దేవునితో సహవాసం- ఎడబాయకుండుట
దేవునితో సహవాసం- ఎడబాయకుండుట
బైబిల్ గ్రంధంలో వ్రాయబడిన/జరిగిన ప్రతీ సంఘటన ఎన్నో వర్తమానాలు-ఆత్మీయ మర్మాలతో నిండిఉన్నాయి. అందుకే 1కొరింథీ 10:11 లో “*ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను*” అని వ్రాయబడింది, కాబట్టి అది ఒక చరిత్ర మాత్రమే అని అనుకోవద్దు. వాటిలో ఎన్నో అర్ధాలు-పరమార్ధాలు దాగియున్నాయి.
ఈరోజు మనం 2రాజులు 2:1-15 ధ్యానించుకొందాము. ఈభాగంలో ఏలియాగారు అగ్నిగుర్రాలమీద, అగ్నిరధాలమీద పరలోకానికి ప్రాణంతోనే ఎగిరిపోయే సమయంలో ఏలియాగారు ఎలీషాగారితో అంటున్నారు- దేవుడు నన్ను పరమునకు తీసుకోనిపోతున్నారు దయచేసి నీవిక్కడే ఉండిపో. అందుకు ఎలీషాగారి సమాధానం “*యెహోవా జీవముతోడు, నీజీవముతోడు నేను నిన్నువిడువను*” అనిచెప్పారు మాటిమాటికి. వారి మజిలీలో 1. గిల్గాలు, 2) బేతేలు, 3) యెరికో, 4) యోర్దాను అనేవాటిని దాటివెళ్ళాల్సి వచ్చింది. అంతేకాదు ప్రవక్తల శిష్యులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
నేడు రక్షింపబడిన విశ్వాసి కూడా ఈ అన్ని మజిలీలు దాటాల్సిందే! వీటిని దాటకుండా ఎదుర్కోకుండా పరలోకానికి చేరడం అసంభవం. వీటిని సంక్షిప్తంగా చూద్దాం.
1.గిల్గాలు-దొరలింపబడుట : వీరిద్దరూ మొట్టమొదటగా గిల్గాలు మీదుగా పోవాల్సి వచ్చింది. గిల్గాలు అనుమాటకు దొరలింపబడుట అని అర్ధం. ఇశ్రాయేలీయులు వారి ఐగుప్తు యాత్రలో యోర్దాను నదిని దాటిన వెంటనే దేవుడు సున్నతిని పొందమని సెలవిస్తారు. అది జరిగిన వెంటనే దేవుడు చెప్పారు నేటితో ఐగుప్తు అవమానాన్ని నేను తీసివేస్తున్నాను అన్నారు. అందుకే ఆ ప్రాంతానికి గిల్గాలు అన్నారు. యెహోషువా 5:9
అదేవిధంగా ఒకవ్యక్తి మారుమనస్సు, పశ్చాత్తాపం పొంది తను పాపినని గ్రహించి , యేసే రక్షకుడని గ్రహించి భాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు పాపాలన్నీ దొరలిపోతాయి. ఇది మొదటి మెట్టు.
2. బేతేలు- దైవమందిరం: ఎలీయాగారు,ఎలీషాగారు బేతేలుఅనే ప్రాంతం చేరుకొంటారు. మనం బేతేలు గురించి చూసుకొంటే తన యాకోబుగారి జీవితంలో ఈ బేతేలు అనుభవం ఎదురైంది. ఆదికాండము 28:13-22 . తన అన్న ఏశావుకి భయపడి తన మావయ్య ఇంటికి ఒంటరిగా పారిపోతుండగా ఆరాత్రి దేవుడు యాకోబును దర్శించి ఆశీర్వదించారు. అందుకే యాకోబుగారు ఆప్రాంతానికి బేతేలు అని పేరుపెట్టారు.
అదేవిధంగా రక్షింపబడిన విశ్వాసి తనజీవితంలో బేతేలు అనుభవం కలిగియుండాలి. ఎప్పుడు ఆ అనుభవానికి చేరుకోగలరు? క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వెళ్తున్నప్పుడు, దైవసన్నిధిని అనుభవించినప్పుడు. దానిద్వారా దేవుని బిడ్డల సహవాసం దొరుకుతుంది. అంతేకాక దైవ దర్శనం కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడుతారు ఏదోవిధంగా! ఇదే బేతేలుఅనుభవం.
3. ప్రవక్తల శిష్యులు-సాతాను ఏజెంట్స్: వీరిద్దరూ బేతేలుకుచేరుకొన్నప్పుడు ఇంకా ప్రతీ స్థలంలో కూడా ఈప్రవక్తల శిష్యులు ఎలీశాగారిని నిరాశపరుస్తారు. మీగురువుగారిని ఈరోజు దేవుడు పరలోకానికి తీసుకోనిపోతున్నారు తెలుసా అంటూ. అందుకు ఎలీషా గారు ఏమన్నారు? అదినాకు తెలుసుగాని మీరు నోరుముసుకోండి.
ఇక్కడ ప్రవక్తల శిష్యులు సాతానుగాడి ఏజెంట్స్ లాగ ప్రవర్తిస్తున్నారు. మనవిశ్వాస జీవితాన్ని నిరాశపరుస్తారు. అప్పుడు మనం సరియైన సమాధానం వాక్యాదారంగా ఇవ్వాలి. వీళ్ళు తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాల ద్వారా మనలను సంఘిగ్ధంలో పడేస్తుంటారు. కొందరు ఏడువారాలు గుడికొస్తే చాలు అని, కొందరు 40రోజుల దీక్ష అని అంటుంటారు. ఈమధ్య కొందరు పెద్ద పెద్ద పాపాలు చేస్తే తప్పుకాని చిన్న చిన్న పాపాలు పర్వాలేదు అని భోదిస్తున్నారు. పాపం అది చిన్నదైనా పెద్దదైనా అది పాపమే. వీటిని వాక్యంతో ఎదుర్కోవావాలి. కొన్నిసార్లు సాతానుగాడే సూటిగా మనతో మాట్లాడుతుంటాడు మనకి నిరాశ నిస్పృహ కలిగిస్తుంటాడు. అప్పుడు యేసుప్రభులవారు జవాబిచ్చినట్లు వాక్యంతో వాడికి జవాబివ్వాలి. అప్పుడు వాడు మనదగ్గరనుండి పారిపోతాడు. ప్రతీ నిజవిశ్వాసి ఈ అనుభవంగుండా వెళ్ళాల్సిందే!
4. యెరికో: మనప్రవక్తల తర్వాత మజిలీ యెరికో. ఇది ఒక పాపపు పట్టణం! ఈ పట్టణ వివరాలు యెహోషువా గ్రంధంలో చూడొచ్చు. ఇది జూదములకు, హత్యలకు, మానభంగాలకు, దొంగతనాలకు, వ్యభిచారాలకు, అవమానాలకు, మోసాలకు ఇంకా అన్యాచారాలకు ప్రసిద్ధి మరియు గుర్తుగా ఉంది. రక్షింపబడిన విశ్వాసిని తిరిగి లోకంలోనికి లాగడానికి సాతానుగాడు ఇవన్నీ చూపించి విశ్వాసబ్రష్టుడిగా చేయాలని చూస్తాడు. విశ్వాసి వీటిని తప్పకుండా జయించాలి. వాక్యంతో తిప్పికొట్టాలి. అందుకే పౌలుగారు 2కొరింథీ 6:14-18 లో చెబుతారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు.......వెలుగుకి చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంభంధం? విశ్వాసికి అవిశ్వాసితో పాలేక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? మనము దేవుని ఆలయమై ఉన్నామని సెలవిచ్చారు.
5. యోర్దాను: అనగా 1) అడ్డము, 2) మరణము.
ఏలియా మరియు ఎలీశాగార్లయొక్క తదుపరి మజిలీ కి ముందు యోర్దాను నదిని దాటివెళ్ళాలి. ప్రతీవిశ్వాసి ఈ యోర్దాను అనుభవం దాటకుండా పైకెత్తబడలేరు. అనగా సాతాను కలిగించే ప్రతీ అడ్డు ఆటంకాలను దాటుకొని వెళ్ళాలి. మరియు మరణం ద్వారా వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏలీయాగారు దీనిని విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి నదిని పాయలుగా చేసి ఎంతో సునాయాసంగా దాటేసారు. ఇక ఎలీషాగారు కూడా తన తిరుగు ప్రయాణంలో అదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి యోర్దాను నదిని ఎంతో అవలీలగా దాటేసారు. ప్రతీవిశ్వాసి కూడా ఇదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి యేసునామంలో ప్రతీ అడ్డంకిని పాయలుచేసి అవతలి ఒడ్డుకి చేరుకోవాలి.
అప్పుడు ఏం జరుగుతుంది?
1. రెండితల ఆత్మ సంపాదించుకోనగలవు
2. అగ్నిరధములు, అగ్నిగుఱ్ఱములు, సుడిగాలి ద్వారా ఏలీయా గారు పైకెత్తబడ్డారు. అదేవిధముగా రక్షింపబడిన విశ్వాసి కూడా యోర్దాను అనుభవం దాటినప్పుడు ఒకరోజు అనగా యేసయ్య రెండో రాకడలో వచ్చినప్పుడు రెప్పపాటులో కడభూర మ్రోగగానే పైకెత్తబడతారు!!! ఎప్పుడూ?
1.విశ్వాస జీవితాన్ని జీవించినప్పుడు
2.వాక్యాదారంగా జీవించినప్పుడు
3.పైనుదహరించిన అన్ని అనుభవాలను వీరోచితంగా దాటినప్పుడు.
ప్రియ విశ్వాసి! నేడో రేపో యేసయ్య రాబోతున్నారు. (1 దెస్సలోనికయులు 4:16,17; 1 కొరింథీ 15:50-52; మత్తయి 24:31)
నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు!
అట్టి కృప, ధన్యత, ఎత్తబడే అనుభవం నీకు, నాకు కలుగును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి