ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం- part-6
ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం
84 వ కీర్తనా ధ్యానం
84 వ కీర్తనా ధ్యానం
కీర్తనా రచయిత అభిషేకించబడిన రాజును గురించి ప్రార్దిస్తున్నాడు.
84 వ కీర్తనా ధ్యానం
(ఆరవ భాగం)
నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. కీర్తనలు 84:10
ఈ కీర్తనా రచయితలైన కోరహు కుమారులు చేసేపని ఏమిటంటే?
"దేవుని ఆలయమునకు ద్వార పాలకులు" ( 1 దిన 9:19 )
దేవుని ఆలయం పట్ల, ద్వారపాలకులైన వీరు కలిగియున్న అత్యున్నతమైన తలంపులను చూస్తే అర్ధమవుతుంది వారు దేవుని ఆలయానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అతున్నత మైనదో!
దేవుని ఆలయ ఆవరణలో ఒక్క దినం గడిపితే? అది మనం బయట గడిపే మూడు సంవత్సరాలతో సమానమట.
వారమునకు ఒక్కసారి దేవుని సన్నిధిలో గడిపే రెండు గంటలు, బయట గడిపే రెండు వేల గంటలతో సమానమట.
అసలు ఇట్లాంటి తలంపే మనకు రాదు కదా! అందుకే మనకు దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం.
ఆ రెండు గంటలు అయినా మనుష్యులము మాత్రమే అక్కడ కూర్చుంటాంతప్ప, మనసులు మాత్రం ఊరంతా తిరుగొస్తాయ్.
వారు ఇంకా ఇట్లా చెప్తున్నారు.
"భక్తిహీనుల గృహాల్లో, వారితో కలసి ఉండేకంటే, దేవుని మందిర ద్వారం వద్ద వుండుటే మాకిష్టం"
*దేవుడు వారికప్పగించిన భాద్యతను నెరవేర్చడం వారికిష్టం.
*దేవుడు వారికిచ్చిన పనిలో సంతోషించడం వారికిష్టం.
*దేవుడు వారిని ఏ స్థితిలో వుంచాడో, ఆ స్థితిలోనే వుండడం వారికిష్టం.
నేటి మన మందిరాలలో, మన జీవితాలలో ఈ పరిస్తితి ఉందా?
లేకనే కదా? నేటి మందిరాలలో తన్నుకుచస్తున్నాం.
మనమెంత ఉన్నతస్థాయికి ఎదిగి పోయామంటే? దేవునిని సహితం బయటకి త్రోసేసి ఆయన స్థానాన్నే మనము లాగేసుకొంటున్నాం.
అధికారం కోసం ఆరాటపడుతున్నాం.
కాని వీళ్ళయితే దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడి ఆయన పరిచర్య చేసే వారుగా వున్నారు. అట్లా ఉండడమే వీరికిష్టమట.
మనమొక తీర్మానానికి వద్దాం !!!
మందిరం శుభ్రం చేసే వారిగా దేవుడు మనలను ఉంచితే అట్లానే ఉందాం.
ఏ స్థితిలో? ఎక్కడ? దేవుడు మనలను ఉంచితే అదే స్థితిలో, అక్కడే ఆయన కోసం నమ్మకముగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
84 వ కీర్తనా ధ్యానం
(ఏడవ భాగం)
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యేమేలును చేయక మానడు. కీర్తనలు 84:11
సూర్యుడు:
ఈలోకయాత్రలో నీకు వెలుగునిచ్చి నడిపించే నీతి సూర్యుడు ఆయనే!
కేడెము:
శత్రువుల బారి నుండి రక్షించే డాలు ఆయనే.
కృప:
నేటి వరకు జీవించి యున్నాము అంటే కారణం ఆయన కృపయే.
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1:16
ఘనత:
మనము ఆయనను సేవించి, ఆయనను వెంబడించ గలిగితే? ఆయన మనలను ఎంతగా ఘనపరుస్తాడు అంటే, ఆయనతో కలసి ఆయన సింహసనములో కూర్చునేటట్లుగా అంతగా ఘనపరుస్తాడు.
ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. యోహాను 12:26
మేలు:
యదార్ధ జీవితం, భయముతో కూడిన భక్తి కలిగియున్న వారికి, వారి జీవితాలను మేళ్ళతో నింపుతాడు.
యదార్ధత అంటే?
నీవు నీ ఇంట్లో వున్నప్పుడు ఎట్లా సత్ప్రవర్తన కలిగి జీవించావో? అట్లానే, నీవు నీ కుటుంబానికి దూరంగా, నీ వారెవ్వరూలేని ప్రదేశంలో కూడా అట్లాగే జీవించగలగడం యదార్ధత.
యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. కీర్తనలు 34:9
అటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!
అట్టి ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
84 వ కీర్తనా ధ్యానం
( మొదటి భాగం)
సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు
యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.
కీర్తనలు 84;1,2
రచయిత: కోరహు కుమారులు
అంశం:, దేవుని మందిరానికి వెళ్లి ఆయనను ఆరాధించడానికి వారు పడే ఆరాటం.
దేవా! నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ పాడుతున్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఆయన మందిరం యొక్క అందచందాలను పొగడడం కాదు.
ఆయన నివాసం వారికి ప్రియమైనది.
ఆ ప్రియమైన నివాసంలో చేరి,
ఆ ప్రియమైన దేవుని ఆరాధించాలన్నదే వారి ఆశ.
వారి ఆశ ఎంత అంటే?
ప్రాణం సొమ్మ సిల్లిపోయేటంత.
ఎందుకు అంత ఆశ?
ఆ మందిరంలో జీవముగల దేవుడున్నాడు.
( అంటే? జీవములేని దేవుళ్ళు కూడా ఉంటారన్నమాట.)
ఆ దేవుని ఆరాదించడానికి వారి హృదయమును వారి శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయట.
ఇట్లాంటి అనుభవం మన జీవితాల్లో లోపించింది. "ఆత్మ సిద్దమే గాని, శరీరం బలహీనం " అన్నట్లు జీవిస్తున్నాం.
దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా? అని వారి ప్రాణం తహతహ లాడుతుందట.
కాని మనమంటాము. దేవుడు ఇంట్లో లేడా? అని.
వున్నాడు.
మరెందుకు దేవుని సన్నిధికి?
* అక్కడ దేవుడు వున్నాడు.
* దేవుని బిడ్డల సహవాసం వుంది.
* దేవుని వాక్యం ప్రకటించే సేవకులున్నారు.
సహవాసం తప్పనిసరి.
నీవు ఒక్కడివే మండితే కొంతసమయానికి ఆరిపోతావు. అదే సహవాసంలో వుంటే, ఒకవేళ
నీవు ఆరిపోతున్నా, నీప్రక్కన వున్న కట్టెలు (విశ్వాసులు )నిన్ను మండిస్తాయి. తిరిగి మండడం ప్రారంభిస్తావు.
దేవునిని గాని, దేవుని సన్నిధినిగాని
నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, అగ్నితో ఆటలాడుతున్నట్లే ! అది నీకు క్షేమం కాదు.
సరిచేసుకుందాం!
సాగిపోదాం!

( రెండవ భాగం)
సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరి కెను.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనలు 84:3,4
కోరహు కుమారులు ధన్యతను గూర్చి పాడుతున్నారు.
ఎవరు ధన్యులు?
దేవుని మందిరమందు నివసించేవారు.
అనగా, ఆయనకు సమీపముగా జీవించేవారు.
ఎందుకు వారు ధన్యులు?
వారు నిత్యమూ దేవునిని స్తుతిస్తారు.
ఇంతకీ, ఇక్కడ దేవుని మందిరంలో నివసించేది ఎవరు?
పిచ్చుకలు, వాన కోవెలలు, ఆయనను సేవించే యాజకులు.
ఈ తలంపు వారికి కొంత అసూయను, కొంత వేదనను కలిగిస్తుంది.
ఎందుకంటే?
పిచ్చుకలు, వాన కోవెలలు సహితం ఆయన మందిరంలో నివసిస్తూ, వేకువనే లేచి స్తుతిపాటలు పాడుతున్నాయి.
అవెంతటి ధన్య జీవులు?
మందిరంలో సేవచేసే యాజకులు ఎంతటి ధన్యులు?
అట్లాంటి ధన్యత మాకు లేదే? అని
అబ్బా!!! దేవుని సన్నిధికి
వెళ్ళడంకోసం, ఆయన్ని ఆరాధన చెయ్యడంకోసం వారికెంత ఆరాటం?
వారి ఆశ ఒక్కటే!
ఆయన్ని చూడాలి.
ఆయన దరి చేరాలి.
నేటి మందిరాలలో ఇట్లాంటి విశ్వాసులు కరువయ్యారు.
సేవకులూ కరువయ్యారు.
ఈ గుంపులోమనమున్నామా?
సందేహం లేదు.
వారికున్న ఆశ మనకుంటే? నేటికీ నామకార్ధ క్రైస్తవులుగానే ఎందుకు జీవిస్తున్నాం?
పేరుకు మాత్రమే క్రైస్తవులంతప్ప,
కనుచూపు మేరల్లోకూడా , క్రియల్లోమాత్రం ఎక్కడా క్రైస్తవ్యం కానరాదే?
అలవాటుగా ఆరాధనకు వెళ్తున్నాంతప్ప, ఆరాధించే హృదయం మాత్రం దేవునికి దూరమయ్యిందిగదా!
జ్ఞాపకముంచుకో!!!
దూరమైన నీ హృదయం తిరిగి ఆయనకు సమీపమైతేనే ఆ ధన్యతలోనికి ప్రవేశించ గలవు.
ఆ రీతిగా మన హృదయాలను
సరిచేసుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
84 వ కీర్తనా ధ్యానం
(మూడవ భాగం)
నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.
కీర్తనలు 84:5
కోరహు కుమారులు ఇంకనూ ధన్యతను గురించి పాడుతున్నారు.
వారంటున్నారు ఆయన వలన బలమునొందే మనుష్యులు ధన్యులు.
అవును! కొన్ని సందర్భాలలో వారు బలహీనులుగానే కనిపించవచ్చు గాని, వారి బలము అంచనాలకు అందదు.
ఎందుకంటే?
ఆయనే వారి బలం.
అందుకే వారంటున్నారు.
"నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు." కీర్తనలు 73:26
ఆయన వలన బలమునొందిన మనుష్యులకు యాత్ర చేసే మార్గాలు ఎంతో ప్రియమైనవి. వారు ధన్యులు.
పురుషులందరూ సంవత్సరమునకు మూడు సార్లు నియామకకాలంలో యెరూషలేము దేవాలయాన్ని దర్శించాలని ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన కట్టడ.
అందుచే ఆ సమయాల్లో అనేక ప్రాంతాలనుండి ప్రజలు యాత్రచేసి అక్కడకి చేరుకుంటారు.
ఆ యాత్ర చేసినవారందరూ ధన్యులు కాదు గాని, ఎవరయితే దేవుడు నియమించిన కట్టడను ప్రియముగా ఎంచి, సంతోషముగా ప్రతీ పరిస్థితిని ఎదుర్కొని ఆ మార్గములయందు ఆనందించ గలుగుతారో వారే ధన్యులు.
దేవుని మందిరానికి వెళ్తున్న మనమంతా ధన్యులంకాదుగాని, ఎవరైతే ఆయనను ఆరాధించాలని నిజమైన ఆశను కలిగి వుండి, ఆయన్ని ఆరాధించగలుగుతారో
వారే ధన్యులు. వారే దేవుని బలాన్ని పొందుకోగలరు.
ఈ లోకంలో యాత్రికులుగా
ప్రయాణం సాగిస్తున్నాం.
కొండలు-లోయలగూండా సాగిపోవాలి. జీవితంలో ప్రతీరోజు నూతనమైన అనుభవమే.
ఆయన నుండి బలాన్ని పొంది, ప్రతీ పరిస్థితిని ఆయన యందు ఆనందిస్తూ ఆ ధన్యత లోనికి మనం ప్రవేశించాలి.

(నాలుగవ భాగం)
వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.
వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.
కీర్తనలు 84:6,7
సియోను లేదా నూతన యెరుషలేము యాత్రలో నీ జీవితంలో అనేక శోధనలు, శ్రమలు అనుభవించవలసి వస్తుంది.
"బాకా లోయ" అది "కన్నీటి లోయ"
నీ కన్నీటితో లోయలు సహితం నింపబడవచ్చు.
అయితే, ఒక్కటి మాత్రం నిజం.
*నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడవబోతున్నాడు.
*నీ కన్నీరు నాట్యముగా మారబోతుంది.
*నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి.
*నీవు కార్చిన ప్రతీ కన్నీటిబొట్టు ఒక దీవెనగా మారబోతుంది.
*కన్నీటి లోయ "ఆశీర్వాదపు నిధి" గా ఆవిర్భవించబోతుంది.
*ఆశీర్వాదపు జల్లు అనే "ప్రారంభపు వర్షం" నీ ఆ శీర్వాదపునిధిని మరింత ఫలవంతం చేయబోతుంది.
*కృప వెంబడి కృపతో దేవుడు నిన్ను నింప బోతున్నాడు.
కన్నీరు, శ్రమలు, శోధనలు ఇవన్నీ పరమ సియోనుకు మార్గాలు.
ఇవే నిన్ను గమ్యం చేరుస్తాయి.
శ్రమలలో, శోధనలలో మన పరిశుద్దతను, విశ్వాస్యతను కాపాడుకొంటూ గమ్యమైన పరమ సియోను వైపు సాగిపోవాలి.
ఈ యాత్రలో నీకు నీవుగా గమ్యం చేరలేవు. అను నిత్యమూ ఆయన బలాన్ని పొందుకొంటూ, ఆయన పైనే ఆధారపడుతూ ఆ గమ్యం చేరాలి.
ఈ రీతిగా ఎవరు చేయగలరో వారు మాత్రమే ఆ పరమ సియోనులో కనబడతారు.
ఆ రీతిగా మన హృదయాలను సిద్దపరచు కుందాం! ఆ పరమ సియోనుకు వారసులవుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
84 వ కీర్తనా ధ్యానం
(ఐదవ భాగం)
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము.
దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము. కీర్తనలు 84:8,9
కీర్తనా రచయితా యాకోబు దేవునికి ప్రార్దిస్తున్నాడు.
"యాకోబు దేవుడు" అని పాత నిబంధనలో 24 సార్లు వ్రాయబడింది.
అట్లా పిలవబడడానికి యాకోబుకున్న ప్రత్యేకత అంటూ ఏమిలేదు.
యాకోబు అనే పేరుకే మోసగాడు అని అర్ధం. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎందుకంతగా హెచ్చించాడు?
*ఆయన కృపగల దేవుడు.
*తన ప్రజలు తప్పులు చేసినా తన వాగ్దానాలను నిలబెట్టుకొనే దేవుడు.
*గొప్ప సహనం గల దేవుడు.
*పాపులను పరిశుద్దులుగా మార్చే దేవుడు.
*ఒక వ్యక్తిని లేదా ఒక జాతిని తన చిత్తానుసారముగ ఎన్నుకొనే దేవుడు.
*అట్లా యాకోబును ఎన్నుకున్నాడు.
యాకోబు ఏదేవుని దేవుడుగా కలిగి యున్నాడో? ఆ దేవుని దేవుడుగా కలిగి యున్న జనులు ధన్యులు.
అందుకే రచయిత ఆ దేవునికే ప్రార్ధిస్తున్నాడు.
కీర్తనా రచయిత అభిషేకించబడిన రాజును గురించి ప్రార్దిస్తున్నాడు.
పాలకులను గురించి, అధికారులను గురించి ప్రార్ధించ వలసిన భాద్యత మన మీద వుంది.
వారు చేసే పనులు నచ్చకపోతే బంద్ లు, ధర్నాలు చేస్తాం. అనేక సార్లు అవి ఫలితాలను ఇవ్వవు. ఇచ్చినా అవి తాత్కాళికమే.
అదే మనము వారికోసం ప్రార్ధించగలిగితే, దేవుడు వారి అంతరంగములో మార్పు తీసుకొని రాగలడు.
అదే మనము వారికోసం ప్రార్ధించగలిగితే, దేవుడు వారి అంతరంగములో మార్పు తీసుకొని రాగలడు.
అప్పుడు వారి జీవితాలు మార్పుచెందుతాయి, వారు తీసుకొనే తీర్మానాలలో కూడా మార్పు వస్తుంది.
మతచాందస వాదులు, వారికున్న అభిప్రాయాలను "ప్రాధమిక విద్య" నుండే పిల్లలలోనికి చొప్పించాలని వేగంగా ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు.
మనకున్న ఆయుధం ఒక్కటే. పాలకుల కోసం ప్రార్దిద్దాం. ఒకవేళ అదే దేవుని చిత్తం అయితే?
ఆ పరిస్థితులను తట్టుకోగలిగే ధైర్యం ఇవ్వమని ఒకరికొకరు ప్రార్ధించు కుందాం!
అట్లా విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగియుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
84 వ కీర్తనా ధ్యానం
(ఆరవ భాగం)
నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. కీర్తనలు 84:10
ఈ కీర్తనా రచయితలైన కోరహు కుమారులు చేసేపని ఏమిటంటే?
"దేవుని ఆలయమునకు ద్వార పాలకులు" ( 1 దిన 9:19 )
దేవుని ఆలయం పట్ల, ద్వారపాలకులైన వీరు కలిగియున్న అత్యున్నతమైన తలంపులను చూస్తే అర్ధమవుతుంది వారు దేవుని ఆలయానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అతున్నత మైనదో!
దేవుని ఆలయ ఆవరణలో ఒక్క దినం గడిపితే? అది మనం బయట గడిపే మూడు సంవత్సరాలతో సమానమట.
వారమునకు ఒక్కసారి దేవుని సన్నిధిలో గడిపే రెండు గంటలు, బయట గడిపే రెండు వేల గంటలతో సమానమట.
అసలు ఇట్లాంటి తలంపే మనకు రాదు కదా! అందుకే మనకు దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం.
ఆ రెండు గంటలు అయినా మనుష్యులము మాత్రమే అక్కడ కూర్చుంటాంతప్ప, మనసులు మాత్రం ఊరంతా తిరుగొస్తాయ్.
వారు ఇంకా ఇట్లా చెప్తున్నారు.
"భక్తిహీనుల గృహాల్లో, వారితో కలసి ఉండేకంటే, దేవుని మందిర ద్వారం వద్ద వుండుటే మాకిష్టం"
*దేవుడు వారికప్పగించిన భాద్యతను నెరవేర్చడం వారికిష్టం.
*దేవుడు వారికిచ్చిన పనిలో సంతోషించడం వారికిష్టం.
*దేవుడు వారిని ఏ స్థితిలో వుంచాడో, ఆ స్థితిలోనే వుండడం వారికిష్టం.
నేటి మన మందిరాలలో, మన జీవితాలలో ఈ పరిస్తితి ఉందా?
లేకనే కదా? నేటి మందిరాలలో తన్నుకుచస్తున్నాం.
మనమెంత ఉన్నతస్థాయికి ఎదిగి పోయామంటే? దేవునిని సహితం బయటకి త్రోసేసి ఆయన స్థానాన్నే మనము లాగేసుకొంటున్నాం.
అధికారం కోసం ఆరాటపడుతున్నాం.
కాని వీళ్ళయితే దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడి ఆయన పరిచర్య చేసే వారుగా వున్నారు. అట్లా ఉండడమే వీరికిష్టమట.
మనమొక తీర్మానానికి వద్దాం !!!
మందిరం శుభ్రం చేసే వారిగా దేవుడు మనలను ఉంచితే అట్లానే ఉందాం.
ఏ స్థితిలో? ఎక్కడ? దేవుడు మనలను ఉంచితే అదే స్థితిలో, అక్కడే ఆయన కోసం నమ్మకముగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
84 వ కీర్తనా ధ్యానం
(ఏడవ భాగం)
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యేమేలును చేయక మానడు. కీర్తనలు 84:11
సూర్యుడు:
ఈలోకయాత్రలో నీకు వెలుగునిచ్చి నడిపించే నీతి సూర్యుడు ఆయనే!
కేడెము:
శత్రువుల బారి నుండి రక్షించే డాలు ఆయనే.
కృప:
నేటి వరకు జీవించి యున్నాము అంటే కారణం ఆయన కృపయే.
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1:16
ఘనత:
మనము ఆయనను సేవించి, ఆయనను వెంబడించ గలిగితే? ఆయన మనలను ఎంతగా ఘనపరుస్తాడు అంటే, ఆయనతో కలసి ఆయన సింహసనములో కూర్చునేటట్లుగా అంతగా ఘనపరుస్తాడు.
ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. యోహాను 12:26
మేలు:
యదార్ధ జీవితం, భయముతో కూడిన భక్తి కలిగియున్న వారికి, వారి జీవితాలను మేళ్ళతో నింపుతాడు.
యదార్ధత అంటే?
నీవు నీ ఇంట్లో వున్నప్పుడు ఎట్లా సత్ప్రవర్తన కలిగి జీవించావో? అట్లానే, నీవు నీ కుటుంబానికి దూరంగా, నీ వారెవ్వరూలేని ప్రదేశంలో కూడా అట్లాగే జీవించగలగడం యదార్ధత.
యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. కీర్తనలు 34:9
అటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!
అట్టి ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
84 వ కీర్తనా ధ్యానం
(ఎనిమిదవ భాగం)
సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమి్మకయుంచువారు ధన్యులు. కీర్తనలు 84:12
కోరహు కుమారులు ఈ కీర్తనను ధన్యతతో ముగిస్తున్నారు.
ధన్యకరమైన జీవితం ఆశీర్వదింపబడిన జీవితం జీవించాలంటే ఎట్లాసాధ్యం?? ఆయనను నమ్ముట ద్వారానే సాధ్యం!
అబ్రాహాము యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను.
ఆనమ్మికే అతనిని ధన్యుని చేసింది.
విగ్రహాలు అమ్ముకొనే వ్యక్తిని భూమి మీద వంశములన్నీ అతని మూలముగా ఆశీర్వదించబడేటట్లు చేసింది .
*యూదులను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని
*ముస్లింలను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని
*క్రైస్తవులను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని
*విశ్వాసులను మీతండ్రి ఎవరని అడిగితే వారు చెప్తారు. అబ్రాహాము అని
వీరేకాదు. భూమి మీదనున్న వంశములన్నీ అబ్రహాము మూలముగా ఆశీర్వదించ బడ్డాయి.
అదెట్లా?
యేసు ప్రభువువారు కూడా అబ్రాహాము వంశములోనుండే భూమి మీదకి వచ్చి తన ప్రాణమును అర్పించుట ద్వారా సర్వ మానవాళిని ఆశీర్వదించడం జరిగింది. ఆ ఘనత కూడా అబ్రహాముకు చెందుతుంది.
అంతేకాదు. దేవుడే తనకు తాను ఒక మనిషి పేరుపెట్టి పరిచయం చేసుకొంటున్నాడు. నేను "అబ్రాహాము దేవుడను" అని.
అబ్రాహాము ఇంతగా హెచ్చించ బడడానికి కారణం?
అతడు యెహోవాను నమ్మెను.
అందుకే కోరహు కుమారులు పాడుతున్నారు. యెహోవా!. నీ యందు నమ్మికయుంచే వారు ధన్యులు
ఈ ఆశీర్వాదం ఒక్క అబ్రాహాముకే పరిమితం కాదు. మనమూ నమ్మగలిగితే అబ్రహాము కుమారులుగా తీర్చబడతాం!
అట్టి ధన్యత లోనికి మనమూ ప్రవేశించగలం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(84వ కీర్తనా ధ్యానం సమాప్తం)

*90 వ కీర్తనా ధ్యానం*
*(మొదటి భాగం)*
పరిచయం:
*రచయిత:మోషే*
*అంశం:దైవజనుడైన మోషే దేవునికి చేస్తున్న ప్రార్ధన*.
*కీర్తనలు అన్నింటిలో అత్యంత ప్రాచీనం( సుమారుగా 3500 సంవత్సరాలు అయ్యింది)
*కాని, నేటికీ నిత్య నూతనం.
* అదే పరిశుద్ద గ్రంధ ప్రత్యేకత.
*ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే*. కీర్తనలు 90:1
మోషే, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో తిరుగుతూ, గుడారాలలో నివసిస్తూ....
తమది కాని ఐగుప్తు దేశం నుండి, తమకు దేవుడు వాగ్దానం చేసిన కనానుకు ప్రయాణం సాగిస్తున్నారు.
*భూమి మీద బాటసారుల వలే, పరదేశులవలే, యాత్రికులవలే వారి పయనం సాగుతుంది.అయితే వారికి స్థిరమైన, శాశ్వతమైన నివాస స్థలం ఒకటుంది. అది సాక్షాత్తు "యెహోవా దేవుడే"*.
అందుకే మోషే చెప్పగలుగుతున్నాడు.
"ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే."
మోషే చెప్తున్న ఈ మాట మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మిక పాటం.
*ఎందుకంటే,క్షయమైన నివాసముల కోసమే,మన ఆరాటం, పోరాటం. అక్షయమైన, శాశ్వత మైన నివాసం గూర్చిన తలంపే మనకు లేదు*.
ఒక్క విషయం!
కోట్లు క్రుమ్మరించి కట్టినా ఈ నివాసం ఒక దినాన్న నేలకూలి మట్టిలో కలియాల్సిందే.
అందుచే, నీవు మిద్దె మీద జీవించినా,
పూరి గుడిసెలో జీవించినా,
కొండ గుహలలో నివాసమున్నా?
నీ శాశ్వత నివాసం "నీ సజీవమైన దేవుడే" అనే విషయం మరచిపోవద్దు.
ఈ విషయాన్ని నీవు నమ్మగలిగితే?
ధనవంతుల భవనాలను చూసి అసూయ చెందాల్సిన పని లేదు.
అంతే కాకుండా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఆ "నిత్యనివాసం" కోసం ఎదురు చూడగలవు.
దానిని స్వతంత్రించుకో గలవు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(రెండవ భాగం)
*పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు*. కీర్తనలు 90:2
మోషే తన ప్రార్ధనలో దేవుని యొక్క ఉనికిని ప్రస్తుతిస్తున్నాడు.
నీవే సృష్టి కర్తవు.
సృష్టి కి ముందు నీవు వున్నావు.
సృష్టి గతించి పోయిన తరువాత నీవు ఉంటావు.
~కాని నేటి మనిషి,దేవుడే లేడు.మా మామ కోతి,మా తాత కొండముచ్చు, మా నాన్న చింపాంజీ, నేనొక పంది పిల్లను.బురదలో నుండి బయటకి రాను అంటున్నాడు~.
*అంతేగాని, నేను దేవుని స్వరూపంలో, దేవుని చేత సృష్టించబడ్డాను.నేను దేవుని కుమారుడను/కుమార్తెను అని చెప్పుకోవడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు, ఇష్టపడడం లేదు*.
సృష్టి కర్త ఉనికినే ప్రశ్నిస్తున్నాడు.
సృష్టి కర్తను మరచి, సృష్టినే పూజించే స్థాయికి దిగజారాడు.
_భూమిని, లోకమును పుట్టించినది ఆయనే.ఈ సృష్టిలో నీకో ప్రత్యేకత వుంది. అందుకే, సృష్టినంతా నీకోసం సృష్టించి, తర్వాత నిన్ను సృష్టించాడు_.
*నీవు ఈ లోకంలో ప్రవేశించావంటే నీపట్ల దేవునికో ప్రణాళిక వుంది. ఆ ప్రణాళికలో నీవున్నావు అని జ్ఞాపకముంచుకో*.
మోషే చెప్తున్నట్లుగా యుగయుగాలకు ఆయనే దేవుడు. ఆయనను కాదని నీవేమి చెయ్యలేవు.
ఒకవేళ ఏదయినా చేసినా గమ్యం మాత్రం భయంకరం.
సిలువను కాదని కాలదన్నే స్వేశ్చ నీకుంది.
కాని, *మహా ధవళ సింహాసనపు తీర్పును కాదనే అవకాశం నీకులేదు*.
పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును
పుట్టింపకమునుపు యుగయుగములకు ఆయనే దేవుడు.
*సమయముండగానే నీ సృష్టికర్తపాదముల చెంత చేరు*.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(మూడవ భాగం)
*నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు*. కీర్తనలు 90:3
దేవుడు మట్టినుండి మానవుని రూపించి, జీవాన్నిచ్చి, భూమి మీద జీవించమని, మరళా కొంతకాలం తర్వాత నీ సమయం అయిపొయింది ఎక్కడనుండి తీయబడ్డావో అక్కడికే వెళ్ళిపో అంటున్నాడు.
~దీనినే మనం "మరణం" అంటుంటే, పరిశుద్ద గ్రంధం "నిద్ర" అంటుంది~.
అది మరణమో? నిద్రో? తేల్చుకోవలసింది కూడా మనమే. నిద్ర అయితే మాత్రం తప్పకుండా లేస్తావు. సందేహం లేదు.
కొంత కాలం జీవించడం, తర్వాత ఎక్కడవి అక్కడే విడచి వెళ్ళిపోవడం. ఎందుకిలా దేవుడు చేసాడు?
దేవుడు ఆదామును సృష్టించినప్పుడు,నీవు ఇంత కాలం జీవించి మరణం కావాలి అనే నిబంధన ఏమి పెట్టలేదు.
దేవుడు ఎంత పరిశుద్దుడో, మానవుని కూడా అంత పరిశుద్దంగానే సృష్టించాడు. కాని హవ్వఆదాము చేసిన పాపం "మరణమును" తెచ్చిపెట్టింది.
మరణం అంటే" దేవుడు ఏర్పరచిన సరిహద్దుల నుండి దాటిపోవడమే"
ఉదా:
1. పక్షులు ఎప్పుడూ ఎండలో ఉంటున్నాయని తీసుకెళ్ళి నీటిలో ముంచితే?
2. చేపలు ఎప్పుడూ నీటిలో ఉంటున్నాయి చలి పెడుతుందేమో అని తీసుకొచ్చి గట్టుమీద ఉంచితే? ఏమవుతుంది?
*మనిషి కూడా దేవునితో ఉండడానికే సృష్టించ బడ్డాడు.దయ్యంతో జత కట్టాడు. ఏమవుతుంది*?
*"మరణం" తెచ్చుకున్నాడు*.
ప్రతీ మనిషికి మరణం ఖాయం.
అయితే, భూమి మీద నీవు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే రెండవ మరణం లోనికి వెళ్ళకుండా జీవములోనికి దాటిపోతావు.
ఆయన నిన్ను నన్ను ఏ క్షణాన్ని పిలుస్తాడో?
మన జీవితాలను సరిచేసుకొని సిద్దంగా ఉందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(నాలుగవ భాగం)
*నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి*. కీర్తనలు 90:4
మనిషి యొక్క ఆయుష్షు:
*పరిశుద్ద గ్రంధములో మేతూషెల 969 సంవత్సరాలు జీవించినట్లు చూస్తాము.
*మోషే తరము వచ్చేసరికి 120 సంవత్సరాలు.
*ఇప్పుడయితే, 70 నుండి 80 సంవత్సరాలు.
*అంటే, మనిషి 100 సంవత్సరాలు జీవించినట్లయితే అది సుదీర్ఘ కాలం జీవించినట్లే మనం తలస్తాము*.
*కాని దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క రోజువలె వున్నాయట*.
అంతే కాదు ఒక్క జామువలే వున్నాయట.
జాము అంటే?
రేయికి 4 జాములు.
సాయంకాలం 6 గంటలనుండి ఉదయం 6 గంటల వరకు ఒక రేయి క్రింద లెక్కిస్తారు.
అంటే 3 గంటలు ఒక జాము.
మనకు 1000 సంవత్సరాలు ఆయనకు 3 గంటలతో సమానమాట.
దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఆయన ఎంతటి అత్యున్నతుడో?
ఆయన వుద్దేశ్యములు ఎంత అత్యున్నత మయినవో?
*అటువంటి దేవుని ప్రశ్నించే స్థితికి మనం చేరుకోవడం, ఆయన న్యాయవిధిని కాదనడం మన అజ్ఞానమే.అహంకారమే.తప్ప మరొకటి కాదు*.
~ఈ సృష్టిలో నీవు గొప్పవాడివే కావొచ్చు~.
~కాని,ఆయనను ప్రశ్నించేంత మాత్రం కాదు~.
ఒక్క క్షణం మనలను ఆయన విడచి పెట్టేస్తే???
సజీవుల లెక్కలోనుండి మనం కొట్టివేయ బడవలసిందే.
వద్దు!!! నిత్యం కృపజూపి నడిపించే, ఆయన పాదాల చెంత చేరుదాం!
ఆయనిచ్చిన జీవాన్ని బట్టి, జీవితాన్ని ఆయనను స్తుతిస్తూ సాక్ష్యులుగా సాగిపోదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(ఐదవ భాగం)
*వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు*
*ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును*. కీర్తనలు 90:5,6
మనిషి జీవితం ఎట్లాంటిదో దైవజనుడైన మోషే జ్ఞాపకంలోనికి తెస్తున్నాడు.
మానవ జీవితం తరం వెంబడి తరం గతించి పోతుంది.
అది ఎంత వేగంగా అంటే?
వరద నీటి ప్రవాహంపై తేలియాడే నురుగులా సాగిపోతుంది.
~సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది~
~యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే~•
~గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును~. యెషయ 40:6-8
*అశాశ్వతమైనది "మానవ జీవితం"
*శాశ్వతమైనది "దేవుని వాక్యము"
అంటే "దేవుడే".
వాక్యము దేవుడై ఉండెను. (యోహాను 1:1)
మన జీవితాలు చిగురించిన గడ్డి వంటివి. అది చూడగానే ఎంతో సంతోషం. చేతిలో సెల్ వుంటే క్లిక్ మనిపించాలి అనిపిస్తుంది.
వాటి పువ్వులను చూస్తే మన హృదయం తన్మయత్వం చెందుతుంది.
సీతాకోక చిలుకలు, తేనెటీగలు వాటి చుట్టూ తిరుగుతూ వుంటాయి.
అయితే, కోయబడిన ఆ గడ్డిని చూస్తే వాడిపోయి, ఉదయం చూసిన పుష్పాలు ఇవేనా? అనిపిస్తాయి.
మానవ జీవితం కూడా అట్లాంటిదే. అందముగా సాగిపోతున్న ఈ జీవితం, ఏ క్షణంలో వాడిపోతుందో?
ఇంటి నుండి బయటకి వెళ్ళిన వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతారు అనే నమ్మకం లేని దినాలివి.
అశాశ్వతమైన ఈ జీవితం కోసం తపన చెందొద్దు.
శాశ్వత జీవమున్న సంగతి మరువొద్దు.
*అల్ప మైన ఈ జీవితం కోసం ఆరాటం వద్దు!*
*శాశ్వత జీవం కోసం పోరాటం చెయ్యి*.
*కోయబడక ముందే, వాడిపోకముందే, పరిమళ పుష్పముగా ఆయనకోసం జీవించు*.
*ఆ పరిమళాన్ని నీ క్రియలరూపంలో ఈ లోకానికి చూపించు*.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(ఆరవ భాగం)
*నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము*.
*మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి*.
కీర్తనలు 90:7,8
*మనిషి జీవితం గడ్డిపువ్వు వలే
ఎందుకు వాడిపోతుంది?
ఎందుకు రాలిపోతుంది?
దానికి దైవజనుడైన మోషే సమాధానం చెప్తున్నాడు.
దేవుని కోపం, ఉగ్రత మన మీద నిలిచి వుంది కాబట్టి.
*దేవుని కోపం, ఉగ్రత మన మీద నిలిచి ఉండడానికి గల కారణమేమిటి?*
దానికి కూడా దైవజనుడైన మోషే సమాధానం చెప్తున్నాడు.
మన దోషములు(అపరాధములు), పాపములు ఆయనకు కనబడుచున్నాయి కాబట్టి.
*దేవునికి కనబడకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?
ఒక్కటే మార్గం. పాపం చెయ్యకుండా ఉండాలంతే.
ఆయనకు తెలియకుండా చెయ్యగలుగుతున్నాను అనుకోవడం
అవివేకం. సంఘమును, సమాజమును, కుటుంబమును ,తలిదండ్రులను, స్నేహితులను అందరిని మోసం చెయ్యగలిగినా, దేవుని చేతిలో మాత్రం అడ్డంగా దొరకిపోతావు.
*బహిరంగంగా అందరికి తెలిసేటట్లు చేసే అపరాధములు కొందరికి తెలిసినా, రహస్య పాపములుమాత్రం ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కాని మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో స్పష్టముగా కనిపిస్తాయి*.
~పాపం జోలికి వెళ్ళకుండా మనలను మనము ఎట్లా నియంత్రించుకోగలం?~ ~ఒక్కటే మార్గం. మన ప్రతీ కదలికలోను ఆయన్ని ముందు పెట్టుకోగలగడం~.
~ఆయన మనతో వున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే తలంపు మనలను పాపం జోలికిపోకుండా నియంత్రిచగలదు~.
ఆరీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం!
దేవుని ఉగ్రత నుండి తప్పించబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(ఏడవ భాగం)
*నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.*
కీర్తనలు 90:9
దైవ జనుడైన మోషే ప్రార్ధన ధ్యానిస్తుంటే ముఖ్యముగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
1.దేవుని ఉగ్రత మన మీద వుంటే అసలు మనం బ్రతుకగలమా?
అవును. బ్రతుకలేము.
మరెట్లా జీవిస్తున్నాము?
అదెట్లా అంటే? ప్రతీ మనిషిని
దేవుని న్యాయము,
దేవుని కృప
రెండూ వెంటాడతాయి.
దేవుని న్యాయము మన పాపములకు శిక్షను మన మీదికి తీసుకువస్తుంటే, దేవుని కృప ఆ శిక్ష నుండి మనలను విడిపించి, మనలను జీవింప చేస్తుంది.
మనము జీవించగలుగు తున్నాము అంటే, మన పరిశుద్దత, మన నీతి ఎంత మాత్రం కాదు.
ఆయన కృప వలన మాత్రమే.
2.మన కోసం తన ప్రాణమునే బలిగా అర్పించిన దేవుడు మన మీద ఉగ్రత చూపుతాడా?
అవును.
పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎట్టి సందేహం లేదు.
కాని, మన పాపములను ఎట్టి పరిస్థితులలోను సహించడు. దీనిలోనూ ఎట్టి సందేహం లేదు.
అదెట్లా?
*మన ఇంట్లో వున్న వ్యాధిగ్రస్తుని మనం ప్రేమించి పరిచర్య చేస్తాం. కాని అతనికి వచ్చిన వ్యాధిని మాత్రం ప్రేమించలేం. ద్వేషిస్తాం. అట్లా*....
నిట్టూర్పులకు బదులుగా నీ జీవితంలో సంతోషం, శాంతి, సమాధానం కావాలి అంటే?
ఆయన ఉగ్రత నుండి నీవు తప్పింప బడాలి.
ఆయన ఉగ్రత నుండి నీవు తప్పింప బడాలంటే?
నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, తిరిగి వాటి జోలికిపోకుండా, ఆయనకోసం జీవించగలగాలి.
ఆ రీతిగా మన హృదయాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(ఎనిమిదవ భాగం)
*మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము*. కీర్తనలు 90:10
పురాతన కాలంలో మనిషి వందలాది సంవత్సరాలు జీవించేవాడు. రాను రాను ఆయుష్కాలం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు 70 లేదా 80 సంవత్సరాలు.
బ్రతికే ఈ కొద్దికాలమైనా జీవితమంతా ఆయాసమే, దుఖమే.
*జీవితమంతా మనిషి కష్టపడుతున్నాడు.
*వాళ్ళని వీళ్ళని మోసం చేసి కూడబెడుతున్నాడు.
*శాంతి సమాధానం లేకుండా కక్షలు, కార్పన్యాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు.
ఇంత చేసినా, ఏదో ఒక క్షణాన ఈలోకానికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాడు.
విచిత్రం ఏమిటంటే?తాను దేనికోసం ఈ భూమిమీద ప్రయాసపడ్డాడో దానిలో"ఒక్కటి తప్ప", మరి దేనినీ తన వెంట తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు.
ఆ ఒక్కటీ ఏంటి?
భూమిమీద తాను జరిగించిన క్రియల మూట. (అవి మంచివైనా, చెడ్డవైనా సరే)
ఈ ఆయుష్షు మనకు చాలు.
ఇంకా ఎక్కువ అయితే ఏమవుతుందో తెలుసా?
*నీవు అవిశ్వాసివి అయితే*?
*నీవు ఎంత ఎక్కువకాలం బ్రతికితే అంత ఎక్కువ పాపాన్ని మూటకట్టుకోవలసి వస్తుంది*.
*నీవు విశ్వాసివి అయితే*?
*నీవు ఎంత ఎక్కువకాలం బ్రతికితే అంత ఎక్కువ శ్రమలు అనుభవించ వలసివస్తుంది.*
*భూమి మీద జీవించే ఈ కొద్ది కాలంలో దేనికోసం నీ ప్రయాస?
* ఎటువైపు నీ పయనం?
*నీవు వేసే ప్రతీ అడుగు నీ పాపపు మూటను పెంచుకొంటూ పోతుందా?
లేక
*నీవు వేసే ప్రతీ అడుగు నిత్య రాజ్యంను నీకు దగ్గర చేస్తుందా?
*ఎంతకాలం జీవించాం అనేదానికంటే, దేవునికోసం ఎట్లా జీవించామన్నది ముఖ్యం*.
ఆ రీతిగా మన హృదయాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(తొమ్మిదవ భాగం)
*నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?*
కీర్తనలు 90:11
పాపానికి వ్యతిరేకముగా దేవుని యొక్క కోపము ఎంత తీవ్రముగా వుంటుందో, దానిని ఏ మనిషి అంచనా వేయలేడు. అర్ధం చేసుకోలేడు.
దేవుని ప్రేమను అంచనా వేయలేము. అదేసమయంలో, ఆయన ఉగ్రతను కూడా అంచనా వేయలేము.
ఆయన కోపం భయంకరమైనది.
అది భీకరమైనది.
అది హడలు పుట్టించేది.
మాటలలో వర్ణించలేనిది.
ఆయన కోపం నీమీద రగులుకుంటే?
*పట్టణములో, పొలములో, పిల్లలు, పాడి పంటల విషయంలో నీవు శపించబడతావు.
*తెగుళ్ళు, రోగాలు నిన్ను వెంటాడుతాయి.
*ఆకాశము ఇత్తడివలే, భూమి ఇనుమువలే మారి దాని సారాన్ని అనుభవించలేవు.
*ద్రాక్ష తోట నాటుతావుగాని, దాని పండ్లు తినవు.
*ఇల్లు కడతావు గాని, దానిలో నివశించలేవు.
*నీ శత్రువుల ఎదుట నీవు నిలువ లేవు.
*అను నిత్యము హింసలు, భాదలే.
**నీ పిల్లలు చెరపట్ట బడతారు.
ఆయన కోపానికి కారణం మన పాపం.
వద్దు!!! మన పాపాన్ని కప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు.
ఒప్పుకుందాం!
ఆయన ఉగ్రత నుండి తప్పించబడదాం!
ఆ రీతిగా మన హృదయాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(పదియవ భాగం)
*మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.* కీర్తనలు 90:12
................................
దైవ జనుడైన మోషే,
ప్రభువా! మాకు జ్ఞాన హృదయం దయచేయి. అని ప్రార్దిస్తున్నాడు.
అంటే, మాకు జ్ఞాన హృదయం లేదు. అని ఒప్పుకొంటున్నాడు.
*మనమయితే, మనకు మనమే జ్ఞానవంతులముగా ఊహించుకొని అజ్ఞానములోనే కొనసాగుతున్నాం*.
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అని ప్రార్దిస్తున్నాడు.
అవును! రోజులు గడచే కొలదీ మరణానికి దగ్గరవుతున్నాం.
అయితే, ఆ తలంపు కంటే, వయసు మీద పడుతుంది ఇంకా సంపాదించాలి. ఇంకా సంపాదించాలి. ఇదే తపన తప్ప. ఈ జీవితం ముగిసిపోతే మనం ఎక్కడికి వెళ్తామో అనే ప్రశ్న మాత్రం మన మదిలో లేకుండా పోతుంది.
మనమూ ఈ ప్రార్ధన చేయగలగాలి.
ప్రభువా! మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
ఆయన మనకు జ్ఞానమును దయచేస్తేనేగాని ఈ విషయాలు అర్ధం కావు.
ఏ విషయాలు ?
*తరతరాలకు నివాస స్థలం ఆయనే అనీ,
*యుగయుగాలకు ఆయనే దేవుడనీ,
*సృష్టికర్త ఆయనే అనీ,
*ఆయన దృష్టి అత్యంత విశాలమైనదనీ,
*మన జీవితం గడ్డిపువ్వు వంటిదనీ,
*ఆయన ఉగ్రత భీకరమైనదనీ,
*మానవుని ఆయుషు స్వల్పమని,
ఈ విషయాలు ఎప్పుడు అర్ధం చేసుకోగలము అంటే, ఆయన జ్ఞాన హృదయాన్ని దయచేసినప్పుడు మాత్రమే. లేకపోతే మన ఊహలకు సహితం అవి అందవు.
పైవాటిని గురించిన జ్ఞానం మనకు లేకపోతే?
మన జీవిత గమ్యమేమిటో మనకు తెలియనట్లే.
గమ్యమే తెలియనప్పుడు ఇక దాన్ని అందుకోవడం అసాధ్యం.
*ఈలోక జ్ఞానం ఆయన దృష్టిలో వెర్రితనం*.
అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది.
యాకోబు 3:17
ఆయనిచ్చే జ్ఞానం కోసం ప్రయాస పడదాం! ప్రార్దిద్దాం!
ఆ రీతిగా మన హృదయాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(పదకొండవ భాగం)
*యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.* కీర్తనలు 90:13
ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపమును,దుష్టత్వమును చూడలేక ఆయన ముఖము త్రిప్పేసుకున్నాడు.
ఎందుకంటే?
ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. హబక్కూకు 1:13
అందుకే, వాళ్ళ జీవితాలు భారమయ్యాయి. జీవితమంతా దుఃఖకరంగా, ఆయాసకరంగా, నిట్టూర్పులతో కొనసాగించాల్సి వస్తుంది.
కారణం?
వారిలో పాపం నిలిచి వుంది. అది దేవుడు వారికి దూరంగా నిలిచేటట్లు చేసింది.
దేవుడే దూరమైతే?
ఇక శాంతి, సమాధానం, సంతోషానికి తావెక్కడిది?
అందుకే దైవజనుడైన మోషే బ్రతిమలాడుతున్నాడు.
ప్రభువా! మావైపు తిరుగు. ఎంతకాలం మమ్ములను ఇట్లా విడచి పెట్టేస్తావు?
మా జీవితాంతం మాకు నిట్టూర్పేనా? నిన్ను సేవించే మమ్ములను ఒకసారి జ్ఞాపకములోనికి తెచ్చుకో అని.
అవును!
*నీ జీవితం భారంగా సాగుతుందా?*
*శోధనలు వెంటాడుతున్నయా?*
*సమాధానం లేని పరిస్థితులా?*
ఒక్కసారి ఆలోచించు?
ఈ పరిస్థితికి ఒకవేళ నీ పాపమే కారణమేమో?*
ఎందుకంటే,నీవు పాపములో నిలిచి వుంటే?
ఆయన ముఖాన్ని త్రిప్పేసుకుంటాడు.
ఆయనే ముఖాన్ని త్రిప్పేసుకుంటే?ఇక జీవితమంతా నిట్టూర్పులే.
ఇప్పుడు ఆయన మరళా నీవైపు తిరగాలంటే? ఒక్కటే మార్గం.
*ఆయనకు నీకు అడ్డుగావున్న పాపపు గోడను కూల్చెయ్యడం*.
ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకుందాం!
కోల్పోయిన సమాధానాన్ని తిరిగి పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(పండ్రెండవ భాగం)
*ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము*.
*నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము*.
కీర్తనలు 90:14,15
1.తండ్రీ! మమ్మును తృప్తి పరచు.
ఇట్లా అడగడానికి మాకున్న అర్హత మా పరిశుద్దత, మా నీతి కానేకాదు.
"కేవలం నీ కృపతో మాత్రమే"
మమ్మును తృప్తి పరచు.
కృప అంటే?
*"ఏ అర్హత లేనివారు అర్హులుగా యెంచబడడమే కృప"*.
2. "నీవు తృప్తి పరిస్తేనే, మా జీవితమంతా మేము సంతోషించగలం."
దైవజనుడైన మోషే చేస్తున్న ఈ ప్రార్ధన మన జీవితాలకు గొప్ప ఆదర్శం.
ఎందుకంటే?
*వ్యర్ధమైన క్రియల చేత మనలను మనం తృప్తి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి ఎప్పటికీ మనలను తృప్తి పరచలేవు సరికదా, ఇంకా అసంతృప్తిని పెంచి, దేవుని నుండి మనలను దూరం చేస్తున్నాయి*.
*ఆయన నిన్ను తృప్తిపరిస్తేనే , అది నీ జీవితంలో నిజమైన ఆనందం.* యేసులోనే శాశ్వతానందం.*
3. "నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది....మమ్మును సంతోష పరచుము."
మోషే ఒక విషయాన్ని విశ్వసిస్తున్నాడు. 430 సంవత్సరాలు మమ్ములను ఐగుప్తు దాస్యానికి, కీడుకి, శ్రమలకు అప్పగించింది ఆయనే అని,
ఆ పరిస్థితుల నుండి విడిపించి, వాటికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వగలిగే వాడుకూడా ఆయన మాత్రమేనని.
అవును!
*నీవూ విశ్వసించ గలగాలి. నేడు నీవున్న ప్రతీ పరిస్థితి నుండి నిన్ను విడిపించి, నీకు సమాధానాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన మాత్రమేనని*.
ప్రార్దిద్దాం!
విశ్వసిద్దాం!
అనుభవిద్దాం!
ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకుందాం!
కోల్పోయిన సమాధానాన్ని తిరిగి పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*90 వ కీర్తనా ధ్యానం*
(పదమూడవ భాగం)
*నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.*
*మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.*
కీర్తనలు 90:16,17
................................
నీ యొక్క సేవకులమైన మాకు నీ కార్యమును చూపించు. అనగా, నీవు మమ్మును నడిపిస్తున్న వాగ్ధాన భూమిని చూపించు.
అంతేకాదు, మేము అరణ్యములో 40 సంవత్సరాలు తిరుగులాడుతున్నప్పుడు ఏరీతిగా నీ ప్రభావమును చూపించావో?
*పగలు మేఘ స్థంభం
*రాత్రి అగ్ని స్థంభం
*ఆకాశము నుండి మన్నా
*ఆకాశము నుండి పూరేళ్ళు
*బండను చీల్చి నీరు
*ఎర్రసముద్రము పాయలు
*మా చెప్పులు అరిగిపోలేదు
*మా వస్త్రాలు చెమట వాసన రాలేదు.
.......... ఇట్లా ఎన్నెన్నో !!!!
అదే రీతిగా మా పిల్లల పట్ల కూడా అట్టి ప్రభావమును చూపించు.
మా దేవుడవైన యెహోవా!
నీ ప్రసన్నత మాకు, మా పిల్లలకు కావాలి.
నీ సేవకులమైన మాకు మా పనిని స్థిరపరచు.
ఇంతకి వీరి పని ఏమిటి?
ఆయనను సేవించడమే.
దైవజనుడైన మోషే చేస్తున్న ప్రార్ధన అద్భుతమైన ముగింపులోనికి తీసుకొని వస్తున్నాడు.
*"మా జీవితాంతము నీ సేవచేసే విధముగా మా పనిని స్థిరపరచు.*"
*ఈ ఆశ నీకెందుకు వుండకూడదు?
ఇదే నీ ఆశయం ఎందుకు కాకూడదు?*
~*వాక్యాన్ని ప్రకటిస్తేనే సేవ కాదు~.
~*పాడడం~
~*ప్రార్ధించడం~
~*మందిరాన్ని శుభ్రం చెయ్యడం~
~*పేద వారికి సహాయం చెయ్యడం~
.... ఇట్లా ఏదయినా కావొచ్చు.
*దేవుడు నీకు అప్పగించిన ఏపని అయినా, నమ్మకముగా చెయ్యగలగడమే "సేవ"*.
ఆ రీతిగా మన హృదయాలను సిద్దపరచు కుందాం!
అట్లాంటి ఆశయంతో దేవునికోసం జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(90 వ కీర్తనాధ్యానం సమాప్తం)
91 వ కీర్తనా ధ్యానం
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనలు 91:15,16
......................................
నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడయిన , ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ,
ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ గలిగితే?
దివ్యమైన, శాశ్వతమైన ఆశీర్వాదాలు నీ స్వంతం:
1.నీ ప్రార్ధనకు సమాధానం:
నీ ప్రార్ధన వింటాడు.
నీ కోరిక సిద్ధింప చేస్తాడు.
నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు.
2.నీ శ్రమలలో నీతోపాటే ఉంటాడు.
"శ్రమలలో ఆయన నీతోవుంటే
అవి శ్రమలే కాదు."
"సంతోషంలో ఆయన నీతోలేకుంటే అది సంతోషమే కాదు."
నీ జీవిత నౌక యొక్క చుక్కానిని ఆయనకీ అప్పగిస్తే .....
సుడిగుండాలలో ఎట్లా నడిపించాలో?
ఎగసిపడే అలల మధ్య ఎట్లా నడిపించాలో?
నిర్మలమైన నీటిలో ఎట్లా నడిపించాలో?
ఆయన కంటే తెలిసిన వారెవరూలేరు.
సమస్యల సుడిగుండాలు నిన్ను వేధిస్తున్నా, వేధన చెందొద్దు.
నీ శ్రమల్లో ఆయన నీతోనే ఉంటాడు. గమ్యం చేర్చుతాడు.
"యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను."
ఆదికాండము 39:2
3.దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాడు:
ఈలోకంలో ఎంతకాలం జీవించినా అది అల్పకాలమే. తప్పకుండ ఒకరోజు విడచి వెళ్ళాల్సిందే. దీర్ఘాయువు అనే నిత్యజీవాన్నిచ్చి నిన్ను తృప్తి పరుస్తాడు.
4.ఆయన రక్షణ నీకు చూపిస్తాడు:
రక్షణ అంటే "శిక్షనుండి తప్పించబడడం."
నిత్య నరకాగ్ని అనే శిక్ష నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
ఇవన్ని ఎప్పుడు సాధ్యం?
*మారు మనస్సు
*పశ్చాత్తాపం
*పాప క్షమాపణ
నీజీవితంలో తప్పనిసరి.
ఇక వాయిదా వెయ్యొద్దు.
ప్రభు పాదాల చెంత మోకరిల్లుదాం!
ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(91 వ కీర్తనా ధ్యానములు సమాప్తం)
( మొదటి భాగం)
"మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు."
కీర్తనలు 91:1
.............................
"మహోన్నతుడు" : విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకెత్త గలవాడు.
"సర్వశక్తిమంతుడు" : విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్ధ్యం గలవాడు.
నీవు ఆ మహోన్నతుని చాటున నివసిస్తే, ఆ సర్వ శక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి పొందుతావు.
ఈ లోకంలో నీడ వాతావరణ పరిస్తితులను బట్టి ఆధారపడి వుంటుంది. కాని ఆయన ఇచ్చే నీడ అన్నివేళలా నిన్ను వెన్నంటే వుంటుంది.అది నీ జీవితానికి ప్రశాంతత నిస్తుంది.
•ఆ నీడ చెంతకు నీవెప్పుడు చేరగలవు?
•ఆయన పర్ణశాలలో ఎప్పుడు అడుగు పెట్టగలవు?
•ఆయన గుడారంలో ఎప్పుడు ప్రవేశించ గలవు?
ఖచ్చితంగా శోధనలు, ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే!
సమాధానం లేని ప్రశ్నలా?
పరిష్కారం లేని సమస్యలా?
ఆందోళన చెందొద్దు!
ఆయన పర్ణశాల ఇంకెంతోదూరంలో లేదు. ఆయన గుడారం నీ ముందే వుంది.
ఆ పర్ణశాలను చేరగానే,
నీ కన్నీరు నాట్యముగా మారబోతుంది.
నీ దుఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి.
"ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును."
కీర్తనలు 27:5
"నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు."
కీర్తనలు 32:7
నీ శోధనలు,వేదనలు, శ్రమలు, నీ కష్ట సమయాల్లో నీవు దాగియుండే చోటు ఆయనే.
కాని ఒక్క విషయం! పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో దాగి వుండి, సేదదీరే అవకాశం నీకులేదు. కనీసం ఆ పర్ణశాల దరిదాపుల్లోకి కూడా చేరలేవు.
ఆయన పర్ణశాలలో నీవుండాలంటే పాపాన్ని విడచి, ప్రభువు పాదాల చెంత చేరు.
సుంకరి చేసిన చిన్న ప్రార్ధన పర్ణశాల ద్వారాలు వాటంతటవే తెరచుకొనేటట్లు చేస్తుంది.
మన నిజ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం! ఆ చల్లని నీడలో నిత్య విశ్రాంతిని పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( రెండవ భాగం)
ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
కీర్తనలు 91:2
...........................
1. ఆయనే మనకు ఆశ్రయము:
మనము బలహీనులమయితే, బలవంతులను ఆశ్రయిస్తాం.
అనారోగ్యమైతే డాక్టర్ ని ఆశ్రయిస్తాం.
ఆర్ధిక ఇబ్బందులు అయితే, ధనవంతులను ఆశ్రయిస్తాం.
ఇట్లా ప్రతీ పరిస్థితి యందు ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి.
ఎవరిని ఆశ్రయించినా, అది కొన్ని సందర్భాలకే, కొంత కాలమే పరిమితం.
అయితే, మన ప్రతీ పరిస్థితి యందు ప్రతీ సమయమందు, శాస్వతకాలము ఆశ్రయించగలిగేవాడు ఒకడున్నాడు.
ఆయన మహోన్నతుడు,
సర్వ శక్తిమంతుడు
మనకు అన్ని పరిస్తితులయందు "చాలిన దేవుడు"
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కీర్తనలు 46:1
నీ శోధన కాలంలో ఆయనే ఒక బలమైన, స్థిరమైన కొండ. దానిలోనికి ప్రవేశించి సురక్షితముగానుండు.
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
సామెతలు 18:10
2. ఆయనే మనకు కోట:
ఈ లోకంలో ఏ రాజ్యపు కోటలను అయినా శత్రు సైన్యం చేధించవచ్చు.
కాని, ఆయనే మనకు కోటగా వున్నాడు. సాతాను ఎన్ని బాణములు ఎక్కుపెట్టినా, ఆ కోటను చేధించిలోనికి రావడం అసాధ్యం.
నీ జీవితంలో సాతాను కోట వెలుపల వుండి వాడు సృష్టించే గందరగోళానికి భీతి చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే నీవు ఆయననే కోటగా కలిగియున్నావు.
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడునా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము.
కీర్తనలు 18:2
3.ఆయనే మనము నమ్ముకొనతగిన దేవుడు:
నీ సమస్యల్లో, నీ శోధన కాలంలో మనుష్యులను నమ్ముకోవద్దు. ఎందుకంటే అనేకసంధర్భాలలో నీ బలహీనతలను, వారి బలముగా మార్చుకొని నిన్ను మరింత బలహీనపరచే అవకాశం ఉంది.
సమస్యలు వచ్చినప్పుడు క్రుంగి పోవద్దు.
ఎందుకంటే మనము రాజాధి రాజు బిడ్డలం. యువరాజులం.
రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి
కీర్తనలు 146:3
నమ్ముకొనదగినవాడు ఒకడున్నాడు.
ఆయన నీ నమ్మకాన్ని వమ్ముచెయ్యడు. ఆయనే నీకోసం తన చివరి రక్తపుబొట్టు వరకు కార్చిన నీ ప్రియ రక్షకుడునైన యేసయ్య.
నీ శోధన కాలంలో ఆయనచూస్తూ వుండిపోడు. తగిన సమయమందు తప్పక కలుగజేసుకుంటాడు.
ఆ కోటను ఆశ్రయించు!
నమ్మకంతో ఎదురుచూడు!
విజయం నీదే!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( మూడవ భాగం)
"వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును."
కీర్తనలు 91:3
వేటగాడు ఉరి వొగ్గడంలో అత్యంత నేర్పుగా వ్యవహరిస్తాడు. పక్షికి అనుమానం కలుగకుండా అన్ని జాగ్రత్తలు. పరిసరాలలో కలసిపోయే దారాలనుతీసుకొంటాడు. ఉపయోగిస్తాడు.
నూకలతో పాటు, అవసరం అనుకొంటే బ్రతికివున్న మిడతలను కూడా అందులో వుంచుతాడు. ఆహారం కోసంవచ్చి వ్రాలుతుంది పక్షి ఆహారం ఆ అందమైన. వేటగాడు వికటంగా నవ్వుకొంటూ పరుగెత్తుకొస్తాడు.
ఎగిరి పోదాం అనుకున్న ఆ పక్షి ఎక్కడికి ఎగురగలదు? అప్పటికిగాని అర్ధంకాదు. తాను ఉచ్చులో చిక్కుకున్నానని. నిర్దాక్షిణ్యంగా కాళ్ళు కట్టేస్తాడు. రెక్కలు విరిచేస్తాడు. దాని ఆర్తనాదాలు వినేదెవరు? పాపం ఆ పక్షి ఇంకేమి చెయ్యగలదు? గడియలు లెక్కపెట్టుకోవడం తప్ప.
సాతాను అనే వేటగాడు కూడా ఉరులు పన్నడంలో చాల నేర్పుగా వ్యవహరిస్తాడు. ఏ వయస్సువారికి తగిన ఎరలను ఆ వయస్సువార్కి సిద్ధంచేసి సులభంగా ఉచ్చులోనికిలాగి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు.
వాడి ఉరిలో చిక్కుకోకుండా ఉండాలన్నా, చిక్కుకున్న నీవు విడిపించబడాలన్నా
ఒక్కటే శరణ్యం!
ఆ మహోన్నతుడును, సర్వోన్నతుడును అయిన, ఆ యేసయ్య పాదాలను ఆశ్రయించ గలగడం.
మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. కీర్తనలు 116:8
ఒకవేళ ఆయన గుడారము మాటున నీవుంటే?
భయపదాల్సిందేమిలేదు!
వాడేమి చెయ్యలేడు.
"నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు."
మొర్ధెకై కోసం ఉరికంభం సిద్దం చేయబడింది. దానిని సిద్దం చేయించిన హామానే ఆ ఉరికంభం ఎక్కాల్సివచ్చింది.
"ఆయన నిన్ను విడిపించే దేవుడు"
ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఏవిధంగా నాశానకరమైన తెగులు రాకుండా వారిని రక్షించాడో! ఆ విధంగా ఆయన నిన్ను రక్షించగలడు.
నీవు చేయాల్సిందేల్లా ఆ సర్వశక్తుని నీడను ఆశ్రయించడం.
ఆశ్రయిద్దాం!
అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( నాలుగవ భాగం)
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
కీర్తనలు 91:4
...............................
ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలనకోసం ఒక బృందం అక్కడకి వెళ్తే, రెక్కలు చాచుకొని, కాలిపోయి, మరణించిన పక్షిరాజును చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఎందుకిది ఇట్లా చనిపోవాలి? మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా! అని.
ఎందుకో వాళ్లకి అనుమానం వచ్చి ఆ పక్షిని పైకిలేపితే, దాని రెక్కల క్రింద సజీవంగా వున్నా పక్షి పిల్లలు వున్నాయట.
అవును!
నీకును ఆయన రెక్కల క్రింద అట్లాంటి కాపుదల, భద్రత, క్షేమం వుంది. నిన్ను సంరక్షించడం కోసం ఆయన ఆహుతి అయ్యాడు.
"నీవు పొందాల్సిన శిక్షను నీకు
బదులుగా ఆయనే అనుభవించాడు."
ఆ ప్రేమ ........???
అద్వితీయమైనది!
అపురూపమయినది!
కొలతలు లేనిది!
హద్దులు లేనిది!
అవధులు లేనిది!
వర్ణింపజాలనిది
మధురమైనది!
స్వచ్చమైనది!
శ్రేష్టమైనది!
సహించేది!
దయ చూపించేది!
అసూయలేనిది!
దంబములేనిది!
ఉప్పొంగనిది!
మర్యాద గలది!
కోపం లేనిది!
స్వంత ప్రయోజనం చూడనిది!
అన్నిటిని తాలుతుంది!
అన్నిటిని నమ్ముతుంది!
అన్నిటిని ఓర్చుకొంటుది!
అన్నిటిని నిరీక్షిస్తుంది!
శాస్వతమయినది!
అది నీ దేవుని ప్రేమ.
"యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును."
కీర్తనలు 125:2
నీవు ఆయనను ఆశ్రయించ గలిగితే ఆయనే నీ చుట్టూప్రాకారముగా వుండి,
సాతాను విసరుతున్న వాడిగల బాణములను( శోధనలను) ఆయనే కేడేముగా, డాలుగా వుండి, వాటన్నిటినుండి నిన్ను సంరక్షిస్తాడు.
ఆయన రెక్కల క్రిందికి రా!
ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించు.

( ఐదవ భాగం)
రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడ
కుందువు. కీర్తనలు 91:5,6
రాత్రివేళ శత్రుదాడులనుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో, పగలు వచ్చే ప్రమాదాలనుండి తప్పించడంలో కూడా అంతే సమర్ధుడు.
నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయ 12:2
ఏ పరిస్తితికి నీవు భయపడనవసర్లేదు. ఎందుకంటే నీ రక్షణకు ఆధారం ఆయనే.
ఆయనే నీకు బలం.
అయితే నీవు చెయ్యవలసింది ఒక్కటే. ఆ మహోన్నతుడును, సర్వశక్తిమంతుడైన దేవునిని నమ్ముకోవడం, ఆయన్ని ఆశ్రయించడం.
యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? కీర్తనలు 118:6
ఆయన నీపక్షమున వుంటే, నిన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు.
ఆ ముగ్గురు హెబ్రీ యువకులను అగ్ని ఏమి చెయ్యలేకపోయింది.
దానియేలును సింహాలు ఏమి చెయ్యలేకపోయాయి.
యోహానును సలసల కాగే నూనె ఏమి చెయ్యలేకపోయింది.
కారణం దేవుడు వారి పక్షమున వున్నాడు.
శత్రు బాణములు నీకు అందనంత ఎత్తులోనుండి దూసుకువస్తున్న భయపడనవసరంలేదు. నీవు ఆ సర్వశక్తుని నీడను విశ్రమించి యున్నట్లయితే?
ఆ మహోన్నతుని చాటున నీవున్నట్లయితే ప్రతీ పరిస్తితి నీముందు మోకరిల్లుతుంది.
భయపడవద్దు.
భయపడితే వాడు ఇంకా భయపెడతాడు.
భయం వేస్తె నీకోసం ఘోరమరణం అనుభవించిన యేసయ్యను తలంచుకో. అప్పుడు భయానికే భయమేస్తుంది.
భయపడవద్దు అని పరిశుద్ద గ్రంధములో 366 సార్లు వ్రాసిపెట్టాడట. అంటే లీపు సంవత్సరంలో వున్న ఆ రోజును కూడా కలుపుకొని రోజుకోక్కసారి చొప్పున ప్రతీదినము ఆ వాగ్ధానమును దేవుడు మనకు ఇస్తున్నాడు.
ఆయన నీకు తోడుగా వున్నాడు ధైర్యంతో సాగిపో! ఆగిపోవద్దు!
పరిస్తితులకు భయపడకు!
ఆయనకు మాత్రం భయపడు!

( ఆరవ భాగం)
"నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును." కీర్తనలు 91:7,8
మహోన్నతుని చాటున నివసించేవాడు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు నాశనం కావడం అసాద్యం.
అతడు జీవించి వుండాలని దేవుని సంకల్పం అయినంతకాలం అతడు మరణించలేడు. దేవుడు విశ్వాసి మేలుకోసం నిర్ణయించినది తప్ప మరేది అతన్ని తాకదు.
నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును.
ఈ జీవితకాలంలో కాకపోయినా దేవుడు లోకానికి అంతిమ తీర్పు తీర్చే సమయంలోనైన విశ్వాసి దీన్ని చూస్తాడు.
ఆసాపు వలే నీవిట్లా అనుకోవచ్చు.
భక్తి హీనులు క్షేమంగా వున్నారు.
వారికి బాధలు లేవు.
రోగాలు లేవు.
బలాత్కారం చేస్తున్నారు
యెగతాళి చేస్తున్నారు
గర్వముగా మాట్లాడుతున్నారు
ధనం సంపాదిస్తున్నారు
దేవుడంటే అసలు లెక్కేలేదు.
అయినా? ....
వారే వర్దిల్లుతున్నారు
వారే సంతోషంగా వుంటున్నారు.
నేను పవిత్రంగా జీవించడం వల్ల నాకొచ్చిన ప్రయోజనం ఏమిటి?
శోధనలు, వేదనలు, శ్రమలు తప్ప?
అయితే ఒక్క విషయం!
ఈ దినాన్న క్షేమంగా వున్నా, భక్తిహీనులు ఒక దినాన్న క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
ఆ సర్వశక్తుని నీడను ఆశ్రయించిన నీవు అయితే ... ఎల్లప్పుడు ఆయనతోనే ఉంటావు.
ఆయనే నీ చెయ్యి పట్టుకుంటాడు. నిన్ను నడిపిస్తాడు. ఎక్కడివరకు? ఆయన మహిమలో చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( ఏడవ భాగం)
"యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు.
కీర్తనలు 91:9
మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతూ, గుడారాల్లో నివసిస్తూ వున్నారు.
యాత్రికులు, పరదేశులు వలే ఒక దేశం నుండి మరొక దేశానికి అనగా వాగ్ధాన భూమికి పయనం సాగిస్తున్నారు. దానిలో భాగంగా అల్పకాల విశ్రాంతి కొరకు గుడారాలు ఏర్పాటు చేసుకొని వాటిలో జీవనం సాగిస్తున్నారు.
అయితే వారికి స్థిరమైన నివాస స్థలం ఒకటి వుంది. అది "యోహావాయే"
అందుకే మోషే అంటున్నాడు.
"ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. కీర్తనలు 90:1
"మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది." కొలస్సి 3:3
నీవునూ ఆ మహోన్నతుడునూ, సర్వోన్నతుడునూ అయిన దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి.
దేవుడే మన నివాసం అయినప్పుడు, ధనికుల యొక్క భవనాలు చూసి అసూయ చెందవలసిన పనిలేదు.
ఎందుకంటే, కోట్లు కుమ్మరించి కట్టినా అవి ఒక దినాన్న నేలకూలి దుమ్ములో కలసిపోవలసిందే.
అదే, నీ సజీవమైన దేవుడే నీకు నివాస స్థలం అయితే నీ నివాసం శాశ్వత కాలంనుండి శాశ్వత కాలం వరకు నిలెచే వుంటుంది.
అయితే, విచారం ఏమిటంటే ఈ శాశ్వతమైన నిత్యనివాసం గురించిన తలంపే మనకులేదు.
ఈ క్షణాన్న దానికోసం ఎందుకు ఒకసారి ఆలోచించ కూడదు?
ఎందుకు ప్రయత్నించ కూడదు?
పక్కాభవనం అని గర్వించొద్దు!
పూరి గుడిసె అని దిగులొద్దు!
కావేవి మనకు శాశ్వతం!
తరతరాలకు మన నివాస స్థలం "నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించిన నీ ప్రియ రక్షకుడయిన ఆ యేసయ్యే!
ఆయననే ఆశ్రయిద్దాం!
ఆశీర్వాదించ బడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( ఎనిమిదవ భాగం)
"నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు" కీర్తనలు 91:10
గుడారం:
శారీరకంగా మనం నివసించే "ఇల్లు."
ఆత్మీయంగా మన "దేహం."
అంటే నీ ఇంటి మీదికిగాని, నీ ఒంటిమీదికిగాని ఏ అపాయంగాని, తెగులుగాని సమీపించదు.
అదేంటి?
మన ఇంట్లోను సమస్యలే.
ఒంట్లోను సమస్యలే కదా?
అంటే ఎక్కడో ఈ వాక్యంలోనే తప్పుంది.
ముమ్మాటికి లేదు. అది నీలోనే వుంది.
ఎందుకలా?
నీవు ఆ మహోన్నతుని చాటున నివసించడం లేదేమో?
ఆ సర్వశక్తుని నీడను విశ్రమించడం లేదేమో?
యేసయ్య కాకుండా నీకంటూ ఒక చాటు, నీడ వున్నాయేమో?
ఆ చాటులో పాపం చేస్తూ, ఆ నీడలో
విశ్రమిస్తున్నావేమో?
అవునా?
ఇదే వాస్తవం అయితే ఎందుకు సరిచేసుకోకూడదు?
లేదు. నేను ఆయన చాటునే దాగియున్నాను. ఆ నీడే నాకు విశ్రమ స్థానం. అంటున్నావా?
అయితే, భయం లేదు.
"నీకు అపాయమేమియు రాదు"
ఒకవేళ అపాయం వచ్చినా, ఉపాయం నీకుంది.
ఈ వాగ్దానాలు నీ స్వంతం.
"ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును." కీర్తనలు 121:7
యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. కీర్తనలు 41:2
నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 1: 33
అవును!!!
ఆయన చాటున దాగివుందాం!
ఆయన నీడన విశ్రమిద్దాం!

( తొమ్మిదవ భాగం)
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొం దురు కీర్తనలు 91:11,12
నీ మార్గములు ఎట్లాంటివి?
నీకు నీవే, నీకోసం స్వంతగా ఎన్నుకున్న మార్గములా? అయితే, ఖచ్చితంగా ఈ వాగ్దానం నీకొరకు కాదు.
ఆ మహోన్నతుని ఆశ్రయించి ఆయన మార్గములలో నీవు సాగిపోతున్నవా? ఖచ్చితంగా ఈ వాగ్దానం నీకోసమే!
ఆయన నీకు తోడుగా "దూతను"కాదు. "దూతలను" పంపుతాడట. ఒక్క దూత ఒక్కరాత్రిలో ఒక లక్షఎనుబది ఐదు వేల మందిని చంపేసింది. అంతటి శక్తివంతమైన దూతలను ఆయన నీకు తోడుగాపంపుతున్నాడు.
సాతాను ఎంతటి వాడిగల బాణములను నీపైకి విసిరినా, అవేమి చెయ్యలేవు. కాపాడే దూతలు నీవెంటే వున్నారు.
ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తే అవి మరెందుకు మన మార్గములను సరాళం చెయ్యడం లేదు?
ఎటు చూసినా! ముండ్లపొదలు, గచ్చపొదలు,
రాళ్ళు, రప్పలతోనే (శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో)మన మార్గములు నిండి వుంటున్నాయి?
ఆ దూతలు నీవెంటే వుండి, నీవు వేసే ప్రతీ అడుగుకు వున్న అడ్డుబండలను తొలగిస్తాయి.నీవు నడవలేని పరిస్తితులు అక్కడ వుంటే అవి వాటి భుజాలపైన నిన్ను మోస్తాయితప్ప, నీకోసం సిమెంటు రోడ్లు సిద్దపరచవు. అట్లా చేస్తే ఇక నీకు దేవునితో పనేముంది?
అంటే నీవు వేసే ప్రతీ అడుగులోనూ ఆ మహోన్నతుడును, సర్వోన్నతుడును, సర్వశక్తుడును అయిన ఆయనను ఆశ్రయించగలగాలి.
అప్పుడు మాత్రమే ఈ వాగ్ధానమును నీ జీవితములో అనుభవించ గలవు.
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును కీర్తనలు 34:7
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. దానియేలు 6:22
ఆయన్నే ఆశ్రయిద్దాం!
ఆయనయందే భయ భక్తులు నిలుపుదాం!
ఆయన దృష్టికి నిర్దోషులుగా జీవిద్దాం!
ఆయనిచ్చు ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( పదియవ భాగం)
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు.
కీర్తనలు 91:13
సింహము, నాగుపాము సాతానును గుర్తుకు తెస్తున్నాయి.
సాతాను అత్యంత శక్తివంతమయినది.
( దేవునికంటే మాత్రం కాదు) ఎంతటి శక్తిగలది అంటే, దేవుని పరిశుద్ద రక్తాన్ని సహితం బలిగా తీసుకోగలిగింది.
అంతటి శక్తిగలిగిన సాతానును సహితం కాలితో త్రోక్కేసే శక్తిని దేవుడు నీకిచ్చాడు.
ఇదెప్పుడు సాధ్యం?
"ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు.
గర్జించు సింహం:
మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
1 పేతురు 5:8
సర్పము( పాము):
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను ఆది కాండము 3:1
సాతాను సింహము వలే గర్జిస్తూ, పాము వలే యుక్తిగలిగి, ఏనుగు వలే బలము గలదై....
నమిలితే ఆలస్యమవుతుంది అన్నట్లుగా, దొరికినవారిని దొరికినట్లు మింగేస్తున్నాడు.
మన బలహీనతలు పసిగట్టి సరయిన సమయంలో పంజా విసరుతున్నాడు.
ఎంతమందిని మింగినా వాడి ఆకలికి అంతులేదు. సంతృప్తికి అర్ధమే తెలియదు.
ఇంటర్ నెట్ లో " క్లిక్ మి" అంటూ వాడి రాజ్యంలోనికి తీసుకెళతాడు. దానిలోనుండి బయటకు రాలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కోకొల్లలు.
ఫేస్ బుక్ తో నీ ఫేస్ వేల్యూ పెంచుతా అనిచెప్పి, అడ్డంగా"బుక్" చేసేస్తున్నాడు. తమ పోస్టింగ్స్ కి లైక్ లు లేవని, కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు ఎందరో?.....
(ఫేస్ బుక్ ఉపయోగించుట తప్పు అనికాదు. బానిస మాత్రం కావద్దని)
ఇట్లా అనేక మార్గాలలో ఎందరినో బానిసలుగా మార్చేశాడు. యుక్తితో, కుయుక్తితో వాడిరాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాడు.
రాజైన దావీదు మొదలుకొని గేహజి వరకు అందరూ వీడికి బానిసలే.
ఇట్లాంటి వాడిని జయించేది ఎట్లా?
" దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును." యాకోబు 4:7
ఆ మహోన్నతుని ఆశ్రయిద్దాం!ఆయనకు లోబడి ఉందాం!
ఆయనిచ్చే శక్తితో సాతాన్ని ఎదిరిద్దాం! వాడిపైన విజయం సాదిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
(పదకొండవ భాగం)
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. కీర్తనలు 91:14
నీవు దేవుని ప్రేమిస్తే?
ఆయన నిన్ను తప్పిస్తాడు, ఘనపరుస్తాడు.
ఆయన ముందుగానే నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమకు నీవు ప్రతిస్పందిస్తే చాలు.
ఇంతకి ఏమి చేసాడాయన?
*సుమారుగా రెండువేల సంవత్సరాల క్రితం "నీకు బదులుగా" యెరుషలేము వీధుల్లో, మండుటెండలో వీపు మీద భారమయిన సిలువను మోసాడు.
*39 కొరడా దెబ్బలతో ఆయన శరీరమంతా నాగటి చాళ్ళవలే దున్నబడింది.
* ఆయన ముఖమంతా పిడిగుద్దులతో వాచిపోయింది.
* ఉమ్ములతో నిండిపోయింది.
*ముండ్ల కిరీటం నుండి కారుతున్న రక్తంతో ముఖమంతా రక్తసిక్తమయ్యింది.
*మూడు మేకులతో భూమికి, ఆకాశమునకు మధ్యన ఆ కల్వరిగిరిలో వ్రేలాడుతున్న పరిస్టితి.
*చివరి రక్తపుబొట్టు వరకు ఏరులై ప్రవహించిన అనుభవం.
*అది వర్ణనకు అందని అద్భుత త్యాగం.
ఇదెవరికి సాధ్యం?
అంతగా ఆయన నిన్ను ప్రేమించాడు.
నీవు ఆయనను ప్రేమించాలంటే, ఆయనలానే నీవూ చెయ్యలా? అవసరంలేదు. అది నీకు సాధ్యం కాదు కూడా!
ఆయనను ఎట్లా ప్రేమించాలి?
"మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ" 2 యోహాను 1:6
ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే ఆయనను ప్రేమించినట్లే.
ఆయనను ప్రేమిస్తే? అయన నిన్ను తప్పిస్తాడు:
*హెబ్రీయువకులను అగ్నిగుండంనుండి,
*దానియేలును సింహపుబోనులో నుండి తప్పించినట్లు.
ఆయన నిన్ను ఘనపరుస్తాడు:
*బానిసగా బ్రతకాల్సిన యోసేపును ప్రధానిని చేసినట్లు.
*ద్వారమందు కూర్చునే మొర్ధెకైను రాజసన్నిధిలో కూర్చుండబెట్టినట్లు.
ఎందుకు వీరంతా తప్పించబడ్డారు?
ఘనపరచబడ్డారు?
ఆయనను ప్రేమించారు గనుక
మనమునూ ఆయన ప్రేమకు ప్రతిస్పందిద్దాం!
తప్పించబడదాం! ఆయన చేత ఘనపరచ బడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( పండ్రెండవ భాగం)
( పదియవ భాగం)
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు.
కీర్తనలు 91:13
సింహము, నాగుపాము సాతానును గుర్తుకు తెస్తున్నాయి.
సాతాను అత్యంత శక్తివంతమయినది.
( దేవునికంటే మాత్రం కాదు) ఎంతటి శక్తిగలది అంటే, దేవుని పరిశుద్ద రక్తాన్ని సహితం బలిగా తీసుకోగలిగింది.
అంతటి శక్తిగలిగిన సాతానును సహితం కాలితో త్రోక్కేసే శక్తిని దేవుడు నీకిచ్చాడు.
ఇదెప్పుడు సాధ్యం?
"ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు.
గర్జించు సింహం:
మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
1 పేతురు 5:8
సర్పము( పాము):
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను ఆది కాండము 3:1
సాతాను సింహము వలే గర్జిస్తూ, పాము వలే యుక్తిగలిగి, ఏనుగు వలే బలము గలదై....
నమిలితే ఆలస్యమవుతుంది అన్నట్లుగా, దొరికినవారిని దొరికినట్లు మింగేస్తున్నాడు.
మన బలహీనతలు పసిగట్టి సరయిన సమయంలో పంజా విసరుతున్నాడు.
ఎంతమందిని మింగినా వాడి ఆకలికి అంతులేదు. సంతృప్తికి అర్ధమే తెలియదు.
ఇంటర్ నెట్ లో " క్లిక్ మి" అంటూ వాడి రాజ్యంలోనికి తీసుకెళతాడు. దానిలోనుండి బయటకు రాలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కోకొల్లలు.
ఫేస్ బుక్ తో నీ ఫేస్ వేల్యూ పెంచుతా అనిచెప్పి, అడ్డంగా"బుక్" చేసేస్తున్నాడు. తమ పోస్టింగ్స్ కి లైక్ లు లేవని, కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు ఎందరో?.....
(ఫేస్ బుక్ ఉపయోగించుట తప్పు అనికాదు. బానిస మాత్రం కావద్దని)
ఇట్లా అనేక మార్గాలలో ఎందరినో బానిసలుగా మార్చేశాడు. యుక్తితో, కుయుక్తితో వాడిరాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాడు.
రాజైన దావీదు మొదలుకొని గేహజి వరకు అందరూ వీడికి బానిసలే.
ఇట్లాంటి వాడిని జయించేది ఎట్లా?
" దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును." యాకోబు 4:7
ఆ మహోన్నతుని ఆశ్రయిద్దాం!ఆయనకు లోబడి ఉందాం!
ఆయనిచ్చే శక్తితో సాతాన్ని ఎదిరిద్దాం! వాడిపైన విజయం సాదిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
(పదకొండవ భాగం)
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. కీర్తనలు 91:14
నీవు దేవుని ప్రేమిస్తే?
ఆయన నిన్ను తప్పిస్తాడు, ఘనపరుస్తాడు.
ఆయన ముందుగానే నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమకు నీవు ప్రతిస్పందిస్తే చాలు.
ఇంతకి ఏమి చేసాడాయన?
*సుమారుగా రెండువేల సంవత్సరాల క్రితం "నీకు బదులుగా" యెరుషలేము వీధుల్లో, మండుటెండలో వీపు మీద భారమయిన సిలువను మోసాడు.
*39 కొరడా దెబ్బలతో ఆయన శరీరమంతా నాగటి చాళ్ళవలే దున్నబడింది.
* ఆయన ముఖమంతా పిడిగుద్దులతో వాచిపోయింది.
* ఉమ్ములతో నిండిపోయింది.
*ముండ్ల కిరీటం నుండి కారుతున్న రక్తంతో ముఖమంతా రక్తసిక్తమయ్యింది.
*మూడు మేకులతో భూమికి, ఆకాశమునకు మధ్యన ఆ కల్వరిగిరిలో వ్రేలాడుతున్న పరిస్టితి.
*చివరి రక్తపుబొట్టు వరకు ఏరులై ప్రవహించిన అనుభవం.
*అది వర్ణనకు అందని అద్భుత త్యాగం.
ఇదెవరికి సాధ్యం?
అంతగా ఆయన నిన్ను ప్రేమించాడు.
నీవు ఆయనను ప్రేమించాలంటే, ఆయనలానే నీవూ చెయ్యలా? అవసరంలేదు. అది నీకు సాధ్యం కాదు కూడా!
ఆయనను ఎట్లా ప్రేమించాలి?
"మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ" 2 యోహాను 1:6
ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే ఆయనను ప్రేమించినట్లే.
ఆయనను ప్రేమిస్తే? అయన నిన్ను తప్పిస్తాడు:
*హెబ్రీయువకులను అగ్నిగుండంనుండి,
*దానియేలును సింహపుబోనులో నుండి తప్పించినట్లు.
ఆయన నిన్ను ఘనపరుస్తాడు:
*బానిసగా బ్రతకాల్సిన యోసేపును ప్రధానిని చేసినట్లు.
*ద్వారమందు కూర్చునే మొర్ధెకైను రాజసన్నిధిలో కూర్చుండబెట్టినట్లు.
ఎందుకు వీరంతా తప్పించబడ్డారు?
ఘనపరచబడ్డారు?
ఆయనను ప్రేమించారు గనుక
మనమునూ ఆయన ప్రేమకు ప్రతిస్పందిద్దాం!
తప్పించబడదాం! ఆయన చేత ఘనపరచ బడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
91 వ కీర్తనా ధ్యానం
( పండ్రెండవ భాగం)
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనలు 91:15,16
......................................
నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడయిన , ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ,
ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ గలిగితే?
దివ్యమైన, శాశ్వతమైన ఆశీర్వాదాలు నీ స్వంతం:
1.నీ ప్రార్ధనకు సమాధానం:
నీ ప్రార్ధన వింటాడు.
నీ కోరిక సిద్ధింప చేస్తాడు.
నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు.
2.నీ శ్రమలలో నీతోపాటే ఉంటాడు.
"శ్రమలలో ఆయన నీతోవుంటే
అవి శ్రమలే కాదు."
"సంతోషంలో ఆయన నీతోలేకుంటే అది సంతోషమే కాదు."
నీ జీవిత నౌక యొక్క చుక్కానిని ఆయనకీ అప్పగిస్తే .....
సుడిగుండాలలో ఎట్లా నడిపించాలో?
ఎగసిపడే అలల మధ్య ఎట్లా నడిపించాలో?
నిర్మలమైన నీటిలో ఎట్లా నడిపించాలో?
ఆయన కంటే తెలిసిన వారెవరూలేరు.
సమస్యల సుడిగుండాలు నిన్ను వేధిస్తున్నా, వేధన చెందొద్దు.
నీ శ్రమల్లో ఆయన నీతోనే ఉంటాడు. గమ్యం చేర్చుతాడు.
"యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను."
ఆదికాండము 39:2
3.దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాడు:
ఈలోకంలో ఎంతకాలం జీవించినా అది అల్పకాలమే. తప్పకుండ ఒకరోజు విడచి వెళ్ళాల్సిందే. దీర్ఘాయువు అనే నిత్యజీవాన్నిచ్చి నిన్ను తృప్తి పరుస్తాడు.
4.ఆయన రక్షణ నీకు చూపిస్తాడు:
రక్షణ అంటే "శిక్షనుండి తప్పించబడడం."
నిత్య నరకాగ్ని అనే శిక్ష నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
ఇవన్ని ఎప్పుడు సాధ్యం?
*మారు మనస్సు
*పశ్చాత్తాపం
*పాప క్షమాపణ
నీజీవితంలో తప్పనిసరి.
ఇక వాయిదా వెయ్యొద్దు.
ప్రభు పాదాల చెంత మోకరిల్లుదాం!
ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(91 వ కీర్తనా ధ్యానములు సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి