పరిశుద్ధ గ్రంధము
పరిశుద్ధ గ్రంధము
(మొదట భాగము)ప్రార్ధన ప్రాముఖ్యమైనదా?
వాక్యము ప్రాముఖ్యమైనదా?
ఏది ప్రాముఖ్యమైనది?
నీకున్న రెండు కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే? ఏమి చెప్పగలవు?
ప్రార్ధన, వాక్యము రెండూ రెండు కళ్ళ వంటివి. రెండూ అత్యంత ప్రధానమైనవే. దేనినీ అశ్రద్ధ చెయ్యడానికి వీలులేదు.
'వాక్యము' ద్వారా దేవుడు మనతో మాట్లాడితే? 'ప్రార్ధన' ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాము. అందుచే,
వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్ధించ గలగాలి.
*నీ యవ్వనంలో నీవు బైబిల్ ని మోస్తే, నీ వృద్ధాప్యమందు అది నిన్ను మోస్తుంది.*
• పరిశుద్ధ గ్రంధము *దేవుని యొక్క మాటలు*.
• పరిశుద్ధ గ్రంధము మూడు గొప్ప ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.
1. నేను ఎక్కడ నుండి వచ్చాను?
2. నేను ఇక్కడ ఎందుకు వున్నాను?
3. నేను ఎక్కడకి వెళ్తాను?
• *బైబిలు* అనే మాట బిబ్లియా అను గ్రీకు పదము నుండి వచ్చినది.
*పరిశుద్ధ గ్రంధమునకు వాడబడిన పర్యాయ పదాలు:*
• ధర్మశాస్త్ర గ్రంథము
ద్వితి 31:25
• పరిశుద్ధ లేఖనములు
రోమా 1:4
• జీవ వాక్యములు
అపో.కార్య 7:38
ఫిలిప్పీ 2:16
• క్రీస్తు వాక్యం
కొలస్సీ 3:16
• దేవుని వాక్యం
హెబ్రీ 4:12
లూకా 11:28
• ధర్మశాస్త్రము
• శాసనములు
• మార్గములు
• ఆజ్ఞలు
• కట్టడలు
• న్యాయవిధులు
కీర్తనలు 119:1-7
పాత నిబంధన పుస్తకములు - 39
క్రొత్త నిబంధన పుస్తకములు - 27
మొత్తము - 66
*పరిశుద్ధ గ్రంధం వ్రాయబడిన భాషలు:*
• హీబ్రు/ ఆరామిక్
• గ్రీకు/లాటిన్
• హీబ్రు (పాత నిబంధనలో ఎక్కువ భాగం )
• గ్రీకు (క్రొత్త నిబంధన)
*పరిశుద్ధ గ్రంధం
వ్రాయించిన వాడు?*
పరిశుద్ధాత్ముడే
ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.
2 పేతురు 1:21
మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
1 కొరింది 2:13
పరిశుద్ధ గ్రంధం ప్రామాణికమైనది!
ప్రశస్తమైనది!
ఈలోకంలో ఎన్ని గ్రంధాలున్నా ఆ దివ్య గ్రంధానికి సాటిలేదు మరేది.
దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! నిన్ను జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది!
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
పరిశుద్ధ గ్రంధము
(రెండవ భాగము)*పరిశుద్ధ గ్రంధం వ్రాసినవారు?*
పరిశుద్ధ గ్రంధం వ్రాయించినవాడు *పరిశుద్ధాత్ముడు* కాగా, వ్రాసిన వారు మాత్రం సుమారు 40 మంది 1500 సంవత్సరాలపాటు వ్రాసారు. వేరు వేరు స్థలాలలో, వేరు వేరు కాలాలలో వ్రాసారు. వీరిలో రాజులు మొదలుకొని పశువుల కాపరుల వరకూ వున్నారు.
• రాజులు - దావీదు, సొలోమోను
• పండితులు - మోషే
• ప్రవక్తలు - యెషయా, యిర్మీయా,యెహెఙ్కేలు,
సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి
• జాలరులు - పేతురు, యాకోబు, యోహాను
• యుద్ధ వీరుడు - యెహోషువ
• రాజకీయ వేత్తలు:
దానియేలు, నెహెమ్యా
• శాస్త్రి - ఎజ్రా
• వ్యవసాయదారుడు - హబక్కూకు
• వేదాంతి - అపొస్తలుడైన పౌలు
• వైద్యుడు - లూకా
• శిష్యులు - యూదా, మార్కు
• పశువుల కాపరి - ఆమోసు
పరిశుద్ధ గ్రంధాన్ని ఎంత మంది వ్రాసినా, ఏఏ కాలాలలో వ్రాసినా, ఏఏ స్థలాలలో వ్రాసినా, వారి వృత్తులు, జీవన విధానం ఏదైనా గాని, ఆత్మ ప్రేరణతో వ్రాసారు కాబట్టి. ఒకరితో ఒకరు విభేదించిన పరిస్థితి లేదు. అదే సజీవ వాక్యమైన పరిశుద్ధ గ్రంథ ప్రత్యేకత.
*పరిశుద్ధ గ్రంధమును వ్రాయడానికి ఉపయోగించిన పదార్ధములు:*
• రాతి పలకలు
• చర్మము చుట్టలు
• మట్టి, చెక్క, మైనపు పలకలు
• కుండ పెంకులు
• ప్యాపిరస్ అనే చెట్టు బెరడు
మొదలగునవి.
*పరిశుద్ధ గ్రంథ మూల ప్రతులు లభించిన స్థలాలు*
• మృత సముద్రము వద్ద గల ఖుమ్రాన్ గుహలు.
• కేథరీన్ చర్చ్ నందు.
•జాన్ గూటంబర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించ బడినది పరిశుద్ధ గ్రంధమే.
•నిమిషానికి సుమారుగా 50 బైబిల్స్ చొప్పున ప్రపంచములో ఎక్కువ అమ్ముడుపోయేది పరిశుద్ధ గ్రంధమే.
• ప్రపంచములో కోట్లాది పుస్తకాలున్నప్పటికీ *పరిశుద్ధ గ్రంధం* అని పిలువబడేది, పరిశుద్ధతలోనికి నడిపించేది, *బైబిల్* ఒక్కటే.
పరిశుద్ధ గ్రంధం ప్రామాణికమైనది!
ప్రశస్తమైనది!
ఈలోకంలో ఎన్ని గ్రంధాలున్నా ఆ దివ్య గ్రంధానికి సాటిలేదు మరేది.
దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! నిన్ను జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది!
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
పరిశుద్ధ గ్రంధము
(మూడవ భాగము)పరిశుద్ధ గ్రంధము కేవలము రక్షణ, ఆశీర్వాదములను కలిగియున్న గ్రంధము మాత్రమే అని కాకుండా, *తీర్పులు* కూడా కలిగియున్న గ్రంధము అని గ్రహించాలి. అట్టి గ్రహింపే మనలను పాశ్చత్తాపము, మారుమనస్సు, రక్షణ లోనికి నడిపిస్తుంది.
*పాతనిబంధనా గ్రంథ విభజన:*
గ్రంధములు: 39
@*ధర్మ శాస్త్ర గ్రంధములు*@
•ఆదికాండము
•నిర్గమ కాండము
•లేవీయ కాండము
•సంఖ్యా కాండము
•ద్వితీయోపదేశ కాండము
@*చరిత్ర గ్రంధములు*@
*దేవుని పరిపాలనా చరిత్ర*
•యెహోషువా
•న్యాయాధిపతులు
•రూతు
*రాజ్య పరిపాలనా చరిత్ర*
•సమూయేలు మొదటి గ్రంధము
•సమూయేలు రెండవ గ్రంధము
•రాజులు మొదటి గ్రంధము
•రాజులు రెండవ గ్రంధము
•దినవృత్తాంతములు మొదటి గ్రంధము
•దినవృత్తాంతములు రెండవ గ్రంధము
*చెరనివాస జీవితమునకు తరువాత చరిత్ర*
•ఎజ్రా
•నెహెమ్యా
•ఎస్తేరు
@*కావ్య గ్రంధములు*@
•యోబు
•కీర్తనలు
•పరమ గీతము
•విలాప వాక్యములు
@*జ్ఞానమునిచ్చు గ్రంధములు*@
•సామెతలు
•ప్రసంగి
@*ప్రవచన గ్రంధములు*@
*పెద్ద ప్రవక్తలు*:
యెషయా
యిర్మీయా
యెహెఙ్కేలు
దానియేలు
*చిన్న ప్రవక్తలు*:
హోషేయా, యోవేలు, ఆమోసు, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి.
*పాత నిబంధనకు, క్రొత్త నిబంధనకు మధ్య కాలము 400 సంవత్సరాలు. ఈ కాలంలో దేవుడు మాట్లాడలేదు. ఈ కాలాన్ని "నిశ్శబ్ద సంవత్సరాలు" (Silent years) అని పిలుస్తారు.*
@*క్రొత్త నిబంధనా గ్రంథ విభజన*@
గ్రంధములు: 27
*జీవిత చరిత్ర పుస్తకములు:*
• మత్తయి
• మార్కు
• లూకా
• యోహాను
*చరిత్ర పుస్తకము*
• అపొస్తలుల కార్యములు
*పౌలు యొక్క పత్రికలు*
1. రోమా
2. 1 కొరింధీయులు
3. 2 కొరింధీయులు
4. గలతీయులు
5. ఎఫెస్సీయులు
6. ఫిలిప్పీయులు
7. కొలస్సీయులు
8. 1 థెస్సలొనీకయలకు
9. 2 థెస్సలొనీకయలకు
10. 1 తిమోతి
11. 2 తిమోతి
12. తీతుకు
13. ఫిలోమోను
14. హెబ్రీ
*సార్వత్రిక పత్రికలు*
• యాకోబు
• 1 పేతురు
• 2 పేతురు
• 1 యోహాను
• 2 యోహాను
• 3 యోహాను
• యూదా
*ప్రవచన గ్రంధము*
• ప్రకటన
పరిశుద్ధ గ్రంధం పరిశుద్దాత్ముని ప్రేరణతో వ్రాయబడింది. అది ప్రామాణికమైనది!
ప్రశస్తమైనది!
ఈలోకంలో ఎన్ని గ్రంధాలున్నా ఆ దివ్య గ్రంధానికి సాటిలేదు మరేది.
*దేవుని వాక్యం, నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.*
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(నాలుగవ భాగము)*ఎందుకు? ఎప్పుడు? ఎలా?*
*పరిశుద్ధ గ్రంధాన్ని ఎందుకు ధ్యానించాలి?*
పాపము అంటే?
దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం, దేవుడు చెయ్యవద్దన్నది చెయ్యడం.
దేవుడు ఏమి చెయ్యమన్నాడో? ఏది చెయ్యవద్దన్నాడో? మనకు ఎట్లా తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే.
ఒక్క మాటలో చెప్పాలంటే? *నిత్య మరణం నుండి తప్పించబడి, నిత్య జీవంలోనికి చేరే మార్గమును పరిశుద్ధ గ్రంధం బోధిస్తుంది.* అందుకే పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి.
*పరిశుద్ధ గ్రంధాన్ని ఎప్పుడు ధ్యానించాలి?*
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు *దివారాత్రము* దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2
పగలు, రాత్రి కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వుండాలి. మన పనులు చేసుకొనే సమయంలో కూడా వాక్యమును స్మరణకు తెచ్చుకొని ధ్యానిస్తూ వుండాలి. అట్లా చెయ్యడం ద్వారా మన తలంపులు చెడిపోకుండా, దేవునిలో మరింత బలాన్ని పొందుకోగలము.
*పరిశుద్ధ గ్రంధాన్ని ఎట్లా ధ్యానించాలి?*
యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా 34:16
పరిశుద్ధ గ్రంధములో ఎన్ని అధ్యాయాలు చదివాము అనేదానికంటే, ఎంత గ్రహించాము అనేది ముఖ్యం. ఎంత గ్రహించాము అనేదానికంటే, ఎంత అన్వయించుకున్నాము అనేది మరీ ముఖ్యం.
ఎప్పుడు అన్వయించుకోగలమంటే? వాక్యాన్ని పరిశీలనగా ధ్యానించినప్పుడు.
వాక్యాన్ని ఎట్లా పరిశీలన చెయ్యాలి?
• పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్ధించి ప్రారంభించాలి.
మనము చదివిన భాగములో ఈ క్రింది విషయాలను పరిశీలన చెయ్యాలి.
• వ్రాయ బడిన సందర్భం ఏమిటి?
• దేవుడు మనుష్యులతో మాట్లాడుతున్నాడా?
• మనిషి దేవునితో మాట్లాడుతున్నాడా?
• మనిషి మనిషితో మాట్లాడుతున్నాడా?
• దేవుని వాగ్ధానముందా? దానికున్న షరతులేమిటి?
• దేవుని ప్రేమ కనబడుతుందా? దానికి మనకున్న అర్హతలేమిటి?
• దేవుని ఉగ్రత ఉందా? దానికి గల కారణాలు ఏమిటి?
• మనము విడచి పెట్టవలసినది ఏమిటి?
• మనము అన్వయించు కోవలసినది ఏమిటి?
• ఏమిటి? ఎందుకు? ఎట్లా? వంటి ప్రశ్నలు సంధిస్తూపొతే, పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తాడు.
• అర్ధంకాని విషయాలుంటే? వ్రాసుకొని వాక్యానుభవం కలిగిన వారి ద్వారా మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(ఐదవ భాగము)*పరిశుద్ధ గ్రంధం - పోలికలు*
*పాలు*:
శిశువు బలము పొందుకొని, జీవించాలంటే? పాలు ఎంత అత్యవసరమో? ఆత్మీయ శిశువు అభివృద్ధి చెందాలంటే? *వాక్యమనే పాలు * అంతే అవసరం.
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
1 పేతురు 2:3
*తేనె*:
తేనె కన్నా మధురమైనది ఈ లోకాన లేదనుకుంటాము. కానీ, దాని కంటే మధురమైనది దేవుని వాక్యము.
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
కీర్తనలు 119:103
*రొట్టె (ఆహారం)*:
ఆహారం క్షయమైన శరీరాన్ని మాత్రమే జీవింపజేస్తుంది. కానీ వాక్యమైన జీవాహారం అక్షయమైన ఆత్మను జీవింపజేస్తుంది.
అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును
మత్తయి 4:4
*అగ్ని*:
అగ్ని స్వచ్ఛ మైనది, పవిత్రమైనది. దేవుని వాక్యము కూడా అట్లాంటిదే.
నా మాట అగ్నివంటిదికాదా?
యిర్మియా 23:29
*సుత్తె*:
బండలను బ్రద్దలు చెయ్యాలంటే? సుత్తె కావాలి. బండలుగా మారిన మన హృదయాలను బ్రద్దలుచేసి, సరి చెయ్యాలంటే? వాక్యమనే సుత్తె తప్పక కావాలి.
నా మాట .....
బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?
యిర్మియా 23:29
*అద్దము*:
నీ బాహ్య రూపాన్ని సరి చేసుకోవడానికి అద్దము కావాలి. నీ అంతరంగాన్ని సరిచేసుకోవాలంటే? వాక్యమనే అద్దము తప్పకకావాలి.
ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
యాకోబు 1:23
*ఖడ్గము*:
శత్రువును జయించాలంటే? ఖడ్గము ధరించాల్సిందే. మన ప్రధాన శత్రువైన సాతానును జయించాలంటే? వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించాల్సిందే.
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీ 4:12
వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
ఎఫెసి 6:17
*విత్తనము*:
ఫలించాలంటే? విత్తనం కావాలి. ఆత్మీయంగా ఫలించాలంటే? వాక్యమనే విత్తనం కావాలి.
విత్తనము దేవుని వాక్యము.
లూకా 8:11
*నీరు*:
దేహమునకంటిన మురికిని శుభ్రపరచు కోవాలంటే? నీరు కావాలి. హృదయానికి అంటిన మురికిపోవాలంటే? వాక్యమనే నీరు కావాలి.
నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
ఎఫెసి 5:27
పాలు, తేనె, రొట్టె, అగ్ని, సుత్తె,
అద్దము, ఖడ్గము, విత్తనము, నీరు వంటి వాక్యాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(ఆరవ భాగము)*పరిశుద్ధ గ్రంధం ఎవరికోసం ఉద్దేశించి బడింది?*
పరిశుద్ధ గ్రంధం పట్ల చాలా మందికి గల అభిప్రాయమేమిటంటే? అది క్రైస్తవులకొరకు మాత్రమే ఉద్దేశించిబడిందని.
అనేక మంది క్రైస్తవ్యాన్ని ఒక మతముగా అభిప్రాయ పడుతుంటారు. క్రైస్తవ్యం అనేది మతమే కాదు. అది నిత్యరాజ్యానికి చేర్చే ఏకైక మార్గము.
*క్రీస్తును కలిగియున్నవాడే క్రైస్తవుడు*. మతములు, కులములు, వర్ణములు ఇవన్నీ మనము సృష్టించుకున్నవేతప్ప, వీటికి క్రైస్తవ్యానికి అసలు సంబంధమే లేదు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు *ఆయనను* అనుగ్రహించెను. యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో......... ప్రేమించాడు. ఎంతగా అంటే? వర్ణించడానికి మాటలు చాలనంతగా. తన కుమారునినే ఈ లోకానికి పంపించినంతగా.
ఆయన కొందరికి మాత్రమే ప్రభువు కాదు. *ఆయన (యేసు క్రీస్తు) అందరికీ ప్రభువు*. అపో. 10:36
అట్లానే, ఆయన వాక్యం కొందరికే పరిమితం కాదు. అది అందరికీ.
*ఆయనే వాక్యం.*
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, *వాక్యము దేవుడై యుండెను*. యోహాను 1:1
*వాక్యమే శరీరధారిగా దిగి వచ్చింది.*
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; యోహాను 1:1
ఆయన ఏ ఒక్కరికోసమో, ఒక జాతి కోసమో ఈ లోకానికి శరీరధారిగా రాలేదు. సర్వ మాన వాళి కోసం వచ్చి, తన ప్రాణమును బలిగా అర్పించారు.
ఆయన వచ్చింది సర్వమానవాళి కోసం. ఆయన వాక్యం ఉద్దేశించిబడినది కూడా సర్వమానవాళి కోసమే.
• దేవుని వాక్యమును ఎవరికో పరిమితం చేసే ప్రయత్నం చేసినా ?
• అన్ని పుస్తకాలలో ఇదొకటి అంటూ చులకన చేసి, నిర్లక్ష్యం చేసినా?
• ఇది విదేశీ గ్రంధం అంటూ అపహాస్యం చేసినా?
నష్టపోయేది నీవే. పరిశుద్ధ గ్రంధం ముమ్మాటికీ నీ కోసమే ఉద్దేశించిబడింది.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(ఏడవ భాగము)*లేఖనములు లేదా దేవుని వాక్యము యొక్క ఉద్దేశ్యము:*
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు *దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము* ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
2 తిమోతి 3: 16,17
*ఉపదేశించుటకు*:
దేనిని గురించి ఉపదేశించును?
సత్యమును గూర్చి.
సత్యము అంటే?
ఆయనే సత్యము, ఆయన వాక్యమే సత్యము.
*నేనే సత్యమును*
యోహాను 14:6
*నీ వాక్యమే సత్యము*
యోహాను 17:17
దేవునిని గూర్చి, ఆయన పంపిన కుమారుడైన యేసు క్రీస్తును గూర్చి, మనము పొందవలసిన రక్షణను గూర్చి ఉపదేశిస్తుంది.
*ఖండించుటకు*:
పాపమును గూర్చి, అబద్ధ బోధలను గురించి ఖండించుచూ, పాపము అంటే ఏమిటో తెలియజేసి, సత్యమైన బోధ ఏమిటో? నిర్ధేశముగా చెప్పగలుగుతుంది.
పాపిని ప్రేమిస్తుంది గాని, పాపముతో మాత్రం ఎన్నటికీ రాజీపడదు.
*తప్పు దిద్దుటకు*:
తప్పు దిద్దుకోవాలంటే?
అసలు మనము చేసేది తప్పు అని తెలియాలి.
తప్పు అంటే ఏమిటో? దానిని దిద్దుకొనే మార్గమేమిటో కూడా వాక్యం తెలియజేస్తుంది.
( అట్లా అయితే, మన తప్పులు దిద్దుకోలేక పోతున్నామంటే? అవి తప్పులని తెలియకా? కానే కాదు. తెలిసే చేస్తున్నాము)
*మన జీవితాలలోని పొరపాట్ల విషయం మనలను ఒప్పించే సాధనం దేవుని వాక్యం.*
*నీతియందు శిక్షచేయుటకు*:
అన్యాయముతో నిండివున్న ఈ లోకంలో న్యాయముగా ఎట్లా ప్రవర్తించాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిలో శిక్షణనిచ్చి, క్రైస్తవుడు ప్రతి సత్కార్యానికి సిద్ధ పడేలా అన్ని వివరాలనూ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.
వాక్యమే లేకపోతే?
• సత్యమును గురించి ఉపదేశించే దెవరు?
• పాపమును గురించి ఖండించేదెవరు?
• తప్పును దిద్దుకొనే మార్గమేది?
• నీతిని గూర్చి శిక్ష చేసేదెవరు?
ఇవే జరగకపోతే? మన జీవితాలకు సార్ధకత లేనేలేదు.
దేవుని వాక్యము నీకు ఉపదేశించి నప్పుడు, ఖండించినప్పుడు, నీ తప్పు నీకు తెలియజేసినప్పుడు, నీతియందు శిక్ష చేసినప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో గలిగితే?
వాక్యము యొక్క ఉద్దేశ్యం నెరవేరినట్లే.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(ఎనిమిదవ భాగము)*దేవుని వాగ్ధానముల యొక్క ఉద్దేశ్యము*
దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
*ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.*
2 పేతురు 1:3,4
పరిశుద్ధ గ్రంధం వాగ్ధానాలపుట్ట.
ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు.
దానికి గల కారణం?
ఆయన మహిమా గుణాతిశయములే.
మహిమ అంటే?
ఆయన మంచితనమే. (గుణము)
మోషే దేవునిని అడుగుతున్నాడు. " నీ మహిమను నాకు చూపించు" అని. దానికి సమాధానముగా దేవుడు "నా మంచి తనమంతయూ" నీకు చూపిస్తాను అంటున్నాడు.
నిర్గమ 33:18,19
• మనకు మేలు చేయడానికి గల కారణం? ఆయన మంచితనమే.
నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
కీర్తనలు 31:19
• ఆయన వాగ్ధానములకు కారణము ఆయన మంచితనము మాత్రమే.
ఆయన వాగ్ధానాలు ఎంత స్పష్టమైనవి అంటే?
1. ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదాన్ని తీర్చేవి.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
ఎఫెసీ 1:3
2. మన ప్రతీ అవసరాన్ని తీర్చేవి:
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
ఫిలిప్పి 4:19
అయితే,
*లోకములో మనము దురాశను అనుసరించుట వలన, బ్రష్టులమైపోవాలి. కానీ, అట్లా జరుగకుండా దేవుని వాగ్ధానాలు ఆ భ్రష్టత్వము నుండి మనలను తప్పిస్తున్నాయి*.
అంతేకాదు, ఆయన యొక్క స్వభావము నందు,ఆయనతో పాలివారమగునట్లు అట్టి వాగ్ధానములు మనకు అనుగ్రహించబడెను.
ఈ సత్యాన్ని గ్రహించి, వాటిని ధ్యానించి, విశ్వసించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( తొమ్మిదవ భాగము)*దేవుని వాక్యము నిర్దోషమైనది*
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. కీర్తనలు 19:8
• ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటలు పరిశుద్ధమైనవి.
*నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది*. 1 పేతురు 1:14
• మట్టి మూసలో వెండిని కరిగించినప్పుడు దానిలోనున్న మలినములన్నీ కరిగిపోయి పవిత్ర పరచబడుతుంది. అయితే, ఒక్కమారు కాదు, ఏడు మారులు కరిగిస్తే? వెండి ఎంత పవిత్రమవుతుందో? అంతటి పరిశుద్ధ మైనది దేవుని వాక్యం.
*యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండియంత పవిత్రములు*. కీర్తనలు 12:6
*దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే.* సామెతలు 30:5
• దేవుడు యదార్ధ వంతుడు. ఆయన అబద్ధమాడడు. ఆయన మాట కలుషితం కానిది.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. సంఖ్యా 23:19
*దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము* కీర్తనలు 18:30
• దేవుని మాట మిక్కిలి స్వశ్చమైనది. అది ఎన్నటికీ కలుషితం కాదు.
*నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది*. కీర్తనలు 119:140
• ఆయనే సెలవిస్తున్నాడు. నేను చెప్పేది ఏదైనా న్యాయమే. అది సత్యమే.
*నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే*. యెషయా 45:19
అవును!
*దేవుని మాట నిర్దోషమైనది*.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పదియవ భాగము)*దేవుని వాక్యము హృదయమును సంతోషపరచును.*
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును.
కీర్తనలు 19:8
మనిషి అనునిత్యం ప్రయాసపడేది దేనికోసం అంటే? తాను సంతోషంగా వుండడం కోసమే. అతడు చేసేపని ఇతరులకు వేదన కలిగించేదిగా వున్నా, తన సంతోషం కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధపడతాడు.
ఈలోకంలో ఎన్నో సంతోషాలున్నాయి. కానీ అవేవి సంతోషాలు కావు. అవి శాశ్వతమైనవి కాదు సరికదా, వాటి గమ్యం శాశ్వతమైన దుఃఖంలోనికి నడిపిస్తాయి.
శాశ్వతమైన సంతోషం ఈ లోకంలో ఏదైనా వుంది అంటే? అది దేవుని వాక్యం చదవడం, వినడం, గైకొనడం ద్వారానే సాధ్యం.
మనుష్యుల మాటలు సంతోషాన్నిచ్చినా? అది తాత్కాళికమే. దేవుని మాటలు శాశ్వతానందాన్ని ఇవ్వగలవు.
• దావీదు దేవుని వాక్యమును నిత్య స్వాస్థ్యముగా భావిస్తున్నాడు. కారణము? దేవుని వాక్యము అతని హృదయానికి ఆనందం కలిగించింది.
*నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను*.
కీర్తనలు 119:111
• విలపించే ప్రవక్తగా పేరుపొందిన యిర్మియా సహితం చెప్పగలుగుతున్నాడు. దేవుని మాటలు నా హృదయానికి ఆనందమును కలుగజేస్తున్నాయని.
*నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి*.
యిర్మియా 15:16
ఇట్లాంటి సంతోషం మనలో ఎందుకు లోపించింది? హృదయానికి ఆనందాన్నిచ్చే పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం మానుకున్నామేమో?
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు హృదయానందాన్నిస్తుంది! నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పదకొండవ భాగము)*నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది*. కీర్తనలు 119:50
సమస్యల సుడిగుండాలా?
గాఢాంధకారమా?
చెలరేగే తుఫానా?
ఎటు చూచినా అపజయాలేనా?
ఆదరించేవారు లేరు. ఓదార్చేవారు అసలే లేరు అనే పరిస్థితులా?
దారులన్నీ మూసుకుపోయి, చావే శరణ్యం అనే పరిస్థితులలో సహితం, *దేవుని మాట* జీవపు ఊట. నేనున్నా తోడంటూ ముందుకు నడిపించే బాట.
పాపములో పట్టబడి ప్రజలందరి మధ్యలో అవమానంతో నిలువబడినప్పుడు, అందరి చేతుల్లోని రాళ్లు ఆమెవైపే గురి కలిగియున్న దయనీయమైన పరిస్థితులలో......
*అమ్మా!* అని పిలిచిన ఆ పిలుపు తనకెంత ఆదరణ? యోహాను 8:10
*కుమారీ, ధైర్యముగా ఉండుము* మత్తయి 9:22
పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల స్త్రీకి ఈ మాట ఎంత ఆదరణ?
• నీ కుమార్తె చనిపోయింది. భోధకుని శ్రమ పెట్టవద్దని సమాజ మందిరపు అధికారితో ప్రజలు చెప్తూవుంటే? యేసు ప్రభువు అతనికిస్తున్న అభయమెంత గొప్పది?
*భయపడకుము. నమ్మిక మాత్రముంచుము*. మార్కు 5:36
• ఆమె విధవరాలు. ఒక్కడైన కుమారుడు చనిపోయి, సమాధికి మోసికొని పోబడుచున్నాడు. ఆ తల్లిని ఆదరిస్తూ ... తన కుమారుని బ్రతికించిన ఆదరణ మరెంత గొప్పది?
ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--*ఏడువవద్దని* ఆమెతో చెప్పి, లూకా 7:13
*మీ హృదయమును కలవరపడనియ్యకుడి*; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి. యోహాను 14:1
మిమ్మును అనాథ లనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను 14:18
అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. యోహాను 14:22
లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. యోహాను 14:33
ఇట్లా అనేక సందర్భాలలో ఆయన మాటలు మన జీవితాలకు ఎంతో ఊరట.
మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,మీ హృదయ ములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక. 2 థెస్స 2:16,17
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పండ్రెండవ భాగము)*దేవుని వాక్యము నడతను శుద్ధీకరిస్తుంది.*
*యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?* కీర్తనలు 119:9
ఒక యవ్వనుడు అడగదగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలలో ఇదొకటి. అతనికి వుండవలసిన ఆశయాలతో ఇదొకటి.
జీవిత శుద్ధి ఎట్లా సాధ్యమంటే? దేవుని వాక్యాన్ని అభ్యాసం చెయ్యడం వల్లనే సాధ్యం. అట్లా చేసేందుకు దేవుని కృపను, ఆయన బలమును వెదుకుతూ వుండాలి
• మన ఆలోచనలకు, ఆశలకు దేవుని వాక్యమునే కేంద్రముగా చేసుకోవాలి.
*నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను*. కీర్తనలు 119:11
• దేవుని సహాయం మూలముగా ఆయన వాక్యమును అర్ధం చేసుకోవాలి.
*యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము*. కీర్తనలు 119:12
• మనము నేర్చుకున్న వాక్యమును గురించి మాట్లాడుతూ వుండాలి.
*నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును*. కీర్తనలు 119:13
• వాక్యములోనే ఆనందిస్తూ, సంతోషముగా వుండాలి.
*సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను*. కీర్తనలు 119:14
• వాక్యమునే ధ్యానిస్తూ , ఆయన త్రోవలలో నడవాలి.
*నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను*. కీర్తనలు 119:15
• ధ్యానించిన వాక్యమును బట్టి ఆనందిస్తూ, వాటిని మరువక యుండాలి.
*నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును*. కీర్తనలు 119:16
ఇట్టి రీతిగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ, జీవించగలిగితే? మన ప్రవర్తన (నడత) సరిచేయబడుతుంది. తద్వారా ఆ నిత్య రాజ్యానికి వారసులం కాగలం.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పదమూడవ భాగము)*దేవుని వాక్యము చీకటితో నిండిన ప్రపంచములో వెలుగును నింపును.*
దేవుని వాక్యము మన పాదములకు దీపము. మన పాదములకు దీపములుంటే? మన త్రోవలన్నీ వెలుగుమయమే కదా? ఇక ముండ్లపైనా, రాళ్ళపైన, అపరిశుభ్రమైన స్థలాల్లో మన అడుగులు పడే అవకాశమే లేదు.
చేరవలసిన గమ్యస్థానం సాఫీగా చేరవచ్చు.
పాపమనే అంధకారాన్ని చేధించాలంటే? వెలుగైయున్న వాక్యమే శరణ్యం. మన గమ్యమైన నిత్య రాజ్యానికి చేరాలంటే? మార్గాన్ని సిద్ధం చేసి, నడిపించగలిగేది వాక్యమే.
*నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది*.
కీర్తనలు 119:105
• దేవుని వాక్యము మన కన్నులకు వెలుగిచ్చును. ఇక మనము చూసేదంతా వెలుగుమయమే. చీకటికి తావే లేదు.
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచునుయెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది *కన్ను లకు వెలుగిచ్చును*.
కీర్తనలు 19:8
• దేవుని వాక్యము వెలుగుతో పాటు, తెలివిలేని వారికి తెలివిని అనుగ్రహిస్తుంది.
*నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును* అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును
కీర్తనలు 119:130
ఒకవేళ, ఇంకనూ పాపమను అంధకారంలో కొట్టుమిట్టాడుతూ వుంటే? వెలుగులోనికి నడిపించగలిగేది పరిశుద్ధ గ్రంధమే.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది! నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( పదునాలుగవ భాగము)*దేవుని వాక్యము మనుష్యులలో భయమును పుట్టిస్తుంది.*
"నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది" కీర్తనలు 119:38
భక్తి చేస్తున్నాము కానీ, ఆ భక్తిలో భయము లోపించింది. భయములేని భక్తి వ్యర్థం.
మన దృష్టిలో భక్తి చెయ్యడం అంటే?
• బైబిల్ పట్టుకొని తిరగడం.
• మెడలో సిలువ
• గోడలకు దేవుని వాక్యాలు
• ఈ గృహాధిపతి యేసే అనే బోర్డులు.
కానీ, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు? మనము పరిశుద్ధ దేవుని బిడ్డలం అనిగాని, మెడలో సిలువ వుంది అనే తలంపుగాని మనకు రాదు.
ఇంట్లో దుర్భాషలు మాట్లాడేటప్పుడు, టీవీ లలో సినిమాలు, సీరియల్స్, సినిమా పాటలు వినబడుతున్నప్పుడు అదే గదిలో దేవుని వాక్యం ( దేవుని వాక్యం అంటే దేవుడే) వ్రేలాడుతుంది అనే తలంపు మన దరిదాపుల్లోనికి కూడా రాదు.
కారణం?
దేవుని గురించిన భయము లేదు.
అయితే, దేవుని గురించిన భయము మనకెట్లా కలుగుతుంది?
పరిశుద్ధ గ్రంధమును ధ్యానించడం ద్వారానే.
"నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది" కీర్తనలు 119:38
నాణెమునకు ఒక వైపు మాత్రమే చూస్తున్నాం! ఆవైపున ఆయన దయామయుడు, కృపామయుడు, ప్రేమమయుడు, గొర్రెపిల్లలా... కనిపిస్తున్నాడు. దేవుడు అంటే అంతే. చివరి క్షణంలో ప్రార్ధించినా క్షమించేస్తాడు అనే చులకన భావం మనలో వుండిపోయింది.
అయితే, నాణెమును రెండవ వైపుకు త్రిప్పితే ఆయన మరొక రకంగా కనిపిస్తాడు.
రోషముగలవాడుగా , దహించుఅగ్నిలా, న్యాయాధిపతిగా, యూదాగోత్రపు సింహములా కనిపిస్తాడు . ఈ కోణంలోఆయనను ఎదుర్కోవడం మనవల్ల కాదు.
ఆయన ఏమిటో మనకు అర్ధం కావాలంటే? ఒక్కటే మార్గం. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడమే.
ఆయన యందుగల భయము, మనకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తుంది.ఆ జీవితము పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, ఆ పరిశుద్ధత మనలను నిత్య రాజ్యమునకు చేర్చుతుంది.
"రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? లూకా 23:40
సిలువలో ఆ రెండవ దొంగకు దేవుని పట్ల గల భయము అతనిని పరదైసుకు చేర్చ గలిగింది.
• మోరియా పర్వతము మీద అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడుతున్న సమయంలో.....
అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనడడుచునదనెను. ఆది 22:12
ఎప్పుడయితే దేవునికి భయపడేవారిగా వుంటామో? అప్పుడు ఆయన కోసం మనము ఏదయినా చెయ్యడానికి సిద్దపడతాము. మనకోసం ఆయన ఏదైనా చెయ్యడానికి ఇష్టపడతాడు.
ఆ భయము ఎట్లా కలుగుతుంది అంటే? వాక్యమును ధ్యానించడం ద్వారానే.
ఆయన వాక్యానికి భయపడదాం!
జీవితాన్ని సరిచేసుకుందాం!
శాశ్వత రాజ్యానికి వారసులవుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పదిహేనవ భాగము)*దేవుని మాటలు మన జీవితాలకు సంతోషాన్ని , ఆలోచనను ఇస్తాయి.*
"నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి." కీర్తనలు 119:24
*దేవుని మాటలు మన సంతోషానికి కారణము.*
ఈ లోకములో మనిషి సంతోషం కోసం ఆరాట పడుతున్నాడు . అనేక విధాలుగా ప్రయత్నించి తన పాపాన్ని రెట్టింపు చేసుకొంటున్నారు గాని, సంతోషము లేకపోగా, చివరికి విషాదమే మిగులుతుంది.
పరిపూర్ణమయిన, శాశ్వతమయిన సంతోషం మనకు ఎక్కడ దొరుకుతుంది?
"పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ద్వారా ఆ సంతోషాన్ని పొందగలము.
"నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి." యిర్మియా 15:16
*దేవుని మాటలు మనకు ఆలోచన కర్తలు.*
దేవునికి విరోధముగా జీవిస్తున్న ప్రజల మధ్య జీవిస్తున్న మనము ఎట్లా జీవించాలో ? పరిశుద్ధ గ్రంధము మనకు ఆలోచన ఇస్తుంది.
సమస్యల సుడి గుండంలో కొట్టి మిట్టాడుతున్న మన జీవితాలకు దేవుని వాక్యం ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తుంది.
ముందు గొయ్యి - వెనుక నుయ్యి అట్లాంటి పరిస్థితుల్లో ... ఏమి చెయ్యాలో అర్ధం కానప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి చూడు. ఆ వాక్యం నిన్ను ఆదరించి, ఆలోచననిచ్చి, నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది.
దొంగతనాలు జరుగుతున్న ఊరిలో, విశ్వాసి అయిన ఒక పోలీస్ ఆఫీసర్ కి వారిని పట్టుకొనే భాద్యత అప్పగించారు. ఒక రాత్రి ఆ దొంగలు వారు ఉపయోగించే గాడిదను విడచి పారిపోయారు.
దేవుని వాక్యాన్ని చదివే ఈ పోలీస్ ఆఫీసర్ కి బైబిల్ ఒక ఆలోచననిచ్చింది.
"గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును" యెషయా 1:3
ఆ గాడిదను చెట్టుకు కట్టి 3 రోజులు ఏమి పెట్టకుండా, తర్వాత విడచి పెట్టాడట. పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఆ గాడిదను వెంబడించగా, అది వెళ్లి ఆ దొంగల గుహదగ్గర ఆగింది. అట్లా దేవుని వాక్యం ఆధారంతో ఆ దొంగల ముఠాను పట్టుకోగలిగాడు.
అవును!
దేవుని మాటలు మనకు ఆలోచననిస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారమవుతాయి. తద్వారా మన జీవితాలకు సంతోషం.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము ఆలోచననిస్తుంది! సంతోషాన్నిస్తుంది! నీ జీవితాన్ని వెలిగిస్తుంది! నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పదహారవ భాగము)*పాపము చెయ్యకుండా దేవుని వాక్యం మనలను అడ్డగిస్తుంది.*
" నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." కీర్తనలు 119:11
పరిశుద్ధ గ్రంధము ప్రకారము మనము ఏ పాపము చేసినా అది మొట్ట మొదట దేవునికి వ్యతిరేఖంగా చేసినట్లు గ్రహించాలి.
దావీదు పాపము చేసినప్పుడు, అది దేవునికే విరోధముగా పాపము చేశానని ఒప్పుకొంటున్నాడు.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కీర్తనలు 51:4
*ఒక వ్యక్తికి కీడు తలపెట్టినా అది దేవునికి చేసినట్లే.*
"సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించు చున్న యేసును" అపో. కా. 9:4,5
సౌలు (ఇంకా పౌలుగా మారలేదు).. యేసయ్యను ఎప్పుడూ ప్రత్యక్షంగా హింసించలేదు. యేసయ్య అంటున్నారు "నన్నెందుకు హింసించు చున్నావు?" "నీవు హింసించు చున్న యేసును" అని.
ఇప్పుడు అర్ధమయ్యింది కదా? ఆయన పిల్లలను హింసిస్తే ఆయనను హింసించినట్లే.
ఆయన పిల్లలకు కీడు తలపెట్టినప్పుడు మనము దేవునికే కీడు తలపెడుతున్నాం అనే తలంపువస్తే ఆ పని చెయ్యకుండా వుండడానికి అవకాశం వుంది. ఆ తలంపు ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించినప్పుడు.
*బైబిల్ గ్రంధాన్ని చదవకపోతే ఏది పాపమో మనకు తెలియదు*
పరిశుద్ధ గ్రంధాన్ని చదివి ఆ మాటలు మన హృదయంలో వుంచుకొనుట ద్వారా పాపానికి దూరముగా వుండగలము.
యోసేపు దేవుని యొక్క న్యాయ విధులను తన హృదయంలో వుంచుకున్నాడు. కాబట్టే పాపం తనని వెంటాడుతూవుంటే తాను పారిపోయాడు.
నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆది 39:9
యోసేపు ఆ దినాన్న ఆ పాపమునకు లొంగిపోలేదు కాబట్టి, బానిసగా బ్రతకాల్సిన యోసేపును ఆ దేశ ప్రధానిగా దేవుడు హెచ్చించాడు.
ఆదినాన్న ఆ పాపం అతడు చేసి వుంటే? ఇశ్రాయేలీయుల చరిత్ర అంతటితో సమాప్తం అయ్యేదేమో? ఆదికాండము 39 అధ్యాయాలకే మొత్తం బైబిల్ పూర్తయ్యేదేమో?
యోసేపు పరిశుద్ధత ఇశ్రాయేలీయుల చరిత్రనే మార్చగలిగింది. మన పరిశుద్ధత కనీసం మన కుటుంబాన్ని మార్చినా చాలు.
మన పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోగలం? దేవుని వాక్యాన్ని మన హృదయంలో వుంచుకున్నప్పుడు మాత్రమే సాధ్యం.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది! నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పదిహేడవ భాగము)*దేవుని వాక్యము మనకు శత్రువులకు మించిన జ్ఞానమును కలుగ చేస్తుంది.*
నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. కీర్తనలు 119:98
మనపైన పోరాటం చేస్తున్న శత్రువును జయించాలి అంటే? ఏదైనా శక్తివంతమైన ఆయుధం మన చేతిలో వుండాలి.
మనము ఉపయోగించే ఆయుధము శత్రువు యొక్క బలమును బట్టి ఆధారపడి ఉంటుంది.
మన ప్రధాన శత్రువైన సాతాను యుక్తిగలవాడు.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను ఆదికాండము 3:1
దేవుడు ఎంత పరిశుద్ధుడో? మన ఆది పితరులైన ఆదాము, హవ్వలను కూడా అంతే పరిశుద్ధముగా సృష్టించాడు. అట్లాంటి వారిని సహితం, యుక్తితో మోసగించి, దేవునినుండి దూరం చేసిన ఘనత వీడిది.
యేసు ప్రభువు వారిని సహితం, అరణ్యములో వాక్యాన్ని ఎత్తిపట్టి, శోధించగలిగాడు. మత్తయి 4:1-10
అయితే, ఆ వాక్యమునే ఆయుధముగా చేసుకొని ప్రభువు వారు సంధించిన బాణాలకు వాడు నిలువలేక పారిపోయాడు.
అవును!
వాడిపై విజయము సాధించాలి అంటే? సర్వాంగ కవచమును ధరించి, *వాక్య ఖడ్గమును* చేతపట్టాలి.
అట్లా అని, వాడు అంత తెలివితక్కువ వాడు కాదు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా, బైబిల్ పట్టుకున్నవాడిని బైబిలతోనే మోసగించడంలో వాడికి వాడే సాటి.
వాడి దగ్గరున్న మరొక టేలెంట్ ఏమిటంటే? దేవుని వాక్యాన్ని వక్రీకరించి భోధించడంలో వాడికి మించిన జ్ఞాని మరొకడులేడు. అందుకే నేటిదినాల్లో క్రైస్తవ్యం వెర్రివెతలు వేస్తుంది. *అందరి చేతుల్లోనూ వున్న బైబిల్ ఒక్కటే. కానీ, అందరి బోధ ఒక్కటికాదు.*
మనము వింటున్న వాక్యము ప్రభువు వారు చెప్పినట్లుగా, అపొస్తలుల బోధకు కట్టుబడినట్లుగా, వుందో? లేదో?
పరిశుద్ధాత్మ సహాయంతో పరిశీలన చేసి వాక్యమును అర్ధం చేసుకొని, అనుసరించగలగాలి.
అట్లా అయితేనే, వాడి మీద విజయం సాధించగలం. లేకపోతే, వాడి మందలోనే కలసిపోతాం. వాడికే దాసోహమై పోతాము. వాడి చేతిలోనే బలై పోతాము.
పరిశుద్ధ గ్రంధాన్ని సరియైన రీతిలో అర్ధం చేసుకుందాం!
వాడియైన బాణాలను సిద్ధం చేసుకుందాం!
శత్రువుపై విజయం సాధిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పద్దెనిమిదవ భాగము)*దేవుని వాక్యం వలన ఒక విశ్వాసి తీవ్రమైన భాద, సంతోషం రెండు ఏక కాలంలో అనుభవించ గలడు.*
"శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి" కీర్తనలు 119:143
సమస్యల సుడిగుండాల్లో సతమత మవుతున్నప్పుడు, ఆదరించేవారు, ఓదార్చేవారు వున్నా, వారి మాటలు ఆదరణను ఇవ్వలేవు. ఇచ్చినా? అది తాత్కాళికమే.
కానీ, అట్టి సందర్భాలలో సహితం, *దేవుని వాక్యం కృంగిన మన జీవితాలను బలపరచి, ఉజ్జీవింపజేస్తుంది. నేనున్నా నీకు తోడంటూ నీ జీవితానికి భరోసా నిస్తుంది. నిన్ను జీవింపజేస్తుంది.*
అవును! మన జీవిత దోనె, సమస్యల తుఫానులో చిక్కి, గమ్యం తెలియని స్థితిలో ప్రయాణిస్తున్నప్పుడు, తీరమేదో కానరాక, ఆశలన్నీ కోల్పోయి, నిరాశ నిస్పృహలు మన జీవితాన్ని ఆవరించినప్పుడు,
*నా కృప నీకు చాలు*
2 కొరింది 12:9
అనే చిన్న మాట మన జీవితాలకు ఎంత గొప్ప ఆదరణ? గుండెలనిండా నిండా నింపుకున్న భారమంతా ఆవిరైపోతుంది కదా?
ఒక్క విషయం!
*ఈ లోకంలో శ్రమలలో సహితం ఆనందించ గలిగేవారు ఎవరైనా వున్నారంటే? వారు పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించేవారు మాత్రమే.*
నీ శ్రమ, నీ వేదన, నీ సమస్య ఏదైనా కావొచ్చు. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి చూడు, ఆయన ప్రసన్నతను, సమాధానాన్ని తప్పక అనుభవిస్తావు.
యేసయ్య మాట జీవపుఊట.
నిన్ను పరమునకు నడిపించే బాట.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది! నీ జీవితాన్ని వెలిగిస్తుంది! నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(పంతొమ్మిదవ భాగము)*దేవుని వాక్యము నిత్య సత్యము.*
"నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. కీర్తనలు 119:160
*దేవుని వాక్యము సత్యమే కాదు. నిత్య సత్యము.*
నిత్య సత్యము అంటే?
మనుష్యులను బట్టి, కాలాలను బట్టి, యుగాలను బట్టి, పరిస్థితులను బట్టి, దేశాలను బట్టి, మార్పు చెందేది కాదు. అది ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా వుండేది.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
పడమర అస్తమిస్తాడు. ఇది నిత్య సత్యం.
ఇట్లా...నిత్య సత్యములుగా పిలువబడేవి సహితం, ఒకవేళ భౌగోళికమైన పరిస్థితులవల్ల మార్పు చెందవచ్చేమోగాని, *దేవుని వాక్యము మాత్రము ఎన్నిటికీ మార్పుచెందనిది.*
గంగి గోవు పాలు గరిటెడైనా చాలు.
కడవడైనానేమి ఖరము పాలు.
ఇది అప్పట్లో సత్యమే కావొచ్చు.
కానీ ఇప్పుడు, లీటరు గోవు పాలు 50 రూపాయలైతే? గాడిద పాలు 700 రూపాయలు.
ఇట్లా మనుష్యులు చెప్పిన విషయాలు కాలాలను బట్టి మార్పు చెందవచ్చేమో గాని, *దేవుని మాటలు మాత్రము ఎన్నిటికీ మార్పుచెందవు.*
*నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము* కీర్తనలు 119:142
*నీ వాక్యమే సత్యము* యోహాను 17:17
*నేనే సత్యము* యోహాను 14:6
అవును!
అబ్రాహాము దినాలలో దేవుని వాక్యము ఎంతటి సత్యమైనదో? నేటికినీ, రాబోయే కాలంలోకూడా, అంతే సత్యమైనది
అబ్రాహాము దినాలలో ఆయన ఎంతటి శక్తిమంతుడో? నేటికినీ, రాబోయే కాలంలోకూడా, ఆయన అంతే శక్తి మంతుడు.
దేవుని వాక్యాన్ని, ధ్యానించి, విశ్వసించి, అనుసరించ గలిగితే? నాటి దినాన్న అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, నేటి దినాన్న నిన్నూ నన్నూ ఆశీర్వదించ గలడు.
యేసయ్య మాట జీవపుఊట.
నిన్ను పరమునకు నడిపించే బాట.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(ఇరువదియవ భాగము)*దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి నెమ్మది.*
"నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు" కీర్తనలు 119:165
దేవుని ధర్మశాస్త్రాన్ని లేదా వాక్యాన్ని ఎవరు ప్రేమించగలరు?
దేవునితో సరియైన సంబంధం కలిగి, ఆయన వాక్యం ప్రకారం నడుచుకొను వారు మాత్రమే.
ఇట్లాంటివారే ఆయనిచ్చే సమాధానాన్ని పొందుకోగలరు.
కారణం?
వారి జీవితాలకు దేవుని వాక్యం అనే గొప్ప పునాదే ఆధారం కాబట్టి వారెన్నటికీ తూలిపోరు.
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
యెషయా 26:3
ఎవరికీ నెమ్మది?
ఎవరికీ సంపూర్ణమైన సమాధానం?
ఎవరైతే దేవునిపైన ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే సమాధానం. ఆయనిచ్చే సమాధానం పరిపూర్ణమైనది. అది శాశ్వతమైనది.
సమాధానం పొందుకోవాలంటే?
ఆయన మీద అనుకోవాలి.
ఎప్పుడు ఆయన మీద ఆనుకోగలం?
ఆయనను విశ్వసించినప్పుడు మాత్రమే.
ఎప్పుడు ఆయనను విశ్వసించగలం?
ఆయన మాటలు వినినప్పుడు, ధ్యానించినప్పుడు మాత్రమే సాధ్యం.
అయితే,
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు. యెషయా 57:21
దుష్టుడు అంటే? అపవాదికి గల మరొక పేరు. వాడి ప్రేరేపణతో మనమేపని చేసినా, అవి దుష్ఠక్రియలే. ఆ దుష్ఠ క్రియలు జరిగించే వారే దుష్టులు.
ఆ దుష్ఠ క్రియల ప్రతిఫలం ఏమిటంటే?
నెమ్మది, సమాధానం వుండదు.
దుష్ఠ క్రియలు జరిగించకుండా వుండాలంటే?
వాక్యం మన హృదయంలో వుండాలి.
వాక్యం మన హృదయంలో వుండాలంటే?
దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించాలి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(21వ భాగము)*దేవుని వాక్యము ప్రార్ధించుటకు సహాయము చేస్తుంది.*
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
యోహాను 15:7
మనకు ఇష్టమైనది దేవునిని అడిగి పొందుకోవాలంటే? ఒక షరతు వుంది.
• మనము ఆయనయందు నిలిచి యుండాలి.
• ఆయన మాటలు (వాక్యము) మనయందు నిలచియుండాలి.
ఇట్లా, జరిగిన పక్షంలో మనకేది యిష్టమో అది దేవుని దగ్గర నుండి పొందుకోవచ్చు.
కోటి రూపాయలు పొందుకోవచ్చా?
మూడు అంతస్థుల భవనం కోసం అడగొచ్చా?
బెంజ్ కారు స్వంతం చేసుకోవచ్చా?
అవును! ఇట్లా భౌతికమైన ఆశీర్వాదాల చుట్టూనే మన ప్రార్ధనలు తిరుగుతున్నాయి.
ఎందుకు ఇట్లా జరుగుతుంది?
ఒక్కటే సమాధానం. ఆయన వాక్యము మనయందు నిలచిలేదు.
ఆయన వాక్యము మనము ధ్యానిస్తే కదా? నిలిచి వుండడానికి.
దేవుని వాక్యమును ధ్యానిస్తే? దేవుడు మనలను నిర్మింపజేసిన కారణము ఏమిటో? ఆయన కోసం ఎట్లా జీవించాలో? ఆయనను ఏమి అడగాలో? అర్ధమవుతుంది.
అర్ధం, పరమార్ధం లేకుండా ప్రార్థిస్తున్నాం. ఫలితాన్ని పొందుకోలేక పోతున్నాము.
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానిస్తే? ఆయన మన ప్రార్ధన విని, ప్రతిఫలమిచ్చేటట్లు ఎట్లా ప్రార్ధించాలో మనకర్ధమవుతుంది.
అర్ధం చేసుకొని ప్రార్ధిస్తే? ఆ ప్రార్ధన ప్రతిఫలాన్ని తీసుకు వస్తుంది.
అట్లా ప్రార్ధించ గలగాలి అంటే? మొదటిగా పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ప్రార్ధనా ఫలాలను పొందుకోగలవు. ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 22వ భాగము)*దేవుని వాక్యము ఆత్మీయ వృద్ధిని కలిగిస్తుంది.*
ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసి 4:15
• మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని సాధించాలంటే?
*సత్యమును ప్రకటించాలి.*
సత్యమును ప్రకటించాలంటే?
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి.
సత్యము అంటే?
ఆయనే సత్యము. యోహాను 14:6
ఆయన వాక్యమే సత్యము యోహాను 17:17
ఆయనను, ఆయన వాక్యమును ప్రకటించాలి. దాని కంటే ముందుగా ప్రేమనుకలిగి యుండాలి.
ప్రేమను కలిగి యుండాలంటే? ప్రేమామయుడైన క్రీస్తును కలిగి, ఆ ప్రేమ యొక్క లక్షణాలు కలిగియుండాలి.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
*విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.* 1కొరింధీ 13:4-8,13
అవును!
ఆయన ప్రేమ అమరం, అతిమధురం,అపురూపం. అవధులులేనిది, అద్వితీయమైనది. సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది.
మరణము కంటే బలీయమైనది. సజీవ మైనది, శాశ్వతమైనది.
ఇట్టి ప్రేమను కలిగి, సత్యమును ప్రకటిస్తూ క్రీస్తు వలే ఉండగలిగితే, మనము *అన్ని విషయములలో* ఎదుగుదుము,
అన్ని విషయములలో అంటే?
ఆత్మీయ ఆశీర్వాదాలతోపాటు, శారీరిక ఆశీర్వాదాలు కూడా.
అంటే? ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ప్రయాస పడితే, శారీరిక ఆశీర్వాదాలు కూడా వాటంతటవే పరుగులెత్తుకొస్తాయి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే?
ఆత్మీయ వృద్ధితో పాటు, అన్ని విషయాలలో అభివృద్ధి సాధించగలం. అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొందాం!
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 23వ భాగము)*దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారము*
అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:4
దేవుని వాక్యమును ఎరుగనివారు సాతాను ప్రేరణలను గుర్తించలేరు.
వాడి ప్రేరణలను గుర్తెరిగి వాడికి లొంగిపోకుండా, వాడిని ఎదిరించి జయించాలంటే? వాక్యము ఒక్కటే మన ఆయుధం.
ఆ వాక్యం మనకు తెలియాలంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ఒక్కటే మార్గం.
అరణ్యములో వాడు యేసు ప్రభువును శోధిస్తూ... ఆయన ఆహరం ఏమి తీసుకోకుండా వున్నాడని ఎరిగి,
ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను.
మత్తయి 4:4
అట్లాంటి పరిస్థితులలో ప్రభువు వారు వాక్యమును ఎత్తిపట్టి సంధించిన బాణమునకు,ఇక వాడి దగ్గర సమాధానం లేకపోయింది.
అవును!
*మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.*
ఈ లోక సంబంధమైన రొట్టె(ఆహారం) అక్షయమైన ఈ శరీరం కొంత కాలం బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
కానీ, జీవాహారమైన దేవుని వాక్యం మనలను శాశ్వత కాలమూ జీవింప జేస్తుంది. ఈ జీవితం తర్వాత నున్న శాశ్వతమైన నిత్యమరణం, నిత్య జీవం అనే రెండు మార్గాలలో, నిత్య మరణం నుండి దాటించి నిత్య జీవం లోనికి ప్రవేశ పెట్టగలుగుతుంది.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 24వ భాగము)*దేవుని వాక్యము విత్తనము వంటిది*
(త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడిన విత్తనాలు)
విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను. లూకా 8:5
విత్తనము అంటే?
*విత్తనము దేవుని వాక్యము.* లూకా 8:11
త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును.
లూకా 11:12
*త్రోవ ప్రక్కనబడిన విత్తనాలు.*
నేటి దినాలలో వాక్యము వినే వారిలో 90 శాతము పైగా ఈ కోవకు చెందిన వారే.
చూడండి! లెక్కలేనన్ని దేవుని మందిరాలు. దేవునిని ఆరాధించడానికి స్థలము చాలక, కొన్ని మందిరాలలో రెండు నుండి ఐదు ఆరాధనలు వరకూ జరుగుతున్నాయి.
ఇక బహిరంగ సభలంటే? ఇసుకవేస్తే? రాలనంత జనసందోహం.
వీరంతా వాక్యం విన్నవారే. వీరిలో వాక్యం విని రక్షణ పొందినవారు ఎంత మంది? అంటే, అది సమాధానం లేని, మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలిపోతుంది.
మిగిలిన వారి సంగతి ఎట్లా వున్నా, కనీసం క్రైస్తవులు అని చెప్పుకొంటున్న వారైనా, క్రీస్తును కలిగి యుండేవారు కదా? కానీ, నేటి దినాలలో ఆపరిస్థితి వుందా?
కారణం ఏమిటి?
చెవుల ద్వారా ప్రవేశించిన వాక్యం హృదయంలోకి చొచ్చుకుపోవాలి.
కానీ, అట్లా జరగకుండా... ఒక చెవితో విన్న వాక్యం మరొక చెవి ద్వారా బయటకి వెళ్ళిపోతుంది.
(అంటే? వాక్యం వినడానికి రెండు చెవులను కూడా అప్పగించలేంత అశ్రధ్ధతో వాక్యం వింటున్నాము).
అనేమంది దేవుని మందిరానికి వెళ్లడమే భక్తి అనే తలంపుతో వస్తారు గాని, వాక్యం విని, జీవితాన్ని సరిచేసుకోవాలని తలంపు ఏ కోశానా వారిలో కనిపించదు. అందుకే, వారు వాక్యం విన్నా, సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. ఆ గుంపులో నీవూ వున్నవా?
చూడండి, గత 50 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నా, రక్షణ లేదు కదా, కనీసం రక్షణ అంటే ఏమిటో? కూడా తెలియని వారు కోకొల్లలు.
కారణం? విత్తనంలో లోపమా?
విత్తేవానిలో లోపమా?
కొన్ని సందర్భాలలో విత్తేవానిలో లోపమున్నా, విత్తబడిన విత్తనం మాత్రం సజీవమైనది, బలమైనది.
మరి లోపమెక్కడ?
నీ హృదయం దున్నబడలేదు.
ప్రార్ధనతో నీ హృదయం దున్నబడితే? ఆ విత్తనం నీ హృదయంలోపడి, తప్పక నూరంతలుగా ఫలిస్తుంది.
సంవత్సరాలు మన జీవితాల్లో దొర్లిపోతున్నా, ఇట్లాంటి అనుభవం మన జీవితాల్లో లోపించిందేమో? సరి చేసుకుందాం! సాగిపోదాం! ఆ నిత్యరాజ్యం చేరే వరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 25వ భాగము)*దేవుని వాక్యము విత్తనము వంటిది*
( రాతినేలను పడిన విత్తనాలు)
విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా ........కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను.
లూకా 8:5,6
రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు.
లూకా 8:13
వాక్యం అనే విత్తనం వారి హృదయంలో పడి మొలకలేస్తుంది. కానీ, అది రాతి హృదయం. వేరు లోనికి చొచ్చుకొనిపోయే అవకాశం లేదు. తద్వారా నీరు (పరిశుద్ధాత్మ) అందక మొలకలు ఎండిపోతాయి.
వాక్యం విత్తబడుతున్నప్పుడు, వింటున్న కొందరి హృదయాలు పశ్చత్తాపముతో కృంగిపోతాయి, కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది.
సంతోషం తో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. చిన్న శోధనలు వచ్చేసరికి ఆ మార్గం నుండి తొలగిపోతారు.
కారణం ఏమిటి?
హృదయాలు దున్న బడలేదు.
ప్రార్ధన ద్వారా మన హృదయాలు వాక్యమును అంగీకరించడానికి సిద్ధపరచి బడాలి. వాక్యాన్ని వినడానికి ముందు, ప్రభువా ఈ దినం నీవు నాతో మాట్లాడు, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా వుంటే నాకు తెలియజేయి అంటూ సిద్ధపాటు కలిగిన హృదయంతో వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి.
అట్లా సిద్ధపాటు లేకుండా, వాక్యం వింటే? కొన్ని సందర్భాలలో ఉద్రేకం కలుగుతుంది. ఆ ఉద్రేకంలో ఏవో తీర్మానాలు తీసుకుంటాము. ఆ ఉద్రేకంలానే మనం తీసుకున్న తీర్మానాలు కూడా చల్లారిపోతున్నాయి.
ఉద్రేకం కాదు రావలసింది, ఉజ్జీవం.
ఉజ్జీవమైతే అయితే అది స్థిరముగా నిలిచి ఉంటుంది. విస్తారంగా ఫలిస్తుంది.
చివరిగా ఒక్క మాట!
విత్తనంలో లోపంలేదు. అది బలమైనది, సజీవమైనది.
మరి లోపమెక్కడ?
నీ హ్రదయమనే పొలంలోనే.
సరి చేసుకుందాం! సాగిపోదాం! ఆ నిత్యరాజ్యం చేరే వరకు.
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 26వ భాగము)*దేవుని వాక్యము విత్తనము వంటిది*
(ముండ్ల పొదలలో పడిన విత్తనాలు)
విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా....... కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. లూకా 8:5,7
ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. లూకా 8:14
ఈ విత్తనం పడిన స్థలము ఫలించడానికి అనుకూలమైనదే. కానీ, చుట్టూ ముండ్ల పొదలున్నాయి. ఫలించాల్సిన మొక్క కంటే ఇవి మరింత ఏపుగా పెరిగి, ఫలించాల్సిన మొక్కను అణచి వేస్తున్నాయి. ముండ్ల పొదలు దానిపైన వ్యాపించడం వలన సూర్యరశ్మి తగులక, పరిపక్వతకు చేరుకోలేక, మరగుజ్జు గానే వుండిపోతూ నిష్ప్రయోజనమైన చెట్టుగానే మిగిలిపోతుంది.
ముండ్ల పొదలు, గచ్ఛ పొదలు సృష్టి ఆరంభములో వున్నట్లు కనిపించవు. అవి పాపము యొక్క ప్రతిఫలాలు.
ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; *అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును*; పొలములోని పంట తిందువు; ఆది 3:17,18
ఇంతకీ, నీ హృదయంలో పడిన విత్తనాలు ఫలించకుండా అడ్డు పడుతున్న ఆ ముండ్ల పొదలేంటి?
నీతి సూర్యుని వెలుగు నీకు సోకకుండా అడ్డు తగులుతున్న ఆ గచ్ఛ పొదలేంటి?
శరీరాశా? నేత్రాశా? జీవపు డంబమా?
నీలో నున్న ఆ ముండ్లపొదలేంటో నీకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలియదు.
నీ హృదయమనే పొలము ఫలించడానికి అనుకూలముగా వున్నా, ముండ్ల పొదలు, గచ్ఛ పొదలు కూకటి వేళ్ళతో పెరికి వేయకపోతే, నీవు ఫలించనే ఫలించవు.
ఒక వేళ నీవు ఫలిస్తున్నాను అని భ్రమ పడుతున్నా, అవి కారు ద్రాక్షలే తప్ప, ఆత్మ ఫలాలు కావు.
చివరిగా ఒక్క మాట!
విత్తనంలో లోపంలేదు. అది శ్రేష్ఠ మైనది, బలమైనది, సజీవమైనది.
మరి లోపమెక్కడ?
నీ హృదయమనే పొలంలో
పెరికి వేయకుండా పెరగనిస్తున్న ఆ ముండ్లపొదలలోనే.
సరి చేసుకుందాం! సాగిపోదాం! ఆ నిత్యరాజ్యం చేరే వరకు.
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
(27వ భాగము)*దేవుని వాక్యము విత్తనము వంటిది*
( మంచి నేలను పడిన విత్తనాలు)
విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా..... మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను.
లూకా 8:5,8
మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.
లూకా 8:15
మంచి నేలను పడిన విత్తనాలు నూరంతలుగా ఫలిస్తూ వున్నాయి.
కారణం?
వీరు విని, విడిచిపెట్టేవారు కాదు. వినిన వాటిని గైకొనేవారు.
చూడండి! ప్రకటన గ్రంధం మొదటి అధ్యాయములో *వాక్యమును చదివే వారికి, వినే వారికి, గైకొనేవారికి* ధన్యతను ఆపాదిస్తే? చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి కేవలం *గైకొనే వారికి మాత్రమే* ఆ ధన్యత పరిమితం చేయబడింది.
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
ప్రకటన 1:3
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.
ప్రకటన 22:7
మన జీవితాలెట్లా వున్నాయి?
కేవలం పరిశుద్ధ గ్రంధాన్ని, చదివేవారము గాను, వినేవారము గాను మాత్రమే వుంటే?
ఫలాలు ఫలించలేము. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించ గలగాలి.
అంజూరపు చెట్టు చూడడానికి విస్తారమైన ఆకులతో నిండివుంది గాని, ఫలాలు లేక, శపించబడింది.
మనము కూడా క్రైస్తవులము అని చెప్పు కొంటూ, క్రీస్తుని కలిగిలేని జీవితాలు జీవిస్తున్నామేమో? ఆ అంజూరపు చెట్టుకు పట్టిన గతే పడుతుందేమో?
వద్దు!
సరి చేసుకుందాం! సాగిపోదాం! ఆ నిత్యరాజ్యం చేరే వరకు.
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 28వ భాగము)*దేవుని మాటలు మనలను శక్తిమంతులనుగా చేస్తుంది.*
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
మత్తయి 7:24,25
• దేవుని వాక్యము ఎప్పుడు మనలను శక్తి మంతులుగా చేయగలుగుతుంది?
1. దేవుని మాట (వాక్యము) వినాలి.
2. వాటి ప్రకారం చెయ్యాలి.
యెరికో గోడలు కూలాలంటే? ఆ పట్టణం పట్టబడాలి అంటే? దేవుడు చెబుతున్న మాటలు చూడండి.
యెరికో గోడలు అత్యంత బలమైనవి. అట్లాంటి గోడలు బూరలు ఊదితే, కేకలు వేస్తే? అవి కూలిపోతాయట. ఇదేమైనా నమ్మశక్యముగా వుందా?
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.
మీరందరు యుద్ధసన్న ద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగ వలెను.
ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.
మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. యెహోషువా 6:2-5
1. వారు దేవుని మాటలు విన్నారు
2. వాటి చొప్పున చేశారు.
అసాధ్యం సుసాధ్యమయ్యింది.
యెరికోగోడలు పేకమేడల్లా కూలిపోయాయి.
మన జీవితంలో మనము ఎదుర్కొంటున్న సమస్యలు యెరికో గోడలంత బలమైనవప్పటికీ, ఆయన మాట విని, వాటి చొప్పున చెయ్యగలిగితే? ప్రతీ సమస్య మన ముందు మోకరిస్తుంది.
ఇంతకీ, ఆయన మనతో ఎట్లా మాట్లాడుతాడు?
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు.
వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.
వానలు, వరదలూ (శ్రమలు, శోధనలు) వచ్చినా నీ ఇంటిని ఏమి చేయలేవు.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 29వ భాగము)*దేవుని మాట సమృద్ధి నిస్తుంది*
నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
ద్వితి 32:2
దేవుడు ఏ ఉద్దేశ్యముతో మంచునూ, వర్షమునూ కురిపిస్తున్నాడో అవి, దేవుని ఉద్దేశ్యమును చక్కగా నెరవేర్చితున్నాయి.
వర్షము, మంచు ఆకాశము నుండి వచ్చి, భూమిని తడుపుతాయి. దాని నుండి మొక్కలు మొలిపించేలా చేసి, చల్లడానికి విత్తనాలను, తినడానికి ఆహారాన్ని యిస్తాయి. అలా చేస్తేనే తప్ప, ఆకాశానికి తిరిగిపోవు.
అట్లానే, దేవుని వాక్కులు ఆయన నోటనుండి, ఆయన ప్రవక్తల నోటనుండి వచ్చి, అక్కడ నుండి లోకములో దేవుని సంకల్పాలను నేరవేర్చడానికి బయలుదేరాయి.
అవి నిష్ఫలముగా దేవుని దగ్గరకు తిరిగి చేరవు. దేవుని యొక్క సంకల్పాన్ని తప్పక సాధిస్తాయి.
వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును
యెషయా 55:10
దేవుడు ఒక మాట చెప్పాడంటే? అది తప్పక జరిగి తీరుతుంది. అందుకే, జరుగవలసిన కొన్ని విషయాలుకూడా, జరిగిపోయినట్లు పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడ్డాయి. అంటే? దేవుని మాటలు అంత ఖాయమన్న మాట.
అయితే, దేవుడు ఏమి చెప్పాడో మనకు తెలియాలంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ఒక్కటే మార్గం.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 30వ భాగము)*దేవుని వాక్యము హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించును.*
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీ 4:12
*దేవుని వాక్యము సజీవమైనది:*
ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
1 పేతురు 1:23,24
దేవుని వాక్యము రెండంచుల వాడి గల ఖడ్గము కాదు. రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగలది.
అది, ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను సహితం విభజించు నంత మట్టుకు దూరగల సమర్ధత గలది.
ఒక మనిషి హృదయంలోనున్న తలంపులు, ఆలోచనలను గ్రహించగలిగే సామర్ధ్యము మరొక మనిషికి లేదు.
కాని, దేవుని వాక్యము హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును.
అయితే, మన హృదయంలో గూడు కట్టుకొని యున్న పాపపు తలంపులే, క్రియా రూపము దాలుస్తాయి కాబట్టి, వాక్యము ద్వారా అవి సరిచేయ బడాలి.
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ద్వారా మన హృదయాలు సరిచేయబడాలి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 31వ భాగము)*పరిశుద్ధ గ్రంధము హృదయాన్ని సరిచేసుకునే అద్దము*
ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. యాకోబు 1:23
మనము అద్దము ఎందుకు చూచుకుంటాము? మన ముఖము ఎట్లా వుందో? ముఖము జిడ్డుగా వుందేమో? పౌడరు ఎక్కువయ్యిందేమో? జుట్టు చెరిగిపోయిందేమో? చూచుకొని, సరి చేసుకుంటాము.
అట్లా కాకుండా,
ముఖమంతా జిడ్డుగా, జుట్టంతా చిరిగిపోయి వుంది. సర్లే, అని అట్లానే వుండనిస్తే? ఇక అద్దం చూచుకోవడం వలన ప్రయోజనం లేనే లేదు.
అద్దములో నీ బహిరంగ స్వరూపాన్ని సరి చేసుకోవచ్చు. మరి మన హృదయాన్ని సరిచేసుకోవాలంటే? ఎట్లా?
ఒక్కటే మార్గం.
పరిశుద్ధ గ్రంధం అనే అద్దంలో చూచుకోవాలి. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానం చేస్తూవుంటే? పరిశుద్ధ గ్రంథములోని మాటలు వింటూ వుంటే, నీ అంతరంగమంతా స్పష్టముగా దానిలో కనిపిస్తుంది.
అట్లాంటి సమయంలో మన హృదయాలను సరి చేసుకోవాలి.
ఒకవేళ సరిచేసుకోకపోతే?
పరిశుద్ధ గ్రంధం ధ్యానించినా, ఆ మాటలు వినినా ప్రయోజనం శూన్యం.
అంతేకాదు, అద్దంలో
తన్ను చూచుకొనిన వ్యక్తి అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోతాడు. అట్లానే, పరిశుద్ధ గ్రంధాన్ని చదివి, జీవితాన్ని సరిచేసుకొనని వ్యక్తి పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది.
అవును! మన జీవితాలు అట్లానే వున్నాయి. పరిశుద్ధ గ్రంధాన్ని చిన్నప్పటి నుండీ చదువుతూనే వున్నాము. వాక్యాన్ని వింటూనే వున్నాము. కానీ, జీవితంలో ఏ మార్పూ లేకుండానే జీవిస్తున్నాము.
అందుకే, నేటికీ సమాధానం మన దరి చేరట్లేదేమో?
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, జీవితాన్ని సరిచేసుకో గలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 32వ భాగము)*దేవుని వాక్యము మనలను జీవింపజేస్తుంది.*
119 వ సంకీర్తనలో దావీదు, దేవుని పాదాల చెంతచేరి తనను బ్రతికించాల్సిందిగా తొమ్మిది సార్లు ప్రాధేయ పడుతున్నాడు.
బ్రతికించమని ప్రాధేయ పడుతున్నాడంటే? దాదాపు అతడు మరణ స్థితిలో తానున్నట్లు భావిస్తున్నాడు.
అయితే,
దేని చేత బ్రతికించమని బ్రతిమాలాడుతున్నాడు?
*వాక్యము చేత.*
నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:25
వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:37
నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:40
నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:88
యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:107
నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:149
నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:154
యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. కీర్తనలు 119:156
యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము కీర్తనలు 119:159
అవును!
ఆయన మాటలు మనలను బ్రతికిస్తాయి.
శారీరికంగా ఆరోగ్యవంతముగానే నున్నా, ఆత్మీయంగా మరణానికి దగ్గరలో నున్నామేమో? ఒక్క సారి మనలను మనమే పరిశీలన చేసుకోవాలి.
దావీదు ఎట్లా దేవుని పాదాలచెంత చేరి బ్రతిమాలాడుతున్నాడో అట్లాంటి అనుభవాన్ని మనము కలిగి యుండాలి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, జీవితాన్ని సరిచేసుకో గలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
పరిశుద్ధ గ్రంధము
( 33వ భాగము)*దేవుని వాక్యము సుస్థిరమైనది.*
యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. కీర్తనలు 119:89
దేవుని వాక్యం పరలోకంలో స్థిరంగా, శాశ్వతంగా వుంది. కాబట్టి, భూమి మీద జరిగేదేదీ దానిని పడగొట్టడం అసాధ్యం.
బైబిల్ కనుమరుగై పోతుందని ప్రకటించిన వారెందరో కనుమరుగై కాలగర్భంలో కలసిపోయారు. కానీ, దేవుని వాక్యం నేటికీ స్థిరంగా వుండగలిగింది. రాబోయే కాలంలో కూడా అట్లానే ఉంటుంది.
*దేవుని వాక్యము శాశ్వతముగా స్థాపించబడి యున్నది:*
ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.
అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి. కీర్తనలు 111:7,8
*భూమ్యాకాశములు గతించిపోయినా? దేవుని వాక్యము స్థిరమైనది:*
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 5:18
*మనకు ప్రకటించ బడిన సువార్త నిత్యమూ నిలిచే దేవుని వాక్యమే:*
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే. 1 పేతురు 1:24,25
అస్థిరమైన నీ జీవితం సుస్థిరం కావాలంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, అనుసరించ గలగాలి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, జీవితాన్ని సరిచేసుకో గలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి