ఎరవుతెచ్చిన గొడ్డలి

ఎరవుతెచ్చిన గొడ్డలి

2 రాజులు 6:1-7లో మరో సంఘటన మన ఆత్మీయజీవితాభివృద్ధికోసం జరిగింది. ఇక్కడ మనంచూస్తే ప్రవక్తల శిష్యులు ఎలీషా గారియొద్దకు వచ్చి అయ్యా! ఇక్కడ స్థలం ఇరుకుగా ఉంది, అడవికిపోయి కొన్ని మ్రానులుతెచ్చి మరో నివాసం కట్టుకొంటాము అన్నారు. అందుకు గురువుగారు మంచిది వెళ్ళిరండి అన్నారు. అయితే ఒకడు దయచేసి మాతో మీరు రావాలి అని మనవిచేసాడు. సరే వస్తాను అని వాళ్లతో బయలుదేరి వెళ్లారు. అక్కడ ఒక శిష్యుడి గొడ్డలి యోర్దాను నదిలో పడిపోతుంది అప్పుడు ఒక చెట్టుకొమ్మ నరికి వేయగా గొడ్డలి తేలింది. ఇదీ జరిగిన సంఘటన.
అయితే దీనిలో నేర్చుకోవలసినవి చాల వున్నాయి,

1.ఈ సంఘటన ద్వారా మనకేం అర్ధమవుతుంది? దేవుడు మనతోఉంటే మనం ఏమైనా సాధించగలము.అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే- ఎంతో సునాయాసంగా సాధిస్తాము. అయితే ఒకవిషయం గమనించాలి. దేవుడు మనతోఉంటే కష్టాలు రావు అనుకోవద్దు. ఆయన కష్టాలు తప్పించారు కాని కష్టాలు తట్టుకొనే శక్తి, ఉపాయం ఇచ్చి, నీవింకా ముందుకు దూసుకుపోయే విధంగా నిన్నుతయారుచేస్తారు.

యేసయ్య పడవలో ఉన్నప్పుడు తుఫాను రాకుండా ఆపలేదు గాని తుఫానును ఏరకంగా ఆపాలో నేర్పిచారు.
దానియేలును సింహపుబోనులోకి పోకుండా అడ్డుకోలేదు గాని సింహాలబోనులో కూడా నేనే నీతో ఉంటాను అని చెప్పడానికి దానియేలుతో పాటు సింహాలబోనులోనికి వెళ్ళారు.

షడ్రక్, మేషకు, అబెద్నేగోలని అగ్నిగుండములో పడకుండా తప్పించలేదు గాని అగ్ని గుండములోనైనా సరే నాభక్తులను కాపాడుతాను అని చెప్పడానికి వాళ్ళతోపాటు అగ్ని గుండములోనికి వెళ్లారు. కాబట్టి ధైర్యంగా దేవునితో కలసి సాగిపో.

2. గొడ్డలి- విశ్వాసం: హెబ్రీపత్రికలో ముక్యంగా 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండలేవు, దేవునిని చూడలేము అని వ్రాయబడింది.

*విశ్వాసాన్ని మనం కొనలేము- అమ్మలేము*
విశ్వాసం అంటే నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు! దేవుణ్ణి సంపూర్తిగా నమ్మడం, ఆరాధించడం ఎటువంటి షరతులు పెట్టకుండా! ప్రభువా! ఏంచేసినా నీదే భారం అని ఆయనమీద పూర్తిగా ఆధారపడడం. ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపరచడు అనే స్థిరమైన విశ్వాసాన్ని కలిగియుండడం!
హబక్కూకు ప్రవక్తలా చెట్లు ఫలించకపోయినా, పూయకపోయినా, గొర్రెలు పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభువునందు ఆనందించాలి. 3:17-18
అయితే విశ్వాసం ఎలా కలుగుతుంది?
11:6 వినుటవల్ల విశ్వాసం కలుగుతుంది.
ఏం వినాలి?
ఆయన వాక్యం, ఆయన చేసిన గొప్పకార్యాలు, ఆయన ప్రేమ, ఆయన మహత్తర బలియాగం. ఎఫెసీ 2:8,9 లో మీవిశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.
విశ్వాసం ఎందుకు కావాలి?
ఆయనకీ ఇష్టులుగా ఉండడానికి
దేవునిని చూడడానికి
అద్భుతాలు పొందుకోడానికి
పరలోకం చేరడానికి
సైతానుని జయించడానికి ----హెబ్రీ 11వ అధ్యాయం, ఎఫెసీ 6:16

అందుకే యేసయ్య అంటున్నారు- నీ విశ్వాసమే నిన్ను స్వస్తపరచింది అన్నారు. మరోసారి నీవు నమ్ముచున్నావా? అని అడిగితె ఆవ్యక్తి అన్నాడు నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయుము అని వేడుకొన్నాడు. అట్టి పరిపూర్ణ విశ్వాసం నీవు నేను కలిగియుండాలి.
*విశ్వాసం దేవునికో నీకున్న సంభాదాన్ని గట్టిపరుస్తుంది.*

3. ఎరవు తెచ్చిన గొడ్డలి:
ఇక్కడ ఈశిష్యుడు తనగొడ్డలి ఎవరిదగ్గరనుండో ఎరవు తెచ్చుకొన్నాడు. అయితే ప్రతీ వ్యక్తికీ సొంతవిశ్వాసం ఉండాలి. యేసయ్యకి రికమండేషన్ అవుసరం లేదు. ఆయన ప్రతీ మొర వినే దేవుడు. ప్రాముఖ్యంగా దీనుల మొర తప్పక వింటారు. కేవలం పాష్టర్ గారి ప్రార్ధనో దైవసేవకుడి ప్రార్ధనో వింటారు అనుకోవద్దు. నీ ప్రార్ధన-విశ్వాసం ద్వారా తప్పకుండా నీకు సహాయం చేస్తారు.

అయితే ఇక్కడ ఈ గొడ్డలి జారి పడిపోయింది. నీవునేను కొన్నిసార్లు విశ్వాసంలో జారిపడిపోతాం, లోకంలో కలసిపోతుంటాం ధనాశవలన, లోకాశలవలన, అక్రమసంభంధాలువలన (సంసోను, దావీదు, సోలోమోను).
కొన్నిసార్లు దేవుడు జవాబివ్వడం ఆలస్యమైతే దిగాజారిపోతాం.

4. కొమ్మ- యేసయ్య:
ఒకవేళ నీవు విశ్వాసంలో జారిపోయావా? తిరిగి యేసయ్య వద్దకు కన్నీటితో రా! ఆ ప్రవక్తల శిష్యుడు రోదించినట్లు రోదించు. అప్పుడు ఎశ్శయికి/ దావీడుకి చిగురైన యేసయ్య నీజీవితంలో అద్భుతాలు చేస్తారు. అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తారు. ఇనుపగొడ్డలి నీటిలో మునిగిపోతుంది గాని ఆశ్చర్యంగా కొమ్మ నీటిలో వేసినవెంటనే అది తేలింది.

కాబట్టి ప్రియవిశ్వాసి! పోగుట్టుకొన్న విశ్వాసాన్ని తిరిగి పొందుకో. యేసయ్య పాదాలు దగ్గరికి రా!
దేవుని సన్నిధిని మరచిపోయావేమో? తిరిగి దేవుని మందిరానికి రా!
వాక్యాన్ని పట్టుదలగా చదువు.
అప్పుడు అన్నీ నీకు సాధ్యమవుతాయి.
అట్టి కృప మనందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు!
ఆమెన్!

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పాపము

పొట్టి జక్కయ్య

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

యేసు క్రీస్తు రెండవ రాకడ

పక్షిరాజు

విశ్వాసము

అబ్రాహాము విశ్వాసయాత్ర

సమరయ స్త్రీ

శరీర కార్యములు

యెషయా ప్రవచన గ్రంధము- Part-1