ఆధ్యాత్మిక సందేశాలు-2 కొన్ని కీర్తనల ధ్యానం-Part-1
ఆధ్యాత్మిక సందేశాలు-2 కొన్ని కీర్తనల ధ్యానం
మొదటి కీర్తన
దానిలో పడితే
మొదటి కీర్తన
మొదటి కీర్తన
మొదటి కీర్తనా ధ్యానం
( మొదటి భాగం)
దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కీర్తనలు 1:1,2
"ధన్యుడు" అంటే ఆశీర్వదించబడిన వాడు.
ఆ ధన్యత నీవు పొందాలంటే?
1. మూడింటిని విడచిపెట్టాలి.
2. రెండింటిని హత్తుకోవాలి.
విడచిపెట్ట వలసినవి:
1. దుష్టులతో నడవొద్దు
2. పాపులమార్గాల్లో నిలవొద్దు
3. అపహాస్యకులతో కూర్చోవొద్దు
*దుష్టులతో నడిస్తే ఏమవుతుంది?
దుష్ట సాంగత్యము నీ మంచి నడవడిని చెరిపేస్తుంది.
*పాపుల మార్గాల్లో నిలిస్తే ఏమవుతుంది?
ఆ పాపం నిన్ను కూడా బంధించేసి జీవితాంతం దానిలోనే నిలిపేస్తుంది.
*అపహాసకులతో కూర్చుంటే ఏమవుతుంది?
"నిన్ను కూడా అపహాస్యకునిగా మార్చేస్తుంది."
నీవు ఎవ్వరినీ అపహాస్యం చెయ్యకపోవచ్చు. కాని వేరొకరు చేస్తుంటే నీవు పగలబడినవ్వి వారిని ప్రోత్సహించవచ్చు. అట్లా నీవునూ అపహాసకుడవే.
ఈ మూడింటిని నీవు విడచిపెట్టాలి.
హత్తుకోవలసినవి:
1. వాక్యమందు ఆనందించడం.
2. వాక్యాన్ని ధ్యానించడం
*వాక్యమందు ఆనందించడం అంటే?
"వాక్యమే దేవుడై ఉండెను" అంటే దేవుని యందు ఆనందించాలి.
అదెట్లా సాధ్యం?
*వాక్యాన్ని ద్యానించడం ద్వారా.
(చదవడంద్వారా మాత్రం కాదు)
దివారాత్రము ధ్యానించాలి అంటే?
నిద్రాహారాలు మాని రాత్రింబగళ్ళు వాక్యాన్ని ధ్యానించాలనా?
క్రమం తప్పక ద్యానించాలని.
"ధ్యానం" దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించి మనలను ఆయన సమరూపంలోనికి మార్చుతుంది.
విడచి పెట్టాల్సినవి హత్తుకోకుండా,
హత్తుకోవలసినవి విడచిపెట్టకుండా,
ఆ ధన్యత లోనికి ప్రవేశించడానికి ప్రయాస పడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్

(రెండవ భాగం)
అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనలు 1:3
ఎవరయితే ధన్యత లోనికి ప్రవేశించారో,
వారు ఎట్లా వుంటారు అంటే?
1.నీటి యోరను నాటబడిన చెట్టు వలే ఉంటారు.
*అదెల్లప్పుడు పచ్చగా వుంటుంది.
*బలముగా వుంటుంది.
*తగిన కాలమందు మంచి ఫలాలనిస్తుంది.
*ఎక్కువ కాలం బ్రతుకుతుంది.
నీవును ఓడబారని, ఫలవంతమైన,
జయకర జీవితాన్ని కొనసాగించాలంటే ఒక్కటే మార్గం.
"జీవజల నీటిబుగ్గ" అయిన "యేసయ్య" చెంత నాటబడాలి.
అట్లా యేసయ్య చెంత నాటబడితే, నీవు దీవెనలు ప్రవహించే నదీతీరాన్న ఉన్నట్లే. ఆ నదీ ప్రవాహం ఎప్పటికీ ఆగదు. ఇక నీ జీవితమంతా ఆశీర్వాదాలు పొంగిపొర్లుతాయి.
2. చేయునదంతా సఫలం:
ఏది చేసినా సఫలం అవుతుందా?
అవుతుంది.
అట్లా అని జీవితాంతం ఏమి కష్టపడతాంలే అని బ్యాంక్ దోపిడీ చేద్దాం అంటే?
సఫలం అవుతుందా?
దేవునియందు ఆనందించే వారికి, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారికి కనీసం ఇట్లాంటి తలంపులు కూడా దరిచేరవు.
వారు ఏది చేసినా దేవుని చిత్తానుసారమే చేస్తారు. ఆయనపైనే ఆధారపడి చేస్తారు.
సఫలీ కృతులవుతారు. సందేహం లేదు.
*మన జీవితాల్లో అపజయాలే ఎందుకు వెంటాడుతున్నాయ్?
*ఎందుకు సఫలం కాలేకపోతున్నాం?
ఏమో?
* ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయనలో ఆనందించే అనుభవం లోనికి మనమింకా రాలేదేమో?
* ఇంకనూ జీవజల బుగ్గ
(యేసయ్య) చెంత నాటబడలేదేమో?
మనము జీవించిన జీవితాలకు గతించిన కాలమే చాలు.
విడచి పెట్టాల్సినవి హత్తుకోకుండా,
హత్తుకోవలసినవి విడచిపెట్టకుండా,
ఆ ధన్యత లోనికి ప్రవేశించడానికి ప్రయాస పడదాం!
ఫలవంతమైన జీవితాన్ని జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మొదటి కీర్తనా ధ్యానం
(మూడవ భాగం)
దుష్టులు ఆలాగున నుండకగాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కీర్తనలు 1:4
దుష్టులు నీటి యోరను నాటబడిన చెట్టువలే ఫలవంతమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండరు.
"నాటబడిన చెట్టు" స్థిరమైన, అచంచలమైన జీవితానికి సాదృశ్యం.
కాని, దుష్టులు అట్లా వుండరట.
గాలికి ఎగిరిపోయే పొట్టువలే అస్థిరమైన, చంచలమైన జీవితాన్ని జీవించేవారుగా వుంటారు.
నీ జీవితం పొట్టులా ఉంటే?
ఆ దినాన్న కాల్చివేయబడతావ్.
ఏ దినాన్న?
న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పుతీర్చే దినాన్న.
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. మత్తయి 3:12
ఆయన "తీర్పు అనే చేటను" మన మీద విసిరినప్పుడు ఫలవంతమైన గింజలవలే వుండి తట్టుకోగలిగి నిలబడగలిగితే ధన్యులమే.
ఒకవేళ పొట్టులా ఎగిరిపోతే?
ఎగిరిపోయి నిత్యమూమండే అగ్నిగుండంలో పడతాము.
అది ఊహలకే భయంకరం.
అగ్ని ఆరదు
పురుగు చావదు
ఏడ్పు పండ్లుకొరికే స్థలమది.
దానిలో పడితే
తప్పించే వారెవ్వరూలేరు.
అది కొన్ని రోజులకు,
కొన్ని సంవత్సరాలకు
మాత్రమే పరిమితం కాదు.
దానికి అంతమంటూ లేదు.
నిత్యమూ అదే నీనివాస స్థలం.
దాని నుండి నీవు తప్పించబడాలి అంటే?
ఫలించాలి.
ఫలించాలంటే?
ధన్యత లోనికి ప్రవేశించాలి.
ధన్యత లోనికి ప్రవేశించాలంటే?
ఆయన యందు ఆనందించాలి.
ఆయన యందు ఆనందించాలంటే?
వాక్యాన్ని ధ్యానించాలి,
అనుసరించాలి.
అప్పుడే ఆ నిత్య మరణంనుండి తప్పించబడతాము
ఆ రీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మొదటి కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
కీర్తనలు 1:5,6
లోకంలో పాపులు , నీతిమంతులు కలిసే వుంటారు. నీతిమంతుల సభలో పాపులు కూడా వుంటారు.
న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పుతీర్చే ఆ దినాన్నమాత్రం నీతిమంతుల సభలో పాపులు ఎంత మాత్రము నిలువలేరు.
1. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును:
ఇది ఇరుకైన మార్గం.
ఎటు చూసినా....
ముండ్ల పొదలు-గచ్చ పొదలే.
రాళ్ళు -రప్పలే,
ఇరుకులు - ఇబ్బందులే,
శ్రమలు -శోధనలే,
కాని ఒక్క విషయం!
*నీవెళ్ళే మార్గం ఆయనకు తెలుసు.
*ఆ మార్గంలో ఆయనున్నాడు.
*ఆయన నీకోసం సిద్దంచేసిన అత్యంత సుందరమైన, శాశ్వతమైన పట్టణానికి నిన్నుతప్పక చేరుస్తాడు.
సందేహం లేదు.
* ఆ పట్టణంలో దేవాలయము లేదు.
కారణం? దేవుడే అక్కడ వున్నాడు.
* సూర్యచంద్రులు లేరు. రాత్రి లేనే లేదు. కారణం? దేవుని మహిమయే దానిలో ప్రకాశించు చున్నది.
*అది మహిమోన్నతమైన పట్టణం.
*అది నీతిమంతుల గమ్యస్థానం.
2. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును:
ఇది అత్యంత విశాలమైన మార్గం.
*ధనముంటుంది
*అల్పకాల సుఖభోగాలు
*అధికారం -హోదా
*లోకంలో లెక్కలేనన్ని
రంగులు నిన్ను ఆకర్షిస్తాయ్!
కాని,
*విశాలమైన మార్గంలో దూసుకుపోతున్న నీపయనం, వెళ్ళేకొలదీ ఇరుకైపోతుంది.
అది ఎంతగా అంటే?
ఆ సందులో నీవు ఇరుక్కుపోయేటంతగా!
*ఇక విడిపించుకోలేవ్!
తప్పించుకోలేవ్!
అపవాదికిని, వాని అనుచరులకును సిద్దపరచబడిన ఆ నిత్యనరకమే నీకు శరణ్యం!
తప్పించాబడాలి అంటే?
ఒక్కటే మార్గం.
*దివ్య గ్రంధాన్ని ధ్యానం చేయడం.
*జీవితాన్ని సరిచేసుకోవడం
ఆ రీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(మొదటి కీర్తనా ధ్యానం సమాప్తం)
8వ కీర్తనా ధ్యానం
యెహోవా యొక్క నామమును ఎంత ప్రభావము గలదో దాని గురించి దావీదు పాడుతున్నాడు.
యెహోవా అను మాటకు హీబ్రూ భాషలో అని వ్రాస్తారు. "యావే" లేక "యాహ్వే" కొందరు. అని అర్ధం " ఉండడం" "ఉన్నవాణ్ని" దీనికి. అని అర్ధం.
పాత నిబంధనలో యెహోవా అనే నామము 6,000 కంటే ఎక్కువ సార్లు వ్రాయబడింది. ఇది దేవునికి జ్ఞాపకార్ధ నామం.
యెహోవా అను నామాన్ని గ్రీకు భాషలో"కూరియోస్" అని పిలుస్తారు అంటే "ప్రభువు". అని అర్ధం
నూతన నిబంధనలో ప్రభువు అనే పదం 700 సార్లు కంటే ఎక్కువగా వాడబడింది.చాలా సందర్భాలలో యెహోవా అనేమాటకు బదులుగా ప్రభువు అని వ్రాయబడింది.
ప్రభువు అనే మాట యేసు క్రీస్తు విషయంలో వందలాది సార్లు వ్రాయబడింది. అంతేగాక ఆయన తనను గురించితాను
"వున్నవాడను". అని చెప్పుకున్నాడు
పాత నిబంధన గ్రంధములో యెహోవాకు అనేక నామములు వున్నాయి.
ఉదా:
"యెహోవా ఈరే చూచుకొనునుయెహోవా" అంటే " "
"యెహోవా రాఫా "యెహోవా స్వస్థ పరచును" అంటే "
"యెహోవా షాలోం "యెహోవాయే సమాధానం" అంటే "
"యెహోవా నిస్సి "యెహోవా నా ధ్వజం" అంటే."
ఇట్లా అనేకం.
ఆయన నామము మహిమగల భీకరమైన నామము. పరిశుద్ద మైన నామము.
అందుచే బైబిల్ ను తర్జుమా చేసే సమయంలో యెహోవా అని పదం వ్రాయవలసి వచ్చినప్పుడెల్లా కాళ్ళు చేతులు కడుగుకొని వచ్చి వ్రాసేవారట.
ఆయన నామము భూమియందంతట ప్రభావము గలది.
ఆయన నామాన్ని గౌరవిద్దాం!
ఆయన నామమునకు భయపడదాం!
ఆయన పరిశుద్దుడై యున్నలాగున మనము కూడా పరిశుద్దులుగా జీవించడానికి ప్రయాస పడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. కీర్తనలు 39:6
ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; 1పేతురు 1:23
*ఇంతటి అల్పులమైన మనలను ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవలసి వచ్చింది?
*దివి నుండి భువికేతెంచి మనకు బదులుగా ఆయన ప్రాణమును ఎందుకు అర్పించ వలసి వచ్చింది?
ఒక్కసారి ఆలోచించు!!!
నిన్ను నిత్య మరణం నుండి తప్పించడానికే కదా? అవును. సందేహం లేనేలేదు.
*పశ్చాత్తాప పడదాం!
*ఆయన చెంత చేరుదాం!
ఆ నిత్య రాజ్యానికి వారసులవుదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
8వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
కీర్తనలు 8:5,6
మనిషి దేవునికంటే కొంచెం తక్కువ వాడు కాదుగాని చాల తక్కువ వాడు.
దేవుడు సర్వ శక్తిమంతుడైన సృష్టికర్త.
మనిషి ఆ దేవునిచే సృష్టించ బడిన బలహీనుడు.
మహిమా ప్రభావములతో మనిషికి కిరీటాన్ని ధరింపజేశాడు. కాని ఆదాము పాపము చేసి దానిని పోగొట్టుకున్నాడు.
మొదటి ఆదాము దానిని పోగొట్టుకున్నాడు గాని, కడపటి ఆదాము అయిన యేసు ప్రభువు విషయంలో ఇది సంపూర్తిగా నెరవేర్చబడింది.
నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, హెబ్రీ 2: 8
ప్రకారం ఇంకా నెరవేరలేదు గాని, యేసు ప్రభువు విషయంలో మాత్రమే పూర్తిగా నిజం.
దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. 1 కొరిందీ 15:27
సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెస్సి 1:22
అయితే ఒక్క విషయం!!
సమస్తము ఆయన పాదముల క్రింద వుంది కాబట్టి, నీవు ఆయన పాదాల క్రింద వుండాలని ఆయన కోరడంలేదు.
ఆయన సింహాసనం లో నిన్ను కూర్చుండబెడతాను అంటున్నాడు.
ఇక వాయిదా వెయ్యొద్దు!
*పశ్చాత్తాప పడదాం!
*ఆయన చెంత చేరుదాం!
ఆ నిత్య రాజ్యానికి వారసులవుదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
8వ కీర్తనా ధ్యానం
(ఐదవ భాగం)
గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను
సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. కీర్తనలు 8:7-9
సృష్టి లో సమస్తమును ఆయన మాటలతో సృష్టిస్తే, మనిషిని మాత్రం చేతులతో నిర్మించాడు.
ఇక్కడే అర్ధమవుతుంది. దేవుడు మనిషికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో?
సృష్టిలో నిన్నూ నన్నూ ప్రత్యేక పరచుకున్నాడు. ఎంతో ఆదిక్యతను ఇచ్చాడు.
సృష్టంతటి పైన అధికారాన్నిచ్చాడు.
అందుకే, క్రూర మృగాలను సహితం మనిషి లోబరచుకో గలుగుతున్నాడు.
పరిపాలించమని దేవుడు జంతుజాలాన్ని మనిషికి అప్పగిస్తే? పరిపాలన విషయంలో మనిషి క్రూరంగా, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు.
అత్యంత విచారకరమైన మరొక విషయం ఏమిటంటే?
ఏలమని వాటిని దేవుడు అప్పగిస్తే? వాటినే ఏలికలుగా చేసుకొని, వాటినే పూజించడం మొదలు పెట్టాడు.
సృష్టి కర్తను మరచి, సృష్టినే పూజించే స్థితికి మనిషి దిగజారిపోయాడు. సృష్టికర్తనే ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయాడు.
వద్దు!!
భూమి యందంతట ఆయన నామము ప్రభావము గలది.
ఆయన నామమును గౌరవించాలి. .
ఆయన నామమును ఆరాధించాలి
ఆయన నామమునకు భయపడాలి.
ఎందుకంటే?
ఆ నామము ద్వారానే నిత్య రాజ్యము.
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(8వ కీర్తనాధ్యానం సమాప్తం)
14వ, 53వ కీర్తనల ధ్యానం
14వ, 53వ కీర్తనల ధ్యానం
(నాలుగవ భాగం)
బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
కీర్తనలు 14:6,7
సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.
కీర్తనలు 53:6
బాధించబడుతున్నావా?
బాధపడకు.
భయపడకు.
ఎందుకంటే?
ఆయన....
* నీ పక్షముగా నున్నాడు.
* నీతో వున్నాడు.
* నీకు ఆశ్రయమై వున్నాడు.
ఆయనే మన ఆశ్రయమైతే?
"సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు
కొదువయై యుండదు."
కీర్తనలు 34:10
అడవికి రాజయిన సింహపు పిల్లలు ఆకలిగొనే ప్రసక్తే లేదు. ఒకవేళ అవయినా ఆకలిగొన వచ్చేమో గాని,
ఆయనను ఆశ్రయించే మనకు ఏ మేలు తక్కువకాదు.
ఎందుకంటే?
మనము రారాజు పిల్లలం.
యువరాజులం.
సాతాను చెరలోనుండి ఆయన మనలను విడిపించాడు.
*రాజులుగా
*యాజకులుగా
*ఆయన పిల్లలుగా
*ఆయన స్నేహితులుగా
మనలను చేసి, విమోచించి ధన్యకరమైన జీవితాన్నిచ్చాడు.
ఇంత చేసినా?
ఆయన ప్రేమను, త్యాగమును
వివేచించ కుండా,
ఇంకా చెడు మార్గాల్లోనే నడుస్తూ ,
దేవుడే లేడు అని చెప్పే బుద్దిహీనమైన జీవితాన్ని జీవిస్తూవుంటే?
నీ జీవిత గమ్యమేమిటో తెలుసా?
* భయం
* సిగ్గు
* అవమానం
* దేవుని ఉగ్రత
వద్దు!
సరిచేసుకుందాం!
సాగిపోదాం!
ఆ పరమ సీయోనుకు చేరుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(14వ, 53వ కీర్తనల ధ్యానం సమాప్తం)
15వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడుఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
కీర్తనలు 15:5
..........................
ఎవరయితే?
*యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
*నీతిని అనుసరిస్తూ,
*హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
అట్టి వారు,
*నాలుకతో కొండెములాడరు.
*తన స్నేహితునికి కీడు చేయరు.
*తన పొరుగువానిమీద నింద మోపరు.
*దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
*దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు.
*మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.
అంతే కాకుండా,
*తన ద్రవ్యము వడ్డికియ్యరు.
*నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.
1. తన ద్రవ్యము వడ్డికియ్యరు.
మన కళ్ళెదుటే కడుబీదలుగా వున్నవాళ్ళు నేడు కోట్లకు పడగలెత్తుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం వడ్డీ తీసుకోవడమే.
దేవుని వాక్యం తెలిసినవారు కూడా చూసి చూడనట్లుగా వారిపని వారు కొనసాగిస్తున్నారు. అది వారికిగాని, వారి పిల్లలకుగాని ఆశీర్వాదం కాదు.
అన్యులు వారికి తెలియదు కాబట్టి వారు క్షమించబడతారేమో కాని, దేవుని పిల్లలముగా మనము తప్పించుకోలేము.
నీవు వడ్డీ 10 రూపాయలు తీసుకున్నా, 10 పైసలు తీసుకున్నా అది వడ్డీయే కదా? అపరాధిగా నిలబడాల్సి వస్తుంది. సందేహం లేదు.
ఒక బీదవానికి సొమ్ముఅప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు.
నిర్గమ 22:25
2. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.
లంచము అతి తక్కువ సమయంలో అక్రమముగా సంపాదించే మార్గాలలో ప్రాముఖ్యమైనది.
వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.
యెషయ 5:23
లంచం తీసుకొని దొరికిపోయిన వాళ్ళు అనేకమంది జైలులో గడుపుతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగితున్నారు.
అంటే? మన దేశ చట్టం కూడా దీనిని ఒప్పుకోదు. ఇక మన దేవుని చట్టం అస్సలు ఒప్పుకోదు.
ఈ అన్ని విషయాల ప్రకారం నడచుకొను వాడు. ఎప్పటికి కదల్చబడడు.
వారు నిస్సందేహంగా దేవుని ఇంటిలో ఆతిధ్యం పొందుతారు.
మన జీవితాలు ఎట్లావున్నాయి?
సరిచేసుకుందాం!
సాగిపోదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(15వ కీర్తనా ధ్యానం సమాప్తం)
(ఆరవ భాగం)
వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.
కీర్తనలు 20:8,9
..............................
"వారు క్రుంగి నేలమీద పడియున్నారు"
ఎవరు?
*దేవుని యందు కాకుండా, లోకమును బట్టి అతిశయించే వారు.
*దేవుని యందు కాకుండా, లోకముపై ఆధార పడేవారు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
యిర్మియా 17:5,6
ధనమును బట్టి అతిశయిస్తే నాశనము.
దేవునిని బట్టి అతిశయిస్తే సంవృద్ది.
ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
సామెతలు 11:28
లోకమును బట్టి అతిశయించే వారు భక్తిహీనులు, వారు కొంతకాలం ఈలోకంలో ఏ కష్టాలు బాధలు లేనట్టే కనిపిస్తారు. కాని, దేవుని ఉగ్రతదినాన్న వారి వేదనకు అంతం లేదు.
అయితే, దేవుని బట్టి అతిశయించే వారికి వేదనలు కలుగవా? తప్పకుండా కలుగుతాయి. కాని, ఆ సమయంలో ఆయన కృప వారికి తోడుగావుండి నడిపిస్తుంది.
ఎంత వరకు అంటే?
నిత్య రాజ్యం చేరువరకు.
భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.
కీర్తనలు 32:10
దేవునిని బట్టి అతిశయించే వారిని, ఆయన పైనే ఆధారపడే వారిని ఆయన రక్షిస్తాడు. వారు ప్రార్ధించినప్పుడు ఆలకించి, సమాధానమిస్తాడు.
ఆయననుబట్టే అతిశయిద్దాం!
ఆయనపైనే ఆధారపడదాం!
ఆయనయందే ఆనందిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(20వ కీర్తనాధ్యానం సమాప్తం)
(మొదటి భాగం)
యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా,భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. కీర్తనలు 8:1

శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలముననీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.
కీర్తనలు 8:2
నూతన నిబంధనలోకూడా యేసు ప్రభువు ఈ మాటలు చెప్పడం జరిగింది.
ఒక దినాన్న యేసు ప్రభువు రోగులను స్వస్థ పరచినప్పుడు అక్కడున్న చిన్న పిల్లలంతా "హోసన్నా", దావీదు కుమారునికి జయము అంటూ కేకలు వేస్తున్న సందర్భములో ప్రధాన యాజకులు. శాస్త్రులు యేసయ్యను ప్రశ్నిస్తున్న సందర్భమిది.
వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?
మత్తయి 21:16
జ్ఞానవంతులం అనుకొనే పరిసయ్యులు, శాస్త్రులు వంటి వారిని దేవుడు పట్టించుకోడు.
చిన్న పిల్లల వంటి వినయం గలవారికి, సామాన్యులకు ఆయన సత్యాన్ని బయలుపరుస్తాడు.
ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
మత్తయి 11:25
మనమే జ్ఞానవంతులం అని పొంగిపోనవసరం లేదు. ఆయన కృంగదీస్తాడు.
ఆయన పాదాల చెంతచేరి తగ్గింపు మనసుతో అంటే చిన్న పిల్లల వంటి నిష్కల్మష మైన మనసుతో, అణకువతో జీవించి ఆయనను స్తుతించే వారముగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
శుభోదయం
8వ కీర్తనా ధ్యానం
(మూడవ భాగం)
నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా,
నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
కీర్తనలు 8:3,4
ప్రకృతి నుండి మనం నేర్చుకోవలసింది అనేకం.
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్న కీర్తనలు 19:1
ఈ అద్భుతమైన విశ్వంతో పోల్చుకుంటే అల్పుడైన ఈ మానవుడెంత?
మనిషి జీవితం ఎట్లాంటిది అంటే?
జనములు చేదనుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు యెషయ 40:15
ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు కీర్తనలు 39:5
నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా,
నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
కీర్తనలు 8:3,4
ప్రకృతి నుండి మనం నేర్చుకోవలసింది అనేకం.
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్న కీర్తనలు 19:1
ఈ అద్భుతమైన విశ్వంతో పోల్చుకుంటే అల్పుడైన ఈ మానవుడెంత?
మనిషి జీవితం ఎట్లాంటిది అంటే?
జనములు చేదనుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు యెషయ 40:15
ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు కీర్తనలు 39:5
మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. కీర్తనలు 39:6
ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; 1పేతురు 1:23
*ఇంతటి అల్పులమైన మనలను ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవలసి వచ్చింది?
*దివి నుండి భువికేతెంచి మనకు బదులుగా ఆయన ప్రాణమును ఎందుకు అర్పించ వలసి వచ్చింది?
ఒక్కసారి ఆలోచించు!!!
నిన్ను నిత్య మరణం నుండి తప్పించడానికే కదా? అవును. సందేహం లేనేలేదు.
*పశ్చాత్తాప పడదాం!
*ఆయన చెంత చేరుదాం!
ఆ నిత్య రాజ్యానికి వారసులవుదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
8వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
కీర్తనలు 8:5,6
మనిషి దేవునికంటే కొంచెం తక్కువ వాడు కాదుగాని చాల తక్కువ వాడు.
దేవుడు సర్వ శక్తిమంతుడైన సృష్టికర్త.
మనిషి ఆ దేవునిచే సృష్టించ బడిన బలహీనుడు.
మహిమా ప్రభావములతో మనిషికి కిరీటాన్ని ధరింపజేశాడు. కాని ఆదాము పాపము చేసి దానిని పోగొట్టుకున్నాడు.
మొదటి ఆదాము దానిని పోగొట్టుకున్నాడు గాని, కడపటి ఆదాము అయిన యేసు ప్రభువు విషయంలో ఇది సంపూర్తిగా నెరవేర్చబడింది.
నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, హెబ్రీ 2: 8
ప్రకారం ఇంకా నెరవేరలేదు గాని, యేసు ప్రభువు విషయంలో మాత్రమే పూర్తిగా నిజం.
దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. 1 కొరిందీ 15:27
సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెస్సి 1:22
అయితే ఒక్క విషయం!!
సమస్తము ఆయన పాదముల క్రింద వుంది కాబట్టి, నీవు ఆయన పాదాల క్రింద వుండాలని ఆయన కోరడంలేదు.
ఆయన సింహాసనం లో నిన్ను కూర్చుండబెడతాను అంటున్నాడు.
ఇక వాయిదా వెయ్యొద్దు!
*పశ్చాత్తాప పడదాం!
*ఆయన చెంత చేరుదాం!
ఆ నిత్య రాజ్యానికి వారసులవుదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
8వ కీర్తనా ధ్యానం
(ఐదవ భాగం)
గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను
సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. కీర్తనలు 8:7-9
సృష్టి లో సమస్తమును ఆయన మాటలతో సృష్టిస్తే, మనిషిని మాత్రం చేతులతో నిర్మించాడు.
ఇక్కడే అర్ధమవుతుంది. దేవుడు మనిషికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో?
సృష్టిలో నిన్నూ నన్నూ ప్రత్యేక పరచుకున్నాడు. ఎంతో ఆదిక్యతను ఇచ్చాడు.
సృష్టంతటి పైన అధికారాన్నిచ్చాడు.
అందుకే, క్రూర మృగాలను సహితం మనిషి లోబరచుకో గలుగుతున్నాడు.
పరిపాలించమని దేవుడు జంతుజాలాన్ని మనిషికి అప్పగిస్తే? పరిపాలన విషయంలో మనిషి క్రూరంగా, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు.
అత్యంత విచారకరమైన మరొక విషయం ఏమిటంటే?
ఏలమని వాటిని దేవుడు అప్పగిస్తే? వాటినే ఏలికలుగా చేసుకొని, వాటినే పూజించడం మొదలు పెట్టాడు.
సృష్టి కర్తను మరచి, సృష్టినే పూజించే స్థితికి మనిషి దిగజారిపోయాడు. సృష్టికర్తనే ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయాడు.
భూమి యందంతట ఆయన నామము ప్రభావము గలది.
ఆయన నామమును గౌరవించాలి. .
ఆయన నామమును ఆరాధించాలి
ఆయన నామమునకు భయపడాలి.
ఎందుకంటే?
ఆ నామము ద్వారానే నిత్య రాజ్యము.
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(8వ కీర్తనాధ్యానం సమాప్తం)
14వ, 53వ కీర్తనల ధ్యానం
(మొదటి భాగం)
ఈ రెండు కీర్తనలను దావీదు ఆయా సందర్భములలో వ్రాసాడు. ఒకే విషయాన్ని అతి కొద్ది మార్పులతో దేవుడు రెండు సార్లు వ్రాయించాడు అంటే? ఒకే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు. కీర్తనలు 14:1
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు.మేలు చేయు వాడొకడును లేడు. కీర్తనలు 53:1
దేవుడు లేడని చెప్పేవారిని మనం "నాస్తికులు"అంటాం.
బైబిల్ అంటుంది "బుద్ధిహీనులు".
బుద్ధిహీనులు అంటే?
ఇక్కడ జ్ఞానము లేనివారు అనికాదు.
"మూర్ఖులు" అని.
బుద్ధి హీనులు ఎందుకు దేవుడు లేడని అనుకొంటారు?
దేవుడు లేడని చెప్పడానికి వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేనే లేవు.
సృష్టిలో ప్రతీ వస్తువు దేవుని ఉనికిని తెలియజేస్తుంది.
ఒక చెక్క కుర్చీని చూసినప్పుడు దీని వెనుక వడ్రంగి అంటూ ఎవరూలేరు. చెట్టుకే కుర్చీలు, మంచాలు, తలుపులు, కిటికీలు కాసాయి. అనుకోవడం ఎంత మూర్ఖత్వమో? ఎంత బుద్ధిహీనతో?
ఈ సృష్టిని చూసినప్పుడు దీని వెనుక దేవుడు లేడు. అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. అంతే బుద్ధిహీనత.
ఇంతకీ వీళ్ళు దేవుడు లేడని ఎందుకంటారు?
దేవుడే లేడంటే వారికి నచ్చినట్లుగా జీవించొచ్చని.
అందుకే వీళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తారు.
బుద్దిహీనులు రెండు రకాలు.
1. దేవుడు లేడని బహిరంగముగా ప్రకటించే వారు.
2. హృదయంలోనే తలంచేవారు.
ఈ రెండవ రకానికి చెందినవారు మనలో కోకొల్లలు.
వీరు దేవుని మందిరానికి వెళ్తారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కాని మనసులో మాత్రం,
నిజంగా నరకముందా?
పరలోకముందా?..... అంటూ బుద్ధిహీనులు గానే జీవిస్తున్నారు.
ఈ రెండు రకాలలో దేనికి మనం సంబంధించిన వారమైనా?
ఒక్కటి గుర్తుంచుకో!
*దేవుడున్నాడు.
*నీవున్నావు అంటే కారణం ఆయనే.
ఆయన నీకిచ్చిన జీవితాన్ని
ఆయన కోసం జీవించు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
14వ, 53వ కీర్తనల ధ్యానం
(రెండవ భాగం)
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను వారందరు దారి తొలగి బొత్తిగాచెడియున్నారు మేలు
చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
కీర్తనలు 14:2,3
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనిదేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.
వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.
కీర్తనలు 53: 2,3
............................
వివేకము అంటే?
పంచదార, బెల్లం, తేనే .... ఇవన్ని తియ్యగా వుంటాయి అని చెప్పడం "జ్ఞానం"
ఆ మూడు తియ్యగా వుండే వస్తువుల రుచులలో గల తేడాలను గుర్తించ గలగడం "వివేకం".
దేవుడూ ప్రేమిస్తున్నాడు.
మనుష్యులూ ప్రేమిస్తున్నారు.
ఆ ప్రేమనూ, ఈ ప్రేమనూ ఒకే గాటన
కట్టడం కాదు.
ఆ ప్రేమలోతులను వివేచించ గలగాలి.
అట్లా వివేచించే మనుష్యుల కోసం ఆయన "పరిశీలనగా చూస్తున్నాడు".
చూడడం వేరు. పరిశీలనగా చూడడం వేరు.
ఆయన చూచీ చూడనట్లు చూడడంలేదు.
పరిశీలించి, పరిశోధించి, పరికించి చూస్తున్నాడు.
ఆయన పరిశీలనలో తేలింది ఏమిటంటే?
అందరూ బొత్తిగా చెడిపోయారు.
బొత్తిగా అంటే "నూటికి నూరుపాళ్ళు".
కనీసం ఒక్కరుకూడా మేలు చేసేవారు లేరు.
"మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను."
యెషయ 53:6
చెడిపోవడానికిగల కారణమేంటి?
అందరూ దేవుడు లేడని చెప్పకపోయినా, దేవుడు లేనట్లే జీవిస్తున్నారు.
*దేవుడున్నాడు.
*మనలను సృష్టించాడు.
*మనకోసం ప్రాణం పెట్టాడు.
*మనలను చూస్తున్నాడు.
అనే వివేచన మనలోవుంటే, దారి తప్పిపోయే అవకాశం లేదు. చెడిపోయే అవకాశం అంతకన్నా లేదు.
కాని, అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో లోపించాయి.
*దేవుడే లేనట్లుగా,
*మనకిష్టమొచ్చినట్లుగా,
*మనకు నచ్చినట్లుగా
జీవితాలను కొనసాగిస్తున్నాం.
వద్దు!!
వాటికి గతించిన కాలమే చాలు.
సరి చేసుకుందాం!

యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు
కీర్తనలు 14:4,5
దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
భయకారణం లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరిగొట్టి యున్నాడు.
కీర్తనలు 53:4,5
దేవుడిచ్చిన ఆహారాన్నిబట్టి ఆయనను స్తుతించకుండా, ప్రార్ధించ కుండా భుజిస్తున్నారంటే?
దేవుడున్నాడని గాని,
ఈ ఆహారం ఆయనిచ్చాడు అనిగాని అట్టి తలంపు వారికి లేదన్నమాట.
అట్లాంటి వారు దారితొలిగిన వారు.
వీరేమి చేస్తారంటే?
దేవుని పిల్లలను భయపెడతారు.
ఎందుకంటే?
దేవుడన్నా? దేవుని పిల్లలన్నావారికి లెక్కలేదు.
కాని, వీరికి తెలియని విషయం ఒకటుంది.
దేవుడు, దేవుని పిల్లల పక్షముగా ఉన్నాడని.
వీరికి తెలియని విషయం మరొకటుంది.
అదేమిటంటే?
వీరు భయపడే దినమొకటుందని.
ఆ దినాన్న దేవుడే వారిని భయపెడతాడని.
ఆ దినమున వారి పరిస్థితి ఎట్లా వుంటుంది అంటే?
భయపడడానికి కారణం లేకపోయినా, ఆ దినాన్న భయముతో వణికిపోతారట.
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
ప్రకటన 6:15-16
ఒక్క విషయం!!!
దేవుని పిల్లలను భయపెట్టేవాడివి/దానవు గా నీవుంటే?
ఆ దినాన్నభయముతో వణికి పోతావు.
ఒకవేళ నీవు భయపెట్టబడుతూ వుంటే?
భయపడకు. ఆయన నీ పక్షముగా వున్నాడు.
ఆయనే నీ పక్షముగా వుంటే? ఆయనే నీతో వుంటే ఇక భయమెందుకు?
* అగ్ని గుండం సహితం ఆహ్లాదకరంగా మారుతుంది.
* సింహాల బోనులో సహితం సేదదీర వచ్చు.
కలవర పడకు
కన్నీరు రానియ్యకు.
నీ శత్రువులకు అవమానం
నీకు ఘన విజయం.
ఎందుకంటే?
ఆయన నీ పక్షముననున్నాడు.
ఆగిపోక సాగిపో.
నీ గమ్యం చేరువరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(మూడవ భాగం)
యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు
కీర్తనలు 14:4,5
దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
భయకారణం లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరిగొట్టి యున్నాడు.
కీర్తనలు 53:4,5
దేవుడిచ్చిన ఆహారాన్నిబట్టి ఆయనను స్తుతించకుండా, ప్రార్ధించ కుండా భుజిస్తున్నారంటే?
దేవుడున్నాడని గాని,
ఈ ఆహారం ఆయనిచ్చాడు అనిగాని అట్టి తలంపు వారికి లేదన్నమాట.
అట్లాంటి వారు దారితొలిగిన వారు.
వీరేమి చేస్తారంటే?
దేవుని పిల్లలను భయపెడతారు.
ఎందుకంటే?
దేవుడన్నా? దేవుని పిల్లలన్నావారికి లెక్కలేదు.
కాని, వీరికి తెలియని విషయం ఒకటుంది.
దేవుడు, దేవుని పిల్లల పక్షముగా ఉన్నాడని.
వీరికి తెలియని విషయం మరొకటుంది.
అదేమిటంటే?
వీరు భయపడే దినమొకటుందని.
ఆ దినాన్న దేవుడే వారిని భయపెడతాడని.
ఆ దినమున వారి పరిస్థితి ఎట్లా వుంటుంది అంటే?
భయపడడానికి కారణం లేకపోయినా, ఆ దినాన్న భయముతో వణికిపోతారట.
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
ప్రకటన 6:15-16
ఒక్క విషయం!!!
దేవుని పిల్లలను భయపెట్టేవాడివి/దానవు గా నీవుంటే?
ఆ దినాన్నభయముతో వణికి పోతావు.
ఒకవేళ నీవు భయపెట్టబడుతూ వుంటే?
భయపడకు. ఆయన నీ పక్షముగా వున్నాడు.
ఆయనే నీ పక్షముగా వుంటే? ఆయనే నీతో వుంటే ఇక భయమెందుకు?
* అగ్ని గుండం సహితం ఆహ్లాదకరంగా మారుతుంది.
* సింహాల బోనులో సహితం సేదదీర వచ్చు.
కలవర పడకు
కన్నీరు రానియ్యకు.
నీ శత్రువులకు అవమానం
నీకు ఘన విజయం.
ఎందుకంటే?
ఆయన నీ పక్షముననున్నాడు.
ఆగిపోక సాగిపో.
నీ గమ్యం చేరువరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
14వ, 53వ కీర్తనల ధ్యానం
(నాలుగవ భాగం)
బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
కీర్తనలు 14:6,7
సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.
కీర్తనలు 53:6
బాధించబడుతున్నావా?
బాధపడకు.
భయపడకు.
ఎందుకంటే?
ఆయన....
* నీ పక్షముగా నున్నాడు.
* నీతో వున్నాడు.
* నీకు ఆశ్రయమై వున్నాడు.
ఆయనే మన ఆశ్రయమైతే?
"సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు
కొదువయై యుండదు."
కీర్తనలు 34:10
అడవికి రాజయిన సింహపు పిల్లలు ఆకలిగొనే ప్రసక్తే లేదు. ఒకవేళ అవయినా ఆకలిగొన వచ్చేమో గాని,
ఆయనను ఆశ్రయించే మనకు ఏ మేలు తక్కువకాదు.
ఎందుకంటే?
మనము రారాజు పిల్లలం.
యువరాజులం.
సాతాను చెరలోనుండి ఆయన మనలను విడిపించాడు.
*రాజులుగా
*యాజకులుగా
*ఆయన పిల్లలుగా
*ఆయన స్నేహితులుగా
మనలను చేసి, విమోచించి ధన్యకరమైన జీవితాన్నిచ్చాడు.
ఇంత చేసినా?
ఆయన ప్రేమను, త్యాగమును
వివేచించ కుండా,
ఇంకా చెడు మార్గాల్లోనే నడుస్తూ ,
దేవుడే లేడు అని చెప్పే బుద్దిహీనమైన జీవితాన్ని జీవిస్తూవుంటే?
నీ జీవిత గమ్యమేమిటో తెలుసా?
* భయం
* సిగ్గు
* అవమానం
* దేవుని ఉగ్రత
వద్దు!
సరిచేసుకుందాం!
సాగిపోదాం!
ఆ పరమ సీయోనుకు చేరుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(14వ, 53వ కీర్తనల ధ్యానం సమాప్తం)
15వ కీర్తనా ధ్యానం
(మొదటి భాగం)
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
కీర్తనలు 15:1,2
మన ఇంటికి అతిధులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కారాలు ఎట్లా ఉంటాయో? వేరే చెప్పనవసర్లేదు.
అతిధులు మన ఇంట్లో వుండేది అతి తక్కువ సమయమే. అయినా,ఆ సమయంలోనే, మనకు వున్నంతలో వారిని సంతోషపరచి, గౌరవముగా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. వాటిని "అతిధి మర్యాదలు" అంటాము.
దేవుని ఇంటిలోనే, దేవుని చేత అతిధి సత్కారాలు పొందడం అంటే ఊహించగలమా? సాధ్యమేనా?
అవును!! సాధ్యమే?
అదెట్లా?
1. యదార్ధ మైన ప్రవర్తన కలిగి యుండాలి.
2. నీతిని అనుసరించాలి.
3. హృదయ పూర్వకంగా నిజం మాట్లాడాలి.
1. యదార్ధ మైన ప్రవర్తన:
అంటే ?
మాటలలో యధార్ధత,
చూపులలో యధార్ధత
తలంపులలో యధార్ధత
క్రియలలో యధార్ధత.
2. నీతిని అనుసరించాలి:
నీతి అంటే?
ఆయనను నమ్మడమే నీతి.
ఆయనను నమ్మి, అనుసరించాలి.
నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి
1 కొరింది 15:34
3. హృదయ పూర్వకంగా నిజం మాట్లాడాలి:
మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
ఎఫెస్సి 4:25
ఎందుకంటే? ఆయనే "సత్యం".
ఈ విధంగా జీవించినట్లయితే, ఆయన ఇంటిలోనే నీవు ఆతిధ్యం పొందగలవు.
ఈలోకంలో నీవు అనుభవించే అతిధి సత్కారాలు తాత్కాళికమే. కాని, ఆయన ఇంటిలో పొందే సత్కారాలు శాశ్వతం. వాటికోసం ప్రయాసపడదాం.
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
15వ కీర్తనా ధ్యానం
(రెండవ భాగం)
అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు.
కీర్తనలు 15:3
ఎవరయితే?
*యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
*నీతిని అనుసరిస్తూ,
*హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
అట్టి వారు,
*నాలుకతో కొండెములాడరు.
*తన చెలికానికి కీడు చేయరు.
*తన పొరుగువానిమీద నింద మోపరు.
1.నాలుకతో కొండెములాడరు:
ఒక వ్యక్తి నీపైనగల నమ్మకంతో వారి విషయాలు నీతో పంచుకున్నప్పుడు, వారిని గురించి ప్రార్ధించు. అంతేగాని, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, వాటికి నాలుగు జోడించి వారిని బజారు పాలుచెయ్యొద్దు.
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
నిర్గమ 23:1
2. తన చెలికానికి కీడు చేయరు:
నీ స్నేహితులకు, నీ పొరుగు వారికి మేలు చెయ్య గలిగితే తప్పకుండా చెయ్యి. ఒకవేళ మేలు చెయ్యలేకపోయినా, మాటలు ద్వారా గాని, చేతలు ద్వారాగాని కీడు తలపెట్టే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు.
"నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను"
మార్కు 12:31
ఈ ఆజ్ఞను గైకొనినట్లయితే?
ఇక కీడు చేసే ప్రసక్తే లేదు.
3.తన పొరుగువానిమీద నింద మోపరు:
నీ పొరుగు వారు చెయ్యని వాటిని వారే చేసినట్లు నీవు ఊహించుకొని , వాటిని వారిమీద రుద్ది మానసికంగా వారిని క్షోభపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. వారిని నిందించవద్దు.
ఇట్టి రీతిగా ఎవరయితే?
*యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
*నీతిని అనుసరిస్తూ,
*హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
వారు నిత్యమూ దేవుని ఇంటిలో ఆతిధ్యము పొందగలరు.

అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
కీర్తనలు 15:4
............................
ఎవరయితే?
*యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
*నీతిని అనుసరిస్తూ,
*హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
అట్టి వారు,
*నాలుకతో కొండెములాడరు.
*తన స్నేహితునికి కీడు చేయరు.
*తన పొరుగువానిమీద నింద మోపరు.
అంతే కాకుండా,
*దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
*దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు.
*మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.
1.దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కొనుట:
అంటే? వారు జరిగించే దుష్ట క్రియలలో ఏ విధంగానూ పాలుపొందక ప్రత్యేకమైన జీవితం జీవించుట.
*నీవు లోకంనుండి ప్రత్యేకించ బడ్డావా?
నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను.
కీర్తనలు 101:3
2. దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించుట:
*దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించడం అంటే?
వారు నడిచే మార్గాలను అనుసరించడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవం.
*అట్టి ప్రవర్తన నీలో ఉందా?
3. మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పకపోవుట:
మన జీవితంలో దేవునికి ఎన్నిసార్లు మాటివ్వలేదు?
ఎన్ని ప్రమాణాలు చెయ్యలేదు?
ప్రతీ వాచ్ నైట్ సర్వీస్ రోజు ఒక తీర్మానం. దాని మీద నిలబడింది ఎన్నిరోజులు?
మన అవసరాలు తీరే వరకు నాజీవితం ఇక నీకే స్వంతం అంటాం. కాని అవసరం తీరాక ???
దేవునికి ఎన్ని సార్లు మాటిచ్చామో? వాటి సంఖ్య మన లెక్కకు కూడా అందదేమో కదా?
ఇటువంటి పరిస్థితులలో ... ఆయన ఇల్లు అనే పరలోకంలో మనకు ఆతిధ్యం దొరకుతుందా?
ఆ రాజ్యంలో ఆ రాజుతో జీవించే హక్కు మనకుంటుందా?
పశ్చాత్తాప పడదాం!
ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(మూడవ భాగం)
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
కీర్తనలు 15:4
............................
ఎవరయితే?
*యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
*నీతిని అనుసరిస్తూ,
*హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
అట్టి వారు,
*నాలుకతో కొండెములాడరు.
*తన స్నేహితునికి కీడు చేయరు.
*తన పొరుగువానిమీద నింద మోపరు.
అంతే కాకుండా,
*దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
*దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు.
*మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.
1.దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కొనుట:
అంటే? వారు జరిగించే దుష్ట క్రియలలో ఏ విధంగానూ పాలుపొందక ప్రత్యేకమైన జీవితం జీవించుట.
*నీవు లోకంనుండి ప్రత్యేకించ బడ్డావా?
నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను.
కీర్తనలు 101:3
2. దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించుట:
*దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవించడం అంటే?
వారు నడిచే మార్గాలను అనుసరించడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవం.
*అట్టి ప్రవర్తన నీలో ఉందా?
3. మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పకపోవుట:
మన జీవితంలో దేవునికి ఎన్నిసార్లు మాటివ్వలేదు?
ఎన్ని ప్రమాణాలు చెయ్యలేదు?
ప్రతీ వాచ్ నైట్ సర్వీస్ రోజు ఒక తీర్మానం. దాని మీద నిలబడింది ఎన్నిరోజులు?
మన అవసరాలు తీరే వరకు నాజీవితం ఇక నీకే స్వంతం అంటాం. కాని అవసరం తీరాక ???
దేవునికి ఎన్ని సార్లు మాటిచ్చామో? వాటి సంఖ్య మన లెక్కకు కూడా అందదేమో కదా?
ఇటువంటి పరిస్థితులలో ... ఆయన ఇల్లు అనే పరలోకంలో మనకు ఆతిధ్యం దొరకుతుందా?
ఆ రాజ్యంలో ఆ రాజుతో జీవించే హక్కు మనకుంటుందా?
పశ్చాత్తాప పడదాం!
ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(నాలుగవ భాగం)
తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడుఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
కీర్తనలు 15:5
..........................
ఎవరయితే?
*యదార్ధ మైన ప్రవర్తన కలిగి,
*నీతిని అనుసరిస్తూ,
*హృదయ పూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో?
అట్టి వారు,
*నాలుకతో కొండెములాడరు.
*తన స్నేహితునికి కీడు చేయరు.
*తన పొరుగువానిమీద నింద మోపరు.
*దుష్టత్వము జరిగించే వారిని అసహ్యించు కుంటారు.
*దేవునియందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు.
*మాటయిస్తే? నష్టమైనా, దాని నుండి తప్పిపోరు.
అంతే కాకుండా,
*తన ద్రవ్యము వడ్డికియ్యరు.
*నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.
1. తన ద్రవ్యము వడ్డికియ్యరు.
మన కళ్ళెదుటే కడుబీదలుగా వున్నవాళ్ళు నేడు కోట్లకు పడగలెత్తుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం వడ్డీ తీసుకోవడమే.
దేవుని వాక్యం తెలిసినవారు కూడా చూసి చూడనట్లుగా వారిపని వారు కొనసాగిస్తున్నారు. అది వారికిగాని, వారి పిల్లలకుగాని ఆశీర్వాదం కాదు.
అన్యులు వారికి తెలియదు కాబట్టి వారు క్షమించబడతారేమో కాని, దేవుని పిల్లలముగా మనము తప్పించుకోలేము.
నీవు వడ్డీ 10 రూపాయలు తీసుకున్నా, 10 పైసలు తీసుకున్నా అది వడ్డీయే కదా? అపరాధిగా నిలబడాల్సి వస్తుంది. సందేహం లేదు.
ఒక బీదవానికి సొమ్ముఅప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు.
నిర్గమ 22:25
2. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు.
లంచము అతి తక్కువ సమయంలో అక్రమముగా సంపాదించే మార్గాలలో ప్రాముఖ్యమైనది.
వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.
యెషయ 5:23
లంచం తీసుకొని దొరికిపోయిన వాళ్ళు అనేకమంది జైలులో గడుపుతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగితున్నారు.
అంటే? మన దేశ చట్టం కూడా దీనిని ఒప్పుకోదు. ఇక మన దేవుని చట్టం అస్సలు ఒప్పుకోదు.
ఈ అన్ని విషయాల ప్రకారం నడచుకొను వాడు. ఎప్పటికి కదల్చబడడు.
వారు నిస్సందేహంగా దేవుని ఇంటిలో ఆతిధ్యం పొందుతారు.
మన జీవితాలు ఎట్లావున్నాయి?
సరిచేసుకుందాం!
సాగిపోదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(15వ కీర్తనా ధ్యానం సమాప్తం)
20వ కీర్తనా ధ్యానం
(మొదటి భాగం)
ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
కీర్తనలు 20:1
............................
కష్ట సమయంలో వున్నావా?
కలత చెంది యున్నావా?
ఆదరించేవారే లేరా?
ఆదుకొనేవారే లేరా?
అయితే,
*మనకో ఫ్రీ కాల్ వుంది.
*ఆ నంబర్ 333
*సిగ్నల్ సమస్యలు లేవు.
*ఆ ఫోన్ ఎంగేజ్ రాదు.
*ఏక్షణమైనా కాల్ చెయ్యొచ్చు.
*తక్షణ సహాయం పొందొచ్చు.
నాకు మొఱ్ఱపెట్టుము
నేను నీకు ఉత్తరమిచ్చెదను.
యిర్మియా 33:3
ఇంతకీ, ఈ నంబర్ ఎవరిది?
యాకోబు దేవునిది.
అవును!
*యాకోబు ఆపత్కాలంలో,
భీకర అరణ్యంలో వున్నాడు.
*తలిదండ్రులకు,
వాగ్ధాన భూమికి దూరమవుతున్నాడు.
*ఆదరించేవారు లేరు.
*ఓదార్చేవారసలే లేరు.
అటువంటి పరిస్థితులలో,
*ఒకాయన, నేనున్నా నీకంటూ
ఆయన చెంత చేరాడు.
*ఆదరించాడు.
*ఓదార్చాడు.
*అభయమిచ్చాడు.
*ఆశీర్వదించాడు.
* ఆ యాకోబు దేవుడు సజీవుడు.
* నిన్నా,నేడు, నిరంతరం
ఏకరీతిగా నున్న దేవుడు.
*ఆ దినాన్న ఆయన ఎంత శక్తిమంతుడో?
నేటి దినాన్న కూడా అంతే శక్తిమంతుడు.
నీవు ఎట్లాంటి పరిస్థితులలో వున్నాసరే.
ప్రార్ధించ గలిగితే?
ఆ దినాన్న యాకోబుకు తోడుగానున్న దేవుడు
నీకునూ తోడైయుంటాడు.
ఆదరిస్తాడు.
ఆశీర్వదిస్తాడు.
ప్రయత్నించి చూడు.
ప్రతిఫలము పొందుతావు.

పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.
కీర్తనలు 20:2
...........................
నీ ఆపత్కాలంలో నీవు ప్రార్ధించగలిగితే?
*పరిశుద్ద స్థలంలో నివసించే పరిశుద్దుడైన యెహోవా నీకు సహాయం చేస్తాడు.
*పరమ సీయోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు.
*కాని, ఈ వాగ్ధానాలు మన జీవితంలో ఎందుకు అనుభవించలేక పోతున్నాం?
ప్రార్ధించ లేకేనేమో?
*మన సమస్యలు ఊరంతా చెప్పుకుంటాం.
ఏదయినా ప్రయోజనం ఉందా అంటే? లేదు. వారికి చులకనకావడం తప్ప.
*కాని, సమస్యను పరిష్కరించే దేవునికి మాత్రం చెప్పక, వాటిని రెట్టింపు చేసుకొంటున్నాం.
నీవు ప్రార్ధించగలిగితే?
*కష్టసమయాల్లో ఆయన నీకు తోడై వుంటాడు.
*నీకు దిగులు కలిగిన సమయాల్లో ఆయన ధైర్య పరుస్తాడు.
*నీ బలహీన సమయాల్లో నిన్ను బలపరుస్తాడు.
*ఆయనే నీకు దేవుడుగా వుండి సహాయం చేస్తాడు.
*ఆయన కుడి హస్తాన్ని చాచి నిన్ను ఆదుకుంటాడు.
నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయ 41:10

ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక నీ దహనబలులను అంగీకరించును గాక.
నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 20:3,4
1. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక!
*ఏమిటీ నైవేద్యము?
ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. హెబ్రీ 13:16
ఆపదలోనున్న నీ పొరుగువారికి నీవు సహాయపడితే అదే దేవునికి నీవర్పించే నైవేద్యం?
అట్లా నీవు చెయ్యగలిగితే?
నీ ఆపత్కాలంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొంటాడు.
2. నీ దహనబలులను అంగీకరించును గాక!
ఆత్మీయ బలులు తప్ప, శరీర సంబంధమైన జంతు బలులు ఆయనకు అవసరం లేదు.
*ఆత్మీయ బలి అంటే?
సజీవ యాగాముగా మన శరీరాన్ని ఆయనకు ఉపయోగపడేలా, సమర్పించగలగాలి.
ఇటువంటి నైవేద్యాలు, దహన బలులు ఆయన చేత అంగీకరించ బడతాయి.
*ఎప్పుడైతే, ఇట్లాంటి నైవేద్యాలు, దహన బలులు ఆయన చేత అంగీకరించ బడతాయో?
నీ కోరికలను, నీ ఆలోచనలన్నింటిని దేవుడు సఫలం చేస్తాడు.
*అవి ఎట్లాంటి కోరికలైనా, ఎట్లాంటి ఆలోచనలైనా దేవుడు సఫలం చేస్తాడా?
తప్పక సఫలం చేస్తాడు. సందేహంలేదు.
ఎందుకంటే?
సజీవ యాగాముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కోరికలు కోరలేవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయలేవు. ఆయన చిత్తానికి లోబడే నీ కోరికలు, నీ ఆలోచనలుంటాయి.
కాబట్టి,
*ఆధ్యాత్మిక బలుల నర్పిందాం!
*ఆయనిచ్చే ఆశీర్వాదముల కొరకు ఎదురు చూద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
20వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి
మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
కీర్తనలు 20:5
............................
1.యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము
ఈ లోకంలో దేనినిబట్టి అయినా జయోత్సాహము చెయ్యాలంటే?
అది ఆయనిచ్చిన రక్షణను బట్టే.
ఎందుకంటే?
ఆయన మరణపు ముల్లును విరచి, సాతానును ఓడించి, మృత్యువు మీద విజయం సాధించి మనకు రక్షణ నిచ్చాడు.
అది ఆయన మాత్రమే సాధించగలిగిన విజయం. ఆయన మాత్రమే ఇవ్వగలిగిన రక్షణ.
2. మా దేవుని నామమునుబట్టి
మా ధ్వజము ఎత్తుచున్నాము
రక్షణ నిచ్చిన మా దేవుని నామమును బట్టే మా విజయ పతాకం ఎగురవేస్తాం.
ఎందుకంటే?
యెహోవా నిస్సి = యెహోవా మా ధ్వజము.
*అన్ని నామములకన్న ఆయన నామము ఉన్నతమైనది.
*యెహోవా నామము బలమైన దుర్గము.
సామెతలు 18:10
3. నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
ఇదెప్పుడు సాధ్యం అంటే?
ఆయన రక్షణను స్వీకరించి, ప్రార్ధించినప్పుడు.
యేసు ప్రభువు సిలువలో రక్తం చిందించినంత మాత్రాన రక్షణ నీ స్వంతం కాదుగాని, ఆ రక్తంలో నీ పాపములు కడుగుకున్నప్పుడే ఆ రక్షణ నీ స్వంతమవుతుంది.
ఆ రక్షణ స్వంతం చేసుకొని నీవు ప్రార్ధించగలిగితే?
నీ ప్రార్ధన లన్నింటికి ( కొన్నింటికి మాత్రమే కాదు)
తగిన కాలమందు(నీ అవసరత మించిపోక ముందే)
తప్పక దేవుడు సమాధానమిస్తాడు.
నీ ప్రార్ధన సఫలమవుతుంది.

యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు
తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
కీర్తనలు 20:6,7
.............................
*యెహోవా తాను అభిషేకించు కున్న ప్రజలను రక్షిస్తాడు.
*తన బలమైన కుడిచేతితో వారిని కావలి కాస్తాడు.
*వారి ప్రార్ధనలకు సమాధాన మిస్తాడు.
*దేవుడు మనపట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నా?
గుర్రాలు , రధాలు, ఆస్థులు,అంతస్థులు,ధనం, అందం, బలం, బలగం బట్టి అతిశయించే వారిగా మాత్రమే ఉన్నాము తప్ప, వాటినిచ్చిన దేవునిని బట్టి అతిశయించేవారముగా, స్తుతించే వారముగా లేము.
*ఆశీర్వాదాలను చూసి
మురిసిపోతున్నాం తప్ప,
ఆ ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని మాత్రం మరచిపోతున్నాం.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
*జ్ఞాని తన జ్ఞానమునుబట్టి
అతిశయింపకూడదు,
*శూరుడు తన శౌర్యమునుబట్టి అతిశయింపకూడదు, *ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
నీ అతిశయం ఏదయినా వుందంటే?
అది నీ పట్ల కృప చూపించే నీ దేవునిని బట్టి మాత్రమే అయ్యుండాలి. దానిని బట్టి నేను ఆనందిస్తాను.
యిర్మియా 9:23,24
పౌలుగారు అంటున్నారు
నా అతిశయం ఏదయినా వుందంటే?
అది ఆయన సిలువను బట్టియే.
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక
గలతీ 6:14
ఇంతకీ నీ అతిశయమేమిటి?
జ్ఞానమా?
శౌర్యమా?
ఐశ్వర్యమా?
వద్దు! ఇవెన్నాడూ నీ అతిశయం కాకూడదు.
ఏ అర్హతా లేని మనలను తన కృపతో ప్రేమించి, మనకు బదులుగా సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తునందే అతిశయిద్దాం!
అటువంటి అతిశయమందు ఆయన ఆనందించువాడై యున్నాడు.
నీయందు ఆయన ఆనందిస్తే?
ఇక నీ జీవితమంతా ఆనందమయమే.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
20వ కీర్తనా ధ్యానం (ఐదవ భాగం)
యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు
తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
కీర్తనలు 20:6,7
.............................
*యెహోవా తాను అభిషేకించు కున్న ప్రజలను రక్షిస్తాడు.
*తన బలమైన కుడిచేతితో వారిని కావలి కాస్తాడు.
*వారి ప్రార్ధనలకు సమాధాన మిస్తాడు.
*దేవుడు మనపట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నా?
గుర్రాలు , రధాలు, ఆస్థులు,అంతస్థులు,ధనం, అందం, బలం, బలగం బట్టి అతిశయించే వారిగా మాత్రమే ఉన్నాము తప్ప, వాటినిచ్చిన దేవునిని బట్టి అతిశయించేవారముగా, స్తుతించే వారముగా లేము.
*ఆశీర్వాదాలను చూసి
మురిసిపోతున్నాం తప్ప,
ఆ ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని మాత్రం మరచిపోతున్నాం.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
*జ్ఞాని తన జ్ఞానమునుబట్టి
అతిశయింపకూడదు,
*శూరుడు తన శౌర్యమునుబట్టి అతిశయింపకూడదు, *ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
నీ అతిశయం ఏదయినా వుందంటే?
అది నీ పట్ల కృప చూపించే నీ దేవునిని బట్టి మాత్రమే అయ్యుండాలి. దానిని బట్టి నేను ఆనందిస్తాను.
యిర్మియా 9:23,24
పౌలుగారు అంటున్నారు
నా అతిశయం ఏదయినా వుందంటే?
అది ఆయన సిలువను బట్టియే.
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక
గలతీ 6:14
ఇంతకీ నీ అతిశయమేమిటి?
జ్ఞానమా?
శౌర్యమా?
ఐశ్వర్యమా?
వద్దు! ఇవెన్నాడూ నీ అతిశయం కాకూడదు.
ఏ అర్హతా లేని మనలను తన కృపతో ప్రేమించి, మనకు బదులుగా సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తునందే అతిశయిద్దాం!
అటువంటి అతిశయమందు ఆయన ఆనందించువాడై యున్నాడు.
నీయందు ఆయన ఆనందిస్తే?
ఇక నీ జీవితమంతా ఆనందమయమే.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(ఆరవ భాగం)
వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.
కీర్తనలు 20:8,9
..............................
"వారు క్రుంగి నేలమీద పడియున్నారు"
ఎవరు?
*దేవుని యందు కాకుండా, లోకమును బట్టి అతిశయించే వారు.
*దేవుని యందు కాకుండా, లోకముపై ఆధార పడేవారు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
యిర్మియా 17:5,6
ధనమును బట్టి అతిశయిస్తే నాశనము.
దేవునిని బట్టి అతిశయిస్తే సంవృద్ది.
ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
సామెతలు 11:28
లోకమును బట్టి అతిశయించే వారు భక్తిహీనులు, వారు కొంతకాలం ఈలోకంలో ఏ కష్టాలు బాధలు లేనట్టే కనిపిస్తారు. కాని, దేవుని ఉగ్రతదినాన్న వారి వేదనకు అంతం లేదు.
అయితే, దేవుని బట్టి అతిశయించే వారికి వేదనలు కలుగవా? తప్పకుండా కలుగుతాయి. కాని, ఆ సమయంలో ఆయన కృప వారికి తోడుగావుండి నడిపిస్తుంది.
ఎంత వరకు అంటే?
నిత్య రాజ్యం చేరువరకు.
భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.
కీర్తనలు 32:10
దేవునిని బట్టి అతిశయించే వారిని, ఆయన పైనే ఆధారపడే వారిని ఆయన రక్షిస్తాడు. వారు ప్రార్ధించినప్పుడు ఆలకించి, సమాధానమిస్తాడు.
ఆయననుబట్టే అతిశయిద్దాం!
ఆయనపైనే ఆధారపడదాం!
ఆయనయందే ఆనందిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(20వ కీర్తనాధ్యానం సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి