ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం- part-8
130వ కీర్తనా ధ్యానం
(మొదటి భాగం)
రచయిత: దావీదు
అంశము: నిరాశా, నిస్పృహలతో నిండిన జీవితాలను ఆశాభావంతో ఉన్నత శిఖరాలను చేర్చే అద్భుతమైన కీర్తన.
యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
కీర్తనలు 130:1,2
............................
అగాధ స్థలము అంటే?
గాడాంధకారము, కనుచూపుమేరల్లో ఎక్కడా వెలుగనేది కనిపించని పరిస్థితి.
సమస్యలు, శోధనలు, శ్రమలు, వేదనలు, కృంగదీసేపరిస్థితులు, అన్నీ అపజయాలే,
ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగేలా సాగే జీవితం.
నిరీక్షణ కరువై, ఆదరించే వారులేక,
ఓదార్చేవారసలే లేక నిరాశా, నిస్పృహలతో సాగే జీవనయాత్ర.
అగాధంలో చిక్కుకొని, బయటకు రాలేక, గమ్యమెటో తెలియక దిక్కు తోచని పరిస్థితులలో.....
హృదయం నుండి పొంగిపొరలే దుఃఖమే ఆర్తధ్వని.
శోధన సమయంలో, తన పరిస్థితి నుండి విడిపించే ఒక మనిషి కోసం దావీదు ఎదురు చూడట్లేగాని, వాటి నుండి విడిపించగల సమర్ధుడైన దేవుని వైపు చూస్తున్నాడు. ఆయననే ప్రార్దిస్తున్నాడు.
కారణం?
ఆయన ప్రార్ధన ఆలకించే దేవుడు.
మనమయితే మన సమస్యలను పరిష్కరించ గలిగే మనుష్యుల వైపు చూస్తాము. వారిదగ్గరకు పరుగులు తీస్తాము.
వారు మనకు మేలు చెయ్యాలంటే? దేవుడే వారికి జాలిగల మనస్సు దయచేయ్యాలని, వారికంటే ముందు దేవుని దగ్గరకు రావాలనే కనీస అవగాహన కూడా మనకుండదు.
అన్ని ప్రయత్నాలు చేసేసి, అన్నీ విఫలమయినప్పుడు ఇక నీవే దిక్కు అంటూ దేవుని వైపు చూస్తాము.
వద్దు!!
నీవు ఏ స్థితిలోనున్నా ప్రధమ స్థానం ఆయనకే ఇవ్వాలి.
నీ సమస్య ఏదయినా సరే!
నీవు ఏ పరిస్థితులలోనున్నా సరే!
ఆయనను ప్రార్ధించగలిగితే?
ఆలకిస్తాడు
విడుదల నిస్తాడు.
ప్రార్ధిద్దాం!
పొందుకుందాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
130వ కీర్తనా ధ్యానం
(రెండవ భాగం)
యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? కీర్తనలు 130:3
*ఒక్క పాపంవలన ఆదాము, హవ్వలు దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. వారితోపాటు వారి సంతానమంతా పాపులయ్యారు.
*ఒక్క పాపం వల్ల ఆకాను తనతో పాటు తన కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయారు.
*ఒక్క పాపం వల్ల సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు.
ఇట్లాంటి పరిస్థితుల్లో, దేవుడు నీ నా పాపాన్ని కనిపెట్టి చూస్తే?
మనము బ్రతగగలమా?
బ్రతుకుతున్నాము అంటే?
ఆయన చూడనట్లే కదా?
అట్లా ఎంత మాత్రమూ కాదు.
ఆయన చూడట్లే, మనకు నచ్చినట్లు జీవించొచ్చు. అనే నిర్ణయానికి వచ్చెయ్యకు.
మనము జీవిస్తున్నామంటే మన పరిశుద్దత, నీతిని బట్టికాదు. ఆయన కృపనుబట్టే!
అట్లా అని,
నేనెట్లా జీవించినా, ఆయన కృప నాకు తోడుగా వుంటుందిలే అనే భ్రమలో మాత్రం జీవించొద్దు. ప్రతీ దానికి కొన్ని పరిమితులుంటాయి.
ఆయన కృప నీకు తోడుగా ఉండాలంటే?
ఆయనలో నీవుండాలి.
ఆయనలో నీవుంటే?
క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. రోమా 8:1
ఇది భూమి మీద మనము అనుభవించే శిక్ష, శోధనలు గురించి కాదుగాని, దేవుని ఉగ్రత దినాన్న ఆ శిక్షనుండి తప్పించ బడతావు.
అందుచే ఆయన కృపను చులకన చెయ్యకుండా, ఆయన కృప మననుండి దూరంకాక ముందే, మన జీవితాలను సరిచేసుకుందాం.
మనలను జీవింపజేస్తున్న ఆయన కొరకై జీవిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
130వ కీర్తనా ధ్యానం
(మూడవ భాగం)
అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
కీర్తనలు 130:4
యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
దేవుని క్షమాపణకు కారణం ఏమిటో దావీదు తెలియజేస్తున్నాడు.
ఆయన క్షమాపణ మనలను ఆయనలో భయభక్తులు నిలిపేటట్లు చెయ్యడానికట.
కాని మనకట్లా లేదు.
తప్పు చెయ్యడం, దేవునిని క్షమించమని అడగడం, మరలా తప్పు చెయ్యడం.... ఇట్లా సాగిపోతుంది మన జీవితం.
తప్పు చేసాము అనే బాధ కంటే, దేవుడు క్షమించేస్తాడులే. అనే ధీమా ఎక్కువయిపోయింది.
నిజానికి, ఆ తప్పులన్నీ క్షమించ బడ్డాయా? లేదు. పెదవులతో క్షమించమని రెండు మాటలు అడిగనంత మాత్రాన క్షమించ బడవు.
నీవు అడిగే క్షమాపణలో పశ్చాత్తాపం వుండాలి.అప్పుడు మాత్రమే క్షమించబడతాయి.
నిజమైన పశ్చాత్తాపం వుంటే? తిరిగి ఆ తప్పులను కొనసాగించలేము.
కాని, వాటినే కొనసాగిస్తున్నాము అంటే పశ్చాత్తాపం లేనట్లే కదా? పశ్చాత్తాపం లేకపోతే మన పాపములకు క్షమాపణలేనట్లే.
క్షమాపణ లేకపోతే?
శాశ్వత రాజ్యం చేరలేము.
పశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల చెంత చేరుదాం!
ఆయన క్షమించినందుకు కృతజ్ఞతతో ఆయన యందు భయభక్తులు కలిగియుందాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
130వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. కీర్తనలు 130:5,6
దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము అనుభవించలేక పోతున్నాము అంటే?
అవి మన చేతివరకు వచ్చి, మనకు దక్కకుండా పోతున్నాయి అంటే?
ఒకే ఒక్క కారణము!
ఎదురు చూసే అనుభవము,
కనిపెట్టే అనుభవము
మన జీవితాల్లో లేదు.
కొన్ని సందర్భాలలో మన అవసరతల కోసం భారం కలిగి ప్రార్దిస్తాం. దేవుడు ఆ ప్రార్ధన ఆలకించి, సమాధానం సిద్దం చేస్తున్న సమయంలో, ఇక కనిపెట్టలేక, ఎదురుచూడలేక, విసిగిపోయి ప్రార్ధించడం మానేస్తాము.
అందుచే, ఆ ఆశీర్వాదాలు మన వరకు వచ్చి, మనకు దక్కకుండా పోతున్నాయి.
మన అవసరతలకు సమయం మించిపోయాక అనుగ్రహించే దేవుడుకాదు. మన దేవుడు. తగిన సమయమందు తప్పక దయచేస్తాడు.
అయితే, ఆ సమయంకోసం ఆశతో కనిపెట్టాలి.
ఎట్లా కనిపెట్టాలి అంటే?
ఒంటరితనం, ఆపదలు వాటిల్లే అవకాశమున్న చీకటి రాత్రి గడచిపోయి తెల్లవారాలని, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని కావలి వాడు ఏ రీతిగా ఎదురు చూస్తుంటాడో? ఆ రీతిగా
ఆయనిచ్చు ఆశీర్వాదం కోసం మనము కనిపెట్టాలి.
కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.
యెషయ 30:18
పొందుకొనేవరకు కనిపెడదాం!
ఆ ధన్యతను సంపాదించుకుందాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
130వ కీర్తనా ధ్యానం
(ఐదవ భాగం)
ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును. కీర్తనలు 130:7,8
ఇశ్రాయేలు ప్రజలారా!
ఆయన మీద ఆశ పెట్టుకొనుడి.
మనము శారీరికంగా ఇశ్రాయేలీయులము కాకపోయినా, అబ్రాహాము కుమారులము కాకపోయినా, యాకోబు సంతతి కాకపోయినా?
క్రీస్తు రక్తములో కడుగబడితే?
ఆత్మీయంగా ఇశ్రాయేలీయులమే.
అబ్రాహాము కుమారులమే.
ఆయన మీద ఆశ పెట్టుకుంటే?
కృప, సంపూర్ణ విమోచన దొరకుతాయి.
ఏ అర్హతాలేని సమయంలో అర్హులుగా ఎంచ బడడమే కృప.
*ఆయన మీద ఆశ పెట్టుకుంటే?
ఆశీర్వాదములకు నీవు అర్హుడవు కాకపోయినా, ఆయన కృప ద్వారా నీవు ఆశీర్వధించ బడతావు.
*ఆయన మీద ఆశ పెట్టుకుంటే?
సాతాను బంధకాలనుండి, పాపములనుండి, దోషములన్నిటినుండి సంపూర్ణ విడుదలను పొంది, శాంతి, సమాధానాన్ని అనుభవించగలవు.
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
మత్తయి 1:21
"యేసు" అనే మాటకు అర్ధమే "రక్షకుడు".
క్రిస్మస్ దినాలు సమీపిస్తున్నాయి.
నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్ లు దాటిపోయాయో?
వాటిలో ఇది కూడా ఒకటి కాకూడదు.
యేసయ్యను నీ హృదయంలోచేర్చుకో.
ఆయన మీదే ఆశ పెట్టుకో.
ఆ కృపను, సంపూర్ణ విమోచనను అనుభవించు.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(130వ కీర్తనా ధ్యానం సమాప్తం)
139వ కీర్తనా ధ్యానం
(మొదటి భాగం)
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
కీర్తనలు 139:1,2
1. యెహోవా పరిశోధించు వాడు:
*ఆ పరిశోధన ఏదో చూచి చూడనట్లుగావుండేది కాదు. *ఆయన కన్నుల నుండి ఏదీ తప్పించుకోలేదు.
*ఒకే చూపుతో ప్రపంచమంతా చూడగలడు.
*ఏక కాలంలో విశ్వమంతా వ్యాపించి వుండగలడు.
2.మనము కూర్చుండుట,లేచుట ఆయనకు తెలియును.
అవును!
*ఈలోకంలో అందరినీ మోసం చెయ్యగలుగుతున్నానని సంబరపడిపోతున్నావేమో?
*నీకు నీవే మోసం చేసుకొంటున్నావన్న విషయం తెలుసుకో!
ఎందుకంటే?
*ఆయన దృష్టికి కనబడని
సృష్టము ఏదియు లేదు.
*ఆయన కన్నులకు మరుగై యున్నది ఏదియు లేదు.
*సమస్తమును ఆయనకు
తేటగా కనబడు చున్నది.
హెబ్రీ 4:13
*ఆయన నుండి తప్పించుకోలేవు.
3.మనకు తలంపు పుట్టకమునుపే
మన మనస్సులో ఏముందో ఆయన గ్రహించ గలడు.
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీ 4:12
*దేవుని వాక్యము అంటే దేవుడే.
*ఆయన పైకి కనిపించే విషయాలే కాదు. నీ అంతరంగాన్ని సహితము గ్రహించగలడు.
*నీకు తలంపు రాకముందే,
ఆ తలంపు ఏంటో? ఆయనకు తెలుసు.
అట్లా అని, చెడ్డ తలంపులు రావడానికి ఆయనే కారణమా? కానేకాదు.
ఎందుకంటే?
*దేవుడు మనిషికి పరిపూర్ణ మైన స్వేశ్చనిచ్చాడు.
*అందులో భాగంగా నచ్చినట్లుగా తలంచుకొనే అవకాశమిచ్చాడు.
*నీ తలంపులకు నీవే భాధ్యుడవు తప్ప . వాటిలో దేవుని ప్రమేయం లేదు.
*నీ తలంపులు మంచివైతే?
నీ క్రియలు మంచిగా వుంటాయి.
*నీ తలంపులు చెడ్డవైతే?
నీ క్రియలూ అట్లానే వుంటాయి.
ఎట్లా వున్నాయి మన జీవితాలు?
* మన ప్రతీ కదలిక, మన హృదయ స్థితిని ఆయన పరిశోధిస్తున్నాడు.
*ఆ పరిశోధనలో పరిశుద్దులుగా
నిలబడగలమా?
సరి చేసుకుందాం!
సాగిపోదాం!
గమ్యం చేరేవరకు!
అట్టి కృప, ధన్యత
దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(రెండవ భాగం)
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. కీర్తనలు 139:3,4
మన ప్రవర్తన ఆయనకు తెలుసు:
మాటలు, చూపులు, తలంపులు, క్రియలు వీటన్నింటిని కలయికే "ప్రవర్తన"
*మన ప్రవర్తన గురించి ఆయనకెట్లా తెలుసు?
కారును తయారు చేసిన వానికి ఆ కారు గురించి తెలియకుండా ఉంటుందా?
అట్లానే,
మన హృదయాన్ని నిర్మించిన వానికి మన ప్రవర్తన గురించి తెలియకుండా ఎట్లా వుంటుంది?
యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.
తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.
ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు.
కీర్తనలు 33:13-15
*మన మాట నాలుకకు రాక మునుపే ఆయనకు పూర్తిగా తెలుసు:
ఎందుకంటే?
హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుచే, హృదయం దేనితో నిండివుందో దేవునికి తెలుసు కాబట్టి.
అయితే, ఎక్కువ సందర్భాలలో మన హృదయంలో ఉండేవి ఒకటి, బయటకి మాట్లాడేవి మరొకటి. వీటినే "కపటపు మాటలు" అంటాము.
ఇవి ఒక వేళ, మనుష్యులు కనిపెట్ట లేకపోవచ్చు గాని, ఆయనను మాత్రం మోసం చెయ్యలేము.
మనము మాట్లాడేవి నిజమైనవో? కపటమైనవో? అవి మన నోటినుండి బయటకు రాకముందే ఆయన గ్రహించగలడు.
దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆయన ఎంతటి శక్తి మంతుడో?
*ఆయనకు లోబడదాం!
* వ్యర్ధమైన, కపటపు మాటలకు దూరంగా ఉందాం!
*ఆయనకు ఇష్టమైన ప్రవర్తనగలిగి జీవిద్దాం!

వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.
ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
కీర్తనలు 139:5,6
.............................
ఆయన ఒక కోటలా మన చుట్టూ ఆవరించి యున్నాడు. ఆయనే ఒక కోటలా ఆవరించి వుంటే, ఇంకెవరు మనపై దాడిచేసి విజయం సాధించ గలరు?
ఆయన చెయ్యి నీ మీద వుంది. అది భారమైనది కాదు. ఆ చెయ్యి, నీ చేతిని పట్టుకొని గమ్యం వైపుకు నడిపించేది.
అన్ని వేళలా నీకు తోడుండేది.
ఒక దినాన్న ఈ చెయ్యి, అరణ్యంలోనున్న యాకోబుకు తోడుగా వుంది.
అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
ద్వితి 32:10
జీవితం ఎడారిగా మారిందా?
అరణ్య రోధనయ్యిందా?
బీటలు వారిందా?
కృంగి పోవలసిన పనిలేదు.
తొలకరి వర్షం రాబోతుంది.
ఎడారిని సస్య శ్యామలం
చెయ్యబోతుంది.
ఆయనయందు నమ్మిక యుంచు!చాలు!
యెహోవాయందు నమ్మిక యుంచువానిని కృప ఆవ రించుచున్నది.
కీర్తనలు 32:10
యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
కీర్తనలు 125:2
యెరూషలేముచుట్టు పర్వతములుండి, శత్రు దాడినుండి ఆ పట్టణమును
ఎట్లా కాపాడుతున్నాయో?
అట్లానే,ఆయన నీ చుట్టూ ఆవరించి అనుక్షణం సాతాను ఎక్కుపెట్టే బాణముల నుండి నిన్ను కాపాడతాడు.
ఆయన కృప ఎట్లా ఆవరించి వుంటుందో? అది మన జ్ఞానమునకు అందదు.
ఎందుకంటే?
ఆయన సర్వ జ్ఞాని.
ఆయననే ఆశ్రయిద్దాం!
ఆయన పైనే ఆధారపడదాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
కీర్తనలు 139:7
దేవుని సన్నిధి నుండి పారిపోవాలని దావీదు ఉద్దేశ్యమా? కానే కాదు.
దేవుడు సర్వ మంతటా వ్యాపించి యున్నాడు అని చెప్పడమే ఆయన ఉద్దేశ్యం.
అవును!
ఎలీషా ఆత్మనుండే గెహాజి తప్పించుకోలేక పోయాడు.
అట్లాంటప్పుడు,
ఎలీషాకు ఆ ఆత్మనిచ్చిన
దేవుని ఆత్మ నుండి ఇంకెట్లా తప్పించుకోగలము?
ఎక్కడకి పారిపోగలము?
యోనా దేవుని సన్నిధి నుండి తప్పించుకొని ఎక్కడకి పారిపోగలిగాడు?
తర్షీషు చేరగలిగాడా? లేదే?
దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావా?
ఎక్కడకి పోగలవు?
ఏమి చెయ్యగలవు?
తండ్రి నుండి పారిపోయిన చిన్న కుమారుని పరిస్థితి ఏంటి?
పందుల పొట్టును తినడానికి కూడా వెనకాడని స్థితి కదా?
తండ్రి నుండి దూరమై ఏమి చెయ్యగలిగాడు?
చేసేది ఏమి లేదు. గత్యంతరం లేక తిరిగి తండ్రి దరి చేరడం తప్ప.
నీవూ, నేనూ ఎక్కడకి పారిపోగలము?
ఎక్కడకీ పారిపోలేము.
ఆయన ఆత్మ నుండి తప్పించుకోలేము.
ఒకవేళ, నీవు పారిపోయి,
దేవునికి దూరమై,
దురలవాట్లకు బానిసై,
దుర్వ్యాపారము చేస్తూ,
దుస్థితిలో వున్నావేమో?
ఈ స్థితిలోనే జీవిత యాత్రను చాలిస్తే?
ఏమయిపోతాం?
వద్దు! అది ఊహలకే భయంకరం.
తిరిగి తండ్రి దగ్గరకు చేరదాం!
నీవే స్థితిలో వున్నా సరే?
ఆయన చేర్చుకుంటాడు.
కౌగలించుకొని ముద్దు పెట్టు కుంటాడు.
ఆయన కుమారునిగా, కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు.
పశ్చాత్తాప పడదాం!
ఆయన చెంత చేరుదాం!

నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను
నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
కీర్తనలు 139:8-10
............................
దేవుని ఆత్మ నుండి ఎట్టి పరిస్థితులలోనూ తప్పించుకోలేమని దావీదు సవిస్తరమైన వివరణ ఇస్తున్నాడు.
నేనెక్కడకి పారిపోగలను?
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు.
అవును!
యోనా కూడా అదే అనుకున్నాడు కదా?
ఓడ అడుగు భాగంలోనికి వెళ్లి దాగుకొంటే నన్నెవరు చూస్తారని.
దాగగలిగాడా?
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిర్మియా 23:24
దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. విశ్వమంతటా ఆయన వ్యాపించి యున్నాడని, నేనెక్కడున్నా ఆయన హస్తము నాకు తోడుగావుండి, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని.
మనము చెయ్యాల్సింది కూడా అదే, దేవునికి దాగివుండాలని చేసే ప్రయత్నాలు మాని, మన చేతిని ఆయన హస్తాల్లో పెట్టి నీ చిత్తానుసారంగా నడిపించమని ఆయనకు అప్పగిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(ఆరవ భాగం)
అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
కీర్తనలు 139:11,12
దుర్నీతిని, పాపమును జరిగించే ప్రతీ మనిషి చీకటినే ప్రేమిస్తాడు. ఎందుకంటే? చీకటిలో జరిగించే క్రియలు ఇతరులకు కనిపించవు కాబట్టి.
మనిషిని ఎట్లా మాయ చేస్తున్నానో? అదే విధంగా చీకటిలో జరిగించే క్రియలు దేవునికి కూడా కనిపించవులే అనే భ్రమలో మనిషి జీవిస్తున్నాడు.
*కాని ఒక్క విషయం!
దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే?ఆయన నుండి దాగుకొనుటకు చీకటిగాని, రహస్య స్థలంగాని, ఏదీ లేనేలేదు.
దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు. యోబు 34:22
*నీవు రహస్యంగా మాట్లాడే ప్రతీ మాట ఆయనకు తెలుసు. అది ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నావో కూడా తెలుసు.
చీకటిలో నీవు జరిగిస్తున్న సంగతులను వెలుగైయున్న దేవునికి దాచిపెట్టడం నీకు సాధ్యం కానేకాదు.
ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయన యొద్దనున్నది. దానియేలు 2:22
*ఆయనకు చీకటి, వెలుగు ఒకే రీతిగా వున్నాయట. చీకటి కూడా ఆయనకు వెలుగుగానే ఉంటుందట.
ఆయన మహిమే నిత్యమూ వెలుగుగా ప్రకాశిస్తుంది.
అందుకే పరలోక రాజ్యంలో సూర్యుడు, చంద్రుడు వుండరు.
ఆయనకు మరుగు చేసే ప్రయత్నం చేసి మన తప్పులను రెట్టింపు చేసుకోవడం తప్ప, ఫలితంశూన్యం.

(ఏడవ భాగం)
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. కీర్తనలు 139:13,14
దావీదు అంటున్నాడు.
*సృష్టి ధర్మము చొప్పున నేను ఈలోకంలోజన్మించలేదు.
*నా తల్లి గర్భములో నిర్మాణము చేసినవాడవు నీవే!
*నా తల్లి గర్భములో ఇంత అద్భుతమైన రూపం ఎట్లా సృష్టించావో?
*ఎముకలను ఎట్లా రూపొందించావో?
*కాళ్ళు, చేతులు వాటి శక్తికిమించి పని చేసే సామర్ధ్యం ఎట్లా ఇచ్చావో?
*సుమారు పదివేల కిలోమీటర్లు పొడవుండే ఈ రక్త నాళాలను ఎట్లా నా శరీరంలో అమర్చావో?
*ప్రపంచంలో ఏ కెమెరాలకు సాటిరాని కళ్ళను ఎట్లా నిర్మించావో?
*సుమారుగా టెన్నీస్ కోర్టు అంత పరిమాణంలో సాగే ఈ చర్మాన్ని ఈ ఎముకల గూడుకు ఎట్లా చుట్టావో?
*క్షణం తీరిక లేకుండా పనిచేసే ఆ గుండెను ఎట్లా తయారు చేసావో?
*నా మెదడును ఎట్లా రూపొందించావో? నా మెదడుకు అందనే అందదు.
*ఊపిరి తిత్తులు, మూత్ర పిండాల పనితీరు ఎంత అద్భుతంగా రూపొందించావో?
*తల్లి గర్భంలో పిండము రూపొందే విధానం మా ఊహలకు కూడా అందదు కదా?
*ఇట్లా.... శరీరములో రూపొందించిన ఏ అవయవమైనా సరే, వాటిని గురించి ఆలోచిస్తే? అది నా జ్ఞానానికి అందదు.
*వాటిని గురించి ఆలోచిస్తుంటే? నాకు భయము, ఆశ్చర్యము కలుగుతున్నాయి.
అవును!
*ఆ భయము సామాన్యమైనది కాదు. పవిత్రమైనది.
ఆ భయము దేవుని స్తుతించడానికి కారణమయ్యింది.
అసలు మనము దేవుని గురించి గాని, ఆయన గొప్ప తనమును గురించిగాని, ఇట్లా ఆలోచించనే లేము కదా?
ఆలోచించగలిగితే?
మనకు భయంతో పాటు, కృతజ్ఞతాభావం కూడా కలుగుతుంది.
ఆయనను స్తుతించకుండా వుండలేము.
*ఒక్కసారి మనస్సుపెట్టి దేవుడు ఎంతటి శక్తిమంతుడో? ఆలోచన చేద్దాం!
*ఆ సర్వశక్తిమంతునికి లోబడదాం!
*ఆయనను కొనియాడదాం!

(ఎనిమిదవ భాగం)
నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. కీర్తనలు 139:15,16
*దేవుని యొక్క దివ్యదృష్టి ఎంత ఉన్నతమైనదో? ఆయన ఎంతటి శక్తిమంతుడో? దావీదు తెలియజేస్తున్నాడు.
*భూమి యొక్క అగాధ స్థలములు అంటే తల్లి గర్భంలో మనము ఎంత విచిత్రంగా, అద్భుతంగా రూపొందించ బడ్డామో?
తల్లి గర్భంలో వుండే 9 నెలలు, ప్రతీ క్షణము జరిగే మార్పులు, ఆ ఎముకల నిర్మాణం ఏదీ కూడా ఆయనకు తెలియకుండాలేదు.
*మనము పిండముగా నున్నప్పుడే!
స్కానింగ్ కంటికి కూడా కనిపించక ముందే, ఆయన కన్నులు మనలను చూసాయి.
అప్పుడే మనము జీవించే సంవత్సరాలు కూడా నిర్దేశించ బడ్డాయి.
*అందుకే దావీదు అంటున్నాడు.
మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. కీర్తనలు 90:12
*నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే మన దినములన్నియు ఆయన గ్రంథములో లిఖితములాయెను.
*తల్లి గర్భములో ఉన్నప్పుడే,
ఒక్క దినమైనా మన జీవితంలో గడవక ముందే, మన జీవిత దినములన్నియు ఆయన గ్రంధములో వ్రాసేసాడట.
*అట్లా అని,
దేవుని ప్రణాళికలో మనకింకా ఆయుష్షు వుందని వెళ్లి బస్సు క్రిందపడితే? చావకుండా ఉంటామా?
అది దేవుని ప్రణాళికను దిక్కరించి, స్వంత ప్రణాళికను నేరవేర్చినట్లే. దానితో దేవునికి సంబంధంలేదు.
*వ్యసనాలకు బానిసయై రోగాల బారినపడి, మరణాన్ని కొనితెచ్చుకొని దేవుడు తన గ్రంధంలో ఇట్లానే వ్రాసాడు. అని చెప్పడానికి వీల్లేదు.
*ఆయన పరిశుద్దుడు. మనపట్ల కూడా ఆయనకు పరిశుద్ద మైన ప్రణాళిక వుంటుంది గాని,
ఇట్లాంటి జీవితం జీవించాలని ఆయన గ్రంధంలో వ్రాయడు.
*మన పట్ల దేవునికిగల ప్రణాళికను గుర్తెరిగి, ఆయన కోసం జీవించడానికి సిద్దపదాం!
*ఆయన మహోన్నత్వాన్ని కొనియాడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(తొమ్మిదవ భాగం)
దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది.
వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును. కీర్తనలు 139:17,18
*దావీదు ఆనందం హద్దులు దాటింది.
కారణం? దేవుడు తనపట్ల లెక్కలేనన్ని తలంపులు కలిగి వున్నాడు.
అవి బహు విస్తారమైనవి.
ఎంత విస్తారము అంటే? ఇసుకరేణువులంత విస్తారము.
యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.
కీర్తనలు 40:5
*దేవుడు మనపట్ల ఆయన కలిగియున్న ఉద్దేశ్యములు సమాధానకరమైనవి మాత్రమే. అవి ఎంత మాత్రమూ హానికరములు కావు.
నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. యిర్మియా 29:11
ఆయన మనపట్ల సమాధానకరమైన తలంపులు కలిగివుంటే?
మన జీవితాల్లో ఎందుకు సమాధానం లేదు?
మన పట్ల దేవునికిగల సమాధానకరమైన తలంపులన్నీ క్రియారూపంలోనికి ఎందుకు మారడం లేదు?
మారకపోవడానికి గల కారణం
మన ప్రవర్తనే. దీనిలో ఎట్టి సందేహం లేనేలేదు.
మన ప్రవర్తనే సమాధానాన్ని సహితం, శోధనగా మార్చుతుంది.
శ్రమలతోనే జీవితం వెళ్లబుచ్చాల్సి వస్తుంది.
అందుచే,
మన పట్ల దేవునికిగల బహు విస్తారమైన తలంపులు మన జీవితంలో నెరవేర్చేలా
మన జీవితాలను సరిచేసుకుందాం!
సమాధానాన్ని అనుభవిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(పదియవ భాగం)
దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.
వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు.
కీర్తనలు 139:19,20
.............................
పాత నిబంధనా గ్రంధంలో దుర్మార్గులైన శత్రువుల నాశనం కోసం ఎదురు చూడాలని దేవుడు తన ప్రజలకు నేర్పించాడు.
దుర్మార్గులను నాశనము చెయ్యడం దేవునికి పరిపూర్ణ న్యాయంతో కూడిన చర్య.
నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు. ద్వితి 28:7
కాని, నూతన నిబంధనా గ్రంధంలో మాత్రం అలాంటి వారికోసం, వారి మేలుకోసం, వారి మార్పుకోసం ప్రార్ధించాలని వుంది.
దావీదు అంటున్నాడు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.
*తన సహోదరుని ద్వేషించు వాడే నరహంతకుడు.
ఇట్లాంటి వారిని కాదు మనం ద్వేషించవలసినది. వారి క్రియలను ద్వేషించాలి.
దుర్మార్గము జరిగించేవాడు ఇతరులను మోసం చెయ్యడాని, లేదా నమ్మించడానికి దేవుని మీద ప్రమాణం చేస్తారు.
వారి మాటల్లోనూ, వారి క్రియల్లోనూ దుర్మార్గమే కానవస్తుంది.
మనము వారి వలే వుండకూడదు. అవును అంటే అవును అన్నట్లు ఉండాలంతే.
అట్టి రీతిగా క్రీస్తు వారి బోధనలను అనుసరించి, ఆయనను పోలి నడచుకుందాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(పదకొండవ భాగం)
యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా?
వారియందు నాకు పూర్ణద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను
కీర్తనలు 139:21,22
దేవుని శత్రువులతో దావీదు స్నేహంగా ఉండలేకపోయాడు.
దేవుని శత్రువులను అతని శత్రువులుగా లెక్కించాడు.
కారణం?
ఈలోక స్నేహం దేవునితో వైరం.
లోకంతో స్నేహం దేవునితో శత్రుత్వం.
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4:4
అయితే ఇదెట్లా సాధ్యం?
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారికొరకు ప్రార్ధన చేయుడి.
మత్తయి 5:44
అవును!
సాధ్యమే! ఆయన సిలువలో సుసాధ్యం చేసి చూపించాడు.
ఆయనను హింసిస్తున్న శత్రువుల కొరకు
" తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరిని క్షమించమని ప్రార్ధన చేసాడు”
దుర్మార్గుల క్రియలను, ఉద్దేశ్యాలను, లక్షణాలను అసహ్యించుకొంటూనే వారి మేలు కోరి ప్రార్ధించగలగాలి.
వారి మనసులుమారి క్రీస్తులో నూతనంగా జీవించగలిగితే వారినిబట్టి ఆనందించగలగాలి.
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
139వ కీర్తనా ధ్యానం
(పండ్రెండవ భాగం)
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము.

నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
కీర్తనలు 139:23,24
.............................
ఇతరుల లోపాలను ఎత్తి చూపడమే కాదు.
ముందుగా మనలో నున్న లోపాలను గుర్తించగలగాలి, సరిచేసుకోగలగాలి.
కేవలం బయటకి మాత్రమే ఆయన పక్షాన వుంటే చాలదు. అంతరంగంలో కూడా ఆయన పక్షమే వహించాలి.
దేవుడు తనను పరిశోధించి తానేమిటో ఆయన తెలుసుకున్నాడని దావీదు ముందే చెప్పాడు.
అంతేకాకుండా నా హృదయంలో ఏముందో నాకు పరిశోధించి తెలుసుకోవడం నాకు సాధ్యం కాదు
అంటున్నాడు.
ఎందుకంటే?
హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ మును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీ క్షించువాడను.
యిర్మియా 17:9,10
అందుచే,
నీవే నా హృదయాన్ని పరిశీలించమని దేవునికే అప్పగిస్తూ........
నిన్ను దుఃఖపరచే, నీ గాయాలనురేపే జీవితం నాలో ఎదయినావుంటే, నేను సరిచేసుకుంటాను. తద్వారా నన్ను శాశ్వత రాజ్యానికి నన్ను నడిపించు.
అంటూ తన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నాడు.
మన జీవితాలు ఎట్లా వున్నాయి?
మన పొరుగు వారితో మనలను పోల్చుకొని వారికంటే మేమే పరిశుద్దులమని సంబరపడి పోతున్నామా?
వద్దు!
మన పరిశుద్దత ఎంతో తెలియాలి అంటే? మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. మనలను పరిశోధించడానికి సమ్మతించాలి.
దేవుని వాక్యము ద్వారా, దేవుని సేవకులద్వారా దేవుడు మన లోపాలను ఎత్తిచూపితే? వాటిని సరిచేసుకొని, మన జీవిత గమ్యమైన నిత్య రాజ్యం చేరాలి.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(139వ కీర్తనాధ్యానం సమాప్తం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి