నిరీక్షణ
నిరీక్షణ
ఒంటరితనమా?
సమస్యల సుడిగుండమా?
చెలరేగే తుఫానా?
ఆప్తులంతా దూరమైన పరిస్థితియా?
చేయిదాటిపోతున్నట్లనిపిస్తున్న ఆరోగ్య సమస్యలా?
ప్రేమించిన వ్యక్తి చేసిన నమ్మక ద్రోహమా?
తీర్చలేని అప్పుల బాధలా?
క్షీణింపజేస్తున్న వ్యసనాలా?
శ్రమలు,ఇరుకులు, ఇబ్బందులు, అవమానములా?
సమాధానం లేదనుకొంటున్న ప్రశ్నలా?
పరిష్కారం లేదనుకొంటున్న సమస్యలా?
నీ కళ్ళల్లో కన్నీరొద్దు!
నీ గుండెల్లో దిగులొద్దు!
యేసే నీ రక్షణ! ఆయనే నీ నిరీక్షణ!
నీ ప్రతీ సమస్యకు ఒక పరిష్కారముంది.
నీ ప్రతీ ప్రశ్నకు ఒక సమాధానముంది.
నీ ప్రతీ పరిస్థితినుండి విడిపింపబడే ఒక మార్గముంది.
అదెప్పుడు సాధ్యం?
నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకునిపై నీవు ఆనుకున్నప్పుడు, ఆయనపైనే పూర్తిగా ఆధారపడినప్పుడు. ఎప్పుడు ఆధారపడగలవు అంటే? నీ హృదయమంతా ఆయన ప్రేమతో నిండిపోయినప్పుడు. ఆయనపై ఆధారపడినప్పుడు, వెలకట్టలేని వాగ్ధానాలనిచ్చి, కృంగిన నీ జీవితాన్ని బలపరచగలడు. దేవుని వాగ్ధానాలంటే? పండుగలకు పంపుకునే శుభాకాంక్షలు వంటివి కావు. అవి వట్టి మాటలు అసలేకావు. సర్వసృష్టికర్త యైన దేవుని మాటలు. అవి మనకు నిరీక్షణనిస్తాయి. మరణమే శరణ్యం అనుకున్న పరిస్థితులలో సహితం, జీవితం మీద ఆశలు చిగురింపజేసి, ఫలవంతమైన జీవితాన్ని జీవింపజేస్తాయి. దేవుని సహాయంతో ఎట్లాంటి పరిస్థితులనైనా తట్టుకోగలము. దేవుని మాటలు మనలను సృష్టించిన దేవునివైపుకు నడిపిస్తాయి. ఆయన మన క్షేమాన్ని కోరేవాడు. మనలను శ్రద్ధతో పట్టించుకొనే వాడు. నీ ప్రతీ అవసరతను తీర్చేవాడు.

దేవుడు, నా తలరాత ఇట్లానే వ్రాసాడేమో? అందుకే నా జీవితంలో సమాధానం లేదని, నీకు నీవు ఊహించుకొని, దేవునిని నిందించే ప్రయత్నం చేస్తున్నావా? అయితే ఒక్క విషయం! “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు”. (యిర్మియా 29 :11)
నీవనుకొంటున్నట్లుగా నీ పట్ల దేవునికి ఎట్లా హానికరమైన ఉద్దేశ్యాలు లేవు. నీవు సమాధానముగా వుండడమే ఆయన చిత్తం. అందుకే కదా? నీ కొరకు చివరి రక్తపు బొట్టును సహితం చిందించింది. ఆయన ప్రేమను అపార్ధం చేసుకోవద్దు. నీవు జీవిస్తున్న జీవితమే, నీకు హాని కలిగించేదిగా, సమాధానాన్ని నీ నుండి దూరం చేసేదిగా వుందేమో? లేకపోతే, ఆయనపైన నీవు ఆధారపడలేకపోవడం వలన, ఆయన సమాధానకరమైన ఉద్దేశ్యాలు నీ జీవితంలో నెరవేరడం లేదేమో? ప్రియరక్షకుని ప్రేమను నిందించకుండా, ఆయన వాక్కులపై ఆధారపడగలిగితే, అవి నీకు నిరీక్షణను కలిగిస్తాయి. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచక, గమ్యానికి చేర్చుతుంది.
మన చుట్టూనున్న పరిస్థితులనుబట్టి, మన తలంపులు కూడా సంకుచితముగానే ఉంటాయి. అయితే మనము తలంచినట్లుగా ఆయన తలంచేవాడుకాదు. ఆయన అత్యున్నతుడు. ఆయన తలంపులుకూడా అంత ఉన్నతముగానే ఉంటాయి. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో ఆయన తలంపులు, ఆయన మార్గాలు మనకంటే అంత ఎత్తుగానున్నాయి. ఆ ఎత్తును అందుకోలేక, సంకుచితమైన తలంపులతో, మనలను మనము తగ్గించుకొంటూ, కృంగిపోతూ, దేవుని నామమును నిందిస్తూ ఆయనపై ఆధారపడలేక ఆయనను నిందించే ప్రయత్నం చేస్తున్నామా? అయితే ఒక్క విషయం! “నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు . ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగాఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంతయెత్తుగా ఉన్నవి.యెషయా 55 :8,9
దేవుడు మనపట్ల కలిగియున్న తలంపులు ఎంత విస్తారమంటే? లెక్కింపశక్యముకానంత విస్తారములు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. (కీర్తనలు 40:5) నీవు నీపట్ల కలిగియున్న తలంపులకంటే, నీపట్ల దేవుడు కలిగియున్న తలంపులు లెక్కకుమించినవి. అయితే నీవు, ఆయన వాక్కులపై ఆధారపడగలిగితే, అవి నీకు నిరీక్షణను కలిగిస్తాయి. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచక, గమ్యానికి చేర్చుతుంది.
ఆర్ధిక ఇబ్బందులు కృంగదీస్తున్నాయా? దేవుని హృదయానుసారుడైన దావీదు తెలియజేస్తున్న మాటలు నీతిమంతుడు, అనగా ఆయనను నమ్మినవాడు, విడువబడడం ఆయన చూడలేదట. వారిపిల్లలు భిక్షమెత్తుట ఆయనకు తెలియదట. నీ పరిస్థితి ఎట్లా వున్నాసరే, ఆయనయందు నమ్మికయుంచు. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. (కీర్తనలు 37:25)
నీవు అడిగినవాటికంటే, శ్రేష్టమైనవి, మనము ఊహించని వాటికంటే ఉన్నతమైనవి అనుగ్రహించగలిగే దేవుడు మనకున్నారు. అయితే, మనము చెయ్యాల్సిందెల్లా ఒక్కటే. ఆయన బలము, ఆయన ప్రభావము మనలో పనిచేయడానికిగల పరిస్థితులను మనము కల్పిస్తే చాలు, సమృద్ధియైన ఆశీర్వాదపు పంటను కోస్తాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. (ఎఫెసీ 3:20,21)
నీ పరిస్థితి ఏదైనా సరే, దానినుండి రక్షించబడాలంటే, విడిపింపబడాలంటే, విరిగిన హృదయం, నలిగిన మనసుతో ఆయన పాదాలను సమీపించడం. ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీ జీవితమే ఒక సజీవ సాక్ష్యమవుతుంది. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. కీర్తనలు 34:18
తల్లి తన బిడ్డను ఎప్పటికీ మరువదు. ఒకవేళ అట్లా అయినా జరుగవచ్చేమోగాని, ఆ తల్లిని సహితం సృష్టించిన ఆ పరమతండ్రి మాత్రం ఎప్పటికీ నిను మరచిపోయేవాడు కాదు. ఆయన యరచేతులలో మనలను చిక్కుకున్నాడు. వ్రాసుకుంటే, చెరిగిపోతుందని ఇనుప ఘంటముతో మనలను చిక్కుకున్నాడు. అవును! ఆయన తల్లినిమించిన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి. యెషయా 49:15-16
నీ జీవితం అరణ్యములా మోడుబారిందా? ఎండిన ఎడారిగా మారిన నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఆయన మాటలు విశ్వసించు. అవి నీ జీవితంలో జరుగబోతున్నాయని నిరీక్షించు. నీవూహించని సమృద్ధితో నీజీవితాన్ని ప్రభువు నింపగలరు. శ్రమగల ఆకోరులోయను నిరీక్షణ ద్వారముగా ప్రభువు మార్చగలరు. ఎండిన ఎముకలను జీవింప చేయగలరు. వాడ బారిన షారోనును చిగురింపజేయగలరు. నీవేస్థితిలోనున్నాసరే, నీవున్నపాటున ప్రభువు పాదాలచెంతకురా! నిత్యమైన ఆశీర్వాదములను, సమాధానమును తప్పక పొందగలవు. ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువుమనకు అనుగ్రహించునుగాక!

మరిన్ని వర్తమానములకై
మీ యొక్క విలువైన సూచనలు సలహాలు మరియు ప్రార్థనావసరతలకై
- మీ సహోదరుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి