యేసు మాటలో శక్తి
యేసు మాటలో శక్తి
అతడు దౌర్జన్యము నొందెను, భాదింపబడినను నోరు తెరువలేదు. వదకుతేబడు గొర్రెపిల్లయు, బోచ్చుకత్తిరించువానిఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరుతెరువలేదు. యెషయా 53:7
సర్వశక్తిగల దేవుడు మానవరూపియై భూమిపైకి వచ్చి తను హింసింపబడుచున్నా కూడా ఎందుకు నోరు తెరువలేదు?
ఎందుకు మౌనముగా ఉండాల్సివచ్చింది?
ఆయన భూమిపైకి నరావతారిగా వచ్చినందువల్ల ఆయన శక్తి (పవర్), అధికారము తగ్గిపోయాయా?
ఎంతమాత్రము కానేకాదు!
ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదో చూద్దాం!
1.మాటతో నీరు ద్రాక్షారసముగా మారింది, యోహాను 2:1-11
2. మాటతో పేతురు తనవల పిగిలిపోయేటంత చేపలు పట్టగలిగాడు లూకా 5:4-10
3. మాటతో తుఫానును ఆపివేశారు మార్కు 4:37-41
4. అంజూరపుచెట్టు వాడి/ఎండిపోయెను మత్తయి 21:18-21
5. శతాధిపతియొక్క సేవకుడు బాగుపడ్డాడు మత్తయి 8:1-13
6. కనానుదేశపు స్త్రీ యొక్క కుమార్తె బాగుపడింది. మత్తయి 15:21-28
7. 38 సంవత్సరాలుగా వ్యాదిగల వ్యక్తీ బాగయ్యాడు. 5:5-9
8. దయ్యాలు వదలిపోయాయి లూకా 4:33-36
9. గెరాసేనుల దేశంలో సేన దయ్యం పట్టినవాడు బాగుపడ్డాడు, దయ్యాలు వదలిపోయాయి. మార్కు 5:1-20
10. చనిపోయిన లాజరు మాటతో బ్రతికి సమాధినుండి లేచివచ్చాడు. యోహాను 11:1-44
11. చనిపోయిన విధవరాలి కుమారుడు బ్రతికాడు. లూకా 7:11-16
చూశారా! ఎంత శక్తి ఉందో ఆయనమాటలో! నాయీను గ్రామమంతా వచ్చి ఆ విధవరాలితో “అమ్మా ఏడువకు!” అన్నారు. గాని ఆమె ఏడ్పును మాన్పించలేకపోయారు. యేసయ్య కూడా అదేమాటన్నారు, గాని అంతటితో ఆగకుండా చిన్నవాడా లెమ్మని చెప్పగా ఆ చిన్నవాడు లేచి కూర్చొన్నాడు. విధవరాలి ఏడుపు , సంతోషంగా మారిపోయింది.
యేసుప్రభులవారు కేవలం మాటలదేవుడే కాదు. ఆయన చేతల దేవుడు కూడా!!!! అందుకే బ్రతికించి ఇచ్చారు.
*ఆయన మాటలో శక్తి ఉంది అని చెప్పడానికి మాటతో అద్భుతాలు చేసారు.
*ఆయన స్పర్శలో/తాకిడిలో శక్తి ఉంది అని చెప్పడానికి మరియు ఆయన ప్రేమను తెలుపడానికి చేతితో తాకి (కుష్టు రోగులను కూడా) స్వస్తపరిచారు.
*ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉందని చెప్పడానికి ఉమ్మితో బురదచేసి స్వస్తపరిచారు.
*ఆయన వస్త్రంలో శక్తి ఉందని చెప్పడానికి 12సంవత్సరాలుగా రక్తస్రావరోగంతో బాధపడుతున్న స్త్రీని వస్త్రపు తాకిడితో నయం చేసారు.
మరి ఇంత శక్తివంతమైన దేవుడు ఎందుకు తనను హింసిస్తున్నా సరే మౌనముగా ఉన్నారు?
యెషయా 53:10-11; అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాదికలుగజేసెను. తననుతానే అపరాధ పరిహారార్ధబలిగా చేసుకొన్నారు. యెహోవా ఉద్దేశ్యము అతనిద్వారా సఫలమగును,.... నీతిమంతుడైన నాసేవకుడు జనులదోషమును భరించి, తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోశులనుగా చేయును.
ఆయన ఈ భూమిమీదకు వచ్చినదే నీకోసం, నాకోసం పాపపారిహారార్ధబలిగా అర్పిచుకోడానికి, బలిదానంకావడానికి! అందుకే అంత శక్తివంతుడైన దేవుడు తనను హింసిస్తున్నా నోరు తెరువలేదు. చివరకు తనను హింసిస్తున్న వారి క్షమాపణకై , వారి విముక్తికై “తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని కోరారు”. ఎంత జాలి! ఎంత ప్రేమ ఆ పరమతండ్రికి నీపై, నాపై. ఈలోకంలో నావారు అనుకున్న వాళ్ళే వదలివేసి వేల్లిపోచుండగా నీకోసం, నాకోసం యేసయ్య పరమును, పరమతండ్రిని, దూతలను, మహా మహిమను వదలి సామాన్యమానవునిగా ఈ భూలోకానికి వచ్చారు. రక్తాన్ని కార్చి బలై పోయారు. తిరిగి మృత్యుంజయుడై లేచారు. తిరిగి రాబోచున్నారు.
లోబడనోల్లని ప్రజలకోసం దినమెల్ల తనచేతులు చాపి పిలుస్తున్నారు. ప్రయాసపడి భారముమోసుకొనుచున్న సమస్తజనులారా! నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగాజేతును అని పిలుస్తున్నారు.
వస్తావా?
ఆయన మాట వింటావా?
ఇదే అనుకూల సమయం, నేడే రక్షణదినం!!!
దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి