడు కాబట్టి! ఇలా ఇన్ని విధానాలలో
దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా విందాము! లోబడదాము!
లేకపోతే గోటికి పోయే అవకాశం ఉంది అని మరచిపోవద్దు!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*125వ భాగం*
యోబు 33:23—28
23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు
వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
24 దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ
వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.
25 అప్పుడు వాని మాంసము బాలుర మాంసముకన్న ఆరోగ్యముగా
నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.
26 వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును
కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.
27 అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును
యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు
చేయబడ లేదు
28 కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు
నా జీవము వెలుగును చూచుచున్నది.
ప్రియులారా! ఇక ఈ 33వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ అధ్యాయంలో నేరుగా యోబుగారితోనే మాట్లాడుతున్నాడు! అయితే ముఖస్తుతి లేకుండా దేవుని పక్షంగా మాట్లాడుచున్నాడు ప్రియులారా!!
ఇక
తర్వాత వచనాలలో కొంత ప్రత్యేకముగా మాట్లాడుచున్నాడు ఏలీహు!
23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకు
వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
24 దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ
వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.
ఇక్కడ దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఒకరు ఉండాలి- అది వేలాది దూతలలో ఘనుడై
ఉండాలి, అటువంటిది జరిగితే మనిషి పాతాళమునకు వెళ్ళకుండా మనిషి
పాపములకు ప్రాయశ్చిత్తము జరుగుతుంది అని అభిప్రాయ పడుతున్నాడు! అయితే ప్రియులారా ఈ వచనాల మీద బైబిల్ పండితులకు విభిన్నమైన అభిప్రాయాలున్నాయి!
అవన్నీ క్షుణ్ణంగా పరిశీలిద్దాము!
మొదటిది:
బాధల ద్వారా బుద్ధి తెచ్చుకున్న మనిషిని ఆ బాధల నుంచి విడిపించేందుకు
దేవుడు ఉపయోగించగలిగిన మార్గాన్ని ఎలీహు వర్ణిస్తున్నాడు.
రెండు:
23,24 వచనాల్లో హీబ్రూలో కనిపించే భాషను అర్థం చేసుకోవడం కష్టం.
ఈ మధ్యవర్తి దేవదూతో లేక మనిషో ఖచ్చితంగా తెలియదు. ఇక్కడి అర్థం ప్రకారం ఆ వ్యక్తి చాలా ప్రత్యేకమైనవాడో (అంటే నూటికి కోటికి ఒకడో) లేక అనేకమంది లాంటివాడో
(వెయ్యి మందిలో ఒక మనిషి) తెలుసుకోవడం కష్టంగా
ఉంది. ఇక్కడ కనిపిస్తున్న విడుదల వెల ఏమిటో కూడా అర్థం చేసుకోవడం
కష్టం. ఎలీహు తనను తానే ఆ మధ్యవర్తిగా చెప్పుకుంటున్నాడని కొందరు
వ్యాఖ్యాతలు అభిప్రాయపడితే,
మూడవది: మరికొందరు పరలోకం నుంచి వచ్చిన
దూతను గురించి ఎలీహు అంటున్నాడు అని అభిప్రాయపడుతున్నారు.
నాల్గవది: మరి కొందరైతే ఎలీహు తనకు తెలియకుండానే
యేసుక్రీస్తుప్రభులవారి గురించి ప్రవచనం చెబుతున్నాడు అని వ్యాఖ్యానించారు. అంటే దేవునికీ మనిషికీ మధ్యవర్తిగా మనుషుల చెంతకు దేవుని సందేశాన్ని తీసుకువచ్చి
మనుషుల విమోచన కోసం తనను తాను విడుదల వెలగా అర్పించుకొన్న క్రీస్తును గురించి ఎలీహు
పలుకుతున్నాడని వారి అభిప్రాయం.
ఏది ఏమైనా యోబుకు ఒక నిరీక్షణ ఎలీహు అందిస్తున్నాడు.
శిక్ష ద్వారా దేవుడు యోబుకు చెప్పదలుచుకున్నది ఏమిటో యోబు వినగలిగితే, విని పశ్చాత్తాపపడితే
అతని ఆరోగ్యం తిరిగి చేకూరుతుంది. అతని ఆనందం, నీతి న్యాయాలు, దేవునితో సహవాసం (25,26 వ) తిరిగి సమకూరుతాయి. అప్పుడు
యోబు 27,28 వచనాల్లో కనిపించే మనిషిలాగా మాట్లాడతాడని ఎలీహు అభిప్రాయం.
మలాకి 3:1 లో 1 ఇదిగో
నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత,
తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
2 అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు,
చాకలివాని సబ్బువంటి వాడు;
3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును.లేవీయులు నీతిని అనుసరించి యెహో వాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను
నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
పౌలుగారు
అంటున్నారు 2 కోరింథీ పత్రికలో 5: 19 అదేమనగా,
దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు
లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు
రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని
ఆయనను మనకోసము పాపముగాచేసెను.
ఇక
యెషయా గ్రంధంలో ఇదే మార్గము కోసం చెబుతున్నారు 61: 1 ప్రభువగు యెహోవా ఆత్మ
నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను
నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని
ప్రకటించుటకును
2 యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును
దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును
3 సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును
బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా
స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా
తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి
పేరు పెట్ట బడును.
ఇప్పుడు
ఈ మార్గములోనికి వచ్చి గుణపడితే అప్పుడు పలుకుతాడు మనిషి 27,28 వచనాలలో
గలమాటలను!
27 అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును
యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు
చేయబడ లేదు
28 కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు
నా జీవము వెలుగును చూచుచున్నది.
ఇక 29—30 వచనాలలో అంటున్నాడు
ఏలీహు
29 ఆలోచించుము,
నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు
30 కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు
రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.
చూడండి ఇక్కడ ఇలా అనేకవిధాలుగా దేవుడు మనిషిని హెచ్చరించి గోతిలోనికి పోకుండా
దేవుడు ఆపుతాడు మనిషిని అంటున్నారు! దేవుడే ఇలా చేస్తారు అంటున్నాడు! ఇక్కడ నిజంగా ప్రవచిస్తున్నాడు ఏలీహు! అలా చెప్పినప్పుడు
గుణ పడ్డావా బాగుపడతావు చావును తప్పించు కుంటావు! వదిలి విర్రవీగావా
పోతావు!
ఇక
చివరి మూడు వచనాలలో అంటున్నారు
31 యోబూ, చెవిని బెట్టుము నా మాట
ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.
32 చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము
చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు చున్నాను.
33 మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా
నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.
ఇక్కడ
మాట్లాడదలచుకుంటే మాట్లాడమని యోబుకు అవకాశమిస్తున్నాడు ఎలీహు. యోబుగారు మౌనంగానే ఉన్నారు.
బహుశా ఎలీహు ఇంకా మాట్లాడాలని యోబు ఉద్దేశం కావచ్చు. లేక ఎలీహు చెప్పినదాన్లో కొత్త సంగతి ఏమీ లేదనీ అలాంటి విషయాలకు తాను ఇంతకు
ముందే జవాబిచ్చేశాననీ అనుకొని ఉండవచ్చు. తన జ్ఞానంలో ఎలీహుకు
ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూచి అతని వినయం గురించి మనకు సందేహం కలగదా?
సరే, ఏదిఏమైనా ఇక్కడ వ్రాయించింది
పరిశుద్దాత్ముడు కనుక దేవుడు మనతో ఒక్కసారి లేదా రెండుసార్లు కలల ద్వారా గాని వ్యాధితో
మొత్తి గాని మాట్లాడినప్పుడు గుణపడుదాం! సరిచేసుకుందాం!
దేవునితో
సమాధాన పడదాం!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*126వ భాగం*
యోబు 34:1—8
1 అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను
2 జ్ఞానులారా, నా మాటలు వినుడి
అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
3 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
4 న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట
మనము విచారించి తెలిసి కొందము రండి.
5 నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
6 న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను
నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
7 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి
నీళ్లవలె తిరస్కారమును పానము చేయుచున్నాడు.
8 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు
సహవాసి ఆయెను.
ప్రియులారా! ఇక ఈ 34వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
2 జ్ఞానులారా, నా మాటలు వినుడి
అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
3 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
4 న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట
మనము విచారించి తెలిసి కొందము రండి.
తన
మాటలు జ్ఞానయుక్తమని ఎంత తేటతెల్లంగా ఉందంటే ఏమాత్రం వివేచనాశక్తి ఉన్న వాడైనా వాటికి
అంగీకరించవలసిందే అని ఎలీహు నమ్మకం.
ఇక
ఇంకా ముందుకు పోతే 5 నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
6 న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానునేను
తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
యోబు
మనసు ఎలాంటిదో దాని గురించి తన అభిప్రాయం ఎలీహు ఇక్కడ వెల్లడిస్తున్నాడు.
5వ వచనంలో యోబు మాటలు కొన్నిటిని తిరిగి వల్లిస్తున్నాడు (యోబు 13:18, ; యోబు 27:2, ).
6,9 వచనాల్లో యోబు చెప్పిన కొన్ని మాటల సారాంశం (తన ఉద్దేశంలో)
ఏమిటో వర్ణిస్తున్నాడు. తాను నీతిన్యాయాలతో బ్రతికాడని
చెప్పుకున్నప్పుడు తన స్నేహితులెవరూ ఆ మాటలు నమ్మలేదని యోబుకు తెలుసు. పరిస్థితులు కూడా దీనికి విరుద్ధంగానే సాక్ష్యమిస్తున్నట్టున్నాయి.
అయితే 9వ వచనంలో
ఉన్న మాటలను యోబు ఎన్నడూ పలకలేదు. 9 నరులు దేవునితో సహవాసము చేయుట
వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ఈ మాటలు యోబుగారు అనలేదు ఎప్పుడు!
అయితే
యోబు పలికిన కొన్ని మాటలకు
(యోబు 9:21-24, ; యోబు 21:7-9, ; యోబు 24:12, ) అర్థం ఇదే అని ఎలీహు భావించాడు.
ఆ మాటకొస్తే తన నమ్మకం దీనికి వ్యతిరేకంగా ఉన్నదని సూచించే మాటలను యోబు
పలికాడు (యోబు 21:14-16, ; యోబు
27:7-23, ; యోబు 28:28, ).
ఇక
7,8 వచనాల్లో ఎలీహు యోబుపైన చేస్తున్న నేరారోపణలు బహు అన్యాయమైనవి.
న్యాయమంటే ఎంతో ఇష్టమున్నవాడు సైతం (యోబు
32:3, ) అన్యాయంగా మాట్లాడగలడు.
(7 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును
పానముచేయుచున్నాడు.
8 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను).
యోబుకు
ఎత్తిపొడుపుగా మాట్లాడ్డం ఎంతో ఇష్టమని ఎలీహు 7వ వచనంలో సూచిస్తున్నాడు. జోఫరు కూడా యోబుపై ఈ నిందే మోపాడు (యోబు
11:3, ). నిజంగా తన స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల పట్ల యోబు తిరస్కార
బుద్ధి చూపాడు. ఎందుకంటే వాటికి తిరస్కారమే తగినది. అది ఎలా ఉన్నా, తనకు ఉన్నదని తాను భావించిన లోతైన జ్ఞానం
మూలంగా ఎలీహు యోబును అర్థం చేసుకోలేదు.
ఇక
తర్వాత వచనాలు చూసుకుంటే
10 విజ్ఞానముగల మనుష్యులారా, నా
మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము
చేయుట అసంభవము
11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును
అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును.
12 దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు
న్యాయము తప్పడు.
దేవుడు
మనుషులపైకి పంపించే శిక్షలో ఇమిడివున్న దేవుని న్యాయాన్ని ఇప్పుడు ఎలీహు సమర్థించ బూనుకొన్నాడు. దేవుని న్యాయం గురించి
ఎలీహుకు చాలా ఉన్నతమైన అభిప్రాయం ఉంది. యోబుకు సంభవించినదైనా
సరే, దేవుని న్యాయాన్ని యోబు ఏ విధంగా విమర్శించినా సరే,
ఈ లోకంలో ఏమి జరిగినా సరే, మనుషులపైకి ఎలాంటి విపత్తులూ
బాధలూ వచ్చినా సరే, ఒక విషయం మాత్రం పచ్చి నిజం – దేవుడు తప్పు చేయడం అంటూ జరగదు . దయచేసి క్రింది రిఫరెన్సులు
చూడండి:
(ఆదికాండము 18:25, ; ద్వితీయోపదేశకాండము 32:4,
; కీర్తనల గ్రంథము 11:7, ; కీర్తనల గ్రంథము
89:14, ; యిర్మియా 9:24, ; అపో. కార్యములు 17:31, ; ప్రకటన గ్రంథం 16:7).
మనుషులు
ఏం చేస్తారో దానికి సరిపోయిన ప్రతిఫలాన్నే దేవుడు ఇస్తాడని 11వ వచనంలో ఎలీహు అంటున్నాడు.
11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన
వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును.
బైబిల్లో దేవుని న్యాయం గురించి చెప్పిన
మాటల సారం ఇదే (కీర్తనల గ్రంథము 62:12, ; సామెతలు 24:12, ; యిర్మియా 32:19, ; యెహెఙ్కేలు 33:20, ; మత్తయి 16:27, ; రోమీయులకు 2:6, ; 2 దినవృత్తాంతములు 5:10, ; ప్రకటన గ్రంథం 22:12, ).
అయితే
మిగతా ముగ్గురు స్నేహితుల్లాగానే ఎలీహు కూడా ఈ ప్రతిఫలం, లేక శిక్ష, ఇక్కడే ఈ లోకంలోనే కలుగుతుందని ఊహిస్తున్నాడు. క్రొత్త
నిబంధనలో దేవుడు తీర్పుల గురించి వెల్లడించిన విషయాలు అతనికి తెలియదు (మత్తయి 25:33, మత్తయి 25:36, ; అపో. కార్యములు 17:31, ; 1 దినవృత్తాంతములు
5:10, ; ప్రకటన గ్రంథం 20:11-15, ).
కాబట్టి
మిగతా ముగ్గురు స్నేహితులు ఏది చెప్పారో ఎలీహు కూడా సరిగ్గా అదే చెప్తున్నాడు – యోబు దోషి. తన దుష్కార్యాలకు న్యాయమైన శిక్ష అతనికి కలిగింది. ఈ
విధంగా యోబు బాధలకు యోబు స్నేహితులు ఇచ్చిన కారణం కంటే ఎలీహు మంచి కారణాన్ని ఇవ్వలేదు
ఇక్కడ!!!
సరే, ఏదిఏమైనా దేవుడు ఎప్పుడు
అన్యాయం చేయడు! యోబుగారిలాగా మనం మాట్లాడకూడదు! అందుకే ఏలీహు అంటున్నాడు దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు
న్యాయము తప్పడు. దేవుడు ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయరు!
గనుక
మన మాటలను జాగ్రత్తగా పలుకుదాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*127వ భాగం*
యోబు 34:13—18
13 ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?
14 ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను
తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల
15 శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
16 కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.
17 న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైన వానిమీద నేరము మోపుదువా?
18 నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని
ప్రధానులతోనైనను అనవచ్చునా?
ప్రియులారా! ఇక ఈ 34వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ భాగంలో ఏలీహు దేవుని పక్షంగా మరో విధంగా మాట్లాడుచున్నాడు!
13 ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?
ఈ విశ్వాన్ని అంతటినీ ఏలే సర్వాధికారి దేవుడు. తనకు ఇష్టం వచ్చినది
చేయగలడు, ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన పని లేదాయనకు.
దీనికోసం ఇంకా ఆలోచిస్తే ఇక్కడ ఎలీహు యోబుగారిని అడుగుతున్నాడు- ఎవడైనా ఈ భూమిని దేవునికి
అప్పగించేశాడా? ఎవడైనా ఈ సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించేనా
అంటున్నాడు! నిజానికి భూమిని అప్పగించడం మాత్రమే కాదు అసలు ఈ
భూమిని సర్వసృష్టిని ఆయనే చేసినట్లు గత భాగంలో చూసుకున్నాము. అయితే సర్వప్రపంచ భారము ఎవడైనా ఆయనకు అప్పగించెనా- దీనికోసం
ఆలోచిస్తే అవును- యేసుక్రీస్తుప్రభులవారికి తండ్రియైన దేవుడు
ఈ సర్వ ప్రపంచభారము ఆయన మీద వేశారు!
ఇదిగో ఋజువు:
యెషయా
9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
*ఆయన భుజముమీద రాజ్యభారముండును*. ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు
పెట్టబడును.
మరి
ఇక్కడ రాజ్య భారమంతా దేవుడు యేసుక్రీస్తుప్రభులవారి మీద మోపారు కదా! లూకా మొదటి అధ్యాయంలో ఆయన యాకోబు వంశస్తులను
యుగయుగములు ఏలును, తన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును,
ఆయన రాజ్యమునకు అంతము లేదు అని చెప్పారు కదా! కాబట్టి
ఇక్కడ ఎలీహు మాట సత్య దూరము! అయితే మనుషులెవరూ మోపలేదు గాని దేవుడే
తన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారి మీద ఈ భూలోక సర్వప్రపంచ భారము మోపినట్లు చూడగలము!!!
ఇక
తర్వాత మాటలలో మరో లాజిక్ తీసుకుని వచ్చాడు ఎలీహు! 14 ఆయన
తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన
యెడల
15 శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
అవును ఇది నిజమే! కీర్తనలు 104 వ అధ్యాయములో భక్తుడు కూడా ఇదే అంటున్నాడు:
27 తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు
నీ దయకొరకు కనిపెట్టుచున్నవి
28 నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి
విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును.
29 నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి
ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.
30 నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు
భూతలమును నూతనపరచుచున్నావు.
ఇక 90:7 లో అంటున్నారు 7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి
దిగులుపడుచున్నాము.
ఇక
దేవుడు కూడా అంటున్నారు యెషయా 57 లో
16 నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల
నా మూలముగా జీవాత్మ క్షీణిం చును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
ఇక
తర్వాత వచనాలలో అంటున్నాడు 16 కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.
17 న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైన వానిమీద నేరము మోపుదువా?
చూడండి న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా అంటున్నాడు! దీనినే
దేవుడు కూడా అడిగినట్లు చూడగలము యోబు 40 వ అధ్యాయంలో యోబు
40:8
8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా?
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
కాబట్టి
న్యాయమును దేవుడు ప్రేమిస్తున్నారు గాని ద్వేషించడం లేదు! ఆయన న్యాయ సంపన్నుడు
ఆయన అన్యాయం చేయరు!!
ఇక
తర్వాత వచనాలు చూసుకుంటే 18 నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని
ప్రధానులతోనైనను అనవచ్చునా?
ఈ
ప్రశ్నకు జవాబు కాదు అని!
ఒకవేళ ఎవడైనా దేశాన్ని ఏలే రాజుని కానీ ప్రధాన మంత్రిని గాని నీవు పనికిమాలిన
వాడవు దుష్టుడవు అంటే బ్రతికి బట్ట కట్టగలడా? నిర్గమ
22 లో మోషే గారి ద్వారా ధర్మశాస్త్రంలో అంటున్నారు 28 నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధి కారిని శపింపకూడదు.
పేతురు
గారు అంటున్నారు 1 పేతురు 2: 17 అందరిని సన్మానించుడి,
సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి,
రాజును సన్మానించుడి.
దేవుడు
తన తీర్పుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. ఆయన అన్నిటినీ చూడగలడు. ఆయనకు అన్నీ తెలుసు. అన్నిటిమీదా న్యాయంగా పరిపాలిస్తున్నాడు
(కీర్తనల గ్రంథము 47:2).
ఇక
తర్వాత వచనాలలో అంటున్నాడు 19 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న
ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు
ఆయన నిర్మించినవారు కారా?
20 వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది
నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.
ఇక్కడ
రాజుల ఎడల పక్షపాతము చూపనివాడు దేవుడే! పేదలకు బీదలకు తారతమ్యము ఎంచనివాడు ఇద్దరినీ ఒకేవిధంగా
చూచేవాడు దేవుడే! కాబట్టి దేవునికి పక్షపాతము తనమన బేధము లేదు
కనుక దేవుడు పక్షపాతి ఆయన అన్యాయం చేశాడు అనడం తప్పు అని హితోపదేశం చేస్తున్నాడు ఎలీహు!!!
ఇక 20 వ వచనంలో పేదలు ధనవంతులు
ఒకేవిధంగా చనిపోతారు రాజులు ప్రజలు కూడా ఒకేవిధంగా చనిపోతారు! ఇంకా ఈలోకంలో బలవంతులైన వారు దేవునిచేత దైవికముగా కొనిపోబడుతున్నారు అంటున్నారు!
ఉదాహరణకు ఇప్పటి ఇరాన్, లాంటి గల్ఫ్ దేశాలు యుద్దాల
వలన వారి ఆధిపత్యము ధనము కరిగిపోతుంది. బలవంతులైన వారు చిన్న
రోగము వచ్చి పుటుక్కున చనిపోతున్నారు! అలగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని
గెలిచేశాడు గాని చిన్న దోమ కుట్టి మలేరియా వచ్చి చనిపోయాడు! ఇదీ
దైవికముగా చనిపోవడం అంటే!
ద్వితీ 10: 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా
పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు
భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు,
లంచము పుచ్చుకొననివాడు.
ఆపో 10: 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా
గ్రహించి యున్నాను.
ఈ
విషయం మనం కూడా గ్రహించి దేవునికి భయపడదాం!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*128వ భాగం*
యోబు 34:21—28
21 ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు
కనిపెట్టి చూచుచున్నాడు.
22 దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు
చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
23 ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని
విచారణచేయుట దేవునికి అగత్యము లేదు.
24 విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.
25 వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు
ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.
26 దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.
27 ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో
దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.
28 బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల
మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
ప్రియులారా! ఇక ఈ 34వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ భాగంలో ఏలీహు దేవుని పక్షంగా మరో విధంగా మాట్లాడుచున్నాడు!
ఇక 21 వ వచనం నుండి చూసుకుంటే
21 ఆయన దృష్టి నరుల మార్గములమీద
నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.
ప్రియులారా
ఈ వచనం కోసం గత భాగాలలో విస్తారంగా చూసుకున్నాము- దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంది
మన నడకను పడకను ఆయన బాగుగా కనిపెట్టి చూస్తున్నాడు కనుక మనము ఒళ్లు దగ్గర పెట్టుకుని
నడవాలని చూసుకున్నాము! ఏదిఏమైనా దావీదుగారు 139 వ కీర్తనలో చెప్పిన
మాటలు జ్నాపకం చేసుకుని ముందుకు పోదాము!
1 యెహోవా, నీవు నన్ను పరిశోధించి
తెలిసికొని యున్నావు
2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు
పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
3 నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు,
నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
4 యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే
అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
5 వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి
నామీద ఉంచియున్నావు.
6 ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
7 నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
8 నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు
పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
9 నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
10 అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను
పట్టుకొనును
11 అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె
ఉండును అని నేనను కొనిన యెడల
12 చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు
వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
ఇక
తర్వాత వచనాలు చూసుకుంటే
22 దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను
మరణాంధకారమైనను లేదు.
23 ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని
విచారణచేయుట దేవునికి అగత్యము లేదు.
ఇక
దాగుకొనుటకు చీకటియైనను మరణాంధ కారమైనను లేదు దీనికి సమాధానము పైన 139 వ కీర్తనలో
7—12 వచనాలలో ఉంది!
ఆమోసు
గ్రంధంలో భక్తుడు అంటున్నాడు 9: 2 వారు
పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.
3 వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకిపట్టి
అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో
మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును.
4 తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున
కాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును; మేలుచేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారిమీద నిలుపుదును.
కాబట్టి
దేవునికి కనబడనివి ఏదీ లేదు! అందుకే హెబ్రీ 4:13 లో భక్తుడు అంటున్నారు
13 మరియు ఆయన దృష్టికి కనబడని
సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ
దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
ఇక 23 వ వచనంలో
23 ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి
అగత్యము లేదు, దీని అర్ధము ఏమిటంటే బలిష్టులు దుష్టులను శిక్షించడానికి
ఒక్కోసారి దేవునికి విచారణ దినమును నియమించవలసిన అవసరం లేదు. ఆయన అనుకుంటే బలిష్టులను తీసేసి వేరొకరిని దేవుడు పెట్టగలడు! బలిష్టుడైన నెబుకద్నేజర్ రాజుని తీసేసి కోరేషుని తీసుకుని వచ్చారు దేవుడు!
సౌలు రాజుని పీకేసి దావీదుగారిని తీసుకుని వచ్చారు దేవుడు! ఇక మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే బలమైన తెలుగు దేశం పార్టీని పీకేసి వైసీపీని
తీసుకుని వచ్చారు. ఇక వీరిని ఎవడూ పీకలేడు అనుకున్నాము గాని దేవుడు
వైసీపీని పీకేసి మరలా కూటమి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు! ఇక తర్వాత దేవుడు తలచుకుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని పీకేసి మరొకరికి అధికారం
ఇవ్వగలరు! ఇదే తెలంగాణలో కూడా జరిగింది!
తర్వాత
వచనాలలో అంటున్నాడు 25 వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు
ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.
26 దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.
27 ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో
దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.
28 బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల
మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
దేవుడు
మానవులు చేసే క్రియలను తెలుసుకుంటున్నారు అంటున్నాడు ఇక పడుకుని లేవకుండా రాత్రే లేపేస్తున్నారు
అంటున్నాడు. ఇంకా దుష్టులను బహిరంగము గానే దేవుడు శిక్షిస్తున్నారు అంటున్నాడు!
అవును నిజమే కదా! ప్రపంచములో అనేకులైన దుష్టులును
దేవుడు లేపేస్తున్నారు ఎవరో ఒకరిని ఏర్పాటుచేసుకుని!
ఎందుకంటే 27—28 వచనాలలో దానికి
కారణం చెబుతున్నారు ఈ దుష్టులు దేవుణ్ణి అనుసరించడం మాని, ఆయన
ఆజనాలు విధులు అనుసరించడం మానేశారు సరికదా బీదలను బాదపెట్టి వారి మొర దేవుని దగ్గరకు
చేరేలా చేశారు అందుకే దేవుడు వారిని లేపేస్తున్నాడు అంటున్నాడు!
అవును
ప్రియులారా దేవునికి ఇష్టంగా లేకుండా జీవిస్తే, దీనులను దిక్కులేని వారిని పేదవారిని బాధపెడితే
దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు! ఒకరోజు వస్తుంది మరి తిరుగులేకుండా
హఠాత్తుగా దేవుడు వారిని లేపేస్తాడు! నీవు నేను కూడా దానిని తప్పించుకోలేము
జాగ్రత్త!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*129వ భాగం*
యోబు 33:29—37
29 ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?
ఆయన తన ముఖమును దాచుకొనిన యెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను
ఒకటే
30 భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను
చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
31 ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను
32 నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము
చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?
33 నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారము చేయునా?
లేనియెడల నీవుందువా? నేను కాదు నీవే నిశ్చయింపవలెను
గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.
34 వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు
పలుకుదురు
35 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
36 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట
శోధింపబడవలెనని నేనెంతో కోరు చున్నాను.
37 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు
మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.
ప్రియులారా! ఇక ఈ 34వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ భాగంలో ఏలీహు దేవుని పక్షంగా మరో విధంగా మాట్లాడుచున్నాడు!
ఇక 29వ
వచనం నుండి చూసుకుంటే ఆయన సమాధానం కలుగజేస్తే శిక్ష విధించేవాడు ఎవడు అంటున్నాడు,
ఒకవేళ ఆయన ముఖము దాచుకుంటే ఆయనను చూడగలిగే వాడు ఎవడు అంటున్నాడు!
అవును కదా ఒకసారి ఆయన తీర్పు తీర్చితే ఎవరినైనా నిర్ధోషి అని
ప్రకటిస్తే వానిని దోషిగా తీర్చే మొనగాడు లేదు- ఒకవేళ
ఒకనికి దేవుడు శాంతి సమాధానం కలుగజేస్తే వాటిని వాణి నుండి తీసివేసే మొగాడు లేడు,
అందుకే అస్తమాను చెబుతుంటాను- ఒక మనిషి మనకు ఏదైనా
ఇస్తే తర్వాత వాడు గాని, మరొకడు గాని లేక దొంగ కానీ మన దగ్గరనుండి
తీసేయ గలడు! అదే దేవుడే గాని ఒకనిని ఆశీర్వదిస్తే మనిషి ఎవడు
ఆ ఆశీర్వాదాన్ని ఐశ్వర్యమును తీసివేయలేడు – హల్లెలూయ!!
ఇక
దేవుడు తన ముఖాన్ని దాచుకుంటే ఎవడూ ఆయనను చూడలేడు – దీనికోసం గత భాగాలలో చూసుకున్నాము!
గాని కీర్తనాకారుడు 27 వ అధ్యాయంలో అంటున్నారు:
9 నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత
నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా,
నన్ను దిగనాడకుము నన్ను విడువకుము.
ఇక
తర్వాత వచనంలో మరో ముఖ్యమైన విషయం చెబుతున్నాడు ఎలీహు! 30 భక్తిహీనులు రాజ్యపరిపాలన
చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
చూడండి మీద
20 వచనంలో బలవంతులు దైవికముగా కొనిపోబడుతున్నారు అని చెప్పాడు కదా-
ఇక్కడ అలా కొనిపోబడటానికి మరో కారణం చెబుతున్నాడు ఈ వచనంలో –
ఏమిటంటే భక్తిలేని వాళ్ళు పరిపాలించకుండా ఇంకా ప్రజలు ఆ భక్తిహీనుల వలలో
పడిపోయి బాధపడకుండా ఉండాలని బలవంతులను దేవుడు లేపేస్తున్నారు అంటున్నాడు! ఇది సరియైన మాట!
ఇక
తర్వాత వచనంలో అంటున్నాడు 31 ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను
32 నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము
చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?
ఈ
రెండు వచనాల్లోని మనిషిలాగా యోబును మాట్లాడమంటున్నాడు ఎలీహు. అలా కాని పక్షంలో దేవుడు
అతణ్ణి కరుణిస్తాడన్న ఆశ లేదు అని కూడా అంటున్నాడు! కీర్తన
19:12 చూసుకుంటే 12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన
తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము.
అయితే 32:8 లో దేవుడు అంటున్నారు
8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద
దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.
అదే కీర్తనాకారుడు 139 కీర్తనలో అంటున్నాడు
23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి
కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
24 నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున
నన్ను నడిపింపుము.
మనము
కూడా దేవుణ్ణి ఇలాగే అడిగి-
దేవునికి యిష్టము కానివి మనలో ఉంటే తెలుసుకుని వాటిని మనలో నుండి తొలగించుకుంటే
దేవునితో సమాధాన పడి ఆయన రాజ్యవారసులుగా ఉండగలము!!
ఇక
తర్వాత వచనంలో 33 నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారము చేయునా? లేనియెడల
నీవుందువా? నేను కాదు నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని
పలుకుము.
చూడండి
ఇక్కడ ఎలీహు ఏమంటున్నాడో ఏమయ్యా యోబు! నీకిష్టమైన విధంగా దేవుడు తీర్పు తీర్చుతాడా??
మనం కూడా మనకు ఇష్టమైన రీతిలో జరిగితే అది దేవుని చిత్తము అంటాము,
అలా జరుగక పోతే దేవునిమీద ఆయాస పడతాము! గమనించ
వలసింది ఏమిటంటే మనకు ఇష్టమైన తీర్పులు దేవుడు ఇవ్వరు- తనకు నచ్చిన-
ప్రజలకు ఉపయోగమైన తీర్పులే దేవుడు తీర్చుతాడు అని మరచిపోవద్దు!!
కీర్తన 135: 6 ఆకాశమందును భూమియందును
సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు.
ఇక 34 వచనం నుండి చూసుకుంటే
34 వివేచనగలవారు జ్ఞానముగలిగి
నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు
35 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు.
అతని మాటలు బుద్ధిహీనమైనవి
36 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున
అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరు చున్నాను అంటున్నాడు!
చూడండి యోబు దీనమనస్సుతో పరితపించడానికి, తన పాపాలను ఒప్పుకోవడానికీ,
దేవుని కరుణ కోసం ప్రాధేయపడేందుకూ నిరాకరిస్తున్నాడు కాబట్టి యోబు తిరుగుబాటు
ధోరణి గల పాపి అని ఎలీహు అభిప్రాయం. ముగ్గురు స్నేహితులు కూడా
ఇలాగే అనుకున్నారు. 36వ వచనం చూడండి. యోబు
ఇప్పటికీ ఆసాంతం విషమ పరీక్షకు పూర్తిగా గురయ్యాడని ఎలీహు గ్రహించలేదా ఏమిటీ?
యోబుకు ఇంకా రావలసిన బాధలు ఏమున్నాయి? ఎలీహు జరుపుతానన్న
మధ్య వర్తిత్వం ఇదన్నమాట! మన రక్షకుడు క్రీస్తులాంటి మధ్యవర్తి
వేరే ఎవరున్నారు? (హెబ్రీయులకు 2:17-18, ; హెబ్రీయులకు 4:15-16, ; 1 యోహాను 2:1, ).
మనుష్యులు ఇంతే , వారు పక్షపాత ధోరణి అవలంభిస్తారు గాని దేవునికి పక్షపాతం
లేదు! అందుకే భక్తుడు అంటున్నాడు- నరులను
నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు! రాజులను నమ్ముకోవడం
కంటే దేవుణ్ణి నమ్ముకోవడం మేలు!
ఇక్కడ ఎలీహు అంటున్నాడు యోబు జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నాడు దేవుడంటే
అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు దుర్మార్గులు జవాబు చెప్పినట్లు చెబుతున్నాడు అన్నాడు! అందుకే చివరి
వచనంలో ఇంకా అంటున్నాడు 37 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు
కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.
అయితే ఈ మాట సత్యదూరమైనది. ఎలీహు కూడా యోబుగారి స్నేహితుల వలె
యోబుగారిని అర్ధం చేసుకోలేక పోయాడు! దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను
అని చెబుతూ ఎలీహు కూడా యోబుగారిమీద నేరం మోపుతున్నాడు! ఇది చేయకూడదు
మనము!
ఏదిఏమైనా
మనము దేవుని నోటిమాటను వినాలి- దాని ప్రకారంగానే జీవించాలి. ఎలీహు యోబు
గారి విషయంలో పలికిన మాటలు యోబు గారి విషయంలో తప్పు గాని- వాటి
భావము మాత్రము సత్యము! యెషయా 1: 18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన
వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె
ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.
19 మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క
మంచిపదార్థములను అనుభవింతురు.
20 సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు
యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
1 సమూయేలు 15: 22 అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు,
పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
23 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము;
మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము.
యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను
విసర్జించెననగా
మనము
కూడా దేవుడు చెప్పినది మాత్రమే చేద్దాం!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*130వ భాగం*
యోబు 35:1—8
1 మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
2 నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన
నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే?
3 ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని
నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా?
4 నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
5 ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ
విశాలములవైపు చూడుము.
6 నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా?
నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
7 నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
8 నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే
నీ నీతి ఫలము చెందును.
ప్రియులారా! ఇక ఈ 35వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
దేవుని న్యాయం గురించి యోబు పలికిన మాటలకు తగిన రీతిలో జవాబిచ్చానని
ఎలీహు అనుకొంటున్నాడు. ఇప్పుడు యోబుకు వ్యతిరేకంగా తనకున్న మరో
ఫిర్యాదును తీసుకున్నాడు. యోబు 34:9, లో
ఇంతకుముందే దీన్ని చెప్పాడు. 34:9 నరులు దేవునితో సహవాసము
చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు నీవు నీతిగా ఉంటే దేవునికి ఏమైనా మేలు చేసి పెట్టావా?
లేక నీవు కీడు చేస్తే దేవునికి ఏదైనా నష్టం కలిగిందా అనే భావనలో మాట్లాడుచున్నాడు.
ఒకతే విషయం విభిన్న కోణాలలో చెబుతున్నాడు ఎలీహు!
చూడండి 2,3 వచనాలు 2
నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన
లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే?
3 ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి
యెక్కువని నీవనుకొను చున్నావా?
ఇక్కడ
అంటున్నాడు నేను తప్పులు లేక పాపములు చేయడము కంటే పాపము చేయకపోవడం వలన నాకు ఏమీ ప్రయోజనం
రాలేదు కదా! నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి
అది నీకు అనగా దేవునికి ప్రయోజనమేమి అని అంటున్నావు అంటున్నాడు! ఇలా మాట్లాడటం
నీకు ధర్మముగా అని పిస్తుందా అంటున్నాడు- ఇంకా తెగించి దేవునికంటే
నీవే ఎక్కువ నీతిమంతుడవా లేక న్యాయవంతుడివా అంటున్నాడు! లేదా
దేవుని నీతికంటే నీ నీతి ఎక్కువ అని అనుకుంటున్నావా అంటున్నాడు! ఇది 34:9 ఆధారంగా అంటున్నాడు!
ఇక
తర్వాత వచనంలో యోబుగారి మిత్రులను కూడా కలుపుతున్నాడు! 4 నీతోను నీతో కూడనున్న
నీ సహవాసులతోను నేను వాదమాడెదను అంటున్నాడు దేని కోసం వాదము?
మనుషులు చేసే పనులు అవి మంచివైనా చెడ్డవైనా
దేవుణ్ణేమీ చేయలేవు అంటున్నాడు ఎలీహు. దేవుడు ఆకాశాల పైగా ఔన్నత్యంలో
ఉన్నాడు. ఆయన దేనికోసమైనా ఇతరులెవరిమీదా ఆధారపడినవాడు కాదు.
మనిషి చేసే ఏ పనీ దేవునికేది ఒరగబెట్టదు, ఆయననుంచి
దేన్నీ తొలగించదు. ఆయన మనుషుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు.
మనిషి చేసే చెడ్డ పనులు గానీ మంచి పనులు గానీ మనుషుల పైనే ప్రభావం చూపేలా
దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కారణాలవల్ల నీతి న్యాయాలు మనిషికి లాభదాయకం,
దౌష్ట్యం మనిషికి నష్టం. దీని గురించి కూడా ఎలీహు
అభిప్రాయం సరైనది కాదు. మనుషుల పాపాలు దేవునికి దుఃఖం కలిగిస్తాయి,
ఆయన ప్రజలు విశ్వాసం వల్ల చేసిన మంచి పనులు ఆయనకు ఆనందం కలిగిస్తాయి.
యెషయా 65: 2 తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున
నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.
కీర్తనలు 78: 41 మాటిమాటికి వారు దేవుని శోధించిరి
మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
అయితే దేవుని యందు భక్తి విశ్వాసాలు గలవారి పట్ల ఆయన ఆనదించు
దేవుడు!
కీర్తన 37: 23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును
వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
147: 11 తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు
యెహోవా ఆనందించువాడైయున్నాడు.
కాబట్టి
ఎలీహు పలికిన మాటలు సత్యదూరమైనవి!
ఇక
తర్వాత వచనాలలో 5 ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
6 నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు
విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
7 నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా? ఆయన
నీచేత ఏమైనను తీసికొనునా? అంటున్నాడు! మరలా పాత పాటే మొదలెట్టాడు! దీనికోసం
గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము!!
ఇక
తర్వాత వచనంలో అంటున్నాడు 8 నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి
ఫలము చెందును.
అనగా
నీవు చేసిన పాపము నీమీదికే వస్తుంది అంటున్నాడు!
కీర్తన 7: 16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే
వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.
యెహేజ్కేలు 18: 2 తండ్రులు ద్రాక్షకాయలు తినగా
పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల
దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు?
3 నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
4 మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో
వాడే మరణము నొందును.
కాబట్టి
ప్రతీవానికి వాడు చేసిన దానిని బట్టి దేవుడిచ్చు బహుమానము దేవుని దగ్గర ఉంది. అది బహుమానమా లేక దేవుని
తీర్పు అనేది నీవు చేసిన క్రియలను బట్టి ఉంటుంది! కాబట్టి దేవునికి
భయపడి నడుచుకుందాం!
ప్రసంగి 11: 9
యవనుడా, నీ యవనమందు సంతోషపడుము,
నీ యవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము;
అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక
ముంచుకొనుము;
10 లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి
వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*131వ భాగం*
యోబు 35:9—16
9 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు
బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.
10 అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు
11 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె
మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును
లేరు.
12 కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు
గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు.
13 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు
సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
14 ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే
యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
15 ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును
ఆయన గుర్తింపక పోయినందునను
16 నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే
మాటలను విస్తరింపజేసియున్నాడు.
ప్రియులారా! ఇక ఈ 35వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక 9 వ వచనం నుండి చూసుకుంటే
9 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల
భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు అంటున్నాడు.
ఇక్కడ ఎలీహు అంటున్నాడు- దుష్టులు బలత్కారులు చేసిన పనులు
వలన సహాయం కోసం జనములు కేకలు వేస్తారు అంటున్నాడు. ఇది బాగుంది
గాని దానికి దేవుడు బలాత్కారం చేసేవారినుండి దీనులను విడిపిస్తాడు అని చెప్పవలసి ఉంది
ఎలీహు గాని అలా చెప్పకుండా వదిలేశాడు!
దేవుడు న్యాయవంతుల ఆక్రందనలనూ మనవులనూ వినడు కాబట్టి నీతిన్యాయాలతో
బతకడం వల్ల లాభం లేదని యోబు అభిప్రాయమా? అదే యోబు అభిప్రాయమని
ఎలీహు భావిస్తున్నాడు. ఇలాంటి అభిప్రాయాన్ని సైతాను చాలా మందిలోకి
ప్రవేశపెడతాడు. నిజమైన విశ్వాసులు కొందరు కూడా ఈ అంశం దగ్గర పరీక్షలకు
గురవుతారు. వారి ప్రార్థనలకు జవాబులు రాకపోతే దేవుణ్ణి సేవించడం
వ్యర్థం అని ఆలోచించేందుకు సైతాను వాళ్ళను ప్రేరేపిస్తాడు. తమ
బాధలలోనుండి మనుషులు మొర్రపెట్టినప్పుడు దేవుడు వినకపోవడానికి మంచి కారణాలనేకం ఉన్నాయి
అంటున్నాడు ఎలీహు. మొదటిది వారు కేవలం దేవుణ్ణే తమ సృష్టికర్తగా
ఉపదేశకుడుగా గుర్తించి, ఆయనకొక్కడికే మొర పెట్టరు అంటున్నాడు
10,11 వచనాలలో!
10 అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు
11 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె
మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును
లేరు.
వారి
మొరలు నోరులేని మూగజీవుల అరుపుల్లాగా ఉన్నాయి. వారు తమ సృష్టికర్తను వినయ పూర్వకంగా ప్రార్థిస్తే
ఆయన “రాత్రివేళ పాడడానికి పాటలు” వారికి
ఇస్తాడు. అంటే వారి కష్టాల్లోనే వారికి ఆనందాన్ని ఇస్తాడు.
చూడండి- దేవుడు మనకు మనషులో సంతోషాన్ని
ఇస్తారు అప్పుడు రాత్రివేళ పాటలు పాడటానికి దేవుడే సహాయం చేస్తారు!
దీనికోసం
ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే కీర్తనలు 42:8 అయినను
పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన
దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
ఇక్కడ
రాత్రివేళ పాటలు పాడటానికి కారణం దేవుడు కృప కలుగ నాజ్నాపించారు
ఇక
దేవుడు చేసిన మేలులను అనుభవిస్తున్న వారు 149:5 లో 4 యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో
అలంకరించును.
5 భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై
తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.
6 వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
అందుకే
భక్తులైన పౌలుగారు సీలగారు వారు చెరసాలలో ఉన్నా గాని దెబ్బలు తిన్నా గాని అపోస్తలుల
కార్యములు 16:25 లో రాత్రివేళ పాటలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి.
రెండోది, 12,13 వచనాలలో చూసుకుంటే దేవుడు మనుషుల మొరలను ఒక్కోసారి ఎందుకు
పట్టించుకోడంటే వారు దుర్మార్గులు, అహంకారులు. అందువల్ల వారి ప్రార్థనలు శూన్యంగా బూటకంగా ఉంటాయి అంటున్నాడు!
12 కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర
మిచ్చుటలేదు.
13 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
చూడండి
ఎవడైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వారికి కష్టం వస్తే దేవుడు వారి మొరను వినరు అంటున్నాడు
ఎలీహు! అవును
ఇదే విషయాన్ని సామెతల గ్రంధంలో చెబుతున్నారు 1: 25లో
నేను చెప్పిన
బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.
26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు
భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను
27 భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు
మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము
చేసెదను.
28 అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను
ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
18: 41 వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను
యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును.
సరే, ఇంతవరకు ఎలీహు చెప్పినది
నిజమే గాని 14,16 వచనాల్లో ఎలీహు దీన్నంతటినీ యోబు విషయం నిజం
అంటున్నాడు. 15 ఆయన కోపముతో దండింపక
పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
16 నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే
మాటలను విస్తరింపజేసియున్నాడు
దుర్మార్గులూ
అహంభావులూ అయిన వారి ప్రార్థనల కంటే యోబు ప్రార్థనలను దేవుడు మరింత నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకు? యోబు మాట్లాడే తీరును బట్టి. ఎలీహు అభిప్రాయంలో యోబు
దేవుని న్యాయాన్ని కాదన్నాడు (14,15 వ); అందువల్ల యోబు గర్విష్ఠులైన దుర్మార్గుల కంటే పాపాత్ముడు అంటున్నాడు!
కాబట్టి
అన్యాయంగా ఎవరినీ నిందించకూడదు- యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు తీర్పు తీర్చకుడి అప్పుడు
మీకు తీర్పు తీర్చబడదు అంటున్నారు! కాబట్టి మనము కూడా ఎవరికీ
తీర్పు తీర్చవద్దు ఎవరినీ నిందించ వద్దు!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*132వ భాగం*
యోబు 36:1—6
1 మరియు ఎలీహు ఇంక యిట్లనెను
2 కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను.
ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడవలసి యున్నది.
3 దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి
నీతిని ఆరోపించెదను.
4 నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు
నీ యెదుట నున్నాడు.
5 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము
చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.
6 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము
జరిగించును.
ప్రియులారా! ఇక ఈ 36వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ప్రియులారా ఇప్పటికీ ఎలీహు
3 సార్లు మాట్లాడాడు (యోబు
32:6, ; యోబు 34:1, ; యోబు 35:1, ). అంటే, ముగ్గురు మిత్రులు మాట్లాడినన్ని సార్లు తానూ మాట్లాడాడు.
వినేవాళ్ళు కొంత అసహనాన్ని చూపించారేమో ఉండండి అంటున్నాడు, దేవుని తరఫున మాట్లాడడానికి నాకింకా ఉంది అంటున్నాడు.
2 కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను.
ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది.
3 దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి
నీతిని ఆరోపించెదను అంటున్నాడు.
ఇతరులు
చెప్పిన మాటలు వేటిలోనూ లేని సత్యాన్ని తాను వెల్లడిస్తాననుకొంటున్నాడు ఇక్కడ ఎలీహు!. తనకు సత్యం తెలుసుననీ
తన జ్ఞానం గొప్పదనీ అతని నమ్మకం. అతని వినయాన్ని శంకించేందుకు
అతను మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాన్నిస్తున్నాడు. తన జ్ఞానం పరిపూర్ణమైనదని
చెప్పుకునేవాడి గురించి ఏమనుకోవాలి?
ఇంకా
అంటున్నాడు 4 నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు
నీ యెదుట నున్నాడు.
5 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము
చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.
ఇక్కడ
తనకు తానే పూర్ణజ్నాని అని పరిచయం చేసుకుంటున్నాడు. స్వంత డబ్బా కొట్టుకుంటున్నాడు!
ఈ
వచనాల్లో ఎలీహు ముఖ్యంగా రెండు అంశాల గురించి మాట్లాడతాడు. మొదటిది, మనుష్యులకు ఏది జరగాలో దేవుడే తన జ్ఞానం చొప్పున నిష్పక్షపాతంగా నిర్ణయిస్తాడు
(5-9 వ). రెండోది, దేవుని
శిక్ష వెనుక కరుణతో కూడిన ఉద్దేశం ఉంది – దారి తప్పి తిరిగేవాడి
మార్గాన్ని సరిచేసి మార్చడం (10-15 వ. యోబు
33:14-30, చూడండి).
తరువాత ఈ సత్యాలను ఎలీహు యోబుకు
అన్వయించాడు (16-21 వ). ఎలీహు అన్నదాన్లో
మంచి ఉంది (ఉదాహరణకు 15వ వచనం).
అయితే “లోపం లేని జ్ఞానం” లేదా పూర్ణజ్ఞాని ఉన్నవాడి నుంచి మనం ఆశించేది ఇలాంటి మాటలు కాదు. ఈ లోకంలోనే దేవుడు న్యాయవంతులకు ప్రతిఫలమిచ్చి దుర్మార్గులను దండించడం విషయంలో
తానూ మిగతా ముగ్గురు మిత్రులూ ఇంతకు ముందే వెలిబుచ్చిన పాత అభిప్రాయాన్నే మళ్ళీ చెప్తున్నాడు.
ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా యోబు చెప్పిన విషయాలన్నిటినీ, మిగతా వారిలాగానే ఎలీహు కూడా పట్టించుకోలేదు. తన మాటలు
కొన్నిటి ద్వారా తాను యోబును అర్థం చేసుకోలేదన్న విషయాన్ని బయట పెడుతున్నాడు.
సరే, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే
6 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును
అంటున్నాడు. అవును ఇది నిజమే! కీర్తనలు 72: 12 దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను
నిరాధారులను అతడు విడిపించును.
13 నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల
ప్రాణములను అతడు రక్షించును
14 కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.
వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
140: 12 బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు
దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును.
ఇక
తర్వాత వచనం 7. నీతిమంతులను
ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును
వారు ఘనపరచబడుదురు.
ఇంకా 8. వారు సంకెళ్లతో కట్టబడినయెడలను
బాధాపాశములచేత పట్టబడినయెడలను
9. అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి
కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును.
కీర్తన 33 లో అంటున్నారు 18 వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన
కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది.
34: 15 యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
16 దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును
భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
17 నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి
వారిని విడిపించును.
18 విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని
ఆయన రక్షించును.
1 సమూయేలు గ్రంధంలో సమూయేలు గారి తల్లి ప్రవచిస్తూ అంటున్నారు
2: 8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును
స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీదినుండి
లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము,
లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
9 తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును
దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
ఇలా
తీర్పులు తీర్చిన తర్వాత ఇంకా నరులకోసం దేవుడు ఏమి చేస్తారు అని ఎలీహు చెబుతున్నాడో
తర్వాత వచనాలలో చూసుకుందాం!
10. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును.
పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.
11. వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను
తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
12. వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు.
జ్ఞానములేక చనిపోయెదరు.
చూడండి
చాలా చక్కని మాటలు చెబుతున్నాడు ఇక్కడ ఎలీహు! ఇలా దుష్టులను శిక్షించిన తర్వాత కూడా మనుషులు
గర్విష్టులు కాకుండా ఉండాలని దేవుడే తన ఉపదేశమును వినుటకై వారి చెవులను తెరువజేస్తాడు
అంటున్నాడు. అనగా వినగలిగే చెవి వారికి దేవుడు ఇస్తారు అంటున్నాడు!
ఇక గ్రహించే హృదయం కూడా దేవుడు ఇస్తారు. వినే చెవి,
గ్రహించే హృదయం ఇచ్చి- పాపమును విడిచి రండి అని
దేవుడే ఆజ్న ఇస్తారు అంటున్నాడు! ఒకసారి 33 వ అధ్యాయం మరలా జ్నాపకం చేసుకుంటే అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతాడో చెప్పాడు
కదా ఎలీహు- దానికి దీనిని కలుపుకుంటే ఇంకా బాగుగా అర్ధం అవుతాయి
ఈ వచనాలు!
16 నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము
వారు మానుకొనచేయునట్లు
17 గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ
వారి ప్రాణమును తప్పించునట్లు
18 ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
19 వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని
నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
20 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి
కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును
22 వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు
సమీపించును.
23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకు
వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
సరే, ఇలా దేవుడు చెప్పిన మాటను
గాని నరుడు విని అవలంభిస్తే 11వ వచనంలో వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ
సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
ఇదీ సంగతి- నీకు
క్షేమము సుఖము నీ జీవితంలో కావాలంటే నీ రోజులు సాఫీగా సాగిపోవాలి అంటే ఇక్కడ చెబుతున్నారు
వారు ఆలకించి ఆయనను అనగా దేవుణ్ణి సేవించాలి. ఒకవేళ నీవు దేవుని
మాటను వినకుండా విర్రవీగితే 12 వ వచనంలో అంటున్నారు వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.
యెషయా
గ్రంధంలో 3:11 లో అంటున్నారు వారు చేసిన వ్యవహారాలకు తగినట్లు వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు!
ఇప్పుడు దేవుడు పిలిచినా వినకుండా విర్రవీగితే గతభాగంలో చెప్పినట్లు
సామెతలు మొదటి అధ్యాయంలో దేవుడు మొదట వీరికి తగిన శిక్ష వేయడమే కాకుండా వీరికి శ్రమలు
దుఖము కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడు! తన చెవులు మూసుకుంటారు!
కాబట్టి
ప్రియ సహోదరి సహోదరుడా!
కాలముండగానే ఇల్లు చక్కబెట్టుకో! సమయము ఉండగానే
చెడుగును విడిచి దేవుని పాదాలు పట్టుకుని దేవునితో సమాధాన పడు! లేకపోతే బాణము లాంటి రోగాలు శ్రమలు వచ్చి నశించి పోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది!
మనలను సరిచేసుకుందాం!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*133వ భాగం*
యోబు 36:13—18
13 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము
నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
14 కావున వారు యవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల
బ్రదుకువంటిదగును.
15 శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.
బాధవలన వారిని విధేయులుగా చేయును.
16 అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును.
ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో
నింపును.
17 దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు
తీర్పును కూడుకొనియున్నవి.
18 నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము
చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో
జాగ్రత్తపడుము.
ప్రియులారా! ఇక ఈ 36వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇంకా
ఈ వచనాలు చూసుకుంటే 13 వ వచనంలో అంటున్నాడు 13 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు.
ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
14 కావున వారు యవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల
బ్రదుకువంటిదగును.
చూడండి
కొంతమంది లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము ఉంచుకుంటారు హృదయంలో. అలాంటివారి తమ యవనకాలమందే
చనిపోతారు. అనగా కాలం తీరాకుండానే పోతారు అంటున్నారు.
అందుకే రోమా 2:5 లో పౌలుగారు అంటున్నారు 5 నీ కాఠిన్యమును, మార్పు
పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు
కొనుచున్నావు.
6 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
ఇదే
యోబు గ్రంధంలో 15 లో అంటున్నారు 32 వారి
కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
33 ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును.
ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారినిాల్చును.
22: 16 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు
జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
కీర్తనల
గ్రంధంలో భక్తుడు అంటున్నారు 55: 23 దేవా, నాశనకూపములో
నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమి్మకయుంచి యున్నాను
ఇక
తర్వాత వచనాలలో అంటున్నాడు ఎలీహు 15 శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన
ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
16 అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును.
ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో
నింపును.
ఇక శ్రమ పడువారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధవలన
వారిని విధేయులుగా చేయును అనగా రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి. మొదటగా
శ్రమ పడువారిని దేవుడు విడిపించే దేవుడు! కీర్తన
34:17, 19; 72:12; ఇంకా నలిగిన వారిని ఆదరించే దేవుడు!
ఇక రెండవ అర్ధము: దేవుడు కొందరిని బలవంతంగా తన మాట
వినేటట్టు చేసుకుంటారు. మాట వినకపోతే గత అధ్యాయాలలో చూసుకున్నట్లు
ఆ వ్యక్తికి రోగం కలిగించయినా తన మాటకు విధేయులుగా చేసుకుంటారు దేవుడు! అవును ఎంతోమంది దైవ సేవకులు చెప్పారు తమ సాక్ష్యములు- తన సేవను చేయమంటే చేయను అంటే దేవుడు ఏదో రోగం పెట్టారు. మా తండ్రి గారు చేపలు పట్టుకుంటూ విశ్వాసిగా ఉండేటప్పుడు దేవుడు తన సేవకు పిలిచారు.
నేను విశ్వాసిగా ఉంటూనే నీ సేవ చేస్తాను, సువార్త
చెబుతాను అంటే దేవుడు ఒప్పుకోలేదు. విశ్వాసిగా ఉన్నప్పుడే ఉదయమంతా
సువార్త ప్రకటించి రాత్రుళ్లు చేపలు పట్టేవారు. దేవుడు సంపూర్ణ
సేవకు రమ్మంటే నాకు చదువు రాదు పాటలు పాడటం రాదు వాక్యం చెప్పడం రాదు. మరొకరిని ఎన్నుకో అంటే కాదు నీవే కావాలని దేవుడు 5 సంవత్సరాలు
పిలుస్తూనే ఉన్నారట! 5 సంవత్సరాలు గడిచాక ఒకరోజు నీవు నా సేవ
చేయమంటే చేయనంటున్నావు కాబట్టి నిన్ను చంపేస్తాను అన్నారు- నన్ను
చంపితే నీకు ఉపయోగం ఏమిటి అన్నారట నాన్నగారు! నీవుండి నాకుపయోగం
ఏమిటి అన్నారట దేవుడు! నేను బ్రతికి ఉంటే నీ సువార్త ప్రకటిస్తాను
కదా అంటే అది నాకు అవసరం లేదు. సంపూర్ణ సేవకు వస్తావా తీసేయాలా
నిన్ను అన్నారట! వెంటనే చివరకు దేవుని పిలుపుకు లోబడి-
తన పడవలను వలలను, రెండు ఇల్లు వదిలేసి సంపూర్ణ
సేవకు రాయవరం వచ్చేశారు. కాబట్టి మా నాన్నగారి లాంటి మొండి వారిని
దేవుడు ఇలా కూడా తన మాటకు లోబడేలా చేస్తారు! మరికొంతమందిని హాస్పటల్
బెడ్ మీద గాని, ఆపరేషన్ టేబుల్ మీద గాని తన మాట వినేలా చేస్తారు!
ఇది దేవుని మోడస్ ఆపరాండి!
ఇంకా
బాధలను తప్పించి విశాల స్థలమునకు తీసుకుని పోవును కోసం చూసుకుటనే దావీదు గారు అంటున్నారు
18:
18 ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను.
19 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెనునేను
ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్నుతప్పించెను.
23: 5 నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు
నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
118: 5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు
యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
కాబట్టి
భయపడవద్దు! దేవుడు మనకు తోడుగా ఉన్నారు!
ఇక
తర్వాత వచనాలలో మరలా యోబుగారిని నిందిస్తున్నాడు ఎలీహు! 17
దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
18 నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము
చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో
జాగ్రత్తపడుము.
19 నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయుబాధనొందకుండ
నిన్ను తప్పించునా?
ఇలాంటి
మాటలు కోసం చాలా విస్తారంగా చూసుకున్నాము గనుక ముందుకు పోదాం!
తర్వాత
వచనంలో మరింత ఘోరమైన మాట అంటున్నాడు ఎలీహు! 20 జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు
రాత్రి రావలెనని కోరుకొనకుము.
తమ స్థలము నుండి కొట్టివేయబడు రాత్రి అనగా తెలియని ఊహించలేని
ఉపద్రవము రాత్రివేళ వచ్చి ప్రజలు నిద్రలో ఉండగానే చనిపోయే విధము కోసం చెబుతున్నాడు
ఇక్కడ!
అనగా ప్రజలు నిద్రలో ఉండగా గుజరాత్ లో భూకంపం వచ్చి అనేకమంది
1990 ప్రాంతంలో చనిపోయారు. అలాగే 1480 లో అనుకుంటాను
తమిళనాడు లో ధనుష్కోడి దగ్గర రాత్రి భయంకరమైన తుఫాను కారణంగా రాకాసి అలలు వచ్చి రామసేతు బ్రిడ్జి,
బ్రిడ్జి మీద రైలు, ప్రక్కనే ఉన్న తొమ్మిది గ్రామాల
ప్రజలు కనిపించకుండా పోయారు. తర్వాత శవాలుగా మారారు. ఇలాంటి రాత్రి కావాలని నీవు కోరుకోవద్దు అంటున్నాడు! ఇది బహుశా యోబుగారు తాను పుట్టిన రాత్రిని రోజుని శపించుకున్నారు కదా
! దానికోసం చెబుతున్నాడు కావచ్చు !
అందుకే జాగ్రత్త పడమంటున్నాడు
తర్వాత
వచనంలో 21 జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న
అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు
అవును
మనము కూడా జాగ్రత్త పడాలి,
చెడుతనము చేయకూడదు ఎందుకంటే కీర్తన 66 లో అంటున్నారు
18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
ఇక
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మత్తయి 5 లో 29
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము;
నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
30 నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి
పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట
నీకు ప్రయోజనకరము గదా.
కాబట్టి
చెడుతనమును విసర్జించి దేవునితో సమాధాన పడదాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*134వ భాగం*
యోబు 36:22—26
22 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై
ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడెవడు?
23 ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?
24 మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు
జాగ్రత్తపడుము.
25 మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని
చూచెదరు.
26 ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు
మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
ప్రియులారా! ఇక ఈ 36వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇంకా
ఈ వచనాలు చూసుకుంటే 22 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై
ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?
23 ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? అంటున్నాడు!
ఈ వచనంతో ఎలీహు దేవుని గొప్పతనం గురించి ఒక సుదీర్ఘ ఉపన్యాసాన్ని
ఆరంభించాడు. ఇది యోబు 37:24, వరకూ సాగేది.
దీనంతటిలో దివ్యమైన సత్యాలున్నాయి. దీనికి
“ప్రకృతి గురించిన ఎలీహు ప్రసంగం” అని పేరు పెట్టవచ్చు.
ఈ భాగానికి మూల వాక్యాలు యోబు 36:26, ; యోబు
37:5, యోబు 37:14, యోబు 37:19, .
“దేవుడు చేసిన భౌతిక ప్రపంచంలో దేవుని
విధానాలను మనం అర్థం చేసుకోలేము. అలాంటప్పుడు మనుషులను ఆయన పరిపాలించే
తీరుతెన్నులను ఎలా అర్థం చేసుకోగలం? అవి కూడా నిగూఢమై మన గ్రహింపుకు
అతీతంగా ఉంటాయి” అని యోబుతో అంటున్నాడు ఎలీహు.
ఇది ఎంతైనా నిజం (యోబు 5:9, ; యోబు 11:7, ; {Job,15:,8}; యెషయా 55:8-9, ; రోమీయులకు 11:33-34, ). ఈ సత్యాన్ని యోబు తన కోసం తీసుకొమ్మని ఎలీహు కోరుతున్నాడు. అయితే ఎలీహు వీటిని తనకోసం తీసుకోవడానికి కూడా ఇంతే సంసిద్ధత చురుకుదనం చూపుతున్నాడా?
యోబు విషయంలో దేవుని తీరుతెన్నులన్నీ తనకు అర్థమైనట్టే మాట్లాడుతున్నాడు
ఎలీహు.
23 ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?
ఇలా అనడానికి కారణం బహుశా యోబు ఇలా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని
ఎలీహు అభిప్రాయపడుతున్నాడు! అవును దేవునికే మార్గ నిర్ధేశకం
చేయడం సాధ్యమా? కానేకాదు! గాని మనం మాత్రం
దేవుని చిత్తానికి లోబడకుండా ప్రభువా నాకు ఇలా చేసేయ్! అలా చేసేయ్!
నా కార్యము ఇలా చేయు అంటూ నీకనుకూలంగా ఉండేలా కోరుకుంటావు దేవునికి ఆర్డర్లు
వేస్తావు! అట్లా కాకుండా ప్రభువా నా జీవితంలో నీ చిత్తము ఏదో
దానినే చేయవా అని ఆడగము మనము! నన్ను సింగర్ ని చేసేయ్,
లేక నన్ను గొప్ప ప్రసంగీకునిగా చేసేయ్, లేక నన్ను
పెద్ద అధికారిని చేసేయ్ ఇలా ప్రార్ధన చేసి బొక్కబోర్లా పడతాము!
తర్వాత మనకు అనుకూలము కానీ ఫలితం వస్తే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము!
24 మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు
జాగ్రత్తపడుము.
25 మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని
చూచెదరు.
26 ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు
మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
ఇక్కడ
ఎలీహు అంటున్నాడు దేవుడు ఎన్నో గొప్పకార్యాలు చేశారు. అందుకే అనేకులు దేవుణ్ణి
మహిమ పరుస్తున్నారు. నీవు కూడా దేవుణ్ణి మహిమ పరచడానికి జాగ్రత్త
పడు, అంతే తప్ప దేవుణ్ణి నిందించ డానికి ప్రయత్నం చేయవద్దు అంటున్నాడు!
ఇంకా అంటున్నాడు దేవుని కార్యములు మనుష్యులు అందరూ చూస్తున్నారు అంటూ
ఆలోచన చేయు దేవుడు మహోన్నతుడు- నిజానికి దేవుడు ఎలాంటి వారో మనకు
పూర్తిగా అవగాహన లేదు ఇంకా ఆయన జీవితకాలము లేక ఆయన వయస్సు మనము లెక్కకట్టలేము!
కాబట్టి దేవునికి భయపడు అంటున్నాడు ఎలీహు!
ఇక
తర్వాత వచనాలలో మేఘముల కోసం ఉరుములు మెరుపులు వర్షాల కోసం చెబుతూ దేవుని మహిమను ఘనపరుస్తున్నాడు
ఎలీహు!
27 ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన
వర్షమువలె అవి పడును
28 మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా
దిగును.
29 మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు
వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
ఉదక
బిందువులు అంటే నీటి బింధువులు అనగా వర్షము. అంతేకాకుండా శీతల దేశాలలో మంచుతో కూడిన వర్షము
కూడా దేవుడు కురిపిస్తాడు అంటున్నాడు! మొదటి భాగాన్ని ఇలా కూడా
అనువదించవచ్చు – “నీటి బిందువులను ఆయన పైకి ఆకర్షిస్తాడు.”
అంటే దేవుడు నీటియావిరి రూపంలో నీటిని భూమి మీది నుండి పైకి వెళ్ళేలా
చేస్తాడు.
తర్వాత
మేఘములు వాటిని అనగా వర్షము మరియు మంచును కుమ్మరిస్తాయి మనుష్యుల మీద అవి సమృద్ధిగా
దిగుతాయి అంటున్నారు. దేవుడు వర్షాన్నీ తుఫానునూ చెయ్యడంలోను, మనుషులను పరిపాలించేందుకు
వాటిని ఉపయోగించడంలోను తన మహా జ్ఞానాన్ని కనపరుస్తున్నాడు (31 వ).
యెషయా 55:10; యిర్మీయా
5:24; హెబ్రీ 6:7; యాకోబు 5:7 లో చెప్పబడినట్లు దేవుడు తన ప్రజలకోసం మానవుల కోసం వర్షమును మంచును కురిపించి
పంటలు పండేలా చేస్తారు, త్రాగడానికి మనుష్యులకు పశువులకు నీటిని
సమృద్ధిగా ఇచ్చేవాడు మన దేవుడు!
ఇక 29 వ వచనంలో 29 మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి
ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
దీనికోసం
గతంలో ధ్యానం చేశాము. మేఘములు ఎలా ఏర్పడతాయో, ఎలా అవపాతం కలుగుతుందో నీటి చక్రము
కోసం గతంలో చూసుకున్నాము! అలాగే ఉరుములు మెరుపులు కోసం కూడా గతంలో
చూసుకున్నాము గనుక ముందుకుపోదాం!
ఇక
తర్వాత వచనాలలో 30 ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
31 వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
32 ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని
ఆయన దానికి ఆజ్ఞాపించును
33 ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని
ఆయన పశువులకును తెలుపును.
ఇక్కడ
30 వచనములో అంటున్నాడు ఎలీహు మెరుపులు అనేవి కేవలం మన అంతరిక్షము లోనే
కాకుండా దేవుడు తనచుట్టూ కూడా మెరుపును వ్యాపింప జేస్తారు అంటున్నాడు. ఇంకా 31 వ వచనంలో వీటివలన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును
అనగా ఇదే వర్షము మరియు మెరుపులు మంచు చేత దేవుడు మనుషులకు తీర్పు కూడా తీర్చుతారు అంటున్నాడు!
అవును కదా- నోవహు గారి కాలంలో ఇదే వర్షము ద్వారా
జలప్రళయము రప్పించి పాపులకు దుర్మార్గులకు తీర్పు తీర్చారు దేవుడు! ఈ కాలంలో తుఫానులు పిడుగులు సునామీలు పంపించి దేవుడు తన తీర్పులు పంపిస్తున్నారు!
అంతేకాకుండా దేవుడు మనుషులకు సమృద్ధిగా ఆహారం కూడా ఇస్తున్నారు!
ఆపో 14:
17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన
రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేత ..
కీర్తనలు 136: 25 సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు
ఆయన కృప నిరంతరముండును.
104: 13 తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును
నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
14 పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన
మొలిపించుచున్నాడు
15 అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు
ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును
ఆయన పుట్టించుచున్నాడు
ఇంకా
అనేక రిఫరెన్సులు ఉన్నాయి!
33 వ వచనంలో అంటున్నాడు ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను
వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును
అనగా
ఈ మెరుపు గాలివానలు ఆయన రాకడను తెలియజేస్తున్నాయి.
అది పశువులకు కూడా తెలుస్తుంది అంటున్నాడు!
యోబు 37: 1 దీనినిబట్టి నా హృదయము వణకుచున్నదిదాని
స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.
2 ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు
ధ్వని నాలకించుడి.
3 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు
తన మెరుపును కనబడజేయును.
4 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన
స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు
2 సమూయేలు గ్రంధంలో కూడా దేవుడు తన స్వర గర్జన చేశారు
22: 13 ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
14 యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని
పుట్టించెను.
కాబట్టి
ఈ వర్షమును మెరుపును మేఘములను చూసి మనము కూడా దేవుని శక్తిని అర్ధం చేసుకుని ఆయనకు
భయపడదాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*135వ భాగం*
యోబు 37:1—8
1 దీనినిబట్టి నా హృదయము వణకుచున్నది దాని స్థలములోనుండి
అది కదలింపబడుచున్నది.
2 ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు
ధ్వని నాలకించుడి.
3 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు
తన మెరుపును కనబడజేయును.
4 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన
స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు
5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును మనము గ్రహింపలేని
గొప్పకార్యములను ఆయన చేయును.
6 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను
ఆయన ఆజ్ఞ ఇచ్చు చున్నాడు.
7 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు
ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.
8 జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో
వసించును.
ప్రియులారా! ఇక ఈ 37వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఈ అధ్యాయముతో ఎలీహు మాటలు పూర్తి అయిపోతాయి!
ఇక
మొదటి వచనంలో ఎలీహు అంటున్నాడు దీనినిబట్టి నా హృదయము వణకుచున్నది దాని స్థలములోనుండి
అది కదలింపబడుచున్నది. అనగా బహుశా ఎలీహు మాట్లాడుతూ ఉండగా గాలివాన వస్తూ వుంది. దాని ఉరుములను ఎలీహు దేవుని కంఠ స్వరంతో పోలుస్తున్నాడు.
2 ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని
నాలకించుడి.
3 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు
తన మెరుపును కనబడజేయును.
రెండవ వచనంలో ఆయన స్వర గర్జన అనగా దేవుని దగ్గరనుండి వచ్చే ఉరుము
అని అర్ధమవుతుంది. ఇక దేవుడు తన ధర్మశాస్త్రమును మోషీ గారికి ఇచ్చేటప్పుడు
సీనాయి పర్వతమునందు ఇదేవిధంగా మాట్లాడినట్లు మనము చూడగలము! దానికి
ఇశ్రాయేలు ప్రజలు భయపడి పోయి అయ్యా మోషే గారు- దేవుడు మాతో మాట్లాడితే
మేము చనిపోతాము. కాబట్టి నీవే దేవుని మాటలు విని- మాకు చెప్పు- నీవు చెప్పినట్లు మేము వింటామని నిర్గమా
కాండంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పినట్లు మనము చూడగలము!!
ఇక మూడో వచనంలో ఆకాశ విశాలమంతటికి ఆ ఉరుము స్వరము వినబడుతుంది
అని అది భూమియంతములు వరకు వినబడతాయి అని చెబుతున్నాడు. నిజానికి
ఊరుములలో పిడుగులు పడేటప్పుడు అవి భూమికి పిడుగుల రూపంలో తాకుతూ ఉంటాయి మనకు దగ్గరగా
వస్తాయి కనుక వాటి స్వరము ఎంతో గంభీరముగా భయంకరముగా ఉంటాయి!
అయితే ఇదే యోబు 36:33 లో ఏఏ మెరులుపు ఉరుములు పిడుగులు
దేవుడు గాలివానలో దేవుని రాకడను మనకు తెలియజేస్తుంది ప్రకటిస్తుంది అని చూడగలము!!
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు 4 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన
స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు
5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును మనము గ్రహింపలేని
గొప్పకార్యములను ఆయన చేయును.
ప్రియులారా దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము!
ఉరుము- పిడుగు- మెరుపు అనీ
ఒకేసారి పుడతాయి గాని ధ్వని వేగం కంటే వెలుగు వేగం ఎంతో ఎక్కువ కనుక మెరుపు-
పిడుగు యొక్క వెలుగు మొదటగా మనకు కనిపిస్తుంది. ఇది జరిగిన కొన్ని సేకన్లకు పిడుగు లేక ఉరుము స్వరము మనకు వినిపిస్తుంది!
కీర్తన 29: 3 యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా
సంచరించుచున్నాడు.
4 యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
5 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను
దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
6 దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును
షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
7 యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
8 యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును
కదలించును
9 యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును.
ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి అంటున్నారు!
ఇక
తర్వాత వచనములో 5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును మనము గ్రహింపలేని
గొప్పకార్యములను ఆయన చేయును.
6 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను
ఆయన ఆజ్ఞ ఇచ్చు చున్నాడు.
ఎలీహు ఇప్పుడు గాలివాన వర్ణనను చాలించి
ప్రకృతిలోని దేవుని మహా జ్ఞానాన్ని చూపించే మరి కొన్ని దృగ్విషయాల గురించి చెప్తున్నాడు.
నీవు భూమి మీద పడుమని హిమము అనగా మంచు
తోను వర్షముతోనూ మహా వర్షముతోనూ ఆయన ఆజ్న ఇస్తున్నాడు అంటున్నాడు!
మన దేశంలో సిమ్లా,
హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో మరియు
పాశ్చాత్య దేశాలలో కురిసే మంచును దేవుడే కురిపిస్తున్నారు అంటున్నాడు! ఇక భూమి మీద వర్షము అనగా సామాన్య వర్షము- మహా వర్షము
అనగా తుఫాను సమయంలో కురిసే భారీ వర్షాలు లేక కుంభవృష్టి వర్షాలు దేవుడే కురిపిస్తాడు
అంటున్నాడు! ఉదాహరణకు నోవహు గారి కాలంలో మహా వర్షము కురిపించి
40 పగల్లు రాత్రుళ్లు – ఈ భూలోకము మీద చలించే ప్రతీ
జీవిని ఊడ్చేశారు దేవుడు!
కీర్తన 147: 5 భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే
ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.
16 గొఱ్ఱబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి
మంచు కణములు చల్లువాడు ఆయనే.
17 ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
18 ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి
విసరజేయగా నీళ్లు ప్రవహించును,
148: 8 అగ్ని వడగండ్లారా, హిమమా,
ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,..
కాబట్టి
దేవుని మాట ద్వారా ఈ వర్షము పిడుగులు ఉరుములు అన్నీ కలుగుతాయి. ఈ విధంగా సమస్తమును ఆయన
నిర్వహిస్తారు. దేవునికి ఇష్టమైన రీతిలో ఈ భూమిని మలుస్తాడు ఆయన!
అందుకే దేవునికి భయపడదాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*136వ భాగం*
యోబు 37:7—13
7 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు
ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.
8 జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో
వసించును.
9 మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి
చలి వచ్చును
10 దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల
మేఘమును వ్యాపింపజేయును.
12 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము
మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర
వేర్చును
13 శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే
గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
ప్రియులారా! ఇక ఈ 37వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇక ఏడవ వచనం నుండి చూసుకుంటే
7 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు
ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్రవేసి యున్నాడు.
8 జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో
వసించును.
చూడండి ఏమంటున్నాడో – దేవుడు ప్రతి మనిషి చేతిని మూసి ముద్ర వేస్తారట!
ఆ విధంగా వారంతా దేవుడు చేసిన క్రియలను గురించి తెలుసుకొంటారు అంటున్నాడు!
దీని వెనుక ఉన్న అసలైన భావము ఇంతవరకు ఎవరికీ స్పష్టంగా తెలియలేదు గాని
బహుశా మనిషి యొక్క శక్తి సామర్ధ్యాలు ఆ వ్యక్తికి పూర్తిగా తెలియదు. ఒక్కో మనిషికి ఒక్కో విధంగా దేవుడు ఏర్పాటుచేశారు. కొన్ని
రకాలైన విధములుగా దేవుడు మనిషితో మాట్లాడుతూ అతిగా గర్విష్టి కాకుండా దేవుడు చేస్తారు.
దేవుడు చేసిన సృష్టి కార్యము మానవునికి తెలియదు. కాబట్టి దేవుడు ఒక్కో విధంగా మాట్లాడుతూ నాకంటే దేవుడే గొప్పవాడు అనేటట్లు
దేవుడు చేస్తారు.
111: 2 యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు
వాటిని విచారించుదురు.
46: 8 యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
9 ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు.
విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో
కాల్చివేయువాడు ఆయనే.
10 ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో
నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును.
64: 9 మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు
ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు
92: 4 ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత
నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
5 యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి!
నీ ఆలోచనలు అతిగంభీరములు,
ప్రసంగి 8: 17 దేవుడు జరిగించునదంతయు నేను
కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు,
కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు,
దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూను కొనినను వారైన కనుగొనజాలరనియు నేను
తెలిసి కొంటిని.
ఇక తర్వాత వచనంలో అప్పుడు మృగాలు వాటి గుహలలో చొరబడతాయి దాక్కునే చోట్లలో ఉండిపోతాయి
అంటున్నాడు.
దీనికోసం
కీర్తనాకారుడు అంటున్నారు 104: 20 నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది
అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
21 సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును
దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి.
22 సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
తర్వాత
అధ్యాయంలో ఇంకా దేవుడే దీనికోసం యోబుగారిని నిలదీస్తున్నారు!!
9 మరుగుస్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి
చలి వచ్చును
10 దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల
మేఘమును వ్యాపింపజేయును.
ఇక
చూడండి మరుగు స్థానములో నుండి తుఫాను వస్తుంది ఉత్తర దిక్కునుండి చలి వస్తుంది అంటున్నారు! అయితే ప్రాచీన ప్రతులలో
దక్షిణ దిక్కునుండి తుఫాను వస్తుంది ఉత్తర దిక్కునుండి చలి వస్తుంది అని ఉంటుంది.
నిజానికి తుఫాను ఎలా మొదలవుతుంది అంటే చుట్టూ సముద్రము ఉండి, మధ్యలో
చిన్న నేల ప్రాంతము కలిగి ఆ భూమిమీద అధిక ఉష్ణోగ్రత ఉంటూ వాటి మధ్యలో అధికమైన తారతమ్యత
ఉంటే అక్కడ ఎక్కువ ఆవిరి తయారై- మేఘములుగా ఏర్పడుతుంది-
ఈ క్రమంలో
మేఘములలో గల latent heat విడుదల అయ్యి, ఆ హీట్ ఎక్కువగా మేఘముల చుట్టూ ఆవరించి ఉంటుంది. అప్పుడు
చల్లని గాలి తగిలితే వెంటనే వర్షముగా మారుతుంది- ఈదురుగాలి వస్తే
ఆ మేఘములు వర్షించవు. ఇలా వర్షించకుండా మిగిలిపోయిన మేఘములు యొద్ద
అల్ప పీడనం ఏర్పడుతుంది. గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన
ప్రాంతానికి పరుగెత్తుతుంది. ఈ క్రమంలో ఇంకా latent
heat మరియు మేఘములు పెరిగే కొద్ది, గాలి ఎక్కువ
అయ్యే కొద్ది అల్ప పీడనం
తుఫానుగా మారుతుంది. కారణం తుఫానుకి బలము ఈ Latent
heat. Latent heat , మేఘములు పెరిగే కొద్దీ పెను తుఫానుగా మారుతుంది.
అయితే ఇది మన దేశంలో లేక భూమధ్య రేఖకు మీదన ఉన్న దేశాలలో
South West నుండి బయలుదేరి
North East దిక్కులో ప్రయాణం చేసి భూమిని తాకేముందు మరలా
North West కి తిరిగిపోతుంది. గాని మన దేశము నుండి
చూసుకుంటే మన దేశానికి దక్షిణ దిక్కునుండే తుఫాను వస్తుంది. ఇది
సౌత్ వెస్ట్ మాన్సూన్. దీని వలలనే మనకు ఎక్కువ వర్షాలు కలుగుతాయి.
అయితే అక్టోబర్ తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉత్తర దిక్కునుండి వస్తుంది
గాని దానివలన మనకు పంటలు పండవు- భీభత్సవం కోసం మాత్రమే వస్తాయి.
అయితే ఇక్కడ ఎలీహు అలా అనడానికి కారణం అక్కడ ఆ దేశాలలో కూడా దక్షిణ దిక్కునుండే
తుఫానులు వస్తాయి కారణం ఆ దేశాలు కూడా భూమధ్య రేఖకు మీదన ఉన్నాయి!
ఇక ఉత్తరం నుండి వచ్చే గాలులు ఎప్పుడూ చల్లగా ఉంటాయి మంచు కురిసే దేశాలలో మంచు
కురుస్తుంది. ఎందుకంటే మన ఆసియా మరియు యూరోప్ దేశాలకు మీదన రష్యా
ఉంది. అక్కడ ఎల్లప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. అవన్నీ మంచుకొండలు! అక్కడనుండి ఎల్లప్పుడూ చల్లని గాలులు
క్రిందకు వీస్తూ ఉంటాయి. అలాగే అమెరికాకు కెనడా గ్రీన్లాండ్ దేశాలనుండి
చల్లగాలులు వీస్తాయి! గాని దీనిని ముందుగానే దేవుడు ఎలీహు ద్వారా
చెప్పడం జరిగింది!!!
10 దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
దేవుని ఊపిరి అంటే గాలి అని ఇక్కడ అర్థం. నిజానికి
ఈ చల్లని గాలులు సముద్రం మీద గాని నదుల మీద గాని వీచినప్పుడు అవి మంచుగా మారిపోయి గడ్డ
కట్టుకుపోతాయి! అందుకే మేము రష్యాకు మీదుగా వెళ్లేటప్పుడు కేవలం
జూన్ నుండి ఆగస్ట్ వరకే ప్రయాణం చేయగలం. తర్వాత నెలలు సముద్రం
గడ్డ కట్టి ఉంటుంది. అంతేకాకుండా దృవ ప్రాంతాలలో సూర్య కిరణాలు
తాకనందువలన ఎప్పుడూ చల్లగానే ఉంటాయి.
ఇక 11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
ఇక దీనికోసం గత భాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము! ఇవన్నీ దేవుడే చేస్తున్నారు
గాని మనిషి దానిని గ్రహించకుండా అతని చేతిని మనసుని దేవుడే మూసివేశాడు. దేవుని కార్యముల కోసం తరచితరచి అన్వేషించే వారికే దేవుడు వీటిని బయలుపరుస్తాడు
అని ఎలీహు భావము!!!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*137వ భాగం*
యోబు 37:12—13
12 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము
మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర
వేర్చును
13 శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే
గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును.
ప్రియులారా! ఇక ఈ 37వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇంకా
క్రింద వచనాలు చూసుకుంటే 12 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన
భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును
అవి నెర వేర్చును అంటున్నాడు!
ఇక్కడ
అసలు మాట నరులకు నివాస యోగ్యమైన భూగోళము!!!
మొదటిది భూమి గోళము అని తెలియజేస్తున్నాడు
దేవుడు! గోళము అనగా
గుండ్రముగా ఉండేది. మరి ఆ పనికిమాలిన గుండోడు భూమి బల్లపరుపుగా
ఉంది అని బైబిల్ చెబుతుంది అని ఎందుకు అంటున్నాడు? వాడికి బైబిల్
జ్నానము కొంతకూడ లేదు!
ఇక రెండవది : నరులకు నివాస యోగ్యమైన భూగోళము! అనగా కేవలం భూమి మీద మాత్రమే మనుషులు జీవించగలరు! ఈ గ్రహము
మీదనే గాలి నీరు తగినంత వేడి అన్నీ ఉన్నాయి. మానవుడు జీవించ గలిగిన వాతావరణం కేవలం
భూమిమీద మాత్రమే ఉంది! గాని దీనిని గ్రహించకుండా అమెరికా రష్యా
జపాన్ ఇంకా చాలా దేశాలు ఏ గ్రహం మీద మానవులు ఉన్నారు, ఎక్కడ గాలి
నీరు ఉంది అంటూ వెదుకుతూ కోట్లు ఖర్చుపెడుతూ ధనమును వ్యర్ధము చేస్తున్నారు!
మన పాలపుంతలో కేవలం భూమి మాత్రమే నివాస యోగ్యమైనది మానవులకు!
ఇంకా మరో పాలపుంతలో మరో భూమి ఉందో లేదో మనకు తెలియదు. అందుకే ఇక్కడితోనే ఆగిపోదాం! ఇది మాత్రమే నివాస యోగ్యమైనది!!
దీనిని
మానవులకు నివాస యోగ్యముగా చేయుటకు దేవుడు ఏం చేస్తున్నారో మనకు కీర్తనల గ్రంధంలో భక్తుడు
చెబుతున్నాడు
65: 9 నీవు భూమిని
దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో
నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.
10 దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను
చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు
అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.
11 సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు
సారము వెదజల్లుచున్నవి.
12 అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును
నడికట్టుగా ధరించుకొని యున్నవి.
13 పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి.
లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు
గానము చేయుచున్నవి.
సృష్టికర్త భూమి పై వాన కురిపించడం,
పొలాలను ఫలభరితం చెయ్యడం, పంటలు సమృద్ధిగా అనుగ్రహించడం,
ఆహా, ఎంత అందమైన వర్ణన! ఇలా
చేస్తున్నందుకు ఆయనను గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు అర్పించేది కొద్దిమందే అయినప్పటికీ
ఆయన దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కృతజ్ఞత లేని మనిషీ!
నేలను చేసినదెవరు? దానిలో నీవు నాటే విత్తనాలను
చేసినదెవరు? వాటిని పంట పండించి కోతకు తెచ్చేదెవరు? ఒక్క సారి ఆకాశం వైపు చూస్తూ భూమినీ మానవాళినీ సృజించిన ప్రేమమూర్తి అయిన దేవునికి
కృతజ్ఞతలు అర్పించు (అపో. కార్యములు
14:15-17, ; {Joel,2:23-24}; యెహెఙ్కేలు 34:26-27, ; యోబు 5:10, ; ద్వితీయోపదేశకాండము 11:13-15,
).
ఇక 13 వ వచనంలో చూసుకుంటే శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని
ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును అంటున్నాడు. అనగా భూమిని
తన జ్ఞానానుసారం పరిపాలించడంలో దేవుడు వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకుంటాడు అంటున్నాడు!
అయితే ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ వాతావరణ పరిస్తితులను దేవుడు ఎందుకు ఉపయోగిస్తాడు
అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాడు ఎలీహు!
మొదటిది: మనుష్యులను శిక్షించడానికి!
మనుష్యులు తప్పుచేస్తే సరిదిద్దడానికి!! ఉదాహరణ-
యోనా గారికి బుద్ధి చెప్పడానికి సముద్రంలో తుఫాను పంపించారు!
అనేకసార్లు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి వచ్చిన శత్రువుల మీద దేవుడు
వడగల్లు పంపించారు!
రెండవది: భూలోకము కొరకు- అనగా భూమిమీద పంటలు పండటానికి- తద్వారా మనుషులు పశువులు
ఆహారము తీసుకుని జీవించడానికి!
మూడవది: కృప చేయుటకు! మానవుల మీద తన భక్తుల మీద తన కృపను చూపించడానికి! ఇంకా
ఏమని చెప్పాలంటే యోవేలు గ్రంధం ప్రకారం మానవులను శిక్షించిన దేవుడు- మనిషి పశ్చాత్తాప పడితే తిరిగి కృప చూపి మానవులకు పశువులకు తగిన వాతావరణం పంపించి
తగినంత ఆహారం ఇవ్వడానికి దేవుడు అదే ప్రకృతిని వాడుకుంటారు! 1 సమూయేలు 12:18—19; 1 రాజులు 18:45-46; నిర్గమ 9:18—25; యోవేలు 2:23 కూడా
ఒకసారి చూడండి!!!
కాబట్టి
దేవుని గొప్పదనాన్ని గ్రహిద్దాము! దేవుడు కృపతో మనకొరకు ఏం చేశారో గ్రహిద్దాము అందుకే దేవుడు
మొదటగా మానవునికి కావలసినవి అన్నీ చేసి ఆ తర్వాతనే మనిషిని చేశారు! మనిషి అంటే దేవునికి అంత ప్రేమ!!!
దీనిని
గ్రహిద్దాము! అంతేకాదు ప్రేమించే దేవుడు శిక్షించ గలరు కాబట్టి మన మాట ప్రవర్తన జాగ్రత్తగా
చూసుకుందాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*138వ భాగం*
యోబు 37:14—18
14 యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి
దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
15 దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో
నీకు తెలియునా?
16 మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును
నీకు తెలియునా?
17 దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు
వెచ్చబడినది నీకు తెలియునా?
18 పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు
నీవు వ్యాపింపజేయగలవా?
ప్రియులారా! ఇక ఈ 37వ అధ్యాయములో కూడా ఏలీహు మాట్లాడుతున్నాడు.
ఇంకా
క్రింద వచనాలు చూసుకుంటే 4 యోబూ, ఈ మాట ఆలకింపుము
ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
15 దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో
నీకు తెలియునా?
16 మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును
నీకు తెలియునా?
అంటున్నాడు!
ఇక్కడ
ఎలీహు తను చెప్పదలచుకున్న దానంతటి సారాంశానికి ఎలీహు వచ్చాడు. అదేమంటే, దేవుని గొప్పదనం, జ్ఞానం వెదికి తెలుసుకోలేనంత బ్రహ్మాండమైనవని
యోబు గ్రహించాలని చెప్తున్నాడు 14-18వచనాలు ప్రకారం!.
యోబు
దేవుని ఎదుట తనను తాను సమర్థించుకుంటూ వాదించాలన్న విపరీతమైన కోరికను విసర్జించాలి 19,20 వచనాలు ప్రకారం.
దేవునికి భయభక్తులతో లోబడాలి
(24 వచనం ).
సరే
ఒకసారి క్లుప్తంగా చూసుకుందాం! దేవుడు తన మేఘాలను
ఎలా నిర్వహిస్తాడో వాటి మెరుపు ప్రకాశం ఎలా ఉండాలో దేవుడు ఇవన్నీ ఎలా చేస్తాడో నీకు
తెలుసా అంటున్నాడు! దీనికి జవాబు ఎప్పుడో 28 వ అధ్యాయంలో 24--27 లో యోబుగారు చెప్పేశారు. అయినా మరలా అడుగుతున్నాడు ఎలీహు! 24
ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది
దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు
ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
26 వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు
మార్గము ఏర్పరచి నప్పుడు
27 ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని
పరిశోధించెను.
తరవాత
వచనంలో 16
మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?
దీనికి కూడా యోబుగారు జవాబు ఎప్పుడో చెప్పారు 26:8 లో
8 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
9 దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని
మరుగుపరచెను.
కీర్తనాకారుడు అంటున్నాడు 104: 2 వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను
పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు.
3 జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు.
మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
ఇక
తర్వాత 17 దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు
తెలియునా?
దీనికి
కూడా యోబుగారు జవాబు ఎప్పుడో చెప్పారు 6: 17 వేసవి రాగానే అవి మాయమై పోవును
వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
అయితే కీర్తనాకారుడు అంటున్నారు 147: 18 ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
కాబట్టి
ఇక్కడ ఎలీహు యోబుగారి మీద సంధించిన ప్రశ్నలు అన్నింటికీ జవాబులు ఎప్పుడో యోబుగారు చెప్పేశారు
గాని ఏవో కొత్తవయినట్లు ఇక్కడ అడుగుతున్నాడు ఎలీహు!
21 వ వచనంలో మేఘాల వెనుక ఉన్న వెలుగు అనగా మేఘములు గుద్దుకోగా పుట్టిన విధ్యుత్
వలన వచ్చే మెరుపులు కోసం చెబుతున్నాడు!
22 వ వచనం అరుణోదయం కోసం మరియు ఇంద్రధనస్సు కోసం చెబుతున్నాడు!
సరే
ఇక 23 వ వచనం
చూసుకుంటే 23 సర్వశక్తుడగు దేవుడు
మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును
నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు
కలిగి యుందురు.
24 తాము జ్ఞానులమను కొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు.
ఈ 23వ వచనంలో దేవుని గురించిన ఎలీహు అభిప్రాయం కనిపిస్తుంది. అలాంటి దేవుడు మనుషుల సంపూర్ణ గౌరవానికీ భయభక్తులకూ అర్హుడు. ఎలీహు దేవుని గొప్పతనం, నీతి న్యాయాలు, పరిపూర్ణమైన ఆయన లక్షణాల గురించి చక్కగా మాట్లాడాడు. అయితే మనం ఎలీహు గురించి, మొత్తంగా అతని మాటల గురించి
ఏమనాలి? అతని గురించి మరీ ఉన్నతంగా గానీ మరీ తక్కువ గానీ ఆలోచించడం
తగదు. అతను చెప్పినట్టే ఎలీహు కూడా యోబు, అతని స్నేహితుల్లాగా బంకమన్నుతో తయారైనవాడే (33:6). తన
మాటల ద్వారా ఇది వాస్తవమే అని బయట పెట్టుకున్నాడు. అతడు వాగ్ధాటి
గలవాడు. దేవుణ్ణి గురించి గణనీయమైన జ్ఞానం, అవగాహన అతనికి ఉన్నాయి. అయితే తన జ్ఞానం గురించి ఎలీహుకు
ఆత్మవిశ్వాసం ఉన్నట్టుగా ఉంది. కొన్ని చక్కని మాటలు పలికాడు గాని
యోబును అర్థం చేసుకోవడంలోను, యోబు బాధలు అనే సమస్యను పరిష్కరించడంలోను
విఫలమయ్యాడు. తనకంటే యోబు ఉత్తముడని అతనికి తెలియదు. మొత్తం మీద అతడు యోబు ముగ్గురు స్నేహితుల కంటే మంచివాడుగా కనిపించినా గుణగణాలలో
యోబుకు సాటి రాడు. ఇందుకు ఆధారం దేవుడు స్వయంగా పలికిన మాటలే
(2:3). దేవుని విశ్వాసులందరిలాగా ఇతను మంచి చెడ్డల కలయిక; జ్ఞానం, అజ్ఞానాల మిశ్రమం. ఎలీహు
పాత్ర మనకు నేర్పేదేమంటే మానవ బుద్ధి ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుని రహస్య సత్యాలను అర్థం
చేసుకోవడం కష్టం (1 కొరింథీ 1:25). ఎలీహు
తానే ఈ విషయాన్ని కొంతవరకు గ్రహించాడు. ఇది మంచిది.
38 వ అధ్యాయంలో దేవుడు రంగంలో ప్రవేశించడానికి ఎలీహు అంతిమ మాటలు చక్కని
అవకాశాన్ని ఇస్తున్నాయి. యోబు, అతని స్నేహితుల
మనస్సులను రాబోయే దేవుని మాటలు వినడం కోసం ఎలీహు సిద్ధం చేశాడని చెప్పవచ్చు.
మనము కూడా నేనే తెలివైన వాడిని నాకే జ్నానముంది నేనే ప్రార్ధనా పరున్నీ! ఇలాంటివి వదిలేసి దేవుని
దృష్టిలో నీవు ఒక నీటి బుడగవు అని గ్రహించి నీవేమీ చేయలేవు అని గ్రహించి యోబుగారిలా
దేవుని ముందు నోటిమీద చేయి వేసుకుని ఉండాలి!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*139వ భాగం*
యోబు 38:1—3
1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
2 జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
3 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు
ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
ప్రియులారా!
ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
నిజానికి నేను అనుకుంటాను యోబుగారు నేను శోధించ బడిన తర్వాత సువర్ణమై
మారుదును అన్నారు కదా! తర్వాత నేను నా కన్నులతోనే నేను నా దేవుణ్ణి
చూస్తాను ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు అని యోబుగారు చెప్పిన స్టేట్మెంట్ కి దేవుడే
ప్రత్యక్షం అయ్యారు అని నేను అనుకుంటున్నాను! అందుకే మొదట వచనంలో
అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఎవరికి? యోబుకి! ఒక సామాన్య మానవునికి
దేవుడే దిగి వచ్చి జవాబు చెబుతున్నారు!
ఇక యోబుగారు అనేకసార్లు తన వాదం వినిపించేందుకు దేవుని ఎదుట నిలవాలన్న కోరికను
యోబు వెల్లడి చేశాడు. (యోబు 13:3, యోబు 13:22, ; యోబు 23:3-7, ). హఠాత్తుగా ఇప్పుడు దేవుడు అతణ్ణి చేరి
అతని హృదయ వాంఛను తీర్చాడు (కీర్తనల గ్రంథము 37:4). దేవుడు గాలివానలో లేక సుడిగాలిలో
రావడం పరిస్థితులకు తగినదే. యోబు జీవితంలోను,
తలంపుల్లోను బలమైన పెనుగాలి వీస్తున్నది. దేవుడు
ఆ పెనుగాలిలో కూడా ఉండి తన ఆశయాలను నెరవేరుస్తున్నాడు. ఇప్పుడాయన
మేఘాల్లో ఉరుములో వచ్చి బాధాపీడితుడైన తన సేవకునితో మాట్లాడుతున్నాడు. అతని బాధలకు కారణమేమిటో దేవుడు తెలియజేస్తాడనీ లేక “యోబూ,
నీవంటే నాకు ప్రేమ. నేను పెట్టిన పరీక్షలో గెలిచావు.
నాలోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. ఇప్పుడు
నిన్ను ఇక ధారాళంగా దీవిస్తాను” అని ఆదరణకరమైన మాటలు అంటాడని
మనం ఊహించవచ్చునేమో. అయితే దేవుడు ఇలా చెయ్యలేదు.
ఇక తర్వాత వచనంలో దేవుడు అంటున్నారు జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను
చెరుపుచున్న వీడెవడు?
ఈ మాటలు దేవుడు ఎవరి గురించి అన్నాడు? దేవుడు
గాలివానలో వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నది ఎలీహు. అతని గురించి
దేవుడు అని ఉండవచ్చు. తన జ్ఞానం గురించి చాలా ఉన్నతమైన ఊహలు గలవాడికి
(యోబు 36:4, ) ఇది తగిన గద్దింపే. ఈ మాటలను దేవుడు ఎలీహును గురించి గనుక చెప్పి ఉండకపోతే, అతని విషయం ఆయన అసలేమీ మాట్లాడలేదన్నమాట. అయితే అతని
విషయాన్ని దేవుడసలు పట్టించుకోకుండా వదిలెయ్యడం విచిత్రంగానే ఉండి ఉంటుంది గదా.
ఆయన ఆ ముగ్గురు స్నేహితులతో మాట్లాడాడు (యోబు
42:7-8, ), యోబుతో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఒక వేళ
ఈ మాట కూడా దేవుడు యోబుతో అని ఉండవచ్చు. యోబే ఇలాగని అనుకున్నాడు
(యోబు 42:3, ). ఈ వివాదంలో భాగస్వాములైన అయిదుగురు
మనుషులూ అక్కడ ఉన్నారు. దేవుడు ఈ మాటలను ఈ అయిదుగురినీ గద్దిస్తూ
అని ఉండవచ్చు. దేవుడు ఈ ప్రశ్నను అస్పష్టమైన రీతిలో వదిలి ఇష్టమున్న
వారెవరైనా దీన్ని తమకు అన్వయించుకొనేందుకు వీలు కల్పించి ఉండవచ్చు. “ఆలోచన” తెలివితక్కువతనం చేత “చీకటి”
అయిందని దేవుడన్నాడు. ఇక్కడ “ఆలోచన” దేవుని ఆశయం, దేవుని ఏర్పాట్లు
లేక యోబు పట్ల ఆయన నెరవేరుస్తున్న ఆయన తలంపులని అర్థం. యోబు,
ఎలీహు, మిగతా ముగ్గురు కూడా తమ అజ్ఞానంలో దేవుని
ఏర్పాటును అస్పష్టంగా మసకగా చేసి వేశారు. వారి మాటలు విషయాన్ని
తేటతెల్లం చేసేది పోయి మరింత మరుగు చేశాయి. మనం ఈ గ్రంధమును గానీ మరి ఏ ఇతర దైవ సత్యాన్నైనా ఇతరులకు
ఉపదేశించే ప్రయత్నంలో వీరిలాగా చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి. మనకు లేని జ్ఞానం ఉన్నట్టుగా చెప్పుకోకూడదు. సందేహాస్పదమైన
విషయాలను గురించి ఇదమిద్ధంగా మాట్లాడకూడదు. దేవుని సత్యం పై మనకే
గుత్తాధిపత్యం ఉందనుకోకూడదు.
ఇక
తర్వాత వచనంలో అంటున్నారు దేవుడు 3 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము
నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
ఇప్పుడు దేవుడు యోబుతో నేరుగా మాట్లాడుతున్నాడు. యోబును కొన్ని ప్రశ్నలు
అడగగోరుతున్నాడు. యోబు వీటికి జవాబులు చెప్పబూనుకొంటే చాలా కష్టపడవలసి
వస్తుంది. యోబును ఓదార్చడానికి బదులుగా ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు?
దేవుడు ప్రపంచం మీద ప్రభుత్వం నెరపే విధానం గురించి యోబు ప్రశ్నలు వేశాడు.
మనుషులతో దేవుడు వ్యవహరించే తీరును గురించి సందేహాలు వెలిబుచ్చాడు.
అలాగైతే దేవుడికంటే తనకే ఎక్కువ జ్ఞానం ఉందని యోబు అనుకుంటున్నాడా?
ఇలా ప్రభుత్వం చేసే పనిని దేవునికంటే తానే బాగా చెయ్యగలను అనుకుంటున్నాడా?
ఈ ప్రశ్నలను దేవుడు ఎత్తి పొడిచే రీతిలో అడుగుతున్నట్టుంది. ఆ ప్రశ్నల వెనుక దేవుని చిరునవ్వులు కనిపిస్తున్నవి గదా. వాటిల్లో ఒక్కదాన్ని కూడా యోబు జవాబివ్వలేడని దేవునికి తెలుసు. యోబు ఉండవలసిన చోటును అతనికి చూపించడం కోసమే ఈ ప్రశ్నలు యోబు నోటికి మూత వేయించి,
తాను తెలివితక్కువగా మాట్లాడానని ఒప్పించేలా చెయ్యాలని దేవుని ఉద్దేశం.
దీన్ని దేవుడు తిరుగు లేకుండా సాధించాడు (యోబు
42:3-6, ). ఇది జరిగిన తరువాతే ఆయన యోబును ఓదార్చాడు. మనుషులను దీవించే ముందు తరచుగా దేవుడు వారి నోళ్ళను మూయిస్తాడు (రోమీయులకు 3:19, రోమీయులకు 3:21-24). యోబు మీదికి ఆపదలు వచ్చినవి, అతను దుష్కార్యాలు చేసినందువల్ల
కాదు. కానీ ఆపదలు వచ్చిన తరువాత ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో
యోబు కొన్ని సార్లు తప్పుగా మాట్లాడాడు. దీన్ని అతను ఒప్పుకుని
సరి చేసుకోవాలి.
మరి నీవు సిద్ధమా?!!!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*140వ భాగం*
యోబు 38:4—7
4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?
నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో
చెప్పుము.
6 దానిమీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము.
దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
7 ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును
ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
ప్రియులారా! ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
అయితే క్రింద వచనాలు ఈ నాలుగు అధ్యాయాలు ధ్యానించే ముందుగా నా మాటగా
ఏమి చెబుతున్నాను అంటే దేవుడు యోబుగారిని ఈ ప్రశ్నలు అడిగి నీకు ఏమీ తెలియదు తెలియకుండా
మాట్లాడావు అని పిలిచి గద్దించడం ఒకెత్తు అయితే ఈ యోబుగారిని ఉపయోగించుకుని సర్వమానవాలికి
దేవుని యొక్క సృష్టి యొక్క రహస్యాలను దేవుని రహస్య సత్యాలు దేవుని మర్మములను తెలియజేయాలని
ఆశించి యోబుని ఉద్దేశించి సర్వమానవాలితో మాట్లాడుతున్నారు అని నా ఉద్దేశం! ముఖ్యంగా నేనే జ్నానిని తెలివైన వాడిని అని విర్రవీగే వారితో ముఖ్యంగా ముఖాముకిగా
చెబుతున్నారు!
ఇక
నాలుగో వచనం నుండి దేవుడు ఒక్కో ప్రశ్నను ఒక బాణంలా లేక ఒక మిస్సైల్ లాగా యోబుగారిమీదికి
వదులుతున్నాడు దేవుడు!!!
4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?
నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో
చెప్పుము.
యోబుకు
తెలిసినది ఎంత స్వల్పమో దేవుడతనికి చూపిస్తున్నాడు. యోబు అజ్ఞానాన్ని దేవుడు పదేపదే గుర్తు
చేస్తున్న విధానాన్ని గమనించండి (వ 5,18,20,21,33;
39:1, 26)...
Job(యోబు గ్రంథము) 38:5,18,20,21,33
5.నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో
చెప్పుము.
18.భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
20.దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా?
దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయు
నీకు తెలిసియున్నది గదా.
21.నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
33.ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
Job(యోబు గ్రంథము) 39:1,26
1.అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా?
లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
26.డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
ఇక్కడ
భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? అంత తెలిసిన జ్నానిలా మాట్లాడవు కదా ఇంతవరకు అంటూ
నిలదీస్తున్నారు! ఇంకా అంటున్నారు భూమి యొక్క పరిమాణం ఎంతో చెప్పు
అంటూ నిలదీస్తున్నారు , నీవు తెలివైన వాడివి కదా నీకు వివేకం
ఉంటే నాకు చెప్పు అంటూ రెట్టిస్తున్నారు!!
ఇంకా
అంటున్నారు 6 దానిమీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల
పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము
భూమికి కొలత కొలిచిన వాడెవడు దాని స్తంభముల యొక్క పాదులు దేనితో కట్టబడ్డాయో
తెలిస్తే చెప్పు అంటూ ఎద్దేవా చేస్తున్నారు!
నిజానికి
దీనికి జవాబు అప్పుడు యోబు గారి వద్ద లేదు! అందుకే నోటి మీద చేయి వేసుకుంటాను అన్నారు యధార్ధముగా
యోబుగారు! ఇప్పుడు భూమిని కొలిచే అత్యాధునిక పరికరాలు వచ్చాయి కనుక శాస్త్రజ్నుల
లెక్క ప్రకారం సుమారుగా భూమి యొక్క పరిమాణం సుమారు
510.1 మిలియన్ చదరపు కిలోమీటర్లు (197 మిలియన్
చదరపు మైళ్లు).
*భూమి యొక్క
కొలతలు*:
- భూమధ్యరేఖ
వద్ద వ్యాసం: సుమారు 12,756 కిలోమీటర్లు
(7,926 మైళ్లు)
- ధృవాల
వద్ద వ్యాసం: సుమారు 12,714 కిలోమీటర్లు
(7,900 మైళ్లు)
- భూమి యొక్క
చుట్టుకొలత : సుమారు 40,075 కిలోమీటర్లు
(24,901 మైళ్లు)
- భూమధ్యరేఖ
వద్ద చుట్టుకొలత: 40,075 కిలోమీటర్లు (24,901 మైళ్లు)
- ధృవాల
వద్ద చుట్టుకొలత: 40,008 కిలోమీటర్లు (24,860 మైళ్లు)
🌎 భూమి యొక్క ఉపరితలం సుమారు 70.8% నీటితో కప్పబడి ఉంది,
మిగిలిన 29.2% భూభాగం.
కాబట్టి, భూమి యొక్క పరిమాణం చాలా పెద్దది! 🌎
భూమి యొక్క ఆకారం పూర్తిగా గుండ్రంగా లేదు, కానీ
కొద్దిగా చపటగా ఉంది, కాబట్టి భూమధ్యరేఖ వద్ద చుట్టుకొలత ధృవాల
వద్ద చుట్టుకొలత కంటే ఎక్కువ. 🌎
ఇదీ భూమికోసం యోబుగారిని
దేవుడు అడిగిన ప్రశ్నలకు కొన్ని జవాబులు!
అయితే
దేవుడు చాలా గొప్పవాడు దయామయుడు! అందుకే అక్కడ ప్రశ్నలు అడిగి తర్వాత వచనాలలో ప్రశ్నలతో కూడిన
జవాబులు చెబుతున్నారు! 7 ఉదయనక్షత్రములు
ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని
వేసినవాడెవడు?
అనగా ఇక్కడ దేవుడు భూమికి పునాది వేసినప్పుడు అక్కడ ఉదయ నక్షత్రములు ఇంకా దేవదూతలందరు
ఉన్నారు! అలా భూమికి పునాది వేసినప్పుడు వీరంతా ఆనందించి జయధ్వనులు కూడా చేస్తూ ఉండగా
భూమికి మూలరాయిని దేవుడు వేశారు అని అర్ధమవుతుంది. వేకువ చుక్కలు
లేక ఉదయ నక్షత్రాలు అంటే
దేవదూతలు కావచ్చు. ఈ వచనంలో దేవునికుమారులంటే దేవదూతలని స్పష్టమే.
మానవ సృష్టి జరగక మునుపు కాలాన్ని గురించి దేవుడిక్కడ మాట్లాడు తున్నాడు
(యోబు 1:6, చూడండి). భూమిని
సృష్టించడం మూలంగా పరలోకంలో గొప్ప ఆనందం కలిగిందన్న విషయాన్ని గమనించండి.
దీనికోసం ఇంకా లోతుగా చూసుకోవలంటే మనము సామెతలు గ్రంధంలో జ్నానము కోసం చెబుతూ
యేసుక్రీస్తుప్రభులవారు ఈ భూమిని చేసేటప్పుడు ఏమి చేశారో చూసుకుంటే ఈ భాగము ఇంకా అర్ధమవుతుంది మనకు సామెతలు 8: 24 ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో
నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
26 భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని
రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
27 ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును
నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు
పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
30 నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు
నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
ఇంకా
యోబు 26 వ
అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాము 7 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని
వ్రేలాడచేసెను.
ఇక్కడ
దీనిని బట్టి తెలుస్తుంది.
భూమికి పునాది శూన్యంలో దేవుడు వేశారు. అది కదలకుండా
ఎలా ఉంటుందో ఈ 26 వ అధ్యాయము ధ్యానించే టప్పుడు చూసుకున్నాము!
అలా వేసేటప్పుడు ఉదయ నక్షత్రాలే కాకుండా దేవుని దూతలు మరియు యేసుక్రీస్తుప్రభులవారు
అందరూ ఉన్నారు. అప్పుడు భూమికి ప్రధాన శిల్పిగా యేసుక్రీస్తుప్రభులవారు
ఉన్నట్లు గ్రహించగలము!!!
అయితే
ఓ యోబు నీవు దీనిని తెలియకుండా మాట్లాడావు అంటున్నారు దేవుడు!!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*141వ భాగం*
యోబు 38:8—13
8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని
మూసినవాడెవడు?
9 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి
పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?
10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను
పెట్టించినప్పుడు
11 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే
నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
12 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును
13 అది దుష్టులను తనలో నుండకుండ దులిపివేయునట్లును నీ
వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును
తెలిపితివా?
ప్రియులారా! ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
గత
భాగంలో భూమి- దాని పునాది- దాని పరిమాణం కోసం అడిగితే- ఈ భాగంలో సముద్రము కోసమైన ప్రశ్నలు దేవుడు సంధిస్తున్నారు!!
8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని
మూసినవాడెవడు?
దేవుడు
సముద్రానికి తలుపులు బిగించి వాటిని మూసివేశారట! మరి దాని తలుపులు ఏమిటి?
తర్వాత
ప్రశ్న: 9 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును
దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?
సముద్రానికి వస్త్రముగా దేవుడు మేఘమును చేశారట! గాఢాంధ
కారమును దానికి పొత్తి గుడ్డలా చేశారట! అనగా సముద్రం మీద గాని సముద్రపు ఒడ్డున
గాని మనం చూస్తే దూరంగా మేఘాలు సముద్రాన్ని తాకినట్లు ఎంతో అందంగా కొన్నిసార్లు భయంకరంగా
కొన్నిసార్లు కనిపిస్తాయి!
అవే సముద్రానికి వస్త్రాలు అని అలంకార ప్రాయముగా చెబుతున్నారు దేవుడు!
అయితే ఆదికాండం 1: 2 చూసుకుంటే
2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన
అల్లాడుచుండెను.
చూడండి ఇక్కడ కూడా చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అంటున్నారు!
ఇక
తర్వాత వచనంలో అదే సముద్రము కోసం చెబుతున్నారు: 10 దానికి సరిహద్దు
నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
11 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే
నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
ఇక
సముద్రానికి సరిహద్దు నియమించారు దానికి అడ్డ గడియలు కూడా వేశారు తలుపులు పెట్టారు. నీవు ఇంతవరకే గాని మరి
దగ్గరకు అనగా భూమి మీద గ్రామాల మీదికి రాకూడదు ఇంకా నీ తరంగములు యొక్క పొంగు అణచబడాలి
అని సముద్రానికి ఆజన ఇచ్చినప్పుడు నీవు ఉన్నావా అంటున్నారు!
కీర్తనా
కారుడు అంటున్నారు 104: 9 అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని
సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
యోబు 26: 10 వెలుగు చీకటుల సరిహద్దులవరకు
ఆయన జలములకు హద్దు నియమించెను.
ఇంకా
వివరంగా సముద్రానికి హద్దులేవీ తలుపులేవీ అని చూసుకుంటే యిర్మీయా గ్రంధంలో దేవుడు చెబుతున్నారు
5: 22 సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను
దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు
మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే
యెహోవా వాక్కు.
ఇక్కడ
సముద్రానికి హద్దు మరియు తలుపులు గెడలు: ఇసుక మరియు ఇసుక దిబ్బలు కొండలు!! అందుకే కీర్తన 89:9 లో అంటున్నారు
9 సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు
నీవు వాటిని అణచి వేయుచున్నావు.
సామెతలు 8: 29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు
ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
30 నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు
నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
కాబట్టి
ఓ యోబు నీవు తెలివైన వాడవు మొదట పుట్టిన వాడవు నీవే కదా! సముద్రానికి సరిహద్దు
మరియు తలుపులు గెడలు పెట్టినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు సూటిగా అడుగుతున్నారు!
అయితే దానికి సమాధానం యోబుగారి దగ్గర లేదు కాబట్టి మౌనంగా దేవుని సన్నిధిలో
తలదించుకుని దేవుని సార్వభౌమత్వానికి లోబడి ఉండిపోయారు!!
ఇక
తర్వాత ప్రశ్నించే అంశము:
12 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును
13 అది దుష్టులను తనలో నుండకుండ దులిపివేయునట్లును నీ
వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును
తెలిపితివా?
అరుణోదయము అనగా సూర్యుడు భూమిపై ఉదయించక ముందు భూమిపై వచ్చే
వెలుగు! సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిని తాకక ముందు సుమారుగా
1:36 నిమిషాలకు ముందు ఇది మొదలవుతుంది. అంతేకాకుండా
సూర్యుడు అస్తమించిన తర్వాత కొంత సమయం వరకు ఉండే వెలుతురును అరుణోదయం లేదా
twilight అంటారు! ఈ twilight మూడు రకాలు!
Civil Twilight, Nautical Twilight and Astronomical Twilight! వీటితో సామాన్యులకు అంతగా ఉపయోగం లేదు గాని ఉదయాన్నే పనిపాటులుకు వెళ్ళేవారికి
మరియు నాలాంటి సముద్రయానం చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది! ఇప్పుడు ఈ అరుణోదయం లేదా Twilight / Dawn కోసం కొన్ని
ప్రశ్నలు సంధిస్తున్నారు దేవుడు!!
ఈ
అరుణోదయము అనేది భూమి యొక్క దిగంతముల వరకు వ్యాపించేలా నీవు చేయగలవా? అది దుష్టులను తనలో ఉండకుండా
ఏరి పారివేసే విధంగా ఉదయాన్ని నీవు చేశావా? అంటూ అడుగుతున్నారు!
దీనికి కూడా యోబుగారు సమాధానం చెప్పడం లేదు. తనాయొక్క అసమర్థతను కూడా దేవుడు చూపిస్తున్నాడు
(వ 16,20,22,31,32,34). యోబుకు తెలివి లేకపోవడమే
గాక దేవుడు చేసే అత్యల్పమైన పనిని చేయడం కూడా యోబు చేత కాదని అతడు తెలుసుకోవాలని కోరుతున్నాడు
దేవుడు. యోబు చేసిన ఫిర్యాదులు సర్వజ్ఞానం, అమిత బలప్రభావాలు గల సృష్టికర్త, విశ్వాన్ని ఏలే సర్వాధికారి
అయివున్న వానికి విరుద్ధంగా చేసినవి యోబు గ్రహించాలి. తన జ్ఞానాన్నీ
బల ప్రభావాలనూ తన మార్గాలనూ ప్రశ్నించే ప్రతి వ్యక్తి బుద్ధిహీనతను కూడా ఈ అధ్యాయంలో
దేవుడు బయట పెడుతున్నాడు. ఏమీ తెలియని మూర్ఖులూ ఏదీ చెయ్యలేని
అసమర్థులూ దేవుని పనులన్నీ విమర్శించడానికి తెగించేవారు ఎంతమంది లేరు? అతి వైభవంగా కనిపిస్తున్న ఈ విశ్వాన్ని చూస్తూ కూడా దేవుని ఉనికినే కాదనే వారెంతమంది
లేరు? నాస్తికులు ప్రదర్శించే అహంకారంతో కూడిన అజ్ఞానం ఎంత భయంకరమైనది!
ప్రతి వ్యక్తీ నోటిమీద చెయ్యి వేసుకుని తన అజ్ఞానాన్ని ఒప్పుకోవలసిన
ప్రశ్నలను దేవుడిక్కడ అడుగుతున్నాడు. ప్రకృతి మనకు వినయాన్ని
నేర్పించాలి. అయ్యో! ఈ సృష్టి రహస్యాల్లో
చాలా చిన్న భాగాన్ని గ్రహించి ఎంతమంది గర్వించి తమ తెలివితేటలను మించినది లేదని విర్రవీగుతున్నారో
గదా.
ఒకవేళ
ప్రియ చదువరీ! నీవు కూడా ఇదే కోవకు చెందితే- దేవుడు ఎలా చేశాడు
–అని గాని లేక నాకే తెలివి ఉంది అని గాని విర్రవీగితే దేవుడు అడుగుతున్న
ప్రశ్నలకు జవాబు ఇవ్వగలగాలి లేదా దేవుని గొప్పతనాన్ని గ్రహించి దేవుని సార్వభౌమత్వానికి
లోబడి ఉండాలి!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*142వ భాగం*
యోబు 38:14—21
14 ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము
మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.
15 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన
బాహువు విరుగగొట్టబడును.
16 సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
17 మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
18 భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
20 దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా?
దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు
నీకు తెలిసియున్నది గదా.
21 నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
ప్రియులారా! ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ఇక
తర్వాత వచనాలలో మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు దేవుడు యోబుగారికి! 14
ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును
విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును.
15 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన
బాహువు విరుగగొట్టబడును.
భూమి
ముద్ర వేయబడ్డ బంక మట్టిలాగా మారిపోతుంది అది విచిత్రంగా ఉన్న వస్త్రములా కనిపిస్తుంది
ఆ సమయంలో దుర్మార్గుల దగ్గరనుండి వెలుగు తొలిగించడం జరుతుంది. ఇంతవరకు వారు పైకెత్తిన
చేయి విరుగగొట్టడం జరుగుతుంది అంటున్నారు!
కొన్నిసార్లు
దేవుడు వరదలు పంపిస్తే భూమి మొత్తం జలమయం అయిపోతుంది. పండిన పంటలు నీటిపాలు
అయిపోతాయి. ఆ వరదల్లో చాలామంది కొట్టుకుపోతారు- వారి పశువులు కొట్టుకుపోతాయి. వారి ఇల్లు పడిపోతాయి-
దేవుడు కొన్నిసార్లు ఇలాంటి ఉపద్రవాలు పంపించి దుష్టులయిన వారికి బుద్ది
చెప్పి వారి గర్వము అణచి వేస్తారు! నీవు కూడా యోబు అలా చేయగలవా
అంటూ సూటిగా అడుగుతున్నారు దేవుడు!
ఇక
తర్వాత ప్రశ్న: 16 సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?
మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
17 మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
సముద్రము యొక్క అడుగు భాగమునకు వెళ్ళి చూశావా అని అడుగుతున్నారు! ఎంత గజ
ఈతగాడు అయినా కొంతవరకు మాత్రమే సముద్రము లోతుకు వెళ్ళి రాగలరు! లోతు తక్కువగా ఉన్న సముద్రంలో నీటియొక్క పీడనం తక్కువ ఉంటుంది. అప్పుడు ఈతగాళ్లు ముఖ్యంగా డైవర్స్ డైవింగ్ చేసుకుని వెళ్లగలుగుతారు గాని మహా
సముద్రములోకి ఎలా? గత రెండు సంవత్సరాల క్రితం ఒకడు మామూలు టాంక్
లో వెళ్ళి లోతు పెరిగే కొద్ది నీటి పీడనం పెరిగిపోయి టాంక్ పగిలిపోయి చనిపోయారు!
అందుకే ఈ మహా సముద్రము అడుగుభాగమునకు మనుషులు వెళ్ళకుండా రోబోలను పంపిస్తారు!
ఆ వాహనాలను R O V లు అంటారు! మనుషులు క్రిందవరకు వెళ్తున్నారు గాని నీటిలోనికి దిగరు! ఈ rov ల సహాయంతో క్రింద అడుగుభాగం చూస్తూ- గేస్ ఆయిల్ పైపులను రిపేర్ చేస్తూ, నీటిలోనే వెల్డింగ్
కూడా చేస్తున్నారు ఇప్పుడు! ఆ పరికరములు రోబోలు లేకుండా క్రిందకు
దిగి బ్రతకడం అసాధ్యం! ఎందుకంటే మనిషి శరీరం కేవలం 15
మీటర్ల లోతు వరకే తట్టుకోగలదు! దానికి మించితే స్కూబా డైవింగ్ వస్తువులతో
క్రిందికి వెళ్ళాలి- అదికూడా కేవలం 40 మీటర్ల
వరకు వెళ్లగలరు! ఇంకా ఇంకా స్పెషల్ గేర్ వేసుకుని టాంకులలో వెళ్తే
230 మీటర్ల వరకు వెళ్లగలరు. అది కూడా కేవలం ఒక
అరగంట నీటిలోని మూడుగంటలు టాంక్ లోని ఉంటూ పనిచేయాలి! లేకపోతే
మనిషి రక్తం ఆ నీటిపీడనం వలన విరిగి పోతుంది.
మరి ఓ యోబు! ఈ మహా సముద్రములోనికి నీవెప్పుడైనా
దిగావా? దాని లోతు తెలుసుకున్నావా? అడుగుభాగంలో
ఏవి ఉన్నాయో తెలుసుకున్నావా అని అడుగుతున్నారు దేవుడు! అంతేకాకుండా
మరణము యొక్క ద్వారములు నీకు ఎప్పుడైనా తెరువబడ్డాయా అని అడుగుతున్నారు! మరణం ద్వారాలు అనగా చనిపోయిన తర్వాత మనిషి వెళ్ళే ప్రాంతపు తలుపులు అని అర్ధం
కావచ్చు! ఇది కేవలం నా అభిప్రాయమే! అనగా
పాతాళపు తలుపులు తెరిచావా అని అడుగుతున్నారు!
కీర్తనాకారుడు
అంటున్నాడు మరణపుటురులు నన్ను ఆవరించి నప్పుడు దేవుడే నన్ను కాపాడారు! యోనా గారు చేప కడుపులో
ఉంది ప్రార్దిస్తున్నాడు 2: 2 నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను;
పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
3 నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు,
ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును
నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.
కాబట్టి
బహుశా ఇవీ మరణపు ద్వారాలు అనగా !!
మరలా 18 వ వచనంలో అడుగుతున్నారు
దేవుడు భూమి యొక్క వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన
తెలిసిన యెడల చెప్పుము.
గత భాగాలలో భూమి యొక్క వైశాల్యం చుట్టుకొలత
చూసుకున్నాము!
ఇక
తర్వాత ప్రశ్నలు: 19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?
చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
20 దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా?
దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు
నీకు తెలిసియున్నది గదా.
21 నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
ఇక
వెలుగు నివశించే చోటు ఏది అంటే ఏమని చెప్పగలము? నిజానికి వెలుగు దేవుడే! ఏసయ్య అంటున్నారు నేను లోకమునకు వెలుగును అన్నారు- తర్వాత
మీరు లోకానికి వెలుగు అన్నారు! అయితే యెహేజ్కేలు 32:8
లో అంటున్నారు 7 నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను
చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.
8 నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని
అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను;
ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
అనగా
వెలుగు చీకటులు దేవుని చేతిలో ఉన్నాయి! అది మనకు తెలియదు! యోహాను గారు అంటున్నారు యేసుక్రీస్తుప్రభులవారిని ఉద్దేశించి 1: 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని
చీకటి దాని గ్రహింపకుండెను.
9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి
వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
ఇక
దేవుడే వెలుగుకి చీకటికి హద్దు నియమించాడు అని ఇదే యోబు గ్రంధంలో ఇదే యోబుగారు చెబుతున్నారు! 26:
9 దానిమీద మేఘమును వ్యాపింపజేసిఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.
10 వెలుగు చీకటుల సరిహద్దులవరకుఆయన జలములకు హద్దు నియమించెను.
అయితే
ఇక్కడ యోబుగారిని దేవుడు అడుగుతున్నారు ఓ యోబు
వెలుగు ఎక్కడ పుట్టింది? చీకటి ఎక్కడ పుట్టింది అని అడుగుతున్నారు!
వాటిని కలుగజేసింది దేవుడే! అందుకే దేవునికి భయపడుదాం!
మనకు తెలియని విషయాలు కోసం తెలిసినట్లు మాట్లాడవద్దు!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*143వ భాగం*
యోబు 38:22—30
22 నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
23 ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును
నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
24 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
25 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము
కురిపించుటకును
26 పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును
వరద నీటికి కాలువలను
27 ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30 జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
ప్రియులారా! ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ప్రియులారా! ఇక తర్వాత వచనాలు చూసుకుంటే
22 నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? అని
అడుగుతున్నారు దేవుడు!
హిమము అంటే మంచు! మంచు యొక్క నిధుల లోనికి నీవు ఎప్పుడైనా
వెళ్ళావా అంటున్నారు! మంచు ఎక్కడ ఉంటుంది. గతభాగాలలో చెప్పుకున్నట్లు ఆవిరైన నీటి ఆవిరి మేఘాల రూపంలో స్టోర్ అవుతుంది.
అక్కడ నీటి తేమ మరియు చల్లని గాలి ఉంటే అయితే వర్షం పడుతుంది లేకపోతే
ఆ మేఘపు ఎత్తు భూమి నుండి ఎక్కువగా ఉంటే ప్రతీ కి. మీ.
కు 6.5 నుండి 10 డిగ్రీలు
సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆ మేఘములు సుమారుగా
5 కి. మీ కంటే ఎత్తుగా ఉన్నట్లు అయితే ఆ మేఘములలో
మంచు ఉంటుంది. ఎత్తు పెరిగే కొలదీ మేఘములలో మంచు పేరుకుపోతుంది.
ఇవే వర్షం పడేటప్పుడు వడగళ్లుగా పడతాయి మన ఉష్ణ మండల దేశాలలో!
అవే శీతోష్ణ మండల దేశాలలో వర్షానికి బదులు మంచు కురుస్తూ ఉంటుంది.
ఇది మంచు యొక్క నిధులు!
గత అధ్యాయంలో కూడా చూసుకున్నాము దీనికోసం 6 నీవు
భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
(గమనిక: ఈ విషయాలను తెలియజేయడానికి
కారణం Marine Meteorology నా ఫేవరెట్ సబ్జెక్టు, మరియు నేను షిప్ కెప్టెన్ కాబట్టి ఈ మేఘాలను వాతావరణమును ఎప్పుడూ గమనిస్తూ
ఉంటాము గనుక రాయడం జరుగుతుంది. అంతేతప్ప నా జ్ఞానము తెలియజేయడానికి
కాదు)
కీర్తనాకారుడు
అంటున్నాడు 135: 7 భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే.
వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన
బయలువెళ్లజేయును..
33: 7 సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే.
అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
ఇక
తర్వాత వచనములో 23 ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల
నిధులను నీవు చూచితివా?
ఇక్కడ
దేవుడు వడగళ్లను నిధులతో పోలుస్తున్నారు అంతేనా అవి దేని కోసం దేవుడు చేశారో కూడా చెబుతున్నారు! దేవుడు ఈ వడగళ్లను మూడు
కారణాల కోసం చేశారట! మొదటిది ఆపత్కాలము కొరకు, రెండు యుద్ధము కొరకు, మూడు యుద్ధ దినము కొరకు!
ఎలా
అంటే ఒకసారి యెహోషువా 10:11 లో
చూసుకుంటే
11 మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్
హోరోనుకు దిగిపోవు త్రోవను పారి పోవుచుండగా, వారు
అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు
దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ
వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
యెషయా గ్రంధంలో 30:30 చూసుకుంటే
30 యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును
ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను
తన బాహువు వాలుట జనులకు చూపించును.
ఇవీ
ఆపత్కాలమూ మరియు యుద్ధం కోసం!
ఇక ప్రళయము మరియు తీర్పు కోసం ప్రకటన
16:21 21 అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద
పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి
దేవుని దూషించిరి.
కాబట్టి దేవుడు వడగళ్లను ఈ విధంగా తన
తీర్పుల కోసము, తన బిడ్డల పక్షముగాను
ఉపయోగిస్తారు!
ఇక
తర్వాత వచనంలో 24 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
ప్రియులారా
దీనికోసం మనం ఇంతకు ముందు అరుణోదయము వెలుగు కోసం ధ్యానం చేసుకున్నప్పుడు చూసుకున్నాము
ఇదే అధ్యాయము 12, 13 వచనాలు ధ్యానం చేసుకున్నప్పుడు!
ఇక
తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమిమీద అన్నీ ప్రాంతాలకు వ్యాపిస్తుంది అనేదాని కోసం
చూసుకుంటే యేసుక్రీస్తుప్రభులవారి రాకడ కూడా అలాగే ఉంటుంది అని ఆయనే చెప్పారు మత్తయి 24:27 లో 27 మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు
నుండును.
ఇక
తర్వాత వచనాలు చూసుకుంటే 25 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను
వర్షము కురిపించుటకును
26 పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును
వరద నీటికి కాలువలను
27 ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
ఇక్కడ
మరలా వర్షం కోసమే దేవుడు మాట్లాడుచున్నారు! దేవుడు నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను
వర్షము కురిపిస్తాను అంటున్నారు, ఇంకా పాడైన యెడారిని తృప్తిపరచుటకును
లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను నేను పంపిస్తాను అంటున్నారు!
కీర్తనాకారుడు అంటున్నారు 29:
3 యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు.
మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
4 యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
5 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను
దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
6 దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును
షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
7 యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
8 యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును
కదలించును
9 యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును.
ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.
10 యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము
రాజుగా ఆసీనుడైయున్నాడు.
11 యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు
సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
ఇక్కడ దేవుడు ఈ వర్షము ప్రవాహము కేవలం తన ప్రజలకు జంతువులకు ఆహారం ఇవ్వడానికోసమే
చేస్తున్నారు అని గ్రహించాలి! యోబు 26 లో కూడా ఇంతకు ముందు
దీనిని ధ్యానం చేసుకున్నాము!
అయితే ఇక్కడ ఒక ఆత్మీయ అర్ధము కనిపిస్తుంది.
నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను అనగా
దేవుని వాక్యము లేకుండా ఎండిపోయిన ఎడారి వలె ఉన్న హృదయాలలో దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని
పంపించి ఆయన సువార్త సత్యము అనేది సువార్త ద్వారా నీటిని వెలుగును సత్యమును తీసుకుని
వచ్చి నిన్ను నన్ను ఆయన తన కొరకు పిలుచుకున్నారు! ఇప్పుడు నీవు
ఆ వాక్యమనే నీటితో ఎంతగా తడుస్తావో అంతగా చిగురించి ఫలిస్తావు. అలా కాకుండా నీకిష్టమొచ్చి నట్లు జీవిస్తే నీటికాలువల యోరను నాటబడిన వాడవు
కాకుండా, క్రీస్తులో అంటుకట్టబడిన వాడవు కాకుండా వేరైపోయిన చెట్టుకొమ్మలా
ఉంటావు. కొమ్మ చెట్టుకు కలసి ఉన్నప్పుడే ఫలిస్తుంది గాని క్రీస్తు
అనేది చెట్టునుంది వేరైపోతే నీవు ఎండిపోతావు. జనులు నిన్ను పొయిలోని
చెత్తవలే కాల్చుతారు జాగ్రత్త!
ఇక
తర్వాత వచనాలు కూడా చూసుకుంటే
28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30 జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
వీటికోసం
కూడా గతంలో ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాం!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*144వ భాగం*
యోబు 38:31—37
31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
32 వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా?
సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
33 ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
34 జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
35 మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు
నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
36 అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు?
37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
ప్రియులారా! ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ప్రియులారా! ఇక తర్వాత వచనాలు చూసుకుంటే 31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
32 వాటి వాటి కాలములలో
నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి
ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
వీటికోసం
చూసుకుంటే ఇదే యోబు 9:9
లో ఈ నక్షత్రాలు అన్నీ దేవుడే చేశారు అంటున్నారు. 8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్రతరంగములమీద
ఆయన నడుచుచున్నాడు.
9 ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను
చేసినవాడు.
10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని
అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
ఇక వీటికి జవాబు ఏమిటంటే ఈ నక్షత్రాలను దేవుడే చేశారు కాబట్టి వాటిని పట్టుకోడానికి
గాని వాటి గమనాన్ని ఆపి కట్టు కట్టడానికి గాని ఏ మనిషికి వల్లకాదు! వీటికి కట్లు కట్టడం
మనిషికి ఏ విధంగా చేతకాదో
ఆ విధంగా ఒకవేళ వాటికి దేవుడు కట్లు కడితే విప్పడం కూడా ఎవరి చేతకాదు! అదేవిధంగా ప్రకటన 3:8 ప్రకారం దేవుడు తీస్తే ఆ తలుపు
వేసే మొనగాడు లేడు, దేవుడే వేస్తే తీయగలిగిన మొనగాడు కూడా లేడు!!
ఇక తర్వాత వచనం యొక్క ప్రశ్నకు కూడా జవాబు
ఈ లోకంలో ఏ మనిషికి వాటివాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చేలా చేయలేరు!
ఏ వ్యక్తి నక్షత్రములను నడుపలేదు!!! అందుకే ఆమోసు
గ్రంధంలో భక్తుడు అంటున్నాడు 5: 8 ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చు వాడు, పగటిని రాత్రి చీకటివలె
మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి
పారజేయువాడు.
9 ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి
ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.
కాబట్టి
దేవుడు తప్ప మరొక మనుష్యుడు గాని ఆత్మ గానిని దానిని చేయలేదు నిర్వహించలేవు!
ఇక
తర్వాత వచనాలు చూసుకుంటే 33 ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా?
దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
దీనికి జవాబు- No ! ఎందుకంటే యిర్మీయా గ్రంధంలో దేవుడు అంటున్నారు 31: 35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు,
సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
36 ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు
సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే
యెహోవా వాక్కు.
37 యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును
కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసివేతును;
యెహోవా వాక్కు ఇదే.
కాబట్టి
ఇవన్నీ దేవునికే సాధ్యము తప్ప నరమానవునికి సాధ్యం కానేకాదు!!
అందుకే
కీర్తనాకారుడు 119 వ కీర్తనలో అంటున్నాడు 90 నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి
అది స్థిరముగానున్నది
91 సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున
అవి నేటికిని స్థిరపడి యున్నవి.
దేవుడు
చేసినవి స్థిరములు- వాటిని మార్చగలిగే మానవుడు లేనేలేడు!!!
ఇక
తర్వాత వచనములలో 34 జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
35 మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు
నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
మొదటి ప్రశ్నకు జవాబు – ఇవ్వలేడు- అది కేవలం దేవుడే
ఇవ్వగలడు! దేవుడే నోవహు గారి కాలంలో ఆ తర్వము వారిని నశింపజేయుటకు
మేఘములను జలరాశులను పిలిచి నాశనం చేశారు! అయితే దేవుని భక్తులు
ప్రార్ధన చేయగా వర్షము వడగల్లు పడ్డాయి- 1 సమూయేలు 12:18 ప్రకారం.
సమూయేలు భక్తుడు ప్రార్ధించగా దేవుడు వడగల్లు పంపించారు!
ఇక 35 వ వచనంలో గల ప్రశ్నకు
కూడా జవాబు- మనిషికి సాధ్యం కాదు! గాని
దేవుడు తన భక్తులతో నీవు ప్రవచనం ఎత్తి చెప్పు అని చెప్పగా నిర్గమ 9:23-25 ప్రకారం జరిగింది. దేవుడు మోషే గారికి నీ కర్ర చాపు నేను
ఉరుములు వడగల్లు కురిపిస్తాను అని చెబితే మోషే గారు కర్ర ఎత్తినప్పుడు ఉరుములు వడగల్లు
పడ్డాయి! ఇవి దేవుడు చెబితేనే వింటాయి. ఒకవేళ దేవుడు చెప్పమని చెబితే- విశ్వాసముతో పలికితే అప్పుడు
జరుగుతాయి!
కాబట్టి
మానవునికి ఆ సత్తాలేదు అని గ్రహించాలి!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*145వ భాగం*
యోబు 38:36—41
36 అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు?
37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
38 ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి
అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
39 ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
40 సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో
పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
41 తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు
కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
ప్రియులారా! ఇక ఈ 38వ అధ్యాయమునుండి చివరి వరకు దేవుడే మాట్లాడుతున్నాడు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ప్రియులారా! ఇక తర్వాత వచనాలు చూసుకుంటే
36 అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు?
37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
జవాబు: దేవుడే!!!
మనిషిని
మిగతా సృష్టినుంచి వేరు చేసేది ఏది? జ్ఞానం, గ్రహణశక్తి ఉన్న
మనసు అతనికి ఉండడం ఎలా? దాన్ని ఇచ్చినది దేవుడే. మూగ నిర్జీవ పదార్థంలో నుంచి జ్ఞానం క్రమేపీ పుట్టి పెరగదు.. ఆదేవిధముగా జ్ఞానము చేత మేఘములను వివరించ గలిగె వాడు కూడా దేవుడే!
ఇదే
యోబు గ్రంధంలో 32:8 లో అంటున్నాడు ఎలీహు 8 అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన
కలుగ జేయును.
సామెతలు 2:6 లో గ్రంధకర్త అంటున్నాడు
6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి
వచ్చును.
ప్రసంగి అంటున్నాడు 2:26 లో 26 ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును
అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టుడగువాని కిచ్చుటకై ప్రయాసపడి
పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము
గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. కాబట్టి జ్నానమిచ్చు వాడు
దేవుడే! దీనికోసం గతభాగాలలో విస్తారంగా చూసుకున్నాము!
కాబట్టి
అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగియున్నాము గనుక దేవునియందు భయమును భక్తిని కలిగి ఉందాము!
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు
38 ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి
అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
దీనికోసం
కూడా ఇదే అధ్యాయములో ధ్యానం చేసుకున్నాము! దేవుడు వర్షము పంపించి ఎడారులను పచ్చికగా చేసేవాడు-
అందులో జంతువులకు నీటిని కాలువలను ఇచ్చేవాడను నేనే అంటూ! ఇక్కడ
దేవుడు వర్షము పంపించి ధూళి మరియు మంటి బెడ్డలు ఒకదానికొక్కటి అంటుకునేలా చేస్తాడు
దేవుడు అంటున్నారు!
ఇక
తర్వాత వచనం నుండి జంతువుల కోసం చెప్పడం మొదలుపెట్టారు
దేవుడు!
39 ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
40 సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో
పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
41 తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు
కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
ఇదే
విషయం కీర్తనాకారుడు కూడా ఆత్మావేషుడై రాస్తున్నాడు 104: 21 సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన
జూచుచున్నవి.
22 సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
23 సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై మనుష్యులు
బయలువెళ్లుదురు.
145: 15 సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు
నీవు వారికి ఆహారమిచ్చుదువు.
16 నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి
పరచుచున్నావు.
ఇక
కాకుల కోసం చూసుకుంటే కీర్తన 147: 9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మత్తయి 6:26 లో 26 ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు;
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
కాబట్టి వీటన్నిని పరిశీలిస్తే దేవుడు జంతు ప్రపంచం పై తన జ్ఞానయుక్తమైన శ్రద్ధను
వివరిస్తున్నాడు.
దీని అంతరార్థం ఏమంటే దీనంతటి విషయం దేవునికి శ్రద్ధ ఉంటే మనిషి విషయంలో
ఆయనకు ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఉండదా. మత్తయి 6:25-32, తో పోల్చ చూసుకుంటే దేవునికి జంతువులను ఎలా ప్రేమగా చూసుకుంటున్నారో అంతకంటే
మనుషులను కూడా ప్రేమగా చూసుకుంటున్నారు!
25 అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి
త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో
అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;
26 ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు
కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని
పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
27 మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
28 వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు,
ఒడకవు
29 అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో
నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
30 నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు
అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు
మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.
31 కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో
అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
కాబట్టి
దేనివిషయంలో చింతించవద్దు!
మత్తయి 6: 25 అందువలన నేను మీతో చెప్పునదేమనగా
ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి
ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;
27 మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
28 వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు,
ఒడకవు
29 అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో
నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
30 నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు
అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు
మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.
31 కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు
కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి;
అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.
34 రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు
ఆనాటికి చాలును.
ఆమెన్!
దైవాశీస్సులు!!
యధార్ధవంతుడైన యోబు
146వ భాగం
యోబు 39:1—8
1 అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు
పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
2 అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
3 అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
4 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను
విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
5 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద
కట్లను విప్పినవాడెవడు?
6 నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి
నివాసస్థలముగాను నియమించితిని.
7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను
అది వినదు.
8 పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని
మొలకను అది వెదకుకొనును
ప్రియులారా! ఇక ఈ 39వ
అధ్యాయములో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు! ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని
తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు! తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు
చెబుతున్నారు!!
ప్రియులారా! ఇక 39 వ అధ్యాయము చూసుకుంటే
1 అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు
పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
2 అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
3 అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
4 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను
విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
ప్రియులారా
ఇంతకు ముందు అధ్యాయం ఆఖరు భాగంలో దేవుడు తీసుకున్న అంశాన్ని అనగా జంతువుల యెడల పశు
పక్ష్యాదుల యెడల దేవుని యొక్క ప్రేమ మరియు పట్టింపు ఈ అధ్యాయం అంతటిలో ఆయన కొనసాగించాడు.
ప్రపంచంలోని ప్రతిదాన్నీ దేవుడు జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నాడు. జంతుజాలాన్ని
అంతటినీ జ్ఞానంతో నైపుణ్యంతో చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు, మనుషుల విషయంలో,
యోబు విషయంలో తక్కువ చేయడు గదా. ఈ అధ్యాయంలో మనం గమనించే మరో విషయం
సర్వశక్తిమంతుడైన సృష్టికర్త తాను చేసిన సృష్టిని ఆనందంతో వర్ణిస్తున్నాడు. తన
సృష్టిని గురించి ఆయన హర్షిస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఆదికాండము 1:31, దేవుడు తాను చేసినది యావత్తును
చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. ;
సామెతలు 8:22-31, ;
కీర్తనల గ్రంథము 104:31 యెహోవా మహిమ నిత్యముండునుగాక.
యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక.
సరే, ఇక్కడ మరలా దేవుడు అడవి మేకల కోసం మరియు అడవిలో లేళ్ళు కోసం పరవశించి
చెబుతున్నారు! అవి ఈనే కాలం నీకు తెలుసా అంటూ అవి వంగి నొప్పులతో తమ పిల్లలను
కంటాయి అంటున్నారు. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారులలో పెరుగుతాయి అంటున్నారు.
వాటి తల్లుల దగ్గర లేకపోయినా అవి ఎంతగానో పుష్టిగా ఉంటాయి అంటున్నారు. నేను అయితే
మిమ్మల్ని వదిలే దేవుడిని కాను అనే అర్ధములో చెబుతున్నారు! యెషయా 49 లో దేవుడు
అంటున్నారు 14 అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను
మరచియున్నాడని అనుకొనుచున్నది.
15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన
చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
16 చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ
ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
ఇంకా ఇదే యెషయా 46 లో అంటున్నారు దేవుడు 3 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు
ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని
నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది
మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.
4 ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల
వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను
చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
కాబట్టి దేవుడు ఆ కొండమేకలు లేళ్ళు కోసం పట్టించుకున్న దేవుడు
నిన్ను నన్ను తప్పకుండా పట్టించుకుంటారు అని గ్రహించమని మనవిచేస్తున్నాను!!
ఇక తర్వాత వచనాలలో దేవుడు అడవి గాడిద కోసం చెబుతున్నారు
5 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద
కట్లను విప్పినవాడెవడు?
6 నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి
నివాసస్థలముగాను నియమించితిని.
7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను
అది వినదు.
8 పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని
మొలకను అది వెదకుకొనును
ఇక్కడ అడవిగాడిదకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చారట! దాని కట్లను
విప్పేశారు. అరణ్యాన్ని ఇళ్లుగాను ఉప్పు పర్ర గాను చేశాను అంటున్నారు. పట్టణంలో
గోడవతో దానికి సంబంధం లేదు దానిని తోలేవాడిని కూడా అది లెక్కచేయదు అంటున్నారు!
అయితే ఇదే యోబు 6 లో అంటున్నారు 5 అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు
మేత చూచి రంకెవేయునా? ఇక్కడ అర్ధం వాటికి కావలసిన గడ్డి
ఆహారం నేను సమకూరుస్తాను! వాటికే కాకుండా సమస్త పశు పక్ష్యాదులకు ఆహారం నేనే
సమకూరుస్తాను- నిన్ను కూడా నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తున్నారు ఇక్కడ!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*147వ భాగం*
యోబు 39:9—18
9 గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
10 పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
11 దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
12 అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును
కూర్చునని దాని నమ్ముదువా?
13 నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
14 లేదు సుమీ, అది నేలను దాని గుడ్లను
పెట్టును ధూళిలో వాటిని కాచును.
15 దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు
వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
16 తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును
దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
17 దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి
ననుగ్రహించి యుండ లేదు.
18 అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.
ప్రియులారా! ఇక ఈ 39వ అధ్యాయములో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తాను చేసిన పశు పక్ష్యాదుల కోసం పరవశిస్తూ మాట్లాడుతున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ప్రియులారా!
ఇక తర్వాత వచనాలలో
మొదటగా గురుపోతూ కోసం మాట్లాడుతున్నారు! గురుపోతూ అనగా గొర్రెపోతూ కాదు- పొట్టేలు కానేకాదు!
గురుపోతూ అనగా ఒక అడవి దున్న! వైల్డ్ ఆక్స్ అంటారు
ఇంగ్లీష్ లో! అది నడిచేటప్పుడు పరుగెత్తేటప్పుడు కేవలం ముందుకు
మాత్రమే చూస్తుంది. ప్రక్కలకు వెనుకకు చూడనే చూడదు!
9 గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
10 పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
11 దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
12 అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును
కూర్చునని దాని నమ్ముదువా?
చూడండి
అది నీకు లోబడునా? లేదు
ఎవరికీ లోబడదు! దాని బలము చాలా ఎక్కువ! అయితే దానిని నీ పొలం పనికి గాని మరి ఏ పనికి కూడా ఉపయోగించుకోలేము!
దానికి తెలివిలేదు! కోపమొస్తే మనిషిని పొడిచి పొడిచి
తరుముతుంది!
ఇక తర్వాత దేవుడు తాను చేసిన నిప్పుకోడి కోసం చెబుతున్నారు! అనగా ఆస్ట్రిచ్!
అనేకమంది చూసే ఉంటారు! ఇది పెద్దదైతే నాలుగు నుండి
ఐదు అడుగుల ఎత్తుగా ఉంటుంది. మనిషిని తరిమి తరిమి కొడుతుంది!
13 నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
14 లేదు సుమీ, అది నేలను దాని గుడ్లను
పెట్టును ధూళిలో వాటిని కాచును.
15 దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు
వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
16 తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును
దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
17 దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి
ననుగ్రహించి యుండ లేదు.
18 అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.
దేవుడే సంతోషంగా చెబుతున్నారు దానికి సంతోషం వస్తే రెక్కలతో ఆడిస్తూ గెంటుతుంది. అయితే అది ఎంతమాత్రమూ
దయ వాత్సల్యము గలది కాదు- అది ఏ మాత్రము తెలివిలేకుండా నేలమీద
గుడ్లు పెట్టి వదిలేస్తుంది. దాని గుడ్లు పగిలిపోయినా దానికి
పట్టదు. తమ పిల్లలు కూడా తనవి కానట్లు ఉంటుంది. ఎందుకంటే దేవుడు దానిని తెలివిలేనిదిగాను వివేచన లేనిదానిగాను చేశారు అంటున్నారు!
చివరకు గుర్రమును గుర్రము మీది రౌతును కూడా ఎదురిస్తుంది అంటున్నారు!
ఇక
తర్వాత గుర్రము కోసం మాట్లాడుతున్నారు!
19 గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
20 మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
21 మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును
అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.
22 అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును
ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
23 అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద
గలగలలాడించబడునప్పుడు
24 ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము
విని ఊరకుండదు.
25 బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి
యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
గుర్రానికి నీవు బలము ఇచ్ఛావా అంటున్నారు! జవాబు లేదు! దానికి అందము కలుగజేయడానికి దేవుడే దాని మెడ కప్పడానికి జూలు పెట్టారు!
అది మిడతవలె గంతులు వేస్తుంది. దాని నాసికా రంద్రముల
ద్వారా అనగా ముక్కునుండి వచ్చే ధ్వని ఎంతో భీకరముగా ఉంటుంది. అది మైదానములో యుద్దానికి కాలు దువ్వుతుంది. ఏదైతే మనుషులకు
భయము పుట్టిస్తుందో దానిని వెక్కిరించి భయము లేకుండా ఉంటుంది చివరికి కత్తి ఈటె బల్లెము
లాంటి ఆయుధాలు చూసి వెక్కిరిస్తూ ఉద్దండ కోపముతో పరుగెత్తు తుంది. బాకా నాధము వింటే చాలు యుద్ధ వాసన తెలుసుకుని సంతోషంగా పరుగెత్తుతుంది.
అయితే
దేవునికి ఈ గుర్రాల బలమంటే సంతోషం ఉండదు గాని మనిషి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు
ఎంతో ఆనంద పడతారు!
కీర్తన 147: 10 గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు
నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు.
11 తనయందు భయభక్తులుగల వారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు
యెహోవా ఆనందించు వాడైయున్నాడు.
మరి నీవు చేసే పనులు దేవునికి సంతోషం కలిగిస్తున్నాయా?? నీవు
దేవుని కృప కొరకు కనిపెడుతున్నావా?
ఇక
తర్వాత డేగ మరియు పక్షిరాజు కోసం చెబుతున్నారు!
26 డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
27 పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా?
తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
28 అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును
ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
29 అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
30 దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో
అక్కడనే అది యుండును.
గమనించాలి డేగ వేరు- పక్షిరాజు వేరు!
డేగ అనగా శవాలు పీక్కుని తినే పెద్ద పక్షి! దీనిని
ఇంగ్లీష్ లో హాక్ అంటారు! పక్షిరాజు అనగా గ్రద్దలలో పెద్ద గ్రద్ద!
మనము చూసే సామాన్య గ్రద్దలు కాదు! గ్రద్ద
(Kite) మరియు పక్షిరాజు (Eagle) రెండూ వేటాడే పక్షులే
అయినప్పటికీ, వాటి పరిమాణం, శారీరక బలం
మరియు జీవనశైలిలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. గ్రద్దలు చిన్నవిగా,
పల్లెటూరు మరియు నగరాల్లో ఎక్కువగా కనిపిస్తే, పక్షిరాజు (ఈగిల్) చాలా పెద్దదిగా,
శక్తివంతమైనదిగా ఉండి ఎత్తైన పర్వత శిఖరాలపై నివసిస్తుంది.
నివాసం
& అలవాట్లు: గ్రద్దలు తరచుగా మానవ ఆవాసాలకు
దగ్గరగా, చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి.
పక్షిరాజులు
పర్వతాల పైభాగం, రాతి కొండల వంటి ఎత్తైన, సురక్షితమైన ప్రదేశాలను ఎంచుకుంటాయి.
సరే
ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు- డేగ నీ జ్నానము చేత ఎగురుతుందా? అది
నీ ఆజ్న వలన దక్షిణ దిక్కునకు రెక్కలు చాస్తుందా అని అడుగుతున్నారు! దాని కన్నులు సుమారుగా రెండు కిమీ దూరంలో ఉన్న శవాలు కూడా చూడగలవు!
ఇంకా
పక్షిరాజు కోసం అంటున్నారు అది నీ ఆజ్నకు లోబడి ఆకాశంలో ఎగురుతుందా? తమ గూడును ఎత్తైన చోట
నీ ఆజ్న వలననే కట్టుకుంటుందా అని అడుగుతున్నారు! ఇక దానికోసం
దేవుడే చెబుతున్నారు ఎత్తైన కొండమీద నివాసం చేస్తుంది కొండపెటు మీద ఎవరు ఎక్కలేని ఎత్తైన
చోటను అది గూడు కట్టుకొంటుంది- అక్కడ నుండే అది ఎరను ఎన్నుకుంటుంది
అంటూ ఇవి కూడా రక్తము పీల్చును- శవాలను పీక్కు తింటాయి.
యేసుక్రీస్తుప్రభులవారు కూడా శవము
ఎక్కడ ఉంటుందో గ్రద్దలు కూడా అక్కడే ఉంటాయి అన్నారు ఉపమానాలు చెబుతూ!! మత్తయి 24: 28 పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.
లూకా 17: 36 శిష్యులు ప్రభువా,
యిది ఎక్కడ (జరుగు) నని ఆయన
నడిగినందుకు
37 ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని
వారితో చెప్పెను.
ఈ
అధ్యాయం ఏమని బోధిస్తుంది అంటే మొదటగా దేవుడు తాను చేసిన సృష్టిని మరియు జంతువులను
చూసి ఆనంద పడుతూ వాటికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వారు ఎవరూ? వాటికి తగిన జ్నానమిచ్చి
పోషిస్తున్న నేను మనుష్య జాతిని కూడా పోషించగలను! ఈ సమస్త పశుపక్ష్యాదులను
పట్టించుకున్న నేను మనుషులను కూడా పట్టించుకుంటున్నాను అని చెబుతున్నారు! కాబట్టి దేని విషయమందు కలవరపడకూడదు మనము!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*148వ భాగం*
యోబు 40:1—8
1 మరియు యెహోవా యోబునకు ఈలాగు...ప్రత్యుత్తరమిచ్చెను
2 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా?
దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను.
3 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
4 చిత్తగించుము, నేను నీచుడను,
నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను?
నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
5 ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
6 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను
7 పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు
ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.
8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా?
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
ప్రియులారా! ఇక ఈ 40వ అధ్యాయములో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు!
మధ్యలో యోబుగారు నేను నా నోటిమీద చేయి వేసుకుంటాను అని మాత్రమే చెప్పారు!
ఈ అధ్యాయాలలో దేవుడు యోబుగారిని తూటాల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు!
తాను చేసిన పశు పక్ష్యాదుల కోసం పరవశిస్తూ మాట్లాడుతున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
1 మరియు యెహోవా యోబునకు ఈలాగు...ప్రత్యుత్తరమిచ్చెను
2 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా?
దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.
యోబు తన వాదనను దేవుని ఎదుట వినిపించగోరాడు (యోబు 13:3, నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను
; యోబు 23:4, ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును
విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను). తనను తాను సమర్థించుకొంటూ
చెప్పవలసినది బోలెడంత ఉంది అనుకున్నాడు. అయితే వెనుకటి రెండు
అధ్యాయాల్లో దేవుడు తన మహా జ్ఞానాన్నీ బల ప్రభావాలనూ వెల్లడి చేసి, యోబు జవాబివ్వలేని ప్రశ్నలతో అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇప్పుడు దేవుడు యోబును అడుగుతున్నాడు – దేవునికీ సలహానూ దిద్దుబాటునూ
ఇచ్చేటంత జ్ఞానం యోబుకున్నదా? అలాగైతే ఇప్పుడు దేవునికి అతను
జవాబు చెప్పాలి.
ఇక
యోబుగారి మొదటసారి జవాబులు చూద్దాము!
3 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
4 చిత్తగించుము, నేను నీచుడను,
నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను?
నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
5 ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
ఇక్కడ యోబుగారికి
జవాబు చెప్పే ధైర్యం లేదు. దేవుని న్యాయం
గురించి అతనికి ఎదురైన ప్రశ్నలకు జవాబు దొరక్కపోయినప్పటికీ వాటిని దేవుని సముఖంలో అడగబోవడం
లేదు (రోమీయులకు 9:20). యోబుతో దేవుడు వాడుకొన్న
విధానం ఫలితాన్ని ఇచ్చింది. యోబు ఇక్కడ తన పాపాన్ని గురించి గాని
భ్రష్ట స్వభావాన్ని గురించి గానీ మాట్లాడడం లేదు. తన అల్పత్వాన్నీ,
మహా సృష్టికర్తతో మాట్లాడేందుకు తన అయోగ్యతనూ ఒప్పుకుంటున్నాడు.
యోబును ఓదార్చి దీవించబోయే ముందు దేవుడు అతని విషయంలో సాధించవలసినది
ఇంకా ఉంది. అతని బయటి స్థితిని నయం చేసే ముందు అతని మనోస్థితిని
బాగు చెయ్యవలసి ఉంది. అందుకని యోబుతో మాట్లాడ్డం కొనసాగించాడు.
దేవుడు తన చెంతకు వచ్చి తనతో మాట్లాడుతున్నాడన్న విషయమే దుఃఖంతో బాధలో
ఉన్న ఆ మనిషికి వర్ణనాతీతమైన ఓదార్పును కలిగిస్తూ ఉంది గదా. యోబు
ఇలా అనుకుని ఉండవచ్చు “దేవుడు ఏమి మాట్లాడినా సరే. అసలంటూ ఆయన మాట్లాడుతూవుంటే అదే పది వేలు” (కీర్తనల గ్రంథము
28:1, యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా
ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల
నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును).
సరే ఇక్కడ యోబుగారి జవాబు చూస్తే
చిత్తగించుము నేను నీచుడను- నేను నీకు
ఏమని జవాబు చెప్పగలను- కేవలం ఇక అలాంటి ప్రశ్నలు వేయకుండా నా
నోటిమీద నా చేయి ఉంచుకుంటాను అంటున్నారు. ఇక్కడ తన మాట్లాడిన
మాటలను గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడి తగ్గించుకుంటున్నారు యోబుగారు! తర్వాత అంటున్నారు ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను అంటున్నారు!
వెంటనే
దేవుడు మరలా మాట్లాడుతున్నారు!
6 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను
7 పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు
ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము. ఇక్కడ యోబు
38:3, మరలా అడుగుతున్నారు!
8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా?
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
యోబు చెప్పిన కొన్ని మాటల ధోరణి ఇదే
(యోబు 7:20-21, ; యోబు 9:22-24, ; యోబు 10:3, ; యోబు 19:6-7, ; యోబు
24:12, ; యోబు 27:2, ). యోబుతో వాదన పెట్టుకొన్న
వారు అతని బాధలకు అర్థాన్ని గ్రహించలేదు. పైగా అతని తప్పును ఎత్తి
చూపించి అతణ్ణి గద్దించారు (యోబు 8:3, ; యోబు 15:4, యోబు 15:12-13, ; యోబు
34:5-6, ). ఇప్పుడు దేవుడే దీన్ని అతని ఎదుట ఉంచుతున్నాడు. యోబు పలికిన మాటల్లో ఉన్న ఒక్క తప్పు ఇదే. ఈ ఒక్క విషయంలోనైనా
తన స్నేహితులు అన్నది నిజమేనని యోబు ఒప్పుకోలేదు. కానీ స్నేహితులతో
వాదించింది వేరు, దేవుని ఎదుట నిలబడి వాదించినది వేరు.
ఈ తప్పుకు దేవుడు యోబులో పరివర్తన కలిగించి దాన్ని ఒప్పించనున్నాడు.
దేవుడు మనపట్ల చేసే వ్యవహారాల గురించి మనం ఫిర్యాదులు చేయడం ఆయన అన్యాయం
చేశాడన్నట్టు. అంటే అర్థం మనం ఆయనకంటే మంచివారమని. మనకు ఏ కష్టం వచ్చినా మనం ఆయనమీద పూర్తి నమ్మకం ఉంచాలనీ ఆయన సంకల్పానికి పూర్తిగా
లోబడాలనీ సంపూర్ణంగా ప్రేమ, భక్తి కనుపరచాలనీ మనలను అధికారికంగా
ఆజ్ఞాపించే హక్కు ఆయనకు ఉంది. దేవుని ప్రజలు చెయ్యవలసినది ఆయనను
ప్రశ్నించడం కాదు, మహిమపరచడమే.
ఇది మర్చిపోయి మనము దేవుణ్ణి ఎన్నెన్నో
మాటలంటూ ఉంటాము. అయ్యో మాయదారి దేవుడా
నేనే దొరికానా అంటు ఉంటాము! అలాకాకుండా దేవుణ్ణి మహిమ పరుస్తూ
దేవునికి లోబడి ఉండాలి.
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*149వ భాగం*
యోబు 40:9—14
9 దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా?
10 ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించు కొనుము
గౌరవప్రభావములను ధరించుకొనుము.
11 నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన
వారినందరిని చూచి వారిని క్రుంగ జేయుము.
12 గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు
ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము.
13 కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో
వారిని బంధింపుము.
14 అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను
నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
ప్రియులారా! ఇక ఈ 40వ అధ్యాయములో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు!
తాను చేసిన పశు పక్ష్యాదుల కోసం పరవశిస్తూ మాట్లాడుతున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ఇక
తొమ్మిదవ వచనం నుండి చూసుకుంటే 9 దేవునికి కలిగియున్న బాహుబలము నీకు
కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా?
అంటున్నారు!
అవును
దేవునికి కలిగి ఉన్న బాహుబలము యోబుగారికే కాదు- మానవులకు ఎవరికీ లేదు! అలాగే
దేవునిలా ఉరుము ధ్వని కూడా మనము గర్జించలేము!! ఈ మాటల ఉద్దేశం
యోబుకు ఈ సత్యాన్ని గుర్తు చేసేందుకే – ప్రపంచానికి తీర్పు తీర్చే బలప్రభావాలు యోబుకు
లేవు. అందువల్ల దేవుడు మనుషులకు చేసేవాటిని విమర్శించే జ్ఞానం
కూడా అతనికి లేదు.
తర్వాత
వచనాలలో అంటున్నారు
10 ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించు కొనుము
గౌరవప్రభావములను ధరించుకొనుము.
11 నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన
వారినందరిని చూచి వారిని క్రుంగ జేయుము.
12 గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు
ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము.
13 కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో
వారిని బంధింపుము.
14 అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను
నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
నిన్ను
నీవే ఆడంబరముతోను మహాత్యముతోనూ అలంకరించుకో- గౌరవ ప్రభావాలను వస్త్రములాగా ధరించుకో అంటున్నారు!
నిజానికి దేవునిలా మనము మహిమను ఘనతను ధరించుకోలేము! అందుకే కీర్తన 93 లో భక్తుడు అంటున్నాడు
1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా
ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము
స్థిరపరచబడియున్నది.
ఇక యెషయా గ్రంధంలో అంటున్నారు 59: 17 నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
18 ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా
ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును
తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.
1 దిన 29: 10 రాజైన దావీదుకూడను
బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు
చెల్లించెనుమాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము
నీవు స్తోత్రార్హుడవు.
11 యెహోవా, భూమ్యాకాశములయందుండు
సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును
ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము
నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
12 ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు,
హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.
13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.
మనము కూడా ఇదే విధముగా దేవుణ్ణి స్తుతించాలి.
కారణం ఆయన దేవుడు మనము మనుష్యులము!!
అదేవిధంగా మనము దేవునిలా కోపము ప్రదర్శించి
శత్రువులను అణగదరొక్కలేము. వారిని దుమ్ములో మట్టిలో
పూడ్చి పెట్టలేము! ఒకవేళ మనము అలా చేయగలిగితే దేవుడు అంటున్నారు
నిన్ను నీవు రక్షించుకో గలవు అని నేను నమ్ముతాను అంటున్నారు దేవుడు!
భక్తుడు అంటున్నాడు కీర్తన
44: 3 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి
జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే
వారికి విజయము కలుగజేసెను
దావీదు
భక్తుడు 33 వ కీర్తనలో అంటున్నారు
16 ఏ రాజును
సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
17 రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత
మనుష్యులను తప్పింప జాలదు.
18 వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని
సజీవులనుగా కాపాడుటకును
19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన
కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది.
కాబట్టి
దేవుడు యోబుగారిని అడిగిన ప్రశ్న నిన్ను నన్ను కూడా అడుగుచున్నారు! మనకు సొంతంగా మహిమ ఘనత
ప్రభావము ఏమీ లేదు! మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప మాత్రమే!
అందుకే ఆ ధైవ భక్తులంతా తమను తాము తగ్గించుకుని అయ్యా మేము దీనులము దౌర్భాగ్యులము!
నిష్ప్రయోజనమైన సేవకులము! అందుకే ధూళి లోనూ మంటిలోనూ
మా ముఖములను ఉంచుకున్నాము అన్నారు! నిజానికి పెంట కుప్పలమీద నుండి
దీనులమైన మనలను పైకి లేపి ఈ స్థితికి తీసుకుని వచ్చింది దేవుడే! మన చదువు- ఘనత- భక్తి- ఆస్తి ఐశ్వర్యములు ఎంతమాత్రమూ కాదు! ఈ విషయాన్ని ఎల్లకాలము
గుర్తించుకుని వినయముతో ఆయన సన్నిధిలో మెలుగుదాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*150వ భాగం*
యోబు 40:15—24
15 నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె
అది గడ్డి మేయును.
16 దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు
నరములలో ఉన్నది.
17 దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును
దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.
18 దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క
టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి
19 అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే
దాని ఖడ్గమును దానికిచ్చెను.
20 పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు
అచ్చట ఆడుకొనును.
21 తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను
అది పండుకొనును
22 తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు
దాని చుట్టుకొనియుండును.
23 నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి
ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.
24 అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా?
ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?
ప్రియులారా! ఇక ఈ 40వ అధ్యాయములో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు!
తాను చేసిన పశు పక్ష్యాదుల కోసం పరవశిస్తూ మాట్లాడుతున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ఇక 15 వ వచనం నుండి చూసుకుంటే దేవుడు తాను
చేసిన నీటిగుర్రము కోసము ఎంతో అతిశయ పడుచు దానిని వర్ణిస్తున్నారు!
15 నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె
అది గడ్డి మేయును.
16 దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు
నరములలో ఉన్నది.
17 దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును
దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.
18 దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క
టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి
నీటి గుర్రం అని ఏ జంతువును పిలుస్తారు?
హిప్పోపొటమస్ . హిప్పోపొటమస్లు హిప్పోపొటమిడే కుటుంబానికి చెందినవి. "హిప్పోపొటమస్"
అనే పేరు "నీటి గుర్రం" లేదా "నది గుర్రం" అని
అర్థం వచ్చే గ్రీకు పదం నుండి వచ్చింది. ఇవి సహారా ఉపఖండ ఆఫ్రికాలోని
నదులు మరియు సరస్సుల సమీపంలో నివసిస్తాయి. ఇక్కడ ఈ అధ్యాయంలో
దేవుడు వీటికోసమే చెబుతున్నారు అని గ్రహించాలి!
15వ వచనం నుంచి యోబుకు దేవుడిచ్చిన సందేశమంతటిలో రెండు జంతువుల వర్ణన ఉంది.
దేహంలో, మనస్సులో బాధ అనుభవిస్తూ, వేధించే ప్రశ్నలతో సతమతమౌతున్న మనిషికి ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం మొదట్లో మనకు
వింతగానే అనిపించవచ్చు. అయితే యోబు బాధలకు త్వరలోనే నివారణ అనుగ్రహించబోతున్నానని
దేవునికి తెలుసు. యోబు వేసిన ప్రశ్నలకు జవాబులివ్వడం కంటే మరింత
ప్రాముఖ్యమైన విషయాలున్నాయని కూడా తెలుసు. యోబు హృదయంలో తన పట్ల
సంపూర్ణ అంగీకార భావాన్ని కలిగించేందుకు దేవుడు ప్రయత్నిస్తున్నాడు. యోబు దేవుని జ్ఞానం, మంచితనం, న్యాయాలను
గురించిన ప్రశ్నలను విడిచి ఆయనపై శాశ్వతంగా సంపూర్ణంగా నమ్మకముంచాలని దేవుని ఆశయం.
మనుషులు కొన్ని సార్లు అన్నిటికంటే ముందు తమ ప్రశ్నలకు జవాబులు కావాలనుకుంటారు.
అయితే వారు దేవుని సన్నిధికి వచ్చి నమ్మకంతో ఆయనకు లోబడినప్పుడు తమ ప్రశ్నలు
తాము అనుకున్నంత ముఖ్యమైనవేమీ కాదని తెలుసుకుంటారు. ఇక్కడ వర్ణించబడిన
జంతువు విషయానికొస్తే కొందరు దీన్ని ఏనుగు అనీ మరికొందరు నీటిగుర్రం అనీ అనుకొంటారు.
మరి కొందరి అభిప్రాయమేమంటే ప్రస్తుతం అంతరించిపోయిన మరేదో బ్రహ్మాండమైన
మృగం. ఇక్కడి వర్ణనను బట్టి చూస్తే ఇది ఏనుగు కంటే నీటి గుర్రం
అనుకునేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తున్నది. ఇకపోతే ఇది ప్రస్తుతం
అంతరించిపోయిన సరీసృపాల్లాంటి జంతువు అనుకుంటారు. 19వ వచనాన్ని
బట్టి చూస్తే నీటిగుర్రం కంటే మరింత బ్రహ్మాండమైన జంతువును ఇక్కడ చూపించినట్టుగా అర్థం
కావచ్చునేమో గాని ఇప్పుడు అంతరించిపోయిన జంతువు అని ఖచ్చితంగా చెప్పలేము.
ఇక
దీనికోసము దేవుడు వివరిస్తున్నారు ఏమని అంటే దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము
దాని కడుపు నరములలో ఉన్నది
దేవదారుచెట్టు
కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి, దాని యెముకలు ఇత్తడి
గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి, అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను
అంటున్నారు!
మరి ఇక్కడ నీటి గుర్రము లేక హిప్పోపోటామస్ కి ఖడ్గము ఉంటుందా?
నీటి గుర్రానికి (Hippopotamus) కత్తి ఉండదు.
అది శాకాహార జంతువు, నీటిలో మరియు నేలపై జీవించే
క్షీరదం. అయితే, హిప్పోలు చాలా బలమైన దవడలు
మరియు పదునైన, పొడవైన కోర పళ్ళు కలిగి ఉంటాయి, వీటిని అవి తమ రక్షణ కోసం మరియు ఆధిపత్యం కోసం ఉపయోగిస్తాయీ.
అయితే ఈ అధ్యాయం చివరి వరకు దాని బలమును దాని ఔన్నత్యమును దేవుడు
వివరించారు! అయితే దీనిలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రాచీన
ప్రతులలోనూ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలొ దీనిని behemoth అని వ్రాయడం
జరిగింది. బెహెమోత్ అనేది ఒక భారీ, శక్తివంతమైన
భూచర జీవి. యోబు 40:15–24లో ఇది
దేవుని సృష్టిలోని ఒక ఆదిమ అద్భుత సృష్టిగా వర్ణించబడింది. దీని
నడుము భాగంలో అపారమైన బలం, కంచు గొట్టాల వంటి ఎముకలు,
మరియు దేవదారు వృక్షంలా కదిలే తోక దీని ప్రత్యేకతలు. ఇది దేవుని శక్తిని మరియు మానవ పరిమితిని ప్రదర్శించడానికి ఉపయోగించబడింది,
ఇది అదుపు చేయలేని ప్రకృతి ప్రపంచానికి ప్రతీకగా నిలుస్తుంది
అయితే దేవుడు తన సృజనాత్మక శక్తిని ప్రదర్శించడానికి బెహెమోతును
యోబుకు "దేవుని మార్గాలలో ప్రధానమైనది" అని వర్ణించాడు.
దీనిని తరచుగా సర్వోన్నత ప్రాచ్య పురాణాలలోని సర్వోన్నత ప్రాపంచిక
శక్తికి చిహ్నంగా లేదా ఒక "అరాచక రాక్షసుడి"గా పరిగణిస్తారు
అయితే దీనిని పౌరాణిక మృగం అనికూడా అనవచ్చు : మరికొందరు దీనిని లెవియాథన్తో జత చేయబడిన ఒక ప్రతీకాత్మక, ఆదిమ, అస్తవ్యస్తమైన మృగంగా భావిస్తారు. యూదుల సంప్రదాయంలో,
భూమికి సంబంధించిన ప్రతిరూపంగా దీనిని తరచుగా సముద్ర జీవి అయిన లెవియాథన్
(యోబు 41) తో జతచేస్తారు. తరువాతి యూదు సంప్రదాయంలో, అంతిమ కాలంలో బెహెమోత్ మరియు
లెవియాథాన్ పోరాడుతున్నట్లుగా తరచుగా చిత్రీకరించబడింది. దీనినే
ఈజిప్టు దేశాన్ని ఏలే ఒక అదృశ్య శక్తి లేక అంధకార శక్తి అని కూడా అన్నారు! దీనిని మకరము అనగా మొసలి తోను కూడా బైబిల్ గ్రంధంలో ముఖ్యంగా యెషయా మరియు ఈ
యోబు గ్రంధంలో పోల్చారు! అయితే అనేకులు దీనిని హిప్పోపోటోమాస్
అంటారు. గాని దాని తోక మరియు కత్తి కోసం వ్రాసినవి దీనితో సరిపోవడం
లేదు!
ఏది ఏమైనా ఇది దేవుని శక్తిని మరియు మానవ పరిమితిని ప్రదర్శించడానికి
వివరించడం జరిగింది అని గ్రహించాలి!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*151వ భాగం*
యోబు 41:1—9
1 నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
2 నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
3 అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
4 నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది
నీతో నిబంధనచేయునా?
5 నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా?
నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?
6 బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా?
7 దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
8 దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు
జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.
9 దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న
ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.
ప్రియులారా! ఇక ఈ 41వ అధ్యాయములో కూడా దేవుడే మాట్లాడుతున్నాడు!
తాను చేసిన పశు పక్ష్యాదుల కోసం పరవశిస్తూ మాట్లాడుతున్నారు!
తద్వారా మనకు కూడా ఎన్నో ఆత్మీయ మర్మాలు చెబుతున్నారు!!
ప్రియులారా ఈ 41 వ అధ్యాయం మొత్తం తాను చేసిన మొసలి కోసం దేవుడు మాట్లాడుచున్నారు!
1 నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
2 నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
ఇక్కడ ఈ మొసలిని కూడా లివియటాన్ అనే ప్రాచీన ప్రతులలో చెప్పడం
జరిగింది. ఈ లివియటాన్ కోసం అనేకసార్లు చూసుకున్నాము!
సరే, మొసలి కోసం దాని గుణగనాలు కోసం దేవుడు చెబుతున్నారు
ఈ అధ్యాయం మొత్తం!
ఈ జంతువు గురించి కూడా అనేకమైన ఊహాగానాలున్నాయి. బైబిలు
విధ్వాంసులు ఇది మహా మొసలి అని అభిప్రాయపడ్డారు. ఇక్కడి వర్ణన
పూర్తిగా పద్య రూపంలో ఉంది. ఈ రెండు అధ్యాయాల్లో కనిపించే మృగాలు
ఖచ్చితంగా ఏవేవో తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యమేమిటంటే దేవుడు యోబుకు (మనకు కూడా) ఇస్తున్న సందేశమే. 10,11 వచనాల్లో దేవుని మాటల్లోని సారాంశం
కనిపిస్తూ వుంది. దేవుడు సృష్టించిన జీవుల ఎదుట నిలబడేందుకే భయపడేవారు
అన్నిటినీ సృష్టించిన దేవుని ఎదుటే నిలబడడం మామూలు విషయంగా భావించకూడదు. ఏ వ్యక్తీ దేవుణ్ణి గదమాయించి ఏదీ అడగలేడు. దేవుడెవరికీ
అచ్చి లేడు. మనుషులంతా, వస్తు వాహనాలన్నీ
ఆయన ఆస్తే. తన మార్గాల గురించి ఆయన ఎవరికీ సంజాయిషీ ఇవ్వనక్కరలేదు.
రోమీయులకు 11:33-35,
33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల
బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు;
ఆయన మార్గములెంతో అగమ్యములు.
34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?
35 ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము
పొందగలవాడెవడు?
సరే, మోసలికి గాలం వేసి దానిని బయటకు లాగా గలవా అని ప్రశ్నిస్తున్నారు!
దాని నాలుకకు నీవు త్రాడు గుచ్చ గలవా? ఇంకా దాని
ముక్కుకు తాడు గుచ్చి లాగగలవా అలా చేసి దానితో నిన్ను దయచూపు మహాప్రభో అని దానితో అనిపించ
గలవా అంటున్నారు! మిగిలిన పశు పక్ష్యాదులతో ఆదుకున్నట్లు నీవు
దానితో ఆడుకోగలవా అంటున్నారు! చేపలు పట్టేవారు మొసలితో వ్యాపారం
చేయగలరా అంటున్నారు! వీటి అన్నింటికీ జవాబు- చేయలేము!!
ఇంకా దాని శరీరం గుండా శూలములు గుచ్చగలవా అంటున్నారు! దానిమీద
చేయివేసి చూడు- అప్పుడు దానితో కలిగే పోరు నీ జీవితంలో ఎప్పటికీ
మర్చిపోలేవు అంటున్నారు! ఒకవేళ అది పడుకుంటే దానిని లేపే సాహసం
ఎవరు చేయలేరు అంటున్నారు!
ఇక 13 వ వచనం నుండి దానిమీద
కవచాన్ని ఎవడు తీసివేయగలడు అని సూటిగా అడుగుతున్నారు! అవును అది
ఏ మనుషుడు దానిమీద ఉన్న కవచం లాంటి తోలును తీయలేరు! దాని రెండు
దవడల మద్య ఎవడైనా తన ముఖాన్ని పెట్టగలడా అని అడుగుచున్నారు! ఈ
మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశాను- పెంపుడు మొసలి నోరు
తెరిచి కొంతమంది దాని మధ్యలో ముఖాన్ని పెట్టి స్టంట్ లు చేశారు! అయితే అదే మొసలి ద్వారా వారిలో అనేకమంది చనిపోయినట్లు చూడగలం!! ఇంకా దానికోసం ఎంతెంతో వ్రాయబడి ఉంది! అది ఖడ్గమునకు
భయపడదు అంటూ- బాణం చూసి పారిపోదు అంటూ! ఇక 33 వ వచనంలో అంటున్నారు 33 అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు
లేదు.
34 అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి
అది రాజు.
దీన్ని
“గర్వమున్న వాటన్నిటికీ అది రాజు” అని కూడా అనువదించవచ్చు.
యోబు, అతని నలుగురు స్నేహితుల వివాదం సందర్భంలో,
వారందరి మాటల్లోనూ కొన్ని కొన్ని సమయాల్లో తొంగి చూచిన గర్వాన్ని తలుచుకుంటే
ఇక్కడ దేవుడు గర్వాన్ని గురించి మాట్లాడ్డంలో అర్థం లేకపోలేదు. భూమిమీద ఉన్న జీవులలో వీటికి ఏవీ సాటిరాదు అని దేవుడే అంటున్నారు!
అయితే
ముగించేముందు ఈ అధ్యాయములో గల ముఖ్య వచనాలు చూసుకుందాం!
10 దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?
11 నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను
ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
అది పడుకుంటే లేపగలిగే ధైర్యమే ఎవరికీ
లేదు అలాంటప్పుడూ దానిని చేసిన నా ఎదుట నిలువడానికి ఎవడికి దమ్ము ధైర్యం ఉంది అని సవాలు
విసురుతున్నారు! ఎవడైనా మరలా ఇవ్వు అంటూ
దేనినైనా నాకు అప్పగించారా అంటున్నారు! ఆకాశ వైశాల్యమంతా క్రింద
ఉన్నదంతా నాదే గదా అంటున్నారు!
ఇదే
మాట ద్వితీ 10:14 లో అంటున్నారు
14 చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు
నీ దేవుడైన యెహోవావే
కీర్తన 24: 1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును
దాని నివాసులును యెహోవావే.
50: 8 నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు
నిత్యము నాయెదుట కనబడుచున్నవి.
9 నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను
నేను తీసికొనను.
10 అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా
11 కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని
పశ్వాదులు నా వశమై యున్నవి.
12 లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
కాబట్టి
దేవునీతో వాదించేవాడు ఎవరూ లేరు- ఆయన చేయిపట్టి నీవు ఏం చేస్తున్నావు అని అడిగే దైర్యము ఎవరికీ
లేదు
యెషయా 45: 9
మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి
శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా?
వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
10 నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ
నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.
కాబట్టి
దేవుని క్రియల కోసం ఆయన ప్రభావ బలముల కోసం దేవుణ్ణి ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికీ
లేదు- అడిగితే
జవాబు చెప్పాల్సిన అవసరం కూడా దేవునికి లేదు! కాబట్టి
10,11 వచనాల్లో దేవుని మాటల్లోని సారాంశం కనిపిస్తూ వుంది. దేవుడు సృష్టించిన జీవుల ఎదుట నిలబడేందుకే భయపడేవారు అన్నిటినీ సృష్టించిన
దేవుని ఎదుటే నిలబడడం మామూలు విషయంగా భావించకూడదు. ఏ వ్యక్తీ
దేవుణ్ణి గదమాయించి ఏదీ అడగలేడు. దేవుడెవరికీ అచ్చి లేడు.
మనుషులంతా, వస్తు వాహనాలన్నీ ఆయన ఆస్తే.
తన మార్గాల గురించి ఆయన ఎవరికీ సంజాయిషీ ఇవ్వనక్కరలేదు. ఈ విషయం గ్రహించి మనము యోబుగారిలాగా దేవుణ్ణి ప్రశ్నించ కుండా ఆయనకు లోబడి
ఉందాము!
దైవాశీస్సులు!!!
*యధార్ధవంతుడైన యోబు*
*152వ భాగం*
యోబు 42:1—6
1 అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను
2 నీవు సమస్తక్రియలను చేయగలవనియునీవు ఉద్దేశించినది ఏదియు
నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
3 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు?
ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను
గూర్చి మాటలాడితిని.
4 నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము
ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.
5 వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే
ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.
6 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
ప్రియులారా! ఈ అధ్యాయములో యోబుగారి జవాబు చూడగలము మరియు దేవుని తీర్పులు యోబుగారి స్నేహితులమీద
చూడగలము ఇంకా దేవుడు రెట్టింపు ఆశీర్వాదముతో ఏ విధముగా యోబుగారిని దీవిస్తున్నారో కూడా
చూడగలము!
సరే, మొదటగా 38 నుండి 41 అధ్యాయాలలో దేవుడు సంధించిన ప్రశ్నలకు జవాబుగా
యోబుగారు ఏమంటున్నారో చూసుకుందాము!
1 అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
2 నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది
ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
3 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు?
ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను
గూర్చి మాటలాడితిని.
చూడండి దేవా నీవు సమస్త క్రియలు చేయగలవు అనియు నీవు ఏవైతే చేయాలని
అనుకున్నావో అవి తప్పకుండా జరిగి తీరుతాయని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అంటున్నారు. దేవుడు
తాను కోరుకున్న ఏ పథకాన్నైనా ఏర్పాటైనా ఆలోచించి అమలు జరపగలడని పూర్తిగా అర్థం చేసుకున్నారు
ఇక్కడ యోబుగారు.
ఈ పాఠాన్ని అతడు ప్రకృతి గురించి దేవుడిచ్చిన సందేశంవల్ల నేర్చుకున్నాడు.
ఇప్పుడు దాన్ని తన పరీక్షలకూ బాధలకూ వర్తింపజేసుకొంటున్నాడు.
తర్వాత 3 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు?
ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను
గూర్చి మాటలాడితిని అంటున్నారు!
ఈ వచనం మొదటి భాగం యోబు
38:2, లో దేవుడు అన్న మాటలే. యోబు ఆ మాటలను నెమరువేసుకుంటూ
వాటిని తనకు వర్తింపజేసుకొంటున్నాడు. అక్కడ మాట్లాడినవారంతా ఏమి
ఒప్పుకోవలసి ఉందో యోబు దాన్ని ఒప్పు కుంటున్నారు. దేవుని గురించీ
దేవుని విధానాల గురించీ వాదించేవారంతా దీన్ని ఒప్పుకోవలిసిందే. తమ ఊహలకు అతి దూరంగా అతీతంగా ఉన్న రహస్య సత్యాల గురించి మనుషులు తేలికగా అంతా
తెలిసినట్టుగా మాట్లాడేస్తారు. వారికి దేవుని దీవెనలు కావాలంటే
యోబులాగా తమను తాము తగ్గించుకొని దీన మనస్కులై వినయంతో తమ మూర్ఖత్వం విషయం పశ్చాత్తాపపడాలి.
నేను మట్టిని ధూళిని అంటూ ఒప్పుకుని దేవుని ఆమోఘమైన బలప్రభావాలను కీర్తించాలి!
ఇక
తర్వాత వచనంలో అంటున్నారు 4 నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము
ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.
యోబు 38:3, ; యోబు
40:7, లో తనను ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాటలను అనగా పౌరుషము తెచ్చుకుని
నడుము బిగించుకుని నా ప్రశ్నలకు జవాబు చెప్పు అనే మాటను గుర్తుకు తెచ్చుకుని ఇక్కడ
మాట్లాడుతున్నారు అని అర్ధమవుతుంది! రాబోయే రెండు వచనాలు తప్ప
జవాబుగా ఇచ్చేందుకు తన దగ్గర ఏమీ లేదని యోబుకు తెలిసివచ్చింది. ఇప్పుడు అతని దగ్గర ప్రశ్నలేమీ లేవు.
5 వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే
ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.
6 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
మొదటగా వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను- ఇప్పుడు
నిను నేను కన్నులారా చూస్తున్నాను!
ఇక్కడ బహుశా గాలివాన మబ్బుల్లో దేవుడు ఒక ఆకారంగా ప్రత్యక్షం
అయి ఉండవచ్చు, ఉండకనూ పోవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ
యోబుగారి మాటలకు అర్థం కేవలం ఏదైనా దేవుని రూపాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని కాదు.
ఒక జ్ఞాన ప్రకాశాలు గల మనస్సు అంటే మనో నేత్రాలు వెలుగొందడం గురించి
ఇక్కడ మాట్లాడుతున్నారు. యోబులో పశ్చాత్తాపం కలుగజేసినది ఎవరైనా
అతని ఎదుట ఉంచిన వాదం కాదు. మరేదైనా సత్యమూ కాదు గాని అతనికి
సరిక్రొత్తగా మరింత లోతుగా దేవుని గురించిన అనుభవం కలగడం. దేవుని
పట్ల విధేయత నేర్చుకున్న మనుషులందరి విషయమూ ఇంతే. మనస్సుకు అందిన
సత్యాలు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రకాశం, అనుభవాలతో కూడిన
గంభీరమైన జ్ఞానంగా మారతాయి. అయితే మరొక విధంగా చూసుకుంటే యోబుగారు
పలికిన రెండు విశ్వాస పూర్వకమైన మాటలకు ఫలితంగా దేవుడే ఇక్కడ యోబుగారికి ప్రత్యక్షమైనట్లు
మనము చూడవచ్చు!
మొదటిది నా విమోచకుడు సజీవుడు- నేను ఆయనను
తప్పకుండా చూస్తాను. రెండు శోధించబడిన పిమ్మట నేను సువర్ణము వలె
మారుతాయను!
యోబు 19: 25 *అయితే నా విమోచకుడు సజీవుడనియు,
తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.*
26 *ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను
దేవుని చూచెదను.*
27 *నామట్టుకు నేనే చూచెదను.మరి
ఎవరును కాదు నేనే కన్నులార ఆయననుచూచెదను* నాలో నా అంతరింద్రియములు
కృశించియున్నవి
ఇక్కడ
యోబుగారి నిరీక్షణకు ప్రతిఫలం కనిపిస్తుంది మనకు! యోబుగారికి ఉన్న ఈ స్థిరమైన విశ్వాసము
ప్రతీ విశ్వాసి తప్పకుండా కలిగి ఉండాలి అని యోబుగారి చరిత్ర మనకు దృవీకరిస్తుంది!
తర్వాత
6 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను
పడి పశ్చాత్తాపపడుచున్నాను.
ఈ వచనం మొదటి భాగంలో యోబు ఏవగించుకొంటున్న విషయం ఏమిటో కనిపించదు. హీబ్రూ
భాషలో “నేను ఏవగించుకొంటున్నాను” లేక
“నేను త్రోసిపుచ్చుతున్నాను” అని అర్థమిచ్చే మాట
ఉంది. గతంలో తన అభిప్రాయాలనూ ఫిర్యాదులనూ ఏవగించుకొంటున్నాడా?
తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఏవగించుకొంటున్నాడా? లేక పరిత్యాగం వహించి తన్నుతాను తిరస్కరించుకొంటున్నాడా (లూకా 9:23, లో లాగా)? బహుశా ఇవన్నీ
అయి ఉండవచ్చు. దేవుని సన్నిధిని విధేయతతో రుచి చూచిన మనిషికి
ఇక తన గురించి గానీ తన అభిప్రాయాలు, చర్యలు, ఇంతకు ముందు సాధించిన ఆధ్యాత్మిక విజయాలు మొదలైన వాటి గురించి గానీ ఉన్నతమైన
అంచనాలుండవు. యోబుగారు పశ్చాత్తాప పడ్డారు. దేన్ని గురించి? గతంలో తాను అనుసరించిన న్యాయబద్ధమైన
జీవితం గురించా? కాదు. ఆ జీవితం గురించి
పశ్చాత్తాపపడవలసిన పని ఉన్నట్టు లేదు. ఆ జీవితానికి సంబంధించిన
ఏ విషయం గురించీ దేవుడు అతణ్ణి మందలించలేదు. తన సాటివారి ఎదుట
యోబును న్యాయవంతుడుగా దేవుడు నిలబెట్టిన విధానాల్లో ఇదొకటి. యోబు
పశ్చాత్తాప పడుతున్న విషయమేమంటే దేవుని న్యాయం గురించి తాను పలికిన తెలివితక్కువ మాటలు.
తన బాధలు, సందేహాలు, దేవునికి
విరోధంగా ఒక్క ఫిర్యాదునైనా తన నోటి నుంచి వచ్చేందుకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నాడు.
ధూళి, బూడిద సంపూర్ణ పశ్చాత్తాపాన్ని సూచిస్తున్నాయి.
అప్పటి వరకు శారీరకంగా అతను బూడిదలో కూర్చున్నాడు (యోబు 2:8, ). ఇప్పుడైతే ఆధ్యాత్మికంగా అలా కూర్చున్నారు.
మనము కూడా మన జీవితంలో కలిగిన వేదన శోధనలకు మనము దేవునిమీద పలికిన
ప్రతీ ఆలోచన లేని మాటల కోసం, దేవుడు నన్ను చూస్తున్నాడా?
చూస్తే ఎందుకు నాకీ శ్రమలు శోధనలు అని పలికిన మాటలకు మనము కూడా పశ్చాత్తాప
పడుతూ దేవుని సన్నిధిలో మౌనిగా ఉండాలి!
దైవాశీస్సులు!
*యధార్ధవంతుడైన యోబు*
*153వ భాగం*
యోబు 42:7—10
7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన
ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది
పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది
8 కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని,
నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను.
అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను;
ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక
లేదు.
9 తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన
బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా
తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.
10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు
పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
ప్రియులారా! ఇక ఈ భాగములో దేవుడు మాట్లాడుతూ తీర్పులు చెబుతున్నారు యోబుగారి ముగ్గురి స్నేహితులకు
విరోధముగా! ముఖ్యంగా తేమానీయుడైన ఎలీఫజుతో ఎందుకంటే తనకుతాను
యోబుగారి స్నేహితుల అందరికీ పెద్దగా ఊహించుకుని వారి తరుపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడాడు
కదా అందుకు మొదటగా తేమానీయుడైన ఎలీఫజుతో మాట్లాడుతున్నారు దేవుడు!
7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన
ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది
పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది
దేవుడు ఇప్పుడు అతణ్ణి “ధూళి,
బూడిద”లో నుండి లేపి అతని స్నేహితుల ఎదుట అతణ్ణి
న్యాయవంతుడుగా చూపాడు. యోబును తన సేవకుడుగా సంబోధిస్తున్నాడు
– 7,8 వచనాల్లో 3 సార్లు.
ఆ ఆలోచన తనకెంతో ఆనందం ఇస్తున్నట్టు దాన్నే ఒత్తి పలుకుతూ ఉన్నాడు దేవుడు.
ఆయన యోబు మిత్రులను అలా పిలవలేదు. వారిమీద తాను
కోపంగా ఉన్నానన్నాడు. యోబు మీద కోపంగా ఉన్నాననలేదు. యోబు తనతో సరిగా మాట్లాడాడు. వారు అలా మాట్లాడలేదు అన్నాడు.
యోబు సరిగ్గా మాట్లాడిన విషయం ఏమిటి? ఈ వాక్యంలో
కనిపించే ఒక హీబ్రూ పదాన్ని ఏ విధంగా అనువదించాలి అన్న విషయం మీద పండితుల అభిప్రాయాలు
కొంతవరకు ఈ సందర్భంలో ఆధారపడి ఉన్నాయి. కొందరు ఇలా అనువదించారు:
“నా సేవకుడైన యోబులాగా నా గురించి మీరు సరిగా మాట్లాడలేదు”; మరికొందరు “నాతో మీరు సరిగా మాట్లాడలేదు” అని అనువదించారు. హీబ్రూ మూలాన్ని రెండు విధాలుగానూ అనువదించవచ్చు.
కానీ ఈ సందర్భానికి రెండో అనువాదమే సరి అని నా ఉద్దేశం. యోబు తన మిత్రులతో వివాదంలో మాట్లాడిన విధానం గురించి కాదు గాని యోబు
40:3-5, ; యోబు 42:1-6, లో దేవునితో మాట్లాడిన
విధానం గురించే దేవుడు అతణ్ణి మెచ్చుకున్నాడు అనుకుంటాను. ఆ వచనాల్లో
యోబు తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ, దేవుణ్ణి గురించి గానీ దేవునితో
గానీ మాట్లాడేందుకు తన అసమర్థత, అయోగ్యతలను ఒప్పుకున్నాడు.
తాను మాట్లాడిన వాటి విషయంలో పశ్చాత్తాపపడ్డాడు. అతని స్నేహితులు ఇలా చేయలేదు. వారు పలికిన మాటల్లో ఎంత
పొరపాటున్నదో, యోబులాగానే దాన్ని ఒప్పుకోవడం ఎంత అవసరమో బహుశా
ఈ క్షణం వరకు గ్రహించి ఉండరు. యోబు పశ్చాత్తాపాన్నీ అపరాధాన్ని
ఒప్పుకున్న విషయాన్నీ దేవుడు మెచ్చుకొని ఆమోదించాడు. యోబు పొరపాట్లనీ
వాటి గురించి పశ్చాత్తాపపడాలనీ తానే గ్రహించగలిగిన మాటలు పలికినందుకు దేవుడు అతణ్ణి
మెచ్చుకొని ఉంటాడా? కాదు గానీ తాను తప్పుగా మాట్లాడానని యోబు
ఒప్పుకున్న సంగతి దేవునికి ప్రీతికరమైనది. నేడు చాలామంది వేదాంతులూ,
తత్వవేత్తలూ (దేవుణ్ణి గురించి వాదులాడుకునే సామాన్య
ప్రజ కూడా) ఈ విధంగా ఒప్పుకోవలిసిందే. వారు
తమ అజ్ఞానాన్ని గ్రహించి అంగీకరించి దేవుణ్ణి గురించి తాము పలికిన లోపభూయిష్టమైన తప్పుడు
సిద్ధాంతాల గురించి పశ్చాత్తాపపడేవరకు వారు దేవుని దీవెనలను చూడలేరు.
అందుకే
ఇప్పుడు దేవుడు అంటున్నారు యోబుగారి స్నేహితులతో 8 కాబట్టి
యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు
పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన
యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును
శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా
నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
9 తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన
బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా
తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.
యోబు స్నేహితుల మెడలు వంచి యోబును న్యాయవంతుడుగా వారి ముందు
ప్రదర్శించేందుకు ఇంతకంటే మంచి పద్ధతి ఉందా? యోబుగారు ఇక్కడ ఒక యాజకునిలా మధ్యవర్తిలాగా వారి పక్షంగా విజ్ఞాపన
చెయ్యనిదే దేవుడు వారిని స్వీకరించడు. వారు మూర్ఖత్వం,
లేక దుర్మార్గం అనే రెండు పాపాల్లో ఒక దానిలో పడ్డారు. (హీబ్రూ మాటకు ఈ రెండు అర్థాలూ ఉన్నాయి). కానీ యోబు దేవుని
సేవకుడు. వారు యోబును దోషి అన్నారు. అయితే
ఇప్పుడు వారే దోషులుగా నిలబడవలసి వచ్చింది. అప్పుడు స్నేహితులు
బలులు తెచ్చారు- యోబుగారు వారి పక్షముగా ప్రార్ధించారు వెంటనే
దేవుడు వారిని క్షమించారు!
ఇక తనమిత్రులు దేవునికి లోబడేందుకు సంసిద్ధులు కావడం చాలా మంచి విషయం. వారు యోబు మీద క్రూరంగా
తప్పుగా నేరారోపణ చేసినవారైనా యోబు వారిని క్షమించి వారికోసం ప్రార్థించేందుకు సిద్ధంగా
ఉన్నాడు (మత్తయి 5:44, ; లూకా
6:28, ; లూకా 23:34, ; అపో. కార్యములు 7:60, ; రోమీయులకు 12:14, ; 1 పేతురు 3:9, పోల్చిచూడండి). యోబు
గ్రంథం అంతటిలోనూ మిత్రులు యోబుకోసం ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు. వారలా ప్రార్థించి ఉంటే వారి మాటలు వేరుగా ఉండేవి.
ఇక
తర్వాత వచనం 10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు
పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
ఇదీ అసలు మజా! జాగ్రత్తగా పరిశీలిస్తే యోబుగారి
స్నేహితులు పలికిన మాటలకు దేవుడు వారిని శిక్షిస్తూ మీకు పాప క్షమాపణ దోష నివారణ కావాలంటే
బలులు అర్పించమన్నారు- అర్పించిన తర్వాత యోబుగారు ప్రార్ధన చేస్తే
నేను మిమ్మును అంగీకరిస్తాను అనగా క్షమిస్తాను అన్నారు! దేవుడు
వారిని క్షమించారు! అయితే బలులు అర్పించినది స్నేహితులు-
దీవెనలు మరియు రెట్టింపు ఆశీర్వాదము కలిగింది యోబుగారికి! హల్లెలూయ!! దేవుడు
చేసే కార్యాలు ఇలాగే ఆశ్చర్యకరముగా ఉంటాయి! బలులు అర్పించిన వారికే
ఆశీర్వాదాలు రావాలి! గాని దానికి కారకుడైన యోబుగారికి ఇక్కడ రెట్టింపు
ఆశీర్వాదం కలిగింది.
*మరో విధంగా
చెప్పాలంటే యోబుగారికి రెట్టింపు ఆశీర్వాదము మరియు తన వ్యాధికి విడుదల బాధలకు విముక్తి
ఎప్పుడు లభించింది?* *యోబుగారు తన స్నేహితులు ఎన్నో కానిమాటలు
పలికినా దేవుడు వారి పక్షాన ప్రార్ధన చేయు అని చెబితే కన్నీటితో వారిని క్షమించి వారి
క్షేమం కోసం మనస్పూర్తిగా ప్రార్ధన చేశారాయన! అప్పుడే యోబుగారికి
మొదట క్షేమము ఆరోగ్యము కలిగాయి- తర్వాత రెట్టింపు ఆశీర్వాదం కలిగింది.
ప్రియ చదువరీ నీకు కూడా క్షేమము ఆరోగ్యము ఆశీర్వాదం కావాలంటే యోబుగారిలా
మొదట నీ శత్రువులను మిత్రువులను క్షమించాలి! తర్వాత వారి క్షేమము
కోసం హృదయపూర్వకంగా ప్రార్ధన చేయాలి! ఆటలు చేయగలిగితే నీవు కూడా
యోబుగారిలా దీవించబడ గలవు!! హల్లెలూయ!*
అయితే
యోబును గౌరవించిన మరో విధానం అతణ్ణి మళ్ళీ సంపన్నుడుగా చెయ్యడం. తనకు యోబు పట్ల ఉన్న
ప్రేమను అతని స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగువారు,
లోకమంతా గుర్తించగలిగే రీతిలో బట్టబయలు చేశాడు. పాత నిబంధన కాలంలో
తరచుగా దేవుడు తన విశ్వాసులను ఇహలోక భాగ్యాలతో దీవించేవాడు. అయితే
ఇప్పటి క్రొత్త నిబంధన కాలంలో విషమ పరీక్షలలో విశ్వసనీయత చూపిన విశ్వాసులను ధనవంతులను
చేయడం ద్వారా ఫలితం ఇవ్వక పోవచ్చు. క్రైస్తవులు తమ యోగ్యతకు రుజువు,
బహుమతులు రాబోయే లోకంలో వస్తాయని ఆశాభావంతో ఎదురుచూడాలని కొత్త నిబంధన
నేర్పుతుంది, ఈ లోకంలో కాదు. క్రీస్తు కోసం
నష్టాన్నీ బాధనూ భరించడం, వారిపట్ల ఉన్న దేవుని దయకు సంపదలు పొందడం
కంటే మిన్న అయిన గుర్తు (మత్తయి 6:19-21, ; లూకా 6:20-23, ; లూకా 12:33-34, ; లూకా 18:22, ; 1 తిమోతికి 6:6-9, 1 తిమోతికి 6:18, 1 తిమోతికి 6:19, ; హెబ్రీయులకు 10:32-37, ; 1 పేతురు 4:12-16,
). క్రీస్తు రెండో సారి వచ్చేటప్పుడు అన్నీ సరి అవుతాయి. హల్లెలూయ!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!!
*యధార్ధవంతుడైన యోబు*
*154వ భాగం*
యోబు 42:11—17
11 అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును
అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట
అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి
యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి
ఇచ్చెను.
12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా
ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱలును ఆరువేల ఒంటెలును
వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.
13 మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును
కలిగిరి.
14 అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా
అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.
15 ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు.
వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
16 అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి,
తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
17 పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
ప్రియులారా! ఇక ఈ భాగములో యోబుగారు తన పూర్వపు స్తితిని పొందుకోవడమే కాకుండా తన బందుమిత్రులు
మరలా తన దగ్గరకు రావడం ముఖ్యంగా దేవుడు యోబుగారికి పోగొట్టుకున్న పిల్లలను పోగొట్టుకున్న
ఆస్తి ఐశ్వర్యము ఘనత మరలా పొందుకోవడం చూడగలము!
11 అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును
అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట
అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి
యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి
ఇచ్చెను.
చూడండి- ఇది నిజానికి తన భాధలకు
జవాబు ఇది! యోబు 19:13-14
13 ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు
నాకు కేవలము అన్యులైరి.
14 నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు
నన్ను మరచిపోయియున్నారు.
అక్కడ అలా బాధ పడ్డారు కాబట్టి దేవుడు ఇప్పుడు మరలా బంధువులను
యోబుగారి కాళ్ళ దగ్గరకు రప్పించారు! అయితే గమనించాలి- ఈ బంధువులు మిత్రులు అందరూ మన దగ్గర ధనము ఆస్తి బలము ఉన్నప్పుడే వస్తారు గాని
మన దగ్గర ఈ మూడు లేకపోతే మనలను పలకరించేవారు ఉండరు. యోబుగారికి
కూడా అలాగే అయ్యింది తన ఆరోగ్యము ఐశ్వర్యము సమస్తము కోల్పోయినపుడు ఎవరూ రాలేదు సరికదా
యోబుగారిని ఒక నేరస్తుడు అన్నట్లు మాట్లాడారు! అయితే దేవుడు దర్శించి
ఆస్తి ఐశ్వర్యము ఆరోగ్యము ఇచ్చాక అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును అంతకుముందు
అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు
పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి
దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి ఇదీ మానవుల సామాన్య నైజము!
అయితే మన దేవుడు ఎవరు విడిచిపెట్టినా విడువడు ఎడబాయడు! హల్లెలూయ!
ఇక
తర్వాత 12
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.
అతనికి పదునాలుగువేల గొఱ్ఱలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి
ఆడుగాడిదలును కలిగెను.
13 మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును
కలిగిరి.
14 అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా
అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.
15 ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు.
వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
చూడండి దేవుడు శోధించిన తర్వాత సాతాను గాడిని ఓడించిన తర్వాత రెట్టింపు
ఆశీర్వాదాలతో దేవుడు నింపుతున్నారు ఇక్కడ! దేవుడు యోబుగారిని శోధనలకు
అనుమతిని ఇచ్చాక దేవుడు వదిలేసే దేవుడు కానేకాదు! వడ్డీతో సహాయ
ఇచ్చే దేవుడు! ఇక్కడ వడ్డీ కూడా కాదు రెట్టింపు ఆశీర్వాదాలతో
నింపుతున్నారు దేవుడు!
మొదట 7000 గొర్రెలే – ఇప్పుడు
14000
మొదట 3000 ఒంటెలే – ఇప్పుడు
6000
మొదట 500 జతల ఎడ్లు- ఇప్పుడు
1000 జతల ఎడ్లు!!
మొదట 500 ఆడ గాడిదలు- ఇప్పుడు
1000! ఈ విధంగా దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు ఇదీ దేవుని స్టైల్!!!
ఇక సంతానము విషయంలో మరలా ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతురులు కలిగారు! కొడుకులు
పేర్లు వ్రాయబడలేదు గాని కూతుర్ల పేరులు వ్రాయబడ్డాయి. వారంతా
చాలా చాలా అందమైన వారు అని దేవుడు చెబుతున్నారు! పెద్దదానికి
యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను
సరే ముగించే
ముందుగా మా సంఘములో జరిగిన ఒక సరదా సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఇది బహుశా నా నాలుగో తరగతి అనగా సుమారుగా
1984లో అనుకుంటాను జరిగింది. మా సంఘములో ఒక తాతగారు
ఉండేవారు- మంచి విశ్వాసి- 80 సంవత్సరాల
వయస్సులో కూడా మాతోపాటుగా నడుచుకుంటూ సుమారుగా 10 నుండి
20 కి. మీ వచ్చేవారు సువార్తలకు వీధి కూటములకు!
ఆ కాలంలో ట్రాన్స్పోర్ట్ లేదు ఇప్పటిలా! సరే ఒక
ఆదివారం నాడు మా తండ్రి గారు ఆరాధనలో యోబుగారి కోసం చెబుతూ ముగింపులో దేవుడు యోబుగారిని
రెట్టింపు ఆశీర్వాదలతో దీవించారు! కారణం ఎన్ని శ్రమలు వచ్చినా
సమస్తము కోల్పోయినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనేను అన్నారు గాని దేవుడు నాకు అన్యాయం
చేశారు అనలేదు. మనం కూడా అలాగా ఉంటే దేవుడు మనలను కూడా రెట్టింపు
ఆశీర్వాదాలతో నింపుతారు- దేవుడు యోబుగారికి ఇలా దీవించారు అన్నీ
రెట్టింపు అయ్యాయి అంటే ఆ తాతగారు ఆదాము గారు రెండు ప్రశ్నలు అడిగారు! వారు చదువుకోలేదు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడిగారు! మొదటిది
అయ్యగారు- మొదటి ఆవిడ లేక రెండో ఆవిడా? ఒక భార్య ఏనా లేక ఇద్దరు భార్యలు ఇచ్చాడా దేవుడు! దానికి
నాన్న గారు జవాబు- యోబుగారి భార్య చనిపోలేదు- కాబట్టి ఆ మొదటి భార్యే యోబుగారికి పూర్వస్థితి కలిగాక మారుమనస్సు పొంది పశ్చాత్తాపంతో తిరిగి వచ్చింది అప్పుడు దేవుడు వారికి
ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు!!
రెండవది ఆస్తి
ఐశ్వర్యమే రెట్టింపు ఇచ్చారు గాని భార్య పిల్లలు మాత్రము రెట్టింపు ఇవ్వలేదు!!!
ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి ప్రశ్నలు ఉంటే దానికి ఈ జవాబులు తెలుసుకోమని
మనవి చేస్తున్నాను!!
కాబట్టి దేవుడు నిన్ను శ్రమల సుడిగుండాలలో
వేశాక తప్పించుకుని జయించాక వదిలేసే దేవుడు కాదు! రెట్టింపు ఆశీర్వాదములతో
నిన్ను నింపుతారు! అలా చేయడానికే కావచ్చు నీకీ శ్రమలు శోధనలు!
అయితే భూలోక ఆశీర్వాదాలు లేకపోతే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కలుగుతాయి!
అభిషేకం మీద అభిషేకం! ఆశీర్వాదం మీద ఆశీర్వాదం
కలుగజేయడానికే దేవుడు నిన్ను ఈ శ్రమలనే సుడిగుండంలో వేశారు అని గ్రహించమని మనవి చేస్తున్నాను!
అట్టి
కృప ధన్యత దేవుడు మన అందరికీ దయచేయును గాక!
దైవాశీస్సులు!!!
సమాప్తం!!
7777777777777777777777777777777777777777777777777
ప్రియ దైవజనమా!! యధార్ధవంతుడైన యోబు గారు అనే ఈ శీర్షిక మీతో మాట్లాడింది
అనియు దేవుడు దీనిద్వారా మీతో మాట్లాడారని భావిస్తున్నాను! మరో
శీర్షిక ద్వారా మరలా కలుసుకుందాం! దయచేసి నాకోసం నాకుటుంబం మా
సంఘాల కోసం పరిచర్య కోసం నేను చేసే ఉద్యోగం కోసం దయచేసి ప్రార్ధించమని మనవి చేస్తున్నాను!!
దైవాశీస్సులు!!!
ఇట్లు
ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు
దోనె డేవిడ్ రాజ కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి