యథార్థవంతుడైన యోబు






*యధార్ధవంతుడైన యోబు*

*మొదటి భాగం ఉపోద్ఘాతం-1*

 

యోబు 23:10. నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ కు మరోసారి స్వాగతం! ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశమిచ్చిన దేవాదిదేవునికి మరోసారి శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!

 

ప్రియులారా! నేటినుండి యధార్ధవర్తనుడు నీతిమంతుడు భక్తిపరుడు అయిన యోబు గారి కోసం ధ్యానం చేసుకుందాం! అయితే ధ్యానం చేసేముందుగా కొన్ని అపోహలు కోసం చూసుకుందాం!

 

   అనేకమంది బైబిల్ పండితులు యోబు గారిది ఒక కధ మాత్రమే, నిజంగా జరుగలేదు అందుకే యోబు తల్లిదండ్రులు, ఇంకా పూర్తి వివరాలు మిగిలిన దైవజనుల వలె బైబిల్ లో లేవు అంటారు! గాని నాకయితే నిజంగా జరిగింది! యోబు గారు ఈ భూమి మీద జీవించారు! ఆయన యొక్క చరిత్ర నిజంగా జరిగింది అని అంటాను!  అయితే ఇది ఇశ్రాయేలు వంశానికి అవతల, యేసుక్రీస్తు ప్రభులవారి వంశావళికి బయట జరిగింది అంటాను! మెల్కీసేదేకు , బిలాము గారు ఎలా ఇశ్రాయేలు జాతివారు కాదుగానీ దేవుడు ఎలా పిలుచుకుని తనపనికై వాడుకున్నారో అలాగే నీతిమంతుడైన యోబు గారిని కూడా అన్య జనులలో నుండి తనకొరకు ప్రత్యేకపరుచుకుని ఏర్పరచు కున్నారు! అందుకే ఆయన వంశావళి మనకు కనబడదు అని నా ఉద్దేశం!

 

   అయితే యోబుగారి చరిత్ర నిజంగా జరిగింది అని నొక్కి వక్కాణించి చెప్పడానికి బైబిల్ ఆధారాలు ఏమిటి అని నన్ను అడిగితే నా జవాబులు కూడా చూడండి! అవి వాక్యాధారమైతే తీసుకోండి!

 

ఒకవేళ నిజంగా ఆయన చరిత్ర జరిగి ఉండకపోతే మొట్టమొదట పరిశుద్దాత్ముడు ఈ చరిత్రను బైబిల్ లో వ్రాసి ఉంచడు! కారణం కట్టుకధలకు బైబిల్ లో స్థానం లేదు! మీరందరూ ఒప్పుకుంటారు కదా బైబిల్ మానవుని ఉద్దేశాల ద్వారా మానవుల తలంపుల ధ్వారా వ్రాయబడలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ పూర్ణులై వ్రాసిరి..

 2పేతురు 1:20

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

2పేతురు 1:21

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. కాబట్టి ఇది నిజంగా జరిగింది!

 

పాతనిబంధన గ్రంధంలో యెహేజ్కేలు గ్రంధంలో 14 వ అధ్యాయంలో ముగ్గులు నీతిమంతులు మరియు యధార్ధవంతుల లిస్ట్ కనిపిస్తుంది. వారికోసం అదే అధ్యాయంలో నాలుగుసార్లు ప్రస్తావించ బడింది! 14. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

ఈ అధ్యాయంలో కనబడే నోవహు గారు నిజమే కదా! ఆదికాండంలో ఈ భక్తుడు కోసం చాలా చాలా వివరంగా ఉంది. ఇక దానియేలు గారు కూడా నిజంగా ఉన్నారు కదా! దానియేలు గ్రంధాన్ని ఆ భక్తుడే వ్రాసి యున్నారు కదా! మరి పై ఇద్దరు నిజమైతే యోబు గారు కూడా నిజమే కదా! కట్టుకధ కల్పితకధ కాదు కదా! ఇక్కడ నీతిమంతులు యధార్ధవంతుల లిస్టులో ఉన్న ఈ ముగ్గురు నిజమైన వారేనని గ్రహించాలి! కాబట్టి యోబు గారి చరిత్ర నిజంగా జరిగింది! అంతేకాదు పాతనిబంధన గ్రంధములోనే కాకుండా క్రొత్త నిబంధన గ్రంధములో కూడా ఈ నీతిమంతుడు కోసం ప్రస్తావించ బడింది! యాకోబు 5:11. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

 

కాబట్టి పైన చెప్పిన వివరణలు మరియు రిఫరెన్సుల ప్రకారం యోబుగారు నిజంగా ఈ భూమిమీద నీతిమంతునిగా యధార్ధవంతుడిగా నివశించారు దానినే బైబిల్ లో గ్రంధస్తం చేశారు అని నేను నమ్ము చున్నాను!

 

పేరు: యోబు

తల్లి: తెలియదు , బైబిల్ లో వ్రాయబడలేదు

తండ్రి: తెలియదు , బైబిల్ లో వ్రాయబడలేదు

ఊరు: తెలియదు , బైబిల్ లో వ్రాయబడలేదు

పుట్టిన సంవత్సరం: తెలియదు , బైబిల్ లో వ్రాయబడలేదు

ఏ దేశానికి చెందినవారు: ఊజు దేశం! యోబు 1:1

 

ఊజు దేశం ఎక్కడుంది? మిద్యాను దేశం ప్రక్కన ఉంది. దీని ఖచ్చితమైన స్థానం తెలియదు, కానీ ఆధునిక సిరియా లేదా జోర్డాన్లోని ఎడారికి సమీపంలో ఉన్న ప్రాంతం అని ఊహించబడుతుంది. ఇది ఒక దేశం కంటే ఒక ప్రాంతంగా పరిగణించబడుతుంది.

 

ఎవరు వ్రాశారు? మోషే గారు వ్రాసినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి. మోషే గారు మిద్యాను దేశం లో ఉన్నప్పుడు; ఈజిప్టుకి కనానుకి  ఊజు దేశానికి రహదారి మిద్యాను దేశం గుండా ఉంది. అది మోషే గారి మామ గారు యిత్రో గారి ఇంటి ప్రక్కనుండే వెళ్తుంది. ఇలా ప్రయాణం చేసే ప్రయాణికులలో ప్రసిద్ధి చెందిన కధనాలు చలామణీలో ఉండేవి. మోషేగారు ఇలాంటి ప్రయాణీకుల దగ్గర విని, మామ గారి పలుకుబడి వలన క్షుణ్ణంగా శోదించి వ్రాశారు. ఏది ఏమైనా వ్రాయించింది పరిశుద్దాత్మ దేవుడే! కాబట్టి పరిశుద్దాత్మ ప్రేరణతో ఇంకా ఐదు ఖండాలు వ్రాయకముందే మోషే గారు మిద్యాను దేశంలో ఉండగానే ఈ గ్రంధాన్ని వ్రాశారు అని బైబిల్ పండితులు నమ్ముతారు! అనగా బైబిల్ గ్రంధంలో మొట్టమొదట వ్రాయబడిన గ్రంధం ఈ యోబు గ్రంధమే!

 

ఎప్పుడు వ్రాయబడింది? క్రీ. పూ. 1100 లలో వ్రాయబడి ఉండవచ్చు! అయితే దీనిని మరలా క్రీ. పూ 550 లలో పాత ప్రతులు వెదికి పారశీకుల రాజుల కాలంలో  ప్రాచీన హెబ్రీ మరియు ఆరామిక్ భాషలలొ వ్రాయబడింది!!!

*యధార్ధవంతుడైన యోబు*

*రెండవ భాగం ఉపోద్ఘాతం-2*

 

యోబు 23:10. నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

     ప్రియులారా గతభాగంలో యోబు గారు నిజమా? కల్పితమా? ఊజు దేశం ఎక్కడుంది అనే విషయాలు చూసుకున్నాము!

 

ఇక ఈరోజు యోబు గారి చరిత్ర ఎప్పుడు జరిగింది అనేది చూసుకుందాం!!

 

1). యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో యోబు గారి గురించి వ్రాయబడింది కాబట్టి యోబు గారి చరిత్ర క్రొత్త నిబంధన కన్నా ముందుగానే జరిగింది అనగా క్రీస్తు శకములో కాకుండా క్రీస్తు పూర్వమే జరిగింది అని అర్ధం అవుతుంది.

యాకోబు 5:11

సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.

 

2) గతభాగంలో చెప్పినట్లు యెహేజ్కేలు 14:14 లో ముగ్గురు నీతిమంతుల పట్టికలో ప్రస్తావించబడ్డారు గనుక యెహేజ్కేలు కాలము అనగా క్రీ. పూ. 597 కంటే ముందుగానే జరిగింది అని అర్ధంఅవుతుంది.

యెహేజ్కేలు 14:14

నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

3) యోబు గ్రంధం ప్రకారం 1:5 తన సంతానం కోసం, వారి పాప ప్రక్షాళన కోసం యోబు గారే స్వయముగా బలులు అర్పించినట్లు కనిపిస్తుంది. ధర్మ శాస్త్ర కాలంలో కేవలం యాజకులు మాత్రమే సామాన్యుల పక్షముగా బలులు అర్పించేవారు. అయితే నోవహు గారు, హనోకు గారు, అబ్రాహాము గారు ఇస్సాకు గారు వీరంతా తామే బలులు అర్పించినట్లు బైబిల్ లో చూడగలము! కాబట్టి యోబు గారు ధర్మశాస్త్ర కాలమునకు పూర్వమే బహుశా అబ్రాహాము ఇస్సాకు గారి కాలమునకు చెంది ఉండవచ్చు! అనగా ధర్మశాస్త్ర కాలమునకు ముందు మనస్సాక్షి యుగమునకు చెందిన పరిశుద్ధుడు అని అర్ధమవుతుంది!

యోబు 1:5

వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

 

4) ఇక యోబు గ్రంధములో ఏల్షద్దాయ్ అనగా సర్వశక్తుడు అనేమాట విస్తారంగా అనగా 31 సార్లు ప్రస్తావించ బడింది. బైబిల్ గ్రంధములో మొట్టమొదట ఈ ఎల్షద్దాయ్ అనేమాట అబ్రాహాము గారికి ఆదికాండం 17:1 లో దేవునిచేత చెప్పబడింది.  నిర్గమ 3:15 లో దేవుడు మండుచున్న పొదలో నేను ఉన్నవాడను అనేవాడను అంటూ పరిచయం చేస్తూ యెహోవా అనే నామము చూడగలము! కాబట్టి సర్వశక్తుడు అనేమాట ఎక్కువగా వాడబడింది కాబట్టి అబ్రాహాము గారి కాలములో గాని తర్వాత గాని, మరియు ఇశ్రాయేలు ప్రజల కనాను యాత్రకు ముందు అనగా అబ్రాహాము గారు, మోషే గారికి మధ్యకాలంలో యోబు గారు జీవించారు అని అర్ధమవుతుంది!

 

5) యోబు 22:16లో వారు అకాలముగా ఒక్క నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహము వలె కొట్టుకొని పోయెను అని వ్రాయబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా నోవాహు గారి కాలంలో జరిగిన జల ప్రవాహం తర్వాతనే యోబుగారు జీవించారు అని అర్ధమవుతుంది!

 

6) ఇక యోబు గారి ఆస్తి ఆయనకున్న పశువుల మందలను బట్టి లెక్కించబడింది. అలాగే అబ్రాహాము గారి ఆస్తి, ఇస్సాకు గారి ఆస్తి, యాకోబు గారి ఆస్తి కూడా అలాగే మందలను బట్టి లెక్కించబడింది గనుక బహుశా వీరికాలంలోనే యోబు గారు జీవించి ఉంటారు అని అర్ధమవుతుంది!

 

7) యోబు గారు జీవించిన సంవత్సరముల ప్రకారం యోబు గారి శ్రమల అనంతరం 140 సంవత్సరాలు జీవించారు. అబ్రాహాము గారు 175 సంవత్సరాలు ఆది 25:7; ఇస్సాకు గారు 185 సంవత్సరాలు 35:28, యాకోబు గారు 147 సం. లు 47:28 ప్రకారం జీవించారు. ఇక ఆ తర్వాత యోసేపు గారి దగ్గరకు వస్తే ఆయన కేవలం 110 సం. లు మాత్రమే జీవించారు. కాబట్టి యోసేపు గారి కంటే ముందు కావచ్చును!

 

కాబట్టి ఈ కారణాల వలన మనస్సాక్షి యుగములో ధర్మశాస్త్ర యుగానికి లేక కాలానికి ముందుగా జన్మించి ఉంటారు అని అర్ధమవుతుంది. అనగా యాకోబు గారి కాలంలో ఊజు దేశంలో యోబు గారి చరిత్ర జరిగి ఉండవచ్చు అని నాకు అర్ధమయ్యింది ప్రియులారా!!!

 

యోబు అనగా: పీడించ బడినవాడు, ప్రయత్నించ బడినవాడు, బాధించబడిన వాడు ఇంకా ఏడుస్తున్న వాడు అని కూడా వస్తుంది!

 

యోబు గారి భార్య పేరు: బైబిల్ లో వ్రాయబడలేదు గాని ఒక పురాతన యోబు వ్రాత ప్రతిలో యోబు గారి భార్య పేరు దీనా అని వ్రాయబడింది.  బహుశా యాకోబు గారు ఈయన విశ్వాసం ఆయన చరిత్ర విని తన ఏకైక కుమార్తెకు యోబు గారి భార్య పేరు పెట్టి ఉండవచ్చు! ఆ కాలంలో తమకు నచ్చిన వారి పేర్లు తమ సంతానమునకు తమ ఆచారానికి విరుద్దంగా పెట్టుకునేవారు. ఉదా అబ్షాలోము తన కుమార్తెకు తన చెల్లి పేరు పెట్టుకున్నాడు!

 

యోబు గారి సంతానం పేరులు: మొదట సంతానం పేరులు తెలియదు గాని శ్రమలు తీరాక పుట్టిన కుమార్తెల పేర్లు మాత్రం చివరి అధ్యాయంలో చెప్పబడ్డాయి!

 

చివరగా బైబిల్ పండితులలో కొందరు యోబు గారి చరిత్ర ఒక ఇతిహాసము మాత్రమే, నిజంగా జరగలేదు అంటారు గాని, యూదా పండితులు మాత్రము ఇది నిజంగా జరిగింది అని నమ్ముతారు చెబుతారు. కాబట్టి మన బైబిల్ పండితులను కాకుండా యూదా పండితులు చరిత్ర కారుల మాటలనే నమ్ముదాము! చివరగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇచ్చిన బైబిల్ వ్యాఖ్యానం లో ఇది నిజముగా జరిగిన సంఘటన అని నొక్కివక్కాణించ బడింది!  యెహేజ్కేలు 14:14 లో ఉదాహరించ బడిన నోవహు గారు దానియేలు గారు కల్పిత వ్యక్తులు కానప్పుడు యోబుగారు కూడా కల్పిత వ్యక్తి కాదు అని మనము బైబిల్ ను నమ్మాలి!

 

మోషే గారు 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉన్నప్పుడు యాత్రికుల ద్వారా విన్న చరిత్రను క్షుణ్ణంగా విని పరిశీలన చేసుకుని మిద్యాను దేశంలోనే మోషే గారి ద్వారా వ్రాయబడింది!

 

ముగించేముందు: అసలు దేవుడు సాతాను గాడు పందెం వేసుకోవడం ఏమిటి? ఏ పాపము అన్యాయము చేయని యోబు గారు కష్టాలు పడటం ఏమిటి?

 

జవాబు: మొదటగా: దేవునికి యోబు గారి వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకుని సాతాను గాడిని ఓడించాలి అనేది దేవుని ప్రగాడ సంకల్పం! అందుకే ఆయనకు ఆ శ్రమలు! దేవుడు గెలిచారు, సాతాను ఓడాడు!

 

రెండవదిగా: దేవుడు యోబు గారి భక్తికి యథార్తతకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలను కున్నారు. అయితే దేవుడు దేనిని పరీక్ష లేకుండా ఇవ్వరు కనుక ముందు పరీక్షించి ఆ తర్వాత రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చారు!

 

మూడవదిగా: శ్రమలకు ముందు ఆయన బంగారము వంటి వ్యక్తి అయితే శ్రమల తర్వాత మేలిమి బంగారము లేక శుద్ధ సువర్ణములా తయారవ్వడానికే దేవుడు చేసిన ప్రణాళికా ఇది!

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! దేవుడు టెక్నిక్ ఇదే కాబట్టి శ్రమలకు శోధనలకు క్రుంగిపోకూ ముందుకు సాగిపో!

 

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*మూడవ భాగం ఉపోద్ఘాతం-3*

 

యోబు 23:10. నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

*యోబు గ్రంధ ప్రత్యేకత*:

 

1).  దేవుడు సాతానుడు పోటీ పడటం: దేవుని భక్తుడు ఇబ్బందులు పడటం- అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే దేవుడు తన కార్యమును తనకు తానుగా చేసుకోగలరు గాని చేయరు. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న ఒక మానవుడు కావాలి! అలాంటి వ్యక్తిని ఉపయోగించుకుని అసాధారణ అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడతారు! దేవుడు సాతాను గాడిని ఒక మనిషి యొక్క భక్తి యథార్ధత  ఆదారంగా ఓడించాలి, మనుష్యులు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో సాతాను గాడికి చూపించాలి అని అనుకున్నారు! అందుకు మంచి సాధనంగా యోబు గారు కనిపించారు!

 

2) సాతాను గాడు అన్నాడు: కేవలం మానవులు దేవుడిచ్చిన ఆశీర్వాదాల కోసమే దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నారు గాని దేవుడంటే భక్తి చేత కాదు, దేవుడంటే ప్రేమ కాదు, యథార్ధత అసలు కాదు అన్నాడు! దేవుడు అన్నారు: కాదురా సాతానుగా నేనంటే భక్తి చాలామందికి ఉంది ఉదాహరణకు నా భక్తుడు యోబును చూడు అతడు నీతిమంతుడు యధార్ధవంతుడు ఇంకా చెడుతనం అనేదానిని ఎంతగానో అసహ్యించు కుంటాడు అని దేవుడే సాతాను గాడి ముందు గొప్పగా చెప్పారు దేవుడు! నిజానికి సాతాను గాడి డైలాగ్ మనలో చాలామందిలో నిజమే! అనగా సుమారుగా నూటికి తొంబై మంది అలాగే ఉన్నారు! అయితే కష్టమైనా నష్టమైనా దేవుడే! నీట ముంచినా పాలముంచినా దేవుడా నీదే భారం అన్నవారు చాలా తక్కువ మంది! అలాంటి వాడే యోబు గారు!

 

3) ఈ యోబు గ్రంధంలో దేవుని అమూల్యమైన సత్యాలతో పాటుగా విజ్ఞాన శాస్త్రము, జీవ శాస్త్రము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఆదునిక విజ్ఞాన శాస్త్రము మరియు ఖనిజ శాస్త్రము (Mineralogy)  వీటికోసం సుమారుగా 77 అంశాలు ఈ గ్రంధంలో ఉదాహరించ బడ్డాయి! మరే ఇతర బైబిల్ గ్రంధాలలో కూడా ఇంత ఎక్కువగా చెప్పబడలేదు!

 

4) దేవుడు అసలు ఎవరు? తన కార్యములు ఏవిధంగా నిర్వహిస్తారు అనేది ఇంకా నరులే దేవునికి జవాబుదారులు గాని  ఆయన ఎవరికీ జవాబుదారుడు కాదు అనేది స్పష్టంగా చెప్పిన గ్రంధము ఇది!

 

5) ఈ గ్రంధములో రెండు ముఖ్యమైన ప్రశ్నలు కనిపిస్తాయి:

ఒకటి: మనిషికి శ్రమలు ఎందుకు వస్తాయి?

రెండు: నీతిమంతుడికి కూడా శ్రమలు శోధనలు వస్తాయా? వస్తే ఎందుకు వస్తాయి? అనేవాటికి దీనిలో జవాబులు ఉన్నాయి!

 

6) యోబు గారి స్నేహితులు యోబుగారికి వచ్చిన శోధనలకు కారణం యోబు గారు చేసిన పాపములు అపరాధములు అని భావించారు! చివరకు యోబు గారి భార్య కూడా అలాగే ఆలోచించి యథార్ధతను వదిలి దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పింది. గాని నిజానికి యోబు గారికి వచ్చిన శోధనలకు కారణం దేవుడు మరియు సాతాను గాడు వేసుకున్న పందెము అని గ్రహించలేక పోయారు! మనము కూడా మనకు వచ్చిన శోధనలు ఇంకా ఇతరులకు వస్తున్న శోధనలు చూస్తూ వారు చేసిన పాపాల వలననే ఈ శ్రమలు శోధనలు కలుగుతున్నాయి అనుకోవడం తప్పు అని ఈ గ్రంధము తెలియజేస్తుంది.

 

7) దేవుని రౌండ్ టేబిల్ సమావేశము: దీనినే దేవుని ఆలోచనా సభ అని అంటారు! ఇది ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. యోబు 15:8 లో దేవుని ఆలోచనా సభ అనే మాట కనిపిస్తుంది మనకు! ఈ ఆలోచనా సభ ఎందుకు అంటే నాకు అర్ధమయ్యింది- దేవుని దూతలు భూలోకంలో తిరుగుతూ ఉంటారు ఏ విశ్వాసి ఏమి ప్రార్ధన చేస్తున్నారు, వారి అవసరాలు ఏమిటి అనేవి దేవునికి చేరవేస్తూ ఉంటారు. అనగా ప్రార్ధనలు అనే అప్లికేషన్ మనము పెట్టుకుంటే అవి ఎప్పుడు నెరవేర్చాలి అనేది దేవుని సమయంలో దేవుడు విధానంలో ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో నిర్ణయించే సమావేశము అని నాకు అర్ధమయ్యింది!

 

8) సరే మరి ఇలాంటి ముఖ్యమైన మీటింగ్ లకు సాతాను గాడు పరలోకంలోకి ఎలా వెళ్ళాడు? వాడికి ప్రవేశం ఎందుకుంది? ఎలా ఉంది? అంటే వాడికి ఈ గ్రంధము ప్రకారం ప్రవేశం ఉంది. దేవదూతలు మన అప్లికేషన్లు ప్రార్ధనలు దేవునికి వినిపిస్తే ఈ పనికిమాలిన సాతాను గాడు మనమీద చాడీలు చెప్పడానికి మోసుకుని వెళ్తా ఉంటాడు. ఎంతవరకు వాడికి ప్రవేశం అంటే ప్రకటన గ్రంధంలో జరుగబోయే పరలోకంలో జరిగే చివరి యుద్ధము వరకు వాడికి ప్రవేశం ఉంటుంది. ..ఈ ప్రకటన 12వ అధ్యాయంలో మనకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి! మొదటిది: సూర్యుని ధరించిన స్త్రీ!

రెండు: పరలోకంలో జరిగిన యుద్ధము- సాతానుగాడు శాశ్వతంగా పరమునుండి  త్రోసివేయబడుట

 

ప్రియులారా! మనకు సూర్యుని ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ప్రసవవేదన పడుతూ ఒక  సమస్త జనులను ఏలే  శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువును మ్రింగివేయాలని ఒక మహా ఘటసర్పం చూస్తుంది. అయితే ఆ శిశువు పరమునకు దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడెను! ఆ స్త్రీ అరణ్యానికి పారిపోతుంది. అక్కడ ఆమె మూడున్నర సంవత్సరాలు దాచబడి పోషించబడుతుంది.  అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ దాచబడిందో ఈ ఘటసర్పము పరలోకమునకు యుద్ధానికి వెళ్లారు వాడు- వాడి సైన్యము! గాని మిఖాయేలు దేవదూత ఒక్క తాపు తంతే భూమిమీద పడింది- వాడు వాడి సైన్యము! ఇక పరమునకు పోయే అనుమతి శాశ్వతంగా పోగొట్టుకుంది ఘటసర్పము అనబడే సాతాను గాడు! ఎప్పుడైతే పరమునుండి త్రోయబడిందో ఉక్రోషం పట్టలేక- ఆ స్త్రీని హింసించడం మొదలుపెట్టింది. వెంటనే ఆమెకు దేవునిచేత రెక్కలు ఈయబడ్డాయి. ఆమె దాచబడింది. ఘటసర్పము తననోటనుండి నీరు ప్రవహాముగా పంపి ఆ స్త్రీని చంపాలని చూస్తే భూమి ఆమెకు సహకారిగా మారి ఆ నీటిని మ్రింగి వేస్తుంది.  వాడు ఆగ్రహం పట్టలేక ఆ స్త్రీకి ఉన్న మిగిలిన సంతానంతో యుద్ధానికి బయలుదేరారు! ఇదీ ఈ అధ్యాయంలో గల విశేషాలు!

 

ప్రియులారా! ఏడవ వచనంలో అంతట పరలోకంలో యుద్ధము జరిగెను అంటూ మిఖాయేలు అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేశారు అంటున్నారు. అసలు ఘటసర్పము ఏమిటి  పరలోకం వెల్లడమేమిటి? అక్కడ యుద్ధము చేయడమేమిటి అనే అనుమానం రావచ్చు! అసలు పరలోకానికి వారిని రానిచ్చింది ఎవరు అనే అనుమానం రావచ్చు! కారణం అపవిత్రమైనదేదీ అందులో ప్రవేశించలేదు కదా పరలోకంలో!

కంగారుపడవద్దు! వాడికి ప్రవేశం ఉంది! వాడు పరమునుండి త్రోయబడిన దేవదూత! లూసీఫర్!  దేవుడు ఒకసారి ఏమైనా ఇస్తే వాటిని తిరిగి తీసుకునే వాడు కాదు! సాతానుగాడికి వాడి సైన్యానికి ఇప్పటికీ పరలోక అనుమతి ఉంది! అది మనం యోబు గ్రంధం 1,2 అధ్యాయాలలో చూడవచ్చు! రెండుసార్లు అక్కడ దేవుని సన్నిధికి పరలోకం వెళ్ళాడు వాడు! ... యోబు 1:67

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

7. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

 

కాబట్టి ఇప్పుడు కూడా వాడి సైన్యంతో వెళ్ళాడు యుద్ధానికి! వాడి అనుమతి ఎప్పుడు ముగిసిపోతుంది అంటే పరలోకంలో మిఖాయేలు అతని సైన్యంతో యుద్ధం తర్వాత సాతాను గాడు ఇక పరలోక ప్రవేశం శాశ్వతంగా కోల్పోతాడు!

 

ఇక ఆయుద్ధంలో మహా ఘటసర్పము వాడి పార్టీ గెలవలేక పోయారు! దేవుని సైన్యంతో సాతాను గాడి సైన్యం యుద్ధం చేసి గెలవడం అసాధ్యం! కేవలం దేవుడు అనుమతి ఇస్తే తప్ప వాడు గెలువలేడు! ఇంతకు ముందే దేవుడు వాడిని త్రోసి ఉండేవారు గాని అలా చేయాలని ఆయన అనుకోలేదు! ఎందుకో మనకు తెలియదు!

ఇక వాడికి అక్కడ అనగా పరలోకంలో చోటు లేకుండా పోయింది అని వ్రాయబడింది. ఆ యుద్ధం తర్వాత వాడికి అనుమతి కోల్పోవడం జరుగుతుంది. ఇక రాబోయే యుగంలో సాతాను గాడికి పరలోకంలో ప్రవేశం అనేది లేనేలేదు అని గ్రహించాలి!

 

9) శ్రమలు శోధనలు అనంతరం రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడం!!!

 

10) విచిత్రం ఏమిటంటే యోబు గారి స్నేహితులు దేవునికి అనుకూలంగా మాట్లాడకుండా యోబు గారిని నీవు పాపివి అని నిరూపించడానికి ప్రయత్నిస్తే యోబు గారు తనను తాను నీతిమంతుడు అంటూ తన నీతిని చెప్పడానికి ప్రయత్నించారు. చివరకు ఒక స్టేజీలో తన స్వనీతిని నిరూపించ డానికి ప్రయత్నం చేశారు, చివరికి దేవునితో ఎన్కౌంటర్ తర్వాత నేను తప్పును ఒప్పుకుంటున్నాను నోటిమీద చేయి వేసుకుంటున్నాను అని చెప్పాక- స్నేహితులను దేవుడు మీరు నాకు అనుకూలంగా మాట్లాడలేదు, మీరు బలిని తీసుకుని వచ్చి యోబుగారి దగ్గరకు తెండి, అతడు మీకోసం ప్రార్ధన చేస్తే మిమ్మల్ని క్షమిస్తాను అని చెబితే వారు బలులు తెచ్చినప్పుడు యోబు గారు ప్రార్ధన చేస్తే దేవుడు స్నేహితులను అంగీకరించి, యోబు గారిని స్వస్తపరచి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చారు. గాని బలులు తెచ్చింది ఎవరు? స్నేహితులు!!!

 

దేవుని కార్యములు మనకు అర్ధం కావు! దేవుడు మనలను శ్రమ పరచినా గాని యోబు గారివలే దేవునినుండి మేలులు అనుభవించము కీడును కూడా అనుభవించ లేమా అని చెప్పగలిగిన స్తితిలో మనముండాలి!

 

దైవాశీస్సులు!!!  

*యధార్ధవంతుడైన యోబు*

*నాల్గవ భాగం ఉపోద్ఘాతం-4*

 

యోబు 23:10. నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

*యోబు గారి  ప్రత్యేకత:*

యోబు అంతగా బాగుపడ్డ వారు లేరు- యోబులా బాధపడిన వారు లేరు.

యోబులా దీవించబడిన వారు లేరు- యోబులా ద్వేషించ బడినవారు లేరు.

యోబులా క్షీణించ బడినవారు లేరు- యోబులా క్షేమము పొందిన వారు లేరు.

యోబులా నష్టపోయిన వారు లేరు- యోబులా లాభపడిన వారు లేరు!

యోబులా సాతాను చేతిలో  శోదించబడిన వారు లేరు- యోబులా సాతానుని అవమాన పరచిన వారు లేరు!

యోబు అంత ఘోరంగా అవమానించబడిన వారు లేరు- యోబులా అభిమానించ బడిన వారు లేరు!

యోబు గారు చనిపోయే వరకు దేవునితో సంబంధమును కోల్పోలేదు- దేవునితో సహవాసమును కోల్పోలేదు!!

 

ఇక యోబుగారి కోసం కొంతమంది సాక్ష్యం చెప్పారు!

 

మొదటగా: *యోబు గారు పరిశుద్ధాత్మ దేవునిచేత సాక్ష్యం పొందారు!*

యోబు 1:1 యోబు అను మనుష్యుడు ఉండెను అతడు యథార్ధ వంతుడును నీతిమంతుడును.. దేవునియందు భయభక్తులు గలవాడు..

2 పేతురు 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన  లేఖనములో ప్రవచనం పుట్టదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించ బడిన వారై దేవుని మూలముగా పలికిరి!!! కాబట్టి యోబు గారు యథార్ధ వంతుడు అంటూ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెబుతూ ఈ గ్రంధాన్ని ప్రారంబించాడు!!!

 

రెండవది:  *యోబుగారు దేవునిచేత సాక్ష్యం పొందారు!*

యోబు 1:8 దేవుడు అపవాదితో వాదిస్తున్నారు: నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్దవర్తనుడు .. .. చెడుతనమును అసహ్యించు కొనువాడు.. అని సృష్టి కర్త చేతనే శత్రువైన సాతాను గాడితో సవాలుచేస్తూ సాక్ష్యం పొందిన గొప్పవాడు యోబు గారు!

 

మూడు: *సాతాను చేత సాక్ష్యం పొందినవాడు*:

దేవుడు సాతానుతో నా సేవకుడు నాయందు భయభక్తులు గలవాడు చెడుతనం అసహ్యించు కొనువాడు అని చెబితే సాతాను గాడు వెంటనే అంటున్నాడు: అతడు ఊరకనే యధార్ధత చూపిస్తున్నాడా? నీవు అతని చుట్టూ కంచె వేసేశావు  అతనికి ఆస్తి ఐశ్వర్యము ఇచ్చి కాపాడుతున్నావు కాబట్టి నీ యందు భయభక్తులు గలవాడుగా ఉంటున్నాడు తప్ప నీ యందు ప్రేమ కలిగి కాదు అంటున్నాడు. ఇక్కడ ఏమి చెప్పినా యోబుగారు భయభక్తులు గలవాడు యథార్ధ వంతుడు అని సైతాను గాడు ఒప్పుకుంటున్నాడు! ఇది ఒక దేవుని బిడ్డ కోసం సాతాను గాడే స్వయంగా ఇచ్చిన సాక్ష్యం!!!

 

నాలుగు: *యోబుగారు తన భార్యచేత సాక్ష్యం పొందారు!*

యోబు 2:9 లో శ్రమల మధ్యలో నిష్టూర పడి యోబు గారిని దూషిస్తుంది: నీవు ఇంకనూ యధార్ధతను వదలక యుందువా? దేవుణ్ణి దూషించి యధార్ధతను వదిలి చచ్చిపో అంటుంది! ఇక్కడ దూషణ మాటలలో కూడా నీవు యధార్ధ వంతుడవు- ఇక నీ యధార్ధను పట్టుకుని వ్రేలాడక దానిని వదిలి ఆత్మహత్య చేసుకో అంటుంది! కాబట్టి భార్య కూడా సాక్ష్యం చెబుతుంది- యోబు గారు యధార్ధవంతుడు!

 

ఐదవది:  *యోబు గారి మనస్సాక్షి కూడా సాక్ష్యం చెబుతుంది*:

యోబు 31:6,7 లో యోబు గారు అంటున్నారు: నేను యధార్ధవర్తనుడనై యున్నానని దేవుడు తెలుసుకొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక అంటున్నారు!! కాబట్టి యోబు గారి మనస్సాక్షి కూడా తాను యధార్ధ వంతుడు అని సాక్ష్యం చెబుతుంది. మనమీద మన అంతరాత్మ ఏ నేరము మోపక పోతే నీవు ధన్యుడవు!

 

నేటిదినాలలో అనేకమందికి తన ఇంట్లో తన గ్రామంలో తన పొరుగు వారి దగ్గర మంచి సాక్ష్యం లేదు. సంఘంలో, ప్రక్క గ్రామాలలో అబ్బో ఎంత భక్తిపరుడో ఎంత ప్రార్థనా పరుడో అని పేరు ఉంటుంది. ఇలాంటి జీవితం మ్రోగెడు కంచు గణగణలాడు తాళము మాత్రమే!!!

 

కాబట్టి మొత్తం ఐదు వివిధ రీతులలో యోబుగారు యధార్ధవంతుడు నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు గలవాడు అంటూ సాక్ష్యం పొందారు! ప్రియ చదువరీ మరి నీకు అటువంటి సాక్ష్యం నీకుందా?

అయితే నీవు ధన్యుడవు!!!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*ఐదవ భాగం*

*యోబులో ఉన్న లక్షణాలు-1*

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

       

             దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ఇక మనము ఈ గ్రంధమును ధ్యానం చేసుకుందాం!

ఊజు దేశంలో యోబు అనే భక్తుడు ఉన్నట్లు చూస్తున్నాము మొదటి వచనంలో! గత భాగాలలో చూసుకున్నాము ఊజు దేశం ఎక్కడుంది? మిద్యాను దేశం ప్రక్కన ఉంది. దీని ఖచ్చితమైన స్థానం తెలియదు, కానీ ఆధునిక సిరియా లేదా జోర్డాన్లోని ఎడారికి సమీపంలో ఉన్న ప్రాంతం అని ఊహించబడుతుంది. ఇది ఒక దేశం కంటే ఒక ప్రాంతంగా పరిగణించబడుతుంది.

ఊజు కోసం ఇంకా చూసుకుంటే ఊజు ఈ దేశం కనానుకు తూర్పు దిశగా ఉంది  యిర్మీయా గారి కాలంలో ఎదోము, ఊజు దేశాలు వేరువేరుగా ఉన్నాయి (యిర్మీయా 25:20-21). కానీ ఎదోమువాళ్ళు ఊజులో ఉన్నారు (విలాప 4:21). కాబట్టి ఊజు బహుశా ఎదోముకు సమీపంలోనే ఉండవచ్చు. ఎలీఫజు స్వస్థలమైన తేమాను (2:11) ఎదోము సరిహద్దుల లోపల ఉంది. ఊజు' అనే పేరు ఆరామ్ కుమారుడైన ఊజును సూచించవచ్చు, అతనికి సంబంధించిన ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తారు.

ఆదికాండము 10:23

అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

ఆదికాండము 22:21

వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,

1దినవృత్తాంతములు 1:17

షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

విలాపవాక్యములు 4:21

అతని నీడక్రిందను అన్యజనుల మధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు.

ఇదీ ఊజు పుట్టు పూర్వోత్తరాలు!

 

సరే ఇక ఈ వచనంలో యోబు గారిలో ఉన్న నాలుగు అత్యుత్తమమైన లక్షణాలు కనిపిస్తున్నాయి! అవి ప్రతీ విశ్వాసిలోను దేవుడు చూడాలని కోరుకుంటున్నారు!

1) యథార్ధవంతుడు

2) న్యాయ వంతుడు

3) దేవుని యందలి భయభక్తులు గలవాడు

4) చెడుతనమును విసర్జించినవాడు

 

ప్రియ దేవుని జనమా! ఈ నాలుగు లక్షణాలను దేవుడు మనందరిలోనే చూడాలి అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డా! నీలో ఈ యథార్థత కనిపిస్తుందా? నీలో న్యాయం కనిపిస్తుందా? నీలో దేవుని యందలి భయభక్తులు కనిపిస్తున్నాయా? నేటి దినాలలో అనేకులకు దేవుడంటే  భక్తి ఉంది కానీ భయం లేదు! అందుకే మన జీవితాలు బాగుపడటం లేదు! ఇక చెడుతనము అది చెడు అని తెలిసిన తర్వాత దానికి దూరంగా పోతున్నావా? ఈ లక్షణాలే యోబు గారిని దేవునికి దగ్గరగా చేశాయి!!!

 

ఈరోజు యథార్ధత కోసం ధ్యానం చేద్దాం!

యథార్థత (Integrity) అంటే లోపల మరియు వెలుపల ఒకే విధంగా ఉండడం, మాటలు మరియు చేతలు సత్యానికి అనుగుణంగా ఉండడం. (ఇంకా నీ కుటుంబం, నీ సంఘం ముందు నీవు ఎట్లా ప్రవర్తిస్తావో? వాటికి దూరంగా ఒంటరిగానున్న సమయంలో సహితం నీవు అట్టిరీతిగానే ప్రవర్తించడం)!

 

ప్రియులారా యోబు గారి యథార్ధత కోసం ఆయనే స్వయంగా చెబుతున్నారు బైబిల్ రికార్డు చేసింది

యోబు 31:1

నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?

యోబు 31:2

ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?

యోబు 31:4

ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగు జాడలనన్నిటిని లెక్కించును గదా

యోబు 31:5

అబద్ధికుడనై నేను తిరుగులాడిన యెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల

యోబు 31:6

నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు

యోబు 31:7

న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచిన యెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన యెడల

యోబు 31:9

నేను హృదయమున పరస్త్రీని మోహించిన యెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల

యోబు 31:10

నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.

యోబు 31:11

అది దుష్కామకార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరము

యోబు 31:13

నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసిన యెడల

యోబు 31:14

దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

యోబు 31:15

గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

యోబు 31:17

తలిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసిన యెడలను

యోబు 31:18

ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

యోబు 31:19

వారి దేహములు నన్ను దీవింపకపోయిన యెడలను వారు నా గొఱ్ఱెలబొచ్చు చేత వేడిమి పొందకపోయిన యెడలను

యోబు 31:20

గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేని వారిని నేను అన్యాయము చేసిన యెడలను

యోబు 31:21

నా భుజశల్యము దాని గూటి నుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

యోబు 31:22

నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాట నుండి దిక్కు లేని వానికి నేను మార్గ దర్శినైతిని.

యోబు 31:24

సువర్ణము నాకు ఆధారమనుకొనిన యెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను

యోబు 31:25

నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను

యోబు 31:26

సూర్యుడు ప్రకాశించి నప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడచుచుండగా అతనినేగాని చూచి

యోబు 31:27

నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన యెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.

యోబు 31:28

అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేర మగును.

యోబు 31:33

ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని

యోబు 31:34

మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.

చూడండి ఎంత యథార్ధత!!

ఇలాంటి యథార్ధత నీకుందా?

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*6వ భాగం*

*యోబులో ఉన్న లక్షణాలు-1*

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

 

     ప్రియులారా యోబు లో ఉన్న నాలుగు లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము. అవి

1) యథార్ధవంతుడు

2) న్యాయ వంతుడు

3) దేవుని యందలి భయభక్తులు గలవాడు

4) చెడుతనమును విసర్జించినవాడు

                  (గతభాగం తరువాయి)

 

 గతభాగంలో యథార్ధత అంటే ఏమిటో చూసుకున్నాము! ఇదే యథార్ధత వలన దానియేలు గారి జీవితంలో ఈ నీతికి యధార్ధతకు ప్రతిఫలంగా మొదటగా తన స్నేహితులు అగ్ని గుండములో ప్రాణాలతో వేయబడ్డారు, గాని దేవుడు అత్యద్భుతముగా కాపాడారు. ఇక దర్యావేషు కాలంలో ఆయనను సింహపు బోనులో వేశారు. అయతే దేవుడు తనదూతను పంపించి కాపాడారు!

 

యోసేపు గారు అవకాశం కలిగినా దేవునికి, కుటుంబానికి, తన ఘటముకు కళంకం కలుగుకుండా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయారు! తద్వారా అనేక సం.లు జైలులో చేయని నేరానికి శిక్ష భరించారు! చివరకు ఒకరోజు ఆ భక్తి, యధార్ధత ద్వారా మొదటగా దేవునికి మహిమ కలిగింది నిగూఢమైన కలలకు భావం చెప్పడం ద్వారా! ఇక దేవుని ద్వారా యోసేపు గారికి కూడా ఘనత కలిగింది! ఇక్కడ యోసేపు గారి పవిత్రమైన జీవితం మహిమను ఘనతను తెచ్చిపెట్టింది!

 

ఇక యాకోబు గారికోసం ఆలోచన చేస్తే... ఇంతకీ నీ పేరు ఏమిటి అని దూత అడిగాడు! గమనించాలి- దేవుని దూతకు యాకోబుగారి యొక్క పేరు తెలియదా? తెలుసు గాని అతని నోటనుండి యధార్ధత రావాలి అనేది దూత ఉద్దేశ్యం! అందుకే నీ పేరేమిటి అని అడిగితే యాకోబు యథార్ధంగా చెబుతున్నారు- నా పేరు యాకోబు! అనగా మోసగాడిని!

వెంటనే 28వ వచనంలో అంటున్నాడు దేవుని దూత: ఇక నీపేరు యాకోబు అనగా మోసగాడు అనబడదు, మడమును పట్టుకునే వాడవు అనబడదు గాని నీవు దేవునితోనూ మనుష్యులతోను పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది అనగా పోరాడేవాడు, లేక దేవుని యొక్క రాజకుమారుడు, దేవునిచేత ఆశీర్వదించబడిన వాడు!

అనగా మన యథార్ధత మొదట మనకు శ్రమలు శోధన కలిగించినా చివరకు అత్యధిక దీవెనలు ఘనమైన విజయాలు కూడా తీసుకుని వస్తుంది!

 

 ఇక యథార్ధత ఎలా వస్తుంది?

భక్తి మరియు ప్రార్థన వలన!

ప్రార్థన నేరుగా యథార్థతను (ప్రామాణికత లేదా నిజాయితీని) కలిగించనప్పటికీ, అది యథార్థతను పెంపొందించడానికి మరియు బలోపేతం చేయడానికి శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది.

 

ప్రార్థన యథార్థతను ప్రభావితం చేసే మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట! దేవునితో గడుపుట! ఒక భక్తుడు అన్నాడు ప్రార్ధన లేదా దేవుడితో మాట్లాడకుండా నీ దినాన్ని ప్రారంభిస్తే అది పాపము ఎందుకంటే గత రాత్రి ఉన్నవాడు ఈ ఉదయం లేడు! అనేకమందికి సరియైన ఆరోగ్యం లేదు! సరిగా ఊపిరి పీల్చుకోవడం లేదు. సరియైన వసతులు లేవు! సరైన ఉద్యోగం లేదు! కానీ దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కదా అందుకే దేవునికి హృదయపూర్వకంగా  వందనాలు చెప్పాలి! ఇక జాన్ బనియన్ గారు ఇలా అన్నారు: ప్రార్ధన నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది అదే పాపము నిన్ను ప్రార్థించకుండా ఆపుతుంది! కాబట్టి ప్రార్థన చేయాలి.

అయితే ప్రార్థన ద్వారా యథార్థత ఎలా వస్తుంది అంటే ప్రార్థించేటప్పుడు హృదయపు లోతులలో నుండి పూరాత్మతోను పూర్ణ బలముతోను ఆత్మతోను సత్యముతోను దేవునికి ప్రార్థించాలి! మన హృదయాన్ని కుమ్మరించాలి! ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నారు అని, మన ముందునే మన ఆయన ఉన్నారని మనం నమ్మాలి! ఎంత దగ్గరగా ఉన్నారంటే మన చేతులు ఆయన పాదాలను తాకుతున్నాయి మన కన్నీరు ఆయన పాదాలను తడుపుతుంది! అంత దగ్గరగా ఉన్నారని నీవు నమ్మాలి నమ్మి యధార్థంగా ప్రార్థన చేయాలి. అలా చేసేటప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనిపిస్తాయి అలా కనిపించినప్పుడు మనలను మనము పరిశీలన చేసుకోవాలి!

 

1) స్వీయ-ప్రతిబింబం (Self-Reflection): ప్రార్థన అనేది తమ ఆలోచనలు, భావాలు మరియు చర్యలను నిజాయితీగా పరిశీలించుకునే సమయాన్ని అందిస్తుంది. ఈ అంతర్గత పరిశీలన వ్యక్తులను తమ బలహీనతలను మరియు వైరుధ్యాలను అంగీకరించేలా చేస్తుంది, ఇది యథార్థమైన జీవితానికి మొదటి మెట్టు.

 

2) జవాబుదారీతనం (Accountability): ప్రార్థనలో ఉన్నప్పుడు, చాలా మంది వ్యక్తులు తమను తాము ఒక ఉన్నత శక్తికి లేదా తమ సొంత నైతిక సూత్రాలకు జవాబుదారీగా భావిస్తారు. ఈ భావన వారిని మరింత నిజాయితీగా మరియు నైతికంగా వ్యవహరించడానికి ప్రోత్సహిస్తుంది.

 

3) నైతిక స్పృహ (Moral Compass): ప్రార్థన ద్వారా మార్గదర్శకత్వం కోరడం వలన, వ్యక్తులు తమ అంతర్గత నైతిక దిక్సూచికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. ఇది వారి మాటలు మరియు చేష్టల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది.

 

ప్రార్ధన ద్వారా యదార్థత (Integrity through Prayer) అనే అంశం క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైన మరియు లోతైన సత్యాలను తెలియజేస్తుంది.

 

♻️ ప్రార్థన ద్వారా యదార్థతను ఎలా సాధించ వచ్చు?

 

ప్రార్ధన ద్వారా యదార్థత (Integrity through Prayer)

 

1. యదార్థత అంటే ఏమిటి?

 

యదార్థత అంటే ఒక వ్యక్తి యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛత. బైబిల్లో, యదార్థత అనేది:

 

🔸సంపూర్ణత: తన ఆలోచనలు, మాటలు మరియు క్రియలలో ఏ మాత్రం దాపరికం లేదా కపటం లేకుండా ఉండటం. (యెహోవా దృష్టికి తాను ఎవరో, ఇతరుల దృష్టికి కూడా అదే విధంగా ఉండటం).

🔸న్యాయం: దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ సరైనది చేయాలనే స్థిరమైన సంకల్పం కలిగి ఉండటం (సామెతలు 11:3).

🔸నమ్మకత్వం: దేవునికి మరియు ఇతరులకు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండటం (కీర్తన 25:21).

 

2. ప్రార్థన యదార్థతను ఎలా స్థాపిస్తుంది?

 

ప్రార్థన అనేది ఒక వ్యక్తి హృదయాన్ని దేవుని సత్యంతో అనుసంధానం చేసే సాధనం. ప్రార్థన ద్వారా యదార్థత ఏర్పడటానికి మరియు నిలబడటానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి:

 

♻️ A. ఆత్మ పరిశోధన మరియు ఒప్పుకోలు

 

🔸పరిశోధన కోరడం: యదార్థత మొదటి మెట్టు దేవుని ముందు మన నిజ స్వరూపాన్ని ఒప్పుకోవడం. దావీదు వలె, మనం కూడా "దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము... నాలో వేదనాకరమైన మార్గము ఏమైనా ఉన్నదేమో చూడుము" (కీర్తన 139:23-24) అని ప్రార్థిస్తాము.

 

🔸ముసుగు తొలగింపు: రహస్యంగా దాగి ఉన్న దురాలోచనలు లేదా చెడు ఉద్దేశాలను ప్రార్థనలో దేవుని సన్నిధికి తీసుకురావడం ద్వారా, మన హృదయంలోని కపటం తొలగిపోతుంది. ప్రార్థన మన అంతరంగం మరియు బహిరంగ జీవితం మధ్య ఉన్న అంతరాన్ని పూరిస్తుంది.

 

♻️B. దైవ శక్తిని మరియు నడిపింపును కోరడం:

 

🔸శోధన నుండి విడుదల: "శోధనలోనికి మమ్మును తేక, కీడు నుండి మమ్మును తప్పించు" (మత్తయి 6:13) అని ప్రభువు ప్రార్థనలో నేర్చుకున్నట్లుగా, యదార్థతను నిలబెట్టుకోవడానికి అవసరమైన శక్తి మరియు రక్షణ కొరకు మనం ప్రార్థిస్తాము.

 

🔸దేవుని చిత్తానికి అప్పగింత: యదార్థత అంటే దేవుని చిత్తం ప్రకారం జీవించడం. ప్రార్థనలో, మన ప్రణాళికలను కాకుండా ఆయన చిత్తమే నెరవేరాలని (మత్తయి 6:10) కోరుకుంటాము. ఇది మన సొంత స్వార్థ ఆశలకు కాకుండా, దేవుని న్యాయమైన మార్గాలకు మనల్ని లోబరుస్తుంది.

 

♻️C. నిరంతర స్థిరత్వం కోసం పోరాటం

 

🔸విశ్వాసములో స్థిరత్వం: యదార్థత ఒక్కరోజులో వచ్చేది కాదు, అది నిరంతర పోరాటం. ప్రార్థన అనేది ఈ పోరాటంలో మన నిబద్ధతను రోజూ పునరుద్ధరించుకోవడానికి సహాయపడుతుంది.

 

🔸ఆచరణలో యదార్థత: యదార్థత అనేది మనకు ఎవరూ చూడనప్పుడు మనం ఎవరో తెలియజేస్తుంది. ప్రార్థనలో దేవునితో గడిపిన సమయం, మనకు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నైతిక బలాన్ని ఇస్తుంది.

 

 

♻️ 3. ముఖ్యమైన సందేశం

🔹యదార్థత యొక్క ఫలితం: సామెతలు 11:3 "యథార్థవంతుల యథార్థత వారికి దారి చూపును." ( యదార్థమైన జీవితం దేవుని దీవెనలతో కూడిన సరళమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది)

 

🔹ప్రార్థనలో యదార్థత: 1 తిమోతి 2:8 "...పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను." ( పవిత్రమైన చేతులు (యదార్థమైన జీవితం) ఉన్నప్పుడే ప్రార్థన దేవునికి అంగీకారమవుతుంది)

 

🔹హృదయ పరిశుభ్రత: కీర్తన 24:4 "నిష్కళంకమైన చేతులును శుద్ధమైన హృదయమును గలవాడే..." ( దేవుని సన్నిధిలోకి రావడానికి ముందు యదార్థత యొక్క అవసరం)

 

జీవితమే ఒక ప్రార్థనగా

"ప్రార్ధన ద్వారా యదార్థత" అంటే, మన ప్రార్థన జీవితం మన సాధారణ జీవితంపై ప్రభావం చూపాలి. మన ప్రార్థనలో మనం స్తుతించే పవిత్రత మరియు సత్యం మన ఆచరణలో స్పష్టంగా కనిపించాలి. మన మాటల్లో మరియు క్రియల్లో కపటం లేకపోవడమే నిజమైన ప్రార్థన యొక్క ఫలితం.

 

ప్రార్థన నేరుగా యథార్థతను (ప్రామాణికత లేదా నిజాయితీని) కలిగించనప్పటికీ, అది యథార్థతను పెంపొందించడానికి మరియు బలోపేతం చేయడానికి శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది.

 

కీర్తనలు 51:6

నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.

 

బైబిల్లో, ప్రార్థన ద్వారా యథార్థతను (నిజాయితీ, ప్రామాణికత మరియు దేవుని పట్ల అంకితభావం) పెంపొందించుకున్న అనేకమంది భక్తులు ఉన్నారు. వారి జీవితాలు మరియు ప్రార్థనలు ఈ లక్షణాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి.

 

కొంతమంది ముఖ్యమైన ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:

 

దావీదు రాజు గారు(King David):

యథార్థత: దావీదు రాజుగా ఉన్నప్పటికీ, తన పాపాలను దేవుని ముందు దాచడానికి ప్రయత్నించలేదు. అతని ప్రార్థనలు మరియు కీర్తనలు (కీర్తనల గ్రంథంలో) అతని హృదయంలోని లోతైన భావాలను, పశ్చాత్తాపాన్ని మరియు దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని వెల్లడిస్తాయి.

పెంపొందించుకున్న యథార్థత: దావీదుగారు తన బలహీనతలను మరియు తప్పులను నిజాయితీగా ఒప్పుకున్నారు. (ఉదాహరణకు, కీర్తన 51). దేవునితో అతనికున్న ఈ యథార్థమైన సంభాషణ, అతనిని దేవుని "హృదయానికి నచ్చిన వ్యక్తి"గా (a man after God's own heart) మార్చింది మరియు అతని నాయకత్వంలో నిజాయితీని పెంపొందించింది.

కీర్తనలు 51:2

నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.

కీర్తనలు 51:3

నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.

కీర్తనలు 51:4

నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

కీర్తనలు 51:5

నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.

కీర్తనలు 51:6

నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.

కీర్తనలు 51:7

నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.

కీర్తనలు 51:16

నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.

కీర్తనలు 51:17

విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

 

ప్రవక్త దానియేలు (Prophet Daniel):

యథార్థత: దానియేలు బబులోను బందీగా ఉన్నప్పుడు కూడా, దేవునికి ప్రార్థన చేయాలనే తన అభ్యాసాన్ని ఆపలేదు. రాజు ఆజ్ఞకు విరుద్ధంగా, అతను ప్రతిరోజూ మూడు సార్లు యథావిధిగా తన కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు.

పెంపొందించుకున్న యథార్థత: అతని యథార్థమైన మరియు స్థిరమైన ప్రార్థన జీవితం అతనికి అసాధారణమైన జ్ఞానాన్ని, ధైర్యాన్ని మరియు సింహాల గుంట నుండి రక్షణను అందించింది. అతని ప్రార్థనలు అతని జీవిత ప్రామాణికతకు మూలంగా నిలిచాయి.

 

యోబు (Job):

యథార్థత: యోబు తన సంపద, కుటుంబం మరియు ఆరోగ్యం అంతటినీ కోల్పోయినప్పుడు, అతని స్నేహితులు మరియు భార్య దేవుడిని శపించమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ, యోబు దేవుని పట్ల తన యథార్థతను వదులుకోలేదు.

పెంపొందించుకున్న యథార్థత: తన బాధల్లో కూడా, యోబు దేవునితో నిజాయితీగా వాదించాడు మరియు తన హృదయాన్ని కుమ్మరించాడు. అతని యథార్థత మరియు ప్రార్థనలు దేవుని దృష్టిలో నిందారహితమైనవిగా (blameless) పరిగణించబడ్డాయి, చివరికి దేవుడు అతని స్థితిని రెట్టింపు ఆశీర్వాదాలతో పునరుద్ధరించాడు.

 

పౌలుగారు (Apostle Paul):

యథార్థత: పౌలు క్రైస్తవులను హింసించేవాడిగా ఉండి, తర్వాత క్రీస్తుకు గొప్ప సేవకుడిగా మారాడు. అతని లేఖనాలలో, అతను తన గత తప్పులను మరియు క్రీస్తుపై తన సంపూర్ణ ఆధారపడటాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

పెంపొందించుకున్న యథార్థత: పౌలు నిరంతరం ప్రార్థించాడు మరియు తన పరిచర్యలో ఎదురైన సవాళ్లను దేవుని ముందు ఉంచాడు. ప్రార్థన ద్వారా అతను పొందిన బలం మరియు మార్గదర్శకత్వం అతనిని క్రైస్తవ విశ్వాసానికి అత్యంత ప్రామాణికమైన మరియు అంకితభావం కలిగిన నాయకులలో ఒకరిగా నిలబెట్టాయి. అతను తన పరిచర్య అంతటిలోనూ నిరంతరం ప్రార్థించాడు.

యథార్థత పెంపొందించుకున్న విధానం: పౌలు తన ప్రార్థనల్లో ఇతరుల కోసం, సంఘాల కోసం విజ్ఞాపనలు చేశాడు. అతని ప్రార్థనలు అతని మిషనరీ జీవితంలో ఎదురైన కష్టాల మధ్య దేవునిపై అతనికున్న అచంచలమైన నమ్మకాన్ని మరియు ఆధారపడటాన్ని తెలియజేస్తాయి, ఇది అతని యథార్థతను ప్రస్ఫుటం చేస్తుంది.

1తిమోతికి 1:12

పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

1తిమోతికి 1:13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

1తిమోతికి 1:15

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

1తిమోతికి 1:16

అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.

గలతియులకు 1:13

పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు

 

1కోరింథీయులకు 15:9

ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

1కోరింథీయులకు 15:10

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను,నాకు తోడైయున్న దేవుని కృపయే.

 

సుంకరి:

లూకా 18:11

పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

లూకా 18:12

వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.

లూకా 18:13

అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.

 

ఈ భక్తులందరూ ప్రార్థనను కేవలం ఒక మతపరమైన ఆచారంగా కాకుండా, దేవునితో నిజాయితీగా మరియు యథార్థంగా అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగించారు. వారి ప్రార్థనలు వారి పాత్రను బలోపేతం చేశాయి మరియు వారి జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడ్డాయి.

 

హన్నా (ప్రవక్త సమూయేలు తల్లి):

యథార్థత: హన్నాకు పిల్లలు లేనందుకు తీవ్ర దుఃఖంలో ఉండేది. ఆమె దేవాలయంలోనికి వెళ్లి కన్నీళ్లతో, హృదయపూర్వకంగా దేవునితో మొరపెట్టుకుంది.

యథార్థత పెంపొందించుకున్న విధానం: ఆమె ప్రార్థనలో తన మనసులోని వేదననంతా నిజాయితీగా వెలిబుచ్చింది మరియు దేవుడు తనకు కుమారుడిని ఇస్తే తిరిగి ఆయన సేవకే అర్పిస్తానని మొక్కుకుంది. ఆమె ప్రార్థనలోని యథార్థత మరియు నమ్మకానికి ప్రతిఫలంగా దేవుడు ఆమెకు సమూయేలు అనే కుమారుడిని ఇచ్చాడు.

 

యాకోబు:

ఆదికాండము 32:9

అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

ఆదికాండము 32:10

నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

ఆదికాండము 32:11

నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

ఆదికాండము 32:12

నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

ఆదికాండము 32:25

తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.

ఆదికాండము 32:26

ఆయనతెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

ఆదికాండము 32:27

ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.

ఆదికాండము 32:28

అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

 

సమ్సోను:

న్యాయాధిపతులు 16:28

అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి

 

హిజ్కియా:

2రాజులు 20:3

యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.

2రాజులు 20:4

యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెల విచ్చెను.

2రాజులు 20:5

నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము-నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా-నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.

2రాజులు 20:6

ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.

 

దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, యిర్మియా: వీరంతా ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు తమ పాపాలు తమ పితరుల పాపాలు యథార్థముగా ఒప్పుకుని కన్నీటితో చెర విముక్తి కోసం ప్రార్థన చేశారు.

 

ప్రామాణికతకు ప్రేరణ (Motivation for Authenticity): ప్రార్థన ద్వారా లభించే శాంతి మరియు స్పష్టత, ఒకరి నిజమైన విలువలకు అనుగుణంగా జీవించాలనే కోరికను బలపరుస్తుంది.

 

ప్రార్థన అనేది ఒక వ్యక్తిని బలవంతంగా యథార్థవంతునిగా మార్చదు. బదులుగా, ఇది యథార్థతను అభ్యసించడానికి, ప్రతిబింబించడానికి మరియు పెంపొందించడానికి ఒక క్రమశిక్షణ మరియు వేదికను అందిస్తుంది. క్రమం తప్పకుండా మరియు హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, కాలక్రమేణా, మరింత యథార్థమైన మరియు నిజాయితీగల వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది.

 

ప్రార్థన మరియు యథార్ధత లేకపోతే?

మన ఆధ్యాత్మిక జీవితాలు నాశనం అయిపోతాయి

 

ఆదాము హవ్వలు యథార్ధత లేనందువలన శపించబడ్డారు! ఆదికాండం 3:12-19

కయీను హేబెలు: కయీను యథార్ధత లేనందువలన శపించబడ్డాడు!: ఆదికాండం 4:5--13

అననీయ సప్పీరలు యథార్ధత లేనందువలన శపించబడ్డారు! అపొస్తలుల 5:1--10

సమూయేలు గారి కుమారులు  యథార్ధత లేనందువలన న్యాయాధికారులు గా ఉండకుండా త్రోసివేయబడ్డారు! సమూయేలు 8:2--8

సొలొమోను: యథార్ధత లేనందువలన తన రాజ్యము తన కుమారుని రోజుల్లో రెండుగా విడిపోయింది. 1 రాజులు 11:4

ఇశ్రాయేలు రాజులు యథార్ధత లేనందువలన ఇశ్రాయేలు ప్రజలను శాపగ్రస్తులుగా చేశారు!

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా యదార్థత అనేది ప్రతి విశ్వాసిలో ఉండాలి!  అది ప్రార్థన ద్వారా సాధించాలి. అప్పుడు దేవుని నుండి దైవ ఆశీర్వాదాలు పొందగలం.!

 అట్టి కృప ధన్యత మనందరికీ దేవుడు దయచేయును గాక! ఆమెన్!

 దైవాశీస్సులు!!!

 

*యధార్ధవంతుడైన యోబు*

*7వ భాగం యోబులో ఉన్న లక్షణాలు-2*

 

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

 

     ప్రియులారా యోబులో ఉన్న నాలుగు లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము. అవి

1) యథార్ధవంతుడు

2) న్యాయ వంతుడు

3) దేవుని యందలి భయభక్తులు గలవాడు

4) చెడుతనమును విసర్జించినవాడు

 

                  (గతభాగం తరువాయి)

 

 గతభాగంలో యథార్ధత అంటే ఏమిటో చూసుకున్నాము!

ఇక ఈరోజు యోబుగారిలో ఉన్న రెండవ మంచి లక్షణం కోసం ధ్యానం చేసుకుందాము!

 

 యోబు గారు న్యాయవంతుడు:

 

మొదటగా యోబుగారు ఎలాంటి న్యాయవంతుడో ఆయన మాటలలోనే చూసుకుందాం!

యోబు 31:

4 ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా

5 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల

6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు

7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల

8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.

13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను

20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.

13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను

20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.

 

ఈ వచనాలలో యోబుగారి న్యాయము కనిపిస్తుంది. ఆయన యథార్ధత కనిపిస్తుంది.  ఇక్కడ న్యాయవంతుడు లేక నిజాయితీ పరుడు అని ఎందుకన్నారు అంటే తాను చేసే వ్యవహారాలు అన్నీ యోబు గారు ముక్కుసూటిగా యధార్థముగా నీతిగా ఉండేవారు.

 

ఆయన ఎందుకు న్యాయవంతుడుగా ఉన్నారు అంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి తాను కూడా న్యాయవంతుడిగా ఉండాలని కోరుకున్నారు!

నిర్గమ 9:27  యెహోవా న్యాయవంతుడు

కీర్తనలు 129: యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు.

ఇంకా చూసుకుంటే

కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు

ఇంకా దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నారు అంటే

నిర్గమ 23:2

దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;

నిర్గమకాండము 23:6

దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు

 

లేవీయకాండము 19:15

అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.

 

ద్వితియోపదేశకాండము 10:18

ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

 

ద్వితియోపదేశకాండము 16:19

నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.

ద్వితియోపదేశకాండము 16:20

నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొన వలెను.

 

ద్వితియోపదేశకాండము 24:17

పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.

 

కీర్తన 7:17; 9:3; 9:7;10:18; 17:1;,2; 33:5; 23,24,37:28,30; 43:1....

 

దేవుడు చెబుతున్నారు నాకు కావలసింది మీ ఉపవాసం కాదు గాని మొదటగా సత్యముననుసరించి తీర్పుతీర్చుడి. ఒకరియందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరచుకొండి. ఆహా ఏమి సింపుల్ గా చెప్పారు. నిజంగా ఈ మాటలు దేవునికి ఘనత తెచ్చేమాటలు కోసం దేవుణ్ణి స్తుతించేవి కాదు. మానవుల మధ్య పరస్పర ప్రేమానురాగాలే దేవునికి ఇష్టమైనవి అని తెలియజేస్తున్నారు.  దీనికోసం బైబిల్ లో చాలా చోట్ల విస్తారంగా వ్రాసారు దేవుడు.

 

మొదటగా పాతనిబంధనలో ఏమన్నారో చూసుకుని క్రొత్త నిబంధన కోసం చూసుకుందాం!

జెకర్యా 7:910

జెకర్యా 8:

16. మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.

17. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.

 

యెషయా 1:17

కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

 

యిర్మియా 22:

యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.

 

యెహెజ్కేలు 45:9

మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

 

నిర్గమ 22:

21. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.

22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.

23.వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.

 

లేవీ 25:17

మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

 

ద్వితీ 10:

18. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

19. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుండి.

 

చివరగా మీకా 6:

6. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?

7. వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?

8. *మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది*; *న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు*.

 

 ఇక క్రొత్త నిబంధనలో కొన్ని చూసుకుందాం.

ఎఫేసి 4:32

ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

 

 రోమా 12:10, 17, 19, 20

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి.

18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

 

కొలస్సీ ౩:

12. కాగా, దేవునిచేత ఏర్పరచ బడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

13. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.

 

ఇంకా చాలా ఉన్నాయి గాని చివరిగా ముఖ్యమైనది యాకోబు 1:27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

ఇదే నిజమైన భక్తి అని దేవుడు చెబుతున్నారు. దేవునికి మనలో కావలసిన గుణాలు ఇవే! మన భక్తి, గొప్ప కార్యాలు, దీర్ఘ ప్రార్ధనలు ఉపవాసాలు, గొప్ప కానుకలు, దశమభాగాలు ఇవికాదు దేవుడు మనలో కావాలని మొదటగా ఆశించేది. మొదట మనుష్యుల మధ్య, పొరుగువారి మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు కావాలి. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించగలగాలి. ఆ తర్వాత నీవు చేసే ప్రార్ధనలు, భక్తి ఉపవాసం, కానుకలు మ్రొక్కుబడులు. దయచేసి ఈ విషయం గమనించి గ్రహించమని మనవిచేస్తున్నాను.

 

కాబట్టి యోబుగారు న్యాయవంతునిగా జీవించి న్యాయము జరిగించి దేవునిచేత సాక్ష్యము పొందారు! మరి నీకు అలాంటి న్యాయవంతమైన జీవితం ఉందా?

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*8వ భాగం యోబులో ఉన్న లక్షణాలు-3*

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

 

     ప్రియులారా యోబు లో ఉన్న నాలుగు లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము. అవి

1) యథార్ధవంతుడు

2) న్యాయ వంతుడు

3) దేవుని యందలి భయభక్తులు గలవాడు

4) చెడుతనమును విసర్జించినవాడు

                  (గతభాగం తరువాయి)

 గతభాగంలో యోబుగారు యధార్థవంతుడు అని  చూసుకున్నాము!

 

ఇక ఈరోజు యోబుగారిలో ఉన్నమూడవ మంచి లక్షణం కోసం ధ్యానం చేసుకుందాము!  *యోబు గారు దేవుని యందలి భయభక్తులు గలవాడు*:

ఈ మాట సాక్షాత్తుగా దేవాది దేవుడే ఇస్తున్న సర్టిఫికెట్. అందుకే ఒరేయ్ సాతానుగా నా భక్తుడైన యోబు సంగతి విచారించావా? అతడు యధార్ధవంతుడు న్యాయవంతుడు మరియు దేవునియందు భయభక్తులు గలవాడు అంటే సాతాను గాడు- అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా అంటూ దేవునికి సాకులు చెబుతున్నాడు!

కాబట్టి యోబుగారు దేవునియందలి భయభక్తులు గలవాడు! అందుకే సాతాను గాడు ఎంతగా శోధించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి ఒకే రోజున తన ఆస్తిని తన బిడ్డలను కోల్పోయినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనెను యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అని పలికారు!!!

21. నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

 

ఇంతటి గొప్ప భయభక్తులు గలవాడు ఆయన! నేటి దినాలలో మనకు దేవుడంటే భక్తి ఉంటుంది గాని భయము లేకుండా పోతుంది! అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాము మనము! మన మాటలలో దేవుడంటే భయము కనపడటం లేదు! మన చూపులలో పవిత్రత లేదు! మనం వేసుకునే వస్త్రధారణ దేవునికి మహిమ తెచ్చేదిగా కాకుండా ఆయనకు అవమాన కరంగా ఆయాసకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే దేవుడంటే భయం లేదు! చివరికి మీ ఊరు ప్రెసిడెంట్ కి, యస్ ఐ కి , కలెక్టర్ కి భయపడతావు గాని దేవుడంటే భయం లేకుండా ఉంటున్నావు! భయము లేని కోడి బజారులో గుడ్డు పెట్టినట్లు ఉంది మన బ్రతుకులు!!!

 

శిలువ మీద దొంగలలో ఒకడు యేసుక్రీస్తు ప్రభులవారిని హేళన చేస్తుంటే మరొక దొంగ గద్ధిస్తున్నాడు- లూకా 23: 40 అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?

 

మనము దేవునికి భయపడాలి!

దేవునికి ఎందుకు భయపడాలి అంటే మొదటగా ఆయన మన సృష్టికర్త కాబట్టి.

మన కాలగతులు ఆయన చేతులలో ఉన్నాయి కాబట్టి!

 ఆయనే సృష్టికర్త మరియు ఆయనే లయకర్త కాబట్టి!

 ఆయన చేతులే మనలను చేశాయి కాబట్టి!

ఇక మరొక కారణం ఏమిటంటే

1). సమూయేలు గారి మాటలు ప్రకారం క్షేమం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి!

1 సమూయేలు 12: 14 మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.

15 అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధ ముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.

2) ఇక 2 రాజులు గ్రంధం ప్రకారం శత్రువుల నుండి విడుదల కావాలంటే:

2 రాజులు 17: 39 మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను..

3) దేవుని నుండి సరైన మార్గ నిర్ధేశకం  కావాలంటే భయభక్తులు కావాలి!

కీర్తన 25: 12 యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.

4) దేవుడు దాచియుంచిన మేలు పొందుకోవాలంటే:

కీర్తన 31:19 నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

5) దేవుని దయా దృష్టి నీమీద ఉండాలంటే :

కీర్తన 33: 19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది.

6) ఇంకా దేవుని కాపుదల, దేవుని దూతలు తోడుగా ఉండాలంటే:

కీర్తన 34: 7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును

7) 34:9 యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.

8) దేవుని కృప కావాలంటే: కీర్తన 103: 11 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.

9) నీయందు దేవుడు జాలి పడాలంటే : 103:13 తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.

10) దేవుడు నీకు ఆహారం ఇవ్వాలంటే: 111: 5 తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.

11) నీవు ధన్యుడవు కావాలంటే: 112:1 యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

12) దేవుని నుండి ఆశీర్వాదం కావాలంటే: 115: 13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

13) నీ కోరిక తీరాలంటే మరియు నీ మొర్ర ఆలకించాలంటే కీర్తన 145: 19 తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.

14) ఇక నీకు తెలివి కావాలంటే : సామెతలు 1: 7 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

15) నీకు జ్ఞానం కావాలంటే : సామెతలు 9: 10 యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.

16) ఇంకా నీవు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే: సామెతలు 10: 27 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.

17) నీకు ధైర్యము కావాలంటే: 14: 26 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

27 అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును

18)ఇంకా సామెతలు 15:33 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.

19) నీవు చెడుతనం నుండి తొలిగిపోవాలంటే సామెతలు 16: 6 కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

20) జీవ సాధనం: సామెతలు 19: 23 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.

21) సామెతలు 22: 4 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.

22) ఘనత కావాలంటే సామెతలు 31: 30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును

ఇంకా అనేకములైన విషయాలున్నాయి! ఇవన్నీ యోబు గారికి తెలియక పోయినా దేవునిలో మన జీవమున్నది అని గ్రహించి ఆయనకు భయపడి భక్తిగా జీవించారు!

ప్రసంగి అంటున్నారు: 12: 13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.

14 గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

యిర్మీయా గారు అంటున్నారు: 5: 24 వారురండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.

అయితే దేవునియందలి భయభక్తులు లేని ఇశ్రాయేలు రాజులను ఆయన శిక్షించారు! అన్యులను సింహాలతో భాదించారు! 2 రాజులు 17:25.

కాబట్టి దేవునియందు  భక్తితో పాటుగా భయముకూడా కలిగి ఉందాము! యోబు గారిలా దీవించ బడదాము!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*9వ భాగం యోబులో ఉన్న లక్షణాలు-4*

 

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

 

     ప్రియులారా యోబు లో ఉన్న నాలుగు లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము. అవి

1) యథార్ధవంతుడు

2) న్యాయ వంతుడు

3) దేవుని యందలి భయభక్తులు గలవాడు

4) చెడుతనమును విసర్జించినవాడు

 

                  (గతభాగం తరువాయి)

 

 గతభాగంలో దేవుని యందలి భయభక్తులు గలవాడు అని చూసుకున్నాము!

ఇక ఈరోజు యోబుగారిలో ఉన్న నాల్గవ  మంచి లక్షణం కోసం ధ్యానం చేసుకుందాము! *యోబు గారు చెడుతనమును విసర్జించినవాడు*:

 

ఈ మాట సాక్షాత్తుగా దేవాది దేవుడే ఇస్తున్న సర్టిఫికెట్!!!

యోబు గారు చెడుతనమును అసహ్యించుకున్నారు అని ఎలా తెలుస్తుంది అంటే మొదటగా దేవుడే దానిని నిర్ధారణ చేశారు!

రెండు: బైబిల్ చెబుతుంది: మరలా 29 వ అధ్యాయం చూసుకుంటే 17 దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.

 ఇక్కడ ఎవరైతే చెడుతనము చేస్తారో అలాంటి దుర్మార్గుల దవడ పళ్ళు విరుగగొట్టి దీనులను ఆదరించారు ఆయన! అందుకే ఇంతగా ఆశీర్వదించ బడ్డారు!

 

ఇక దావీదు గారికి కూడా ఇలాంటి దుర్మార్గులంటే అసహ్యం!

 

అసలు వీరంతా చెడుతనమును ఎందుకు అసహ్యించు కున్నారు అంటే వీరికి దేవునిపట్ల భయభక్తులు ఎక్కువ, దేవునిపట్ల ప్రేమ ఎక్కువ! ఈ రెండు కావాలంటే తప్పకుండా చెడుతనమును అసహ్యించు కోవాలని బైబిల్ చెబుతుంది కాబట్టి వీరు చెడుతనమును అసహ్యించు కుని దేవునియందలి భయమును భక్తిని పెంచుకున్నారు!

 

కీర్తనాకారుడు అంటున్నారు: నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే చెడుతనమును అసహ్యించు కోవాలి! అలా అసహ్యించు కోకుండా అనగా దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని చెడుతనమును ప్రేమిస్తే నీవు అబద్దికుడవు

 

97:10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.

 

ఇక దేవునియందలి భయభక్తులు ఉండాలంటే చెడుతనమును అసహ్యించుకోవాలి!

సామెతల గ్రంధంలో భక్తుడు రాస్తున్నారు: 3: 7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము.

8:13 యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.

 

16: 6 కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

 

ఇంకా ఈ చెడుతనము కోసం సామెతల గ్రంధంలో ఏమని వ్రాయబడింది అంటే

మూర్కులకు చెడుతనము మానేయాలి అంటే అసహ్యము: 13: 19 ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.

 

16: 17 చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.

 

ఇంకా చెడుతనము పోవాలంటే గాయాలవ్వాలి! 20: 30 గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం చును.

29: 16 దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు.

 

ఇక ఇశ్రాయేలు రాజులంతా, మరియు యూదా రాజులలో సగం మంది యెహోవా దృష్టికి చెడుతనము చేశారు అంటూ రాజుల గ్రంధములలో వ్రాయబడి ఉంది ఒక్కో రాజు కోసం చెబుతూ!!

 

అసలు దేవుడు ప్రజల యొక్క చెడుతనమును బట్టే కనానీయులు హిత్తీయులు ఆమోరీయులు యెబూశీయులను దేవుడు కనాను దేశమునుండి వెల్లగొట్టారు! ద్వితీ 9: 4 నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలి వేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశ పెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.

5 నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జన ముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.

 

ఇక ఎవరైతే ఈ చెడుతనమును దుష్టత్వమును చేస్తారో దేవునికి కోపం పుట్టిస్తారు!

2 రాజులు 21: 6 అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను

 

హబక్కూకు 1:13

నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

 

ఇక యెషయా యిర్మీయా గ్రంధాలలో దేవుడు చెబుతున్నారు మీయొక్క చెడుతనమును బట్టియే నేను మిమ్మును శిక్సిస్తున్నాను

యెషయా 47:10,11; 59:1517; యిర్మీయా 2:19, 6:7-8, 11:17, 12:4, 14:16, 16:12,13; 18:8; 23:11; 33:56; 44:910;  యెహేజ్కేలు 16:23;33:12

కాబట్టి చెడుతనము చేస్తే దేవుని శిక్ష తప్పదు! చెడుతనమును అసహ్యించు కుంటే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు! ఇంకా దేవునియందలి భయభక్తులు పెరుగుతాయి! నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు! అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తారు!

కాబట్టి నీకు ఏమికావాలో నేడే తేల్చుకో! దీవెనా శాపమా?

తేల్చుకో!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*10వ భాగం యోబుగారి ఐశ్వర్యం*

 

యోబు 1:25

2. అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

3. అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను!

4. అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

5. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

 

     ప్రియులారా గతభాగలలో యోబుగారిలో  ఉన్న నాలుగు లక్షణాలు కోసం ధ్యానం చేసుకున్నాము. ఇక ఈరోజు ఆయనలో ఉన్న భక్తి మరియు ఆయన యొక్క ఐశ్వర్యం కోసం చూసుకుందాం

 

  పై వచనాలలో ఆయనకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని చూస్తున్నాము . గమనించాలి యోబు గారి కాలంలో వారి ఆస్తి వారికున్న పశువుల బట్టి మరియు పాడిపంటలను బట్టి లెక్క కట్టేవారు. అయితే వారి పేరు ప్రఖ్యాతలు మరియు ఘనతను లేక గొప్పను వారికి గల సంతానమును బట్టి లెక్క కట్టేవారు ఎంతమంది ఎక్కువ పిల్లలు కలిగితే అంత గొప్పవారు అని అర్ధం ఆ రోజులలో!!

 

కాబట్టి ఇక్కడ పిల్లలను లేక సంతానం బట్టి చూసుకుంటే యోబు గారు పదిమంది పిల్లలు కలిగి గొప్పవానిగా ఉన్నారు. ఇక ఎంతో పాడిపంటలు పశువులు కలిగి ఐశ్వర్యవంతునిగా ఉన్నారు!

 

ఒక్కసారి మనము ఊహాలోకములోనికి వెళ్లిపోదాం!  అక్కడ చూడండి- మీ నేత్రాలు సూటిగా చూడండి- అక్కడ ఏమి కనిపిస్తుంది?  ఎంతో అందమైన ఊజు దేశం- ఎంతో సస్య శ్యామలంగా పచ్చగా కనిపిస్తుంది.  వాటి మధ్యలో పెద్ద కుటీరం.  దాని కుడి ప్రక్కన సముద్రపు ఇసుకలా కనిపించే అందమైన బలిసిన గొర్రెలు. సుమారుగా 7000! వాటిని మేపుచున్న 700  మంది కంటే ఎక్కువ పనివారు! అడుగుదాం- ఈ గొర్రెలు ఎవరివి? అయ్యా ఇవన్నీ యోబు గారివి! ఆహా!!

 

ఇక ఎడమ ప్రక్కన చూస్తే పచ్చని మైదాన భూమిమీద నడుస్తున్న కొండలవలే కనిపిస్తున్న 3000 ఒంటెలు!  వాటిని కాచేవారు 600 మంది కంటే ఎక్కువ!.   అడుగుదాం- అయ్యా ఇవి ఎవరివి? యోబు గారివి సార్! ఓహో!!!

 

ఇక ఇంకా ముందుకు చూద్దాం! అక్కడ విశాలమైన పంట భూమి, దానిలో దుక్కు దున్నుతున్న 500 నాగల్లు వాటిని దున్నే దుక్కిటేద్దులు! మరియు వాటిని దున్నే 500 మంది సేవకులు! అడుగుదాం- ఇవి ఎవరివి? ఈ భూమి ఎవరిది?  అయ్యా ఇవి యోబు గారివి ఆండీ!!! అలాగా..

 

మరో వైపు తిప్పుదాము మన నేత్రాలు- అక్కడ అరణ్య నౌకలు అనే పేరుగల 500 ఆడ గాడిదలు, వాటి కాపరులు 50 మంది ఇవి కూడా యోబు గారివే! ఆలోచించండి 500 అరకలతో దున్నుతున్నారు అంటే ఎన్ని వేల ఎకరాల భూమి ఉందో కదా!

ఇంత ఆస్తి అశ్వర్యం ఉన్నా గాని దేవునియందలి భయము విడువలేదు దేవునియందు భక్తి విడువలేదు! ఇంత ఆస్తి ఐశ్వర్యం అతిశయం అహంకారం లేనేలేదు! మన భాషలో చెప్పాలంటే ఆస్తి ఉన్న గీర పొగరు లేనేలేదు! అందుకే దేవునికి యోబు గారంటే అంతగా ఇష్టపడ్డారు!

 

నేటిరోజులలో మనకు కొంత ఆస్తి మంచి ఉద్యోగం ఉంటే చాలు కళ్ళు మామూలుగా ఉండే చోటన కాకుండా నెత్తి మీదికి ఎక్కేస్తున్నాయి దేవుడంటే భయము లేదు భక్తి లేదు! అలనాడు ఆ ధనవంతుడు చెప్పినట్లు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటూ కాలుమీద కాలు వేసుకుని ఎదురుగా మందు ముక్క పెట్టుకుని గర్వించి తాగితందనాలు ఆడుతున్నారు! గాని ఈ భక్తుడు ఎంత ఐశ్వర్యం ఉన్నాగాని ఒదిగిపోయి దేవునియందు భయమును మరియు భక్తి కలిగి జీవించారు! నిజానికి ఇంత ఐశ్వర్యం ఉంటే 99% తప్పకుండా గర్విష్టిగా ఉండాలి గాని ఎంతమాత్రం లేనేలేదు! అందుకే సామెతల గ్రంధంలో ఒక భక్తుడు ఇలా ప్రార్ధన చేశాడు: 30:79  లో

7. దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;

8. వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

9. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.

 

ఇందుకోసమే అనుభవంతో పౌలుగారు చెబుతున్నారు 1 తిమోతి 6:8 లో కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.

 

ప్రియమైన చదువరీ! దేవుడు ఈ రోజు నీకు ఆస్తి ఐశ్వర్యము, చేసుకోడానికి ఉద్యోగం- మంచి ఆరోగ్యం- మంచి ఇల్లు ఇచ్చి ఆశీర్వదిస్తే ఈ రోజు నీవు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఇచ్చిన ఐశ్వర్యం ఎక్కువైపోయి అసలు కాళీ దొరకటం లేదు అంటూ ఆదివారం మందిరమునకు రాకుండా తిరుగుతున్నావా?  జాగ్రత్త! ఆస్తిని ఇచ్చిన దేవునికి నీవు నమ్మకముగా లేకపోతే ఆ ఇచ్చిన ఆస్తిని మరలా తీసుకునే హక్కు ఉందని మరిచిపోకూ!!!

 ధన్య వంతుల కోసం యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు లూకా 18: 24. యేసు అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.

25. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.

 

మరి దేవునికి ధన్యవంతులంటే ఇష్టం లేదా? కానేకాదు- యోబు గారు ధనవంతుడు- అబ్రాహాము గారు ధనవంతుడు- అయితే ధనవంతులు ఎలా ఉండాలో ఆత్మవశుడై చెబుతున్నారు పౌలుగారు 1 తిమోతి 6: 17. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

 

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక! ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*11వ భాగం యోబుగారి భక్తి*

 

యోబు 1:25

2. అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

3. అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను!

4. అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

5. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

 

                  ప్రియులారా గతభాగములో యోబుగారి  ఐశ్వర్యం కోసం ధ్యానం చేసుకున్నాము. ఇక ఈరోజు ఆయనలో ఉన్న భక్తి కోసం చూసుకుందాం!

 

ఇక 4,5 వచనాలలో యోబు గారి పిల్లల యొక్క ఐక్యత కనిపిస్తుంది. అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్లను ఎంతప్రేమగా చూసుకున్నారో ఇక్కడ కనిపిస్తుంది.  యోబుగారికి ఏడుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు! బహుశా వీరికి పెళ్లిల్లు అయిపోయి ఉంటాయి! అయితే యోబుగారి మగపిల్లలు వారంలో ప్రతీరోజు రోజుకొక్కరి చొప్పున వారి ఇంట్లో విందు చేసుకోవడం అలవాటు. అలా చేసుకున్నప్పుడు తమ మిగిలిన సహోదరులను విందుకు పిలవడం అలవాటు. అలా పిలిచినప్పుడు తప్పకుండా తమ అక్కాచెల్లెలు ముగ్గురిని కూడా విందుకు పిలవడం అలవాటు! చూడండి. రోజుకో అన్న ఇంటిదగ్గర విందుచేసుకోవడం ఆ విందులో అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు అలా పదిమంది కలుసుకొని భోజనం చేయడం ఎంత ధన్యత కదా!

 ఎందుకంటే ఈరోజులలో అన్నదమ్ములకు వారిలో వారికి పడటం లేదు! అన్నా చెల్లెళ్లకు పడటం లేదు! నిత్యమూ తగవులతో ఉంటున్నారు! ఇంకా తెగించి ఆస్తి కోసం కోర్టు మెట్టులు ఎక్కుతున్నారు ఘోరంగా! మా సంఘంలో ఒకామె చాలా ఏడుస్తూ ఉంటుంది. కారణం ఆస్తికోసం ఆమె ఇద్దరు కుమారులు కుమార్తె తగవులాడు కుంటూ తల్లి దగ్గరకు రావడమే మానేశారు! ఈ ఆస్తి నాకు దేవుడు ఇవ్వకపోతే ఎంత బాగుండునో అని నిత్యమూ ఏడుస్తూ ఉంటుంది!

 

 గాని యోబు గారి భాగ్యం పిల్లలంతా కలసి ప్రతీరోజు ఐక్యతగా విందు భోజనాలు చేస్తున్నారు! అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము అంటూ మురిసిపోతున్నారు దావీదుగారు కీర్తనలు 133:1 లో! అలా ఐక్యతగా ఉంటే ఆహారోను తలమీద తన అభిషేకం సమయంలో కారిన ఆభిషేక తైలము వలే ఆశీర్వాదము శాశ్వత జీవం ఇలా ఐక్యతగా ఉన్న అక్కాచెల్లెలు అన్నదమ్ముల మీదికి దిగివస్తుంది అని ప్రవచిస్తున్నారు భక్తుడు!!! మరినీకు ఇలాంటి బుద్ది వుందా అనగా అన్నాతమ్ములతో అక్కాచెల్లెళ్లతో సమాధానం సహవాసం ఉందా?

 

ఇక తర్వాత ముఖ్య విషయం ఏమిటంటే ఇలా విందు దినాలు ముగిసిన అనంతరం తమ పిల్లలు మాట ద్వారా గాని చూపు ద్వారా గాని తలంపుల ద్వారా గాని దేవునికి వ్యతిరేఖంగా పాపం చేశారేమో, గర్వించారేమో అని, ఇంకా తమ హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అని  యోబు భక్తుడు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

ఈ మాటల్లో యోబుకు దేవునిపైన, తన పిల్లల పైన ఉన్న ప్రేమా, మానవ హృదయంలో సహజంగా ఉండే పాప స్వభావం గురించిన గ్రహింపూ తేటతెల్లమౌతున్నాయి. అంతేకాక కుటుంబ నాయకుడైన యోబుగారు యాజకుడు  నిర్వహించే పనులను గురించి తెలుస్తున్నది.

 

చూడండి మొదట ప్రతీ ఒక్కరినీ తన దగ్గరకు పిలిచారు! అనగా తమ పిల్లలు తమ మాట వినేలా చూసుకున్నారు! అందుకే సంఘములో పెద్దగా ఉండేవాడు మొదట తన పిల్లలను బాగుగా కంట్రోల్ చేసేవాడు అయి ఉండాలని పౌలుగారు తిమోతి గారికి తీతు గారికి తన పత్రికలలో ఖరాకండిగా చెబుతున్నారు! తన పిల్లలను సరిగా ఏలని వాడు సంఘాన్ని ఎలా చూసుకుంటాడు అని ప్రశ్నిస్తున్నారు పౌలుగారు!

1తిమోతి 3:3--5;

కాబట్టి యోబు గారు తన పిల్లలను తన భార్యను బాగుగా చూసుకోవాడమే కాకుండా వారిని సరిగా పరిపాలన చేశారు అని అర్ధమవుతుంది!

 

ఇక రెండవదిగా వారిని పవిత్ర పరిచారు! అనగా శుద్ధి చేశారు! పూర్వకాలంలో పవిత్ర పరచడం శుద్ధి చేయడం అనగా వారు స్త్రీ సంపర్కములో ఉండకూడదు 24 గంటలకు ముందు (కొన్ని పరిస్థితులలో 72 గంటలు), తర్వాత తమ వస్త్రాలు తమ దేహాలు ఉదుకుకుని పరిశుద్ధంగా ఉండాలి.  ఇక అరుణోదయమున అనగా సూర్యుడు రాకముందు వేకువ జామున వచ్చే కాంతి- ఆ సమయంలో బలిపీటం వద్దకు లేదా బలి దగ్గరకు వారిని తీసుకుని వస్తున్నారు! అనగా తమ పిల్లలను పరిశుద్ధ మార్గంలో నడిపిస్తూ ఉదయాన్నే వారిని బలి అనగా ప్రార్ధనా బలిపీటము వద్దకు తీసుకుని వస్తున్నారు! ప్రియ సహోదరీ సహోదరుడా!! నీ పిల్లలను వేకువనే ప్రార్ధన చేసేలా చూస్తున్నావా? నీ కుటుంబంలో ప్రార్ధనా బలిపీటము ఉందా?  నీ గృహంలో ప్రతీరోజు కుటుంభ ప్రార్ధన జరుగుతుందా?? యోబు గారు తన కుటుంబ మంతటినీ ప్రార్ధనా బలిపీటము ముందు మోకరించేలా చూశారు! ఆశీర్వాదాలు పొందుకున్నారు! నేడు నీ గృహంలో శాంతి సమాధానం పిల్లల మధ్య ఐక్యత లేదు అంటే ప్రార్ధనా బలిపీటము ముందు నీ పిల్లలను మోకరించనీయలేదు నీవు. అందుకే అశాంతి! అలజడలు!

 ప్రియ తల్లీ తండ్రీ! దయచేసి నీ గృహంలో ప్రార్ధనా బలిపీటము కట్టు! దానిలో నీ పిల్లలను తప్పకుండా మోకరించేలా చేయు! పిల్లలకు హోమ్ వర్కు ఉంది, స్పెషల్ క్లాసులు ఉన్నాయి అని చెప్పినా వినవద్దు! తప్పకుండా ప్రార్ధనలో వారిని భాగస్వాములుగా చేయు! అప్పుడే నీ పిల్లలను సరిగా భక్తిలో పెంచగలవు! ఈ రోజులలో పనికిమాలిన కాలేజీలు స్పెషల్ క్లాసులు ఆదివారం నాడే పెడుతున్నాయి! ఈ సందుతో పిల్లలు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి స్పెషల్ క్లాసులకు వెళ్తున్నారు. మరికొంతమంది స్పెషల్ క్లాసులు పేరుతో బాయ్ ఫ్రెండుతో షికార్లు కొడుతున్నారు! నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులతో చర్చికి వచ్చేవారు గాని తల్లిదండ్రులతో కాకుండా లాస్ట్ బెంచీలో కూర్చుంటూ పాటలు అయిపోయిన వెంటనే తమ బాయ్ ఫ్రెండులతో పాటు బీచ్ లకు షికార్లుకు వెళ్లిపోయే వారు, మరలా ఆమెన్ అనే సమయానికి వచ్చేసి వెనుక కూర్చుండేవారు! ఈరోజు వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే క్రైస్తవులు కానీ అన్యులను తల్లిదండ్రుల ఇష్టం లేకుండా ప్రేమ మోజులో పడి వివాహం చేసుకుని సరియైన ఉద్యోగాలు లేకుండా జీవితాలు బాగోలేకుండా మొగుడితో దెబ్బలు తింటూ బాధపడుతున్నారు! పిల్లలారా! ఖబడ్దార్! తల్లిదండ్రులను మోసగించ గలవేమో గాని దేవుడ్ని మోసగించలేవు. దేవుని కన్నులు దేవుని cctv కెమెరాలు 24 x 7 పనిచేస్తున్నాయి!

 

ఇక మూడవది: యోబుగారు ఒక్కొక్కరి నిమిత్తమై బలి అర్పించారు! గమనించాలి- యోబు గారే స్వయంగా బలి అర్పించారు అనగా ఇది తప్పకుండా ధర్మశాస్త్ర కాలము లేక యుగానికి ముందు రోజులలోనే జరిగింది అని అర్ధమవుతుంది! ధర్మశాస్త్ర ముందు రోజులలో ఆదాము గారు, హనోకు గారు, అబ్రాహాము గారు నోవహు గారు వీరంతా స్వయంగా బలి అర్పించారు! కాబట్టి యోబుగారు ధర్మశాస్త్ర కాలానికి ముందటి వారు అని అర్ధమవుతుంది!

 ఇక్కడ యోబుగారు ప్రతీ కుమారుని కుమార్తెను పిలిచి శుద్ధీకరణ చేసి ఒక్కొక్కరి కోసం బలి అర్పిస్తున్నారు! ఈ రోజు నీవు నీ పిల్లల ఆరోగ్యం కోసం వారి భవిష్యత్ కోసం ప్రతీరోజు వారి తల దగ్గర మోకరించి ప్రార్ధిస్తున్నావా? భక్తురాలు సూసన్నా తన 16 మంది పిల్లల కోసం రాత్రి మోకారిస్తే 16 మంది పూర్తికాబోయేసరికి తెల్లారిపోయేదట! అందుకే తన పిల్లలంతా దైవసేవకులు మిషనరీలు అయ్యారు! నీవుకూడా ఈ రకంగా నీపిల్లలను భక్తిలో పరిశుద్ధంగా పెంచితే ఒకరోజు నీపిల్లలు గొప్ప దైవజనులు కాగలరు! మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నాన్నగారికి పుట్టిన 5 గురుము పరిచర్యలో సేవలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రార్ధనలో భక్తిలో క్రమశిక్షణలో  పెంచారు కాబట్టి మేము ఆ భక్తి మార్గము విడువకుండా అందరమూ భక్తిగా ఉండటానికి ప్రభువు సహాయం చేశారు! నీ పిల్లలు ప్రయోజకులనుగా చేయాలి అని అనుకుంటే ఇదే మార్గం!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*12వ భాగం యోబుగారి శోధన-1*

 

యోబు 1:68

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

7. యెహోవా - నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

8. అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

 

                  ప్రియులారా గతభాగములో యోబుగారి  భక్తి  కోసం ధ్యానం చేసుకున్నాము. ఇక ఈరోజు నుండి సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుందాం!

 

ఆరవ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము వచ్చింది అని చూస్తున్నాము! గతంలో చెప్పడం జరిగింది ఇది దేవుని ఆలోచనా సభ అని! దానికి దేవదూతలు అందరూ వచ్చారు వివిధ ప్రాంతాలనుండి యెహోవా సన్నిధికి అనగా పరలోకములో! అయితే దేవదూతల సభకు సాతాను గాడు రావడం ఏమిటి? ఎందుకంటే ఈ సాతాను గాడు ఒకానొకప్పుడు వీడు కూడా దేవదూతయే కదా! దేవదూతలలో ముఖ్యమైన దేవదూత!

 

యెషయా 14: 12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13 నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14 మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

యెహేజ్కేలు 28: 13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంక రింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

14 అభి షేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

15 నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

16 అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచ రింపవు, నిన్ను నాశనము చేసితిని.

17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.

18 నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.

 

ఈ విధముగా ప్రధాన దూతగా ఉన్న దేవుని దూత గర్వించి దేవుని సన్నిధి నుండి తరుమబడ్డాడు !

 అయితే వీడికి కూడా దేవుని రౌండ్ టేబుల్ సమావేశంలోనికి అనుమతి ఉంది అని ఈ వచనాల బట్టి తెలుస్తుంది! ఈ అనుమతి ఎంతవరకు అంటే గతభాగాలలో చెప్పినట్లు ప్రకటన గ్రంధంలో 12 వ అధ్యాయములో జరుగబోయే పరలోకంలో జరిగే చివరి యుద్ధం వరకు ఈ సాతాను గాడికి పరలోకంలో యెహోవా సన్నిధిలో ప్రవేశం ఉంది అని అర్ధం అవుతుంది!

 

ఇక్కడ ఆరవ వచనంలో దేవుని దూతలు యెహోవా సన్నిధిలో నిలువబడిన రోజు అని ఉంది గాని ప్రాచీన ప్రతులలో దేవుని కుమారులు అని వ్రాయబడి ఉంది! దేవుని కుమారులు అంటే దేవదూతలు (ఆదికాండము 16:7 ప్రకారం). ఇక్కడ జరిగిన దాన్నిబట్టి చూస్తుంటే దేవదూతలు ఎందుకు వచ్చారు అంటే తమ తమ చర్యల గురించి దేవునికి చెప్పి వాటికి సంబంధించిన ఆజ్ఞలను తీసుకొనేందుకు వచ్చారని, ఇంకా మనుష్యులు చేస్తున్న ప్రతీ చర్యలు దేవునికి తెలియజేయడానికి వచ్చారని అర్థమౌతున్నది.

దేవదూతలు యెహోవా సన్నిధిని కనబడే రోజు అనగా మనుషులకు అగోచరమైన ఆత్మల లోకంలో జరిగే సంభవాలు అని అర్ధం అవుతుంది. అయితే  యోబు గారికి ఆరోజు సంభవించిన దానంతటికీ మూల కారణం ఆ లోకంలోనే ఉంది గాని యోబుగారి శ్రమలకు శోధనలకు యోబుగారు చేసిన పాపములు అపరాధాలు ఎంతమాత్రమూ కావని ఇక్కడ అర్ధం అవుతుంది. “సైతాను 1 దినవృత్తాంతములు 21:1.  అయితే సైతాను కూడా దేవుని ఎదుట కనిపించవలసిందే. ఒక విధంగా చూస్తే సైతాను చేసే ప్రతీ చర్య  కూడా దేవుని సర్వాతీతమైన సంకల్పం పరిధిలోనే సాగుతాయని చెప్పాలి. అంటే సైతాను చెయ్యదలచుకున్నదంతా పూర్తిగా చేసేందుకు అతనికి అధికారం లేదు. దేవుని బిడ్డలకు ఏమైనా కీడు చేయాలని సాతాను గాడు అనుకుంటే దేవుని అనుమతి తప్పకుండా కావాలి అని అర్ధం అవుతుంది!  దేవునికి జ్ఞానయుక్తంగా, న్యాయంగా అనిపిస్తే సైతాను లేక ఇతర దురాత్మలు మనుషులకు కీడు చేసేందుకూ దేవుని ప్రజలను పరీక్షించేందుకూ ఆయన అనుమతిస్తాడు.

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా నీవు కూడా ఇప్పుడు దేవుడు నాకు ఈ శ్రమలను శోధనలను ఎందుకు అనుమతిస్తున్నారు? నేను ఎంతో యధార్ధముగా ఉంటున్నానే, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నానే అయినా దేవుడు నా జీవితంలో ఈ శ్రమలను ఎందుకు అనుమతించారు అని అనుకుంటున్నావా? దానికి జవాబు- అది దేవునికి సమంజసముగా అనిపించింది, ఇంకా నిన్ను శ్రమలద్వారా సంపూర్ణత లోనికి నడిపిద్దామని, లేక యోబు గారిలా సువర్ణము నుండి శుద్ధ సువర్ణము లేక మేలిమి బంగారముగా నిన్ను చేద్దామని, ఇంకా రెట్టింపు ఆశీర్వాదానికి నిన్ను పాత్రునిగా చేయాలనే దేవుడు ఈ శోధనలను శ్రమలను అనుమతించారని గ్రహించు! అంతేగానీ దేవుని మీద నిష్టూరాలు వేయ వద్దు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*13వ భాగం యోబుగారి శోధన-2*

 

యోబు 1:68

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

7.  నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

8. అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      ఇక ఏడవ వచనంలో యెహోవా - నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

 

ఇక్కడ చూడండి సాతానుగాడి పని ఏమిటో!!! వాడికి పనిపాటు ఏమీ లేదు! ఈలోకంలో కోట్లమంది మనుష్యులున్నా వాడికి అనవసరం గాని  విశ్వాసులు ఏమి చేస్తున్నారు? వారేమైనా చిన్న తప్పు, చిన్న అబద్దం, చిన్న నేరం, చిన్న తప్పుడు  మాట అన్నారా/చేశారా వెంటనే దేవునికి చాడీలు చెబుదామా లేక కంప్లైంట్ ఇద్దామా అని చూస్తాడు ఇదే వాడి పని!! భూమిమీద ఇటు అటు తిరుగుచ్చు అందులో సంచరించుతూ వచ్చితిని అంటున్నాడు దేవునితో వీడు!

 

గమనించాలి సైతాను ఎక్కడెక్కడికి వెళ్ళాడో దేవునికి తెలుసు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేదేమంటే సైతాను కూడా తన కార్యకలాపాల గురించి దేవునికి సంజాయిషీ ఇచ్చుకోవాలి. సైతాను భూలోకంలో తిరుగుతూ కీడు చేసే అవకాశాల కోసం చూస్తున్నాడు (1 పేతురు 5:8,  నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.).

 

 దేవునిలాగా సైతాను ఒకే సమయంలో అన్ని చోట్లా ఉండలేడు.  సైతాను గాడి పని అస్తమాను ఎవర్ని మ్రింగుదామా ఎవర్ని పాడుచేద్దామా? ఇదే వాడి పని! ఈరోజులలో మనుష్యులలో కూడా కొందరు  బాగున్న వారిని ఎవర్ని పాడుచేద్దామా? ఎవరి మీద చాడీలు చెబుదామా? ఎవరిమీద గాసిప్స్ చెబుదామా? ఎవర్ని దోచుకుందామా? ఎవర్ని ఏడిపిద్దామా? అని చూస్తూ ఉంటారు కొందరు!! వీరు ఎవరంటే ఇలాంటి సాతాను గాడి పిల్లలు సాతాను గాడి అనుచరులు అన్నమాట! ప్రియ సహోదరీ సహోదరుడా నీవుకూడా ఈ గుంపులో ఉంటే నరకానికి దగ్గరలో ఉన్నావని మరచిపోవద్దు!

 

ఇక తర్వాత వచనంలో దేవుడు అడుగుతున్నారు అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

ఇక్కడ దేవుడే ఒక మనిషి కోసం సర్టిఫికెట్ ఇస్తున్నారు ఏమని అంటే అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

ఇది సైతాను అంతవరకు గమనించని విషయం కానేకాదు! ఒక వ్యక్తివైపుకు దేవుడు అతని దృష్టి మళ్ళించడం కాదు. తరువాతి రెండు వచనాలను బట్టి సైతాను యోబును జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నాడని అర్థమౌతున్నది.

ఇక సాక్షాత్తుగా దేవుడే అతని లాంటి వారు  ఎవరూ లేరుఅంటే   దేవుని అభిప్రాయం ప్రకారం యోబు అతని తరంలో భూమిపై ఉన్న వారందరిలోకి మంచివాడు, ఉత్తముడు. ఈ గ్రంథంలోని సత్యం పూర్తిగా గ్రహించాలంటే ఈ విషయాన్ని గుర్తించాలి.

ఇంకా చెడుతనము విసర్జించిన వాడు అనగా చెడుకి దూరంగా ఉన్నవాడు! 1 థెస్సలొనీకయులకు 5:22

5:22 ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.

యోబు గారు ప్రతీవిధ్యమైన కీడుకి దూరంగా ఉంటున్నారు!

 

ప్రియ దేవుని బిడ్డా! ఇలా నీవు దేవుని చేత సర్టిఫై చేసే స్థాయిలో ఉన్నావా లేక దేవుని నామమును అవమాన పరుస్తున్నావా?

అబ్రాహాము నా స్నేహితుడు అని దేవునిచేత పిలిపించుకున్నారు!

దావీదు నా ఇష్టానుసారి లేక నా హృదయాను సారి అని దేవుని చేతనే అనిపించుకున్నారు!

మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవునిచేతనే సెహబాష్ అని పించుకున్నారు!

మరి నీకోసం దేవుడు ఏమనీ పిలువబోతున్నారు? భళా నమ్మకమైన మంచిదాసుడా! లేక సోమరియైన చెడ్డదాసుడా!!!

ఒకసారి నీకు నీవే పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టం లేనివి సరిదిద్దుకో విడిచిపెట్టు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*14వ భాగం యోబుగారి శోధన-3*

యోబు 1:812

8. అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

9. అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?

10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

11. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ఇక 9 వ వచనంలో దేవుడు అడిగిన ప్రశ్నకు సాతాను గాడు జవాబు చెబుతున్నాడు- అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?

10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

అంటున్నాడు..

ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఎవరైనా విశ్వాసి దేవుడంటే భయభక్తులు కలిగి భూమి అంతటిపైనా మంచివాడైన ఒక వ్యక్తి విషయంలో సైతాను అభిప్రాయం ఇదే. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, సేవించడం ద్వారా తమకు దక్కే లాభం కోసమే మనుషులంతా అలా చేస్తారు అంటున్నాడు ఇక్కడ సాతాను గాడు. మానవ జాతి అంతటిలోనూ దేవుడంటే యథార్థమైన ప్రేమ, భయభక్తులు ఉండడమనేది వట్టి మాట అంటున్నాడు. ఈ లోకంలో కనిపించే మత సంబంధమైన ఆసక్తికి మూలం కేవలం స్వలాభాపేక్ష, స్వార్థం మాత్రమే అని సైతాను అభిప్రాయం. దురదృష్టవశాత్తు  సైతాను వెలిబుచ్చిన ఈ అభిప్రాయం చాలా మట్టుకు సత్యమే అని మనకు మనుష్యులను చూస్తే అర్ధమవుతుంది. పాపాత్ములైన మనుషులు కేవలం తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. దేవుని నుంచి తమకేమి లభిస్తుందో అనే చూస్తుంటారు గాని దేవుణ్ణి ప్రేమించరు. దేవునినుండి ఎల్లప్పుడూ భౌతికమైన మేలులు లేక మెటీరీయల్ blessings కోసమే ఎదురుచూస్తున్నారు గాని ఆధ్యాత్మిక మైన మేలులు పొందటానికి చాలా తక్కువమంది చూస్తున్నారు!  అయితే దేవుడు వ్యక్తుల మనస్సుల్లో పని చేసి వారిని మార్చగలరు. వారికి క్రొత్త స్వభావాన్ని ఇచ్చి తన ప్రేమను వారి హృదయాల్లో నింపగలరు. అలాంటివారు దేవునికి నిజంగా సేవ చేయగలుగుతారు. ఇలాంటివారు  ఆయనకోసం తమకున్న సమస్తాన్నీ వదులుకునేందుకు వెనుకాడరు (మార్కు 10:28,( పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.); లూకా 5:11, లూకా 5:27-28, ; లూకా 14:33, ; రోమీయులకు 5:5, ; ఫిలిప్పీయులకు 3:8, ; హెబ్రీయులకు 10:32-34, ; హెబ్రీయులకు 11:36-38, ).

 

అయితే  దీనికి ఒప్పుకునేందుకు సైతానుగాడు  ఇష్టపడడు. దేవుని ప్రజలపై నేరాలు మోపుతూ వారిని వ్యతిరేకిస్తూనే ఉంటాడు. మనుషులు దేవునికి ఎదురు తిరిగి ఆయన్ను తూలనాడేలా చెయ్యడమే సైతాను ఆశయం. ఇలా చేసేవాళ్ళంతా అసలు సైతాను ఉన్నాడని తెలియకపోయినా సైతాను పక్షం చేరుతున్నారన్న మాట. సైతానుకు దేవుడంటే ద్వేషం. మనుషులందరూ కూడా ఆయన్ను ద్వేషించేలా చెయ్యడమే వాడి ఆశయం. సైతానుకు మనుషులంటే కూడా ద్వేషం. దేవుడు మనుషులకు తీర్పు తీర్చి శిక్షించి నాశనం చెయ్యడమే వాడి ఆశయం.

 

అయితే ఇలా ఎంతవరకు మనుష్యులను దేవునితో విడదీయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే ప్రకటన గ్రంధంలో వివరించినట్లు వాడు పాతాళంలో త్రోయబడేవరకు. ప్రకటన గ్రంథం 12:10

12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

 

ఇక తర్వాత వచనంలో ఇంకా  అంటున్నాడు . నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. ఇక నీవే గనుక ఆ కంచె తీసివేస్తే అనగా ప్రొటెక్షన్ లేక దేవుని కాపుదల తీసివేస్తే వెంటనే ఆస్తిని పోగొట్టుకున్న వెంటనే నిన్ను తిట్టి తన యధార్ధత ను భక్తిని వదిలేస్తాడు అంటూ ఇప్పుడు సాతానుగాడు దేవునితో సవాలు చేస్తున్నాడు! ఒరేయ్ పోరా సైతానుగా ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఆస్తి ఉన్నా లేకున్నా యోబు నా కుమారుడు నన్ను వదిలిపోడు అని దేవుడు మరలా ఛాలెంజ్ చేస్తున్నారు సాతాను గాడితో!

 

సైతాను యోబును గురించి (కాబట్టి భక్తిపరులైన మనుషులందరి గురించి) తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాడు. దేవుని ద్వారా కలిగే సంరక్షణను బట్టీ, ఇహలోక సంబంధమైన దీవెనలను బట్టీ మాత్రమే యోబు ఆయన్ను సేవించి ఆరాధిస్తున్నాడని అంటున్నాడు సైతాను. ఆ దీవెనలను, సంరక్షణను తీసేస్తే చాలు యోబుకున్న భక్తి వాటితోనే పోతుంది. ఈ గ్రంధములో  మనం చూచేదేమంటే యోబు విషయంలో ఇది నిజం కాదు అని యోబు గారు నిరూపించి సాతానుని ఓడించాడు. అయితే ఒక వేళ ఇది మన విషయంలో నిజమేనా? ఆయన మన ఆస్తిమీదికీ మన పిల్లలమీదికీ విపత్తును రానిస్తే ఆయన మంచితనం మీద మనకున్న నమ్మకాన్నీ భక్తిభావాన్నీ పోగొట్టుకుంటామా? ఇదీ అసలు ప్రశ్న విశ్వాసులకు!

 

ఇక ఈ వచనాలను బట్టి మరొక విషయం కూడా అర్ధమవుతుంది-  అది ఏమిటంటే దేవుడు మనలో ప్రతీ ఒక్కరి చుట్టూ ఇంకా దేవుణ్ణి అంగీరించిన ప్రతీ ఒక్కరిచుట్టూ తన కంచెను అనగా తన కాపుదలను ఉంచారు అని అర్ధమవుతుంది! దీనినే ఆయనయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండును అని కీర్తనల గ్రంధంలో భక్తుడు ప్రవచిస్తే సాతానుగాడు యేసుక్రీస్తు ప్రభులవారిని శోధిస్తూ దీనినే ఉటంకించాడు!

కీర్తన 91: 11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును

12 నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొం దురు

లూకా 4:10 నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.

11 నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను...

 

కాబట్టి మనం గ్రహించవలసినది ఏమిటంటే మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి! దేవుని అనుమతి లేకుండా సాతాను గాడు నిన్ను ముట్టలేడు! చిన్నతనంలో కధలు చదువుకొనే వారం కదా- మాయల ఫకీరు ప్రాణం అట- ఏడు సముద్రాల అవతల మర్రి చెట్టు- ఆ చెట్టు తొర్రలో ఒక పెట్టె- ఆ పెట్టెలో ఒక చిలుక- ఆ చిలుకలో తన ప్రాణం ఉందట- ఇది కట్టుకధ! గాని నిజంగా నీ ప్రాణం నా ప్రాణం దేవుని చేతిలో ఉన్నాయి! వాడు నిన్ను ఏమీ చేయలేడు! గాని నీవు దేవుణ్ణి వదిలేస్తే ఆయన నీకు పెట్టిన కంచె అనే కాపుదల తీసివేయ గలడు అప్పుడు అడవి జంతువులు నిన్ను పాడుచేస్తాయి సాతాను గాడు నిన్ను ఘోరమైన ఇక్కట్లు పాలుచేస్తాడనీ భయము నొంది దేవునికి ఇష్టురాలుగా ఇష్టుడిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం!

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*15వ భాగం యోబుగారి శోధన-4*

యోబు 1:1122

11. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

13 ఒక దినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి

14 ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి

15 ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.

16 అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

17 అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

18 అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చినీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా

19 గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ఇక 12వ వచనంలో యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

 

ఇక్కడ దేవుడు సాతాను గాడు శోధిస్తాను అని సవాలు చేస్తే సాతాను గాడి సవాలు స్వీకరించి యోబుగారిని సాతాను గాడు శోధించడానికి అనుమతిని ఇచ్చారు! యోబు విషయంలో సైతాను చేసిన సవాలును దేవుడు స్వీకరించాడు. తాను స్వయంగా యోబుకు విరోధంగా చెయ్యి ఎత్తడు గాని సైతాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు లేక టెస్ట్ చేసేందుకు  అనుమతించారు దేవుడు. దేవుడు తరచుగా తన ప్రజలను పరీక్షలకు గురి కానిస్తాడు (ఆదికాండము 22:1 లో దేవుడు అబ్రాహాము గారిని పరిశోధించారు!

దేవుడు తరుచుగా కొందరు వ్యక్తుల్నీ కొన్ని విషయాలనూ త్యాగం చెయ్యమని అడుగుతారు. అబ్రాహామును మొదట తన దేశాన్ని, బంధువులను విడిచిపెట్టమన్నారు  (ఆదికాండము 12:1, ). తరువాత ఇష్మాయేల్ గురించిన ఆశలను వదిలెయ్యమన్నారు  (ఆదికాండము 17:17-18, ). చివరిగా తన ముద్దుల కొడుకు ఇస్సాకును వదులుకోమంటున్నారు . ఇలాగే తన కోసం సమస్తాన్నీ విడిచిపెట్టాలని యేసుప్రభువు కూడా తన శిష్యులను అడుగుతున్నారు  (మత్తయి 10:37-39, మార్కు 10:21, మార్కు 10:29-31, లూకా 9:57-62, లూకా 14:33, ). దేవుడు తన పట్ల తన ప్రజల ప్రేమనూ నమ్మకాన్నీ విధేయతనూ పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు కష్టతరంగా, బాధకరంగా ఉన్నప్పటికీ వాటిని సహించేవారికి మేలు కలిగిస్తాయి. వారి విశ్వాసాన్ని వృద్ధి చేసి అనేక ముఖ్య పాఠాలను నేర్పిస్తాయి (దయచేసి ఈ రిఫరెన్సులు చూడండి: ద్వితీయోపదేశకాండము 8:2, ద్వితీయోపదేశకాండము 8:16, ద్వితీయోపదేశకాండము 13:3, కీర్తనల గ్రంథము 66:10-12, యాకోబు 1:2-4, యాకోబు 1:12, 1 పేతురు 1:6-7, {1Pet,4:12-13}).

కాబట్టి ఆయన మనలో ఉంచిన మంచిని సహణమును వెలికి తేవాలని దేవుడు మనల్ని పరిశోధిస్తారు . కానీ సైతాను మాత్రం మన భ్రష్ట స్వభావంలోని చెడును బయటికి తేవాలని పరిశోధిస్తాడు. “

 

ఇలాంటి పరీక్షల ద్వారా కలిగే ఫలితాలేవంటే దేవునికి మహిమ, ఆ పరీక్షలనుంచి విజయవంతంగా బయటపడిన వారికి బహు గౌరవమూ, ఆధ్యాత్మిక శ్రేయస్సూ. వేరే విధంగా చెప్పాలంటే దేవుడు సైతాను వేసే అపనిందలనూ, తనకూ తన ప్రజలకూ విరోధంగా సైతాను జరిపే కార్యక్రమాలన్నిటినీ మంచికే జరిగేలా చేస్తాడు (ఆదికాండము 50:20, ; సంఖ్యాకాండము 24:25, ; రోమీయులకు 8:28,).

 

చూడండి ఈ శోధనాలు శ్రమల ద్వారా  దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదం, అభిషేకము మీద అభిషేకము దయచేయడానికి ప్రయత్నం చేస్తే, సాతాను గాడు మనలను నాశనం చేయడానికి, భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా, ఇంకా మన ఆరోగ్యమును ఆస్తిని గౌరవమును పాడుచేయడానికి ఇదే శోధనల ద్వారా ప్రయత్నం చేస్తాడు!

అయితే నమ్మకమైన విశ్వాసికి అదే సాతాను చేసే శోధనలను కీడులను దేవుడు మేలులుగా ఆశీర్వాదాలుగా మలుస్తారు!

 

 కాబట్టి ప్రియ విశ్వాసి ఈ వ్యత్యాసమును గ్రహించి శ్రమలలో ఓలిపోక సోలిపోక అలయక ముందుకు సాగిపోవాలి!!! 

ఇక్కడ ఈ శ్రమల ద్వారా మనకు ఏమని అర్ధమవుతుంది అంటే ఆత్మ సంబంధమైన విషయం చూస్తే ఆ తరంలో దేవునియొక్క  సర్వ శ్రేష్ఠమైన చేతి పనిగా  యోబుగారు నిలిచారు. (ఎఫెసీయులకు 2:10).   చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు పరీక్షకు గురి కానివ్వకుండా యోబుగారిని  దాచిపెట్టే ప్రయత్నం దేవుడు చేయనిష్టపడలేదు. ఆ శ్రమల ద్వారా తన సేవకుణ్ణి పంపించి శ్రమలలో పరీక్షించి సాతాను గాడి నోరు మూయించి అత్యధిక ఆశీర్వాదాలకు కారకుడిగా చేశారు దేవుడు!!

ఇది దేవుడు క్రియచేసే విధానం! ఇంగ్లీష్ లో మోడస్ ఆపరండి అంటారు (Modus Operandi- The way someone does things)!!!

దీనిని గ్రహించి శ్రమలలో శోధనలలో ఓలిపోకూ సోలిపోకూ! శ్రమలు వస్తే దేవుణ్ణి నిందించకు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*16వ భాగం యోబుగారి శోధన-5*

యోబు 1:1122

11. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

13 ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి

14 ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి

15 ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.

16 అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి  దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

17 అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

18 అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా

19 గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక.

22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ఇక 13 నుండి 19 వచనాలలో మనము చూడగలము యోబు గారి ఆస్తి మొత్తాన్ని సాతాను గాడు ఒకే రోజు పాడుచేశాడు. అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటంటే ఆస్తిని పొగుట్టుకున్నా సహించగలడు గాని తన సంతానమంతా ఒకేరోజు మరణిస్తే ఏ మనిషి సహించలేడు. పోయిన నెలలో తెలంగాణకు చెందిన ముగ్గురు సహోదరీలు ఒక పెళ్ళికి వెళ్తుండగా బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుర్లు చనిపోతే ఆ తండ్రి ఎంతగా విలపించాడో కదా! గవర్నమెంట్ 17 లక్షల చెక్కు ఇచ్చినా ఆ తండ్రి దుఖము తీర్చలేక పోయింది! ఇక్కడ యోబుగారికి ఆస్తి మరియు సంతానం మొత్తం ఒకేరోజు పొగుట్టుకున్నారు!

 

సరే, ఇక్కడ 13 వ వచనంలో ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి..  ఇక్కడ ఈ వచనం చూసి కొంతమంది యోబు గారు తన పిల్లలను విచ్చల విడిగా వదిలేశాడు- తన పిల్లలు అక్కడ ద్రాక్షారసము అనగా వైన్ త్రాగుతున్నారు అని బైబిల్లో చెబుతుంది అంటూ విమర్శిస్తారు! అయితే ప్రియులారా- గమనించవలసిన విషయం ఏమిటంటే వీరు త్రాగే ద్రాక్షారసం వైన్ కానేకాదు! కొన్ని ప్రతులలో ద్రాక్షపండ్ల రసము అని తర్జుమా చేయబడింది! ఈ కాలంలో ఇంట్లో ఏదైనా విందు జరిగినప్పుడు టీ కాఫీలు కూల్ డ్రింకులు త్రాగడం  ఎలా అలవాటో, ఆ కాలంలో ఆ చలి ప్రాంతాలలో ద్రాక్షారసం త్రాగడం అలవాటు! అంతే తప్ప ఈస్ట్ కలిపిన వైన్ కాదని గ్రహించండి! ఏమండీ మీరు గాని ఇంటికెళ్ళి చూశారా అని ఆడగవద్దు నన్ను! ఎందుకు అలా ఘంటాపధంగా చెబుతున్నాను అంటే దేవుడే యోబు గారి గురించి యధార్ధవంతుడు నీతిమంతుడు దేవునియందలి భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించు కొనువాడు అని సాక్ష్యం చెబుతున్నప్పుడు ఈ మత్తు పదార్ధాలను యోబు గారు తప్పకుండా అసహ్యించుకుని ఉంటారు- ఇక తప్పుడు పనులను చేయకుండా తప్పకుండా తన పిల్లలను వారించి ఉంటారు! అందుకే ఆ ద్రాక్షారసము ఈస్ట్ కలిపిన వైన్ కాదు- ద్రాక్ష పండ్ల రసము లేక జ్యూస్ అని గ్రహించమని మనవిచ్చేస్తున్నాను!

 

సరే, ఇలా యోబుగారి సంతానం అంతా తమ పెద్ద కుమారుని ఇంట్లో విందు చేసుకుంటూ ఉండగా ఒక్కొక్క హాని జరిగింది యోబు గారికి!

14, 15 వచనాలలో 500 అరకలతో తన భూమిలో దున్నుతుండగ షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని లాక్కుపోయారు. 499 పనివారిని చంపేశారు. ఒక్కడు మిగిలాడు, వచ్చి కబురు ఇచ్చాడు! ఇక్కడ  షెబావాళ్ళంటే ఉత్తర అరేబియా ప్రాంతాల్లో సంచార జీవనం గడిపే తెగ.

 

గమనించాలి తన చేతిలో పడిన ఆస్తిపాస్తులకూ మనుషులకూ ఏ గతి పడుతుందో సైతాను ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. వాడు నాశనకారి, హంతకుడు (యోహాను 8:44). దేవుడే గనుక అనుమతి ఇస్తే దేవుని ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఇలానే చేస్తాడు. వాడలా చెయ్యడం లేదంటే దానికి కారణం దేవుడు తన ప్రజల చుట్టూ కంచెను నిలిపి ఉంచుతున్నాడు (కీర్తనల గ్రంథము 3:3, ; కీర్తనల గ్రంథము 5:12, ; కీర్తనల గ్రంథము 32:7, ; ద్వితీయోపదేశకాండము 33:27, ; యోహాను 17:15, ; 1 పేతురు 1:5, ). సైతాను తన పక్షాన చేరినవారికి, సంపదల కోసం, హోదాల కోసం వాడి ప్రలోభాలకు లొంగిపోయిన వారికీ వాటిని అభివృద్ధి చేయవచ్చు. అయితే అవి వారి అంతిమ నాశనానికి దారి తీస్తాయని వాడిక్కూడా తెలుసు.

 

ఇక 16 వ వచనంలో దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

ఇప్పుడు 7000 గొర్రెలు, కాపుకాసే 699 పనివారు కూడా పోయారు!

 

ఇక్కడదేవుని అగ్నిఅంటే మెరుపులు, పిడుగులు అని కొందరు పండితుల అభిప్రాయం. అయితే ఇది సైతాను ఆకాశం నుంచి వారిమీద కురిపించిన అగ్ని కావచ్చు (ప్రకటన గ్రంథం 13:13, చూడండి. అక్కడ సైతాను అనుచరుడొకడు సరిగ్గా ఇదే పని చేసినట్టుగా ఉంది). ఏది ఏమైనా ఈ వార్తను యోబుకు వినిపించినవాడు మాత్రం ఆ అగ్ని కురిపించింది దేవుడే అనుకొంటే అతడు పొరపాటుగా అర్థం చేసుకున్నాడని తెలుస్తున్నది. ఈ వచనంలో 3000 ఒంటెలు సుమారుగా వాటిని కాచే 599 పనివారు హతమైపోయారు!

 

17 వ వచనంలో అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

ఇంకామాట్లాడుతూనే ఉండగా అనగా ఒక విపత్తు గురించి విన్న దెబ్బ నుంచి యోబుగారు  తేరుకోక ముందే మరో విపత్తును గురించిన వార్త వినిపిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి వేగంగా వచ్చే దుర్వార్తల మూలంగా యోబును పడద్రోసి నేలరాసి నలిపివేద్దామని సైతాను ప్రయత్నం. ఊజు దేశానికి తూర్పుగా లేక ఉత్తర తూర్పు దిశగా ఈ కల్దీయవారు నివసించేవారు. అనగా కల్దీయులు  దక్షిణ ఇరాక్ కి చెందినవారు.

 

ఇక 18 వ వచనంలో అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా

19 గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను

 

ఈ వచనంలో ఏడుగురు కుమారులు ముగ్గురు అందమైన యువతులు హతమై పోయారు!

నాశనం కలిగించే సుడిగాలులను సైతాను పంపించగలడన్న మాట. ఇప్పుడు యోబు హృదయంపై, దెబ్బ తిని ఉన్న అతని మనసుపై అన్నిటికంటే విపరీతమైన దెబ్బపడింది. 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, 7000 గొర్రెలు, 3000 ఒంటెలు వీటన్నిటినీ పోగొట్టుకోవడం కంటే తన పదిమంది సంతానాన్ని కోల్పోవడం యోబు పాలిట అతి దుఃఖకరం.

 

ఇక ఈ విషయాన్ని విన్న యోబుగారు ప్రవర్తించిన తీరు మన అందరికీ ఆదర్శప్రాయం!!

చూడండి 20 , 21 వచనాలు

20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.   హల్లెలూయ!! ఆమెన్!! ఎంత మంచి విశ్వాసమండి! బహుశా ఈ మాటలు విని పరలోకంలో ఉన్న దేవదూతలంతా చప్పట్లు కొట్టి ఈలలు వేసి ఉంటారని నా ఉద్దేశం! దేవుడు ఉప్పొంగి పోయారు!

 చూడండి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అంటున్నారు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను ఇప్పుడు దిగంబరిగా పోతున్నాను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనేను యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక! మనమైతే ఇలాంటి గొప్ప మాటను పలుకగలమా!! మాయదారి దేవుడా నేనే దొరికానా! మా ఊరిలో ఇన్నివేలమంది ఉంటే అందరినీ వదిలేసి నా మీద పడ్డావా అంటు శాపనార్ధాలు పెడతావు! గాని భక్తుడు దేవుణ్ణి స్తుతించాడు!

అందుకే ఒక భక్తుడు ఇలా పాడు తున్నాడు- కష్టములయందు స్తుతింతు- నష్టములయందు స్తుతింతు ..  ఆ ఆ సదా స్తుతింతు యేసురక్షకా ,.. ఇలా నీవు పాడగలవా?!!!

 

ఇక యోబుగారు  లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము ఎందుకు చేస్తున్నారు అంటే అదిబట్ట...క్షౌరం పట్టరాని సంతాపానికి గుర్తుగా చేస్తున్నారు అని అర్ధం!

 

సరే, ఇక్కడ బైబిల్లోని ఉత్తమోత్తమమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబుగారి  పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబుగారి  విశ్వాసం అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సైతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదీ నిజమైనదీ అన్న విషయం నిరూపించబడింది. సైతాను ఊహించినట్టు దేవుణ్ణి దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం షెబావారిని గానీ కల్దీయవారిని గానీ సుడిగాలిని అగ్నిని గానీ చివరికి సైతానునూ కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశానో, మనుషుల దౌర్జన్యం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగాయని అతడు భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అన్నాడు. అంతటిలో దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు.

 

ఇటువంటి మనస్తత్వం, దృఢమైన విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*17వ భాగం యోబుగారి శోధన-6*

యోబు 1:2022

20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక.

22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      ఇక్కడ ఇంత బాధలో కూడా యోబు గారు దేవుణ్ణి నిందించ లేదు సరికదా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చితిని దిగంబరిగా తిరిగి వెల్లెదను అంటున్నారు! ఈ జీవిత సత్యము మనం గ్రహిస్తే ధనము వెనుక ఆస్తుల కోసం వెంపర్లాడము! దీనికోసం భక్తులు చాలా వివరంగా రాశారు ఆత్మవశులై !

 

1 తిమోతికి 6:7 చూసుకుంటే

6:7 మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.

 

కీర్తనల గ్రంథము 49:17 వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు. ;

 

 ప్రసంగి 5:15, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;

 

అందుకే అన్నవస్త్రములు గలవారమై సంతృప్తి పడదాము అని పౌలుగారు హితవు పలుకుతున్నారు తిమోతి పత్రికలో!

 

 ఇకయెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనేను అనగా ఈ ఆస్తి ఐశ్వర్యం సంపద ఆరోగ్యం అన్నీ దేవుడిచ్చినవే మనకు! ఇలా గున్నామంటే అది దేవుని కృపయే, దేవుని ఆశీర్వాదమే! అయితే ఇప్పుడు మనందరం దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినవాళ్ళమే. ఆయననుంచి మంచిది ఏదైనా పొందేందుకు యోగ్యులం కాము. మనకేదైనా ఉందీ అంటే అది దేవుని ఉచిత కృపవల్లే. కొంత కాలంపాటు మనకిచ్చినదాన్ని మన బ్రతులుకు బాగోలేక పోయినా లేక ఏదైనా కారణాల వలన ఆయన తీసేసుకుంటే అందులో అన్యాయమేమీ లేదు. అయితే ఇలాంటి విపత్తు తనకెందుకు వచ్చిందో ఆ కారణం తెలియకపోయినా యోబుగారు ఈ సంగతిని గ్రహించి అంగీకరిస్తున్నారు. ఇదీ మనకు ఉండవలసిన లక్షణం! దేవుణ్ణి నిందించకుండా దేవుడు చేసిన పనిని సమ్మతిస్తున్నారు !

 

అంతేనా ఇంకా దేవునికిస్తుతిచెల్లిస్తున్నారు! కీర్తనల గ్రంథము 22:22-23

22 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.

23 యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ;

 

కీర్తనల గ్రంథము 33:1-3, 1 నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

2 సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి

3 ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ;

 కీర్తనల గ్రంథము 34:1, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ;

కీర్తనల గ్రంథము 44:8, ; కీర్తనల గ్రంథము 50:23, ; కీర్తనల గ్రంథము 52:9, ; కీర్తనల గ్రంథము 63:3-4, ;

ఎఫెసీయులకు 5:20, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ;

1 థెస్సలొనీకయులకు 5:18, . ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

 

కాబట్టి అన్నీ విషయములలోనూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాల్సిన అవసరం  ఎంతైనా ఉంది! పాటలు పాడేస్తాము కష్టమైన కన్నీరయినా ఇరుకైనా ఇబ్బందైనా నిన్ను విడువను అంటూ గాని నిజముగా మనకు శ్రమలు శోధనలు సంభవించినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ముఖ్యం! అప్పుడు యోబు గారిలా స్తుతించ గలగాలి మనం!!!

 

ఇక చివరి వచనంలో 22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

హల్లెలూయ! ఎంత ఘనుడో కదా యోబుగారు! ఏ విషయం లోనూ పాపము చేయలేదు ఇంకా దేవుడు నాకు అన్యాయం చేశారు అని కూడా అనలేదు మనమైతే మాయదారి దేవుడికి నేనే దొరికాయను అంటాము!

 

మనలో చాలామంది యోబుగారికి  కలిగిన నష్టం కంటే అతి తక్కువ నష్టం వచ్చినా దేవుడు తమకు అన్యాయం చేశాడని బుద్ధిమాలి ఆలోచించేవారు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు? అలాగే కొంచెం కష్టాలు ఒకదాని వెనుక వస్తే యోబు లాంటి కష్టాలు వచ్చేశాయి అంటూ డప్పాలు కొడుతుంటాము మనము! నిజానికి ఎవరికైనా వారికున్న పశువులు కార్లు బంగాళాలు అన్నీ ఒకేరోజు పోతే ఇంకా  వారి పిల్లలంతా ఒకేరోజు చనిపోతే అప్పుడు అనాలి యోబు గారి లాంటి కష్టాలు నాకు వచ్చాయి అని! ఏమీ లేకుండా ఒకటో రెండో కష్టాలు వస్తే యోబు లాంటి కష్టాలు వచ్చాయి అంటే వెంటనే మనం అడగాలి నీకు ఎన్ని గొర్రెలు పోయాయి ఎన్ని గొడ్లు పోయాయి? ఎన్ని ఇల్లు పోయాయి? ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు అని! కాబట్టి మనలను మనము దయచేసి యోబు గారితో పోల్చుకో వద్దు! ఆయన కాబట్టి సహించారు! ఆయనను చూసి నేర్చుకుందాం మనము!

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*18వ భాగం యోబుగారి శోధన-7*

యోబు 2:16

1). దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

2 యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచ రించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

3 అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా

4 అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

5 ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

6 అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

మొదటి అధ్యాయంలో దేవుడు సాతాను వేసుకున్న సవాలులో పావుగా మారి యోబు గారు తనకున్న సమస్త ఆస్తి ఐశ్వర్యమును కోల్పోవడమే కాకుండా తన కున్న పదిమంది పిల్లలను ఒకేరోజు పొగుట్టుకున్నట్లు చూడగలం! అయితే ఇంత జరిగినా దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట ఎంతమాత్రమూ అనలేదు సరికదా యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనేను యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేశారు!

 

ఇక రెండవ అధ్యాయంలో మొదటివచనం ప్రకారం 1). దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

2 యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

 

ఇక్కడ దేవుని సన్నిధిలో దేవదూతలు నిలిచే మరో రోజు వచ్చింది. అక్కడకు సాతాను గాడు కూడా వచ్చాడు!  దేవుడు మరలా అడిగారు ఒరేయ్ సాతానుగా ఎక్కడ నుండి వచ్చావు అంటే వాడి పాత డైలాగ్ భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. 

 

ఇక మూడవ వచనంలో దేవుడు మరలా నాకొడుకు యోబు నీతిమంతుడు యధార్ధవంతుడు ఇంకా చెడుతనము విసర్జించిన వాడు అంటూ నాయందు భయభక్తులు గలవాడు అని దేవుడు మరోసారి సైతాను గాడి ముందు గొప్పగా చెప్పుకుంటున్నారు!

 

 ఇంకా ఈ వచనంలో ముఖ్యమైన మాట ఏదనగా నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా--

 

 నిష్కారణముగా నీవు నన్ను అతనిని  పాడుచేయడానికి ప్రేరేపించావు  అతడు నష్టపోయాడు గాని తన యధార్ధత ను వదలలేదు తన భక్తిని కూడా వదలలేదు అని గొప్పగా చెబుతున్నారు!

యోబుగారికి  వచ్చిన ఆపదలు అతని గుణాన్ని ఎంత మాత్రం మార్చలేకపోయాయి. ఆపదలు రాకముందు యోబు ఎంత నిర్దోషంగా నిజాయితీగా, దైవభక్తి గలిగి ఉన్నారో  ఇప్పుడూ అలానే ఉన్నాడని దేవుడతణ్ణి గురించి అంటున్నారు  (యోబు 1:1, యోబు 1:8, ).

 

అయితే 4,5 వచనాలలో సాతాను గాడు మరో సాకు, మరో అపవాదు వేస్తున్నాడు మనుషుల కోసం! మొదట అధ్యాయంలో మానవులు దేవునియందు భయభక్తులు ఎందుకు కలిగి ఉన్నారంటే నీవు వారిని దీవిస్తావు ఆశీర్వాదాలు ఇస్తావు అనే తప్ప నీమీద ప్రేమ భక్తి కలిగి కాదు అని ఆరోపిస్తే, ఇక ఈ వచనాలలో అంటున్నాడు

 4 అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

5 ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

 

మొదటి అధ్యాయంలో ఆస్తికోసమే యోబు నిన్ను యధార్ధతను వదలకుండా ఉన్నాడు అని ఆరోపించి అభాసుపాలైనా సాతాను గాడు ఇప్పుడు మరోవిధంగా ఆరోపిస్తున్నాడు! సైతాను ఇక్కడ అనేదేమంటే యోబుకు వాటిల్లిన నష్టాల మూలంగా అతను దేవుణ్ణి దూషించలేదు నిజమే గాని ఇది యోబుకు దేవునిపై ఉన్న నిజమైన భక్తి వల్ల కాదు. తాను గనుక దేవుణ్ణి దూషిస్తే ఆయన తన ప్రాణం తీసేసుకుంటాడేమోనన్న భయంవల్లే, అనగా నేను దేవుణ్ణి ధూషిస్తే ఈ ప్రాణం  దేవుడిచ్చినదే కదా, దేవుడు కోపగించి ఈ ప్రాణాన్ని తీసేస్తాడేమో, లేక ఏదైనా కుదరని రోగం పెట్టేస్తాడేమో అని యోబు నీ మీద భయపడి భక్తిగా ఉంటున్నాడు తప్ప నీమీద నిజమైన భక్తికాదు! నీవంటే వల్లమాలిన భయం అంటున్నాడు!  . ప్రతివాడికీ తన దేహం గురించీ, ఆరోగ్యం గురించీ చాలా శ్రద్ధ ఉంటుంది. మనుషులు దాన్ని కాపాడుకునేందుకు లేనిపోని భక్తిశ్రద్ధలు నటించడంతో సహా ఏదైనా చేస్తారు అంటున్నాడు సైతాను. అయితే ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు బాధ్యుడు దేవుడే అని అతనికి అనిపిస్తే అతడు దేవుని మీద తిరగబడతాడు. కాబట్టి ఇప్పుడు అతని ఆరోగ్యం పాడుచేయు! అప్పుడు నిన్ను ధూషిస్తాడు.  అతని భక్తికి మూలం స్వార్థం, పాపమేనని అప్పుడు తెలిసివస్తుంది. అని యోబు గారిమీద మానవుల మీద అభాండాలు వేస్తున్నాడు సాతాను గాడు!  ఇదంతా సైతాను మానవ స్వభావం గురించి వేసిన అంచనా. భ్రష్ట స్థితిలో మనిషి ఉన్నప్పుడు ఈ అంచనా సరైనదే. అయితే యోబుగారి విషయంలో ఇది సరి కాదు. (13-15 వచనాలు). దేవుడు మనుషులకు పాపవిముక్తి ప్రసాదించి వారి హృదయాల్లో మార్పు జరిగించేటప్పుడు ఆయనకోసం మనుషులు తమ ప్రాణాలనైనా ఇచ్చేసేలా వారిని తయారు చేస్తాడు (యోహాను 11:16, ; అపో. కార్యములు 20:24, ; అపో. కార్యములు 21:13, ; హెబ్రీయులకు 11:36-38, ; ప్రకటన గ్రంథం 12:11, ; లూకా 14:26, ; మత్తయి 10:38-39, ).

తమకెలాంటి విపత్తు వాటిల్లినా మరణం వరకు కూడా అన్ని బాధలనూ సహించి దేవుణ్ణి ప్రేమించే తన పిల్లల వల్ల ఆయనకు గొప్ప మహిమ కలుగుతుంది.

 

మరి ప్రియమైన విశ్వాసి నీ పరిస్తితి ఎలా ఉంది? ఆరోగ్యం ఉన్నా లేకున్నా దేవునికి భయపడి భక్తి కలిగి ఉంటావా? లేక చిన్న భాధ కలిగినా చిన్న రోగం కలిగినా మాయదారి దేవుడా నేనే దొరికానా అని అంటావా?

సరిచేసుకో! సరిచూసుకో!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*19వ భాగం యోబుగారి శోధన-8*

యోబు 2:410

4 అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

5 ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

6 అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.

8 అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా

9 అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

10 అందుకతడుమూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      యోబు నిన్ను ధూషిస్తే  ఎక్కడ శపించేస్తావో అని నీకోసం భయపడి నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడు తప్ప నీమీద భక్తికాదు- ఒకసారి ఆరోగ్యం పాడుచేస్తే నిన్ను ధూషిస్తాడు అతని భక్తిలో స్వార్ధము భయము ఉంది అంటే 6 వ వచనంలో దేవుడు అంటున్నారు: అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

 

ఇక్కడ మరోసారి అర్ధమవుతుంది దేవుని అనుమతి లేనిదే సైతాను మనుషులను ఏమీ చెయ్యలేడు (యోబు 1:12, ). అయితే దేవుడు సైతానుకు అనుమతి ఎందుకిస్తాడు? ఎందుకంటే ...

అనుమతి ఇవ్వకపోవడం కంటే ఇవ్వడమే మేలని ఆయనకు తెలుసు. ఈ భూమిమీద ఉన్నప్పుడు ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కాదు (యెషయా 55:8-9, ; రోమీయులకు 11:33-34, ).

యెషయా 55:8-9

8 నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9 ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

 

రోమీయులకు 11:33-34

33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?

 

కాబట్టి యోబుగారి ఆరోగ్యం పాడుచేయడానికి దేవునినుండి అనుమతి పొందిన సాతాను గాడు తర్వాత వచనాలలో యోబుగారి ఆరోగ్యం పాడుచేసినట్లు కనిపిస్తుంది!

 

7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.

8 అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా

 

ఇక్కడ అరికాలు నుండి నడినెత్తి వరకు ఘోరమైన కురుపులతో యోబుగారిని మొత్తినట్లు చూడగలము! నా ఉద్దేశంలో కుష్టు వ్యాధి కావచ్చు!

గమనించాలి సైతానుకు అదను చిక్కితే మనుషులను బాధించడానికి తనకు చేతనైనదంతా చేస్తాడు. ఒంటిమీద ఒక్క కురుపే ఎంతో బాధకరంగా ఉంటుంది. అలాంటప్పుడు మంట, దురద, యాతన పెట్టే పుండ్లు శరీరమంతటా లేవడం ఎంత దుర్భరమో భయంకరమో ఊహించుకోండి. ఈ రోగంవల్ల యోబుగారు అనుభవించిన యాతన ఈ గ్రంథంలోని అనేక వచనాల ద్వారా అర్థమౌతున్నది (యోబు 2:8, ; యోబు 3:24, ; యోబు 6:10, ; యోబు 7:4-5, ; యోబు 13:28, ; యోబు 16:8, యోబు 16:17, ; యోబు 17:1, ; యోబు 19:20, ; యోబు 30:17, యోబు 30:30, ).

 

ఇలా యోబు గారు తట్టుకోలేనంత కురుపులు దురద బాధతో పడుతున్నారు! తీవ్రమైన దుఃఖానికి ఇది గుర్తు (యోబు 42:6, ; యిర్మియా 6:26, ; యోనా 3:6, ). తన జీవిత సర్వస్వం బూడిద పాలైనట్టు యోబుగారు భావిస్తున్నారు.

 

ఎన్ని రోజులు ఇలా బాధపడ్డారో తెలియదు! బహుశా ఒక రెండు నెలలు కావచ్చును అని నా ఉద్దేశం! ఇలా అనడానికి కారణం- యోబు గారు పడే బాధలు చూడలేక యోబు గారి భార్య ఇక నీ భక్తిని యధార్ధత ను వదిలేసి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది ఆవిడ! ఏ సామాన్య భార్య తన భర్తను చచ్చిపో అని అనలేదు! పనికిమాలిన వదరబోతు బరితెగించిన వ్యభిచారం చేసే స్త్రీలు తాము చేసే చెడు తిరుగుళ్ళకు అడ్డు వస్తున్నారు అని చచ్చిపో అని అంటారు , లేక ఎవరితోనైనా చంపిస్తారు గాని మామాలు స్త్రీలు తన భర్తకు కష్టం వస్తే ఏదో విధంగా వైద్యము చేయిస్తుంది! ధనము లేకపోతే అవసరమైతే తనకు కలిగిన సమస్తము తాకట్టు పెట్టి భర్తకు వైద్యము చేయిస్తుంది. అలాంటిది ఒక నీతిమంతుని భార్య భక్తిగల భార్య ఇక చాలు చచ్చిపో అన్నది అంటే బహుశా యోబుగారు ఎంతో బాధపడుతున్నారు- ఇక తన భర్త  బ్రతకడం కంటే చనిపోవడం మేలు అని నిర్ణయానికి వచ్చి ఈ మాట పలుకుతుంది ఆమె!

 

అయితే 9 వ వచనం చూసుకుంటే అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

 

తన భర్త బ్రతకటం కంటే చనిపోవడమే మేలు- ఆ విధముగా నైనా యోబుగారు తన వేదనల నుండి బాధల నుండి విముక్తి పొందుతారు అని ఆమె అనుకున్నారు అయితే ఇక్కడ సాతాను గాడు దానికి రెండు మూడు మాటలు కలిపి అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు! తన ఉద్దేశానికి మారిని మాటలు చేర్చుతున్నాడు సాతాను గాడు! తనకన్నా పనికిమాలిన ఏడు దయ్యాలను తీసుకుని వచ్చినట్లు ఇక్కడ ఆమెతో మాట్లాడిస్తున్నాడు! తన సందేశాన్ని యోబుకు అందజేయడానికి, అతని దుఃఖాన్ని మరింత పెంచడానికీ సైతాను ఇప్పుడు అతని భార్యను సాధనంగా చేసుకున్నాడు. యోబుకు ప్రాప్తించిన భయంకరమైన నష్టాలనూ బాధలనూ అతని యథార్థతా, భక్తీ అడ్డుకోలేక పోయినప్పుడు ఇక వాటివల్ల లాభమేముంది అంటూ ఉంది యోబు భార్య.

దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో అనడంలో ఆమె సైతాను ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. ఆత్మహత్య చేసుకొమ్మని కాదు. యోబు దేవుణ్ణి దూషిస్తే ఆయన అనగా దేవుడే యోబుగారిని చంపేస్తాడనీ, అలానైనా అతని దైన్య స్థితినుంచి విడుదల కలుగుతుందనీ బహుశా ఆమె అభిప్రాయం కావచ్చు.

 

ప్రియమైన సహోదరి! ఒకసారి నీమాటలను పరిశీలించు! నీ మాటలు నీ భర్తకు ఆధరణ కరంగా ఉంటున్నాయా లేక నిష్టూర పెట్టేవిధంగా ఉంటున్నాయా? ఈ మధ్యకాలంలో మా ఏరియాలో భార్య యొక్క సూటిపోటి మాటలు తట్టుకోలేక నాకు తెలిసిన ముగ్గురు భర్తలు ఆత్మహత్య చేసేసుకున్నారు! చచ్చిపోతే చచ్చిపో నా పీడ విరగడై పోతుంది అంటే ఇక ఎందుకు అని వెంటనే క్షణికావేశంలో ఆ ముగ్గురు చనిపోయారు- దానిలో నా ఫ్రెండ్ ఒకడు, నా ఫ్రెండు తమ్ముడు ఒకడు ఉన్నారు! అమ్మా నీ మాటలతో నీ భర్తను ఆదరించి, తన బాధను చల్లార్చే లాగుండాలి గాని, కుళ్ళబొడిచే విధంగా ఉండకూడదు! ఆ మాత్రం చేతకాని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని బాధించే స్త్రీ లారా! మీలో సాతాను గాడు పనిచేస్తూ మీతో ఈ మాటలు పలికిస్తున్నాడు అని గ్రహించి మీ మాటలు సరిచూసుకోమనీ ప్రభువు పేరిట మనవిచ్చేస్తున్నాను!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*20వ భాగం యోబుగారి శోధన-9*

యోబు 2:910

9 అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

10 అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.

 

                  ప్రియులారా సాతానుకు దేవునికి మధ్య సవాలు- అందుకు గాను యోబుగారు అనుభవించిన శోధనలను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! యోబుగారి బాధలను చూసి యోబు గారి భార్య ఇక ఈ బాధలను అనుభవించే బదులు నా భర్త చనిపోతే మంచిది అని నిర్ణయానికి వచ్చి మాట్లాడే మాటలను సాతాను గాడు ఉపయోగించుకుని యధార్ధతను వదిలి దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పినట్లు గతభాగంలో చూసుకున్నాము! అయితే అందుకు యోబు గారి సమాధానం ఎంతో గొప్పది! మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నారు ఇది మొదటి మాట! మూర్ఖురాలా అనలేదు! మూర్ఖురాలు వలె మాట్లాడవద్దు అని హితవు పలుకుతున్నారు!

తర్వాత మనము దేవుని వలన మేలును అనుభవించాము- అప్పుడు సంతోషించాము- ఇప్పుడు మనకు కీడు కలిగింది- దానిని కూడా సంతోషంగా అనుభవించాలి కదా- దేవుని మీద నిష్టూరాలు వేయవద్దు అంటున్నారు!

 

మూర్ఖురాలు లేక తెలివితక్కువ అని అనువాదం చేసిన హీబ్రూ పదానికి బుద్ధితక్కువ అనియు,  నీతి లేకపోవడం అనియు కూడా అర్థం వస్తుంది. తెలివి తక్కువదానా అని యోబుగారు  తన భార్యను తిట్టడం లేదు గాని తెలివితక్కువ ఆడదానిలాగా మాట్లాడుతున్నావు అని మాత్రం అన్నారు . ఒక విషయం యోబుగారికి తెలుసు. అది మనం కూడా గ్రహించాలి. అదేమంటే ఒక్క రోజునే ఆమె కూడా తన పదిమంది పిల్లలను కోల్పోయింది. తన భర్త పడే వేదనలను చూస్తూవుంది. హఠాత్తుగా ఒక్క పిల్లవాడిని కోల్పోతేనే తల్లులు శోకంతో దాదాపు పిచ్చివాళ్ళై పోవచ్చు గదా. అందుకే యోబుగారు ఇంత బాధలో కూడా మాట దాటడం లేదు! ఈ పరిస్తితిలో సాధారణ మగాడు బార్యను తిట్టడం కొట్టడం చేస్తారు గాని యోబు గారు ఎంతో ఓరిమితో మాట్లాడుతున్నారు తన భార్యతో! ఓర్పు గొప్ప దోష కార్యములు చేయకుండా ఆపుతుంది!

 

ఇక తర్వాత మాట ఇంత జరిగినా గాని ఈ సంగతులలో ఏ విషయమందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబుగారు  తన మాటల మూలంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా సైతానును అబద్ధికుడిగా నిరూపించారు . వాడి నోరు మూయించారు. సైతాను ఓడిపోయాడు. ఇకపై ఈ కథలో మరెక్కడా సైతాను కనిపించడు.

 

దేవుడు ఆశించిన ఫలితం ఇక్కడ జరిగింది! హల్లెలూయ!!! మనము కూడా దేవునికి మహిమ తెచ్చే పనులు చేయాలి గాని దేవునికి అవమానం కలిగించే పనులు మనము చేయకూడదు!

 

ఇక తర్వాత వచనాలలో తన స్నేహితులు ముగ్గురు వచ్చినట్లు చూడగలము!

11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.

12 వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.

13 అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.

 

ఈ వచనాలలో యోబు గారి వేదన అతని వైకరి కనిపిస్తుంది. పోల్చుకోలేనంతగా మారిపోయారు!

ఇరుగు పొరుగు ప్రదేశాలనుంచి నిజమైన స్నేహభావంతో, యోబును ఊరడించాలన్న సదుద్దేశంతో ఈ మనుషులు వచ్చారు. కానీ వారి ప్రయత్నం యోబు దుఃఖాన్ని ఇంకా పెంచింది (యోబు 16:2, ). యోబు దేహ సంబంధమైన బాధ మొదలైనప్పటినుంచి అతని మిత్రులు అతణ్ణి చూచేందుకు వచ్చేదాకా ఎంతకాలం గడిచిపోయిందో మనకు తెలియదు. కానీ యోబు 7:3, లో యోబునెలల తరబడిఅన్నారు.

 

ఇకవారు వచ్చి తూర్పు వారందరిలోకి గొప్పవాడైన వ్యక్తి (యోబు 1:3, ) అసహ్యకరమైన కురుపులతో బూడిదలో కూర్చుని ఉంటాడని ఆ స్నేహితులు మాత్రం ఎలా ఊహించగలరు? తెల్లబోయి, పట్టరాని శోకంతో గొల్లుమన్నారు (యెహోషువ 7:16, ; నెహెమ్యా 9:1, ; విలాపవాక్యములు 2:10, ; యెహెఙ్కేలు 27:30). పురాతన కాలంలో 7 రోజుల సంతాపం దినాలు అసామాన్యమేమీ కాదు (ఆదికాండము 50:10, ; 1 సమూయేలు 31:13, ).

 

ఇక చివరి వచనంలో అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.

ఇక్కడ యోబు నిజంగా మంచివాడేనా, న్యాయవంతుడేనా అన్న సందేహం ఈ 7 రోజుల్లో యోబు మిత్రులకు కలిగి ఉండవచ్చు. వారు తరువాత పలికిన మాటల్లో ఈ సందేహం బయటికి వచ్చింది. ఏదో ఘోర పాపం చేసి ఉండకపోతే ఇంత విపత్కరమైన పరిస్థితులు, ఇంత బాధ దేవుడు యోబు మీదికి ఎందుకు రానిస్తాడు అన్నది వాళ్ళకర్థం కాలేదు.

 

కొన్నిసార్లు దేవుని శోధనను చూసి దేవుడు ఎందుకు ఇంత ఘోరమైన శోధనలకు వీరిని గురిచేస్తున్నారు- వీరు ఏ పాపం చేశారో అని చాలామంది తలస్తూ ఉంటారు! మనము కూడా ఇలా అనుకోకూడదని ఈ వచనాల వలన అర్ధమవుతుంది. యోబుగారు చేసిన నేరం ఏమీ లేదు గాని యోబుగారు అనేక బాధలకు నిందలకు గురి అయ్యారు! కాబట్టి తొందరపడి ఎవరిని నిందించ వద్దు! వారికి కలిగిన యిడుములు చూసి వారు పాపులు అని నిర్ణయానికి రావద్దు!

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*21వ భాగం *

యోబు 3:15 

1 ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.

2 యోబు ఈలాగు అనెను

3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

4 ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

5 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక!

 

    ప్రియులారా! ఇంతవరకు దేవుడు సాతాను వేసుకున్న సవాలు వలన యోబు గారు అనుభవిస్తున్న భౌతిక శోధనల కోసం చూసుకున్నాము! ఇక మూడవ అధ్యాయము నుండి తన ఆప్తమిత్రులు ముగ్గురు ఓదార్చడానికి వచ్చి- ఓదార్పు ఆదరణకు బదులుగా మాటలతో యోబుగారిని బాధించడం చూడగలం! వారు దేవుని తరుపున వాదిస్తున్నట్లు వకాల్తా పుచ్చుకుని యోబుగారి మీద అపనిందలు వేస్తున్నారు. నీవు చేసిన అపరాదాల వలనే ఇన్ని శోధనలు శ్రమలు కలిగాయి అంటున్నారు!

 

ఇక్కడనుంచి 31వ అధ్యాయం వరకు యోబుగారు బాధల గురించి యోబుగారు , అతని స్నేహితులు పలికిన మాటలు ఉన్నాయి. అతనికి అలాంటి విపత్తు ఎందుకు కలిగిందో అన్న సమస్యకు సమాధానాన్ని ఎవరికి వారు ఆలోచిస్తూ వారంతా కలిసి 7 రోజులు గడిపారు. యోబుగారు ఇప్పుడు  ఈ సంభాషణను ఆరంభించారు. చాలా కాలంగా అతడు ఎడతెగని వేదన అనుభవిస్తూ తన బాధల గురించి తలపోస్తూ ఉన్నారు . దేవుడెందుకు నన్నిలా చేశాడు? నేను చేసిన దోషం ఏమిటి? నాకిక మిగిలినదేమిటి? బ్రతకడం కంటే మరణం మేలు గదా. అసలు పుట్టకుండానే ఉంటే అంతకంటే మంచిది కాదా? ఇలాంటి ప్రశ్నలు అతని మనస్సును వేధిస్తూ ఉన్నాయి, అతని ఆత్మను క్రుంగదీస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగిందో ఏమీ అంతుబట్టలేదు. తన సమస్యల్లో దేనికీ జవాబు లేదు. పరలోకంలో అతని గురించి సైతాను, దేవుడు మాట్లాడుకున్న మాటలు అతనికి తెలియదు. అతని స్నేహితులు అతనికేమీ ఆదరణ కలిగించలేదు. దేవుడు మౌనం వహించాడు. ఒక సంగతి గుర్తుంచుకోవాలి. యోబుగారి సమయంలో  లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నా కృప మీకు చాలు లాంటి వాగ్దానాలు లేవు.

 

యోహాను 16:33, ; రోమీయులకు 8:17-18, రోమీయులకు 8:28, ; 2 దినవృత్తాంతములు 4:17, ; 1 పేతురు 4:12-13, ; ప్రకటన గ్రంథం 7:17, ; ప్రకటన గ్రంథం 21:3-4,

 

ఈ వాక్యాలను అప్పటికింకా రాసి ఉండలేదు. క్రీస్తు సిలువ ద్వారా దేవుని అద్భుత ప్రేమ ప్రత్యక్షాన్ని యోబుగారు  చూడలేదు. అదింకా జరగలేదు. దేవుడు మానవ చరిత్రలో ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం ఇలా క్రమక్రమంగా తన సత్యాన్ని వెల్లడి చేశారు. ఇలాంటి వెల్లడింపు అప్పుడప్పుడే ఆరంభమౌతున్న రోజుల్లో యోబుగారు  జీవించారు. యోబుకు తానున్న పరిస్థితుల్లో గ్రహింపునూ ప్రోత్సాహాన్నీ ఇచ్చే దేవుని వాగ్దానమేమీ లేదు. జరిగినదేమిటో అర్థం చేసుకునేందుకు అతనికి ఉన్నదల్లా తన సొంత ఆలోచనలే. కాని అవి అతనికెలాంటి ఆదరణనూ ఇవ్వలేకపోయాయి. ఎందుకంటే జరిగిన విషయం ఏ తర్కానికీ దేవుణ్ణి గురించి తనకు తెలిసిన దానంతటికీ భిన్నంగా ఉంది. ఒక్కసారి బద్దలైన ఆనకట్టలాగా అతని హృదయమూ, నోరు తెరుచుకుని అప్పటిదాకా బిగబట్టి ఉంచిన పరితాపం, పరిపరివిధాల పోయిన ఆలోచనలు తన్నుకువచ్చాయి. యోబు అన్నమాటల గురించి కఠినమైన అభిప్రాయం ఏర్పరచకూడదు. సహించలేనంతగా శరీరం, మనసు గాయపడిన మనిషి నోట వెలువడే మాటలే ఈ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. (దీని విషయం యోబు స్వంత అభిప్రాయాన్ని యోబు 6:2-4, యోబు 6:11-13, ; యోబు 7:11, లో చూడండి.) యోబుగారు  భూమి అంతటిలోకి నీతి యథార్థత విషయంలో సాటిలేనివాడు. ఇది దేవుడు అన్నమాటే (యోబు 2:3, ). మనలో ఎవరమైనా ఆ పరిస్థితుల్లో ఉంటే అంతకన్నా యోగ్యంగా ప్రవర్తించేవారమూ మాట్లాడేవారమూ కాదు. బైబిలు ద్వారా దేవుని సర్వ సత్యాన్ని గ్రహించిన ఒక విశ్వాసి అయితే ఇలాంటి బాధ, విపత్తులు ఎదురైనప్పుడు యోబు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. దేవుడు వెల్లడించిన సత్యం యోబుగారికి ఎంత తక్కువ తెలుసో మనం గుర్తించుకోవాలి.

 

సరే, ఈ అధ్యాయంలో మొదటగా యోబుగారు తన శ్రమలను శోధనలను తన స్తితిని చూసుకుని తనకు తానే నిందించు కుంటున్నారు! ఇక్కడ ఈ వచనాలలో యోబుగారు ఆత్మన్యూనతా భావంతో బాదపడినట్లు చూడగలం! దీనినే self pity అంటారు, చివరకు ఇది నీకు ఆత్మహత్యకు కూడా దారితీస్తుంది.

 

ఇక మొదటి వచనంలో ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను అంటున్నారు! తనను తాను తిట్టుకుంటూ తాను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నారు! ఇలా తనను తాను తిట్టుకుని తాను పుట్టిన దినాన్ని శపించుకోవడం యోబుగారిని చూసి చాలామంది చేశారు!  యిర్మీయా గారు కూడా ఇలాగే తాను పుట్టిన దినాన్ని శపించుకున్నారు తన బాధలు తట్టుకోలేక!!

 

ప్రియదేవుని బిడ్డా! ఒకవేళ నీవు కూడా నీ బాధలను తట్టుకోలేక ఇలాగే తిట్టుకుని శపించు కుంటున్నావా!! జాగ్రత్త! నీలో తప్పుడు తలంపులకు నీవే సాతానుగాడికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది! యోబుగారి భార్య తన భర్త బాధలను చూసి తట్టుకోలేక చావు అయినా వచ్చినా బాగుణ్ణు, నా భర్తకు ఈ బాధల నుండి విముక్తి దొరుకును అని అనుకుంది, గాని సాతాను గాడు ఆమెతో ఏమని మాట్లాడించాడు? ఇంకా యధార్ధతను విడువవా? దేవుణ్ణి దూషించి ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అని మాట్లాడించింది! కాబట్టి ఇలాంటి నెగిటివ్ థాట్స్ తప్పుడు ఆలోచనలను మీ మనస్సులలో నుండి తీసివేయండి, రానీయకండి!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*22వ భాగం *

యోబు 3:15

1 ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.

2 యోబు ఈలాగు అనెను

3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

4 ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

5 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక

 

    ప్రియులారా! మూడవ అధ్యాయంలో యోబుగారు తనను తాను నిందించు కుంటున్నట్లు చూసుకుంటున్నాము!

 

                (గతభాగం తరువాయి)

 

మొదటి వచనంలో తాను పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఇంకా అంటున్నారు

3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

 

యిర్మీయా గారు కూడా ఇలాగే అంటున్నారు యిర్మియా 20:14-18

14 నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;

15 నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;

16 నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక

17 యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక

18 కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?

 

ఇక్కడ యిర్మీయా గారు కూడా తనను తాను తిట్టుకుంటున్నారు.  యోబుగారి వలె నేను పుట్టిన దినము శపించబడును గాక, నా తల్లి నన్ను కనిన నా బర్త్ డే ఎవరూ మంచి రోజు అనకుండా ఉండును గాక! నా తల్లికి నీకు మగపిల్ల పుట్టాడు అన్నవాడు, నా తండ్రికి నీకు మగ పిల్లాడు పుట్టాడు అని కబురు చెప్పినవాడు శాపగ్రస్తుడు అవును గాక అంటున్నారు. ఏమండీ మధ్యలో అమ్మకు నాన్నకు కబురు చెప్పినవాడు ఏం పాపం చేశాడు? ఇది ఫ్రస్టేషన్ లో అంటున్న మాటలని అర్ధమవుతుంది!

 

ఇంకా యిర్మీయా గారు అంటున్నారు నా తల్లి నాకు సమాధిగా ఉండి, ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక

 

చూడండి తండ్రికి కబురు చెప్పినవాడు తన తల్లి గర్భంలోనే తనను చంపలేదు కాబట్టి కబురు చెప్పిన మనుషుడు శపించబడాలట.. ఇదెంత విడ్డూరమో!

 

సరే, యోబు గారు ఏమన్నారో చూద్దాం!

3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

4 ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

5 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక

 

చూడండి యోబు గారు ఏమంటున్నారో- నేను పుట్టినరోజు లేకుండా ఉంటే బాగుండేది, మగబిడ్డ పుట్టాడు అని చెప్పిన రాత్రి  లేకుండా ఉంటే బాగుండేది! నా తల్లి పిల్లలు కనకుండా తన గర్భాన్ని మూసివేయ లేకపోయింది గనుక ఆరోజు చీకటిగా మారిపోవాలి, పైగా దేవుడు ఆ దినాన్ని తలచుకోకూడదు! ఆ రోజుమీద వెలుగు ప్రసరించకూడదు! చీకటి చావునీడ మబ్బు ఆవరించాలి అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు! నిజానికి యోబుగారు కానీ యిర్మీయా గారు గాని తమ బాధలు వేదనలు తట్టుకోలేక ఫ్రస్టేషన్ లో ఇలా మాట్లాడుతున్నారు!

 

ఒకవేళ నీవు కూడా ఇలాంటి స్తితిలో ఉంటే ప్రియ దేవుని బిడ్డా! ఇవి రాసే రోజులకు దేవుని నుండి సంపూర్ణ వాగ్ధానాలు లేవు! ఇప్పుడైతే సంపూర్ణంగా వాగ్ధానాలు ఉన్నాయి! నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుని మాటలు మరచిపోవద్దు! యెహోషువా 1:6; యోహాను 14:18, హెబ్రీ 13:5,

 

ఇంకా ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకును వాడను రక్షించువాడను నేనే అంటూ కూడా వాగ్ధానం చేశారు! యెషయా 46:34

 

కాబట్టి అధైర్యపడవద్దు! దిగులు పడవద్దు! నీతోకూడ నీ దేవుడు ఉన్నారు!

 

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*23వ భాగం *

యోబు 3:615

6 అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.

7 ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక

8 దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక.

9 అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక

10 అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?

11 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?

12 మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి? నేనేల స్తనములను కుడిచితిని?

13 లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును

14 తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.

15 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును.

 

    ప్రియులారా! మూడవ అధ్యాయంలో యోబుగారు తనను తాను నిందించు కుంటున్నట్లు చూసుకుంటున్నాము!

 

                (గతభాగం తరువాయి)

 

మొదటి వచనంలో తాను పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఇంకా అంటున్నారు. ఇక ఆరవ వచనం నుండి ఇంకా తాను పుట్టిన రోజుని శపించుకుంటూ అంటున్నారు నేను పుట్టిన రోజును చీకటే ఆ రాత్రిని పట్టుకోవాలి. సంవత్సరంలో ఉన్న రోజులలో అది ఒక రోజుగా ఉండకుండా పోవాలి, ఏ నెలలో కూడా అది ఒక భాగం కాకూడదు! ఏమండీ చివరికి ఫిబ్రవరి 29 కూడా లీఫు సంవత్సరంలో ఒకరోజుగా పరిగణింప బడుతుంది కదా- ఇదెక్కడి మాటండీ!

 

ఇంకా అంటున్నారు ఆ రాత్రి ఎవరూ పుట్టకపోతే ఎంత బాగుణ్ణు- అంటే ఆ రాత్రి ఎవరూ పుట్టకపోతే నేను కూడా పుట్టి ఉండకపోదునే అని అభిప్రాయం కావచ్చును!

 

ఇక శాపనార్ధాలు పెట్టేవారు ఆ రోజుని శపించాలి అంటున్నారు! ఇంకా ఒక విచిత్రమైన మాట అంటున్నారు భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించు దురు గాక.

 

భుజంగము అనగా మకరము అనగా మొసలి మొసలిని పిచ్చెక్కినట్లు చేసేవారు దానిని శపించాలి అంటున్నారు! నిజానికి ఈ మాట లివయాటాన్ అనే మాట వాడబదినది ప్రాచీన ప్రతులలో! ఈ జంతువు గురించి కూడా అనేకమైన ఊహాగానాలున్నాయి. బైబిలు విధ్వాంసులు ఇది మహా మొసలి అని అభిప్రాయపడ్డారు. ఇక్కడి వర్ణన పూర్తిగా పద్య రూపంలో ఉంది. ..

ఇక్కడ లివయాటన్ అనగా అర్థం దుర్మార్గతతో నిండిన ఒక మహా సామ్రాజ్యం, ప్రజలను బాధించే అధికారం అని. బైబిల్లో ఈ మాటను ఉపయోగించిన ప్రతి చోటా దీని అర్థం వేరువేరుగా ఉన్నట్టుంది. యోబు 3:8లో ఇది ఏదో ఒక సముద్ర జంతువు. యోబు 41:1లో ఇది బహుశా గొప్ప మొసలి. కీర్తన 74:14లో ఇది బహుశా ఈజిప్ట్ను సూచించేందుకు వాడిన పదం. ఈ వచనంలో పైవాటికన్నిటికీ భిన్నమైన అర్థం రావచ్చు. బబులోను, ఈజిప్ట్ వంటి పురాతన రాజ్యాలు లివయాటన్ లాంటివి కావచ్చు. అయితే యెషయా 27 అధ్యాయంలో లివయాటన్ యుగాంతాన్ని సూచిస్తున్నదైతే పై రెండు ఈ మాటకు అర్థాలు కాదు. “ఆ రోజున” ( 1) ప్రపంచంలోని దౌర్జన్యకరమైన శక్తి ఏదై ఉంటుంది? క్రీస్తువిరోధి, అతని సామ్రాజ్యమూను. ఇది సముద్రంలో నుండి బయటకు వస్తుందని రాసివుంది (ప్రకటన 13:1). అక్కడ ఈ మృగాన్ని సర్పంగా అభివర్ణించలేదు నిజమే గాని అతడి గుణం అదే. అంతేగాక రెక్కల సర్పం తన శక్తిని ఆ మృగానికి ఇస్తుంది. క్రీస్తువిరోధి సింహాసనం వెనుక ఉండి వాస్తవంగా లోకాన్ని పాలించేది సర్పమే, అంటే సైతానే (ప్రకటన 12:7-9; 13:2, 4)

 

ఇంకా అంటున్నారు పదవ వచనంలో :అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని? చూడండి ఇక్కడ నేను పుట్టిన వెంటనే నేను ఎందుకు చనిపోలేదు.. తల్లి గర్భము నుండి నేను రాగానే నా ప్రాణం ఎందుకు పోలేదు అంటున్నారు?

 

యోబు 10:18-19

18 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు;

19 అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

 

ఇంకా నా తల్లి నన్ను తన మోకాళ్ళ మీద ఎందుకు ఉంచింది? నేనెందుకు అమ్మ పాలు త్రాగాను అంటున్నారు!  లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును

 

ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలోను, ఆత్మలోను నెమ్మది కలగాలని యోబుగారు కోరుకుంటున్నాడు. అందువల్ల బ్రతుకు కంటే చావే అతనికి తియ్యగా అనిపించింది యోబు గారికి!

 

ఇంకా ముందుకు పోతే 14 తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.

15 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును అంటున్నారు!

 

ఇలా అనడానికి కారణం చాలామంది తన పొలాలకు తమ ఇళ్లకు తమ పేరులు పెట్టుకుంటున్నారు- చూడండి నేటి రోజులలో ఇందిరమ్మ గృహాలు అనియు, రాజీవ్ గృహాలని, ఉన్నాయి! గాని వారులేరు! వారు చనిపోయారు! తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు- గాని వారు ఇప్పుడు లేరు! అలాగే బంగారాన్ని సంపాదిస్తున్నారు తమ ఇళ్లను బంగారముతోనూ వెండితోనూ నింపుకుని ఏమీ అనుభవించకుండా చచ్చిపోయి కుళ్లిపోయారు! అలాగే యోబు గారు నేను కూడా అలాగే ఉందును నా తల్లి గర్భములో నేను చనిపోయి ఉంటే ప్రజలకు నా గుర్తింపు గాని నా అడ్రస్ గాని లేకుండా ఉండును! ఇప్పుడైతే నాకు ఎంతో పేరుంది ఎంతో ఘనత ఉండేది! అయితే ఇప్పుడు అన్నీ పోయాయి! ఆ భూములకు తమ పేర్లు పెట్టుకుని ఇప్పుడు వారు లేకపోయినట్లు నేను కూడా ఇప్పుడు ఉన్నాను అని అభిప్రాయపడుతున్నారు!

 

ఈ రకంగా ఇంకా తనను తాను నిందించు కుంటున్నారు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*24వ భాగం*

యోబు 3:1622

16 అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.

17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు

18 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు

19 అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.

20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

21 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.

22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

 

    ప్రియులారా! మూడవ అధ్యాయంలో యోబుగారు తనను తాను నిందించు కుంటున్నట్లు చూసుకుంటున్నాము!

 

                (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇంకా ఈ వచనాలు చూసుకుంటే చివరి వరకు తననుతాను నిందించుకుంటూ మాట్లాడుతున్నారు యోబుగారు! అయితే ముఖ్యమైన మాటలు మాటలు మాత్రమే ధ్యానం చేసుకుందాం!

 

 16 వ వచనంలో తాను తల్లిగర్భములోనే పుట్టకుండా గర్భస్రావమై పోయి చనిపోయిన పిండములా ఉంటే బాగున్ను అనియు, ఇంకా వెలుగుచూడకుండా చనిపోయిన పిండము వలె చనిపోతే బాగుణ్ణు అని తలపోస్తున్నారు! అలాగైతే 17 వ వచనంలో చెబుతున్నారు ఆ పరిస్తితిలో దుర్మార్గులు ఇక తనను ఎప్పుడు శ్రమ పరిచే అవకాశమే లేదు, బలహీనులై అలసిపోయిన వారు విశ్రాంతిగా ఉంటారు

 

 19 వ వచనంలో ఆ పాతాళంలో లేక ఆత్మల లోకంలో అలపులేమి ఘనులేమి అందరూ అక్కడ ఉన్నారు దాసులు బానిసలు కూడా తమ యజమానులనుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు అంటున్నారు! అవును కదా! ఇక్కడ దాసులుగా బానిసలుగా ఉన్నవారు ఆ పాతాళంలో లేక పరదైసులో, ఆత్మలలోకంలో తమ బాధల నుండి విముక్తి పొంది ఉన్నారు కదా! ఆ లోకంలో అనగా చనిపోయిన తర్వాత తన యజమాని మరియు తాను ఒకే లోకంలో ఉంటే ఇద్దరు ఒకే స్తితిలో ఉంటారు! ఇక్కడైతే బాస్ అనియు, మేనేజర్ లేక ఓనర్ అని ఉంటుంది. అక్కడ అందరూ సమానమే! ఇక్కడే పోస్ట్ లు పదవులు అధికారాలు ఉంటాయి! అక్కడ అందరూ సమానమే! అందుకే కదా ధనవంతుడు లాజరు ఉపమానంలో ధనవంతుడు తండ్రివైన అబ్రాహామా! నేను దాహంతో బాధపడుతున్నాను- లాజరును నా దగ్గరకు నీటితో పంపించండి అంటే అది కుదరదు అని చెప్పారు దేవుడు! ఆ ధనవంతుడు పాతాళంలో కూడా లాజరుతో సేవలు చేయించుకోవాలని అనుకున్నాడు గాని అది కుదరదురా అబ్బాయ్ అని చెప్పారు దేవుడు!

 

ఇక ఈరోజు మనం ధ్యానం చేసే ముఖ్యమైన మాట 20 వ వచనంలో యోబు గారు అంటున్నారు:

 20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల? దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

21 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.

 

ఇక్కడ దుర్దశ అనగా కష్టాలలో కడగళ్ళలో ఉన్నవారు ఎందుకు బ్రతకడం? నిరాశ నిష్ప్రహ లో ఉన్నవారి ప్రాణము కలిగి ఉండటం ఎందుకు చనిపోతే మంచిది కదా? దేవుడు ఎందుకు వారిని బ్రతికించి ఉంచుతున్నారు అంటు బాధపడుతున్నారు!

 

యోబు వేసిన ఈ ప్రశ్న మానవ చరిత్ర ఆరంభాల నుంచీ మనుషులను కలత పెడుతున్నది. ప్రశ్న ఏమిటంటే జీవితం బాధలతో నిండి, ఒక ఆశాభావం గానీ గమ్యం గానీ లేనప్పుడు బ్రతికి ఉండి ప్రయోజనం ఏమిటి? యోబుకైతే జీవితం అనవసరంగా, అసాధ్యంగా అయిపోయింది. బైబిలు ఇతర భాగాల్లో, ముఖ్యంగా క్రొత్త నిబంధన  గ్రంథంలో దేవుని ప్రజలకు వచ్చే బాధలకు కారణాలు వెల్లడి అయ్యాయి ఇవేవీ తెలుసుకొనే అవకాశం యోబుకు లేదు. దేవుడు మనుషులతో వ్యవహరించే తీరు, దేవుని ప్రజల మీదికి వచ్చే బాధలకు కారణాలు చూసుకుంటే:

 ద్వితీయోపదేశకాండము 8:2

2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.

 

 ద్వితీయోపదేశకాండము 8:16 తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.

 

 కీర్తనల గ్రంథము 66:10-12,

10 దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11 నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12 నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

 సామెతలు 17:3, 3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.

 

రోమీయులకు 5:3-4, 3 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

4 శ్రమలయందును అతిశయపడుదము.

 

2 దినవృత్తాంతములు 12:7-10,

 హెబ్రీయులకు 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

 

హెబ్రీయులకు 12:5-11,

5 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

6 ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?

8 కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.

9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?

10 వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.

11 మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ;

 

యాకోబు 1:2-4,

2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

3 మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

4 మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

 

 1 పేతురు 1:6-7

6 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

గనుక ప్రియులారా! వీటిని  మనలో ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేము. యోబు గ్రంథంలో కూడా ఇందుకు కారణం ఏదీ కనబడడం లేదు. ఈ పుస్తకం చివర్లో దేవుడు తనను తాను సర్వ జ్ఞానం గల సర్వాధికారిగా ప్రత్యక్ష పరచుకుంటాడు అంతే. అయితే యధార్ధవంతులకు నీతిమంతులకు న్యాయవంతులకు ఎదురయ్యే కష్టాలు, పరీక్షల గురించి కొన్ని కారణాలు బైబిల్లో కనబడుతున్నాయి.

 

 ఈ కారణాలు మీదన ఇచ్చిన రిఫరెన్సుల ప్రకారం 

1). విశ్వాసికి ఉన్న నమ్మకం నిజమైనదని రుజువు చేసి దాన్ని శుద్ధీకరించి బలపరచేందుకు కష్టాలు వస్తాయి.

2). అవి విశ్వాసిలో ఓపిక అనే సుగుణాన్ని అభివృద్ధి చేస్తాయి.

3). విశ్వాసిలోని బద్ధకాన్ని వదలగొట్టి అంతరంగ పరిశోధన, ఆలోచన, ప్రార్థనలకు అతణ్ణి పురిగొల్పుతాయి.

4).  విశ్వాసిలో మిగిలిన స్వనీతి, గొప్పలు చెప్పుకోవడం, విలాసవంతమైన జీవన విధానాలపై దెబ్బ తీస్తాయి.

5). విశ్వాసులను ఇహలోక బంధకాలనుంచి వేరు చేసి దేవునిలోనే తమ సర్వస్వాన్ని వెదికేలా చేస్తాయి.

6). తమకోసం క్రీస్తు పడ్డ బాధలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తాయి.

7). వాటిని విశ్వాసి సహనంతో భరిస్తే అవి సైతాను నోరు మూయించి దేవునికి మహా ఘనతను కలిగిస్తాయి.

8). విశ్వాసి లక్షణాలను వెలికి తేవడానికి వారిని మరింత లోపరహితంగా చేసి క్రీస్తు పోలికలోకి మార్చడానికి ఉపయోగపడతాయి.

9) విశ్వాసికి ఎప్పటికీ నిలిచి ఉండే మహిమ భాగ్యాన్ని కలిగిస్తాయి (2 దినవృత్తాంతములు 4:17, )

 

కాబట్టి ప్రియ దేవుని బిడ్డా! నీవు కూడా యోబు గారిలా అనుకోకు! ఈ బ్రతుకు ఎందుకు? బ్రతికి ఏం సాధించాలి? అని అనుకోకు! నీతో ఉండువాడు నీ దేవుడైన యెహోవాయే! ఆయనే నీకు ఓదార్పు! అండ! కొండ!

దేవునిమీద సంపూర్ణ నమ్మకముంచి ముందుకు సాగిపోదాం!

దైవాశీస్సులు !

*యధార్ధవంతుడైన యోబు*

*25వ భాగం*

యోబు 3:21-26

21 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.

22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

23 మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.

 

    ప్రియులారా! మూడవ అధ్యాయంలో యోబుగారు తనను తాను నిందించు కుంటున్నట్లు చూసుకుంటున్నాము!

 

                (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇంకా ఈ వచనాలు చూసుకుంటే 21   వచనంలో వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది అంటున్నారు!

ఇక్కడ యోబుగారికి  చావు తరువాత ఏమి సంభవిస్తుందోనన్న భయం లేదు. అతని అంతరాత్మ  అతణ్ణి దేని గురించీ తప్పుపట్టలేదు. దేవుని ఎదుట నిలిచి తన జీవిత కాలమంతటి గురించీ సంజాయిషీ చెప్పుకోవడానికి అతనికేమీ భయం లేదు. దేవుని ప్రజల్లో అతి శ్రేష్ఠులైనవారు కూడా చావు గురించి అర్రులు చాచడం అరుదు కాదు (సంఖ్యాకాండము 11:15, ; 1 రాజులు 19:4, ; యిర్మియా 20:14-18, ; యోనా 4:8, ; ఫిలిప్పీయులకు 1:23, ). కానీ ఆత్మహత్య అన్నది కనీసం ఆలోచించడానికైనా తగని పాపం. ఆత్మహత్య హత్యతో సమానమే అని గ్రహించాలి!

 

తర్వాత వచనంలో సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. అనగా చనిపోతే అక్కడ చాలా సంతోషిస్తారు అంటున్నారు!

ఇక 23 వ వచనం కూడా 20 వ వచనం లాంటిదే! మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల? అనగా తన మార్గములనీ మూసుకుని పోయిన వారికి, చావు తప్ప మరో దారిలేదు అని నిర్ణయించుకొన్న వారికి , ఆ వ్యక్తి ఎక్కడికీ వెళ్ళకుండా దారులు అన్నీ మూసివేసిన వానికి వెలుగు లేక జీవం ఇవ్వబడుట ఏలా అంటున్నారు!

ఇక్కడ కంచె వేయడం అనేమాట యోబు 1:10, లో కూడా కనిపిస్తున్నది. అయితే అక్కడ దాని అర్థం పూర్తిగా వేరు. ఇక్కడ యోబుగారి  భావం ఏమిటంటే తన దుఃఖం నుండి కష్టం నుండీ బయటపడే మార్గం ఏదీ కనిపించడం లేదని. అతను పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. ఇరుకులో, చీకటిలో ఉన్నట్టు చిక్కుకుపోయినట్టు అనిపించింది

 

యోబు 19:8, నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు

 

విలాపవాక్యములు 3:5, నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు

ఇదీ అసలు అర్ధం ఇక్కడ!

 

ఇక తర్వాత వచనాలలో 24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

 

ఇక్కడ బోజనము చేద్దాం అని ఉంది గాని బాధకు తట్టుకోలేక నిట్టూర్పులు విడుస్తున్నారట యోబు గారు! తనకి వచ్చిన కష్టము దుఖము అంత ఘోరంగా ఉంది అన్నమాట!

 

ఇక ఏది రాకూడదు అని అనుకున్నానో అదే నాకు సంభవించింది అని వాపోతున్నారు! నాకు భయము పుట్టించినదే నా మీదికి వచ్చింది అంటున్నారు!

ఇక్కడ యోబుగారు  అంటున్నది బహుశా తన ఆస్తి, సంతానం, ఆరోగ్యం హఠాత్తుగా నాశనమవడం గురించి కానే కాదు యోబు 29:18-20 చూడండి. 18 అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.

19 నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.

20 నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.

 

అలా అనుకున్నారు గాని  ఈ భయం ఇక్కట్ల తరువాత అతనికి కలిగి ఉండవచ్చునేమో. అది దేవుని సహవాసాన్ని పూర్తిగా కోల్పోతాననీ దేవుని ముఖకాంతికి దూరమౌతాననీ అయి ఉండవచ్చు. అలాంటి స్థితిలో యోబులాంటి మనిషికి ఇది నిజంగా భయం గొలిపే ఆలోచన. ఇప్పుడది నెరవేరుతున్నదేమో అని యోబుగారు  భావిస్తున్నారు .

 

ఇక చివరి వచనంలో అంటున్నారు 26. నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.

దావీదు గారు కూడా తన జీవితకాలంలో చాలాసార్లు ఈ పరిస్తితుల గుండా వెళ్లారు! కీర్తన 102వ కీర్తన మొత్తం ఇలాగే బాధ పడ్డారు ఆయన! దయచేసి మొత్తం చదవండి ఒకసారి!  గాని నీ ధర్మశాస్త్రం ద్వారా, నీకట్టడల ద్వారా, నీ వాక్యం ద్వారా నాకు నెమ్మది కలుగుతుంది అని కీర్తన గ్రంధములో  మొత్తం చెబుతున్నారు!

 

ఒకవేళ నీవు కూడా ఇదే స్తితిలో ఉంటే నీకు ఆదరణ నెమ్మది ఆయనే! దేవుని మీద ఆనుకో!

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*26వ భాగం*

యోబు 4:16

1). దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

2 ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?

3 అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

4 నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.

5 అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

 

    ప్రియులారా! మూడవ అధ్యాయంలో యోబుగారు తనను తాను నిందించు కుంటున్నట్లు చూసుకున్నాము! ఇక నాల్గవ అధ్యాయం నుండి యోబుగారి స్నేహితులు మాట్లాడుతున్నారు!

 

మొదటి వచనంలో తేమానీయుడైన ఎలీఫజు అనే యోబుగారి స్నేహితుడు మాట్లాడుతున్నాడు!

యోబుగారి  మిత్రులు ముగ్గురిలోనూ ఎలీఫజు ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఇక్కడ.  కారణం మొదట మాట్లాడుతున్నది ఇతనే. అంతేగాక యోబు 5:27, లోమేముఅనేమాట వాడుతున్నాడు. అంటే మిగతా ఇద్దరు కూడా అలాంటి అభిప్రాయాలతోనే ఉన్నారన్నమాట. అంతేగాక మిగతా ఇద్దరూ మాట్లాడినదంతా కలిపినా ఎలీఫజు మాటలకన్నా తక్కువే.

ఇక ఎలీఫజు కోసం చూసుకుంటే ఆయన  స్వస్థలము  తేమాను! ఇది  జ్ఞానానికి, జ్ఞానులకు  ప్రసిద్ధికెక్కినది (ఓబద్యా 1:8-9, వచనాలు). తరువాత యోబు 32:6,

ఇక యోబు 34:2, లో ఎలీహు మాటలను బట్టి చూస్తే ఈ ముగ్గురు మిత్రులు వృద్ధులూ, జ్ఞానవంతులు. వీరు పలికిన మాటలు కొంత మట్టుకు మంచివే, సత్యమైనవే, గాని మాట్లాడినదంతా కాదు. వారు యోబును వారు అపార్థం చేసుకున్నారు. యోబుగారు పొందిన కష్టాలకు శ్రమలకు కారణం అతని పాపములు, అతిక్రమములుగా ఊహించారు/ భావించారు! అతని సమస్యకు పరిష్కారం గాని, అతని మనసుకు ఊరట గాని ఇవ్వలేకపోయారు. ఈ ముగ్గురి మాటల్లో ఏవి మంచివో, ఏవి పొరపాటో గ్రహించాలంటే మనకు కొంత జ్ఞానం, వివేచన అవసరం. నిజానికి వారు ఊరట నిచ్చినది చాలా తక్కువ అయితే నొప్పించిన మాటలే అనేకము కనిపిస్తాయి ఈ గ్రంధంలో!

 

ఇక రెండో వచనంలో అంటున్నాడు ఈయన- ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?

ఎలీఫజు తన మాటలను చాలా మర్యాద పూర్వకంగా మొదలు పెట్టాడు. యోబు పడే యాతన అంతా చూస్తూ ఉన్నాడు. గనుక తానింకా దాన్ని పెంచదలచుకోలేదు. అయితే కొన్ని మాటలు మాత్రం తప్పకుండా చెప్పాలనుకొన్నాడు. అవి యోబును బాధించినా సరే. ఎలీఫజు త్వరలోనే యోబు యోగ్యత భక్తిశ్రద్ధలపై తనకు గల అనుమానాలను వెల్లడి చేశాడు. యోబు ఇతరులకు బోధిస్తాడు గాని తనకు తాను బోధించుకోలేడు అంటున్నాడు. యోబుగారి  భక్తే నిజమైతే అతను నిరీక్షణ/విశ్వాసం  వదిలేసి నిబ్బరాన్ని కోల్పోయి ఎందుకుండాలి? అయితే యోబుగారిది కపట భక్తి అని ఇంకా అనలేదు. ముందు ముందు అది అన్నాడు. (యోబు 15:4-6, ; యోబు 22:4-6, ). ఈ సందేహం మట్టుకు ఇప్పటికి ఎలీఫజు మనసులో ఉన్నట్టుంది.

 

ఇక మూడవ వచనంలో ఇంకా అంటున్నాడు

3 అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

4 నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.

చూడండి ఏమంటున్నాడో ఇతడు: అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు! జాగ్రత్తగా గమనించాలి ఈ మాటను: బుద్ధి నేర్పినవాడవు అంటున్నాడు ఇతడు, బుద్ధి చెప్పిన వాడవు అనడం లేదు! ఇక్కడ నేర్పడం అనగా మొదట తాను నీతిగా బ్రతికి చూపిస్తే, మాదిరి నేర్పితేనే గాని ఇతరులు నేర్చుకోలేరు! దీనిని బట్టి మొదట తాను నీతియుక్తమైన జీవితం, బుద్ధి కలిగిన జీవితం కలిగి- ఇతరులకు ఆ విధముగానే జీవించమని నేర్పించారు! ఈ క్రమంలో అవసరమైతే దండించి అయినా వారికి బుద్ధి నేర్పించారు అని అర్ధమవుతుంది!

 

ఇక తర్వాత బలహీనమైన చేతులను నీవు బలపరచితివి అనగా దిక్కులేని వారిని ఆదరించి, ఇబ్బందులు గలవారిని సహాయం చేసినట్లు ధన సహాయం, మాట సహాయం చేసినట్లు అర్ధమవుతుంది మనకు! ఇంతా దెప్పి పెట్టిన మనిషి కూడా ఆయన చేసిన గొప్ప మంచి పనులను అభినందించకుండా ఉండలేకపోతున్నాడు!

 

ఇక నాలుగో వచనంలో నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొని ఉండెను ఇంకా క్రుంగి పోయిన వారిని నీవు బలపరిచావు! ఎంత గొప్ప మనసో కదా!

తొట్రిల్లు వారిని ఆదుకున్నారట ఇంకా క్రుంగిపోయిన వారిని బలపరిచారు! నిజంగా బైబిల్ గ్రంధంలో ఈ విధంగా చేసేది మొదటగా దేవుడు! రెండు దేవుని వాక్యము! యోబుగారికి పరిపూర్ణంగా వాక్యం తెలియక పోయినా తన మనస్సాక్షి ధర్మశాస్త్రంగా పనిచేస్తూ ఇలాంటి మంచి పనులు చేశారట!

 

ప్రియ దేవుని బిడ్డా! నీకు ఇలాంటి గొప్ప మంచి పనులు చేసే బుద్ధి ఉందా? యోబు గారి గురించి తన స్నేహితులు దెప్పి పొడుస్తున్నా ఆయన చేసిన మంచి పనులను అభినందించకుండ ఉండలేక పోయారు! నా శత్రువుల ఎదుట నీవు నాకు బోజనము సిద్దపరచి ఉన్నావు అని బైబిల్ సెలవిస్తుంది! తనను మాటలతో హింసించే వారితోనే సెహబాస్ అని చెప్పించ గలిగేవారు నీ దేవుడు! అంతేకాక నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారు దేవుడు! ఇది బైబిల్ చెబుతుంది!

అటువంటి జీవితం దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*27వ భాగం*

యోబు 4:58

5 అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

7 జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?

8 నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.

 

    ప్రియులారా! నాల్గవ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! ఈ అధ్యాయంలో ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు!

ఇక అయిదో వచనంలో అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఖ పడుతున్నావు అది అనగా శ్రమ తగులగా నీవు కలవర పడుతున్నావు అంటూ దెప్పుతున్నాడు!

నీవు ఎంతోమందిని వారి ఇబ్బంధులలో ఇరుకులలో బాధలలో ఆదుకున్నావు ఆదరించావు! అలాంటి బాధ నీకే వస్తే నీవు ధైర్యంగా ఉండటం మానేసి నీవు దుఖపడుతున్నావు కలవర పడుతున్నావు ఎందుకు అంటూ గేలి చేస్తున్నాడు!

 

ఇంకా తెగించి అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అంటూ ఎగతాళి చేస్తున్నాడు! నీ యధార్ధ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కావడం లేదా ఇప్పుడు అంటున్నాడు!

ఇక్కడ ఈ ఎలీఫజు ఎగతాళి చేస్తున్నా గాని విశ్వాసులకు పనికొచ్చే అమూల్యమైన సత్యాలు చెబుతున్నాడు:

మన భక్తి మనకు ధైర్యము పుట్టించే విధంగా ఉండాలి! లేక నీవు చేసే నిజమైన భక్తి నీకు నీమీద నమ్మకము మరియు దేవుడిచ్చే ధైర్యము పుట్టిస్తుంది! ఇంకా నీయొక్క యధార్ధ ప్రవర్తన నీ నిరీక్షణకు నీ విశ్వాసమునకు ఆధారంగా ఉంటుంది అంటూ ఆత్మీయ సత్యాలు చెబుతున్నారు!

ప్రియ దేవుని బిడ్డా! ఈ రోజు నీకు ధైర్యము ఆధరణ నిరీక్షణ నీ భక్తి ద్వారా కలుగుతుంది అని గ్రహించగలరు!!!

 

ఇక 7వ వచనంలో మరో విధంగా ఆయనను నిందిస్తున్నాడు 

7 జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడు ఎప్పుడైన నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?

8 నేను చూచినంతవరకు అక్రమమును దున్ని, కీడును విత్తువారు దానినే కోయుదురు.

 

ఇక్కడ ఈ వచనాలలో అంటున్నాడు ఈయన నిరపరాది ఎప్పుడు నశించి పోడు యధార్ధంగా నడిచేవాడు ఎప్పుడు నాశనమైపోరు! అయితే ఆక్రమము చేసేవాడు ఆక్రమాన్ని దున్ని కీడును విత్తేవారు కీడును కోస్తారు! అనగా ఇక్కడ అంటున్నాడు- నీవు మంచివాడవు కావు! మంచివాడుగా నటించావు గాని దేవుడు నీకు తగిన శాస్తి చేశాడు అంటున్నాడు!

 

లోక పరిపాలనలో దేవుడు ఒక నియమం అనుసరిస్తాడని ఎలీఫజు నమ్మకం. అతను అనుకొన్న ఆ నియమమేమంటే దేవుడు గొప్ప విపత్తులను పంపిస్తున్నాడంటే ఆ విపత్తులను అనుభవించేవారు జరిగించిన గొప్ప దోషాల కారణంగానే. యోబు పదిమంది సంతానం నిర్దోషులూ యథార్థవంతులూ కారు, అందుకే వారు నాశనమయ్యారని ఎలీఫజు అభిప్రాయం. ప్రస్తుతానికి యోబు గురించి అతని ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించడం లేదు. సందేహానికి ఇంకా తావు ఉంది. ఎలీఫజు అభిప్రాయం ప్రకారం యోబు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి నాశనానికి పాత్రుడయ్యేటంతగా అతడు పాపం చేసి ఉండకపోవచ్చు. ఈ విషయంలో ఎలీఫజు అనుకొన్న నియమం పూర్తిగా వాస్తవమేనా? ఎంతమాత్రం కాదు. కొన్ని సార్లు దేవుడు దుర్మార్గుల మీదికి విపత్తులు పంపి వారిని నాశనం చేస్తాడన్నది సత్యమే (ఆదికాండము 6:5-7, ; ఆదికాండము 19:24-25, ; 2 దినవృత్తాంతములు 36:15-16, మొ।।).

అయితే తుఫాను, భూకంపాలు, యుద్ధాలు మొదలైన విపత్కర పరిస్థితుల్లో కొన్ని సార్లు నిర్దోషులు, న్యాయవంతులు కూడా, దోషులు, దుష్టులతో కలిసి మరణిస్తారు. అలానే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు మంచివారికీ చెడ్డవారికీ కూడా వాటిల్లుతాయి. ఒక్కోసారి నిజంగానే న్యాయవంతులకంటే దుర్మార్గులే తక్కువ కష్టాలు అనుభవించి వారి వృద్ధాప్యంలో ప్రశాంతంగా చనిపోవడం కనిపిస్తుంది (యోబు 21:7-13, లో యోబు మాటలు చూడండి).

 

8 నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.

క్రింది రిఫరెన్సులు చూడండి:

సామెతలు 22:8, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.

 

హోషేయ 10:13, నీ ప్రవర్తన నాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధమునకు ఫలము పొందియున్నారు.

 

 గలతియులకు 6:7, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.

 

నిజానికి పై రిఫరెన్సులు భావము నిజమే! గాని యోబుగారి విషయంలో మాత్రము కాదు! యోబు గారు ఏ తప్పు చేయకపోయినా దేవుడు- సాతాను గాడు వేసుకున్న పందెములో పావుగా మారినందువలనే ఈ కష్టాలు కడగల్లు యోబుగారికి వచ్చాయి!

 

కాబట్టి ప్రియ సహోదరుడా/ సహోదరి! మొదటగా ఏమీ పూర్తిగా తెలియకుండా ఎవరిమీద అభాండాలు వేయకు!

రెండవదిగా నీకు వచ్చే కష్టాలకు నీ తప్పులే కారణం కాకపోవచ్చు, అంతేకాకుండా ఇతరులకు వచ్చే కష్టాలకు కూడా వారు చేసిన పాపాలు కారణం కాకపోవచ్చు! దేవుని ఉద్దేశం నీకు తెలియదు కాబట్టి ఇతరులకు కష్టాలు కలిగినప్పుడు తీర్పు తీర్చకుండా వారి ఆదరణ కోసం సహాయం కోసం ప్రార్ధించు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*28వ భాగం*

యోబు 4:916 

9 దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.

10 సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును.

11 ఎర లేనందున ఆడుసింహము నశించును సింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.

12 నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.

13 గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

14 భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.

15 ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను.

16 అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగాదేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

 

    ప్రియులారా! నాల్గవ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! ఈ అధ్యాయంలో ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు!

 

ఇక 9  వచనంలో అంటున్నారు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.

10 సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.‌ కొదమ సింహముల కోరలును విరిగిపోవును.

 

ఈ వచనం చూస్తే ఒక మాట గుర్తుకొస్తుంది! కీర్తన 104 వ అధ్యాయంలో దావీదు గారు రాస్తున్నారు:

27 తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి

28 నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును.

29 నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.

30 నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.

చూడండి సృష్టిలో ఉన్న జీవరాశులు జంతువులు చెట్లు చివరకు మనిషి కూడా దేవుడు తగిన కాలమున వాటిని పోషిస్తారు అని ఎదురు చూస్తున్నాయి. దేవుడు పెట్టినప్పుడు ఈ జీవరాశులు తిని తృప్తి పరచబడుతున్నాయి అయితే దేవుడు తన ముఖము మరుగు చేసుకుంటే ఇవన్నీ కలతపడతాయి! దేవుడు వాటి ఊపిరి ఆపేస్తే అవన్నీ ప్రాణాలు విడిచి మంటిపాలు అయిపోతాయి!

 

ఇక్కడ ఎలీఫజు కూడా అలాగే అంటున్నాడు: దేవుడు తన ఊపిరి బలంగా ఊడితే శత్రువులు దేవునికి ఇష్టం లేనివారు నశించి పోతారు ఆయన కోపాగ్ని వలన వారు లేక పోతారు అంటున్నారు!

 

యెషయా 11:4

4 కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

 

యెషయా 30:33

33 పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

 

2 థెస్సలొనీకయులకు 2:8

8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

 

ఇక 12 వ వచనం నుండి దేవుడు నరులతో మాట్లాడే మరో విధానం చెబుతున్నారు 12 నా కొకమాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.

13 గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

14 భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.

భయం గొలిపే ఈ నిగూఢమైన అనుభవం ద్వారా దేవుడు తనకో సందేశం పంపాడని ఎలీఫజు నమ్మకం. ఆ సందేశం యోబుకు అతికినట్టుగా సరిపోయిందని ఎలీఫజు అంటున్నాడు. కానీ ఇది సరి కాదు. ఒక మనిషి తాను దేవునివల్ల ప్రేరణ పొందానని అనుకున్నంత మాత్రాన అది నిజమైపోదు.

 

గాడనిద్ర కలిగే సమయంలో దేవుడు కలల ద్వారా మనతో మాట్లాడతారు అట! వెంటనే భయము వణుకు పుట్టింది నాకు అంటున్నాడు! ఇలా గాఢ  నిద్రలో ఉన్నప్పుడు తనకు సంభవించబోయే సంగతులు అప్పుడప్పుడు కలల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు దేవుడు! చూపిస్తూ ఉంటారు! అవి మనకు అలారం వలె పనిచేయాలి! మన చెడుగును తొలిగించు కొని ఆ పాపము నుండి వైదొలిగి నప్పుడు మనం బ్రతుకుతాము!!!

అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

*యధార్ధవంతుడైన యోబు*

*29వ భాగం*

యోబు 4:1521 

15 ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను.

16 అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

17 తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?

18 ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.

19 జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

20 ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

21 వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధి కలుగకయే మృతినొందుదురు.ఆలాగుననే జరుగుచున్నది గదా.

 

    ప్రియులారా! నాల్గవ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! ఈ అధ్యాయంలో ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు!

ఇక 16  వచనంలో  అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

17 తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?

ఇక్కడ ఈ వచనాలలో దేవుడు మానవులతో మాట్లాడే విధానం కోసం చెబుతున్నాడు! ఒక్కోసారి తన మెల్లని చల్లని స్వరముతో లేక అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటారు దేవుడు! ఉండుండి ఒక్కసారి క్లిక్ అవుతుంది మానవుల హృదయంలో! ఇలానే తనతో ఒక దేవుని మాట వినబడింది అట ఏమిటంటే దేవుని సన్నిధిలో మర్త్యులు అనగా మాంస యుక్తమైన దేహంతో ఉన్న వ్యక్తి లేక శాశ్వతుడు కాక ఒకరోజు చనిపోయే వ్యక్తి నీతిమంతులు అవుతారా? తనను సృజించిన వాని సన్నిధిలో నరులు పవిత్రులు అవుతారా??

 

ఎలీఫజు యోబుకు చెప్పదలచుకున్నది ఇది యోబుతో సహా మనుషులంతా బలహీనులు, పాపాత్ములు. చేసిన అపరాధాలకు శిక్ష వచ్చినప్పుడు ఎవరూ బిత్తరపోకూడదు లేక తన పక్షంగా తాను వాదించుకునేందుకు ప్రయత్నం చెయ్యకూడదు (యోబు 5:1, ). ఎలీఫజు అంటున్న మాటల్లోని అంతరార్థం ఏమిటంటే యోబుకూ అతని కుటుంబానికీ సంభవించినదంతా వారు చేసిన పాపాల మూలంగానే జరిగింది . యోబు మొదటి సారి నోరు తెరిచినప్పుడే (3వ అధ్యాయం) తనకు జరిగినదాన్ని గురించి ఆవేశపడి తనకు దేవుడు చేసినదాన్ని బట్టి ఫిర్యాదు చేయకుండా తన పాపాలను ఒప్పుకొని దేవుని దయను అర్థించవలసింది అని ఎలీఫజు అభిప్రాయం ఇక్కడ . మనుషులంతా పాపాత్ములే, దుష్టులను దేవుడు శిక్షిస్తాడు అన్నంత వరకు ఎలీఫజు మాటలు నిజమే. బైబిల్లోని అనేక వచనాలు దీన్నే నేర్పుతున్నాయి. అయితే యోబుకు జరిగిన విషయం అతని పాపాల మూలంగా దేవుడు విధించిన శిక్ష అనుకోవడంలో మాత్రం ఎలీఫజు పొరపాటు చేశాడు. యోబు 9:2, ; వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

యోబు 25:4, ; నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

 అయితే వాస్తవంగా ఆలోచిస్తే ఒకరు దేవుని దృష్టికి నీతిమంతునిగా కనబడ్డారు! ఆదికాండము 15:6, ; అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

అయితే క్రొత్త నిబంధనలో పౌలుగారు ఏమి చెబుతున్నారు అంటే

రోమీయులకు 3:21-26, ;

 21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

 రోమీయులకు 4:5-8, ; 5 పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

6 ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.

7 ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

8 ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,

 

ఎఫెసీయులకు 1:4, . ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు,

 

తీతుకు 3:5

మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

తీతుకు 3:6

మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,

తీతుకు 3:7

నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.

 

మనిషి తన ఎదుట నిర్దోషీ, పవిత్రుడూ కావడానికి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మార్గాన్ని సిద్ధం చేశాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారియందు విశ్వాస ముంచడం ద్వారా మనిషి నీతిమంతుడిగా మార్చబడతాడు! కాబట్టి మీద ఎలీఫజు వేసిన ప్రశ్నకు జవాబు క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది! దానికి జవాబు అవును! అయితే అది ఎప్పుడు అవును అవుతుంది అంటే ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి తన పాపములను వదిలి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొందుకుని ఆత్మను పొందుకుని క్రీస్తునందు విశ్వాస ముంచడం వలన ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడతాడు!

 

ఇక తర్వాత వచనాలలో 18 ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.

19 జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

 

ఈ వచనాలలో ముఖ్యమైన మర్మము ఏమిటంటే ఆయన తన సేవకులను నమ్మడం లేదు వారిలో కూడా తప్పులు వెదుకుచున్నాడు కదా అలాంటప్పుడు మట్టి ఇంటిలో నివశించు వారియందు మంటిలో పుట్టిన వారియందు కూడా తప్పులు వెదుకుతారు కదా అంటున్నాడు! అనగా దేవదూతలలోనే ఆయన వారి తప్పులను వెదుకుతున్నాడు మట్టిలో పుట్టిన మట్టి నుండి తీయబడిన మనిషి, ఒకరోజు మరలా మంటికి అప్పగించబోయే మనిషిలో కూడా తప్పులు వెదుకుతారు అంటున్నాడు ఇక్కడ!

 

ఇంకా 15 వ అధ్యాయంలో కూడా ఇదే అభిప్రాయం చూపెడుతున్నారు 14 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమి్మకయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16 అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లుత్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అప విత్రుడు గదా

 

25 వ అధ్యాయంలో ఏమి చెబుతున్నారో చూద్దాం! 4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు.

6 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

 

కాబట్టి మొత్తం పై వచనాలన్నీ కలిపి చూసుకుంటే నిజానికి మానవుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు! అయితే అదే వ్యక్తి దేవుని పాదాలు పట్టుకుని దేవుని శరణు వేడితే తన పాపములకు నిజముగా పశ్చాత్తాపం పడితే , దేవుడు తన కుమారుని రక్తంలో ఆ వ్యక్తిని కడిగి ప్రతి పాపము నుండి పరిశుద్ధ పరచి నీతిమంతునిగా మార్చగలరు!

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! మనము నిజానికి ఎవరమో గ్రహించి దేవుడు ఎవరో నిజముగా గ్రహించి ఆయనలో సాగితే ఆయనయందు విశ్వాసమందు కొనసాగితే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధునిగా పవిత్రులముగా నిర్ధోషులుగా చేసి నీతిమంతులుగా మార్చగలరు!

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*30వ భాగం*

యోబు 5:15 

1 నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?

2 దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

3 మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమని కనుగొంటిని.

4 అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు గుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.

5 ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురు బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి

 

    ప్రియులారా! నాల్గవ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 5   అధ్యాయంలో కూడా ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు!

 

ఇంకా యోబుగారిని తప్పు పడుతూ అంటున్నాడు నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?

ఇక్కడ ఎలీఫజు యొక్క భావము బహుశా దేవుని దూతలలో ఎవడు నీ తరుపున మాట్లాడగలడు?

ఎలీఫజు అర్ధం ఇదై ఉండవచ్చు తాను పలికిన మాటల్లో సత్యం ఎంత తేటగా ఉందంటే ఎవరూ దాన్ని అనగా ఎలీఫజు 4 వ అధ్యాయంలో చెప్పిన మాటలను  వ్యతిరేకించడానికి ప్రయత్నించకూడదని ఎలీఫజు ఉద్దేశం. యోబుగారు  దీనికి అంగీకరించక తన వాదానికి మద్దతుగా మనుషులను గానీ దేవదూతలను గానీ తెచ్చుకుందామనుకుంటే ఎవరూ అతని పక్షంగా మాట్లాడరని ఎలీఫజు అభిప్రాయపడుతున్నాడు!

 

తర్వాత వచనంలో అంటున్నాడు దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు

 

ఇక్కడ ఇంకా తెగించి ఎలీఫజు అంటున్నాడు తన కష్టాలు, విపత్తుల మూలంగా యోబు కోపంతో మండిపడినా, క్షేమంగా ఉన్నవారిని చూచి అసూయపడినా అదంతా యోబుగారి  నాశనానికే దారి తీస్తుందని ఎలీఫజు భావం.

అంతటితో ఆగకుండా తర్వాత వచనాలలో అంటున్నాడు 3 మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని.

4 అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు గుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.

5 ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురు బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి

 

మూడో వచనంలో మూడుడు అంటున్నాడు కదా ఆ మూడుని స్థానంలో యోబు ఉన్నారని ఎలీఫజు నమ్మకం! యోబుమీదికి వచ్చిన విపత్తుల్లాంటి ఇబ్బందులనే ఎలీఫజు వర్ణిస్తున్నాడు అంటే, 3వ వచనంలో తాను చెప్పిన మూర్ఖుడి పరిస్థితే ప్రస్తుతం యోబు పరిస్థితి అని కూడా అనుకొన్నట్టు కనిపిస్తుంది. యోబు తనకంటే యోగ్యుడు అని ఎలీఫజుకు ఎంతమాత్రం తెలిసినట్టు లేదు (యోబు 1:8, ). ఇదంతా యోబుగారు ఓపికగా వినడం ఆశ్చర్యమే.

 

మూడుడు మొదట చిగురిస్తాడు తర్వాత తన శాపం వలన నశించిపోతాడు అతని పిల్లలు కూడా సంరక్షణ లేక అనాదలై పోతారు ఆకలితో అలమటించి పోతారు అంటున్నాడు! అయితే దీనికి బైబిల్ గ్రంధం సెలవిస్తుంది సామెతలు 20: 7 యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

 

కీర్తన 37: 25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.

26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

 

ఇదీ నిజానికి నీతిమంతుల పిల్లలకు యధార్ధవంతుల పిల్లలను దేవుడు దీవించే విధానం! వారి పిల్లలు ఎప్పుడూ భిక్షమెత్తుకోరు ! అయితే ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యధార్ధవంతుల పిల్లలు ఆ యధార్ధవంతుడు బ్రతికుండగా బహుశా ఆశీర్వదించ బడరు తండ్రితో పాటుగా కష్టాలను కడగళ్లను అనుభవిస్తారు గాని ఆ యధార్ధవంతుడు చనిపోయాక ఆ ఆశీర్వాదానికి పాత్రులై నిండారులుగా ఆశీర్వదించ బడతారు అని అర్ధం కావచ్చును!

 

ప్రియమైన దేవుని బిడ్డా! ఒకవేళ నీ యధార్ధతను బట్టి నీవు హింసించ బడుతున్నావా? హేళన చేయబడుతున్నావా? కష్టాలు బాధలు అనుభవిస్తున్నావా? భయపడకు! అంతటి గొప్ప నీతిమంతుడు యోబు గారిని ప్రాణ స్నేహితులే ఘోరంగా దూషించారు గాని దేవుడు చేయి విడువలేదు! నీవు ఈ మాటలద్వారా ఆదరించబడి విశ్వాసములో బలముగా సాగిపో!

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*31వ భాగం*

యోబు 5:610

6 శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు.

7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.

8 అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.

9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

10 ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

 

    ప్రియులారా! 5  అధ్యాయంలో కూడా ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు! అయితే ఈ అధ్యాయం మొత్తం ఆయన యోబుగారి మీద నిష్టూరాలు అబాండాలు వేస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వచనాలు మాత్రం చూసుకుందాం!

 

ఇంకా యోబుగారిని తప్పు పడుతూ అంటున్నాడు 6 శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు.

7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.

శ్రమ దూలిలోనుండి పుట్టదు బాధ భూమిలోనుండి మొలవదు అనడానికి కారణం ఎలీఫజు భావం ఏమిటంటే విపత్తులనేవి ప్రకృతి సిద్ధమైనవి కావు, వాటంతట అవి రావు. అవి ఒక ఆధ్యాత్మిక నియమంవల్ల తప్పనిసరిగా కలిగే ఫలితాలు. మనిషి జన్మపాపం వల్లా, చేసే పాప కార్యాల వల్లా కష్టాలు కలుగుతాయి. దేవుడు పాపాన్నీ బాధలనూ కలిపి కట్టాడు. ఈ క్రమాన్ని ఎవరూ తప్పించుకోలేరు. చేసిన పాపం ఊరికనే పోదు! ఎవని కర్మఫలం వాడు అనుభవించాలి అంటున్నాడు!

 

తర్వాత వచనంలో నిప్పురవ్వలు మీదకు ఎగిరినట్లు మనుష్యులు శ్రమలు అనుభవించడానికే పుడుతున్నారు గాని ఎంజాయ్ చేయడానికి కాదు అంటున్నాడు!

 

ఇలా ఎద్దేవా చేసి తర్వాత వచనంలో తనకుతాను పొగుడుకుంటున్నాడు ఏమని అంటే అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను దేవునికే నా వ్యాజ్యము అప్పగిస్తాను అంటున్నాడు!

అంటే తానే గనుక యోబు పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేవాడో చెప్తున్నాడు. అంటే యోబు అలా చెయ్యడం లేదు అని నిరసన అన్నమాట! అనగా తానే ఈ స్తితిలో ఉంటే మూడవ అధ్యాయంలో యోబుగారు అన్నట్లు అనకుండా దేవునిమీద భారం వేసి వదిలేస్తాను అంటున్నాడు!

 

ఇక తర్వాత రెండు వచనాలు దేవుని పక్షాన వాదించుచున్నట్లు ఫోజు కొడుతున్నాడు ఎలీఫజు : 9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

10 ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

అవును ఈ విషయాలు తెలియని వారు ఎవరు? యోబుగారికి కూడా ఈ విషయాలు తెలుసు! మనుషుల పట్ల దేవుని వ్యవహారాలను ఎలీఫజు చిత్రిస్తున్నాడు. తద్వారా యోబు దేవునివైపు తిరిగి కరుణించమని ప్రార్థిస్తాడని ఎలీఫజు ఆశ. ఇక్కడ దేవుని గురించి చాలా ఉన్నతమైన భావాలను వెలిబుచ్చుతున్నాడు దేవుడు అద్భుతాలు చేసేవాడు కాబట్టి యోబు కోల్పోయిన ఆస్తిపాస్తులన్నిటినీ అద్భుతమైన రీతిలో తిరిగి సమకూర్చగలడు 9 ; తన సృష్టి పట్ల దయగల సర్వాధికారి ( 10); మనుషుల వ్యవహారాల్లో న్యాయం జరిగిస్తాడు. యుక్తిపరులైన దుర్మార్గులను శిక్షించి వారిచేత పీడించబడేవారిని విడిపిస్తాడు (11-16).

 

ఇక భూమిమీద వర్షం కురిపించు వాడు దీనికోసం చూసుకుంటే బైబిల్ లో అనేకచోట్ల దేవుడు ఆకాశమునుండి వర్షమును కురిపించు వాడు అని వ్రాయబడి ఉంది! కీర్తన 147:

8 ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు

9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.

 

తర్వాత వచనంలో అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును అంటున్నాడు!

ఇదే అదే కీర్తనలో చెబుతున్నారు

3 గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.

6 యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.

 

సమూయేలు గారి తల్లి హన్నా గారు ప్రార్ధిస్తూ ప్రవచిస్తూ అంటున్నారు 1 సమూయేలు 2: 4 ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుదురు.

5 తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.

6 జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.

7 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము,లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.

9 తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడునుదుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

 

యేసుక్రీస్తు ప్రభులవారిని ఈ లోకములో కనిన మరియమ్మ గారు ఇలా అంటున్నారు లూకా 1: 51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

 

అవును దేవుడు అహంకారులను పడగొట్టి దీనులను లేవనెత్తు తారు! దీనులను ఆదరించు వాడు! నిన్ను నన్ను కూడా ఆదరించు వాడు ఆయన! కాబట్టి అహంకారమును వదిలేద్దాము! దీనత్వమును కరుణను నేర్చుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*32వ భాగం*

యోబు 5:1219

12 వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండఆయన వారి ఉపాయములను భంగపరచును

13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

14 పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమున వారు తడువులాడుదురు

15 బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండి ఆయన దరిద్రులను రక్షించును.

16 కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.

17 దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

18 ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.

19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

 

    ప్రియులారా! 5  అధ్యాయంలో కూడా ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు! అయితే ఈ అధ్యాయం మొత్తం ఆయన యోబుగారి మీద నిష్టూరాలు అబాండాలు వేస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వచనాలు మాత్రం చూసుకుందాం!

 

ఇక 1216 వచనాలలో యుక్తిపరులైన దుర్మార్గులను శిక్షించి వారిచేత పీడించబడేవారిని విడిపిస్తాడు అంటున్నారు!

ఇక ఈ వచనాలలో చూసుకుంటే దేవుడు యుక్తిపరుల పన్నాగాలను భంగ పరుస్తాడు ఈ అతి తెలివైన వాళ్ళు తమ ఆలోచనలను నెరవేర్చలేక పోతారు! దేవుడు జనాలను వారి కుయుక్తి లోనే పట్టుకుంటాడు! వంచకులు చేసే ఉపాయాలను ఆయన తారుమారు చేస్తాడు అంటున్నాడు! అవును- ఒకసారి రాజైన దావీదు గారిమీద అహీతోపేలు ఆలోచనను చెరపమని ప్రార్ధించినప్పుడు దేవుడు అహీతోపేలు చేసిన ఆలోచనను తారుమారు చేసినట్లు చూడగలము!

 2 సమూయేలు 15: 31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు: యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.

 

17:1 దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక

2 నేను అతనిమీద పడి అతని బెదరించినయెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను;

3 నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొనిపోయి యీ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా

4 ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.

 

23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.

 

దేవుడు దుష్టుల ఆలోచనలను తారుమారు చేయగలడు! హల్లెలూయ!!!

 

ఇంకా అంటున్నారు: పగలు వాళ్ళకు చీకటి ఎదురవుతుంది మధ్యాహ్నం పూట చీకటిలో తడుముకుంటారు వారి నోరు ఖడ్గం లాంటిది వారి బారినుండి దేవుడే దరిద్రులను తప్పిస్తారు బలాడ్యుల చేతినుండి బీదలను రక్షిస్తారు అంటున్నారు! సామెతల గ్రంధంలోనూ ఈ యోబు గ్రంధం లోనూ దీనికోసం విస్తారంగా వ్రాయబడింది!

కీర్తన 5:9 యిర్మీయా 5:16  రోమా 3:13  చూడండి!

 

ఇంకా అంటున్నాడు: దేవుడు ఇలా చేసి పేదలకు నిరీక్షణ ఆదరణ కలిగిస్తారు! అప్పుడు అక్రమము నోరుమూసుకుంటుంది అంటున్నాడు!

 

ఇక 17 వ వచనంలో అనుకోకుండా దేవుని పక్షంగా మంచిమాట చెబుతున్నాడు ఎలీఫజు: దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

ఈ వచనాల్లోని సత్యం సామెతలు 3:11-12, ; హెబ్రీయులకు 12:5-6, లో కనిపిస్తుంది. ఇది మనోహరమైన సత్యం. కానీ అప్పటి పరిస్థితుల్లో యోబుకు అవసరమైనది ఇది కాదు. ఎందుకంటే యోబు పడుతున్న బాధలు అతను చేసిన పాపాలకు శిక్షగా రాలేదు. ఇందులో దేవుని ముఖ్యోద్దేశమేమంటే యోబు యోగ్యతను రుజువు చేయడం, సైతాను నోరు మూయించడం. ఉపదేశకుడు చేసే ప్రసంగాలు వినేవాళ్ళ పరిస్థితులకు వర్తించకుంటే అవి ఎంత మంచివైనా ఏం లాభం?

 

సామెతలు 3:11-12

11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.

12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.

 

హెబ్రీయులకు 12:5-6

5 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

6 ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

 

ఇక తర్వాత వచనాలు కూడా ఎంతో ప్రియమైనవి ఆదరించు మాటలు!

18 ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.

19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

 

అవును దేవుడే గాయములు చేయువాడు! ఎందుకు గాయము చేస్తాడు అంటే నీ బ్రతుకు బాగోలేనప్పుడు రెండు దెబ్బలు కొట్టి గాయము చేసి మంచి మార్గమున లేక సన్మార్గము లోనికి నడిపించి ఆ తదుపరి ఆ గాయమును కట్టేవాడు కూడా ఆయనే!

 

కీర్తన 147:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కత్తువాడు ఆయనే!

 

యెషయా 30:26 యెహోవా తన జనుల గాయములను కత్తి వారి దెబ్బను బాగుచేయు దినమున..

 

 యిర్మీయా 30:17  అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యెహోవా వాక్కు!

 

కాబట్టి గాయము చేసేవాడు ఆయనే గాయమును కట్టేవాడు కూడా ఆయనే అని గ్రహించాలి!

 

ఇంకా 19 వ వచనంలో ఆరు బాధలు కలిగినా ఆయన నిన్ను తప్పిస్తాడు ఏడు కష్టాలు వచ్చినా నీకు హాని రాదు!

 

ఎలీఫజు అంటున్నాడు, యోబు గనుక దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తే దేవుడు అతణ్ణి కష్టాలనుండి తప్పిస్తాడు ( 19,20), అతని ఆస్తిని తిరిగి సమకూరుస్తాడు ( 22-24), అతను పోగొట్టుకున్న సంతతికి బదులుగా మరింతమంది పిల్లలను ఇస్తాడు ( 26), అతనికి తిరిగి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు ( 18,26).

అవును ఆయన పోగొట్టుకొనిన దానిని మరలా ఈయగలడు మన దేవుడు!

యోవేలు 2: 25 మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.

26 నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.

 

ఇది నీకు జరగాలంటే నీవు దేవుని మాట వినాలి! ఆయన మార్గములోనికి మరలా రావాలి!

మరి నీవు సిద్దమా?!!!!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*33వ భాగం*

యోబు 5:1927

19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

20 క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును.

21 నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.

22 పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.

23 ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు

24 నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.

25 మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.

26 వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు.

27 మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.

 

    ప్రియులారా! 5   అధ్యాయంలో కూడా ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేస్తున్నారు! అయితే ఈ అధ్యాయం మొత్తం ఆయన యోబుగారి మీద నిష్టూరాలు అబాండాలు వేస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వచనాలు మాత్రం చూసుకుందాం!

 

ఇక 19 వ వచనం నుండి చూసుకుంటే 19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

20 క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును.

 

యోబు గనుక దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తే దేవుడు అతణ్ణి కష్టాలనుండి తప్పిస్తాడు ( 19,20), అతని ఆస్తిని తిరిగి సమకూరుస్తాడు ( 22-24), అతను పోగొట్టుకున్న సంతతికి బదులుగా మరింతమంది పిల్లలను ఇస్తాడు ( 26), అతనికి తిరిగి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు ( 18,26).

 

ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నిన్ను తప్పిస్తారు ఎప్పుడు అంటే నీవు నీ తప్పులు ఒప్పుకుని దేవుని మీద భారం మోపితే నీ కష్టాల నుండి నిన్ను తప్పిస్తారు నీ కరువు కాటకాలు సంభవించి నప్పుడు నిన్ను చావునుండి తప్పిస్తారు, ఇంకా యుద్ధం వస్తే కత్తి నుండి మరణం నుండి తప్పిస్తారు అంటున్నాడు. అందుకే దావీదు గారు అంటున్నారు యెహోవా నాకొండ నాకోట నా ఆశ్రయదుర్ఘము వేటగాని ఊరి నుండి నన్ను తప్పిస్తారు అంటున్నారు!

కీర్తనలు 18: 1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.

2 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.

3 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.

4 మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను

5 పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

6 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.

7 అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.

8 ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను

14 ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.

16 ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

17 బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

18 ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను.

 

కాబట్టి మన నమ్మకాన్ని విశ్వాసాన్ని దేవునిమీదనే ఉంచాలి మనుష్యుల మీద కాదు!

 

ఇంకా నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.

అనగా దుష్టులు శత్రువులు వారి నోటి దురుసుతనంతో పలికే మాటల వలన కలిగే బాధ నుండి దేవుడు నిన్ను దాచుతారు! దౌర్జన్య కారుల నుండి కూడా ఆయన నిన్ను కాపాడుతారు అంటున్నాడు!

 

ఇంకా పొలంలో రాళ్ళు నీతో సఖ్యంగా ఉంటాయి అంటున్నాడు. పొలంలో రాళ్ళు నిబంధన చేయడం ఏమిటి? అనగా రాళ్ళ దెబ్బలనుండి కాపాడటమే కాకుండా ఆ రాళ్ళనుండి మంచి పంటలను పండించగలరు దేవుడు! ఇంకా అడవి మృగముల నుండి నిన్ను విడుదల చేస్తారు! అవి నీకు ఏ హానీయు చెయ్యవు!

 

ఇంకా మీ ప్రాంతంలో కరువు కలిగినా దౌర్జన్యం కలిగినా నీవు భయపడక చిరునవ్వుతో ఉంటావు అంటున్నాడు! గమనించాలి ఇవన్నీ నీవు దేవునితో సమాధాన పడితేనే కలుగుతాయి అంటున్నాడు!

 

ఇంకా నీ డేరాలో శాంతిభద్రతలు మెండుగా ఉంటాయి! అనగా నీ ఇంటి చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది గనుక నీ ఇల్లు ఎల్లప్పుడూ క్షమంగా ఉంటుంది. నీ ఇంట్లో నుండి ఏ సామాను ఎవడును ఎప్పుడు దొంగతనం చేయడు! నీవు ఇంట్లో పడుకున్నా లేక నీవు ప్రయాణంలో ఉన్నాగాని నీ ఇంట్లో నుండి ఏ వస్తువు దొంగల వలన అపహరించ బడదు అంటున్నాడు!

 

అంతేకాకుండా నీ నీవు సంతానాభివృద్ధి పొందుతావు ఇంకా చూసుకుంటే పంట పండాక పంట లేక ధాన్యం ఇంటికి ఎలా వస్తుందో అలాగే నీవు వయసు మీరిపోయాక అనగా పండు ముసలి తనంలో సమాధికి చేరుతావు అంటున్నాడు!

అలా జరగాలంటే నీవు దీర్ఘాష్మంతుడవునట్లు నీ తల్లిని తండ్రిని ఘనపరచమని వ్రాయబడింది. ఇది వాగ్ధానంతో కూడిన ఆజ్నలలో మొదటిది అంటున్నారు!

 

ఇక చివరి వచనంలో 27. మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది. ఇక్కడ చూసుకుంటే బిల్దదు, జోఫరుల తరుఫున కూడా ఎలీఫజు మాట్లాడాడు. యోబుకు ఆ పరిస్థితిలో విని, దాని ప్రకారం చెయ్యడానికి తగిన సత్యాన్ని తాను చెప్తున్నాడని ఎలీఫజుకు గట్టి నమ్మకం.

 

ఏదిఏమైనా ఇక్కడ ఎలీఫజు యోబు గారిని మాటలతో బాధిస్తున్నా బైబిల్ ను వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని కూడా వాడుకుని మనకు కావలసిన మంచి సత్యాలను వ్రాయించారు దేవుడు!

దేవునికే మహిమ కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*34వ భాగం*

యోబు 6:16

1). ఈమాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను

2 నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక.

3 ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.

4 సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.

5 అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకెవేయునా?

6 ఉప్పులేక యెవరైన రుచిలేని దాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?

 

    ప్రియులారా! 5   అధ్యాయంలో కూడా ఎలీఫజు అని యోబు గారి స్నేహితుడు ఆదరించే మాటలను చెప్పడానికి మొదలుపెట్టి ఆయన మీద నిష్టూరాలు వేశాడు!! అయితే దానికి జవాబుగా ఈ ఆరవ అధ్యాయంలో యోబుగారు మాట్లాడు చున్నారు! ఎలీఫజుకు ఇచ్చిన ఈ జవాబులో యోబుగారు  తాను 3వ అధ్యాయంలోని మాటలను ఎందుకు అన్నారో  వివరిస్తున్నారు . తాను తొందరపడి మాట్లాడానని ఒప్పుకొంటున్నారు . తన బాధలు అంత ఘోరమైనవి కాబట్టే తన మాటలు అదుపు తప్పినట్టుగా, అర్థం లేనివిగా, పిచ్చివాగుడులాగా ఉన్నాయి. తన పరిస్థితిని తన మిత్రులు అర్థం చేసుకుని తన విషయం అంత కఠినంగా ఆలోచించకుండా ఉండాలి (యోబు 6:26, ).

 

ఇక్కడ రెండో వచనంలో అంటున్నారు 2 నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక.

3 ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.

నా దుఖము చక్కగా తూచబడును గాక అని ఎందుకు అంటున్నారు అంటే తాను అనుభవిస్తున్న బాధలు కష్టాలు అలాగే ఉన్నాయి. దానికి తోడు ఆదరించడానికి వచ్చిన స్నేహితులు ఆదరించడం లేదు సరికదా మాటలతో గుచ్చిగుచ్చి పొడుస్తున్నారు అందుకే నా దుఖము చక్కగా తూచబడును గాక అవి త్రాసులో వేయబడును గాక అలాగు చేస్తే నాకు వచ్చిన విపత్తులు సముద్రపు ఇసుకకన్నా బరువుగా ఉంటాయి అంటున్నారు! ఈ కారణం వలననే నేను నిరర్ధక మైన మాటలు పలికాను అని ఒప్పుకుంటున్నారు ఇక్కడ యోబుగారు!

 

మనము కూడా బాధలలో అవమానాలలో ఫ్రస్టేశన్ లో ఎన్నో మాటలు అంటాము తర్వాత ఆలోచించి అవి ఎంత పొరపాటు మాటలో గ్రహించి పశ్చాత్తాపం పడతాము! యోబు గారు కూడా అలాగే పశ్చాత్తాపంతో అంటున్నారు!

 

ఇక నాలుగో వచనంలో ఇంకా తెగించి మాటలు పలుకుతున్నారు! నా కష్టాలకు దేవుడే కారణం అని తెగించి పలుకుతున్నారు! సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.

యోబుగారికి  తన విపత్తులు, దుఃఖం, దేహబాధలు దేవుడే గురిపెట్టి అతని మీదికి వదిలిన విషపు బాణాలలాగా ఉన్నాయి. ఆ బాణాలు గాయపడిన అతని దేహానికి, కల్లోలమైన అతని మనస్సుకూ ఇంకా గుచ్చుకునే ఉన్నాయి. తాను దేవునితో సఖ్యంగా ఉంటున్నానని, దేవుడు తనను దయ చూస్తున్నాడనీ ఇప్పటివరకు అనుకున్నాడు యోబు. ఇప్పుడు హఠాత్తుగా అకారణంగా దేవుడు తనపై యుద్ధం జరిగించినట్టుగా ఉంది. ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ యోబు, లేక అతని స్నేహితుల మాటల్లో ఈ ఇక్కట్లను యోబు మీదికి పంపినది సైతాను అన్న ఆలోచన చూచాయగానైనా కనిపించదు. వారి మాటల్లో దేవుడే యోబును శిక్షిస్తున్నాడని అతడూ, అతని మిత్రులూ నమ్మారు. ఉన్న తేడా ఒక్కటే. యోబు స్నేహితులేమో యోబు చేసిన కొన్ని పాపాల కారణంగా అతనికా విపత్తులు వచ్చాయని నమ్ముతున్నారు. యోబు గారు  సరైన కారణమేదీ లేకుండానే తాను శిక్ష అనుభవిస్తున్నానని నమ్ముతున్నాడు. మనుషులు అప్పుడప్పుడు తమకేదైనా విపత్తు వాటిల్లితే, దేవుడే తమకు విరోధి అయ్యాడని పొరపాటుగా భావించి తమ దుఃఖాన్ని ఎక్కువ చేసుకుంటారు. సైతాను వారికి వ్యతిరేకంగా చెలరేగినప్పుడు అది దేవుని కోపంగా భావిస్తారు. దేవుడు యోబును ఎంతగానో ప్రేమించాడు. అతణ్ణి అధికంగా దయ చూశాడు. అధికంగా దీవించబోతున్నాడు. అయితే ఇదంతా యోబుకు తెలియదు.

 

ఇంకా 5 వ వచనంలో అంటున్నారు 5 అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకెవేయునా?

6 ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?

ఇక్కడ అడవి గాడిద గడ్డిని చూసి ఓండ్ర పెడుతుందా?  వేరే విధంగా చెప్పాలంటే సరైన కారణం లేకుండా యోబుగారు  శోకించరు . అడవి గాడిదకు, లేక ఎద్దుకు కావలసినదేమిటి? ఆహారమే. యోబుకు కావలసినది తన బాధలకు ఏదో ఒక రకమైన సంజాయిషీ, వివరణ; కొంతయినా తన మనసుకూ హృదయానికీ ఊరట, ఆదరణ. అయితే అతని అవసరానికి సరిపోయి అతణ్ణి సంతృప్తిపరచే నాలుగు మెతుకుల సత్యం అతనికెక్కడా దొరకలేదు. ఆ కాలంలో ఇప్పుడున్న  బైబిలంతా యోబుగారి  దగ్గర ఉంటే యోబుగారు  ఎంత ఆనందపడేవాడో గదా. అయితే నేటి కాలంలో బాధల్లో ఉన్న అనేకమంది పరిపూర్ణ బైబిల్ చేతిలో ఉన్నాగాని  క్రైస్తవులు ఆ జ్ఞాన నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు!

 

ఆరవ వచనంలో ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా? అంటున్నారు! అనగా కారణం లేకుండా నొప్పి లేకుండా బాధ లేకుండా నేను ఆ విధంగా మాట్లాడను కదా! కాబట్టి నా బాధను వేదనను గుర్తించండి అంటున్నారు యోబు గారు! ఆరోజు యోబుగారి స్నేహితులు యోబుగారి బాధను గాని యోబుగారి భాధలకు కారణం గాని గ్రహించలేక పోయారు! నేడు మనదేవుడు మన సృష్టికర్త మన భాధలను అర్ధం చేసుకోగలరు! నేడే కన్నీటితో ఆయన పాదాలు పట్టుకో! నిన్ను ఓదార్చ గలడు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*35వ భాగం*

యోబు 6:714

7 నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.

8 ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక

9 దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక.

10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును

11 నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?

12 నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా?

13 నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.

14 క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.

 

    ప్రియులారా! ఏడవ అధ్యాయంలో ఎలీఫజు చేసిన ఆరోపణలకు యోబు గారు జవాబు చెబుతున్నారు!

 

ఇక 7 వ వచనంలో అంటునారు  నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయెను. అనగా నాకు ఇష్టం లేని పదార్ధాలను తిన వలసి వస్తుంది. ముఖ్యంగా నేను ముట్టకూడని వాటిని నాకు అసహ్యమైన వాటిని ముట్టుకోవలసి వస్తుంది ఆకలికి దానినే తినవలసి వస్తుంది అంటున్నారు! కారణం ప్రియులారా! ఈ మాట పలుకబోయే సరికి యోబు గారు పెంటమీద కూర్చున్నారు! బూడెదలో కూర్చున్నారు! తన శరీరము కుళ్ళి పోయి తన గాయాలలోనుండి పురుగులు నడుస్తున్నాయి! అందుకే ఈ మాటలు పలుకుతున్నారు!

 

ఇక 8 వ వచనం నుండి తనకు చావు రావాలని కోరుకుంటున్నారు యోబుగారు బాధలు తట్టుకోలేక! అయితే ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం లేదు! ఆత్మహత్య అనే ఆలోచన సాతాను నుండి వస్తుంది! అయితే నిరీక్షణ అనేది దేవుని నుండి వస్తుంది! ఈ నిరీక్షణ అధ్యాయాలు గడిచే కొద్ది వస్తుంది యోబు గారికి!

 

8 ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక

9 దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.

10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును

 

తన సమస్యకు జవాబు దొరకడం లేదు కాబట్టి యోబుగారు  మనసారా వాంఛించేది ఒకటే మరణం. బాధల కోరల్లో చిక్కుకుని ఉన్నా మరణంలోనైనా అతనికి ఒక తృప్తి ఉంటుంది దేవునిపట్లా, దేవుని నుండి తనకు వెల్లడి అయిన సత్యం పట్లా తాను నమ్మక ద్రోహం చెయ్యలేదు. యెహోవాపట్ల తన స్వామిభక్తిని బాహాటంగా ప్రకటించాడు ఇంతవరకు అయితే ఇప్పుడు చావాలని కోరుకుంటున్నారు 

యోబు 1:21, నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

 యోబు 2:10, అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.

 

ఇంత భక్తి శ్రద్ధలను చూపించిన యోబుగారు ఇప్పుడు నిరాశ నిండిన మాటలు పలుకుతున్నారు! మనము కూడా చాలాసార్లు ఇక ఈ బ్రతుకు ఎందుకు? చస్తే బాగుణ్ణు అని అనుకుంటాము! మానవులు సాధారణంగా ఇలా అనుకుంటారు! ఏలీయా గారు అలాగే ప్రార్ధన చేశారు! ఇక చాలు చస్తే బాగుణ్ణు అనుకున్నారు!

1 రాజులు 19: 4 తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.

 

యోనా గారు కూడా అలాగే కోరుకున్నారు! గాని దేవుడు అలా కానివ్వలేదు! యోనా 4: 3 నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.

ప్రియ దేవుని బిడ్డా! ఒకవేళ నీవు కూడా ఇలా ప్రార్ధన చేస్తుంటే జాగ్రత్త! ఆ ప్రార్ధన దేవుని నుండి వచ్చింది కాదు! సాతాను గాడి సలహా ఇది! వెంటనే తప్పు ఒప్పుకుని దేవుణ్ణి ఆశ్రయించు! నీ బాధలను తీయగలిగే దేవుడాయన!

 

ఇక తర్వాత వచనాలలో 11 నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?

12 నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా? అని ప్రశ్నిస్తున్నారు!

 

యోబుగారు  తన నిస్సహాయతనూ అంతులేని తన నిరాశనూ గురించి మాట్లాడుతున్నాడు. తన స్నేహితులు అనుకొనేదేమిటి? బాధను లెక్కచేయని మొద్దు శరీరమా తనది? నిరీక్షణ  పూర్తిగా అడుగంటినట్టు కనిపించే సమయంలో ఇంకా ఆశపెట్టుకునే రాతి మనస్సా తనది?  నా బలము రాయి లాంటి గట్టిదా ? నా శరీరము ఇత్తడిదా? అంటున్నారు! అనగా బాధలను శ్రమలను ఎండను వేడిమిని తట్టుకునేలా నా శరీరము లోహమా లేక రాయా అంటున్నారు దేవునితోనూ తన స్నేహితుల తోను!!

 

తర్వాత వచనంలో 13 నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.

అనగా నాలో బలము లేదు ప్రాణము లేదు ఆశ లేదు శక్తి నన్ను పూర్తిగా విడిచిపోయింది అంటున్నారు!

 

అయితే 14,15 వచనాలు తన స్నేహితుల కోసం మాట్లాడుచున్నారు! 14 క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.

15 నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

 

క్రుంగిపోయిన వాడు ఒకవేళ దేవుని మీద ఆశ వదులుకున్నా స్నేహితులు దయచూపి వారికి ఆదరణ కలిగించాలి గాని నా స్నేహితులు ఎండి పోయిన వాగు లేక నదిలా ఉన్నారు! మాయమై పోయిన జల ప్రవాహం లాగా నమ్మకూడని వారు అయిపోయారు అంటున్నారు!

 

ఇప్పుడు తన స్నేహితులు తననేమీ ఆదుకోవడం లేదని యోబుగారు  వారిని విమర్శిస్తున్నాడు. తన నిరాశను వారికి తెలియజేశాడు. కానీ వారు అతనికి ఎదురు తిరగడానికే అది కారణమైంది. ఆదరించవలసింది పోయి వేలెత్తి చూపుతున్నారు. దప్పికతో ఉన్న తన మనస్సు సేదదీర్చి బలం చేకూర్చే సత్యం కోసం అల్లాడుతున్నది. తన స్నేహితులు రావడం చూచి జ్ఞానయుక్తమైన సలహా వారిదగ్గర దొరుకుతుందేమో ఆనుకున్నాడు. ఇప్పుడు వారు అతని కళ్ళకు ఎండిపోయిన వాగులాగా కనిపిస్తున్నారు. దుఃఖితులకూ, దిక్కుతెన్నూ తోచనివారికీ దాహం తీర్చడానికి వారి మాటలు పనికి రావు. యోబుగారు వారి విషయం తీవ్రంగా ఆశాభంగం పొందారు. ఆ విషయాన్నే స్పష్టంగా వారితో చెప్తున్నాడు.

అందుకే బైబిల్ చెబుతుంది స్నేహితుని నమ్మకు ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మకు! మీకా 7: 5 స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.

 

మరి ఎవరిని నమ్మాలి!?  కీర్తన 37: 3 యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

 

కాబట్టి యోబు గారిలా స్నేహితులను నమ్మవద్దు వారినుండి ఏ ఓదార్పు ఆశించకూ!

దేవుణ్ణి మాత్రమే నమ్ముకో!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*36వ భాగం*

యోబు 6:2130

21 అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.

22 ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?

23 పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా?

24 నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకుతెలియజేయుడి.

25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

26 మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

27 మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు.

28 దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?

29 అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

30 నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

   

ప్రియులారా!   అధ్యాయంలో ఎలీఫజు చేసిన ఆరోపణలకు యోబు గారు జవాబు చెబుతున్నారు!

ఇక 21 వ వచనంలో అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు అనగా వాగులు నదులు ఎండాకాలంలో ఎలా ఎండిపోయి లేకుండా ఉంటాయో అలాగే మీరు కూడా అవసరానికి లేకుండా పోతారు అంటున్నారు యోబుగారు!

 

ఇక 22 వ వచనంలో ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? అని అడుగుతున్నారు. ఇంకా నా పగవారి చేతిలో నుండి గాని శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించండి అని మిమ్మల్ని అడిగానా? లేదు కదా! మరి ఎందుకు మీ మాటలతో నన్ను బాధిస్తున్నారు అని వాపోతున్నారు ఇక్కడ! వారు రావాలనీ, శారీరకంగా గానీ ఆర్థికంగా గానీ ఆదుకోవాలనీ యోబుగారు  వాళ్ళను అడగలేదు వారి నుండి ఏమీ  ఆశించలేదు! (ఆస్తి, ఆరోగ్యాలను కోల్పోయిన యోబుగారికి నిజానికి  ఇలాంటి సహాయం బహుశా అవసరమే. కానీ వారు ఇలాంటి సహాయం చేస్తామని చెప్పినట్టు కనిపించదు). వారినుండి యోబుగారు కోరినది ఒక్కటే తనకు అప్పటికి అవసరమైన సలహా. వారు తాను చేసిన పొరపాట్లు గానీ పాపాలు గానీ ఇవీ అని చూపిస్తే వాటిని ఒప్పుకోవడానికి యోబు సిద్ధమే.

 

అందుకే తర్వాత వచనంలో అంటున్నారు నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి! ఈరోజు మనము కూడా ఇలాంటి భావముతోనే ఉండాలి! మనలో ఎవరైనా తప్పిపోయినప్పుడు ఈ విషయంలో నీవు తప్పుచేస్తున్నావు అని చెప్పగలగాలి! అలా చెప్పినప్పుడు ఎవడవురా నీవు? లేక ఎవర్తివే నీవు నీ బ్రతుకు నాకు తెలియదా! నన్నే అంటావా అని అడుగకూడదు! ఏసయ్య చెప్పారు- నీ సహోదరుడు తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు- మత్తయి 18: 15 మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

16 అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.

17 అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

 

యాకోబు 3: 2 అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.

 

కీర్తనలు 19: 12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము.

 

సామెతలు 9: 9 జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.

 

8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

 

ఇక తర్వాత వచనాలలో 25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

26 మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

27 మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు అంటున్నారు!

ఒక వ్యక్తి అవసరానికి సరిపోయే విధంగా చెప్పిన మాటల్లో ఉండే శక్తి యోబుగారికి  తెలుసు. అలాంటి మాటలు పలకడంలో వారు విఫలమయ్యారని చెప్తున్నాడు. పైగా తన మాటలను (3వ అధ్యాయం) వారు అపార్థం చేసుకున్నందువల్ల తన పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు

 

ఇక 2830 వచనాలలో తన యొక్క నిర్దోశత్వమునూ నిరూపిస్తూ అంటున్నారు 28 దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?

29 అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

30 నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

 

ఇక్కడ  తన నీతియుక్తమైన జీవితాన్ని, యథార్థతను గుర్తు చేసుకుని అన్యాయంగా తనపై నిందలు వేయవద్దని యోబు వారిని బ్రతిమిలాడుతున్నాడు.

కాబట్టి మనము కూడా ఎవరిమీద ఆరోపణలు చేయకూడదు! అపనిందలు వేయకూడదు! ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వారిని హెచ్చరించాలి!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*37వ భాగం*

యోబు 7:1

1 భూమి మీమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములవంటివి కావా?

 

           ప్రియులారా! 6   అధ్యాయంలో ఎలీఫజు చేసిన ఆరోపణలకు యోబు గారు జవాబు చెబుతున్నారు! ఇక 7 వ అధ్యాయంలో యోబుగారు దేవునితో మాట్లాడుచున్నారు! తన బాధను దేవునితో చెప్పుకుంటున్నారు! ఈ గ్రంధంలో కొన్నిసార్లు దేవునితో గొడవాడుతున్నారు!

 

ఇక మొదటి వచనంలో భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఇంకా వారి దినములు కూలివాని దినముల వంటివి కావా?

ఇక్కడ యోబుగారి  స్థితిని రెండు మాటల్లో వర్ణించవచ్చు తాను పడే యాతన,  రెండు ఆశారాహిత్యం లేక నిరాశపూరితమైన తన జీవితం!  8వ వచనం ప్రకారం యోబు బాధపడుతున్నది కొద్ది రోజులుగా కాదు, కొన్ని నెలలుగా.

 

ఇక యోబుగారి మాటలను ఆలోచిస్తే : అవును భూమిమీద నరుల జీవితకాలము యుద్ద కాలములా ఉంటున్నాయి! అనగా ప్రియులారా నాకు విశ్వాసుల జీవితంలో మూడు రకాలైన యుద్ధాలు కనిపిస్తున్నాయి!

మొదటిది: ఉదయాన్నే నిద్ర లేవాలి- తొందరగా తయారై తన పనిపాటుల కోసం వెళ్లిపోవాలి! ఇక స్త్రీలకైతే ఉదయాన్నే లేచి పిల్లలకు భర్తకు కారేజీ సిద్ధం చేయాలి- యుద్ధానికి సిద్ధపడినట్లు లేక యుద్ధానికి వెళ్ళినట్లు తొందరగా చేయాలి!

ఇక ఉద్యోగం చేసే స్త్రీలయితే ఉదయాన్నే లేచి భర్తకు పిల్లలకు కారేజీలు రెడీ చేయాలి, లేకపోతే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది! వారు వెళ్ళిపోయిన వెంటనే భర్తను పంపించాలి! అందరూ వెళ్లిపోయాక తాను యుద్ధం చేసినట్లు రెడీ అయ్యి ఆఫీస్ కు వెళ్ళాలి! ఇదంతా స్త్రీకి ఒక యుద్దం లా వుంటుంది! ఇది ఒకరకమైన యుద్ధం!

 

రెండు: ఇక మరో రకమైన యుద్ధం: మానవుని మీద దాడి చేసే రోగాలు అవి మనమీద యుద్దం చేస్తుంటే వాటికి వ్యతిరేఖంగా మనము ఆ రోగాలతో పోరాటం చేయాల్సి వస్తుంది! అవి ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయి! బీపీ వెనుక షుగరు పొగరు వస్తుంది- వాటివెనుక మోకాళ్ళ నొప్పులు- వాటి వెనుక థైరాయిడ్- ఇలా ఒకదానికి మరొకటి తోడై రైలు ఇంజన్ వెనుక బోగీలు కలిపినట్లు రోగాలు కలిసి అనీ మనతో యుద్ధం చేస్తున్నాయి!  ఇక వాటికోసం మనం డాక్టర్ల చుట్టూ హాస్పటల్స్ చుట్టూ దండయాత్ర చేస్తున్నాము! ఎంతవరకు- బ్రతికినంత కాలము!!! ఈ యుద్ధాలు కాకుండా మరో యుద్ధం అప్పుల బాధలు! EMI ల బాధలు- ఇవన్నీ ఒకటో తారీకు రాబోయేసరికి యుద్దానికి వస్తాయి!

 

ఇక మూడవ రకమైన యుద్ధం! విశ్వాసి చేసే ఆత్మీయ పోరాటాలు! దీనికోసం ఎంతో విస్తారంగా వ్రాయడం జరిగింది. ఇవి విశ్వాసి లోకము తోను సాతాను తోను చేసే యుద్దాలు- సంఘర్షణలు! దయచేసి వివరాలు కోసం ఈ లింకు నొక్కండి!

(*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు* PDF కోసం దయచేసి ఈక్రింది లింకు నొక్కండి.

.....................................................................................................................................................................................................

https://drive.google.com/file/d/1u_O7VK2wsopXJkDbwGBKtuWpyax9Bekf/view?usp=sharing

 

ఇంకా మా వెబ్సైట్ నుంచి కూడా ఇదే PDF ని, ఇంకా మరిన్ని సేవకు ఉపయోగపడే PDF లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

వెబ్సైట్ లింకు

https://adhyatmikasandeshalu.blogspot.com/)

.......................................................................................................................................................................................................

కాబట్టి మానవుడు బ్రతికినంత కాలం ఈ యుద్దాలు తప్పవు! మానవునిది యుద్ద కాలమే!

 

ఇక తర్వాత మాట: కూలివాని దినముల వంటివి-  ఇక్కడ కూడా రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి:

1) అవును కూలివాడు ఉదయాన్నే లేచి కారేజీ సిద్ధం చేసుకొని వెళ్ళి కూలిపని చేసుకుని వచ్చీ మరలా వంట చేసుకుని తిని పడుకుని ఉదయాన్నే లేచి వెళ్లిపోవాలి! ఇదీ కూలివాని జీవితం! కూలివాడు అంటే కేవలం లేబర్ పని చేసే వారే కాదు! చదువుకొనని వాడు- కూలిపని చేసుకుంటాడు! చదువుకున్నవాడు- ఉద్యోగం కోసం వెళతాడు- ఇది కూడా కూలిపనే కదా! అనగా అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైన నెలంతా కష్టపడి చివరి రోజు కూలి కోసం కనిపెట్టేవారు ఎవరైనా కూలివారే కదా! జీతం కోసం పనిచేసే వారంతా కూలివారే! గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటే గవర్నమెంట్ కూలివారు! మామూలు మనుష్యుల దగ్గర తీసుకుంటే మామూలు రోజు కూలీలు! ప్రైవేట్ వ్యక్తుల వద్ద, కంపెనీల వద్ద జీతం తీసుకున్న వారు ప్రైవేట్ కూలీలు! కాబట్టి అంతా మనము కూలివారమే! మన జీవిత కాలము కూలివాని జీవితాలే!

 

రెండవది: దైవసేవకుల కోసం పౌలుగారు చెబుతున్నారు. దేవుడు వ్యవసాయకుడు! మేము దేవుని తోటలో పనిచేసే జతపనివారము అని చెబుతున్నారు 1 కోరింథీ పత్రికలో 3: 6 నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

7 కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

8 నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

9 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

14 పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

15 ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

కాబట్టి ప్రతివాడు జీతం పుచ్చుకుంటున్నారు! అందుకే వారిని సేవకులు అంటున్నారు అనగా సేవ చేసేవారు అనగా కూలివారు! అయితే వారు దేవుని దగ్గర జీతం పుచ్చుకుంటున్నారు కాబట్టి దైవసేవకులు అయ్యారు! కాబట్టి దైవసేవకులు కూడా కూలివారే!

 

అయితే మరి విశ్వాసులో! వారు కూడా కూలివారే! మీరు కూడా కూలి తీసుకోబోతున్నారు! ఎవరి దగ్గర దేవుని దగ్గర! మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను చాటమని చెప్పారు! కాబట్టి సువార్త భారము కేవలం సేవకులది కాదు! నమ్మి విశ్వసించిన ప్రతీవాని మీద ఉంది! అంతేకాకుండా ప్రతీ విశ్వాసి సంఘములో మందిరములో ఏదో ఒక పరిచర్య చేయాలి- దానికి నీకు సంఘములో పేరు మెప్పు రాకపోయినా ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా దేవుని దగ్గర మెప్పు ఖ్యాతితో పాటుగా జీతం కూడా పొందుకోబోతున్నారు! అది నేను చెప్పింది కాదు సాక్షాత్తుగా యేసుక్రీస్తుప్రభులవారే చెబుతున్నారు!

ప్రకటన 22: 12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

కాబట్టి మనము చేసే పనిని నమ్మకముగా యధార్ధముగా చేద్దాం! దేవుని నుండి జీతం తీసుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*38వ భాగం*

యోబు 7:18

1 భూమి మిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములవంటివి కావా?

2 నీడను మిగుల నపేక్షించు దాసునివలెను కూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను

3 ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి. నేను పండుకొనునప్పుడెల్ల

4 ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.

5 నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది.

6 నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

7 నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.

8 నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.   

 

           ప్రియులారా! 7వ అధ్యాయంలో యోబుగారు దేవునితో మాట్లాడుచున్నారు! తన బాధను దేవునితో చెప్పుకుంటున్నారు! ఈ గ్రంధంలో కొన్నిసార్లు దేవునితో గొడవాడుతున్నారు!

 

              (గతభాగం తరువాయి)

 

ఇక తర్వాత వచనంలో నీడను మిగుల నపేక్షించు దాసునిలా ఇంకా కూలి నిమిత్తం కనిపెట్టుకొనే కూలివానిలాగా ఉంది నా బ్రతుకు అంటున్నారు!

నీడకోసం ఎదురుచూసే దాసుడు లేక పనివాడు అనగా ఒకవేళ మన పొలంలో ఎవరైనా పనిచేయడానికి వచ్చారు అనుకుందాము! ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది! అప్పుడు మేఘం ఎప్పుడు పడుతుందా లేక నీడ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తారు! ఒకవేళ నీవే ఆ స్థితిలో ఉన్నా నీవుకూడా అలాగే ఎదురుచూస్తావు! పనికి వెల్లనక్కరలేదు- ఒకవేళ నీవు మంచి ఎండా కాలంలో కొంతదూరం నడవాల్సి వచ్చింది అనుకో- ఎండకు నడవలేక కొంచెం సేపు ఎక్కడైనా నీడలో ఆగుదామని అనిపిస్తుంది కదా! అలాగే పనివారు కూడా నీడకోసం ఎదురుచూస్తారు! అనగా బాధనుండి శ్రమ నుండి కొంతసేపు విశ్రాంతి లేక ఎడతెరిపి కోసం ఎదురుచూస్తున్నాను అంటున్నారు! తాను అనుభవిస్తున్న బాధలనుండి కనీసం తాత్కాలిక ఎడతెరిపి కోసమైన ఆశిస్తున్నారు ఇక్కడ యోబుగారు!

 

ఇక కూలి కోసం కనిపెట్టుకొనే కూలివానిలాగా ఉంది అంటున్నారు! ఇక్కడ రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి! మొదటిది కూలికి వెళ్దాము అని బయలుదేరితే ఎక్కడా పని దొరకడం లేదు ఆనియు, రెండవది పని అయిపోయింది ఇప్పుడు యజమాని కూలి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని నిత్యావసర సరుకులు కొనుకుందాము అని అనుకునే కూలివానిలా ఉంది నా బ్రతుకు అంటున్నారు! అనగా దేవుడు ఇంతకాలం నన్ను శ్రమలు అనే కొలిమిలో పనిచేయించు కున్నాడు- ఇప్పుడు నా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇస్తే తీసుకుని కొంత ఆకలి తీర్చుకుంటాను అనే భావముతో అని ఉండవచ్చు ఇక్కడ!

 

ఇక తర్వాత వచనంలో ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి. ఆశలేకయే జరుగు నెల అనగా ఒకసారి ఈ వ్యాధి వచ్చింది- కనీసం ఇప్పుడైనా తగ్గిపోతుంది, నా బాధలకు వ్యసనాలకు ఉపశమనం కలుగుతుంది. పోయిన నెల ఎన్నెన్నో ఇబ్బందులు కనీసం ఈ నెల అయినా బాధలనుండి ఉపశమనం కలుగుతుందేమో అని ఆశిస్తున్నారు! మనము కూడా అనేకసార్లు మనకు వచ్చే బాధలు శ్రమలనుండి కనీసం ఈనెల అయినా లేక ఈ సంవత్సరం అయినా నా శ్రమలనుండి బాధల నుండి రోగములు నుండి ఉపశమనం కలిగితే బాగుణ్ణు అని ఆశిస్తున్నావేమో! భయపడకు! దేవుడు తప్పకుండా నిన్ను విడుదల చేయగలరు! ఇక్కడ యోబుగారు కూడా అలాగే ఆశిస్తున్నారు!

 

ఇంకా ఏమని ఆశిస్తున్నారు అంటే ఆయాసముతో కూడిన రాత్రులే నాకు నియమించ బడ్డాయి! ఇంకా రాత్రి పడుకున్నప్పుడు ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు లేస్తానా అని ఉంటుంది! ఎందుకంటే నొప్పులకు నిద్రపట్టడం లేదు! నిద్రలేక ఒక బాధ! ఆ వ్యాధివలన కురుపుల బాధ వలన మరో భాధ! ఇక నిద్ర రానందువలన మంచం మీద ఇటు అటు దొర్లుతూ బాధపడుతూ ఉంటున్నారు అంట!

ఇంకా అంటున్నారు నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. ఇంత ఘోరంగా ఆయన బాధపడుతున్నారు! అందుకే ఎప్పుడు ఉపశమనం కలుగుతుందా ఎప్పుడు ఈ వ్యాది మానుతుందా అని ఎదురుచూస్తున్నారు! ఇక్కడ చూడండి నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కప్పబడి ఉన్నది అంటున్నారు! దేహము నిండా పురుగులు, ఇక ఆ పురుగులు కురుపులలోనికి వెళ్ళకుండా కురుపులను మట్టితో నింపుకుంటున్నారు! ఇదీ తన పరిస్తితి! ఆ బాధను తట్టుకోలేకనే ఆ మూడవ అధ్యాయం పలికిన మాటలు ఇంకా ఈ అధ్యాయాలలో పలుకుతున్న మాటలు!

 

ఇంకా అంటున్నారు 6 నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

7 నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.

దినములు నేతగాని నాడికంటే వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేకుండా క్షయమై పోతున్నాయి అంటున్నారు! నేత గాని దోనె లేక నాడీ ఎంతో తొందరగా పరుగెత్తుతుంది బట్టను నేసేటప్పుడు! అలాగే నా రోజులు గడిచిపోతున్నాయి అంటున్నారు!

 

ఇంకా నా జీవము వట్టి ఊపిరే కదా ఒకసారి దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటు దేవునికి చెబుతున్నారు! ఇక నా జీవితంలో ఎప్పుడు నేను మేలు అనేది చూడానేమో అంటు వాపోతున్నారు! మనము కూడా ఇలాగే చాలాసార్లు అనికుంటాము! నిరాశ ఆవహించి క్రుంగిపోతూ ఉంటాము ఇక నాకు ఆశ లేదు అని అనుకుంటూ ఉంటాము! గాని ప్రియ సహోదరి సహోదరుడా!నీకు ఒక ఆశ ఉంది! దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు! ఆయనకు సమస్తము సాధ్యమే!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*39వ భాగం*

యోబు 7:811

8  నన్ను చూచువారి కన్ను ఇక  మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.  

9  మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు

10  అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

11  కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

 

           ప్రియులారా! 7వ అధ్యాయంలో యోబుగారు దేవునితో మాట్లాడుచున్నారు! తన బాధను దేవునితో చెప్పుకుంటున్నారు! ఈ గ్రంధంలో కొన్నిసార్లు దేవునితో గొడవాడుతున్నారు!

 

              (గతభాగం తరువాయి)

 

         ఇక ఎనిమిదవ వచనంలో నన్ను చూచువారి కన్నులు ఇకమీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూచును గాని నేను ఉండక పోదును! దీని అర్ధం ఏమిటంటే కొన్ని రోజులకు నేను ఇదే బాధలను అనుభవిస్తూ చనిపోతాను అప్పుడు మీరు నన్ను చూడాలని అనుకుంటారు గాని మీరు నన్ను చూడలేరు! దేవుడా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి గాని ఒకరోజు నేను భూమిమీద ఉండను అంటున్నారు! గమనించాలి  7వ వచనం నుండి 21వ వచనం  వరకు యోబుగారు  దేవునితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది. తనకిక రాబోయే కాలంలో సంతోషం కలుగుతుందన్న ఆశ ఏది లేదని దేవునితో స్పష్టంగా చెప్తున్నారు. అతనికి చావు తప్ప జీవితంలో ఏమీ మిగల్లేదు. మరణించి సజీవంగా తిరిగి లేవడం అన్న సిద్ధాంతం గురించి యోబుకు బొత్తిగా తెలియదు. ఇంకా తాను పోగొట్టుకొనేదేమీ లేదు గనుక తన దుఃఖాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తానంటున్నాడు.

 

గమనించాలి ఈ వచనాలలో యోబుగారు తనకు అసలు ఏమీ నిరీక్షణ లేదు అంటున్నారు! అంతగా క్రుంగి పోయారాయన!

 

యోబు 14: 7 వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.

8 దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను

9 నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?

11 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

12 ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

 

ఇక తర్వాత వచనాలలో నేను తొందరలో ఇదే బాధలతో చనిపోబోతున్నాను ఇక ఎప్పుడు ఎవరూ నన్ను కనుగొనలేరు అనే అర్ధంతో మాట్లాడుచున్నారు!

 

9  మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు

10  అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

 

ఇక్కడ పాతాళమునకు దిగిపోయిన వాడు ఎప్పటికీ తిరిగి రాడు అంటున్నారు! అవును ఇది నిజమే! భూమిమీద పుట్టినవారు అందరికీ ఈ వాక్యము నిజమే! అయితే ఒక్క యేసుక్రీస్తుప్రభులవారికి మాత్రము వర్తించదు! ఎందుకంటే ఆయన పాతాళమును మరణమును మరణపు దూతను సాతానును ఓడించి విజయోత్సవముతో సజీవుడై చెరను చెరగా ఓడించి చెరలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలను పరదైసుకి ఎత్తుకుని పోయారు!

ఏసయ్య  లాజరు- ధనవంతుడు ఉపమానంలో ధనవంతుడు చాలా ప్రయత్నాలు చేశాడు పాతాళము నుండి బయటకు రాడానికి గాని ఏసయ్య అన్నారు- అక్కడవారు ఇక్కడకు రాకుండా, ఇక్కడ వారు అక్కడకు వెళ్ళకుండా మీకును మాకునూ మధ్య గొప్ప అగాధం ఉంది! కాబట్టి పాతాళమునకు ఒక్కసారి వెళ్తే ఇక ఎప్పుడు బయటకు రాలేరు!

 

యిర్మీయా 22: 10 చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగలార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.

 

ప్రసంగి 7: 14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.

 

ఇక 11 వ వచనంలో కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

 

ఇక ఈ వచనంలో ఇక నేను అతి తొందరలో చనిపోబోతున్నాను! అదికూడా నేను చేయని నేరానికి బాధలను అనుభవిస్తున్నాను కాబట్టి నా హృదయ వేదనలు బట్టి నోరు మూసుకోకుండా నా ఆత్మ వేదనకోలది నేను మాట్లాడుతాను నాయొక్క మనో వేదనను బట్టి మూల్గుచూ మాట్లాడతాను అంటున్నారు!

 

ఇక 10:1 లో అంటున్నారు నా బ్రతుకు అంటే నాకు విసుకు మరియు అసహ్యము పుట్టింది అంటున్నారు!

 

అయితే ప్రియులారా ఒకవేళ మీరు కూడా ఇదే స్థితిలో ఉంటే నిరాశలలో మనకు ఒక ఆశా కిరాణం అది యేసుక్రీస్తుప్రభులవారు! ఆయనను నమ్ముకుందాం! ప్రతి సమస్యకు జవాబు ఏసే!

నీ జీవిత వ్యధలందు యేసే జవాబు!

 

కాబట్టి జీవితమంతా పాడుదాం!

 

ప్రతి సమస్యకు జవాబువు!

ప్రతీ నొప్పికి ఔషదము!

నా నిరాశలో నా ఆశవు!

చీకటిలో వెలుతురువు!!!

నీవేగా! నీవేగా! నీవేగా! (har sawal ka jawab tu.!!!)

Amen!

God Bless You!

*యధార్ధవంతుడైన యోబు*

*40వ భాగం*

యోబు 7:1221

12 నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు?

13 నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా

14 నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

15 కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను ఈ నా యెముకలను చూచుట కన్న మరణమొందుట నాకిష్టము.

16  అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

17 మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?

18 ప్రతి పగలు నీవతని దర్శింపనేల? ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

19 ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

20 నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?

21 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.

 

           ప్రియులారా! 7వ అధ్యాయంలో యోబుగారు దేవునితో మాట్లాడుచున్నారు! తన బాధను దేవునితో చెప్పుకుంటున్నారు! ఈ గ్రంధంలో కొన్నిసార్లు దేవునితో గొడవాడుతున్నారు!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! పై వచనాలలో మరో కోణంలో మాట్లాడుచున్నారు దేవునితో! నేను బ్రతకడం కన్నా చావే మేలు అని! ఎందుకంటే ఆయన పడుచున్న యాతనలు మరో కోణంలో వివరిస్తున్నారు!

 

ఇక నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు అంటున్నారు! తాను పరవళ్ళు తొక్కే సముద్రమో, లేక అదుపులో పెట్టవలసిన పెద్ద జలచరమో కాదు గదా. మరి ఎందుకు దేవుడు తనను ఈ విధంగా అణగదొక్కుతున్నాడు? అని యోబుగారి  భావం!

 

ఇక తర్వాత రెండు వచనాలలో మరో విధంగా చెబుతున్నారు 13 నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా

14 నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

 

చూడండి బాధలను తట్టుకోలేక మంచం మీద పడుకుని నిద్రపోయి విశ్రాంతిలో ఉపశమనం పొందుదాము అని అనుకుంటే మంచం మీద కునుకు పట్టిన వెంటనే పీడకలలు వచ్చి బెదిరిస్తున్నాయి! ఆ పీడకలలు ఓ దేవుడా నీవే పంపుతున్నావు అంటున్నారు!

 

అనగా రాత్రి సమయం యోబుగారికి  బాధకు ఉపశమనాన్ని ఇచ్చే బదులు బాధను రేపుతూ ఉంది. ఎలాగంటే అతను నిద్రపోతే పీడ కలలు, బీతి పుట్టించే దర్శనాలు అతణ్ణి వేధించి చావును కోరుకునేలా చేస్తున్నాయి అంటున్నారు! అవును చాలాసార్లు మనము బాధలలో శ్రమలలో వేదనలో దుఖంలో ఉన్నప్పుడు అవే పీడకలలు వచ్చి మనలను మరింతగా వేదిస్తూ ఉంటాయి! ఆయితే  ఆ పీడకలలలో కూడా తాను మరింత సంకట పడినట్లు ఇబ్బందులు పడుతున్నట్లు వస్తే ఎలా? అందుకే చనిపోవాలని ఉంది అంటున్నారు!

 

ఇక తర్వాత వచనాలలో కూడా దీనినే కొనసాగిస్తున్నారు! 15 కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను ఈ నా యెముకలను చూచుట కన్న మరణమొందుట నాకిష్టము.

16  అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

 

చూడండి నన్ను ఉరి తీసేయండి అంటున్నారు ఎందుకంటే మరో కారణం చెబుతున్నారు ఈ నా ఎముకలు చూడటం కన్నా చచ్చిపోవడమే మేలు అంటున్నారు! కురుపులకు చర్మం ఊడిపోయి తన ఎముకలు కనిపిస్తున్నాయి అట!!!

 

అందుకే ఇక విసికిపోయి ఓ దేవుడా! ఇక చాలు నన్ను వదిలేయ్! నా జోలికి రావద్దు అంటున్నారు! ఎందుకంటే నీవు నన్ను తలచుకుంటే నాకు ఏవేవో కష్టాలు వస్తున్నాయి అంటున్నారు!

 

యోబు 9:21

21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.

 

ప్రసంగి 2:17

17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను.

 

ప్రసంగి 4:2-3

2 కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని.

3 ఇంకను పుట్టని వారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని.

 

అయితే దావీదు గారు అంటున్నారు కీర్తన 119: 50 నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

 

94: 9 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.

 

అయితే ఆదరణకరమైన మాటలు యెషయాగ్రంధంలో రాజైన హిజ్కియా  గారు అంటున్నారు 38: 9 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

10 నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

12 నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును.

16 ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

18 పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.

19 సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

20 మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.

 

మనము కూడా ఇదే మాటలతో ఆదరణ పొందుదాము!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*41వ భాగం*

యోబు 7:1721

17 మనుష్యుడు ఏపాటివాడు?  అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?

18 ప్రతి పగలు నీవతని దర్శింపనేల? ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

19 ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

20 నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?

21 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేక పోయెదను.

 

           ప్రియులారా! 7వ అధ్యాయంలో యోబుగారు దేవునితో మాట్లాడుచున్నారు! తన బాధను దేవునితో చెప్పుకుంటున్నారు! ఈ గ్రంధంలో కొన్నిసార్లు దేవునితో గొడవాడుతున్నారు!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! పై వచనాలలో మరో కోణంలో మాట్లాడుచున్నారు దేవునితో! నేను బ్రతకడం కన్నా చావే మేలు అని! ఎందుకంటే ఆయన పడుచున్న యాతనలు మరో కోణంలో వివరిస్తున్నారు!

 

ఇక 17 వ వచనం నుండి చూసుకుంటే

17 మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?

18 ప్రతి పగలు నీవతని దర్శింపనేల? ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

19 ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

 

చూడండి మనుష్యుడిని నీవెందుకు ఘనపరిచావు ఎందుకు ధనము బలము ఐశ్వర్యము పేరు ప్రతిష్టలు ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు బలహీనుడిగా రోగిగా చేసి ఇప్పుడు ధనము కీర్తి ఆరోగ్యము తీసివేసి ఎందుకు నన్ను బాధల పాలు చేస్తున్నావు అంటున్నారు!  కీర్తనల గ్రంథము 8:4లో ఉన్నట్టుగా దేవుడు మనిషి పట్ల అంత ప్రేమాదరణలను కనపరచేందుకు అతనెంతటివాడు? అన్నది కాదు యోబు ప్రశ్న. ఇంత బలహీనులను దేవుడెందుకు అస్తమానమూ బాధిస్తాడు? అన్నదే. మనిషి చేసే ప్రతి పనినీ జాగ్రత్తగా పరిశీలించి శిక్షనూ కీడునూ పంపించడంలో దేవుడు అంత శ్రద్ధ వహించడం ఎందుకు? యోబు ప్రశ్నలు ఇవే. తనపట్ల దేవుని వైఖరి శత్రుభావంతో ఉన్నదని యోబుగారు  అనుకుంటున్నారు. కొంత కాలం పాటు తన విషయం పట్టించుకోవద్దని దేవుణ్ణి కోరుతున్నారు. నిజానికి 18వ వచనం చివరి భాగంలో తన పైకి విపత్తులు ఎందుకు వచ్చాయి అన్నదానికి సరైన జవాబుకు యోబుగారు  చాలా దగ్గరగా వచ్చారు  (పరీక్ష కోసం ఆదికాండము 22:1, ; కీర్తనల గ్రంథము 66:10-12). కానీ ఈ సత్యాన్ని ముందుకు ఆలోచించకుండా అక్కడే వదిలేశారు. బహుశా మానవ చరిత్రలో ఆ కాలంలో, ఆ విషయం పై దేవుని ఉపదేశం ఇంకా మానవులకు అందని ఆ సమయంలో, అతడున్న పరిస్థితుల్లో యోబుగారు  ఈ సత్యాన్ని చర్చించకపోవడం సహజమే. ప్రతీ రోజు నన్నెందుకు పట్టించుకుని మరీ నన్ను బాధిస్తున్నావు అని అడుగుతున్నారు ఇక్కడ! చివరకు నేను గుటక వేయువరకు అనగా నేను చనిపోయేవారకు నన్ను బాధించడం మానవేమో అంటున్నారు!

 

ఇక తర్వాత వచనాలలో 20 నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?

21 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.

 

ఇక్కడ 20 వ వచనంలో నేను పాపము చేశానో లేదో నీకు తెలుసు! నేను పాపము చేయలేదు అని నీకు తెలుసు! అయినా నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నావు! సరే, నేను పాపము చేయకపోయినా నన్ను ఇబ్బందులు పాలు చేశావు కాబట్టి ఇలా నన్ను ఎందుకు చేశావు అని నిన్ను గట్టిగా ఆడగలేను! నేను నిన్నేమి చేయలేను! నాకు నేనే భారంగా ఉన్నాను! సరే, నేను పాపము చేశాను అనుకో- మాట ద్వారా గాని ప్రవర్తన ద్వారా గాని అప్పుడు నిన్ను క్షమించమని వేడినప్పుడు నన్ను ఎందుకు క్షమించడం లేదు అని వాపోతున్నారు దేవునితో!

 

అందుకే నేనిప్పుడు మంటిలో పండుకొనెదను అనగా చనిపోతాను  నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను అని ముగిస్తున్నారు!

 

చూడండి తనమీదికి దేవుని తీర్పును రాజేసే పాపం ఏదీ తాను ప్రత్యేకంగా చేసినట్టు యోబుగారికి  గుర్తు రావడం లేదు ఎందుకంటే తాను చేయలేదు కాబట్టి. ఒక వేళ తాను పాపం చేసి ఉన్నప్పటికీ దేవుని కోపానికి తాను గురయ్యేటంతగా దేవుణ్ణి తాను గాయపెట్టానా అని అడుగుతున్నారు  యోబుగారు .

 

తన జీవితంలో ఎప్పుడూ పాపం చేయలేదు అనడం లేదు యోబుగారు ఇక్కడ, వాటికి క్షమాపణ లేనందుకు ఆశ్చర్యపోతున్నాడు. అంతే. తాను కఠిన మనస్కుడూ పశ్చాత్తాపం లేనివాడూ కాదని అతనికి తెలుసు. తన అంతం సమీపించిందని అతడు అనుకొన్నాడు. అందువల్ల తాను ఏదన్నా పాపం చేసివుంటే దానికి క్షమాపణ దొరికిందన్న నిశ్చయత కావాలని కోరుతున్నాడు. దేనికోసం అర్రులు చాస్తూ యోబు మాట్లాడుతున్నాడో దాన్ని మనం పొందవచ్చు. పొందామని తెలుసుకోవచ్చు

 

 లూకా 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

 

ఎఫెసీయులకు 1:7, దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

 

1 యోహాను 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

కాబట్టి మనకు కూడా ఇదే ఆశ నిరీక్షణ ఉంది కనుక దేవుని పాదాలు పట్టుకుందాం! క్షమాపణ వేడుకుందాం! దేవునితో సమాధానం పొంది బాధలనుంది విముక్తిని మనశాంతిని పొందుకుందాము!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*42వ భాగం*

యోబు 8:14

1 అప్పుడు  షూహీయుడగు బిల్దదు ఇట్లనెను

2 ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.

3 దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

4 నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.

 

           ప్రియులారా! 6,7 అధ్యాయాలలో యోబుగారు తన స్నేహితుడైన ఎలీఫజు తోను, దేవునితోనూ పలికిన మాటలు విని ఇప్పుడు ఈ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు మాట్లాడుచున్నాడు! మొదట దేవుని తరుపున మాట్లాడుచున్నట్లు మాట్లాడుతూ దేవుడు న్యాయం తప్పడు, నీవు చేసిన పొరపాటుల వలనే నీకు ఈ స్తితి! ఒకవేళ అది నీ తప్పు కాకపోతే నీ కొడుకులు చేసిన పనులు వల్ల నీకీ స్తితి కలిగిందేమో అంటున్నాడు! మొదట నీది తప్పు అన్నాడు! ఒకవేళ నీది కాకపోతే నీ కొడుకులది తప్పు పాపము అంటూ ఆరోపిస్తున్నాడు!

 

ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను అంటున్నాడు!

 

ఇక్కడ యోబుగారి  మాటలు చాలా భక్తిహీనంగా సత్యంపట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు బిల్దదు భావిస్తున్నాడు. ఈ అధ్యాయంలోని మాటల్లో యోబు గురించి బిల్దదు ఎలీఫజుతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలియజేస్తున్నాడు.

 

మూడవ వచనంలో దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? అంటున్నాడు!

 

యోబుగారు  దేవుణ్ణి అన్యాయస్థుడు అంటూ నేరం మోపుతున్నట్టు బిల్దదు భావిస్తున్నాడు ఇక్కడ. బిల్దదు చెప్పిన దానంతటికి మూలం ఈ వాక్యమే. బిల్దదు అనుకొన్నదేమంటే దేవుడు ఈ ప్రపంచంలో ఎడతెగక న్యాయాన్ని జరిగిస్తున్నాడు. మంచికి ప్రతిఫలమిస్తూ దుర్మార్గాన్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఒక మనిషి మీదికి విపత్తులు, బాధలు వచ్చాయంటే వాటికి అతను పాత్రుడేనన్నమాట అనగా ఒకవ్యక్తి చేసిన అపరాదాలు వలననే దేవుడు మానవులను శిక్షిస్తాడు, తన అపరాదాలు వలనే మనిషికి కష్టాలు రోగాలు వస్తాయి అంటున్నాడు!. ఎందుకంటే దేవుడు అన్యాయంగా ఎవరినీ శిక్షించడు. యోబు అనుభవిస్తున్న విపత్తులు, బాధలు కేవలం అతను చేసిన దుర్మార్గానికి ప్రతిఫలాలు అని బిల్దదు భావిస్తున్నట్టున్నాడు. ఒక వ్యక్తిని పరీక్షించడానికీ అతని నమ్మకాన్నీ విశ్వాసాన్ని గుణగణాలనూ రుజువు చేయడానికీ దేవుడు న్యాయ సమ్మతంగానే అతనిమీదికి విపత్తులను రానిస్తాడన్న విషయాన్ని బిల్దదు అర్థం చేసుకోలేదు. దుర్మార్గులను జీవితాంతం సుఖంగా ఉండనిచ్చి మరణించిన తరువాత వారికి తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడని కూడా బిల్దదు గ్రహించలేదు. దేవుడు న్యాయాన్ని వక్ర మార్గంలో పెట్టడన్నది పచ్చి నిజం. కానీ భూలోక వాసులకు బైబిలు గ్రంథంలోని సత్యాలు లేకపోతే దేవుని న్యాయం ఎలా నెరవేరుతుందో తెలుసుకోవడం అసాధ్యం. యోబుగారి స్నేహితులు ముగ్గురికీ దేవుని న్యాయం వెల్లడయ్యే రీతి విషయంలో చాలా సంకుచితమైన, అపరిపక్వమైన కఠిన నమ్మకాలు ఉన్నాయి. అందువల్ల వారు కొన్నిసార్లు క్రూరంగా, సానుభూతి లేనట్టుగా కనిపిస్తారు. ఈ లోకంలో ప్రతివాడూ తాను పొందవలసినదాన్నే పొందుతున్నాడని మనం అనుకుంటే, ఎవరన్నా బాధలు పడుతుంటే అది వాడి కర్మ అని మనం నమ్మితే అలాంటి అభిప్రాయాలు మనలను బాధల్లో ఉన్నవారి పట్ల కఠినంగా, దయ లేని విధంగా వ్యవహరించేలా చేయవచ్చు.

 

ఇక తర్వాత డైలాగ్  నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.

 

దేవుని న్యాయం గురించి బిల్దదు అభిప్రాయాలు ఇలా ఉంటే యోబు పిల్లలు భయంకరమైన పాపాలు చేసి ఆ కారణంగా దేవుని చేత నాశనమయ్యారు అని అతను భావించి ఉంటాడు. అందుకే నీ పిల్లలు చేసిన పాపాలు వలన నీ పిల్లలు అందరూ ఒకేసారి చనిపోయారు!

 

అయితే దీనిని వాక్యపూ వెలుగులో ఆలోచిద్దాం!

 

మొదటగా దేవుడు ఆదిలో చేసిన నిర్ణయము: నిర్గమ 34: 6 అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.

7 ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.

 

దీని ప్రకారం తండ్రుల దోషము కుమారులకు అంటుకుంటుంది గాని కుమారుల దోషము తండ్రులకు అంటుకోదు!

 

2)  యిర్మీయా గారు అంటున్నారు: మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము! విలాప వాక్యములు 5:7

 

దీని ప్రకారం తల్లిదండ్రులు చేసిన పాపము వలన ఫలితము కుమారులకు వస్తుంది గాని పిల్లల దోషముల వలన తండ్రులకు రానేరాదు!

 

3) అయితే దేవుడు తర్వాత దీనిని మార్చినట్లు చూడగలము!  యెహేజ్కేలు గ్రంధంలో దేవుడు అంటున్నారు 18: 1 మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు?

3 నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

4 మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.

 

దీని ప్రకారం ఎవడు పాపం చేస్తే వాడే చస్తాడు గాని తండ్రి దోషం వలన కొడుకు చావడు! ఈ అధ్యాయం పూర్తిగా చదివితే నీతిమంతుడు కొడుకు పాపం చేస్తే తండ్రి నీతి కొడుకుని రక్షించదు. తండ్రి అవినీతి కొడుకుని శిక్షించదు! కాబట్టి దీని ప్రకారం కూడా కుమారుల పాపముల వలన తండ్రికి శిక్ష రాదు!

 

కాబట్టి ఈ మూడు రిఫరెన్సుల ప్రకారం బిల్దదు అనిన మాటలు సత్యదూరము మరియు వాక్యవిరుద్దము!! కాబట్టి యోబుగారు కుమారులు చేసిన పాపముల వలన యోబుగారికి ఈ కష్టాలు రానేలేదు అని గ్రహించాలి! మనము కూడా ఇలాంటి నిష్టూరపు మాటలు అనకూడదు అవసరమైతే ఆదరించాలి గాని ఇలా దెప్పి పొడవకూడదు!

 

కాబట్టి యోబుగారి స్నేహితులను చూసి నేర్చుకుందాం! వారిలా ఉండకుండా మిత్రులు బందువులు స్నేహితులు ఆపదలో శ్రమలలో ఉన్నపుడు దెప్పకుండా ఆదరిద్దాము!!!

 

దైవాశీస్సులు!!

*యధార్ధవంతుడైన యోబు*

*43వ భాగం*

యోబు 8:510

5 నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల

6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.

7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.

8 మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.

9 మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.

10 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.

 

           ప్రియులారా! 8వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు మాట్లాడుచున్నాడు!  దేవుని తరుపున మాట్లాడుచున్నట్లు మాట్లాడుతూ దేవుడు న్యాయం తప్పడు, నీవుగాని  నీ పిల్లలు చేసిన పొరపాటుల వలనే నీకు ఈ స్తితి, అని సూటిపోటి మాటలతో యోబుగార్ని బాధిస్తున్నాడు!

 

ఇక ఐదవ వచనం నుండి నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకుంటే నీవు పవిత్రుడవై యధార్ధవంతుడవు అయితే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధనిలిపి నీనీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును అంటున్నాడు!

నిజానికి ఇది నిజమే! దేవుణ్ణి జాగ్రత్తగా వెదికితే సర్వశక్తుడగు దేవుణ్ణి హృదయ పూర్వకంగా బ్రతిమాలితే మనలో ఉన్న పాపములు మాని కడుగుకుని ప్రభువు దగ్గర క్షమాపణ వేడుకుని శుద్ధుడైతే మనము పవిత్రులుగా మారతాము, ఇంకా యధార్ధత కలిగి ఉంటే దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు అప్పుడు మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించి మహాభివృద్ధి పొందుకోగలము! మంచిది! ఇదీ మనము దేవునితో సమాధాన పడే విధానం! ఆశీర్వాదాలు పొందుకునే విధానం! సెహబాస్!

 

మరి దీనిని యోబుగారికి చెప్పడానికి కారణం ఏమిటి? దేవుడే యోబు నీతిమంతుడు యధార్ధవంతుడు చెడుతనమును బాహుగా అసహ్యించు కొన్నవాడు అని చెబితే ఈ వ్యక్తి ఇలా ఎందుకు చెబుతున్నాడు అంటే బిల్దదు ఏమను కుంటున్నాడు అంటే యోబుగారు దేవుణ్ణి జాగ్రత్తగా వెదకటం లేదు అని భావిస్తున్నాడు! ఇంకా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును దీని మర్మమేమిటంటే ఇతను ఏమను కుంటున్నాడు అంటే యోబు గారు పవిత్రుడు కాదు- ఇతడు అపవిత్రమైన పనులు చేశాడు, యోబు యధార్ధవంతుడు కాదు అని అనుకుని మాట్లాడుచున్నాడు అయితే దేవుడే అంటున్నారు రెండు సార్లు అదికూడా సాతానుతో వాదిస్తున్నారు దేవుడు : యోబు యధార్ధవంతుడు! 1:1 అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

8 అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.

 

దేవుడే ఇంత స్పష్టంగా మాట్లాడితే ఇతడు కాదు అంటున్నాడు! బహుశా  యోబు కూడా అతని సంతానంతోబాటు నాశనమై పోలేదు. కాబట్టి అతను న్యాయవంతుడేననుకోవడానికి ఎంతో కొంత ఆస్కారం ఉండవచ్చునని బిల్దదు అభిప్రాయం. ఇదే నిజమైతే దేవుడు తిరిగి అతణ్ణి ఆశీర్వదించి అతని ఆస్తిని అతనికిప్పిస్తాడు. ఇది యోబు విషయంలో నిజంగానే సంభవించింది (యోబు 42:10-13, ). అయితే మొత్తం మీద ఈ ప్రపంచంలో తప్పకుండా ఇలా జరుగుతుందని మనం నమ్మకూడదు. న్యాయవర్తన ఎప్పుడూ సంపదలను కలిగిస్తుందన్న నియమమేమీ లేదు. అలానే పాపం ఎప్పుడూ పేదరికానికి దారితీస్తుందనీ చెప్పకూడదు. సిరిసంపదలు దేవుని ఆశీర్వాదానికి సూచనా కాదు, పేదరికం దేవుని కోపానికి గుర్తూ కాదు (లూకా 6:20-26, ; లూకా 16:9-31, చూడండి).

కాబట్టి ఇక్కడ బిల్దదు అన్నమాటలు నిజానికి యధార్ధము గాని యోబుగారికి దీనిని చెప్పడం యోబుగారికి ఆపాదించడం సరికాదు! ఎందుకంటే అతడు పొందిన ఈ స్తితికి కారణం అతని దోషములు కానేకావు!

 

ఇక తర్వాత 8 మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.

9 మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.

10 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదా వారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా అంటున్నాడు!

 

చూడండి ఎలీఫజు తాను పలికిన మాటలకు ఏదో ఒక నిగూఢమైన ప్రేరేపణ అని చెప్పాడు (యోబు 4:12-16, ). బిల్దదు అయితే తన మాటలకు ఆధారంగా సంప్రదాయం, లేక గత చరిత్రను చూపిస్తున్నాడు. అంటే తాను, ఇతర స్నేహితులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కొత్తవేమీ కాదనీ, అవి కేవలం తాము మాత్రమే వెలిబుచ్చినవి కావనీ పురాతన జ్ఞానం దీన్నే బోధిస్తున్నదనీ అతని భావం. అనగా దీని అర్ధం. ఓ యోబు ఎవరైనా అపరాధాలు దోషాలు చేస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు- వారు మారుమనస్సు పొంది దేవునితో సమాధాన పడితే దేవుడు క్షమించి వారి పూర్వ స్తితి మరలా ఇస్తారు! ఇదీ పూర్వకాలం నుండి జరుగుతుంది! కాబట్టి నీవు చేసిన అపరాధాల వలనే ఈ కష్టాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అపరాధాలు ఒప్పుకుని దేవునితో సమాధాన పాడు అని అంటున్నాడు ఇక్కడ!

మనము కూడా మన జీవితాలు సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*44వ భాగం*

యోబు 8:1122

11 బురద లేకుండ జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

12 అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.

13 దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

14 అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.

15 అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.

16 అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.

17 అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనును రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.

18 దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అది నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.

19 ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.

20 ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు.ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.

21 నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును.

22 అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.

 

           ప్రియులారా! 8వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు మాట్లాడుచున్నాడు!  దేవుని తరుపున మాట్లాడుచున్నట్లు మాట్లాడుతూ దేవుడు న్యాయం తప్పడు, నీవుగాని  నీ పిల్లలు చేసిన పొరపాటుల వలనే నీకు ఈ స్తితి, అని సూటిపోటి మాటలతో యోబుగార్ని బాధిస్తున్నాడు!

 

ఇక 11 వ వచనంలో అంటున్నాడు బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా నీళ్ళు లేకుండా రెల్లు మొలుస్తుందా అని అడుగుతున్నాడు! అనగా దీని అర్ధం- నీలో పాపములు లేకుండా కారణం లేకుండా దేవుడు నిన్ను శిక్షిస్తారా? నీవు ఏదో దోషములు చేశావు అందుకే దేవుడు నీకు ఇన్ని శోధనలు పంపించారు అని భావం! ఇంకా బిల్దదు మాటల సారాంశం ఇది. దుష్టులు కొంత కాలం పచ్చగా వర్ధిల్లుతారు. అయితే వాడిపోయిన మొక్కల్లాగా రాలిపోతారు. యోబుగారు కూడా తాను వర్ణించిన దుష్టుల లాంటివాడు అని బిల్దదు అనడం లేదు గాని ఆ అనుమానం అతనికి ఉందనేది స్పష్టం. అలా కాని పక్షంలో ఇలాంటి ఉదాహరణలు ఎందుకు వాడతాడు? అవి యోబుకు హెచ్చరికలుగా ఉండాలనే బిల్దదు ఉద్దేశం.

ఇక్కడ ఏవేవి ఉదహరణము వాడుచున్నాడు అంటే నీళ్ళు లేకుండా రెల్లుగడ్డి మొలుస్తుందా? అయితే ఈ రెల్లు గడ్డి ఇంకా పెరుగుతూ ఉండగానే దానిని కోసేముందు అన్నీ మొక్కలకంటే ఈ గడ్డి తొందరగా ఎండిపోతుంది! అలాగే దేవుణ్ణి విస్మరించే వారు కూడా మొదట అభివృద్ది చెందినట్లు కనిపించినా కొంతకాలమునకు ఎండిపోతాడు మాడిపోతాడు భక్తిలేని వాడి గతికూడ ఇదే అంటున్నాడు!

 

అతడి ఆశ భంగమై పోతుంది ఆశ అడుగంటి పోతుంది అంటూ కవిలాగా మాట్లాడుచున్నాడు!

ఇంకా అంటున్నాడు అతడు ఏది కావాలని కలలు కంటున్నాడో అది రాకుండా పొందుకోకుండా సాలెగూడులా ఉంటుంది అతడి జీవితం అంటున్నాడు! అలాగే భక్తిలేని వాడు ఎండకు పచ్చగా ఉన్న మొక్క లాంటి వాడు దాని తీగెలు తోటమీదుగా అల్లుకుంటాయి దాని వేరులు కొండచుట్టూ ఆవరిస్తాయి దాని తీగెలు తోటమీదుగా అల్లుకుంటాయి! ఇలా గొప్ప పాడుగా మారిపోతుంది! అయితే దేవుడే గాని దాని స్థలమునుండి దానిని తీసేస్తే దాని స్థలమే నేను నిన్ను ఎరుగను పో అంటుంది నిన్ను ఎప్పుడూ చూడలేదు అంటుంది అలాగే భక్తిహీనుడు జీవితం కూడా ఎంతగా పువ్వు విరిసి ఫలించినా ఒకరోజు మాడిపోతుంది ప్రజలు దానిని మర్చిపోతారు! నీవు కూడా అలాగే ఉన్నావు ఇంతవరకు నీవు భక్తిగా నటించావు ఇప్పుడు నీవు లేవు కారణం నీకు దేవుని భక్తిలేదు భక్తిగలవాని వలె నటించావు అంటూ దెప్పుతున్నాడు!

 

ఇక 20 వ వచనంలో మూడో వచనంలో చెప్పిన విషయాన్నే చెబుతున్నాడు ఇదిగో విను దేవుడు నిర్ధోషిని ఎప్పుడూ త్రోసివేయడు అలాగే దుర్మార్గులను చేయి పట్టుకుని హెచ్చించడు అంటున్నాడు!

 

తర్వాత వచనంలో నీవుగాని దేవునితో సమాధాన పడితే నీకు మరలా నోటినిండా నవ్వు వచ్చేలా చేస్తాడు నీ పెదవుల నిండా ఆనంద ధ్వనులు ఉండేలా చేస్తాడు. అప్పుడు నీ విరోధులకు అవమానం కలుగుతుంది దుర్మార్గుల డేరా ఉండకుండా పోతుంది అంటున్నాడు!

యోబు నిజంగా న్యాయవంతుడైతే, దేవుణ్ణి ప్రాధేయపడితే ఇదంతా యోబు విషయంలో దేవుడు చేస్తాడని బిల్దదు అంటున్నాడు!

కాబట్టి బిల్దదు ఏమి మాట్లాడినా యోబును టార్గెట్ చేసి మాట్లాడటం తప్పు గాని, మిగిలిన వారి విషయంలో అతడు మాట్లాడిన మాటలు సత్యదూరము కానేకాదు! మనము కూడా మనలను సరిచేసుకుందాం, దేవునితో సమాధానం పడుదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*45వ భాగం*

యోబు 9:13

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

3 వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.

       

   ప్రియులారా! 9వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు  ఛేప్పిన మాటలకు ఈ 9వ అధ్యాయంలో యోబుగారు జవాబు చెబుతున్నారు ! 

 

రెండవ వచనంలో వాస్తవమే ఆ సంగతి అంతేయని నాకు తెలుసు అంటున్నారు! అనగా 8వ అధ్యాయంలో తన స్నేహితుడు పలికిన 57 వచనాలలో సారము, ఇంకా దుష్టులు నాశనమయ్యే విధానం కోసం, ఇంకా దేవుని ఆశ్రయిస్తే తిరిగి దేవుడు మనిషిని దీవించే విధానం కోసం అతడు చెప్పిన విషయాలకు సరే అంటున్నారు! బిల్దదు మాటల్లో ఏ మాటలను యోబు అంగీకరిస్తున్నాడో స్పష్టంగా లేదు.

 

ఇక అదే వచనంలో యోబుగారు ఒక ప్రశ్న వేస్తున్నారు: నరుడు అనగా మానవుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్ధోషి అవుతాడు?

 ఇప్పుడు యోబుగారు  వేస్తున్న ప్రశ్న అత్యంత ప్రాముఖ్యమైనది. దీని జవాబు యోబు గ్రంథంలో లేదు. నిజానికి దీనికి జవాబు దొరుకుతుందని యోబుగారు  నమ్మలేదు. అతడు కేవలం మనిషి భ్రష్ట స్వభావాన్నీ అజ్ఞానాన్నీ ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాడు. యోబుగారి  భావం బహుశా ఇది కావచ్చు మనుషులంతా పాపులే. నేనూ పాపిని. నాకు ఈ సంగతి బాగా తెలుసు. ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడి నేను ఏ లోపమూ లేని న్యాయవంతుణ్ణి అని వాదించడం అసాధ్యం. నా మట్టుకైతే నేను అలా చేయలేను.” కానీ దేవుని దృష్టిలో మనిషి పరిపూర్ణ న్యాయవంతుడుగా ఉండేందుకు మార్గం ఉంది.

 ఆదికాండము 15:6, అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.; దీని ప్రకారం దేవుణ్ణి నమ్మి పరిపూర్ణంగా విశ్వాసముంచి నప్పుడు నీతిమంతులుగా నిర్దోషులుగా మారతాము

 

రోమీయులకు 3:22-26, 

22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.;

ఈ భాగంలో కూడా యేసుక్రీస్తుప్రభులవారు లోక రక్షకుడని నీకోసం నాకోసం వచ్చారు- అని ఆయనను నమ్మి ఆయన రక్తంలో కడుగబడటం వలన నీతిమంతులుగా నిర్దోషులుగా మారతారు!

ఫిలిప్పీయులకు 3:9 క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,

ఇక ఈ వచనం ప్రకారం క్రీస్తుయేసు నందలి విశ్వాసం వలన నీతిమంతులుగా మార్పుచెందుతాము!

కాబట్టి యోబుగారు వేసిన ప్రశ్న- నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్ధోషి అవుతాడు అంటే క్రీస్తునందు విశ్వాసముంచడం వలన ఆయన శిలువ రక్తములో కడుగబడటం వలన నీతిమంతుడిగా మార్పు చెందుతాడు!

 

ఇక మూడవ వచనంలో వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు

మనిషి ఒకవేళ దేవునితో తగవాడుతూ దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు వేసిన ప్రశ్నలలో ఒకదానికి కూడా మనిషి జవాబు చెప్పలేడు!

 

దేవునితో వాదన విషయానికి వస్తే తాను గెలిచే అవకాశం ఎంత మాత్రం ఉండదని యోబుగారికి  తెలుసు. తాను ఎక్కువ బలప్రభావాలూ జ్ఞానమూ లేనివాడిననీ సంభాషణలో జాగ్రత్త లేనివాడిననీ వాదంలో నేర్పు, ప్రవీణత లేనివాడిననీ అతనికి తెలుసు (3,14-16,20 ). దేవుడైతే జ్ఞానవంతుడు, బలప్రభావాలుగల సృష్టికర్త అనీ, తన సృష్టికి తన ఇష్టం వచ్చిన విధంగా చేయగలవాడనీ తెలుసు ( 4-10). యోబు (అతని మిత్రులు కూడా) దేవుని గురించి కొంత సత్యాన్ని తెలుసు కున్నాడు. యోబుగారు  భూమినీ సూర్య చంద్ర నక్షత్రాదులనూ చూచి అవి దేవుడు కాదనీ, దేవునిలో కనీసం విభాగాలు కూడా కాదనీ తెలుసుకున్నారు. సృష్టి కేవలం దేవుని చేతిపనే అని యోబుగారికి తెలుసు. ఎంతోమంది దేవుళ్ళు లేరు, దేవుడొక్కడే అని తెలుసు. 11వ వచనంలో దేవుడు విశ్వంలో మనుషులకు కనపడని ఆత్మగా ఉన్నాడని యోబు చెప్తున్నాడు. మానవ జీవన వ్యవహారాల్లో దేవుడు సర్వ శక్తిమంతుడు (12,13 ). దీన్లో బహుశా యోబు ఉద్దేశం ఇది దేవుడు నా పిల్లలను తీసివేసుకున్నాడు. ఇందులో ఎవరూ చేయగలిగేదేమీ లేదు.

మనము కూడా ఈ విషయాలు గ్రహించి దేవుడు మన జీవితంలో అనుమతించిన ఎటువంటి క్లిష్ట పరిస్తితి అయినా దేవా ఒక కారణం వలననే దీనిని అనుమతించావు దయచేసి నీ చిత్తమైతే దీనిని తొలగించు అని ప్రార్ధన చేయాలి తప్ప దేవునితో వాదనలు చేయకూడదు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*46వ భాగం*

యోబు 9:410

4 ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

5 వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే

6 భూమిని దాని స్థలములో నుండి కదలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే

7 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును.

8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్ర తరంగములమీద ఆయన నడుచుచున్నాడు.

9 ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.

10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.

       

   ప్రియులారా! 9వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు  చెప్పిన మాటలకు ఈ 9 వ అధ్యాయంలో యోబుగారు జవాబు చెబుతున్నారు ! 

ఇంకా యోబుగారు అంటున్నారు దేవుడు మహా వివేకి- అధిక బలసంపన్నుడు కాబట్టి ఆయనతో పోరాడి హాని పొందకుండా ఎవరైనా ఉంటారా అని అడుగుచున్నారు!

 

అవును ఆయన వివేకి! ఆయన చేసే కార్యాలు మన ఊహలకు అందవు! ఇంకా అధిక బలసంపన్నుడు! గర్విష్టి అయిన నెబుకద్నెజర్ రాజు నా చేతిలో నుండి తప్పించగలిగిన దేవుడెవరైన ఉన్నారా గర్విస్తే, దేవుడు గడ్డి మేసేలా చేశారు! ఇక మరొక రాజు అస్సూరు రాజు- ఈ దేవతలేమయ్యారు ఆ దేవుడు నా చేతిలోనుండి కాపాడేడా? ఎవరూ వారి దేవతలు వారి దేవుళ్ళు నాచేతిలోనుండి కాపాడలేక పోయారు మీ దేవుడు నా చేతిలోనుండి కాపాడగలడా? ఇశ్రాయేలు రాజు పెట్టుకున్న దేవతలు దేవుడు వారిని నా చేతిలోనుండి విడిపించలేక పోయారు కదా- ఓ హిజ్కియా నీ దేవుడు అసలు విడిపించలేడు కదా అని విర్రవీగాడు- దేవుడు కేవలం ఒకేఒక దేవదూతను పంపించాడు! 1,85,000 మంది ఉదయానికి చచ్చి శవాలుగా మారిపోయారు! ఇంటికి వెళ్ళిన వెంటనే కన్న కొడుకులే కత్తితో పొడిచేశారు! ఇదీ దేవుని దెబ్బ! కాబట్టి ఏ మనిషి గాని, రాజు గాని దేవునితో పోట్లాడలేరు ఆయన దేవుడు- మనం మనుషులం మాత్రమే! దేవుని రాజ్యాన్ని పాడుచేద్దామని ఏసయ్య పుట్టిన దగ్గరనుండి బోలెడు మంది రాజులు రాజ్యాలు చూశాయి గాని ఎవడబ్బ తరము కాలేదు- కాదు కూడా! కారణం దేవుడు మహా అధిక బలసంపన్నుడు!!!

 

ఇక తర్వాత వచనంలో వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే అంటున్నారు. అవును ఈ రోజులలో కొండలు కరిగిపోతున్నాయి- కొండల స్థానంలో ఇల్లు వస్తున్నాయి రోడ్లు వస్తున్నాయి! ఇవన్నీ దేవుడు చేసిన క్రియలు అని గ్రహించాలి! అంతేకాకుండా మీరు విశ్వాసము కలిగి ఈ కొండను చూసి అక్కడ పడమంటే వెళ్తుంది అని యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు! చైనాలో ఒకామే అలాగే విశ్వాసంతో ప్రార్ధన చేసింది అట! కారణం వర్షాలు పడినప్పుడు కొండరాళ్ళు ఈమె ఇంటిమీదికి వచ్చేవి అట! అలా ప్రార్ధించగా నాలుగు సంవత్సరాల తర్వాత ఆ కొండమీదుగా ఒక హైవే వేశారట అప్పుడు ఆ కొండమొత్తం ఆ హైవేలో పోయింది! ఈ విధంగా ఆమె చేసిన ప్రార్ధనకు దేవుడు జవాబిచ్చాడు! ఈ రకంగా ఆయన కొండలను వాటికి తెలియకుండా కనుమరుగయ్యేలా చేయగలరు!

 

ఇంకా 6 భూమిని దాని స్థలములో నుండి కదలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే

అనగా భూకంపముల ద్వారా భూమిని కూడా స్థాన భ్రంశము చేయగలడు అంటున్నారు! అంతేకాకుండా ఇదే భూకంపాల ద్వారా భూమి అదిరిపోయేటట్లు తత్తరిల్లి పోయేలా చేస్తారు ఆయన! దెబ్బకు భూమి పగిలిపోతుంది! దాని ఫలితమే నేడు ఆఫ్రికా ఖండములో ఏర్పడుచున్న గొప్ప పగులు!

. . . ఆఫ్రికా ఖండంలో భూమి పగుళ్లు ఏర్పడటం అనేది

తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ (East African Rift) వ్యవస్థ వల్ల జరుగుతోంది, దీనివల్ల ఖండం నెమ్మదిగా రెండుగా విడిపోతుంది, త్వరలో కొత్త మహాసముద్రం ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ చీలిక (రిఫ్ట్) వల్ల భూమిపై పెద్ద పగుళ్లు, సరస్సులు, అగ్నిపర్వతాలు ఏర్పడుతున్నాయి, ఇది ఆఫ్రికన్ టెక్టోనిక్ ప్లేట్ (నుబియన్ మరియు సోమాలియన్ ప్లేట్లు) విడిపోవడమే దీనికి కారణం. ఇదీ AI ఇస్తున్న జవాబు! నిజానికి దీనిని చేస్తున్నది దేవుడే!

 

ఇక 7 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఇది జరిగిందా అంటే జరిగింది కదా యెహోషువా గారి కాలంలో యెహోషువా గారు ప్రార్ధన చేసిన వెంటనే దేవుడు భూభ్రమణమును భూపరిభ్రమణమును ఆపివేశారు. సూర్య చంద్రుల యొక్క భ్రమణములను కూడా ఆపివేశారు!

యెహోషువా 10: 12 యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.

13 సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.

14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.

 

నిజానికి దీనిని యోబుగారు ముందుగానే గ్రహించి దేవుని మహిమను కీర్తిస్తున్నారు!

 

ఇక తర్వాత ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్ర తరంగములమీద ఆయన నడుచుచున్నాడు!

దేవుడు చేసిన చేస్తున్న కార్యాలకు కొన్ని మన ఊహలకు అందనివి! ఇక్కడ ఆకాశ మండలమును విశాల పరచును అంటున్నారు ఎప్పుడు విశాలపరిచారు ఎందుకు విశాలపరిచారు అనేది మన ఊహలకు అందదు. అయితే ఖగోళ శాస్త్రజ్నులూ మరికొన్ని నక్షత్రాలు పాలపుంతలు కనుగొన్నారు! అంటే ఆకాశ మండలము విశాలము అయినట్లే కదా! ఇంకా సముద్ర తరంగముల మధ్య నడుచుచున్నాడు! దీనిని వ్రాయించింది పరిశుద్దాత్ముడు గనుక ఇది సత్యము! యోబుగారి కాలంలో దేవుడు సముద్ర తరంగముల మీద నడిచారు! ఆ తర్వాత యేసుక్రీస్తుప్రభులవారు నీటిమీద నడుచుకుంటూ వచ్చినట్లు ఆయన శిష్యులంతా చూశారు- పేతురు గారు అడిగారు- నేను నడిచేలా చేయమంటే ఆయన కూడా నడిచాడు!

 

మత్తయి 14: 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను

26 ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

27 వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా

28 పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

29 ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని

30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.

31 వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

32 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.

 

కాబట్టి దేవుడు ఆశ్చర్యకార్యములు చేయువాడు! నమ్మి విశ్వాసముంచు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*47వ భాగం*

యోబు 9:912

9 ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు.

10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.

 11 ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

12 ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

 

   ప్రియులారా! 9వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు  చెప్పిన మాటలకు ఈ 9 వ అధ్యాయంలో యోబుగారు జవాబు చెబుతున్నారు ! 

 

ఇంకా యోబుగారు అంటున్నారు దేవుడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు

తర్వాత వచనంలో ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు. అంటున్నారు!

ఇక్కడ ఆగి ఒక విషయం చెప్పనీయండి- కొన్ని సంవత్సరాల క్రితం నేను రాసే శీర్షికలలో మనము వాస్తుని పాటించకూడదు జ్యోతిష్యాలు చెప్పించుకోకూడదు విధులు తిధులు చూపించుకో కూడదు అంటే ఒక వాట్సప్  గ్రూప్ లో  ఒక పాస్టర్ గారు నాతో వాదించారు దూషించారు శపించారు ఏమని అంటే యోబు గ్రంధంలో దేవుడే వ్రాయించారు  ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు అనడమే కాకుండా ఎవడూ తెలిసికోలేని మహత్తర కార్యాలు చేసేవాడు లెక్కలేనన్ని అధ్బుత క్రియలు చేసేవాడు అని- అనగా ఈ వాస్తు శాస్త్రము లోని, జ్యోతిష్య శాస్త్రము లో బైబిల్ లో  లేని మనము తెలుసుకోలేని గొప్ప విషయాలు ఉన్నాయి వాటిని మనము పాటించాలి లేకపోతే మనకు నష్టం శాపం వచ్చేస్తుంది అన్నారు!  అప్పుడు  నేను: ఇది  తప్పు . ఇక్కడ దేవుడు రాసింది ఆయన నక్షత్రాలు రాశులు చేసిన వాడు- వాటివాటి కాలంలో వాటివాటి పనులు సక్రమంగా జరగడానికి దేవుడు ప్రకృతిలో కొన్ని చేశాడు అవి మన వాతావరణ విషయాలకు సంబంధించినవే గాని మన భవిష్యత్ కు వాటితో సంబంధము లేదు- మన భవిష్యత్ దేవుని చేతిలో ఉంది! ఈ వాస్తులోని జ్యోతిష్య శాస్త్రములో లేదు అని చెబితే ఆ పాస్టర్ గారు అన్నారు  నేను నీ కంటే ఎక్కువగా వాదించేవాడిని- మన పెద్దలు చెప్పిన మాటలు నమ్మక వాస్తుని జ్యోతిష్యము నమ్మక బోలెడు నష్టపోయాను- తర్వాత నమ్మి విశ్వసించి లాభ పడ్డాను, నీవు కూడా దీనిని పాటించక పోతే బోధించక పోతే నాశనమై పోతావు అంటూ నన్ను శపించాడు! దేవునికి స్తోత్రము కలుగును గాక! ఆ వ్యక్తి శాపం ఇంతవరకు నాకు తగులలేదు! నేను నా కుటుంబం, నా సంఘములు అన్నీ బాగున్నాయి! పైగా దేవుడు నన్ను అత్యధిక్యముగా దీవించారు కూడా! కాబట్టి ఆ నక్షత్రాలను దేవుడు చేసినది కాలములు వాతావరణ విషయాలు కోసమే! నక్షత్రాలతో తిధులతో మన భవిష్యత్ ఆధారపడి లేదు అని గ్రహించాలి! పనికిమాలిన వాస్తు జ్యోతిష్యము లను నమ్మవద్దు అని మనవిచేస్తున్నాను!

 

ఇక తర్వాత వచనములో 11 ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

12 ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

 

చూడండి దేవుడు యోబు గారికి సమీపమున గడచిపోతున్నాడు అనగా అక్కడే నడుస్తూ అక్కడే ఉంటున్నారు గాని నేను ఆయనను చూడలేక పోతున్నాను! ఆయన నాకు కనబడటం లేదు! ఆయనను పట్టుకొందాం అంటే సాధ్యపడటం లేదు! అంటున్నారు! ఆయన మనకు ఎందుకు కనబడటం లేదు అంటే మొదటగా ఆయన ఆత్మ స్వరూపి- మనము ఈ మానవ కన్నులతో ఆయన చూడలేము- ఆయనను  తాకలేము! పట్టుకోలేము! గనుక ఆయనను చూడలేము తాకలేము!

 

రెండు: ఆయనకు మనలా

ఆయన ఎవరి ప్రాణమునైనను పట్టుకుని పోతుంటే అడ్డగించేవాడు ఎవడు అంటున్నారు- ఇంకా నీవేమీ చేస్తున్నావు అని ఆయనను అడగడానికి కూడా ఎవడూ సరిపోదు అంటున్నారు!

యెషయా గారు ప్రవచిస్తున్నారు  45: 7 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.

8 ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.

9 మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

10 నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?

12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

 

చివరకు గర్విష్టి గడ్డిమేశాక ఆ రాజు అంటున్నాడు దానియేలు గ్రంధంలో 4: 35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు

 

కాబట్టి ఈ విషయం యోబుగారు గ్రహించారు- నెబుకద్నేజర్ గడ్డి మేసి బుద్ధి వచ్చాక గ్రహించి చెప్పాడు! నీవు కూడా తెలుసుకో! ఆయన చేసిన దానికి మనము దేవుణ్ణి ప్రశ్నించలేము! లోబడటం నేర్చుకో!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*48వ భాగం*

యోబు 9:1322

13 దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

15 నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని  నేనాయనను బతిమాలుకొనదగును.

16 నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

17 ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు

18 ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.

19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?

20 నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే.

22 కావునయథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

 

   ప్రియులారా! 9వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు  చెప్పిన  మాటలకు ఈ 9 వ అధ్యాయంలో యోబుగారు జవాబు చెబుతున్నారు ! 

ఇంకా యోబుగారు అంటున్నారు దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు

ఇక్కడ దేవుని కోపము నాపై చల్లారదు అంటున్నారు! క్రింద వచనాల ప్రకారం యోబు గారు ఏమని నిర్ణయానికి వచ్చేశారు అంటే నేను నిర్ధోషిని అది నాకు తెలుసు దేవునికి కూడా తెలుసు- అయితే దేవుడు ఎందుకో నామీద కోపంగా ఉన్నారు అందుకే నాకు ఇవన్నీ ప్రాప్తించాయి ఆ కోపము ఇప్పుడు నామీద తగ్గదు అంటున్నారు! ఆ కోపానికి రహబు సహాయులు ఆయనకు లోబడతారు అంటున్నారు

ఇక్కడ రహబు అనగా యెహోషువా గ్రంధంలో వ్రాయబడిన రాహాబు అనే వేశ్య కానేకాదు అని గ్రహించాలి! యోబు 26, ఇంకా కీర్తనల గ్రంధం 87, 89 లో కూడా పేర్కొనబడిన ఈ రహబు ఒక్కో సంధర్భం లో ఒక్కో అర్ధం కలిగి ఉంది! రహబు అనేది కీర్తనల గ్రంధం ప్రకారం ఇంకా యోబు 26 ప్రకారం- ఇశ్రాయేలు ప్రజలను అణగద్రోక్కిన ఐగుప్తు రాజ్యము అని గ్రహించాలి!

 

ఇక తర్వాత వచనంలో 14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

మరి దేవుడు ఇంతటి గొప్పవాడు కాబట్టి ఆయనకు జవాబు చెప్పగల ధైర్యము స్థైర్యము నాకు లేవు చివరకు ఆయనతో వాదించడానికి సరియైన మాటలు కూడా నా దగ్గర లేవు నేనెంతటి వాడను అంటునారు! ఇదేమాట చివరలో దేవునితో చెబుతున్నాడు యోబు 40:3 లో

3 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

4 చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.

5 ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.

 

ఇక 42 వ అధ్యాయంలో కూడా ఇలాగే పలుకుతున్నారు

1 అప్పుడు  యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను

2 నీవు సమస్తక్రియలను చేయగలవనియునీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియునేనిప్పుడు తెలిసికొంటిని.

3 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.

5 వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.

6 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

 

ఇక్కడ తనను తాను తగ్గించుకోవడం చాలా బాగుంది అయితే తర్వాత వచనంలో యోబు గారు పలికిన మాటలు అసలు ఏమీ బాగోలేదు!

15 నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని  నేనాయనను బతిమాలుకొనదగును

ఇదేమాట 21 లో కూడా అంటున్నారు 21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే.

నిజానికి యోబు గారు నిర్ధోషి ఆయన ఏమీ పాపములు దోషములు చేయలేదు గాని దేవుడు సాతాను గాడు వేసుకున్న సవాలు వలన యోబుగారు ఇన్ని కష్టాలు పడుతున్నారు! అయితే ఇక్కడ యోబు గారు అంటున్న మాటలు ఏమిటంటే నేను నిర్ధోషిని గాని దేవుడు నా మీద పగపట్టి కోపంతో ఇన్ని కష్టాలు పాలు చేశాడు ఇప్పుడు నా ప్రాణము మీద నాకు ఇష్టం లేదు! కాబట్టి నీతిమంతుడుగా ఉండటం వలన ఉపయోగం లేదు- కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను అంటూ ఘోరంగా మాట్లాడుచున్నారు ఇక్కడ!

 దేవుని గురించి యోబు పలికిన మాటలన్నిటిలోకి ఇవే కఠినంగా ఉన్నాయి. తన నిరాశలో పూర్తిగా అధమ స్థితికి యోబు ఇక్కడ దిగజారాడు. తనకు దేవుడు చేసినవాటిని అపార్థం చేసుకోవడంలో యోబుగారు  ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయారు. దేవుణ్ణి క్రూరుడైన నియంతగా, కనికరం లేకుండా తోచినది చేసేవాడిగా చిత్రీకరించారు ఇక్కడ. న్యాయవంతులు, దుర్మార్గులు అనే తేడా చూపని దేవుడుగా వర్ణిస్తున్నారు . అయితే యోబు దుర్మార్గుడని ఈ మాటల వల్ల రుజువు కావడం లేదు. ఎడతెరిపి లేని బాధ, దుఃఖం, వేధించే ప్రపంచంలో అత్యంత యోగ్యుడైనవాణ్ణి కూడా ఎలా మాట్లాడించగలవో ఇక్కడ అర్థమౌతున్నది. శరీరం, ఆత్మ బాధతో మెలికలు తిరిగిపోతూ ఉంటే దారీ తెన్నూ తోచని మనిషి దేవదూతలాగానో, కష్టాలు అనుభవించని పవిత్రునిలాగానో ఎలా మాట్లాడగలడు? అయితే ఒకటి గమనించడి. ఇప్పుడు కూడా యోబుగారు  దేవుణ్ణి నిరాకరించడం లేదు. నాస్తికత్వం అనే అజ్ఞానం, దుర్మార్గతలో పడడం లేదు. సైతాను ఇలా వాదించి మనుషుల్ని నాస్తికత్వాన్ని అవలంబించడానికి ప్రేరేపిస్తాడు ఈ లోకం అంతా నిర్దోషుల మీదికీ అమాయకుల మీదికీ వచ్చే అన్యాయమైన బాధలు, విపత్తులతో నిండి ఉంది. దేవుడంటూ ఉంటే ఇలా జరగనివ్వడు గదా. సైతాను తర్కం ఇది:

 (1) దేవుడే గనుక ఉంటే నిర్దోషులు బాధలు పడరు;

(2) కానీ నిర్దోషులు బాధలు పడుతున్నారు;

(3) కాబట్టి దేవుడు లేడు.

సైతానుకు ఇది నిజం కాదని తెలుసు. గాని కొందరిని ఇది నిజమని నమ్మిస్తాడు. యోబుగారు  ఈ ఉచ్చులో పడలేదు. కానీ ఈ లోకంలో కనిపించే కీడు విషయంలో యోబుకు కలిగిన అయోమయావస్థ 24వ వచనంలో కనిపిస్తున్నది. దేవుడు దీన్ని ఎందుకు అరికట్టడు? పైగా దీన్ని సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నదేమిటి? యోబు గానీ బైబిల్లోని దేవుని సంపూర్ణ సత్యం తెలియని వారెవరైనా గానీ మనుషులతో దేవుని తీరు తెన్నులను అర్థం చేసుకోలేరు. బైబిలంతటితో పరిచయం ఉన్న మనం కూడా ఒక్కో సారి దిగ్భ్రమలో పడిపోతాం (కానీ నిరాశ చెందకూడదు). మనం కూడా యోబులాగానే విశ్వాసంతో నడుచుకోవాలి (2 దినవృత్తాంతములు 5:7, ), కనిపించేవాటిపై గాక కనిపించని వాటిపై మనస్సు లగ్నం చెయ్యాలి (2 దినవృత్తాంతములు 4:18, ).

 

కాబట్టి ఇలాంటి మాటలు మనము పలుకకూడదు! యోబుగారు నిరాశలో క్రుంగి పోయి యోబుగారు ఫ్రష్టేషన్ లో ఉండి ఘోరమైన మాటలు పలుకుచున్నారు మనము అలాగుండకూడదు ఏ మాయదారి దేవుడవో గాని నేనే దొరికానా అని అనకూడదు! మన మాటలను సరిచేసుకుందాం! దేవునితో సమాధాన పడదాం!

దైవాశీస్సులు!

 

*యధార్ధవంతుడైన యోబు*

*49వ భాగం*

యోబు 9:1322

13 దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

15 నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని  నేనాయనను బతిమాలుకొనదగును.

16 నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?

20 నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే.

22 కావునయథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

 

   ప్రియులారా! 9వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు  చెప్పిన  మాటలకు ఈ 9 వ అధ్యాయంలో యోబుగారు జవాబు చెబుతున్నారు ! 

 

ఇంకా యోబుగారు అంటున్నారు నేను నిర్ధోషిని అయినా ఆయనకు  జవాబు చెప్పలేను! దేవుడు న్యాయకర్త కాబట్టి నేను ఇప్పుడు ఆయనను బ్రతిమాలు కోవడమే మిగిలి ఉంది అంటున్నారు! అవును దేవుడు న్యాయకర్త కాబట్టి మనము దేవుణ్ణి బ్రతిమాలు కోవాలి! ప్రియులారా ఇంతవరకు యోబు గారు చెప్పిన మాట బాగుంది గాని తర్వాత వచనంలో నేను ఆయనకు మొర్రపెట్టినప్పుడూ దేవుడు నాకు జవాబు ఇచ్చినా గాని దేవుడు నా మాట ఆలకించారు అని నేను నమ్మలేను! ఇది నిజంగా విశ్వాసము నిరీక్షణ లేని తనము! ఇలాంటి స్థితి విశ్వాసులకు ఉండనే కూడదు!

యాకోబు పత్రికలో భక్తుడు అంటున్నారు 1: 5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

7 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

8 గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.

 

ఇక్కడ యోబుగారు చెప్పేది విశ్వాసమునకు దూరంగా ఉంది! మనమైతే అలాగుండా కూడదు!

ఇక తర్వాత వచనాలలో ప్రాణము విసికి ఇంకా అంటున్నారు 17 ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు

18 ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.

 

ఇక్కడ దేవుడే నాకు కారణం లేకుండా నా గాయములను విస్తరిస్తున్నారు పెనుగాలి చేత నలుగగొట్టు చున్నాడు అంటున్నారు! మరలా యాకోబు గారి దగ్గరకు వస్తే 12 శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

నిజానికి దేవుడు ఎవరినీ శోధించడు గాని యోబుగారి కేసే వేరు! దేవుడు సాతాను గాడు వేసుకున్న పందెములో పావులా మారిపోయారు యోబుగారు! అయితే శోధన తర్వాత యోబుగారిని శుద్ధ సువర్ణముల మార్చాలని దేవుని ప్రణాళికా! అంతేకాకుండా రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుని ఉద్దేశం! అందుకే దేవుడు ఇన్ని శ్రమలకు శోధనలకు అనుమతిని ఇచ్చారు! అయితే మానవుల ఉద్దేశాలు వేరు- దేవుని ఉద్దేశాలు వేరు!

 

ఇక తర్వాత వచనాలలో 19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?

20 నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

 

దేవుడు బలవంతుల శక్తిని గూర్చి వాదము కలిగితే ఒరేయ్ ఆ బలవంతుల కంటే నేనే బలవంతుడిని రా అంటారు అంటున్నారు! అవును ఆయన అధిక బలసంపన్నుడు!!! ఇంకా న్యాయముకోసం వాదము వస్తే నేనే న్యాయకర్తను భూమిమీద నీతిని న్యాయాన్ని స్థాపించే వాడను నేనే అంటారు అంటున్నారు! అవును కదా! అందుకే భూలోక న్యాయాధిపతి అని పిలుస్తున్నారు దేవుడ్ని!!!  కీర్తన 94: 2 భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము

కాబట్టి నిజమైన న్యాయాధిపతిని నమ్ముదాము! ఆయన యందు విశ్వాసముంచుదాము! యోబుగారిలా ఆయనమీద కానిమాటలు పలుకవద్దు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*50వ భాగం*

యోబు 9:2429

24 భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు?

25 పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.

26 రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

27 నా శ్రమను మరచిపోయెదననియు దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకొంటినా?

28 నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను

29 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

  

      ప్రియులారా! 9వ అధ్యాయంలో యోబుగారి మరో స్నేహితుడు షూహీయుడగు బిల్దదు  చెప్పిన  మాటలకు ఈ 9 వ అధ్యాయంలో యోబుగారు జవాబు చెబుతున్నారు ! 

 

అయితే ప్రియులారా ఈ అధ్యయమంతా యోబుగారు నిరాశతో నిరీక్షణ లేకుండా దేవుడు నన్ను బాధించాడు అని చెప్పడమే ఉంది గనక ముఖ్యమైన వచనాలు క్లుప్తంగా చూసుకుందాం!

భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును నిజానికి ఈ మాట నిజమే! భూమి మీద మంచివారు నీతిపరులు శోధనలను శ్రమలను తిరస్కారములు నేటి రోజులలో పొందుకుంటున్నారు- ఆరోజులలో కూడా అలాగే ఉంది! ఇక వారి న్యాయాధిపతులు లంచగొండులై పోయారు న్యాయాన్ని అన్యాయంగా తిప్పి వేస్తున్నారు అన్యాయమే న్యాయమని చెబుతూ న్యాయాన్ని మార్చేస్తున్నారు! ఇదే మనకు యిర్మీయా గ్రంధం లోనూ యెషయా గ్రంధంలోనూ వ్రాయబడింది! అయితే వీటిని జరిగించు వాడు దేవుడు తప్ప ఎవరు అంటున్నారు! నిజానికి వారిలో ఇలా ఉండి నడిపించేది దేవుడు కాదు- సాతాను గాడే వారిని నడిపిస్తున్నాడు! గాని ఇక్కడ దేవుడే చేస్తున్నాడు అని కానిమాటలు పలుకుచున్నారు ఆయన!

 

పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అంటున్నారు

 యోబు 7:6

6 నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

కీర్తనల గ్రంథము 39:5

5 నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. (సెలా. )

 

యెషయా 38:12

12 నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తికొనిపోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

ఇది మానవుల యొక్క పరిస్తితి భూమిమీద! ఇది గ్రహించకుండా ఈ భూమి నాదని ఆ జాగా నాదని అని వెంపర్లాడు తున్నారు!

 

ఇంకా తర్వాత వచనాలలో 27 నా శ్రమను మరచిపోయెదననియు దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకొంటినా?

28 నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను

చూడండి నేను నా బాధలను మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నా గాని నీవు నన్ను చివరికి నిర్ధోషిగా ఎంచవు అని గ్రహించి నేను బాధపడుతున్నాను అంటున్నారు!

దేవుడు తనపై అకారణంగా నేరం మోపుతున్నాడనీ తాను పవిత్ర జీవనం గడిపినప్పటికీ తప్పులెన్నుతున్నాడనీ యోబుగారు  అంటున్నారు  తన బాధలను మరచి, ఈ నేరారోపణ దోషం నుండి విముక్తుడై సంతోషంగా ఉండే దారి ఏదీ కనిపించడం లేదు అని వాపోతున్నారు అన్నమాట!

 

ఇంకా అంటున్నారు 29 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

30 నేను హిమముతో నన్ను కడుగుకొనినను సబ్బుతో నా చేతులు కడుగుకొనినను

31 నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.

32 ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

నేను మంచుతో నన్ను నేను కడుగుకున్నా సబ్బుతో రుద్దుకున్నా నీవు నన్ను అపవిత్రునిగానే ఎంచుతున్నావు నీవు నన్ను గోతిలో ముంచబోతున్నావు చివరకు నేను వేసుకున్న వస్త్రాలకు కూడా నేను అసహ్యమై పోయాను అంటున్నారు!

 

ఇంకా దేవుడు నావలే నరుడు కాదు గదా అందుకే నేను దేవునితో వాదము పెట్టుకోలేను మేము న్యాయవిమర్శకు పోలేము ఎందుకంటే ఆయనకు నాకు కలిపి న్యాయం తీర్చగలిగే జడ్జి ఎవరూ లేరు! ఆయనే న్యాయాధిపతి నేను ఎవరి దగ్గరకు వెళ్లగలను అంటున్నారు!

 

తననూ దేవుణ్ణీ ఒక చోట చేర్చి, వివాదం పరిష్కరించి దేవుని శిక్ష దండాన్ని తన తలపై నుండి తొలగించేలా చెయ్యగలిగే మధ్యవర్తి ఒకడు ఉండాలని యోబు కోరుతున్నాడు. అయితే యోబు ఆశించినదాని కంటే ఊహించినదాని కంటే మరెంతో ఘనమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ అవసరాన్ని పూర్తి చేశాడు. దేవునికీ మనిషికీ ఉన్న ఏకైక మధ్యవర్తి ఆయనే (1 తిమోతికి 2:5, ). విశ్వాసి తరుఫున పరలోకంలో ఉన్న న్యాయవాది ఆయనే (1 యోహాను 2:1, ). ఆయన మూలంగా దేవునికీ మానవునికీ మధ్య సంధి కుదిరింది. మనిషికి దేవుని చెంతకు నేరుగా చేరే విధానం ఏర్పడింది

1 యోహాను 2:1

1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.

 

1 తిమోతికి 2:5

5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

ఎఫెసీయులకు 2:17-18

17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.

ఇంకా అంటున్నారు యోబుగారు 34 ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెను నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.

35 అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను చున్నాను.

 

దేవుడ్ని తమ దండమును నా మీదనుండి తీసివేస్తే ఆయన తన మహా పరాక్రమమును మహాత్యమును నామీద నుండి తీసివేస్తే అప్పుడు నేను దేవునికి భయపడకుండా దేవునితో వాదిస్తాను అంటున్నారు!

నిజానికి ఇది జరుగని పని!

దేవుడు సర్వశక్తివంతుడు!

ఆయనతో మనము వాదించలేము! నోటిమీద వేలు వేసుకోవడం మంచిది!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*51వ భాగం*

యోబు 10:15

1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

2 నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.

3 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

4 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?  

 

      ప్రియులారా! 10వ అధ్యాయంలో కూడా యోబు గారు దేవునితో నిరాశతో నిష్ప్రహతో మాట్లాడుచున్నారు!

ఇక మొదటి వచనంలో అంటున్నారు నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను అంటున్నారు!  నా బ్రతుకు మీద నాకు విసుకు పుట్టేసింది అందుకే నేను ఎవరు ఆపినా ఆకుండా అడ్డులేకుండా ఏడుస్తాను నా మనో వ్యాకులము కొద్దీ నేను పలుకుతాను అంటున్నారు!

చూడండి. తన ఆలోచనలు, అనుభూతుల్లో దేనినీ దాచిపెట్టకూడదని యోబు నిర్ణయించుకున్నారు . కొందరు వెల్లడి చేయడానికి భయపడి తమ హృదయంలోనే దాచిపెట్టుకునే విషయాలను యోబుగారు ఇక్కడ  స్వేచ్ఛగా బయటపెట్టారు . తన మాటల గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని యోబుగారు  భయపడటం  లేదు. అతనికి కావలసినది సత్యమే.

 

తర్వాత వచనంలో నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను అంటున్నారు

నిజానికి ఇలా మాట్లాడటానికి కారణం అతని అంతర్వాత్మ  అతని మీద ఏ దోషారోపణ చేయలేదు. దేవునికి తనలో నచ్చనిది ఏదో అతను తెలుసుకోగోరాడు (యోబు 6:24, ; యోబు 13:23, ). దేవునికి అతనంటే విరోధ భావం లేదనీ ఆయన అతణ్ణి ప్రేమిస్తున్నాడనీ అతని గురించి సంతృప్తి చెంది అతణ్ణి దయతో చూస్తున్నాడనీ యోబుగారికి  తెలియదు. యోబు తన స్నేహితులతో చర్చిస్తూ హఠాత్తుగా మధ్యలో ఆపి దేవునితో మాటలు మొదలు పెట్టడం గమనించండి (యోబు 7:7-12, ; యోబు 10:2-22, ; యోబు 13:20, ; యోబు 14:22, ; యోబు 16:7-8, ; యోబు 17:3-4, ; యోబు 30:20-23, ). యోబు స్నేహితులు ఇలా ఎన్నడూ చెయ్యలేదు. దీన్ని బట్టి ఒక విషయం అర్ధమవుతుంది !

యోబు ప్రార్థనాపరుడన్న విషయం తెలుస్తున్నది. దేవునితో మాట్లాడే అలవాటు ఉన్నవాడు (యోబు 12:4, ). తన తలంపులు, ఆశలు ఉన్నవి ఉన్నట్టుగా విశ్వానికి సృష్టికర్త అయిన దేవుని పాదాల ఎదుట కుమ్మరిస్తున్నాడు. మనందరం ఇలా చెయ్యడం దేవుని అభిమతం (కీర్తనల గ్రంథము 62:8, ). మనకు వచ్చే కొన్ని ఆలోచనలూ, ప్రశ్నలూ బుద్ధిలేనివీ, పాపంవల్ల మలినం అయినవీ అని ఆయనకు తెలుసు. ఆయనకోసం మనం ఆశతో ఎదురు చూచే విషయం, మన సత్యాభిలాష ఆయన గ్రహిస్తాడు. మనం పలికే మాటల్లో నిజాయితీని ఆయన మెచ్చుకుంటాడు.

ఇక తర్వాత వచనంలో దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

ఒకసారి యోబు 9:23-24, చూడండి.

22 కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

23 సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.

24 భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడు? అని అన్నారు ఇక్కడ!

దేవునికి శిక్షించడంలో అంత ఆసక్తి ఉంటే శిక్షకు పాత్రులైన దుర్మార్గులను శిక్షించాలి గాని అందుకు తగని తనలాంటివారిని శిక్షించడమెందుకని యోబు అనుకున్నాడు

అయితే ఆసాపు గారు కూడా ఇలాగే అనుకున్నారు కీర్తనల గ్రంథము 73:3-5,

3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

4 మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.

5 ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.

అయితే తర్వాత సత్యాన్ని గ్రహించి చెబుతున్నారు

12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.

13 నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే

14 దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.

యోబుగారు కూడా అలాగే అనుకున్నారు!

ఇక తర్వాత 4 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?  

యోబుగారి  మీదికి వచ్చిన ఆపదలకు కారణమైన ఏదో ఒక పాపం అతనిలో కనిపిస్తుందని యోబు స్నేహితులు వెతుకుతున్నారు. వాళ్ళు వెతికినట్టుగానే దేవుడు కూడా పాపం కనుక్కోవాలని వెదకడం ఎందుకు అని అడుగుతున్నాడు. దేవునికి అన్ని విషయాలూ తెలుసునని అతను గుర్తించాడు. శిక్షకు పాత్రమైన ఒక్క పాపాన్ని అయినా దేవుడు యోబులో పసిగట్టి ఉంటే దాన్ని తేటగా స్పష్టం చేయాలని కోరుతున్నాడు.

అందుకే నీ జీవితకాలం నరూలా జీవితకాలము వంటిది కాదు కదా- నీ ఆయూషకాలము మానవుల ఆయూషకాలము వంటిది కాదు కదా! నేను కొద్ది డినముల కలిగిన నరుడను కదా నన్నెందుకు ఇంతగా బాధిస్తున్నావు శోధిస్తున్నావు అని వాపోతున్నారు ఇక్కడ యోబుగారు!

అయితే దేవుని ఉద్దేశములు యోబుగారికి అర్ధం కాక ఇలా ఆంధోళన తో మాట్లాడుచున్నారు! నీవు కూడా దేవుని ఆలోచనాళం అర్ధం చేసుకోకుండా ఏవి పడితే అవి మాట్లాడవద్దని ప్రభువుపేరిత మనవి చేస్తున్నాను

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*52వ భాగం*

యోబు 10:615

6 నేను దోషిని కాననియు నీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు

7 నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్నను నీవు నన్ను మింగివేయుచున్నావు.

9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

10 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

12 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

14 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు.

15 నేను దోషకృత్యములు చేసినయెడల  నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

 

      ప్రియులారా! 10వ అధ్యాయంలో కూడా యోబు గారు దేవునితో నిరాశతో నిష్ప్రహతో మాట్లాడుచున్నారు!

 

ఇక ఆరవ వచనంలో అంటున్నారు 6 నేను దోషిని కాననియు నీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు

7 నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

 

చూడండి నేను దోషిణి కాను అని నీకు తెలుసు! ఇంకా నీ చేతిలో నుండి నన్ను ఎవడూ విడిపించలేదని కూడా నీకు తెలుసు గాని  నా దోషాల కోసం నా అపరాధాల కోసం ఎందుకు వెదుకుతున్నావు నా పాపమును ఏల వెదుకుతున్నావయ్యా అంటూ కన్నీరు కార్చుతున్నారు! ఇప్పుడు యోబు గారు తన స్నేహితులతో మాట్లాడటం లేదు తన బాధను దేవునితోనే చెప్పుకుంటున్నారు! కారణం మనుషులు తన బాధను పెంచేవారే గాని తగ్గించేవారు కాదని తెలుసును!

 

అందుకే తర్వాత వచనంలో నీవు నీ స్వంత చేతులతో నన్ను నా అవయవాలను చేశావు కదా నీవే నాకు రూపకల్పన చేశావు కదా ఇప్పుడు నీవే నన్ను ఎందుకు మింగివేస్తున్నావయ్యా అంటున్నారు!

కీర్తనాకారుడు కూడా అంటున్నారు: కీర్తనల గ్రంథము 119:73

73 (యోద్‌) నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయచేయుము.

కీర్తనల గ్రంథము 139:13

13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

 

ఇంకా అంటున్నారు నీవు నన్ను జిగటమన్ను లేక బంకమన్నుతో చేశావు. నీ చేతితోనే నన్ను చేశావు కదా ఇప్పుడు నన్ను మట్టిపాలు చేస్తావా దేవుడా? నన్ను పాలుపోసి నట్లు నన్ను పోశావు కదా ఒకడు పెరుగు తోడు పెట్టి పేర బెట్టినట్లు నన్ను చేశావు కదా ఎందుకయా ఇప్పుడు నాకీ బాధలు అంటూ ఏడుస్తున్నారు!

 

గమనించాలి ఇంతవరకు నిష్టూరాలు పలికిన యోబుగారు ఇప్పుడు దేవుని దగ్గర ప్రాధేయపడటం మొదలుపెట్టారు! ఏడుస్తున్నారు విలపిస్తున్నారు! ఒకసారి నన్ను నీవు ఎలా చేశావో గుర్తుచేసుకో బాబు అంటూ దేవుని పాదాలు పట్టుకుంటున్నారు!

అయ్యా నీవే కదా నన్ను మాంసము తోను చర్మము తోను నా ఎముకలను కప్పావు కదా, నన్ను నరాలతోనూ ఎముకలతోనూ రూపొందించావు కదా! ఇప్పుడు అదే ఎముకలు అందరికీ కనబడేలా ఎందుకు చేస్తున్నావు! నా మాంసమును ఎందుకు పాడుచేశావు ప్రభూ అంటున్నారు!

 

ఇంకా 12 వ వచనంలో అంటున్నారు ఇంకా నాకు జీవాన్ని ఇచ్చావు అది నీవిచ్చినదే కదా! నామీద నీ అనుగ్రహం కూడా చూపావు కదా! నాకు నీవు సంరక్షణ కూడా ఇచ్చావు కదా! నా ఊపిరి నీవు ఇచ్చినదే ఆ ఊపిరిని నీవేకదా కాపాడుతున్నావు! ఇప్పుడు కష్టంగా ఊపిరి పీల్చుకునేలా ఎందుకు చేశావయా! అంటున్నారు!

 

దేవుడు తనకు జన్మనిచ్చి దయ చూపించినా ఆయన అస్తమానమూ ఏదో ఒక వంకతో తనను శిక్షించడానికి చూచే కఠినుడైన తీర్పరి అనీ, నాశనం చేయాలని తరిమే సింహం లాంటివాడనీ ఇంతకు ముందు  యోబుగారికి  అనిపించింది ఇప్పుడైతే కరుణించి కాపాడమని వేడుకుంటున్నారు!

అయితే ఇప్పుడు నీవు నేను దోషం చేస్తే దానిని పసికట్టాలని నామీద ప్రతీకారం తీర్చుకోవాలని చూసున్నట్లు అనిపిస్తుంది నాకు అంటున్నారు!

 

 ఇప్పుడు 14 వ వచనం నుండి దేవునిమీద నిష్టూరాలు వేయడం మొదలుపెట్టారు! నేను అపరాధం చేయకపోయినా ఏదైనా చేస్తే కనుకొని నన్ను నీవు శిక్షించాలని చూస్తున్నావు అంటున్నారు!

ఇంకా నేను దోషకృత్యములు చేసినయెడల  నాకు బాధ కలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

17 సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మొర్ర పెడుతున్నారు ఇక్కడ!

 

ఒకవేళ నీవు కూడా దేవుని ప్రణాళికను దేవుని ఉద్దేశాలను అర్ధం చేసుకోకుండా నీకు కలిగిన కష్టాలలో శ్రమలలో ఇలాగే పలికితే ఇప్పుడే సరిచేసుకో! ప్రభువా నన్ను క్షమించు అని క్షమాపణ వేడుకో!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*53వ భాగం*

యోబు 10:1822

18 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండిన యెడల మేలు;

19 అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

20 నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు

22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము.

  

         ప్రియులారా! 10వ అధ్యాయంలో కూడా యోబు గారు దేవునితో నిరాశతో నిష్ప్రహతో మాట్లాడుచున్నారు!

 

ఇక 18  వచనంలో అంటున్నారు గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండిన యెడల మేలు;

19 అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

అయ్యా గర్భములో నుండి నీవు నన్నెల వెలుపలికి రప్పించావు? అప్పుడు ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి యుండిన మేలు ఇంకా అప్పుడు నేను లేనట్లు యుండి యుందును తల్లిగర్భము నుండి తిన్నగా సమాధికి వెళ్ళిపోతాను అంటున్నారు!

 ప్రియులారా! ఈ వచనాలు కూడా మూడవ అధ్యాయంలో బాధను తాళలేక తాను పుట్టిన దినాన్ని శపించుకున్నట్లు అదే రీతిగా ఈ పదవ అధ్యాయంలో కూడా మాట్లాడుచున్నారు! యోబు 3:3

3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక  మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

11 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?

16 అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.

 

ఇక 2022 వరకు పూర్తిగా నిరాశపూరితమైన మాటలు యోబు గారు చెబుతున్నారు! నిజానికి అవి పాతాళలోకములో మానవుల పరిస్తితులను కూడా తెలియజేస్తునాయి.

20 నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు

22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.

 

ఇక్కడ నా దినాలు కొద్దివే కదా ఆ కొద్ది దినాలు గడిచిపోయాక నేను

మొదటగా ఎవరూ తిరిగి వెలుపలికి రాలేని దేశమునకు వెళ్ళిపోతాను! అందుకే దనవంతుడు లాజరు ఉపమానములో ధనవంతుడు ఎంతగా గింజుకున్నా దేవుడు అంటున్నారు: కుమారుడా ఇక్కడవారు అక్కడకు రాకుండను అక్కడ వారు ఇక్కడకు రాకుండను మీకును మాకూనూ మధ్య గొప్ప అగాధము ఉన్నది! అనగా పాతాళమునకు ఒక్కసారి వెళ్తే ఇక ఎప్పటికీ దానినుండి తిరిగిరాలేవు అని అప్పటికే యోబుగారికి తెలిసిపోయింది అన్నమాట!

 

రెండు: అంధకారమే మరణాంధకారముగల దేశమునకు అనగా కటిక చీకటి గల దేశము- ఎలాంటి చీకటి అనగా మరణాంధకారముగల దేశమునకు అనగా అక్కడ చావు రాజ్యమేలుతుంది. ప్రేతలు ప్రేతాత్మలు ఆ దేశములో ఉన్నారు! చావు మాత్రమే గల దేశము అంధకారమయమైన దేశములోనికి వెళ్ళిపోతాను అంటున్నారు!

 

మూడు: కటికచీకటి గాఢాంధ కారమయమైన దేశము- దీనికి కూడా మీదన చెప్పిన వివరణయే

 

నాలుగు: భ్రమ పుట్టించు మరణాంధకారముగల దేశమునకు- అనగా అక్కడ అంతా భ్రమ- నిజమని అనుకుంటాము గాని అది ఒక కల మాత్రమే- గాని అది నిజము కూడా, అలాంటి దేశములోనికి నేను వెళ్ళిపోతాను అంటున్నారు

 

ఐదు: వెలుగే చీకటిగాగల దేశము- అనగా ఎల్లప్పుడూ చీకటే గాని అక్కడ వెలుగు చీకటి లాంటిదే అంటున్నారు!

 

ఇప్పుడు అలాంటి దేశమునకు వెళ్లకముందు అనగా నేను చనిపోవక ముందు దయచేసి కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనీయవా మహానుభావా అంటున్నారు యోబుగారు!

 

నిజానికి యోబుగారిని  ఆశ పుట్టించేందుకు  పరలోకాన్ని గురించిన నిశ్చయత అతనికి లేదు. యోహాను 14:2-3, లాంటి వాక్యాలు ఆ రోజుల్లో లేవు. ప్రకటన గ్రంథం 21:10-23, లాంటి వర్ణణలు లేవు. నిజంగా మనము దేవుని సంపూర్ణ సందేశం బైబిలు మన చేతిలో అందుబాటులో ఉన్న ఈ కాలంలో మనం ఉండడం ఎంత భాగ్యం! యోబుగారు  బ్రతికి ఉన్న కాలంలో చావు తరువాత మనుషుల ఆత్మలు ఏమవుతాయో అన్న విషయం సరిగ్గా తెలియదు. దీన్ని గురించి దేవుడు అంత విపులంగా మనుషులకు వెల్లడి చేయలేదు. చనిపోయిన తరువాత మనుషుల ఆత్మలు దట్టమైన చీకటి కమ్మివుండే లోకానికి పోతాయని యోబుగారు  వెలిబుచ్చిన అభిప్రాయం సాధారణంగా చాలామంది అనుకునేదే (కీర్తనల గ్రంథము 88:10-12, ). దీన్ని గురించి దేవుడు సంపూర్ణంగా వెల్లడి చేసినది క్రొత్త నిబంధన  లోనే ఉంది (2 తిమోతికి 1:10, ). క్రొత్త నిబంధనలో నిజమైన విశ్వాసులు చనిపోయిన తరువాత చీకటి ఎంత మాత్రం లేనిచోట శాశ్వతంగా నివసిస్తారు అని ఉంది (ప్రకటన గ్రంథం 22:5, ).

2 తిమోతికి 1:10

10 క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

ప్రకటన గ్రంథం 22:5

5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

 

మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.

 

హెబ్రీ 12: 22 ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,

23 పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును,

24 క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

 

కాబట్టి యోబుగారి కాలంలో ఇట్టి నిరీక్షణ లేదు కారణం అప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు మానవుల రక్షణ కోసం సిలువయాగం చేయలేదు! ఇప్పుడైతే మనకు నిరీక్షణ ఉంది- బైబిల్ ఉంది! కాబట్టి నిరాశను వదిలి ఆశతో దేవునికోశం శుభప్రదమైన నిరీక్షణ కోసం ఎదురుచూద్దాం!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*54వ భాగం*

యోబు 11:17

1). అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?

3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?

4 నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

5 దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు

6 ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

7 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము కలుగునా? 

        

     ప్రియులారా! 11 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరూ అనే మూడవ స్నేహితుడు  యోబుగారు మాట్లాడిన మాటలకు జవాబు చెబుతున్నారు! అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఇతడు కూడా మిగిలిన తన స్నేహితులు యోబుగారికి విరోధముగా మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తున్నారు అనగా యోబుగారు చేసిన పాపముల వలననే యోబుగారికి ఇన్ని కష్టాలు శ్రమలు శోధనలు వచ్చాయి అంటున్నారు!

 

ఇక రెండవ వచనంలో ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా? అంటున్నాడు! దీనిద్వారా ఏమని అర్ధమవుతుంది అంటే జోఫరు కూడా బిల్దదు, ఎలీఫజులతో పూర్తిగా ఏకీభవిస్తున్నాడు. యోబు ఘోర పాపం చేశాడనీ అతని మాటలు వ్యర్థ ప్రలాపాల్లాగా, ఎగతాళి మాటల్లాగా ఉన్నాయనీ నమ్మాడు అని అర్ధమవుతుంది!

 

ఇంకా ఏమని ఎగతాళి చేస్తున్నాడు అంటే 3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?

4 నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

 

ఒకసారి ఈ రెండు ఆలోచిద్దాం! ఎవరును నిన్ను అపహాస్యం చేయకుండా నీవు హాస్యం చేస్తావా? ఏమండీ యోబుగారు ఇంతవరకు తన స్నేహితులను అపహాస్యం చేశారా? ఎవరినైనా తక్కువగా చూశారా! లేదుకదా! గాని ఇక్కడ కానిమాటలు పలుకుతున్నాడు జోఫర్!

తర్వాత నా ఉపదేశము నిర్ధోషము నీ దృష్టికి నేను పవిత్రుడను అని నీవంటున్నావు నిజానికి యోబు గారు ఈ మాట అన్నారా అసలు!!

యోబుగారు  ఇలా అనలేదు. యోబుగారు  అన్న కొన్ని మాటలకు అర్థం ఇది అని జోఫరు భావం. కానీ అలాంటి అర్థం రావాలంటే అతను యోబు మాటలను వక్రంగా అర్థం చేసుకోవలసి ఉంది. నిజానికి యోబుగారు తన అజ్ఞానాన్ని ఒప్పుకుని (యోబు 9:2-3, ) అర్థమయ్యేలా తనకు వెల్లడి చేయమని దేవుణ్ణి వినయ పూర్వకంగా అడిగాడు (యోబు 6:24, ; యోబు 10:2, ). తాను జీవితంలో కొన్ని సార్లైనా పాపాలు చేశానని అతనికి తెలుసు (యోబు 7:21, ).

 

ఇంకా ఆ స్నేహితుడు అంటున్నాడు 5 దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు

6 ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

 

ఇక్కడ చూడండి- దేవుడే నీతో మాట్లాడితే మేలు అంటున్నాడు- అవును ఇది నిజంగా నెరవేరినది 38 వ అధ్యాయంలో 1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను

నిజానికి దాని అర్ధం- ఇక నీకు ఎవరు చెప్పలేరు- దేవుడే నీకు బుద్ది చెప్పాలి అని!

ఇంకా అంటున్నారు దేవుడే నీకు జ్ఞాన రహస్యాలు తెలిపితే నీకు మేలు అంటున్నారు! ఇంకా అంటున్నాడు అప్పుడు జ్నానము నీ యోచనకు నీకు మించినదని నీవు తెలిసి కొంటావు! ఇంకా అంటున్నాడు దేవుడు నీవు చేసిన పాపాలలో అధిక భాగం మర్చిపోయారని నీకు తెలుసా!!!

దేవుడు యోబుగారి పట్ల కరుణ వహించి అతనికి రావలసిన దానికంటే తక్కువ శిక్షను పంపించాడని జోఫరు అభిప్రాయం!

 

అయితే ఇది నిజంగా నిజమే- మనము చేసిన ప్రతీ పాపమును దేవుడు క్షమించకుండా గుర్తుంచు కుంటే మనము చేసిన దోషములకు ఎప్పుడో చనిపోయి ఉందుము ఎప్పుడో మనము ఆయన ఉగ్రతకు పాత్రులము అయ్యి ఉందుము! గాని దేవుని మహా కృప ఆయన కృపా వాత్సల్యము మనలను ఇంతవరకు కాచి కాపాడుతుంది!

 

7 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము కలుగునా? 

జోఫరు ఈ విషయాలేవీ యోబుకు వివరించి చెప్పగలవాడు కాదు. యోబే ఇలాంటివి ఇంతకు ముందు మాట్లాడారు (యోబు 9:4-12, ).

అవును మనము దేవుని గూఢాంశములను అర్ధం చేసుకోలేము గ్రహించలేము ఆయనను గూర్చిన పరిపూర్ణ జనఆనము మనకు లేదు!

 

8 అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?

9 దాని పరిమాణము భూమికంటె అధికమైనది దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

చూడండి అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేమీ చేయగలవు? పాతాలము కంటే లోతుగా ఉంది నీకేమి తెలుసు అంటున్నారు!

 

దేవుని యొక్క జ్ఞానము యొక్క పరిమాణము భూమి కంటే అధికమైనది ఇంకా దాని వెడల్పు సముద్రపు లోతుకంటే ఎక్కువ అంటున్నారు!

కాబట్టి దేవుని జ్నానమును మనము అర్ధం చేసుకోలేము! కాబట్టి మనకు అందని విషయాలు మాట్లాడవద్దు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*55వ భాగం*

యోబు 11:1020

 10 ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ  పిలిచినప్పుడు ఆయన నడ్డగింప గలవాడెవడు?

11 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.

12 అయితే అడవి గాడిదపిల్ల నరుడై  పుట్టిననాటికి గాని బుద్ధిహీనుడు వివేకికాడు.

13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల

14 పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దాని విడిచినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల

 15. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.     

 

     ప్రియులారా! 11 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరూ అనే మూడవ స్నేహితుడు  యోబుగారు మాట్లాడిన మాటలకు జవాబు చెబుతున్నారు!

 

ఇంకా అంటున్నాడు: 10 ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ  పిలిచినప్పుడు ఆయన నడ్డగింప గలవాడెవడు?

అంటే ఒకవేళ దేవుడు ఒక మనిషిని బంధించి చెరసాలలో వేసిన తర్వాత దేవుని కోర్టులోనికి వెళ్ళి ఆయనతో వాదించగల సత్తా ఎవరికి ఉంది అంటున్నాడు! దేవునితో వాదించ గల కెపాసిటీ ఎవరికి  ఉంది అంటున్నారు!

 

ఇక తర్వాత వచనంలో 11 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.

 

ఇక్కడ ఇంకా అంటున్నాడు దేవునికి మంచివాడు ఎవరో పనికిమాలిన వారెవరో బాగా తెలుసు! ఇంకా పరిశీలన చేయకుండానే పాపము ఎక్కడ జరుగుతుందో దేవునికి ఇట్టే తెలిసిపోతుంది కదా అంటున్నాడు! అది నిజమే! ఈయన మాట్లాడే మాటలలో తప్పులేదు గాని నీవు పాపం చేశావు అది దేవునికి తెలిసిపోయింది దేవుడు నీ పాపమును పసిగట్టి నీకు ప్రతిఫలము ఇచ్చాడు అనే భావనతో ఈ మాటలు యోబుగారితో పలకడం తప్పు!!!

 

ఇంకా అయితే అడవి గాడిదపిల్ల నరుడై  పుట్టిననాటికి గాని బుద్ధిహీనుడు వివేకికాడు అంటున్నారు!

తెలివితక్కువ వాడికి తెలివి రావడం అసాధ్యం అనుకొంటున్నాడు (యోబు తెలివి తక్కువవాడని అతడి భావం). అడవి గాడిద మనిషిగా పుట్టడమనేది జరగదని జోఫరుకు తెలుసు. బైబిలు రచయితలందరికీ తెలుసు మనుషులు మనుషులేననీ, జంతువులు జంతువులేననీ మనుషులు జంతువులూ, జంతువులు మనుషులూ కావడం అసాధ్యమనీ తెలుసు. బైబిల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు. యోబు గ్రంథంలో (బైబిలు మొత్తంలో) ఎవరి నోటా తాను గత జన్మలలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నానని చూచాయగానైనా అభిప్రాయం వెలువడలేదు. దేవుడు మనుషుల కోసం ఇచ్చిన ఉపదేశం బైబిలు. ఇప్పటికి ఆధ్యాత్మిక విషయాలను గురించి మనుషులు తెలుసుకోవలసినంత సత్యమూ దానిలో ఇమిడివుంది. హిందూ, బౌద్ధ మతస్థులు నమ్మే పునర్జన్మను బైబిలు బొత్తిగా పట్టించుకోలేదు. ఇలా చేయడంద్వారా మనుషులకు అవసరమైన సత్యం పునర్జన్మ అనే వాదంలో ఏమీ లేదని బైబిలు సూచిస్తున్నది. మనుషులు తెలుసుకోవలసిన ఏ విషయాన్నీ పునర్జన్మ సిద్ధాంతం వివరించదు. ఆ మాటకొస్తే బైబిలు పునరుత్థానాన్నే (చనిపోయిన శరీరాలు తిరిగి బ్రతికి లేవడమే) గాని పునర్జన్మను నేర్పించదు. బైబిలు ప్రకారం ఒక మనిషి ఈ లోకంలో ఒక్కసారే జీవిస్తాడు. ఒక్క సారే మరణిస్తాడు. అంతంలో చనిపోయినవారు సజీవంగా లేవడమూ, దేవుని తీర్పూ జరుగుతాయి. యోహాను 5:28-29, ; అపో. కార్యములు 17:31, ; హెబ్రీయులకు 9:27, చూడండి.

 

కాబట్టి మీదన జోఫర్ చెప్పిన మాటలు సత్య దూరమని బైబిల్ బోధకు వ్యతిరేఖంగా ఉన్నాయని తెలుసుకోవాలి!

 

ఇంకా తర్వాత వచనాలలో దేవుని తరుపున మాట్లాడినట్లు ఆయన మీద అభాండాలు వేస్తున్నాడు! 13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల

14 పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దాని విడిచినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల..

యోబుగారు  పశ్చాత్తాపపడి, కరుణించమని దేవుణ్ణి వేడుకుంటే అతనివన్నీ తిరిగి లభిస్తాయి అంటున్నాడు.

 

ఇలాంటి ఆశాభావాన్ని యోబులో కల్పించడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ముగ్గురూ తామేదో యోబు పట్ల బోలెడంత సానుభూతి, జాలి చూపుతున్నట్టుగా భావించారేమో. నిజానికి పశ్చాత్తాపం, పూర్వస్థితి తిరిగి కలగడం విషయంలో వారంటున్నవి చాలా మట్టుకు మంచివే. కానీ మనం ఇంతకుముందే చూచినట్టుగా ఇవి యోబుకు వర్తించవు (యోబు 5:17-18, ). జోఫరు అతని స్నేహితుల్లాగానే యోబు ఇంకా ఇలా చేయలేదని భావించాడు. మన మనస్సు దేవుని మీదనే నిలపాలి మన చేతులు ఆయన వైపు చాపాలి అంటున్నాడు ఇంకా పాపము నీ చేతిలో ఉంటే చూచి దానిని విడిచి పెట్టాలి, ఇంకా మన గుడారము నుండి దుర్మార్గాన్ని విడిచి పెట్టి తీసివేస్తే 15. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. అంటున్నాడు!

 నిజమే! నీవు ఇదే స్తితిలో ఉంటే నేడే నీ చేతులకు అంటిన పాపములు కడుగుకోవాలి! మన ఇంట్లో ఉన్న దుర్మార్గాన్ని కొట్టివేయాలి మన చేతులు దేవుని వైపు చూడాలి మన మనస్సు దేవుని వైపుకే త్రిప్పుకోవాలి! అప్పుడు దేవుడు మనలను నిర్ధోషిగా మార్చగలరు అంటున్నాడు! మరి నీవు సిద్ధమా!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*56వ భాగం*

యోబు 11:1520

15 నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.

16 నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లునీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.

17 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.

18 నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక  నీవు ధైర్యముగా ఉందువు. నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.

19 ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.

20 దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.

 

     ప్రియులారా! 11 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరూ అనే మూడవ స్నేహితుడు  యోబుగారు మాట్లాడిన మాటలకు జవాబు చెబుతున్నారు!

 

ఇంకా అంటున్నాడు: నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లునీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.

ఇక్కడ అంటున్నాడు ఒకవేళ నీవు నీ చేతుల నుండి దుష్టత్వమును తొలిగించుకుని దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపం కలిగి దేవుని క్షమించమని వేడుకుంటే నీవు నిశ్చయముగా నిర్ధోషివై సంతోషిస్తావు నీవు ఎప్పుడు భయపడకుండా స్థిరంగా ఉంటావు అంటూ నీవు నిశ్చయముగా నీ దుర్దశను  మరచిపోతావు అంటున్నాడు అనగా నీవు నీ దుర్దశ నుండి మంచి స్తితికి వచ్చి ఆ మీదట నీవు పడిన కష్టాలను మరచిపోతావు అంటున్నాడు! అనగా పరోక్షంగా నీవు దేవుడిని నీ అపరాదాలు క్షమించమని వేడుకుంటే నీలో ఉన్న దుర్నీతిని తొలగించుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను నీ ఆపదల నుండి విడుదల చేసి నీ మంచి స్థితి మరలా నీకు దయచేస్తాడు అంటున్నారు! అవును ఇది నిజమే! గాని అది మనయెడల నిజమే గాని యోబుగారి విషయంలో కాదు! కారణం యోబుగారు తాను పడుతున్న కష్టాలకు కారణం తన పాపములు అపరాదములు కానేకాదు! మనకైతే ఇది నిజమే! ఇంకా అంటున్నారు నీవు పడిన కష్టాలు కడగల్లు ఎలా ఉంటాయి అంటే దాటిపోయిన ఏటినీళ్లు ఎలా నీవు మరలా చూడలేవో ఎలా అవి నీ దగ్గరకు మరలా రాలేవో అలాగే నీ కడగల్లు కూడా నీవు చూడలేవు నీ దగ్గరకు ఎప్పటికీ రావు అంటున్నాడు!

 

ఇక తర్వాత వచనంలో అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును అంటున్నాడు

నీవు దేవుడ్ని శరణువేడి నీ పాపములను విడిచిపెడితే ఇంకా నీ బ్రతుకు మధ్యాహ్నం ఎలా వెలుతురుగా ఉంటుందో అలా నీ బ్రతుకు కూడా వెలిగిపోతూ ఉంటుంది! ఒకవేళ చీకటి కమ్మినా అది ఉదయం సూర్యుడు రాకముందు వచ్చే అరుణోదయము లాగా ఉంటుంది! అనగా కష్టాలు వచ్చినా నీకు ఎండగా ఉండక ఎలా ఆహ్లాద కరమైన వెలుగు ఉంటుందో అలాగే నీకు ఎండ అనే కష్టాలు రాకుండా సరిపోయేటంత వెలుతురు సుఖము నీ ఇంట్లో గృహంలో ఉంటుంది అంటున్నాడు!

 

ఇక తర్వాత వచనంలో అంటున్నాడు నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక  నీవు ధైర్యముగా ఉందువు. నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.

నీకు దేవుడిచ్చిన దైర్యము నమ్మకము పుష్కలంగా ఉంటుంది గనుక నీవు ధైర్యంగా ఉంటావు నీ ఇల్లు మొత్తం సురక్షితముగా ఉంటుంది అంటున్నాడు!

ఇక నీవు పడుకునేటప్పుడు ఎవరి భయము లేకుండా పడుకుంటావు అనేకులు నీ చెక్కిళ్లు నిమురుతారు అంటున్నారు! అనగా నీవు సురక్షితముగా ఉండటమే కాకుండా అనేకులు నీ దగ్గరకు వచ్చి వారి విన్నపములు చేస్తారు వారి సమస్యలును నీవు పరిష్కరించే స్తితిలోకి నీవు వెళ్తావు అంటున్నాడు! అనగా 28 ద్వితీయోపదేశ కాండములో చెప్పినట్లు నీవు అప్పు ఇచ్చే స్థితిలో ఉంటావు గాని అప్పు చేసే స్థితిలో ఉంటావు అలాగే నీవు మరొకరి విన్నపములు విని వారికి సహాయపడే స్థితిలో ఉంటావు గాని నీకు సహాయం చేయమని మరొకరిని అడిగే స్థితిలో నీవుండవు అంటున్నాడు! అవును మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు ఇష్టమైన రీతిలో జీవిస్తే తప్పకుండా ఇలా చేసే దేవుడు మన స్థితిని మార్చగలిగే దేవుడు మనదేవుడు!

 

ఇక చివరి వచనంలో అయితే దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు అంటున్నాడు! అనగా పరోక్షంగా అంటున్నాడు అయితే నీవే గాని నీ దుష్టత్వము విడిచిపెట్టకపోతే నీ కనుచూపు మందగిస్తుంది ఆశ్రయం లేకుండా పోతుంది నిరీక్షణ పోతుంది అంటున్నాడు! ఇక్కడ దేవుని తరుపున మాట్లాడినట్లు ఆదరణ మాటలు చెప్పినట్లు చెప్పి నీవు మారుమనస్సు పొందకపోతే నీ గతి అదో గతే అంటూ యోబుకు ఎంతో అవసరం అని తాను భావించి హెచ్చరిక ఇవ్వడంతో జోఫరు తన మాటలను ముగించాడు.

 

ఏదిఏమైనా వ్రాయించిది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆ మాటలను మనం పాటిద్దాం ! వాక్యానుసార జీవితం జీవిద్దాం! మన జీవితాలు సరిచేసుకుని దేవునితో సమాధాన పడి పాపమును విడిచి క్షమాపణ పొందుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*57వ భాగం*

యోబు 12:15

1 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

2 నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.

3 అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

5 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

 

     ప్రియులారా! 12 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరు అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

 

నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును అనగా తన ముగ్గురు స్నేహితులు మాట్లాడినది యోబుగారు విన్నారు. అప్పుడు అతనికి అనిపించినది ఇది తన స్నేహితులు గొప్ప జ్ఞానవంతుల్లాగా మాట్లాడుతున్నారు గాని వాళ్ళు చెప్పినవన్నీ తనకు తెలిసిన సామాన్యమైన మాటలే. అతనికంటే తామేదో ఉన్నతస్థాయి వాళ్ళుగా ఎంచుకుని సలహాలు ఇవ్వబోయారు గాని అతనికి తెలియని విషయం ఏదీ చెప్పలేదు, అతని సమస్యకు మూలమేదో చెప్పలేకపోయారు. అందుకని వ్యంగ్యంగా ఈ మాటలు అంటున్నారు. మనం కూడా ఇతరులకు సలహాలు ఇవ్వదలచు కుంటే ఇలాంటి జవాబు వచ్చే రీతిలో ఇవ్వకూడదు మరి.

అందుకే అంటున్నారు నిజానికి లోకములో మీరే జ్నానులు మీకు తెలియని జ్ఞానము లేదు మీ తెలివి మీతోనే గతించిపోతుంది అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు!

 

అయితే మూడో వచనంలో అంటున్నారు అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

 

ఇక్కడ చూడండి అయినా గాని మీకున్నట్లుగా నాకు కూడా దేవుడు వివేచనా శక్తి ఇచ్చారు. నేను మీకంటే తక్కువజ్ఞానము గలవాడను కాను మీరు చెప్పిన వాటిని నేను కూడా ఎరుగుతాను! అయితే మీకు నాకు తేడా ఏమిటంటే నాకు వాటితో పాటుగా దేవునికి మొఱ్ఱపెట్టి జవాబులు పొందుకున్న అనుభవం నాకుంది అయితే మీకు అది లేదు అంటున్నారు!

ఇక్కడ యోబుగారికి ఉన్న మరో మంచి లక్షణం కనిపిస్తుంది! దేవునికి మొర్రపెట్టి దేవుని నుండి జవాబులు పొందుకునే లక్షణం ఓర్పు! నిజానికి మనలో చాలామందికి దేవునికి మొర్రపెట్టడం తెలుసు! మొర్ర పెడుతున్నాము కూడా! అయితే దేవుడు దానికి జవాబిచ్చె వరకు మనము ప్రార్ధనలో కనిపెట్టలేక పోతున్నాము! దేవుడు జవాబిచ్చె వరకు మనము ఓర్చుకోలేక పోతున్నాము! అందుకే దేవుని నుండి జవాబులు పొందుకోలేక పోతున్నాము!  ఎంత కన్నీటితో ఆయన సన్నిధిలో మోర్రపెట్టామో అంటే ఓపికగా ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిన అవసరం కూడా ఉంది! దేవా నా ప్రార్ధనకు జవాబివ్వవా అంటూ ఆయన సన్నిధిలో మౌనముగా కనిపెట్టాలి అప్పుడు ఆయన మెల్లని చల్లని స్వరమును మనము వినగలము! ఆ బుద్ధి అలవాటు యోబుగారికి ఉంది అందుకే ఆయన పొందుకున్నారు! మరి నీవు కూడా ఇలాంటి లక్షణాన్ని యోబుగారి దగ్గర నేర్చుకుంటావా?”!!! సరే ప్రార్థన చేయడం తన అలవాటనీ, తన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడనీ యోబుగారు  చెప్తున్నారు  అయితే ఇప్పుడైతే దేవుడెందుకో మౌనం దాల్చాడు.

 

ఇక నాలుగవ వచనంలో ఇప్పుడు ఇలాంటి అనుభవం గల నేను నా స్నేహితునికి   అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను అంటున్నారు! నీతియు యధార్ధతయు గల నేను ఇప్పుడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను అంటున్నారు! నిజానికి యోబుగారిని తన స్నేహితులు సరిగా అర్ధం చేసుకోలేక పోయారు సరికదా సూటిపోటు మాటలతో దెప్పి పొడుస్తున్నారు!

నేను ఎంతో నీతి మరియు యధార్ధత గలవాడను గాని ఇప్పుడు దానిని మర్చిపోయి నా స్నేహితులే అపహాస్యం చేస్తున్నారు అని యోబుగారు బాధపడుతున్నారు!

 

ఇక తర్వాత వచనంలో దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

యోబుగారి  స్నేహితులు బాధలో లేరు. విపత్తులేవీ వారికి రాలేదు. కాబట్టి తనను తృణీకార భావంతో చూడడం వారికి తేలికే. యోబుగారు అనుభవించినదాన్ని అనుభవించనివారెవరూ అతని పరిస్థితిని సరిగా అర్థం చేసుకోలేరు (2 దినవృత్తాంతములు 1:3-7).

 

అందుకే ఇప్పుడు యోబుగారు బాధతో తరువాత వచనంలో అంటున్నారు దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. ఇప్పుడు దేవునిమీద నిష్టూరంతో మాట్లాడుతున్నారు యోబుగారు!

ముందునుంచి యోబుగారి  అభిప్రాయం ఇదే ఈ లోకంలో దేవుడు మనుషుల పట్ల వారి గుణగణాలకు అనుగుణంగా వ్యవహరించడము లేదు  (యోబు 9:22, యోబు 9:24, ; యోబు 10:3, ). యోబు స్నేహితులకైతే సరిగ్గా దీనికి వ్యతిరేకమైన నమ్మకం ఉంది.

 

ప్రియ సహోదరుడా మనకు కూడా ఇలాంటి దేవునిమీద నిష్టూరం వేసే గుణము ఉండకూడదు! ఒకవేళ ఉంటే నేడే సరిచేసుకో!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*58వ భాగం*

యోబు 12:79

7 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.

8 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును

9 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?

    

       ప్రియులారా! 12 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరూ అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ఇక 7 వ వచనం నుండి చూసుకుంటే ఈ లోకంలో గొప్పగొప్ప మేధావులము అని చెప్పు కునేవారికి సరియైన జవాబు కనిపిస్తుంది!

7 అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.

8 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును

9 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?

 

ప్రియులారా ఇక్కడ మృగములను చూడండి అవి మీకు భోధిస్తాయి ఆకాశ పక్షులను చూడండి అవి మీకు తెలియజేస్తాయి ఇంకా భూమిని గూర్చి బాగుగా ధ్యానం చేస్తే భూమి నీకు భోధిస్తుంది సముద్రములోని చేపలను గూర్చి ఆలోచన చేస్తే ఆ చేపలు నీకు వివరిస్తాయి అంటున్నారు! ఇదంతా దేని కోసం చెబుతున్నారు అంటే వీటన్నింటినీ బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే యెహోవా హస్తము వీటిని కలుగజేసింది అని తెలిసికొనలేని వాడెవడు? ఇదే మేధావులకు జవాబు! ఒరేయ్ మేధావులని చెప్పబడే జ్నానము లేని వారలారా దేవుని హస్తమే సమస్తము చేసింది!

 

పౌలు గారు అంటున్నారు హెబ్రీయులకు 11:3

ప్రపంచములు (లేక, యుగములు) దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.

చూశారా ఎంత స్పష్టంగా చెబుతున్నారో!!!

 

ఇక యెహోవా హస్తము దీనిని కలుగజేసింది అని తెలిసికొనలేని వాడెవడు అంటే కీర్తన 14 మరియు 53 వ అధ్యాయాలలో బుద్ధిహీనుడు అని వ్రాయబడింది!

14: 1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను

3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

 

53: 1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు.

2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

3 వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.

 

కాబట్టి దేవుడు ఈ సృష్టిని ఈ సృష్టిలో ఉన్న సమస్తమును చేశారు అని నమ్మని వాడు బుద్ధిహీనుడు! చివరకు దేవుడు జలచరములము నీటిలో ఊపిరి తీసుకునే అవయవాలు ఇచ్చారు- అదే మానవుడు అదే నీటిలో ఊపిరి తీసుకోలేడు! అదే చేప నీరు లేకపోతే భూమిమీద కొన్ని నిమిషాలు కూడా బ్రతుకలేదు! ఇది దేవుడు చేసిన మహత్తు!

 

ఇక మనిషి కోసం ఆలోచన చేస్తే కీర్తనాకారుడు 139 వ కీర్తనలో అంటున్నారు

13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు

16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను

 

జాగ్రత్తగా పరిశీలన చేస్తే మానవులలో ఇన్ని అవయవాలు అన్నీ తగవులు అహంభావము లేకుండా సమిష్టిగా పనిచేస్తూ మనిషిని బ్రతికిస్తూ నడిపిస్తున్నాయి అంటే అది దేవుని మహత్తు! ఈ భూలోకములో ఏ ఇంజన్ లేక పంపు గాని కనుగొనని కాలంలో మన శరీరంలో అనేకమైన ఇంజన్ లు పంపులు పెట్టారు. అవే మనలను నడిపిస్తున్నాయి! గుండె అనే ఇంజన్ మరియు పంపు పనిచేయక పోతే రక్తము అన్నీ కణాలకు ప్రసరించదు తద్వారా మనిషికి పక్షవాతం వచ్చేస్తుంది చివరికి గుండె ఆగిపోతే మనిషి చనిపోతాడు! ఊపిరితిత్తులు అనే పంపు పనిచేయక పోతే ఊపిరి ఆడదు! మన కడుపు అనే కర్మాగారము పనిచేయకపోతే తిన్న ఆహారము అరగదు రక్తముగా మారదు వ్యర్ధాలు బయటకు పోవు శరీరానికి కావలసిన బలము శక్తి కణాలకు అందదు! కాబట్టి ఇలా ప్రతీ అవయవము దాని దాని పనులు సక్రమంగా చేయడానికి ఒక వ్యవస్థ చేశారు! ఇది దేవుని మాస్టర్ ప్లాన్! అలా కాకుండా మనిషి కోతినుండి వచ్చాడు. కొన్ని పదార్ధముల ద్వారా బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ భూమి ఏర్పడింది అనే చదువుకున్న మూర్ఖులను ఏమనాలి?!!!

 

అందుకే పౌలుగారు అంటున్నారు రోమా మొదటి అధ్యాయములో 19 ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.

20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

 

ఇక్కడ పౌలుగారు అంటున్నారు దేవుని అదృశ్య లక్షణములు ఆయన దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను మరియు పశువులను గూర్చి ఆలోచించడం వలన అర్ధమవుతుంది అంటున్నారు! కాబట్టి దేవుని హస్తమే మనిషిని చేసింది దేవుని మాట వలననే ఈ సృష్టి కలిగింది. ఆదికాండములో మొదటి అధ్యాయములో రెండవ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు ఖచ్ఛితముగా జరిగింది!

 

సరే, మన భాగ్యమునకు వచ్చేద్దాం! 2,3 వచనాల్లోని తలంపులకు తిరిగి వచ్చారు యోబుగారు. తన స్నేహితులు వృద్ధులైనప్పటికి ప్రకృతిని చూచి వారు నేర్చుకోవలసినది చాలా ఉందని యోబుగారు  అభిప్రాయ పడుతున్నారు అందుకే కీర్తనల గ్రంథము 19:1-4లో చూసుకుంటే 1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

2 పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

3 వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.

4 వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోక దిగంతములవరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

కాబట్టి దేవుని హస్తమే మనిషిని చేసింది దేవుని మాట వలననే ఈ సృష్టి కలిగింది. ఆయనే ఈ సర్వసృష్టిని నిర్వహిస్తున్నారు! ఆయనకు లోబడుదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*59వ భాగం*

 

యోబు 12:1013

10 జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

11 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?

12 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

    

       ప్రియులారా! 12 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరూ అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ఇంకా మనము 10 వ వచనం నుండి చూసుకుంటే జీవరాశుల ప్రాణములు మనుష్యులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నాయి! అందుకే కీర్తనాకారుడు రాస్తున్నారు మా కాలగతులు నీ వశములో ఉన్నాయి! కీర్తన 31: 15 నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.

 

ఇంకా 139 వ కీర్తనలో అంటున్నారు 2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3 నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు

16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

 

కాబట్టి మనము ఎన్ని రోజులు బ్రతకాలి ఎప్పుడు చనిపోవాలి అనేది మనము భూమిమీదికి రాకముందే తల్లి గర్భములో పడకముందే దేవుని గ్రంధములో వ్రాయబడి ఉంది! కాబట్టి మన పిలక దేవుని చేతిలో ఉంది అని గ్రహించి విర్రవీగకుండా ఆయన చేతి క్రింద అణిగిమణిగి ఉందాము!

 

ఇక మనుష్యులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నాయి! అందుకే ధనవంతుడు పంటలు బాగా పండాయి అని తన ప్రాణముతో తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటూ పొంగిపోతుంటే దేవుడు ఆ రాత్రే వాడి ఆత్మను తీసుకున్నట్లు లేక ఆ రాత్రే వాడి చీటి చింపేసినట్లు చూడగలము!!! చివరికి యేసుక్రీస్తుప్రభులవారు కూడా తాను చనిపోయే ముందు తండ్రీ నా ఆత్మను చేతికి అప్పగించుచున్నాను అని పలికి తన ప్రాణము విడిచినట్లు చూడగలము!!! లూకా 23:46

 

ఇక అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవులు మాటలను పరీక్షించవా అంటున్నారు! అనగా నీవు మాట్లాడే మాటలు అవి మంచివా? కావా? జ్నానము గలవా? జ్నానము లేనివా? అనేవి మన చెవులు చాలా తేలికగా గుర్తుపట్ట గలవు గనుక ఏమి పడితే అది మాట్లాడవద్దు అని అంటున్నారు!

 

ఇక 12,13 వచనాలలో అంటున్నారు  12 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు

13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

 

ముసలి వారిదగ్గర చాలా తెలివి జ్ఞానమున్నది వాటివలనే దీర్ఘాయువు వివేచన కలుగుతుంది అని మీరు చెబుతున్నారు అయితే నిజానికి జ్ఞానశౌర్యములు దేవుని యొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు అని మీరు తెలుసుకోండి అంటున్నారు!

ఇక్కడ యోబుగారు  దేవుని జ్ఞానం, బలప్రభావాల గురించి తన స్నేహితులకు తెలిసినంతా తనకు కూడా తెలుసని చూపిస్తున్నారు. మానవుల జ్నానము పరిమితమైనది అయితే ఆయన ఆనంతజ్నాని అని చెప్పారు! 1 సమూయేలు 2: 3 యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.

 

అందుకే సోలోమోను గారు అంటున్నారు సామెతలు 3: 5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము

6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

 

కాబట్టి సోలోమోను గారు చెప్పిన జ్నానమైన మాటలు విందాం! నేనే తెలివైన వాడిని నాకే తెలివి ఉంది అని మురుసిపోకు నీకంటే తెలివైన వారు భూమిమీద ఉన్నారు! వారికంటే తెలివైన వారు అనంతమైన జ్నానము గలవాడు మన దేవుడు! ఆయన చేతికి మనలను అప్పగించుకుని ఆయన  అధికారమునకు ఆయన నడిపింపునకు అప్పగించుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*60వ భాగం*

యోబు 12:1420

14 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

15 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు! మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు.

17 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

18 రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.

19 యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.

20 వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.    

 

       ప్రియులారా! 12 వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరు అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ఇంకా మనము 14వ వచనం నుండి చూసుకుంటే ఇంకా దేవుని యొక్క మహత్కార్యాలు కోసం చెబుతున్నారు! ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు అంటున్నారు!

 

దీనికోసం ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తుప్రభులవారి కోసం కూడా యెషయా గ్రంధంలో వ్రాయబడింది 22: 22 నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు

23 దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.

 

ఇదే విషయము ఫిలడెల్ఫియా సంఘానికి చెబుతూ ప్రకటన గ్రంధంలో అంటున్నారు 3: 7 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా..

 

ఇక యిర్మీయా 51:64 లో కూడా బబులోనూ సామ్రాజ్యము కోసం అదే అన్నారు! ఇంకెప్పుడూ లేవకుండా బబులోనూ రాజ్యము మునిగిపోతుంది! దాని జనము గతించి పోతారు అని!

కాబట్టి ఆయన మూస్తే తీయగలిగే కెపాసిటీ ఎవరికీ లేదు!

 

ఇక తర్వాత వచనంలో ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును. దీనికోసం ఆలోచిస్తే అవును 1 రాజులు 17:1 ప్రకారం దైవజనుడైన ఏలీయా ప్రవక్తగారు నా మాట ప్రకారం అవును గాక: ఈ రోజులలో మీకు మంచు గాని వర్షం గాని పడదు అని దైవావేశంతో ప్రవచించి వెళ్లిపోతే మూడున్నర సంవత్సరాలు మంచుగాని వర్షము గాని పడనట్లు మనము చూడగలము!

 

ఇక తర్వాత మాట వాటిని ప్రవహించనివ్వగా అవి భూమిని ముంచి వేయును! అవును నోవహు గారి సమయంలో జలప్రళయము వచ్చి భూమిమీద నున్న సమస్తమును ఊడ్చిపెట్టినట్లు చూడగలము ఆది కాండము 68 అధ్యాయాల ప్రకారం!

అందుకే ఆమోసు గారు అంటున్నారు 5వ అధ్యాయంలో 8 ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చు వాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.

అనగా ఆయన జలప్రళయమే కాకుండా సునామీలు కూడా పంపించి మానవులను శిక్షించగలరు అని అర్ధం!

 

ఇక తర్వాత వచనాలలో అంటున్నారు 16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు! మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు.

17 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

 

చూడండి మోసపోయే వారు మరియు మోసం చేసేవారు కూడా ఆయన చేతిలోనే ఉన్నారు! బలమును జ్నానమును ఆయన యొక్క లక్షణాలు అంటున్నారు!

చూడండి ఆహాబు గారి సమయంలో జ్నానులను ప్రవక్తలను మోసగించడానికి ప్రవక్తల నోటను అబడ్డము లాడు ఆత్మను పంపించి ఆహాబు తాను చేసిన పాపములకు చనిపోయేటట్లు చేశారు దేవుడు 1 రాజులు 22 వ అధ్యాయం ప్రకారం!

 

ఇంకా ఆలోచన చెప్పే మంత్రులను నాయకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొనిపోవును! ఉదాహరణకు అహీతోపేలు అనే దావీదు గారి స్నేహితుడు మంత్రి దావీదు గారికి వ్యతిరేఖంగా ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనను తారుమారు చేసి వాడు తనకుతానుగా చనిపోయేటట్టు చేశారు దేవుడు!

 

ఇక తర్వాత వచనంలో రాజుల అధికారాన్ని ఆయన కొట్టివేస్తాడు! అవును ఆదేకదా బబులోనూ రాజైన నెబుకద్నేజర్ రాజుకి దర్శనలో చూపించి బుద్ది చెప్పారు! దానియేలు 2 మరియు 4 వ అధ్యాయాలలో దీనిని మనము చూసుకోవచ్చు!

17 ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛ éయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నా డనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును.

32 తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

 

ఇక తర్వాత వచనంలో యాజకులను కూడా నగ్నంగా చేసేస్తారు అంటున్నారు వారిని బందీలుగా తీసుకుని పోతారు! అవును యెహేజ్కేలు గారు యాజకుడు గాని బబులోనూ రాజు బందీగా తీసుకుని పోయారు! అనేకమంది యాజకులు బబులోనూ రాజు చేతివలన బందీలుగా బబులోనూ రాజ్యమునకు చెరలోనికి పోయారు!

 

అంతేకాకుండా పెద్దలను వాగ్ధాటి గల నాయకులను కూడా నోరుమాట మాట్లాడకుండా చేయగలరు దేవుడు! ఇది ఇశ్రాయేలు ప్రజలకు నాయకులకు సంభవించింది! గనుక దేవుడు ఏదైనా చేయగలడు కధ మొత్తం మార్చగలడు! లూకా 1: 52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

కాబట్టి అట్టి బలమైన దేవుడ్ని దీన మనస్సుతో విరిగినలిగిన హృదయంతో ఆరాధన చేద్దాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*61వ భాగం*

యోబు 12:2125

21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

24 భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచును త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.

25 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

 

       ప్రియులారా! 12వ అధ్యాయంలో  నయమాయతీయుడైన జోఫరు అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ఇంకా మనము క్రిందికి చూసుకుంటే ఇంకా దేవుని యొక్క మహత్కార్యాలు కోసం చెబుతున్నారు!

21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

 

అధిపతులను దిక్కరిస్తాడట దేవుడు! బలముగల వారి నడికట్లను విప్పేస్తారు అంటున్నారు! చూడండి బబులోనూ రాజైన నెబుకద్నేజర్ మరియు అస్సూరు రాజైన సన్హేరీబు ఇద్దరు దేవుని అధికారాన్ని తృణీకరించారు! దేవుడు వారికే బుద్దిచెప్పి వారిని త్రోసివేశారు! అందుకే కీర్తనాకారుడు అంటున్నారు 107: 40 రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.

 

ఇక దానియేలు గ్రంధంలో అంటున్నారు 2: 20 ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.

21 ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై యున్నాడు.

22 ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయన యొద్ద నున్నది.

 

ఇక బలాడ్యుడు ఆరుమూరల జానెడు ఎత్తుమనిషి గొలియాతును దేవుడు నిర్బలుడుగా చేసి ఒక్క ఒడిసెల దెబ్బకే చచ్చేలా చేశారు దేవుడు!

 

ఇక తర్వాత వచనంలో చీకటి లోని రహస్యాలను బయలుపరచువాడు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును అంటున్నారు!

దానియేలు 2వ అధ్యాయంలో 22 లో మీదన వివరించి నట్లు మరుగుమాటలను చేష్టలను దేవుడు బయలు పరుస్తారు అంధకారములోని సంగతులు ఆయనకు తెలుసు అంటున్నారు!

 

పౌలుగారు 1 కోరింథీ పత్రికలో అంటున్నారు 4: 5 కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

ఆమోసు 5: 8 ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చు వాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.

 

అందుకే కీర్తనల గ్రంధంలో అంటున్నారు 44: 21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

 

యేసుక్రీస్తుప్రభులవారు తానే అంటున్నారు మత్తయి 10: 26 లో 26 కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

27 చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.

 

హెబ్రీ పత్రికాకారుడు అందుకే అంటున్నారు 4: 12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.

13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

 

కాబట్టి ఎవరూ లేరు కదా, ఎవరూ చూడటం లేదు కదా ఎవరూ వినడం లేదు కదా అని నీవు ఏవి చూస్తున్నావు నీ సెల్ ఫోన్లో లేక టీవీలో! ఏమి చేస్తున్నావు ఒంటరిగా! జాగ్రత్త! దేవుడు ఆకాశాన్ని భూమిని కాపలాగా పెట్టారు తెలుసు కదా! కారణం మానవుడు చేసే ప్రతీ పని ప్రతీ పాపము ఆకాశం క్రింద, భూమి మీదనే చేస్తాడు! అందుకే ఆ రెంటినీ కాపలాగా పెట్టారు దేవుడు! ఆయన కన్నులకు మరుగైనది ఏమీలేదు- భూమి ఆకాశానికి కూడా మరుగైనది ఏదీ లేదు! ఒకరోజు నీవు దేవుని సముఖమందు లెక్క అప్పగించాలి అని మర్చిపోకూ!

 

ఇక 23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

దేవుడు ఒక్క అబ్రాహాము గారిని అనేక జనములకు తండ్రిగా చేసి ఆయన ద్వారా అనేకులైన జనాంగాలను చేశారు! యాకోబు ఒక్కడే అనేకులైన వారిగా చేశారు దేవుడు! అందుకే యెషయా 26:15 లో అంటున్నారు 15 యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.

 

కీర్తనాకారుడు అంటున్నారు 107: 38 మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు

39 వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు

40 రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.

41 అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

 

యెషయా 60: 22 వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

 

ఇక తర్వాత వచనాల విషయము కూడా పై వచనాలలో చూశాము! కాబట్టి దేవుడు సర్వశక్తి మంతుడు! ఆయనకు సమస్తము తేటగా కనిపిస్తున్నాయి! ఆయన అసాధారణమైన అద్భుతాలు చేయగల సత్తా గలవాడు! కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనస్పూర్తిగా దేవునికి భయపడుతూ ఆయన యందు నిజమైన భక్తి కలిగి జీవిద్దాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*62వ భాగం*

యోబు 13:15

1 ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను. నా చెవి దాని విని గ్రహించియున్నది

2 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.

3 నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను

4 మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.

5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

 

       ప్రియులారా! 13వ అధ్యాయంలో కూడా  నయమాయతీయుడైన జోఫరు  అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

 

ప్రియులారా ఈ 13 వ అధ్యాయంలో డైరెక్టుగా చెబుతున్నారు- స్నేహితులారా మీకంటే నేను తక్కువ జ్నానము గలవాడను కాను, ఇక మీతో వాదించి ఉపయోగం లేదు నేను దేవునితోనే మాట్లాడతాను అంటున్నారు!

మొదట వచనంలో 1 ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను. నా చెవి దాని విని గ్రహించియున్నది

2 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.

ప్రియులారా ఇక్కడ ఇలా చెప్పడంలో యోబుగారు  గర్విష్ఠి అయినందువల్ల, డంబాలు పలికేవాడైనందువల్ల ఇలా మాట్లాడాడని అనుకోకూడదు. యోబుగారి  మాటల అర్థం ఇదిమిత్రులారా, నామీదికి ఇంత ఘోరమైన ఆపదలు ఎందుకు వచ్చాయో అన్న సమస్యను పరిష్కరించడానికి మీకూ నాకూ తెలిసిన ఈ సత్యాలు సరిపోవు. మీ జ్ఞానమే అన్ని జవాబులనూ ఇవ్వగలదన్న భ్రమలో ఉండకండి. ఎందుకూ కొరగాని నివారణను నిర్ణయించే పనికిమాలిన వైద్యులు మీరు. ఇప్పటివరకు చెప్పినదానికంటే మరి కాస్త అర్థవంతమైన మాటలు పలకలేని పక్షంలో దయ చేసి మౌనంగానే ఉండండి. అనగా ఒకవిధంగా నాకు కలిగిన కడగళ్లకు కారణం ఒకవేళ మీకు తెలియక పోతే నోరుమూసుకుని కూర్చోండి గాని నామీద అభాండాలు వేయవద్దు. ఇక నేను  దేవునినుండి జవాబు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.” అని అర్ధం అని నాకు తోస్తుంది! వారు కల్పించిన అబద్ధాలేవంటే యోబు దుర్మార్గుడని చేసిన నేరారోపణే వారు కల్పించిన అబద్ధం.

 

ఇక మొదటి వచనంలో చెప్పింది 12 వ వచనంలో నేను చెప్పింది కేవలం నా మాటలు కావు అవి నా అనుభవంలో నేను కన్నులారా చూసినవి అంటున్నారు! ఇక నా చెవి విని వాటి ఫలితము మరియు వాటి పరమార్ధము నేను స్వానుభవంలో గ్రహించినది అంటున్నారు!

 

ఇంకా అంటున్నారు ప్రియ స్నేహితులారా మీకు తెలిసినది నాకు కూడా తెలుసు! అంతేకాకుండా నాకు మీకంటే ఎక్కువ జ్నానము ఉంది అని తెలుసుకోండి అంటున్నారు!

 

ఇక తర్వాత వచనంలో అంటున్నారు ఇక నేను మీతో వాదించి ఉపయోగం లేదు : నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను. చూడండి మీతో వాదించను గాని దేవునితోనే వాదిస్తాను ఆయనతోనే మాట్లాడతాను అంటున్నారు! నిజానికి దేవునితో వాదించి ఎవరూ గెలవలేరు అని యోబు గారికి తెలుసు! ఆ విషయం గత అధ్యాయాలలో ఆయనే ఒప్పుకున్నారు! 9:3  వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు.

4 ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

  గాని ఇక్కడ తన స్నేహితులు తనను ఒక పాపిగా అపరాదిగా నేరస్తుడుగా చూస్తూ తమకు తెలియక పోయినా తనను నేరస్తునిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు- తనను అర్ధం చేసుకోలేక పోతున్నారు కనుక ఇక నేను మీతో మాట్లాడను వాదించను దేవునితోనే వాదిస్తాను అని తెగించి పలుకుచున్నారు యోబు గారు!

 

అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాగే పలికిన ప్రజలతో దేవుడు యెషయా గ్రంధంలో అంటున్నారు 41: 21 వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు.

22 జరుగబోవు వాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

 

1: 18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.

19 మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

20 సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.

 

కాబట్టి మనము దేవునితో వాదించలేము గనుక యోబుగారు పలికినట్లు మనము పలుకకూడదు అని గ్రహించమని మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*63వ భాగం*

యోబు 13:48 

4 మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.

5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

6 దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.

7 దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

8 ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా?

 

       ప్రియులారా! 13వ అధ్యాయంలో కూడా  నయమాయతీయుడైన జోఫరు  అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ప్రియులారా ఈ 13 వ అధ్యాయంలో డైరెక్టుగా చెబుతున్నారు- స్నేహితులారా మీకంటే నేను తక్కువ జ్ఞానము గలవాడను కాను, ఇక మీతో వాదించి ఉపయోగం లేదు నేను దేవునితోనే మాట్లాడతాను అంటున్నారు!

ఇక 4 వ వచనం నుండి తన స్నేహితులతో అంటున్నారు 4 మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.

5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

మీరు నామీద కేవలం అబద్దముగా అన్యాయంగా అభాండాలు వేస్తున్నారు! నిజము చెప్పడం లేదు. మీరు ఎందుకు పనికిరాని వైద్యులు అంటున్నారు! కాబట్టి మీరు మాట్లాడటం కన్నా మౌనముగా ఉండటమే మంచిది అలాగుంటే అదే మీకు జ్నానమని ఎంచబడుతుంది అంటున్నారు! దీనినే సోలోమోను గారు అంటున్నారు సామెతలు 17:28 లో 28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును. అందుకే అలాగైనా నోరుమూసుకుని కూర్చుంటే మీరు జ్నానులు అని ముద్రపడుతుంది అంటూ హితవు పలుకుతున్నారు!

 

ఇక తర్వాత వచనాలలో అంటున్నారు దయచేసి నా వాదము వినండి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేస్తారా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుతారా అని నిలదీస్తున్నారు! ఇంకా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుతారా? ఇంకా దేవుని పక్షమున మీరు వాదిస్తారా? అని అడుగుతున్నారు! 

 

ఇలా అనడానికి కారణం  తాము దేవుని తరఫున వాదించేవారన్నట్టు యోబుగారి  స్నేహితులు మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే తన పైన లేనిపోని నేరాలెందుకు మోపుతున్నారు అని అడుగుతున్నారు యోబుగారు. అతనిలో తప్పులేమన్నా ఉన్నాయేమోనని యోబును పరీక్షిస్తున్నారు. దేవుడు వారిని కూడా అదే విధంగా పరీక్షిస్తే ఏమవుతుంది? దేవుణ్ణి గురించి అంత తేలికగా మాట్లాడుతున్నారే, ఆయనంటే భయం లేదా? తాము యోబుకంటే మంచివారమైనట్టు వారు భావించుకుంటున్న సంగతిని యోబు పసిగట్టాడు. వారి అంతరంగంలోని భావం ఇలా ఉండి ఉండవచ్చు: “దేవుడు యోబును అతని పాపాల కారణంగా ఘోరంగా శిక్షించాడు. ఆయన ఆ విధంగా మనకు చెయ్యలేదు. గనుక యోబు చాలా చెడ్డవాడై ఉండాలి. మనం మంచివాళ్ళమై ఉండాలి. కనీసం అతనంత చెడ్డవాళ్ళం మాత్రం కాము”. తనలో ఉన్న స్వనీతిని కనిపెట్టడం ఎవరికైనా చాలా కష్టం. అతనితో మాట్లాడే ఇతరులకు అది పెద్ద సమస్య అవుతుంది. మానవ హృదయంనుండి పెరికివేయడానికి అతి కష్టమైన పాపాల్లో ఇది ఒకటి.

ఈ సంధర్భంగా నాకు నా చిన్నప్పుడు చదివిన వేమన శతకంలో ఒక పధ్యం గుర్తుకొస్తుంది! తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు దప్పు తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఎదుటివారిలో తప్పులు చూసేవారు, చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషీ ఎదో ఒక తప్పు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాడు. "నీది తప్పు, మార్చుకో" అని ఎదుటివారికి చెప్తూ ఉండేవారు తమ తప్పు ఏమిటో, తాము ఏమి మార్చుకోవాలో అని అసలు ఆలోచించరు అని వేమనగారి  భావం. ఇక్కడ యోబుగారి ముగ్గురు స్నేహితులు కూడా అదే స్తితిలో ఉన్నారు! అందుకే వారిని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు!

ఇక పౌలుగారు కూడా అంటున్నారు రోమా పత్రికలో 2: 17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?

18 ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా?

19 జ్ఞానసత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపు వాడను,

20 చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?

21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?

23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?

24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది?

 

ప్రియ సహోదరీ సహోదరుడా!! నీవు కూడా ఇతరుల తప్పులను ఎంచుతూ నీవుకూడా అదేపని చేస్తున్నావా? అయితే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మత్తయి 7 వ అధ్యాయములో 1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

3 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?

4 నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?

5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును

 

కాబట్టి నీవు మంచివాడవా లేక వేషధారివా ఈ భాగము ద్వారా పరిశీలించి తెలుసుకో! అవసరమైతే సరిచేసుకోమని క్రీస్తు నామము పేరిట మనవి చేస్తున్నాను!

కాబట్టి ఎదుటి వారి తప్పులెంచడం మానేద్దాం! సరిచూసుకుందాం! సరిచేసుకుందాం!

క్రీస్తుతో సమాధాన పడుదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*64వ భాగం*

యోబు 13:915

9 ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?

10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.

11 ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?

12 మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు

13 నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.

14 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను? చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.

 

       ప్రియులారా! 13వ అధ్యాయంలో కూడా  నయమాయతీయుడైన జోఫరు  అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ఇక 9 వ వచనం నుండి తన స్నేహితులతో అంటున్నారు ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?

చూడండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు అనగా మానవ జాతికి క్షేమమా అని అడుగుతున్నారు! ఇంకా మనుషులను మోసగించినట్లు మీరు దేవుణ్ణి మోసగించగలరా నా ప్రియ స్నేహితులారా అంటున్నారు! నిజానికి దేవుడు మనలను పరిశోదిస్తే పరిశీలిస్తే ఏ మనిషి నీతిమంతుడిగా కనబడరు! మన నీతిక్రియలు ఆయనకు మురుకి గుడ్డలా కనిపిస్తాయి!

 

యెషయా గ్రంధంలో భక్తుడు అంటున్నారు 64: 6 మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

 

యిర్మీయా గ్రంధంలో అంటున్నారు 17: 10 ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను

 

గలతీ పత్రికలో పౌలుగారు అంటున్నారు 6: 7 మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.

8 ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

 

ఇక తర్వాత వచనంలో 10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.

11 ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?

ఇక్కడ మీరు రహస్యముగా పక్షపాతము చూడడం అంటే మీరు నీతిమంతులుగా నన్ను పాపిగా చూస్తే దేవుడు తప్పకుండా మిమ్మును గద్దించును అని తెలుసుకోండి అంటున్నారు! అందుకే యాకోబు 2:9 లో అంటున్నారు  9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

 

ఇక ఆయన భయము మీకు భీతి పుట్టించదా అనగా మీరు ఇలా నా ఎడల పక్షపాతంగా తీర్పు తీరిస్తే దేవుని యొక్క ప్రభావం  మీకు భయము భీతి పుట్టిస్తుంది అనియు ఇంకా దేవుడు తన భయముచేత మిమ్మును చీల్చి చెండాడుతాడు అని మరచిపోవద్దు అంటున్నారు!

 

అందుకే కీర్తనాకారుడు 119వ కీర్తనలో అంటున్నారు 120 నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.

 

దేవుడు అంటున్నారు యిర్మీయా గ్రంధం 5 లో 22 సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.

 

ఇక అందుకే తెగించి తన స్నేహితులతో అంటున్నారు 12 మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు

13 నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.

14 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను? చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

 

నేను దేవునితోనే వాదిస్తాను గాని మీతో వాదించను. దేవుడు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోనీయ్ గాని నేను ఇప్పుడు నేను చెప్పెదంతా దేవునికి చెప్పేస్తాను అంటున్నారు!

 

యోబుగారు  ధైర్యం చేసి మాట్లాడడానికే  నిశ్చయించుకున్నారు. అందుకే దేవుడు తనను చంపినా సరే చివరికి తన నిర్దోషత్వం రుజువౌతుందన్న నిరీక్షణ దేవుని పట్ల అతనికి ఉంది. దేవుని ఎదుట తనను తాను సమర్థించుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇతని అభిలాష ఇతడు కపట భక్తుడు గానీ దుర్మార్గుడు గానీ కాదని నిరూపిస్తున్నది.

 

అందుకే తెగించి ఇంకా దేవునితో మాట్లాడుచున్నారు 14 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను? చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.

చూడండి ఈవచనంలో అంటున్నారు ఇదిగో వినండి నేను ఇలా మాట్లాడుతున్నందుకు దేవుడు నన్ను చంపినా సరే నేను మాత్రం దేవుని వైపు మాత్రమే నిరీక్షణతో ఎదురు చూస్తాను దేవుని ఎదుటే నా మార్గం సరియైనది అని రుజువు చేసి తీరతాను అంటున్నారు!

 

అసలు ఇలా ధైర్యంగా మాట్లాడటానికి కారణం తన మనస్సాక్షి తనమీద ఏ నేరము మోపలేదు! అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నారు! దావీదు గారు కూడా ఇలాగే అంటున్నారు కీర్తన 23:4 లో 4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

ఇలాంటి స్థిర విశ్వాసం నిజమైన నిరీక్షణ నీకుందా? దేవుడు నన్ను చంపినా నేను దేవునిమీదనే ఆనుకుంటాను! చావైనా బ్రతుకైనా నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని చెప్పగలవా!!!

అయితే నీవు ధన్యుడవు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*65వ భాగం*

యోబు 13:1619

16 ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

17 నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.

18 ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.

19 నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.

 

       ప్రియులారా! 13వ అధ్యాయంలో కూడా  నయమాయతీయుడైన జోఫరు  అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు!

ఇక 16వ వచనం నుండి చూసుకుంటే 16 ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

17 నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి అంటున్నారు

 

ఇక్కడ 17 వ వచనంలో నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి అంటున్నారు. వాజ్మూలము అనేది ఏదైనా నేరం జరిగినప్పుడు గాని ఏదైనా ఎంక్వైరీ జరిగే సమయంలో ఒక వ్యక్తి చూసినది తనకు తెలిసినది అధికారిముందు ఆఫీసియల్ గా ఇచ్చే స్టేట్మెంట్ , ఇంకా ఒక మనిషి చనిపోయేముందు పోలీసుకి ఇచ్చే స్టేట్మెంట్! అనగా ఇక్కడ యోబు గారు తెగించి మాట్లాడుచున్నారు- ఇక నేను కొద్ది రోజులలో చనిపోబోతున్నాను, నా కధ తుది దశకు చెరిపోయింది గనుక తెగించి మాట్లాడుచున్నారు! ఇప్పుడు నేను చెప్పేది మీ చెవుల్లో మారుమ్రోగాలి అంటున్నారు!

 

ఇక తర్వాత వచనంలో నా వ్యాజ్యెమును ఇప్పుడు సరిచేసి కొన్నాను అంటున్నారు- అయినా గాని నేను నిర్ధోషిగా కనబడతాను అనే నమ్మకము నాకుంది అంటున్నారు!

ఇక్కడ మనకు రెండు విషయాలు అర్ధమవుతున్నాయి. మొదటిది: యోబుగారిలో ఇక్కడ తాను పాపము చేయలేదని నమ్మకం కనిపిస్తుంది! కారణం అతని అంతరాత్మ అతనిమీద ఎక్కడా నేరం మోపలేదు- అలా మోపడానిని ఆస్కారం లేకుండా ఆయన ఎప్పుడూ పాపం చేయ లేదు!

రెండు: మరో విధంగా చూసుకుంటే యోబుగారిలో ఇక్కడ స్వనీతి కనిపిస్తుంది! నేను చాలా నీతిమంతుడుని! నేను ఏ నేరము చేయలేదు! చివరకు భూమిమీద ఉన్నవారిలో నేను నీతిమంతుడిని అనే భావము బహుశా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది ప్రియులారా! ఎందుకంటే తర్వాత అధ్యాయాలలో తన స్నేహితులు ఇదే భావాన్ని వ్యక్తపరిచారు!

ప్రియ దైవజనమా! ఇలాంటి బుద్ధి, ఇలాంటి అభిప్రాయం మనలో ఎప్పుడు ఉండకూడదు! అయితే ఇంతకు ముందు యోబుగారు అన్నారు నాకు ఉపదేశం చేయండి నేను మౌనిగా ఉంటాను! ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు తెలియజేయండి అంటే తన స్నేహితులు అభాండాలు వేశారు గాని తాను చేసిన అపరాధాలు చెప్పలేక పోయారు కారణం ఆయన చేయలేదు కాబట్టి! అందుకే తెగించి ఇక్కడ నేను ఎంత పరిశోధించినా దేవుని దగ్గర నేను నీతిమంతుడిగా నిర్ధోషిగా కనబడతాను అంటున్నారు! అయితే యెషయా 43:26 లో దేవుడు అంటున్నారు  25 నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

26 నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

27 నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే.

కాబట్టి మనమంతా పాపులమే గాని దేవుడు తన అత్యంత కృపతో మన దోషములను క్షమించి మనలను నీతిమంతులుగా నిర్ధోషులుగా చేస్తున్నారు!

 

రోమా పత్రికలో పౌలుగారు అంటున్నారు 8: 33 దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;

34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

 

1 కోరింథీ 6: 11 మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి.

 

సరే ఇక తర్వాత వచనంలో అంటున్నారు నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను

దీని అర్ధం నేను ఏ పాపము చేయలేదు కనుక నామీద నేరస్థాపన చేసేవారెవరు? అలా ఒకవేళ నేరస్థాపన చేసి నిరూపించగలగితే నేను నోరుమోసుకుని ముక్కుమూసుకుని ప్రాణము విడిచేస్తాను అని ఢంకాయించి చెబుతున్నారు! నిజానికి ఒకని మనస్సాక్షి అతని మీద నేరం మోపకపోతే నిజానికి అతడు నీతిమంతుడు!

పౌలుగారు అంటున్నారు అపోస్టులుల కార్యములో 24: 16 ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.

 

రోమా 2: 14 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.

15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు

 

రోమా 13: 5 కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

 

నిజానికి ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు!

ఇలాంటి స్థితి యేసుక్రీస్తుప్రభులవారి కి ఉంది యెషయా గ్రంధంలో 50: 7 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.

8 నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.

9 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.

 

అందుకే యోహాను సువార్తలో బహిరంగంగా సవాలు విసిరారు నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు అంటూ

8: 46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

ఇలాంటి స్థితి నీకుందా?

అయితే నీవు ధన్యుడవు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*66వ భాగం*

యోబు 13:2024

20 ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.

21 నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము

22 అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము

23 నా దోషములెన్ని? నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.

24 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

 

       ప్రియులారా! 13వ అధ్యాయంలో కూడా  నయమాయతీయుడైన జోఫరు  అనే మూడవ స్నేహితుడు మాట్లాడిన మాటలకు యోబుగారు జవాబు చెబుతున్నారు! ఇక 20వ వచనం నుండి దేవునితో మాట్లాడుచున్నారు!

ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను!

 ఇక్కడ దేవునితో అంటున్నారు యోబుగారు దేవుడా నాకు రెండు పనులు చేస్తే నేను భయపడకుండా నీతో వాదిస్తాను అంటున్నారు!

అవి ఏమిటంటే 21 నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము.

మొదటిది దేవుని చేయి అతనిమీద నుండి తీసేయాలి!

రెండు: దేవుని భయము అతనిమీద ఆవరించకూడదు బెదిరించ కూడదు!

అలా చేస్తే నీవు నన్ను పిలిస్తే నన్ను ప్రశ్నిస్తే నేను నీకు జవాబు చెబుతాను నేను నీతో ధైర్యంగా ప్రశ్నలు అడుగుతాను అప్పుడు నాకు జవాబు ఇవ్వు అంటున్నారు! నిజంగా ఇలా పలకడం మంచిదికాదు అని నా ఉద్దేశం! ఆయన దేవుడు! మనము కేవలం మనుష్యులము మంటితో చేయబడిన వారము! ఆయన నిత్యుడు మరియు సర్వాధికారి సర్వశక్తిమంతుడు! మనము ఏమీ చేయలేని వారము! కాబట్టి మనమాటలు కొద్దిగా ఉండాలి! ఇక్కడ యోబుగారు పలికిన మాటలు మనము మాట్లాడకూడదు అని మనవిచేస్తున్నాను!

 

ఇక్కడ మరో సారి యోబుగారు  తన స్నేహితులతో మాటలు ఆపి దేవుణ్ణి సంబోధిస్తున్నారు (యోబు 10:2, ). దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోవాలని అతని వాంఛ. తన నీతి నిజాయితీని నిరూపించుకోగలనని అతనికి గట్టి నమ్మకం ఉంది. అయితే అతనిలో నొప్పి, అయోమయం, శోకం, భయం నిండి ఉన్నాయి. ఈ కారణం వల్ల తనకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ ఇప్పుడా అవకాశం వస్తే తనను తాను సరిగా సమర్థించుకోలేడు. అందుకని ఈ విన్నపాలు చేస్తున్నారు.

 

ఇంకా అంటున్నారు 23 నా దోషములెన్ని? నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.

24 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

 

ఈ వచనాలలో దేవునితో యోబుగారు తన ఆక్రోషమంతా చెబుతున్నారు. అతనికి వ్యతిరేకంగా మోపిన నేరాలేవో యోబుగారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు! కారణం  అతనికి తెలియకుండానే అతణ్ణి నేరస్థుడిగా నిలబెట్టడం జరిగింది. దేవుడు తనకు శత్రువై తనను తీవ్రంగా శిక్షిస్తున్నాడు అనుకొంటున్నారు యోబుగారు! (26-28 ) మరింతగా బాధించేందుకు కారణాలు వెతుకుతున్నాడనీ భావిస్తున్నారు. అందుకే దేవుని న్యాయ స్థానంలో తనపై మోపిన నేరాలన్నీ వినేందుకు తనకు అవకాశం కావాలంటున్నారు.

అందుకే అంటున్నారు- నన్నెందుకు పగవానిగా ఎంచుతున్నావు? ఎందుకు నేను అడిగితే నీ ముఖాన్ని నాకు దూరంగా పెట్టుకుంటున్నావు అని అడుగుచున్నారు!

 

ఇక తర్వాత వచనంలో అసలు తాను ఎవరో ఏ స్థితిలో ఉన్నారు తెలుసుకుని మాట్లాడుచున్నారు! 25 ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా?

26 నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు

 

చూడండి తననుతాను గాలికి కొట్టుకుపోయే ఆకుతో పోల్చుకుంటున్నారు ఇలాంటి ఆకులాంటి నన్ను మహా ఘనుడవైన నీవు వేధిస్తావా? ఎండిపోయిన చెత్త లాంటి నన్ను తరుముతావా? అని వాపోతున్నారు!

 

ఇంకా అంటున్నారు నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు

తనకు సంభవించిన ఆపదలకు తగిన పాపాలను తాను పెద్దవాడైన తరువాత చేయలేదని యోబుగారికి  గట్టి నమ్మకం. ఇవి తన పైకి రావడానికి గల కారణాలు వెదకితే తాను యువకుడుగా ఉన్నప్పుడు చేసిన పాపం ఏదైనా దీనికి కారణం కావచ్చునని యోబుకు అనిపించింది. అయితే ఈ గ్రంధములోని మొదటి రెండు అధ్యాయాలను బట్టి మనకు అర్థమైనదేమంటే ఈ విషయంలో యోబుగారు అనుకొంటున్నది సరి కాదు. ప్రస్తుతం అతని బాధలకూ, అతని పాపాలకు రావలసిన శిక్షకూ ఎలాంటి సంబంధమూ లేదు. కానీ తన కష్టాలకు కారణమేదన్నా ఉందేమోనని తన గత జీవితాన్ని పరిశీలించడం యోబుకు మంచిదే.

 

 మనకు కష్టాలు ప్రాప్తించినప్పుడు మనం కూడా అలా చేయాలి. మనం చేసిన ఏదన్నా పాపం కారణంగా అవి వచ్చి ఉండవచ్చు

 

కీర్తనల గ్రంథము 77:5-6

5 తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.

6 నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

 

కీర్తనల గ్రంథము 119:59

59 నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.

 

కీర్తనల గ్రంథము 139:23-24

23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

24 నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

 

కాబట్టి యోబుగారు ఇలా జ్నాపకము చేసుకున్నట్లు మనం కూడా మనలో ఏదైనా పాపమున్నదేమో అని మనలను మనము విమర్శించుకోవాలి!

 

ఇక తర్వాత వచనాలలో అంటున్నారు 27 బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు

28 మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటి వానిచుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

 

ఇలాగే యిర్మీయా గారు కూడా అన్నారు    విలాపవాక్యములు 3:4

4 ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు

 

అయ్యా నా ప్రవర్తన అంతా నీవు కనిపెడుతున్నావు! ఇక చాలు మహా ప్రభో! ఈ శ్రమలు పరిశోధనలు చాలించు ప్రభూ అని మొర్ర పెడుతున్నారు!

మనలను ఆదరించు వాడు మనలను విడిపించువాడు దేవుడే కాబట్టి మనలను మనము పరీక్షించు కొని, పాపములను విడిచిపెట్టి దేవుని క్షమాపణ వేడుకుని క్షమించి ఆదుకో దేవుడా అంటే తప్పకుండా విడిపించి కాపాడే దేవుడు కనుక ఆయన శరణే వేడుదాం! ఆయననే వేడుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*67వ భాగం*

యోబు 14:1 6

1 స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును.

2 పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.

3 అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.

4 పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు.

5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు

6 కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము

 

       ప్రియులారా! 14వ అధ్యాయంలో కూడా యోబుగారు  దేవునితో మాట్లాడుచున్నారు!

మొదటి వచనం నుండి చూసుకుంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును ఇంకా పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అంటున్నారు!

యోబుగారు దేవునితో అంటున్నారు స్త్రీకి పుట్టిన మానవుడు కొన్ని రోజులే బ్రతుకుతాడు అది కూడా మిక్కిలి బాధతో తన దినములు వెళలబుచ్చుతాడు కదా! ఇంకా పువ్వు వికసించునట్లు వికసించి పువ్వు వాడిపోవు నట్లు వాడిపోతాడు కదా మరి అలాంటి వాడిని ఎందుకు పట్టించుకుంటున్నావు అని బాధపడుతున్నారు ఇక్కడ!

 

ఇంత అల్పుడు, గడ్డిపోచవంటివాడు అయిన మనిషి గురించి దేవుడు ఇంతగా ఎందుకు పట్టించుకుంటున్నాడు? అని యోబుకు ఆశ్చర్యం వేస్తున్నది

 

అవును మనిషి జీవితం పువ్వులాంటిది! వికశిస్తుంది వాడిపోతుంది! అందుకే దావీదు భక్తుడు అంటున్నారు 1 దిన 29: 15 మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు

 

ఇంకా 90 వ అధ్యాయంలో మరో భక్తుడు అంటున్నారు

కీర్తనలు 90: 3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

4 నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.

5 వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు

6 ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.

7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

9 నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.

10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?

12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

13 యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.

ఎంత చక్కగా చెప్పారో చూడండి!

 

అందుకే ఇక్కడ యోబు గారు అంటున్నారు అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు!

 

ఇక తర్వాత వచనంలో అంటున్నారు 4 పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు

పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంతమేలు అంటున్నారు! నిజానికి భూమిమీద పుట్టిన వారికి ఇది అసంభవము! గాని యేసుక్రీస్తుప్రభులవారి విషయంలో మాత్రమే ఇది సాధ్యమయ్యింది! ఆయన పాపము లేని వానిగా పుట్టి పాపము లేని వానిగా బ్రతికి పాపుల కోసం చనిపోయి లేచారు హల్లెలూయ!!!

 

సరే, ఇక్కడి అంశంమనిషి’. పాపభూయిష్టమైన మానవతలో నుంచి పవిత్ర స్వభావం రాదు. తాను మానవుడు కాబట్టి తనది కూడా భ్రష్ట స్వభావమని యోబుకు తెలుసు. అపవిత్రమైనదేది తనలో లేదని యోబుగారు చెప్పడం లేదు ఇక్కడ! నేను జన్మతహా పాపిని! ఇట్టివాని మీద నీ దయా దృష్టి చూపాలి గాని కోప దృష్టి చూపవద్దు అని అర్ధంతో మాట్లాడుచున్నారు యోబుగారు!

 

ఇక తర్వాత వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు అంటున్నారు! అవును ఇది నిజమే! పైన చూసుకున్న వచనం ప్రకారం కీర్తనలు 90: 10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము

 

అయితే ఇక్కడ యోబుగారు  వాదించేదేమిటంటే మానవ జీవితం ఎలాగూ శూన్యమూ, వ్యర్థమే గదా. అలాంటప్పుడు దేవుడు ఆపదలూ కష్టాలూ పంపడం మానుకుని మనిషి తనకు చేతనైనట్టు బ్రతికేలా అతణ్ణి ఎందుకు వదిలివేయడు? అని అర్ధం లా కనిపిస్తుంది!

 

అందుకే  తర్వాత వచనంలో 6 కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము అంటున్నారు!

ఓ దేవుడా మా జీవితకాలమంతా కష్టాలు కడగల్లు మాత్రమే కదా! అలాంటప్పుడు కొంతకాలమైన మమ్మల్ని సంతోషంగా ఉండనీయు! గనుక మానవుని వైపు నుండి నీ దృష్టి తిప్పుకో! జీతగాడిలాగా అతని కాలమంతా పూర్తిచేసే వరకు వానిని వదిలిపెట్టే అంటున్నారు! అవును మానవుని జీవితం కూలివాని వంటిది! గతంలో వివరించినట్లు మనిషి జీవితం కూలివని జీవితం లాంటిది. మొదటగా వాడు కూలిపని కోసం ఎదురుచూడాలి! తర్వాత కూలిపని గడించిన తర్వాత కూలిడబ్బుల కోసం ఎదురుచూడాలి! ఇలాంటిదే మానవుల జీవితం! యజమానుడైన దేవుడు తమను కరుణించే వరకు ఆయనను చూద్దాం! ఆయన దయకోసం ఎదురుచూద్దాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*68వ భాగం*

యోబు 14:712

7 వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.

8 దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను

9 నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు?

11 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

12 ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

 

       ప్రియులారా! 14వ అధ్యాయంలో కూడా యోబుగారు  దేవునితో మాట్లాడుచున్నారు!

7వ వచనం నుండి చూసుకుంటే 7 వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.

8 దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను

9 నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

ఇక్కడ మానవుని జీవితాన్ని వృక్షము జీవితంతో పోలుస్తున్నారు యోబుగారు! ఒక చెట్టు నరకబడిన తర్వాత కొన్నిరోజులకు దాని వేరుల నుండి లేత కొమ్మలు వస్తాయి! దాని వేరు పాతదై పోయినా గాని కేవలం నీటి వాసన తగిలిన మాత్రమే అది చిగురిస్తుంది అది లేత మొక్కలా మరలా జీవితం ప్రారంభిస్తుంది అయితే మానవుడు ఒక్కసారి చనిపోతే ఇక వారు కదలలేక ఉంటారు! ఆ తర్వాత వారి జీవితం ఏమై పోతుందో ఎవరికి తెలుసు అంటున్నారు! దీనికోసం గత భాగాలలో చూసుకున్నాం! యోబుగారు  గానీ అతని స్నేహితులు గానీ బైబిల్లో మరెవరూ గానీ పునర్జన్మపై నమ్మకం ఉంచినట్టు లేదు. యోబు 11:12 ధ్యానం చేసినప్పుడు దీనికోసం చూసుకున్నాము!.

 మనిషి చనిపోయి సజీవంగా తిరిగి లేవడమనే సత్యాన్ని ఆ సమయానికి దేవుడింకా వెల్లడి చేయలేదు. మరణం అంటే కటిక చీకటి ప్రదేశంలో మరి ఇక ఎన్నడూ తిరిగి లేవని శాశ్వతమైన నిద్ర అన్న అభిప్రాయంలో ఉన్నారు యోబుగారు . ఇది గాక మరో విధంగా అనుకునేందుకు అతనికి దేవునినుంచి ఎలాంటి సందేశమూ అందలేదు.

 

కాబట్టి ఇక్కడ చెట్టుకయినా మరలా జీవిస్తాను అనే నిరీక్షణ ఉంది మానవునికి లేదు అనే అర్ధంతో మాట్లాడుచున్నారు!

 

11 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

12 ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

 

తటాకము అనగా చెరువు- చెరువులో నీళ్ళు ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోతాయి! నదిలో నీరు కూడా ఎండాకాలములో తరగిపోతాయి! అలాగే నరులు కూడా పండుకొని శాశ్వత నిద్రలోకి పోతారు అంటున్నారు! ఆకాశములు గతించేవారకు వారు లేవరు అంటున్నారు! అనగా సృష్టి అంతము వరకు వారు లేవరు అంటున్నారు!

 

ఇంకా ఆకాశం గతించే వరకు వారిని ఎవరు నిద్రలేప జాలరు అంటున్నారు”! అయితే వారు ఎప్పుడు లేస్తారు అంటే

క్రీస్తునందు ఉంది మృతులైన వారు 1 కోరింథీ 15 వ అధ్యాయం ప్రకారం 50 సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.

52 బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.

53 క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

 

1 థెస్స 4: 14 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15 మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16 ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18 కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

 

యోబుగారి సమయంలో ఈ నిరీక్షణ లేదు ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తుప్రభులవారి బలియాగము జరుగలేదు! యోబు గారి సమయానికి ఆహారోను యాజక క్రమము లేదు- మెల్కీసేదేకు యాజక క్రమము కూడా లేదు! అది కేవలం మనస్సాక్షి యుగము కాబట్టి! నేడైతే ఈ రోజు నీకు నిరీక్షణ శుభప్రధమైన నిరీక్షణ- గొర్రెపిల్ల రక్తము- బైబిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేడే నీ పాపములను కడిగి వేసుకుని పవిత్రుడవై ప్రభువు రాజ్యానికి రా!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*69వ భాగం*

యోబు 14:1317

13 నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను.

14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

15 ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యు త్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు

17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

 

       ప్రియులారా! 14వ అధ్యాయంలో కూడా యోబుగారు  దేవునితో మాట్లాడుచున్నారు!

ఇక 13  వ వచనం నుండి చూసుకుంటే నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను అంటున్నారు!

ఇక్కడ రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి నాకు! మొదటిది: మనిషికి కలిగిన దుస్థితిని యోబుగారు  తలపోసు కుంటూ ఉంటే అతని మనసులో ఒక ఆలోచన చోటు చేసుకొంది. అతని హృదయంలో చిన్న ఆశాదీపం  వెలిగింది. మనిషి ఒకవేళ తిరిగి బ్రతకడం అసాధ్యం కాదేమో. చావు తరువాత మళ్ళీ బ్రతుకు ఉండి నిర్దోషుల యోగ్యత రుజువు కావడం, ప్రశ్నలన్నిటికీ జవాబులు, సమస్యలన్నింటికీ పరిష్కారాలు దొరకడం జరగవచ్చునేమో. అలా జరిగితే ఎంత బావుంటుంది! ఇహలోకం బాధలను, దుఃఖాన్ని ఎంత తేలికగా భరించవచ్చు.

 

ఇక రెండవ అర్ధం: మనిషి పుట్టిన తర్వాత వారి జీవిత దినాలన్నీ యుద్ద దినాలే కదా! దానికి తోడు దేవుడు ఆ యుద్ధ దినాలతో పాటుగా మనుషులు చేస్తున్న దోషాలు పాపాలు కూడా   వెదుకుతున్నారు. అందుకే దేవుడు ఇలా కాకుండా అనగా మానవులు చేసిన పాపాలు వెదకకుండా మనిషి పుట్టాక కొన్ని రోజుల వరకు దేవుడు మనలను జ్నాపకం చేసుకోకూడదు! ఆ రోజులు తీరాక దేవుడు జ్నాపకం చేసుకోవాలి అలాగయితే ఎంత బాగుణ్ణు అంటూ ఆశ పడుతున్నారు! కారణం మానవుని జీవితమంతా కష్టాలతోనూ కడగళ్ల తోను నిండి ఉంది- దానికి తోడు దేవుడు మనలో తప్పులు వెదుకుతూ దానికి శిక్షిస్తే ఎలా అంటున్నారు!

 

ఇలాంటి చిలిపి ఆలోచన నాకు కూడా వస్తుంది. అదేమిటంటే మన జీవితమంతా కష్టముతోనే గడిచిపోతుంది కదా! ఉదయాన్నే లేవాలి- రెడీ అయ్యి పనికి లేదా డ్యూటీ కి వెళ్ళాలి! అక్కడ పనిచేయాలి! తిరిగి అలసిపోయి ఇంటికి రావాలి- ఇంటికి వచ్చాక ఇంటికి కావలసిన వస్తువులు తేవాలి- స్త్రీలకైతే ఇంటిపని వంటపని- ఉద్యోగం చేసే స్త్రీకి ఆఫీసుపని- ఇంటికి వచ్చాక మరలా వంటపని పిల్లల పని- ఇలా అన్నీ పనులే- కష్టాలే- మధ్యలో రోగాల గోల- అప్పుల గోల-ఆకలి బాధ! కాబట్టి ఇలా తినడం- కష్టపడటం లేకుండా మనలో ఒక స్విచ్ ఉండాలి! మనము పుట్టాక పెరిగాక ఆ స్విచ్ ఆన్ చేసుకొనే అవకాశం ఉండాలి- అప్పుడు మనకు తినే అవసరం కష్టపడే అవసరం ఉండకూడదు, రోగాలు రాకూడదు! మనము ముసలి వారము అయిపోయాక  ఆ స్విచ్ మరలా ఆఫ్ చేశాక మరలా మనకు అవన్నీ రావాలి! ఇలాంటి స్విచ్ అవకాశం ఉంటే ఎంతబాగున్నో కదా అని పిస్తుంది నాకు! ఇక్కడ బహుశా యోబుగారికి కూడా ఇలాగే అనిపించింది ఏమో అని నా అభిప్రాయం!

 

14వ వచనంలో యోబుగారు అడిగిన ప్రశ్నకు క్రొత్త నిబంధనలో యేసుప్రభువు జవాబిచ్చారు. 14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?

 మనిషి చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. యేసుప్రభువు చనిపోయి సజీవంగా లేచాడు. ఒక సమయం వస్తున్నది మనుషులంతా బ్రతికి లేస్తారు

మత్తయి 16:21 అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

 

మత్తయి 28:1-7,  యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయి తిరిగి లేచినట్లు చూడవచ్చు

1 విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.

2 ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను.

3 ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.

4 అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.

5 దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును;

6 ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి

7 త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను

 

యోహాను 5:28-29, ;

28 దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

29 మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

 

యోహాను 11:23 యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

24 మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

26 బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

 

1 థెస్సలొనీకయులకు 4:13-18,

13 సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14 యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16 ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18 కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

 

ఇన్ని ఆదరణ కరమైన మాటలు బైబిలో నేడు మనకు కనిపిస్తున్నాయి . కానీ యోబుకు సంతోషం కలిగించేందుకు ఈ ధన్యకరమైన సత్యం అతనికి ఆ రోజులలో  తెలియదు.

ఇదే నిరీక్షణ లేక ఆశాభావము మనకు కూడా ఉంది గనుక ఇలాంటి నిరాశ పూర్వకమైన మాటలు వదిలి బైబిల్ మాటల మీద నమ్మకముంచి ముందుకు కొనసాగుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*70వ భాగం*

యోబు 14:1422

14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

15 ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు

17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

18 పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.

19 జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.

20 నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.

21 వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.

22 తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.

 

       ప్రియులారా! 14వ అధ్యాయంలో కూడా యోబుగారు  దేవునితో మాట్లాడుచున్నారు!

ఇక 15వ వచనం నుండి చూసుకుంటే ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు

ఆలాగుంటే అనగా దేవుడు కొంతకాలము వరకు తనను గుర్తుచేసుకోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు అన్నారు కదా- అలాగయితే నీవు నన్ను పిలిస్తే నేను నీకు జవాబు ఇస్తాను నీకు చేసిన మనుషులు నీవు చేసిన వస్తువుల ఎడల నీకు ఎంతో ఇష్టం పడుతుంది అంటున్నారు!

 

తర్వాత వచనంలో అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాదలను లెక్క పెడుతున్నావు నా పాపాన్ని సహించలేకుండా ఉన్నావు అంటున్నారు! తన స్నేహితుడు దీనికోసమే చెబుతూ నీ దోషాలలో అనేకమైనవి దేవుడు మర్చిపోయాడు అని నీకు తెలుసా అంటున్నాడు- గాని ఇప్పుడైతే యోబు గారు అంటున్నారు నీవు నా దోషాలను లెక్క పెడుతున్నావు నా పాపములను సహించడం లేదు అంటున్నారు!

 

చనిపోయి సజీవంగా లేవడం గురించిన ఆలోచనలు, తద్వారా రేకెత్తిన నిరీక్షణ  యోబులో అప్పుడు గతించిపోయాయి. అతని బాధకరమైన పరిస్థితులు, కమ్ముకు వచ్చిన నిరాశ క్రింద అవి నలిగిపోయాయి. అయితే ఈ ఊహ అతని మనసు పొరల్లో ఎక్కడో తన పని సాగిస్తూనే ఉంది. కాసేపటికి మరింత బలంగా నిశ్చయతతో ఈ ఊహ బయటికి వచ్చింది (యోబు 19 :25-27, ). అయితే తర్వాత వచనాలలో  16,17 వచనాల్లో యోబుగారు  తన జీవితంలో పాపం ఉందని ఒప్పుకోవడం గమనించండి. దాన్ని కాదనడం లేదు. అతను అనేదేమిటంటే ప్రస్తుతం తనకు వచ్చిన భయంకరమైన విపత్తులకు పాత్రుడయ్యేటంత ఘోరమైన పాపం ఏదీ తాను చెయ్య లేదని అంటున్నారు!

ఇంకా 17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు అంటున్నారు!

నిజానికి దేవుడు ఈ మాట ఎప్పుడో చెప్పారు! ద్వితీ 32: 34 ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?

35 వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.

 

హొషేయా 13: 12 ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.

 

యిర్మీయా 17: 2 యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.

 

కాబట్టి ప్రియులారా జాగ్రత్త పడదాం! ఆయన క్షమాపణ వేడుకుందాం! అలాచేస్తే అంటున్నారు యెషయా గ్రంధంలో హిజ్కియా భక్తుడు  38: 17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

 

ఇక తర్వాత వచనంలో పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.

19 జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు అంటున్నారు

 

ఒక కొండ పడిపోయి ఇంకా చిన్నచిన్న ముక్కలుగా అయిపోయి చివరకు నాశనమై పోతుంది! అలా అది దాని స్థానం తప్పిపోతుంది. నది నీరు గాని, సముద్రం నీరు గాని ఒక రాయిని అరగదీసేస్తుంది దాని ప్రవాహములు భూమి యొక్క దూలిని కొట్టుకొని పోతాయి. అదే విధంగా నీవు మనిషి యొక్క నిరీక్షణను భంగం చేసేస్తున్నావు అంటున్నారు! అయితే ఇలా అనడం సరికాదు అని నా ఉద్దేశం ప్రియులారా! మన దేవుడు నిరీక్షణకు ఆధారమైన వాడే గాని నిరీక్షణ లేకుండా చేసేవారు కానేకాదు! ఇదే యోబు 4:6 లో మన భక్తి మనకు నిరీక్షణను పుట్టిస్తుంది అని కూడా చెప్పారు కదా! రోమా 4:18 ప్రకారం, విలాపవాక్యములు 3:29 ప్రకారం మనకు నిరీక్షణకు ఆధారం దేవుడే!

 

అయితే దేవుడు ఎవరికి నిరీక్షణకు ఆధారం లేకుండా చేస్తారు అంటే రోమా 4:18 ప్రకారం దేవుని మీద తిరుగుబాటు చేసిన వారికి! లూకా సువార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు- పంట బాగా పండినందుకు దేవుణ్ణి స్తుతించకుండా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తనతో చెప్పుకుంటే దేవుడు అన్నారు లూకా 12: 19 నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.

20 అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.

 

అయితే దేవుణ్ణి ఆశ్రయించిన వారికైతే దేవుడు అంటున్నారు యెహేజ్కేలు 37: 11 లో

11 అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు

12 కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చె దను.

13 నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా

14 నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

 

కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం!

ఇక తర్వాత వచనాలలో యోబు గారు ఇంకా నిరాశా పూరితమైన మాటలు అంటున్నారు! అలాగే నీవు మనుషులను ఎప్పటికీ అణచి వేస్తావు వారు అంతరించిపోతారు- వారి పిల్లలు ఘనత వహించినా ఆ సంగతి వారికి తెలియదు దీనస్థితి అనుభవించినా తెలియదు తమ స్వంత శరీరంలో ఉన్న బాధ మాత్రమే మనుష్యులు అనుభవిస్తారు తమ విషయమే వారు శోకిస్తారు అంటున్నారు!

 

ప్రియులారా మన దేవుడు ఇలాంటి దేవుడు కానేకాదు! ఫ్రస్టేషన్ లో ఏది పడితే అది మాట్లాడకూడదు అదికూడా దేవునికి వ్యతిరేఖంగా మాట్లాడకూడదని మనవిచేస్తున్నాను! కాబట్టి మన మాటలు సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*71వ భాగం*

యోబు 15:1 7

1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?

3 వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా? నిష్ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?

4 నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

5 నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

6 నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.

7 మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?

       ప్రియులారా! 12 నుండి 14 అధ్యాయాల వరకు యోబుగారు స్నేహితులకు సుధీర్ఘ జవాబులు ఇవ్వడమే కాకుండా దేవునితో మాట్లాడారు! దానికి ప్రతి జవాబుగా ఇప్పుడు మరలా స్నేహితులు ఒక్కొక్కరు మాట్లాడటం మొదలుపెట్టారు!

మొదటి వచనంలో తేమానీయుడైన ఎలీఫజు ప్రత్యుత్తరం చెబుతున్నట్లు చూడగలము!

అనగా ఇక్కడ మొదటి తడవ లేక మొదట విడత  మాటలు సమాప్తమయ్యాయి. వాటి సారము ఏమిటంటే విపత్తులనేవి లేక మనిషికి వచ్చే కష్టాలు కడగల్లు అనేవి  మనిషి చేసిన పాపాల కారణంగా దేవుడు పంపించినవి అన్న సిద్ధాంతాన్ని మిత్రులు ప్రతిపాదించారు. అందుకు గాను  యోబు పశ్చాత్తాప పడాలన్నారు. అయితే యోబుగారు  తన నిర్దోషత్వాన్ని సమర్థించుకుంటూ పశ్చాత్తాపపడవలసినది ఏదీ లేదన్నారు. ఇంకా తన స్నేహితుల్లో జ్ఞానం, తన పట్ల సానుభూతి లోపించాయని చెప్పారు. అందుకే ఈ రెండవ సారి మాటల్లో ఎలీఫజు ధోరణి మొదటి సారికంటే మరి కాస్త కఠినంగా ఉంది. అతని నేరారోపణలు మరింత సూటిగా ప్రత్యక్షంగా ఉన్నాయి. చివర్లో పశ్చాత్తాపాన్ని గురించిన హెచ్చరికలు లేవు.

 

ఇక రెండో వచనం నుండి చూసుకుంటే

2 జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?

3 వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా? అంటున్నారు!

 

ఇక్కడ  మొదటిసారి మాట్లాడినప్పటి మర్యాదను వదిలేశాడు (యోబు 4:2-6). యోబు మాటలు వడగాల్పుల్లాగా ఉన్నాయంటున్నాడు. తూర్పు గాలి అంటే వడగాల్పు అన్నమాట! వేడి గాలులు! ఇక్కడ యోబు గారి మాటలు కూడా చల్లని గాలి వీచే ఆహ్లాదకరమైనవి కాకుండా ఎండతో మాడ్చె వేడి గాలుల్లా ఉన్నాయి అంటున్నారు!

 

అందుకే అలాంటి వ్యర్ధ సంభాషణలతో ప్రయోజనం లేని మాటలతో ఎందుకు వాదిస్తున్నావు అంటున్నాడు ఎలీఫజు

 ఇంకా 4 నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు అంటూ ఆరోపిస్తున్నాడు! నిజానికి దీనిలో కొంతవరకు నిజముంది!

దేవుని మంచితనాన్నీ న్యాయాన్నీ యోబుగారు  ప్రశ్నించడంవల్లే ఇలా జరిగింది అని ఎలీఫజు ఉద్దేశం!

 

తర్వాత వచనంలో నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. ఇంకా నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి అంటున్నాడు!

 

యోబు కపటమైన రీతిలో తన నిర్దోషత్వం గురించి పదేపదే నొక్కి చెప్పడం ద్వారా తన పాపాలను దాచిపెడుతున్నాడనీ దేవుడంటే అతడు లెక్కలేకుండా మాట్లాడటమే అతను ఘోర పాపి అన్నదానికి రుజువు అనీ ఎలీఫజు నమ్మకం.

 

తర్వాత వచనంలో మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? అంటూ ప్రశ్నిస్తున్నాడు!

యోబు తన జ్ఞానాన్ని బట్టి గర్విష్ఠి అనీ ఇతరుల మాటలను నమ్రతతో వినేందుకు ఇష్టపడడం లేదనీ ఎలీఫజు ఆరోపిస్తున్నాడు. యోబుకంటే వయస్సు పైబడిన వారి జ్ఞానాన్ని యోబు ఎదిరించి యోబును సవాలు చేస్తున్నాడు అంటున్నాడు. అయితే ఇతడు ఆరోపించిన దానికి జవాబు: కాదు! సరియైన జవాబు: యేసుక్రీస్తుప్రభులవారు!

 

కీర్తనలు 90: 1 ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.

2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు

 

సామెతలు 8: 22 పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను.

23 అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.

24 ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.

25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు

26 భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.

27 ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.

28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు

29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు

30 నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.

 

అందుకే ఈ గ్రంధంలో చివరలో దేవుడు ఇదే ప్రశ్నను యోబుగారితో డైరెక్ట్ గా అడుగుతున్నారు 38వ అధ్యాయంలో 441 వ వచనం వరకు 4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.

6 దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.

మనము కూడా వ్యర్ధమైన మాటలు మనకు అందని మాటలు మాట్లాడకూడదు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*72వ భాగం*

యోబు 15:8

8 నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

 

       ప్రియులారా! యోబుగారి మాటలకు స్నేహితుడు ఎలీఫజు రెండోసారి పలికిన కఠినమైన మాటలను మనం చూసుకుంటున్నాము!

ఇక ఇన్ని వ్యర్ధమైన మాటలు మాట్లాడినా మధ్యలో ఒక మంచిమాట మాట్లాడుచున్నాడు ఎలీఫజు! నిజానికి ఇది ఒక మర్మము! అదేమిటంటే నీవు దేవుని ఆలోచన సభలో చేరి యున్న వాడవా?

 

దేవునికి ఒక ఆలోచనా సభ ఉంది! ఈరోజు మనము దేవుని ఆలోచన సభ అంటే ఏమిటి? ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అనే వాటిని క్లుప్తంగా చూసుకుని ముందుకు పోదాం!

ఇక్కడే కాదు యిర్మీయా గ్రంధంలో కూడా ఈ ఆలోచనా సభ కోసం వ్రాయబడి ఉంది! The Council Of God అంటారు దీనినే!

 

యిర్మీయా 26: 18 యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?

ఇక్కడ ఆయన సభలో అని వ్రాయబడి ఉంది గాని ప్రాచీన ప్రతులలో ఆయన ఆలోచన సభలో యెహోవా సందేశము విని గ్రహించడానికి నిలబడిన వారు ఎవరు అని ఉంటుంది! అనగా దేవుని ఆలోచనా సభ అనేది దేవుడు ఏవైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకునే టప్పుడు తన దూతలతో ఆలోచన చేసి నిర్ణయించే స్థలము అని అర్ధమవుతుంది!

 

దేవుని ఆలోచనా సభ అనేది ఒక ఆధ్యాత్మిక భావన, బైబిల్లో వివరించబడింది. ఇది దేవుడు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనతో పాటు ఆయన దూతలు లేదా ఇతర ఆధ్యాత్మిక జీవులు సమావేశమవుతారని సూచిస్తుంది. (1 రాజులు  22:19-22, యోబు 1:6-12, కీర్తన  82:1 ). ఇదే యోబు గ్రంధం మొదటి రెండు అధ్యాయాలలో రెండుసార్లు జరిగినట్లు దానికి సాతాను గాడు కూడా వచ్చినట్లు మనము చూసుకున్నాము! 1:6  దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను.

2:1 1 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

 

సరే - ఎందుకు జరుగుతుంది?

    - దేవుని ప్రణాళికలను ప్రకటించడానికి (ఉదా: యెషయా  6:8).

    - తీర్పులు ఇవ్వడానికి (కీర్తన  82).

    - ఆధ్యాత్మిక పనులకు దూతలను నియమించడానికి (యోబు  1).

 

- ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది?

    - ఎక్కడ: "ఆలోచనా సభ" భౌతిక స్థలం కాదు, ఆధ్యాత్మిక రాజ్యంలో లేక పరలోకంలో  జరుగుతుంది.

 

    - ఎప్పుడు: నిర్దిష్ట సమయం లేదు, దేవుని సంకల్పం, ప్రణాళికల ప్రకారం అవసరమైనప్పుడు జరుగుతుంది.

 

ఇది దేవుని అధికారాన్ని, ఆయన ప్రణాళికల్లో ఆధ్యాత్మిక జీవుల పాత్రను చూపిస్తుంది. 

 

కాబట్టి ప్రియులారా! నాకు అర్ధమయింది ఏమిటంటే దేవుని ఆలోచనా సభ ఎప్పుడు జరుగుతుంది అంటే: మనము చేసే ప్రార్ధన మరియు విజ్నాపణలు దేవుని సన్నిధికి దేవుని దూతలు మోసుకుని పోతూ ఉంటారు! ఇలా మోసుకుని పోయినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తన కార్యము  నెరవేర్చవలసిన సమయం వచ్చినప్పుడు దేవుని సమయంలో దేవుడు ఆలోచనా సభ లేక రౌండ్ టేబిల్ సమావేశం ఏర్పాటుచేస్తారు! అది ఎప్పుడు ఎలా అనేది మనకు తెలియదు గాని పరలోకంలో జరుగుతుంది అని మనకు యోబు 1,2 అధ్యాయాలు బట్టి అర్ధమవుతుంది! అప్పుడు దూతలు తెచ్చిన ప్రతీ అప్లికేషన్ అనగా ప్రార్ధనలు దేవుడు ఆలకించి సమయం ఆసన్నమయ్యిందా లేదా అని చూసుకుని అనగా మానవుడు కార్చాల్సిన కన్నీళ్ళు కార్చాడా లేదా అని నిర్ధారణ చేసుకుని- Guys- Lets do it now- this is the time అని అంటారు! ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది కాబట్టి ఇప్పుడు కార్యం చేద్దాం అంటారు! అప్పుడు మరి ఇప్పుడు ఎలా చేద్దామండి అని దూతలు అడుగుతారు! అప్పుడు దేవుడు దూతలనే అడుగుతారు ఎలా చేద్దామని! నీకు ఎలా తెలుసు అని నన్ను అడుగవద్దు! ఆహాబు రాజుని చంపడానికి దేవుడు ఏర్పాటుచేసిన ఆలోచన సభను ధ్యానం చేస్తే ఇది మనకు అర్ధమవుతుంది!

ఒకసారి చూద్దామా?

1 రాజులు 22: 19 మీకాయా యిట్లనెను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని

20 అహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.

21 అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.

22 అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

 

మరి ఈ వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడే అడుగుతారు మరి ఎలా చేద్దాం ఈపని అని అడిగితే ఒక దేవదూత ఒకలాగా మరో దేవదూత మరోలా చెబితే వాటిలో సరియైనది శాశ్వత పరిష్కారం దేవుడు ఆలోచించి తుది నిర్ణయం చెబుతారు! ఇవన్నీ ఆలోచన సభలోనే నిర్ణయాలు జరుగుతాయి అని అర్ధమవుతుంది! అందుకే దేవుని ఆలోచన సభ జరుగుతుంది!

 

కాబట్టి ప్రియులారా! అప్లికేషన్ పెట్టడం మనవంతు! అనగా ప్రార్ధన విజ్నాపన చేయడం మనవంతు! అయితే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు! దేవుడు తన ఆలోచనా సభలో నిర్ణయం తీసుకునే వరకు మనం ఎంత గింజుకున్నా జరుగదు! దేవుని పని దేవుని సమయంలో దేవుని విధానంలో జరుగుతుంది! మనం ఆలోచించి నప్పుడు మనం కోరుకున్నప్పుడు జరుగదు! కేవలం ప్రార్ధన చేద్దాం! ఆయన జరిగించే వరకు బలిష్టమైన  కాడిక్రింద దీనమనస్సు కలిగి ఎదురుచూద్దాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*73వ భాగం*

యోబు 15:916

9 మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?

10 నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సుమీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.

11 దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?

12 నీ హృదయము ఏల క్రుంగిపోయెను? నీ  కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?

13 దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?

14 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు?  నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమిమకయుంచడు.  ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16 అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.

 

      ప్రియులారా! యోబుగారి మాటలకు స్నేహితుడు ఎలీఫజు రెండోసారి పలికిన కఠినమైన మాటలను మనం చూసుకుంటున్నాము!

ఇక తర్వాత వచనాలలో యధావిధిగా యోబుగారిని అవమానిస్తున్నాడు ఎలీఫజు. మాకు తెలియనిది నీకు ఏమి తెలుసు? మేము గ్రహించలేనిది నీవేమీ గ్రహిస్తున్నావు అంటున్నాడు! నిజానికి ఇది 13:2 లో యోబుగారు పలికిన మాటకు జవాబుగా అంటున్నాడు- అక్కడ యోబుగారు మీకు తెలిసింది నాకు తెలుసు! మీకంటే నేను తక్కువ వాడను కాను అన్నారు కదా అందుకే ఇక్కడ మేము ఎరుగనిది నీకేమీ తెలుసు అంటున్నాడు! ఇంకా క్రిందకు పోతే నెరసిన వెండ్రుకలు గలవారు వయస్సు మీరిన పురుషులు మాలో ఉన్నారు, ఇంకా వారు నీ తండ్రి కంటే వయస్సులో చాలా పెద్దవారు అంటున్నాడు! అయితే నెరసిన వెంట్రుకలు ఎవరికి వస్తాయి అంటే సామెతలు 16:31 ప్రకారం నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును. చూడండి కేవలం నీతి ప్రవర్తన కలిగి ఉంటేనే ఈ నెరసిన వెంట్రుకలు వస్తాయి అంటున్నారు!

 

ఇక తర్వాత వచనంలో దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?అంటున్నాడు!

ఈ మాట పలకడానికి కారణం తాను, తన స్నేహితులు యోబుతో పశ్చాత్తాపం గురించీ తిరిగి అతనికి పూర్వస్థితి కలగడం గురించీ పలికిన మాటలకుదేవుని ఓదార్పుఅని పేరు పెడుతున్నాడు (యోబు 5:8-27, ; యోబు 8:5-7, ; యోబు 11:13-19, ). తన పాపాలకు పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగవలసిన పాపి విషయంలో ఈ మాటలు మంచివే, నిస్సందేహంగా మంచి ప్రోత్సాహం, ఆదరణను కలిగించే మాటలే. అయితే అలా చేసే అవసరం యోబుకు లేదు కాబట్టి ఈ మాటలు యోబు పాలిట దేవుని ఓదార్పు మాటలు కావు.

 

తర్వాత వచనం 12 నీ హృదయము ఏల క్రుంగిపోయెను? నీ  కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?

13 దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు? అంటున్నాడు!

ఇలా అనడానికి కారణం 13, 14 అధ్యాయాలలో యోబుగారు  దేవునితో పలకడానికి సాహసించిన కొన్ని మాటలకు అతని స్నేహితులు ఖంగుతిన్నారు. అందుకే నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది? నీ కళ్ళు ఎందుకు కోపంతో ఎర్రబారి పోయాయి? దేవుడు మీద నీవెందుకు కోప పడుతున్నావు? నీ నోట నుండి అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటున్నాడు! మనము కూడా ఒక్కోసారి అలాంటి కానిమాటలు దేవుని కోసం పలుకుతా ఉంటాము! మా పల్లెటూర్లలో ఏవైనా కష్టాలు వస్తే స్త్రీలు ఎక్కువగా ఓరి మాయదారి దేవుడా! నేనే దొరికానా? మా ఊరిలో ఇంతమంది ఉన్నారు అందరినీ వదిలేసి నన్నే ఇలా చేస్తావా? నేనే దొరికానా అంటారు! ఇలా దేవుని మీద అభాండాలు వేస్తూ ఉంటారు! అందుకే కీర్తన 34:12 లో అంటున్నారు 12 బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైన నున్నాడా?

13 చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.

14 కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము

 

మలాకి 3: 13 యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికి నిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.

14 దేవుని సేవచేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,

15 గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.

16 అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

 

యాకోబు 1:26

ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

 

యాకోబు 3:2

అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము(తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన(కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

యాకోబు 3:3

గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

యాకోబు 3:4

ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

యాకోబు 3:5

ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును(అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

యాకోబు 3:6

నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

యాకోబు 3:7

మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

యాకోబు 3:8

యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

 

ఇప్పుడు మనలను మనం పరిశీలించు కుందాం! ఎన్నిసార్లు మనము ఇలాంటి కానిమాటలు పలికాము దేవునికి విరుద్దంగా! నిజానికి ఆ పలికిన కానిమాటలకు మనము శిక్షార్హులము కానీ దేవుడు క్షమించి వదిలేశారు! అందుకే ఇలాంటి కానిమాటలు పలుకాకుండా జాగ్రత్త పడదాం! దేవుని క్షమాపణ వేడుకుందాము!

ఒకవేళ నీ జీవితంలో చాలా కష్ట కాలములో నీవుకూడా ఇలాంటి మాటలు పలికి ఉంటే ఇప్పుడు ఈ ప్రార్ధన నాతో కలిసి చేయు!

ప్రియ పరలోకపు తండ్రి! నా కష్టాలలో తట్టుకోలేక మిమ్మల్ని కానీ మాటలు పలికాను! అది నిజంగా నా ఆవివేకత అనీయు, నా బుద్ధిహీనట అని ఒప్పుకుంటున్నాను! యికను ఎప్పుడూ అలా పలకనని మాటిస్తున్నాను!దయచేసి నా పెదవులకు కాపలా ఉంచామని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి! ఆమెన్!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*74వ భాగం*

యోబు 15:916

14 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు?  నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమిమకయుంచడు.  ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16 అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అప విత్రుడు గదా.

17 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచినదానిని నీకు వివరించెదను.

18 జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.

 19 అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

 

      ప్రియులారా! యోబుగారి మాటలకు స్నేహితుడు ఎలీఫజు రెండోసారి పలికిన కఠినమైన మాటలను మనం చూసుకుంటున్నాము!

ఇక తర్వాత వచనాలలో యధావిధిగా యోబుగారిని అవమానిస్తున్నాడు ఎలీఫజు!

14 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు?  నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మికయుంచడు.  ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

ఇలా అనడానికి కారణం- నేను నిర్ధోషిగా కనబడతాను దేవుని దృష్టిలో అంటూ 14 వ అధ్యాయంలో పలికారు కదా! ఈ మాటలు ఎలీఫజు మొదటి సారి మాట్లాడిన మాటల్లాంటివే (యోబు 4:17-19, ). అయితే మరింత కఠినంగా ఉన్నాయి. యోబు తాను నిర్దోషినని చెప్పుకున్నదాన్ని ఎలీఫజు ఎంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాడో ఈ మాటలవల్ల అర్థమౌతున్నది.

నీవు నేను నిర్ధోషిని అంటు పలుకుతున్నావు- అసలు శుద్దులగుటకు నరుడు ఏపాటి వాడు అంటున్నాడు! తర్వాత వచనంలో దేవుడు ఆయన తన దూతల యందు కూడా నమ్మిక ఉంచడం లేదు అంటున్నాడు చివరికి ఆకాశ వైశాల్యం కూడా దేవుని దృష్టికి పవిత్రం కాదు అంటున్నాడు! ఈ మాటలు ఇంతకు ముందే పలికాడు ఎలీఫజు 4:18; 25:5

 

ఇక తర్వాత వచనంలో హేయుడైన మనిషి చెడుని నీళ్లలా త్రాగే మనిషి మరి అపవిత్రుడు కదా!

16వ వచనంలో చివరి భాగానికి హీబ్రూలో అక్షరాలా అర్థమేమిటంటేదుష్టత్వాన్ని తాగేవాళ్ళు.”

ఈ మాట మరో స్నేహితుడు ఏలీహు  కూడా అన్నారు కదా 34: 7 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానము చేయుచున్నాడు.

 

ఇక తర్వాత వచనాలలో కొన్ని సలహాలు ఇస్తున్నారు! 17 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచినదానిని నీకు వివరించెదను.

18 జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.

యోబుకు అవసరమైన సందేశం ఒకటి తాను ఇవ్వబోతున్నానని భావించాడు ఎలీఫజు. దానికి ఈ మాటలు గంబీరమైన పీఠిక.

ఇంకా అంటున్నాడు 19 అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

ఇంతకీ అది ఏమిటి అంటే 20 తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును.

21 భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.

22 తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.

23 అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.

గమనించాలి ఏదో క్రొత్త జ్నానము గల మాటలు చెబుతాను జాగ్రత్తగా విను అంటూ ఎంతో గంభీరమైన మాటలు పలికాడు ఎలీఫజు అయితే అతని సందేశంలో క్రొత్తదనమేమీ లేదు. అతని వాదంలో మరి కాస్త ఉన్నత స్థితికి వెళ్ళినదీ లేదు. దుష్టులకు వచ్చే శిక్షను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ఈ పాఠాన్ని యోబు స్వీకరించాలని ఎలీఫజు ఉద్దేశం. యోబుకు వాస్తవంగా సంభవించినవాటినీ, యోబు తన గురించి తాను చెప్పుకున్న వాటినీ ఉదహరించాడు ఎలీఫజు. 20 వ వచనాన్ని యోబు 2:13, తో; 24ను యోబు 7:13-15, తో పోల్చిచూడండి. 25వ వచనం వర్ణించిన మనిషిలాగా యోబు ప్రవర్తిస్తున్నాడని ఎలీఫజు నమ్మకం. యోబు పూర్తిగా ఘోరమైన అబద్ధం పైన, అంటే తనకున్నదని భావించిన నిర్దోషత్వం పైన నమ్మకం ఉంచుతున్నాడని ఎలీఫజుకు గట్టి నమ్మకం. అందుకని 31లో కనిపించే హెచ్చరిక ఇస్తున్నాడు.

 

ఇంకా చూసుకుంటే ప్రియులారా ఈ అధ్యాయం చివరి వరకు యోబు గారు దుష్టుని వలె గర్విష్టిగా మాట్లాడాడు అందుకే ఈ శోధనలు వచ్చాయి అంటున్నాడు! చివరకు దేవుడు ఇలాంటి వారిని శిక్షిస్తాడు వాడికి చీకటి అంధకారమే గతి అంటున్నాడు! అతని చెవులలో భయంకరమైన ధ్వనులు వినబడతాయి! చివరకు ఆహారం లేక ఎక్కడ కూడు దొరుకుటుందో అంటూ ఇటు అటు తిరుగుతాడు ఎండకంటే వాడు దేవునికి విరోధంగా చేయి చాపాడు దేవుణ్ణి ధిక్కరించాడు! అతని మెడ వంగదు ముఖ్యం నిండా కొవ్వు పట్టి ఉంది, నడుము చుట్టూ కొవ్వు పేరుకు పోయింది, అతని ఐశ్వర్యం  ఎంతో కాలం ఉండదు ఇలా ఎన్నెన్నో మాటలు పూర్వం పలికిన దూషణ మాటలే పలికాడు!

 

ప్రియులారా! స్నేహితుడు బాధలలో ఉంటే ఆదరించాలి గాని ఇలా మాటలతో కుళ్ళబొడవ కూడదు! మనుష్యులు పలికే వ్యర్ధమైన ప్రతీ మాటకు విమర్శ దినమందు లెక్క అప్పగించాలి అని కూడా మరవకూడదు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*75వ భాగం*

యోబు 16:15

1 అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

3 ఈ గాలిమాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?

4 నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాటలాడవచ్చును. నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును.

5 అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును

 

      ప్రియులారా! ఎలీఫజు మాట్లాడిన రెండవ విడత మాటలకు ఈ 16 వ అధ్యాయంలో యోబు గారు జవాబు చెబుతున్నారు! అయితే ఇక్కడ తన స్నేహితునితో కంటే మరలా దేవునితో మాట్లాడుతూ మధ్యలో తన భాధను తన స్నేహితులకు అర్ధమయ్యేలా ఉక్రోశమంతా చెబుతున్నారు అంతేకాకుండా దేవుడే నన్ను ఇలా చేశాడు అంటూ దేవుని మీద ఆరోపణలు కూడా చూడవచ్చు ఈ అధ్యాయంలో! అయితే ఇవన్నీ గత భాగాలవలే ఉంటాయి కాబట్టి చాలా క్లుప్తంగా చూసుకుంటే ముఖ్యమైన వచనాలు మాత్రం వివరంగా చూసుకుందాం!

 

రెండో వచనంలో అంటున్నారు ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు అంటున్నారు! ఎలీఫజు మాటల్లో క్రొత్త విషయమేదీ లేదు కాబట్టి జవాబిచ్చే  ప్రయత్నమేమీ చేయలేదు యోబుగారు. ఆ స్నేహితులు అతణ్ణి ఓదార్చడానికి వచ్చారు (యోబు 2:11, ). ఓదార్పు తనకు అవసరం కూడా. అయితే వారిదగ్గర అలాంటిదేమీ అతనికి దొరకలేదు. ఆ మాటకొస్తే యోబు తాను పలికిన మాటల్లో కూడా ఏమీ ఓదార్పు పొందలేదు. అందుకే ఇతటిమాటలు అనేకమైనవి నేను విన్నాను! మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు మీరు అంటున్నారు! తర్వాత వచనాలలో అంటున్నారు

4 నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాటలాడవచ్చును. నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును.

5 అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును

 

చూడండి నాస్తితిలో మీరు ఉంటే గనుక నేను మీలాగా గేలి చేయను నా నోటి మాటలతో మిమ్మల్ని ఓదారుస్తాను! మిమ్మల్ని ఆదరిస్తాను! మీరైతే నన్ను అవమానిస్తున్నారు ఇంకా మీ మాటలతో నన్ను బాధపెడుతున్నారు అంటున్నారు!

జ్నానియైన సోలోమోను అంటున్నారు సామెతలు 27: 9 లో 9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.

 గాని ఇక్కడ యోబు గారి స్నేహితుల మాటలు ఎంతో వేదన కరంగా ఉన్నాయి! ఇలాంటివి మంచివి కావు అని గ్రహించాలి!

 

ఇక అందుకే మరలా విసికిపోయి అంటున్నారు 6 నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? అంటున్నారు! భక్తుడైన ఆసాపు కూడా ఇదే విధంగా విసికిపోయి దేవునితో మాట్లాడుతున్నాడు కీర్తనలు 77  లో 1 నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.

2 నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.

3 దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)

4 నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.

5 తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.

6 నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

7 ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

8 ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?

9 దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)

10 అందుకు నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము.

 

చూడండి మొదటలో ఎంతో ఆశాభరితంగా మొదలు పెట్టినా 10 వ వచనంలో అంటున్నాడు భక్తుడు దేవుడు మారిపోయాడు నన్ను వదిలేశాడు అనడానికి నాకు కలిగిన శ్రమయే కారణము అంటున్నాడు! దేవుని ప్రేమను అర్ధం చేసుకోకుండా మనము కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాము!

కీర్తన 88: 15 బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.

16 నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.

17 నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించు చున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి

18 నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.

 

తర్వాత వచనాలలో 7 ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు

8 నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది అంటున్నారు యోబుగారు!

 

చూడండి దేవుడు నాకు ఆయాసము కలుగజేశాడు నా కుటుంబాన్ని నీవు పాడుచేసేసావు! నా శరీరాన్ని కూడా పాడుచేశావు! నా క్షీణత నీకు సాక్ష్యం చెప్పడం లేదా అంటున్నారు!

ఇంకా అంటున్నారు దేవుని కోపము నాతో యుద్దం చేసింది. ఆ కోపమే నన్ను నిలువునా చీల్చి వేసింది పండ్లు కోరుకుతూ దేవుడు నా మీద పడిపోయాడు దేవుడు నాకు పగవాడై తన కళ్ళు ఎర్ర చేసేశాడు అంటున్నారు!

 

అయితే ఒక్కమాట! నిజానికి దేవుడు కోపంతో యోబుగారిని శిక్షించలేదు! సాతాను గాడిని ఓడిద్దాం అని యోబుగారిని ఒక సాధనంగా వాడుకున్నారు! ఇక ఆ శ్రమలకు శోధనలకు ప్రతిఫలంగా రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుని కోరిక! అయితే ఇది యోబుగారికి తెలియక దేవుణ్ణి నిందిస్తున్నారు! గాని మనం ఎలా ఉండాలి అంటే హొషేయా భక్తుడు అంటున్నారు

6: 1 మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును

2 రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.

3 యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహో వానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

ఆమెన్!

ఇటువంటి ఆదరణకరమైన మాటలతో ఆదరణ పొందుకుంటూ కష్టాలను కడగళ్లను సహిస్తూ ముందుకు పోదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*76వ భాగం*

యోబు 16:10 17

10 జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.

12 నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్నుముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసి యున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

13 ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను.

14 కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.

15 నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.

16 నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను

17 ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

 

     ప్రియులారా! ఎలీఫజు మాట్లాడిన రెండవ విడత మాటలకు ఈ 16 వ అధ్యాయంలో యోబు గారు జవాబు చెబుతున్నారు!

 

ఇంకా తర్వాత 10వ వచనం నుండి చూసుకుంటే తన బాధను వెళలబుచ్చు కుంటూ దేవునితో మాట్లాడుతున్నారు యోబుగారు!

 

10 జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.

12 నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్నుముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసి యున్నాడు.తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

 

ఈ పదవ వచనంలో మనుషులు నామీద పలికిన మాటలు చెంప దెబ్బలు లాగున్నాయి అంటున్నారు! అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అంటున్నాడు భక్తుడు! సామెతలు 12:18 లో!

ఇంకా అంటున్నారు నా విరోదులంతా ఏకీభవించారు! నిజానికి దేవుడే నన్ను దుర్మార్గులకు అప్పగించేశారు అంటున్నారు! నన్ను భక్తిహీనుల వశంలో ఉంచేశారు! చూడండి ఈ దుర్మార్గుల గుంపులో భక్తిహీనుల గుంపులో  యోబుగారు  తన స్నేహితులను కూడా చేర్చాడు!

 

తర్వాత వచనంలో దేవుడు నన్ను అన్యాయస్తులకు అప్పగించేశాడు అంటున్నారు అనగా ఇప్పుడు అన్యాయస్తుల జాబితాలో కూడా చేర్చేశారు యోబుగారు తన స్నేహితులను! నిజానికి ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వచనం యొక్క భావము ఇది ఈ గ్రంధంలో మొదటి రెండు అధ్యాయాలకు సంబంధించినది. యోబుగారు తప్పుచేయక పోయినా ఆయనకు వచ్చిన శ్రమలు శోధనలు యోబుగారిని  అన్యాయస్తులకు దుర్మార్గులకు భక్తిహీనులకు కలిగే శిక్షల వంటి శిక్షలు వేసి వారి జాబితాలో తాను చేరిపోయినట్లు అయ్యింది! అందుకే ఆక్రోశమంతా ఈ అధ్యాయంలో చూపిస్తున్నారు యోబుగారు!

 

ఇంకా అంటున్నారు 12 వ వచనంలో 12 నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్నుముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసి యున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

13 ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను.

14 కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.

 

చూడండి నా ప్రాణము ఎంతో నెమ్మదిగా ఉండేది అయితే దేవుడు నన్ను ముక్కచెక్కలుగా చేసేశారు! మెడ పట్టుకుని బయటకు త్రోసివేసి నన్ను ఇబ్బందుల పాలు చేశారు! ఆయన తన బాణము మీద బాణము వేసి నన్ను బాదించారు! ఒక శూరుడు తన విరోధిని బాధించినట్లు నన్ను బాధించారు అంటున్నారు యోబుగారు!

 

ఇంకా తర్వాత వచనాలలో అంటున్నారు 15 నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.

16 నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను

17 ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

ఈ మాటలు అపార శోకాన్ని, వేదననూ తెలియజేస్తున్నాయి. ఆదికాండము 37:34, ; యిర్మియా 6:26, ; విలాపవాక్యములు 2:10, ; యెహెఙ్కేలు 23:30.  ఈ వచనములో యోబుగారు వేదన యాకోబు గారు తన కుమారుడైన యోసేపు కోసం ఏడ్చినట్లు, యిర్మీయా గారు తన జనుల కోసం దేవుని యొద్ద విలపించినట్లు, యెహేజ్కేలు గారు తన ప్రజల కోసం విలపించినట్లు యోబుగారు తనకోసం ఏడుస్తున్నారు! గోనె పట్ట కట్టుకుని విస్తారమైన దుఖంతో తనగోడు దేవునికి చెప్పుకుంటున్నారు!

 

ఇంకా అంటున్నారు 18 భూమీ, నా రక్తమును కప్పివేయకుము నా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక.

19 ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములోనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు..

ఇక్కడ భూమీ నా రక్తాన్ని కప్పి వేయవద్దు అంటున్నారు దీనికి కారణం ఆదికాండము 4:10, తో  హేబేలు రక్తంతో . హత్యకు గురైన ఒక నిర్దోషితో యోబు తనను తాను పోల్చుకుంటున్నాడు. తనకు జరిగినట్టు అతను భావిస్తున్న ఈ అన్యాయం ఎప్పటికీ మరుగై ఉండడం అతనికిష్టం లేదు. జరిగిన అన్యాయం సరి అయ్యేలా ఏదైనా జరిగేవరకూ తన ఆక్రందన అన్ని చోట్లా మారుమ్రోగుతూ ఉండాలని అతని కోరిక.

 

తర్వాత నాకు సాక్షియైన వాడు పరలోకంలో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలికే వాడు దేవుడు పరలోకంలో ఉన్నాడు అంటూ రెట్టిస్తున్నారు!

తన పక్షాన వాదించే తన తరుఫు సాక్షి దేవుడే అని అతని అభిప్రాయం. దేవుడు తన పట్ల అన్యాయంగా వ్యవహరించి తన శత్రువయ్యాడని తన ఆవేదనలో నిరాశలో యోబుగారు అన్నారు. కానీ ఇలాంటి క్షణాల్లో కూడా దేవునిపై అతనికున్న నమ్మకం అతణ్ణి వదిలి పెట్టలేదు. అతని హృదయంలో నుంచి అది తిరిగి ప్రకాశించింది. దేవుడే యోబుకు సాక్షిగా వస్తే ఆయన అతనికి శత్రువు కాదన్నమాట. యోబు ఆలోచనలు ఏకరీతిగా, స్పష్టంగా లేవు. తనకు సంభవించిన ఈ భయంకరమైన అయోమయ స్థితి వల్ల అవి చంచలంగా ఉన్నాయి. దేవుని న్యాయాన్ని గురించి విశ్వాసం, అవిశ్వాసం అతని హృదయంలో పెనుగులాడుతూ ఉన్నాయి. మొదట ఒకటి తరువాత మరొకటి కలుగుతూ ఉన్నాయి. ఒకసారి ఒక ఆలోచన ఉంటే మరుక్షణం మరొకటి దాని స్థానం ఆక్రమిస్తూవుంది. అతని హృదయాంతరాళాల్లో యోబుకు తెలుసు ఒక్కడే అయిన నిజ దేవుడు తప్పనిసరిగా న్యాయవంతుడై ఉండాలి. అయితే తనకు జరిగినదాన్ని చూస్తే అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. తీరా చూస్తే యోబు పక్షంగా వాదించేది దేవుడే అని తేలింది. (యోబు 42:7, ). యోబు మనస్సులో ఉన్నది ఇదే కావచ్చు. విశ్వాసి పక్షంగా ప్రస్తుతం న్యాయవాది దేవుని కుమారుడైన క్రీస్తే (1 యోహాను 2:1, ).

కాబట్టి మనము కూడా మన నిరీక్షణ మన చూపులు దేవుని వైపుకు త్రిప్పుకుందాం!

ఆయనే మనలను కొట్టేవాడు ఆయనే బాగుచేసే వాడు! కాబట్టి ఆయన కొరకే కనిపెట్టుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*77వ భాగం*

యోబు 16:10 17

19 ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములో నున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు.

20 నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు.  నరుని విషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు

21 నర పుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు  కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.

22  కొద్ది సంవత్సరములు గతించిన తరువాత  తిరిగి రాని  మార్గమున నేను వెళ్లుదును.

 

     ప్రియులారా! ఎలీఫజు మాట్లాడిన రెండవ విడత మాటలకు ఈ 16 వ అధ్యాయంలో యోబు గారు జవాబు చెబుతున్నారు!

ఇంకా తర్వాత 19 వ వచనం నుండి చూసుకుంటే తన బాధను వెళ్లబుచ్చు కుంటూ దేవునితో మాట్లాడుతున్నారు యోబుగారు!

చూడండి 20 వ వచనంలో నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యెము చేయాలని కోరుకుంటున్నారు ప్రియులారా! ఈ వచనం నుండి తనగోడు మరో విధంగా దేవునితో చెప్పు కుంటున్నారు

నా స్నేహితులు ననను ఎగతాళి చేసేలా ఎందుకు చేసేవయ్యా అని బాధపడుతున్నారు! తన పడుతున్న బాధలకంటే తన స్నేహితులు చేస్తున్న హేళనలను తట్టుకోలేక పోతున్నారు యోబుగారు! నీవు నేను కూడా ఇలా చాలాసార్లు అనుభవించి ఉంటాము! తెలుగులో సామెత: మొగుడు కొట్టాడని బాధపడలేదట తోటికోడలు దెప్పి పొడిచింది అని ఎక్కువగా బాదపడింది ఆట ఒక ఇల్లాళ్లు. నా మొగుడు నన్ను కొట్టుకుంటాడు తిట్టుకుంటాడు గాని దెప్పడానికి అది ఎవర్తి అన్నాదట! మన పరిస్తితులు కూడా చాలాసార్లు ఇలాగే ఉన్నాయి కదా! ఇదే పరిస్తితి గుండా దావీదు గారు వెళ్లారు, యిర్మీయా గారు వెళ్లారు! చివఱకు యేసుక్రీస్తుప్రభులవారు కూడా వెళ్లారు వారు ఎలా తట్టుకున్నారో నీవు నేను కూడా అలాగే తట్టుకోవాలి!

 

కీర్తనలు 142 :  1 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.

2 బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను చున్నాను.

3 నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.

 

109: 3 నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు

4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.

5 నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.

 

ఇక యిర్మీయా గారి పలుకులు విందాం: 20: 7 యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.

8 ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను.

9 ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.

10 నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.

 

యేసుక్రీస్తుప్రభులవారి కోసం చూస్తే

కీర్తన 22: 1 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?

2 నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

6 నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

7 నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.

8 యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు.

12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

 

మత్తయి 27: 39 ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు

40 దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజ కులును కూడ ఆయనను అపహసించుచు

42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

43 వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

44 ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

45 మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.

46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.

47 అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట వినిఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

49 తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.

 

హెబ్రీ 5: 7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.

8 ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.

 

కాబట్టి ఎన్ని ఇబ్బందులు హేళనలు వెక్కిరింపులు ఛీత్కారాలు ఎదురైనా భక్తులు దేవుని మీద ఆనుకొన్నట్లు మనము కూడా దేవుని వైపు ఓర్పుతో చూసుకుంటే పోవాలి! ఒక భక్తుడు పాడినట్లు కన్ను మూసుకుని నిన్ను నమ్ముకుని నన్ను జంపుకుని.. .. .. సదా స్తుతింతునేసు రక్షకా.. అంటూ పోవాలి!

 

ఇక తర్వాత వచనంలో అంటున్నారు: 21 నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు  కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.

ఎందుకంటే యోబుగారికి తెలుసు- దేవునితో వాదించి నెగ్గలేమని అందుకే ఒక వ్యక్తి నరులకు దేవునికి మధ్య ఉండాలి అని అనుకుంటున్నారు! ఒకవేళ మనిషి తప్పుచేస్తే వానిని క్షమించమనే ఒక ఉత్తరవాది ఉండాలని ఎప్పుడో పూర్వమే యోబు గారు కోరుకున్నారు!

ప్రసంగి 6: 10 ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.

 

యెషయా 45: 9 మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

10 నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

 

రోమా 9: 19 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు.

20 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?

21 ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?

22 ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?

 

ఇక తర్వాత వచనంలో 14 వ అధ్యాయంలో చెప్పినట్లు నేను కొద్దిరోజుల తర్వాత తిరిగి రాని  మార్గమున నేను వెళ్లుదును అంటూ ముగించారు ఈ అధ్యాయాన్ని!

కాబట్టి హేళనలు శ్రమలు నిందలు వచ్చినప్పుడు క్రుంగి పోవద్దు! దేవునిమీద ఆనుకుని గురివద్దకు తరలి పోదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*78వ భాగం*

యోబు 17:1 5

1 నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

2 ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

3 ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?

4 నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి  కావున నీవు వారిని హెచ్చింపవు.

5 ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును.

 

     ప్రియులారా! ఎలీఫజు మాట్లాడిన రెండవ విడత మాటలకు ఈ 17వ అధ్యాయంలో కూడా యోబు గారు జవాబు చెబుతున్నారు!

తన బాధను వెళ్లబుచ్చు కుంటూ దేవునితో మాట్లాడుతున్నారు యోబుగారు!

 

ప్రియులారా ఇక మొదటి వచనంలో చూసుకుంటే 1 నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

ఇది 16 వ అధ్యాయం చివరి వచనానికి కొనసాగింపు ప్రియులారా! ఇక కొద్ది రోజులకు నేను తిరిగిరాని మార్గమున చీకటిగల స్థానమునకు వెళ్లిపోతాను అన్నారు కదా. ఇక్కడ అంటున్నారు నా ప్రాణము ఇప్పుడు అలసిపోయింది నా దినముల ఆకరి గట్టమునకు నేను వచ్చేశాను! అతి కొద్ది సేపటిలో నా జీవితం అనే నాటకానికి శుభం కార్డ్ లేక సమాప్తము అనే కార్డ్ రాబోతుంది అంటున్నారు! నాకోసం సమాధి సిద్దంగా ఉంది అంటున్నారు!

 

ఈ విధంగా అనేకమంది భక్తులు వాపోయారు, కీర్తన 88 లో భక్తుడు అంటున్నారు: 2 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము

3 నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.

4 సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని.

5 చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా.

6 అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.

 

గత బాగాలలో అనేకసార్లు చూసుకున్నాము హిజ్కియా భక్తుడు ఇలాగే ప్రార్ధించాడు యెషయా 38 లో 10 నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.

12 నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును.

16 ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

 

ఇక తర్వాత వచనంలో ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుకున్నారు అంటున్నారు! అనగా తన స్నేహితులు ముగ్గురు అన్నమాట!

ఇంకా చూసుకుంటే వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

3 ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?

 

ఇక్కడ చూడండి! ఇప్పుడు యోబుగారు వాస్తవములోనికి వచ్చి మాట్లాడుచున్నారు! తాను ఎవరో తన స్థానమేదో తెలుసుకుని మాట్లాడుచున్నారు! దేవుని ఎదుట తన వాస్తవమైన పరిస్థితి ఏమిటో దాన్ని దేవుడు అతని స్నేహితులకు మరుగుచేశాడు. యోబుకు తన దోషం లేక నిర్దోషత్వాన్ని నిరూపించే ఒక తీర్పు జరుగుతున్నట్టు అనిపించింది. ఈ తీర్పులో న్యాయం జరగాలని కోరుతున్నారు యోబుగారు. ఇది సాధించడానికి అతనికి తోడుగా నిలిచి సహాయం చేసేవారెవరూ లేరు. కనుక అతను నేరుగా దేవునికే విన్నవించుకొంటున్నారు.

అయితే నాలుగో వచనంలో అంటున్నారు నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి  కావున నీవు వారిని హెచ్చింపవు. ఇక్కడ సరిగా అర్ధమైంది యోబుగారికి తన స్నేహితులు తనను ఇలా అనడానికి కారణం తన స్నేహితులకు దేవుని యొక్క సంపూర్ణమైన జ్నానము లేనందువలన ఇలా మాట్లాడు చున్నారు గాని నిజానికి వారు మంచివారు ప్రేమగలవారే గాని దేవుని జ్నానము లేక తనమీద అభాండాలు వేశారు అని అతనికి అర్ధమైంది!

 

ఇక తర్వాత వచనంలో ఒకమాట చెబుతున్నారు ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును! హమ్మబాబోయ్! జాగ్రత్త! బైబిల్ గ్రంధంలో వ్రాయబడినవి పరిశుద్ధాత్మ ప్రేరేపరణతో వ్రాయబడ్డాయి- కాబట్టి ఇది ముమ్మాటికి నిజం! నిజంగా నిజం! ఏమిటంటే ఎవడైతే తన స్నేహితుణ్ణి నమ్మించి మోసం చేస్తాడో వారు ఎలాగూ నాశనమై పోతారు గాని వారి పిల్లలకు క్షీణత కలుగుతుంది అనగా ఆ పాపము యొక్క ఫలితం తప్పకుండా తమ పిల్లలకు కలుగుతుంది. అందుకే విలాప వాక్యములలో యిర్మీయా భక్తుడు ఘోరంగా గుండెలు బాధుకుని ఏడుస్తున్నారు మా తండ్రులు పాపము చేసి గతించి పోయారు వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము! 5:7;

 

కాబట్టి ప్రియులారా! స్నేహితులను గాని ఎవరిని గాని నమ్మించి మోసం చేయవద్దు! నష్టము కలిగినా గాని మాట తప్పవద్దు అట్టివాడే దేవుని పర్వతమందు ఉంటారు అని కీర్తనల గ్రంధంలో చెబుతున్నారు!

కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!!!!

*యధార్ధవంతుడైన యోబు*

*79వ భాగం*

యోబు 17:6 9

6 ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడు నలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు.

7 నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను

8 యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.

9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

 

     ప్రియులారా! ఎలీఫజు మాట్లాడిన రెండవ విడత మాటలకు ఈ 17వ అధ్యాయంలో కూడా యోబు గారు జవాబు చెబుతున్నారు!

తన బాధను వెళ్లబుచ్చు కుంటూ దేవునితో మాట్లాడుతున్నారు యోబుగారు!

 

ప్రియులారా ఇక 6  వచనంలో చూసుకుంటే ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదం చేసేశారు నలుగురు నా ముఖము మీద ఉమ్మివేస్తున్నారు అంటున్నారు! ప్రియులారా ఈ రెండు వచనాలలోనూ మరలా యోబుగారు తననుతాను నిందించు కుంటూ దేవునిమీద నిష్టూరాలు వేస్తున్నారు! దేవుడు నన్ను జనులు నామీద సామెతలు పాడుకోడానికి విడిచిపెట్టేశారు, నలుగురు నా ముఖము మీద ఉమ్మివేస్తున్నారు. నా కనుదృష్టి దుఖము చేత మందమై పోయింది నా అవయవాలు నీడవలే అయిపోయాయి అంటున్నారు! భక్తుడు కూడా కీర్తనల గ్రంధంలో ఇలాగే అన్నారు 44: 13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచి యున్నావు.

14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

15 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు

16 నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.

 

ఇక తర్వాత వచనము చూసుకుంటే 8 యథార్థవంతులు దీనిని

చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.

ఇక్కడ యోబుగారు ఏమని అనుకుంటున్నారు అంటే తనకు కలిగిన నష్టాలు కష్టాలు చూస్తే భూమిమీద ఉన్న న్యాయవంతులు బిత్తరపోతారు. అయితే ఇది వారు తొట్రు పడేలా చేయదు అయితే వారు ఇంకా విశ్వాసంలో దృడంగా ఉంటారు

తర్వాత వచనంలో అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

చూడండి నీతిమంతులు న్యాయవంతులు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటారు ఇంకా బాలామవండుటారు అంటున్నారు!

 

సామెతలు 4: 18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,

 

ఇక తర్వాత వచ్చనాలలో 10 మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడి మీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.

11 నా దినములు గతించెను నా యోచన నిరర్థకమాయెను నా హృదయ వాంఛ భంగమాయెను.

12 రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు అంటున్నారు.

 

ప్రియులారా ఇక ఈ అధ్యాయం చివరి వరకు ఇక తన బ్రతుకు మెరుగు పడుతుంది అనే ఆశ యోబుగారికి కనబడటం లేదు- అన్నీ మాటలు నిరుత్సాహంగా నిరాశపూరితంగా మాట్లాడుతూ తన స్నేహితులను నిందిస్తున్నారు!  అందుకే అంటున్నారు తన స్నేహితులతో మీరు నామీద ఎన్ని నిందలు మోపినా పరవాలేదు అనే అర్ధముతో మాట్లాడుచున్నారు! అందుకే ఈ మాటకు జవాబుగా స్నేహితులు ఇంకా ఘోరమైన మాటలతో తర్వాత వచనాలలో మాట్లాడారు!

 

ఇంకా అంటున్నారు నా దినములు గతించిపోయాయి నా యోచనలు నిరర్ధకం అయిపోయాయి నా హృదయం యొక్క కోరికలు భంగమయిపోయాయి అంటున్నారు .  సామెతల గ్రంధంలో భక్తుడు అంటున్నారు 16: 9 ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును

 

అయితే మన తలంపులు ఆశయాలు ఎలా ఉండాలంటే యాకోబు గారు చెబుతున్నారు 4: 13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,

14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15 కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.

 

ఇక చివరి మాటలలో అంటున్నారు 13 ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను

14 నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేనుమనవి చేయుచున్నాను.

15 నాకు నిరీక్షణాధారమేది?  నా నిరీక్షణ యెవనికి కనబడును?

16 ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.

 

ఈ వచనాలన్నీ ఎంతో నిరాశాపూరితంగా మాట్లాడుచున్నారు! నేను పోయే గోయి నా తండ్రిగా నన్ను ఆదరిస్తుందేమో అంటున్నారు. ఎందుకంటే తాను పడుచున్న నరకయాతన కురుపులు బాధ అలా ఉంది దానికితోడు స్నేహితుల మాటలు బల్లెము తో పొడిచినట్లు ఉన్నాయి. ఇక తాను చనిపోతే తన బాధలకు విశ్రాంతి కలుగుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడుచున్నారు యోబుగారు!

 

అయితే ఈ మాటలలో ఒకమాట అంటున్నారు యోబుగారు నాకు నిరీక్షణాధారమేది?  నా నిరీక్షణ యెవనికి కనబడును?

గాని మన నిరీక్షణకు ఆధారం దేవుడు! దేవుడే మనలను ఆదరించువాడు! మనలను ఉద్దరించువాడు! మనలను బాగుచేయు వాడు!

యోబు 5:18 ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.

19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

20 క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును.

 

మనము కూడా ఇదే నిరీక్షణతో ముందుకు సాగిపోదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*80వ భాగం*

యోబు 18:1 6

1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను

2 మాటలలో చిక్కుపరచుటకై  మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.

3 మీ దృష్టికి  మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?

4 కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?  నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?

5 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.

6 వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్దనున్న దీపము ఆరిపోవును

 

     ప్రియులారా!  ఇక ఈ అధ్యాయంలో మరో మిత్రుడు బిల్డదు యోబుగారి మాటలకు రెండో విడత సమాధానం చెబుతూ మాట్లాడుచున్నాడు!

 

ఇంకా ఎంతసేపు మాటలతో చిక్కు పరుస్తావు అంటున్నాడు! నీవు మాట్లాడటం మానేస్తే మేము మాట్లాడతాం అంటున్నాడు!

మూడో వచనంలో మీ దృష్టికి మేము మృగాలుగా ఇంకా మూడులుగా మేము ఎంచబడటం ఎందుకు అంటున్నాడు!

ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని అర్ధమవుతుంది అంటే బిల్డదు యొక్క అహం దెబ్బతింది గత రెండు అధ్యాయాలలో యోబుగారు మాట్లాడిన మాటలకు! అందుకే తన మాటల ద్వారా ఇప్పుడు యోబుగారిని బాదించడానికి సిద్దమయ్యాడు!

 

 మమ్మలని ఎందుకు జంతువులుగాను తెలివి తక్కువ వాళ్లగాను ఎంచుతున్నావు అంటున్నాడు!

ఇంకా తర్వాత వచనంలో కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనే వాడా అంటున్నాడు ఇంకా నీ నిమిత్తం భూమి అంతా పాడై పోవాలా? నీకోసం కొండ తన స్థానం తప్పిపోవాలా అని అంటున్నాడు!

 

దీని అర్ధం ఏమిటంటే ఇంకా బిల్డదు యోబుగారి కష్టాలకు కారణం తాను చేసిన పాపమని రూఢిగా నమ్మి నొక్కి చెబుతున్నాడు ఇక్కడ! ఇక్కడ యోబుగారు దోషి! గాని ఆయన ఒప్పుకోవడం లేదు- అలా ఒప్పుకోక పోవడం భూమిని తలక్రిందులుగా చేయడమే అని తాను భావిస్తున్నాడు! ఒక్క మనిషి కోసం దేవుడు తాను నియమించిన సూత్రాలకు వ్యతిరేఖంగా చేయడం జరుగదు గదా అని అతడి ఉద్దేశ్యం!

తర్వాత వచనంలో అంటున్నాడు: దుర్మార్గుల దీపం తప్పకుండా ఆరిపోతుంది. వారి నిప్పు మంట మండటం మానేస్తుంది, వారి డేరాలో వెలుగే చీకటిగా మారిపోతుంది వారి దీపం ఆరిపోతుంది అంటున్నాడు! ఈ రకంగా ఇంకా దెప్పుతున్నాడు!

 

 గమనించాలి ఈ అధ్యాయం మొత్తం బిల్డదు ఏమంటున్నాడు అంటే నీవు దోషివి పాపివి, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు- గాని నీవు ఒప్పుకోవడం లేదు- అలా దేవుని కోపానికి లోనవుతున్నావు. ఇప్పుడైనా నీవు పాపివి అని ఒప్పుకో అంటున్నాడు!

 

యోబుగారు ఏదో పెద్ద నేరం చేశాడన్న నమ్మకాన్ని అతని స్నేహితులు వదల్లేకపోతున్నారు. ఈ విషయంలో అతను పలికిన మాటలన్నిటినీ వారు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక నిజాలను బయటికి తీసి తమ మాటలన్నీ తారుమారై పోవడానికి వీలు కల్పించడానికి వాళ్ళకు మనసు లేదు. దేవుని మార్పులేని నియమం ఒకటి ఆచరణలో ఉన్నదని వారిలో నమ్మకం ఏర్పడిపోయింది. వారి ఆలోచనలు గంబీరమైనవీ లోతైనవీ కావు. వారు అనుకొనేదేమంటే గొప్ప విపత్తులు ఘోర పాపుల మీదికే వస్తాయి; యోబు మీదకి గొప్ప విపత్తులు వచ్చాయి కాబట్టి యోబు ఒక ఘోర పాపి.

ఒక్కోసారి మనము దేవుని గురించి మన ఆలోచనా విధానం కూడా కొన్ని సత్యాలను విడిచిపెట్టి తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తుందేమో జాగ్రత్త వహించాలి. రెండో సారి మాట్లాడినప్పుడు బిల్దదు ఎలీఫజు చూపిన త్రోవను అనుసరిస్తున్నాడు. ఈ వచనాలన్నిటి సారాంశం దుర్మార్గుడికి జరిగేవాటిని గురించిన వర్ణనే. ఎలీఫజులాగానే బిల్దదు కూడా యోబు జీవితంలో జరిగిన సంఘటనల గురించే మాట్లాడుతున్నాడు (11-14,19 వచనాలు). 21వ వచనంలో యోబు దేవుణ్ణెరుగని అన్యాయస్థుడు అంటున్నాడు.

 

ప్రియులారా ఈ అధ్యాయం మొత్తం యోబుగారిని అన్యాయంగా నిందించడమే ఉంటుంది గనుక కొద్దిగా చూసి ముగించుకుందాం!

నీవు దుర్మార్గుడివి నీలాంటి వారికోసం వారి పాదాలే వాళ్ళను వలలోనికి నడిపిస్తాయి. బోనులు వారిని పట్టుకుంటాయి. ఉచ్చులో పడతారు, చివరికి ఊరిలో పడతారు. అన్నివైపులా నుండి భయం వారిని వెంటాడుతుంది. అడుగడుగునా వారిని భయం వెంటాడుతుంది వాళ్ళ బలము క్షీణించి పోతుంది. విపత్తు వారి శరీరాన్ని తినేస్తుంది వారి ఆవయవాలలో మరణకరమైన రోగం వచ్చి తినేస్తుంది ఇలా వారి జ్నాపకం భూమిమీద ఉండకుండా పోతుంది చివరకు ప్రజలే వారిని తరిమేస్తారు అంటున్నాడు!

 

 నిజానికి ఇవి నిజమే గాని యోబుగారి విషయంలో మాత్రం కానేకాదు! గాని యోబుగారి స్నేహితులు అర్ధం చేసుకోకుండా ఇన్ని మాటలు మాట్లాడుచున్నారు!

అయితే ఒక హెచ్చరిక: ఇంకా క్రైస్తవుడు అని పేరుపెట్టుకుని, ఇంకా దుర్మార్గముగా ప్రవర్తిస్తూ, అన్యాయమైన మార్గాలలో ధనము సంపాదిస్తూ, ప్రజలను బాధపెడుతూ ఉంటే ఈ అధ్యాయంలో బిల్డదు మాట్లాడిన 21 వచనాలలో ఉన్న ప్రతీ ఉపద్రవం తప్పకుండా వారికి కలుగుతుంది అని మరచిపోవద్దు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*81వ భాగం*

యోబు 19:1 6

1 అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

2 ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

3 పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

4 నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?

5 మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద  మీరు మోపుదురా?

6 ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన  వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.

 

     ప్రియులారా!  ఇక ఈ అధ్యాయంలో మరో మిత్రుడు బిల్డడు మాటలకు జవాబుగా మాట్లాడుచున్నారు యోబుగారు!

మొదట మూడు వచనాలలోనూ వారు చేసిన ఆరోపణలకు ఎంతగా బాధపడుతున్నారో అర్ధమవుతుంది మనకు!

2 ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

3 పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు

చూడండి నన్ను ఎంతకాలం వేదించుకు తింటారు అంటున్నారు మీ మాటలచేత నన్ను ఎంతకాలం చితకకొడతారు అంటున్నారు! పడిసార్లు సిగ్గులేకుండా నన్ను నిందించారు అంటున్నారు! అసలు ఇలా నాతో మాట్లాడటం మీకు సిగ్గు అనిపించడం లేదా అంటున్నారు!

ఇక నాలుగో వచనం నుండి తెగించి మరో విధంగా మాట్లాడుచున్నారు, మొండిగా తెగించి పలుకుతున్నారు- 4 నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?

ఇక్కడ చూడండి ఒకవేళ నేను పాపం చేసి ఉంటే ఆ శిక్ష నామీదికే వస్తుంది గదా మెరెందుకు గింజుకు పోతున్నారు అంటున్నారు! అయితే మీరు మీకుమీరుగా న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా భావించుకుని నామీద జడ్జిమెంట్లు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు! తర్వాత వచనంలో అలా అనుకుని మీరేందుకు నామీద నాకంటే మిమ్మల్ని ఎందుకు హెచ్చించు కుంటున్నారు అంటున్నారు! అయితే అలా అని వదిలేస్తే బాగుణ్ణు గాని తర్వాత వచ్చనములలో దేవునిమీద కొన్ని అనరాని మాటలు అంటున్నారు 6 ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన  వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.

7 నామీద బలాత్కారము జరుగుచున్నదని నేనుమొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదుసహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

8 నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు

చూడండి దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నారు! ఒకసారి యోబుగ్రంధం మొదటి అధ్యాయం చివరి వచనం, రెండో అధ్యాయం పడవ వచనం చూసుకుంటే అక్కడ యోబుగారి ఆస్తి మొత్తం పోయినా పదిమంది పిల్లలు పోయినా దేవుడు అన్యాయం చేశాడు అనే మాట అసలు అనలేదు! తద్వారా దేవుడు ఆశించి ని ఫలితం దక్కింది! సాతానుగాడు తోక ముడుచుకుని పోయాడు!  గాని ఇక్కడ తన స్నేహితులు అన్న సూటిపోటి మాటలు వలన దేవుడు అన్యాయం చేశాడు అని అంటున్నారు యోబుగారు!

1: 21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక.

22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

2: 10 అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.

చూడండి సూటిపోటు మాటల ఫలితం! ప్రియులారా ఇలాంటి మాటలు మనము అసలు మాట్లాడానే కూడదు! ఇక్కడ యోబుగారు తెగించి దేవుడు నా పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. దేవుడు తనను పక్షిలా తన వలలో చిక్కించు కున్నారు న్యాయం కోసం నేను న్యాయాధిపతికి మొరరాపెడుతున్నా ఆయనకు నేను అన్యాయస్తుడిగానే కనిపిస్తున్నందున నాకు న్యాయం దొరకడం లేదు అంటున్నారు!

మరో భక్తుడు కూడా ఇలా అన్నాడు 44 వ కీర్తనలో, మరో భక్తుడు ఆసాపు కూడా ఇలాగే అన్నాడు

9 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.

11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు

12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమి్మ యున్నావు

13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచి యున్నావు.

14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

ప్రియులారా ఇలా మనము మాట్లాడకూడదు!

34: 10 విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును.

12 దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

మరి మనుష్యులకు ఈ శ్రమలు శోధనాలు ఎందుకు?

యాకోబుగారు అంటున్నారు 1: 12 శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు- దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనే మాటలను పలుకనే కూడదు! ఒకవేళ మనకు ఏవైనా శోధనలు వస్తే ముందు మనలను మనం ఆత్మ శోధన చేసుకోవాలి! ఈ శ్రమలకు శోధనలకు నేను చేసిన నా క్రియలు, నా మాటలు నా ప్రవర్తన వలన వచ్చిందా అని మొదట మనము సరిచూసుకుని సరిచేసుకొని దేవుని క్షమాపణ పొందుకోవాలి! ఒకవేళ అవేమీ కారణం కాకపోతే సాతాను నుండి కూడా కావచ్చు- అప్పుడు ప్రభువా ఈ శోధనలు తట్టుకుని వాటిని జయించే మార్గము దయచేసి నాకు చూపించండి అంటూ వేడుకోవాలి! అలా చేస్తే దేవుడు నీకు విజయం చేకూరుస్తారు! ఇక మూడవ కారణం దేవుడు నీకు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, అభిషేకం మీద అభిషేకం, నీకు అధ్యాత్మికంగా విశ్వాశంలో ప్రమోషన్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు! అందుకే ఈ శోధన- వాటిని తట్టుకున్నావా ఆశీర్వాదాలు అభిషేకాలు నీకే! అందుకే ధైర్యముగా సహించు! అలాకాకుండా ఓ  మాయదారి దేవుడా నేనే దొరికానా అంటే నీవు ఓడిపోయావు టెస్ట్ లో ఫెయిల్ అయిపోయావు! నీవు అభిషేకాలకు ఆశీర్వాదానికి పాత్రుడవు కాలేవు అని తెలుసుకో!

దైవాశీస్సులు!

 

*యధార్ధవంతుడైన యోబు*

*82వ భాగం*

 

యోబు 19:919

9 ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

10 నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.

11 ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.

12 ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి వారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరి నా గుడారముచుట్టు దిగిరి.

13 ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.

14 నా బంధువులు  నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయి యున్నారు.

15 నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.

16 నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండ నున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.

17 నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.

18 చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన యెడల  బాలురు నామీద దూషణలు పలికెదరు.

19 నా ప్రాణ స్నేహితులకందరికి  నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.

 

     ప్రియులారా!  ఇక ఈ అధ్యాయంలో మరో మిత్రుడు బిల్డదు మాటలకు జవాబుగా మాట్లాడుచున్నారు యోబుగారు!

 

 ఇక 8 వ వచనం నుండి తన బాధలను ఏకరువు పెడుతూ దేవునిమీద నిష్టూరాలు వేస్తున్నారు యోబుగారు! ఇది 20 వ వచనం వరకు ఇలా ఏకరువు పెడుతూనే ఉన్నారు! చూడండి ఏమంటున్నారో

 నా మార్గానికి దేవుడు కంచె వేసేశారు! అనగా నేను మంచి  మార్గములో నడవకుండా అడ్డుగా కంచె వేసేశారు.  దేవుడు ఇంతవరకు నాకున్న ఘనతను కొట్టివేశారు. నా తలమీద ఇంతవరకు ఆయన పెట్టిన కిరీటం ఆయనే తీసేశారు! నిజానికి దేవుడు తీయలేదు గాని తాను పరీక్షా కాలంలో ఉన్నారని ఆయన గ్రహించక  ఇలాంటి మాటలు మాట్లాడుచున్నారు ఆయన!

 

చూడండి ఎనిమిదవ వచనంలో నా వెలుగు తీసేశారు అన్నారు!

9 వ వచనంలో నా గౌరవం తీసేశారు అన్నారు!

పదవ వచనంలో నా నిరీక్షణను తీసేశారు అన్నారు!

11,12 వచనాలలో ఇంతవరకు దేవుడు నామీద ఉంచిన ఆయన ముఖ ప్రసన్నతను తీసేశారు అంటున్నారు!

ఇక 13—15 వచనాలలో నా సోదరులు నా బందువుల సహాయ సహకారాలు గౌరవ మర్యాదలు తీసేశారు అంటున్నారు!

ఇక 17—19  వచనాలలో నన్ను ఎవరూ ప్రేమించకుండా చేసేశారు అంటున్నారు! అనగా నానుంచి నామీద గల  ప్రేమను తీసేశారు అంటున్నారు!

ఇక 20 వ వచనంలో నా ఆరోగ్యాన్ని ఆయన తీసేశారు! ఎందుకయ్యా ఇలా చేశావు అని విలపిస్తున్నారు ఈ అధ్యాయంలో యోబుగారు!

 

ఇలా నేను అన్నింటికీ దూరమయ్యాను అని బాధపడుతున్నారు! పై వచనాలు ఇవే అర్ధమిస్తున్నాయి అయితే అవి కవితా ధోరణిలో ఆయన బాధలు కళ్ళకు కనబడేలా చెబుతున్నారు అన్నమాట!

 

అయితే 10 వ వచనంలో నా నిరీక్షణను ఆయన చెట్టుని పెళ్లగించినట్లు తీసేశారు అనినా, ఇదే అధ్యాయంలో 25—27 వచనాలలో అంటున్నారు

25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

27 నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

 

 అంతేనా 23 వ అధ్యాయంలో కూడా ఒక చక్కటిమాట అంటున్నారు శోధించబడిన మీదట నేను సువర్ణము వలె కనబడతాను అంటూ! అనగా ఇక్కడ నిరీక్షణ లేక ఆశాభావమును పూర్తిగా కోల్పోయినా తర్వాత   మరలా నిరీక్షణ తెచ్చుకున్నారు! అనగా ఇవి ఫ్రష్టేషన్ మాట్లాడిన మాటలు అని అర్ధమవుతున్నాయి!

 

10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

11 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.

12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

హల్లెలూయ!

 

ఇక 13—14 వచనాలలో నా బంధువులు నన్ను ముఖము తప్పించుకుని తిరుగుతున్నారు అని బాధపడుతున్నారు. తన స్నేహితులకు నేను అసహ్యమై పోయాను అని బాధపడుతున్నారు. ఇక 15 వ వచనంలో నా ఇంటి దాసులు దాసీలకు కూడా నేను లోకువై పోయాను అని బాధపడుతున్నారు.

 

17 వ వచనంలో నా భార్యకు  కూడా అసహ్యమైపోయాను అని చాలా బాధపడుతున్నారు! నిజంగా ఊరంతా ఒకటై పోయినా తన భార్య తోడుగా సహకారంగా నిలబడితే మగాడు ఏదైనా సాధించగలడు! ఊరును జయించినా భార్య సహకారం గౌరవ మర్యాదలు లేకపోతే ఎందుకురా ఈ బ్రతుకు అనుకుంటాడు పురుషుడు! ఇక్కడ స్వంత భార్య దేవుణ్ణి దూషించి యధార్ధత వదిలి ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అంటుంది. నిజానికి దీనిని తట్టుకోవడం చాలా కష్టం! ఈ మధ్య నా స్నేహితుడు ఒకడు, నా స్నేహితుని తమ్ముడు ఒక్కడు కేవలం తమ భార్యలు ఏం చేశావులే నీ బ్రతుకు ఎందుకు? ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నారు! అయితే నేను చావాలని కోరుకుంటున్నావా అన్నారు. ఇద్దరిదీ ఒక్కటే డైలాగ్! చచ్చిపో పీడయినా విరిగిపోతుంది అన్నారు వారి భార్యలు! అన్న మూడు నిమిషాలలో వారి చావు వార్తను విన్నాను! క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది ఆ పురుషులదీ తప్పు అయితే- మరింత తప్పు నిజంగా ఆ భార్యలదే కదా! కేవలం ఒక్క నెలలో రెండు వార్తలు విన్నాను నేను!

 గానీ యోబుగారు తట్టుకున్నారు- ఆయన దేవుని జ్నానముతో నింపబడిన వ్యక్తి దేవుని భయము గల వ్యక్తి కనుక అర్ధం చేసుకున్నారు అది సాతాను గాడి బోధ అని! ఇది కేవలం విశ్వాసులకే అనుకున్నారా?! ప్రియ దైవసేవకుల భార్యలారా! మీకు కూడా కన్నీటితో చెబుతున్నాను! నాకు తెలిసిన కొందరు దైవసేవకుల భార్యలు ఉన్నారు, వారు తమ భర్త అంతగా సంపాదించలేక పోతున్నారు- మిగిలిన సేవకుల లాగా కార్లు బంగాళాలు కొనడం లేదు- వెలగల చీరలు బంగారం కొనడం లేదు అని భర్తను ఘోరంగా దెప్పి పొడుస్తూ మాటలతో హింసిస్తున్నారు! గమనించాలి- నీ భర్త దైవసేవకుడు! వాక్యానికి భయపడిన వాడు- అందుకే తప్పుడు దారిలో తప్పుడు బోధలు కుయుక్తి బోధలు చేసి విశ్వాసులను దోచుకోకుండా నిజాయితీగా సేవచేస్తున్నాడు! అతనికి కలిగే ప్రతిఫలం తర్వాత ఉంది. ప్రస్తుతం యోబుగారిలా టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నారు. నీ భర్తతో పాటుగా శ్రమలు సహించు! నీ భర్తకు ఇచ్చే కిరీటాలలో నీకు కూడా పాలుపంపులు ఉంటాయి! నీ సహకారం లేకపోతే నీ భర్త సేవచేయడం చాలాచాలా కష్టం అని మరచిపోకు! ఒక ప్రక్క సాతాను శోధనలు! మరో ప్రక్క ఇరుగుపొరుగు వారితో శోధనలు! మరోప్రక్క సేవకు ఆటంకం చేసే అన్యులు మరియు విశ్వాసులు! ఇందరితో పోరాటం చేస్తుంటే మధ్యలో ఇంటిలో కూడా పోరు కావాలా? ఇంటిలో పోరు ఇంతింత కాదయా విశ్వధాభి రామ వినుర వేమ అన్నట్లు ఉంది నీ భర్త పరిస్తితి! కాబట్టి దైవ సేవకుల భార్యలారా! దయచేసి మీ భర్తలకు అన్ని విషయాలలో సహకరించమని చేతులెత్తి నమస్కరిస్తూ మనవిచేస్తున్నాను!

విశ్వాసులయిన భార్యలారా లేక స్త్రీలారా దయచేసి మీ భర్తలకు లోబడి వారికి అన్నీ విషయాలలో సాటియయిన సహాయం సహకారం చేయమని మనవిచేస్తున్నాను! అందుకే దేవుడు స్త్రీని చేసినట్లు ఆదికాండం 2:18 లో చూడగలం! దేవునికి లోబడుదాం! మీ భర్తలకు లోబడి ప్రేమించి ఆదరించండి!

అట్టి కృప ధన్యత చదువుతున్న ప్రతీ విశ్వాసికి సేవకునికి దేవుడు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*83వ భాగం*

యోబు 19:21— 28

21 దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి.

22 నా శరీరమాంసము పోవుట చాలునను కొనక  దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుము దురు?

23 నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను.

24 అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.

25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

27 నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

28 జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల

29 మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పుకలుగునని  మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.

 

     ప్రియులారా!  ఇక ఈ అధ్యాయంలో మరో మిత్రుడు బిల్డదు మాటలకు జవాబుగా మాట్లాడుచున్నారు యోబుగారు!

 

ఇక తర్వాత వచనాలలో తన స్నేహితులతో మాట్లాడుచున్నారు 21, 22 వచనాలలో బ్రతిమలాడు కుంటున్నారు, చివర వచనాలలో వార్నింగ్ ఇస్తున్నారు!

21 దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి.

22 నా శరీరమాంసము పోవుట చాలునను కొనక  దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?

చూడండి ఏమంటున్నారో నా స్నేహితులారా నా మీద జాలి చూపండి దేవుని చేయి నన్ను మొత్తింది, మీరు మరింక నా మీద నేరాలు మోపవద్దు అంటున్నారు!  యోబుగారు ఇప్పటికీ ఏమనుకుంటున్నారు అంటే దేవుడు ఏమనుకున్నారో ఏమో గాని దేవుడే నాకు ఈ కీడు కలిగించారు. ఆయన చేయి నన్ను మొత్తింది అంటున్నారు. కానీ యోబు 1:2, 2:6 ప్రకారం నిజానికి యోబుగారిని మొత్తింది సాతాను గాడు- అయితే దేవుడు దానికి రెండు ఉద్దేశాలతో అనుమతించారు! గాని యోబుగారు అనుకోవడం ఇప్పుడు తానున్న దయనీయమైన స్థితికి, దుఖ స్థితికి ఓదార్పు లేని స్థితికి కారణం దేవుడే- ఓ కఠినులైన స్నేహితులారా దీనిని గ్రహించి నామీద జాలి పడండి అంటున్నారు; గాని దీనిని అర్ధం చేసుకునే ఆధ్యాత్మిక స్థితి తన స్నేహితులకు లేదు!

 

ఇక 23—27 వచనాలలో తన నిరీక్షణ ఏమిటో తన విశ్వాస పరిమాణం ఏమిటో తేటతెల్లం చేస్తున్నారు. ఇలాంటి నిరీక్షణ / ఆశాభావం విశ్వాసులందరికీ ఉండాలి!

23,24 వచనాలు చూసుకుంటే 23 నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను.

24 అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.

ఇంతకీ ఎందుకు వ్రాయబడాలి ఏమని వ్రాయబడాలి అంటే తర్వాత వచనాలలో అంటున్నారు 25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

27 నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

శభాస్ యోబుగారు! నిజానికి ఆయన ఇప్పుడు ఉంటే ఆయన విశ్వాసానికి నిరీక్షణకు సెల్యూట్ చేయాలని ఉంది నాకు! నా చర్మము చీకిపోయిన తర్వాత నేను దేవుణ్ణి చూస్తాను అంటున్నారు!  ఎవరో కాదు నేనే నా కన్నులారా, ఇదే శరీరంతో చూస్తాను అంటున్నారు. 

యోబుగ్రంథంలో అతి ప్రాముఖ్యమైన, మనోహరమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. యోబుగారి కుటుంబం, బంధువులు అతనిపట్ల చూపిన కఠినమైన తీరూ, అతని స్నేహితుల నేరారోపణలూ ఇవన్నీ ఇప్పుడు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. వారిలో యోబుకు ఏ సహాయమూ, ఓదార్పు దొరకలేదు. కాబట్టి అతడు దేవునివైపుకే చూడాలి. మరో సారి అతని హృదయంలో విశ్వాసం, నిరీక్షణ/ ఆశాభావం కదులుతున్నాయి. (14:13-15, 16-22; 16:19  చూడండి). తాను పలకబోయే మాటలు చాలా ప్రాముఖ్యమైనవని గ్రహించారు. కాబట్టే అవి శాశ్వతంగా నిలిచి ఉండేలా వాటినెవరన్నా రాసిపెట్టాలని కోరుతున్నారు (23,24 వచనాలలో). ఈ విషయంలో అతని కోరిక నెరవేరింది. అతని మాటలు శాశ్వతంగా నిలిచి ఉండేలా బైబిలు గ్రంథంలో రాసి ఉన్నాయి. 25-27 వచనాల్లో యోబు నమ్మకం ఉన్నత స్థాయిని అందుకున్నది. ఇది సంపూర్ణ నిశ్చయతగా మారింది.

 

ఇక నా విమోచకుడు సజీవుడు అనే ఈ మేలిమి ముత్యమైన మాట కోసం జాగ్రత్తగా పరిశీలిస్తే స్టడీ బైబిల్ ఉన్నది ఏమిటంటే

నేను ఎరుగుదును” - అనే మాటను వాడారు యోబుగారు. అతనికి తెలిసినదాని సారాంశమేమంటే తనకు సజీవుడైన విమోచకుడు ఉన్నాడు. ఆయనెవరో కాదు దేవుడే. రాబోయే కాలంలో ఒకప్పుడు ఈ విమోచకుడు ఈ భూమిమీద నిలబడతాడు. యోబు ఆయన్ను చూస్తారు. ఇక్కడ విమోచకుడు అని అనువాదం చేసిన హెబ్రూ పదం హీబ్రూ పాత నిబంధనలో 46 సార్లు కనిపిస్తుంది. దీనికి వేరువేరు అర్థాలున్నాయి

ఇబ్బందినుండీ బానిసత్వంనుండీ విడిపించేవాడు (ఆది 48:16; ద్వితీ 13:5);

ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి ఇప్పించే సమీపబంధువు (లేవీ 25:25);

హత్యకు గురైన మనిషి కుటుంబానికి చెంది పగ సాధించేవాడు (సంఖ్యా 35:12);

తన కుటుంబంలోని విధవరాలిని పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనడమే కాక ఆమె పోగొట్టుకున్న ఆస్తిని కొనుక్కునేవాడు (రూతు 2:20);

పీడించేవారికి విరోధంగా తన ప్రజల పక్షాన నిలిచేవాడు (దేవుడుసామెత 23:11).

విమోచకుడుగా దేవుడు తన ప్రజలను బానిసత్వంనుంచి విడిపించి, వారి భూమిని వారికిప్పించి, వారి శత్రువులను శిక్షిస్తాడు (యెషయా 49:25-26; యిర్మీయా 50:33-34).

ఇక్కడ యోబుగారు ఈ మాటను ఏ అర్థం, లేక అర్థాలతో వాడారు? అతను బహుశా ఇలా ఆలోచించాడు: తన బంధువులెవరూ తనకు సహాయంగా రావడం లేదు (14 ). అతని స్నేహితులు అతన్ని సమర్థించడానికి బదులు నేరారోపణ చేస్తున్నారు (19 ). అందుకని దేవుడే అతనికి సహాయంగా వస్తాడు. అతని మాట నిలబెట్టి అతన్ని విడిపించి, అతని రక్తానికి ప్రతీకారం చేస్తాడు (16:18-19).

 

అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందని యోబుగారు ఎదురు చూస్తున్నారు? తానింకా బ్రతికి ఉండగానేనా? లేక చనిపోయిన తరువాతా? తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే హీబ్రూ భాషలో 26వ వచనం అర్థం చేసుకోవడానికి బహు కష్టతరమైనది. దీన్ని ఇలా అనువదించవచ్చు. “ఈ విధంగా నా చర్మం చీకి చివికిపోయాక నా శరీరానికి వేరై నేను దేవుణ్ణి చూస్తాను”. అంటే, హీబ్రూలో ఇక్కడ రెండు అర్థాలు ఉండవచ్చు – “శరీరంలో ఉంటూలేదాశరీరంతో ఉండిఅనీశరీరానికి దూరమైఅనీ. శరీరానికి దూరమై అనే అర్థం తీసుకుంటే యోబు తన మరణం తరువాత ఆత్మ స్థితిలో దేవుణ్ణి చూస్తాను అంటున్నాడన్నమాట. ఈ అర్థమే నిజమనుకుంటే యోబు దేవుణ్ణి చూడ్డానికీ, దేవుడు భూమిమీద నిలబడటానికీ సంబంధమేమిటో తెలియదు. అలా కాక ఆ హీబ్రూ పదానికిశరీరంతోనేఅనే అర్థం తీసుకుంటే యోబు మాటల్లో వేరే విధమైన అర్థాన్ని మనం వెదకవలసి వస్తుంది. వాటిని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. యోబుగారి మాటకు అర్థాన్ని కొందరు విద్వాంసులు ఇలా అన్నారు – “యోబు ఇంకా బ్రతికివుండగానే దేవుడు ఈ భూమిపై ప్రత్యక్షం అవుతాడు. అతనికి వచ్చిన రోగం మూలంగా అతని చర్మం పగుళ్ళు చూపి రాలిపోతున్నది. కానీ దేవుడు వచ్చే వేళకు అతనింకా అతని శరీరంలోనే ఉంటాడు. యోబుగ్రంథం చివర్లో దేవుడు నిజంగానే కనిపించి అతని యథార్థతను నిరూపించి అతని ఆరోగ్యాన్నీ ఆస్తినీ తిరిగి ఇచ్చాడు. యోబుగారు చెప్తున్నది ఈ విషయమే కావచ్చు.

 

ఇది ఇలా ఉండగా మరో వివరణ ఉందియోబుగారు తన మరణం తరువాత శరీర జీవితం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు విమోచకుడుగా భూమిమీదికి వచ్చి అతణ్ణి సజీవంగా లేపుతాడు గనుక యోబు ఆయన్ను చూస్తాడు. యోబు మాటలకు మంచి వివరణ ఇదేనని ఈ స్టడీ బైబిల్ తో పాటు నేను కూడా నమ్ముతున్నాను!

14:4లో యోబుగారు అడిగారు.

మనిషి చనిపోయి మళ్ళీ బ్రతుకుతాడా? దీనికి సంబంధించిన సత్యాన్ని దేవుడింకా మనుషులకు వెల్లడి చేయలేదు. ఒకవేళ ఇక్కడ దేవుని ఆత్మ బాధల్లో ఉన్న తన సేవకుడికి ఈ సత్యాన్ని వెల్లడించడం మొదలు పెట్టి ఈ మహా నిరీక్షణ లేదా ఆశాభావాన్ని ప్రకటించడానికి అతణ్ణి ప్రేరేపించాడేమో, తనకే అర్థం కాని విషయాన్నే అతడు పలికేలా దేవుడు చేశాడేమో.

 

ఏది ఏమైనా శరీరంతో గానీ శరీరం లేకుండా గానీ దేవుణ్ణి తాను చూడగలిగే రోజు కోసం యోబు ఎంతగానో ఆశిస్తున్నాడు (27 ). దీనివల్ల తెలుస్తున్నదేమంటే అతని అంతర్వాణి లేదా అంతరాత్మ నిర్మలంగా ఉంది. తన సృష్టికర్తను కలుసుకునేందుకు అతడు సిద్థమే.

 

ఇక చివరిగా తన స్నేహితులను హెచ్చరిస్తున్నారు చివరి రెండు వచనాలలో

 28 జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల

29 మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పుకలుగునని  మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.

 

చూడండి హెచ్చరిక ఎంత సూటిగా ఉందో! నా ప్రియ స్నేహితులారా! నా విశ్వాసానికి నా నిరీక్షణకు మీకు తేడా ఇదే! అలా కాకుండా నా పాపములు దోషములు కారణంగానే దేవుడు ఇవి నాకు చేశారు అని తలస్తే ఖబడ్దార్ మీరు తీర్పులోకి వెళతారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు! ఎందుకంటే నేను కాదు దేవుడే నా పక్షంగా వాదిస్తారు అని యోబుగారి గట్టి నమ్మకం!

 

కాబట్టి మనము కూడా ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితే ఆదరించాలే తప్ప తీర్పులు చెప్పవద్దు లేకపోతే దేవుని అదే తీర్పు మనమీదకు వస్తుంది అని భయపడి ఇతరుల పట్ల  జాగ్రత్తగా మెలుగుదాం!

 

అంతేకాకుండా కష్టాలు ఎన్నివచ్చినా యోబుగారు నిరీక్షించినట్లుగా ఒకరోజు మనము దేవుణ్ణి చూస్తాము, మన చివరి మజిలీ దేవుని వద్దకే అని నిరీక్షణతో ముందుకు పోదాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*84వ భాగం*

యోబు 20:1— 8

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

3 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

4 దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.

5 ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

6 వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

7 తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.

8 కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

 

     ప్రియులారా!  ఇక ఈ 20వ అధ్యాయంలో   యోబుగారు మాట్లాడిన మాటలకు మరో మిత్రుడు జోఫరు జవాబిస్తున్నాడు! అయితే గమనించవలసినది ఏమిటంటే ఈ అధ్యాయం మొత్తం యోబుగారిని ఒక దోషిగా ఒక నేరస్తునిగా పరిగణిస్తూ ఆయనను అవమానించడమే ఉంటుంది గనుక చాలా క్లుప్తంగా ఈ అధ్యాయం చూసుకుందాం!

 

ఇక్కడ 2 ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

3 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నం దుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది అంటున్నాడు జోఫరు! దీనినిబట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఇక్కడ జోఫరు అహము కూడా దెబ్బ తిన్నట్లు చూడగలము! నిజానికి యోబు స్నేహితులు అతణ్ణి దూషించారు. అతని తలపై అపనిందలు కుమ్మరించారు. వాటితో పోల్చుకుంటే యోబుగారు  వారిని గద్దించిన రీతి సున్నితమే (యోబు 19:28-29, ). కానీ దానికి వారు బాధపడి కోపం తెచ్చుకున్నారు.

 

ఇక నాలుగవ వచనం నుండి యోబుగారిని ఒక దుష్టినిగా పరిగణించి మాట్లాడుచున్నట్లు మనము గమనించగలము!!

4 దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.

5 ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

నిజానికి యోబుగారు  చెప్పినదేది అతని స్నేహితుల తప్పుడు సిద్ధాంతాన్ని కదిలించలేకపోయింది. ఏ క్రొత్త ఆలోచననూ స్వీకరించేందుకు వారి మనస్సులు సిద్ధంగా లేవు. తాము జ్ఞానులమనీ జీవిత సమస్యలకు తమ దగ్గర జవాబులున్నాయనీ వాళ్ళ గట్టి నమ్మకం. కానీ యోబులాంటి మనిషిని అర్థం చేసుకోవడం కనీసం మొదలు పెట్టడం కూడా వాళ్ళ తరంకాదు. ఈ రెండో సారి మాటల్లో జోఫరు పాత పాటే పాడుతున్నాడు (యోబు 11:6, యోబు 11:10-12, ). యోబు ఎలాంటివాడని తాను అనుకుంటున్నాడో వర్ణిస్తూ ఉన్న అతని మాటలు ముందటికంటే పదునుగా ఉన్నాయి.

మానవ చరిత్ర తన సిద్ధాంతాన్ని రుజువు చేస్తుందట (4,5 వచనాలు ).

 

దుష్టుడు కొంతకాలం వర్ధిల్లవచ్చు (యోబు లాగా), అయితే అతను తప్పకుండా నాశనమౌతాడు (6-11 వచనాలు).

 

అన్యాయంగా అతడు సంపాదించుకొన్నదంతా అతనితోనే పోతుంది (12-22 వచనాలు).

 

దేవుడే అతనికి విరోధంగా లేచి అతని దోషాన్ని బయట పెట్టి అతణ్ణి నాశనానికి గురి చేస్తాడు (23-29 వచనాలు).

 

ఇప్పుడు ఇంకా వివరంగా చూసుకుంటే ఈ 5వ వచనంలో ఈ విషపూరితమైన మాటల్లో జోఫరు యోబును పరోక్షంగా దుర్మార్గుడు అంటున్నాడు ,

ఆరవ వచనంలో గర్విష్ఠి అంటున్నాడు!

 దుష్టత్వాన్ని ప్రేమించేవాడు (12,13 వచనాలలో),

పేదలను బాధించేవాడు అంటున్నాడు 19 వచనంలో ,

 దురాశపరుడు 20 వ వచనంలో  అని వర్ణిస్తున్నాడు.

 

అసలు యోబు ఇలాంటివాడు అనడానికి జోఫరుకు ఎలాంటి ఆధారమూ లేదు. యోబు ఇలాంటివాడై ఉండాలి అని జోఫరును నమ్మించేది అతని సిద్ధాంతమే (యోబు 18:5-21).

 

ఒక విధంగా చూసుకుంటే దుష్టులను ఉద్దేశించి జోఫరు పలికిన పలుకులు 100% నిజమే! గాని ఇక్కడ జోఫరు ఆ దుష్టుడు ఎవరూ కాదు నువ్వే అని పరోక్షంగా పలుకుతున్నాడు! ఇలాంటి నిందలు విశ్వాసి ఎట్టి పరిస్తితులలో చేయకూడదు అని గమనించాలి!

 

సరే, ఈ అధ్యాయాన్ని వ్రాయించింది పరిశుద్ధాత్ముడు కాబట్టి ఒకసారి దుష్టులకు ఏమి జరుగబోతుందో జరుగుతుందో క్లుప్తంగా చూసుకుందాం!

 

వారు ఎంతగా ధనములో బలములో మరే విషయంలో హెచ్చించ బడినా ఒకరోజు కనబడకుండా నశించిపోతారు 5—7!

రాత్రి కలవచ్చి ఉదయం లేనట్లు అయిపోతారు.6

వారి సంతానం అనాదలై, పరుల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడతారు! 10,

వారి యవ్వన బలము ఎందుకు పనికిరాకుండా పోతుంది. 11

వారికి చెడు చేయడమే ఇష్టం కనుక వారు తిన్న తిండి వారి కడుపులో పాడై పోతుంది వారి నోటిలో విషముంది 12—14

వారు దోచుకున్నదంతా దేవుడు వారితో కక్కించేస్తాడు, 15—16

వారు ఆస్తి సంపాదిస్తారు గాని దానిని అనుభవించలేరు! 17—19

వారు ఎంత తినినా ఆకలి తీరదు!

24 ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.

25 అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.

26 వారి ధననిధులు అంధకార పూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును.

27 ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.

28 వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.

29 ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.

 

నిజానికి ఇవీ దుష్టులకు జరిగే కార్యాలు! కాబట్టి దుష్టత్వమును వదిలేద్దాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*85వ భాగం*

యోబు 21:1— 8

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.

4 నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా?  లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?

5 నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.

6 నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల  నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

7 భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?  వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

8 వారుండగానే వారితో కూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

 

     ప్రియులారా!  ఇక ఈ 21 వ అధ్యాయంలో   యోబుగారు మిత్రుల మాటలకు జవాబిస్తున్నారు! అయితే గమనించవలసినది ఏమిటంటే గత  అధ్యాయం మొత్తం యోబుగారిని ఒక దోషిగా ఒక నేరస్తునిగా పరిగణిస్తూ ఆయనను అవమానించడము జరిగినది గనుక ఆ అధ్యాయములో వారు చెప్పిన దుష్టులు నాశనమై పోతారు అనే సిద్దాంతము తప్పు అని నిరూపించడానికి యోబుగారు ప్రయత్నించారు!

 

 దుష్టులు వర్ధిల్లుతారు! ఆస్తిలో వ్యవసాయంలో పాడి పంటలలో అన్నీ విషయాలలోనూ వారు వర్ధిల్లుతయారు అంటున్నారు ! అయితే కంగారు పడకండి- తన స్నేహితులకు తనకు తేడా ఏమిటంటే ఇలా దుష్టులు ఎంత వర్ధిల్లినా ఒకరోజు హటాత్తుగా నాశనమై పోతారు అంటున్నారు!

 

సరే కొంచెం వివరాల లోనికి వెళ్తే 2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును అంటున్నారు!

 

ఎందుకు నన్ను అవమానిస్తున్నారు? నేను చెప్పే మాటలు వినిన తర్వాత మీరు ఎంత కావాలంటే అంతా అపహాస్యం చేసుకోండి అంటున్నారు!

 

ఇక నాలుగో వచనంలో అంటున్నారు 4 నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా?  లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?

చూడండి నేను మీకు మొర్ర పెట్టడం లేదు కదా- నా బాధ అంతా నా ఆక్రోశం అంతా దేవునిమీదనే! మీకెందుకు మంట అంటున్నారు!

 

తర్వాత వచనాలలో 5 నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి. అంటున్నారు! అనగా నాకు కలిగిన ఉపద్రవాలు చూసి నోటిమీద వేలు వేసుకోండి అంటున్నారు! నిజానికి ఇంకా ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలను విని యోబు వారికి సమాధానం ఎలా ఇవ్వగలుగుతున్నాడు? యాకోబు 5:11, చూడండి.

11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

 

ఇంత సహించారు కాబట్టి దేవుడు రెట్టింపు ఆశీర్వాదము దయచేశారు!!!

 

ఇక భక్తిహీనులు దుష్టులు విస్తరిస్తున్నందుకు ఆశీర్వదించ బడుతున్నందుకు తర్వాత వచనాలలో యోబుగారు చాలా ఆశ్చర్య పడుతున్నారు వ్యసనపడుతున్నారు!

6 నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల  నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

7 భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?  వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

8 వారుండగానే వారితో కూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది అంటున్నారు!

 

ఇక 8,9 వచనాలలో వారి కుటుంభం ఎలా ఆశీర్వబడుతుందో చెబుతున్నారు 8 వారుండగానే వారితోకూడ  వారి సంతానమువారు చూచుచుండగా  వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

9 వారి కుటుంబములు భయమేమియు లేక  క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు.

 

ఇక్కడ యోబుగారి అర్ధం ఏమిటంటే నీతిమంతులు భక్తులు ఏమాత్రం చిన్న తప్పుచేసిన దేవుడు లెంపకాయ కొడుతున్నారు- శిక్షిస్తున్నారు! గాని భక్తిహీనులు దుష్టులు ఎన్ని పాపాలు దోషాలు చేసినా వారికి ఏమీ జరగటం లేదు! సరికదా ఇంకా వారెంతో ఆశీర్వదించ  బడుతున్నారు ఇదెక్కడి విడ్డూరం! దీని ప్రకారం చూసుకుంటే మీ సిద్దాంతం అనగా దుష్టులు నాశనమై పోతారు వారు లేకుండా పోతారు అనే సిద్దాంతం తప్పు అంటున్నారు!

ఇంకా అంటున్నారు వారి పాడి పంటలు కోసం, కుటుంభం కోసం  : 10 వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును.

11 వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.

12 తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.

 

ఈ వచనాలలో వారి కుటుంబము మరియు వారి ఆస్తికి ఉన్న శ్రేయస్సు కనిపిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది!

మనము కూడా అనేకసార్లు ఏమిటి ప్రభువా మేము చిన్న తప్పు చేసిన వెంటనే శిక్షిస్తున్నావు- అన్యులు దేవుని యందు భయభక్తులు లేనివారు ఇంకా భక్తిహీనులు ఎన్ని నేరాలు ఘోరాలు పాపాలు చేసినా వారిని ఏమీ అనడం లేదు! నీకేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతాము! గాని నిజానికి దీనికి సమాధానం 13 వ వచనం లోనూ, కీర్తనలు 73:18 లోనూ ఉంది!

13. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇదీ అసలు విషయం!

 

కీర్తన 73: 16 అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు

17 నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.

18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

19 క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

20 మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు.

 

ప్రియ సహోదరి సహోదరుడా! నీవు కూడా ఇలాగే బాధపడుతూ మత్సరపడుతూ దేవునిమీద అలుగుతున్నావా? వద్దు! దేవుడు వారిని అనగా అన్యాయం చేసేవారిని భక్తిహీనులను కాలుజారే చోటున ఉంచారు! ఎన్నిమార్లు గద్దించినా వినని వాడు మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమైపోతాడు అని సామెతలు  29:1 చెబుతుంది!

అయితే మరి నీవు తప్పుచేస్తే వెంటనే ఎందుకు దేవుని నుండి శిక్ష లేక లెంపకాయ తగులుతుంది అంటే నీవు పరలోకం వెళ్ళే బ్యాచ్ లో ఉన్నావు లేక దేవుని ప్రణాళికలో నీవున్నావు గనుక దేవుడు నిన్ను తన రాజ్య వారసునిగా చేసుకున్నారు గనుక నీవు గాడి తప్పితే దారి తప్పితే ఒక లెంపకాయ కొట్టి మరలా తన దారిలోనికి తీసుకుని వస్తున్నారు! ఇదీ నీ పట్ల దేవుని ప్రణాళిక! అయితే వారు నరకానికి నాశనానికి పోయే బ్యాచ్! అందుకే వారు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా దేవుడు పట్టించు కోకుండా తిన్నగా ఒకేసారి నాశనం చేయబోతున్నారు!

కాబట్టి గ్రహించి ఒకవేళ దేవుని మీద నిందలు మోపితే ఇప్పుడే  దేవుని శరణువేడు! ఆయన పాదాలు పట్టుకుని దోషాలు కదిగివేసుకో!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*86వ భాగం*

యోబు 21:14— 18

14 వారు నీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

16 వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

17 భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా. వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.

18 వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

 

     ప్రియులారా!  ఇక ఈ 21 వ అధ్యాయంలో   యోబుగారు మిత్రుల మాటలకు జవాబిస్తున్నారు!  ఇక తర్వాత వచనాలలోనూ భక్తిహీనులు ఎందుకు అభివృద్ది నొందుతున్నారు అని ఆశ్చర్యమే వ్యక్త పరుస్తున్నారు!

 

ఇక 14,15 వచనాలలో దేవుని మార్గములను భక్తిహీనులు త్రోసివేయడం కోసం చెబుతున్నారు!

 14 వారు నీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

చూడండి మేము దేవునికి ప్రార్ధన చేయడం వలన గాని లేక ఆయనను పూజించడము వలన మాకేమీ లాభము అంటున్నారు.  అనగా వీరు ఏదైనా లాభమున్నది అంటేనే స్వార్ధ పూరితమైన భక్తి చేస్తారు! లాభము లేదు అంటే భక్తి చేయరు! ఇంకా మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు అంటారు? అవును ఆ రోజు మోషే గారు ఆహారోను గారు- మేము మా దేవుణ్ణి పూజించటానికి వెళ్తాము- మమ్మును వెళ్ళనీయు అని అడిగితేయెహోవా ఎవడు- నేనెందుకు వినాలి అన్నాడు! ఈజిప్ట్ నాశనం అవ్వడానికి కారణం అయ్యాడు. చివరకు తన కొడుకునే పోగొట్టుకున్నాడు!

 

మరొకడు- నెబుకద్నేజర్ రాజు- నా చేతిలోంచి రక్షించగలిగే దేవుడెవరైనా ఉన్నారా అని అడిగాడు! హా ఉన్నాడు- మా దేవుడు, ఒకవేళ రక్షించక పోతే చావనైనా చస్తాము గాని నీ బంగారమ్మ బొమ్మను పూజించము పో అన్నారు- హనన్య, మిషాయేలు అజర్యాఅగ్ని గుండములో పడేశారు- దేవుడు అగ్ని గుండాన్ని AC రూమ్ గా మార్చేశాడు- దేవుడు తానే అగ్ని గుండములోకి దూకేశాడు- తర్వాత ఈ రాజు ఏమన్నాడు- మహోన్నతుడగు దేవుని సేవకులారా దయచేసి బయటకు రండి- ఇంకా అంటున్నాడు-ఇవ్విధముగా రక్షించుటకు సమర్ధుడగు దేవుడు ఎవరు లేరు!

 

మరో రాజు అస్సూరు రాజు- ఈ దేవత రక్షించేనా ఆ దేవుడు రక్షించేనా- మీ దేవుడు రక్షించ గలడా అని ప్రేలాపనలు పేలాడు దూత మొత్తాడు సైన్యాన్నిఒక్క రాత్రిలో 1,85,000 మంది చచ్చి పడ్డారు!

 అలాగే వీరికి కూడా దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నారు.

 

అయితే 16 వ వచనంలో రెండు స్టేట్మెంట్ లు ఇస్తున్నారు- 16 వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

మొదటి స్టేట్మెంట్: భక్తిహీనులు ఎంతో విర్రవీగుతారు గాని వారి క్షేమము వారి చేతిలో లేదు- దేవుని చేతిలో ఉంది!

 

రెండు: అలాంటి భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును గాక! నాకైతే ఇలాంటి భక్తిహీనుల యోచనలు పడవు అవి నాకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు

 

తర్వాత వచనాలలో మరో క్రొత్త విధానంలో బాధపడుతున్నారు 17 భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా. వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.

18 వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

 

ఇక్కడ ఈ రెండు వచనాలలో భక్తిహీనుల దీపం ఆర్పివేయబడటం లేదు- వారి మీదికి ఆపద రావడం లేదు- వారు గాలిలో చెత్తలా కొట్టుకు పోవడం లేదు- దేవుడు కోపపడి వారిమీదికి వేదనలు తీసుకుని రావడం లేదు అని బాధపడుతున్నారు- అయితే ప్రతీదానికి ఒక అంతము అనేది ఉంటాది.  పాపము పరిపక్వమయ్యే వరకు దేవుడు దేవుడు వేచి చూస్తారు. చూడండి సోదొమా గోమర్రా మొర్ర గొప్పది వారు దానిని పూర్తిచేశారో లేదో తెలుకుంటాను అన్నారు- పూర్తి అయ్యాక నాశనం వచ్చింది- అలాగే భక్తిహీనుల పాపం పండే వరకు దేవుడు ఎదురుచూస్తారు!

పూర్తి అయ్యాక ఇక తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమై పోతారు! సామెతలు 29: 1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

 

ఇక తర్వాత వచనాలలో 19 వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారు చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక

20 వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక  సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత

21 తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి చింత ఏమి?

 

చూడండి ఈ వచనాలలో మీరు తండ్రులు చేసిన పాపముల యొక్క దోషాలు కుమారుల మీద దేవుడు మోపుతాడు అని మీరు అంటున్నారు అయితే నేను కోరుకొనే దేమిటంటే ఎవరు చేసిన పాపముల యొక్క ప్రతిఫలం వారే అనుభవించాలి! ఎందుకంటే తాము పోయాక వారికి తమ ఇంటిమీద గాని ఒంటిమీద గాని చింత ఉండదు గదా అని అభిప్రాయ పడుతున్నారు- అయితే దేవుడు దానిని యిర్మీయా గ్రంధంలో మార్చేశారు!

 

 నిర్గమ-ద్వితీయోప దేశ కాండములలో తండ్రులు చేసిన పాపము వారి కుమారుల మీదికి వేస్తాను అని చెప్పినా- దేవుడు తర్వాత యిర్మీయా గ్రంధంలో మార్చేశారు 31: 29 ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.

30 ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.

 

ఇక తర్వాత వచనంలో మరో విధంగా దేవునిమీద బాధపడుతున్నారు యోబుగారు 22 ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

దేవుని ఇంత జ్నానము ఉంది కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటున్నారు- దేని కోసం మాట్లాడుతున్నారు అంటే తర్వాత వచనాలలో కనిపిస్తుంది.

 

23 ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను

24 సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును

25 వేరొకడు ఎన్నడును  క్షేమమను దాని నెరుగక  మనోదుఃఖముగలవాడై  మృతినొందును.

26 వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.

 

చూడండి ఒక మనిషి ధనవంతుడు లాజరు ఉపమానంలో చెప్పబడిన విధంగా జీవిత కాలమంతా సుఖము అనుభవించి ధనవంతుడిలా  చనిపోతున్నాడు- మరొకడు లాజరులా జీవితకాలమంతా కష్టాలతో దుఖాలతో సుఖము అనేది తెలియకుండా చనిపోతున్నాడుఇద్దరూ ఒకే విధంగా భూమిలోకి పోతున్నారు- దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ బాధపడుతున్నాడు!  అయ్యా దేవుని ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు వేరు- యోబుగారు ఇలా అడిగే సరికి ఈ ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పబడలేదు! ఈ ఉపమానంలో దేవుడు చెప్పారు- దేవుని భయము లేకుండా జీవితమంతా సుఖాలు అనుభవిస్తూ జీవించిన ధనవంతుడు పాతాళములో అగ్ని మంటలలో నరకయాతన పడుతున్నాడు- అయితే జీవితమంతా సుఖమే లేకుండా యాతనలు పడి జీవించిన లాజరు- దేవుని దూతలచేత పరమునకు తీసుకొని పోబడి తండ్రియైన అబ్రాహాము రొమ్ము అనబడే పరదైసులో సుఖములు అనుభవిస్తున్నారు! లూకా 16:19—31

 

కాబట్టి మనము కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు! ప్రతీవానికి దేవుడిచ్చే జీతము ఉంది- మన క్రియల ప్రతిఫలము తీసుకుని దేవుడు రాబోవుచున్నారు గనుక జాగ్రత్తగా మెలుగుదాము!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*87వ భాగం*

యోబు 22:1— 5

1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా?  కారు; బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు

3 నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?  నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ కరమా?

4 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా?  నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?

5 నీ చెడుతనము గొప్పది కాదా?  నీ దోషములు మితిలేనివి కావా?

 

     ప్రియులారా!  ఇక ఈ 22వ అధ్యాయంలో   యోబుగారు మాట్లాడిన మాటలకు మొదటి మిత్రుడు ఏలీఫజు మూడో విడతగా జవాబులు చెబుతున్నాడు! ఈ మూడోసారి మరింత ఘాటుగా దేవుని పక్షాన మాట్లాడుతున్నట్లు ఫోజులు కొట్టి- నీవు చేసిన అన్యాయ పనుల వలనే దేవుడు నీకు కీడు చేశాడు అంటూ ఏవేవో తప్పుడు కేసులు యోబుగారి మీదికి రుద్దుతున్నాడు! చూసుకుందాం- రెండో వచనం నుండి:

 

2 నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా?  కారు; బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు

3 నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?  నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ కరమా?

 

ఒక మనిషి నీతిన్యాయాలతో జీవించినప్పటికీ అతని పట్ల తప్పకుండా అనుకూలంగా ఉండాలని దేవుని పైన ఎలాంటి బలవంతమూ ఉండదని ఎలీఫజు అంటున్నాడు. తనకేదో కొరత వస్తుందని భయపడి దేవుడెప్పుడూ పాపాన్ని శిక్షించకుండా మానుకోడు అనికూడా అంటున్నాడు!

 

ఇంకా నీవు భక్తిగా యధార్ధంగా జీవిస్తే దేవునికేమైనా కోటి రూపాయలు లాభం వస్తుందా అని అడుగుతున్నాడు!

 

ఇంకా 4 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?

కొత్తరకం టెక్నిక్ వాడుతున్నాడు అంటే నీవు భక్తిగా ఉంది దేవునికి చేసిన ఉపకారం ఏముంది? నీకు నీవే కదా ఉపకారం చేసుకుంటావు అంటున్నాడు!

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఎలీఫజు ఒక నిర్ణయానికి వచ్చేశాడు. 21 వ అధ్యాయంలో యోబు చెప్పినదానిలో గల సత్యం అందరికీ తేటతెల్లమే అయి ఉండాలి కానీ ఇది ఎలీఫజుమీద ఎలాంటి ప్రభావమూ చూపించలేదు. అతని మనస్సులో జలగలాగా ఒకే తలంపు తిష్ఠ వేసుకొని ఉంది. అదేమంటే నిర్దోషుల మీదికి దేవుడు విపత్తులను రానియ్యడు. ఈ విషయంలో ఎలీఫజుకు ఎంత నిశ్చయంగా ఉందంటే యోబు ఏ పాపం చేశాడో తెలియక పోయినా, ఊహాగానం ద్వారా కొన్ని పాపాలను కల్పిస్తున్నాడు. తన స్నేహితులు చేస్తున్నది ఇదేనని యోబు 13:4, లో యోబు అన్నాడు గదాదేవునికి అసహ్యంగా ఉండేది వీరు చేస్తున్నారు. సామెతలు 17:15, లో దీని వర్ణన ఉంది – “దుర్మార్గులను నిర్దోషులనీ, నిర్దోషులను దుర్మార్గులనీ తీర్పు చెప్పడం రెండూ యెహోవాకు అసహ్యం”. వీటిల్లో మొదటి తప్పును చేయడానికి యోబు స్నేహితులు భయపడ్డారు. అయితే రెండోదాన్ని మాత్రం యధేచ్ఛగా చేసేస్తున్నారు. ఎలీఫజు ఆరోపణలన్నిటికీ యోబు 29:12-17, ; యోబు 31:5-40, లో జవాబిచ్చాడు.

 

ప్రియులారా! ఇక తర్వాత వచనాలలో ఒక్కో వచనంలో ఒక నేరం మోపుతున్నాడు- నిజానికి అవి సత్య దూరమైనవి = చూద్దాం

 

5 వ వచనంలో నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? అన్నాడు

 6 వ వచనంలో ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి అన్నాడు!

 

తర్వాత వచనంలో దాహము అని ఇంటికి వస్తే దాహం తీర్చలేదు- ఆకలి అని ఇంటికి వస్తే నీవు అన్నం పెట్టలేదు అంటున్నాడు-

9 వ వచనంలో విధవరాళ్లను దోచుకున్నావు అంటున్నాడు  దిక్కులేనివారి ఆస్తి దోచుకున్నావు అంటున్నాడు;

 

     అయితే ముందుకు పోయే ముందు తర్వాత అధ్యాయాలలో ఆయన సమాధానం చూస్తే ఇక్కడ చేసిన ఆరోపణలు ఎంత సత్య దూరమైనవో అర్ధమవుతుంది,

 

31: 13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును?  ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా?  గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

16 బీదలు ఇచ్ఛయించిన దానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను

20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని

 

ఇదే అధ్యాయంలో తన నిర్దోషత్వము నిరూపించడానికి అంటున్నారు

7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల

8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.

 

ఇదీ ఆయన సవాలు! ఇలాంటి సవాలు స్వీకరించడానికి వారికి దమ్ము ధైర్యం లేదు! మనము ఇలాంటి నేరారోపణలు చేయకూడదు! యోబుగారి వలె యధార్ధంగా నీతిగా నడుచుకుందాం!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*88వ భాగం*

యోబు 22:11— 16

11 నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా? నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?

12 దేవుడు ఆకాశమంత  మహోన్నతుడు కాడా?  నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?

13 దేవునికి ఏమి తెలియును?  గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?

14 గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.

15 పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?

16 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.

 

     ప్రియులారా!  ఇక ఈ 22వ అధ్యాయంలో   యోబుగారు మాట్లాడిన మాటలకు మొదటి మిత్రుడు ఏలీఫజు మూడో విడతగా జవాబులు చెబుతున్నాడు=

ఈ మూడోసారి మరింత ఘాటుగా దేవుని పక్షాన మాట్లాడుతున్నట్లు ఫోజులు కొట్టి- నీవు చేసిన అన్యాయ పనుల వలనే దేవుడు నీకు కీడు చేశాడు అంటూ ఏవేవో తప్పుడు కేసులు యోబుగారి మీదికి రుద్దుతున్నాడు!

 

ఇక తర్వాత వచనాలలోనూ చేయని నేరములను యోబుగారికి అంటగడుతున్నాడు అయితే చివరి వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి ముఖ్యమైన వచనాలు మాత్రం ధ్యానం చేద్దాం!

 

12—14 వచనాలలో అంటున్నాడు 12 దేవుడు ఆకాశమంత  మహోన్నతుడు కాడా?  నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?

13 దేవునికి ఏమి తెలియును?  గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?

14 గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు

 

ఏమండీ నిజానికి యోబుగారు అసలు ఈమాటలు అన్నారా? దేవునికి సమస్తము సాధ్యమే! అన్నీ చూస్తున్నారు- ఆయన అనంత జ్నాని నేను ఆయనతో మాట్లాడలేను వాదించలేను అంటూ చెప్పుకొచ్చారు ఇంతవరకు, అయితే ఇక్కడ తన స్నేహితుడు సత్యదూరమైన మాటలు పలుకుచున్నాడు! యోబుగారిని దుష్టులతో సమానంగా చూస్తున్నారు! కీర్తనలు 10: 3 దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

4 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

5 వారెల్లప్పడు భయము మానుకొని  ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.

6 మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు

7 వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

11 దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.

 

యెహేజ్కేలు 8: 12 అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశ మును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.

 

యెషయా 29: 15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు?  మా పని యెవరికి తెలి యును?  అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.

 

ఇవి దుష్టులనుద్దేశించి పలకడం  సబబే గార్ని యోబుగారికి ఆపాదించడం నేరం!

 

కీర్తనలు 139: 7 నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?

8 నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

9 నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను

10 అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11 అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల

12 చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

 

ఇక 15 వ వచనంలో అంటున్నాడు 15 పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?

16 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.

 

ఎలీఫజు ఇక్కడ బహుశా నోవహు కాలంలో దుర్మార్గులు మహా జలప్రళయంవల్ల నిర్మూలం కావడం గురించి మాట్లాడుతూ ఉండవచ్చు (ఆదికాండము 6:5-7, ). న్యాయవంతులు కాదు గానీ దుర్మార్గులే ఘోర విపత్తులకు గురి అవుతారని చెప్పేందుకు ఆ సంగతి ఎత్తాడు. అయితే యోబు 21వ అధ్యాయంలో చెప్పిన సత్యాలను వీగిపొయేలా చేసేందుకు ఒక్క ఉదాహరణ సరిపోదు. 20వ వచనంలో ఎలీఫజు యోబు ఆస్తికి సంభవించినవాటిని గురించి మాట్లాడుతున్నట్టుంది (యోబు 1:16, ).

 

ఇక 21—30 వచనాల వరకు దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్లు ఫోజు కొడుతున్నాడు!

21. ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.

ఇక్కడ ఇంతకు ముందు వచనాలలో తాను యోబు పై నిందలు మోపడంలో చాలా దూరం వెళ్ళిపోయాననీ యోబును దోషిగా తీర్చడంలో చాలా కఠినంగా మాట్లాడాననీ గ్రహించి నట్టున్నాడు. ఇప్పుడు కాస్త మృదువుగా మాట్లాడుతూ యోబును పశ్చాత్తాపపడి దేవునివైపుకు తిరగమని నచ్చజెపుతున్నాడు. కానీ 5వ అధ్యాయంలో అతను యోబుకు ఇచ్చిన మొదటి హెచ్చరిక లాగానే ఇది కూడా యోబు పరిస్థితికి ఎంతమాత్రం సరిపోవడం లేదు (యోబు 5:17-18).

 

ఇంకా అంటున్నాడు 22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

23 సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.

24 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ మును పారవేయుము

25 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.

26 అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు దేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.

27 నీవు ఆయనకు ప్రార్థనచేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.

28 మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును.

29 నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయముగలవానిని ఆయన రక్షించును.

30 నిర్దోషికాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.

 

నిజానికి ఈమాటలన్నీ యధార్ధమైనవే సత్యమైనవే గాని యోబుగారు తనకంటే నీతిపరుడు యధార్ధవంతుడు అయినా తానే నీతిపరుడు అయినట్లు యోబుగారు దుష్టుడైనట్లు మాట్లాడుతున్నాడు ఇక్కడ!

 

అయితే ఇవి వ్రాయించింది పరిశుద్దాత్ముడు కాబట్టి వీటినుంది కొన్ని సత్యాలు తెలుసుకుందాం.

మొదటిది: నీవు అభివృద్ధి పొందాలంటే 23 వ వచనం ప్రకారం- మొదటగా దేవునివైపు తిరగాలి, గుడారములోనుండి అనగా ఇంటినుండి దేహమునుండి దుర్మార్గమును దూరంగా తరమాలి!

 

ఇక 24—29  ప్రకారం: మొదటగా: దేవుణ్ణి నీవు నీకు స్వాస్త్యముగా చేసుకోవాలి అంటే నీకున్న బంగారము మీద వ్యామోహాన్ని వెండిమీద ఉన్న వ్యామోహాన్ని వదులుకోవాలి అనగా ధనము మీద వ్యామోహం వదిలి దేవునివైపు తిరిగితే దేవుడే నీకు ఆస్తిగా ఉంటారు!

 

రెండు: అలా చేస్తే నీవు దేవునియందు ఆనందించడమే కాకుండా నీవు ప్రార్ధన చేస్తే దేవుడు నీ మనవి ఆలకించి నీ మ్రొక్కుబళ్ళు అంగీకరిస్తారు. నీవు ఆలోచించినవి స్థిరమౌతాయి! నీవు పడిపోయినా దేవుడు నిన్ను మరలా లేపుతారు! వినయము ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను లేపుతారు అంటున్నారు!

 

కాబట్టి నీకు కూడా అభివృద్ధి కావాలా? దేవుడు నీ మొరలను వినాలా? అయితే దేవునివైపు తిరుగు! దుష్టత్వాన్ని నీ ఇంటినుండి నీ దేహము నుండి తొలగించుకో!

దైవాశీస్సులు!!!

*యధార్ధవంతుడైన యోబు*

*89వ భాగం*

యోబు 23:1— 10

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది

3 ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ  కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

4 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.

5 ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అదినేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.

6 ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా? ఆయన ఆలాగు చేయక  నా మనవి ఆలకించును

7 అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవుదును.

8 నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు

9 ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.

10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

     ప్రియులారా!  ఇక ఈ 23వ అధ్యాయంలో   యోబుగారు ఏలీఫజు మాట్లాడిన మాటలకు జవాబుగా మాట్లాడుచున్నారు. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే మొదటగా ఇక తన స్నేహితులతో మాట్లాడి ప్రయోజనం లేదు, ఎందుకంటే తన స్నేహితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు ఏమిటంటే యోబుగారు పడుతున్న కష్టాలకు ఆయన చేసిన అపరాధాలు మాత్రమే కారణం అని చెప్పి లేనిపోని మాటలంటున్నారు అందుకే ఆయన కేవలం దేవునితోనే మాట్లాడుచున్నారు!

 

రెండవదిగా ఈ అధ్యాయంలో కూడా యోబు హృదయంలో చెలరేగే ఊహలూ, అభిలాషలూ ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. దేవుని సముఖంలోకి రావడానికి అతడు అర్రులు చాస్తున్నాడు (3 ). అయితే తనలో తనకు దేవుని గురించి అధిక భయం ఉంది (15,16 ). తనను తాను సమర్థించుకుంటూ దేవునితో వాదించి నిర్దోషిని అనిపించుకోగలనని అతనికి నమ్మకంగా ఉంది (4-7 ). అయితే తన దోష రాహిత్యంతో నిమిత్తం లేకుండా దేవుడు తనను బాధలు పెడుతూనే ఉంటాడని అతని అభిప్రాయం (13-15 ). నమ్మకమూ, భయమూ, నిబ్బరమూ, సందేహమూ వీటి మధ్య అతను కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ ప్రధానంగా కనిపించే అంశమొకటి యోబు 16:19, లో ఉన్న అంశంలాంటిదే.  యోబు 12:15, లో ఎలీఫజు చేసిన ఆరోపణకు జవాబుగా యోబు తాను దేవుని మార్గాన్నే అంటిపెట్టుకొని దానినుంచి తొలిగిపోలేదంటున్నారు (10-12 ). ఇంతకు ముందు ఒకసారి జరిగినట్టుగా (7-18 ) యోబు తన కష్టాలకు అసలు కారణమేదో దానికి అతి సమీపంగా వచ్చారు. అయితే అప్పటిలాగానే ఇప్పుడు కూడా ఈ ఆలోచనను త్వరగా వదిలేసి వేరే మాటల్లోకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు తనకు పెట్టిన పరీక్ష ఎలాంటిదైనా తాను మాత్రం నిజాయితీ, నీతిన్యాయాలకు కట్టుబడే మనిషిగా నిలబడతానని అతని నమ్మకం. మంట ఎంత వేడి అయినప్పటికీ బంగారం దానిలో ఎంతమాత్రం చెడిపోదని యోబుకు తెలుసు. బంగారంలో ఏదన్నా మలినం ఉంటే మంటవల్ల అది వేరైపోయి బంగారం నిలిచి ఉంటుంది.

 

సరే, ఆ అధ్యాయాన్ని సారాన్ని క్లుప్తంగా చూసుకుందాం!

రెండో వచనంలో అంటున్నారు యోబుగారు: ఈ రోజుకూడ నేను కన్నీటితో దేవునికి పిర్యాదు చేస్తున్నాను ఏమని అంటే దేవుడు నాకు ఎక్కడ కనిపిస్తాడో తెలిస్తే బాగుండేది! ఆయన నివాస స్థలానికి నేను వెళ్లాలని అనుకుంటున్నాను ఎందుకంటే నా మనషులో చెలరేగుతున్న అలజడులు మొత్తం ఆయనకు చెప్పి ఆయన నుండి జవాబులు పొందుకోవాలి అంటున్నారు! ఆయనకే నేను నా పిర్యాదుని చెప్పుకుంటాను ఆయనతో వాదోపవాదాలు చేయాలని నా నోటినిండా మాటలతో ఉన్నాను అంటున్నారు!

 

ఇక 5 వ వచనంలో అంటున్నారు నేను అడిగిన ప్రశ్నలకు దేవుడు ఏమి జవాబు చెబుతారో అది కూడా వినాలని ఉంది అంటున్నారు!

ఇక ఆరవ వచనంలో అనుమానాస్పదంలో  అంటున్నారు- దేవుడు నాకు జవాబుగా తన బలప్రభావాలు చూపించి నన్ను బెంబేలెత్తించి హడలుగొట్టి సమాధానం చెబుతారా?  నేనైతే అలా చేయరని అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు చాలా యధార్ధవంతుడు ఆయన నా మాటలు చాలా శ్రద్ధతో వింటారు! ఆయన న్యాయమూర్తి కాబట్టి నేను మాట్లాడే మాటలు నేను న్యాయమంతుడిని కాబట్టి ఆయన నాకు ఏమీ శిక్ష విధించరు అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు!

 

ఇక 8,9 వచనాలలో మరలా దేవునిమీద అనుమానంతో మాట్లాడుతున్నారు! నేను తూర్పుకి వెళ్ళినా ఆయన లేరు, పడమరకు వెళ్ళినా ఆయన అక్కడ లేరు! ఆయన పనులు చేసే ఉత్తరాన కూడా లేరు- దక్షిణాన కూడా కనబడలేదు అంటున్నారు! అనగా అర్ధం నేను ఎంత వెదకినా ఎంతగా ప్రార్ధించినా దేవుడు నాకు కనబడటం లేదు నా ప్రార్ధనకు జవాబు ఈయడం లేదు అని అర్ధము!

 

అయితే ఈ సందర్భంగా ఒక మర్మము ఆయన చెబుతున్నారు- దేవుడు తన కార్యాలను జరిగించేది ఉత్తరము వైపు నుండి. అందుకే కీర్తన 48:2 లో ఉత్తర దిక్కు మహారాజు పట్టణమైన సీయోను పర్వతము .. అంటూ చెప్పబడింది. చివరకు ఇశ్రాయేలు మీదికి వచ్చిన ఉపద్రవము కూడా ఉత్తర దిక్కునుండే వచ్చినవి! యెషయా 41:25; యిర్మీయా 6:1; యెహేజ్కేలు 1:4;

 

చివరకు యాజకులు బలి అర్పించవలసినది కూడా బలిపీఠము నకు ఉత్తరము వైపుననే! లేవీ 1:11

 

కాబట్టి దేవుడు ఉండేది- పనులు జరిగించేది ఉత్తరము వైపు అని బైబిల్ సెలవిస్తుంది!

 

ఇక పదవ వచనంలో మేలిమి ముత్యమైన మాట అంటున్నారు! 10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

ఆహా! ఎంత ఘనమైన మాట! శభాస్! నేను నడిచే మార్గము దేవునికి తెలుసు! అనగా నేను సుఖ పడటం దేవునికి తెలుసు, ఇప్పుడు నేను ఇబ్బందులు పడటం కూడా దేవునికి తెలుసు! అయితే నేను ఇలా శోధించబడిన మీదట సువర్ణము వలె మారిపోతాను అంటున్నారు!

 

ఒకసారి ద్వితీ 8:2 చూసుకుంటే 2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.

 

కీర్తన 17: 3 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత  నేను అతిక్రమింపను

4 మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొని యున్నాను.

5 నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.

 

కీర్తన 66: 10 దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11 నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12 నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

139: 1 యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు

2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3 నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

 

యాకోబు 1: 2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

3 మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

4 మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

12 శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

 

 

కాబట్టి దీనిని బట్టి ఏమని అర్థమవుతుంది అంటే దేవుడు శోధనలు ఒక ప్రణాళికతో అనుమతిస్తారు. వాటిని తట్టుకుని నిలబడితే మొదటగా నీవు విశ్వాసం లో బలపడతావు. రెండు నీకు ఆధ్యాత్మికత లో ప్రమోషన్ వస్తుంది. చివరకు సువర్ణము వలే మారిన తరువాత క్రీస్తు రూపములోనికి మారి, సంపూర్ణత సాధిస్తావు!

 

కాబట్టి యోబుగారు సహించినట్లు మనము కూడా శ్రమలను సహిద్దాము దేవుడు తప్పకుండా మనలను శోధనలు జయించాక సువర్ణము వలే చేయబోతున్నారు!

దైవాశీస్సులు!

*యధార్ధవంతుడైన యోబు*

*90వ భాగం*

యోబు 23:11— 17

11 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.

12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

13 అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?  ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

14 నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు.

15 కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.

16 దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.

17 అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనముచేయబడి యుండలేదు.

 

    ప్రియులారా!  ఇక ఈ 23వ అధ్యాయంలో   యోబుగారు ఏలీఫజు మాట్లాడిన మాటలకు జవాబుగా మాట్లాడుచున్నారు.  ఇంకా తన నిరాషాపూరితమైన మాటలు కొనసాగిస్తున్నారు!

 

ఇక 11,12 వచనాలలో అంటున్నారు 11 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.

12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

 

నా పాదములు ఆయన చెప్పిన మార్గాలలోనే నడిచాయి, ఆయన మార్గాన్నే నేను అనుసరించాను, ఆయన పెదవుల నుండి వచ్చిన మాటలను ఆజ్నలను నేను జవదాట లేదు. ఆయన నోటిమాటలను నేను నా సంత అభిప్రాయాల కంటే ఎక్కువగా భావించి నడుచుకున్నాను అంటున్నారు! నిజానికి ఇట్టి స్థితి గలవారు చాలా ధన్యులు! మనమైతే అనేక విషయాలలో తప్పిపోతున్నాము గాని ఆయన దేవుని మార్గములలో నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకుండా నడుచుకున్నా నాకు ఆపదలు ఇబ్బందులు తప్పలేదు అని బాధపడుతున్నారు!

 

ఇలా చాలామంది భక్తులు కూడా అన్నారు: కీర్తనలు 44: 17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువ లేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.

18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

 

17: 5 నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.

 

18: 20 నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను

22 ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను

23 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.

24 కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

25 దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

26 సద్భావము గలవారి యెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

27 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

 

ఇక దేవుని ఆజ్నలను మీరలేదు కోసం చూసుకుంటే : గత అధ్యాయంలో 22:22 లో అన్నాడు కదా దేవుని నోట నుండి వచ్చే ఉపదేశం విను అంటూ- ఏలీఫజు, దానికి సమాధానంగా ఈమాట చెబుతున్నారు . నేను దేవుని ఆజ్నలను మీరలేదు!

దావీదు గారు దేవుని ఆజ్నలను కట్టడలను నేను ఎందుకు పాటిస్తాను అంటున్నారు అంటే

 19: 7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము  నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును.

9 యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.

10 అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవి.

11 వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.

12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?  నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము.

 

119: 11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

 

ఇక్కడ భక్తులు దేవుని మాటల ప్రకారం జీవించి తమ జీవితాలలో ఎన్నో ఘనమైన కార్యములు చేయగలిగారు!

 

తర్వాత మాటలలో దేవుని కోసం చెబుతూ ఆయన మార్పు లేని వాడు- అయితే నా పట్ల ఆయనకున్న కోపము కూడా ఎన్నటికీ మారదు అనే అర్ధముతో మాట్లాడుచున్నారు!

13 అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?  ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

14 నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై యున్నాడు అంటున్నారు!

 

సంఖ్యా కాండములో బిలాము గారు  అంటున్నారు 23: 18 బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.

19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

20 ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను;  నేను దాని మార్చలేను.

 

కీర్తన 115: 3 మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు

 

జ్ఞాని యైన సోలోమోను గారు అంటున్నారు ప్రసంగి 3: 14 దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు;  మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.

 

యెషయా గ్రంధంలో దేవుడే నొక్కివక్కాణించి చెబుతున్నారు 46: 10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి  నేనే యింక జరుగనివాటిని  తెలియజేయుచున్నాను.

 

దానియేలు గ్రంధంలో గర్విష్టి రాజు నెబుకద్నేజర్ బుద్ధి వచ్చాక అంటున్నారు 4: 35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

 

యెషయా 14: 24 సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.

25 నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును.

26 సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.

27 సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు?  బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?

 

ఈ విషయం యోబుగారికి కూడా తెలుసు! అందుకే ఆయన ఏక దృష్టి గలవాడు ఆయనను మార్చడం ఎవరి తరము కాదు అంటున్నారు! అయితే ఆయన నిర్ణయాన్ని మార్చిన వారు ఉన్నారు- అది మనకు యోనా గ్రంధంలో కనిపిస్తుంది. 3—4 అధ్యాయాలలో యోనా గారు ప్రకటించిన దేవుని తీర్పులు విని చిన్నలనుండి పెద్దలవరకు గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో విలపించి నప్పుడు దేవుడు వారికి రాసిన మరణ శాసనమును మార్చి వారిని కాపాడారు!

కాబట్టి దేవునికి భయపడదాం! ఆయన చెప్పినట్లు ఆయన మార్గములలో ప్రయాణం చేద్దాం!

దైవాశీస్సులు!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు

సప్త సూక్తులు - యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఏడు మాటలు

పాపము

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

శరీర కార్యములు

సమరయ స్త్రీ

శిలువ శ్రమలు

బాప్తిస్మం

అబ్రాహాము విశ్వాసయాత్ర

విశ్వాసము