ఆధ్యాత్మిక సందేశాలు-2-కొన్ని కీర్తనల ధ్యానం- part-2

ఆధ్యాత్మిక సందేశాలు-2  కొన్ని కీర్తనల ధ్యానం
22  కీర్తనా ధ్యానం
(మొదటి భాగం)
నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
             కీర్తనలు 22:1
దావీదు విషమ పరిస్థితులగుండా సాగిపోతున్నప్పుడు, ఆదరణ కరువై, ఆవేదనతో చేస్తున్న గొప్ప ఆర్తధ్వని.

దేవుడే నా చెయ్యి పట్టుకుంటే?
ఆయనే నాతో వుంటే? 
ఎందుకీ శోధనలు?
లేదు. ఆయన నా చెయ్యి విడచి పెట్టేసాడు. సందేహం లేదు. అంటూ ఒక నిర్ణయానికి వచ్చేసాడేమో?

శోధన తర్వాత శోధన మనలను వెంటాడుతున్న సందర్భాలలో, మన ప్రార్ధనలకు సమాధానంరాని పరిస్థితుల్లో అనేకసార్లు మనలో జనించే తలంపు ఇదేకదా? 

కాని ఒక్క విషయం!!
ఆయనే మనలను విడచిపెట్టేస్తే? 
ఈ తలంపు రావడానికి గాని,
ఈ మాట అనడానికి గాని, మనమే బ్రతికుండే వాళ్ళం కాదు గదా?
"ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా  జీవించలేము."

ఆయన మనలను విడచి పెట్టేసాడేమో?
 అనే తలంపే మనలను అంతగా కృంగదీస్తుంటే?
 ఇక ఆయనే విడచి పెట్టేస్తే తట్టుకోగలమా? 

యేసు ప్రభువు వారు కూడా సిలువలో ఇదే మాట పలుకుతున్నారు.  
"ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము."   మత్తయి 27:46
*అన్యాయపు తీర్పుకంటే, 
*కొరడా దెబ్బలకంటే,
*ఉమ్ములు, పిడిగుద్దులు కంటే,
* సీలలు, ముండ్ల కిరీటం, బల్లెపుపోటు కంటే, 
ఆయనను బాధించిన విషయం ఏమిటంటే? 
ఆయన తట్టుకోలేక పోతున్న విషయం ఏమిటంటే?
"తండ్రితో ఎడబాటు"
(అది కూడా శాశ్వతమైన ఎడబాటు కాదు. తాత్కాళిక మైనదే )
అది అనుభవించిన వారికేతప్ప, మాటలలో వర్ణించలేనిది. 
ఆయన నిన్ను విడచిపెట్టే వాడుకాదు. నీ చెయ్యి పట్టుకోవడంకోసమే తండ్రి చేతిని విడచి పెట్టుకోవలసి వచ్చింది. 


నా దేవా నన్నెందుకు విడచిపెట్టేసావు అంటున్నాము కాని, మనము ఆయనను విడచిపెట్టేసి ఎంత కాలమయ్యిందో కదా?

సరి చేసుకుందాం! 
ఆయన చెంత చేరుదాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

22 వ కీర్తనా ధ్యానం
  (రెండవ భాగం)
నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.
                కీర్తనలు 22:2,3
         .......   .......,
దావీదు జీవితంలో శ్రమలు, శోధనల గుండా సాగిపోతున్నప్పుడు దివారాత్రములు ఆయన ప్రార్దిస్తూనే ఉన్నాడట.
ఒక దేశానికి రాజుగా వుండి, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ, యుద్దాలు జరిగిస్తూకూడా, రోజుకి 7 మార్లు ప్రార్ధించే అనుభవం దావీదుకు ఉంది.
అయినా, అతని ప్రార్ధనలకు సమాధానం రానప్పుడు, దేవుని నిందించే వాడుగా దావీదు లేడు. సరికదా, ఆయనను స్తుతించ గలుగుతున్నాడు. ఆయన నామమును గొప్ప చేయ గలుగుతున్నాడు.
కారణం?
అతనికి తెలుసు దేవుడు ఏది చేసినా సరియైనదే చేస్తాడు. తప్పుచెయ్యడని.
ఇక మన ప్రార్ధనల విషయానికి వస్తే? 
మనము దేవునితో గడిపే సమయమెంత?
మనము రాత్రి ప్రార్ధన చేస్తే,  ఉదయానికి సమాధానం వచ్చెయ్యాలి. లేకపోతే దేవుని ఉనికినే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతాం.

"నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును."
         యోహాను 11:42
ఇది యేసు ప్రభువు వారు చెప్పిన మాట. తండ్రి ఎల్లప్పుడు ఆయన ప్రార్ధన  వింటూనే వున్నాడు. దానికి సమాధానం ఇస్తూనే వున్నాడు.
కాని, మొట్టమొదటి సారిగా ఈ ప్రార్ధనకు జవాబు రాలేదు.
కారణం?
మనకు రావలసిన శిక్షను మన స్థానంలో ఆయన భరిస్తున్నాడు.
        ...........   .........

నీ ప్రార్ధనకు సమాధానం రాకపోతే, దేవునిని నిందించకు. ఆయనను స్తుతించు 
ఆయన చిత్తానికి విడచిపెట్టు. 
ఏది అవసరమో? ఎప్పుడు అవసరమో? 
నీకంటే ఆయనకే బాగా తెలుసు.
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!


                                     
                                     22 వ కీర్తనా ధ్యానం 
                                             (మూడవ భాగం)
మా పితరులు నీయందు నమి్మక యుంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి.
వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి.       కీర్తనలు 22:4,5
దావీదు తన అనుభవంలోనుండి చెప్తున్నమాట ఇది. 

*
ఎవరయితే విశ్వాసంతో ప్రార్ధన చేస్తారో? వారు తప్పకుండా వారి పరిస్థితుల నుండి విడిపించ బడతారు, రక్షించ బడతారు. 
* ఆయన యందు విశ్వాసముంచిన వారు ఎన్నటెన్నటికి సిగ్గుపడరు.

అయితే, మనమెందుకు విడుదల పొందలేక పోతున్నామంటే? 
మన సమస్యలను చూసి భయపడుతున్నాము తప్ప, ఆ సమస్యల నుండి విడిపించడానికి మన దేవుడు సమర్ధుడు. లేకపోతున్నాం అని విశ్వసించ. 
తద్వారా దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసేవారిగా వుండి, ప్రతి ఫలాలను పొందలేకపోతున్నాం. 

430
సంవత్సరాలు ఐగుప్తు దాస్యములో నున్న ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టినప్పుడు వారిని ఏ రీతిగా దేవుడు విడిపించి, కనానులో ప్రవేశ పెట్టాడో? ఆ విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకొంటున్నాడు. 

ఒక్క విషయం! 
*
ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏక రీతిగావున్న దేవుడు.
*
తరాలుమారినా, యుగాలుమారినా ఆయన మార్పులేని దేవుడు. 

*
మన పితరులను రక్షించిన దేవుడు మనలనూ రక్షించగల సమర్ధుడు. 
*
మన పితరులను విడిపించిన దేవుడు మనలనూ విడిపించగల సమర్ధుడు 
*
మన పితరులను సిగ్గుపరచని దేవుడు మనలనూ సిగ్గు పరచడు.
*
మన పితరులకు తోడైయున్న దేవుడు మనకునూ తోడుగా ఉంటాడు. 

అయితే, మనము చెయ్యాల్సింది ఒక్కటే!!!
"
ఆయన యందు విశ్వాసముంచాలి."
*
నీ ప్రతీ సమస్యకూ ఆయనే పరిష్కారం. 
*
నీ ప్రతీ ప్రశ్నకూ ఆయనే సమాధానం 

విశ్వసిద్దాం! 
విడిపించ బడదాం!
విజయం సాదిద్దాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                                              22 వ కీర్తనా ధ్యానం 
                                               (నాలుగవ భాగం)

నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.
నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.        కీర్తనలు 22:6,7
యేసు క్రీస్తు సిలువ మరణం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు తన కీర్తనలో ప్రవచించాడు. అది సున్నయినా, పొల్లయినా తప్పిపోకుండా అట్లానే నెరవేరింది. 

1.
పురుగు వంటివాడు: 
పురుగు మనుష్యుల చెప్పులు క్రింద నలిగిపోయే అల్ప జీవి. 
పురుగు కంటే బలహీన మైనది, వికారమైనది, మనుష్యుల తృణీకారమునకు గురయ్యేది మరేది లేదు. 
ఎందుకు యేసయ్య అంతగా తగ్గించుకోవలసి వచ్చింది?
ఆయన పాపులకు ప్రతిగా అతినీచులు, హీనులు, బలహీనులమైన మన స్థానంలో వున్నాడు కాబట్టి. 

2.
తృణీకరింపబడినవాడు:
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను     యెషయ 53:3

3.
దూషించబడిన వాడు:
ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి   మత్తయి 27:39,40

ఆయన చనిపోయి మూడవ దినమున లేస్తానని ఆయన పునరుత్థానమును గురించి చెప్పిన మాట వారికి అర్ధం కాక, ఆయనను అపహాస్యము  చేస్తున్న సందర్భమిది. 

*ఆయన ఎందుకు పురుగు వంటి దీనస్థితికి దిగజార వలసి వచ్చింది? 
*
ఎందుకు తృణీకరించ బడవలసి వచ్చింది? 
*
ఎందుకు దూషించ బడవలసి వచ్చింది? 

నీ కోసమే!! 
నా కోసమే!! 

ఇంకనూ ఆయన ప్రేమను, త్యాగాన్ని అర్ధం చేసుకోకుండా జీవిస్తున్నామేమో? 

వద్దు!!
*
పశ్చాత్తాప పడదాం!
*
ఆయన పాదాల చెంత
 ప్రణమిల్లుదాం! 
*
ఆయనకోసం జీవిద్దాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 



                                         22 వ కీర్తనా ధ్యానం 
                                                          (ఐదవ భాగం)

యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.       కీర్తనలు 22:8

యేసు క్రీస్తు సిలువ మరణం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు తన కీర్తనలో ప్రవచించాడు. అది సున్నయినా, పొల్లయినా తప్పిపోకుండా అట్లానే నెరవేరింది. 
"వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి."
    మత్తయి 27:43,44


దావీదు జీవితంలో కూడా శోధనల గుండా సాగిపోతున్నప్పుడు, అనేకులు ఈ రీతిగా నిందించిన సందర్భాలెన్నో?
విశ్వాస యాత్రలో సాగిపోతున్న మనలను ఆ మార్గము నుండి తప్పించడానికి శోధకుడు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. 

అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో మనకే అర్ధం కాక, తల్లడిల్లుపోతున్న  సమయంలో, మన శోధనలకు లోకంతోడై, మనలను ఇంకా  క్రుంగ దీసిన సందర్భాలెన్నో?

మందిరానికి వెళ్తారు, 
ప్రార్ధన చేస్తున్నారు, 
వీరే దేవునికి ఇష్టులైతే?
వీరికే శోధనలు ఎందుకు? 
వచ్చినా, దేవుడు తప్పించాలి కదా?
అంటూ... లోకం సంధించే ప్రశ్నలెన్నో? 

ఒక్కవిషయం  జ్ఞాపకముంచుకో!
నీ ప్రియ రక్షకుడైన యేసయ్యను సహితం లోకం నిందించింది. 
ఇక నీవెంత?
నేనెంత?

లోకం మాటలకు క్రుంగిపోవద్దు.
దాని పోకడలకు లొంగి పోవద్దు. 

నీ భారం యెహోవామీద మోపు. 
ఆయనే నిన్ను విడిపిస్తాడు.
ఆయనే నిన్ను తప్పిస్తాడు.
సందేహం లేనే లేదు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                            22 వ కీర్తనా ధ్యానం 
                                              (ఆరవ భాగం)
గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవునీవే.
             కీర్తనలు  22:9,10

తన తండ్రియైన దేవునిపై తనకున్న నమ్మకాన్ని యేసయ్య మనమం చేసుకొంటున్న సందర్భమిది.
దావీదు కూడా శోధనలగుండా  ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవునిపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు. 

*
దేవా నన్నెందుకు విడచి పెట్టేసావ్?
*
నా ప్రార్ధన ఎందుకు వినట్లేదు? 
*
నేనెందుకు  అపహాస్యం పాలయ్యాను?
*
నన్ను రూపించినది నీవే కదా?
*
జన్మింప చేసింది నీవే కదా?
*
నా తల్లి దగ్గర పాలు త్రాగుతున్నప్పుడు నీవే కదా నీకు తోడుగా వున్నానని నమ్మకాన్ని కలుగజేసావు? 
*
నా దేవుడవు నీవే కదా?
అయిననూ, నాకెందుకు ఈ శోధనలు? 

మన జీవితంలో కూడా ఇట్లాంటి ప్రశ్నలే తలెత్తిన సందర్భాలెన్నో కదా? 

కాని ఒక్క విషయం!!
*నీవు పిండముగా రూపింపబడక ముందే ఆయన కన్నులు నిన్ను చూసాయి. 
*
నియమింప బడిన దినాలలో ఒక్కటైనా కాక మునుపే, నీ దినములన్నియు ఆయన గ్రంధములో వ్రాయ బడ్డాయి. 
*
ఆయన అరచేతిలో నీవు చెక్కబడ్డావు. 
*
ఆయన ప్రణాళికలో నీవున్నావు.

నారు పోసినవాడు -----నీరు పోయడా?
పుట్టించిన వాడు-------పోషించడా? 

ఆయన యందు విశ్వాసముంచు.
నీ జీవితాన్ని ఆయనకప్పగించు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                         22 వ కీర్తనా ధ్యానం 
                                            (ఏడవ భాగం) 
శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడునాకు దూరముగా నుండకుము.
వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి .చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు   కీర్తనలు  22:11-13

యేసు క్రీస్తు అంధకార శక్తులతో ఒంటరిగా పోరాడుతున్న సమయంలో తండ్రి సహాయం కోసం అర్ధిస్తున్న సందర్భమిది.

ఎందుకంటే?
శత్రువులు ఆగ్రహంతో చిందులు తొక్కుతున్న భాషాను ప్రాంతపు ఎద్దులువలే నున్నారు.
గర్జించే సింహాలవలే నోళ్ళు తెరచి  ఎదురు చూస్తున్నారు. 
         
దావీదు జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవాలెన్నో? 
కన్న బిడ్డలే శత్రువులై, తండ్రిని కడతేర్చాలని ప్రయత్నం చేసిన సందర్భాలెన్నో? 

మన జీవితాల్లోనూ ఇట్లాంటి సందర్భాలెన్నో కదా? 

సామాజిక, కుటుంబ, ఆర్ధిక, మానసిక, ఆరోగ్య సమస్యలు శత్రువులుగా మారి మనలనను వేదనకు గురిచేస్తున్న పరిస్థితులలో మన ఆక్రందన, ఆర్తధ్వని కూడా             ఇదేకదా!
తండ్రీ! శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.

అవును!
పిలిస్తే దాటిపోయేవాడుకాదు   నీ దేవుడు.
దూరమయ్యేవాడు అంతకన్నా కాదు. 

నీవే పరిస్థితులలోవున్నా సరే! 
ఆ పరిస్థితిని ఆయనకు అప్పగించు. 
అవి వృషభంలా బలమైనవైనా?
సింహంలా గర్జించేవైనా?

ఆయన యందు విశ్వాసముంచు.
నీ జీవితాన్ని ఆయనకప్పగించు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                          22 వ కీర్తనా ధ్యానం 
                                           (ఎనిమిదవ భాగం) 
నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలెకరగియున్నది.
నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.
కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.    కీర్తనలు  22:14-16

యేసు క్రీస్తు సిలువ మరణం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు తన కీర్తనలో ప్రవచించాడు. అది సున్నయినా, పొల్లయినా తప్పిపోకుండా అట్లానే నెరవేరింది. 

ఇది అంతరంగంలో అనారోగ్యం, నిస్సత్తువ, శారీరికమైన యాతనలను సూచిస్తుంది. 
ఆయన చేతులకు కొట్టిన మేకుల ఆధారంతో ఆయన శరీరం వ్రేలాడుతూ వుంది..  ఎముకలు కీళ్ళు కండరాలు పోతూమెల్లమెల్లగా విడి నరాలు. పట్టు తప్పుతున్నాయి. 
నోరు కూడా ఎండిపోయింది:
అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.     యోహాను 19:28

కల్వరిగిరిలో మన స్థానంను ఆయన తీసుకొని మూడు మేకులతో భూమికి ఆకాశమునకు మధ్యలో ఆయన వ్రేలాడుతున్న దృశ్యాన్ని దావీదు ఏనాడో ప్రవచించాడు. 

కుక్కల్లా మండిపడుతున్న శత్రువులు ఆయనను పొడిచారు. అంటే, ఇనుప మేకులు ఆయన కాళ్ళనూ, చేతులనూ సిలువ కొయ్యలోకి దిగగొట్టారు. 
ఇన్ని శ్రమలు ఎవరికోసం?     ఎందు కోసం? 

నీ కోసమే!!       నా కోసమే!! 
ఇంకనూ ఆయన ప్రేమను, త్యాగాన్ని అర్ధం చేసుకోకుండా జీవిస్తున్నామేమో? 

వద్దు!!
*
పశ్చాత్తాప పడదాం!
*
ఆయన పాదాల చెంతప్రణమిల్లుదాం! 
*
ఆయనకోసం జీవిద్దాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                      22  కీర్తనా ధ్యానం
                                     (తొమ్మిదవ  భాగం) 
నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు.
నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.
యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.     కీర్తనలు 22:17-19

యేసు క్రీస్తు సిలువ మరణం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు తన కీర్తనలో ప్రవచించాడు. అది సున్నయినా, పొల్లయినా తప్పిపోకుండా అట్లానే నెరవేరింది. 

పూర్వ కాలంలో యుద్దంలో జయించిన వారు, తమ చేతిలో ఓడిపోయిన వారి బట్టలు తీసివేసి, గొలుసులతో బంధించి తీసుకొని పోయేవారు. 
బట్టలు తీసి వేయడం అవమానమునకు, ఓటమికి గుర్తు. 
ఈ విధంగా సిలువలో క్రీస్తు శత్రువులు ఆయనపై పూర్తి విజయం సాధించినట్లయ్యింది. 

ఆయన వస్త్రాలు, అంగీ తీసివేసి చీట్లు వేసుకొని పంచుకున్నారు. 
ఎందుకాయన ఓటమిపాలు కావలసి వచ్చింది? 
*లేఖనముల నెరవేర్పు కోసం. 
*నీకు విడుదల, విజయాన్ని ఇవ్వడం కోసం. 

క్రీస్తుకువున్న బలం తండ్రియైన దేవుడే. 
నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.
                యోహాను 5:30

యేసయ్యే  దేవుడై యుండి  తన తండ్రి యైన దేవుని బలముగా కలిగి యున్నాడు. ఆయన పైనే ఆధారపడుతున్నాడు.

మన బలమెవరు?
వేటి పైన ఆధార పడుతున్నాం?
ఆస్థులా?
అంతస్తులా? 
ధనమా? 
అధికారమా? 

ఆయన సిలువలో చిందించిన రక్తం తప్ప, ఇవేవి నిన్ను విడిపించ లేవు. 
శాంతిని సమాధానాన్ని అనుగ్రహించలేవు. 
*పశ్చాత్తాప పడదాం!
*ఆయన పాదాల చెంత
 ప్రణమిల్లుదాం! 
*ఆయనకోసం జీవిద్దాం! 
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                              22  కీర్తనా ధ్యానం 
                                              (పదియవ భాగం) 
ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించినాకుత్తరమిచ్చి యున్నావు
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. కీర్తనలు 22:19-22

ఆయన గుండెల్లో నుండి దూసుకు పోవడానికి సిద్దంగానున్న  సిలువ అనే ఆ "ఖడ్గం" నుండి,  
కుక్కల్లా మండిపడుతున్న శత్రువుల చేతిలోనుండి తప్పించమని ప్రార్ధించే సందర్భమిది. 

కాని, ఈ ప్రార్ధన కూడా దేవుని చిత్తానికే అప్పగిస్తున్నాడు. గేత్సేమనే వనంలో ఆయన చేసిన ప్రార్ధన " తండ్రీ నీ చిత్తమైతే ఈపాత్ర నా యొద్దనుండి తొలగించు. లేని యెడల, నీ చిత్తమే సిద్ధించు గాక!"
మన ప్రార్ధన దేవుని చిత్తానికే లోబడిఉందా? లేక మన చిత్తమే నెరవేరాలని పట్టుబడుతున్నామా? 

సిలువపై ఆయన వ్రేలాడడం అడవి దున్నల కొమ్ములకు వ్రేలాడినట్లుగా వుంది. 
అయితే, ఆయన ఒక విషయాన్ని నమ్ముతున్నాడు తండ్రి తనను సమాధి నుండి లేపుతాడని. అందుకే ఆయన అంటున్నాడు. "రక్షించి నాకు ఉత్తరమిచ్చి యున్నావు"అని.

మనమూ ఇట్లాంటి అనుభవం లోనికి ప్రవేశించాలి. మనం దేని నిమిత్తం ప్రార్దిస్తున్నామో దానిని దేవుడు అనుగ్రహించాడు అని నమ్మగలగడం. 

తాను ఎవరి కోసమైతే మరణిస్తున్నాడో వారిని సహోదరులు అని పిలుస్తున్నాడు. 
కాని మనము ఆయనను అట్లా పిలవలేక పోయాము. శత్రువుగానే భావించాము. 
నేటికీ అదే పరిస్థితిలో కొనసాగుతున్నామా? 

*పశ్చాత్తాప పడదాం!
*ఆయన పాదాల చెంత
 ప్రణమిల్లుదాం! 
*ఆయనకోసం జీవిద్దాం! 
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                                 22 వ కీర్తనా ధ్యానం 
                                    (పదకొండవ భాగం) 

యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకుభయపడుడి   కీర్తనలు 22:23

బైబిల్ గ్రంధములో అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే "దేవుని యందు భయ భక్తులు". 
ఎందుకంటే, ఆయనను స్తుతించే వారముగా మనముండాలంటే భయముతో కూడిన భక్తి అవసరం. 

క్రీస్తు జీవితమంతా దేవునికి మహిమార్ధంగానే జీవించారు., సిలువ మరణంకూడా, దేవుని మహిమార్ధమే. అట్లానే మనము కూడా దేవునికి మహిమార్ధంగా వుండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. 

తాను స్వయంగా చెయ్యనిది ఏది మనలను చెయ్యమనడు. ఆయన తాను బోధించిన దానంతటికి ఆయన తానే మనకు లోపం లేని ఆదర్శం. 

దేవుని ఎవరు స్తుతించాలి? 
ఎవరు భయపడాలి?
యాకోబు వంశస్తులు
ఇశ్రాయేలు వంశస్తులు 

యాకోబు, ఇశ్రాయేలు ఒక్కరే కదా? 
అవును. 

మరెందుకలా?
యాకోబు వంశము అంటే?
ఆయనకు జన్మించిన 12 గోత్రముల ప్రజలు. 
(
శారీరిక మైనది)

ఇశ్రాయేలు వంశం అంటే?
అన్యులుగా వుండి,    యేసయ్య సిలువ మరణం ద్వారా ఇశ్రాయేలుగా తీర్చబడిన మనమే. (ఆత్మీయ మైనది) 

ఇట్లాంటి ఆధిక్యతనిచ్చిన మన ప్రియ రక్షకుని స్తుతిద్దాం!
ఆయనకు భయపడదాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                        22  కీర్తనా ధ్యానం 
                                        (పండ్రెండవ భాగం) 
ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు.వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.      కీర్తనలు 22:24
   
దేవుని స్తుతించడానికి ఇంతకన్నా మంచి కారణం ఏమి కావాలి? 

*నీవు బాధలలో వున్నప్పుడు నిన్ను త్రుణీకరించే వాడు కాదు. 
నీ బాధలలో ఆయనే ఓదార్పు. 
* నీ బాధలను చూసి అసహ్యించుకొనే వాడు కాదు. హక్కున చేర్చుకొనేవాడు.

* నీ బాధలలో ఆయన ముఖాన్ని మరుగు చేసుకొనేవాడు కాదు. 
ఆయన ముఖ కాంతిని నీమీద ప్రకాశింపజేసేవాడు.

*నీ ప్రార్ధనలను పెడచెవిని పెట్టేవాడు కాదు. నీ ప్రార్ధనలకు సమాధాన మిచ్చేవాడు. 

యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు తండ్రి తన ముఖాన్ని త్రిప్పేసుకోవడం తాత్కాలికమే. 
తర్వాత అగాధంలో నుండి ఆయన ప్రార్ధించినప్పుడు ఆయన ప్రార్ధన విన్నాడు. 

*నీ ప్రార్ధనలకు సమాధానం రావట్లేదా? 
*ఆయన ముఖాన్ని త్రిప్పేసు కున్నాడేమో? అనే సందేహమా? 
*ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని, 
అలక్ష్యం మాత్రం చెయ్యడు.
*ఆ ఆలస్యంలో కూడా మేలే దాగివుంటుంది తప్ప, కీడేమి వుండదు. 
*నీకున్న అవసరతలు ఏంటో నీకన్నా ఆయనకే బాగా తెలుసు. 
 *తగిన సమయమందు తప్పక సహాయం చేస్తాడు. 

విశ్వసిద్దాం!
ఆయనను స్తుతిద్దాం!
ఆయనకు భయపడదాం!
పొందుకుందాం!


ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                       22  కీర్తనా ధ్యానం 
                                      (పదమూడవ భాగం) 
మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.        కీర్తనలు 22:25

దావీదు అంటున్నాడు. 
మహా సమాజములో నిన్ను గూర్చి కీర్తన పాడతాను. అంటే సంఘములో చేరి నిన్ను స్తుతిస్తాను. 
ఎందుకు అట్లా? 
ఒంటరిగా స్తుతించకూడదా ?

ఎందుకంటే?
"ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను."       మత్తయి 18:20

అంటే? మనం ఒంటరిగా వున్న చోట దేవుడు ఉండడా? 
ఒంటరిగా స్తుతిస్తే దేవుని చేరదా? 

అట్లా అనికాదు.
ఏకీభవించి చేసే ప్రార్ధనగాని, స్తుతిగాని చాల శక్తివంతమైనవి. 

 దావీదు ఎక్కడ స్తుతిస్తాడట? 
దేవుని యందు భయ భక్తులు గలవారి ఎదుట ఆయనను స్తుతిస్తాడట.

రోజుకి ఏడు మార్లు ప్రార్ధించే దావీదుకి సహితం, దేవుని స్తుతించడానికి విశ్వాసుల సహవాసం కావాలట. 

మన పరిస్థితి ఎట్లా వుంది?
దావీదుకున్న తలంపులు గాని, అనుభవాలు గాని మనకున్నాయా? 

ఏవో సాకులు చెప్పి విశ్వాసులతో కలసి, దేవుని స్తుతించే ఆ విలువైన సహవాసాన్ని కోల్పోతున్నామా? 

కనీసం వారమునకు రెండు గంటలైనా ఆయన సన్నిధిలో చేరి, ఆయనను స్తుతించలేక పోతున్నామేమో? 
మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. 
దేవుని సన్నిధినిచేరి, విశ్వాసుల సమూహంతో ఆయన నామమును గొప్ప చేద్దాం! 


ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                     22 వ కీర్తనా ధ్యానం 
                                   (పదునాలుగవ భాగం)

దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు
మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.      కీర్తనలు 22:26 

పరలోకం నుండి వచ్చిన ఆహారమైన యేసు ప్రభువులో సాత్వీకం, వినయం గలవారు గొప్ప సంతృప్తిని అనుభవిస్తారు. 
ఆయనే అంటున్నాడు "జీవాహారం నేనే" 

కృంగిన నీ ప్రాణం తెప్పరిల్లాలి అంటే?
నీవు ఆయనను వెదకాలి. పట్టుకోవాలి. 

అయన ఎక్కడుంటాడు?
నీ హృదయమనే తలుపునొద్ద ఉండి నీహృధయపు ద్వారం తట్టుచున్నాడు.. పిలిస్తే నీహృధయంలోనికి వస్తాడు.

ఆయన లోపలికి  వస్తే?
ఆయనతో పాటు శాంతి,
సమాధానం నీ హృదయంలోనికి వస్తుంది.
కృంగిన నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. తెప్పరిల్లలిన ప్రాణం నిత్యము బ్రతుకుతుంది. 

ఈ జీవితం ఈలోకానికే పరిమితం కాదు. ఈజీవితం ముగిశాక మరో జీవితం ఉంది. అది శాశ్వత జీవం.

అది నిత్య జీవం అయినా కావొచ్చు.
నిత్య మరణం అయినా కావొచ్చు. 

నిత్య మరణం అత్యంత ఘోరం. 
అది ఊహలకే భయంకరం. 

నిత్య జీవమైతే శాశ్వతకాలం నీ యేసయ్యతో గడిపే జీవితం. 
ఆ రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనను వెదకాలి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                     22 వ కీర్తనా ధ్యానం 
                                     (పదిహేనవ  భాగం)
భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు
రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే.   కీర్తనలు 22:27,28


భూ నివాసులందరూ ఆయన తట్టు తిరగడానికి, 
అన్య జనులందరూ ఆయనను ఆరాధించడానికి ఒకే ఒక్క కారణం. అదే, యేసు ప్రభువు  సిలువలో చేసిన అద్భుతమైన త్యాగం. 

ఏ పరిశుద్దత లేని నిన్నూ, నన్నూ ఆ అత్యున్నత సింహాసనము చెంత నిలువ బెట్టగలిగింది ఆ త్యాగమే. 

ప్రభువా అని పిలవడానికి కూడా అర్హతలేని మనలను ముఖాముఖిగా ఆయన చెంతచేరి స్తుతించగలిగే ధన్యత నిచ్చింది ఆ త్యాగమే. 

అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని, సంహాసనము ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి!
సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
       ప్రకటన 7:9,10


అవును!!
స్తోత్రార్హుడు ఆయనే!
రాజ్యం చేయువాడును ఆయనే! 

అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
           మత్తయి  28:18


కాబట్టి!
ఆయన అధికారమునకు లోబడి జీవిద్దాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                   22 వ కీర్తనా ధ్యానం 
                                   (పదహారవ భాగం)

భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగువారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు.
ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.
వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.
            కీర్తనలు 22:29-31


క్రీస్తులో అందరికి చాలినంత ఆహారం వుంది. అందరూ వినయ విధేయతలు కలిగి ఆయనను ఆరాధించాలి. 
ప్రతీ మోకాలు వంగి ఆయనకు నమస్కరించాలి. 

ఎందుకనగా? 
భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
     ఫిలిప్పి 2:10,11


ఆయనకు చెందవలసిన స్తుతి, ఆరాధన అంతము లేనిది. అది తరము వెంబడి తరముకు అట్లా ప్రయాణిస్తూనే వుంది. 

అన్ని కాలాలలోనూ దేవుని ప్రజలు ధ్యానించే శ్రేష్టమైన అంశం దేవుని నీతి న్యాయాలు. 

ఆయన మనలను నిర్దోషులునుగా చేసే మార్గం "సిలువపై త్యాగం"

విశ్వాసులను దేవుడు ఎన్నడూ చెయ్యి విడచి పెట్టకుండా ఉండేందుకు  తన ప్రియ కుమారుడైన యేసయ్య చేతిని విడచిపెట్టాడు. 

మనం శాశ్వత విడుదల పొందగలిగేందుకు ఆయన సింహం నోట చిక్కాడు. 

ఇంత చేసినా??? 
ఆయనను గనుక మనం నిరాకరిస్తే? 
శాశ్వత జీవాన్ని వదులుకోవాల్సిందే. 
మనకు ఇకమిగిలేది. 
సింహపు నోరు, నిత్య మరణమే. 

*
పశ్చాత్తాప పడదాం!
*
ఆయన పాదాల చెంత
 ప్రణమిల్లుదాం! 
ఆ నిత్య రాజ్యానికి వారసులవుదాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
(22
వ కీర్తనా ధ్యానం సమాప్తం) 



                                    23 వ కీర్తనా ధ్యానం

                                         (మొదటి భాగం)


యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
                   కీర్తన 23:1

యెహోవా మనకు కాపరిగా వుంటే ఏది కొదువ లేదట. అయితే మన జీవితమంతా కష్టాలే, శోధనలే, ఇబ్బందులే.
ఎందుకిలా?

అయితే ఇది అందరి విషయంలో కాదేమో? అవును.  అందరి విషయంలో కాదు. ఎవరు అయితే ఆయనను కాపరిగా కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రమే.

ఇంతకి మనం ఆయన మందలో వున్నామా?
ఆయనేనా మన కాపరి?

ఆలోచించు!!!
గొర్రెలకు కాపరి ముందుంటాడు.
పందులకు కాపరి వెనుకుంటాడు.
ఇంతకి మనమెవరము?
గొర్రెలమా? లేక ..........?

నీవు గొర్రెవు అయితే ???
1.నీముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య వుండాలి.
2.నీ కాపరి అడుగుజాడల్లో నడవాలి.
3.ఆయన స్వరం వినాలి.
4. గొర్రెలకుగాయ పరచే అవయవాలు( కొమ్ములు) లేవు.  అట్లాంటి సాదు స్వభావం నీకుండాలి
.నీ మాటలు గాని, నీ క్రియలుగాని ఎవ్వరిని గాయపరచే విధంగా ఉండకూడదు.
5. వాటి సంఖ్యా బలం వాటిని రక్షించ లేదు. ఒక్క  గోర్రేవున్నా, లక్ష గొర్రెలు కలసి వున్నా తోడేలు సులభంగా వాటిని ఎత్తుకొని పోగలదు.
నీవెనుక నున్నవారు, నీ ఆస్తులు, నీ ధనము నీ బలం కాకూడదు. ఆయనే నీ బలం అయ్యుండాలి.
6. గొర్రె స్వచ్చమైననీరు త్రాగుతుంది. మరి మనం?
7.స్వచ్చమైన ఆకుపచ్చని మొక్కలను తింటుంది. ఎండినవి, క్రుల్లినవాటి జోలికిపోదు.
8. గొర్రెను  బలవంతంగా త్రోసినా బురదలో పడడానికి ఇష్టపడదు. మనం ? ఆ ఆవకాశం కోసం ఎదురు చూస్తుంటాం.
9.గొర్రె  ఒకవేళ అది బురదలో పడినా ఒక్క నిమిషం దానిలో ఉండలేదు. ఆలస్యం అయితే చనిపోతుంది కూడా. మనం? సంవత్సరాల తరబడి దానిలోనే జీవితం.
10.మాంసం అమ్మే వాడు ఒక గొర్రెను మెడ నరికినా, దానిని చూచి మిగిలిన గొర్రెలు వాడిమీద తిరుగబడవు. తర్వాత నేనే అన్నట్లుగా అక్కడే వుంటాయి. దేవుని కోసం ప్రాణం పోగొట్టుకోవలసిన పరిస్టితులు అయినా వాటికోసం సిద్దపడాలి.
     ......      ........    ......

నిజమయిన గొర్రెలుగా ఆయన మందలో చేరుదాం!
ఆయన మందలో నీవుంటే, ఆయన నీ కాపరిగా వుంటే, ఈ వాగ్దానాలు నీ స్వంతం.

"సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు."   కీర్తన 34:10

"కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును."
            ఫిలిప్పి  4:19

"అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల వాడు మన దేవుడు "
                    ఎఫెస్సి 3:20

ఆయన మందలో చేరుదాం!
ఆయన కాపరత్వం క్రింద ఉందాం!
అట్లా వుండగలిగితే .... ఎన్ని క్రూర మృగాలు ( సాతాను శోధనలు) వచ్చినా, వాటన్నిటి నుండి విడిపించి గొర్రెల దొడ్డి ( నిత్య జీవం) లోనికి నడిపించ గలడు.

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!



                                           23 వ కీర్తనా ధ్యానం
                                             (రెండవ భాగం)

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.     కీర్తన 23:1
("యెహోవా రోయి" = యెహోవా నా కాపరి)
         .........................

ఆయనే నా కాపరిగా వున్నాడు.
ఆయన మందలోనే నేనున్నాను.
ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నాను.
అయినా? ..... నా జీవితంలో ఎందుకీ శోధనలు? మన జీవితంలో ఈ ప్రశ్నలు తలెత్తిన సందర్భాలెన్నో కదా?

"శోధనల ద్వారా దేవుడు నిన్ను పరిపూర్ణత లోనికి తీసుకెళ్తాడు."

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటముపొందును.
                యాకోబు 1:12
           ........................,
*కుమ్మరివాని చేతిలోని బంకమన్నుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే!కాల్చబడాల్సిందే!

*కంసాలి చేతిలో బంగారం పరిశుద్ద పరచాబడాలంటే అది నిప్పులకోలిమిలో మండాల్సిందే!

*వజ్రం ప్రకాశించాలంటే అది చెక్క బడాల్సిందే!

రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే!

నీవు పరిపూర్ణత చెందాలంటే శోధనలను సహించ వలసిందే!
              ...............................

ఎంత వరకు?
*కుండ పగిలిపోతుంది అనుకొంటే కుమ్మరి మంటను ఆపేస్తాడు.

*బంగారం పరిశుద్ద పరచబడిన తర్వాత ఆవిరి అయిపోతుంది అనుకొంటే కంసాలి కొలిమిని ఆపేస్తాడు.

*నీవు శోధనలు తట్టుకోలేని పరిస్టితులు వస్తే ఆయన కలుగచేసుకుంటాడు. నీవు భరించలేనంత శోధనలు నీ మీదకి రానియ్యడు. వస్తే ఆయన కృపను ఎల్లప్పుడు నీకు తోడుగా వుంచుతాడు.

ఎందుకంటే,
ఆయన నిన్ను రక్షించేవాడు. 
నిన్ను నడిపించేవాడు.
నిన్ను విడిపించేవాడు

అది అగ్నిగుండం అయినా,
ఎర్ర సముద్రం అయినా,
సింహాల బోనయినా, ఏదయినా సరే!
నీ కాపరి నీకు తోడుగా వున్నాడు.
సందేహించకు!
ఆగిపోక సాగిపో!
నీ కాపరి బాటలో!

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

                                       23 వ కీర్తనా ధ్యానం 
                                         (మూడవ భాగం)
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.     కీర్తన 23:1
ఆయన మన కాపరిగా వుంటే, మరెందుకు ఆయన మన సమస్యల పట్ల వెంటనే స్పందించుట లేదు

ఎప్పుడు, ఎట్లా స్పందించాలో
ఆయనకు అన్నీ తెలుసు
మందను గురించి    ఆయనకు తెలిసినంతగా  మరెవ్వరికి తెలియదు.
చూలికట్టిన గొర్రెలను యేరీతిగా నడిపించాలో?
చిన్న గొర్రెపిల్లలను యేరీతిగా పెంచాలో?
బలహీనమయిన వాటిని యేరీతిగా సంరక్షించాలో
గాయపడిన వాటికి యేరీతిగా కట్లుకట్టాలో
నడవలేనివాటిని యేరీతిగా తన భుజాలపై మోయాలో
అన్ని ఆయనకు తెలుసు

"నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను." 139:16

నీవు ఈ భూమి మీద అడుగు పెట్టకముందే నీవేమిటో ఆయనకు తెలుసు. నీకొచ్చే సమస్యలేమిటో
వాటి పరిష్కారాలు ఏమిటో? ఆయనకు తెలుసు
అబ్రహాము కత్తి పైకి ఎత్తే వరకు దేవుడు స్పందించలేదు. ఆ కత్తి ఇస్సాకు మెడ మీదకి దిగబోతుండగా ..... ఆయన ప్రణాలికను నెరవేర్చాడు
మన జీవితంలోకూడా అదే జరుగబోతుంది. సరయిన సమయంలో ఆయన స్పందిస్తాడుకలవరపడకు.
ఆయన నీ మంచి కాపరి

అటు ఇటు చూడకు దారి తప్పిపోకు
పొదలమాటున తోడేళ్ళు పొంచి ఉంటాయ్.

యేసయ్య వైపు చూస్తూ ....ముందుకు సాగిపోగమ్యం చేరువరకు
మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్
                                         23 వ కీర్తనా ధ్యానం 
                                          ( నాలుగవ భాగం)
     
"పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు  శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు." 
                            కీర్తన 23:2

మన మంచి కాపరి గొర్రెలను పచ్చికగల సమృద్ది అయిన ప్రాంతాలకు వాటిని తోడుకొని వెళ్తాడు.
 (ఉదా: గల్ఫ్, ఇశ్రాయేలు వంటి ప్రాంతాలకు తీసుకొని వెళ్తున్నాడు)

తన మంద ఆకలితో అలమటిస్తూ పండుకోవడానికి ఆయన ఇష్టపడదు. ఆయనే మందను మేపి పరున్దబెడతాడు.
"నేనే నా గొఱ్ఱలను మేపి పరుండబెట్టుదును."    యేహెజ్కేలు 34:15

ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా తనమందను పరుండబెట్టి కావలికాస్తున్నాడు. 

"యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు."            కీర్తనలు 4:8

అంతేకాదు శాంతి జలాల చెంతకు నిన్ను నడిపిస్తాడు. నడవలేకపోతే ఆయనే నిన్ను మోసుకోనిపోతాడు. 

"గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును."  యెషయ 40:11

నీకు ఆహారము, ఆరోగ్యము,భద్రత, క్షేమము ఆయనయందే....
ఆయనే కాపరిగా నీకుండగా
ఇక భయమెందుకు దండగ. 
సాగిపో!! ... ఆగిపోక!!
ఆ నిత్య రాజ్యం చేరువరకు.

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                           23 వ కీర్తనా ధ్యానం 
                                              ( ఐదవ భాగం)

నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
          కీర్తనలు 23:3 

విశ్వాసులు ఈలోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు. అలాంటి కృంగిన స్థితిలో వున్నప్పుడు కాపరి వారి దరిచేరి వారి ఆత్మలకు సేదదీర్చి,ఊరడిస్తాడు.

   ఆయన ఎల్లప్పుడు మనలను నీతి, న్యాయ మర్గాలలోనే నడిపిస్తాడు. వక్ర మార్గాలలో ఎన్నడు నడిపించడు.ఈ మంచికాపరి పాపం వున్నదారుల్లో నిన్ను నడిపించడు. మనము కావాలని వక్ర మార్గంలో తిరిగి ఆయనే అట్లానడిపించాడు అని చెప్పడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడూ సత్యం, న్యాయం, యదార్ధత కలిగిన మార్గాలలోనే నడిపిస్తాడు. 

"అతడు తన స్వంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును."
              యోహాను 10:4

మంచి కాపరి గొర్రెలను తోలడుగాని, అవి వెళ్ళవలసిన చోటకి ముందుండి తీసుకువెళ్తాడు. 
క్రీస్తు తన ప్రజలను భూమి నుండి పరలోకానికి నడిపిస్తాడు. వారు వెయ్యవలసిన ప్రతీ అడుగు ఆయనకు తెలుసు. ఎందుకంటే వారికి సంభవింపబోయే ప్రతీ విషయంలోనూ ఆయన వారికి ముందుగా వెళ్ళాడు. 
   
స్వంత మార్గాలు వద్దు.
ఆయన మార్గంలోనే మన పయనం. 
సాగిపోదాం అంతంవరకూ
ఆయన్నే వెంబడిస్తూ 

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 



                                           23 వ కీర్తనా ధ్యానం 
                                              (ఆరవ భాగం)
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.         కీర్తనలు 23:4

కొన్ని సందర్భాలలో యేసయ్య గొర్రెలు భయంకరమైన చీకటి, కృంగదీసే పరీక్షలగుండా ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో అవి మరణం అంచులవరకు చేరుతాయి. అయితే వారి కాపరి సర్వ శక్తిగల సృష్టికర్త. ఆయన వారితోనే ఉంటాడు. వారికిక భయమెందుకు? 

వారి కాపరే వారికాశ్రయం.
ఆయనే బలమైన కొండ
ఆయనే ఆపత్కాలంలో సహాయం 
ఆయనే గాడాంధకారంలో వెలుగు
ప్రకృతి వైపరీత్యములు వారిని భయపెట్టలేవు. 
శోధనలు, వేదనలు--ఇరుకులు, ఇబ్బందులు
ఒకవేళ భాధించినను ఆయన వారితో వున్నాడు. 

"దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము."     కీర్తనలు 46:1-3

ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును     కీర్తనలు 121:7

కొన్ని సందర్భాలలో అపాయం రాకముందే ఆయన వారిని కాపాడితే, కొన్ని సందర్భాలలో అపాయం వచ్చిన తర్వాత ఆయన కాపాడతాడు. ఏసమయంలో ఎట్లా స్పందించాలో ఆయనకు తెలుసు.

ఏది ఏమయినా ఆయన తోడుంటే,
అగ్నిగుండమే ఆహ్లాదకరం
గాడాంధకారమే ప్రకాశమానం

భయపడకు పరిస్థితులకు.
కాని, యేసయ్యకు మాత్రం భయపడు.
భయం వేస్తే ఆయన్ని జ్ఞాపకం చేసుకో.
అప్పుడు భయానికే భయమేస్తుంది.
ఇక ఆగిపోక సాగిపో .......!

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 



                                            23 వ కీర్తనా ధ్యానం 
                                                (ఏడవ భాగం)
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.         కీర్తనలు 23:4

కాపరి దుడ్డుకర్రను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తాడు? 
1. శత్రువులు మందను వెంటాడుతున్నప్పుడు వాటినుండి మందను రక్షించడానికి. 

2. కొన్ని మొండి గొర్రెలు కాపరి మాట వినకుండా మంద నుండి చెదరిపోతూ వున్నప్పుడు, కాపరి దుడ్డి కర్రతో  వాటిని దండిస్తాడు. వాటి కాలు విరగ్గొట్టి, మరల దానికి కట్టుకట్టి, కాపరి భుజాలపై దానిని మోస్తూ , మంచి చిగురిటాకులు వాటికి ఆహారంగా సమకూర్చి, వాటి గాయం తగ్గేవరకు, పరిచర్య చేస్తాడు. 
        కాపరి ప్రేమను రుచి చూచిన ఆ గొర్రె ఎప్పటికి కాపరిని విడచి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడదు.
      
          దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు దుడ్డికర్ర దెబ్బలు( శోధనలు, వేదనలు, అవమానములు) తప్పవు. అవి దేనికోసం అంటే దేవునితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగియుండడానికి మాత్రమే.

3.  కొన్ని సందర్భాలలో చీకటిగుండా కాపరి మందను తీసుకొని వెళ్తున్నప్పుడు,  కాపరి ఎటువైపు వెళ్తున్నాడో, గొర్రెలకు కనిపించడు. అట్లాంటప్పుడు, కాపరి దుడ్డుకర్రతో నేలమీద టక్....టక్ ....టక్  అంటూ శబ్దం చేసుకొంటూ ముందుకు వెళ్లిపోతుంటే, ఆ శబ్దాన్ని బట్టి గొర్రెలు కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి.

"గొర్రెలకు కాపరి కనిపించకపోయినా, శబ్దం వినిపిస్తుంది ముందుకు సాగిపోవడానికి. "
" మనకు యేసయ్య కనిపించకపోయినా, ఆయనిచ్చిన వాగ్దానాలు వినిపిస్తున్నాయి ముందుకు సాగిపోవడానికి."

సాగిపోదాం!
ఆగిపోకుండా!
అలసటలేకుండా!
అద్దరి చేరువరకు!

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                23 వ కీర్తనా ధ్యానం 
                                                 (ఎనిమిదవ భాగం)
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.     కీర్తనలు 23:4

కాపరి దండమును ఏయే సందర్భాలలో ఉపయోగిస్తాడు? 
(దండము అంటే ఒక పొడవాటి కర్రకు కొంకి కట్టి వుండేది.)
1. కాపరి మందను మేపుతున్నప్పుడు ఆ మంద చెట్లు ఆకుల్ని తినడానికి అవి అందక ఇబ్బంది పడుతుంటే, కాపరి ఆ దండము సహాయంతో ఆ కొమ్మలను వాటికి అందేలా క్రిందకి లాగుతాడు. 
           అంటే తన మందకు ఆహారం సమకూర్చడానికి కొన్నిసందర్భాలలో దండమును ఉపయోగిస్తాడు. 

2. కొన్నిసందర్భాలలో కొన్ని గొర్రెలు త్రోవ తప్పి బయటకి పోతుంటే కాపరి ఆ పొడవాటి దండమును వాటి నడుముకు వేసి బలంగా మందలోనికి లాగుతాడు. ఆ సరిచేసే క్రమంలో అనేకసార్లు వాటికి గాయాలవుతాయి.  అట్లా అని గాయపరచడం కాపరి ఉద్దేశ్యం కాదు. సరి చెయ్యడమే. అట్లా అని చెప్పి గాయపడిని వాటిని అట్లానే వుండనియ్యడు. వాటికి కట్టుకట్టి, పరిచర్య చేస్తాడు. 

కొన్ని సందర్భాలలో మనలను దేవుడు సరిచేసే క్రమంలో కొన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు రావడం సహజమే. అట్లా అని దేవుడు విడచిపెట్టినట్లు కాదు. ఆ శోధనలలో తిరిగి ఆదరిస్తాడు. విజయాన్నిస్తాడు.

ఆ దండమును దేవుడు మన మీద ప్రయోగిస్తే అది మేలుకేగాని, కీడుకు కాదు. అట్లాంటి ఇబ్బందికర పరిస్తితులను మనము ఎదుర్కొంటున్నప్పుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. ఎక్కడ తప్పిపోయామో పరీక్షించుకుందాం. 

   ఆ చిన్న కుమారుడు పందుల పొట్టు తినే పరిస్తితికి చేరుకున్నప్పుడు అతడు ఆలోచించ గలిగాడు. ఎక్కడ తప్పిపోయాను అని. ఎక్కడ తప్పిపోయాడో అర్ధమయ్యింది. మరల తిరిగి అక్కడకే పయనం సాగిస్తున్నాడు.
           తప్పిపోయిన మనం తిరిగి తండ్రి దగ్గరికి చేరాలి.

పయనమవుదాం!    సాగిపోదాం!
ఆగిపోకుండా!       అలసటలేకుండా!      అద్దరి చేరువరకు!
మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                                   23 వ కీర్తనా ధ్యానం 
                                                   (తొమ్మిదవ భాగం)
"నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది."        కీర్తనలు 23:5
"నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు."
నాకంటూ శత్రువులు ఎవారూలేరే?
నన్ను వ్యతిరేకించేవారు ఎవరూ లేరే? ..... అనుకొంటున్నావా? 

అయితే,                      " నీవు ఆయన మందలో లేవేమో?" ఒక్కసారి ఆలోచించు. 

లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.      యోహాను 15:18,19

ప్రేమకే అర్ధాన్ని  చెప్పిన యేసయ్యనే ద్వేశించింది లోకం. ఆయన మందలో నున్న నిన్ను ఎట్లా ప్రేమిస్తుంది?
ప్రపంచ మతాలన్నీ ఒకే ఒక్క క్రైస్తవ్యం ( క్రైస్తవ్యం ఒక మతం కాదు. నిత్య రాజ్యానికి చేర్చే ఒకే ఒక్క మార్గం) మీద గురి కలిగి వున్నాయి. క్రైస్తవ్యాన్ని కాలగర్భంలో కలిపేస్తాం అని సవాలు చేసిన వాళ్ళు కాలగర్భంలో కలసిపోయారు. 
అది ఆయన రెండవ రాకడ వరకు అట్లనే నిలిచి వుంటుంది. అది దహించు అగ్ని జ్వాల. దాన్ని ఆర్పే శక్తి ఎవ్వరికిలేదు. ఆర్పాలనుకుంటే ఆరిపోతారు. 

క్రైస్తవ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే దేశాల్లోనే దేవుడు మనకు ఉపాధినిచ్చి, శత్రువుల మధ్యలోనే మనకు ఆహారం సిద్దపరుస్తున్నాడు.   
  "ఆయన మనకు చాలిన దేవుడు."

 ఈ శత్రువులు, వారిలో అత్యంత ప్రధానుడు సాతాను, వీళ్ళంతా కలసినా నిన్నేమి చెయ్యలేరు. ఎందుకంటే నీవు ఆయన మందలో వున్నావు. ఆయన నీ కాపరిగా వున్నాడు.
భయపడకు!     సాగిపో! 
మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                         23 వ కీర్తనా ధ్యానం 
                                          (పదియవ భాగం)

"నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నాగిన్నె నిండి పొర్లుచున్నది."
                కీర్తనలు 23:5
   .......................................

"నూనెతో నా తల అంటియున్నావు"

నూనె :
         ఆహారమిస్తుంది
          స్వస్తతనిస్తుంది
         వెలుగిస్తుంది
         అభిషేకిస్తుంది (పరిశుద్దాత్మ)

    ఈ ఆశీర్వాదాలన్ని తన గొర్రెలకు సమృద్ధిగాఆయనఅనుగ్రహిస్తున్నాడు. 

అది ఎంత? 
             పట్టజాలనంత. 
             పొంగి ప్రవహించేటoతా
      
జీవితమంతా శోధనలే, వేధనలే.
ఇదెప్పుడు సాధ్యం?
ఇది జరిగేదేనా?

అవును.  సందేహం వద్దు. 
ఇది నీ కంటికి కనిపించని 
అత్మీయి ఆశీర్వాదపు జల్లు. 

ప్రప్రధమ ప్రధాన యాజకుడయిన ఆహారోనును అభిషేకించిన తైలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు.

ఇక నీవు,
ఏర్పరచబడిన వంశము 
రాజులయిన యాజక సమూహం
పరిశుద్ద జనం
దేవుని సొత్తు
నీవే ఒక రాజ్యం.  

ఇంతకి మించిన ఆశీర్వాదాలు ఉంటాయా?


అంతేకాదు, 
"నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు"
                  కీర్తనలు  45:7

నీ స్నేహితుల కంటే దేవుడు నిన్ను అత్యధికముగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. 

నీకో విషయం తెలుసా?
శోధనలలో కూడా ఆనందంగా జీవించగలగడం నీకే సాధ్యం. ఎందుకంటే ఆయన మందలో నీవున్నావుగనుక.

ఆందోళన చెందొద్దు!
ఆనందంగా సాగిపో!

మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 





                                           23 వ కీర్తనా ధ్యానం 
                                           (పదకొండవ భాగం)
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.       కీర్తనలు 23:6              
"నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును"
కృప అంటే?
మన మాటల్లో: .... మన ఇంటికి ఒక దొంగ వచ్చి దొరికిపోయాడు. మనం అతనిని ఏమి చెయ్యకుండా తినడానికి భోజనం పెడితే అది దయ. అంతేకాకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని ఆటో చార్జెస్ కూడా ఇచ్చి పంపిస్తే అది కృప. 
ఇది మనకు సాధ్యమా? 
కాని నీకోసం ప్రాణం పెట్టిన ఆ మంచికాపరికి సాధ్యం. 
కృప అనే మాట దేవునికి మాత్రమే ఉపయోగించ తగినది. 
కృప అంటే 
"అర్హతలేనివాడు అర్హునిగా  ఎంచబడడమే కృప "
ఆయన కృపనుబట్టే క్షేమము మనలను వెంటాడుతుంది. అంతేగాని మన పరిశుద్దత, నీతి ఎంతమాత్రము కాదు.

ఆయన కృప శాస్వతమయినది. మనము జీవించే విధానం బట్టి గంటకో విధంగా మారేది కాదు. అట్లానే జరిగితే అసలు మనము జీవించడానికే అర్హులం కాదు. 

మనము పిండముగా రూపింపబడిన నాటినుండి తుది శ్వాస విడచే వరకు ఆయన కృప మనలను వెంటాడుతూనే వుంది. 
"పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు"   యెషయ 54:10
"నా కృప నీకు చాలును"   2 కొరింది 12:9

నేనెట్లా జీవించినా ఆయన కృప నన్ను వెంటాడుతుందని ఆయన కృపను నిర్లక్ష్యము చెయ్యొద్దు. చులకన చెయ్యొద్దు, అలక్ష్యము చెయ్యొద్దు. 
ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తే, ఆయన ఉగ్రతకు గురికావలసి వస్తుంది. అది అత్యంత భయంకరం. 

ఆ కృపామయుని పాదాల చెంత చేరుదాం!
ఆయన బాటలో సాగిపోదాం! 
మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి  కృప మనకు తోడుగా ఉండును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                               23 వ కీర్తనా ధ్యానం 
                                              ( పండ్రెండవ భాగం)
"చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను."      కీర్తనలు 23:6              

దేవుని మందిరంలో మనము గడిపే సమయమెంత? 
వారమునకు రెండు గంటలు. ఆ రెండు గంటలు అయినా, మనము మాత్రమే అక్కడ ఉంటాము. మనసు మాత్రం ప్రపంచమంతా చుట్టి వస్తుంది.
పాస్టర్ గారి గొడవపడలేక వచ్చేది కొందరయితే, స్నేహితులను కలసుకోవచ్చు అని వచ్చేది మరికొందరు. ఆయనను నిజముగా ఆరాధించడానికి వచ్చేది బహు తక్కువ.

ప్రక్క వారితో కబుర్లు చెప్పేవారు కొందరయితే, సెల్ ఫోన్స్ తో ఆడుకొనేవాళ్ళు కొందరు. 
దేవుడన్నా, దేవుని సన్నిధి అనినా, అంత నిర్లక్ష్యం మనకి.

అయితే దావీదు చెప్తున్నాడు, "నా జీవితాంతము ఆయన మందిరములో నివసిస్తాను."

కోరహు కుమారులు చెప్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలని వారి ప్రాణం ఆశ పడుతుందట. అది ఎంత అంటే? సోమ్మసిల్లిపోయేల.
జీవముగల దేవుని దర్శించడానికి వారి హృదయం, శరీరం కూడా ఆనందంతో కేకలు వేస్తున్నాయట.

"యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి."
           కీర్తనలు 84:2

దేవుని మందిరానికి వెళ్ళాలంటే, హృదయం సహకరిస్తే, శరీరం సహకరించదు. శరీరం సహకరిస్తే హృదయం సహకరించదు. 

దావీదు, కోరహు కుమారులు కలిగి వున్న ఆశను, అట్టి అనుభవాలను కలిగివుందాం. 
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్.

(23 వ కీర్తనా ధ్యానములు సమాప్తం)


                                                                27వ కీర్తనా ధ్యానం 
                                      (మొదటి  భాగం)

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?       కీర్తనలు 27:1
దావీదు తాను భయపడక పోవడానికి గల కారణాలు చెప్తూ, దేవుడు తనకు ఏమై యున్నాడో చెప్తున్నాడు. 

*
వెలుగు(Light)
*
రక్షణ(Salvation)
*
ప్రాణదుర్గము (strength of life)

1.
వెలుగు(Light):
వెలుగును గురించే వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. 
"
తమషోమా జ్యోతీర్గమయ"
(
చీకటిలో వున్నాను వెలుగు లోనికి నడిపించు)
ఆ వెలుగై యున్న దేవునిని దావీదు కలిగి యున్నాడు. 
మరి నీవు? 

ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.   యోహాను 1:4 
నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను 1:9

2. రక్షణ(Salvation):
రక్షణ అంటే? శిక్ష నుండి తప్పించ బడడం. 
తప్పించే వాడే రక్షకుడు. 
ఆ రక్షకుడై యున్న దేవునిని దావీదు కలిగి యున్నాడు. 

మరి నీవు? 
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను    లూకా 19:10

3.
ప్రాణదుర్గము (strength of life)
దావీదు తన జీవితానికి ఆయననే బలముగా కలిగి యున్నాడు.
మరి నీవు? 

ఆయననే బలముగా కలిగియుంటే? ప్రతీ భయము, బలహీనత ఆయన ముందు మోకరిల్లవలసిందే కదా? 
ఈ అనుభవాలు నీలో ఉన్నాయా? 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!  

                                               27వ కీర్తనా ధ్యానం 
                                                ( రెండవ భాగం)
నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి
నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.     కీర్తనలు 27:2,3

దావీదు ఈలోకంలో శత్రువులు యుద్దానికి కాలు దువ్వుతున్నప్పుడు, వారి విషయంలో నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండగలుగుతున్నాడు. 
మనముకూడా మన ప్రధాన శత్రువైన సాతాను సృష్టించే గందరగోళ పరిస్థితులలో నిబ్బరం కలిగి ధైర్యంగా వుండాలి. 

*గొల్యాతు శూరుడు *ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.
*
తలమీద రాగి శిరస్త్రాణము
*
అతడు ధరించిన యుద్ద కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.
*
కాళ్లకు రాగి కవచమును 
*
భుజముల మధ్యను రాగి బల్లెము.
*
అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది. యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. *ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.
కాని, ఇవేమీ అతనిని రక్షించలేక పోయాయి. 

అయితే? 
సాతాను ఎక్కుపెట్టే ఏ బాణము కూడా నీ దరిచేరకుండా ఉండాలంటే? తప్పక కవచాన్ని ధరించాలి. 
అది గొల్యాతు ధరించిన కవచం కాదు గాని, దేవుడిచ్చే సర్వాంగ కవచం. 
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
              ఎఫెస్సి 6:11

సర్వాంగ కవచము: 
*
నడుమునకు సత్యమను దట్టి 
*
నీతియను మైమరువు
*
పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు
*
విశ్వాసమను డాలు

వీటిని ధరించిన అనుభవం మనకుందా?
లేకుంటే? వాడి బాణాలకు బలి కావలసిందే? 

సరి చేసుకుందాం! 
భయపడక సాగిపోదాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                             27వ కీర్తనా ధ్యానం 
                                           (మూడవ భాగం)
యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.
                కీర్తనలు 27:4

దావీదు దేవుని అడిగిన వరమేమిటి? 
*
యెహోవా ప్రసన్నతను చూడాలి. 
*
ఆయన ఆలయంలో ధ్యానించాలి. 
**
తన జీవితమంతా ఆయన సన్నిధిలో నివసించాలి. 

యుద్ద కాలాల్లోను, శత్రువుల నుండి పారిపోయి దాక్కున్న సమయాల్లోనూ, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయాల్లోను దావీదు తరచుగా దేవుని ఆరాధన స్థలానికి దూరంగా ఉండేవాడు. 

అటువంటి పరిస్థితుల్లో 
*
ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను?
*
ఎప్పుడు ఆయనను ఆరాదించ గలుగుతాను? 
*
ఎప్పుడు ఆయన ప్రసన్నతను అనుభవించ గలుగుతాను? 
అని తన హృదయం ఆరాటపడుతున్న సమయంలో? 

యెహోవా! నీ ప్రసన్నతను చూచేటట్లు, 
నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటట్లు, *నా జీవితమంతా నీసన్నిధిలో నివసించాలి. 
అటువంటి వరమును నాకు దయచెయ్యి అని దావీదు ప్రార్దిస్తున్నాడు. 
అంతేకాదు. అవి దొరికే వరకు (పొండుకొనే వరకు) వేదకుతున్నాడు.
అయితే? 
మనమడిగే వరాలు ఎట్లా ఉంటున్నాయి? 
*
అన్నీ వ్యక్తిగతమైనవే కదా? 
*
దేవుని ప్రస్తావన లేనేలేదు కదా? 
*
జీవితాంతం ఆయన సన్నిధిలో నివసించడం కాదు కదా, కనీసం వారమునకు రెండు గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి కూడా ఆసక్తి లేనివారముగా జీవిస్తున్నాంకదా? 

వద్దు!!
ఆయనను గురించిన ఆశను కలిగి యుందాం!
ఆయన ప్రసన్నతను అనుభవిద్దాం! 
ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధిద్దాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                        27వ కీర్తనా ధ్యానం 
                                     (నాలుగవ భాగం)
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.     కీర్తనలు 27:5

ఆయన పర్ణ శాలలో ఎప్పుడు అడుగు పెట్టగలమంటే? 
ఆపత్కాలంలోనే? 

ఆయన గుడారము చాటున ఎప్పుడు దాగి యుండగలమంటే? 
ఆపత్కాలంలోనే? 

యెహోవా! నీ ప్రసన్నతను చూచేటట్లు, 
నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటట్లు, *నా జీవితమంతా నీసన్నిధిలో నివసించాలి. 

ఇట్లాంటి ఆశను కలిగి యుండి, దానిని వెదికే వారముగా మనముంటే? 

*ఆపత్కాల సమయంలో ఆయన గుడారంలో మనలను దాస్తాడు. 

ఆయన గుడారంలో నీవుంటే? 
ఇక శత్రువు నిన్నేమి చెయ్యగలడు? 


*
ఎతైన ఆశ్రయ కొండ మీద మనలను ఎక్కించి కాపాడతాడు. 

ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు         ద్వితి 32:4

*ఆయనే నీ ఆశ్రయ దుర్గము. 
*
ఆయన కార్యములు సంపూర్ణము. 
*
ఆయన ఏది చేసినా న్యాయమే.
*
ఆయన ఏ దోషం లేని వాడు. 
*
ఆపత్కాలంలో నమ్మదగిన వాడు. 
*
ఆయన నీతిపరుడు 
*
ఆయన యదార్ధవంతుడు. 

నీ ప్రతీ పరిస్థితిని ఆయనకు అప్పగించు. 
నీ సమస్యల నుండి విడిపించి, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు.

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                         27వ కీర్తనా ధ్యానం 
                                         (ఐదవ భాగం)

ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.
            కీర్తనలు  27:6
     .............................

నిన్ను చుట్టుకొని యున్న నీ శత్రువుల కంటే ఎత్తుగా నీ తల యెత్తబడుతుంది. 

నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. 

నీకు వ్యతిరేకముగా నిలచిన ప్రతీ శత్రువు అంటే? అది సామాజిక, ఆర్ధిక, శారీరిక, మానసిక సమస్యలు ఏవైనా కావొచ్చు. నీ ముందు తలదించాల్సిందే.

ఎప్పుడు?  

*
ఆపత్కాలమున ఆయన పర్ణశాలలో నీవున్నప్పుడు.
*
ఆయన గుడారము మాటున దాగియున్నప్పుడు. 
*
క్రీస్తు అనే ఆశ్రయ దుర్గముపైన నీవున్నప్పుడు. 

అప్పుడు నీవేమి చెయ్యగలవంటే? 

*
ఆధ్యాత్మిక బలులను అర్పించ గలవు. 
*
ఉత్సాహధ్వనితో ఆయనకు స్తుతి గానము చెయ్యగలవు. 

ఇట్లాంటి అనుభవం నీకుందా? 
లేకుంటే? 
సరిచేసుకుందాం! 
సాగిపోదాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 






                                          27వ కీర్తనా ధ్యానం 
                                         ( ఆరవ భాగం)

 యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించు నప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము.
నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.
              కీర్తనలు  27:7,8
         ...........................

దేవుని సన్నిధిని వెదకాలి అని తీర్మానమునకు వచ్చిన దావీదు, 
దేవునిని అడుగుతున్న వరమేమిటంటే? 

*
యెహోవా నీ  ప్రసన్నతను చూడాలి. 
*
నీ ఆలయంలో ధ్యానించాలి. 
*
నా జీవితమంతా నీ సన్నిధిలో నివసించాలి. 

ఈ రీతిగా ప్రార్ధిస్తూ, నా ప్రార్ధన ఆలకించి దయతో నాకు జవాబు ఇవ్వు. 

మనము ప్రార్ధించినప్పుడు కూడా ఇదే విషయాన్ని గమనించి ప్రార్ధించాలి. 

ఆయన మన ప్రార్ధనలకు సమాధానం ఇస్తున్నాడు అంటే ఒకే ఒక్క కారణం? 
అది ఆయన మన పట్ల చూపించే కరుణ లేదా దయతో మాత్రమే. 

అంతేగాని, 
మన పరిశుద్దత, నీతి ఎంతమాత్రం కానేకాదు. 

అదే సమయంలో, ఆయన మన ప్రార్ధనలను ఆలకించాలి అంటే? వాటికి సమాధానం ఇవ్వాలంటే? 

ఆ ప్రార్ధన నోటినుండి, పెదవుల నుండి వచ్చేదిగా కాకుండా, హృదయం నుండి వచ్చేదిగా వుండాలి. 

అందుకే దావీదు అంటున్నాడు. 
"నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను."

ఆయనతో "హృదయంతో మాట్లాడే" అనుభవంలోనికి మనం ప్రవేశించాలి. 

అట్టి అనుభవాన్ని కలిగియుందాం!
ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                27వ కీర్తనా ధ్యానం 
                                                (ఏడవ భాగం)
నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము.
నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.      కీర్తనలు  27:9,10

దావీదు ఇట్లా ప్రార్దిస్తున్నాడు. 
*
నీ ముఖాన్ని నాకు మరుగు చెయ్యొద్దు. 
*
నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివెయ్యొద్దు. 
*
నన్ను విడచిపెట్టొద్దు.
ఎందుకంటే? 
*
నీవే నాకు సహాయకుడవు. 
*
నీవే నన్ను రక్షించేవాడవు. 

అంతే కాకుండా, 
ఒకవేళ నా తలిదండ్రులు నన్ను విడచి పెట్టేసినా నీవు నన్ను చేరదీస్తావు. ఆదరిస్తావు. అనే విశ్వాసంతో ప్రార్దిస్తున్నాడు. 

అవును!!
నిజమైన తల్లి  తాను  కన్నబిడ్డపై జాలిచూపకుండా, తన చంటి బిడ్డను మరచిపోతుందా? 
అట్లా ఎట్టి పరిస్థితులలోనూ జరుగదు. ఒకవేళ అట్లా జరిగినా జరగవచ్చు. కాని ఆయన నిన్ను విడచిపెట్టేవాడు కాదు. 

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.    యెషయ 49:15
ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను      యెషయ 66:13

అంతే కాకుండా, 
ఆయన తల్లి లేనివారికి తల్లిగా, 
తండ్రి లేనివారికి తండ్రిగా, 
భర్తను కోల్పోయిన వారికి  న్యాయము తీర్చేవానిగా ఆయన వున్నాడు. 
తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
              కీర్తనలు 68:5

ఇదెప్పుడు సాధ్యం? 
నీవే నా రక్షణకర్త, 
నీవే నా సహాయకుడవని
ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించ గలిగినప్పుడు. 

 ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
ఆదరణను, ఆశ్రయాన్ని పొందుదాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                                    27వ కీర్తనా ధ్యానం 
                                               (ఎనిమిదవ  భాగం)

యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.
అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
              కీర్తనలు  27:11,12
          ............................
           

దావీదు ఇంకనూ తన ప్రార్ధనను కొనసాగిస్తున్నాడు. 
*
యెహోవా, నీ మార్గమును నాకు బోధించు.
*
సరాళమైన మార్గమున నన్ను నడిపించు.
*
నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకు.

1.
మనమయితే మన మార్గములను ఆయనకు తెలియజేసి ఇట్లాగే మమ్ములను నడిపించు అని ప్రార్ధిస్తాము . దేవుని ముచిత్తానికి మాత్రం అప్పగించ. 

కాని దావీదు అంటున్నాడు నీ మార్గమేంటో నాకు భోధించు. 

2. మనమయితే మనకు నచ్చిన మార్గాల్లో వెళ్లి, చిక్కుల్లోపడి, వాటినుండి విడిపించు. నా మార్గమును సరాళముచెయ్యి అని ప్రార్దిస్తాము. 

కాని దావీదు అంటున్నాడు. 
నీవే ముందుగా చిక్కులున్న మార్గాలేవో చూసి, వాటిని సరాళము చేసి, ఆ మార్గాలగుండా నన్ను నడిపించు. 

ఎందుకంటే? 
అబద్దికులు, క్రూరులు నాకు వ్యతిరేకముగా తిరుగుబాటు చెయ్యడానికి సిద్దపడుచున్నారు. వారి ఇష్టానికి నన్ను అప్పగించకు.
 నీ ఇష్టమే నాజీవితంలో నెరవేర్చు. 

అవును! 
మన శత్రువైన సాతాను మన మీద తిరుగుబాటుకు సిద్దపడుచున్న సమయంలో మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించగలగాలి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 



           

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అబ్రాహాము విశ్వాసయాత్ర

పాపము

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పక్షిరాజు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

విశ్వాసము

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు